Telugu kinnera sahityam ( november 1948 february 1955 ) vol 4 - anilvaranasi/indianlanguages GitHub Wiki

భై న నక కా కత త కక నడ న వ న న. ఆ లావ ననన క డా నంతా నల న న పల రసల ల ల లాడు కాయా కక పం నవల క న న నల న క న నా శ వసన నాలక య కా లాయ పట ాాతంనంాయయయయంయన నాం చనన | ంించితి యుతం నలత చవనులతుంంలతి. తలలు. ....... | సై వ. స క న వ న స = న. | హ్‌ / మం జాం జ నా కవ స్ట | ॥ శ లు | . ఎ ్‌ , న్‌. కలో లల స ను = | - టాం | వ. ॥ క. శ 1 జా జ ఎ హా హా | శ ॥ | వ పంటీ * క్ష ౨. ( _ ॥ . న. =. సం ఉలి టా నటు? యూ న. న

యన షు సమా కా సె (.. ( థీ) టి గ్రే 1 సు! (7 ణా [గ కధలో న జు హూ? చే టాం ఉ్యర్ర్రు సాహిత్యము 1948- 1955

పందిరి మల్లికార్డునరావు శతజయంతి ప్రచురణలు సంపుటము 4 గ, ౩ ౪రోగ ని గ స నట. | నే గ్‌ న స్తో క రా క న వా నాహెత్వము 1948 - 1955 సంపాదకుడు పందిరి మల్లికార్డునరావు పందిరి మల్లికార్డునరావు శతజయంతి ప్రచురణలు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌

6౦౧౪9౧1 అ 2007 ౧౮౧౮ గగ90౧౦ ౧1000౧ కిన్నెర ళా నాహిత్వము ల నవంబరు 1948 - ఫిబ్రవరి 1955 పరిమిత ముద్రణ 200/7

ప్రమరణ

పందిరి మల్లికార్జునరావు శతజయంతి ప్రచురణలు

'టావ్‌*, 802, మౌంట్‌ కైలాష్‌ 54, రోడ్‌ నెం 4, బంజారాహిల్ట్‌ హైదరాబాదు 500 034, ఆంధ్రప్రదేశ్‌, ఇండియా ఇ-మెయిల్‌ ౧6౧1౧౦౦౧౫9 ౪౪౮౧౦౦ 6౦౧ 541117 గి/ (1గ౯౧ఉ౮గిఅి [10౪9గ౧౧౦6| 1 948 - [౧60గ0౧/ 1 955 1౧౧6౮ 861110౧ 2007 9081615162 9౧౧౮1 01116000౧౦ ౧౦౦ ౧౪౧1౭౧౮౪ ౧౪110010౧5 “౦౦', 802, [106౧1 గం1105%

54, గింంర గ!10 4. 800౧)0/09 గ|||5 (౪/౮౪/0006 500 034. 4ఉగియ౧;0 గ|౦౮౪:౧., 1౧౮16 ఆ-గ౧౧౦|| 0౧|౧౧9౦గ౦(౪౪౦౮౧౦౦ 00గ౫ న॥౧+౪6 01 010౮0౪4010 ౧౧00౪3 ౧౪. 60౮, [15౧66![0006, 1౪/66/0006 - 500 020 580౮౧6౮౪౮6 07 5/00 800% 810665, ౧౪/౮౪/౦006 - 500 00] గ౧0౧6 91-40-2475 3913

పందిరి మలభికార్తునరావు శతజయంతది క్‌ 2౫ 1903 - 2003 . . స స న . స్ట గత | స్‌ . ల . వ స . న

  1. స. రట ము స్‌ ] స వ. నుం సు సం న... త్తు స స న. క. . ని సై ] న. జ మ ౩ సు వ యూ స ా. స య ను | ము న - క్ష త్‌ ఇ , న | న. వ్‌ ఆన య . స ( షయ న స ను తే వి టంది9ి వవఐశ్రాలు నే “కావు గాగ్నా టా 9 ఏప్రిల్‌ 1903 - 23 డిశంబరు 1981 ల ల వ. క. .. 1పిజెం;

అంకితం శా. జ లో. పందిరి వీరన్న పందిరి మల్లికార్జునరావు తండ్రి (మరణం : 926 | 5 ౯ (1 లా 1 నే త్రో (7 న..! ల్ల ర్త | ॥ మల్లంపల్లి సోమశేఖర శర్మ పుచ్చలపల్లి సుందరయ్య (1891-1963) (1913-1985 మరియు పరిశోధకులకు

పందిరి మల్లికార్జునరావు శతజయంతి ప్రచురణలు స్తూపుటిమ్ము శ యుభాయ్యి మాసపత్రిక . అక్టోబరు, నవంబరు, డిసెంబరు 1927 (పుటి: 1-208) వీఠిక : దాః పొత్తూరి వెంకటేశ్వరరావు ॥ కిన్నెర వ. 1948-1955 న. పుటము 2 హనీ వ్‌ శీ సీ | ॥ ళ్‌ ) (పుట: 209-550) గి న వీఠ5 : దాః ఎ.బి.కె. ప్రసాద్‌ మ్‌ ( ఆ పాపటనముం + భాష, చరిత్ర, సంస్కృతి (పుట: 551-1 376) భాష: వీరిక : డా. చేకూరి రామారావు చరిత్ర సంస్కృతి :వీఠిక : దా. వకుళాభరణం రామకృష్ణ సంపుటము 4 సాహిత్యము (పుట: 1377-2756) వీఠిక : దా. బేతవోలు రామబ్రహ్మం సంపుటము 5 జానపద విజ్ఞానము మాలో (పుట: 2757-3026) భయాత లావాను వీఠిక : డా. నాయని కృష్ణకుమారి ॥ వ. రాం క ॥ "శ క. నంపుటము 6 త్త 40 ఒ| లైతి0 కత ర్య | 080/ * లలితకళలు, సినీమా ము [| (పుట: 3027-3496) సపార్రమాల లిం... లలితకళలు: పీఠిక : దా, పప్ప వేణుగోపాలరావు " న. - నీనీమా : పీఠిక : దా. రావి కొండలరావు సంపుటము 7 పుసక సమీక, పూలతోర గ్గు క్ష పూలతోరణము (పుట: 3497-3996) వీఠ5 : డా. మాలతీ చందుర్‌ సంపుటము 8 అలి రుందిరి స

౧|||01౧| [1466140004 ౧4౦ (5150414 ౧౮81041015 ౪016౧౧౪ 1 59811గ49[41॥ గగ0గ [11 ౦౮||. 00100610 0౪6౧౦6)? 06౭గ౦౯|౧ 1927 " (౧౩౮65 11-208) ౧౧౭౧6౬6౬ :? రి కింకంగ ౪6౧|21465౪*/37౯3 ౧౫౦ 1%|[1౬[గ 1048-1955 ౪7014౧6 2 ౬£0170[14ఓ5 (080౮65 209-550) ౧7౦౧౧6 ? 0॥ గీ.8.గ. ౧౯౩౭9౭౮ ౪0141౧6 3 ఓగిసి6ఆగ6ంక౬, +1115₹0[4 (౮౬౮౧౬ (92065 5551-1376) ఓ2గం6366 : ౧౧౧౦౧౫6 : 0౯ ల౧౪%౪|౫ [2౧౫8 [౧౫౦ 100౧4 6౫||(1౯6 2 ౧౧౦౧౫౧౦ : రణ ౪౩|412003620౧200 [2౧౧౩1150౧8 ౪014౧6 4 ఓ1[౬[౧గ/౮౧౬ (౧2065 1377-2756) ౨౯౭౧6౭ :- 07 8612౪70141 గ౭గ౧౧౩20|/20౧౧౧౩౧౫ ౪0160౧౪౭ 5 0[౬%1ఓ0గ%8 (08665 2757-3026) ౧౧౦౧౧౭ : రణ సీజా౭గ! కగంగిగిం కటగా౭ గ ౪010౧66 ₹1%16౬ శగ[5, (6|[|౬|4గ (౧2౮65 3027-3496) [1౧6 గగ : ౧౧౦౪౫౦౦ : 0౧ గ౭౧౧౪| ౪6౧4౮౦౧౩1౩ గతం 61౧౭౧౫౫౭ ; ౧౧౦౧౧౭ 0౯ ౧౭౪ గంగిరే3!2 గ౫౦ ౪016౧౧6 7 8500[గ గ౯౪|౬౯౪/9, 51౧1%165 0గ ౧ఓ౬౦౪/౬౧6 (౧౩౮65 3497-3996) ౧౧౦౪౫౬6 . 9౧ గీ4!26 616౧౮డ౮౯ ౪016౧6 8 నగగ|0|౧| గీగి[ఓ1గసకగగంలసిగి ౧గ౦ ౧౬615611౧1

జూ

మా నాన్నగారి జ్ఞాపకార్థము, పందిరి మల్లికార్జునరావు గారి శతజయంతి 'ప్రచురణలలోని 8 సంపుటాలలోని ఈ నాల్లవ సంపుటాన్ని, సాహిత్యము ్రచురిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

పందిరి మల్లికార్జునరావు శత జయంతి ఉత్సవాల (ప్రారంభదశలో అనేకమంది మేధావులు, పాత్రికేయులు వారి విలువైన సలహాలనందించారు. వారి కందరికీ నా కృతజ్ఞతలు. సర్వశ్రీ, యన్‌. రామ్‌, హిందూ (ప్రధాన సంపాదకులు; యన్‌.ఆర్‌. చందూర్‌, డా॥ మాలతీ చందూర్‌, డా॥ కె.బి. గోపాలం, బి.యస్‌. ఆర్‌. కృష, డా॥ జి.వి.యస్‌.ఆర్‌. కృష్ణమూర్తి, కె. రామలక్ష్మి ఆరు(ద్ర, డా॥ అక్కిరెడ్డి, ఇ.యస్‌. రెడ్డి కీ॥శే॥ వాసిరెడ్డి సీతాదేవి, బి. సుబ్బరాయన్‌, డా॥ పప్పు వేణుగోపాలరావు గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ (ప్రాజెక్టులో ప్రత్యేక శ్రద్ద కనబరచి, తమ విలువైన సూచనలను అందించిన డా॥ నాయని కృష్ణకుమారి గారికి, డా॥ చేకూరి రామారావు గారికి నా కృతజ్ఞతాభివందనాలు. వీరు ఎన్నో విలువైన గంటలను వెచ్చించి, ఈ ప్రాజెక్టులో ప్రచురించాల్సిన వ్యాసాలను ఎంపిక . చేశారు. , ॥

తమ విలువైన సలహాల నందించి, విసృతంగా ఈ కృషిలో పాలుపంచుకొన్న డా॥ గంగిసెట్టి లక్ష్మీనారాయణ మరియు ఇలింద్ర సదాశివగుప్త గార్లకు నా మనఃపూర్వక వందనాలు. ఈ (ప్రాజెక్టుకి అతి విలువైన తమ మద్దతుని ఇచ్చి ప్రోత్సహించిన డాక్టర్‌ నలమోలు గోపాలరావుగారికి (రాక్‌ఫర్డ్‌ ఇల్లినాయ్‌, యు.ఎస్‌.ఎ, అక్కడ ఇండియా అసోసియేషన్‌కి నా మనఃపూర్వక ధన్యవాదాలు. నాల్గవ సంపుటము సాహిత్యము కి పీఠిక రాసిన డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం గారికి నా కృతజ్ఞతలు. ఈ సంపుటము తీర్చిదిద్దడంలోనూ, ముఖ్యపద సూచిక తయారు చేయడంలోనూ కంచర్ల మాధవిగారు ఇతోధికంగా సహకరించారు. ఈ (ప్రాజెక్టు చేపట్టడానికి నాకు స్ఫూర్తినిచ్చిన డాక్టర్‌ ఆరుద్రగారి సహకారాన్ని విస్మరించలేను.

సకాలంలో చక్కగా ముద్రించి ఇచ్చిన కళాజ్యోతి అధినేతలయిన ఆలపాటి దేవేంద్రనాథ్‌, ఆలపాటి బావన్న గార్లకి నా కృతజ్ఞతలు. నన్ను (ప్రోత్సహిస్తూ, ఈ (ప్రాజెక్టు (ప్రారంభంలో ఆర్థిక సహకారాన్నందించిన మా అక్కయ్య శ్రీ;శే, పందిరి శాంతాబాయ్‌కి నా కృతజ్ఞతాభివందనాలు. .

| పందిరి కృష్ణమోహన్‌ జులై, 2007

&6గగ!0౪/1ఓ౬౬౮౬|1౬[115

1615 ౧౧౫/ 0621 ౧|694/6 €0 ౧491150 115 [106/౧ 0౧ €16 6100౯ ౪౦01౪౧6౩, ౬66౯౧66౮76, 01 ౯3౧061౧ 41411163%06౧4 [8౦0 66౧6౧౩౧/ [691163౪0౧9, 1౧ ౧6౧౧౦౧/ 0 ౧౧౫౫ 1306 120066 1౧ 06 ౪6౧/ 1౧1031 5306 ౦0606 1662 0 523061/ 142116366౧ [౧౩౦ 66౧16౧2౧ (61690/311009 96౪6141! 5401365 8౧64 [0060౧౧౩196 (6౦౧౧౦౦66 ౪160) గా౭గ/ ౪2164016 16635. గ4గ66146 0430౧15 ౩౧6 9/0260466 €0 520/356 సి [3౧0, 561601 1౧) 6౧|| 1౧6 ౧1౧6౮; ౧. అంగరంగ 0౧ 143136 6౧6౧౮౪౧ 0౧ గ.8. 600212౧, 8.5.5. గగ౧150౧2,. 0౧ 6.౪.9.గ. కగ9ం00౧3 గీీంగుం గ. ౧౩౭గ౧౩|2౩౬60౧౧| గిగిరేగ3, ౧౧ గీ! ౧66౮౦0౫ ౬5. గ66ర)౫ 1216 ౪౩51/6606౫/ 5112 06౪, 8. 560031372౧ 2౧01 0 ౧౩౧౧4 ౪6౧౮౮౦౧213 గ40. | 3౧ 65066131 1౧660196 10 0 స2ఎ4గ౧! గగం[గ౧4 గంగా౭గ 3౧6 0౧ 6౧౪౧4౧ [2౧3 [౧20 10% 061౧ 90606131 1౧66654 1౧ +6 ౧౧౦6౮౧ 2౧6 గ౧౦09 ౪144016 0056౧/310౧5 2౧6 546099656005. 1౧6/ 506౧1 1౧౧౮౪గ౧౯|౫916 [౧౦౮౪౧ [౧ 63౧6%1|%/ 50/1౧0 0౮౪1 2౧౮6 6616౧౮9 గ౧౫౧౫ 6613115 ౦0" 16 1౧౧౮61 0 16 ౪౦14గ6. ౧౧ 62౧0915600/ ఓ2150గ|౧4[3%/2౧2 30౧06 9/1 1౧౮/2 5364 51౪2 66063 66561/6 5066831] 120165. 1060/ ౪6౧౬ 1010 $66121 6663119 3౧6 0౧666 ౪3102016 5406560009. గీగ/ 5౧666 11306 10 | 413౧0౦16 600213 [౭౦ 0 గింంయగం!0, 111౧015, ఆనీ. 2౧౮ 0౧6 1౧613 5506126000 168 10/61/1౧00 ౪061! ౧౦9౬౪౩|౪ఎ016 5400011 3౧6 6౧6౦౦౮|3౮1౧9 69 ౦౧ ₹1)15 ౧౧౦6౦ | 863౪0106 గ౧౩౧౧౩౦౧2౧౧౧౩గ౧) ౪౩5 8/౩6|౦0౪5 6౧౦౮౦౧ [౧ గ6౧౮౦ 06 ౧౧౪౧౩66 10! 46 ₹04గ% ౪౦1౪౧6, £/00/66/76. గ2గ0023గ3 గీర 0౧4/1 €00% 6౦౦6 (3౧6 0 116 6612119 ౦0౧ ఈ1115 ౪7014గ౧6 3౧౮ 2150 ౧౪౧౩౯౪96 ౪116 1౧౮ఆఅ6 | 63౧౧౦1 [0066 16 6౧౦౧౪064610౧ ౧౧౩66 0౫ 0౧ శీ[63 1౧ 91౪100 16|| 1౧59౧1260౧ 2౧6 61026 6376 ౧6 116 ౧౦౧గ౮6౧౧6౭ (0 ౪౧౮6౧౩౪ 16 ౪0గ౬ తీ150 (1౧౩౧5 [0 5% 12036 0౪౪౪౭౧౮౫ సీ360) 2౧౮6 564 గ1304౪ 9202002 0 గ౭12 ౨౫౦11 ౧౧౦6౬౭5౩, 10! 16|| 6%66౧0/ 23౧6 ౧౧6 ౧౧౧6౧8. |! ఎయ0౧౦౪/16606 112౧15 0౧౫ 556% 1366 02౧61 9503063 6881, ౪/౧౦ 6౧౦౦౪|8౦66 ౩౧౮ ౧౦0౪106066 16 1౧163! 5666 ౧౧0౧౯౫ [0% 6006 ౧౧౦6౮.

నిగగ[01%1 గగ౧|5101%% ౧౧౦0114 % (1/66/2020, ల 2007

ఒల్లో అల్లో విషయసూచిక కృతజ్ఞతలు న గీ౦010౧0౪/|6696గ6౧౩ న జీవిత చరిత్ర పందిరి మల్లికార్దునరావు చేకూరి రామారావు ఏ0 పీఠిక; సాహితీ న్వరగతులు బేతవోలు రామబ్రహ్మం న. క్షే౦48 - 1955 ల సాహిత్యము సంపాదకుడు; పందిరి మల్లికార్జునరావు సహాయ సంపాదకులు: పందిరి మీరాబాయి “పఠాభి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1377 కిన్నెర: సంపుటము 1, సంచిక 1, నవంబరు1948 _

అందం అచంట జానకీరామ్‌ 1385

కిన్నెర: సంపుటము 1, సంచిక 2, జనవరి19409 మేఘదూత కావ్యమూలకథ బులును వేంకటరమణయ్య 1389

కిన్నెర: సంపుటము 1, సంచిక 5, జూలై 1949 ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు శ్రీరంగం శ్రీ నివానరావు 1393

కిన్నెర: సంపుటము 1, సంచిక ర, ఆగస్టు 19409 ఆల్హస్‌ హక్స్‌లీ ఆచంట జానకిరామ్‌ 1405

కిన్నెర: సంపుటము 1, సంచిక 6, ఆగస్టు 1949

విషయ సూచిక | మను చరిత్రము: సాంఘిక, రాజకీయార్జిక పరిస్థితులు | బుఖును వేంకట రమణయ్య 1411 కిన్నెర: సంపుటము 2, సంచిక 3 ఫైబవరి 1950 గ్రంథ విమర్శనముల గతి బులుసు వేంకట రమణయ్య 1418 కిన్నెర: సంపుటము 2, సంచిక 5, మే 1950 వేగుచుక్క మల్లంపల్లి సోమ శేఖర శర 1422 కిన్నెర; సంపుటము 2, సంచిక 5, మే 1950 “నారాయణభట్టు బులును వేంకట రమణయ్య కేతత కిన్నెర; సంపుటము 2, సంచిక 7, జూలై 1950 భావకవిత్వము: నవీనయుగము ని నరోజనీదేవి 1445 కిన్నెర; సంపుటము 2, సంచిక 8 సెప్టెంబరు 1950 కథారచన తూలికాభూషణ్‌ [1451 కిన్నెర: సంపుటము 2, సంచిక 8 సెప్టెంబరు 1950 సాహిత్య సింహావలోకనము పి. వి. రాజమన్నార్‌ [1455 కిన్నెర: సంపుటము 2, సంచిక 11. డిశంబరు 1950 మన సాహిత్య సంస్థలు బులును వేంకట రమణయ్య 1461 కిన్నెర: సంపుటము 3, సంచిక 1, జనవరి 1951 శ్రీ, ప్రభాకరశాస్తుులుగారు (నా యనుభవములో) బులుసు వేంకటరమణయ్య 1467 కిన్నెర: సంపుటము 3. సంచిక 3, మార్చి 1951 శ్రీ సుబ్రహ్మణ్య శాస్తింగారి చిన్న కథ ప్‌. గణపతి శాస్త్ర 1477 కిన్నెర: సంపుటము 3. సంచిక 4, ఏప్రిల్‌ 1951 శ్రీ సుబహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి 1486 కిన్నెర: సంపుటము 3, సంచిక 5, మే 1951 మయ్యావస్కీ: విప్లవ కవి కెవిరమణా రెడ్డ 1498 కిన్నెర: సంపుటము 3, సంచిక 6, జూన్‌ 1951

గ. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము &: సాహిత్యము

నార్ల వ్యాసాలు విద్వాన్‌ విశ్వం 1513 కిన్నెర: సంపుటము 3, సంచిక 6, జూన్‌ 195]

అబ్బ! విద్వాన్‌ విశ్చుం 1519

కిన్నెర: సంపుటము ౨, సంచిక 7, జూలై 1951 , ఆంధ్ర వాజ్బయములో అనువాదసాహిత్యము. ఆర్‌ కృష్ణ వింత్‌ 1527 కిన్నెర: సంపుటము 3, సంచిక 7, జూలై 1951 | చలంగారి మ్యూజింగ్స్‌ ఎన్‌.ఎన్‌.చారి 1531 కిన్నెర: సంపుటము 3, సంచిక 8, ఆగస్టు 1951

వినోద కథలు వేటూరి ఆనంచమూి 1543

కిన్నెర: సంపుటము 3, సంచిక 9, సెప్టెంబరు 1951 _ |

రచయితలు: నేడు, నాడు అభ్యుతుని గర 1549 కిన్నెర: సంపుటము 3, సంచిక 12, డిశంబరు 1951

అనువాద సాహిత్యం 1553

కిన్నెర: సంపుటము 4, సంచిక 2, ఫిబవరి 1952 |

కొడవటిగంటి కుటుంబరావు గ(౮పాటో వెంకటనుబ్బయ్య 1556 కిన్నెర: సంపుటము 4, సంచిక 3, మార్చి1952

నేను చదువుతున్న పుస్తకాలు రమణారెక్ధ 1559 కిన్నెర: సంపుటము 4, సంచిక 7, జూలై 1952

శ్రీ బేకుపుళ్ల కామేశ్వరరావుగారి కథలు గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి 1567 కిన్నెర: సంపుటము 4, సంచిక 7 జూలై 1952

శ్రీ కవికొండల వేంకటరావుగారు బేకుమళ్ల కామేశ్వరరావు 1580 కిన్నెర: సంపుటము 4, సంచిక 8, ఆగస్టు 1952

కవికొండలవారి *ఇనుప కోటొ గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి 1583 కిన్నెర: సంపుటము 4, సంచిక 8, ఆగస్టు 1952

శ్రీ కవికొండల కవి కవితాశ్రీ జమ్యులమదక మాధవతాయ ళ్ళ 1589 కిన్నెర: సంపుటము 4, సంచిక 9, సెప్టెంబరు 1952

విషయ సూచిక 30/1 కాళిదాసు: కావ్య శిల్పము ఇంద్రగంటి హనుమచ్చాన్తి) 1596 కిన్నెర: సంపుటము 4, సంచిక 9, సెప్టెంబరు 1952 నేను చదువుతున్న పుస్తకాలు రమణారెక్ట 1601 కిన్నెర: సంపుటము 4, సంచిక 10, అక్టోబరు 1952 కాదంబరి బులును వేంకట రమణయ్య 1613 కిన్నెర: సంపుటము 4, సంచిక 10, అక్టోబరు 1952 “*నేసు వ్రాసిన వేమిటంటొ కథలు కవికొంచల వేంకటలావు 1617 కిన్నెర: సంపుటము 4, సంచిక 11, నవంబరు 1952 మఅుంకి పాటలు: వ్యాఖ్య బెల్లంకొండ రాఘవరావు 1625 కిన్నెర: సంపుటము 4, సంచిక 11, నవంబరు 1952 వలా పుజ్నుస్‌ అసలు కథ పారనంది జగన్నాథస్వామి 1630 కిన్నెర: సంపుటము 4, సంచిక 11, నవంబరు 1952 పిల్లల చిరునవ్వుల్లో అలుగు వెలుగులు (ఒక పరిశీలన) సోమమనుందల్‌ 164/7 కిన్నెర: సంపుటము 4, సంచిక 12, డిశంబరు 1952 సారస్వతము: పరమార్హము భూపతి లక్షీనారాయణరావు 1677 కిన్నెర: సంపుటము 4, సంచిక 12, డిశంబరు 1952 తలుగు సాహిత్యంలో క్రొత్త ఆన్నులు తమణాలెడ్డ 1711 కిన్నెర: సంపుటము 5, సంచిక 1, జనవరి 1953 సారస్వతము: విమర్శ ఖభూవతి లక్షీనారాయగాలావు 1719 కిన్నెర: సంపుటము ౨, సంచిక 1, జనవరి 1953 అలంప్పురం సభలలో సాహిత్య సమారాధన గడుణు నీతాపతి 1751 కిన్నెర: సంపుటము 5, సంచిక 2, ఫబవరి 195ఎ రూపకోత్పత్తి భూపతి దక్ష్యీనారాయణ రావు 1759 కిన్నెర: సంపుటము 5, సంచిక 4, ఎపైల్‌ 1953 రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 17093 కిన్నెర సంపుటము 5, సంచిక 5, మే 1953

౫౪141 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1821

కిన్నెర: సంపుటము 5, సంచిక 6 జూన్‌ 1953 “నేను వ్రాసిన వేమిటంటెో: *కల్పనావ్యాసములు"

కవికొండల వేంకటరావు 1853 కిన్నెర: సంపుటము 5, సంచిక 5, మే 1953

“ఊర్వశి: రవీంద్రుని సౌందర్య కల్పన” బెజవాడ గోపాల రెడ్డీ 1860 కిన్నెర; సంపుటము 5, సంచిక 6, జూన్‌ 1953

“కన్యాశుల్కం” రమణాలెథి 1868 కిన్నెర: సంపుటము 5, సంచిక 7, జూలై 1953

అభ్యుదయ కావ్యాల్లో “అగో సి. నారాయణ లెడ్ఞి 1878 కిన్నెర: సంపుటము 5, సంచిక 7, జూలై 1953

శృంగారషష్టము నేలటూరి వేంకట రమణయ్య 1882 కిన్నెర: సంపుటము 5, సంచిక 7, జూలై 1953

కావ్య విమర్శన సంప్రదాయములు శిష్టా రామకృష్ణ శాస్తి 1889 కిన్నెర: సంపుటము 5, సంచిక 7, జూలై 1953

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణరావు 1915 కిన్నెర: సంపుటము 5, సంచిక 8, ఆగస్టు 1953

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు 01 కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్ఫూర్తిశ్రీ 1953 కిన్నెర: సంపుటము 5, సంచిక 9, సెప్టెంబరు 1953

దొరకిన షష్టస్కంధము పోతనకృతమా? మిన్నికంటి గురునాథ శర్దు 1965 కిన్నెర: సంపుటము 5, సంచిక 10, అక్టోబరు 1953

కవిత్వం నా సాధనం సి. వారాయణ రెడ్డి 1977 కిన్నెర; సంపుటము 5, సంచిక 10, అక్టోబరు 953

మన సాహిత్య సంగ్రామములు గ్యరెపాటి వెంకట నుబ్బయ్య 1983 కిన్నెర: సంపుటము 5, సంచిక 10, అక్టోబరు 1953

విషయ సూచిక ౭౫ కవిః ప్రచురణ శ్రీపాద నుబ్రహృణ్యు శాస్త్రి 1987 కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953 . అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు నంథూలి రామకృష్ణమాచార్య 1999

కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953 కవి; విపముర్శకుడు కాలయాతు నరసింవోచార్చ్భులు 2005 కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953 ప్రజాకవి “దాశరథి పి. వి. రత్నం 2009 కిన్నెర: సంపుటము ఏ, సంచిక 12, డిశంబరు 1993 మన సాహిత్య సంగ్రామములు.. కేతవర్యు వేంకట రామకోటి శాస్త్రి 2012 కిన్నెర: సంపుటము ౨, సంచిక 12, డిశంబరు 1953 మన సాహిత్య సంగ్రాముములు: నమాధాసములు గ్యలిపాటొ పంతటి నుబ్బయ్య 2019 కిన్నెరః సంపుటము 6, సంచిక 1, జనవరి 1954 “ఆత్మ విశ్వాస సూర్యోదయంబు.” (1918 - 30) యణాలెడ్డి 2024 కిన్నెర: సంపుటము 6, సంచిక 1, జనవరో 1954 బజాలవాజ్మయం గొా౭ెపాటి వంకట నుబ్బయ్య 2041 కిన్నెర: సంప్పుటము 6, సంచిక 1, జనవరి 1934 మన సాహెత్య సంగ్రామములు: సమాధానములు కేతవరన్టు వేంకట రామకోటి శాస్త్రం 2051 కిన్నెర: సంప్పుటము 6, సంచిక 2, ఫ్మబవరి 1934 నేటి కవితా రచన మాదిరాజు రంగారావు 2055 కిన్నెర: సంప్పుటము 6, సంచిక 3. మార్చి 1954 “ముదురలశవము” కొములగిలి నలసిలవో రొవు 2060 కిన్నెర; సంపుటము 6, సంచిక 3. మార్చి 1954 కవి చెదస్వ రమణాలెడ్డ్‌ 2069 కిన్నారం సంప్పుటము 6, సంచిక 3, మార్చి 1954 కథకాదు సంజీవదేవ్‌ 2078 డిసురవం సంచ్పుపము 6, సంచిక 4 ఏప్రైల్‌ 1954

3% పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

అఆనుగులో నవల చల్లా రాధాకృష్ణ శర్థు 2083 కిన్నెర: సంపుటము 6, సంచిక 5, మే 1954

జపాన్‌ నాటక కళ విశిష్టత నార్జున్‌ స్మిత్‌ 2091

కిన్నెర; సంపుటము 6, సంచిక 5, మే 1954

జర్మను సాహిత్యము " ని ఎన్‌. శర్జు 2097 కిన్నెర; సంపుటము 6, సంచిక 5, మే 1954

సాహిత్యములో పరమార్థ దృక్పథము వెల్రండ ప్రభాకర రావు 2109 కిన్నెర: సంపుటము 6, సంచిక 6, జూన్‌ 1954

సాహిత్యము జూస్త్‌ వేంకట నరసయ్య 2122 కిన్నెర: సంపుటము 6 సంచిక 7, జూలై 1954

ఇఅఆలంగాణ సీమ : కవృలదర్శనము డీ. రామలింగం 2125 కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై 1954

మహోజ్జ్వల కవి *“ఉత్పలి మాడపాటి భాన్మరూవు 2135 కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై 1954

విమర్శ న్నూల్తిశ్రీ 2141 కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై 1954

ఆంధ్రసాహిత్యము: హాస్యము వనంతంావు రామకృష్ణరావు 2145 కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై 1954

రసదృష్టి నంజీవదేవ 2151 కిన్నెర; సంపుటము 6, సంచిక 8 ఆగస్టు 1954

శరశ్చంద్రుని స్తీ పాత్రలు వాసి రెడ్టీ సీతాదేవి 2157 కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954

ఏంటన్‌ చెఖోవ్‌ పాఫెనర్‌ వాదిమిర్‌ ఎర్భిలోవ్‌ 2163 కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954

సి. నారాయణ రెడ్డిగారి గేయ నాటికలు డి. రామలింగం 2167 కిన్నెర; సంపుటము 6, సంచిక 9, సెప్టెంబరు [1954

విషయ సూచిక్ష ॥ 204 శరత్‌బాబు గొలెపాట్‌ వంకట నుబ్బయ్య 2177 కిన్నెర: సంపుటము 6, సంచిక 9, సెప్టెంబరు 1954 ఒక అజ్జాతకవి +" వాస్‌ రెత్ర్‌ రాధాళ్ళష్ణ 2189 కిన్నెర: సంపుటము 6, సంచిక 10, అక్టోబరు 1954 కొ్‌న్ని కావ్యలక్షణాలు పారనంది జగన్నాథస్వామి 2190 కిన్నెర: సంపుటము 6, సంచిక 10, అక్టోబరు [1054 ముట్లవారిమీంది మజికొన్ని చాటువులు తిమ్మావజ్రల కోదండరామయ్య 2204 కిన్నెర: సంపుటము 6, సంచిక 11, నవంబరు 1954 మన రచనా శిఖరాలు మనూనా 2215 కిన్నెర: సంపుటము 6. సంచిక 11, నవంబరు 1] 954 రస శ్తక్తి హ్‌మకో 22109 కిన్నర: సంపుటము ర, సంచిక 12, డిశంబరు 1954 ఎర్నెస్ట్‌ మామింగ్వే కుని కృష్ణ 2224 కిన్నెర; సంపుటము 6, సంచిక 12, డిశంబరు 1954 కప్పులు - సంఘాఖివృద్ది కొండూరు నరసింహాచార్యులు 22209 కిన్నెర: సంపుటము 6, సంచిక 12, ఉిశంబరు 1954 భారతదేశ నాటక సాంప్రదాయాలు 2235 కిన్నెర: సంపుటము 6, సంచిక 12, డిశంబరు [1954 ఒక అజ్జాత రచయిత్రి నాయని కృష్ణమమారి 2247 కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 నవల - ప్రధానాంగాలు న్వూర్లిశ్రీ 2257 కిసెర; సంప్తుటము 7, సంచిక 1, జనవరి 1955 మను చరితము - మార్క్మంచేయ స్పరాణము కిజార: సంపుటము 7, సంచిక 1, జనవరి [1953 సంన్బృతటాపకముంమి - ఖభాణవుు వెచ్యుదుటి శ్రీనివాసాచాద్యులు 2287

10 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 ఆలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2295 కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎన్‌. శాస్తి 2319 కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 స్సు మధుబాల - సమీక్ష బి. ఆదిలక్ష్యమ్ము 2327 కిన్నెర; సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 జర్మను సాహిత్యంలోని కొన్ని ఘట్టాలు వి. ఎన్‌. శు 2345 కిన్నెర: సంపుటము 7, సంచిక 1 జనవరి 1955 హిందీ వాజాయము కామాక్షి రావు 2358 కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 ఆంధ్ర వచన సారస్వత స్వరూపము బొజ్జా రాధాకృష్ణమూరి 2369 కిన్నెర; సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 సాహిత్య శాస్త్రం సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు 23860 కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955 సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎన్‌. శాస్త్రం 2402 కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫ్మిబవరి 1955 కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు 2410 కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫిబ్రవరి 1955 . ఆంధ్రమున వాజ్మయ విమర్శ కేతవరపు వేంకట రామకోటి శాస్త్ర 2435 కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫిబవరి 1955 గురుజాడ అప్పారావుగారు శ్రీపాద గోపాలకృష్ణమూరి 2447 కిన్నెర: సంప్పుటము 1, సంచిక 5, జూలై 1949 గురజాడ అప్పారావు రమణా రెథ్ఞి 2453 కిన్నెర: సంపుటము 5, సంచిక 4, ఏప్రిల్‌ 1953 గురజాడవారి వ్యాసచంద్రిక పౌఠనంది జగన్నాథ స్వామి 2461 కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954

విషయ సూచిక ౫641 గురజాడవారి వ్యాసచంద్రిక: విమర్శకులకు సమాధానం అవనరాల నూర్యారావు 2469 కిన్నెర: సంపుటము 6, సంచిక 10, అక్టోబరు 1954 శృంగారము - గురజాడ అప్పారావుగారు రమణా రెడ్డీ 2479 కిన్నెర: సంపుటము 6, సంచిక 11, నవంబరు 1954 గురజాడవారి బహుముఖప్రతిభ రమణా రెడ్డి 2485 కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫ్రిబవరి 1955 నన్నెచోడ దేవ దేశికవి (క్రీ.శ. 828 - 882) బేవమళ్ళ కామేశ్వర రావు 2490 కిన్నెర: సంపుటము 7, సంచిక 4, ఏప్రిల్‌ 1954 నన్నెచోడ దేవ దేశికవి (క్రీశ. 828 - 882) బేవమళ్ళ కామేశ్వర రావు 2513 కిన్నెర; సంపుటము 6, సంచిక 5, మే 1954 నన్ని చోడ కవిరాజు జి. వి. నుబ్బరామయ్య 2541 కిన్నెర: సంపుటము 6, సంచిక 2, ఫిబ్రవరి 1955 ఏరిన ముత్యాలు 25409 ప్రజాహృదయం 2741 శీర్డికల సూచిక ౫౪ రచయితల సూచిక ౫|| ముఖ్యపద సూచిక వ.

జీవత చరిత తాాంద్రణాలలి? ల్లి బహుముఖ ప్రజ్ఞాశాలి అల్‌ ణో పందిరి మల్లికార్జునరావు 4 ౧111101600 (105 క ల 0. అలౌజమండ్రిలోని ప్రముఖ వ్యాపార 2౧01 ౪66:2౧౧&, & ౧0౧౧6౧1 వేత్త, పరోపకారి అయిన పందిరి వీరన్న 04510653గ4&౧ 2౧6 ౧౧||2౧1౧౧౦౧|5+ ధనమ్మ దంపతులకి పదిమంది పిల్లలు - 2౧6 0౧౭౧౭౧౫౫౧4, &2 00౪౧16 ₹/0గ౫ ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మా ౧౭|2౧గ౧౧౮౧౮౧/ ౧46 18౧ 0౧1660. ౧౧/6 యిలు. వీరిలో తొమ్మిదో సంతానం మల్లికార్డు ౪6/6 00/9 2౧6 ౧౫6 ౮5. 7౧6 ౧1౧౪౧ నరావుగారు (1903-1981). మల్లికార్జున 0 06గ ౪౭౩ [/411%4గ6౧౭ [౧౬౦ (1903 రావుగారు 1903 ఏప్రిల్‌ 9వ తేదీన పుట్టారు. 1981). ౧12411142గ4౧4 ౧4౦ ౪/28 00గ ఆయన విదాాభాగసం రాజమం(ిలోనే 9౧ 9” శం/| 1903. 16 91646166 &1 ప్రబోధాలచే ఉలేజితుడెన మలికార్లునరావు [00 42116466౧4 ౧౬౦ ౪43 1౧50166 అప్పటి యువకులందరిలాగానే స్వాతంత్యు 0౫ 106 1920101౧05 0" 64౧౮౧. ౬16 &॥|| సమరంలోకి అడుగుపెటాలని నిరయించు (౧6 ౫౦౪1౧ 0 6 రేజ/, ౧6 6601666 10 కునా?రు. ఖదరు ఉద మంలో పాలానాలని 101౧ 106 18660౧ ౧౦౪౭గ౭౧1. 116 హిందీ నేర్చుకవాలనీకూలా అనుప్‌న్నారు. (౧0060౧1 0% ౧4౧౦104608 1౧ 6 “ గగడరరడగ? గొంం8గాం౧! 2౧౮ 10 1647౧ డే సమ లో టి లి రయం ఉపమా రత చ్యమం (1061. 04/౧౩ ౪౧098 రేజ/5, 1101141 చేందుకు మోతీలాల్‌ నె ౦ వ క 1160704 04౧06 10 గ౭40౧6౧6౧/ 10 566 వచారు అప కః భీలాల వలన 1౧6 1గ౧|౭౧౪౧|1౬౪౮౦౧ ౦0 8 గ౧౦౧- లచ పయన ప లాల మల్లికార్జున ౦౦0౦౧6410౧ గ౦౮౪8గ౧6౧1 సీ&1|164గ4౧4 రావు ల గా ఉన్నారు. ఈ పరిచ గిం 16515166 ౧|౫ 66౧౧౩ 106 ౪151౬ క బ్రకార్డునరావుగారిని ప్రభావితం గ| 206౪441[౧0142౧06 1౧301766 ౧1౧ ఎంది. సే 06గ న మారి మోతీలాల్‌ న హూ 116 ౮601066 10 168400 &॥140&0461 దళ శ్రంల్‌ స్వాతంత్య్యాద్యమంలో గగ 101% 106 6660గ) 5160916 ౪౧౮6 ల టం నిశ్చయించుకున్నారు. కాని (౧౩ ర్హ6ఇ౧౦6 ౦1 40114 సీం0ల. ౧6 అంజూబలా చూసుకుంటున్న తల్లిదండ్రులు. 28 రేం654041 ౪౧606౯ ౧1౩ 601100 తను స్య్వాతంత్య్యు సమరంల పాల్గొనడానికి ౧౭8౧18 ౪౦౮16 20౪ ౧1౫ 10 16 ఒప్పుకుంటారా అనే సంచేహం కలిగింది 2౧6. ౫6 ౪౬౧6610 8౦ 10 4202046

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్జునరావు 201/ మల్లికార్డునరావుగారికి. అందుకని ఇంట్లో 1000౪1 1౧10౧౧౫1౧9 2౧7006౪7 &ఇ౧61 ఎవరికీ చెప్పకుండానే అలహాబాద్‌ వెళ్ళా 514160 ౧15 |04గ౧౪/ 0౧ & 010/016. ౧101 లనుకుని, ఒక మెకిల్‌ మీద అలహాబాద్‌ 06100 2016 10 084 106 ౧6౬41 0 26 బయలుదేరారు. అనకాపల్లిడాక వెళ్ళాక 500౧ ౧6 1210196 ౧64 ఉగిడగ&04!11. ఎండకి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. ౧౭౦౧|6 ౧6000౧1266 ౧|| ౬5 చుట్లూ చేరిన వారిలో కొందరు ఆయన్ను “౭612౧౧45 50౧” ఇగిరే 0౧040901 [౧1౫ “వీరన్నగారి అబ్బాయి'గా గుర్తించి, ఇంటికీ 040% ౧౦౧౫6. గీగంగ00[౧1౧0 10 గగం౪ ౧19 చేర్చారు. విషయం తెలుసుకున్న వీరన్నగారు 500'59 6౧౧౧౮5125౧) 2౧౮6 6601510౧, కొడుకు ఆలోచనలను ప్రోత్స హిస్తూ 66౯20౧౧4 +*౧016 ౧6౬౧1661 న్‌ ననగ నట ౭00/60141606 ౧19 500 4౧6 5601 [1% 60 ఆయన్ను రైలుల్‌ అలహాబాదు పంపెంచారు. [౧౭౦౭66౫ (౯౭౧. [44460608 [4౦ అప్పటికి మల్లకార్డుసరావుగారి వయస్సు [19 ఇం 0౧౫ 19 ౪62/5 016 1౧6౧. నం. డీ! గీ!!2%౧2026, 6౧౦6౧ 106 అలహాబాద్‌లో మోతీలాల్‌ మార్గ 9౮1౮2౧౦6 0104014141 1౧1640100౧ ౪41 దర్శకత్వం, ఆనందభవస్‌లో రాజకీయ. [6 0116 0011004! 1646615 & శి౧2౧౮1 నాయకులమధ్య వెలుగుతూ స్వాతంతుగ్థ 8౬౪2౧4౧6 ౧|$ 1౧౦6౭966 6౦6156 సమర విశేషాలు తెలుసు కోవటం, హిందీ |౧ (106, సీ11180౧6౧& గడ౦'5 భాషలో పావీణ్యం సంపాదించటం 8౧1649125౧) 1౧6౪౫ ౧౦ 000౧69. 041 మొదలైనవన్నీ మల్లికార్డునరావుగారిలో ఇ౭ఇ8 1౧6 [౧6 ౪06౧ 116 ౧41౦౧౬| ఉత్సాహాన్ని పెంచాయి. అదే సమయంలో 186613 6601166 10 ౧౧01851 116 ౪1811 ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాకకు నిరసన తెలుపాలని 01116 ౧|౧౦౪ ౦0[౪/2169. 441148గ402 భారత జాతీయ నాయకులు నిర్ణయించారు. గం &|90 ౬గ|౦108166 1౧ 16 001651 ఈ నిరసన ఉద్యమంలో మల్లికార్జునరావు &౧6 ౪89 27765186. [42142060౧౬ గడ౦ గారు కూడా పాలొనాారు; అరెస్తు ౪౬5 1౧6 15[06౧390౧ [0గ ఉగ౧6014 10 అయ్యారు. ఉత్తర భారత బేశంలో జరిగన 06 4765160౮ 1౧ ౪౧6 ౧౦111021 గం౪6గ6౧1 రాజకీయ ఉద్యమంలో అరెస్టు అయిన తొలి 1౧ గంగ౧ 1౧౮14. 0౦౧ 141 00025100, [౧6 ఆంధధుడు మల్లికార్జునరావుగారు. ఈ ₹825 12166 10! ౧౪౦ 2౧6 ౧411 ౧౧0౧౪౧౩. సందర్భంగా రెండున్నర నెలలు పైలు శీక్ష ౧ 06103 1016 0౫ 18 19806619 121 అనుబవీంచారు. దక్తీణ భారతదేశంలో “౧6! [౧౭౩ 10 06 ౧౦౧౮|౭గ266 1౧ 8064 జహూంద్‌ ప్రచారం చేయాలని నాయకులు. ౧62, ౧9 ౦2౧౭ 020% 10 గ౧4౭౧గాంగి6గ౧/. చెప్పడంలో ఆయన రాజమండ్రి వచ్చారు. [16 ౪౭5 96౧ &॥ 7065100 9080110౧ న రాజమండ్రి వచ్చినప్పుడు ఆయసకు 86. 56౧10 1646965 146 "2౧0౮416 యు ౧44494౧౫ ౧4౧1౪16 ౪/6100గాఆ6 2గ6 అఖండ స్వాగతం లభించింది. టంగుటూరి 0165566 ౧1౫. (ప్రకాశం పంతులు మొదలైన రాజకీయ (ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికి, ౯/0౧ గిడిడగిగాంగిరేగి౧ ౧6 ౪6౧1 10 ఆశీర్వదించారు. తీ5క5డగ) 10% 9086461౧00 ౧౧౮1. [6 ౪/29 క ల ట్ట లల ఎ ఆం0% 10 గ౭|4౧4& (066 &౧6 హిందీ ప్రచారానికై రాజమండ్రి నుంచి. (066 ౧౦౧౭. ౧6 00౧1౧066 10 అస్సాం వెళ్ళారు. అక్కడ ఆయనకి ౧1010216 1౧ 16 ౧౯౦2౯2౧9 01 106 మలేరియా రావటంతో తిరిగి రాజమండి. ౦౧౮8౭58 ౬౧6 10 1౧6 501926 01

౧/1 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము &: సాహిత్యము వచ్చారు. ఆ తర్వాత కాంగెసు కార్య ౧1౧౮1. గ6౦౧|౪ 11౧6 . రం/౧9౭౦4| క్రమాలలో పాల్గొంటూ, హిందీ భాషావ్యాప్తికి ం9[౧గ౧౧౮నగ 194701 111౧61 1/0 ౧1౧౧. కృషిచేశారు. దుర్గాబాయ్‌ దేశముఖ్‌ 064౧1౧00 1౧056 64౫/5 5/1 [12660471 మొదలైనవారు ఆయన దగ్గర కందీ గీగిగడం6/౧౭)౧/& 512166 116 ౪0౪24120౧4 , నేర్చుకున్నారు. ఆ రోజులలో మద్దూరి రంగా. (4211 నజ 002 (ం 1252 అన్నపూర్ణయ్యగారు “యువజన సమితి" కన! | 21 ల వా గ ప్రారంభించారు. అందులో మల్లికార్డున $55120 0 1౧౭ ర్ర౦౮|౧ ని లల చల గ౭౧౫/ ౧౧౦౫౧4౧౩. [౧6 21140186 1౧16 రావుగారు కూడా సభ్యులు, తర్వాత శో క్‌ ౫/౦౪1) 0౫ ౧19 ౧౦౪/6గ౮6| 80660069 4౧౮6 కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. 07060౧1 58006121 ౦00౧౩౦|0౪9౩౧౪58 &౧౮ యువకులను ఆకట్టుకునేలా మాట్లాడి, ్మ్య్న/6౧659 10 (06౧. 16 00౧౧౮66 ౧౩ వారిలో సాంఘిక చైతన్యం కలిగించడం, (0/19 (10౯ 116 50/6&64 01 14110061 హిందీ భాషా ప్రచారం మున్నగు 12004206. 1౧6 520016 04/66 06 15 కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమితికి ౧౧౮౬౧౫8 06౪0౧6 05816 &౧6 0/966 కులమత వ్యత్యాసాలు లేవు. 1౧1600౧౩. " ఉభయగోదావరి జిల్లాలకు కాంటగెస్‌ 16 00౧౪౧౮౪6 16 9/00"8గ8 01 కార్యవర్గ సభ్యుడుగా ఉండి, కాం(గెస్‌ 8 00౧3855 6౧1016౧1 28 106 కార్య[క్రమాలు'సమర్ధంగా నిర్వహించారు... 8౫60641౫౪6 ౧౧6౧౧౦6! ౦ 00) 1౧6 ౬851 తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగెన్‌ ఇ౧6౪/6816064౪4/ 61511065. 16 ౪౭3 కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. &160 116 560/8180/ 0 ౪6 ౦0౧౫659 కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో 00౧౧166 0౬451 ఉ౦0644/2గ. 1౧ 0౧6 మహమ్మదాలీ ఉపన్యాసాలకి తెలుగు 0 6 ౧/09/2గ5 2 గ౭న౧206౬, ౧6 అనువాదకుడుగా ఉన్నారు. _ 201664 48 (06 172౧5120 10% వుల్లి కార్టున రావుగారు కాం(గెస్‌ గగ0[0[42గ౧౧గ౪6 గీ|॥'9 ౧౮౪0110 5069601639. సభ్యుడుగా ఉంటూనే రష్యా విప్లవాన్ని ౪/0౧16 00౧1౧౮61౧౩ 1౧ 0౦౧౮౧౪55, గురించి, సోషలిస్టు వ్యవస్థ గురించి చదివి గ%2111%6204౧4 ౧4౦ 646 200061 116 ఉత్తేజితులయేవారు. సోషలిస్టు, కమ్యూనిస్టు ౧౮5812౧ ౧8౪016410౧ 2౧6 1౧6 50014151 సాహిత్యం ఆయనని విపరీత గా !060100/. ౧6 ౪/29 |౧గ౦6౧౦౪౮ 0౫ (౧6౫. ఆకర్షించింది. తాను చదవడవేకాక, 3500141131 2౧౮ ౦0గ౫గ౧౫౪౧|91 11811416 అందరితో చదివించేవారు; వాటిని అనువ ౧9866 10 ౧1౧౫ 9[000)/. 16 2190 దించే వారుకూడా. మద్రాసు వెళ్ళినపుడు గొడరేం 016/5 (986 1)6గ. [౧6 6౪6౧ లో టక గ 14౧5141866 90౧౭ 0 (168గా. (ప్రవఎఖ కవ్య్యూనిస్థ్రు సింగారవేలు ౧41411162%౧60౧&4 [౧4౦ 6౪5606 10 గ౧66'౪ చెట్టియార్‌ని కలిసేవారు. పుచ్చలపల్లి ట్రం 6౦ ల 9౭౧47916 6౧610/. & ౧6౧0౪౧60౮1 సుందరయ్య మొదలైనవారు తరచుగా (ంగగా౧|51 162606, ౪౧6౧6౪6! ౧6 మల్లికార్జునరావుగారిని కలిసేవారు. ఇవన్నీ “౧; ' [ గవమనిటన పొలీసులు 1920లో వం ఇ ౪15166 1126045. న౧4౦౧౭|&౧4||| ప ౯ ఇల్లు ర్ర్వగ౦డ/8)0/4 2౧6 006/5 ౪560 10 ౧౧6౭1 సోదాచెసి చాలా పుస్తకాలను స్వాధీనం [4121120608 ౧౭౦ 9606౧. [101101౧0 చేసుకున్నారు. 1930లో శాసనోల్లంఘన _ 210, 1౧ 1929, 106 ౧01109 (16066 ౧|$ ఉద్యమంలో పాల్గొన్న మల్లికార్డునరావుగారు [౧0౮0586 2౧౮6 106౧6 గ4౧౩/ 00015.

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్జునరావు ౧06/1 పోలీసుల హింసకి గురయ్యారు. [కమంగా గ1211164206౧4 ౧4౦ ౪48 4 ౪10110) 01 గాంధీమార్గంపట్ల, కాంగెసు పార్టీపట్ల 0106 10గ6/6 &%16! 061౧0 265166 10 ఆయునకి నవ్య్శుకం తగ్గిపోయింది. 41010406౧0 1౧ 0౧0/| 6159006618గ066 శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత ఆయన గొం౪ంగాం౧[. 6౯166481 ౧6 9121861 కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరారు. 105100 [4110 1౧ 16 642౧౮౧|&౧ 1935 నుండి 1938 వరకు తూర్పుగోదావరి ౧|౦090[౧౫ &౧6 1౧6 ౮౦౧౮౭9౩ ౭గ0/. జిల్లా కవ్యూనిస్టుపార్టీ కార్యదర్శిగా శీ!1[6! 16 01/1 6150066116౧006 పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్యగారిని ౧౧౦౪౭౧౧౭౧1 ౧6 01౧6౮61 116 ౦౦గాగాలగి151 (ప్రభావితం చేసిన వ్యక్తులలో పందిరి £4గ0/ 25 2 గ౭౧౦6|౧. ౧6 ౪/0౧/1666 &8 మల్లికార్టునరావుగారు ముఖ్యులని “పందిరి 1౧౪560/612ఇ0/ 01 1౧8 ౦౦గ౧౧౫౪౧1౩1 ౭గ౫/ మల్లికార్జున రావ్చ జీవిత రేఖాచితం' 0 ౬491 6064&౪72%| 6158101. 14౧5. పుస్తకంలో ఆ. రామలక్ష్మి గారు రాశారు. ౧౫8గ౧౭౫|8౧50గ| ౪౧౦169 1౧ [౧6౧ 000% “౭౧౮16 21116206౧4 ౧4౦ -- శీ [౬16 1936లో వివిధ ప్రాంతాల నుండి 5868100” 41 [14116464౧4 [౧4౦ ౪౬5 వచ్చిన సుమారు నలఖై మందితో ఆంధ (౧|| ఇగాంగం్ర (056 ౪/౧౦ 1౧౦6౧౦౭౮ సం క ప నమత 0౧21202411 5600౧622)౧/4. వు న క వల, 1౧ 1936, [44116400౧4 [౭౦ ౪85 గాంధీ అహింసా విధానం" వల దేశానీకి 0౧6 ౬౧౧౦౧౮ 1౧6 40 ౦66 ౧4౧1010405 స్వాతంత్య్యుం రాదని ఆయన భావించారు. 0౧ 4| 0౪6౯1౧౮1 10 ౧౭౬గ1౦10216 1౧ 106 విష్ణవవాది దరిశి చెంచయ్య భావాలు, జీ[౧౮౧[4 50014191 ౧౦౦౧198౧06. ౪6 1811 ఆయన నవ్విన బాంబుల మార్గం ౧౧41 09 006౧1౧/ ౪౦౮౪16 ౧6౪౭! 1౧ మల్లికార్జునరావు గారిని ఆకరించాటు. 1౧69౧6౧౮6గ౧౦6 ౪/00 9 ౧గ౧౦|౧|89 01 విపవవీరుడు బగత్‌సెంగ్‌ బావాలకు కూడా 9౨9౧9౪53 2౧6౮ (౧69 ౧౦౧-౪1౦|16౧౦౪ వీరు ప్రభావితులైనారు. క్రమంగా కమ్యూనిస్టు 640011౧6 01 6ఇ౧౮౧|. 106 166249 01 పారీ నిషేదానికి గురి కావడంతో ఎందరో 04గ5 0౧6౧౦౧౭౫౧4, 16౪0161004 ౧/, లు శ ణం 2౧0 ౧015 6౫1160౧150 42640166 వక ౧లక్సి వెళ్ళిపొవాల్సిన తన రల 1/1211142గ60౧24 ౧౬4౦ 1౧౧౪౧56౫. 802941 ఆశయం కల్పించారు మల్సికార్లునరావుగారు. 51000, 1౧6 16౪/014800040/ 1686౧6, &180 ఇ.ఎమ్‌.ఎస్‌. నంబూద్రిపాద్‌ కూడా వీరి 1౧6౧1౧66 ౧|౧%. 4౪/1౧ 16 040౧ 0౧ ఇంటో అజాతవాసం' చేశారు. గతంలో 00గ౧౪౧|5| ౧౭గ/ ౧౧౪ ౦1 19 16466౧3 " ఒకసారి పోలీసు నిషూకి, పోలీసు సోదాకి 726 1000 లగి౮గరోంటగ6. '421 1206౧2 , + ॥ &0 2౪69 506116! 10 ౧౭౧౫ 960 గురయిన మళ్లికార్జునరావుగారు, ఆయన ౧6౦౧18. ౬043 [12౫9౪6౧౧౭౦ ౪/29 0౧6 ఇల్లు మల్లీ పోలీసుల దృష్టికి వచ్చాయి. ఇగాంగిం్ర 106౧౧. త1/946/ గగ 41114266౧౭ ఒక దశలో ఆయన కూడా అజ్ఞాతవాసం [౧౬౦ 1౧౪|166 (116 116 0 16 ౧౦108౭ &౧౮0 చేయాల్సి వచ్చింది. 1౧6 ౧85 ౧41605, 0౧౦6 2041౧ రాజకీయాలలో చేరిన తొలినాళ్ళలో [42౭11206౧2 ౧4౦ 4120166 16 ౧0106 ఆయన భావాలకి, రాజకీయాలలో చీరిన. 2గ6౧1౦౧. 7౧6/6 ౪89 & [౧౧6 ౪౧6౧ ౧6 దశాబ్దం తర్వాత ఆయన భావాలకి చాలా [౧|౧86|/ ౧౬6 10 ౮౦ ౪౧౮6గ౧౦౪౧6.

న. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము తేడా ఉంది. 1920లలో మోతీలాల్‌ నెహూ 08/6 ౪85 & 10 01 06116౧9౧06 వూర్గదర్శాకత్యంలో రాజకీయాలలో 061466౧ ౧15 [0625 ౪౧6౧ ౧6 101౧66 రాణించాలనుకున్న మల్లికార్జునరావుగారు. 109 ౧౦11105 4౧6] ౧056 & ర౭౦266 1216౧. 1930 తర్వాత జాతీ యోద్యమూన్ని స14111642%060౧4 ౧౬౦ ౪/౧౦ 1౧000౧1 1౧ దనవంతులు నడపరాదని, కప జీవులు 1920, 0 64661103 10 20103 6౧౮6 నడపాలని అనుకున్నారు. గాంధీ మహాత్ముడు 108 ం41042006 01 1011141 80౧౬, తొలిసారి రాజమం ్రీ వచ్చినప్పుడు జరిగిన. ౧069011౧ 1930 1౧4 110 10% ర॥౦66 ళల ం ౧౦ 0౮1౦6 1౧6 ౧4|౦౧4||51 ౧౦౪౭౧౧6౧ విద్యార్థి మహాసభల దాగా ఉల్తేజితుదై నం 5౧00416 06 166 0 16 ౪౧౦౫౭౧౩. రాజకీయాలలి ప్రవేశించిన మట్లికార్టునరావ్లు గగీ2111%0206౮౧2 గ4౦, ౪౧౦ ౪/28 గారు, తర్వాతే కాలలల గాంధీ సిద్ధాంతాలతో 1౧౧౮౦6౧౦6౮ 0 1౧6 5046460౧ 1%6661౧05 విభేదించి కమ్యూనిస్టుగా మారారు. అయిలే. గంం 1412028192 6206౧౩ 1/31 ౪ ఆయన _ఎచశలోనూ తు సమ్మిసదానిని 10 ౧౭౭౧గ౮౧6౮౧/, 1218! 61167986 ౪/1 ఆచరించడానికి వెనుకడుగు వేయలేదు. 64౧6౧14౧ 10601007 2౧6 14/౧66 & కవుంగా కుటుంబ బాధ్యతలు 00గాగాంగి!5 [046౪6౯41౧౦ 51106 ౮6106 పెరగటం వల్ల, రాజమండ్రిలో చేపట్టిన ౧8౭ ర౦ 040% 0౧ 1౧౧౧|6గ౭౧1౧౦ ౧౬1 వ్యాపారం దెబ్బతినటం వల్ల ఆయన ౧౭ $70౧౮౫ 06116౪66. కుటుంబంతో సహా 1938లో మద్రాసు జీ5 106 ౧65800౧510111185 01 1౧68 చేరారు. ఆ తర్వాత ఆయన (ప్రత్యక్ష 12010 97౪4 &౧6 116 0051065595 21 రాజకీయాలల్‌ క్రి రాలేదు. కానీ 1048ల గ4|2౧గ౧౧౮౧౮౧/ 1646 10 [0956839, [౧6 ౧౬6 కిన్నెర పత్రిక స్థాపించి, ఆ పత్రిక ద్వారా (06౧౧15 12౧1 [0 142012 1౧ 1936. ఆంధరాష్ట్ర నిర్మాణం, లబ్ద రాజధాని, 2198 ౧6 ౧6౪౭౯ ౦4౧6 1౧10 &0౪/6 ఆయీ సమయాలలోని రాజకీయ పరిస్థితులు 0011005. 1౧ 1948 ౧6 912566 116 మొదలైన వాటిమీద తన భావాలను సంపాద ౧౭౩221౧6 గగ౧గ౭/౧౫౩ 2౧6 1౧80000 ౧15 కీయాలల మల్లికార్డునరావుగారు వివరించే 66110/1215, ౧6 6౫౦౦౮౪౧666 ౧15 166245 వారు. 0౧ 18100105 [46 10గ4౪0౧ 0" 4ఉగ౦౮౧౧1 మల్లికార్జునరావుగారీకి సాహిత్యాభిలాష 51116, 19 020141 ౬౧6 06౯౦ ౧౦114041 మెండు. చిన్నతనం నుంచి పుస్తకాలు 1గ౧౦గ౧౦౭ ౦1 1౧056 [౧౧6౩. విపరీతంగా చదివేవారు. రాజమండ్రిలో ఉన్న గ2|1162%040౧4 గడం *28 ౪6౧/ 10౧61 కాలంల్‌ ప్రతిరోజు గౌతమి గ్రంథాలయానికి 0111614049. ౧9 ౪566 10 [986 1001 ఎళ్ళవారాయన. బంధువులు, తల్లిదండ్రులు. 0౦83 19010౧ ౧19 ౦0౧॥6౧౦౦6. ౪/౧6 ఎమైనా కొనుక్కోమని డబ్బులిస్తే వాటితో ౧6 ౪/45 26 గిజి2గ0గ౮౧06౧/, ౧6 ౪866 10 పుస్తకాలు కొనుక్కొనేవారు. పుస్తక సేకరణ ౪1511 ౦411౧ ఓ10/42౧/ 6౪6౧/౦4). తన జీవితకాలం కొనసాగించారు. సుమారు ఇగ౭౧ల6౭ ౧19 ౧46౧159 0/ 61/68 లక్షా యాఫఖైవల పుస్తకాలు సేకరించి తన 9౭౪౮6౧1౧ గ౧౧౦౧౪/ ౧6 ౮86౮6 10 [౧౪౧4౦1 (గ్రంథాలయంలో భద్రపరిచారు. తను ర్య/ 00019. ౧6 00౧1౫066 ౧19 ౧౬|| చదవడమే కాదు, తన వారికి కూడా ౮ 00180400 000%58 (117060[౧0౪1 ౧1౩ పుస్తకాలు కానుకగా ఇచ్చేవారు. నాళం 118. ౪6 00॥90166 2౧0౪౧౮ 0౧6 2౧6 కృష్ణారావుగారి నుంచి మల్లికార్డుసరావుగారు. 12౬1 116) 0% 000%9 2౧౮6 ౧'656౧/6౮

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్జునరావు ౫01% (గ్రంథాలయోద్యమం గురించి తెలుసు 16౧0 1౧ ౧ 10[40/. గ6 ౧౦1౦౧|/ 1686 కున్నారు. 000[8, 041 4180 0||166 1౧6గ 10 ౧15 రాజకీయాలలో త్రీరిక లేకుండా ఉన్న ౧6౦౧16. [421112౧6౧౬ ౧4౦ 168/౧ కాలంలో కూడా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గం 0 9 020 ౧౧౦౪౪౧౧౭౧1 [౧0౧ గారి సంపాదకత్వంలో వలువడే ప్రబుద్ధాంధ్ర ఇడ గగ50౧౬ 1౬0. . (క్రమం తప్పక చదివేవారు. కాశీనాథుని 1౧9౧116 01౧15 005)/ 6౧౭96౧౫౪౧1 నాగేశ్వరరావు పంతులుగారి భారతి, 1౧౧౦111039, ౧6 (669612/)/ 656౮6 10 16206 అయ్యంకి వెంకట రవుణయ్యుగారి ౧9 ౧49౬2౧6 '౧౯౬౦6౮౦౮౮౧2౧060/4), ఆంధ్రభారతి, కౌతా శ్రీరామశాస్తింగారి ౧6015066 0౪/ 5/0264 560/20040/2 సంపాదకత్వంలో వచ్చిన శారద కూడా 3290)/. ౧౭2150 ౮56610 ౧946 '60౬/21 ఆయన చదివేవారు. తెలుగు పత్రికలే కాక, 0 గ&510౧200064౧| 1120654212 గ్‌జ౦ ప్రతాప్‌, ఆజ్‌ మొదలైన హింద్‌ పత్రికలు ౧4౧14|౮, 'ఉ౧060!4 8౧444౪ 01 గి౧/24౧|| కూడా చదివేవారు. కేవలం ఆ పత్రికలు 6౧212 గి౭గా 2౧౭/౬ 944, &౧౮ చదవడమే కాదు, వాటిని అనువదించేవారు; 527262 ॥ ౧౮౦1150౧66 ౪4౧౮6 106 ఆ పత్రికలకి రిపోర్టర్‌గా కూడా పని చేశారు. ఆ౮110[9[10 01 గంళ4& 5గ/202 54510/. సావర్కర్‌ రచించిన స్వాతంత్య్య పోరాటం ల ౧౦1౦౧) "626 ] 61690 ౧౧౫౦2౧౦౩, వంటి (గ్రంథాలు చదివేవారు. ౮|| 250 /11౧౮| గ౧)ండ2|౧65 1146 '౧4(10 40౧6] “గి2|'. 116 142౧514166 90౧06 01 116 మల్లికార్డునరావుగారు రాజకీయాలలోకి గడ16గ4|8 +0గ౧౫ కగు. ౧6 6౪6౧ అడుగుపెట్టిన తొలి నాళ్ళలో విప్లవ ఇ0గ486 ఇ & ౧6౧౦౧6! 10% 1౧056 సాహిత్యం ఆయన్ని ఆకర్షించింది. ఈ ౧౪౧౦౮1౦415. 44111206౧2 గడం ౪56౮ సాహిత్యం ఆయన్ని కమ్యూనిజం వైపు 10 [16886 00019 146 '౧౮6౧౭౧౮౦౭౧౦6 నడిపింది. వీరి ఇల్లు పోలీసు సోదాకి 5160016 0౫ 542474042౧. గురయినపుడు స్టాలిన్‌ రాసిన ప్రోబ్బమ్స్‌ 1౧ 16 64౧౫ 64/5 01 ౧15 [0/4 ఆఫ్‌ లెనినిజమ్‌, (టాట్‌్సస్క్‌ రష్యా విప్లవ . క స 800 (5 చరిత్ర, గాంధీ హిందీ స్వరాజ్‌, తోరూదత్‌ 1౧10 0111105 ౧6 4/25 డి ౧2018 డగ ల కం 1౧౧46౧౦6౮౦ 0 16ఈ01610040/ 16(21416 సావాత్యం స్వాధీనం ఇ సుకున్నార్రు. 50 గ౮౦౧ 10820 ౧6 06904గ%6 కాల్టగెఎ క్‌ు సరిపడక కమ్యూనిస్టు ౦౦౧౧౫౮౧191 ౧105611. 4/06౧ ౧15 ౧౦౪56 పార్టీలో చేరారు. తీవ్రవాదం ద్వారానే గ "216066, 000% 16 '£/0018౧9 01 స్వాతంత్ర్యం సాధించడం సులభం అనే [601015గొ 0 54411౧0, ₹/0(66/9 “౫15100/ దరిశి చెంచయ్య భావాలకి కూడా ఎరు (్మిక5|1౧ [6౪౦1410౧ “11౧0 54272] (ప్రభాపితులయినారు. ౩వలం స్వాతంత్ర్య ల 4౧60106 1162216418 070౧) 011 సమరోత్సాహమే కాకు సాంఘిక సంస్కరణల _ ం/8౦౦౧౧9౦2166. ౦1 ౧౭౦౧౦౫ ౪10 6 గురించి కూడా ఆయున తీవంగా ఇజం ౦0! 16 00౧౫౧౪55 ౧6 01౧66 116 ఆలోచించేవారు. అప్పటికే కందుకూరి. గ౦గగా౦౧|5( నగ). 7౧6 1064 1౧41115 వరేశలింగం వంటి సంస్క ర్తల ప్రభావంతో 8౭86 10 &ఇ0[018౪6 1౧౮౭౧6౧౮౭౧౦6 0౧౫ రాజమండ్రి సగరం ఉత్తేజితమై ఉంది. చదివే. 1౧/౦66౧ అ/6గ౧|5గ) &5 (016 0౫/ 02&గ5| సాహిత్యానికి పరిసరాల (ప్రభావం కూడా 0౧69౧౦౧౭౧4 [౧౧౧౪9986 ౧1౧ ౧౮౫౦౧. తోడై, తన భావాలను ప్రతిబింబించేలా ఒక [16 000011016౧ 0506121 610/9

య! పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము శ: సాహిత్యము పిక నడిపెంచాలనుకున్నారు. సాహిత్యపు 2౧025 /70గ 1౧౮6౧9౧౮౭౧౦6. 8౫ 1౧6౧, విలువలతోను, సాంపుక చైతన్యం ౧4)20౧౮౧౮౧/ ౫25 6౮౧6౦6? 86/10609 కలిగించేదిగాను ఆ ప(తికను రూపొం 1౧1౮6౧౦6 ౦ !610గ౧|513 116 గడ౧రంనం॥ దించారు. అదే 'సుబాపి*. ౪66/65211002గ. 4/10 ౧6 800121 స్ట గ౧౧౫|||6౮ ౦౦గ౧౦౪౧6|౧0 1౧6 6[౭౦101 ౧15 సుభాష్‌ ప్రారంభ సంచికలో *.... (9261౧00, 44111642%06008 ౧4౦ 10640001 సారస్వతము, కళ, చరిత - ఈ మూటి ౧౧1౧౩ 2 గ౭ర్ర22106 40100౧ ౪౦౮16 రూపంగా తెలుగు హృదయాన్ని [8601 ౧19 (౧06901 ౧౧౦౦655. [16 వ్య క్తీకరించటమే మా ఆశయం” అని $/000౧(20041[2 6౦౦102! 560౧45// తెలియజేసిన మల్లికార్డునరావుగారు ఆ ౪110౧ 116/205/ ౪414669 50 1౧41 1 020 మాటలు నిలుప్పుకున్నారు. శ్రీయుతులు 0/100 800141 24266౧1౧00 1౧ 960౧16. విశ్వనాథ సత్యనారాయణ, చిలుకూరి 1౧ ౧6 |౧4260౪6౧4| (553646 01 వీరభ్యదరావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్తి, 56002350/ [42142006౧౬ గిం ౪౯౦66, శ్రీపాద సుబహ్మణ్యశాస్తి9, వేటూరి ప్రభాకర “౧౪౧ 1౧16౧[00 15 10 6౫౧౧655 006 మ. ల ౨౫ ॥| శాస్తి మొదలైన పండితుల రచనలను [61090 ౧౪౫, 1౧౧౦౪౩౧ (౧/౭6 (౧1౧౦౩ సుభాషి ద్వార తలుగు పాఠకులకందించారు. *2 11672419, ఇ &2౧౮6 ౧1510౧7, ఇగిరీ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర ౧6 గం1 ౧19 రం [ ంకిగి ౧|5 శర్మగారి రచనలు కూడా సుభాషిలో 02022 6 6 0069౧010 ౧6 61౮౮౮ 466౧3 1౧6 ౪౦౧౫4౩ 0% 9000129 166 కానవస్తాయి. 1927 అక్టోబరులో 1542020024 520/420౧4౯౧4274౧4, ప్రారంభమైన సుభాషి కొద్దికాలంలోనే (౧||0౧ *86/20%26/4 గి౭౦, ఆగిపోయింది. అప్పటి దేశకాల పరిస్థితులు 8/0264 గంగ౧2గ410౪/ 529107,

  • పరాయి పాలనలో అణచివేత విధానాలే కగ౧&64 54020౧2౧ 5251/ 2౧6 ఇందుకు కారణాలు. ఈ కొద్దికాలంలోనూ ౪౭16| ౯/2004%2/2 5298(౧0/. ౪/0గ5 01 వారు తెలుగు పాఠకులకు చక్కని 106 ౧1510140 [%14112గ0411|
  • సాహిత్యాన్ని అందించారు. 50గ%8256604%[4 54౧౧౬ ౬006466 1౧ క్‌ ం 565/%౧45/౧/. 565౧25౧/ 88851196 1౧ . సుభాషై ఆగిపోయినా సా వాత్యాభిలాష 001006! 1927 2౧6 ౦00౧40౧666 10! & ఆయనను విడిచిపెట్టలేదు. కాని ఇబ్బందుల [0గ [16 2౧6 ౪49 3100066. 7౧6 వల్ల కొద్దిగా మరుగున పడింది. ఆర్థికపరమైన 6,షఇ/10% 1౧ 16 002౧6 2౧6 16 ఇబ్బందులు, పిల్లలు కలిగి బాధ్యతలు 0౧౧655౫6 ౧౭ 01 1౧6 0618౧6౧3 పెరగడం మొదలైన కారణాలతో 1938లో *ఇ6/6 16 [౧649008 9060106 | 801 సకుటుంబంగా వమదాసు చేరారు. ఒక ౪/1010 జ! 500 661100౧, ౧౪ 00416 దశాబ్దం గడిచింది. ఈ లోగా రీటా 07100 16 0651111614 10 16 ౧9401 . తయారీతో ఆర్థికంగా నిలదొక్కు కున్నారు. 0116 7616006 19206615. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. 0000౧ 565౧425౧/ 8100066, 1౧6 పరిస్థితులు చక్కబడడంతో సాహిత్య 10౪610? 116౧2118 ౧అ/౭౯౮656గ66 ౧౧. మపియులైన రావుగారు తిరిగి పత్రికను 110౧ 100% & 020% 5641 0602056 01 గురించి ఆలోచించారు. ఫలితంగా 1948లో 0/16! ౧౧౦016౧5. 0646 €0 *౧4౧౦|2| కిన్నెర ప్రారంభమైంది. [00169౧5 4౧6 1౧06251౧00 12౧౧11

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లిార్దునరావు ౫0061 కిన్నెరలో ఆనాటి ప్రముఖ సాహితీ [169000910॥1163 610 , ౧6 95౧1166 &|0౧0 వేత్తలవే కాక, అప్పటి వర్థమాన రచయితల ౪0౧09 12గ|%/, (0 సీజ2రగ25 1౧ 1938 గీ రచనలు కూడా ఉన్నాయి. శ్రీయుతులు ౮8౦౭68 6120966 1640౧40116, ౪1 బూపతి లక్ష్మీ నారాయణరావు, నేలటూరి 1[€ 980666100౧ 01 ౧1 ౧6 000616 వెంకటరమణయ్య, జమ్మలమడగ మదవ 5051410 1104౧01414 ౧18 00౧|06/9౧ రాయశర్మ, కవికొండల వెంకటరావు, విద్వాన్‌ ౧౧౦౦6౪5586 ౪6|| 1౧ 161 6660410గ తీ3 1౧69 91144000 1౧౫౧౧౧౦౪6౮, 106 10౪6! విశ్వం, తిరుమలరామచంద్ర, శ్రీశ్రీ, శ్రీపాద 0116021009 10౧ 11411144! న్‌ క్త 146౧4 [౧4౦ గోపాలకృష్ణమూర్తి, నిడదవోలు వెంకటరావు 514166 1౧010%41౧09 01+ 514గ11౧ & తూమాటి దొణప్ప, యస్వీ జోగారావు గాడం్రడ2106 0౧౦౪ &941౧ గం & ౧95011 సాం రచనలే కాక, వాసిరెడ్డి “44౧6౭” 512166 1౧ 1౧6 ౪94" 1948 బతాదేవి, నాయని కృష్ణకుమారి, సి నారా ణే యణరెడ్డి వంటి అప్పటి వర్థమాన రచయి ష్య గ్గని ర్‌ ౧౦ 0౯ (౧౦ 6౫౧615 శత 0/0౧౫|51౧0 తల రచనలు కూడా ఉన్నాయి సుభాష్‌ లర్టగగ౧66 0౧ 1౧6 16164 01 116/21/9 రచయితలు కూడా కిన్నెరలో పాలుపంచు. (్యిగ|| ౨1406 1౧ గ౧౧౭౦/ గి!0గ౧0 ౪10 కొన్నారు జానపద వాజ్మయం, యక్ష (౧౭ ౪0౧౧5 01 8006081 ఓ2%50గా| గానాలు, నాటకాలు, బాల సాహిత్యం, స్త్రీల గి&ఇ/2౧& గి8౦, 161210% 6౧౬41 పాటలు, హాస్యము, పదాల పుట్టుక, లిపి గ౧౭గ౫4౧౭)౫/&, త౮4గ౧౧౫౭|8గడ6౬9& మొదలైన సాహిత్య శాబలన్నిటిని కిన్నెర [126042౪2 ౧౬/4 54104, గడ/1గ0౧ర214 స్పృశించింది ప్రాచీనుడైన నన్నెచోడుని /69౧గ414 గ౧డ౦, ౪|644*420౧ ౪1584%/2గొ, వివరాలు, ఆదునికుడెన గురజాడ విశేషాలు 11౯6408414 గ౭గాజ౦[౧4౧౮6/4, 5% 5%, కిన్నెరలో సవము(ప్రాదాన్యం పొందాయి కం ంర౭ంండ రం నం మార్కండేయపురాణం, మనుచరితల నం గత ల. (1 4 పోలికలు - భేదాలు ఈ పత్రికలో నిష్పక్ష ౪261666౪ 5 ( క క్‌ 7514 06౪1, సజ/ం20! గగ900౧4 పాతంగా చర్చించారు ప్రబంధ యుగంలోని లగ, 0 గ122/2౧4 గొంరం౫/ &౧6 ఏ జీవన విధానం, ఆదునిక యుగంలో 0||౮| ౪౧౦౦గ౫|౧౦ ౪౧166 ఈ 16 1౧6 స్త్ర్రల జీవన విదానం గురించిన వ్యాసాలు |$౦ &0౧6౬!66 1౧ 4౧185 (0గ 6 పారకులను ఆలోచింప జేస్తాయి రచయితలు 50/5/౧25// 0౧0600 &180 ౦0౧1006166 తమ అభ్మిపాయాలను స్వేచ్చగా వెల్లడించ [౧8/8 గ/౧౧౭/2 10600066 ౪౧౦౧ 1౧6 టానికి కిన్నెర ఒక వేదికగా నిలిచింది నన్నె ౪4౧౦౮5 0/400069 01 11641479 146 చోడుని గురించి టేకుమళ్ళ కామేశ్వర ౯0141118/2414/6, *2జక5080డ089, 0౯4౧౫౬, రావుగారు రాసిన వ్యాసాలను జివి సుబ్బ 00॥618౧'9 118౧4146, 90౧08 0 ౪106 రామయ్య గారు అదే పిక ద్వారా బండిం *౪౦గ6గ౧, ౧౮౧౫౦౧, 9౪/గ౧౧౦|౦౮౫/ &౧౮ చారు నాయని కృష్ణకుమారిగారు రాసిన 30/01, ఆ య 25 0 |06 ఇగి010౧| కశ సన | ౪౧16౧ 166 [4౧౧6౦౧౦౮౦4 &౧ కొన్ని తలుగు పదాల పుట్టు పూర్వోత్తరాలకి (60481464 0 1౧09 182991 ౪౧65 ౪68 బులుసు వెంకటరమణయ్య గారి నుంచి గగ 6648! 50806 2౧6 1౧౧౧౦గ౬౧౦6 ఖండన ఎదురైతే, రమణయ్యగారి వ్యాసానికి క్రణ4165 2౧౮ 6168౧౦65 06466౧ స్పూర్తిశ్రీ నుంచి పప్రతిబండన వచ్చింది. [42౧4౬౧౮662 న౮౧2౧2౧ &౧6 [14౧౪ అలాగే గ్మొరెపాటి వెంకటసుబ్బయ్య, 0[%4/1/2 ౪6/6 6180608566 1౧ 16

10041 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము శేతవరప్పు రామకోటి శాస్త్రిగార్ల మధ్య గాడం్ర౭2106 41౧061 ఇగ 0125. శీగ10165 వ్యాసరూప సంవాదాలు (చర్చలు) కిన్నెరలో 200౪61 106 111650/169 రో 0గం౧ (1 కనిపైసాయి. ఇవన్నీ సాహిత్యాభిలాషులను 1౧6 ౧|204౧6౧4 ౧6౧౦౮ 25 ౪౬ న అలరింపజేసేవే కాదు, ఆలోచింప చేసేవి ౧౧౦౮6గ ఇ06 ౪6/9 [1౧06౮౦౧(0/0౪011009. య ₹౧6 గొడర్రడ2106 ౪౭3 2 10040 101 86 కూడా. ఈ విధంగా ఖండన, (ప్రతిఖండనలకు 6౫065510౧0 01 16 ౪165. 5558)/5 అవకాశమిచ్చిన కిన్నెర సాహెత్య ఆర 2900061! 14౧౧6౦౧౦౮4 ౪౧16౧ 0౫ వేదికగా ఉపయోగించింది. కిన్నెరల ని ₹660గ2|12 గడగాం5ళ/2/4 [౧80౦ ౪816 చైనాలో నవ్య సాహిత్యం, జర్మను (౧౦1266 0/ 6 5600024/2గ2)0/2 1౧ సాహిత్యం, జపాను నాటక కళ విశిష్టత ౧ ్క%0 ౧౭౮౭21౧6. ౧6 66/౧౧౦10౫ మొదలైన వ్యాసాల వలన ఇతరదేశాల |౮౭గ౬|౧ 61064 40/65 29 ౧౮౦15066 సాహాత్యం, కళలతో తెలుగు వారికి స గం! గగం0ండ గంగా౭గ 064 12% పరిచయం కలుగుతుంది. కిన్నెరలో తెలుగు 0౯81654 ౪6౧౧౬12 గ2గా2౧2)0/2. జానపద విజ్ఞానమే కాదు, హిందీ జానపద _ క౧౧గ9గ'5 00౪౧168/0గ(౦15గ౫ 0౧ 16 వాజ్మయ విశేషాలు కూడా కన్పిస్తాయి. ౧౦గాగాంగి18 0 ౧౭౫౫౭౧౬౫౭౬ 6౧ కిన్నెర పత్రికనే కాక, కిన్నెర అకాడమీని 1010౪66. 0604168 1౧ (౧6 +ంగా 0౦! కూడా మల్లికార్జునరావుగారు ప్రారంభించారు. 6552)%/5 061౧496౧ 60౭౧౬4 ౪6౧౧౭14 ఇందులో సాహిత్యంమై వుధావృలతో 54008౧/2 2౧౮ గ612౪4/2006 ౧౭గ౬గ౦ ఉపన్యాసాలిప్పేం చేవారు. శ్రీయుతులు 525810 24130 420౧౧౭౭౧౪6 [౧ 1౧6 గిడుగు సీతాపతి, పాలగుమ్మి పద్మరాజు, ౧౧౭922౧9. ౧656 4/86 ౧౦1 1౪51 కొడవటిగంటి కుటుంబరావు, విద్వాన్‌ విశ్వం, &గ౫౮51౧0 1౧6 10౪6౯5 01 1192046 041 నిడదవోలు వెంకటరావు, నార్ల వెంకటేశ్వర 2150 గ౫౫66 1౧6౧ (౧1౧౬. 0౧63 రావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, తీత: 0౧0౪161౧00 & 002006 10 0110150 ఇగిరే ఆరుద్ర, భూపతి లక్ష్మీ నారాయణరావు, 60౪8౧16౧౦౧1116159గ, గగగ6౧2 ౪/25 చిటూ6 స తగృనారాయణ, శ్రీపాద ౪561041 29 & 1116/20/ [10౧1౧ 10! 6౮60416. గో పాలకృష్ణ మూరి మొదలెన వారెందరో ఈ +4/1 (౧9 ఇగ10169 1౧ (1002 యింట (116 వల రా ౧౪౪ 11164046 1౧ 1౧48, 66౧౭౧ కార్యక్రమాలలో పాల్గొనే వారు. కానీ 1116710479 4౧౮6 6 &గ ౦1 614గ2& 1౧ నష్టాలతో నడిచె కిన్నెర _ప(త్రికని డన8గ, 616., 61604 [8826615 ౪/66 కొనసాగించలేక 1955లో ఆ ఎయాల్సి 6౫00566 10 1116/4214/6 2౧6 219 01 వచ్చింది. పత్రికతో పాటే అకాడమీ కార్య 01౧౪? 006౧169 100. 01 1451 6164806 కలాపాలు కూడా [క్రమంగా ఆగిపోయాయి. [0141162148 0641 661219 ౦1 6 52గ06 సాహిత్యాభిలాషులు తాము చదివినంత ₹0గ) 111061 00౪164 2190 ౧6 ౧1806 1౧ మాత్రాన తృప్తి చెందరు. ఆ సాహిత్యాన్ని గగ౧౧౭|౧. పదిమందికి అందించాలని ఆరాటపడతారు. గినిజ/1 [0౧ 16 ౧6గ౦౮1౦2|, మల్లికార్డునరావుగారు కూడా ఈ భావాలకి 12౧6౮౧౭ [౭౦ 2150 6510115060 &౧ మినహాయింపు కాదు. నాహత్యాన్ని అందరికీ 202606౧౫ ౧౭౧౭౮౦ గ/౧౧౭/. 16 ౮66 అందించాలనే ఉద్దెశంతో ఇంటింటి 10 &గ౭౧౮6 16014189 0౧ 1161810416 0 విజ్ఞానమాల ప్రారంభించారు. ఇతర భాషా అ(౧6గ9. 6160064 512084, ౯౭|8౮గ౧గ౫| సాహత్యాల్ని తెలుగులోకి అనువదింపజేసి న6౧౧౭|2|, గంరేజ౭1ం2౧6 కంగార02

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్దునరావు 30061 ఇంటింటి విజ్ఞానమాల ద్వారా తలుగువారికి. [౧౦, ౪16480౧ ౪19420, [/16046424/01౪ అందించారు. కిన్నెర బుక్‌ డిపో (ప్రారంభించి ౪6౧%412 [౦, [డగ 6౧%81654/4/& తలుగు పుస్తకాలు అందరికీ అందుబాటులో గడం, గ! 2112౧౧౫౬11 50౧8966088 ఉంచేందుకు ప్రయత్నించారు. 54గ4, 5/1 5%, శిగ6/8, 8060411 తెలుగు భాషా సమితికి ఫౌండర్‌ [42%50గ| 12౯౧22౧2 ౧౬౦, 601401 మెంబర్‌గా మల్లికార్డునరావుగారు సమితి 540/204/2)/2౧2, 5/104&604 10౧4|& అభివృద్దికి కృషి చేశారు. సమితి సాంస్కృ గగంగిగిడ [40/0 2౧6 ౧౧౭౧౫ గొం౯6 తిక క, కార్యేచర్శిగా కూడా పని చేశారు. ౧811010411066 1౧ 906061 ౧౧౦౭1౧౮5. ల ల 1046౪76౯ ౪౧4౦16 10 5691210 ౪6 ఆ సమయంలో నెలకొకసారి పండితులతో, 105365, 06 గా౭రం౭2|౧6 ౧౬6 10 06 ఆయా రంగాలలో నిష్టాతులయిన వారితో (0866 604/1 1౧ 1955. ౧6 2011163 ఉపన్యానా లిప్పెం చేవారు; వారికి 50 0( 16 20466గ౫ 4190 062566 రూపాయలు పారితోషి కంగా కూడా. గఇర4జ. ఇచ్చారు. తొలి ఉపన్యాసం ఎర్పాటు చేసిన ॥ | సందర్బంగా మల్లికార్జునరావుగారు అన్న 1౧౦56 1౧16869196 1౧ 11162149 ౪||! మాటలివి: “ఉపన్యాసకులు పరిశ్రమించి ౧౦1 06 గ౭9౧౮ ౪/10 ౧౧౭6 6261౧0. పడిన ప్రయాసకు, కృషితో గడిపెన కాలానికీ ₹౧6/ ౧106 10 ౧౧౫౧౦ ॥ 2౪212016 10 ఈ పురస్కారం చాలా తక్కువే అయినా, [లో ౧౧౦8. [211200౧2 [౧౦ 19౧౦ తెలుగు దేశంలో ఇట్టి సంప్రదాయం 6౫0801100౧. ౧ 4 ౪16౪/ 10 0/1009 ప్రారంభించిన తొట్లతొలుతటి ప్రయత్నం 11167219 10 6౪9౧ ౧౦౮౩6౧0౦16, ౧6 ల న; 514/5166 “1౧40 ౪0౧40౧8 స!412” తెలుగుభాషా సమితిదె....” ఆయన (6౧0౪/166096 (0 ౯౪6౧/ గం౧౧౪). ౧6 ఆవిధంగా అన్నారు కానీ, ఆ కాలంలో 50 + రూపాయలు తక్కు ప్రమీకాదు! మొటమొదట &౧౯౬౧౦66 (2౧9140౧5 ౦0 ౪౦౫49 [0౧ సలటూరు వెంకటలమణయ గాడ మదుర 0106 12౧౮468965 &౧6 ౧466 106౧ . థ్‌ ల. 2412016 160680౧ 1015. ౧6 1666 10 త ఇజామూ ర నాయక షి నాటి 0/౧9 000163 10 6౪6౧/౦౦ర)/9 220% 0౫ మీద వంలీప క అందుకున్నాడు. 0060109 గ/౧౧౭౦/ 900% 0౭౧౦1 క క్‌ / గక 1౧6 106066 గాంగా౦6౧ ౧8 లం అతి విస్తృతంగా వస్తున్న ఆధునిక ౪0066 1042169 106 6౮6౪610౧గ౧౭౧1 6! విజ్ఞానాన్ని తెలుగువారికి అందించాలన్న గరం 80౧2504 52011. ౧6 22౧966 తపన మల్లికార్జునరావుగారికి చాలా [్రగ69 03000116 2౧6 6౫౦౭గ8 10౧ ఎక్కువగా ఉన్నట్లు కిన్నెర పత్రిక ద్వారా ఒ/069 116109 ఆ6౧/ గాంగ 2౧6 4౪౮6 ఆయున అందించిన వ్యాసాలవల్ల ౭౧ ౧౦౧౦౧౫౧౮౦౫ ౦౧5. 50 10 16౧. 0౧ తెలుస్తుంది. సాహిత్యం, రాజకీయాలు, 280002510౧ 01106 1౧51160106 01 116 చర్విత, సైన్సు. ఇతర దేశాల విశేషాలు 8౭౧65 [42114200౧4 గ&౦ 5216, “501 మొదలైనవెన్నో ఆయన కిన్నెర ద్వారా 8 8గంగం &౧6 1౧6 1016 9021686 0౫ తెలుగువారికి అందించారు. కేవలం వ్యాసాల [8 అ(6గే9, 1016 50గ 18 ౧౦ గ౧౧౬(౦౧. ద్వారానే కాక, ఇతర పత్రికలలో అచ్చయిన ౬౪8౧ 16౧ 761606 854904 52/11 అనేకాంశాలతో పాటు, శాస్త్ర సంబంధ 12469 1౧6 61661 0 01౪109 2౧ విషయాలను కూడా ఏరిన ముత్యాలు శీర్దిక [౦0౧౦౭౧6౧ 108 18 11 [006 1౧ 416

100/4 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము కీ: సొౌహిత్యము ద్వారా అందించేవారు. ఆంధ్రదేశంలోని 294...” [౧0౮౪౮౧ ౧6 541650, ౧5.50 అన్ని ప్రాంతాలకూ సమప్రాధాన్యం ఇవ్వడం 4485 ౧౦1 5౧౧౬|| 9౪4గ) [౧ 056 64౫/9. చెప్పుకోదగిన సంగతి. తెలంగాణా నుంచి 1౧6 75. ౧6౧90౧ 10 6౭1/6 జె 1601476 వచ్చిన సుజాత పతికలోని కొండాపురం 2౧౮ [806/8 106 ౧౦౧౦౧౭గ౧6౧) ౪8 5/1 గిథిలాలు అనే వ్యాసాన్ని ఏరిన ముత్యాలలో [1014140504 ౪6౧1414 గ౭౧౧౬౧౭గ/౬. ౧6 చేర్చడం ఇందుకు తగిన ఉదాహరణ. 10010 ౪89 “5006106గ 11641416 ర6గ౧3 1౧6 6618౧ 0 ీడ6ర6[2 2౧|2౪౯0౧6 నవజీవన, భారతి, మురళి, స్వతంత్ర [౫14 ౧19/౪”. క సాభాగ్యం శీ[110195 4౯160 0% 1121120402 విజయవాణి, ఉదముని మొదలైన పత్రికల 120 9) 1౧౮10416 ౧ (009 రేం5/9 వా ణు 0 04౧00 106 6౪6! 6౧౬౧61౧౮ గ౦౮6గ నుంచే కాక, సోవియట్‌ యూనియన్‌ టాబ, మర 10 1౧6 7610004 192666 ౧6 అమెరికా వార్తా వాహిని, ఆసియా మైగాన్‌, 0006001106 16406౧5 01 గ౧౧౭/ ౧౬౧౫ సోవియట్‌ భూమి మొదలైన పత్రికల నుంచి 100109 1116119721, 0011109, ౧51004, విదేశీ సమాచారాన్ని కూడా ఏరిన ముత్యాల 5018౧09, 1౧16గ౫౭|౦౧౬| గ౭గ6/5 &౧౮6 80 ద్వారా తెలుగువారికి మల్లికార్డునరావుగారు. 0౧. &ం&గ (10౧ 16 &గ110165, ౧6 ౪566 అందించారు. 10 001601 9|64౧|1౧౦౩ 1౧0౧౫ 01౧6౧ మల్లికార్జునరావుగారు నిరంతర విద్యార్థి. ౧౮510210౧5 2౧6 ౧౧౧౬ 06౧ ౮౧౮6! ఆయన పుస్తకాలు చదవటమే కాదు. అనేక (౧6 11116 “౬1౧4 1160/416” ౦ ౮౦|16801606 భాషలు మాట్లాడగలరు కూడా, తెలుగు, ౧61౧15. శిగం(౧6/? 164146 ౪౪౦గ౧ ఇంగీషు, జాందీ, ఉరూ, తమిళం, ౧౧6౧౪౦౧1౧౮ 15 116 04140౧06 1౧ 3/00 సంస్కృతం, అస్సామీ, బెంగాలీ, ఒరియా, 6604! [౧౧౦గ4౧౦6 10 4|| 116 ౧6010౧5 పంజాబీ, గుజరాతీ, మరారీ, కన్నడం, 0116 51219. గీగి 9౫౬గ౧|6 ౧౪౧౧409 15 గురుముఖీ భాషలు ఆయన నే ర్చుకొన్నారు. (౧౭ ౧౮0110860౧ 01 &౧ ౬11016 0౧ 1౧16 కేవలం పుస్తక విజ్ఞానం కాక, ప్రపంచాన్ని ౮1౧8 0 గంగిర2౧6? 0/19|౧౭||) చూడాలని ఆయన అంటారు. అలాగే 0 వగం6 1౧ 16 ౧౪గ౦౮|౦4| '50)814 శ్రీలంక, ఇంగ్లండ్‌, యూరప్‌, అమెరికా, (0గా | 62౧౮౭౧౬. కెనడా, హవాయి, జపాన్‌, హంకాంగ్‌, ౮౧౮6౧ 16 56/68 “6౯౧1౧౬ కంబోడియా, థాయిలాండ్‌, సింగపూర్‌, [00/210”, 116౧09 [0గ) ౧౦౬౦0౧1 6140౮ మలేషియా, బర్మా మొదలెన దేశాలు ౧౭/10010215 1119 2౪724) 66౪4గ౧2, ఆయన సందర్శించారు. పుస్తక సేకరణ 8౧226, 116/4, 54212002, శగ౧౮[౧1 అంటే ఆయనకి ఎంతో ఇష్టం. జానపద $12012, గిర గ/2 గ?20[౬, గగ50౧౬ వాజ్మయంలో 15 పేజీల నుచి 30 పేజీల న(గ౧|44, 54414, ౮/12/2౪౧1, ౮రఖ/౧| వరకు ఉన్న చిన్న చిన్న పుస్తకాలను ఆనాడు ఆ10., 041 2150 10౧౫ 1౧(9గ౧౭|౦౧౫| అమ్ముతుండేవారు మేల్టికార్డునరావుగారు 801095 116 50౪161 ల౧|౦౧, 1453, కక = యల్లుకొర్ట తీగింగం& ౪4గ2 ౪40౧1౧1 గీ512 5410900, అలాంటి నసకాలను 00 150 కలిపి 850౪16[8%0గ 610. ౪68 1౧౦1౮666. ఒ ౧క౦గా ఎవౌలు. పుస్తకంగా చేసినవి 65 వ. $4211162౧04౧2 గజం ౭5 2౧ 6167)! దగరుండేవి. నాయని కృష్ణకుమారిగారు 504690 1016091 "6461౧00 00015, ౧6 గి ణ్‌ "000416 90646 1౧ ౧౫౧౫ [2౧8౪౦౬069. ౧6

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్జునరావు 004 బిరుదురాజు రామరాజుగారు మల్లికార్డునరావు _ 16801 74168964, ౬001150, ౧1౧౮1 అగ, గారి దగ్గరున్న ఈ ప్పస్తకాలను తవు 4గ౧|గ౧), 5420560510 గికఠ4గ|, 86౧0081, పరిశోధనలకు ఉపయోగించుకున్నారు. 0గ//౭, గ౧)80), 64౧20, 42042014 మల్లికార్జున రావుగారి మరణానంతరం ఈ గడ౧౧డ౦4, 2౧౦ ఉం/06౧1651. 6 5216 పృస్తకాలను వంద్రాసు ప్రాచ్యలిఖిత ! 07౧౪ 90౧0616 586% [౧౦౪6686 ౧౦1 న ల ౧౧౫ [0గ 00085 5061 4150 1/00) 106 ప్పస్తకాగారానికి ఇచె ఎశార్శ, ఇతర ల్ర(/8 ౪0గ6. 50 ౧6 ౪1511864 000౧165 పుస్తకాలలో కొన్ని రాజమండ్రిలోని గౌతమి [1౭ 5% ౬2౧౪౬, కాం్ర2౧6, 641006, (గంథాలయానికి, సుందరయ్య లైబరీ గిగాంగ౦ంష, 010౧464, ౧44%, 20౬0, (హైదరాబాద్‌్స)కి ఇచ్చేశారు. (10౧360౧0, 04గ00614, 7౧౭12౧6 సుభాష్‌, కిన్నెర పత్రికల సంపా క5!004100/9, 1412/9514, 2౧6 36౧18, దకులుగా మల్లికార్జునరావుగారు ఆయా 610. ౧6 1166 00॥60041౧8 &౧౦ ౧6461౧0 సాహిత్య శాఖలలో నిష్ణాతులయిన వారి 12102010 016 500%53. “౧6 00160196 ల క్లే 06౪1 16గ ఫంయ54064 010 5800%1819, నుంచి వ్యాసాలు గ్రహాంచి ప్రచురించారు. బగ 1010 30 ౧28౪౩ ౦0౧1౧1౧౮ 101% కిన్నెర అకాడమీ ద్వారా సాహిత్యాభిలాషులు |18౧[|6. ౫6 0416001266 187 1౧10 ఒక చోట చేరి జావ వినివవుయుం 65 ౦౮౪౧666 ౪౦4౧౧6౩, 6౭౦౧ ౪౦14౧౧6 చేసుకోటానికి అవకాశం కల్పించారు. ౧0౧141౧1౧8 100 10 150 00011219. గీగ తలుగు భాషా సమితిలో వివిధ హోదాలలో 2౫16౧81 ౪2164016 0011601100 0౧ ఉండి సాహిత్యాభివృద్ధికి కృష చేశారు. +61౪1341014:101. 50[01ఇ/3 146 8/26 ఇంటింటి విజ్ఞానమాల ద్వారా అందరికీ గగ5గిగ4 గంగొాడగ 2౧౮ 9116064410 సాహైతం౦ ఆందించే ప్రయత్నం చేశారు. గ2గా& [| ౮౩66 16956 ౮601604009 అనాటి ల దశాబ్‌ మానులో కసపస్తున్న 10/ 61 ౧9056200. గం? 1౧6 66౧౫156 శ యథ జ గ [రే 0 441114౧6౧4 ౧౬౦, 1656 000%9 భాషాభిమాసం, శాస్త్ర జిజ్ఞాస, పఠనాభిలాష్క, ౪/86 60౧8166 10 ౭ 0౧౪౧14! ౬10/40/ రాజకీయ తీవ్రవాద భావాల పభావం 0/[|౭౧౪5౦(06 1౧ [1206/29. ] ౧౭ 01౧6 ఒక్కచోట కెం్చదీకృతవె పందిరి 00౦౦౪ 1౧ ౧౩ 10/20 ౪68/8 9/6౧ 10 మల్లికార్జునరావుగారిలో కనపెస్తున్నాయి.. 0412౧10110 ౫ ఏిజ2గిగ4గం౧/ 2౧6 ఒక్క మాటలో చెప్పాలంటే పందిరి 5ఇగి6జ/ుం ఓ1012%/ 1౧ ౧౧౫౪1026. మల్లికార్డునరాపుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. గీకి 106 66110! 0 ౧౭౧౦౮16415, రాజకీయాలలో పాల్గొనటం, సాహిత్యం, ఈ60/%48// 2౧6 గం౧6/2, సీ4ీ2|162గ64౧ లలిత కళలలో అభిరుచి, సంపు ౧౫౦ ౦౦1 2గ)0185 *గగ6౧ 0 అ(౭గేం సంస్కరణాభిలాష మొదలైన లక్షణాలతో 0% ౪౬10౪9 116169. 1౧౧౦౪౮౧ 16 పాటు ఆయనలో గొప్ప “వాంపార దక్షత గ10౧౧6[4 గం౭0ర6గ00, ౧6 27100696 & కూడా ఉంది. అంఎతో సాలంంలో 100116 10౯ 6౫౦[౬గ౧౦6 ౦0+ 060౧6 కే క నగ 5061౧4696౧ 6౧౧౮518919 011662[4/9. ౧8 గారాబంగా పెరగడం, హై రలు దశలోనే 6౧౮84౪0896 1౧ ౪4/౦౮ ౧4౧౬౦163 10! కాంగెస్‌ కార్టకవమూలల్‌ పాల్గొనడం: (౧౭ 66౪6100౧౭౧! 01 1116౧41476, స్వాతంత్య్థ సమరోత్సాహం, హిందీ [౦౦౦౧ 761094 8085౧4 52గ1. ౧6 బఖాపాధ్య్థయునాసక్తి, హాందీ ప్రచా 0౧00౧1 11620466 10 ౧4౧౫ ₹616006 రోద్యమంలో పాల్గొనడం, యువజన సమితి ౧0౮౪89౧0109, 1౧౦౮9౧ 108 “ఈం00%9 ౧౧౯ మొదవైన సంస్టలలో చేరి సాంపుక క60/ గ౦గాలి 80[06గ6. 106 10౪6 10?

౫06/1 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సంస్కరణల పట్ల ఆసక్తి కనబరచడం 12౧9౮౭౦6, 06/10910 10 00౪, ౧౭5510౧ మొదలైన ఎన్నో కారణాల వల్ల మల్లికార్జున 101 ౧846100, 1౧106౧౦6 01 (6 అగ/8గ౧౧|51 రావుగారు వ్యాపారంలో త్‌ద్ధ చూపించలేదు. 1060100/ ౪6/6 &|| [000586 &1 0౧౪ 1926లో ఆయన తండ్రి వీరన్నగారు ౧1206 2౧6 ౪618 ౧౧౭౧1991 1౧ చనిపోయారు. ఆ తర్వాత కూడా మల్లికార్జున 112116206౧ ౧1౦. "0౧౮6110 0౧౭ ౪/06 రశ 2 టి [14111206౧2 [౧౬౦ ౪/43 & గాం1114061601 రావుగారి అలవాట్లలో పెద్దగా మార్పు లేదు. , కానీ (క్రమంగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ౯/౪. కుటుంబ పోషణకు తగినంత డబ్బు తీం&[1 ₹70గ 1౧౮౦౪౭౧౧౪౧ 1౧ సంపాదించడం ఎలా అని ఆలో చించాల్సిన ౧011109, 1౧19951 1౧ 11192106 &౧౮ 1106 పరిస్థితి వచ్చింది. ఇ&గే5, 561063౧655 1౧ 500141 1610గ/3, 6910., గసీీడ111542గ0౧4 గ౧డ౦ గ౧౬౮ &౧ ఆయనకి వైద్యం గురించి ఏమంత 6౧౦4౧౧౫ 6ఆ[1016౧60/” &25 & తలియదు, కాని అనేక ప్రయోగాల గ్య[గ౧659గాడగి. ౧15 ౧4౧౧౧౪౧౭౮6 ఫలితంగా 1937లో అమృతాంజనం లాంటి ౮౧|11౧౦౦6, ౨4౧010460౧ 1౧ ౧0౦౧౩౪58 'వీటో' అనే మందు కనుక్కున్నారు. దీని 201౪1169 ఇ 4౧ 64౧0౫ 16౪61, 1.6. ౧1౩౧ అమ్మకాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు 30[001, ౧౭౧610410౧ 1౧ ₹6660గ కూడా వాక్రిపం౦ం చాంయు. వాాపొారం గొంళ౭8గ6గ౧ఓ ౧19 1౧16651 1౧ 164111౧0 లాభాలదారిలో ఉంది అనుకుంటుండగానే &౧౮6 50946100 ౧1౧౮6! 12000896, ౧19 "రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ ౦00గ౧|1౧౫౪౧| 10! 800141 ౪౦౫ ౧000౧ యుద్ధ ప్రభావం వీటో మీద కూడా పడింది. 1౧౪౦0౧&౧194100౧9 46 ౪0౪౭4)4౧౭ 52010 ఎందుకంటే దాన్ని తయారు చెయ్యడానికి ౭గిరే ౧౧౭౧) గ౧౦౪ 500% "642580౧5, అవసరమైన కొన్ని రసాయన పదార్థాలు 21 2/02 గ్‌ఇం 0౮16 10 వ గట) విదేశాల నుండి తేప్పేంచేవారు. ప్రపంచ (116196 1౧ 651౧౦95 13 2(06గ 61 యుదం మొదలవడంతో వాటిని విదేశాల 6614004 ౧4౩866 24/4/ 1౧ 1926. 6౯౮6౧ క గ (౧6౧, 11616 ౪25 ౧౦1 ౧౧౮౦౧ 0012006 నుండి తెప్పెంచడం సాధ్యం కాక వీటో |౧౧6 ౧౬౦15. 860146 1౧2౧౦౬ 50240౧ తయారీని ఆపేశారు. “అజంతి కంపెనీ కగంశ(0 9౧0౪ & 6004/04/2/06 ౪9౧6. గి స్థాపించి దువ్వెనలు తయారు చేశారు. కానీ ౭౭6 &/056 10 11౧8 200౪1 116 ౪/5 కుటుంబ పోషణకు అరకొరగా ఉన్న ఈ _ 10 560000గ 116 +2గ|)/. సంపాదన చాలలేదు. బ్రతుకు తెరువు ౧16 ౧6౪౪ 606౪/ గొం౦౧ ఇ0061 వెదుక్కోవలసి వచ్చింది. కుటుంబంతో గంగ్రం1౧6. 801 15 & 60౧56666౧౦6 0 1938లో మాసు చేరి చేయవలసిన గ)డగ౧౫ 661౧౪౧15 ౧6 10౧౧౦186 & వ్యాపారాన్ని గూర్చి ఆలోచించారు - ౧౧66౮1౦1౧6 0 116 ౧౭౧౪ ౦0[౪/610, 51%! ఫలితం కుంతలిన్‌ తలనూనె తయారీ. 10&ిగాగ12౧]40౧. 524169 509406 6౪6౧10 జ 9, (2 రంల నానె ససాలను 9౧0౪100 2౧ ౪౧౪46 16౧6, 16

  • పా దుకాణాలకు _ క్రం00గ6 1/0గ6 ౪/౯ 0106 0౮6 708 తీసుకెళ్ళేవారు. తర్వాత మైకిల్‌మీద ౭/01 ౪29 6౪166౧1 0౧ ౪610 &150. పంపించేవారు. వ్యాపారం పెరిగింది. 50౧6 01 116 1౧8/6616౧15 01 (6

బహుముఖ ప్రజ్ఞాశాలి పందిరి మల్లికార్దువరావు ప. ఇరుగుపారుగు రాష్ట్రాాలకీ, (కవుంగా ౧౧6౮1౦౧6 *౪6(8 10 06 1౧౧౧౦౫6౮. 1౧15 విచేశాలకీ కూడా రీటా అవుకాలు 56024౧8 4 010 ౧౦016౧ 6౮౧౧౦ 106 వ్యాపించాయి. ఇక ఆర్థికంగా ఆయన ౪2౧0౧9. [౪16 5100066 1౧6 0706040600 0 ౪౭10 &౧6 ౦౧6౧66 & 00౧౧౭౬౧౪ 1౧ చెనుదిరిగి చూడలేదు. సెంటు, అగరుబత్తీలు, 9 ౧౭౧౫౪ 0 గీ4౧(4 [0 ౧౧౦౮౮౦౪౭ యూకలిష్టన్‌ ఆయిల్‌, లెదర్‌ మొదలైన 600౧౦8. ₹౧6 6201౧౦ ౪౬9 ౧౦1 6౧౦౪౮౧ వ్యాపారాలెన్నో చేశారు. అన్నిటిలోకీ 10 94000గ 106 18001. & 982700 10! ప్రముఖంగా చెప్పుకోవలసింది రీటానే, [1176100061 ౪౧9౮6౮6. [౧8 58011166 10 అందుకనే ఆయన బంధుమిత్రులలో “రీటా [12625 1౧ 1938 &౧0 5121661 10 11౧% మామయ్య'గా గుర్తింపు పొందారు. రీటా 2000641 & ౧6౪/ ౧6 ౦1 0౧51౧655. 06 [650౮1(౪/43 ౧౧౦6010౧ 0 [గ4౧12110, 116 తెచ్చిన లాభాలు కుటుంబ అవసరాలకే ౧4౦. కాక “కిన్నెర నడపడానికి కూడా 02810 (80 ర00806 + ఉపయోగించారు. సాహెత్య సేవలో 6 డగ డె 6 ౨౭౦౬౧6 ౪౯౫ ౦0౧౮౪14౧25 “గె|14. [౧6 ౪9566 (0 ౧66౮16 పండితులు, రచయితలు ఆయనకి ఎంతగా [8001165 0(1౧6 ౧౭1 ౦11, 801౧9 ౪10 సహకరించినా, ఆయన సాహిత్య సేవకు 2 020 0గ 8౧0౧ 10 5[00. 27౧6౧ ౧6 ఆర్థికంగా మద్దతు నిచ్చింది రీటాయే. 96౧1 16౧ ౦౧ & 010/016. 8451౧655 ఆయన మన మధ్య లేరు కానీ రీటా మనతోనే 9/64 8౧6 807640 10 016౧514169 4150. ఉంది. ౬౪6౧ అంగం 06080 ౧26441. 1౧616 *25 ౧౦ 1!00%100 040% 1౧24౧౦1811. స్త్రీ పురుష విచక్షణ ఉండకూడదని, ర్రం౭గ౧15, [1౧౦6౧58 511045, గ స్తీలు పురుషులతో సవూానవెనని 0॥, 1881067 610. ౪68 4150 6666 10 మల్లికార్దునరావుగారు అంటారు. ఆయన “6 16గ5 5016. ౧|| ౪45 1౧6 46 5010 భార్య మీరాబాయి సబ్‌ ఎడిటర్‌గా కిన్నెర 04౧6. | ౧౧౫౮6 ౧1౧౫ 00౮11 4౧౧౦0౧౮ బాధ్యతలు నిర్వహించే వారు. ఆయనకి 1౧16 7011౪765 &5 1౧6 ౧14 6౧౦16. 1౧6 0113 ౧0౧) 6 84169 ౪6/8 ౪6866] ౧౦ కూతుళ్ళు, కొడుకులు సమానమే. అందరూ గి (0౯ 116 12౧11/ 041 2190 101 16 చక్కగా చదువుకొన్నారు. తన కుటుంబమే [41012106 గ౧౧ం/2. [41016 02౧ 106 కాదు, ప్రతి కుటుంబం అలానే ఉండాలని ౧౭|౧1౯0గా 50[012/3 2౧౮ ౪//1(6/5 10/౧6 ఆయన కోరిక. ఒకసారి ఆయన ఫ్యామిలీ 1116[40౧/ 86[౧/106, 11 ౪28 [౧14 ౪౧1౦౧ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. మద్రాసులోని గ)4౮6 1౧6 381/109 ౧0551016 ౧౧౦౮౭). 50-60 కుటుంబాలను ఆ డిన్నర్‌కి పిల్చారు. 1009 [421114200౧ ౧౫౦ 159 ౧౦ ౧౦/౪ 112 541! 00౧౪౧౮6౩. దానికి భార్య, భర్త - ఇద్దరూ రావాలి! క! . పురుషులు వస్తారు కానీ స్త్రీలు పార్టీలకి [421111206౧ గజం ౪/85 29౬1౧81 రావడానికి బిడియపడతారని ఆయన ఇదరూ 6౪౧౮6? 6౮1980గ0104(0౧ ఇగిరే 9216 ౯౧౦౧ ద్‌ &౧6 ౪౦౧౧6౧ 2/6 60౮6441. ౧19 ౪/16 141/4 కలిసి రావాలని ఈ ఏర్పాటు చేశారు. డ్య 100%66 &గ16| 16 ౪౦౫౬ 46 ఈ౧౧6/2 అప్పటి విద్యాశాఖా మంత్రి మల్లవరపు 1862 509-66110!. ౧6 164166 ౧19 590౧5 కృష్టారావుగారి అధ్యక్షతన ఆ డిన్నర్‌ ఇగిరే 6260201975 60064&||౫/. ౧|| ౧15 జరిగింది. ౦౧||౮6/6౧ 5[461606 ౪/61. ౧6 ౪5౧6౮61 141

_ 00/4 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము మల్తికార్లునరావుగారి ఇంట్లో సామ్య గ౦| ౮91015 12౧1౫ 0612 ౧6 12౧11195 - వాదం ఎలా ఉంటుందో తెలుసు కోడానికి 50౧0064164 ౧౭౪6 ౧౦౪106 0 69664110/ ఒక ఉదాహరణ - వారి ఇంట్లో బీరువాలో 69846100 రంగరంగ. 0౧౦6, ౧6 . ఒక డబ్బాలో డబ్బులు ఉండేవి. పిలలకి 420966 2 61౧౧6? &౧6 1౧166 20౮౧6 డబు*లు అవసరమెతే తలిని, తండ్రిని 60 12గ11165 ౦01 1126౧25. [16 9416 ౪281 బి శ సీ గ్‌ న 0010 16 ౧౮9౦24౧6 &౧6 ౪/6 9100616 అడగవలసిన అవసరం లేదు. అవసర 60గా6. 116 9216 90, 06026456 ౧6 గగ౧6౪/ మైనంత డబ్బు పిల్లలే తీసుకొనేవారు. ఎంత్‌ గ జంగంగ 1014 ౪౦౮6 186! 8[౧౫/1000 తీసుకొన్నారో, ఎందుకు తీసుకొన్నారో ఆ (0౧ 81౧౧6౧. 7౧6 1090 క6000240 డబ్బాలో ఉండే పుస్తకంలో రాసేవారు. * ౪॥౧౧16 5% 12112౪2206 గగంగ౧& ఎప్పుడూ డబ్బులెక్కలలో తేడాలు రాలేదు. గం ౧651066 0౪6/6 6౪౭౧౬. ' తగిన కృషి చేసి ఏదైనా సాధించ [12111420౪౧ గి౭౦'9 ౧౦౮౦86౧౦16 15 వచ్చుననే మల్లికార్టునరావుగారు నాస్తికులు. 2౧ 6౫౧౧౧6 0" ౧౦806 ౦01 9001111550. దేవుని బొమ్మ ఉన్న కాలెండరు కూడా వీరి /10౧6౫ ౮8661 10 06 601 1౧ & 00౫ 1౧ ఇంట్లో ఉండేది కాదు. తన మరణానంతరం 0౧౪ 0 1౧6 0౪4౧004165. /06౧ 6౭ ఏవిధమైన కర్మకాండలు చేయవద్దని 0౧॥|68౧ ౧66౮66 గాంగిల/ 1౧6/ ౧౪6౮ వీలునామాలో రాశారు. ఆయన. కోరినటే ౧౦1 240 10 (0106 2/615 &గిరీ యం ౨ 146 1 1౧6౧561768. 06 2౧౦౮౧4౧ ఏ విధమైన కర్మకాండలు లేకుండా ఆయన 116 ౧64/౧౦౩6 10! ౪౧౧100 1 ౧46 066౧ అంతిమ యాత్ర జరిగింది. 1286౧ ౧6 (10 06 8001666 1౧ ౧౦180001 16/6. 6౪64 61506024౧0

  • చేటూరి రామారావు “క ౧౦1066 1౧) 16 ఇం00640౧19. [1411462గ౧6౧4 ౧౦, ౪౧౦ 061 6/66 (సమాచార నం్యగ్రహణ సమన్వయాల్లో _ [౭| ఇగ్సిగ౧1౧9 0౧ 06 ౦0౧16౪66 ౪11 సమధికంగా సహకరించిన కంచర్ల మాధవికి గ౦గ, ౪49 ఇ౧ 2406156. 0! 6౪8౧ & కృతజ్ఞతలు 02416౧64! ౪/11 & ౧|౦౧౧8 01 ౦6 ౪966 10 09 69 1౧ 1౧61 ౧౦౧౫6. [16 ౪౧౦16 1౧ ౧1 ౪ 41౧౦ 1231 ౧168 9[064106 06 56గ0/౧౭4 &2గ16/ ౧158 ర64€). ౧15 151 104౧76 ౪88 00[660166 ౪౭౧/ గ౧౪౦౧ 2000161౧00 10 ౧159 ౪/159069. = ౧౭4౮౧ న2గ౧2౧౭౦ (7౧౭౨౧46 0 గ౭గ౧౦౧౭4గ4 గోడ0౧2౮ ౧07 ౧౭/0/౧౮ అగం౧5౫/60/ ౧౧ ౦00/60%0౧ 07 “౧౧0౧4౧౦౧ 4౧౮ 00/200/)

ఫీర్రిక్ర కిన్నెర ; సాహితీ స్వరగతులు

1948 నుంచి 1955 ఫిబ్రవరి వరకు కిన్నెర అరవైయేడు సంచికలు వెలవడ్డాయి. వాటిలో ప్రచురణ పొందిన నూట పన్నెండు సాహిత్య వ్యాసాల బృహత్సంపుటి ఇది. వీటి తీరు తెన్నుల్ని సమీక్తించబోయే ముందు చెప్పుకోవలసిన మాట ఒకటి ఉంది. కిన్నెరకు ఏరిన ముత్యాలు

  • ప్రజా హృదయం అనే అనుబంధ శీర్షికలు ఉండేవి. వీటిలో ప్రజాహృదయం పాఠకుల లేఖలకు వేదిక. ఇది సాధారణంగా అన్ని పత్రికలలోనూ నేటికీ కనిపించేదే. ఇందులోనుంచి ఆనాటి పాఠకుల స్పందన లేఖలను కొన్నింటిని మచ్చుకి ఈ బృహద్వ్యాస సంపుటిలోనూ అనుబంధించడం ముదావహం. ఆ లేఖల్లో చివరిది మూల్పూరునుంచి వైతన్యగారు రాసినది. అందులో వారు - నాడు కొత్తగా బయలుదేరిన వచనకవిత రీతికి సంబంధించి ఒక సూచన చేశారు. అప్పట్లో దీన్ని కొందరు గేయంగానే వ్యవహరించేవారు. వీరూ అలానే వ్యవహరిస్తూ, “గేయములకు ఛందస్సు నేర్చరచి కొనిన బాగుండును. ఆ ఛందస్సు పంక్తికి 10,12 లేక 14 మాత్రలనియో లేక అంత కెక్కువయో తక్కువయో ఏర్పరచుకొని, ఆ గేయనామముల (పద్యవృత్త నామములవలె) నేర్పాటు చేసికొన్న బాగుండును. ఇట్లు గేయ లక్షణము నేర్చరచుకొనుట ఆవశ్యక విషయము. దీనిని సహృదయులు గమనింతురుగాక అని నా విశ్వాసము అన్నారు. దీన్ని ఎవరూ పట్టించుకోకపోయినా యాభైఏళ్ళ నాటి ఈ అభిప్రాయానికి ఇప్పటికీ చెల్లుబాటు ఉండటం, అడపాదడపా ఎక్కడో ఒకచోట ఇది వినిపిస్తూనే ఉండటం గమనించదగిన అంశం.

(ప్రధానంగా ముచ్చటించుకోవలసింది ఏరిన ముత్యాలు శీర్షిక గురించి. ఏకాలంలోనైనా ఎంత సంపన్నుడైనా ఒక పాఠకుడు అప్పటికి వెలువడుతున్న పత్రికలు అన్నీ చదవగలగడం అసంభవమే. తీరిక ఉండాలి. అవి వెలువడే వేళకి వెళ్ళి కొనగలిగిన ఓపిక ఉండాలి. ఇన్నీ ఉన్నా మధ్యమధ్యలో ఒక్కొక్క సంచిక చేజారిపోవచ్చు. ఇది గుర్తించిన పందిరి మల్లికార్జునరావు గారు తమ కిన్నెైరలో ఈ శీర్షికను ఏర్పాటు చేశారు. ఇతర పత్రికల నుంచి తమ పాఠకులకు అందవలసిన విలువైన విషయాలను ఈ శీర్షికలో క్లుప్తంగా అందిస్తూ వచ్చారు. అభిరుచి గలవారు

॥| పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము . సదరు పత్రికను సంపాదించుకుని పూర్తి వ్యాసం చదివి లబ్ధి పొందవచ్చు. లేదా క్లుప్తంగా అందిన సమాచారంతోనే సంతృప్తి పొందనూ వచ్చు. ఇది చాలా విలువైన శీర్షిక అని నా అభిప్రాయం. భారతి వంటి ప్రసిద్ధ పత్రికలనుంచే కాక సుజాత, సంస్కృతి వంటి అప్రసిద్ధ పత్రికలనుంచి కూడా వీరు ముత్యాలను ఏరారు. ఆ పత్రికలకు పప్రాచుర్య మివృడమేమిటి అనిగానీ, అందువల్ల తనకు చందాదారులు తగ్గిపోతారేమో ననిగానీ కిన్నార భావించక పోవడం ఎంత ఆరోగ్యకరమైన విషయం, ఎంత అభినందించదగిన విషయం! తన పాఠకులకు జ్ఞాసలబ్బి కలగాలి అన్నదొక్కటే సంపాదకుడికి ఆశయం, ధ్యేయం కావడం ఎంత గొప్ప విషయం! టాస్‌ - సోవియట్‌ యూనియన్‌

  • అమెరికా వార్తావాహిని వంటి విదేశీ పత్రికల నుంచి కూడా ఏరిన ముత్యాలను వీరు కూర్చారు. అంతేకాదు ఏంటన్‌ చేఖోల్‌ గురించి ప్రొఫెసర్‌ వ్లాదమిర్‌ ఎర్మిలోవ్‌ రచించిన మొత్తం వ్యాసాన్ని “సోవియట్‌ భూమి” నుంచి తెచ్చి తమ కిన్నెరలో ప్రచురించారు. తెలుగు కన్నడల చుట్టరికాన్ని గురించి పుట్టపర్తి నారాయణాచార్యులుగారు రాసిన విలువైన వ్యాసం సుజాత పత్రికలోది ఏరినముత్యంగా కిన్నెర పాఠకులకు అందింది. ఇలాంటి ముత్యాలు ఎన్నో ఎంత గొప్ప పత్రిక అయినా గొప్ప వ్యాసాలు అన్నీ ఆ ఒక్క పత్రికలోనే రావు. ఇతర పత్రికల్లోనూ ముత్యాలు దొర్హుతూ ఉంటాయి. ఈ శీర్షిక - పేరుకి తగ్గట్టు ఇప్పటికీ మురిపిస్తుంది. పత్రికా లక్ష్యాన్నీ సంపాదకుల విశాల దృక్పథాన్నీ స్పష్టపరిచేవి ముందుగా శీర్షికలే. నేను చదువుతున్న పుస్తకం, తెలుగు సాహిత్యంలో కొత్త తెన్నులు, నేను వ్రాసిన వేమిటంటే - అనే శీర్షికలు కిన్నెరలో కనిపిస్తాయి. మొదటి రెండు శీర్షికల కె.వి. రమణారెడ్డి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి తమ వ్యాసాలతో పుష్టి కలిగించారు. కె.వి. రమణారెడ్డిగారు మొదటి శీర్షికలో కొత్త గ్రంథాలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. చివరి శీర్షికలో కవికొండల వెంకటరావుగారి వ్యాసాలు (ఉపన్యాసాలు) ఉన్నాయి. ఈ మూడు శీర్షికలూ సాహిత్య పత్రికలకు ఇప్పటికీ ఉపాదేశాలేనని నా అభిప్రాయం. వీటిలో కొన్నింటిని కొన్ని పత్రికలు కొంత కొంతకాలం వేరేవేరే పేర్లతో నడిపించిన దాఖలాలు సాహితీపరులకు మనస్సుల్లో మెదలుతాయి. తెలుగు సాహిత్యంలో నవల అన్న శ్రీవాత్సవగారి బృహద్వ్యాసం, నవల ్రధానాంగాలు అన్న స్పూర్తిశ్రీ గారి వ్యాసం రెండవ శీర్షికకు అనుబంధ రచనలు. మల్లికార్జునరావుగారు ఆధునిక చైతన్యానికీ, వామపక్ష భావజాలానికీ చెందిన మనిషి, అయినా సంప్రదాయ సంస్కృతాంధ్ర సాహిత్యాలకు తమ కిన్నెరలో సముచిత స్థానం ఇచ్చారు. ఇదొక అరుదైన సుగుణం. సాహిత్యపరమార్ధం. నాటక రసానుభూతి, రూపకాలు, రూపకరచన (భూపతి లక్ష్మీనారాయణ), కావ్య విమర్శన సంప్రదాయం (శిష్టా రామకృష్ణశాష్టి) సాహిత్య శాస్త్ర సంప్రదాయాలు, కావ్యాలంకార పరిచయం (పి. యస్‌. ఆర్‌. అప్పారావు), సంస్కృత రూపకములు: భాణము (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు), ఆంధ్ర వాజ్యయ విమర్శ (కేతవరపు రామకోటి

పీఠిక : బేతవోలు రామబ్రహ్మం ౫|| శాస్త్రి, సాహిత్యము (జాస్తి వేంకట నరసయ్య), నన్నెచోడుడి గురించి టేకుమళ్ళ కామేశ్వర రావుగారి సీరియల్‌ వ్యాసాలు - ఇవన్నీ ఈ అరుదైన సుగుణానికి బరువైన నిదర్శనాలు. భూపతిగారి వ్యాసాలైతే చిరు పుస్తకాలే. ఇక్కదే ఒకమాట చెప్పాలి. కొవ్యాలంకారానికి పి.యస్‌. ఆర్‌. అప్పారావుగారి అనువాదాన్ని ఫిబ్రవరి సంచికనుంచి ధారావాహికంగా - వరుసగా అన్నారులెండి

  • ప్రచురిస్తాము అని జనవరి 1955 సంచికలో సంపాదకులు ప్రకటించారు. అన్నట్టే కావ్యాలంకార పరిచయ వ్యాసం ప్రచురించారు. పాఠకుల దురదృష్టం - అక్కడితో కిన్నెర ఆగిపోయింది. ఇతర ప్రాంతాల సాహిత్యాలనూ, ఇతర దేశాల సాహిత్యాలనూ తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యాలనే తపన ఒకటి కిన్నెారలో కనిపిస్తుంది. లైలామజ్నూ అసలు కథ (పారనంది జగన్నాధస్వామి), జపాన్‌ నాటక కళ విశిష్టత (నార్మన్‌స్మిత్‌), జర్మను సాహిత్యం, జర్మను సాహిత్యంలోని కొన్ని ఘట్టాలు (వి.ఎన్‌.శర్శ), హిందీ వాజయము (కామాక్షీరావు) మొదలైన వ్యాసాలు ఇందుకు ఉదాహరణలు. ఈ నేపథ్యంలోనే అనువాద సాహిత్యం అవసరాన్ని గుర్తించిన మల్లికార్జున రావుగారు దాన్ని ఆహ్వానిస్తో ఒక ప్రకటన ఇచ్చారు (ఫిబ్రవరి - 1952). ఇప్పుడు అనువాద సాహిత్యం మీద విస్తృతంగా కృషి జరుగుతుంది. అన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేక శాఖలు తెరిచాయి. ప్రత్యేకంగా కొన్ని పత్రికలూ వెలిశాయి. కానీ అర్ధశతాబ్దం కిందటనే దీన్ని గుర్తించిన కిన్నెర దూరద్యష్టిని అభినందించ వలసిందే. యాబఖైలనాటికి సర్వాంగీణంగా విముక్తమై జూలుదులిపి ఆవులిస్తున్న తెలంగాణం సాహిత్యానికి పెద్దపీట కాకపోయినా తగినంత చోటు ఇవ్వడం కిన్నెరలో చూస్తాం. కవిత్వం నా సాధనం (ి.నా.రె.), ప్రజాకవి దాశరధి (పి.వి. రత్నం), నేటి కవితారచన (మాదిరాజు రంగారావు), తెలంగాణ సీమ కవుల దర్శనం, సి.నా.రె. గేయ నాటికలు (డి. రామలింగం), మహోజ్వల కవి ఉత్పల (మాడపాటి భాస్మరరావు) మొదలైన వ్యాసాలు ఇందుకు సాక్షులు. పత్రికల్లో గ్రంథ సమీక్షల గురించి బులుసు వేంకట రమణయ్యగారు ఒక వ్యాసం రాశారు (యే-1950). నాటికీ నేటికీ పత్రికల్లో వీటి “గతి” అలాగే ఉంది. దీనికి భిన్నంగా గ్రంథ సమీక్షలనూ పరిచయాలనూ సమగ్రంగా జరిపించింది కిన్నెర. మధుబాల : సమీక్ష (బి. ఆదిలక్ష్మమ్మ), గురజాడవారి వ్యాసచంద్రిక మీద పారనంది జగన్నాధ స్వామివారి సమీక్ష - దీనికి నిదర్శనాలు. సమీక్షల మీద సమాధానాలూ చర్చలూ సాగించడమొకటి అభినందించ వలసిన విషయం. ఇష్టమైతే ఇంపు అనడం, కష్టమైతే కంపు అనడంగా సమీక్షలు రాస్తే గ్రంథ రచయితలకు నోరువిప్పే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికం కదూ! గిల్లికజ్జాలు పెట్టి సాహిత్యపుటలకు గిరాకీ పెంచుకునే వ్యాపారదక్షత కాకపోయినా వాదవివాదాల వ్యాసాలు కొన్ని కిన్నెరలో కనపబతాయి. మన సాహిత్య సంగ్రామములు అనే

౫|| పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము దానిమీద గొగరైపాటి వెంకటసుబ్బయ్య కేతవరపు రామకోటిశాస్త్రి గార్ల మధ్య సాగిన సంగ్రామ ఆరోగ్యంగా ప్రజాస్వామికంగా కిన్నెరలో దర్శనమిస్తుంది. చర్చను సంపాదకులు కల్పించుకుని ముగించడం కాకుండా కేతవరపు వారే ముగించడం గమనించదగిన అంశం. సంపాదకుడు ముగింపు పలికితే వివాదపడ్డవారిలో ఎవరో ఒకరు మూతి ముడవడం ఖాయం.

