Telugu laxmikataksham - anilvaranasi/indianlanguages GitHub Wiki

యయా న ట్‌ నాలను. సు. మం 1 తష ళు గ్‌... సం శ స్‌ నాన టి గు కి ఇ వ | (1 చాన వి 1 స్నా! వీ శ 1. ఫం క, గీ - / | ౯ (| పథం నీ ప! | శే? “అనీ 1) నా స్వ మావా కోో జ ఖీ / క ర / క మ న (న | లకు (గనక షు ల _ న ల = ల శః జ్య _ 4 . ఎ అల య గ్య న! చార్‌ స ోవాచక్రాక్మప్లి [ా వో శ క ల. ల 224శ దా | నం | వ్‌ గ 1 హోగనోీ - లక్షా? ఈాత్తాన ే వే ఏ దళం స: 1 | మం ల కా క్‌. 1 ల్‌ వ కాం. / "ఈ న 1! (0 వం నోలళు షు? ద. స్‌ో | (క్ష "| [1 లన్న? సశ ళ్గ టు టల ప. గ్‌ ఫ్‌ ఇ 1! న్‌ గారు... తో ను గ్లో నరక... ర యం! వాన్ని రా య్‌ . 11 ంం బ్ర నన ను చ మా. . త న వ ఎ ఆ సో .

లక్షీ శై కటాక్షం గ్‌ హా .. తోలేటి జగన్మోహనరావు కథలు

"/ గ. ౮ 7 ఓగగ54న కగగగం[411 రా శి 0011606100 09౧0 300/గ189 01 / "0౬౯7 తశ6గడ1084414 ౧4౦ ర్స మ్మ ౯116౯61100 ఉ€ ౪౮౯, 2002 య ౧0౦6. [5.100/- 0 (| 0 (0) 701౯ 4464సగంణ4౫4 240 (- ర (0) 0౦౪8 6౮6310౧ సీగిగి5్‌!1| 00౪8! ౯|౧166 &1 ౬4 ౮౪01111 ౧౫౦౦౬౯౩౨ 116 ౧,౦. 0౧౦౩ గిండ౦09. 11/4611046 - 500 020 ౧౧; 7612337, 7612436 "604 న|౧166 41 ౪1014 0౦11౧౮7౬౯౧ 56౧/1066 21200012, గ66/2046 - 500 044 ౧|: 7676910 ౦౧: 8౮౧౯౧4౮గి ఆగగ౧|1|09, '1ర/40492% గ/ర6'20286 - 500 044. న౧౧.7076148. 501౬౬ 0131౧18070[%5: ౪184.4%౫011౧4 800 40056 8౭౧% 80660 గ౧౪౦౬౯౧4ఉ840-500 001 తిాజ॥2016 14! (9 0/1౧0౧౪౩.

నా అర్తాంగి వరనికి లు ఠు (ప్రేమతో...

కృతజ్ఞతలు ఈ పుస్తకం ఇలా రావడానికి ప్రోత్సహించి, తను స్వయంగా బాధ్యత తీసుకుని సహకరించిన కవి మిత్రులు శ్రీ తాళ్ళపల్లి మురళీధర గౌడ్‌ గారికీ- డిటిపి బాధ్యతలు చేపట్టి తన సహకారాన్నందించిన శ్రీ రెడ్డి రాఘవయ్య గారిక్షీ- అడిగిన వెంటనే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ముఖ చిత్రాన్ని చాలా అందంగా చిత్రించిన శ్రీ నర్ఫిం(ఇండియాటుడే) గారిక్తీ అచ్చు వేసిన కళాజ్యోతి (ప్రాసెస్‌ లిమిటెడ్‌ వారికీ- పుస్తకాన్ని శ్రద్దతో ముద్రించిన విష్ణ కంప్యూటర్‌ సర్వీసెస్‌ శ్రీ ఎం.విజయసేనా రెడ్డి గారికీ -

-తోలేటి జగన్మోహనరావు

ఇందులో... "పేజీ

నామాట 1 ఫౌల్‌ కేర్‌ 2. గోడ 33 3. లక్ష్మీ కటాక్షం య క్షం 4, నివాళి ఆ ౯/0 5. వర్షక్రమాలు ఎం 80 6. బహుఛత్రాధిపతి య తి6 7. కల్కి ల 97 8. సీరియల్‌ చేసిన పెళ్ళి 115 9. నారాయణ... నారాయణ... . 127 10. గంగా గౌరీ సంవాదం 139 11. అన్వేషి ఎ కేశ 12. విజ్ఞప్తి ఎ 161 13. కప్పడాలు 168 14. అంతం ఎ 180

సీజీ నామాట

1995లో నా తొలి కధా సంపుటి తోలేటి జగన్మోహనరావు కథలు వెలువడింది. ఇది రెండో సంపుటి.

నా మొదటి కధ 1977 లో ప్రచురితమైంది. ఆ తర్వాత గత పాతిక సంవత్స రాలలోనూ దాదాపు నలభై అయిదు కధలు (ప్రచురితమయ్యాయి. నేను కధలు రాయ డానికి స్రయత్మిస్తున్నష్తుడు కధలు ఎలా రాస్తారు, కధారచయితలు ఎలా ఆలోచిస్తారు, అని ఆలోచించేవాడిని. అలాంటి విషయాల మీద ఏదైనా వ్యాసం కనిపిస్తే చాలా ఆసక్తిగా చదివేవాడిని. ఆ కారణం వలన ఈ పాతిక సంవత్సరాల నా అనుభవాలు యువ కధా రచయితలకి ఏవైనా ప్రయోజనకారిగా ఉంటాయమోనన్న ఉద్దేశంతో, నేను ఎలా, ఎప్పుడు కథలు రాయడం మొదలు పెట్టిందీ, ఎందుకు రాస్తున్నదీ, నా అనుభవాల గురించి చెప్పాలనుకుంటున్నాను. నీ గోల మాకెందుకు అనుకునే పారకులు ఈ పేజీ తిప్పేయవచ్చు.

మా నాన్నగారు, కీశే. తోలేటీ సుబ్బారావు గారికి పుస్తక పరనం చాలా ఇష్టం. లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకొచ్చి శ్రద్దగా చదువుతుండేవారు. ఆ పుస్తకాలు నేనూ అప్పుడప్పుడు చదువుతుండేవాడిని. పదమూడు, పద్నాలుగేళ్ళ వయసులో విశాలాంధ్ర ప్రచురణాలయం వార్హూ ఇతర ప్రచురణ సంస్లల వారూ ప్రచురించిన పుస్తకాలు చదివాను. నేను ఎంత వరకు అర్ధం చేసుకున్నానో తెలియదు కాని రష్యను నవలల తెలుగు అనువాదాలు బాగా ఇష్టపడేవాడిని, మా నాన్నగారు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి, కమ్యూనిష్టు పార్టీ సానుభూతి పరులుగా 1948-51 సంవత్సరాలలో జైలు శిక్షకు కూడా గురయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా, సానుఘాతిపరుడ్‌గా ఉంటుం డేవారు. నాలో వామపక్ష భావాలు బలపడడానికి మా నాన్నగారి రాజకీయ జీవితం, నేను చదివిన పుస్తకాలు కారణం.

నేను 196% నుంచి 1971 వరకూ "హైదరాబాద్‌లో ఎ.జి. ఆఫీసులో పనిచేశాను. అక్కడ జంపాల ఉమామహేశ్వరరావు గారితో పరిచయమైంది. “సహవాసి అన్న కలం పేరుతో ఆయన చక్కటి అమ్‌వాదాలు చేశారు. ఉమామహేశ్వరరావు గారు చక్కటి కవితలు రాస్తుండేవారు. ఒకసారి ఉగాది సందర్భంగా ఆయన ఒక గేయం రాశారు.

ముళ్ళపొద సైతం ఒళ్ళు పులకరించి పల్లవించింది

బాధల ముళ్ళు గుచ్చుకు (బతుకు పచ్చిగాయమైంది...

కడిగిన ముత్వంలా ఆకాశం న్వుచ్చుంగా ప్రకాళిస్తోంది

కలగుండు పడ్డ అడవిలా దేశం శకున పాగులుతోంది...

నాకు ఈ గేయం ఇప్పుడు సరిగా గుర్తు లేదు. ఇలా ఈ గేయం సాగి చివరన

9 తోలేటి జగన్మోవానరావు “అయినా ఒక్క రోజు - ఈ ఒక్కరోజయినా - నన్ను ఉగాది జరుపుకోనీ' అని ముగుస్తుంది అందులో నాకు అర్దం తెలియని పదం ఒక్కటీ లేదు. మామూలుగా మనం వాడే మాటల్నే కూర్చి ఈయన ఇంత శక్తివంతంగా ఎలా రాయగలిగారా అని నాకు ఆశ్యర్యం కలిగింది అదే సమయంలో శ్రీశ్రీ మహా ప్రస్థానం చదవడం జరిగింది. శ్రీశ్రీ కవిత్వంలో ఆవేశం, ఆదర్శం, ధ్వని, నన్ను ఆకర్థించాయి. అప్పుడు నేను కూడా కొన్ని వచన కవితలు రాశాను. అవి ఉమామహశ్సరరావు గారికి చూపించేవాడిని. ఆయన సరి దిద్దేవారు కాని ఈ కవితలు ఏ పత్రికకి పంపించలేదు. తర్వాత నేను కవిత్వం రాయడం మానేశాను. కవిత్తుం రాయకపోయినా, రాయడానికి (ప్రయత్నించడం నాకు భాషలో ఉన్న శక్తి తెలుసుకోడానికి ఉపయోగపడింది.

తర్వాత నేను, ఇరవై సంవత్సరాల వయసులో రావిశాస్రిగారి 'ఆరుసారాకథలు' చదివాను. మొదట చదివినప్పుడు అవి బోరుగా అనిపించాయి. ఈ కధల్లో కథ ఏవీ లేదు అనిపించింది తర్వాత, లోకం మరికొంత అర్ధమయ్యాకా, రెండోసారి చదివినప్పుడు, చాలా బావున్నాయనిపించింది. మరికొంత కాలం గడిచాకా, అద్భుతమైన కధలు అని సించాయి. నేను రావిశాస్త్రి గౌరి వీరాభిమానినైపోయాను. కవిత్వం వదిలేసి కధల వెంటపడ్డాను. రాస్తే రావిశాస్త్రి గారిలాగే రాయాలి అనుకునేవాడిని.

ఆ కాలంలో, అంటే 1967-71 ప్రాంతంలో నేను నక్సల్‌ బరీ, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో అతివాద రాజకీయాలనైపు ఆకర్షితుడనయ్యాను. అతివాదుల్లో వీర అతి వాదిగా, కాయకష్టం చేసేవాళ్ళు తప్ప మిగిలిన వారంతొ, రచయితలతో సహా, పేరసైట్లు అన్న అభిప్రాయానికొచ్చేస, నే కలం వదిలేశాను.

1971లో ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్‌ వదీలి ఢిల్లీ వచ్చాను. అప్పటినుంచీ, అంటే మూడు దళొబ్దాలుగొ, ఢిల్లీలోనే ఉంటున్నాను. ఢీల్లీ చేరిన తర్వాత మళీ కధలు రాయడానికి ప్రయత్నించాను. కాని రాస్తే రావిశాస్త్రి గారి లాగే రాయాలి అ అభిప్రాయం నన్ను వదలలేదు. ఆయనలాగే రాయడానికి ప్రయత్నించినపుడు కలం కదిలేది కాదు. ఒక్క వాక్యం కూడా రాయలేకపోయేవాణ్ణి. నాకు తెలియని విషయాల గురించి నేను రాయడాని 'సయత్నిస్తున్ననని తెలుసుకోలేకపోయాను. చిన్నప్పుడు చదివినదే తప్ప, నేను ఇంగ్లీషులో కాని, తెలుగులో కాని ఎక్కువగా సాహిత్యం చదవలేదు. రావిశా(స్తి గురజాడ, శ్రీశ్రీ, ముళ్ళపూడి వెంకటరమణ, కాళీపట్నం రామారావు గార్ల రచనలు తప్ప ఎక్కువగా చదవలేదు. ఎవరేనా చలం చదివారా? గోపీచంద్‌ చదివారా? కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలు చదివారా? అని అడిగితే నేను తడబడతాను. కారణాలు ఏవైనా సాహిత్యం నేను ఎక్కువగా చదవలేదు.

ఈ కాలంలోనే, అంటే 1972-74 (ప్రాంతంలో, ప.జి.వోడ్‌ హౌస్‌ నవలలు చదవడం తటస్థించింది. నా మిత్రుడొకడు, అతని నవలలు చదువుతూ తెగ నవ్వుతుండేవాడు. అందులో నవ్వొచ్చేదేముందా అని నేనూ చదవడానికి (ప్రయత్నించాను. కాని నాకు మొదట అందులో హాస్యం కనిపించక చికాకు

లక్ష్మీ కటాక్షం [0 అనిపించింది. తర్వాత సింగ్‌ ఫీవర్‌ అన్న నవల పూర్తిగా చదివాను. మొదట పాతిక పేజీలు బలవంతంగా చదివినా వెంటనే ఆ నవల పూర్తి చేశాను. చాలా హాస్యంగా అనిపించింది. ఆ తర్వాత వోడ్‌ హౌస్‌ అభిమానిని అయిపోయి, అతని నవలలు ఏవి దొరికితే అవి చదివాను. అతను రాసిన తాంబభైకి పైగా పుస్తకాలలో చాలా మటుకు చదివాను. నా హాస్య రచనల మీద వోడ్‌ హౌస్‌ ప్రభావం ఉంది. ఫార్పు, స్టేప్‌ స్టిక్‌ కామెడీ లాంటివి ఇత్తి చదివి నేర్చుకున్నాను. ఇతను కాక ఇర్షపులో ఓ హెట్రి. మపాసా, కొద్దిగా ఛెకోవ్‌ కూడా చదివాను. అంతకంటే విదేశీ సాహిత్యం కూడా నేను పెద్దగా చదవలేదు.

ఈ టైములోనే కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య వ్యాసాలలో ఒక చోట నేను కార్మిక వర్గం గురించి రాయలేను, నేను నాకు తెలిసిన జీవితాన్ని గురించి మాత్రమే రాయగలను, నాకు తెలియని జీవితాన్ని గురించి రాయలేను' అన్న వాక్యాలు చదివాను. ఇవే మాటలు ఆయన ఉపయోగించి ఉండకపోవచ్చు కాని ఈ అర్ధం వచ్చేట్టు రాశారు. ఈ వాక్యాలు నా కళ్ళు తెరిపించాయి. నేను మంచో చెడో, నేను రాసినట్టుగానే రాయగలను, నేనెప్పట్‌కీ రావిశాస్త్రి గారిలా రాయలేనని స్పష్టమయింది. దానితో రావిశాస్త్రి గారి ప్రభావం నుంచి తప్పించుకున్నాను. ఒక న్‌ రచయిత, తన అద్భుత రచనా శక్తితో పాఠకుల్ని ఉక్కిరిబిక్కీరి చేసి, ఇలా తప్ప మరిలా రాయడానికి వీలులేదన్న భావం కలిగిస్తాడు. వారిని అనుకరించడం కాక, వారివల్ల ఉత్తేజీితులై ఎవరికి వారు తమకు వచ్చిన రీతిలో రచనలు చెయ్యడమే మంచిదన్న అభి(ప్రాయానికొచ్చాను.

రావిశ్యాప్తి గారి ప్రభావం నుంచి బయటపడ్డా నేను ఏం రాయగలనో, ఎలా రాయ గలనో, నాకు మరికొంతకాలం వరకూ తెలేయలేదు. నా సొంత గొంతుక వెతుక్కునే ప్రయత్నం మొదలు పెట్టాను. వయసుతో, అనుభవంతో నా అతివాద భావాల తీవ్రత కొంచెం తగ్గి లోకం, సమాజం అన్న మాటలకు నేను కొత్త అర్జాలు చెప్పుకున్నాను. వ కా

నా కధారచనలో మలుపు తీసుకు వచ్చిన ఒక కధ గురించి చెప్పాలి. అది ఇప్పటికీ అము(ద్రైతంగానే ఉండిపోయింది. అంతకు ముందు అసంపూర్తి కథీలు కొ న్ని రాసినా, ఒకటి రెండు పూర్తి చేసినా, అవి రావిశాస్త్రి గారు నా చేత రాయించినవే కానీ నావి కావు. నాదైన ప్రత్యేకత ఏదీ ఆ కధల్లో లేదు. వస్తువు నాది కాదు. శిల్పం నాదికాదు. శైలి నాది కాదు. నేను రావిశాస్త్రిగారి ఛాయలాగా మాత్రమే అవి అతి కష్టం మీద రాశాను. వాటిలో జీవం లేదు అన్న సంగతి నాకు ఎవరూ చెప్పనక్కర్లేకుండానే అర్హమయింది. నేను నా శైలిలో వ్యంగ్య కధ రాయడానికి చేసిన మొదటి ప్రయత్నం ఈ కధ. హాస్యం, వ్యంగ్యం, ఫార్చ్సు, కామెడీ య అన్నీ కలగా పులగం చేసి రాశాను. అంతకు ముందు నేను హాస్య రచనలు చెయ్యడం వర్షద్రోహం అనుకునేవాడిని. స్ట లగ

ఆ సమయంలో, అంటే 1973-74 ప్రాంతాలలో, శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్టితి ప్రకటించడానికి సంసిద్దురాలౌతోంది ఆ ప్రయత్నాలలో

11 లతోలేటి జగన్నోవానరావు భాగంగా రోజూ కిరాయి మూకలు ఆవిడ ఇంటి దగ్గర జై జై లు కొట్టడానికి టెంపోల్టో, బస్సుల్లో, ట్రక్కుల్లో వస్తుండేవి. ఆవిడ వాళ్ళని ఉత్సాహంగా కలుసుకుని దేశం అంటే ఈ కిరాయి మూకలే అన్నట్టు ప్రవర్తించెది. ఓ రోజు బోటు క్షబ్బు దగ్గర ఒక బహిరంగ సభలో ఆవిడ (ప్రసంగిస్తుంటే టీవీ కెమేరావాళ్ళు ఆవిడక, ఈ మూకలకీ మధ్య అడ్డం వచ్చారుట. నన్ను నా ప్రజలకు కనిపించకుండా చెయ్యడానికి అదొక కుట్ర అనిఆవిడ చాలా ఆవేశ పడిపోయింది. బోటు క్లబ్బు పక్కనే మా ఆఫీసుండేది. లంచ్‌ టైంలో ఆ మీటింగుకి వెళ్ళి అదంతా చూస్తున్న నాకు ఆవిడ అవేళం, మాట్లాడే తీరూ చూసి నవ్యాచ్చింది.

లంచ్‌ టైం తర్వాత ఆఫీసుకు తిరిగొచ్చాకా 'నల్లపులి' అనే కథ (ప్రారంభించి అప్పటికప్పుడు ఎనిమిది పేజీలు రాశాను. అంతకు ముందు ఒక వాక్యం, ఒక పేరా రాయడానికి ఎంతో కష్టపడిన నేను ఎనిమిది పేజీలు ఏకబిగిన ఎలా రాయగలిగానా అని నాకే ఆశ్చ్ళర్యమనిపించింది. ఆ కథ పూర్తయ్యేటప్పటికి ఇరవై పేజీలకు పైగా వచ్చింది. తర్వాత ఆ కధ మెల్లిగా పూర్తి చేసి ఒక ప(త్రికకు పంపించాను.

ఒక రాజకీయ నాయకుడి ఉద్చ్పోధతో ప్రభావితులైన ముగ్గురు వ్యక్తులు, బ్లాక్‌ మార్కెటీర్ల మీదా, సంఘ విద్రోహక శక్తుల మీదా దాడి చెయ్యబోయి తన్నులు తింటారు. అదీ కధ.

ఆ కధ సంపాదకుల ఉత్తరంతో పాటు తిరిగి వచ్చింది. ఆయన కధ చాలా పెద్దదై పోయిందనీ వారి పత్రికలో సగం తినేసేలా ఉందనీ, కథలో స్పష్టత లేదనీ రాశారు. స్పష్టత లేదన్న సంగతి ఆయన ఉత్తరం చదవగానే అర్ధమైంది. కధలోని పాత్రలలో ఒక కుర్రాడున్నా, మిగిలిన ఇద్దరూ యువకులే. కాని ఆయన ముగ్గురినీ స్కూలు పిల్లలనుకున్నారు. ఆ కధ మళ్ళీ తెరిగి రాళాను. కాని నాకే నచ్చక ఏ పత్రికకీ పంపలేదు. పాఠకుడు కధ చదివేటప్పుడు రచయిత దగ్గరనుంచి ఏ సహాయం అందదనీ, కథలో ప్రతీ విషయం సూటిగా, స్పష్టంగా పాఠకుడికి అర్ధమయ్యేలా ఉండాలనీ ఈ కధ రాయడం ద్వారా తెలుసుకున్నాను.

ఆ తర్వాత కాలంలో రాసిన కధల్లో కొన్నింటిని హైదరాబాద్‌లో ఉన్న మిత్రులు నాగభూషణం గారికి ఆయన సలహా కిం పంపిస్తుండేవాడిని. నాగభూషణం గారు ఉమామహేశ్చరరావు గారి ద్వారా పరిచయం అయిన మరో మిత్రులు. సాహిత్యంలో లోతుపాతుమి తెలిసినవారు. ఈయన కూడా ఎ.జి. ఆఫీసులో పనిచేస్తుండేవారు. ఈ కాలంలో ఇరవై కధల వరకూ రాశాను, కాని నాకే సంతృప్తి లేక ఏ పత్రికకీ పంసించలేదు. అవి అము(ద్రితాలుగానే ఉండిపోయినా, అవి రాయడం వలన నాకు మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం ఇవ్వగల శక్తి వచ్చింది. పేరాలూ, పేజీలు తేలిగ్గా రాయడం మొదలు పెట్టాను.

1976లో, అంటే నేను రాయడం మొదలు పెట్టిన పన్నెండు సంవత్సరాలకి, మొట్టమొదటిసారిగా నా కధ 'మనుషులుచేసిన దేవుళ్ళారా' ఒక వార పత్రికలో ప్రచురిం పబడింది. 'మన బండి స్టార్టయింది' అనుకుని చక చకా ఒక అరడజను కధలు, అటూ, ఇటూ పంపించాను. కొన్ని తిరిగి వచ్చాయి. కొన్ని అయిపు లేకుండా

లక్ష్మీ కటూక్షం 12 పోయాయి. తర్వాత మెల్లిగా అప్పుడో కధ, అప్పుడో కధ (ప్రచురితమవుతూ వచ్చాయి.

నేను సీరియస్‌గా కధలు రాయడం మొదలుపెట్టినప్పటినుంచీ, అంటే మూడు దశాబ్దాలుగా, తెలుగు దేశానికీ, తెలుగు వాతావరణానికీ దూరంగా ఢిల్లీలోనే ఉంటు న్నాను. ఈ కారణం వలన నా రచనలకు కొన్ని పరిమితులు ఏర్పడిన విషయం నేను గుర్తిస్తున్నాను.

నేను చాలా స్టో రైటర్ని. ఒక కధా వస్తువు గాని, పూర్తి కధ కాకపోతే కధలో ఓ సన్నివేశం గాని, తట్టినప్పుడు ఆ వస్తువు గురించి చాలా కాలం ఆలోచిస్తాను. కథావస్తువు గురించి ఆలోచన వచ్చింది మొదలు, కధ పూర్తయ్యేసరికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. అంచేత నేను ఎక్కువగా రాయలేను. కొంతమంది రచయితలు ఒకటి రెండుసార్లు రాసి కధ పూర్తి చేస్తామని చెప్పారు. ఆలోచనల వేగానికి, కలానికి సమన్వయం కుదిరినప్తుడు అలా తృ్యరగా రాయడం వీలుపడుతుందనుకుంటున్నోను. నా విషయంలో. బహుశానా ఆలోచనల్లోని అస్పష్టత కారణం కావచ్చు. బద్దకం కావచ్చు, చాదస్తం కావచ్చు, ఏ కారణాలవల్లనైతేనేమి నేను త్వర త్వరగా కధ రాయలేను.

కొత్తగా రచనలు చేసేవారు ఒకరిని అనుకరించడం మంచిదికాదు అని తెలుసు కోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అభిమాన రచయితల ప్రభావం ఉండటం వేరు. వారిని ఉద్దేశపూర్వకంగా అనుకరించడం వేరు. ఒకరు వేసిన మార్గంలో నడవడం మొదట తేలికగా కనిపించినా, రచయిత స్వంత ప్రతిభ కనిపించదు. కొంచెం కష్టమైనా ఎవరి ధోరణిలో వారు సొంత గొంతుక వినిపించేలా రాయడమే మంచిది. ఆ విధంగా రాసేవారి కధలు, మామూలుగా వచ్చే కధలకి భిన్నంగా, '్రత్యేకత కలిగిఉండి సాహితీప్రియులను ఆలస్యంగానైనా 'ఆకర్షించక మౌనవు. పాఠకుల అభిరుచిని బట్టి కొట్టుకు పోక తనదైన భోరణిలో రచనలు చేస్తూ ప్రతీ రచయితా తన్ను అభిమానించే పాఠకులను క్రమంగా తయారు చేసుకోవాలి అని కూడా నేను అనుకుంటున్నాను.

హాస్య రచనల గురించి రెండు మాటలు - ఎంత గొప్పుగా నటించినా హాస్య నటుడికి హరోకి వచ్చిన గుర్తింపు రానట్లే హాస్య రచయిత వెప్పుడూ రెండో (శ్రేణే రచయితగానే మిగిలిపోతాడు. హృద య' మాలిస్యాన్ని ప్రక్షాళనం చేసే కన్ఫీటికున్లు ఎలువ నాలుగు విధాల చేటైన నవ్వుకు లేకపోవడమే కారణం కావచ్చు. హాస్య రచనలో సాధారణంగా కధ బలహీనంగా ఉంటుంది. పాత్రలకి డెప్త్‌ ఉండదు. అంచేత రచయిత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కధ తేలిపోయి, రచన పేలవంగా ఉండి విసుగు కలిగించే ప్రమాదం ఉంది. వెంత జా(గ్రత్తగా రాసినా, చదివే పొరకుడి మూడ్‌ని బట్టి కధ నచ్చడమో, నచ్చకపోవడమో జరుగుతుంది. మూడ్‌ బావున్నప్పుడు, నేను చాలా ఎంజాయ్‌ చేసిన పి.జవోడ్‌ హౌస్‌ రచనలు నాకు చికాకుగా ఉన్నప్పుడు చదివితే సిల్లీగా బోరుగా అనిపించాయి.

అలాగే వ్యంగ్యం. వ్యంగ్యం వాస్తవాన్ని వ్రీకరించదు. జీవితంలోని వాస్తవికతని అతిశయోక్తితో ఎత్తి చూపిస్తుంది. అతిశయోక్తి హాస్యానికి, వ్యంగ్యానికి ప్రాణం. రాజ

[3 తోలేటి జగన్నోహనరావు కీయాల్లో సమాజంలో, సాహిత్యంలో, కళల్లో - అన్ని రంగాల్లోనూ అంగుష్టమాత్రులు ఆకాశమెత్తు అహంతో రొమ్ములు విరుచుకు తిరుగుతున్న కాలం ఇది. గుడ్డి దీపాలు సూర్యుణ్ణి వెక్కిరిస్తున్నప్పుడు, చిట్టెలుకలు సింహాల్డా గర్జిసున్నసుడు. పెంటకుప్పలు మేరు నగాలుగా కీరంచబడుతున్నప్పుడు, వ్యంగ్యం రచయిత చెతిలో అయుధమవు తుంది సమాజంలో మెజారిటీ గుడ్డిగా, ప్రశ్నించకుండా అంగీకరిస్తున్న విషయాలలోని అసంగతత్వాన్ని వ్యంగ్యం సెర్చిలైటు వేసి చూపిస్తుంది.

సామాజిక స్పృహ అన్న పదం కొంత పిడివాదానికి, కొంత అవహేళనకు గురవుతున్నది కనుక ఈ విషయం మీద కూడా నా అవగాహన చెబుతాను. నేటి సమాజం చాలా కాంస్లెక్స్‌గా ఉంది. సమాజంలో మనం నిలబడిన స్థలంలోంచి , షాక్షిక సత్యాలను మాత్రమే చూడగలం. ఎంత ఆబ్జెక్టివ్‌ గా ఉన్నామనుకున్నష్పటి, వ్యక్తులుగా సమాజం యొక్క పూర్తి స్వరూపం మనం అర్హం చేసుకోలేకపోవచ్చు. రచయిత తన కోణం నుంచి తను చూసే వాస్తవాన్ని నిజాయితీతో ఎవరు ఏమనుకుంటారో అన్న భయం లేకుండా రాయాలి. సమాజం గురించి ఎవరు, ఏకోణం నుంచి రాసినా, నిజాయితీ తో రాస్తే అది సమాజ అవగాహనకు తోడ్పడుతుంది. సమాజంలో, జీవితంలో ఎంత వైవిధ్యం ఉందో, సాహిత్యంలో నూ అంత వైవిధ్యం కనిపించాలి. సామాజిక స్పృహ అంటే కొన్ని వర్గాలకో, వర్ల పోరాటాలకో పరిమితం చెయ్యడం కాని, మన ఆశయాల కనుగుణంగా ప్రపంచం మారుతున్నట్టు చిత్రించడం కాని కాదు. విశాల దృక్పధంతో మారుతున్న సమాజాన్నీ, ఆ మార్చుకీ దారి తీస్తున్న కారణాలను, సంఘర్షణలను వాస్తవి కంగా చిత్రించడం అని నా ఉద్దేశం.

ప్రతి వ్యక్తికి, స్పష్టంగానో, అస్పష్టంగానో ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఏ వాదానికీ కట్టుబడి ఉండను అనెవారికి కూడా ఏదో ఒక వాదం, కనీసం 'యధాతదవాదం”, ఉంటుంది. అలాగే నాకూ ఒక దృక్పథం ఉంది. నా దృక్పధం మార్క్సిస్టు దృక్పధం. ఆ మాటంటే ఒక మిత్రుడు మీ కధల్లో నాకు మార్క్సిజం ఎక్కడా కనిపంచటం లేదు అని చికాకు పడ్డారు. రచయిత దృక్న్షధం ప్రత్యేకంగా 'కనుపించకూడదు', రచనలో కలసి పోవాలి అని నా ఉద్దేశం. అంచేత ఆయన విమర్శను ఒక కాంప్లిమెంట్‌ గా స్వీకరించి సంతోషించాను. ప్రతీ _ కధలోనూ పనిగట్టుకుని మార్క్సిజాన్ని ఊదరగొట్టడం నా పద్దతి కాదు. సాహిత్యం సమాజం నుంచి వచ్చేదే అయినా దానికొక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కధ, పాత్రలు, గమనం, సన్నివేశాలను బట్టి నా దృక్పధం కనిపిస్తే కనిపించవచ్చు. హాస్య రచనల్లో దాదాపు మృగ్యం అనిపించవచ్చు. స్టూలంగా మార్క్సిజాన్ని అంగీకరించ వామపక్ష రచయితలు ముక్క చెక్కలుగా చిలిపోయిన కమ్యూనిస్టు పార్టీ (గ్రూపుల గందరగోళ సిద్తాంతాలను ప్రచారం చెయ్యడం కాక, అవసరమైతే ఈ ్రూపులని నిలదీసి, పేమర్శించి మార్కిజం పేరుతో చలామణి అవుతున్న మూర్జత్యాన్ని బట్టబయలు చెయ్యాలి. ప్రశ్నించి, విమర్శించే స్వభావం మార్కె జానికి ప్రాణం ఆ హీక్కు ఏ రచయితా వదులుకోకూడదు. సమాజానికి ఒక గమనం ఉంది. పాతది నళించి కొత్తది

లక్ష్మీ కటాక్షం 14 ఉద్భవిస్తుంటుంది. మార్కిజంలో కూడా మారిన కాలానికి అనుగుణంగా లేనిది నశిస్తుంది. కాలం చెల్లిన భావాలు నళించడాన్ని రచయితలు ఆహ్వానించాలి. నేటి సామాజికావసరాలకు అనుగుణంగా నూతన మార్క్సిస్టు భావజాలం రూపొందడాన్ని ప్రోత్సహించాలి. అందుకు అనువైన వాతావరణం స్పష్టంచడానికి కృషి చెయ్యాలి. తన నమ్మకాలకు అనుగుణంగా లేకపోయినా, ఈ నూతన సమాజ గమనాన్ని, సంఘర్షణలనీ, రచయిత చిత్రించాలి కాని ఒక సిద్దాంతంలో గుడ్డిగా నమ్మకం పెంచుకుని కేవలం దాన్ని సమర్దించడానికో, ప్రచారం చెయ్యడానికో రాయకూడదు. అలా రాసే రచయితలు నీజాయితీగలవారైతే కొంతకాలానికి తాము విశ్శసించేదానికి, వాస్తవానికి గల అంతరాన్ని గుర్తిస్తారు. అంతవరకు తాము (ప్రచారం 'బేసిన దానిని కాదనలేక, మారిన సామాజిక వాస్తవాలను ్రతిబింబించని ఆ సిద్దాంతాన్ని మరి సమర్దించలేక ఎందరో కవులు, రచయితలు, అస్త్రసన్యాసం చేయడం కూడా మనం చూసూనే ఉన్నాం. జీవిత వాస్తవమా, సిద్దాంతమి అనే ప్రశ్న రచయితకు ఎదురైనప్పుడు రచయిత తన విశ్వాసాలతో నిమిత్తం లేకుండా జీవితవాస్తవాన్నే ఎన్నుకోవాలి. ఏ సిద్దాంతమైనా జీవితం నుంచే వస్తుంది. కథలో పరిషారం చూపించడంపట్ల నాకు నమ్మకం లేదు. కధ వికాసాన్ని బట్టి ఒక పరిష్కారం కనిపిస్తే కనిపించవచ్చు. కాని రచయిక్‌ ప్రతీ సమస్యకీ పనిగట్టుకుని పరిష్కారాలు చూపించడానికి నేను వ్యతిరేకిని, క్లిష్టమైన సామాజిక, ఆర్జిక సమస్యలు అన్ని పార్వ్వాల నుంచి పరిశీలించి, పరిష్కారోలు సూచించడానికి నీపుణులు వేరే ఉంటారు. రచయిత చెయ్యాల్సింది సమస్యను కళాత్మకంగా పారకుల ముందుంచి వారు ఆలోచించేలా చెయ్యడం అనినా ఉద్దీశం. నా మొదటి సంపుటి 'తోలేటి జగన్మోహనరావు కధలు" పాఠకులు కొనకపోయినా ఆదరించారు. ఈ పుస్తకాన్ని కొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. న్యూ ఢిల్లీ తోలేటి జగన్మోహనరావు 01-05-2002 1056, బాబా ఖరక్‌సింగ్‌ మార్ష్‌, న్యూ ఢిల్లీ-.110 001.

ఫవోల్‌

సా యంత్రం అయిదవుతుండగా బీచి రోడ్డు మీద ఓ ఎర్ర మారుతీకారు వచ్చి ఆగింది. వెనుక తలుపు తెరవగానే ముద్దాచ్చేలా ఉన్న ఓ తెల్ల బొచ్చుకుక్క కిందికీ దూకి, అటూ ఇటూ ఒకసారి పరిగెట్టి తోకొడ్రిస్తూ 'నీలబడిర్‌ది. దానీ వెనకాలే ఓ యువకుడూ, ఆ యువకుడి వెనకాలే ఓ అందాల సుందరీ దిగారు. ఈ లోగా (డ్రైవరు సీట్లోంచి ఓ ముసలి పులి, బహుశా ఆ యువకుడి మామగారు కాబోలు, దిగి వచ్చి వాళ్ళ పక్కన నిలబడింది.

ఆ ఎర్ర మారుతీకారు, ముచ్చటైన జంటా, ముద్దొచ్చే కుక్కపిల్హా ముసలి పులి, అంతా (గ్రూపు ఫొటోలోలా అలా నిలబడితే, దూరంనుంచి వాళ్ళనే పరిశీలనగా చూస్తున్న నేను ఆ యువకుడి అదృష్టాన్ని పొగుడుతూ, కొంచెం ఈర్ష్యతో, “అదృష్టవంటే అదీ గురూగారూ - ఎన్ని జన్మల్లో నో పుణ్యం చేసుకుంటే తప్ప అలోంటి లైఫ్‌ దొర్వకదు' అన్నాను, నా పక్కన బీచిలో కూర్చున్న “గురూ” గారితో.

గురువుగారికీ నాకూ పెద్ద పరిచయం ఏవీ లేదు. రోడ్షూ సాయంత్రం నాలాగే బీచికి వస్తాడు. ఏదో పోగ మన్న వాడిలా అలా సము(ద్రం కేసి చూస్తూ

  • కూర్చుంటాడు. అతనికి పాతికేళ్ళకంటి ఎక్కువ ఉండదు కాని గడాలూ, మీసాలో పెంచడం వలన కొంచెం వయసు ఎక్కువగా కనిపిస్తుంది. స్ట

వాళ్ళనే దీక్షగా చూస్తున్న గురూగారు, “ఎన్నో జనల ఇ న జన్మలో టి అన్నాడు ఉక్రోషంగా న్నో శ్రేల పుణ్యం అక్కర్లేదు

16 లక్ష్మీ కటాక్షం

“అతను మీకు తెలుసా?

'ఆ తేలుకొండి గాడి పేరు కొండల్రావు - స్టెయిలుగా యం. కె. రావు అని చెప్హు కుంటాడు. ఒకే ఊళ్ళో, ఒకే స్కూల్డో ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే ఆఫీసులో ఒకే రోజు జాయినయ్యాం. సరళా వాళ్ళింటి జౌట్‌ హౌస్‌లో ఉండేవాళ్ళం ”

'సరళివరు?

,._ గురువుగారి గుండెల్లో నా ప్రశ్న కత్తిలా దిగబడింది కాబోలు, కొంచెం సేపు గిజగిజలాడ,. కారు. దగ్గర నిలబడ్డ అమ్మాయి కేసి చెయ్యి ఊపి చూపిస్తూ మొదలుపెట్టాడు...

“బౌట్‌ హౌస్‌ లో దిగిన మర్నాడు ఉదయం ఏడింటికి లేచి యాదాలాపంగా కిటికీ లోంచి గార్డెన్గోకి చూసేటప్పటికి ఓ మెరుపు మెరిసినట్టయింది. తోటలో వనకన్యలా మెరిసిపోతూ ఓ అమ్మాయి. కనిపించింది. ప్రి చేసుకుంటే ఈ అ్రమ్మ్థయినే చేసుకోవాలి" అని మనసులో అనుకున్నానో లేదో అవే మాటలు నా చెవుల్టా పడేసరికి నేను ఆశ్చర్యపోయి వెనక్కు తిరిగాను ఆ మాటలన్నది కొండిగాడు. నా వెనకాలే నిలబడి వాడు కూడా ఆ మెరుపునే చూస్తున్నాడు.

ఎమంటావు? * అన్నాడు నేను వాడికేసి తిరగ్గానే. సట్‌ యస్సంటాను కాని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నది నేను - లవ్‌ ఎట్‌ ఫస్ట్‌

మి!

ఆసలు | ఈ బౌట్‌ హౌన్‌లోకి ఏ ప్లానుతో దిగాననుకుంటున్నావు?' అన్నాడువాడు సీరియస్‌గా. ల చస కే ష్టానుతో దిగావో నాక్సు తెలియదు కాని నేను మాత్రం ఆ అమ్మాయినే

గ వార అని అరనిమిషం క్రితమే డిసైడ్‌ చేసేశాను' అన్నాను నేనూ సీరియస్‌గా. నళ వైద్దరం బద్ద ఇత్రువులమైై పోధ్రామని ఇద్దరికీ 'అర్హమయింది. కొంచెం ే మొహాలు ఒకళ్ళు సైలెంట్‌గా, సీరియస్‌గా చూసుకున్నాం. కొ ర్వాత కొండ్తిగాడే కొంచెం తగ్గి అన్నాడు - "మనిద్దరం జెంటిల్మన్‌ ఎగ్రిమెంటు ద్దాం. నువ్వూ (ప్రేమించు, నేనూ ('ప్రేమిసా - విజయలక్షి ఎవర్స్‌ వరిస్తుందో చూద్దాం...' = - విజయల్న్మ అంట్ల లారా ఆ మటు పేరు విజయలక్ష్మా?' 'విజయలక్ష్మ అంటే పేరు కాద గు దు గాడిదా- సక్సెస్‌ అన్న మాట. నీకు తెలు హర్గా నల భాద్దుకదా, అ అమ్మాయి పేరు సర ఏకైక పుత్రిక ఇంట్లో ఉండేది

  • కుక్కాను. మావగారికి గారెనింగ్‌ హాలీ. ఆ మొక్కలంటే పంచ(న్రాణాలు. సరళకి వాళ్ళ నాన్న అయిదు డ్‌ / న్న (ప్రాణాలు, కుక్క ఆరో ప్రాణం, అని ఇంట్లో ఉన్న (ప్రాణాల లెక్క చెహ్హీ' ౮౨ లాణం, కోస ర మాక్‌ నం న అత్తగారు ఆరు సంవత్సరాల నుంచీ మావగారి రాకకోసం ఎదుర చూస్తూ స్వర్గం _టింటున్నారు.. అంచేత ఆయన నా లాంటి యోగ్యుడైన ఫ్‌ స సరళకి పెళ్ళి చేసయాలన్న తాందరలో ఉన్నారు... చూశావా! జెంటిల్మన్లా నాకు తెల్పిసిందంతా ఏవీ దాచకుండా చెప్పేశాను 9 అంతా చెప్పావుకాని నువ్వు జెంటిల శ్రనంటేనే నాకు నమ్మకం కుదరడం లేదు.

తోలేటి జగన్నోవానరావు 17 నువ్వెంత దొంగ వెధవ్యో నాకు తెలీదా? చిన్నప్పుడు కేరమ్సు ఆడుతుంటే నే చూడ్డం లేదనుకుని కాయిన్సు చేత్తో గెంటేసేవాడివి. నువ్వు ఫౌలాడని గేం లేదు," అన్నాను నేను అనుమానంగా.

వభ. చిన్నప్పుడు వేరు, ఇప్పుడువేరు. ఇప్పుడు జెంటిల్మెనైపోయానని చెబుతున్నాను కదా... * అని వాడు అంటుండగా, ఓ ఉరుము ఉరిమినట్టు హలో అన్న శబ్దం వినిపించింది. ఇద్దరం బెదిరిపోయి వెనక్కి తిరిగి చూశాం. గుమ్మానికి అడ్డంగా ఆ గుమ్మానికి సంపూర్ణ (గ్రహణం కమ్మేసినట్లు ఓ స్థూలకాయం నిలబడి మమ్మల్ని పలకరిస్తోంది. స్థూలకాయం కాళ్ళ దగ్గర ఓ తెల్లటీ బొచ్చుకుక్క నిలబడి నోరు తెరిచి, 'ఎవర్రా మీరు?' అన్నట్టు చూస్తోంది.

కొండిగాడు మోచేత్తో నన్నో పోటు పొడిచి చెవిలో 'మానగారు' అన్నాడు మెల్లిగా.

హలో... హలో... ' అన్నాను నేను ఉలిక్కిపడి కంగారుగా.

మావగారు. లోపలికి రెండడుగులు వేశారు. కుక్కపిల్ల నాలుగడుగులు ముందుకేసి, నా ఎదురుగా నిలబడి , 'నీ పేరేమిట్రా?' అన్నట్టు నాకేసి కళ్ళు చికిలించి చూసింది.

నాకు కుక్కలంటే చచ్చే భయం. చిన్నప్పుడు ఓ సారి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఎనిమిదో, పదహారో ఇంజక్షన్లు పొడిచేశారు. అయినా, (ప్రేమ భయాన్ని జయించింది. మావగార్నీ, కుక్కపిల్లనీ చూడగానే సరళ హృదయాన్ని జయించడానికి (బ్రహ్మాండమైన అయిడియాలు బుర్రలోంచి తన్నుకొచ్చాయి.

“కుక్క పిల్ల చాలా బావుంది" అన్నాను దాన్ని ఎత్తుకుంటూ.

“వాణ్ణి కుక్కపిల్లనకు, టామీ అని పిలు. - మావగారుగాండ్రించారు = 'టామీ గొడు మా ఫామిలి మెంబరు”

“ఇకనుంచీ నేను కూడా మీ ఫేమిలీ మెంబరే అనుకోండి" అని మావగారికి కొంచెం మస్కాకొట్టి టామీ గొణ్జి ముద్దాడుతుండగా, 'టా...మీ...” అని పిలుస్తూ వచ్చింది సరళ. టామీ గాడు నా చేతుల్లోంచి దూకి సరళ దగ్గరకు వెళ్ళి పోయాడు.

వీళ్ళ అమ్మాయి, మన బౌట్‌ హౌస్‌లో అద్దెకు వచ్చింది" అన్నారు మావగారు మమ్మల్ని పరిచయం చేస్తూ - వెధవది - నాకు ఎర్హు గుర్తుండవోయ్‌- నీ పేరేమిటన్నావు?” అనడిగారు కొండిగాడి కేసి తిరిగి.

వాడు నోరు విప్పడానికి అవకాళం గెన్ఫకుండా, “వాడి పేరు కొండిగాడండి - నా పేరు శంకరం అండి” అన్నాను నేను సరళకసి తిరిగి.

'నమస్తే' అంది సరళ,

“నమస్తే * అన్నాను నేను.

(మళ్ళీ కలుద్దాంలే' అంటూ మావగారు దారి తీశారు. వాళ్ళు వెళ్ళిపోగానే కొండిగాడు చిటపటలాడుతూ, 'ఒంటరిగా ఉన్నప్పుడు అంటే అన్నావుకాని సరళ ఎదురుగా కొండిగాడని అలా బోదురు కప్పలా అరుస్తావేం?'అన్నాడు ఉడుకుమోత్తనంతో. వాడి పేరుగుర్ధించి వాడింత ఇదవుతాడని నాకు అంతవరకు తెలియదు. అది తెలిసిన తర్వాత ఇంక సరళ ముందు ఎప్పుడూ కొండిగా అని

18 లక్ష్మీ కటాన్షం పిలవాలనే నిర్ణయానికొచ్చేశాను 'అది సరే కాని, సరళకి మావగారంటే ఎన్ని ప్రాణాలు?" అనడిగాను నా ప్లానుకి ఓ రూపం ఇస్తూ. “అయిదు 'మావగారికి తోట?” “అయిదు” “'టామీగాడు?" “ఆరవ (ప్రాణం - ఏం? ఎందుకలా అడుగుతున్నావు?” ఓ నెల లోపున ఈ పదకొండుప్రాణాలు నా గుప్పిట్లో ఉంటాయి” అన్నాను నేను చిరునవ్వు నవ్వుతూ. “ఎలా?” చూడు మర్నాడు తెల్లవార గట్లే నా ప్లాను అమలులో పెట్టాను. రోజూ పొద్దుటే మావగారూ, టౌమీగాడూ మార్చింగ్‌ వాక్‌కి వెడతారు. ఆయన బుర్ర అప్పుడు (ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి ఇద్దర్నీ జాయింటుగా బుట్టలో వెయ్యడానికి బంగారం లాంటి ఛాన్సు అది. అంచేత తెల్లవారగట్ల నాలుగున్నరకి అలారం పెట్టి పడుకున్నాను. నాలుగున్నరకి అలారం గణగణా ఫైరింజన్లా మోగుతుంటే మెలకువ వచ్చింది. గబ గబా మంచం మీంచి దూకి బట్టలు, బూట్టు వేసుకుంటుంటే కొండిగాడు ముసుగు తీసి తల బయటకి పెట్టి, ఏం రోగవాచ్చీంది? పొద్దుటే అలారం పెట్టి లేపేశావు” అన్నాడు చికాగ్గా. స 'మార్చింగ్‌ వాక్‌ కి వెడుతున్నాను” “ఈ జబ్బు ఎప్పట్నుంచీ? “ఇవాలినుంచే' ఇంతలో తలుపు తీసిన చప్పుడైంది. 'నే వెడుతున్నా - తలుపేసుకో- వాళ్ళు వచ్వేసున్నారు" ఎవర?! నా ఛి ఎబ్బస్తున్నా “మావగారు, టామీగాడు"” వాడి ని(ద్రమత్తంతా వదిలి పోయింది. 'అమ్మ దొంగవెధవా..' అంటూ నోరు తెరిచి లేచి ధూర్మునాడు. వాడి నోరు నొక్కేసి, టాటా చెప్పి, మావగారి కలిశాను, 'గుడ్‌మార్షింగ్‌ సారో అంటూ ఆయన సోడా బుడ్డి అద్దాలు సరిచేసి నన్ను చూసి, 'నువ్వూ మార్నింగ్‌ వాక్‌ కి వెడతావన్నమాట. గుడ్‌ అలా “ఉండాలయ్యా! ఈ కాలం కుర్రాళ్ళు రాత్రి పన్నండుదాకా రోడ్డ మీద అడ్డగాడిదల్హా తిరగడం, ఎనిమిదింటికి లేవడం అమెరికాలో అయిలే రోజూ జాగింగ్‌. " "మావగారికి మంచి ఇంప్రెషన్‌ కలిగించానన్న సంతోషం అయిదు నిమిషాలు

తోలేట్‌ జగన్మ్నోవానరావు [19 కూడా నిలవలేదు. పలకరించగానే జోరీగలా తగులుకున్నారు నికరాగ్నేలో ఎన్నికల గురించీ, బోఫోర్స్‌ గురించీ, వాతావరణ కాలుష్యం గురించీ , న్యూజిలాంటీలో మావోరీ తెగవారి జీవన విధానం గురించీ, నాన్‌ స్టాపగా మాట్టాడటం మొదలుపెట్టారు. ఆయనకి ఆన్‌ స్తెస్సే కాని ఆఫ్‌ స్విచ్‌ ఉన్నట్టు లేదు అరగంటయినా ఆగే సూచనలు ఎక్కడా కనిపించలేదు. ఆయన (ప్రసారం ఎప్పుడు ముగిస్తారో తెలియక కంగారు పడి. కనీసం స్టేషనేనా మారుద్దామని, నా నొకివ్వండి సారో అన్నాను, టామీగాడు మావగారికంటే ప్రమాదకరమైనవాడని తెలియక.

'వాడు నిన్ను విసిగిస్తాడయ్యా" అన్నారు మావగారు, తల్లి తన అల్లరి పిల్హాణ్ణి పక్కింటావిడకు అంటగడుతూ ముద్దుగా అన్నట్లు .

'ఫరవాలేదు సార్‌ - నాకు చాలా సరదా” అన్నాను గొలుసు అందుకుంటూ.

అంతవరకు మెల్లిగా నడుస్తున్న టామీగాడ జీను గొలుసు పట్టుకున్న తర్వాత హుషారుగా నన్ను ఈడుస్తూ పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఊపిరి బిగబట్టి వాణీ వెనక్కు లాగుతూ వాడి వెనకాలే నేను పరిగెట్టాను.

అలా పరిగెట్టి పరిగెట్టి, ఓ చోట రక్కున ఆగిపోయాడు వాడు. గుర్రు గుర్రు మంటూ మెల్లిగా వెనక్కు వెనక్కు జరిగి నా కాళ్ళ మధ్యకు వచ్చేశాడు. ఏవిటా అని చూస్తే రోడ్డు పక్కగా నిలబడి ఓ ఊర కుక్క మాకెసి తీవ్రంగా చూస్తూ కనిపించింది. దాన్ని చూపించి, నాకేసి తిరిగి, 'దాన్ని తన్ను” అన్నాడు టామీగాడు.

టామీగాడిలో ఏ కుక్కలోనూ నేనెప్పుడూ చూడని ప్రత్యేకత ఒకటుండేది. వాడికి మాటలు రావుగాని తోక ఊపీ, తల కదిపీ, కళ్ళు చికిలించీ, చిందులు తొక్కీ, వాడు చెప్పదలచుకున్న దేవిటో స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పేసేవాడు. వాడికేసి చూడగానే వాడు ఏవంటున్నదీ నాకు ఎలా తెలిసేదో కాని తెలిసిహోయేది.

'దాని గొడవ నీకెందుకురా - నీ దారిన నువ్వు నడు,” అన్నాను టామీగాడితో, ఈ కుక్క జట్టీల్లో దిగడం ఇష్టం లేక.

వాడి దారిన వాడు నడవలేదు. నా ఆసరా దొరికిందన్న ధైర్యంతో, 'భౌ...భౌ....' అని నన్ను గుంజుతూ ముందుకి దూకాడు - “అడ్డు తప్పుకోండి, మహారాజుగారు నస్తున్నారు' అంటూ. ఊరకుక్క స్రీట్‌ 'ఫైట్స్‌లో ఆరితేరిన రకం కాబోలు - 'నీలాంటోళ్ళని చాలా మందిని చూశాంలే' అన్నట్టు తాపీగా తోకలేపి, రోడ్డుసైడు నుంచి సెంటరులోకి వచ్చి అడ్డంగా నిలబడి భౌ....భౌ...అని ఛాలెంజి చేసింది. టామీగాడు తోక దింపి ముడుచుకుపోయి మళ్ళీ నా కాళ్ళ మధ్య దూరాడు.

ఈ లోపున మమ్మల్ని కలుసుకున్న మావగారు, “ఇది అందుకో అన్నారు లారీ అందిస్తూ,

“ఎందుకు?' అన్నాను అయోమయంగా.

'దీంతో ఆ వెధవకుక్కని ఒకటందుకో'

నేనా? ఛాలెంజి చేసింది టామీగాడు, యుద్ధం నేను చెయ్యాలిట.

“నువ్వే” - గంభీరంగా అన్నారు మావగారు నా కళ్ళలోకి సూటీగా చూస్తూ,

హివిన్టీ టబైజు చెయ్యబడ్డ వాడిలా నేను కర్ర తీసుకు కదలగానే టామీ గొడు

20 లక్ష్మీ కటాక్షం మళ్ళీ తోక లేపి ముందుకి దూకాడు. సీట్‌ ఫైటర్‌ తోక దించకుండానే ఒక అడుగు వెనక్కు వేసి, యుద్దశంఖం పూరించినట్లు తలపైకెత్తి కుయ్యోమని దీర్హంగా అరిచింది. ఆ సిగ్టలందుకుని దాని సైన్యం వచ్చేసి మమ్మల్ని చుట్టుముట్టేసింది.

'భా...భా...భౌ.. - నా చుట్టురా ఓ అరడజను కుక్కలు చేరి అరవడం మొదలు పెట్టాయి. టామీగాడిని రక్షించడానికి కాకపోయినా, [ప్రాణ భయంతో లారీ గిరగిర తిప్పసాగాను. శత్రు సైన్యం రెండు నిమిషాలు దూరం నుంచే అరిచి అరిచి అలసిపోయి యుద్ధ విరమణ చేసే సందుల్డోకి వెళ్ళి పోయింది.

“శభాష్‌...” అన్నారు మావగారు. అంతవరకూ ఆయన రోడ్డు పక్కన తూము రాయి మీద సేఫ్‌ డిస్టైన్సులో కూర్చుని, బాల్కనీ సీటులోంచి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు - 'ఈ ఉృారేకుక్కలతో చచ్చేచావోచ్చిందయ్యా - నువ్వ బాగానే టాకిల్‌ వేశావు అన్నారు. టామీగాడు కూడా, బాగానే స్టంటు చేశావురోయ్‌ - సుప్రీం హరోలా' అని తోకాడించి మెచ్చుకున్నాడు. న ॥ నిమిషానికి మూడు వందల సార్టు కొట్టుకుంటున్న గుండె ఆ షాటికి కొంచెం స్పడు తగ్గి రెండు వందలసార్లకి దిగి, కొంచెం నోరు పేగిలింది నాకు - *-వె-ంధ “వ... కు....క్క....లకి.... భయపడితే... ఎ...లా.....సార్‌.....”

| మార్షింగ్‌ వాక్‌ ఆలా ముగిసి గార్డెన్లో కుర్చీలో కూలబడ్డాక టేపు రికార్తరు ఆన్‌ చేసి, శాస్త్రీయ సంగీతం పెట్టి " ఇదీ "ఎందుకు పెట్లాన్‌ తెల్సా?" అనడిగారు మావగారు, ల బ

మిక్తు శాస్త్రీయ సంగీతమంటే ఇష్టం కాబోలు” గురంచ సరే, ఈ మొక్కలకి...” అంటూ సర్‌ జగదీష్‌ చంద్రబోస్‌ పరిశోధనల సని వివరించారు చూడు! మొక్కలు సంగీతమంటే చెవి కోసుకుంటాయయ్యా!

అల్హాటప్పా సంగీతం కాదు - సజీవమైన శాస్త్రీయ సంగీతం' సంగీ హ్‌ మొక్కలకి ఉదయం, సాయంత్రం రోజూ రండు గంటలు శాస్త్రీయ 0 వినిపించి బెండకాయలంత మిరపకాయలు, బీరకాయలంత బెండ కాయల్సు ద్ద్‌సకాయలంత టొమాటాలు పండిస్తారట. బ్ద క పండిట్‌ వా ళ్‌ /| స మీద అనర్గళంగా బడ న మఖ రావాలి మనకు' అన్నారు, ఆ సబ్జెక్టు

ఆ రజా నుంచీ మావగారూ, టామీగాడూ, రాహుకేతువుల్తా నన్సు తగులుకుని క్ర్‌య్యడం మొదలు పెట్టారు. అలా ఓ నెల రోజులు గడిచేసరిక్‌ వాళ్ళే ప్రాణాలు నా

౧% రావడం దేవుడెరుగు కాని, నా (ప్రాణాలు పోయే పరిస్టితి వచ్చింది. నా ఎడం చెయ్యి భుజం దగ్గర్నుంచి క్రింది వరకు లాగడం ్రారంభించేవిది మొదట అంతగా పట్టింఛుక్టోలేదు కాని, రాను రాను నొప్పి ఎక్కువైపోయింది. ఓ రోజు రాత్రి పడుకోబోతూ కొండిగాడికి ఆ విషయం చెప్పాను...

'నాప్రా? ఎడం చెయిలోనా” అ సూ.

ఎడ చెద్యు లోనే శ న్నాడు వాడు కొంచెం ఆతృత కనబరుస్తూ,

“ నేనెక్కడో చదివాను - హార్టెటాక్‌ వచ్చే ముందు అలా ఎడం చెయ్యి

తోలేటి జగన్మోహనరావు 21 లాగుతుందట. ఎందుకైనా మంచిది ఓ సారి డాక్టరుకి చూపించుకో. పాపం, పెళ్ళి కూడా చేసుకోబోతున్నావు' అని ఓ బాంబు పేల్ఫి ముసుగు తన్నేశాడు వాడు

ఇంక నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మర్నాడు మా బామ్మకి ఆరోగ్యం బాగా లేదని కారణం చెప్పి ఓ పదిహేను రోజులు సెలవు పెట్టి మా ఊరు వెళ్ళాను.

'నీ గుండెకేం ఫరవాలేదు, గుండులా ఉన్నవు అన్నాడు నన్ను, నాలుగురోజులు అన్ని టెస్టులు చేసి అయిదువందలు గుంజేసేన కార్డియాలజిస్టు - 'ఎందుకైనా మంచిది. ఆర్హాపేడిక్‌ స్పెషలిస్టుకి చూపించు. ఇంకో అయిదొందలు నా దగ్గర్నుంచి లాగేశాక ఆర్గోపిడిక్‌ స్పెషలిస్టు గారు ఆర్టోపేడిక్‌ ప్రాబ్బం ఏవీ లేదని నిర్ణయానికొచ్చి, “ఓ సారి న్యూరాలజిస్టుకి చూపించు. ఎందుకైనా మంచిది" అన్నాడు.

మరో అయిదొందలు వదిల్చి, 'నీ నరాలు ఉక్కు తీగల్లా ఉన్నాయని సంతోషించాడు న్యూరాలజిస్టు. నేను కూడా సంతోషించి లేవబోతుంటే, 'ఆగు! నీ తల కొంచెం వాచినట్టుగా ఉందేమిటి? ఓ సారి బుర్ర స్కేనింగ్‌ చేద్దాం, ఎందుకైనా మంచిది' అని ఏదో అనబోతుండగా, "ఇది మావగారి దెబ్బ సార్‌! అంతకంటే ఏమీ లేదు" అని ఆయనకు నమస్కారం చేసి పరిగెట్టాను నేను.

ఈ లోగా మా బామ్మ రోజూ నూనె రాసి మర్దనా చేసి కాపడం పెడుతూనే ఉంది. బామ్మ కాపడం పెట్టడం వలనో, లేకపోతే నా దగ్గర్నుంచి పదిహేనొందలు లాగేసిన మన్‌ స్పెషలిష్టుల దీవెనల చలవో కాని రెండు వారాల్లో న్‌ పూర్తిగా తగ్గిపోయింది. అయితే, నొప్పికి కారణం మాత్రం నాకు అప్పుడు తెలియలదు.

మళ్ళీ 'డ్యూటీ' లో జాయినయ్యి టామీ గాణ్మి తిప్పటం మొదలుపెట్టిన తరువాత నొప్పి ప్రారంభమవడంతో అసలు కారణం తెలిసింది. గొలుసు ఎడం చేత్తోనూ, లారీ కుడి చేత్తోనూ పట్టుకుని టామీగాళ్ణి షికారుకు తీసుకెడతాను కదా! టామీ గాడు దారిలో ఏ పిచిక కనిపించినా, కాకి కనిపించినా దాని మీదకు దూకుతాడు. టామీగాడు ఓ రోజున ఓ ఊరకుక్క మీదకి దూకబోతుంటే వాణ్ణో వారిస్తూ వెనక్కు లాగినప్పుడు భుజం కలుక్కుమని నొప్పికి కారణం తెలిసొచ్చింది.

'ఓ8ి వెధవా...” అని పోయిన పదిహేను వందలూ గుర్తుకొచ్చి అనాలోచితంగా టామీ గాణ్ణి ఒక్కటేశాను లారీతో. వాడు కుయ్యోమని ఎగిరి గంతేశాడు.

మావగారు. రోడ్డు మీద అగిపోయి, 'వాడినెందుకు కొట్టావు? అనడిగారు తీవ్రంగా.

'వాజణ్ణి కొాదుసార్‌ అన్నాను నేను తెలివి తెచ్చుకుని.

“మరి?”

“ఊరకుక్కని సార్‌ - దాన్ని కొడదామనుకుంటే పాపం మన టామీగాడికి తగిలింది దెబ్బ' అన్నాను ఏదో సమర్ధిస్తూ

నేనూ, టామీ గాడూ తప్ప ఎవరూ లేరే' అన్నారు మావగారు ఆశ్చర్యపోతూ.

“లేరా? అరే! నాకు ఊర కుక్క కనిపించిందే' అన్నాను దబాయిస్తూ,

ఆయన మాట్లాడకుండా నన్ను ఎగాదిగా చూసి, నీకు పిచ్చికాని లేదు కదా' అనడిగారు అనుమానంగా.

22 లక్ష్మ కటాక్షం నేను ఏదో చెప్పానుకాని, నా సమాధానంతో ఆయన సంతృప్తి చెందలేదు. టామీగాడి మీద ఎవరు చెయ్యి చేసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. 'సరే సార్‌ అన్నాను నేను చెయ్యి రుద్దుకుంటూ. ఇంకా ఆ చేతి నొప్సి నుంచి పూర్తిగా కోలుకోలేదు, మరో ప్రమాదం వచ్చిపడింది. ఓ రోజు టీవీలో! వెన్నాల తగిలితే కందిపోయేలా న కోమలాంగి దేశం గురించి, దరిద్రం గురించి, ఇరవై ఒకటవ శతాబ్దం గురించి ఏదో మాట్టాడి, 'ఐ రన్‌ ఫర్‌ మై కంట్రీ - డుయు?'” అనడిగింది ముద్దు ముద్దుగా 'యన్‌' అని పులిలా గాండ్రించారు మామగారు, నా చెవిలో. మర్నాడు తెల్లవారకట్టే తెల్లలాగు, _తెల్లబనీను వేసుకుని సున్నపు కుండ దొర్హుకుంటూ వచ్చినట్టు వచ్చేసి, 'రన్‌ మాన్‌ అనరిచారు. “ఎక్కడికి? " అనడిగాను భయం భయంగా. శక్‌ మాన్‌ - రన్‌ ఫర్‌ద కంట్రీ - దేశం కోసం - పరిగెట్టు' అనరుస్తూ పరుగు తీశారు. ఆయన వెనకాలే నేను, నా వెనకాల టామీగాడు - అలా ఓ వంద గజాలు పరిగెట్టామో లేదో ఆయన నిషా దిగిపోయింది. అలిసి పోయి రోడ్డు పక్కన గడ్డిలో కూల బడ్డారు. “నాది పరిగెట్టే వయసు కాదయ్యా" అన్నారు వగురుస్తూ ఆయన వెనకాలే ఉన్న నాకు ఆయన మాటలు సంగీతంలా వినిపించాయి. “పోనిద్దురూ - వెధవ పరుగు. ఇంట్లో కాలు కార్లోనూ, కార్గో కాలు ఇంట్లోనూ యి న్‌ సల ఉండేవాళ్ళు సంవత్సరానికి ఓ సారి సరదాగా అలా టీవీలో దేశం కోసం పరిగెట్టాలి కానీ, మన (బ్రతుకే ఓ పరుగు - ఇంక ఈ వెధవ పరుగెందుకు సార్‌! విశ్రాంత్రి తీసుకుందాం", అన్నాను నేను ఆయన పక్కన కూలబడి. 'వెధవ పరుగా? విశ్రాంతి తీసుకుంటావా? నన్నాక సమాజ విద్రోహక్త్క దేశ విద్రోహక శక్తిని చూసినట్టు చూసి 'లే...' అని తుపాకి పేలినట్టు పేలారు మావగారు. నేను ఉలిక్కి పడి లేచాను. టామీగాడుకూడా నన్ను సువి.దే.వి. శక్తిని చూసినట్టు చూస్తి. 'పరుగెట్లు' అనరిచాడు. ల దేశం కోసం త్యాగాలు చెయ్యమనడం విన్నాను. కష్టపడి పనిచెయ్యమనడం విన్నాను. కానీ, దేశం జం పరిగెట్టడమేవిటో, నేనూ, టామీ వెధవా పరిగెడితే దేశం ముందుకు ఎలా పోతుందో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఎక్కడ ఏ సారవంతమైన మెదడులో దేశం కోసం పరుగు అనే ఆలోచన మొలిచిందోకానీ, మావగారికి నన్ను హింసించడానికి కొత్త ఆయుధం ఒకటి దొరికింది. విశ్ష శాంతికనీ, బాలల దినం అనీ, స్త్రీ విముక్తి అనీ, వాతావరణ కాలుష్యం అనీ - దేశంతో ఏ సమస్య ఎదురైనా నన్ను పరుగెట్టించడం మొదలు పెట్టాడాయన. టామీగాడూ, మావగారూ పెట్టే చిత్ర హింసలతో నేను శారీరకంగా, మానసికంగా శిధిలమైపోయాను. ఇంకో వారం రోజులు ఈ హింస కొనసాగితే నాకు పిచ్చెక్కడం ఖాయం అనుకుంటుండగా మావగారు శుభవార్త చెప్పారు - మేం ఓ నెల

తోలేటి జగన్మోహనరావు 2% రోజుల పాటు ఊరు వెడుతున్నామోయ్‌! తోటా అదీ జాగ్రత్తగా చూస్తూండు. నీళ్ళు పోసి, మర్చిపోకుండా సంగీతం వినిపించు "

ఆ వార్త వినగానే నాకుఎగిరి గంతెయ్యాలనిపించింది. నా సంతోషాన్ని దాచుకుని, మొక్కల గురించి మీరు చెప్పాలా సార్‌! మీరొచ్చేటప్పటికి అవి ఎలా ఉంటాయో చూడండి' అని హామీ ఇచ్చి, దిగులుగా ముఖం పెట్టి - 'ఓ నెల రోజుల పాటు మిమ్మల్ని మిస్సవుతానుసార్‌! పోనీ టామీగాబ్బయినా ఉంచెయ్య కూడదా! నాకూ సరదాగా ఉంటుంది” అన్నాను గొప్పుగా.

'నేనూ సరిగ్గా అదే అనుకుంటున్నానోయ్‌ - వాడికీ ప్రయాణాలంటే ఇష్టం ఉండదు"

నా గుండెల్లో రాయిపడింది. ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని తెలిస్తే నేను ఏదో వంక పెట్టి ఉడాయించేవాణ్ణీ కానీ, స్వయంగా ఇలా ఉచ్చు మెడకి తగిలించుకునేవాణ్ణి కాదు.

ఆ రోజునుంచీ టామీగాడితో చచ్చే చావొచ్చి పడింది. వాణ్ణి పొద్దుటే షికారుకి తీసుకెళ్ళి వాడి ఎంటర్‌టెయిన్‌ మెంటుకి కుక్కలతో యుద్దం చెశాను స్నానం చేయించ, (బ్రష్‌ చేసి, పాలు పట్టించి, తిండి పెట్టి, 'బజ్జోరా నాన్నా” అని పడుకోబెట్టి , ఆఫీసుకి వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ అంట్ల వెధవలా తయారై కూర్చు నడు సాయంకాలం షికారూ, వినోద కార్యక్రమాలూ, మళ్ళీ స్నానం...

“ఇదేవిటి - ఈ వెధవ సబ్బుతో రుద్దుతున్నావు?' అన్నాడు టామీగాడు చికాగ్గా, వాణ్ణి రుద్దడానికి సబ్బు తియ్యగానే.

'మరి దేంతో రుద్దాలిరా?”

సదానితో' అన్నాడు టామీగాడు - నా కోసమని తెచ్చుకున్న ఇంటర్నేషనల్‌ లగ్టరీ సబ్బు చూపిస్తూ .

'అది సినీతారల సౌందర్య స్వ్టరా - నీ కుక్క మొహనికిది చాల్లే"

“నువ్వేవన్నా సినీ తారడివా? నీద్‌ కుక్కమొహవెకదా - నీకెందుకు?'

"వెధవా - నీకూ నాకూ సాపత్యమేమిటి - వెధవ వాగుడు వాగకు' అని చెంబుడు నీళ్ళు పోశాను. టామీగాడు బాత్రూంలోంచి ఛంగున ఎగిరి గార్డెన్లోకి పారిపోయి. నిరసనగా మట్టిలో పార్షసాగాడు. వాణ్ణి బతిమాలి, మళ్ళీ బాత్రూంలోకి తీసుకొచ్చి సినీతారల సౌందర్యసబ్బుతో స్నానం చేయించేటప్పటికి నా తలప్రాణం తోకకొచ్చింది. ఎనిమిది రూపాయల సబ్బు నాలుగు రూపాయల సబ్బు అయింది.

ఇప స్నాన సుఖం' అంటూ టీవీ ఎడ్వర్టయిజ్‌ మెంట్‌ సుందరిలా ఒళ్ళంతా అటూ ఇటూ కదిపి నీళ్ళు విదిలిస్తూ, “అలా రాయిలా చూస్తూ నిలబడతావేం? తుడిచి (బ్రష్‌ చెయ్యి" అవరు. వాడికి బ్రష్‌ చేసి, బయటకు పంపించి, నేను స్నానం చేస్తుంటే 'ఆ బాత్రూం ల్‌ంచి తగలడతావా? నన్ను తినెయ్యమంటావా?' అనరిచాడు కొండిగాడు, హోటల్నుంచి వచ్చిన కేరియర్‌ విప్పుతూ.

నేను భోజనానికి కూర్చోగానే కొండిగాడు నాకేసి ఎగాదిగా చూసి, 'నీ ఆరోగ్యం బాగాలేదా?' అనడిగాడు.

“ఏం? బాగానే ఉందే.”

'గులాబీ మల్లెల సబ్బులు, కలోన్‌ నిమ్మకాయ సబ్బుల మంచి. గంధ పరినముళాలు కాక ఆరోగ్యానికి రక్షణ నిచ్చే కంపు కొడుతుంటే అనుమానం వచ్చి అడిగాను.”

'టామీగాడు నా సబ్బు వాడేశాడు కదా - వాడి సబ్బుతో నేను రుద్దుకున్నాను, అన్నాను నేను దుఃఖంతో.

'ఏడీ వాడు?"

'ఎక్కడో తగలడ్డాడులే - భోం చేద్దాం"

మా భోజనాలైనా టామీ గాడి అజాపజా లేదు.

'ఏమైపోయాడు వీడు?” అన్నాడు కొండిగాడు ఆశ్చర్యంగా.

'వీడు మళ్ళీ మట్టిలో దార్జచ్చి స్నానం చేయించమనడుకదా' అన్నాను భయం భయంగా. మరో అరగంట వాడికోసం వెతికి వెతికి, వాడే వస్తాడులే అనుకుని మంచం మీద వాలబోతూ, బెడ్‌ మీద మెత్తగా తగిలి, “అమ్మోయ్‌' అని ఎగిరి గంతే శాను. అదే సమయంలో “కుయ్యో'మని మూలుగు వినిపించి, మల్లెపువ్వులాంటి బెడ్‌షీటు కింద నుంచి టామీగాడు (ప్రత్యక్షమయ్యాడు.

“కళ్ళు కనబడ్డంలా? అలా మీద కూర్చుంటావు. కొంచెం 'ఉంటే చచ్చే వాడిని అన్నాడు టామీగాడు కోపంగా. ఐం

"వెధవా - మహారాజులా నా మంచం మీద పడుకున్నావు - లే"

'లేవను" రకు టామీగాడు ముడిచిపెట్టుకు పడుకుంటూ .

'తన్ని తగిలేయ్‌ వెధవని - అలా నెత్తికెక్కించుకోకు” అన్నాడు కొండిగాడు నన్ను రెచ్చగొడుతూ.

“ఏం చెయ్యమంటావ్‌

వొల్టో కట్టేఏయ్‌'

కొండిగాడు అలా అనగానే టామీగాడు ఉండచుట్టుకుపోయి. కుంయి కుంయి మని గోల చెయ్యడం మొదలు పెట్టాడు. వాళ్షి మంచం మీంచి ఈడి సరళ వాళ్ళింటి హాల్లో కట్టీశాను. బి

మర్షాడు మార్నింగ్‌ వాక్‌ అయిన తర్వాత టేపు రికార్డ్‌ ఆన్‌ చెయ్యగాన్న "ఏవిటి గురూ ఈ సంగీతం ముసిలాళ్ళల్లా - సరదాగా హుషారు సంగీతం వినాలి గాని " అంటూ ఇంగ్లీష్‌ పాప్‌ మ్యూజిక్‌ కేసెట్‌ ఇచ్చాడు కొండిగాడు. నేను పాక్‌ మ్యూజిక్‌ పెట్టగాన్‌ టామీగాడు పరిగెట్టుకొచ్చీ, 'ఆపరోయ్‌ - నాక్తు పిచ్చెక్కుతోంది” అన్నాడు తల కొట్టుకుంటూ .

విడికి పిచ్చెక్కుతోందిట*

“అయితే ఇంకా వాల్యూం పెంచు - వెధవకి రోగం కుదురుతుంది" అన్నాడు కొండిగాడు.

నేన్తు వాల్యూం పెంచాను. టామీగాడు కుయ్యోమని ఎగిరి గంతేసి హాల్లోకి

ల] పరిగెట్టాడు 'నా తల పగిలిపోతోందిరోయ్‌' అంటూ.

తోలేటి జగన్మోహనరావు 25

టామీ గాడికి తడి గుడ్డలో గొంతు కొయ్యడం తప్ప ఓపెన్‌ ఫైట్లు ఇష్టం ఉండదు. అంచేత 'సరి! ఇష్టం వచ్చినట్టు నువ్వేడు. నిన్నింతకింతా ఏడిపించకపోతే నా పేరు టామీ కాదు" అన్నట్టు హాల్టోంచి సైలెంటుగా చూస్తూ కూర్చునడు వాడి చూపుల్లో వార్డ్మింగు నాకు అర్హం అయినా అప్పుడు పట్టించుకోలేదు గాని, ఆరోజు నుంచీ నన్ను వేపించుకు తినెయ్యడం మొదలు పెట్టాడు వాడు. అలా మూడు వారాలర్యాటప్పటికి టామీ గాణ్జీ మర్దరు చెయ్యడమో, నేను ఆత్మహత్య చేసు కోవడమో, ఏదో ఒకటి జరగక తప్పదనే పరిస్టితి వచ్చేసింది...

వెధవని నెత్తికక్కించుకుంటున్నావు. నువ్వు ఇలాగే వాడు ఆడించినట్లల్లా ఆడేవంటే, వాడి మెల్‌ గొలుసు నీ మెడలో వేసి, షికారు తిప్పి, వాడి పళ్ళింలో నీకు పాలుపోసి పట్టించి, నీ పాంటూ, షర్టూ వేసుకుని ఆఫీసుకు వెడతానని మారాం చేసినా ఆశ్చర్యపోను' అన్నాడు కొండిగాడు,

“ఏం చెయ్యను?” అన్నాను నీరసంగా.

“వాడి కాళ్ళూ చేతులూ విరగ్దాట్టేసేయ్‌! సరేలే, నీ వల్ల ఏం కాదు. వాడి తోక పుచ్చుకుని ప్రేమ గోదారి ఈదుతున్నావు కదా - అంతర్చది సముద్రంలో తేలుదువు గానిలే' అన్నాడు కొండిగాడు హేళనగా.

'నువ్వు నా సో ఉంటే ఏం చేసేవాడివి?

“నేనా? వాడిని చావగొట్టేవాణ్ణి

“వాడు మావగారికి చెబుతాడు కదా”

'వాడు నన్నుగుర్తుపట్టకుండా అమావాస్య అర్ధరాత్రి నల్లదుప్పటి ముసుగే సుకు వెడతాగదా'”

'వాడు వాసన పసిగడతాడుకదా!?

'వాడు వాసనపసిగట్టకుండా సస్పెన్సు కింగ్‌ నవల్లో హీరోలా చెప్పులకి సున్నం రాసుకు వెడతాను కదా..."

టామీగాడిని గుర్తు పట్టకుండా చావగొట్టడానికి కొండిగాడు ప్టాను చెప్పగానే, నా ప్రేమ వెనక్కు వెళ్ళి టామీగాడి పెళ్ళి ఎజెండాలో ముందుకు వచ్చింది. టామీ గాడిని టపటపలాడించడానికి గొప్ప అవకాశం వచ్చిందన్న సంతోషంలో , కొండిగాడు వాడి దుర్మార్గమైన ప్టాను నా బుర్రలోకి జా(గ్రత్తగా ఎక్కిస్తున్నాడన్న విషయం గమ నించలేదు.

"ఒరే! సెకండ్‌ షోకి వెడదామా?" అన్నాడు కొండిగాడు, నేను మాట్టాడకుండా ఆలోచిస్తూ కూర్చుంటే .

“ఏ సినిమా?'

'అమావాస్యలో పౌర్ణమి చంద్రుడు - ఈ రోజే (బ్రహ్మాండమైన విడుదల. మళ్ళీ రేపుండదు. అన్నట్టు ఈ రోజు ఆమావాస్యరోయ్‌..'

నువ్వెళ్ళు - నాక్తు కొంచెం పనుంది' - కొండిగాడి ప్లాను ఆ రోజు అమళ్లో పెట్టేయాలని నిర్ణయానికి వచ్చేశాను.

26 లక్ష్మీ కటాక్షం “ఓకే' అంటూ వెళ్ళి పోయాడు కొండిగాడు. రాత్రి పన్నెండు అవుతుండగా, తలనుంచి కాళ్ళ వరకూ నల్ల దుప్పటి కప్పుకుని, జోళ్ళకి అడుగున సున్నం బాగా పట్టించి, దుద్దుకర్ర తీసుకుని హాలువైపుకి నడిచాను. టామీ వెధవకి రెండు పూటలా మస్తుగా తిని నన్నడిపించడమే కాని కుక్క కుండాల్సిన లక్షణాలేవీ లేవు. నేను హాల్లో అడుగు పెట్టగానే వాడు వాడి స్వప్న లోకాల్టోంచి దిగి వచ్చి కళ్ళు తెరిచిచూశాడు. లేచి నిలబడి, నోరు తెరిచి, 'నువ్వె వడివిరా బూచాడిలా అర్దరాత్రి వచ్చావు?” అన్నట్టు చూశాడే కాని, అపరిచితుడు వస్తే అరవాలనే జ్ఞానం లేదు వెధవకీ. నేను గుండెల నిండా ఊపిరి పీల్చి, దుడ్డుకర్ర పైకి లేపి ఒక్కటేశాను. నేనేదో వాడిని ఎంటర్‌ టెయిన్‌ చెయ్యడానికి వచ్చిన సర్కస్‌ బపూన్నన్నట్టు చూస్తున్న టామీగాడు అనుకోకుండా దెబ్బ పడటంతో ఉలిక్కిపడి ఎగిరి గంతెసేడే కాని అరవాలని కూడా తోచలేదు. రెండో దెబ్బ పడ్డాక అది సర్కస్‌ కాదనీ, నేను వాణ్ణి చావగొట్టడానికి వచ్చాననీ వాడికి అర్హమై కుయ్యోమని ఏడుస్తూ. గొలుసు గింజుకోవడం మొదలు పెట్టాడు. ఆనందంగా మరో రెండు వడ్డించానో లేదో, నా ఆనందానికి అంతరాయం కలిగిస్తూ గేటు దగ్గర టాక్సీ ఆగిన శబ్దం వినిపించింది. మావగారు టాక్సీ దిగుతూ, టామీగాడి ఏడుపు వినిపించి, *'టామీగాడు ఎందుకో అరుస్తున్నాడు అమ్మాయ్‌” అంటూ లోపలికి పరిగెట్టుకొచ్చారు. ఆయన గొంతు విస బేను హాల్టోంచి బయటకి దూకి బౌట్‌హౌస్‌ వైపు పరిగెడుతూ చీకట్లో ఆయనకు డ్రేష్ష్‌ రచ్నాను. ఆయన పిప్పళ్ళ బస్తాలా దబ్బుమని పడిపోయారు. నేను వగరుస్తూ జాట్‌ హౌస్‌ వెనక తలుపు గుండా లోపలిక పరిగెత్తి నిశ్శబ్దంగా తలుపేసేశాన్స. * చీకట్టో నన్ను గుద్దేసి కింద పడిపోవడంతో మావగారి బుర్ర క్షణకాలం పని చెయ్యలేదు. బుగర్రపని చెయ్యడం మొదలు పెట్టగానే నోరు 'దొంగ...దొంగ..? అని అరవడం మొదలు పెట్టింది. ఎక్కడ దొంగ? ' అనడుగుతున్నాడు కొండిగాడు “ఇలా పెరట్లోకి పారిపోయాడు. నల్ల ముసుగేసుకున్నాడు. వాడి చేతిలో నాలుగడుగుల కర్ర కూడా ఉంది... వరండా తీసి ఉందే.. టామీగాడు ఏవయ్యాడు?.... టామీగాణ్హి చంపేళశారేవ్‌.....” - పది సెకండ్త విరామం తర్వాత పెద్ద కేక వినిపించింది. నాకు దృళ్య చిత్రం కనుపించకపోయినా శబ్ద చిత్రం వినిపిస్తూనే ఉంది. మావగార్ని చూసి టామీగాడు సింపతీ కోసం ఇంకొంచెం గట్టిగా మూల్గడం మొదలు పెట్టాడు. 'ఏం జరిగింది నాన్నా? ఎవరు నిన్ను కొట్టారు నాన్నా" అంటోంది సరళ, “నన్నెవరు కొట్టగలరమ్మా. దొంగ దెబ్బ తీసి పారిపోయాడు కాని" నిమ్స్‌ కాదు నాన్నా - టామీ గాబ్జంటున్నా!' 'వాడు దొంగకాదు' - మామగారి కంరం కంచుగంటలా మోగింది -

తోలేటి జగన్న్మోవానరావు 27 'దొంగయితే. ఇంట్లో సామాను ఎత్తుకు పోతాడు కాని నోరు లేని జీవిని చంపడానికి ప్రయత్నించడు. వాడు...” ఆవేశంలో ఆయనకు ఊపిరందక ఓ క్షణం ఆగి - .... వాడు... హంతకుడు, వాడెక్కడికీ పారిపోలేడు. నేను షెర్దాక్‌ హోమ్స్‌ కంప్పీట్‌ వర్క్సు జౌపోసన పట్టేశాను. వాడెక్కడ దాక్కున్నా పట్టేస్తా. కొండ(ల్రావ్‌....'

“సార్‌. .."

“హంతకుడు బౌట్‌ హౌస్‌ వైపు పారిపోతూ నాకు డేష్‌ ఇచ్చాడు కొంపతీసి వాడు మన శంకరాన్ని మర్తరు చెయ్యలేదు కదా... ' - ఆయనలోని పషెర్టాక్‌ హోమ్స్‌ చురుగ్గా పని చెయ్యడం మొదలు. పెట్టాడుకాబోలు - 'అయితే హంతకుడు ఇంకా బొట్‌ హౌన్‌ లోనే ఉండాలి... అమ్మాయ్‌ .. నువ్వు కారం పొట్లం అందుకో... కొండ(ల్రావ్‌... రుబ్బురోలు పొత్రం నాకందించి నువ్వు పందిరి రాట అందుకో... ” అని సైన్యాన్ని సిద్ధం చేస్తుంటే నేను కంగారుపడి తలుపు తీసి, అప్పుడే నిద్రలేచినట్టు ఆవులిస్తూ, “ఏవిటిసార్‌? ఎప్పు డొచ్చారు? ' అన్నాను ఆశ్చర్యం నటిస్తూ.

“నువ్వు మర్దరైపోలేదా?'- షె . హోమ్స్‌ గారు నిరాశగా రుబ్బురోలు పొత్రం కిందికి దించుతూ అడిగారు.

'మర్హరేమిటి?”

'ఏంలేదులే! మీరు వెళ్ళి పడుకోండి సార్‌! ప్రయాణంలో అలిసిపోయారు” అని వాళ్ళని పంపించేసి లోపలికి వచ్చాడు కొండిగాడు.

“థాంక్యూ గురూ ' అని కొండిగాడికి ధాంక్స్‌ చెప్పి, వీళ్ళు నీకెల్టా కలిశారు' అనడిగాను.

“అ... సినిమా నుంచి వస్తుంటే వాళ్ళు స్ట్రేషన్నుంచి టాక్సీలో నన్నెక్కించుకు తీసుకొచ్చారు" అన్నాడు వాడు కేజువల్‌గా.

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన మావగారు వాకింగ్‌కి వెళ్ళ లేదు, కాని తెల్లారగానే మొక్కలకి సంగీతం వినిపించడానికి టేపురికార్లరు ఆన్‌ చేశారు. ఆయన స్విచ్‌ నొక్కగానే దాన్హోంచి బొంయిమని శబ్దాలు వచ్చి వగిరి గంతేశారు. ఆయన పక్కనే ఉన్న నా గుండె జారిపోయింది.

“ఏమిటి?” అన్నారు నాకేసి చూస్తూ,

'పాప్‌ మ్యూజిక్‌ " అన్నాను నేను నీళ్ళు నములుతూ. మావగారు హఠాత్తుగా రావడం వలన కేసెట్‌ మార్చే టైము లేకపోయింది.

'జూ అంటుకుంటే జంతువులు బోనుల్టోంచి గోల చేసినట్టు కూతలూ, కంకర రాళ్ళు తారు డబ్బాలో పోసి మెట్ట మీది నుంచి దార్లించినట్టు మోతలూ, ఇది సంగీతమా? ఈ సంగీతం వింటే మనుషులకి పిచ్చెక్కుతుంది. మొక్కలు చచ్చిపోతాయి... మొక్కలు చ..చ్చి... అయ్యో... * - ఆయన మొక్కల మధ్యకి పరుగెట్టారు.

మావగారువెళ్ళిన తర్వాత మొక్కలు ఎలా వున్నాయో వాటి మొహం చూసిన, పాపాన పోలేదు. అంచేత నేనుకూడా నాలుక కరుచుకుని ఆయన వెనకాలే

28 లక్ష్మీ కటాన్షం పరిగెట్టాను ఎలా ఉన్నాయో చూద్దామని.

నవనవలాడే మొక లతల నేలకేసి వ్‌ టుకుంటున్నట్లు వంగి పోయాయి. పొట్ట కాయలు, 'ఉయార్‌ మేడ్‌... ఉయార్‌ మేడ్‌" అంటూటబ్రక్‌ డాన్సు చేస్తున్నట్టు ఆఅష్టవంకర్షు తిరిగిపోయాయి. టొమోటాలు చెవులు మూసుకుంటున్నట్టు "సైడునుంచి వంకర తిరిగిపోయాయి.

“ఇది చూడు" అన్నారు నిమ్మకాయ సైజులో ఉన్న ఓ కాయ చూపిస్తూ, “..ఇదేవిటో తెలుసా?"

'నిమ్మ కాయా సార్‌

'నా తలకాయ - గుమ్మడికాయ' అన్నారు కళ్ళ నీళ్ళ పర్యంతమవుతూ.

మావగారు. వెళ్ళేప్పుడు గుమ్మడి పిందెలు చూపించి, " ఎంత పెద్దవిగా తయారవుతున్నాయో చూడు" అన్నారు గర్వంగా. ఇప్పుడేమ్రైందో కాని అవన్నీ నిమ్మకాయ సైజుకి కృంగి పోయాయి. అవేకాదు - బీరకాయలు బెండకాయల "సైజుకి, బెండకాయలు మిరపకాయల సైజాకీ కృంగిపోయాయి.

'నేనప్పుడే చెప్పాను - నా మాట వినకుండా వీడు పొప్‌ మ్యూజిక్‌ వినిపించి మొక్కల్ని చంపేశాడు' అంటూ టామీగాడు తోటలో అటూ ఇటూ తిరుగుతూ నా మీద ఇంకా ఏం చెబుదామా అని చూస్తుంటే, వాడికి నా అడుగు ముద్రలు కనిపించి కుయ్యోమని మొరిగాడు. ఏమైందిరా అంటూ మావగారు అటు పరిగెట్టారు.

“ఇవి హంతకుడి అడుగు ముద్రలే....హ్హ,...హ్హ.... పెర్టాక్‌ హోమ్స్‌ని... వా సంగతి వాడికి తెలియదు. వాడెక్కడున్నా పిలక పుచ్చుకుని ఈడ్చుకొస్తా...? హంతకుడిని పట్టుకోడానికి క్రూలు దొరికాయన్న ఆనందంలో మొక్కల సంగతి తాత్కాలికంగా మర్చిపోయి లోపలికి పరిగెట్టారు.

“ఒరే "కొండిగా 1 ఇంత స్పష్టంగా అడుగు ముద్రలు పడ్డాయి, ఆ సస్పెన్సు కింగ్‌ సన్నాసి జోళ్ళకి సున్నం రాయమని ఎలా సలహా ఇచ్చాడురా?' అన్నాను దిగులుగా కొండిగాడి చవల

'వాడు కుక్కల్నుంచి తప్పించుకోడం ఎలాగో చెప్పాడు కాని షెర్లాక్‌ హోమ్స్‌ లాంటి మావల సంగతి రామలీటు' రా

ఇంతలో మావగారు పెనం సైజు భూతద్దంతో (ప్రత్యక్ష మయ్యారు. నేలమీద వంగి భూతద్దంతో గడ్డి నలిగిన గుర్తులూ, సున్నపు మరకలూ - అంతా పరిశీలిస్తూ తిన్నగా నా గదిలోకి వచ్చేశారు.

హంతకుడు నీ గదిలోకి ఎలా వచ్చాడు? ' అనడిగారు అనుమానంగా.

'నాకు తెలియదు సార్‌” అన్నాను తడబడుతూ.

ఆయన అటూ ఇటూ చూస్తూ గదిలో అడుగుపెట్టగానే, తలుపు పక్కన కర్ర కనుపించింది. 'ఇదేవిటి?' అన్నారు ఇంకొంచెం అనుమానంగా, టేపుతో కర్ర పొడుగు కొలుస్తూ,

ఆయనలా అడుగుతుండగా టామీగాడికి ఈ సారి నా చెప్పులజతకూడా

తోలేటీ జగన్నోవానరావు 29

కనుపించి, 'మిస్టర్‌హోమ్స్‌' అంటూ మావగార్ని పిలిచాడు. మావగారు చేతి కర్ర

చెప్పుల్లో దూర్చి పైకి లేపి, భూతద్దంతో సోల్‌ జా(గ్రత్తగా పరిశీలించి, కిందికి దించి,

ఓ సారి గుర్రుమని పైకి కిందకూ మీసాలు ఆడించి, నా కళ్ళల్లో కళ్లు పెట్టి

తీవ్రంగా చూస్తూ హంతకుడి సంజాయిషీ ఏవిటి?" అని గాండ్రించారు. ౯ హంతకుడెవరు సార్‌?”

'మృత్యు సంగీతం వినిపించి నా మొక్కల్ని హింసించిన శాడిస్టు. అడ్డుపడ్డ టామీగాణ్మి నోరులేని వాడు, వాణ్మీ హత్య చేద్దావని (ప్రయత్నించిన నరరక్త... కుక్క రక్త ..రక్తపపాసి," అంటూ మావగారు నా మీదకు దూకబోతుంటే కొండిగాడు దేవుడిలా అడ్డుపడి 'మీరొకసారి ఇలా రండి సారో అని మావగార్ని బయటకు లాక్కెళ్ళి పోయాడు.

ఓ అయిదు నిమిషాలు బయట అరుపులు, కేకలు వినిపించాయి. నన్ను సుప్రీంకోర్టుదాకా ఈడ్చుకెడతారుట. నా సంగీతంతో వాతావరణ కాలుష్యం చేసి మొక్కల్ని చంపేస్తున్నానని భారత 'ప్రభుత్న పర్యావరణ శాఖ వారికి ఆరోపణ చేస్తారుట. జీవకారుణ్య సంఘం వాళ్ళని తెసుకొచ్చి నా గది ముందు ధర్నా చేయిస్తారుట. ఈ కేకల మధ్య కొండిగాడు ఏం చెప్పాడో సరిగా వినిపించలేదు. కానీ కొంచెం సేపటికి మావగారి కేకలు పూర్తిగా ఆగిపోయాయి. కొండిగాడు 'అమావాస్వ- పౌర్లమి' అంటూ ఏదో చెబుతున్నాడు. 'నాకిదివరకు టామీ గాణ్మి కొట్టినప్పుటే డౌటొచ్చింది సుమా. అయ్యోపాపం! చిన్న వయసులో... ఆ వెధవ సంగీతర వింటే ఆలాగే అవుతుంది. నువ్వు జాగ్రత్త! ఎందుకైనా మంచిది అంటున్నారు మావగారు. మెల్లిగా. మరో రెండు నిమిషాల తర్వాత అంతా నిళ్శబ్దమైహాయింది. కొండిగాడు జేబురుమాలుతో మొహం తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు.

'ఏం చెప్పావ్‌? అలా పిల్లిలా వెళ్ళి పోయారు మావగారు" అన్నాను నేను మంచం కింద నుంచి లేస్తూ.

'ఏదోసద్రి చెప్పేశాలే'

"నేను బయటికి వెళ్ళగానే ఏ పొద చాటునించో హరాత్తుగా మీదకు దూకి మెడ పట్టుకు కొరికెయ్యదుకదా ముసలి పులి"

“ఏవీ ప్రమాదం లేదు

“ధాంక్యూ గురూ! పెద్ద (ప్రమాదం నుంచి రక్షించావు' అన్నాను నేను గట్టిగా ఊపిరి పీలుస్తూ. (|

“చూశావా నేను ఎంత జెంటిల్మన్‌నో ...." అన్నాడు కొండిగాడు - వాడు జెంటిల్మన్‌ అని నేనూ ఒప్పుకున్నాను.

తర్వాత ఒకటి రెండు “రోజులు మావగారి కంట పడకుండా తప్పించుకున్నాను. కానీ, మూడో రోజు ఆయన కంటపడక తప్పలేదు.

“ఆ రోజు నా ప్రవర్తనకి చాలా సిగ్గుపడుతున్నాను'

“ఏప్రవర్తన?' అన్నారు ఆయన ఏవీ గుర్తులేనమ్టు,

౩0 లక్ష్మీ కటూన్షం

'మొక్కలు.... టామీగాడు....'

'ఆ సంగతి నేనప్పుడే మర్చిపోయానోయ్‌! నువ్వింకా అదే_ మనసులో పెట్టుకున్నావా? ఛ...ఛ... తప్పు కదూ... నువ్వు అసీలు అలా సీరియస్‌గా ఆలోచించేకూడదు. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా నువ్వు తెలిసి చేసేవా ఏవిటి?” అన్నారు ఆయన అభిమానంగా.

'తెలిసి చేసేవా అంటాడేవిటి?" అని నేను ఆలోచిస్తూ ఆయన్ని ఏదో అడగబోతుంటే, ఆయన భూమి మీద 72 కేజీలుండే మనిషి చంద్రమండలం మీద ఎంత బరువుంటాడు? కుజగ్రహం మీద ఎంత బరువుంటాడు' అనడిగి నన్ను వాయేజర్‌-2 ఎక్కించి, సౌరకుటుంబ యాత్రకు తీసుకుపోయారు, మారు మాట్టాడనివ్వకుండా,

న

శంకరం అతని కధ అలా చెబుతుండగా బీచ్‌లో అటూ ఇటూ పరిగెడుతూ, పరిచయస్టులు కనిపించినప్పుడు తోక ఊపి పలకరిస్తూ వస్తున్న టామీగాడు మమ్ముల్ని దాటి కొంచెం దూరం పరిగెట్టి, మళ్ళీ ఏదో అనుమానం వచ్చి వెనక్కు తిరిగ, మాకు నాలుగడుగుల దూరంలో ఆగి, శంకరం కేసి, 'వీజ్ళెక్కడ చూశాను చెప్మా" అన్నట్టు పరిశీలనగా కళ్ళు చికిలించి చూశాడు.

'ధీ...లి...” అన్నాడు శంకరం టామీగాడితో.

వాడు _శంకరాన్ని గుర్తు పట్టి నాలుగడుగులు వెనక్కి గెంతి, 'నువ్వే...భీ....భ.... అన్నాడు. న

'కాళ్ళిరగ్గాడతాను వెధవా"

టామీగాడు ఏవనేవాడో కొని, 'నోరులేని వాడురా - వాణ్లెందుకు కొట్టడం ” అన్నాడు టామీగాడివెనకాలే వస్తున్న కొండల్రావు. న

వాణ్మీ కాదు - అసలు నిన్ను తన్నాలి' అన్నాడు శంకరం ఉక్రోషంగా.

'జెంటల్మెన్‌ని - నన్ను తన్నడం జీనిక

'మావగారు ఆ రోజు రాత్రి వస్తున్నట్టు నీకు టెలి(గ్రాం వచ్చిందా?"

'వచ్చింది' లా

నువ్వ అంతా తెలిసే మావగారు వచ్చే టైముకి టామీగాడి పెళ్ళి ముహూర్తం పెట్టావా?'

“పెట్టాను”

'మావగారితో నాకు అమావాస్యకి, పౌర్ణమికి పిచ్చెక్కుతుందని చెప్పావా?

చెప్పాను”

“ఎందుకు చెప్పావు?'

_. సరళకీ నాకూ మధ్య ఉన్నది ప్రేమ - నీకు నాకూ మధ్య ఉన్నది యుద్ధం. నిన్ను తన్ని తగలెయ్యకపోతే నో పెళ్ళెలా అవుతుంది? ఎవ్విరిథోంగ్‌ ఈజ్‌ ఫెయిర్‌

లోలేటి జగన్మోహనరావు ప ఇన్‌ లవ్‌ అండ్‌ వార్‌ అన్నారు పెద్దలు..."

“ఆ పెద్దలే మూడో క్టాసులో చెవి మెలిపెట్టి, 'కలునకు నిలువెల్ల విషముగదరా సుమతి...”

'కలునకు కాదు గాడిదా - ఖలునకు - వత్తు 'ఖ'. వెంకటచలం మేష్టారి చేత అన్ని మొట్టికాయలు తిన్నా నీకు వత్తు పలకడం రాలేదు...ప్ప్‌... నీకు తెలియని రహస్యం ఇంకోటుంది. చెప్పనా?"

స్ప

“అసలు మావగారు సరళని నీకే ఇవ్వాలని ముహూర్తం కూడా పెట్టించేశారు. నీ సంగతి తెల్పిన తర్వాత పిచ్చాడితో పెళ్ళి తప్పించినందుకు కృతజ్ఞతగా నాకిచ్చి అదే ముహూర్తొనికి పెళ్ళి చేసేశారు..."

'అమ్మ దొంగ వెధవా... " అంటూ శంకరం ఏదో అనబోతుంటే, “నువ్వా శంకరం! నీ ఆరోగ్యం ...ఎలా ఉంది ఇప్పుడు? అదేవిటి? అలా గెడ్డాలూ, మీసాలూ 'పెంచేశావేమిటి బూచాడులా” అంటూ ముసలాయన వచారు.

“అదేవిటి శంకరం గారూ ! మీరు మా పెళ్ళికి రానేలేమే - ఆయన కూడా ఎంతో బాధపడ్డారు అంది సరళ,

'ఎవరు?' అన్నాడు శంకరం పళ్ళు నూరుతూ, అంత సముద్రపు హోరు లోనూ తిరగలిరాయి మోత నాకు స్పష్టంగా వినిపించింది.

నేనే! చూశావా - ఎంత జెంటిల్మన్‌నో," అన్నాడు కొండల్రావు నవ్వుతూ,

“ఇంకా ఆ కూతల సంగీతం వంటున్నావా? వినకు, అది నీకు అసలు మంచిది కాదు. మంచి సంగీతం మైండుని ప్రశాంతంగా ఉంచుతుంది. కూతల సంగీతం మెదడుని డిస్టర్చు చేసి పిచ్చెక్కిస్తుంది... అని అల్ఫా, బీటా, తీటా తరంగాల గురించి సీరియస్‌గా శంకరానికి లెక్చరిస్తున్స ఆయన హఠాత్తుగా ఆగిపోయి, నోరు మూసుకోవడం కూడా మర్చిపోయి, షాకు తగిలినట్టు ఆకాశం కేసి చూస్తూ విగ్రహంలా నిలబడిపోయారు. క్షణం తర్వాత తేరుకుని శంకరం కేసి ఓ సారి చూసి, కంగారుగా సరళ కేసి తిరిగి, 'అమ్మాయ... పద" అంటూ ఓ కేక వేసి పరుగు తీశారు.

“ఏవిటి నాన్నా?" అంటూ వెనకాలే వెళ్ళిన సరళ చెవిలో ఆయన ఏదో చెప్పారు.

“అమ్మో అంటూ సరళ పరిగెట్టుకొచ్చి, 'రా నాన్నా - క్విక్‌ " అంటూ టామీగాణ్హే ఈడ్చుకు పోతూ, “ఏవండీ! మీరూ వచ్చేయండీ' అని కొండల్రావుని కూడా పిలిచింది కంగారుగా.

'ఏవిట్రా కొండిగా, వాళ్లు ఉన్నట్టుండి అలా కంగారుగా పరిగెడుతున్నారు?' అడిగాడు శంకరం తెల్లబోయి.

“నువ్వు ఇవాళ విశ్శరూపం చూపిస్తావేమో నని మావగారికి భయం వేసింది కాబోలు' అన్నాడు కొండల్రావు పగలబడి నవ్వుతూ.

'విశ్శరూపమేమిటి?”

32 లక్ష్మీ కటాక్షం కొండల్రావు చిన్నగా విజిలేసి, ఆకాశం కేసి చూపిస్తూ కన్నుగ్‌టి నవ్వాడు. శంకరం తలెత్తి చూసి రెండుచేతుల్లోనూ తల పట్టుకుని కూలబడిపోయాడు. ఏవిటా అని నేను ఆశ్చర్యపోయి తలెత్తి చూశాను. ఎగిరి పడుతున్న సముద్రం మీద ఆకాశంలో పౌర్షమి చంద్రుడు నిండుగా వెలుగుతున్నాడు. (ఇండియా టుడే వార్షిక సంచిక 1994)

నౌకు పత్రికా విలేఖరిగా వివిధ పత్రికా కార్యాలయాల్లో పదేళ్ళ అనుభవం ఉన్నా, నేను సాధారణంగా ఆర్టిక విషయాలమీదా. తప్పితే" రాజకీయాలమీదా, రాస్తుంటాను, అల్లర్లూ, ఆందోళనల గురించి (ప్రస్తావించినా, రాజకీయాల మీదా, ఆర్థిక (ప్రగతి మీదా వాటి పరోక్ష ప్రభావం గురించి రాయడమే గాని ప్రత్యక్షంగా వాటిని ఎప్పుడూ కవర్‌ చేయలేదు. అంచేత మా ఎడిటర్‌ గారు న్యూఢిల్లీ టైమ్స్‌ తరపున నన్ను హుస్నాబాద్‌ వెళ్ళ మన్నప్పుడు కొంచెం సందేహించాను. ఈ విషయాలు సాధారణంగా చూసే దాసు, తల్లికి ఆరోగ్యం బాగాలేక సెలవు మీద వెళ్ళడం వలన నేను హుస్నాబాద్‌ వెళ్ళక తప్పలేదు.

హుస్నాబాద్‌ పూర్వ కాలం, అంటే 1947 కి ముందు, ఒక సంస్టానంగా నవాబుగారి పాలన కింద్‌ ఉండేది. స్వాతంత్రానంతరం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయింది. తివాసీలకి ఇత్తడి పమామ్‌కీ "పెట్టింది పేరు. జనాభా లక్షపైగా. హిందూ, ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉంటుంది. హుస్నాబాద్‌కి మతకలహాలు కొత్తకాదు. గవర్నమెంటు రికార్డుల్లో కమ్యూనల్లీ హైపరొసెన్సిటివ్‌ గా ప్రసిద్ది కెక్కింది.

గత రెండు నెలలుగా అక్కడ పరిస్థితి మళ్ళీ ఉద్రిక్తంగా ఉంది. హుస్నాబాద్‌ లో శిధిలావస్తలో ఉన్న కట్టడం ఒకటుంది. శిథిలమైనది శిథిలమువగా అక్కడ ఒక గోడ మాత్రం మిగిలింది. అది మసీదు అని ముస్లింలు, మందిరం అని హిందువులు గొడవ

పడుతున్నారు. ఎవరికి వారు వాస్తుకి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తు న్నారు. ముందు హిందువులు పూజలు మొదలు పెట్టారా, లేక ముస్షింలు నమాజు చెయ్యడం మొదలు పెట్టారా అనేది స్పష్టంగా తెలియదు కాని అక్కడ పూజలు, నమాజులు (ప్రారంభమయ్యాయి. రెండు నెలల [క్రితం ఆ గోడని కలుపుకుని రాత్రికి రాత్రి ఒకవైపు మసీదు, మరొకవైపు మందిరం లేచాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్టితికి కారణం అది. ఈ ఉద్రిక్త పరిస్టితి పూర్వా పరాలు విచారించడానికి నేను మా పత్రిక తరపున వెడుతున్నాను. = నేను న్యూల్సీ స్టేషన్లో రాత్రి ఎనిమిదింటికి బండి ఎక్కాను. బండి హుస్నాబాద్‌ చేరేటప్పటికి తెల్లవారకట్ట నాలుగవుతుంది. రేపంతా తీరిక లేకుండా పని. తిరిగి రాత్రి బయలు దేరి ఎల్టుండి ఉదయానికి ఢిల్లీ వచ్చేస్తాను అదీ నా కార్యక్రమం. నాకన్నా ముందే ఫోటోగ్రాఫర్‌ మిశ్రా హుస్నాబాద్‌ చేరుకున్నాడు. అతనీకి ఫోన్లో నేను వస్తున్నట్టు చెప్పాను. తనున్న హోటల్టోన్‌ నాకు కూడా బస ఏర్పాటు చేసినట్టు, తను స్టేషనుకి వస్తున్నట్టు చెప్పాడు. బండి బయలు దేరబోతుండగా హడావిడిగా ఓ ఇంగ్రీషు అమ్మాయి బేగ్‌ తీసుకు వచ్చి, నా ఎదుటి బెర్తు మీద కూలబడింది. 'అసలు (టైయిన్‌ మిస్సయి పోతాననుకున్నాను' అంది నాకేసి తిరిగి నవ్వుతూ. 'నా పేరు జెన్నీ' అంటూ తనని పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి వయసు ఇరవై ఇరవైరెండు కంటె ఎక్కువ ఉండదు. ఒంటరిగా భారత దేశం చూడడానికి వచ్చింది. ఆగ్రా, జైపూర్‌, బెనారస్‌, కలకత్తాలు చూసింది. దక్షిణాన బెంగుళూరు, మైసూరు, హైదరాబాద్‌లు చూసి ఢిల్లీ తిరిగి వచ్చింది. ప్రస్తుతం హుస్నాబాద్‌ వెడుతోంది. చిరకాలంగా జెన్నీ హుస్నాబాద్‌ చూడాలనుకుంటోందిట. నేనూ అక్కడికే వెడుతున్నానని తెలిసి ఆ అమ్మాయి చాలా సంతోషించింది. హుస్నాబాద్‌ చిన్న పట్టణం. సందులూ, గొందులూ, ఇరుకు బజారతో చికాకుగా ఉంటుంది. దానికి చరిత్రలో ప్రాధాన్యత ఏవీ లేదు. యాత్రా సలవూకాడు.” అన్నాను జెన్నీతో. న + 'యాత్రా స్థలమని కాదు. మా తొత అన్నగారు - మా పెదతాత హుస్నాబాద్‌లో ఉండేవాడు. ఆయన అక్కడ 1935 లో మరణించాడు. ఇంత దూరం "ఎలాగూ వచ్చాను కదా! ఆయన నివసించిన స్టలం అదీ చూసి తిరిగి వెళ్ళి పోతాను' అంటూ జెన్నీ బేగ్‌లోంచి ఫోటో అల్బం తీసి చూపించింది. ఫోటోలో జాక్సన్‌ బలిష్టంగా, ఒత్తు మీసాలతో పులిలా ఉన్నాడు. ఖాక్తీ 'డ్రసూ నెత్తిమీద హేటూ - సైనికుడి యూనిఫాంలో కొన్నిఫాటోలు ఉన్నాయి. పులిమీద బీ కాలు వేసి తుపాకీ నేలకానించి నిలబడి, పులి మీద కూర్చుని ఒళ్ళో త్తుపాక్రి పెట్టుకునీ - రక రకాల పోజులలో ఎన్నో ఫోటోలున్నాయి. ప్రతీ ఫోటోలోనూ అతనితో పాటు ఓ కుక్క కూడా ఉంది. 'అదేవిటి? అది కూడా ఆల్బమేనా?”, అన్నాను జెన్నీ దగ్గర ఇంకో బైండు చూసి. “ఇది మా తాత ఆత్మ కధ' అంటూ జెన్నీ జాక్సృన్‌ ఆత్మ కధ (వ్రాత ప్రతి ఫోటో

తోలేటి జగన్నోవానరావు 35 కాపీ ఇచ్చింది. ఆత్మ కథ పాతటైపు రైటరు మీద ఎగుడు దిగుడుగా టైపు చేసి వుంది. దాదాపు రెండొందల పేజీలకు పైగా ఉంది.

నాకు ప్రయాణాలలో నిద్రపోయే అలవాటు లేదు. కిటికీలోంచి బయటకు చూస్తూ గడపడమో లేక ఏదైనా పుస్తకం చదవడమో చేస్తుంటాను. కాలక్షేపానికి జాక్సన్‌ ఆత్మ కధ చదవడం మొదలు పెట్టాను. అతను ఆత్మ కధ ఒక (క్రమపద్దతిలో రాయలేదు. ఒక సంఘటనలోంచి మరోసంఘటనలోకి వెళ్ళి స్త్వాం లాంటిది చాలా చోట్ల ఉంది. స్పష్టత లేదు. అందువల్లనేమో - ఏ ప్రచురణకర్తా దాన్ని (ప్రచురించ డానీకి అంగీకరించలేదు. అతి కష్టం మీద పది, పదిహేను పేజీలు చదివాను. అతను బాల్యం గురించి ఏదో రాశాడు కాని అర్థం కాలేదు విసుగు పుట్టి పక్కన పడేసి, కిటికీలోంచి బయటకి చూడటం మొదలు పెట్టాను

వెన్నెల్లో టెలిఫోను స్తంభాలు, పొలాలు, తోటలూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ దూరంగా పలైల్లో వెలుగుతున్న దీపాలు, కదులుతూ కన్పించాయి. ఓ గంట అలా కిటికీలోంచి చూసి, విసుగు పుట్టి, నడుంవాల్చి, నా బెర్తుమీద లైటు వెలిగించి, జాక్సన్‌ పుస్తకం మళ్ళీ అందుకుని తిరగియ్యడం మొదలు పెట్టాను.

జాక్సన్‌ జీవిత కధ చదవడానికి మొదట విసుగు కలిగించినా, బాల్యం తర్వాత ఆసక్తి కరంగానే సాగింది. అతని పుస్తకం అంతా మొదటి (ప్రపంచ యుద్ధంలో (ఫ్రాన్సులో అతని అనుభవాలూ, వేట అనుభవాలూ తప్ప మరేవీ కనిపించలేదు. టట్రెంచిలలో అతను గడిపిన జీవితం, యుద్దంలో అపార జననష్టం, ముఖ్యంగా అతని స్నేహితుడు బిల్‌ మరణం - వీటన్నిటి ప్రభావం అతని జీవితం మీద చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. అతడు బిల్‌గురించి, బిల్‌ మరణం గురించి పుస్తకంలో అనేక చోట్ల ప్రస్తావించాడు.

“.ఉదయం నుంచీ జర్మన్‌ ఫిరంగులు గుళ్ళ వర్షం కురిపిస్తున్నాయి. మౌ ట్రైెంచి మీదా, చుట్టూరా రెండు గంటలనించీ విరామం లేకుండా గుళ్ళు పడుతున్నాయి. ఎంతటి ధైర్యవంతుడికైనా పిరికితనం కలిగించే సన్నివేశం అది. మేమందరం చెవులు మూసుకుని, తలవంచుకుని ట్రెంచిలలో ఒదిగి కూర్చున్నాం. కొన్ని చోట్ల టబ్రైంచిల మీద తిన్నగా గుళ్ళు పడి, ట్రైంచిలలో ఉన్న వాళ్ళు అక్కడికక్కడే సమాధి అయిపోతున్నారు. గుళ్ళు సమీపంలో పడినప్పుడల్లా భూమి కంపించి పైనుంచి మట్టి పెళ్ళలు పడుతున్నాయి. ఆ హోరులో “ఇంక భరించలేను.... ఇంక భరించలేను' అంటూ ఎవరో ఏడుస్తున్నట్టు విఖీపించింది. నేను తల తిప్పి చూశాను. బిల్‌ ఏడుస్తూ పలవరిస్తున్నాడు. “బిలో అంటూ అతన్ని కుదిపాను. తలెత్తి నాకేసి పిచ్చి చూపులు చూశాడు. అతను అశాంతిగా కదులుతున్నాడు. అతని మానసిక పరిస్టితి నాకు అర్థమైంది. ఇలాంటి బొంబార్జుమెంటులో మతి చలించిన వాళ్ళని చూశాను. 'ఏం ఫరవాలేదు = తొందరలో ముగిస్‌పోతుంది' అని అతని మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాను. అతను జరిగేది (గ్రహించగల స్టితిలో లేడు 'నాకు చావాలని లేదు- నాకు చావాల్నని లేదు- నాకు బతకాలని ఉంది" అంటూ లేచి నిలబడి, ఆపబోతున్న నన్ను విదిలించి కొట్టి, ట్రెంచిలోంచి బయటకి దూకి గుళ్ళ వర్షంలోకి పరిగెట్టాడు. నేను

36 లక్ష్మీ కటాన్షం ట్రైంచిలో నిలబడి తలెత్తి అతన్ని వెనక్కు రమ్మని అరిచాను. ఆ క్షణంలో ఊళలు వేస్తూ ఓ గుండు సరిగా అతని తలమీద దిగింది. మరుక్షణంలో ఓ మెరుపు... పెద్ద ప్రేలుడు .. వేడి గాలి విసురుగా నా మొహాన్ని తాకింది. నేను టైంచిలో కూలి పోయాను, నా తలకి బాంబు తునక తగిలి ఉంటుంది. నాకు స్పృహ తప్పింది....”

జాక్సన్‌ తలకి బలమైన గాయం తగిలింది. పదకొండు నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. అతనిది మొదటినుంచీ పదిమందితో కలిసి మెలిసి తిరిగే స్వభావం కాదు. సైనికుడిగా అతను గడిపిన జీవితం, కళ్ళ ఎదురుగా అతనికి ఉన్న ఒకే ఒక స్నేహితుడు బిల్‌ దుర్మరణం, తలకు తగిలిన గాయం - ఇవన్నీ అతని దృక్పధంలో చాలా మార్చు తీసుకు వచ్చినట్టు కనిపిస్తుంది.

నేనెప్పుడూ చర్చికి వెళ్ళి లేదు. నాకు దేవుడంటే నమ్మకం లేదు - ఒకప్పుడు మనిషంటే నమ్మకం ఉండేది - అదిప్పుడు పోయింది - నాకునా జిమ్మీ తప్ప ఎవరూ లేరు. నాకు బంధువు, మిత్రుడు, దైవం, అన్నీ నా జిమ్మీయే” అని ఒక చోట రాశాడు జాక్సన్‌.

జిమ్మీ అతని పెంపుడు కుక్క.

అతను సైన్యం నుంచి విడుదలయ్యాక ఇండియాలో అటవీ శాఖలో చేరాడు. అతను ఎవరితోనూ కలిసేవాడు కాడు. సాధ్యమైనంత వరకూ నగరాలకీ, జనవాసాలకీ, దూరంగా మసిలేవాడు. అతనికి వేట ఒక వ్యసనమైంది. పులులు తిరిగే (ప్రాంతాలలో ఎరవేసి, మంచె కట్టుకుని పులికోసం ఎదురు చూడకుండా, తుపాకీ భుజాన వేసుకుని, జిమ్మీని తీసుకుని పులివెంట పడేవాడు.

ఆ కుక్క కూడా జాతి కుక్క కాదు. ఎక్కడో దొరికితే చిన్న పిల్లని తీసుకొచ్చి పెంచాడు. అది కూడా విశ్వాసంగా నీడలా వెంట తిరుగుతుండేదే. క్రబ్బులోకి అందరూ జాతి కుక్కల్ని తీసుకువస్తే అతను ఆ ఊరకుక్కని తీసుకు వెడుతుండేవాడు. ఆ కుక్క గురించి ఎవరైనా ఏదన్నా అంటే పోట్ట్లాటకి దిగేవాడు.

అతను ఒంటరివాడు. పెళ్ళి చేసుకోలేదు. ఉన్నది ఒక తమ్ముడు. అతనూ దూరంగా ఎక్కడో ఇంగ్రండులో ఉన్నాడు. అతను ఒకటి రెండు సార్హు ఇంగ్రండు వెళ్ళి తమ్ముణ్ణో చూసి వచ్చాడు. అతనికి ఇంగ్రండు జీవితం నచ్చలేదు. ఇండియాకి తిరిగి వచ్చి, ఇక్కడే స్టిరపడిపోయాడు.

అతను ఏభయ్యవ పడిలో పడ్డాడు. ఇంక ఉద్యోగం నుంచి ర్షిటైరై విశ్రాంతి తీసుకుందామని హుస్నీబాద్‌లో ఎవరో నవాబు దగ్గర నుంచి ఒక పాత బంగ్లా

ళా కొన్నాడు. ఆ బంగ్లాలో వంటవాడు, ఇద్దరు నౌకర్గూ అతనూ, జిమ్మీ - అంతే. ఇలా కాలం నడుస్తుండగా కుమాం పర్వత(శ్రేణుల్లో మనుషుల్ని వేటాడుతున్న పులి గురించి అతని చెవిన పడింది. జనం భయకంపితులై ఊళ్ళు వదిలి పారిపోతున్నారు. ఒక చోట పశువులు మేసే కుర్రాడిని ఎత్తుకుపోయింది. మరో చోట ఇంట్లో నిశ్శబ్దంగా (ప్రవేశించి, పడుకున్న వాళ్ళలో ఒకడ్ని నోట కరుచుకు పోయింది. మిగిలిన వాళ్ళకు మెలకువైనా రాలేదు. ఆ పులిని చంపడానికి వెళ్ళిన ఇద్దరిలో ఒకడు తిరిగి రాలేదు. ఒకడు ఒక కాలుతో తిరిగి వచ్చాడు అసలు అది పులి కాదనీ, మనిషి రక్తానికి

తోలేటి జగన్నోహనరావు 37 అలవాటు పడిన మంత్రగత్తె అనీ, రాత్రి వేళ అది పులిగా మారి మనుషుల్ని తింటోందని కధలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక [గ్రామ శివార్లలో ఒంటరిగా ఉంటున్న ఓ ముదుసలిని మంత్ర గత్తె అని అనుమానించి, తలుపుకు గొళ్ళెం పెట్టి గుడిసె అంటించి చంపేశారు జనం.

ఈ కధలన్నీ వింటూన్న జాక్సన్‌ ఇంక ఉండబట్టలేక పోయాడు. జోడుగుళ్ళ తుపాకీ భుజాన చేసుకుని, జిమ్మీని వెంట బెట్టుకుని బయలు దేరాడు. ఈ వయసులో అది దుస్పాహసమని కొందరు ఆపడానికి ప్రయత్నించారు. అతను ఎవరి మాటా వినలేదు. అతను పులి వేటాడే తీరూ, తిరిగే మార్గం, అంతా జా(గ్రత్తగా పరిశీలిస్తూ అడవుల్లో మూడు నెలలు తిరిగాడు ఒకటి రెండు సార్హు పులి గంటల తేడాలో తప్పించుకు పోయింది. ఈ మూడు నెలలలోనూ మరో పదిమంది పులి వాత పడ్డారు. జార్మన్‌కి పిచ్చెక్కినట్టయింది.

ఒక రోజు ఉదయం సమీప (గ్రామ శివార్లలో పులి కనిపించిందని బార్ట్‌ క్షి కబురందింది. అతను హుటా హుటి అక్కడకు వెళ్ళాడు. అడుగు జాడలు పరిశిలించి తను వెతుకుతున్న పులే అని (గ్రహించాడు. ఆ అడుగు జాడలు, అది నడిచిన దారిలో నలిగిన ఆకులూ, విరిగిన కొమ్ములూ చూసుకుంటూ అడవి లోపలికంటా వెళ్లి పోయాడు. పులి నడుస్తున్న దారిలో చెట్ల మీంచి లేస్తున్న పక్షుల కిల కిలా రావాలు, కోతుల అరుపులు, అస్సి జాగ్రత్తగా వింటూ, అది వెడుతున్న దారి గమనిస్తూ వెంటాడాడు. కాని ఎక్కడొ జాడ తప్పింది. పులి కనుమరుగైంది. అడవి నిళ్ళబ్దమైంది.

అష్టటికి మధ్యాహ్నాం రెండు గంటలయింది. అతను చాలా అలసివోయాడు. వయసులో అయితే రోజులకు రోజులు ఒంటరిగా అడవిలో గడిపేవాడు. ఏభైవ పడిలో పడ్డాక చూపు, వినికిడి, ఘ్రాణశక్తి - అన్నీ మందగిస్త్రన్దియి. రాత్రిళ్ళు చూపు సరిగా ఆనడం లేదు. చీకటి పడేలోగా ఏ (గ్రామమైనా చేరుకోవాలని తిరుగుముఖం పట్టాడు.

సాయంకాలం అయిదు గంటలయింది. అడవిలో వెలుగు తగ్గి నీడలు సాగుతున్నాయి. జాక్సన్‌ కొండదారిన నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు. ముందు దారి పదిగజాల అవతల వంపు తిరుగుతోంది. ఒంపు దగ్గర పెద్ద బండరాయి ఒకటి ముందుకు చొచ్చుకు వచ్చింది. కాలిబాట దాన్ని చుట్టి కిందకు పోతోంది. ఆ (ప్రదేశమంతా పొదలతో, తుప్పలతో నిండివుంది. అక్కడ, ఆ ప్రదేశంలో, అప్పుడు ఎందుకు ఆగి పోయాడో అతనికే తెలియదు. బహుశా “ఆరవ ఇంద్రియం' అతన్ని హెచ్చరించి ఉంటుంది.

అతని వెనకవైపు నుంచి గాలి వీస్తోంది. గాలి వాలులో ఉన్న పులి తన వాసన పసిగట్టగలదు. కాని పులి వాసన తనకు తెలియదు. పులి మాటు వెయ్యడానికి అనువైన (ప్రదేశం అడి. పులి తనకోసం అక్కడ కాచుకుని ఉందని ఎందుకో అనుమానం వచ్చింది అతనికి.

అతను ఆగగానే జిమ్మీ కూడా ఆగిపోయింది. అతను జోడు గుళ్ళ త్తుపాక్తీ చేతుల్లోకి తీసుకుని, జాగ్రత్తగా గురి చూస్తూ ముందుకు నడవసాగాడు. జిమ్మీ కూడా

38 లక్ష్మీ కటొన్షం నిళ్ళబ్దంగా అతనితోపాటు కదిలింది. అతను మెల్లిగా బండరాయి కిందకు వచ్చాడు. ఇంకో నాలుగడుగులేస్తే మలుపు వస్తుంది. ఆ మలుపు చాటునే పులి ఉందని తతని అనుమానం. అతని దృష్టి అంతా ముందు దారి మీదే ఉందికాని పులి బండరాయి మీద నిలబడి పైనుంచి తనకేసే చూస్తున్నదని అతను గమనించలేదు. మరో అడుగు వెయ్యగానే జిమ్మీ పైకి చూసి అరవడం, పులి అతని మీదకు దూకడం, అతను వెనక్కు తిరిగి తుపాకి సైకెత్తి పేల్చడం - అన్నీ ఒకేసారి జరిగాయి. తుపాకీ గురి తప్పింది. పులి గుర్రు మంటూ అతనికేసి చూస్తూ నిలబడింది. అతని ఆలోచనలకూ, చర్యలకూ సమన్వయం వయసుతోపాటు తగ్గి పోయింది. పదేళ్ళ క్రితమైతే ఆ పరిస్తితిలో అసంకల్పితంగా తుపాకీ ఎత్తి పులికదిలేలోగా మళ్ళీ 'పేల్చగలిగేవాడు. ఆరడుగుల దూరంలో నిలబడి వున్న మృత్యువుని చూడగానే అతను ఏం చెయ్యాలో తోచక స్టాణువులా నిలబడి పోయాడు. పులి గుర్రు గుర్రుమంటూ, వెనుక కాళ్ళమీదకి జరిగి, ముందుకు, మీదకు దూకడానికి సిద్దమవుతోంది. .

అతను తేరుకుని తుపాకీ ఎత్తి గురి చూడటానికి క్షణం పట్టింది. ఆ క్షణం అతనికి తన ప్రాణాలు బలిపెట్టి ఇచ్చింది జిమ్మీ యజమాని మీదకు దూకబోతున్న పులిమీదకు ఉరికి వెనకకాలు పట్టుకుంది. పులి వెనక్కు తిరిగి జిమ్మీని సంజాలో విదిలించి కొట్టి, మళ్ళీ జాక్సన్‌ వైపు తిరిగేలోగా తుపాకీ పేలింది. పులి ఎగిరి పడింది. అది కదలడం ఆగిపోయేవరకూ మళ్ళీ మళ్ళీ తుపాకీ పేలింది. పులి చచ్చిపోయిన తర్వాత జాక్సన్‌ ఏడుస్తూ పది అడుగుల దూరంలో రక్తపు మడుగులో ఉన్న జిమ్మీ దగ్గరకు...

బండి చక్రాలు కీచుమంటూ, సడన్‌ (బ్రేక్‌ వేసినట్టుగా కుదుపుతో ఆగింది. నేను జాక్సన్‌ (ప్రపంచంలోంచి హఠాత్తుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. ఆ కుదుపుకి జెన్నీకి కూడా మెలకువ వచ్చినట్టుంది. ' ఏమైంది? " అనజీగింది*

'సిగ్షలు కోసం అయివుంటుంది " అన్నాను.

అలా ఆగిన బండి ఆరగంటయినా కదలేదు. నేను టైము చూశాను. నాలుగవుతోంది. అంటే ఈ పాటికి హుస్నాబాద్‌ వచ్చేసి ఉండాలి. మరో పదిహేను నిమిషాలు గడిచాయి. బండి నిళ్ళబ్దంగా అలాగే నిలబడి ఉంది. నేను కిటికీ అద్దం పైకెత్తి చూశాను. కనుచూపు మేర చెరుకుతోటలు వో స్నానమాడుతున్నాయి. రైలుపట్టాల పక్కనే పిల్ల కాలువ ఒకటిపోతోంది. దానిలో నిరు అడ్డకట్టదాటి పల్గానిక్షి గల గల చప్పుడు చేస్తూ ప్రవహిస్తోంది.

“ఏమైంది?”- జెన్నీ మళ్ళీ అడిగింది.

'చూసి వస్తాను, అంటూ నేను తలుపు తీసి బయటక నడిల్చి కంపార్టుమెంటులోంచి తొంగిచూశాను. అప్పటికే చాలా మంది ప్రయాణీకులు బండి దిగి నిలబడి చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్న వైపు నేనూ దృష్టి సారించాను. గారంగా ఎడంవైపు ఆకాశమంతా ఎర్రగా కనుపిస్తోంది.

తోలేటి జగన్మోహనరావు వెం నేను అటే చూస్తూ కిందికి దిగి, 'ఏవిటది?' అనడిగాను, అక్కడ మెల్లిగా మాట్టాడుకుంటున్న గుంపు దగ్గర చేరి.

'చెరుకుతోటల్లో తుక్కు తగలబెడుతున్నారేమో - లేకపోతే బెల్లం వండుతున్నారో?” అన్నాడు ఒకడు.

'నై.. నై... ధంగా షురూ హోగయా... " అన్నాడు మరొకడు ఉద్రిక్తంగా.

ఆ వెలుగు చెరుకుతోటల్లోంచి కాదనీ, తగలబడుతున్న హుస్నాబాద్‌నుంచనీ బండిలో ఉన్న వాళ్లందరికీ త్వరలోనే అర్ధమైంది హుస్నాబాద్‌ మీదుగా దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు ఆసక్తికరంగా చూస్తుంటే, హుస్నాబాద్‌లో అయినవాళ్ళు ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెట్టారు.

ఆ ఆగడం, ఆగడం, బండి ఉదయం ఆరుగంటలదాకా అలాగే ఆగిపోయింది. జెన్నీ రెండు మూడుసార్జు, 'ఏవిటి? బండి ఇంతసేపు ఆగింది?" అనడిగింది. ఆమెకు విషయం చెప్పకుండా, నువ్వు ఈ సమయంలో రాకుండా ఉండాల్సింది, అన్నాను.

తెల్లవారింది. లే ఎండపడి రాత్రి మంచులో తడిసిన చెరుకుగడలు ఎర్రగా మెరుస్తున్నాయి. తోటల మీద పిట్టలు కిచకిచమంటూ ఛగురుతునర్యు. దూరంగా పొగమంచు చెరకు తోటల మీద కమ్ముకుంటోంది. పిల్లకాలువల్‌' నీళ్ళు అలాగే గలగలమని చప్పుడు చేస్తూ ప్రవహిస్తున్నాయి.

ఆ ్రశాయ ద్ద్యూనీ తర్వాత చూడబోయే ఘోరకలికి ఎంత తేడా! వెలుగు వచ్చాక ఆకాశంలో ఏర్రీదనం కనుపించడం లేదుగాని హుస్నాబాద్‌ మీద నల్లటి మేఘం అలుముకున్నట్టుంది.

ఆరుగంటలకి బండి బయలుదేరి, వెళ్ళాలా వద్దా అని సందేహిస్తున్నట్టు, చాలా మెల్లిగా నడుస్తూ ఆగుత్తూ మరో గంటకి హుస్నాబాద్‌ స్టేషన్‌ చేరుక్తుంది. బండి స్లాట్‌ ఫాం మీద ఆగకుండానే కెరటం విరుచుకు వీడ్డట్టు జనం బండిమీద పడ్డారు. శోసుకుంటూ, గెంటుకుంటూ, పడిపోయిన వాళ్ళని 'తోక్కుకుంటూ కిటికీ ఊచలు పట్టుకుని వేళ్ళాడుతూ, తలుపులు తియ్యమని దబ దబ బాదుతూ, బండి కూడా పరిగెట్టారు జనం.

అంత జనసందోహం, ఆ గందరగోళం, తొక్కిసలాట, ఏడుపులు, అదంతా జెన్నీ ఎప్పుడూ చూసి ఉండదు. ఏమైంది, అనడిగింది. ఆ అమ్మాయి మొహంలో భయం న్చేష్టంగా కనిపిస్తోంది. దిగకుండా అదే బండిలో వలి పొమ్మన ఆమెకు సలహా ఇద్దామని అనుకున్నాను కొని పరిస్టితి చూస్తే బండి కదిలేలా లేదు. జనం చీమల్లా బండి కప్త్పుమీదకు పాకేస్తున్నారు.

లన్ని టగ్‌ తీసుకోలే చెప్పి తలుపు త్రీశాను. తలుపు తియ్యగానే జనం బోగీలోకి విరుచుకు పడ్డారు. ఆ తోక్కిసలాటలో ఎలా ముందుకు వళ్ళీ గలిగామో నాకే తెలియదు. జెన్నీ చేయ్యి పట్టుకుని జన (ప్రవాహానికి ఎదురీదుతూ అతి కష్టం మీద స్టేషను మాస్టారి గదికి క! అక్కడ నుంచి మిశ్రాకి ఫోను చేద్దామని పబ్దిక్‌ టెలిఫోను తీశాను: అది పని చెయ్యడం లేదు. ఇంక స్టేషను మాస్టారిని ఆశ్రయించడం తప్ప గత్యంతరం లేకపోయింది.

స్టేషను మాస్టారు మొదట నేను చెప్పేదేవీ వినిపించుకోలేదు. నేను ప్రెస్‌ అనగానే కొంచెం అగి నా మాట విన్నాడు. అతనికి విషయమంతా చెప్పి ర్షిటైరింగ్‌

40 లక్ష్మీ కటాక్షం రూం ఏదైనా ఖాళీగా ఉంటే జెన్నీకి ఇవ్వమనీ, ఢిల్లీకి వెళ్ళే మొట్టమొదటి బండిలో తిరిగి వెళ్ళి పోతుందనీ, చెప్పాను.

స్టేషనులో అంగుళం జాగా కూడా ఖాళీ లేదు. జనంతో కిటకిటలాడిపోతోంది. రిబైరింగ్‌ రూం ఒకటుంది కాని ఆ తలుపులు తియ్యడం అసంభవం. ఒక వేళ గది తలుపులు తెరవగలిగినా జనం లోపలికి తోసుకు వచ్చేస్తారు. జెన్నీ ఉండడానికి వీలుపడదు. అతను కాసేపు ఆలోచించి, 'ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. బళ్ళు ఎప్పుడు నడిస్తే అప్పుడు వనక్కుపంపించేస్తాను' అనైడు.

జెస్టల్లో అతను అన్నది చెప్పాను. ఆ అమ్మాయి చాలా మొహమాట పడింది. ఏదైనా హోటల్లో రూం టోరకదా 'అంది. పట్టణ పరిస్టితి ఆ అమ్మాయికి పూర్తిగా అర్థమైనట్టు లేదు. అంతా వివరంగా చెప్తా ఆ అహ్యాయి ఒప్పుకుంది. స్టేషను మాస్టారు కూలీని తోడిచ్చి జెన్నీని తన ఇంటికి పంపించాడు...

ఏ వాహనం దారికితి ఆ వాహనం తీసుకునీ, నడిచీ, జనం ఎడతెరిపి లేకుండా స్టేషనుకి వచ్చి పడుతున్నారు. పట్టణం నుంచి (ప్రాణాలతో బయటపడాలనీ, ఎక్కడికో అక్కడికి పారిపోవాలనీ ఆరాటం. నేను పోలీసు జీపులో నా బసకి బయలు దేరాను. పట్టణంలో కర్ఫ్యూ ఉంది కాని అమలు జరపడానికి తగిన పోలీసు బలగం ఉన్నట్టు లేదు. దారి పొడుగునా విచ్చలవిడిగా తిరుగుతున్న మూకలూ, కాలుతున్న ఇళ్ళు, దుకాణాలు, కార్డు బస్సులు, 'టక్కులూ.....

అంత ఉద్రిక్త పరిస్థితిలో రోడ్డు మీద డాన్సు చేస్తున్న ముగ్గురు కుర్రాళ్లని చూసి ఆశ్చర్యపోయాను. పోలీసు జీపు కంట పడగానే వాళ్ళు పక్కసందులోకి పారిపోయారు. పట్టణమంతా తగులడుతుంటే వీళ్లు రోడ్డు మీద ఇలా డాన్సు చేస్తున్నారేమిటి అని తెల్టబోతున్న నాకు జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని షాక్‌ తగిలీంది. ఒకమనిషి మరో మనిషి పట్ట ఆంత (క్రూరంగా ఉండగలడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను స్వయంగా చూడకపోతే నమ్మేవాడిని కాదు. నేను ఈ పెషయం చెబితే మరొకరు నమ్మక పోయినా ఆళ్ళర్యపోను.

ఆ కుర్రాళ్ళు డాన్సు చేస్తున్నది రోడ్డు మీద కాదు. రోడ్డు మీద బోర్ధాపడి ఉన్న ఓ పదిహేడేళ్ళ కుర్రాడి శవం మీద,

“బాబూజీ ఢర్‌ గయా" అన్నాడు జీపు నడుపుతున్న కానిస్టేబుల్‌ నవ్వుతూ, శవం పక్కనుంచి జీపు పోతుంటే. నాకళ్ళల్లో అతనికి భయం కనుపించింది కాబోలు. అతను శవం కేసి చూడనైనా చూడలేదు. ఆ విషయం అంత తేలిగ్గా ఎలా తీసుకో గలిగాడా, ఏదో జోక్‌ వేసినట్టు ఎలా నవ్వగలిగాడా అని నాకు ఆశ్చర్యమేసింది. బహుశా ఆతని మనసు ఇటువంటి దృళ్యాలు చూసి చూసి బండబారిపోయి ఉంటుంది. నాకు ఇది కొత్త కావచ్చు. అతను తన సర్వీసులో ఇటువంటి దృశ్యాలు

ఎన్ని చూశాడో?

నన్ను హోటలు దగ్గర దింపి జీపు వెళ్ళి పోయింది.

'వచ్చావా బాస్‌", అన్నాడు మిశ్రా. మనిషి షేక్‌ ఆయిపోయినట్టు కనిపించాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. రాత్రి నిద్ర పోయినట్టు లేదు.

లోలేటి జగన్మోహనరావు త

“ఏమన్నా తిన్నావా? అనడిగాడు.

'ఏం తినలేదు - తినాలనిపించడం లేదు,” అన్నాను నేను చూసినది గుర్తుకు వచ్చి.

, “ఇప్పుడే ఏదైనా తీసుకో - బయట జరుగుతున్నది చూసిన తర్వాత ఇంక తినలేవు. నిద్రపోలేవు' అంటూ బ్రైడ్‌, టీ తెప్పించాడు. అయిష్టంగానే రెండు స్పైసులు తిని, టీ తాగాను.

“నిన్న ఉదయం ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రశాంతంగా ఉంది కదా' అన్నాను.

'ప్రశాంతంగానా? మందు పాతర పేలడానికి సిద్దంగా ఉంది - నిన్న రాత్రి రెండు గంటలకి అంటుకుని పేలింది. రావుసాబ్‌! నేను వాలు తాగే పిల్లాణ్మి కాదు - ఢక్కా మొక్కీలు తిన్మవాణ్మి రక్తం, చావు చూస్తే జడుసుకునే వాణ్ణి కాను - కాని ఇలాంటిది ఎపుడూ చూడలేదు...

'రావుసాడ్‌! కొన్ని మాటలకి అర్హం అనుభవిస్తేనే కాని తెలియదు. అర్ధరాత్రి నిళ్ళ బ్దంలో హరాత్తుగా పరిగెడుతున్న జనం అడుగుల సవ్వడి - గోలగా కేకలు, కెవ్వున వ్‌డుపులు - గాఢ నిద్రలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే గది గోడలమీద కొండ చిలువల్దా కదులుతున్న నల్లటి, ఎరటి నీడలు - ఏం జరుగుతున్నదో అర్థంకాక దడ దడ లాడుతున్న గుండెలతో కిటికీ దగ్గరకు పరుగెట్టి చూస్తే మంటల వలయంలో చిక్కుకుని కాలిపోతున్న నిండు ప్రాణాల ఆర్తనాదాలు - ఇదంతా అనుభవంలోకి వచ్చేవరకు నాకు భయం అనే మాటకు అర్ధం తెలియలేదు.....' - మిశ్రా మాట్టాడుతూ కిటికీ కర్టెను లాగాడు. నాలుగో ఆంతస్తు కిటికీలోంచి కింద నాలుగురోడ్ల కూడలి కనిపిస్తోంది.

'ఆ మేడ చూశావా” - ఓ మూల సన్నటిపొగలు వస్తున్న భవనం చూపిస్తూ అన్నాడు మిశ్రా- 'కింద పెయింట్ల షాపు మూకలు అంటించడంతో పైన ఉను కుటుంబానికి పారి పోవడానికి అసలు అవకాశం లేకుండా పోయింది. క్షణాల మేడంతా మండసాగింది. నిద్రలో ఉన్నవాళ్ళు, ఎలా ఉన్నవాళ్ళు అలా టె(గ్రేసుమీదికి పరిగెట్టుకొచ్చారు.. అంతా నేను ఈ కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను. పదకొండుమంది. నీడల్లా అటూ ఇటూ పరిగెడుతూ గొల్లున ఏడుస్తూ జుట్టు పీక్కుంటూ, దేవుణ్ణి వేడుకుంటూ, సజీవంగా తగలబడిపోవటం నా కళ్ళతో చూశాను.

. ఆ తల్లి అలా ఎందుకు చేసిందో నాకు అర్హం కాలేదు. బహుశా ఆమెకు ఏం చెయ్యాలో తోచి ఉండదు. లేదా తన బిడ్డ తన కళ్ళెదురుగా కాలిపోవడం చూడలేక అలా చేసి ఉంటుంది. అంతవరకు గుండెలకు హత్తుకుని మంటలు, పొగలు తప్పించుకుంటూ అటూ ఇటూ పరుగెడుతున్నది, ముందుకు వచ్చి నెలల పిల్లాణ్ణి కిందకు విసిరేసింది. బహుశా మంటలకు దూరంగా విసిరేద్దామునుకొని ఉంటుంది. ఆ కుర్రాడు కరెంటు తీగల మీద పడి, ఎగిరి, సరిగ్గా పాయ్యిలా మండుతున్న షాపులో ఏదో బొమ్మ పడ్డట్టు పడ్డాడు. కాగితం ముక్క కాలిపోతూ, వంకరలు తిరిగి నల్లబడి పోయినట్టు, వాడి కాళ్ళూ చేతులూ వంకర ప్లోతూ, మెల్లగా మంటల్లో అదృశ్యమయ్యాడు. వాడి దగ్గరనుంచి ఒక్క శబ్దం కూడా రాలేదు.

42 లక్ష్మీ కటాక్షం

క్రిష్టియన్ను అంటుంటారే - ఏసు శిలువ మీద మనకోసం తన రక్తం చిందించెను అని - అలా బహుశా వాడు మన పాపాలు మనకు గుర్తు చేస్తూ మనకోసం మౌనంగా కాలి పోయాడేమో! వాడి ఏడుపు శాపంలా వినిపించినా నాకు మనశ్శాంతి ఉండేది. ఆ మౌనమే... ' - మిశ్రా మరి మాట్లాడలేక ఆగిపోయాడు - 'రావునాబ్‌! పిల్లలు దేవుళ్ళంటారు. మరి ఈ దేవుళ్ళని బలి తీసుకునే దేవుడు ఎలాంటి దేవుడు? ఈ రాక్షసుల దేవుడు దేవుడు కాదు - సైతాను" అన్నాడు కొంచెం కోలుకున్న తర్వాత.

'పద' అన్నాను లేస్తూ,

ఎక్కడికి?

“'యన్బని కలుద్దాం”

“ఇప్పుడా? మిశ్రా తెల్లబోయి అన్నాడు *... బయటి పరిస్టితి నీకు తెలిసినట్టు లేదు. నీ ప్రెస్‌ ఐడెంటిటీ కార్డుకి బయట మూకలు గడ్డి పరక కిచ్చిన విలువ కూడా ఇవ్వవు. అలా అన్నాడే కాని నేను లేవడం చూసి తనుకూడా మాట్లాడకుండా, కెమేరా తీసుకుని నాతో వచ్చాడు.

యస్పీ ఆఫీసు దగ్గరే. అర కిలోమీటరు దూరంలో ఉంది. ఆ అర కిలోమీటరు రోడ్డు రాళ్ళు చిమ్మినట్టుగా ఉంది. రోడ్డుకిరుపక్కలా తగలబడుతున్న ఇళ్ళు, దుకా ణాలు, రోడ్డుమీద పాగలు కక్కుతున్న లారీలు, బస్సులు - అక్కడక్కడ టెలిఫోను స్తం భాలు, రాళ్ళత్తో బారికేడ్డు - దూరంగా 'అల్లాహక్చర “హర హర మహదేవ్‌ అని కేకలు, తుహిళ్తీ కాల్పులు, ఆరుపులు, ఏడుపులు - ఆ అరకిలోమీటరు దూరంలో కనీసం ఇరవై శవాలన్నా చూశాం. మేం మాత్రం ఏ అవాంతరం జరగకుండా యస్పీ ఆఫీసు చేరాం.

యస్పీ ఆఫీసు రణరంగంలా ఉంది. ఓ వందమంది సాయుధ పోలీసులు ఉక్కు టోపీలు, రాళ్ళ దెబ్బలు తగలకుండా వెదురుతో చేసిన జాకెట్టు వేసుకుని సిద్దంగా ఉన్నారు. వాళ్ళి చేతుల్లో పేముతో తయారు చేసిన డాలులు ఉన్నాయి. పక్కన రెండు లారీలు నిలబడి ఉన్నాయి. ఆఫీసులో యస్పీయే కాకుండా, డి్టైక్సు మేజిఫ్ట్రేటు కూడా ఉన్నాడు. యస్పీ రెండు నెలల నుంచి అక్కడే కేంపు వేసి ఉన్నాడు.

అక్కడ కంట్రోలు రూంలో విరామం లేకుండా ఫోనులు మోగుతున్నాయి. యస్పీ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.

'అసలు ఇదంతా ఎలా మొదలయింది? ఇంత పెద్ద ఎత్తున ఇలా జరగడం ఆళ్ళ ర్యంగా ఉంది" అన్నాను యస్పీతో, ఫోనుకి ఫోనుకి మధ్య విరామంలో.

'ఆశ్చర్యం దేనికి? కళ్ళున్నవాడికెవడికైనా ఇవాళ కాకపోతే రేపైనా ఇలా జరగక తప్ప దని తెలుస్తూనే ఉంది" అన్నాడు యస్స బెనర్జీ. అతను ఐ.పియస్‌. ముష్ఫయి ముష్ఫ యైదు కంటె ఎక్కువ ఉండదు అతని వయసు --రెండు పక్షాలూ కయ్యానికి కాలు దువ్వు తున్నప్పుడు కారణాల కోసం వెతకక్కర్లేదు. ఆడ, మగ, వ్యవహారాలు, ఇరుగు పొరుగు తగాదాలు, రౌడీ మురాల అంతర్యుద్దాలు, స్కూలు కుర్రాళ్ళ కొట్టా..లు - ఏ చిన్నరవ్వ యినా చాలు అంటుకోడానికి. న

తోలేటి జగన్మోహనరావు 43 'రెండు పక్షాలూ తయారవుతున్నాయని అంత స్పష్టంగా తెలిసినప్పుడు పోలీసు

లేంచేస్తున్నారు?”

నా ప్రశ్న అతనికి కోపం తెప్పించినట్టుంది. అతను నాలుగు రోజులనుంచీ సరిగా నిద్రాహారాల్లేకుండా రాత్రీ పగలూ రానాలో ఉంటూ చాలా చికాగ్గా ఉన్నాడు.

“పోలీసులేం చెయ్యగలరు? - బెనర్జీ విసురుగా ఎదురు ప్రశ్శవేసాడు - ఇక్కడ చలా మణిలో ఉన్న ఆడియో కేసెట్టు విన్నావా? ఇమామ్‌లు, సాధువులు మతం "పేరుతో జనాల్ని ఎలా రెచ్చగొడుతున్నారో తెలుసా? వాళ్ళ మీద ఏ చర్యా తీసుకోలేని పోలీసులు నిస్సహాయత గురించి నీ పేపర్టో రాసే ధైర్యం నీకుందా? ప్రార్హనా స్టలాల్గోకి హంతకు లకు, సాయుధ గూండాలకు (ప్రవేశం ఉంటుంది. కాని వాళ్ళని వెంటాడుతూ పోలీసులు ప్రవేశిస్తే పెద్ద ఆందోళన - మత హక్కులు, పౌర హక్కులు అంటూ మీ పత్రికల్లో కాకిగోల - మిస్టర్‌ - ఒకటి స్పష్టంగా అర్హం చేసుకో. ఈ రోజు విఫలమయ్యింది పోలీసు లొక్కళ్ళే కాదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం - ఆ పైన సమాజం - అసలు మీరందరూ ఈ పరిస్థితికి ఎంతవరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి..' అంటూ చాలా ఘాటుగా మాట్టాడాడు.

యస్పీ అలా మాట్లాడుతుంటే బయట కలకలం వినిపించింది. ఒక కానిస్టేబుల్‌ లోపలికొచ్చి, సెల్యూట్‌ కొట్టి, నిలబడి, 'సాబో అన్నాడు భయపడుతూ, భయపడుతూ.

“ఏమిటి?”

'యమ్మెల్యే సాబ్‌ జనాన్ని తీసుకుని ఇటువైపు వస్తున్నాడు సాబ్‌! మొన్న మనం అరెస్టు చేసిన ఆయన మనుషులందరనీ వదిలెయ్యాలంటున్నాడు' అని చెప్పాడు.

'గేట్లు వేసేయండి" అన్నాడు యస్సీ.

పాతకాలపు పోలీసు రానా కోటలాగా ఎత్తు (ప్రహారీ గోడతో ఉంది. దానికున్న పెద్ద ఇనుప గేటు మూసేసారు. నేను యస్పీ పక్కనే వరండాలో నిలబడి చూస్తున్నాను.

ఐదు నిముషాలలో రెండు మూడు వందల మంది ఉన్న మూక పోలీసు రానా మీద విరుచుకుపడింది. వాళ్ళ చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, ఇనుపరాడ్డు, తుపాకులు, పెట్రోలు టిన్నులు, కాగడాలు - గేటు ఊచలు పట్టుకుని గుంజుతూ అరవడం మొదలు పెట్టారు.

'యస్పీ ! డౌన్‌, డౌన్‌! పోలీసు జులుం నశించాలి..."

అందరికంటే ముందున్న _వ్యక్తి పంచె, లాల్ఫి , వెయిస్టుకోటు వేసుకుని, చూడగానే వీడు గూండా నెంబర్‌ వన్‌ అనిపించేలా వున్నాడు. వాడు గేటు ఓ తోపు తోసి, 'పారక్‌ ఖోలో' అని అరిచాడు.

యస్పీ మైకు తీసుకుని, పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది. దయచేసి అందరూ వేంటనే వెళ్ళి పాండి. రోడ్ల మీద ఎవరూ తోరగకూడదు,” అని చెప్పాడు.

సమాధానంగా రానా మీద రెండు నిమిషాలు రాళ్ళ వర్షం కురిసింది. మూకలోంచి రెండు మూడు తుపాకులు గాలిలోకి పేలాయి.

'సాబ్‌! వాళ్ళని మనం వదిలెయ్యకపోయిన్నా వాళ్ళు ఎలాగా రేపు కోర్టులో బెయిలు మీద విడుదలయిపోతారు. మీ ధంగా మొదలు పెడతారు. ఇది వాళ్ళికి

త లక్ష్మీ కటాక్షం అలవాటే . విరోధం తెచ్చుకోడం దేనికి సాబ్‌ - క్రింది ఆఫీసరు అనుభవపూర్వకంగా చెపుతున్న మాటలు బెనర్జీ విన్నాడు కాని ఏం సమాధానం చెప్పలేదు. డియం వైపుకి తిరిగి అతనితో మెల్లిగా మాట్టాడాడు. డి.యం. అంగీకరిస్తున్నట్టు తలూపాడు.

బెనర్జీ మైకు తీసుకుని 'అందరూ వెళ్ళి పోవడానికి సరిగ్గా నిమిషం

ట్రైమిస్తున్నాను. లేకపోతే కాల్పులు జరపాల్సి వుంటుంది" అని హెచ్చరిక చేశాడు. వెంటనే సాయుధ పోలీసులు పొజిషను తీసుకున్నారు. పరిస్తితి ఉద్రిక్తంగా తయారవుతోంది- 'సాలే యస్పీ' ముందున్న వ్యక్తి ఉద్రేకంతో ఊగిపోతూ బూతులు గుప్పించడం మొదలు పెట్టాడు. 'నాగురించి ఏవనుకుంటున్నావురా - మాకీ...” సరిగా నిమిషం తర్వాత పోలీసు తుపాకులు గుంపు మీదుగా గాలిలో పేలాయి. గుంపులో కొద్దిగా చలనం వచ్చింది. కాని అలాగే నిలబడింది. మళ్ళీ పదిసెకండ్ల తర్వాత రెండో రాండ్‌ గుళ్ళు కొంచెం దిగువగా జనం తలల మీంచి దూసుకుపోయాయి. ఈ సారి జనం చెల్లా చెదరై పారిపోసాగారు.

*.... మై తేరేకో దేఖ్‌లూంగా ...... సాలే... నా మీద కాలుస్తావా... బెహెన్‌ కీ... అక్కడ రోడ్ల మీద తిరుగుతున్న జనం నీకేవవుతాగర్రా... వాళ్ళకి కర్ఫ్యూ లేదా - సాలే యస్ప - మై తేరే కో ఛోడూంగా నై ..” అని బూతులు తిడుతూ ఒంటరి అయిపోయిన నాయకుడు వెళ్ళి పోయాడు.

అరగంట తర్వాత పై అధికారుల దగ్గరనుంచి ఫోనువచ్చింది. శాంతి భద్రతల విషయంలో పోలీసులకి ఎంత బాధ్యత ఉందో, ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులకి కూడా అంతే బాధ్యత ఉందనీ, వాళ్ళని నిర్లక్ష్యం చెయ్యడం, అవమానించడం కూడదని మందలించారు పై అధికారులు.

అయిదు నిమిషాల తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి ఫోను... సీనియర్‌ అధికారుల, అన్ని పార్టీల రాజకీయ నాయకుల బృందం ఒకటి పరిస్టితి పరిశీలించడానికి వస్తున్నదనీ, వారి రక్షణకు ఏర్పాట్లు చెయ్యాల్సిందనీ....

మళ్ళీ ఫోను... (. నుంచి షాహీ ఇమామ్‌ గారు ఎనిమిది కార్లలో వస్తున్నారట. ఈ ఉద్రిక్త పరిస్టితిలో హునె్థభాద్‌ వెళ్ళ వద్దని వారిని కేంద్ర ప్రభుత్వం (ప్రారిస్తోందట. ఒకవేళ వారు అంగీకరించని పక్షంలో హుస్నాబాద్‌ సరిహద్దుల్లో వారిని సగౌరవంగా అరెస్టు చేసి, అతిధి గృహంలో ఉంచి సకల మర్యాదలూ చెయ్యమని...

ఫోను మీద ఫోను అలా వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత యస్పీతో మాట్లాడడానికి వీలు పడలేదు. పరిస్థితి గంట గంటకీ విషమిస్తోంది. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బారికేద్డు.... పోలీసు వాహనాలు...కాని, 'ఫైరింజన్లు కాని నడవడం కష్టంగా ఉంది. ఒక పద్దతి ప్రకారం దహనకాండ, హత్యాకాండ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా మంటలు, పొగలు, ఆర్రనాదాలు....

పన్నెండు గంటలకి జిల్లా కేంద్రం నుంచి, సమీప (ప్రాంతాల నుంచి, కొద్దిగా పోలీసు బలగాలు, అసమాపక దళాలు వచ్చాయి. జిల్లా అంతా అల్లర్జు వ్యాపించ వచ్చన్స భయంతో జిల్లా అధికారులు నః బలగాలన్నింటినీ హుస్నాబాద్‌ తరలి .చడానికి సాహసించలేదు. అయినా పరిస్థితిలో ఏవీ మార్పులేదు.

తోలేటి జగన్మోవానరావు శ్‌ మధ్యాహ్నం రెండు గంటలకి రేపిడ్‌ ఏక్షన్‌ ఫోర్సు దిగింది. మర్నాడు ఉదయం తొమ్మిదింటికి సైన్యం దిగింది. 'షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్హర్సు ఇవ్వబడ్డాయి. రోడ్డు మీద మనిషి కనిపిస్తే హెచ్చరిక లేకుండా కాల్పులు చేసింది. సైన్యం దెగడంతో అష్నుటి వరకు బీభత్సాన్ని సృష్టించిన మూకలు అదృశ్యమయి పోయాయి. సాయ౭కుకాా-= ప్రశాంత పరిస్టతి నెలకొంది. రాత్రి మిశ్రా, నేనూ సైన్యం జీపులో పట్టణమంతా తిరిగేం. కరెంటులేదు. మసక వెన్నెల్లో పట్టణం శ్మశానంలా ఉంది. దారిలో ట్రక్కు ఒకటి కనిపించింది. అక్కడ కంపు దారుణంగా ఉంది. నేనూ, మిశ్రా జేబురుమాళ్ళు ముక్కుకి అడ్డం పెట్టుకున్నాం. అక్కడ మొహాలకి గుడ్డలు కట్టుకున్న ఓ అరడజను మంది చీకట్టి టార్చిలైటు సహాయంతో శవాలకోసం వెతుకుతున్నారు. గోనెఫుట్టాల మీదికి శవాల్ని ఎక్కించి ట్రక్కుల్లోకి విసురు తున్నారు. అలాంటి ట్రక్కులు మాకు దారిలో చాలా ఎదురయ్యాయి. నగరానికి వెలుపల శవాలు గుట్టలుగా పోసి పెట్రోలు చల్లి తగల బెడుతున్నారు. సైన్యాధికారి అనుమతితో మిశ్రా అక్కడ నాలుగైదు ఫొటోలు తీశాడు. ఈ రెండు రోజుల్లోనూ ఎంతమంది చనిపోయారు? (ప్రభుత్వం నాలుగైదు వందలంటుంది. నా అంచానా ప్రకారం మూడు వేల మందికి పైగా మరణించి ఉంటారు. మర్నాడు ఉదయం హుస్నాబాద్‌ నుంచి రంగాపూర్‌ "సైన్యం జీపు ఒకటి వెడ్తు తుంటే, రంగాపూర్‌ దాకా జీపులో వెడితే అక్కడ్నుంచీ ఢిల్లీకి ట్రెయిన్‌ అందుకోవచ్చునన్న ఉద్దేశంతో జీపెక్కాం. జీపు బయలుదేరబోతుండగా నాకు జెన్నీ గుర్తుకు వచ్చింది. ఈ గొడవల్లో పడి జెన్నీ విషయం పూర్తిగా మరెచిపోయాను. ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళి పోయిందో, ఇంకా స్టేషను మాస్టారింట్లోనే ఉందో తెలియదు. ఇంకా పానెన్టబాద్‌ లోనే ఉండి ఉన్నట్లయితే జీపులో నాతో పాటే తీసుకు వెళ్ళవచ్చనే ఉద్దేశంతో జీపు స్టేషను వైవుకి పోనిమ్మన్నాను. షి వెళ్ళి పోలేదు. బితుకు బితుకు మంటూ స్టేషను మాస్టరింట్లోనే ఉంది. స్టేషను మాస్టరింట్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళెవరూ లేరు. ఈ రెండు రోజుల నుంచి మాట్లాడే వారెవరూ లేక ఉందేమో నన్ను చూడగానే నిట్టూర్చి స్టేషను మాస్టరి కుటుంబానికి కృత జ్ఞతలు చెప్పి జీపెక్కింది. 'ఎవరీ అమ్మాయి?” అనడీగాడు క్డ్‌్య్‌లో ఉన్న ఆర్మీ ఆఫీసరు. 'జెన్నీ అని - ట్రైయిన్‌లో పరిచయమైంది." 'ఓహో- స్నేహితురాలి తీసుకుని ఈ బృందావనంలో విహార యాత్రకొచ్చావన్న మాట' అన్నాడు అతను వెటకారంగా. అతని ఆవేశాన్ని నేను అర్ధం చేసుకున్నాను. ఏ పరిస్థితిలో ఆ అమ్మాయి కలిసినదీ, స్టేషను మాస్టారింట్లో ఎలా ఉంచినదే, జెన్నీకి అర్ధం కాకుండా అతనికి హిందీలో ఛెప్పాను. అతను ఇంకేమీ మాట్లాడలేదు. రంగాపూర్‌ వెళ్ళే దారిలోనే ఈ వివాదొస్పదమైన కట్టడం వుంది. మిశ్రా అంతకు

తర లక్ష్మీ కటాక్షం ముందే ఇదంతా చూసినా నేను మాత్రం చూడలేదు. ఆర్మీ ఆఫీసరుకి ఈ విషయం చెప్పి, అతను అనుమతిస్తే ఒకసారి అది చూసి వస్తానని చెప్పాను. ఈ సారి అతను చాలా మర్వాదగా మాట్లాడాడు. బహుశా తను ఇందాక అనవసరంగా దురుసుగా మాట్లా డానని అనిపించింది కాబోలు - జీపు దిగి తనుకూడా వచ్చాడు. జెన్నీ మాత్రం జీపులోనే ఉండి పోయింది. రోడ్డు పక్కగా విశాలమైన ఖాళీ స్టలంలో మర్రి చెట్టునీడన ఉంది ఇంత వినాళ కాండకు కారణమైన కట్టడం. అక్కడ పోలీసు బందోబస్తు చాలా _ ఎక్కువగా ఉండటం వలన కాబోలు, మసీదుకాని, మందిరం కాని ఈ అల్లర్లలో ఏవీ దెబ్బ తినలేదు. ఇంతకు ముందు ఈ గోడ ఎలా ఉండేదో కాని ఇప్పుడు గోడ కనుపిం చడం లేదు. మందిరం దక్షిణం వైపున వుంది. మసీదు ఉత్తరం వైపున ఉంది. మందిరం పక్కనుంచే ఓ తారు రోడ్డు తూరుపువైపుకి పోతోంది. ఆ రోడ్డు పక్కన, మసీదు-మందిరాల వెనుక, దాదాపు రేండు వందల గజాల దూరంలో ఓ గుట్ట మిద స్టేట్‌ బ్యాంక్‌ , పోస్టాఫీసు , ఇంకా ఏవో గవర్నమెంటు ఆఫీసులూ ఉన్నాయి. అదంతా చూసి మళ్ళీ జీపెక్కాం. రెండు గంటల తర్వాత మమ్మల్నీ రంగాపూర్‌ స్టేషన్లో దించి జీపు వెళ్ళి పోయింది. రంగాపూర్‌లో చిన్న చిన్న చెదురు మదురు ఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉంది. జన జీవనం మామూలుగానే నడుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకి ఢిల్లీ వెస్తే బండి ఎక్కాం. బండి కదిలిన తర్వాత సంభాషణ 'మొదలైంది. జీపులోకాని, “స్టేషన్లో కాని పెద్ద సంభాషణలేవీ జరగలేదు. హుస్నాబాద్‌ తప్ప మరే విషయమైనా మాట్లాడాలని ఒక అంగీకారానికి వచ్చినట్టు ॥ అదీ ఇదీ మాట్టాడసాగాం. మిశ్రాకి జాక్సన్‌ కథంతా చెప్పాను. మిశ్రాకి ఫోటోగ్రఫి పిచ్చి. జెన్నీ నడిగి జాక్సన్‌ అల్బం తీసుకుని తిరగెయ్యడం మొదలు పెట్టాడు.

“ఇంత కష్టపడ్డా జూక్సన్‌ బంగ్లా చూడడానికి వీలుపడనందుకు నాకు విచారంగా వుంది", అన్నాను జెన్నీతో: 'ఏం చేన్తాం” అంది జెన్నీ నిరాశగా

తర్వాత మళ్ళీ సంభాషణ ఆగిపోయింది. నేను కిటికీలోంచి బయటకు చూడ సాగాను. అవే చెరకు తోటలు... అవే దృళ్యాలు... తేడా అల్లా అప్పుడు వెన్నెల... ఇప్పుడు ఎండ...రెండు రోజులే అయినా ఆ (ప్రయాణం ఎంతో కాలం (క్రితం చేసినట్టు అనిపిస్తోంది. ఎంత మనసు మరల్చుకుందామన్నా ఆలోచనలు హుస్నాబాద్‌ వైపుకి పరుగులు తియ్యడం మానలేదు... మతం పేరిట ఎంత అర్థరహిత హత్యాకాండ? ఎన్ని వేల ప్రాణాల బలి?

'ఎందుకు ఇలా జరుగుతోంది? లోపం హిందువుల్లోనా? ముస్పింలలోనా? మనిషి లోనా? మతంలోనా? ఈ రోజు ఈ పరిస్టితికి కారణం ఏమిటి? గత చరిత్ర

  • విభజించి పాలించిన ఇంగ్రీషు వాళ్ళ రాజనీతి , మతం పేరిట దేశాన్ని ముక్కలు చేసి హిందూ - ముస్లింల మధ్య ఒక అగాధం సృష్టించిన మతశక్తులు - మెజారిటీ మతస్తులని, _ మైనారిటీ మతస్తులనీ మతం ప్రాతిపదికపై ప్రజలను చీల్చి, కొంతమందికి ప్రత్యేక హక్కులు, సదుపాయాలు ప్రసాద్దిస్తున్న లౌకిక రాజ్యాంగం - చేదు నిజాల్ని నిర్భయంగా చెప్పే నిజా యితీ లోపించి, హిందూ మత తత్వాన్ని

తోలేటి జగన్నోవానరావు ॥ 47 విమర్శించడమే సెక్యులరిజంగా చిత్రిస్తూ హిపోక్రేట్టుగా, కుహనా సెక్యులరిస్టులుగా ప్రజల్లో అపఖ్యాతి పొందిన మేధావులు - వెనుక చూపే కాని ముందు చూపులేని మత నాయకులు- మత విద్వేషాలు రెచ్చగొడుతూ (ప్రజలను ఓటుబ్యాంకుగా వాడుకుం టున్న రాజకీయ నాయకులు, గూండాలు, సంఘ విద్రో హక శక్తులు, పాకిస్టాన్‌ గూఢచారి శాఖ- ఈ నాటి పరిస్టితికి మూల కారణాలు వెతకడం కర్ణుడి చావుకి కారణాలు వెతకడం లాంటిదే!

అందరూ పెంచి పోషించిన ఈ విష సర్బం కాలనాగై ఇప్పుడు కాటు వేస్తోంది. ప్రతి కల్లోలం పోలీసు కాల్పులకు అరెస్టులకు, నిర్బంధానికి దారి తీస్తుంది. నిర్బంధం (ప్రజలకు, మతానికి మధ్య అనుబంధం పెంచుతుంది. పెరుగుతున్న మత నాయకుల పట్టు ప్రతీ కార వాంఛ రగిలిస్తుంది. ఇదంతా మరో కల్గోలానికి దారి తీస్తుంది. ఇదొక విషవలయం. ఇది మొదలూ కాదు, తుదీ కాదు. గతం ఎంత అంధకారమో, భవిష్యత్తు కూడా అంత అంధకారం......

నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ 'రావుసాబ్‌... ఇదేవిటి? అనడిగాడు అల్బం తిరగేస్తున్న మిశ్రా ఒక ఫొటో చూపించి.

“ఇదే జాక్స, బంగ్లా"

“ఇది... గేటు పక్కన ఉన్నది?

“అదా- అది జిమ్మీ సమాధి"

జాక్సన్‌ ఒక ఎక్సెంట్రిక్స్‌ తనకేది తోస్తే అది చేసేవాడు. అతను ఏ ఆర్మిటెక్టుని సంప్రదించకుండా పెర్షియన్‌ వాస్తు శైలి, హిందూ వాస్తుశైలి, యూరోపియన్‌ వాస్తు శైలి, అన్నీ మేళవించి తనే తన దైవం సమాధికి రూపకల్పన చేశాడు. దానికి ఓ అందం, చందం లేదు.

నా సమాధానం వినగానే మిశ్రా మొహం పాలిపోయింది. “నువ్వు చెబుతున్నది నిజవేనా? వేళాకోళవాడటల్లేదుకదా' అన్నాడు మిశ్రా.

'నిజమే. వేళాకోళ వెందుకాడతాను? జాక్సన్‌ ఆత్మకధలో ఇదంతా స్పష్టంగా రాళాడు. ఏం? అన్నాను నేను.

'బాస్‌' - మిశ్రా కంరం చాలా సీరియస్‌గా ఉంది. 'ఈ ఫొటోలు రెండూ ఒకసారి జా(గ్రత్తగా చూడు' అన్నాడు - రెండు ఫోటోలు పక్క పక్కనే పెట్టి. ఒకటి అల్బంలో జాక్సన్‌ బంగ్లా ఫోటో, రెండోది మసీదు మందిరం రంగుల ఫొటో మిశ్రా తీసినది.

రెండు ఫొటోలు మార్చి మార్చి చూశాను. కాని నాకేవీ అర్దం కాలేదు.

“ఏవీ అర్థం కావడం త్‌? * అన్నాడు మిశ్రా. న్‌

“ఏవిటి అర్ధం కావడం?”

“ఇప్పుడు జా(గ్రత్తగా చూడు రెండు ఫొటోలూ. మొదటి ఫోటోలో గేటు, గేటు లోంచి జాక్సన్‌ బంగ్లాకి పోతున్న కంకర రోడ్డు చూడు. నేను తీసిన ఫోటోలో మందిరం పక్క నుంచి పోతున్న తారు రోడ్డు చూడు. జాక్సన్‌ బంగ్లా స్తానంలో అదే గుట్ట మీద వెలిసిన ఆఫీసులు చూడు. అన్నింటికన్న "ముఖ్యమైసేద్‌ - రెండు ఫొటోల్లోనూ ఉన్స మర్రి చెట్లు చూడు... " -మి(శ్రా వివరించసాగాడు.

ఉపి లక్ష్మీ కటాక్షం

నాగరికత, కాలం, ఆ ప్రాంతంలో ఎన్ని మార్పులు తీసుకు వచ్చినా, జాక్సన్‌ బంగ్హా ఈ నాడు పూర్తిగా మాయమైపోయినా, వాస్తవం పూర్తిగా మరుగున పడిపోలేదు. మిశ్రా చెబుతున్నది నా బుర్రకి మెల్లిగా ఎక్కసాగింది.

“అంటే... ఇది...... ఇది..ఈ ఆవేశకావేషాలు...ఈ దహనకాండ.... ఈనర మేధం... ఈ నెత్తుటి ఏరులూ... ఈ కన్నీటి వరదలూ....... ఇదంతా..... ఇదంతా..... ' అన్నాను తెల్లబోతూ.

నాకేమీ సందేహం లేదు, ' అన్నాడు మిశ్రా రెండు ఫొటోలూ కింద పడేస్తూ,

( ఆవ్యానం. నవంబర్‌, 1996)

లక్ష్మీ కటాక్షం

లక్ష్మీ దేవికి ధన లక్ష్మి ధాన్స లక్షి సంతాన లక్ష్మి స్టాక్‌ మార్కెట్‌ లక్ష్మి - ఇలా అనేక పస్తే ర టా వ చపల షే 'అయిజే హ్‌ లక్ష్మి మహా మహా చపల చిత్త, ఎవరిని ఎప్పుడు కటాక్షించి ఆందలమెక్కిస్తుందో, ఎవరి మీద ఎప్పుడు శీత కన్ను వేస్తుందో ఎవరికీ తెలియదు.

మహా మహా లోతులు తెలిసిన గజ వ్రైతగాన్ట ములిగిపొతుంటే, ఈ స్టాక్‌ మార్కెట్‌ సుడిగుండంలోకి నేను దూకడం లేదని ఒకి బాధ పట్టుకుంది మా ఆవిడకి ఈ మధ్య. ఇప్పుడు పార్టీలకెళ్ళినా, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఎక్కడికి వెళ్ళినా ఇదే టాపిక్‌కదా!

“మనకి రెండు వెంపులా వ్యాపారం అచ్చిరాదు' అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు, కాఫీ తాగేసి కాఫీ కప్పు, సాసరు బద్దలు కొట్టి మరీ చెప్పాను -' మా తాత ధాన్యం వ్యాపారం చేసి పొలం అమ్మేశాడు. మా నాన్న బట్టల కొట్టు పెట్టి ఇల్లమ్ముశాడు. మా మావ గారు ఆరు ర్‌ళ్ళి సినిమా తీసి పదహారెకరాలమ్మేశాడు....”

“ఆయన సంగతెందుకు ఇప్పుడు?” = రుస రుసలాడుతూ అంది మా ఆవిడ.

“ఆయన సంగతి నాకెందుకు? వ్యాపారం మనకు అచ్చిరాదని సోదాహరణంగా వివరిస్తున్నాను - అంతే.

“అచ్చిరాదని కూర్చుంటే కాదు, కొంచెం ఆసక్తి పెంచుకుని చేస్తే ఎందుకు అచ్చిరాదు?” అని అప్పట్నుంచీ స్టాక్‌మార్కెట్‌లో ఆసక్తి పెంచడానికి నా ట్రెయిన్‌ వాష్‌ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ (ప్రయత్నాలలో భాగంగా ఓ రోజు వంటింట్లో

50 లక్ష్మీ కటాక్షం అంట్లు తోముతూ ఉదయ కార్యక్రమాలు ప్రారంభించింది -'వనజగారి మొగుడుకి ఏదో “షేరమ్మితే ఇరవై వేలు లాభం వచ్చిందట. మనవూ ఉన్నాం, ఎందుకు? అదృష్ట వంటే అలా వుండాలి' అంది అంతకు ముందు రోజు పేరంటం విశేషాల సంక్షిప్త వార్తలు చెబుతూ.

పేరంటంలో ఆడవాళ్ళు చక్కగా నగలు చీరలు గురించి మాట్లాడుకుని, ఇరుగమ్మ, పొరుగమ్మ గురించి చెవులుకొరుక్కోకుండా, షేర్ల గురించి మాట్లాడు కోవడవేవిటో నాకు అర్ధంకాదు. ఆ ప్రస్తావన తీసుకొచ్చి పొద్దుటే అంట్లతో పాటు నన్ను కూడా తోమడం నాకు నచ్చలేదు. అందులోనూ ఎవడో సన్నాసితో పోల్చి నన్ను తక్కువ చెయ్యడం అసలు సహించరాని విషయం. ఇలాంటి సంభాషణలు ఎలా మొగ్గలోనే తుంచెయ్యాలోనాకు బాగా తెల్సు

'వనజ ఎవరు? తెల్లగా, స్లిమ్‌గా పక్కవబిధిలో ఉంటుంది. ఆవిడే కదా'

....... తెల్లగా, స్లిమ్‌ గా నాకళ్ళకెపుడూ కనిపించలేదుకాని ఉండేది పక్కవీధిలోనే.”

“ఆవిడ మొగ్గుజ్ఞయితే నాకూ ఆ అదృష్టం పట్టేది”

వంటింట్టో ఓ చిన్న భూకంపం వచ్చి థణ ధణ గిన్నెలన్నీ మోగి నిశ్శబ్దమైంది.