వాసిరెడ్డి రాధాకృష్ణగారు ఒక అజ్ఞాతకవి శీర్షికతో చిట్టూరి సత్యనారాయణ గారిని పరిచయం చేస్తూ ఒక వ్యాసం రాశారు. ఇది ప్రేరణగా నాయని కృష్ణకుమారిగారు పిల్లుట్ల శారదాదేవిని పరిచయం చేస్తూ మరో వ్యాసం రాశారు. కిన్నెర ఆగిపోకపోతే, ఈ శీర్షిక కొనసాగి ఉంటే ఇంకా ఎందరు మనకి పరిచయం అయ్యేవారో కదా అనిపిస్తుంది. కొద్దిపాటి రచనలే చేసి వాటిని ప్రచురించుకొని, ప్రచురించుకోలేక, తగినంత గుర్తింపును పొందని రచయితలూ రచయిత్రులూ ఎందరో ఉన్నారు. ఉద్యమాల నడుమ నలిగిపోయినవారు కొందరు. ఇలాంటివారిని లోకానికి చూపించడానికి ఉద్దేశించిన ఈ శీర్షిక ఏ పత్రికలోనైనా కొనసాగితే బాగుండుననిపిస్తోంది.

సాహిత్యం జీవితం లాగానే బహుముఖీనం. ఎప్పుడూ సీరియస్‌గానే ఉండనవసరం లేదు. పాఠకులు సైతం పొద్దుగూకులూ అదే కోరుకోరు. కాసింత విందు వినోదాలు అవసరం. కేవల సాహిత్య పత్రికలో ఛలోక్తులు, కార్టూనులు వగైరాలకు అవకాశం ఇస్తే మంచిదే. ఇవ్వకపోతే - అలాంటి వ్యాసాలైనా అందించాలి. కిన్నెర ఈ పనికూడా చేసింది. సాహిత్యరంగంలో వినోదం గురించి ఎమ్‌.ఎస్‌.శాస్తి, వేటూరి ఆనందమూర్తి ప్రభృతుల వ్యాసాలు గిలిగింతలు పెడతాయి. వినోదంతోపాటు విజ్ఞానమూ అందిస్తాయి.

అచ్యుతుని గిరిజగారు రచయితలు నేడు - నాడు అంటూ ఒక వ్యాసం రాశారు. ఇది పైకి గిలిగింతలు పెట్టే వ్యాసమే కానీ లోలోపల గట్టి చురకలు పెడుతుంది. ఇక్కడే కిన్నెరమీద నా కన్నారకూడా చెప్పేస్తాను. వ్యాస రచయితల సంక్షిప్త పరిచయమైనా ప్రచురించకపోవడం పెద్దలోటు. అప్పటికీ ఇప్పటికీ చాలా పత్రికలు ఇంతే చేస్తున్నాయి. ఏవో (ప్రత్యేక సంచికలూ, పరిశోధన పత్రికలూ తప్పిస్తే. తూలికాభూషణ్‌ (కథా రచన), ఎస్‌. ఎన్‌. చారి (చలం మ్యూజింగ్స్‌), హిమకర (రసశక్తి) కుని కృష్ణ (ఎర్నెస్ట్‌ హేమింగ్వే) వీళ్ళని గురించిన పరిచయం ఇవ్వేళ ఎవరిని అడిగితే చెబుతారా అని ఆరా తీయాల్సి వస్తోంది. చాలా విషయాల్లో నిర్మాణాత్మకంగా కొత్త పుంతలు తొక్కిన కిన్నెర ఇది ఎందుకు చెయ్యలేక పోయిందా అని దిగులు. సరే.

కిన్నెర కార్యాలయంలో జరిగిన ఉపన్యాసాల సారాంశాలను ప్రచురించడంతో పాటు రాష్ట్రంలో జరిగిన సాహిత్య సభల విశేషాలను (ప్రత్యేక వ్యాసాలు రాయించి 'ప్రచురించడంద్వారా కొన్ని అద్భుత సంఘటనలను స్థిరీకరించిన గౌరవాన్ని దక్కించుకుంది ఈ చిన్ని కిన్నెర. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి షష్టిపూర్తి సన్మానసభ రాజమహేంద్రవరంలో ఎంత రంగరంగ వైభవంగా

పీరిక బేతవోలు రామబ్రహ్మం ౫14 జరిగింది, ఏ దిగ్ధంతులు పాల్గొన్నారు, ఏమి వాకొన్నారు, శాస్రిగారి స్పందన ఏమిటి- మొత్తం మహోత్సవాన్ని కళ్ళకు కట్టించే వ్యాసం ఈ ఒక్క కిన్నైరలోనే దొరుకుతోంది అలాగే కవికొండల వేంకటరావుగారి షప్టిపూర్తికి ప్రత్యేకవ్యాసాలు, అలంపురంలో జరిగిన సాహిత్య సమారాధన (గిడుగు సీతాపతి), ఆం సా పరిషత్‌ సప్తమ మహాసభల విశేషాలు కిన్నెర మనకు వన్నెచిన్నైలతో సహా అందిస్తోంది

మొట్టమొదట చెప్పవలసినదే అయినా చిట్టచివర చెబుతున్నారు అదేమిటంటే - ఇవ్వేళ పరిశోధనలకు దిగుతున్న సాహిత్య విద్యార్థులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య - పాత వ్యాసాలు దొరక్కపోవడం వ్యాన సూచికల్లో నామధేయాలు కనపడతాయి. రూపధేయాలు ఏ (గ్రంధాలయంలోనూ దొరకవు కొన్నింటి నామధేయాలు కూడా దొరకవు చిట్టచివరి ముఖాముఖిలో పరీక్షకుడు ఏదో వ్యాసం ప్రస్తావిస్తే, పరిశోధకుడూ కొండొకచో పర్యవేక్షకుడూ నోరు వెళ్ళబెట్టవలసి వస్తోంది ఈ దుస్థితిని తప్పిస్తూ కిన్నెరలోని అన్ని రకాల వ్యాసాలనూ ప్రత్యేక సంపుటులుగా పునర్శుద్రించి అందిస్తున్నందుకు, ఇంతటి మహోపకారం మరొకటి లేదు మహాప్రభూ అంటూ పందిరి కృష్ణమోహన్‌గారికీ వారి కుటుంబ సభ్యులకూ చేతులెత్తి మొక్కుతున్నాను

సెలవు తెలుగుశాఖ, కేంద్రీయ విశ్వవిద్యాలయం భవదీయుడు హైదరాబాద్‌ - 46 బేతవోలు రామబ్రహ్మం 18-05-07

6 పఠాభి లి (సంప్రదాయాలమీద ఆధునిక కవుల తిరుగుబాటు) శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

(గౌ౦థిక భాషా శిష్ణవ్యవహారికమూ మాత్రమేకాక వాడుకలోవున్న ఏ జాతీయమైనాసరే కావ్యరచనకి పనికివస్తుందని నిరూపించడానికి నండూరి సుబ్బరావుగారు యెంకి పాటలు రాస్తే పద్యాలూ పాటలూ మాత్రమేకాక ఏవరస అయినాసరే కవిత్వానికి వాహకము కాగలదని నిరూపించడానికి 'పఠాఖి'గారు “'ఫెడేలు రాగాలడజన్‌' రచించారు. ఇందులో పన్నెండు ఖండాలున్నవి. మొట్టమొదటి ఖండము 'ఆత్మకథిలో తపు ఆదర్శాల్ని చెప్పుకొచ్చారు. 'నా ఈ వచన పద్యాలనే దుడ్డుకరల్లో పద్యాల నడుముల్‌ విరగదంతాను' అనే (ప్రతిజ్ఞని గమనించినప్పుడు విచితమైన ఆ ఆశయానికి రిచ్చపడతాము. 'చిన్నయ్‌సూరి బాల వ్యాకరణాన్ని చాల దండిస్తాసు'అని చదివి 'ఈయన లెఫిని సాధనం మాత్రమే కాదు; ఆయుధంకూడా కాబోలు" అనుకుంటాము. 'నా యిష్టం వచ్చినట్టు జేస్తాను'తో వీరి యత్నం పూర్తిగా తిరుగుబాటే ననిపిస్తుంది. 'అనుసరిస్తాను నవీనపంథా' అనగానే వీరి తిరుగుబాటు విరగబాటు కాదనీ, అందులో కొత్తరకపు కట్టుబాటుకూడా ఉన్నది కాబోలు అనీ ఆశపుడుతుంది.

అవును. 'ఫెడేలు రాగాల డజన్‌' పఠిస్తే తిరుగుబాటూ కొత్తరకపు కట్టుబాటూ కూడా కనిపిస్తాయి. తిరుగుబాటులోని పప్రధానపుటెత్తుని 'ఆత్మకథ'లో కవిగారే మెప్పుకున్నారు. 'ఈ నా వచనపద్యాలనే దుడ్డుకరలో పద్యాల నడుముల్‌ పందిరి ముక్రకార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

13/8 పందిరి మల్ల్‌కార్డునరాప్యు శతజయంతి సంపుటము 4: సాహిత్యము విరగదంతాను' అని. ఈ పుస్తకములోని పన్నెండు ఖండాల్లోనూ మొత్తపు నడక ఫక్తు వచనపు నడకె. పంక్తులన్నీ గాలిస్తే, అన్ని ఖండాల్లోనూ చేరి 'కడగంటి చూపయిన వరపరోసీ శశి, 'మిలియనుజనములు మిణుగురు బువ్వలి, 'గాంధీటోప్‌ జహ్వరు జాకటొ వంటి పంక్తులు పదికన్నా ఎక్కువ లేవు. ప్రత్యేకంగా యత్నించి పూర్తిగా విరగదన్నేరు పద్యగతిని కవిగారు. ఎక్క డైనా ఒకచోట తమ రచన 'నీ గుండ్రని మోమందపు తరహాసయితము' అనీ, 'వినూతన పద (యేమికులు మహాకాముకులు' అనీ గతి నలవర్చుకుంటున్నట్లుగాని కనబడితే, వెంటనే 'మాకేమి నచ్చనేనచ్చడు*, 'అన్యోన్యమగు దంపతులు కూడ' లాంటి వచనపు దుడ్డుకర్రల్లో ఆగతిని విరగగొట్టి పారేశారు. పద్యానికి జీవము గతిమాతమే అని నమ్మి గతిని పూర్తిగా విరిచిపారేశి, వీరు తమ ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నారు. కాని యతిప్రాసలు మ్యాతము ఆకాశంలో చుక్కల్లాగ వీరి ఫిడేలు రాగాలన్నిటిలోనూ మెరుస్తున్నాయి. పద్యత్వము యతిప్రాసలలోనే నిలిచి వుంటుందని నమ్మడము చేతనే కాబోలు తమ రచనలకి 'వచనపద్యా'లని పేరుపెట్టుకున్నారు.

'చిన్నయ్‌సూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను' అన్నది వీరి తిరుగుబాటులో ర౦డో ప్రతిజ్ఞ. వ్యాకరణసమ్మతమైన 'పలు రంగు వలువలు గట్టుకొని లలనలు ప్రదర్శించుకొనుచున్నారు', 'తొమ్మిదణాల సినిమాటిక్కటునకు

తమ బహిర్దేహము మీద యాత్రచేయుటకు హక్కు నిచ్చే () కొంద రాంగ్లో . . ఇండియన్‌ అభాగినులు, “చిటపట చిటపట చినుకులు పడుచున్నవి కడు నిలచినది మనుష్యుల నడక వంటి పంక్తులు చాలా చాలా వాడినప్పటికీ, 'ఎవర్నని? 'అతగాడు% 'దోస్తాను?, 'వొత్తుకుంటూ', 'నాగరీకులు' లాంటి వాడుక మాటలు చివరవరకూ వాడుతూ గ్రాంథిక సూతాల్ని పాటించక పోవడముతో ఊరుకోక, “ఉపజ్జ నాకున్‌ లేదని", 'ప్రదర్శనము చేతన్‌ స్థంభీభూతంబయిన', 'పోసినట్లుంగురిసేటో, 'లోనన్‌ . మాట్లాడుటకు' అని కశితో నకారపు పొల్లును పదేపదే ప్రయోగించి వ్యాకరణాన్ని ఉడికించి, 'తలనవాల్చే, పరుగిస్తూన్న, పరిమార్చుట, వినుబడలేదే”, 'అధికమగుచుంది' అనే కృతక (ప్రయోగాల్లో వెనక్కి తిరిగి వెళ్లిపోయే వ్యాకరణాన్ని వెక్కిరించి మరీ వదిలారు. మొత్తంగా రచన లన్నిటినీ పరికిస్తే, 'నా యిష్టం వచ్చినట్లు జేస్తాను' అని ఈయన ప్రథమఖండములో చెప్పినది కూడా జ్ఞాపకము వస్తుంది. 'భావ కవిని మాత్రము కాన్నే, 'పొగా? 'వయిట వేసులోకీ, 'తిరుగుచుంది,

పఠాఖి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1379 'హంగ్రీకనులు, 'మేమాసము*, 'మూతొ”, 'క్యాజ్టేయ' ముదలైన కుదిరీకుదరని స్వతంత్రపు ప్రయోగాలూ; “బ్లడీ, హయిహీలుయాన, రుమాన్‌టిక్‌గా' వంటి ఇంగ్లీషుమాటలూ; 'గరం, గమ్మత్‌, కులాసా, నాజూకు' వంటి హిందూస్థానీ పదాలూ, 'పరిష్యుంగ్యగస్తము, చంద్రాగవమునము, సత్యనారాయణ కృత రామాయణము' వంటి సంస్కృత సమాసాలూ మాత్రమే కాక, విశాఖా, గోదావరీ, గుంటూరూ, నెల్ల్లూరూ మాండలికాలుకూడా ధారాళంగా వాడడం ఇష్టం వచ్చినట్లు చెయ్యడము కాకపోతే మరేమిటీ? జర్మనీ యుద్ధానంతరము యూరపులో బయల్దేరిన నియవు భంగ చాపల్యవముకూడా వీరి రచనలలో, '20 అయిటమ్చులంచి*, 'ఇన్‌గ్‌లీష్టానిని నన్‌ను వ్చేపట్‌ట వద్‌దని గద్‌దిన్నినాకూడ' వంటి ప్రయోగాల్లో కనపడుతోంది. ఉచ్చారణని బట్టి వర్షకమము మారాలని సూచించడానికి కాబోలు 'వైనా, కైన, సౌందర్యము, మౌనము' వంటి ఐత్య, బెత్వ పదాల్ని 'చయినా, పయిన, సవుందర్యము' అని విరిచేశారు. 'త్రుప్తే, (హుదయమూ' అని ఎందుకు రాయలేదా అని అనిపించింది నాకు. 'ఫిడేలు రాగాల డజన్‌' అనే పేరులో అట్టమీద 'ఫిడేలు'కి బదులు ఫిడేలు బొమ్మ వేయడమూ, అంకితములో 'మృణాలినికి; కాదు కళ్యాణికి; కాదు ఇరువురికి అని ఆలోచన చూపించడమూ కూడా వీరి స్వంతపద్ధతికి ఉఊదాహరణాలే. ఈ పద్ధతిని బి. వి, సింగరాచార్యులు గారిలాగ

'ఆ మాసిన నల్ల మసిష్టం

లో ... వచ్చి మెల్లిగా

గదిలో [౬190ను తగ్గిస్తే

ఎల్లాగుంటుందో బోలో

ఈ 862060/ ౪/07/5106,

అని ఏ భాషలోని పదాలు ఆ భాషలోనే వేసి, శ్రీశ్రీ చెప్పినట్లు

'న-న-న - నత్తిమాటలు కూడా

మ- మ-మ- మన కవిత్వం ఉండొచ్చు' గనక కొన్ని నత్తిమూటలుకూడా చేర్చియుంటే, ఇంత చిన్నపుస్తకంలో అన్ని మార్పులు చెయ్యగలిగిన పఠాభిగారు జాగత్త ఇంకా నిండుగా ఉండియుండును.

1380 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము మనకి సాధారణంగా తెలిసిన కవితా సామగిని వాడక అంతా సరికొత్త సరుకు వాడడము 'పఠాభి'గారి తిరుగుబాటులో మూడోయొత్తు. బందరు వీథుల్లో బేహారి అమ్మిన కవితా సామగి 'కపురంపుం బలుకుల్‌ తుషార జలముల్‌ కల్పాల్‌ పికధ్వాన మచ్చపుు బంగారము జ్యోత్స్నల్‌ చల్ల గాలుల్‌, కూడా ఈయన నాగరిక దృష్టికి నచ్చనే నచ్చవు. బాదంభీరూ, డీలక్సు కుషన్‌ సోఫాసనమూ, అమృతాంజనప్పు పూతా, కనిమారాలో టీపార్టీ - ఇవీ కవి కోరే సుఖానుభవాలు. కామాక్షీ స్పుర్శవల్ల 'పఠాభి'కి కలిగేది గగుర్చాటుకాదు, 'అపూర్వంబగు మజా” మైమరపు కలగడు; 'నోరూరుతుంది'. లీల్‌ అధరాలలో సుధారసము కాదు ఆయనకు గోచరించేది; జహంగీరు తీపు; బ్రహ్మానందము కాదు ఆయనకు కలిగేది; బలే సరదా, బలే గమ్మత్తు! నయనోత్సవమూ, పులకరింతలూ (ప్రాణులకు కాదాయన ఆరోపించేది ప్రాణంలేని కామాక్షి కోకకి! కర్ణపేయత్వమూ, కీరవాణులూ, హిమాలయమూ, మినుకు మినుకు మనే దీపికలూ, ముఖ చందుడూ వీరి కావ్యప్రపంచంలో తొంగి చూస్తున్నాయే అంటే అది యతిప్రాసల్ని సర్దుబాటు చెయ్యడానికి మాత్రమే కాని అంతకు మించిన పనికికాదు. వీరు సృష్టించే పాత్రలకు కూడ 'విచితంబగు భావాలు కలవు. 'యులక్ట్రికు దీపాలకుమల్లే ఈ మూన్లయిటుక్కూడా స్విచ్చుండిన ఏం బాగుండును' అని 'పఠాభి' అంటే 'జిలేబీ లాగా ఈచందచ కాన్ని (మింగి వేయాలనిపిస్తున్నది' అంటుంది కామాక్షి. నాయ్యరోడ్డున పోయే నవ్యస్త్రీ యందం శాభఖాహారుడగు పఠాఖికి మాంసాహారం మీదికి బుద్ధి పోనిచ్చిందట. భువి కార్చిన కన్నీటి చుక్కల్లాగ తారకలు గగనములో రగులుచున్నవట. మిలియను జనములు మిణుగురు బువ్వుల కొరుకుచున్నటు లున్నదట మేఘధ్యని! లీల 'నాతో సమానమయిన లావుంగల్సి దిట్టంగా జంతువట్లుంటుంది'ట. అమెరికస్‌ కార్లు ఉబ్బుకొని వచ్చే "సెక్సు అపీలు'తో “అమెరికన్‌ స్త్రీల' రకం, వున్నవట! ఇవన్నీ చూస్తే 'ఇంట్రో'లో శ్రీ శ్రీ. ఉద్దాటించిన 'విచిత్రమే సౌందర్యం! సౌందర్యమే విచితం! అన్న సూత్రాన్నే గాఢంగా నమ్మి, 'పఠాఖి'గారు ప్రతీ అడుగులోనూ కశితో ఈ విచిత్రాన్నే సాధించారా అనిపిస్తుంది. అంత మాత్రమే అయితే ఈయన ప్రయత్నమంతా సంప్రదాయాల విరగబాటుకోసమే అని నిశ్చయించవచ్చును.

పఠాభి శ్రీపాద గోసాలకృష్ణమూ్తి 1381

కాని, వీరి ఏచితంబగు భావాల నన్నావొస్‌ 'పేర్చుకుని విజ్ఞాన శాస్త్రజ్ఞుడి లాగ వాటిని పరిశీలిస్తే చిత్రమైన ఒక కట్టుబాటు గోచరిస్తుంది. ఈ కట్టుబాటే వీరిని ఆధునిక కవికుమారులలో చేరుస్తుందని కూడా అంటాను నేను. ఏమిటీ కట్టుబాటూ అంటారా? మనవిచేస్తున్నా. వీరి కవితాదృష్టి అంతా నగరీక (౮/02౧) దృష్టి. మదాసు నగరంలో మందయానలూ, మలయానిలమూ, కోకిలాగానమూ ఎక్కడనించి వస్తాయీ - బాటా హయిహీలు యానలూ, బంగాళాఖాతం మీది నుండి వచ్చే గాలీ, విధీవిరామం లేని బస్సు టాముల గోలా తప్ప? మరి ఆనుభవాన్నిబట్టి రచించే మద్రాసు కవికి ఏది కవితాసామగ్రి కాగలదు? రోజల్లా ఏ ఆఫీసులోనో అకపుంట్లతో అనంతమగు యుద్ధం సాగించే నగరీకుడికి, డ్రాయింగు రూములో గోడకి తగిలించే చిత్రాలూ, నాగరిక కన్యల పవుడర్‌ పూయబడిన ముఖాలూ, సోయగము కల అమెరికన్‌ కార్లూ, రవికందున గుచ్చబడిన లేడీస్‌ పార్క ర్కలంబులూ, కమాన్లతో డోములతో నున్న ముఘల్‌ ష్టయిలు దేహంపు కట్టూ కాక, ఆకర్షించి పట్టగల సౌందర్య మేముంటుంది? అందుకే పఠాఖభిగారు 'తగిలింపబడియున్నది జాబిల్లి చయినా బజారు గగనములోన' పయిన అనీ, 'క్వన్మేరీసులోని కీరవాణుల పొడి పాముకొనబడిన ముఖాలు చూస్తూవుంటె నో రూరుతుం' దనీ, 'యహెరికన్‌ కార్లు... ఉబ్బుకొని వచ్చే సెక్సు అపీలుతో ... అమెరికన్‌ స్త్రీల రకం వున్నవి' అనీ, 'రవికందున [గుచ్చబడి' స్వర్గద్వయం మధ్య నూగాడుచున్ను ఆ స్త్రీ వక్షము మీది, లేడీస్‌ పార్క ర్కలంబుగానున్న నేను నా రక్తాన్నే సిరాగా పోస్తాను' అనీ, 'ముఘల్‌ ష్టయిలు దేహంపు కట్టుజూచుట నాకు అమృతాంజనం పూసినట్లుంది' అనీ రాశారు. నగరములో రంగులన్నీ ఉన్నప్పటికీ, పల్లెపట్టులో వలె పచ్చని వృక్షరాజములూ, నక్షత్ర ఖచిత నీలాకాశ సౌందర్యమూ, వర్ణకుసుమావృత లతానికుంజములూ, శాద్వల స్థుల నడుము మెల్లగా సాగిపోవు నదీ నదములూ, సంధ్యారుణాంశులూ నిర్మలస్థితిలో గుర్తించుటకు వీలుండదు. కనుక నగరీకకవికి రంగులతోకంటె చలనముతోనే ఎక్కువ పరిచయము. కాబట్టి అతని కావ్యాలంకార సామగిలో భాంతిమంతమూ, ఉతేృక్షా. రూపకమూ కంటె స్వభావోక్తే ఎక్కువగా కనపడుతుంది. 'పిచ్చి ఉబలాటంతో ... మనుష్యులు, మోటార్లు, ప్రాణాలు, యంత్రాలు, భుజాల రాసుకొంటూ, ఉన్మాదంతో త్రోసుకొంటూ, వొత్తుకుంటూ పోతున్నవట. 'పలురంగు

1382 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వలువల గట్టుకొని ఆలనలు ప్రదర్శించు' కుంటున్నారట 'మరీనా'లో. 'మర్యాదస్తులు గూడ అంగళ్లందున కళ్లకు అగపడిన వరండాలందున తమ దుస్తులు తడుస్తాయని వొదుక్కొను చున్నా' రట! నీళ్లు పారుచుండే వీథుల్లో జలాంచలమును ఇరువంకల విరజిమ్ముచు బస్సులు మాత్రము బుస్పని పోతున్నవట! చల్లారామ్సు షాపుముందు 'వసంతకాలంపు టఖండ అమ్మకాలని అడ్వర్హయిజు చేయబడి' యుండడాన్ని బట్టి (చెట్లు చిగిర్చడమును బట్టి కాదు!) మదాస్సిటీలోకి వసంతర్హువు వచ్చియుండాలట. స్వభావోక్తిని పట్టి యిచ్చేస్తుంది ఈ ఉదాహరణ చూడండి. “ఉడతలు ఎలుకలు మిడతలు చచ్చిపడియున్న చవిటి కాల్వల నీరు పొంగి, మురుగు గబ్బుగల గాలివడితోడ చిటపట చినుకులు పడుచున్నోవట. 'పఠాభి'గారి వర్ణనలు చాలా మట్టుకు యథార్థ మాత వర్ణనలే.

అయితే ఈ ఫోటోగ్రావుల మధ్యన అక్కడక్కడ కవిగారి కల్చ్పనని చూపించగల పెన్సిలు స్కెచెస్‌ కూడా కనబడక పోలేదు. 'సగం కాంతి సగం చీకటిగల యిండ్లలోపల బోగంచానలు ఫ్యాన్సీ మార్కట్లోని జపాన్‌ సరకుల్లా మవునంగా కూర్చోనున్నారట. మద్రాసు పట్టణపు టశాంతంలో నవ్య స్త్రీ మీద కళ్లు నిల్చుట డీలక్సు కుషన్‌ సోఫాల మీద కూలబడినట్లుంటుందట. నవ్య స్త్రీ కన్నులు క్రాస్వర్డు పజిల్సు లాగున్నవట. ఆమె చేతులు బిగ్‌ బ్రాకెట్లట. వీటిలో కవి మానసమే కాని హృదయమంతగా బింబించడము లేదు. ఎట్లు బింబించును? వెండిరూపాయి ఘలంఘలా శ్రావ్యసంగీతము కర్ణపేయముగా కర్ణాలలోనూ గుండియ లందుగూడ ముఖరించు చున్నదాయును. మరి వేరు సాందర్య మెట్లు (వవేశించగల దీ నగరీకుని గుండెలోనికి?

రోడ్డు దాటడానికని వేచియుండే రెండు మూడు నిమిషాల్లోనూ మదాసువాసునికి గోచరించే అపూర్వదృశ్యం ఇది చూడండి.

నటరాట్టులాగా నతండు కూడ

మృత్యుంజయ నృత్యంబును

సల్పుచుంటాడు సతతము

బల్బు హారన్ల తాలాం తోడి

పఠాభి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1383

యిలక్టింకు హారన్ల రాగానికిన్ని

మోటారు సయికిళ్లు మృదంగానికినీ

అనుగణ్యంగా నర్తిస్తుంటాడు

తటాల్మని ఇటూ అటూ తిరుగుచు

హసాల నందమ్ముగ ట్రిప్పుచు. ఇందులోనూ వైచిత్రియే!

అయితే, మద్రాసు వాసుడయేది, న్యూయార్కులో మ్కె స్క్రేపరువాసుడయ్యది, మానవుడన్నవాణ్ణి ఆకర్షించి లాగేది ఒక టున్నది. వెండిరూపాయ ఘలంఘలలూ, అమెరికస్‌ కార్ల సోయగమూ, అమృతాంజనపు పూతా దాని దగ్గర తీసికట్టు!

దాని బంగారు గంటల చిరు సంగీతము మదాసువాసుని గుండెలో కూడా మార్మో9గుతుంది. దానికి నగరీకకవి జవాబేమిటి? అందులో అతని అంతరాంతరాలు "పెల్లగిలి తీరాలి. ఎల్లగిల్లాయి కూడాను. చూడండి. అంకితములోనే 'మృణాలినికి, కాదు కళ్యాణకి; కాదు ఇరువురికి, అని తటపటాయించినాడు. “ఆ స్తీ హస్తములోని హ్యాండు బ్యాగయ్యున్న సేను ఏం బాగుండును' అంటున్నాడు. తడిసిన ఏనాద్దాని పయ్యుంటా, జాతికసన్నియ రొమూ్మూ, చూసూ చూస్తూ తన్మయుణై నాడు. సహాధ్యాయిని సీతా, లీలా, కామాక్షీ మృణాళినీ, కళ్యాణీ (మిసెస్‌ మాఢ్యూసో?;

  • ఇందరూ చాలక, మింటుప్ట్రీటు ప్రవేశించి, అక్కడికి వచ్చే అన్ని విధాల మనుపుగ్రలమూకని చూచి వేదాంతి అయి కవిత్వం చెపుతున్నాడు చూడండి. ఇంతవరకూ పట్టుకున్న నియమాలు పటాపంచలైపోయి, వచనపద్యం నదీప్రవాహమై పోయింది,

“ఆంతా బూటకం అంతా నాటకం గొప్ప అబద్ధం పూజారి యబద్ధం

-. పరపురుషుని జూచి తలవాల్చే పతివ్రత సతీత్వ మబద్ధం

ఆాగు అబర్హం, అందరూ అబద్ధం సర్వ్యమబడ్ధం.

కాసీ సీప్పు మపికు ఓ బోగందానా!

వబసుగునను సస్టురముగు సిజాసిటి'

1384 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కాదామరి! నగరీక అహంభావ కవిచేత గేయ కవిత్వం కూడా చెప్పించింది! పఠాభిగారి ఉపజ్జకి గొప్ప ఉదాహరణం 'కామాక్షికోక!' ప్రాణంలేని కోకకి కామాక్షి నగ్నాంగమ్మును చూపి ప్రాణం తెప్పెంచారు. శ్రోణీ వక్షో పీఠ్రభూముల్ను డయిరక్టుగానే ఆక్రమించి పులకరించి పోయిందట కోక. ఇక విద్యార్ధుల్‌ దొంగలు, (తాగుబోతులు, లీడర్లు, ప్లీడర్లు, పూజారులు, జారులు మాట చెప్పే దేమిటి? నగరీక కవి సందేశము వినండి: 'నీవుమటుకు ఓ బోగందానా నీడపడనటువంటి నిర్మలమగు నిజానివి. (శిన్నెరః సంపుటము క, సంచిక 11, నవంబరు 1948) నస ం పు పుం శ్‌ లే యా న, [పై ం 1 న సట త్త (1 చ నో మా ళో ( శరా ్టు

అందం _ ఆచంట జానకిరామ్‌ “మి రు వెల్లిపోయారు; కాని, మీ దోసిలిలోని పూవుల పరిమళము ఇంకా

వసూనే వుంది!” ...

అనేక విధాల మనలను గురించి జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు మన ఆప్తులు. నన్ను గురించిన జ్ఞాపకము పారిజాతపు సువాసనలతో మిళితమై యుండటము నా భాగ్యమే! ఎప్పటికీ ఇల్లాగే ఇండాలని ఉంది. పూవుల వాసనతో కొందరికీ, పున్నమ చంద్రుని పండువన్నెలతో కొందరికీ, తెలిమంచు వసనాన్ని విదళించుకు కన్నులు మిరుమిట్లు గొలిపే సూర్యకిరణాలతో కొందరికీ నేను జ్ఞాపకం వస్తూ ఉండటము కంటె కావలసిన దేమిటి!

కిటికీలోంచి చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. రకరకాల మందారాలు; వాని వెనుక, చిరుగాలికి ఇటు అటూ కదలుతూ అచ్చంగా ముసిముసి నవ్వులు నవ్వుతో ఉన్న మాలతీతీగా; ఆపైన, పచ్చిక బయలు; ఇంకా అవతల, గుబురుగా పెరిగిన న్మిదగన్నేరు గుంపులోంచి కావేరి పాయ. నీరు ఎక్కడ ఆఖరో, అకాశం ఎక్కడ [ప్రారంభమో తలియడంలే. ఎంత నిర్మలమైన ఆకాశమో! ఇంత నీలి ఆకాశం సాయంత్ర మయ్యేసరికి రంగుల రంగుల మబ్బులతో నిండిపోతుంది. ఎక్కడనుంచి వస్తాయో ఆ మబ్బులు! - ఎవరు కలిపారో ఆ రంగులు! - హరివిల్లును గురించి పాడుతూ మా 'రజని' అంటాడు.

“నేరెటి రసమెవరో విల్లున నిలువున పూశారే!”, అతనింకా అంటాడు. పండిత షుల్తీకార్టునరాప్తు శతజయంతి... సంపుటము. 4: సాహిత్యము

1386 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము సంద్రపు పాయో పొలాల చాయో... చక్కగ మెరిసిందీ! పాలవెల్లిలో పసపు కుంకుమలు నూరి అలదినారా! కోరి కూర్చి శ్రీ శ్రావణ లక్ష్మికి | గొడుగు నెత్తినారా! అవును! ఎంతటి అద్భుతమైన దృశ్యాన్నీ కూడా, ఇదివరకు మనకు పరిచితమైన మరో అందమైన వస్తువుతో పోల్చి చూచుకుంటాము. ఒక విధంగా ఆలోచిస్తే, ఈ పోలిక అనవసరమే. ఏ ఒక్క అందమైన వస్తువూ, అన్నివిధాల, మరొక అందమైన వస్తువులా ఉండదు. దేని అందము దానిదే. ఐతే ఒక రంగు చాయలోనో, ఏదో ఒక వంపులోనో మరో వస్తువును జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడో తమాషా; మనకు నిత్యమూ అనుభవనీయమైన సుందర దృశ్యాన్ని మనము ఎన్నడూ కల్లార చూడని దృశ్యంతో పోల్చుకుంటే గాని మనకు తనివి తీరదు. ఇందాకటి సూర్యకిరణ౦ కరగబోసిన బంగారంలా ఉంది అంటాము. ఈ రోజులలో కరగిపోసిన బంగారాల్ని చూడకలిగే అవకాశం మనకు ఎందరకుంది. ఏ బాపాలాల్‌నో, ఏ సూరజ్‌ మల్‌నో నమ్మి నగలు చేయించుకుంటాము గాని బంగారం మన కళ్ల ఎదుట కరిగించమనంగా. ఐతె మనం కళ్లారా చూడకపోయినా, కరగబోసిన బంగారం ఎల్లా ఉంటుందో ఊహించుకొనే శక్తి ఉంది కాబట్టి సూర్యకిరణాన్ని ఆ బంగారంతో పోల్చుకుని ఆనందింప కలుగుతున్నాము. ఈ శక్తి అద్భుతమైన శక్తి ఇటువంటి శక్తి ప్రభావంతోనే అల్లసాని పెద్దన్న హిమవత్పర్వత సానువుల్నీ, ద్విగుణిత కస్తూరీ వాసనలను గురించి అద్భుతంగా వర్ణింపకలిగాడు అంటారు. మన పరిసరాలు అందంగా లేకపోయినా, ఊహిక్తివల్ల సుందర పరిసరాలలో తిరగగలిగాము అంటె అది ఒక గొప్పే! ఐతే, ఇది ఎల్లప్పుడూ చేయలేము. దీనికీ ఒక హద్దు ఉంటుంది. మనం అల్లా అంటాము గాని అత్యద్భుతమైన సుందర దృశ్యాలను నిత్యమూ చూస్తూ, నిత్యమూ తాకుతూ ఉన్నవారు మనలో అనేకులు ఆ సౌందర్యం వల్ల కాసింతైనా 'చకితులుకారు". గులాబీ తోటలలో

  • పనిచేసేవారికి ఎందరికి తెలుసు ఆ గులాబీల సౌరభము. అబూ పర్వతము కైన మోటారు త్రోవను వెళుతూఉంటే ఇరుప్రక్కల కనిపించే అతి సుందరమైన దృశ్యాలను చూస్తూ డైంవరు కారు నడపడం మానివెయ్యడు. మనం పనిగట్టుకుని

అందం ఆచంట జానకీరామ్‌ 1387 ఆ అందాన్ని అతనికి వేలుపెట్టి చూపించినా అతడు సరకు చెయ్యడు. మనకు వండిపెట్టాలని మనతో వచ్చిన వంటమనిషీ అంతే. కారు కదలికకు ఆమెను ఇదివరకే దీర్షనిద్ర ఆవహించి ఉంటుంది. లేదా, కారు దిగడంతోనే వీళ్లందరికీ కాఫీలు కాచాలి అని సణుగుకుంటూ ఉంటుంది. అందమైన వస్తువులను చూచి ఆనందించగలగడమూ ఒక భాగ్యము.

ఇది అందరికీ ఉండదు. కాని, పుట్టుకతో లేకపోయినా మనం అలవరచుకోవచ్చు. మనం మన పిల్లలకు అలవర్చవచ్చు. కాని, ఎందరు తల్లులకు అంత ఓపిక ఉంటుంది. “ఇది తప్పు"! “ఇది చేయకూడని పని”! “చేస్తే నాన్న కొడతాడు” అంటూ పిల్లలను పెంచుతారు కాని, “ఇది ఎంత అందంగా ఉందో” “ఈ పువ్వు ఎంత సొగసుగా ఉందో! “ఆ పక్షి రెక్కలు చూడు - ఎంత బాగున్నాయో!” "ఈ ఊదా మీద ఈ యొరుప్తు చూడు! నీ కిల్లాంటి పరికిణీ కావాలా?” అని పిల్లలకు సౌందర్యంతో పరిచయం కలిగించే తల్లులు ఎంతమంది ఉన్నారు?

మనం పరికించి చూడం కాని, మన చుట్టూ ఎంత అందం ఉందో! ఒక్కొక్కప్పుడు “ఇంత అందమూ మనకోసమేనా?” అనిపిస్తుంది. అవును! మనకోసమే!! ఐతే, నైసర్గికంగా ఉద్భవించి అతిశయిస్తూ ఉన్న అందం సంస్కారంలేని మానవుడు హర్షింపలేకపోవడము అల్లా ఉండగా, ఆ అందాన్ని పాడుచెయ్యకలడు కూడానూ. మన తీర్థయాత్రా స్థలాలలో ఇది మరీ మరీ కనబడుతూ ఉంటుంది. ఆకాశాన్ని చుంబించే ఉన్నత పర్వతం అల్లా అల్లా క్రిందికి పాకుతూ వచ్చి, లేత చిగుళ్లు గుబురుగా పెరిగిన దేవదారు వృక్ష సముదాయంతో, నిర్మల గంగా తోయాన్ని తీయగా తాకుతూ ఉన్న హరిద్వార పరిసరంలో ఆ సీనారేకు గుడిసె లెందుకు? ఇల్లాగే - మానవుడు కాలు పెట్టినచోట ప్రకృతికి దిష్టిబొమ్మలను నెలకొల్పుతాడు. ఇటువంటి వికృత స్వభావం చూచే కాబోలు కవి విలపిస్తాడు.

దారి దలలెత్తు నింత సాందర్యలవము

వదలిపోలేరా చంపెడు వరకు వీరు! - అని.

ఎటువంటి పరిస్థితులలోనో అందాన్ని పూర్తిగా ఆస్వాదించగల శక్తి, కవికీ, యోగికీ మాత్రమే ఉన్నాయి. ఎటొచ్చీ కవికి అందంతో నిమిత్తముంది యోగికి అందంతో నిమిత్తంలేదు. అతడు సౌందర్యాతీతమైన దృష్టి అలవర్చుకున్నాడు కాబట్టి. కవికి అందమే జీవము. అంచేతనే అతడు ఏమాతపు అందవికారాన్నీ సహింపలేడు. తోటివారు సుందరమైన వస్తువులను, సుందరమైన అభిప్రాయాలను ఏమాత్రము నిరసించినా కవి అపరిమితంగా బాధ పడతాడు. ఎంతటి

1388 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సౌందర్య(పియుడూ, సౌందర్యోపాసకుడు కాకపోతే అతని హృదయాంతర్హ్చదయం లోంచి వెలువడగలవు ఈ మాటలు :

కార్మొయిలు పెదవుల ఖండ ఖండములుగ +" చిదికిపోయిన కౌముదీ మృదుల కళిక

గాంచి యొకరేయి దుస్సహ గాఢ దుఃఖ

మాపుకోలేక యేడ్చె నా యార్జ్ర మనము!

ఇంతటి సునిశిత సౌందర్య దృష్టికల వాడు కాబట్టే కవి - మన కృష్ణశాస్తి9- గాలిలో అల్లలాడిపోయే సుకుమార కోరకాన్ని గురించి జాలిపడతాడు:

కొత్తరాక నొడలె యురిగికొనని గాలి

తమకంపు గౌగిలి తొందరల నలగి

యూపిరాడక మూర్చిలు నొక్క యలరు

గని వనట ([గ్రుంగి నాకొక్క దినము దినము!

ప్రతి చిన్న వస్తువులోనూ సౌందర్యం మూర్తీభవించి ఉన్నదనీ, అందమైన' వస్తువు దెస చేసిన అపచారం సృష్టికర్తదెస చేసిన అపచారమే అని మనం ఎందరము విశ్వసిస్తున్నాము? క్షమింపరాని అజ్యాగత్తవల్లనో, అమానుష మైన కాఠిన్యంవల్లనో ప్రతి నిమిషం సౌందర్యాన్ని నిరసిస్తూ ఉన్నవారు ఎందరు లేరు మనలో.

నిజానికి సౌందర్యాన్ని పూర్తిగా అనుభవించే శక్తి అలవరచుకోవడం అంత కష్టం కాదు. జన్మతః మన కందరికీ కూడా అందమంటే అభిమానమే! ఐతే, అనుభవించడము కొందరకు చాతకాదు; కొందరకు బద్ధకము! చాతకానివారు నేర్చుకోగలరు. బద్ధకంవల్ల అందవికారంలో మునిగి తేలే వారిని చూస్తేనే, “అయ్యో! పాపం!” అనిపిస్తుంది. (కిన్నెర; సంప్పుటము 1, సంచిక 2, జనవరి 1949)

మేఘదూత కావ్యమూలకథ బులుసు వేంకటరమణయ్య

వముహాకవియగు కాళిదాసు రామాయణ, మహాభారతములను మనమున నుంచుకొని, రసపరిపోషణమునకయి కొన్ని మార్పుల నొనరించి కావ్య, నాటకములను రచించి కడమ లెని కీర్తిని గడించిననుట జగద్విదితము. కాళిదాసుని (గంథాంతరములకువలె 'మేఘదూతము'నకు మూలము మృగ్యమని కొందజి తలంపు.

మేఘదూతమునకు విపులవ్యాఖ్య విరచించిన మల్లినాథసూరి. రామాయణము నందలి హనుమత్సం దేశమును మనస్సున నుంచుకొని కాళిదాసీకావ్యమును రచియించి యుండనోపునని యభ్మిపాయపడెను.

కాళిదాస మహాకవి రమారమి పదునాల్గువందల 'యేండ్డక్రిందట సర్గుజా సంస్థానమునకుంజెందిన రామగిరియందు నివసించుచు, అలకానగరము నందుండెడి తన [(పయనెడంబాసి, విరహపేడితుండయి ఎనిమిదినెలలు గడపెననియు, ఆ యనుభవమే యేతత్కావ్యముగాం బరిణమించెననియు వంగీయులగు శ్రీ వున్మథనాథ భట్టాచార్యులవారు కలకత్తాలో జరిగిన మేఘదూతోత్సవమున వెల్లడించియున్నారు. *ోసీత్రాంప్రతి రామస్య హనుమత్సందేశం మనసి నిధాయా మేఘసందేశం కవిః కృతవానిత్యాహుః' (మేఘడూత వాఖ్య) పందిరి మల్లీకార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1390 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

ఆదికవియగు వాల్మీకియెడను, ఆతని రామాయణమునెడను దృథభక్తికల కాళిదాసమహాకవి హనుమత్సం దేశమును మనసుననుంచి, స్వానుభవమును దానితో మేళవించి మేఘదూతమును రచించెననుట యుక్తి సహము.

కాని యీ విషయమున కొన్ని సందేహముల కవకాశము లేకపోలేదు. 'శప్పుండగు యక్షుండెవ్వండు? అతనిభార్య యెవతా? అతని యధికారమేమి? అతండేల తనధర్మము నేమజియుండెను? అతండొనర్చిన తప్పునకు అతని భార్యయు ఏల గుజికావలసి వచ్చినది?” - అను నిట్టి సందేహములు కలుగవచ్చును.

కాని యిట్టి సందేహములు కలుగకుండుటకయి కొన్నికొన్ని కథలను గల్పించి కొందజు తృప్తిపాందినట్లు కనంబడుచున్నది.

అందొకకథ యిట్లున్నది - “యక్షా ధ్యక్షుండగు కుబేరుండు (ప్రతిదినము కమలములతో శివుని బూజించుచుండును. భృత్యుండగు యక్షుండొకండు పూజార్ధము

" కమలములను తేవలసియుండెను. వేకువనే ప్రియురాలి కౌంగిటినుండి విడివడ

నశక్తుండగు నా భృత్యుండు, ఎప్పుడైనను ప్రమాదము సంభవింపవచ్చునని తలంచి, సాయంకాలమునందే కమలముకుళములంగోసి, తనగృహమున భదపరచి, ఉదయమున గుబేరునకు సమర్ప్చించుచుండెను. ఒక దినము కోసియుంచిన తావుర మొగ్గలో తుమ్మెదయొకటి చిక్కుకొనియుండి, వుజునాండు పూజాసమయమునకు ఆ ముకుళము వికసింపంగా తేంటి బయటపడి కుబేరుని కరమునుకుట్టెను. అంతం గుబేరుండు భృత్యునిమైం గినిసి శపించెను. ప్రభునాజ్ఞను నెజవేర్చని కృతఘ్నులనామము నుచ్చరింపను జనదుకావున, ఆ యక్షునిపేరు (గ్రంథస్థము కాలేదు" -

పయిరీతిని మేఘదూత వ్యాఖ్యాతలగు సుమతి విజయాదులు మూలకథను వివరించిరి.

కాని యియ్యది సుసంగతమైనట్లు కానరాదు. యక్షుండు తన కృత్యమును నెఅవేర్చినట్లు - కమలములం దెచ్చి యిచ్చినట్లు - మూలకథ చెప్పుచున్నది. అంతెయకాదు; అతడు తెచ్చినవి ముకుళములుగదా! అందొక్కదానిలో6 దేంటిచిక్కుకొనియుండుట అతని తప్పుకాదుగదా! అట్టివానికి శాపమొసంగుటయు, పేరైన నుచ్చరింపరాదనుటయు పొసగుటెట్లు?

మేఘదూత కావ్యమూలకథ . బులును వేంకటరమణయ్య. 1391

వేజొకకథను గనుండు - 'కుబేరుని యుద్యానవనమగు చైత్రరథమును కాచుటకు నియుక్తుండగు యుక్షుండొకండు సోవురియె ఇం[దుని యైరావత మూ తోంటంబవేశించుట గమనింపండయ్యె. ఆయ్యది తోంటను ధ్వంసమొనర్పంగా ప్రభువాయక్షుని శపించెను'-

ఇయ్యది రామనాథ, హరగోవిందాదుల వ్యాఖ్యలందు6 గానంబడుచున్నది.

పయికథయు సముచితమైలేదు, ఏలయన యక్షు;ండపరాధమొనర్చిన - అతనితోంబాటు అతని ప్రియురాలికిని శిక్షవిధించుటలో హేతువు కానరాదు. వనుకటికథలో6 జూపంబడిన యుక్తులయిన నిందు లేవు.

వేజొక కథను గమనింపుండు - “హేమమాలి యనునతండు కుబేరుని భృత్యుండు; అతని భార్య విశాలాక్షి. ఆమెపై నాతనికి మక్కువ యెక్కువ. హమమాలి పతి దినము పపాతఃకాలమునందే కుబేరునికి శివపూజార్ధము పుష్పములంగోసి యర్పించు చుండును. ఒక దినమున పూవులంగోసి, యింటికిందెచ్చియు వెంటనే కుబేరునికీయక, ప్రియురాలితో వినోదముగం గాలము గడుపు చుండెను. శివపూజా సంసిద్ధుండగు కుబేరుండు పూవులు లేమికి మిగులంగోపించి, సేవకులవలన హేమమాలివృత్తాంతము నెజింగి, అతనికి (ప్రియావియోగము, కుష్టురోగము సంభవించునట్లు శపించెను. శాపగ్రస్తుండగు హేమమాలి పదచ్యుతుండై యిటునటు తిరుగుచు పూజ్యుండగు మార్కండేయ మహామునిని దర్శించి యతని యానతి ననుసరించి యాషాఢకృ సష్టెకాదశియం దుపవసించి, భగవంతుని. బూజించి, యా పూజాఫలముగ రోగవినిర్ముక్తుం డై, (పియం గలిసి కొనెను.”

పయికథను శ్రీమాన్‌ బుర్సీ శ్రీనివాసాచార్యులుగారు తెలుపుచు, '" _ తదనుగుణముగా నున్న బహ్మ వైవర్త పురాణకథ నుదహరించి యున్నారు.

కాని యియ్యదియును యుక్తిదూరము గనేయున్నది. మాంద్యములేక యుదయముననే లేచి, పూవులం గోయంజాలిన హేమమాలి, వెనువెంటనే వానిని . కుబేరునకర్పింపక, జాలమొనర్చుటలో6 దగిన హేతువు కానరాదు. కుబేరుండు సంవత్సరముపాటు శాపము ననుభవింపవలునని భృత్యునాదేశించి, శాపావధినికూడ నిర్ణయించినట్లును, కాలపరిమితిని తగ్గించి, యనుగ్రహించినట్లును మూలమునం6

1392 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (మేఘదూతమును గలదు. ఈ పయికథలో శాపకాలపరిమితిగాని, కుబేరు6 డనుగ్రహించుటగాని చెప్పంబడలేదు. ఒక్క తప్పునకు రెండు శీక్షలన్నట్లు - భృత్యుని యలసతకు ప్రియావియోగము మాత్రము కాక, కుష్టురోగమును గూడ విధించుట యంత యుచితముకాదు. మేఘదూత కావ్యమున సందేశమే (పధానము; కథ పధానముకాదు. దూతకావ్యము లన్నింట నిదియే పరిపాటి. కావున మహాకవి రామాయణమునందలి హనుమత్సందేశమును మనంబున నునిచి, మేఘదూతమును (వాసెననుటయే యుచితము. కొందజు కవులు తాము కల్పించిన కథలకు6 బచారము కలుగుటకయి యిట్టివానిని కల్పించి, వానికి కాళిదాసకృతితో ముడి పెట్టియుండవచ్చునని తోంచుచున్నది. (కిన్నెర: సంపుటము 1, సంచిక 5, జూలై 1949) న 11 న్‌, మా జా (౮ /. ర్య గ నో

ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు శ్రీరంగం శ్రీనివాసరావు

జలఅెటరిగా నా గదిలో కూర్చుండి జ్ఞాపకాలు మాత్రమే ఆధారంగా, పత్రికలకీ పుస్తకాలకీ, తదితర దస్తావేజులకీ దూరంగా, ఎవరి సలహాలేకుండా ఈ సమీక్ష, ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్య సంఘాలని గురించిన ఈ సమాలోచన సాగించబూనడం సాహసకృత్యమే కావచ్చును. కాని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తెగించాలి. ఎక్కడో ఒకచోట ప్రారంభించాలి. అన్ని హంగులూ కుదిరిన తర్వాత, అంత సామగీ పోగుచేసిన పిమ్మట, నిరుపహతి స్థలం మొదలైనవి చూసుకొని కృతులు రచించడం చాలా బాగుంటుంది. (కృతులు సమీకృతులు కూడా కృతులే) ఇచ్చేవాళ్లుంటే అడి గేవాళ్లకే కొదవా? సాహిత్యసంఘాలమీద సమగ్ర వివేచన జరపడానికిగాను ప్రస్తుతం నాకొక పెద్ద లైబరీ కావాలి. అందులో ఈ శతాబ్దపు దిన పతికల ఫైలు (ఆంధ్రపటత్రికు ఆంధ్రప్రభ జనవాణి, జన్మభూమి, ప్రజాశక్తి మొదలైనవి) ఉండాలి. ఆంధ్రసాహిత్య పరిషత్ప(త్రిక సంపుటాలు, పరిషత్తు తరఫున అచ్చు అయిన, అచ్చుకాని పుస్తకాలూ ఉండాలి. మద్రాసు యూనివర్సిటీ, ఆంధ, మైసూరు, అన్నామలై, ఉస్మానియా మొదలైన విశ్వవిద్యాలయాలు తెలుగుకోసం చేసిన పనులను వివరించే పుస్తకాలన్నీ ఉండాలి. ఈ విశ్వవిద్యాలయాలకి చెందిన కాలేజీలలో తెలుగు సాహిత్యం ఏయే విధాల వికసించిందో, ముకుళించిందో విశదం చేసే దస్తావేజులన్నీ కావాలి. కాలేజీలలోనే కాక హైస్కూళ్లలోనూ, ఆఖరికి అరుగులమీద బడుల దాకా అన్ని పాఠశాలలలోనూ తెలుగు పండితులూ, కవులూ, రచయితలూ పడ్డ పాట్లకు సాక్ష్యం ఇచ్చే సామగ్రి పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1394 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము "యావత్తూ కావాలి. (నా కిప్పుడు హైస్కూలు పండితులుగా తమ యౌవనాన్ని కర్పూరంవలె ఖర్చుపెట్టిన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రీ, మారేపల్లి రామచంద్రశాస్తీ" కనబడుతున్నారు. ఇంకా నా కళ్ళబడని వాళ్ళు ఎందరో ఉన్నారని ఎరుగుదును.) నా జాబితా ఇంకా పూర్తి కాలేదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును ముందుగా స్మరించడం జరిగింది కాబట్టి ఆ వెంటనే నవ్య సాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం రావాలి. ఇవి అఖీలాంధ పరిషత్తులు. ఇవికాక ఇంచుమించు అఖిలాంధ్ర - (అంతేకాదు అఖిల భారత) విఖ్యాతి పొందిన సాహితీ సమితి, కవితా సమితి, సారస్వత సమాజం, యువకవి మండలి మొదలైన సంస్థలున్నాయి. అవి చేసిన పనులూ, రాసిన రాతలూ, విశదం చేసే పరికరాలు నా లైబరీలో అందుబాటుగా ఉండాలి. అనగా సాహితి, సఖి, వైశాఫీ, కవిత మొదలైన పటత్రికలూ, అనేక గద్యపద్య (గ్రంథాలూ! నవ్యసాహిత్య పరిషత్తు తరష్టున వలువడ్డ “ప్రతిభ సంపుటాలూ, గిరాం మూర్తి వర్ధంతి సంచికా, పరిషత్‌ ప్రచురణలూ, కరపత్రాలూ కావాలి. అభ్యుదయ రచయితలు వెలువరించిన “తెలుగు తల్లో, “అభ్యుదయ”

  • పత్రికల సంపుటాలు కావాలి. అన్నట్టు ఆంధ్ర భారతీ తీర్ధ సేవ మరిచి పోకూడదు. ఏదో ఒక సంఘం తరఘ్లున వెలువడక పోయినా వ్యక్తి స్వాతంత్య్య సూతాన్ననుసరించి జనించి, సాహిత్యానికి మహోపకారం చేసినవీ, చేస్తున్నవీ, అన్ని సంఘాల దృక్పథాన్నీ ఆదరిస్తున్నవీ అనేక పత్రికలున్నాయి. అవి కళ (పా. వెం. రాజమన్నారు సంపాదితం), శారద (కౌతా త్రీరామశాస్తి, భారతి (కాశీనాథుని నాగేశ్వరరావు మొదలగువారు, జయంతి (విశ్వనాథ సత్యనారాయణ), జ్వాల (ముద్దు కృష్ణ, ఉదయిని (కొంపెల్ల జనార్దన రావు), వీణ (పాటిబండ మాధవశర్మ), నా వైబరీలో ఈ పటభైకల సంపూర్ణ సంపుటాలు తప్పకుండా ఉండితీరాలి. ఇవి లేనిదే సాహిత్య సంఘాలని సమీక్షించడం అసంభవం. ఇంచుమించు ఇరవయ్యు శతాబ్దంతో పుట్టి దానితోబాటు ఎదుగుతూ వస్తున్న “కృష్ణాపత్రిక” సంపుటాలకోసం నా లైబరీలో (ప్రత్యేకం ఒక బీరువా ఉండాలి. మంచి గంధపు చెక్కలతో దాన్ని తయారుచేస్తే మరీమంచిది. *ఈ వ్యాసంలో ఉదహరించిన ఏ వ్యక్తి పేరుకీ ముందు శ్రీగాని. వెనక గారు అనిగాని. ముందు వెనకల శ్రీఫలానాగారు అనిగాని ఈ రచయిత చేర్చలేదు.

ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు శ్రీరంగం శ్రీనివానరావు 1395 ఇవేకాక ఇంకా - బరంపురం, విజయనగరం, విశాఖ పట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, బెజవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, బళ్ళారి, అనంతప్పురం, అన్నట్టు మదాసు, హైదరాబాదు, బెంగుళూరు, నాగపూరు, ఖరగ్‌పూర్‌, రంగూను మొదలైన చోట్ల నుండి వెలువడినంత కాలం వెలువడి, ఆగిపోయి, మళ్లీ వెలువడి, ఆగిపోయి, మరో -. సేరుతో వెలువడి, ఆగిపోయి, మల్లి వస్తున్న పత్రికలన్నీ కావాలి. ఫెని చెప్పిన, చెప్పమరచిన ఊళ్ళలో (ప్రకటించబడిన (గ్రంథాలన్నీ ఈ లైబరీలో ఉండాలి. అచ్చుయంశతపు బెరస పుత్రికలైన వేగుజుక్క, హితకారిణి, ఆంధ ప్రచారిణి, సరస్వతీ గ్రంథమాలాదుల ప్రచురణలన్నీనా లైబ్రరీలో దొరకాలి. పుస్తకాల, పతికల జాబితా (నాకు తెలుసు, ఇది అసమ[గ్రమని) ఇంతటితో చాలించి నాకు కావలసిన లైబరీ ఇంకా ఎలా ఉండాలో చెబుతున్నాను. ఆంధ్రదేశంలోని అనేక గ్రంథాలయాలలాగ కాక ఈ లైబరీకి ఒక క్రమపద్ధతి, కాంతి, నీటుదనం, ప్రశాంతి ఉండాలి. నేను పని చేసుకొనే లైబరీ హాలు ఎలా ఉండాలో ప్రత్యేకంగా వర్ణించను. గోడలమీద చిన్నయసూరి. కొక్కొండ, వీరేశలింగం, సాంఖ్యాయన శర్మ, వేదం వెంకటరాయశాస్తి9, ఆదిభట్ల నారాయణదాసు, జయంతి రామయ్య, అక్కిరాజు ఉమాకాంతం౦, కొమరాజు, గిడుగు, గురజాడ మొదలైన వారి తైలవర్ణ చిత్రాలు (నిలువుటద్దం సెజులో) ఉండాలని మాత్రం నిష్కర్జ్షగా చెప్పి ఊరుకుంటాను. “ఊహ తలియంగల లేఖక పాఠకోత్తములు” అక్కరలేదు. నా రాత నేనే రాసుకుంటాను. అచ్చులో దాన్ని పాఠకులు చదువుకుంటారు. అయితే నేను తెమ్మన్న పుస్తకాన్ని ఆలస్యం చెయ్యకుండా తీసుకురావడాని కొక మనిషి కావాలి. మామూలుగా సిగరెట్లూ, కాఫీ తెచ్చేవాడికన్న ఎక్కువ తెలివితేటలూ చదువూ ఇతని కవసరం. లేకుంటే, సర్వత్రా విజ్ఞానపు వైశాల్యం విస్తరించిన సమాజం ఏర్పడేదాకా నా సమీక్షకి వాయిదా వెయ్యపలసి వస్తుంది. అయిందా మరి, నేను రాసుకుంటున్నప్పుడు గొడవ చెయ్యకుండా, నా తీరుబాటు సమయాన్ని కనిపెట్టి నా యువక స్నేహితులు నాతో ముచ్చటిస్తూ ఉండాలి. వాళ్ళంతా, నేనేదో బ్రహ్మాండమైన పనిచేస్తున్నట్లు ఆంధ్రదేశం అంతటా ఒకపెద్ద భ్రాంతిని పత్రికలద్వారా, పుకారుల ద్వారా ప్రచారం చెయ్యగల సరసులై ఉండాలి.

1396 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

ఇచ్చేవాళ్లు లేరని తెలిసికూడా ఇన్ని కోరుతున్న నేను ఇస్తారని ఆలిస్తే ఇంకా ఎన్ని కోరగలనో పాఠకుల ఊహకి వదిలి వేస్తున్నాను.

మరోమారు చెబుతున్నాను. ఈ వ్యాసానికి చదివిన, జీవించిన నా జ్ఞాపకాలు మాత్రమే ఆధారం. తారీఖులూ, దస్తావేజులూలేని ఈ సమీక్ష అవశ్యం అసమగ్రం. కేవలం వ్యక్తిగతం. సాధ్యమైనంత వరకు సత్యానికి హానిరానీయకుండా చూడాలని నా సంకల్పం. అభ్మిపాయాల విషయంలో వాటికి నా చిత్తశుద్ధి ఒక్కటే హామీ. ఇక ప్రారంభిస్తున్నాను.

ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ సాహిత్యసంస్థ ఆంధ్రసాహిత్య పరిషత్తు. బహుశా ఇది ఈ శతాబ్దపు [ప్రారంభంలోనో, క్రితం శతాబ్దపు తుదిలోనో ఏర్పడిఉండాలి. దీని పుట్టుపూర్వోత్తరాలు నాకే కాదు ఎవరికీ తఆలియవనుకుంటాను. ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రారంభమయిందో ఎవ్వరూ చారితిక ప్రమాణాలతో ఇంకా రాసినట్టు లేదు. బహుశా మద్రాసు విశ్వవిద్యాలయంలో కొన్ని విప్లవాలు రాబోతున్నవని తెలిసి వాటిని అరికట్టడానికి ఈ పరిషత్తు ఏర్పడి ఉండాలి. నాటి నుండి నేటిదాకా దీని ప్రధానాంశం తెలుగు సరస్వతిని కొత్త భావాల బారినుండి రక్షించడంలాగ కనబడుతుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వపుటండ చూసుకొని మార్పు వెల్లువలకు ఆనకట్టలు కట్టడం అభివృద్ధి నిరోధకుల ముఖ్యలక్షణం. విప్లవపుు వరదలో అతః పూర్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం కొట్టుకుపోయి కొత్తప్రభుత్వం రావడం, ఇది వరకు వెలివేయబడ్డ భావాలు ఈ కొత్త ప్రభుత్వం గొడుగుకింద రాజ్యం చెయ్యడం, విధిగా ఈ భావాలకి ముసలితనం వచ్చి యువక భావాలను కారాగృహంలో వెయ్యడం, ఆ కారాగృహాల్లోనే ఇంకో సరికొత్త ప్రభుత్వానికి ప్రాతిపదికలు ఏర్పడడం జీవితానికి పరిపాటి.

సాహిత్య సమాలోచనలో రాజకీయ పరిభాష వాడుతున్నందుకు నేను క్షమాపణ చెప్పుకో దలచుకోలేదు, “మేము సాహిత్యవేత్తలం, మాకూ రాజకీయాలకీ సంబంధంలేదు” అనే వాళ్ళ సంకుచిత దృష్టికి నేను జాలిపడడం మానలేను. సాహిత్యానికీ రాజకీయాలకీ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంగతి ఎంత పెందరాళే గుర్తిస్తే అంత మంచిది.

రాజకీయ సమస్యలంటే జీవిత సమస్యలు. సాహిత్య సమస్యలు కూడా అంతే. రాయల సీమలో కరువుకీ, ఆకలిలో అర్థానుస్వారానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని వాళ్ళతో వాదించి ప్రయోజనం లేదు. నా ఆకలిలో నుంచి అరసున్నను

ఆంధ్రదేశంలో సాహిత్య సలఘాలు. శ్రీరంగం శ్రీనివానరావు 1397 బహిష్కరించాను. ఈ దృక్పథంతో నన్ను పనిచెయ్య నిస్తే రాయలసీమనుంచి కరువును కూడా తరిమి కొట్టగలను, అయితే ఆ కరువూ, ఈ అరసున్నా అలాగే ఉండడం కొందరికి అవసరం.

ఈ అవసరాన్ని అంటిపట్టుకున్న ఆంధ్రసాహిత్య పరిషత్తుతో గిడుగు వెంకట రామమూర్తి సాగించిన పోరాటమే ఈ శతాబ్దపు ఆంధ్ర సాహిత్య చరిత్ర. ఎవరికి చెవుడు? గిడుగు పండితునికా? లేక అతని మాటలను చెవిని బొట్టమని భీష్మించుకు కూర్చున్న వఎశ్వవిద్యాలయాధికారులకా?

ఆంధ్ర సాహిత్య పరిషత్తుకీ అప్పటి ప్రభుత్వానికీ ఉన్న సంబంధం చప్పున గోచరించేది కాదు. నిజంగా ఆ రెండిటిమధ్యా లండన్‌కీ కాకినాడకీ ఉన్నంత దూరం ఉంది. మద్రాసు విశ్వవిద్యాలయం అధికారసంస్థ. ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనధికారసంస్థ. అయితేనేం ఈ ఆ0డూ తెలుగు సాహిత్యపు అభివృద్ధికి అడ్డంగా నిలుచున్నాయి, మదాసు యూనివర్సిటీ అశ్రద్ధవల్ల; ఆంధ్ర సాహిత్య పరిషత్తు అవివేకంవల్ల.

అవివేకం అనే ఘాటయిన మాట ఆంధ సాహిత్య పరిషత్తు విషయంలో ఉపయోగించక తప్పింది కాదు. కొత్త భావాల ప్రవేశానికి తలుపులు తెరవడం నిరాకరించిన పరిషత్తుది అవివేకం కాకపోతీ మరేమిటి? అందుకే దాని మీద తిరుగుబాటుగా నవ్యసాహిత్య పరిషత్తు ఏర్పడింది.

ఇంతటితో ఆంధ సాహిత్య పరిషత్తు ప్రసక్తి వదలిపెట్టవచ్చును గాని, అదంటే నాకు పూర్తిగా అనిష్టం అనే అపార్థం పాఠకులకు స్ఫురించవచ్చును. పక్షపాత బుద్ధితో పరిషత్తుమీద దుమ్మెత్తి పోస్తున్నాననీ, పెద్దల పట్ల అవినయం ప్రదర్శిస్తున్నాననీ కొంద రనుకోవచ్చును. అందుచేత ఆంధ్ర సాహిత్య పరిషత్తులో అమూల్యములని నేను భావించే అంశాలనుకూడా ఇక్కడ పేర్కొనవలసి ఉన్నది.

వాటిలో ముఖ్య మైనది సాహితీపరులు ఒక సంఘంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను ఆంధ సాహిత్య పరిషత్తు మొట్టమొదట గుర్తించడం. ఈ నలభై యేఖై ఏళ్ళలో ఆంధ్రసాహిత్య పరిషత్తు కేవలం ఆటంకాలు కల్పిస్తూనే కూర్చోలేదు. అన్ని సంఘాలూ మొదట సంకల్పశుద్ధితోనే ఏర్పడతాయి. యౌవనం కాలక్రమాన వార్థక్యంగా మారకతప్పదు. కాని ఈ వార్టక్యంలో లాలిత్యం లేకపోవడమే తప్పు. రాను రాను స్వప్రయోజనం ఘనీభవించి, ఎదిగి వస్తూన్న నూతన భావాల సౌందర్యాన్ని గుర్తించలేని గుడ్డితనం ఒకటి ఈ వార్థక్యానికి పుట్టుకొస్తుంది.

1398 పందిరి మల్లికార్జువరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గాంధీజీవలె, గిడుగు రామమూర్తివలె శరీరం ముడుతలు పడుతున్నా మానసిక వైర్మల్యం మసక బారకుండా వయోవృద్ధులు కాగలినవారు అరుదు.

ఒక్క శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం (ప్రచురించి నందుకే పరిషత్తు జన్మ సార్థక మయిందని నే నొప్పుకోగలను. దీనితోబాటు పరిషత్తు యాజమాన్యం కింద సూర్యరాయాంధ్రనిఘంటువు వెలువడబోతోంది కాదా? ఆ నిఘంటువు రావడం ఆంధ్రభాషకి ఎంత్రైనా అవసరం. కాని దాని నిర్మాణం వెనుక నున్న మనస్తత్వమే ఆ నిఘంటువు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణమని ఎందరు గుర్తిస్తున్నారు? మడికట్టుకున్న మాటలను మాత్రమే మా నిఘంటువులోకి రానిస్తామంటారు. ఏది మడి? ఏది కాదు? అనే తర్జన భర్జ్దనలతో ఇంతవరకు కాలం గడిచిపోతోంది. ఈ లోపున దేవాలయాల తలుపులు హరిజనులకు తెరుచుకుంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీవారి ఆంగ్ల నిఘంటువు ఉదాహరణ మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది.

సమగ్రమైన ఆంధ్ర నిఘంటువు వెలువడక పోవడమే సంపూర్ణమైన ఆంధ్ర వ్యాకరణం లేకపోవడానికి కూడా కారణం,

లాభంలేదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుని మెచ్చుకోవడం నాకు చేతకాదు. బహుశా నా మనస్తత్వమే ఇందుకు నాకు అడ్డుపడుతున్నట్లుంది. ఎంత నిష్పాక్షికంగా ఉండాలనుకున్నా ఆంధ్ర సాహిత్య పరిషత్తు చెయ్యగల స్థితిలో ఉండిన్నీ చెయ్యడం మానిన పనులే నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏదీ నిఘంటువు? ఏదీ వ్యాకరణం? ఏదీ ఆంధ్ర సాహిత్య చరిత్ర? మళ్ళీ అడుగుతున్నాను ఏదీ నా లైబరీ? ఆంధ్ర విశ్వవిద్యాలయం చేస్తుందనుకొని సాహిత్య పరిషత్తూ, పరిషత్తు చేస్తుందనుకొని విశ్వవిద్యాలయం ఆదమరిచి నిద్రపోయినట్టుంది.

చైనా దేశపు ఉద్యోగస్థులను గురించి చాంగ్‌కై - షేక్‌ సతి ఇలా అంది! "౧6 2/6 2౧ 2గ౫)/ 0 6౧6౧౫౦|౦2౦|95. ఓ272%/ 102| 006౧) 0612168 ౧6౪6గ౧61659 ౧౦1502౧౧66 10 634 1161 ౪౧6౭౧౧6౮ 5212గ65. (సరిగ్గా ఈ మాటల్లోకాదు, భావం మాత్రం ఇదే.). *సాజు ఫొజంత ఉద్యోగానికి అనర్హులు, పిసరంత పనిచేయలేని బద్దకం. అయినా తమ ఆర్టించని జీతాలనందుకోవడానికి వీళ్ళకి సిగ్గనిపించదు. గో క

ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు. శ్రీరంగం శ్రీనివానరావు 1399

ఇంతటితో ఆంధ్ర సాహిత్య పరిషత్తుని వదలి నవ్య సాహిత్య పరిషత్తు వైపు మళ్ళవలిసిం దేగాని ఈ రెండిటికీ మధ్య సాహితీ సమితి, కవితా సమితివంటి సమూహాలను కొన్నింటి నిక్కడ స్మరించవలసిన అగత్యం ఉంది. నిజానికి ఆంధ్ర సాహిత్య పరిషత్తు కంటె ఈ సంఘాలే కేవలం సాహితీ స్నేహాన్ని పురస్కరించుకొని ఏకీభవించి సృజనాత్మకమైన సారస్వత సేవ చేశాయని చెప్పాలి. సాహితీ సమితి సమగ్ర చరిత్రను నోరి నరసింహశాస్త్రి) రచిస్తున్నట్టు విన్నాను. ఆంగ్రంలో ఆయన వ్రాసిన వ్యాసం ఒకటి “త్రివేణి” పత్రికలో చదివాను. సాహితీ సమితి పుట్టుక తెనాలిలో అని కొందరూ, గుంటూరులో అని మరికొందరూ, అబ్బే మా రాజమండ్రిలో అని ఇంకొకరూ అంటారు. దీని కొక రాజ్యాంగ చట్టం ఉన్నట్టు కనబడదు. ఉండ నక్కర లేదు కూడాక్టర్‌ నలుగురు మిత్రులు కలుసుకున్నప్పుడల్లా సాహితీ సమితి అవతరిస్తుంది. నేను కలంపట్టిన కొత్తరోజుల్లో సాహితీ సమితి అంటే నాకు ప్రాణం లేచి వచ్చినట్టుంటేది. అందులో సభ్యుణ్ని కావడం ఎలాగో, ఎపరికి ఉత్తరం రాయడమో తలియకపోబట్టిగాని లేకపోతే ఒక అర్జీపెట్టుకొనేవాణ్నే! శ్రీరంగం శ్రీనివాసరావు (సాహితీ సమితి) అని అచ్చులో చూసుకోవాలని నాకు చాలా ఉబలాటంగా ఉండేది. నాలోనూ పురిపండాలోనూ ఉండిన ఈ ఉబలాటమే “కవితాసమితి" స్థాపనకి కారణమని ఇప్పుడు వెనక్కి చూసుకొని ఆలోచిస్తే అనిపించుతోంది. శ్రీరంగం శ్రీనివాసరావు, బి. ఏ. కంటె కూడా శ్రీశ్రీ (కవితా సమితి) అనుకోవడమే నాకు బాగుండేది. ఒకటి రెండు మార్లు కాబోలు శ్రీరంగం శ్రీనివాసరావు, బి. ఏ. (కవితా సమితి) అని నారచనలకి సంతకం చేశాను. ఈ రకం ప్రదర్శన ప్రియత్వం ఇప్పుడు నాలో పూర్తిగా ఇంకిపోయిందనుకుంటాను.

కళ్ళుమూసుకొని సాహితీ సమితి గురించి జ్ఞాపకం తెచ్చుకోబోతే నాకు కనబడేవి మూడు ముఖ్యాంశాలు. ఒకటి : గిడుగు వెంకటరామమూర్తితో సమితి సభ్యులు కలిసి తీయించుకున్న ఫోటోగ్రాపు. రెండు : ఆంధ్రదేశం అంతటా ఆధునిక కవిత్వాన్ని గానం చేస్తూ కృష్ణ శాస్తి) కావించిన వైత్రయాడత్ర. మూడు : చెన్నపట్టణంలో శీవశంకరశాస్తిం చేసిన సాహిత్యోపన్యాసాలను ఆంధ్రపత్రికలో చదవడం. ఆరోజుల్లో అక్కిరాజు ఉమాకాంతం “నేటి కాలపు కవిత్వం” అనే పుస్తకం ప్రయోగించాడు. అందులో కవి శబ్బచ్యు జైన ప్రతీవాణ్నీ ఆయన ఎడాపెడా వాయించి

1400 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వదలి పెట్టాడు. అదేం చిత్రమో కాని అతను ఎవరెవరిని మరీ ఎక్కువగా దులి పేశాడో వాళ్ళ కవిత్వంమీదనే నా అభిమానం ఎక్కువయింది. తర్వాత కొంతకాలానికి 1124110024 వ్రాసిన 0౭06౧6210౧ అనే [గ్రంథం చూశాను. ఆంధ్ర భావకవులమీద అక్కిరాజు ఉమాకాంతం కన్నా తీవంగా నోర్జౌపండితుడు యూరోపియన్‌ నవ్యకవులమీద విరుచుకు పడ్డాడు. అతను తిట్టిన కవులందరి రచనలూ సంపాదించి అతిమధురంగా ఆస్వాదించాను. “42% [10౧62౮6 నోరు నొక్కిన వాణ్ణి నేనే” అని ఎక్కడో బెర్నార్డ్‌ షా ప్రకటించాడు. ఒక అమెరికన్‌ పత్రికలో నోరా గ్రంథాన్ని రివ్వూచేస్తూ బెర్నార్డ్‌ షా నవీన కవిత్వాన్ని సమర్థించాడు.

అయితే మహా పండితుడైన అక్కిరాజు ఉమాకాన్తం సవాలుకి సాహితీ సమితి విమర్శాత్మకమైన (గంథరూపంలో జవాబు చెప్పలేక పోయింది. “కొన్ని సందేహాలు” అనీ కృష్ణా పత్రికలో చింతా దీక్షితులు సరళంగా, సరసంగా హేళన చెయ్యడం మినహాయిస్తే ఎవ్వరూ పతి విమర్శకి సాహసించలేదు. పండితుడు తిడుతూ ఉంటే కవి ఏం చెయ్యాలో చూపించిన వాడు కృష్ణశాస్త్రి. “ఇదీ మా కవిత్వం, ఏ మంటారు మీరు?” అని (ప్రజల్లోనికి ఆధునిక కవిత్వాన్ని తీసుకువెళ్ళాడు. (ప్రజలు హర్షించారు. “వీళ్ళంతా మావాళ్ళే” అని చెన్నపట్టణములో శివశంకరశాస్తి9 ఉపన్యసించడంతో నేటి కాలంలో కూడా కవిత్వం సజీవంగానే ఉందని స్థిరపడింది. ముద్దుకృష్ణ “వైతాళికులు అచ్చువేసి ఆధునిక కవిత్వాని కొక [గ్రంథరూపం ఇచ్చాడు. బెమాకాన్తులకి అదే జవాబు.

ఈ లోపున విశాఖపట్టణంలో నేనూ, పురిపండా అప్పలస్వామి, వడ్డాది సీతారామాంజనేయులూ కలిసి “మనం కవితా సమితి” అనుకున్నాము. అధ్యక్ష స్థానంలో ఒక పెద్ద పేరు ఉండడం మాకు అవసరమనిపించింది. అడగ్గానే అంగీకరించారు “కవిగారు” (మారేపల్లి రామచందదశాస్తి9). కార్యదర్శిత్వం పురిపండా అప్పలస్వామిది. కవితా సమితి ఏం చేసిందో మానిందో నాకు తెలియదుగాని ఎవరూ చెయ్యని పనులు మాత్రం చెయ్యాలని మా కుండేది. అందుకే పురిపండా అప్పలస్వామి “అఖిలాంధ్ర కవుల ఛాయాచిత్ర ప్రదర్శనం” ఏర్పాటుచేసి దిగ్విజయంగా జరిపించాడు. కవిగారి షష్టిపూర్తి ఒక కొత్త ఐడియా. కవితా సమితి వార్షికోత్సవాలు మహోత్సాహంతో జరిగేవి. ఒక వార్షికోత్సవాసకి ఆచంట వెంకటరాయ సాంఖ్యాయన శర్మని అధ్యక్షునిగా ఎన్నుకున్నాం. “పెద్ద

ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు శ్రీరంగం శ్రీనివానరావు 1401 అధ్యక్షో పన్యాసం తయారు చేస్తున్నాను. నా జీవితంలో చెప్పదలచుకున్నవన్నీ ఒక్కుమ్మడిగా చెప్పబోతున్నాను” అన్నాడాయన. కాని మా దురదృష్టవశాత్తూ వార్షికోత్సవానికి ముందుగా ఆయన మరణించాడు. సాంఖ్యాయన శర్మస్థానే గిడుగు వెంకట రామమూర్తిని ఆహ్వానించాం. ఆయన అధ్యక్షత వహించిన సభకి విశాఖపట్టణంలో ఏరాజకీయ సమావేశానికి రానంతమంది జనం వచ్చారు.

ఈనాడు కవితా సమితి నావువూత్రావశిష్టంగా ఉంది. మారేపల్లి రామచంద్రశాస్త్రి ఒంటరిగా అచ్చ తెలుగు “నుడి కడలి” ని మథిస్తున్నాడు. సెట్టి లక్ష్మీనరసింహం “బస్తీమీద సవాలొ అని వాడుకభాషకోసం పడుచుతనంలో

నడుంబిగించినవాడు “ప్రాయమింతకు మున్నె కై వ్రాలకుండ” జయపురాధీశ్వరుని

ఆంతరంగిక కార్యదర్శి అయి “ప్రభాసశాప విమోచనము” అనే ప్రబంధం రచించి మరణించాడు. పురిపండా దగ్గరనుంచి అప్పుడప్పుడొక ఉత్తరం వస్తుంది. అక్కడక్కడ ఒకపద్యం కనబడుతుంది. వడ్డాది సీతారామాంజనేయులు ఇంకా ఇప్పటికీ అష్టావధానాలూ, శతావధానాలూ చేస్తున్నా డనుకుంటాను, మరి నామాట! సరే. నా మాటకేం! ప్రస్తుతం రాస్తున్నది సాహిత్య సంఘాలను గురించి.

సారస్వత సమాజం, యువకవి మండలి, ఆం(ధ్రభారతీ తీర్థ! ఇంకా ఎన్నో పేర్లు. వీటిలో కొన్ని స్థానిక ప్రాముఖ్యం మాత్రమే సంపాదించినవి. ఆంధ భారతీ తీర్ణ అందుకోవడానికి సాధ్యంకాని ఆశయాలతో ఏర్పడింది. తానే ఒక విశ్వవిద్యాలయంగా ప్రవర్తించదలచుకుంది. స్నాతకోత్సవాలూ, బిరుద ప్రదానాలూ మొదలైనవి జరిపించింది. ఆంధ్రభారతీ తీర్థ ప్రధాని బుర్రా శేషగిరిరాపు విచిత్రవ్యక్తి. ఈయనలో 00౧ ౧1౫018 అంశ కొంతా, ౧6౬౯౯౫౧ అంశ కొంతా ఉంది. చిన్నపిల్లలు తాటాకు బొమ్మల పెల్లిళ్లు చేసేటప్పుడు చూపించే ఉత్సాహమూ, ఏకాగ్రతా ఆంధ్ర భారతీ తీర్గోత్సవాలలో నాకు కనబడేవి.

నవ్యసాహిత్య పరిషత్తు జననం! బ్రిటిష్‌ స్వామాజ్య విధానంమీద తిరుగుబాటుగా ఉప్పు సత్యా(గగహం జరిగిన కాలంలోనే నవ్యసాహిత్య పరిషత్తు ఏర్పడడం కాకతాళీయం కాదు. భారతదేశం అంతటితోబాటు ఆంధ్రదేశంలో కూడా “మధ్య తరగతుల విప్లవం” చలరేగుతోంది. (పపంచ పర్యాప్తమైన “ఆర్థిక మాంద్యం ఈ విప్లవాన్ని ఎగసనదోసింది. పాతవ్యవస్థ మీద అసహ్యం! కొత్త వ్యవస్థ కోసం తహతహ! ఈ కొత్త వ్యవస్థ ఎలాగ ఉండాలని అనే విషయంలో ఎవరికీ

1402 పందిరి మల్లికార్డువరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విస్పష్టాభ్మిప్రాయాలు లేవు. పాత వ్యవస్థ విసుగెత్తిస్తోంది. విషమెక్కిస్తోంది. అది పోతేచాలు ఆ తర్వాత ఏదివచ్చినా సరే! అదీ ఆనాటి మనస్తత్వం.

(ప్రజలలో, రాజకీయాలలో (ప్రస్ఫుటంగా కనిపించే ఈ మనస్తత్వమే సాహిత్యలోకంలో కూడా ప్రతిబింబించింది. బరంపురంలో మొట్టమొదటి సారి సమావేశమైన అభినవాంధ్ర కవిపండితసభ (ఇదే, దరిమిలాను నవ్యసాహిత్య పరిషత్తుగా మారింది)లో ఈ ఉత్సాహమే కనిపించింది. అందరి ఆశీర్వాదాలూ నవీనత్వానికే! మెరిసిపోయే కళ్ళలో అపరిమితానందంతో చింతా దీక్షితులు “వచ్చేసింది కొత్తతరం! కొత్త కవిత్వం” అని నాతో అన్నప్పుడు ఆ మాటల్లో చిలుకూరి నారాయణరావు అధ్యక్షోపన్యాసపు సారాంశమంతా ఇమిడిపోయింది. (కథక చ(కవర్తితో నాతొలి పరిచయం బరంపురంలోనే.)

నాటినుండి పది హేనేళ్ళకుపైగా (పతి సంవత్సరం నవ్యసాహిత్య పరిషత్తు సమావేశమవుతూ వచ్చింది. ఏటా ఒక వార్షికోత్సవం, ఒక అధ్యక్షుడూ, కొన్ని తీర్మానాలూ. కాం(గెసు సభలు జ్ఞాపకం రాలేదూ? పరిషత్తు సాగించిన 018642040౧ “పతిభొ ప్రకటన, అధ్యక్ష వరణం కూడా ఎన్నికల ద్వారా కాదు. ప్రజాస్వామ్యపు బహిరంగస్వరూపం లేకపోలేదు పరిషత్తుకి. ఆంధ్రదేశం అంతటా పరిషత్తుకి సభ్యులున్నారు కాని వీళ్ళంతా సరిగా చందాలైనా చెల్లించారో లేదో తెలియదు. (నామట్టుకు నేను ఒక్కసారికూడా చందా ఇచ్చినట్టు జ్ఞాపకం లేదు) పరిషత్తుకి ఆర్థికంగా గట్టి పునాది పడనేలేదు.

సాహితీ సమితికి సహజమైన వ్యవస్థారాహిత్యం అనేగుణం నవ్యసాహిత్య పరిషత్తుని ఎప్పుడూ అంటిపెట్టుకొనే ఉంది. సారస్వత సంఘాలు శిలావిగ్రహాలు కావన్న మాట నిజమే. మార్చు, ఎదుగుదలా వాటి ముఖ్యలక్షణం. రాజ్యాంగ చట్టంలోని నిబంధనలను కూడా అధికసంఖ్యాకుల అనుమతితో మార్చుతూ ఉంటారు. కాని ఆ స్వరూప మంటూ ఉండాలి కదా! నవ్యసాహిత్య పరిషత్తుని పట్టుకొన్న పెద్దలోపం ఏమిటంటే దానికొక కేంద్రకార్యాలయం లేకపోవడం. సాహితీ సమితిలాగే నవ్యసాహిత్య పరిషత్తు కూడా నలుగురు మిత్రులు కలుసుకున్నప్పుడు మాత్రం ఉన్నానంటుంది. తతిమ్మా సమయాలలో కనబడదు.

ఆంధ్రదేశంలో సాహిత్య సంఘాలు శ్రీరంగం శ్రీనివావరావు 1403

లక్షలకొద్ది జనానికి ఇళ్ళులేని ఈ కాలంలో ఈ దేశంలో సాహిత్యాని కొక భవనం కావాలని కోరడం హాస్యాస్పదమే! కోట్లకొలది ప్రజలకి ప్రధాన జీవితావసరాలే సరిగా అందుబాటులోకి రావడంలదు. సాహిత్యం వైపు దృష్టి మరల్చడానికి కావలసిన తీరుబాటుగాని సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కావలసిన సంస్కారంగాని అధిక సంఖ్యాకులగు మన (ప్రజలలో మృగ్యం. ఒక సాహిత్యంలోనే కాదు. అన్ని కళలలోనూ, శాస్త్రాలలోనూ కూడా ఏమాత్రం శక్తి సామర్థ్ధ్యాలూ, అభినివేశం ఉన్నవాడైనా ఒక ప్రవాసిగా, కాందిశీకుడుగా బతకవలసి వస్తోంది. భరించలేని ఒంటరితనం నేటి జీవితానికి శాపం; కలసిమెలసి బతకడంగాని, కలిసి పనిచెయ్యడంగాని ఎక్కడా కనపడదు.

ధన స్వామ్య సమాజం వ్యక్తి స్వాతంత్య్యుం అనే మిథ్యావాదంతో తెచ్చిపెట్టిన ముప్పు ఇది. చిన్నచేపని మింగడానికి పెద్ద చేపకి స్వాతంత్య్యం! కూలివాడిని మోసగించడానికి కామందుకి స్వా త్యం! కులంవల్ల, ధనంవల్ల వచ్చిన గొప్పతనం అలగా జనానికి ఎంత మం వుంటే అంత మంచిది. అప్పుడునీ వ్యక్తికి గిరాకీ.

కొందరనవచ్చును : “ప్రపంచం [ంతటిక్సీ ఒకే ఒక్క షేక్సియరున్నాడు. ఒక్కడే కాళిదాసు ఉన్నాడు." అని. ఆంధ్రులందరికీ ఒకే ఒక్క అల్లారు ముద్దుతార ఉందనడం కూడా ఇటువంటిదే! ఈ విధంగా విలువ కట్టడం విజ్ఞానపు పరిణామ (కమం తఆలిసిన వాడెవ్వడూ చెయ్యడు. షేక్సియరుగాని కాళిదాసుగాని సహజ కవచకుండలాలతో జన్మించలేదు. వారికి పూర్వం. వారిచుట్టూ అపారమైన విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానానికి అందమైన ఫలంగా వారు రూపుదాల్చ్బారు. అల్లసాని పెద్దన్న అంత మధురమైన కవిత్వం చెప్పాడంటే అందుకు కారణం అతని చుట్టూ ఉన్న వివిధ విద్యల ఉద్యానవనాలని మనం మరిచి పోకూడదు.

వాతావరణం కావాలి. స్పర్ధకి బదులు సహకారం సాధ్యం కాగల పరిస్థితులను సృష్టించాలి. మన మొక తిరుగులేని నిశ్చయం తీసుకోవలసిన తరుణం వచ్చింది. అరణ్య సీమలో అబ్ధిగర్భంలో పెద్దపులుల, తిమింగిలాల మిలిటరీ స్మామాజ్యమా? లేక మాధుర్యాన్ని సృష్టించే తేనెటీగల సమష్టి వ్యవసాయమా?

1404 పందిరి షల్లికార్డుసరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

రాజకీయ స్వాతంత్య్యం లభించి రెండేళ్ళయినా అయిందోలేదో అప్పుడే మనం బ్రహ్మాండమైన మిలిటరీ సన్నాహాలు [ప్రారంభిస్తున్నాం! ఇంకోవిషయం ఆలోచించడానికే తీరుబాటు లేదు, నిర్మూలనం కోసం మనం కృషి చేస్తున్నాం. నిర్మాణం కోసం గాదు.

కాబట్టి అభ్యుదయ రచయితల సంఘం గురించి నేనిక్కడ అసలే ప్రస్తావించను. అధికారస్థానాలను ఆక్రమించిన మరుగుజ్జులు కొందరు అభ్యుదయ ధోరణులను అరికట్టాలని చూస్తున్నారు. వీరి అల్బ బుద్ధులకు తాము జయిస్తున్నట్లుగానే అనిపించవచ్చును. కాని అది తాత్కాలికం మాత్రమే. నిడివిమీద వీళ్ళ పతనమూ తప్పదు; సామ్యవాద సమాజ ప్రతిష్టాపనా తప్పదు.

ఆ సామ్యవాద సమాజమే అభ్యుదయ రచయితల ధ్యేయం. అందుచేత అభ్యుదయ రచయితలంతా సామ్యవాదులే అని నిరభ్యంతరంగా ఒప్పుకోవచ్చును. కాని సామ్యవాద వ్యవస్థ మానవపురోగమనంలో ఒక మజలీ మాత్రమే. దారిద్యూం, నిరుద్యోగం, సరుకు గిరాకీ అనే పునాదులమీద నిలబడే పెట్టుబడిదారీ విధానానికి బదులు సమృద్ధి, సమానావకాశాలూ గల సామ్యవాద సంఘం ఏర్పడినప్పుడు ఆ (ప్రజల సాహిత్యావసరాలు ఏ రూపం ధరిస్తాయో ఆ తర్వాత వాళ్ళు వేసేముందడుగు ఎట్టిదో ఊహించడంకష్టం. అయితే అప్పుడుకూడా తిక్కన

' సోమయాజిని చదవకుండా తిక్కన సోమయాజి గురించి మాట్లాడేవాళ్ళూ, అందరాని దేని కోసమో అశాంతి పొందేవాళ్ళూ ఉంటారని మాత్రం చెప్పవచ్చును. (కిన్నెర; సంపుటము 1, సంచిక 6, ఆగస్టు కైంం) టా.

ఆలస్‌ హక్స్‌లీ ( ౮ ఆచంట జానకిరామ్‌

“ఆధునిక ఆంగ్ల వచన రచనలో అందె వేసిన చేయి హక్స్‌లీ. ప్రస్తుత సంఘ పరిస్థితులను అతి నిపుణతతో విమర్శింపగల శక్తికలవాడు. సమకాలికు లెవ్వరు అందలేని ఉన్నత స్థానమును అందగలిగాడు రచయితగా ఇతడు”

“ఇప్పటివారిలో ఇంతటి కుశ్శాగమైన విమర్శనాదృష్టి మరి యెవ్వరికిని లేదు. ప్రపంచ విషయాలలో నిమగ్నుడు కాక, ప్రపంచ విషయాలను గురించి అతి వివరముగా అత్యద్భుతమైన విచక్షణతో విమర్శింపగల ప్రతిభ వున్నది హక్స్‌లీలో.”

“ఇతడు చెప్పదలచినవి అన్నీ ప్రథమ (శ్రేణికి చెందిన విషయాలే! సాహిత్య రుచి ఇతనికి ఉగ్గుపాలతో పెట్టినది. ఇతని విచక్షణా శక్తి అత్యద్భుతము. ఫై మై మెరుగును చూచి మోసపోడు. ప్రస్తుతము మనకున్న రాజకీయ తత్వవేత్తలలో మేట్‌ ఇతడు.”

“అబ్బా! ఇతని కన్ని విషయాలూ అవగాహనమ! ఇతని ఛలోక్టి ఛురకత్తివంటిది. వివిధ విషయములగురించి ఇంత చక్కగా చదువుకున్న రచయిత మరియొకడు లేడు”. +

ఈవిధంగా ఉంటాయి ప్రస్తుత ఆంగ్ల రచయితలలో మిక్కిలి పేరు పొందిన ఆల్డస్‌ హక్స్‌లీని గురించిన పతికా విమర్శలు. హక్స్‌లీ ఒకప్పుడు ఉత్తమ రచయితగా విఖ్యాతిగాంచివున్నా, ఇటీవల అతి కుశ్యాగమైన దృష్టితో విమర్శించే తత్వవేత్తగానూ, అసమాన మేధావిగాను పేరుపొందుతున్నాడు. ఒకప్పుడు తన నవలల ద్వారా, వ్యాసములద్వారా, ఉపన్యాసములద్వారా, సంఘపరిస్థితులలోని పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంప్పుటము. 4: సాహిత్యము.

1406 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము మలినము నంతటిని వ్య క్తపరుస్తూ మానవ జీవితము దెస ఒకవిధమైన విముఖత గల హక్స్‌లీ, తాను సంపాదించిన విశేష జ్ఞాన సంపద ఫలితంగా, పాశ్చాత్యులకు జీవితము దెస, మన వేదాంతరీత్యా, ఉత్తమ దృక్పథాన్ని చూపించడానికి యత్నము చేస్తున్నాడు.

౧68౧౧1! [౧|౦500[%౫ అనే ఇటీవలి ఇతని రచన వ్యక్తి జీవితాన్ని సంఘ జీవితంతో సమన్వయించుకొని మానవుడు తన నిజస్థానమును తలుసుకొనడానికి ఎంతో ఉపయోగపడగల దనడానికి సందేహము లేదు..

మొదటి ప్రపంచ యుద్ధము ముగిసిన పిదప, ప్రపంచమందలి జనులందరి మనస్పులలోనూ కలిగిన నిరాశను కొంతవరకు తొలగించడానికి సాయపడినై హక్స్‌లీ రచనలు. ముఖ్యంగా, అతడు తన రచనలో చూపించే తెలివితేటలు పాఠకులను ముగ్ధులను చేశాయి. హక్స్‌లీ నవలలను చదవడమనేది ఒక నాగరికతా చిహ్నంగా పాటించేవారు యువకులు. [కమక్రమంగా అతని నవలలలో ఇంకా ఇంకా కొత్తవి వెలువడిన కొద్దీ, పాఠకులు వాటిని కేవలం విలాసార్థమే కాకుండా జీవిత సమస్యలను విమర్శించడానికి అనుకూలమైన రచనలుగా భావింప మొదలుపెట్టారు. నవలారచయితగా ఉప[కమించిన హక్స్‌లీ తన రచనానైపుణిని

“ జీవితమునందలి సత్యమును వెదకి కనిపెట్టడానికి తీవ యత్నంగా మార్చాడు. అంచేత [క్రమంగా గ౧॥౦౪౦౧౧౦౫| 10౪615 అంటే కథావస్తువు కంటె సన్నివేశాలకంటె మానసిక ప్రవృత్తిని పరిశీలించే రచనలుగా పరిణమించాయి ఇతడి నవలలు. తమ చిన్నతనంలో ఇతని రచనలు చదివి ఆనందించేవారు తదుపరి హక్స్‌లీ వ్రాసిన రచనల్లో ఉదాత్త విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించడము నేర్చుకొని సమకాలిక మానవ జీవితాన్ని బాగుపరచు ఉద్దేశవే. హక్స్‌లీది అని వితర్కించుకోవడము మొదలుపెట్టారు.

౬/61655 1౧ 6422- అనే నవలలో కథావస్తువును కేవలం నిమిత్తమాత్రంగా భావించి ఒకానొక శాశ్వత లక్ష్యము, ఒక పరిపూర్ణ విశ్వాసము - వీనిని ఉద్దేశించిన ఒక ముఖ్య యత్నంగా పరిణమించినది హక్స్‌లీ రచన. ఈ నవలలో ప్రధాన పాత తనలో తాను ఈ విధంగా తర్కించుకొంటాడు: “ప్రపంచమంతా మాయ అని అనేకుల విశ్వాసము. ఐనా, మాయామయమైన ఈ ప్రపంచాన్నే మనము మన చేతనైనంతవరకు బాగుపర్చాలి. ప్రపంచం నిజంగా మాయే ఐతే, మాయను బాగుపరచడ మెల్లా? తామరాకు మీద నీటిబొట్లులా ఏ విషయంలోనూ కలిగించు కోకుండా వుంటే, పరిస్థితులను బాగుచేయటమెట్లా?”

ఆల్పస్‌ హక్స్‌లీ ఆచంట జానకీరామ్‌ 1407

ఇది అసలు హక్స్‌లీ మనస్సులో కలిగిన సందేహమే. ఇదివరకు ఈ చిక్కును విప్పడానికి [ప్రయత్నము చేసిన అనేకుల త్రోవనే వెళ్ళాడు హక్స్‌లీ. ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిచయ ఫలితంగా, సర్వచరాచర వస్తువులలోను ఒకే జీవము అంతర్వ్యాప్తమై ఉన్నదని అతడు నమ్ముతాడు. ఎన్నెన్ని పెపూతలున్నా, పతి నిమిషము ఎంతటి విధ్వంసమున్నా జీవితము నిరంతరము నిరామయము అని అతడు నమ్ముతాడు.

(ప్రస్తుతము హక్స్‌లీ జీవితాన్ని ఒక అతి విలువగల అవకాశంగా భావిస్తాడు. పాశ్యాత్య దేశములో కేవలము (ప్రపంచ విషయములలో మునిగిపోయినవారిని తమ జీవితమును కాస్త ఆధ్యాత్మికంగా మారుస్తూ, ఇప్పటికంటె అతి ఉన్నతమైన లక్ష్య్యముల కొరకు యత్నింపవలసినదిగా ప్రబోధిస్తాడు హక్స్‌లీ. ౧౭/౧౧1| న౧|౦500%/లో మన ఉపనిషత్తులనుండి, బౌద్ధవాజ్బాయమునుండి చీనా కైస్తవ పారసీక మత ప్రవక్తల ప్రబోధములనుండి అనేక విషయాలను స్వీకరించి మనకు చూపుతాడు. “వీరు అందరు అసాధారణ ప్రజ్ఞకలవారు. తాము ఏ విషయమును గురించి మాట్లాడుతున్నారో దాన్నిగురించి సంపూర్ణమైన జ్ఞానము కలవారు. ఐతే వీరి మాటల అంతరార్థము పూర్తిగా తెలుసుకోవాలంటే మనము మానసికంగా పరిశుభ్రత పొందాలి. మన జీవితములను (ప్రమమయంగా చేసుకోవాలి. ఎటువంటి కాంక్ష ఉండకూడదు" అని నిర్దేశిస్తాడు.

“కులాసాగా కాలం గడపడం” గురించి హక్స్‌లీ ఒక పర్యాయం ఇలా (వ్రాశాడు:

“కులాసాగా కాలం గడపడం అంటే గుృురప్పు పందాలు చూడటం, పేకాట, అందరూ కలిసి త్రాగడం, తూర్పు తెల్లవారేదాకా డ్యాన్సు చెయ్యడం, అర్థంలేని విషయాలనుగురించి తెగ వాగుతూ ఉండడం - ఇదీ కులాసాగా కాలం గడపడం అంటే. మనం ఇటువంటి వ్యాపకాలలో చిక్కుకొని, మనం మనసారా పాల్గొని లక్షవిధాల మనకు, మన తోటివారికి శాశ్వతానందం కలుగజేయడానికి అవకాశమున్న నిజమైన జీవితాన్ని వస్మరిస్తాము. జీవితంలో ఎంతటి అద్భుతం ఉన్నదో, ఎంతటి ఆనందం ఉన్నదో మనం గుర్తించం. మన ఆయుఃపరిమాణము ఎంతో లేదు. కాలం నిర్ణయతో గడచిపోతోంది. పపాణాపాయకరమైన గాయంలోంచి ఏకధారగా ్రవించిపోతూ ఉన్న రక్షప్రవాహంవలె కాలం గడచిపోతూన్నట్టు మనకు తఆఅలియదు.

1408 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఎంతటి కళా సంపద! ఎంత జ్ఞాన సంపద! ఎందరెందరు మహనీయులు, స్పీంలు, పురుషులు, ప్రతి నిమిషము (ప్రపంచంలో ఏదో ఒకచోట కృషిజేస్తూ ఈ సంపదలను మరింత ఎక్కువచేయడం లేదు! కోటానుకోట్ల ప్రజ! వీరందరి జీవితంలో ఎంత వైతన్యముంది!! ఎన్ని పుస్తకాలు! అమరత్వము సిద్ధించిన సిద్ధహస్తుల రచనలు ఎన్నిటిలో మానవాత్మ మూర్తీభవించి ఉండలేదు!

కులాసాగా కాలం గడపడమా! ఎందుకొచ్చిన కులాసా! ఎవరిని ఉద్ధరించను? ఒద్దు! నాకు ఒద్దు. ఈ కులాసా అంటాడు,

ఈ విధంగా జీవితంలోని శాశ్వతమైన విలువలను పాంటించవలెనని ఉద్చోధిస్తూ హక్స్‌లీ ఎంతైనా వాశాడు.

(ప్రపంచంలో అల్ప విషయం లేదు. మనఃపూర్వకంగా, శ్రద్ధాభక్తులతో చేసిన అత్యల్ప విషయమైనా, ్రమలేకుండా చేసిన మహత్కార్యాలకంటె గొప్పది. ఎంతో కష్టపడి సాధించిన మహత్కార్యమే విలువకలదని కొందరు తప్పు అభిప్రాయపడతారు. ఎంత కష్టపడితే ఒకానొక పుణ్యకార్యానికి అంత విలువ అనడం కొంతవరకు నిజం. కాని, ఏ ఉత్తమ కార్యపు విలువైన అది ఎంతవరకు విశ్వప్రేమ స్వరూపమైన దైవాంశమును ప్రతిఫలింప కలుగుతుందో దానినిబట్టి ఉంటుంది.

నిజానికి చాలా కష్టమైన పనులు అని జనులు భావించేవే సులభసాధ్యాలు. ఒకానొక ప్రమాదము సంభవించినప్పుడు సాధారణ జనులు ఇదివరకు తమలో లేని గుణగణాలను చూపిస్తూ ప్రమాదమునుంచి తప్పించుకొనే యత్నము చేస్తారు. కాని ఇటువంటి ప్రత్యేక పరిస్థితులలో మనము చూపే విశేష గుణములలో పదవ వంతైనా మన నిత్య జీవితములో చూపగలిగామంటే ఆ ప్రమాద పరిస్థితు లేర్పడడానికి అవకాశమే ఉండదు.

నిజంగా విలువగల పనులు చేసినప్పుడు తద్వారా ప్రపంచానికి నిజంగా మంచే జరుగుతుంది. కాని, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము అని మనము చేసే పనికంటె పరమాత్మ స్వరూపమైన ఏదో ఒక శక్తియందలి ఆపుకోలేని (పేమవల్ల చేస్తే ఆ పనికి ఎక్కువ విలువ ఉంటుంది. "

“సత్యాన్వేషము” అంటూ సత్యాన్ని అన్వేషించడము కంటె గొప్ప తప్పు లేదు. సత్యాన్వేషణము అనుకోవడములోనే సత్య మంటే ఏదో ఒక అభిప్రాయానికి ఇదివరకే వచ్చినట్లు ధృవ మవ్పుతోంది. అలా కాకుండా, ఏ విషయాన్ని గురించీ ఎటీవంటి అభ్మిపాయము లెకుండా నిశ్చలమైన మనస్సుతో అన్వేషింప గలిగినప్పుడే

ఆల్గస్‌ హక్స్‌లీ ఆచంట జానకీరామ - 1409 సత్య స్వరూపము ఒకానొకప్పుడైనా కనిపించగలదు. ప్రపంచకములోని శత హస స్వరూపమైన భిన్న ప్రకృతులతో ఏకత్వాన్ని గుర్తించగలిగిన సాథకుచే

జ్ఞానికి “నిర్వాణము” “సంసారము” రెండూ ఒకటే. భౌతిక ప్రపంచము దైవాంశ సంభూతము. దైవములో భౌతిక ప్రపంచము ప్రతిబించితము. కాని ఈ సత్యాన్ని నిజంగా అవగాహన చేసుకునేటంతవరకు దైవము వేరు, ఈ భౌతిక (ప్రపంచము వేరు, అని మనము ప్రవర్తించక తప్పదు. ఆ పరిస్థితులలోనే సంసారము వేరు, నిర్వాణము వేరు అని తోస్తుంది - అంటాడు.

అహంకారము చాలా చెడ్డది. వ్య క్రితమైన అహంకారము మనుష్యులను పాడుచేస్తుంది. ఈ అహంకారము ఒక వర్ణమును ఆవహిస్తే ఆ వర్ణము నాశన మవుతుంది. ఒక జాతిని ఆవహిస్తే ఆ జాతి నాశనమవుతుంది. ఒక మతాన్ని ఆవహిస్తే ఆ మతము నాశన మవుతుంది.

అహంకారానికి హద్దు లేదు. ఇతరులను మనకు లోబరచుకోవాలనే కాంక్ష కలిగినప్పుడు అందుకు మితి వున్నదా ? ఈ కాంక్షవల్లే ప్రపంచములో కలిగే యుద్ధాలన్నీ - అంటాడు.

ఈ విధంగా పూర్తిగా పాశ్చాత్య పరిసరాలలో పెరిగి పెద్దవాడైన హక్స్‌లీ

దృక్పథం (పాచీన తత్వ మార్గాలనే అనుసరిస్తుంది.

హక్స్‌లికి ఇప్పుడు 55వ ఏడు. ఇటీవలనే నోబెల్‌ ప్రైజ్‌ గౌరవము పొందిన టి. ఎస్‌. ఎలియట్‌ ఇతనికి సమకాలికుడు. థామస్‌ హక్స్‌లీ అనే ప్రఖ్యాత శాస్త్రజ్ఞున సంతతివాడు ఆల్జస్‌. ఇతడు చదివిన చదువును బట్టి, సంపాదించిన జ్ఞానాన్ని బట్టి, వ్రాసిన జగత్ప్రఖ్యాతమైన రచనలనుబట్టి ఇంగ్రండులోనే ఏదోఒక పెద్ద ఉద్యోగము నలంకరిస్తూ బి. బి. సి. వంటి సంస్థలద్వారా అనేకమందికి తన విజ్ఞానాన్ని పంచి యిచ్చే వ్యాపకంలో ఉండవచ్చు. కాని ఇవేవీ కాకుండా, సన్నెండేళ్ళ [క్రితము ఇంగ్లండు విడిచివెళ్ళి ప్రస్తుతం హాలీవుడ్‌లో ఉంటున్నాడు.

ఒకానొకప్పుడు ప్రపంచములో ఆర్థికంగా ఉన్నత పదవిని పొందాలనీ, జనానీకము యొక్క మెప్పును పొందాలనీ ఆశించివున్నా ప్రస్తుతము అతడికి ఇటుపంటి ఆశ ఎమీ పున్నట్లు లెదు. ఇప్పుడు అతని యత్నమంతా ఆధ్యాత్మికమైన ప్రవృత్తిగా కనబడుతూంది. ఇతనిని చూసిన తక్షణమే ఇతడెంతో మేథావి అనిపిస్తుంది. కాని పరమ శాంతి స్వభావము కలవాడు, దయార్ణ్రు హృదయుడు అనికూడా (ప్రస్ఫుటమవుతుంది.

1410 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము హక్స్‌లీ పది పన్నెండేళ్ళుగా అమెరికాలో ఉన్నా, అమెరికను పద్ధతులేమీ అలవర్చుకోలేదు. ఇతడు తన వ్యక్తిత్వాన్ని ఏవిధంగాను పోగొట్టుకోలేదు. హాలీవుడ్‌లో పని చేస్తున్నా అచటివారి అలవాట్లేమీ అతనిని అంటలేదు. మితాహారి. పెందరాణే నిద్దరపోతాడు. వేకువనే లేచి అనేక విషయాలను గురించి చదువుతాడు. లలిత కళలందు అపరిమితమైన ఆసక్తి. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక దృష్టి కలవాడైనా హాక్స్‌లీ నేటి ప్రంపంచ భౌతిక సమస్యలన్నీ కూడా ఆమూలా[గ్రంగా చర్చిస్తూ వానిని గురించి మిక్కిలి బాధపడతాడు. కొద్దికాలంలో ప్రపంచాన్నంతా ఆవహించే ఒక మహాకాటకము సంభవిస్తుంది; ఆటంబాంబులు, రేడియో ఏక్టివ్‌ కిరణాలు - వీనివల్ల అపరిమితమైన జన నాశనవువుతుంది. కాని, మానవజాతిని ఈ (పప్రవమాదమునుండి తప్పించడముకంటె జనులలో వుండే అధికార కాంక్ష విషయ వాంఛ వీటిని పోగొట్టటము అత్యవసర మంటాడు. ప్రస్తుతము హక్స్‌లీ ఇటలీకి సంబంధించిన ఒకానొక ప్రాచీన చారిత్రాత్మిక విషయము కథా వస్తువుగా ఒకానొక గొప్ప నవల రచిస్తున్నాడు. “కార్యకారణ స్వరూపాలను గురించి జనులలో ఎంతో తప్పు అభిప్రాయ ముంది! మన చరిత్రంతా తప్పే! చరిత్రకారులు ఏవో కొన్ని ముఖ్యమైన తేదీలగురించీ తలలు బద్దలు కొట్టుకుంటారు. కాని, మానవ నిజ స్వరూప పరిణామముగురించి ఆలుసుకొనడానికి ప్రయత్నించరు" అంటాడు హక్స్‌లీ. ఇదే అతని జీవిత లక్ష్యముగా తోస్తుంది. మానవ నిజ స్వరూప పరిణామాన్ని గుర్తించడములోనే హక్స్‌లీ తన జీవితము గడపవచ్చు. ప్రతిభాశాలి, లలితకళా ప్రియుడు - యోగిగా తన నిజ స్వరూపమును, తన పరిసర ప్రపంచపు నిజ స్వరూపమును ఇకముందు తెలిసికోగలడేమో ! (కిన్నెర: సంపుటము 1, సంచిక 6, ఆగస్టు శేంషం) (యింట రనంి మా న్‌ .! టం ర ర్‌... పు మా దుం శరా గ్‌ ల్‌

ఠి మను చరిత్రము: సాంఘిక, జో ల రాజకీయార్దిక వరిస్బతులు బులును వేంకట రమణయ్య మును చరిత్రముపై నిదివరకు లెక్కలేని సమీక్షలు వ్యాస రూపమునను, (గ్రంథ రూపమునను వెలువడియే యున్నవి. అన్నియు నించుమించుగ [గ్రంథ (సాశస్త్యమును దెలుపునవియు, ఛందో వ్యాకరణా లంకార విషయములను వివరించునవియు, బొచిత్యా నౌాచిత్యములను విమర్శించునవియునై యున్నవి. ఈ వ్యాసమున నా కాలము నందలి సాంఘిక, రాజకీయార్థిక పరిస్థితులగూర్చి కొంత వివరింపబడును. పెద్దనార్యుడు తన ప్రబంధపు బీఠిక యందు గొన్ని చరిత్రాంశములను వాచ్యముగ దెల్పుటచేతను, ముదిత [గ్రంథములలో నాయాయి యెడల విశేష విషయములు సూచితము లగుటచేతను, ఇందు జారిత్రక విషయము లుద్దిష్టములు కాలేదు. కవులు తమ గ్రంథములలో సాంఘిక పరిస్థితులు మున్నగువానిని కంఠోక్తిగ దెలుపకుండుట సర్వ ప్రబంధ సామాన్య లక్షణము. అయినను, వారు వర్ణించిన వర్ణనములబట్టి కొలదిగనైన వానిని గ్రహింప వీలగుచున్నది. సాంఘిక పరిస్టితులు అప్పటి జనులు జాతి మతాచారములను సక్రమముగ బాటించుచు వారి వారికి విధింపబడిన వృత్తులను నెరవేర్చుచుండిరి. గృహస్థులు స్వార్థపరాయణులు పందిరి మల్షికార్డునరావు శతజయంతి. సంప్పుటము 4: సాహిత్యము

1412 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గాక, పరోపకార పారీణులై యతిథి పూజ లొనర్చుచుండిరి; గృహిణులు వేవురు వచ్చిలేని, వండ నలయక యన్నపూర్ణకు నుద్దులై యతిథుల నిష్ట మృష్టాన్న సంతృప్పుల జేయుచుండిరి. గృహస్థుల్నపై విరాగులకు యోగులకును గౌరవ మధికమై యుండెడిది: బధిర, పంగ్వంధ భిక్షుకాద్యనాథులకు గుటుంబి యాకటి కొదవు సస్యమనియు, సర్వవిధముల సాంత సామ్మనియు గృహస్థు మెప్పు పాందెడివాడు.

గృహస్థు లాక్క యతిథి పూజలతోనే కృతకృత్యు అగుట యసాధ్యము. ఆ యతిథి పూజలకు దగిన వసతు లుండవలెను; ఆయా వృత్తులవారికి దొరతనము శాశ్వతముగా ననుభవించుటకు మాన్య క్షేత్రముల నిచ్చుచుండెడిది. అవ పెక్కు చందాలం బండుచుండెడివి; కావున గేస్తులకు పాడిపంటల కొరత యేమియు లేకుండెను: పొలము దున్నువారు రైతులైనను, భూస్వాములు బాధ్యతను బూర్తిగః వారిమీదనే వదలివేయక తజచు బొలముల కేగి పరామర్శించు చుండెడివారు; ఆలకాపరులను నియమించినను, పశువులను వారు సరిగా మపుచు గట్టుచున్నారా? లేదా ? యని గశ్రద్ధతో జూచెడివారు. లేనిచో నవి యూరూర బందెలలో బడి పోగల వను భయము వారికి లేకపోలేదు.

విద్యావేత్తలకు ప్రభువులు “మాన్య క్షే.తము”ల నిచ్చుటచే, ఆ విద్వాంసులు ఛాత్రులకు విద్య గజపుచుండుట యాచారమైనది. ఇల్లేపక్షమునను నిర్బంధము లేకయే - ప్రభుత్వము సాయమున విరామము లేకుండ విద్యా సంస్థలు నెలకొనినవి. ఈ మాన్యములే శాశ్వతములైన నేటి “గ్రాంటులు కాదగును. కూడు, గుడ్డల జరుగుబాటున దృప్తిపొందిన యా యొజ్జలు - ఇక - ఏ భూపాలు రీవచ్చినను, సాల[గ్రామము మున్నుగా నెట్టి దానమును బరిగ్రహింప కుండిరి. అయిన, నాశ్రితు లగు నీ విద్వాంసులు భూముల నొసంగి పోషించు ప్రభువులను లెక్కసేయనివారు కారు. గ్రహణ, సంక్రమణాదుల యవసరమున దివాణములకు బోయి మన్ననల నందుటయు గలదు.

ప్వుతులు యుక్తవయస్కు లై, గృహనిర్వహణ సామర్థ్యము కలిగియున్నను, ఆ బాధ్యతను పెద్దలే వహించియుండుట యప్పటి పద్ధతి. కావుననే “సుఖులై తలిదండ్రులు దేవియుం దేవరవోలెనుండి యిలు దీర్చగ” ప్రవరుని కాపుర మెంతయు ననుకూలమై యుండెను.

మను చరిత్రము: సాంఘిక, రాజకీయార్దిక పరిస్థితులు బులును వేంకట రమణయ్య 1413 ఒజ్జల నిత్యకృత్యములు తక్కినవారి నిత్యకృత్యముల మాట ఎట్లున్నను, (పవరుని వంటి యుపాధ్యాయుని దైనిక కృత్యములు స్పష్టముగా దెలియుచుస్నవి. ఆకాలమున నట్టి విద్వాంసులు ప్రాతఃకాలపు బిల్ల వాయువులు వీచు సమయముననే దైవ (ప్రార్థన మొనర్చుచు లేచి. శిష్యులతో గూడ బయలుదేరి, యూరి వెలుపల నున్న ఏటికో, చైజువునకో పోయి, యఘమర్షణ సూక్తములు జపించుచు స్నానముచేయు చుండిరి. పిదప సంధ్యావందన, జప, సూర్యోపస్థానాదికము లచటనే యొనర్చి ఇంటికి వచ్చువారు. వచ్చునప్పుడు పూజకు గావలసిన పుష్ప ఫలాదులను, హోమమునకు గావలసిన సమిత్కుశలను దీసికొనియే వచ్చి, యాయా విహిత కృత్యముల నొనర్చుచుండిరి. తర్వాత పాఠ (ప్రవచనములు! ఈ కార్యకలాపములతో ప్రొద్దు రెండు జాములు తిరుగును. అప్పు డతిథి పూజయు, నతిథ్యభ్యాగతుల నిష్ట మృష్టాన్నమున సంతృప్పుల నొనర్చుటయు జరి గెడివి. పిదప సత్కాలక్షేపము, పాఠ ప్రవచనములు మున్నగువానితో గొంత ప్రాద్దుపోగా, సాయంసమయ కాలకృత్యములు, పూజాడులు మున్నగువానితో ర్యాతి తొలియామము గడచిన పిదప నిద! ఇట్టి కార్యకలాపముతో, గృహకృత్య పర్యవేక్షణకు లభించు కాల మతిస్వల్పము! అయినను - ఆ యింటి పనులను జూచుటకు బెద్ద లుండనే యుందురు! కళలు సంగీతమునకు దగిన స్థాన మాకాలమున నీయబడినట్లు తెలియుచున్నది. అందు వేశ్యలు గానమునం దాజితేరుటయేగాక, మంచి పాండిత్యము గల్లి యుపనిష త్సూక్తులనుగూడ లోకపరముగా సమన్వయింప గల్గియుండిరి. యుక్తివాదమున వారికి బెట్టినది పేరు! కావుననే (పవరునివంటి విద్వాంసుడు “ఈ పాండిత్యము నీకు దక్క మజి యొందే గంటిమే? మోక్ష లక్షీ పాఠ్యగమ సూత్ర పంక్తికివెపో మీసంప్రదాయార్థముల్‌' అని పలుకుచు, వరూధిని “ఆనందో (బ్రహ్మేతి వ్యుజానాత్‌" మున్నగు నుపనిషత్సూ క్తి పంక్తికి జప్పెన యర్థమున కచ్చెరువ డెను!

1414 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంపుటము 4: సాహిత్యము గానమునను, రాగాలాపనమునను కొన్ని కట్టుదిట్టము లుండెడివి ; ఇష్టము వచ్చినట్లు రాగముల నాలాపించుట సంప్రదాయ విరుద్ధము. (ప్రాతఃకాలమున దేశాక్షిని, మధ్యాహ్నమున నాటను, ఆలాప మొనర్చుట యుచితమని “వాలారుం గొనగోళ్ళ” అను పద్యమున గల “*నాటకున్‌ మేళంబైన విపంచి - దేశాక్షికిన్‌ మేళవింప గదవే!” అను దానింబట్టి తెలియుచున్నది. ఆ కాలమున సంపన్నుల సౌధోపరితలములందు నర్తనశాల లుండెడివని “ఒక చేడియ నాటకసాల మేడపై, నిలువున నాడుచుండి" యను పద్యభాగము స్పష్టపజచు చున్నది. కళలయం దాసక్తియును, గౌరవము నున్నను, గలావంతులయెడ దగిన గౌరవ మున్నట్లు కానరాదు. దానికి గారణము వారి వేష భాషలును వ్యసనములును, సౌశీల్యా భావమును కారణములు కావచ్చును. తనయొద్ద వైద్యశాస్త్ర మభ్యసింప వచ్చిన గంధర్వ రాజప్తుత్రునితో (బ్రహ్మ మిత్రుం డను మహర్షి “నట విట గాయక గణికా కుటిల వచశ్శీథురసము క్రోలెడి ఇవికిం గటువీ శాస్త్రము” అని హళనచేస్‌ పలుకుటయు, పారు డను మునితన పుత్రికను వివాహమునకైై యాచింపవచ్చిన ఇఖేచరునితో ఆహా! ధన్యుడనైతి; మద్య్విమల వంశాచార విద్యాతపః శ్ళీంహోమాదులు నేడుగా తుది ఫలించె న్నాగవాసంబు మ ద్లేహ క్షోణికి బిడ్డ వేడుటకు నేతే గాంచుటన్‌ అని యధిక్షేపించుటయు నీ విషయమున దార్కాణము. దుస్తులు ఆ కాలపు జనుల దుస్తులను గూర్చి వివరముగా దెలిసికొన నసాధ్యము. మగవారిలో శిష్టులు నీర్కావి ధోవతులు ధరించెడివారని తెలియుచున్నది. విలాస పురుషులు చలువలు ధరించుటయేగాక, నెమలిపురి దోపెన సరిగంచు గుండు తలపాగలను ధరించెడివారు. లోపల పావడలను ధరించి, పైని వలవాటుగా జీరలను ధరించు ముప్లిము ముగుదల యాచారమానాటికి హిందువులయందును సంక్రమించినది. వరూధిని యజ్ఞ పావడమీద తెల్ల చీరను ధరించినట్లు “తతనితంబా భోగధవళాంశుకములోని, యంగదట్టపు గావిరంగువలన” అను పద్యభాగము తెలుపుచున్నది. అలకనిజీబులో గుసుమ మద్దిన పావడదోప, చెందిర వన్నె

షుసు చరితము: సాంఘిక, రాజకీయార్తిక పరిస్టితులు .. బులుసు వేంకకు రమణయ్య 1415 పావడ మున్నగు వర్ణనములు నీ యర్థమునే తెల్పుచున్నవి. ధనవతులు తళుకు దుకూల చీలనుగట్టి, చందనము పూసికొని, కమ్మలు, హారములు, కంకణములు, మొలనూళ్లు, ఉంగరములు మున్నగు వానిని ధరించి, పూవులు ముడుచుకొని ముస్తాబగుట పరిపాటి.

వివాహ పద్దతులు

ఆ కాలపు వివాహ పద్ధతు లించుమించు ఇప్పటి మాదిరిగనే యుండినవి.

పెండ్లికి బూర్యము "పెండ్లి పెద్దలు బంధు మితులకును, పెద్దలకును శుభలేఖలను బంపుదురు. పెండ్లికొడుకునకు విడిదిలో బస యేర్చరుపబడును, అతని బందుగు లతనితోనే యుందురు. ముత్తయిదువలు వధూవరులకు వారివారి బసలలోనే పసుపు నలుగుపెట్టి జలకమాడించి ముస్తాబు చేయుదురు. వరుడు ఊదిన పాజు దుకూల చేలము కట్టి సరిగంచు కుసుంభా తలపాగ ధరించును. ఏెదప సపెండ్లికూతురు బందుగులతో బద్దలు భజంత్రీమీళముతో గూడ విడిదికిబోయి, వివాహమునకు రావలయునని వరుని బార్జించి ఆత్తురు. అతడు విభవానుసారి యగు వాహనముపె నక్కి తనవారును వెంటరా గన్యాగృహమునకు వచ్చును. కన్యాదాత గృహద్వారమునొద్ద పరునికి, అతని చుట్టములకును స్వాగతము నొసగును. అల్లుడు మామగారికి వందన మొనర్చును; మామగా రాతనిని దీవించి, లోనికి దీసికొనిపోయి కల్యాణమండపముపై నుండు పీఠమున గూర్చుండ పెట్టును. వేదికమీదికి వెళ్తులోపల వరునకు ముత్తయిదువలు నివాళు లిచ్చుచుందురు. భూసురులు దీవించుచుండురు.

-ెండ్తిపిటపై గూర్చున్న వరునకు మామగారొక పాత్రముతో మధుపర్కమును గొని ఆచ్చి యిచ్చి, ధారాదత్తముగ గన్యకను దానమిచ్చును. పిదప తెల్లని ఆజకు ఇజియొక వైపు వధూవరుల గూర్చుండబట్ట, ముత్తయిదువులు క్రమముగ నా తెజను దించి, వధూవరులు పరస్పరము చూచికొనుట కవకాశ మేర్ప్చుజతురు. పెడప వధ్గూవరులొకరి తలపై నొకరు సేసటబాలు పోసికొందురు. పిదప మాంగళ్యధారణము, ప్రధాన లాజహోమములు జరుగును; సన్నెకల్లు ద్రొక్కించుట, బ్రహ్మముళ్లు వేయుట, ద్రువ దర్శనము, అరుంధతీ దర్శనము, అక్షతధారణము జరుగును.

1416 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఇట్లు వైదికాచారము (ప్రకారము పెండ్లి తంతు జరుగగా - లౌకికపద్ధతి (ప్రకారము పెండ్తికివచ్చిన పెద్దలు కట్నములు చదివించుటయు, పెండ్లిపెద్ద యల్లుని కుపాయనముల నొసగుటయు పరిపాటియే. శుభలేఖలందిన కొందజు

. పెద్దలు తమకు దీరికలేక తమకు బదులుగా - తమవారిని పంపుటయు,

వారుచితములగు కట్నములను - తమ యాంతరంగికుల సలహాల ననుసరించి, వరునకిచ్చుటయు గలదు.

మనుచరిత్రమున - శుభలేఖయందిన కుబేరుండు పెండ్లికి వచ్చుటకు. దనకు దీరికలేక తన పుత్రుండగు నలకూబరునిం బంపుటయు,

'కూరిమిమం(త్రితోడ నలకూబరు6 డేకతమాడి పెద్ద బం

గారపు6 గోరంగల్పవని కాజనికాంతములైన చీరలున్‌

హారవిభూషణావళియు నమ్మిథునంబునకుం బబ్రియంబుతో

నారదమౌనిచేత నదనం.... ....గుబేరు పేరిటన్‌” జదివించుటయును గమనింపందగినవి.

పెండ్లికివచ్చిన బంధువులును దమతమ విభవానుసార ముడుగర లిత్తురు. మామగా రల్లునికిం గట్నములిచ్చుటయే కాక, కుమార్తెకు బసుపు కుంకుమలకు (గామములను, పొలములను (వాసియిచ్చుట కలదు. పిదపం బెండ్లిపెద్ద వచ్చిన చుట్టపక్కములను దగినట్లు గౌరవించి సాగనంపును.

పయివానిలో నిపష్పటియాచారము [ప్రకారము కొన్ని వ్యత్యస్తముగ నుండుటయు., కొన్ని కొంత మాజుటయును గాననగును. శకునములు

శకునములపై నా కాలపువారికి గట్టినమ్మిక యుండెడిది. దికటమునం గాజుచీంకట్లు (్రమ్ముకొనుట, సూర్యమండలమున కభిముఖముగ మాలక్షాకులు కూయుట మున్నగునవి దుశ్శకునములు. వానివలన నపాయము కల్గునని స్వరోచి యూహించియు6 గొన్ని జయ లాభసూచక నిమిత్తములు తోంచుటచే యుద్ధ విజయాదులు కల్గునని థైర్యముపొంది సంతసించుట యిందు వర్ణితము.

మను చరిత్రము: సాంఘిక, రాజకీయార్డిక పరిస్థితులు... బులును వేంట రమణయ్య 1417 ఆర్థిక పరిస్థితులు

మనుచరిత్రమునుబట్టి యప్పటి యార్థిక పరిస్థితులను వివరముగా6 దెలిసికొనుట కష్టము. అయినను కొంచెము తెలిసికొన వీలగుచున్నది. ప్రభువులు విద్యాంసులకు మాన్యములొసంగి, ఏద్యాసంస్థలను బోషించుటయు, బందెములు మున్నగువానివలన సుంకములను వసూలుచేయుటయు, జనులలో నప్పుసప్పు లిచ్చుకొనుటయు. గలదు; తీసికొనినయప్పుల నెగవేయువారు నప్పుడును కలరు. రాజకీయ పరిస్టితులు

కథా[ప్రధానములయి, రాజుల కంకితమీయంబడిన [గంథములలో రాజకీయవిషయ వివేచనమున కవకాశము తక్కువ. దొంగతనమునకు6 గొజతవేయుట శిక్ష యైనట్లు 'అర్థపుం దెఖవాటుల్‌ గొనికొట్టి....కొజతంబడుంగుకవి' అనుదానివలన దెలియవచ్చుచున్నది. వేంటకయి, వలలను మోయుబోయల మూలుగులను బట్టి రాజకీయోద్యోగులలో బెద్దవారు క్రింది వారిని వీడించుచుండుట తలియుచున్నది.

ఇంకను సూక్ష్మముగ బరిశీలించినచో నిట్టి విశేషము లీమనుచరిత్రమునుండి మజీకొన్ని బయలుపడ6ంగలవు. (కిన్నెర: సంపుటము 2, సంచిక 3, ఫిబ్రవరి 1950)

భావనపై 0 గ యా

గ్రంథ విమర్శనముల గతి బులును వేంకట రమణయ్య

యై దేశములలో వార్తా [పప్రచారము (పధానాంశము కాని సారస్వత ప్రికలన్నియును (గంథవిమర్శనమునకు (బ్రత్యేక స్థానము నిచ్చుచున్నవి. మనదేశమునను - అందును -తొలు6ంగునను వెలువడు సారస్వత పత్రికలు గ్రంథ విమర్శనమును జిన్నచూపుతో. జూచుట మిగుల విచారకరము!

విదేశములలో గ్రంథ విమర ఇనార్ధము ప్రత్యేక పత్రికలే యున్నవి; మనదేశమునం బేర, పెంపులు వెలసిన “మాడరన్‌ రివ్యూ” వంటి పత్రికలు “విమర్శనార్థము పంపంబడిన (గంథములనన్నింట్‌ని విమర్శించు బాధ్యత సపెట్టుకోలో దని స్పష్ట ముగా దెల్పుచున్నవి, “హొ ందూ” మున్నగు పత్రికలు తవు సారస్వతానుబంధమున - వ్యక్తిగత - భాషా పక్షపాత దృష్టితో - కొన్ని గ్రంథములను విమర్శింపక [క్రియలో మీది పద్ధతినే యనుసరించుచున్నని. ఇంతయేల? తఆలుంగు పత్రికల స్థితి యున్నట్లే యున్నది !!

ఈ విషయములన్నియు నాంధ్రవిద్వల్లోక మెజుంగనివి కావు; గత సంవత్సరమున “భారత్తీ ప(ికా రజతోత్సవ" సందర్భమున నుపన్యసించుచు, శ్రీ శివశంకర స్వామిగా రీ విషయమును గూర్చియే ముఖ్యముగ ముచ్చటించిరి. (గంథవిమర్శనములను దక్కువ చూప్పుతోం జూడరాదనియు, అట్టివానికి. బ్రత్యేక పత్రికలే యావశ్యకములనియు, “భారతి వంటి యుత్తమ సారస్వత ప[తిక తన బాధ్యతను గుర్తించి తగిన (ప్రోత్సాహము నీయవలెననియు, నీ విషయమున ముదిరి మల్లికర్డునరావు శవయంతి సువ ₹ వావ

గ్రంథ విమర్శనముల గతి బులును వేంకట రమణయ్యా 1419 బాశ్చాత్య పత్రికల పద్ధతిని దృకృథమున నుంచుకొనవలయుననియు ఆయన ఆలిపిరి.

(గ్రంథవిమర్శనముయొక్క విలువను (గంథకర్తలును, విమర్శకులును, ముఖ్యముగా బత్రికాసంపాదకులును గమనింపవలసి యున్నది. భాషలో (బకటింపంబడు (గ్రంథము లన్నిటిని గొనుటకు6గాని, పఠించుటకు6గాని అందథికి నవకాశముండుట కష్టము. ఏ (గ్రంథ మేవిషయమును బోధించుచున్నది? విషయప్రతిపాదనమున నది యెంతవజకును సమర్థమయినది? అందలి బాగోగులేమి? అను నంశములు పాఠకులకు [గంథవిమర్శనమును బట్టియే వ్య క్త్రపడంగలవు. ఇట్టి విమర్శనములు పఠితలకు ఆయా (గంథములను సమ్మగ్రముగం బఠించుటయందు. గుతూహలమును గూడం గలిగింపంగలవు.