“వెధవా! స్కూలుకి టబైమవుతోంది. నైళ్యసుకున్నావా!: - సుపుత్రుల్ఞు ఉద్దేశించి కేక విన్టించింది క్షణం తర్వాత.

"బళ్ళు కాగాయని చెప్పావా?"

'మాటకి మాట ఎదురు చెప్పడం మాత్రం వచ్చు. ఇంకేం తెలీకపోయినా” రెండు క్షణాలు ఆలస్యంగా మనం కొట్టిన దెబ్బకు సమాధానం డొంకతిరుగుడుగా వచ్చింది.

బె అల్లాంటి చిన్న చిన్హు అపజయాలకి బెదిరి పోయే రకం కాదు మా ఆవిడ. రెండు రోజులు అగి బ్రెయిన్‌ వాషింగ్‌ కార్యక్రమం మరింత ఉధృతం చేసి ఊదర గొట్టసాగింది. ఇంక నేను తెల్లజెండా ఎత్తేసి లొంగిపోయే సమయంలో ఊపిరి పీలుకుని నిలదొక్కుకోడానికి ఓ మంచి అవకాశం వచ్చింది.

'మీ నాన్న దగ్గర్నుంచి ఫోనొచ్చింది. గుంటూరులో 1 రెండో తారీఖున మీ పినతలి కొడుకు పెళ్ళట. వాళ్ళంతా అలా వెడతారుట. నిన్ను తిన్నగా గుంటూరు వచ్చేయమన్నారు” అని శభ వార్త చెప్పాను

"అదేవిటి? ఇవాళ ముప్పయి. ఒకటి. రెండు రోజుల్లో పెళ్ళేవిటి? ముందే చెప్పొచ్చుగా? గా

'హరాత్తుగా అలా పెళ్ళి నిశ్చయం చేశారంటే ఏదో పెద్ద విశేషమే ఉంటుంది" అన్నాను నేను సస్తెన్సుగా .. 'అయితే వెంట వెళ్ళాలి" అని రాత్రికి రాత్రే గుంటూరు వెళ్ళి పోయింది మా

ఆవిడ. మర్షాడు సాయంకాలం సినిమాకెళ్ళి, రాత్రి పదింటికి కొంపకి చేరి, ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోతూ లోపలికి అడుగు పెట్టి సోఫాలో

“వౌ క వబ

సు కో తోలేటి జగన్నోవానరావు ర. = | 51 పులిలా కూర్చున్న మా ఆవిణ్శీ చూసి ఉలిక్కి పడ్డాను - ' అదేమిటి? అలా తిరుగు టపాలో వచ్చేశావమిటి?'

"పెళ్ళి గుంటూరులో కాదు, ఉంగుటూరులో' - సీరియస్‌గా అంది మా ఆవిడ- “రెండున కాదు, ఇరవై రెండుని

'మరి మీ నాన్న అలా చెప్పాడే?

'మా నాన్న సరిగానే చెప్పారు. మీకు చెవుడు కదా. సరిగా విన్పించి ఉండదు'

నాకు కొద్దిగా చెవుడేమోనని అప్పుడప్పుడు, ముఖ్యంగా ఫోన్లో మాట్టాడినప్పుడు అన్పిస్తుంది. కాని తను అనవసరంగా గుంటూరు వెళ్ళడానికి కారణం నేను అని మా ఆవిడ ఆరోపించడం నాకు నచ్చలేదు. అంచేత ఎదురుదాడి మొదలు పెట్టాను.

“నాకు సరిగానే విన్నిస్తుంది. మీ నాని ఈ సారి ఫోన్లో మాట్టాడేప్పుడు గోవింద రాజుల సుబ్బారావులా పోజుగా చుట్ట నోట్లో పెట్టి ఉంగుటూరుని గుంటూరనకుండా, చుట్టతీసి, ఉం..గు....టూ....రు.... అని స్పష్టంగా పలకమని చెప్పు

“గోవిందరాజుల సుబ్బారావెవరు?

'పాత సినిమాల్లో విలను”

'మా నాన్న పాత సినిమాల్లో విలన్లా ఉండరు"

'పోనీ కొత్త సినిమా - పసిపిల్లల స్కూల్లో బాంబులు పెట్టేసి, నోట్లోంచి చుట్ట తీసి హ్హ...హ్హ్హ....హ్హ... అని వికటాట్టహాసం చేస్తూ ప్యూజా వైరు అంటించే కొత్త సినిమాల్లో ముసలి విలననుకో.'

'నేనన్నదానికీ, మీరు మాట్లాడుతున్నదానికి సంబంధమేమైనా ఉందా?"

'నాకు చెవుడు అంటే అలాగే మాట్టాడతాను'

నేను అడ్డంగా వాదించడం మొదలు పెట్టానంటే నా ముందు ఎవరూ నిలవలేరు.

“ఉన్న మాటంటే ఉలుకెందుకో.... మిమ్మల్ని భగవంతుడు కూడా మార్చలేడు అని నమస్కారం పెట్టింది కాని, దేవుడు కూడా చెయ్యలేని పని దేవాంతకురాలు చేసింది. చివరకు నేను స్టాక్‌ మార్కెట్‌లో దిగక తప్పలేదు.

ఓ డజను కంపెనీల అప్లికేషను ఫారాలు తీసుకొచ్చి పూర్తి చేసి పంపించాను. నాలుగు నెలల తర్వాత ఎనిమిది తిరిగొచ్చాయి. రెండు తిరిగి రాలేదు. అవేమ య్యాయో ఇంతవరకు అజాపజా లేదు. రెండు పేర్టు తగిలాయి. కానీ, అమ్మ బోయేటప్పటికి పది రూపాయల పేర్లు, ఏడుకి ఎనిమిదికీ దిగిపోయాయి.

'అయ్యో- అడుగులోనే హంసపాదు' అంది మా ఆవిడ.

“ఏం పాదు?

హంసపాదు కాదు! ఐరన్‌ లెగ్‌ నాన్నది అడుగు పెడితే నాశనం” అన్నాడు ఏడోక్టాసు చదువుతున్న సుపుత్రుడు. వాడికి ఈ మధ్య సినిమా పరిజ్ఞానం ఎక్కువైంది.

“నువ్వు నోరు ముయ్యరా వెధవా" అన్నాను వాడి నెత్తిమీద ఒకటందుకుని

నష్టం రావడంతో ఇంక ఆ గోల వదిలేస్తుందేమో ననుకుంటే, 'మీకు

52 అక్ష్మ్‌ కటాక్షం తెలియకపోతే తెలిసిన వాళ్ళివర్ష్నేనా అడగండి కాని, ఇలా అయినదానికి కాని దానికి అప్టికేషన్టు పంపి డు తగలెయ్యొద్దు' అని మళ్ళీ సతాయింపు మొదలు పెట్టింది.

స్టాక్‌ మార్కెట్‌తో కొద్దిగా పరిచయం ఉన్న స్నేహితుడిని సలహా అడీగాను. అతను “ఫ్రైమతీ మార్కెట్‌లో ఏం సంపాదిస్తావు? సెకండరీ మార్కెట్లోకి దిగు" అని సలహా ఇచ్చాడు.

లంటి. అన్నాను నేను డైరీ తీస్తూ.

ఇది వరకు బృహస్పతో, కాళిదాసో, ఎవరో గుర్తు రావటం లేదు - ఓ సుభాషితం చెప్పారు. ధీరులైన వాళ్ళు అసలు ఏపనీ చెయ్యరట. ఒక వేళ మొదలు పెట్టారా దాని అంతుచూసే దాకా వదలరట. ఆ కోవకు చేందిన వాణ్ణి నేను. స్టాక్‌ మార్కెట్‌లో దిగాక ఓ డైరీ పెట్టుకుని, అందులో దానికి సంబంధించిన వివరాలన్నీ రాయడం మొదలు పెట్టాను. రెప్పాద్దున ఎవరైనా నరసింహం గొప్పవాడు ఎలా అయ్యాడు అని నా జీవిత చరిత్ర రాయాలనుకుంటే వాళ్ళకి ఆధారాలుంచి వెళ్ళాలి కదా!

“ఫైమరీ మార్కెట్‌ అంటే కొత్త ఇస్యూలకి అప్లికేషన్సు పంపించడం, సెకండరీ మార్కెట్‌ అంటే ్రీకరు దగ్గర్నుంచి షరీలు కొనడం * అని వివరించాడు నా మిత్రుడు.

“ఏవైనా మంచిపేర్టుంటే చెప్పు”

అతను ఓ అరడజను షేర్డు చెప్పాడు. ఓ నలభైవేలు పెట్టి అవి కొన్నాను. ఆర్నాల్ల తర్వాత మూడు పైకి లేచాయి. మూడు కిందకి పోయాయి. లాభం లేదు, నష్టం లేద్తు. నరసంహం గాడి గొంగళి ఎక్కడ వేసింది అక్కడే ఉంది.

“అంతా వేలకి వేలు సంపాదిస్తున్నారు. మన ఖర్మ' అంది మా ఆవిడ,

“ఐరన్‌ లెగ్‌ అన్నాడు సుపుత్రుడు.

అంతా ఎలా సంవాదిస్తారో నాకు అప్పుడే కాదు, ఇప్పుడూ అర్దం కాదు. ఒకడు పోగొట్టుకుంటేనే కదా మరోడి జేబులోకి పోయేది.

ఏవిటి గురూ ఇలా ఉంది' అన్నాను నా స హితుడితో

నా పరిస్థితీ అలాగే ఉంది. నాకు దీంట్లో లోతు పాతులు అంతగా తెలియవు బంగా(ర్రాజుని అడగకూడదా”

ఏ బంగా(ర్రాజు?"

ఏ బంగాగ్రాజేవిటి? కాలేజీ రోజుల్లో మీ ఇద్దరూ రూమే శట్టు కూడా అనుకుంటా”

"నేను స్వీటు తిన్నప్పుడల్లా 'బూర్జువా' అని తిడుతుండేవాడు. ఆ బంగా(ర్రాజా?"

'వాడే. ఇప్పుడు రెండు చేతులా సంపాదించేస్తున్నాడు. వాణి సలహా అడుగు"

బంగార్రాజు దగ్గరకి వెళ్ళడానికి మొదట కొంచెం సందేహించాను. దానికి కారణం ఉంది. బంగా(ర్రాజుకి తనకి ఫస్టుక్సాసు రాకపోవడానికి కారణం నేనే అని అపోహ ఒకటి అప్పట్నుంచీ వుంది. "ఈ పీనటీ (బ్రెయిన్‌ గాడు" - బరాణీ గింజసైజు

మెదడుట నాది- ..... కాకుండా ఇంకెవరైనా రూమ్మేటు ఉంటే ఐ ఏ యస్‌ కూడా పాసయేయవాణ్ణి' అని నా ఎదురుగా అందరికీ చెప్పి వాపోతుండేవాడు. కానీ, నిజం

తోలేటి జగన్మోహనరావు కె అది కాదని నా ఉద్దేశం. బంగా(ర్రాజుకి అపరాధ పరిశోధక నవలలంటే పిచ్చి. పావలా లైబ్రరీలకి వేలు తగలేసి ఇరవై నాలుగ్గంటలూ అవే తెగచదువుతుండేవాడు. అవి ఎక్కువ చదివితే ట్రెయిన్‌ ఎఫెక్టు ఇస్తుందని నా ఉద్దేశం. ఆ మాటంటే 'నీ తలకాయ

  • అవి చదువుతే బుర్ర పదునెక్కుతుంది. నువ్వు కూడా చదువు" అని నాకు ఎదురు సలహా ఇచ్చాడు.

మొదట్లో కొంచెం తటపటాయించినా, బృహస్పతిగారు చెప్పిన పట్టువదలని విక్రమార్కుణ్హే గదా, ఒక రోజు శుభ ముహూర్తం చూసి బంగార్రాజింటికి వెళ్ళాను. పూల తోట మధ్య చిన్న డాబా చాలా అందంగా ఉంది. నేను కాలింగ్‌ బెల్టు మోగించగానే బంగార్రాజే తలుపు తీశాడు.

కాలేజీ రోజుల్లో బంగార్రాజు సన్నగా, రివటలా ఉండేవాడు. ముతక ఖాదీ "పైజామా, లాల్ఫీ, భుజానికి వేలాడే సంచి, పిల్లి గడ్డం, అచ్చు సినిమాల్లో విష్ణవకారుడి గెటప్‌లో ముడు ఇప్పుడు బంగార్రాజు బాగా ఒళ్ళు చేసి, చింత పండెట్టి తోవిన ఇత్తడి గుండిగలా నిగనిగలాడుతున్నాడు. మెళ్ళో బంగారు గొలుసు. పైజామా, లాల్చీ తెల్లవే కాని ఖరీదైనవి.

'నువ్వా?' అన్నాడు నన్ను చూసి ఉలిక్కిపడి.

'నేనే' అన్నాను లోపలికి అడుగు పెట్టి, 'బావున్నావా?

'నీ ఐరన్‌లెగ్‌ పడని ఇన్నేళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాను" అన్నాడు బంగార్రాజు, నన్ను చూడడం తనకి ఆనందం కలిగించే విషయం కాదని స్పష్టం చేస్తూ. అంత మాథ్రానికి వెనక్కి నడిచే బాపతు కాదు నేను. ఆ విషయం బంగార్రాజుకీ తెల్పు.

ఏవిటి, చాలా సంపాదించేసినట్టున్నావు,' అన్నాను బంగార్రాజు బొజ్జ రెండు చేతులతోనూ కొలుస్తూ,

“వచ్చిన పనేవిటో చెప్పు" అన్నాడు చేతులు విదిలించుకుని.

ఏడో స్నేహితుడివి కదా. చాలా కాలమైంది నిన్ను చూసి” అన్నాను సోఫాలో కూర్చుంటూ.

“ఇన్నేళ్ళ తర్వాత వచ్చావంటే ఏదో విశేషం ఉండకపోదు. వెధవ ఫార్మాలిటీస్‌ అక్కర్లేదు. తొందరగా ఏడు. అవతల బిజీగా ఉన్నాను.”

“ఏం లేదు, స్టాక్‌ మార్కెట్‌ గురించి నీ సలా తీసుకుందామని"

'స్టాక్‌ మార్కెట్టా? నువ్వా?" అన్నాడు బంగా(ర్రాజు, ఉత్తరకుమారుడు యుద్దానికి వెడతానంటే బృహన్నల ఆశ్చర్యపోయినట్టు ఆళ్ళర్యపోతూ.

నేనే, ఏం?”

“ని ఐక్యూ ఎంతో నాకు తెల్సు. షేర్‌ మార్కెట్‌ అంటే సినిమా టిక్కెట్టు బ్ఞాకులో కొని, సీల్కుస్మిత తెరమీదకు రాగానే ఈలలు వెయ్యడం కాదు”

“ నేనెప్పుడు బ్బాకులో ట్‌్కెట్టు కొని సినిమా హాల్గో ఈల లేశాను?"

“నువ్వు ఎప్పుడు ఈలలేశావో నీ ఈలలకి చెన్సడా్మి ఈయన్టీ స్పెషలిస్టులకి వందలు వదిలించుకున్న వాళ్ళు చెబుతారు కాని బోనుల్లోకి ఎలక దూరినట్టు స్టాక్‌ మార్కెట్‌లోకి దిగకు, శ్‌ కట్టయిపోతుంది జా(గ్రత్త. స్టాక్‌ మార్కెట్‌ లో దిగేవాడు

ర్‌తీ లక్ష్మీ కటూక్షం ఎలా ఉండాలో తెల్ఫా' అంటూ మొదలు పెట్టాడు బంగా(ర్రాజు.

ఇదివరకు ఎప్పుడో ఇంగ్లండుకి, 'ప్రొన్సుకి పెద్ద యుద్దం జరిగిందట. ఆ

యుద్దం ఇంగ్లండుకి జీవన్మరణ సమస్యట. అప్పుడో పెద్ద మనిషి ఆ యుద్దం చేసే జనరల్‌ గారికీ పదో, పన్హెండో పాపురాలిచ్చాడట, యుద్ధ వార్తలు పంపిరిచమని. యుద్దంలో చివరకు ఇంగ్లండ్‌ నెగ్గిందట. ఆ వార్త పావురాల టపా ద్యారా అందరి కంటే ముందు మన గురువు గౌరికి అందింది. వెంటనే ఆయన ఏడిపు మొహం పెట్టుకుని స్టాక్‌ మార్కెట్‌కి వెళ్ళి ఆయన దగ్గరున్న పేర్లన్నీ అమ్మేశాడు. ఆయన అమ్మడం చూసి యుద్దంలో ఇంగ్లండు ఓడిపోయిందనుకుని గొల్లుమని అందరూ అమ్మేయడం మొదలు పెట్టారు. అలా మార్కెట్‌ కూలగొట్టేసి ఈ పెద్ద మనిషి మ అన్ని షేర్లు కారు చౌకలో కొనేశాడుట. యుద్దంలో ఇంగ్రండ్‌ నెగ్గిన వార్త షమ్మీ తెలిసేటప్పటికి ఈయనగారు బిలియన్లకి పడగలెత్తేశాడుట.

ఆయన గారు ఇప్పుడు మనకి రోల్‌ మాడల్‌ అన్నమాట.

'స్టాక్‌ మార్కెట్‌ ల దిగేవాడు అలా స్మా్ట్‌గా ఉండాలి” అన్నాడు బంగార్రాజు.

ఆ కధ వింటుంటే మాత్రం నా మనసు చివుక్కుమంది. యుద్దం వచ్చి దేశం

శ్మశానంగా మారుతుంటే అందులో ధనరాసులు పండించడం ఎలాగా అని ఈ పెద మనిషి ఆలోచించడం చాలా దుర్మార్గం అనిపించింది. న్‌

“త్యాగాలు చెయ్యడానికి మనీటేశయూ, లాభాలు తియ్యడానికి నా దేశమూన్తా

చాలా అన్యాయం గురూ.”

వెధవ సెంటిమెంట్లు పెట్టుకోకు. అన్యాయం లేదు, గిన్యాయం లేదు. అసలు

ఇంగ్రీషులో ఓ మాటుంది. వీధుల్లో రక్తం (ప్రవహిస్తుంటే స్టాక్‌ మార్కెట్‌లో దిగ్వ్స నీకు నీతి సూత్రాలు కావాలంటే సుమతి శతకం, భాస్కర శతకం చదువుకో డబు+ కావాలంటే స్టాక్‌ మార్కెట్‌లో దిగు. నీకు సూక్తి ముక్తావళి కావాలా? డబ్బు కావాలానీ

“డబ్బు... డబ్బు... డబ్బు..." అన్నాను హుషారుగా. డబ్బుమాట 'వినబడగానే నా కళ్ళకు కట్టిన మాయ పొరలు తొలగిపోయాయి - “నువ్వు బాగా స్టడీ చేసి ఓ షేరు చెప్పు. ఉన్నదంతా దాని మీద కాసేస్తా."

“అదిగో - నీ పీనట్‌ (బైయిన్‌ ఎలా పనిచేస్తోందో చూశావా. స్టాక్‌ మార్కెట్‌ అంటే లాటరీ అనుకున్నావేమిటి? తోక తెగిపోగలదు. కోడి గుడ్డన్నీ ఎప్హుడూ బ్‌ బుటలో పెట్టకూడదు. పది బుట్టల్టో సర్దాలి. ఒక చోట నష్టపోయినా ఒక చోట లాభం వస్తుంది" ఆని బుట్టల న్యాయం చెప్పాడు బంగా(ర్రాజూ.

“ఆలా అయితే మజా ఏం ఉంది? మనకి లాభం ఉండదు, నష్టం ఉండదు. థ్రిల్‌ ఉండదు. పెద్దనగారు చెప్పినట్టు సింహం పిల్ల ఆకలేసినా....'

'మళ్ళీ మొదలెట్టావూ.... పెద్దనగారు కాదు, తెలియకపోతే తెలియనటు పడుండకూడదూ” అన్నాడు బంగా(ర్రాజు తల కొట్టుకుంటూ. ల

“పెద్దనగారు కాకపోతే పోతన గారు, లేకపోతే మరొకరు. పాయింటేమిటంటే, సింహం పిల్ల ఆకలేసినా గడ్డి తినదు, మదించిన ఏనుగు కుంభస్టలాన్ని బద్దలు కొడుతుంది కాని. నా పేరే సింహం, నేను గడ్డి తినను, మంచి షేరొకటి చెప్పు. పొని

తోలేటి జగన్నోహనరావు వ్‌5్‌ కుంభస్టలం పగలగొట్టేస్తా విజయమో, వీరస్వర్గమో. ఏం జరుగుతుందో సరదాగా చూద్దాం.

'ఏట్టోకి దూకి ఏం జరుగుతుందో చూడాలని సరదాగా ఉంటే దూకు కాని చూడ్డా నికి మాత్రం నువ్వుండవు. నువ్వెళ్ళే దారిలో విజయం లేదు. వీర స్వర్గమే,” అన్నాడు బంగా(ర్రాజు హెచ్చరిస్తూ.

నున్యేం భయపడకు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సింహానికి గడ్డాద్దు. కుంభస్టలవే కావాలి" అన్నాను బంగార్రాజుతో ఫైనల్‌గా.

న్స కర్మ' అని ఆ తర్వాత బంగా(ర్రాజు స్టాక్‌ మార్కెట్‌ ఏబిసిడిలు ఓ రెండు గంటలు వివరించాడు.

“అలా గేదెలా తలూపుతున్నాన్త గాని ఏవైనా బుర్రకెక్కిందా' అన్నాడు రెండు గంటల తర్వాత రెండు గ్లాసులు బళ్ళు తాగి.

'బ్రహ్మాండంగా అర్దమైంది. సెన్సెక్స్‌ పడిపోతున్నప్పుడు కొనడం మొదలుపెట్టాలి. లేస్తున్నప్పుడు అమ్మడం మొదలుపెట్టాలి. చాలా సింపుల్‌ అయిదువేల దాకా అంకెలు లెక్కెట్టగలిగే వాడెవడైనా చెయ్యొచ్చు బిజినెస్‌, నా దాకా ఎందుకు, మా కుర్రాడి చేత చేయిస్తాను. సెన్సెక్స్‌ అయిదు వేలు దాటితే నేను రంగంలోకి దిగుతాను. నువ్వేం వర్రీ అవకు.”

'వగ్రీ అవుతున్నది నీ గురించి కాదు, నా గురించి. నీ మాటలు వింటుంటే నా తల పగిలిపోతోంది. ఇంక వెళ్ళు అన్నాడు బంగా(ర్రాజు పేపరు వెయిట్‌తో తలమీద కొట్టుకుని.

ఓకే బాస్‌ అన్నాను లేస్తూ - ' నీ ఫోను కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తా, గురూ బంగా(ర్రాజూ! ఓ చిన్న సందేహం. ఫోనుకోసం వెయ్యి కళ్ళతో అనాలా? వెయ్యి చెవులతో అనాలా ? యమ్మే తెలుగు చదివావుకదా అని అడుగుతున్నాను...”

'నా బుద్ది తక్కువై యమ్మే చదివాను. నా బుద్ధి గడ్డితిని న్వాక్‌ మార్కెట్‌ లోదిగాను. నీతో మాట్లాడి ఉన్న తెలివి తేటలు కూడా పోయాయి. నాకు పిచ్చెక్కేట్టుంది. ఇంక నన్ను వదిలెయ్యరా బాబూ' అన్నాడు బంగార్రాజు, రెండు చేతులూ జోడించి నమస్కారం పెడుతూ

“ఓకే బాస్‌ 1 నీ ఫోను కోసం వెయ్యి చెవులతో ...టా....టా.... అని సెలవు తీసుకున్నాను బంగార్రాజు దగ్గర్నుంచి.

వారం రోజుల తర్వాత బంగా(ర్రాజు ఫోను చేశాడు. నేను వదిలే రకం కాదని తెల్సు కదా!

'హలో గురూ - బావున్నావా' అన్నాను

"ధవ పరామర్శలక్కర్లేదు. బాగా స్టడీ చేసి షేరు చూశాను. బుక్‌ వేల్యూ,

'వివరాలొద్దు. అవన్నీ నువ్వు చూశావు కదా.”

“ఇంకో మాట, న్దాక్‌ మార్కెట్‌లో రేట్టు రోజూ పైనా కిందా అవుతూనే ఉంటాయి. కొన్న మర్నాటి నుంచీ, అయ్యో బంగా(ర్రాజూ - రేటు పడిపోయింది. ఏం

్‌ద్ర లక్ష్మీ కటాక్షం చెయ్యనూ అంటూ ఫొన్టేసి నసపెట్టకు.....'

“దాన్ని గురించి వర్రీ అవకు"

"ఆఖరి సారి వార్నింగ్‌ ఇస్తున్నాను. స్టాక్‌ మార్కెట్‌ నీలాంటి పీనట్‌ బైయిన్‌ గాళ్ళ కోసం కాదు. నష్టం వస్తే నన్నని లాభం లేదు. నాదగ్గరికి మళ్ళీ రావద్దు. ఫోన్చియ్యొద్దు

'నేను కిల్లింగ్‌ చేసినా చెప్పాద్దా?”

'ఒద్దు' - ఒద్దు అన్న వెంటనే పేపరు వెయిట్‌తో తలమీదకొట్టుకున్నట్టు టప్‌” మని శబ్దం స్పష్టంగా వినిపించింది - "పేపర్లో నల్ల బోర్డరుతో నీ ఫోటో పడ్డమ్పుడు సంగతి అర్ధవై అంతిమ దర్శనానికి నేనే వన్తాను. జా(గ్రత్తగా విను - కంపెనీ 'పేరు గుజరాత్‌...

“గుజరాత్‌ గోల్డ్‌....... ఓకే బాస్‌...... ఇంక నువ్వు ని తగా ఉండు" అని నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే బంగార్రాజు రక్కున ఫో పడు

బంగా[ర్రాజు ఫండమంటల్సు అన్నీ చూసి షేరు చెప్పాడు కాని టెక్నికల్సు చూసి రంగంలోకి దిగాలి కదా! అంచేత ఓపిగ్గా సమయం కోసం ఎదురు చూస్తూ"కూరు న్నాను. ఓర్పు ఉన్నవాడే స్టాక్‌ మార్కెట్‌లో సంపాదిస్తాడని బంగార్రాజు చెప్పాడు. అబీ కాకుండా ఇదివరకు ఓర్పుగల తాబేలు కుందేలుని ఓడించేసిన ఉదాహరణ కూడా ఉంది కదా!

అలా నిశ్చింతగా పడుకున్న నా చెవిలో - క్షమించాలి- వాక్య నిర్మాణం సరిగ్గా ఉన్నట్టు లేదు. 'పడుకున్నది నా చెవి కాదు - నేనే - పడుకున్న నా చెవిలో ఓ ర్రోజ్జీ ఉదయం ఏడు గంటలకి మా సుపుత్రుడు 'నాన్నోయ్‌' అని అరిచాడు కొంపలు మునిగి పోయినట్టు,

వెధవా! స్కూలుకి తయారవలేదా” అన్నాను నేను ఉలిక్కి పడి లేచి.

'నాకు స్కూలు లేదు. మీకు ఆఫీసు"లేదు. నగరంలో కర్ఫ్యూ" అన్నాడు వాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ.

ఎక్కడో ఏదో మతంవారు రోడ్డు మీద ప్రార్ధన చేసుకుంటుంటే మరో మతం వాడు ఆ రోడ్డు మీద పోతూ తుమ్మాడుట. వాళ్ళ (ప్రార్దనకి అంతరాయం కలిగించ డానికే వాడు అలా తుమ్మాడని వాళ్ళు ఆ(గ్రహించారు. మానవ హక్కుల కిందే కాకుండా రాజ్యాంగం (ప్రసాదించిన ప్రాధమిక హక్కుల (ప్రకారం కూడా తనకు తుమ్ము వస్తే తుమ్మ జన్మ సిద్దమైన హక్కుందని వాడు వాదించాడు. మాటా మాటా

పెరిగి వాళ్ళు వాణ్ణి పొడిచేశారు. క్షణంలో దావానలం నగరం నుంచి రాష్ట్రానికి, రాష్టం నుంచి దేశానికి వ్యాపించి, వారం రోజుల్లో ఓ వెయ్యిమంది. పైగా బలైపోయారు. ల స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. సెన్సెక్సు పడుకుంది. వీధులో రకం 'ప్రవహిసింది. అన్ని శుభ సూచనలే. ఇంక మనర స్టాక్‌ మార్కెట్‌లో దిగే 'పైమొచ్చే సింది. ఓ మంచి ముహూర్తం చూస్తి బ్రోకరు దగ్గరకు యలు దేరాను. "= పెళ్ళి మధ్యలో మగ పెళ్ళి వారు లేచిపోతే ఆడపెళ్ళివారిల్లు ఎలా ఉంటుందో

తోలేటి జగన్మోహనరావు 57 ఎప్పుడైనా చూశారా? నేను చాలా సినిమాల్లో చూశాను. అలా దిగులుగా నిద్దరపోతోంది బ్రోకరు ఆఫీసు. అక్కడున్న నలుగురిలోనూ ముగ్గురు కునికిపొట్టు పడుతున్నారు. కంప్యూటరు ముందు కూర్చున్న నాలుగోవాడితో ఎవరో కష్టమరు కాబోలు మెల్లిగా మాట్టాడుతున్నాడు. నిద్రపోతున్న వాళ్ళలో ఒకణ్ణి లేపి నేను వచ్చిన పని తెలియ చేశాను.

'ఏ కంపెనీ అన్నాడు అతను అవులిస్తూ,

“గుజరాత్‌ గోల్డ్‌

“పీరు ఎప విన్లేదే' అని తల గోక్కొని, కంప్యూటరు దగ్గర కూర్చున్న కుర్రాడి కేసి పంత గోల్డ్‌ అసలు లుకు చూడు" అన్నాక అతను అలా అంటుంటే అక్కడున్న కష్టమరు చెవులు ఎలర్జు అయి నిక్కబొడు చుకుని గాడిద చెవుల్లా రెండు మూడు సార్హు పైకి కిందకి ఊగడం నేను

యా పళ వ గమనించాను.

కంప్యూటరు దగ్గరున్హు కుర్రాడు కీలు నొక్కి “గుజరాత్‌ గోల్డ్‌ - బాంబేలో ఎనిమిది నెలల క్రితం ఓ రోజు ఇరవై తొమ్మిదికి ట్రేడయింది' అన్నాడు. ఆ పాటికి గాడిద చెవుల తాలూకు మెదడుకు విషయం బోధపడి ఆదేశాలు పంపించినట్టుంది. హఠాత్తుగా ఆతను గిర్రున వెనక్కి తిరిగి లేచి, 'ఏమిటి? గుజరాత్‌ గోల్డ్‌ మీకు కావాలా" అంటూ పెద్దగా అరిచి నా మీదకు దూకి నన్ను కింద పడేసినంత పనిచేశాడు.

గొప్ప గొ వాళ్ళలా నా బుర్ర ఒకే ట్రాక్‌లో ఆలోచించడానికి అలవాటు పడింది. అనుకోనిదేదైనా తటస్టపడితే అదేవిటో అర్హమయ్యేదాకా నా బు(ర్ర కొంచెం సేపు పని చెయ్యడం మానేస్తుంది. మెడకాయ మీద ఆలోచించే తలకాయ ఉన్న వాళ్ళివరికైనా ఇలా జరుగుతుందని నా ఉద్దేశం కాని, మా ఆవిడ మాత్రం 'ఏవిటలా వెర్రిమిహం వేస్తారు" అని దాన్ని వెర్రిమొహంగా వర్షిస్తుంది.

ఆ పెద్ద మనిషి నా మీద అలా దూకేటప్పటిక్‌ నా బుర్ర రెండు నిమిషాలు పని చెయ్యడం మానేసింది. అంటే నేను ఉలుకూ పలుకూ లేకుండా మా ఆవిడ చెప్పినట్లు వెర్రిముహం వేసుకు చూస్తూ ఉండిపోయానన్న మాట. రెండు నిమిషాల తర్వాత స్టహ వ్య్చేటస్సృటికి ఆతను అంటున్నాడు - *ఓ అయిదొందలు - ఏదో రేటుకి

సుకోండి. పోనీ ఇరవై అయిదివ్యండి.

ఇరవై అయిదివ్వమంటాడేమిటి అని మళ్ళీ బుర్ర రెండు నిమిషాలు పని చెయ్యడం ఆగిపోయింది. ఆ రెండు నిమిషాలలోనూ రేటు పదిహేడుకు పడిపోయింది.

'డీలో అన్నాను నేను తేరుకుని.

'డీలో అన్నాడు అతను.

'డీల్‌ అన్నాడు (బ్రోకరు ఇద్దరి మధ్యా తలదూర్చి - కమీషన్‌ కోసం ఇద్దరివేపు చెరో చెయ్యి చాపుతూ .

(బ్రోకరు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను నా చేతులు కలిపి

58 లక్ష్మీ కటాక్షం 'మనం సపేర్టు తెల్పుకోకుండానే బిజినెస్‌ చేసేశాం. నా పేరు యస్సెన్‌ బుట్టా - బుట్టా సత్య న్నారాయణ'” అన్నాడు. “నాపేరు నరసింహం' 'సెంహం గారూ! (బ్రోకరు గాడు మనిద్దరి దగ్గరా కమిషను కొట్టేస్తాడని ఇందాకా చెప్పలేదు. ఇంకో వెయ్యి షేర్సు ఏదో ఒక శెటుకు తీసుకుంటారా" చివరకు ఓఅయిదొందలు పదమూడుకి, ఓ అయిదొందలు పదకొండుకి కుదిరింది. డీల్‌ అయిపోయిన తర్వాత బుట్టాగారు నాదగ్గర చెక్కు తీసుకుని ముద్దు పెట్టుకుని, జేబులోకి తోసి, ఆప్యాయంగా భుజాల మీద చేతులేసి, "కాఫీ తాగొదాం రండి" అంటూ కాఫీ హోటలుకి తీసుకెళ్ళి స్వీటూ, హాటూ తెప్పించాడు. నన్ను వారించి తనే బిల్లు చెల్లించాడు. మీరాకిళ్ళీలు కట్టించి, రెండు సిగరెట్లు కొని, నా కొకటి ఇచ్చి, తను స్వయంగా అగ్గిపుల్ల గీసి వెలిగించి, తనొకటి అంటించి, ఓ సారి గుండెల నిండా పల్చి హగ్మమెలిగా వదులుతూ అన్నాడు - 'మీకు స్టాక్‌ మార్కెట్‌ కొత్తనుకుంటాను” కాత “తెలుస్తూనే ఉంది. ఈ పేరు నెత్తిమీద రూపాయి పెట్టి పానలాకి కొనమంటే ఎవడూ కొనడు. అయిదొందలడిగితే ఓ వంద ఇస్తాడనుకుని మూడు అప్పిక్షన్సు తగలేస్తే పదిహేనొందలు మెడకి తగులుకున్నాయి. రెండేళ్ళ నుంచి ఏ సన్నాస్‌ దొరుకుతాడా అని... సారీ.....ఎలా వదుల్నుకోవాలా అని చూస్తుంటే ఇన్నాళ్ళకు మిక్సు దొరికారు. మిమ్మల్ని నిలువునా ముంచెశాను. లేకపోతే నేను తేలేదెలా? స్హాక్షా మార్కెట్‌ అంటే అంతే... * -తన పొట్టలోకి పోయిన మేకపిల్లను తల్చుకుని తోడ్తర్చి ఫిలసాఫికల్‌గా బాధపడినట్టు బాధపడుతూ అన్నాడు బుట్టా - “అసలు ట్ర విలువెంతో తెల్సా?” “తెలియదు, చెప్పండి" అన్నాను అయోమయంగా . బుట్టా ఏదో చెప్పబోయి ఆగి * ఓ పని చెయ్యండి. నేను మీకు సర్టిఫికెట్లిపాన్సు మా వీధి చివర పాత కాగితాల కొట్టుంది. అక్కడ తూకం వేయించండి. వాడు సం గా చెబుతాడు అన్నాడు. నా గుండె గుభీలుమంది. నా వెర్రి మొహం చూసి అతనే మళీ అన్నాడు - 'కంగారు పడక్షండి. ఇంతవరకు మీకు డార్మర్‌ సైడ్‌ ఆఫ్‌ది సిక్సర్‌ చూపించాను. రెండో వైపు, బైటర్‌ సైడేమిటంటే, 'లోతు తెలీనిచోట దిగకూడదు.' అనే అక్షరలక్షలు చేసే పారాన్ని చాలా చౌకలో, ఇరవై వేలకి నా దగ్గర నేర్చుకున్నారు. కం(గ్రాచ్యులేషన్స్‌ 1 అప్పుడే గురూగారు స్టాక్‌ మార్కెట్‌లో కిల్లింగ్‌ చేసేశారు. ఇరవై వేలకి పన్నెండు లక్షలు. లక్కీ "ఫెలో మీరు' - పిల్లికి చెలగాటం, కుక్కకి (ప్రాణసంకటం అని ఏదో అంటారే, అలా ఉంది నా పరిస్థితి - 'స్టాక్‌ మార్కెట్‌లో పూల్స్‌ షేర్గు కొని అమ్మడానికి బిగ్గర్‌ పూల్స్‌ కోసం ఎదురుచూస్తారుట. నాకు మీరు దొరి కారు. మీకు ట్చ అన్నగారెవరేసొ దొరుకుతారేమో చూడండి” నేను నిజంగా తెలివితక్కువ పని చెయ్యలేదు కదా అని రవ్వంత అనుమానం

తోలేటి జగన్నోహనరావు 59 వచ్చింది. నేనేదైనా తెలివితక్కువ పని చేసినప్పుడు మా అత్తారింట్లో అందరూ నవ్వు తుంటే, మా ఆవిడ నా డిఫెన్సుగా 'నవ్విన నాపచేను పండుతుంది' అంటుంది. ఆ సామెత గుర్తుకొచ్చి, చిరునవ్వు పెదాల మీదకు తెచ్చుకుని, గంభీరంగా 'నవ్విన నాపచేను పండుతుంది" అన్నాను. 'నాప చేను ఎందుకు నవ్వుతుంది? నవ్వాక ఎందుకు పండుతుంది?” అన్నాడు బుట్టా ఆశ్చర్యంగా. ఆసలు ఆ సామెతకి అర్హమేమిటో నాకూ తెలియదు. అంచేత “దానికి అర్ధం కాలమే చెబుతుంది," అన్నాను ఇంకొంచెం గంభీరంగా . అలా అన్నానే కానీ, కురుక్షేత్రంలో అర్జునుడి మనసు వికలమైనట్టు నా మనసు ఓ క్షణం వికలమైంది. కానీ, వెంటనే బంగార్రాజు స్టాకోపదేశం గుర్తుకొచ్చి నా (భ్రమలన్నీ తొలిగిపోయి రెట్టించిన ఉత్సాహంతో స్టాక్‌ మారె్టట్‌ మీద పడ్డాను. మళ్ళీ ఇంకో వెయ్యి గుజరాత్‌ గోల్డ్‌ షేర్లకి ఆర్హరిచ్చినప్పుడు (బ్రోకరు ఆఫీసులో అంతా చెవులు కొరుక్కుని నవ్ధకొద్ధం నేను గమనించకపోలేదు. గుజరాత్‌ గోల్డ్‌ కొటేషను పేపర్టో వచ్చిందో లేదో దేశం నలుమూలలనుంచీ ఆ పేర్టు నా దగ్గరకొచ్చి పడసాగాయి. మన బిజినెస్‌ కాకలు తీరిన బ్రోకరుకి కూడా మిస్టరీగా మిగిలిపోయింది -'ఏవిటి సార్‌? మార్కెట్లో షేరు కన్పించనియ్యడం లేదు. కొంపతీసి కంపెనీ టేకోవర్‌ చేస్తున్నా రేవిటి?' అన్నాడు బు(ర్రగోక్కుంటూ . ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదుకాని, ముందు ముందు ఆకలేస్తే తినేసినా తినే స్తాను' అన్నాను బ్రోకరుతో మిస్టీరియస్‌గా. ఇదివరకులా నవ్వుకోకుండా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఎవరి బు(ర్రలు వాళ్ళు గోక్కోవడం మొదలు పెట్టారు బ్రోకరు ఆఫీసులో, ఆఖరి వెయ్యి షేర్చు అయిదుకి కొన్నాను. అవ్పటికి నా బ్యాంకు బేలన్సు అయి పోయింది. మనం కొనడం మానేశాక దాని ధర మూడు రూపాయలకి దిగి అక్కడే బబ్బుంది. “అయ్యో... అయ్యో... పెట్టుబడంతా ఎగిరి పోయింది" అంది మా ఆవిడ కంగా రుగా, 'బంగా(ర్రాజేవన్నాడు?' - డైరీ తీసి చూపిస్తూ అన్నాను - "పేర్డు రోజూ ఉయ్యాల లూగుతాయి. వాటి గురించి కంగారు పడకూడదు.” “ఉయ్యాలలూగడమేమిటి నా తలకాయ- ఉయ్యాలతాడు తెగి కిందపడి ఛస్తే ఇంకేం లేస్తుంది? పదిహేడెక్కడ, మూడెక్కడ? * అంది మా ఆవిడ తలపట్టుకుని. “నువ్వేం కంగారుపడకు, కొంతకాలం ఆగి చూడు, ఎలా లేస్తుందో" అని మా ఆవిడకి ధైర్యం చెప్పి, సూట్‌ కేసు నిండా సర్టిఫికెట్లు నింపి అటకెక్కించేశాను. “ఈ వధవెక్కడ' అన్నాను సుపుత్రుణ్ణి ఉద్దేశించి. భావి భారత పౌరుడికి స్తాక్‌ మార్కెట్‌లో శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఒకట్టుందిగా. య ఇక్కడే ఉన్నాను” అన్నాడు సుపుత్రుడు మంచం మీంచ్చి

60 లక్ష్మీ కటాక్షం

“ఇలా ర్హా ఈ (గ్రాఫ్‌ చూశావా? దీన్ని సెన్సెక్స్‌ అంటారు. ప్రస్తుతం నువ్వు మంచం మీద బబ్బున్నట్టు కాళ్ళు పారచాపి పడుకుంది' అన్నాను పేపర్గో చూపించి వివరిస్తూ - 'నీకు స్కూళ్ళో యోగా చెబుతున్నారా?”

“చెబుతున్నారు”

“గుడ్‌! ప్రస్తుతం శవాసనం వేసింది సెన్సెక్స్‌. శవాసనం తర్వాత కొంచెం తలెత్తి భుజంగాసనం వేస్తుంది. ఆ తర్వాత లేచి కూర్చుని వజ్రాసనం వేస్తుంది. అప్పుడు మనం అమ్మటం మొదలు పెట్టాలి. అది లేచి నిలబడి చేతులెత్తి తాళాసనం వేసేలోగా మనం అమ్మేయాలి. లేకపోతే మళ్ళీ శీర్షాసనం వేసే ప్రమాదం ఉంది. అర్దమైందా?” - ఎంత కాంసెక్సు విషయాన్నయినా సింపుల్‌గా చెప్పడం నా ప్రజ్ఞ,

“బ్రహ్మాండంగా అర్ధమైంది. నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నాడు సుపుత్రుడు. వాడిది నా పోలికే. ఒకసారి చెబితే అందుకు పోతాడు.

“మరింక నన్ను డిస్టర్బ్‌ చెయ్యకండి'

నాలుగు నెలలు గడిచాయి.

'నాన్నోయ్‌ - భుజంగాసనం" అన్నాడు సుపుత్రుడు, ఓ రోజు ఉదయం పేపరు చూసి.

నిజమే - సెన్సెక్సు లో కదలిక ప్రారంభమైంది.

నాడైర్‌ తిరగే. కట్టెపేళ్ళు చిగురిస్తున్నప్పుడు షేర్డు అమ్మడం మొదలు పెట్ట మన్నాడు బంగార్రాజు. దేశం పరిస్టితి ఎలా ఉందో తెలుసుకోడానికి పేపరంత్రా తిరగే శాను.

కాశ్మీర్‌ సమస్య త్వరలోనే పరిష్కారం కాగలదని ప్రధానమంత్రి ఆశా వ్యక్త పరిచేరు. వట బండిని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చేశామని ఇంక రి స్పీడు తగ్గే సమస్య లేదని ఆర్థిక మంత్రి ఉద్దాటించారు. అవసరమైతే బ్రేకులు శీసియ్యడనికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. పాకిస్తాన్‌మిద ఇండియా క్రికెటో నెగ్గింది. ఏదో సినిమా సిల్వర్‌ జూబిలీ ఆడింది. అమెరికా అప్పు ఇస్తానంది. జర ప్‌ అప్పు తీర్చక్కర్లేదంది. అరడజను మంత్రులు తూర్పుకు, అరడజను మంత్రుకీ పశ్చిమానికి ఎగిరి పోయారు, జోలె పుచ్చుకుని. మొత్తం మీద దేశం పరిస్షితి మహ భిక్తంగా ఉంది. కొత్త అప్పులు పుడుతున్నాయి. కౌత్త ఆశలు చిగురిస్తున్నాయి. దేశంలో అప్పుల వర్షాలు కురుస్తుంటే స్టాక్‌ మార్కెట్‌ లో ఆశల పంటలు పండక వుతుంది?

సెన్సెక్స్‌ వజ్రాసనం వేసింది రెండువారాల్లో. కానీ, మన షేరులో కదలిక లేదు. మరో రెండు వారాలు గడిచాయి. ఓ రోజు సుపుత్రుడు 'నాన్నోయ్‌! మన షేరు కదిలింది" అన్నాడు పేపరు చూసి.

'ఎంత? అంది మా ఆవిడ,

“బాంబేలో ముఫ్పయ్బి నలభై ఉంది.”

'ముప్పయ్యేమిటిర్హా నీ తలకాయ. మూడయి ఉంటుంది. పక్కన సున్నా పొర

పాటునపడి ఉంటుంది" అన్నాను నేను.

తోలేటీ జగన్మోహనరావు 61

ఆ రోజల్లా ఆ అంకె మూడు - నాలుగా, ముప్పయి =నలభైయా అని తల బద్దలు కొట్టుకున్నాను. అంకెలు సరిగా ప్రింటు చెయ్యని పేపరు వాడి మీద చాలా కోపం వచ్చింది.

మర్నాటి పేపర్గో కూడా ఆ అంకె అలాగే వచ్చింది.

ఈ మిస్టరీ ఏవిట్రా అని నిద్ర పట్టక రాత్రంతా అటూ ఇటూ దొర్లి, తెల్ల వారకట్ట కళ్ళు ముయర్థస తుంటే మా ఆవిడ, 'ఏవండోయ్‌! బాంబేలో మన పేరు 63,81 కి పెరిగింది ఢిల్లిలో కూడా 69,85 ఉంది,” అని సైరింజన్లా గణగణ మంటూ చెప్పింది.

'ఏదీ, పేపరియ్యి' అన్నాను మంచం మీంచి దూకి,

ఈ సారి సంటేహానీక్‌ తావులేకుండా ఉంది. కానీ ఎందుకు పెరిగిందా అని మళ్ళా తల బద్దలు కొట్టుకోబోతుంటే వ్యాపార వార్తల పేజీలో నాలుగు కాలాల హెడ్డింగుతో. వార్త కంట పడింది. గుజరాత్‌ గోల్డ్‌ కంపెనీలో స్విండ్లర్స్‌ అమెరికా (ఫార్బ్యూన్‌ -500 కంపెనీ) మెజారిటీ వాటాలు తీసుకోబోతోందట. సంప్రదింపులు చివరి దశలో ఉన్నా యట. ఆ తర్వాత గుజరాత్‌ గోల్డ్‌ షేర్డు మేలిమి బంగారవేనట. అంచేత షేర్‌ ధర చుక్క ల్లోకి వెళ్ళి పోతోంది.

'నిచ్చెన తీసుకురా"

"ఎందుకు? ”

'అటకమీంచి సూట్‌ కేసు దింపాలి. సాయం పట్టు.

'అప్పుడే అమ్మడం దేనికి? ఇంకా ఎంత పెరుగుతోందో చూద్దాం' అంది మా ఆవిడ.

'బంగార్రాజేం చెప్పాడు? రేటు పెరుగుతుండగానే షేర్డు అమ్మడం మొదలు పెట్టమన్నాడు. ఇప్పుడో అయిదొందలు అమ్మేద్దాం. రేపేం జరుగుతుందో ఎవడికి తెల్సు? పంజాబులో బాంబులు పేలొచ్చు. బాంబేలో బ్రోకర్లు సమ్మె చెయ్యొచ్చు. వానలు పడకపోవచ్చు. వరదలు రావచ్చు. అంచేత బూముండగానే స్టాకు చక్కబెట్టాలన్నాడు బంగా(ర్రాజు' అన్నాను గురూపదేశం గుర్తుకు తెచ్చుకుంటూ.

మర్నాడు బ్రోకరు అఫీసుకి వెళ్ళి ఓ అయిదొందలు అమ్మేసి బయటకు వస్తుంటే, నా భుజం మీద ఓ చెయ్యి బరువుగా పడింది. ఎవరా అని చూస్తే బుట్టాగారు, ఆయన పక్కన కొత్త స్కూటరు తళతళ మెరుస్తోంది.

“కంగ్రాట్యులేషన్సు గురూగారూ! నక్కతోక తొక్కి స్టాక్‌ మార్కెట్‌లో దిగారు" అన్నాడు బుట్టా అభినందిస్తూ - “ఆ సామెతకి అర్ధం చెప్పలేదు

“ఏ సామెత?”

“నవ్విన నాపచేను ..."

'అర్జం తెలియకపోయినా, అంటే ఏవిటో తెల్సిందికదా' అన్నాను నేను గంభీరంగా.

“తెల్సింది” అన్నాడు బుట్టా బాధగా - పదండి. కాఫీ తాగొద్దాం

“ఈసారి బిల్టునేచెల్లిస్తా'

62 లక్ష్మీ కటాక్షం

'మీఠే ఇవ్వాలి. నాదగ్గరేవుంది బూడిద?”

“అదేవిటి? కొత్త స్కూటరు మీద పూల రంగడిలా ఉన్నారు. మీకేవిటి? ”

“మూడు నెలల [క్రితం స్కూటరు కొన్నప్పుడు పూలరంగళ్చే, ఇష్టుడు బూడిద రావుజ్ళి గొప్పదెబు తినేశాను. సార్‌: స్యూటరు డిస్కౌంటీకీ అకమ్ముస్తా. తీసు కుంటారా? హెల్మెట్‌ ఫ్రీ...”

“ఓకే

“అది సరే కాని గురూ గారూ, ఈ నాపచేనులో బంగారం పండుతుందని మీకల్దా తెల్సింది? ఊరికే తెల్సుకోవాలని కుతూహలంతో అడుగుతున్నాను...."

నను నిజం చెప్పేశాను - ' బంగార్రాజని, స్టాక్‌ మార్కెట్‌ లస్టుపులు తెలిసిన స్నేహితుడు, అతను కొనమంటే కొన్నాను కాని, నా మొహం నాకేం తెల్పు?”

“నేనూ అలాగే అనుకున్నాను లెండి. ఎవరు సార్‌, ఎడారిలో కూడా వసంతోలు చూడగలిగిన మహానుభావుడు? ఆయన దర్శనం చేసుకుంటాను. మరోమాట, నిప్పన్‌ సిల్క్‌, ఓ అయిదొందలు తీసుకుంటారేవిటి?”

“అదేవిటి?”

“మళ్ళీ బుట్టలో పడిపోయాను సారో - గురువుగారికి ఓ బుట్టలోంచి ఇంకో బుట్టలోకి దూకడం హాబీలా ఉంది- ఈసారి నిజం చెప్పేస్తున్నాను. ఇదీ నాప చేన్స, మీ చెతిలో బంగారం పండొచ్చు. ఏదో రేటుకు తీసుకోండి...”

“చూద్దాం లెండి.

బుట్టాగారు స్కూటరు. అప్పచెప్పి, చెక్కు తీసుకుని థాంక్స్‌ చెప్పి వెళ్ళి పోయారు...

భవిష్యత్తులోఎవరైనా 'స్టాక్‌ మార్కెట్‌ వీరులు” అన్న పుస్తకం రాస్తున్నప్పుడు అందులో నాపేరు సువర్జాక్షరాలతో లిఖస్తారని నా విశ్వాసం. తెరవైన్సళ్ర బంగా(ర్రాజున్నా తెర మీద హీరోని నేనే కదా! నెల రోజుల తర్వాత్‌ మొత్తం స్తాకంతా అమ్మేసి (బ్రోకరు ఆఫీసు నుంచి బయటకు నడుస్తుంటే, అంతా లేచి సవినమంగా గుమ్మందాకా వి వీడ్కోలు చెప్పారు. కొంతమంది ఆటో[గ్రాపులు అడిగారు. కొంతమంది ఫొటొలు అడిగారు. (బకరుగారు నాకు సన్మానం చేసి 'మూ ఊరి హర్షద్‌ మెహతా' అని బిరుదివ్వాలని ముచ్చ టపడ్డారు. వే వద్దు. ఇల్లాంటి రెండు మూడు కిల్లింగ్స్‌ చేశాక ఇవ్వచ్చు" అని ఆయన్ను ఆపు బశాను.

ఈ ఘన విజయానికి మూలకారకుడు బంగార్రాజు. బంగా(ర్రాజు ఫోను చెయ్యొద్దన్నాడు. ఇంటికి రావద్దన్నాడు. నిజమే కానీ, జాక్‌పాట్‌ కొట్టేసి లక్షలు లక్షలు సంపాదించి, అతనికి కృతజ్ఞతలు తెలుపక పోవడం చాలా కృతఘ్నత అనిపించింది నాకు. బంగా(ర్రాజు ఆఫిసుకి ఫోన్చేస్తే సెలవులో ఉన్నాడన్నారు. ఇంటికి ఫాన్టేస్తే టెలిఫోను కట్టయిందన్నారు. అంచేత నేశే ఓ రోజు సాయంత్రం బంగార్రాజింటికి స్కూటరు మీద వెళ్ళాను.

బంగా(ర్రాజిల్టు డిప్రెషన్లో ట్రేడింగ్‌ రింగ్‌లా సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ముందు తోటంతా సంరక్షణ లేనట్టు కలుపు మొక్కలతో నిండిపోయి. ఉంది

తోలేటి జగన్మోహనరావు 63 నాలుగైదు సార్లు కాలింగుబెల్లు నొక్కాక బంగార్రాజు తలుపు తీసి నన్ను చూసి కెవ్వున కేకేసి రెండడుగులు వెనక్కు వేశాడు నున్నటి తిరుపతి గుండు, చారల పైజామా, చారల లాల్చీ, బంగా(ర్రాజు సెంట్రలు జెయిల్లో యావజ్జీవ ఖైదీలా ఉన్నాడు. ఏదో పని చేస్తూ వచ్చినట్టున్నాడు. చేతిలో సుత్తి కూడా ఉంది.

నేను హలో' అని ఓ అడుగు ముందుకు వేయగానే అంత వరకూ రాయిలా నిలబడిపోయిన అతనిలో చలీనం వచ్చింది. ఇంకోసారి కెవ్వున కేకేసి చేతిలో సుత్తితో నా నెత్తి మీద ఒకటేశాడు. బుర్రకి దెబ్బ తగల్లేదు కాని తమాషాగా టింగుమని శబ్దం వచ్చి విషయం అర్దమైంది.

ఇందాకట్నుంచీ తలేవిటిరా ఇంత బరువుగా ఉంది అనుకున్నను కానీ, హెల్మెట్‌ నెత్తిమీద అలాగే ఉందన్న విషయం మర్చిపోయాను. అలవాటు లేని హెల్మెట్‌ కదా! మునిమాపు వేళ బంగార్రాజు నన్ను ఆ అవతారంలో చూసి జడుసుకున్నాడంటే జడుసుకోడా?

హెల్మెట్‌ తీసి నేనే అన్నాను ముఖారవిందం చూపించి - 'చేతిలో ఆ సుత్తేమిటి?'

'టీవీ చూస్తున్నాను”

'ఏవిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగుందా?”

“బాగానే ఉంది"

'బాగా చిక్కినట్టున్నావే'

“ఎండాకాలం కదా"

సుత్తితో టీవీ చూడ్డవేవిటి, డిసెంబర్లో ఎండాకాలవేమిటి, మనిషి వాలకం ఇలా తయారయ్యిందేవిటి, అనుకున్నాను.

'చాలో కాలం నుంచి నీన్ను కలుద్దామంటే వీలు పడలేదు. ఒకసారి మీ ఇంటికొచ్చేను. ఇల్టు తాళం వేసి ఉంది. పక్కన అడిగితే మీ ఊరెళ్ళావన్నారు.”

“ఏదో పాలం అమ్ముదామని'

'ఆ తర్వాత నేను ఊరెళ్ళాల్సి వచ్చింది... "

బంగా(ర్రాజు ఉలిక్కిపడ్డాడు - 'నువ్వూ పొలం అమ్మేశావా?'

“పొలం అమ్మడవేమిటి?”

బంగా(ర్రాజు చికాగ్గా అన్నాడు - నువ్ధు ఎందుకు వచ్చావో నాకు తెల్పు నేను ముందే చెప్పాను. స్టాక్‌ మార్కెట్‌లో ముందేం జరుగుతుందో ఎవరికీ తెలియదని. నేను మంచిదనుకున్న షేరు నీకు చెప్పాను. నేను కొన్నాను - బంగార్రాజేం మాట్టాడుతున్నాడో నాకు అర్ధం కాలేదు - 'నూట యాభై పెట్టి కొన్న షేరు ఇరవై ఆరుకి పడిపోతుందని నేను కలగన్నానా? శుభ్రంగా తిరుపతి క్షవరమై పోయింది. ఉన్నదంతా తుడిచిపెట్టుకు పోయిం ది," అన్నాడు గుండు నిమురుకుని చూపిస్తూ,

'నాకే నష్టం లేదు. యమా లాభం వచ్చింది."

'నిజం గురూ. కొడితే ఏనుగు కుంభస్టలవే కొట్టాలన్నాను, గుర్తుందా? సింహం

64 లక్ష్మీ కటాక్షం ఏనుగు కుంభస్టలాన్మి బద్ధలు కొట్టేసింది నీ దయవల్ల...”

'జాటర్‌ ఢమాల్‌...”

'జాటర్‌ ఢమాళ్‌ కాదు, నిజం చెబుతున్నాను" అంటూ నేను షేరు ఎలా కొన్నదీ, ఎలా అమ్మిందీ, ఎన్ని లక్షలు లాభం వచ్చిందీ బంగా(ర్రాజుకి వివరంగా చెప్పాను. కధ వింటుంటే బంగా(ర్రాజు మొహంలో రంగులు మారిపోయాయి.

“గుజరాత్‌ గోల్డ్‌ ఎందుకు కొన్నావు?" - బంగాగర్రాజులో డిటెక్టివ్‌ బంగా(ర్రాజు మేల్కొన్నాడు కాబోలు, అనుమానంగా (పల్ళించాడు.

'నువ్వు కానమనన్నావుగా!' అన్నాను నెను తెల్లబోయి.

“నిన్ను కొానమన్నది, నేను కొని నాశనవైపోయింది గుజరాత్‌ కోల్డ్‌...”

“మరి నాకు అలా విన్పించిందే'

'జాటర్‌ ఢమాళ్‌.... అలా విన్పించడం కాదు, ఇష్ముడు నాకు అంతా అర్ధమవుతోంది” - బంగా(ర్రాజు కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయి, అక్కడ నుంచి అంతర్నీత్రంతో చూస్తున్న వాడిలా కొద్దిసేపుండి మెల్లిగా కళ్ళు తెరిచి, చ్రైరునవ్యు నవ్వి = “చిన్మయ సూరిగారు మహానుభావుడు” పైకి చూస్తూ అన్నాడు, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ,

“ఆయనేం కిల్లింగ్‌ చేశాడు?”

"ఆయన ఫీల్డు స్టాక్‌ మార్కెట్‌ కాదు, సాహిత్యం. ఆయన కధల్లో బిత్తులమార్ర నక్కల గురించి చదీవినప్పుడు జిత్తుల మారి నక్కలు ఎలా ఉంటాయా అని బ్వర్ర బద్దలు కొట్టుకునే వాణి...”

అలాంటి కధలంటే నాకూ సరదా కాబట్టి నేనూ ఉత్సాహంగా వినడం మొదలు పెట్టాను.

బంగా(ర్రాజు చిన్నప్పుడు కోడేరు నుంచి వాలమగర్రు సైకిలు మీద వెడుతుంటే చెరకు తోటల్లోంచి నక్క ఒకటి పరిగెడుతూ రోడ్డు మీదకు వచ్చిందట. అది రోడ్డు దాటుతూ ఒక క్షణం ఆగి అత్తని కేసి చూసిందట. అతని హృదయ ఫలకం మీద టొ నక్క చూపు ఇప్పటికీ స్పష్టంగా ప్రింటయి ఉందట. చిన్నయ సూరిగారు వర్షించినట్టు అది జిత్తులమారి నక్క అవునా కాదా అని చిరకాలంగా ఉన్న సందేహం... .. న

“ఇప్పుడు తీరిపోయింది" అన్నాడు బంగార్రాజు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ,

“ఎలా ?”

“దాని చూపు కూడా నీ చూపులాగానే ఉంది.”

'నేను జిత్తులమారి నక్కనా?"

“గోముఖ వ్యాఘ్రానివి, పయోముఖ విషకుంభానివి, తేనెపూసిన కత్తివి, మేకవనై పులివి.... ' - బంగా(ర్రాజు రంకెలెయ్యడం మొదలు పెట్టాడు 'అసలు గుజరాత్‌ గొల ఏం చేస్తుంది?"

“తెలియదు”

(బుక్‌ వేల్యూ, ఈపీయస్‌, పీయీ రేషియో. ."

“ఆలియదు"

తోలేటి జగన్నోహనరావు 65

'హ్హ..హ్హ... కంపెనీ ఏవిటో తెలియదు. ఏం చేస్తుందో తెలియదు. డివిడెండి స్తోందో, దివాలా తీస్తోందో తెలియదు, ఏం తెలీకుండానే దాంట్లో లక్షలు పెట్టేశావు, లక్షలు కొట్టిశావు, ఇదంతా నన్ను నమ్మమంటావు. .

"నిజం గురూ

'నిజం నువ్వు చెప్పాద్దు, నేను చెబుతాను” - ఫత్తేదారు బంగార్రాజు పరిశోధన పూర్తయి నట్టుంది, నన్ను వారిస్తూ అన్నాడు - “గుజరాత్‌ గోల్డ్‌లో స్విండ్లర్స్‌ అమెరికా మెజా రిటీ పేర్టు తీసుకోబోతోందని నీకు ఇనొసైడు ఇన్ఫర్మేషనొచ్చింది. ఆ సంగతి దాచిపెట్టి, నాదగ్గరకొచ్చి నా సలహా మేరకు ఈ '"షేర్డుకొంటున్న వాడిలా (చి.సూ. గారి జి.మా, నక్క లా) నాటకమాడావు....'

'నే చెప్పేది విను..."

భనం మనం ్రెండ్సువి, రూమ్మేట్లవి గదా. గురూ బంగార్రాజు! ఈ ఇన్‌ సైడు ఇ ఫర్మేషన్‌ వచ్చింది. నువ్వూ, నేనూ ఫిఫ్టీ, ఫిఫ్టీ లూట్‌ పంచుకుందాం అన్నావా? నువ్వు ఓపెన్‌గా అంతా చెప్పేస్తే కష్టంలో, సుఖంలో నీకు తోడుండేవాణ్ణే కదా. కప్పారు నిన్ను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కింద జెయిల్లో పడేస్తే జెయిలుమేటుగా నీకు కంపెనీ ఇచ్చె వాణ్ణై కదా......”

'జెయిలేవిట్‌?' - బంగార్రాజు ఎక్కడనుంచి ఎక్కడకు వెడుతున్నాడో నాకు అర్హం కాలేదు.

“ఇదే అమెరికా అయితే నీకు ఏడేళ్ళు, నీ బావమరిదికి పధ్నాలుగేళ్ళూ వేసేవారు. నేనే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్నయితే -* తను పబ్లిక్‌ ప్రాసిక్యూటరు కానందుకు విచారిస్తూ అన్నాడు బంగా(ర్రాజు - *. అసలు విలనువి నువ్వు. నీకు పద్నాలుగేళ్ళు, నీ బావమరిదికి ఏడేళ్లు వేయించేవాణ్ణి....”

'నా బావమరిదికి ఏడేళ్ళేవిటి?”

“గుజరాత్‌ గొల్డ్‌లో పనిచెస్తూ నీకు ఇన్‌సైడు ఇన్ఫర్మేషన్‌ అందించినందుకు...

ఇదివరకు గూఢచారి సినిమాలు చూసి చూసి మతి చలించిన నా స్నేహితుడొకడు హోటల్లో ఓ మూల కూర్చుని మొహానికి పేపరడ్డం పెట్టుకుని, దానికో చిల్లు పెట్టి దాంట్లోంచి వచ్చేపోయేవాళ్ళందర్నీ చూస్తుండేవాడు. హోటలుకి వచ్చే వాళ్ళంతా శత్రుదేశ గూఢచారులని వాడి నమ్మకం. 'అదంతా నీ పైత్యం" అని నేనంటే, అసలు గూఢచారి మురా నాయకుణ్ణి నేనే అని అనుమానించి, నేను ఓ రాత్రి రెండో ఆటకు వెళ్ళగా చూసి, కిటికీలోంచి నా గదిలోకి దూకి, సీక్రెట్‌ ట్రాన్స్‌మీటర్‌ కోసం వెతుకుతూ రూమంతా చిందర వందర చేసి పడేశాడు. అలా ఉంది బంగార్రాజు మానసిక పరిస్టితి అక్కడికీ చిలక్కి చెప్పినట్టు చెప్పాను - వెధవ పుస్తకాలు చదవద్దు, (బ్రెయిన్‌ ఎఫెక్టిస్తుందని. వింటేగా.

'నా బావమరిదేవిటి? ఇనొసైడు ఇన్ఫర్మేషనివ్వడవేమిటి? నాకసలు బావమరిదే

లేడు”

బంగా(ర్రాజు పెదాలు నవ్వుతున్నట్టుగా మెల్లిగా స్లో మోషన్టో విచ్చుకుని, జలుబు

రర లక్ష్మీ కటొక్షం చేసిన గొర్రె దగ్గినట్టు శబ్దాలు వెలువడ్డాయి.

'జై-.....-ఖి--.... గ్గ.ఘ.......హ్హ...... నాకు తెల్సు అలా అంటావని. బూర్జువాకి స్నేహం లేదు, బంధుత్వం లేదు, బంగార్రాజు లేడు, బామ శక్తి లేడు. వాడికి డబ్బు తప్ప ఇంకెవరూ కనిపించరు......”

“నిజం గురూ. మా మావగారికి మా ఆవిడ ఏకైకపుత్రిక..'

“ఇంక నువ్వేం చెప్పొద్దు. నేను జాగ్రత్తగా ఇన్నేళ్ళూ స్టాక్‌ మార్కెట్‌ లో ఉన్న వాణ్ణి

నన్ను సలహా అడగడానికొచ్చి, నీ వెధవ ఆలోచన... వెధవ సామెత. . అదేమిటి?” "'కాడితే ఏనుగు కుంభస్టలం కొట్టాలన్నారు పెద్దలు' "పెద్దలెవరూ అనలేదు. ఈ వెధవ సామెత నీడే - బంగా(ర్రాజు ఓరంకె వేశాడు

  • ఆ వెధవ ఆలోచన నా బుర్రలో ్రవేశపెట్టావు. ఉన్నదంతా ఒక సేర్టో పెడితే సర్వనాశనమేనని తెలుసు. కానీ, శనిగాడి ప్రభావం పడ్డాకా నా బుర్ర ఎలా పనిచేస్తుంది? పోనీ ఒక్కసారి స్పెక్యులేట్‌ చేసి చూద్దాం అని గుజరాత్‌ కోల్డ్‌లో దిగాను. నువ్వు కుంభస్తలం కొట్టేశావు. నేను ఏనుగు కాళ్ళ కింద పచ్చడైపోయాను.”

ఇంక చాలు అన్నట్టు బంగార్రాజు చెయ్యి అడ్డం పెట్టి న. వారించి, *ఇక్ర నువ్వేం చెప్పాద్దు. నేనంటే నీకు ఇంకా కొద్దిగా దయ ఉందా? నేను ఉరికంబం ఎక్కడం నీకు ఇష్టమేనా?” అన్నాడు.

“ఛ....ఛ... అవేం మాటలు గురూ. నీ కోసం (ప్రాణాలైనా ఇస్తాను.”

'నీ ప్రాణాలు నీ దగ్గరే ఉంచుకుని నేను నిన్ను మర్డరు చెయ్యక ముందే వెళ్ళి పో అన్నాడు బంగా(ర్రాజు కన్టీళ్ధతో -'నువ్వు నాకు చేసే మహోపకారం ఇదే”

'నీ మూడ్‌ బావున్నట్టు లెదు. వస్తా" అన్నాను ఎందుకైనా మంచిదని లేస్తూ

'ఇంకరావద్దు. నేనే స్వీట్టు తీసుకుని వస్తా నువ్వు శ్రీకృష్ణ జన్మస్టానంలో ఉన్న ప్పుడు .....”

ధాంక్స్‌

'ధాంక్స్‌ ఎందుకు? స్వీట్టు నీ కోసం కాదు. నా కోసవే, జెయిల్లో నీ ఎదురుగా కూర్చుని నిన్నూరిస్తూ తినడానికి "

ఇంక అక్కడ ఉండడం క్షేమం కాదని వెంటనే బయటకు నడిచాను. ఇంటికి వెడుతూ మార్కెట్లో కూరలు తీసుకుని స్కూటరు స్టార్టు చెయ్యబోతుంటే, 'గురూగారూ అంటూ బుట్టాగారు బెల్లూ, బేకులూ లేని పాత సైకిలు తమకు? పరిగెట్టుకొచ్చారు.

న్స్‌ర్రా! బావున్నారా?”

నేనే. నా తలకాయలా ఉన్నాను.” రెండు ప్రశ్నలకూ రెండు సమాధానాలు క్లుప్తం గా చెప్పి - 'గుజరాత్‌ గోల్డ్‌ - అయిదొందలు, పదో పరకో- ఎంతో కొంతకి సర్దుకు పోదాం. తీసుకుంటారా?- పరామర్శలేవీ లేకుండా తిన్నగా బిజినెస్‌ లోకి దిగిపోయాడు హడావిడిగా.

“అదేవిటి? నాకు అన్నీ అమ్మేశారు కదా! మళ్ళీ ఎక్కణ్ఞుంచి పుట్టుకొచ్చాయి

తోలేటి జగన్నోసానరావు 67 ఇవి?" అన్నాను ఆశ్చర్యంగా. “రామేశ్వరం వెళ్ళినా శనేళ్టరం తప్పదన్నట్టు ఈ షేరు నన్ను వదలడం లేదు సార్‌ అన్నాడు బుట్టా దుఃఖంతో. గుజరాత్‌ గోల్డ్‌ పైకి లేవడం మొదలు పెట్టిన తర్వాత బుట్టా గారింట్లో ఇంటిల్లపాదీ మూడురోజులు తిండి తినలేదట. తెలివితక్కువగా అమ్మేశారు, చూడండి, ఎలా పసెరుగుతోందో... అని సతాయించడం మొదలు పెట్టీందట వాళ్ళావిడ. ఆ పోరు పడలేక బుట్టాగారు చూసి చూసి, ఊగిసలాడి ఊగిసలాడి, చివరకు ఎనభై రెండుకి ఓ అయిదొందలు తీసుకున్నాడట. ఓ నెల్లో రేటు రెండాం దలు దాటకపోతే చెవి తెగ్గోయించుకుంటానన్నాడట ్రోకరు. అందుకని రేటు పెరిగినసుడు తటపటాయించారు. బుట్టాగారు. ఈలోగా స్పిండ్రర్స్‌ అమెరికా గుజరాత్‌ గోల్డ్‌ లో వాటాలు తీసుకునే ఉద్దేశం తమకి లేనేలేదని స్పష్టం చేస్తూ ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం దాని రేటు పదకొండు. బ్రోకరుగారి చెవి క్షేమంగానే ఉంది కానీ బుట్టాగారి తలెగిరిపోయింది. వళి బుట్టలో పడిపోయాను సార్‌. ఈసారి స్టాక్‌ మార్కెట్‌ నుంచి - పేంటూ, షర్టూ పోతే పోనీండి - గోవీతో బయట పడితే చాలు, ఆ పైన దేశం అదృష్టం' అన్నాడు తన బాధ్యతేం లేదన్నట్టు - “నా గొడవకేం గాని మీ బిజనస్నెలా ఉంది?

మన స్టాక్‌ మార్కెట్‌ విజయాలు చెబుతుంటే, తెరమీద మాధు దీక్షిత్‌ డాన్స్‌ చూస్తున్నట్టు , అతని మొహం వెలిగి, కధ పూర్తవగానే రక్కున ఆరిపోయింది. కొంచెం సేపు అడగాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు తటపటాయించి, 'మిమ్మల్ని అడగడం బాగోదు. మీరైతే కారో, రైలో, హెలికాష్టరో కొంటారు. ఈ సైకిలు ఎవడైనా కొంటాడేమో చూడండి. బెల్లు ఫ్రీ...” అన్నాడు జేబులోంచి బెల్టు తీసి టింగు టింగుమనిపించి,

సరే అని, అతన్ని హోటలుకి తీసుకెళ్ళి బిల్లు నేనే చెల్లించి వెళ్ళిపోతుంటే, 'సార్‌! మీ గురువుగారి పేరు వెండో , బంగారవో 'వీదో చెప్పారు. ఆయన్ని దర్శనం చేసుకోవాలి అప్పుడే ఆయన్ని కల్సుంటే ఈ డొక్కు సైకిలేనా మిగిలేదేమో" అన్నాడు కసిగా సైకిల్ని ఓ తాపు తన్ని.

“అతని పేరు బంగార్రాజు. ఇప్పుడు కొంచెం మానసిక పరిస్టితి - మూడ్‌ బాగాఠేదు'. అన్నాను వివరాలేవీ చెప్పకుండా.

“ఫరవాలేదు సార్‌! బంగార్రాజు , ఏంపేరు సార్‌? పేరులోనే బంగారం ఉంది. ఇంక ఆయన పట్టింది బంగారం కాక ఏనువుతుంది? పేరంటే అలా ఉండాల్సార్‌. వారు అను(గ్రహిస్తే ఉపదేశం పొందుతాను. లేకపోతే దూరం నుంచే దర్శనం చేసుకుని తరిస్తాను. వస్తా సారొ అంటూ పేక్‌ హాండివ్వబోతుంటే నా కొత్తవావీ ఆయన కంట పడింది - 'వాబీ చాలా బావుంది సార్‌! గట్టివ?

పద్దెనిమిది కేరట్ట బంగారం' అన్నాను వావీ తీసి అతనికి అందివ్వబోతూ.

బుట్టా రక్కున చెయ్యి వెనక్కు లాక్కున్నాడు -, 'మన జాతకం బాగా లేదు సార్‌ బంగారం ముట్టుకుంటే మట్టయిపోతోంది. మీ చేతినే ఉండనివ్వండి' అంటూ

68 లక్ష్మీ కటాక్షం బంగా (ర్రాజు అడ్రస్‌ తీసుకు వెళ్ళి పోయాడు. పైకొచ్చిన వాణ్ణి పైకి లేపేస్తుంది లోకం. ఆ తర్వాత నాకు స్టాక్‌ మార్కెట్‌ మాంత్రి కుడిగా పెద్ద పేరొచ్చింది. ఎక్కడెక్కడి వాళ్ళు సలహాల కోసం నా దగ్గరకు వస్తారు. నేను ఎర్ర, నీలం పెన్సిలు తీసుకుని, టిక్కులు కొట్టి 'కొనండి, అమ్మండి' అని క్లుప్తంగా సలహాలిస్తాను. లాభం వచ్చిన వాళ్ళు నన్ను ఆకాళానికెత్తేస్తారు. నష్టం వచ్చిన వాళ్ళు నన్ను నిందిస్తారని మీరనుకుంటే పారపాటే. వాళ్ళు, 'సింహం గారు మా(త్రం ఏం చేస్తారు? స్టాక్‌ మార్కెట్టే అంత” అని ఏడ్భి మళ్ళీ నా దగ్గరకే వస్తారు. నేనెంత వారించినా వినకుండా స్టానిక ఇన్మెప్టర్‌ క్రబ్‌ వాళ్ళు నాకు సన్మానం చేశారు. వేదికమీద పెద్దలు రిఫార్మ్‌, డంకెల్‌, గాట్‌ అంటూ ఏదో మాట్లాడారు. నాకు సగం అర్థమైంది సగం అర్ధం కాలదు ఆ తర్వాత నేను లేచాను. ' నీష్టియా పులి" భారత దెళం లేచింది. గర్జిస్తోంది' అన్నాను. పులి గర్జిస్తుందా, గాండ్రిస్తుందా? ఇల్దాంటప్పుడు బంగార్రాజు దగ్గరుంటే ఎంత బావుంటుంది? అనుకున్నాను. బంగార్రాజు చాలా దగ్గర్గోనే పొంచి ఉన్నాడని నాకు తెలియదు. పులి గర్జించదు, గాండ్రిస్తుంది. సింహం గర్జిస్తుంది. నా పేరే సింహం. నేను గర్జిస్తాను' అన్నాను. అంతా చప్పట్లు కొట్టారు, అదేదో జోకనుకుని. ఆ తాత నేనేదో నాకు తోచింది మాట్టాడాను. వాళ్ళకి సగం అర్థవైంది, సగం అర్ధంకాలేదు. నేన్షం మాట్టాడ్తుతున్నానో నాకె తెలియదు. పాపం, వాళ్ళకేం అర్ధమవుతుంది? ల్సి సాక్‌ మార్కెట్‌ విజయ రహస్యం ఏమిటి?' అని నన్ను (ప్రశ్నించారు. అందరి కళ్ళల్లో లక్షలు ఎలా సంపా దించేయాలా అన్న ఆశ. అలీబాబా గుహ తలుపులు తెరవడ్‌ొన్సిక్ష మంత్రం కావాలి వాళ్ళకి, బంగార్రాజు సూక్తులు గుర్తుకొచ్చి వాళ్ళకు మంటత్రోప్రద్ర్యేం చేశాను- 'తక్కువలో కొనడం, ఎక్కువలో అమ్మడం'. అది అందరిక్షి తెల్సిందే అయినా, ఏదో కొత్త విశేషం అయి నట్టు చప్పుట్టు కొట్టి ఆనందించారు. బీ సన్మానం, విందు అయిన తర్యాత సభ నిర్యాహకులు నా క్రారుదాక్టా వచి నాకు వీడ్కోలు చెబుతుంటే, “బూర్జువా అన్న కేక వినిపించి అదిరిపడ్డాను. ఓ ముతక ఖద్దరు లాల్ఫీ, భుజాన వేలాడే సంచి, పిల్లిగడ్డం - పాత గెటప్‌లోక్సి వచ్చేశాడు బంగార్రాజు. అతని పక్కన అదే గెటప్‌లో యస్సెన్‌2 బుట్టా కూడా ఉ న్నాడు వాళ్ళిద్దరూ నా కారుకి కొంచెం దూరంలో రోడ్డు పక్కగా నల్ల జండాలు పట్టిక్షుని నిలబడి ఉన్నారు. లా “జిత్తుల మారి నక్క... మేకవన్నై వ్యాఘ్రం...” = బుట్టా నాకేసి నలజండా ఊపుతూ అరిచాడు. ల నేను కారెక్కి వెళ్ళి పోయేలోగా, చిన్మయసూరిగారు నన్ను తిట్టిన తిట్లన్నీ వల్లించాలి కాని, ఎంత తొందరలో ఉన్నా భాషా దోషాల్ని సహించలేడు బంగార్రాజు. 'మేకవన్నై పులి... గోముఖవ్యా[ఘ్రం...'- బుట్టాగారి సమాసదోషాన్ని సరిదిద్దాడు బంగా(ర్రాజు. 'మేకవన్నె పులి... గోముఖ వ్యాఘ్రం... పయోముఖ... పయోముఖ...” 'పయోముఖ విషకుంభం.... తేనెపూసిన కత్తి..."

తోలేటి జగన్మోహనరావు 69 నేను ఎందుకైనా మంచిదని వెంటనే కార్టోకి దూకి స్టార్ట్‌ చేశాను. “డౌన్‌...డౌన్‌......'

“వాడి బామ్ముర్షి.... “డౌన్‌... డౌన్‌ వాళ్ళిద్దరి నినాదాలు దూరమవుతుండగా కారువేగం అందుకుంది. (ఇండియా టుడే- అక్టోబరు 6-20 , అక్టోబరు 21 - నవంబరు 5, 1994 సంచికలు) (1996 సంవత్సరంలో ఉత్తమ కథగా జ్యేష్ట లిటరరీ (ట్రస్సు అవార్డు అందుకున్న కథ)

సా యంకాలం నాలుగు గంటలవుతోంది. శీతాకాలం ఎండ ఏటవాలుగా పడు తోంది. తారురోడ్డుకి వంద గజాల దూరంలో, రాళ్ళ గుట్టల మధ్య కొంచెం చదున్వై (ప్రదేశంలో ఓ మూల ఎర్ర జండా ఎగురుతోంది. ఆ ఎర్రజెండా నీడన ఒకతన్స డప వాయిస్తూ పాటపాడుతున్నాడు. అతని నడుంకి చిన్న ఎర్రగుడ్డ, కాళ్ళకి గజ్జలు భుజం మీద నల్ల కంబళి ఒకటి వేసుకున్నాడు. అతని పక్కన పదిహేడేళ్ళ కుర్రాడు ఒకడు చేతి కర్ర నేలను తాటిస్తూ వంత పాడుతున్నాడు. మరో నలుగుర్చ కుర్రాళ్ళు పక్క వాద్యాలు వాయిస్తూ అప్పుడప్పుడు అందిస్తున్నారు. అతని చుట్టూరా రాళ్ళ ము న్‌ ఓ వంద మంది కూలి జనం కూర్చుని అతని పాట వింటున్నారు. ర

' తెల్లోడు పోయెనంట - నల్లోడు వచ్చెనంట

ఎవ?నిద్‌ రాజ్జెమొచ్చినా - ఓ రాజయో

నిటి సచ్చే రోజులాయరో....”

ఆ సమయంలో తారు రోడ్డు మీద ఎంబాసిడర్‌ కారు ఒకటి హైదరాబాద్‌ వేపు పోతోంది. అందులో వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి .సి.సి.బి. టీవి విలేఖరి రిచర్‌స్తు రాళ్ళ గుట్టల మధ్య ఎగురుతున్న ఎ(ర్రజండా ఆకర్షించింది. అతను సి.సి.బి. టక్షి ఇండియా మీద డాక్యుమెంటరీ తీసే నిమిత్తం రెండు నెలలుగా భారత దేశమంతా పర్యటిస్తున్నాడు. కారులో అతనితో పాటు అతని కెమేరామేన్‌ టామ్‌, ఆం(ధ్రదేశంలో సహాయ పడటానికి వెంటవచ్చిన శ్రీనివాసరావు ఉన్నారు.

రిచర్డ్‌ కారు ఆపమన్నట్టు చెయ్యెత్తాడు. కారు, మెల్లగా వేగం తగ్గి తోడ్డు మీద చింత చెట్టు నీడన ఆగింది. అతను కారు దిగకుండానే రావుకేసి తిరిగి ఎవరతను?"

తోలేటి జగన్నోనానరావు 71 అనడిగాడు పాడుతున్న వ్యక్తికేసి చూపిస్తూ.

“అతని అసలు పేరు నాకు తెలియదు కాని అంతా అతన్ని డ్సులయ్య అంటారు. "20015 [016 310268 ౪101 అగాంగ15ఓ 16201085 - కమ్యూనిస్టు లే అతివాదులు, తుపాకీ ద్వారా విప్లవం తీసుకొస్తామంటారు అక్కడక్కడ తెలంగాణాలో, అడవి ప్రారతాలలో - వీళ్ళకు కొద్దిగా పలుకుబడి ఉంది", అని వివరించాడు రావు.

కారు. దిగకుండానే మెళ్ళో వేళ్ళాడుతున్న బైనాక్యులర్స్‌ పైకెత్తి అటువేపు చూశాడు రిచర్డ్‌ గాలి వాలుకి డప్పులయ్య పాట కెరటాలు, కెరటాలుగా వస్తోంది.

“పచ్చా పచ్చని బూమి, పచ్చాని బూమి - అమ్మలాలో

పైడిపంటల బూమి - బంగారు బూమి - అమ్మలాలో

క్రష్ప్వమ్మ కరుణిస్తే - రతనాలే పండు - అమ్మలాలో

గోదారో కరుణిస్తే - వజ్రాలే రాలు- అమ్మలాలో

పచ్చా పచ్చని బూమి - పచ్చాని బూమి - అమ్మలాలో...?

కన్నతల్లి లాంటి చల్లని ఊరు - పంట పొలాల్లో వంపులు తిరుగుతూ (ప్రవహించే కాలువ - బంగారం పండిన చేలు - వెండి పూలు చల్లిన పత్తిపొలాలు - వెన్నెల్లో మిలమిలమెరుస్తున్న కొబ్బరాకులూ - కళ్ళాపి చల్లిన వాకిట్టో విరబూసిన బంతిపూలు - గుడిసె మీదకి పాకిన ఆనపపొదు ఆకుల మాటు నుంచి తాంగి చూస్తున్న ఆనప పిందెలు - లేగదూడలా ఛంగున గంతులు వేస్తూ తిరిగిన పసితనం

  • కూలిన కొంపలు - కూలిబ్రతుకులు - కూటికి అగచాట్టు...... ఆపాట వింటుంటే ఏయే దృశ్యాలు కళ్ళ ముందు మెదిలాయో, శ్రోతల గుండెలు బరువెక్కాయి. ఆడకూలీలు కొంగుతో కళ్ళు తుడుచుకుని బిడ్డల్ని దగ్గరకు తీసుకున్నారు. బైనాక్యులర్లోంచి వాళ్ళని చూస్తున్న రిచర్జ్‌కీ పాట అర్ధం కాకపోయినా శ్రోతల మొహాల్లో కదలాజే భావాలు స్పష్టంగా కనుపించి, “అతను ఏం పాడుతున్నాడు", అనడిగాడు ఆశ్చర్యంగా, రావు అనువదించి చెప్పాడు. 0 92015 (0 విం (814 హ(లజరుకై - పద, అతనితో మాట్టాడుదాం' అన్నాడు రిచర్డ్‌ కారు దిగి దారి తీస్తూ. వాళ్ళు వస్తుంటే జనం వింతగా చూస్తూ దారి ఇచ్చారు. పరిచయాలైన తర్వాత రిచర్డ్‌ కెమెరా ముందు నిలబడి అడిగాడు - 'సి.సి.బి పేరు విన్నావా?" డప్పులయ్య సమాధానాలు చెప్పసాగాడు. అతను సి.సిబి టీవీ గురించీ, స్టార్‌ టీవీ గురించి విన్నాడు కానీ చూడలేదు. ఇంగ్లీషు అర్ధం కాదు, తెలుగు రాయడం చదవడం వచ్చు 'కాని ఎక్కువగా చదువుకోలేదు. 'అతని చదువంతా ఉద్యమాల ద్వారానే. “మీరెందుకు పోరాడ్డుతున్నారు?" “కమ్యూనిజం కోసం'

72 లక్ష్మీ కటాక్షం

“కమ్యూనిజం అంటే?”

“సోషలిజం'

“సోషలిజం అంటే?”

“అంతా సమానంగా ఉండాలని... " - సంభాషణలో కలుగ చేసుకుంటూ అన్నాడు డప్తులయ్య పక్కనున్న కుర్రాడు శివ

“అంతా సమానంగా ఎప్పుడూ లేరనీ, ఎప్పుడూ ఉండరనీ నేనంటాను. ఒక కూలీకి, ఒక ఇంజనీరుకి సమాన వేతనం ఇస్తే ఇంజినీరవడానికి ఎవడైనా ఇష్టంగా కష్టపడతాడా?'

శివ కొంచెం తడబడ్డాడు. పదిమందీ అంటుండగా వింటున్థదే కాని నిజానికి సోషలిజం అంటే ఏమిటో అది ఎలా వస్తుందో అతనికి అవగాహనలేదు.

శివ మౌనం చూసి డప్పులయ్య సమాధానం చెప్పాడు-'అందరూ సమానమంటే అందరికీ సమానావకాశాలుండాలని.... అందరికీ కూడూ, గుడ్డా, నీడా ఉండాలని...”

“అది కూడా అందమైన కలే అంటాను.”

'అది కలే అయితే ఆ కలకోసమే మేం పోరాడుతాం. మనిషి మనిషిలా బతకాలనుకోవడం అందమైన కల అనిపించే అమానుష వ్యవస్థని మేం పునాదులతో సహా తవ్వి పారేసి పేదల రాజ్యం తీసుకొస్తాం...”

“సోషలిజం . సమానత్మం, పేదల రాజ్యం. ఇవన్నీ అందమైన (భ్రమలు. పేద్రల రాజ్యంలో కూడా రాజులు ఉంటారనీ , వారూ పదల ఒకటి కారనీ చరిత్ర రుజువు చేసింది. ఈ నినాదాల మీద లేచిన సోషలిస్టు రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి పేకమేడల్హా ఎలా కూలిపోయాయో చూశావా?

“సోషలిజం అనేది అసలు ఉంటేగా కూలిపోవడానికి" డప్తులయ్య అన్నాడు, “సోషలిజం స్థాపనకు అనేక దేశాల్లో ప్రయత్నాలు జరిగాయి. అనేక కారణాల వలిన ఆ (ప్రయత్నాలు ఫలించలేదు. అంత మాత్రాన సోషలిజం ఓడీపోయిందని నేననుకోను చరిత్ర సూటిగా పురోగమించదు. పురోగమనం, తిరోగమనం, మళ్ళీ పురోగమనం" ఇది చరిత్ర నడిచే పద్దతి అని మాకు తెలుసు."

“ఇప్పుడు ఏ దళలో ఉన్నారు మీరు?' రిచర్డ్‌ నవ్వుతూ అడిగాడు.

'నా ఉద్దేశంలో ఈ శతాబ్దంలో సోషలిస్టు పోరాటానికి మూడు (ప్రధాన దశలు కనిపిస్తున్నాయి. రష్యా విప్లవం నుంచి స్టాలిన్‌ మరణం వరకూ సోషలిజం పురోగమనం, స్టాలిన్‌ మరణం నుంచి సోవియట్‌ యూనియన్‌ పతనం వరకూ తిరోగమనం, ఇప్పుడు సోషలిస్టు శక్తులు సంఘటిత పడి మళ్ళీ పురోగమించాల్సిన కాలం....”

సస్తండా? రిచర్డ్‌ ఆశ్చర్యపోతూ అన్నాడు- 'దేళశం తర్వాత దేశం సోషలిజానిక్తి ఎలా గుడ్‌బై చెప్పేస్తున్నాయో, నిన్నటి కమ్యూనిస్టు పార్టీలు” పేరు జెండాలు ఎలా మార్చే స్తున్నాయో గమనించావా? చైనాలో కూడా ఎర్రజండా నియంతృత్వంలో నీవు కలలుగంటున్లు సోషలిజం కాకుండా కేపిటలిజం నిర్మాణం జరుగుతోందనీ తెలుసా?

కేపిటలిజం (ప్రపంచమంతా. విస్తరించి బలపడుతుంటే ఇది సోషలిజానికి

తోలేటి జగన్నోవానరావు 72 అనుకూలమ్మెన కాలం అనడం ఆశ్చర్యంగా ఉంది." ఎ

"ఊడలు దించి విస్తరించిన మహా వృక్షం నిన్నటిది. దాని నీడన మొలకెత్తే విత్తనం రేపటిది. ఎంత ధృడంగా కనుపించినప్పటికీ కాలంతో పాటు వంగి పోవాల్సింది ఒకటి. ఎంత బలహినంగా ఉన్నప్పటికీ ఎదిగే దశలో ఉన్నది మరొకటి. వడగాలులకీ, తుఫానులకీ మహావృక్షం తట్టుకున్నట్టు తట్టుకోలేకపోయినా భవిష్యత్తు విత్తనానిదే. కాలం దాని వేపే ఉంటుంది. కొంతమంది విలాస జీవితానికి కోట్ట మందిని బలిచేసే వ్యవస్థ నిన్నటిది. అది కూలిపోక తప్పదు. రేపు నిశ్చయంగా మాదే..." అంటూ గేయం అందుకున్నాడు డప్పులయ్య.

ఒఒమేం తిరిగి వస్తాం

కొత్త రక్తంతో

కోట్లమంది మై/

మేం మళ్ళీ వస్తాం

కోటి కిరణాలతో

రేపటి ఉదయమై +"

రావు అనువదించి చెప్పాడు. రిచర్డ్‌ పగలబడి నవ్వి, డప్పులయ్య నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు లాక్కుని, కెమీరా కేసి తిరిగి మం 308 11966208 నెగడు ంంరం42 కాంతలు 02 26 01 పిండవడే ఓం 1854 ఇంరే 68 02 5061411501. గక? 00028 సలురే 21 4912 తంట 201 ఓం క 16 పే 0621ల0. కం 535 %6 ౪111 60౧౯ 9201౬. మీ బాంబులు, గన్నులు, టాంకులు, విమానాలు, రాకెట్టు, ఏవీ మిమ్మల్ని కాపాడలేవు. మా డహ్థులయ్య డప్పు తీసుకుని రేపు నాదంటూ పాటలు పాడుతూ వస్తున్నాడు. కాసుకొండి' అన్నాడు, అమెరికా అధ్యక్షుల్ని వేళాకోళంగా హెచ్చరిస్తూ .

ఇంటర్వ్యూ పూర్తయింది. 'బెన్ట్‌ ఆఫ్‌ లక్‌ ఆంటూ చేతులు కలిపి రిచర్డ్‌ కారు వేపు నడిచాడు. రావు ఒళ్ళు విరుచుకుని, తలుపు తీసి కార్గో కూర్చున్నాడు. అప్పటికి పొద్దు వాలింది కాని ఇంకా బాగా వెలుగుంది.

'టామ్‌! రాళ్ళూ రప్పలూ, గడ్డి పరకలేని ఈ భూమి, ఈ దారిద్ర్యం - అంతా ఛఫ్రేం లోకి వచ్చేలా చూడు. ఎడిటింగ్‌లో ఏం చేయ్యాలో చూద్దాం” అన్నాడు రిచర్డ్‌ కారు దగ్గర నిలబడి. టామ్‌ వేరు వేరు కోణాల నుంచి డప్పులయ్య దళాసదూరం నుంచి చిత్రీకరి స్తుంటే, రిచర్డ్‌ కారునానుకుని నిలబడి జేబులోంచి సిగరెట్‌ పేకెట్‌ తీసి, సిగరెట్టు వెలి గించి, డప్పులయ్య కేసి చూస్తూ ఆలోచించసాగాడు.

అతను డప్పులయ్య లాంటివాళ్ళను ఆసియా, అకా లాటిన్‌ అమెరికాల్లో అనేక దేశాల్లో కలిశాడు. వాళ్ళ రంగు, భాష, జెండా, రాజకయాలు, నినాదాలు వేరు కావచ్చు. కాని సారాంశం ఒక్కటే - ఆకలి, అశాంతి.

అతను రెండు నెలలుగా భారత దేశమంతా పర్యటిస్తూ జర్నలిస్టు కళ్ళతో

“త్మ లక్ష్మీ కటాక్షం దేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. నగరాల్లో పల్లె ప్రాంతాల్లో తిరుగుతూ దేశంలోని ఘోరమైన దారిద్ర్య స్వరూపాన్ని అర్హం చేసుకున్నాడు. తల్లి కొంగు వదలలేని వయసులో రోజుకు పది, పన్నెండు గంటలు గొడ్డల్లా పనిచేస్తూ పసితనం అంటే ఏమిటో మరచిపోయిన లక్ష లాది పసివాళ్ళను చూశాడు. చిన్నచిన్న పరిశ్రమళ్ళో, కార్థానాల్లో పనిగంటల నియమం, భద్రతా, కనీస కూలి లేకుండా దారుణంగా దోచుకోబడుతున్న కోట్లాది కార్మికుల జీవితాలు చూశాడు. రైలు స్టేషన్లలో. పుణ స్తలాల్లో - దేశంలో ఏ మూలకు పోయినా పిడికెడు మెతుకుల కోసం ఈగల్హా ముసలీ బెచ్చగాళ్ళను చూశాడు. మరోపక్క, “1641203 2౯ 624666 60 8004 11089 01 11౯౬ల అంటూ కొంతమంది, ఇండియన్స్‌ అంటే తామే అన్న భావం నిస్సంకోచంగా వెల్లడిస్తూ పశ్చిమ దేశాల జీవన ప్రమాణాలను అందుకోవడానికి, అనుకరించడానికి ఆరాటపడటం చూశాడు.

ఈ అసమానతల పరిణామం ఎల్లా ఉంటుందోకూడా అతను దేశ దేశాల్లో గమనిస్తున్నాడు. బైబిల్లో పట్టుమని పదేళ్లు నిండని అనాధులైన పిల్లలు గేంగులుగో తిరుగుతూ, దోపిడీలు, హత్యలూ చెయ్యడం, పోలీసులు రోడ్ల మీద నిద్రపోయే ఈ బాలనేరస్టుల్ని నిద్రలోనే మరతుపాకులతో కాల్చి చంపడం చూశాడు, మెక్సికోలో బిలియనైర్త విలాసజీవితంతో పాటు మాయా ఇంయయన్హ తిరుగుబాటూ చూశొడ్తు,

అక్కేడే కాదు, బుణ(గ్రస్తమవుతున్న మూడవ ప్రపంచంలో, రష్యాలో, తూర్పు యూరోపు దేశాల్లో విచ్చిన్నమవుతున్న సామాజిక వ్యవస్థను, ప్రబలుతున్న అరాచక్రాప్ట్‌ చూశాడు. (ప్రపంచాన్ని చుట్టుముట్టుతున్న అశాంతిలో భాగంగానే ఇక్కదే డప్పులయ్యనీ చూస్తున్నాడు అతను.

'సమాజాంతరాళాల్జోంచి నేడు చెదురుమదురుగా, *' బలహీనంగా వినవసున ఈ రణగొణ ధ్వనులు రాబోయే విస్సోటాలకు సంకేతాలా? లోలోన రగులుతు్నై ఈ అగి పర్వతాలు బద్దలైన రోజున ఈ ప్రపంచం ఎలా మారుతుంది?” _ 6న అసహనంగా కదిలి సిగరెట్టు పీక విసిరేసి, మరో సిగరెట్టు అంటించాడు. డ్‌

పరిచితమైన (ప్రపంచం కూలిపోయి, దాని స్థానంలో అపరిచితమైన (ప్రపంచం తలెత్తుతోందనీ, ఆకలీ, కాళు అర్హంకాని, హృదయం లేని ఆర్షిక వ్యవస్త ప్రపంచాన్ని చుట్టబెట్టుతోందని రిచర్డ్‌ గమనిస్తున్నాడు . తుమ్మెద మధువు కీస్‌ పువ్వు నుంచి పువ్వుకి ఎగిరినట్టు పెట్టుబడి లాభాల కోసం ప్రపంచమంతా తిరుగుతోంది. స్వేచ్చా విపణి పేరుతో బలబాన దేశాల స్వేచ్చా స్వాతంత్రాలను క్రమ (క్రమంగా హరిస్తోంది. క్రిందటి శతాబ్దాలలో ఇటువంటి పరిస్టితి వలస విధానానికి, వ్యాపార యుద్దాలకి, (ప్రపంచ యుద్దా లకు, రక్తపాత విప్రవాలకు దారితీసింది. ఇప్పేడేమవుతుంది? అనూహ్యమైన వేగంతో వస్తున్న ఈ మార్పు దేశాలన్నింటినీ శాంతి యుతంగా వసుదైక కుటుంబంగా ఏకం చేస్తుందా? లేక ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా మారణ హోమంలో కోట్ల మందిని బలితీసుకుంటుందా?....

రిచర్డ్‌ అలా ఆలోచిస్తుండగా, రాళ్ళ గుట్ట వెనుక నుంచి ఒక జీపు వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి అయిదారుగురు వ్యక్తులు బల్హాలు , కత్తులు, గొడ్డళ్ళు

తోలేటి జగన్మోహనరావు 75 తీసుకుని దూకి డప్పులయ్య వేపు పరుగెట్టారు. వాళ్ళు వస్తూనే డప్పులయ్య తల మీద గొడ్డలితో ఒక్కటి వేశారు. 'శివా' అని పెద్దగా కేకపెట్టి రెండు చేతులతోనూ తల పట్టుకుని ఒరిగి పోయాడు డప్పులయ్య. గూండాలు కంటబడగానే అసంకల్పితంగా పారిపోయిన శివకి అప్పుడు తెలివొచ్చి, 'అన్నా' అంటూ వెనక్కు తిరిగి అతని రక్షణకు రాబోయాడు. రౌడీలు అతన్ని ఓ పక్కకు విసిరేసి, పడిపోతున్న డమ్సుభయ్యను పది పన్నెండు సార్టు కత్తులతో, బల్బాలతో పొడిచారు. వాళ్ళు అతన్ని హత్య చేసి జిపువైపుకి పరిగెడుతుంటే, రోడ్డు మీడ ఎంబాసిడర్‌ కారు, కారుపక్కన టీవీ కెమేరా కనుపించాయి. వాళ్ళు ఒక క్షణం తెల్లబోయి, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, గొడ్డళ్ళు ఊపుతూ రోడ్డు మీదకు పరిగెట్టుకొచ్చారు. కెమేరా మేన్‌ ని కారులోకి గెంటి, తలుపేసి అక్కడే కదలకుండా నిలబడ్డాడు రిచర్డ్‌.

అతను ఆరడుగుల ఆజానుబాహుడు. నిర్భయంగా నిలబడ్డ అతన్ని చూసి, వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక ఆగిపోయారు. తెల్లవాడంటే ఇంకా కొద్దిగా ఉన్న బెదురో, లేకపోతే తెల్లవాణ్ణి చంపితే గొడవ అవుతుందనో, వాళ్ళు సాహసించలేదు.

“హు ఆర్‌ యు?'- అందరి కంటే ముందున్న వ్యక్తి అడిగాడు. అతని మొహం ఒత్తు మీసాలతో భయంకరంగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. అతను తాగి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అతని పక్కన ఖద్దరు పంచె, ల తో మరో వ్యక్తి ఉన్నాడు.

'నాపేరు రిచర్డ్‌ సి.సి.బి. టీవి కరస్పాండెంటుని" అన్నాడు రిచర్డ్‌ మెల్లగా, స్పష్టంగా ఒత్తి పలుకుతూ,

రిచర్డ్‌ సి.సి.బి విలేఖరి అనగానే మీసొల వాడు తటపటాయించాడు. ప్రక్కనున్మ వ్యక్తి కేసి చూశాడు ఏం చేద్దాం అన్నట్టు, అతనితో మెల్లగా మాట్లాడాడు. రిచర్హ్‌ ఇదంతా కెమేరాలో రికార్డు చేసే ఉంటాడని అనుమానం వచ్చింది ఇద్దరికీ.

'ఆ కేసెట్‌.... ఇచ్చేయ్‌..." అన్నాడు మీసాల వాడు.

రిచర్డ్‌ కారు తలుపు తీసి, 'టామ్‌! కేసెట్‌ ఇనేయి.. అన్నాడు. టామ్‌ కారు దిగి, కమెరాలోంచి కేసెట్‌ తీసి ఇచ్చాడు. కేసెట్‌ తీసుకుని 'నౌ...గో అన్నాడు మీసాలవాడు బెదిరిస్తున్నట్టు.

“ఓ.కే. అన్నాడు. రిచర్డ్‌ భుజాలు ఎగరేసి. అతనికీ, టామ్‌కీ అలాంటి అనుభవాలు కొత్త కావు. అతను కూర్చున్నాకా కారు కదిలింది. కొంత దూరం వెళ్ళాకా, 'కేసెట్‌ సేఫ్‌గా ఉందా?" అనడిగాడు రిచర్డ్‌

“ఉంది. వాళ్లు నిన్ను బెదిరిస్తునప్పుడు స్టిల్‌ క కెమేరాతో ఫొటోలు తీశాను. అవి కూడా బాగా రావచ్చు," అన్నాడు టామి.

వారం రోజుల తర్వాత ఓ ఉదయం వామపక్షాలకు చెందిన శాసన సభ్యులొకరు, (ప్రశ్నోత్తరాల సమయం తాత కాల్‌ అటెన్షన్‌ మోషన్‌ రూపంలో డఘులయ్య హత్య ఉదంతం శాసన సభల్‌ ప్రస్తావించి, ఇందులో స్థానిక పోలీసు ఆఫిసరుకు, అధికార పక్షానికి చెందిన స్టానికు శాసన సభ్యులకు ఏవైనా ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆంతరంగిక వ్యవహారాల మంత్రి తీవ్ర అభ్యంతరం

76 లక్ష్మీ కటాక్షం తెలిపారు. వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రిగారు. కలుగ చేసుకుని, గౌరవనీయుడైన తన మిత్రుడు నిరాధారమైన ఆరోపణలు చెయ్యడం తనకు చాలా విచారం కలిగిస్తోందన్నారు. అధికార పక్షం మీద అభాండాలు వేయడం రాజకీయ చతురత అనిపించు కుంటుందేమో కానీ విజ్ఞత అనిపించుకోదన్నారు. ఈ హత్య ఉదంతం విచారించడానికి (ప్రభుత్వం ఏకసభ్య సంఘాన్ని నియమిస్తోందని కూడా తెలియ శారు. మూడు నెలల్లో ఏకసభ్యసంఘ నివేదిక వచ్చింది. అతివాద రాజకీయాలతో విసుగు చెందిన స్టానిక ప్రజలు తమ ఆగ్గహాస్మి దురదృష్టవశాతూ హింసాయుతంగా తెలియ చేశారని నివేదిక పేర్కొంది. గౌరవనియులైన ముఖ్యమంత్రి, నివేదికను గౌరవనీయ మైన సభకు సమర్పిస్తూ జరిగిన దానికి చింతిస్తున్నా ఒక విషయం సభ దృష్టికి తీసుకు రాదలిచానంటూ, “తుపాకి పట్టినవాడు తుపాకేతోనేమరణిస్తాడన్న' సామెత సభ్యులకు గుర్తు చేశారు. (ప్రతి పక్ష సభ్యులొకరు, ఈ సామెత నిరంతరం తుపాకుల రక్షణలో మసిలే మీకు కూడా వర్తిస్తుంది కదా! అని చమత్కరించారు. అంతా గొల్లున నవ్వారు. చమ త్కార సంభాషణలతో, నవ్వుల మధ్య డప్పులయ్య హత్య ఉదంతం అలా ముగిసి పోయింది. అలా ముగిసిపోయేదేకానీ.... మరి నాలుగు నెలల తర్వాత ఇంగ్రండులో ఫెస్ట్విబ్‌ ఆఫ్‌ ఇండియా పెద్ద ఎత్తున నిర్వహించబడింది. ఆ జీత్సవానికీ భారత గ్రా నలుమూలల నుంచి రెండు వందల మందికి పైగా కళాకారులు తరలి వెళ్ళారు భారతీయ సంస్కృతి, జానపద కళలు, నృత్యాలు, సంగీతం గురించి పెద్ద ఎక్స ప్రచారం ఇవ్వబడింది. భారత ఉపరాష్ట్రపతి ఉళ్నవాన్ని మరునాడు ఆవిష్కర్‌స్తారనగ్గా ఆ రోజు రోత్రి సిసిబి టీవీలో భారత దేశం మీద రిచర్డ్‌ డాక్యుమెంటరి ప్రసారం చెయ్యబడింది. అందులో డప్పులయ్య హత్య ప్రేక్షకులందర్నీ విస్మయంలో ముంచెత్తింది. ఆవిష్కరణొత్నవాసిక ఆహ్యానించబడిన ప్రముఖ ఇంగ్లీషు కళాకారులు ఉత్సవాన్ని బహిష్కరించ కాకుండా నల్లబేడ్డీలు ధరించి, నల్లజండాలతో మౌనంగా నిరసన (ప్రదర్శన చేశారు. అంతర్జాతీయంగా గగ్గోలు రేగింది. భారత ప్రభుత్వానికి అది ఇబ్బందికరంగా పరిణమించింది. లండన్‌ లోని ఇండియన్‌ హైకమీషన్‌-ఢిల్లీ -హైదరాబాద్‌ల మధ్య సంభాషణలు జరిగాయి, సందేశాలు నడిచాయి. రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రిగారు హైదరాబాద్‌లో (ప్రత్యేక పత్రికా సమావేశంలో ఆలస్యంగానైనా నిజం నిరూసించబడినందుకు సంతోషించి, నేరస్తులు ఎంత ఉన్నత స్టానంలోఉన్నా వారిని చట్టం శిక్షించి తీరుతుందని, వారు తప్పించుకోలేరని ఉద్దాటించారు. స్టానిక పోలీసు ఇనస్పెక్టరు సస్పెండు చెయ్యబడ్డాడు. గౌరవనీయులైన స్టానిక శాసన సభ్యులు రాజీనామా చేసి, అరెస్టయి, వెంటనే బెయిలు మీద విడుదల య్యారు. ముఖ్యమంత్రి తన సహాయనిధి నుంచి డప్పులయ్య కుటుంబానికి లక్ష

తోలేటి జగన్నోనానరావు 77 రూపాయలు ఆర్దిక సహాయం అందచేశారు. అతని స్మారక చిహ్నంగా ఒక ఆడిటోరియం నిర్మాణానికి ప్రముఖ కళాకారులతో ఒక కమిటి ఏర్పడింది. ఆలస్యంగా కళ్ళు తెరిచిన స్టానిక పత్రికలు తమ నోరు అరువిచ్చాయి. పత్రికలలో బాగా ప్రచారం వచ్చింది. నెల రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా పోగు పడింది.

దస్థాలయ్య మమోరియల్‌ హాల్‌_త్వరలోనే తయారయింది. _ అధునాతన సౌకర్యాలన్న ఉన్న పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ హాలు అది. దాని (ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. పెప్సీ కంపెనీ వారు పూలతో తూర్పు వైపున పెప్సీ గేటు పెట్టారు. పోటీగా పశ్చిమం వైపున కోకాకోలా వారు కోక్‌ గేటు పెట్టారు.

ముఖ్యమంత్రి గారు ప్రాంగణంలో ఉన్న డప్పులయ్య కాంస్య వి[గ్రహానికి దండలు వేసి నమస్కరించారు. (ప్రారంభోత్సవానికి డ్‌్సులయ్య దళ మిత్రులను ఆహ్వానించారు. దళం వారికి అతిధి గృహంలో చక్కటి ఏర్పాట్టు చెశారు. వారి కోసం ఒక కారు ఇచ్చారు. వారికి సరియైన సౌకర్యాలు సకాలంలో అందేలా చూడడానికి ఒక ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించారు.

ఆరోజు సాంస్కృతిక ప్రదర్శనకు నగరంలోని 'ప్రముఖులూ, పేరు పొందిన కళా కారులూ వచ్చారు. పట్టుచీరెల రెపరెపలతో, రకరకాల సెంట్ల గుబాళింపులతో హాలంతా కళకళలాడింది.

శివదళం పాడింది, ఆడింది. కాని కాంక్రీటు పంజరంలో కోకిల పాట హాస్యా స్పదంగా ద్వనించింది. వాళ్ళు బహిరంగ ప్రదేశంలో గొంతెత్తి పాడటానికి అలవాటు పడిన వాళ్ళు. చిటికేస్తే ఉరుము ఉరిమినట్లు వినిపించే అధునాతన సౌండ్‌ సిష్టమ్‌ లో వాళ్ళు అరుస్తూ, కేకలేస్తూ గోలగా పాడితే, అంతా గందరగోళంగా తయారయింది. వాళ్ళ గజ్జెల చప్పుళ్ళు, డప్పుల మోతలూ వికృతంగా (ప్రతిధ్వనించాయి. అజీర్షమే తప్ప ఆకలి ఎరుగని శ్రోతలకు వాళ్ళ ఆకలి పాటలు విసుగు, చికాకు, ఒక్కోచోట జుగుప్ప కలిగించాయి. అయినా ఆహ్వానితులు సభామర్యాద తెలిసినవారు. పైగా ముఖ్యమంత్రి ప్రదర్శన పూర్తయ్యేవరకూ లీనమై చూస్తూ కదలలేదు. ఆహ్వానితు లందరూ కూడా చిరునవ్వుతో, మొహాలలో భావం కనపడనీయకుండా చివరివరకూ ఉండి సభాకార్య క్రమం జయప్రదం చేశారు.

అంతా సవ్యంగా ముగిసింది. డప్పులయ్య మెమోరియల్‌ హాల్‌ ఇంక డియం హాల్‌గా ప్రసిద్ధికెక్కుతుంది. అక్కడ ఏడాది పొడుగునా సినీ తారలకు సన్మానాలు, జన్మదిన వేడుకలూ, పెళ్ళిళ్ళూ, సమావేశాలూ, సెమినార్హు వర్కుషాపులు జరుగు తాయి. ఏడాదికోసారి డప్పులయ్య వి[గ్రహానికి తప్పకుండా ఒక దండ పడ్రుతుంది.

అంతా సవ్యంగానే ముగిసింది.

అయినా శివకు ఎందుకో దిగులుగా ఉంది. ప్రదర్శన నవ్వుల పాలయిందని అతనికి అర్దమైంది. కాని దిగులు అందుకు కాదు. లక్షరూపాయలు ధన సహాయం

78 లక్ష్మీ కటాక్షం చేసి డప్పులయ్య కుటుంబం వీధుల్లో పడకుండా నిలబెడితే, అతని పేరు శాశ్చతంగా నిలిచిపోయేలా అద్భుతమైన ఆడిటోరియం వెలిస్పే దానికి సంతోషం కాక దిగులెందుకో అతనికి అర్హం కాలేదు. ఎవరో నేర్పుగా పన్నిన వలలో చిక్కుకు పోయి, వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలై, సిగ్గూ లజ్జా వదిలేసి, వాళ్ళ ఎదురుగా నగ్హంగా ఆడినట్టుగా ఉంది అతనికి . తిరిగి వెడుతున్నప్పుడు రైల్లో కూడా అతను ఏవీ మాట్టాడలేదు. అతని మిత్రుల మనసుల్లో కూడా స్పష్టంగా ఇదీ అని వర్షించలేని ఆవేదన నిండి ఉంది. ఎవరైనా సంభాషణ ప్రారంభించినా కొనసాగక ఆగిపోయి నిశ్శబ్దమవుతోంది. వాళ్ళు దిగాల్సిన రైలు స్టేషను వచ్చింది. ఆ చిన్న స్టేషన్లో రైలు దిగి వాళ్ళు బయటకు వచ్చారు... అక్కడ స్టేషను మెట్ట మీద కూర్చున్న ముష్టిది ఆకలితో అల్లల్లాడుతున్న బిడ్డకు ప్లాస్టిక్‌ కప్పులోంచి అల్యూమినం చెంచాతో -నీళ్ళు- పట్టి స్తోంది. శివని చూసి ముష్టిది సందేహిస్తూ చేతులు చాపింది. అతను తన దగ్గరున్న రొట్టెముక్క, ఒక రూపాయి ఆమెకిచ్చాడు. ఆమె శివ పొదాలకు తల తాకిస్తూ ఏదో గొణిగింది. మరో గంట తర్వాత గూడెం చేరేటప్పటికి చీకటి పడుతోంది. కాని ఇంకా వెలుగుంది. గూడెం ముందు ఈత చెట్ల దగ్గర పిల్లలు ఆడుతున్నారు. దూరంగా గుడొసెల మధ్య నుంచి ఓ ఆడదాని ఏడుపు భయంకరంగా వినిపిస్తోంది. మధ్య మధ్య మొగుడు కాజోలు' తిడుతున్న తిట్టు కర్షకరోరంగా వినిపిస్తున్నాయి. అక్కడంతా దుమ్ము, ధూళి, దరిద్రం, నిండివుంది. శివ దళాన్ని గుర్తు పట్టిన పిల్లలు ఆటలు ఆపేసి వాస్‌ చుట్టూ మూగారు. చింపిరి తలలు, చిరుగు గుడ్డలు, పోషణ లేక బక్క చిక్కిన శరరాలు-వాళ్ళని చూస్తే శివకి తన బాల్యం గుర్తుకొచ్చింది. వాళ్ళు దరిద్రంలో పుట్టారు. దరిద్రంలో పెరుగుతున్నారు. చివరకు దరిద్రంలోనే రాలిపోతారు. ఈ రోజు కేరింతలు కొడుతూ ఆడుతున్న ఈ పసివాళ్ళ నవ్వు, ఆనందం, మరో పదేళ్ళలో మాయమైపోతాయి. ఎందుకు పుట్టారో , ఎందుకు బతు కుతున్నారో, ఎందుకు ఛస్తున్నారో తెలియ కుండానే దుమ్ములో కలిసిపోతారు. మరో విధమైన జీవితం ఉంటుందని, అందులో ఆశలూ, సంతోషాలు ఉంటాయనీ , అల్దాంటి జీవితం జీవించే హక్కు తమకీ ఉందనీ తెలియకుండానే వాళ్ళు రాలిపోతారు. అక్కడికి, ఇక్కడికి ఎంత తేడా! వెన్నెల వెదజల్లే విద్యుద్దీపాలు, వేసవి ఎరుగని ఏసీ గదులు, హోటళ్టు, క్షబ్బులు, కార్డు-ఒకచోట అంత ఐళశ్చర్యం ఎలా పోగుపడుతోంది? ఇక్కడ ఇంత దరిద్రం ఎందు కుంది? 'లోకమంతా ఈ గొప్పా - బీదా అంతరం అనాదిగా ఉంటున్నదే అననీ! ఇదే లోకం తీరు అననీ! కూలిపోయిన కూలీల రాజ్యాలు చూపించి ఎగతాళి చెయ్యనీ।

తోలేటి జగన్మోహనరావు 79 నేను మాత్రం ఇది అసహజం అంటా. ఎవరు విన్నా వినకపోయినా - ఒంటరిగానైనా సరే - గుండెలు పగిలేలా గొంతెత్తి అరుస్తూ ఇది అన్యాయం అంటా! ఈ దుర్మార్గాన్ని నేను సహించను...” -శివకి ఆవేశంతో పాటు, ఏవీ చెయ్యలేని తన నిస్సహాయతకు ఉడుకుమోత్తనంతో కన్నీరు పొంగుకొచ్చింది. ఆ కన్నీటి తెరచాటున డప్పులయ్య రూపం అస్పష్టంగా కనిపించింది.

అతను కళ్ళు తుడుచుకుని, చేతి కర్ర నేలలో దింపి దానికి ఎర్రజండా తగిలించాడు. హరికేను లాంతరు వెలిగించి, చెట్టు కొమ్మకి వేలాడదీశాడు. ఎర్ర రుమాలు తీసి తలకు చుట్టుకుని డప్పు అందుకున్నాడు.

జజ్జణక.... జజ్జణక .. జజ్జణక.. డప్పులయ్య డప్పు మళ్ళీ మోగసాగింది. పాయ్యిల ముందు వంట ప్రయత్నాలలో ఉన్న ఆడవాళ్ళు తలెత్తి చూశారు. బీడీలు కాలుస్తూ. కబుర్జు చెప్పుకుంటున్న మొగాళ్ళు బీడీలు ఆర్పి చెవుల్లో పెట్టి లేచారు. శివగొంతులో తమ (బ్రతుకు పాట వినడానికి గూడెంలో చిన్నా పెద్దా, ఆడా మగా, అందరూ అతనిచుట్టూ మూగారు. ఆ సమయంలో దళవంతకీ డప్పులయ్యకు నిజమైన నివాళి ఏవిటో అర్ధమైంది. వాళ్ళు పదం అందుకున్నారు...

“అయ్యోరయ్యో - రయ్యో

అప్పలకొండో - కొండో

రండో రండో - రండో

రండోహో - రండోహో'

జజ్జణక .... జజ్జ్బణక...జజ్బణక.... డపులయ్య డప్పు విరామం లేకుండా మోగుతూ అడవుల్లో జ లుట్తో నగరా్తో ప్టీల్లో వల్లో కార్ధానాలలో ప్రతిద్ధనిస్తూ అభాగ్యులైన అప్పల కొండల్ని పిలుస్తోంది. ఈ లోకం అందరిదీ అనీ, ఈ లోకంలో మనిషిగా బతికే హక్కు మాకూ ఉందని నిలదీసి అడగండని వెన్ను తట్టి లేపుతోంది.

( సాహిత్య నేత్రం భైమాసిక పత్రిక 6, 7 సంచికలు- జూలై, సెప్టెంబరు 1996)

ర్దక్రమా

“గుడ్‌ మార్నింగ్‌ ఎవ్విరిబడి' అన్నాను నేను స్తాఫ్‌ రూంలో అడుగుపెటి, “ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుగొచ్చు. నువ్వు ఇంగ్లీషులో ఏడ్వక్కర్రేదు” అన్నాడు తెలుగు టీచర్‌ విశ్వనాథం. విళ్చేనాధం ఇంగ్లీషులో రెండు వాక్యాలు సరిగా మాట్టాడలేడు. అంచేత ఇంగ్రీసు మాట్టాడితే వాడికి కోపం - 'అయినా పన్నెండు దాటింది. ఇంకా మార్షింగేవిటి నీ తలకాయ.....”

“డ్రిల్లు మాస్టర్‌ (బైయిన్‌ బూటులో ఉంటుంది. రొటీన్‌గా లెఫ్ట్‌, రైట్‌ అనడం తప్పు అంత ఆ చన ఎక్కడుంటుంది?" అన్నాడు సత్యన్నారాయణ ఇంగ్లీషులో. వాడు ఇంగ్లీషు టీచ్‌ చేస్తాడు. శామ్యూల్‌ జాన్సన్‌ అంతటివాడిననుకుంటాడు.

వాళ్లిద్దరికి నన్ను చూస్తే అసూయ. వాళ్ళే కష్టపడి పోతున్నట్టు * నీకేం? పిల్లాయ లకి బంతో, బేటో పడేసి (గ్రవుండులోకి తోలేసి హాయిగా, కాళ్ళు పారజాపుకు కూర్చుం టావు' అని గోల పెడతారు.

ఇంగ్రీషు - తెలుగుల జాయింట్‌ ఎటాక్‌ నుంచి తప్పించుకోడానికి, అప్పుడే ఉసురు స్తురంటూ స్టాఫ్‌ రూంలోకి వస్తున్న శర్మగారిని ఏవిటి శర్మగారూ, ఇహెళ కూర? *' అని పలకరించాను.

“కూరా? నా పిండాకూడా? పూజలోంచి లేచేలోగా మాడి చచ్చింది' అన్నారు ఆయన విసుగ్గా.

శర్మగారి భార్త, వాళ్ళమ్మాయికి ఆరోగ్యం బాగా లేదంటే చూడడానికి వెళ్ళింది. రెండు నెలల నుంచీ అక్కడే ఉంటోంది. అమ్మాయికి డెలివరీ అయితే కాని తిరిగి

తోలేటి జగన్మోహనరావు 81 రానని ఉత్తరం రాసింది. శర్మగారికి మడి, ఆచారం ఎక్కువ. హోటల్లో భోంచెయ్యరు. ఆయనే వండుకుంటున్నారు.

'అలా చెయ్యి. కాల్బ్చుకోకపోతే హాయిగా కొడుకూ, కోడలు దగ్గర ఉండ కూడదూ? కోడలు వండి పెట్టేది కదా! మా వియ్యంకుడి గారికి కోడలి చేతి భోజనం తినే అదృష్టం లేదు' అంది దయామణి వరస కలిపి నవ్వుతూ. ఆ మాటంటే శర్మగారు ఉడుక్కుం టారని తెలుసు. ఆయన్ని ఉడికించడానికే అలా అంది అవిడ.

శర్మగారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. టీచరుగా శర్మగారు సంపాదించి నదేవీలేదు. కొడుక్కి పెళ్ళి చేద్దామని ఆయన ఆలోచిస్తుండగా ఆ కుర్రాడు అతని ఆఫీసులోనే పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి, కానీకట్నం లేకుండా పెళ్లి చేసు కున్నాడు. "పైగా వర్ణాంతర వివాహం. కొడుకు హరిజనుల అమ్మాయిని చేసుకున్నా డంటి కూతురికి అసలు సంబంధాలు రావేమో అని ఆయన బెంగ పెట్టుకున్నారు. చివరకు మంచి సంబంధం వచ్చింది, కానీ వాళ్ళు శర్మగారి పరిస్థితి గమనించి, బిగిసి, కట్నం ఎక్కువ అడిగారు. కొడుకు ఆదుకున్నాడు. ఎక్కువ కట్నం ఇవ్వగానే వాళ్ళ అభ్యంతరాలన్నీ తొలగిపోయాయి. కాబోలు. ఆ పెళ్ళి సవ్యంగా జరిగి అమ్మాయి హాయిగా కాపురం చేసు కుంటోంది. శర్మగారు చాలా కాలం కొడుకు ఇంటికి వెళ్ళలేదు. కానీ, ఏవనుకున్నారో ఏమో, కూతురి పెళ్ళయ్యాకా కొడుకు ఇంటికి వెళ్ళి రావడం మొదలు పెట్టారు. అయితే కొడుకు ఇంట్స్‌ ఇప్పుడు కూడా పచ్చి మంచ్చి నీళ్ళు ముట్టరు.

  • _..కోడలక్కర్లేదు కాని కోడలి డబ్బు మాత్రం కావాలి మా అన్నయ్యగారికి' అంది దయామణి మళ్ళీ.

“వాడి చెల్లెలి పెళ్ళికి వాడు ఖర్చుపెట్టాడు..."- అంతవరకు మౌనం వహించిన శర్మ గారు ఇంక తప్పనిసరై నోరు విప్పారు.

“అంతా అల్టుడిగారి డబ్బే కాబోలు - మా అమ్మాయి సంపాదన లేదా? పెళ్ళి ఖరు భరించడానికి కోడలు కావల్సి వచ్చింది. కాని పెళ్ళి బంతిలో కూర్చోడానికి పనికి రాలేదు" అంది దయామణి ఎత్తిపొడుస్తూ,

పెళ్ళికి కొడుకూ, కోడలు వచ్చి, కొంచెం సేపు ఉండి వెళ్ళి పోయారు. వాళ్ళని ఉండమంటే (బ్రాహ్మల బంతిలో కూర్చోబెట్టాలా, విడిగా కూర్చోబెట్టాలా అన్న సమస్య వచ్చింది. బ్రాహ్మల బంతిలో కూర్చోబెడితే పెళ్ళివారూ, పెళ్ళికచ్చిన (బ్రాహ్మలూ లేచి పోతారేమో? పెళ్ళి కూతురి అన్నా వదినెలకు, బంధువులతో పొటు కాకుండా విడిగా ఏ అరుగుమీదో వడ్డిస్తే బాగుంటుందా? ఈ ఆలోచనతో సతమతమవుతూ ఆయన వాళ్ళను భోజనాలకి ఉండమనలేక పోయారు. దయామణికి ఆ విషయం చాలా కష్టంగా తోచింది. అప్పట్నుంచీ అవకాళం చిక్కినప్పుడల్లా శర్మగారిని సూటిపోటి మాటలంటోంది.

శర్మగారు నూటికి తొంబై మంది లాగా మంచైనా, చెడైనా, వాలులో కొట్టుకుపోయే మనిషే కాని, లోకానికి ఎదురీది నిలువగల ధైర్యం, మొండితనం ఉన్న మనిషి కాదు. ఎన్నోసార్లు ఆయన నా దగ్గర, ' ఏవిటోరా చం(ద్రం! వాళ్ళు... ఇంటికి

82 లక్ష్మీ కటాక్షం వస్తే భోజనానికి ఉండమనలేకపోయాను' అని కస్పళ్ళు పెట్టుకున్నారు కూడా.

దయామణికి సూటిగా ఏం సమాధానం చెప్పలేక, "పెళ్ళి చెయ్యాలన్నా, పీనుగు లేవాలన్నా, మానాభిమానాలు వదిలేసి, 'భిక్షాందేహి' అని నలుగురి కాళ్ళూ పట్టుకోవాల్సిన వాళ్ళం. మాకేమన్నా ఆస్తిపాస్తులున్నాయా? కాలేజీల్లో కోటాలా? ఉదో గాల్డో తిజర్వేషన్లా? ఏవుంది నా(శ్రాద్దం...... అంటూ తనకు అలవాటైన పద్దతిలో ఫ్లాంకీ నుంచి ఎటాక్‌ మొదలుపెట్టారు శర శ్రైగారు.

'ఆస్తి లేకపోతేనే? వంశపారంపర్యంగా వస్తున్న తెలివి తేటలున్నాయి మీకు! హరి జనుడికేమో ఇంకా ఒక కాలు బేల లోనే ఉంది. అలాంటి వాణ్ణి మెరిట్‌ పేరుతో మీతో సమానంగా పరిగెట్టమంటారు. పైగా అది న్యాయం అంటారు. అమ్మో! ఎన్ని తెలివి తేటలు? ఎంతైనా కరణం బుద్ది పోనిచ్చుకున్నారు కాదు శర్మగారు” అందీ దయామణి వెటకారంగా, +

ఆ తర్వాత విశ్శనాథం, సత్యనారాయణ.... అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ కబుర్దు మామూలుగా రోజూ ఉండేవే అయినా , మాటల విసురు చూస్తే ఇది చినికి చినికి గాలి వాన అయ్యేలా ఉంది అనిపించింది నాకు, నేను కలగచేసు కోకుండా వాళ్ల మాటలు వింటూ కూర్చున్నాను.

“'మీరేవీ అనుకోకపోతే ఓ మాట అడగనా?'- రాజుల లక్ష్మి గారు కలుగచేసు కుంటూ అన్నారు - 'మీరు టీచరు, మీ ఆయన క్రాస్‌టు గెబీటెడ్‌ ఆఫీసరు. ప్సీ విజయని మో పిల్లల కంటే ఎక్కువగా రెసిడెన్షియల్‌ కాన్వెంటులో చదివించార్తు. అమ్మాయికి మెడిసిన్లో సీటొచ్చింది. రేపు డాక్టరవుతుంది. సమాజంలో ఉన్నత స్తానం చేరుకున్న మీలాంటి వారికి కూడా రిజర్వేషన్టు ఏవిటి చెప్పండి.....'-సన్న సన్న్‌గా ఆంటించింది ఆవిడ. లక్ష్మిగారి అబ్బా యికి మంచి మార్కులొచ్చినా ఏ ఇంజినీరొంగ్‌ కాలేజీలోనూ సీటు రాలేదు. అందుగురించి ఆవిడకి చాలా కష్టంగా ఉంది

అక్ష్మిగారు రంగంలోకి దిగడంతో, ఆడ అభిమన్యుడిలా మాటల బాణాలు అటూ ఇటూ చక చక విసురుతున్నా , ఒంటరిదైపోయింది దయామణి. కాష్ట్‌ మాస్టారు వెంకటే శ్చ(ర్రావు గారు ఆవిడకి మాట సపోర్టేనా ఇవ్వకుండా తనకేం పట్టనట్టు గదిలో ఓ మూల కూర్చుంటే, దయామణికి తోడుగా ఆయన్ని రంగంలోకి

  • దించుదామని, “ఏం మాస్టారు! మీ మాట్లాడటం లేదు" అన్నాను ఆయనక్షేసి తిరిగి.

'ఆయ్య్‌....నేనేం మాట్లాడనండీ? దయామణిగారు చెబుతున్నారు. కదా..." అన్నారు ఆయన చేతులు నలుపుకుంటూ.

ఆయనది అదో స్వభావం. నలుగురితోనూ కలవరు. బర్త్‌డే పార్టీలనీ, పెళ్ళిళ్ళనీ ఫంక్షన్తనీ, టీచర్లందరం ఎవరి ఇంట్లోనో ఒకరింట్లో కలుస్తూనే ఉంటాం. కాని, ఆయ సాధారణంగా ఎవరింటికీ రారు. ఆయన ఇంటికి మమ్ముల్ని ఎప్పుడూ పిలవలేదు. 'ఎక్కడుంటారు మాస్టారూ?” అంటే, సంత మార్కెట్టు ఎనకాలరిడి.... దయామణి

గారికి తెలుసండి,' అని మాట తప్పించేస్తారు కాని సరిగా చెప్పరు. మొన్న దయామణి కొత్త ఇల్లు గృహప్రవేశానికి, టీచర్తందరం ఫామిలీలతో వచ్చీనాా ఆయన మాత్రం ఒక్కరే వచ్చి కాసేపు మొహమాటంగా కూర్చుని వెళ్ళి పోయారు ఆయన ఫామిలీ

ఛోలేటి జగన్మోహనరావు 83 తాలూకు వాళ్ళెవరూ రాలేదు. దయామణి లాగా ఆయన పెద్ద తెలివి తేటలున్నవారు కారు. ఆర్టికంగా కూడా అంత బాగా ఉన్నట్టు కనిపించరు. అంచేత కొంచెం ఇన్‌ఫీరియారిటీ ఫీలవుతున్నారేమో అనిపిస్తుంది నాకు.

వెంకటేశ్చ(ర్రావు గారు అలా అనగానే దయామణి ఆయనకేసి ఒకసారి నిరసనగా చూసీ, లక్ష్మిగారి కేసి తిరిగి అంది - * మన బీడివో గారు ఎంత అద్దె ఇవ్వడా నికి సిద్దమైనా కొత్తపేటలో ఆయనకు ఇల్లు దొరికిందా? మీ ఇళ్ళల్లో మేం తాగిన కాఫీ కప్పులు మీరు ముట్టుకోకుండా పనిమనిషి చేత కడిగించడం నాకు తెలియ దనుకుంటున్నారా? సమాజంలో పైకి రావడం ఎక్కడ? ఏ ఉద్యోగం చేసినా, ఏ పదవిలో ఉన్నా హరిజనుడి స్టానం అట్టడుగునే. ఎంత పైకొచ్చినా అంటరాని వాడుగానే చూస్తారు...”

“వాళ్ళూ, వీళ్ళూ మీకు అన్యాయం చేశారని మీరు అవేశపడుతున్నారు. కాని మీరు మీ వాళ్ళకు ఏం చేస్తున్నారో కొంచెం ఆలోచించండి." -రాజుల లక్ష్మిగారు ఊరుకోలేదు. దయామణి ఈ మధ్య మారుతీ కారు కానుకు నందుకు అవిడకి అసూయగా ఉంది. ఆ ప్రస్తావన తీసుకొస్తూ అంది-..... కార్లలో 'దూసుకుపోయే మీలాంటి వాళ్ళు పొలంలో ఒక కాలు, స్కూల్లో ఒక కాలు ఉండే దళితులతో సమానమెలా అవుతారు? వాళ్ళపేరు చె్టి తరతరాలుగా (ప్రత్యేక సౌకర్యాలు మీరే అనుభవించడం మీ సోదరులకు (ద్రోహం చసినట్టు కాదా?"

శర్మగారు సపోర్టు దొరకడంతో విజబ్బంభించారు - 'దయామణి కొడుకు, కూతు ళ్ళు, మనవలు, మునిమనవలు అందరికీ రిజర్వేషన్లు ఉండాలి. వాళ్ళే బాగుపడాలి, ఎవరు ఎలా పోయినా సరే! రేపు దయామశణిని 'బేఫ్‌ మినిస్టర్‌ని చేసినా, (ప్రైమ్‌ మినిష్టరును చేయ లేదు కాబట్టి దళితులకు అన్యాయం జరిగిపోయిందంటుంది....

“బ్రాహ్మలమని చెప్పుకోవడం కంటే రిజర్వేపన్లే ముఖ్యమనుకుంటి, ఇప్పుడు రూల్సు మారాయంటున్నారు కదా, మీ మనవలకి తల్లి కులం రాయించండి చూద్దాం, అని దయామణి ఛాలెంజ్‌ చేస్తుండగా, నాకు అర్జంటు ఫోనొచ్చిందని కబురు వస్తే హెడ్మాస్టరు గారి ఆఫీసుకు వైగల్టైను కంగారుగా.

మా కుర్రాడు సూపర్‌మేన్‌లా మెడకు టవలు చుట్టుకుని గోడమీంచి దూకి, ఆకాశంలోకి ఎగిరి పోవడానికి బదులు నేల మీద పడి కాళ్ళు విరగ్శొట్టుకున్నాడట -మా ఆవిడ ఖంగారుపడుతూ చెప్పింది. వాణ్ణి డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్ళాను. కాలు బెణి కింది కాని విరగలేదని, ఆయేన అయింట్‌మెంటు రాసి, కాపడం పెట్టమన్నారు.

“ఇరవైనాలుగ్గంటలూ అలా టీ.వీ ముందు ఏడుస్తుంటే ఇలాంటి వెధవ అయిడి యాలే వస్తుంటాయి. టి.వీ ముందు నుంచి లెమ్మంటే ప్రాణం పోతుంది మీకు... అని విసుక్కున్నాను.

“బావుంది, టీ.వీ చూస్తున్న పిల్లలంతా నోడలమీంచి దూకి కాళ్లు విరగ్గొంటుకుంటు న్నారా? ఎవరి పోలికలొచ్చాయో? కోతి వెధవ... కోతిబుద్దులు " అంటూ మొదలు పెట్టింది మా ఆవిడ. నేను చెవులు మూసుకోబొతుంటే, 'గుడ్‌మార్నింగ్‌ సార్‌ అని విని పించి ఉలిక్కి పడి చూశాను. ఎదురుగా నా ప్రియ

84 లక్ష్మీ కటాక్షం శిష్యుడు జగన్నాధం మధ్యాహ్నం పోస్టు తీసుకొస్తూ కనిపించాడు.

“ఎలా ఉన్నావురా నాయనా ? ,

(బ్రహ్మాండంగా ఉన్నాను సార్‌! మీ దయవల్ల ....

'నా దయ ఏమిటి? దేవుడి దయ అను. ఆయన దయ వల్లనే నీకీ ఉద్యోగం వచ్చింది.....”

“అమ్మ! అలా అనకండి సార్‌! మీరు డ్రిల్లు చేయించిన కాళ్ళు ..... ఎన్ని మైళ్లు నడిచినా, సైకిలు తొక్కినా అలుపు సొలుపూ లేదు. "

'ఉత్తరాలేమైనా ఉన్నాయా?

జగన్నాధం ఉత్తరాల కట్ట తెరిచి చూస్తూ-'.... విష్ళవాధం మౌస్పారు.... వెంకటే శ్య(ర్రావుగారూ.... దయామణి మేడం.... సుల్తాన్‌ గాడు.... మీకు లేవు సార్‌.... ఏవిటిలా డాక్టర్‌గారి దగ్గరకు వచ్చారు?” అన్నాడు.

విషయం వివరించి, “నువ్వు స్కూలుకి వెళ్ళినపుడు నేను కొంచెం ఆలస్యంగా వస్తానని హెడ్మాస్టర్‌ గారికి చెప్ప అన్నాను.

వాడు డాక్టరుగారికి ఉత్తరాలు అందించి, స్కూలువైపు వెళ్ళిపోయాడు, నేను ఫ్యామిలీని ఇంటి దగ్గర దిగబెట్టి స్కూలుకు తిరిగి వచ్చి “హెడ్మాస్టర్‌ గారి ఆఫీసులో అడుగు పెట్టే సరికి అక్కడ వాతావరణం సీరియస్‌గా ఉన్నట్టు కనిపించింది. విశ్చనాధం, శర్మగారు. రాజుల లక్ష్మి గారు, ఏదోతప్పు చేసిన వాళ్ళలా నిలబడి ఉన్నారు. వాళ్ళ హెడ్మాస్టరుగారు అంటున్నారు-'........ నేనెన్నో సార్హు చెప్పాను... స్కూల్లో ఇటువంటి విషయాలు మాట్లాడొద్దని... ఒకళ్ళ 'మనసులు ఒకళ్ళు కష్టపెట్టుకోవడం, మనసుల్లో ద్వేషం పెరగడం తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? నా మాటవింటే కదా”

“అసలు దయామణే మొదలు పెట్టింది..... కావలిస్తే వీళ్ళనడగండి...'- శర్మగారు సణుగుతున్నట్టు సంజాయిషీ ఇచ్చారు,

ఒ.... అవిడ మొదలుపెట్టిందే అనుకోండి... మీరందరూ దాన్ని తెగేదాకా లాగాలా? మాస్టారూ! మీరు వయసులో పెద్దవారు. మీకు చెప్పడం బాగోదు. అందరూ ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళండి. మీరు చదువు చెప్పకపోయినా పరవాలేదు కాని మీకేస్ట్‌ పాలి టిక్స్‌ పిల్లల బుగర్రలకి ఎక్కించి వాళ్ళని పాడ్డు చేయకండి. వెళ్ళండి"

  • హడ్మాస్టరుగారు చికాగ్గా అన్నారు. అంతా ఆయన ఆఫీసునుంచి నిళ్ళబ్దంగా బయటకి నడిచారు.

“ఏవైంది లక్ష్మిగారూ?” - రాజుల లక్ష్మిగారిని ఆపుచేసి మెల్లగా అడిగాను.

నృన్యండగాన మొదలైంది కదా చంద్రం! తర్వాత పదినిమిషాలకి నా క్లాసుకు

టైమవుతే నన్లు వెళ్ళి పోయాను. నా క్షాసయి అరగరిట క్రితం తిరిగి వచ్చేటప్పటికి, స్టాఫ్‌ రూంలో దయామణి ఏడుస్తూ "కనిపించింది. ఏమైందంటే మాట్లాడదు. ఏం జరిగిందో నాకూ తెలియదు” అన్నారావిడ,

నేను అడిగి చూస్తాను" అంటూ స్టాఫ్‌ రూం వైపు దారి తీశాను. స్టాఫ్‌ రూం దగ్గర వరండాలో తచ్చాడుతూ వెంకటేశ్చ([ర్రావుగారు కనిపించారు.

తోలేటి జగన్నోహనరావు 85

“ఏవైంది మాస్టారూ?"

ఆయన కంగారు పడి నాకేసి చూశారు. ఆయన మొహం పాలిపోయి ఉంది.

"నేను... వద్దంటూనే ఉన్నానండి .. దయామణి గారికి ఇష్టం లేదు... నా మాటెవరింటారండ్‌?' అన్నారు తయన తడబడుతూ. ఆయనేం మాట్లాడుతున్నారో నాకు అర్దం కాలేదు.

'దయామణి స్టాఫ్‌ రూంలో ఉందా?”

“ఆయ్‌ ..ఉన్సారండీ'

స్టాఫ్‌ రంలో నేను అడుగుపెట్టగానే దయామణి కళ్ళెత్తిచూసింది. కాని ఏం మాట్లాడలేదు. ఆవిడ ఏడ్భినట్టు ఎర్రబడ్డ కళ్ళు, ఉబ్బిన మొహం చెబుతూనే ఉన్నాయి. నేను ఆవిడ ఎదురుగా కూర్చుని తటపటాయిస్తూ అన్నాను.

“మిరు .. అలా .... ఉంటే...... మాకేం బాగాలేదు...”

దయామణి ఏం మాట్లాడలేదు.

లం శరస్మిగారికి చాదస్తం.... కాలం మారినా కొంతమంది మనుషులు మారరు..... అంతె

పెచ్చి బ్రామ్మడు - ఆయన్ను అనుకోడం దేనికి పాపం?”

“'మర్‌?'- నేను తెల్లబోయాను.

దయామణి హాండ్‌బ్యాగ్‌లోంచి ఇన్లాండ్‌ లెటర్‌ తీసి ఇచ్చి జేబు రుమాలుతో కళ్ళు తుడుచుకోవడం మొదలు పెట్టింది. నేను కంగారు పడుతూ కవరు తెరిచాను. అందులో ఒకే ఒక వాక్యం ఉంది - 'అమ్మా! నేనూ, రవి, ఈరోజు ఉదయం పెళ్ళి చేసుకున్నాం - విజయ. ఉత్తరం తేదీ పన్నెండు. అంటే విజయ పెళ్లయి మూడురొజులైంది.

“రవి ఎవరు?”

'వెంకటేశ్వ(ర్రావుగారి అబ్బాయి"

“మన వెంకటేళ్ళర్రావు ళా?!

“'మ....న.... వెంకటేశ్వ[ర్రావు.....గా...రే...'-వెటకారంగా అంది దయామణి.

“'మన వెంకటేశ్వ[ర్రావుగారబ్బాయా? వాడికేం? చాకులాంటి కుర్రాడు. కొంచెం నల్లగా ఉనా కలైన "ముఖం. నెమ్మదస్తుడు.... బుద్దిమంతుడు... " - దయామణి మొహం లో రంగులు మారడం 'చూసి నేను కోంచెం తగ్గాను - '.... మీకు చెప్పకుండా, మీరు లేకుండా పెళ్ళి చేసుకున్నందుకు మీకు బాధగానే ఉంటుంది. విజయ అలా చేసి ఉండకూడదు. అయినా వాడు మనకు తెలియని వాడు కాదు కదా! వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు. పోనీండి. పైగా మీరూ .... మీరూ ఒకటే కదా”

అలా అనగానే నేనూ ఏదో కాని మాట అన్నట్టు చదయామణి మొహం కందగడ్డలా ఎర్రబడింది- 'వాళ్ళూ, మేమూ ఒకటెలా అవుతాం? వాళ్ళు యండీస్‌”

“యండీస్‌ అంటే?

“మాదిగలు - వాళ్ళూ, మేమూ ఒకటెలా అవుతాం? ”" అంది దయామణి రోషంగా.

(ఆంధ్రప్రభ వారపత్రిక. 14&5.19097)

బహుఛత్రాధిపతి గ ల్‌ 5

మౌజీ యమ్మెల్యే బాపినీడు ఉదయమే లేచి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కొబ్బరి కాయకొట్టి, ఆంజనేయ స్వామివారికి హారతిచ్చి. 'శ్రీరామ చంద్రా ! ఏడేళ్ళ నుంచి వన వాసం చేస్తున్నా నీకు దయగలగడం లేదా! ఇప్పుడేనా నన్ను రూలిం పార్టీలో చేర్పించు రామయ్య తండ్రి” అని శ్రీరామచంద్ర మూర్తిని. రాముడు కాకపోతే రహీం కరుణించి తన్ను పదవిలోకి లేపకపోతాడా అనే సెక్యూలర్‌ ఆశతో 'బిస్మాల్లా యే రెహ్మాన్‌ ఉర్‌ రహీం' అని రహీంనీ, ఇంకా కోటి దేవుళ్ళందర్నీ పేరు పేరునా, షక్షసాతం లేక్సుండా పదవి కోసం వేడుకుని, ఏడుగంటలవుతుండగా అప్పాజీకి ఫోన్‌

శాడు.

అప్పాజీ నేటి రాజకీయాలకి గంగోత్రి లాంటివారు. ఎనభై ఏళ్ళచ్చాక క్రియాళీల రాజకీయాలనుంచి ర్షిటైరై ముసలి పులిలా వానప్రస్టాశ్రమంలో ఉంటూ, తెర వెనుకనుంచి. రాజకీయాలు నడిపిస్తున్నారు ఆయన ప్రస్తుతం. స్టేట్‌ లోనూ, సెంట్రల్‌లోనూ , లెన్ట్‌ రైటు, సెంటర్‌ పార్టీలోనూ - అన్ని చోట్లా ఆయన శిష్య గణం ఉంది.

అలాంటి అపోజిషన్‌ శిష్యపరమాణువు బాపినీడు ఫోను పక్కమీంచే అందుకుని, ఏంటి బాపినీడు! నిద్రపీనివ్వవుకదా! తెల్లారకుండానే ఫోన్‌ +శీశావంటి? అన్నారు అప్పాజీ బద్ధకంగా.

“నా బతుక్కి తిల్లారడమంటూ ఉంటదా, అప్పాజీ! ఏడేళ్ళనుంచి సంర కట్టయి చీకట్లో పడేడుస్తున్నా తవరికి దయ కలగడం లేదు" అన్నాడు బాపినీడు : గులుగా.

“నా దయేంటి? ఆ దేవుడి దయుండాలి గాని "

తోలేటి జగన్నోహానరానవు 87

“కనికరించి గుడి కడితే గుళ్ళో ఉంటాడు, -కోపగించి తన్ని తగలేస్తే ఈదిలో ఉంటాడు. మీలాంటోళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ మీ దయా దాక్షిణ్యాలమీద బతికేవోడు ఆడి దయ నాకెందుకు, మీ దయుండాలి గానీ" అని దేవాంతకుణ్ణై కొంచెం పొగిడి, “బాపినీడు మీ శిష్యపరమాణువేకదా! ఆడు ఎక్కడ సచ్చాడో, ఎలా సచ్చాడో పట్టించుకుంటున్నారా? అన్నాడు బాపినీడు అభిమానంగా ఆరోపణ చేస్తూ.

'పట్టించుకోకపోవడవేమిటి? ఏళాపాళా లేకుండా రేత్రీ, పగలూ ఫోన్‌ చేసి నన్ను సంపు తూనే ఉన్నావు గదా! అయినా నేనప్పుడే సిలక్కిచెప్పినట్టు చెప్పాను = పార్టీకి నూకలు చెల్లిపోయాయి బాపినీడు - జెండా మార్చి రూలింగుపార్టిలో కల్సిపో” అని - ఇన్నావా? పాలి టీషియన్‌ గాలి కోడిలాంటాడు. ఎటు గాలి వీస్తుందో చూసి గమ్మున అటు తిరిగి పోవాలి. లేకపోతే ఆడికి లైపుండదు' అని గాలికోడి న్యాయం వివరించారు అప్పాజీ,

ఆ సంగతి బాపినీడికీ తెలుసు. 'గాలి' వీస్తోందని తెలిసింది కాని, ఎటునుంచి ఎటు వీస్తోందో సరిగా అర్ధం కాక రాంగ్‌ డైరెక్షన్‌లో, రాంగ్‌ టైంలో తిరిగిపోయి దెబ్బ తినేశాడు బాపినీడు._ఆవిషయం గుర్తుకొచ్చి, 'వాలు గాలనుకుని ఎదురు గాల్మ్‌ నిలబడి హైదరా బాద్‌నుంచి ఎగిరి అంతర్వేది సముద్రంలో పడ్డాను అప్పాజీ! మన జాతకం బాగోలేదు. ఏపార్టీలో కాలెడితే అది అప్పోజిషన్లోకి పోతోంది" అన్నాడు బాపీనీడు దిగులుగా .

“అందుకే రూలింగ్‌ పార్టీ వోళ్ళు నిన్ను చేర్చుకోవడానికి బయపడతన్నారు. నీ జాతకం దెబ్బ ఆళ్ళకు కూడా తగుల్తుందేమో నని ఆళ్ళ బయం”

“బాబ్బాబు! ఇది ఫోను కాదు, మీ కాళ్ళనుకోండి . పదవి లేకుండా ఈదిలో కెల్టా లంటే బంటేటీద నూలు పోగు లేకుండా ఎళ్ళినట్టు సచ్చే సిగ్గుగా ఉంది. నా మానం కాపా డండి అప్పాజీ అన్నాడు బాపినీడు కళ్ళనీళ్ళతో.

“ఈ ఫీల్టులో దిగీనోడికి సిగ్గూ లజ్జా ఉండకూడదు; కిందటెలక్షన్సలో పెద్దసూరీడు సన్నాసోడి ఏషం ఏస్తే చిన్నసూరిడు సీర కట్టుకుని ఓట్లడగలేదూ! ఆళ్ళేమన్నా సిగ్గుపడ్డారా?”

'ఆళ్ళ సంగతి ఇప్పుడెందుగ్లానీ, బాబ్బాబు, పవర్‌ కనెక్షన్‌ ఇప్పించండి అప్పాజీ! మీ రుణం ఉంచుకోను' అన్నాడు బాపినీడు బతిమాలుతూ.

“'సూద్దాం లే"

'సూద్దాంలే అంటే కాదు. మీరో మాట చెబితే ఆళ్ళు కాదనరు. మీరీ పని 'సెయ్యక పోతే 'నా సావుకి కారణం అప్పాజీయే' అని ఓ ఉత్తరం రాసి మీ ఇంటిముందు. ఏపసెట్టుకి ఉరేసుకు సచ్చిపోతాను. ఆపైన మీఇష్టం.” అన్నాడు బాపినీడు గారంగా మంకుతనం చేస్తూ.

'రూలింగ్‌ పార్టీ వోళ్ళతో ఇవాళ మళ్ళీ గట్టిగా మాట్టాడతానుగాని, నువ్వాపని చెయ్య కు. నాకు సచ్చిన సెవాలంటే సచ్చే బయం'

అప్పాజీ దగ్గర అలా మాట తీసుకుని, హుషారుగా ఫలహారం చెయ్యడానికి డైనింగ్‌ టేమీల్‌ ముందర కూర్చున్న బాపినీడుకి ఎదురుగా బిస్కెట్ట స్టేటు

88 లక్ష్మీ కటాక్షం కనిపించగానే, 'ఇదేంటి? రోజూ కుక్క బిస్కట్లేనా! కోడిగుడ్తట్రా' అని అరిచాడు చికాగ్గా.

'అండు నిమిషాల తర్వాత బాయిల్డ్‌ ఎగ్స్‌ మీద ఆయన చెయ్యి పడబోతుండగా రోజూలాగానే బుల్లోడు న్యూస్‌ పేపర్‌తో వచ్చి, సుప్రభాతం చెప్పి కూర్చొ బోతూ కోడిగుడ్ల ప్లేటు చూసి ఉలిక్కిపడ్డాడు. బుల్లోడు బాపినీడుకి సెక్రటరీ. పదో తరగతి పాసై లోడ్డ' మీద తిరుగుతుంణే బాపినీడై. గారు దయతలచి ఏదైనా ఉద్యోగం ఇప్పించక పోతారా అనే ఆశతో బుల్గోడి తండ్రి వాడిని ఆయన కాలువులో పెట్టాడు. తండ్రికున్న ఆశలు కాని, బాపినీడు గారంటే భయభక్తులు కాని కొడుక్కిలేవు.

“పేపర్టో ఏంటి వార్తలు బుల్లోడా?”

రోజూ ఆయన నాస్తా తీసుకునే. టైములో బుల్లోడు పేపరు చదివి ఏనిపిస్తూంటాడు. బాపినీడు ప్రశ్న వినిపించుకోకుండా కోడిగుడ్ల ప్లేట్‌ కేసే చూస్తూ , 'అదేంటి? అలా కోడొ గుడ్డు తినేస్తున్నారు. అసలే మీరు బీపి, హార్ట్‌ పేషెంటు" అన్నాడు బుల్టోడు ఆశ్చర్యంగా.

ఆ మాట వినగానే బాపినీడు బీపీ అయిదు పాయింట్లు పెరిగింది. పెరిగిపోతున్న రక్తపోటుని అదుపులో తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ "పేపరు చదువు బుల్లోడా అన్నడు ఓ కోడి గుడ్డు అందుకుంటూ.

“అందులో కోలెస్ట్రాలుంటుంది' అన్నాడు బుల్లోడు హెచ్చరిస్తూ,

“అదేంటి?”

“అది లోపలికెళ్ళి గుండెకట్టుకుని పిసికేస్తది. పేపర్గో ఇప్పుడే చదివా”

బాపినీడు గుండెలో ఒక్కసారి సూది పుచ్చుకు పొడిచినట్టయింది. ఆయినా బింకంగా *“డాక్టర్లలాగే అంటారు బుల్లోడా! అయి మనం పట్టించుకోకూడదు.” అన్నాడు.

మా పెద్ద మావయ్య ఇలాగే వాదించి, కోడికి కోడి లాగించేసి, చేతులు కడుక్కోడానికి నూతి దగ్గరీకెళ్ళి, అక్కడ బాల్చీ తన్నేశాడు. మళ్ళీ లేవలే" - డాక్టర్ల మాట పట్టించుకోకపోతే సీమవతుందో సోదాహరణంగా వివరించాడు బుల్లోడు,

“నువ్వెళ్ళి ఆఫీసు,గదిలో కూర్చో బుల్లోడా” అని బుల్లోణ్ణి పంపించేసి, “పోన్లే! ఇదీ మన మంచికి. ఇప్పుడిప్పుడే కొంచెం సెక్కుతున్నాం. హెల్తు బాగుపడి మళ్ళా పవర్గోకి వచ్చేటప్పటికి ఫిట్టగా ఉంటాం అనుకుని కోడి గుడ్డ ప్లేటు అవతలికి గెంటి, 'కుక్క బిప్కెట్ట ప్లేటు అందుకుని, నాస్తా అయ్యాక, 'బుల్లోడా! నేను దేశాటనకెడుతున్నాను.

ఆఫీసు జాగ్రత్త అని చెప్పి, దేశాటనకి బయలు దేరాడు మాజీ ఎమ్మెల్యే బాపినీడు. కారుమీదకంటే పవరులేనివాడు కాలినడకనే ఓటర్లకు దగ్గరవుతాడని బాపినీడు పాద యాత్ర చేస్తూ రైలు గేటుపక్కన కిళ్ళీ కొట్టు దగ్గరకు చేరాడు ఆయాసపడుతూ, “ఏంటి విశేషాలు? '- అడిగాడు బాపినీడు కిళ్ళీ కట్టించుకుంటూ. “ఏం విశేషాలు బాపినీడుగారూ - క్రొంపలంటుకుపోతే * “ఎవరి కొంపలంటుకున్నాయంట?' - తాపీగా కిళ్ళినములుతూ అడిగాడు

తోలేటి జగన్మోహనరావు 89 బాపినీడు.

“రాత్రి జేజే నగర్‌ అంటుకుపోయింది. తవరికి తెల్దా?”

బాపినీడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 'బంగారం లాంటి వార్త తెలీ లేదు. ఈ పాటికి పేపర్గో ఫొటోలతో సహా పడేది. ఇంకా మించిపోయింది లేదు' అనుకుని ఇంటికి పరుగు తీశాడు.

“బుల్లోడా ! నిన్న రాత్రి జేజే నగర్‌ అంటుకుపోయిందట తెలుసా?” - అడిగాడు బాపినీడు.

'తెల్టు'- కుర్చీలో వాలిపోయి, టేబుల్‌ మీద కాళ్ళు పెట్టి, సినిమా పత్రికల్గో బొమ్మలు తదేక దీక్షతో చూస్తున్న బుల్ఫోడు, బాపినీడు గొంతు వినిపించగానే కాళ్ళు టేబుకీ మీదనుంచి దించి నిర్హన్మంగా సమాధానం చెప్పాడు.

నీకేం తెల్టు? కోడిగుడ్డులో కొ...కా...కొ...కొ...'

“ొలెస్టరాలు - గుండెకంటుకుని పిసికేస్తది”

'అదే - అలాంటెదవ నాలెడ్డి తప్ప పనికొచ్చేదొక్కటీ తెల్పు”

ఊళ ఎయి జరుగుతాయి. నాకేం తెలుస్తాది?”

(మరి ఉద్యోగం ఏంటి?”

“ఇది ఉద్యోగవా!”' - బుల్లోడు ఆశ్చర్యంగా ప్రశ్నించి , బాపినీడు తెల్లమొహం వేయ డం చూసి, తనే సమాధానం చెప్పాడు - 'అరవై రూపాయల బోడి జీతానికి అరవచాకిరి”

'సర్లే! సరే! నీతో వోదించడానికి నాకు టైం లేదు. నేనాళ్ళని పరామర్శించడాని కెళుతున్నా. నువ్వు దాసుకి ఫోను చేసి కమేరా పుచ్చుకు రమ్మని చెప్పు. ఇదిగో, కుర్ర గాడిదను పంపించొద్దను. ఎదవ ఫోటో ఎలా తిశాడో చూళావుగదా' అన్నాడు బాపినీడు,గతం గుర్తుకొచ్చి నిట్టూరుస్తూ, ం

ఆ మధ్య గోదావరి వరదలు వచ్చినప్పుడు ఏటి గట్టున కట్టేసిన పశువుల్ని పరా మర్శించడానికి వెళ్ళాడు బాపినీడు. ఆ సమయంలో ఓ గేదెకి ఆయన స్వయంగా గడ్డి తినిపేస్తుంటీ ఈగంత దోమ ఒకటి ముక్కుమీద వాలి ఆయన్ను విసిగించసాగింది. ఆయన ముక్కు కదిపీ, బుగ్గలాడించీ, మీసాలూగించీ, దోమను లేపుదామని ఎంత (ప్రయ త్నించినా కదలలేదు. మరి లాభం లేదని, 'నీ యమ్మా..." అని దోమని తిడుతూ. కుడిచేత్తో ముక్కుమీద కొట్టుకుంటూ వుండగా, దాసు అసిస్టెంటు (కురగాడిద) ఫొటో లాగేశాడు. బుల్లోడు బాపినీడుకి చూపించకుండానే ఆ ఫోటో థ్రెస్‌కి పంపేశాడు.

మర్హాడు ఆ ఫొటో నగరం నుంచి వెలువడే సంచలన పత్రిక 'కోడికూతి మొదటి మ్యోః ప్రచురించబడి సంచలనం కలిగించింది.

“బాపినీడు గేదెలకి గెడ్డెడతన్నాడా, లేకపోతే ఆటికాడ గెడ్డి లాక్కుని తినేస్తన్నాడా” అని ఎగసార్లీ వాళ్ళు చమత్కరించారు, ఆ ఫొటో చూసి,

బాపినిడు గేదె దగ్గర గడ్డి లాక్కుని తినేస్తుంటే, 'ఎలాంటోడు ఎలా అయిపోయాడు బాపినీడు," అని గేదె జాలిగా ఆయన వైపు చూస్తున్నట్టుగా ఉంది ఆ

90 లక్ష్మీ కటాక్షం ఫొటోలో.

'ఎంత పవర్హో లేకపోతే మాత్రం గేదెలకాడ గెడ్డి అలా తినొచ్చా బాపినీడు? అందులోనూ పబ్లిగ్గా" అని బాధపడ్డారు ఆయన పార్ట్షీవాళ్ళు.

నేను గెడ్జెడతన్నాను కాని గెడ్డోతింటల్లేదు బాబోయ్‌! ఈ మధ్య హెల్తు బాగోక డైటింగుకూడా చేస్తన్నా' అని గొల్టుమన్నాడు బాపినీడు.

'మేమంతా డైటింగు చెయ్యటంలా పవరుపోయాక? మన సోములు గాడెలా టోడు? పదివేల టన్నుల సిమెంటు తిని ఆరాయించుకుని పైల్యానులా తెరిగేవోడు ఎరక్షయిరీ కమిషను జడ్జిగారికి ఆడు తిన్న సిమెంటేమైందో అంతే తెలీలేదు. ఆడి బ్దడ్‌ టెస్సు చేసి 'నా సర్వీసులో ఎంతో మంది కేడీల్ని, డాకూల్ని చూశాను గాని, నీలాంటోజ్ఞ సూళ్ళేదు నీ బ్బడ్‌ లో సిమెంటు టట్రేసే కనిపించడం లేదు” అని ఆశ్చర్యపోయి, అభినందించి, క్షీన్‌ సర్టిఫికెట్‌ ఇని సుప్రీంకోర్టుకి ఎళ్ళిపోయాడు. అలాంటి ఆకలి, జీర్ణ శక్తి ఆడిది. మొన్న తిరుపతిల్‌' 'రాజుగారూ, రాజుగారూ' అంటే, ఆణ్జి చూసి అడుక్కు తినేవోడనుకుని ఓ రూపాయి చేతిలోపెట్టి ఎళ్ళి పోతుంటే, ఆడుచేతులట్టుకు గొల్టు మంటే తెలిసింది సోములుగాడని. ఈ నాలుగేళ్ళ కరువులోనూ తినడానికి ఏం చిక్కక టి.బి. పేషెంటులా అయిపోయాడు.

అడే కాదు, మేవంతా ఎలా అయిపోయావో సూడు. ప్రతీ కుక్కకీ ఓ మంచి రోజుంటుందన్నాడు ఇంగ్రీషోడు. ఆ మంచి రోజు కోసం కళ్ళల్లో (ప్రాణాలెట్టుకుని ఎదురు సూస్తున్నాంగానీ, నీలా గేదెలకాడ గెడ్డికి కక్కుర్తడ్డావా?' అని పార్టీ రాజుగారు మందలించి- ఏంటి, అప్పాజీతో డైలాగులు నడుపుతున్నావంట?" అని ప్రల్నించారు, బాపినీడు షాగ్లీ మార్చబోతున్నాడన్న వార్తలు ప్రస్తావించి.

“అప్పాజ్‌ అలా రూమర్జు పుట్టిస్తున్నాడా! కాటికి కాళ్ళు సాచిన ముసిలోడికి ఇదేం బుద్ధి? అని ఆశ్చర్యం నటించి, “రాజుగారు సివరికి నా పాతి(వ్రత్యాన్నే సెంకిస్తున్నారన్నమాట! అని బాధపడి, “అల్లకి ఓ ఐడియాలజీ, పాయింటూ, (ప్రోగ్రాం ఉన్నాయా? ఛ....ఛ.... పంది జన్నెత్తి బురదగుంటలోనైనా దిగుతానుగాని, ఆ పార్టీలో చేరతానా?” అన్నాడు బాపినీడు ఆవేశంగా.

“ఆ ముక్క పబ్లిగ్గా చెప్పి పత్రికలాళ్ళ నోరు మూయించకూడదూ!'

“ఆళ్ళను చేతికొచ్చినట్టు రాసుకోనివ్వండి, నా సంగతి తవరికి తెలీదా? "

“నీ సంగతి నాకు తెలీదా”

“మీ తోడు"

“నన్ను సంపేకు బాపినీడు! ఇంకా బాగా సైకెళ్ళి సీయంవో, పీయంవో అవ్వాల్సినోణ్ణి' అన్నారు రాజుగారు అదిరిపడి.

రాజుగారి తీరు చూస్తుంటే ఆయనకు తన మాట మీద విశ్వాసం కలగలేదేమో నని అనుమానం వచ్చి, గమ్మున కుర్చీలోంచి కిందకు జారి రాజుగారి చెప్పులందుకుని, నెత్తి మీద పెట్టుకునీ పరుగు తీశాడు బాపినీడు.

రాజుగారుతేరుకుని, “నువ్వుల్తాయలిస్టువే బాపినీడూ! ఒప్పుకున్నాను. నా చెప్పు "న్చేసే' అంటూ బాపినీడు వేనకాల కొంత దూరం పరుగెత్తి, తారురోడ్డు మీద

తోలేటి జగన్మోహనరావు 9| కాళ్ళు కాలగా రెట్టింపు వేగంతో వెనక్కు వచ్చిపడి, 'తెల్టారి లేచింతర్వ్యాత ఇది మూడో జత వచ్చిన ప్రతీవాడు చెప్పులట్టుకుపోవడానికి ఇది పార్టీ ఆఫీసా? బాటా షాపా?' అంటూ చిందులు తొక్కారు.

ఆ రాజుగారు నిన్న రాత్రి తనంతట తనే ఎందుకనో ఫోనుచేసి బాపినీడు ఆరోగ్యం గురించి పమర్శించి, అవీ ఇవీ మాట్లాడి, 'ఆ రూమర్హు ఖండిస్తూ నీ పేర నేనే ఓ (ప్రెస్సు స్టేటుమెంటు ఇచ్చేశాను బాపినీడూ' అన్నారు క్యాజువల్‌గా.

“మంచి పనిచేశారు. అసలు నేనే వచ్చి తమ దర్శనం చేసుకుందా మనుకుంటున్నాను"

“నువ్వు రావద్దు బాపినీడోయ్‌' అంటూ రాజుగారు కంగారుగా పోన్‌ పెట్టేసి, చెప్పులు స్టీలుబీరువాలో పెట్టి తాళం వేసి, బీరువా తాళం చెవులు డ్రాయర్‌లో పెట్టి (డ్రాయర్‌ తాళం వేసి, ఇంకా ధైర్యం చాలక, 'ఒరేయ్‌ సెక్రటరీ! నువ్వు ఆఫీసు బయట నుంచి తాళం వేసి బాపినీడొస్తే నేను ఏక్సిడెంటులో సచ్చిపోయానని సెప్పు, అంటూ టేబుల్‌ కిందకు డైైన్‌ చేశారు.....

అగ్నిబాధితులను పరామర్శించడానికి వెళ్ళ బోతున్న బాపినీడు ఆ విషయం గుర్తుకొచ్చి రాజుగారు నిన్న రాత్రి అంత అర్జెంటుగా ఎందుకుఫోను చేశాడా అని ఆలో చిస్తూ మేకప్పు మార్చడానికి లోపలికి వెళ్ళాడు

“'హలోదాసుగారూ! స్‌ బాపినీడుగార్తి సెక్రటరీ బుల్లోణ్లి మాట్లాడుతున్నా నండి. మీరు అర్జంటుగా జేజే నగర్‌ వెళ్ళాలండి. బాపినీడు గారు అక్కడికెళ్ళారండి...... బాబ్బాబు... కుర్రగాడిదను పంపించకండి. (శ్రమనుకోకుండా మీరే వెళ్ళండి. ఫొటో సరిగ్గా రాకపోతే గోల పెట్టేస్తాడు ముసిలి ముండాకొడుకు”

“ఎవుణ్లి పరగడుపునే ' తిడతన్నావు? * - సందర్భానికి తగినట్టు మాసిపోయిన గళ్ళ. లుంగీ: చిరిగిపోయిన బనియను వేసుకుని నేత్తిమిద పాతబట్టల మూట పెట్టుకుని లోపలి నుంచి హాలులోకి వస్తూ చివరి మాటలు విన్న బాపినీడు అనుమానంగా అడిగాడు.

'దాసుని - కుర్రాణ్ణి రావద్దంటున్నాను. వాడు సరిగా తియ్యకపోతే దాసు గోలెడతా డని? దాసునే పంపించమంటున్నాను' అని ఏ మాత్రం తడబడకుండా సమాధానం చెప్పాడు బుల్లోడు.

“ఈడు చది ఏది నిజవో, ఏదబద్దవో, దేవుడికైనా తెలీదు. ఈడు పూర్తిగా క నా అండర్‌లో ఉంటే నన్ను మించినాడైపోతాడు 'అనుకుని, * దాస్తుకి మస్తీ

స్టైసి పెర్సనల్‌గా రమ్మన్నానని పెర్చనల్‌గా నేను చెప్పిపట్టు చెప్పు ' అని జేజే నగర్‌క పరుగు తీశాడు బాపినీడు.

అక్కడ బట్టల మూట దించి అందరకీ పాత బట్టలు పంచిపెట్టాడు. ఓ కుర్రాణ్మి ఎత్తుకుని" వాడి చీమిడి ముక్కు తుడిచి, ముద్దాడి , చాక్లెట్‌ నోట్టో పడేసి కితకితలు పెట్టి నవ్వించాడు. కాలిపోయిన పాకలో దిగులుగా కూర్చున్న ముసలయ్యను, ఏడ్చెదాకా ప్రష్టించి కళ్లు తుడిచాడు. ముసలమ్మ నాలుగు నూకల్తో గంజి కాచుకుంటూంటె, 'అమ్మా - నాకు ఆకలేస్తోందమ్మా' అంటూ ఆ గంజి తాగేశాడు.

92 లక్ష్మ కటాక్షం

బాపినీడు వెనకాలే తన పని తాను చేసుకుపోతున్న ఫొటో([గ్రాఫరు దాసు ఉలిక్కిపడి, 'ఓవరైపోయి. బాపినీడు గారికి ఓ ఓటు పోయింది, అనుకున్నాడు మనసులో.

అగ్ని బాధితులందరికీ ఒక్కొక్కరికీ లక్షరూపాయలు ఆర్దిక సహాయం చేయాలని, వాళ్ళు తీసుకున్న బేంకు లోన్హు మాఫీ చెయ్యాలనీ, అన్ని బాధితుల పిల్లలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్సుండాలనీ, అక్కడ బడుగు వర్గాలకు ఓ బడుగు సినిమాహాలు కట్టించి , బడుగు సినిమాలు ఉచితంగా చూపించాలనీ డిమాండుచేసి, ఆ డిమాండ్లన్ని ప్రభుత్వం అంగీకరించేవరకు ఆ క్షణం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని హర్థర్తానాల మధ్య (ప్రకటించి, ఓటర్లకు అలా చేరువయ్యే అవకాశం కల్పించినందుకు ల్‌ వుడికి కృతజ్ఞతలు తెలుపుకుని, ఇంటికొచ్చి తృప్తిగా భోంచేసి నిద్రపోయాడు బాపినిడు.

మర్నాడు ఉదయం బాపినీడు డైనింగ్‌ టేబుల్‌ ముందర కూర్చుని, ఆమైట్‌- టైడ్‌ సై సులూ తినబోతుండగా బుల్గోడు న్యూస్‌ పేపర్‌తో వచ్చి, ఆమ్రెట్ల 'స్పటు చూస్తి వ... ప్ఫ్‌..... ' అంటూ నిట్టూర్చి నిలబడి పోయాడు.

“ఈ ఎదవ దిష్టి తగిలింది ఇవ్వాళ కూడా ' అని మనసులో తిట్టుకుని స్టేటుమీంచి వాడి దృష్టి మరల్చడానికి", " ఏంటి దేసం. విశేషాలు బుల్లోడా అనడిగాడు బాపినీడు.

“రత్నం టాకీసు ్రాపైటరు రత్నం తెలుసా?"

“ ఆడు తెలీకేం - గున్న ఏనుగులా సూడముచ్చటగా తిరుగుతుండేవోడు”

“క ఆడు గున్నఏనుగులా సూడముచ్చటగా తిరగడు'

“అదేంటి?

'ఆడు నిన్న రాత్రి సచ్చిపోయాడు”

'ఏం పాపం?

“'హార్టెటాకుట...."

బాపినీడు గుండెల్లో మళ్ళీ ఒకసారి సూది పుచ్చుకు ఫొడిచినట్టయింది. విసురుగా ఆమెట్ల ప్లేటు పక్కకు తోసేసి, బిస్కెట్ట ప్లేటు అందుకుంటూ, 'తెల్దారకుండా సావు కబురు మోసుకొచ్చావు” అన్నాడు రుస రుసలాడుతూ.

“నిన్న కొంపలంటుకుంటే చెప్పలేదన్నారు కదా"

“అది న్యూసు బుల్లోడా”

“కొంపలంటుకోడం న్యూసయితే గుండాగిసావడం కూడా న్యూసే” అన్నాడు బుల్లోడు వాదనలోకి దిగుతూ

కాదు"

“అవును

'కొంపలంటే ఓట్లు బుల్లోడా + నీకు పాలిటిక్సు తెలీదు. అదేరు, ఇదేరు”

వేరు కాదు, అదీ” ఇదీ బకటే'

తోలేటి జగన్నోసానరావు 9వ కాదు '

“అవును'

“ఇంక వాదించకురా మొగడా, నా బీపీ పెరిగిపోతోంది. ఆసలు నువ్వు నాకు సెక టరీవా, లేకపోతే నన్ను సంపేడానికి ఎగస్సార్టీ వోళ్ళు పంపించిన ఏజెంటువా' అని అరుస్తుండగా అప్పాజీ కారు వచ్చి ఆగింది

హడావిడిగా కారు దిగుతూ, "కొంప మునిగింది బాపినిడూ* అన్నారు అప్పాజీ.

బాపినీడు కళ్ళు మిలమిలా మెరిసాయి. ఈ రోజు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా దేవుడిచ్చిన వరంలా వచ్చిందీ వార్త మరి ఆలోచించకుండా కారులోకి దూకి, పదండి" అన్నాడుబాపినీడు.

“ఎక్కడికి? ' - అయోమయంగా అడిగారు అప్పాజీ.

'కాంపలు ములిగాయి కదా. వరద బాదితుల్ని పరామర్శించొద్దాం. ఒరే బుల్లోడా! నువ్వు దాసుకి ఫోన్చైయ్‌ ....”

'నా తలకాయలా ఉంది" అన్నారు అప్పాజీ తలపట్టుకుంటూ,.

'ఏవైంది?'