ఉపయుక్తమగు గ్రంథవిమర్శనము వెలువడుటలో [గ్రంథకర్త కూడ బాధ్యత వహించి యుండవలెను. [గ్రంథకర్త “విమర్శనార్థము” పత్రికలకు (గ్రంథములను బంప్‌యు, సంపాదకుల నాశ్రయించి, తమ (గ్రంథములెట్లున్నను - వాని ప్రశస్తిని వెల్లడించునట్లే విమర్శలను (బకటింపంజేయుట కలదు; కొందజు [గగ్రంథకర్తలు పథత్రికలకు6 పుస్తకముల నంపుట - అవి పాఠకులకు6 బరిచితములగుటకు మాత్రముద్దేశింపంబడినదనియు, “విమర్శనార్థము” అని పుస్తకముపై వ్రాయంబడుట లాంఛనార్థమనియు, సంపాదకులు గ్రంథముయొక్క బాగోగులను విమర్శించు విమర్శలను (బకటింప రాదనియు భావించుచుండుట కలదు.

కొందజు రచయితలు తమ (గ్రంథములను విమర్శనార్థము పంపకున్నను

  • కొన్ని పత్రికలు వానిపై విమర్శనలను (బకటించుటయు. గలదు. “విమర్శనార్థ్ధము పంపంబడని నా పుస్తకము నీ పత్రిక యేల ప్రకటింపవల”" నని యా (గ్రంథకర్తలు మథనపడుటయు. బరిపాటి. కాని ముదితమయి, ప్రకటింపంబడిన (గ్రంథమును గూర్చిన యఖ్మిపాయమును వెల్లడించుట కూడదని యా (గ్రంథకర్త తలంచుట పొరపాటు.

వమర్శకులు [గ్రంథమును గూర్చిన విషయములను విమర్శించుటలోని 'ర0౦డు పద్దతులను బాగుగా గమనింపవలను. [గ్రంథకర్త కాలము, (గ్రంథములోని విషయవిభాగము. పుటసంఖ్య, ముద్రణము, పూర్వముద్రణములు, ఆధారములు,

1420 " పందిరి మల్లికార్డుసరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఇ

పోలికలు మున్నగు వానిని విమర్శించుట యొకటి; (గ్రంథములోని విషయ నిరూపణము, లోపాలోపములు, గుణదోష ములు మున్నగు వానిని వివరించుట వేరొకటి. ఇందు మొదటిపద్ధతి పీరికా పాండిత్య (ప్రతిపాదకమనియు రెండవది విషయపాండిత్య (ప్రతిపాదన మనియు స్వర్గీయ మహామహోపాధ్యాయ శ్రీ రామావతార శర్మగారు (కాశీ) ఒకప్పుడు వెల్లడించియున్నారు. ఈ పద్ధతులలో మొదటిది చరిత్ర జ్ఞానమును, రెండవది విషయపరిజ్ఞానమును కలిగెంపం జాలియున్నందున రెండు నుపాదేయములే యగును. ఏదో యొక పద్ధతి ననుసరించిన విమర్శనము సమగ్రము కాంజాలదు. కేవలము పీఠికా పాండిత్య ప్రతిపాదకమగు విమర్శనము నిరుపయోగము. విమర్శకు లీ రెండు పద్ధతులను (గ్రహించి, వ్య క్షిగతములగు ద్వేషాభిమానములకుం దావీయకు దూషణ భూషణముల జోలికి పోక, ఉత్తమపురుష (ప్రయోగముల కెడము కలిగింపక యొనర్చిన (గంథవివుర్శ్గనవట లాదర్శ్మపాయువములగు ననుటకును, పాఠకుల కుపయోగకారులగు ననుటకును ఎంతమాత్రము సందేహము లేదు. పాఠకులు కోరునది విషయ వివేకము కాని వ్యక్తి దూషణ భూషణములు కావుగదా?

ఉత్తమ విమర్శనలు వెలువడుటకు6 దక్కిన వారి బాధ్యత లొక యెత్తు; సంపాదకుల బాధ్యత యొకయిత్తు. పథికలోం బ్రకటింపంబడిన విమర్శనము లుత్తమములు కానిచో సంపాదకులే విమర్శన పాత్రులగుదురు. “విమర్శకు లిట్ల్టువాసిరి: అందులకు వేవటు బాధ్యులము క్షావుని సంపాదకులు తప్పించుకొనుట పాడిగాదు; తా మట్టి విమర్శనలను బకటింపక యుండుటయే (డేయము!

కొందజు సంపాదకులు తమకు గ్రంథకర్తలు విమర్శనార్థము పంపిన [గ్రంథములను - ఆ కర్తలను వ్య క్తిగతముగ ద్వేషించువారి చేత విమర్శనలను (వాయించుటయు, అట్టి విమర్శనములు విషయ విమర్శనమును విడిచి వ్యక్తి విమర్శనములోనికి దిగుటయు జరుగుచున్నది. ఇది యెంతయు శోచనీయము. ఇట్టి విమర్శనములు విషయగహణలాలసులగు పాఠకులకు నిరుత్సాహమునే గాక, యేవను గూడం గల్గించుచుండును. కావున బ(్రికా సంపాదకులు తమ బాధ్యతను గుర్తించి యిట్టి లోపములను సవరించుకొననగును.

(గ్రంథ విమర్శనముల గతి బులును వేంకట రమణయ్య 1421 కొందజు సంపాదకులు తమ పథతికలకు6 “విమర్శనార్థము" పంపబడిన పుస్తకములను విమర్శింపక యుపేక్ష వహించుటయుం గలదు. అట్లు చేయుటకుంగల కారణము దురూహ్యము. తమకు6 బంపంబడిన పుస్తకము చిన్నదయ్య్యును "పెద్దదయ్యును ఎట్టి భేదాఖ్మిప్రాయమును మనస్సున నుంచుకొనక వానిమై “విమర్శన”ను (బకటించుట తమ బాధ్యతయని సంపాదకులు గుర్తింపవలను. మన దేశమున జనసంఖ్యతోంబాటు వాజ్బయమును శాఖభోపశాఖల నల్లుకొని 'పెరుగుచున్నది. అందలి మంచిచెడ్డలను దెలిసెకొనుటకు ముఖ్యసాధనమగు (గ్రంథ విమర్శమునకై (ప్రత్యేక పథతిక యుండుట ఎంతయు నవసరము. అట్టి యవకాశము లభించువజ కయినను పేరుపడిన తెలుంగు పటత్రికలు తమ బాధ్యతను గుర్తించి గ్రంథవిమర్శనమునం దగిన శ్రద్ధను వహించి వాజ్బయసేవ నొనర్చగలపని విశ్వసించుచున్నాను. (కిన్నెర: సంపుటము 2, సంచిక 5, మే 1950) వల్‌ ఖు ం క్‌ , శయ్యా

వేగుచుక్క మల్లంపలి సోమశేఖర శర్మ న్‌ శ

ఒక మనిషి మన తెనుగు దేశంలో ఉదయించాడు వేగుచుక్కలాగు. అంతటితో అంతవరకు గాఢనిద్రా పరవశమై వున్న మన సంఘం ఆతని పిలుపులకూ, వేల్కొలుపులకూ, కూకలకూ, కేకలకూ అదిరిపడి దద్దరిల్లి లేచింది; ఆహవనీయాగ్నిచ్చటవలె తాను పాకినంతమేరా ఒక మహా సాంఘిక విప్లవం (పావృట్కాల పయోధర మాలికలాగ గర్జిస్తూ పునీతం చేసింది. సంఘం ఇల్లు చక్కదిద్దుకొని ఆత్మపరీక్ష చేసుకొని కన్నులు నులుముకొని అభ్యుదయపథాన ప్రయాణం సాగించింది.

ఒక మనిష్‌ మన హిందూదేశంలో ప్రభవించాడు. వెన్వెంటనే సేతు శీత్రాచలవమూ వురొక వుహావిప్టవం రరుం రరూవూరుతోద్ధూత వుయిన " మహాసముద్రంలాగ తరగెత్తి పొంగి దేశం అంచులకంతా పార్గికలెత్తింది. భారత జాతిని అంతవరకు బంధించి ఉంచిన రాజకీయ అయశ్శృంఖలాలు ఆ మహావిప్లవాగ్ని హోత్రజ్వాలలో కరగి నీరయి సమసిపోయినవి.

ఎప్పటివో కాదు, ఈ రెండు సంఘటనలూ మన నాటివే, నేటివే. మనలో చాలామందికింకా అనుభవంలో ఉన్నవే.

వా రిద్దరే మనుషులు : మన తెనుగుదేశంలోనివారు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు; రెండవవారు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీగారు. ఒకరు శత శతాబ్దులనుంచి దట్టంగా పట్టిన దుర్న్వయ, దురాచార, మూఢ విశ్వాసా పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

వేగుచుక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ 1423 లనే బూజు దులిపి సాంఘిక జీవనానికి నిర్మల దృష్టినీ, బలిమినీ, వెలుగు కలిమినీ, సౌందర్యాన్నీ చేకూరిస్తే వేరొకరు మానసిక దౌర్బల్యమూ, రాజకీయ పరదాస్యబంధనవవా, భయవమూ తొలగించి, జాతికి ధర్మ దృష్టినీ, స్వాతంత్య్యపథాన్నీ చేకూర్చినవారు. కానైతే ఆ వుభయులవీ సాధనలు వేరు. ఒకరిది వాజ్బాయం సాధనయితే వేరొకరికి రాజ్యతంత్రపు క్రియ సాధన అయింది. వా రిద్దరే మనుష్యులు. అందువల్లనే అన్నాడు ఎమర్సన్‌ - మనిషి ప్రభవించాడు - విప్లవం ఛాయవలె అతని వెన్నంటి పరుగులు వారిందని. మనిషే పుట్టాలికాని - వుడితే విప్లవం రాకుండా మానదు. శ్రీ వీరేశలింగం పంతులు పుట్టాడు - తెనుగు దేశంలో విప్లవం పొడసూపింది. జీవితం అన్ని ముఖాలలోనూ విప్లవమే. ఆ వెనుకటి దృష్టే మారింది. సంఘమే మారింది. జీవితంలోనే ఎంతో మార్పు వచ్చింది. అంతామార్చే. అంతాకొత్తే. నవయుగం అది - ఆయన యుగపురుషుడు. దేశం అంతా అర్థంలేని మూఢ విశ్వాసాలలోను, అనర్థకాలయిన అలవాట్లలోను, ఆచారాలలోను కుత్తకబంటిగా కూరుకుపోయి, గుడిగుడి గుంచం గుండా రాగం అన్నట్టు చ(క్రనేమి భమణంలాగు తొక్కిన తోవనే తొక్కుతూ, తిరిగిన పరిధిలోనే తిరుగుతూ సాలెగూటిలోని కీటకంలాగ సంఘం పరి(భమిస్తూవున్న కాలంలో అవతరించాడు శ్రీ కందుకూరి వీరేశలింగం. అప్పటికప్పుడే కుంఫిణీ ప్రభుత్వం ఇక్కడ పాతుకుపోయి పాశ్చాత్య విద్యా విజ్ఞానలత దేశం అంతటా పంది రల్లుకొన్నట్టు అలుముకొని దేశాని కొక కొత్త వికాసమూ, కొత్త శోభా చేకూర్చింది. పాశ్చాత్య ప్రాచ్య సంస్కృతి మహాసాగరాలు ఒండొంటిని తీవ్రంగా తాకేసరికి ఆ సంఘట్టనలో హాలాహలమూ వెలువడింది; అమృతమూ పుట్టింది. దేశీయమైన మన ప్రాచ్య సంస్కృతి క్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతి పండించిన సరికొత్త ఫలం వీరేశలింగం. పాశ్చాత్య విద్యా, విజ్ఞానమూ శ్రీ వీరేశలింగం పంతులుగారి సాంప్రదాయకమయిన ధార్మిక సంపత్తికి ఒక కొత్త సంస్కార పరిణతి కలిగించి ఆయనకు దూరదృష్టినీ, ధర్మ దీక్షనూ, అకుంఠిత శక్తినీ ప్రసాదించినవి. కాకపోతే ఇంగ్లీషు విద్యా పారంగతు లయినవారు ఆ కాలంలో ఎందరు లేరు? ఆయనలోనే ఆ కాలమహిమ భాసించింది.

1424 పందిరి షుల్షికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

తాము పొందిన నూతన విజ్ఞాన కాంతిలో దుర్న్వయ దురాచార పీడితమయిన సంఘాన్ని విలోకించేటప్పటికి శ్రీ వీరేశలింగం పంతులుగారి వొళ్లు జలదరించింది. ఎట్లా కుట్ల బొంతలా వున్న ఈ జాతి జబ్బు వీడి బాగుపడడం? మూఢ విశ్వాసాలూ, దురాచారాలూ మొదలైనవన్నీ జాతి ప్రాణశక్తిని పీల్చి పిప్పి చేసే చీడపురుగులలాగు ఆయనకు తోచినవి. ఇవన్నీ మాంద్యమూ, మసకతనమూ సంఘటించి జాతి దృష్టికి లోపం తెచ్చిపెట్టినవి. ఈ దృష్టిమాంద్యమూ, ఈ జబ్బూ వదిలితేనే కాని జాతికి అభ్యుదయం లేదు, మోక్షం లేదని విశ్వసించాడు రోగ నిదానం ఆలిసిన ఆ వైద్యశిఖామణి. ఇల్లు అంటుకుంటూవుంటే మూర్థులు తక్క ఎవరు మిన్నకుండగలరు? కాని - తానేం చేయగలడు ఒక్క తెలుగు పండితుడు?

విజయనగరం తుళువ, ఆరవీడు వంశ నృపతుల కాలంలోను, తంజావూరు, మధుర నాయకరాజుల కాలంలోను కానయితే పట్టం కట్టుకొని ఏలింది తెలుగు. ఆ కాలం మారింది. ఆ రోజు లిప్పుడు పోయినవి. ఇప్పుడాంగ్ల ప్రభుత్వం. ఆంగ్లమే రాజభాష. విద్యనేర్పే సాధనం ఆంగ్లమే. ఆంగ్లవిద్యా పారంగతుడికే ఘనతా, గౌరవమూను. ఆతనిముందు తెలుగు పండితుడు దివిటీకింద దీపం. ఇప్పుడు తెలు గెవరికి కావాలి? తెలుగుకు గౌరవమూ లేదు, ఆదరమూ లేదు. ఆంగ్ల్రపాఠశాలలలో చదువుకొనే విద్యార్థులకు కూడా తెలుగు పండితుడంటే అలుసే. వీరేశలింగం పంతులు తెలుగు పండితుడే; కాని ఏ తెలుగు పండితుడికీ లేని కార్యదీక్ష, దృథనిశ్చయము, చిత్తప్టైర్యము, దేవృనివీద విశ్వాసము, సత్కార్యాచరణమున ఉత్సాహమూ - ఇవన్నీ వున్నవి. ఆయన మానసికతత్వమే వేరు. మంచిపనికి పూనుకొంటే దైవ మెందుకు కలసిరాడు? ఈశ్వరు డెందుకు తోడ్చడడు? ఇదే ఆయనకు గల పరమ విశ్వాసం. ఎవరి ధర్మం వారు వెనుదీయక నిర్వ ర్తించినపుడే సంఘం బాగుపడుతుంది. సంఘంలో ఒకడుగా జన్మించినందుకు తన బాధ్యత తాను నెరవేర్చవలసిందే - కష్టాలురానీ, సుఖాలుపోనీ, ఆయన వీరుడు - మహాయోధుడు. దయ దాక్షిణ్యమూ లేకుండా తన పని తాను నెరవేర్చి తీరవలసిందే. ఎవరికిష్టం ఉండనీ, ఎవరి కిష్టం ఉండకపోనీ, అటువంటివాడు వీరేశలింగమంలేను. కర్తవ్య నిశ్చయానికి గడంగినా డాయన.

వీరేశలింగం పంతులుగారికి ఆంగ్లభాషా పరిజ్ఞానం బాగా ఉంది; ఆంగ్ల వాజ్మయంలో ('ప్రసిద్ధులయిన కవుల [గ్రంథాలు చదివాడు. ఇంగ్లాండు, ప్రాన్సు

వేగుచుక్క మల్లంపట్లి సోమశేఖర శర్మ 1425 మొదలైన యూరోపు దేశాలలో కవికలానికి ఎంతటి పటుత్వం ఉన్నది తెలుసుకొన్నాడు. కత్తికంటెనూ పదునయింది కలం అని గ్రహించాడు. దేశీయులలో విద్య విజ్ఞానము వ్యాపిస్తేనే కాని దేశం బాగుపడదు. దేశీయులను విద్యాపంతులను, విజ్ఞానవంతులను చేయడానికి ఉండే పరిస్థితులలో కలమే శరణ్యం. తన ఆశయ సాఫల్యానికి కలమే ఖడ్గం. కార్యసాధనానికి సాహిత్యమే ఆయనకు అసమానమయిన వజాయుధం అయింది.

నాడు మొదలు దైవంమీద భారంవేసి ధర్మదీక్తితుడై జాతీయాభ్యుదయానికి కలం చేతబట్టి రకరకాలయిన సాహిత్యరచనల మూలంగా తాను నమ్మిన అభిప్రాయాలను ప్రకటించి ప్రబోధిస్తూ, సంఘాని కనర్థకాలని తనకు తోచిన మూఢాచార విశ్వాసాలను ఖండిస్తూ సహససాక్షుడై వీరేశలింగంపంతులు విక్రమించాడు.

వీరేశలింగం పంతులుగారికి ఆంగ్లవిద్యా వ్యాసంగంవల్ల సాహిత్యాన్ని నవ్యనూతన మార్గాల ఎట్లా నడపడానికి వీలున్నదో బాగా తెలిసింది. ఆ రూపాల నన్నిటినీ ఆయన ఇంగ్లీషులో చదివినవాడే. ఆ నూతన రూపాలను తెలుగు సాహిత్యరంగంలోకి తీసుకువచ్చి కొత్త సృష్టి చేయాలని పూనుకొన్నాడు. అంతకు పూర్వం తెనుగులో, సంస్కృతంలో వలె రచించిన గద్య, పద్య కావ్యాలే, దృశ్య కావ్యాలే, యక్షగానాలే. అన్నీ తరతరాలనుంచి గతానుగతికమైన వరవడిలో వస్తున్నవే. ఇప్పుడాయన చేయదలచిన దంతా కొత్తసృష్టే. తన రచనలు ఏ మాత్రం చదివిన పామరుని కయినా సుబోధమయేటట్లు, సుకరంగా తెలిసేటట్లు ఉండాలని రచన సాగించాడు వీరేశలింగం పంతులు.

శ్రీ వీరేశలింగం పంతులుగారు ఆంధ సాహిత్యరంగంలో ప్రవేశించిన తరువాత ఆ రంగం అదివరకుకంటె ఎన్నోమడుగులు విశాలమయింది. ఆ విశాలమయిన సాహిత్యరంగంలో శ్రీ పంతులుగారు తొక్కని పాలమే లేదు; రచనార్థము ఆయన స్పృశింపని విషయమే లేదు. ఆంధ్రసాహిత్యసీమ నిజముగా అత్యంత రమణీయమయిన ఒక దివ్యపుషృఫలవాటిక అయింది. ఆనాటినుంచి తెనుగు సాహిత్యంలో కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త వింతలు, కొత్త కొత్త రుచులు. ఆంధ్ర పాఠకలోకం ఈ కొత్త సృష్టిని చూసి నివ్వెరపోయింది, భాషమీద, కొత్తగా వచ్చే కొత్తరకం వాతలమీద ఆంధ్రజనానీకానికి రుచి అధికమయింది.

1426 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వారు కొత్తనీటికి చేప యొక్కినట్టు నూతన వాజ్మయాన్ని హార్దంగా ఆదరంతో స్వీకరించినారు. శ్రీ, వీరేశలింగం పంతులుగారి రాకతో ఆంధ్రసాహిత్యం పండితులనే కాదు, పామరుల హృదయాన్ని కూడా ఆకట్టివేసింది. శ్రీ పంతులుగారితోనే మొదటి ఆంధ్రసాహిత్యంలో ఆధునిక యుగం. ఆయన ఆంధ్రసాహిత్య చరిత్రలో నూతనశకం స్థాపించాడు.

“దేశాభివృద్ధి కలుగుటకయి విద్యావిషయమునను, వ్యవహారవిషయమునను, కులాచార విషయమునను, నీతి విషయముననూ, మతవిషయముననూ నానా ముఖముల6 గృషిచేయ వలయుననియే కాని రాజ్యాంగ విషయములందే పనిచేయుట నా యుద్దేశము కాదు”- ఆయన వాస్తున్నారు తమ స్వీయచరిత్రలో. “మానవ దేహములోని కరచరణాది సమస్తావయవములును యథధాప్రమాణముగా పెరుగుటయే వృద్ధి కాని యొక్క తలయో, కాలో అత్యధికముగా పెరుగుట వృద్ధికాక రోగమయినట్లే దేశవిషయములోం గూడ జనులు నీతి మత కులాచారాదులైన సమస్తాంగములందును సమానముగా నభ్యున్నతి నొందుటయే వృద్ధికాని యితరాంగములకు భంగము కలుగునట్లుగా ఒక్క రాజ్యాంగములయందే కాని యొక్క బుద్ధిప్రచారమునందే గాని యుత్కర్షమునొందుట క్షేమకరమైన దేశాభివృద్ధికాదని నా యభిప్రాయము. రాజ్యాంగ విషయమున నెక్కడో దూరమున నున్న పరిపాలకులను, వారి శాసనములను దూషించుటకంటె సమీపమునముండి రాజశాసనములను నడపువారి దోషములను వెల్లడిచేయుట అధిక (ప్రయోజనకరమని నా నమ్మకము.” ,

ఇదే శ్రీ పంతులుగారి సాహిత్య రచనల కన్నిటికీ కీలకమూ, వ్యాభ్యానమూను. ఈ సంఘసంస్కారదృష్టే పంతులుగారి రచన లన్నిటిలోను కనిపిస్తూ వుంటుంది. సంఘం సర్వదోష సంక్షాళితం కావాలి, సంఘహృదయం సంస్కారం పొందాలి అని శ్రీ పంతులుగారు సంస్కృతికోసమే ఎక్కువ కృషి చేశారు. వారు ఏ సాహిత్యరచన సాగించినా ఆయన లక్ష్యం సామాన్యజనుడే. అతనికి తన రచనను సుగమం చేయడం ఎట్లా, అతని మనస్సుకు తట్టేటట్టు, అతని మనస్సు రంజించేటట్టు ఎట్లా వ్రాయడం అనేదే ఆనా డాయనకు సమస్య అయింది.

అంతవరకు తెలుగున రచన లెన్నో జరుగుతూ వచ్చినవి కాని అవి డబడబలాడే సంస్కృత పదాల ఆడంబరంతో కఠిన పాకంలో పడి పండితులకే కాని పామరుల

వేగుచుక్క మల్లంపల్లి సోమశేఖర ర్‌ (| 1427 కర్థం కాకుండా ఉండేవి. ఆనాడూ, అంతకు పూర్వమూ పండితులు మెచ్చుకొన్నదే సాహిత్యం. సాహిత్యం పండితుల కోసమే, పండితుల మెప్పు చూరగొనడం కోసమే చేసేవారు. ఆరీతిని సంస్కృత పదభూయిష్టంగా సంధులతో, సమాసాలతో పెనవేసుకుపోయిన తాటి చిక్కంలాగు, బాగా తాళ్లు పోసి లాగి బిగదీసి కట్టిన రాల్యేపార్సెలులాగ బిగువుగా పదజటిలంగా ఉంటేనేకాని ఆనాడు సాహిత్య రచనకు

  • అది గద్యంకానీ, పద్యంకానీ - గౌరవంలేదు. కాని ఆ రీతిని వ్రాస్తే పంతులుగారి లక్ష్యం ఎట్లా సిద్ధిస్తుంది? ఆశయం ఎట్లా సఫలమౌతుంది? తన రచన ఒక్క పండితులకోసమే కాదు, సకలాంధ్ర ప్రపంచానికీని, పండితులకూ పామరులకూ కూడాను. అలనాడు తిక్కన సోమయాజిగారు మహా భారత రచనకు గంటం అందుకొని ఆంధ్రావళి మోదముం బొరయుటకే అన్నట్టు ఈనాడు వీరేశలింగం పంతులుగారు యావదాంధ్ర దేశాన్నీ లక్ష్యంలో ఉంచుకొని తమ కలం చేతబట్టినారు. అందువల్ల పండితుల తోవకూ, పంతులుగారి తోవకూ భాషారంగంలోకూడా విభిన్నత ఏర్పడింది. సంధులు, సమాసాలు, కఠినపదాలు విసర్జించి పిన్నలకు, పెద్దలకు తేలికగా అర్థ మయేటట్టు పంతులుగారు రచన కారంభించారు. సంఘాన్ని ఉద్దేశించి, ప్రధానంగా సంస్కార లక్ష్యంతో చేసిన రచనలలో చక్కగా వ్యావహారికమే వాడేశారు - సూటిగా, చెప్పినవిషయం చదివేవాని మనసు కెక్కేటందుకూ, చెప్పదలచిన విషయం స్ఫూర్తిగా నిండుతనంతో చెప్పగలిగేటందుకూను. ఈ కారణాలవల్ల తెలుగు భాష రచనలో మార్పు వచ్చింది. పంతులుగారి వెనక నిలబడి వారు రచించిన పద్ధతిని రచనలు చేసేవారు కొందరు తయారయినారు. తెనుగులో వీరందరితో ఒక కొత్త సంప్రదాయం ఏర్పడింది. అట్టివారికి తెనుగులో రచనను చేయాలనే ఉబలాటం అంతకు పూర్వంనుంచీ వారి "గుండె గొంతుకలో కొట్లాడుతున్నా" పండితులకు జడిసి, వారికున్నంతటి పాండిత్యం తమకు _ లేకపోవడంచేత కలం చేత బట్టడానికే వెరచేవారు.. ఇప్పుడు సవ్యసాచి పంతులుగారు అన్నిటికీ కాచుకొనే వారు ముందు నిలబడ్డ కారణాన వారి జడుపు తీరింది. ఈ విధంగా పంతులుగారి సాహిత్య రంగావతరణం భాషా సౌలభ్యానికే కాకుండా సాహిత్య రచయితల రంగ విస్తరణకు కూడా దారి కలిగింది. తెనుగు రచనలలో కొత్తసంప్రదాయం తలెత్తింది.

శ్రీ వీరేశలింగంగారు ఆనాటి ఆంధ్ర సాంఘిక జీవనంలోని మాలిన్యం చూచి, దాని శోచనీయ పరిస్థితిని విలోకించి దానిని సంస్కరించే తలంపుతో

1428 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహీత్యము కాలుష్యం కడిగివేసి దానికి కొత్త కాంతీ, బలమూ ఇవ్వాలనే ప్రధానాశయంతో సాహిత్యరంగంలో ప్రవేశించిన నాటినుంచీ సాహిత్యం సంఘానికి అదివర కేనాటి కంటెనూ చేరిక అయింది; సంఘానికీ, సాహిత్యానికీ అవినాభావసంబంధం విర్చ్పడింది. అదివరకు కూడా సంఘాన్ని అనుసరించే తెనుగు సాహిత్యం పెంపొందుతూ వచ్చినా రెంటికీ గల పరస్పర సంబంధం - సంఘజీవితంలో సాహిత్యం, సాహిత్యంలో సంఘజీవితం - వీరేశలింగం పంతులుగారి నాట్‌వల అంత ప్రబలంగా, ప్రస్ఫుటంగా గోచరించి వుండలేదు.

ఆనందాని కయితేనేమి, విజ్ఞానాని కయితేనేమి ఏ జాతి సాహిత్యం ఆ జాతి చేసుకొనే గొప్ప సృష్టి. అదొక కళ. అదొక మహాశిల్బం. జాతి ఆశయాలు, ఆదర్శాలు, లక్ష్యాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు - అన్నీ ఆ జాతి సాహిత్యంలో (వతిఫలిస్తవి. జాతీయ జీవిత మనే క్షీరసాగరం మథధించగా వచ్చిన అమృతకలశ సాహిత్యం. అది జాతి సౌందర్యమయ జీవితానికి వ్యాఖ్యానం; జాతీయ జీవనపు మీగడ తరకే ఆది. సంఘమూ, సాహిత్యమూ ఈ 6౮0డూ ఒకదాని కొకటి యెడమయితే అవి రెండూ కూడా వెరితలలు వేస్తవి. సంఘం రసవంతమయిన సాహిత్యరచనకు జీవగర్ర; కవి ఎప్పుడూ సంఘంలోనుంచే, తన చుట్టుపట్ల పరిస్థితులలోనుంచే కథావస్తువును తీసికొంటాడు కాని అంతరిక్షంలోనుంచి ఆహరించడు. సాహిత్యం సంఘానికి ధర్మపథం చూపి దివ్యదృష్టి నిచ్చి ఆనందంలో రంగరించి లలితంగా దానిని ప్రబోధించకుండా ప్రబోధిస్తుంది. కొండ అద్దంలోలాగ సంఘం సాహిత్యంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒక్కసాహిత్యమే కాదు, శిల్పం, చితలీఖనం, కవిత్వం - కవిత్వమంటే ఒక్క పద్యమే కాదు, గద్యమూను - అన్ని లలితకళలూ ఇట్టివే. ఒక జాతి కళలో ఆ జాతి ప్రభావమూ ఉంటుంది, పతిఫలనమూ ఉంటుంది. మన లలితకళలను చూసి మన జాతి ఎట్టిదో, మన సంఘం అభిరుచు లెటువంటివో సులభంగా చెప్పవచ్చు - ఒకడు చదివే పుస్తకాలను అనుసరించి వా డెటువంటివాడో చెప్పగలిగినట్లు. ఈ కారణంచేతనే ఎడ్వర్డ్‌ స్టోన్‌ అన్నాడీ విధంగా :

“06 2గ 02 ౧4|౦౧, 1౧81 13 10 92౪% (16 [౧6 గ, ఆం641016౧8, 41౧౪1౧3, ౧0610/- 501) ౧౧౦56 2౧6 ౪6/56 - 15 2 [606% 01౧6 గాం!213 ౦ ౧6౯ 60018. 1౧6 ౧౪౧౦/ 0౧1౧౧౮౧౪ ౮౧౪ 8గ 13 106 0౧1౫ 5218 90166 0౫ ౪1౧10౧ 6 ౪166 0 ౪1గ౮66 0 ౧6 61126౧5 ౧2౧ 06 1౪6096. శీగి 61662166 గ ౧6109 10 61౧6, 2౧6 1౧౧౧౦౪6, 5614 660౧8౪66 2గ, ౪౧60161 1౧ [౧6 10౧౫ 0 90610149, ౧౭౧౪౧౦ 0౯116214౧8. 15 12031 10 [06 ౮౪|||5810౧"

వేగుచుక్క మల్లంపల్లి సోమశేఖర శర్ళు 1429

“ఒక జాతికళ - అంటె శిల్చం, చిత్రలేఖనం, కవిత్వం (గద్యమూ పద్యమూ కూడాామొదలైనవి - ఆ జాతి ప్రజల నీతికి ప్రతిబింబమే. ఆ జాతి కళలోని పరిశుద్ధత, అపరిశుద్ధతల ననుసరించే ఆ జాతి పౌరుల గుణావగుణాలను తేల్చిటందుకు తగిన సాధనం. ఉన్నతమైన కళ పరిశద్ధికి అభివృద్ధికి తోడ్పడుతుంది. (భష్టకళ శిల్పంలో కాని, చిత్రలేఖనంలో కాని, సాహిత్యంలో కాని యథార్థ సభ్యతకు వినాశకర మవుతుంది."

కళాత్మకములయిన సాహిత్యరచనలను చేసి సంఘం తప్పాప్పులను అద్దంలో లాగు చూపి, దానినుద్చోధించి శ్రీ పంతులుగారు సాహిత్యాన్ని ఒక మెట్టెక్కించి దాని కీయవలసిన విలువను, గౌరవాన్ని ఇచ్చి దానిని ధర్మపీఠం మీద సుప్రతిష్టితను చేశారు.

ఒక జాతి సాహిత్యం ఆ జాతి సభ్యత స్వీయ చరిత్ర. ఆ విధంగానే మన ఆంధ్ర సాహిత్యం ఆంధ్రజాతి సభ్యత స్వీయచరిత్ర. మన కళ మన సభ్యతకు చ్మితరూపమయిన వ్యాఖ్యానం. శ్రీ వీరేశలింగ సాహిత్యం ఉపలక్షిస్తే ఈ యథార్థం మనకు చక్కగా బోధపడుతుంది.

శ్రీ వీరేశలింగంగారు తెనుగులోని ప్రాచీన సాహిత్యం బాగా చదివిన దిట్ట; చక్కని కవిత్వం చెప్పగల నేర్పరి. ఆయన దొక విచిత్ర ప్రకృతి. కార్యం ఎంత కష్టమయినదయితే అంతటి ఉబలాటం ఆయనకు దానిని సాధించాలని. అది వీరప్రకృతి, ఆయన మహావీరుడు. అందువల్లనే ఆయన ప్రాచీన (ప్రబంధఫక్కిని కావ్యాలు వ్రాయడంలో కూడా శుద్ధాంధధ్ర కావ్యములూ, శుద్ధాంధ్ర నిరోష్ట్యు నిర్వచనములూ ప్రయత్నించారు కాని తేలికయినవాని పొంతపోలేదు. శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం, రసికజనమనోరంజనం, శుద్ధాంధ్ర భారత సం[గ్రహం వంటి రచయిత ప్రజ్ఞను పరీక్షించే గీటురాయి వంటి కావ్యాలు రచించడమేకాదు, అవి మా దొడ్డ పాకాన బడినవని ఆనాటి మేటి పండితులు శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు మొదలైనవారి చేత ప్రశంసలు కూడా పొందారు; పండితులే ననేటట్టు గద్యం వాసి చెన్నపురి పండితులచేత రజత పాత బహూకరణమూ, గద్యతిక్కన బిరుదమూ కూడా పొందారు. అటువంటప్పుడు పంతులుగారి కవితా చాతురిని గురించి కాని, ఆయన గద్య శైలిని గురించి కాని వేరే చెప్పడం ఎండుకు?

1430 పందిరి మకీకార్టునరావ్వు శతజయాతి సంపుటము శ: పాహిత్యము

శ్రీ పంతులుగారు ముఖ్యంగా ఆంధ్ర భాషకు చేకూర్చిన అలంకారాలు మూడు: నవల, ప్రహసనం, కరు కడ్డి మన ఆనుగు సాహిత్యంలో వీరేశలింగంగారికి పూర్వం లేకపోలేదు. కాని దానిని ప్రారంభించడంలోను, సాగించడంలోను, ముగించడంలోను పూర్వపు కథలకూ, పంతులుగారి కథలకూ చాలా లేడా వుంది. కథా కల్పనే వేరు; వర్ణన విధానమే వేరు; ఆ కూర్చే వేరు. కథలని పంతులుగారు రచించినవి ఈనాటి కథానికల వంటివి కావు. వాటిలో పెద్ద కథలు కూడా ఉన్నవి. వీటిని చిన్న నవలలన్నా తప్పులేదు. ఇక చిన్న కథలలో నీతికథలూ, అటువంటి ఇతర కథలూ కూడా చాలా ఉన్నవి. వీటిలో కొన్నినడచిన తీరునుబట్టి చూస్తే అవి నేటి కథావికకు, చిన్న కథకు ప్రాతిపడికలా అనిపిస్తుంది.

ఇక శ్రీ పంతులుగారి నవలల విషయం ఎత్తగానే ముందుగా చట్టున మన మనస్సుకు తట్టేవి రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వ దేశ యాత్రలు. ఈ తరంలో నేమోకాని వెనుకటి తరంలోనూ పంతులుగారి నాడూ కూడా పంతులుగారి (గ్రంథాలను వివి చడివినా, ఏవి చదవకపోయినా ఈ రెంట్‌నీ చడవని వారు ఆంధ్రదేశంలో లేరంటే అది స్వభావోక్తే; నూటికీ కోటికీ ఒక రుండేవారేమో అట్టివారు. రాజశేఖర చరిత్ర, వికార్‌ ఆఫ్‌ వేక్‌ ఫీల్డు (గ్రంథాన్ని అనుసరించి వాశానని ఆయన అన్నారు గనుక మనం కాబోలు ననుకోవాలి కాని దానికీ దీనికీ ఎక్కడా ఏవిధమయిన పోలికా లేదు. దీనిలోని కథావస్తువు తెలుగునాటి ఒక సంసార గాథ. రాజశేఖర చరిత్ర చదివితే మన తెలుగునాటి మధ్యరకపు సంసారమూ, పంతులుగారి నాటి మన సాంఘిక పరిస్థితులూ బొమ్మ గీసినట్లు మన మనోనేత్రానికి స్ఫుటంగా కనబడుతవి. ఆఫ్రికా సహారా ఎడారిలో కూర్చుని ఆ నవలను చదివినా ఆంధ్రుడికి తన దేశం, తెనుగు ఇల్లు తన ఎట్టయెదుట ప్రత్యక్షమై ఒళ్లు పులకరించకపోదు. రాజశేఖర చరిత మూడుమూర్తులా శుద్ధ తనుగు నవల. ఈనాటికి కూడా ఈ నవలకు దీటువచ్చేవి మన తెనుగులో ఎన్నో లేవు. రాజశేఖర చరిత్రలో కథా సంవిధానాన్ని పంతులుగారు గొప్ప చాకచక్యంతో అత్యద్భుతంగా నడిపారు; ఆ కల్పనే సొగసయినది. ఆ నవల ప్రతి పుటలోనూ చిక్కని తనుగుతనం రూపుకట్టి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కథ (ప్రారంభించినది మొదలు ముగించేదాకా నిద్రపట్టదు. పంతులుగారి రచనా చాతురికి, కథా కల్పనకు, పాత పోషణకు విస్మయం పొందుతాము. భూతవైద్యుల బూటకాలు, సిద్ధాంతుల సొరకాయ కోతలు, ఇచ్చకాలమారుల వందిమాగధ స్తవాలు, బైరాగుల దాంభికపు

వేగుచుక్క మల్రంవల్లి సోమ శేబత ళప్తా 1431 మాయలు - ఒక టేమిట్‌, ఆ కాలంలో మన సంఘంలో మాలిన్యం, కపటం, దాంఫ్‌కం - ఇటువంటివి ఎక్కడెక్క డున్నవో, వయే పద్ధతులు మన కభ్యుదయ హేతువులో అన్నీ పంతులుగారు గొప్ప నేచ్చుతో ఆయా పాతల రూపాన చూపి వ్యంగ్యంగా తమ లక్ష్యాలు - కావాలని తచ్చి పెట్టినట్టు కాకుండా - చూపుతూ వచ్చారు. ఈ నవల ఒక్కటే చాలు శ్రీ పంతులుగారికి సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించడానికి.

ఇంక సత్యరాజా పూర్వ దేశ యాత్రలు ఒక చక్కని చిక్కని హాస్య (గంథం. గలివర్స్‌ టటావెల్ప్‌ను అనుసరించి వ్రాసిన గ్రంథం యిది. దాన్ని అనుసరించినా మన భారతీయ వాతావరణానికి సరిపడేటట్టు దాన్ని మార్చి గొప్ప విన్నాణముతో కథ సాగించారు పంతులుగారు. ఇందులో ఆడుమలయాళం, లంకాద్వీపం అనేవి రెండు భాగాలు. ఆడు మలయాళం స్త్రీలకు ఎద్య అక్కరలేదనీ, దానివలన వారికి హాని కలుగతుందనీ వాదించే పూర్వాచారపరాయణులను అవహేళన చేయుట కోసం వ్రాసిన అపహాస్య ప్రబంధం. ఇంక లంకాద్వీపం జనులలో జ్యోతిశ్శాస్త్రం మీదగల పిచ్చిని అవహేళనం చేయడానికి సంకల్పించింది. ఈ రెంటిలోనూ స్తీ విద్య వ్యతిరేకవాదుల మీదా, జ్యోతిశ్శాస్త్రాథిమానులమీదా తీసిన దెబ్బ లనేకాలు. ఈ సత్యరాజా పూర్వ దేశ యాత్రలు చదువుతుంటే కడుపుబ్బ నవ్వు వస్తుంది. దీనిలో పంతులుగారు చేసిన అపహాస్యం పైకి నవ్వు పుట్టించినా పోలీసుల లాటీ దెబ్బలలాగ హృదయానికంతా గాఢంగా (గుచ్చుకొని బాధ పెడుతుంది. (పహసనాలలోకూడా పంతులుగారు హాస్యం ముమ్మరంగా ఉపయోగించారు. ఈ (ప్రహసనాలలో కొన్ని అనుసరణాలు, కొన్ని స్వకపోల కల్పితాలు. ఇవన్నీ చాలవరకు సంఘంలోని దురాచారాలను నిర్మూలించడం కోసమే వ్రాయడంచేత పంతులుగారి ఈ హాస్యం మాటున వారి రోషమూ, [కోధమూ చచ్చులా జ్వలిస్తూ ఉంటవి. పంతులుగారు ఏది చిప్పినా, ఎది వ్రాసెనా నిర్మొాగమాటంగా, ఒక్కొక్కప్పుడు ఆతి క్రూరంగా కటువుగా, సంఘాన్నీ వ్యక్తులనూ విమర్శిస్తారు. వ్రాస్తారు. ఈ కారణం చేత ఆయన కనేకులు శత్రువు లేర్చడ్డారు; ఏర్పడడమేమిట, కొని తెచ్చుకోడమే.

త్రీ వీరేశలింగం పంతులుగారు విరచించిన కథలలో చాలభాగం స్త్రీల ఉపయోగం నిమిత్తం వాసినవే. మనదేశంలో బడులు పెట్టి స్త్రీలకు విద్య

1432 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము చెప్పించడం ఆయనతోనే పారంభం. అంతకు పూర్వం విద్యనేర్చిన ఆం(ధ్రమహిళలు లేకపోలేదు మనదేశంలో. వారిలో కొందరు గొప్ప కవయిత్రులు కూడాను. కుమ్మరి మొల్ల రచించిన రామాయణం చదవని వారుండరు. అథమం మొల్ల పేరయినా వినని వారుండరు. తరిగొండ వెంగమాంబ మరొక సుప్రసిద్ధ కవయిథతి; ఆవిడ రచించిన కావ్యాలు ఎన్నో ఉన్నవి. ఈ విధంగా చదువునేర్చిన స్తీంీలు ఏ సకృతుగానైనా మనలో పూర్వం ఉన్నప్పటికీ బాలికల కందరికీ విద్య నేర్పాలనే నిర్బంధం, సామాన్యాభిలాష ఉండేదికాదు. ఆడుది చదువుకొని ఉద్యోగాలు చేయనా, ఊలళ్లేలనా అనే నిస్పాకారం సంఘంలో శ్రీ పంతులుగారి నాటికి బలిసిపోయింది. మన జాతిలో ఉండే గొప్ప శక్తులూ, గొప్ప గుణాలూ క్రీణించిననాడు స్త్రీ చదివి చెడ్డది; మగవాడు చదవక చెడ్డాడనే విపరీత వాదం (ప్రబలింది. ఇదంతా చూసి, లోకవృత్తం గమనించి, భావికాలపు ఛాయలు కనిపెట్టి, స్త్రీలకు విద్య అవసరం; పురుషునితోపాటు స్త్రీకూడా చదువుకుంటే కాని, స్త్రీకి కూడా సంఘంలో సముచిత గౌరవస్థానం ఇస్తే కాని కుటుంబ సంసార శకటం సరిగా సాగదు, జాతి అభ్యున్నతి పొందదని వాదించి పంతులుగారు ప్తీ9 విద్య కోసం అత్యధికమైన కృషిచేశారు. స్తీ విద్యా వ్యతిరేకులతో ఆయన చేసిన వాగ్యుద్ధా లనేకాలు. ఆకాలంలో ఆయన సంఘాన్ని బహుముఖాల అనేక విషయాలలో ఎదుర్కోవలసివచ్చింది. ఏటి కెదురీతే ఆయనది. ఏకైక వీరుడై అర్జునుడు బిల్లు నెదిరించినట్లు ఎదిరించాడు. స్త్రీ విద్యా ఉద్యమం ఆయన కృషిఫలంగా విజయం పొందిందే.

శ్రీ పంతులుగారు స్త్రీల నిమిత్తం విఖ్యాత మహిళల జీవితాలెన్నో వ్రాశారు; ఎన్నో కథలు రచించారు. ఈ కథలలో కొన్ని ఇంగ్లీషు కథలకు అనుసరణాలు; కొన్ని అనుకరణాలు. ఆయన ఏది వ్రాసినా ఇక్కడి మన పరిస్థితులకు తగినట్టు మార్చి సవరించి, తన అభ్మిపాయాల కనుగుణంగా వాసేవాడు. సత్యవతీ చరిత్ర, చంద్రమతీ చరిత్ర, సుమిత్ర చరిత్ర, సతీమణీ విజయం, రఘుదేవరాజీయం, గయ్యాాళిని సాధు చేయుట వంటి ఆయన రచించిన కథలు చాలా ఉన్నవి. కథలని అవి నేడు మనం సాధారణంగా పథతికలలో చదివే కథల వంటివి కావు. ఈ విషయం ఇదివరకే చెప్పాను. అవ చిన్న నవలలే.

వేగుచుక్క మల్లంపల్లి నోమ శేఖర శర్ణు 1433

సంఘంలోని దురాచారాలను తొలగించడానికీ, పరంపరగా వస్తున్న మూఢ విశ్వాసాలను ఛేదించడానికీ ఆయన చేపట్టిన సాహిత్య సాధనం ప్రహసనమూ, నాటకమూను. వారి హాస్య సంజీవని సంవాదరూపకమయిన చిన్ని నాటికల గుచ్చుమే. ఈ హాస్యసంజీవని, పెద్దయ్యగారి పెళ్ళి అనే నామాంతరం గల బ్రహ్మ వివాహమూ, వ్యవహార ధర్మబోధిని మొదలైనవి చదివితే శ్రీ వీరేశలింగం పంతులుగారి నాటి ఆంధ్రసంఘం ఏ స్థితిలో ఉండేదో కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఈ రచనలన్నీ ఆనాటి మన సాంఘిక చరిత రచనకు ముఖ్యమైన సాధనాలు. ఇటువంటి విచిత్ర వినోద సాహిత్యరచన లంతకుపూర్వం తెలుగులో లేకపోవడం వల్ల, అవి తమ ఆచార వ్యవహారాలను అధిక్షేపించి ఎద్దేవ చేసేవయినా ఆ రచనాపద్ధతి కక్కజపడి వాటిని చదువడానికి జనం విరగబడ్డారు. తిర్యగ్విద్వన్మ హాసభ, మహారణ్య పురాధిపత్యంవంటివి ఆనాటి రాజమ హేంద్రవర పరిస్థితులు తెలిస్తేనే కాని అవి శ్రీ పంతులుగారు ఎవరిమీద తీసిన దెబ్బలో తెలియదు. ఈ విధమైన రచనలన్నిటిలోను ఆయన ఎవరి మీదనో ఒకరిమీద దెబ్బలు తీస్తూనే వచ్చారు. మనమీద దెబ్బతీస్తున్నాడని తెలిసీకూడా వాటిని మనం చదవకుండా ఉండలీము. అదే వాటిలోని ఘనత. సంఘాన్ని శ్రీ పంతులుగారు సంస్కరించింది ఇట్టి వ్యంగ్య, హాస్యరచనల ద్వారానే.

శ్రీ వీరేశలింగం పంతులుగారి సాహిత్యానికి ఒక విశీష్ణత ఉంది. ఆయన చేసిన సాహత్య సేవ ఎంత గొప్పదో, ఎంత అపారమయినదో మన ఊహకు తట్టటంలేదు. ఆయన సృష్టించిన సాహిత్యాని కింకా మనం సరిగా విలువ కట్టడం లేదు. ఇంతవరకు పంతులుగారిని లోకం సంఘసంస్క ర్తగానే గుర్తించింది కాని ఆయన చేసిన సాహిత్య సేవను గుర్తించలేదు. సాహిత్యాన్ని చేయూతగాతీసుకొన్నాడు గనుకనే, దాన్ని ఆశయించాడు గనుకనే ఆయన ఆంధ్రదేశంలో సాంఘికంగా అంత గొప్ప మార్పు తీసుకు రాగలిగినాడు. ఎప్పటికయినా క్తి నిర్వహించలేని పని కలం నిర్వహింపగలదనీ, కత్తి కంటెను కలమే బలీయమైనదనీ, ఎక్కువ వాడిమైనదనీ ఆయన రచనలే ధ్రువపరుస్తవి.

శ్రీ వీరేశలింగం పంతులుగారి సాహిత్య కృషిని సమంగా పరిశీలించి, దానికి సరి[మైన విలువకట్టి, తగిన సమర్థులచేత ఒక విమర్శా పూర్వకమయిన

1434 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (గంథం వ్రాయించి ప్రకటించడం చాలా అవసరం. ఇది హితకారిణీ సమాజంవారి ప్రధాన కర్తవ్యమని నా మనవి.

ఆంధ్ర కవుల చరిత్ర

త్రీ వీరేశలింగంగారు రచించిన ఇతర (గ్రంథాలన్నీ ఒక యొత్తు, ఆయన ఆంధ్ర కవుల చరిత్ర ఒక యొత్తూను. ఒక విధంగా చూస్తే ఇదే ఆయన రచనలలోనికి మేటి కిరీటం వంటిదనవచ్చు. ఆయన రచియించిన (ప్రతీ యితర [గ్రంథంలోనూ ఆయన కాలంనాటి సంఘం విషాద పరిస్థితీ, ఆయన సంస్కారపరత్వపు నిశితచ్భాయలూ ముదురు ముదురు గాకపోతే మానె లేత లేతగా నయినా గోచరిస్తూ ఉంటవి. "

ఆయన రచియించిన సాహిత్య(గంథా లన్నిటిలోనూ కళకంటేనూ. శిల్పముకంటేనూ మనకు గోచరించేది ఆయన సంఘసంస్కరణాభిలాషే. సత్యహరిశ్చంద్ర నాటకములో హరిశ్చంద్రుని వేడుక చెలికాడు గాలవుడు మాలెతలు హరిశ్చందుని వేడరాని వెడకోరికలు కోరినప్పుడు నేను వీరిని తాకకూడని బ్రాహ్మణుడ నయిపోతిని కాని కాకపోయిన యెడల వీ రీపాటికి యిల్లాండ్ర కేశఖండన మహోత్సవమునాటి రాగములు తీయుచు బరుగెత్తి యిల్లు తొక్కి చూడరా అంటాడు. బల కేశఖండన దురాచారము, వితంతువివాహము, స్త్రీవిద్య మొదలైనవి శ్రీ వీరేశలింగముగారి హృదయంలో ఎప్పుడూ మెరుగుతూ ఉండే అభిప్రాయాలు. ఆయన సాహిత్య మంతటా ఏదోవిధంగా ఎక్కడినుంచో ఒకక్కడినుంచి బెచిత్యాన్ని కూడా ధిక్కరించి తొంగి చూస్తూనే ఉంటవి కాని యీ కవుల చరిత్ర రచనలో ఆయన పుక్కిటి పురాణపు గాథలు, అసలయిన చరిత్రాంశములు శాస్త్రీయ పద్ధతిని విమర్శించి తక్కెడలో వేసి తూచి సత్యము నిర్ధారించి తీర్పు చెప్పే గొప్ప న్యాయమూర్తి అయినాడు.

ఆ కాలంలో కవుల చరిత్రగ్రంథం రావడమె వింతలలోనికల్లా వింత. అంతవర కిట్టి చరిత్రగ్రంథాలు లేవు. మన మిప్పు డర్ధం చేసుకొనే దృష్టిలో చరిత్ర అనేది ఇంగ్లీషు విద్య మనదేశంలో వ్యాపించిన తరువాత వచ్చిందే. అయితే కవులచరిత్ర లనే పేరుతో వీరేశలింగముగారి కవులచరిత్ర నాటికి వచ్చిన (గ్రంథాలు లేకపోలేదు. శ్రీ గురజాడ, శ్రీ రామమూర్తి పంతులుగారు. బొద్దికూరపాటి వెంకట రంగకవిగారు

వేగుచుక్క మల్లంవల్లి సోమశేఖర శర్మ 1435 మొదలైనవారు దేశంలో వ్యాపకంలో ఉన్న కవుల గాథల కొన్ని సత్యాంశాలను జోడించి కలగాపులగం చేసి రచియించిన చరిత్ర లున్నవి కాని వాటిలో శాస్త్రీయమయిన విమర్శనాపటిమ తక్కువ. అందువల్ల శ్రీ వీరేశలింగంగారి కవుల చరిత్రకే విలువ యొక్కువ. ఆకాలంలో ఇంతటి శాస్త్రీయ పద్ధతిని వీరేశలింగంగారు ఆ కవుల చరిత్ర రచించినారంటే అది చాలా ప్రశంసనీయమయిన విషయం. ఏమంటారా, దేశచరిత్ర రచనకుకాని, కవుల చరిత రచనకు గాని వలసిన సాధన సామగ్రి ఇప్పుడయితే పుష్కలంగా లభిస్తున్నది కాని ఆ నాటికి చాలా తక్కువ. లేనేలేదన్నా అది అతిశయోక్తి కాదు. ఏ సంవత్సరం వీరేశలింగంగారు కవృల చరిత్ర పథవుభాగం (పకటించారో ఆయేడే గవర్నమెంటువారు దేశంలో వివిధ ప్రాంతాల వెదచల్లినట్టున్న శిలాశాసన తామశాసనాలను సంపాదించి పరిష్కరించి (ప్రకటించడానికి శాసనశాఖ నొకటి యేర్పరచినారు. అందువల్ల ఆయన కవులచరిత్ర వ్రాసేనాటికి గవర్నమెంటు శాసనశాఖవారి శాసనసామ[గి ఆయనకు అందుబాటులో లేనిది. అందువల్లనే ఆంధ కవుల చరిత్రను రచించడం చాలా కష్టమయిన పని అయిం దాయనకు. వారే తమ స్వీయచరిత్రలో వ్రాసుకొన్నారు, నేను చేసిన గ్రంథాలలో నెల్ల ఆంధ్ర కవులచరిత్ర ప్రధానమయినదనీ, పూర్వకాలమునుండి మనదేశంలో చరిత్రములు వ్రాసెడి ఆచారం అంతగా లేకపోవడంచేత కవులచరిత వ్రాయడం యెంతో కష్టసాధ్యమయిన దనీని. కాదా మరి, కవుల కాలం తెలుసుకోడాని కాధారాలు లేవు; కవులు తమ [గంథాలు రచించిన కాలం బహుళంగా తెలుపుకోలేదు. కొందరు తమ [గ్రంథాలను రాజులకు, మంత్రులకు దండనాథులకు అంకితమిచ్చినా ఆ రాజుల మంత్రుల దండనాథుల కాలం తెలుసుకోడానికయినా సాధనాలు లేవు. రాజులకు గాని, వారి మంత్రులకు గాని, వారి దండనాథులకు గాని అంకిత మియ్యని కవుల విషయంలో మొదలే పేచీ. ఇంతటి పేచీలతోను, కష్టాలతోను కూడిన యిట్టి కవుల చరిత్రను వీరేశలింగంగారు ఆనాడు అంత శాస్త్రీయంగాను, అంత వైపుణ్యంతోను (వాసినారంటెే వారి విమర్శనా చాతుర్యానికి వారి ప్రజ్ఞాపాటవానికీ, వారి యుక్తి వివేకానికీ వారి నెంతైనా అభినందింప వలసిందే. అసలీ పరిశోధనలో ముఖ్యమయిన విషయ మేమంటే ఈ చరిత రచనకు సాధన సామ(గి ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోడమే కష్టతరమయిన పని. ఇప్పుడంటే

1436 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము ఇది సుకరంగా తెలుసుకోడాని కవకాశా లున్నవి కాని వీరేశలింగంగారి నా డట్టివి చాలా తక్కువ. అట్టి వాటిని గని పెట్టి శ్రీ వీరేశలింగంగారు అట్టి ఉత్తమ శాస్త్రీయ చరిత్రగ్రంథాన్ని రచించారంటే ఆయన ఘనతా, (ప్రజ్ఞా అందులోనే ఉంది. ఆ కాలంలో ఆయన కొందరు కొందరు కవుల విషయంలో చేసిన కాలనిర్ణయాలు పొరపాటు కావచ్చు; కొన్ని కొన్ని సిద్ధాంతాలు తప్పులు కావచ్చు. (ప్రాచీనులలో పడవలసిన కవులు కొంద రాధునికులలోను, ఆధునికులలో పడవలసిన వారు కొందరు 1పాచీనులలోనో, మధ్యకవులలోనో పడియుండవచ్చు - ఆయన కాలంనాటి కంటె నేడు చరితరచనకు కావలసిన సామగ్రి విస్తరించి మనకు దొరకడం చేతను, అనేక [గ్రంథములు మన కచ్చుపడి లభ్యమవడం చేతను, అదీ కాక అచ్చుకాని పుస్తకాలయినను మనకు ఒక్కచోట ప్రాచ్య లిఖిత (గంథాగారంలో చక్కని కాగితాలమీద వ్రాసో, తాటాకులమీద వ్రాసో అందుబాటులో ఉండడం చేతనూ, లక్షణ(గంథాలు, ప్రబంధ రత్నావళివంటి గ్రంథాలు దొరకడంచేతనూ, కవులకాలము, కవుల (గంథములు మొదలైన విషయాలనుగురించి ప్యతికలలో ఇటీవల చర్చ లనేకం జరగడంచేతను వీరేశలింగం పంతులుగారు చీసిన పొరపాట్లు, ప్రమాదాలు మనకు తెలుసుకోడానికి నే డెక్కువ అవకాశముంది. ఆయన రచించిన. కవులచరిత్రలో అటువంటి పొరబాటులు, ప్రమాదలేశములు ఉన్నవని ఆయన కవులచరిత్రను గాని , ఆయన చేసిన కృషినిగాని తృణీకరించడేం ఆయన పారపాట్లని చూపి ఆయనకంటె మన మేదో పొడిచేశా మనుకొని విర్రవీగడంవల్ల మన అజ్ఞానమూ, అహంభావమే వెల్లడవుతుంది కాని ఆయనకు కలిగే న్యూనతా ఏమీ లేదు, ఆయన చరిత్రకు గల విలువా తగ్గదు. నేటికి కూడా ఆయన కవులచరిత్ర అమూల్యమయిన గ్రంథం. నేటికి ఆంధ్రంలోని చరిత్రవాజ్మయానికి అల౦కారసప్రాయమైన (గ్రంథం. ఆయన చేసిన సిద్ధాంతా లనేకాలు, కొంచె మించు మించు అన్నీ అన్నా తప్పు లేదు, ఇప్పటికి ఒప్పులుగా చెల్లుబడి అవుతున్నవే. నన్నయ్యభట్టీయాన్ని గురించి ఆయన చేసిన సిద్ధాంతాన్ని నేటికీ ఆమోదింపని వా రరుదు. అయితే, ఇప్పటికీ ఒక రిద్దరు లేకపోతే పదిమంది అది నన్నయభట్టుకృతమే అని వాదిస్తున్నా ఆ వాదానికి పటుత్య్వంలేదు. భూమి చదునుగా ఉంది కాని గుండ్రనగా లేదని వాదించేవారు శాస్త విజ్ఞానం పూరా నిండి తొణికిసలాడే యూరోపులోనే నేటికీ ఉన్నారు. వీరేశలింగంగారి నాటి

వేగుచుక్క మల్లంపల్లి సోమశేఖర ళల 1437 నుంచి నేటివరకు త్యామశాసనములు,శిలా శాసనములు మొదలైన వెన్నో బయలుపడినవి. [ప్రాత తాటియాకుల పుస్తకాలను సేకరించుటకు అనేక (ప్రయత్నములు తెలుగు దేశంలో జరగడంవల్ల తాళప్యత (గ్రంథ సంచయం వృద్ధిఅయి అదివరకు దెలియరాని కవులు ఎందరో తెలిసినారు; అదివరకు 'దెలియరాని పుస్తకములూ ఎన్నో తెలిసివచ్చినవి; ఆయా కవుల కాలములు నిర్ణయించుటకు వెనుకటికంటె అవకాశము లిప్పు డెక్కువ లభఖిస్తున్నవి. మదాసు [ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం, తంజావూరు పుస్తక భాండాగారాలలోని పుస్తకాల డిస్క్రిప్టివ్‌ క్యాటలాగులు ప్రకటితము లయినవి. ఇవి కాక ఆంధ్రసాహిత్య పరిషత్తు, విశ్వకళాపరిషత్తు, తిరుపతి దేవస్థాన విద్యాసంస్థలలో సేకరించిన తాళపత్రగంథాలు - వీటి కింతవరకు డిస్కి9ప్టివ్‌ క్యాటలాగులు లేకపోయినా - అనేకాలున్నవి. వీటి నన్నిటినీ పురస్కరించుకొని వీరేశలింగముగారు రచించిన ఆంధ్రకవుల చరిత్రమును పునఃవిమర్శించి పరిష్కరించి ప్రకటించడం ఎంతయినా అవసరం. పంతులుగారి కీర్తిన, సాహిత్యకృషినీ చిరస్థాయిగా చెయ్యడానికి ఈ ఒక్క [గంథం చాలును; ఎందుచేతనంటే శ్రీ పంతులవారు వ్రాసిన పద్యకావ్యాలు శుద్ధాంధ నిరోష్ట్య నిర్వచన వైషధః, రసికజన మనోరంజనాదులు ఎంత పండిత 1పశంసను ఆ కాలంలో చూరగొన్నవయినా అట్టి కావ్యాలకీ కాలంలో మెప్పుదల లేదు... ఇంకా ఇప్పుడయినా ఏ కొద్దిగానో ఉందేమో కాని ముందు ముం దుండదని తోస్తుంది - కాలప్రపృత్తి మారుతున్నది గసుక. ఇక పంతులుగారు రచియించిస ప్రహసనములు, హాస్య సంజీవనులు, రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వాదేశ యాత్రాది నవలలూ సమకాలిక సామాజిక ప్రవృత్తిని చిత్రించి, ప్రధానంగా సమాజ సంస్కరణానికి ఉద్దేశించినవే కాబట్టి, ఆ సమాజం మారేటప్పటికి ఈ గ్రంథాదులమీది ఆదరం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. అందువల్ల శ్రీ పంతులుగారు విరచించిన (గంథాలలోనికల్లా వారి ఆంధకవుల చరిత అమూల్యమయినది, ఆంధ్రదేశానికి అమితోపకారకపుయినదీని. కాలము గడచినా దాని విలువ తగ్గనిది. విజయనగర వాజ్బయము, కవులచరిత్రమనీ ఇటీవల (పకటితములయిన, అవుతూఉన్న గ్రంథములను గురించి నాకు తెలియక పోలిదు. ఎన్ని కవుల చరితలు [(ప్రకటితమయినా కాని శ్రీ పంతులుగారి కవుల చరిత్రకు

1436 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము గల విలువ తగ్గదనే నా అభిప్రాయం. పంతులుగారు కూడా (ప్రాచీన కవులను గురించి వ్రాసిన ప్రథమభాగమును పునఃము[దించినపుడు అనవసరమయిన (గ్రంథమును చాలా జెంచినారనే తోచినది. ఇప్పుడు కవుల చరిత్ర (వాస్తున్నామంటే వీరేశలింగం పంతులుగారి నాటినుంచి నేటివరకు ఒక్కొక్క కవి కాలనిర్ణయాదికాలను గురించి ఎట్జెట్టి పూర్వపక్ష సిద్ధాంతాలు జరిగినవో వాటి నన్నిటినీ ఏకరువు పెట్టుట అనవసరమూ, [గ్రంథ విస్తర కారణమూ కూడాను. ఒక్కొక్క చారిత్రకాంశం స్థాపించడంలో మొదటికాలంలో అనగా ప్రారంభంలో అనేక వాద ప్రతివాదాలు జరగవచ్చును, పలువురు పలువిధాలుగా ఆ విషయాన్ని గురించి వాసి ఉండవచ్చును. కాని చారిత్రక సామగ్రి అధికంగా లభించిన కొద్దీ, ఆకరములు ఎక్కువగా దొరకినకొద్దీ ఒక్కొక్క విషయం సునిర్దిష్టమయి స్థిరపడిపోతూ ఉంటుంది

  • సమస్యలు కొత్త కొత్త వివరవిషయాలలో పుడుతూ ఉన్నప్పటికీని. కాలానుగుణంగా (ప్రబల (ప్రమాణాధారాన స్థిరపడిపోయిన చరిత్రవిషయాలను గురించిన వాదోపవాదాలు మళ్ళీ అన్నీ తవ్వి పుస్తకంలోని కెత్తనక్కరలేదు. స్థిరపడని విషయాలను గురించి మాత్రమే మనం (గ్రంథంలో పాందుపరుస్తూఉంటే చాలు. మనకు [గ్రంథం విస్తరింపజేయడం, సంపుటాలు పెంచడమూ కాదు కావలసింది. వషయం ప్రమాణ పూర్వకంగా, యుక్తి సహంగా , ఖచ్చితంగా చెప్పి మన చరిత్రకు ప్రామాణికతా, నిర్దుష్టతా, స్వచ్చతా కలిగించడమే. ఈ ఫక్కీని త్రీ పంతులుగారి ఆంధ్ర కవులచరిత్రను ఒక పరిశోధక బృందంచేత కాని, తగినవారిచేత కాని పరిష్కరింపించి సమగ్రంగా (పకటింపించడం ప=తకారిణీ సమాజ కార్యనిర్వాహకుల ధర్మమని మనవి చేస్తున్నాను. శ్రీ పంతులుగారి కవుల చరిత్రే ప్రస్తుతం తరచుగా సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర, దేశచరిత్ర చదివేవారు పరిశోధించేవారు వాడే రిఫరెన్సు బుక్కు. ఈ గ్రంథం మొదటి భాగం తక్క మిగిలిన రెండు మూడు భాగాలూ ఎక్కడ కొందామన్నా దొరకటం లేదు. పంతులుగారి సంస్కరణ కృషి జాతిలో అంతర్భాగమయి ఆజాతి ఆ కృషి ఫలితాన్ని పొందితే, వారి ఆశయాలు జాతిలో సాఫల్యం పొందితే ఇక సంస్కరణ విషయంలో పంతులుగారిని తలచుకొనేవా రుండరు. నేడు వితంతు వివాహాలు అనేకాలు జరుగుతున్నవి. అవి నేడు పరిపాటే అయిపోయినవి,

వేగుచుక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ 1439 వితంతు వివాహమంటే ఎబ్బెరికం పోయింది. ఆ పూర్వపు పట్టుదలలూ, ఆ వివాదాలూ అన్నీ మణిగిపోయినవి. దేశ మంతా, ఆంధ్ర జాతి అంతా వితంతు వివాహ సంస్కరణానికి సుముఖమయింది. ఇప్పు డది మంచిదని ఒకరిని ఒప్పించవలసిన పని లేదు: అంటే ఆయన తలపెట్టిన వితంతు వివాహ విషయకమైన ఆశయం ఫలించింది: ఆయన కృషి సార్థక మయింది. ఇక ఈ సంస్కరణోద్యమ చరిత వ్రాయ తలపెట్టినప్పుడు కాని ఆయనను స్మరించేవా 'రెవరు? ఈ విధంగానే ఆయన జాతిని సంస్కరించాలని ఏ లక్ష్యంతో ఆయన [గ్రంథాలు (వాశారో ఆ లక్ష్యమే సిద్ధించినపుడు ఆయన ఆంధ్రజాతి సంస్కారంలోనే తిరోహితులై ఉంటారు. ఇక ఆయనకు వ్యక్తిత్వం లేదు. ఇక వ్యక్తిత్వం ఇచ్చి, విశిష్టత ఇచ్చి ఆయన కీర్తిని చిరస్థాయి చేసేది ఆంధ్రకవుల చరిత్రమే. అది యొంతకాలం ఆంధ్రదేశంలో రిఫరెన్సు పుస్తకంగా ఉంటుందో, ఆయన ఆ (గ్రంథాన్ని నిత్యనూతనంగా ఎంతకాలమయితే పఠిస్తూ ఉంటారో అంతకాలమూ ఆయన యశఃకాయుడే. ఏ కాలానికీ పనికి వచ్చే మహా కావ్యాలను - అవి గద్యములు కానీండి, పద్యములు కానీండి - వ్రాసిన మహాకవు లందుచేతనే యశఃకాయులు; ఆ కారణంచేతనే కావ్యం - తాత్కాలిక ప్రయోజనానికి పుట్టింది కాదు - చిర ప్రయోజనానికయినది - [గ్రంథకర్త పేరు చిరస్థాయిగా నిలిపే సప్తసంతానాలలో ఒకటిగా ఎన్నిక గన్నది - శ్రీ వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్ర శుష్కమయిన చరిత్ర [గంథమయినా అదీ ఒక విధమైన చారిత్రక కావ్యమే. శ్రీ రాజమహేంద్రవరము హితకారిణీ సమాజము వారు శ్రీ వీరేశలింగం పంతులుగారి ఈ కవుల చరిత్రను సమర్థులయిన వారిచేత పునః దోషరహితంగా పరిష్కరింపించి నూతనంగా దెలియవచ్చిన కవులు కావ్యములను గురించిన విషయాలు చేర్పించి ప్రకటించడం చాలా అవసరం. అట్లా చేయకపోతే శ్రీ హెతకారిణీ సమాజంవారు శ్రీ పంతులుగారిపట్ల అపచారం చేసినవా రవుతారు. శ్రీ పంతులుగారు ఆంధ్ర మహాపురుషులలో ప్రప్రథములు; నవ్యాంధ్ర నిర్మాతలలో అగ్రగణ్యులు. ఆంధ్రదేశంలో ఆధునికయుగ ప్రత్యూషం తెలుపుడు చేయుట కుదయించిన వేగుజుక్క. దేశంకోసం తన రక్తం ధారపోసి కష్ట నష్టాలకూ, తోడివారి దూషణ తిరస్కారాలకూ లెక్కచేయక సాహిత్యం ద్వారా నూతన భావాలు వెద వెట్టి ఆంధ్ర జాత్యభ్యుదయంకోసం కృషి చేయగా చేయగా ఈనాటి

1440 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము యాంధ్రదేశం తయారయింది. ఈ సంతత మహా కృషిలో ఆయన అర్థ [పప్రాణములూం, రక్తషాంసములూ అన్నీ అరిగిపోయినవి. వాటితో ఆయన జాతి అభివృద్ధి సౌధానికి నిర్మించిన సోపాన పరంపరను ఎక్కే మన మీనాడు ఇంతటి అభివృద్ధి పొందినాము. ఆయన కీర్తిని చిరస్థాయి చేయవలసిన బాధ్యత ఆంధ్రలోకం అంతటిదీని, అందులో ముఖ్యంగా హితకారిణీ సమాజం వారిది. ఆంధ్రులు తమ నవ్యజాతి నిర్మాతలను విస్మరించి కృతఘ్నులు కారాదు. అట్టి మహనీయుల దివ్యచరిత సంస్మరణమే పురోభివృద్ధి పథానుగాములము మన కంగరక్ష. . శ్రీ దంగేటి నారాయణస్వామిగారు శ్రీ హితకారిణీ సమాజము కార్యదర్శిగ ఉండి సమాజ కార్యాలను జక్కగా నిర్వహించి సమాజాన్ని వృద్ధిలోనికి థ్‌ తీసుకువస్తున్నందుకు వంద్యులు. కార్యనిర్వాహక సభ్యులలో ఉత్సాహవంతమైన యువకు లనేకులు చేరి శ్రీ నారయణస్వామిగారికి చేయూత ఇవ్వడం ప్రశంసింపదగ్గ విషయం. శ్రీ మద్దూరి శివరామకృష్ణయ్యగారి సారథ్యంవల్లా, శ్రీ నారాయణ స్వామిగారి కార్యదర్శితవల్లా హితకారిణీ సమాజం ఉత్తరోత్తరాభివృద్ధి పొందాలనీ శ్రీ వీరేశలింగంగారి ఆశయాలను సఫలం చేయడానికీ పేరు చిరస్థాయి చేయడానికీ అది గట్టి కృషి చేస్తుందనీ నా నమ్మకం. . (కిన్నెర: సంపుటము ౨, సంచిక 5, మే 1950) గ ర్త

సను -

1 ౧౨49ల 12

(నలల శి

1 1 1.

“నారాయణభట్టు”* బులుసు వేంకట రమణయ్య

గత శతాబ్ది చివజ్‌వణకును గల గద్య, పద్య కావ్యముల పద్ధతికి విలక్షణముగ కల్పిత కథలగు “నవలొలు వచన రూపమున నేండు మంచి ప్రచారము నొందియున్నవి. “నవల” రచనమునకు బీజము గత శతాబ్ది చివఅనే నాంటంబడినది. ఆంగ్లభాషా కోవిదులగు నాంధ్ర కవుల ప్రయత్నమున నవలలు పరినిష్టితరూపము నేర్పజచుకొనినవి. ఈ శతాబ్దిలో తొలిరోజులలోవెలసిన ఆంధ్రప్రచారిణి, వేగుంజుక్క, ఇతిహాసతరంగిణి, కళాభివర్థని, విజ్ఞానచంద్రిక మున్నగు సంస్థలు నవలా రచనకు తగిన ప్రోత్సాహము నొసంగినవి. కాని మొనమొన్నటివజకును వెలువడిన నవలలలో చాలవ అకును భాషాంతరీకరణవములు, అనుసరణవులు వూ్యూతము కానవచ్చుచున్నపి.

కథా వాజ్బియమునను, “నవల” రచనమునను సాహితీసమితి సమర్థులగు పండిత కవుల పర్యవేక్షణమున పెక్కుమార్గముల ముందంజ వేసింది.

చక్కని కథలు వ్రాయుటయందును, నవలల రచనమునను సాహితీసమితి సభ్యులు సిద్ధహస్తులు. సభాపతి యగు శ్రీ శివశంకరులు తమ సభ్యుల రచనలను దిద్ది, తీర్చి వన్నెలు చిన్నెలు కూర్చి పేరుప్రతిష్టలు కలిగించుట సమితి సభ్యులకున్ను, మిత్రులు కొందజీకిని విదితము. వారు చేసిన యాంధ్రీకరణము లనువాదములవలె గాక స్వతంత్ర రచనల రీతినే హృదయంగమములయి యుండును. అట్టి రచయితలలో శ్రీ నోరి నరసింహశాస్తింగారు ఎన్నదగినవారు. కర్త: శ్రీ నోరి నరసింహశాస్తి9, సాహితీసమితి, రేపల్లె, గుంటూరు జిల్లా. ఆంధ్ర వారపత్రికనుండి పునర్ముద్రితము: డెమ్మీ 240 పుటలు. చిన్న అచ్చు. వెల రు. 4-0-0. ముడణ: ఆం్రప(త్రికా మ్యుదణాలయము, మద్రాసు [. పందిరి మల్ల్‌కార్టునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

1442 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

కాలక్రమమున మన వాజ్బాియమున అనువాదములయెడ వ్యామోహము తగ్గినది; స్వతండత్రములును, అందును ఆంధ్రదేశ సంబంధ్ధములును అగు నవలలకు ఆదరము హెచ్చినది. శ్రీ 'విశ్వనాథ' వారి ఏకవీర, వేయిపడగలు, శ్రీ బాపిరాజుగారి “నారాయణరావు” శ్రీ ఉన్నవవారి 'మాలపల్ల' మున్నగు నవల లుచిత స్థానము నాకమించుకొన్నవి. ఈ *“నారాయణభట్టు”ను అట్టి ఉత్తమ తరగతికి చెందినది:

శ్రీ నరసింహశాస్త్రిగారు ఆంధ్రమునను, ఆంగ్లమునను విద్వాంసులు; సంస్కృత పరిజ్ఞానము కలవారు; [గ్రంథ రచనముననే కాక, విమర్శునమునను దిట్టలు. వారు పెక్కు విషయములను సం[గహించి, శాసనములను పరిశోధించి, కవుల చరిత్రములను కర తలామలకములుగ నొనర్చుకొని నన్నయనాటి దేశ, కాల, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు (పపతిబించించున ట్లీ “నారాయణభట్టు” ను రచించిరి. వీరు విమర్శకు లగుటచే చారిత్రక విషయములు కొన్నింటియెడ వీరికి సంతృప్తి కలుగలేదు. ఈ విషయము వీరు వాసిన -

“నాకు సాధ్యమయినంతవరకు ఆ కాలపు చరిత్ర సంపాదించితిని. అందులో కృషిచేసిన పలువుర వ్యాసములు చదివితిని. ముఖ్యముగా ఆంధ్రుల చర్మితయు, రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచికయు నామూలా[గ్రముగా పఠించితిని. వానిలో నెన్నియో భమలు కలవు. ఆ భమలు కూడా నా కెక్కినవి. అనంతరమున పరిశోధకులెన్నియో నూతనాంశములు వెలువరించినారు. అవి యన్నియు నా దృష్టిలోనికి రాలేదు. అందుచే నేటి చరిత్రకారులకే కాక, నాకు గూడ పొరపాటులుగా కనపడు కొన్ని చిన్న విషయము లిందున్నవి. కథలో నివి కలిసెిపోయినందున సరిచేయుటకు వీలులేకపోయినది... ఐతే ఇది చరిత్ర గ్రంథము కాదు” 'అను పఏఠికా భాగమునుబట్టి తెలియుచున్నది.

శ్రీ నరసింహ శాస్త్రిగారు ఈ నవలలో "“ఆంధ్రభారత రచననాటి ఉజ్వల చరిత్ర చిత్రింపనెంచిరి. వారి ప్రయత్నము చక్కగ నిందు కొనసాగిన దనవచ్చును. ఆకాలము నాటి వేంగీదేశ వైభవము, మోటుపల్లి విదేశ వ్యాపారము, తూర్పు. పడమట చాళుక్యుల కుటుంబ పరిస్థితులు, చోళరాజ్య [1పాభవము, రాజరాజ నరేంద్రుని యౌదార్యము, అమ్మంగ దేవి బుద్ధి ప్రాభవము, వజ్జియు ెగ్గడ మంత్రాంగము, నన్నినారాయణుని ప్రతిభ, నన్నయ వైదుష్యము, బౌద్ధారామముల పరిస్థితులు, మత చర్చలు మున్నగు విషయములిందు బాగుగా చిత్రింపబడినవి. అధర్వణుని భారతమును గూర్చిన యథార్థ విషయ మెట్టున్నను, ఆ (గ్రంథము లభింపకుండుటకు కల్పింపబడిన గాథ మాత్రము యుక్తిసహము; నన్నయ భారత రచనకు నారాయణభట్టు ఎట్లు కారణమైనదియు బాగుగ వివరింపంబడినది.

నారాయణభట్టు బులును వేంకట రమణయ్య 1443

(గ్రంథకర్త పీఠికలో. జెప్పినట్లు ఇందు కొన్ని భమలను పాఠకులు (గ్రహింపంగలుగుదురు. ఇందు వేములవాడ భీమకవి నన్నయ సమకాలికుం డైనట్లు అఆల్బంబడినది. శ్రీ గురజాడవారి కవి జీవితముల ననుసరించి భీమకవి నన్నయకు పూర్య్యుడనియు కొందరు (భవుపడవ చ్చును; మజ్‌యు నన్నయయు, అధర్వణుండును సమకాలికు లనుట యుక్తి దూరము, నన్నయకు పూర్వము తెలుగు కవులు “కాసట బీసటల్‌ చదివి గాథల నల్లి"రని చెప్పుట యుచితము కాదు. భారత రచనకు ముందు వాజ్మయ మనుపలబ్ధమైనంత మాత్రమున అది అనాదరింపదగినది కాదు గదా!

“నారాయణభట్టు"లోని కథన పద్ధతి ఆది నుండి అంతమువజకు నొక్కరీతిగా జరిగినది. కొంచెము సంస్కారము గల చదువరులకు మతచర్చ మున్నగు విషయములు విసువు కలిగింపవు. కథా (పప్రారంభమునను, చ(కకోట్య యుద్ధ వర్ణనమునను కొంత భాగము తగ్గియుండిన మే లనిపించును.

మజియు రాజరాజు నన్నయకంటె నారాయణభట్టు నెడనే ఎక్కువ ఆదరము చూపినట్లును, దాని కతండు యువరాజున కండగా నిలిచి చ్మకకోట్యమును జయించుటకు కారణమగుటయే ముఖ్య హేతువైనట్లును, అందుననే నందంపూడిని దానము చేసినట్లును (గంథమునుబట్టి ఆలియుచున్నది. నారాయణభట్టు యువరాజున కన్నియెడల నండయై యుండెననుటకు సందేహము లేదు; కాని చక్రకోట్య విజయమున నాతండు చూపిన సర్వాతిశాయి ప్రతిభ గ్రంథమున గోచరము కాకున్నది. _

నందమపూడి శాసనమును బట్టి నారాయణభట్టు గొప్పకవి యనియు, విద్వాంసుడనియు, సంస్కృత, కర్ణాటక [పాకృతాది భాషావేత్త యనియు

“యః సంస్కృత కర్ణాట

ప్రాకృత ప్రైశాచి కాంధ్రభాషా సు,

కవిరాజ శేఖర ఇతి

ప్రథితః సుకవిత్వ విభవేన.

కవీన్‌ మనీషాలవ దుర్విదగ్గాస్‌

మనోహరాఖి ర్నిజసూక్తిభి ర్య

కుర్వ న్నగర్వాన్‌ పటుభి ర్చిభర్తి _

కపీభవ జాంకుశనామ సార్థమ్‌.

తతత పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

తమస్క్మై సకల జగదభినుత గుణశాలినే, సరస్వతీ కర్ణావతంసాయ అష్టాదశావధారణ చడ్రవర్తినే నన్ని నారాయణాయ”

పయి చోట నారాయణభట్టు రాజనీతిజ్ఞుండని సూచింపనైనను లెదు; అట్టివానికి నందంపూడిని దాన మొన ర్భఏటకుం గల్పింపంబడిన సందర్భము హృదయంగమముగ లేదు; ఒకవేళ నారాయణభట్టు యువరాజనకు బాసటయమొ నిలిచి, విజయమునకు కారణమైనను అట్టి వానికి సోమోపరాగ సమయమున కేవలము ధర్మార్థముగా దానము చేయట ఉచితముగా కానరాదు.

నన్నయ్యయే మరు జన్మములలో తిక్కన్నగను, ఎజ్జన్నగను జనించి భారత రచన పూర్తి చేసెనని యిందు చమత్కారముగ చిత్రింపబడినది.

కథావస్తు విందు అల్బమైనను కథ మ్మాతము విపులముగా సాగినది. కాని చదువరులకు విసుగు అనిపించదు. ఇట్లు రచించిన శ్రీ నరసింహశాస్తింగారు ప్రశంసార్హులు.

తెలుగుదేశమున పుట్టినవారిలో చాలమందికి ఆంధ్రదేశ చరిత్రమును గూర్చిన విషయములు తఆలియవనుట అందరికిని అల్లము. విదేశ చరిత పఠనమునకు (ప్రాముఖ్యము నొసగిన విద్యా ప్రణాళికయే దానికి కారణము. తెలుగు విద్యార్థులయు, పాఠకులయు హృదయసీమలో తలుగునాటి చరిత్ర విశేషములకు తగిన తావొసగి, యువకుల కుత్సాహము కలిగించి, వారికిని, తన్మూలమున దేశమునకును అభ్యున్నతిని కలిగించుటకు “నారాయణభట్టు" వంటి నవల లన్నియైనను కావలెను. ఇట్టి పనిని నెజవేర్ప్చుజాలినవారు మన దేశమున మిక్కిలి అల్పసంఖ్యాకులు. అట్టివారిలో శ్రీనరసింహశాస్తి9గా రొకరు. కాన శ్రీ శాస్తింగారు ఇట్టి నవలలను రచించి, సమర్థులచే రచింపజేసి, దేశాభ్యున్నతియే తమ “సాహితీసమితి” లక్ష శ్రముగా నుంచుకొని, అన్నివిధముల ఆంధ్ర దేశాభ్యున్నతికి పాటు పడుదురు గాక! (కిన్నెర: సంప్పుటము 2, సంచిక 7, జూలై 1950)

భావకవిత్వము: నవీినయుగము వి. సరోజనీదెవి, బి.ఎ.

సేమకాలమువారి మెప్పులకు నోచుకొను కృతు లేకాలమందును చాల అరుదు. సమకాలపువారిని తెగడుట వలెనే పాగడుటకూడా పరిగణింపదగినది కాదు. కవి కేవలము తన యనుభవములనే చెప్పుడు. స్వర్గసాందర్య్యము, నరకబాధనుగూడ నాతడు భావనచేసి, కవితాసమాధియందు దాను పొందిన యనుభవానందమును తిరిగి కవనముఖమున నభివ్య క్తపరచును. కవితా సమాధిలోనున్న కవి మానవమాతుడు కాడు. సుఖదుఃఖములను రెంటిని నాతడానందముతో దిలకించును. మనకు గామ్మకోధములుగ గోచరించెడి విషయములే అతనికి శృంగార వీరములుగా సాక్షాత్కరించును. మనకు భయహేతువులగునవి కవియుక్క దివ్య చిత్తమున సంస్కారముపాంది ఆనందముగా తరిగి సాక్షాత్కరించును. కవి దేశ కాలముల కతీతుడు. భూతముతో వర్తమానమును సమన్వయించి, భవిష్యుత్కాల ప్రవాహముతో సంగమింపచేసినవారే మహాకవులు.

నవ్యకవుల రచనలకును, 1పాచీన కవుల రచనలకును కవిసమయములందు, నూతన పదజాల సృష్టియందు, ఛందోవిధానములందును చాల భేదములున్నవి. ఆంగ్ల హిందీ సాహిత్యములతోడి పరిచయ మీ నవ్యకపుల రచనలకొక [కొత్తదనము తఆచ్చి పెట్టినవి. వీరి రచనలకే నవీనులు భావ కవిత్వమనియు, వేళాకోళముగా బావ కవితలనియు పేరు లిడుచున్నారు. పప్రావీనులుకూడా వారియడ సహృదయ భాపములేక వారి రచనా విధానమును తెగనాడుదురు. అత్యాధునిక భావములతో నవ్యకవులును ప్రాచీనుల నపహసెంచెడరు. కాని కాళిదాస మహాకవి యన్నట్లు

1446 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (ప్రాతమైనంత మాత్రమున కావ్యము మంచిదియుకాదు; క్రొత్త మెనంతమాత్రమున చెడ్డదియు కాదు. ఉత్తమ పఠితలు గుణపరీక్షచేసి రసవత్కావ్యమును గ్రహించెదరు.

పలువు రాధునికకవుల రచనలు సంకలితముచేసి వ్రాయబడిన “వైతాళికులు” అను గ్రంథమునుండియు, ఉత్తమ భావ కవిత్వమున కాదర్శ[పప్రాయముైన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి “కృష్ణపక్షము” నుండియు, అల్ప్బాయుష్కుడయ్యెను కాని బ్రతికియున్నచో “తెలుగు కావ్య సరస్వతి నూపురంబు [మోయుదినములు మనకు చూపియుండు” శ్రీ కొడాలి సుబ్బారావుగారి “హంపీ క్షేత్రము" నుండియు, నవ్యకవుల రచనా విధానములను గొన్నింటిని మనము తెలిసికొనగలము. ఆంగ్ల సాహిత్యముతోడి సంపర్కమువలన, మన ప్రాచీన గ్రంథములం దెచ్చటను కానరాని “నీత్రార్తులు, నీరవ గళమున జనించు కోరికలు, జవ్వనపునీడలు, ఇరుల గుసగుసలు, (పొద్దు పొడుపు రేకుల పైడిదారులు, తుషారపు స్వప్నరాసులు, తడిగట్టెడి సిగ్గులు, నగ్న గీతములు, విరహవీణలు, నీలమేఘనిశ్వాసములు, మూగబాధలు, జీవన గంగాహరిత తటములు, సాఖ్యజ్వాలలు " మున్నగు పదములు వీరు వాడుచున్నారు.

నవీన యుగమున ప్రపంచమున చెలరేగిన యశాంతి నిరాశలు, సిద్ధినొందని మనోరథములు, పండని వలపులు నవ్యకవుల హృదయములను కలంచి వేయుటచే వీరు విషాద గీతములను బాడుకొనుచు జీవితపు టెడారులయందు (తోవతప్పిన పాంధులవల పరితపించు చున్నారు. వీరి రచనలయం దెచ్చట చూచినను విరహ విషాదగంధము పరిమళించుచుండును. అందుచే వీరి రచనలందు కృష్ణ శాస్త్రిగా రనినట్లు:

“ఎద్దియొ అపూర్వ మధురరక్తి స్ఫురించుకొని అర్థమ్ముకాని భావగీతమ్ములవి” విప్రయోగమునందే రససిద్ధిని బడయ జూచెదరు.

“దానితోసరి, మరల నాంధ్యమ్ము గ్రమ్మె

తొలి చివరలేని యీ చీకటులును, నేను

ఒక్కరొక రప్పళించుకొంచుండినాము,

నిన్ను, నీనాటి మెబుపు మన్నించుకొంచు" దుఃఖావేశముచే వారికి జీవితము పీడకలవంటి దైనది.

“రేయి కడుపున జీకటిచాయవోలె

తమస్సు టెడద దివాంధగీతము విధాన

ఘూకరావాన వలవంతరేకరీతి

నా విషాదమ్ములో దాగినాడ నేనె”

భావకవిత్వము: నవీనయుగము వి. నరోజనీదోవి బి.ఎ. 144/7

అస్సుటమగు వాచ్యముచే ననూహ్యమగు వ్యంగ్యమును సాధింపగోరు రచనములవలననే వీరి కవిత్వ మర్థమగుట లేదని చాలామంది యూహించు చున్నారు.

స్వాతంతృ్య భారతరంగమున పొంగి పొరల నవ్యకవుల నూతనావేశములతో జయగీతములు, మాతృగీతములు పాడుచు భవిష్యుత్కాల గర్భకుహరముంజొచ్చి, సృటికప్యాతమున శాంత్యాసవముం ధర్మదేవతచే దెప్పించి జనులను సంతుష్టులం జేయుచున్నారు. సంస్కృతపు్పు పోకడలలో వాతము వున కవృలది తక్కువచేయియా?

“వాగర్థంబులలో (పమాణములలో,

వాదంబులో, సూతచర్చాగాంభీర్యములో

కవిత్యమధు ధారావేగ విభ్రాంతిలో "

బాగోయీ కవిరాజ!” పంపాసరస్సు కొండచరియలయందు వేలు మేఘప్రవాహాల నేలుకొనునట.

“ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి

తలుగు జెండా కర తీసిరేల” ఈ ఆవేశము, తన్మయత్యము, సామాన్యకవులకు అందునవికావు.

“అవమానమేలరా, అనుమానమేల

భరతప్పుతుడనంచు భక్తితో పలుక” అని హెచ్చరించి, సంకుచితమగు నాంధ్రత్యమునుండి ఉదారమగు భారతీయతకు దారి చూపుచున్నారు.

“మాతృదేశ సేవాచరణమ్ము నం

దసువులర్పణ చేసినవారి పార్థివశ్రీ

చెలువారు చోట తదసృృ్యగుచులన్‌ వికసించి,

వాసనల్‌ వీచుచు రాలిపోవగవలిన్‌

తడుదాత్త సమాధి మృతికస్‌” అని జీవత కుసుమముల నివేదింప నాకాంక్షించుచున్నారు.

1448 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

వీరు స్త్రీని భోగ్యపదార్థముగా కాక ఉపాస్యదేవతగా నారాధింతురు. వీరు భోగించునది ప్రకృతియందు దాగియున్న అంతః సౌందర్య మేకాని బాహ్యరూపము కాదు. ప్రకృతిని ప్రియురాలిగా భావించి

“ఆమె నవనీత హృదయ, నాయంతరంగ

శాంతిదేవత, ఆశాపథాంతరాళ

పారిజాతమ్ము (శేమజీవన విభాత

కెశికీగీతి, నా తపః కల్పవల్లి.

ఆమె జగదీశమకుటాగ్రసీమనుండి

యుర్వి పై జారిన సుధామయూఖరేఖ...

ఆమె నా జన్మజన్మ పుణ్యములు పండి

(పాప్తమైన కేళీపరిత్యాగలీల,

ఆమె పదసన్నిధాన దివ్యస్థలాన

భక్తినముడవై నిలంబడినయప్పుడు

తలంపునకు వచ్చు నా పేదతనము నాకు:”

అని ప్రియ నాశ్వాసింతురు. నామరూపాదులు లేని యీ స్త్రీవ్య క్రియే నేటి యాంధ్ర సారస్వత పూజా ఫ్పీర్ర మలంకరించియున్నది.

“పొద్దు పొడుపు నోములు నోచుచు, చిన్నతనపు సింగారంపు జెయిది సిరుల పడుచువాండ్రను వలచి వలపించు ఆలుగుకన్నెల మోహనాకృతిని మనకు సాక్షాత్కరింపజేయుచున్నా రీకవులు. స్త్రీ మూర్తిని నారాధించునపుడు రూపవర్ణన, నామ కథనమును వీరుచేయరు. “నేను”, *ఆమెో అను సర్వనామములు ప్రయోగింతురు. బహుశా షెల్లీ కవిశేఖరుని (ప్రేమగీతములు వీనికి మార్గదర్శకములు కాబోలు! సామాన్య జనుల జీవిత మాధుర్యమును అలతి పొలతి తీయని నుడులతో మిక్కిలి సున్నితముగ నండూరి, అడవి, కవికొండల గానము చేసినారు.

“స్వేచ్చా గానమొను ఖండకావ్యమున శ్రీ కృష్ణశాస్త్రిగారు తమ స్వతంత్ర భఖభావవఎల నన్నింటిని*దాసశృ్ళంఖలవుఎలు చెదిరిపోవ కంఠ మెత్తి స్వేచ్చాగానర్సురుల” నించినారు. ఇతను కొన్ని వేళల భావోన్మత్తుడు; కొన్నివేళల ప్రకృతి తన్మయుడు.

భావకవిత్వము: నవీనయుగము వి. నరోజనీదేోవి బి.ఎ. 1449

“ఆకులో ఆకును పూవులో పూవును

గలగలని వీచు జిజబుగాలిలో కెరటము .

జలజలనిపాజు సెలపాటలో తేటయు”

అయి యుండుట ఈతనికి మిక్కిలి ప్రియము. దుఃఖమును వర్ణించుఘట్టములం దీకవి అద్వితీయుడు. కావ్యమున సుఖాభిలాషకన్న దుఃఖాభిలాష యే ప్రియముగా నున్నట్లు గోచరించుచున్నది.

“అమల మోహన సంగీతమందు

హృదయ దళన దారుణ రోదన ధ్వనులు" ఈ కవికి వినిపించుచుండును.

“స్వచ్చ మైనట్టి పణయంపుసలిలధార

బోసి పెంచిన స్నేహంపు బూలతీవ

తావులను జిమ్మునలరుల దాల్చకుండ

గాలి తాకున నేలపె వ్రాలనకట!”

తుద కీదుఃఖము ఒక వింత భోగముగా పరిణమించి లోకమును తిరస్కార భావముతో చూసె

“నన్ను గని యేరు జాలి చెందంగవలదు

ఎవ్వరని ఎంతురో నన్ను? ఏ ననంత

శోకభీకర తిమిర లోకైకపతిని

కంటక కిరీట ధారినై...

నాకు నిశ్వాస తాళపృంతాలు కలవు

నాకు కన్నీట్‌ సరుల దొంతరలు కలవు”

దుఃఖము లోతెరింగిన యీతని హృదయమున [పేవమయంకురించి దయఃఖభోపశాంతి గావించినది.

“నారభము లేలజిమ్ము పుష్పవజమ్ము?

చండికల నల వెడజల్లు చందమామ?

ఏల సలిలంబుపాజు? గాడ్చేల విసరు?

ఏల నాహృదయంబు (ప్రేమంచును నిన్ను?

1450 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మరియు “ఏడ జనిన మనోహరి జాడలరసి కలగు హృదయంబు, నెమ్మది చలనమొందు కనులు మూసిన, లోక మోహన మనోజ్ఞ మూర్తి చిరునవ్వు. జిలుకుచు [మోలనిలచు” స్వతంత్ర బుద్ధితో లోకమున సంచరించి దుఃఖముపాలై తుదకు (ప్రేమతో కూడ తృప్తి పొందజాలని హృదయముల కింకొక్కటియే శరణ్యము. అది భక్తిమార్గము. “కలుష దుర్దాంత పంక సంకలిత కుహర ముల జనించు మదీయాడ్రు మలిన ధార స్వామి, భవదీయ పాదదేశమున బాజీ పరమపావన జాహ్నవీ ప్రతిభగాంచు!” సంపూర్ణముగ ఈ భక్తిమార్గము నవలంబించునపుడే కృష్ణశాస్త్రిగారి “కృష్ణపక్షము” శుక్తపక్ష మై ప్రపంచమునకు వెల్లుబాటలు చూపునేమో! కాలక్రమమున ఇట్టి గ్రంథములే సారస్వత పూజా పీఠ మలంకరించి ఖ్యాతిగాంచునేమో! (కిన్నెర: సంప్పుటము 2, సంచిక 8, సెప్టెంబరు 1950) జ శకరాు ప్ర క్షి వ ///2 (0) హాం (నాథ (హన్‌

కథారచన తూలికాభూషణ్‌

'లౌలుగు సారస్వతంలో చిన్నకథ ఇంతవరకు, ఒక విశిష్టమైన స్వరూపం, ఒక ప్రత్యేకత, ఒక అందం సంతరించుకోలేదనే చెప్పాలి. అంటే తెలుగులో మంచి కథలే లేవనికాదు.

(ప్రతిజాతికీ ఒక విశిష్టత ఉంటుంది. అదే ఆజాతి సారస్వతంలో ప్రస్ఫుటం కావాలి. ,

ఎ సారస్వతంలో అయినా ఒక మంచి గేయానికి ఉన్న గౌరవం ఒక చిన్నకథకు ఉంది. ఒక మంచిగేయం రచించడం ఎంతకష్టమో ఒక చిన్న కథ రచించడం కూడా అంతే కష్టం.

అయితే చిన్నకథ అంటే ఏమిటి అనేప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చిన్న కథ ఒక సంఘటన కావచ్చు; ఒకవ్యక్తి మనస్తత్వ పరిణామం కావచ్చు; ఒక సుదీర్ణ మైన ఇతివృత్తమే కావచ్చు. చిన్నకథలో కేవలం ఒకే ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తక్కువమంది వ్యక్తులతో, తక్కువ సంఘటనలతో అది కథ కావాలి. అంతేకాక అది స్వయం సంపూర్ణం కావాలి. అంటే కథకు ఆధారంగా తీసుకున్న సంపుటనలతో, వ్యక్తులతో చెప్పు దలచుకున్న దానిని సంపూర్ణంగా చెప్పగలిగిఉండాలి.

కథ అయినా, కారుణ్య మైనా, ఏ సాహిత్యఖండ మైనా పాఠకునికి హృదయంగమంగా ఉండేటట్లు చేయాలి. దానిని చెప్పే పద్ధతి అందంగావుండాలి. అదొక కళాఖండం కావాలి. పందిరి మల్షీకార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

1452 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము “అనగా అనగా వొక రాజుండేవాడు.” అని ప్రారంభించగానే చిన్న పిల్లలు చెవులు రిక్కించి వింటారు. ఆ వాక్యం వారి హృదయాలమీద వెంటనే హత్తుకుంటుంది. చిన్నకథ 1పారంభించడంలో మొదటి వాక్యంతోనే పాఠకుడు కథలో ఐక్యం అయ్యేట్లు చేయాలి. కథ కొక [కమపరిణామము, అంతము ఉండాలి. ఇతర సారస్వతాలలో వలెనే తెలుగులో కూడా చిన్న కథ వొక [కమపరిణామం పొందుతోంది.

పూర్వం తెలుగులో చిన్న కథలే లేవంటే ఆశ్చర్యపడవలసిన పనేమీలేదు.

ప్రప్రథమంగా తెలుగులో చిన్న కథ రచించడం (ప్రారంభించినది “కన్యాశుల్కం” నాటకం రచించిన గురజాడ అప్పారావుగారు.

మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి నరసింహశాస్తి9, శ్రీపాద సుబహ్మణ్యశాస్తి9, తల్లావర్సుల శివశంకరశాస్తి9, ఇంకా తదితరులు చిన్న కథ కొక నూతన సౌందర్యం కల్పించారు. వారి యుగంలోనే చిన్నకథ మొదటి పర్యాయం అభివృద్ధి చెందింది.

ఆ రచయిత లందరూ నాటి సామాజిక జీవితంలోని సమస్యలనే ఆధారంగా చేసుకుని చిన్నకథలు రచించారు. వారానాటి పరిస్థితులను “తప్పని సరివిగా తీసుకున్నారు. వాటిలోని లోపాలను చూపించి, హృదయ పరివర్తనం కలిగించడానికి ప్రయత్నించినవారు కొందరు. కేవలం దాంపత్యజీవితంలోని సాబగులను, ప్రణయ కలహాలను సున్నితమైన మధురహాస్యంతో మేళవించి మన కందించడంతో తృప్తి చెందాడు మునిమాణిక్యం.

అడవి బాపిరాజుగారివలె చరిత్రాత్మకమైన ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని చిన్న కథలు రచించినవారున్నారు.

చిన్నపిల్లల కథలు రచించడంలో విశేషమైన ప్రజ్ఞ చూపినది చింతా దీక్షితులు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని అవగతం చేసుకొని, వారి అభివృద్ధికి దోహదమిచ్చే చిన్న కథలకు అత్యం౦తమైన విలువ ఉన్నది. మన దురదృష్టవశాత్తు చింతా దీక్షితులుగారు రచించినవి తప్ప చెప్పుకొనదగిన చిన్న పిల్లల కథలు తెలుగులో లేనేలేవు.

కథారచన తూలికాభూషణ్‌ 1453

కథాసాహిత్యంలో చలం ప్రవేశంతో ఒక రుంరూమారుతం లేచింది. నాటి వరకు హేయంగా, పాపంగా, పశు ప్రవృత్తిగా పరిగణింపబడుతూ వచ్చిన కామాన్నే కథలలో చితించడానికి పూనుకున్నాడు చలం. చలం రచనలు నాటి సామాజిక పరిస్థితులపై తిరుగుబాటు. తనకు సమస్యలుగా గోచరించిన పరిస్థితుల్నపై ఆయన మహా త్మీవమైన పోరాటం నడిపాడు.

మానవ జీవితంలో కేవలం సుఖంకాని, కేవలం దుఃఖంకాని కరడుగట్టి ఉండదు. వాస్తవికతలో విభ్రాంతి ఏ విధంగా మిళితమైఉందో అదేవిధంగా సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము అంతర్గర్భితమై ఉన్నాయి. రచయిత అయినవాడు సామాజిక పరిస్థితులను సమంగా అర్థం చేసుకొనడానికి (పప్రయత్నించవలసినదే కాని, తనకు కావలసిన ఏ ఒక్క భాగాన్నో చూచి, మిగిలినదంతా తన కవసరంలేనిదని తలచరాదు. అదే చలం రచనలలోని లోపం, గద్య రచనలో చలం సిద్ధహస్తుడు.

చలాన్ని అనుకరిస్తూ కథలు రచిస్తున్నవారు నేడు లేకపోలేదు. కాని వారి రచనలిలో చలం పోకడలు వినా మరేమీ లేదు.

ఆ తరువాత కథా సాహిత్యంలో ప్రవేశించిన రచయితలు చాలా మందే ఉన్నారు.

ఉదాహారణకు కొడవగంటి కుటుంబరావు, గోపీచంద్‌లను తీసుకొనవచ్చును. ఒక తరగతికి చందిన (ప్రజల జీవిత పరిస్థితులను పరిశీలించి, ఈనాడా తరగతికి చెందినవారు ఎడుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాడు కొడవటిగంటి. గోపీచంద్‌ రచనలలో సమగ్రతలేదని చెప్పాలి.

జీవితం నేడొక తిన్నని మార్గంలో నడవడం లేడు. సిద్ధాంతాల సంఘర్షణ, మానవత్వం అడుగంటడం, వైతిక పతనం, దారిద్య్యం సామాజిక వ్యవస్థా విచ్చన్నానికి కారణమయ్యాయి.

ఎ సిద్ధాంతానికి, తరగతికి చెందిన రచయితలయినా కాంక్షించేది విశ్వ మానవకళ్యాణము, సాభ్రాతృత్వాలే.".మార్గాలుమాత్రం భిన్నించవచ్చు.

సామాజక జీవితం పూర్తిగా పతనమై అధోోగతికి పోయిన ఈ స్ధితిలో ఇప్పటి విలువల, పరిబ్బతుల్నప ఈ పరిణాషూనికి కారణభూతమైన వాట్ళిపె తిరుగుబాటు తప్పక రావాలి.

1456 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శీ; సాహిత్యము సమాజ సంఘర్షణలు, రాజ్యాంగ విప్ణవములు, యుద్ధం, క్షామం, ఆవేదన - అనుక్షణమూ మార్చు.

ఇటువంటి ప్రపంచ పరిస్థితులను గురించి మనదేశం పూర్తిగా తప్పించుకోడానికి సాధ్యం కాలెదు. పరిపాలనా స్వాతంత్య్యం లభించింది నిజమే గాని దానితోబాటు సర్వజన సౌఖ్యం రాలెదు, సర్వజన సమ్మతమైన జాతీయ జీవితం కుడుటబడలేదు. పరస్పర సామరస్యము వ్యాపింపలేదు. స్నేహముకన్న వైషమ్యమే హచ్చుగా నున్నది. తృప్తికన్న కోరిక మెండుగా నున్నది. విశ్వాసంకన్న సందేహం ఎక్కువగా నున్నది. ”

ఈ వాతావరణంలో ఆవిష్కారం పొందే సాహిత్యంలో ఈ పరిస్థితుల ఛాయలు కనబడక మానవు. ఇటీవలి తెలుగు సాహిత్యం పరిశీలిస్తే అక్కడక్కడ అట్టి జాడలు పొడగట్టుచున్నవి. కానీ, మొదటి తరగతికి చెందదగిన (గ్రంథాలు.కావ్యాలు ఎక్కువగా కనబడవు.

సాధారణంగా పాశ్చాత్య భాషలలో సమకాలీన జీవితాన్ని చిత్రించడానికి నవల, నాటకం, కథ ఎక్కువగా అవకాశం ఇస్తవి. అందులో ముఖ్యంగా నవల. (గ్రంథ విస్తర కారణమున నవలలో పరిస్టితులు, భావాలు, ఆశయాలు, అన్నీ విపులంగా వర్ణించడానికి స్థలం ఉంటుంది. ఆర్థిక నైతిక రాజకీయ సమస్యలు సాంఘిక జీవనంలో ఏవిధంగా ఎదురవుతవో, ఆ చిక్కులు ఒక్కొక్కరు ఎలా విడతీయడానికి 'ప్రయత్నిస్తారో, సంకల్పానిక్రీ నిర్వహణకూ ఎంత తారతమ్యం ఉంటుందో - అన్నీ ప్రదర్శించడానికి వీలుంటుంది. కాని ఇటీవల తెలుగు నవలలు సంఘ జీవితానికి సంబంధిచినవి వేలు మడచి లెక్కించడానికైనా లేవు.

నాటకాల సంఖ్యకూడా చాలా తక్కువేగాని సామాన్య(పప్రజను ఆకర్షించగల శక్తి నాటకాలకి ఎక్కువగా ఉండుటచే గాబోలు ఈ మధ్య కొన్ని నాటకాల్లో వర్తమాన సాంఘిక జీవితఛాయలు కనబడుచున్నవి. “ముందడుగు”. “మా భూమి”, “ఎన్‌.జి.ఓ, “ఇదా ప్రపంచంి మొదలైనవి నిస్సందేహంగా ఈనాటివే అనిపిస్తవి. ఇవి ముఖ్యంగా ఆర్థిక సమస్యలను నిరూపించేవి. ఇటువంటి నాటకాల్లో సాహిత్యంకన్న ప్రచారం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. కేపలం ప్రచారం కోసరం వాసింది సాహిత్యంలో మె మెట్టుకు చేరదు. సాహిత్యంలో ప్రచారం కొంత ఉండవచ్చు గాని అది

సాహిత్య సింహావలోకనము పి.వి. రాజమన్నార్‌ 1457 సూక్ష్మంగా, వ్యంగ్యంగా ధ్వనిస్తూ ఉండాలి. అలా వ్రాయగలవాళ్లు మనలో ఉన్నారని నా నమ్మకం.

ఇంకొక్కమాట. ఇటీవల సాంఘిక నాటకాల్లో వాస్తవికత అనే పేరుతో ఉత్పేేక్త ఎక్కువగా నిండి ఉంటూవుంది. అర్థాలంకారాల్లో ఉత్పే9క్ష చాలా సులభమైనది. ఉత్వేంక్ష మొదట మొదట ఆకర్షణీయంగానే ఉంటుంది గాని శీఘ్రంగా నీరసమైపోతుంది. ఎప్పుడైనా ఒకప్పుడు రక్తం, అగ్నిజ్వాల అంటే మనసు కదులుతుందిగాని ప్రతి పుటలోనూ రక్తం ప్రవహిస్తూవుంటే, అగ్ని దహించివేస్తూ వుంటే సామాన్య మైపోతుంది. షేక్‌స్పెయరు విషాదాంత నాటకాలకును ఆ కాలంనాటి ఇతర నాటకాలకును భేదం ఇందులోనే.

నవలలు నాటకాలకన్నా చిన్న కథలు, ఏకాంకాలే ఎక్కువగా 'ప్రచురింపబడుతున్నవి. ఇందుకు కారణాలు రెండు. నవల చదవడానికి కొంతకాలం పడుతుంది. [ప్రస్తుత పరిస్థితుల్లో అంతకాలం వినియోగింపడానికి అనేకులకు అవకాశం లేదు. ఆసక్తీ లేదు. జీవితం వెయ్యి కార్యాలతో కిక్కిరిసి పోతున్నట్లు కనిపిస్తుంది. ఎ ఒక్క విషయంమీదా కూడా మనసు నిల్చడానికి శక్తి లేకుండా ఉంది. చిన్న కథ అంటే పది ఇరవై నిమిషాల్లో చదివి పారవేయవచ్చును. అలాగే పెద్ద నాటకాలు చూడడానికి, చదవడానికి ఓపికలేదు. ఇది ఒక కారణం. రెండవ కారణం రచయితలకు ప్రచురణ సౌకర్యము లేకపోవడం. పెద్ద నవల వ్రాసి (గ్రంథకర్త స్వయంగా అచ్చు వేయించడానికి కష్టసాధ్య మవుతుంది. పారితోషికం ఇచ్చినా ఇవ్వకపోయినా అచ్చు ఖర్చులు భరించి అయినా ప్రకటించే (పప్రచురణాలయాలు బొత్తుగా లేవు. నాటకం వాస్తే ప్రదర్శించేవాళ్లు ఎవరు? చిన్న చిన్న కృతులైతే పత్రికల్లో పడవచ్చును. ఇదీ రెండవ కారణం.

ఈ మధ్య ప్రత్యేక గ్రంథాలకన్నా పత్రికలు అధికంగా వెలువడుతున్నవి. ధర స్వల్బం. అనేకులు కొనడానికి వీలుగా ఉంటుంది. వివిధ విషయాలతో నింప వచ్చును. భిన్న భిన్న రుచులకు నచ్చే రీతిగా నడప వచ్చును. అన్నిటికన్నా ముఖ్యం తొందరగా చదివి పారవేయవచ్చును. కాలక్షేపానికి సరిపోతుంది.

ఈ పత్రికల్లో సాధారణంగా బరువైన వ్యాసాలకు చోటులేదు. అంతా తేలికగా ఉంటుంది. అన్నీ చిన్న చిన్నవే ఉంటవి. సిగరెట్టు కాల్చినట్లు కొన్ని నిమిషాల్లో

  1. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ముగించవచ్చును. అయితే కొంచెం మజాగా ఉంటవి తత్కాలానికి. అయిపోగానే సిగరట్టు ముక్క పారవేసినట్లే పారవేయ వచ్చును. .

కేవలం వినోదార్థం ఒక కొన్ని పత్రికలు ఉండరాదని నేననను. కాని మన సాహిత్యానికి ఇవే శరణ్యములై ఉండడం చింతనీయము. ధరలో చవుకదనము తప్పుకాదు. ఆ చవుకదనము వాజ్బయములో వ్యాపిస్తే మాత్రమ ప్రమాదమే. ఇటీవల కొన్ని పత్రికలలో ప్రచురింపబడే కథలలో, నాటికలలో ఉత్తమ సాహిత్యలక్షణం నానాటికి తగ్గిపోతూ ఉన్నట్లు నాకు తోచినది. నూటిలో తొంఫఖై తొమ్మిదింటికి శాశ్వతమైన విలువ పూర్తిగా లేదనుకొంటాను. చిన్న కథగాని ఏకాంక నాటికగాని బాగా ఉండాలంటే జీవితానుభవం మీద ఆధారపడి ఉండవలెను. నిశితమైన భావనాశక్తి, సజీవమైన భాష ఆవశ్యకములు. ఇవన్నీ ఇప్పటి కథల్లో నాటికల్లో కనపడవు - ఎక్కడో తప్ప. వీటిలో ప్రాముఖ్యత సెక్సుకే. ఒక్కొక్కప్పుడు చాలా హీనంగా చిత్రింపబడుతూ ఉన్నది. గుడిపాటి వంకటచలంలాగ నిష్కల్మషంగా సెక్సు కథలు వ్రాస్తే గొప్ప సాహిత్యం కావచ్చుకాని చలంగారి వ్రాతలు చూచి ఇతరులు పులిని చూచి నక్క వాతలువేసుకున్నట్టు వెర్రిగా వ్రాస్తే అసహ్యంగా ఉంటుంది.

కవిత్వం గురించిన నా మాటలు ఆఖరికి ఉంచాను. నవలలకు, నాటకాలకే అవకాశం లేనప్పుడు మహాకావ్యాలు ఎక్కడనుంచి వస్తవి? ఇటీవలి కవిత్వమంతా ఖండకావ్యాలలోనే. రెండు మార్పులు ముఖ్యంగా కనుపిస్తున్నవి.

పాతప్రంబంధాల్లో సామాన్యజనుల జీవితం లేదనే చెప్పవచ్చును. ఎంతసేపూ రాజులూ, రాజకుమార్తెలూ, గంధర్వులూ, అప్సురసలూ, ఆ తరువాత ఆధునిక వాజ్బయంలో కొందరు కవులు హాలికుల జీవితం, కార్మికుల బాధలు కవిత్వంలోకి తీసుకొని వచ్చారు. అప్పటి కవి దృక్పథం జాలి, అభిమానం, సానుభూతితో సరిపోయింది. రామిరెడ్డి కృషీవలుడు చూడండి.

ఫలముల్‌ మెక్కెడివారు తతృలరసాస్వాద [క్రియాలోలురై

పలుమా అ మ్మధురత్వమున్నుతుల సంభావింతురేగాని త

తృల హేతు క్రమ వృక్షముం దలపరెవ్వా రైనట్లీరమా

కలితుల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుం జూతురే

సాహిత్య సింహావలోకనము హ్‌ివి. రాజమన్నార్‌ 1459

అయినా "అనుదిన మెట్లు కష్టపడనావిధి వ్రాసె నటంచు నీమదింబనవకు, కర్షకుండ!” అని అంటాడు కవి. ఇటీవల కవిత్వంలో కవి దృక్పథం మారింది. అనిసెట్టి గీతం వినండి:

లేవరా ! లేవరా!

కూడులేని నీడలేని సోదరా!

లోకపు సిరిసంపదలకు

మనకూ హక్కుందిరా.

(శ్రామికుల శిరస్సులతో

బంతులాడు పాలకులను

ప్రగతి చక్రఘట్టనతో

సంహరించవలెనురా

లేవరా! లేవరా!

నీడలేని సోదరా

మతంతాగి నగరాల్‌ నర

రక్తంలో నాట్యమాడి

సడలిన మన పల్లబడుగు

నడుము విరగ [దొక్కెనురా

లేవరా! లేవరా!

కూడులేని నీడలేని సోదరా!

లోకపు సౌందర్యానికి

మనకూ హక్కుందిరా.

ఎవరు కాదనగలరు? కాని ఈ ప్రచారమేనా కవిత్వానికి పరమావధి అనే సందేహం నాకు కలుగుతున్నది.

ఇంకొకమార్పు ఎమిటంటే, ఇదివరకు శృంగారం కవిత్వానికి జీవగ్మరగా ఉండేది. ఇప్పుడు వెనకబడ్డది. “లోకముతో మనకేటికి లోలాక్షి రా పోడము” అనే ధోరణి అదృశ్య మైపోతూవుంది. దానితోపాటు మెత్తదనము, తియ్యదనము తగ్గిపోతూవుండి. కఠినత్వం, కర్కశత్వం ఎక్కువవృతూంది. నవకవనానికి ఏమి కావాలో శ్రీశ్రీ చెప్పెంది శిరసావహిస్తున్నారు యువకవలు.

1460 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సిందూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎవరని జండా రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్‌ నవకవనానికి. ఇంతవరకు అనుసరిస్తున్నారు - సరే. కాని, శ్రీశ్రీ ఇంకా ఏమో ఇప్పాడు. ఆ విషయం మరచిపోతున్నారేమో! ఏమిటది అంటారా - కదలేదీ కదలించేదీ మారేదీ మార్చించేదీ పాడేద్‌ పాడించేదీ పెనునిద్దుర వదిలిం చేదీ పరిపూర్ణపు (బతుకిచ్చేదీ కావాలోయ్‌ నవకవనానికి పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా ఏదీ అలాంటి కవనం?

  • ఆలిండియా రేడియో సౌజన్యంతో (కిన్నెరః సంపుటము 2, సంచిక 11, డిశంబరు 1950) భు టీల ధు స గ (న్య "ర్త థ్‌ [ తి చ్నైల్లకీ 'పుళ్వాళ

మన సాహిత్య స ౦స్టలు బులుసు వేంకట రమణయ్య

(

య విషయంలోనైనా పరిశోధనలు సాగించి అపూర్వ విషయాలు సాధించడానికి (ప్రత్యేక వ్యక్తులకంటె, నలుగురూ కలిసి పనిచేసే సంస్థలు ఎక్కువ (పయోజనకారు లని అందరూ అంగీకరించిన విషయమే! ప్రత్యేక వ్యక్తులు సమర్థులు ఉండవచ్చు. అయినా అలాంటి వారందరూ కలిసి, చర్చిస్తే - నలుగురి ఆలోచనలకూ ఫలితంగా సులభంగా కొన్ని మహద్విషయాలు తేలుతాయి. అట్టి సంస్థలకూ, వాటిలో చేరిన సభ్యులకూ అపారమైన గౌరవం కలుగుతుంది.వి దేశాల్లో వున్న రాయల్‌ సామెటీ, జగ్రాఫెకల్‌ సొసైటీ మొదలైనవన్నీ యిల్లాంటివే! వాటిల్లో వుండే సభ్యులు కొమ్ములు తిరిగిన పండితులు; మహామేధావులకి తప్ప, అందులో సభ్యులుగా జేరడం సాధ్యంకాదు! గత శతాబ్దిలో మనదేశంలో కూడా రాయల్‌ సొసైటీ శాఖలు "రాయల్‌ ఎషియాటిక్‌ సొసైటీ"లనే పేరుతో వెలసినవి. అందులో మహామేధాపులు సభ్యులుగా ఉంలజేవారు. ఆ సభ్యత్వానికి విశ్వవిద్యాలయాలిచ్చే పెద్ద పెద్ద బిరుదులకంటె ఎక్కువ గౌరవం! ఎం.ఆర్‌.ఎ.ఎస్‌. (మెంబర్‌ ఆఫ్‌ రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీ అని సభ్యులు తమపేరు చివర చేర్చుకోవడం గొప్ప గౌరవంగా భావించేవారు! వారు వ్రాసివున్న వ్యాసాలను బట్టి చూస్తే, వారి అపూర్వ పరిశోధనలు స్పష్టమౌతాయి.

ఈ విధంగా శాస్త్రీయ విషయాల్లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి! కాని సాహిత్య విషయంలో ఏర్పడిన సంఘాలూ తక్కువ; అవి చేసిన పనీ తక్కుప. అందులోనూ ఆంధ్ర సాహెత్యంలో మనవారి కృషె తక్కిన వారి కృషితో పోల్చ చూస్తే మిక్కిలి తక్కువ అని చెప్పక తప్పదు. పందిరి మర్త్‌కార్టునరావు శతజయంతి. సంప్పబము 4: సాహిత్యము

1462 పందిరి మల్లికార్జునరాపు శతజయంతి సంపుటము 4: సౌహిత్యము

బెత్తరాహుల సంగతి విడిచిపెట్టి మన దాక్షిణాత్యుల సంగతినే తీసుకుందాం. దాక్షిణాత్యు లందరిలోనూ తెలుగువారే చాలా వెనకబడి వున్నారని తలుస్తూనే వృంది. తమిళ నిఫుంటువు (౭౧|| ఓ౬జ4ం౦ంగ), తెలుగు నిఫఘుంటువయిన సూర్యరాయాంధ్ర నిఘంటువు ఒక్క మారే (ప్రారంభ మయాయి. తమిళ నిఘంటువు దశాబ్దుల క్రిందనే పూర్తయింది. తెలుగు నిఘంటువు ఇప్పటికి సగం అచ్చయింది. మహారాష్ట్ర విజ్ఞానసర్వస్వంతోపాటు శ్రీ కె.వి. లక్ష్మణరావుగారి సంకల్పఫలితంగా ఆంధ విజ్ఞానసర్వస్వం (ప్రారంభింపబడి మూడు సంపుటాలతో ఆ పని నిలిచిపోయింది. శ్రీ నాగేశ్వరరావు పంతులుగారి బెదార్యంవల్ల ఆ ముద్రితభాగమే పునస్సంస్కరణం పొంది రెండు సంపుటాలుగా వెలువడి, అంతతో ఆగిపోయింది. మళ్ళీ - తమిళ విజ్ఞానసర్వస్వం అడుగుజాడల్లో ప్రభుత్వంవారి సహాయంతో తెలుగు విజ్ఞానసర్యస్వ్యం ఓనమాలు ప్రారంభించింది. అయినా దీన్ని వెలయించడానికి పూనుకొన్న తెలుగుభాషాసమితి ప్రశంసించ తగ్గది.

అదేమి విచ్శితమో గాని, మన దేశంలో మొదట్నుంచీ ఏ కార్యమన్నా సంఘం కంటే, ప్రత్యేక వ్యక్తులు తలపెట్టితేనే నెరవేరినట్లూ, సంఘంమీద ఆధారపడినవి నీళ్ళు కారుతున్నట్లూ కనబడుతుంది. నలుగురిలో పడ్డ పాము చావకుండా తప్పించుకు పోతుందన్న సామెతని మనం అందరమూ ఎరుగుదుము. దీనికి కారణం యేమిటంటే - సంఘంలో చేరిన వ్యక్తులు ఆయా కార్యాలలో తమకే కాకుండా తతిమ్మావారికి కూడా బాధ్యత వుందని అలస భావం వహించడం కాని, “నాకేం పోయింది?” అనే తత్వాన్ని అవలంబించిన వారుగాని - “చెయ్యకపోతే మనని అడిగేవాడెవడు?” అనే ధీమా కలవారు గాని - అయి ఉండడమే!

ఒకవేళ ఏ సంస్థ అయినా పని చేసింది - లేదా చేస్తున్నది అని అంటే దానికి “నా బొందో”్‌ అని తన జీవితాన్ని దానికోసం ధారపోసే వ్యక్తి ఉండడమే కారణమని మనం నిశ్చయించాలి. ఈ విషయాలన్నీ మన తెలుగు సాహిత్యసంఘాల దృష్టితో చూస్తే యథార్థాలే అని అందరూ అంగీకరించవలసి వుంటుంది. పాశ్చాత్యు డైన (బౌను పండితుడు కొద్దిమంది పండితుల సాయం పొందినా కూడా తన ప్రత్యేక కృషివల్లనే అపూర్వ [గ్రంథాల పరిష్కరణ జరిపించిన్నీ తాను వ్యాకరణాదులనూ, గొప్ప నిఘంటువునూ రచియించి ఆంధ్రభాషకు మహోపకారం చేశాడు. చిన్నయసూరీ, సీతారామాచార్యులు నిఘంటువులనూ వ్యాకృతులనూ - తాము జీవికకోసం ఉద్యోగం చేస్తూ కూడా తయారుచేశారు. శ్రీ వీరేశలింగంగారు తానొక్కడే బహుముఖాల దేశసేవ చేస్తూ అపారంగా భాషావాజ్బయసేవ చేయగలిగినారు.

మన సాహిత్య సంస్టలు. బులును వేంకట రమణయ్య 14563

ఇక కొన్ని సంస్థలు స్థాపించబడినా, వాటికి (ప్రత్యేకవ్య క్తే జీవితం ధారపోయడం చేత ఆ వ్యక్తి అస్తమించడంతోనే ఆ సంస్థలు నీళ్లు కారడం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. విజ్ఞానచంద్రిక మొదట అమూల్య (గ్రంథాలను వెలయించడానికి కారణం శ్రీ కొమ్మరాజు లక్ష్మణరావు పంతులుగారు దానికి నిర్వాహకు లగుటయీ. ఆయన తమ [గంథమాలలో ప్రకటితాలయిన చాలా [గంథాలని - ఇతరుల రచనలని తీర్చిదిద్ది ఆ పిదపనే ప్రకటించేవారు. అత్యంత కష్టసాధ్య మై వ్యయప్రయాసలకు లోనైన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించి తమ జీవితాంతమూ నడపారు. ఆయన కీర్తిశేషులు కాగా విజ్ఞాన సర్వస్వం నిలిచిపోయింది. విజ్ఞానచందిక నీళ్ళు కారింది.

ఆంధ్ర సాహిత్య పరిషత్తునకూ, స్తీ సూర్యరాయాంధధ నిఘంటువునకూ (ప్రధాన కారణభూతులూ, ప్రాచ్యసాహిత్యానికీ, వాజ్బ్ఞయ శాసన పరిశోధనానికీ తమ జీవితము ధారపోసినవారూ అయిన శ్రీ జయంతి రామయ్య పంతులుగారు వానితో సంబంధం పెట్టుకొని వున్నన్నాళూ ఎలా పని జరిగినదీ, ఇప్పుడే సితిలో వున్నదీ వాజ్బయపరిచయం కలవారికందరికీ తెలియును.

ఇవి కాకుండా మరికొన్ని సాహిత్యసంస్థలూ, పరిశోధన సంస్థలూ కొన్ని ఎర్చుడి ఉన్నాయి.

శ్రీ బ్యురా శేషగిరిరావుగారు విజయనగరంలో “ఆంధ్రభారతీతీర్థ" సంస్థను నెలకొల్పి కొన్నాళ్ళు నడిపించారు. దానికి * ఆంధ్ర రిసెర్చి యూనివర్సిటీ" అంటూ పేరు పెట్టారు. భాషా వాజ్ఞయాల్లో గొప్ప పరిశోధనలు జరిపించాలని వారి ఉద్దేశం! ఈ యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడ్డానికి ఎన్నో ఏండ్లు ముందుగా ఏర్పడింది. నా చిన్నతనంలో ఆ యూనివర్సిటీ ఎక్కడుందో అని విజయనగరం నాలుగు మూలలా వెతకినా కనబడలేదు. తర్వాత, తర్వాత దాని ఆధ్వర్యాన ఒక రీడింగు రూము కొంతకాలం నడిచింది.

శ్రీ శేషగిరిరావుగారు జీవించి ఉన్నంత కాలమూ - ఏడాదికొకసారో, రెండేండ్ల కొకమారో సారస్వత సభలంటూ జరుపుతూ వచ్చీవారు. అందులో కవితావినోదమూ, (గంథపఠనమూ, నాటక ప్రదర్శనమూ అన్నింటి కంటే ప్రధానంగా బిరుదప్రదానమూ జరుగుతూ ఉండేవి. “కవితావినోద, వివుర్శక్యాగేసర, మహోపాధ్యాయ " మొదలయిన బిరుదులు కవులకూ, విమర్శకులకూ, పండితాాగేసరులకూ ఇయశ్రిబడుతూ ఉండేవి.

1464 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఈ బిరుదపదానంలో ఈ సంస్థకు సోదర సంస్ధ అయిన ఆంధ్రసారస్వత పరిషత్తు తోడుపడుతూ ఉండేది - ఎవరెవరికి ఏ యే బిరుదాలు ఇయ్యడం బాగుంటుందా అని సలహాలు యిస్తూ ఆ సంస్థతరపున శ్రీ కోన వేంకట్రాయశర్మగారు వచ్చేవారు. ఈ సంస్థ కార్యస్థానం నరసరావుపేటలో అని అనుకుంటాను. ఏమంటే

  • ఒకప్పుడు శ్రీ శర్మగారు ఆంధ సారస్వతపరిషత్పథత్రికను (ప్రకటింప ప్రారంభించారు, నరసరావుపేటనుండి. ఏ కారణంచేతో ఆ పత్రిక ఒకటి - రెండు సంచికలకంటే ఎక్కువ వెలువడినట్లు కనబడలేదు.

॥ భారతీతీర్థ * ఆగిపోగానే ఈ పరిషత్తు “త్రిలింగవిద్యాపీఠం” మున్నగు వాటితో కలిసి, బిరుదపదానంలో ఆ యా సంస్థలకు చేదోడు, వాదోడుగా వుంటున్నది. ఇంతకంటే యీ సంస్థ నెరవేర్చిన ఘనకార్యం వున్నట్లు ఆలియలేదు. ఒకవేళ ఉంటే ఉండవచ్చునేమో! అది ఆంధ్రావనికి మాత్రం స్పష్టం కాలేదు.

ఆంధ్రసాహిత్య పరిషత్తు భాషావాజ్మయాలకు చేసిన సేవ అపూర్వ మైనది. ఎన్నో అమూల్య అపూర్వ[గ్రంథాలు ప్రకటించి, పతికమూలంగానూ, మహాసభల మూలముననూ భాషా వాజ్బ్యయపరిశోధనమునకూ, శాసనపరిశోధనకూ ఎక్కువ 'ప్రోత్సాహమిచ్చి ఎంతో సేవ జేసినది. కాని వ్యావహారికవాదుల అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా, [ప్రాచీనవాజ్మయాన్ని అణగదొక్కడ వే. ఆవాదం (పధానసిద్ధాంతమని (భాంతి పడి భాషావాజ్మయాల స్వరూపాన్ని ఎరగనివారు పరిషత్తును భాషావాజ్మయాలకి చాలా అపచారం చేసినదని వాకొనడం ఎంత సబబుగా వుందో గ్రహించండి! తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కొన్ని నవలలూ, నాటకాలు చదివి, తాము వాజ్ఞయాభఖీమానులమూ, ఉధ్ధారకులమూ అని అనుకొని, పరిషత్తు ఎప్పుడు ఎందుకోసం ఏర్పడినదో కూడా తెలియకుండా దాన్ని విమర్శింప బూనుకొన్నవారిని ఏమనవచ్చును?

ఏమైతేనేమి? యువకలోకానికి సాహిత్య పరిషత్తుమీద వైముఖ్యం కలిగింది. నవ్య సాహిత్యపరిషత్తు ఏర్పడింది. అన్ని రకాలవారూ అందులో సభ్యు లైనారు. చక్కని పాండిత్యం గల విద్వాంసులూ, రసవత్కవిత చెప్పగల కవివతంసులూ అందులో చేరారు. తదితరులూ చేరారు. సభ్యత్వం చాలా చవకగా కోరిన వారికి లభించినది.

భాషా, వాజ్బయాలని సేవించడానికి ఒక ప్రత్యేక వ్య క్తిగాని, ప్రత్యేక సంస్థగాని గుత్తకు తీసుకొనేది కాదు. అందరూ అన్ని విధాలా సేవ చెయ్యవలిసినదే! భాషా, వాజ్మ్బయాల అభ్యుదయా న్నాశించే సంస్థ లెన్ని వున్నా మంచిదే! కాని ఒక

మన సాహిత్య సంస్థలు బులును వేంకకు చమణయ్యా 1465 సంస్ధ మరొక సంస్థమీద కక్షకట్టడం ధర్మం కాదు. నవ్యసాహిత్య పరిషత్తు కేవలం వ్యవహారభాషను అభిమానించేది కాదు. పరిషత్తువారు (ప్రకటించిన [గ్రంథాలు కొన్ని శుద్ధగ్రాంథధికంలో వాసినవీ ఉన్నాయి.