'అంతా పెంట పెంట చేశావు కదా బాపినీడూ?”

“ఏవైంది ? సూటిగా చెప్పండి" అన్నాడు బాపినీడు అయోమయంగా.

“ఏంటిది?” అన్నారు అవ్వాజీ ఆ రోజు పేపరు చూపిసూ -పంది జన్మ ఎత్తి బురద గుంటలోనైనా దిగుతాను కానీ, రూలింగ్‌ పార్టీలో చేరతానా?నీలివార్తలు ఖండిస్తూ బాపినీడుగారి ప్రకటన" అన్నవార్త చూపించి - 'నా బొంద ఏంటిది? రెండ్రోజులు రూలింగోళ్లకి నచ్చ చెప్పి నిన్ను చేర్చుకోవడానికి ఒప్పిస్తే ఇవ్వాళ్ళ పొద్దుటే పేపర్‌లో ఈ స్టేట్‌మెంటు” అన్నారు అప్పాజీ విసుగ్గా

'ఆళ్ళు ఒప్పుకున్నారా? అయ్యో' - బాపినీడు రెండు చేతులతోనూ, తల పట్టుకుని గొల్టుమన్నాడు - ” ........ ఆ ఉప్పందే కాబోలు మొన్న రాత్రి రాజుగారు ఫొస్టేసే నా పేరన ప్రెస్సు స్టేట్మెంటిచ్చేస్తానన్నాడు. దొంగ ముండా కొడుకు”

“ఆడిచ్చాడా? నువ్విచ్చావా?”

'అడే ఇచ్చాడు"

'సంతకం పెట్టావా?”

"పెట్టలే"

'పల్లదులే. ఓ పిడేద్దాం' - అప్పాజీ కొంచెం శాంతించి ఆఫీసు గదిలోకి నడుస్తూ అన్నారు.

'ఏం పిడి?” - బాపినీడు ఆళ చిగురిస్తూండగా అడిగాడు.

అప్పాజీ సమాధానం చెప్పకుండా, కలం, కాగితం తీసుకుని రాయడం మొదలు పెట్టారు- దేశం గడ్డు పరిస్టితనెదుర్కొంటున్న ఈ సమయంలో, విభేదాలు మరచి భుజం భుజం కలిపి నడవాల్సిన ఈ తరుణంలో, పార్టీ కాదు, దేశం ముఖ్యం అని బాపినీడు లాంటి దేశభక్తులంతా పార్టీ విభేదాలు మరిచి దేశ సమగ్రతకు, జాతి ఐక్యతకు, పురోగతికి నడుం కడుతుంటే ఆయనపేరన ఈ ప్రకటన ఇచ్చిన

9్రగ లక్ష్మీ వటాన్షం (ప్రతిపక్షాల దేశ విద్రోహక్క సమాజ విద్రోహక చర్యలను ఖండించి, గర్హించి, దేశసేవకు పునరంకి తమయ్యారు శ్రీబాపినీడు ....." “సెబాష్‌ అప్పాజీ! సెక్యూలరిజం, బేక్‌ వర్డ్‌ క్లాసులూ, డెమో(క్రసీ - అయి కూడా రాయండి” “ఆయన్నీ రాశానుగానీ, ఓ ఏలి ముద్ర కొట్టు దానిమీద" “బుల్లోడా పెన్నందుకో 'సంతకం కాదు బాపినీడూ -ఏలి ముద్ర! సంతకవైతే ఎయ్యి రకాలుగా పెట్టి, గెప్పాద్దున్ననాది కాదు పొమ్మంటావు, మనదంతా పోలీసోళ్ళ పద్దతి - ఫింగరు ప్రింటుంటినే మంచిది.” “అదేంటి అప్పాజీ! నామీద మీకామాత్రం నమ్మకం లేదా - నేనెలాంటోళ్లో మీకుతెలీదా.' అన్నాడు బాపినీడు అమాయకంగా. 'నా శిష్యులెలాంటోళ్ళో నాకు తెలీదా," అన్నాడు అప్పాజీ నవ్వుతూ 'మీ తోడు" “నన్ను _అర్జాంతరంగా సంపేకు బాపినీడు. తాంబై తొమ్మిదో ఏట తొంబైరోజులు పియం అవ్వాల్సినోణ్లి - జాతకంలో రాసుంది” 'సెవరికి అప్పాజీ నా పొతివ్రత్యాన్నే సెంకిస్తన్నారన్నమాట' అన్నాడు బాపినీడు బాధపడుతూ, “పాలిటిక్సులో పాతివ్రత్యవేంటి? పాలిటిక్సులో జుట్టు పండిపోయి రాలిపోయినోణ్మి నాదగ్గర చెప్పకు ఈ కబుర్దు'" 'ఒరే బుల్లోడా - ఆ స్టేంప్‌ పేడ్‌ అందుకోరా' అన్నాడు బాపినీడు మరి తప్పక ఆ రాత్రంతా తను యమ్మెల్యే అయిపోయినట్టు మంత్రి అయిపోయినట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, తన ఇల్టు బంగారంతో నిండిపోయినట్టు తీయటి కలలతో బాపినీడుకి నిద్రపట్టలేదు. ఉదయమే దైన (ప్రార్ధన అయ్యాక, సూడు - బుల్గో డొస్తే ఆఫీసు గదిలో కూసోమని చెప్పు - లోపలకు మాత్రం రానివ్వక' అని వంటవాడితో చెప్పి, డజను కోడిగుడ్లతో ఆమెట్టు వేయించుకుని తృప్తిగా నాస్తా తీసుకుని, బ్రేవ్‌ మని డ్రేనుస్తూ ఆఫీసు గదిలోకీ వచ్చి కుర్చీలో కూలబడి, 'ఏంటి దేసెం విశేషాలు బుల్లోడా” అని అడిగాడు, అర్హనిమీలిత నేత్రాలతో, అక్కడ బుద్దిగా కూర్చున్న బుల్లోడికేసి చూస్తూ, కళ కళలాడుతున్న బాపినీడు మొహం కేసి ఓ సారి చూసి, “మీ స్టేట్‌మెంట్‌ పేపర్ణో వచ్చింది" అన్నాడు బుల్లోడు క్తుప్తంగా. “మన దళ మారిపోయింది బుల్ల! నీకేం కావాలో కోరుకో" అన్నాడు బాపినీడు వరాలినే దేవుడిలా, బుల్లోడి పాత తప్పులన్నింటిని ఉదారంగా క్షమించిస్తూ, “మి దశా మారలేదు, నా దశా మారలేదు. ఎడవ జాతకాలు ఎదవ జాతకాలే," అన్నాడు బుల్లోడు నిర్తిప్తంగా. న్న “అదేంటీ బుల్లోడా - మనపార్టీ పవర్గో ఉంది కదా" ఏ పార్టీ?'

తోలేటి జగన్మోవానరావు ర్‌

'ఇంకే పార్టీ? ఈ రోజు ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ"

“ఈ రోజు ఏ పార్టీలోఉన్నామో ఆ పార్ట్‌ మొన్న మనం ఏ పార్టీలో మో ఆ పార్టీ పొజిషన్‌లోకి వెళ్ళి. మొన్నటి పార్టీ, నిన్న మనం చేరిన పార్టీ పొజిషన్‌లోకి ఈ వేళ వచ్చింది" అన్నాడు బుల్లోడు తికమకగా.

“బుల్లోడా - నువ్వు ఇలా పొడుపు కథలతో పొడిసి సంపక, సంగతేంటో సూటిగా చెప్పు" అన్నాడు బాపినీడు విసుగ్గా.

“రూలింగుపార్టీలోనుంచి ఎనబైమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిమీద అవిశ్వాసం ప్రకటించి, ఆపోజిషన్‌తో చేతులు కలిపి, గవర్నమెంటు పడగొట్టేసి, రాజుగారిని కుర్చీలో కూర్చోబెడుతున్నారు. అదీ న్యూసు' - ఆ రోజు పేపర్ణో పతాక శీర్షిక వార్త చూపిస్తూ అన్నాడు బుల్లోడు.

“అంటే, ఇయాల మన పాజిషనీంటి?”

మొన్న ఉన్నవోటే ఉంటే ఇవాళ్ళ పవర్గో ఉండేవాళ్ళం. నిన్న మారడం వల్ల ఇవాళ మొన్నటి పొజిషన్‌లోకి వెళ్ళిపోయాం '" అని మట్లీ తికమకగా చెప్పి , బాపినీడు మొహం క్య్యశ్ళన్‌ మార్కులా సాగడం చూసి, 'అంటె బాపినీడుగారి ఇవ్వాల్టి పొజిషన్‌ ఆపోజిషనే'అని అరటి పండు ఒలిచి పెట్టినట్టు బుల్లోడు వివరిస్తుండగా -

'బు...ల్లో...డా..." అని బాపినీడు ఓ అరుపు అరిచి, కళ్ళు తేలేసి, కుర్చీలో వాలిపోతూ, కాళ్ళ దగ్గరున్న వేస్ట్‌ పేపర్‌ బేస్కెట్‌ని తన్నేశాడు.

“అరే | ముసిలోడు వెట్‌ తన్నేళాడే' అనుకుని, అంతలో బేస్కెట్‌ బకెట్‌ అవు తుందా కాదా అని డౌటొచ్చి, ఏం సక డాక్టర్‌గారికి ఫోన్‌ చేసి, " డాక్టరు గారూ! నేను బాపినీడుగారి సెక్రటరీ బుల్లోడిని మౌట్హ్రాడ్దుత్తున్నానండ్తి బాపినీడు. గారు బేస్కెట్‌ తన్నేశాడండి ఆయ్‌! బేస్కెట్ట్‌నండి - వేస్ట్‌ పేపర్‌ బేస్కెట్‌ - స్టాస్టిక్‌ది - అది తన్నే శాడండి- బేస్కెట్‌ అన్నా బకెట్‌ అన్నా ఒకటేకదండి - లేదండి - ఇప్పటిదాకా బాగానే ఉన్నారండి - నాస్తా అని చెప్పి, బకాసురుడిలా డజన్‌ కోడిగుడ్డు - ఆయ్‌! డజనండి - తినకూడదని చెప్పానండీ - హార్టూ, బీపీ, షుగరు కంప్టేంటు, పవరు కంప్పెంటు, ఇన్ని కంస్తేంట్లతో గేరంటీగా సచ్చిపోతారని కూడా చెప్తానంది మా పెద మామయ్య ఇలాగే కోడికి కోడి లాగించేసి = గుడ్డు కాదండి, కోజేనండి - బకెట్‌ తన్నేశాడండి - అది ఇనప బకె ట్టండి - అదీ చెప్పానండి- పోగాలం దాపించినోడు మన మాటెందుకింటాడండి? నాడా? నాకు నాడి చూడ్తం రాదు కాని, నాకేం డౌటు లేదండి. మీరోసారి వచ్చి చూసి ఎస్సంటే మిగతా ఏేర్పాట్టు చేసేస్తావండి' అని బుల్లోడు డాక్టర్‌ గారితో మాట్లాడుతుండగా, బాపినీడు కళ్ళు తెరిచి, నీరసంగా , " కొ..... .కొ.. .కొ. ...కొ. ...” అన్నాడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ.

“కొలెస్త్రాలా? గుండె పేసికీస్తదా? మరి పిసకదా? ఒకటా, రెండా.... పన్నెండు గుడ్డు' అన్నాడు బుల్లోడు మందలిస్తున్నట్టు.

నీ కొలెస్ట్రాల్‌ తగలడ' - ఉన్న ఓపికంతా కూడదీసుకుని, ఓ అరుపు అరిచి, మళ్ళీ నీరసం కమ్ముకు రాగా - కొ .. కొ..కొ...కా... కొంచెం మంచినీళ్ళిచ్చి..... అ.. .అ.... అర్జంటుగా అ....అ....అప్పాజీకి ఫోను కొట్టరా మొగడా, నన్ను

96 లక్ష్మీ కటాక్షం సం....సం...పెయ్యక' అన్నాడు బాపినీడు దీనంగా రెండు చేతులు జోడించి బుల్లోడికి నమస్కరిస్తూ.

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక నవంబర్‌ 30 - 6 డిసెంబర్‌ 1994)

ఈ పిట్టలకి తెల్లవారబోతోందని ఎలా తెలుస్తుందో? వేగు చుక్క కనిపించగానే ఎక్కడో పిట్ట లేచిన సవ్వడి అవుతుంది. క్షణాలలో మావిడి చెట్టు మీం, వేప చెట్టు మీంచి అన్ని వైపుల నుంచీ పెట్టల కలకలా రావం వినిపిస్తుంది. క్రమంగా ఆకాశం తెల్ల బడుతుంది. రెక్కలు తప తపలాడిస్తూ , హడావిడిగా అటూ ఇటూ ఎగురుతూ పిట్టలు....

నాకూ ఆ పిట్టలలాగా ఎగిరిపోవాలనిపిస్తుంది. కొనీ ....

నాన్నా, లేచావా' అంది పెద్దమ్మ వంటింట్లోంచి.

పెద్దమ్మ పిట్టల కంటే ముందే లేస్తుంది. కానీ వెలుగొచ్చేవరకూ _ ఏదో గొణుగుతూ, భగవంతుడిని ప్రార్ధిస్తూ చాప మీద అలాగే పడుకునుంటుంది. వెలుగొస్తే కాని పెద్దమ్మకు సరిగా కనిపించదు.

“నువ్వు లేవద్దు పెద్దమ్మా - ఇంకా బాగా వెలుగు రాలేదు"

నేను పెరట్లోకీ దార్‌ తీసీ, మావిడి చెట్టు చప్టా మీద కూర్చున్నాను.

ఉదయం జేళ చల్లటి గాలి వీస్తోంది. మనసు రోజూలాగ గజిబిజిగా లేక ప్రశాంతంగా ఉంది. మరిడుతున్నట్టుండే నా కళ్ళు ఇవాళ శాంతంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత నాకెంతో ఉత్సాహంగా ఉంది,

ఈ రోజు నుంచీ నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను.

గతవంతా పీడకలలా మరిచిపోతాను.

తెగిన గాలిపటంలా అటూ ఇటూ కొట్టుకుపోకుండా నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుని నడిపిస్తాను.

ర్క లక్ష్మీ కటాక్షం

ఈ నిర్యయం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. గుండెల నిండా చల్లటి గాలి పీల్చి మెల్లిగా వదిలాను. కొత్త శక్తి ఒళ్ళంతా పాకినట్టయింది.

కళ్ళు మూసుకుని, మళ్ళీ మెల్లిగా గాలి పీలుస్తుండగా .... అగరొత్తుల వాసన.....

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.

ఎవరో పూజ చేసి వెలిగించినట్టున్నారు - అగరొత్తుల వాసన మెల్లిగా అలుముకుంటోంది.

అగరొత్తుల వాసన తగిలినప్పుడల్దా నాన్న శవం గుర్తొచ్చి భయం వేస్తుంది.

మనసంతా కంగారుగా అయిపోతుంది.

నాన్న ఇరవై ఏళ్ళ క్రితం, నా చిన్నతనంలో పోయినా, అదంతా నిన్న కాక మొన్న జరిగినట్టనిపీస్తుంది.

చెరువు...

చెరువుముందు స్తంభాల ఇల్లు...

షోర్రటి గచ్చు...

ఎత్తు అరుగులు...

అరుగు మీద నాన్న శవం.....

అంతకు ముందు నాన్నని ఎప్పుడూ చూసినట్టు లేదు. అసలు అక్కడికి ఎలా చేరానో కూడా గుర్తు లేదు.

పెద్దమ్మ నన్ను అరుగు మీద దింపి, “మీ నాన్నరా" అంది నాన్న పడుకుని ఉన్నాడు. తల దగ్గర ప్రమిదలో నూనె దీపం వెలుగుతోంది. అక్కడ అంతా పహడావిడిగా, నిశ్శ బ్దంగా, నీడల్లా తిరుగుతున్నారు.

న్‌

== అక్కడ అగరొత్తుల వాసన.

“నిన్నెవరు పిలిచారే' అంటూ పెద్దమ్మని చూడగానే దూకుడుగా మీదకు వచ్చాడు ఒకతను. ఒత్తుగా మెలితిరిగిన మీసోలు.... ఎర్రగా ఉబ్బినకళ్ళు .... అతని మొహం భయం గొలిపేలా ఉంది - '.... నీ బాబు సొమ్ము ఇక్కడేం దాచి పెట్టలేదు!

అతని అరుపుకి నాకు భయం వేసింది. మెల్లిగా స్తంభం చాటుకు జరిగాను.

నా బాబు సొమ్ము గురించి కాదు - వీడి బాబు సొమ్ము గురించి”

వీడి బాబు సొమ్మా? ఎవడికి పుట్టాడే వీడు? కానీ ఇవ్వను. దిక్కున్న చోట చెప్పుకో

“అది బతికున్నంత కాలం దాన్ని వేపించుకు తిన్నారు. శవం చేత వేలి ముద్రలు వేయిస్తారా? తల్లీతండ్రీ లేని పిల్లాణి అన్యాయం చేస్తారా? మీరు నాశనమైపోతారు. ర్న న. అలో సున పురుగులు పడి చస్తారు.....”

'ఏవిటే లంజా! వాగుతున్నావు?' = ఆతను ముందుకొచ్చి పెద్దమ్మ జుట్టుపట్టు కున్నాడు. పెద్దమ్య వాడి ప పించుకోలే స్‌ యు

న్నా ద్ద శవా పట్టు విడిపించుకోలేక గొల్లుమని ఏడ్వసాగింది.

నాకు వాడి ఎక పిస్తికయ్యాలన్నంత కోపం వచ్చినా, చెయ్యి కదల్బలేని అశక్తత.

నాకు ఏడుపొస్తోంది. "పెద్దమ్మా అని ఆరుద్దామనుకున్నాను కానీ భయంతో నోరు

తోలేటి జగన్నోహనరావు 9౦ పెగలలేదు.

అరుపులు, కేకలు, "పెద్దమ్మ ఏడుపు.

నేను ఏడవడానికి కూడా భయపడుతూ స్తంభం చాటున నిలబడి చూస్తుండటం గుర్తుంది. కాని ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందీ జ్ఞాపకం లేదు.

మళ్ళీ పెద్దమ్మ వెన్నల్లో పాలాల మధ్య నుంచి, పంట కాలవ గట్టున, ఏడుస్తో తిడుతూ, “కొంత డూరం వత్తుకునీ, కొంతే దూరం నడిపించీ నన్ను తీసుకెళ్ళడం గుర్తుంది.

కాలవకి అడ్డంగా రైలు కట్ట....

వంతెన దాటుతుండగా కాలవలో వెండి పువ్వులా తేలుతున్న చందమామ.....

అంతా స్పష్టంగా ఇప్పటికీ గుర్తుంది.

“పెద్దమ్మా' అన్నాను నెను భయం భయంగా, రైలు కట్ట దిగుతుంటే...

“ఏం భయం లేదు నాన్నా! ఎవరున్నా లేకపోయినా నేను లేనా?”

'ఆ....క....లేస్తోంది పెద్దమ్మా"

“అయ్యో - పొద్దున్ననగా తిన్న వాడివి, కనీసం పిల్దాడికింత 'పెడదామనేనా తోచలేదు"

రైలుకట్ట దిగువ, కాలవ పక్కన చిన్న దిబ్బ మీద పాక ఉంది. అక్కడ రెండు గేదెలు కొబ్బరి చెట్టు నీడని పడుకుని నెమరేస్తున్నాయి. కాలవ ఒడ్డున ఒకతను గొంతుక్కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు.

“బాబూ! పిల్హాడికేదైనా తినడానికి దొరుకుతుందా నాయనా? పొద్దున్ననగా తిన్నాడు" అనడిగింది పెద్దమ్మ.

అతను లేచి కొబ్బరి బోండాలు, అరటి పళ్ళు తీసుకొచ్చాడు. దిబ్బ మీద కంది చెట్ట నుంచి పది రెమ్మలు తెంపి, గడ్డి అంటించి, ఆ మంట మీద కాల్చి 'తినరా బుల్లోడా" అని ఇచ్చాడు. పెద్దమ్మ కొంగు ముడి విప్పి డబ్బులివ్వబోయింది, అతను వద్దన్నాడు.

“కుర్రాడికి ఓ అరటి పండిచ్చినంత మాత్రాన నా ఆస్తులేవన్నా కరిగిపోతాయా? పోయేవి ఎలాగూ పోయాయి. ..' - అతను ఏదో చెబుతున్నాడు. నేను పెద్దమ్మ ఒడిలో పడు కుని నిద్రపోయాను. తిరిగి కళ్ళు తెరిచేటప్పటికి అతను ఏడుస్తున్నాడు. పెద్దమ్మ అతడిని ఓదారుస్తోంది.

ఎవరేనా ఏడుస్తున్నా, పెద్దగా అరుచుకుంటూ దెబ్బలాడుకుంటున్నా నా గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటాయి. లోకంలో దుఃఖం, దౌర్థన్యం తప మరేవీ లేవా అని భయం వేస్తుంది. అక్కడ నుంచి పారిపోవాలన, ఎవరి. కనిపించకుండా ఎక్కడేనా దాక్కో వాలనీ అనిపిస్తుంది.

"పెద్దమ్మా" అన్నాను నేను భయంగా లేచి కూర్చుని. 'దేవుడు పై నుంచి కనిపెడుతూనే ఉంటాడన్నా - ఏం ఫరవాలేదు. అంతా సవ్యంగా జరిగిపోతుంది - బెంగెట్టుకోక్తు' అంది పెద్దమ్మ అతడిని ఓదారుస్తూ. దేవుడు అతడిని చల్లగా చూశాడా?

100 లక్ష్మీ కటాక్షం

అతను ఇప్పుడెలా ఉన్నాడు?

చాలా సార్హు ఆలోచిస్తుంటాను.

పెద్దమ్మకు మాత్రం దేవుడు న్యాయం చెయ్యలేదు.

అప్పుడు నా చెయ్యి పట్టుకు నడిపిస్తూ వార్టక్యంలో ఈ కొడుకు ఒంటరి బతుకుకి ఆసరాగా ఉంటాడని అనుకుని ఉంటుంది పెద్దమ్మ.

పెద్దమ్మ నాటిన మావిడి మొక్క కాపుకొచ్చింది.

కానీ, పేద్దమ్మ కస్హీళ్ళు పోసి పెంచి పెద్ద చేసిన నువ్వు?

కానీ సంపాదన లేని అడ్డగాడిదవి.

పెదమ్మ కొచ్చే మూడువందల యాభై పెన్షన్‌ మీద బతికే చవటన్నర చవటవి.

నామీద నాకే అసహ్యం కలిగి, 'భీ' అని ఖాం(డ్రించి ఉమ్మేశాను.

రోడ్డు మీద పోతున్న ఒకడు ఒకసారి ఆగి నాకేసి చూశాడు.

'నా ముఖంలో కోతులాడుతున్నాయా? పో

అతను వెనక్కు చూడకుండా త్యరత్వరగా నడుస్తూ వెళ్ళి పోయాడు.

నేను ఎందుకిలా (ప్రతీదానికి చలించిపోతాను?

అతను ఆగి చూస్తే నాకెందుకంత కోపం?

పోనీ అని ఊరుకోవచ్చుకదా.

నా నిర్ణయం మరిచిపోతున్నాను.

ఈ రోజు నుంచీ మామూలుగా ఉండాలి.

('ప్రయోజకుణ్ణి కావాలి.

'ప్రయోజకుడు అంటే?

లోకం 'రెండు చేతులా సంపాదించే వాడు ' అని నిర్వచనం ఇస్తుంది.

లోకం నిన్ను కాసులతో తూస్తుంది.

నీ తెలివి శ్వా. చదువూ, కాసులు కూడబెట్టలేకపోతే నువ్వు లోకం దృష్టిలో దద్దమ్మవి. ఎందుకూ పనికి రాని వెధవ్వి.

న్న 'ప్రయోజడివి కావాలంటే లౌక్యం కావాలి.

చలాకగా ఉండాలి.

దెబ్బ తప్పించుకుంటూ దెబ్బ తియ్యాలి.

మనసులొ విషం దాచుకుని పెదాల ట్లీద్రక చిరునవ్వు తేవాలి.

కానీ....

“నట చ(క్రవర్తులారా!

ముసుగులు తగిలించి నటించలేను!

నన్ను (ప్రేక్షకుడిగానే ఉండనివ్వండి!

నడి సముద్రంలో నావని

అలాగే కొట్టుకు పోనివ్వండి!

నా సమాధిలో నిళ్ళబ్దంగా

తోలేటి జగన్నోవానరావు 101 ఇలాగే నన్ను రోదించనివ్వండి' 'నాన్నా ! ఏం రాస్తున్నావు? పతే = గేయం' న్నా

“నాకు వినిపించు"

ఒక్క కవిత కూడా ఏ పత్రికలోనూ రాకపోయినా పెద్దమ్మ నేనేదో కవిని అనుకుని సంతోషపడుతుంది గూట్టోంచి నా నోటు పుస్తకాలు తీసి, లావుపాటి కళ్ళద్దాలు తగిలించుకుని, కూడబలుక్కుంటూ ఒక్కొక్క కవితా చదువుతుంది. అర్హమైనా, కాకపోయినా నా కవిత్వం అంటే పెద్దమ్మని ఇష్టం.

నేను వాస్తవంతో రాజీ" పడలేక, కలల్ట్‌కి, కవిత్వంలోకి పలాయనం సాగిస్తున్నానని పెద్దమ్మకి తెలియదు.

బయట (ప్రపంచంతో నేను విసిగిపోయినప్పుడు, నా మనో (ప్రపంచంలోకి వెళ్ళి పోతాను. ఊహలలో నాకిష్టమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాను. ఆ ఊహల లోకం నా కవిత్యానికి జన్మస్థానం.

కాని, కవిత్వం కూడు పెట్టదే!

ఈ బోడి కవిత్వం కానీ సంపాదించలేదే!

కానీ సంపాదించని వాడు నిస్ప్రయోజకుడే!

'పెద్దమ శై నన్ను ప్రయోజకుళణ్ణి చెయ్యాలని ఎన్ని కలలు కంది?

ఎంత కష్టపడి చదివించింది?

నాకు ఓ దారి చూపించాలని, చివరకు మిగిలిన ఎకరం వీరాసామికి అమ్మేసింది. వీరాసామి ఏ టీచరు ఉద్యోగవో, అటెండరు ఉద్యోగవో వేయిస్తాడని పెద్దమ్మ ఆశ.

“వీళ్ళు డబ్బులు తినడవే కానీ ఉద్యోగాలు వుంచు "పెద్దమ్మా"

'ని గురించి అనికాదులే, మన చెక్క వాడి పాలాల మధ్య ఉంది. అంచేత అమ్మమని బలవంతపెడుతున్నాడు. మనం అమ్మకపోయినా వాడు. కలిపేసు కుంటాడు. కోర్టుల చుట్టూ ఎవరు తిరగ్గలరు నాయనా! పోనీ, ఏ ఉద్యోగవేనా

మూడేళ్ళయినా ఉద్యోగం వేయించడు.

పొలం అమ్మిన డబ్బు ఇవ్వడు.

నువ్వు ?

నువ్వు నంబర్‌ వన్‌ హిపోక్రేట్‌వి.

అవినీతి మీద నిప్పులు కక్కుతావు.

కలంతో చీల్చి చెండాడుతావు.

నీ విషయం వచ్చేటప్పటికి నీ ప్రిన్సిపల్సు గాలిలోకి ఎగిరిపోతాయి.

వీరాసామి ఉద్యోగం కా జాయినవడానికి రెడీ అయిపోతావు.

నువ్వు ముసుగులు తగిలించలేనంటూ ముసుగులో తిరిగే దొంగ వెధవ్వి.

పెద్దమ్మ పెన్షన్‌ మీద బతికేసే పేరసైట్‌వి.

రెండు పూట్ట్లా సుష్టుగా దున్నపోతులా తినడం.....

102 లక్ష్మీ కదూక్షం

పెళ్ళాం కోసం కలలు కనడం ...

'వెధవా, నీకుపెళ్ళాం కావాలా?”

పక్కవాటా కుర్రాడు, మూడేళ్ళ బుజ్జిగాడు. అప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. ఇంకా కళ్ళనా సరిగా తెరవకుండా తరుగుమీద నిలబడీ ఉచ్సపోయబ్లోతునవాడు, నేను వాణ్ణే తిడుతున్నాననుకున్నాడు కాబోలు, ఉచ్చపోయడం ఆపుచేసి లోపలకు పారిపోయాడు.

నాకు నవ్వాచ్చింది.

పగలబడి నవ్వాను.

మూడో వాటా శాంతమ్మ, తీరిగ్గా ముగ్గు వేస్తున్నది, త్వరత్వరగా నాలుగు గీతలు గీసి వెళ్ళిపోయింది.

వీళ్ళందరికీ నన్నుచూస్తే భయం.

రేవతికి?

నేనంటే (ప్రేమా? జాలా? అసహ్యమా?

రేవతి గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసంతా దిగులుగా అయిపోతుంది.

ఏడుపొస్తుంది.

ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడుస్తూ ఎలా గడిపాను?

సంతోషం కలిగించే సంఘటనలు ఏవైనా నా జీవితంలో ఉన్నాయేమో నాకు గుర్తు లేదు కానీ, దుఃఖం కలిగించే విషయాలు మాత్రం వదలని పీడకలల్లా, ఎంత మర్చి పోదామనుకున్నా మరుపు రాకుండా నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నా విషయంలో ఏదీ, ఎప్పుడూ సవ్యంగా ఎందుకు జరగదో నాకు అర్ధం కాదు.

ఆ రోజు శనిగాడు నా చెత అలా మాట్టాడించకపోతే నా జీవితం మరోలా ఉండేదా?

మధ్యాహ్నం రెండు గంటల వేళ నేను మాట్నీకి వెడదామని బట్టలు వేసు కుం టుంటే ఓ ముసీలాడు 'అనంతం' అంటూ చెవటలు కక్కుకుంటూ లోపలికి వచ్చాడు.

కక తెగిపోయి, పిన్నీసు పెట్టిన హవాయిచెప్పులు, మాసి పోయిన చిరుగుల పంచె, పేచలున్న లాల్ఫీ, నెరిసిన గడ్డం, చింపిరి జుట్టు - నడుస్తున్న దరిద్రంలా ఉన్నాడు.

అతను. నన్ను పలకరించబోతుంటే, ఆ అవకాశం ఇవ్వకుండా, "పెద్దమ్మా నీకోసం ఎవరో వచ్చారు," అంటూ నేను లోపలికి వెళ్ళి పెద్దమ్మను పంపించాను.

“అనంతం! మనవరాలి గురించేనే నా బెంగ! తిరగలేక చచ్చిపోతునినె! దాని పెళ్ళయితే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకెలా చచ్చినా ఫరవాలేదు. విసిగిపోయానే వెధవ జీవితంతో...” - అతను పెద్దమ్మ తో అంటున్నాడు.

'వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చాకే ఓ ఇంటి వాణ్ణి చేద్దామని ఉందన్నయ్యా'

“ఉద్యోగానికేమిటమ్మా! ఏదో ఒకటి దొరక్కపోదు. బంగారం లాంటి పిల కు(ర్రాడి నొకసారి అడిగి చూడు."

ముసిలాడు లౌక్యంగా మాట్టాడి. వాడి దరిద్రాన్ని నాకు అంటగట్టి నా పీక

తోలేటి జగన్మోహనరావు 103 నులుము దామనుకుంటున్నాడు. నేను లోపల్నుంచే "పెద్దమ్మా! నేను ఉద్యోగం వస్తే కానీ పెళ్ళి చేసుకోను" అని గట్టిగా అరిచాను.

“నా ఉద్దేశం కూడా అదే అన్నయ్యా! వాడు వాడి కాళ్ళ మీద నిలబడితేనే కదా ఓ బరువు మోసేది'

ముసిలాడు లేచాడు - 'అనంతం - కుర్రాడికి పెళ్ళి చెయ్యాలనుకున్నప్పుడు ఓ మాట నా చెవిన వెయ్యి. నాకున్న దానిలో ఏ లోటూ లేకుండా చేస్తాను"

అతను వెళ్ళగాన పెద్దమ్మ - 'నాన్నా - ఓసారి నెంబరు గార్ని కలిసొస్తాను" అంది పెద్దమ్మ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు - అందర్నీ నెంబరు అంటుంది.

నెంబరు వీరాసామిగారు ఉద్యోగం ఇప్పేస్తే ఆ పిల్లని వెంటనే కోడలిగా చేసుకోవాలని పెద్దమ్మ కలలు కంటోందన్న మాట.

నేను నవ్వుకున్నాను - “ఎందుకు పెద్దమ్మా! ఆయన ఏ ఉద్యోగం వేయించడు కానీ, డబ్బు ఇచ్చయమను”

పెద్దమ్మ నంబరుగారిని కలవడానికి పొరుగు ఊరు వెళ్ళి రాత్రి పదింటికి తిరిగి వచ్చింది.

'ఏవిటి పెద్దమ్మా - బస్సు స్టాండు నుంచి రాత్రి వేళ నడిచి వచ్చావు? రిక్షాలో రాలేకపోయావా

“నాలుగడుగులికి పది రూపాయలు - రిక్షా ఎందుకు?

"నెంబరుగారేవన్నాడు?'

“ఏవంటాడు? చూద్దాం అంటాడు. ఉద్యోగం వేయించడు. డబ్బు ఇవ్వడు. వీడి కొంప తగలడ* - పెద్దమ్మ ఎంతో విసిగిపో 'నే కానీ అలా మాట తూలదు. రాత్రి "పెద్దమ్మకి ఫెళ్ళున శం వచ్చింది.

మగత ని(ద్రల్‌ కలవరింతలు.....

పెద్దమ్మని డాక్టరు దగ్గరకు తీసికెళ్లాలి. గూట్లో, పెట్టో, అన్ని చోట్లా వెతికాను. అయిదురూపాయల చిల్లర' దొరికింది. మరో వారానికి గాని పెన్షను రాదు. రిక్షా డబ్బుల్లేక అంత జ్వరంలోనూ, పెద్దమ్మ అంత దూరం నడిచి వచ్చింది.

దొరగారు?

దొరగారు సినిమాలకి, షికార్లకి వెడతారు గాని నెంబరుగారితో మాట్లాడరు. ఎంచేతంటే ఆయనకి బోడి ప్రిన్సిపల్సు. ఆయన స్వయంగా అడగరు. పెద్దమ్మ ద్వారా ఉద్యోగం వస్తే దొరగారు చికాకు పడుతూ జాయినవుతారు. హిపోడ్రేట్‌!

“పెద్దమ్మా, పద! డాక్టరు దగ్గరకు వెడదాం" - హిపో|్రేట్‌ లాగే మాట్లాడాను, ఖాళీ జేబుల్లో చెతులు పెట్టుకుని.

“ప్రయాణం బడలిక వల్ల వచ్చింది కానీ, ఇలా రా నాన్నా ", చుంచం దగ్గరకు పిలి చింది పెద్దమ్మ - 'చూడు నాన్నా - డాక్టరొద్దు కానీ నాకేదన్నా అవుతే - ఇదుగ్‌'...

కుడిచేతి వేలికున్న ఉంగరం చూపిస్తూ అంది _పెద్దమ్మ - 'ఈ ఉంగరం అమ్మితే వెయ్యో, పదిహేను వందలో వస్తాయి. క్లుప్తంగా కార్యక్రమం జరిపించు

104 లక్ష్మీ కటాక్షం నాకు వచ్చే భయంకరమైన ఆలోచనల్లో పెద్దమ్మ చావు ఒకటి

ఆ ఆలోచన రాగానే నాకు కాళ్ళూ, చేతులూ ఆడవు.

భయంగా, కంగారుగా ఉంటుంది.

పెద్దమ్ము మంచం మీద పడితే ? చచ్చిపోతే... చేతిలో కానీ లేని, కానీ సంపాదిం చడం చేతకాని, నేను ఏం చెయ్యగలను? తల్లి బుణం ఎలా తీర్చుకోగలను?

బహుశా పెద్దమ్మకి నా అసమర్ధత తెలుసు.

అందుకే తన ఏర్పాట్టు తాను చేసుకుంటోంది.

"పె.....ద్ద....మ్మా......' = నాకు దుఃఖం ముంచుకొచ్చింది.

ఛ-...చిన్న పిల్ళాడిలా అలా ఏడవ కూడదు. ఊరికే అన్నాను కానీ, నాకేం రాయిలా ఉన్నాను. నీకే ఏ దారీ చూపించలేకపోయాను”

పెద్దమ్మ త్వరలోనే కోలుకుంది.

నాలుగైదు వారాల తర్వాత పెద్ద గుళ్ళో ఏదో పూజ జరుగుతోందంటే పెద్దమ్మని తీసికెళ్ళాను, గుళ్ళోకి వెళ్ళబోతుంటే, “అనంతం - బాగున్నావా" అంటూ పలకరించాడు ముసిలాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే, “తాతా, వెడదామా అన్న మాట వినిపించి వెనక్కి తిరిగి చూశాను.

ఎదురుగా...చామంతి పువ్వులా పచ్చగా...సన్నజణజి తీగలా సన్నగా శాప(గ్రస్తురాలయిన ఓ దేవకన్య...

“ఇదేనే అనంతం నా మనవరాలు. దేవుడి దయవల్ల సంబంధం కుదిరింది. గంతకు తగ్గ బొంత, వచ్చే మాఘమాసంలో పెళ్ళి. అమ్మాయ్‌ ! అనంతం అత్తయ్య అని చెప్పానే... అవిడ, ఇతను ... వాళ్ళబ్బాయి"

ఆ అమ్మాయి, నువ్వేనా అనంతంగారబ్బాయివి, అన్నట్టు ఓ క్షణం పరిశీలనగా చూసింది. కళ్ళూ కళ్ళూ కలిసినప్పుడు. గుండె రుల్టుమంది. నేను సరే అంటే ఈ అందం నా సొత్తు అయ్యేది. ఇప్పుడు...

'పద తాతా' అంటూ ఆ అమ్మాయి తాతగార్ని తీసుకుని వెనక్కి తిరిగి చూడ కుండా వెళ్ళి పోయింది.

ఒక్కసారి నిరాశ, శూన్యం నన్ను ఆవరించినట్టయింది.

'బంగారం లాంటి పిల్ల - చిదిమి దీపం పెట్టుకోవచ్చు"

"పెద్దమ్మా! నువ్వు గుళ్ళోకి వెళ్ళు - నేనిక్కడే ఉంటాను”

నాకు ఒంటరిగా ఉండాలని ఉంది.

ఎవరూ లేని చోట, ఎవరూ చూడకుండా గుండె బరువు తగ్గేదాకా...ఏడ్వాలని ఉంది,

ఇంటికి తిరిగి వెడుతుంటే పెద్దమ శ తప్పి పోయిన ఆ సంబంధం గురించి ఏదో

మాట్లాతూనే ఉంది. ఒక్కముక్క కూడానా బు(ర్రకెక్కడం లేదు. “పెద్దమ్మా! ఆ.... అమ్మాయి.....పేరేమిటన్నావు?' “పేరేదైతేనం. ....కుందనపు బొమ్మ”

తోలేటి జగన్మోహనరావు 105

కనీసం పేరైనా తెలుస్తే బావుండును.

ఆ అమ్మాయి పేరవై ఉంటుంది?

సరోజ....కమల...వసంత...రేవతి...రేవతి బాగుంది.

'వడ్డించమంటావా?"

'నువ్వుతిను- నాకు ఆకలిగా లేదు”

ఆ రాత్రంతా ని(ద్రపోలేదు.

ఆ రాత్రే కాదు... ఆ తర్వాత అనేక రాత్రులు నిద్రపోలేదు.

పెద్దమ్మ బలవంతం మీద నాలుగు మెతుకులు తింటున్నానే కానీ, తినబుద్ది కావడం లేదు,

ఏ పనీ చెయ్యాలనిపించదు.

ఎవరితోనూ మాట్టాడాలనిపించదు.

నిరంతంరం అలా మంచం మీద పడుకుని కిటికీలోంచి శూన్యం లోకి చూస్తూ... ఎడతెగని ఆలోచనలు.

కనీసం పిల్లనైనా చూస్తానని చెప్పాచ్చుకదా!

ఎలా చెబుతావు? ముసిలాడు నడుస్తున్న దరిద్రంలా కనిపించాడుకదా!

నీకు అందాల రాకుమారి అర్థరాజ్యం తీసుకురావాలని మనసులో కోరిక, ఎలా చెబుతావు?

నువ్వు హిపోగ్రేట్‌ వి.

నీకు బాగా శాస్తి అయింది.

ఒకవేళ... పెళ్ళయినట్టయితే.. ఎలా ఉండేది?

హాయిగా చిలకా గోరింకల్లా ఉండేవాళ్లమూ?

ఎందుకూ పనికిరాని అప్రయోజకుణ్ణై పెళ్ళాడానని అసహ్యించుకునేదా?

పేరైనా తెలియదు.

చూసింది క్షణకాలం.

ఎందుకు ఈ తపన?

ఎందుకు ఈ బాధ?

“లోకం శూన్యం

నింగ్‌ నేలా ఘనీభవించిన శూన్యం

'ప్రియతమా! నువ్వు మెరుపులా మెరిసి

మాయమైపోయిన తర్వాత

ఈ అంధకారంలో నాకు నేనే కనిపించడం లేదు..."

ఈ భయంకరమైన ఒంటరితనాన్ని , ఈ శూన్యాన్ని నేను భరించలేను.

నాకు బతకాలనిలేదు.

నాకు చచ్చిపోవాలని ఉంది.

బ్లేడుతో మణికట్టు దగ్గర కోశాను.

106 లక్ష్మీ కటాక్షం రక్తం (ప్రవాహంలా కారుతోంది. (ప్రాణం పోయేంతవరకూ అలా ఆగక కారుతూనే... “అయ్యో! అక్కడెలా తెగింది నాన్నా - పెద్దమ్మ కంగారుగా కాఫీ పొడి తీసుకొచ్చి అద్ది కట్టుకట్టింది. అతి కష్టం మీద రక్తం ఆగింది. (ప్రాణం నిలిచింది. కానీ..... ఎందుకీ (బ్రతుకు ? ఎవరికోసం? మళ్ళీ రేవతి మీదకు ఆలోచనలు... ఆ చూపుకి అర్హం ఏమిటి? నన్నెందుకు చేసుకోనన్నావు అనా? నా కాలి గోటికైనా నువ్వు తగవు అనా? రాత్రీ పగలూ, రోజులూ వారాలు... ఎడతెగకుండా ఏవో ఆలోచనలు... ముసురుకమ్మినట్టు ఏదో దిగులు... “ఏవిటి నాన్నా అలా చిక్కిపోతున్నావు? ఒంట్లో బాగాలేదా?” - పెద్దమ్మ నుదిటి మీద చెయ్యి వేసింది - 'అయ్యో - ఒళ్ళు కాలి పోతోంది” పెద్దమ్మ డాక్టరు గారిని శీసుకొచ్చింది. టేబెట్స్‌.... కేప్సుల్స్‌... మనసంతా మంటల కొలిమిలో ఉన్నట్టున్నా, వారం రోజుల్లో జ్వరం తగ్గింది. 'ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల - లోకం గొడ్డుపోయిందా?" - పెద్దమ్మ తల నిమురుతూ అంది. పెద్దమ్మకు అంతా తెలుసన్న మాట నా మనసు లోతుల్లోకి పెద్దమ్మ ఎలా చూడగలిగింది? నాకు సిగ్గేసింది. చిన్న పిల్లాడిలా పెద్దమ్మ చేతుల్లో ముఖం దాచుకుని తనివితీరా, మనసు తేలికపడేలా ఏడవాలనిపించింది. పెద్దమ్మ రెండు చేతులూ ముఖం మీదకు లాక్కుంటూ.... తృళ్ళి పడ్డాను. పెద్దమ్మ చేతిన ఉంగరం లేదు. నన్ను పెంచి పెద్ద చెయ్యడానికి ఒక్కొక్కటీ అన్నీ అమ్మేసింది పెద్దమ్మ. ఆ ఉంగరం మాత్రం తన కోసం, తన కొడుక్కి ఏ ఇబ్బందీ కలిగించకుండా తాను బూడిదవడం కోసం ఉంచుకుంది. ఇప్పుడు ఆ ఉంగరం ఎగిరిపోయింది. మరి పెద్దమ్మని ఏదైనా అవుతే? మరుక్షణంలోనే ఏదో అవబోతున్నట్టు...

తోలేటి జగన్మోహనరావు 107 కంగారుగా, భయంగా...

ఇప్పుడు పెద్దమ్మ పోతే?

నలుగుర్నీ ముష్టి అడగాలా?

అనాధ శవం తగలేసినట్టు నలుగురూ చందాలేసి....

నీ కోసం పెద్దమ్మ కడుపు మాడ్చుకుంది. అవమానాలు సహించింది. కొవ్వొత్తిలా కాఠథిపోయింది.

నువ్వు?

నువ్వు బాధ్యతల నుంచి పారిపోయే పిరికివాడివి.

మేసేప్పుడు ఎద్దుల్లోనూ, దున్నేప్పుడు దూడల్లోనూ....

కరణం పెద్దమ్మని మోసం చేస్తుంటే కలగ చేసుకున్నావా?

వీరాసామి బెదిరిస్తుంటే అండగా నిలిచావా?

నీ బదులు పెద్దమ్మ కుక్కని పెంచితే బాగుండేది.

పెద్దమ్మ మీద చెయ్యి వేసినవాడి గుడ్డు పీకేసేది.

నువ్వు కుక్కకన్నా హీనుడివి...

కుక్కకన్నా...

భయం స్టానంలో ... నరాల కొసలు అంటుకున్నట్టు ఎన్నడూ నేను ఎరగని ఆవేశం రగులుకుంటోంది.

"పెద్దమ్మా - నేను నెంబరు గారి దగ్గరకు వెడుతున్నాను. ఉద్యోగం లేదు, గాడిద గుడ్డూ లేదు. నెంబరు దగ్గరనుంచి ఆ ఏభైవేలూ తీసుకొచ్చేస్తాను' అన్నాను హరాత్తుగా మంచం మీంచి లేస్తూ.

నేను అలా అన్గుందుకు నాకే ఆశ్చ్ళర్యమనిపించింది.

పెద్దమ్మ కళ్ళళల్ళ్‌ కూడా ఆళ్ళర్యం.

కొడుకు బాధ్యతగా మాట్ట్లాడుతున్నందుకు ఆనందం.

వీడివల్ల ఈ పనవుతుందా అని అనుమానం.

'నీర్చంగా ఉన్నావు. పైగా నీకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. నాలుగు రోజుల తర్వాత నేనేవెడతాలే'

నాలుగు రోజులే!

నాలుగు క్షణాలో?

ఎవరికీ తెలియదు పెద్దమ్మా!

ఒక్క రోజు...ఒక్కక్షణం కూడా...

నువ్వు ఇలా నిస్సహాయంగా ఉండకూడదు.

నే వెడుతున్నా పెద్దమ్మా - ఇవాళే... ఇప్పుడే'

'జాగ్రత్త నాయనా - పెద్దవాళ్ళతో వ్యవహారం - ముళ్ళ కంచె మీద బట్ట చిరగకుండా నేర్పుగా తీసుకోవాలి. అతను అసలే పొగరుమోతు”

పొగరుమోతు అయితే కొమ్ములు విరిచిపడేస్తా.

108 లక్ష్మీ కటాక్షం ముళ్ల కంచె మీద బట్ట రాకపోతే ముళ్ళ కంచే నరికిపడేస్తా, ఇవాళ అటో, ఇటో తేలిపోవాలి. దారిపొడుగునా బస్సులో ఇవే ఆలోచనలు... శంకరం! పిరికి పీనుగా! నలుగురిలో కలవడానికి భయం ..మాట్టాడటానికి భయం.... రేపెల్దాగ అని భయం....

అనుక్షణం భయం భయంగా జీవచ్చవంలా చావకు!

ఈ రోజునుంచీ మనిషిలా తలెత్తుకు బతుకు...

బస్సు దిగాను.

చెరువు గట్టున పెద్ద గేటు, గేటు లోపల విశాలమైన ఆవరణలో సపోటా చెట్టు.

స్తంభాల ఇల్టు....

ఎత్తు అరుగులు...

రక్తంతో అలికినట్టు ఎ(ర్రటి గచ్చు. ....

ఎర్రటి గచ్చుమీద నాన్న శవం...

'ఏయ్‌! ఎవరు కావాలి? - సపోటా చెట్ల దగ్గర మొక్కల్లోంచి ప్రశ్న వినిపించింది

  • 'ఎవర్ష్నడిగి వచ్చావు లోపలికి?" - నా చెదిరిన జుట్టు, నలిగిన చాక్కా పాంటూ, మాసిన గడ్డం, దుమ్ము కొట్టుకుపోయిన చెప్పులూ, నన్ను "పైనుంచి కింది దాకా కళ్ళు చిట్లించి అసహ్యంగా పురుగుని చూసినట్టు చూస్తూ అడిగాడు వీరాసామి నౌకరు.

ఆ చూప్పుకి గుండె భగ్గుమంది.

ఇంకోసారి అలా చూశాడంటే వాడి కళ్ళు పొడిచేస్తా.

నన్ను నేను తమాయించుకున్నాను.

'వీరాసామిగారున్నారా?ొ

“ఏం పని?"

“అనంతమ్మగారబ్బాయి డబ్బుకోసం వచ్చాడని చెప్పు”

“ఏ డబ్బు?”

నీకెందుకురా వివరాలు కుక్కా!

నా పిడికిళ్ళు బిగిశాయి.

'ఏ డబ్బో నీకు చెప్పాల్సిన అవసరంలేదు. వీరాసామికి...' - గారు అనలేదు - " వీరా సామికి నేను వచ్చానని చెప్పు' - కళ్ళెర్ర చేసి గట్టిగా అరిచాను. ఏమనుకున్నాడో ఏమో, ఇంకేమీ మాట్లాడకుండా నౌకరు లోపలకు వెళ్ళాడు.

నేను అరుగుమీద గుమ్మం ముందు నిలబడ్డాను.

అయిదు నిమిషాలు, పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, అరగంట...

నా ఓపిక నళించింది. తిన్నగా పెరట్లోకి వెళ్ళి పోయాను. విశాలమైన పెరడు, ఓ మూల పెద్ద గడ్డిమేటు, ధాన్యం గాదె, ట్రాక్టరు, దూరంగా పశువుల కొట్టం, పక్కన నీళ్ళ పొయ్యిమీద కాగు, గుమ్మం ముందు సిమెంటు చప్పా మీద టేబులు , టేబులు

తోలేటి జగన్మోహనరావు 109 మీద ప్లేట్లూ సారా సీసాలు...

టేబులు ముందర కూర్చుని ఇద్దరు తాగుతున్నారు. ఒకతను ఖద్దరు లాల్పీ , ఖద్దరు పంచె వేసుకుని ఉన్నాడు. మరో అతను లుంగ్‌ కట్టు కున్నాడు. పైన టవలు. మెళ్ళో బంగారు గొలుసు..

నా అడుగుల చప్పుడు వినిపించింది కాబోలు, లుంగీ కట్టుకున్న వాడు వెనక్కి తిరిగాడు - 'ఎవర్నడిగి వచ్చావు లోపలికి?”

భీకరమైన మొహం.

ఒత్తు మీసాలు.

ఎర్రగా ఉబ్బిన కళ్ళు.

పెద్దమ్మ జుట్టు పట్టుకున్న వాడు వీడే...

అరుపులు ... కేకలు...ఏడుపు

స్తంభం చాటుకు మెల్లిగా మెల్లిగా...

అక్కణ్జుంచి పారిపోదామా అనిపించింది.

పారిపోతావా?

పిరికి వెధవా!

నిలబడు. నిలబడి, నిలదీసి అడుగు.

నేను, అనంతమ్మగారబ్బాయిని. డ...డబ్బు...కోసం...'

“డబ్బడగడానికి వేళా పాళా లేదా? రేపు రా"

ఛ....ఛ ..వాడు... ఆ దొంగ వెధవ నిన్ను చూసి భయపడాల్సిందిపోయి, నిన్ను డబాయిస్తున్నాడు. తప్పుడు వెధవ ముందు నువ్వు తడబడతావేంరా పిరికి లంజాకొడకా!

నా మీద నాకే అసహ్యం.

అసహ్యంతోపాటు తెగింపు.

'రేపు కాదు, ఇవాళే. ఇప్పుడే మొత్తం ఏఖై వేలూ, వడ్డీతో సహా కావాలి'

నాలోంచి నేను కాక మరెవరో మాట్టాడుతున్నట్టు వచ్చాయి మాటలు.

నేను అలా నిక్కచ్చిగా మాట్లాడ్డం వీరాసామికి, ఖద్దరు ఆసామీకి కోపం కలిగించినట్టుంది.

'ఎవడీడు' అన్నాడు ఖద్దరు ఆసామీ

'అనంతమ్మని. ఆవిడ కాళ్ళా వేళ్ళా పడితే..ఏదో నౌకరి వేయిద్దామని చూస్తుంటే వీడి హీగరు చూడు... ఆవిడ మొహం చూసి ఊరుకుంటున్నాను కానీ..."

“ లేకపోతే వెంట్రుకలు పీకుతావా?" - అలా నిర్భయంగా, నిర్లక్ష్యంగా, మొరటుగా నాలోంచి మాటలు వస్తుంటే తమాషాగా అనిపించింది.

అలా అంటాననుకోలేదు కాబోలు, ఒక క్షణం అవాక్కయిపోయాడు. నురుక్షణం నిప్పులు కురిపిస్తూ నా దగ్గరికి వచ్చాడు - 'ఏం కూశావ్‌ ...'

'వం(టుకలు .. '

110 లక్ష్మీ కటాక్షం

నామాట పూర్తి కాకుండా చాచి లెంపకాయ కొట్టాడు - కానీ ఇవ్వను, నీ దిక్కున్న చోట చెప్పుకో."

నా గుండెల్లో ఏదో పేలినట్లయింది.

నరాల్లోంచి విద్యుత్తు ప్రవహించింది.

ఒక శక్తి తరంగం నన్ను కుదిపేసింది.

“కానీ ఇవ్వను...నీదిక్కున్న చోట చెప్పుకో "

అవే మాటలు,

అదే దుర్మార్గం

దుళ్ళాసనుడి గుప్పిట్లో పెద్దమ్మ జుట్టు.

నిస్సహాయంగా పెద్దమ్మ ఏడుపు.

వణుకుతూ స్తంభం చాటుకు...

లేదు పెద్దమ్మా నీ కొడుకు ఈ రోజు స్తంభం చాటుకు పారిపోయే పిరికి పంద కాదు, స్తంభం చీల్చుకు వచ్చే ఉ(గ్ర నరసింహ మూర్తి

కొట్టం వైపుకు పరిగడుతుంటే పారిపోతున్నావనుకున్నాడు కాబోలు, 'దెబ్బకు దెయ్యం దిగింది నా కొడుక్కి' అని నవ్వాడు ఇద్దరు ఆసామీ.

సీళ్ళస్తాయ్య దగ్గర ఉన్న గొడ్డలి అందుకుని పరిగెట్టుకొచ్చాను.

నా చేతిలో గొడ్డలి చూసి వాళ్లిద్దరూ ఉలిక్కిపడ్డారు.

“ఈడికి పిచ్చెక్కింది... ఆ కళ్లు చూడు - కంగారుగా అన్నాడు ఖద్దరు ఆసామీ.

నాలో తెగింపు.

వాళ్ళ కళ్ళల్లో భయం.

ఆస్తి అధికారం కలిగించిన మదం దిగిపోయింది వీరాసామికి, నా చేతిలో గొడ్డలి చూడగానే. కంగారుగా రెండడుగులు వెనక్కు వేశాడు.

'ఏ..య్‌....ఏ...వి...టి....ది....?"

ఇప్పుడు తడబడుతున్నది, భయపడుతున్నది, వణుకుతున్నది నేను కాదు, వాడు. పెద్దమ్మా! నీ కొడుకు ఈ రోజు, ఈ క్షణం, భయాన్ని జయించాడు. ఇంతవరకూ తన్ను భయపెట్టిన లోకాన్ని ఇప్పుడు తాను భయపెడతాడు.

పెద్దమ్మా! నువ్వు అలా నిస్సహాయంగా, దీనంగా ఏడ్వద్దు.

నీ జుట్టు పట్టుకున్న దుర్మార్గుడి చేతులు ఇవాళ తెగిపడతాయి.

నిన్ను లంజ అన్నవాడి తల వెయ్యి ముక్కలవుతుంది.

గొడ్డలి విసురుగా దిగింది.

రక్తం చిమ్మింది.

ఖద్దరు ఆసామీ కేసి తిరిగాను - 'ఏవన్నావ్‌? దెబ్బకు దెయ్యం దిగిందా?"

“నాకేం తెలీదు. సారో - గొడ్డలివాడికి కొత్త భాష నేర్పినట్టుంది. క్షణం క్రితం నా కొడుకు" అన్నవాడు ఇప్పుడు 'సార్‌ అంటున్నాడు - 'ఎమ్మెల్యేగారూ. జల్సా

తోలేటి జగన్నోహనరావు 111 చేద్దాం రండి' అని ఈరాసామి పిలిస్తే వచ్చాను కానీ, నాకు బేక్‌ (గ్రవుండు తెలీదుసార్‌. నన్నాదిలేసెయ్యండి. మీ కాళ్ళు పట్టుకుంటా" - తోడుదొంగ గజగజ వణుకుతున్నాడు

దొంగ నాకొడకా! నీ వాటా నువ్వు తీసుకో.

గొడ్డలి మరోసారి దిగింది.

పెద్దమ్మా! వీడి కొంప తగలడ అని శపించావు.

నీ శాపం వృధాకాదు.

అలాగే జరుగుతుంది.

వీడి పాపం భగ్గున మండుతుంది.

వీడి కొంప కాలి బూడిదవుతుంది.

అలాగే జరుగుతుంది పెద్దమ్మా!

నీళ్చిపాయిన్ల లోంచి మండుతున్న కట్టెలాగి గడ్డి మేటు మీద విసిరాను

ఆకాశంలోకి మంటలు లేచాయి.

గడ్డిమేటు....

ట్రాక్టరు...

ధాన్యం గాదె...

స్తంభాల ఇల్టు....

నీ దుర్మార్గం...

నీ దౌర్జన్యం ..

అన్నీ తగలడుతున్నాయి....

అంతా బూడిదవుతోంది.

ఇప్పుడు నీకు దిక్కెవరో నేను చూస్తాను...

'దిక్కున్న చోట చెప్పుకోవాలా? లంజా కొడకల్టారా! ఒక్కక్కళ్ళనే నరికి పడేస్తాను. మీ కొంపలు కాలి బూడిద చేసేస్తాను. దిక్కున్న చోట చెప్పుకోవాలా. మీ యమ ట్‌. - పెద్దమ్మ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది. ఆయాసంతో, దుఃఖంతో మాట్లాడలేక తన బలహీనమైన చెయ్యి నా మీద వేసింది.

“ఇదంతా వింతలోకం పెద్దమ్మా! వినయంగా తల వంచితే జుట్టు పట్టుకుంటుంది. ఈడ్చి తన్నే కాలు నెత్తి మీద పెట్టుకుంటుంది. ఇదంతా తలకిందులు లోకం పెద్దమ్మా... ఈ లోకాన్ని కాల్చి బూడిద చేసేయ్యాలి. ఈ దౌర్జన్యాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పడెయ్యాలి. దిక్కెవరని అడుగుతా(ర్రా లంజాకొడకల్టారా...'

నా చేతుల మీద కన్నీటి చుక్కలు పడ్డాయి.

“ఉన్నట్టుండి ఏమవుతుంది నాయనా? ఎందుకలా అయిపోతావు?” - పెద్దమ్మ ఏడుస్తోంది.

నా ఆవేశం మీద నీళ్ళు చిలకరించినట్టయింది - పెద్దమ్మ కంట తడిపెడితే

అక కటాక్షం

2కు నేను చూడలేను. పెద్దమ్యరారా నని సరివారనటం నేను బరించలేను.

“అదు నయనా! ముందు లోపలికి పద

“దమ వెనకాలే లోపలికి నడిచాను.

పెద్దమిశై ల క్ష ది

గదలో అద్దంలో నా రూపం కనిపించింది.

చింపిరి జుట్టు ...

నెరిసినగడ్డం...

లోతుకుపోయిన కళ్ళు...

దుఃఖం ముంచుకొచ్చింది.

ఎందుకిలా అయిపోయాను?

ఎందుకిలా అయిపోతున్నాను?

వెక్కివెక్కి ఏడుస్తూ మంచం మీద కూలబడ్డాను.

పెద్దమ్ము మాత్రలు తీసుకొచ్చి ఇచ్చింది. మాత్రలు మింగి పడుకున్నాను. పెద్దమ్మ తల నిమురుతూ చెప్పసాగింది. మాత్రల (ప్రభావమో, చల్లని తల్లి చెయ్యి మహిమో, నా అవేశం మెల్లిగా తగ్గుతోంది.

'నువ్వు పిచ్చివాడివి అన్న వాళ్ళు పిచ్చివాళ్ళు నాయనా, కానీ,...దారి వంకర టింకరగా ఉంటే సూటిగా ఎలా పోగలం నాయనా, తప్పో ఒప్పో నలుగురునడిచే దారినే నడవాలిగానీ...”

నేను లౌక్యం తెలియని వాణ్ణి,

బతకడం చేతకాని అసమర్జుణ్ఞా

వంకరటింకర దారిలో సూటిగా నడవాలనుకునే పిచ్చివాణ్ణి .

నా జీవితం ఇలాగే ఉండనీ.

కానీ.... అతను ...కాలన ఒడ్డున నాకింత తిండి పెట్టిన అమాయకపు రైతు. అతని కన్నీళ్ళు? టె

అసలు లోకంలో ఇంత దుఃఖం ఎందుకుంది?

ఈ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, మోసాలు...

ఈ నిర్హలత్వం, ఈ నిస్సహాయత, ఈ కన్నీళ్ళు.

వసంతంలో పువ్వుల తోటలా ఉండాల్సిన మనిషి జీవితం నిప్పుల మంటలో ఎందుకిలా కాలిపోతోంది?

వంకర టింకర దారిలో వంకర టింకరగా నడవక తప్పుదు అంటే నీ బార్థ్యతా, నా బాధ్యతా ఏవీ లేదా? మంచీ- చెడూ, పాపం-పుణ్యం అనే మాటలకి అర్హం లేదా? అసలు....

“ఈ లోకం .. ఈ దారి... ఇలా వంకర టింకరగా ఎందుకుంది పెద్దమ్మా?

పెద్దమ్మ నిట్టూర్చి చెప్పసాగింది

తోలేటి జగన్నోవానరావు [11]

“ద్యాపర యుగం అంతమైంది. కలియుగం (ప్రారంభమైంది. కలిపురుషుడు పరీక్షిత్తు మహారాజు కలలో ప్రత్యక్షమై, నీ రాజ్యంలో నివసించడానికి అనుముతించు అని అడి గాడు. మహారాజు కలి మాయలో పడి, వ్యాసమహర్షి చేసిన హెచ్చరిక పెడచెవిని పెట్టి, కలి స్వర్గంలో నివసించడానికి అంగీకరించాడు. కలి చిరునవ్వు నవ్వి స్వర్షంలో ప్రవేశించాడు...'- పెద్దమ్మ కథ చెబుతోంది.

నేను పెద్దమ్మ ఒడిలో పసివాడినై చిన్నప్పటిలాగే పెద్దమ్మ చెప్పే కధ ఊ కొడుతూ వినసాగాను ం

స్వరంలో అడుగు పెట్టిన కలి స్వర్ణంలో ఉండిపోలేదు. స్వర్గంలోంచి మెల్లిగా మనుషుల మనస్సుల్లోకి ప్రవేశించాడు.

ఎన్నడూ లేనిది గురుపత్నికి బంగారు-కుండలాల మీద మోజు కలిగింది.

గురుదక్షిణగా తృణమో, ఫణమో కాక మహారాణిగారి బంగారు కుండలాలు కోరింది.

శిష్యుడు తెల్లబోయి దిక్కు తోచక మహారాజుని ఆశ్రయించాడు...

మహారాజు-మహారాణిని కుండలాలు ఇమ్మని అడగడం....

ఎన్నడూ రాజు మాట జవదాటని రాణి తన కుండలాలు ఇవ్వుననడం...

బదులుగా కుంతీదేవి కుండలాలు ఇస్తానని రాజు ఆశపెట్టడం....

కలి అందరి మీదా తన ప్రభావం చూపిస్తున్నాడు.

మహారాణి కుండలాలు తీసుకు వెడుతుంటే దారిలో శిష్యుడి హత్య.

ఆశ...లోభం.... దగా... మోసం....దౌర్జన్యాలు...నేరాలు... శిక్షలు. వ్యధలు .. కన్నీళ్ళు ..

'అది నాయనా కలియుగం అంటే...స్వర్షంలో ఉండి వాడు ప్రపంచాన్ని ఆడిస్తు న్నాడు. లోకం కాసుకి దాసోహం అంటోంది. వాడు వేసిన దారిన నువ్వూ, నేనూ, అందరం - ఇష్టమైనా, కష్టమైనా నడవక తప్పదు. వాడి మాయ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.”

పెద్దమ్మ మాటలు దూరం నుంచి వస్తున్నట్టు వినిపిస్తున్నాయి.

నా కనురెప్పులు బరువెక్కుతున్నాయి.

ఈ కలియుగం - కాసుల యుగం - అధర్మ యుగం,

ఈ అధర్మం అజేయం కాదు....

కానివ్వకూడదు.

అధర్మం ప్రబలినప్పుడల్లా ధర్మసంన్థాపనార్థం దేవుడు అవతరిస్తాడంటారు. దేవుడు దీనుల కోసం అవతరిస్తేడన్న ఆళ నాకు లేదు.

కలి అజేయుడన్న నిరాశా లేదు.

ఏదో ఒక రోజు, కలిని అంతం చేసి, ఈ కాసుల మాయ నుంచి (ప్రపంచాన్ని విముక్తి చేసే యుగపురుషుడు .అవతరిస్తాడు.

వాడు....

114 లక్ష్మీ కటాక్షం

దేవతలు పూలవర్దాలు కురిపిస్తుండగా ఆకాశ మార్గాన రాడు.

మనిషే నా దేవుడంటూ నేల తల్లి గర్భం చీల్చుకు వస్తాడు.

వాడు నీ కన్నీరు, నా కన్నీరు చూసి ఆవేశపడతాడు. తిరగబడతాడు.

వాడు నీకోసం, నా కోసం శిలువలు మోస్తాడు.

ఉరికంబాలెక్కుతాడు.

వాడికి మరణం లేదు.

నేలకు రాలిన ప్రతి నెత్తుటి చుక్క నుంచీ మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు.

ఏదో ఒక రోజు ఈ కానికాలం అంతం చేసీ నిన్నూ, నన్నూ విముక్తుల్ని చేస్తాడు.

ఇది ఎన్నటికీ ఫలించని జోస్యమా?

మతి చలించిన వాడి స్వప్నమా?

నాకు తెలియదు.

కానీ, ఈ ఆలోచన నాకు ఎంతో ఉపశమనాన్నిస్తుంది.

మనసు ఆనందంతో తేలికవుతుంది.

లోకమంతా చల్లని వెలుగుతో నిండి పోయినట్లనిపిస్తుంది.

అప్పుడు కాసుకి ఆత్మ అమ్ముడుపోదు.

అప్పుడు మనిషి నిరంతరం వంచిస్తూ వంచించబడుతూ, వేటాడుతూ, వేటాడబడుతూ, ఈ జనారణ్యంలో జంతువులా బతకడు. నిజమైన మనిషిలా, స్వచ్చమైన మనసుతో జీవిస్తాడు.

అక్కడ...

వంచన ఎరుగని మనుషులు

వెన్నెల కురిసే మనసులు

అక్కడంతా... వెన్నెలే

అక్కడంతా.... పువ్వులే

అక్కడంతా .. పువ్వుల నవ్వులే

అ...క్క...డ...వె...వె...న్నెలే...పు...వ్వు...లే..న...న..నవ్వు....లే...లే....

(ఇండియా టుడే, వార్షిక సాహిత్య సంచిక 2000)

సీరియల్‌ చేసిన పెళి

ళ్‌

క్‌ 0 (గ్రాట్యులేషన్స్‌ చిట్టిబాబూ! ఈ మధ్య నీ పెళ్ళయిందట కదా! మమ ్రైవీ వకవ?”

'శనుకోకుండా పీడకలలోలా జరిగిపోయిందండి - పిలవడానికి టైమే లేదండి

“షీ మేనమామ కూతురు వరలక్ష్మేట కదా! అవునూ, మతున్నవాడెవడూ వరలక్ష్మిని చేసుకోడు అంటూ ఉండేవాడివి కదోయ్‌! ఇప్పుడెలా చేసుకున్నావు?"

“మతి పోయండి”

“అదేవిటి?”

'ఆ రోజు సీరియల్‌ చదివాను కదండి'

“ఏ సీరియల్‌ ?”

సెన్స్‌ కింగ్‌ డీవీపి సీరియల్‌

“డిరీపీ "సీరియల్‌ చదివితే మతి పోవడమేమిటి? మతి పోతే వరలక్ష్మితో పెళ్ళవడవేమిటి? అదెలా జరిగిందోయ్‌?”

'ఇలాగండి"

సననం

చిట్టిబాబుకి వరలక్ష్మిని చేసుకోవడం మొదటినుంచీ ఇష్టం లేదు. వరలక్ష్మికి మాత్రం చిట్టిబాబంటే ఇష్టమే. చిట్టిబాబు తల్లికి మేనకోడలిని కోడలుగా చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉండేది.

“చక్కగా చిలకా - గోరింకల్లా ఉంటారు మీ ఇద్దరూ' అనేది తల్లి,

“అవును, కొండంత చిలక, కొంగ లాంటి గోరింక

116 లక్ష్మీ కటాక్షం

“దానికేంరా! కొంచెం లావుగా ఉంటుంది కాని లక్షణమైన రూపం. టెన్తు కూడా పాసయింది"

'అలా అని చెప్పాడా మీ అన్నయ్య? ఇప్పటికి రెండుసార్హు తన్నింది. తెలుసా?

“తంతే తన్నిందిలే, అదేమన్నా ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళేలాలా? మొగుడికి ఉత్తరం రాసుకోగలిగితే సరిపోతుంది. ”

'మొగుడికే ఏం కర్మ? ఏ వారపత్రిక తిరగేసినా, కె.వరలక్ష్మి-కొత్తపేట' అని మీ మేనకోడలి మీ ( మా) ఉత్తరాలే,' అన్నాడు చిట్టిబాబు హేళనగా.

టెన్తు రెండుసార్హు తన్ని ఖో కూర్చున్న వరలక్ష్మి, ఆం(ధ్రుల అభిమాన రచయితల అభిమాన పారకురాలు. సస్పెన్స్‌ సీరియల్స్‌కి మహారాణి పోషకురాలు. ఏ కథైనా, నవలైనా చదివిన వెంటనే -' ఈ కథ అద్భుతంగా ఉంది. అనూహ్యకరమైన మలుపులతో, సస్పెన్స్‌తో మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇలాంటి కథ రాసిన రచయి తకూ, ప్రచురించిన మీకూ, చదివిన మాకూ కృతజ్ఞతలు” అంటూ ఓ మీ ( మా) ఉత్తరం రాసి పడేస్తుంది. “వస్తోంది, వచ్చేస్తోంది, వ్‌ అభిమాన రచయిత సీరియల్‌ - తేదీ కోసం ఎదురు చూడండి '" అని ప్రకటన రాగానే “ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాకర కాయలు చేసి ఎదురు చూస్తున్నాం" అంటూ రోజూ ఓ ఉత్తరం రాస్తుంది. మీ అభిమాన రచయిత రాయబోయే సీరియల్‌కె ప్పాట్టు చెప్పండి, పేర్టు సూచించండి అంటే, వెంటనే ప్పాట్టూ పేర్లూ, కట్టలు "కట్టలు పార్సిలు చేసేస్తుంది. 'సబ్బులమ్ముకుంటున్నట్టు త్‌, కధలూ, నవలలూ అమ్ముకుంటున్నారే! నీ వెధవ ప్టాట్టూ, పేర్లూ వాళ్ళకి అక్కర్లేదే అదంతా పబ్లిసిటీ స్టంటే' అని తండ్రి నెత్తీ నోరూ కొట్టుకున్నా వినదు.

'నన్ను అమాయకుణ్ణై చేసి ఆ తెల్ల ఏనుగుని నాకు అంటగట్లేద్తామని సి లా అయి చూస్తున్నాడు మావయ్య. నా జీతవంతా పోస్టలు స్ట్పాంపులుగా మార్షి చప్పరించెస్తుంది.

అవును, ఈ మధ్య మావయ్య రెండు గేదెలు అమే శశాడుట. నిజమేనాగే 'ఏమో నాకు తెలియదు. రేపు వాళ్ళింటికి వెడుతున్నాం కదా. నువ్వే అడుగు ” అంది తల్లి విసుగ్గా. “ఎవరు వెడుతున్నారు? ప్‌ నువ్వూ, నేనూను. మావయ్య పెళ్ళి విషయం మాట్టాడ్డానికి రమ్మని రాశాడు. చనుకే చెబుతున్నానేవ్‌! మీరందరూ ఏడ్చి మొత్తుకున్నా, ఆ వరాహలక్ష్మిని “చక్కటి పేరు వరలక్ష్మి ఉండగా ఏవిటా కూతలు. ఎవరేనా విన్నా బాగోదు” అని తల్లి మందలించింది. చిట్టిబాబు రానని ఎంత మొత్తుకున్నా తల్లితో పాటు మేనమామ ఇంటికి వెళ్ళక తప్పలేదు. న 'ఓహో- అల్లుడు గారు దిగారన్నమాట” అన్నాడు మేనమామ ఆహ్వానిస్తూ. “అల్లుడు కాదు, మేనల్లుడు" అని సరిదిద్ది, 'అవునూ, నువ్వు రెండు గేదెలమ్మే శావుట కదా ఈమధ్య," అడిగాడు చిట్టి బాబు, మేనమామని' చూడగానే గేదెలు

తోలేటి జగన్నోవానరావు 117 గుర్తుకొచ్చి.

“చూడవే నీ కొడుకు! ఇంట్లో అడుగుపెట్టిన వాడు నా గురించి కాని, వరలక్ష్మి గురించి కాని ఒక్కమాట అడగడం లేదు. గేదెల గురించి అడుగుతున్నాడు” అన్నాడు మేనమామ చిట్టిబాబు తల్లితో.

ఆ రోజు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ చిట్టి బాబుని పెళ్ళికి ఒప్పించే (ప్రయత్నాలు జరిగాయి.

చిట్టి బాబు లొంగలేదు. నా కిష్టం లేదు అని ఒకసారీ, నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోనని ఒకసారీ మొండికేశాడు.

“ఇష్టం లేదట. బావకి కొంచెం స్కూలు ట్రైటుచెయ్యాలి' - లోపలి గదిలోనుంచి హాలులో సంభాషణ వింటున్న వరలక్ష్మి అనుకుంది .

కన్నీళ్ళు, నిట్టూర్పులు, మందలింపులు, కేకలతో ఏకధాటిగా ఐదు గంటలు అలా రభస జరిగాక చిట్టిబాబు మనసంతా చికాకుగా ఉండి సెకండ్‌మోకి వెళితే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అనుకుని బయలు దేరబోతుంట్సే బావమరిది పండుగాడు, 'సినిమాకా బావా? నేనూ వస్తాను" అన్నాడు, నిక్కరులో షర్టు టక్కు చేసి, దానిమీద మొల తాడు బిగిస్తూ,

పండుగాణ్లి ఇదివరకోసారి సినిమాకు తీసుకెళ్ళాడు చిట్టిబాబు. సినిమా జరుగుతున్నంత సేపు పండుగాడు జోరీగలా చిట్టిబాబు చెవిలో రన్నింగ్‌ కామెంటరీ ఇస్తూనే ఉన్నాడు - *' ఈ రోలుకి బండోడు లాభం లేదు బావా! వాడికి పైటింగు రాదు. చిరంజీవే వుండాలి... ఛ...ఛ.... ఇది డైరెక్షనా? నా తలకాయ, హీరోయిన్‌ హీరోని లెంప కాయ కొట్టగానే ధన్‌మని పాట స్టార్ట్‌ అయిపోవాలి. బంగారం లాంటి సీను తగలేశాడు. నాకిచ్చినా (బ్రహ్మాండంగా డైరెక్ట్‌ చేసేవాణ్ణి”

వాడు పుల్‌ స్టాప్‌ లేకుండా అలా వాగుతూనే ఉన్నాడు. బండోడు (బ్రేక్‌ చేయలేడు. వాడికి పొట్టకదా! బ్రేక్‌ చేయాలంటే చిరంజీవి - రాధ కాని, చిరంజీవి - భానుద్రియ కాని ఉండాలి. భానుప్రియ చీరలో కన్నా స్కర్టులో స్మార్ట్‌గా ఉంటుంది. అదే జయ(ప్రదయితే, క్లాసికల్‌ బ్యూటీ కదా, చీరలోనే బాగుంటుంది.

“అసలు కొత్తగా వచ్చే హిరోమున్లలో ఎవళ్ళకీ సరైన పెర్సనాలిటీ లేదు బావా అన్నాడు పండుగాడు.

“వెధవా! నిక్కరేసుకోవడం రాదు, హీరోయిన్ల పెర్సనాలిటీ గురించి కామెంట్టు చేస్తావా? నోరు మూసుకు సినిమా చూడు' అని చిట్టిబాబు వాణ్డో గుద్దు గుద్దినా వాడి నోరు మూత పడలేదు. హాలునుంచి ఇంటెకెళ్ళేస్తుడు దారిలోనూ, ఆ తర్వాత రెండు మూడు రోజులూ, కనిపించినప్పుడల్దా డైరెక్ట గురించీ, ఏక్టన్‌ గురించీ, మ్యూజిక్‌ గురించీ, ఫొటోగ్రఫీ గురించీ చిట్టి బాబు ప్రాణాలు తీసేశాడు. ఆ

అప్పట్నుంచీ వాణ్ణి సినిమాకు తీసుకెళ్లడమంటే భయం చిట్టిబాబుకి. అంచేత సినిమా ప్రోగ్రాం కేన్సిల్‌ చేసి, 'సినిమాకి కాదు-ఏట్లోకి' అన్నాడు. విసుగ్గా.

“అయితే నువ్వే వెళ్లు అన్నాడు పండుగాడు, మొలతాడు టకీలోంచి షర్టు బయటకి లాగుతూ.

116 లక్ష్మ కటాక్షం

చిట్టి బాబు సినిమా ప్రయత్నం విరమించుకుని, ఊరంతా తిరిగి వచ్చి, రాత్రి పదవుతుండగా హాలులో మడతమంచం మీద నడుం వాల్చాడు. అతని పక్కన ఓ పట్టెమంచం మీద పడుకున్న పండు, గడియారం పది గంటలు కొట్టగానే ఉలిక్కెపడి లేచి, 'అరెరే! ఇవ్వాళ ఇవ్వడం మరిచిపోయాను నీ గొడవలో పడి- అర్హరూపాయ నష్టం" అని మంచం మీంచి దూకి లోపలికి పరిగెట్టి ఓ పుస్తకం తీసుకొచ్చి, రేప్పాద్దుట పావలా లైబ్రరీలో ఇవ్వాలి" అంటూచిట్టిబాబు పక్కనే ఉన్న టేబుల్‌ మీద పడేశాడు. వారపత్రికల్లోంచి సీరియల్‌ కట్‌ చేసి కుట్టిన పుస్తకం అది. అట్టమీద 'మృత్యువీణ' అని ఇంకుతో రాసి ఉంది.

'ఏవిటిది? అన్నాడు చిట్టిబాబు, ఏదో పురుగును చూసినట్టు చూస్తూ,

'సీరియల్‌ - అక్క తీసుకు రమ్మంది'

“మీ అక్క ఈ సీరియల్‌ చదవలేదా?"

ఇప్పటికి పాతిక సార్హు చదివింది. గొప్ప ఆడియో విజువల్‌ సీరియల్‌ లే”

'ఆడీయో - విజువల్‌ సీరియల్‌ ఏవిటి? నేనెప్పుడూ వినలేదే'

“నీ బుర్ర అంతే కదా” అన్నట్టు పండుగాడు జాలిగా చూసి ఆడియో- విజువల్‌ సీరియల్‌ అంటే ఏవిటో వివరించాడు - సీరియల్‌ చదివితే స్టీరియో ఫోనిక్‌ సౌండుతో స్కోపు సినిమా చూసినట్టు కళ్ళకు కట్టినట్టుంటుందన్నమాట'"

'బు(ర్రకి శ్రమ లేకుండానా?”

“ఏవిటన్నావ్‌?”

'ఏం లేదులే. ఎవడు తీశాడు ఈ సీరియల్‌?”

“ఆడియో - విజువల్‌ సీరియల్‌ తియ్యరు. రాస్తారు"

“ఏదో ఒకటిలే. ఎవడు రాశాడు?”

“డీవీపీ...?

'డీవీపీ ఎవడు?”

పండుగాడు షాక్‌ తగిలినట్లు ఓ సారి నోరు తెరిచాడు. అర నిమిషం తర్వాత నోరుమూసి వన్‌ అని మూడు సార్హు చప్పరించి, 'డీవీపీ అంటే తెలియదు. నీలో ఏం చూసి మా అక్క పెళ్ళి చేసుకుంటానంటోందే నాకర్థం కావడం లేదు” అన్నాడు.

'మీ అక్కనెవడో తలమాసినవాడు చేసుకోవాలి గాని నేను చేసుకోను. వెధవ వాగుడు వాగక అడిగిందానికి సమాధానం చెప్పు" అన్నాడు చిట్టి బాబు పండుగాడి కెత్తి మీద ఒకటందుకుంటూ.

డీవీపీ - దేవీ వర ప్రసాద్‌ - నవలాకాళంలో సూపర్‌ స్టార్‌ అట. మంత్ర తంటత్రాలు, సస్పెన్స్‌, సైన్ఫూ, అన్నీ కలిపేసి అద్భుతంగా రాస్తాడట. మొదటి పేజీ చదివితే మళ్ళీ 50ద పెట్టకుండా చివరి పేజీ వరకూ చదివేయాల్సిందేనట. మధ్యలో పుస్తకం దిరపనీయకుండా, 'మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తూ, అనూహ్యకరమైన

మలుపులతో , అడుగడుగునా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో, మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకు పోతాడట'

తోలేటి జగన్మోహనరావు 119

డీవీపీ గురించి వివరంగా చెప్పి, 'ఓసారి చదివి చూడు - సస్పెన్స్‌ కింగ్‌ అంటే ఏవిటో నీకే తెలుస్తుంది. నీ నాలెడ్డ్‌ కూడా ఇంప్రూవవుతుంది' అని సలహా ఇచ్చాడు పండుగాడు.

“ఆ చెత్త చదివి ఇంటధ్రెసైపోవడానికి పండుగాడిలా ఏడో క్లాసు రుబ్బే అరపైసగాణ్బి కాదు. ఈ (బైయినుంది చూశావా?-. చిట్టి బాబు కుడి చేతి చూపుడు వేలుతో తన తల మీద టింగు టింగున మోగించి, 'ఇది సూపర్‌ కంప్యూటర్‌ రా పండుగా, టెన్తు రెండుసార్లు తన్నేసిన పావలా సైజు (బ్రెయిన్‌ కాదు" అన్నాడు స్టయిలుగా,

“ఓసారి అద్దంలో చూసుకో నీ సూపర్‌ కంప్యూటర్‌ని - పండుగాడు కోపంగా అన్నాడు - 'మా సస్పెన్స్‌ కింగ్‌ గురించి మాట్టాడ్డానిక నీకు అర్హత లేదు"

'ఒరేపండూ - అసలు సస్పెన్స్‌ అంటే ఏవిటో తెలుసా?"

“నన్ను టెస్టు చేస్తున్నావా? సస్పెన్స్‌ అంటే స్‌

“పోనీ నారికేళ పాకం , (ద్రాక్షపాకం అని మీ తెలుగు మాస్టారు అనడం విన్నావా?”

'మీ' అక్కకే తెలియదులే - నీకేం తెలుస్తుంది, అరపైసగాడివి. అలాగే జీళ్ళపాకం ఆని సాహిత్యంలో ఇంకో పాకం ఉంది. గానే ఇంగ్లీషులో సెన్స్‌ అంటారన్నమాట. సస్పెన్స్‌ అంటే జీళ్ళ పాకవైతే, సస్పెన్స్‌ కింగ్‌ ఏవవుతాడో తెలునా?

'జీడికి రాజా....హ్హ...హ్హ....హ్హ....”

'నీ జోకు నీ మేహంఠా టరిది. మళ్ళీ అద్దంలో చూసుకో” - కోపంగా అని ముసుగెట్టేశాడు పండుగాడు.

పండుగాడు ముసుగెట్టేశాక చిట్టిబాబుకేమీ తోచలేదు. నిద్రరాక పండుగాడ్ని లేపి పేకాడదామా అనిపించి, 'ఒరే పండూ - పేకాడదామా?" అనడిగాడు.

'నేను అణ్టు' అన్నాడు పండుగాడు ముసుగులోంచే.

నిద్ర పట్టక అటూ ఇటూ దొర్జుతున్ల చిట్టిబాబు దృష్టి సీలింగ్‌ ఫాన్‌ గాలికి రెప రెపలాడుతున్న. సీరియల్‌ పుస్తకం మీదికీ మళ్ళింది. చిట్టబాబుకి పత్రికల్లో సినిమా బొమ్మలు, కార్పూన్నూ వారఫలాలు తప్ప మరేవీ చూసే అలవాటు లేదు.

కధలు, సీరియల్సు, అసలు చదవడు. అవంటే అతడికి ఎలర్జీ కానీ,నిద్రపట్టక దొర్హుతూ కేవలం కాలక్షేపం కోసం మాత్రమే. రాత్రి పదిగంటల ఇరవైమూడు నిమిషాలకి టేబులు మీంచి ఆ పుస్తకం తీసి మొదటి పేజీ చదవడం మొదలు పెట్టాడు, నిరాసక్తంగా.

పన్నెండవుతుండగా చివరి పేజీ చదువుతున్నాడు చిట్టి బాబు -

*. తలుపు మీద టకటక మని రెండుసార్హు కొట్టిన శబ్దం వినిపించింది. కుమార్‌ దేవ్‌ కోట్లు జేబులోంచి రివాల్వరు తీసి, తలుపు దగ్గరికి మెల్లగా చప్పుడు

కాకుండా నడిచి వెళ్ళి, హాండిల్‌ మీద "చేయి వెయ్యబోయి. ఠక్కున ఆగిపోయాడు.

120 లక్ష్మీ కటాక్షం అతనికి వచ్చిన టైెనింగూ, వత్తిలో అతని అనుభవం చ. చెయ్యి వెయ్యనియ్యలేదు. కోటు పొకెట్టులొంచి టెస్టర్‌ తీసి డోర్‌ హాండిల్‌ లోకి కరెంటు పాసవుతుందో లేదో చెక్‌ చేశాడు. కరెంటు పాస్‌ అవడం లేదు. కుడిచేతో రివాల్వర్‌ తలుపుకేసి గురిపెట్టి ఎడం చెయ్యి హాండిల్‌ మీద ఉంచి, గుండెల నిండా గాలి పీల్చి, ఒక్క ఊపులో హాండిల్‌ నొక్కి తలుపు లాగి, 'హాంద్సప్‌” అన్నాడు. అతడు అలా తలుపు లాగగానే తలుపునానుకునే ఉన్న సుహాసిని అతని మీద వాలిపోయింది. 'సుహా! సరసాలకి ఇదా సమయం?” అని అతడు మందలించబోతుం డగా సుహాసిని నిర్జీవ శరీరం కార్పెట్‌ మీద వాలిపోయింది. పచ్చటి ఆమె శరీరం మెల్లి మెల్లిగా బంగారం కరిగినట్టు కరిగిపోతూ అదృశ్య మవుతోంది. కుమార్‌దేవ్‌కి అంతా అర్హమైంది - సుహాసినికి పి2 కెమికల్‌ ఇంజక్ష్‌ చేశారు. మానవ శరీరంలో వైట్‌ బ్బడ్‌ సెల్టూ, రెడ్‌ బ్లడ్‌ సెల్పూ విడివిడిగా సర్క్యులేట్‌ అవుతుంటాయి. పి.2 కెమికలీలోని వక్‌ కేటలిప్టుగా పనిచేసి వైట్‌ బ్లడ్‌ సే్వీని, రెడ్‌ బ్లడ్‌ సెల్సుని కోల్డ్‌ ప్యూజన్‌లో బంధించేస్తాయి. ఆ విస్పోటనంలో అమితమైన వేడి పుడుతుంది. కాని అది సెల్‌కే పరిమితమవుతుంది. ( మ్‌క్రో ఓవెన్‌లో పేపర్‌ బేగ్‌లో కన్న బంగాళా దుంప పేపరు కాలకుండానే ఉడుకుతుంది - డీవీపీ). 2327 డిగ్రీల సెంటీ గ్రేడులో కాని బూడిదవని శరీరం ఈ శీతల కొలిమిలో కేవలం రెండు నిమిషాల్లో బూడిద వుతుంది. ఆ తర్వాత మిగిలేది సుహాసిని స్పృతులు, పిడికెడు రెండు నిమిషాల తర్వాత కుమార్‌ దేవ్‌ ముందుకు వంగి కుడిచేతి పిడికిలితో వ్రతాభస్మ్ట్ర తీస్తూ అన్నాడు - 'సుహా! దీని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నిన్ను అంతం చేసినవాళ్ళు రేపు సూర్యాస్తమయం చూడరు. ఇంతవరకూ ఏ వ్యక్తీ చావని విధంగా ' ఒక్కొక్కళ్ళూ ఒక్కో రకంగా అతి ఘోరమైన చావు చసారు.. అంతే... అలాగే జరుగుతుంది” న్‌ ై ఆవేశంలో అతని పెదవులు ఆదురుతున్నాయి. అతని పిడికిలి బిగిసింది. అతని కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయి. అతను వేసిన కేక అర్ధరాత్రి నిశ్చబ్రంలో ఉరుములా (ప్రతిధనించింది. ఆ శబ్దం గాలిలో కలిసిపోతుంఢగా నని వనీకననన చిన న్న ప ల _ చాక్షర్‌ యూకాతో వ్యవహారం నిప్పుతో చెలగాటం మిస్టరో కుమార్‌ దేవ్‌! ముందు నువ్వు సూర్యోదయం చూడవు." క్‌ కుమార్‌ దేవ్‌ /గిరుక్కున వెనక్కుతిరగబోతుండగా తలమీద బలంగా దెబ్బ తగిలింది. అతను ఛిశాల్వరు వదిలేసి కార్పెట్‌ మీద నిస్సత్తువగా కూలిపోతుండగా ... (మొదటి భాగం సమాప్తం),

తోలేటి జగన్మోహనరావు 121

చిట్టి బాబు కెవ్వుమన్నాడు. అంతవరకూ రెండో భాగం ఉందని అతనికి తెలియదు. జుట్టు పీక్కుంటూ “ఒరే పండూ - రెండో భాగం ఏదిరా? అన్నాడు, పండుగాణ్ణై ఓ తాపు తన్ని.

గాఢనిద్రలో ఉన్న పండుగాడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అప్పుడు గోడ గడియారం. పన్నెండు గంటలు కొడుతోంది. పిచ్చాడిలా జుట్టు పీక్కుంటున్న చిట్టిబాబుని చూసి, 'ఏవిటి? అర్దరాత్రి వేళ అంకమ్మ శివాలు?” అన్నాడు వాడు చికాగ్గా.

“రెండో భాగం ఏదిరా?"

“ఏ రెండో భాగం?'

'మృత్యువీణ"

'అది నీకెందుకు, పావలా సైజు మెదళ్ళకి, అరపైసగాళ్లకీ గానీ? పడుకో

“అసలు రెండో భాగం తీసుకొచ్చావాళ

“తీసుకొచ్చాను”

“ఎక్కడుంది?

చెప్పను. మా సస్పెన్స్‌కింగ్‌ని జీడికి రాజన్నావు. డీవీపీ అభిమానుల్ని మమ్మల్ని పావలా, అరపైసాగాళ్ళని ఇన్ఫల్టు చేశావు"

'నా బ్రైయినే పావలా లైబ్రరీ గాని తొందరగా చెప్పు గాడిదా"

“తాందరగాను చెప్పును, ఆలస్యంగానూ చెప్పను. నువ్వు క్షమార్చణ చెప్పి పది రూపాయలు పరువు నష్టం కింద ఇచ్చుకుంటే చెబుతాను."

  • రేపిస్తాలే”

'రేపు చెబుతాలే”

చిట్టిబాబుకి పండుగాణ్ణై చంపేద్దానన్నంత_ కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకుని, పాంటు జేబులూ, షర్టు జేబులూ అస్థి వెతికి, ఎనిమీది రూపాయల ఇరవైఐదు పైసలు వాడి చేతిలో పెట్టి, “మిగతాది రెపిస్తాలే - ఇప్పుడు. చెప్పు,

నేడు నగదు - రేపు అరువు

ఇంక సంప్రదింపులు, శాంతి సంభాషణలూ జరిపే ఓపిక నళించిపోయింది చిట్టిబాబుకి - 'ఒరే పండూ! పేజీకో మర్దరు. చూసిన వాణ్ణి - నీ పీక నొక్కేయడం నాకు కష్టం కాదు కానీ అర్దరాత్రి వేళ నిని మర్ధరు చేస్తే నువ్వు దెయ్యవై నన్నే తగులుకుంటావని భయంగా ఉంది. అంచెత చెయ్యి మూత్రం విరిచేన్తా అని, అరవకుండా వాడి నోరు నొక్కి చెయ్యి మెలి తిప్పాడు గట్టిగా. వాడు కుయ్యోమని మూలిగి, చెబుతానన్నట్టు తల ఊపాడు.

“ఎక్కడుంది?

“అక్క దగ్గరుంది'

“తీసుకుర్తా'

“తీసుకురాను”

122 లక్ష్మీ కటాక్షం “తీసుకురావూ?" చెయ్యి మళ్ళి మెలి తిప్పాడు చిట్టిబాబు. వాడు మళ్ళీ కుయ్యోమని "తీసుకొస్తాను బాబొయ్‌' అంటూ లోపలికి పరిగెట్టాడు. అయిదునిమిషాలైనా వాడు తిరిగి రాకపోతే, హాల్లో అసహనంగా పచార్జు చేస్తున్న చిట్టిబాబు, “ఎక్కడ చచ్చాడు వీడు?" అనుకుంటూ లోపలికి పరిగెట్టాడు. పండుగాడు వాళ్ళ నాన్న పక్కన పడుకుని గుర్రు పెడుతున్నాడు. 'ఓరి వెధవా! అనుకుని, వాణ్ణి ఎలా లేపడమా అని ఆలోచిస్తూ కాసేపు అక్కడే నిలబడ్డాడు. మేనమామ నిద్రలో కాబోలు అటూ ఇటూ కదిలాడు. ఇక పండుగాడి మీద ఆశ వదులుకుని చిట్టిబాబు హాల్లోకి వచ్చి మంచంమీద వాలి నిద్రపోదామని కళ్ళు మూశాడు. కాని చెవుల్లో కేమార్‌బీవ్‌ మాటలే గింగురుమంటున్సాయ్‌- 'అంతే - అలాగే జరుగుతుంది" కువార్‌దీకో సూర్యోదయం లోపున ఎలా తప్పించుకుంటాడు? సూర్యాస్తమయం లోపున శత్రువులందరూ ఎంత ఘోరంగా ఎలా చస్తారు? అసలు మొదటి భాగంలో చివర ప్రత్యక్షమైన డా. యూకా ఎవడు? ఈ సస్పెన్స్‌ విప్పడానికి తెల్గారే దాకా ఆగాలంటే పిచ్చెక్కినట్టుగా ఉంది చిట్టిబాబుకి. మొట్టమొదటిసారి ఓ క్వార్టర్‌ బాటిల్‌ రుచి చూసి, కొంచెం నిషా అందుకుని, హుషారుగా ఓ ఫుల్‌ బాటిల్‌ లాగిద్దామని బార్‌దాకా పరిగెట్టిన వాడికి 'మూయబడినది" అనే బు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చిట్టిబాబుకి. 'పోని వరాహలక్ష్మి గదిలోకి వెళ్ళి చూస్తే .... ఇంతవరకూ పండుగాణ్ణి బతిమాలడమే కాని తనే వెళ్ళి తెచ్చుకోవచ్చన్న ఆలోచనే రాలేదు చిట్టిబాబుకి. ఆ ఆలోచన రాగానే, 'నేవెంత పిచ్చి వెధవని ! అనవసరంగా పావుగంట వేస్ట్‌ చేశాను" అని తన నెత్తిమీద తానే ఒకటి కొట్టుకుని మేడమీదున్న వరలక్ష్మి గది వైపు పరిగెట్టాడు చిట్టిబాబు. వరల్న్మ గది తలుపు దగ్గరగా వేసి ఉంది. గదిలో ట్యూబులైటు వెలుగుతోంది. తలుపు మెల్లిగా తెరిచి, తొంగిచూసి, పిల్లిలా చప్పుడు చేయకుండా రెండడుగులు వేసి వరలక్ష్మికేసి చూసిన చిట్టిబాబు గుండె ఓసార్‌ లయతప్పి కొట్టుకోవడం మొదలు పెట్టింది. అతని చూపు వరలక్ష్మి వక్షస్టలం మీదే ఆగిపోయింది. 'ఆ....” అని నోరు తెరిచాడు చిట్టిబాబు కళ్ళు తిప్పుకోలేక. వరలక్ష్మి లావుగా ఉంటుందే కాని అనాకారి మాత్రం కాదు. ట్యూబ్‌లైట్‌ వెలుగులో తెల్లచీర. తెల్లజాకెట్టు, తలలో బుట్టెడు మల్లెపూలతో. వడ్డాది పాపయ్యగారి చిత్ర సుందరిలా తళతళా మెరిసిపోతూ, రెండు చేతులు గుండెల మీద వేసుకుని నిద్రపోతోంది వరలక్ష్మి, మెరిసేకళ్ళతో వరలక్ష్మి గుండెల కేసి చూస్తూ నోరుమూసి మళ్ళీ ' ఆ.... ' అని తెరిచి, గుటకలేస్తూ ముందుకు కదిలాడు చిట్టిబాబు. అయితే చిట్టిబాబుని ఆకర్షించింది వరలక్ష్మి సౌందర్యమూ కాదు, ఆమె

తోలేటి జగన్మ్నోవానరావు 123 వంపుసొంపులూ కావు. అసలు వరలక్ష్మి సంగతే అతను పట్టించుకోలేదు. ఆమె గుండెలకీ, గుండెల మీద వేసుకున్న చేతులకీ మధ్య, ఆమె ఉచ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా పైకి కిందకు కదులుతున్న 'మృత్యువీణ' రెండవ భాగం షే ఆతని చూపు నిలిచి ఉంది.

మంచం పక్కన అడుగు దూరంలో నిలబడి “వరలక్ష్మీ! ఆ పుస్తకం ఇలా ఇయ్యి" అన్నాడు మెల్లిగా.

వరలక్ష్మి ఉలకలేదు, పలకలేదు.

'ఏయ్‌.... నిన్నే... ఆ పుస్తకం ఇలా ఇయ్యి. అన్నాడు ఇంకొంచెం దగ్గరికి జరిగి.

ఓ రెండు నిమిషాలు అలా అరిచి, అరిచి, నెత్తి కొట్టుకుంటూ, “ఈ బొండాన్ని లేపడం దేవతల తరం కాదు. .... " అనుకుని , కుడిచేతి చూపుడు వేలు , మధ్యవేలు పటకారులా చేసి వరలక్ష్మి చేతుల కింద ఉన్న పుస్తకాన్ని అందుకుని, వధంక్ష్మి శరీరానికి ఎక్కడా తన చెయ్యి. తగలకుండా జాగ్రత్త పడుతూ లాగడాని ప్రయత్నించాడు. పాలరాతి స్తంభాల్దాంటి వరలక్ష్మి చేతుల కింద ఉన్న పుస్తకం మిల్లీమీటరు కూడా కదల్లేదు.

అర నిముషం రెష్టు తీసుకుని, మొహానికి పట్టిన చెమట తుడుచుకుని , మళీ లేచి వరలక్ష్మి భుజం పట్టుకుని కుదుపుతూ, 'ఓ వరాహలక్ష్మీ! ఆ చేతులు తీసే మరిడీ మహాలక్ష్మీ" అన్నాడు ఏడుపు మొహం పెట్టి.

వరలక్ష్మి కదల్లేదు. ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని అక్కడే కుర్చీలో కూలబడిపోయాడు. అలా కొంచెం సేపు కూర్చున్నాక కొంచెం శాంతించి, 'పోనీ! వెధవ పుస్తకం రేపు చదువుకోవచ్చులే" అని లేచి గుమ్మం దాకా తిరిగి వెళ్ళిన చిట్టిబాబు చెవుల్లో “డాక్టర్‌ యూకా...కా...కా...కా.. " అన్న క్వ ఫుల్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌లో గింగురుమంది.

వెంటనే జుట్టుపీక్కుంటూ వరలక్ష్మి "'మంచం దగ్గరికి పరిగెట్టి వర్తి రెండు చేతులు పట్టుకుని గుంజుతూ, ముందుకు వంగి వరలక్ష్మి చెవి దగ్గర తన నోరు పెట్టి 'ఒసే దెయ్యం! ఆ పుస్తకం వదలవే?" అని గట్టిగా అరవబోతుంట్సే 'చూశావా చెల్లెమ్మా! వీబ్ణేం చెయ్యమంటావ్‌? 'అన్న ఉరుములాంటి స్వరం ( సస్పెన్స్‌ కథలోలా) వెనుకనుంచి వినిపించి, ఉలిక్కిపడి వరలక్ష్మిని వదిలేసి, పైకి లేచి, వెనక్కు తిరిగి చూశాడు చిట్టిబాబు.

గుమ్మం దగ్గర కర్ర పుచ్చుకుని మేనమామ, పక్కన తల్లి నిలబడి ఉన్నారు. అర్ధరాత్రి వెళ చిట్టిబాబు తన గదిలోకి వచ్చి అటూ ఇటూ తచ్చాడి, మేడమీద వరలక్ష్మి గదిలోకి వెళ్ళడం చూశాడు మేనమామ. వెంటనే లేచి, చేతికర్ర తీసుకుని, చెల్లెల్ని లేపి చెల్లెమ్మా! చెల్లెమ్మా! నీ కొడుకు చేసే పనులేమన్నా బాగున్నాయా? " అన్నాడు ఆవేళంగా.

“ఏం పనులు? అంది చెల్లెమ్మ.

'నా నోటితో నేను చెప్పలేము. (సీ కళ్ళతో నువ్వే చూడు' అని చెల్లెమ్మని లాక్కొ

124 లక్ష్మీ కటాక్షం వాళ్ళిద్దరూ గది గుమ్మం దగ్గరకి వచ్చేటప్పటికి చిట్టిబాబు రెండు చేతులూ వరలక్ష్మి గుండెలమీదా, చిట్టి బాబు మొహం వరలక్ష్మి మొహం పైనా...

“హవ్వ... ఏవిట్రా ఇది? అర్హరాత్రిపూట దాని గదిలోకి ఎందుకొచ్చావ్‌? " అంది తల్లి,

“” సుహా...శవం... పీ 2 ...డాక్టర్‌ యూకా...” అన్నాడు. చిట్టిబాబు నీళ్ళు నములుతూ.

పిచ్చెక్కినట్టు ఏక్ట్‌ చేస్తే వదిలేస్తాననుకున్నావేమో? నా దగ్గర ఆ వేషాలు కుదరవు' అన్నాడు మేనమామ, కర్రతో నేలమీద గట్టిగా కొట్టి.

“నాకేం పిచ్చెక్కలేదు. కావాలంటే చూడు... వరాహ .. వరలక్ష్మి ఆ పుస్తకం పట్టుకుని ఎలా నిద్రపోతుందో.... ఆ పుస్తకం గురించే వచ్చాను” అన్నాడు చిట్టిబాబు చికాగా.

కి చెట్టు ఎందుకెక్కావంటే దూడల గడ్డికోసవన్నాడట వీళ్ళాంటివాడే! అర్దరాత్రి వేళ ఆడపిల్ల ఒంటరిగా నిద్రపోతున్న గదిలోకి దొంగలా వెళ్ళి, దాని మీద చేతులేసి, ఎందుకంటే పుస్తకం కోసం అంటున్నాడు వీడు. వింటున్నావా చెల్లెమ్మా?”

“శుభ్రంగా పెళ్ళి చేస్తానంటే వద్దని గోల చేసి, అర్దరాత్రి కళ ఈ వెధవ పనులేవిట్రా?' అంది తల్లి

'ఏ వెధవ...ప...ను...లు...?' = తల్లీ, మేనమామ అనుకుంటున్నదేమిటో అప్పటికి అర్ధమైంది చిట్టిబాబుకి - “కొబ్బరి చెట్టు నిజంగా దూడల గడ్డి ... డీవీపీ సీరియల్‌ కోసమే ఎక్కానేవ్‌... వేరే ఉద్దేశం లేదేవ్‌.. ఇంత గోల జరుగుతున్నా అది ఎలా నిద్రపోతోందో చూశావా? నాకు దీనితో పెళ్ళేవిటేవ్‌?” అని గొల్లుమన్నాడు చిట్టిబాబు.

“పెళ్ళొద్దన్నావంటే పళ్ళు రాలగొడతాను'

“నీకెందుకు శ్రమ చెల్లెమ్మా? నువ్వు కొంచెం అడ్డుతప్పుకో. వీడి కాళ్ళూ, చేతులూ నేను విరిచేస్తాను' అన్నాడు అన్నయ్య,

'వద్దు! తెల్లారగానే శా(స్తులుగారి దగ్గరకెళ్ళి ముహూర్తం పెట్టించు. నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట” అంది చెల్లెమ్మ.

“అలాగే చేస్తా కాని ఈ రాత్రికి వీడు మేడెక్కకుండా జా(గ్రత్తగా కాపలా కాయి,” అన్నాడు అన్నయ్య,

చిట్టిబాబు నెత్తీ నోరు కొట్టుకున్నాడు కాని ప్రయోజనం లేకపోయింది. ఫైనల్‌గా తన మాట చెప్పి తల్లి వెళ్ళిపోబోతుంటే, ఇల్లు ఎలాగా కాలిపోయింది, బొగ్గులేనా ఏరుకుందామన్న ఆశతో - * కనీసం ఆ దెయ్యం దగ్గర్నుంచి ఆ పుస్తకం తీసినా మొహాన్ని పడేసి వెళ్ళవే అమ్మా అన్నాడు చిట్టిబాబు ఏడుస్తూ,

చూడు చెల్లెమ్మా! అమ్మాయిని దెయ్యవంటున్నాడు' వో పెళ్ళాన్ని వాడిష్టం వచ్చినట్టు పిలుస్తాడు కాని ఆ పుస్తకం సంగతేమిటో

మేనమామ వరలక్ష్మిని ఓ గుద్దు గుద్ది, ఎ... హే..య్‌... ? అని పొలాల్లో రైతులు పొలికేక వేసినట్టు, మైలు దూరంలో పడుకున్న వాళ్ళు ఉలిక్కిపడి లేచేలా, ఓ

తోలేటి జగన్మోహనరావు 125 కేక వేసి చేతికరతో మంచం కింద ఉన్న డబ్బాలు ఢమ ఢమా వాయించి మళ్ళా ఇంకో గుద్దు గుద్ది, 'అ. మ్మాయ్‌' అని ఇంకొక పాలికేకవేశాడు. వరలక్ష్మి బద్ధకంగా కళ్ళు తెరిచి 'ఏవిటి నాన్నా?” అంది.

*ఈ కుంభకర్ణిని ఇలా లేపాలా?” అనుకున్నాడు చిట్టిబాబు దిగులుగా

“ఆ పుస్తకం ఇలా పడేయ్‌. నీ మొగుడికి కావాలిటి అన్నాడు మేనమామ.

నాలుగురోజుల్లో చిట్టిబాబు-వరలక్ష్మిల వివాహం అయిపోయింది. మేనమామ కూతుర్ని సాగనంపుతూ, 'అల్టుడిగారికి అన్నీ అందాయా? ఇంకేమన్నా తక్కువ య్యాయా?' అన్నాడు

“'తక్కువయ్యాయి'

'ఏం తక్కువయ్యాయి?' - మేనమామ తెల్లబోయి అడిగాడు.

'మేడ మీది గదిలో మంచం కింద డబ్బా.. చేతి కర్రా... " అన్నాడు చిట్టిబాబు దుఃఖంగా.

చిట్టిబాబు బావతో కలిసి అత్తారింట్లో అడుగుపెడుతూ, 'థాంక్యూ డీవీపీ' అంది వరలక్ష్మి ఆనందంతో.

" డీవీపీ ఎడ్రసు తెలుసా?

“ఏం? రిసెష్టన్‌కి పిలుద్దామా?'

“వద్దు కాని చిన్న పనుందిలే * అన్నాడు చిట్టిబాబు దవడ కండరం బిగిస్తూ,

ఇవ విని

'ఏవిటోయ్‌ చిట్టిబాబూ? అండర్‌ (గ్రౌండ్‌ వెళ్ళిపోయావా? రెండేళ్ళయింది నీ దర్శనమై'

“క్షణం తీరికుండటం లేదండి”

“వరలక్ష్మి ఎలా ఉంది? సంసారం ఎలా సాగుతోంది?

'సంసారానికేం? (బ్రహ్మాండంగా మూడు కథలూ, ఆరు సీరియల్స్‌లా సాగు తోందండి'

'అదేవిటి - వరలక్ష్మి మారలేదా?

“బాగా మారిందండి'

'మరి అలా ఏడుపు మొహం పెట్టి మాట్టాడుతావేవిటోయ్‌?”

*'పారకురాలు ముదిరితే రచయిత్రి అవుతుంది కదండీ.

“అంటే?”

.. వరలక్ష్మి ఇప్పుడు సైంటిఫిక్‌ , హార్రర్‌ , సస్పెన్స్‌, మిస్టరీ నవలలు రాస్తోందండి”

“కొంపతీసి అవన్నీ నువ్వు చదువుతున్నావేవిటి? అలా మెంటల్‌ కేసులా అయిపోయాను

'తాళి కట్టాక తప్పుతుందాండి?

కో వాపం ఎంత క్షష్టం వచ్చింది నీకు! ఏవన్నా పబ్దిష్‌ అయ్యాయా?'

'లేదండీ! మొదటి పారకుర్నీ, చివరి పాఠకుడ్నీ వేనేనండ్‌'

126 లక్ష్మీ కటూక్ష్తం

“అది సరే కాని, నెత్తిమీద ఆ మూటేమిటోయ్‌?'

“మూడు. పిశాచాలూ, నాలుగు నకిలీ బాండ్లూనండి, పోస్టాఫీసుకి తీసుకెడుతున్నానండి'

“అదేవిటి చిట్టిబాబూ 1! ఇంత ఎండలో నెత్తి మీద అంత బరువు పెట్టుకుని నడిచి. వెళ్ళక పోతే, హాయిగా స్కూటరుందికదా, స్కూటరు మీద తీసుకెళ్ళకపోయావుటోయ్‌'

“ఇంకెక్కడి స్కూటరండి ? ఎప్పుడో అమ్మేశానండి.”

( ఆంధ్రప్రభ వార పత్రిక , 29-8-90)

నారాయణ.,...నారాయణ...

ల్వ్వే శ్రీమన్నారాయణ గారికి ఆ ద్దు్యం తమాషాగా కనుపిస్తోంది. బెడ్‌మిద తననీ, తన పక్కన పడుకున్న భార్యనీ, బెడ్‌పక్కన ఉన్న లేంస్‌నీ, మధ్యలో సెంటర్‌ టేబులుని, దానిమీద ప్లవర్‌ వేస్‌ స్‌ - అన్నింటినీ పైనుంచి చూస్తున్న ఆయన - “ఇదేవిటి” నా శరీరాన్ని నేనెలా చూస్తున్నాను? ఇది కలా? నిజమా?" అని ఓ సారి గిల్లుకోబోతుం డగా, అరుంధతీ దేవి లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, రోజులాగే శ్రీమన్నారాయణ గారి పాదాలకు నమస్కరించబోయి, అవి చల్లగా తగలడంతో ఉలిక్కిపడి, తర్వాత జరిగింది (గ్రహించి గొల్దుమంది.

క్షణాలలో మంత్రి శ్రీమన్నారాయణగారి మరణవార్త నగరమంతా వ్యాంచింది. ప్రభువుల వారు - అంటే ముఖ్యమంత్రి గారు - ఉదయమే యోగాసనాలు వేస్తుండగా శ్రీమన్నారాయణ గారి మరణవార్త అందింది. పద్మాసనంలో ఉన్న ఆయన ఆ దుర్వార్త వినగానే కళ్ళు మూసుకుని గుండెల నిండా గాలి మెల్లిగా పీల్చి, ఛాతీ పొంగించి, ఓ అరనిమిషం గాలి స్తంభింప చేసి, తర్వాత నోరు సున్నాలా చేసి బుస్సుమని గాలి వదులుతూ, గాలి తీసిన బెలూన్దా డీలా అయిపోయి, ఆ స్టితిలో మరో అరనిమిషం వుండి, తర్వాత కళ్ళు బరువుగా తెరిచి, అటూ ఇటూ వున్న పత్రికల వాళ్ళ కేసి తడికళ్ళతో చూసి, గడ్గదకంరంతో, 'మా కుడిభుజం కూలిపోయింది. అని పక్షవాతం వచ్చినట్టు కుడిచెయ్యి వేలాడదీసి, మెడ వాల్చేశారు.

'నచ్చినకోడిలా మెడవాల్భేశాడు - ఈడు కూడా బాల్చీ తన్నేశాడా' అని ప్రభువుల వారి ఎడం భుజం ఆత్రుతగా, ఆశగా చూస్తుండగా, గాలి కొడుతుంటే పుట్‌బాల్‌ బ్లేడరు. పొంగినట్టు ప్రభువుల వారు మెల్లిగా పొంగుతూ పూర్వపు

128 లక్ష్మీ కటాన్షం ఆకారంలోకి వచ్చేసి, వైరాగిలా చిరునవ్వు నవ్వుతూ, 'జాతస్య మరణం ధృవమ్‌” అన్నారు ఫిలసాఫికల్‌గా.

“అహా - ఏం రంగులు మారుస్తారు గురువుగారు - పూర్వ జన్మలో ఉడతై వుండాలి" అన్నాడు మెల్లిగా, ఒక జర్నలిస్టు తన సీనియర్‌తో.

“ఉష్‌ రంగులు మార్చేది ఉడతకాదు- ఊసరవెల్లి ' అన్నాడు సీనియర్‌ జూనియర్‌ని మందలిస్తూ...

స్వగృహంలో హాలులో ఉంచబడిన శ్రీమన్నారాయణగారి భౌతిక కాయానికి అందరూ (శ్రద్దాంజలి ఘటించి వెడుతుండగా, ఒకరు పొరపాటున శ్రీవారి పాదరక్షలు ధరించి బయటకు నడవబోయారు.

ఎవరో అవి శ్రీవారి పాదరక్షలుగా గుర్తించి - 'అరే - ఇవి మీకు సరిపోయాయే” అని ఆయన్ను అభినందిస్తుండగా, మరొకరు ఈ సారి ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి టోపీ తన నెత్తికి తగిలించుకున్నారు.

“అరే - ఇది మీకోసమే కుట్టించినట్టు ఎంత చక్కగా అవిరిందీ, అని ఆయన్ను వందిమాగధులొకరు పొగిడారు.

“అయితే మంత్రి పదవి మీదే' అంటూ రెండో వందిమాగధుడు శవాలంకరణకు తీసుకు వచ్చిన దండల్లో ఒక దండ తీసి ఆయన మెళ్ళో వేశారు అభినందిస్తూ.

“అయ్యా - తవరు పొరబడుతున్నారు. శ్రీవారి పాదరక్షల్లో - ఇంగ్రీషువాడు ప్రాగ్‌ ఇంటూ షూస్‌" అంటాడే - అలా మా గురువుగారు మొదట అడుగువేశారు. అంచిత ఆయన మంత్రి అవాలి” అని వివరించారు మొదటి పక్షం వారు.

తల ముఖ్యం కాబట్టి టోపీ దాసుగారే మంత్రి అవాలి అని పట్టుబట్టారు ఆయన అభిమానులు.

“అయ్యా! ప్రభువుల్ని పొగిడే నోరు, వారి పాదపూజ చేసే చేతులూ, సీటుదాకా నడిచి వెళ్ళే” కాళ్ళూ - ఈ మూడున్నూ పంచేంద్రియాలుగా శాస్త్రకారులు సెలవిచ్చారు. అందులోనూ, తతిమ్మా రెండూనూ పాదాలను సీటుదాకా నడిపించే కార్యక్రమం నిర్వర్తించడానికే ఉద్దేశించబడ్డవి కాబట్టి, 'సర్వేంద్రియానాం పాదమ్‌ 'ప్రధానమ్‌' అన్నారు కూడా! అంచేత ధర్మానుసారం పాదరక్షలు మోస్తున్న భరతుడు గారే శ్రీవారి నో “అర్హులు” అని ధర్మ సూక్ష్మాన్ని వివరించారు శాస్ర్రులుగారు.

తల ముఖ్యమా, పాదాలు ముఖ్యమా క్త్తీ వాదం వివాదంగా మారి, రెండు (గ్రూపులూ చెయ్య చెయ్య కలిపేటప్పటికి పెద్దలు కలుగచేసుకుని, ఈ విషయం గురించి పార్టీ హైకమాండు విచారిస్తుందని నచ్చచెప్పి, ఇరుపక్షాల వారిని శాంతింపచేస్తుండగా 'ఓర్నా దేవుడోయ్‌ - నన్ను కూడా తీసుకుపోరా నా దేవుడోయ్‌” అంటూ పెద్ద పెట్టున ఏడుస్తూ అరుంధతీ దేవి సుడిగాలిలా దూసుకు వచ్చి శ్రీవారి పాదాల మీద వాలిపోయింది.

'అమ్మా! అమ్మా! అరుంధతమ్మా! పోయినోళ్ళతో మనవూ పోతామా - తప్పుక్తాదూ - సమ్మళించుకోండమ్మా' అని ఓడ్గార్థుసాగారు ఆప్షులు.

“ఇంక సమ్మళించుకునేదేంటి దేవుడో - ఆయనెల్లిపోయాకా ఈ

తోలేటి జగన్నోహనరావు 129 బతుకెందుకు” ఆయనతో పాటే నన్నూ తగిలేసేండ్రోయ్‌,.' అంటూ సహగమనం చేస్తానని [పకటించి, ఇంకో పుట్టెడు కట్టెలతో డబుల్‌ బెడ్‌ ఏర్పాటు చెయ్యమంది సతీ అరుంధతి.

హాలులో, ఫేను రెక్కమీద కూర్చుని ఆంతాచూస్తున్న శ్రీవారి కళ్ళు చెమ్మగిల్లాయి ఈ పిచ్చి మొహం నేను లేకపోతే ఎలా బతుకుతుందో ఏవిటో” అని ఆయనకు దుఃఖం ముంచుకొచ్చింది

“అమ్మా! మీకు ఈ బతుకు అక్కర్లేదు - నిజమే - మరి మాకు కావాలే-మీ బిడ్డల్ని ఇలా అనాధల్ని చేసి మీరూ వెళ్ళి పోతే ఎలా? అసలే నాన్నగారు పోయి గుండె పగిలి మేమేడుస్తుంటే మీరుకూడా ఇలా అంటే మేం ఏమైపోవాలి? దేశం ఏమైపోవాలి? అమ్మా- ఈ కుర్చీలో కూర్చుని కొంచెం శాంతించండమ్మా' అంటూ 'బిడ్డలు' శ్రీవారి కుర్చీ తీసుకువచ్చి అక్కడ వేశారు. ఆవిడ రక్కున ఏడుపాపి, బిడ్డల కోరిక మన్నించి శ్రీవారి పాదాల దగ్గరనుంచి లేచి కుర్చీలో కూర్చుని శాంతించింది.

“గోవిందా....” అన్నారు ఎవరో.

అది శవం లేపమన్న సూచనో లేక కుర్చీ గోవింద కొట్టిందని చెప్పడమో అర్హం కాక టోపీ దాసరిగారూ, భరతుడుగారూ ఒకళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు అయో మయంగా

చివరకు శాస్తులుగారు, 'ఆవిడని ఈ సమయంలో ఇక్కడ కూర్చోబెట్టడం ఏం బావుంటుంది చెప్పండి - లోపలకు తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకోనివ్వండి - ఈ పదిరోజులూ అయ్యాక ఆ విషయాలు చూసుకోవచ్చు, అన్నారు పెద్ద మనిషి తరహాగా,

'అమ్మ - మీ దొంగెత్తు మాకు తెలీదా - 'స్టెప్పెంగ్‌ ఇంటూ షూస్‌' అన్న ముండాకొడుకే 'ఫస్టైక్‌ ది ఐరన్‌ వైన్‌ ఇటీజ్‌ హాట్‌ అన్నాడు. మేవూ ఇంగ్లీషు చదువు కున్నాం - మాకూ రాజనీతి, మంత్రినీతి అన్నీ తెలుసు - అమీ తుమీ ఇప్పుడే తేల్చుకోకపోతే ఎలా? " అన్నారు ఆమె “బిడ్డలు, అంతవరకు ఏక ధారగా కారుస్తున్న కన్నీళ్ళు ఆపి, కళ్ళెర్రజేస్తూ .

'అయితే తేల్చుకుందామా? " అన్నారు టోపీదాసుగారు లేస్తూ,

'తేల్చుకుందామా?" అన్నారు భరతుడుగారు, సిల్కు ఖాదీ లాల్ఫీ చేతులు పైకి మడుస్తూ.

“ఇంకా నా శవమైనా లేవలేదే - ఇక్కడే వీళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారే' అని శ్రీవారు బాధపడుతుండగా, ఎవరో జరగవలసిన దాన్ని గురించి హెచ్చరించారు. అంతా ఆ(గ్రహ పూరిత వదనాలను విషాదవదనాలుగా మార్చేసి శ్రీమన్నారాయణగారి భౌతిక కాయాన్ని అతిశ్రద్ధతో లేవదీసి, పూలమాలలతో అలంకరించబడిన వాహనం మీద వుంచి రాజ కీయాలు చర్చించుకుంటూ, వాదించుకుంటూ, దూషించుకుంటూ వాహనం వెనుకే నడవసాగారు. .

పంతులూ - నాకు తెలీక అడుగుతాను - ఇంట్లో అడుగుపెట్టినాడి సూపు ఇనప్పెట్టి మీదికెల్తాది కానీ - దీనమ్మ సిగదరగ - ఈడి సూపు సెప్పుల మీదికెల్లా

130 లక్ష్మీ కటాక్షం పోయిందయ్యా ' - ఈ మధ్యనే రాజమండ్రి సెంట్రలు జైలునుంచి రాజకీయాల్లోకి (గ్రాడ్యుయేట్‌ అయిన [క్రిమినల్‌ - పొలిటీషియన్‌ గారు సందేహం వచ్చి పంతులుగారి అడిగారు.

“'మదమలిన గండ కుంజరాల్హాంటి ఇనప బీరువాల మీదికి లంఘించడానికి అంతా తమవంటి వీరకిశోరాలే వుంటారా ప్రభూ - అల్ప జీవులకు అల్ప బుద్దులు...”

...అసలు అరుంధతమ్మగారికేం వచ్చని ల"

“అదిగో మళ్ళీ - ఆవిడ నోటి పవరు నికేం తెలుసు? - ఆవిడ చీపురుచ్చుకుని రంగంలోకి దిగిందంటే అనఫీషియల్‌గా ఎమర్జన్సీ డిక్తేర్‌ చేసినట్టే... "

'ఆ టోపీ పెట్టుకుని కొమ్మ దాసరోడిలా వెలా కులుకుతున్నాడో చూశారా? - వెధవ బోఫోర్సు మొహం వాడూనూ .....” - రుసరుసలాడుతున్న భరతుడిగారికి మళ్ళీ సందేహం వచ్చి దిగులుగా పక్కనున్నాయన్ని అడిగారు - "పార్ట్‌ హైకమాండు మనల్ని సపోర్టు చేస్తుందంటారా?”

ఊరుకోండి వెధవ అపశకునం మాటలూ మీరూను - పార్టీ హైకమాండుకి బుర్రలక్కర్లేదు - అసలు సొంత బుర్రలుండటం పెద్ద డిస్క్వాలిఫికేషన్‌ కూడా - మీకేం ఎక్కువని అలా కంగారుపడిపోతారు?' - అభిమానంగా మందలించారు ఆయన అఆప్షులొకరు.

“పాపం - గురూగార్చి స్థిమితంగా కూర్చుని తిననిచ్చిందెప్పుడు? ముద్ద ముద్దకి ఎంక్వయిరీ కమిటీలు - హార్టెటాక్‌ వచ్చిందంటే రాదా?"

“ప్రభువుల వారి పక్కలో బల్లెంలా వుండేవారు - ఇంకో అర్నెల్లు ఆయన బతికుంటే ఈ హార్టైటాకు ప్రభువుల వారికే వచ్చి, మన గురూగారు సియం. అయిపోయేవారు' - శ్రీవారి కక్ష్యలో తిరిగే రెండు ఉపగ్రహాలు శోకించసాగాయి.

“అయ్యో - ఇంకో అర్నెల్లు బతకలేకపోయానే' అని శ్రీవారి ఆత్మ విలపిస్తుండగా, ఆయన అంతిమ యాత్ర ఇందిర ధర్మాసుపత్రి సెంటర్‌కి చేరింది.

2 ఆ రోజు ముందు రెండు రోజుల క్రితం సాయంత్రం వేళలో, అలవాటుగా దేవాలయానికి వెళ్ళి ఓ గంటసేపు ధర్మోపన్యాసాలు విని, శాంతి పొందిన మనస్సుతో, ఇంటికి తిరిగి వెడుతున్న ప్రముఖ సమాజ్‌ సేవకులు పద్మశ్రీ ధర్మారావు గారికి దేవాలయ మెట్ట మీద అపస్మారక సితిలో పడున్న దరిద్ర నారాయణుడు కనిపించాడు. న్‌

“అయ్యో పాపం - ఈ దీనుడు ఇలా నిస్సహాయంగా పడిఉన్నాడే " అని ధర్మారావు గారు కలత చెంది, దరిద్ర నారాయణుడీని తన కారులో ధర్మొసుపత్రికి తీసుకుపోయి, అక్కడ వదిలి ఇంటికి వె వేన్నీళ్ళ స్నానం చేసి, భోం క్తి తన గదిలోకి వెళ్ళి డైరీతీసి- “ఈ రోజున నేను లేసిన మంచి పనులు” అనే శీర్షిక కింద ఆ విషయం రాసుకుని, తృప్తిగా ఆనందంగా నిద్రపోయారు

తోలేటీ జగన్నోవానరావు 131 దరి[ద్ర నారాయణుడు మాత్రం రెండు రోజుల నుంచి ఆలనా పాలనా లేకుండా అపసా గక స్పితిలో అలాగే పడున్నాడు ధర్మాసుపత్రిలో,

'ఏమిటికేసు?' అనడిగాడు రెండు రోజుల తర్వాత ఓ యువ డాక్టర్‌ ఓ యువ డాక్టరి కళ్ళల్లోకి చూస్తూ,

ఏవ్‌ట్‌ - ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు - పేషంటు కో ఆపరేట్‌ చెయ్యకపోతే మనవేం చెయ్యగలం” అంది నిస్సహాయంగా, జాలిగా, ఆ అమ్మాయి యువడాక్షరు కళ్ళల్లోకి చూస్తూ,

'నాకందుకనే ఈ జనాలన్నా, ఈ దేశమన్నా అసహ్యం = నేను రిజైన్‌ చేసి స్టేట్సుకి వెళ్ళిపోతున్నాను,” అన్నాడు యువడాక్టరు.

'నిజంగా' అంది ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి. ఆడవాళ్ళు ఎవరి మదినేనా కలవర పెట్టాలనుకున్నప్పుడు వాడే బ్రాండు కాటుక కళ్ళకు పెట్టుకునుంది యువడాక్షరి ఆ సమయంలో.

'నిజంగా' అన్నాడు యువడాక్టరు కొంచెం కలవరపడి.

'అసలు ప్రాణం వుందంటావా?' అన్నాడు మళ్ళీ యువడాక్షరు తన కలవర పాటును కప్పిపుచ్చుకుంటూ, దరిద్ర నారాయణుడు కేసి తిరిగి.

'అదీ అడిగాను = పెదవి విప్పడే' - మళ్ళీ బేలగా అని, ' సిష్టర్‌ - ఆ పేషంటు పల్ఫు చూడు," అంది కాటుక కళ్ళ సుందరి, స్టేట్స్‌ యాత్రలో మళ్ళీ దరిద్ర నారాయణుడి ప్రస్తావన వచ్చినందుకు చికాకు పడుతూ.

సిస్టర్‌ ఓ కంటితో వారిని గమనిస్తూ ఓ చెవితో వాళ్ళ మాటలు వింటూ, చాలా బిజీగా వుంది. ఆవిడకి అక్కడ్నుంచి ఆ సమయంలో కదలడం ఇష్టం లేదు. అంచేత అమె దరిద్రుడి బెడ్‌ దగ్గర నిలబడి ఉన్న వార్డు బోయ్‌తో, "పేషంటు పల్సుచూడు' అంది విసుగ్గా,

నిరోలాక్‌ సూపర్‌వైట్‌ పెయింటులో పీకలదాకా ముంచి తీసిన నల్లకాకిలా మెరుస్తున్న నర్సు ఒంపుసాంపులన్నీ కళ్ళతో తడుముతున్న వార్డు బోయ్‌, కళ్ళు తిప్పకుండానే చెయ్యికిందికి పోనిచ్చి, దరిద్రుడి చెయ్యు పట్టుకోడానికి బదులు ఇనుపమంచం రాడ్‌ పట్టుకుని, అది చల్లగా తగిలేసరికి రక్కున వదిలేసి, 'సచ్చిపోయాడు' అన్నాడు, కళ్ళు తిప్పకుండానే .

"పేషంట్‌ డెడ్‌ అయిపోయాడు” అంది సిస్టర్‌.

హీ ఈజ్‌ డెడ్‌ " అంది యువడాక్టరి విచారంగా.

“అయితే శవాన్ని వెంటనే మార్చురీకి చేర్ప్చించండి " అన్నాడు యువడాక్టరు.

“తొమ్మిదో నెంబరు పేషంటు తాలూకు మనుషులెవరయ్యా = హాలు బయట కూర్చున్న పేషంట్ల బంధువుల దగ్గరకు వెళ్ళి నిర్లక్ష్యంగా ఓ కేక ఇశాడు తోటీ వాడు.

ఎవరూ లేవలేదు.

'ఓళ్ళూ లేరా. పేషంటు సచ్చిపోయాడు” అనరిచాడు మళ్ళీ,

ఎవరూ లేవ లేదు.

'వాళ్ళ వాళ్ళు వస్తారులే - నువ్వు శవాన్ని శవాల గదికి చేర్చు అన్నాడు

132 లక్ష్మీ కటాక్షం యువడాక్షరు.

'వాళ్ళ వాళ్ళను రానీయ్‌' అన్నాడు తోటీవాడు.

వాళ్ళ వాళ్ళు వస్తే కాని వాడికి డబ్బులు రాలవు డబ్బులు రాలితేగాని శవం శవాలగదికి చేరదు. కాని దరి[ద్రుడికి ఎవరూ లేరన్న సంగతి వాడికి మరో రెండు గంటల తర్వాత కాని అర్హం కాలేదు అంతవరకు వార్డులోంచి బయటకు ఈడ్వబడి వరండాలో ఉంచబడ్డ దరి[ద్రనారాయణుడి భౌతిక కాయానికి వచ్చే పోయేవాళ్ళందరూ భయపడుతూ (శ్రద్దాంజలి ఘటించి వెడుతున్నారు

నువ్వేమన్నా ఇస్తావా -.తొందరగా తిసికెళ్ళి పడేస్తా అని వాడు శవంతో అన్నాడు కాన, "కాని విదల్బను - నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళు బే' అన్నట్టు శవం కాళ్ళు నిగడ దన్ని పడుకుంది కాని పెదవి విిలేదు చేతిలో మామూలు పడకుండా శవాన్ని శవాల గదికి చేర్చాలంటే వెట్టిచాకిరీ చెసినట్టు ఉంది వాడికి.

“'యమ్మెస్‌ విజిట్‌ కొచ్చే టైమైంది. శవం ఇక్కడుంటే ఆయన కోప్పడతారు' అంది యువడాక్టరి.

సమ్మెనొమి నా ఎంట్రుకలు పీకుతాడా - ఆర్ని నోరెత్తమను - నేను చిటికేసాన స్ట్రైక్‌ - అప్పుడు ఆడూ, నువ్వూ మొయ్యాలి శవాల్ని' అంటూ తను ఓ పవర్‌ పుల్‌ యూనియన్‌ లీడర్న్న సంగతి దురుసుగా గుర్తు చేశాడు తోటీవాడు.

వాడి నోటి దురుసుతనానికి యువడాక్టరికి కళ్ళనీళ్ళొచ్చినంత పనైంది.

కాటుక కళ్ళ సుందరికి అలా కళ్ళనీళ్ళు తెప్పించిన తోటీవాడిమీద అన్నాడానురాగం పాంగుకొచ్చిన నర్చు. 'చూడు శివుడూ - ఇది ధర్మారావగారి కేసు

  • ఎడకెవరూ లేరు - వెంటనే వీడిని ఇక్కడనుంచి తీసుకెళ్ళకపోతే ఇంకో మూడు నాలుగు శవాలు తయారవుతాయి - 'పషంట్లంతా బయపడి సస్తన్నారు' అని నచ్చచెప్పింది.

ఆ నర్భు అలా మెత్తగా చెప్పాకా కోపం కొంచెం చల్లారి, వాడు దరి(ద్రుడి శవం వున్న చక్రాల బండిని విసుగ్గా అటూ ఇటూ తోస్తూ శవాల గదివైపుకి తీసుకెడుతుండగా శ్రీమన్నారాయణ గారి అంతిమయాత్ర ఇందిర ధర్మాసుపత్రి సెంటర్‌కి చేరింది. చక్రాల బండిని విసురుగా ఓ తోపు తోసి, అది చూడ్డానికి రోడ్డు మీదకు నడిచాడు వాడు.

అలా తోటీవాడు విసురుగా తొయ్యగానే రంయినపోయి చక్రాలబండి గోడకు గుద్దుకుంది. ఆ కుదుపుకి ముక్కుమీదున్న కొనప్రాణం పోయి దరిద్రుడు బరువు దించుకున్నట్టు శరీరం వదలి, 'థాంక్స్‌' అంటూ హుషారుగా గాలిలోకి ఎగిరాడు. అలా ఎగురుతున్న వాడికి వాహనం మీద తన భౌతిక కాయం పక్కన కూర్చుని కన్నీరు కారుస్తున్న ట్రెమన్నారాయణ గొరు కనిపించారు.

'హాయ్‌-చచ్చిపోయా' అన్నాడు దరిద్రుడు శ్రీమన్నారాయణగారి పక్కనవాలి.

“అయ్యో - వ్రచ్మిపోయా' అన్నారు శ్రీమన్నారాయణగారు సమాధానంగా. *

. గాడ్‌ టు మీట్మ్‌ యు- నాపేరు డి.నారాయణ, బి.ఏ. అన్నాడు ఎ౩ద్రుడు శ్రీమన్నా రాయణ గారికి షేక్‌ హాండిస్తూ

తోలేటి జగన్మోనానరావు [133

'నాపేరు యన్‌ నారాయణ- నిన్ను కల్సుకోవడం నాకేమాత్రం సంతోషంగా లేదు' అన్నారు శ్రీమన్నారాయణ గారు చెయ్యి. విదిలించుకుని కళ్ళు తుడుచుకుంటూ.

'ఏవిట్రా పిచ్చివాడా - చచ్చిపోయినవాడివి హాయిగా గాలిలో తేలిపోక ఏడుస్తూ కూర్చున్నావు? + అన్నాడు డి. నారాయణ నవ్వుతూ.

'నాకు చావాలని లేదు” అన్నారు యస్‌. నారాయణ గారు. ఏడుస్తూ.

“శరీరం, ఆత్మకి చాక్కాలాంటిదిరా - చచ్చిపోవడవంటే పాత చొక్కా వదిలి కొత్త చొక్కా తొడుక్కోవడమన్నమాట - కొత్త చొక్కా తాడుక్కున్నందుకు సంతోషించక ఏడు స్తావేంటిరా పిచ్చివాడా!”

నాకు పాత చొక్కాయే బావుంది' అన్నారు శ్రీమన్నారాయణ గారు తన 'చొక్కా' కేసి కన్నీళ్ళతో చూస్తూ,

దరిద్రనారాయణుడు శ్రీమన్నారాయణ గారి భౌతిక కాయాన్ని పరిశీలనగా చూస్తూ, 'మనం ఇద్దరం నారాయణ స్వరూపాలమే కాని దేవుడు నీకు సిల్కు చొక్కా ఇచ్చి నాకు వెధవ చిరుగుల చొక్కా ఇచ్చాడేవిట్రా' అన్నాడు దిగులుగా.

నీ కర్మ"

“అంతేనంటావా?”

'అంతే'”

దరి[ద్ర నారాయణుడు శ్రీమన్నారాయణ గారి భౌతిక దేహం వున్న తెల్లటి పరుపు కేసి ఆశగా చూస్తూ 'ఆ పక్షటిద కాసేపు పడుకోనా? బతికున్నప్పుడు ఇంత తెల్లపక్క మీద ఎప్పుడూ పడుకోలేదురా' అన్నాడు.

'పడుకో' అన్నారు శ్రీమన్నారాయణ గారు విసుగ్గా.

తెల్లటి దుప్పటీలో దూరి పోయి, కాలు మీద కాలువేసుకుని కొంత దూరం (ప్రయాణం చేసి, అంతలో తన చొక్కా గుర్తుకొచ్చి, 'ఆరేసుకోబోయి. పారేసు కున్నాను .హర్‌...హరీ...' అని పాడుతూ పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు దరిద్రుడు

'వెధవపాట ఆపు” - అరిచారు శ్రీమన్నారాయణ గారు దుఃఖంతో.

దర్శిద్రుడికి శ్రీమన్నారాయణ గారిని చూస్తే జాలేసింది - 'పోనీ ఓ పని చెయ్యకూడదురా పిచ్చివాడా, బతికేద్దువుగాని” అన్నాడు.

“ఏవిటి?'- ఆశగా అడిగారు శ్రీమన్నారాయణగారు, ఇంకో ఆర్నిల్గు బతికితే తను సియం అయ్యేవాడినన్న అభిమానుల మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ.

'నీ చొక్కాకు టైమ్రైపోయింది - అది నీకు ఇంక పనికిరాదు - నా చొక్కా ఆసుపత్రి వాళ్ళు దయతో తొందరపడి విప్పేశారు కాని ఇంకా టబైముందిరా - అంత సరదా పడుతున్నావు - పోనీ నువ్వు నా చొక్కా వేసుకు తిరగకూడదా?'

“ఎలా?

“ఎలా ఏవిట్రా పిచ్చివాడా - ఇన్ని పార్టీలు మార్చిన వాడివి నన్నడుగుతావేం ఆ పరకాయ ప్రవేశం చెయ్యరా డింభకా"

134 లక్ష్మీ కటాన్షం

“నిజంగా నీ చాక్కా ఇచ్చేస్తున్నావా - ఒక్క ఉదుటున లేచి అడిగారు శ్రీమన్నారాయణ గారు, దరిద్రుడు మళ్ళీ మనసు మార్చుకోకముందే చొక్కా తొడిగేసుకోవాలన్న ఆత్రుతతో.

'నిజంగానేరా - నే బతికినంతొట్ట - అచ్చంగా నీదే ' అన్నాడు దరిద్రుడు. శ్రీమన్నా రాయణ గారు లాంగ్‌ జంప్‌ చేసి వాహనం మీంచి ఆస్పత్రి గేటు మీదకు దూకారు.

“ఒరే పెచ్చివాడా. మన ఎడ్రసు తెల్పుగా - బ్రాంచినెంబరు 7, ఊడల మర్రి, ముప్పు య్యారోవార్ను- అంటే తెల్పుగా ....హ్హ...హ్హ్హ...” - తన జోకుకి తనే విరగబడి నవ్వి - 'నన్నెప్పుడైనా కలవాలనిపిస్తే అక్కడికి వచ్చేసేయ్‌ - టా...టా...భీరియో...' అని ర్రీయున్దారాదుణ గారికి వీడ్కోలు చెప్పి, ' హరీ...హరీ...' అని పాడుకుంటూ ముష్ఫ య్యారో వార్డు వైపుకి సాగిపోయాడు దరిద్రుడు.

శ్రీమన్నారాయణ గారు దరిద్రుడి శరీరంలోకి ప్రవేశించడానికి విశ్వ (ప్రయత్నాలు చెస్తుండగా తోటీ వాడు తిరిగి వచ్చి, విసుగ్గా చశ్రాలబండిని ఓ గెంటు గెంటాడు. బండి ఈ సారి పక్కనున్న గోడకు దఖీమని గుద్దుకుంది. ఆ కుదుపుకి శ్రీమన్నారాయణ గారి ఆత్మకి దరిద్రుడి శరీరంలో దారి దొరికింది.

“పొద్దుటే ఎవడి మొహం చూసేనో కాని టీ డబ్బులు కూడా రాల్లేదు - ఉన్నది కాని లేనోడీకి ఎవడూ కానీ విదల్గడురా నాయనా అని శవాల సంపాదన మదే రెండిళ్ళు కట్టిన విషయం మర్చిహేయి బాధపడి, 'పోనీ బీడీయేనా వుందా? అనడిగాడు. తోటీవాడు.

శవం జేబులన్నీ తడిమి. సగం కాలిన బీడి ముక్క జేబులోంచి లాగి, ' ఛీ అని విసిరయ్యబోయి, మళ్ళీ ఆలోచించి, 'సచ్చినోడి దగ్గర్నుంచి ఏదొచ్చినా లాబవే” అని బీడి ముక్క చెవిలో పెట్టి, 'సొంత డబ్బులతో టీ తోగొస్తా కాని నువ్వెళ్ళి శవాల గదిలో పడుకో - విసిగించక' అని శవానికి చెప్పి, టీ తాగడానికి పోయాడు తోటీవాడు.

శవం లోపలున్న శ్రీమన్నారాయణగారు ఊ కొట్టి, వాడు వెళ్ళిపోగానే బండిదిగి త్వరత్వరగా ఆసుపత్రి లోంచి బయటకు నడిచారు.

దరిద్రుడి కళ్ళల్లోంచి చూస్తున్న ప్రపంచం శ్రీమన్నారాయణ గారికి వింతగా అనిపించింది,

'నిన్నటిదాకా ఏసీ బంగ్లాలు, పడవకార్జు, "ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌తో, పిటపిటలాడే పడుచుల సల్కు చీరల రెపరెపలతో, టీవీ ఎడ్వర్‌బెజుమెంటులా కలకలలాడుతుండే దేశం నేను పదవిలో లేని ఒక్కరోజులోనూ ఇంత పాడైపోయిందేవిటి? ఈ మురికివాడలూ, ఈ ఎండిన మనుషులూ, ఈ దరిద్రం - ఇదేవిటి?" అని ఆశ్చర్యపోతూ తన కోటవేపు నడిచారు ఆయన.

అలా నడిచి, నడిచి, నీరసంగా. గేటు తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే గేటు దగ్గర గూర్థావాడు లారి అడ్డుపెట్టి , ఎవడ్రా నువ్వు?” అని కళ్ళరదేశాడు.

నేను... కనిపించడంలా...శ్రీమన్నారాయణన్‌, అన్నారు శ్హీవారు.

చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన తల, ఎండిసోయిన నల్లన శరీరం,

తోలేటి జగన్మోహనరావు 135 లోతుకు పోయినకళ్లు - ఆయన ఆకారం చూసి అంతా గొల్టున నవ్వారు.

'పాపం - పిచ్చాడితో నీకేవిటి? అని గూర్ధావాడితో ఎవరో అంటుండగా, ' ఏవిటి గొడవ?" అంటూ అరుంధతీదేవి పోర్టికోలోంచి అరిచింది.

ఆవిడ కనుపించగానే శ్రీవారికి ఎక్కడలేని ఓపికా వచ్చింది. గూర్చ్ధావాణ్ణో తప్పించు కుని మెరుపులా అవిడ దగ్గరకు పరిగెట్టి 'నేనేనే భువనసుందరీ" అన్నారు శ్రీమన్నారా యణ గారు ఆవిడ చెవిలో.

ఆవిడని 'భువన సుందరీ" అని ఏకాంతంలో శ్రీవారు తప్ప ఎవరూ పిలవరు. అంచేత ఆవిడ ఆయన్ని తరుముకు వస్తున్న గూర్థాని పొమ్మని చెప్పి, శ్రీమన్నారాయణ గారికేసి తిరిగి ఎవరు నువ్వు? అంది అనుమానంగా.

నేనే అరుంధతీ, నీ మొగుణ్ణి...” అంటూ ఆవిడకీ, ఆయనకీ, మూడో కంటివాడికీ మాత్రమే తెలిసిన రహస్యాలు బుజువుగా చెప్పి, 'బతికొచ్చేసేనే అరుంధతీ - ఇంకో నెల్లో నేను సియం. అవకపోతే చూడు” అన్నారు అనందంగా.

అవన్నీ విన్నాకా, ఎదురుగా ఉన్నది నిజంగా శ్రీవారేనని నమ్మకం కుదిరాక, అవిడ గొల్టు గొల్లున ఏడ్వడం మొదలుపెట్టింది.

'ఏడవకే పిచ్చి మొహవా - వచ్చేశాగా' అని శ్రీవారు ఓదార్చబోతుండగా మొదలు పెట్టింది ఆవిడ - 'ఓరి సచ్చినాడో - సచ్చినోడివి సావకుండా మళ్ళీ ఇలా బతికి సచ్చావంటట్రా సచ్చినాడో - పార్టీవోళ్ళు నాకు పట్టాబిషేకం చేద్దామనుకుంటుంటే ఇప్పుడిలా స్మెసానం లోంచి ఎందుకు తగలడ్డావురా సచ్చినాడో అంటూ, గొల్టు గొల్లున ఏడ్చి, మళ్ళీ వస్తే కాసా చేతులూ విరిచేయమని చెప్పి, ఆయన మొహం మీదే'తలుపేసేసిందీ అరుంధతీదేవి.

ఆ ఇంటి తలుపులేకాదు - 'చొక్కా' మారగానే తానంతవరకూ మసలిన స్వర్గం తలుపులు తనకు మూసుకుపోయి, తనెన్నడు చూడని నరకం తలుపులు తెరుచుకున్నాయన్న సంగతి ఆయనకు" స్పష్టమైంది. ఆయనకు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్దం కాలేదు. దిగులుగా రోడ్డుమీద నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టయింది. కడుపులో ఏదోలా అనిపించసాగింది. విపరీతమైన నీర్సం అనిపించింది.

“ఇప్పుడే బతికాను - మళ్ళీ ఏవైంది నాకు' అని ఆయన ధర్మాసుపత్రి వైపుకు దారి తీయబోయారు కాని వాళ్ళు తనని గుర్తుపట్టి శవాల గదిలో పడేస్తారేమోనన్న భయంతో ఆ (ప్రయత్నం విరమించుకుని నడక కొనసాగించారు.

అలా తూలుతూ నడుస్తూ ఎంతకాలం, ఎంతదూరం వి ఎప్పుడు స్పృహ తప్పి పడిపోయారో గుర్తులేదు. కాని ఆయన కళ్ళు తెరిచేటప్పటికి భూతంలా ఉన్న ముసిలాడు ఆయన మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు.

'నాకేమైంది?” అనడిగారు శ్రీవారు.

ముసిలాడు సమాధానం చెప్పకుండా సూపర్‌ స్పెషలిస్టులా ్రశ్చలడగడం మొదలుపెట్టాడు.

'నీర్చంగా ఉందా?"

136 లక్ష్మీ కటాక్షం

'తల తిరుగుతోందా?”

“కాళ్ళు వణుకుతున్నాయా?”

'ఊ...... ఏవైంది నాకు... పెద్ద జబ్బా.... " అనడిగారు శ్రీవారు కంగారుపడుతూ.

"పెద్ద జబ్బేంకాదు ....మామూలు జబ్బే... ఆకలి' అన్నాడు ఆకలి స్పెషలిస్టు నవ్వుతూ.

3

ఆరు నెలల తర్వాత ఓ అమావాస్య రోజు అర్హరాత్రి ముపష్పయ్యారో వార్డులో 'హారిబుల్‌...మోస్ట్‌ హారిబుల్‌ * అనే పెనుకేక్‌ సమాధుల మధ్య ప్రతిధ్వనించింది.

మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఉయ్యాలలూగుతున్న వెయ్యం ఒకటి ఉలిక్కి పడి అటూ ఇటూ చూసి, 'మనిషి.. మనిషి ' అని భయంతో కిచుగా అరుస్తూ, మాయమై పోయింది. నడిరేత్రి తమ తమ పనుల్లో మునిగి వున్న దెయ్యాలు ఆ కేక వినగానే ఉలిక్కి పడి ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

చిటారు కొమ్మమీద పడుకున్న దరిద్రుడు కొంచెం కళ్ళు తెరచి ఏవిటి గొడవ?' అని తన కొమ్మమేటుని అడిగాడు.

“కామ్ములంటుకున్నా లేవవు నువ్వు - నడి రేత్రి కాళ్ళ కింద కొచ్చినా ఇంకా బద్దకమే.. లే...లే..... అని మందలించి, “ఎవరో మనిషి వచ్చాడు అని దెయ్యూలలోకంలో కలవరానికి కారణం వివరించాడు కొమ శమేటు.

దరిద్రుడు ఓ సారి ఆవిలించి, కొమ్మ మీంచి కిందకు చూసి, శ్రీవార్ని గుర్తుపట్టి, సంతోషంతో కిందకు దూకి ఆయన్ను కౌగిలించుకుని, “ఏరా పిచ్చివాడా - బావున్నావా" అని పరామర్శించి, ఏమిటి? చాక్కా ఇలా మాపేశావు? " అని దిగులుగా ఆయన ఒళ్ళంతా తడిమాడు,

శ్రీవారి గెడ్డం బాగా పెరిగిపోయింది. మహామాంత్రికుడి జుట్టులా కేశ సంరక్షణ లేక జుట్టు అట్టలు కట్టింది. కళ్ళు లోపలికి పోయి ఎర్రగా మండుతున్న కట్టెల్లా వున్నాయి. శరీరమంతా చిక్కిపోయి, ఎముకలు కనుపిస్తున్నాయి

దరిద్రుడి (ప్రశ్చకు సమాధానం చెప్పకుండా శ్రీవారు, 'హారిబుల్‌...మోస్ట్‌ హోరిబులో అని అరిచారు మళ్ళీ అవేశంగా .

'ఏవిట్రా హారిబుల్‌ పిచ్చివాడా - అలా గింజుకుంటున్నావు?' అనడిగాడు దరిద్రుడు నవ్వుతూ,

“ఇది దేశవా? వల్లకాడా?” - శ్రీవారు గర్జించారు.

“వల్లకాడే' ఓ దెయ్యం జోకేసి పగలబడి నవ్వసాగింది.

“లార్జెస్టు డెమోగ్రసీని పట్టుకుని అలా అంటావేంట్రా - తప్పురా” అని జోకేసిన దెయ్యాన్ని దర్శిద్రుడు మందలిస్తుంటే శ్రీవారు - 'డెమో[క్రసీయా గాడిద గుడ్డా పైసా ఉన్న వాడికి స్వర్గం. లేనివాడికి నరకం - ఇదేం డెమో(క్రసీరా, వల్లకాట్లో డెమో'క్రసీ. ..”

తోలేటి జగన్మోహనరావు 137 అని మండిపడ్డారు.

'సీ...సీ .డెమోక్రసీ...సీ...సీ.... డెమోక్రసీ...” - నాలుగు దెయ్యాలు లేచి పాడుతూ బ్రేక్‌ డాన్సు చెయ్యసాగాయి.

“ఉష్‌ - గొడవ చెయ్యకండ్రా' అని వాటిని మందలించి శ్రీవారి కేసి తిరిగి, “బావుం దిరోయ్‌ - నిన్ను సంపాదించొద్దని ఎవడన్నాడు ? నువ్వూ తాతా, బిర్జా, అంబానీ అంత వాడివి కావచ్చు. అయినా ప్రపంచమంతా ఫ్రీడం, డెమోక్రసీ అని పరుగులు తీస్తుంటే , నువ్వేవిట్రా, ఇంకా తిండి, గుడ్డా అని పాత ఏడుపులు ఏడుస్తున్నావు -" అన్నాడు దరిద్రుడు. శ

శ్రీవారు అగ్గినిప్పయిపోయారు. 'నాలుగు మెతుకుల కోసం కుక్కకన్న హీనంగా బతికేవాడికి ఫ్రీడం ఏవిటిరా నీ పిండాకూడు. వెధవ పేపరు కబుర్జు చెప్పక్తు....'

'డమ్‌. డమ్‌... డమాడమ్‌... ఫ్రీడమ్‌... డమాడమ్‌...”

దెయ్యాలు ట్యూను మార్చి డాన్సు చెయ్యసాగాయి. |

'ఉండండర్రా! మాట తాణగనిన్వ ముండా వెధవ గోలా మీరూను...' అని దరిద్ర నారాయణుడు వాటిని మందలిస్తుంటే, *... ఈ నాకొడుక్కి సచ్చిబతికి రెండోసారి సావడానికి సిద్దవయ్యాకా ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా అని నేను మూడో బ్రాంచి మీంచి కొళ్ళను చేస్తున్నాను అని మూడవ బ్రాంచి మీంచి ఓ కేక వినిపించింది.

“ఎవరది?"- శ్రీవారు ఆగ్రహంతో ప్రళ్ళించారు.

“షీ జాతివాడే - అపోజిషన్‌ వాడు - వాడు తౌగిన సారా నిషా వాడి ఆత్మకు కూడా ఎక్కేసింది - అందుకని అలా వాగుతుంటాడు - ఏవనుకోక్తు కాని సియం నవుతానన్నావుకదరా - ఏమైంది?" అనడిగాడు దరిద్రుడు, శ్రీవారి ఆవేశం తగ్గించడానికి మాట మారుస్తూ, శ

'నీ చొక్కాతో పాటు నీ దరిద్ర జాతకం కూడా తగిలించాకా ఇంక సియం ఎలా అవుతాను? నీ వెధవ చొక్కా నువ్వు తీసేసుకో అన్నారు శ్రీవారు మండిపడుతూ.

“ఒకసారి అచ్చంగా ఇచ్చేశాకా వలీ ఎలా తీసుకోనూ - తప్పుకాదూ ,

'తప్పూలేదు, గిప్పూలేదు - నాకీ కంలో ఎలా బతకాలో తెలియడం లేదురా

  • శ్రీవారు నంగ అంటుండగా, మళ్ళీ మూడో బ్రాంచి మీంచి “ఈ నా కొడుక్కి... అని కేక వినిపించింది.

'ఒరే తప్పురా! ఇదేవన్నా పార్లమెంటా, ఎసెంబ్లీయా నీ నోటికొచ్చినట్టు మాట్టాడటానికి ఎ” అని డా బ్రాంచి అపోజిషన్‌ దెయ్యాన్ని మందలించి, 'చిలక్కి చెప్పినట్టు చెబుతున్నా 'నాకు చావాలని లేదు. నాకు చావాలని లేదు..." అని గొల్టు మన్నావు - ఖర్మ అనుభవించు ...." అన్నాడు దరి[ద్రుడు.

“ఓరి దరిద్రుడా! నీ కర్మ నేననుభవిస్తున్నాను కదరా - నీ చొక్కా నువ్వు తీసుకొని నీ కర్మ నువ్వే అనుభవించు...”

'అలాగంటీ ఎలారా - చిరిగి పోయేదాకా వేసుకోక తప్పుదు...'

“వీ చొక్కా నువ్వు తీసుకుంటావా లేదా' అని శ్రీమన్నారాయణ గారు కళెర్ర చేసి దరిద్రుడి పీక రకల ఆయన చేతికి ఏవీ తగల్లేదు. దరిద్రుడు గొల్టున

138 లక్ష్మీ కటాక్షం నవ్వి మాయమై పోయాడు. మిగిలిన దెయ్యాలన్నీ కూడా మాయమై పోయి, శ్రీవారు శ్మశానంలో ఒంటరిగా మిగిలారు. అప్పుడు తెల్లవారబోతోంది.

ఆయన దరిద్రుణ్మి తిట్టుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ, ఊళ్ళోకి దారి తీశారు. అలా నీరసంగా నడుస్తూ దేవాలయం దాకా వచ్చి అక్కడ స్పృహ తప్పి పడిపోయారు...

సాయంత్రం వేళలో అలవాటుగా దేవాలయానికి వెళ్ళి, ఓ గంట సేపు ధర్మోపన్యాసాలు విని, శాంతి పొందిన మనసుతో ఇంటికి తిరిగి వెడుతున్న ప్రముఖ సమాజ సవకులు పద్మశ్రీ ధర్మారావుగారికి దేవాలయం మెట్ట మీద అపస్మారక స్పితిలో పడున్న శ్రీమన్నారాయణ గారు కనుపించారు.

'అయ్యో పాపం - ఈ దినుడు ఇలా నిస్సహాయంగా పడివున్నాడే' అని ధర్మారావు గారు కలత చెంది, శ్రీమన్నారాయణ గారిని తన కారులో ధర్మాసుపత్రికి తీసుకుపోయి...

“ఈడింతకు ముందస సచ్చిపోయాడనుకుంటా... ." అన్నాడు తోటీవాడు శవం కేసి అనుమానంగా చూస్తూ. ఫ్రీగా శవాన్ని మోస్తే జన్మలో ఆ విషయం మర్చిపోలేడు వాడు.

, నాకూ అలాగే అనిపిస్తోంది" అంది నిరోలాక్‌ నరు అళ్చ్ళర్యంగా.

“'ధర్మాసుపత్రిలో ఫ్రీగా సావాచ్చంటే సరదాపడి, కాపీ ఇవ్వకుండా నన్నేడిపించ డానికి మళ్లీవచ్చాడు ఈడు. అసలు పేషెంటు ఓసారి కంటే ఎక్కువసార్హు సావగూడదని గవర్నమెంటు ఏక్ట చెయ్యాలి. అప్పుడు ఎవరూ ఇలా రెండేస్సార్డు మూడేస్సార్లూ సచ్చి మన్ను సంపర్పు," అన్నాడు వాడు.

నువ్వ పెద్ద యూనియన్‌ లీడరువి కదా - హైద్రాబాదులోనూ, ఢిల్లీలోనూ నీ పార్టీవోళ్ళే గదా పవరులోవుంటా. ఆ ఏకు చేయిద్తువుగాని కాని ఈ శవాన్ని మాత్రం తొందరగా శవాల గదికి చేర్చు - పేషంట్టంతా బయపడి సస్తన్నారు" అంది నిరోలాక్‌ నర్సు.

శవం కేసి తిరిగ, “ఈ సారేనా నన్నా ఇస్తావా - తాందరగా తీసుకెళ్ళి పడేస్తాను" అన్నాడు పద్‌ ఆశ చావక,

కాన విదల్బను - నీ ఇష్టం వచ్చినపుడు తీసుకెళ్ళు బే' అన్నట్లు శవం కాళ్ళు నిగడదన్ని పడుకది కాని వ వివ్పలేదు , షట శ

వాడు శవం చేబులన్నీ వెతికాడు కాని ఏవీ దొరకక ఏడుపొచ్చింది వాడికి - 'ఇది వరక్కు సచ్చినప్పుడు బీడీ ముక్కయినా జేబులో ఏసుకు సచ్చావు - మాయరోగం ఇప్పుడేవొ చ్చిందీ.... జేబులు ఖాళి అని విసురుగా చక్రాలబండిని ఓ తాపు తన్నాడు.

రంయిన పోయి చక్రాల బండి గోడకి గుద్దుకుంది. ఆ కుదుపుకి ముక్కు బదున్న కొనప్రాణం పోయి, శ్రీవారు బరువు దించుకున్నిట్లు శరీరం వదలి, 'థాంక్స్‌' అంటూ హుషారుగా గాలిలోకి లేచి, మరి ఆలస్యం చెయ్యకుండా ముఫ్పయ్యారో వార్డుకి ఎగిరిపోయి, ఊడలమ!రి బ్రాంచి నెంబరు ఏడు మీద దరిద్రుడి పక్కన వాలి, 'వచ్చేశారా పిచ్చివాడా అన్నాడు వాణ్డే కౌగిలించుకుని,

'మంచి పని చేశావురా పిచ్చివాడా అన్నాడు దరిద్రుడు ఆయన్ని ఆహ్వానిస్తూ,

(ఆహ్వానం, ఏప్రిల్‌ 1996)

గంగా గౌరీ సంవాదం శ్రీరామ విశాఖపట్నం, 15.12.1990. డియర్‌ గంగా, నీ దగ్గరనుంచి ఉత్తరం వచ్చి చాలా కాలమైంది. నేను కూడా బద్ధకించి రాయలేదు. నీ స్త్రీవాద కధలు, కవితలు పత్రికల్లో చూస్తూనే ఉన్నాను. బందరులో సుశీల, సుబ్రహ్మణ్యం విడిపోయిన శుభ సందర్భంలో కలిసినప్పుడు నీతో కొంచెం మాట్లాడాలన్నాను, గుర్తుందా? ఆ తర్వాత నిన్ను కలవడమే వీలు పడింది కాదు. నా వ్యక్తిగత సమస్యలు చర్చించి నీ సలహా తీసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. గంగా! నువ్వు లింగమూర్తిని వదిలేసి చాలా తప్పు చేశావు. గంగిగోవులా నువ్వు కూర్చోమంటే కూర్చుని, నించోమంటే నించునే లింగమూర్తి ఇతనేనా అనిపిస్తోంది, ఇప్పుడు చూస్తుంటే. అతని ఫెమినిస్టు భార్యా బాధితుల (భాబా) సంఘంలో రాఘవ లైఫ్‌ మెంబరుగా చేరాడు ఈ మధ్య. రాఘవ సంగతి నీకు తెలుసుకదా! అసలే కోతి

  • ఆ కోతికి ఇప్పుడు సుగ్రీవుడి లాంటి గురువు లింగమూర్తి దొరికాడ్డు. ఫెమినిస్ట్ర సిద్దాంతాల వెలుగులో కళ్ళు తెరిచిన నేను, 'ఇంటి పనులు వెట్టీ చాకిరి - నేను చెయ్యను అన్నాను. సరే అయితే, అన్నాడు రాఘవ. రోజూ పొద్దుటే కుర్రాడిని సైకిలు మీద తీసుకెళ్ళి స్కూలు బస్సెక్కించేవాడు. మర్నాడు వెళ్ళనన్నాడు.

140 అక్ష్మీ కటాక్షం ఎందుకు వెళ్ళవు అంటే, నువ్వు చేసేది వెట్టిచాకిరి అయితే నేను చేసేదీ వెట్టిచాకిరీయే, అన్నాడు. "పెద్ద యుద్దం జరిగింది. చివరకు ఓ అంగీకారానికొచ్చాం. అతని జీతం, నాజీతం ఓ డబ్బాల్‌ పడేసి ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి దానిలోంచి డబ్బులు తీసుకోవాలని నిర్ణయించాం రోజూ సైకిలు మీద వెళ్లేవాడు - ఈ ఒడంబడిక అయినప్పటినుంచి ఆటోలో వెళుతున్నానని ఆటో ఛార్జీలు తీసుకుంటున్నాడు. పొద్దుట స్కూలు బస్సు ఎక్కించడానికి, మధ్యాహ్నం క్రెచ్‌ నుంచి ఇంటికి తీసుకురావడానికి ఆటో ఛార్జీలు ..... నిజంగానే ఆటోలో వెళ్ళార్రా అని కుర్రాడిని అడిగాను ఆటో ఎక్కడ? ఆ డొక్కు సైకిలు మీదే, అన్నాడు వాడు. నిలదీసి అడిగితే, తను ఐదు హార్యుపవర్‌ మనిషట, సైకిల్‌ను ఆటోలా తొక్కేస్తాడట, ఇదే ఆఫీసు పని కనుక అయిజ్తీ టాక్సీ ఛార్జీలు వసూలు చేసేవాడట, ఇంటిపని కదా అని కొంచెం తగ్గించి నన్ను ఉద్ధరిస్తున్నాడట - ఇదీ సమాధానం. పోనీలే అని ఊరుకుంటే, గెడ్డం గీసుకున్నప్తుడల్లా పది రూపాయలు తీసుకోవడం మొదలు పెట్టాడు. నువ్వు గెడ్డం గీసుకుని పది రూపాయలు తీసుకోవడమేవిటంటే, మంగలి షాపు ఇడిల్తే వాడు పది రూపాయలు తీసుకుంటాడు కదా, అంటాడు. “నువ్వు ఎకనమిక్‌ ఆనర్స్‌ ఎలా చేశావో నాకు తెలియదు కానీ, దేనికైనా మార్కెట్లో రానంతవరకు విలువ వుండదు. ఇంట్లో నీ గెడం నువ్వు గీసుకుంటే విలువుండదు మొగడా” అన్నాను. 'ఎందుకుండదు? కౌవాలంటే నీ గురిలీ న్లడుగు' అన్నాడు. గురివి ఏవిటన్నాను అర్జ్హం కాక. గురువు పుల్లింగంట. గురివి 'శ్రలింగంట. ఆడ గురువుల్సి గురివి అనాలట - లింగమూర్తి చెప్పాడట (ఈ లింగమూర్తి భాషా వప్లవంటో చంపేస్తున్నాడు) నెల తిరిగేటప్పటికి ఎవరి జీతం వాళ్ళకే పోయింది. పని పని లాగానే ఉందో ఇద్దరం చేసే ఇంటి'పనికి విలువ ఎలా కట్టాలో తెలియడం లేదు గంగా! న్‌ మరో సంఘటన. కిందటి వారం మా ఇంట్లో ఫెమినిస్తులం కొందరం సమావేశమయ్యాం. “రాఘవా! కాఫీ పెట్టు అన్నాను. మాట్టాడకుండా లేచి, అలమైరాలోంచి రిజిస్టరు తీసి, ఆరు కాఫీలు తాని పెట్టినట్లు రొసి, వంటింటోకి వెళ్ళాడు రాఘవ. మేమందరం కబుర్లలో ఉండగా, నా ఎదురుగా కూర్చున్న ఉమ కెవ్వున కేకేసి నిలబడింది. ఏవిటా అని చూస్తే నా వెనుక ట్రేలో కాఫీ కప్పులతో రాఘవ. పలుచటి చారల అండర్వేర్‌ తప్ప మరేమీ లేదు లుంగీయో, పైజామాయో కట్టుకు ఏడ్వచ్చుగా, అన్నాను. వంటింట్లో వేడిగా ఉందట. అండర్వేరులోనే హాయిగా వుందట "హాముగా ఉరీడటవేమిటి? నలుగురు ఆడవాళ్ళు కూర్చున్న చోటికి బుద్దున్న ఏ మగాడూ అలా రాడు. సభ్యత,” అని మందలించాను. 'నా సెక్సువాలిటీ వనీ కంట్రోలు ఏమిటి?” అంటూ తిరగబడ్లాడు. నేను లోపలి గదిలోకి. ఈడ్చుకెళ్ళి 'దేనికైనా టైం అండ్‌ ప్లేస్‌ వుంటాయి. వాటికనుగుణంగానే మనం వ్యవహరిస్తాం. నీ సెక్సువాలిటీ రోడ్ల 'మీద, (డ్రాయింగ్‌ రూంలోనూ కాదు - పడకగదిలో చూపించు - నేనూ సంతోషిస్తాను' అని చివాట్లు పెట్టాను. ౯

తోలేటి జగన్నోహనరాను 14]

ఆ రాత్రి బయట వాన పడుతూ చిరుచలిగా వుంది. రాఘవ సాయంకాలం నుంచి టేబులు దగ్గర కూర్చుని వంచిన తల ఎత్తకుండా ఏదో రాస్తున్నాడు. చింపేస్తున్నాడు. రాత్రి పదకొండయినా మంచం ఎక్కకపోతే నాకు విసుగుపుట్టి నను మధ్యాహ్నం ఏం చెప్పానో గుర్తుందా బుద్దూ"_ అన్నాను, నైటీ వేసుకుంటూ. 'ఏం చెప్పావు అన్నాడు వంచిన తల ఎత్తకుండానే. నీ సెక్సువాలిటీ చూపించడానికి పడకగది ఉంది అన్నాను, గుర్తుందా? అన్నాను ఓ రూపాయి ఎడ్వాన్స్‌ పడేస్తూ. గుర్తుంది కాని తను రాతలో బిజీగా ఉన్నాడట. తనకిష్టమైతే మంచం ఎక్కుతాడట. లేకపోతే లేదట “నీ ఇష్టం. నా ఇష్టం” అంటూ పంతాలకు పోతే సంసారం కావేరీ గోదారీ అవుతుంది. పెళ్ళయ్యాక కొంత అడ్డస్టు లాలి అన్నాను. 'నీ గురివి కూడా అలాగే అంటుందా? రోజూ పెళ్ళాలు మొగుళ్ళ చేత రేప్‌ చెయ్యబడతారు అంటుంది కదా" అన్నాడు వాదనలోకి దిగుతూ. 'గురివి సంగతి అలా వుంచు - పిచ్చి పిచ్చి వేషాలు వెసేవంటే ఇప్పుడు నేను నిన్‌ రేప్‌ చెయ్యాల్సి వుంటుంది, అని వార్చ్నింగిచ్చాను ఒళ్ళు మండి. అయినా కదల్లదు.

లింగమూర్తి బాగానే ఎక్కించాడు అనుకుని కొంచెం వాతావరణం తేలిక

పరచడానికి “ఏవిటి రాస్తున్నావు? అనడిగాను. కధ రాస్తున్నానన్నాడు. 'ఈ పైత్యం ఎప్పటినుంచీ' అన్నాను. “'ఇవాల్లి నుంచే" అన్నాడు. లింగమూర్తి మగవాద పత్రిక "మగోడు' ప్రారంభిస్తున్నాడట. ఈయనగారు (ప్రారంభ సంచికకు కధ రాస్తున్నాడట. ఏం కధ? అనడిగాను,

కథ పేరు 'రావుడి గుండు". రావుడనే వాడికి చిన్నప్పట్నుంచీ రాకేష్‌ రోషన్లా చనివిడిగుండు చేయించుకోవాలని తీరని కోరికట. చిన్నప్పుడు వాడి నాన్న, వెధవా! నేను చచ్చాననుకున్నావా? వీల్లేదు అని చావగొడతాడు పెళ్ళయ్యాక ఆ కోరిక తీరుతుంది అనుకుంటే 'గుండు చేయించుకొస్తే గుండు పగలగొడతాను' అని వాడి పెళ్ళాం అప్పడాల కర్రతో వార్నింగిస్తుంది. రావుడి కోరిక తీరకుండానే ట్రాఫిక్‌ ఐలేండు లాంటి బట్టతల వచ్చేస్తుంది. ఇదీ గుండు కథ.

నా మొహంలా వుంది నీ కధ, అన్నాను. నీ మొహం మగవాద రాజకీయ

కధలా వుందా? అంటూ మొదలు పెట్టాడు. రావుడి గుండే కాదు - ఈయన్టీ 'స్పెషలిస్టులా రావుడి చెవి, రావుడి ముక్కు, రావుడి గొంతు అంటూ ఓ ఆరడజను మగవాద కధలు రాయబోతున్నాడట. పారకలోకం మీద జాలి కలిగింది.

నిన్న రాత్రి రాత కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడేంకధ? అన్నాను, అమృతాంజనం సీసా అందుకుంటూ. కథ కాదు, రామాయణం అన్నాడు. వాల్మకి నుంచి విశ్చనాధదాకా ఇంతమంది. రాశాక నువ్విప్పుడు కొత్తగా ఏం రాస్తావు? అన్నాను. రామాయణాన్ని మగవాళ్ళ కోణం నుంచి పరిశీలిస్తున్నాడట. అసలు రామాయణంలో విలన్షందరూ ఆడవాళ్తేనట. ఆడవాళ్ళని వేంప్‌ అంటారు, మగాళ్ళని విలన్‌ అంటారు, మొద్లు మొహవా, అని వివరించాను.