నవ్యసాహిత్య పరిషత్తు ప్రధానోద్దేశాలు అందరికీ అవగాహన కావు. తోచినప్పుడు ఏడాదికో, 'రెండేళ్ళకో, అంతకు ఎక్కువ కాలానికో ఒకసారి సభ కూడుతుంది. అందులో నవకవృలు తవు గేయాలనీ, పద్యాలనీ చదివి కవితాప్రదర్శనం చేస్తారు. పఠితలు బహుశా పరిషత్సభ్యులే అయి వుంటారేమో! పరస్పరం కొనియాడుకొని సభను జయప్రదంగా ముగిస్తారు. పత్రికల్లో ప్రకటించిన సభావృత్తాంతా న్ననుసరించి నవ్యసాహిత్యపరిషత్సమావేశ కార్య[క్రమం పయి విధంగానే వుంటున్నట్లు లోకానికి తెలుస్తున్నది. ఇదే యథార్థమయితే పరిషత్తు పేరుకు తగినట్లు తన ధర్మాన్ని నిర్వ ర్తించ లేదని స్పష్టమవుతూ ఉన్నది.

ఏ విషయంలోనైనా చక్కని పరిశోధనలు జరగడానికి విశ్వవిద్యాలయాలూ, వాటికి సంబంధించిన కళాశాలలూ తగిన [పోత్సాహం ఇవ్వవలసి వుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్రభాషా, వాజ్బ్ఞయాల పరిశోధనమునకు ఇంతవరకూ అవకాశం కలిగించకపోవడం వింతగా ఉన్నది. మద్రాసు విశ్వవిద్యాలయం వారు భాషా వాజ్మయపరిశోధనలకు (ప్రత్యేక సంస్థను చాలా ఏళ్ళకిందటే ఏర్పాటు చేసివున్నా, చెప్పుకోదగిన పరిశమ జరగడం లేదని కొందరి అభిప్రాయం! విశ్వవిద్యాలయంవారు ప్రకటించిన [గ్రంథాలు కొన్ని త్మీవవిమర్శనలకు గురి అయినాయి. వాటినిబట్టి విశ్వవిద్యాలయ పరిశోధనసంస్థవారు చేసిన పరిశోధన లెక్కకు రాలేకపోయింది.

తిరుపతి దేవస్థానం కొన్ని యేళ్ళ [క్రిందట ప్రాచ్యపరిశోధన సంస్థను ఏర్పరచి భాషావాజ్బయ పరిశోధనకు తగిన [పోత్సాహం కలిగించినది. ఆ సంస్థ బాల్యావస్థలోనే వున్నా అపూర్వపరిశోధనలు జరిగాయి. ఈ విషయం ఆ సంస్థపక్షమున ప్రకటింపబడుతున్న పత్రిక వల్లనూ, ప్రకటించిన గ్రంథాలవల్లనూ ప్య క్త్రమగుచున్నది. శ్రీ వేటూరి ప్రభాకరశాస్తు్రంలుగారు అక్కడ ఆంధ్రవిభాగానికి పర్యవేక్షకులుగా వుండబట్టి ఇది సాధ్యమయింది! త్రీ శాస్త్రిగారు యీ నడుమనే డివంగతులయినారు. ఈ మీదకూడా ఆ పర్ధతిమీదనే పరిశోధనలూ, గగంథప్రకటనా జరిగించి, ఆ సంస్థ ఆ (ప్రతిష్టను నిలుపుకోగలదనీ త్రీకోరాడ రామకృష్ణ య్యుగారి పర్యవేక్షణ క్రింద కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలదనీ ఆంధ్రావని ఆశిస్తున్నది.

1466 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

మన దేశంలోని యిలాంటి సంస్థలు సరిగ్గా పనిచేసి, వాటివల్ల ప్రయోజనం కలగాలంటే అది పాశ్చాత్య దేశాల్లో ఉండే సంస్థల పద్ధతి అవలంబించాలి. అంటే

  • సంస్థ అన్ని విధాలా కొత్త విషయాలని కనిపెట్టడానికి సిద్ధపడి, ఆ విషయంలో తగిన కృషి జరపాలి.

ఎంతో పరిశీలించి అర్హత వుండేవాళ్ళనే అందులో సభ్యులుగా చేర్చుకోవాలి. కాని మొగమోటపడి గాని, ధనవంతులని ఆలోచించి కాని అర్హత లేనివారికి అందులో సభ్యత్వం వుండకూడదు.

ప్రతీ సభ్యుడూ తాను చేసిన పరిశోధననూ, చేయబోయే పరిశోధననూ సంస్థకు ఆలియజెయ్యాలి.

పదిహేనురోజులకి ఒకసారి, లేదా నెలకి ఒకసారి సమావేశమయి వారివారి పరిశోధనల సారాంశాన్ని వ్యాసరూపంగా పఠింపచేసి, ఆ విషయం చర్చిండానికి అందరికీ అవకాశం యివ్వాలి,

ఫలానా విషయం ఫలానా తేదీని చర్చించబడుతుందని ముందుగా సభ్యు లందరికీ తలియపరచాలి.

జరిగే చర్చలు భాషాభేదంతోగాని, మరి యే యితర భేదంతోగాని కూడి ఉండక నిష్పాక్షికంగా ఉండాలి.

చర్చలు ముగిసిన తర్వాత సిద్ధాంతాన్ని తమ పత్రికమూలంగా లోకానికి వెల్లడించాలి.

సంస్థ ఈ పద్ధతిలో నడవడానికి ధనం చాలా అవసరం కాబట్టి సంస్థలోని కార్యవర్గం వారు తమ ఆశయాలను లోకానికి విన్నవిస్తూ తమకు సాయపడాలని ప్రార్ధించి నిధిని వసూలు చెయ్యాలి.

ఇట్టి సంస్థకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయం చెయ్యాలి.

ఇలా జరగనప్పుడు ఏ సంస్థా పని చెయ్యలేదు. అందులోనూ ఆంధ్రభాషా, వాజ్మయాలకు సంబంధించిన సంస్థ బొత్తిగా పని చెయ్యలేదు. (కిన్నెర: సంప్పుటము 3, సంచిక 1, జనవరి 1951)

నా స లె ఏంట్రా!

శ్రీ ప్రభాకరశాస్తుంలుగారు (నాయనుభవములో) బులుసు వేంకటరమణయ్య

క్రీరకాయులు పూజ్యత్తీ వేటూరి ప్రభాకర శాస్తు్రులుగారి యకాలమృతికి వాపోవుచు నాంధ్రలోక మీనడుమ పెక్కు విధముల తన సంతాపమును వెల్లడించినది. త్రీ శాస్తు్రులుగారి భాషా, వాజ్మయ పరిశోధనమును, ఆంధ్రవాణికొనర్చిన సేవను వే విధముల నుగ్గడించినది. నాకు శ్రీ శాస్త్రులుగారితోడి పరిచయ భాగ్య మెక్కువగ ఉండుటచే నా యనుభవమునం దెలిసికొనిన వారి యుత్తమ గుణములను, ఆదర్శ జీవితమును కొంత వజకు లోకమున కెజకపజచవలెనని దీనిని వాయ సమకట్టితిని.

శ్రీ ప్రభాకరశాస్తుంలుగారును, శ్రీ మానవల్లి రావుకృష్ణ కవిగారును ముప్పదియైదేండ్ల క్రిందటనే పెక్కు శ్రమల కోర్చి తెలుంగుదేశమున మాజుమూలల నున్న ప్రతి కుగామమునకును బోయి, ప్రాచీన తాళపత్ర గ్రంథములను పెక్కింటిని (ప్రాయ్యిపాలు కాకుండ సేకరించి, ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము నమూల్య (గ్రంథములతో నింపిరి; నింపుటయే కాదు! పెక్కు (గగంథములను బరిశోధించి వాని తత్త్వమును లోకమున కెజుకపజచిరి. శ్రీ శాస్తు్రంలుగారు తయారు చేసి ముద్రింపించిన [వాచ్యలిఖీత భాండాగార [|గంథ సూచికలన్నియు వాజ్యయమున కమూల్యాలంకారములని చెప్పవచ్చును. వీరు గంథసంపాదనకు గడంచి, అమూల్యములగు (గ్రంథములను గని పెట్టి, వానిని గ్రంథాలయముల6 జేర్చుటకుం పందిరి షుల్లికార్టువరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1468 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దఅచు సామ, దానముల నుపయోగింపవలసివచ్చెడిదంట! శ్రీ శాస్తుంలుగారి కృషియే లెనిచో ప్రాచ్య లిఖిత (గ్రంథాలయము నిట్టి యుద్దుంథములతో నింపుటకుం బ్రభుత్వమునకు నసాధ్యమే! నేండు మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము భారతదేశములోనున్న ప్రాచ్య గ్రంథాలయము లన్నింటను మిన్నయెై యున్నదన్నచో దానికి ప్రధానకారణమైనవారు శ్రీ శాస్తుంలుగారును, శ్రీ రామకృష్ణకవిగారునని చెప్పుట సాహసము కాంజాలదు.

శ్రీ శాస్త్రిగారియొక్కయు, శ్రీ, కవిగారియొక్కయు కీర్తి ప్రతిష్టలయెడ నసూయ చెందిన కొందటు వీరు తాము సేకరించిన (గ్రంథములలో నుత్తమములను దాంచివైచి, వానింగూర్చి పరిశోధించి విమర్శనలు వ్రాసి పేరు పెంపులు పొందుచున్నారని దుష్ప్ర్రచార మొనర్చిరి. కాలకమమున యథార్థ స్థెతి వారికే బోధపడెను. శ్రీ శాస్త్రిగారు, కవిగారును వాసిన విమర్శనలను, చేసిన పరిశోధనమును బూర్తిగా నవగాహన చేసికొనంజాలనివారే యిట్టి ప్రచారమునకు6 గారకులగుట! ఇచట నొక సంగతిని గ్రహింపనగును. ప్రాచ్యలిఖిత గంథాలయమున నున్న కొన్ని యుత్తమ (గ్రంథములు ముద్రితము - ఇప్పటికిని గదులు విప్పక, వచ్చినవి వచ్చినట్లుగనే యున్నవన - మనవారికి గ్రంథపతనమున ఎంత యాసక్తి యున్నదియు, అట్టివా రిట్టి విమర్శనల నొనర్పనెట్లు అధికారు లైనదియు, దెలియుచునే యున్నది!

అపూర్వపరిశోధన మొనర్చిన యిట్టి మహా విద్వాంసులకు దేశ మొసంగిన ప్రతిఫల మిది! దీని నేమననగును?

ఆర్థికముగ నీ పరిశోధనము శాస్తింగారి కక్కువ యుపయోగింపలేదు. వీరు ప్రాచ్య లిఖిత పుస్తకభాండాగార పండితపదవి నుండి విరమించుసరికి వీరి జీత మే యేంబది, ఏంబదిమొదు రూప్యములో మై యుండెడిది. ఎడనెడ వీరు రాజధానీకళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా6 బని చేయుచుండిరి. అప్పుడయినను వీరికీయంబడు జీతము వృద్ధి పొందలేదు.

ఉద్యోగమును వెదకికొనుచు నేను 1933లో మద్రాసునకు వచ్చిన కొత్తలో త్రీ శాస్తుంలుగారిని తొలిసారి దర్శించితిని, అప్పుడు సాయంకాల మెదున్నర

శ్రీ ప్రభాకరశాస్తులుగారు... బులును వేంకటరమణయ్య 1469 గంట లయియుండును. శ్రీ శాస్తు్రంలుగా రప్పుడే పుస్తక భాండాగారమునుండి యింటికి వచ్చిరి. నన్ను జూచినతోడనే వాత్సల్యముతోం గూర్చుండం గోరిరి. నేను శ్రీ శాస్త్రులగారి సోదరులు (బందరు) ఇచ్చిన పరిచయపత్రమును ఆందంటబేసి యరుగుపైనున్న యొక చాపపయిం గూలంబడితిని. శ్రీ శాస్తుంలుగా రా జాబు పూర్తిగం జదివినారో, లేదో దానిని మడచి యొకచో నుంచి, కుశలపూర్వకముగ నా పరిస్థితుల నడిగి ఆలిసికొనిరి. శ్రీ శాస్త్రిగారిని జూచువజకు నా మనస్సు నిరుత్సాహపూరితమై యుండెను. ఏలయన - గంపెడాసతో పెద్ద యుపకారము జరుగునని ఒకచోటికింబోగా - “ఉద్యోగము లెక్కడ దొజకును? పొలము దున్నుకొనరాదా?” అని జవాబు వచ్చినది. అశక్తుండనగు నేను “పొలము లుండినంగదా, దున్నుకొనుటకు” అని లోలోన అనుకొని, మాజుమాట చెప్పక అచట్‌నుండి మజలితిని. ఎచటికిం బోయినను “సమయము మించి పోయిన” దను మాటయే! ఇచట నదే సమాధానము వచ్చునేమో యని నేను దిగులొందితిని. కాని శ్రీ శాస్తుంలుగారు “దిగులుపడ నక్కరలేదు; రెండు రోజులు కడచినపిదప నన్ను గలిసికొనుండు; నా కొక మార్గము తోంచుచున్నది. దానిసంగతి యప్పుడు తేలును” అని ఖైర్యము నొసంగిరి. అది మొదలు నేంటి దనుక నాకు దిగులనునది లేదుః “రేంపటి సంగతి యేమి?" అను విచారమును లేదు; శ్రీ శాస్తుంలుగారి దయార్ద్రృహృదయము నా యథ్రైర్యమును పటాపంచలు చేసినది. పిదప శ్రీ శాస్తుంలుగారు. చెప్పెనట్లుగా నేను వారిని దర్శించితిని; తత్పలితముగా శ్రీ నాస్తెంగారు నెల దినములు సెలవ "పట్టటయు, వారి స్థానమున నన్ను నియమించుటయును జరిగినది. ఆ తర్వాతంగూడ స్తీ శాస్తు9లుగారు రాజధానీ కళాశాలకుం బోవునపుడెల్ల ప్రాచ్యలిభిత పుస్తకభాండాగారమునందలి వారి స్థానము నాకు లభించుచుండెడిది!

మజి కొలంది నెలలలోనే మత్రులు శ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారి కృషవలన నాకు క్లిట్‌ హైస్కూలులో ఆంధ్రాధ్యాపక పదవి లభించినది. వెంటనే యీ వార్తను శ్రీ శాస్తుంలుగారికిం డెలుపంగా “నాయనా! చాల సంతోషము! అది మంచి పాఠశాల; నే నజుంగుడును. నేనును కొంతకాల మచట అధ్యాపకుండ నైతిని" అని పల్కిరి. పాఠశాలయండును శ్రీ శాస్త్రిగా రధిస్టెంచిన స్థానమే

1470 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము లభించినందున నాకు ఎక్కువ ఆనందము కలిగినది! “పాఠశాలలో పనిచేయుట గౌరవప్రదము కా"దను నా దురభిప్రాయమునిట్లు శ్రీ శాస్తులుగారే పోంగొట్టిరి!

శ్రీ శాస్తు్రులుగారు నిరంతరము సారస్వత సేవ యొనర్చుచున్నను, దానిపై నెక్కువ యాస్థ వారికి లేదు; ఆధ్యాత్మికచింత, యోగాభ్యాసము, మనోవశీకరణము, ఆత్మశక్తిచేం బరుల దీర్ణవ్యాధులకు6 జికిత్స, నిష్కామకర్మ - మున్నగునవియే వారి ప్రధాన లక్ష్యములు! లోకకల్యాణము కోరి, సుప్రసిద్ధవైద్యులకు నసాధ్యములగు రోగములను మానసశక్తిచేం గుదుర్చ వీరు గొప్ప పరిశ్రమ లొనర్చి, చాల వజకును గృతార్జులయిరి. అకాల మృత్యువు వాత వేసికొనకపోయినచో, శ్రీవా రింకను కృషిచేసి సర్వవిధరోగములను మనశ్శ క్తిచే కుదిర్చి యుండెడివారే! ఇయ్యెడం బ్రజలే దురదృష్టవంతులు!

నేను తఅచుగ శ్రీ శాస్తుంలుగారిని దర్శింపనేంగుచుండెడివాండను. సరిగా, ఆయన [గ్రంథాలయమునుండి యింటికి వచ్చుసమయమునకే వెళ్లెడివాండను. వారి యోగాభ్యాస మాజు గంటలకు. అప్పటికే విశాలమైన వారి యింటి యరుగుపైని, పంచలోను చాపలు పజువంబడి యుండెడివి. శ్రీ శాస్తు్రంలుగారు సరాసరిగా గదిలోనికి. బోయి, కోటు విప్పి బయటికి వచ్చి కాలుసేతులు, మొగము కడుగుకొని నేలనొక చాపపయి గూరుచుండెడివారు. వారియెదుటనే నన్ను కూర్చుండ నియమించెడివారు! లోపలి నుండి కాఫీగాని, జలముగాని ఏది వచ్చినను దానిని తీసికొనెడివారు! వారి సంగతి చూడంగా - గృహవ్యవహారములతో ఆయన కొట్టి సంబంధము లేనట్లు తోంచెడిది! ఆయన మహానగరములో వానప్రస్థజీవితమును గడపుచున్న మహాప్పురుషులని నా కర్థమైనది. వారు నివసించునది [ప్రత్యేకగృహము! విశాలమైనది. ఆ కాలములో దాని యద్జె యిరువదికి పైగా నుండును; స్వల్పవేతనముతో శ్రీ శాస్తుంలుగా రిట్టి గృహ మద్దెకుం దీసికొని, పెద్ద కుటుంబము నెట్టు పోషించుచున్నారా? యని కొత్తవారికి వింత కలుగవచ్చును. కాని వారి పరిచితులకుంగాని, త్రీ శాస్తుంలుగారికింగాని అట్టి చింత ఎప్పుడు కలుగదు. ఆ యాలోచనయే లేదు. శ్రీ శాస్తు్రంలుగా రెప్పుడును ఆ విషయమును మాటలవరుసనైనను ముచ్చటించి యొజుంగరు. వారి సంభాషణలు - నావంటివారితోసారస్వతమునుగూర్చియు దక్కినవారితో నాధ్యాత్మికములం గూర్చియు. వేజే ప్రసంగములు వారి కక్కజలేదు.

శ్రీ ప్రభాకరశాస్తు్రులుగారు.. బులును వేంకటరమణయ్య 1471

సారస్వత విషయములంగూర్చి యపుడపుడు చర్చించుచు క్రమముగా సారస్యతోపాసకులలో. గొందజి కుమార్గములను దడవ వలసి వచ్చెడిది. అపుడు త్రీ శాస్తుంలుగారు ప్రసంగము నిలిపి “నాయనా! ఏది ఎటులైనం గానిమ్ము. నా కీ సంగతి యనినం దలనొప్పి! నేను సాహెత్యపథమునుండి తొలంగితిని; నా మార్గము వేణు” అనుచుండెడివారు.

సారస్వత విషయమున శ్రీ శాస్తుులుగారి కసంతృప్తి కలుగటకుం గారణాంతరములు లేకపోలేదు. చక్కని పద్ధతిలో విమర్శన మొనర్చుటకు మార్గదర్శకులు శ్రీ శాస్తులుగారుః శాసనపరిశోధనమున వీరగ్రగణ్యులు! చక్కని కవిత్వము చెప్పువారిలో6 (బథమగణ్యులు. సంస్కృతముననే కాక, దావిడ, కర్ణాటకభాషలయందును పాండిత్యము గడించి యాయా భాషల సంప్రదాయములను బాగుగ గుర్తెజింగి వానితో జోడించి విమర్శించి తెలుంగు మెజుంగులను వెలువరించిన పండిత (పప్రకాండులు శ్రీ శాస్తుంలుగారు; ఈయన గొప్ప [గ్రంథములను సంకలన మొనర్చినారు; ఉత్తమ (గంథములకు సంపాదకు లైనారు; అనువాదము లానర్చినారు; ఖండకావ్యముల రచించినారు; కథలు వాసినారు. చరిత (గ్రంథములం6 గూర్చినారు. అమూల్యములను భాషా, వాజ్బయవిమర్శనములను వెల్లడిపజుచినారు. శ్రీ శాస్తు్రులుగా రెప్పుడు వ్యాసము వ్రాసినను, అందు క్రొత్తవిషయ ముండక తీరదు.

“భారతీ పత్రిక వెలయుటకు6 బధాన కారణము శ్రీ శాస్త్రంలుగారు! ముక్త్యాల నుండి వెలువడుచుండిన “సరస్వతీ” పత్రికకు. గారకులు శ్రీ శాస్తుంలుగారు. ఇట్లు వాజ్బయమునకు వెలకట్టరాని సేవ యొనర్చిన శాస్తుంలుగారి విలువను లోకము గుర్తించలేకపోయినది! శ్రీ శాస్తుంలుగారు రెండు సారులు కోరినప్పుడు చెన్నప్పురి వఐశ్వవిద్యాలయము వారి కుపన్యాసక పదవి నిచ్చి తన్ను గౌరవించుకొన లేకపోయినది! ఆం(డ్రవిశ్వకళాపరిషత్తు ఇట్టి యుద్దండపండితులకు పండితపదవి

  • నీయలేకపోయినది. దొరతనమువా రీయనను తమ కళాశాలలలో నాంధ్రపండితునిగా గ్రహింప లేకపోయిరి. బిరుదపదానము కేవలము వ్య క్తిగతాభిమానమ్చుపైనే ఆధారపడి యుండుటచే ఎన్నండో రావలసి యుండిన “కళాప్రపూర్ణ” బిరుదము తుద కీయనకు రాకుండనే పోయినది. ఇట్టి విద్వాంసులు వేజొక రాష్ట్రముననే

1472 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము యుండినయెడల విశ్వవిద్యాలయము లెన్ని విధములనో గౌరవించి యుండెడివి! (పజలందజును బ్రహ్మరథము పట్టి యుండెడివారు!

శ్రీ శాస్తుంలుగా రిట్టి విద్వాంసు లైనను, ఆర్థికముగ వారి స్థితిగతు లేమియు సరిగా లేకుండెడివి. దానింగూర్చి వారు తలంచుటయే లేదు. బంధువుల రాకపోకలు అతిథ్యభ్యాగతుల నాదరించుట, ఏ లోటు లేని సంసారయాత్ర అవిచ్చిన్నముగ సాగుచునే యుండినవి. ఇవి యన్నియు నప్పులమూలము జరిగెడివని నాకు శ్రీ శాస్త్రులుగారు మద్రాసు విడిచి, తిరుపతికిం బోవునప్పుడు తెలిసినది!

శ్రీ శాస్త్రిగారు సొాంతముగం గొన్ని గ్రంథములను బకటించిరి. కాని (గ్రంథకర్తలు వ్యాపారులగుటచేం గలుగునది నష్టమే కాని లాభము కాదని అందజికిని ఎజుకయేగదా! పోనీ! ఏ ప్రకటన కర్తలయినను గ్రంథముల నిత్తుమన్న - దానిపలన లాభముపొందునది ప్రకాశకులును, నష్టిననుభవించునది గ్రంథకర్తలును! ఒకప్పుడు ఒక [గ్రంథమును జక్కంగా సంస్కరించి యేంబది రూప్యముల ప్రతిఫలమున కొక ప్రసిద్ధ సంస్థకొసంగి, యా సొమ్ము రాబట్టుకొనుటకు త్త శాస్తుంలుగారు పడినపాట్లు నా కెప్పుడును మజుపునకు రావు.

ఒక్కసారి మాత్రము శ్రీ శాస్త్రులుగారు తమ యార్థికదుస్థితిని దెలిపెరి; అదియు వారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర పప్రాచ్యపరిశోధన సంస్థకు. బోవునప్పుడు! అప్పటికి శ్రీ శాస్త్రిగారు ప్రభుత్వోద్యోగమునుండి విశ్రాంతిని గైకొనిరి. శ్రీ శాస్తింగా రిట్లన్నారు - “నాయనా! ఈ యూరు వచ్చినవా రందటును వేలకొలంది సంపాదించుకొని తమ తమ యూళ్లకుం బోవుచుందురు. నే నైదాజు వేల యప్పుతో నిచటినుండి వెళ్లుచున్నాను” అని. ఇట్లు పల్కుచున్నపు డాయన కనులనుండి ఒకటి, రెండు బాష్పబిందువులు రాలినవి!

విశ్వవిద్యాలయములు గాని, ప్రభుత్వము గాని గౌరవింపనిచో వమాయె? ఆయన నమ్మిన భగవంతుండే ఆయనకు సాయపడినాండు! శ్రీవేంకటేశ్వరస్వామి కోరి ఆయనను తన సన్నిధానమునకు రప్పించు కొన్నాడు. కొలందికాలము శ్రీ శాస్తు్రులుగా రధ్యాపకత్వమును గూడ వహించి ప్రాచ్య కళాశాలలోని విద్యార్థులకు విద్యగఅపి వారిని విద్వద్య్వతంసుల నొనర్చినారు. శ్రీ శాస్తు౨లుగారి

శ్రీ ప్రభాకరశాస్తుంలుగారు.. బులును వేంకటరమణయ్య 1473 శిష్యబృందములో 'పేరు పెంపులు సంపాదింపంగల విద్వాంసులు పెక్కురు తయారయినారు. పిదప కేవలము పరిగోధనకే తమ సమయము నుపయోగించి యమూల్య[(గ్రంథములను (బకటించుచు విలువైన వ్యాసములను బకటించుచు నిర్విచారముగ - చీకుచింతలు లేక యవసానదశవజకును కాలము గడుపగలిగినారు; ఆంధ, చెన్నపురి విశ్వవిద్యాలయము లవీయనను తమ పరిశోధనసంస్థలలో నియమించినచో ఎంతో గొప్ప భాషా, వాజ్మయ పరిశోధనము జరిగి యుండెడిది!

న్రీ ప్రభాకర శాస్తుంలుగారికి భాషా, వాజ్బాయసేవయు, ఆధ్యాత్మి కవిచారము ననిన ఎంత మక్కువయో, రాజకీయములయెొడ నంత మక్కుపవయే! వా రాంధ్రపటత్రిక చదువని దినము లేదని చెప్పవచ్చును. చదువుటయే కాదు. మిత్రులగోష్టిలో రాజకీయములను గూర్చి తీవముగ6 జర్చించెడివారు! అట్టియెడ శ్రీ శాస్త్రిగారి యాశయము లెంతయు యుక్తిసహములయి యుం ెడివి! గాంధీజీ తత్త్వము నవగాహన చేసికొన్న కొలంది మందిలో శ్రీ శాస్తు్రంలుగారు ముఖ్యులనవలెను; మహాత్ముని మరణమునకు శ్రీ శాస్త్రిగారు విలపించిన రీతిని వేజెవ్వరును విలపించి యుండరని నా నమ్మకము. ఆయన యునర్చిన రేడియో ప్రసంగము వినినవారికినిి ఆ [పప్రసంగమును పత్రికలలో: జదివినవారికిని ఈ యంశము 'ఆల్లము.

శ్రీ శాస్తుులుగారి కాత్మాభిమాన మెక్కువ; తమ పనికి దేనికయినను సరే

  • ఆయన ఇంటిగడప దిగి యెజుంగరు. ఆ యా పనులు వానియంత నవి జరుగవలసినదే. ఆయన యొనర్చిన వన్నియు నిష్కామ కర్మలు! లోకవిహితములు! కావుననే ఆయన కెప్వరి లక్ష్యమును లేదు; శాస్తుంలుగారు [గంథాలయమునం బనిచేయు కడపటి దినములలో శ్రీ పి.ప.యస్‌. శాస్త్రిగారు తదధినేతమై యుండెడివారు. సుప్రసిద్ధ విద్వాంసులు మహోదారులు నగు శ్రీకుప్పుస్వామిశాస్తి గారి యనంతర మా పదవి యీ పి.పి.ఎస్‌ శాస్తెంగారికి సం[క్రమంచినది. ఈ యధికారి (గంథాలయమునకు వచ్చి నిష్కారణముగ అనాలోచితముగ వయసుమీజ్‌న పండిత (పకాండులను దూషెించుచుంజెషవాంచట. అతనికి శ్రీ శాస్తుంలుగా రనిన ప్రక్కబడురు! వీరిని మాత్రము గౌరవషమునోం జూబెడివాండు.

14/74 పందిరి మళల్లీకార్దునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కాని యది శ్రీ శాస్తింగారికి దుర్చరమైనది. పండితులను వెనుక వేసికొని అధికారి కెదురు తిరిగి బుద్ధి చెప్పెడివారు! ఆ (క్రోధము మనసులో నుంచుకొని యా మహానుభావు6 డీయనను కడపటి రోజులలో బాధింపందలంచి, వేజొకమార్గము సాధ్యము కాక సైదాపేటలోని బోధనాభ్యసన పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా నేర్పజచినాండు! దాని కప్పుడు పాశ్చాత్యుండగు డైరక్స రామోదమును జూపెను. తెలుగక్షరము నెజుంగని తెల్లదొరకు శ్రీ శాస్త్రిగారి సంగతి య మెజుక? ఎట్లయినను సెైదాపేట పంపవలెనని అధికారి పట్టుదల! వెళ్ళరాదని శ్రీ శాస్త్రిగారి పట్టుదల! తుదకు శ్రీ శాస్త్రిగారి పట్టుదలయే నెగ్గెను! ఎట్టి దుష్టునకయిన నపకారమొనర్పక సౌజన్యముతో లాలించుట శ్రీ శాస్త్రిగారి స్వభావము. కావుననే దయతలంచి శ్రీ శాస్త్రిగా రా యధికారిని విడిచిరి, ఆయన సంకల్పించినచో ఆ యధికారి పదవీచ్యుతుం డగుట కెంతో కాలము పట్టదు! శ్రీ శాస్తు్రంలుగారి పలుకుబడి యట్టిది!

త్రీ శాస్తు్రులుగారికి జాతిమత విచక్షణ లేదు. అన్ని జాతులవారిని, అన్ని మతముల వారిని వాత్సల్యముతో నాదరించెడివారు! ఆర్తుల రోగములను కుదుర్చుటకు తమ మనశ్శక్తి నంతటిని ధారపోసెడివారు;ు ఆయన సంస్కార ప్రియులు! అర్థము లేని యాచారములను త్రోసిరాజు చేయుటలో వెనుదీసెడివారు కారు. ఒకే జాతిలో అంతశ్యాఖా వివాహములు వారికి సమ్మతములు! వెలనాటి వైదికులగు తాము నియోగులతో సంబంధ బాంధవ్యములను సలిపి, తమవారి నట్టివానికిం బోత్సహించెడివారు. ఒకప్పుడు ప్రాచీనాచార పరాయణులగు నొకరు నాతో “మీ శాస్తుంలుగారు శాస్త్ర విరుద్ధముగ నియోగులతోం బొత్తు కలిపినారే!” అని ఎత్తిపొడిచి మాటలాడిరి. అంత నేను “అయ్యా! శాఖభాంతరవివాహములన్న నేమో తమరు గమనిం చితిరా? మీరనుకొన్న వెలనాండు, కోసలనాండు, ములికినాండు, వేంగినాండు మున్నగునవి శాఖలు కావు. శాఖలన వేదశాఖలు! శాఖాంతర వివాహములు కూడదనంగా బుక్షాఖవారు యజాశ్శాఖవారితో సంబంధబాంధవ్యములు చేసికొనరాదని యర్థము! ఏలయన వైదికాది కర్మల పద్ధతి బేదించును. ఇప్పుడు - వెలనాంటి వారిలోనే బుక్శాఖవారు యజుశ్శాఖవారితో

శ్రీ ప్రభాకరశాస్తులుగారు.. బులును వేంకటరమణయ్య 1475 బంధుత్వము కలుపుచున్నారు! అది నిషిద్ధము! నిజమైన శాఖభాంతరవివాహ మదియే! మనవారి పద్ధతియే శాస్త్రవిరుద్ధము. “నాండు"ల భేదమునుబట్టి శాఖలు వేజయినచో మీరు ఢిల్లీలోం గాని, లాహోరులోంగాని కలకత్తాలోంగాని యుద్యోగధర్మమున నున్న మీ బంధువులతో సంబంధము కలుపుటయు విరుద్ధమే!” అని యంటిని. ఆయన మజి సమాధానము చెప్పలేకపోయును. మూఢాచారములే సదాచారములని (భాంతిగొన్నవారికి. దప్ప, తక్కినవారికి శ్రీ శాస్తింగారి పద్ధతి శిరోధార్య మైనది!

శ్రీ శాస్తు్రంలుగారు వయసుమళ్ళన పండితులైనను పండితసహజమగు ఛాందసము వారి యడ మచ్చు కైనను లేదు. ఏ పనియొనర్చినను నియమము (ప్రకారము జరుగవలసినదే! ఎక్కడ నున్నను సాయంకాల మాజు గంటలకు (పార్థనలో నుండవలసినదే! రైలు ప్రయాణము చేయునపుడు బండి యింక పావు గంటకో, ఇరువది నిముసములకో కదలు ననంగా స్టేషనుకు వచ్చెడివారు! ఎమాతపు టాందోళనము నెజుంగరు.

గురుపాదులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్తుంలుగారు చెన్నప్పురి కెప్పుడు వచ్చినను శ్రీ ప్రభాకరశాస్తుంలుగారి యింటనే బస చేసెడివారు; వా రెచ్చటికి6 పోవలసినను నేను వెంట నుండెడివాండను! ఒకప్పుడు శ్రీ సుబ్బారాయశాస్తుంలు గారు విజయనగరమునకు6 బోందలంచి సాయంకాల మైదున్నర గంటలకు నాతో “ఈ ర్యాతి ఇంటికి. బ్రయాణము! నీవు కొంచెము ముందుగనే రావలొననిరి. అప్పుడు శ్రీ శాస్తుంలుగారును వారిప్రక్కనే యుండిరి. “బండి ఎనిమిదిన్నర గంటలకు! నే నేడున్నరకు వత్తు నంటిని. “అట్లుకాదు; ముందుగ బోవలెను, ఏడవగంట కొట్టుసరి కిచట ఉండవలె" నని శ్రీ సుబ్బరాయశాస్తుంలుగా రనంగా “సరియే” అని సెలవుతీసికొని వెళ్ళితిని. నేను సరిగా ఏడుగంటలకే హాజరైతిని. కాని మా గురువుగా రారున్నరకు నేను రానందులకు విసుగుకొనుచు "ఈ కాలములో పిన్నలు పెద్దలమాటలను లక్ష్య పెట్టరు. ఇంతవేళమైనను అతండు రాలేడు చూడండీ!” అని శాస్తు్రులుగారితో అన్నారంట! శ్రీ శాస్తుంలుగారికి నవ్వు వచ్చినద6ంట! కాని బలవంతము మీంద నాంప్పుకొని “శాస్త్రంలుగారూ! బండిఎనిమిదన్నరకు! ఎడున్నరకు బయలుదేరిన నెక్కువ! ఇంతకును మీ

1476 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము రేడుగంటలకు రమ్మంటిరి. ఇప్పు డారున్నరయే కదా యొనది! మీ శిష్యుం డేడింటికి రానిచో అతనిదే తప్పు! ఇంక అజగంట సమయ మున్నదికదా!” అని పల్కిరంట! ఈ సంగతి తర్వాత శ్రీ (ప్రభాకరశాస్తుంలుగారే తెల్పిరి. ఇట్టివాని నింక నెన్నింటినైనను వ్రాయవచ్చును. ముఖ్యముగా శ్రీ శాస్త్రులుగారు నా కొనరించిన యుపదేశమిది! “ఏపని యొనర్చినను సరే సత్యమునకు దూరము కారాదు; చెప్పందలంచినచో ఉన్నదున్నట్లు మోమోటమి లేక చెప్పవలెను, లేదా మూకీభావము వహించవలెను.” అని. శ్రీ శాస్తు్రులుగా రట్లే యొనర్ప్బెడివారు; వారి సదుపదేశములను నెఐువేర్చం గలిగినచో జన్మము సార్థకము కాంగలదేమా! క్రీర్తకాయులగు శ్రీ శాస్తుంలుగారి కీర్తి శాశ్వతముగ నుండుటకు వారింతవణకుం (బ్రకటించిన వాజ్బయము చాలును. కాని శ్రీవారు సంస్కరించి సిద్ధపఅచిన [గ్రంథములు కొన్ని యున్నవి. అయ్య వి 'పప్రకటితములైనచో ఆంధ్రులు తమకు. దామే యుపకారము చేసి కొన్నట్లగును. అట్టి భాగ్య మెవరికి. గలుగనున్నదో! (కిన్నెర: సంపుటము 3, సంచిక 3. మార్చి 1951) ఫోన? 1. అరక యా [ఘూ (టం? ॥్‌

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్న కథ పి. గణపతి శాస్తం మళ్ళ

శ్రీ శ్రీపాద సుబహ్మణ్య శాస్త్రిగారు అనేకమైన నాటికలు, నాటకాలు, నపలలు వ్రాశారు. ఖండకావ్యాలు కూడా పేరనేకంగా రచించారు. ప్రబుద్ధాంధ్రపత్రికా సంపాదకులుగా ప్రసిద్ధికక్కారు. ఇటీవలనే వాల్మీకి రామాయణం యథామూలంగా వ్యావహారికంలోకి అనువదించారు. పత్రికలలో ఎన్నో విమర్శనలు, సమీక్షలు (వాశారు. ఈనెలలో వారి షష్టి వర్ష పూర్తి కాబోతున్నది. ఇంచుమంచుగా నలభై సంవత్సరాలనుంచి శ్రీ శాస్త్రిగారు అవిరళంగా వాజ్బయ వ్యాసంగం చేస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా వారి లేఖిని నుండి అసంఖ్యాకమైన గద్యురచనలు వెలువడ్డాయి; వెలువడుతున్నాయి. అయితే శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారంటే మనకు మున్ముందుగా వారి చిన్న కథలు స్ఫురణకు వస్తాయి.

దీనికి కారణం లేకపోలేదు. శాస్త్రిగారు మిగిలిన రచనలకంటె కథలు చాలా విరివిగా వ్రాశారు. ఇంతకు పూర్వవే. వారు ఏడెనిమిది కథాసంపుటాలు (ప్రచురించారు. ఇంకా శ్రీ శాస్త్రిగారి కథలన్నీ పుస్తకాకారంలో (ప్రకటిస్తే అవి ఇరవై ముప్పయి సంపుటాలు డాకా అవుతాయని తలుస్తున్నది.

ఈవేళ ఏ సాహిత్య పత్రిక తీసినా సామాన్యంగా కథలులేని పత్రిక కనబడదు. సావాత్య పషత్రికలిగాక మిగిలిన పత్రికలు కూడా కొన్ని తము వ్యాప్తికోసం ఎక్కువగా కథలమీడ ఆధారపడుతున్నాయి. శాస్త్రిగారు బాగా మచన వాజ్మయ వ్యాప్తికావాలని ఆరాటపడిన రోజులు నే నెరుగుడును. ప్రత్యేకంగా ప్రబుద్దాంధ్రలో వారు పద్యాలను

1478 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (పప్రకటించమనీ, తమ పత్రికకు పద్యాలు పంపపద్దనీ హెచ్చరిక చేసేవారు! శాస్త్రిగారి కోరిక ఫలించింది. ఈ రోజుల్లో కవిత ప్రకటించే పత్రికలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని వేళ్ళ మీదే లెక్క పెట్టవచ్చునేమో!

నేటికాలపు కథావ్యాప్తికి త్రీ శాస్త్రిగారు వారి సమవయస్కు లైన మరికొందరు ప్రసిద్ధ కథకులు ప్రధాన కారణమని చెప్పాలి. కథకులలో ఇంచుమించుగా శ్రీ శాస్త్రిగారితో సమవయస్కు లైనవారిని ఒకతరంగా విడదీయవచ్చును. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తి9, చింతాదీక్షితులు, వేలూరి శివరామశాస్తి9, వెంకటచలం, మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి నరసింహశాస్తి9, అడివి బాపిరాజు, కవికొండల వేంకటరావు మొదలైన వారినందరిని ఈ తరంలో జేర్చువచ్చును. వీరి తరవాత పేర్కొనదగిన కథకులంతా కాలం దృష్ట్యా ఇంకొకతరంలోకి వస్తారని తోస్తుంది.

శాస్తింగారు తాము వ్రాసిన కథలన్నీ భారతి, ప్రబుర్ధాంధ్ర మొదలైన పత్రికలలో ప్రచురించారు. వీరి కథలలో ఉత్తమ(్రేణికి చెందిన కథలు అసంఖ్యాకంగా వున్నాయి. ఉదహరించాలంటే యావజ్జీవం హోష్యామి, షట్కర్మయుక్తా, వడ్లగింజలు, గులాబీ అత్తరు, తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.. శుఖికే శిర ఆరోహ, కన్యాకాలే యత్నాద్వరితా, మార్గదర్శి మొదలైన కథలెన్నో స్ఫురణకు వస్తాయి.

శాస్త్రిగారి కథలు స్థూలంగా మూడు విభాగాలు చెయ్యవచ్చును. వీరు వ్రాసినవి కొన్ని చారిత్రిక కథలు, మరికొన్ని సాంఘిక కథలు. మరికొన్ని అంతర్గర్భితమైన వ్యంగ్యం గల అవ హేళనాత్మకమైన (5464111021) కథలు.

వీరి చారిత్రక కథలలో, వడ్డగింజలు, ఆంధ్ర శిల్చిలో ప్రకటితమైన గులాబీ అత్తరు నేటి కాలప్పు కథావాజ్మయానికి రత్న్మప్రాయాలు. ఈ కథలతో వీరు అతి సులభంగా ఆయాకాలాల వాతావరణం సృష్టిస్తారు. అందులోను 18, 19 శతాబ్దాలలో సంస్థానాలు, ఆకాలపు సాంఘికమర్యాదలు, సాంప్రదాయికమైన వారి ప్రసంగధోరణులు సృజించడంలో శాస్తింగారు సిద్ధహస్తుల. వీరి చారిత్రక కథలలో వడ్డగింజలు అత్వ్యుత్తవుం అని నా అభిప్రాయము. ఈ కథ చదువుతూన్నంత సేపూ మనం ఆయాకాల సంస్థానాల దివాణాల్లో సంచరిస్తూ

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ. ప్‌, గణాపతి శాస్త్ర 1479 ఉన్నట్లే వుంటుంది. వడ్డగింజలలో రంగనాయకి ప్రవేశం వర్ణించే ఈ క్రింది ఘట్టం ఈ విషయానికి ఒక చక్కని ఉదాహరణం:

“వీరీ స్థితిలో వుండగా యొక్కడోలాగ మంజీరనాదం సన్నసన్నంగా వినవచ్చింది. “ఎమిటి చెప్మా" అనుకుంటూవుండగా “దణ్ఞాలండి” అని వెనకాల చిలకపలుకు. ముగ్గురూ అదిరిపడి వెనక్కి తిరిగిచూడగా అంజలిబంధంతో వొక బంగరు బొమ్మ. “ర్రీకృష్ణార్పాణం” అని శంకరప్పా, “సాభాగ్యవతీభవ” అని శాస్తి యాజులూ దీవిస్తూ లేచి నుంచున్నారు.

దరహాసలిప్తాలే అయినా శంకరప్ప చూపులతో విభ్రాంతురానవై అంజలి బంధంతో ఆమె అలాగే నిలిచిపోయింది.

అడ్డ చారల తాబొందుమీద వుప్పాడ సన్నజరీ కండువా వల్లెవాటు, ముద్దుముద్దుగా వాటిని పొదివి పట్టుకొని గంటల మొలనూలు, మెడలో ప్రైటమీద యుగుడుదిగుడుగా పచ్చల పతకం, ముక్కున నత్తూ, బులాకీని, చెవులకి జూకాలు, కర్ణిపువ్వులు, బావిలీలూను, చేతులకు మురుగులు, మురిడిగొలుసులు, పోచీలు,

| కంకణాలు, భుజబండులు, శీరస్సున సూర్యుడు చందుడు, పాపిడిపిందిలీలు, తమలపాకు, మొగలిరేకు, ఆగబాతెడు బంగారు జడ, దానికి గుత్తులు గుత్తులుగా గంటలు.

ఆమె శరీరకాంతిలో కలిసెిపోపడంవల్ల కొన్ని ఆభరణాల రత్నసరుకేగాని, బంగారం కనిపెంచడం లేదు. శిరోభూషణాలు మాత్రమే సర్వాంగీణంగా మెరుస్తున్నాయి.

సంతత పరిచయం వుండిన్నీ శాస్త్రీ, యాజులూ చకితులయినారు. శంకరప్ప పరవశుడే అయిపోయినాడు.”

శాస్తింగారు చేసే చారిత్రిక వాతావరణస్పృష్టికి ఈ ఉదాహరణం చాలుననుకుంటాను. సామాన్యంగా చారితిక కథలు వ్రాసే రచయితలు తమ కాలికములన అనుభవాలు, సమస్యలు దొర్లించడం ఒక దౌర్బల్యం. శాస్త్రిగారు తమ చారిత్రిక కథలలో ఈవిధమైన తాత్కాలిక భావచ్చాయలు రాకుండా చాలా

1480 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము జాగ్రత్త తీసుకుంటారు. ఇది వారి చారిత్రక కథల అత్యుత్తమత్వానికి ప్రథాన హేతువు. శాస్త్రింగారి సాంఘిక కథ లనేసరికి బాహ్మణా[గ్రహారాలు, ఇల్లుపట్టిన వెధవాడబడుచులు, వారి సాధింపులు, మూతివిరుపులు, అ(గగహార బ్రాహ్మణ కుటుంబాల ఆచార వ్యవహారాలు, అందులోను, గోదావరీ ప్రాంతీయ బ్రాహ్మణ గృహాల కష్టసుఖాలు మనకు స్ఫురణకు వస్తాయి. ఇంకా రెడ్డు, పల్లటూరి కాపులు, పట్టణవాసంలో సుఖంగా జీవనం చేసుకునే వకీళ్ళు మొదలైనవారి జీవితాలు గూడా మన కక్కడక్కడ కథాఘట్టాలలో తగులుతూంటాయి. పైన చెప్పిన జమీందారీ గృహాలు, తత్సంబంధమైన వాతావరణం తప్పిస్తే సామాన్యంగా మిగిలిన ఆంధ్రదేశీయ జీవనంగాని, వాటి సమస్యలుగాని శాస్త్రిగారి కథలలో కనిపించవు. ఏ రచయిత అయినా దేశీయ జీవితం సమస్తము, అన్ని పరిసరాలలోను చేపట్టడం చాలా దుష్కరమైన పని. తాత్కాలికమైన సంఘం సంపూర్ణంగా ప్రతిఫలించగలగడ మనేది ఎవరికో మహామహులైన రచయితలకుగాని సాధ్యమయ్యేది కాదు. ఆపరిచితమైన సంఘం తీసుకుని కథారచన కుప(కమించి, చేతగాక తేలిపోవడంకంటె పరిమితమైన పరిచిత సంఘవ్యవస్థ సూక్ష్మంగా చిత్రించగలగడం చాలా అభినందనీయమైన శక్తి. తమ శక్తి పరిమితులు గుర్తెరిగిన రచయితలే ఈ వివేచనతో కథారచన కుప[క్రమిస్తారు. శాస్త్రిగారిలో ఈ వివేచన చాలా నిశితంగా కనిపిస్తుంది. శాస్త్రిగారు అతీతమయిన ఆంధ్రదేశ సంస్థానాల బెదార్యాదులు, మాధుర్యము తలుచుకుంటూ నిట్టూరుస్తూ కూర్చున్న వ్య క్తికాదు. ఇంచుమించుగా ఈ శతాబ్బప్రారంభంలోని సాంఘిక సమస్యలన్నిటిమీద వారి లేఖిని సాగింది. తరుణీ " వివాహము, విధవావివాహము, (ప్రమవివాహము మొదలైన వాటిమీద వీరన్నో కథలు వాగారు. అల్లాగే వీరు, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం దేబిరించడం మానివేసి, స్వతంత్ర వృత్తులయిన వాణిజ్యాదులు చేపట్టాలని సూచించే కథలుకూడా వ్రాశారు. వీరి కథలలో బెత్తరాహుల అనుకరణ [ప్రాయాలైన హిందీ వ్యామోహాదులు మానివెయ్యాలని సూచించే కథలు కొన్ని ఉన్నాయి. వీరి “శుభికే శిర ఆరోహ”"

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ ప్‌, ౧౫పతి శాస్త్ర 1481 అనే కథలో బౌత్తరాహుల భాషాచారాదులు అంథప్రాయంగా అనుసరించకూడదనే అవహేళన చాలాచురుకుగా కనిపిస్తుంది.

రచనా శిల్పదృష్ట్యా చూస్తే ఇది చాలా మంచి కథ. మరి మన ఆంధ్రులలో ఉండే అంథపాయమైన బౌత్తరాహుల అనుకరణ శీలాన్ని కూడా ఈ కథ దుయ్యబడుతుంది. ఇలాగే నిర్బంధ వైధవ్యాదికములయిన దురాచారాలు గూడా శాస్తి్రిగారనేక కథలలో నిశితంగా విమర్శించారు.

అయితే ఈ తాత్కాలికములైన సాంఘిక సమస్యలమీద (వాయడంలో కళాశీలి చాలాచాలా జాగత్తపడవలసి ఉంటుంది. లేకపోతే అతని రచన కేవలం (పచార్మ్వపాయమై ఊరుకుంటుంది. ఈ విషయంలో ఉదాహరణకు గురుజాడ అప్పారాయకవినీ, వీరేశలింగకవినీ తీసుకుందాము. ఇద్దరు తమతమ సమాన కాలీనములయిన సాంఘిక దురాచారాలు తూర్ప్చారబట్టినవారే. వీరేశలింగకవి ఏ ప్రహసనం వ్రాసి తమమీద విరుచుకుపడతాడో అని ఆ కాలంలో సంఘశత్రువులు, దాంభికులు హడలిపోతూండేవారట! బహుశః కన్యాశుల్క౦ చూసిన ,పేక్షకులు అంతగా హడలిపోయి ఉండకపోవచ్చును.

వీరేశలింగకవి లేఖిని ద్వారా అప్పారాయకవి కంటె నిశితంగా తన సాంఘిక (ప్రయోజనాలు సాధించి ఉండవచ్చును. కాని వీరేశలింగ కవి ప్రహసనాలకు అప్పృురాయకవి కన్యాశుల్కానికి లభించినంత సాహిత్యగౌరవం లభించలేదు, కన్యాశుల్కం నానాటికీ సాహిెత్యపరుల గౌరవాదరాలు అత్యధికంగా చూరగొంటున్నది. వీరేశలింగకవి (ప్రహసనాలీవేళ ఎవరో సాహిత్య పరిశోధకులను మాత్రమే ఆకర్షిస్తున్నాయి. నేడు వాటివిలువ అంతకంటె ఎక్కువగా లేదని నిశ్చితంగా చెప్పవచ్చును.

దీనికి వేరే కారణం అన్వేపించవలసిన అవసరం లేదు. తాత్కాలికములెన (ప్రయోజనాలనే దృప్టలో ఉంచుకొని వాయడంవల్ల ఆ రచనలకు ఆనాటితో (ప్రయోజనం తీరిపోయింది.

అప్పారాయకటద సమాజం నిశితంగా విషుర్శించినా ఆయన లోతులకు పోయి సమాజ సమస్యలు అవగాహస చేసుకుని, వాటిని పాఠకుల యెొడుట అతి గంభీరంగా ప్రదర్శించాడు. కన్యాశుల్కలలో పడుప్పువృత్తితో జీవించే మధురవాణి దృష్ట్యా ఆ

1482 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము శ; సాహిత్యము నాటకంలో ఉండే సపెద్దవునుష్యులు, సంఫుసంస్కారపరులు తక్కువ నిజాయితీగలవారుగా కనిపిస్తారు. ఈ విధమైన అతి గంభీరమయిన వ్యంగ్యావ హేళనతోనే అప్పారాయకవి తన సమకాలిక సంఘం తూర్చారబట్టాడు. సామాన్య నాటక రచయిత అయితే చవకబారుగా మధురవాణిని అవహేళనం చేయించి, నీతిసూత్రోపన్యాసాలు చేయించి తన సాంఘిక [ప్రయోజనం సాధించుకుని ఉండేవాడు. అప్పారాయకవి సంఘసంస్కరణావశ్యకతతోబాటు సంస్కారుల లోపాలు కూడా సరిసమానంగానే అవగాహన చేసుకొని తన రూపక రచన కుప[కమించాడు. కేవలం వాజ్మయం ద్వారా ఏర్పడే సాంఘిక ప్రయోజనాలదృష్ట్యా పరిశీలించినా అప్పారాయకవే నిశితము, విశాలము అయిన సాంఘిక ప్రయోజనం సాధించుకోగలిగాడని అనాలి. ఇదే కళాశీలి సాంఘిక సమస్యలు పరిష్కరించే రచనా విధానానికీ, కేవలం రాజకీయ వాజ్మయ (ప్రచారకుడు అవలంబించే రచనా విధానానికీ గల భేదం.

శ్రీ శాస్త్రిగారు చాలా త్మీవమయిన సంఘసంస్కార దృష్టి గలవారు. అందుచేతనే వీరు తమ కథలలో చురుకుగా ఆయా సాంఘికాచారాలు అవహేళన చేశారు.

అయితే ఆనాటి సాంఘిక సమస్యలు వేరు. ఈనాటి సమస్యలు వేరు. తరుణీ వివాహం నేడొక సమస్యకాదు. అది సంఘంలో ఒక పరిపాటి అయిపోయింది. విధవా వివాహం కూడా నేడొక పెద్ద సమస్యకాదు. హిందీ (హిందుస్తానీ) సమస్యకూడా అలాంటిదే. శాస్త్రిగారు హిందీ విషయంలో చాలా పెద్ద గాలిదుమారం లేవదీశారు. అయితే ఇంచుమించుగా హిందీ విషయంలో వాదోపవాదాలన్నీ సమసిపోయాయి. దాన్నిప్పుడు అఖిల భారతీయ రాజకీయ భాషగా అందరు అంగీకరించారు.

కనకనే వీరీసమస్యలు తీవ్రంగా ప్రదర్శించే కొన్ని కథలు నేడంతగా ఆకర్షణంగా కనబడవు. ఉదాహరణకు “కన్యాకాలేయత్నాద్వరితా” అనే కథ తీసుకుందాము. దీనిలో వితంతువు రంగనాయకి అష్టకష్టాలుపడి చిన్నప్పటినుంచీ కోరి (ప్రేమించిన వరుణ్ణి వివాహం చేసుకోవడం కథావస్తువు. “పేమ వివాహాలు” వితంతువివాహాలు విడ్డూరంకాని నేటి రోజుల్లో ఈ కథ నవాసిన రోజుల్లో ఉన్నంత ఆకర్షకంగా కనబడదు. అలాగే ఆ రోజుల సాంఘిక దురాచారాలను తీవ్రంగా ఎదుర్కొనే కొన్ని కథలు, కొన్ని ఘట్టాలు నేట్‌ పాఠకులకంతగా రుచించవని తోస్తుంది.

శ్రీ సుబహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ పి.గణపతిశాస్త్రి. 1483

శ్రీపాద, చలం మొదలయిన పెద్దతరం ఉత్తమ కథకులు ఒక్కొక్క పంథాలో సిద్ధహస్తులై ఆ రంగంలో అందెవేసిన చేతులని అనిపించుకున్నారు. గోదావరీ ప్రాంతపు సాంప్రదాయిక (బాహ్మణ గృహాలు, వారి సంప్రదాయాలు, రాజ సంస్థానాలు, వాటి మర్యాదలు చిత్రించడంలో శాస్త్రిగా రద్వితీయులు. ఈవిధమయిన ఆంధ్ర దేశీయ జీవితం శాస్త్రిగారు అతిసహజంగా చిత్రిస్తారు. ఈ చిత్రణలో ఆయా బ్రాహ్మణ కుటుంబాలలో వ్యవహరింపబడే భాష శాస్తి9గారికి పట్టుబడినంత దగ్గిరగాను, స్వాభావికంగాను మరి ఏ రచయితలకు పట్టుబడలేదు. అసలు శాస్త్రిగారు వాడే వ్యావహారిక భాషకూడా గ్రోతియ బ్రాహ్మణ కుటుంబాల శిష్ణవ్యావహారికమే. అందుచేతనే వీరి భాష, ఆయా శిష్ట బ్రాహ్మణ కుటుంబాల సన్నివేశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని మన కళ్ళ ఎదుట సజీవంగా

ఈ సందర్భంలో శాస్తింగారు కథలలో వాడే వ్యావహారికాన్ని గురించి ర౦డు మాటలు వ్రాయడం అప్రస్తుతం కాదనుకుంటాను.

మనదేశంలో నేడు వ్యావహారికం బహుళంగా వ్యాపించింది. అయితే శాస్త్రిగారు రచన ప్రారంభించే రోజులలో ఇది వ్రాయడానికి రచయితలు జంకేవారు. శాస్త్రిగారు మొట్టమొదట వ్రాసిన నవలలు కొన్ని (గాంథికాంధ్రంలో వ్రాశారు. క్రమంగా వారు వ్యావహారిక భాషామాధుర్యం గ్రహించి అవిరళంగా ఈ భాషలోనే తమ రచనలన్నీ సాగించారు.

ఈవేళ వ్యావహారికం ఎక్కువగ వ్యాప్తి చెందినా, జాతీయము, సహజము, సరళము, శీష్టము అయిన వ్యావహారికం వ్రాసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చును. నేటి వ్యావహారిక రచయితలు ఆంగ్లేయ భాషా నిష్టాతలు కావడం వల్ల కాబోలు, వారి రచనలలో ఆంగ్ల వాక్యవిన్యాసాలు, అసహజములైన అన్వయాలు, కారకాలు కొల్లలుగా దొల్లుతూంటాయి. మరి ధర్మధర్మిభావ శూన్య మైన అపశబ్ద ప్రయోగాల మాట చెప్పనే అక్కరలేదు. నేటి రచయితలలో చాలామందిలో శిష్ట శైలీదృష్టి శూన్యప్రాయంగా ఉంది. శాస్త్రిగారి శైలిలో విజాతీయచ్చాయలు వెతికినా కనబడవు. వీరి శైలి వ్యావహారిక భాష అభ్యసింపగోరే వారికందరికీ చక్కని ఒరవడి అనడం అతిశయోక్తి కాడు. వీరి శైలిలో లాలిత్యము కొంత తక్కువ కావచ్చును. అయితే సూటిగాను, నిశితంగాను, సుసంస్కృతంగాను వ్యావహారిక రచన చెయ్యడంలో

1484 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము శాస్తింగారిది అందెవేసిన చెయ్యి. బహుశః వారి స్వభావంలో సహజంగా ఉన్న ఈ గుణాలే వారి వ్యావహారిక రచనల్మోకూడా ప్రవేశించాయని అనుకుంటాను.

శాస్త్రిగారు కథచెప్పడంలో ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఇది సామాన్యంగా వీరి కథారచనలలో అంతటా కనబడేదే. కొందరు కథకులు తమ కథలు ముగించేటప్పుడు ప్రవేశపెట్టే ఆశ్చర్యాంతసన్నివేశాలు వీరి కథలలో సామాన్యంగా కనబడవు. అక్కడక్కడ ఆయా ఘట్టాలలో ఏకకాలంలో కలిగే మానసిక భావస్పందాలు వీరు అతిమెళుకువతో (గహించి, వాటిని పాఠకుల మనోనేత్రాల ఎదుట ప్రత్యక్షంచేస్తారు. “శుభికే శిర ఆరోహ” అనే కథలో ఈ క్రింది విషయంవల్ల ఇది సోస్పుష్టంగా పరిశీలించవచ్చును.

“దీంతో అప్పటికి తనకే అలాంటి అనుభవమే కలగగా తానూ పాడాలని అన్నపూర్ణ గుబగుబలాడిపోయింది; కాని దానివల్ల ముసలమ్మ కోరిక నెరవేరుతుందని మనస్సు బిగబట్టుకుని - అయినా ఆగలేక నాయనమ్మ కంటబడకుండా వుండేటట్టు కుంచుకుపోయివచ్చి, జానకి పక్కని కూచుంది.”

ఇక్కడ కథకులు ఆయా పాతల చిత్తవృత్తుల కదలికలు అతి సూక్ష్మంగా చిత్రిస్తారు. ఇది జానకికి రుంరూమారుతంలో జవజవలాడిపోయే యేలకితీ గెక్షి ఆలంబనం దొరికినట్టయింది.

  • రత్తమ్మ యిందు కానందించిన్నీ "నువ్వు పాడవద్దుసుమా! అని అన్నప్పూర్ణని కళ్లతో నిషేధించింది. ఇది యెరగని జగ్గప్ప కూడా ఆమెను కళ్లతో వారించాడు
  • “నువ్వు పాడవద్దని.”

ఇల్లాగ మౌనముద్రాంకితమైన పాతల చిత్తవృత్తులు ఎప్పటికప్పుడు నిశితంగా చిత్రించుకుంటూ శాస్త్రిగారు కథ కట్టుకుపోతారు. దీనివల్ల కథకొక జీవచైతన్యం ఏర్పడి పాఠకులను కొసవరకు తీసుకుపోతుంది. పాత్రల చిత్తవృత్తులతోబాటే ఆయా పరిసర వాతావరణం ఆతి స్వాభావికంగా చిత్రించుకుంటూపోవడం వల్లనే శాస్త్రిగారు కథ కొక విచితమయిన యథార్థత్వం కల్పిస్తారు. శాస్త్రింగారు పరశ్శతంగా రచించిన చిన్న కథలన్నీ ఇంత చిన్న వ్యాసంలో సమీక్షించడం సాహసమే. అయితే వీరి కథావాజ్బ్ఞయం పఠించి ఆనందించవలసిందేగాని, ఉదాహరణార్హమయినవి కాక పోవడంవల్ల ఈ విషయం ఈ దికృ్రందర్శనంతో విడిచివేయవలసి వచ్చింది.

1485 శాస్త్రిగారు నేట్‌ ఉత్తమ కథకులలో అత్యల్ప సంఖ్యాకమయిన అ(గ(శ్రేణికి చెందిన వారు. వీరి షష్టిపూర్తికి రాజమహేంద్రవర పౌరులు యావదాంధ సహకారంతోను ఘనసన్మానం జరిగించబోతున్నారని తెలిసింది. శాస్త్రిగారు స్వయంగా సంపన్నులు కారు. అయినా వీరు అనేకవిధాల శ్రమించి ఇటీవల రాజమహేంద్రవరంలో అనేకమైన సారస్వతోత్సవాలు జరిపించారు. అనేక విధాలుగా నిస్పృహంగా ఉన్న జాతీయ జీవితంలో ఉత్సాహం రేకెత్తిస్తున్నారు. సహజంగా వీరు స్వతంథత్ర ప్రవృత్తి కలవారు. అందుచేతనే ఇతరుల కెవ్వరికీ లభించని అవిరళ సారస్వతోపాసన భాగ్యం వీరికి లభించినదని అనుకుంటున్నాను. నిత్య సాహెత్యవతులయిన శ్రీ శాస్తి గారికి రాజమ హేంద్రవరంలో జరిగించే షష్టిపూర్త్యుత్సవం నేటి గద్య వాజ్మయ సరస్వతి కొక పూలకానుక. ఈ వుహోత్సవం జేగీయమానంగా జరగగలదనీ, ఈ ఉత్సవం౦లోనైనా శాస్త్రళగారి గద్యరచనలన్నీ సంపూర్ణంగా చక్కని సంపుటాలు (ప్రకటించే ప్రయత్నాలు జరగగలవనీ ఆశిస్తున్నాను. (కిన్నెర: సంపుటము 33, సంచిక 4, ఏప్రిల్‌ 1951) స్త? క్ష్‌ య నె యాత భు ట్‌ లో

శ్రీ సుబ్రహ్మణ్య శాస్తింగారి షష్టిపూర్తి

0వలౌవదాంధ్ర దేశపక్షముగా నిది మొన్నటి ఏల్‌ 22వ తేదీని రాజమహేంద్రవరమున, కోఆపరేటివు సెంటల్‌ బ్యాంకి ఆవరణమున, ఇందునిమిత్తము ్రత్యేకముగ నిర్మితమైన మంటపమున దేవేంద్రవైభవముగా జరిగినది. వచనరచయిత కిట్టి భూరిసన్మానము జరుగుట అపూర్వ విషయము. శ్రీ శాస్త్రిగారు 42 సంవత్సరములుగా సేయుచున్న సారస్వతోపాసన యీవిధముగా రాణకెక్కినది. ఇందునిమిత్తము ఆ సన్మాన సంఘమువారు ఘనముగా ఏర్పాట్లు చేసినారు.

ఉదయము అభ్యంగానంతరము త్రీ శాస్త్రి దంపతులను మంగళవాద్యములతో కారులో నూరేగించుచు సభాస్థలికి కొనివచ్చి, నూతన వస్తాాలంకృతులను గావించిరి. పిమ్మట యజుర్వేదము, శుక్షయజుర్వేదము, బుగ్వేదము, సామవేదము

  • ఈ మంత్రములతో వేదవేత్తలాశీర్వదించిరి. తరువాత, తమ నిమిత్తము మహాన్యాస పూర్వకముగా మార్కండేయస్వామికి అభిషేకము చేసివచ్చుటకు శాస్తింగారు (బాహ్మణోత్తములను నియమించుకొనిరి.

అప్పుడు సన్మానసభ ఉదయ కార్యక్రమము ప్రారంభమైనది. మొదట సన్మానసంఘాధ్యక్షులు శ్రీ సోమిని కామేశ్వరరావు పంతులుగారు సభ్యులకు స్వాగతము నివేదించిరి. ఇది జరుగుచుండగా, మహామహోపాధ్యాయ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు సభకు దయచెేసిరి. శ్రీపాద శాస్తుంల కిరువురకును

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి 1487 ఇంతవరకును వైమనస్యము తీవ్రముగనే యుండినది; కాని సన్మానసంఘ కార్యదర్శుల చాతుర్యమువలన కృష్ణమూర్తి శాస్త్రిగారు సభకు దయచేసిరి. వారి రాక సుబహ్మణ్యశాస్త్రింగా రెరుగరు. వారప్పుడు కామేశ్వరరావు పంతులుగారి స్వాగత వచనముల వినుచుండిరి. వచ్చీరావడంతోనే శక్రటరీ శ్రీ వోగిరాల సుబ్బారావుగారు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారిని వూలదండ వేసి సత్కరించిరి. అప్పుడీసంగతి గుర్తించి వెంటనే వెళ్లి శ్రీ సుబహ్మణ్య శాస్త్రిగారు కృష్ణమూర్తి శాస్త్రిగారికి పాదాభివందనము చేసిరి. కృష్ణమూర్తి శాస్త్రిగా రాశీర్వదించిరి. కొంతసేపయిన తరువాత తమకు పిఠాపురము వెళ్లవలసిన అగత్యమున్నదని, మెయిలు వేళ అగుచున్నదని సుబ్రహ్మణ్య శాస్త్రులవారికి ఇట్టిసన్మానము జరుగుట తమకు మిక్కిలి ఆనందకరముగా నున్నదనిచెప్పి, ఆశీర్వదించి వెడలిపోయిరి. తరువాత కవిస్మామాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు అ(గాసనాధిపత్యము వహించి, వెంటనే మొదట నిర్ణయించబడిన కృష్ణా పత్రికా సంపాదకులు శ్రీ కాటూరి వెంకటేశ్వర రావుగారు మొవ్వ (గగామములో క్షేతయ్య మహోత్సవమున నిమగ్నులయి రాజాలకపోగా, అడవి బాపిరాజుగారు [ప్రారంభోత్సవము జరిగించిరి. మునిమాణిక్యం నరసింహారావుగారు, గడియారం వెంకట శేష శాస్త్రిగారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారి రచనలను మిక్కిలి [ప్రశంసించుచు మాట్లాడిరి. పిదప, అధ్యక్షులు సత్యనారాయణగారు సుబహ్మణ్యశాస్తింగారి రచనలను సాధారణముగ ప్రశంసించుచు గంఖీరోపన్యాసము చేసిరి. అది శ్రోతలను ఆనంద పరవశులను చేసినది. వారు ముఖ్యముగా సుబహ్మణ్య శాస్త్రిగారి రచనలలో వడ్గగింజలు, రాజరాజు, కన్యాకాలే యత్నాద్వరితా, కలంపోటు, తల్లిప్రాణం - వీటిని గురించి చాలావిప్తులముగా నుపన్యసించి వాటి ఘనత నుగ్గడించిరి. వారి రచనలన్నియు నిట్టివేయని దృఢముగా వచించిరి. ప్రత్యక్షరము చదివి ఉపన్యసించిన శ్రీ సత్యనారాయణగారి పూనిక సభ్యులను ఆనంద పరవశులను గావించినది. అంతటితో ఉదయకార్యకమము ముగిసినది. మధ్యాహ్నము మరల నాలుగున్నర గంటలకు శాస్త్రి దంపతులను ఒక కారులోను, అధ్యక్షుల నందరినీ ఒక కారులోను ఊరేగించుచు, జొన్నలగడ్డ సత్యనారాయణవమార్తిగారు, మొక్కపాటి నరసింహశాస్తింగారు. భమిడిపాటి కావేశ్వరరావుగారు, మధునాపంతుల

1488 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సత్యనారాయణ శాస్త్రిగారు, గడియారం వెంకటిశేష శాస్తి9గారు, దేవులపల్లి రామానుజరావుగారు మొడలైన విఖ్యాత రచయితలు, పండితులు, పురప్రముఖులు సభాస్థలికి వచ్చిరి. ద్వారమున సుమంగళులు శాస్త్రిదంపతులకు మంగళహారతి యిచ్చిరి. కార్యదర్శులు పూలుచల్లుచు శాస్త్రిదంపతులను వేదికకు గొని వచ్చిరి.

శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు సభాధ్యక్షులుగా మధ్యాహ్నకార్య[క్రమము ప్రారంభమైనది. సుబహ్మణ్య శాస్త్రిగారు మొదట సభలోకూర్చుండియున్న తన రెండవ అన్నగారయిన వెంకటరవుణ దైవజ్ఞశర్మగారని పూలమాలాలంకృతులను గావించి తమ ధర్మపత్నితో కలిసి పాదాఖివందనములు చేసివెల్లి, అప్పుడు వేదికమీద ఆసీనులయిరి,

నండూరి బంగారయ్యగారు, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు, మొక్కపాటి నరసింహశాస్తింగారు, దేవులపల్లి రామానుజరావుగారు, గడియారం వేంకటశేష శాస్త్రిగారు, మల్లెల శ్రీరామమూర్తిగారు, పొన్నాడ వేంకటాద్రిగారు, డాక్టర్‌ దోనెపూడి బ్రహ్మానంద శాస్త్రిగారు స్కుబహ్మణ్యశాస్త్రిగారి రచనా (పప్రాగల్బ్యమును వివరించుచు చక్కగా నుపన్యసించిరి. కార్యదర్శులలో నొకరగు గంటి కృష్ణమూర్తిగారు పరశ్శతమునైన సందేశలేఖలు, తంతివార్తలు చదివిరి. మరొక శక్రటరీ శ్రీ వోగిరాల వెంకట సుబ్బారావుగారు ఆద్యంతముగ నీ సన్మాన ప్రయత్నములు, విరాళముల వివరములు ఎన్నవించిరి.

అప్పుడు, శ్రీకృష్ణశాస్తింగారు మొదట చందన మచ్చి, అత్తరు చిలిక్తి పన్నీరు చల్లి, కర్పూరదండ వేసి, వెండి పళ్లిమున ఉంచి సేలం పట్టుతాపితాలు సమర్పించి కాశ్మీర దుశ్శాలువలు కప్పి సుబహ్మణ్యశాస్తింగారిని సత్కరించిరి. ఈ సమయమున శాస్త్రిగారి ధర్మపత్ని సీతమ్మగారికి పట్టుచీరయిచ్చి అద్దేపల్లి వివేకానందా దేవిగారు సత్కరించిరి. పిదప సరసులు కొందరు శ్రీ శాస్తింగారికి వొండిపాతంఎ, దంపతులుపు నూతన వస్త్రములు యిచ్చి సత్కరించిరి.

అప్పుడు సుబహ్మణ్యశాస్త్రగారు. తమకు జరిగిన యీ భూరిసన్మానముతో ఆనంద పరవశులయి గద్గదికతో క్లుప్తముగా తమ కృతజ్ఞత వెల్లడించిరి. అందువారు “ఈ సన్మానానికి నేను సుతరామూ అర్హుడుకాను. మొదట మానాయనగారు ఆనుగులో రచనచెయ్య డానికి వల్లకాదని నన్ననేకవిధాల నిర్బంధించారు. అప్పుడు

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి 1489 తటవర్తి వెంకటరాజుగారు, కూచిమంచి సాంబయ్యగారు మానాయనగారికి నచ్చచెప్పి నా సాధనకు మార్గము కల్పించిరి. వారప్పుడు అలా చేసివుండకపోతే నేనివాళ మీ యెదట యిలాంటి సన్మానం పొందలేక పోయివుందును. తరవాత రెడ్డిరాణ్‌ పత్రికాసంపాదకులైన శ్రీ మల్లిడి సత్తిరెడ్డిగారు నాకు కావలసిన తెనుగు పుస్తకాలు కొన్ని వందలరూపాయిలతో కొని నా సాహిత్యకృషికి అవకాశము కలిగించిరి. అప్పటికి నేను రచన్నాప్రావీణ్యము కొంత సంపాదించుకోగలిగితిని, కాని తృప్తి కాలేదు. వెంటనే పిఠాపురం సంస్థానకవులైన రామకృష్ణ కవులదగ్గిర శుశూషచేసి చదువుకున్నాను. వారనేక విషయాలు బోధించి నాకు నూత్నజీవితం (ప్రసాదించారు. ఇలాగ ఈ నలుగురున్నూ నా ఉన్నతికి బాగ సాయపడ్డారు. కనక, వీరిప్పుడు నాకు చేసిన ౦0వ సన్మానం 0 నలుగురి కీ సమర్ప్చించుకుంటున్నాను. సన్మానం పేరుతో మీరు నామీద మోపిన భారం యిప్పటికి తీరి నేను చులకన పడ్డాను” అని చెప్పినప్పుడు అందరికీ కళ్లు ఇమ్మగిల్లినవి.

సభకు రాజమహేం[ద్రవర పారులూ, చుట్టుపట్లగ్రామముల వారునేకాక, పొరుగు జిల్లాల నుంచి, తఆలంగాణానుంచీ ఎండలో వచ్చిరి. సభ సుమారు 2వేలమంది కిటకిటలాడిపోయినది. లౌడ్‌ స్పీకర్లు అమర్చుట వలన విశాలమైన రాజవీథిలోను మార్గమునిండుగా అనేకులు నిలిచి ఉపన్యాసము లాలకించి ఆనందించిరి. అయిదు గంటలకే రాదొడగిన సభ్యులు, 6 గంటలకు సభ (ప్రారంభమైనది మొదలు 10-30 లకు ముగిసేవరకును నిశ్శబ్దముగను, నిశృ్చలముగను ఉండి, తమ సాహిత్య ప్రీతి కనపరిచి సభకు శోభ చేకూర్చిరి. కృష్ణశాస్త్రిగారు మొదలైనవారు ఇంతవరకును మేము ఇంతగొప్పగను, ఇంత చక్కగను జరిగిన సాహిత్య సభ చూసియెరుగమని చకితులయి వాక్రుచ్చిరి. సుబహ్మణ్యశాస్తి9గారి యెడల రాజమహేంద్రవర పౌరులు, దేశీయులు ఎంత ప్రీతివిశ్వాసములు కలవారో సభ స్పష్టము చేసినది. ఇది రాజమహేంద్రవర చరిత్రలో నూతనాధ్యాయము నంకితము చేసినది.

మరునాడు, హహడ్మాష్టరు కంభంపాటి రామశాస్త్రిగారు. సుబహ్మణ్య శాస్తింగారిని, కృష్ణశాస్త్రిగారిని, సత్యనారాయణగారిని, వెంకట శేషశాస్తి గారిని, బాపిరాజుగారిని తమ వీరేశలింగం మైస్కూలుకు తీసికొని వెల్లి సత్కరించిరి.

1490 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పిదప స్థానిక న్యాయవాడులలో ప్రముఖులయిన శ్రీకొల్లూరి సూర్య ప్రకాశరావుగారు

  • (పముఖ పండితరచయితల అందరికీ విందుచేసి సత్కరించిరి.

శ్రీ త్రీపాద సుబహ్మణ్యశాస్తింగారి షష్టిపూర్తి మహోత్సవము ఇట్లు

బేగీయమానముగ జరిగి దేశీయుల ఆధునిక సాహిత్య ప్రీతిని సుస్పష్టము చేసినది. (శ్రీ నుబవ్యాణ్య శాస్త్రిగారి షష్టివూర్తి మహోత్సవ నందర్భంలో శ్రీ ఇం[దగంటొ హనుమచ్చాస్త్రిగారు చదివిన ఉవన్యానమ్సు శే

కొనలు కొంచెం గిరజాలుగా అేల్చి దువ్విన జుట్టు. వైకల్చికంగా ధరించే కళ్లజోడు. కమీజులోపలికి పెట్టికట్టిన తెల్లని పంచమీద నిలువునా బొత్తాలుగల కోటు. ఒక కొన వీపుమీదకు పోగా రెండవకొన ముందుకు విడిచిన సన్నఖండువా, కొంచెం వెడల్రైన పెదవులమీద ఒక చితమైన యాసతో ఉచ్చరించే అచ్చపు తూర్పు గోదావరి జిల్లా తెనుగు. సడలని ఉత్సాహంతో, వడలని శరీరంతో, రాజమహేంద్రవరం వీథిలో తెనుగుబింకంతో నడిచే ఆ నిండువిగ్రహం ఎవరు?

ఆయనే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తిగారు. ఉరఫ్టు - కలాభివర్థనీ పరిషత్తు.

ఆయనకు షష్టిపూర్తి అంటే ఎవరు నమ్ముతారు? నేటి సాహిత్య యువకు లందరికంటె గూడా యువకుడుగా కనిపిస్తూ, పొంగులువారే ఉత్సాహంతో సాహిత్య సేవ చేస్తూ, వి విషయంమీదనైనా ముక్కుమీద గుద్దినట్టు వెరపెరుగకుండా మాటలాడుతూ, తెనుగుతనం ప్రసక్తిలో పిడికిలి బిగించి ఉపక్రమించే ఆయన ఎప్పుడూ ముప్ఫయి దాటని సాహిత్య టతత్రిదశుడని మా విశ్వాసం గదా - అప్పుడే ఆయనకు అరవై అంటే ఎవరు నమ్ముతారు? “నిజమే....ఆయన రచనాశక్తికీ, సాహిత్యాసక్తికీ, కార్యదీక్షకూ, కళాభిరుచికీ నిత్యయౌవనమే కావచ్చు. కాని - శరీరానికి మ్మాతం షష్టిపూర్తి, అన్నాడు మావాడు.

ఉచితజ్జులైన రాజమహేంద్రవర పౌరులు అభిలాంధ్రదేశ [పోత్సాహ, (పోద్చలాలతో సుబహ్మణ్యశాస్తి9గారికి శక్తివంచన లేకుండా “ఓహో” అన్నట్టు షష్టిపూర్త్యుత్సవం చేస్తున్నారంటే సారస్వత ప్రియులంతా సంతోషి స్తున్నారు.

ఆంధ్ర వాజ్మయానికి - తత్రాపి - నవ్య సాహిత్యానికీ శ్రీ శాస్త్రిగారి యీవి తక్కువ కాదు. భక్త విజయం మొదలు కలంపోటు దాకా ఆయన లెలిని ఆంధ్రసారస్వతక్షే తంలో విశ్శంఖల విహారం చేసింది.

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి 1491

నాటకాలు వాశారు. నవలలు సృష్టించారు. రూపికలు చిత్రించారు. కవిత నారాధించారు. వ్యాఖ్యానాలు ప్రపంచించారు. వ్యాసాలు రచించారు. మీగడతరకలు అందించారు. ఇంకా ఎత్తిన కలం దించలేదు. కొత్తరచనకు పథకాలు పడుతూనే ఉన్నాయి. సాహిత్య రంగంలో దుతగమనం సాగుతూనే ఉంది.

యుగప్పురుషులు, నన్ని భట్టారకుడూ, వీరేశలింగం పంతులూ మెట్టిన రాజమహేందదవర సారస్వత పుణ్యక్షేత్రంలో శాస్త్రిగారి మనుగడ. అటు ప్రాచీనసారస్వత సారమూ, ఇటు నవ్య సంస్కార చైతన్యమూ సమన్వయించి ఆస్వాదించిన (ప్రబుద్ధాంధ్రులు శ్రీ శాస్త్రిగారు.

కావైతే...సాహిత్య పూర్వాశ్రమంలో పండిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్తులవారు చక్కని గ్రాంథికాంధ్రభాషలో పెక్కు గ్రంథాలు వ్రాశారు. అప్పుడు నలిగిన తోవలో వాసుకుపోయే నలుగురు రచయితల్లోనూ ఆయన ఒకరు...అంతే. ఏ విశిష్టతకూ ఆయన లక్ష్యం కాలేదు. ఏ పప్రత్యేకతకూ ఆయన నిదర్శనం కాలేదు.

ప్రతిభగల వ్యక్తకి ఏనాడో ఏర్పడిన పరిధుల్లో కళ్లు మూసుకుని సురక్షితంగా నడవడం సాధ్యమైన పనికాదు. అపయత్నంగా అతడు ఎప్పుడో ఎరజండా పట్టుకొని గీతలుదాటి బయటపడి తన (ప్రజ్ఞకు రెక్కలు తొడుగుతాడు. ప్రజలకు తన ముక్త కంఠం వినిపిస్తాడు.

శాస్తింగారికి ఎప్పుడో ఒకనాడు ప్రజాసామాన్యంతో బొట్టుసరిగా ఉండే గ్రాంథిక భాషమీద పొంగివచ్చే నవ్య చైతన్యవాహినికి ఇరకాటమైన సంప్రదాయ రచనమీద నిర్లక్ష్యం పుట్టింది. దానితో ఆయన మేధలో వింత మెరపులు మెరసి విచిత్ర భావావళతి విరిసింది.

శోత్రియతాసంపన్నమైన వైదిక కుటుంబంలో పుట్టిన శాస్త్రింగారు. అన్నగారిలా, నిగ్గయిన ఏ దైవజ్ఞశిఖామణిగానో, శౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా పరతంత్రులైన ఏ వేదమూర్తిగానో కావలసింది. అయితే ఆయన పేరు మహేంద్రవాడ పరిసరాలనూ, మహా అయితే రామచందదపురం తాలూకానూ దాటకుండానే ఉండేదేమో. కాని ఆయన భవిష్యత్తు అదికాదు. పరిసరాలను జఒత్తిగించుకొని ఆయన వ్యక్తిత్వం ఒక నవ్య వాజ్మయ తపస్సిద్ధి వైపు అచంచల గమనం సాగించింది.

1492 పందిరి ల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కః

శాస్త్రంగారు కృషిచేసిన తెనుగు పొలం చాలా పెద్దది. గట్టుమీద నించుని కలయజూస్తే ఆ సస్యాభోగం కంటిని చెదరగొడుతుంది. ఆంధధంలో సర్వతోముఖమైన సారస్వతకృషి చేసి వాసికెక్కిన ప్రముఖులెందరో ఉన్నారు.

కాని, వారిమార్గం మార్గకవితానుకారి. వారు ఎంత నవిన సమస్య నెత్తుకొని వాస్తూన్నా వారి రచనల్లో అగ్గలమైన సాంస్కృతిక వాసన గుప్పుమనక తప్పదు.

ఇక, సుబహ్మణ్యశాస్తింగారు ఏది వ్రాసినా దేశిపథం పట్టిస్తారు. ఆయన నాటకాల్లో అఖండ రాజమర్యాదలతో విలసిల్లే తెలుగు రాజులూ, అతి “లౌక్యం” లో ముదరబండిన తెలుగు మంతతివృద్ధులూ, మాటలాడిన ప్రతిమాటనూ కావ్యంగా మెరిపించగల తెలుగు మహాకవులూ (ప్రత్యక్షమవుతారు.

కథల్లో, నిండు పాలకుండల్లాంటి ఆలుగు కుటుంబాలూ, కొత్త బంతిపూవుల్లాంటి పల్లెపడుచులూ కనిపిస్తారు.

వ్యాసాల్లో, వ్యాఖ్యానాల్లో, మాటపరువంతో నిశితతర్కం చూపే ఒక ఆంధ్ర మనిషి కనిపెస్తాడు. వెరసి - ఒక మాటలో చెప్పవలసి వస్తే - సుబహ్మణ్య శాస్త్రిగారి రచన అంతా తెనుగు జాతికి అంకితం. దీనికోసం ఆయన తన సంస్కృతాంధ్ర సంస్కారాన్నంతా ఒకొక్కప్పుడు మూటకట్టి ఒకచోట పెట్టి....ఎంత మట్టానికైనా దిగి తెనుగు వాతావరణం సృష్టించడంలో చరితార్జు లవుతారు.

ఆయన ఆంధ్రాభిమానానికితోడు 'ప్రశంసార్హ మైనది అసాధారణమైన అభ్యుదయదృష్టి. ఈనాడు భాషా, సంఘ, సంస్కారాల గురించి ఎవరు ఎట్లా మాటలాడినా పేలపిండి. శాస్త్రిగారు రచన చురుగ్గా చేసేనాటికి కత్తులబోను. భాషా సంస్కారం గురించి తలపెడితే చీల్చి చెండాడే వృద్ధపండితు లొకప్రక్క; సమాజ సంస్కారం గురించి ఎత్తితే నిప్పులు చెరిగే సనాతనవాదులు 'ర0డోపక్క. రెండు కక్ష్యలనూ ధిక్కరించి తాను నమ్మిన భావావళలిని రచనలద్వారా (ప్రచారం చెయ్యడంలో గుండెలు దీసిన బంటు శ్రీ శాస్తెంగారు.

స్త్రీ పునర్వివాహ విషయంలో వీరేశలింగం పంతులుగారి వాక్కు ప్రభుసమ్మతంగా హుంకరి స్తే...శాస్తింగారి కథలు కాంతాసమ్మతంగా తెలుగు

శ్రీ సుబ్రహ్మణ్య శాస్తింగారి షష్టిపూర్తి 1493 గుండెలను కరిగించివేశాయి. వితంతు దయనీయ స్థితిని లోకానికి ఇంతగట్టిగా వాదించి చెప్పిన వకీలు మరొకరు కనిపించరు.

చేసేచేసే గ్రాంథికాంధ్రరచనను విడిచి తెనుగు మనస్సులోనికి దూసుకు వెళ్ళ వాడుక భాషను పట్టుకున్నారు. (గ్రాంథికం మార్చి వ్యవహారికం చెయ్యవచ్చు. కాని యాయన వ్యావహారం వేరు. ఇంకొకరికి పట్టుబడదు. ఈయన రచన ఏదిచదివినా ఇది కనబడి పోతుంది!

శాస్తింగారి రచనల్లో ఒక పరమోద్దేశం స్పుటంగా కనబడుతుంది. హిందువుల ఆర్హమతం చాలా గొప్పదే. అయితే ఏంలాభం? అది శిథిలమూ, విషమమూ అయిపోయింది. దాన్ని అభిమానంతో కప్పితే ఏం లాభం? దాని కలరూపు స్పష్టంగా గుర్తించి ధైర్యంగా సంస్కరించాలి. ఈ భావప్రచారంకోసం అ(గజాతుల అహంకారాలూ, మాలిన్యాలూ, అన్యమతమాత్సర్యాలూ, సోమరితనం, స్త్రీల పతనం వస్తువులుగా తీసుకుని పరశ్శతంగా రచనలు సాగించారు.

శాస్తింగారి రచనలు రెండు విధాలుగా విభజించవచ్చును.

  1. ప్రగతిశీల రచనములు

  2. రసైక రచనములు, అని.

ఒక సిద్ధాంతం ప్రచారం చెయ్యడానికి రమణీయ సన్నివేశాలు కల్పించి చేసిన రచనలు మొదటి తరగతివి.

ఉన్న విచ్శిత సంవిధానాలను, వింత కథలనూ ఉపయోగించుకొని (ప్రజ్ఞతో కావ్యత్వ సిద్ధిని పొందించిన రచనలు రెండవ (గేణికి చెందుతాయి. శాస్తింగారు యీ రెండు విధాలైన రచనలూ సమృద్ధిగానే చేశారు.

  1. మార్గదర్శి 2. మొదటి దాడి 3. పెల్లాడ దగ్గ మొగాడేడే 4. తాపి మేస్తి9
  2. తల్లిపాణం 6. ఇల్లాంటి తవ్వాయి వచ్చిపడితే మొదలైన కథ లనేకం తొలి జాతివి.

రాజరాజు, నిగళబంధనం, కలంపోటు మొదలైన నాటకాలూ, వడ్డగింజలు, యావజ్జీవం హోష్యామి, ఇల్లుబట్టిన....ఆడపడుచు, గులాబీ అత్తరువూ మొదలైన కథానికలూ ర0డవజాతికి చెందినవి.

1494 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము పె

శాస్త్రిగారి రచనలమాట తలపెల్టేసరికి మొట్టమొదట చిన్నకథలు జ్ఞాపకం వస్తాయి. ఎన్నాళ్ళకిందట చదివినా ఆ కథల్లోని సన్నివేశాలూ, పాత్రలూ, అన్నింటినీ మించిన కథ చెప్పే ఒడుపూ మనస్సులోనుంచి చెరిగి పోదు.

వడ్డగింజల్లో తంగిరాల శంకరప్పగారినీ, దివాంజీగారినీ తెలుగు పాఠకులు మరచిపోగలరని నే ననుకోలేను.

“ఇల్లుబట్టిన...ఆడబడుచు" కథలో ఒక సాధారణ బబాహ్మణ కుటుంబ సన్నివేశం ఎంత నేర్పుగా చిత్రించారో, వడ్డగింజల్లో గంభీరమైన ఒక తెనుగు దివాణాన్ని అంత లోకజ్జ్ఞతతో వర్ణించారు. ఈ రచనలో శాస్త్రిగారి రచనా సౌందర్యం “పరిణత 'ప్రజ్ఞస్యవాణీ మియామ్‌"” అన్నట్టుంది. దాన్ని ఇంకా వివరించడానికి ఈ సంకుచితస్థలం చాలదు.

సరిగ్గా ఇదే రంగస్థలంమీద గులాబీ అత్తరుతో షుకురల్లీ కనిపించి, “ఇదేనా తెనుగు జాతి రసికత” అని ఎ(రని కళ్లతో అడుగుతూ ఉంటే మన తెల్లని కళ్లు చెమ్మగిలుతూ ఉంటాయి.

మార్గదర్శి అంతా ఒక ఉపన్యాసం. కాని విసుగు పుట్టించదు. అందులో కొన్ని కథలు చరచర పరుగెత్తుతాయి. ఇందులోని టెక్నిక్‌ చిత్రమైనది. ఉద్యోగం పేరిట బానిసతనానికి ఎగబడే బ్రాహ్హాణ యువకుల భావరుజకు ఈ రచన సంజీవిగా పనిచేస్తుంది.

“శభికేశిర ఆరోహ అనేది ఒక చురుకైన “శటైరో. అచ్చపు తెనుగు కుటుంబంలో అతకని ఉత్తర హిందూ నాగరికతా వ్యామోహాన్ని చమత్కారంగా నిరూపించి చాలా మంది ఆంధ్రయువకుల భావదాస్యాన్ని హేళన చేశారు ఇందులో. అంతేగాదు

  • శాస్త్రంగారికి హిందీభాషమీద ఉండే సదభ్మిపాయం కూడా దీనిలో తొంగిచూస్తూ కనబడుతుంది.

తల్లప్రాణం ఒక మంచికథ. టీకప్పులో తుఫాను అన్నట్టు ఒక బాహ్మణ కుటుంబంలోని భావ సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. శిధిలమైన సనాతనాచారానికి ఒక ముసలి వితంతువు ప్రతినిధి. పొంగివచ్చే సంస్కార వాహినికి ఒక ప్రోడ తనుగు ఇల్లాలు ఆలంబం. మధ్య నిస్సృహాయుడైన యజమాని యొక్క సంశయాత్మ,

శ్రీ సుబహ్మణ్య శాస్తింగారి షష్టిపూర్తి 1495 ఫలితం - మొదటిదాన్ని రెండవది అణచివేసి నెగ్గుతుంది. ఇది శాస్తింగారికే గాదు, ఆంధ్రపాఠకు లందరికీ అభిమానరచనే అనుకుంటాను. ఇట్లాంటి వందలకొలదీ రసవత్కథానికలే కాకుండా ఈయన నవలలు కూడా అనేకం వ్రాశారు. రక్షాబంధనం మొదలైనవి అపరాధ పరిశోధకములు. వీటిలో గూడా ఈ రచయిత మేలికత కనబడుతుంది. వంగ అపరాధ కథలతో నిండిన తెలుగు పాఠకులకు ఊరటగా - తెలుగు జీవితంలోనుంచి అట్టి కథలు కల్పించి ప్రజాదరణ సంపాదించారు.

ఆత్మబలి - శాస్త్రిగారు ఇటీవల రచించిన నవల. వయసువచ్చిన కొడుకును కులపారుష చిహ్నంగా యుద్ధానికి పంపిన ఒక కాపుయువతి ముమ్మరమైన యౌవనపు పొంగును ఆపుకోలేక నరకానికి జారిపోతూ చట్టున నిలదొక్కుకుని కొడుకు ప్రతిష్టకోసం అతని సుఖం కోసం తన అనుభూతిని బలివేసుకుంటుంది. ఈ పతనోతృతనాలలో రచయిత చూపిన కౌశలం సాటిలేనిది.

నాటకాల్లో “రాజరాజు శాస్త్రిగారి కీర్తి పతాక అని చెప్పవచ్చు. గ్రాంధికాభిమాని స్వర్గీయ జయప్పురాధీశుణ్ణి గూడా ఆకర్షించి ఆనందపెట్టినదంటబే ఈ నాటకంయొుక్క ఉదాత్తత ఊహించవచ్చు.

అనేకులు “సారంగధరలు” రాశారు. కాని వాటిలోని రాజరాజు పూసలకోటుతో వట్టి నాటకం రాజుగా కనిపిస్తాడు గాని యావదాంధ భూమిని ఏకచ్చత్రంగా పాలించిన చాళుక్య ,పభువుగా కాన్బించడు. ఇక ఆ నాటకాల్లో నన్నయకు నామరూపాలే లెవు. అట్టి కథ తీసుకుని ఇంద్రజాలం చేసినట్టు సజీవమైన ఆంధ్ర రాజ్య వాతావరణం సృష్టించి గంభీర చాళుక్య రాజరాజును, రాజనీతిలో పండిపోయిన తెనుగు మంతత్రివృద్ధులనూ, మాటలతో బంతులాడే భృత్యవర్గాన్నీ (ప్రదర్శించారు.

ఇందులోని నన్నయ మహాకవి సృష్టి అపూర్వం. ఈ నాటక ముకాహారానికి మేరుమణి నన్నయ. ఇతడు కులబ్రాహ్మణుడు మాత్రమే అనుకునే అల్ప్బజ్ఞ్జులకు కూలంకష లోకజ్జుడు కూడాను అని స్ఫుటంగా శాస్త్రిగారు తమ నాటకంలో నిరూపించారు.

భారత రచన అరణ్యపర్వంలో ఆగిపోవడానికీ, కోడలుకాదగిన చిత్రాంగిని రాజరాజు వరించడానికీ ఈయన చేసిన వ్యాఖ్యానం అద్భుతమైనది. అధర్మ పరిధిలో భారతాంధ్రీకరణం చెయ్యలేడు నన్నయ మహర్షి.

1496 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తన భోగం కోసం అన్యాయంగా కొడుకు యౌవనం అడిగి పుచ్చుకున్న యయాతివంశస్థుడు రాజరాజు. ఎంత ఉజ్జ్వల కల్పన!

కలంపోటు - ఒక ఏకాంక రూపిక.

ఈ రచనచేసిన శాస్తింగారిలో - ఇప్పటి వారి పరిభాషలో - ఒక అభ్యుదయకవి దాగి ఉన్నాడు. తిమ్మన పారిజాతాపహరణం గురించి చెప్పుకునే ఒక దంతకథ దీనికి ఆధారం. దాన్ని కవి అన్నవాని (ప్రజ్ఞాపారమ్యానికి నిదర్శనంగా చేసి శక్తిమంతంగా నడిపారు.

పారిజాత... రచనలో మునిగితేలే తిమ్మకవిగారికి మహామంత్రి తిమ్మరుసు కొట్టిన దెబ్బ నసాళం అంటింది. “నే నిప్పుడొక రాచకార్యంలో పడి కొట్టుకుంటున్నాను... ఈ స్థితిలో వాజ్బయవిషయం...అందులో శృంగార కవిత్వ...” అనే సన్నాయి నొక్కులతో తిమ్మకవిగారికి గొంతు నొక్కినంతపని అయింది. ఈ చీజావాపంతో శాస్త్రిగారు కథకు వేగం కల్పించి, తిరుమలదేవి దాసి మంగ ప్రసంగంతో తిమ్మకవికి తహతహ లెత్తించి, అతని గంటాన్ని అనేక యుద్ధాల్లో ఆరియుతేరిన కర్ణాట సార్వభౌముని మీద మోపెట్టి ఓడించి రసవంతమైన పరిసమాప్తి నిచ్చారు.

రాయల సభలోని సాహిత్య చర్చాసౌరభం ఈ చిన్న నాటికలో అనుభూతమై

తత్పింయావులను ఎన్నటికీ విడువదు.

అయితే ఒక్కమాట - అభిజ్జులైన నటులూ, రసజ్జులైన (ప్రేక్షకులూ వచ్చేదాకా తెనుగు రంగంమీద ఇట్టి నాటకాల ప్రదర్శనం చూచే యోగ్యత మనకు లేదు.

శీ

రచయితలకు సాధ్యంకాని ఒక అసాధారణ సాహిత్యసంస్థ నడుపుతున్నారు శాస్త్రిగారు. దానిపేరే కలాభివర్థనీపరిషత్తు. చాలా రోజులు ఈ పేరు సుబహ్మణ్య శాస్త్రిగారి పుస్తకాల అట్టలమీద మాత్రమే కనబడుతూ ఉండేది. ఉండి ఉండి ఒక్కసారిగా కల నిజమైనట్టు ఇది బలిష్టంగా ప్రత్యక్షమయింది. పేరుపడిన ఎందరో రచయితలు కలాభివర్ధని పిలుపుతో వచ్చి అసాధారణ గౌరవమంది జాంబూనదాంబరంబులు గ్రహించి ఉత్సాహ తరంగితంగా ఉపన్యాసా లివ్వడం,

శ్రీ సుబ్రహ్మణ్య శాస్తింగారి షష్టిపూర్తి 1497 కావ్యగానం చెయ్యడం జరుగుతున్నది. ఈ సమావేశాలకు నాయకమణులు నన్నయ్య శ్రీనాథ జయంతులు. వీటి అన్నిటి వెనకా ప్రబలమైన (పేరకశక్తి శ్రీ శాస్తింగారు. వీరికి సాహితీ ప్రియులైన రాజమహేంద్రవర పౌరులు ఆలంబనం. భేష్‌. “మణినా వలయః వలయేన మణిః” మొత్తంమీద - శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సాహిత్య వ్యాసంగం గురించి ఒక చిన్న వ్యాసంలో చెప్పడం సాహసికమైన పని. వారి అన్నిరచనల గురించీ సమ పరిశీలన చెయ్యవలెనంటే ఒక (గ్రంథం వాయడం అవసరం. నాకన్న సమర్థులు ఆపనికి అర్హులనుకుంటాను. ఇంతకూ - శాస్త్రిగారు షష్టి పూరితవయస్కులే కాకుండా సాహిత్య శతవృద్ధులు గూడా అయి మాకు మార్గదర్శి కావాలని కాంక్షిస్తున్నాము. (కిన్నెర: సంపుటము ౨3, సంచిక 5, మే 1951) 11|||//// [ యువా షన! సఈ/ ప్రై (47/11)

త్‌ అట్లీ మయ్కావన్క: విప్పవ కవి లూ క.వి.రమణా రెడ్డి

ఈ వ్యాసకర్తగా నా పేరు వుండడం నాకు యిష్టంలేదు. కారణం, చాల వ్యాసాలసార సంగ్రహమే యీ వ్యాసంగా పరిణమించింది. అయినప్పటికి, యీ వ్యాసాలను నేను చదివి, ఏరి, తీసి, కూర్చి, ఏకవ్యాసరూప మిచ్చినాను కనుక, పూచీ నాది కనుక నా పేరుంచడములో దుశ్చేష్ట లేదు. ం

క్షే

“పెంగ్విన్‌ న్యూ టింగు” అనే పటిక పాతప్రతిలో [12౫72%0౪910/ : ౧౦౪౬౦1 ౧౪9518 అనే వ్యాసం చూశాను. కాని దురదృష్టవశాత్తున, యీ వ్యాసపు తొలిపుట చిరిగిపోయి వుండినందుచేత, వ్యాసకర్త యెవరో నాకు తెలియదు. ఫెంచి మహాకవి ఆరగన్‌భార్య రష్యాదేశపు కన్య అయినట్టూ, ఆమెకు చిన్నతనాన మయ్యావస్కితో చాల దగ్గర పరిచయ ముండినట్లూ, ఆమె పై పత్రికలో ఒక వ్యాసం రాసినట్లూ, మిత్రులు చెప్పగా విని, ఎల్స్ఫ్బా ఆరగాన్‌ అన్నఆవిడే యీ వ్యాసకర్త అనుకుంటున్నాను; కాకపోయినా ఫర్యాలేదు. ఎలాగైనా యీకింద ఆ వ్యాస సం[గ్రహమిస్తున్నాను: .

“1911 సంవత్సరానికి మునుపే మయ్కావస్కీ కవిత్వ రచన మొదలు పెట్టినప్పటికి, దానితో అసంతృప్తి పడి, నిరాశచెంది, చితకళారాధనకు వుప[క్రమించాడు. ఇది కూడ సరిగా సాగలేదు. “రంధ్రాన్వేషణ చిక్కులు తచ్చిపెట్టడమూ” అనే చేష్టలు చేసినందుచేత, 1914లో లలితకళా పాఠశాలనుంచి వ. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

మయ్యావస్కీ: విప్లవ కవి కెవిరమణాలెట్దీ 1499 గెంటివేశారు. పాగరుబోతుతనానికి, దురుసుబిరుసుతనానికీ మయ్యావస్కీ పర్యాయపదమా, అనిపించేది. బ్రహ్మాండమయిన ఆకృతి - దీనిని మనము అందుకొని, దీని రహస్యాలు తెలిసికోగలమా అనిపించేది.

“మాయింటికి తరచు వచ్చే వాడుక. “వస్తు విప్లవం” అనే పెద్ద పాటను ఆ నడుమనే అమ్మి వున్నాడేమో. నాలుగు రూకలు చేతబడేసరికి, బెల్జూ గిల్టూ లేని, మోకాళ్ళు దగ్గరకయినా రాని పసుపుపచ్చలాగు ఒకటి కుట్టించుకున్నాడు. ఒక హేటు, ఓవరు కోటూ, చేతికర్రా - యివి ముస్తాబుకు పూర్ణత నిచ్చేవి. వీథులవెంట యీ విచిత పురుషుడు చూసిన వాళ్ళకు విభమం కలిగించి, మా యింటిలోకి వచ్చాడంటే, మా వంటపిల్లకూడ నివ్వెరపోయేది. ఒక్కొక్కప్పుడు అతను వచ్చేవేళకు నేను యింట లేకపోవడము చూసి, పుస్తకపు పుటంత వెడల్పాటి కాగితమ్మీద పొడుగుతా పసుపురంగులో అచ్చుకొట్టిన విజిటింగ్‌ కార్డు వుంచిపోతూ వుంటే చూసిన మా అమ్మ, నవ్వులాటకు అతని నాపి, “యిదిగోనోయి నీ సెన్‌బోర్టు, మరచిపోయావే, మా మంచి వాడవే”, ననేది.

“నన్ను (ప్రేమించేవాడు. ఎక్కువ మూకీభావం వహించడము అలవాటయినా, అప్పుడప్పుడు పద్యం చదువుతున్నంత వడిగా, పదాలు దొర్లించేవాడు. అప్పటికి ఇతను కవి అనికూడ నాకు తెలియదు. పియానో వాయించవుని, వాయిస్తున్నంతసేపూ నా వీపు వెనక చేరి, అదేదోగా తనలో తనే మాటాడుకునేవాడు. ఆ పిమ్మట యేడాదికి కాబోలు, మాస్కో పరిసర గ్రామంలో వేసవి సాయంకాలంవేళ, అతని నోటివెంబడి పద్యధార వినబడింది! నే నిక్కడ వుదహరించలేనంతటి భావోన్మాదంతోటి, వు(దేక నిర్భరత్వంతోటి, ఏ అనువాదమూ మూలానికి సరిపోనంతటి ఏకధార! కవిత్వమంటే చెవికోసుకునేదాన్ని - నా వయసు పిల్లలు పక్కలలో మగబొమ్మలు పెట్టుకుని నిదరబోతుంటే, నా పక్కమీద మట్టుకు పుష్కిన్‌[గంథం కాని, వెర్మన్‌టావు రచన గాని వుండేది. క్షీణకవుల రచనలు నేను ముట్టుకోలేదు: చిహ్నవాదులు (9/౧౧౦౦159) అయిన అలెగ్జాండర్‌ బ్లాక్‌ వంటి గొప్ప కవులని పేరు స్థిరపరచుకున్నవారి ప్రభావం మాత్రం మీదప్రసరించక మునుపే, మేము పదిబారలు ముందుకు దూకాము. మా కప్పుడు కావలసింది

, కొంగ్రొత్త భూకంపం; దాని పురుషమూర్తియే మయ్యావస్కీ. విజయ దీక్త అచంచల మనోసంకల్పం, సహిష్టుత - ఈ లక్షణాలతోటి సోవియట్ల వసంతంలో వికసించిన

1500 పందిరి షుల్లికార్డునరావ్యు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మండే నెత్తురుల యువకశక్తికి రూపు రేఖలు తీర్చి దిద్దింది మయ్యావస్కీ కవిత్వం. ఒక్క పద్యభాగాన్ని కూడ కంఠస్థం చేయలేని నేను, మయ్యావస్కీ కవిత్వాన్ని క్షుణ్ణంగా వర్ణించ కలిగాను.

“అతని కవిత్వం జటిలవుని, అర్థంకాదని అన్నారు కొందరు. కాని ఇప్పుడయితే, ఇంత సులభగ్రాహ్య మైనది మరి వుండదని అంటారు. పంక్తిని యెక్కడంటే అక్కడ విరగగొట్టడ మేమిటి, అపూర్వ విచిత్రాలయిన కొత్త పదాలను కల్పించడ మేమిటి, అడ్డు దోవలు తీయడ మేమిటి, అతిక్షుప్తీకరణ లేమిటి - పాఠకుడు మెదడు నుపయోగించ నిష్టపడని సోమరిదినాలలో - ఈ కవిత్వం అర్థంకాదనిపించేది. అయినప్పటికీ, తనగీతాలతోబాటు, వాట్‌ తాళపు చెవినికూడ మయ్యావస్కీ యిచ్చేపోయాడు: అతని కవిత్వమంతా బిగ్గరగా చదివితేనే లోబడుతుంది! ఎలా చదవాలోకూడ అతనే చూపించాడు వేలాది సమావేశాలలో. దావాగ్నివలె విశాల సోవియట్‌ భూతలంలో మయ్మావస్కీ కవిత రేగిపోయింది.

“సభావేదిక ఆక్రమించుకున్న స్థానాన్ని గ్రంథం తొలగించలేదు. అధికార గర్వదాయకమయిన స్థానంలో వుండిన రోజులలో వ్రాత పుస్తకాన్నయితే అలా చేసిందికాని, [గంథం సభావేదికను నిర్మూలించలేదు. సభావేదిక వ్యాప్తి నిరవరోధమూ, నిరవధికమూ. కళ్లను అప్పచెప్పి చేసే కవిత్వ పఠన మిక ఏమాత్రమూ పొసగదు. విప్లవ ఫలితంగా, శ్రవ్య కవిత్వపు అవసరం హెచ్చింది. పుష్కిన్‌దానివలె, కవిత్వ పఠన యేకొందరి గుత్తోకాదు ఈనాడు; ప్రపంచమంతా ఈనాడు కవిత్వాన్ని వినవచ్చు”

“శోతలలో యొందరు గ్రహిస్తే, కవిత్య్వవమంత ఫలాధికమవుతుందని మయ్యావస్కీ అభిప్రాయపడినాడు. శ్రోతలను “ముట్టడించి” వారితో చెల్లాటలాడి, విసిగించి, కోపింపచేసి, తన్నుకొని పోదలచుకున్న చోటికి వారిని చేర్చుకలిగే కళ, నాకు తెలిసినంతమట్టుకు, మయ్యావస్కీకి చేతనయినట్టు, అనితరసాధ్యం. చర్చీ సంగీత ధ్య్వనివాహిని మోస్తరు ప్రతిధ్వనించే, ప్రచారకుడయిన ఆతని పాటల వుదదేకంతో జనం ప్రకంపమానమై పోయేది. "

“1913-14లో, యెప్పుడయినా పత్రికలు మయ్యావస్కీ పేరెత్తినట్లయితే, అది అవమానించేందుకు తప్ప, మరందుకూ కాదు. 1914లో అపహాస్యమనే వికట రచనల పతికకు వరుసగా రచనలు పంపేవాడు. ఆ యేడాదిలోనే గోర్కీకి

మయ్యావస్కీ: విప్లవ కవి కెవిరమణారెడ్డ 1501 7౧6 010౪6 1౧ 770056 అనే గీతికను చదివి వినిపించాడు. సంతోషంతో గోర్కీ కన్నీళ్లు రాల్బాడు. ౧౦061 & 819 ౧064 అన్నాడు; ౧6 ౪|| ౪౧18 0౦౦౮ ౧౦౪1౧౫/ గ౧6&| ౧౦61౫ అన్నాడు. 1915లో గోర్కీ ఆధ్వర్యాన “లిటాపిన్‌” అనే పరిశీలనాత్మకమయిన పథతికలో వరసగా మయ్యావస్కీ రచనలను ముదించుకున్నాడు; దీనితో అక్షర ప్రపంచంలో మయ్యావస్కీ అనేవాడు తలయెత్తాడు. 1916లో పెట్రోగ్రాడ్‌ నగరంలో /2౯4౧6 ౧62౦8 అనే కావ్యం మయ్యావస్కీ వినిపిస్తుంటే, పియానోమీద తలాన్ని వెక్కివెక్కి యేడ్చిన విక్టర్‌ చొల్కావస్కీ అనుభవించిన వృ[దేకం శోతలందరూ అనుభవించారు. పంక్తి మొదట ఢంకా కొట్టినట్లుండేది; పంక్తి సాగేకొద్దికీ యిది రణరంగమా అనిపించేది; భయంకరవుయిన నిశ్శబ్దం - నిశ్శబ్దంలోపల స్మకమమయిన ఛందోగతితో పదపాదధ్వని, నిరాశా, నిట్టూర్పులూ - అన్నీ వినకలిగినప్పుడు, గుండెలు విడిపోతున్నట్లు వణకిపోయేవాళ్ళం.

“క్రీర్ణి అనే నిచ్చెనలో మయ్యావస్కీ కింది కట్టుమీదినుంచి పెకి వెళ్ళకమునుపే నేను రష్యాను విడువవలసి వచ్చింది. తిరిగి 1925లో మాస్కోకు వెళ్ళినప్పుడు, యీ ఆరోహణ పూర్తి అయింది. దారిని పోయే వాళ్లకు, బళ్ళవాళ్ళకు మయ్కావస్కీ యొరిగిన ముఖమైపోయాడు; “నా పేరు చెప్పనవసరం లేకుండానే గుడ్‌-డే, అని అభివాదం చేస్తాడు ఒడెస్సా నౌకాశయపు పనిమనిషి; అంతా క్రేమమా, అని పరామర్శ చేసేబదులు, నీ లెనిన్‌ పుస్తకం వెల తగ్గంచమని ప్రకాశకులతో చెప్పవయ్యా, అని సలహా యిస్తాడు. కాని సాహిత్యరంగంలో అప్పటికీ యుద్ధత్మీవత తగ్గిపోలేడు. “సౌొందర్యవాదులు నామీద శాపాలు కురిపిస్తున్నారు. 61046 1 706563 వంటి అందమయిన గీతాలు రాయడంమాని, ఇటువంటి స్వల్పవిషయాలు చిత్రిస్తున్నావు అంటున్నారు. కాని సమకాలిక వస్తువేదయినప్పటికి దానిని నేను (గహిస్తాను - భూఖామందులుగాని, పాఠశాలలుగాని, గోస్టార్లువారి చిట్టాలుకతోళ్ళ తయారీగాని, ఎదయితేనేమి, అర్థవంతమయిన (ప్రతిదాన్నీ నేను (గహిస్తాను. అని, అనిన విధంగానే చేశాడు. 1919-22లో ఒకవైపు 150 మిలియన్లు, | [0౪6 వంటి గీతికావ్యాలు వ్రాస్తూ మరోవైపు గ0౪[5[00 ౯౯0౧15* గురించి కృషి చేసేవాడు;

  • ౧051 5000-5౧0015. 1917 సోవియల్‌ విప్లవం పేమ్మట, విరోధి పెట్టుబడి రాజ్యాలు ఆంతర్వుద్ధాలు

అందుకోగా. ఇత్రకారులు బొమ్ములువేసి ప్రదర్శించేవారు.

1502 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “150 మిలియన్ల ప్రజల అవసరానికి అనువుగా కొద్దిమంది చిత్రకారులు గం51 5౧00-70౧5 మీద కృషి సాగిస్తున్నారు. టెలిగ్రాఫ్‌వార్తలు వెనువెంటనే తయారై, రంగానికి పోకముందు సెనికులు యీ బొమ్మలు చూసి, యీ పాటల వ్యాఖ్యలు చూసి, ఉత్సాహులవుతారు. 1923లో ఒకవైపు 0/7౧18 అనే గొప్ప ప్రణయగీతం రాస్తూ, ప్రభుత్వ పరిశమల (ప్రచారంకోసం, ప్రభుత్వకార్యాలయాలు కోరిన చిత్రపటాలకోసం చాల కృషించేవాడు.

“అతని జీవితం తీర్థయాత్ర - అతని ననుసరించినవారు అసంఖ్యాకులు - వారి గుండెలలో తలలెత్తిన వుదదేకాలు నిబ్బరాలు. 1922లోనే మయ్యావస్కీ ప్రతిభను లెనిన్‌ గుర్తంచాడు; “నిన్న ఇజ్వెస్తియా పత్రిక చూస్తూవుండగా, మయ్యావస్కీ రాసిన రాజకీయాత్మక వ్యంగ్య గేయం చదివినతర్వాత కలిగిన సంతోషం, యిటీవల నే నెప్పుడూ అనుభవించాను కాను. కమ్యూనిస్టుల సమావేశప్రీతిని అపహసించే యీ గేయం నికాల్తీ సత్యచిత్రణ, “సోవియటు యుగానికంతటికీ గొప్ప కవి...అతని స్మృతిని లక్ష్యం చేయకపోవడం గొప్ప తప్పిదం” అని స్టాలిన్‌ అన్నాడు. “తొలిరోజులలో కాగితమ్మీద గేయం రాసిపెట్టక, లోలోపలే పరిపక్క్యమయేంతవరకూ మథించేవాడు. 1500 పంక్తుల గీతాన్ని అనేకసార్లు నిర్మించి, ప్రతి మార్పు పూర్తిపాఠలమూ వర్ణించకలిగేవాడు. అప్పుడప్పుడు అతనికి స్ఫురించిన పదాలను, చరణాలను వేరే రాసివుంచుకునేవాడు. అంతుకుముందు వాడుకలోలేని అంత్యానుప్రాసలను కల్పించాడు. కనుకనే అతని రచనలు అనువదించేవాడు సమాన ప్రతిభాన్వితుడై వుండాలి"

2

సోవియట్‌ విప్లవం “నా విప్లవం” అనకలిగిన మయ్యావస్కీ “దుఃఖపర్వ్యతాల కావల” “అగణ్య సిరిసంపదలతో మెరిసేభూమి"ని చూడకలిగాడు. సాంస్కృతిక యుద్ధరంగప్పు మొగుదల నిలిచి, పూర్వ సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరించవలెననే ముసుగులోపల ఆపూర్వ ఫలాధికమయిన సోవియట్‌ యథార్థాన్ని మరుగుచేసే, బూర్జువా మేధావుల కాపట్యాన్ని వెలికీడ్చాడు. వీరిని తదేకంగా యొదిరించడంలో మయ్యావస్కీ పొరపాటున పడ్డాడు; ఏమున్నది గతసంస్కృతిలో, అని మానవులు గతచరిత్రలో సాధించిన మహత్తర విజయాలను

మయ్యావస్కీ: విప్లవ కవి కెవి.రమణారెడ్డ 1503 నిర్లక్ష్యం చేశాడు. భవిష్యత్తుమీదనే యెక్కువ ఆశలు పెట్టుకొని, భూతవర్తమానాలను విస్మరించిన యీ అతివాదానికి ౯౪౮౪|9గ౫ అనిపేరు; ఇదేరకమయిన మరొక వాదాన్ని ౦16141 అనేవారు. కాని మార్కుతత్వము ననుసరిస్తే యీ పొరపాటు కలిగి వుండేదిగాదు. కారణ మేమంటే, వారు వర్తమానాన్ని యెంత గౌరవిస్తారో, భవిష్యత్తుకోసం అంత పురుష ప్రయత్నం చేస్తారు; గత చరిత్రను అంత వివక్షంగా పరిశీలించి, గతమున వున్న మంచిని సమాదరిస్తారు - గతాన్ని గౌరవించనివాడు చరిత ద్వేషి - నియంత అయివుంటాడు; వర్తమానాన్ని గౌరవించని వాడు కార్యభీరువు - ఆదర్శవాది అయివుంటాడు; భవిష్యాన్ని గౌరవించనివాడు అభ్యుదయ విరోధి - విజ్ఞాన శాస్త్రద్వేషి అయివుంటాడు. మయ్కావస్కీ చేసిన పొరపాటును గోర్కి యొత్తిచూపి మందలించాడు. ఈ మందలింపు [01455౧ మీద వచ్చిన కొన్ని విమర్శలు చూసి, దేశాంతర “ప్రజాస్వామిక” వాదులు - సోవియట్‌ దేశంలో రచనా స్వాతంత్య్యం లేదన్నారు; విశ్స్చ్శంఖలమయిన కళను పరిధులమధ్య నిలపడానికి సోవియట్‌ పప్రభుత్వంచేసిన దుష్కార్యాన్ని చూసి, మనసు విరిగి, మయ్యావస్కీ ఆత్మహత్య చేసికున్నాడని నిరాధారమయిన వదంతులు లేపారు - ఎద్దు యీనిందంటే దూడను గాట కట్టివెయ్యమన్నట్టు. కాని లెనిన్‌ - మార్కుల ఆర్థిక శాస్త్ర బలిమిచే సృష్టింపబడిన ఒక సురుచిర సుందర వ్యవస్థ, ప్రవర్ధ్గమానం కావాలంటే వారి వైజ్ఞానిక శాస్త్ర బలిమిని వూతగొనాలి. లెనిన్‌ యిలా అన్నాడు: “2000 సంవత్సరాల మానవ గత చరిత్రకు వారసులయిన కృషి జీవులు" యీచరిత్రను మించిన చరిత్రను నిర్మించ కలగాలంటే, దానినుంచి (గ్రహించాలి. చరిత్ర సరళరేఖ కాకపోయినప్పటికి దారపువుండ అని చెప్పవచ్చు.

లెనిన్‌ బోధచేత తప్పు సర్దుకొని, మైగా రష్యన్‌ పురాజానపదరీతులను, విశిష్ట సాంప్రదాయాలను కలుపుకుని నూతన చారిత్రక వాస్తవమయిన సోవియట్‌ రాజ్యాంగాన్ని కిమ్మీర వర్జాంకితమయిన తన కవనంలో అపూర్వ మనన్యసాధ్య చిత్రణ చేశాడు. అతని దృష్టినుంచి యే ఒక అంతర్జాతీయ సంఘటన కూడ తప్పితారిపోయేది కాదు. ఒక చెంపను సోవియటుసమాఖ్య మహదవతరణముతో కన్నుగుట్టి జేంకిన్‌, రేంగల్‌ ముఠాలను రేపి, అంతర్యుద్ధాలు పోరాడిస్తూనే, మరోచెంపను వోల్గా తీరంలో సంఘటిల్లిన క్షామబాధితులకు అవసర సహాయ మంపాలని వుపన్యాసాలు దంచుతుండిన కపట తంత్రజ్ఞులయిన బూర్జువా

1504 పందిరి మల్లికార్జునరావు శతజయంతి " నంపుటము. 4: సాహిత్యము దేశనాయకుల దుమ్మెత్తిపోశాడు. ఎప్పుడో ప్రజానుమతిలేని జార్‌చక్రవర్తి తీసుకున్న అప్పు, జార్‌ శత్రువయిన సోవియట్‌ ప్రభుత్వం చెల్లించాలని 1922లో జినోవా సమావేశంలో వాదించిన పుండాకోరుల మోసాన్ని బయటపెట్టాడు.

1924లో లెనిన్‌ చనిపోయాడు - మయ్యావస్కీ కళ్ళముందరి దీపం ఆరిపోయింది. లెనిన్‌ జనం, జనం లెనిన్‌, మనం లెనిన్‌, లెనిన్‌ మనం అనే యేకీభావాన్ని సూచించాడు. లెనిన్‌ జీవితచరిత్ర, పార్టీజీవితమూ, సోషలిస్టు విప్లవ[క్రమమూ ఒకటేనన్నాడు. “ఈ గీతాన్నిగురించి చాల భయపడ్డాను. అతి సాధారణమయిన రాజకీయాత్మక కవిత్వమవుతుందేమోనని;? సంఘటనలు జరిగిన వెంటనే దానిని గురించి కవిత్వం రాస్తే, అది వుత్తమ కవిత్వంగా వుండదని, అర్జెంటు కవిత్వమవుతుందని కవికి “దృష్టి వైశాల్యముండా” లని శుద్ధకళావాదులు వాదించారు; అంభే, లెనిన్‌ మూర్తికి సరిగా కళావ్రతిబింబం రావాలంటే, సంవత్సరాల వ్యవధి అవసరమని వారి అఖ్మిపాయం. కాని, "

"ఆదేశిస్తున్నది హృదయము -

నిర్దేశిస్తున్నది విధి -

తప్పదు - వ్రాయక - "

తప్పదు

నాయకుడుగా, సాధారణవ్య క్తిగా లెనిన్ను మయ్యావస్కీ చిత్రించినట్లు యింతవరకు యెవరూ చేయలేదు. ఈ మహాగీతంలో కొన్ని పంక్తులు యెంతో క్లుప్తంగానూ, నిజాన్ని నిలువునా చెప్పేవిగానూ వుంటాయి.

“లెనిన్‌ నేడు లేడూ ? చూడు

జనంలో ఉన్నాడు

లెనిన్‌ వేడి లనిన్‌ నాడి

జగం నాడి, ధమని .

లెనిన్‌ శాంతి లెనిన్‌ కాంతి

లెనిన్‌ మనకు ద్యుమణి .

క్యామేడ్‌ లెనిన్‌ ఛత్రం (పేమ

స్నామాజ్యానికి చిహ్నం .

మయ్యావస్కీ: విప్లవ కవి కవిరమణారెడ 1505 క్యామేడ్‌ లెనిన్‌ క్షాత్రం శాత్రవ దుర్మార్గాల లవిత్రం లెనిన్‌ పరాకాష్ట లెనిన్‌ లెనిన్‌ మన పరాక్రమం క్యామేడ్‌ లెనిన్‌ ఆయుధం మన అసరా మన జ్ఞానం లెనిన్‌ దృష్టి లెనిన్‌ సృష్టి లెనిన్‌ మన నిధానం లెనిన్‌ లెనిన్‌ లెనిన్‌ లెనిన్‌ అనిన్‌ మన ప్రమాణం 'లనిన్‌ మనం మనం లెనిన్‌ లనిన్‌ మన ప్రయాణం నీలో నాలో నీతో నాతో లెనిన్‌ మహా ప్రవాహం...” (శ్రీశ్రీ గారి ధారాకానువాదం; విశాలాంధ్ర) “పార్టీ లెనిన్‌ కవలలు చరిత్రవాది తల్లి - ఆమెది నిష్పాక్షిక (శ్రేమ! మనం లెనిన్‌ అంటే పార్టీ అని అర్థం - పార్టీ అని మనమంటే లనినని తాత్పర్యం[ కార్మి కవర్గమూ, కమ్యూనిస్టు (బోల్లివిక్‌) పార్టీ వేర్వేరుకావు - ఏకశిలనుంచి మలచినవేనని అంటూ, “వర్గపు వెన్నెముక కార్మికవర్గపు వెన్నెముక పార్టీ - వర్గపు వెన్నెముక

1506 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము వాదపుు టనశ్వరత సమవాదపు టనశ్వరత పార్టీ - వర్గపు మేధస్సు వర్గవాద చిహ్నము వర్గపు దారుఢ్యము వర్గ ప్రతిష్ట! లనిన్‌ శాశ్వత శయ్యాగతుడయిన చోటికి “వరస్కాయా, మిత్రొవ్కా వీథుల వెలపానాొ పరుగులు తీస్తున్న అశేషటప్రజను, “నిజంగానే లెనిన్‌గారిని యింత (పేమిస్తుందా?” అని పరీక్ష చేసేందుకన్నట్లు, అసాధారణంగా గూడమంచు వ్యాపించిందట. ఆ పాడుదినాన సంఘటిల్లిన కాసింత విశేషాన్ని కూడ మయ్యావస్కీ మరచిపోలేదు. నిఖిల జాతివిలాపంతో విచలించిపోతూ, “ఈ సమాఖ్యలో భాగం నేనయి నందుకు సంతోషమవుతున్నది నాకు! స్వరం సముదాయికమే ఈ మా కన్నీళ్లున్నూ! అనేక సంవత్సరాల అనుభవాలు ముడిపెట్టిన వర్గఐక్యతకు మీదొక శుభతరం బలాధికం వేరే మరి లేదు!” “జీవితం నుంచి గహించి, జీవితానితో సరితూయగా నికరకమయిన కమ్యూనిస్టు _ పునర్నిర్మాణానంతరమయిన సజీవ వాస్తవ విషయాల యొడల, సాధారణ విషయాల యెడల, సార్థక విశేషాల యొడల" కళాకారులు శద్ద యితోధికంగా చూపాలని

మయ్యావస్కీ: విప్లవ కవి కెవి.రమణారెడి 1507 1919లో లెనిన్‌ ఆదేశించాడు. పునర్నిర్మాణకార్యాలలో భాగస్వామి అయితేనే తప్పు, లెనిన్‌ సూచించిన సోవియటు కళాశిఖరాలను అందుకోలేమని మయ్యావస్కీ గుర్తించాడు. సోవియటు భూమిలో పనిచేస్తున్న జనానికి, కార్మికవర్గ విప్లవ సమరాన్ని అనుగమించే “గొప్ప సంగీతమే” కవిత్వం. ఒక కళాసృష్టి యొక్క గుణాగుణ నిర్ణయంచేసే పడిగట్టురాయి, దానియెడల పఠితల అభిప్రాయమే. “నా గీతాన్ని అనేక కార్మికశ్రోతలకు వినిపించాను. వారి సానుభూతి నన్ను సంతోష పెట్టింది. ఈ గీతం వారికి అవసరం అయివుండాలని నేను అనుకున్నాను" అవసరం అనేదే పడిగట్టురాయి.

ఎటువంటి కళారీతులను వాడితే, చుట్టూ సంఘటిల్లుతూన్న మహాద్భుత కథను సక్రమంగా, సాకల్యంగా అంతే అద్భుతంతోటి చిత్రించగలను, అని మయ్యావస్కీ ఆలోచించిన మీదట, ప్రతిపదం మీద, ప్రతి పంక్తి మీద, ప్రతి భావప్రతిమమీద మయ్యావస్కీ చాల శద్ధ తీసుకున్నాడు. కత్తిఅంచుమీద నిలిచిన ప్రతి పదమూ, “లక్షవక్షాలను కదల్బదక్షమై” వుండాలని నిశ్చయించాడు. “జీవితాన్ని (పతిబింబించినమాత్రాన, సాహిత్యపరులు విధి తీరిందని విశ్వసించరాదు. ఉన్నదానిని ప్రతిబింబించడముతో తృప్తిపడకూడదు. కామితాన్ని సాధ్యాన్ని మనసులో ెట్టుకోవడమెంతయినా అవసర"మని గోర్కీ అన్నమీదట, “నిజమయిన కవిత్వం జీవితానికి ఒకగంట అయినా ముందు పోతుండాలి” అని మయ్యావస్కీ అన్నాడు. మయ్యావస్కీ రచనలలో ఒక రాజ్యాంగ విధానం వుత్తమ కవిత్వంగా మారింది. ఇది విశ్వసాహిత్యచర్మితలో అపూర్వము.

“సోవియట్‌ ప్రజలకు మయ్యావస్కీ చేసిన సేవ అపారమయిందనిన్నీ అతుల మయింది. వైప్లవ్య సైనికుణ్ణి అనుకునేవాడు, కళాయుధాలతో సెనికుడే అయ్యాడు. విపష్లవపరులయిన (పజలతోటి, కవిత్వ వస్తువునే కాక, రీతిని కూడ లీనపరచ కలిగాడు. మానవసంబంధ పునర్నిర్మాణయుగానికి అతని కవిత్వం శిరోమణి వంటిదని, భవిష్యచ్చరిత్రకారులు వుల్లేఖించగలరు” అని కేలినిన్‌ అన్నాడు.

త

మయ్యావస్కీ తొమ్మిది పర్యాయాలు రష్యా సరిహడ్డులుదాటి విదేశాలకు

వెళ్ళాడు. అన్ని ప్రయాణాలకంటె దీర్ణృతరమయింది 1925 అమెరికా ప్రయాణం;

1508 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము శ4: పాహిత్యము స్పెయిన్‌, మెక్సికో, అమెరికా సంయుక్తరాష్ట్రాలు చూశాడు. తర్వాత అనేకగీతాలు, 'ప్రయాణవ్యాసాలూరాసి, 5021౧, 7౧6 008౭౧, ౧2౪౭౧8, [ీఅ4ం౦, ఉగంగ4 అనే శీర్దికగల పుస్తకంలోనూ । 4500౪76! గిగాంగం& లోనూ చేర్చి ముదింపించాడు. కవిత్వ రాయబారిని నేను. మిన్నులు తాకే యెత్తయిన భవంతులతోనూ, నమ్మశక్యంకాని యింజనీరింగు విజయాలతోనూ, న్యూయార్కు వంతెనలతోనూ భూగర ఎంలోనూ, మిట్టలమీదనూ, పోవీలయిన రైలుదారులతోనూ, సర్వసంపదలతో తులతూగే అమెరికా - “శ్రామిక మహావాహిని" చేత నిర్మితమయిందని, కానయితే పెట్టుబడిదారులు దానిని స్వాధీనపరచుకుని, స్వార్థాలకు వినియోగించుకుంటున్నారని కనిపెట్టాడు. ఈ వెల్లికొల్ల నడుమ తోచే నిత్యక్షామపరిస్థితులతో, సోవియట్‌ స్వర్గభూతలావకాశాలను పోల్చిచూసి, స్వదేశంలో “నేరుగా సమాజవాదానికి దారితీసే వంతెనతో అఖాతాన్ని పూడ్చివేశామ"ని గర్వపడ్డాడు. అమెరికా సమాజంలో వర్గ వైరుధ్యాలు లేవనే బూటక (ప్రచారాన్ని ఖండిసూ, పరాన్నభుక్కులయిన స్వల్పసంఖ్యాకులు నిర్మాతలయిన నిరవధిక (1ప్రజారాసుల నేవిధంగా పైబడి తింటున్నారో, ఉదాహరణపూర్వకంగా, రుజువు చేశాడు. ఈ దోపిడీ పద్ధతులలో అతి నవీనమయిన ఫోర్డు పద్ధతి చాల నాజూకయిందనీ, ఈ పద్ధతివల్ల అమెరికన్‌ కార్మికుల పరిశమాభారం తగ్గిపోవడానికిమారు, ఆ దుర్భరభారవహనం చేత కార్మికులు వికలాంగులవుతున్నారనీ చెప్పాడు. “వజ(ప్రభ లోమునిగి మందత్రులున్నారు పె కొసను. క్రింద ప్రజ వెనుకభాగాలు వెలుగుతున్నై, " షరాయీలు కప్పక. ఒకటి - అలాంటి వేవీలేవు, రండు - ఇండియన్లు వాళ్లు - షరాయీలు నిషిద్ధం.”

మయ్యావస్కీ: విప్లవ కవి కె.వి.రమణారెడ్డీ 1509

“బూర్జువాతత్వానికి ఆశలు విడిచినదానికి ఆఖరుకోటగా బహంఎశా సంయుక్తరాష్ట్రాలు తయారుకావచ్చు - హెచ్‌.జి.వెల్స్‌ రాసిన 7౧6 ౪/ఇ౯0116 /0/65 లోని అద్బుత శైలిలో చరితను రాయవచ్చు.” పెట్టుబడిదారి “పజాతంత్ర"దేశాలలోని స్వేచ్చల బండారాన్ని బయలుచేస్తూ, “పెద్దపెద్ద ట్రస్టులు వార్తాపత్రికల్ని నెలకొల్పుతాయి; (టస్టుల యజమానులు వాట్‌ిని, బడా బడా అడ్వర్హయిజర్లకూ, డిపార్టుమెంటు స్టోరు ప్రాప్రయిటర్లకూ అమ్మివేశారు. ఎంతపెద్ద వెలల కివి అమ్ముడయ్యా యంటే, సామాన్యులు కొన సాహసించని ధరలకు. కాబట్టే అమెరికన్‌ ప్యతికలకు లంచాలు మేపడం శక్యంకాని పని అంటారు." మానవ పురోగతిని నిరోధించే పెట్టుబడిదారి తత్వంకింద, మానవుని తగ్గు గొప్పలను నిర్ణయించే కొలబద్ద అతని తెలివి తేటలుకావు - అతని డాలరు ముడుపు. సంయుక్తరాష్ట్రాల శాస్త్ర వైపుణ్య విజయాలనూ, దాని సాంఘికవ్యవస్థలో నమ్మ శక్యంకాని మందగొడితనాన్ని మయ్యావస్కీ సమాధానపరచలేక,

“అనుకున్నాను నేను

ఏడువేల లెర్‌స్‌ట్ల దూరం పోతున్నానని; కాని నేను -

ఏడు సంవత్సరాలు వెనుకబడిన కడ

దిగాను”

చిన్నచిన్న విషయాలను పరిశీలిస్తూ కూడా, చాల పెద్ద నిశ్చయాలు చేస్తాడు. (బూక్షిన్‌ వంతెన ఇంజనీరింగుశాస్తాంనికి ఫునవిజయమని పేర్కొంటూ, “విలయధూళిమీదుగా యిది మిన్ను తొంగిచూస్తుంది” అంటూ, ఇక్కడ జరిగిన వెన్నో ఆత్మహత్యలు, నిరుద్యోగుల కడసారిశాపాలు, “హడ్సన్‌ అఖాతజలాలకు తలక్రిందులుగా దూకిన పని దొరుకని వారి” కారురూపులు గమనించి, బూర్జువా నాగరికతలోని ప్రజల కహెైతమయిన ప్రయోజనాన్ని బయలుపరుస్తాడు. అమెరికాలో సులభోత్పత్తిమార్గాలు యెంత ప్పురోగమిస్తే, యంత్రాలు యెంత యొక్కువయిళే, నిరుద్యోగుల సంఖ్య అంత పెరిగిపోవడం చూసె, స్వదేశంలో తద్వ్య్యతిరేక సాధననుచూసి,

1510 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

“అనన్య సాధ్యావకాశాలతోకూడిన

శోభించే శక్తితో కూడిన -

ఎడిసన్లం మేము. కానీ ముఖ్యంగా మాకు

(దీనిని మరుగు చేయరాదు)

శోభాయమాన మయిన

సోవియట్‌ భూమి, సోవియల్‌ స్వేచ్భ,

సోవియట్‌ సవిత

సోవియట్‌ బావుటా, ” అంటాడు.

ఇక్కడ అమెరికాలో “దుఃఖాన్ని గజంబద్దతో కొలుస్తారు; దానితోనే ఆనందాన్ని కూడ కొలుస్తారు. ఆఖరుకు నశుపసవం కూడ ఒక ఉద్యోగ ధర్మమాయె ం స్వేచ్చ్భాయిది?”

“మీ వినుతించే పప్రజాతం(త్ర మేమిటి

ఈ (ప్రజాతంత్ర మేమిటి?

తియ్యటి గుళిక ఒక కొం

దరికి; యిక కొం

దరికిది

ఇరుకు యిరుల బొరియ!”

చికాగో వెల్లి, ఉరితీయబడిన ప్రథమ కార్మిక విప్లవవీరుల సమాధులు దర్శించి, అందుమీద లిఖితమయిన స్మృతి వాక్యాన్ని పునశ్చరిస్తాడు:

“గోరీలోపల మేము వహించే నిశ్శబ్దం అనర్గ్లళమయిన మా ఉపన్యాసాలకంటె పటుతరమయిన మంచిరోజు ముందొకటి వస్తుంది!

శే

“మయ్యావస్కీని విప్లవకవి అని సరిపెడితే, బహుముఖమయిన అతని

వ్యక్తిత్వానికి అపచారం చేసినట్లవుతుంది. విప్రవపుకవి అనికాదు, అతనిని

మయ్మావస్కీ: విప్లవ కవి కఇవితమణాలెద్ధ 151] పేర్కొనవలసింది, అతడే ఒక ఏప్లవము. విప్లవ విజయాన్ని ప్రమాద భూయిష్టం చేయగల విరోధిమూకలపై అతను వర్షించిన పాషాణాలవంటి గీతాలద్వారానే, ఆ మునుపటి కలహోదేకాన్ని వుత్సాహాన్ని యిప్పుడు మనం చదవడంద్వారా అనుభవించ కలుగుతున్నాము” అని ఒక వ్యాసములో డేవిడ్‌ మగార్షక్‌ రాశాడు. (చూడు : 7౧6 &గ0ం10 - 50౪*16ఈ1౮06౧౧281-: 50గ౧౩ 1948)

“ఎక్కడ ఆతడు కాలు మోపినా

మును కని యెరుగని పెనుసంచలనము

మును విని యెరుగని పెనుసంరంభము -

"పను సంచలనము పెను సంరంభము

రగుల్కొలుపు నా కోపస్వభావుడు

ఎక్కడ ఎక్కడ ఎందుబోయెనో?” అని మయ్యావస్కీని గురించి అస్సీప్‌

“గొంతా అది నీది -

తుపాకి (పేల్చుకాక! పెరికిమంద ముసిరిన ప ర్వత [ప్రాంతము మీద

ఏరిగిపడే ఎట్నా గిరి శిఖరము! అని “కవి మృతి” అనే దానిలో బోరిస్‌ పేస్టర్నాక్‌ రాశాడు.

“హండ్రికాపు గొందె” అనే రచనలో మార్గరీతా ఆలిగర్‌ యిలా రాస్తుంది:

“మరే యితర సంకోచమనేది లికుండా నిండు మనససుతోటి, సముత్సాహముతోటి పూనవులను మయ్మావస్కీ ్రేమించాడు. సాగరతీరంమీద మోకరిల్లి, ఒకే ఒక గుక్కలో జలరాసినంతా త్రాగివేస్తున్నాడనిపించేటంత దాహంతో మానవులను (ప్రేమించాడు. భూమిపై ఆకాశంవంటి అతన్నిప్రేమ, అన్నిటిని పరిశీలించింది, గ్రటాంచింది, ఆలుసుకుండి”.

'పేబ్లో నిరూడా పసితనములో మయ్యావస్కీ యొక్క చిచ్చులపిడుగు - గొంతు అనుపమాన గంభీరదైై అతనిని దడరిసెండి; “ఉదయ సాయంసంధ్యల

1512 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము విభాగాలతో కూడిన యెముకలు కుళ్ళిన వృద్ధకవితా రీతుల నడుమ, నిర్మాత చేతి పెనుసుత్తి దెబ్బలవంటి కంఠం ప్రగల్భించింది. సమాజ హృదయానికి కవి చేతులు చాచాడు. అందులోని అనుక్షణ నవ్యమధుర జలాలనుక్రోలి, మహా సత్వ సంపన్నుడయ్యాడు. మన తరపు కవిత్వంలో మయ్యావస్కీ శక్తి, మార్దవము, ప్రకటిత ప్రకంపమాన రోషమూ - అనితర సాధ్యాలు" అని నిరూదా రాశాడు. నిరూదా కవిత్వ (ప్రాదుర్భావంలో, ప్రజాధ్యేయంలేని సమయంలో మయ్కావస్కీ కవిత్వ [ప్రత్యేక లక్షణాలయిన, నేరుగా చెప్పడం, సాంప్రదాయ శృంఖలలను తెగ్యదెంపడం, పిడుగులజడిలాగ దెప్పడం - అతనికి దారి చూపాయి, ఇప్పుడో, అవేకాక, వ్యక్తిగా కవి భవిష్యత్తును ఉద్యమ భవిష్యత్తుతో ఒకటి చేయడం, సాంఘిక పునర్నిర్మాణానంతర్గతమయిన మహోత్సాహం- యివి. (కిన్నెర; సంపుటము 3, సంచిక 6, జూన్‌ 1951) యమో లీ ఫల రి లక నిలీలలి ళ్‌ అటి ్య్టీం 99 ఇ గ్‌ అ6౨౨ అళ ఖల 9 :::66 తి శ్‌లం ల్ని? న్‌ో* రోయళయాంకు ఏ లలత ళీ అం

నార్ల వ్యానాలు నే విద్వాన్‌ విశ్వం నౌరస్వతం బహుముఖాలా తీవలు సాగినప్పుడే మన సంస్కృతి విస్తృత మవుతుంది. సమాజం బాగా అభివృద్ధి చెందినప్పుడే సారస్వతం, వివిధ శాఖలుగా విడిపోయి ఒక్కొక్క దానిలోను కావలసినన్ని రచనలు వెలువడుతాయి. ఒకానొకప్పుడు మన సమాజం శాంత్యభ్యుదయ పరిప్తతమవుతున్నప్పుడు పాయలు పాయలుగా చీలిన వాజ్మయ వాహిని, పరదాస్య పరాభూతమయిన స్థితికి రాగానే చాలవరకు శుష్కించిపోయి, ఒక్క కావ్యరూపం మాత్రమే ఏదో అఅకొజ (ప్రాణంతో నిలచినది. వురొక్క తూరి జాతీయోద్యవుం దేశాన్ని ఉరూత లూగించగనే, సాంస్కృతికరంగంలో జీవం సంచలించగనే తిరిగి సారస్వతం కూడ మొగ్గ దొడిగినది. అప్పుడే స్వతంత్ర నాటకాలు, ఖండ కావ్యాలు, కథానికలు, గల్పికలు, ఏకాంకికలు, నవలలు, వ్యాసాలు, గేయాలు - ఇలా రంగు రంగుల పువ్వులతో తఆలుగుతోట కనులు మిరుమిట్లు గొలుపసాగినది. మన సారస్వతంలో ప్రస్తుతం బహుళ (ప్రచారంలోనికి రానిది సృజనాత్మక వ్యాస రచన. ఈ మాట కొంత పెద్దగా నున్నమాట వాస్తవమే. కాని ఒక వినిర్దిష్ట రూపాన్ని సూచించడం కోసం ఉపయోగించవలసి వస్తున్నది. పందిరి మల్ష్‌కార్టునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

1514 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ముఖ్యంగా ఒక్కొక్క అంశంమై హేతువాదబద్ధంగా చర్చసాగించి వివరించే రచనలను కూడ వ్యాస మనడం అలవాటు. రాజ్యాంగం, సామ్రాజ్యవాదం, భాషాశాస్త్రం - ఇలా వేనిని గూర్చో వ్రాసిన వాని కన్నిటకు వ్యాసాలని పేరు పెట్టవచ్చును. నే నిప్పుడిక్కడ వానినిగూర్చి మాట్లాడడం లేదు.

మరి ఆంగ్ల సారస్వతంలో ఓ1౧[6552/ అన్న శాఖ ఒకటి బాగా విరియబూసిన పూలతో తులతూగుతున్నది. ఒక అనుభూతిని లేదా ఒక సంఘటనను, ఒక చిన్న అంశాన్ని తీసుకొని (0661౪69) సృజనాత్మకంగా ఖండకావ్యంలా వ్రాసిన వానినే ఈ శాఖలో చేర్చడం అలవాటు. వీనినే నిక్కడ సృజనాత్మక వ్యాసా లంటున్నాను. ౬1901 6592/ అన్నమాట ననువదించడంవల్ల చక్కని పేరు కుదరక పోవడం వల్లనే 018246 అనే పదాన్ని ఊతగా ఉపయోగించుకొనవలసి వచ్చింది.

గార్డినర్‌, లిండ్‌ మొదలగు వారు ఆంగ్లంలో ఈ శాఖలో సిద్ధహస్తులు. ఏ చిన్న అంశమైనా, ఏ క్షణికానుభూతియొనా వీరికి ఉపాదేయమే. ఆ యింతను కేంద్రంగా చేసుకొని వీరు లక్ష సంగతులను యాథాలాపంగా మన చెవిని వేస్తారు. సునిశిత ప్రతిభతో చిన్న చిన్న సంఘటనలయినా, వాని అంతరాంతరాలలోనికి చొజుచుకొని పోయి, లోపలి లోతులలోని చీకటి వెలుగులను కానిపింపజేస్తారు. ఒక్కొక్క వాక్యంలోనే మన కేదో అతిసన్నిహితమైన అంశాన్ని భూతద్దంవేసి చూప్పుతారు.

ఒక్కొక్క (ప్రత్యేక వాతావరణంలోనే అసలు వి (ప్రత్యేక శాఖైనా బయలుదేరుతుంది. పత్రికల ఆరంభంతోనే మనకీ శాఖపెనికి దృష్టి మరలినది. తొలుత తొలుత సాక్షి వదరుబోతులలో వెలువడి నప్పు డీవ్యాస రూపం నర్మ గర్భితంగా పిచ్చి ఆచారాలపై మొండిఘటాలకై చేసిన మర్మాఘాతంగా మాతమే కనిపిస్తూ వచ్చింది. కబుర్లు, పాన్‌సుపారీలు వగైరా రూపాలతో వెలువడినప్పుడు తాత్కాలిక వార్తలపై, సంఘటనలపై ఛలోక్తులతో విసిరిన విసురులుగా ఇవి తలచూపినవి. తెలుగువ్యాసం పుట్టు పూర్వోత్తరాల సమగ్ర చరిత్ర నా ఇప్పటి విషయం కాదు. కాబట్టి (ప్రస్తుతం [౬1% 6558/గా బాగా రూపాందిన వ్యాససంపుటులను గూర్చే చెబుతాను.

నార్ల వ్యాసాలు. విద్వాన్‌ విశ్వం 1515 మాటామంతీ, పిచ్చాపాటీ

శ్రీ నార్ల వెంకటేశ్వర రావుగారు [కొత్తగా మాటామంతీ, పిచ్చాపాటీ అనే రెండు వ్యాస సంపుటులను ప్రచురించారు. రెంటిలోను మొత్తం 28 వ్యాసాలున్నవి. జీవితంలోని వివిధాంశాలు వీనికి వస్తువులైనవి,

సొంత పుస్తకం, క్షుద్ర విశ్వాసాలు మొదలు సందేశాలు, మామిడిపండు వరకు వీని శీర్షికలు. వీనిని ఒక్కొక్క దానిగా కాక వీనిలో అనుస్యూతమై ఉన్న ప్రధాన విశిష్టాంశాలను గూర్చే చెబుతాను. లోకోక్తులు

మనదేశంలో కేవలం అసలు స్వదేశ సంస్కృతిని ప్రతిఫలించేవి ఒక్క లోకోక్తులేనేమో! వానిలో మన సాంప్రదాయాలు, మన మనస్తత్త్వ వైఖరులు, మన నిశితదృష్టి - ఒకటెమిటి తెలుగు హృదయమే అందులో జీవంతో జివజివ లాడుతుంది. ఈ లోకోక్తులను వీరు కొల్లలుగా ఉచితజ్ఞతతో, సందర్భశుద్ధితో ఈ వ్యాసాలలో ఉపయోగించారు. వీరికి జానపద జీవితంతోను, తెలుగు పలుకుబడులతోను, బ్రతుకు తీరులతోను గాఢమైన సన్నిహితత్వ మెంతగా ఉన్నదో ఇవి వేనోళ్ల చాటుతున్నవి. “దంచి నమ్మకు బొక్కినదే కూలి" “కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్టు”, “పరుగెత్తి పాలు తాగేకన్న నిలుచుండి నీళ్లు తాగడం మేలు” వగైరాలు మొదలు, “ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్టె దొక దారి." “పిల్లపోయినా పురిటికంపు పోలేదు" ఇలాంటివాని వరకు వీరెన్ని లోకోక్తులనో మన యెదుటనుంచారు.

“అనెక్టోట్సు"గా చాలమంది సహృదయులు చేరినప్పుడు చెప్పుకునే వానిలో లక్షసంగతులు వెల్లివిరుస్తుంటాయి. ఇవి వివిధ ముఖాలా దేశమంతటా వ్యాపించి వాసనల గుబాళిస్తుంటాయి. ఎందరు ప్రముఖ వ్యక్తుల మనస్తత్వాలనో, ఎన్ని సంఘటనలనో, ఎన్ని దేశీయ విశీష్టతలనో వీనిద్వారా మనం తలుసుకుంటుంటాము. ఇలాంటివానిని వీరి ప్రతి వ్యాసంలోను మనం చూడవచ్చును. ప్రాచీన కాలపు పైథియన్‌, ఆర్కిమిడిస్‌ లాంటివారికి చెందినవి మొదలు, మొన్నమొన్నటి

1516 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము షా. చెస్టర్జన్‌, చర్చిల్‌ లాంటివారి వరకు చెందిన వానినికూడ వీరు గ్రంథస్థం చేశారు. వీరి బహుగ్రంథపఠనం, బహుసహృదయ సాంగత్యం వీనిలో తొంగిచూస్తాయి.

వీనిలో ఇతరదేశాలవే కాక, మనదేశం కథలున్నా మరికొన్ని మనవిచేరితే ఎంత బాగుంటుందో ననిపిస్తుంది. (ప్రస్తుతం వున పాతపండితులు 'చెప్పకుంటూవచ్చే కథలు మాసిపోతున్నవి. కారణం అవి (గ్రంథస్థంకాలేదు. మరి మనతరంవారిలో చాలామందికి పాతపండితుల చేవగల సంభాషణలతో మాలిమి, చేరువ చాల తక్కువ. వీనిని ప్రచారం చేయాలి.

ఛలోక్తులతో, నిశితంగా మన వ(కవర్తనలమై వీరు చాల విసురులు విసిరారు. “గార్థభాన్ని క్షు ద్రజీవిగా యెంచిన మాసిడోనియన్‌ దండనాథుడైనా క్షంతవ్యుడు కాగలడు గాని, గాడిద కూస్తే చేస్తున్నపని మానుకునేవాడు మాతం క్షమాక్తుడు కానేరడు.” ఎంతటి గట్టిమాట! మంత్రయుగం అనే వీరి వ్యాసం వ్యాసమే, మన మొండినమ్మకాలపై చక్కని ఛలోక్తి. “ఇప్పటికైనా మనం పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలపై పాకులాటమాని, విద్యాలయాలకు, వెద్యాలయాలకు డబ్బు పారబొయ్యక దేశాన్ని తపోవనాలతో నింపివెయ్యాలి; గుళ్ళూ గోపురాలు కట్టించాలి; పూజలూ పునస్కారాలూ జరపాలి: యాగాలూ యజ్ఞాలూ చెయ్యాలి; వర్ణాశమ ధర్మాలను పునరుద్ధరించాలి; సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చెయాగ్టలి - అప్పుడుగాని ధర్మదేవత వెకిలిచేస్టలు మాని, తిరిగి నాలుగు కాళ్ళమీద నడవదు. అప్పుడుగాని తిరిగి రామరాజ్యం నెలకొనదు, ఇలాంటివే పరామర్శ, సందేశాలు, కవులఢంకా, స్మారక చిహ్నాలు - లాంటి వ్యాసాలు. నిశితపరిశీలన

“రంగు అద్దాలు” అనే వ్యాసంలో వీరి నిశితదృష్టి ప్రస్ఫుటమవుతుంది. “మనం దేన్ని హర్షించినా, దేన్ని విద్వేషించినా, మన అనుబంధాలను అధిగమించి, మన అనుభూతులకు అతీతంగా ఉండి, ఆ కార్యం చేస్తున్నామా అనే ఆత్మపరీక్ష

నార్ల వ్యాసాలు. విద్వాన్‌ విశ్దుం 1517 అవసరమేమో!” అంటూ “మనకు ఆలోచనాశక్తి ఉన్నదనుకుంటాము. వివేచనాపటిమ ఉన్నదని గర్విస్తాము. కాని దేన్నికూడా మన అనుబంధం, మన అనుభూతి అనే రంగు అద్దాలగుండా తప్పితే చూడలేము” అంటారు వీరు. ఇది నిజం.

రీతి =

వీరి మొదటి మాటామంతీ, పిచ్చాపాటీలోకి దిగేసరికి బాగా బరువెక్కినది. వ్యాస రచనలలో ప్రధానమైన ప్రవాహ గమనవేగం వీనిలో ప్రతిపుటలోను కనిపిస్తుంది. ఏ విశిష్ట విషయ పరిశీలనకో చెందిన పారిభాషిక పదజటిలతలేక, ఏ కేవలం ఉబుసుబోక మాటల పోవులుగానో, దూదిలా గాలిలో తేలిపోక - ఉన్న ఒక ప్రత్యేకరీతి వీరిరచన కబ్బిన గొప్ప ఆదరువు, మురువుకూడ.

ఇలాంటి వివిధ వ్యాస సంపుటిని మన కందించి, వీరు మన తెలుగు తోటలో అట్టే పూతపూయని కొమ్మను, రంగుల పూవులతో వలపులు విరజల్లే మొగ్గలతో నించారు. మన పాఠక లోకం వీరికి తప్పక కృతజ్ఞత వెల్లడిస్తుంది.

ఈ శాఖలోనే వీరు మరిన్ని రచనల నందించాలి. ఏకాంకికలో వీరు చేసిన కృషి “తెలుగు గడ్డిలో వాసికెక్కినది. మన “పిచ్చాపాటి “మాటామంతీ"లో కూడ వీరి అనుభూతులు వ్యాపించాలని ఆశిస్తున్నాను. కొత్తమాటలు

వీనిలో అక్కడక్కడ ఒకటి రెండు చెవికాట్టే చక్కని సవ్వడి నీని మాటలున్నవి. ఇలాంటివి - కాదు ఇవి మాత్రమే - “తస్కరణ విద్య” “కధ కాయించి” “రోతగించు కోకుండా” “ముక్కోళ్ళ వెంట నీళ్ళు" “ఊసరవెల్లి క్షేత్రాలు” - రెండవ ముద్రణలో తొలగిస్తారనుకుంటాను. అలాగే “క్షణక్షణం పెచ్చుపెరిగే అసహనంతో కళ్ళు కాయలు కాచేటట్టు ఎంతగా ఎడురు తన్నులు చూస్తుంది.”లో అసహనం అతకదు. ఎవరి బాగునైన చూచి ఓర్వలేక పోవడమే అసహనంగా రూఢి, కాకులజాతిలో “ఏకాకి” చేరిక ఎబ్బెట్టుగానున్నది. ఇవి తొలగించడం మరింత బాగుంటుందని మాత్రమే నే నంటున్నది.

1518 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము ముచ్చటైన ముద్రణ

వీరు రచనలో చూపినంత డ్ర్‌ద్ధాః పుస్తక (ప్రచురణలో చూపడం ముదావహం. చక్కని బొమ్మలతో, భావగర్భిత రేఖలతో ముచ్చట లొలుకుతున్న వీసంపుటాలు. అచ్చుతప్పులు - నే చూచినంతలో - ఏ రెండుమూడింటితోనో మాత్రమే ఇంత పుస్తకాలు వెలువడడం ఇదే మొదలు, వెలకూడ చాల చౌక అని చెప్పితీరాలి. ఇన్ని హంగులతోను ఒక్కొక్క సంపుటిని ఒకటిన్నర రూపాయకే అందివ్వడం తప్పక అభినందనీయమైన సంగతి.

ఈ పుస్తకాలు మన పుస్తకాలయాల కలంకారాలు కావాలి. పాఠకుల ఆదరణకు ప్యాతం కావాలి. బహుళ (ప్రచారాన్ని అందుకోవాలి. మరి కొందరు రచయిత లీశాఖలో కృషి చేసేందుకు దోహదమివ్వాలి. ఈ నా ఆశ అడియాస కాదని విశ్వసిస్తున్నాను.

(కిన్నెర: సంపుటము 3, సంచిక 6, జూన్‌ 1951) తు టీ, కారి. త్త సూ ఉయహ్వాస

అబ్బ! విద్వాన్‌ విశ్వం టొెరుణమైనవార్త. డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు గతించారు. . గొప్ప భాషాశాస్త్రుజ్ఞ్జుడు, నాటకకర్త పదకర్త, కులపతి అకస్మాత్తుగా పరమపదించాడు.

ఒక్కసారిగా పద్ధెనిమిదేళ్లు వెనక్కు వెల్లింది మనస్సు. 1932 డిసెంబరునాటి మాట,

చిన్నతువాలు కట్టుకొని చిన్న బల్లమీద ఏదో రాసుకుంటూ మాటిమాటికీ కంటిలో ఓ పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ కూచున్నారు పంతులుగారు. కల్లూరు సుబ్బరావుగారు నన్ను తీసికెళ్లి అన్నారు:

“మీకో బంగారంముద్ద తెచ్చాను. ఏం చేస్తారో చేసుకోండి.”

ఆయన శబ్దం వినేవరకు తల మెకెత్తని వారొకమాటు నన్ను పరకాయించి చూచారు - నమస్కారం చేశాను. కూచోండి అంటూ ఆయన అంటూ అంటూనే ఏం చదువుకున్నావు, ఏంచేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని సరాసరి సంభాషణలోకి దిగిపోయారు. భాషాశాస్త్రం, వ్యాకరణాలమీద నాకభిమానమున్నదని విని మురిసిపొయ్యారు - “ఇంకేం నీకు కావలసిన సాయం చేస్తాను. నా జీవితమే అది” అన్నారు.

నాటినుండీ నేను అనంతపురం విడిచిపెట్టే దాకా - రెండేళ్లకిందటివరకూ - ఆయనను కలుసుకోని రోజులు చాల తక్కువ. ఆయన వాత్సల్యం అఖండమైనది. కొత్తవారిలో పరిశోధనాభిరుచిని పెంపొందించడం తన జీవిత పరమావధిగా పెట్టుకున్న వ్యక్తి కాబట్టే, ఎందరినో కేవలం కళాశాలలోని శిష్యులుగా కాక, తన వ్య క్రిగత పర్యవేక్షణతో ఫెకి తీసుకొని వచ్చారు. పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1520 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము పరిశోధన

అప్పుడాయన ఆంధ్రభాషాచరిత వస్తున్నారు. అందాక తెలుగు (ద్రవిడ భాషలలో ఒకటని, ద్రవిడ భాషాకుటుంబానికీ ఆర్యభాషలకు చెందిన సంస్క ఎతానికీ జన్యజనకభావం లేదని ప్రచలితమవుతున్న సిద్ధాంతాన్ని తలక్రిందులు చేయాలని అహోరాత్రులూ కష్టపడుతున్నారు.

ఆయన కీవిషయంలో ఉన్న పట్టుదల అపరిమితం. ఇందులో సమస్త (ప్రాకృతవ్యాకరణాలు, పుస్తకాలు దొరికినవల్లా సేకరించారు. ఏపదాన్నేనాసరే, ఎంత డొంకతిరుగుడుగానైనాసరే సంస్కృతంలో ఏదో పదం, ప్రాకృతాలలో ఏదోగా మారి, కెశాచికంలో పరిణతిచెంది ఇలా తెలుగుశబ్దంగా మారిందని చెప్పి తీరవలసిందే. ఈ అభినివేశంతో ఆయన కొన్ని పదాలకు తీసిన వ్యుత్పత్యర్థాలు, సంస్కృతంలోని ఏ మారుమూల ధాతువునుంచో లాగేందుకై ఆయన చూపుతున్న ఆవేశమూ బహు పండిత సమ్మతం కాలేకపోతూవచ్చినది. అయినా ఆయన పట్టుదల సడలలేదు సరికదా మరింత బిగుస్తూ వచ్చినది. ఈ విషయంలో ఈ సిద్ధాంతం తేలిందా లేదా అన్నది కాదు మనం చూడవలసినది. ఎన్నో పదాలను మనం పచ్చి తెలుగు అని భావిస్తుంటే, కాదని వేలపదాలకు ప్రాకృతంలోని మాతృకల నాయన చూపించారు. ఈ విషయంలో వారు చేసిన కృషి తర్వాతి భాషాపండితులకు గొప్ప నిధిగా ఉపకరించగలదనడంలో సందేహంలేదు.

పదేపదే నేనీ విషయంలో ఆయనతో విభేదాలు చూపుతున్నా విసుక్కోవడం కాని, కూరిమి వెలితికావడం కాని జరగలేదు. మరింత పట్టుదలతో ఒప్పించేందుకు వివిధ ముఖాలా పరిశ్రమించేవారు.

భాషాచరిత్రలవంటి విషయంలో కూడ వారెంతో సరసంగా వ్రాసేవారు చర్చించేవారు. లింగం అనేది సంస్కృతంలో చాల కవిత్వ దృష్టితో ఏర్పడినదని కాడ్వెల్‌ అన్న భాగం చదువుతూ నవ్వారు. లత స్త్రీలింగం కావడం, దానికాశ్రయమైన వృక్షం పుంలింగం కావడం, తారలు స్త్రీలు, చంద్రుడు పురుషుడు కావడం ఇలా చాల పదాలున్నవి. వీనిలో ఎంతో కవిత్వదృష్టి కనిపిస్తుందని, అలాంటిది తెలుగు మొదలైన ద్రవిడ భాషల్లో లేదని కాడ్వెల్‌ అన్నాడని వంటనే చిర్ణారాయడం మొదలెట్టారు.

అబ్బ! విద్వాన్‌ విశ్వం _ 1521

దారాః పుంలింగం, కళత్రం నపుంసక లింగం, స్త్రీ జననేంద్రియం పుంలింగం, పౌరుషం నపుంసకం, లావణ్యం నపుంసకం, వపుః నపుంసకం ఇలా జాబితా పెరిగిపోతూఉంది. నేనూ పుట్టపర్తి నారాయణాచార్లూ మరికొన్ని పదాలు అందిస్తూన్నాము.

“ఏమిటి వీడి బొంద కవితా దృష్టి అని పెదవి విరిచారు. తర్వాత ఈ విషయంమై ఒక పెద్ద వ్యాసమే వ్రాశారు. దానిని ఆంధ్ర భాషాచరిత్రలో ఒక అధ్యాయంగానే వేసినట్టు జ్ఞాపకం.

భాషావిషయంలో అంత వ్యంగ్యంగా ఛలోక్తులతో మాట్లాడేవారిని నే నెరుగను. పండితులలాంటి వాడు కాదాయన - జీవితంలో. ప్రసంగాలలో సరసతగల కవి. మంచి మనస్వి. తిట్టినా తిట్టించుకున్నా అదొక శాస్త్రీయ చర్చగా వదిలివేసే ఉదారత నలవరచుకున్నారు. వాడుకభాష

ఆయనది బహుముఖమైన పాండితి. ఇంత శుష్కభాషా చర్చలలో నుంచి అమాంతంగా యెంకి పాటల్లోకి వెడిపోయేవారు. నాకూ, పుట్టపర్తికీ కూడ అప్పటికి చాల గ్రాంథికాభిమానమున్నది. ముఖ్యంగా మేము రాయలసీమ వాళ్ళం కావడంవల్లను, అందులో పాత పద్ధతిలో సంస్కృతం చాలా చదువుకున్నామని భావించే మేము, వ్యావహారిక మేదో భాష రానివారు రాసుకొనే “అథవా” పక్తమంటూ అనుకోవడంవల్లను మొదటిలో ఆయన ప్రాణం తీసేసేవారం. వప్రాంతం భాష రాయాలి. మూ జిల్లాలోనే నాలుగు ప్రాంతాలవారు నాలుగు రీతులుగా మాట్లాడుతారుకదా. ఇక మీ విశాఖవారు “వళ్ళిపాయ్యొచ్చాడు అంటే మాకేలా తెలుస్తుంది అనేవారం. మీ గుంట మాకు కోనేరు, మా అప్ప మీకు అక్క, మేం పోయాడంటే మీరేదో విచారంగా మొఖం పెడతారు. “బాగా విచారించారు” అని మేమంటే మీకు బాగా ఉపచారం చేశారు - అనే అర్థం అసలు బోధపడదు. మేం తట్టలో భోంచేస్తామంటే మీకు నవ్వు వస్తుంది. మీరు “పెసరట్టట్రా" అంటే మా కడుపు బద్దలవుతుంది - అని వాదించే వారం.

కాని ఆయన లక్ష ఛలోక్తులతో సర్వాంధ భాషాసమన్వయం కావలసిన మాట నిజమేనని ఒప్పుకుంటూ కొన్నాళ్ళలో శిష్ణ్టభాష సర్వేసర్యత్రా అర్థమయితీరుతుం దనేవారు.

1522 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

1934లో వారి కుమార్తె వివాహ సందర్బంలో అనంతపురంలో నవ్యసాహిత్య పరిషత్తు శివశంకర శాస్త్రిగారి అధ్యక్షత [క్రింద జరిగింది. అప్పుడు వారితో వ్యావహారికం విషయమై చాల చర్చించాము. మీవేపు భాషను వరు రాసుకోవచ్చునన్నారు. ఈ చర్చలన్నింటిలోనూ చిలుకూరి నారాయణరావుగారికి ప్రత్యేకించి రాయలసీమపైనున్న అభిమానాదరాలు వ్య క్షమయ్యేవి. ఆఖరుకాయన రాయలసీమవారికంటె కూడ రాయలసీమ వారయ్యారు లెండి.

నేను త్వరలోనే వాడుకభాషలో రాయడం ఆరంభించాను. అప్పుడాయన పడ్డ ఆనందం ఇంతా అంతా అనికాదు. అదే సమయంలో మిగత రాయలసీమ పండితులూ కవులూ పడిన బాధకూడ మిక్కుటమే. రాళ్ళపల్లివారు, పప్పూరు రామాచార్లుగారు వాడుకభాషలో నేను రాస్తానని అంతోఇంతో అప్పుడు కించపడుతున్నవారే. కాని వారిలాగా అంత సాఫీగానే అందరూ [గాంథికంరాస్తే అసలీ వాదమే ఇంత తీవ్రంగా వెలువడేది కాదేమో - అది వేరుమాట. నాటక రచన

వాడుక భాషలో ఉదాత్తమైన నాటకాలు కూడ రాయవచ్చునని గురజాడ చూపించారు. అలాగే వీరు అంబ, అశ్వత్థామ రెండు నాటకాలు వ్రాశారు. వీనిని అనంతపురం కళాశాల విద్యార్థులే ప్రదర్శించారు. చక్కగా రక్తికట్టినవి కూడ.

ముఖ్యంగా అచ్చిలో ఈయనకున్న కవిత్వ ప్రతిభ సూచనగా కనిపిస్తుంది. ఛలోక్తులెంత చక్కగా విసరగలరో తెలుస్తుంది. అందులోనూ అప్పటి పాటలూ 'గేయాలూ ఎంతో అందంగా మనకు చూపారు. ఇందులోని పల్లెపాటలు నిజంగా మనసు నాకర్ణిస్తాయి.

“ఎగిరిపోయెరా చఛచిల కెగిరిపోయెరా .

గూడు చిన్నబోయెరా దాని వన్నెలేదురా

చిట్టిపలుకుల చిలుక

చిన్నివన్నెల చిలుక

కన్నుల కిరవైన చిలక

కళ్ళలోన దుమ్ముగొట్టి

ఎగిరి పోయెరా

చిల కెగిరిపోయరా”

ఈ పాటలనెంతో మృదు మధుర స్వరంతో పాడేవారు.

అబ్బ! విద్వాన్‌ విళ్చాం 1523 విద్యార్థులలో సాహిత్యాభిరుచిని పెంపొందించడంలో ఈయన కీయనయే సాటి. వీరూ ప్రయాగ వెంకటరామశాస్త్రిగారు ఆ కాలంలో అనంతపురం కళాశాలలో తలుగు బోధించేవారు. సామాన్యంగా తెలుగంటే ఈసడింపుగల రోజులవి. అయినా వీరిద్దరికాలంలో తెలుగు తరగతుల కోసం విద్యార్థులెదురు చూచేవారు. తెలుగు ఉపాధ్యాయులంటే ఎంతో గౌరవటప్రతిప్రత్తులు చూపేవారు. అది కడకొక (పేమబంధంగా తయారయ్యేది. సాహిత్యగోష్టులలో

సాయంకాలం విద్యార్థులను చేర్చుకొని ఈయన సాహిత్యగోష్టి జరుపుతుంటే, వారందరినీ తన సవాధ్యాయులుగా చూస్తున్నట్టే కానిపించేది కాని తానేదో ఆచార్యుడూ, వారు శిష్యులూ అని తోపించే వారే కాదు.

ఇక రాళ్ళపల్లివారి వంటి సహృదయులు వచ్చినప్పుడు వారి యింటిలో జరిగే చర్చలు నిజంగా ఎంతో ఉదాత్తంగా, ఎంతో విజ్ఞానదాయకాలుగా ఉండేవి. రాళ్ళపల్లి వారి నిశిత ప్రతిభ, సంస్కారం చూచి వీరు మైమరచి పద్యాలే రాసి చదివారు.

సమకాలీన పండితులపై ఇలా వ్రాసే ఉదారత పాత పండితులలో చాల అరుదు.

రాయలసీమలోని పండితుల, దేశభక్తుల సాయంతో కృష్ణ దేవరాయ పరిషత్తు ఆరంభంకాగా, అందులో పీరి ప్యాత మరువరానిది. కాని ఆ పరిషత్తు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోయింది. అందుకు కారణాలొక లక్ష. వానిని తడవడం ఆ తరం వారికే వదలడం మంచిదని వదిలివేస్తున్నాను.

ఆ సందర్భంలోనే అక్కడి తాళపష్యత (గ్రంథాల సంచయనం జరిగింది. రాయలసీమలోని ఇళ్ళలో భారతాల తాళపత్ర గ్రంథాలు వందలకొలది దొరికేవి. ఈ నాటికీ ఎన్నో పుస్తకాలున్నవి. వీనిలో చాలవరకు వీరు సేకరించారు. కొన్నిఎ ఇతిహాస మండలికో ఇచ్చారు. కొన్ని వీరి దగ్గరే నిలిచి పొయ్యాయి. వీని నన్నిటిని పెనుకొండలోనో, అనంతప్పురంలోనో ఒక లైబరీలో పెట్టాలన్న మొదటి ఉద్దేశం

. నెరవేరకపోవడంతో చాలమంది రాయలసీమవాసులు నొచ్చుకొన్నారు. వారి అలుక చిలుకూరి వారిమీద కూడ ఎక్కువగానే పడినదని నేను బాగా యెరుగుదును. . బాధ్యత ఎవరిపై మోపడమూ నా తలకు మించినపని.

1524 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము కొత్త రచయితలకు ప్రోత్సాహం

కవిత్రయమని ముగ్గురు కవులను ప్రోత్సహించి, వీరప్పుడు వారితో రెండు పద్య సంపుటాలు (ప్రచురింపజేశారు. ఒక దానికి చక్కని పీఠికకూడ వాశారు. వారిలో భవిష్యత్తు కలదనుకొన్న ఉమా మహేశ్వరుడేమో సినీమాలలో దిగి కవిత్వం మానివేశారు. మూర్తి పరిశోధనలో మునిగిపొయ్యారు. సుబ్బణాచార్యులు జర్నలిష్టయ్యాడు - ముగ్గురూ దాదాపు కవిత్వం వదిలివేసినట్టేనేమో - కాదనగలిగితే ఒక్క ఉమామహేశ్వరుడే అనాలి. ఆయన కనీసం ఏదో ఒక నవల ఇటీవల [వాశానని చెప్పాడు. కవిత్వం ఇంకిపోయినా పోకపోయినా, ఈయనలో ఇంకా సహృదయత, సరసత కావలసినంత ఉంది. పద్యాలంటే చెవి కోసుకుంటాడు. రాజశేఖరంగారి రాణాప్రతాప సింహనూ, వెంకటశేష శాస్తింగారి శివాజీని, పూర్వం భావకవుల పద్యాలను సభల్లో చదివి కవిత్వాన్ని ప్రజాపరం చేయడానికెంతో కృషి చేసిన వ్యక్తి ఈ మిత్రుడు.

1935లో నేను “విరికన్నె" అనే ఓ ఖండకావ్య సంపుటి ప్రచురించి డాక్టరు నారాయణరావుగారికి అంకిత మిచ్చాను. అంతకంటె ఆయన నాపై చూపిన వాత్సల్యానికి ప్రతిగా ఎఏమివ్వగలను? కాశీకి పరిశోధనార్థం నే వెడుతుండగా ఎ.బి. ధ్రువగారికి వీరు వ్రాసియిచ్చిన లేఖ అపారమైన వారి (ప్రేమను వెలువరిస్తుంది. తద్వారా నేనక్కడోస్థానం సంపాదించుకోగలిగాను.

ఒక్కసారిగా రెండేళ్లు మూడేళ్లదాకా వారితో సంబంధం తెగిపోయింది.

తర్వాత ఒకేమారు నేను కాం[గెసులోకి వెళ్ళిపోవడం భాషాపరిశోధలను మానివేయడం జరిగింది. వర్దుల చిన్న సీతారామశాస్తిగారి ఆంధ్రశబ్ద చింతామణి గూర్చిన రచనలపై నేను చిలుకూరివారి గ్రైడెన్సుకింద వ్రాసిన పరిశోధక వ్యాసం ఆయనకు చాల సంతృప్తి చేకూర్చినది. అలాగే తిక్కన భాషలోని ప్రత్యేకతలను గూర్చి నే చేసిన కృషి వారికి నచ్చినది. నేను రాజకీయాలలోకి “పడిపోవడం” (ఆయన మాటే ఇది) వారికేమాత్రం ఇష్టం లేదు. కాని నేను 1938 జిల్లా కాంగగెసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడి వారింటికెల్లినప్పుడు “శుభం” అని మాత్రమే అన్నారు. వారింటి కెదురుగాఉన్న కల్లూరు సుబ్బరావుగారింట్లోనేమో ఆఫీసుండేది. రోజూ వెడుతూ సాహిత్యం పై, భాషపై చర్చిస్తూండేవాడిని.

ఇక [క్రమంగా రాజకీయ రచనలను సాగిస్తూ నేను పద్యాలు, పాటలు, కథలు అడపా దడపా వ్రాస్తూ ఉన్నాను.

అబ్బ! వచ్వాన్‌ వళ్వుం 1525

కాంగగెసు కమిటీ, వారి భార్యను జిల్లాబోర్డుకు నిలబెట్టలేదని నామీదా, సంజీవరెడ్డిగారి మీదా (ఈయనా వారి శిష్యుడే కళాశాలలో) కొన్నాళ్లు కోప్పడ్డారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఆరోజుల్లో వస్తున్నా, వారికి, దేశభక్తి మెండు గనకా, కాంగెసు స్వాతంత్రోద్యమాలపై నిజమైన సానుభూతి సద్భావాలుండేవి గనకా నా మీది ఆదరం హెచ్చిందే కాని తగ్గలేదనుకోండి. సంస్కృతంలో కృషి

అధర్వ వేదాన్నాయన పూర్తిగా అనువదించాలని రాజమండిలో ఉన్నప్పుడే సంకల్పించామని ఒకసారి చెప్పారు. ఒక్కొక్కపుటలో మన మంత్రం, పదం వ్రాసి ఉంచిన పెద్ద కవిలెకట్టను చూపారు. దీనికి అర్థమూ తాత్పర్యమూ (వాయాలన్నారు.

నాలుగు సంపుటాలుగా విభజించి, నాకు రెండూ, పుట్టపర్తి నారాయణాచార్లకు 'ర0డూ ఇచ్చారు. వానిని మేమిరువురమూ ముగించి వారికిచ్చివేశాము. అదింకా ఏ బీరువాలోనో మూలుగుతూన్న దనుకుంటాసు.

అశ్వత్థామను వీరు సంస్కృతీకరించి నప్పుడుకూడ మేమిద్దరమూ తోడ్పడ్డాము. సంస్కృతంలో వారు స్వయంకృషితో ప్రాకృతంలోలాగే కూలంకష పాండిత్యానిక్రై అంత వయసులోనూ అనవరతం పరిశ్రమ చేయడం చూచి మేము సిగ్గుపడేవారం. ఎప్పుడూ రాతే

తెల్లవారుజామున లేచి బల్లముందు కూచుంటే పదికొట్టిది. వేళయిపోయిందని కోటును చేతికి తగిలించుకొని, రుమాలు బజారులో జీరాడుతుండగా కట్టుకుంటూ, తొట్రువడుతూ కాలేజీకి వెళ్లేవారు. తిరిగీ వస్తూనే కూచుంటే ఎవరు వచ్చినా పలకరిస్తూనే రెండు చదరపుటంగుళాల కాగితం ముక్కలపై ఏవో పదాలు రాసుకుంటూనే ఉండేవారు. రాత్రి పదికి పిల్లలంతా నిదపోతున్నారో అని గోల బయలుదేరేవరకూ భోజనానికి లేచేవారు కారు. ఒకోమారు ఆమెగారు కూడా నిదపోపడం జరిగేది. వీరలాగే రాసుకుంటూ ఉండిపోయేవారు.

అప్పుడు రామాచార్లుగారు చెప్పే కథ జ్ఞాపకం వచ్చేది. ెడ్డిగారు అరుగుమీడ కూచొని, దేవలఠాలు తరిగాక అనేవాడట. రామిగా అన్నం తిన్నానేమో అమ్మగారి సడగరా అని. వాడు లోనికివెల్లి తిరిగొచ్చి “లేదంట నాయనా" అనేవాడు -

1526 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము “అందుకేరా ఆకలవుతోందీ” అని రెడ్డిగారు లోనికి వెళ్లేవాడట వీరూ అంతే. పరిశ్రమలో ఆకలి దప్పులు జ్ఞాపకంరాని పండితుడీయన.

ఇంత సింపుల్‌గా, ఇంత అమాయకంగా పిల్లలలో పిల్లవాడుగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపారు. ఆంధ్రరాష్ట్ర వాంఛ

మొన్న ప్రొఫెసర్‌ (పతాపగారింటిలో చిలుకూరివారి సతీమణి లక్ష్మి నరసమ్మ గారు కనిపించారు. ఏంబాబూ ఎలా ఉన్నావూ, మీ పంతులుగారు ఆసుపత్రిలో ఉన్నారని ఆమె చెప్పగా నిస్తబ్ధుడ నయిపొయ్యాను. వారి ఆరోగ్యం కాయకల్పాన్ని కోరేది కాదని మేమనుకునేవారం.

అప్పుడే ప్రతాపగిరిగారు చెప్పారు. పంతులుగారు డెలిరియంలో కూడా “ఆంధ్రరాష్ట్రం రావాలి, వస్తుంది” అంటున్నారు. చూచారా మరి!

ప్రతాపగిరిగారు కూడానూ అనంతపురం వర్గంలోనివారే. మాదంతా ఒక కుటుంబం. ఇప్పటికీ ఎంత వేరు వేరు దేశాలలో ఉన్నా మాఅందరినీ కలిపి కట్టివేసుకున్న ఒక అనుబంధం అవిచ్చిన్నంగా ఉంది.

రాళ్లపల్లి సోదరులూ, ప్రతాపగిరీ, పప్పూరి రామాచారక్షుగారూ, చిలుకూరివారూ, కవిత్రయమూ, పుట్టపర్తి, నేనూ, కల్లూరి సుబ్బరావుగారూ, రాఘవా అడపాదడపా కలిసిన సమ్మేళనాలు జ్ఞాపకంవస్తే ఎడద పులకరిస్తుంది. కళ్లు చెమరుస్తాయి. గొంతు బొంగురుపోతుంది. మాటాడలేను. మా చిలుకూరి లేడు మా రాఘవా లేడు. మిగతవారమైనా అప్పుడప్పుడు కలుసుకోవడం ఊహామాత్రంగానే ఉంది = ఎంత కర్కోటకమైనది కాలం! ఎంత బండ గుండె గలది మృత్యువు! అబ్బ! (కిన్నెర: సంపుటము 3, సంచిక 7, జూలై 1951)

పస నుమష న అతల ] ప

ఆంధ్ర వాజ్బయములో లి అనువాదసాహిత్యము ఆర్‌. కృష్ణ వింత్‌ ణ్‌

సౌహెత్యానికి సరిహద్దులు లేవు. భాషా, దేశ, ఖండ భేదాలు లేవు. ఏ దేశములో పలువడినా, ఏ భాషలో రచింపబడినా మానవాళికి ఒక సందేశము, మానవ పురోగతికి ఓ మార్గము చూపెట్టె గంధాలు సర్వత్రా చదువుతారు. మహాకవులు ఒకే దేశానికి, ఒకే భాషకు, ఒకే కాలానికి చెందరు. సర్వమానవ (ప్రపంచానికి వారు చెందుతారు. ప్రపంచ ప్రజ వారిని గౌరవించి, ఆ మహాకవు లొసగిన సందేశాలను అత్యంత ప్రీతితో స్వీకరించి తమవారిగా చేసుకొంటుంది. వారి రచనలు సార్వకాలికములు సార్యజనీనములై విరాజిల్లుతాయి.

మహారాజులు ఉదయించవచ్చు. తన ప్రజకు మహోపకారము గావించవచ్చు. ఆ రాజును అతని ప్రజలే గౌరవిస్తారు. వారి మనస్సులోనే వారికి స్థానము ఉంటుంది. ఉదాహరణకు మనము అశోకుని మహారాజుగా గౌరవించుతాము. కాని ఆంగ్లేయుల మనస్సులో అశోకునికి స్థానము ఉండదు. మహాకవుల కీర్తి అటువంటిది కాదు. వారికి మరణము లేదు. తమ (గ్రంథాలలో వారు సర్వదా జీవించి ఉంటారు. వారి (గగంథాలు చదివిన ప్రతివ్యక్తి మనోసామాజ్యంలోను ఆరని ఒక దివ్వెను వెలిగిస్తారు.

షేక్సిపియర్‌ ఆంగ్లేయుల సొత్తు కాదు. కాళిదాసు భారతీయుల సొత్తుకాదు. అదేవిధముగా మహాకవృలందరూ (ప్రపంచ వ్యక్తులు. వారి కవితార్వురిని పందిరి షుల్ష్‌కార్టుసరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

1528 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఆస్వాదించుటకు ప్రపంచములోని ప్రతివ్య క్తికి హక్కు ఉంది. మాయింటి ప్రక్కన ఉన్న ఆసామికంటె షేక్సిపియర్‌ నాకు ఎక్కుడు ఆప్తమిత్రుడు. నా దగ్గర బంధువులకంటె మహాకవులు నాకు ఎక్కుడు ఆప్తబంధువులు. మానవుడు కష్టాలను ఎదుర్కొనవలసివస్తే దగ్గర బంధువులు సహితము మొఖాలు (ప్రక్కకు త్రిప్పుతారు. కాని అటువంటి సమయములో చిరునవ్వుతో అతనిని పలకరించి కార్యోన్ముఖుణ్ణి గావించి విజయము చేకూర్చేది ఈ మహాకవులే. వాస్తవానికి ఎవ్వ రైనా వందమంది జనంలో కూర్చోటంకంటె ఒక చిన్న (గ్రంథాలయంలో కూర్చోటానికి యిష్టపడతారు. మహాకవుల సందేశాలను ప్రపంచములోని (ప్రతిదేశములోనికి తీసికొనిపోయి, ప్రతివ్యక్తి వారి కవితను ఆస్వాదించుటకు తోడ్పడి, ఆ మహాకవులను ప్రపంచపరము చేసేవారు అనువాదకులు. అనువాదమంటే మాటకు మాట అనువదించి వాక్యాలను నిర్మించటము కాదు. నిజానికి అనువాదము అందరూ అనుకొనేటంత సులభమైన పనికాదు. స్వతంత్ర రచనకంటె, ఒక (గ్రంథాన్ని అసువదించటము కష్టతరమన్నా అతిశయోక్సి కాదు. అనువాదకుడు తనకు లేని భావాలను, ఊహలను, అనుభూతులను చిత్రించాలి. అంటే అనువాదకుడు తిరిగి మూలగంథకర్త అంతటివాడు కావాలి. అప్పుడే అతని అనువాదము నిర్దుష్టమైనదిగా ఎంచబడుతుంది. అనువాదకుడు సాహసముతో మూలగంథాన్ని అత్మికమంచి స్వతంత్ర ప్రతిభతో నవ్యకాంతులతో రచిస్తే అదొక మహాగంథముగా వెలువడి, అనువాదకునినే ఆ [గంథకర్తగా జేస్తుంది. ఆంధ వాజ్మయ చరిత్రలో (పప్రాజ్వన్నయ యుగాన్ని వదలివేస్తే (పప్రథమాధ్యాయము అనువాదయుగము. వేదవ్యాస విరచితమైన మహాభారతమును నన్నయ ఆంధ్రీకరించి ఆంధ్రుల గౌరపమన్ననలకు పాత్రుడయ్యాడు. ఆంధ్రీకరణలో స్వతంత్ర కవితారీతులను స్వయం(ప్రతిభను చూపి ఆంధ్రులకు ఆది గ్రంథమైన మహాభారతాన్ని మహోత్కృష్టంగా రూపొందించాడు. ఆ యుగములోనే రామాయణ భాగవతాది పురాణాలు సంస్కృతము నుండి అనువదించ బడ్డాయి. తరువాత శ్రీనాథుని కాలము వజకు ఆంధ్రభాషా సరస్వతిని అలంకరించినవి అనువాద (గంథాలే. సంస్కృతములోని గొప్ప గ్రంథాలను అట్లనువదించి ఆ యుగము ఆంధ్రులకు అందజేసినందులకు సంతసమే గాని ఆ మధ్య కాలములో ఒక్క స్వతంత్ర (గంథమైనా వెలువడక పోవుట విచారింపదగిన విషయము. ఇతర భాషలలోని

అంధ్ర వాజ్బ్యయములో అనువాదసాహైత్యము _ అర్‌ కృష్ణ వింత్‌ 1529 ఉత్కృష్ట రచనలను మన భాషలోనికి అనువదించ గోరెదము కాని అది స్వతంత్ర రచనలకు అడ్డు తగిలితే మనము సహించలేము. తరువాత శ్రీనాథుని కాలమునుండి స్వతంథఉత్ర (గ్రంథములు వెలువడుతూ వచ్చినా, ఇప్పటి వజకు సంస్కృత (గ్రంథాలను అనువదించుట జరుగుచునే ఉంది. తరువాత అనేక వంగ భాషాగ్రంథాలు, కొద్దిగా యితర భారతీయ భాషలలో గల ఉత్కృష్ట రచనలు అనువదించబడ్డాయి. ఆంగ్లభాషా పరిచయముతో మన వాజ్మయ (ప్రపంచములో విప్లవము కల్లిందనవచ్చు. పాశ్చాత్య వాజ్మయ (ప్రపంచానికి మనకి సంబంధము కలిగింది. అనేక ఆంగ్ల (గ్రంథాలు ఆంధ్రీకరించ బడ్డాయి. అంగ్ల (గంథాలే కాదు, ఆంగ్లభాషలోనికి అనువదించబడ్డ అనేక యితర భాషా (గ్రంథాలు సహితము ఆంధ్రీకరించబడ్డాయి. అది మనము ఆనందించవలసిన విషయము. అయిజీ యిక్కడ మనము కొన్ని విషయాలు ఆలోచించాలి. అనేకమంది మిడి మిడి సారస్వత జ్ఞానముతో తమ పేరులను అచ్చులో చూచి ఆనందించటానికా అన్నట్లు అనువాదాలు చేస్తున్నారు. ఆ అనువాదాలు నిర్జీవమైన కళేబరాలలా తయారవుతున్నాయి. దానివలన చదువరులకు మూలగ్రంథకర్తలకు కూడ హాని కలుగచేస్తున్నారు. గ్రంథకర్త పేరుచూచి (పచురించటము సంపాదకుల ధర్మముకాదు. సంస్కారము గల ఉత్తమ అనువాదకులు అనువదించితే తప్ప ప్రచురించరాదు. సామాన్యముగ ఉత్తమ రచయిత లందరూ ఉత్తమ అనువాదకులే. మన ఆదికవి నన్నయ అనువాదకుడు. ప్రఖ్యాత నాటక రచయిత బెర్నార్డుషా అనువాదకుడు! అంతవజకు దేనికి? వర్తమాన ఆంధ వాజ్మయ (ప్రపంచాన్ని తన రచనలతో ఉరూతలూగించిన శీత్రీ ఆఅనువాదకుడే! మన వాజ్మయములో స్వతంత్ర రచనల కంటె అనువాదాలే అధికమా అనే సందేహము కలుగుతుంది. అయినా అనువాద గ్రంథాలు ఉత్తమములైతే సర్వదా ఆదరణీయాలు. విశ్వ సాహిత్యమాల మొదలైనవి ఆంధ్రీకరించిన అనేక [గ్రంథాలను (ప్రచురించినాయి. ఇప్పటికే వంగభాషనుండి అనేక గ్రంథాలు అనుపదింపబడ్డాయి. యింకా మన పోదర భారతీయ భాషా వాజ్బ్యయములందలి ఉత్తమ రచనలను ఆంధ్రికరించవలసిన ఆపశ్యకత ఎంతైనా ఉన్నది. ఇప్పటికీ మన సోదర డక్షిణభాషా

1530 పందిరి ముల్లికార్దునరాప్పు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము వొజ్బయములలో వెలువడిన గొప్ప రచనలు - స్యుబహ్మణ్య భారతి, వల్లథోల్‌ నారాయణ మీనస్‌ లాంటి వారి రచనలు - ఆంధద్రీకరించబడలేదంటే కోచనీయముగా ఉన్నది.

నేడు ముఖ్యముగా చిన్న కథలు, నవలలు మాత్రమే ఆంధ(దధీకరించ బడుతున్నాయి. వాజ్మయానికి యితర అంగాలైన నాటకాలు, పద్య కావ్యాలు సహితము అనువాదము జరగాలి. ఇప్పటికీ కీ.శే. వీరేశలింగము పంతులుగారు గోల్డుస్మిత్‌ రచించిన కొన్ని వద్యకావ్యాలను ఆంధ్రీకరించారు. టి. యస్‌. ఇలియట్‌ మొదలుగాగల కవుల కవితలను శ్రీ ఫ్రైరాగి అనువదించాడు. యప్‌. విలన్‌, మయకోవస్కీ మున్నగు ప్రఖ్యాత కవుల కవితలను శ్రీశ్రీ ఆంధ్రపాఠకలోకానికి అందించి వారి మన్ననలకు పాత్రుడయ్యాడు, ఇంకను షేక్సిపియర్‌, బెర్నార్డ్‌షా లాంటి వారి నాటకాలను, ఇంకా యితర ప్రఖ్యాత గేయకావ్యాలు అనువదించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.

ఉత్తమ అసువాదాలను సర్వదా ఆంధద్రపాఠకలోకము ఆహ్వానించి ఆదరిస్తుంది. ప్రపంచ (ప్రఖ్యాత రచయితల [గ్రంథాలను విడివిడిగా పప్రచురించుటకంటె, సంపుటాలుగా జేర్చి వారి రచనలను ఆంధ్రలోకానికి అందించాలని సహృదయులను అంధ పాఠకుల తరఫున వేడుతున్నాను. అంతేకాదు, ఆంధ్రులు సృష్టించిన సారస్వతాన్ని సహితము ప్రపంచానికి పరిచయము చేయాలి. అప్పుడే సారస్వత (ప్రపంచములో కల్పించబడిన అడ్డకట్టలు తెగుతాయి. (కిన్నెర; సంపుటము 33, సంచిక 7, జూలై 1950

చలంగారి మ్యూజిం గ్స్‌ ఎస్‌.ఎన్‌.చారి, ఎం.ఎ

మూ్యూజంగ్స్‌ అంటే భావపపరంపరలు. రచయిత హృదయములో మానవ

జీవితమువలన కలిగిన (పప్రతికియ ఈ రూపేణ వ్య కృమవుతోంది. భావాన్ని సంక్షిప్తముగా సూటిగా వ్యక్తము చెయ్యటానికి ఇంతకంటె మంచి సాధనము లేదు. ఒక విషయముతో ప్రారంభమైన లేఖ [క్రమముగా సహజముగా అన్యవిషయములలోకి మారి ఒక శృంఖలగా తయారవుతుంది. వ్యాసములో మాదిరిగా ఏవిధమైన కట్టుబాట్లు లెవు. ఐక్యత అవసరము లేదు. ఒకటి తరువాత ఒకటిగా అనేక విషయాలు.

ఉత్తమ సాహిత్య (గ్రంథాలలో రచయిత వ్యక్తిత్వము స్పష్టముగా గోచరిస్తుంది. అందులో మ్యూజింగ్స్‌ వంటి రచనల విషయము ఇక చెప్పవలసిన పనిలేదు. మిగతా రచనలన్నింటి కంటే మ్యూజింగ్స్‌లో చలంగారి వ్యక్తిత్వము ఎక్కువగా పరిస్సుటమైంది. విషయాన్ని సూటిగా పాఠకుని మనస్సులో గుచ్చుకొని పోయేటట్లు చెప్పుటయే చలంగారి (ప్రత్యేకత. అన్ని పుస్తకాలూ ఒక ఎత్తూ మ్యూజింగ్స్‌ ఒక ఎత్తూ.

(ప్రకృతి వర్ణనలూ భావావేశము అక్కడక్కడ కనపడినా మొత్తముమీద మ్యూజింగ్స్‌ విమర్శనాత్మకమైనవి, ముఖ్యముగా సాంఘిక విషయముల సమీక్ష. సాహిత్యములో సాంఘిక దురాచారాలను ఘాటుగా విమర్శించటము మొదలు పెట్టింది ఇబ్బను. చలంగారిలో ఇబ్బను ఛాయలున్నాయన్నారు, పాలగుమ్మి పద్మరాజుగారు. పందిరి మల్లికార్టునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1532 పందిరి షుల్గికార్డుసరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కాని ఇబ్బనుకంటే కూడా ఇంకా త్మీవంగా వుంటుంది చలంగారి విమర్శ. ఇబ్బను విమర్శ పరోక్షంగాను వ్యంగ్య పప్రధానముగాను వుంటుంది. చలంగారు కూడా కొంతవరకు వ్యంగ్యమును ఆశ్రయించినా ముఖాముఖిగానే దెబ్బకొడతారు. బెర్నార్డ్‌షా మాదిరి సాంఘికదోషాలను అతిశయోక్తులుగా వర్ణించటము కూడా చలంగారి మతంకాదు. మ్యూజింగ్స్‌ చదువుతూవుంటే ఆయా విషయాలవైపుకు దృష్టే మరలుతుంది. ఆ విషయాలను గురించి ఆలోచించవలననే జిజ్ఞాస రేకెత్తుతుంది. అదే రచయిత ప్రతిభ. సాంఘిక విషయాలకు సంబంధించిన ఒక ఉదాహరణ చూడండి:

“మార్దవమైన అమాయకమైన సౌఖ్యాలు (క్రమంగా తొలగిపోతున్నాయి జీవితాల్లోంచి. నాగరికతవల్ల నరాల్ని కొట్టి, గుంజి తీవ్రంగా కంపింపటేస్తేనే గాని చలనం కలగటంలేదు. హృదయాలకి సినిషూరంగులు, రేడియో అరుపులు, అత్తరుఘాటులు, కాఫీహోటలు బరువు రుచులు. పట్టణపు స్త్రీలు మల్లెపూలు గుచ్చుకోరు. విద్యావంతులు మాటలు, కబుర్లు, తగాదాలు, క్లబ్బులు వీటితో గడుపుతారు. సాయింత్రాలు తల్లో మల్లెపూలు విచ్చినప్పుడు ఆ వాసనని అంగీకరించేందుకు వ్యవధి లేదు - కుర్చీలమీద కూచొని “బ్రిడ్జి ఆడే స్త్రీలకి. మల్లెపూలు గుచ్చటం మాని, సిల్కుచీరలు, భర్తల గొప్పదనాలు, పిల్లలవిద్యా, అధికారం గల స్నేహితుల షోకులు, వియ్యంకుల విరాళాలు - ఇవీ వాళ్లు చేస్తున్న పనులు. స్వతంత్రాన్వేషణంలో విద్యావ్యామాహంలో శాంతికీ, సుఖానికీ దూరమైపోయినారు. పోనీ, ఆ స్వతంత్ర మేమీ రాలేదుకదా, ఒక విధమైన బానిసత్వంనుంచి యింకోవిధమైన బానిసత్వానికి ప్రయాణమైనారు. వడ్డాణాలు, కాసుల పేర్లూ మాని సన్నగొలుసులకే, రవ్యలగాజులకే దాసులైనట్లు, ఆర్థికస్వాతంతృ్య్య్యము వచ్చినా సెక్సు స్వాతంత్య్యం రాలేదు. భర్తకోసం వెతకడం, భర్త దొరికిన తరువాత తగాదాలు, ఈర్ష్యలు, దాచుకోడాలు, నటనలూ, భర్త దొరక్కపోతే రహస్యప్రియులు - ఇదీ నవీనస్త్రీల చరిత్రలు”

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మన జీవితంలోంచి కళ, సౌందర్యము, నిజమైన ఆనందము [క్రమంగా లోపించిపోతున్నాయి. అసలు జీవితలక్ష్యమే మరచిపోయామెమో. చిన్న చిన్న విషయాలే ఆదర్శ్మపాయమైనాయి. సరియైన

చలంగారి మ్యూజింగ్స్‌ ఎన్‌ ఎక్‌ చారి, ఎంఎ 1533 విలువలు తెలుసుకోలేక పోతున్నాము ఇటువైపు మన దృష్టి మరల్చి చలంగారు చేసిన ఉపకారము మరవలేము

“కవిత్వం, సౌందర్యం, (ప్రేమ - ఇట్లాంటి విలువలు ఈనాటి మనుష్యుల మనస్సులలో లేవు వున్నాయని కొందరు పునతకోసం నటిస్తారు ఆస్తి, పిల్లలు, గొడ్లు, బీరువాలు, చీరలు, ఇళ్లు - ఇవే నిజమైన విలువలు వాళ్లకు

మోసాలు, చయాలు, ద్వేషాలు సెక్సు, పిల్లలు, ఎడుపులు, బాదలు, రోగాలు

  • నిజముగా జీవితం ఎంత దుర్చరమైపోయింది ఉన్నతమైన ఆనందము మన జీవితంలోంచి ఎనాడో వెల్లిపోయింది అనవసర త్యాగాలు, చయము, పాతిప్రత్యము, జలసీ, దొంగ దేశబక్తి ఇవే మిగిలాయి మంకు మ్యూజింగ్స్‌ చదువుతూవుంటే ఏదో చెప్పలేని ఆవేదన కలుగుతుంది మన జీవితాలు చివరకు ఇట్లా అయ్యాయి ఏమిటా అని ఆలోచిలంచుతాము ఇంతకంటె కవి సపలత మరేముంది

సుబమైన, ఆనందదాయకమైన ఆదర్శానికి సరిగ్గా వ్యతిరేకముగా మనజీవితము గడుస్తోంది అందుకనే ఆదునిక జీవితానికి సంబందించిన అన్నివిషయాలు మ్యూజింగ్స్‌లో పూటైన విమర్శకు గురి అయ్యాయి ఆదునిక పరిప్టితులు, స్తం పురుష సంబంద బాందవ్యాలు, అబద్దాలతో నిండిన మన జీవితాలు, గార్హస్థ్య జీవితాలు, చదువులు - ఒకటేమిటి అన్నీ ముఖ్యంగా చదుపులపేరుతో చిన్నపిల్లల జీవితంలో ఆనందాన్ని ఎవిదంగా చంపివేస్తున్నామో తలుచుకుంటే హృదయము జలదరిస్తుంది అసలు విద్య అంటే ఏమిటి?

విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధి చెయ్యటం సౌందర్యాలకు కళ్లు తఆెరవటం బాదల్నించి, కషప్టాల్నించి తప్పెంచుకునే నేర్పు నివ్వడం, ఇతరుల స్వేచ్చల్ని అడ్డగించే స్వార్హపరత్వంనుంచి, అంతా మనకే కావాలని దాచుకునే కాపీనంనుంచి, చయాలనుంచి తప్పించడం

ఆనందాన్ని ఇవ్వని జ్ఞానం, మనోశరీరాల సౌబ్యం చంపే జ్ఞానం ఎందుకు? బాద, సౌబ్యము తప్పితే నిజానికి వేరే విలువలు లేవు ౮1౧౭16 గా చూస్తే బాదని తగించి ఆనందాన్ని వృద్ధిచెయ్యని విదానాలన్నీ మముష్యృజాలీకి శత్రువులు

రవీలదుడు. రోమాలా ఒకరేమిటి ప్రపంచములో అనేకమంది జత్తమ రచయితలు ప్రస్తుత విద్యావిదానాన్ని దానిలోని దోపాలకు విడమర్చి చూపారు కాని మన మింకా కళ్లు తెరవలేదు

1534 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ; సాహిత్యము

మరొక విషయాన్ని తీసుకుందాము. ప్రస్తుతము స్త్రీ పురుషుల సంబంధ బాంధవ్యాలు. స్త్రీల శరీరాన్ని బంధించటము, [క్రూరత్వము, బలవంతము, నిరంకుశత్వము - ఇవే మనము రోజూ ఇళ్లలో చూచే దృశ్యాలు. శాంతి సుఖాలతో నిండిన గార్హ స్థ్యజీవితము, (పేమ అని మనము ఎంత గొప్పగా చెప్పినా అవి ఏనాడో జీవితాల్లోంచి మాయమైపోయాయి. శారీరకసంబంధ మొక్కటే తుచ్చమని, మనస్సు (పేమ ముఖ్యమని, మనస్సు లేకపోయినా భార్యగా జీవించటంకంటే లేచిపోవటమే మంచిదంటే పవిత్ర వివాహసంస్థనే చలంగారు నిరోధించి పీకి పారవేస్తున్నాడని ఆరోపణలు. చాలమంది అనుకుంటున్నట్లుగా చలంగారు వివాహాన్నే తిరస్కరించారా? వివాహము స్థరమైన వ పురుష సంబంధము. అది మానవ స్వభావములోనే వుంది. చలంగారి మాటలలోనే చెపుతున్నాను వివాహాన్ని నిషేధించినా కలిసి ఉండటం పోదు. (పాపం మన (పజామిత్రలో విమర్శకు మ్యూజింగ్స్‌లో (ప్రతి విమర్శ చూడండి) ఈ చట్టాలు, బంధాలు అన్నింటినీ భేదించి నిజమైన (పేమ ఏనాడైనా మానవజీవితంలో తొంగి చూడాలని వ్రాస్తూంటే చలంగారు పాతివ్రత్యాన్ని శీలాన్ని14060630 నో ధ్వంసం చేస్తున్నారని (ప్రచారం. వివాహంలోని అక్రమాలు, అన్యాయాలు పోవాలంటే, స్త్రీ మీద పురుషుని ఈ అధికారాలు, నిర్చ్బంధము పోవాలంటే వివాహాన్ని నాశనంచేయ చూస్తున్నారని ఆరోపణలు.

కొంచము ఆలోచించి చూస్తే మనకే స్పష్టమవుతుంది. జీవితంలో |పేమకు మనము ఎంతమాత్రం స్థానం ఇస్తున్నది. భోజనం, పాలిటిక్సు జీవితంలో ఇవి రెండే మిగిలాయి. మిగతా విషయాలన్నీ మరిచిపోయాము. ఏదో అలవాటు ప్రకారము అన్నీ మామూలుగా జరుపుకుపోతాము. పిల్లలు, చదువులు, అన్నీ (క్రమంగా జరిగిపోతాయి. చలంగారు ఘాటుగా చెపితే కష్టం కలుగుతుంది. ఎందుకంటే సత్యాన్ని చూచే, అంగీకరించే శక్త్సి మనలో నశించిపోయింది. చలంగారి ఒక వాక్యం ఎప్పుడూ చెవులో గిలిగురులు పెడుతూ వుంటుంది. వ్రాస్తే చాలామందికి కోపం రావచ్చు. కాని సత్యానికి భయపడవలసిన అవసరము లేదు.

చలంగారి మ్యూజింగ్స్‌ ఎన్‌.ఎన్‌.చారి ఎంఎ 1535 “గర్భాదానాలతోనేగా వీరి ప్రమ చరిత్రలు ప్రారంభం, అంటే “రేప్‌తో, ఒక్క యువకుడికి ఈ ఆచారాన్ని ఎదిరించే ధైర్యం లేదు" “అందరూ (గేమనుగురించి మాట్లాడే వాళ్లే. వీళ్లందరికీ (పేమ అక్కడే ప్రారంభం. అక్కడే ఆ నిమషానే అంతం. మోహాన్ని అలవాటుని అతిక్రమించే (ప్రేమను గురించి వ్రాయపోతే వ్యభిచారం, పశుత్వం అని అరుస్తారు” సెక్సు స్వాతంత్రం అంటేనే చాలామంది వులిక్కి పడతారు. ఎమాత్రము ఆలోచించినా సెక్సు స్వాతంత్య్యుం వచ్చినా కలసి వుండటం ఏలాగూ వుంటుందని స్పష్టమవుతుంది. ఇక భయం ఎందుకు? స్త్రీ పురుషులు స్వేచ్చగా, త్వరగా (ఒకప్పుడు అనాలోచితంగా) విడిపోతారని. కాని మోహము (ప్రేమ లేనప్పుడు ఒక్క శారీరకసంబంధమే కలిగిఉండటమే ఎంతవరకు వుచితమో తేలికగా నిర్ణయించుకోవచ్చు. (ప్రస్తుతము అసలు స్త్రీ పురుషులు స్వేచ్చగా కలుసు కుంటానికీ (ప్రేమకు అవకాశమే లేనప్పుడు ఈ విషయాలన్నీ ఆసంగతమేమో) సెక్సు స్వాతంత్యుం కావాలన్నా మాటలతో, క్షణాలలో వచ్చేదికాదు. మనలో తరతరాలుగా జీర్ణించుకొనిపోయిన ఆచారాలు, అలవాట్లు, ఆలోచనలు ఎన్నో ఆమూలపరివర్తనము చెందవలసివుంది. ఇక్కడే చలంగారి పాతలనుగురించి, పౌరాణిక పాత్రల 04గ040/8 గురించి (చలంగారి శబ్దాలలోనే) 'రెండుముక్కలు తలుసుకొనటం మంచిది. “కొందరి కొందరిలో ఒక్కొక్క గుణం అద్భుతంగా ప్రకాశిస్తుంది. అంటే, పాత పతివ్రతల్లో అనుకరణీయమైన ఉత్తమగుణాన్ని మాత్రమేగాక వారి లోపాలన్నీ ఆదర్శాలనడం వల్లనే వాళ్లని తిరిగి [వాయవలసివచ్చింది” ఇక ఆధునికసపమయానికి చెందిన పాత్రలు. ఒకవైపు నీచులు, కులటలు, రోడ్డుపక్క దిక్కులేక చచ్చే స్త్రీలలోని బెన్నత్యం మరియొకవైపు పుణ్య పవిత్ర ప్రతిష్టాపూరితు లనుకునే సతులలో నీచత్యం - స్పష్టమవుతుంది. ఈ నగ్నసత్యం చూడటానికి ఎంతో భయంకరం. అర్థము చేసుకోవాలంటే ఎంతో హృదయవిశాలత, సహానుభూతి కావాలి. ఎందుకంటే ఏదైతే సత్యమని మనము నమ్ముతూవచ్చామో, ఆరాధించుతూ వచ్చామో, అవి సరిగ్గా తద్విపరీతమని ఎవరైనా నిరూపిస్తే అసలు మనము చదవలేము, చదివి అర్ధం చేసుకుంటానికి ప్రయత్నించము. కళ్లముందు అంతా అంధకారమయమై

1536 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము పోతుంది. చదివి స్థిరమైన వర్తమానమునుండి ఏదో నిశృయంగా తెలియని భవిష్యత్తులోకి అడుగు ెట్టలేము. ముందు ఏముందో అనే భయము వెనుకకు లాగుతూనే వుంటుంది. కాని సత్యాన్ని అంగీకరించకతప్పదు. భవిష్యత్తు ఏదైనా ధైర్యంగా నిలబడి తీరాలి. లేకపోతే వికాసము, ఉన్నతి అనే శబ్దాలకు అర్థమే లేకుండా పోతుంది.

"పెద్దపెద్ద విషయాలు చదివి సాధారణమైన మన అలవాట్లు తీసుకుందాము. మన సభ్యత వెనక ఎంత డాబు దర్పం, అనవసరమైన బడాయి వుందో తెలుస్తుంది. దైనిక జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు [గహించి వాటి వెనకభాగాలను చలంగారు చక్కగా స్పష్టంచేశారు. + .

“చాలామంది సముద్రపు ఒడ్డుకు ఎందుకు వస్తారంటే మార్పుకోసం. ఆఫీసునుంచి, వంటిళ్లనుంచి, నలుగురూ వస్తే ఎవరైనా తెలిసినవారిని కలుసుకోవచ్చునని, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చుననీ, అంతకన్న చాలామందికి సముద్రతీరానికి రావడం ౯౭౩౧1౦౧. తమ గొప్పతనం చూపించుకోడం. కారూ, బట్టలూ, పువ్వులూ, కుక్కలూ, కొంతమంది తమ స్నేహితులతో “యేమండీ

  • యీవాళ సాయంత్రమండీ బీచికి వెళ్లామండి. చాలా బావుంది లెండి” అని చెప్పుకునేందుకు వస్తారు. |.

సాయంత్రము బీచికి వెళ్లేవారు, వెళ్లనివారికన్న సాంఘిక సోపానాల్లో ఒకమెట్టు యెత్తు. బీచిలో తక్కినవారు అనుభవించే ఆనందం “*మిన్‌ో అవుతున్నామనే ఆశతో వస్తారు చాలామంది. ఈ “మిన్‌” అవుతున్నామనే ౧౭16958065 [క్రమంగా ఎక్కువ అవుతోంది ప్రజల్లో. నిజమైన ఆనందంమీది వాంఛకాదు. ఆనందం “మిసొ అవుతున్నామనే దిగులు (పోత్సహిస్తోంది చాలా కార్యాలని”

మ్యూజింగ్స్‌ మన జీవితాలకు దర్చణం. మన ఆచార వ్యవహారాలు, సభ్యత అలవాట్లు అన్నిటి ప్రతిబింబాలు అక్కడ కనపడతాయి. మామూలు (పతిబింబాలు అనటము కంటే ఎక్సురే ప్రతిబింబాలు అనటము సమంజసము. ఎందుకంటే

మన ఆంతర్యములోని, సాధారణముగా మనకు దృష్టి గోచరముగాని మన మానసికప్రవృత్తులను, ఉద్దేశాలను (1401౪69) కూడా చలంగారు వివరించారు.

చలంగారి మ్యూజింగ్స్‌ ఎస్‌ఎన్‌వారి ఎం.ఎ 1537

మ్యూజింగ్స్‌లో లేని విషయము లేదు. ఆధునిక జీవితాన్ని ఇంత సమగ్రంగా విమర్శించిన వారు చాలా తక్కువ. ఈ విమర్శవలన తేలిన ప్రధానమైన విషయాలు మూడు. 1. సంస్కృతి, విజ్ఞానపరంగా మానవుని వున్నతికి ప్రాపంచికమైన అభివృద్ధి ఒక సాధనము మాత్రమే. ధనార్జనమే జీవితపరమార్థము కాదు. ఉత్తమమైన సంస్కృతి. సంస్కారములు అలవరచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది, ఆత్మబెన్నత్యం (ప్రధానం, అందుకు నిజమైన, ఉన్నతమైన ఆనందము, సర్వియెన విలువలు తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలవెనక ఆనందము, కళ, సౌందర్యము, (పేమలను మరిచిపోకూడదు. 2. అలవాట్లు, కట్టుబాట్లు. జీవితంలో (ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నించవలసిన సమయము వచ్చింది. భావదాస్యం నుండి మనలను విడిపించ ప్రయత్నించినవారు. ప్రయత్నించి సఫలత పొందినవారు కూడా తెలుగులో మరొకరు లేరంటే సత్యదూరం కాదు. అలవాట్లకు కట్టుబడినన్నాళ్లు ఇక వికాసానికి దారిలేదు. సత్యాన్వేషణ, కష్టించి సాధించినదానిని ఆచరణలో ెట్టటము [పారంభించాలి. ౯౭4 (౧1౧60౧0 ౪100061 ౧9౮61085 యొక్క (ప్రాముఖ్యత వివరించి చలంగారు చేసినమేలు మరువతగినది కాదు. 3. రూపము గుణములవలన కలిగిన మోహము, పరస్పరము అర్థము చేసుకొనుట, సానుభూతి - దాంపత్యానికి ఆధారం కావాలి. కానిసందర్చములో ప్రస్తుతకాలములో మాదిరిగా దాంపత్యము సరకషువుతుంది. ఏదో కామవాంఛ తీర్చుకొనటము. అజ్జానములోపడి కొట్టుకుంటూ పిల్లలు, ఇంటిపనులమధ్య శతమతమయ్యీ భార్య; ఇంట్లో బయటాకూడా విసుగెత్తిపోయి దుర్చరజీవితాన్ని గడిపే భర్త. అంతా పెద్ద భారం. ఏ నియమాలు లేకుండా కామవాంఛ తీర్చుకోవటమే చలంగారి ఆదర్శమనుకునే వాళ్లు భమలో వున్నారు. ఇది వ్యాసరూపేణ విపులముగా చర్చించవలసిన విషయము.

ఇక శృంగారము - (పకృతి. పకృతి సౌందర్యము శృంగారోద్దిపనముగా ఏనాడో అంగీకరించబడింది. సిర్ధాంతీకరించబడింది. ఇక చలంగారు ప్రకృతిఒడిలో స్వచ్చందదైన (ప్రణయలీలలంటె చాలముంది “సిగ్గులేకుండా” అని [పారంభిస్తారు. మన అలవాట్ల (ప్రకారము, అట్లా అనిపిస్తుంది. కాని అందులోని సుఖము, హాయి అనుభ వైకవేద్యము. చాలీచాలని ఇళ్లలో, మురికిసందులలో మధ్యపర్గ జీవితాన్ని

1538 పందిరి మల్లికొర్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గడిపే పట్టణవాసులకు అలవాటులేని కారణమున సభ్యతావిరుద్ధముగా కనపడినా, అది స్వాభావికమే, రసోద్దీపకమే.

కేవలము విమర్శకాదు, తత్వాన్వేషణ, సాందర్యాన్వేషణలకు కూడా మ్యూజింగ్స్‌లో సముచితమైన స్థానము అభించింది. సాహిత్యములో, (ప్రకృతిలో, స్త్రిలో సర్వత్రా సౌందర్యాన్వేషణ, ఆనందటప్రాప్తి చలంగారి అభిమతము. ఎంకిపాటల్లో ఎంతో ఉదాత్తమైన, అనంతమైన భావాలు కనపడినాయి. చూడండి-

“యెంకెవ్వరని లోక మెప్తుడైన కదిపితే

యలుగు నీడలకేసి యేలు చూపింతు.

ఈ రెండుపాదాలకే ఈడైన కవిత్వం ఈ ప్రపంచ వాజ్మయంలో ఎక్కడా కనిపెంచదు. నా ముందు ఆరాటపడే ఈ సము్ముదపు అగాధత్వము, నిరంతర అశాంతీ, నా హృదయంలోని అర్థంలేని ఆరాటాలు, నిర్నిద్ర, ఆదర్శవాంఛా, సఫలంలేని, కాని ఘోషాజీవితంలోని మాధుర్యమూ, విషమూ, నిషృ్ఫృలత్వమూ, నిరాశా, నిరంతరము ఆకర్షించే ఈ ఆనందాల అల్పత్వమూ, వ్యర్థత్వమూ గోచరిస్తాయి నాకు ఆ పాదాలలో. అంతేకాదు, ఈ సృష్టి ప్రవాహపునడక - ఆత్మ అందుకునే అర్థంకాని పిలుపు, సాధారణ మోహంలోని మిష్టరీ, బొిన్నత్యం అన్నీ తోస్తాయి నా మనోవీధిలో"

కఏత్వము అర్థంచేసుకోవాలంటే కొంతవరకైనా కవిహృదయము కావాలి. సహృదయుడు కాని వ్యక్తి విమర్శకుడు కాలేడు.

ఇంకా సాహిత్యము, శ్రీనాథుడు - పోతనలకు సంబంధించిన భాగాలు చదివితే తెలుస్తుంది. గొప్ప కావ్యం (వ్రాయాలంటే పదాలు కాదు, సమాసాలు కాదు, వ్యాకరణం కాదు కావలసింది, ఆత్మ బొన్నత్యం. ఏదో ఒక గొప్ప 5110016, తిరుగుబాటు, ఆదర్శ ప్రయత్నంలేందే ఆత్మతుష్టి కలగదు. అందులోనే వుంది పోతన విశేషత.

సౌందర్యాన్వేషిగా మ్యూజింగ్స్‌లో ఇంకా అనేక ఉదాహరణలు. విశాఖపట్టణం వీచి వర్ణన చూడండి. ఆ దృశ్యము హృదయాన్ని నిలిపివేస్తుంది. ఒకేచోట స్థిరనివాసమంటే అసహ్యమైన చలంగారికి కూడా అక్కడే, బీచివడ్డున ఇల్లు

చలంగారి మ్యూజింగ్స్‌ ఎన్‌.ఐన్‌.చారి, ఎం.ఎ 1539 కట్టుకొని ఎందుకు వుండిపోకూడదా అనిపిస్తుంది. మల్లపూలు గుచ్చటం గురించి చలంగారు వ్రాసిన మ్యూజింగ్స్‌ ఎప్పుడూ మరవలేము.

' “ఎవరో గుచ్చి యిచ్చినవీ, అమ్మినవీ దండలు తలలో పెట్టుకుంటే ఈ శాంతి ఈ మాధుర్యం కలుగుతుందా? ఇటా చేతితో తాకి, విశ్రాంతిగా గుచ్చిన అనుభవం! శు[కుడి కాంతివలె తెలియకుండా రక్తం మధ్య యొక్కడో చెలీంచే శృంగారం! జూతికారాయ్‌ సంగీతంవలె నరాలమధ్య చక్కలిగింతలు పెట్టే చిరునవ్వు!!...ఈ మల్లెపూలని సూదికి గుచ్చటము కష్టంగా వుంది. వాటి హృదయాల్లోంచి ఈ దారాన్ని లాగుతూన్నట్లుగా బాధగా వుంది నాకు. అవి ఇంకా పసివిగా వున్నప్పుడే ఈ మొగ్గల్ని కోసి, గుప్పెట్లో పెట్టుకొని, బుట్టలో అదిమి, వేళ్లతో లెబ్బలు పెట్టి, యిట్లా గుచ్చి బాధించినా, ఎండించి పాడుచేసినా, సాయింత్ర మయ్యేసరికి పాపం, అవి వికసించి పరిమళాన్ని లోకంమీద వెదజల్లుతాయి.”

ఎంతో సాధారణ విషయము కాని ఎంతో సూక్ష్మముగా, ఉదాత్తంగా వర్ణించబడింది, ఈ భావుకత, సహృదయత అన్యథత దుర్లభము.

మ్యూజింగ్స్‌లో సౌందర్యము - ఆనందములకు సంబంధించిన అనేక విషయాలు కనపడతాయి. సౌందర్యము ఏదో ఒక అంగసంబంధమైనది కాదు. అంతర్నిహితమైన జ్యోతివల ఆత్మప్రకాశము. దాని అనుభూతి రహస్యాత్మకమైనది. చలంగారి మాటలలో చెప్పాలంటే సరిక్రొత్త అవటముచేత కథలలోని 1/516గ0౮69 ఉ06గ6౧౦8౪8 0 06461/ ఏదైతే వుందో దానిని అందరూ అర్థము చేసుకోలేక పోతున్నారు. ఈ సౌందర్యానుభూతి సుఖాత్మకమైనదే కాదు, చాలా తృప్తితో (గ్రేమించే స్త్రీ హస్తాల్లో కూడ చెప్పలేని దిగులు కలుగుతుంది. “ఎమిటి? ఎందుకు? నేనెవరు? ఎంత నశ్వ్యరం” అని మూలుగుతుంది హృదయం. “ఇంక, ఇంకేంచెయ్యను" అనే నిరాశ, అశాంతి దేనిలోను తృప్తిపడక, వూరికే అశాశ్వతమై ఎప్పుడూ మారే ఆశలతో ఆరాటపడుతూ వుంటుంది మనసు.

(శేమ, ద్వేషం, భయం, అలవాట్లు మొదలైన అనేక విషయాలు దైనిక జీవితంలోంచి ఉదాహరణలతో ఎంతో మనోవైజ్ఞానికముగా నిరూపింపబడినాయి.

1540 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము “నియమాలు నియమాలంటారే అదంతా చాలామటుకు 54/౧0 0౧౯5 1206. నిజమైన నియమాలు మనస్సులోనే వుంటాయి. కాని బైటికిరావు. కనుక అవసరమైనప్పుడు, ఎపరికీ తెలియకుండానే వాటిని సులభంగా వొదులుకోగలరు. కాని యే నియమాలకై మనిషి ప్రసిద్ధికెక్కాడో వాటిని వొదులుకోలేడు మనిషి. అంటే ఆ కీర్తిని మాపుకోలేడు. దాత అనే కీర్తిని పొందిన మనిషికి యాచకుణ్జి పొమ్మనే ధైర్యం వుండదు. మననీ, మన నియమాల్ని ప్రపంచమంతా చూస్తున్నారనీ, గౌరవిస్తున్నారనీ అనుకొని ఆ పీఠంనుంచి ఎక్కడ చ్యుతికలుగుతుందోనని భయపడి “నియవు౦ం, నియవుం చాలా వృన్నతమైనది దాన్ని తప్పకూడ"దని సమర్థించుకుంటారు. అట్లానే చాలమంది నియమాలు వారి అవసరంకొద్దీ, నమ్మకాల కొద్దీ వారు ఏర్పరచుకున్నవిగాక ప్రజలు వారిపై విధించినవి ఐవుంటాయి” “ఒకసారి కొన్ని 'యేళ్లకిందట, నా చిన్నప్పటి టీచరు ఒకాయన వచ్చారు, నన్ను చూడ్డానికి. ఆయన్నిచూస్తే చిన్నప్పుడు నాకు చాలాప్రేమ, ఇప్పటికీ గౌరవం. నన్ను గురించి విని, నా స్థితిని తలుచుకొని దిగులు పడ్డారు. అదే భేదం - మనని నిజంగా (గ్రేమిస్తున్నవాళ్లు, మనం అవినీతిపాలవుతున్నామన్నాా కష్టాల్లోకి పోతున్నామన్నా దిగులుపడతారు. ఎవరన్నా కోపగించారా, వాళ్లు మనమీద (ప్రేమచేతకాదు, వారిమీద స్వంత (ప్రేమచేత, లేకపోతే ఈర్ష్య చేత” మనస్తత్వానుగుణముగా భావాల వర్ణన మ్యూజింగ్స్‌లోని ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటి. అనేక స్థలాలలో భావాలు సూక్షా్మాతి సూక్ష్మములై దార్శనికములైనాయి. పక్షుల వేటకు సంబంధించిన వాక్యాలు చదవండి. హత్యకుముందు హృదయము కరుణార్జ్రృమవుతుంది. ఒక్కసారి మొదలుపెట్టగానే పక్షుల వేటకు ఇక అంతముండదు. రక్తము కోసము తీరని దాహము. చివరకు జీవన మరణముల మీమాంస. ఈ క్రింది వాక్యాలు కూడా చూడండి - “సుఖమూ, బాధా ఈరెండే విలువలు - ఏదైనాసరే, ఏ (ప్రయత్నమైనా అన్నీ విడతీసి చూస్తే చివరకు మిగిలే అసలు విలువలు, బాధనుంచి తప్పించుకోడమూ, సుఖాన్ని అనుభవించటమూ - భవభూతిని చదివితే పండితునికి వచ్చే ఆనందంకన్న బాలనాగమ్మ చదివే పామరుడికి తక్కువ ఆనందం వొస్తోందా? నిశ్చయంగా చెప్పగలరూ? బాలనాగమ్మని ఆనందించే మనిషిని ఎందుకు

చలంగారి మ్యూజింగ్స్‌ ఎస్‌.ఎన్‌.చారి. ఎంఎ 1541 భర్తృహరికోసం విద్యామరలో పెట్టి తిప్పడం? జ్ఞాన మంటారా? సుఖాన్ని హెచ్చుచెయ్యని అనుభవంకోసం, జ్ఞానంకోసం, మార్పుకోసం యత్నించడం మూర్ధం.

లోకమంతా ఒక సుందరసమ్ము[ద్రం, అందాన్ని నిరంతరం అనేకరూపాల వెదజల్లుతోంది ప్రపంచంమీద. ఏమూలనుంచో చూస్తో కీటకాలనించి గొప్ప మేధావులుదాకా అనుభవిస్తున్నారు సౌందర్యాన్ని. తాము చూచింది ఇతరులు చూడలేక పోతున్నారనీ, తామేదో గొప్పయెత్తున గొప్పవి అనుభవిస్తున్నామనీ, ఇతరుల్ని ఆ స్థితికి తీసుకురావాలనీ తపన పడటం చాలా ఉదారం, కాని మూర్జం, వాళ్లూ అనుభవిస్తున్నారు కాని నీకవి సౌందర్యాలమల్లే కనపడవు.”

ఈవిధంగా మ్యూజింగ్స్‌లో మూడు విషయాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సాంఘిక విమర్శ, సౌందర్యార్చన, తత్వాన్వేషణ. [క్రమంగా విషయము గంభీరమైంది. ఆమధ్య “ఆంధశిల్పి"లో మ్యూజింగ్స్‌ చదివితే చలంగారు తత్వవేత్తగా మారిపోతున్నారని అనటానికి ఏవిధమైన సందేహము మిగలదు.

మ్యూజింగ్స్‌వంటి గంభీరమైన విషయాలనుగురించి వ్రాస్తో కళ, శైలి అని తలుచుకోవటము అంత సమంజసము కాదేమో. ఏమైనా మ్యూజింగ్స్‌లోని భావాలు ఎంతో సహజంగా మనస్సులోకి వచ్చినవి వచ్చినట్లుగా వ్రాయబడ్డాయి. “తోక లెత్తుకుని చెట్లమాూనుల కెగబాకే వుడతల్ని చెట్టు కొమ్ముమీదనించి వాటివంక కిందకుచూసే గోరువంకల్నీ కనిపెడుతూవుంటే, వీటికేమన్నా కష్టాలు, దుఃఖాలు వుంటాయా అనిపిస్తుంది.” ఏకాంతంగా కూర్చొని, పాతవిషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ, సుఖదుఃఖాలలో మునిగితేలే మనిషికి దృష్టి నాలుగువైపులా (పప్రసరించగానే ప్రాణికోటి నిశ్చింత, ప్రసన్నత చూడగానే అలా అనిపిస్తుంది. చలంగారి వ్యంగ్యము, హాస్యము మ్యూజింగ్స్‌లో ప్రత్యేకముగా చూస్తాము. వ్యంగ్యము ఎంత తీక్షణముగా వుంటుందో వెన కొన్ని ఉదాహరణలలో స్పష్టమైంది. కొంచెము వ్యంగ్యధోరణి, సున్నితమైన హాస్యముల సమ్మేళసము. “స్కూళ్ళలోంచి నప్వ్యూ, స్వేచ్చా, విశ్వాసమూ, ధైర్యమూ, అందమూ తరమగలిగారు. చాలా పాఠశాలల్లో గాలినీ, వెలుతురునీ కూడా బహిష్కరించారు. కాని యీ చెట్లు,

1542 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యీ యెొండ, గడ్డీ, గాలీ యెట్లాగో అధికార్ల ఆజ్ఞ్జల్ని తప్పించుకొని దొంగతనంగా జారబడుతున్నాయి.” భాషను గురించి రెండు ముక్కలు. మనస్తత్వవిషయాలు విపులీకరించటానికి, సూక్ష్మ మైన మనోభావాలు వ్య క్త్రముచేయటానికి తెలుగులో సరియైన పదాలు అంతగాలేవు. అయినా భాష ఎక్కడా కుంటుపడలేదు. కాని విషయాన్నిబట్టి మధ్యమధ్య ఇంగ్లీషు పదాలు అనివార్య మైనాయి. మ్యూజింగ్స్‌ వంటి రచనలు తెలుగులో తప్ప మన దేశభాషలలో మరెక్కడా కనిపించవు. చక్కగా చదివి, మననము చేసుకొని, విచక్షణతో మంచిచెడ్డలు గ్రహించి, జీవితాన్ని సరిదిద్దుకోవలసిన బాధ్యత మనది. (కిన్నెర: సంపుటము 3, సంచిక 8, (ఆగస్టు 051) భా యా భ్‌ డా ౮ క |.

  • ర లో క ట్‌

వినోద కథలు వేటూరి ఆనందమూర్తి

మినోదకథలు, చమత్కారకథలు విశేషించి మన తెలుగునాటి వ్యవహారములో వినబడుతుంటవి. కాలమూహింపరాని (ప్రాచీన కాలమునుండీ కూడ ఆంధ్ర సారస్వతరంగములో కవుల గురించీ, వారిని బోషించిన ప్రభువుల గుజించీ యిట్టి వినోదకథలు, చమత్కారకథలు ఉండుట మనకెజుకయే. మన తెలుగునాటి వ్యవహారములో ఆనోట యీనోట పడి దొరలుతూ దొరలుతూ నాటినుండి అట్టి గాథలు పెక్కులు జనక్రుతులై నేటివజకు నిలిచి ఉన్నవి. తెనాలి రామలింగడు, నడిమింటి మంగళేశ్వరశాస్తి9, పెద్దిభట్లు మొదలగు రసికులు, సాహితీపరులు ఉండువజకు చమత్కారకథలకు, వినోదకథలకు మనకు కొదువలేదు. రామలింగని పేంత్తి ఏడుకథలైన చెప్పుకొనకుంటే తలలేని మొండిపాము కరుచునని ప్రతీతి. అతని ఖ్యాతి అట్టిది:

ఈ వినోదకథలు ఎంత వినోదము గొల్పుతవో చూడండి! ఒకతూరి ఒక కదిశ్యరుడు రాజవీథిలో వెళుతుండగా ఎవరో దేవలూరి కేశవరెడ్డి అనువాడొకడు వెనుక నుండి “ఓహో!కపిగారూ!”” అని హేళనగా పిలచెనట! వెంటనే అతడు వెనుదిరిగి -

పీ పట్టినట్టు నోరను

వీ పట్టదదేమి నీకు వీ, పీ, లందున్‌

దీపయి రుచి పుట్టెనొ నీ

కీ పట్టున దేవలూరి కేశవరెడ్డీ!

1544 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

అని తడవుకోకుండ (పప్రశ్నించినాడట! పాపమారెడ్డి తలవంచుకొని తనదారిన బోయెను. ఆ కవీశ్వరుని సమయస్ఫూర్తి అటువంటిది. చాటుపద్యమణిమంజరిలో ఇదివజకే అట్టి కథలు కొన్ని ఆతనివి, మరియు ఇతరులవి కూడ ముదితముల ఉన్నవి. లభ్యమైనంత వజకు వినోదకథల నన్నిటిని ఒకచోట సేకరించి యుంచుట అవసరము. ఇంగ్లీషుభాషలో ల్యూకాసు వంటివారు ఈ కార్యమును తలపెట్టి పెక్కుకథలను సేకరించి పప్రకటించిరి. నిజమునకు ఆంగ్లముకన్న మన ఆలుగుభాషలోనే అట్టి వినోదకథల (సొదుర్భావమునకు ఎక్కువ అవకాశమున్నది. సాహిత్య సమావేశములు, సారస్వత సభలు, పండిత పరిషత్తులు, కవితాగోష్టులు, రాజాస్థానములు, అష్టావధాన శతావధానములు ఇట్టివానికి పుట్టినిండ్తు.

ఒకతూరి శతావధాని చెళ్లపిళ్ల కవిగారు అవధానము జరపుతూ ఉండగా ఎవరో కొంటెగా “చీకుముల్లుమీద పద్యమొకటి చెప్పండి” అని కోరిరి. వెంటనే అవధానిగారు అందుకొని “నిన్ను చెప్పునగొట్ట నీ బుద్ధి మానవో” అని సీసపద్యార్థ పాదమును అభినయపూర్వకముగా కనులెజ్జజేసి పలికి, అంతటితో ఆపి, పైవారి (ప్రశ్నలను పరికింప మొదలుపెట్టిరి. పాపము ప్రష్టపని నలుగురిలోను నవ్వుల పాలైనది. సిగ్గుచే జిదికిపోయినాడు. సభ్యులెల్లరు గొల్లుమనిరి. ఏదో కొంటెప్రశ్న గొప్పగా వేయబోతే చెప్పునకొట్టినట్లు సమాధానము వచ్చినదే - దీని పర్యవసాన మేలా గుండునో అని అందజూ శ్రద్ధతో ఆలింపసాగిరి. శాస్త్రిగారు కొంత తడవాగి

  • “ఛీ! యేమనందునే చీకుముల్లగొ అంటూ పాదము ముగించిరి. సంబోధనమంతా చీకుముల్లునకే అయినా ఎత్తుగడలో చూపిన చమత్కారము వలన ఎంత అలజడి కలిగినదో చూడండీ! ఇలాటి సమయస్ఫూర్తి శ్రీ శాస్త్రిగారిలో అద్వితీయముగా ఉండేది. మరియొక సందర్భమున; చెళ్లపిళ్ల కవిగారిదే అని వినికిడి! ఎవరో ఒకతూరి వారితో వాదించుతూ కాబోలును “అందరూ కవులేనా? అధఃకేశములు మీసము లగునా? అన్నారట. శాస్త్రిగారు వెంటనే క్షణమాలస్యమయినాలేకుండ “అందరూ కవులేనా అన్న సంగతి చెప్పలేను గాని అధః కేశములు మాత్రము మీసములే అగునని అనుకొంటాను” అని సమాధానమిచ్చిరట. సమయస్పూర్తితో పదమువిడిచి పలుకుటతో వాదించుతూ ఉన్నవారి పని పాపము రసాభాసమైనది. చెళ్లపిళ్ల కవిగారిని గూజ్బ్చిన వినోదకథలు యిటువంటివి మసెక్కులున్నవి. తడవతడవకు, అవధానము జరపిన ప్రతిచోటా ఎన్నెన్నో వినోదకథలను విసరివేసి సభ్యుల మనస్సులను చూజగొనేవారు. వారియెదుట నోరుతెజుచి ఎవ్వ రైన నిలువగలరా?

వినోద కథలు వేటూరి ఆనంచమూర్తి. = 1545

ఒకతూరి ప్రసూతి సందర్భమున-మంతసాని వలికివచ్చి శుభవార్త నాకాంక్షించుచున్న శాస్త్రిగారితో “స్టీర్టోదయమైనదండీ” అసెనట. “ప్రాచీనములా నవీనములా” అని ప్రశ్నింపగా ఆమె తెల్లబోయినది. ఇటువంటి కథలు బోలడు.

వినోదకథలలో కొన్ని అన్లీలములుగాను, కొన్ని మాత్సర్యపూరితములుగాను, కొన్ని ఆహాదజనకములుగాను ఉంటూ ఉంటవి. పెనిజప్పిన కథలలోనే ఈ మూడు ఆఅగుల కథలూ ఉన్నవి. కొన్ని కొన్ని కథకుల కర్తలెవరో తెలుస్తూ - కథవెనుక కర్తకూడా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాడు. కొన్ని సందర్భములలో కర్త మరుగుపడిపోయి కథ మాత్రమే వ్యవహారములో నిలచిపోతుంది. మజికొన్ని సందర్భములలో కథ (ప్రఖ్యాతమైపోతుంది. కర్త తారుమారైపోతాడు. కథలో ఏకొద్ది చమత్కార విశేషమున్నా, అట్టివాటిని కల్పెంప సమర్థుడయిన ఏ వానికో దాని కర్సత్వ మంటగట్టబడుతూ ఉంటుంది. ఈ కథలు చెవినుండి చెవికిగా మారుతూ ఉండడము వలన కొన్నాళ్లకు వాని ప్రాచీనతను గుర్తించుటకు కూడ కష్టసాధ్యమపుతుంది. కథ్రారసాచిత్యాన్నిబట్టి వాటికి ప్రాచీనతా, గౌరవము ఏర్పడుతూ ఉంటుంది. ఈ కథ వినండి; పండితుడొకడు రాజదర్శనార్థమై కోటలోనికి వెళ్తుతూ గడపదాటుతూ ఉండగా ద్వారపాలకుడు “దండాలు సాములు!గ అన్నాడట - పండితుడది విననట్లు లోనికి వెల్లి పోయినాడు. సభానంతరము తిరిగి వస్తుండగా ఆ ద్వారపాలకుడు ఎదురేగి “దండమిడిన దీవింప వేమయ్యా?” అని నిర్మాగమోటముగా అడిగెను. “ద్యారప్రవేశము చేస్తున్నప్పుడు లోపల ఒక కాలు బయటనొక కాలు ఉండగా నడుమ నమస్కరిస్తివ! ఏమనగలను!” అని పండితుడు సమాధానమచ్చెను. అంతమాత్రం మొగమోటమైన లేకుండా “దీవింప రేమయ్యా ?” అని అడిగినపుడు ఆ మాత్రము అంటిసట్లు అయినా అనకపోతే సారస్యములేదులండి! అశ్లీలమే అయినా అట్టిది సమ్మానార్హమే అవుతుంది!

కొన్ని కొన్ని కథలు 'కీపలము వినోదార్థమే సృష్టింపబడుతవి! వావిలాల వాసుదేవశాస్త్రిగారు ఉద్దండపండితుడు. వారియింట ఒక వివాహ సందర్భమట! కవులు, పండితులు సమావేశమై ఉండిరి. శాస్తింగారి బావమజదిగారు కూడ అందున్నారట. సభలో ఏదో తృీవమైన చర్చ సాగిస్తూఉండగా నడుమ బావమజది బావగారి పేలెత్త “ప్రాసయతులు వీడలేక పండితుడు - [ప్రాజ్ఞుడు - అయిఉండి యిలకా భోగముదాని పాదమునుబట్టి పెనగులాడుతున్నారదేమి న్యాయము?” అసిరట. బాహ్యార్ధము సత్యము కాకపోయినా బాపగారు కంగారుపడిరి. బావముఆది

1546 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము కొంటెతనపు మాటలకు పెద్దలందజు ముక్కున వేలు వేసికొనిరి. “ఏమి యీ అసందర్భపుమాటలు!” అనిరి. దానికాయనగారు “ఏమున్నది” - “వావిలాల వాసుదేవశాస్త్రి” అని చక్కగా ఆటవెలది పద్యపాదము చదివి వినిపించెనట. పకపకలతో వారికి పొట్టచెక్క లైనది. నేను వినిన కథతీరు యిట్టిది! పండితగృహములు కూడ యిట్టి వినోదకథలకు పుట్టుకసాధనములే కద! కొన్ని కొన్ని ప్రాచీన వినోదకథల వినికిడి వలన కలిగిన సంస్కారమును అనుసంధించుకొని కొన్ని క్రొత్తకథలు పుట్టుతుంటవి. అవి ఏలాటివంటే - మచ్చునకు ఒకతూరి ఒకరింట వివాహ (ప్రస్తావనలు వచ్చినై. “పిల్ల అన్నివిధాలా సరిపోతుంది

  • వరకట్నం ఎనిమిది వేలు - స్వీకరించు బాబూ! అన్నారు పెల్లనిచ్చే పెద్దలొకరు. పెండ్లికొడుకు కొద్దిగానో గొప్పగానో చదువుకొన్నవాడు. “మీరన్నమాట సరిగానే ఉన్నదిగాని మటి నేను శ్రీనాథుడనుకానుగదా!” అన్నాడాతడు. పిల్లతండ్రి ధనికుడు
  • సరసుడు - సాహిత్యాభినివేశము గలవాడు! వెంటనే ఆయనగారు “అవును - శ్రీనాథుడవు ఎన్నటికినీకావు అని తెలుస్తూనే ఉన్నది - ఒక ఆకు ఎక్కువగానే చదివావోయి” అన్నారు. నేను వినిన వింతకథలలో యిది ఒకటి! ఆ మామా అల్లుళ్ళ సంభాషణలో (ప్రాచీన వినోదకథల సంస్కారము పనిచేస్తూఉన్నది, వేమారెడ్డిని స్ఫురింప జేస్తున్నారు ఆ మామగారు. ఆ 1ప్రాచీనగాథ యిది: అనవేమ మహీపాల స్వస్త్యస్తు తవ బాహవే ఆహవే రిపుదోర్దణ్ణ చం[దమణ్ణల రాహవే. అని శ్రీనాథుడు వేమారెడ్డిని ఆశీర్వదించెనట - రాజు నాలుగువేలు బహూకరించెను. “నేనిచ్చినదే నాకిత్తురా?” అన్నాడు శ్రీనాథుడు, రాజు ఐదువేలీయబోయును. “భగవంతుడే యిచ్చినాడుకదా” అన్నాడట. ఆరువేలు గ్రహింపగోరెను. “మేము ఆరువేల నియోగులమే” అన్నాడు. మజీయొక వేయి పెంచెను. “రోదనసంఖ్య ఎందులకు” అన్నాడు. తుదకు ఎనిమిదివేలీయగా తృప్తితో స్వీకరించి వెళ్లెనట. ఇక్కడ మామగారు ఎనిమిదివేలు కట్నమిత్తునన్నప్పుడు అల్లుడు “శ్రీనాథుడను కానుగదా! స్వీకరించుటకు” అన్నాడు. ఎనిమిదివేలతో తృప్తిపడుట కాతడు కవిసార్వభౌముడూ కాడు. శ్రీనాథుడూ కాడు. సరసము (గ్రహించి మామగారు తొమ్మదివేలిచ్చి వివాహము చేసి పంపెను. ఇది ఒక చమత్కారకథ. మజతికొన్ని వినోదకథలు మాత్సర్యపూరితములు. పరస్పర వైవిధ్యముచేత సూటుపోటు మాటలతో, దెబ్బకుదెబ్బ, ఎత్తుకుఎత్తు వేసికొంటూ, కర్త, శ్రోత

వినోద కథలు వేటూరి ఆనందమూర్తి 1547 కూడ నలుగురిలోను నవ్వులపాలవుతుంటారు. ఈ కథ వినండి: ఒకయింట పెండ్లి, వచ్చిన పెద్దలందరికి చందనాది సుగంధ్యదవ్యాలందిస్తున్నారు. సువాసనతో గమగమలాడుతున్న పన్నీటిని చిలుకుతుండగా అందులో ఒకరు “నామీద చల్లకు బాబూ! అన్నారు. “మీరు పన్నీరు మెచ్చరా ఏమిటండీ? అని ప్రశ్నించారు పన్నీరు చల్లుతున్నవారు. “అవును తమ్ముడూ!” అంటూ చల్లగా సమాధాన మిచ్చారు 'రెండవవారు. వేమనగారి పద్యము స్ఫురణకు రానిదే యీ కథలోని విశేషము ఆలియలేదు.

చెజొక కథ. ఇద్దరు కవిపండితులొక బండిలో పప్రయాణమైనారు. దారిలో ఏదో చర్చసాగింది. అవక తవకగా మాట్లాడగా అందులో పెద్దలొకరు “మీరు కవిగారని ప్రతీతి. ఈ తీరుమాటలు సబబుకాదు” అని మందలించారు రెండవవారిని. “ఆ (ప్రతీతి సత్యమే కాబట్టి నా మాటలు సబబయి తీరుతవి” అన్నారు వారు సమాధానముగా.

ఇలాటి కథలు కవీ కవీ కలసినపుడు కావలసినన్ని అందులోనూ చమత్కరించి మాటాడుటలో చతురులైతే యిక చెప్పబనిలేదు. ఈ వినోదకథల గుజించి ఏదైనా (వాద్దామనుకొంటూ ఉన్ననాళ్లలో ఆప్పులయిన మిత్రులొకరు ప్రసంగవశమున తెలిపిన కథ యిది: "

హాస్యరచనలో సిద్ధహస్తులయిన కథకులొకరు నవ్యకవిత్వములో ప్రఖ్యాతి పడసిన ఒక మహాకవీశ్వరునింట విడిది చేశారట. ఆ నాళ్లలో ఒకనాడు గృహస్థు కార్యాంతరము చేత భోజనానికి కొద్ది ఆలస్యముగా రాగా గృహిణి “వేళదాటి భోజనము చేస్తే అసలే తలతిరుగుతుంది కదా మీకు: పెందలాడే రాలేకపోయారుటండీ - పన్నెండవస్తోందొ అన్నారట! అణుపణువున హాస్యరసమే నిండిఉన్న అతిథి ఆ ప్రక్కనే ఉండి చటుక్కున “అయితే మీకూ ఉన్నదా ఏమిటండి ఆ తలతిరుగుడు” అని అడిగారట. “పనికిమాలిన వచన రచన చేసే మీకే ఉండగా (కొత్తదనాలతో గేయరచన చేసే నాకు ఉండకూడదూ” అని తిరుగుప్రశ్న వేశారట గృహస్టు. చాలామట్టుకు వినోద కథలన్నీ ఈ తీరునే ఉంటవి. చమత్కరించి మాటమీద మాట అనుకొనుటచేత పుట్టినవే యివి అన్నీ మన భాషలోని వినోదకథల మాట మాత్రమే కాడు యిది - (ప్రపంచభాషలన్నింటిలోని వినోదకథల మాటా యింతే. అంగ్ల భాషా సంప్రదాయములో వస్తున్న ఈ కథ వినండి:

మేడమెట్లు ఒకరు ఎక్కుతున్నారు. ఎదురుగా పైనుండి ఒకరు దిగుతున్నారు. అందులో ఒకరు ఎక్కుతున్నవారికి అడ్డుపడి “మూర్జులకు నేను దారితీయను"

1548 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పటము 4; సాహిత్యము అన్నారట. “అయితే నేను తీస్తాన” అన్నారట రెండవవారు. ఇలాటి కథలు ఏ భాషలో చూచినా బోలెడన్ని

ఈ చమత్కార కథల విషయములో శ్రీ మునిమాణిక్యంగారిని ఒకతూరి స్మరింపనిదే రచన పూర్తికాదు. వారు ఇటీవల “ఆంధ్రజ్యోతి "లో కాబోలును (వాసిన “తియ్యని కలలు"అన్న వ్యాసము చదివి చూడండి. ఎన్నెన్ని చమత్కారకథలున్నయ్యో తలుస్తవి. మచ్చునకు అందులో ఒకటి వినిపిస్తాను. ఇద్దజు త్రాగుబోతులు అర్ధర్యాతిపూట నడిబజారులో తగవులాడుకొంటున్నారట. ఇది పగలని ఒకడు - కాదు రాత్రి అని ఇంకొకడు. ఆ సమయాన రెండవ ఆట చూచి ఒంటరిగా యింటికి వెళ్లుతున్న ఒక వ్యక్తిని వారు అడ్డగించారు. పగలా? ర్మాతియా? అని యిద్దణూ తీవ్రముగా ఆ వ్యక్తిని ప్రశ్నించారు - పగలుఅంటే వాడు ఏమిచేస్తాడో: రాత్రిఅంటే వీడు ఏమిచేస్తాడో! కంగారుపడి “నేను యీ ఊరికి [కొత్తవాజణ్ణి నాకు తెలియదు - వదిలిపెట్టండి!” అన్నాడట ధైర్యం చిక్కుబట్టుకొంటూ. త్రాగుబోతులిద్దజూ “సరే! అయితే వెల్లిపో” అని, వారి దారిన వారు పోయారట. చూడండి యీ కథ ఎంత వినోదము గొల్పుతున్నదో! శ్రీ మునిమాణిక్యంగారు యిలాటి రచనలలో సిద్ధహస్తులు.

చమత్కార కథలను విసరివేయుటలో రసికులు రామలింగారెడ్డిగారికి కూడా పేరు ఉండేది. వారు ఒకతూరి ప్రసంగములో “మీరు నెల్లూరి నెజజాణలయితే, మేము చిత్తూరు చిబుజాణలము అన్నారు. సభ్యులు నవ్వు ఆపుకోగలరా? రసికతలో ఆ నెజజాణలకంటె ఈ చిజుజాణలే గట్టివారనిపించేరు రెడ్డిగారు. ఇటీవల ష్యతికలలో చూచినట్లు గుర్తు! రెడ్డిగారికి సంబంధించిన వినోదకథలనన్నిటిని సేకరించి ప్రకటింపదలచినట్లు! అందజికి సంబంధించిన వినోదకథలను పె విధముగా సేకరించి ప్రకటించుట ఎంతైనా అవసరము! (కిన్నెర: సంపుటము 3, సంచిక 9, సెప్టెంబరు 1951)

రచయితలు: నేడు, నాడు అచ్యుతుని గిరిజ

రచించగలవాళ్లు రచయితలు. ఏమి రచించగలవాళ్లు అని నిలవతీస్తే కొంత యిబ్బందే కలుగుతుంది. ఏ ఒక్కటని చెప్పగలం? కవిత కావచ్చును. నాటకమో నవలో కావచ్చు. కథో విమర్శనో కావచ్చు. ఇవేవీ కాకపోతే చివరకు యే పత్రికలోనో అరపేజి వ్యాసం కావచ్చు. వీటిల్లో యే ఒక్కటి రచించగలిగినా యీ రోజుల్లో రచయిత అనిపించుకోవచ్చు. ఒక్కసారి అచ్చులో పేరుపడిందాఅంటే ఇంక తిరుగులేదనుకోండి. రచయిత అని పట్టాపుచ్చుకున్నట్లే భావించవచ్చు. మరి ఢోకాలేదు. ఏ సంఘంలో చూసినా, యే సభల్లో చూసినా వీరిపేరు కనబడకమానదు.

(ప్రస్తుత రచయితల ఆదర సన్మానాలు, పేరు ప్రతిష్టలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పూర్వం ఎన్నోభాషల్లో పాండిత్యం వుండి, కవిత చెప్పగలిగినా ఊరుపేరు వుండేదికాదు. గురువుగారి మొట్టికాయలు తింటు, వారికి యింటా బయటా కావలసిన పనిపాటలు చేయాలి. శ్రద్ధగా చదవాలి. పట్టెడు పట్టెడు (గంథాలు (వాయాలి. ఇంతటితో యేమి అయినట్లు? ఉన్నదంతా ముందే వున్నది. ఆ (గంథాలమీద మట్టిపడకుండ ఫై శాలువ తీసి కప్పి, రాజధాని నగరాలకు వెళ్ళాలి. అక్కడ వీళ్ల ముఖం చూసేదెవరు? రాజుగారి దర్శనమే కాదు. ఖర్మంచాలక రాజుగారి దర్శనమే అయి, ఆయసగారు యీ కవితామాధుర్యాన్ని చవిచూడటానికి అంగీకరించా రనుకుందాం. అయినా రాజుగారికి అన్నీ రుచిచూసే అవకాశం పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

1550 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వుండదుగదా. ముందు పరీక్షకులు కొరికి, నమిలి, పిప్పెచేసి అప్పటికే యీనాటి చూయింగ్‌గమ్‌ మాదిరి అది అట్లాగే వుంటే ప్రభువు వారికి నివేదించేవారు. నిండు దర్చారు. తప్పులు పట్టటానికి చెవులు రిక్కరించుకు కూర్చున్న ఆస్థాన కవులు: బిక్కుబిక్కుమంటు పాపం యీ కవి తన కావ్యాన్ని తడబడకుండ చదివి వినిపిస్తాడు. కావ్యాన్ని మెచ్చారా యింక తిరుగులేదు. కవి ఏనుగు నెక్కి నిక్కుతాడు. 'ప్రతిద్వందుల కంచుఢక్కలు పగలగొట్టించుతాడు. కనకాభిషేకాలు, బంగారు సంకెళ్లు - యిట్లా ఎన్నో. ఒకవేళ సభికులు మెచ్చలేదనుకుందాం. అంతా సున్నా. భత్యఖర్చయినా గిట్టుబాటుకాక చివరకు అవమానంతో యిల్లు చేరుకుంటాడు. ఇదీ పాత కవి పరిస్థితి. ఇప్పటి రచయిత ఎంత అదృష్టవంతుడో చూడండి. రచయిత కావటంకోసం యీ పరిశ్రమ - అంటు రసేమీ చెయ్యనక్కరలెదు. మామూలుగా చదువుకునే రోజుల్లో క్లాసులో కాంపోజిషన్లు మొదలయినవి వుంటవిగా. అవే చాలు. అసలు పద్ధతేమిటి పాద్ధోవతి. స్వచ్చమైన వూహలు స్యేచ్చగా, బావిలో జలమాదిరి వూరుతూవుంటే వాటిని, భాష, సాంప్రదాయం, వ్యాకరణం అంటు నలిపివేయటమా? ఎంత పాపం. అసలు వున్న విలువంతా భావంలోనే. త్యాగరాజు అంతటివాడు భావ, రాగ, తాళ అంటు ముందు భావానికి స్థానం యిచ్చాడు. అందుకని రచయితకు భావమే ప్రధానం. ఒకవేళ యీ భావం ఎవరికీ నచ్చదనుకుందాం. అసలు ఇబ్బందే లేదు. ఎంత విపరీతంగా వింతగా భావాలు తోస్తే, అంత ఘటికుడన్నమాట రచయిత. రాజధాని యాత్రా అక్కరలేదు దేబిరింపూ అక్కరలేదు. మూడుకాన్ల తపాలాబిళ్లలు వుంటే చాలు. మనకు నచ్చిన పత్రికకు పంపవచ్చు. పెద్ద రచన అయితే సీరియల్‌గా వేసుకుంటారు. చిన్నదయితే ఒక్కసారే వేసుకుంటారు. ఒక ప్రికవాళ్లకు నచ్చదనుకోండి. దానికి భయ మెందుకు? పుబ్బలో పుట్టి మఖలో మాయమయ్యే పషత్రికారాజములు కుప్పతిప్పలు. అన్ని పత్రికలవాళ్లు వాళ్లకు పంపిన రచనలన్నీ తిరగగొడితే ఆ పత్రికలు అచ్చయే దెట్లా? అందువల్ల తప్పనిసరిగా యెక్కడో అక్కడ రచన పడితీరుతుంది. ఒకసారి రచన అచ్చుపడిన తర్వాత ఆ భావాల పేచీ ఎవరికి కావాలి? ఇష్టముంటే సాంతం చదువుతారు చదివేవాళ్లు. లేకపోతే పేజీ తిరగవేస్తారు. ఇంతేగా దూషణభూషణంబులు ఆత్మకుగాని శరీరంబునకుగావు

రచయితలు: నేడు, నాడు. అచ్యుతుని గిరిజ 1551 అని జడభరతుడు అన్నాడు. అట్లాగే రచనల బాగోగులు చదువుకునే వాళ్లకేగాని రచయితలకు చెందవు.

నిజం చెప్పాలంటే పూర్వ కవులకు స్వాతంతృ్య్యమే లేదు. ఎంతసేపటికి కొన్ని నియమిత విషయాలను గురించే వ్రాయవలసివచ్చేది. నాయికా నాయకుల వర్జన, విరహవేదన, ఉద్యానవన వర్దన, ఇట్లాంటివే. ఏది నచ్చితే దాన్ని గురించి తోచింది తోచినట్లు యిష్టానుసారం రచించే భాగ్యం ఆనాటివాళ్లకు లేదు. నానాసూన వితాన వాసనల నానందించటంలో ప్రసిద్ధికెక్కిన ముక్కు తిమ్మనగారు పారిజాతాపహరణం (వ్రాయటానికి, రాయలవారు వారి దేవేరి సరాగమే . కారణమంటారు పెద్దలు. ఇట్లా తమను ఆదరించే ప్రభువుల ఆంతర్యాన్ని కనిపెట్టి, కలం సాగనివ్వవలసి వచ్చేది ఆస్థానకవులకు. (ప్రస్తుత రచయితకు ఎంత స్వేచ్చ వుందో చూడండి. ఇష్టంవచ్చిన విషయాన్ని యిష్టంవచ్చినట్లుగా వర్ణించవచ్చు. ఎలక్షన్లు, ఎలుకలు, భావనాయికలు, ఆకాశ సౌధాలు, కలలో స్టాలిస్‌, ఆవులింతలో హిట్లర్‌, ఆటం బాంబు, అగ్గిపెట్టై ఆకలి మంటలు, తేనెసోనలు - యిట్లా యెన్నని వివరించటం? రచయితకు కేవలం అరగంట తీరికంటువుంటే, వ్రాయలేని విషయవుంటులేదు. ఒక్కసారి వాసిన తర్వాత పథతికలో కనీసం అయిదువందలమంది అయినా చదివినారన్న మాటి. ఇంతమంది యే పూర్వకవి రచనను ఒక్కసారిగా చదివి విని ఆనందించివుంటారు? ఇంత సాభాగ్యం ప్రస్తుత రచయితదే.

ముఖ్యమైన విషయం ఇంకొకటి వున్నది. పూర్వ కవులు తమ రచనల్లో వుపయోగించిన (ప్రతిపదానికి (పతి అలంకారానికి తగిన సంజాయిషీ యిచ్చుకోవాలి. ఈనాటివాళ్లకు ఆ బాధ కూడ లదు. ఒక్కొక్క రచయిత వాడే భాష వేరు. రచన కొక గతి, రీతి అంటు వుండవలసిన అగత్యం అంతకుముందే లేదు. ఒక్కొక్కప్పుడు రచయితకు ఆవేశం ఎక్కువవుతుంది. తత్పలితంగా నాలుగు ఆశ్చర్యసూచక గుర్తులో, అయిదు చిన్నచిన్న గీతలో, ఆరు చుక్కలో కనిపించుతయ్‌. అంటే ఆ అమూల్య భావాన్ని వెలిబుచ్చటానికి తగిన ఊతంగల పదాలు యింకా సృష్టి కాలేదన్న మాట. పోనీ చివరికయినా దీని భావమిది అని వివరించి చెప్పడు రచయిత. దీని భావమేమి తిరుమలేశ అని సంజాయిషీ అడిగే (పతికక్షులేరీ? పతికక్షులంటే జ్ఞాపకం వచ్చింది. మునపటి రచయితలలో

1552 పందిరి మల్షికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పరస్పర స్నేహం తక్కువ. (ప్రజానురాగం, (ప్రభు ఆదరణ ఎక్కడ పొందుతాడో అని ఒకరిని చూస్తే ఒకరికి భయం. కాని యీనాడు చూడండి. ఇద్దరు రచయితలు కలుసుకున్నప్పుడు మీ రచన అద్భుతంగా వున్నదని ఒకరంటే, మీ రచన అమోఘంగా వున్నదని ఇంకొకరు అంటారు. ఎన్నివిధాల ఆలోచించి చూసినా నేటి రచయితల అదృష్టం ఎంతగానో నా కళ్లకు కనిపిస్తున్నది. ప్రజాదరణ, పలుకుబడి, స్వేచ్చ, పేరు ప్రతిష్టలు, పరస్పర మైత్రి యీనాటి రచయితల సొమ్ము. " (కిన్నెర: సంపుటము ౨3, సంచిక 12, డిశంబరు 1951) లాం ఆ? రాళ యము ను త

అనువాద సాహిత్యం

'తౌలుగు మన దేశభాషలలో ఒక ప్రధానమైన భాష. అన్ని భాషలకువలెనే తెలుగు భాషకుకూడ ఒక (ప్రత్యేకత, ఒక విశిష్టత ఉన్నవి. తెలుగు సంస్కృతి. తలుగు విజ్ఞానం, యుగయుగాలుగా పరిపుష్టమవుతూ, అద్వితీయ స్థానాన్ని పొందగలిగినవి. ఈ పరిపుష్టికి ఈ వికాసానికి తలుగు వాజ్బాియం యొక్క ప్యాత ముఖ్య మైనది.

అఆలుగు వాజ్బయం సంపన్నమైః పరిపుష్టి నొందుతూ వచ్చిందంటే - ఇది ఒకనాటి ప్రయత్నంకాదు. ఒకనాటి సెద్ధికాదు. శతాబ్దాల తరబడి పండితులు, మేధావులు, మహాకవులు ఈ వాజ్మయాన్ని పోషించి, పెంపొందించి ఉన్నతస్థితికి తీసెకొని వచ్చారు. పెక్కుమంది కవులు తమ ఉత్కృష్ట రచనలచే తెలుగు సాహితిని అలంకరించినారు. సంస్కృతం, హిందీ బెంగాలీ, మహారాష్ట్రం, కన్నడం, ఉర్దూ, ఇంగ్లీషు మొదలైన భాషలలోనుండి అనేక రచనలను, ఉద్దుంథాలను అనువదించి, విఖిన్న దేశపజల విజ్ఞానాన్ని, సంస్కృతిని తెలుగు దేశానికి అందచేశారు. తద్వారా తెలుగు సరస్వతి నూత్నాలంకారాలను చేకూర్చుకొన్నది.

సహజముగానే తెలుగువాణి పటుత్వ మైనది. తెలుగు భావన సునిశితమైనది. _ దానికితోడు ఈ భావనా బలాన్ని, నూత్న దృక్పథాన్ని తెలుగుజాతి. సంతరించుకొన్నదంటే పరభాషల, ఇతరసంస్కృతుల పలుకుబడి, (ప్రభావం కొంతవరకు లేకపోలేదు. పాశ్చాత్య పభుత్వం [క్రింద నిర్బంధంగా నేర్వబడిన ఆంగ్లభాష, పాశ్చాత్య విజ్ఞానం మన తెలుగువారిలోనే కాదు, యావద్భారతంలోను

1554 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కొత్త చూపులకు, కొత్త ఆలోచనలకు దారి తీసినది. పాత సిద్ధాంతాలను కొత్త చూపులతో చూడసాగాము. ఇదివరకు అనుకోని కొత్త విషయాలు దృగ్గోచరం కాసాగాయి. మన భావనాసవంతి కొత్తమార్గాల పరుగిడసాగింది. పాశ్చాత్య నాగరికత దెబ్బతో భారతజాతి నాగరికత, సంస్కృతి, వాజ్మయాలలో విప్లవం కలిగినదంటే అతిశయోక్తి కాజాలదు.

అనూచానంగా వస్తూన్న మన సంస్కృతికి, మన భావనలకు పరదేశాల సంపర్కం, పరదేశాల వాజ్బయం ఏయే మార్పులను తీసికొని వచ్చినవి? ఎంత వరకు తీసికొనివచ్చినవి? అవి మన తెలుగుజాతి వికాసానికి తోడ్పడినవా? లేక మన అవనతికే హేతుభూతమయినవా? - అనే విషయాలను గూర్చి తలిసికోవాలంటే ఇతర భాషలలోనుంచి మన భాషలోనికి వచ్చిన సాహిత్యాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే - తెలియగలదు.

“అనువాద సాహిత్యం” మన తలుగు భాషమీదా, వాజ్బయంమీదా, జాతిమీదా కావించిన పలుకుబడిని సమగ్రంగా చర్చించుకొని, తహవేలు వేసికోపడం ఎంతని అవసరం. అట్లే, మన భాష, మన వాజ్మయం ఇతర (ప్రాంతాలమీద ఎంతవరకు పలుకుబడిని చలాయించినవి? ఏయే (గంథాలు, ఏయే రచసలు ఇతర భాషలలోకి అనువదింపబడినవి? అనే విషయాన్ని గూర్చి కూడ తెలిసికొనడం సమంజసం.