విలన్‌, వేంప్‌ అనే లింగ విభజన అనవసరంట. విలనంటే అసలు ఆడదనే అర్హంట (లింగ.మార్తి చెప్పాడట). మగాళ్ళలో రాస్కేలున్నర రాస్కేల్సు ఉంటారు

142 లక్ష్మీ కటాక్షం కదా అంటే, వాళ్ళు స్వతహాగా మంచి, వాళ్ళే, స్త్రీలే వాళ్ళని అలా తయారు చేస్తున్నారంటాడు. అసలు రామాయణంలో విలన్తందరూ ఆడవాళ్ళే..... కైక, మంధర, శూర్చణఖ విలనెల్ద్లా అయిందని అడిగాను. శూర్చణఖ పెద్ద గూండీ. రాముడిని రేప్‌ చేయడానికి ప్రయత్నించింది. అడవిలో కోర్టులు, జెయిళ్ళు ఉండవు కనుక లక్ష్మణ స్వామి రేప్‌ నేరానికి సింపుల్‌గా శూర్చుణఖ ముక్కూ, చెవులూ కోసేశాడు. శూర్పణఖ లెంపలేసుకుని బుద్దిగా ఉండకుండా, సిగ్గు లేకుండా రావణుడి దగ్గరకు వెళ్ళి, ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి, రామ రావణ యుద్దానికి కారణమైందట. 'సీతాదేవి విలనెల్లా అయిందిరా మొగడా?” అన్నాను తల పట్టుకుని. కైక రాముడిని అడవికి పొమ్మంది కానీ సీతను కాదు కదా! అరణ్యవాసమంటే అరకువేలీ పిక్నిక్‌ కాదు, అక్కడ పులులు, సింహాలు ఉంటాయి. అడవికీ పోయి నా ఏడుపేదో నేనేడుస్తాను, నువ్వూ ఊర్మిళలాగా స్లీపింగ్‌ టేబ్రైట్స్‌ వేసుకుని పడుకో, అన్నాడట రాముడు. 'రాట్‌- నేనూ వస్తాను' అని కూడా బయలుదేరిందట సీతాదేవి. నార చీరలు కట్టుక్షునే కండీషను మీద కదా అరణ్యవాసానికి వెళ్ళింది. అక్కడకు వెళ్ళాక బంగారు లేడిని చూసి ముచ్చట పడి, జుకెట్టు కుట్టుకుంటానందట. జంతు హింస పాపం - మేనకాగాంధి గారు బాధపడతారు- పిచ్చి కుక్కమీద రాయి విసిరినా కలతపడే సున్నిత హృదయం అవిడది, ఇన్ని లెదరీ జాకెట్టుండగా మళ్ళీ ఆ జింకచర్మం ఎందుకు? అని రాముడు గోలపెట్టినా వినక తరిమిందట. “రావుడికేం కాలేదు సతమ్మా, అది మాయలేడి మాయమ్మా' అని లక్ష్మణ స్వామి మొత్తుకున్నా వినక నానా తిట్టు తిట్టి రాముడికి హెల్ప్‌ చేయమని తన్ని తగలేసిందట. అంతటితో అవలేదు. ఆంజనేయస్వామి సీతాదేవినీ వెతుక్కుంటూ లంక చేరి, అశోకవనంలో సీతాదేవిని చూపి, 'చుప్‌పాప్‌గా నా భుజాల మీద ఎక్కించుకుని క్షణంలో రాముడి దగ్గరకు తీసుకుపోతాను, పద తల్లీ అంటే”, “రాట్‌ - రావుడొచ్చి యుద్దం చేసి రావణున్ని చంపి, నన్ను విడిపించి తీసుకేళ్ళాలిగాని ఇల్లాంటి షార్డ్‌కట్‌ో తిరిగి. వెళ్ళను' అని మొండికేసిందట. 'రావణుడు రావుడితో ఫైట్‌ చేసి నిన్ను తీసుకొచ్చాడా? వాడూ ఎత్తుకొచ్చాడుకదా? యుద్ధవైతే నరనష్టం, వానర నష్టం, లంక నాళనం' ఆని ఆంజనేయస్వామి అంటే 'యుద్దంలో చచ్చేది మగాళ్లే కదా! మాదేం పోయింది? రాట్‌. నేను రాను' అందట సీతాడేవి. అసలు విలన్‌ - ఇన్‌ - చీఫ్‌ సీతాదేవే లేకుండా ఉంటే రావుడు, రావణుడు నందమూరి తారకరామారావుగారి ద్విపాత్రాభినయంలా, అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారట. ఇదీ రాఘవుడి మగవోద రామాయణం. రామాయణటేసాదు - మహాభారతం, పురాణాలూ అన్నీ మగవాద కోణం నుంచి పరిశీలించి, ఇతనూ, లింగమూర్తి తిరగరాస్తున్నారట. "ఫెమినిజం అంటే ఏమీటో వివరించి మొద్దుమొహం (బైయిన్‌కి కొంచెం పదును పెడదామని న్లీ సిద్దాంత (గంధం ఫెమి'నిజం' అందుకుని పారం తీసుక్తున్నాను. అంతా విని 'ఆ ఊకదంపుడులో ఊకంతా ఎగరగొడితే గంగాదేవిది సింగిల్‌

తోలేటి జగస్మోనానరావు 143 పాయింట్‌ ప్రోగ్రాం - మగాడిని పిలకట్టుకు జాడించడం. పిలకంటే గుర్తుకొచ్చింది - ఓ పిలక కవిత వినిపిస్తా- అందాల ఓ చిలకా! అందుకో నా పిలకా! అంటాడు ! పాపం అమాయకుడు మూడు ముళ్ళూ వేసి ముప్పు తిప్పులు పడతాడు అయ్యో | అభాగ్యుడు! అంటూ ఓ పిచ్చి కవిత వినిపించాడు. “నువ్వు కవితలు కూడా రాస్తున్నావేమిటి? "అన్నాను ఆశ్చర్యపోయి. నేను కాదు, లింగమూర్తి - ఇంతకీ చెప్పాచ్చేదేమిటంటే, గురువుగారి పిలక చేతిలో ఉన్నంతకాలం వంట చేయలేదని, అంట్లు చోమలేదన, ఆయన్ను వేపించుకు తింది. ఆయన పిలక చేయి జారిపోయిన తర్వాత మగ జాతి పిలకట్టుకుంది. ఆవిడ సింగిల్‌ పాయింట్‌ ప్రోగ్రాంలో రెండో పాయిరిటు, అసలు పాయింటు ఏమిటంటే, "ఫెమినిజం పేరు చెప్పి తన్ను తాను ఉద్దరించుకోవడం' అంటూ మొదలుపెట్టాడు. “ఇంక వాగకు, పచ్చెక్కేట్టుంది' అన్నాను చెవులు మూసుకుంటూ. “అయితే ఇంకా మాట్లాడతాను అంటూ తను నిద్రపోకుండా, నన్ను నిద్ర పోనివ్వకుండా, రాత్రి తెల్టార్దూ అడ్డంగా వాదిస్తూనే వున్నాడు... ఏదో రాద్దామని (ప్రారంభించి ఏదో రాసినట్టున్నాను - చెప్పానుగా నా మానసిక పరిస్టితి - అర్హం చేసుకుంటావనుకుంటాను. ఉత్తరం చాలా పెద్దదయిపోయినట్టుంది. ఇంక ముగిస్తాను. ఉత్తరాలు రాస్తుండు! ఫెమినిస్టు అభినందనలతో గౌరి పి.ఎస్‌: ఇతని (ప్రభావంతో కు(ర్ర వెధవ కూడా పాడైపోతున్నాడని భయం వేస్తోంది. 'సరిగమ” అనరా అంటే 'సరిమగ'" అంటున్నాడు, వెధవ మగబుద్ధి! 2 (ప్రపంచ మహిళల్దారా! ఏకం కండి! మీకు పోయేదేమీ లేదు - మొగుళ్ళు తు హైదరాబాద్‌, 15.1.1999 డియర్‌ గౌరీ,

144 లక్ష్మీ కటాక్షం

నీ ఉత్తరం చూడగానే నాకు డిడ్రైెషనొచ్చేసింది మనం స్త్రీలలో వేన్‌ గార్డు లాంటి వాళ్ళం. ఆకాశంలో సగానికి దారి చూపొల్సిన వాళ్ళం మనమే ఇలా తప్పుదారిన పోతే ఎలా చెప్పు!

మనలో ఇంకా ఎన్ని పితృస్వామ్య భావాలు ఎలా జీర్షించుకు పోయాయో నువ్వు, నీ ఉత్తరం 'శ్రీరామ' అని (ప్రారంభించడంతోటే స్పష్టమవుతోంది. నాకు దేవుడీలో విశ్వాసం లేదు. నేను సోషలిస్టు ఫెమినిస్టుని. నువ్వు ఆస్తికురాలివి కావచ్చు- తప్పులేదు. ఫెమినిజం శంభుడి చెరువులా విశాలమైనది. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, (ప్రాంతాలు, దేశాల స్రీలను, అన్ని రకాల భావాలను, విశ్శాసాలను తనలో ఇముడ్చుకునే శక్తి కలది నీకు దైవ భక్తి ఉంటే, నువ్వు సెమినిస్టుగా "త్రై సీత అంటూ నీ ఉత్తరం మొదలు పెట్టి ఉండాల్సింది. భాష పదాలు చాలా ముఖ్యమైనవి. స్త్రీలకి భాషాపరంగా న్యాయం జరగాలంటే పురుష పక్షపాతాన్ని, పురుష దృక్పధాన్ని, పెంచి పోషిస్తున్న పురుష దురహంకార పదాలను వదిలేసి, నిరంతర చైతన్యవంతమైన స్పృహతో మనం పదాలు ప్రయోగించాలి. స్రీ విముక్తి పోరాటంలో భాష ఒక పదునైన ఆయుధం అన్న సంగతి మరిచిపోకూడదు.

(స్త్రీల సమస్యల పట్ల స్త్రీ వాదులలో కూడా ఎంత తప్పుడు అవగాహన ఉందో నీ ఉత్తరం చూస్తే అర్ధమైంది. నీ వ్యక్తిగత సమస్యలు నాతో చర్చించాలి అన్నావు. స్త్రీల జీవి తాలలో రాజకీయం కాని వ్యక్తిగత సేమస్యలున్నాయా? రాఘక్‌ గెడ్డం, సెక్సువాలిటీ, నీ ఒక్కదానికే సంబంధించిన సమస్య కాదు. మొత్తం స్త్రీ జాతికి సంబంధించిన రాజకీయ సమస్య.

'స్త్రీ సమాజంలో (ప్రతీ విషయంలోనూ ఎంత వివక్షతకు గురవుతోందో తలుచు కుంటే గుండెలు మండిపోతాయి. నాకు. మొన్న హోటలుకి వెడితే మాడిపోయినపెసరట్టు నాకు, మంచి పెసరట్టు పక్కనున్న మగాడికి అందించాడు సెర్వర్‌. ఈ పురుషస్వామ్యవ్యవస్తలో, (స్త్రీ మాడిన పెసరట్టు తప్ప మంచి పెసరట్టు ఆళించడం ఆత్యాశే. ఫేమినిజం ప్రత్యేకత ఏవిటంటే , అది మారి్టాజం లాగా ఆర్దిక వ్యవస్థ ఉపరితలం అంటూ నిత్య జీవీతంతో సంబంధంలేని ఏవో కొన్ని సూత్రాలు, సెద్దాంతం కాదు. ఫెమినిజం మన రోజువారీ జీవితాలనుంచి వేరుగా ఉండదు. ఫెమినిస్ట్ర పరికరాలతో 'పెసరట్టుని విశ్లేషిస్తే యాదృచ్చికంగా నీచేతికి వచ్చినట్టు అనిపిస్తున్న మాడిన పెసరట్టు వెనుక పీతృస్వామ్య పౌస్తేం కనిపిస్తుంది. ఫెమీనిస్టు మ్మోషణల్‌ో బలం అక్కడే ఉంది. మార్క్సిజం కానీ, మరే ఇజం కానీ ఇంత సూటిగా, స్పష్టంగా పెసరట్టు గురించి వివరించలేదు (నిజం చెప్పాలంటే స్త్రీలని, (స్త్రీల రోజువారీ సమస్యల్నీ, ఫెమినిజం పట్టించుకున్నట్టు మార్క్సిజం ఏనాడూ పట్టించుకోలేదు)

ఇక్కడ ఎతస్వామ్య వ్యవస్థ రెండు స్టాయిలలో పనిచేస్తుంది. మగ ప్రపంచంలో

మగాడికున్న ప్రత్యేక స్థానం వలన, అడగకుండానే మంచి పెసరట్టు సంపాదించ గలుగు తున్నాడు. సెర్వర్‌పురుషుడు. వాడు తోటి పురుషుడికి మంచి పెసరట్లే ఇవ్వా*ను కుంటాడు. ఇది కంటికి కనిపించని, అత్యంత సహజంగా అనిపించే వివక్షణ రెండో కారణం - స్త్రీలంటే చులకన. సెర్వర్‌ వంటవాడితో .(ఇక్కడ ఇంకో

లోలేటి జగన్మోహనరావు 145 వైరుధ్యం వుంది. ఇంట్లో సాధారణంగా ఆడదే వంట చేస్తుంది. హోటల్లో సాధారణంగా మగవాడే వంట చేస్తాడు. మరొకటి గమనించావోలేదో- నలభీమపాకం అంటారుకానీ దమయంతీ- (ద్రౌపదీపాకం అనరు. (శ్రమ స్త్రీలది, పేరు పురుషులది. మనం రీసెర్చి చేసి, దీని వెనుక వున్న పితృస్వామ్య వ్యవస్త కుట్రను బహిర్గతం చేస్తి స్త్రీవాద సిద్దాంతానికి పదును పెట్టాల్సిన ఆవళ్యకత ఎంతైనా ఉంది). .సెర్వర్‌ వంటవాడిత్‌ “బాసూ, పెసరట్టు మాడిపోయిందని" చెప్పే వుంటాడు. 'ఏం పర్వాలేదు. ఫామిలీ రూంలో ఆడంగులుంటారు. వాళ్ళకిచ్చేయ్‌' అని జిడ్డుమొహం వంటవాడు అనే ఉంటాడు. ఇదంతా నేను ఊహించగలను. మాడిన పెసరట్టు ఇస్తే అడది ఏం చేస్తుందని వాడి ధైర్యం. అక్కడ ఉన్నది మామూలు ఆడది కాదని, ఫెమినిస్టు పులి అని వాడికి తెలియదు. వాడి పెసరట్టు వాడి మొహాన కొట్టి, పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ నినాదాలిచ్చేసరికి సెర్వర్‌ దగ్గరనుంచి ్రొఫైటరు దాకా ఆరితా కాళ్ళీ మీద పడ్డారు పెసరట్టు అయినా పరమాణు బాంబు అయినా, ఏదైనా స్త్రీల దృక్పధం నుంచి, ఫెమినిస్పు పరికరాలతో విశ్తేషించడం ప్రతీ స్త్రీవాది అభ్యాసం చేయాలి.

అణుబాంబంటే గుర్హొచ్చింది. ప్రీ సైంటిస్టు ఎవరైనా మగాళ్ళ మీద మాత్రమే పేలే అణుబాంబు కనిపెట్టగలిగితే ఎంత బావుంటుంది? ఇంతవరకు పురుషులు ఆయుధ బలం చూపించి మనను లొంగదీసి బానిసల్ని చేశారు. మనం అటువంటి ఆయుధాలు చేసి ఈ పురుష ప్రపంచాన్ని నాశనం చేస్తే? కంగారుపడకు - తరతరాలుగా ఈ మగజాతి స్త్రీలను గురి చేసిన హింస గుర్తుకొచ్చి ఆవేశంలో అంటున్నాను కానీ, మగాళ్ళు లేకపోతే మనమేమైపోతాం. మొగుళ్ళాద్దంటున్నాం కానీ మగాళ్ళు వద్ధంటల్లేదు కదా!

రాఘవ కాఫి తీసుకొచ్చినప్పుడు, మీరందరూ అంత ఇబ్బంది పడిపోవడానికి కారణమేమీ నాకు కనిపించలేదు. సెక్సువాలిటీ అంటే మన శరీరం పట్ట మనం ఏర్పరచు కున్న భావాలు, ఇతరులతో స్పందించే పద్దతి, సమాజానికున్న విలువలు, నమ్మకాలు, అభిప్రాయాలు - ఇవన్నీ కలిసి సెక్సువాలిటీ - లైంగికత్స్వం - అవుతుంది. ఇది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, సంస్కృతి పరమైనది. రాజకీయమైనది. ఈ పితృ స్వామ్య వ్యవస్థలో (స్త్రీలకు ఎదురయ్యే నిజమైన ఆటంకం బిడియం స్త్రీల లైంగికత్వం మీద ఆధిపత్యం వహించడానికి సభ్యత, సిగ్గు గౌరవం, మర్యాదల భావజాలాన్ని సృష్టించారు. ఈ పురుష ప్రపంచం మన లైంగికత్వం మీద, వేషభాషలమీద విధిస్తున్న కంటట్రోళ్ళను ధిక్కరిస్తూ పైటలు తగలేస్తూ మగ గుండెలు షాకుతో అదిరిపోయేలా ఆల్ఫిప్ప, అరటిపండు అంటూ అంగాంగాల్నీ వర్ణిస్తూ, స్వేచ్చగా గొంతువిష్మి జెండర్‌ విధానాన్ని సవాలు చేసి, వాళ్ళు గీసిన మర్యాద రెఖల్ని చెరిపేస్తున్నప్తుడు, (స్త్రీల ఎదురుగా పురుషులు మర్యాదగా, సభ్యతగా, మృదువుగా మాట్లాడాలని, ప్రవర్తించాలని మనం డిమాండు చేయడం స్త్రీలుగా మన పట్ట వివక్షత చూపించమని _అడిగినట్టవుతుంది. మనల్ని మనం వేరు. పరుచుకుని కించపరుచుకోవడం అవుతుంది. ఫెమినిజం నీకు సరిగా అర్ధం కాలేదు. ఫెమినిస్టు సాహిత్యం నువ్వు సీరియస్‌గా అధ్యయనం చెయ్యాలి,

146 లక్ష్మీ కటాక్షం

లింగమూర్తి ఈ మధ్య మరీ పేట్రేగి పోతున్నాడు. అతనికి విడాకులిచ్చి, ముక్కుకు తాడు తిసేసి దేశం మీదకు వదిలేశానేమోననీ నాకూ అనిపిస్తోంది. మేం విడిపోయిన రోజు విమోచన దినంగా ప్రకటించి “గంగ మొగుడిగానే కాని గుర్తింపులేని లింగమూర్తి గంగాదేవి పెట్టిన శారీరక, మానసిక, లైంగిక హింసల నుంచి విముక్తి పాంది, హండ్రెడ్‌ పర్సెంట్‌ మగాడిగా ఈ రోజునుంచి నూతన జీవితం (ప్రారంభిస్తున్నాడు' అంటూ విమోచన దినోత్సవం చేశాడట ఈ మధ్య, ఆ సభలో లింగమూర్తి ఉపన్యాసం ఇస్తుంటే సుధ మొగుడు నిద్రపోతూ, నిద్రలో అలవాటుగా 'హరి హరీ, శంకరి, మహాదేవీ అంటూ ఆవలించాడట. లింగమూర్తికి కోపం వచ్చి “శంకర్‌! మహాదేవీ" అంటున్నావు, వర్షద్రోహీ- మగదేవుళ్ళంతా చచ్చారనుకున్నావా? అంటూ వెయ్యి రూపాయలు ఫైను వెశాడట - సుధ చెప్పింది.

'మగోడు' ప్రారంభ సంచిక చూశాను. 'నా రెక్కలు నాకు (ప్రసాదించి నన్ను మళ్ళీ స్వేచ్చా జీవిని చేసిన ప్రియ నేస్తం గంగా దేవికి, కృతజ్ఞతలతో, అని రాసి పంపించాడు లింగమూర్తి. నిన్ననే అందింది. అందులో నడి వేవిలో, మధ్యాహ్నం 12.07 ని.కు. ఇంటి కప్పెక్కి కూర్చొని రాసిన అతని మగవాద కవిత చదివావా?

“ మొగుళ్ల కొట్టి మొగసాలకెక్కి

వడున్తున్లు శర్మిష్ట

ను చూసి తనూ వడ్చిందాక ఫెమినిస్టు!

అయ్యో! నాకూ మొగుడుంటే

నా నరదా కూడా తీరేది కదా! అని”

ఈ వెధవ కవితల్ని, గేయాలు, పద్యాలు, వచన కవితలు అనకూడదట - లింగాలు అనాలిట. ఇలా నూటొక్క లింగాలు రాసి ఆ శతకం నాకు అంకితం చేస్తాడట! లింగమూర్తి పిచ్చి రోజు రోజుకు ముదిరి పోతున్నట్టుంది. ఎందుకని ఊరుకుంటున్నాను కాని తిక్కరేగిందంటే ఎప్పుడో లింగమూర్తి బుర్ర సీతకీర్తన పాడించేస్తాను. అంతవరకు అవాకులు, చవాకులు అలా రాస్తూనే ఉంటాడు. గురువుకు మందేస్తే శిష్యుడి రోగం కుదురుతుందని నా నమ్మకం. కుదరకపోతే రావుడి గుండు సంగతి తర్వాత చూద్దాం.

లింగమూర్తి లాంటి వర్గ శత్రువులకంటే తీవ్ర ప్రమాదం - కనించని ప్రమాదం

  • తోటి ఫెమినిస్టులనుంచే ఏదురవుతోంది. ఈ మధ్య ఫెమినిస్టులం సమావేశమై, ఇంతవరకు మగాళ్ళు దేశాన్ని పాలించి తగలేశారనీ, ఇప్పుడు ఇంక కాగడా మనం చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనీ భావించాం స్త్రీల రాజకీయ పార్టీ పెడితే బాగుంటుందనుకున్నాం. మనలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు నాయకురాలు, ఎవరు అనుచరులు అనే భావం ఉండకూడదని, పురుష సమాజం సృష్టించిన ఈ రకమైన హైరార్కీల చట్రంలోకి, పోటీ ధోరణిలోకి, మనం స్రీలం

వెళ్లకూడదని, ఈ సారి యంపీగానో, మంత్రిగానో స్రీలకు సేవ చేసే బాధ్యత నేను

తోబేటి జగన్మోహనరావు 147 వహిస్తానని ఎంత చెప్పినా వినక 'నేనూ సేవ చేస్తాను' అంటూ మొదలెట్టింది కావేరి, దాంతో పెద్ద గొడవ అయింది. చివరకు నిర్మయం వాయిదా పడింది. ఫెమినిస్టు ఎజెండాతో పార్లమెంటును గజగజలాడించే మహత్తర అవకాశం తప్పిపోయింది. మన వాళ్ళనుంచి మనల్ని దూరం చేయడానికి, ఎలియనేషన్‌కి గురి చేయడానికి పురుషస్వామ్య వ్యవస్ట కుట్ర ఇది. ఈ కుట్ర గుర్తించకుండా ఒకరితో ఒకరు పోటీలోకి దిగితే ఎవరికి వాళ్ళే అవుతాం. కావేరికి ఎప్పుడు బుద్దాస్తుందో, ఎప్పుడు ఈ పురుష రాజకీయ పోటీ సంస్కృతి నుంచి బయట పడుతుందో తెలియడం లేదు.

బహుశా నీకు తెలిసేవుంటుంది - నాకవిత 'పులుసు స! కు ఉత్తమ ఫెమినిస్పు కవితగా లేడీ క్రింటన్‌ ఎవార్డు వచ్చింది. ఆ ఎవార్డు తీసుకోవడానికి వారం రోజుల్లో వాషింగ్టన్‌ వెడుతున్నాను. నా 'చారుగిన్నె' కంటె పులుసురాబ్చిష్తు ఏం గొప్పది” గంగ ఇదంతా మసఖచపంయి అని యమున అందరితోనూ అంటిొందట. నేనూ నా జీవితాన్ని పణంగా పెట్టి ఎన్నెన్ని ప్రయోగాలు చేశాను? ముగ్గురు మొగుళ్ళతో సహా నా ముప్ఫయ్యేళ్ళ జీవితం ఫేమినిజానికి ఇర్భయిపోయిన సంగతి దానికి తెలియదా? నా త్యాగాలకి గుర్తింపు రాకూడదా? దానికి ఎప్పుడు బుద్దాస్తుందో, ఎప్పుడు ఈ పురుష స్వామ్య అసూయ సంస్కృతినుంచి బయట పడుతుందో తెలియడం లేదు. పులుసు రాచ్చిప్పు' చదివి, వెనుకబడిన దేశాలలో స్త్రీల వంటింటికష్టాలు చూసి లేడీ క్షింటన్‌ కన్నీళ్లు పెట్టుకుందట. ఇక్కడ పేదబ్రలకు ఉచితంగా పంచడానికి పదివేల మైక్రో బెన్‌ పంపిస్తోందట - న్యూస్‌ వీక్‌ రాసింది. ఇక్కడ మనం _పాయ్యి ఊదితే, లేడీ రాక్‌ ఫెల్లర్‌ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. - ఫెమినిస్టు సిస్టర్‌హుడ్‌ అంటే అది. వర్గాలకు, ఇజాలకు, అతీతమైనది ఫెమినిజం.

వంటిల్టు ఇంటి చాకిరీ మన జీవితాలనీ, ఆలోచనలనీ, సాహిత్యాన్నీ ఎంతగా (ప్రభావితం చేస్తున్నాయి అంటే నా మటుకు నేను ఎదురుగా అంట్ల గిన్నా, చీపురు కట్టో లేకపోతే కథలు, కవిత్వం రాయలేని పరిస్టితి వచ్చింది. నా ఎవార్డు కవిత ఎప్పుడు రాశానో తెలుసా? పనిమనిషి రెండు రోజులు రాలేదు. వంట మనిషి ఊరు వెళ్ళింది. శంకరం టూరుమీద వెళ్ళాడు. అప్పుడు వంటిల్లు ఎలా వుంటుందో ఊహించుకో. ఆ అంట గిన్నెలు చూస్తుంటే విపరీతమైన కవితావేశం వచ్చి ఒక నిమిషంలో గేయం రాసి మళ్ళీ "ఫెయిర్‌ చెయ్యకుండా పంపించి వేశాను. నాకు ఏం రాయాలో తోచనప్పుడు, పనిమనిషిని, శంకరాన్ని పొమ్మని చెప్పి, వంటింట్లోకి వెళ్ళి అంట్లు తోమడం మొదలు పెడతాను. అద్భుతమైన అయిడియాలు, ఆవేశం వచ్చేస్తాయి.

స్త్రీల లైంగికత్వం మీద ఎలాంటి ఆంక్షలు, నిర్బంధాలు ఉన్నాయన్న దాన్ని బట్టి సమాజంలో స్త్రీల స్థానం ఆధారపడి వుంటుందని మనం చెబుతుంటే బుగర్రకెక్కనట్టు నటిస్తూ, ఆర్జిక అసమానత లైంగిక అసమానతకు కారణమవుతోందనీ, స్త్రీకి ముందు

ఆర్దిక స్వాతంత్ర్యం, ఛదువు చట్టుబండలు కావాలని అరిగిపోయిన రికార్డులు వేస్తే

వాళ్ళను చూస్తే పరమ చికాకు-కలుగుతుంది. ఈ సమస్యలన్నీ మన ఫెమినిస్ట్రలం

148 లక్ష్మీ కటాక్షం పరిష్కరించలేని రాజకీయ చట్రాలలో వున్నాయన్న సంగతి వీళ్ళకు తెలియదా? రాజకీయాల రోట్లో తలపెట్టి మనం బు(ర్రలు బద్దలు కొట్టించుకోవాలి అని వీళ్ళ ఉద్దేశమా? మన స్వచ్చంద సంస్టలకి వస్తున్న ఫండ్స్‌ ఇంకిపోయేలా చెయ్యడానికి, ఇప్పుడు పడుతున్న దండల బదులు అరదండాలు, విదేశీయాత్రల బదులు పరలోక యాత్రలు చేయించడానికి కుట్ర ఇది వర్గ చైతన్యం పేరుతో మనలో మనకి విబేధాలు కల్పించి స్త్రీల ఆ(గ్రహాన్నుంచి పురుషుడిని రక్షించడానికి పురుషస్వామ్య వవస్ట చేస్తున్న కుట్ర ఇది! వ్యవస్థ మారి, ఆర్షిక స్వాతంధ్యం వచ్చేదాకా మూడు రేప్‌లు, ఆరు వరకట్నాల చావులు గా స్రీలు వర్తిల్లాలని వీళ్ళ ఉద్దేశమూ? ఆర్దిక స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన స్త్రీల సమస్యలు తీరిపోతాయని వళ్ళు రాసివ్వగలరా? ఏ చేశంరటనా ఎక్కడేనా అలా జరిగిందా... సారీ! ఉత్తరం ఉపన్యాసంగా మారిపోతున్నట్టుంది. స్నేహితురాళ్ళందరూ అంటుంటారు,ఫెమినిజం అనగానే ఎంత అవేశమే నీకు, నీతో మాట్లాడాలంటే భయం' అని. ఏం చెయ్యను? ఫెమినిజం నా ఊపిరి, జీవితం, జీవన సోపానం. మగజాతంటే ఎంత ఆసహ్యం అంటే నా ఫేవరేట్‌ ఫాంటసీ ఏమిటో తెలుసా? స్త్రీలు గెరిల్టా దాడులు చేసి పురుష దురహంకారుల బుర్రలు బద్దలు కొడుతూ మగజాతి గుండెల్టో వణుకు పుట్టిస్తున్నట్టు..... జయగంటలా ఫోను మోగుతోంది... (ట్రావెల్‌ ఏజంటు దగ్గరనుంచనుకుంటా! వాషింగ్టన్‌ నుంచి వచ్చాక వివరంగా రాస్తాను, ఉంటా! ఫెమినిస్టు అభినందనలతో గంగ ( ఆదివారం ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి, 24, 1999)

అన్వేషి

సా యంత్రం, ఆరు బయట కొబ్బరిచెట్టు కింద, మడత మంచం మీద వెల్లకిలా పడుకుని, ఆకాశంలో దూది పింజల్లా తేలుతున్న మేఘాల కేసి చూస్తూ భార్య చెబుతున్నది పరధ్యానంగా వింటున్న రామచంద్రానికి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది. అతని చుట్టూ కొబ్బరిచెట్లూ, మేఘాలు, నక్షత్రాలు - అన్నీ గిరగిర తిరగనాగాయి. అలా గిరగిర తిరుగుతున్న మేఘ శకలాలు పోగుపడి - భూమి మీద ఒక కాలు ఆని ఆకాశమంతా తనే అయి, తాండవ నృత్యం చేస్తున్న ఈశ్వరుడి రూపు దాల్చాయి. ఆ ఈశ్వరుడి శిరస్సున చంద్రవంక వెలుగుతోంది. అదే సమయంలో చెవులు చిల్లులు పడేట్టు ఢమరుక నాదం వినిపించసాగింది...

రామచంద్రానికి తను కల కంటున్నాడో. నిజంగా చూస్తున్నాడో అర్ధం కాలేదు. అతను భయంతో ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. క్షణం తరువాత కళ్ళు తెరిచేటప్పటికి దృశ్యం కరిగిపోతోంది. ఢమరుక నాదం ఆగిపోయి, ఎక్కడో నూతిలోనుంచి వస్తున్నట్టు శకుంతల మాటలు వినిపించసాగాయి -

*... శారద కాలేజీ చదువు పూర్తి కాగానే ఈ సంవత్సరం పెళ్ళి చేసేద్దావంటున్నాడు మా అన్నయ్య. తొందరగా శుభ కార్యం జరిపిస్తే మంచిది. ...!

రామచం/(ద్రానికి కణతల్లో విపరీతంగా నొప్పి అనిపించింది. కళ్ళల్లో సూదులుచ్చుకు పొడుస్తున్నట్టుగో ఉంది. మెల్లిగా శరీరాన్నీ స్వాధీనంలోకి తెచ్చుకున్‌ శకుంతలా... నువ్వు ......ఇప్పుడు....ఏవైనా చూశావా? అని అడిగాడు. అతనికి చాలా అలసటగా ఉండి మపినలుగో వస్తోంది.

ఏవిటి చూడడం?” అంది అరుగుమీంచి శకుంతల.

'నీకు.. .నీకు. . ఏవీ వినిపించలేదా?'

150 లక్ష్మీ కటాక్షం

'చూడడవేవిటి? వినడవేవిటి?" అంటూ తలెత్తి పరిశీలనగా భర్తను చూసింది శకుంతల. అతని మాట చాలా నీరసంగా వస్తోందని అప్పుడు (గ్రహించి, 'ఏవిటి? ఏమైంది?' అనడుగుతూ, ఆందోళనతో అరుగు దిగి వచ్చింది.

'ఏవీలేదు' - రామచంద్రం మంచం మీంచి లేవబోయి, కూలబడ్డాడు.

'ఏవిటలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా ?' - శకుంతల ఈ సారి నిజంగానే కంగారు పడింది. మరింత దగ్గరకొచ్చి అతన్ని పరిశిలనగా చూసింది. అతని మొహం పీక్కుపోయినట్టుంది. కనుపాపలు నిశ్చలంగా ఒక చోట ఉండక కదులుతున్నాయి.

'ఏవీ లేదు. కొంచెం తలనొప్పిగా ఉంది' అన్నాడు రామచం[ద్రం కణతలు నొక్కు కుంటూ. శకుంతల అమృతాంజనం తీసుకొచ్చి రాసి, 'కొంచెం కాఫీ తాగండి. నీరసం తగ్గుతుంది." అంటూ ప్లాస్కులోంచి కాఫీ కప్పులో పోసి అతనికి అందించింది. కాఫీ తీసుకున్నాక, పదండి - డాక్టరు దగ్గరకు వెళదాం" అంది.

'వద్దు - ఇప్పుడు బాగానే ఉందిలే' అన్నాడు రామచంద్రం.

మర్నాటికి అతను మామూలుగా అయ్యాడు. నిన్నటి అనారోగ్య చిహ్నాలు ఏవీ అతని మొహంలో కనిపించకపోయేసరికి శకుంతల కూడా డాక్టరు దగ్గరకు వెడదామని పట్టుబట్టలేదు. వారంరోజుల తర్వాత ఆ సంగతి పూర్తిగా మరిచిపోయింది.

రామచంద్రం మాత్రం నిరంతరం ఆ సంఘటన గురించి ఆలోచించసాగాడు. 'నేను కమ్యూనిష్టుని - ఎప్పుడూ చెయ్యెత్తి దేవుడికి నమస్కరించలేదు. ఇలా ఎందుకు జరిగింది? ఇది భ్రమా లేక ....” - అతను నెల రోజులు తనలో తనే మధన పడి ఓ ఆదివారం సాయంత్రం వెంకటేశ్చర్హు ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికి వెంకటేళ్ళర్హు ఒక్కడూ వరండాలో పడక కుర్చీలో పడుకుని కూనిరాగాలు తీస్తున్నాడు. రామచంద్రాన్ని చూసి, 'రా...రా... బహుకాల దర్శనం... బాగున్నావా? క అన్నాడు ఆహ్వానిస్తూ.

“ఏవిటి? ఒక్కడివీ కూర్చున్నావు. మీ ఆవిడ, పిల్లలూ లేరా?"

'టీవీ చూస్తున్నారు' ఖ్‌

“అలా కాలవ ఒడ్డుకి షికారు వెడదామా?”

'పద' - వెంకటేశ్యర్టు జోళ్ళు తొడుక్కొని వెంటనే బయలు దేరాడు.

దారిపొడుగునా రామచంద్రం విషయం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ పరధ్యానంగా అవీ ఇవీ మాట్లాడుతున్నాడు.

“ఏవిటలా ఉన్నావు?"

'నెల రోజుల (క్రితం.....' అంటూ జరిగింది వివరంగా చెప్పాడు రామచంద్రం.

'ఒంటికాలి మీద వెయ్యేళ్ళు తపస్సు చేసిన సర్వసంగ పరిత్యాగులకి కూడా లభించని. ఈశ్వర దర్శనం పుచ్చలపల్లి 'సుందరయ్యగారి శిష్యుడికి ఆయ వితంగా లభించిందన్నమాట' - వెంకటేశ్వర్లు పకపకా నవ్వుతూ అన్నాడు.

పరిహాసం కాదు - నాకంతా అయోమయంగా ఉంది"

'అలా పడుకుని నీకు తెలియకుండానే కళ్ళు మూసుకుని కలగనుంటావు'

తోలేటి జగన్నోహనరావు 151

“కల కాదు- మెలకువగానే ఉన్నాను"

'కల కాకపోతే భ్రమ అయివుంటుంది- నీ కళ్లు చూసిన దృశ్యాన్ని నీ మెదడు సరిగా ఇంటర్‌ (పైట్‌ చెయ్యలేక తికమకపడి ఉంటుంది"

“అలా అయితే ఈశ్వరుడే ఎందుకు కనిపించాలి?

'అంటే నిజంగా ఈశ్వర దర్శనం అయిందంటావా? వ్యక్తి అనుభవం సామాజిక అనుభవం కానప్పుడు దానిలో నిజానిజాలు నిర్ణయించడం సాధ్యంకాదు. నీకు కనిపించిన ఈశ్వరుడు మీ ఆవిడకి ఎందుకు కనిపెంచలేదు.... సైరుగాలికి ప్రాణం లేచొస్తోంది.. .. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదలిపెట్టి పద ..." అన్నాడు వెంకటేశ్వర్డు అతను రామచంద్రం చెప్పేది సీరియస్‌గా తీసుకోలేదు. రామచంద్రం మీద ఆ సంఘటన (ప్రభావం ఎంత గాఢంగా ఉన్నదీ ఆరునెలల తరువాత గానీ అతనికి అర్హం కాలేదు.

ఈ ఆరు నెలలలోనూ రామచంద్రం చాలా మారాడు. ఆతని దృష్టి ఆధ్యాత్మికంగా సాగింది. భగవద్గీత, ఉపనిషత్తులు చదివి అర్ధం చేసుకోవడానికి (ప్రయత్నించాడు కాని అవి అతనికి ఓ పట్టాన కారుకుడు పడలేదు. గురువు ద్వారా మాత్రమె జ్ఞానం లభిస్తుందని ఎవరో సలహా ఇవ్వగా జనకాశ్రమంలో రామానంద స్వామిని సేవించడం మొదలుపెట్టాడు.

“ఏవిటిదంతా? ఎ(ర్రజెండా వదిలేసి కాషాయ జండా పట్టుకున్నావేవిటి కొంపదీసి?” - కొంచెం వేళాకోళంగానూ, కొంచెం సీరియన్‌గానూ అడీగాడు వెంకటేళ్వర్దు.

“సాజేతిలో ఏ జండా లేదు. నా మనసు నిండా సందేహాలు మాత్రం ఉన్నాయి. మానవ జీవితానికి ఏవైనా అర్జం వుందా? ఆత్మ, పరమాత్మ, కర్మ, మోక్షం, - ఇలాంటి వన్నీ నన్ను కలవర పెడుతున్నాయి .... "

“ఆధ్యాతి తల్‌ సమాధానం దొరికిందా?

'దొరికనట్టె అనిపిస్తోంది..కాని సందేహం వదలడం లేదు'

“బావుంది - నేను ఆస్తికత నుంచి నాస్తికత వైపు ప్రయాణిస్తే నువ్వు గతితార్కిక భౌతిక వాదంలోంచి ఈ గందరగోళంలోకి దూకుతున్నావన్నమాట. నువ్వు ప్రశ్నించే స్వభావం ఇంకా వదులుకోలేదు కనుక సందేహాలు వదలడం లేదు....' - వెంకటేళ్వర్టు అన్నాడు - '..నా అనుభవంతో చెబుతున్న మాట విను. ఇదంతా శుష్క వేదాంతం. నమ్మడం, నమ్మకపోవడం నీ ఇష్టం కాని సరియస్‌గా ఆలోచిస్తే ఇందులో ఏవీ లేదు. నేను చిన్నప్పటినుంచి వన్ని చదివి, చదివి, తలబద్దలు కొట్టుకుని, చివరకు ఈ సృష్టి రహస్యాల గురించి ఎవరిక ఏమీ తెలియదని స్పష్టమై, దేవుడంటే అపనమ్మకం కలగసాగింది. ఆ అపనమ్మకమే చివరకు నన్ను నాస్తెకుడుగా చేసింది .....

'నిన్న మొన్నటి దాకా నేనూ దేవుడూ, దెయ్యం -ఏవీ లేవని వాదించినవాడినే. జీవితపు లోతులు అనుభవంలోకి వచ్చినకొలదీ ఈ వాదనలో ఏదో లోపం ఉందేమోననిపిస్తోంది. .." - రామచం[ద్రం సమాధానం చెప్పాడు.

“దేవుడంటే నాకు నవ్వాస్తోంది" - వెంకటేశ్వర్లు అన్నాడు - "పదిమంది ఎదుట

152 లక్ష్మీ కటాక్షం పడి నేనున్నానని చెప్పడానికి సర్దు శక్తిమంత్తుడైన ఈ దేవుడికి సిగ్గా? భయమా? పైగా ఒకళ్ళా? ఇద్దరా? కాలగర్భంలో అడ్రస్‌ లేకుండా పోయిన మతాలు, దేవుళ్లూ ఎన్హి వందలో? ఈ దేవుడు ఒక పెద్ద ్రాడ్‌. అజ్ఞానంలో పుట్టాడు. అజ్ఞానం "పెరుగుతున్నాడు. జ్ఞానోదయం అయిననాడు నశిస్తాడు....'

“ఇంకచాలు, ఆపు! నువ్వేదో మహా జ్ఞానివైనట్టు, మిగిలినవాళ్ళు మూర్చులైనట్టు మాట్టాడకు" - రామచంద్రం అసహనంగా అన్నాడు.

'నాకేవీ తెలియదని, నేను అజానిని అనే జ్ఞానం నాకుంది. కాని దేవుడిని ప్రచారం చేస్తున్న వాళ్ళు అజ్ఞానులమనే స్పృహ కూడా లేని అజ్ఞానులు. వాస్తవాలు చేదుగా ఉండి నికు మింగుడు పడటం లేదు కాని ఈ పాపిష్టి దేవుడి చరిత్ర అంతా ఒకసారి_తిరగేసి చూడు.....' - వెంకటేశ్వర్హు అన్నాడు - '.... చరిత్ర తిరగబడి, కొలంబస్‌ అమెరికా చేరకుండా, అమెరికా లెడ్‌ ఇండియన్లే మన 'అనాగరిక' ప్రపంచం మీద దిగి, రక్తపుటేరులు పారిస్తూ మన మతాల్ని నామరూపాలు లేకుండా చేసేసి, వాళ్ళ మతం మనమీద రుద్దితే ఈనాడు మనం 'ఈళ్టరా, అల్లా, జీసస్‌" అని ప్రార్ధించేవాళ్ళం కాదు. అవి దేవదానవ యుద్దాలుగా కిర్తించి, ఇప్పుడు "పేరేనా తెలియని వాళ్ళ దేవుళ్ళని ఇంత ఆవేశంతోనూ ఆరాధించేవాళ్ళం. వాళ్ళ పవిత్ర (గ్రంధాల్ని వేదాల్లా పూజించేవాళ్ళం. కత్తి తుపాకీ లేకుండా దేవుడెక్కడైనా నిలబడగలిగాడా? ”

రామచం(ద్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు = 'నేను ఊహిస్తున్న దేవుడు ఈ దేవుడు కాదేమో! ఈ చరాచర ప్రపంచాన్నంతా నడిపించే నామ రూప రహితమైన మహాశక్తి ఏదో ఉండి ఉంటుంది. ఆ శక్తినే ఆస్తికులు వివిధ రూపాలలో ఆరాధిస్తున్నారు కాబోలు...”

వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట, నీలాంటివాడే వెనకటికి! ఈ దేవుడి దివాలాకోరుతనం స్పష్టమవగానే నిరాకార నిర్గుణ (బ్రహ్మను రంగంలోకి దించుతునిన్నవన్నమాట... - వెంకటేళ్ళ్వర్హు నవ్వాడు - 1... ఈ సృష్టి ఎలా మొదలైందో, ఎలా అంతమవుతుందో తీలియదు కానీ, ఆద్యంతాల మధ్య వికాసం మాత్రం ఏ ద్‌ శక్తీ అవసరం లేకుండా స్వయంచలితంగా ఉన్నట్టు కనిపిస్తుంది... ఇది ఇవాళ తేలే విషయం కాదుకానీ ... పద... చీకటి పడుతోంది, అంటూ వెంకటేశ్వర్లు వెనక్కు తిరగబోతుండగా ఎర్ర మోటారుసైకిలు ఒకటి విసురుగా అతన్నీ దూసుకుంటూ వెళ్ళి కొంచెం దూరంలో ఆగింది.

“గుడ్‌ ఈవినింగ్‌ అంకుల్‌. అంటూ వెంకటేశ్చర్హును పలకరించాడు సుధాకర్‌.

'నువ్వటరా నాయనా - హడలి చచ్చాను” - రం. నవ్వుతూ అని, 'బండి కొంచెం మెల్లిగా నడుపు - నెత్తి మీద హెల్మెట్‌ పెట్టుకుంటే స్టెయిలు తగ్గిపోతుందా? హెల్మెట్‌ పెట్టుకో" అని సుధాక్షర్‌ని మందలించాడు.

మావయ్య వచ్చాడు - అమ్మ నిన్ను అర్జంటుగా రమ్మంటోంది' అన్నాడు సుధాకర్‌ తండ్రితో,

"పెళ్ళి విషయం మాట్టాడ్డానికి వచ్చినట్టున్నాడు మీ బావమరిది - నువ్వు

తోలేటీ జగన్నోవానరావు 153 మోటారు. సైకిలు మీద వెళ్ళిపో. నేనుమెల్లిగా నడిచి వెడతాలే.....' అన్నాడు వెంకటేశ్వర్డు.

రామచంద్రం అంత ఆత్రత చూపించలేదు - 'నే వస్తాలే - నువ్వెళ్ళు, అన్నాడు కొడుకుతో.

“వస్తా అంకుల్‌... బై బై డాడీ” అంటూ మోటారు సైకిలు కిక్కిచ్చి బాణంలా దూసుకుపోయాడు సుధాకర్‌.

“కుర్రాడు జోరు మీదున్నాడు. కాలు నేల మీద నిలవడం లేదు. త్వరగా ముహూర్తం పట్టరు.

“చూద్దాంలే'

“ఇంకా చూద్దావేవిటి? ఎంతకాలం తిప్పించుకుంటావ్‌ మీ బావమరిదిని నీచుట్టూ ? మగపెళల్లి వారి టెక్కు చూపిస్తున్నావేవిటి? ఇంక ఆలస్యం చేయకు...'

దూరంగా సుధాకర్‌ మోటారుసైకిలు చీకటిలో కలిసిపోతోంది. దాని వెనకనున్న ఎర్ర దీపం అస్పష్టంగా కనిపిస్తోంది. రామచంద్రం అటువైపే చూస్తూ, ' తొందరపడిగే ఏద్‌ జరగదు. తాందరపడనంత మాత్రాన ఏదీ ఆగిపోదు. జరగాల్సింది జరగాల్సిన టుడు జరగాల్సిన విధంగా జరుగుతుంది...” అన్నాడు.

వెంకటెశ్వర్హుకు తెలుసున్నంతవరకూ రామచంద్రానికి అతని బావమరిదికి మధ్య ఏ గొడవలూ లేవు. మరి రామచంద్రం పెళ్ళి ఎందుకు వాయిదా వేస్తూ పోతున్నాడో అతనికి అర్జంకాలేదు. ఏదో అనబోయి, మళ్ళీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో తను తల దూర్చడం బాగుండదనిపించి ఆగిపోయాడు వెంకటేశ్వర్డు.

వారం రోజులు తిరగకుండా రామచంద్రం దగ్గర నుంచి అర్ధరాత్రి వేళ ఫోను వచ్చింది. రామచంద్రం ఫోనులో చెబుతున్నది వెంకటేశ్వర్లు నమ్మలేకపోయాడు. వెంటనే స్కూటరేసుకుని రామచంద్రం ఇంటికి వెళ్ళాడు. ఇల్లంతా ఏడుపులతో ప్రతిధ్వనిస్తోంది.

“ఏమైంది రామం?" - రామచంద్రాన్ని కౌగిలించుకుని ఏడుస్తూ అడిగాడు వెంకటేశ్వర్లు.

సుధాకర్‌ పొరుగూరులో ఉన్న మేనమామ ఇంటికి వెళ్ళాడుట. మధ్యాహ్నం వెళ్ళిన వాడు రాత్రి పదిగంటల వరకూ అక్కడే వుండిపోయాడు. రాత్రి ఏం వెడతావురా వానలో ..... ఇక్కడే పడుకో...” అన్నాడు మేనమామ. 'వద్దు.... ఇంటి దగ్గర చెప్పలేదు... నాన్న కోప్పడతాడు...పెద్దవానేం లేదు.....తుంపరేగా పడుతుంట... ఎంత? పది మైళ్ళు, అయిదు నిమిషాల్టో... మళ్ళీ రేపాస్తాగా. అంటూ కాబోయే పెళ్ళాని కేసి చూస్తూ మోటారు సైకిలెక్కాడు వానల్‌నే. వంతెన దిగుతూ లారీని ఢీ కొట్టి ఎగిరి పడ్డాడుట. పడడం బురదలో, గడ్డిలో పడ్డా, తలకు బలమైన గాయం తగిలి వెంటనే ప్రాణం పోయింది.

'వాణ్మి హెల్మెట్‌ పెట్టుకోరా అని ఎన్నిసార్టు చెప్పినా విన్నాడు కాడు. తలకి అంత గాయం తగలకుండా ఉంటే కాలో, చెయ్యో విరిగేదేమో కాని (ప్రాణం పోయేది కాదు'

  • నాలుగు వారాల తర్వాత రామచంద్రంతో అన్నాడు వెంకటేశ్వర్టు బాధగా.

154 లక్ష్మీ కటాక్షం “ఆయువు మూడిన వాడికి హెల్మెట్‌ ప్రాణం పోస్తుందా - నీ పిచ్చిగాని - రామచంద్రం అలమైరా తెరచి, అందులోంచి ఓ ఫైలుతీస్తూ అన్నాడు - వీడు పుట్టినప్పుడు, అప్పుడు నాకు నమ్మకం లేకపోయినా, సరదాకి మీ నాన్టుగారి చేత జాతకచ(క్రం వేయించాను. వీడి జాతకంలో లగ్నంలో గురుడు, రాహువు, చంద్రుడు వరసగా సప్తమ అష్టమ భావాలతో ఉన్నారు. వీడు అల్ప్సాయుష్కుడు. ఇలాంటి జాతకులు ఇరవై రెండేళ్ళు దాటి (బ్రతికే అవకాశం లేదు. వచ్చే మంగళవారానికి వీడికి ఇరవై రెండు నిండేవి.... వీడు మోటారుసైకిలు కావాలి అని ఎంత గోల చేశాడో తెలుసా? ఎందుకనో నాకు వాడి మరణానికి, మోటారు సైకిల్‌కి సంబంధం ఉందనిపించింది. పోనీ, ఇరవై రెండు నిండాక కొంటానన్నాను. విన్నాడా? నిరాహార దీక్ష చేశాడు. లేక లేక కలిగిన బిడ్డ ఒక చిన్న కోరిక కోరితే నేను పీనాసితనం చూపిస్తున్నానని సతాయించడం మొదలుపెట్టింది శకుంతల. వాడి మేనమామ, అల్టుడికి పెళ్ళిలో ఇద్దామనుకున్న మోటారుసైకిలు ముందే కొనిస్తానన్నాడు. ఎన్ని విధాల (ప్రయత్నించినా మోటారు సైకిలు రాకుండా ఆపగలిగానా? వాణ్డో స్పీడుగా పోవద్దని ఎన్నో సార్హు మందలించాను. వాడి రోజులు దగ్గర పడుతున్నా యని తెలిసి కూడా నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. కాని వా్డే ఆ మార్గం నుంచి తప్పించగలిగానా? మన చేతిలో ఏదో ఉందనుకుంటాం కాని ఏదీలేదు. రాత ఎవరూ తప్పించలేరు” అన్నాడు రామచంద్రం నిర్లిప్తంగా. జాతకాలలో నమ్మకం ఎప్పటి నుంచి? - వెంకటేశ్వర్హు తెల్లబోయి అడిగాడు - అజ మా నాన్న జోస్యం పట్ట నువ్వు నమ్మకం పెంచుకున్నావు కాని మా అమ్మ అకాలమరణం మా నాన్నకు తెలిసిందా? పెళ్ళయిన ఎండే కూతురికి వైధవ్యం రాసి పెట్టి ఉందని మా చెల్లెలి జాతకంలో చూడగలిగాడా? మానాన్నని మించీన జ్యోతిశ్శాస్త్ర పండితుడు మా తాత మా బాబయ్యది మహారాజ జాతకమనుకున్నాడు కాని పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటా డనుకున్నాడా? చివరిరోజుల్లో మా నాన్నకీ జాతకాలలో నమ్మకం పోయినట్టుంది. మా బోవ పోయిన తర్వాత జాతకాలు చూడటం మానేశారు. ఆ (గ్రంధాలన్నీ కట్టకట్టి అటకెక్కించేశాడు. వీవిటిది నాన్నా? అంటే, ముందేం జరుగుతుందో ఆ రాత రాసిన వాడీకి తప్ప ఎవరికీ తెలియదు నాయనా 'అనేవాడు. నేను వందల జాతకాలు చూశాను కొకతాళీయంగా కొన్ని నిజమవుతాయి. కాని ఈ శాస్రానికి పునాది లేదు. పిచ్చి నమ్మకాలు పెంచుకోకు.... అని మందలించాడు వెంకటేళ్ళర్డు. “_ సుధపోయాడనీ, ఇంకిప్పుడూ. వాడిని చూడలేననీ, ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను వెంకటేశం. వాడు ఎక్కడికో వెళ్ళాడనీ తిరిగి వస్తాడనీ అనిపిస్తోంది. ముందే పెళ్ళి చేస్తే వాడు శారదని కలపడానికి అలా అర్హరాత్రీ, అపరాత్రీ వెళ్ళే వాడు కాదా? వాడిని అలా తిరగొద్దు అని గట్టిగా కోప్పడకుండా ఉంటే వాడు భయపడి వానలో బయలుదేరకుండా 'రౌత్రికి మేనమామ కంట్లో ఉండిపోయేవాడా? ఈ (బ్రమాదం తప్పేదా? శకుంతల నిందిస్తున్నట్టు నేను పరోక్షంగా నాడి ..చావుకి.

లోలేటీ జగన్మోహనరావు 155 కారణమయ్యా.. నేమో..అ..ని..పి..స్తోం ది... - రామచంద్రం దుఃఖం కట్టలు తెంచుకు పొంగింది అతను వెక్కి వెక్కి ఏడవసాగాడు.

'జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించకు” వెంకటేశ్వర్హు ఓదారుస్తూ అన్నాడు- “జీవితం దుఃఖమయం. ఈ దుఃఖసాగరాన్ని ఈదడానికీ మనిషికి ఏదో ఒక ఆలంబన, విశ్వాసం కావాలేమోననిపిస్తోంది నాకు. నువ్వు మార్క్సిజాన్ని వదిలేశావు. దేవుడిలో విశ్వాసం పెంచుకోలేకుండా ఉన్నావు. నడీసముద్రంలో, తుఫానులో, చుక్కాని లేని నావలా ఉంది నీ పరిస్టితి. నా మాటలకేం గాని నీ మనసు దేవుడివైపు మొగ్గుతోంది కనుక, పోనీ ఆ దారిలో నీకు మనశ్శాంతి కలుగుతుందేమో చూడు. ముందు నువ్వు ఈ నిస్పృహ నుంచి బయట పడాలి- సలహా ఇచ్చాడు వెంకటేశ్చర్జు.

'శకుంతలా! నామనసు బాగా లేదు. నాలుగు పుణ్యస్థలాలూ చూసివద్దాం - స్టలం మారినట్టుగానూ ఉంటుంది." అన్నాడు రామచంద్రం భార్యతో. శకుంతల వస్తానన లేదు, రాననలేదు. కొడుకు పోయినప్పటి నుంచి భర్తతో సరిగా మాట్లాడడం లేదు ఆమె. శకుంతల మౌనం చూసి రామచంద్రం ఒక్కడే బయలు దేరొడు. తిరుపతి వెళ్ళాడు. రమణాశ్రమం వెళ్ళాడు. ఎక్కడా అతని సందేహాలకు సంతృప్తి కరమైన సమాధానాలు దొరకలేదు. పైగా కొత్త సందేహాలు కలుగసాొగాయి.....

పుట్టపర్తి నుంచి తిరిగి వస్తూ విజయవాడ బస్సుస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ రామచంద్రం ఒకవ్యక్తి తనకేసే చూస్తుండటం గమనించాడు. అతనికి పక్షవాతం వలన కాబొలు కుడిచెయ్యి, కుడికాలు పడిపోయాయి నోరు కొంచెం వంకర పోయి, కింది పెదవి వదులుగా కదులుతోంది. తలంతా చింపిరి చింపిరిగా రోత కలిగిం చేలా ఉంది. ఎందుకిలా వీడు నాకేసి చూస్తున్నాడు అని చికాగ్గా మరోవేపు తిరిగాడు రామచంద్రం. రెండు నిమిషాల తర్వాత ఇంకా అతను తనకేసి చూస్తున్నాడా అని అనుమానం వచ్చి, తలతిప్పి చూశాడు. అతను చేతికర్ర సహాయంతో కుంటుకుంటూ నాలుగడుగులు ముందుకొచ్చాడు. ॥ |

రామచంద్రం అతన్ని తప్పించుకోడానికి కదలగానే, అతను ..రే....రే.... అంటూ వెంట పడ్డాడు. 'ఫో...ఫో.... - ముష్టివాడనుకుని విదిలించి హోటల్లోకి వెళ్ళబోయాడు రామచంద్రం. అతను వదిలి పెట్టక '..రే...రే.... అంటూ ఏదో వెప్తునాగాడు. అతని మాట అస్పష్టంగా ఉండి రామచంద్రానికి మొదట ఆర్థం కాలదు.

'ఒరే ...నువ్వు... రామ... చంద్రం....కదూ," - ఒక నిమిషం తర్వాత అతను అంటున్నది మెల్లగా బోధపడింది రామచంద్రానికి.

తనను ఆ వ్యక్తి అలా పేరు పెట్టి పిలవడంతో రామచంద్రం ఆశ్చర్యంతో ఆగి పోయాడు.

.. నన్ను గుర్తు పట్టలేదా? నేను... కృష్ణమూర్తిని మనిద్దరం గుండువారి పేటలో ఒకే వీధిలో ఉండేవాళ్ళం... బాడ్మింటన్‌ ఆడవాళ్ళం..." అతను ఆగి, ఆగి, ప్రయాసతో సలుకుతూ, గుర్తు చెయ్యడానికి కష్టపడుతున్నాడు.

156 లక్ష్మీ కటూర్షం

కృష్ణమూర్తి - బాడ్మింటన్‌ డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌...పచ్చగా దబ్బపండు ఛాయలో, మంచి పెర్ఫనాలిటీతో ఉండేవాడు... వాణ్ణో 'జింబో' అని సరదాగా పిలుస్తుండే వారు...వాళ్ళు ఆస్తిపరులు ...ఇల్లు, పొలాలు.... ఒక్కడే కొడుకు .. వీడెందుకిలా అయ్యాడు? రామచంద్రం తెల్లబోయాడు.

కృష్ణమూర్తి ఏదో చెప్పన తుంటే వారించి, 'పద! ముందు కాఫీ తాగుదాం అంటూ చెయ్యి పట్టుకుని హోటల్టోకి తీసుకెళ్ళి టిఫిను, కాఫీ ఇప్పించాడు. కృష్ణమూర్తీ, తనూ స్కూలు ఎదురుగా చిట్టయ్య కాఫీ హోటల్లో ఇడ్లీలు, పెసరట్టు తింటూ సినిమాల గురించి సరదాగా మాట్లాడుకోవడం గుర్తుకొచ్చి రామచండద్రానికి కళ్ళల్లో నీరు చిమ్మింది.

“ఏవిటిది కృష్ణా ? అన్నాడు భుజం మీద అనునయంగా చెయ్యివేసి.

'ఖర్మ- బంధువులు, స్నేహితులు... చివరకు పెళ్ళాం పిల్లలు _- అంతా మోసం చేసి బికారి చేసి వీధిలోకి గెంటేశారు. ఆస్తి నా పేరున ఉంచుకుంటే ఈ రోజు ఇలా దిక్కులేని వాజ్ఞయి. పోయేవాడిని కాదురా - కానుకో లేకపోయాను - నాశనం చేసేశారు" - కృష్ణమూర్తి ఏడుస్తూ చెబుతున్నాడు - 'అందం, ఆనందం, ఐళ్ళర్యం, ఆరోగ్యం, అన్నీ ఎప్పుడూ అలాగే ఉండిపోతాయనుకున్నాను - అన్నిరోజులూ మనవి కావని తెలుసుకోలేక పోయాను...”

కృష్ణమూర్తిని ఓదార్చి ఓ వంద రూపాయలివ్వబోయాడు రామచంద్రం.

'వద్దురా' - కృష్ణమూర్తి తల అడ్డంగా ఊపాడు - 'ప్రేమతో మాట్లాడావు - అదే చాలు - అంతా తప్పుకు తిరిగే వారే - మనిషితో మాట్టాడ్డానికి మొహం వాచి పోయానురా - నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది - డబ్బు గురించి అనుకోకు - ఈ వందతో మరో వారం బతకగలనేమో - బతకకపోయినా నష్టం లేదులే - వద్దురా”

నల తర్యాత క్థ్ణమూర్తి రోడ్డు పక్కన దిక్కులేని చావు చచ్చినట్టు, మునిసిపాలిటి వాళ్లూ పోలిసులూ, శవదహనం చేసినట్టూ తెలిసి రామచంద్రం మనసు వికలమై పోయింది. ఏవిటీ జీవితం? ఎక్కడ మొదలై అనూహ్యంగా మలుపులు తిరుగుత్తూ ఎలా అంతమవుతోంది? ఏవిటీ దు:ఖం? అతను మళ్ళీ తీవ్రమైన అశాంతికి గురయ్యాడు...

“శకుంతలా! నేను కాశీ, ప్రయాగ వెడదామనుకుంటున్నాను - వస్తావా?' - ఆమె రాదని తెలిసినా మాటవరసకి అడిగాడు. అతను ఊహించినట్లుగానే ఆమె రానంది.

రామచంద్రం కాశీ, ప్రయాగ చూశాడు. హరిద్వార్‌: హృపీకేశ్‌: కేదార్‌నాథ్‌: బదరీ నాధ్‌ - అన్నీతిరిగాడు. ఎక్కడా అతను కోరుకున్న మనశ్శాంతి లభించలేదు. ప్రదే దర్శనం చేసుకుందామని జమ్మూ వెడుతూ, జ్వాలా దేవి గురించి విని, దారిలో పరాన్‌ కోటలో బండి దిగిపోయాడు. అటువైపు వెళ్ళే బండి మర్నాడు ఉదయం గానీ లేదని తెలిసి, ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టేషన్‌ బయటికి వచ్చాడు

'చంబ్బా. చంబా... చంబా...జానేవాలి బస్‌ జా రహీహై...” - బస్సు రాడ్‌ పట్టుకుని ఊగుతూ అరుస్తున్నాడు కండక్టరు. రామచంద్రం ఆ కు్రడికీసి ఒక

తోలేటి జగన్మోహనరావు 157 క్షం చూసి బస్సు ఎక్కాడు

అతని ఎదురు సీటులో కొత్త దంపతులు వచ్చి కూర్చున్నారు. ఆ అమ్మాయికి పదిహేను, పదహారు కంటే ఎక్కువ ఉండదు. పచ్చగా, బంగారంలా మెరిసిపోతోంది. ఆమె ముక్కుకి హిమాచల్‌ ప్రదేశ్‌ స్రీలు ధరించే 'నత్‌నీ' వేళాడుతోంది. ఆమె తలపై ముసుగు కొంచెం తొలగించి, కళ్ళెత్తి భర్తకేసి మాటి మాటికి చూస్తోంది. ఆ కుర్రాడికి ఇరవై, ఇరవై రెండు కంటే ఎక్కువ వుండదు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు తగిలేలా కూర్చున్నారు. "చిలకా గోరింకల్టా ఉన్నారు' అనుకున్నాడు రామచంద్రం వాళ్ళని చూస్తూ

పరాన్‌కోట్‌ నుంచి బయలుదేరిన బస్సు పంజాబుదాటి హిమాచల్‌ ప్రదేశ్‌లో (ప్రవేశించి, మైదాన (ప్రాంతం వదలి ఘాట్‌రోజ్‌లో కొండల పైకెక్కసాగింది. ఆకాశం మేఘావృతమై ఉధృతంగా వాన పడసాగింది. బస్సు పైకి వెళుతున్నకొద్దీ రామచంద్రానికి చలి అనిపించి శాలువా తీసి కప్పుకొని, దూరంగా కనిపిస్తున్న మంచుకొండల్నీ, కింద లోయలో తేలుతున్న మేఘాలనీ చూడసాగాడు. ఎదురుగా కొండని కావలించుకొన్నట్టు నిలిచి పోయిన మెఘంలో బస్సు ప్రవేశించగానే వాన జడి పెద్దదైంది. (డ్రైవరు బస్సువేగం తగ్గించి, లైట్లు వేసి దారి చూసుకుంటూ జాగ్రత్తగా నడపసాగాడు. పదినిమిషాల తరువాత మేఘంలోంచి బయట పడిన బస్సు కొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోయింది- ఎదురుగా కొండ చరియ విరిగి పడి, రోడ్డంతా మట్టితో, రాళ్ళతో కప్పబడి దారి మూసుకుపోయి ఉంది. అప్పటికి వాన జోరు తగ్గి చిన్నగా చినుకు పడుతోంది

"పెద్దగా దారి మూసుకు పోలేదు నలుగురూ చేతులేస్తే సర్కారు వాళ్ళు రోడ్డు బాగు చేసే దాకా ఆగక్కర్ర్లేదు' అన్నాడు (డ్రైవరు.

కండక్టరు బస్సు లోంచి పాఠ, గడ్డపార తీసుకుని దిగాడు. అతనిత్తో పాటు ఆడవాళ్ళు, వృద్దులు తప్ప, అంతా బస్సు దిగారు. గడ్డపార సహాయంతో రాళ్ళని పక్కకి గెంటుతూ దారి చేయ్యసాగారు. అందరితో పాటు రామచంద్రం ఎదురుగా కూర్చున్న కుర్రాడు కూడా దిగటోతుంటే, ఆ అమ్మాయి శాలువా కిందనుంచి, ఎవరికీ కనుపించకుండా అతని చిటికెన వేలు పట్టుకుని “నువ్వు దిగొద్దు" అన్నట్టు లాగింది. అతను కూర్చుండి పోయాడు. మరో పదినిమిషాలకి బస్సు మెట్టి మెల్లిగా ఖాళీ అయింది. రామచంద్రం, మరో నలుగురైదుగురు తప్ప బస్సులో ఎవరూ లేరు. అందరూ దిగిపోగానే ఆ అమ్మాయి అతనికి మరింత దగ్గరకు జరిగి, ముసుగు సైైకెత్తి మిల మిల మెరిసే కళ్లతో అతనికేసే చూస్తూ అతని చెవిలో గుసగుసలాడసాగింది.

కొత్త దంపతులిద్దరికి మధ్య తను అడ్డంగా ఉన్నాననిపించి రామచంద్రం లేచాడు.

'బాబా! బాహర్‌ రండ్‌ హై.... బస్‌ మత్‌ ఉతరీయే... ' అన్నాడు ఆ కుర్రాడు, రామచంద్రం ఎందుకు లేచాడో అర్దమై, మొహమాటపడుతూ.

'ఫరవానై. ... అఖీ తక్‌ ..మై...'టైరా..." - రామచంద్రం తనకొచ్చిన హిందీలో ఆ కు(ర్రాడికి సమాధానం చెప్పి బస్సు దిగాడు బయటకు అడుగు పెట్టగానే చలిగాలి

158 లక్ష్మీ కటాక్షం అతని మొహం మీద విసురుగా కొట్టింది. అతను ఊపిరి తిరగక ఉక్కిరి బిక్కిరైపోయాడు కొంచెం సేపు. కోలుకున్న తర్వాత శాలువా దగ్గరకు లాక్కుని ముందుకు నడిచాడు.

మరో పావుగంటకి రోడ్డు మీద ఉన్న పెద్ద రాళ్ళన్నీ తొలగించడం పూర్తయింది. (డ్రైవరు, కండక్షరు మట్టిని పారతో ఓ పక్కకు లాగి దారి చేస్తున్నారు. కొందరు పైనుంచి పడుతున్న నీటి ధారలలో కాళ్ళూ చేతులూ కడుక్కుంటున్నారు.

తనకంటే వయసులో పెద్దలు అలా చలిలో పని చేస్తుంటే తను పెళ్ళాం పక్కన వెచ్చగా కబుర్హు చెబుతూ కూర్చోడం సిగ్గనిపించింది కాబోలు కొత్త పెళ్ళి కొడుక్కి

  • అతనూ బస్సు దిగాడు. అతను బస్సు దిగగానే అంతా అతని కేసే చూశారు. “జవానీ...” అంటూ ఎవరో ఏదో అన్నారు. మగాళ్ళంతా గొల్టున నవ్వారు. ఆడవాళ్ళు మొహాలు పక్కకి తిప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వారు. తనను చూసి అంతా పరిహాసంగా నవ్వుతున్నారని అర్ధమై, ఆ కుర్రాడి మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. ఏం చెయ్యాలో తోచనట్టు ఓ క్షణం నిలబడిపోయాడు. ముందుకు వెళ్ళాలా, తిరిగి బస్సె క్కాలా అని ఆలోచిస్తున్న అతనికి రామచంద్రం కనుపించాడు. అతను రామచంద్రాన్ని సమీపించి, “బాబా...” అని పలకరించబోతుండగా, రామచంద్రం తలెత్తి పైకీ చూసి “అయ్యో... అని పెద్దగా అరుస్తూ ఆ కుర్రాడిని పక్కకు గెంటబోయాడు.

కొండ చరియ విరిగినప్పుడు, ఇంకా వదులుగా అంటి పెట్టుకుని ఉన్న చిన్న రాయి ఒకటీ నీటి ప్రవాహానికి మెల్లిగా మట్లి కొట్టుకు పోగా, విడివడి కిందికి వగ జారడం మొదలు పెట్టింది. టెన్నిస్‌ బాలు పరిమాణంలో ఉన్న ఆ రాయి పడే శబ్దం కూడా ఎవరికీ వినిపించలేదు. యాదాలాపంగా తలపైకెత్తిన రామచంద్రం అది చూసి ఆ కుర్రాడిని పక్కకు గెంటే లోపల, ఆ రాయి పెద్ద బండమీద పడి, ఎగిరి రామచంద్రం పక్కన నిలబడ్డ కుర్రాడి తలను తాకి, కింది అగాధంలోకి దార్డుకుంటూ వెళ్ళి అదృశ్యమెంది. ఆ కుర్రాడు ఒక కుదుపు కుదిపినట్టయి, తూలి, రోడ్డు మీద వెల్లకిలా పడీపోయాడు.

అంతా క్షణంలో అనూహ్యంగా అలా జరగడంతో నిశ్చేష్టుడైన రామచంద్రం కోలుకుని ఆందోళనగా ఆ కుర్రొడి లేత మొహం కేసి చూస్తూ చెయ్యి పట్టుకున్నాడు. నుదుటి మీద ఎడమవైపు రాయి తగిలిన చోట కమిలి పోయినట్టు మచ్చ కనిపిస్తోంది, కాని చుక్క రక్తం కూడా రాలేదు. రామచంద్రం నిట్టూర్చి చల్లబడ్డ చెయ్యి వదిలేశాడు.

ఇద్దరు (స్త్రీలు కళ్ళు ఒత్తుకుంటూ ఆ అమ్మాయిన్‌ బస్సు దింపారు. బస్సు దిగి, అంతా తనకేసి జాలిగా చూస్తుంటే ఆ అమ్మాయి కంగారుపడి, ముసుగు కొంచెం మీదకి లాక్కుని, బెదురు కళ్ళతో భర్తకోసం వెతకసాగింది. ఆమె దగ్గరకు రాగానే గుంపు పక్కకు తొలగింది..గుంపు మధ్యగా రోడ్డు మీద పడున్న అతన్నీ చూడగానే ఆ అమ్మాయి ఏవీ అర్ధం కానట్టు ఓ క్షణం శిలలా నిలిచిపోయింది. తర్వాత కెవ్వున కేకవేసి అతని మీద పడి గొల్టు గొల్టున రోదించసాగింది నలుగురు ఆడవాళ్ళు ఆమె పక్కన కూలబడి, గుండెలు బాదుకుని ఏడుస్తూ ఆ అమ్మాయిని ఓదార్చసాగారు

తోలేటి జగన్మోహనరావు 159 రామచం[ద్రం ఆ దృశ్యం చూడలేక బరువు గుండెలతో తడబడుతూ లేచాడు. “గువ్వల జంటలో ఓ గువ్వ ఎగిరిపోయింది..." - అతను రోడ్డు మీద నడుస్తూ

ఆలో చించసాగాడు. (క్రమంగా ఏడుపు దూరమవుతోంది - ...... అంతా తమాషాగా

జరిగి పోయిందే! జమ్మూ వెళ్ళాల్సిన నేను పరాన్‌ కోటలో దిగి, జ్యాలాదేవి వెళ్ళకుండా

, అనా లోచితంగా చంబా బస ఎందుకు ఎక్కాను? ఈ కుర్రాడు నన్ను

పలకరించడానికి ఆ సమయంల్‌ ఎందుకు వచ్చాడు? ఆ రాయి ఆ క్షణాన

కాకుండా, కొంచెం ముందూ వెనకా ఎందుకు జారిపడలేదు? ఈ కుర్రాడికి మృత్యువు అలా రాసి పెట్టి ఉందా? అంటే సృష్టిలో చేతనా చేతన వస్తువుల పుట్టుక, ఎదుగుదల, కదలిక, అంతం - అంతా కాలంలో -ముందే నిర్ణయమై ఉందా? నిర్ణయించబడిన సంఘటనలు కాలంలో వరుసగా సంభవిస్తున్నాయె కాని మనిషి

'ప్రమయం ఏవీ లేదా? కృష్ణ మూర్తిని అందరూఘోరంగా వంచించారా లేక ముందే

నిర్మయించబడిన మాంట్‌. వాడీ జీవితం అలా అంతమైైందా? అదే నిజమైతే - ఇంక

పాపమేమిటి? పుణ్యమేమిటి? కర్మ చెయ్యడమేమిటి? కరు అను భవించడమేమిటి?'

ఘాట్‌రోడ్డు మలుపు తిరిగి పైకెక్కుతున్న చోట లోయవైపు పిట్టగోడలాంటిది ఉంది. రోడ్డు ఎక్కుతున్న రామచంద్రం ఊపిరందక, ఆయాసపడుతూ, అలసటగా దానిమీద కూలబడ్డాడు.

పైన కొండల మీద కురిసిన వాన నీరు, చిన్నచిన్న జలపాతాలుగా గలగల చప్పుడు చేస్తూ కిందకి జారి, రోడ్డు మీదుగా కింద అగాధంలోకి (ప్రవహిస్తోంది. తెల్ల మేఘం ఒకటి నీలికొండల మీంచి జలపాతం ఉరికినట్టు లోయలోకి ఉరుకుతోంది. దూరాన మంచుకొండలు ఎండపడి వెండి కొండల్హా తళ తళలాడుతున్నాయి

ఇన్ని అందాలతో పాటు ఇంత దుఃఖాన్ని కూడా సర్వ శక్తిమంతుడైన భగవంతుడే సృష్టించాడా?' - ప్రకృతి అందాలు తిలకిస్తూ అనుకున్నాడు రామచంద్రం

  • “ఎ లేక వంికటన్సర్లు అన్నట్టు, ఏ నిర్లీత పధకం లేకుండా, పరిణామం

చెందుతున్న సృష్టిలో లేని లోతులు, అర్జాలు చూడడానికి ప్రయత్నించి నేను

గందరగోళ పడుతున్నానా? నాకేవీ... అర్హం.... కావడం.....లే...దు......”

రామచంద్రం విపరీతమైన ని(స్తాణతో ఒరిగి పోయాడు. చేతులాన్ఫి కూర్చుందా మని ప్రయత్నించాడు. కాని చెయ్యి కదల్బలేకపోయాడు. అతని కనురెప్పలు బరువై మూసుకుపోసాగాయి. అంత చలిలోనూ శరీరమంతా చెమటలు (క్రమ్మసాగాయి. పాదాల నుంచి చల్లదనం పైకి ఎగబాకుతున్నట్టనిపించి కాళ్ళు ఒకటి, రెండుసార్జు విదిలించాడు ఒక క్షణం వేడి అందుకున్నట్టనిపించింది. కాని (క్రమంగా చల్లదనం శరీరమంతా వ్యాపించసాగింది. కాలం అతి మెల్లిగా కదులుతున్నట్టూ, శరీరమంతా పట్టువిడి గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది అతనికి, మూసిన కల ముందు తెల్లని వెలుగు మెల్లిగా కదులుతున్నట్టు- అనిపించి దాని మీదే దృష్టి కెంద్రీకరించి చూడసాగాడు. ఆ వెలుగు అతి మెల్లిగా, దూరంగా కదలిపోతుంటే చుట్టూరా చీకటి, నిళ్ళబ్దం ఆవరించసాగ్గాయి.

“ఇదన్నమాట మృత్యువంటే... ఎంత హాయిగా, తేలిగ్గా ఉంది" అనుకున్నాడు

160 లక్ష్మీ కటాక్షం

అతను. మరికొన్నిక్షణాలలో మరణిస్తాడనగా, పూర్తిగా ఆలోచనాశక్తి కోల్పోకముందు,

రామచంద్రం మనసులో ఆఖరి (ప్రశ్న మెదిలింది - “దీనితో అంతా ముగిసిపోతుందా ( ఆంధ్రప్రభ వార పత్రిక - మార్చ్‌. 12, 1997)

విజ్లిప్తి

సా తంత్ర స్వర్ణ జయంతి సందర్భముగా, దిగువ తోక ము(ద్రలు వేసిన పంతమే గేదెలు, రెండు దున్నపోతులు, దేశమునందలి అసంఖ్యాక మూగజీవముల తరపున పౌరులకు చేయు విజ్ఞప్తి ఈ దిగువ వివరించిన కారణముల వలన ఈ విన్నపము ఎవరికి, ఎటుల జేయవలెనో అర్థము గాక ఇటుల మొదలు పెడితిమి

మేము మా భాషలో మా గోడు వినిపించగా, శ్రీ తోలేటి జగన్మోహనరావు అను లేఖకులు మానవ భాషలోనికి అనువదించడమైనది. తప్పొప్పులకు, సారాంశములోని వాస్తవ, అవాస్తవములకు, తోకము(ద్రదారులేగాని, అనువాదకుడు బాధ్యుడు గాడని స్పష్టబరచుచూ, లేఖకులు శ్రీ జగన్మోహనరావుగారిని ఈ విజ్ఞప్తి వలన ఉత్పత్తికాగల వాద వివాదముల నుంచి విడుదల చేయుచున్నాము.

ఇంద్రప్రస్ట్ర నగరములో రాజసేవలో యున్న శ్రీ తోలేటి జగన్మోహనరావు, విహార యాత్ర నెపమున పాటలీపుత్రము జేరి నొక దినమున గంగానది యొడ్డున పవ్వళించి, ..హోరోంపే నచాయీ రహితీ హై....జిస్‌ దేశ్మే గంగా బహతీ హై.... అని ఎలుగెత్తి కర్షకరోరముగా పాడుచుండ నా సమీపమున జలకాలాడుచున్న మేము, 'ఎవ్వడీ బుద్ది హీనుడు? గంగానది (ప్రవహించు దేశమున సత్యము నిరతమ్ము వెలుగుచుండునని నిస్సిగ్గుగా ఇంత యసత్యము పలుకుచున్నాడు.... అని మాలో మేము మాటలాడుకోనుచుండ, ఆయన విని ఆగ్రహము చెంది ' ఓ మహిషములారా! మీ భాష నాకు తెలియదనుకుని నోటికి వచ్చినట్టు వదరుచున్నారా?” అని రాయి విసరగా, అది దీర్చశ్చంగుడను దున్నపోతునకు

162 లక్ష్మీ కటాక్షం తగిలెను. మేము ఆ(గ్రహించి కొమ్ములతో కుమ్మివేయుటకుద్యమింప, ఆయన భయముతో లేచి పరుగెత్తసాగెను.

దీర్చ శృంగుడు మమ్ములను వారించి, 'వీన్సిక్తి పూర్వ జన్మ సంస్కారము బోక మన భాషను అర్ధము చేసుకొన గలవాడైయున్నాడు. ఈ మూర్చుని వలన మనకు కాగల కార్యమొండుయున్నది. వీనిని ఇప్పుడే బొడువరాదు' అని శ్రీ జగన్మోహనరావుతో, “మిత్రమా! మా వలన నీకు ఏ హానియు జరుగదు. నీవలన మాకు జరుగవలసిన యుపకారమొకటియున్నది యనగా ఆయన 'మీరు మహాబలశాలురు, మీకు నేనేమి సహాయము జేయగలను' అని గడ గడ వణుకుచు ఆంటిరి, క

“అన్నా! మా తరపున నీవు ఒక విన్నపము రాసి పెట్టవలె' అని దీర్చ శృంగుడు చెప్పగా తన యవసరము మాకు నిజముగా గలదని తెలిసిన వెంటనే, ఆశ్చర్యకరముగా ఊసరవిల్లి రంగు మార్చినట్టు ఆయన రంగు మార్చిరి. భీరుత్వము పోయి, రాజసేవకులకు సహజముగ నుండు దర్పాతిశయముతో, 'మికు విజ్ఞప్తి రాసి పెట్టినచో నాకేమి లాభము?” అని కాలుమీద కాలువేసుకుని, అర్థించుచున్న మా వెంపు జూడక ఎటువైపో జూచుచు, నిర్హక్ష్యముగా అడిగిరి.

దీర్చశ్చంగుడు నిట్టూర్చి, 'ఆహా! అల్పుని అవసరార్టము ఆశ్రయించినచో కన్నూ మిన్నూ "గోనడు. రాజోద్తిగము ఎటువంటివాని చూపునైనను వ(క్రబరచునో. లంచమివ్వనిచో మంచమైనను ఎక్కని రాజోద్యోగి, స్వలాభము లేక ఊరికి రవంత ఉపకారము చేయనిచ్చగించడుకదా యని చింతించి, నేస్తమా! ఎండిన పొదుగుల క్షీరము లేదు. పేడ తప్ప నీకు మరియే కానుకలివ్వగలము?' అని దిగులుగా అనెను.

'ఛీ...నన్ను పిడకలుచేసి అమ్ముకొనమందురా? అయినను, ప్రభుత్వము విదేశముల నుండి పేడ దిగుమతి చేయ సంకల్పించుచుండ, స్వదేశీ పేడ ఎవరికి కావలెను? పొండు!' అని ఈసడించిరి.

ఇక్కడ కోట్ట పశువుల పేడ యుండగా, విదేశీ పేడ ఎందులకు అని ఆశ్చర్యపోయి (ప్రశ్నించితిమి.

మంద బుద్దులారా! విదేశీ పేడ దిగుమతిజేయనివ్వనిచో విదేశీ పెట్టుబడులు భారతదేశమునకు వచ్చుటెట్టు? దేశము. పురోగమించుటెట్లు? మీకు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వీధానములు అర్హముగావు. గడ్డి మేయుట తప్ప ఆర్థిక సంస్కరణల గురించి మీకేమి తెలియును?" యని మహాజ్ఞాని వలె మమ్ములను వానబరుచుచు మాటలాడ, మా యజ్ఞానమునంగీకరించుచూ, “అన్నా! ఆ [గ్రాసము కుంభకోణమే నీ ద్వారా నలుగురికి వ్‌న్నవింపదలంచుచుంటిమి', యేని మా గోడు ఆయనకు వినిపించి, నొక విన్నపము వ్రాసి పెట్టమంటిమి

ఆయన పలు_ అభ్యంతరములు లేవదీసి తాత్సారము జేయ, మేము విసుగుజెంది, మేము జెస్పినది చెప్పినట్టు (వ్రాయక పిచ్చి పిచ్చి వేషములు వేసినచో కొమ్ములతో బొడిచి వేయుదుమనీ సవీనయముగా హెచ్చరింప,, మా హెచ్చరిక నిర్లక్ష్యము జేయ సాహసించక్క కలము, కాగితము తీసి" తనచేత వెట్టి చాకిరి

తోలేటి జగన్నోనానరావు 163 చేయించుచున్నారని నిందించుచూ, రోదించుచూ వ్రాయదొడంగిరి.

అయ్యలారా! మేము పశువులమైనను లోకజ్ఞానము లేనివారముగాము. మాలో కొందరము (గ్రామ పాఠశాలలో నివాసమేర్చరుచుకుని, భావి భారత పౌరులకు గవర్నమెంటు వారు ఉచితముగనిచ్చు విద్యాబుద్దులు నేర్చితిమి. మరికొందరము 'పైవేటు. కాలేజీ పాకలలో మసులుచూ ఉన్నత విద్యగూడ నభ్యసించితిమి. అదియునుగాక, పంచాయితీ ఆఫీసు ఆపరణలనూ, రచ్చబండ మీదను జరుగు చర్చలు, సోదర రాజకీయ నాయకుల ఉపన్యాసములు వినుచు మా విషయ పరిజ్ఞానము వృద్ది చేసుకుంటిమి.

పౌరులారా! మాకు జరిగిన ఘోర అన్యాయము గురించి మీరు ఆకాశవాణి, దూరదర్శనుల ద్యారా తెలిసికొనియేయుందురు._ వార్తాపత్రికలలో గూడ చదివియేయుందురు. చర్విత చర్వణమే అయినను, మీలో తెలియని వారు ఎవరైనను ఉండవచ్చునన్న సందేహముతో మా గోడు మరల ఈ దిగువన వివరించుచున్నాము.

కేంద్ర ప్రభుత్వము మా గ్రాసము నిమిత్తము, సాలునకు అయిదువందల కోట్ట (అక్షరాలా అయిదువందల కోట్టు) రూపాయలు రాష్ట ప్రభుత్వమునకు ఇచ్చుచున్న దనియు, రాష్ట్ర ప్రభుత్వము మరొక అయిదు వందల కోట్ట (అక్షరాలా అయిదు వందల కోట్లు) రూపాయలు ఇందునిమిత్తమై ఖర్చు పెట్టుచున్నదనియు, అనగా సాలునకు వెయ్యి కోట్ట (అక్షరాలా వెయ్యికోట్టు రూపాయలు మా గ్రాసము నిమిత్తము ప్రభుత్వము ప్రత్యక్ష ముగా గానీ, పరోక్షముగ స్వచ్ళంద సేవా సంస్టల ద్వారాగాని ఖర్చు పెట్టవలసి యుండ, ఆశ్చర్యకరముగ ఇందుల్‌ గడ్డిపరకయైనను మాకు చేరలేదనియు, ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, నోరులేని మూ నోటి దగ్గర గడ్డి తినివేసిరనియు, తమకు బాగుగా తెలిసిన విషయమే అయినను, మరియొకసారి తమ దృష్టికి తీసుకురా సాహసిం చుచుంటిమి. ఇన్ని సంవత్సరముల నుంచి ఇది ఎటుల జరుగుచున్నదో మా గేదె బుర్ర లకు అర్హమగుటలేదు.

అందువిషయమై. ప్రభుత్వ సేవలో మూడు దళాబ్దములు వెలగబెట్టిన అనుభవజ్ఞులు శ్రీ జగన్యోహనరావుగారిని యడుగగా, ఆయన తెలివి తేటలు గూడ మా లెవెలు లోనే యుండుట చేతనో, లేక ఆయన స్వయముగా రాజోద్యోగి అయియుండి, గడ్డి తినుట ఉద్యోగుల జన్మ హక్కుయని భావించుటచేతనో, ఈ విషయము స్పష్టబరచరైరి. పై పెచ్చు, ఒక (ప్రక్క వాములు వాములు మాయమగుచుండ, నాలుగు గడ్డి పరకల గురించి ఇంత గింజుకొనుచున్నారే! ఇది నలుగురి దృష్టికి తీసుకురావలసినంతటి ముఖ్య విషయమా? నా శిరము! అని విసుగుకొనిరి.

లక్షల ప్రాణముల జీవన్మరణ సమస్య నాలుగు గడ్డిపరకలగునా యని చింతించి, ఇన్ని గవర్షమెంటు రూల్సు యుండగా, ఇంత పెద్దఎత్తున, ఇంత కాలము ఈ కుంభకోణమెట్టు జరిగెను యని యడుగగా, శ్రీ జగన్మోహనరావు, 'రూల్సు అసమర్జ్హుల వీపుమీద రూళ్ళ కర్రవలె నాట్యము చేయును, సమర్జ్హులు రూల్సు నడుము విరుగగొట్టుదురు. .ఇదియును తెలియదా?” యని హేళన జేసిరి,

164 అక్ష్మీ కటాక్షం

తినుటకు. గడ్డి లేకపోయినచో మేమెట్టు పాలిత్తుము యని యడుగగా, తినుటకు గడ్డి లేకపోయినచో మంత్రులు మాత్రము ఎట్టు పాలిత్తురు? యని ఆయన ఎదురు ప్రశ్న వేసిరి.

ఓటరు మహాశయులారా! గడ్డి తినుటయే పాలించుటకు అర్హతయని మీరు భావించుచున్నచో, మా కంటె అర్హులెవరూ నుండబోరన్న సత్యము మీ అమూల్యమైన ఓటును వినియోగించు సమయమున మదిలోనుంచుకొనవలయునని కోరుచున్నాము.