ఈ ఉద్దేశాన్ని పురస్కరించుకొనియే తెలుగు భాషాసమితి యాజమాన్యాన ఏర్పడిన సంస్కృతి సమితి పక్షాన త్వరలోనే ఒక మహాసభ జరుగనున్నది. ఇంతవరకు వేరు వేరు భాషలనుంచి తెలుగులోనికి అనువదింపబడిన (గ్రంథాలను గూర్చి, వాటి ప్రభావం, పలుకుబడినిగూర్చి ఆయా శాఖలలో ఆరితేరినవారిచే ఉపన్యాసాలు ఇవ్వబడతవి. చర్చలు కావింపబడతవి. ఆలుగులోనికి అనువదింపబడిన (గ్రంథాలు, తెలుగులోనుంచి ఇతర భాషలలోకి అనువదింపబడిన (గ్రంథాలు సమకూర్చి, ఈ మహాసభతోపాటు ప్రదర్శింపబడతవి.

._ కాబట్టి పండితులు, రచయితలు, ప్రకాశకులు, పత్రికాధిపతులు, సాహితీసంస్థలు మా ఉద్యమానికి సంపూర్ణంగా తోడ్పడి. జయప్రదం కావింప ప్రార్థన.

అనువాద సాహిత్యం 1555 అనువాద (గంథాలను తమదగ్గర నున్న వారు పంపిస్తే, (ప్రదర్శనానంతరం తిరిగి పంపివేయగలము. అనువాద సాహిత్యాన్ని గూర్చి తెలిసినవారు ఆయా విషయాలను కూడ ఆలియచేయగలరని సవినయంగా అభ్యర్థిస్తున్నాము. ఇట్లు పందిరి మల్లికార్జునరావు కార్యదర్శి సంస్కృతిసమితి (ఆలుగు భావాసమితి) 27, యూనివర్శిటీ భవనములు, మద్రాసు. (24-2-1952) (కిన్నెర: సంపుటము 4, సంచిక 2, ఫిబ్రపరి 1952) నై ల్ల గో

కొడవటిగంటి కుటుంబరావు గొ(ం౮పాటి వెంకటసుబ్బయ్య ఃక సౌఖ్యానుభవంలో సంతోషం, సంతృప్తి, ఆనందం లేవు. నిరంతరం

ఆదర్శాలు కోసం, ఆశయాలు కోసం కృషి చేయడములోనే, పోరాడడములోనే ఆనందం ఉంది. పాతజీవితం మెడతిరగని ఇరుకుల్లో ఉంది. అందులో అభివృద్ధి విషయ మటుంచి మసలడానికే సందులేదు. దానిని బ్రద్దలు కొట్టి తుడిచిపెట్టెయ్యాలి. విశాలమైన గాలీ, వెలుతురు గల నూతన జీవితాన్ని నిర్మించుకోవాలొ - గోర్కీ

ప్రపంచములోని మతకర్తలందరూ ఆసియా ఖండంలోనే ఉద్భవించారు.

అందులో మన హిందూదేశములో ఎందరో మహాపురుషులు జన్మించారు. మత౦ మానవునిలో దైవత్వాన్ని నెలకొల్పుటకుగాను ఉద్భవించింది. కాని ఆ పని నెరవేరలేదు. నెరవేరకపోగా మత మౌఢ్యం ఏర్పడింది. ఈ మత మౌఢ్యము వల్ల మానవత్వమే నశించింది.

హిందువులు మహమ్మదీయులను, మహమ్మదీయులు హిందువులను మానవత్వం వీడి ఒండొరులను వధించుకొనుట మతమౌఢ్యము గాక మరేమిటి?

ఇక హిందువులలో ఉన్న మత మేమిటి? ఈ వేదభూమిలో వైదిక మతమెన్నడో అడుగంటింది. నేటి హిందువులు వేదాంతులు కారు. వారు ద్వైతులుకారు, అద్వైతులుకారు, విశిష్టాద్వైతు లంతకంటే కారు. శల్యగతమై ఉన్న మతం ఒకటే. “అది నన్ను ముట్టుకోకు” అనే మతం.

నిజమాలోచిస్తే దేవాలయం ఈనాడు దేవాలయం కాదు. వంటయిల్లే దేవాలయం. వంటకుండలే దేవతలు. పందిరి మల్తికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

కొడవటిగంటి కుటుంబరావు. గొగ్రెపాటి వెంకటినుబ్బయ్య 1557 మన పెద్దలు ఎంతెంత పెద్ద మాటలు చెప్పినా యథార్థమిది. ఈ సతి ఎంత త్వరగా పోతే అంత శీఘ్రముగా మనం అభివృద్ధిపొందగలము. వర్ణ ధర్మ రక్షణమందే మనం అధిక లక్ష్య ముంచి (ప్రపంచంతో సంబంధం లేకుండా (ప్రవర్తించాము, అందువల్ల మనకు లభించింది పరదాస్యం తప్ప మరొక (ప్రయోజనం లేదు. మనదేశముయొక్క అధోగతికి కారణమేమిటో కనుగొన్నవారు అరుదు. “జనసామాన్యమును అలక్ష్యము చేయుటయే మన సాంఘిక మహాపాతకము. మన పతనమునకు ఇది ఒక గొప్ప కారణము” అని వివేకానందస్వామి చెప్పిన మాట యథార్థము. మనలో ఎందరెందరో హిమాలయాల్లాగా పెరిగారు. కాని ఏమి ప్రయోజనం? జనసామాన్యం యొక్క స్ధితిని పంచినవారు లేరు. దేశముయొక్క గతి, జనసామాన్యము యొక్క స్థితిపై ఆధారపడి వుండునని (గ్రహించాలి. భ్రష్టమైనవారి సాంఘిక వ్య క్తిత్వమును మరల వారికి అలవడచెయ్యాలి. రచయితలు ఇందులకు కంకణధారులు కావాలి. ఈనాడు మనకు కావలసినది దైవారాధన కాదు. కళారాధన అంతకంటే కాదు. మానవారాధన. ప్రపంచం క్షణక్షణం మారుతున్నది. నవ్యాదర్శాలు, నూతన సమస్యలు ఉదృవించుచున్నవి. ఆ నిర్వహణ కొత్తవారిమైనే కలదు. మనలో కొందరు ప్రతిభావంతులు వున్నారు కాని, వారు గతకాలమునకు స్మృతి చిహ్నముగా నున్నారేగాని వర్తమానమునకు కర్తలుకారు. నేడు ఒక కొత్త జాతి ఏర్పడుచున్నది. ఈ నవ్యజాతి సంకల్పము, మనశ్శ క్తి, ఉత్సాహం, ఇవన్నీ వేరు. వీరికిని, పూర్వ తరమువారికిని సాపత్యమే లదు. ఈ తరమునకు చెందినవారిలో శ్రీశ్రీ, కుటుంబరావుగారలు (ప్రప్రథములుగా, ప్రముఖులుగా కన్పిస్తారు. మన కథకులలో పప్రతిభావంతులనేకులున్నారు. కాని వారు ప్రజాకథకులు కారు. ప్రముఖులు. కుటుంబరాపుగారు శివరామ శాస్త్రిగారి వంటి ప్రతిభావంతుడు కాడు; చలంగారి పంటి శక్తివంతమైన రచయితకాడు; దీక్షితులుగారిపంటి భావుకుడుకాడు;

1558 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సుబ్రహ్మణ్యశాస్త్రిగారివంటి లోకజ్జుడుకాడు; మునిమాణిక్యంవారివంటి శిల్చికాడు; బాపిరాజుగారివంటి లలిత కళోపాసకుడుకాడు. గోపీచంద్‌గారివంటి నిశితదృష్టికలవాడు కాకపోవచ్చు. కాని కుటుంబరావుగారు ప్రజాకథకుడు. ఆయనది జనవాణి. ఇంతే కాదు; యుగవాణి ఆయనద్వారా వెలువడుచున్నది.

ఆయనది బహుముఖమైన ప్రతిభ కాకపోవచ్చును. కాని ఆయనది విస్తృతమైన సాహిత్యార్చన.

ఒక భావమును పలువిధములుగా చెప్పుట కాదు ఆయన ప్రత్యేకత. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక సమస్యలను నేటి కాలానుగుణముగా చిత్రించుట ఆయన విశిష్టత.

మనస్తత్వ నిరూపణలో ఆయన మంచి నేర్చరి. అనుదిన రచన ఆయన నిత్యానుష్థానము.

కథాసాహిత్యంలో కుటుంబరావుగారు అధిక కృషి చేశాడు. రాశిలో, వేగంలో, వైవిధ్యంలో, కథకలోకంలో ఆయనే అధికుడు.

ఆయన దైవారాధకుడు కాడు. కళారాధకుడు కాడు. సంఘారాధకుడు.

ఇతర కథాసాహిత్యంలో కేవలం కళాపేరణీ మనము (గ్రహించేది. కుటుంబరావుగారి సాహిత్యంనుండి జీవన (ప్రేరణ ([గ్రహించగలం.

(కాంతి పథమున పోయి శాంతి జగమును స్థాపించుటయే కుటుంబరావుగారి ఆశయము.

(ప్రజాశక్తిని పెంపొందించుటే ఆయన పరమావధి. (కిన్నెర: సంపుటము 4, సం చిక 3, మార్చి 1952)

త్‌

నేను చదువుతున్న పుస్తకాలు ఎం రమణారెడ్డి

౮౧౦6 10గ'5 0401౧: ౧4౧౧61 866006! 510౪6

ఆమ పేరే చెబుతుంది - హేరియట్‌ బీచర్‌ స్టౌవ్‌ - స్త్రీ అని. డాక్టర్‌ లిండ్‌మన్‌ బీచర్‌ అనే ప్రఖ్యాత క్రిశ్చియన్‌ మతప్రచారకుని కూతురుగా 1812లో పుట్టింది. పుట్టుకవల్ల, (పోదివల్ల, సహజసమర్థతవల్ల ఆమె, కొత్త యింగ్లాండును అర్థంచేసుకున్నంతగా మరెవ్వరూ చేసుకోలేదు. ఆఫికా తీరాలనుండి తుపాకులతో భయపెట్టబడి ఓడలలో శృంఖలాబద్ధాలైన కాల్సేతులతో మందకట్టబడి, అమెరికాలో పశువులకు మారు పనిచేయుటకు, దిగబడిన న్నీగోలు - నిగ్గర్లు - మీద, క్రస్తవమతము [గ్రేరేపిన కరుణ భావము (క్రమంగా నీగోల విముక్తి వుద్యమంగా రూపొందింది. కన్నీళ్ళనుండి కండరాల గర్జగామారే యీ మానవస్వేచ్భాసమరంలో, “అంకిల్‌ టామ్స్‌ కేబీస్‌” పీడితుల చేతి ఆయుధంగా, పీడకులమీది శాపంగా వుపకరించింది. తండిగారి సమానతాబోధ చిన్ననాడే మనసున మాయని ము[దదవేయగా, 1832 (ప్రాంతాల బానిసవ్యవస్థ చట్టబద్ధంగా పనిచేసే దక్షిణాది రాష్ట్రాల సమీపానికి కుటుంబం వచ్చి నెలవుకొనడం, హేరియట్‌కు బానిసల బాధలు, గాథలు (పత్యక్షాలయ్యాయి, చెవులపడ్డాయి. 1836లో హేరియట్‌ లేన్‌ కాలేజిలో (పాఫెసరయిన స్టాగారిని వివాహమాడింది. బానిసలు దొంగచాటుగా వుత్తరాదికి పారిపోయే “భూగర్భ రైలు మార్గం"లో తమ స్వగృహాన్నే మజిలీస్థానంగా చేసింది. మరి కొన్నేళ్ళకు, తనకు విశ్వవిఖ్యాతిని సమకూర్చిన యీ “వ్యధార్తజీవన పందిరి మర్తికార్టునరావు శతజయంతి. సలప్పుటము. 4: సాహిత్యము.

1560 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము యథార్థదృశ్యాన్ని" నవలరూపంలో వాయ నుపకమించింది. రచనాకాలం 1851-52. ఇంగ్లీషు, (ఫెంచి, ఇటాలియన్‌, స్పేనిష్‌, డేనిష్‌, స్వీడిష్‌, డచ్‌, ప్లెమిష్‌, జర్మన్‌, పోలిష్‌, మాగ్యార్‌ భాషలలో 1852 ఆఖరుకే తర్జుమా అయింది. ఇటాలియన్‌ అనువాదం [క్రిశ్సియన్‌ మత ఏకైకాధికారి పోపగారి ఆంక్షను ఆర్జించుకుంది. ఈ భాషలేకాక, వెల్త్‌ ఆర్మీనియన్‌, ఇల్లీరియన్‌, ఫిన్నిష్‌, గీక్‌, పోర్చుగీసు భాషలుకూడ యీ నవలను సొంతపరచుకున్నాయి. మరొక ప్రఖ్యాత రచయిత్రి జార్ట్‌సాండ్‌ వ్రాసినట్లు, హేరియట్‌ స్టా “సాహిత్య నైపుణినే కాక, మానవత్వాని కవసరమయిన సజ్జన వైపుణొని కూడ కలిగివుండింది. ఆమె 1896లో చనిపోయింది. . |

ఈ నవల కల్పితం కాదు. “ముగింపు”లో రచయిత్రి (వాసుకున్నట్లు, “ప్రత్యేక సంఘటనలు చాలమట్టుకు యథార్థాలే - తనే నేరుగా పరిశీలించినది కాని తన ఆప్తమ్మితుల దృష్టికి వచ్చినట్టివి గాని ఆమకాని తన స్నేహితులుకాని, యీ నవలలో ప్రవేశపెట్టిన పాత్రలన్నిటి నిజస్వరూపాలను పరికించారు; వాటిమాటలు చాల మట్టుకు ముక్కకు ముక్కగా యథాతథంగా వున్నాయి...వేలాది హృదయాలను చీల్చివేసే, వేలాది సంసారాలలో చిచ్చుపెట్టే, అసవాయమైన చురుకైన జాతిని నిరాశకు వున్మాదానికి కొసనెట్టే వ్యథ, నిస్పృహలయొక్క ఛాయనుమాత్రమే, మందకాంతిగల చిత్రాన్ని మాత్రమే రచయిత యిచ్చింది... ఇప్పుడు, అమెరికన్‌ శాసనాలు, బానిసవ్యాపారాన్ని దోపిడిగా పరిగణిస్తున్నాయి. కాని అమెరికన్‌ బానిస వ్యవస్థకు తప్పనిసరిగా ఫలితమయిన, ఎప్పుడూ దానివెన్నంటివచ్చే, [క్రమబద్ధమయిన బానిసవ్యాపారం యింకా వుంది.....అమెరికన్‌ శాసనపు నీడకింద, కైఏస్తు శిలువనీడ క్రింద, ప్రతిదినము ప్రతిగంట మన తీరాలలో సంఘటిల్లుతున్న దృశ్యాలను భయంకర వాస్తవంతో సరితూగగల విషాదాంత నాటకం కొంచెమైనా (వాయజాలము, మాట్లాడజాలము, వూహించజాలము.....జాతులు జాతులు ప్రచలించి, పెల్లగిల్లుతూ, కూలిపోయే యుగమిది. తీరాంతరాలలో మహాశక్తి ఒకటి (ప్రపంచాన్ని ముంచెత్తుతూ పొంగి (క్రుంగదీస్తున్నది - భూకంపంవల. మరి అమెరికా మాత్రం భద్రంగా వుందా? తన సరిహద్దులలోపల యింకా నివారింపబడని (బహ్మాండమైన అన్యాయాన్ని అట్లే పట్టుకున్న (పతి ఒక్కజాతి, మహామృత్యుబీజాలను (పోదిచేసుకుంటున్నది."

నేను చదువుతున్న పుస్తకాలు రమణారెడ్డి 1561 . ఈ భయంకరమైన దూరదృష్టి, నిష్పాక్షికత, ధర్మబుద్ధి జాలిగుండె, మతాలను, మఠాలను, పాలకులను, శాసనాలను, లాభాలను, లోభాలను అధిగమించిపోయే మహాప్రసక్తి కంఠస్వరం హేరియట్‌ వీచర్‌ స్పాకు మానవాతీతమైన (ప్రకాశాన్ని నూర్చిపెట్టాయి. (క్రశ్సాయన్‌ మత సూత్రాలను తమ దౌర్జన్య ధ్వంసకాండకు అనువుగా భాష్యాలు చెప్పుకుంటున్న పాలకజాతినేకాక, వారి .చేష్టలకు అధికార న్యాయముద్ర వేస్తూవున్న మతబోధకులను కూడ నిలువునా తెగడే దెప్పె గర్లించే నిజాయితీ వృందీమెకు. మేధాజనితమయిన సర్వ మానవ సౌఖభాతృత్వ వుద్దాటనమేకాక, ఆఫ్రికాలో ఉత్తమ నాగరికతకు, మేధర్వికాసానికి వారసులై, సకలజగట్టేగేదుమానమయిన విశ్వ సంస్కృతికి డోల అనదగిన ఆదిమ ఆఫ్రికా సంస్కృతికి హక్కుదారులై, తుపాకుల నాగరకత తెలియని గొప్ప లోటుచేతనే బందీలై, తీరాంతరక్షే త్రాలలో నాటబడిన యీ వుడుకు కలవాటుపడిన మహావృక్షాలకు, అమెరికన్లు 1పాణపదార్థ మైన స్వేచ్చను నిరాకరించారు; వారి వర్ణాన్ని చులకనచేశారు, రక్తాన్ని కించపరచారు, మనస్సు లేదన్నారు. మనుషులు కాదన్నారు. ఈ దురన్యాయం చరిత్రలో అపూర్వమయినది. ఇంత గట్టి ఆధారంమీదనే హేరియట్‌ స్టా మానవవాదం నిలిచింది. యజమానినుండి దొంగచాటుగా ఒక్కరువ్వకూడ మిగిలించుకొనని అతి విశ్వసనీయుడైన టామ్‌ మామ యజమాని వ్యాపారమంతా నిర్వహించ శక్తిగలవాడు. పత్తి పరిశమలో పనిచేస్తూ, పనిని సుకరంచేయ వీలయిన యంత్రాన్ని కనిపెట్టగలిగిన జార్జ్‌ మేధథస్సులో ఏ అమెరికనుకూ తీసిపోడు. కాని ఆర్థికకారణాలు, దేవుడుకాడు సుమా; వారిద్దరినీ దొరలకు తొత్తులుగా శాసిస్తాయి. పేరుకున్న అప్పులు తీర్చేటందుకు, బిడ్డ వంటి నిర్మలుడయిన టామ్‌ను, ధర్మాధర్మ విచక్షతగల యజమాని అమెరికన్లలో అరుదైన దాక్షిణ్యం కలవాడుకూడ, కనికరంలిని “వ్యాపారం లాభదృష్టికి తప్ప మరిదేనికి చలించని మనిషి - తోలు మనిషికి - మంచి లాభం ముట్టేపనయితే కన్నతల్లినికూడ నిలువునా అమ్మేందుకు సహించని మనిషికొ అమ్మేస్తాడు. కొత్తయంత్రాన్ని కని పెట్టి, తలివీతేటలలో తనకు చిన్నతనం ఆచ్చే జార్జిని చూసి యీర్హ్య్యాసూాయలు పెకొని మరొక యజమానికి అమ్మ చూపుతాడు- కాని టామ్‌ మామ సరళ గంభీరతకూ సహనానికి పూర్తిగా భిన్నమయిన గుండెదిటువూ, స్వేచ్చాకాంక్ష కలిగిన జార్డ్‌ పారిపోతాడు. ఈ కొనుగోళ్లు,

1562 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అమ్మకాలలో నీగోలు మనుషులుగా చూడబడక “అనుభవించే, జీవించే, నెత్తురుకార్చే, కాని అమరమయిన వస్తువును అమెరికా శాసనాలు మూటలతో, బేళ్లతో, పెట్టెలతో జమకట్టాయి.* ఇక నీీగోలు అమెరికాను స్వదేశంగా యెలా చూడగలరు? కనుకనే వారి మనస్సులు తమ కష్టాలను గురించి కట్టిన పాటలలో చాల దూరమయిన ఒక నగరానికి, చాల దూరమయిన ఒక దినానికి అ(రులు చాచాయి. “జోర్జాన్‌ తీరాలు” “కానాన్‌ పొలాలు”, “కొత్త జెరూసెలమ్‌” లను గురించి చేతులు చాపాయి.

“ఓ, నే పోతున్నాను కీర్తికి - నాతో రావూ నువ్వు?

దేవదూతలు పైగలు చేస్తూ రమ్మంటున్నారు చూస్తున్నావా నువ్వు?

కనిపిస్తుందా నీకు బంగారపునగరం, శాశ్వతమై మహాదినం?”

“ఓ కానన్‌, మెరిసే కానన్‌,

కానన్‌భూమికి పయనం కట్టానోయి నేను”

మత సంబంధికమైన పగటి కలలకు తావియ్యని నవనాగరికుడైన జార్జి, నిక్కచ్చిగా నిజం అంటాడు. అతనిమీద సానుభూతికల విల్చన్‌గారు, జార్జిని,

“జార్డ్‌! కడపటికి నీ దేశపు చట్టాలను అతిక్రమించబోతున్నావా?” అని అడిగితే, జార్జిఅంటాడిలా:

“నా దేశం! విల్పన్‌గారూ! మీకు దేశమనేది ఒకటుంది కాని, నాకు, నాలాగ బానిస తల్లుల కడువుపంటకు దేశమనేది ఏదుంది? చట్టాలనేవే వున్నాయ్‌! మేము వాటిని నిర్మించడంలేదు - వాటిని అంగీకరించడం లేదు - వాటితో మాకు పనేలేదు. మాకోసం అవి యేమన్నా పాటుపడుతున్నాయా అంటే, మమ్మల్ని అణగ దొక్కేందుకే. మీరందరూ (గెంచి విప్లవం జూలై నాల్గు తేదీ గురించి చేసిన ఉపన్యాసాలు నేను వినలేదూ? పాలితుల సంపూర్ణ మైన అంగీకారంవల్లనే ప్రభుత్వాలకు న్యాయసమ్మతంగా అధికారం సం[క్రమిస్తున్నదని, ఏడాదికొకతూరి, మీరు మాకు చెప్పారుగా? వీటన్నిటినీ వినిన తర్వాత, మనిష నేవాడు ఆలోచించలేడూ?”... “నా దేశం! గోయితప్ప మరి దేశమేముంది నాకు! ... ఆరడుగుల సొంతనేల - కెంటుకీలో మొట్టమొదలుగా తుట్టతుదగా నా సొంత మయ్యేనేలగ

నేను చదువుతున్న పుస్తకాలు రమణారెడ్డి 1563 హేరియట్‌ స్టా క్రిశ్చియన్‌ వనిత. తండ్రి క్రిశ్చియన్‌ మత బోధకుడు. కాని వారి మతం నిరాధారమయినది. నలుగడలా ప్రత్యక్షమయ్యే మతానికి వారి (గంథస్థమతానికి పోలికేలేదు. నిజమయిన మతం ధనికుల లంజకూతురు. “మతం!” అన్నాడు సెయింట్‌క్షేర్‌ - స్త్రీలిద్దరూ నివ్వెరపోయి అతనివైపు చూసేటటువంటి కంఠస్వరంతో. “మతం!చర్చిలో మీరు వినేదా మతం? స్వార్ధకలుషితమయిన లౌకిక సంఘపు (ప్రతివకగతికి సరిపోయేలాగు వంగేదీ తిరిగేదీ దిగేదీ ఎక్కేదీ - యిదా మతం? మనిషి యెడల తక్కువ దయ, తక్కువ దాక్షిణ్యం, తక్కువ న్యాయం, తక్కువ సమాదరణ చూపేదేనా మతం? కాదు; నేను మతాన్ని అన్వేషిస్తున్నానంటే, నాకు మీదుగా వున్నదానినే చూడాలిగాని నాకు [క్రిందుగా వున్నదాన్ని మాత్రంకాదు...యూరపులోనూ ఆమరికాలోనూ (ప్రస్తుతముంటున్న సాంఘిక వ్యవస్థ యావత్తూ, ఎటువంటి పూర్ణ నైతికాదర్శ దృష్ట్యా నైనాసరే, నిలువలేని వివిధ విషయాలతో నిండివుంది. బానిస విధానం మనకు అవసరం, దానిని వదలివేస్తే మనకు భిక్షాపాత మిగులుతుంది, దాన్ని కొనసాగించటమే మన ఆశయం అని ఎవడైనా మనిషిపలె అంటే, యిది బటువయిన, స్పష్టమయిన నిజమయిన భాష; సత్యం కాబట్టి యిది కాస్తయినా గౌరవనీయం; మన ఆచరణను బట్టి నిర్ణయించవలసివస్తే (ప్రపంచంలో అధికభాగం మనతోటి వస్తుంది. కాని ముఖం పొడిగించి, తల నిగిడించి, మత (గంథాలముల్ల విప్పి, బానిస విధానానికి మతము[దవేసే పనయితే, అతను వుండవలసినంతకంటె బాగాలేడనిమట్టుకు నే చెప్పగల..” బానిస విధానాన్ని ఖండించే పంక్తులుకూడ ఆ (గంథాలలోనే మరుగుపడి వున్నాయి. “వారు యితరులవల కష్టాలలో లేరు, యితరులవలె బాధలుపడడములేదు. కాబట్టి గర్వము గొలుసువలె వారిని చుట్టుముట్టివుంది; దౌర్దన్యబలాత్కారము వారిని వస్త్రృమువలె కప్పివుంది. వారి కళ్లు కొవ్వుతో వెళ్ళకొస్తున్నవి; మనసు కోరేదాని కంటి మిక్కుటంగా వారికి వుంది. వారు భ్రష్టుపట్టారు, పీడనను గురించి పొగరుగా మాటాడుతారు; ఉన్నతంగా వుపన్యసిస్తారు” మరొక జాడ్యముంది వీరికి. విదేశాలలో స్వేచ్భాసంగ్రామాలను బలపరుస్తారు కాని మాతృదేశాలలో స్వేచ్చ్భాకాంక్ష కంఠాన్ని మర్దిస్తారు. “నేను హంగేరీ యువకుణ్ణయివుండి, యిప్పుడు పర్వత దుర్గాలలో నిలిచి, ఆస్ట్రియాసుండి అమెరికాకు పారిపోయే దీనుల గమనాన్ని పరిరక్షిస్తూ వుండివుంటే, యిది' అనుపమ

1564 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సాహసమని వీళ్ళే వుగ్గడించి వుండేవాళ్లు; కాని నేను ఆఫ్రికా యువకుణ్ణికావడం చేత, అమెరికానుండి కెనడాకు పారిపోయ శరణార్థుల గమనాన్ని రక్షిస్తుండడం చేత, యిందులో యీాషణ్మా[తతమైనా సాహసం చూడకుండేలాగున, వీళ్ళకు దేశభక్తి పాఠాలు బోధింపబడ్డాయి.” ఆఫ్రికా దేశీయులలో కనుపించే దుర్గుణాలు, నీచలక్షణాలు వారికి మానవత్వ బిరుదాన్ని నిరాకరిస్తున్నాయి అవే వాదానికి, రచయిత్రి జవాబేమిటంటే, “తరతరాల సంస్కారము, యాజమాన్యము, విద్య - సేక్టన్లకు శారీరక నైతిక బెన్నత్యాన్ని ప్రసాదించాయి. తరతరాల పీడన, అజ్ఞానము, కాయకష్టము, నీచజీవనము - ఆ(ఫ్రికన్లకు వేరు గుణాలను యిచ్చాయి” కాని స్వతహాగా ఏ మనిషీ దుష్టుడూ నీచుడూ కాదు. అందరూ పరిస్థితుల వారసులే. సుప్రసిద్ధ తాత్వికుడు రూసో ఆదర్శవాదం “మానవు లందరూ స్వేచ్భాయుతులుగా, సమానులుగా జన్మించారు,” అనేది వాస్తవవిరుద్ధం. “మానవులందరూ స్య్వేచ్భాయుతులుగా సమానులుగా పుట్టడంలేదు.” ఇందు నుండి మరొక వితండవాదం వస్తుంది. కొందరు నీచులుగా జన్మించారు కనుక సంపన్నులకు వీరు లోబడివుండవలసిందే. “విద్యావంతులు, మేధావంతులు, సంపన్నులు, సంస్కారులు వీరికే సమానహక్కు లుండవలసింది. అలబరిమూకకు కాదు...వీరిని అడుగడుగునా త్రొక్కి పెట్టాలి...విద్యనేర్చకూడదు....” కాని యీ వాదానికి వెంటనే ఖండన వుంది. “వారు విద్యావంతులయితీరుతారు.. మన వ్యవస్థే వారిని ఆటవికత్వంలోనూ, పశుత్వంలోనూ బోధిస్తూవుంది. సకల మానవసంబంధాలను మనం తెగ్యదెంచి, వారిని మొరటు పసరాలుగా చేస్తున్నాము. వారికి పైచేయి యేర్పడిందా, మన అంతు పట్టుతారు."

ఈ నవల ఉత్త వాదోపవాదాలతో నిండిలేదు; మనకు కనుపించనంత సూక్ష్మంగా వాదాలు జరుగుతాయి; కనుక విసుగనేదిలేదు. విభిన్న ప్రవృత్తుల ప్యాతలను నిర్మించి పోషించడంలో హేరియట్‌ స్టా జయించింది. ్రిశ్చియన్‌ సహనం మూర్తీభవించిన టామ్‌ మామ, వుడుకునెత్తురు పొంగిపారే జార్డ్‌, తెలివితేటలు లేకుండా యజమానుల కనుసన్నలలో మెలగుతూ, పారిపోయిన తోటి నీగో మనిషిని వ్యాపారికి పట్టియివ్వడానికికూడా జంకని సేమ్‌, యజమానుల దుస్తులను ధరిస్తూ వారి వేషభాషల ననుకరిస్తూ తోటి న్మీగోలమీద కర పెత్తనం చేయచూసే అడాల్ఫ్‌, పరమ సాధుమూర్తియన టామ్‌ను నరకయాతనలు "పెట్టి ఘోరంగా

నేసు చదువుతున్న వుస్తకాలు . లమణారెడ్తే 1565 హింసించే న్నీగోలు క్వింబో, సేంబో - అతిమూర్డులూ పశు సమానులూ - అతిమేధావులూ దైవసములూ యిందు చత్రింపబడుతారు. ఇద్దరు పసిపిల్లల పాత్రలు బహునేర్చుతో చితితమయ్యాయి. లక్షాధికారి కూతురు, అమాయిక, కరుణాశీల, ఈవా ప్యాతలో రచయిత్రి సౌహార్దాన్ని సౌాకుమార్యాన్ని సౌజన్యాన్ని సానుభూతిని సమస్తం కూరిపెట్టి, ఆదర్శంగా చిత్రించింది, ఈమె దేవుని అవతారమా అనిపించేటట్లు. “నిజమైన ప్రజాతంత్రవాది నీ సొంతబిడ్డ,” అని ఈవా విషయంలో సిద్ధాంతీకరిస్తుంది. అతి నికృష్ణ పరిసరాలలో దొంగతనాలకూ పోకిరీతనానికీ అలవాటుపడిపోయిన నీీగో పిల్ల టాప్పీ, కడపటికి ఈవా సౌజన్యం చేత పునర్జన్మ యెత్తి మంచిపిల్ల కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవావంటి పరిపూర్ణ వ్యక్తులుంటే, (ప్రపంచం సౌజన్యమయమవుతుంది; లోపభూయిష్ట మైన (ప్రపంచంలో అల్లాంటి దివ్యకాంతిరేఖ చాలకాలం నిలువదు; కనుకనే రచయిత్రి ఈవాకు బాల్యమరణం కల్పించి, బొచిత్యాన్ని సమకూర్చింది. బానిసవ్యాపారులూ యజమానసులలోకూడ మంచిచెడ్డల వివిధదశలు వేర్వేరు పాతలలో చిత్రింపబడినాయి. నవలలోని సంఘటనలకు ఎక్కువగా మనస్సును కలవరపెట్టే విషాదచ్చాయ తప్పనిసరిగా పులుముకుంది. పాఠకుల మనస్సులను తనవైపుకు (తిప్పుకునే ప్రయత్నంలో రచయిత్రి అక్కడక్కడ రంగును ముద్దలు ముద్దలుగా అలిమింది తప్పితే, బెచిత్యం కొసవరకూ సాగిపోతుంది. చారితిక సంఘటనల దారపు కొసలు రచయిటి చేతికొసనే వుంటాయి కాని దారం చిక్కుపడిపోదు. బానిసవ్యాపారానికి వ్యాపారిని మాత్రమే నిందిస్తే సరిపోదంటుంది. "సంస్కారులయిన, విజ్ఞానులయిన, మేధావంతులయినవారు యీ వ్యవస్థను సహించి వూరకుంటే, వారిదా తప్పు, లేక, యీ వ్యపస్టలో తప్పని సరిగా వుండపలసిన వ్యాపారిదా? అతని వ్యాపారానికి కావలసిన ప్రజానుమతిని కల్పించీది మీరు; మరి ప్యాపారం అతస్ని కలుషపరచి పశసమాసుని చీస్తుంది. అతనికంటె మీఠలాగొప్ప?' ఒకదేశంలో ఘటిల్లి సంఘటనల బాధ్యత ఆ దేశీయులందరిది. హట్లరును నేరుగా బలపరచకుండినా, అతని విధ్వంసకాండను చూస్తూ పవూరకున్నారు కాబట్టి జర్మన్లందరూ నింద్యులు, బాధ్యులు. ఆలిసిసదారు వూరకుంటే, సిందలో ఎక్కువపాలు వారిదే. “మీరు విద్యావంతులు, అతడు నిరక్షరకుక్తి, మీరు ఉచ్చులు, అతడు నీచుడు, మీరు

1566 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము ముందు రాబోయే విచారణ రోజున యీ విషయాలే మీకంటె అతనికి యెక్కువ ఆనుకూల్యాన్ని కల్పిస్తాయి” అమరమూర్తి అయిన, స్వేచ్చను యవరభిలషించినా వారిని బలపరచిన, మతపు ధనపు వర్ణపు ముసుగు విప్పి పశు వికృతముఖం చూపిన, అబ్రహాం లింకన్‌కు దారి యేర్పరచిన హేరియట్‌ బీచర్‌ స్టాకు అందరమూ నమస్కరిద్దాము. ఆమె సూక్తులు : “తమను తాము పరిపాలించుకోలేనివారు యితరులను పరిపాలించలేరు.” “సఫలంకావాలంటే, విద్య ప్రభుత్వవిద్య అయివుండాలి. “వాస్తవంగా దుఃఖాన్ని అనుభవించగల హృదయం మంచి చేయగలదు.” “జాతికీ స్వేచ్చ యేమిటి, అందులోని వ్యక్తులకు స్యేచ్భగాక?ొ (కిన్నెర: సంపుటము 4, సంచిక 7, జూలై 1952) 1/ సా గ (౧/1 సుం + వ్ర ప (ఇం 0402. | స్‌ రి క్‌న్‌ క (17 గ ఏవ ఇర్‌ో (7 సాయ సమయాలలో 1 1.

శ్రీ టేకుమళ్ల కామశ్వరరావుగారి కథలు గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి

శ్రీ బేకుమళ్ల కామేశ్వరరావుగారు జగమెరిగిన బ్రాహ్మడు. వీరి పేరు వినని ఆంధులు అరుదు. చాలామంది వీరి కథలు చదివి ఆనందించినవారే.

త్రీ కామేశ్వరరావుగారి కథలు బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి? అనే విషయం సాధారణంగా ఎవ్వరూ ఆలోచించరు. ఈ (ప్రశ్నకు జవాబివ్వటం ఈ వ్యాసంయొక్క ప్రయత్నం.

కామేశ్వరరావుగారి కథల్లో వైవిధ్యం ఉన్నది; సహజత్వం వెల్లివిరిసింది. భావాల్లో నూతనత్వం, భాషలో నాగరికతా ఉట్టిపడుతూ ఉంటాయి. రచనలో ఒక పద్ధతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీరు రచించిన కథల్లో భావంలోనూ, పన్నుగడలోను, భాషలోనూ కథకు అత్యవసరమైన ఏకత ఉన్నది. పేర్లుకొత్తవిగా, సహజంగా మొలుచుకొచ్చినట్లుగా ఉన్నాయి. శీలచితణంలోనూ, సంభాషణారచనలోనూ వీరి ప్రతిభ అమేయం. సన్నివేశ నిర్మాణంలో వీరి ప్రజ్ఞ అసమానం. కథావస్తువు

బేకుమళ్ళ కామేశ్వరరావుగారి కథల్లో వస్తువు విశిష్టమైనదిగా ఉంటుంది. కథావస్తువులలో చాలావజకూ వైవిధ్యం కనబడుతుంది. వీరి కథల్లో జీవం ఉంటుంది. ఇవి మానవ మానసాలకు సంచలనం కలిగిస్తాయి. 'పంచిరి మల్త్‌కార్డునరాప్పు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1568 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

వీరి కథల్లో అభ్మిపాయంలో ఏకత ఉంటుంది. వీరు ఒక కథానికలో ఒక్క అభిప్రాయాన్నే చెబుతారు. “భారతి”లో ప్రచురితమైన “పళ్ల పండగ" అనే కథలో ఈ ఏకత ఎట్లా కనుపిస్తున్నదో చూడండి. కోయజాతిలో పదహారేళ్ల యువతులకు పళ్లు ఊడగొట్టటం అలవాటు. ఎరుకయ్య ఈ పరంపరాగతాచారాన్ని ధిక్కరిన్తాడు. ఇటువంటిదే “ప్రతిభొలో ప్రచురితమైన “అవివాహ శాసనం” కూడా. చదవవేస్తే

“ ఉన్నమతి కాస్తాపోయింది అనే సామెత మనకందరికి తెలుసు. ఈ సామెతను

ఉపయోగించుకుని “చదవవేస్తే..” అనే కథ రాశారు. “తెలుగు స్వతంత్రిలో (ప్రచురితమైన “పందెంజత” చూడండి ఎంత సహజంగా ఉందో. మళ్లీ “రెండువేల చుట్టాలు” అనే కథలో మరొక కొత్త అభ్మిపాయం. దూరపుబంధువులు వొచ్చి, నెలలు తరబడీ మరొకళ్ల ఇంటిమీద పడి, తెగతిని తమ బంధువుల్న, స్నేహితుల్ని మొతం మేపేవాళ్లను మనం చూడటంలేదూ? “ఆంధ్రజ్యోతిలో (ప్రచురితమైన “ఎండమావులు” చూడండి. తెలుగు రచయిత అగచాట్లన్నీ వడకట్టి అందులో పోశారు. ఇలాగే అన్ని కథలూ వేరు వేరు అభిప్రాయాలతో ఉంటాయి. వీరు కేవలం అన్ని కథలూ సంసారాన్ని గురించే రాయలేదు. అయితే, గృహచ్చిద్రాలను గురించి రాసిన కథలుకూడా లేకపోలేదు. ఇటీవల (ప్రచురితమైన కథలు చాలా పెల్లిని గురించినవే ఉన్నాయి. వీటి అన్నింటిలోనూ పెల్లి సందడి కనిపించినా, వీటికి కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉండనే ఉంది. ఇటువంటి కథలు “నాగవల్లి నిష్టారాలు, “చదవేస్తే...” “పెండ్లి పిలుపు” “ప్రసాదరావు పెల్లి చూపులు “గంగవెజ్టులు" మొదలైనవి.

ఇంత వైవిధ్యంగల సామగ్రి ఎక్కడినుంచి వొచ్చిందీ అని అడగవచ్చు. అది రచయిత దైనందిన జీవితంలోనుంచే. రచయిత అనుభవాలు అతని మనసులో పొదిగి జీవితాన్ని పొందుతాయి. కొన్ని కేవలం ఊహాజనితాలుగా ఉంటాయి. పన్నుగడ (స్టాటు)

కామేశ్వరరావుగారి కథల్లో పన్నుగడ బహు చక్కగా ఉంటుంది. ఈ పన్నుగడ ఒక ఉద్దేశ్యం మూలంగా ఉంటుంది. ఇదే కథానికకు అంకురం. ఇది రచయిత జీవితానుభవాలలోనుంచీ, ఊహాపథంలోనుంచీ ఉత్పన్నమౌతుంది. ఒక సంఘటనో, ఒక సన్నివేశమో, ఒక వ్య కో, ఒక ఊహో దీనికి కారణం. ఇటువంటి కథాంకురం ఉంటేనే కథలకు వాజ్మయంలో స్థానం ఉంటుంది. కామేశ్వరరావుగారి కథల్లో

శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారి కథలు గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి 1569 ఇటువంటి కథాంకురం (ప్రస్పుటంగా ఉంటుంది. చూడండి, “ఎండమావులు” అనే కథకు అంకురం ఆలుగు రచయిత అగచాట్లు. “కనికరం”లో కూలివాళ్లమీద యజమాని చలాయించే జబర్దస్తీ ముఖ్యోద్దేశం. “చదవవేస్తే...” అనే కథకు చదవవేస్తే ఉన్నమతిపోయింది అనే సామెత మూలాధారం. “వ్యామోహం”లో రౌతు మెత్తనైతే గుజ్జం మూడే కాళ్ల మీద నడుస్తుంది అనే లోకోక్తి ఉపయోగించుకోబడింది. కొన్ని ఉదాహరణలు దిజ్మాత్రంగా సూచించాను. ఇలాగే ప్రతి కథకూ ఒక కథాంకురం అంటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కథానిక పన్నుగడకు మూలం. ఇది కేవలం ఆశ్చర్యజనకంగానే ఉండక్కర్లేదు. ఇటువంటి కథల నిర్మాణం మెలికలు మెలికలుగా ఉంటుంది. సాధారణంగా ఒకటి జరుగుతుందనుకుంటే మరొకటి జరిగి ఊరుకుంటుంది. ఇంగ్లీషులో డిటెక్టివ్‌ కథలు వీటికి ఉదాహరణలు. ఇటువంటివి తెలుగు రచనల్లో ఎక్కువగా కనిపెంచవు. టేకుమళ్ళవారి కథల్లో కూడా వీటికి (పశస్తమైన ఉదాహరణలు కనిపెంచవు. “రామసుబ్బయ్య (గహస్థితొ, “పండ్రిపెలుపు”, “సౌందర్య వికారా”లు అనే కథల్లో ఈ వాసన కొద్దిగా కొడుతుంది.

సంఘటన కథలు కొన్ని ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క సంఘటన చిత్రితమౌతుంది. నేడు ప్రచురితమయ్యే గల్పికలు దాదాపు ఈ ఆగవి. సంఘటన కథల్లో ఉండే ఐక్యత - భావంలోనూ, భాషలోనూ, శీలచితణలోనూ - మజేీ కథావిభాగంలోనూ లేదని చెప్పవచ్చు. దీనికి చక్కని ఉదాహరణం “రహస్యమంటే?" అనే కథానిక.

కొన్ని కథలు శీలచిత్రణకోసమే ఉంటాయి. సింహాద్రిరావు శీలాన్ని చిత్రించేవి చితకథలు రెండు ప్రచురితమైనై. వీటిలో సింహాద్రిరావు శీలం బాగా పోషింపబడ్డది.

కొన్ని సమస్యకథలు ఉంటాయి. ౪/12 81204 ఒకసారి అన్నాడు; “ప్రపంచంలో ఇద్దరు స్త్రీలూ ఒక పురుషుడుగానీ, ఒక పురుషుడూ ఇద్దరు స్త్రీలూగానీ ఉన్నంతకాలం కథల ప్లాటుకోసం ఎందుకు తంటాలుపడతారో బోధపడదు” అన్నాడు. “పశుప్రాయుడు", “గంగవెజ్జులు" అనే కథలు వీటికి దృష్టాంతాలు.

ఒకవ్యక్తి జీవితంలోనో, సంఘంజీవితంలోనో కలిగే మార్చు చాలా ఉత్తమమైనది. ఇటువంటి మార్పు “పళ్ళ పండగ”, "అవివాహ శాసనం” అనే కథల్లో కనిపిస్తుంది.

1570 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

కొన్ని ఉద్దేశకథలు. వీటికి ఒక ఉద్దేశం ఉండితీరుతుంది. అందుకు ఉదాహరణలు ఇదివరకే సూచించినట్లు “ఎండమావులు” మొదలైనవి.

పన్నుగడ అంటే కథాంతానికి దారిచూపే సంఘటనల [కమం. ఇది బేకుమళ్ళవారి కథలను పరిశీలిస్తే కనిపెస్తుంది. వీరి కథలు అనవసరమైన గజిబిజిలేకుండా, సాధారణంగా సరళంగా ఉంటాయి. కథాస్వరూపం

కథానికకు ఆదిమధ్యాంతాలు ఉంటాయి. ఇవి మూడూ కథల్లో ఎడతెగని భాగాలు. ప్రారంభం మధ్యభాగానికీ, మధ్యభాగం అంతానికీ మార్గదర్శకాలు మాత్రమేకాక, ఇవి ఒకదానికి ఒకటి కారణభూతాలు. చివర కథ చెడిపోయిందంటే దీనికి కథ మొదలూ, మధ్యాకూడా కొద్దిగానో గొప్పగానో కారణాలు.

బేకుమళ్ళవారి కథలు కొన్నింటిలో ప్రారంభదశ చాలా చక్కగా ఉంది. మొదటి వాక్యంలోనే కథాంతానికి దారికనిపించేటటువంటిది ఇది చూడండి. “పేమహృదయాలు అనే కథ ఇలా (ప్రారంభమౌతుంది. “ఇద్దరూ సయామూ అక్కా తమ్ముడూలాగ ఆడుకొనేవారు” అనే వాక్యంలో (పమహృదయాలకు వియోగం వొస్తుందనే సూచన కనిపిస్తుంది. ఈ వాక్యం ప్రారంభంనుంచీ మధ్యభాగానికి దారిచూపుతోంది. మధ్యభాగంలో ఇద్దరికీ ఎడబాటు కలుగుతుంది. చివ్వరికి (పమహృదయాలు - అక్కా, తమ్ముడూ ఒక్కచోటికి చేరుతారు. అక్క వొచ్చి దగ్గజకూచుంటే తమ్ముడి జ్వరంకాస్తా ఎటుపోతుందో? “అవిశ్రాంతి భూమి"లో చూడండి. “సంసారం బాధలు ఏమని చెప్పమన్నారు?” అని ఆరంభిస్తే, రచయిత తనకు సంసారాన్ని చవిచూపిస్తాడనే నమ్మకం పాఠకుడికి కలుగుతుంది. ఇంతలోకే, భార్య మేష్టరీ చేస్తానంటే, పాఠకుడు విస్తుపోతాడు! చివ్వరికి “భయపడకండి” అంటూ ఇల్లాలికి ఇంటి చార్జీ వాపసుచేసి, తను ఆఫీసు చార్జీ పుచ్చుకునేసరికి తేరుకుంటాడు పాఠకుడు. “వర్జి అనుమానం మనిషి అనే కథానికలో “నరసింహమూరర్తికీ నాకూ పన్నెండేళ్ళనుంచీ స్నేహం.” అనడం తోటే మనం తరవాత ఏదో అనుమానాస్పదమైన విషయం చదువుతామని సూచనామాత్రంగా ఆలుస్తుంది. కానీ, ఇవి మొట్టమొదటిసారి చదివితే అలాగ కనిపించవు. చదివింతర్వాత చూసుకుంటే వీటి అర్ధం బోధపడుతుంది.

శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారి కథలు గుంటువల్లి రాధాకృష్ణమూర్తి 1571

కామేశ్వరరావుగారు సాధారణంగా కథలోకి నేరుగా దిగుతారు. ఇది గొప్ప సుగుణం. కానీ, కొన్ని కథలలోమాత్రం వర్దనలతో (ప్రారంభిస్తారు. “అవివాహ శాసనం” ఒక ఉత్తమమైన కథానిక అనవచ్చు. కానీ, ఇందులో కథకుడు తిన్నగా కథలోకి దిగక లోవగూడేన్ని వర్ణిస్తాడు. అసలు కథ (ప్రశంస నాలుగో పేరా దాకా రానేరాదు. సాధారణంగా ఉత్తమమైన కథల్లో మొదటి రెండు మూడు పేరాల్లో కథాప్రశంస వచ్చితీరాలి. మొదటి పేరాలో వస్తే మరీ మంచిది. ఆరంభంలో పేజీల తరబడి వర్ణనలుంటే అవి అప్రస్తుతంగానూ, అనవసరంగానూ కనిపిస్తాయి. లోవగూడెం వర్దన ఆ మాటా ఆ మాటా మధ్యచెబితే ఇంతకంటే చాలా బాగుండేది కథ. “ఆమె దుఃఖం” అనే కథకూడా దాదాపు ఈ పంథానే తొక్కిందనవచ్చు.

ఇందాక సూచించినట్టు, వీరి కథల మధ్యభాగంలో పన్నుగడలో ఐక్యత కనిపిస్తుంది.

చాలా తక్కువకాలంలో జరిగిన చాలా తక్కువ విషయాల వివరణ అని, మంచి కథను నిర్వచించారు కొందరు. ఈ పరీక్షకు నిలుచునే కథలు “రహస్యమంటే?” లాంటివి. శ్రీ కామేశ్వరరావుగారు ఇంకొంచెం విసర్జనకళను ఉపయోగిస్తే, కథలు ఎంతైనా బాగుంటాయి.

కథానికకు [ప్రారంభం ఎంత ముఖ్యమో అంతం కూడా అంత ముఖ్య మైనదే. (పప్రారంభంలోకంటే అంతంలో అభ్యుదయం వచ్చి తీరాలి. కథలో తేడాఉండాలి. వీరి కథల్లో చాలామటుకు ఇటువంటి గమనం కనిపిస్తుంది. కథాంతం అనేభాగంలో ఒక శిఖరమూ (0॥గఖం, ఉపసంహారమూ ఇమిడిఉన్నాయి. అంతాదాకా ఉత్కంఠ ఉంటుంది. కథ శిఖరంలో ఆ ఉత్కంఠకు విడుదల కలుగుతుంది. కథకు పరిపూర్ణతనిచ్చే ముగింపు వాక్యాలే ఉపసంహారం. ఒక్కొక్కప్పుడు శిఖరాగ్రమే కథాంతంగా ఉండవచ్చు. అది అత్యుత్తమమైనది.

“పేమచితాలు” అనే కథలో ఈ శిఖరం మనోహరంగా ఉంది. ఉమాకాంతం చిత్రకారుడు. లోకనిందకు పాలౌతాడు. సావితిని (శ్రేమిస్తాడు. ఒకసారి సావిత్రిని తీసుకు లేచిపోయి, వివాహమాడటానికి (ప్రయత్నించి ఐఫలుడౌతాడు. సావిత్రి తండ్రి ఆమెను ఇంకొకడి కిచ్చి పెళ్ళిచేసేస్తాడు. ఉమాకాంతం సావిత్రిని అడిగితే, సావిత్రి ఇలా అంటుంది. “అమాయకంగా నన్ను వివాహమాడిన ఆయన్ని నేను మోసంచెయ్యను. నా నుదుటిరాత ఇంతే” అని ఇంట్లోకి ఛ్యరున వెల్లి

1572 పందిరి ముల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పోతుంది.అటుతరువాత నాటికీ నేటికీ ఉమాకాంతం వివాహం చేసుకోలేదు. సావితి బొమ్మని ఆరాధిస్తుంటాడు. “పేమచిత్రాలు” కథ (ప్రారంభం ఉమాకాంతం కథలోనే అయినట్లయితే, ఇటువంటి కథ మరొకటి లేదని అనవచ్చు. “లలిత వివాహం అనే కథ బాగా సాగినప్పటికీ చివ్వరికి “అనంగనంగా” కథలాగా ముగిసింది. కథ స్వరూపం, భావముద్రయొక్క ఏకత

కథానికకు ఒక్క ముఖ్యలక్షణం చెప్పమంటే, “ఏకత” అని చెప్పవలసిందే. పన్నుగడలోనూ, భావంలోనూ, భాషలోనూ ఐక్యత ఉంటేనే ఒక రచనను “కథానిక అని పిలవవచ్చు. ఇటువంటి ఐక్యత వీరి కథానికల్లో బాగా కనిపిస్తుంది. దీనికి ఒకటి రెండు దృష్టాంతాలు. “రెండు వేల చుట్టాలు, “ప్రమహృదయాలు” “ఎండమావులు అనే కథల్లో ఐక్యతను పరిశీలించండి. “రహస్యమంటే?” అనే కథానికలో ఈ ఐక్యత మరీ స్ఫుటంగా గోచరిస్తుంది. కథానికలో ఎంత తక్కువకాలాన్నీ ఎంత తక్కువ సంఘటనలనూ చిత్రిస్తే అంత బాగుంటుంది ఏకత.

కథకులలో అ(గ్రగణ్యు డైన [5602446౧ ౧౦౪ ఇలా అంటాడు: “మొట్టమొదటి వాక్యంలోనే తన అభిప్రాయంయొక్క సారం కనిపించకపోతే ఆదిలోనే హంసపాది అయిందన్నమాటే. రచనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తను ఏర్పరుచుకున్న ఆకృతికి తోడ్పడని మాటలు ఉండకూడదు.” కథల పేర్లు

కొందరు రచయితలు కథల పేర్లనుగురించి తగినంత శ్రద్ధవహించటంలేదు. పేరు ఆకర్షవంతంగాలేకపోతీ పాఠకులు కథను చదవకుండా పేజీలు తిప్పేస్తారు.

మంచి పేరుకు అయిదు ముఖ్య లక్షణాలున్నాయి.అవి 1. బెచిత్యం. 2. (ప్రత్యేకత. 3. ఆకర్షణ. 4. క్రొత్తదనం. 5. క్లుప్తత. లేకుమళ్లవారి కథల పేర్లు అతికినట్టు ఉంటాయి. వీటికి పైన చెప్పిన లక్షణాలు చాలామటుకు ఉంటాయి. కొన్ని పేర్లు జిజ్ఞాస కలిగించేవిగా కూడా ఉంటాయి. “నాకేం తెలుసు?” అనే పేరు చూస్తేనే కథ చదవాలనిపిస్తుంది. “రహస్యమంటే?” “తనదాకా వస్తే ఎొ “చదవవేస్తే..” అనే పేర్లలో ఇటువంటి గుణమే ఉంది. కొన్ని కథలపేర్ల మనస్సును ఆకర్షిస్తాయి. “ప్రసాదరావు పెల్లి చూపులు” “పెండ్లి పిలువు” “నాగవల్లి నిష్టూరాలు"

శ్రీ బేకుమళ్ల కామేశ్వరరావుగారి కథలు గుంటువల్లి రాధాకృష్ణమూర్తి 1573 ఇలాంటివి; మొత్తానికి అన్నింటిలోనూ కొత్తదనం కనిపిస్తుంది. అయితే కొన్ని కథలకు మాతం బెచిత్యానికే ఎక్కువ 'పప్రాముఖ్యమిచ్చి నట్లు కనిపిస్తుంది. ఉదాహరణ: “పంచభూతాల చట్టం” “అవివాహ శాసనం” సామాన్య పాఠకులు ఈ పేర్లతో ఉండే కథలలో తమకు కావలసిన ఉత్సాహం దొరుకుతుందని అనుకోరు.

శెలీ

తెలి వ్యక్తిత్వానికి సంబంధించినది. అందుకనే అది వివిధ రచయితల్లో వివిధ రీతుల్లో కనబడుతుంది. ఒకే విషయాన్ని గురించి ఇద్దరు రచయితలు రెండు మనోహర రూపాలలో రాస్తారు. ఇద్దరూ రైటే. శైలి వ్యక్తులతోటేకాక, భావాలతోకూడా మారుతుంది. ఒకే రచయిత శైలిలో వివిధ భావాలకు అనుగుణంగా మార్ప్చువస్తుంది. కథానిక ఒక రెండెద్దుల బండి. ఈ బండికి భాషా, భావమూ రెండు ఎద్దులు.

శెలిలో నాలుగు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి సరళత, ఏకత, క్లుప్తత, సహజత. ఈ నాలుగూ కామేశ్వరరావుగారి కథల్లో ఉన్నాయి. భావాలను బహు సరళంగా మాటల్లోకి తర్జుమా చేస్తారు. తాను వెల్వరింప దలచుకొన్న భావాన్ని గజిబిజి లేకుండ సరళంగా అందరికి విస్పష్టమయ్యేటట్టుగా వాస్తాడు, అని ఒక పథ్రికాధిపతి వీరి కథానికకు ఉపోద్దాతం రాశారు. వీరి మార్గం బుజుమార్గం. ఇటీవల రాసిన కథల్లో చాలామటుకు శైలిలో ఏకత కనిపిస్తుంది. చప్పదలచుకొన్నది క్లుప్తంగా, అర్ధం చెడకుండా చెప్పగలరు. సరే. వీరి రచనల్లో సహజత మాట వేరే చెప్పనే అక్కర్లేదు. ఆయితే, ఒకటి - వీరు సాధారణంగా సహజత్వం చేకూర్చుటానికో, లేక సన్నివేశ చితణకో ఒక్కొక్కప్పుడు వర్ణనల్లో పడిపోతారు. ఇవి కోయజాతిని గురించి వీరు రాసిన కథల్లో కనిపెస్తుంది. ఇవి అంతమాతానికే ఉత్తమ రచనలు కావని అనటానికి వీలులేదు. పరికించి చూస్తే, వీరి కీర్తిధ్వజాలు, బహుశా, అవేనేమో? “రొజా” ఒక అపూర్వ కళాసృష్టి “రొజూ” కళావైభవాన్నీ భాషా కోభనూ తిలకించి, రాప్పసాహెబ్‌ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు “నేను భాషలో ఇంత కృషి చేశాను! ఎందుకూ! ఇటువంటి కథ ఒక్కటి రాసి ఉంటే ఎంత బాగుండును” అని ప్రశంసించారు.

1574 పందిరి మల్లికార్డునరాప్తు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గీలచిత్రణు సంభాషణలు

శీలచిత్రణ, సంభాషణారచనలలో కామేశ్వరరావుగారు సిద్ధహస్తులు. వీరు సృష్టించిన ఒకరిద్దరు వ్యక్తుల శీలాలను గురించి చెబుతాను. "వరి అనుమానం మనిష అనే కథలో నరసింహరావునూ, *ప్రసాదరావు పెల్లి చూపులు అనే కథలో పప్రసాదరావునూ చూసి లోలోపుల నవ్వుకోనివారు ఎవరుంటారు! వీరి శీలచిత్రణకళను పరిశీలించేటప్పుడు, సింహ్మాదిరావును మర్చిపోకూడదు. “మన్నెంలో సాహసాలు" అనే కథానికలో రచయిత మనకు సింహాద్రిరావును పరిచయం చేస్తున్నారు. “సింహాద్రిరావు సన్నగా ఎరగా ఉంటాడు. పాతిక ఏళ్లు. కళ్లు పెద్దవి. మధ్య మధ్య బిత్తర చూపులు చూస్తుంటాడు. కొంచెం నవ్వుమొహం. సన్నని మీసం, చిన్న పిలక ఉందిగాని బయటపెట్టడు. ముందు క్రాపింగు, దేశీయ దిరీసు వేసుకున్నాడు. కాస్త షోకు జమాయిద్దామని రంగు వెలిసిపోయిన కోటు ఒకటి ధరించాడు.” ఈపాటికి మీ మనోదర్పణంలో సింహాద్రిరావు ప్రతిబింబం పడేఉంటుంది. సింహాదిరావుకు మృగాలంటే తగని భయం. గానీ, అది బయటికి కనపడనీయడు. తను శూరుడనీ, వీరుడనీ ప్రగల్భాలూ! తన మిత్రుడు డిప్యూటీ ఇనస్పెక్టరు (ప్రాణాన్ని తన పాణానికి అడ్డు వేసుకుంటాడు. పులి వొచ్చినా అతళ్జే ఎత్తుకుపోతుందిగానీ తనదాకారాదు అని ధైర్యం తెచ్చుకుంటాడు. సింహాదిరావు సారథ్యం చూడండి. అతనికి సారథ్యం అంతా వచ్చుగానీ మతిమణపు; ఎద్దుబండికి ఏది దాపటెద్దో, ఏది వెలపటెద్దో అతనికి సందేహం. సింహాదిరావు ఇంకా ఏమేమి చిత్రవిచిత్రాలు చేస్తాడో చూడాలి.

“అతివృష్టి అనే పెద్ద కథలో శీలచ్చితణ బాగుంది. తులసెమ్మ నీలం బాగా పోషింపబడ్డది. కోడలిని బాగా సాధించగలుగును. వియ్యంకుణ్ణీ, వియ్యపురాలినీ దుయ్యబట్టగలుగును. కోర్టులక్కి సాధించగలుగును. “అర్థంగాని నవమతి"లో తల్లి దండ్రులు ఎన్నిసంబంధాలు చూసినా నవమతి ససేమిరా అంటుంది. చివ్యరికి అందరూ అసహ్యాంచుకొని, చీదరించుకున్న వ్యక్తిని, అష్ట వపంకరలుగల వ్యక్తిని పళ్లాడటానికి అంగీకరిస్తుంది. ఈ కథానిక మనకు ఒక చక్కని వ్యక్తిని ప్రసాదించింది.

శీలచిత్రణలో అనేక రకాలున్నాయి. ఇది సింహాద్రిరావు కథల్లో వర్ణనద్వారా జరిగింది. మొదట రచయిత మనసులో ఒక సంపూర్ణమైన భావం ఏర్పడిఉంటుంది.

శ్రీ లేకుమళ్ల కామేశ్వరరాప్పుగారి కథలు. గుంటువల్లి రాధాకృష్ణమూర్తి 1575 అందులోనుంచీ అవసరమైన విషయాలు వ్రాసి సింవాద్రిరావుకు వ్య క్తిత్వాన్ని చేకూర్చుతాడు. తరవాత ఆతని శీలం సంభాషణలో పెరుగుతుంది. వ్యక్తులచేత మాట్లాడించి, కార్యాలు వేయించి శీలచిత్రణ చెయ్యటం చాలా బాగుంటుంది. చదువరులకు సంభాషణలలో ఉన్న ఉత్సాహం వర్ణనలలో ఉండదు. చక్కని ఉదాహరణం “రెండువేల చుట్టాలు.” ఇందులో చంద్రగిరి నీలం బాగా చిత్రించారు. ఈ కథలో మరొక సుగుణంకూడా ఉంది - కథానాయకుడికి ప్రాముఖ్యత నిచ్చి, తక్కిన వ్యక్తులను వెనక ఉంచటం. చంద్రగిరి శీలానికి [ప్రాముఖ్యత నిచ్చి, తత్తిమ్మా మనిష్యులను కాస్త మరుగుగా ఉంచారు రచయిత. “అవిశ్రాంతి భూమి” అనే కథలో ఇల్లాలు ఉద్యోగంచెయ్యటంవల్ల ఆమె నీలంలో కలిగిన మార్పు సహజంగా చిత్రించబడింది. వ్యక్తుల పేర్లుకూడా చాలామటుకు కొత్తవిగా ఉన్నాయి. వైవిధ్యమూం, విశిష్టతా ఉన్నాయి. ఈ పేర్లు సాధారణంగా వ్యక్తి శీలాన్ని పరిచయంచేసేవిగా ఉంటాయి. లాలసమూర్తి, సాహసరావు ఇలాంటి ఉదాహరణలు. ఆధునికుల కథలలో సంభాషణలు విరివిగా ఉంటాయి. వీరు 1950 సంవత్సరంనుంచీ రాసిన కథలకు ఇది పర్తిస్తుంది. సంభాషణలన్నీ స్వభావసిర్ధంగా, పాత్రోచితంగా ఉంటాయి. అవి పాత్రలకు వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాయి. అయినా, కోయదొరల భాషను వీరు సభ్యతకు దెబ్బతగలకుండా రాశారు. దీనికి “అవివాహ శాసనం”, “పళ్ళపండగి, “పంచభూతాల చట్టం” తార్కాణాలు. సంభాషణల ధోరణి కాలదేశాలనుబట్టీ, భావాలనుబట్టీ మారుతుంది. ఈ సంభాషణ చూడండి; వీరదొర శాంతంగా “యుద్ధంలో నిస్ను బందీగా తీసుకునివచ్చాము అన్నాడు. “జను” అన్నట్టుగా దేవదొర చూశాడు. “ఇప్‌ ప్రాణం నాచేతుల్లో ఉంది” అన్నాడు వీరదొర బింకంగా. దేవదొర తల అడ్డంగా ఊోపి, “కొండదేవత చేతుల్లో మన పప్రాణాలున్నాయి” అని విగువైస నెష్ము బైస స్వరంతో అన్నాడు.

1576 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము “ఆ విషయం కొండదేవతకి తెలుసు,” అని వీరదొర ప్రశాంతంగా అని, “ఇప్పుడు నీకూ నాకూ తెలిసిన విషయం; ఒక్క కత్తిదెబ్బతో నీ తల వెళ్లి బంధించిన మేక తలలాగ కింద పడుతుంది. ఎరుగుదువా?” అన్నాడు హుంకారంతో. అవతల దేవదొరా, ఇవతల వీరదొరా - ఇద్దరి భావాలూ, ఎవరికివారు పృథక్కరించుకోవలసిందే. “పళ్ళపండగొ సహజ సంభాషణలకు ఆటపట్టు. ఎరుకయ్య పళ్ళపండగను రద్దుచెయ్యాలని పడ్డ తాప్య్తతయమూ, ఎదుటివాళ్ళని తమ పక్షానికి తిప్పుకోటంలో అతని చాకచక్యమూ, వాళ్లు మనస్సులో సమాధానపడ్డప్పటికీ, సంప్రదాయాన్ని ధిక్కరించలేక పాత ఆచారానికి పట్టుకు పాతర్లాడడమూ చాలా చక్కగా చిత్రించారు. ఎరుకయ్య చివ్వరికి నిరంకుశత్వం ప్రకటిస్తేగానీ, వని ఏమీ జరగకపోయేసరికి, గూడెం రాజు జాలయ్యను బంధింపించి, పళ్ళపండగను తను రద్దుచేసినట్లు చాటిస్తాడు. అంకుశానికిగానీ లొంగరు జనం! ఇందులో ప్రజల మూర్థత్వమూ, ఎరుకయ్య స్వతంత్రబుద్ధీ చక్కగా కనిపిస్తాయి. మొత్తానికి రచన లన్నింటినోనూ వ్య క్తిస్వాతంత్య రం, భాషాస్వాతంత్య్యం, భావస్వాతంత్య్య౦ కనబడతాయి. కానీ, ఒక్కొక్కసారి వీరూ పప్పులో కాలువెయ్యకపోలేదు. ఆమాటకువస్తే, (ప్రతీరచయితా మంచివీ, చెడ్డవీకూడా రాస్తాడు. “అవిశ్రాంతి భూమి" లో భర్త “మాఆవిడ పేరు చెప్పడానికి మొహమాటపడుతున్నాను. కాని, ఆవిడ పేరు పంకజాక్షి అని తెలుసుకోండి” అని అనటం ఎలా ఉందంటారు? భర్త ఎవరైనా జీవితగాథను చెబుతూ, ఇలాగ చెబుతాడా? మొహమాటస్థుడ్రైతే పేరు ఊసే ఎత్తడు. కాకపోతాడూ, ఈ బాధేలేదు. పోనీ పంకజాక్షి అనే పేరులో ఏదైనా విశిష్ణ్టతఉందా అంటే అదీ కనిపించదు. అదీకాక, “మా ఆవిడ పేరు పంకజాక్షి అని తెలుసుకోండి.” అని వీపుమీద చరిచినట్టు చెబుతాడా ఎవరైనా? ఇలాగే “మా తాతయ్య” అనే రచనలో “ఇంతటిలో మా నాయనమ్మ వచ్చేది...అంతా పూర్వకాలం మనిషి. వర్ణిస్తా ఉండండి.” అని రాశారు. ఇది బేకుమళ్ళవారే రాశారా అనిపించింది. రచయిత “మా నాయనమ్మను వర్ణిస్తాను ఉండండి,” అని మనల్ని ఆపితే మనం ఇహ ఆ కథ చదవం. వీటిని నేను తప్పులుగా

శ్రీ లేకుమళ్ల కామేశ్వరరాపవుగారి కథలు గుంటువల్లి రాధాకృషమూర్తి 1577 ఎన్నటం లేదు. ఇటువంటివి ఏ ఉత్తమరచయితలోనూ ఉండకూడదనే నా ఉద్దేశం. అదీకాక, ఇవి సవరించలేని తప్పులు కావు. పై వర్దనలో “వర్దిస్తా ఉండండి.” అనే వాక్యం తీసేస్తే చాలు. సన్నివేశం (౧6 5611౧9)

వీరి కథలలో సన్నివేశం బాగుంటుంది. ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పటమే వీరి ఉద్దేశం. అందుకనే అవసరమైనప్పుడు టూకీగా పూర్వగాథను చెప్పి, తరువాత (ప్రస్తుత కథలోకి దిగుతారు. “పెండ్లిపిలుపు” “పందెం జత” అనే కథల్లో ఈవిధంగా పరిస్టితులన్నీ వెొొందట వివరిస్తారు. పరిస్థితులను వెల్లడి చెయ్యటం సంభాషణలద్వారానూ, మాటలకూ మాటలకూ మధ్య రచయిత స్వగతాలవల్లనూ చెయ్యవచ్చు. ఇలాంటిదే “గంగ వెజ్జులు” అనే కథలో కనబడుతుంది. ఇందులో ఆరంభంలోనే వర్గనల్లో పారంభించక, కాస్త కథ సాగింతర్వాత పరిస్థితుల విశదీకరణ జరుగుతుంది. “"అతివృష్టోలో మళ్ళీ ఇది చాలా సరసంగా జరుగుతుంది. ఈ (ప్రయోజనాన్ని వీరు మాండలికాల ప్రయోగంవల్ల కూడా సాధిస్తారు.

సన్నివేశంవల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కథానిక సన్నివేశంమీద చాలావజకు ఆధారపడి ఉంటుంది. అది కథానిక పన్నుగడకు కావలసిన సామగిని ఇస్తుంది. అది వ్యక్తులను ప్రవేశపెట్టటానికి ఉపకరిస్తుంది. పాఠకులను మరొక దేశానికీ, మరొక కాలానికి తీసుకుపోగలుగుతుంది. అది భావస్పోరకంగా కూడా ఉంటుంది. వాస్తవికత, కల్చ్పస, భాపం

వాస్తవకత అంటే కథాపస్తువును యథాతథంగా ఉపయోగించుకోటం అని చాలామంది అభ్మిపాయం. రచయిత సామాన్య (ప్రపంచంలోకి దిగివస్తాడు. వాస్తవికత సమకాలికల అయినది. ఇది అనుభవజన్యం. ఇది కథకుడికి చాలా సహకారిగానే ఉన్నది. టేకుమళ్ళవచారి రచనల్లో వాస్తవికత ఉన్నది. కానీ, అతివాస్తవికత లేదు. కోయరాజుల మాటలలో బూతుకూతలుంటేనే వాస్తవికత అని అనుకోకూడదు. కథల్లో సంభాషణల్లో కూడా (గగామ్యుభాష ఎక్కువగా వాడటం సమంజసంకాదు. ఈ విషయంలో కాదుశ్వరరావు తగిన శద్దవహించారు.

1578 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

అభూతకల్పనలు కూడా కొన్ని రాశారు. దెయ్యాల కథలు చెప్పడంలో చాలా నేర్పు అవసరం. “సుబహ్మణ్యం దెయ్యం” అనే కథను చదివి ఎవరు ఆనందించకుండా ఉంటారు? “సౌందర్యం”, “తీర్థంకరుడి రెండో దర్శనం” అనేవి చక్కని 521763.

వీరి రచనల్లో భావాలు పుష్కలంగా ఉంటాయి గానీ, అవసరమైన భావ్యోదేకం కనబడదు. (పేమ ఉంటేనేగానీ రచన బాగుండదనే భావం ఇప్పుడు మాసిపోతున్నది. వీరి రచనల్లో ఈ భావం సాధారణంగా మితిమీరదు. ఉన్నా, అది మరొక ముఖ్యమైన భావానికి వెనక ఉంటుంది. వీరు రాసిన కథల్లో [శ్రేమభావం కనిపించేవి “పేమ చిత్రాలు, “పార్వతీబాయి” మొదలైనవి. రచనల్లో (ప్రేమ అవసరమా అనే విషయాన్ని గురించి 112౧20౧ అనే ఇటలీ నవలా రచయిత అభిప్రాయం గణనీయం. “ప్రేమ ఈ (ప్రపంచానికి అవసరమే. అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని కష్టపడి, సతమతమై కథల్లోకి ఎక్కించటం అనవసరం. దీనివల్ల జరిగేదల్లా ఎదుటి వాళ్ళల్లో భావో(దేకం కలిగించడమే. ప్రపంచానికి అవసరమైనవీ, రచయిత రాయవలసినవీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.”

కామేశ్వరరావుగారి కథలు సరసంగా ఉంటాయి. ఆయా భావాలను వ్య క్తపరిచేటప్పుడు ఆయా రసాలు చిప్పిలుతూ ఉంటాయి.

వీరి రచనల్లో ప్రసాదమైన హాస్యం ఉన్నది. “నభూతో న భవిష్యుతొ అన్న కథను చదువుతూన్నప్పుడు శ్రీ వడ్డాది అప్పారావుగారు తమలో తాము నవ్వకుండా ఆపుకోలేకపోయారని “జానకి [గశేమ” కథల 'సంపుటి తొలిపలుకులో రాసారు. “రైలు ప్రయాణం”లో మల్లీపెల్లి చేసుకున్న ముసలి భర్త తన భార్య విషయంలో పడే శంకలు, అనుమానాలూ, బాధలూ వినోదకరంగా ఉంటాయి. “వర్థి అనుమానం మనిషి*ని చూసినా మనకు నవ్వు ఆగదు. “ప్రసాదరావు పెల్లి చూపులు” అనే కథలో గూడా హాస్యధోరణి (ప్రసాదంగా కనిపిస్తుంది. సింహాదిరావు శీలాన్ని గురించి శీల చిత్రణలోనే వివరించాను. సింహాదిరావు సారథ్యమూ, మన్నెంలో సాహసాలూ పాఠకులను నవ్వించి తీరుతాయి.

కామేశ్య్వరరావుగారి కథలలోని సహజత్వం, శీలచిత్రణా ఠాకూరు రచనా ధోరణిని జ్ఞాపకం చేస్తాయి. వీరు “ప్రతిభిలో రాసిన కథలు ఆలెన్‌ పో, హాతార్న్‌ రాసిన కథలను పోలివున్నాయి. వాషింగ్టన్‌ ఇర్వింగ్‌ కథల్లోలాగా కొన్నింటిలో

శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారి కథలు _గుంటువలి రాధాకృషమూర్తి 1579 మొదటి అయిదారు పేరాలదాకా వర్దనలే ఉంటాయి. వెల్పు కథావాజ్బయంలోని వైవిధ్యం వీరి కథాసామగిలో కనిపిస్తుంది.

కామేశ్వరరావుగారి కథలకు కొండగుర్హులు రెండు. అవి వైవిధ్యమూ, వైశిష్ట్రమూ. ఇది నిర్వివాదం. వీరి కథల్లో వ్యక్తిత్వం సువ్యక్తం. ఎంత వొద్దనుకున్నా కథల్లో మూడు భాగాలు రచయిత ప్రతిబింబం ఉండనే ఉంటుంది. ఇది వీరి రచనలకు వర్తించే సత్యం మాత్రమే కాదు. ప్రతీ ఉత్తమ రచయితా ప్రతీ రచననూ తన వ్యక్తిత్వంతో నింపుతాడు. అందులోని శీలాలను మనోనేత్రంతో తిలకించే (దష్టకు రచయిత మూడుమూర్తులా ఆ నీలాలలో కనబడుతాడు. ఆ శీలం రచయితలోని ఒక భాగమే. అయితే, అది అతని చిత్రపటం కాదు. మాటవరసకి, “ఎండమావులు ఉన్నదా? మేఘోదకం శీలాన్ని పరిశీలించేటప్పుడు రచయితను చూసిన ప్రతివ్య క్తికీ, కామేశ్వరరావుగారు కళ్లకు కట్టినట్టు కనిపిస్తారు.

శ్రీ చేకుమళ్ల కామేశ్వరరావుగారి కథావాజ్బయం బహు విస్తృతం. భావ పరిపుష్టికీ, భాషా సౌష్టవానికీ కామేశ్వరరావుగారి పేరు చెప్పే మరొకరి పేరు చెప్పాలి. వీరి కథలన్నింటిలోసూ విజ్ఞాన వినోదాలను జోడించి, ఏ తరగతి పాఠకులకు కావలసిన వస్తువు ఆ తెగవారికి అందపేసారు. గణనకెక్కిన ఆధునిక కథకుల్లో శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు ముఖ్యులు అనటం నిర్వివాదాంశం. (కిన్నెర: సంప్పుటము 4, సంచిక 7, జాలై కేవ 2)

రం లి ఇం ల్రింం నా అం ఇ సిపిలి. దళ ఛి ఆతంరుా

శ్రీ కవికొండల వెంకటరావుగారు టేకుమళ కామేశ్వరరావు తే

(నేను 1932, 33 ప్రాంతాలలో కొందరు కవుల సంగ్రహ చరిత్రలు పోగుచేశాను. వాటిలో శ్రీ వెంకటరావుగారి చరిత్రకూడ ఉంది. సుమారు ఇరవై ఏళ్ల [కిందట రాసిన దీనిని కవిగారి షష్టిపూర్తి సందర్భంలో (ప్రకటించ నవకాశం కలిగినందుకు చాల సంతోషిస్తున్నాను - టే.కా. 9.7-1952)

తోవికొండల వెంకటరావుగారి స్యగామం తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం తాలూకాలోని శ్రీరంగపట్నం. తండ్రిపేరు నరసింహారావుగారు. తల్లి పేరు శేషమ్మగారు. శేషమ్మగారి తండిపేరు గాడిచెర్ల రామయ్య పంతులుగారు. నరసింహారావుగారు భూస్వాములు. వేరే ఉద్యోగం లేదు. కవికొండలవారిది భారద్వాజస గోత్రం; యాజ్ఞవల్క్య సూత్రం.

శేషమ్మగారికి కలిగిన ముగ్గురు కొడుకులలోను వెంకటరావుగారు పెద్దవారు. ఈయన 20-7-1892 (నందన నామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశి నాడు జస్మించేరు. వెంకటరావృగారి తల్లి 1899లో పాతికేళ్లేనా నిండకుండా స్వర్గస్తులయేరు. నరసింహారావుగారు ద్వితీయ వివాహం చేసుకొన్నారు. రెండో భార్యకి ఒక కుమార్తె మాత్రమే కలిగింది. వెంకటరావుగారు 'మా సవతితల్లివల్ల నేను సుఖపడ్డాను కాని కష్టపడలేద'ని చెప్పుతున్నారు.

శ్రీ కవికొండల వేంకటరావుగారు. టేకుమళ్ల కామేశ్వలరావు 1581

కవిగారు చిన్న తరగతులు శ్రీరంగపట్టణంలోను, తర్వాత చదువంతా బి.ఏ. సహా, రాజమహేందవరంలో చదివేరు. మెట్రిక్యులేషన్‌ 1908లోను, బి.ఏ. 1913 లోను ఉత్తీర్ణులయేరు. వీరు ఏ తరగతిలోను తప్పిపోలేదు. కాని, తర్వాత చదివిన బి.ఎల్‌లో మాతం ఒకసారి తప్పిపోయేరు. బి.ఎల్‌. పరీక్షపోగా ఒక సంవత్సరం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని బైలరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బి.ఎల్‌పాసయి రాజమ హేంద్రపరంలో మొట్టమొదట (పాక్టిసు మొదలుపెట్టేరు. 1916 నుంచి 1922 దాకా రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. తర్వాత నరసాపురం వళ్ళేరు. అక్కడ 1922 మొదలు 1933 వరకు ప్రాక్టీసు చేశారు. 1933లో తిరిగి రాజమహేందవరం వచ్చేరు. ఇప్పుడు వీరు ఇక్కడే (ప్రాక్టీసు చేస్తున్నారు.

వెంకటరావుగారికి పదునాలుగో ఏట మొదటి వివాహం అయింది. భార్య పరు విచేకవర్ణనమ్మగారు. ఈమె జోస్యుల నారాయణమూర్తిగారి కుమార్తె. ఈమె 1909 లో స్వర్గస్తురాలయింది. వెంకటరావుగారు తిరిగి 1910లో వివాహం చేసుకొన్నారు. ఆమె పేరు దమయంతి లక్ష్మీ దేవమ్మగారు. ఈమె గడిదాసు వెంకటచలంగారి కుమార్తె. వెంకటరావుగారికి (ఈ వ్యాస రచనాకాలం అనగా 1933 నాటికి ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు.

వెంకటరావుగారి తండ్రిగారు 1919లో ఎఫ్రైయైదో ఏట జీవయాతను ముగించేరు.

ఈ కపిగారియొక్క పూర్వు లెవ్వరూ కవిత్వం చెప్పినట్లు కనబడదు. కాని వాజ్మయంలో (గర్ధాభిరుచులున్నవారు.

ఎంకటరావుగారు 1910లో కవిత్వం చెప్పడం ప్రారంభించారు. అనేక (గ్రంథాలు రచించీరు, వీటినిక్కడ తెలియజేస్తాను.

“భారతీయ సందేశము” - ఇదొక చిన్న నాటకం. ఇది మొదట నాళం కృష్ణారావుగారి చే నడీపింపబడ్డ మానవసేవ అనే పత్రికలలో 1912లో (పకటింపబడ్‌ంది. ఆ తర్వాత (గంథరూపంగా చెలువడింది.

“అనాథాభ్యుదయము" -. ఈ చిన్న నాటకంకూడ మానవసేవలోనే (పకటంచబడదింది. వెంటనే పుస్తకరూపంగా [013లో ఎలువడింది.

1582 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “విజయసదనము” - ఈ నవల చాల వరకు 1916 ప్రాంతాలలో పిఠాపురంనుంచి వెలువడుతూన్న “ఆంధసేవ” అనే పత్రికలో అచ్చయింది. కాని అంతటితో ఆ పత్రిక ఆగిపోవడంవల్ల పూర్తిగా అచ్చుకాలేదు. కవిగారు అనేక ఖండకావ్యాలు రచించేరు. పద్య ఖండకావ్యాలను కొన్నిటిని 1916లో “వివిధకుసుమావళిొ అనుపేరున అచ్చు వేశారు. ఇది ఇప్పుడు మూడో ము[దదణ భాగ్యం పొందింది. 1924లో “భావమురలళి” “జనపదములు” “కుమార కంఠము" “మాతృదేశ సంకీర్తనము” “కలరుతము” అనువాటిని, 1925లో “ప్రకృతి చందనము” 1926లో “ఆత్మవ్య క్తి” 1927లో “నెలబాలుడు” అను కావ్యాలను అచ్చువేశారు. 1929లో “ఆ గడపలు" *“చదువులదుత్త” “చిట్టికైత” “పొట్టికత” అను నాలుగ పుస్తకాలను ప్రకటించారు. “పొట్టి కతి మాత్రం వచన[గంథం. 1930లో “త్రయి" అను పద్య[గంథం, “కోనేరు అను చిన్న నాటకం “విప్రసందేశం” అను నాటకం - ఈ నాటకం 1911లోనే రచింపబడ్డది - “జంటలు” అను వచన (గంథం (్రకటించేరు. వీరి కథలు, పద్యాలు, వ్యాసాలు మొదలైనవి ఈకాలవు పత్రికలలో అచ్చవుతూనే ఉన్నాయి. వెంకటరావుగారి కవిత్వం అసామాన్య మైనది. (కిన్నెర: సంపుటము 4, సంచిక 8, ఆగస్టు 1952) కోలు ఫ్‌. సై ఓీత 4 (౧ టు సాం ౮ మిం! // యా గ్ల జానా! టీ40) న స డ్య న గ గ చర గంగ డల

ఆల త్‌ ల్‌ కవికొండలవారి “ఇనుప కోట గుంటుపలి రాధాకృష్ణమూర్తి క. యణ తాల శ్రీ కవికొండల వేంకటరావుగారు గడచిన మూడు, నాలుగు దశాబ్దాలలో అనేకమైన కథలూ, గేయాలూ, నవలలూ ఆంధ్ర పాఠకలోకానికి అందజేసారు. వీరి షష్టిపూర్తి సందర్భంలో తెలుగులోకం సత్కరిస్తోంది.

కవికొండలవారి నవలల్లో “ఇనుపకోట” ఉత్తమమైనదని చాలమంది అభ్మిపాయం.

“ఇనుపకోటొ సుమనోహ్లాదినీ శీర్షికలో నాల్గవ భాగంగా ప్రచురింపబడింది. ఈ నవల 1933లో రచింపబడినప్పటికి, 1944లో గానీ పత్రికలో ప్రచురింపబడలేదు. తరువాత దీనికి పుస్తకరూపం లభించింది 1050లో. ఈ కాలవిపరాన్ని సూచించింది, తలుగు నవలల పరిస్థితిని పాఠకలోకానికి తెలపటానికి మాత్రమే.

కాలానికీ, రచనకూ ఎడతెగని సంబంధం ఉన్నది. ఏ రచననేనా ఆ కాలంతో ఆ కాలం రచనలతో సరిపోల్చి చూడాలి. “ఇనుపకోట” అన్ని విధాలా 1930 (ప్రాంతాలకు చెందినదే. కథావస్తువు అయితేనేం, శీలచ్మితణం అయితేనేం, భాష అయితేనేం అన్నీ నేటి పాఠకుడికి కొంచెం పాతవిగా కనబడతాయి.

(గామ పునర్నిర్మాణోద్యమాన్ని గురించి నలుగురు వక్తలూ బల్లగుద్ది చెబుతున్న రోజు లవి. గగామోద్ధరణం, సంఘసంస్కరణం మొదలైనవి ఆనాడు (పజ్వరిల్లిన భావాలు. “ఇనుపకోటొలో కృపావతమ్మ భారతవర్త స్వార్థత్యాగ సమితి స్థాపించి, సంఘసేవకోసం తన శక్తినంతా వినియోగించింది. విద్యార్థులూ, విద్యార్థినులూ సెలవుల్లో గ్రామసేవ చెయ్యాలని బయల్టేరుతారు. ఈ నవల విద్యార్థులకు సెలవులు ఎలా వినియోగించాలి? అనే తీరని సమస్యకు జవాబు చెబుతున్నది. లా పండరి మల్లీకార్టునరావు శతజయంతి. సంప్పటము. 4: సాహిత్యము

1584 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము కథాంశం

కృపావతమ్మ సముదవుటొడ్డున కట్టిన ఇసకగుడిలో “ఓబలేకొ అని రాసిఉన్న రబ్బరుబంతి వచ్చిపడ్డది. ఆమె ఒక జాలరి ద్వారా ఓబలేశుడు కొమరగిరివాసి అని తెలుసుకుంది. జమీందారు విశ్వేశ్వరాయలు గ్రామోద్ధరణ కార్య(క్రమదీక్ష తో “అంతర్వేదికరొ దగ్గర విడిసి ఉన్నారు. కొందరు కాలేజీ విద్యార్థులూ, విద్యార్థిసులూ (గామపునర్నిర్మాణార్థమై వచ్చి, జమీందారు పరిచయంచేసుకొని, సెలవులు

జమీందారు మేనకోడలు కృపావతమ్మ “ఈ పట కుటీరాలు దాటిపోతేనేగానీ నిజభావాలు కార్యరూపం దాల్బవు." అని చీటీరాసి వెల్లిపోయింది. దోవలో మాలపిల్ల ముత్తికీ, దేవర కులజుడు గంగడికీ కలిగిన శిశువును, ఇద్దరూ విడిచి వెల్లితే ఆమె చూసి అనాథశరణాలయానికి చేర్చిస్తుంది. అక్కడ ఉన్న ఓబలేశుణ్జి మునసబుకు ఈ సంగతి చెప్పెరమ్మని కృపావతమ్మ పంపితే, అతని దగ్గరడఉన్న రబ్బరుబంతుల్ని బాంబులుగా భావించి పోలీసులు పట్టుకుని, తరవాత కోర్టులో విచారించి విడిచిపెట్టారు.

ముత్తి కులం తప్పిందని, చనిపోయిన తల్లిదగ్గరికి రానివ్వరు. ముత్తి ఒక

__బహ్మసమాజస్టుడిద్వారా కాకినాడ అనాథశరణాలయంలో కొలువుకు చేరింది.

అక్కడ తన బిడ్డ ఉన్నాడు.

జమీందారు మేనకోడలు కనబడకపోగా, గుజ్జంమీద ఎక్కి వెతకటానికి వెళ్ళి, దోవలో దోపిడిగాండ్రచేతిలో చిక్కుతాడు. దోపిడి దొంగలు “ఆఅంతర్వేదికరొను కొల్లగొట్టి నాశనంచేస్తారు.

కృపావతమ్మ భారతవర్ష స్వార్థత్యాగ సమితి స్థాపించి అందులో ఓబలేశుడినీ, మిత్రురాలు సునందనూ చేరమంటుంది. సునంద అన్న కేశవులు అవినీతి మనిషి. చివరికి దుర్మరణం పాలౌతాడు. కృపావతమ్మ బూదేవమ్మ అనే ఆమె తనబిడ్డను జగన్మోహిని అనే వేశ్యకు అమ్మిందని తెలుసుకుని, ఆ బిడ్డను పడుపు వృత్తిలోనుంచీ రక్షించ యత్నించింది. సునంద (ప్రేమించిన తన మేనమామ కొడుకు శ్యామ్‌ ఈ పని నెరవేరుస్తాడు.

కవికొండలవారి ఇనుప కోట గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి 1585

ముత్తి వెల్లినతర్వాత రంగడూ బూదేవమ్మా కలుసుకుని హైదరుజంగు మొదలైన దోపిడి దొంగలద్వారా రంగూన్‌ వెాళ్ళదలచుకుంటారు. కానీ బూదేవమ్మకు తన శిశువు దొరుకగానే ఆ పని విరమించుకుంటుంది.

దొంగలు తెచ్చిన బంగారు గొలుసును అమ్మటానికి హెదరుజంగు మేనకోడలు బయల్దేరి, దాన్ని సునందకు అమ్ముతుంది. కృపావతమ్మ సునంద మెడలో గొలుసు చూసి, గుర్తించి, దాన్నితన మేనత్త కిచ్చివెయ్యమంటుంది. సునంద అట్లాగే చేస్తుంది.

చివ్వరికి అందరూ సత్రంలో కలుసుకుంటారు. ముత్తి అనాథశరణాలయంవారు సాక్షి చూపితేనేగానీ బిడ్డ నివ్వమంటున్నారని విలపించి, బిడ్డ నిష్పించమని ప్రాధేయపడ్డది. కృపావతమ్మా ఓబలేశుడూ సరేనని ఆమె శిశువును ఇప్పిస్తారు. కేశవులు కృపావతమ్మకు లేఖా, పిస్తోలూ పంపిస్తే ఆమె వాటిని ఓబలేశుడిద్వారా తిరిగి పంపుతుంది. కేశవులు హత్యగావింపబడ్డాడని ఆలిసి, ఓబలేశుడిని అనుమానిస్తుంది. కానీ, అతనిద్వారా రామ్‌ అనే అతను కేశవులును తుపాకీతో కాల్చి చంపాడని తఆసుసుకుంటుంది.

తండ్రి పాలంవెల్లి పైకం వసూలుచేసుకుని, వైద్యకళాశాలలో జీతం కట్టమని పంపితే, ఓబలేశుడు ఈ తతంగం అంతా ఆడి, చివ్వరిరోజు వైద్య కళాశాలలో చేరబోతాడు. కృపావతమ్మకు ఏ కాలేజీలో చేరాలో తోచలేదు.

కథ టూకీగా అదీ. పన్నుగడ

పన్నుగడలో రచయిత చాతుర్యం ఎంతైనా కనుపిస్తున్నది. సెలవుల్లో గ్రామసేవ

  • ఇది కథాంకురం. దీనిలోనుంచే కథావస్తువు అంతా ఎదిగివొచ్చింది. పన్నుగడ అంటే కథాంతానికి దారిచూపే సంఘటనలక్రమం. ఈ నవలలో సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే కొంచెం గజిబిజి అందులో కనిపిస్తుంది. ఇందులో డిటెక్టివ్‌ కథల వాసన కొంచెం సోకుతుంది.

ఈ నవలలో ప్రకరణ విభజన బాగా ఉంది. కానీ, సంఘటలు ఒకటి తరువాత ఒకటి క్రమంగా రావటంలేదు. నవలలో సంఘటనలు వరసగా ఉండవలసిన

1586 పందిరి మల్లికార్జునరావు శతజయంతి "సంపుటము శీ; సాహిత్యము అవసరంలేదు. అయినా అలాగ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్కప్పుడు తొలి (ప్రకరణాల్లో సూచించిన ఒకానొక అంశానికి సంబంధించిన ప్రస్తావన సువివరంగా వెనక (పప్రకరణాలలో రావటం ఎంతో మనోహరంగా ఉంటుంది, అటువంటివి ఈ నవలలో చాలా చోట్ల ఉన్నాయి. ఇవి పఠిత బుద్ధిబలాన్నీ జ్ఞాపకశక్తిన, సమన్వయ శక్తినీ పరీక్షిస్తాయి. ఇది నవలా రచనలలో ఒక పాత అలవాటు అంటే సాహసంకాదు.

నేటి పఠితలకు సూటిగా, వరసగా, మరుగు లేకుండా భావాలు కావాలి. అయితే కవికొండలవారు ఈ విషయంలో ఎంత నేర్పుగా రాసారో చూడండి. ఏడవ [ప్రకరణంలో దేవర కులస్థుడు బిడ్డను విడిచి వెళ్లే దృశ్యం చిత్రించారు. పన్నెండవ ప్రకరణంలో మల్లీ అందుకొని ముత్తి _పేమరంగాన్ని పెళ్ళగించారు. రచయిత దీనివల్ల పఠితలో ఒక కౌతుకాన్నీ ఒక జిజ్ఞాసనూ కలిగించారు. ఆ దేవర కులస్థుడెవరా అని పఠిత ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఓడ కనిపిస్తుంది. ముసల్మాన్‌ కనిపిస్తాడు. ఇవి మళ్ళీ పఠిత మనసుకు ఆహారాన్ని ఇస్తాయి. రైలుబండిలో, జగన్మోహినీ, ముత్తీ ఇతర ప్రయాణీకులూ తమాషా భావాలతో కనిపిస్తారు. మళ్ళీ ముత్తి పాత కథకాస్తా బయటపడుతుంది. తరవాత శ్యామ్‌ రామ్‌ల వర్తనల అంతరార్థాలు పూర్తిగా చదివితేనేగానీ బోధపడవు. ఈ సంఘటనా చిత్రణలో రచయిత చాకచక్యం ఇంతా అంతాకాదు. ఇవి విజ్ఞులైన

చదువరుల మనసులకు ఆహారాన్ని ప్రసాదిస్తై. శైలి ఈ నవలలో కవికొండలవారి భాష (గాంధికం. భాష అక్కడక్కడా వింత మెరుపులు మెరిసింది. అక్కడక్కడా చక్కని ఛలోక్తులు కనిపిస్తాయి. అక్కడక్కడా బహు సందర్శ్భోచితమైన భాష కనబడుతుంది. కానీ, ఇంకా కొంచెం సరళంగా ఉన్నట్లయితే, భాష మరీ రాణించేది. క్లుప్తతా, సహజతా స్ఫుటంగా కనిపిస్తున్నాయి. వర్ణనలలో సహజతకు ఒక ఉదాహరణం: “గాలి వీచుటనుబట్టి పడవవాడు పడవను “వేరువాోమీదనే ప్రప్పుచుండెసు. అత “డనరముూ” వైపు “మడ్డు అెడ్డును" పట్టుకొని కూరుచుండెను.”

ఈ వర్ణనలో పడవవానికి సన్నిహితమైన పదాలన్నీ గుప్పించబడ్డాయి. రచయిత ఎన్నాళ్లు ఈ భాష విని, ఎన్నిసార్లు మనసులో అనుకొని మననం చేసుకున్నారో?

కవికొండలవారి ఇనుప కోట గుంటువల్లి రాధాళ్ళష్ణమూర్తి 1587 శీలచిత్రణ, సంభాషణలు

శీల చిత్రణలో గొప్ప ప్రత్యేకత లేకపోయినప్పటికీ, కృపావతమ్మశీలం పేర్కొన తగ్గదే. ఓబలేశుడూ తదితర పాత్రలూ కేవలం నామమాత్రంగా వస్తారు. వారికి ఒక ప్రత్యేకత, ఒక కొత్తదనమూ లేవు. ఈ నవలలో ఏ శీలానికీ పరిపూర్ణత లభించలేదు. కృపావతమ్మ శీలానికికూడా కావలసిన సమ(గ్రతలేదు. మామూలు మనుషుల్లో ఉండే వివిధ భావాలూ రచయిత సృష్టించిన వ్యక్తులకూ ఉండాలి. అవి లేకపోతే మనిషి బతుకుకు సార్థకం ఏముంది? కృపావతమ్మ స్థానంలో ఉండే ప్రతి స్త్రీ ఓబలేశుణ్ణి (ప్రేమించి తీరుతుంది. ఆరాధిస్తుంది. అందుకుగాను ఓబలేశుణ్ణే ఒక ఆరాధించతగ్గ మూర్తిగా తయారుచెయ్యాలి.

సాధారణంగా ఇతర పాత్రలందరూ ఉన్నామంటే ఉన్నామనేగానీ, వారి వ్యక్తిత్వాన్ని మనసుల్లో నాటలేరు. కొంతకుకొంత జమీందారు శీలమూ, సునంద శీలమూ మెరుగుగానే ఉన్నాయి. కేశవులు శీలం మనసులో చక్కగా స్ఫురిస్తుంది. కానీ, రచయిత అతనిలో మరికొంత శ్రద్ధవహిస్తే బాగుండేది.

సంభాషణలు (గగాంథికంలో ఉన్నా, ఒక్కొక్కచోట మెరుపు తీవెల్లా మెరుస్తున్నాయి. కొన్ని చోట్ల పపసాదమైన హాస్యం ఇమిడి ఉంది. సరసమైన లోకోక్తులు అక్కడక్కడా తళుక్కుమంటుంటాయి. సంభాషణలు సహజంగా ఉంటాయనటానికి దీన్ని చూడండి:

“పెయుడేర్పడియుండు టేమిటి? విద్యుత్తేజము స్యురించునట్లు స్పురించవలెనుగాని అని అన్నతరువాత జమీందారు.

“ఓ కాయలంగారా? తాయలంగారి పేరెత్తుసరికి ఓ తాయలంగారితో మాటలాడరట?” అని అంటే,

“మామోయ్‌...ఈపెని నా మాటెత్తితివా చూసుకో?” అన్నది. ఇంకొక ఉదాహరణ:

కాలేజీ విద్యార్థులూ, విద్యార్థినులూ [గామోద్ధరణ దీక్షతో వస్తే నలుగురూ మూగి ఇలా అన్నారు.

“అమ్మాయిగారూ మా ఊరి కోనేరు లోతు చేయించెదరా?

“మా గామమం దొక బంతియాట నాడించెదరా?

ఇది సహజం. ఎవరి ఊరిని గురించి వారు “మాకివి చేస్తారా? అవి చేస్తారా? అని అడగరూ?

1588 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మరొకటి; ముత్తి శిశువును విడిచి వెల్లింది. దేవర కులజుడు కూడా బిడ్డను వదిలి వెళ్లుతుంటే “దేవరకులజుడా! ఈ బిడ్డడు నీ బిడ్డడు కాడందువాళో అని కృపావతమ్మ అడిగింది. 'దేవరకులజుడు *నా కొక్కనికే పుట్టలేదు! అంటే మన కందరికీ నవ్వు రాకమానదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తానికి “ఇనుపకోట” ఒక మంచి నవల. కథావస్తువూ, కథన పద్ధతీ, నవల శెలీ నేటి పాఠకుడికి పాతవిగా కనబడతాయి. అయినప్పటికీ “ఇనుపకోటొ అందరూ చదివి ఆనందించతగ్గది. కవికొండలవారి రచనారీతులు తెలుసుకోటానికి ఇదొక ముఖ్యమైన నవల, (కిన్నెర: సంప్పుటము శ4ీ, సంచిక 8, ఆగస్టు శే౦వ2ై) రవమరు శ ఫు ర ఫగంంయే శ్వ 4 (ము కు వ్ర గ్ర శాశ/'కీ యయా ప్ప జల

శ్రీ కవికొండల కవి కవితాశ్రీ, జమ్ములమడక మాధవరాయ శర్మ కొ౦డకొలను వికసితోత్సల కవి శ్రీ కవికొండల వేంకటరావు కవితను కవితా భావక హృదయముతో భావించి నిరూపించాలని నాకుగా నేను ఉత్సాహము కలవాడనయినాను. అయితే ఆ కవివల జిగిబిగి కల జిలుగు అలుగు వెలుగు పలుకు పలుకగలనా? ఏమయినా నా రీతిలో నా గీతిలో నా గతిలో నా భావన వఎలయించాలని ఉంది.

కవికొండల యింటిపేరు. వేంకటరావు వ్య క్తిపేరు. వేంకటరావు కవి. కవి బిరుదనామము. వేంకటరావు గద్య పద్య కవితలు గేయ పాఠ్య కవితలు చాలాకాలమునుంచీ పటత్రికాభూషలయినవి. అప్పటప్పట ముక్కలుగా ముక్కలుగా వానిని లోకము భావించింది. ఖండము లన్నిటినీ కూర్చుకొని సమకాలంలో సంభావించి ఆస్వాదించే సౌకర్యము అందరకూ కలిగి ఉండకపోపచ్చు. అఖండాస్వాదము ఉంటేనే కాని అంతర్నిహితమైన అంతర్వాణి ప్రజ్ఞ అవగతం కాదు.

(గథనం పొందిన కవికొండల కృతులు “సుషునోవ్లాదని” శీర్ణచిహ్నాంతో ఉంటై. సహృదయాహ్లాద విధానం దీనిలో ఉంటుందన్నమాట. సుమనోహ్లాదిని పదానికి “కొండకొలకు వికసితోత్పల” విశేషణం ఉన్నది. ఇది సాభ్మిపాయ పదమై ఉండాలి. కవికొండల [గ్రంథాల ముఖదృశ్యం చూస్తే ఒకవిధంగా కొండకొలకు వికసితోత్పల పందిరి మల్రికార్జునరాప్పు శతజయంతి. సంప్పుటము. 4: సాహిత్యము

1590 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కవి భావ సాహిత్యం కొంత గోచరంకావచ్చు. పెన మెఘమేదురమయిన ఒక మహాకాశం ఉంది. ఉదయించిన సూర్యాలోకం ఆకాశాన వ్యాప్తమయింది కాని సూర్యుడు కనపడడంలేదు. కొన్ని నీలమేఘాలు చిత్రంగా అడ్డు ఉన్నవి. దిగువ భూమిపై నున్నగా తిన్నగా ఒక కొండ ఉంది. కొండ (ప్రక్క ఒక కొలను ఉంది. కొలనులో వికసితమయిన ఉత్పలం ఉంది. ఆ సరోనీరం మలుపు తిరిగి ఉత్పలం పక్కగా మెలిక తిరిగి ఉంది. ఇది కొండకొలను వికసితోత్చల రీతి. ఈ రీతికి పెనున్న మేఘావృతాకాశానికి సంబంధంకూడా గోచరిస్తుంది. పై నున్న ఆకాశము తన మేఘాలతో భూమికై ముద్రితమయితే ఏర్పడే రీతి ఈ రీతి ఒక విధంగానే ఉంటుంది. ఆకాశము అందనిది. భూమి అందునది. అందని ఆకాశమును కవికొండల భువికి అవతరింపజేసి అందిస్తున్నారు. కవికొండల కవి. కవి కవికొండల రసమయంగా భావాంబరమును అందిస్తున్నాడు. తన హృదయాన్ని ఒక ఉత్పలంగా చేసికొని వేంకటరావు ఒక అనుభూతిని అందిస్తున్నారు.

కవిగా వెంకటరావు అనుభవించిందేమిటి? ఇది అజ్జేయంకాదు. హార్దంగా భావనీయము. కవుల భావాంబరాలలో అందరానివిగా గోచరించే భావాలు పరిసర (ప్రజకు అందడంలేదు. అందించడానికి వారి యత్నాలున్నూ సఫలంగా ఉండడంలేదు. అవి ఆ విధంగా ఉన్నా పరిసర (ప్రజకు ఇంకా ఏదయినా కావాలి. ఆ కావలసినది కవిభావనాభావం కంటె అన్యం కానక్కరలేదు. అదే రూపాంతరంలో వస్తే చాలు. కొండను ఆధారంగా చేసికొని కొలను ఉన్నట్లుగా కవిని ఆధారంగా చేసికుని కావ్యం ఉంటుంది. ఉత్పలం ఉంటే సరస్సుకు సౌందర్యం వస్తుంది. ఏదో హృదయ వికాసకమయిన బోధ ఉంటే కావ్యం కమనీయం అవుతుంది. ఈ విధముగా తన కవితలో ఒక ప్రతీతవాదమును కవికొండల అనుసరించారనిపిస్తున్నది. పట్టణం వాతావరణానికి రోతపడి దూరంగా నదీతీరానికి చేరి ఆ దరినే కొండను చూస్తూ వునఃపథకంలో ఒక ఖావపథమును నిర్మించుకొన డానికి రాజమహేంద్రవరంలో వెంకటరావు అలవాటు పడి ఉంటారు. దానిని చిక్కబట్టి హృదయాన ముద్రించుకొని కవికొండల కొండకొలకు వికసితోత్పల కవి అయినాడని భావించుచున్నాను.

ఒకచోట కథలో, కొండకొలకు భావమును కవికొండల గుర్తింపచేయడానికి యత్నించారని భావిస్తున్నాను. “కాసవరపు చెరువులో కోరుకొండ నరసింహస్వామి

శ్రీ కవికొండల కవి కవితాశ్రీ జమ్యులమడక మౌధవరాయ శర్ళు 1591 నీటినీడలు” కవికి బాగా పరిచితములయినై. “కోరుకొండ కొండుండడంబట్టి ఆ కొండ వెనకాలి తడిసిపోకుండా పొడిపొడిగా సూర్యు డుదయిస్తున్నాడు. కోరుకొండ కొండయుక్క నీట్‌నీడసంతనూ నా వశం చేసికొని నిత్తెమూ తరించి ఆ కొండను మెట్లు లేని పక్కనుండి మై కెక్కి తచ్చిఖరాగ్రంనుండి నిర్మలమగు నీరాన్నే సూర్యాస్తమయకాంతులు కరిగిపోవుట తిలకిస్తూ ఒడలు పులకెత్త తియతియ భావాలకు” వెంకటరావు వివశులయినారు. చేపలవాడు “ఈ చెర్లో నే నెప్పుడూ చేపలట్ట” నన్నాడుట, అది కవికొండలకు పాఠమయింది. స్ఫురణ కలిగింది. కొండమైని దేవుని నీడలు నీటిలో చూచి బెస్త పరవశుడయితే మహాజగత్తులో సర్వేశ్వర ప్రతిబింబం చూచి తమకుతాము వెంకటరావు కవి అయినారు. దారి కన్పించింది. అది ఎగుడుదిగుడు. కాని ఆది తన సాంతదారి. తాను చేసికొనిపాయ్యే దారి. “నేను లోకమును జయించాను. కోరికలను జయించాను” అని కవికొండల తనలో ఆనందం మెరిసేటప్పటికి ఉప్పొాంగిపోయినాడు. కొండకొలకు చూడగా వెంకటరావు హృదయపద్మం౦ వికసెంచింది. కవి అయినాడు. ఇది కొండకొలకు వికసెతోత్పల కవి కవికొండల వెంకటరావు భావస్పందము. ఇతరుల మాటల రోరణి వేరు. వెంకటరావు మాటల తీరు వేరు. ఈనాడు రహస్యవాదమని, ఛాయావాదమని, (ప్రతీకవాదమని కవితలలో వచ్చిన భేదాలు ముప్పేటగా వీరిలో కనిపెస్తవి. ఒక విజాతీయ స్పురణం అందుకొని భావాన్ని స్పందింపచేసికొని ఒక తత్వమును ఆవిష్కరింపజేయడము ఒక విలాసమును ముదడించడము కవికొండల కవితాతత్వసారము. ఏనాటి కానాడు కవికొండల కేదయినా కొంగొత్త. దానిలోని నిసర్గస్ఫృప్టు దుగ్ధము. ఏరోజు కారోజు నవనవలాడుతూండే భావనవనీతాన్ని చలికిస్తూంటుంది. ఈ భాపం వొంకటరావుకు అతిమాత్రమై మతి మురిపిస్తుంది. మతి మరపిస్తుంది. “కళ మూటగడితే ఉండదు. తుడిస్తేనే ఉంటుంది” అంటాడు వెంకటరావు. రహస్యవాదం ఛాయావాదాలకు సంబంధించిన కవితారచనలు కొందరకు సరిగా అర్థంకావడంలేదు. “ఎవరికయినా అర్థంతెలుసుకోవాలని ఉంటే ఆ ధ్వనిలోకాడు. ఆ ధ్వని వింటూ నేను పొందిన నా ఆనందంలో అర్థం వెతుక్కోండి” అని కవికొండల చెపుతారు. “ధ్వనిలో అర్హంకోసం తంటాలు పడకండి” అని హాచ్చరిస్తారు. చిన్నప్పుడు అర్థం లేకుండా చేసిన చేతిచప్పుళ్తులాంటిదే ఎప్పుడూ చేస్తారు. పెద్దదగినాక పెద్ద పెద్ద సంగతుల్లో పడారనుకోనక్కరలేడు. జీవితంలో అల్లాంటిది ఉండదు. “నా వ్రాతనూ నన్నూ వేరుచేయకండి! వ్రాస్తూన్నప్పుడు నా చేతివ్రాలు ఎలా వెడుతూ నాకు చిదానండం

1592 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కలిగిస్తుంటుందో ఆ పరిపూర్ణస్వభావాన్ని గమనించండి" అని వెంకటరావు అంటారు. కవి వెంకటరావు స్వాంతస్ప్సుఖానికి వాస్తాడుకాని సమాజహితానికి [వాయడా? కవికొండల రచనలు చూస్తే ఈ భావం కలుగదు. “ముష్టికోసం డప్పు ఎంత బాగా వాయించినా ముష్టికోసం" అన్న ఒకానొక తీసికట్టు అందులో ఉంటుంది. ముష్టికి నష్టికి కాకుండా జబ్బ పుష్టికొద్దీ డప్పు వాయించి ఊరందరినీ హడలగొట్టడమును వెంకటరావు అభినందించరు. ఆకాశాన్నుంచి వానచినుకులు విడివిడిగా వేనవేలు పడడ మెందుకు? ఏనుగు తొండంలాగ ఏకధారగాపడకూడదా? భూమి పగుళ్ళలో వేచియుండే పచ్చికవిత్తులు వేలకు వేలు విడివిడిగా ఉన్నప్పుడు అన్నింటికీ అన్ని చినుకులూ కురిసి అన్నింటినీ తనియించి అన్నింటినీ ఫలోన్ముఖముగా చేసి అన్నింటికీ ముక్తి కూరుద్దామనే ఊహకొద్దీ అన్ని చిన్న చిన్న చినుకులు విడివిడిగా పడుతూఉంటాయి. కవితారచనలుకూడా ఇట్లాగే ఉండాలి అని వీరి భావం.

శ్రీ వెంకటరావు వేంగిమండల౦లో పామర(ప్రకృతులలో పాతుకొని ఉన్న పలుకు తీరు బాగా పట్టుపట్టి స్వీకరించారు. వారి విశిష్టతలు (ప్రాజ్ఞ్జులమని అనుకునేవారి కందాలి. అప్పుుడుగాని సామరస్యం రాదు. ప్రకృత్యుపాసకుని దృష్టితో చూడడం కవికొండల అలవరచుకొన్నారు. అప్పుడుగాని కవిత సరిగా రాదని అంటారు. “కమ్మని పాలుగాయగను కమ్మని మీగడ దేరునట్లు, వాక్యమ్ములు సెప్పుకొని హృదికర్టము చప్పనిదైన వాని వాక్యమ్ములునున్‌ సుబోధలగు" “కవనము ధారగా వరుసగా తనయంతన రావలగాని యొక్కచోట విసుగుచేత గూరుచుని ఠావుపయిన్‌ గలముంచి యూహకై మివుల చదల్‌ బయల్‌ నెమకి మేదరి బుట్టల నల్లునట్లుగా చవులకొజన్‌ రచించుటలు సంతనయా?” అని కవి కొండల అంటారు. “ఫిచ్చెత్తిన నరు నుడువుల పచ్చిబూతులాడు వాని పలుకులలోనన్‌ అచ్చులు హల్లులు వినబడు అచ్చపు భావములు కొదువ అంతే సభలో” అని పలికే కవికొండలకు ఒక కవితానిశ్చయం ఉన్నది. “నే ననుకొంటూ వాస్తున్నా, వ్రాస్తూనే ననుకొన్నా. కలంచివర కాస్త సిరా, చేర్చుక్కై యాగిపోవు, అక్షరాలు సరిగా రావు. కలం చివర కాస్త సిరా బుడబుడ పార్లెత్తితే, ఏదో ఊహ, ఏదో కోరిక, వచ్చేవచ్చే ధారను భావంబులు తరిమి వేస్తయి. కలం చివర కాస్త సిరా, త్రుల్లి చింది పరువుళ్ళయితే, ఆర్జ్రస్మరణ, గాఢస్సురణ, రాగసుదీప్తి, నిత్యసుషుప్తి సరిగా వస్తుందిొ = ఈవిధంగా కవితాసృృష్టికి కవికొండల కవి యత్నిస్తారు. కవికొండల

శ్రీ కవికొండల కవి కవితాశ్తీ జమ్యులమడక మాధవరాయ శర్మ 1593 గద్యరచన అక్కడక్కడ పద్యపు ఛాయలతో కనపడుతుంది. దీనినే సంస్కృతజ్జులు “వృత్తగంథి గద్యము” అన్నారు. బాగా భావించి భావించి భావవస్తువునుండి భావాన్నిపట్టి భావకుడయిన వెంకటరావు రచనలు సాగించాడు. ప్రాకృతికశోభతో ఉండే సర్వవిషయాలనూ కవి మృదులంగా భావించినట్లు తోస్తుంది. “నావ్నపె పిల్లో అనే గీతంలో; “కళ్ళల్లో ముద్దెట్టుతూ - తెల్లారనీ నంటదీ, ఆెల్లారిపోతుంటె తా - నెల్లాగో అయిపోతదీ ఒక్కళ్ళ మైయున్ననూ - నక్కి తా నలుసౌతదీ" అని పాట పాడిన కవికొండల భావనాచాతుర్యంలో భావ చాతుర్యం ప్రసన్నగంభీరంగా ఉందంటాను. వీనిని చూచి వాయకపోయినా ఎంకిపాటల్లో ఈ ఛాయ లున్నవి. పామరప్రకృతుల మధుర పణయరీతులను కోమలంగా చాలచోట్ల కవి నిరూపించాడు. గీతికారచనలలో కవికొండలకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా పల్లెనాడులలో ఈయన సంచరించి ఉండాలి. చాలా జానపద గీతాలను కవి రూపం కట్టి నిరూపించాడు. పల్లెకారులకు రాగంతో భావం వస్తుంది. భావంతో రాగం వస్తుంది. కవికొండల గీతాలు భావరాగాలతో రాగభావాలతో ఉన్నవి. “జుము జుము తుమ్మెద గీతం కమ్మగా పాడగలిగిన కొమ్మ కోమల కంఠంలో నుంచి వినాలి. కొన్ని గీతాలలో ఊపు ఉంది. శ్రీరంగం శ్రీనివాసరావు చూపిన గీతికాగమనాలు అక్కడక్కడా ఉన్నవి. ఈ గీతాలు పుట్టిననాటికి శ్రీశ్రీ కలం పట్టినాడో లెదో? నే సనుకొంటూ వ్రాస్తున్నా వాస్తూ నే ననుకొన్నా ఎదియో కింపురుషాంగన ఎదియో కిన్నెర కన్నియ ఎది యో గంధర్వ స్తం ఎదియో యచ్చరలేమ ఇటువంటివి కొన్ని ఉన్నవి. అయితే విషయం వేరు. ఒక చోట (ప్రగతి ఉంది. జీవిత గమనాన్ని వేగపరచడానికి వీరత, శూరత, ధీరత అక్కడ ఉన్నవి. కవికొండల టప్రగతివాది కాడు. ఒకరకంగా ప్రాచీన వ్యవస్థకు ప్రత్మికియావాది. ఆజే కవికొలండల రచనలలో అంతటా కనిపిస్తుంది. “నే ననుభవించి వేస్తున్నా లోకంలో సౌందర్యం, లోకంలో ఆనందం, లోకంలో గానరసం, నే ననుభవించివేస్తున్నా అనే అనుభవంతో కవికొండల రచన చేస్తాడు. ప్రతి

1594 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము క్రియామార్గం భావించినవాడయినా అదీ విప్లవాత్మకంగా ఉండాలని తలచడు. “కల్రిసిపోనీయ్‌ నా పాట నీ పాట, కలిసిపోనీయ్‌ నాకు గొప్పా వద్దు, నీకు మెప్పూ వద్దు కలిసిపోనీయ్‌, నా పాట నీ పాట కలిసిపోనీయ్‌,” ఇదీ వరస, తాను అవిరళంగా గీతికలు ఆలాపిస్తాడు.

“కూర్చున్న పాటొస్తే

నించున్న పాటొస్తే

నడుస్తున్న పాటొస్తే

నేనేమి చేసేది .

నిశ్శబ్దంగా -

నిశ్శబ్దంగా

పాటమ్మా !రాకమ్మా!

పాటమ్మా!వద్దమ్మా!

పాటమ్మా!మానమ్మా!

అంటూను. వింటాను.

పాడేది ఎవరంటే

.... వీవేను నీ హృదయం

నీవేను నీ మనసు

నీవేను నీ వాక్కు

అంటూంటే ఏమంటా?”

కవికొండల ఏమనగలడు? మంచి పాట ఆలాపిస్తాడు. “నా మంచి పాట నాలో నేనే పాడుకొంటాను. నే ఫైకి పాడే పాట యొల్లా రెండోరకమేను." అయినా మొదట అన్నట్లుగా మొదట్లోని మూలార్థమే గుర్తించాలి. “పియుడేమో పాడ్డ్తుంటే వద్దను వారున్నారా? హద్దిడువారున్నారా? సద్దనువారున్నారా? “నా పాట మల్లే నువ్వు, నా పాట మంచిగంధం. నా పాట యెవరికోయి! నా పాట యెవరికోయి?” అని కూడా ఒకచోట కవికొండల కవి అన్నారు. కాని వీరి హృదయం *“నవనవలాడే తీగెలకంటె, నవనవలాడె హృదయ” మన్నమాట సత్యము.

శ్రీ కవికొండల కవి కవితాశ్రీ జమ్ములమడక మాధవరాయ శర 1595

సమిష్టిగా కవికొండల వేంకటరావుగారి రచనాపర్యాలోచనం చేస్తే, సమీక్షా సంయుతమయిన ప్రాచీనతాభిమానం కనపడుతుంది. అందంగా ఆధునాతనమును అనుసరించడమును అభిమానించేట్టు లేదు. స్వాత్మవికాసంతో పరిసరసమాజ హెతసంధానం చేస్తూ కోమలంగా (పకృత్యుపాసనతో జీవనం సాగిస్తూ హృదయ పద్మానికి తగిన వికాసం సంపాదించాలని కవికొండల భావిస్తారు. ఈ లక్ష్యంతో స్వాత్మసాధన ధన్యాత్వమును సంభావింపగలుగుతూ ఉన్న శ్రీ కవికొండల వెంకటరావు కవితాశ్రీలను అభినందిస్తున్నాను. ప్రాఢంగా పాఠ్య కవితలు నిర్వహించగలిగిన (ప్రజ్ఞావిశీేషం ఉండిన్నీ గేయాత్మకమైన కోమల పదవిన్యాసంతో ఇంతవరకు ప్రసిద్ధి సంపాదించిన శ్రీ వెంకటరావు ప్రాథవయఃపరిపాకంలో ప్రొఢ కవిత్వ పటుత్వం వెలయింప చేస్తారని సహృదయలోకం ఆశింపవచ్చు. కవికొండలనుండి ఇంకా సృష్టిని ఆశించే హక్కు లోకానికి ఉంది. ఇంతదాకా కొండ కొలకులు చూస్తే సూర్యుడు కొండ అవతలనే ఉన్నట్లనిపిస్తుంది. ఆ సూర్యు డిక మైకి వచ్చి తన కరప్రసారం చేయాలి. కొలను జీవనంలో ప్రతిబించించాలి. ఉత్పలమును ఇంకా వికసితం చేయాలని లోకం కాంక్షించడం సహజం.

“దీకటులు నాతోడి చెలిమిగన్నప్పుడు

ఆకారమె మజచి అడిగాను దారి

వయసులో కూడా రహస్సు నాకుంది

నీ కొత్త నీటితో నృత్యమాడేను" (కిన్నెర: సంపుటము 4, సంచిక 9, సెప్టెంబరు కే952)

వు గిం ల యం ధంలీ ట్రై న.

కాళిదాసు: కావ్య శిల్పము ఇంద్రగంటి హనుమచ్చాస్తి?

ఉజ్వల హిమ శిఖరము, ఉపనిషద్దానము, అజంతా మహా శిల్పము - వీని యెదుట నిలిచినపు జెట్టి భావ విజ్బంభణము, ఆనందోన్మీలనము కలుగునో అట్టి అనుభూతియే కాళిదాసమహాకవి కావ్య(శేణిని దర్శించినపుడును గలుగును.

మహా సామాజ్యములు రావచ్చును; పోవచ్చును. సింహాసనములు, (పప్రాబల్యములు కాలవాహినిలో నువ్వెత్తుగ నామరూపములు లేకుండ. గొట్టుకొని పోవచ్చును. కాని ఈ భారత మహాసంపదకు మాత్రము చావులేదు. ఇది యజరామరము; అవికల్చ్పము. శక్తికొలంది సమీపించి సేవించినవారికి నర్హతకు6 దగినంత యమృతమును బంచిపెట్టుచునేయుండును.

మహాకవి కావ్య(గేణి స్వచ్చభారతమానసములో వికసించిన దివ్య పద్మము. మహోన్నత హిమశృంగమున నెగురు రసజ్జతా పతాక. గొంతు జీరలేక యుగయుగాలుగా వినంబడు నఖండకల్యాణ గానము.

ఒక దివ్య కళావిభూతి చెంత నిలిచినపుడు హృదయపుటంచుల నొరసికొని యొరసికొని తొలుదొల్త నానంద మొకటే పొంగిపోవును గాని కార్యకారణములు,

| హేతువాదములు నిలువందొక్కుకొననేరవు. ఈ యనుభూతి మొగముమొత్తు

చిక్కని తీయందనము వంటిది. కనుల మిజుమిట్లు గొలుపు నద్భుత తేజస్సందర్శనము వంటిది. .

కాళిదాసు; కావ్య శిల్పము ఇంద్రగంటి హనుమచ్చాస్తి? 1597 జర్మను కవి 'గెధీ యిట్లనినాడు:

“ఓహో; నీవు వాసంత పుష్ప(శేణివియు, తజ్జన్యమైన ఫలసంపదవునా?

= ఆత్మను ముగ్గముసు, తన్మయమును, సంతృపష్తమును చేసివేయు సర్వశక్తివా? మర్త్య: స్వర్గము లొక్కటిగాంగలిసిన మధుర నామధేయమవా?

నిన్ను నేను “శకుంతలా!” అనిమాత్రమందును. ఇక 'నేమియుంజప్పును”

లాసన్‌ మహాశయుని మాటలివి:

“భారత కవితాకాశమున వెలిగిపోవునొక దీప్తనక్ష (తమది.”

వెదేశిక సాహిత్యశీలుర యనుభూతి యిది.

భారతీయ సాహిత్యవేత్తలును నిట్లనిరి.

  1. *త్రేనె లొలుకు పూలగుత్తులందును, కాళిదాస సూక్తులందును బ్రీతికలుగని వా డెవ్వడు?” అనం భట్టారకుడును, 2 “కవికుల గురువు కాళిదాసు కవితాకన్య విలాసమే” అని జయదేపుడును. (బస్తుతించిరి.

తొలుతటి ఆనందపు పొంగు ఇంచుక శాంతించిన మీందట మనకుంగలిగిన ఈ దివ్యానుభూతికె ఆధారములైన కారణములేవి? అను బలమైన మీమాంస మనసునం బొడమి యన్వేషణ మారంభించును. సంగీతమైనచో, భావరాగముల చక్కని సమ్మేళనమా? తాళగతుల యావృత్తుల పొంకమా? అపూర్వ కంఠ మాధుర్యమా? అనియు,

చిత రచనమైనచో, రేభాసొందర్యమా? వర్ణసమీకరణ సామంజస్యమా? అద్వితీయ మూర్తికల్పనమా? అనియు6 జర్చించి సంస్కారము కొలంది, రసజ్ఞత కొలంది విలువలు కట్టుదుము. అట్లే ఒక గొప్ప కవిత్వము నాస్వాదించునపుడు దీని ఘనత దేనిపై నాధారపడియున్నది అని మీమాంసింపక మానము. అట్టి సవిమర్శకమైన యాస్వాదనముసందే యా కవి కవితాఘనత చరితార్థ మగునుగాని యొకటి రెండు ప్రశంసావాక్యాలతో సంపూర్ణముకాదు.

  1. నిరతాసు సదాకన్యు కాలిదాసన్య సూక్తిను (ప్రతిర్మధురసార్త్రేషు మంజరీష్వివ జాయతే.
  2. కవికులగురుః కాల్‌డాసో విలాసం.

1598 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

వన యాలంకారికులు ప్రసక్తి వచ్చినపుడు కాళిదాస కవితలోని రసభావములను, ధ్వనివిశేషములను, జొచితీసారమును, ఆనుషంగికముగ వ్యాఖ్యానించుచు “విచిత కవి పరంపరతో సాగిపోవు నీ కావ్య సంసారమున కాళిదాసు మున్నగువారు ఇద్దరు ముగ్గురో, ఐదారుగురో మహాకవులని లక్కకువత్తురు” అని సాహితీ (ప్రపంచమున కాళిదాస విశిష్టతను నిరూపించిరి.

విశ్వకవి రవీంద్రుండు తన శాకుంతల పీరికలో గెథీ కవి ప్రశంసలోని మూడవ వాక్యమునకు రమణీయ భాష్యము చేసి అది యెట్లు పుడమికిని స్వర్గమునకు ముడియయ్యునో వ్యాఖ్యానించెను.

ఒక మహా శిల్పమును సందర్శింతుము. దాని భంగిమమునొకరు ప్రశంసింతురు. వేరొకరు హస్తమ్ముదలను, మజియొకరు అంగసౌష్టవమును, ఇంకొకరు భావ విస్ఫూర్తిని నద్భుతముగా6 గొనియాడుదురు. నిజమున కది యంత సర్వాంగ సుందరమైన యుత్కృష్ట శిల్చమే కావచ్చును. కాని యా శిల్పపు నిండురూపము గాని, దాని వెనుక మహాశిల్చి నిల్చిన యఖండ కళాహృదయము గాని ఈ ఖండ (ప్రశంసలవలన మనకు గోచరింపక సమగ శిల్పము నవగత మొనర్చుకొన్న సంతృప్తి గలుగదు. అట్లే మహాకవి రచనలోని యేకదేశమైన యే భావమునో, పద్యమునో, రస సన్నివేశమునో యభినందించినంత మాత్రమున నాతని యఖండ కవితా లక్ష్యము, కావ్యాదర్శము, ఆనంతశిల్చ విశేషము మనకుం (బత్యక్షమగుటలేదు. కనుక నొక సమగ దృష్టితో నాతని రచనముల నవలోకించి. యతడు సృష్టించిన కావ్య ప్రపంచంలోని ప్రతిభా విశేషముల నంతయేని వ్యాఖ్యానించవలసి యున్నది.

మహాకవి శాకుంతలాది దృశ్యకావ్యములను గూర్చి పలువురు సాహితీవ్రతులు పలు విమర్శనముల సడుపుచునేవచ్చిరి. కాని శ్రవ్య కావ్యములను మాత్రముతరచి చూచి చెప్పవలసినంత చెప్పినట్టు కాన్పింపదు. కొందరు కొన్ని విషయములు స్పృశించిరి. కాని యతని కావ్యలక్ష్యములను గూర్చి యింకను నెన్నియేని సమీక్షలు రావలసియున్నవి.

ఆతని కావ్యములను సమగ్రదృష్టితో సమీక్షింపందలంచి నపుడు అతండు జీవించిన కాలవిశేషములు, నాటి భారతదేశవైఖరి, ప్రజాజీవనధోరణి, ఆదర్శములు, సిద్ధాంతములు, అభిరుచులు మున్నగువానిని నిశీతముగం బరిశీలించింగాని యాతని హృదయ దర్శనము సాధ్యముకాదు.

కాళిదాసు: కావ్య శిల్పము. ఇంద్రగంటి హనుమచ్చాస్త్ర) 1599 వెదిక పురాణ యుగములు కడచినవి. వేదప్రతిపాదితాంశములతో6 గావ్యరూపముగ, సుహృత్సమ్మితముగ శ్రీమద్రామాయణ, మహాభారతము లుద్భవిల్లినవి. భారతదేశము వీనివలన6 బొందందగిన జ్ఞానానందముల సంపూర్ణవఎగ నందుకొన్నది. కాని యివి కేవల కావ్యవటలే కావు. ధర్మపతిపాదకములును, ఐతిహాసికములును, పారమార్థికములునై అత్యంతము విస్తరించుకొనిపోయినవి. ఉజ్జ్వల ప్యాతనిర్మాణము, క్లుప్త కథాకథనకాశలము, శబ్ద భావశిల్పములతో6 గూడిన యచ్చపు. గావ్యముల్నపై6 గాంక్షకలిగినది. అప్పుడు కాళిదాసమహాకవి సంస్కృత సాహిత్య సుకృతపరీపాకముచే మహెందవ కీర్తి వైజయంతికవలె నుద్భవించినాండు. హెమవద్వింధ్యపర్వతములవంటి రామాయణ, భారతహృదయములనుండి యొక దివ్యరసవాహిని పుట్టి విద్వల్లోకమును బహర్హమున ముంచివైచినది. అదియ కాళిదాస కావ్యశేణి! అతడు జీవించిన సువర్జ్ణయుగము వ్మికవుశకము. ఆభారతీయు మహాపురుషునిపేరిటం గాలమును గొలుచు నవసర మింకను రాలేదు. పరప్రభావముల తొక్కిడికి మహోందవ సంస్కృతి: ఆచారాదర్శములు, సాహితీప్రమయము నలిసలి కాలేదు. భారతజాతి నిండుజీవములతోం గలకలలాడుచు వర్థిల్లుచున్న కాలమది. బౌద్ధ పైనమత ప్రభావము లొకప్రక్క కొదిగిపోయినవి. ఆర్యనాగరికత, ఆర్షభావగంధము అవ్యాహతముగ దేశమునం దమ పలుకుబడిని6 జల్లించుకొనుచున్నవి. మహరాజసితాతపత్త్రృచ్చాయలను (ప్రజలు సుఖించుచు భోగభాగ్యముల నోలలాడు చుండిరి. వారినిం గలపర పజచు కరినజీవన సమస్యలు లేవు. శైశవమున విద్యాభ్యాసము, యౌవనమున విషయోపభోగము, వార్ధక్యమున మునివృత్తి - వీని నవలంచించి యాచరించు పాలకులు ప్రజలకు లక్ష్యభూతులుగ నుండిరి. ఇట్టి సుభిక్షకాలమున జీవించిన మహాకవి, ధర్మార్థకామమోక్షములను పురుషార్ధ్థముల నిండుహృదయముతో నారాధించి వాని సతృ్ఫలితముల సంపూర్ణముగ ననుభవించిన జాతియౌన్నత్యమును (ప్రజ్జ్ఞతో6 జిత్రించిచూపుటయే తన కావ్యలక్ష్యముగా నెంచినట్లు కాన్పించును. అంతవరకు లోకమునం (బ్రవేశము సంపాదించిన యనార్దమత చబ్భాయల పట్టుపవదలించి ఆర్హజ్ఞాన తేజమును

1600 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కమనీయకావ్యరూపమున లోకమున వెలయించు తలంపు నిశితవ్యంగ్య మై స్ఫురించును.

మానవ జీవితమునందలి యన్నివైపుల సూక్ష్మసందేశములు, సౌందర్య రహస్యములు ఈతనికి (ప్రత్యక్ష మైనవి. సృష్టి తన యనంతలీలావిశేషముల చిత్రవర్ణ మయూరపింఛమువలె నీయన యొదుట విప్పి సాక్షాత్కరించినది.

ఇట్టి తత్త్వదృష్టితో, రసనిష్టతో, మహాకవి కావ్యోప్మకమముచేసి రఘువంశ, కుమారసంభవములను రెండు మహాకావ్యములను, బుతుసంహార, మేఘసందేశము లను 6౦డు ఖండకావ్యములను విరచించినాండు.

బుతుసంహార మీతనిది కాదని కొందజి వాదము. “జోనని కావ్యములోనికిం జూచినవారికిం దోంచును. కాళలిదాసహృదయజ్జులైన శ్రీ అరవిందులుగూడ బుతుకావ్య మీతనిదే యని యభిప్రాయపడిరి.

ఒకండు గొప్ప వృత్త వైపుణితోం దీయని పద్యములు [వాయవచ్చును. ఒక దృశ్యమును మధురాతిమధురముగ వర్ణింపను వచ్చును. కాని గొప్ప కథ కట్టలేదు. అపూర్వపాత్ర సృష్టికావింప నేరండు. ఉత్కృష్ట రససందర్భముల స్పృశింపలేండు. అతడు మహాకవి కాండు. మంచి కవి కావచ్చును. మహాకావ్యమునకుం గొన్ని యంశములు ఈ దృష్టితోనే నిర్బంధించిరి. కవి శక్తి వీనిలో నిగ్గుదేఅవలెను.

కథాకథనకౌశలములో, విలక్షణ పృాతనిర్వహణములో, రసానుసంధానములో, ఉక్తిచారిమములో కాళిదాసు మహాకవి.

ఇంక నీ దృష్టితో నాతని కావ్యప్రపంచమును దెజచి చూతము. (కిన్నెర: సంపుటము 4, సంచిక 9, సెప్టెంబరు 1952)

నేను చదువుతున్న పుస్తకాలు జూం ఓల్న్‌గారియట్‌: బాల్డా రమణారెడ్డి /. మైగత విషయాలన్నిటికంటి, రచయిత అనేవాడు తన కాలానికి ప్రతినిధి. సమకాలీన సుఖదుఃఖాలను నాటకాలను నేరుగా చూస్తాడు. లేదా, వాటిలో పాల్గొంటాడు. తన వర్గపు మూర్జవిశ్వాసాలనుండి, ట్రత్యప్రతులనుండి అతను చాల స్వతంత్రించితేనే కాని, అతని చూపు నిష్పాక్షికమయితేనే కాని, సమకాలపు కేందదీకృత నక్తిలో తానొక అణువయితేనేకాని, అతను తన రచనలలో యథార్థతను చిత్రించలేడు. తక్షణ పరిశీలన, తక్షణానుభవాల మీదనే కాక, అతను దేనిమీదనైతే పనిచేస్తున్నాడో ఆ సజీవ పదార్థానికి రచయిత యొక్క నిర్హేతుక వర్గ పాక్షిక దృష్టిని నిరోధించేటట్టి అవకాశమున్నదనే దానిమీద కూడ, అతని రచన లాధారపడి వుంటాయి. సజీవ పదార్థములో కల యీ గుణం కారణంగా, బూర్జువా సమాజంలో నివసిస్తున్న రచయితలు స్వవర్గపు నిష్పాక్షిక చరిత్రకారులుగా, దాని దుర్గుణాలను, నైచ్యాన్ని. దురాశను, కార్యాన్ని దాని క్షైణ్యాన్ని. పతనాన్ని నిర్విరామంగా వర్ణించగలుగుతున్నారు,” అని మహనీయుడు మాక్సిం గోర్కి రాశాడు. దీనినే లెనిన్‌ మరొకవిధంగా వివరించాడు: రచయిత దృష్టిలో దురభిమానాలు, పక్షపాతాలవంటి లోపాలు లేకపోయినట్లయితే, అతని రచనలు, స్వమత ఏరుద్ధంగా నయినా సరే, యథార్థాన్ని చూపుతాయి - “సత్యం జయిస్తుంది.” అంటాడు.

1602 పందిరి మల్లికార్జునరాపు శతజయంతి. సంప్పుటము 4; సాహిత్యము

బాల్జా ఫ్రెంచి ప్రభు వర్గాభిమాని. అట్లని, స్వమత నిరూపణ కొరకు, చరిత్రను సవరించలేదు. నిజాయితీ కలిగిన ఆత్మపరుడయినందుచేత, సత్యం - అంటే యథార్థం, తనకు రుచించకపోయినా, దాని గొంతు నులిపివేయక, దానిని చిత్రించాడు. తత్పలితంగా, అతని వర్గపు ప్రతిష్ట దెబ్బతినింది కాని, “సత్యం జయించింది". కనుకనే బాల్జా రచించిన నవలలకు. కల్పనా మహత్వ పటుత్వ సంపద మాత్రమే కాక, చారిత్రక విశిష్టతకూడా వుంది. చరిత్రలో ఒక శకాన్ని కాగితంమీద దాని సమస్త వైలక్షణ్యాలతో సమ్మగంగా పునర్నిర్మించాడు. కాని యిది యథార్థ చ్మితణ కాదు. కావాలని అతని అభివుతవమూ కాదు. అయినంతమాత్రాన అది యథార్థవాద సాహిత్యం కాదు. “విమర్శా సహితమయిన యథార్థవాద” మని (0/21 ౧6౭|౪గ) గోర్కీ దానికి పేరిచ్చాడు. అంటే, యీ యథార్థ వాదప్పు (ప్రత్యేకత, నాటి పరిస్థితుల విమర్శ, నాటి సంఘవ్యవస్థలోని దోషాలను వెలికీడ్వడం.

  • అసలు యీ “యథార్థవాద" మంటే యేమిటి?

సాధారణంగా ప్రజలనుకునేటట్లు, వున్నది వున్నట్లు అప్పటంగా జీవితాన్ని అచ్చు [గుద్దడం కాదు. కెమెరా యీపనిని రచయితకంటె సరిగా చేయగలదు.

  • మార్క్సిస్టు తత్వపు “పెడ వాదులు కొందరు అనుకునేటట్లు, యథార్థవాద సాహిత్యం రూవాయణాపైసల అజాపజా పద్దు పుస్తకం కాదు. ఈ పనికి కళాకారుడే అవసరం లేదు - వెయ్యి మంది కళాకారులకంటే ఒక కోమటి యీ పనిని శుద్ధంగా చేయగలడు.

  • “భౌతిక వాద దృక్పథముంటేనే తప్ప, యథార్ధవాద రచన దుర్లభమనుకోపడం కూడ సరికాదు. మార్క్సిస్టులమనుకునే వారు కొందరు ఈ రకమయిన దుర్భ్రమలకు లోనవుతున్నారు. దీనికి కారణం, వీరికి భౌతికవాదం సరిగా బోధపడకపోవడమే. ఒక (ప్రత్యేక చారిత్రక దశలో, ఒక ప్రజయొక్క ఆస్తి సంబంధాలు రాజకీయాలను గురించి, మతాన్ని గురించి, సంస్కృతిని గురించి, నీతి నియమాలనుగురించిన వారి భావాలనూ, వారి భావాలనుండి తయారయిన రాజకీయాది సంస్థలనూ, వివరిస్తాయనేది భౌతిక వాదం; ఆస్తి సంబంధాలనేవి సంఘానికి వమూలముట్టం, పునాది (68296); ఆ సంఫు ఖావాలు, వాటి నానయించుకొనిన సంస్థలు యివన్నీ ఆ పునాదిమీద లేచిన కట్టడం (300661౧019); అనగా భౌతికమైన పునాదులనుండి లేచినవే భావాలూ, సంస్థలూ వగైరా; స్థితి ముందు, భావం తర్వాత - యిది “భౌతిక” వాదం. అట్లాకాదు, భావం ముందు,

నేను చదువుతున్న పుస్తకాలు రమణారెడ్డి 1603 స్థితి తర్వాత; మానవ మనస్సే సర్వస్రష్ట అని వాదించే మతాన్ని యింగ్లీషులో 1662[5గ అంటారు; తెలుగులో సరియైన మాట దొరక్క “ఆదర్శ్గొవాదమంటున్నారు, కాని “మనో”వాదమంటే బాగుంటుంది.

  • “ఆర్థికొ విషయాలను ప్రతి పంక్తి నిండుగా కూరితేనే అది భౌతికవాద మయ్యేటట్లు, లేకుంటే అది మనోవాదమయ్యేటట్లు, ఈ నడుమ “జ్వాల” పత్రికలో వాసిరెడ్డి భాస్కరరావు, అనిశెట్టి సుబ్బారావుల నడుమ నడచిన వాగ్యుద్ధాన్ని బట్టి అపోహలున్నట్లు తలుస్తుంది. మార్క్సుకూడ సూచించిన దానిని యీ వుత్సాహకులు (౬006512319) బల్ల (గ్రుద్ది చెప్పుతున్నారు. ఈవిధంగానే చేసిన యువ రచయితలను సరిదిద్దుతూ, మార్క్మృంతటివాడయిన ఎంగెల్బ్సుః “ఆర్థికమే” సమస్త జీవిత విధానాన్ని వివరించజాలదనీ, యితర విషయాలనుకూడ చూడకుంటే యథార్థానికి అన్యాయం జరగగలదనీ మందలించాడు. అంటే, సమగ్రమైన జీవిత స్వరూపాన్ని చిత్రించాలంటే, పునాదినే భవంతి మొత్తంగా పొరపడకూడదు. కాని పునాది మిగతవాటికంటె ప్రధానమెందుకంటె - అది పునాది కనుకనే.

"కనుక “ఆర్థికా”నికే మకుటం తొడిగిన రచన అజాపజాబేరీ జవుతుందేకాని, కళకాదు. ఒక 'పప్రజయొక్క “కట్టడం”లోని రాజకీయాలనుగాని, మతాచారాలనుకాని, నీతినియమాలనుకాని, సరిగా చిత్రించిన రచనను, “ఆర్థికాద్యనేక విషయాలు లేనంత మాతంచేత, యథార్థవాదకళ కాదని (తోసివేయలేము.

  • మరియు యథార్థవాద మేమిటి? ఫోటోగగ్రాపు కాదు. ఫోటోకూ, చిత్రానికీ కల తేడాయే యథాతథచిత్రణకూ, యథార్థవాదకళకూ కల తేడా. మొదటిది కేవలం యంధత్రప్రవృత్తితోటిదయిన అమానుష [క్రియ (1460020041); రెండవదానిలో మానవ మేధస్సు వ్యాపిస్తుంది. జీవితంలో అనపసరమైనట్టివీ, అశిష్టాలైసట్టివీ, అర్థంలేసట్టివీ, స్వల్పాయుర్దాయం కలట్టివీ అనేక స్వల్ప విషయా లుంటాయి - యథార్థవాది వీటినన్నింటినీ కాగితంమీది కక్కించడు. ఎక్కించాడా, యథార్థవాదికాడు - 1114123”) (పకృతివాదం)లో పడతాడు. బాల్జా తర్వాతి _ఫెంచి రచయితలయిన జోలా, హ్యూగో యీ పొరపాటు చేశారు. జోలా ఒక రచన చదివినపెమ్మట, మరి గురపురేసులు చూడనవసరంలేదు. హ్యూగో ఒక రచన చదివినపెమ్మట, మరి ఒక భవంతిని చూడనవసరంలేదు - ఏమంటే ఆ రచనలు అద్దాలు. యజథార్థవాదరచన అద్దంవంటి నిర్జీవ నిశ్చలక్రియ కాదని లెనిన్‌ చెప్పాడు. జీవత్పదార్డం రచయిత ముడిసరుకు. జీవితంలో విశిష్టాలూ, హేతుబద్ధాలూ, సార్థకస్థితులూ (5190102౧00 అయినట్టి విషయాలనే రచయిత తీసుకోవాలి. ప్రకృతి
  1. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము జడపదార్థంకాదు - నిరంతరం చలనశీలమైన [ప్రాణమయపదార్థం. కాబట్టి చలనంలోవున్న ప్రకృతిని వర్ణించాలికాని, జడప్రకృతిని కాదు. జడప్రకృతిని చిత్రించినప్పుడు, మానవుడు అల్పుడుగా గోచరిస్తాడు. ప్రకృతిని వశంవర్తిని చేసుకునే వీరుడుగాగాక, (ప్రకృతికి బానిసగా కనుపిస్తాడు.

యథార్థ్ధవాదం అజాపజా బేరీజు కూడా కాదు. ఆర్థికమే మానవుని జీవితాని నంతటినీ నిర్ణయిస్తుం దనుకుంటే, మనిషి మరొకరకపు బానిస అవుతాడు. దుర్భరజీవితాన్ని యెప్పటికప్పుడు యెదిరిస్తూవున్న మానవుడి “మేధ”, అతని “క్టోర్రిక, అతని “దీక్ష” - యివీ ఆర్ధికాలు కావు. ఈ “మనస్సు” క్రమంగా ఆర్థికాది విషయాలనుకూడ మార్చగలదు. మనకు “కనుపించే” రూపాయణాక్రైసలనేగాక కనుపించని “మనస్సు” ను కూడ రచయిత గౌరవించాలి. పద్దుపుస్తకాలకు కళాబిరుదం అనుచితం.

  • “సౌందర్యం సారళ్యం సూక్ష్మత” అనే నియమత్రయానికి లెనిన్‌ చెప్పినట్లు కట్టుబడి, జీవితంలోని అర్ధవంతాలయిన శిష్టాలయిన విషయాలను సమంగా చిత్రించినదే యథార్థవాద రచన.

పందొమ్మిదవ గతాబ్టిలోని యథార్థవాద సాహిత్యభవనానికి బాల్జా ఒక మూల స్తంభం.

1830నాటి గ్రంచి జీవితం “బూర్జువా” వర్గప్పు రాజ్యాధికార సముపార్ణ్దన అప్పుడప్పుడే చూసింది. ఈనాటికి నెపోలియన్‌ స్మామాజ్యం చరిత్రగత విషయమైపోయింది. కాని సామాజ్యకాలాన్ని స్వయంగా చూసినవారింకా గతించలేదు. 1816లో తిరిగి విప్త్లవాత్ప్చూర్య రాజవంశాన్ని, గ్రైంచి (ప్రజాబాహుళ్యవాంఛల నధఃకరించి, నెపోలియను నోడించిన ఆస్ట్రియా, (ప్రష్యా, రష్యా సేనలు, ంచి సింహాసనంమీద ప్రతిష్టించాయి. విప్లవ విజయకాలంలో అగచాట్లపాలైన భూస్వాములు, కేథలిక్‌ వుతాభివమానులు |1పజలమీద పగతీర్చుకుందామని, నిరంకుశంగా పాలించసాగారు. ఒకసారి తమ బాహుశక్తిలోని చేవను తెలిసికొనివుండిన ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది. ఈ అసంతృప్తిని ఆదరువు చేసుకొని, వర్తకులు, బ్యాంకర్లు, మేధాజీవులు 1830లో రాజవంశాన్ని తొలగించి, మరొక రాజును నిలిపారు. కాని యీ రాజు రాజు కాడు - పెద్ద పెట్టుబడిదారు. కనుకనే యితనికి “ప్రజా” తంత్రవాది బిరుద సమర్పణ జరిగింది.

నేను చదువుతున్న పుస్తకాలు రమణారెడ్డి 1605 (ప్రజల నెత్తుటివర్షం వల్ల రాజ్యాధికారాన్ని సంపాదించుకొన్న యీ “కొత్త” దోపిడీదారులు, “పాత” దోపిడీదారులతో చేతులు కలిపి, (ప్రజలను యితోధికంగా దోపిడికి గురిచేశారు. పాత వ్యవసాయపద్ధతులతో లాభంలేదని,"శాస్త్రబద్ధ వ్యవసాయం” (5616౧410 11గ1౧౦) మొదలుపెట్టారు భూస్వాములు - అంటే, కూలివారిని యంత్రాలు నోరుగొట్టాయి. ర౮0డవది, చిన్న చిన్న మడులను కొనివేసి, అమ్మినంతవరకూ తైతాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి భూస్వాములు తమ ఆస్తులను పెద్దవి చేసుకున్నారు - అంటే యింతవరకూ స్వంతదారులై యుండిన రైతాంగం యిప్పుడు కౌలుదారులు కావలసివచ్చింది. మూడవది. బ్యాంకుల (పాబల్యం హెచ్చింది - కొన్నిచోట్ల యివే భూమికి స్వాములయ్యాయి. చాలమంది భూస్వాములు, యీ బ్యాంకుల పోటీకి తట్టుకోలేక, ఎదో ఒక ధరకు వాటిని బ్యాంకులకే తెగనమ్మి, తాము పట్నవాసాలు చేరారు. పెట్టుబడిదారివర్గం తప్ప, తక్కినవర్గాలన్నీ దెబ్బతినిస యీ పాత, కొత్త రక్కసి కలయికలో, బాల్డా కలాన్ని తీసుకున్నాడు. గతించిపోయిన పాత రాజవంశ పరిపాలనలోనే, యిప్పటికంటే (ప్రజల (బదుకు హాయిగా వుండిం దనుకున్నాడు. ఆ “సుదూర” కాలాన్ని గ్రేమించి, తన నవలలో దానికొరకు తపించాడు. ఈ భూతకాలపణయం (౧0గా౭౧[0 91210) అతని అన్ని రచనలలోనూ కనుపిస్తుంది. వర్తమానాన్ని విమర్శిస్తూ చేసిన యథార్థవాద రచనలలోకూడా భావికామనే లేదు. కాని భూతకాల మననం వుంది. కనుకనే గోర్కీోయీ విమర్శాసహిత యథార్థ్ధవాద సాహిత్యం (పతిదానినీ విమర్శించింది కాని దేనినీ వుద్దాటించలేడు....వర్తమాన దురవస్థనుండీ నిష్క్ర్రమణమార్గం చూపలేదు” అన్నాడు.

1834లో బాల్జ్డా “018 ఆంగం౯ (ముసలి గోరియో రచంచినప్పుడు, దానిని “19వ శతాబిసి ఆచారపరిశీలన" అని పిలిచాడు. పీనితర్వాత రాసిన నవల లన్నిటినీ కలప్‌ “మానవ సుఖాంతనాటక"మని 1842లో అన్నాడు. 18వ శతాబ్దాంతంలో సంఘటిల్లిన ట్రెంచి విష్ణవమాదిగా, 19వ శతాబ్ర (ప్రారంభంలోని సెపోలియస్‌ స్యామాజ్యం, స్మామాజ్యపతనం, పూర్వ రాజవంశ పునషపటిష్ట, దాని పతనం, “పజాతంథత” రాచరిక పపతిష్ట - ఒక శకాన్ని చతించ తలపెట్టాడు. ఈ శకాన్ని “పతిబింబించడం"తోనే సమాధాసపడక, సంఘదౌప్ట్యాలను, సంఘపు పునాదులను, మనుషులను యావజ్జీవితం (్రేరేపెంచే మూలకారణాలను పరీక్తించుకోరాడు.

1606 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కనుకనే యితని రచనలకు చరిత్ర గ్రంథానికున్నంత (ప్రాశస్త్యం వుంది. అనేకుల చరిత్రను “పఠించి, వారి వైలక్షణ్యా లన్నిటినీ కలిపి ఒక పాత్రను సృష్టించడంలో బాల్జా సిద్ధహస్తుడు. ఒక్కపాతలోనే బహుమానవుల వైలక్షణ్యాలన్నీ యిముడివుండడంచేత, యీ పాత్ర సంఘంలో ఒక విభిన్నకూటమికి ప్రతినిధి. ఇటువంటి 06 (రకవు) ప్యాతలను సృష్టించడమే యథార్ధవాద రచయితవిజయానికీ గీటురాయి. రచయితదృష్టి మనుషుల అంతరాంతరాలలోకి కూడా చొరబారేటంత నిశితమై వుండాలి. ఎంతో నైపుణ్యం వుంటేనేకాని, యిది సాధ్యంకాదు. తన మనసులోని భావాలతో రచయిత దృష్టి మలినమైపోతే యితరుల మనస్సులు కూడ తనదిలాగే వున్నాయని పొారబడడం మామూలుగా జరుగుతుంటుంది. ఇలా జరిగినప్పుడు, వివిధ పాత్రలను సృష్టించడంలో రచయిత కృతకృత్యుడుకాలేడు

  • అన్నిపాత్రలూ రచయిత వివిధరూపాలే అవుతాయి. బాల్డా చేసిన మానవ మనస్తత్వ పరిశీలన సామాన్యంగా మనస్తత్వశాస్త్ర నిరూపణకు పొల్లుబోదు. “యథార్థం బాల్జా చిత్రణలో, నాటకంలా అవుతుంది" - అంటే, దూరంగా నుంచుని, పాత్రలనుండి విడివడి, రచయిత (పేక్షకులలో ఒకడుగా వుండిపోతాడు.

ఈ నవల మొదలయ్యే పూర్వరంగ దృశ్యం ($68109) బాల్డా వర్ణనానైవుణికి నిదర్శనమే అయినా, చిట్టిచిట్టి విశేషాలను ఏకరువు పెట్టినందుచేత, విసుగుపుట్టక మానదు. కాని యీ స్వల్ప విశేషాలను సమకూర్చుకుంటే సమ్మగ రూప చిత్రణ వీలుపడదు. మదాం వాక్సీర్‌ పూటకూళ్ల యిళ్లు, తన అసహ్య బహిరంతర విశేష సర్వస్వంతో, మనముందు నిలుస్తుంది. దుర్గంధపూరితమైన కాల్వ, రాబండలు పరచిన వీథి యీ యింటి పరిసరాలు. ఈ యింటి వాసనకు “భాషలో పదంలేదు”” అంటాడు బాల్డా. పూట కూల్లింటి వాసనతప్ప, ఏదో కుళ్లు దాచుకున్నట్టుంటుందట.

ఈ యింటిలో తింటూ, వుంటూ, నెలకింతని చెల్లిస్తూ వివిధ వయస్సుల, మనస్తత్వాల, ఆలోచనల, స్త్రీ పురుషులు: యూజిన్‌డి రాస్టిగ్నాక్‌ అనే లా విద్యార్థి, పేదరికమనుభవిస్తున్న గొప్ప కుటుంబంనుండి వచ్చినవాడు. చెల్లెళ్లు యాదరకట్టిన డబ్బును కూడతీసుకొని, తలిదండ్రులు తనమీద పెట్టుకున్న ఆశలను గుర్తించి, సంఘంలో ఏదో ఒక మార్గాన పపైకిరావాలనుకునేవాడు. వాటిన్‌ అనే మరొకతను నలభై యేళ్లవాడు తాను పూర్వం వర్తకుణ్ణని చెప్పుకుంటూ, మీసాలకు రంగు వేసుకుని, తలకు విగ్గు ధరించే వాడుక. ఇంతకుముందు తిండిదినుసుల వ్యాపారం సాగించిన “ముసలి గొరియో” అని అందరిచేత, అపహాసనాత్మకంగా పిలువబడే

నేను చదుపుతున్న పుస్తకాలు. రమణాలెడ్డి 1607 వృద్ధుడు - యిక కొంతమంది స్త్రీలు కలిసి మొత్తం ఏడ్డురు. యాజినీ రూపసి, సదాచారి, కాని నిర్బాగ్యుడు. వాటిన్‌ “ఖులాసా మనిషి", దృఢకాయుడు. కఠిన పరిశ్రమలకు లోనయినట్లు కనుపించేవాడు. ఖుషీగా బిగ్గరగా నవ్వుతూ, అన్ని విషయాలు తనకు తెలిసినట్లు ప్రవర్తించేవాడు. ధనం దొరికే అవకాశముంటే హత్యలక్కూడ వెనుదీయడనిపించేటంత, అన్ని సమస్యలను అందరి మనస్సులను అన్ని ఆలోచనలను కని పెట్ట్టలడన్నంత, చురుకు చూపు కలవాడు - ఆవులిస్తే (గ్రువులు లెక్కపెట్టే రకం. అందరి చేత ఏడ్పింపబడుతూ, తా నెవరినేమీ అనక, పరమ దీనుడుగా దయనీయుడైన ముసలి గొరియో, తాను యీ యింట చేరిన తొలి దినాలలో, రాజభోగాల కలవాటుపడిన వానివలె, తన గదులకు 1200 ప్రాంకులు విసరి పారవేసేవాడు. ఇప్పుడు 45 ్రాంకులు మాత్రమే భోజనానికీ గదులకూ యిస్తున్నాడు. అప్పుడు అతని పెట్టెలలో ఎన్నో విలువగల దుస్తులూ, రత్నాలు పొదిగిన పిన్నులూ, బంగారు పొడుం డబ్బా, వెండీ సామాన్లు వుండేవి. ఇప్పు డవన్నీ మాయమయ్యాయి. ఎవరికో పుంపుడుకత్తెల కిచ్చి వుంటాడని, యీ ముసలాడికి లూ కాలంలో కూడానా అని అందరూ అతనిని అసహ్యించుకునేవారు. అతను దర్నిదుడయ్యేసరికి, యీ తరస్కార భావం యింకా యెక్కువయింది. నిసి రాత్రిచేళలండు అతని గదులలో వినిపించే స్త్రీల కంఠస్వరాలు యీ అపవాదును మరింత నేయిచల్లి మంలడించాయి. ఆ వచ్చిపోయేవారు తన కూతుళ్లని చెప్పినా సమ్మేవారు లేరు. అతని నోటిసుండి నిజం వచ్చినా అది అబద్ధమే. కాన్‌ నిజానికి వారతని కస్నకూతుళ్లే. ఇద్దరినీ ఉన్నత కుటుంబాలలో, యెక్కువ కట్నాలిచ్చి "పెల్లిచేశాడు. కాని కొద్ది కాలానికి, అల్లుల్లిద్దరూ అతనిని యిళ్లనుండి గెంటివేస, అతనితో యీలాంటి సంబంధం పెట్టుకోకూడదని తమ భార్యలను నాసిలచారు. అతను తమతో కలిసిపుంటే, తపము భార్యల ఆస్తులసుండి చిల్లగవ్వకూడ ఖర్చుపెట్టనివ్వడని వీరి భయం. కసుకనే యితని పూటకూళ్లింటి కాపురం. కూతుళ్లు విలాసవతులు; పవిలాసాలకొరకు మగలిచ్చిన నగలు కుదవబెట్టి, మగలకు అఆదిసినసప్పుడు, తండ యింకా (బతికివున్నాడని జ్ఞాపకం ఆచ్చుకొని, ముసలివాని నిలువ డబ్బును తగలవీసేవారు. అల్లుళ్ల కముమరగి, తసకొరకే తనమీది (ప్రేమచేతనే, కూతుళ్ల రాత్రిచళల తసడగ్గిర కొస్తున్నారని గోరియో (భమ. కాని అతని డబ్బు వారకి కావలసింది. వారి పాడరజోరేణువుకూడా సుపర్జమనుకునే తండ్రి, వారి మనసులోని నలుసు, కంటిలోని తత చూసి అల్లుళ్ల గొంతు కోసేస్తాననే తండి - తం పున్మావిగా చసహపోతున్నా కూతుల్లో అని కలవరిస్తున్నా, న్నిడపోయి వస్తానని,

1608 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము లేదా, తల భారంగా వుందని నిర్లక్ష్యం చేసే కూతుళ్లు, తండ్రి శవానికి కర్మలకు కానీ కూడా లేకుంటే, దుకూలాలకు వేలువేలు తగులవేసే కూతుళ్లు - ఎంత విషాదం, ఎంత అన్యాయం, యిది మానవ సంఘమా పశుగణమా, కరుణకు తావు లేదా - యిదే యీ నవల యితివృత్తం. భయంకరమయిన కథ - పెట్టుబడిదారి వ్యవస్థలో కుటుంబ బంధా లెక్కడివక్కడ తెగిపోగలవని మార్కు సూచించిన విషయాన్ని వ్య క్తపరచే వ్యధ! “నన్ను మోసం చేశారు. నన్ను వాళ్లు (గేమించడంలేదు - అసలెప్పుడూ (ప్రేమించలేదు...నీ కళ్లు పొడిచేస్తాం నాన్నా అని వాళ్లు అడిగినా, నేను కాదనేవాణ్ణికాను...నన్ను చూసేందుకు రాకపోవడం పితృహత్యా నేరమని చెప్పు పో, ఫో, పోయిచెప్పు!... నీచులు కటికివాళ్లు, శపిస్తున్నా వాళ్లని! సమాధినుంచి రాత్రుళ్లు లేచి మళ్లీ శపిస్తానుగ్‌ అని కడపట, చనిపోతూ అంటాడు. ఎంత త్యాగం! తన కూతుళ్లకు, వాళ్లు తనంటే కపట ప్రేమ నటిస్తున్నారని తెలిసి కూడా, తన హృదయమంతా - వెధవ ఆస్తి యేమిటి - అర్పించడం నిజంగా ఎంత త్యాగం! వీళ్ల కోసమని రెండవ పెల్లి చేసుకోకుండా దొంగ బజారులో ధాన్య మమ్మి సంపాదించిన డబ్బంతా వీళ్ల ప్రీత్యర్థం ధారపోసి, తాను మురికి గదులలో వుండి మురికి గుడ్డలు వేసుకుని, పిసినిగొట్టువల తయారై, తన అవసరాలనుండి మిగిల్చి, భర్తను ద్వేషిస్తున్న ఒక కూతురికి రసికుణ్ణి తార్చిన గోరియో ఎంత త్యాగి! త్యాగి కావచ్చుగానీ మంచి తండ్రి మట్టుకు కాదు. వారికి తగిన శీక్షణ చిన్ననాడే వుంటే యీవిధంగా తయారయ్యేవాళ్లు కాదు. గోరియో కూతుళ్లనేకాదు - శుష్కువిలాసవంక మగ్నమై పోయిన సీమపంది వంటి పేరీస్‌ నగర సంపన్న జీవితవిధానాన్నేే ఈ నవల ద్వారా బాల్డా ఖండిస్తాడు. అతని కూతుళ్ల డబ్బు కొట్టేద్దామని, భర్తలతో విసిగిపోయిన వారియొక్క సాదర కటాక్షపు సూర్యరశ్మిలో కపట (ప్రేమ నటించే సంపన్నచారులు, భర్తలను ఉడుపులవల మార్చే భార్యలు, భార్యల పైతృకాలను కొట్టేయచూసే భర్తలు, ఎవరికి పుట్టినారో తండ్రి యవరో తెలియని బిడ్డలు = ఈ వ్యవస్థోత్పత్తులు! యూజినీవంటి రూపసి, ధనికుడు కావాలంటే యిదే నిచ్చెన. యూజినీ ఈ నిచ్చెన పెకెక్కుతాడు. మకైనవున్న ప్రణయాధిదేవత పితృఘాతకిమొన గోరియో కూతురు. ఈమె నిజప్రవృత్తిని చూసి, పవిత్రమైన యూజినీ మనసు ఏవగించుకుంటుంది. కాని క్షణం మాత్రం - తర్వాత తనను తాను సమాధానపరచుకొని, కరుణాది “స్వల్ప” భావాలకు ఈ

నేను చదువుతున్న పుస్తకాలు రమణాలెథ్ణి 1609 సమాజంలో తావులేదని బోధపొంది, “ఇక యుద్ధం మనిద్దరకూ!” అని సంఘానికి సవాలు విసిరి, “విజయం” సాధించాలని బయలుదేరుతాడు.

ఈ సంఘాన్ని యొదిర్చి, అసహ్యించుకొనినవాడు, ఈ నవలలో, వాట్రిస్‌. అతని వుద్దేశాలు సమకాలీన వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకాలు - అంటే విప్లవోద్దేశాలు. కాని అతని మార్గాలు అనుసరణీయాలు కావు. ఈ వ్యవస్థలో, “నిజాయితీకి విజయావకాశం లేదు. నిపుణుడనేవాడుంటే, వాడికి దారిచ్చి, తర్వాత అతనిని (ప్రబలంగా ద్వేషిస్తారు. ఏమంటే స్వీయ (పతిభవల్లనే అతడు, దోపెడిలో పాలడుగకుండా, తానే తీసుకోగలడు. అతనిని బురదలో తొక్కివేయడం అసాధ్యమనుకున్నప్పుడు, అతనిని మోకాళ్లమీద పూజించేవారూ వీరే. (ప్రపంచంలో (భష్టత అనేది సర్వశక్తిమంతం; (ప్రతిభ అనేది మృగ్యం...నరకపాయమైన కుంభకోణాల నెదుర్కోకుండా, -ఏరీసులో రెండడుగులు వెయ్‌ చూద్దాం;...మరి వీరి అందరి శతువైన నిజాయితీపరు డెవడనీ? దోపెడిలో తనపాలును నిరాకరించేవాడు” అని యూజినికి కలరూపు చెప్పి, తాను యూజినీకి పదిలక్షల (ఫాంకుల ఆస్తివచ్చే పిల్లను పెల్లిచేయిస్తానని, అయితే రెండు లక్షలు తసకివ్వాలని చెప్పుతాడు. ఈ అమ్మాయికి అంత ఆస్తి రావాలంటే, ఆమె అన్న చనిపోవాలి, నేనే చంపిస్తానంటాడు. లక్ష్య్యంకదా కావలసింది. దానిని పొందేందుకు యేమార్గమవలంబిస్తే యేమి? “పేరీసులో జరిగే అరవై సంపన్నుల వివాహాలలో, నలప్రైయేడు యిట్లాంటి ఒప్పుందాలమీద జరిగేవే.”

“క్రొత్త ప్రపంచంలో అడవి మూకలు ఒకరితో ఒకరు తమ స్థితి కొరకు యుద్ధం సాగించే అడవిపంటిది పేరిస్‌ - కొందరు డబ్బున్న కన్యలను వేటాడుతారు; కొందరు ఆర్థిక కుంభకోణాలద్వారా లాభాలను వేటాడుతారు...నిండైన. వేట సంచితో, బువడు వేటనుంచి మరలివస్తాడో, వాడినే ఆహ్వానిస్తారు, విందులిస్తారు. మంచి సమాజంలోకి చేరదీసుకుంటారు...నీ అభ్మిపాయాలు మార్చుకో. తన అభిప్రాయాలు నిశ్చలాలనుకునేవాడు సరళరేఖలో నడువవలసి వుంటుందీ - తాను చేసేదల్లా ఒప్పు అనుకునే మూర్జుడు! నియమాలనేవిలేవు, సంఘటనలే వున్నాయి; చట్టాలనేవి లేవు, పరిస్థితులే వుండేవి; తస సహచరులకంటె తఆలివైనవాడు సంఘటనలనూ, పరిస్టితులనూ ఆమోదించి, వాటిని తన లక్ష్యాలకు అనువుగా తప్పుకుంటాడు. స్‌రమైన నియమాలనేవే వుంటే, జాతులు వాటిని షర్ట్దులవలె మార్చకూడదు. కాని జాతులు మారుస్తున్నాయి. కనక జాతి చేయగా ఒప్రైనపని,

1610 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఈవిధంగా బాల్జా, నవల సంఘటనలనుండి మూలసిద్ధాంతాల చర్చకు దిగి, వర్తమానప్రపంచ రాజకీయాలలో చర్చనీయాంశంగావున్న ౬౧69 2౧6 6809 ను చర్చిస్తాడు. యూజినీకి డబ్బువస్తే, అతని కుటుంబమంతా సుఖిస్తుంది కాబట్టి, ధనసముపార్ణన అతనికి “మంచి” లక్ష్యం; కాని వాటిన్‌ సూచించిన “మార్గం” “మంచి” మార్గమని యూజినీ ఒప్పుకోలేదు. కాని సంఘంలో యిలాంటి వన్నో జరుగుతున్నాయి. దొంగతనం తప్పనిసరిగా చేయవలసివచ్చిన నిర్భాగ్యుడికి కొన్ని సంవత్సరాల కఠినశిక్ష పడుతూవుంది. పరస్పర మారణానికి ఆయుధాలను జాతులకు సరఫరాచేస్తూ, లాభాలు గడిస్తున్న కోటీశ్వరులు గౌరవనీయులు. “గొప్ప ఆస్తుల రహస్యం, విస్మరింపబడిన నేరం - సరిగా నిర్వహింపబడింది కనుకనే విస్మరింపబడిందిొ. యూజినీకి, అతని స్నేహితునికీ యిదే విషయం చర్చకువస్తుంది.

“పేరీసునుండి కదలకుండానే, తన యిచ్చను తెలిపినంత మాత్రాన, చైనాలోవున్న ఒక ముసలివానిని చంపి, అతని ఆస్తికి ప్రభువు అయ్యే అవకాశముంటే, నువ్వేమి చేస్తావు. అని రూసో వేసిన ప్రశ్న గుర్తుందా?” అని యూజినీ తన స్నేహితుణ్ణి అడుగుతాడు. ఆ స్నేహితుడు యిట్లా జవాబిస్తాడు: “ఆ ముసలివాడు చాల వృద్ధా? ఛీ, ఛీ, కాటికి కాళ్లుచాచనీగాక, పక్షవాతంతో పడివుండనీకాక - ఆ ఆస్తి పిశాచిపాలుగానీ- నా కొద్దుబాబోయ్‌” బాల్జాకూడ వైనావృర్ధుణ్ణి చంపకూడదనే

  • అంటే - లక్ష్యం మంచిదయినాకాని, మార్గం “చెడుగా వుండకూడదని అంటాడు. వ్యాటిన్ను “నరరూప రాక్షసుూ డంటాడు.

వాట్రిన్‌ పాత్రకు బాల్జా కల్పించిన ముగింపు అద్భుతమైనట్టిది. వాటిన్‌కొరకు పోలీసులు వచ్చి, అరెస్టుచేస్తారు. అతను చేసిన “నేర మేమిటి? ఇతను జైలుపక్షి. జైలులో వున్నప్పుడు యితనిని “మృత్యువంచకుడు” అనేవారట. చావునుకూడ మోసం చేసే యితని ప్రతిభ యేమిటి? అంటే, అతను సాగించిన (ప్రమాదకర చర్యలన్నిటిలోనూ, తానుమాత్రం పట్టుబడలేదట. అసలు అతనిపేరు జాకిస్‌ కాలిన్‌. మూడు కారాగారాలలోని ఖైదీలకు యితను గురువు, రాజు, రక్షకుడు, కోశాధిపతి, ఏజుంటు. ఖైదీల డబు ఏను నిధిచేసి, పెట్టుబడిపెట్టి యిబ్బిడిచేసి, వాళ్లు విడుదలయిన తర్వాత వారిచేతికిగాని, లేక వాళ్లు లేనప్పుడు వీలునామాలప్రకారం వాళ్ల కుటుంబాలకుగాని యిస్తాడు, అంతేకాదు -"పదివేలమంది” (1౭౧ 7౧0494౧6) అనే

నేను చదువుతున్న పుస్తకాలు దమణా రెడ్డి 1611 ఘరానా జెలగలకుకూడ యితనే ఏజెంటు, న్యాయశాస్త్రమంత్రి. వాటిన్‌ అసామాన్యుడు. అతని గూఢచారులు పోలీసు గూఢచారులమీద పనిచేస్తారు. అతనిమూక “సంఘా"నికి యెదురుబడి యుద్ధంచేస్తారు. ఇరవై సంవత్సరాల కఠినశీక్షనుండి తప్పించుకొనివచ్చి, యిక్కడ చేరాడు. పోలీసులు వచ్చేసరికి, అతను నారసింహావతార మెత్తుతాడు - “వ్యక్తి ఒక వ్య క్రిమ్మాతుడుగాకాక, కిరాతకులూ పశుసములూ అయిన విశృంఖల (ప్రవృత్తి కల ఒక వర్గానికంతా బాకా అయ్యాడు” అని బాల్జా, వాట్రిన్‌ తుది ఘట్టాన్ని వర్ణిస్తాడు. “నేరుగా యీ పోలీసులు నన్ను జైలుకు పంపితే, చిటికలో బయటికివచ్చి నాపనిలో వుండగలను...ప్రాణమయినా యేమయినా తనకొరకు అర్పించగలిగిన పదివేలమంది తనకున్నారనీ, మీలో ఎవరైనా నావలె చెప్పగలరా?....ఎంత మొద్దులు మీరంతా! ఈవరకు మీరు ఖైదీనే చూడలేదా? కాని యీ కాలిన్స్‌ అఖండుడు సుమీ...న్యాయసభలూ, రక్షకభటులూ, కోట్లకొలది ఆవెన్యూ - యింత అంగబలం కలిగిన రాజ్యాంగాన్ని నే నొక్కణ్ణే యెదుర్కొంటున్నాను. అది పనికిమాలిన దనిపించాను...అవమానపు మ్యుద మాకు భుజాలపైనే వుంటే, క్షుల్లిపోతున్న సంఘంలోని మురికి సభ్యులారా, మీ మనసులలో అది యింకా లోతుగా పడివుంది. మీలో ఉత్తమోత్తముడుకూడా నాకు సరిపోలేడు.” అని సగర్వంగా నిలబడ్డాడు వాటిన్‌. వాటిన్‌ పృాతలో రెండు శక్తులున్నాయి; ఒకటి, ఆ కాలపు సాంఘిక వ్యవస్థపై ప్రజల అసంతృప్తి! రెండు, ఆ అసంతృప్తిపట్టిన చెడు మార్గాలు. వాటిన్‌ దారితప్పి పెడదారిబట్టిన విప్లవమూర్తి. ఈ పాత్రచిత్రణలో బాల్డా, పీడిత ప్రజల దుఃఖానికి సానుభూతిచూపేది పోయి, వారు అలవరుచుకున్న దౌష్ట్యాన్ని నిష్కర్జగా ఖండించాడు. చెడ్డ ప్రపంచంలో పైకివచ్చేందుకు చెడ్డతప్ప మార్గాంతరం లేదని వాట్రిన్‌ తత్వం. “సంఘం”చెడ్డచేసినా తలమీద మోయాలని బాల్దా మతం. “కాని, వాటిన్‌ మనుష్యమాతుడే సుమా!” అని, మరొక పాత్రద్వారా బాలా మాటాడుతాడు. అంత ప్రతిభావంతుడయిన వాటిన్‌, ప్రజలను సమీకరించి, సంఘటితపరచివుంటే, అతని కృషి యెంత సఫలమైవుండును? కాని అతని మనస్సు దానిమీద కాదు

  • “స్వ” ప్రయోజనాలమీదనే లగ్నమై వుండింది. కనుకనే అతని దురంతానికికూడ పాఠకుడు తగినంతగా విచారించడు.

1612 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఈ నవల అంతటా మూగగా మంచిగా వుండిన విక్టోరిన్‌, యూజినీని (కేమిస్తుంది. కాని అతను యీమెను కన్నెత్తికూడా చూడక, విలాసాల పోకిరీలతో నిండిన సమాజంవైపు “యుద్ధానికి బయలుదేరుతాడు. “సుశీల అయిన స్త్రీ చిత్రణ జటిలసమస్య.” అని బాల్జాయే రాశాడు కనుక విక్టోరిన్‌కు నేరుగా యీ కథలో లోపాలేమీ లేవు. కాని తొలి దర్శనంలోనే ఆమె మంచి, వెన్నెల వల హాయిగా పాఠకునికి అంటుతుంది.

ఈ నవలను నాటక మనవచ్చు; “మీ బూర్జువా నాటకాలలో కంటె నా నవలల్లో విషాదం యెక్కువ వుంటుంది" అని బాల్టాయే అంటాడు. “నాటకం మాదిరి వున్నదంటే నాటకమనే పదానికి వున్న అర్థంకాకపోవచ్చుగాని, దీనిని చదివేటప్పుడు, కొన్ని కన్నీళ్లు రాలుతాయి.” అని యీ నవల నారంభిస్తూ బాలా రాశాడు. (కిన్నెర: సంపుటము 4, సంచిక 10, అక్టోబరు 1952)

న. న! (౯౪ ,)

కాదంబరి బులుసు వేంకట రమణయ్య

సంస్కృత వాజ్బయమున - అంతే కాదు - భారతీయ వాజ్బయమునంగల గద్యకావ్యములలో “కాదంబరి”కిం. గల న్‌ మున్నతము. తర్వాత వాలువడిన పెక్కు భాషలలోనే పెక్కు (గంథములకు అయ్యది ఆధారమయినది. అందు స్పృశింపంబడని వర్ణనలు లెవు; సూచింపంబడని కథా చమత్కృతి లేదు. గమనింపని వాగ్ర్వైదగ్ధ్యము లేదు. వాడంబడని పదము లేదు. కావుననే “బాణోచ్చిష్టం జగత్సర్వం; కాదంబరీ రసాస్వాదాదాహారోపి నరోచతే” అను నానుడులు వెలసినవి.

సుదీర్టమును, పరమాద్భుత సన్నివేశ విలసితము నగు కథావస్తువును గ్రహించి బాణవుహాకవి కాదంబరిలోని పూర్వ భాగమును మూత్రము రచించి దివంగతుండాయెను. అతని (గంథభాగమునం గథాంశ మల్చము; వర్ణన లధికములు. తండ్రి మరణింపంగా - అన్ని విధముల నతనితోందులతూంగు పుత్రుండు భూషణభట్టు ఉత్తర భాగమును రచించి, ఎట్టి యజకొజలు లేకుండ [గ్రంథమును పూర్తిచేసి తండ్రి సంకల్పమును నెజవేర్చెను. తండ్రికింగల ప్రతిభయుం గవితా సామర్థ్యమును తనకు లేవని భూషణమహాకవి తెలిపెనను - పాఠకులకు (గంథమంతయు

“ నేకకర్తృకమైనట్లే స్ఫురించును. “

ఈ (గ్రంథమునెడంగల గౌరవమున నృసింహకవి దీనిని సంస్కృతమున “కాదంబరీ కల్యాణ” మను నాటకముగా వెలయించెను. వామనభట్టు కాదంబరిలోని రచనాపద్దతిని, వర్ణనవమలను వేలుబంతులుగా. _గెకొని, బాణుని పందిరి ములికార్టునరావు శతజయంతి... సంపుటము. 4: సాహిత్యము

1614 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యడుగుజాడలలోనే “వేమభూపాలచరిత్రము"”ను రచించెను. శ్రీనాథాదులగు ఆంధ్రమహాకవులు - శివర్శాతి మాహాత్మ్యాదులలో కాదంబరి ననుసరించియే కొన్ని వర్ణనలు సాగించిరి! సూరనార్యుని కళాపూర్ణ్జోదయమున కిది యాధారము!

మూలమునందలి యభ్మిపాయములను, చమత్కృతులను తదనువాదము లందును, అనుకరణములందును వ్య క్రపజచుట మిక్కిలి కష్టము. ఇట్లు గద్యమును గద్యముగను, పద్యకావ్యమును పద్యకావ్యముగను అనువాదమొనర్చినపుడు వెల్లడికాని మూల భావములు, వేజొకరీతినున్న అఆనువాదములందు విశదములు కాకున్నవి. సంస్కృత శాకుంతలాదుల యాంధ్రానువాదము లీవిషయమునం దార్కాణలు.

తొలుతనుండియు సంస్కృత కావ్యములను - అనంగా - గద్య, పద్యరూపముల ద్వివిధములైనవానిని - తలుంగున పద్యకావ్యములుగనే మార్చుట పరిపాటియైనది. ఇందులకు కేతన దశకుమార చరిత్ర, జక్కన విక్రమార్క చరిత్ర, వెంకటనాథుని పంచతం(టత్రము మున్నగునవి ఉదాహరణములు. బాణుని కాదంబరియు నీ

_ విధముననే బృహద్గృంథముగా ఆంధ్రీకరింపబడి యున్నది. దాని నిదివజకు శ్రీ

వావిళ్ల సంస్థవారు ప్రకటించియు నున్నారు.

కాదంబరి యుద్గ్దృంథమగుటచే గీర్వాణవాణి యెడ నెక్కువ ఆదరము, అభినివేశవము కలవారు కూడ, దానిని పూర్తిగాంజదువుట యరుదు; విశ్వవిద్యాలయములలోని ఉత్తమ పరీక్షలకుంగూడ - అందలి యొక భాగము మాత్రము పాఠ్యభాగముగ నిర్ణయింపంబడుచుండును. విద్యార్ధులకయి జరిగిన గద్యానువాదములు కూడ పూర్వభాగ మాత్రమునకే కానవచ్చుచున్నవి. శ్రీ వావిళ్లవారి పద్య కాదంబరియు ఇప్పుడలభ్యము. ఎక్కడనేని అది లభ్య మైయున్నను

  • మూలముకంటెను రెండంతలు పెద్దదగు నా పద్యకావ్యమును జదివి, కథను గ్రహించు నోపిక యుండుట మిక్కిలి యరుదు. ఈ యంశములను గమనించియే కాంబోలు "శ్రీ నాగగోపాలరావుగారు 60 పుటలలో మున్నూరింటికిందక్కువ సంఖ్యగల పద్యములలో కాదంబరీకథను సులభముగను - సం[గహముగను బకటించి, సంస్కృతాంధ్ర భాషా వాజ్మయ నిష్టాతల పొగడ్తలను పొందగలిగిరి.
  • రచయిత శ్రీ అద్దేపల్లి నాగగోపాలరావుగారు. శ్రీ. సీ. ఆర్‌. ఆర్‌. కళాశాల, ఏలూరు.

కాదంబరి బులును వేంకట రమణయ్య 1615 వివిధ విశ్వవిద్యాలయముల యామోదమును పడసి యీ [గ్రంథము పఠనీయముగ నిర్ణయింపంబడినది. శ్రీ నాగగోపాలరావుగారి పద్య “కాదంబరి” నవ్యసాహిత్యములో ఉన్నతస్థానము పొందందగినది. ఇయ్యది 1పాచీన లాక్షణిక మార్గము నతికమింపక క్రొత్తపోకడలం బోవుచు, కొత్తపాతలకు మేళవింపు కలిగించుచు, భిన్నదృకృథములవారి యాదరామోదములను పొందుచు, సంగ్రహ కావ్యములకు తలమానిక మనందగినది. పద్యరచనలో కృతికర్త కలము నిరాఘాటముగ సాగినది. పొల్లుపదములులేక మధుర భావములు వానియంత అవి వచ్చిపడినట్లు (ప్రవహించిన దీకవితాధార. కథాసంవిధానమున కడ్డు కలుగనీయక - ఆవశ్యకములని తోంచిన వర్ణనలనుమాత్ర మలంతిగాం గూర్చుచు, కాదంబరీ కథాసారమును కరతలామలకముగ నీకృతి యందు నిరూపెంపంబడినది! ఒక చిన్న చేతి యద్దమునందు మహాగజము ప్రతిబింబించినట్లు మూల స్వరూపమంతయు నిందు వ్య క్తమగుచున్నాది. కథను సంగ్రహించి కూర్చుటలోని నేర్చునకు - “మదలేఖయు గాదంబరి€ బదియున్‌ బదిగా వచించె బహుతరకాల మ్మది విని రాసుతు6 డెంతయు మది మెచ్చెను, దానివెన్క వగువయు చనియనస్‌ 'కమముగ నస్తమించె రవి [కమ్ముకొనెన్‌ దమ మెల్లతావులన్‌ విమలదుకూలపంక్తి పర పెంచిన (గావవితర్జిశయ్య భూ రమణ కుమారుండుస్‌ గడపె ర్యాత్రియదెల్ల క్షణమ్ము పోలికన్‌ అమృతరసార్ద్రభావకల శార్జవవీచుల దేల డెందముస్‌.” అను పద్యద్వయము నుదాహరించిన6 జాలును. కిన్నర మిథునమును వెంటాడి, విసివి, వేసరిన రాజపుత్రు6 డెట్లు తనలో విచారించుచున్నాండో ఒకింత గమనింపుండు- “పట్టుకొన్న వీరి వచ్చునదేమిటి? పట్టకున్నం గలుగు చెట్ట యేమి?

1616 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంపుటము 41: సాహిత్యము మోహమూఢబుద్ధి మున్ను వచ్చినతోవ చొప్పు నరయః; నరుగు టిప్పుడెట్లు? దక్షిణాశంబట్టి తరలిపోవుట తప్ప కానరాదు వేరుగతి యొకండు “ఆత్మకృతములైన యా దోషముల నెంత లేసిరైన ననుభవింపవలయు వర్ణనమునకు - “సురభిమాసమ్ము సనుదెంచె సుమచయమ్ము పరిమళమ్ముల వరజిమ్మె, నిరుపమాన సుందరము లౌచు సుమలతల్‌ కందలించె శగేమమయమౌచు దోచె ధాత్రీలలామగో అను వసంతవర్ణనము నుదాహరించిన6 జాలును! సులక్షణ భాషలో నవ్యకృతులు రచించు నాధునిక కవివతంసులలో శ్రీ నాగగోపాలరావుగారు ముఖ్యులు! తెలుంగువారికి బాణకాదంబరీ రసాస్వాదమును కలుగంబేయుటకు ఈ పద్యం “కాదంబరి” పరమసాధనము! + (కిన్నెర: సంపుటము 4, సంచిక 10, అక్టోబరు 1952) మా ఫె తపు లా వ్‌ స్య కం క ల సన స ఈ ిగియి / రల కాం

“నేను వ్రాసిన వేమిటంటే” కథలు . కవికొండల వేంకటరావు

“కథలు” అన్న శబ్దం బాహుళ్యం మీద స్ఫురింపజేసుకుంటే వచన గాథలు కావచ్చు; పద్య గాథలు కావచ్చు; పొడుగువి కావచ్చు: పొట్టివి కావచ్చు. అన్ని పేర్లు పేర్కొంటూ విడమర్చి విశదీకరించడం అంటూ వస్తే అంటింత లూడదీసుకుంటూ నడక సాగించేనట్టే - కాబట్టి “కథలు” అన్నదానికి నేడు వ్యవహరింపబడే సంకుచితార్థం అనగా “చిన్న కథలు” అనే నేడు పరివేషించి యీ ప్రసంగం గావిస్తూవున్నాను.

పుస్తకరూపం దాల్చిన నా కథలు ఇంతవజకు ఎన్నో లేవు. [929లో “పొట్టి కత" అనే [గంథం వొకటి, 1941లో “సుమనోవ్లోదిని, మొదటి భాగము” అనే (గంథం ఒకటి, 1949లో ప్రచురితమైన “పెనుమంచిలి పైనదేవుడు"” మున్నగు పది కథలు, అన్న (గంథం వొకటి - ఈ మూడు (గ్రంథాలు మాత్రమే కనిపిస్తాయి. కాని పత్రికల్లో 1931 నుంచి ప్రచురితమవుతూ వచ్చిన కథలను లెక్కిస్తే పెక్కులు అగుపిస్తాయి. ఎప్పుడైనా చదివారో లేదో, “భారతిోలోను, “వినోదినోలోను. “ఆంధ్రభూమి"లోను, “ఢంకా”లోను, “ఆంధధశిల్చి"లోను - ఇలా ఏకరు "పట్టడమంటూ వస్తే, వందకు మించిన పత్రికలు కోరేవస్తాయి. ఆ కథలన్నీ కలోసికంటి కలగాయ పులుసులా కళపెళమనిపిస్తుంది హృదయాన్ని, - ఒకషూటు గ్యాంగ్‌మాస్‌ సూరయ్య (ప్రత్యక్షమవుతాడు. మరోమాటు పొట్టి రవికలూ వాలుజడలూ (ప్రకోపింపజేస్తాయి. (ఇప్పుడీ పొట్టి రవికలూ - వాలుజడలూ అన్నవి పుస్తకముగా అచ్చుపడ్డాయి) పందెరి మల్తికార్డునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

1618 పందిరి షుల్లికార్టునరాప్తు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము మూడోసారి “ఆయన కథి ఆహ్లాదం గొలుపుతుంది. ఏలా లక్కించి చూచినా అన్నీ సుమారు మూడువందల కథలుండగలవని నా నమ్మకం. ఈ కథలను ఎవరైనా అనుగమిస్తూ అందలి ఆవాహన అనుభపమూ అందుబాటులో నెల్లప్పుడూ ఉంచుకోవాలి అంటే, అవి తరుచు చదువుతూ అందలి రూపంతో సారూప్యం పొందడం అవసరం - ఒక “హరిజన”వాడను వర్జిస్తే నేను బ్రాహ్మజ్జి అని పఠిత మడిగట్టుకు చదివితే అర్ధం కాదు. ఒక “బీదొఘట్టం కనుగట్టుగా ఎదరపెడితే నేను జమీందారుణ్ణి అని జరిగిపోగూడదు - అందటూ మానవులే అందజూ అంతో ఇంతో పెరిమకు, గరిమకు, పెంకెతనానకు వంకరచేష్టకూ ఆదయ్యేవారేను అని తలపోయాలి - మళ్ళా మరే వేదాంతంలో పడరాదు. అతి విజ్ఞానంలోకి దిక్కూడదు. గోడ మీది పిల్లి వాటంగా , కళను కాంతిని ఆగ్రయించుకు చప్పుచప్పున ఏతద్వాతావరణ సంబంధమైన మిడతనో మిజ్ఞాగునో పట్టుకునేలాగుండాలి. కథ ఒకొక్కప్పుడీలా ప్రారంభమవుతుంది. "ఆ చేడెల కిద్దజకీ ఎంత నేస్తం అంటే కుళ్ళాయి నీళ్ళ కళ్ళేటప్పుడుకూడా ఉత్త బిందె ఇద్దరూ తోడట్టుకెడతారు" అని కుళాయి నీళ్లు బిందె మనకు రోజూ తెలిసినవే కావచ్చు. కాని చేడెలు? ఎవరో కొత్తవారే! కాని కథలో మనకు తెలిసినవారుగా రోజూ చూస్తూవున్నవారుగా పేర్కోబడతారు. వేలెట్టి చూపడానికి కూడా జంకని వానిలా కవి కాపరుస్తాడు. అవితే వింత ఎక్కడ వుందీ అంటే వారియొక్క సరిసమానత వర్ణించడంలో వుంది. “తోడికోడళ్ళా అంటే తోటికోడళ్లు కారు. ఒక యింటి ఆడపడుచులా అంటే వాళ్లూ కారు, వదినే మజదండ్రా అంటే ఉంహు. కుజ్జయీడూ ఇద్దరిదీ కూడా. ఇద్దజీ చాయాకూడా సాయంకాలం నీరెండలో నీలాంబరప్పూ వన్నె ననుకరిస్తూ వుటుంది - ఆ” అని ఇలా చక్కగా జతకట్టినట్టు పూన్చి పఠరితయుక్క ముందుచూపును పురిగొల్పుతాడు. కొత్తవారిని ఎజీగున్నవారుగా చెబుతూ ఎజీగున్న వారిలో వింత ప్రకటించడం ఒక్కొక్కప్పుడు కథలయొక్క విలక్షణత. ఒక్కొక్కప్పుడు అంశాలు చరితలో మాదిరిగానో, శాస్త్రంలో మాదిరిగానో కొంత దూరం చెప్పి అనుకూల వాతావరణం, కల్పనకావడంతోనే ఒక గీతిక నతికిస్తాడు రచయిత - ఏలా అంటే - “పైడయ్య దరిద్ర దేవత” అనే కథ ఒకటి

నేను వ్రాసిన వేమిటంటే కథలు కనికొండల వేంకటరావు 1619 వుంది. అందులో బంటావాళ్ల జీవితం, వాళ్ల (త్రాగుడువల్ల కలిగే వ్రైపరీత్యము అతి వాస్తవికంగా చెప్పబడుతుంది. కాని శిల్పం పాట వల్లనే పోషింపబడుతుంది. ఎట్లా అంటే పైడయ్యగాడనే బంటావాడు ఎక్కడికో పోవాలనుకుంటూ వున్నాడు. పోవాలనుకుంటూ గుడిసె యీవలకు వచ్చి ఆకాశం కేసె చూచేడు. “ఓరబ్బో ఏం ఎండ! మండుకు పోతూందే!” అనుకొన్నాడు. గుడిసె యీవలనున్న తన గునపం మీద చెయ్యివేసి చూచేడు. “ఓంమ్మా! చుజ్ణుమంటున్నది. కొలిమిలో ఎజ్జమడ్డాదానికిమల్లే! ఉం-” అనుకొన్నాడు. “ఎన్నాళ్లు పాటడ్డ యీ గునపమే మిగులు ఎందుకుర యీ జన్మమోరన్నా! కంటరాక్టరు మేడ కలకటేరు ఓడ కట్టుకుసి ఎంచక్క సౌఖ్యపడుతూవుంటె ముందూరు ఏదంచు మోసపోయీ మనకు ఎందుకుర యీ జన్మమోరన్నాో అని పాడుతూ దిక్కులు చూచేడు. గవల్లోరి అడపడుచు పాశాలమ్మ కుజ్జగుంట, పదాజేళ్లది. ఆకుజోడు కాళ్లను, ఈడిముంత చేతను - ఆ పాట వినో వినకో వరసకు “పయిడయ్య బావా! ఆల్లాజగట్ల వెల్లిపోతారుకామోసు!” అంది. పయిడయ్య చూచేడు కళ్లెత్తి, తన ఒళ్ళూ తానూ మజచిపోయేడు. “ఎండ సెగలూ చెరుగుతున్నా ఈడి ముంతకు వేడి లేదు, కల్లుముంతకు కాకలేదు, గంవళ్ళోరి పాశాలమ్మ కళ్ల చలవకు తిరుగులెడు.” అని పదమ్మార్చి గట్టిగా పాడి, “వళ్లముందు నీక్కనమడే వెడతానో మజదలా" అన్నాడు. “అయితే నీ వొచ్చేదాకా కూకుంటాను చప్పున రా! అంది.

1620 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఈ పద్ధతిలో వుండే విశిష్టత ఏమిటి అంటే సర్వసామాన్య సంభాషణంలో మధ్యన ఊహను రేకెత్తించే గీతిక లమరివుండడమే అని నా మనవి. ఆ గీతికలను జాగత్తగా పాడుకొంటూ, అనువదించుకొంటూ వుంటే, కథ కప్పదాటులు దాటుతూ కడకంటా కవ్విస్తుంది.

._ ఒక కథలో గారడివాడు, ఒక సాహేబు తన ఐందదజాలం అంతా ముగించి డబ్బులుకోసం అడుక్కుంటాడు. “అడుక్కున్నాడు" అని వ్రాస్తే ఏముంది కనక

  • పళ్లెంపుచ్చుకు తిరుగుతూ పాడేడు అని అనడంలో అందంవుంది కాని.

“పొద్దుకూకొస్తోంది - ఎద్దాపెసాంబుండు సాంబు డెద్దూదిగితె - సంబరంబే లేదు - అడుక్కో అడుక్కో” (ఇందు సూచన సాంబశివుడు ముష్టైత్తుకునేవాడని) “షూర్యుని మర్గాయే - షోహం ఉడాజాయే షోహం వెళ్ళిపోతే - షుంగారమేలేదు - వడుక్కో వడుక్కో” (ఇందు సూచన జందెం వడుక్కో పేదబాపనయ్య) “సందెలడిపోతూంది - సాహేబుండబోడు సాహేబెల్లిపోతీ - సంసారమేలేదు - లడికో లడికో”" (ఇందు సూచన స్వార్థం) “లడికో లడికో అనడంలో ఓ పిల్లకేసి చూపు - ఆ చూపుకే ఒక కూలిపనిచేసికునేదాని చేతినుండి ఒక కొత్తకాసు ధర్మం. “అంతకూ చల్లని వడగన్నట్టు పడి తూలింది అంచుమీదినుంచి మధ్యకు ఒక కొత్త కాసు" అని ఆ పనిమంతురాలి ఎముక లేనిచేయి చూపిస్తాడు కవి. వెంటనే సాహేబు “ఈ రాగివేసినా సెయిగలతల్లికి సలాం! సలాం! కలకాలం ఆ కాంతకు కనకం సలాం!1సలాం!” అని ఆడిపోయేడు. మరోఅప్పుడు కథ గీతికతో ప్రారంభమౌతూ మనలను జిజ్ఞాసపాలుకావిస్తూ, కొంత తడువు ఆపి కథ చదివిస్తుంది.

నేను ద్రాసెన వేమిటంటే కథలు. కవికొండల వేంకటరావు 1621 “దొక్కా చిరిగిఆె, దర్జీ కుట్టు జోడూ చిరిగెతె, గొడారి కుట్టు ఒక్కీ చిరిగితె, కుట్టే దెపడు?” అని అడుగుతూ. అయితే ఈ కథల్లోవుండే ముఖ్యవిశేషం “నిర్మాణపథకం”. అది నేర్వాలి సర్వులూను మునుముందు. అది ఒక గీతలమధ్య కొలతబద్ద పెట్టి, ముందు అమర్వ్చుకొన్న గడులమధ్య పెరిగిన బొమ్మగా తలపోయకండి. అది జీవకణం ఏలా పెరిగి, క్రమక్రమముగా అభివృద్దిఅవుతూ పరిపూర్ణస్వరూపం, దానియొక్క ఆశయం ద్వారా వెల్లడిచేస్తూవుంటుందో, అలాగే కథ అన్నదికూడా మాట తరువాత మాట, పంక్తి తరువాత పంక్తి కనిపిస్తూ, దానంతటది అంతర్వాహినీ (ప్రవాహాన్ని పరిపుష్టకంటూ, తుదకో వివేకమో, వినోదమా నిరూపిస్తుంది. ఉదాహరణకు “గానుగెద్దూ" అనే కథ తీసుకు చూద్దాం. ఆలుకుల సత్తయ్య అనే అతసు అప్పుల్లో పడిపోతాడు. ఆతనిమీదను పససయ్య అనే బ్రాహ్మణ వ్యపహర్త డిక్రీపొంది అతగాడి గానుగెద్దును జప్పుచేస్తాడు. జప్పు చేయించి ఆ యిద్దును తన యింటికి తోలి ఇప్పంచి. దొడ్లో కట్టేయించుకోగా, ఆ యుద్దు కసపడదు. సత్తియ్యకు గత్యంతరంలెక రాత్రిపూట తానే గాసుగు తిప్పుతూపుంటాడు ఎద్దులా లాగుతూ! ఈలోపుగా పనసయ్యగారి కొడుకు, అదిపఅకు గానుగుమీద కూర్చుని ఆలకపిండి తినడం అఅవాటుపడివున్న కారణంగా, ఈ యెర్దును తన తండ్రికి ఆలియకుండా గానుగుకడకు తోలుకెడుతూ పాకముం దుంటాడు. లోపల గాసుగు తిరిగుతూపున్న శబ్రం అవుతూనేవుంది ఎద్దులేకపోయినా! పనసయ్యు వెంటవెంటనే తనకుజ్ద డా యొద్దుసు తోలుకునివెల్లాడు అని ఆలుసుకుని తాను వెంటాడించినట్టు వెళ్లి, ఎద్దు లేకుండానే లోపలఅయ్యే కిర్రువిని - ఎవరు లాగుతున్నారు గానుగు? అని అడుగుతాడు. కొడుకు కొంచెం తొంగిచూచి "లేదు సత్తెయ్య వొక్కడే గానుగు లాగుతున్నాడు! పాపం! గానుగు లాగుతున్నాడు" అన్నాడు. ఆ మూటలో లోకానికి కాయకష్టదేవత (ప్రత్యక్ష భ్రైుంది అని తుది నిరూపణ గావిస్తాడు రచయిత. ఆ కథకు “భారతిలో ధాత సంపత్సర జ్యేష్రమాసమందు "ఏర్దవి "రండు బొమ్ములువేస చూపెలచారుఎడిటర్‌గారు. కథ నువుగింజతో పాఠరంభమపుతుంది. ఇలాగ్గానే ఆ యా సర్మాణాల్లో వున్నటువంటి సన్నివేశ వైదముత్యాన్ని గహిస్తూ

1622 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అర్థంగావించుకుంటే, పెద్దపెద్ద బొమ్మలు కాగితమ్మీద చూడ్డమేకాకుండా మనస్సుల్లో కట్టుకుతీరుతారు. అదేనా లోకం అని గ్రహిస్తారు.

ఈ కథలు నేను వ్రాసినవి లెక్కిస్తే మూడువందలవజకు వుంటాయి అన్నాను. ఇప్పటికీ శైలిలోగాని, శబ్బజాలంలోగాని, సన్నివేశప్రాప్పిలోగాని ఏమైనా

' సర్వసామాన్యసిద్ధాంతం దొజుకుతుందా అని విమర్శించి చూచాను. నాకు

నేటివజకు దొజకలేదు ఒక్క పరిమాణంతప్పిస్తే. అన్నింటినీ “చిన్నకథలు” అని పిలవవచ్చును. మజిన్నీ అన్నీ వచనంలోనే వెలువడ్డాయి - అక్కడక్కడ మధ్యను బొడసూపే గీతికలు తప్పిస్తే. కాబట్టి ఒక విధంగా వానిని “వచన ఖండికలు” అని పేర్కోవచ్చును. “చిన్న కథి అన్నదిప్పుడు ఒక విశిష్టమైన సారస్వతశాఖగా ఏర్పడిపోయింది. కాబట్టి చదువతగ్గదే అని తాత్పర్యము. కాని పుస్తకరూపం దాల్బడంలో ఏవొక్క కథ ఒక పుస్తకం కానేరదు. ఒక్క పుస్తకం కావాలీ అంటే పదింటినో, పంఢడెండింటినో గుంపుగా గూర్చి సంపుటిగా (ప్రకటించితీరాలి. అప్పుడు వేరువేరు తరహా కథ నొక్కక్కదానినే ఎంచి కథే చూడడమా లేక “ఒకమాదిరి గుంపు ఇది అని ఓ పదింటిని ఏర్చి చూపడమా అని, ఏది మంచిది అని ఆలోచించాను. కడకు రెండవపద్ధతే మెజుగనిపించింది. ఆ విభజనలో కొన్ని కొన్ని కథలు ఒక (తాటిమీద, కొన్ని కొన్ని కథలు ఒక తాటిమీద నడిచేటట్టు బోధకువచ్చాయి.

ఉదాహరణము - కొన్ని నెలలక్రిందట ప్రచురితమైన “పెనుమంచిలి జైనదేవుడు” మున్నగు పదికథలు తీసుకుందాము.

చాలాభాగం అవన్నీకూడా దేవాలయాలకు సంబంధించినవి అయియున్నాయి. ఈ సర్వసామాన్యతత్వం ఏ కథ నా కథగా వేజ్వీజు పత్రికల్లో అప్పటప్పట చూచినవాళ్ళకు గోచరించదు. కవినైన నాకు తెల్లమవుతూవున్నా మథిన్నీ రచనలయొక్క తారీఖులనుబట్టీ తోచదు. ఆయా స్థలములయొక్క దూరభారాలనుబట్టీ తట్టదు. అనగా అవన్నీ ఒక రోడ్డేగాని, ఒక రైలెక్కి ఒక దిక్కుగా వెడితేగాని కనబడేవికావు. కాని పుస్తకం మొదటినుంచి తుదివజకు చదివితిమా అవగాహనకు వచ్చేది ఒక వింత దృక్పథము, ఒక వివేచనాశక్తీని. [గంథం మీలో చాలామంది

నేను వ్రాసిన వేమిటంటే కథలు. కవికొండల వేంకటరావు 1623 ఈమధ్యనే చదివివుంటారు కాబట్టి విమర్శ పాొడిగించ నవసరం వుండదు. కొత్త చైతన్యం, కొత్త వికాసం పెంపొందితీరుతుంది - ఎంత కాదంటూవున్నా.

“పెనుమంచిలి జైనదేవుని" కథలోని కీలకం అంతా ఈ సంభాషణలో వుందని నా అభిప్రాయం. అంతా కొత్తగా వెలిసిన దేవుడంటే మీరు పప్రాతవిగ్రహం, రెండు మూడువేలయేండ్ల [క్రితపు దనండి! ఇదా మీ పరిశోధనా? ఇంతసేపూ మీ పరకాయింపూను? అంది. నే నామె కళ్ళల్లోకి నాదొక చూపు విసరి, వంగుని బిందెతో నీళ్ల్తుముంచుకుంటూ “నూతన వధూవరులు, నూతన వధూవరులు అని పెల్లికాలమందు అభినందిస్తూవున్నగానీ, దాంపత్యము పూర్వజన్మసుకృతమని, పూర్వజన్మంలోని లక్ష్మీనారాయణులే యిప్పుడీలా వెలిసినారని కొనియాడరూ?” అన్నాను.

కాని రెండపకథ చదవడంలో “పెరుమాళ్ళ స్తంభానికి ధ్వనిలేని రోజులుకూడా

వున్నాయి" అనే తీర్మానానికి వస్తాము. జన్మరాహిత్య మైన నిశ్శబ్దంలో విడిచిపోతాము. వవూడవ కథలో మోహాన్ని గురించిన విషాదంతొలగి వివేకంగొంటాడు సన్యాసి. నాల్గవ కథలో కవి చేసుకుపోయే కొంతదారిలోవుండే ఆనందం ప్రకృతిగుండా చూపిస్తాడు. ఆయిదవ కథ ప్రకృతికి, పురాణానికి వుండవలసిన సామరస్యం బోధిస్తుంది. ఆరవ కథ అమాయకమైన పరిధ్యానాన్ని సూచిస్తుంది. 7, 8, 9, 10 కథలు దేవుళ్ళకూ మనుష్యులకూవున్న తారతమ్యాలు సామ్యాలు దీప్తిమంతంగా జూపెడతాయి. ఇలా విభజించుకొని వివేచనతో పరిశీలిస్తే కొన్ని కొన్ని కథ లొక్కొక్క గుంపుగా సాంపుచూపింపగలవని నా నమ్మకం.

ఆ విధానాన్నే ఈ పుస్తకా లచ్చుపడుతున్నాయి. నవలలా ఏకగంథముకాదు అంతాను. కాని సర్వసామాన్య మైన ఒక భావం మీద ఆధారపడి కొన్ని కొన్ని కథలు అప్పటప్పట ఉత్పన్నమవడం మీరు కనుగొంటారు. అప్పుడువచ్చే (ప్రతిబంధకం; కొందజికి కొన్ని తరగతి కథలు నచ్చి, కొందథతీకి కొన్నితరగతి కథలు నచ్చక పోవచ్చును. అన్నీ అందజకూ నచ్చేటట్టు (వాయడమనేదికూడా కష్టం. “పూజాపుష్పాలు” అని వొక కథ వ్రాశాను. ఎందుకు వాశానో నాకి ఆలియదు.

1624 పందిరి మల్లికార్జునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చదివితే అందజికీ అడుగడుక్కీ శంకే! కాని సాక్షాత్తూ సర్వేంద్రియాలు పట్టుతప్పిపోతాయి. కథంతా చదవండి! ఏమీ అనుకోకండి! “విడుపువ్వులో సొగసు పడుపువ్వులో సొగసు నిడుపాటి గీతగా నే గీసికొనులో చేతు లమిరేని; ॥ ముఖము మెజసేని; నడుము కాలు కీలు - అదె ప్రవర్తనగాగ అందె పరివర్తనం అందుకొని సాగ.” (కిన్నెర: సంప్పుటము శీ, సంచిక 11, నవంబరు 1952) గ్‌ శ్ర, న్వు శ య్యూథ జవ న న [10 ////111 .

యుంకి పాటలు: వ్యాఖ్య బెల్లంకొండ రాఘవరావు

రమైనక జల్మములోన యెవరమోనంటి

సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి!

ముందు మనకేజల్మ ముందోలెయంటి

తాల్లతలపోయింది పిల్లనా యెంకి

యొున్నాళ్లు మనకోలె యీ సుకములంటి =

కంట నీరెట్టింది జంట నా యొుంకి”.

“యనక జల్మములోన యెవరమానంటో: నాయకుడు సంపూర్ణ రసావేశస్థితిలో నుండి వేసిన (ప్రశ్న ఇది.

“పేయసీ! ఈనాడు మనము ఈవిధముగా శృంగార రసవీథులలో నిరంతర నిరాఘాట సంచారం చేస్తున్నామంటే, ఇంతటి మహాభాగ్యం కలగడానికి పూర్వజన్మలో ఎవరముగా నుంటిమో! రంభానలకూబరులుగా నుండి ఏ శాపవశంచేతనో ఇట్లా పుట్టి ఉందుమా! నాక్ర నీవూ, నీకై నేను కావించిన రసతపస్సు పరిపక్వ మై మనకీ జన్మలు లభించి ఉండునా? ఏమైనా అఖండ పుణ్యఫలంగా లభించినది ఈ మన కలయిక” అని నాయకుని భావం ఆ ప్రశ్నవేయడం - ఆ ప్రశ్న శృంగార రసస్పోరకమైనది కావడంచేత నాయికకు తదనుగుణమైన అసుభావం కలిగి “సగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి" - ఆ సవ్విన నాయిక “సిలక”,

ది పలలద్రనరాపు తబయంత. సంపుటము 42 సాహిత్యము.

1626 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

“ముందు మనకేజన్మ ముందోలెయంటి" - నాయకుడు తొలి రసావేశస్థితిలో నుంచి ఒక మెట్టు క్రిందికి దిగాడు. ఆ మైకం కొంత విచ్చింది. “ఎ పూర్వపుణ్య విశేషంవల్లనో ఈ దివ్యానుభావం ఈ జన్మలో లభించింది. కాని ఎంతటి పుణ్యమైనా ఉపభుక్తమై క్షయించక తప్పదు - కోశంలో నిలవచేసుకొన్న ధనం వ్యయించిన కొద్దీ తరగక తప్పదు. నేటి భోగానుభవం మూలంగా పురాసుకృతరాశి క్షయించిన తరువాత మనకు ముందు జన్మలు ఎట్టివి లభించునో? ఈ గాఢ (పణయ జీవితం ఈ జన్మతో ముగిసి ముందు జన్మలో నీదారి నీది నాదారి నాది అవుతుందా?” అని నాయకుని విచారం. (ప్రథమ స్థితిలోని ఉత్సాహరేఖ ద్వితీయ స్థితిలో విషాద కబళితమైంది - కాని ఆ విషయం తత్త్వ విచారాత్మకమైంది కావడంచేత యొంకి అమాయిక బుద్ధికి అందినదికాదు. అందుకే “"తెల్లతెలపోయింది పిల్ల నాయెంకొ

  • ఆ స్థితిలో యెంకి “పిల్లొ అంటే అమాయిక అని.

“యెన్నాళ్ళు మనకోలే యీ సుకములంటొ. నాయకుడు ఇంకా ఒక మెట్టు భూమిమీదికి దిగాడు. మొదటి రసావేశం తత్త్వ విచారంగా పరిణమించి చివరకు సద్యస్థితిని గురించికూడా సంశయగ్రస్త మైంది. “పూర్వ జన్మలలో - నీవు కాకపోతే నేనే అనుకో - పుణ్యమే సంగ్రహించామని ఏమి నమ్మకం? ఆ సంగ్రహించిన 'పుణ్యలేశం భుక్ష్తమైన తరువాత ఏ క్షణంలో ఏ దైవదుర్విపాకంవల్ల మన ప్రణయ జీవితానికి ఎట్టి అవాంతరం వాటిల్లనున్నదో! లోకంలో ఎందరి జీవితాలలో అట్టి విపరీత పరిణామాన్ని మనం చూడడంలేదు? కడదాక గడిచి (బతికిన వారెందరున్నారు? మనమైనా మానవమాత్రులమేకదా? నాయకుని భావవీథిలో విషాదచ్చాయ పూర్తిగా అలముకొన్న స్ధితి అది. ఈ మూడవ భావం భయావహమైంది కావడంచేత యొంకి గ్రహించగలిగింది. అందుకే “కంటనీరెట్టింది జంట నా యెంకి ఇక్కడ యెంకి “జంట”, అంటే నాయక గత జీవి అని భావం. “చిలకా, “పిల్ల”, “జంట” అనే పదాలు ఆయా స్థితులకు ఉచితములైన సార్థకోక్తులు -

సంసారంలో అనుభవించే సుఖదుఃఖాలు పురాకృత పుణ్య పాప ఫలితాలనిన్నీ ఎంతటి భోగికైనా తన భోగం అత్యంతంగా నిలవగల దనుకోవడం అవివేకమనిన్నీ; దుఃఖాన్ని నివారించుకొని సుఖాన్ని పొందాలంటే సంసారి నిరంతర పుణ్యశీలి కావాలనిన్నీ ఈ గేయం ఉపదేశిస్తున్నది. ,

యెంకి పాటలు: వ్యాఖ్య _బాల్లంకొండ రాఘవరావు 1627

“గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు

మనిసికైనా లేని మంచి పోకిళ్లు.

యెొంకితో కూకుండి యింత సెపుతుంటె

తనతోటి మనివల్లె తల తిప్పుతాది.

'యంకి సరసాలాడ జంకుతావుంటె

సూసి సూడక కళ్ల్తుమూసి తెరిసేది.

కూరి కూకొని నేనె పోరుపెడుతుంటె

తల్లిడుపు పిల్లల్లె తెల్లపోతాది”

ఈ గేయంలోని వాచ్యార్థం తెలుస్తూనేవున్నది. అయితే ఆ వాచ్యార్థం ఆధారంగా ప్రతీయమానం అయ్యే వ్యంగార్థమే ఈ గేయానికి కాంతాసమ్మితమైన ఉపదేశ యోగ్యతను కల్పిస్తున్నది. కేవల వాచ్యార్థంలో రంజకత్వమూ చమత్కార జనకత్వమూ గోచరించవు. వాచ్యార్థవ్య క్తి కాగానే దాన్ని అత్మికమిస్తూ దానికంటే విలక్షణ రమణీయతాస్ఫోరకమైన వ్యంగార్థం చర్వణమూలకంగా సహృదయునికి సాహిత్యభోగాన్ని చేకూరుస్తుంది. వ్యంగార్థప్రతీతికి కీలకపాయమైన శిల్పరహస్యాన్ని సహృదయుడు రసచక్షువుతో (గ్రహిస్తాడు.

ఈ గేయంలో వ్యంగార్థ ప్రతీతికి కీలక్సపాయమైన వాక్యం “గోవు మాలచ్చిమి” అనేది. గోవే లక్షి - ఇది రూపకోక్తి. గోవు సత్త్వగుణపప్రధానమైన జంతువు. సంసారికి పరమోపకారకమైనది. ఆర్షసంప్రదాయంలో గోవుకు గల స్థానం (ప్రసిద్ధమైనది. స్థితికిన్నీ ఐశ్వర్యానికిన్నీ అభ్యుదయానికిన్నీ అధికార దేవత లక్ష్మి.

ఈ గేయంలో ఆద్యంతము అనుస్యూతంగావున్న వ్యంగార్థమును (గ్రహించడానికి “గోవు మాలచ్చిమి" అనే జక్తిని సర్వార్ధ హేతుకమైన ఒక మహాభావానికి సంకేతంగా అన్వయించుకోవాలి. ఆ మహాభావం ధర్మం.

ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనేవి మానవుడు సాధించదగిన నాలుగు పురుషార్థములు. అందు మొదటి మూడు (పపవృత్తికి చెందినవి. మోక్షము నివృత్తికి చెందినది. సర్వసుఖానుభవమే కామము. దానికి మూలము అర్థము. అనగా సుఖహేతుక వస్తుసంపాదనమే అర్ధము. అర్థకామములు ఆధారాధేయము లన్నమాట. అయితే అర్ధకామప్రవృత్తులకు ఒక నియమరేఖను శాసించేది ధర్మం.

1628 పందిరి మల్లికార్డుసరాపు శతజయంతి. సంప్పుటము 4: సాహిత్యము అర్థకామప్రసక్తమైన మానవ జీవితంలో అపగుతులను పరిహరించి, సామరస్యాన్ని కల్పించి మానవుని అభ్యుదయ నిశ్శేయస (క్రమప్రాప్తికి హేతుభూతమైంది ధర్మం. అర్థకామములు ధర్మ రేఖను అతిక్రమిస్తే అనర్థహేతుకము లపుతాయి. ధర్మ విధేయములైన అర్థకామములే పూనవునికి ఉపాడెయములు. కాగా మానవుడు ధర్మవిహితంగా అర్థకామాలను సాధించినప్పుడే నిజమైన పురుషార్థి కాగలడు. ఈ ధర్మప్రభావం వస్తుధ్వనిరూపంగా ఈ గేయంలో ప్రతిపాదించబడింది.

“గోవ్సు మాలచ్చిమికి కోటి దజ్జ్ఞాలూ ధర్మదేపతకు నమోవాకములు అని. తరువాతి వాక్యంలో ధర్మవిశిష్టతను పప్రతిపాదిస్తున్నాడు. “మనిసికైనా లని మంచి పోకిళ్లు” సర్వజంతుకోటిలో వివేచనా శక్తి కలవాడు మనిషి. కాని మనిషిలోని మనస్సు నిత్యమూ రాగద్వేషాది ద్వంద్వములచేత సంక్షుభితమై ప్రవర్తిస్తుంది. కాబట్టి మనస్సు “పోకిళ్లు ఎప్పుడూ “మంచివో అని చెప్పరాసివఏి. “మంచి అనగా తాత్కాలిక రుచ్యారుచ్యములసు పాటించని “పరమహాతం౦” అని భావం. అట్టి పరమహితాన్ని బోధించగలది ఒక్క ధర్మమే - అందుకే “మనిసికైనా లేని మంచి పోకిళ్ల” ధర్మానివి.

“యెంకితో కూకుండి యింత సెపుతుంటే,

తనతోటి మనివల్లె తల తిప్పుతాది” తాను యెంకితో ఏవో ముచ్చట్లు చెప్పుతూ సరస సల్లాపాలు ఆడుతూ పుంటే ఆ గోవు అవన్నీ తనతో చెప్పుతున్నట్టుగా తల త్రిప్పేదట. అంటే ఆ దంపతుల కామవృత్తులను ధర్మం గమనిస్తున్నదని భావం- “తల తిప్పుతాది” అనే ఉక్తిలో ఆ కామవృత్తులు నియతములు కావడంచేత ధర్మదేపత వాటిని ఆమాదిస్తున్నదని భఖావం- “మునివి అనే ఉక్తిలో నాయకుడు నాయికతో ధథర్మవిధేయుడై వ్యవహరిస్తున్నాడని భావం - గోవులకు సహజలక్షణమైన ఈ “తలతిప్పడాన్ని” ఆలంబనగా తీసుకొని ఈ భావాన్ని వ్యంజింపచేయడం కవి ప్రతిభకు ప్రమాణం.

“యంకి సరసాలాడ జంకుతావుంటే

సూసి సూడక కన్ను మూసి తెరిసేదొ” శృంగారకలాపంలో పురుషున కున్నంత ఉచ్వేగపప్రకటనమూ, సాహసమూ స్త్రీకి ఉండడు - అందులో కులస్త్రీ సామాన్యంగా రసోవ్వగ్న అయికూడా ముగ్రతావృత్తినే అనుసరిస్తుంది. యుంకికి సరసాలాడవలెనని కుతూహలమే. కాని ధర్మభంగ ఛీతిచేత జంకు. అట్టి జంకు కులస్త్రీల కుండవలెనని ఉపదేశరూపకమైన వ్యంగ్యం

యెంకి పాటలు: వ్యాఖ్య. వాల్లంకొంద లాఘనరావ్టు 1629 ఈ వాక్యంలో ద్యోతకమవుతున్నది. అయితే ధర్మం కామవిరోధి కాదు. “ధర్మావిరున్దమైన కామాన్ని నేస అని గీతలో భగవంతుని వాక్యం. సూసి సూడక: కళ్లు తెరిస్తే యింకి సరసాలాడ మానుతుందేమోననీ; కళ్లు మూస్తే ఆ సరసాలను చూచి అసందించే అవకాశం జారిపోతుందనీ, ధర్మదేవత ఆందోళన. అందుకే చూచీ చూడనట్టు కళ్లుమూసి తెరవడం. అంటే నియతమైన కామప్రవృత్తియెడల ధర్ముదేవతకు పూర్ణానుగ్రహమని భావము. “కూరి కూకొని నేనె పోరుపెడుతుంటె తల్లిడుప్పు పిల్లల్ల చెల్లపోతాది” ఎంత కూర్మిగల సంసారంలోనైనా అప్పుడప్పుడు పారుపులు రాకపోవు - అట్టివి యంకి సంసారంలోకూడా వచ్చేవి. అయితే వాటికి కారణం నేనే అంటాడు నాయకుడు. “కూరికూకొని” అంటే నిర్నిమిత్తంగాసని భావం. ఆ పొరుపులకు తన ఉద్వేగమూ, చిత్తవికారమూ హేతువులుగాని యెంకి దోషముకాదు. వారి దాంపత్యసుభానుభూళతిక్‌ భంగకరములైన పోరులసు ధర్మదేవత సహోంచదు. గార్హస్తశ్రచే ధర్మప్రచారానికి ఏకైకాలంబనం. అక్కడే ధర్మ రేఖ సర్వతోముఖంగా వికసిస్తుంది. అట్జిచోపి అపనృతీవైరస్యమూ కలిగితే ధర్మానికి ఆశయమే ఉండనేరదు _ అందుకే "తల్లిడుపు పల్లల్లె ఆల్లపోతాది" - “ఆల్లపోతాదొ అసడంలో అట్టి సంసారంలో పోరులు పొసగడం ధర్మ దేపతకుకూడా ఆశ్చర్యజనకం అని భావం. దంపతులకు థర్మవిహితమైస కామాసుభవమే ఉపాదేయమనిన్నీ; అట్టె కామాసుభపం డూషశ్టం కాకపోగా కళ్యాణ హేతుక మనిన్నీ; దాంపత్య జీవితంలో అప(ణశుతులను వైరస్యవములను ఆప్రవుత్తతతో పరిహరించుకొంటూ ధర్మకామసాసురస్యమును నిర్వహించడమే సర్వపురుషార్ధ ప్రదమనిన్నీ ఈ 'గేయంలోని పస్తుధ్యని. (క్‌న్నెర: సంపుటము +, సంచిక 11. నపంబరు 1952) ఎ. మయ యా టట నే..దుంలరూ.. టలు

ఇల్లీ లైలా మజ్నున్‌ అసలు కథ యా పారనంది జగన్నాథస్వామి

(1140-1202లో నిజాం ఉద్దీను అనే పెర్షియన్‌ కవిశేఖరుడు ెర్షియా ప్రభువు కొలువులో మాననీయుడై ఉండెను. శృంగార సాహసరసములతో అల్లబడిన కల్పితకథలు వాయడములో (పప్రఖ్యాతిగాంచినాడు. ఇతని కథలలో పేరుబడినది ఈ లైలా - మజ్బ్నున్‌ కథ. ఇది అసలు పద్యకావ్యము. రసవంతమైనది. దీనిని సినీమాలోనికి తీసుకొనివచ్చినవారు కథను చాలా మార్చినారు. కాబట్టి మూలకథను ఇక్కడ పొందుపరచుటకు ముఖ్యోద్దేశము ఆ కవి రచనను ఈ సినీమా కల్పనను విమర్శకులు సంప్రతించగలరని.) . లైలా రజనీ ముకాఫలం!

తూద్పదిక్కన ఆకాశమండలమును అలంకరించు చందునివల ఆకర్షించు సౌందర్యము కలది. రాత్రి వీచే మలయానిలములో ఊగే తమాలవల్లివల నాజూకుగాను, కోట్ల నక్షత్రముల కాంతిలో మెరిసే వజపు తునకవల రమ్యముగాను, శోభిల్లు లలామ. గాఢ తమోరాశులవలె నిగనిగలాడే శిరోజములు; (వభాతిశయముతో అల్లబడిన నేత్రములు; తేజఃకిరణాలను ప్రసరించే చూపులు. ఆమె హాసాన్న విడే బింబోష్టములు ఉషషండములా అని (భమింపజేస్తున్నవి. శృంగారము ఆమెలో (పాదుర్భవించగానే, ఆమె (ప్రియుని హృదస్థలమున నలగడానికి స్వర్గలోకంనుంచి తంపితెచ్చిన గులాబీ అని అందరికి కనబడింది. గులాబీ - ఆ - కృశించి, (వాలిపోయి, తుదకు నశించిపోవడానికా! పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

లైలా మజ్బున్‌ అసలు కథ పారనంది జగన్నాథస్వామి 1631

అంధకారమునుండి వచ్చింది, లైల, అనుపమ సౌందర్యరాశి; జోతిష్టులోనికి వెళ్లిపోయినది. ఆమె (ప్రేమకథను ఆమె గోరీ మీదనున్న తమాలవృక్షానికి శోకము వెలిబుచ్చి మారుతము చెప్పుతున్నప్పుడు, ఆకాశవీథినున్న నక్షత్రములు ఎక్కువ (ప్రకాశవంతములై (క్రిందికి చూచినవి; చూడు, మీదికి చూడు. లైల కూర్చున్న చోట చీకటిలేదు. జ్యోతిష్‌ ప్రకాశిస్తున్నది. శోభ వెదజల్లి ఉంది. చూడు “లైల నశించిపోలేదు. మాలో పుట్టింది; మాలోకి వచ్చేసింది" అని పలికినట్లు ఆ నక్షత్రాలు ఒక్కమారు వెలిగినవి.

చంద్రుడు ఒక్కడే అయినా, క్రిందవున్న అన్ని నదీజలాలలో ప్రతిబింబించినట్లు లైల సౌందర్యము అందరి హృదయాలలో శృంగారాన్ని మొలకెత్తించింది. లైల తండ్రి ఒక అధిపతి; అతని దర్శనార్థము లైల లాలిత్యఖ్యాతిచే ఆకర్షితులై అనేక (ప్రభువులు వస్తూ ఉండిరి. కాని ఎవరూకూడా ఆమె హృదయాన్ని ఆకర్షించలేకపోయిరి. ధనముగాని రాజరఠీవిగాని గెలుపు పొందని చోట, యోమన్‌ (ప్రధాని పుతుడు కయన్‌ విజయము పొందినాడు. అడగకుండానే వాని సొత్తు అయింది ఆమె [ప్రేమాగారము.

లైల తండ్రిన్ని కెయస్‌ తండ్రిన్ని స్నేహితులుగా ఉండలేదు. వారిద్దరి మధ్యనున్న మార్గము రణభూయిష్ట మైయున్నది; తమ పూర్వుల కాలములోవల సాక్షా త్తుగ యుద్గవములలో దిగియుండకపోయినా, అప్పుడప్పుడు యాత్రాస్థలాలలోను ఉత్సవాదులలోను ఒకరినొకరు పలుకరించుకొన్నా వారి చూపులుమాత్రము ద్వేషమునే సూచిస్తూ ఉండెను. అట్టి ఉత్సవములలో ఒకమారు లైల కయసుల చూపులు కలిసినవి. ఒక్కమాటైనా పైకి రాకపోయినా, వారి హృదయాలను మదనుడు వశపరచెను. ప్రథమ దర్శనమే (పేమగర్భితమైనది.

ఆ నిమిషమునుండి కయస్‌ మారిపోయినాడు. వేటకా వెళ్ళడు; మాటా ఆడడు. సభలోగాని విందులలోగాని మౌనము దాల్చి ఉండేవాడు. కాని నేత్రములు ఒక అద్భుతకాంతితో ప్రకాశిస్తూ ఉండెను. తన సహచరులలోని యువతీయువకులు, ఎవరూ కూడా వానిని ఉల్లాసములోనికి మరల్చలేకపోయిరి. అతని హృదయము మరొక గృహములో చిక్కుకొని ఉండెను; ఆ గృహము తన వంశమునకు విద్వేషునిది.

లైలా ఎల్లప్పుడూ అధోదృప్టితో విషణ్ణురాలై ఉండేది. ఆమె అనుచారికలు ఆమెచే ఒక్కమాబైనా చెప్పించలేకుండిరి. వారిలో ఒకర్తి సూటిగా ఆమె వేదకారణాన్ని గ్రహించి, ఆమె విపంచిని మేళవించి, శశాంకసమక్షాస నిర్రరసీమవర్ద,

1632 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము విపిన మధ్యను ఏకాంతమున కౌగిలింతలలో కాలము గడిపిన (ప్రేమికుల పాటను పాడింది; ఐల ముఖము ఎత్తి పాటను ముమ్మారు పాడించింది. సూర్యాస్తమయమైన తరువాత తన ఉద్యానవనమందు ప్రాసాదానికి దూరముగా ఒంటరిగా వెళ్లినదారినే వెళుతూ చుట్టిచుట్టి తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఉద్యానవనమునుండి దానికి అత్తియున్న వనములోనికే వెళ్ళినది. చంద్రకాంతితో అడవిదారులు మెరుస్తూ ఉండెను. ఆ వెలుతురులో పెద్ద చెట్లమధ్య జారి ప్రవహిస్తున్న నిర్ణరప్రవాహము కంటపడింది. తన పరిచారిక పాడిన మధుర గీతములో అనశ్వర ఖా్థతిపొందిన నిర్ణరము ఇదే అని ఆమె నిశ్చయించింది. అక్కడనే ప్రణయినులు అనేకులు తను (పేమగ్రంథిని దృఢపరచుకున్నారనే గాథలు ఆమె జ్ఞప్తికి వచ్చినవి. వెదికి వెదికి ఈ స్థలానికే చేరగలిగినందుకు ఆమె గుండె ఠల్లుమనినది. శరీరము వేడిఎక్కి, బదరిన లేడివల నాడిత్వరితముగ కొట్టుకొనుచుండగా, ఒక విధమైన సిగ్గుతో లైల కోటలోనికి పరుగెత్తి పారిపోయినది.

మేడమీద గదిలో పాన్పు పై పవ్వళించి కిటికీలోనుండి వృక్షశీఖరాలను చూస్తూ కాలము గడుపుతూఉండగా రెండు తెల్లని పావురములు శృంగారములో ఉంటూ కంటపడినవి. అవి తాను పెంచినవి. ఆమె భుజములపై కూర్చొని ఆమె చెక్కిళ్లను ముద్దుగా పొడుస్తూ, కూకూ మని పాడుతూ, రెక్కలతో గెంతుతూ ఆటలు ఆడే పెంపుడు పావురములు అవి. ఆమె పిలుపుకు వచ్చి ఆమె చేతులనుండి ఆహారము తిసు అలవాటు గలవి అవి. ఒక పావురాన్ని కిటికీలోనుండి విడిచిపెట్టి ఆండోదానిని తన గుండెకి నొక్కుకొంటూ ఉన్నప్పుడు, చెట్టుపైకిపోయిన పావురము తన జత కొరకు కూచుంటే ఆర్జృహృదయముగల లల 'రెండోదానినికూడా ముద్దాడి విడిచిపెట్టేది. ఆ పక్షి ఎగిరిపోతూఉంటే “ఆహా నాకు రెక్కలు లేవుగదా నా ప్రియుని చేరడానికి అని నిట్టూర్పు విడిచేది. అట్టి పావురమే లెక్కలలో దాచి (ప్రయునివద్దనుండి ప్రేమ లేఖను తెచ్చి ఆమె ఒడిలో నుంచగానే భయవిభ్రాంతులతో వణికి వణికి తుదకు పాదచారిణీగ ఆ (శేమికుల సంకేతస్థలానికి నడవగలిగింది తొందర తొందరగ ఆ అబల.

ఈమధ్య తనను స్వాధీనపరచుకొనిన ఏకాంతచింతనలలో వ్రైలయొక్క పావురముల ఉదంతము కెయస్‌ స్మరణకు వచ్చింది. ఆ భావనలో లేచి, చేరబడి తనలో తలపోసుకొన్నాడు; “ఆమె తండ్రివద్దకు వెళ్ళి నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహముచెయ్యి” అని అడిగితే, అతడు నన్ను ఎట్లు ఆదరించునో! ఒక రాయబారిని పంపిస్తే, వానిని ఏమనునో! ఎందుకు, ఆ పావురాలను - కథలే నిజము అయితే

లైలా మజ్నున్‌ అసలు కథ పారనంది జగన్నాథస్వామి 1633 అవి ఆమె వక్షస్థలాన్ని ఆదుకొంటవిగదా!గ ఇట్లు తలపోసి, వెంటనే తనను నమ్మిన జయ్యద్‌ నౌఖరిని పిలిచి, “జయ్యద్‌! ఆ బససా ప్రభువు నగరులో రెండు ధవళ పావురాలు ఉన్నవి. నీకు ఆలియదూ, ఆమె ఒకదానిని విడిచిపెట్టితే "రెండోది కూకూ మని ఆెండోదానిని విడిచినవరకు వదలదు” అని 'కెయస్‌ అడిగాడు. “తెలియకేమి, ప్రభూ! అవి పెంపుడు పక్షులు. ఎక్కడకు వెళ్ళినా, ఆ రాణి హస్తగతములే అవి.” “నీవు పిలిస్తే నీవద్దకు వస్తవా అవి?” కయస్‌ పడుతున్న వ్యధను పోల్చుకొన్నట్టి ఆ జయ్యద్‌ అడిగాడు, “ప్రభూ, నీకు కావాలా ఆ పావురాలు? నా తండ్రి పిట్టలను పట్టేవాడు; నాకూ ఆ వేట తెలుసును. పావురాలకంటెను వన్య మైన పిట్టలను పట్టగలను. వల అక్కరలేకుండా చేతులతో పట్టుకోగలను, ప్రభూ” “ఆలాగు అయితే ఆ రెండింటిలో ఒకదానిని పట్టి తీసుకొని, చూడు దాని అక్కలలోని ఒక్క వెంట్రుకైనా రాలకూడదు సుమా! జాగత్తగా పట్టుకోవాలి.” జయ్యద్‌ నేర్చరి - మాటలలోవలెనే పనిలోకూడా. అన్న మూడోనాటికి లైల కపోతాలలో ఒకదానిని ఆచ్చి యస్‌ చేతులలో పెట్టడు. దానిని దువ్వి, మచ్చికచేసి దాని కాలుకి ఒక తోలు-కాగితము కట్టి వదిలివేశాడు; దానిమీద తన దస్తూరీలో ఈ కవనము వ్రాశాడు: నీ హృదయము ధవళకపోతమై ఆ చెట్టునుండి నావద్దకు వచ్చి నీ (పమసంతా నాకు ఇచ్చినది. నీ హృదయము నీకు తిరిగిరాదు నాతో ఇక్కడ ఉండిపోతున్నది నా హృదయాన్నిఇక వినుచుందువు ఆ చెట్టునుండి విలపించుచుండగా. ్రేమికులు కలిసే నిర్హరం వద్ద నేనీ రాత్రి నిరీక్షించెదను; చెట్టుమీదనున్న గువ్వ వద్దకు

1634 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఎగిరివెళ్లే కపోతముగ నీవు

కలియవాః నన్నునా హృదయమా!

మామూలుగా రాత్రి లైల కపోతాన్ని విడిచి, రెండోదానిని వక్ష స్థలాన్ని నొక్కి ఉంచుకొని, కూకూ ధ్వనికొరకు ఆసక్తితో విన కుతూహలపడుచుండెను. కాని ఆరాత్రి ఆ కూకూలు వినబడలేదు. పాన్పు వైనుండి లేచి కిటికీవద్ద నిలుచుండి చెవులను ఎంత నిగిడించి వినినా, ఆ కూ ధ్వని రాలేదు ఆ నిశ్శబ్దములో; “ఏమై ఉండును? ఎక్కడికి వెళ్లినది? ఎప్పుడూ ఇట్లు జరగలేదే. నిదపోతున్నదా?” అని లైల ప్రశ్నిస్తూ నిలుచుండెను. నిశాకరుడు వృక్షశిఖరాలలో తన జోత్స్నను విరజిల్లుతూ ఆకాశమున మీదికిరాగా, ఇక కూకూ రాదని నిశ్చయించుకొని వక్షస్థలాన్ని అధిష్టించియున్న కపోత రాజును తీసి, దువ్వి, ముద్దాడి, ఓదార్చి, మాటలు చెప్పి తన జతను వెదుక్కోమని కిటికీలోనుండి ఎగరవేసింది ఆమె. ఆ గువ్వ తిన్నగా చెట్టుపై కూర్చొని కూకూమని ఎంత అరచినా, జోడు ధ్వని రాలేదు. చెట్టుపైనుండి ఎగిరి లైల గదిమీద చక్రాకృతిని పరుగెత్తి, పరుగెత్తి, జక్కలు కొట్టికొట్టి ఆ కపోతము తిరిగీ ఆ కిటికీమై వాలినది. లైల దానిని అందుకొనగా అది వణకుతూ బాధపడుతున్నట్టు స్పష్టమైనది.

మెల్లగా దానిని దువ్వ “పాపము, ప్రియుని పోగొట్టుకొనుట దుర్భరముగదా; అంతకంటె దుర్భరతరము ఒకమారైనా ప్రియుని కానకపోవడము” అని ఆమ తలపోసినది. అట్లు ఆ గువ్వను లాలిస్తూ ఉండగా, అెండోది రువ్వుమని వచ్చి చేతిపై వాలింది. సంతోషమున ఒక కేకవేసి, రెండింటిని కలిపి ఆమె తన వక్షస్పున అనుకొన్నది. ఆ ఖేలనములో ఆ కపోతపాదాన్ని ఉన్న బంధనము ఆమె మృదుకరతలమునకు తగిలినది. దానిని విప్పి చదవగా కలిగిన హృదయ స్పందనమునకు పావురములు తుళుక్కు పడినవి. ప్రియుడు వ్రాసిన లేఖ. ఆహా! ఏమి చేయడమో ఆమెకు ఆ ఆవేగములో తోచలేదు. ఆ శశధరుని సమక్షాన ఆ నిర్ణర పాశ్వాన్న ప్రియుని కలియవలెనుగదా. వార్త తెచ్చిన కపోతాన్ని మొదట, ఆ కపోతాన్ని తెచ్చినదానిని తరువాత, ఇట్లు ఒకనిదాని తరువాత మరొకదానిని నొక్కి నొక్కి తన (ప్రేమావేగాన్ని చల్లార్చుకొన ప్రయత్నించింది. పావురాలను విడిచి ఒక బురకావేసుకొని మేడదిగి, నగరు దాటి అడవిలో ప్రవేశించింది. ప్రేమ దారిచూపగా, (ప్రేమికుల నిర్షరమును ఆమె ఆ నిశలో చేరుకోగలిగింది. ఇట్లకొమ్మల

లైలా మజ్బున్‌ అసలు కథ పారనంది జగన్నాథస్వామి 1635 వుధ్యనుండి పసరిస్తున్న చంద జో్యోత్స్నాంతరాయములలో పుట్టిన ఛాయామూర్తివలె ఆమె ఎగురుతూ నిర్షరస్థలము దరికి చేరింది. ఆ వాహినీ జలములు రజతనిర్మితాభరణము పంక్తివలె మీదికి ఎగిరి [క్రిందకుపడి (ప్రేమికుల రాకకొరకు ఆడుతున్నది. లల గుండెచప్పుడు ఆ నీటి చప్పుడులో నిశ్శబ్దమైనది. ఆమెకు స్టైర్యము లేకుండెను. పరుగెత్తడము కారణమా? ఏడీ ఆ కపోతాన్ని దొంగలించిన చోరుడు? అంతకుముందు ఎంతోసేపటి నుండి కాచుకొని యున్న కెయస్‌ నేత్రములు ఆ ఛాయను గుర్తెరిగి ప్రవాహ పార్శ్వమునుండి తొందరతొందరగా ఆమె ప్రక్కకు చేరినాడు. ఆమె చంద్రకాంతిలోనికి గెంతినది. చందకిరణాలు వారి ఇరువురి ముఖాలను తేటపరచినవి. నేత్రాలు కలిసిపోయినవి. ఒకరినొకరు పొల్చుకోగలిగిరి. “లలా, వచ్చినావు. నిన్ను (ప్రేమించి వచ్చాను.” అన్నాడు కెయస్‌. “నేను నిన్ను అలాగే (ప్రేమించి వచ్చాను అన్నది లైల. వ్యర్థరజనీకాంతుడు తప్ప మరియెవరూ లేరు చూడడానికి వారి గాఢమైన కౌగిలింత; పూర్వము ఎన్నిటికోవలెనో వాడు ఒక్కడే సాక్షి. వారి _పేమ వాక్కులను విన్నది ఆ వాజానీ దేవత ఒక్కతే; నిశ్శబ్దమై అనాదిగా తాను అక్కడ ఆవిర్భవించినదాదిగా విన్నవి ఎన్నో ఇట్టి సంభాషణలు. ఇట్లు ఎన్నోసారులు ఆ (ప్రేమికులు అక్కడ ఆలాగున కలిసి ఆ అరణ్యమధ్యమున తమ బంధనాన్ని దృఢపరచుకొన్నారు. ఒకనాడు విడబడే ముందర కెయస్‌ సెలవుతీసుకొంటూ అన్నాడు. “ప్రేయసీ, ఎడారి నా నివాసమైనాసరే, నీవు నేను స్వతంతులము అయితే, ఆ ఇసుక దిబ్బలపై పెరిగే దుంపలను తింటూ, ఆయా గుంటలలో పండే యవలను విసిరి నీవు చేసే రొట్టెను ఆహారముగా జేసుకొని, అచ్చటి "సెలలోని నీటిని (తాగుతూ, ఉండే చెట్టుకొమ్మల నీడను పరుండి - హాయిగా నిశ్చింతగా (పపంచమంతను వదలుకొని, నీ ప్రజల ద్వేషానికి దూరంగా నిన్ను సతతం గ్రుమిస్తూ ఉండిపోగలను.” “నా ప్రియుడా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉండిపోతాను." “అయితే, పద పారిపోదాము.”

1636 పందిరి షుల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

“ఇప్పుడేనా?"

“ఇప్పుజేకాదు. నీకు కొంత తడవుకావాలి సిద్ధంకావడానికి కదూ. రేపు ఈవేళకు ఇక్కడ రెండు మంచి గుజ్జాలతో నీకొజకు కాచుకొని సిద్ధంగా ఉంటాను. ఆ గుజ్జాలు డెక్కల నుండి ధూళిని (తోసెవేసినట్లు మనము ఈ [ప్రపంచాన్ని తోసవేదాము.గో

ఆ రాత్రి నిద్దరలో లైల ఆ ఎడారివాసాన్ని కలగంది. చెట్టు క్రింద కూర్చోవడము, సెలనుంచి త్రాగడము, రొట్టె యిద్దరు పంచుకోవడము, (పెయుని సమక్షములో ప్రాసాదసుఖాలను మరవడము - ఇవీ కల సంగతులు.

కల కలే; ఫలించలేదు. లైలను పెండ్లాడాలన్న ఒక యువకుడు ఇబన్‌ సలాం, ప్రభువు కొలువులో ఉన్న ప్రధాని తలకు వెనకకూడా కళ్లు చెవులు ఉన్నవానివల ఈ పలాయనమును ఊహించి, లైల తండ్రి చెవులలో ఊదాడు. సాయంకాలం కాకమునుపే లైల తండ్రి లైలతో కలిసి పరివారసమేతంగా కొండల మధ్యనున్న తన రాజధానికి ప్రయాణము చేసినాడు. లైల ఆరోగ్యం అచ్చటి పరిశుభ వాతావరణములో బాగుపడగలదని హేతువుగా కల్పెంపబడినది. కాని లైల ముఖలావణ్యము పూర్వముకంటె ఎక్కువ తేజోవంతముగ అందరికి కనబడుతున్నా ఆమె తండ్రి మాత్రం ఆలాగు ఆ ప్రయాణానికి సమాధానము చెప్పాడు.

అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రయాణము సంగతి కొన్నాళ్ళవరకు కాయన్‌కి ఆలియలేదు. ఆ సం కేతస్థలానికి (ప్రతీరోజూ కెయస్‌ పోయేవాడు. ఇబనస్‌ సలాం ప్రచారంవల్ల లైల కోరికమీద కొండలమధ్యకు నివాసం మారిందనిన్నీ ఇబస్‌ సలాం సుందరాకారుడు కలిసి వెల్లాడనిన్నీ కయస్‌ చెవులకు చేరింది. ఖిన్నుడైయున్న కెయస్‌ ఈ వార్తను నమ్ముకొని, లైలకొరకు కేకలువేస్తూ ఎడారిలో పడ్డాడు. ఆ ఎడారిలో ఉన్న ప్రతీరాయి, చెట్టు, సెల లైల పేరుతో (ప్రతిధ్వనిస్తూ ఉండెను. ఇట్లు ర్యాతి పగలు తిరిగి తిరిగి కేవలము అలసటవలన ఒకచోట స్మృతితప్పి పడిపోయియుండెను కెయస్‌. వాని అనుచరుడు జయ్యద్‌ కొంత పరివారముతో కెయస్‌ కొరకు తిరుగుతూ అక్కడికి చేరినాడు.

'కెయస్‌ పెచ్చిఎత్త్‌పోయి యున్నాడు. ఆకలి, అలసట, దాహము, బాధలవలన కృశించిపోయిన కెయన్‌ మనస్సు భ్రమస్తూ ఉంటిను. వాని తండ్రి నివాసానికి

లైలా మజ్నున్‌ అసలు కథ పాతనంది జగన్నాథస్వామి 1637 కెయస్‌ను మోసుకొనిపోయింది ఆ పరివారము. అక్కడ ఉపచారములు చేయగా చేయగా కొంత స్థిమితానికి మరలివచ్చినాడు. (పేమాన్మాదముతో లైలా వైలా అని కేకలు మాసనందున అందరూ అతనికి మజ్నూన్‌ అని పరు పెట్టిరి. మజ్నూస్‌ అనగా (పేమాన్మత్తుడు. తనకు స్నేహితుడు కానివాని కొమార్తెకొరకు అట్టి ఉదేకాన్ని మరవమని 'కెయనస్‌ తండి కొడుకును అనేకవిధాల (బతిమాలి బోధపరిచాడు. అన్ని విషయాలలోను సబబుతప్పుక ప్రపర్తించే కొడుకు ఈ (యేమ విషయములో దారికి రానందున "ఈ పిచ్చితీరకపోతే వీడు తిరిగీ మనిషి కానేరడు” అని తనలో తలపోసుకొన్నాడు. బాస్రా (ప్రభువుతోగల ద్వేషాన్ని తొలగించి స్నేహబాంధష్యము సాధించ నిశృయించి, ఒక బద్ద పరివారముతో కొండల మధ్యనున్న రాజధానికి . పయనమైనాడు కయస్‌ తండి: కెయస్‌ను జెయ్యద్‌కి అప్పచప్పినాడు. ఎన్నో దినాల ప్రయాణము సాగించి, లల తండ్రి పట్టణాన్ని ఆ పరివారము చేరుకొన్నది. బాస్రా ప్రభువు కొలువులో గంధీరముగ అడిగినాడు అతని కొమార్తెను తన పుత్రునికిచ్చి వివాహము చేయుమని; అంగీకారముపల్ల కలిగే లాభాలసు, అసంగీకారముపల్ల కలిగే ప్రమాదాలను సగర్వముగా వివరించి చెప్పాడు. యోమస్‌ ప్రభువు ఆ ప్రస్తావము ఎంత అభిమాసముతో చేయబడినదో అంత సగర్వముగా తిరస్కరింపబడెను. “నీకొడుకు పిచ్చివాడని వినికిడి పిచ్చి కుదిర్చి నా అంగీకారాన్ని కోరు” అని బాస్రా ప్రభువు త్‌ర్చు చెప్పినాడు. - సిక్‌ ఆహెమస్‌ ప్రభువు ఆఅహంకారముగల వ్య క్తి. ఆ (పత్యుత్తరాన్ని సహించలేకపోయాడు. స్నేహబంధము కోరిపస్తే ముళ్లకోలగా మారింది. యుర్దసన్నాహము సంకల్పిస్తూ ద్వేషపూరిత భ్రూభంగమును చేస్తూ బ్యాసాను విడిచివచ్చనాడు సిద్‌, ఇల్లు చేరేసరికి తన కొడుకు జయ్యద్‌తో కలిస చుక్కాకు మోకాళ్లమపైపడ్‌ కాబా జలాన్ని త్రాగితే, ఆ మరుస్టలములో పుట్టిన ఆ పవ్మితోదకము నా పుత్రుని డాహాన్ని తప్పక శాంతపరుస్తుంది. నా కొడుకు నాకు దక్కును. నేనుకూడ ఆఅతసతో కలిస్‌ ఆ పుణ్యాలయములో ప్రార్హన చేసెదను” అని సిట్‌ నిశ్చుయిం చెను.

1638 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము మెక్కామార్గాన రెండు దినాలు ప్రయాణము సాగినది. మూడోరోజున నౌఫాల్‌ అనే ఆ ఎడారిలోని ప్రధాని ఒకడు ఒక మైనిక దళమును వెంటనుంచుకొని ఆకాశమునకు ఎగిరిన ధూళి మేఘాలను వెనకను ఉంచి సిద్‌ను స్నేహపూర్వకముగ పలుకరించెను. తన ఉజ్వ్యృలతురగాన్ని వేగమునుండి ఒక్కమారు ఆపగా ఇసుక కంకర ఎగిరి నాలుగు ప్రక్కల పడినది. “నేను మిమ్ములను ఎరుగుదును. మీరు యోమన్‌ ప్రభువులు. మీ కొమారుని మజ్నూని ఎడారిలో కలిశాను. చాలా అవ్యవస్థలో చరమావస్థకు సమీపించి యున్నవానిని నేను సంరక్షించినాను. నాకు కథ అంతా తెలిసింది. ప్రభూ! మీకు అంగీకారమే అయితే బ్యాస్రా ప్రభువుకు బుద్ధిచెప్పడాసికి ఇదుగో ఈ సేన మీ అధీనము" అని ఆదరపూర్వకముగా మనవిచేశాడు.

“నాఫాల్‌ ప్రభూ! సలాం మీకు. మిమ్ములను నేను ఎరుగుదును. మీరు ఎడారిలో సంచారం చేసేవారైనా, మీ బలముగురించి మీ జెదార్యము గురించి నేను చాలాసార్లు వినియున్నాను. మీ సంరక్షణలో ఉన్నాడా నా కొమారుడు? అతని మెక్కాయాత్ర ఎట్లు విఘ్నమైనది? ఆ పవిత్రాలయములో వానిని కలియాలని నేనుకూడా బయలుదేరినానే."

“నా కైనికులు తిరుగుతున్న మార్గములో మీ పుత్రుడు పడి యుండెను. లైలా అన్న కేక తప్ప మరొకటి లేదు. నావద్దకు తీసుకొనివచ్చిరి నా మైనికులు. వాని లైలా కేకలవలన మధ్యమధ్య చెప్పిన విడిమాటలవలన మజ్నూన్‌ అనేవాడు నీ పుత్రుడని నేను పోల్చుకోకలిగితిని. సౌందర్య (ప్రేమల గాథ ఈ ఎడారిలోకూడా వ్యాపించియున్నది.”

“నాఫ్రాల్‌ నీవు ఏమనెదవు?”

“మీరు నేను కలిసి తగిన సేనతో ఆ బాస్రా ప్రభువువద్దకు వెళ్లి నీ పుత్రరత్నానికి వాని కొమార్తెను ఇవ్వక తప్పదు అని నిరోధి ౦చి అడుగుదాము. అంగీకరించక పోయినాడా, వానిని ఓడించి, నీ స్వాధీనాన్ని నేను ఆ రాజ్యాన్ని చూస్తూ ఉంటాను. అంగీకరించాడా, మనము ముగ్గురము స్నేహితులముగా ఉండి మన మూడు రాజ్యాలు కలిసి నీ స్వాధీనంలో ఉంటవి.”

“బాగానే చెప్పావు. నిన్ను నేను విశ్వసించెదను. నీవు బాస్రా ప్రభువ్పువద్దకు వెల్లి, నా రాయబారంగా లైలాను అడుగు. నీవెంబడే నేనూ వస్తాను. నీవు లైలాను

లైలా మజ్నున్‌ అసలు కథ పారనంది జగన్నాథస్వామి 1639 నీ రక్షణలో ఉంచుకొని నన్ను దారిలో కలిసినావో సంతోషము. లేదా ఇద్దరము కలిసి బాసామై దాడిచేయుదము. నీ షరతులు నా షరతులు. మిగిలినదానికి వార్తాహరులు ఉన్నారు.”

నౌఫాల్‌ అశ్వమును ్రిప్పి తన ప్రైనికులకు ఆజ్ఞచేశాడు. వెంటనే ఆరుగురు ఆరు దిక్కులా మహావేగంతో పరుగెత్తారు. ఎడారి ప్రభువు ప్రధానులు అందరూ కొండల రాజ్యం మై దాడిచేయడానికి చేరవలెనని ఆజ్ఞ. ఆలాగే యోమన్‌ ప్రభువు ఆజ్ఞను వార్తాహరులు తీసుకొని వెళ్లేరు. నౌఫాల్‌ తన సేనలను చేర్చుకొని నిర్ణయ స్థలానికి వెల్లేడు. మోమన్‌ తన సేనలకొరకు వేచియుండెను.

లైల తన తండ్రి రాజధాని నగరులో దౌర్భాగ్యాగాధాలలో పడియున్నది. ఆమె తండి దయను సంపాదించిన ఇబన్‌ సలాం అనే యువకుడు అహర్నిశము ఆమె పాణిగహణానికి అనురోధిస్తూ ఉండెను. లైల బాష్పప్రవాహములు, అసమ్మతి వాక్యములు తండ్రి మనస్సును కరిగించిసవి కాబట్టి “అబ్బాయీ, లైలకు వయస్సు రాలేదు. కొన్నాళ్లు ఆగియుండుము.” అని ఆ ధసవంతుని కానుకలకు (ప్రత్యుత్తరము ఇచ్చెను. బాస్రాకు పూర్తిగా వానియెడల ఆశమెండు; ధనము, ఆస్తి, సేన అన్నీ వానికి కలవు. కాని లైల చీకటి గదిలో దాగుకొని రాత్రి నక్షత్రాలతో కాలము గడుపుతూ “నాకొరకు నావలెనే పిచ్చిఎత్తిపోయిన మజ్నూస్‌ను వివాహమాడడమా కన్యగా మరణించడమో నా జీవితావధి” అని తన నిశృయాన్ని దృఢపరచుకొనేది.

గూడుకట్టే సమయమని పోల్చి తన పెంప్పుడు పావురాలను ఆ చెట్టుమీద విడిచి లల వచ్చివేసింది. తన దుఃఖోపశమనానికి అవి బాగా ఉపచరించేవి; ముఖ్యంగా (క్రేమవార్తను తెచ్చినది ఎక్కువ శాంతిని ఇచ్చేది. అవా ఇప్పుడు లేవు. కాని ఒకనాడు తన నౌఖర్తె ఒక శకుంతపక్షిని తీసికొనివచ్చి ఆమె భర్త అడివినుండి తెచ్చి ప్రభ్వికి కానుకగా సమర్ప్చించేనని చెప్పింది. ఆ పక్షిని లైల గారాబముతో పెంచి దానికి ఒక్కషూట మప్పింది. ఆ ఒక్క మాటి! తన భుజముయెక్కి మజ్నూన్‌ మజ్నూన్‌ అని అది గంటలకొలది విరామము లేకుండ అరస్తూ ఉంటే, లైల శాంతిని పొందేది. ఆ మధుర స్వసము ఆమె చెప్పులలో నిలిచి ఆమె హృదయాన్ని మజ్నూన్‌ వెదక ఎడారులలోనికి తీసుకొనిపోతూ ఉండెను. రషమ్ముని నిరోధించెను. దినకరుడు కొండలలో (కుంగుతున్న నిముషములు ఆవి.

1640 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము నాలుగు మాటలే నడిచినవి ఆ వీరులమధ్య. నౌఫాల్‌ అశ్వము వాని అనుచరులు తిరిగి పరుగెత్తి యోమన్‌ సేనను కలియ ఉద్యుక్తులై ఉండడములో లేచిన ధూళి మేఘాలను బ్మాసా చూచి యుద్ధసన్నాహం అని పోల్చుకొన్నాడు.

తన కొండల రాజ్యమునకు అత్తియున్నది ఇబన్‌ సలాం రాజ్యం. తన ప్రణయ వ్యవహారంవల్లనేగదా నౌఫాల్‌ని నిరాకరించినాడు బాస్రా అని ఇబన్‌ గుర్తెరిగి, తన వెయ్యిమంది ఘైనికులను బాస్రా సహాయార్థము పంపినాడు. తెల్లవారేసరికి కైలా చూచింది రెండు ప్రక్కలనుండి హుంకరిస్తున్న రెండు సేనాదళాలను, “నేను గదా ఈ యుద్ధానికి కారణము” అని నిట్టూర్పు విడిచి, “నా తండ్రి ఒకవైపు, నా మజ్నూన్‌ రెండోవైపు, ఇద్దరూ నాకు కావలసినవారే:” అని తలపోసినది.

విధి ఆశ్చర్యముగా మారుతూ ఉంటుంది. సాయంకాలము అయేసరికి తన తండ్రి సహాయానికి వచ్చిన ఇబన్‌ సేనలు నౌఫాల్‌ దాడిలో నిలవలేకున్నవి అని స్పష్టమైనది. శత్రువు సేనలు మట్టుకొని కోటలోనికి ప్రవేశించినవి. అది అపజయమా జయమా! దూత ఒకడు స్వాధీనపు షరతులు ప్రకటించాడు. మాటలు వినడానికి కిటికీలో నుండి చెవులు నిగుడించినది లైల; ఏమీ వినబడలేదు. కాని ఓడిపోయినా సగర్వముగ తన తండ్రి గర్జించిన వాక్కులు ఆమె చెవికి చేరినవి. “సరే నేను అప్పగించకపోయినా మీరు తీసుకొనిపోతారు. కాని సజీవంగా తీసుకోవెళ్లలేరు. ఈ చేతిని ఎత్తినానా, ఆమె చావు నిశ్చయం. నేను చేయలేకపోయినా, నా ఆజ్జను పాలించే నా నౌఖర్లు చేయగలరు. ఆమె శవమే మీది.”

యోమన్‌ (ప్రభువు అరిచాడు “అట్టిపని చెయవద్దు; నీకు ఈ రోజు అంతా గడువు ఇచ్చాను. నీ పుటతైకను నా పుత్రునకు ఇచ్చి వివాహము చేసితివా మనము ఇరువురము స్నేహబాంధవ్యములలో వర్థిల్లగలము. లేదా నీ రాజ్యము నాకు స్వాధీనపరచి నా ప్రధానిగా రాజ్యభారము వహించి ఉండు” అని పలికినాడు. నాఫాల్‌ యోమన్‌ ఇద్దరూ ఆ రాత్రి ఏశ్రాంతికి వెళ్ళిరి.

ఇబన్‌ సలాం తన చారులలో ఒకనిని నియమించాడు. యోవున్‌ పట్టణమునుండి వచ్చిన వార్తాహరునివలె నటించి, యోమన్‌ ప్రభువు సమక్షానికి వెల్లి, మజ్నూన్‌ పరిచారకులనుండి తప్పించుకొని పారిపోయి ఎడారిలో చచ్చిపడినాడు. ఆ కళేబరాన్ని పట్టణానికి తెచ్చారు అని నచ్చచెప్పమని వానికి ఆజ్ఞ అయింది. కొందరి సైనికులను పిలిచి, ఎడారిలో వెదకి, మజ్నూన్‌ను చంపివేయమని ఆజ్ఞాపించాడు. మరికొంత తన సేవను ఈలోపున రప్పించి

లైలా మజ్నున్‌ అసలు కథ పాఠరనంది జగన్నాథస్వామి 1641 బా(స్రాకు బలము కలిగించవలెనని ఏర్పాటుచేశాడు. ఇందువలన లైల అంగీకారాన్ని సంపాదించ ఆనించాడు. -

ఈ వార్త విని యోమన్‌ రోదనగస్తుడైనాడు. లైల మనకు అనవసరము కాబట్టి షరతులు మార్చివేయవలెనని నౌఫాల్‌ నిర్ణయించెను. ఇబన్‌ సలాం బాసా ప్రభువు ఈ చావుమాట విని తమకు సంబంధించనట్లు నటించారు. “ఇక నీ కొమార్తె అంగీకారానికి అడ్డు ఉండదు గదా. ఆమె యువతి గనుక చచ్చినవానికంటె జీవించియున్నవాడు వరనీయుడు అవుతాడు. ఇదివరకే చాలా సాయము నేను చేసియున్నాను. నీ కూతురు అంగీకరిస్తే నా పూర్తి సేన నాలుగువేల బలము నీ స్వాధీనము అవుతుంది. సగం మన రక్షణకు సగం యోమన్‌ను తరమడానికి సరిపడుతుంది. ఊకవలె ఎగిరిపోతారు నీ శత్రువులు. వెళ్లు నీ కొమార్తెపద్దకు. ఆమె మాట ఒక్కటి నిన్ను ఎట్లు ఈ నాశనమునుండి తప్పించగలదో బోధపరుచు” అని ఇబన్‌ బాసాకు నచ్చచెప్పాడు.

కూతురు దగ్గరకు వెల్లాడు ప్రభువు. ఆడదాని రోదనధ్వనులు వినబడగానే ఇబస్‌ ఆశించాడు లైల నమ్మింది మజ్నూస్‌ మరణ వార్త అని. చాలాసేపు ఊరడించాడు బస్రా లైలను ఒప్పించడానికి. మజ్నూన్‌ గురించి ఏడిస్తే వ్రయోజనము లేదనిన్నీ ఇబస్‌తో వివాహమువలన బ్యాసా సురక్షితము అగుననిన్నీ అన్ని విధాలా క్షేమము అందరికి కలుగుననిన్నీ అతడు వాదించాడు. ఆమె తండ్రి దీనావస్థలో ఉన్నప్పుడు ఆమె ధర్మము ఏదో నిరూపించాడు. తండికొరకు ఈ త్యాగము చేయకతప్పదని ఆమెకు తోచింది. ఏడుస్తూ ఇబస్‌ పెండ్రాడ ఒప్పుకొంది.

ఈ లైల మాట తనకు చేరగానే ఇబన్‌ తన చారులను సేనానాయకులను పిలిపించి శతువుయొక్క బలము గురించి ప్రశ్నించాడు. “మన సేన నాలుగువేలు; వారిది మూడువేలా?” తస సేనలో సగము రాతికి ర్యాతి వచ్చి యుద్ధానికి సిద్రముగా ఉండాలి. ఉన్న సగము కనబడకుండా చుట్టుతిరిగి వెనకనుండి యుద్రమధ్యసమయాన్న శత్రువును ముట్టడించాలి. ఇదంతా ఉదయాత్పూర్వము జరగాలి అని ఇబస్‌ తన సమ్మిన బంట్లకు ఆజ్ఞ జేశాడు. తనకు జయము తప్పదని నిశృయించుకొన్నాడు. -

ఇందులో పారపాటులేదు. ఎడారి ఇసకమై తెల్లవారిన తెలుపు కసబడగానే, కొండల శిఖరములు వోరగా నుండగానే యోమన్‌ దూత వచ్చి, వశపడినట్లు నిర్ణయించిన షరతులలో లలా సంగతి చెప్పలేదు. బాసా (ప్రభువు తిరస్కారముతో

1642 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నవ్వి “పో, చెప్పు నీ యోమన్‌ ప్రభువుకూ ఆ ఎడారి దొంగకూ. నా రాజ్యము కావాలంటే యుద్ధములో జయించాలి. అంతే, బాస్రా లొంగడు. స్వతంత్రుడుగా జీవించడమో లేదా రణరంగమందు (ప్రాణములు విడవడమో జరగాలి అని గర్జించాడు.

ఈ తిరస్కారాన్ని దూత మోసుకొనివెల్లాడు. వినగానే యోమన్‌ ఆలోచనలో పడ్డాడు. కాని ఆ ఎడారి వీరుడు నౌఫాల్‌ ఆగ్రహభూతుడై తొందర స్వభావము వ్య క్త్రబరుస్తూ తక్షణమే దాడికి ఉద్యుక్తుడాయెను. కోటమై సేన నడవగానే కొండలనుండి వచ్చిన రెండువేల సైనికులు అడ్డుపడ్డారు. యోమన్‌ నొపాల్‌ ఇద్దరు ఆశ్చర్యపడ్డారు. సరిసమానంగా ఉన్న రెండు కక్షలు పోరాడుతున్నారు. భయముతో వణకుతున్న లైల కిటికీనుండి చూస్తున్నది. ఇటూ అటూ ముందుకి వెనకకీ ఊగుతున్న రెండు సేనలు ఆమెకు కనబడినవి. కాని [క్రమంగా శత్రువు ముందుకు మట్టుకోవస్తూ ఉండెను. దూరంలో ఆమెకు ఒక పెద్ద పరాగము కనబడింది. అశ్వపాదాఘాతము [కింద భూమి వణుకుతున్నది. ఏమిటి ఇది? ఒక్కమారు ముట్టడిస్తున్న సేనమై పడ్డారు ఆ సైనికులు. ఎండిన గడ్డిని పడవేసే సుడిగాలా? శత్రువుల పడవేసి ఊకను విసిరినట్లు ఊడ్చివేశారు ఆ మైనికులు. యోమన్‌ చనిపోయాడు. నాఫాల్‌ పారిపోయాడు. కాని వాని గుజ్జ్బముకంటె త్వరితముగల గుజ్జముపై వెంబడిస్తున్న సైనికులను జూచి నాఫాల్‌ పొడుచుకొని పడిచచ్చాడు.