కంచెయే చేను మేయుచుండ, మా విన్నపము ఎవరికి జేయవలెనాయని యోచించుచుండ, ఈ విషయము విచారించుటకు పార్లమెంటరీ కమిటీ నొకదానిని నియమింపగోరమని మేము అడుగకుండనే శ్రీ జగన్మోహనరావు యొక వెధవ సూచన జేసిరి. మేము ఎంత దున్నపోతులమైనను ఎంక్త్యయిరీ కమిటీలు ఎటుల పని చేయునో తెలియని యజ్ఞానులముగాము, (ప్రభుత్వము కోరినదే తడవుగ, ఆనందముగ కమిటీలు నియమించును. ఆ కమిటీలలోని అధికారపక్ష, ప్రతిపక్ష సభ్యులు బావమరుదుల వలె సరస సల్దాపములాడుచూ, దూషించుకొనుచూ బయటకు నడుచుచూ' లోనికి వచ్చుచ్హూ సంవత్సరముల తరబడి విచారింతురు. వాటి నివేదికలు నేలమాళిగలలోనికి బోవును. సత్యము సమాధియగును. “ఈ కమిటీలలో మాకు విశ్వాసము లేదు. మీ బోడి సలహాలు మీవద్దనే యుంచుకొనుడని' ఆయనకు గట్టిగాజెప్పి, న్యాయస్థానములకు బోదలచితిమి

శ్రీ జగన్మోహనరావు లా యనగ గాడిద యనియు, ధనముగలవారు గాడిదనెక్కి వీర విహారము సలుపుచుండ, పేదలు న్యాయమునకు మూల్యము చెల్లింప లేక స్వల్చ అపరాధములు చేసినను, నిరపరాధులయినను, కారాగారములలో నశించి పోవుదురు. అదియునుగాక లా బలవంతుల విషయములో నత్తనడక నడుచును. ఎందరో అయిదు నక్షత్రముల నేరస్తులు దశాబ్దములు గడిచినను శిక్షపడకపోగా, వివిధ పదవుల నలం కరించి, ఇంద్రభోగములననుభించుచుండుట మీ గేదె కన్నులకు కనిపించుటలేదే యని వెక్కిరించి, ముద్దిమంతులైన తనవంటి మనుషులు, వందలాది కుంభకోణములలో వేల కోట్లు నా;వా చేసిన నేరస్తులు, కొంతకాలము కారాగారము యనబడు నరి)ంగ్‌ తకిట విశ్రమించి, నిపుణుల పర్యవేక్షణలో శక్తియుక్తులు పుంజుకొని, డేు మీద మరలబడి తినుచుండుట గుర్తించి, నిర్హిప్తత వహించియుండ, మా బుద్లిహీనతకు బుజువుగా న్యాయస్థానములకు బోవు చున్నామని మందలించి, 'అయినను న్యాయము గొనుటకు మీ వద్ద వీమియున్నది' యని పరిహసించిరి.

న్యాయము గాలిలాగ, నీటిలాగ అందరికీ అందుబాటులో నుండవలసినది గాని వ్యాపార వస్తువా? యని మేము తెలబోయి, న్యాయము గొనుటయేమి?. ప్రభుత్వము పేదలకు ఉచిత న్యాయ “సహాయము. జేయును గదా?” యనగా ప్రభుత్తము పేదలకు ఉచిత వైద్య సహాయము గూడ జేయును, ఎప్పుడైనను ప్రభుత్వ ఆసుపత్రికి బోయి వచ్చితిరా యని ఆయన వెటకారముగా ధఘడీగిరి.

తోలేటి జగన్నోనానరావు 165 మాలో ప్రభుత్వ ఆసుపత్రికి బోయిన వారు కలరు కాని వారు తిరిగి వచ్చుట సంభవించలేదు. మా మౌనము చూసి ఆయన, క్యాలిటీ న్యాయము - క్వాలిటీ చదువు, కాలిటీ వైద్యము, క్వాలిటీ జీవితముల వలె ఖరీదైనదనియు, అది క్యాలిటీ మనుషులకి గాని పేడయనెడు పచ్చ బంగారము. తప్ప కాసులేనివారికి లభించ దనియు వాక్రుచ్చిరి.

ఇది యన్యాయము గాదా యనగా, ఆయన మార్కెట్‌ శక్తుల గురించి నొక గంట బోరి, ఇది యధర్మముగావచ్చును గాని యన్యాయముగాదనిరి. 'ధర్మము గానిది న్యాయ మెట్టుగును? ధర్మము న్యాయము నొకటి గావా?'యని యడుగగా, “ఒకటి గావు - నలుగురికీ మేలు చేయునది ధర్మము, న్యాయస్థానములు నిలబెట్టు నది న్యాయము' యని జెప్పిరి. అదెట్టన, కోట్ట మంది కూటికి లేక అల్లాడిపోవుచుండ, కోట్టు ఫర్ఫు పెట్టి మిన్‌ వరల్డ్‌ పోటీలు నిర్సహించుటయు, ఛార్జర్డ్‌ విమానములలో వివాహమాడీ అంత రిక్లమున హనీమూన్‌ జరుపుకొనుటయు యధర్మముగా వచ్చును గాని యన్యాయము గాదనిరి, అట్టే కూడూ నీడా లేనివారు తిరుగబడుట యధర్మముగాక పోవచ్చును గాని చట్టరీత్యా నేరమై, ఉరికంబములకు దారి తీయు నంటిరి.

మేము న్యాయము జేయవలెనని యడుగవలెనో, ధర్మము కొరకు పోరాడవలెనో మాకు యర్హమగుటలేదు. మా కండ్లకు పరిస్టితియంతయు ీతానహముగ నగు పడు చున్నది. ప్రభుత్వ యంత్రాంగము గ్రీజు వేయనిచో నడువననుచున్నది. (ప్రజా ప్రతినిధుల కంచే చేను మేయుచున్నది. న్యాయము ప్రియమై అందుబాటులో లేకున్నది. (ప్రజ మా వలె దిక్కు తోచకయున్నది. మరి మాగోడు ఆలకించువారు ఎవరు? యనగా, శ్రీ జగన్మో హనరావు రెండు చేతులు సైకెత్తి , 'వాడు' యని ఆకాశము వైపు చూపిరి.

“పరలోకము జేరిన పిదప ఎటులను వానికి విన్నవింతుము, ఇపుడు ఇహలోకము గురించి ఆలోచించుచుంటిమి' యని ఏమి చేయుటకు తోచక, తోకలెత్తి బు(ర్రలు కొట్టు కొనుచుండ, దీర్హ శృంగుడు, 'ఏ దేశమునందైనను, ఏకాలమునందైనను, మేధావులు గౌరవస్‌యుటు. వారికి మా గోడు వినిపింపుము. వారు విషయమును జక్కగ నర్జము జేసి కొనగల సమర్జ్హులైయుండి జాతికి దారిచూపుదురు, యనగా స్ట్‌ జగన్మోహనరావు, 'ఎచటకు? ఏటిలోనికా?' యని బెక బెక నవ్వి, 'దేశమున దిగుమతి యగు విలాస వస్తువులపై విదేశీ కంపెనీలు డిమాండు చేసినట్టు (ప్రభుత్వము సుంకము. తగ్గించుచుండ, దివాలా తీసిన బొక్కసము నింపుటకు మద్యపానము (్రోత్సహించవలెననియు, విద్యా వైద్యములమీది ఖర్చు తగ్గించవలయునీయు, (ప్రముఖ మేధావులు (ప్రభుత్వమునకిచ్చెడి అమూల్య సూచనలు మీ చెవులబడలేదా? అయినను, నూతన ఆర్థిక విధానములలో ఉన్నత వర్గమునకు చెందిన మేధావులకు వారి మేధకు తగ్గ మూల్యము లభించుచూ, వారి జీవితము మూడు కెంటుకీ ఫ్రైడ్‌ చికెనులు, ఆరు పెప్పీల వలె నుండ, ఎచటనో, ఎవరికో, ఏదియో అన్యాయము జరుగుచున్నదని వారెందుకు తమ అమూల్య

166 లక్ష్మీ కటాక్షం కాలమును వృధా చేసికొనెదరు?" యని విసుగుకొనిరి.

“దేశవాసులారా! దిక్కుతోచని ఇటువంటి స్టితిలో మీయందరకును ఈ విజ్ఞప్తి జేయుచుంటిమి!

ప్రజలారా! స్వాతంత్ర్యము మా_ జన్మహక్కని నినదించుచూ మీరు ఉరికంబములు ఎక్కితిరి. కారాగారములలో నశించిపోతిరి ధనమాన(ప్రాణహానులకు లెక్కజేయకు నలుగురికి మేలుజేయు నొక రామరాజ్యము రాగలదన్న ఆశతో పోరు సలిపితిరి. దగాపడిన తమ్ములారా! మీరందరూ అనేక కష్టనష్టములకోర్చి సంపాదించిన ఈ స్వాతంత్ర్యము అందరి సొత్తూనయి జనులందరూ అనుభవింపవలసియుండ, మాయోపాయము జేసి మీ త్యాగఫలము కొందరు వంచకులు చేజిక్కించుకొనిరని గుర్తించినను, నిలదీసి యడుగక, ఇటుల నిర్లిప్తత వహించుట తగునా? భారత దేశము వదలి పొండు యనుచు గర్జించి ఆంగ్ల సింహముతో కలబడి పోరాడినది దేశమును ఈ నక్కల పాలు జేయుటకేనా? యోచింపుడు.

చీమకైను, పాముకైనను హాని తలపెట్టక, సమదృష్టితో జూచు సహృదయులారా! శాంతి ప్రియులారా! దౌస్ట్రము, వంచనల ముందు తలవంచి యార్ణించిన శాంతి మరింత యశాంతికి దారీ యుననియు, అధర్మము, శాంతి, సహజీవనము జేయుట అసంభవ మనియు, అధర్మ నిర్మూలనమే సుస్టిరము, సత్యమునగు శాంతికి దారితీయుననియు గుర్తించి, స్యీందతే యాలోచన చేసి, ఈ రాజ్యమున ధర్మము నిలబెట్ట వలసినదని, సవినయముగా కొము శైలు మీ పాదములకు తాకునట్టు శిరము వంచి ప్రార్ధించు చున్నాము.

వివిధ రంగములలో అత్యున్నత స్టానములనలంకరించి, జాతి జీవనము నిర్దేశించు మేధావులారా! అధర్మము పెచ్చరిల్లి, ధర్మ దేవత కొన (ప్రాణముతో నున్న ఈ తరుణమున మీరు యధర్మ పక్షము జేరి, కాకులను గొట్టి (గ్రద్దలకు వేయు (ప్రణాళికలు రచియించుట గానీ, లేక తటస్తులుగా నుండుటగాని ్రీియస్కరము గాదు. ధర్మము నకు యధర్మమునకు సంఘర్షణ జరుగుచున్నప్పుడు తటస్తులుగ నుండు వారు నిజ ముగ తటస్తులుగారనియు, వారు యధర్మపక్షమునే యుందురనియు. నీత్తి కోవిదులు చెప్పుదురు. మరియు, ధర్మహానిజరుగునప్పుడు ఆపగల సమర్హులు ఉపేక్ష వహించినచో ఆ పాపము వారిని గూడ జుట్టుకొనుననియు, వారు గూడ 'ప్రాయళ్ళిత్తము జేయవలసి యుండుననియు, ధర్మశా(స్తములు హెచ్చరించుచుండుట మరువకుడు!

నయవినయ ్రణామాల వల్లకీలెక్కిన నహుఘలారా! మీరు పదవుల కొరకు కుక్కల వలె కొట్టాడుచూ కులమత (ప్రాంత భాషా విద్వేషములు రెచ్చగొట్టి మీ స్వార్థమునకు అసంఖ్యాక అమాయక ప్రాణములు బలిపెట్టిచూ, ఈ ఏజరిఏండ్లూ నిర్భయముగా, ఘరానా దొంగలవలె దేశమును కొల్లగొట్టితిరి, కుక్కలు చింపిన విస్తరిజేసితిరి, నాలుగు డాలరుల కొరకు అంతర్జాతీయ విపణిలో అందరి సొత్తూ అయిన ఈ స్వాతంత్ర్యమును మీయబ్బ సొమ్మువలె నిర్లజ్జగా తాకట్టు పెట్టుటకు

తోలేటి జగన్మోహనరావు 167 గూడ సందేహించకుంటిరి. తల్లినైనను తార్చుటకు వెనుదీయని తుచ్చులారా! ప్రజ మూడవ కన్ను తెరిచి లెక్కలడుగు సమయమున, మీ కావలి కుక్కలు గాని, మీ చట్టముల కవచములు గాని, ఏవియును మిమ్ములను కాపాడలేవని తెలుసుకొనుడు! ఇటువంటి. బందిపోట్ల రాజ్యములు ఎటుల ఉరితీయబడినవో చరిత్రనాకసారి తిరగవేయుడు! మీమీ బంగారు కలుగులలో, సుఖశాంతులతో, ఐళ్వర్యానందములతో విలాసముగ జీవించుచున్న లక్ష్మీపుత్రులారా! మా క్షేమము మీకెటులను బట్టునట్టు లేదు గనుక, మీ క్షేమము దృష్టలోనుంచికొనియైనను, మీ స్వపష్నలోకముల నుండి దిగివచ్చి, కాష్టమువలె కాలుచున్న దేశము నొకసారి తిలకించుడు. మేము చెప్పునది ఒడలు దగ్గరయుంచుకుని వినుడు. మీరు మసులుచున్న అయిదునక్షత్రముల స్వర్గము (క్రింద నొక యస్ని పర్వతము రగులుచున్నది. నేలకు చెవి యొగ్గి యున్న మాకు, భూగర్భ నుండి వచ్చు చున్న రణగొణధ్వనులు - రాబోవు విస్పోటనపు సంకేతములు - స్పష్టముగా వినవచ్చు చున్నవి. మూర్చులారా! ఆ అన్నిపర్వతము ఫెళ "ఫెళారావములతో "భయంకరముగా విస్సోటనము జెంది, ఆ ్రళభయజ్యాలలో మీరు శలభముల వలె మాడి నశించి పోకమునుపే మేల్కొనుడు. అది మీకును, మాకును, అందరకును క్షేమమగును. ఇది నిస్సహాయుల, బలహీనుల, ఆక్రందనగా (త్రోసిపుచ్చెడి దుస్పాహసము జేయవలదు. ఏలయన, మాకు పాలనిచ్చు పొదుగులతో పాటు, రాధర్శుము గుండెలు చీల్చగల కొమ్ములు గూడ యున్మవి 'పై ప్రయత్నములు విఫలమైనచి ఆ కొమ్ములు ఉపయోగించుటకు మేము వెనుదియమని హెచ్చరించుచూ = ఇట్లు తము విధేయులు (అసంఖ్యాక మూగజీవముల తరపున పంధామ్మిది గేదెలు, రెండు దున్నపోతులు తోకముద్రలు వేయడమైనది) గమనిక:ఈ విజ్ఞప్తి పకోడీలు పొట్టము కట్టటకే ఉపయోగపడుననియు, ఎవరును జదువరనియు, ఇదియంతయు వృధాకాలయాపనయనియు, ఎంత నచ్చజెప్పినను వినక, నన్ను బెదిరించి, తోకముద్రదారులు నా చేత బలవంతముగ (వ్రాయించితిరని చదువరులు (గ్రహింతురుగాక! వారు నా గురించి చేసిన అప్రస్తుత, అభ్యంతరకర వ్యాఖ్యలతో సహా, వారు చెప్పినది చెప్పినట్టు యధాతధముగ 'వ్రాసీతినని చదువరులు (గ్రహించి, లేఖకునకు తోకముద్రదారులు మనసులో అనుకున్న దీ, వారిలోవారు సంభా షించినదీ, ఎట్టు తెలిసినది యను చొప్పదంటు ప్రశ్నలు వయకుందురుగాక! తోలేటి జగన్మోహనరావు వ్రాలు శ్‌శగ (ఆదివారం ఆంధ్రజ్యోతి , 16 ఆగష్టు 1998)

కప్పడాలు

(ప్రే కథలన్నీ ఒకేలాగా ముగుస్తాయని నాదో థీరీ - (ప్రేమ, పెళ్ళికి దారి తీస్తే పెళ్ళయ్యాకా ఏడుస్తారు. పెళ్ళి కాకపోతే దేవదాసులై ఏడుస్తారు. ఏడుపు మాత్రం తప్పదు. మొదటి దానికి నేనూ, రెండోదానికి మూ గన్నూ ఉదాహరణ. నేను ఎందుకు, ఎలా ఏడుస్తున్నానో చెప్పను. ఎందుకంటే ఇది నా కధ కాదు గన్‌ కథ.

గన్‌ అసలుపేరు సి.యన్‌. గణేశ్‌ వాడి అమెరికన్‌ బాసులకి పలకడం

కయ. లేక ఫాస్ట్‌ గన్‌ లాంటి మనవాడి ప్రతాపం చూసో, గన్‌ అని పిలవడం మొదలుపేట్టారు. చివరకి ఆ పేరే సిరపడిపోయింది.

గన్‌ చదువంతా ఢిల్లీలోనే. అతరాాత ఐ.ఎ.యమ్‌ అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాక కేంపన్‌ సెలక్ష్‌న్‌ ఏదో ంపన్లీలో అయింది. కానీ, వేందుకనో చేరలేదు. ఈ లోగా ఎవరి పెళ్ళికో హైద్రాబాద్‌ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చూశాడు మాలతిని

  • లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. మాలతి కూడా కో అంటే ఇష్టపడింది. వాళ్ళ అసలూరు విశాఖపట్టణంట, నెల్లూరు దగ్గర ఎక్కడో 'సెటీలయ్యారట. మాలతి మనసు తెలుసుకున్న వెంటనే మరి అలస్యం చెయ్యకుండా - మూవ్‌గారికి = అంటే మాలతి నాన్నగారికి ఎటాకిచ్చి, పెళ్ళి (ప్రస్తావన తెచ్చాడు. ఆయనకీ గన్‌ నచ్చాడు.

“అంతా బాగానే ఉంద్‌. నున్న (ప్రయోజకుడివి అనిపీంచుకో, లష్టుణు అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తాను. ఎంబీయేకవుంది? ఈ రోజుల్లో ప్రతీవాడికీ ఏదో డిగ్రీ తోక నా. ఉంది. నాకు ఏ డిగ్ర్‌ లేదు. కానీ, రెండుచేతులా సంపాదిస్తున్నాను. తోకలు కాదు, ఫ్రయోణకత్యం కోవాలి" అన్నారాయన గన్‌తో.

ఆయన మాటలకి కొంచెం చిన్నబుచ్చుకున్నా, ఓ.కే. నాకు ఓ ఏడాది గడువివ్యండి..నేనేమిటో మీకు తెలుస్తుంది. అంతవరకూ" మాలతికి పెళ్ళి చెయ్యొద్దు" అన్నాడు.

తోలేటి జగన్మోహనరావు 169

“చెయ్యను 'ప్రయోజకుడివి అనిపించుకురా. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా" అని వెన్ను తట్టి పంపించేశారాయన

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చాకా ఇదంతా హుషారుగా, మైకంలో ఉండి మాట్లాడు తుని చెప్పాడు.

ఆ వెలిగిపోయే కళ్ళూ, భూన్యంలోకి ఆ చూపులూ, క్షణం ఆగకుండా ఆ అమ్మాయి గురించి కబుర్దు - ఈ జబ్బు లక్షణాలు నాకు బాగా తెలుసు.

నేను నిట్టూర్చి, 'మావగారేంజేస్తారు?" అనడిగాను.

'మావగారెవరు”

'నీ ప్రేయసి తండ్రి"

“ఆయనేం జేస్తుంటే నాకెందుకు?

“ఆమ్మాయి వెనకాల అత్తమామలు, మరదళ్ళు, బావమరుదులు, ఓ పెద్ద పటాలం టింటుంది. అమ్మాయి మెడలో తాళి కట్టగానే ఈ సైన్యం న్‌ నెత్తికెక్కుతుంది. మా మావగా। నన్ను ఎల్లా వేపించుకు తింటున్నాడో చూశావుకదా' అన్నాను, 'ఇల్లరికం' వచ్చిన మావ గు లచ్చి,

“అవునూ, ఇలా " అంట్లున్నానని ఏవనుకోకు. మీ మావ తల్కటోరా గార్జెన్సులోనూ, బిరా మందిర్‌ దగ్గరా, అందరి ముందరా చెయ్యి చాస్తూ అలా తిరుగుతున్నాడేవిటి? నువ్వు సరిగా చూసుకోవటం లేదా? తప్పు కాదూ? నీకోసం ఓ అమ్మాయిని కని, పెంచి పేద్ద చేసినాయన రుణం ఏవిస్తే తీరుతుంది, అన్నాడు గన్‌ నన్ను మందలిస్తూ.

ఇరవై నాలుగు గంటలూ టీవీ ముందు కూర్చుని, కుడి చెయ్యి చాచి రిమోట్‌ కంట్రోలుతో ఛానలు మారుస్తూ మారుస్తూ మా మావగారి చెయ్యి అలాగే బిగుసుకు పోయింది. గనం వాళ్ళు ఆయన అడుక్కుంటున్నాడని అహీర్థేం చేసుకున్నారంటే చేసుకోరా? నాకు అయిదారు వేలు చమురు వదిలాక ఆయన చెయ్యి సరి అయింది. ఈ లోగా తన చెయ్యి నయమైతే నేను గుండు కొట్టించుకుంటానని ఆయన తిరుపతి మొక్కు మొక కున్నాడు ఇప్పుడు నేను ఏడుకొండలూ నడిచి ఎక్కి, గుండు కొట్టించుకుని ఆయన రుణం తీర్చుకోవాలి...

'మా మావ సంగతి గుర్తు చేసి నా మనసు పాడుచెయ్యకు. మీ మావేం చేస్తున్నాడో అడగలేదా?”

ము నాన్హేం చేస్తాడు? ఎంత సంపాదిస్తాడు? ఎంత అస్తుంది? - ఇస్టసీ అడిగితే మూలత్‌ ఏవనుకుంటుంది? ఆయనకి కాఫీ హోటలో, బట్టల కొట్టో ఉందనుకుంటా. ఆయన కోటీశ్వరుడైనా, కానీ లేని వాడైనా నాకు అక్కర్లేదు. మాలతి మంచి మనసు, ్రైమించే హృదయం - ఆ రెండూ చాలు...” అన్నాడు మళ్ళీ మెరిసిపోయే కళ్ళతో.

(ప్రేమలో పడ్డవాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చిత్రవేవిటంటే, అలా విచిణంగా (ప్రవర్తిస్తున్న సంగతి లోకవంతకీ తెలిసినా వాళ్ళకు తెలియదు. అంచేతే కాబొలు, అనుభవజ్ఞులు (ప్రేమగుడ్డిది అంటారు. గన్‌కి ఆ అమ్మాయి పేరు తప్ప కుటుంబం గురించి ఏవీ తెలియదు. సోదరబుద్ది తక్కువ డిటీగా వాడిని నేను అర్హం చేసుకోగలను. వాడికి అమ్మాయి పేరేనా 'తెలుసు. నాకు పెళ్ళయ్యేదాకా మా ఆవిడ అసలు పేరు తెలియదు.

170 లక్ష్మీ కటాక్షం

“సుబ్బులు మొగుడే " అంది మా పెళ్ళిలో ఓ ముసిలావిడ నన్ను చూపిస్తూ,

నేను అదిరిపడ్డాను.

'సుబ్బులు మొగుణ్జీ కాను, సీతాలు మొగుణ్లోకాను - శ్రీలక్ష్మి మొగుణ్ని

'సుబ్బులంటే శ్రీలక్ష్మి అంటాడేవిటే?” - ముసీలావిడకి డొటొబ్బీ మరో'ముసిలా విడని కన్సల్టు చేసింది.

“ఇద్దరు పెళ్ళాలు కాబోలు" అంది ఆవిడ - నవలలు రాస్తుందో, టీవీ సీరియల్స్‌ చూస్తుందో తెలియదు.

క్షణంలో ఈ వార్త చిలవలు పలవలుగా పెళ్ళి పందిరి కింద పాకింది.

సుబ్బులు నీ పెళ్ళాం కాదా?' = మావగారు ఉగ్ర నరసింహులై గర్జించారు.

“కాదు

“అయితే, దీన్నేవంటావు? - మా ఆవిడని చూపిస్తూ అడిగారు.

“శ్రీలక్ష్మి అంటాను”

'వి.వియస్‌లక్ష్మి. - యస్‌ లక్ష్మి అంటే సుబ్బ లక్ష్మి”

“యస్‌ లక్ష్మి అంటే శ్రీలక్ష్మి

"కాదు, సైద్మలక్మీ

“కాదు, శ్రీల; ర

“సుబ లక్ష్మి

లక్షీ

మా వాదన అలా కొనసాగుతుండగా, 'సుబ్బలక్ష్మి పాతగా ఉందని మార్ధేన్‌

గా శ్రీలక్ష్మి అని కాలేజీలో ఫ్రెండ్స్‌ పేరుపెట్టారు" 'అనీ' సస్పెన్సు విడదీసింది వీర వెంకట సుబ్బలక్ష్మి ఉరఫ్‌ శ్రీలక్ష్మి.

'నీ విడ్డూరం బంగారం గానూ. రేప్పాద్దున్న మొగుడు పాతబడిపోయాడని స్టీలు గిన్నెలకి వేసేస్తోవుటే " అంటూ బుగ్గలు నోక్కుకు రు ఓల్టు ముత్తయిదువులు.

ప్రేమలో ఇలాంటి విడ్డూరాలు, ఇంతకంటే రాలు పెరుగుతున్నప్పుడు, మా గని మాలతి తప్ప ప్రపంచంలో ఏదీ కనిపించకపోవడంలో ఆశ్చర్యం లు. చిన్న సవరణ - మాలతి తప్ప అన్నాను కదూ, తప్పు-మాలతితో పాటు వాడి జీవితం ఫ్రవేశించి వాడి నాశనానికి కారణభూతమైన మరో భూతం ఉంది. మళ్ళీ గన్‌ కధలోకి

స్తున్నాను.

'ఇప్పుడు అర్జెంటుగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి" అన్నాడు గన్‌ స్యపులోకం లోంచి ను మ మ్‌ ల్‌ న్నా వ

క్రెఫ్పీ ప్త కంపెనీ ఇండియాలో బిజినెస్‌ మొదలు పెడుతోందట. వాళ్ళకి స్మార్ట్‌ = ఇంటెల్లిజెంట్‌, బీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కావాలిట... అన్నాను పేపరులో ప్రకటన చూపిస్తూ.

కెప్సీ ఫిలాసఫీ వేరు. వాళ్ళకి వయసు మళ్ళిన, ఎముకలు కుళ్ళిన ముసిలాళ్ళు అక్కర్రేదు. నవతరం, యువతరం, పెప్సీ తరం కావాలి. ఈ ముడి వజ్రాలని వాళ్ళు వాళ్ళకి కావలసిన విధంగా సానబకంాలీ.

మావాడు సా స్‌ ఇంటెలిజెంట్‌, డేషింగ్‌, డైనమిక్‌ - తెలుగులో చెప్పాలంటే కత్తి మౌర్యా షెరాటాన్‌ల్‌ మూడు రోజులు ఏకధాటి ఇంటర్వ్యూ తర్వాత షొండియాలో తాను చెయ్యబోయే యుద్దాలకి కెప్సీ ఈ కత్తిని ఎన్నిక చేసింది. సరివత్సరానికి ఆరు లక్షల జీతం, ఇల్గు, కారు - అమెరికాలో మూడు నేలల ట్రెయినింగ్‌.

తోలేటి జగన్మోహనరావు [71

“మాలతికి చెప్పావా?"

'లేద్రు, నువు చెప్పొద్దు ఆ సీతారామా కాఫీ పొడువాయన...."

“ఆయనెవరు?”

'మా మావగారు”

“ఆయనకి కాఫీ హోటలుందన్సావు కదా...

“కాఫీ హోటలుండనీ, కాఫీ నం అమ్ముకోనీ, నాకెందుకు? యం.బియే అంటే తోకట ...” - గన్‌ని ఆయన మాటలు ములుకుల్లా బాధిస్తున్నాయి కాబోలు - 'తోకంటే ఏవిటో అనుకుంటున్నాడు. తోకతో ఆంజనేయులు లంకని కాల్ఫేశాడు. తెలుసా?" అంటూ తోక మహత్యం వివరించి, 'మాలతికి చెప్పొద్దు. సీక్రెట్‌ గా ఉంచి సర్‌(పైజ్‌ చేద్దాం. నన్ను సెలక్ట్‌ చేశారంటే. ఇదంతా నా ప్రయోజకత్వం కాదు. మాలతిని చూసిన వేళాలేశేషం' అన్నాడు వాడు (డ్రీమీగా ఆకాశంలోకి చూస్తూ,

మూడు. నెలల (ట్రైయినింగులోనూ వాడు అమెరికా లాటిన్‌ అమెరికా యూరోప్‌ అంతా తెరిగి కెప్సీ ఎలా వ్యాపారం చేస్తుందో స్టడీ చేశాడు.

'మైగాడ్‌! లాటిన్‌ " అమెరికాలో కెప్పీ పళ్ళ తోటలు వందలూ, వేల ఎకరాలుంటాయి. అది కంపెనీ కాదు. గవర్దమీంట్లకీ గవర్నమెంటు - సూపర్‌ గవర్నమెంటు" అనెపైడు ట్రెయినింగు విశేషాలు చెబుతూ.

“ఇంతకీ నువ్వేం చెయ్యబోతున్నావు?'

'అప్పడాలు....

“అప్పడాలా?” అన్నాను నేను తెల్లబోయి.

“అప్పడాలు” అన్నాడు గన్‌ కూల్‌గా.

'మూడు నెలల సాము చేసి, మూలనున్న ముసలమ్మని కొట్టినట్టు... మూడు నెలలు అమెరికాలో (్రయినింగయి...అప్పాలా

“అప్పడాలా అని అలా దాకలా నోరు తెరవక్తు. అప్పడాలు టో-హోల్డ్‌ - కాలి బొటనవేలు ఆనడం మాత్రమే. ఒకసారి బ్రాండ్‌ పేరు పాపులరయిన తర్వాత ఒడ్రియాలు, ఉప్పు, పప్పు, ఊరగాయలు - అన్నింటిలోకి పెద్ద ఎత్తున దిగుతుంది 'తెపె..."

సి మావాడు మార్కెట్‌ సర్వ చేశాడట, ఇండియాలో అప్పడాల స్యాపారం అయిదు కోట్ల దాకా టర్శావరుంది, మరో నాలుగైదు కోట్టు విదేశాలకు ఎగుమతి అవుతుంది. పావలా పెట్టుబడి పెడితే పది రూపాయల లాభం. ప్రస్తుతం ఒకే ఒక బ్రాండు అప్పడాల రాజు గార్తి 'శ్రీగణేష్‌ ,. పెద్ద ఎత్తున నడుస్తోంది. కొద్దో గొప్పో ఎగుమతిలో కూడా ఉంది. దాన్ని దెబ్బ తీశావంటే అప్పడాల వ్యాపారంలో కెప్సీ మానాపలీ ఉంటుంది.

మావాడి ఈ ప్రపోజల్‌ విని కెప్పీ దొరగారు భుజంతట్టి, ఎంత ఇర్భయినా ఫరవా లేదు. మనం గెలవాలి, గో ఎట్‌ అని మెచ్చుకున్నారు.

నెహ్రాప్టేస్‌లో హెడ్డాఫీసు, శీ,కారుళం జిల్లాలో ఓ కుగ్రామంలో పదిహేను మంది వర్కర్లతో అధునాతన ఆటోకేటిక్‌ అప్పడాల ఫాక్టరీ. రిబ్బను కత్తిరిస్తూ ముఖ్య మంత్రిగారు కీ మన రాష్టంలో అప్పడాల ఫ్యాక్టరీ పెట్టడం తన ఉదార, సంస్కరణ వాద ఆర్షిక పాలిసేకి ఘనవిజయం నీ నొక్కి వాతం, విదేశీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నందుకు సంతోషించి, అప్పడాల

172 లక్ష్మీ కటాక్షం తయారీలోనూ, డిజైనింగ్‌లోనూ కంప్యూటర్హు విరివిగా ఉపయోగించాలని మనవి చేశారు

“ఇప్పుడు మనం_మన ఎడ్యర్టయిజ్‌మెంట్‌ కేంపేన్‌కి మాడల్సుని సెలక్టు చెయ్యాలి,” అన్నాడు గన్‌ ఓ ఫొటో 'అల్బం ఇస్తూ, |

సల సుందరీమణులకి ఒంటి మీద జేబు రుమాలంత గుడ్డ ముక్క తప్ప ఏవీ లేదు ఆ గుడ్డ ముక్క బరువు కూడా ఓపలేనట్టు అష్ట వంకర్ణు తరిగి పోయారు వౌ ॥

సస్పడాలకి, ఈ అర్ధ నగ్న సుందరీమణులకీ సంబంధం ఏమిటి?"

“అర్హ న్‌్‌ సుందరీమణులకి, కూల్‌ డ్రింకుకీ సంబంధం ఏవిటి? - ఎదురు ప్రశ్న వేసి సమాధానం చైష్టాడు గన్‌ - సంబంధం ఏవీ లేదు. ప్రకటనలో అందమైన అమ్మయి బొమ్మ సెక్సీగా కనిపించగానే, ఆహా అని నోరు తెరిచి చూసి, ఆ తర్వాత అది కూల్‌ డ్రింకా, షాంపూయా, అపుడాలా అని చూస్తాడు ఎవడైనా. అదే నీ మొహిం, నా మొహం అయితే కూల్‌ ్రంకో కోసం వచ్చిన వాడు జీవితం మీద విరక్తి పుట్టి, మంచి నీళ్ళు కూడా మానేసి ప్రాణ త్యాగం చేస్తేడు అదీ ఎడ్వర్టయిజ్‌ మెంట్‌ రహస్యం."

ఎడ్వర్జయిజ్‌మెంటు గొప్పదనం నాకూ తెలుసు. ఆడో, మగో తెలియని వాణ్ణి చూసి, ఆడా, మగా, ఇద్దరూ గుండెలు బాదుకుని మూర్చపోవడం నేనూ చూశాను. వాడికి ఓ పది ఫొటోలు ఇచ్చి, 'మిగిలిన ఫొటోలు ఉంచు. కొంచెం వివరంగా స్టడీ చెయ్యాలి," అన్నాను డ్రాయరులోకి తోస్తూ,

త్వరలోనే కప్పడాల ఎడ్వర్టయిజ్‌మెంట్‌ మొదలైంది.

“అమ్మా! అప్పడం వెయ్యి..." - ఉదయమే టీసీలో మొదలవుతుంది.

“ఊహూ... అప్పడం అనకూడదు, కప్పడం అనాలి"

“ఎందుకు?”

“ఏందుకంటే కెప్సీ వారి కప్పుడాలు వట్టి అప్పడాలు కావు. వాటిలో మన ఆరోగ్యానికి, పోషణకూ అవసరమైన ఇరవైతొమ్మిది విటమిన్లు, ముస్ఫయ్యారు మినరల్సు ఉన్నాయి..." వసాడ్‌ బల్‌ తసి ఆ కుర్రాడు క్రికెట్‌లో ఫస్టు వస్తాడు. స్కూల్లో చదువులో ఫస్టు

"మమ్మీ ! అంటాడు, మూడడుగుల వెండి కప్పు అందిస్తూ.

నాకు కాదు....దీనికి ' అంటూ కప్పడాల పేకెట్‌ క్లోజప్‌ లో చూపిస్తుంది తల్లి,

ఆ తర్షాత రబ్బరు బొమ్మలాంటి తల్లి, దున్నపోతులాంటి తండ్రి, పుట్‌టోల్‌ లాంటి కుర్రాడు నవ్వుతూ, తుళ్ళితూ ఫ్రేమ్‌లో కన్‌పిస్తారు.. 'తెలివైన పెళ్ళాలు/ తల్టులు తమ మొగుళ్ళికి/పిల్లలకి కప్పడాలే ఎంచుకుంటారు' అని వినిపిస్తుందీ.

దీనికి కాంట్రాస్టుగా మరో ఎడ్న్వర్టయిజ్‌మెంట్‌....

కుర్రాడు తీవ్ర గ్నరంతో మగతగా పడి ఉంటాడు. ధర్మామీటరులో పాదరసం జంయిన పరిగెడుతుంది. డాక్టర్‌ పెదవి విరిచి, నిట్టూర్చి, బేగ్‌ టీుకు వెళ్ళి పోతుంటే, 'డాక్టర్‌...బాబుకేమైంది?' అంటూ తల్లి ఆత్రంగా అడుగుతుంది.

పుడ్‌ పాయిజనింగ్‌ అయింది. కు(ర్రాడు ఏం తిన్నాడు" అని అడుగుతుంటే, శ్రీ, గణేష్‌ అప్పడాల పేకెట్‌ టేబుల్‌ మీద అస్పష్టంగా కనిపిస్తుంది

తోలేటి జగన్మోహనరావు [73

“కొంపతీసి .'

“అవును డాక్టర్‌ .పాంబారులో అపడాలు...”

“చేతితో చేసన అపుడాలలో లక రకాలైన హానికారక ్రిములుంటాయి. కలరా, టీబీ, టైఫాయిడ్‌, న్‌ లాంటి భయంకరమైన వ్యాధులు కలుగజేస్తాయి. అందుకే తెలివైన తల్లులు మషిను మీద తయారయ్యే కెప్సీ వారి కప్పడాలే తమ పెల్లలకి ఎంచుకుంటారు" అని డాక్టర్‌ అక్బరిస్తుంటీగా. ధర్మామీటరు రప్పున పేలిపోతుంది, దీపం ఆరిపోతుంది, కుర్రాడు మెడవాల్ఫేస్తాడు, తల్లి గొల్దుమంటుంది. డాక్టర్‌ 'కెప్పీ వారి కపడాలు తింటే ఈ కుర్రాడి ప్రాణాలు నిలిచేవి అనీ కళ్ల జోడు తీసి క్టోజప్‌ లో ఏడుస్తాడు.

అలా ప్రారంభమైన. కషడాల పర్ధం త్త్తరలోనే జోరు అందుకుంది. ఇండియా, టింబక్తూ [కికెట్‌ కవీ స్సొన్స చేసింది కే గ

ఓవర్‌కే, ఏవక్‌ | మధ లో అజార్‌: కప్పడర్‌ ఖాయేంగే' అంటూ సచిన్‌, 'చలో సచిన్‌ 'అంటూ అజాగేద్దీన్‌ - ఇదరూ వంద ఓవర్లలో నూ వందసార్జు బేట్టు విసిరేసి కప్పడాల మీద కెగబడతారు. (మొచ్‌ అయే (నృత కప్పడాల సెంచరీలు కొట్టి అజారుద్దీన్‌ రెండు పరుగులతోనూ, సచిన్‌ తీన్‌ అత్యధిక పరుగులు - తొమ్మిది పరుగులు తీసి కొటయ్యారు)

క్రికెట్‌ పొటీలే కాదు, అందాల పోటీలే కాదు...

స్టాకిస్టులకి కార్టూ, మోటారు సైకిళ్ళూ, బహుమతులు...

లక్కీ విజీతలకి కీలోల బంగారం, డిస్న యాత్ర, సినిమా స్టార్లతో ఇంటర్వ్యూలు, డిన్సర్లూ...

గ స్కూల్లో పిల్లలకి ఉచితంగా కప్పడాల పాకెట్లతో పాటు మెడోనా, మైఖేల్‌ జాక్సన్‌ల ఫాటోలు....కేపర్లకి బదులు అర్హన్‌గ్న సుందరీమణుల చిత్రాలు అది వట్టి ప్రచారం కాదు, మనుషుల్ని కాగితముకలా గాలిలోకి విసిరేసే సుడిగాలి. అడ్డం వచ్చిన దాన్నల్హా ముంచేసే ఉప్పెన... టైపూ, -టార్టడ హరికేన్‌ ..అప్పడాల భక ఊపిరి పీల్చుకునే వ్యవధి లేకుండా, నిలిచి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా. టీవీ, రేడియో, సినిమా, పత్రికల్లో... ఇరవై నాలుగు గంటలూ ప్రకటనల హోరు....

ఏ. ఫర్‌ ఏపిల్‌

బి.....ఫర్‌ బాల్‌.

కె.....ఫర్‌ కప్పడం. నర్సరీ పిల్లలు పాడసాగారు. చే ఏడాది తింగేటప్పటికి తెలుగు భాషలో అప్పడం పదం మాయమై కప్పడం

రింది.

ఈ (ప్రచార యుద్దం ఇలా కొనసాగుతుండగా, హిందూ దేవుళ్ళని అప్పడాలు అమ్ముకోడానికి ఉపయోగించి అవమానిస్తున్నారనీ, వెంటనే శ్రీ గణేష్‌ బ్రాండున ఆపు చెయ్యాలనీ మహారాష్ట్ర నుంచి ఓ శాస్త్రి గారు కోర్టులో కేసు వెశారు. గణేష్‌ బొమ్మా, పేరూ వాడకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పడాల ర్రాహి గారు అతి కష్టం మీద స్ట వెకేట్‌ చేయించారు. ఈ లహాడేలసో అప్పడొల పుడ్‌ పాయిజనింగ్‌ కేసు... ఆకేసు చూపించి అన్ని దేశాలూ ఇండియా నుంచి అప్పడాల దిగుమతులు నిషేధించాయి. దీనంతటికి వెనకాల కెప్సీ హాండుందని వేరే చెప్పక్కర్లేదు.

174 లక్ష్మీ కటాక్షం

హిట్టర్‌ పోలెండు మీద బ్లిట్ట్‌ క్రీగ్‌ చేసినట్టు, కెప్పీ అప్పుడాల రాజుగారి మీద మెరుపు దాడి చేసేటప్పటికి ఆయనకేం పాలుపోలేదు... విసలు యుద్దం ఎలా 'ప్రారంభమైనదీ, ఎలా జరుగుత్తున్నదీ ఆయనకు అంతు చిక్కలేదు. ఆయన కెప్సీ దెబ్బతో అదిరి ప్రచార రంగంలోకి దిగారు కానీ, సముద్రాల పడీరులో కూనిరాగంలా ఆ గొంతుక ఎవరికీ వినిపించలేదు ఆ ఖర్చులు తట్టుకోలేక కాబోలు - చివరికి అదీ ఆగిపోయింది.

యుద్దం ఎంత హరాత్తుగా ఆరంభమయిందో అంత హరాత్తుగానూ ముగిసింది. అప్పడాల అమ్మకాలు పడిపోవడంతో శ్రీగణేష్‌ తెల్ల జెండా ఎత్తేసింది. అప్పడాల రాజుగారు మొహరి చూపించలేక తన తరపున సంప్రదొంపులు జరపడానికి వకీము నటరాజన్‌ అయ్యర్‌ గారిని ఢిల్లీ పంపారు. కెప్సీ సుప్రసిద్ద న్వాయవాది టోపీవాలాని తమ వకీలుగా నియమించింది. ఆయన గంటికు యాభ్జేవేలు సున టాప్‌క్టాస్‌ లాయరు. నటరాజన్‌ అయ్యరు గారు ఆయన ముందు నిలబడ్డానికే భయపడ్డారు.

క్స్‌ విధించిన షరతులన్నీ అంగీకరించి, అప్పడాల రాజుగారు కెప్పీ దొరగారి కాళ్ళ ముందు తన కిరీటం పెట్టి ఆయన దయతో ఇచ్చిన భరణం తీసుకుని రాజ్యం అప్పజెప్పేశారు శ్రీగణేష్‌ బ్రాండు మూతబడింది. మొదటి సంవత్సరం అయిదు కోట్టు నష్టం వచ్చింది కెప్సీ కంపెనీకి. అయితేనేం? అప్పడాల మర్ల ఎనభైశాతం. కప్పుడాల పరమై పోయింది. కెప్సీ (బ్రాండు పేరు ప్రతీ నాం నానుతోంది. 'శహబాష్‌ అని గన్‌ భుజం తట్టి జీతరి రెట్టింపు చేశారు. మొదట మార్కెట్‌ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. లాభాలు అవే వస్తాయని కెప్సీకి తెలుసు

ఈ అప్పడాల యుద్దంలో ఎంత మునిగిపోయినా, గన్‌ మాలతిని మరిచిపోలేదు. కలవడం వీలు పడకపోయినా, అప్పుడప్పుడు మాలతితో ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడు.

గడువు ముగుస్తోండగా ఓ రోజు మాలతి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది - నాన్నగారి ఆరోగ్యం బాగోడం లేదు. నువ్వు ఒకసారి వస్తే మంచిదేమో" అంది దిగులుగా.

ఈ విషయం నాకు చెప్ప, “ఈ మధ్య నాలుగైదు నెలల నుంచి మాలతి దిగులుగా ఉన్నట్టు అనిపిస్తోంది ఎంత అటీగినా కారణం చెప్పలేదు. బహుశా ఇందుకేమో. మనం వెళ్ళాలి" అన్నాడు గన్‌ ఆందోళనగా

'మనం?

నవ్యా నేనూ - నీకంటే ఆస్తలెవరున్నారు. పెళ్ళి విషయం మాట్టాడటానికి.”

“పెళ్ళి బషయం మాట్టాడటానికి ఇది రాంగ్‌ టబైమేమోా?”

“రాంగ్‌ టైమ్‌ ఏమిటి? రైట్‌ టైమే. ఆయన పోతే ఎవరితో మాట్లాడతాం?” - మూ వాడు అంతా లాబికల్‌గా ఆలోచిపాడు. ౯

సరే, పది ల్‌

మాలతి వాళ్ళ ఇల్లు పాతకాలం బంగ్లా. ముందు విశాలమైన ఆవరణ అంతా నిళ్ళబ్దంగా ఉంది.

మేం లోపలికి వెళ్ళ బోతుంటే లోపలినుంచి డాక్టరుగారు, ఆయన ఫెట్టె పట్టుకుని ఒక నౌకరు, అతని వెనకాల మాలతి వచ్చారు.

తోలేటి జగన్మోహనరావు [75

“వచ్చావా?' అంది మాలతి గన్‌ని చూసి. ఆ అమ్మాయి మొహంలో ఉత్సాహం లేదు. కొండంత బరువు మోస్తున్న దానిలా కృంగిపోయి ఉంది.

“ఎలా ఉంది నాన్నగారికి?"

'బీపీ ఎక్కువగా ఉంది. పద, మేడమీద గదిలో ఉన్నారు”

మేడ మీద గదిలో పాత కాలపు పందిరి మంచం మీద పడుకుని ఉన్నారు ఆయన. మంచం వెనకాల, గాంధీ గారు రాట్నం వడుకుతున్న నిలువెత్తు పెయింటింగ్‌ గోడకి వేళ్ళాడుతోంది. దగ్గరకు వెళ్ళి, మెల్లిగా లేప, చెవిలో ఏదో చెప్పింది మాలతి.

'నల్లగా నిగనిగలాడుతూ చీంబోతులా ఉండేవాడు ఎలా చిక్కిపోయాడో' అన్నాడు గన్‌ దిగులుగా.

'ష.. ఇలాంటి సమయాల్లో అలాంటి భాష వాడకూడదు.”

'నిజం మొదట చూసినప్పుడు. .

' ష్‌..."

ఆయన గన్‌ ని దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపారు. వాడు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయను వాడి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, చూడు నాయనా! ఈ ఇల్టూ నౌకర్లూ చాకర్లూ చూసి నువ్వ నాకేదో బాగా అస్తి ఉందనుకోవచ్చు. ఒకసుడుండే. సిరి వచ్చినప్పుడు కోబ్బరి కాయలో నీళ్ళలా వస్తుందంటారు. అలాగె వచ్చింది. కరిమింగిన ఎలగపండులా చూస్తుండగానే అలాగే హరించుకుపోయింది. ఇల్టు కూడా తాకట్టులో ఉంది. ఉన్న య్‌ కూతురి వీ వైభవంగా చేద్దామనుకున్నాను. కానీ... ' - ఆయన గొంతు మూగబోయింది. మాల కళ్ళు తుడుచుకుంది. -'... నేనెప్పుడూ తెలిసి ఎవర్నీ మోసం చెయ్యలేదు. అసత్యం చెప్పలేదు. ఇప్పుడు నీకూ అసత్యం చెప్ప లేను. నేను.....నేను.... ఈ రోజు ఏవీ లేనివాణ్ణే ...”

అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

'మాలతిని నేను పెళ్ళాడుతానన్నప్పుడు మీ ఆస్తి పాస్తుల గురించి ఆలోచించ లేదు. ఇప్పుడూ ఆలోచించడం లేదు. నాకు కావలసింది మాలతి, ఆస్తి కాదు. దేవుడి దయవల్ల నాకే లోటూ లేదు. నేను.....'

మావగారు అల్సుడి మాటకు అడ్డు వస్తూ ' అంతకన్నా ఏం కావాలి? నా కూతురు అద్భస్థ వంతురాలు,” అన్నారు ఆనందంగా. మాలతి ఆరాధనగా చూసింది.

అంతా తెలిగా నిట్లూర్తారు.

(త

కథ సుఖాంతం కాటీతోంది.

“సార్‌! వడ్డిస్తునా?' అన్నాడు నరు హుషారుగా.

“పదండి, ఇవాళ అంతా కలిసే భోంచేద్దాం' అన్నారు మావగారు లేస్తూ,

'మీరిక్కడే భోంచేయ్యండి. కదలొద్దు అని అల్జుడు అభిమానంతో ఎంత వారిస్తున్నా వినక ఆయన కూడా మెట్టు దిన్‌ డైనింగ్‌ హాల్లోకి నడిచి వచ్చారు.

'నాకు బుధవారం - ఇవాళ నేను భోం చేయ్యను' అన్నాను నేను.

“అదేవిటి? శుక్రవారాలు, శనివారాలు విన్నాను వ్చై బుధనారం భోం చెయ్యకపోవడవేవిటి' అన్నారు మావగారు.

బుధవారం నా పెళ్ళయిన రోజు ప్రతీ బుధవారం భోంచెయ్యను మళ్ళీ

176 లక్ష్మీ కటాక్షం జన్మలోనైనా బుద్ది రావాలని వ్రతం ఉంటాను. అదంతా ఆయనకి చెప్పడం ఇష్టం లేక్‌'అదో సెంట్‌మంటు' అన్నాను.

'తవరికి ఇడ్లీ తెస్తునా? ' అన్నాడు అయ్యరు.

“తీసుకురా, సాంబారొద్దు. షా చే తీసుకురా"

అయ్యరు వడ్డించే ప్రయత్నంలో లోపలికి వెళ్ళాడు. మామా అల్టుల్లిదరూ నన్‌ మరిచిపోయి కబుర్హు చెప్పుకుంటుంటే, సిగరెట్‌ కాల్చుకోవాలన్న నెపంతో డైనిం హాల్లోంచి ముందు హాలులోకి వచ్చి, సిగరెట్‌ అంటిస్తుంటే, 'బాబుగారి మొహంలో సాన్నాళ్ళ తరత ను చూశాను." అన్న మాటలు వినిపించి వెనక్కు తిరిగాను,

వాత సిసిమాల్టో జమీందారుగారి నొకరు పాత్రలో ఏ పెరుమాళ్ళు గారినో మీరు చూసే ఉంటారు. విశ్వాస పాత్రుడైన పెరుమాళ్ళు గారికి ఇల్లూదాకిలీ, పెళ్ళాం పిల్లలూ, కష్టాలు, సుఖాలూ ఉంటాయో, ఉండవో తెలియదు కానీ, జమీందారు గారింట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, రాత్రీ పగలూ, పైటవలుతో కళ్ళొత్తుకుంటోనే ఉంటాడు.

అలా పై టవలుతో అనంద బాష్పాలు ఒత్తుకుంటున్న అతని భుజం మీద చెయ్యేసి, 'ఏవిటి పెరుమాళ్ళూ ' అన్నాను.

"బాబుగారికి నా పేరెలా తెలుసు? "

'ఊహించానులే కాన్సీ, అయ్యగారికేం అనారోగ్యం ?

'మనోవ్యాది బాబూ. రాయిలాంటోడు. ఆయనకి రోగవేంటి? రాత్రీ పగలూ మరలా తిరిగేవాడు. ఆయన పేరు సెప్పుకుని అయిదారు వేలమంది కూడు తింటుం డేవోరు. ఆయన కూలిపోయాడు. ఆళ్ళ నోట్లో మన్నడ్డాది' - పెరుమాళ్ళు కళ్ళొత్తు కున్నాడు,

'ఏవైంది పెరుమాళ్ళూ?'

'ఏవైందంటే ఏం జెప్పేది బాబూ! ఎదవ లోకం. ఎదవ మనుషులు. ధూ..." అని ఉమ్మేసి, 'దరమ ప్రబువులు' అన్నాడు అయ్యగారు గుర్తుకొచ్చి కళ్ళొత్తుకుంటూ.

'ధర్మాత్ములకి అన్యాయం చేసే దుర్మార్గులెవరుంటారు పెరుమాళ్ళూ?

'దరమరాజుకి దుర్యోదనుడు లేడా? రోవుడికి రావణాసురుడు లేడా? అక్కడ సివరికి దర్శం గెలిసింది. ఇక్కడ అదర్మం గెలిసింది. అదీ తేడా."

“పెరుమాళ్ళూ ...."

“ముసుగులో గుద్దులాట మాని అసలు విషయం సూటిగా కుండ బద్దలు కొట్టి నట్టు చెప్పు - పెరుమాళ్ళు రెండు చేతులూ పట్టుకున్నాను.

ష్య్రవాళ ఆగిపోయాడు - 'తవరలా సేతులట్టుకుంటే నా నోరు పెగల్టు'

“చేతులొదిలేస్తా కానీ, మాట్లాడ్డం మానకు”

పెరుమాళ్ళు చెప్పేది వింటుంటే కుండ పగిలినట్టు కాదు, బాంబు పేలినట్టయింది. 'అయోో” అని మూలిగి ఎగిరి గంతేశాను.

నంటి బాబూ? తేలు కుట్టినట్టు అలా తెంయిమంతన్నారు? "

'ఒక తేలు కాదు, అరడజను తేళ్ళూ, డజను మండ్రీగబ్బలూ ... ' అంటూ డైనింగ్‌ హాల్లోకి పరిగెట్టాను

నేను అడుగు పెట్టేసరికి డైనింగ్‌ హాల్‌ నవ్వులతో కళకళలాడుతోంది.

తోలేటి జగన్మోహనరావు 177 మావగారు, పక్కన మాలతి, ఎదురుగా గన్‌ - గన్‌ ఏదో జోక్‌ పేల్చినట్టున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు.

దీన్నే కాబోలు వేదాంతులు 'క్షణికానందం' అంటారు. ఆకాశంలోకి తేలిపోతున్న ఈ ఆనందపు బుడగను సూదిపుచ్చుకు గుచ్చేసి రప్పున పేల్ళెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు దేవుడు. ఆయన లీలలు తెలుసుకోవడం ఎవరి తరం?

నేను డ్జైనింగ్‌ హాల్లోకి అడుగుపెడుతుంటే,- మరో పక్కనుంచి వెండి బకెట్టుతో సాంబారు. తీసుకొస్తూ అయ్యరు, అతని పక్కనే పెద్ద పళ్ళెంలో అప్పడాలతో బాలమురుగన్‌ లాంటి బుల్లి ఆయ్యరు ప్రత్యక్షమయ్యారు.

ఎ(ర్రగుడ్డ చూసి ఆంబోతు. బెదిరినట్టు, అప్పడాల పళ్ళెం చూస్తూనే గన్‌ అదిరిపడ్డాడు, - 'అప్పడాలా?"

“అప్పడాలు -ఏం?” అన్నారు మావగారు అల్టుడి బాధ అర్హం కాక,

మ్‌ర్లీ మీరు అప్పడాలు తింటారా - ' మావగారి అనారోగ్య రహస బోధపడి విచారంగా తలూహేడు గన్‌ - 'అప్పడాలు తింటే కలరా, ఫాయిక్‌ జాండీస్‌ కేన్‌ ఎయిడ్స్‌...

“ఎయిడ్డా?”

ఎయిడ్స్‌ కూడా ... అంచేతే తెలివైన తల్టులు/ పెళ్ళాలు తమ పిల్లలకి/ మొగుళ్ళకి కెప్స వారి కప్పడాలే ఎంచుకుంటారు" మాలతి కేసి నవ్వుతూ చూస్తూ ప్రకటన కొంచెం అశువుగా పొడిగించాడు... “తెలివైన కూతుళ్ళు తంగడ్రులకి కూడా...."

మాలతి మొహం చిట్టించింది - “ఎవరు చెప్పారు నీకు?',

“ఒకళ్ళు చెప్తేదేమి? మేమే అందరికీ చెబుతాం. మాలతీ, నాగురించి ఇంతవరకూ" చెప్పకీదు కదూ. సర్‌్రైజ్‌ చేద్దావని సస్పెన్స్‌ లో ఉంచాను. కెప్పీ ఇండియాకి నేను ఫైన.

'గ...న్‌...* - నేను కంగారుగా వాడికి ఫిర్హసథిను,

గన్‌ నా మాట వినిపించుకునే స్టితిలో లెడు. ఎన్నాత్గనుంచో అణచి పెట్టిన ఉత్సాహం సోడా బుడ్డిలోంచి సోడా తన్నకాల్ళినట్టు తన్నుక్‌ స్తోంది.

'ష్‌ * అని నానోరు మూసి, మాలతి కసే తిరిగి, 'మాలతి, వ గురించి నీకు తెలుసా! కెప్సీ దొరగారు చిటికెనవేలు కదిపితే గవర్థమైంట్యు కూలిపోతాయి. రాత్రికి రాత్రి కొత్త గవర్నమెంట్లు లేస్తాయి. అలాంటి కంపెనకి అప్పడాల రాజులు, ఒడియాల జమీందారులూ ఒక లెక్కా? ఉఫ్‌మని ఊదానంతే..... అప్పడాల రాజుగారి టోపేరం రప్పున లేచిపోయింది. .. ఫినిష్‌..హ్హ.హ్హ...హ్హ...”

అల్లుడు అలా మాట్టాడుతురిటే మావగారికి బీపీ రెండొందలకి పెరిగింది కాబోలు. ఆవేశంతో నోరు 'పెగలక మలేరియా జ్వరం వచ్చినవాడిలా కుర్చీతో సహా గజగజ వణకసాగారు. అలా వణక్తి వణకి, చివరకు తనను తాను అదుపులోకి తెచ్చుకుని గర్జించారు - “మీర్‌ జాఫర్‌...

గన్‌ ది మన హైటెక్‌ ముఖ్యమంత్రి గారి పాలిసీ. చరిత్ర, సాహిత్యం లాంటివి శుద్ద వేష్టనీ, అవి చదవడం వేల్ల నష్టవే కాని లాభం లేదనీ 'వాడి నమ్మకం. ఈ;స్తిండియా కంపెనీ ఇండియాని 'మీంగేయడంలో మీర్‌ జాఫర్‌ పాత్ర గురించి వాడు వినలేదు.

'మీర్‌ జాఫర్‌?” అన్నాడు మావగారి కేసి తిరిగి అర్హంకాక.

178 లక్ష్మీ కటాక్షం

'జయచంద్‌'

'జయచంద్‌”

గన్‌ చెవిలో మెల్లగా చెప్పాను - 'జయచంద్‌....సంయుక్త తండ్రి. .పృర్వీరాజ్‌ మావగారు.... "

“అయితే, ఆయన జయచంద్‌, నేను పృధ్వీరాజ్‌ అవ్వాలి కదా...” = గన్‌కి చిన్నప్పుడు చదివిన కథ గుర్తుకొచ్చినట్టుంది-" ?... ఇప్పుడు నేను సంయుక్తని గు(ర్రవేక్కించుకు పారిపోవాలా?

సంయుక్త పృధ్వీరాజ్‌తో లేచిపోవడానికి సిద్దంగా లేదు. కాలుతున్న కాగడాలా లేచి నిలబడి బాంటీ పేలినట్టు పేలింది.- గెటౌట్‌. ..'

మాలతి అలా అనగానే గన్‌ స్టన్నయిపోయి పిచ్చిచూపులు చూడసాగాడు.

ఒక పక్క అయ్యరుగారు వేడివేడి సాంబార్‌ నెత్తి మీద ఒంపెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో పక్క బుల్లి అయ్యరు అప్పడాల పళ్ళిం విష్తుచక్రంలా గిరగిర తిప్పు తున్నాడు. శత్రు కదలికల్ని ఓరకంట గమనిస్తున్న నేను, భుజం మీద బుసకొడుతున్నట్టు వెళ్ళగా గాలి తగిలితే, ఉలిక్కి పడి వెనక్కు తిరిగాను.

“బాబూ, నాకు కోపం వస్తే మనిసిని కాను. మర్యాదగా ఎల్లిపోండి....”

పెరుమాళ్ళు ఛెస్సు పొంగించి ఆవేశంతో రొప్పుతున్నడు అతని పక్కన తోటమాలి గునపంతోనూ, పనిమనిషి చీపురుతోనూ "నిలబడీ ఉన్నారు. క్షణంలో చుట్టు పక్కల ఆడాళ్ళు నలుగురైదుగురు అప్పడాల కర్రలు, గరిటెలు, చేటలు - ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధం తీసుకు వచ్చిశారు.

మరింక ఆలస్యం చెయకుండా, నమసే్కేర బాణాలు వదులుతూ, శత్రు సైన్యం మధ్యనుంచి గన్‌ని కార్వే దగ్గరకి ఈడ్భుకొచ్చాను. అప్పటికి తేరుకున్నాడు వాడు- 'ఏవైంది? నేనేవైనా తప్పు మాట్ట్లాడానా? వాళ్ళకి పెచ్చెక్కిందా?”

'ఏవైతేనం? మాలతిని మర్చిపో

మర్మిసోనా? చం(ద్రబింబం లాంటి, కప్పడం లాంటి ఆ ముఖం మర్చిపోనా?” ఆ ఎ|(రగా కాలేసిన అట్టకాడతో వాత పెట్టినట్లు కొవ్వుమన్నాడు.

'విధి లిఖతం"= మన చేతుల్లో ఏవీ లేదు”

“మాలతి ..నన్ను ...కుక్కని..” తరిమేసినట్టు ... అలా.... తరిమేసిందేవిటి?' - వాడి కళ్ళల్లో నీళ్ళు తీరిగాయి.

చేదు నిజం వాడికి చెప్పక తప్పుదు. మెల్లగా (ప్రారంభించాను.

“ మీ మావగారికి బట్లలి కొట్ల కాఫీ పజల

శ థ్‌ క్త ల్య ల్ల 1

-౧సతారామా కాఫీ పొడుం కొట్టో....

'కాఫీ పొడుం కొట్లో .. ఏదో ఉందన్నావు కదా'

“.. ఆ లుంగ్‌, ఆ పొట్టా ... ఆ మాటలు...యంబియే అంటే లోకట న గల్హాపెట్టై దగ్గర చిల్లర లెక్కెట్లుకునేవాడిలా ఆ మొహం చూసి అలా అన్నాను, కా ఆయెనేం చేస్తాడో సాకు తేలియేదు.. ఖ్‌

నేను నిట్టూర్గాను - 'ప్రేయసి వెనకాల" ఓ పటాలం ఉంటుందిరా - వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా?

'దానికీ . దీనికీ సంబంధం ఏవిటి?”

“దానికీ, దీనికీ సంబంధం ఏవిటంటోే.....' - ఎందుకైనా మంచిదని వాటర్‌ బాటిల్‌

తోలేటి జగన్నోనానరావు 170 అందుకున్నాను *.. నువ్వు మట్టి కరిపించిన అప్పుడాల రాజుగారే నీ మావగారు..." న్యూ ' అన్న కేక్‌ వెంటనే ద్రఘ్బామని శబ్దం వినిపించింది. నేను నిట్టూర్చి వాటర్‌ బాటిల్‌లో నెళ్ళు చల్లసాగాను. (ఇండియా టుడే, జనవరి 9, 2001)

చెం చిలకమ్మ కళ్ళు తెరిచి రెక్కలు ఒక్కసారి తప తపలాడించి, న్నా ( స గ్ర గ్రా ం ఆకాశంలోకి లేచి, సముద్రం అంచుదాకా వ్యాపించి ఉదయపు టెండలో ఆకుపచ్చటి తివాసీలా మెరుస్తున్న అడవి మీద ఎగురుతూ, ఎగురుతూ ఓ మరి చెట్ట కొమ్మ మీద వాలింది. మర్రి చెట్టుకు వంద గజాల దూరంలో వాగు ఒకటి గల గల పారుతూ సంగీతం పాడుతోంది. ఆ సంగీతం వింటూ, 'ఏరా తిమ్మన్నా, బాగున్నావా?" అని తిమ్మణ్ణి పలకరించింది చిన్నారి,

"ఓ అన్నాడు సమాధానంగా - చిటారు కొమ్మల్లో /, కొమ్మ మీంచి కొమ్మ మీదకు దూకుతూ కిచకిచలాడుతున తిమ్మన్న . తెల్లారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా వాడికి కాలు ఒక చోపే నిలవదు. అంతకు ముందు వారం రోజులు ఏకధాటిగా, కుండపోతగా వానకురిసి ఆ ఉదయమే పూర్తిగా తగ్గింది. ఈ వారం రోజులూ కాళ్ళూ చేతులూ కట్టేసినట్టు పడున్న తిమ్మడికి ఇవ్వాళ మళ్ళీ ఆడుకోడానికి వీలు చిక్కింది. అలా కొమ్మలు పట్టుకు ఊగుతూ ఆడుతున్న వాడి చూపు దిగువ వాగులో, వెండి కోడి గుద్డులా తళ తళలాడుతున్న వస్తువు మీద పడింది. నిన్నటి దాకా వాగు పొంగి నిండుగా (ప్రవహించింది. వాన తగ్గాక ఇప్పుడు వాగు లోపల పలచగా నీరు ప్రవహిస్తోంది. ఆ నీటిలో మునిగీ మునగకుండా ఉంది ఆ వస్తువు.

తిమ్మన్న కొమ్మల మీంచి ఊగుతూ వెళ్ళి వాగు గట్టు మీదికి దూకి, కిందకు = వంగి చూశాడు. 'ఇది ఇక్కడ ఇంతకు ముందు లేదే, ఎక్కడనుంచి వచ్చిందబ్బా' అని కొంచెం సేపు బుర్ర గోక్కుని ఆలోచించాడు. వందల సంవత్సరాల నుంచి భూగర్భంలో ఉన్న ఆ వస్తువు, వారం రోజులు కురిసిన వానకి పైన కప్పిన మట్టి కొట్టుకు పోయి కొద్దిగా బయట పడింది. వాన నీరు దాని మీదుగా గల గల చప్పుడు

తోలేటి జగన్నోవనరావు 181 చేస్తూ దిగువకు (ప్రవహిస్తోంది.

వాడు కాసేపు అలా నోరు తెరిచి చూసి, అదేవిటో తెలుసుకోవాలన్న ఆసక్తితో గట్టు మీంచి దాని మీదకు దూకగానే పెద్ద ధ్వనితో అది పేలింది.

వొడి కోతి చేష్టలు నన్మ్యతూ చూస్తున్న చిన్నారి నిర్చాంతపోయింది. ఏం జరిగిందో అర్హం కాక అది కీచు కీచుమని అరుస్తూ అటూ ఇటూ గాబరాగా ఎగిరింది. ఆ పేలుడు శబ్దం వినగానే చెట్ల మీద పక్షులన్నీ ఒక్కసారి గోలగా ఆకాశం లోకి లేచాయి. మృత్యుభయంతో అడవిలోని జంతువులన్నీ 'మనిషి ... మనిషి అని అరుస్తూ అటూ ఇటూ పరుగులు తియ్యసాగాయి.

ఆ మాట వినడం అదే మొదటి సారి చిన్నారికి.

ఆ మనిషి ఎవరో, అదంటే అంత భయం ఎందుకో దానికి అర్హం కాలేదు. కానీ, ఆ భయం దానిని కూడా ఆవహించింది. రివ్వున బాణంలా ఎగిరి, రావి చెట్టు తొర్రలో గూడు చేరుకుని, ఆత్రంగా తనకోసం ఎదురు చూస్తున్న అమ్మ పక్కన వాలి, ' అమ్మా! మనిషంటే ఏవిటి? అనడిగింది.

ఆ మాట చెవిన పడగానే చిలకతల్లి మొహం పాలిపోయింది. ' ష్‌..... ఊరుకో” అంది తన భయాన్ని కప్పి పుచ్చుకుంటూ.

“అమ్మా! మనిషంటే అడవంతా ఎందుకు అలా బెదిరిపోతోంది? అదేం జంతువు? నువ్వెప్పుడైనా చూశావా?” అనడిగింది చిన్నారి.

"నేను చూళ్ళేదు. చెప్పుకుంటుంటే వినడవే తప్ప చూసిన వాళ్ళెనరూ లేరు"

“అది కొండంత ఉంటుందా?”

“ఉండదు”

“పోనీ ఏనుగంత ఉంటుందా? పాములా కాటేస్తుందా? పులిలా మెడకొరికి చంపుతుందా? గద్దలా తన్నుకు పోతుందా? ఎందుకన్మూ జంతువులన్నీ అలా భయపడుతున్నాయి?" అనడిగింది చిన్నారి.

“చూడ్డానికి కోతిలాగే ఉండేదట. కాళ్ళ మీద నిటారుగా నడిచేదట' అంటూ మనిషి గురించి తాను విన్నది చెప్పబోయి, 'నీకు అనవసరమైనదేదీ లేదు. పోయి ఆడుకో' అని మందలించి, మాట మార్చి పంపించేసింది తల్లి. అప్పటికి తాత్కాలికంగా చిన్నారి మరచిపోయింది కానీ వారం రోజుల తర్వాత నది సముద్రంలో కలిసే చోట చిన్నారి 'మనిమని చూసింది. తల్లి వర్షించినట్టుగానే ఉన్న ఆ ఆకారం నది ఒడ్డున ఇసుకలో వెల్లకిలా పడుకునుంది.

చిన్నారి పులుల్నీ, ఖడ్గ మగత, కొండ చిలువల్నీ, భయంకరమైన జంతువు లెన్నింటినో చూసింది. వాటితో పోల్చి చూస్తే అర్భకుడిలా కనిపించే మనిషంటే అందరికీ అంత బెదురెందుకో దానికి అర్ధం కాలేదు. పైగా నవ్వొచ్చింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఇంకొంచెం దగ్గరకి గంతులేసుకులటూ వెళ్ళింది. కొంచెం ముందుకు గెంతి ఆగి, మళ్ళీ గెంతి ఆగి, మెల్ల మెల్లగా నాలుగైదు అడుగుల దగ్గర దాకా వెళ్ళి పరిశిలనగా చూసింది. కళ్ళు, ముక్కు నోరూ, కాళ్ళూ చేతులూ, అంతా తల్లి వర్ణించినట్టుగానేఉంది. బహుశా నిద్ర పోతున్నట్టుంది... ఆ

182 లక్ష్మీ కోటాన్షం ఆకారం కదలలేదు రెండు క్షణాలు మనిషిని పరిశీలనగా చూసి, అమ్మ దగ్గరకు తిరిగొచ్చి. 'మనిషిని నేను చూశానమ్మా నాకేం భయంవెయ్యలేదు' అంది గర్వంగా. వ. వో

చిలక తల్లి పెద్దగా నవ్వి 'మనిషి ఇప్పుడెక్కడున్నాడు. నువ్వు నిద్రపోయి కలగనుంటావు' అంది.

'నిజం అమ్మా రా చూపిస్తా. ఆ నది ఒడ్డున పడుకున్నాడు" అని అమ్మని తీసుకెళ్ళి చూపించింది.

చిలకతల్లి ఆ ఆకారాన్ని చూసి, 'అది మనిషికాదు. దేవుడి విగ్రహం. వరదల్లో కొట్టుకు వచ్చి ఉంటుంది” అంది.

జ్ల్వ్యేడంటే?

'మనిషి తనలాంటి రూపాన్ని ఊహించి దాన్ని దేవుడనే వాడు. ఈ ఆకాశం, నక్షత్రాలూ. సూర్యచంద్రులూ, చెట్టూచేమా - అన్నీ ఆ దేవుడే సృష్టించాడని వాడు నమ్మేవాడు."

ఈ (బ్రహ్మాండంలో, కోటానుకోట్ట నక్షత్రాలలో, ఒక నక్షత్రాన్ని ఆశ్రయించిన ఒక (గ్రహం మీద (ప్రాణం పోసుకున్న కోట్టాది జీవుల్లో ఒక జీవి ఒక రూగాన్ని దేవుడనడం, అదే ఈ (బ్రహ్మాండాన్ని నడిపిస్తుందనడం చిన్నారికి అర్హం కాలదు.

“నిన్నూ, నన్నూ కూడా ఈ దేవుడే సృష్టించాడా? నాకు అర్హం కావడం లేదు” అంది చిన్నారి.

'మహా మహా తత్వవేత్తలకే చివరివరకూ అర్హం కాలేదు. నీకేం అర్హం అవు తుంది, అంది చిలకతల్లి,

ఈ మనిషి చాలా వింతగా ఉన్నాడే అనుకుంది చిన్నారి. దానికి మనిషి పట్ట ఆసక్తి పెరగసాగింది. మరి కొన్నాళ్ళకు మరో దృశ్యం దాని కంటపడింది. అంతవరకు దూరాన్నుంచి చూసీ అది కొండ అనుకుంటోంది. ఆ రోజు దగ్గరకు వెళ్ళి నప్పుడు అది కొండకాదని దానికి ఆర్హమైంది. దట్టమైన అడవి మింగేసీనా, చిటారు వామి దాటి నిట్టనిలువుగా ఆకాశంలోకి లేచిన ఆ కట్టడం దగ్గర నుంచి స్పష్టంగానే కనిపి స్తోంది. లోపల అంతా మట్టి మట్టిగా . చీకటిగా, తడిగా, నాచుతో, పిచ్చిమొక్కలతో, తీగలతో నిండి ఉంది. అందులో గబ్బిలాలు కీచుమంటూ ఎగురుతున్నాయి. లోపలి గూళ్ళలో ఎగురుతూ ఆళ్ళర్యంగా చూసింది చిన్నారి. ' ఇదేంటి అమ్మా?" అమ్మని తీసు కొచ్చి చూపించి అడిగింది చిన్నారి.

చెలక తల్లి నిట్టూర్చింది.

“ఇలాంటి ఆకాశాన్నంటే భవనాల్లోనే మనిషి ఉండేవాడు... - చిలకతల్లి తరతరాలుగా అను(శ్రుతంగా వస్తున్హ మనిషి కధ చెప్పసాగింది = ఒకప్పుడు ఈ భవనం దీపకాంతులతో రాత్రి కూడా పట్టపగలులా ఉండేది. ఇలాంటి వందలూ వేల భవనాలతో ఇదంతా పెద్ద నగరంలా ఉండేదిట....”

తోలేటి జగన్నోహనరావు 183

చిన్నారికి తల్లి చెప్పేది నమ్మశక్యంగా లేదు. ఈ కీకారణ్యం ఒకప్పుడు లక్షల మంది. నివసించే మహానగరమనీ, ఇందులో అంతరిక్షాన్నంటే హరాష్మ్రల్యందేవని, దార్‌ తెన్నూ లేని ఈ అడవిలో ఒకప్పుడు రైళ్ళు శరవేగంతో పరిగెత్తేవనీ, రోడ్డ మీద వింత వింత వాహనాలలో మనుషులు ప్రయాణం చేసేవారనీ, ఇప్పుడు అడుగుపెట్టడానికి శక్యంగాని ముళ్ళ డొంకలదారుల్లో బకస్టుడు స్కూలుకి పోయే పసిపాపలు నడిచేవారనీ, ఈ సముద్రాల్ని కలుపుతూ నీటిమీద (బ్రహ్మాండమైన ఓడలూ, ఆకాశంలో విమానాలు తిరిగేవనీ, తల్లి చెబుతున్నది దానికి నమ్మడం కష్టంగా ఉంది.

“ఎంత అర్భకుడు? ఎలాంటి శక్తులు సంపాదించాడు?'- చిలకతల్లి చెప్పసాగింది - 'ఠన చేతులతో స్యయంగా చిన్నరాయి కూడా ఎత్తలేకపోయే వాడు. కానీ, కొండల్ని కదిలించే వాడు. నాలుగడుగులేస్తే అలసిపోయే సుకుమారజీవి, ప్రపంచమంతా తిరిగేవాడు. వాడు ఆకాశంలోకి దూసుకుపోయి చంద్రుణ్ణి కూడా అందుకున్నాడు”

'మనిషి ఇంత శక్తి ఎలా సంపాదించాడు?' చిన్నారి ఆశ్చర్యంగా అడిగింది.

“వాడు వెనుక కాళ్ళమీద నిటారుగా నిలబడి ముందు కాళ్ళు = చేతులు - చాచ గానే ప్రపంచం వాడి చేతుల్లో వాలింది. వాడి చేతులు ఎంత అపూర్వమైనవి? ఎన్ని అద్భుతాలు సృష్టించాయి? వాడికి వరమో, శాపమో చేతులతో పాటు ఆస్వ్వాన, వివేచన అనే శక్తి వచ్చింది. 'నేనెవర్ని? ఎక్కడ నుంచి వచ్చాను? ఎక్కడికి పోతున్నాను? ఈ పువ్వులు ఎందుకు వికసిస్తున్నాయి? ఈ పక్షులు ఎలా ఎగురుతున్నాయి? ఈ చేపలు ఎలా ఈదుతున్నాయి? ఈ ఆకాశం , నక్షత్రాలు ఏవిటి? ఈ సృష్టి ఏవిటి?" అని నిరంతరం ఆలోచిస్తూ అశాంతిగా అడవుల్లో, కొండల్లో, సముద్రాల్లో, అంతరిక్షంలో అన్వేషిస్తుండే వాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలోనే అమోఘ శక్తుల్ని సంపాదించాడు. ఆ శక్తుల్ని అదుపులో పెట్టలేకపోయాడు. చివరకు అవే వాణ్ణి నాశనం చేసేశాయి. ....'

'మనిషి అంత మూర్ధంగా ఉండే వాడా?”

'వాడెలాంటివాడో చెప్పడం కష్టం. వాడు చాలా దయాళువు. చీమలకి కూడా హాని చెయ్యకూడదనేవాడు, ఒక్కోసారి తనవారినే కోట్లమందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కీబసిహాడు వాడు విశాల హృదయం కలవాడు. వసుదైక కుటుంబం అనేవాడు. కానీ, నేను, నాది అంటూ నిరంతరం పోట్టాడుతుండేవాడు. వాడిలో రాక్షసుడికి, మానవుడికీ నిరంతరం జరిగే పోరాటంలో చివరకు రాక్షసుడే గెలిచాడు ఆఖరి యుద్దంలో...

అపాం పరుపు మీద నిశ్చింతగా నిద్రపోతున్న మానవజాతి ఆ అఖరి యుద్ధంలో ఎంత భయానకంగా అంతమైందో చిలకతల్లి ఊహకి కూడా అందలేదు.

నగరాలు అంటుకున్నాయి. పల్లెలు అంటుకున్నాయి. పొలాలు అంటుకున్నాయి. అడవులు, కొండలు, కోనలు, అన్నీ అంటుకుని ప్రపంచం

184 లక్ష్మీ కటాక్షం అన్నిగుండమైంది. ఆ అన్ని గుండంలో శలభాల్లా జనం మాడిపోయారు. తాలి క్షణాలలోనే వందల నగరాలు నామరూపాలు లేకుండా మాయమైపోయాయి. కోట్ల మంది, నిద్రపోతున్న వాళ్ళు నిద్రలోనే ఆవిరైపోయారు.

సముద్రాల్లో తాటి చెట్టంత ఎత్తు ఉప్పెన కెరటాలు లేచి జలప్రళయం సృష్టించాయి. అణు ధూళి మేఘాలు చేతులు చాచి తరుముతుంటే, నలువైపుల నుంచీ మృత్యువు కమ్ముకు వస్తుంటే, జనం భయవిహ్ఞాలులై జుట్టు పీక్కుంటూ, పిచ్చివాళ్ళలా మృత్యువు చేతుల నుంచి తప్పించుకోడానికి మృత్యువు నోట్లోకి పరిగెట్టారు. ఆకాశమంతా ధూళి మేఘాలు అలుముకుని పగలు చీకటిగా మారిపోయింది. నెలల తరబడి సూర్యకిరణం నేల తాకలేదు. భూమి మీద ఉన్న చెట్టూచేమా, ఈ దీర్చ రాత్రిలో, చలిలో నశించి. పోయాయి. కలరా, ప్లేగు, మశూచి వంటి వ్యాధులు క్రిమి బాంబుల ఈూపంలో బద్దలై, ఇన్నాళ్ళూ బంధించబడ్డ మహమ్మారులు విజృంభించి జనాన్ని కబళించడం మొదలు పెట్టాయి.

నేల విషం, నీరు విషం, గాలివిషం - కన్నతల్లి రొమ్ము విషమై బిడ్డలు అల్బాడిపోయారు తిండి లేక, మందు లేక, ఉండటానికి వసతి లేక, రోగాలు

  • వెంటాడుతుంటే, అక్కడక్కడా మిగిలిన మనుషులు కూడా రాలిపోయారు.

'ఈ ఒక్కసారికి నన్ను కాపాడు తండ్రీ, మళ్ళీ అధర్మంగా ప్రవర్తిస్తే నాశనం చేసేయి. ఒకే ఒక్క అవకాశం ఇయ్యి (ప్రభూ' అని గొల్టు గొల్లున ఏడుస్తూ దేవుణ్ణ వేడుకున్నారు జనం. ఉన్నాడు, ఉన్నాడు అనే వాడు నిజంగా లేకపోయి ఉండొచ్చు. ఒక వేళ ఉంటే, 'మీరు నా కరుణకు అర్హులు కారు. నశించిపోండి" అని మానవ జాతిని అంతం చేసి ఉండవచ్చు. శాప(గ్రస్తమైనట్టు మానవ జాతి సమూలంగా అంతరించిపోయింది. అయితే...

మృత్యువు ఎంత శక్తివంతమైనదో (ప్రాణం కూడా అంత శక్తివంతమైనదే. గతంలో ఎన్నో 'ప్రకృతి ఉత్పాతాలను తట్టుకుని జీవం నిలిచింది. అలాగే ఈ విపత్తునూ తట్టుకుని నిలబడీంది. సముద్ర జలాల్లో , భూగర్భాలలో, ఇంకా నళించి పోవి మారుమూల భూసప్రాంతాలలో 'తలదాచుకున్న జీవజాలం (క్రమక్రమంగా విస్తరించింది. కొన్ని వందల ఏళ్ళకు భూమి (ప్రాణం పోసుకుని మళ్ళీ పచ్చగా కళకళలాడింది.

“ ...ఎలాంటి వాడు ఎలా అంతమయ్యాడు మనిషి! వాడు నశించిపోయి వందల ఏళ్లయినా వాడి దుష్ట శక్తులు తమ (ప్రభావాన్ని ఇంకా చూపిస్తూనే ఉన్నాయి' అంది చీలకతల్లి నిట్టూరుస్తూ,

మనిషి అంతమైన -తీరు- తల్చుకుంటే చిన్నారికి జాలి కలిగింది. ఏడుపొచ్చింది. వాడి క్రార్యాన్ని ఊహిస్తే భయం వేసింది. మనిషంటే ఏవగింపు కలిగింది. తనకే అర్ధం కాని రకరకాల ఆలోచనలు కలవరపెడుతూ ఉంటే చిన్నారి తల్లి ఒడిలో కలత నిద్రలోకి జారిపోయింది మెల్లిమెల్లిగా...

తోలేటి జగన్నోహనరావు [185 2

రాత్రి ఆకాశంలో పౌర్షమి చంద్రుడు తెల్లగా వెలుగుతున్నాడు. నక్షత్రాలు అక్కడక్కడ మెరుస్తున్నాయి. సముద్రంలో అలలు లేచి విసురుగా తీరందాకా వచ్చి విరిగి వెనక్కు మళ్ళుతున్నాయి. నదిలో అప్పుడప్పుడు నీటిలోంచి పైకెగిరి పడుతున్న చేపలు వెన్నెల్లో వెండి ముక్కల్లా తళుక్కుమంటున్నాయి. పిండారబోసినట్టున్న వెన్నెల అడవి మీద కురిసి, కొమ్మల్గ్లోంచి జార, కింద ఎండుటాకుల మీద్‌ పొడలు పొడలుగా పడుతోంది. కీచురోళ్ళు కీ...కీ... అని విడవకుండా అరుస్తున్నాయి. ఉన్నట్టుండి అడవి జంతువుల గర్జనలు, పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి.

ఈ భూమి, సముద్రం, జల వన చరాలు, వందల కొట్ల సంవత్సరాలుగా ఇలా ఉంటూనే ఉన్నాయి. మరి వందల కోట్ల సంవత్సరాలు - ఈ భూమి మీద సృష్టి అంతమయ్య వరకూ ఇలా ఉంటూనే ఉంటాయి. సుదీర్ధమైన ఈ భూమి చరిత్రలో లక్షల జీవజాతులు పుట్టి, వృద్రిపొంది, నశించిపోయాయి. ఆతి స్వల్ప కాలం, ఓ మెరుపులా మెరిసి వెలిగిన మనిషి కూడా అలాగే నశించిపోయాడు.

అయితే మిగిలిన జీవజాతుల్లా, మానవజాతి మారుతున్న శీతోష్ట

స్‌! పరిస్తితులలో, పరిసరాలలో ఇమడలేక నళించిపోలేదు. జీవించడంలో తన ప్రల్యేకత చూపించినట్టే మరణంలో కూడా అది తన ప్రత్యేకతను నిలుపుకుంది. తాను స్వయంగా తన చితిని పేర్చుకుని ఆ మంటల్లో దూకి అంతరించిపోయింది. (ఇండియా టు డే - 1 ఫిబ్రవరి 2000) య్మురంధొల భయా ఘా శీ (1 టాలపై! ం ల్‌ స్టా లే శో శన. నీ ( శ భై జం మే - పాప్‌ క

య... లం ౧౧౧4న | | " " ముందు తరం తర్వాత. .... తెలుగు కథ బావుటాని న. ఖే. న్‌" భుజానికత్తుకోగల పది పన్నెండు మందిలో ( 1 | [| శీ (| 1 మీరు బకరు....నివాళి' మీ కథలన్నింటిలో నాకు నట నన్‌ గుర్తుండి పోయే కథ (క్రీ కాళవట్షం రామారావు /" త నం శ్రీ జైలే ః మీ కథలు అప్పడప్పుడు దర్శనమిచ్చే ఆకాశంలో /| ఇ గ లో నవ్వతారలు ... ప్రత్యేకం, విశిష్టం అయిన 10[6 4 2౧06 గ౧/101) ఉన్న కథలు (6క్ర ముఖివల్లె రాజు మ్‌ వ్యంగ్య కథ 'బహుఛత్రాధిపతి' చదివాను. |! 6౧|0/66 16 మీ 'మార్చు' కథ చాలా విశిష్టమైనదిగా ఇక్కడి మిత్రులు గుర్తు పెట్టుకొని ఉన్నారు (శ్రీ వాకాటి పాండురంగ రావ్లు మిమ్మల్ని కేవలం నోస్య రచయితగా, ఒక బపూన్‌లా నవ్వంచే వాడిలా చూడడం అపరాధం ... (క్రీ వురాణం నుబ్రహ్మణ్య శర్మ . జీవితాన్ని గురించి లోతైన అవగాహన, జీవితాన్ని చూడడానికి బక తాత్త్విక దృక్ట్రథం, చక్కని కథన చాతుర్యం, అందులో అంతర్లీనంగా ప్రవహించే వ్యంగ్యం -వెరసి తోలేటి జగన్మోహనరావు కథలు ం (కీ వల్లంపాటి వెంకట నుబ్బయ్మ , చెప్టే విషయంతో పాటు చెప్పే తీరుకు కూడా రచయిత ప్రాముఖ్య - మిచ్చినప్పడు రచన తష్టక రాణిస్తుంది... చెప్పే తీరులో రావిశాస్త్రి ॥ లాగా ఒడుపు తెలిసిన కథకులు (డా! పోరంకి దక్షిణామూర్తి - ఈనాడు లీ శే. ల వ్యంగ్యం, వోస్యం, మేళవించి కథ చెప్పడంలో తోలేటి జగన్మోహనరావు జై. న యా ఎంత సిద్ధహస్తుడో, సీరియస్‌ కథనంలోనూ అంతే అందెవేసిన చెయ్యి ( హర. త 0. 1 (1 2 కరి *... ఉండియా టుడ్తు తెలుగు కథా ప్రవాహం త్ర క్షోజ్టేటి జరన్మోహనరావుది ప్తక్తేకమముననినిిో నాలా రుతక ట్ర? షర వమనం గ్గ వ. ఉంది. వృంర్భ థోర్తాలడా.దేబ్సలు. కొట్టినట్టు రాయగల ప్రేతభాశకా ర్‌ స స ళు ంలింిది...ఆలోచన) తర్కం నిండుగా పెన్న కథల్పుఆల్లోచ్తనను కుదపటం, / నే మర... ాసకదపటిం ఆయన ప్రధాన రచనా స్వభావరో(ఆంధ్రవ్రభ వారపత్రిక్రు శం