విజయము బాస్రాది. ఆ రాతే లైల ఇబన్‌ సలాముల పాణ్మిగహణ మైనది. కాని యుద్ధములో తగిలిన గాయమువలన ఆవెంటనే బాస్రా ప్రభువు మరణించాడు. మూడు రాజ్యాలను ఏకముచేసి ఇబ్‌స్‌ పాలించాడు. వాడు రాజు, లైల రాణి.

సంవత్సరాలు గడిచినవి. లైల ఇబన్‌లు నెమ్మదిగా పరిపాలన చేశారు. లైల తండ్రియొక్క [ప్రాసాదములో నివాసము. పావురములు శకుంతలము ఆమె పాణసఖులు:ః నష్టమైపోయినా మరవబడని [.పేమగాథను అవి స్మరణకుతస్తూ ఉండినవి. తన యజమానునికొరకు ఎడారి అంతా వెదికిన జయ్యద్‌ ఆమె నౌఖరి.

ఒకనాడు జెయ్యద్‌కు రహస్యవార్త వచ్చింది; మజ్నూన్‌ బతికియున్నాడనిన్నీ, వర్తకుని వేషముతో పట్టణానికి వచ్చి యున్నాడనిన్నీ, ఎడారిలో రాత్రి కలియమనిన్నీ ఆ వార్త. తన రాణికి ఈ రహస్యమేమీ తలియనీయకుండా, పావురములో ఒక దానిని పట్టుకొని ఆ సంకేతస్థలానికి జయ్యద్‌ వెళ్లిడు. పూర్వము ఒకమారు ఈ

లైలా మజ్నున్‌ అసలు కథ సారనంది జగన్నాథస్వామి 1643 పావురముతో ఏమి జరిగిందో తిరిగీ ఇప్పుడు అలాగు జరగవచ్చోను. అమితానందముతో మజ్నూన్‌ జెయ్యద్‌లు ఎడారిలో కలిశారు. సాయంకాలం తన పడకగదికి వెళ్లేసరికి ఒక పావురము కనబడనందుకు ॥ ఆశ్చర్యపడింది. ఆ చెట్టుమీదికి తనవద్ద ఉన్నదానిని వదిలింది. కాని ఒక్కటే తిరిగివచ్చింది. పూర్వము జరిగిన ఉదంతము జ్ఞప్తికి వచ్చి ఆలోచనలో మునిగిపోయింది లైల. మూడు సంవత్సరాల క్రిందట ఈలాగే కనబడని కపోతము మజ్నూస్‌ ప్రేమవార్తను తెచ్చిందిగదా. ఆ అధ్యాయము అయిపోయిందే. మజ్నూన్‌ చనిపోయాడు; తాను మరియొకనికి వివాహిత భార్య. బాష్పములతో కళ్లు చీకట్లు (కమ్మినవి; ఆ కిటికీతలముకైై శిరస్సు ఆనుకొని అదే ఏడ్చింది. ఎంతసేపు ఆలాగు ఉన్నదో స్పురణలేదు. కూకూ ధ్వనితో తాలివి వచ్చింది. కనబడలేదన్న గువ్వ వచ్చి ఆ చెట్టుమీద వాలింది. వెంటనే గదిలో ఉన్న గువ్వ రెక్కలు కొట్టుకొంటూ జోడును కలియ ఉత్సాహము చూపింది. లైలకు కూడా ప్రియునివద్దకు ఎగిరిపోవ రెక్కలు కావాలన్న కోరిక పుట్టింది. రెండు గువ్వలు కలిసి ఆమె భుజముపై వాలినవి. వచ్చిన దానికాలికి కట్టియున్న చీటి గుచ్చుకొన్నది. ఏమిటి ఈ అద్భుతము. వణుకుతున్న (వేళ్లతో చీటివిప్పె చదివింది. మజ్నూన్‌ వాసినది. పూర్వమువల (బతిమాలినాడు - ఆ రాత్రి ఆ నిర్షరంవద్ద కలియమని. తన ప్రియుడు సజీవుడై యున్నాడని తెలుసుకొని ఒక్కమారు ఉబ్బివచ్చిన ఆనందముతో సర్వము మరిచిపోయింది లైల. నిశాకరుడు తన ధవళకాంతులను విరజల్లగా ఆమె లేచి బురకా వేసుకొని రహస్యముగా (ప్రాసాదాన్ని విడిచింది. హృదయం మజ్నూస్‌ వద్దకు పరుగెత్తివెల్లింది. కాని అరణ్యము (ప్రవేశించగానే హృదయము స్థంభించిపోయింది. పాదములు ఆగిపోయినవి; పడిపోతూ చెట్టుకొమ్మను పట్టుకొన్నది. భర్త! వివాహ ధర్మము! తన విధి కొరకు సర్వము త్యజించినది. ఇప్పుడు దానిని రద్దుచేయడమా? ఒక్కమారు మజ్నూన్‌ బాహువులమధ్య వాలితే అంతా మాయమై పోతుంది. భర్త, వివాహ విధి, రాజ్యము, (ప్రజలు - అంతా మరచిపోబడగలప్పు. తిరిగీ రాలేదు. భార్య చేయవలసిన కృత్యమా ॥ ఇది! రాణి (పవర్తించవలసిన పనా ఇది! ఆ చెట్ట్టుకొవమ్ము పట్టుకొని మూలుగుతూ,శరీరకంపములో శాశ్వత దుఃఖాన్ని స్వీకరించే పట్టుదలతో ఆ మార్గాన్ని విడిచిపెట్టింది. మెల్లగ శరీరబలాన్ని తెచ్చుకొని, పాదాలను వెనకకు వేసి, ప్రాసాదం చేరుకొన్నది. అశ్రుకణములేని పొడికళ్లు, నిట్టూర్పులేని

1644 పందిరి మల్లికార్టునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము కంఠస్వరము; రాత్రి అంతా ఒక్క కునుకుగాని, విశ్రాంతిగాని లెనిదై, తెల్లవారుకొరకు లేచి కూర్చున్నది. ఉదయముతో బాష్పములు [క్రమ్మినవి. ధర్మవిధిని నిలిపింది.

మజ్నూన్‌ ఆ ప్రమవాహినీ పాఠర్శ్య్యాన చాలాసేపు కాచుకొని యుండెను. జయ్యద్‌ వచ్చి రాణి బయలుదేరి తిరిగిపోయిందని చెప్పగానే, అంతా సమర్ప్చించలేని_ ప్రేయసి చూపుసుకూడా (పసాదించలేకపోయిందని [గ్రహించి వెల్లిపోయినాడు. లైల ఎట్లు నిశ్శబ్దంగా బలమును తెచ్చుకోగలిగిందో, అలాగే మజ్నూస్‌కూడా ధైర్యం వహించి దూర్యపయాణాన్ని నిశ్చయించుకొన్నాడు. భవిష్యత్తులో శోకనాశనమేగాకుండా లైల (్రేమాసందముకూడా సంభవించవచ్చునని ఆశిస్తూ వడలిపోయినాడు కయస్‌.

మరి రెండు సంవత్సరాలు గడిచేసరికి విధిలో మార్పు వచ్చింది. ఇబ్‌న్‌ సలాం జ్వరంతో చచ్చిపోయినాడు. ఈ వార్త నలుదిక్కుల ప్రసరించి మజ్నూన్‌ శ్రవణములకు చేరింది. బాస్రా యామెస్‌ల రాణి లైల విముక్తురాలైనది. యామెన్‌కు వెంటనే కెయన్‌ చేరుకొన్నాడు. రెండుమార్లు ధర్మము విధి అని ఎట్లు ఆల స్వార్ధత్యాగము చేసినదో ఎరిగిన కెయస్‌ సాంఘిక నీత్మిపకారము వైధవ్యములో ఉండవలసిన నాలుగు నెలలు ఆగినాడు. ఈ కాలము అనాజ్ఞాతంగా బైలగదిలోని దీపాలు చూస్తూ ఒక చిన్న నివాసములో కాలము గడిపినాడు కెయస్‌. అభిలాష హృదయాన్ని పొడుస్తున్నది. మజ్నూన్‌ పేరు సంపాదించిన పూర్వపు పిచ్చికంటె ఈ కాంక్ష ఎక్కువ దుర్భరమైపోయినది. కాని తన వివేకబలము చేత సహించగలిగినాడు.

లైల వృత్తాంతాన్ని జెయ్యద్‌ మజ్బుస్‌కు తీసుకొనివెళ్లాడు. కాని వ్యవధి తీరిందాకా మజ్నూన్‌నుండి లైలకు ఏ వార్త చేరలేదు. గడువు తీరగానే మజ్నూన్‌ వార్తను జెయ్యద్‌ తీసుకొనివెళ్ళేడు; మధ్యాహ్నం నగరులోనికిగాని లేదా సాయంకాలమైన తరువాత నిర్షరమువద్దకుగాని మజ్బ్నున్‌ వస్తాడు లైలను కలిసుకొనుటకు: ఎక్కడికి రావాలో వైల ఇష్టము. (ప్రత్యుత్తరం ఆలస్య మైనది; “సడికాలము గడిచిపోయినా తిరిగిరాగలదు - ఈ సాయంకాలానంతరము". అట్టి ప్రత్యుత్తరాన్నే మజ్నూస్‌ ఎదురుచూస్తూ ఉండెను.

సాయంకాలం కాగానే సంకేతసమయానికి మజ్నూన్‌ వచ్చాడు. ఆ వేళకి వల పూర్వమువలె బురకా ధరించి మంటలేకుండా మండిపోతున్న నేతములతో నగరు విడిచిపెట్టింది. నిశాకరుడు లేడు. నక్షత్రాలు మందమైన కాంతితో ఆ

లైలా మజ్నున్‌ అసలు కథ పాఠనంది జగన్నాథస్వామి 1645 స్థలాన్ని వెలుగుపరుస్తున్నవి. గుండె త్వరితానికి ఊపిరి వేగానికి మితిలేదు. ముందు భవబిష్యలతా పరుగిత్తుతున్న ఆమె పాదాలలో ఇమిడియున్నట్లు పాదాలు తత్తరపడుతున్నవి. గుండెను రెండుచేతులతో గట్టిగా పట్టుకొన్నది. తొందరగా పరుగెత్తిరాలేదని మజ్నూన్‌కి బోధపడాలని ఊపిరిని ఆపుకొంటూ ఉన్నది. కాని ఊపిరి స్థిరపడకపూర్వమే తిరిగీ పరుగెత్తింది. నిర్షరం సమీపించింది - అదే (ప్రేమికుల అందరి సంకేతస్థలం - చెట్లముధ్యసుండి ప్రసరిస్తున్న నక్ష(తకాంతిలో చూచింది. దాని పార్శ్య్యానికి వచ్చింది. బురకా విడిపోయింది. ఆమ కృష్ణ క్రేశప్తుంజములు జారిపడిపోయినవి; వక్షస్సు విపరీతముగ కంపిస్తున్నది.

ఒక వ్యక్తి ఒక పార్శ్వముసుండి దుమికివచ్చాడు. ముందుకు తడబడి ఇటూ అటూ ఊగింది లెల. ఉస్మత్తమైన అలింగసములో మజ్నూన్‌ ఆమెను పట్టుకున్నప్పుడు మూలుగుతో మిళితమైన కేక పెకిపచ్చింది ఆమె కంఠమునుండి. ఆ సమయము ఒక్క నిముషమా లేక సహస సంవత్సరాలా? (పేమకు కాల పరిమితిలేదు. ఆ ఆలింగనములో ఆమె అధరస్పర్శ మజ్నూస్‌ అధరములకు కలగగానే మజ్నూస్‌ వివేకము నులిపెవేయబడిసది. వాని అథధరములు ఆమె అధరములకు తగలగానే ఆమె వాని బాహువులషుధ్యనే చిన్న మూర్చలో పడిసది. కెయస్‌ ఆమెను జారవిడిచి ఆ అరణ్యమునుండి ఆ ఎడారిలోనికి అరుస్తూ “లైల లైల లైల” అనే కేకలలో పరుగెత్తి పారిపోయాడు. ఆ పిచ్చికేకలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ఆ ఎడొరిపముధ్య ఆలివతప్పి గోషణచే అపశుడై కయస్‌ పడిపోయ్లునాడు. వాని కంఠధ్య్వనిని పట్టి వెంబడించిన జయ్యద్‌ వానిని కసుక్కొన్నాడు. ఎన్నో రాత్రింబగళ్తు సేప చేశాడు. అంతా నిష్ఫలము. దుఃఖము చేయలేని పనిని ఆనందము చేసింది. పూర్తిగా పచ్చిఎత్తిపోయాడు.

మూర్చునుంచి లేజండి బల, తన పేరును అరుస్తున్న కేకలు ఎడారి మూలమూలలనుండి వచ్చి ఆదు చెపులకు వినబడుతూ ఉండెను. నిజము (గ్రహాంచింది. చతులు సులుప్పుకొంటా నగతు ప్రచేశంచింది. ముజ్నూన్‌ స్థతినిగురించి జెయ్యడ్‌ ఎప్పటకప్పుడు వార్తలు పంపేడు. వాని పిచ్చికూడా అణచలేసివాని ఆఅనన్వర్యప్రషు చార్తలు ఆమెకు చేరుతూ ఉండెను.

రోజుకు రోజుకు లైల నేత్రములు ఎక్కువ ఎక్కువ తేజస్సుతో నిండినవి ఆలయినవి; కాని కడోలవులు తెలుపుతో నిండిపోంయినవి. [కవుంగా

1646 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆడిన నాలుగు మాటలు మజ్బ్నూన్‌కి పంపిన అనశ్వర (ప్రేమ సందేశము; “ఈ మృణ్మయ నివాసము ఎంత సుందరమైనదో అంత అసౌఖ్యమును అనుభవించినది. గాని దాని నివాసిమయెన (ప్రేమ దివ్యస్వర్గీయమైనది. నా శరీరమునకు ఏ నికర పాశ్వమున వాని పవిత్ర బాహువుల మధ్య ప్రథమ పరిరంభము జరిగెనో అక్కడనే స్థాపింపబడవలెను. మజ్నూన్‌ ఏవీ నీ కళ్ళను ఎత్తి చూడు. అవిగో ఆ జ్యోతిమండలములో, ఆ సూర్యలోకం, అక్కడ ఆ శాశ్వత నిర్షరజలములు ఉన్నవి చూడు. అక్కడగదా (పేమికుల సమాగమము. ఆ బంధము వియోగము ఎరగనిది. నన్ను అక్కడ కలుసుకో. ఈ నా సందేశాన్ని నా ప్రియునికి చెప్పవలను* ఆ మాటలు తుదముట్టగానే ఆమె ఆత్మ ఆ స్థలానికి పరుగెత్తి వెల్లిపోయినది.

ఎడారిలో తెల్లవారింది. రెండు ఆకృతులు పరుగెత్తుకొని వచ్చినవి. ఒకరి చేతులను ఒకరు గ్రహించిరి. ఒకరి ముఖంపై (ప్రమ పిచ్చి దృష్టి తాండవమాడుతూ ఉండెను. జయ్యద్‌ పట్టును వదల్చుకొని మజ్నూన్‌ అరణ్యంలోనికి పరు గెత్తిపోయెను; ఆ నిిర్హర స్థలం చేరుకొని, మొదటిమారు ఏ నిర్జేశాన్ని లైలను కౌగలించుకొన్నాడో సరిగ్గా అక్కడ (క్రొత్తగా చేయబడ్డసమాధిమీద (ప్రేమావధిగా లైలా లైలా అనే మూలుగుతో గుండెను బద్దలుచేసే బాధతో “ఇదిగో వస్తున్నాను, ఇప్పుడే చేరుకొంటాను; ఆ జ్యోతి మండలాలలో నీ సౌందర్యాన్ని దాచి ఉంచు, నేను వచ్చినదాకా” అని అరచి పడినాడు.

సూర్యుడు ఆకాశాన్న మీదికి వస్తూ ఉండగా జెయ్యద్‌ వచ్చాడు. ఆ సమాధిమీద పడియున్న శరీరాన్ని కన్నీళ్లతో తడిపాడు. (కిన్నెర: సంపుటము శీ, సంచిక 11, నవంబరు 1952) .

[

ఠి

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు (ఒక పరిశీలన) సోమసుందర్‌

(

య సాహిత్యానికినా బాలసాహిత్యం ఆణిముత్యాల కోవ వంటిది. జీవితానికివలెనే సాహిత్యానికి కూడా పిల్లల చిరునగవు వెలుగులు శోభాకరాలు. సాహిత్యంలో తొలిపూవులు పూసిన ఆదికాలంనుంచీ పరిపక్వతనంది మధురస మూరు వర్తమాన దశవరకు బాలజీవితం రవ్యు మైన, వునోరంజకమైన సాహత్యాన్ని ఉత్పత్తిచేసుకుంటూనే ఉంది.

కాని మన సాహిత్యజీవితంలో పునర్జీవన కాంతిపథం తెరుచుకున్న ఆధునిక యుగంలోమైతం ఇటీవలివరకూ బాలసాహిత్యం వెంపుకు కవుల ఆదరాభిమానాలు ప్రసరించనేలిదు. మన సాహిత్యంలో అంతర్లీనమై, పిల్లల పెదవుల నుంచి పెదవులకు అనుశ్రుతంగా ప్రవహిస్తూవచ్చిన పాటల తేటవూటలు - అపరంజి జిలుగు లీనుతూ, అమరమై నిలచేవున్నాయి. ఉదాహరణలుగా;

“చెమ్మ చెక్క - చేఠెడేసి బుక్క.

అట్లు పాయ్యంగ - ఆరగించంగ

ముత్యాల చెమ్మ చెక్క - ముగ్గులేయంగ

రత్నాల చెమ్మచెక్క - రంగులేయంగ”

“చిప్పిచిప్పి గోళ్లు - చిన్నారి గోల్లు

మా తాత గోళ్లు - మండాపరాళ్లు” పందిరి ముల్లీకార్టునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

1648 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

“కొక్కిరాయి - కాలు విరిగి

దానికేం మందు?

వేపాకు చేదు - వెల్లుల్లిగడ్డ

నూనమ్మ బొడ్డు - నూటొక్క ధార?

“బుజబుజరేకుల పిల్లుందా?

బుజ్జూలేకుల పిల్లుందా?

సామీదండం పెల్లుందా?

స్వరాజ్య మిచ్చే పిల్లుందా?”

“మామయ్య పంపేడు - మందలోకెల్లి

పాలేళ్లు తెచ్చారు - పాలకావిళ్లు

బుడ్డిముంతలతోటి - బుడిగావు పాలు

పదవమ్మ చెల్లెలా - పట్టుకొద్దాము!

“డబ్బుకు రెండూ దాక్షాపళ్లు

బడిపిల్లలందరు కొనుక్కొండీ!

నారింజ పచ్చన - గులాబి ఎరుపూ

చివరిపిల్లని పట్టుకొండి! ”

ఇలాంటి పదచిత్రాలు పిల్లల బతుకులో జలతారు వెలుగుల్ని ప్రవేశపెడుతూ నిత్య జీవితపు ఆటపాటలలో ఉచ్చ్వాస నిశ్వాసములవలె మిళితమై పోయాయి.

ఏ జాతీనా మహోత్తమపథంవెంపవు పయనించాలంటే బాల జీవితాల్ని తీర్చిదిద్దే అవిరళకృషిపైనే ఆధారపడివుంటుంది. ఈ భావాన్ని ఆధునిక యుగం పునస్థాపనచేసి, బాల సాహిత్యోద్యమాన్ని సంస్కరించినప్పటికీ - దీని బీజాలు ఏనాడో (ప్రాదుర్భావం చెందాయి. అధునాతన కవితాయుగానికి పూలవంతెన లేర్పరచిన శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, పునర్జీవన ప్రారంభంచేసిన శ్రీ గురజాడవారూ తమ దృష్టిని బాల సాహెత్యానికి మరల్చినవారిలో అగ్రగణ్యులు.

శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు ఉత్తమమైన పిల్లల సాహిత్యాన్ని సృష్టించారు. 'ర0డవ తరగతినుంచి - ఐదవ తరగతివరకు చదువుకునే పిల్లలకు పాఠ్యభాగాలుగా

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1649 వుపయుక్తమయ్యే బాలగీతావలిని సృష్టించారు. దాదాపు - రెండు దశాబ్దాలవరకు వీరి పుస్తకాలు - ఆనందాన్నీ ఉత్సాహాన్ని పంచిపెడుతూ పిల్లల హృదయాల్ని పరివాలించాయి.

దానికి కారణం - వారి కవితావస్తువులు బిడ్డల జీవితాలకు చేరువలోగల వస్తుసముదాయంతో నిండిఉండటమూ, వారి భావమూ - భాషా సులభగ్రాహ్యంగా వుండటమూ, సులభవాచ్యంగా వుండటమూ మాత్రమే! అంతేగాక బాలసాహిత్యాన్ని సృష్టించ దలుచుకున్నపుడు వారి సహజ ప్రకృతిని గురించి స్పష్టంగా పరిశీలీంచాలి. అంచాతనే వారి మాటలలో “బిడ్డలు తమ ఉత్సాహం పొంగినపుడు, భావ ముదేకించినపుడు తమకు వచ్చియురాని మాటలకు వరుస కల్పించుకొని, యాడుచు పాడుచు తవు యవ్యక్త హృదయభావముల నవ్య క్తవముగ వెలువరించుచుందురు. అది పిలల సహజ ప్రకృతి. దీనినిబట్టి చూడగా నుదిక్తభావము (ప్రకటింపబడవలసినపుడు గణబద్ధమగు శబ్దముగ విన్యాసము కావలసియున్నట్లు అగపడుచున్నది” అన్నారు.

“మదురుగోడమీద కుదురుగా కూర్చొని” ఏవేవో వెరికేకలు వేసే కాకులగురించీ; చిన్న వలుగుతో ప్రారంభించి పుట్టలోంచి బుస్పుమంటూ నాలుకలునాచి లేచే (తాచు పామువలె పెరిగి పెద్దచెట్టులాగ విజృంభించే చిచ్చుబుడ్డినిగురించీ; బువ్వ తింటున్నా పుస్తకాలతో బడికివెడుతున్నా బంతి ఆడుకుంటున్నా ఎప్పుడూ తనతోనే వుండే నీడ చెలికానిగురించీ ప్రస్తావించిన వీరి “బాలగీతావళి” ఎన్నటికీ మరపురాదు. వింతగా ఆలోచనం సాగించే ముక్కుపచ్చలారని పసిబిడ్డలకు అందాలు ఒలకబోసే సున్నితమైన సాహిత్యాన్ని మృదుమధురశైలిలో రంగరించి కలకండతో కలిపిన పాలమీగడవలె పసిపిల్లల కందించారు.

బాలగీతాపళిలోని కవిత పిల్లల ధీశక్తికి అనుగుణంగా ఆహ్లాదకరంగా వున్నదని వివరించడానికి ఎన్నో మచ్చుతునకలసు చూపించాల్సివుంది; నాలుగవ తరగతి బాల గీతావళిలో యిలా అంటున్నారు:

“ఎదుట కనబడుచుండిన ఎల్లవాని

కనసుగొనగ నేర్చుకొన్న నా కన్నుదోయి

తన్ను కనుగొనజాలక యున్నదకట!

ఎవరి సంగతి వారల కెరుకపడునె? అందులోనే నల్లమబ్బుల్ని గురించి;

1650 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ; సాహిత్యము

“ఎగిరిపోవుచున్న ఏనుగలాగున,

గునిసి యాడు నల్లగొండ లాగు,

ఆకసంబుమీద నాడుచునున్నది

చల్లగాలితోడ నల్లమబ్బు! వేరొకచోట గున్నమామిడిని గురించి;

“చిగురు లిచ్చుచుండె చిన్న కోయిలలకు -

ఫలము లిచ్చుచుండె చిలుకలకును;

నీడ లిచ్చుచుండు నీకును నాకును,

తనకు మామి డేమి దాచుకొనియ!” మరోచోట చీకటిని గురించి:

“దివ్వె గూడులకును దిగువ, మిద్దెలమీద,

=. స్తంభములకు వెనుక దాగి దాగి

ఇల్లు వదల దేమి యీమొండి చీకటి?

తన్ను వెలుగు లెంత తరుముచున్నొ ఐదవతరగతి “బాలగీతావళి”లో పుస్తకాన్ని గురించి:

“మించు విజ్ఞానజలధి తేలించు నావ,

మంచి చెడ్డల గతు లేర్చరించు తోవ,

మానసిక రోగముల నెల్ల మాను మందు

పొగడ తగువిందు నీ కెందు పుస్తకంటె!”

ఈ విధంగా బాలసాహిత్య మణిదీపికలనదగు పద్యాలను ఉదహరించ దలచుకుంటే పాఠ్యపుస్తకాలన్నిటిని ఉల్లేఖించవలసివస్తుంది. పిల్లల కందుబాటులోని కథన పద్యాలను ఎన్నిటినో వాశారు. రెండు నుంచి ఐదవ తరగతివరకు బాల గీతావళి పుస్తకాలను ప్రచురించిన శ్రీ వేంకట పార్వతీశ్యర కవులకు గిడుగు రామమూర్తి పంతులుగారు - మొదటి తరగతి పిల్లలకు పాడుకొనేందుకు వీలుగావుండే, అనేక సంవత్సరాలనుంచి అన్నుశుతంగా మన సమాజంలో ఎరాజిల్లుచున్న పిల్లల పాటలను సంపాదించి (ప్రకటించమని సలహా యిచ్చారు.

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1651 ఆ సలహా ననుసరించి, “తప్పల్లోయ్‌ - తాళాలోయ్‌ - దేముడిగుళ్ళో బాజాలోయ్‌[; “చందమామ రావె - జాబిల్లి రావె కొండెక్కి రావె - కోటివేలు లేవో, *వానాలు కురవాలి - వరిచేలు పండాలి. మా కొట్లు నిండాలి - బుడుగో, బుడుగో!” “గుమ్మాడమ్మా గుమ్మాడీ - తీగ పాకిందమ్మ గుమ్మాడీ" వంటి అనేక పాటలను సంకలించి మొదటి తరగతి బాల గీతావళిగా సంపుటీకరించారు.

నవ్యాంధ్ర సాహిత్యంలో ఆదికవిగా, సమాజ వాస్తవికతకు పితృపాదులుగా, నవపథాలను సృష్టించిన గురజాడ వాల్మీకి ప్రజల వ్యావహారిక భాషకి పాణ (ప్రతిష్ట చేసి నాటకాన్ని, కథానికనూ, నూత్న సృష్టి చేసినట్టే బాలసాహిత్యానికి మైతం అమూల్య ఆభరణాలను ప్రసాదించారు. ఒక (పక్క సమాజం - మూర్థభావాలతో, తన జాతిని అపస్మారకం చేసే వకమైన దురాచారాలతో కులకుల లాడుతున్నది. వేరొక ప్రక్క సాహిత్యం అంధత్వానికీ - అచేతనత్వానికీ - సంకుచిత జడత్వానికీ బానిసై నిర్జీవంగా మారిపోతున్నది. పాసిపోయిన పాతపాటలనే పాడుతూ ఏహ్యంగా తయారైంది. ఆ సమయంలో గిడుగువారు వినిపించిన పిడుగుల జడికి తట్టుకున్న మనీషులే కొద్దిమంది. అందులో కొత్త చేగంటలను (మోగించినవారు శ్రీ గురజాడ మహాకవే!

ఏ సమాజమైనా ప్రగతిని ఆశ్చేషించాలంటే - నవజీనవ విధానాలను ప్రతిష్టించుకోవాలంటే - వెన్నపూసవలె సున్నితమైన, నెత్తమ్మివలె నిరంజనమైన శిశుహృదయాలను నిండుగా ఆకట్టుకోవాలి. నిను హృదయ కీమ్రలో భావి మహావిజయ వృక్షాల బీజాలను నాటాలి. ఈ కృత్యాన్ని కళలుమాతమే సాధించగలవు. అంచాతనే గురజాడవారు తన సోదర సమాజాన్ని ఉజ్వల భవిష్యత్తు కేసి పయనించే పసిపెల్లలుగా ఆకళింపు చేసుకున్నారు. అందుకనే పిల్లల మానసిక వికసనం కోసమే నిర్దేశించి “లవణరాజు కల, కన్యక, డామన్‌పితియస్‌, పూర్ణమ్మ వంటి కథసకావ్యాలను హృద్యంగమమైన శైలిలో ఉత్తమ కళాసంవిధానంతో విరచించారు.

ఈ కావ్యాలలో కథను చెప్పి వూరుకోవడమొక్కటే వారి పనికాదు. లేక సమాజంలో జరుగుతున్న దురన్యాయ వక్రతలను ప్రతబింబించి వూరుకోవడమేకాదు. కేవలం సమాజంలో తానాశించే సంస్కరణను ప్రతిపాదించాలి. తాను కలలుగనే స్వచ్చశుభ్రతలను సమాజపరం చేయాలి. వారిలోగల ఈ తీవ్ర ఆకాంక్షే ప్రతి అక్షరంలోనూ ధ్వనిస్తుండి.

1652 పందిరి మల్షికార్డునరాప్తు శతజయంతి. సంప్పుటము 4: సాహిత్యము

సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ కలలుకనే కొత్తతరానికి ప్రతినిధి లవణ రాజు. మానవ సమాజం అరలు అరలుగా విడిపోపడానికి కారణమేమిటి? వేదాలచే నిర్వచించబడిన ఆర్షమతం సమాజపు సుగమనానికి కదా వృత్తుల నేర్పరచినది! వృత్తుల రీత్యా విభజించబడిన సమాజంలో మనిషికీ - మనిషికీ మధ్య అగడ్త తొలుత లేదు కదా? రాను రాను ఆ వృత్తులే కులాలుగా రూపొందాయి కదా? మనుధర్మశాస్త్రంలో మూడే కులాలుగా రూపొందిన వర్ణ వ్యవస్థలో - “చాతుర్వర్దం మయా సృష్టం” అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిర్వచించాడు కదా. అయితే ఎక్కడనుంచి వచ్చిందీ అంటరాని పంచమకులం? అంతే కాదు, అసంఖ్యాకమైన కులాలుగా శాఖలుగా హైందవ సమాజం తుత్తునియ లవడానికి కారణమేమిటి? - ఈ ఆలోచనలే లవణ రాజు కల కావ్యసృష్టి కాధారభూతాలు! ఈ ఆలోచనలతోనే సాంఘిక దురాచారాలపై కోపించాడు లవణరాజు, అందుకనే తీయని కలకంటాడు. కలలో తాను మాయాశ్వం పె విహారానికి వెడతాడు. చీకటి పడుతోంది. ఆకలి చేస్తుంది. చం[దోదయ మౌతుంది. ఆ సమయంలో దూరపు దారులలో ఒంటరిగా ఒక మాలపిల్ల పాట పాడుతూ రావడం కనిపిస్తుంది.

“కూటి కడవను భుజముపై నిడు

వాటమది యొక మురువు గులుకగ,

పాడపాడెను పాటలాధరి చెట్లుచేమలకై!

పాటపాడెను చెట్లుచేమలు

కోట్‌ చెవులను (గోలి అలరగ

తాటివనమున నాగి చంద్రుడు

తాను చెవియొగ్గెన్‌!....”

ఆమెలో నిష్కల్మషమైన స్నెగ్ధ సౌందర్యం ముమ్మూర్తులా ప్రతిబింబిస్తోంది. కవ్వించే చక్రవాకాలతో, చక్రాలవంటి పద్మదళలాయతనేత్రాలతో అమె దేహప్పు హొయలు నిజంగా ఆ రాజుని ముగ్దుణ్ణి చేశాయి. ఆమెతో పూసు కలీపాడు. ఆమెను నక్కున చేర్చుకున్నాడు.

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు. సోమనుందర్‌ 1653

“కరము బట్టియు రమ్ము యురమున

జేర్చి, ముద్దిడి, కురులు దువ్వితి;

తాళవనమున వెడలి చండదుడు

ఫక్కునను నవ్వాన్‌”

“ఆడబోయిన తీర్థ మెదురై

వేడబోయిన వరము వచ్చెను;

పెండ్లియాడెద చందుసాక్షిగ

పెట్టుకూడంటిస్‌.”

అవిధంగా లవణరాజు కలలో గాంధర్వ విధిని వివాహమాడతాడు. లవణరాజు ఆలోచనల నీవిధంగా (పపతిబించిస్తారు గురుజాడవారు:

“పుస్తకంబులలోని మాటలు

విస్తరించుచు, ననుభవమ్ముల

తత్వమెరుగక, శుకము లగుదురు

వొట్టి శాస్త్రజ్ఞ్జుల్‌!” దానితో పఠిత హృదయం గలగలమని కింకిణీనిక్వణాలను నింపుకొంటుంది.

ఆలుగుల కళింగదేశంలో రాజుగారి భోగలాలసత్వానికి బలిమయై మరణించిన కస్యను తెలుగు హృదయం మరువలేదు. భూస్వామ్య వ్యవస్థలోని రాజరికపు నిరంకుశ వకవిధానాలకు నిస్సహాయతతో చేసిన తిరుగుబాటు ఆ పసిబాల జీవితం. అంచేతనే ఆమె అంటోంది:

“కండకాపర మెక్కి నీవీ

దుండగము తల పెట్టినందుకు

ఉండడా ఒక దైపమంటూ

ద్‌ఆడ్‌ పూర్కానునా?

కులల పెడలు కూడి రదిగో!

ఆగ్నిసాక్షికి అగ్ని అదిగో!

కమ్నకోరిన కన్నె యిదిగో!

1654 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము జాలమేలొక్కొ? పట్న మేలే రాజువైతే పట్టు నన్నిపుడు!....” అంటూ మంటలోనికి దుముకుతుంది. ఆమె ఆత్మత్యాగంతో నిరంకుశత్వపు కోటలు కూలేటందుకు వుత్సాహమిచ్చింది. కాబట్టే ఆమె మన తెలుగు హృదయంలో నివసించే దేవత! స్నేహం, (ప్రేమ వంటివి మానవత్వపు పరిపక్వతకు నిదర్శనాలు. ఇవి ఎంతటి రాక్షసత్వా న్నైనా జయించగలవు. ఎంతటి త్యాగానికైనా వెనుదీయవు. అంచేతనే “డామన్‌, పిథియస్‌ొల అపూర్వ స్నేహ సంపదకు నిరంకుశుడైన రాజు సైతం అచ్చెరువొంది: *.....మితృభావము సల్పు డిక నీ సఖుడు నీవును!” అని డామన్‌ పిథియన్‌లను విడిచిపెడతాడు రాజు. రాజుల నిరంకుశ శాసనాలను సెతం స్నేహసత్యసంధతలు పటాపంచలు చేయగలవనేదానికి గురజాడవారి యీ కావ్యం నిదర్శనం. ఇలాంటిదే “గోవ్యాఘ సంవాదం” తెలుగులం మరచిపోలిం. పడుపు కూటికి - వివాహమనే మంచి పేరుపెట్టి మల్లిమొగ్గలవంటి కన్యలను ధనాశకు బలిచేసి, యెముకలు క్రుల్లిన ముసళ్ల కిచ్చి, సమాజానికి నిట్రాటలైన తల్లిదండ్రులు ఆనందంగా “కళ్యాణం” చేస్తున్నరోజు లవి. ఈ సంఘ దురాచార పిశాచానికి బలియెైపోతున్న పూర్ణమ్మ లింటింటా వెలుస్తున్న రోజు లవి. తేనెలూరు కెందమ్మి మొగ్గలు ధూళి రాలుతున్న రోజు లవి. సృష్టికర్త ఏ దివ్యహస్తాలో మలచిన పుత్తడి బొమ్మలు ముక్కలై బుగ్గిపాలవుతున్న దినాలవి. అంచాతనే పూర్ణమ్మ అంటుంది: “నలుగురు కూర్చుని నవ్వే వేళల నాపే రొకతరి తలవండి; మీమీ కన్నబిడ్డల నొకతెకు (శేమను నా పేరివ్వండి”"

పిల్లల చిరునవ్వుల్లో ఆలుగు వెలుగులు సోమనుందర్‌ 1655

అని అన్నల వదినల యిరుగుపొరుగు అమ్మలక్కల అందరి దగ్గరా "సలవు తీసుకుంటుంది. హృదయ శిలలు (దవించి సెలయేరులై పారే దృశ్య మది!

పూర్ణమ్మ సామాన్య కన్య కాదు. బంగారు కాంతుల భవిష్యత్తును ప్రతి నిముషమూ ఆశిస్తూ తన చేతిలో లేనివానికై తన కులదేవతపై ఆధారపడుతూ కలలుకనే కుసుమహృదయిని.

*ఏఏ బుతువుల పండే పళ్లను

ఆయా బుతువుల నందించి

బంగరు దుర్గను భక్తితొ కొలచెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా!

తనకీ తన కులదేవతకీ వున్న గౌరవప్రదమైన సామ్యలక్షణం - సువర్ణం. అలాంటి పూర్ణమ్మ పాడై బీడుగా మారిన పాతలోకం మీద నిప్పు లురలిస్తూ, కలలతో పుట్టబోయే కొత్తలోకంమీద సేసలు జల్లుతూ, తన గుండెలలోని ఎరరని ఆశలను దిగంతాలలో పారబోస్తూ - ఆఖరిసారిగా యిల్లు విడిచి దుర్గకోవిల కొలనుకు పయనం సాగించింది. అంతే!

“ఆవులు పెయ్యలు మందల చేరెను

పెట్టలు చెట్లను గుమికూడెన్‌

మింటను చుక్కలు మెరయుచు పొడమెను

పూర్ణమ యింటికి రాదాయె!

పగటికాలంలో ఎవరికి వారుగా విడిపోయి చీకటి భూతంలా శాసించినపుడు సమస్త జీవులూ తమ తమ సమూహాలను చేరుకుంటాయి. ఆశగల ్రతీజీవికీ ఇదే కర్తవ్యం మరి! కాని పూర్ణ్వమ్మకు వ్యక్తిగతమైన ఆశలు నిండుకొన్నాయి. అంచాతనే పూర్ణమ్మ నాటికీ నేటికీ యింటికి రానేలేదాయి!

సమాజంతో తనకు రుణం తీరింది. తన (బతుకుమీద పణం పెట్టి - “కాసుకు లోనై తల్లీతండ్రీ నెనరూ న్యాయం విడనాడి-" తనకే తెలియకుండా ఎప్పుడో బుణపడ్డ నోటుమై చెల్లుపెట్టించేసుకున్నారు. కంచె చేను మేసింది. సమాజ వకనీతి ఆమె భవిష్యత్తును నమిలిమింగింది. తనకీ లోకంతో పనేమిటి?

"1656 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. నంపుటము 4: సాహిత్యము “కన్నుల కాంతులు కలువలు చేరను. . మేలిమి చేరెను మేనిపసల్‌ హంసల చేరెను నడకల బెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మ బంగారంలో బంగారం కలిసిపోయింది. కాంతిలో కాంతి లీనమైపోయింది. పూర్ణమ్మ కన్నుల కాంతులతోనే జనహృదయంపవంటి కోనేటిలో నేటికీ కలువలు (గుమ్మరిస్తున్నాయి. శ్రీ గురజాడవారి యీ నాల్లు కావ్యాలు పిల్లల కుపయోగించే సాహిత్యంలో నాలుగు వజాలని చెప్పాలి. వీటిని ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుకొనే పది పదిహేను వర్ణాలమధ్య పిల్లలకు మహత్తరమైన హృదయ సంస్కారాన్నిస్తాయి. ఈ నాల్గు కావ్యాల్ని బాలసాహిత్యంలో జమ కట్టడం కొంతవరకూ సాహసమే అయినా వీటి సంవిధానాన్నిబట్టి చూసినా, కథనరీతిని బట్టి చూసినా యిది వాస్తవానికి దూరంకాదని స్పష్టపడుతుంది. ఈ దృక్కోణంనుంచి చూస్తే శ్రీ గురజాడవారికి మన సాహిత్యంలో గల విశిష్టస్థానానికి మరికొంత విలువ చేరుతున్నదే గాని అన్యం కానేరదు. శ్రీ చింతాదీక్షితులుగారు పిల్లలకోసమని సాహిత్యాన్ని సృష్టించడంలో అనన్యమైన కృషి సల్పారు. ఒకవంక ప్రాథమిక విద్యావిధాన పర్యవేక్షణోద్యోగిగా జీవితం గడుపుతూ పిల్లల మెత్తని మనస్సు పై ఎలాంటి ముదలను కల్పించాలో (గద్ధగా పరిశీలించారు. వేరొకవంక ఆంధ్రసాహిత్యంలో [ప్రముఖ కథకులై మానవ వూనస సరోవరపు లోతులు కనుగొనడానికి పయత్నించారు. ఈ ద్వంద్వానుభవజన్యంగానే ఉత్తమమైన బాలసాహిత్యాన్ని సృష్టించారు. వీరు (ప్రచురించిన లక్కపిడతలనే గేయసంపుటి పిల్లల సాహిత్యానికి మణిపూసవంటిదని చెప్పాలి. పిల్లల సుకుమార హృదయాల నురూతలూగించే చక్కని గేయా లన్నో వున్నాయి. ఉదాహరణలుగా; “చిట్ట చిట్టి కమలాలు చెరువులోని కమలాలు నవ్వేటి కమలాలు - నాకు తెచ్చిపెట్టె!

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు. సోమనుందర్‌ 1657

అమ్మ తెచ్చిపెట్టే!”

“బాజాలు రా నాన్న బాజాలు

బాజాలు వచ్చాయి బాజాలు

బాజాలతో వచ్చె పల్లకీ అదిగొ,

పల్లకీలో వుంది పార్వతీదేవి.”

“వీడేనమ్మా కృష్ణమ్మా

వీడే వీడే కృష్ణమ్మా!

కాళ్లకు గజ్జలు చూడండి.

మొల్లో గంటలు చూడండి,

మెళ్లో హారము చూడండి,

తల్లో పెంఛం చూడండి!”

“చిన్ని కృష్ణుడు పుట్టాడు

చిటపట పువ్వులు కురిశాయి.

చిన్ని కృష్ణుడు నవ్వాడు

తళతళ మెరుపులు మెరిశాయి

చిన్ని కృష్ణుడు నడిచాడు

తప్పట్లు కొట్టింది భూదేవి”

“తువ్వాయి తువ్వాయి ఏమి తువ్వాయి?

తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి

తువ్వాయి మెళ్ళోను ఎమి వున్నాయి-

తువ్వాయి మెళ్ళోను మువ్వ లున్నాయి

తువ్వాయి కాళ్లలో ఎమి ఉన్నాయి?

తువ్వాయి కాళ్లలో పరుగు లున్నాయి”

ఈ విధంగా ఉదాహరణలు చూపదలిస్తే 56 పేజీల పుస్తకాన్నీ ఉల్లెభించవలసి పస్తుంది. లక్కపిడతల సంపుటిలో హనుమంతుడి తోక, బూచాడు వంటివి మరుప్పురానివ.

1658 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము బాలసాహిత్యాని కుండవలసిన ముఖ్య లక్షణాలలో పిల్లల కందుబాటులో వుండే తేలిక రకపు లయబద్ధమైన ఫణితి, భావసరళత, భాషాసౌొలభ్యమూ, కల్పనలో పిల్లల మెదడుకు అతీతమైన విషయాలగురించిగాక వారి ఊహపోహలు (ప్రసరించగలిగే తిన్నని తీరు తెన్నులుండాలి. అందుకనే వీరు “హనుమంతుడి కోక్‌ అనే యంలో వుత్తమ లక్షణాలను పోనాడకుండా - పసిపిల్లల మానసికాభిలొషను ఏమరకుండా - చక్కని సంవిధానబద్ధమైన కావ్యాన్ని సృష్టించారు. పిల్లలకి కోతిని చూడగానే విచిత్రమైన ఆనందం కలుగుతుంది. మనిషికి మల్లేనే వుండి - మనిషికి లేని తోక ఎలా కలిగివుందా అని పిల్లల కెంతో అవ్బెరువు కలుగుతుంది. అంచాతనే పెద్ద కోతియగు హనుమంతుని తోక చిత్రవిచిత్రాలుగా సాగుతుంది. " “రాముని బంటూ - రాముని బంటూ , హనుమంతులవారూ! హనుమంతుని కొక తోక వున్నదీ అందమైన తోక." . అని ప్రారంభించి ఆ తోకకున్న ప్రాశస్త్యాన్ని వర్దిస్తూ ఈ గేయం సాగుతుంది. రామాయణంలోని లంకాదహన ఘట్టాన్ని వర్దిస్తూ - రమ్యంగా మనోహరంగా బొమ్మకట్టి చూపుతారు; “తోకను ఎత్తి ఎగిరి రాక్షసుల మూకను కొట్టాడు” ఆఖరికి ఇంద్రజిత్తుకి దొరికిపోయాడు. రావణుని కొలువుకూటంలో హనుమంతుడు తన వాలాన్ని సింహాసనంలాగ అమర్చుకొని కూర్చుంటాడు. రావణుడు చేసిన అన్యాయానికి నిర్భీతిగా నిందించాడు. “నీ కంఠార్పిత కాలపాశము శిరోనిర్దాతపాతమ్ము” అన్న రామాయణ ఘట్టంలో శ్రీ దీక్షితులుగారు: “రాములవారిని భూషించాడు రావణు తిట్టాడు . రావణాసురుడు కోపముతోను కోతీ అన్నాడు కోతిని బట్టీ తోకను కాల్చి తన్నండన్నాడు.”

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1659 వెంటనే రాక్షసులు హనుమంతుని పట్టారు. ఎన్నెన్నో బట్టలు తెచ్చి తోకకు చుట్టారు. కుండలకొద్దీ నూనె తెచ్చి తడిపారు. నిప్పంటించారు. అంతే! దానితో- “అంటించాడు - అంటించాడు లంకాపట్నాన్ని భగభగ భగభగ భగభగ భగభగ మండుతోంది తోక!” రాక్షసులకి తగిన శాస్తి అయింది. “ఇదిగో చెట్టు అదిగో గొయ్యి పదండి దాక్కోండో అంటూ గోలపెడుతూ ఆత్మ రక్షణోపాయాన్ని వెదకడం (ప్రారంభించారు. అప్పుడు వాళ్లనుకుంటారు; “*త్రోకకాదురా శంభుడి శూలం ఖస్సున పొడిచింది తోకకాదురా విష్ణుని చక్రం "గిర్రున తిరిగింది _ తోకకాదురా ఇందుని వజం పరపర నరికింది తోకకాదురా యముడి దండమూ దబదబ మొత్తింది.” ఈవిధంగా సాగిన “హనుమంతుడి తోక” శ్రీ దీక్షితులుగారి లక్కపిడతలలో విశిష్టస్థానాన్నలంకరించింది. ఈ గేయాన్ని పది పన్నెండేళ్ల వయసుగల పిల్లలకు పాఠ్య భాగంగా చెబితే వారి వూాహపోహల కెంతో సహకరించి చెరగని ముద్రలు వేస్తుంది. మన సాహిత్యంలో - సంఖ్యలో స్వల్పమైనా గుణంలో ఉత్తమేణికి చెందిన బాలగేయాలను రచించినవారిలో శ్రీ బసవరాజు అప్పారావు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, త్రీ అడివి బాపిరాజు, శ్రీమతి చావలి బంగారమ్మగార్లు గణనీయులు. శ్రీ బసవరాజు అప్పారావుగారు జీవితాన్నే కవితగా మార్చిన మనీషి. వీరి హృదయం సజీవమైన మహతివలె జీవితంలో ఏ దెబ్బ తగిలినా, ఏ గాలి సోకినా,

1660 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పలుకకుండా వుండలేకపోయింది. అంచాతనే పిల్లలనుగురించి కూడా అవ్యాజకరుణా రసవాహినిని స్రవించారు వీరు. “మినుకు మినుకు మినుకు మంచు - మింట మెరయు చుక్కలార! " చెప్పలేరె మీలో నా చిన్నితల్లి ఎవ్వరొక్కొ” అని తన పసిబిడ్డ చిహ్నాలను ఆకాశంలో వెదుకుతారు. మరొక చోట; “ఇది సంపెంగపూ విది మల్లెపూవు, ఎది కావలెనే చెలియా! ఇది మామిడి పం డిది జామపండు, ఎది కావలనే చెలియా! ఇది (దాక్షారస మిది పూవుదేనె. ఎది కావలెనే చెలియా! ఇది వైడూర్యం బిది మేలికంపు ఎది కావలనే చెలియా! ఇది కృష్ణ[ప్రమ ఇది మిత్రుపణయ మెది కావలెనే చెలియా!” వంటి ప్రశ్నాపూర్వక గేయాలు పిల్లల ఆట పాటలలో చక్కని వెలుగు సోకిస్తాయి. “నల్లవాడే గొల్ల పెల్లవాడే చెలియ

పిల్లల చిరునవ్యుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1661

కల్లకాదే వాని

వల్లో చిక్కితినె-

వచ్చినాడే

తోట జొచ్చినాడే! అనేపాట పాడుతున్నపుడు ఏ బాల అవ్య కానందంతో పరవశతనొంది నర్తించదు? ఈ కవిసైతం ఈ పాట పాడుతూ ల్మేబాయపు గోపికహృదయంతో తాదాత్మ్యతనొంది రసానందాన్ని పొందినట్టు కనిపిస్తాడు.

పసిబిడ్డలను గౌరవించలేని జాతి ముందుకు రాదనే మానవత్వపు (పపధాన సూత్రాన్ని తన ప్రతి పలుకునా వినిపింపచేస్తాడు. ఒకచోట వీరు;

“వెనుక జన్మలో ఏమి

"పట్టి పుట్టితిమొ?

బంగారు పండంటి

పసిబాల కలిగె!

దినదినము పాపణ్ని

దీవించి పొండి

దేవలోకములోని -

దేవతల్లార!” ఎంతో పుణ్యం చేసుకున్న తల్లితం[డడులకు పుట్టిన బిడ్డని [ప్రతిదినమూ దేవతలే దీవించాలని కోరుకుంటాడు కవి. అంతేగాదు మరో ఘట్టంలో తనబిడ్డసు కేపలమూ భగవత్స్యరూపంగా కీర్తిస్తాడు. ఆ పసిబిడ్డల కోసమే గాకపోతే మానవసృష్టి ఏనాడో అంతరించి ఉండేది. మానప్పునిలో ఆశాభావమూ, (ప్రగతిశీలతా ఏనాడో మటుమాయమైై కేవలమూ పశుత్వమూ రాక్షస 'పప్రవృత్తీ మాత్రమే మిగిలిపుండేవి. అంచాతనే ఈ కవి అంటాడు;

“ఎవ్వ రనుకొన్నారొ ఎరుగరా మీరు?

పాపాయి సాక్షాత్తు పరమాత్ముడండీ!

1662 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

తరతరాలా గొప్ప తపము చేశాము

స్వామి నాటికి నేడు వరమిచ్చినాడు”

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు జేబుదొంగలనుంచి వేయిపడగలదాకా అనేక నవలలూ, ఆం(ధ్రప్రశస్తినుంచి రామాయణ కల్పవృక్షంవరకూ అనేక కావ్యాలూ రచించి కవిసామాట్టుగా పేరొందారు. కవిత్వంలో ఎన్నిపోకడలైనా పోగల శక్తిమంతుడు కావడంవల్ల వీరు విశిష్టమైన బాలగేయాలనుమైతం రచించారు. వీరి “కిన్నెరసాని పాటలు - కోవెలమ్మ పెండ్లి అనే కావ్యాలు కొంగొత్తగా యవ్వనోషస్సులోకి ప్రవేశించే బాలలకి కడుహృద్యంగా ఉంటవి.

“కన్నె కాటుక కళ్లు

చిన్నినాథుని చూచి

కదలు లాడినవేళ -

కందళించిన వేళ -

ఆకాశమధ్యాన అటునొక్క తెలిమబ్బు

మెరుపులా మెరిసిందిలే!

వెలుగులో వొరిసిందిలే!” వంటి పాటలు బాలల కప్రయత్నంగా వారిచ్చిన మెరుపుతీగల పసిడి కాన్కలు.

శ్రీ అడవి బాపిరాజుగారు తన సహజ కళాశీలత్వంతో సృష్టించిన గేయాలు కొన్ని పిల్లలకు బాగా ఉపయుక్త మవుతున్నాయి.

“నువ్వూ నేనూ కలసి

పువ్వులో తావిలా

తావిలో తలపులా -

నువ్వూ నేనూ కలసి

కోకిలా గొంతులా -

గొంతులో కోర్కెలా

నువ్వూ నేనూ కలిసి

వన్నెలా వెన్నెలా

వెన్నలో వెలుగులా

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు. పోమనుందల్‌ 1663

నువ్వూ నేనూ కలిసి

నింగిలో నీడలా

నీడలో నిదరలా!” వీరు పాతమాట అనే గేయంలో - భవిష్యత్తు కధినేతలైన నేటి పసికందులను

“వాతకతలూ, పాతవతలూ

పారి చనె, స్వేచ్భాపతాకము

నెత్తరా, నెత్తవేం, ఎత్తూ -

ఏడు ద్వీపాలన్‌!” ఈ పతాక యిరుగుపొరుగుల కలిమిలేములతో సంబంధం పెట్టుకొనేది, బతుకు మార్గంలోంచి ద్వేషాన్నీ వేషాన్నీ తొలగించేది, బానిసల చెడుబతుకుల కంటిచూపులలో సముజ్వల కళల తోపించేది. హాయిగా కలమూ కంఠమూ కదంత్రొక్కుతూ గానం చేసేది అయిన ఉత్తమ స్వేచ్చను కూర్చే పతాక కావాలని కాంక్షిస్తాడు. వీరి “వరద గోదావరొ పాట నేడు అనేక బాలికాపాఠశాలల్లో నాట్యగీతంగా నేర్చుబడుతోంది. ఈ పాటంతా గోదావరి తేట ఊట. ఇందులో;

“అడవి చెట్లన్నీని

జడలలో తురిమింది;

ఊళ్లు దండల గుచ్చి

మెళ్లోన తాల్చిందీ,

ఉప్పొంగిపోయింది గోరావరీ - తాను

ఆప్పున్న ఎగిసింది గోదావరీ!” అని మృదులమైన చిత్రాలతో ఫయంకరమైన గోదావరి వరదలను కనులకు కట్టడం పసిగుండెలలో చలువ లూకించడానికేనని స్పష్టమవుతుంది.

శ్రీమతి చావలి బంగారమ్మగారు - సహజ స్త్రీహృదయ మార్టవంతో చక్కని గేయాలెన్నో వ్రాశారు. వాటిలో ఎక్కువభాగం స్త్రీలను పసిపిల్లలను రసావేశంలో ముంచెత్తగలిగేవి కావడం ముదావహం! వీరి రచనలలో కప్పతల్లి పెల్లి-ఆ కొండ

1664 ఫందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము _ నీడ వంటి గేయాలు మరపురానివి. నాటివరకూ నిర్జీవంగా కనిపించే కప్పలు ఒక్కసారిగా - తొలకరి వానలు ముసురుకొనడంతోటే అకస్మాత్తుగా వాతావరణంనిండా సజీవ కలవరాన్ని నింపుకాయి. పెళ్లి బాజాల హోరులాగా రణగొణ ధ్వనిలాగా చెవులు చిల్లులు పొడుస్తాయి. ఈ హఠాత్‌ సంఘటన అందరికీ విచిత్రకారణమే కదా! అందులోకీ పిల్లలకు మని! ఈ సహజ సంఘటననే ఈమె ఇలా వ్యాఖ్యానిస్తారు. “కప్పతల్లీ పెల్లినేడూ, చూడరే - ల కావిళ్ల నీల్లొంపినాడూ! వరుణదేముడు పంపినాడూ! ఓ చెలీ - వాడలన్నీ నింపినాడూ! కప్పమ్మ పెల్లికోయంచూ, మేళములు గొప్పగా ఆప్పెంచినాడూ! చెప్ప శక్యముగాదు వేరే - బోదురూ కప్పలా మేళములు రారే! కప్పమ్మ గడప తొక్కినదీ - శుభమన్న సూచనలు చూరు చెప్పినది. కప్పు లెగిరే వానలమ్మా - పొలములూ కనకమే పండుతాయమ్మా! అలాగే వేరొకచోట ఆమె చెరువులోపడే నీడలగురించి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంది! “వీడ తన అందాన్నిచూసి” తనే మురిసి పోతుందంటుంది: “సాగసెల్ల చూశాను, సొమ్మసిలిపోయాను, చెట్లంటి పాములే, చెరువెల్ల పాకాయి” ఆ వింతల్ని చూసి ఆకాశం హడలిపోతుంది. గజగజా వొణికి గట్లపై కొరిగింది. అంతేగాక ఈ మురిపాన్ని చూడ్డాన్నికన్నట్లుగా:

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1665

“జుట్టెల్ల విరియబోసింది;

మందార బొట్టెట్టె చెదరి రాలింది.

గట్లగుండెలు కలగ, మెట్లకన్నులు చెదర

ఒంగున్న మందార వంగియేయుండి - ఆ

అందాలు తానె చూసింది;

నాతోటి

మందార మాటలాడింది...” ఈ కవయితి రైల్లో పయాణంచేస్తూండగా దూరంనుంచేవేవో మౌనసందేశాలిస్తూ కనిపించే కొండ ఒక్కసారిగా మాయమైంది. ఆ కొండను మంచు మేలిముసుగు ఆరుసూూ, మూస్తూ వింత దాగుడుమూత లాడిస్తోంది. ఇంతకీ ఆ కొండ తనకోసమే వస్తోందేమో? రైలు ప్రయాణంలో కనిపించే ప్రతీ చిన్న దృశ్యమూ పసిపిల్లల గుండెల న్యురూత లూగిస్తుంది. ఈ గేయమంతా ఆ సన్నివేశంలో గల పిల్లల మానసికమైన ఆలోచనలకీ, ఆరాటాలకీ, ఆవేశాలకీ ప్రతిబింబం. రైలుమాత్రం మామూలుగానే వెల్లిపోతుంది;

“డబ్బుతే-డబ్బుతే

డబ్బుతే - అను పలుకు

విడువకను పలికేటి

వడినడక రైలుతో

తనుకూడా చనుదెంచెనే -

ఆ కొండ - తడయకను పయనించెనే”్‌ అలాగే కూడావచ్చిన కొండకి కోపం వస్తుంది:

“కొనియాడలేదన్న

కోపమున తాబోయి

కొండ పొడవృన కూలెనే!

ఆ కొండ

గుండెరాయిగ మాఠెనేగొ

1666 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అంచాతనే ఆమెకోసం అందాలు చిత్రించిన ఆ కొండ నల్లరాయెపోయింది. మంచులో మునిగి, మాయమై - అక్కడే పడివుంది. ఎంత పిలిచినా పలకదు. సాహిత్యంలో పాతపాటలు పోయి కొత్త పాటలు (ప్రాణంపోసుకుంటున్న సమయం వచ్చింది. మహాప్రస్థాన గేయాలతో తెలుగు సాహిత్యలోకంలో విప్లవ శంఖారావంచేసిన శ్రీరంగం శ్రీనివాసరావు పసిపిల్లల వెరిసంతోషాలను కీర్తిస్తూ వివశుడయ్యాడు. “మెరుపు మెరిస్తే - వానకురిస్తే - ఆకసమున హరివిల్లు విరిస్తే

  • అవి మీకే నని ఆనందించే - పిల్లల్లారా - బుడతల్లారాగ్‌ అంటూ ప్రపంచంలోని అందచందాల గురించి, వెలుగునీడల గురించి - దుఃఖ ఆనందాల గురించి కవితాహృదయంతో ఘోషిస్తూ, “తల్లిసందిటా - తండ్రి కౌగిటా - నోళుల వేళుల _- కచభారంతో -” ఉంటూ, “ఏమీ ఎరుగని ఐదారేడులొ పసిబిడ్డలతో, ఈ లోకంలోనివన్నీ మీయందరివీ నంటాడు. ఇలాంటి కావ్యాలు ప్రత్యక్షంగా పిల్లల కోసమని నిర్దశించబడకపోయినా, పిల్లల రుచిరప్రకృతిని పతిబింబిస్తూనే వుంటాయి. నేటి రచయితల్లో శ్రీయుతులు అనిసెట్టి, రాంషా, శశాంక, బైరాగి, కవిరావు (ప్రభృతులు బాలసాహిత్యాన్ని సృష్టిస్తున్న వారిలో ముఖ్యులు. పిల్లలకోసమని ప్రత్యేక పత్రికలను పప్రారంభించినవారిలో శ్రీ న్యాపతి రాఘవరావు - కామేశ్వరమ్మ దంపతులు మార్గ దర్శకులు. వీరి “ఆటవిడుపు - బాలానందం” రేడియో కార్య[క్రమాలు పిల్లల నాకర్షించి నంతగా - మరేయితర రేడియో కార్య[కమాలూ ఆయా తరహాల ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయి. వీరి “బాల” నిర్వహణ విజయవంతం కావడంతో ఎన్నో పత్రికలు బయల్టేరాయి. అందులో ముఖ్య మైనవి; చందమామ - బాలమిత్ర - పాపాయి - బొమ్మరిల్లు - నవ్వులు పువ్వులు - జాబిల్లి వగైరాలు. వీటన్నింటా చందమామ విజయం పొందిందనడానికి తార్కాణం - మరి రెండు భాషల్లో ప్రచురణకావడమే! శ్రీ బైరాగి చందమామలో వ్రాస్తున్న బాల గేయాలు, ఆంధ సచిత వారపత్రికలో శ్రీ కవిరావు (పచురించిన 'గేయాలలోనూ ఎన్నదగినవెన్నో వున్నాయి. అలాగే శ్రీ బుజ్జాయి బొమ్మలతో ప్రచురిస్తున్న వచనసాహిత్యం అమితంగా వుంది. కాని దురదృష్టవశాత్తూ ఎందరివో ఉత్తమమైన బాల గేయాలు (గంథస్థంకాకుండా వుండిపోయాయి.

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1667

ఆంధ్రదేశంలో నాట్యకళాకారుడుగా ఖ్యాతివహించిన శ్రీ, బి.వి.నరసింహారావు ఎన్నో వృత్తవు గేయాలను రచించారు. ఇవి షుస్తకవముఖంగాగాని, ప(త్రికాముఖంగాగాని ప్రచురణ కాకపోయినా శ్రావ్యమైన వారి కంఠతహా అనేక సభల్లో పాడి వినిపించడంవల్ల బాగా [ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీరొక గేయంలో అక్కయ్య నుంచి జాబురాగానే ఆనందంతో పొంగిపోయే పసిబిడ్డల చిత్తవృత్తిని సులభంగా ప్రతిధ్వనించారు:

“జాబు వచ్చిందమ్మ - జాబు వచ్చింది

బాబయ్య పేరనే జాబు వచ్చింది.

అక్కయ్య పిల్లలూ అంత క్షేమమంట

అక్కయ్య పాపాయి ఆడుతున్నాడంట

చెప్పన్నిమాటలు చెప్పుతున్నాడంట

తాతయ్య పేరెపుడు తలుచుకుంటాడంట

అమ్మమ్మ పేరెత్త ఆనందమంట

జాబు వచ్చిందమ్మ జాబు వచ్చింది....” ఇలాగే మరో గేయంలో -

“పెద్దలకంటే బుద్ధిమంతులూ

పిల్లలేను తెలుసా?

పెద్దలబుద్ధీ తరుగుచుండునూ

ఊెరుగుచున్న కొలదీ!

పెద్దలకంటే బుద్ధిమంతులూ

పిల్లలేను తెలుసా?

పిల్లలబుద్ధీ పెరుగుచుండునూ

ఊపరుగుచున్నకొద్దీ!....” అంటారు. ఈ గేయం అల్లరిపిల్లల్ని ఎంతో వుత్సాహపరచి లాలిస్తుంది. మరోగేయంలో తెల్లని వస్తువులగురించి వర్ణిస్తూ యిలా అంటారు;

1668 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “మల్లిపూవు తెలుపు - మంచు తెలుపు మంచివాని మనసు తెలుపు” పిల్లల్ని మంచివాళ్లుగాగాని చెడ్డవాళ్లుగాగాని తయారుచేసే శక్తుల్లో సాంఘిక పరిస్థితులే ఎక్కువ పాత్ర వహిస్తాయి. కాబట్టి సాంఘిక పరిస్థితులకుమల్లినే మాససిక పరిస్థితులకు కూడా పరివర్తనం కలిగించడానికి మనిషి అనన్యంగా కృషిసల్పాలి. మంచివాని మనసు తెల్లని మల్లిపూవువంటిది అనే వివరణ విన్న బాలుడు మంచివాడుగా మారకుండా వుండగలడా?...మరో "గేయంలో ఎరుపు రంగుగురించి మనోరంజకంగా చెబుతున్నారు: “ద్రీప మెరుపు - కోప మెరుపు రాగ మెరుపు - రక్త మెరుపు. నందన మందార మెరుపు = సూర్యుం డుదయాద్రి నెరుపు పడతి మెడను పగడ మెరుపు కొమ్మ నుదుటి కుంకుమెరుపు" బాలసాహిత్యాన్ని పరిశీలించే ఏ సమాలోచనమైనా శ్రీ నార్ల చిరంజీవిగారి “తెలుగుపూలు”, “ఆటపాటలు” అనే రెండు పుస్తకాల్ని సమీక్షించకుండా విడిచితే సమగ్రం కానేరదు. నాలుగవ ముదణాగౌరవాన్ని పొందిన వరి “తెలుగుపూలు” ఆంధ్రజాతి గౌరవాన్ని బాగా ఆకర్షించుకొన్నాయి. కుమారీశతకం, సుమతీశతకం, వేమన పద్యాలు, కృష్ణశతకం మున్నగునవి పెల్లల కుపయుక్తమయే సులభశైలిలో

  • కాలానుగుణ్య మైన ఏవో కొన్ని నీతులను ప్రతిపాదించడానికే రచియించబడ్డాయి. అయితే మానవచర్శిత ప్రగతిలో ఒకనాటి నీతిసూత్రాలు వేరొకనాటికి మారుతూ రావడం సువిదితమే. అంచాతనే, జీవిత విధానాలను మార్పుచేయబూనుకొన్న ఈ నవయుగంలో పాతనీతులన్నీ శిరోధార్యాలు కావు. పాతరీతుల్లోనే కొత్తనీతులను (ప్రతిపాదిస్తే అక్షరాస్యు లైన పిల్లల్లో సులభంగా వ్యాపిస్తాయి. ఈ ఉద్దేశంతోనే వీరు తెలుగు పూలను సులభ ఛందోరీతులైన ఆటవెలది, తేటగీతులతో నింపారు.

పిలల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందలి 1669 ఈఓ టో ల టొ వూ తాత కాలంనాటి నతులవైాన మ్‌ న్‌ ద్‌ రం పాతవీ రోతవీ పారేసిరంతి. ని ర చ _ వాడిపోయిన పూలు ధరియించగలమెొ! న ల్‌ జా జ ది సలఘదుసపిని సుంచు సరికొత్త ణతి 6౬ నో. న్‌ | శాం, .- పై ఆశీ ౯. సాధింపవలసనోయి - సొగిరండ య్‌” బి న లి న. న అల్లి ల్లో అంటారు, తెలుగుపూలు తొలిపలుకుగా. మానవుడు (ప్రధానంగా సంఘజీవి. (4 (న నా కల్‌ హా (న్‌ అత్మ సో అధ ఆ, తరువాతనే వ్యక్తి. సాంఘకదచైతన్యం పరమానదశలో అపసరమూ, ఆచరణార్హమూ పో వ చిం న గతచ ల్‌ ఎన జాం నాం 2 అయిసంతగా గతచర్మితల న్నడూ కాలయి మరి. “అవి మందారము లివి తెలుగు పూలు యథ. ఆశ ౯ ఎవి కావలెనోయ్‌ - నీ కెది కావలసాయో (| లంద ల వలం గం ఉం | బ్‌ ః తళా అని ప్రశ్నించి - కలకండ పోనపంటి తైలుగుబాసలప్‌ కావాలని సమాధాసమిస్తారు. ణం వాం లగ * ల, చలం గ సంచ రుల న. నయిజ టైలుగు టుణయి లాలన్‌ ౯ ॥. లవి కావలనోయ్‌ - నీ ఇది... తరిప చెన్నప్తూస పూ తలుగు మనసు టాం ండారో ౯ 11 అబ కావలన అం! సల ల వ. లా పల్‌ . . గానీ (1 అని జవాబు లిట్బుస్తాలు. మన బాట మహోతము సాంఘిక వ్యవస్థల నికి రు ర్త లారి టై చ లా ప. వ లాల న | చుల్కొనేందుకు సాంఖుర పతన్యుంతోపాటి జాఆయ బతన్యలకూడా పెరగాలి, మ్‌ ల ఎం ౯ గ -, మ్‌ ఆ లా లం వ్య కలో సామాజిక “ఆహం” పెంపొందాలి. అప్పుడే మన భౌతిక మానసెక వ వాట్స్‌ టం మిం హలం టా బం య. తే ఆం లో లోసే జాంఎత్వ్య్రాల విమురిం సాధింబగలులొలు ఆ గలంల బఅటుబ్రయటాలలు ఆకె లం ర్టాంల /. న న. నం. చా న్న. ంయంాగి న... క రా 2 వేరొాకచోట ఉరే[ించిన బసవరాజువారి “యిట సంపలగ ప్లూ అవి మల్లివూలు - ఎవి కావలనే అలియా!" ఆన్న గేయం బపాౌపకలవుస్తులది. స్టో జ అలంఇ౭ిగాక; . వా లి ల నాం ల్‌ మసం గ్రమ్మానట్ట మసక అకట ఈలి శ. పాలీ డ్‌ కా తరభకాంలలతోడ తరమీద లై /. లం న. =. (. వ స్వాతంతక్యఖ సంఆలు

1670 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

నిలిచి చూడుమోయి తెలుగు బిడ్డ!

మూడు కోట్లమంది ముద్దుబిడ్డల గన్న

తెలుగు సీమ నెపుడు తలుచుకొమ్ము

కన్నతల్లి ఘనత కలనైన మరువకు.

కలుగుమేలు నీకు తెలుగు బిడ్డ”

అనే పద్యాలతో ప్రారంభించిన వీరి “తెలుగు పూలు” అనేక జాతీయభావాలనూ, స్వాతం(ేచ్చనూ, సాంఘిక చైతన్యాన్ని కలిగించి బాలహృదయంలో కొత్త స్పందనాల్ని కలిగించి - వారిని వున్నతులుగా చేయడానికి ఎంతగానో ప్రయత్నించాయి. అంతేగాక వెలుగు రాకముందే మేల్కాంచి, శుచిశుభములందు మలకువకలిగి, కాలకృత్యములయడల బద్ధకము లేకుండా, వ్యవహరించవలసిన ఆరోగ్యవిధుల గురించి ఆహారవ్యవహారాదులలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చక్కగా, పిల్లల గుండెలకు సూటిగా హత్తుకునే రీతిగా పద్యాలలో వివరించారు. పిల్లవాడు తనంతతానుగా చదువుకొనినా అర్ధమయ్యి రీతులూ - ఈ పద్యాలు సాగాయి. పిల్లలు చదువుకొనేటపుడు వహించవలసిన గద్ధగురించి, కొంకిరిగీతల వాతలవల్ల వచ్చే నష్టాల గురించి, తెలియని పాఠాలను తెలుసుకొనుటలో మొహమాటం పడటంవల్ల వచ్చే అనర్థాలగురించి పిల్లల మనసులో చెరగని ము[దలను నాటారు;

“పూర్తి స్వేచ్చ మనము పొందలేనికతన

మంచి చదువు లిపుడు మనకు లేవు!

స్వేచఛ్చ్భయున్న (ప్రజలు విజ్ఞానవంతులై

వెలయవచ్చునయ్య లెలుగు బిడ్డ!”

అని నేటి యథార్థాలను స్పష్టంగా వివరించి, మనదేశంలోని “రైతుకూలీల చమట - కలవారి మేడమిద్దెలకు జిలుగు లీనుచున్న” మన ప్రస్తుతాన్ని విపులీకరించి

  • దీనుల యందు దయ, ఇరుగు పారుగులయందడు స్నేహము, సత్యమునందు (పేమ - సర్వజన సమానత్వమువంటి ఉన్నత భావాలను వారి మనోక్షేత్రంలో పాదుకొలిపి - నేటి అసమవ్యవస్థను పారదోలి సమతను సాధించుట, ఎక్కడ

పిల్లల చిరునప్యుల్లో తెలుగు వెలుగులు. సోమనుంచర్‌ 1671 ఎలా సాధ్యమయిందో - తద్వారా కలిగిన ఫలితాలేమిటో సరళంగా వివరించుతాడు. ఈ కవి నిజానికి - “విప్పి చెప్పలేక వీపు బ్రద్దలు చేయు - గురువు గురువు గాడు కొరవిగానొ అని చెప్పినట్టుగా అన్ని విషయాలను చక్కగా వివరించి పిల్లలకు అభ్యుదయ గురువు అయ్యాడు.

“కులము తక్కువంచు కలిమి లేదంచును

సలవరించువారి పలుకు వినకు;

కులము కలుము లెప్పుడు నిలచేవి కావోయి

నిలుచు గుణగణాలు తెలుగువిడ్డగో

కులంపేరుతో కుళ్లు పెరిగిపోతోంది. ఏ పువ్వుకి వాసన ఉంటే అదే పరిమళిస్తుంది. ఏ బిడ్డకు తెలివివుంటే అతడే రాణిస్తాడు. “నందినీ పందినీ నారాయణుడని నమ్మి” ప్పుట్టనీ గట్టునీ ఇట్లనే పూజించే మన మతం - కులంపేరుతో సాటినరుణ్ని నీచంగా చూస్తోంది. ఆ నీచంగా చూడబడే మానవుడే ఈ సమాజ భవనాన్ని న్మిబ్రాటలాగ మోస్తున్నాడు. కూడులేక దేవులాడుతూ పాడుగుడిసెలందు (బతుకుతున్నాడు. అట్టి దీనజనులకు "వలయు సాయమిమ్ము తెలుగు బిడ్డ” అని ఉద్చోధించి కవి కృతకృత్యుడొతాడు. ఆ విధంగా తెలుగుబిడ్డడు కవి యాశించిన నూత్న భావానువర్తియె పెరిగి పెద్దవాడైనచో మన సమాజంలోని వెన్నో రోదనలు అవలీలగా పరిష్కారమౌతాయేమో! “ఆలుగు పూలు” కావ్యం బాలసాహిత్యంలో విశిష్టమైనది. నిత్య నైమిత్తిక జీవితంలోని అనేక విషమసమస్యలకు పరిష్కారమార్గాల్ని (ప్రబోధిస్తూ పిల్లలలో సొంఘకవైతన్యాన్ని ప్రజ్యలింపచేస్తూ- వారిలో సత్ప్రవర్తన నెలకొల్పుతూ సాగిన ఈ చన్నపష్పుస్తకం సొర్థకవమూ స్మ్వపయోజకవమా అయిందనడంలో సందేహంలేదు, అంచాతనే యిది నాలుగోసారి ముద్రింపబడి విశేష ప్రాచుర్యాన్ని పొండింది.

ఏ జాత్వియెనా ఉజ్వల భవిష్యత్తు వెంపుకు పయనించాలంటే గత జీవిత కాంతిపథాల పరిశ్‌వించాలి;

“వందలాది మేలు వజాలు గొనితెచ్చి

విజయసగత రాజ్య వీథటులందు

1672 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తిరిగి అమ్మిరంట ఎరుగు మా వైభవాల్‌

కలిమిబలిమి నీవు ఆలుగుబిడ్డ గ అట్టిగతంతో తులతూగినది ఆంధ్రదేశం.

“రాజనాల పండు రతనాల సీమలో

జీవనదులు పారి సిరులు కురియ

పాలుబారినట్టి బంగారు మా తల్లి

వెలుగుచున్నదోయి తెలుగు బిడ్డ!”

తెలుగుదేశం ఊసరక్షేత్రం కాడు. పాలు (ప్రవహించే మహానదులు లేకపోలేదు. కాని మనకుమాత్రం ప్రస్తుతం ఏలినాటి శని వదలలేదు. తిన తిండి కట్ట గుడ్డ లెని కటికదరిద్రంతో ఘూర్దిల్లుతున్నాం. కనుక నిజమైన శాంతి స్వాతంత్యా్యాల స్థాపనకు కొత్తతరం నడుములు బిగించాలి. అందుకనే “నీవే యిక దిక్కురా! తెలుగుబిడ్డ లమ్ము పురోగమించరాగో అంటా డీ కవి గ్రంథాంతంలో.

“దేశ మేదన్నచో తెలుగు దేశ మనుము

జాతి యేదన్నవో తెలుగు జాతి యనుము

వంశ మేదన్నచో తెలుగువాడ ననుము

తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ!

అని గర్వించగలిగే వుత్తమోషస్సులోనికి మన జాతి మేల్కొనేందుకు వుత్తేజమైన జాతీయభావాలు, సంఘాభిమానమూ నెలకొనాలి. తద్వారా పొందిన యా పోరాటగక్తితో మనమా స్థితిని సాధించుకోవాలి.

ఈ కవిదే రెండో పుస్తకం ఆటపాటలు. తెలుగు పూలు, ఆటపాటలు అనే రెండు పుస్తకాల్నీకూడా ఆదర్శ [గ్రంథమండలి - విజయవాడవారు అందంగా ముద్రించి పిల్లల కందుబాటులో వుండేటట్టుగా ఒక్కొక్కటి మూడణాలకు అందించారు.

పిల్లల హృదయమే ఆటపట్టు. వారికి మన మే విషయాన్ని బోధించినప్పటికీ

  • ఆడుతూ పాడుతూ నేర్పినప్పుడే వారి మనోఫలకంపై చక్కగా చితితమౌతాయి. ఇందులోనివన్నీ తెలుగు పూలలోవలెగాక గేయచఛందోరీతులలో రచించబడ్డాయి.

పిల్లల చిరుసవ్వుల్లో తెలుగు వెలుగులు. సోమమందరల్‌ 1673 “దిన్న పిల్లలన్న ముద్దు గాంధి తాతకు- మన గాంధి తాతకు కులములన్ని కలిపి మనకు దారిచూసపెను - మేలు దారి చూపెను” అనే పాటతో ప్రారంభించి మనదేశం, పూలసాక, మన కథ, మరువలేము, వసంతం, సందేశం, పాడిపంటలువంటి గేయాలతో ఈ చిన్నిపుస్తకం పూర్తవుతుంది. మన దేశం, మన పుట్టుక, మన తల్లితండ్రులు వారి పూర్వోత్తరాలు, మాతృదేశపు బెన్నత్యాలువంటి విషయాలగురించి విన్నపుడు అందరికీ ఒక అపూర్వగర్వం ఆవహిస్తుంది. అందులోకీ పిల్లల ఎదలలో మరీను! మనదేశం అనే గేయంలో రాబోయే పచ్చని దినాలలో మన మనుభవించగలిగే అందాలను అశాపూరితంగా వర్ణించాడు! “రావె శాంతి! రార మురళి! రాం పల్లలార!! అందమైన పూల నౌక వచ్చె = చూడరండి? అంటూ (ప్రారంభించిన పూలనౌక అనే గేయంలో పిల్లకాల్వలన్నీ పొంగి, తీయని వానజల్లులన్న్‌ కలసి తల్లియేరుగా సాగి అవ్వలాగ కూనిపాట పాడుకుంటూ తాత లాగ పడుతూ లేస్తూ పరుగులెట్టింది. ఆ యేరులో మామ తెచ్చిన రంగుకాగితాలతో అత్తచేసెస పూలపడవలను కాలువల్లో వదులుతారు. అది మురళినీ శాంతినీ పెల్లలందర్నీ ఎక్కించుకొని ఎక్కడికో ప్రయాణం చేస్తుంది. (ప్రమ, శాంతి పొంగిపారలే కొత్తరేవు చేరుకుంటుంది అన విపరించిన ఈ గేయంలోని కల్చన బాల మానసవీతులలో విచిత్రతైన భావనాభవనాలను నెలకొల్పుతుంది. “మన కథ" అనే గేయంలో "పసిపాపల చిరుసప్వులు విరిసిన యీ లోకంలో - పెనుచీకటి పోంజంలదడని - తొలికాలతులు వచ్చాయని - జగమంతా మేల్కొందని, (ప్రతివారికి ఆనండం పచ్చుంచనా ఏవో తీయని వెలుగు లోకాలను చేతి కందిస్తుంది. అంతేగాక; “గతమంతా గతిమాలిన - బాధలతో బతికామని అక మనకా దశ రాదని

1674 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అని నిరాశాతప్తహృదయాల హై హెచ్చరికల పూలజల్లు కురిపించి సేద తీరుస్తాడు. “మరువలేము అనే గేయం జన్మభూమిపై భక్తినీ స్వాతం తృ్యేచ్చనూ ఉద్దీపింపచేస్తుంది. కాని “వసంతం” అనే గీతంలో అందని ఏ భావాలకో లంగరువేయడానికి వ్యర్థ ప్రయత్నం జరిగింది. మనదేశంలో దురదృష్టవశాత్తూ వసంతం సంక్రాంతిలో రాదు. పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి పండగనాటికే “పసిడి పంటపొలాలు” కోతలు పూూర్తిఅవుతాయి. నూర్పులు ప్రారంభమై “రాజనాల రాసులు” ఉంటాయేగాని పొలాలు మాత్రం శూన్యంగా మొండిగా తయారవుతాయి. అయినా సంక్రాంతినీ వసంతాన్నీ కలపి ఏదో అందని భావనలో బిగించి పిల్లల కిబ్బంది కలిగించడం ఈ పుస్తక పరిధికి అనువైనది కాదేమో!? కాని దీనితరువాతనున్న పూవు అనేది నిజంగా నృత్యగీతమే. ఆ గీతంగురించి వివరించడంకంటె దాన్నే యథాతథంగా వుల్లేఖించడం సమంజసం:

“నల్లనీ బురదలో పూసేటి పూవ!

ఆెల్లనీ రేకులా విరిసేటి పూవా!!

చిన్నారి పొన్నారి చిరుమొగ్గ తొడిగావె.

పగడంపు తీగల్ల సాగసిలిపోయావె.

అలరు సిగ్గులతోడ అందాలు తీరావె -

నెనరు చూపులతోడ నెయ్యాలు చూపావె -

తియ్యతియ్యని తేనె సోనల్లు కురిశావె

'రేకురేకున పండు వెన్నల్లు విరిశావె -

తుమ్మెదల పాటతో వుయ్యాల లూగావె -

తమ్మెరల ఆటలతొ కయ్యాలు చేశావె -

దేశభక్తులతోడ నేస్తాలు కట్టావె -

జాతివీరుల చెల్మి రాస్తాలు వేశావ -

చీకటి లోకాన వెలుగుల్లు చిమ్మావె-

(ప్రేమతో మేమిచ్చు జోహార్లు కొనరావె” అంటూ పూవు పొందే గౌరవాన్ని వివరిస్తాడు కవి. బురదలోను రొంపిలోనూ పుడితేనేం గాక - అది సుగుణమున్న కుసుమ మవడంచేతనేకదా దేవుళ్ళ శిర మెక్కగలిగినా - రాజుమెడ నింపగలిగినా - దేశభక్తులతో నేస్తాలు కట్టగల్లినా -

పిల్లల చిరునవ్వుల్లో తెలుగు వెలుగులు సోమనుందర్‌ 1675 దాని కా అర్హత కలిగింది ! ఆంచాతనే జన్మస్థానాలు, జనన కారణాలు ఏవైనా గుణం ప్రధానమని సందేశమిస్తాడు. సందేశ మనే గీతంలో మన భారతభూమి మాట పాటలతో సంపూర్ణమై శాంతిసౌఖ్యాల సంగీతాల్ని వినిపింప చేయాలని కాంక్షిన్తాడు. “పాపాయి” అనే గేయాలలో తొలికోడి కూసినది మొదలు తాత చెప్పే కథలకు తలలూపుతూ నిద్దరోయేవరకూ, ప్రకృతిశోభలో విలీనమైన దినచర్యగా వర్ణిస్తాడు: మందారుపూవల్లె - అందాల సూరీడు ఎ్మరన్ని వెలుగుల్లు - ఎగజిమ్ముతుంటేను - పలుదోమి తలదువ్వి పాపాయి - కిలకిల నవ్వేను పానాయి. “పషాడ్రిపంటలు” అనే గేయంలో మబ్బులు వర్షాన్ని ఎలా (కుమ్మరిస్తాయోననే శాస్త్రం విషయాన్ని కపితారీతిలో [ప్రారంభించి పాడిపంటలు విలసిల్లేందుకు ఎలా దోహదకారులౌతున్నాయో హృద్యంగా చితించాడు: “కొండమీది కుండపోత వాన కురిసెను - ఏరు తాొానమాడిను” అనే పరిస్థితినుంచి వ్యవసాయానికి ఆయత్తమైన రైతు, కాలం స్మక్రమంగా సాగితే చిటికెలో పంట పండించేస్తాడు. “కోతకోసి కుప్పవేసి నూర్చితెచ్చెనూ - రైతు గాదె నింపెనూ![ఓ.” ఆ విధంగా గాదులు నిండితే;

“పాడిపంట కొదువలేక

పిల్లపాపలూ - సదా

చల్లగుందురూ!...” అనే ఈ గేయంలో “వానాలు కురియాలి, వరిచేలు పండాలి - మా కొట్లు నిండాలి బుడుగో - బుడుగో” అనే పాతపాటలో ప్రతిబింబించిన భావనకు ఎంత పరాకాష్ట

1676 పండిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము చేకూర్చినదో స్పష్టమవుతోంది. ఇలాంటి గేయాల్ని, గీతాల్ని రచించి మన కందించిన యీ కవి అభివంద్యుడు. మన సాహిత్యం జీవితానికివలెనే బహుముఖమైనది. పాత్రము కలిగినదే సాహిత్యం కనక - పిల్లలకు పెద్దలకు స్త్రీలకు - సర్వులకు అది హృదయరంజకంగా వున్నపుడే సార్థక్యమౌతుంది. నేటి సాహిత్యమంటేనే అభ్యుదయ సాహిత్యంగా అర్థమవుతున్న ఈ దశలో ఈ పయోజకత్వం దానికి సహితం పునరుద్దాటించ నవసరంలేదు. సర్వతోముఖంగా విరాజిల్లవలసిన కవితా నందనంలో అందరాని మందారమంటూ లేనేలేదు. అభ్యుదయ కవిత్వవుంటే ఏదో రక్తమూ, అరుణజోదయమూ, పీడిత జనమూ, విప్లవమూ మొదలుగాగల పడిగట్టు పదాలతో నిండివుండేది మాత్రమేనని దురభ్మిపాయం చెలామణి అవుతున్న ఈ దశలో మన అందరి దృష్టీ మరికొంత నైశిత్యాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే మనమూ మన సాహిత్యమూ వెలుగుబాట లోనికి పయనిస్తాం. (కిన్నెర: సంపుటము 4, సంచిక 12, డిశంబరు1952) యం ఠః [గ ఖా మ్య్‌ రా క గ్ర ప్‌ (1 లో క. షు శా ప్యాట

సారస్వతము: పరమార్ధము భూపతి లక్ష్మీనారాయణరావు

వైశ్వమందలి చేతనాచేతన రూపమగు ప్రకృతియంతయు భగవంతుని వ్య క్తరూపమై యున్నవి. ప్రతిప్రాణియందుసు. ప్రతివస్తువు సందును భగవంతుని యేంశమేదో యొకటి వ్య క్తమగుచున్నది. ఈ విషయమును గుర్తించిన మన ప్రాచీనులు "అణోరణీయాస్‌ మహతో మహీయాన్‌” అని యా పరబ్రహ్మను స్తుతించినారు. సృష్టస్థతిలయములు మూడును భగవల్లీలలు. భగవంతుడు సృష్టి నెందుకు గావించవలను? అందడులో భిన్నవ్యవస్థలను, నానాముఖ వైవిధ్యములను ఏల కల్పించవలను? ఈ సృష్టి ప్రయోజన మేమి? అను ప్రశ్నలకు సమాధానములేదు. ఈ రహస్యము బోధపడినచో భగపత్తత్వము, భగవత్స్వరూపము నర్థవుగుననుటలో సందేహము లేదు. కాని మాయాంధకారావృతమైన చర్మ చక్తువులకు భగవత్స్వ్వరూపము గోచరింపదు. విశ్వరూపమును సమ[గ్రముగ, నిశ్చలముగ దర్శించగల శక్తి మనోనయనమునకు గూడ లేదు. ఈ సృష్టిరహస్యము మసోనయమునకు గోచరించునల్లె యుండి మరుక్షణముననే మాయమగుచున్నది. ఒక శిలామధ్యమందలి చీలికలో నుద్భువించిన యొక చిన్ని మొక్కనుజూచి, బెన్నిసను అను నాంగ్లకవి, దాని జన్మకు కారణమును, దాని జీవితపయోజనమును నేమైయుండునో యని తర్కించి, తడహస్య మవగాహనకాక, అది యొక విశ్వలీల యని తృప్తిజెందినాడు. అల్లే మన ప్రాచీనులును భగవత్సృష్టిలోని సౌందర్యమును, తేజస్సును, సృష్టిస్టితిలయములను గాంచి, ముగ్గులై, యాశ్చర్యచకితులై,

1678 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వానినిగూర్చి తర్కించి తర్కించి, తద్రహస్యములను (గ్రహించలేక, తుదకు ఏతద్విశ్వమునకు కారణభూతమగు పరాశక్తి కంజలి ఘటించి తృప్పులైనారు. ఒకచో పుట్టుక నొకచో మరణము, నొకచోట నవ్వు నొకచోట రోదనము, నొకభాగమున మనోహరసౌందర్యము మరియొక భాగమున నేవగలిగించు వికారము, నొకచో శిలలనైన గరగింపజాలు కరుణరసస్థితి మరియొకచో గుండెను పాషాణముగ మార్చు క్రౌర్యము, ఒకచో మాతృస్వరూపమగు నదీమధుర నినాదము, మరియొకచో మృత్యురూపమగు నగ్నినదీఘోషము - ఇట్టి వైవిధ్యముతో నొప్పు విశ్వతత్త్వము మానవమాత్రునకు బోధపడకుండుటలో ఆశ్చర్యములేదు. ఈ సృష్టివైవిధ్యమంతయు భగవంతుని చిద్విలాసమని మాత్రమే చెప్పగలము. సృష్టించుట, పోషించుట, లయింపజేయుట - అను నీ కర్మలు పరాశక్తి విశిష్టలక్షణములు. ఐన, వీనివలన ఆ పరాశక్తికి, లేక భగవంతుని చిచ్చక్తికి గలుగు ప్రయోజన మెట్టిదో తెలియలేము. కనుకనే ప్రాచీనులు ఇవి భగవంతుని లీలలని నిర్ణయించి, యతనిని జగన్నాటక సూత్రధారుడని వర్ణించినారు. ప్రాణులను సృష్టికి దెచ్చి, వాని జీవితములలో వివిధ సన్నివేశములను గల్పించి తదసస్థితుల యనుభవమున నానందమును భగవంతుడు బొందునని వీరి భావన. అనగా భగవంతుడు రసస్వరూపడని వీరు నిశ్చయించినారు. కనుకనే “రసోవైసః్‌ అను వాక్యము వ్యాప్తికి వచ్చినది. భగవంతుని వ్య క్తరూపమగు సృష్టియందలి ప్రతిదృశ్యమును, ప్రతిసన్నివేశమును రసమయమై గోచరించినప్పుడు భగవంతుని రసస్వరూపుడని వర్ణించుటలో ఆశ్చర్యములేదు.

నిజముగ భగవంతుడు రసస్వరూపుడా లేక మానవుని కవితా దృష్టి కట్లు గోచరించుచున్నాడా? రెండును కారణములు కావచ్చును. ఇదమిళత్ణ మని సిద్ధాంతము చేయుటకు సాధ్యముకాదు. ప్రకృతి రసమయమనుట నిజము. తద్రసానుభవమునకు విశిష్ట సంస్కారసిద్ధమగు కవితాదృష్టి వలయుననుటయు నిజము. అట్టి సంస్కారజన్యమగు కవితాదృష్టిగల బుషులు విశ్వము నొక రంగస్థలముగను, భగవంతుడు జీవిత నాటక సూతధారుడుగను వర్జించినారు. బుషితుల్యులగు మహాకవులును నట్లే భావించినారు. మానవుని రసపరత్వమే యిట్టి కవితాదృష్టికి వీజమగుచున్నది. కనుకనే కరుణరసస్థితిని బొందిన వాల్మీకికి కవితాదృష్టి సిద్ధించినది. వేద బుక్కులన్నియు నిల్లే సృష్టికి వచ్చినవి, భగవదంశమున

సారస్వతము: పరమార్ధము భూపతి లక్ష్మీ నారాయణరావు 1679 జన్మించిన మానవుడును మూలప్రకృతి ననుసరించి నూతన సృష్టికి గడంగినాడు. భగవంతుని లీలలగు సృష్టి సితిలయములు వమూాడును తదంశవుగు మానవునియందును సిద్ధించినవి. ఇతర (ప్రాణులయందు భగవదంశము సూక్ష్మముగ, పాక్షికముగ సిద్ధించియుండ, మానవునియందు సమ[గముగ, నఖండముగ సిద్ధించియున్నది. కనుకనే యొక ఆంగ్లకవి, భగవంతుని సంపూర్ణప్రతిబింబము మానవుడని - 1420, ౪౧౭20 1౧౬960 606 - ఆవేశముతో పలికినాడు.

భగవత్సృ్టికి పపతిసృష్టి చేయగల శక్తి మానవునకు (ప్రకృతి సిద్ధముగ నున్నది. ఆ గక్తి సాహాయ్యుమున చిత్రవిచిత్రమగు సృష్టి నతడు కావింపగలిగినాడు. (పకృతియందలి పంచభూత వములనంఎ కీలుబొవ్శులవలె వూనము డొడింపగలుగుచున్నాడు. భౌతిక (పపపంచమున నిగూఢములై యుండు (పకృతిశక్తులను వశపరచుకొని, వానిని స్వసౌఖ్యమునకును పరనాశమునకును గూడ వినియోగించుచున్నాడు మానవుడు. ప్రాణివర్గముయుక్క స్థితిగతులనుకూడ నితడు తన యిచ్చవచ్చిన రీతిని మార్చుగలుగుచున్నాడు. (ప్రాణులయుత్పత్తి విషయమున విజ్ఞాన శాస్త్రము గావించిన మార్పులసంఖ్యాకములు. అల్లే స్వసౌఖ్య సంపాదనకై మానవుడు గావించిన ప్రయత్న మపారమైనది. ఇక నాశముకూడ మానవున కొక [క్రీడయొనది. పకృతి కల్పితములైన యగ్నిపర్వతములు కూడ మానవకల్పిత మారణ యంత్రముల యెదుట తృణప్రాయము లగు చున్నవి. ఇట్లు భగవంతుని లీలలని వర్ణితములైన సృష్టిస్టితిలయములన్నియు నతని యుత్తమాంశమగు మానవునియందును సమ(గముగ వృద్ధిజందినవి.

మానవుని యందలి భగవదంశమును సమగముగ వ్య క్తముబేయునది అతని సారస్వత సృష్టి. (ప్రకృతిదత్త మైన బుద్ధి ప్రభావము నాధారముగ బేసికొని మానవుడు గావించిన సృష్టిసర్వస్వములోనూ సారస్వత సృష్టి విశిష్టము. మానవుని సహజాతమగు బుద్ధిశక్తియు, నతని మానసిక జీవితమును నీ విశిష్ట నూతన సృష్టి కాధారములు. సృష్టైయందలి ప్రతి ప్రాణియు, ప్రతి వస్తువును నీశ్వరుని యంశ మేయైనను వానిలో తరతమభావములు లేకపోలేదు. కాష్ట లోష్ట నిలామయమైన జడప్రపంచముకంటెను జనన వికాస నాశములు గల వృక్షాది చేతనాపపంచ ముత్తమము., కాని, చలన, సంయోగ ఆత్మరక్షణ సంఘీభావాది

1680 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వృత్తులతో నొప్పు (ప్రాణి ప్రపంచము వృక్షాది కేవల చేతన్నాపపంచముకంటె నుత్క్భృుష్టమనుటలో విప్రతిపత్తి లేదు. అబట్లె, స్వచ్భందతా బుద్ధి శక్తి సామర్థ్యములతో నొప్పు మానవ ప్రపంచ మత్యుత్తమ మగుచున్నది. ఆహార నిద్రాభివృద్ధులన్నియు ప్రాణులన్నిటికిని సమానమే. ఈ విషయమున మానవుడును నొక ప్రాణిమాత్రుడే మయొయున్నాడు. కాని యితనికి గల బుద్ధిశక్తి మానసిక జీవితములే యితనికి భగవత్సృ్టిలో [ప్రాధాన్యమును, సృష్టిమె నధికారమును గలుగబేయుచున్నవి. ఆత్మరక్షణకు, సౌఖ్యసంపాదనకు మానవు డొనర్చిన ప్రయత్న ఫలితమే గృహనిర్మాణాది సృష్టి. ప్రకృతియందలి కష్టములను తొలగించుకొనుట మానవుని (పథమ కర్తవ్య మైనది. అనేకములగు పరికరములను కలంచవలసిన యవసరమేర్చడినది. సంఘ జీవితముతో నీ సృష్టియు సర్వతోముఖ వికాసము నందినది. భౌతిక వాంఛలు తృప్తి చెంది జీవితమున అలజడి తగ్గుటతో మానవుని మనస్సు భౌతిక ప్రపంచము నధిగమించి నానా ముఖముల (ప్రసరించుట కారంభించినది. దానికో మానసిక జీవిత మారంభమైనది. ఈ మానసిక జీవితమే సారస్వత సృష్టికి దారితీసినది. తదారంభముతో మానవు డితర పాణి ప్రపంచముకంటి విశిష్టుడగుచు, మానవత్వమును పోషించుకొనుచు, దివ్యుత్వమునకు పయనింప నారంభించినాడు. మానవత్వ పశుత్వములకు మానవుని యీ మానసిక జీవితమే (ఫధాన కారణము. మానసిక జీవితము కమాభివృద్ధిని గాంచి ఆధ్యాత్మిక జీవితమునకు దారి తీసినది. నిరంతర మానసిక కృషెచే ప్రకృతి రహస్యములను, ప్రకృతి శక్తిని గ్రహించిన మానవునకు భగవత్స్యరూపము ప్రత్యక్షముగ గాకపోయినను నప్రత్యక్షముగ గోచరమైనది. అట్టి స్థితిలో ప్రకృతి యందలి వివిధ దృశ్యములును భగవత్స్వరూపములుగ నతనికి భాసించినవి. కనుకనే ప్రకృతి యందలి ప్రతి కదలికయు సీశ్యరుని హృదయ స్పందనమేయని మహాకవులు

  • తాతిష్ట్రకులు భావించినారు. కొండలలో [ప్రవహించు సల యేళ్ళ జలజలారావవలటలం౦దును, ఉన్నత వృక్ష శాఖాంతరవుల వీచు రుంరూమారుతముయొుక్క శబ్దములందును, వర్షకాల మేఘధ్వనియండును కూడ కర్ణగోచరమగునది “పరావాక్కు” అని వీరు వర్జించినారు. ప్రకృతి విషయికమగు జిజ్ఞాసయు, మానసిక జీవితమును నిట్లు మానవునియందు భావనను, తార్కి కశక్తిని పెంపొందించి సారస్యత సృష్టికి తోవ చూపినవి.

సారస్వతము: పరమార్థము భూపతి లక్ష్మీనారాయణరావు 1681 ఇదిగాక, మానవునకు సహజమగు సౌందర్యాభిలాష కూడ నిందులకు తోడైనది. సౌందర్యాసక్తి కవితాసక్తులు 'రెండును ప్రతి మానవునియందును సహజముగనే నిహితములై యున్నవి. కాని వీని వికాసము సంచితాభ్యస్త సంస్కృతులపై నాధారపడియున్నది. సుందరములగు వస్తువులను దృశ్యములను చూడగోరుట, మధుర నినాదముల నాకర్ణింప కుతూహలపడుట, అట్టి యనుభవములచే తాత్కాలికముగనైన తన స్ధితిని మరచి, తన్మయతను జెంది అఆనందించుట - మానవుని లక్షణములు. ఈ సౌందర్యదిదృక్ష పిల్లల మొదలు పెద్దలవరకు నందరియందును గాఢమైయున్నది. సమరస భావము (౫18గ0౧) సౌందర్య ప్రధాన లక్షణము. సమరసభావము జీవిత సౌఖ్యమునకు ముఖ్యమగు నాధారము. కనుకనే సామరస్య (ప్రధానమగు సౌందర్యమున కట్టి యాకర్ణణ శక్తి యున్నది. బాహ్యేంద్రియ గోచరములగు రూప రస గంధ శబ్దాదులందును, మనో గోచరములగు గుణ శీల భావాదులందును మానవుడు వాంఛించునది యీ సామరస్యమే. ఈ సమరస భావము బాగుగ వికసించినపుడే జీవితము శాంతి ప్రదమగుటయు, సౌందర్య (పధానములగు కవిత్వ నృత్య గీతాది కళలు సృష్టికి వచ్చుటయు జరుగగలదు. ఇట్టి మానసిక వికాసము సిద్ధించుటకు జీవి పూర్వజన్మ సంచితమును, నీ జీవితమందలి పరిసరములును కూడ కారణములగును. కళల యందభిరుచి కలుగుటకే సామరస్య మవసరము. అట్టిచో సామరస్యము సిద్ధింపక కళాసృష్టి సాధ్యము కాదనుట అతిశయోక్తి కాదు. మానవ జీవితమును మూడు (ప్రధాన భాగములుగ విభజింపవచ్చును. భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము నను నీ మూడు భాగములును సమరస భావమున మేళవించినపుడే మానవత్వమును (ప్రకృతి సౌందర్య గ్రహణ సామర్థ్యమును సిద్ధింపగలవు. భౌతిక జీవితము (ప్రాధాన్యమగుచో పశుత్వమును, భౌతిక మానసిక జీవితములు మాత్రమే ప్రాధాన్యము వహించుచో రాక్షసత్వమును సిద్ధించును. ఆధ్యాత్మిక భావ మంతర్వాహినిగనైన ప్రవహించుచుండిననే తప్ప జీవితము సాత్త్వికము కాజాలదు. అధమమగు ప్రాణికోటి జీవితమంతయు కేవలము భౌతికమైయున్నది. కీచ, దుశ్శాసన, రావణాదులవంటి వ్యక్తులలో భౌతిక మానసికములు వూతమే (ప్రాధాన్యము వహించినవి. ఆవేశపూరితులె యన్యమతములవారిని హింసింప బూనువారిలో నాధ్యాత్మిక జీవితము శూన్యమనుట

1682 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ; సాహిత్యము నిస్సందేహము. వ్యాస వాల్ళ్మీకాది ద్రష్టలు, మహాజిన బుద్ధ (క్రీస్తులవంటి జీవన్ముక్తులు, రామకృష్ణ గాంధీలవంటి మహాత్ములు జీవిత సామరస్యసిద్ధిని గాంచిన ఆదర్శ మానవులు. సృష్టియందలి ప్రతి సన్నివశమునందును భగవల్లీలలను, చిద్విలాసమును చూడగలిగిన వ్యక్తి ప్రకృతి సౌందర్యమును గ్రహింపగలుగుచున్నాడు; దానిని వివరింపగలుగుచున్నాడు. అట్లు ప్రకృతి సౌందర్యమునకు ముగ్ధుడైన రసపరుడగు విశిష్ట మానవుడే కళా ప్రపంచమునకు (స్రష్ట. [పకృతియందు తాను దర్శించిన సౌందర్యమును, తా (గ్రహించిన ప్రకృతి రహస్యములను, తన్మూలము తా ననుభవించిన యానందమును కళాసష్ట యితరులకు కూడ కలిగింప (బయత్నించును. కళాసృష్టి కిది యొక [ప్రధానహేతువు. "

సౌందర్యాభిలాష. పప్రకృతితత్త్వ జిజ్ఞాసలు మాత్రమే కాక వర్దనాభిలాషకూడ మానవుని సహజ లక్షణము. తా మనుభవించిన సౌఖ్యమునుగాని, తాత్కాలిక సంతోషమునుగాని యితర [ప్రాణులు తమ తోడివానికి ఆలుపలేవు. భౌతిక సౌఖ్యము భౌతిక జీవితమునందే ఆ ప్రాణుల విషయమున లయించిపోవుచున్నది. మానవుని యందట్లు కాదు. తా ననుభవించిన సంతోషానందముల యనుభపము నితరులకును గలిగించి, వారి చిత్తవృత్తిని దర్శించి మానవుడానందించగలడు. మానవునకు విశిష్టము, భావ వ్యక్తీకరణ సాధనము నగు భాషకూడ నిందుల కొక ముఖ్య కారణము కావచ్చును. మాటలు బాగుగరాని చిన్న పిల్లలుకూడ, తమేదేని మనోవికాసకరమగు దృశ్యమును చూచినపుడు, గంతులు వేయుచు, తమ తల్లికిగాని, లేక తోడివారికిగాని, ఆ దృశ్యమును జూప ప్రయత్నించుట నిత్య జీవితమున మనము చూచుచున్నాము. ఇది మానవుని లక్షణము. మానవుడు తాను జూచిన సుందర దృశ్యమును, తా ననుభవించిన యానందమును శబ్ద సాహాయ్యమున వ్యక్తము చేయుటతో సారస్వత సృష్ట యారంభమైనది.

ఇదికాక, నూతన సృష్టిని గావింపవలెననెడి యభిలాష కూడ మానవునకు సహజసిద్ధమైనదియి. ప్రకృతి దృశ్యములను చిత్రించుటయు, తమ భావనాశక్తిచే వానికి మెరుగులు పెట్టుటయు మాత్రమేకాక వాని యాధారమున ప్రకృతియందు లేనివానినిగూడ మానవుడు కల్పించగలడు. సారస్వత సృష్టిలో నీ కల్పన అమిత ప్రాధాన్యము వహించి యున్నది. ఇట్లే మానవ జీవితమున కళలన్నియును వృద్ధికి వచ్చినవి. దైనందిన జీవితమున కుపకరించు వస్తువుల రచనలో కూడ నీల్పము వృద్ధిజెందుటకు మానవుని యందలి యూ సౌందర్య దిదృక్షా కల్పనాశక్తులే

సారస్వతము: పరమార్థము భూవతి లక్షీనారాయణరావు 1683 కారణములగుచున్నవి. చతుష్ట ష్టి కళలునూ నీ విధముగనే సౌందర్య 'ప్రధానములైనవి. ఇక లలితకళల విషయమున సౌందర్యము (ప్రధానమైయుండుట తప్పనిసరి. మానవ జీవితమునకు మాత్రమే కాక విశ్వజీవితమునకే లలితకళలు వ్యాఖ్యానములు. “పకృతికిన్‌ భాష్యప్రణేతల్‌ కవుల్‌.” అను వాక్యము లలితకళ లన్నిటి విషయమునను సమన్వయింప వీలగుచున్నది. ఈ కళాప్రపంచము భగవంతుని లీలాప్రపంచము నాధారముగ గొని సృష్టికి వచ్చినదయ్యును, తదాధారమును గూడ నధిగమించి వ్యాప్తిచెందిన దనుటలో సందేహము లేదు. ఈ కళానుభపమున తన్మయుడైన జీవి విశ్వసౌందర్యమును దర్శించుచున్నాడనుట నిజము. కనుకనే కళావేత్త లీ యానందమును (బ్రహ్మానందమునకు బోల్చియున్నారు. కనుక కళాసృష్టియు, కళానుభవమును మానవత్వ ప్రథమ లక్షణములని కళాభిజ్ఞుల భావము. సరియగు కళాదృష్టి నలవరచుకొన్న మానవుడు (కూరుడగుటగాని, సామాజికావముఖుడగుటకాని జరుగదు. మానవప్రకృతిని చక్కగ నవగాహన చేసికొన్న కళావేత్త మానపజీవితమందలి లోపములను సహింపగలడు. లోపములును (పకృతి సిద్ధములసి (గహించినప్పుడు విద్వేషమున కవకాశమే కలుగదు. అట్లే, యితరుల సుఖదుఃఖములను, స్థతివైవిధ్యమును గ్రహాంచగల సహృదయత కళాజీవితమువలన సిద్ధించగలదు. అట్టి సహృదయత సంస్కారమున కాధారము. ఇట్లు, సాహిత్యాది కళాజీవితముచే సంస్కృతి సిద్ధించునని సిద్ధాంతమగుచున్నది. హృదయసంస్కారము మానవత్వ ప్రధాన లక్షణము. హృదయ సంస్కారము, సమరసభావము - ఈ రండును సిద్ధించినపుడే మానవ జీవిత మానందప్రదము కాగలదు. “6 5 & 189421 0౧1 10 106 ౪196.” అను ఎమర్చన్‌ మహాశయుని వాక్యమునిం దనుసంధింపవచ్చును. అతడు “//13600" అను మాటచే సూచించినది విశిష్టజ్ఞానము. విశిష్టజ్ఞానమే ఆనందమునకు మూలము. అట్టి విశిష్ట్ణజ్ఞానమున కుపస్కారమైనది సారస్వతము. భౌతిక మానసికాధ్యాత్మిక జీవితవమలకు జెందిన రచనలన్నియు సారస్వతభాగములే యగుచున్నవి. ఐనను, నందలి భాగములన్నియు సనందరకును నాస్వాదయోగ్యములు కాపు. మానవ జీవితము ననుసరించు రసస్ఫోరకములగు రచనలు మనల నాకర్షించిన ట్లితరము లాకర్షించవు. కనుక, “౨౪౧8 ౬1612108”

1684 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అసదగిన సాహితీశబ్రమునకు “సహ ఇతా భపతీతిసాహితీ” అను వ్యుత్పత్తిని ప్రాచీను లిచ్చియున్నారు. తత్త్వశాస్త్ర, వేదాంత, మత, నీతి శాస్త్రేత్యాదులన్నియు నుత్తమ్మశేణి నందడుకొన్న వద్యావంతులకు మాత్రముపకరించును కాని సామాన్యజనుల కవి పప్రయోజకములు కావు. సాహిత్యము కాంతాసమ్మతము కావలెనను నాలంకారికా్మిప్రాయమునకు గూడ నిదియే హేతువు. దైనందిన జీవితమున మనయనుభవమునకు వచ్చుచుండు సంఘటనలు, సన్నివేశములు మనకెక్కు వాకర్ణణీయము అనుట వింతకాదు. అట్టి యితివృత్తముతో నొప్పు సాహిత్యము సర్వజనాదరణీయ మగుచున్నది. మనోహరమగు విధానమున హృదయము నార్జ్రృముగావించి, స్టరమగు సాత్త్వకానందము నొసంగునది సాహితీరచన. కసుకశీ సాహిత్యమును ప్రియసతి యుపదేశముతో బోల్చియున్నారు. కథలు, కథానికలు, నవలలు, నాటకములు, (డ్రవ్యకావ్యములు మున్నగునపన్నియు మాసవజీవిత విషయప్రధానము లగుటవల్లనే మిక్కిలి యాకర్షణీయము లగుచున్నవి. అట్టివాని పఠతనపాఠనమువల్లను, దర్శనమువల్లను కలుగు మనోవికాస చిత్తసంస్కారవమలుకూడ సాత్త్వికవులైనవియే. చిత్తసంస్కారవుబ సారస్వతధ్యేయము. ఐనను నీ సంస్కారము ప్రత్యక్షోపదేశమార్గమునగాక పరోక్షవిధానమున సెద్ధింపవలను. చిత్తవికాస సద్యఃపరనిర్వృృతులు మాత్రమే సారస్వత (వథమ లక్ష్య్యములు. ఇట్టి యుదాత్తాశయము మాత్రమేకాక మరియిుక సామాన్యాశయముకూడ సాహిత్యమువలన సిద్ధించుచున్నది.

జీవితము చాలవరకు కష్టభూయిష్టము. ఎడఆగని కష్టములు, సంఘర్షణలు, హృదయక్షో భ, నిరాశ ఇత్యాదులు జీవితమున (ప్రాధాన్యము వహించుచున్నవి. వీని మధ్య నప్పుడప్పుడు తనకు లభించు క్షణికములగు విరామకాలములలో తాను సుఖించుచున్నట్టు జీవి భమించుచున్నాడేకాని సాఖ్యవునునది భౌతికజీవితమున లేదని వేదాంతులు. ఇది అఖండసత్య మైనను కాకపోయినను సామాన్య జీవితము చాలవరకు దుఃభఖాకాంత మనుట నిజము. అది పకృతి సహజమైన విషయము. కష్టములనుండి మానవుడు విడుదలపొందలేడు. మానసికజీవితములేని జంతువుల విషయమున నీ సితి దుఃఖావహము కాకపోవచ్చునుకాని, మానసిక జీవితమే ప్రధానముగాగల మానవు డీస్పెతిని భరింపలేడు. తాత్కాలికముగనైన నీ కష్టపరంపరలనుండి విడుగడ కలుగనిచో

సారసంతము; పరమార్ధము భూపతి లక్షీ నారాయణరావు 1685 బీవతము దుర్భరమై, మానవుని హృదయము భగ్నమగుటయు, జీవితము నాశమగుటయు జరుగగలదు. ఇట్టి సంఘటనల కారణముననే హృదయములు భగ్నములు కాగా ననేకులు పిచ్చివారైనారు. ఎందరో ఆత్మహత్యలకు పాల్పడినారు. కనుక, అట్టి జీవితపరిస్టితులనుండి మానవునకు కొంత వ్యవధానమును గల్గించి, మనసునకు సంతోషమును వికాసమును కలిగించుటకు సాహిత్య మొక యుత్కృష్ట సాధనమగుచున్నది. కష్టముయమైన యీ భౌతికజీవితమున కొంత విరామమును గల్పంచుకొని, తాత్కాలికముగ భావనావీథుల విహరించుట జీవితశాంతి కెంతయు నవసరము. జీవితసాధారణములగు దుఃఖాదుల నితరుల జీవితములయందుగూడ చూడగలిగినచో వ్యక్తి తన జీవితమునందలి దుఃఖములను భరింపగలడు. కష్టము అనునవి మానవజీవితమున సర్వసాధారణము లనియు, నవి యెంతటివారికైనను తప్పువనియు, వానిని ధైర్యముతో నెడుర్కొనుట మానవుని ధర్మమనియు మానవుడు (గ్రహటాంపవలసెయున్నది. భిస్నకాల భిన్నావస్టలయం దనేకుల జీవితములలో గలిగిన యిట్టి సన్నివేశములును, తత్పరిణామములును సాహిత్యమున రసవత్తరముగ చతితములై యున్నవి. కనుక నట్టి సాహిత్యము జీవితవిషయమున సరియగు జ్ఞాసమును కలుగజిసి, మానవునకు చిత్త స్టర్యము నొసంగ జాలియున్నది. ఇతరుల జీవితమందలి సుఖదుఃఖాలను గాంచుటతో మన హృదయ మొకవిధమగు సామభూతికి లోనగుచున్నది. అట్టి సానుభూతి హృదయసంస్కారమునకు, పామరస్య్రామునకు మూలము. అట్టి సమరసభావము సిద్ధించిననాడే మానవుడు లోవిత సమస్యలను ధైర్యముగ నెదుర్కొనగలడు, భౌతిక కష్టపరంపరలమధ్యకూడ వితశాంత్‌ ననుభవింపగలడు. కనుక సాహిత్యము సామాన్య మానవుల వషంపమునకూడ మిక్కిలి ప్రలహెజనకారి యగుచున్నది. రూపక రచనయంతయు సికారణముననే సృష్టికి వచ్చినది. జీవితసన్నివేశ వైవిధ్యములను, మానవహృదయ ఎన్రపొరములను వత్యక్షముగ రంగస్థలమున దర్శించిన వ్యక్తి హృదయము క్షతం సంస్కృతి నందుననుటలో సందేహములేదు. వురిలొుక పిషయము. జీవితమున మన కోరికలన్నియు సిద్ధింపవు. ం

“లీ ్రటానా మతటాః ప్రవాహాకొ అని కాళిదాసు నుడిపినట్లు మన మనోరథము అంంభ్యారములు నసాధ్యములుకూడ నగును. భావన కవధిలెడు. కనుక,

1686 పందిరి షుల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము స్వర్గపాఖ్యములు లభించిన తర్వాతకూడ మానవుని హృదయ మింకను నువ్విళ్లూరుచుచే యుండును. అది మానవస్వభావము. కనుక మానవజీవితమునం దసంతృప్తి ప్రబలమైయున్నది. లోకమున, వస్తుసంపద సౌందర్య సంపదల విషయమున వ్యక్తులలో న్యూనతాధిక్యములు బహుళములు. అట్టిచో నదృష్టహీనుల జీవితము లసంతృప్తితో నిండియుండుట వింతకాదు. కాని, యిట్టి వైవిధ్యము (ప్రకృతిసిద్ధమైసది. ఏ విషయమునను సర్వసమత్వము సాధ్యముకాదు. 'ప్రాణివర్గముల " సృష్టైెయందే యీ యంతరమున్నది. మానవజీవితమందును నట్లే యీ _తరతమవ్యవస్థ యతికమింపరానిది. వస్తుసంపద, సౌందర్యము, ఆరోగ్యము, బుద్ధిశక్తి - ఇట్టి సమస్తవిషయములందును మానవులలో న్యూనతాధిక్యములు నిత్యములు, అనతిక్రమణీయములు. అదృష్టహీనుల జీవితములు అసంతృప్తి వైరాశ్యములకు లోనై భగ్నములు కావచ్చును. లేక యొకప్పుడట్టి పరిస్థితులు సాంఘికక్షో భకు కారకములు కావచ్చును. అట్టి యనర్ధములనుండి రక్షించుటకు సాహిత్య మెంతయో తోడ్పడుచున్నది. లౌకిక జీవితమున ననుభవింపలిెని సౌందర్యసంపదాదులను, సౌఖ్యములను మానవుడు సాహిత్యసాహాయ్యమున మానసికముగ ననుభవింప గలుగుచున్నాడు. ప్రత్యక్షముగ, నింద్రియాదులచే ననుభవింప సాధ్యముకాని వెన్నియో భావనాసాహాయ్యుమున వ్యక్తి మానసికముగ ననుభవించి, యానందించి, భాతికజీవితవమునందలి లోపములను పూరించుకొనగలుగుచున్నాడు. ఇం[దియకాలుష్యుమునుండి మనస్సును శుద్ధమొనర్చ్భు విధాన మిది. దీని కాంగ్లమున 5601౧20౧ అసి వ్యవహారము. హృదయమునిండిన ప్రేమ ఫలించుట కవకాశములేక ప్రణయగీతముగ రూపొందుటకలదు. చిరకాలమునుండి చిత్తమును తపింపజేయుచున్న ప్రియపత్నీ విరహమును కాళిదాసు మేఘసందేశ కావ్యరూపమున వెలిగక్కియున్నాడని (పతీతి. (పణయినీవిపయోగతప్పు లగువారి కెల్లరకును మేఘసందేశ మమృతృపాయమనుట నిస్పందేహము. “ఇష్టాన్‌ దేశాన్‌ జలద విచర పప్రావృషాసంభృత శ్రీః మా భూదేవం క్షణమపి చతే విద్యుతా విప్రయోగఃళొ

సారస్వతము: పరమార్థము భూపతి లక్ష్మీనారాయణరావు 1687 అను యక్షుని పల్కులెట్లు వియోగభారమును హృదయంగమముగ జేయుచున్నవో సహృదయెొకవేద్యము. యక్షదంపతుల యవస్థను, వారి యన్యోన్యానురాగమును గ్రహించిన వ్యక్తి విప్రలంభమును సహింపగలుగుచున్నాడు. “శేషాన్మాసానమయచతురో లోచనేమీలయిత్వా పశ్చాదావాం విరహగణితం తంతమాత్మాభిలాషం నిర్వేక్షాగ్యవః పరిణత శరచ్చందికాసు క్షపాసు” అను యక్షుని పల్కు లాశ్వాసము నొసంగుచున్నవి. సాత్త్విక్యపేమ ప్రణయ గీతములుగ పరిణామ మందిన దృష్టాంతము లన్నియో పాశ్చాత్య సారస్వత చరిత్రయందు గలవు. ప్రణయము మాత్రమేకాక, హృదయమును సంక్షుభితముగ జేయు గాఢ భావావేశముల (ప్రవృత్తి కంతకును సాహిత్య మొక రంగమగుచున్నది. సాంఘిక లోపముల సహెంపలేని వ్య క్రిహృ్ళాదయము హేళన కావ్య పఠనచే తృప్తిచెందుచున్నది. తా నిహ జీవితమున ద్వేషమును సాధింప వీలులేక (ప్రహసన రచనచే కోపమును శాంతింపజేసికొని తృప్తిచెందిన రచయితలును గలరు. రావణ దమ్మీయ మట్టి రచనయే. ఇట్లొక విధమున ప్రగాఢభావములకు సాహితీరంగ మొక నిర్గమన ద్వారముగ కూడ నగుచున్నది. ఇంతియకాక, భావనా శక్తియుతుడగు మానవుడు కేవల వాస్తవిక జగత్తుతో తృప్తిజందడు. ఇందలి సంపదలు, సౌఖ్యములు, సౌందర్యము నతనికి చాలవు. కనుక నతడు ఇంతకంటే నసుదాత్తమగు వస్తు సంపదను, సౌఖ్య సౌందర్యములను భావనా ప్రపంచమున కల్పించుకొని, తాత్కాలిక సంతృప్తిని గాంచగలుగుచున్నాడు. ఈశ్వర సృష్టియందలి యశ్వజాతితో తృప్తిలేక సువర్ణ పక్షములతోడి శుద్ధ ధవళాశ్వము నూహించికొని భావనాప్రపంచమున విహరింపగలుగుట యిట్టిదే. (ప్రత్యక్ష స్త్రీ సౌందర్యముతో తృప్తిలేకపోవుటచే రంభాద్యప్పరసల సృష్టి యావశ్యకమైనది. అట్లే విశ్వ్శసష్టయగు నీశ్యరుని యఖండ శక్తిని సూచించుటకై, యతనికి సహస శీర్చములు, సహస బాహుపులు - ఇత్యాదులు భావన గావింపబడిసవి. (పకృతిచే తాత్కాలికములు, నేకదేశములు నగు రమ్యవస్తువులకు, సుందర దృశ్యములకు భావనయందు నిత్యత్వ మాపాదితమైనది. “యత్రోన్మత్త భమరముఖరా పాదపానిత్యపుప్పా హంసేణీ రచితరశనా నిత్యపద్మానలిన్యః

1688 పందిరి షుల్లికార్జునరాపు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

కేకోత్క్మంఠాభవన శిఖినో నిత్యభాస్వత్కలాపా

నిత్యజ్యోత్స్నా ప్రతిహతతమో వృత్తిరమ్యాషపదోషాఃొ

అను కాళిదాసు వర్ణ్షనయే ఇందుల కుత్తమ సాక్ష్యము. ఇట్లు సాహిత్యము మానవ జీవితమున కెంతయు నాలంబనమగు చున్నది.

అయినను నిట్టి సాహిత్య విషయమున సరియగు నభిరుచి యేర్పడిననే కాని సాహిత్య ప్రయోజనము సిద్ధింపదు. శాబ్టికరచన యంతయు సారస్వతము కాజాలదు. కరచరణాద్యవయవ సంపద మాత్రమే మానవత్వ లక్షణము కానియట్లు శబ్బ్దసముదాయము మాత్రమే సారస్వత లక్షణము కాదు. సత్సారస్వత లక్షణము లట్టివి? తత్పృయోజన మేమి? అను విషయములను విమర్శించుకొనక చేయు సారస్వతాధ్యయనము ప్రయోజన శూన్యమగుటయే కాక, విపరీత పరిణామమును గూడ కలిగింపవచ్చును. భౌతికజీవిత పోషకమైన ఆహార విషయమున నెంతయో విమర్శ శాస్త్రవిధానమున జరిగియున్నది. మాంస పోషణకు, నరముల పటుత్వమునకు, సకలేంద్రియ వికాసమునకు, దైహికశక్తికి వలయు నాహార సామాగ్రి యంతయు సవఐమర్శకముగ వివరింపబడినది. ఆహార పదార్థముల రుచులు, పాకవిధానము మున్నగునవన్నియు సమగ్రముగ చర్చింపబడినవి. ఖాద్యములు, లేహ్యములు, ఆసవములు, పానీయములు మున్నగు వర్గము లేర్పడినవి. జిహ్వను తృప్తిపరచుటకై వివిధములగు పాకములు కల్పింపబడినవి. పాకవిధాన మొక శాస్త్రముగ పరిణమించినది. వివిధములగు నాహారముల రుచులను, నాసవముల భేదములను గుర్తింపగల నిపుుణు లెందరో పాశ్చాత్య దేశములలో గలరు. దైహిక విషయమైన యాహారము నెడ నింత గద్ధవహించినపుడు మానసిక పోషణ కాధారమగు సారస్వత విషయమున నెక్కుడు శ్రద్ధవహింప వలయుననుట తప్పదు. కనుక, సత్సారస్వతమును గూర్చిన సమీక్ష యావశ్యకమగుచున్నది.

మానవత్వమున కాధారభూతములగు మానసికాధ్యాత్మిక భాగాభివృద్ధి కంతకును సారస్యతమే ప్రధాన పోషక (ద్రవ్యమగుచున్నది. అధ్యాపన లేనిచో మానసికాభివృద్ధియు, చింతన లేనిచో నాధ్యాత్మిక దృష్టియు కలుగుట కల్ల. ఈ రెండును లేనిచో సంస్కృతి సెద్ధింపదు. సంస్కృతియే మానవత్వ ముఖ్యలక్షణము. ధనము, పదవి, బాహ్యనాగరికత - ఇత్యాదు లస్నియున్నను, నెంతటి

సారస్వతము: పరమార్థము భూవతి లక్షీ నారాయణరావు 1689 పట్టభ్మదునకైనను, నాధ్యాత్మిక దృష్టిలనినాడు సంస్కృతి సిద్ధింపదు. మానవునకు గల సంస్కృతి ననుసరించి యతడు గౌరవనీయుడు పూజ్యుడు నగుచున్నాడు. మానసికమగు శక్తి నఖండముగ మార్చుటేకాక సంఘ జీవితమున సమన్వయము గూర్చుట సంస్కృతి లక్షణము. బుద్ధిని సర్వతోముఖముగ వికసింపజేయుట యంత ముఖ్యమో హృదయమును మెత్తబరచి రసవంతముగ జచేయుటయు నంత ముఖ్యము. మతోన్మాదులగు మానవరూప రాక్షసుల కార్యమునకు గురియై, భర్తలను పిల్లలను గోల్పోయి, అగతికలె దీనలై వచ్చిన స్త్రీలయెడ సానుభూతి జూపకపోవుటయేకాక, వారి శీలమును గూర్చిన విమర్శకు గడంగు వారికి సంస్కృతి యెక్కడిది? భారత సతీధర్మస్వరూపమగు సీత శీలమును గూర్చికూడ శంకించువారికి సంస్కృతి శూన్యమనుటలో తప్పేమి? బుద్ధి హృదయము - ఈ రెండును సమప్రధానములై మేళవించిననేగాని న్యాయాన్యాయ, ధర్మాధర్మాది ద్య్వంద్వముల గూర్చిన వివేచనయు కలుగదు, రసపరమగు హృదయముసు సిద్ధింపదు. యుక్తాయుక్త వివేకమును, సానుభూతిని కలిగించుట సంస్కృతి లక్షణము. హృదయమునకు, బుద్ధికి, సామరస్యము లేకపోవుటయే జీవితమున గల్గు ననేక క్షేశములకు, దుఃఖములకు కారణమగుచున్నది. హృదయమునకు మాత్రమే [పాధాన్యమొసంగి, ఇంద్రియ వశంవదయమొ (ప్రవర్తించిన శకుంతలకు గలిగిన యనర్థమునకు కాళిదాసుని నాటకము చక్కని వ్యాఖ్యానము. ఇం[దియ విజతయగుటకు మారుగ నిందియ దాసియగుటవల్లనే శకుంతల అట్టి యవమానమును, క్షోభను ననుభవింపవలసి వచ్చినది. భౌతికములగు నీ యిం[దియములను స్వాధీనపరచుకొని, వానిపై నధికారము సంపాదించు కొనునంతవరకును నీమెకు రాజ్జియగుటకు దగిన యర్హత లభింపలేదు. అట్టి యిలదియ విజయము నీమెచే సంపాదింపజేయ నుద్దేశించియే కాళిదాసు గకుంతలను మారీచాశమమున వదలినాడు. భౌతికములగు సర్వసంపదలకు సకల సాఖ్యములకు నాకరముగు నా యాశ్రమమున, నైహికబిముఖులై, ఆతీం(దియముగు, ననిర్య్వచనీయవుగు పరతత్త్వ దడర్శనాభిలాషులై తపోనిరతుల్రయున్న మారీచాది మునిసత్తముల సాహచర్యముచే, వారిసేపచే, నకుంతల తనదేహమును, ఇంద్రియములను జయింపగల్గినది. తాను జూపిన

1690 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము శ: సాహిత్యము యింద్రియ దౌర్చల్యమునకు సిగ్గుపడి, తనకు గల్గిన పరాభవమునకు ఖిన్నురాలై: హృదయముననే బాధజెందుచున్న తపస్విని శకుంతల [కవుముగ పరిపూతమైనదనుటలో సందేహము లేదు. కనుకనే కడపట, అనుకొనిన విధమున నామెకు దుష్యంతునితో సమాగమము కల్గినప్పుడు నిర్వికారయె, సంయమనముతో ప్రవర్తింప గలిగినది. తన జీవితమును భగ్న మొనర్చిన కాముకునిమై క్రోధముగాని, అసహ్యముగాని చూపినదికాదు. నా పురాకృత కర్మ పరిపాకమున మీకట్టి విరసభావ మప్పుడు కలిగినదని మాత్రమే పలికినది. ఇంద్రియ సంయమనమువలన గలిగిన చిత్త సంస్కార మట్టిది. దుష్యుంతుడును నట్లే దీర్ణకాలము పశ్చాత్తాపతప్పు డై, తా జేసిన యింద్రియ సాహసమును, నన్యాయమును గుర్తింపగలిగినాడు. “ఇతః ప్రత్యాదేశాత్వ్వజన మనుగన్తుం వ్యవసితా ముహుస్తి ష్టేత్యు చ్చైర్వదతి గురుశిష్యే గురుసమే! పునర్జృష్టిం బాష్ప[ప్రసరకలుషామర్చితవతీ మయి కూరే యత్తత్సవిషమివ శల్యందహతి మామ్‌.” అని పలుకుటలో నితని హృదయ మెంత మెత్తబడినదియు తలియుచున్నది. . పశ్చాత్తాపముచే హృదయము క్షాళలితమై సంస్కృతి సిద్ధించినది. కనుక పునసృృమాగమమున శకుంతల నొక భోగ్యపస్తువుగ కాక మాతృత్వపరిపూరితయగు పకృతిరూపముగ చూడగలుగు చున్నాడు. శకుంతలాదుష్యంతుల యీ పునస్సమాగమములో నేమాత్ర మలజడిగాని, భావావేశముగాని, ఇంద్రియ 'పప్రాబల్యము గాని గోచరింపదు. ఇందియ వ్యాపారములకు లోనైయున్నంత వరకును మానవుల కలజడియ తప్ప శాంతికాని, యానందముకాని సెద్ధింపదనుట తాత్త్వికసత్యము. ఈశ్వరుని సాధింపగోరిన పార్వతికూడ మొదట యిందియములను జయింపవలసివచ్చినది. కనుకనే, తన భౌతిక సౌందర్యమును నిందించి, ఆత్మసౌందర్యమునక్ర తప మొనర్చినది. ఇంద్రియములకు దాసుడైన పురూరవుడు పిచ్చివాడగుటయు, నగ్నివర్డుడు క్షయరోగపీడితుడై నశించుటయు జరిగినది. కథారూపమగు వస్తువు నాధారమున కాళిదాసు ప్రకృతితత్త్యము నీవిధమున వెల్లడించినాడు. షేక్స్‌పియరు విరచితమగు ఒథెల్లో చరిత్రకు గకుంతలాదుష్యంతుల చరిత్రతో కొంత సామ్యమున్నది. డెస్టిమోనాకూడ నింద్రియములకులోగి, తండ్రి

సారస్వతము: పరమార్థము. భూవతి లక్ష్మీ నారాయణరావు 1691

యనుమతిలెకయే మూరుని వరించినది. ఇట్లిందియవశంపదయైన యీమె జీవితము

గట్‌యుని జీవితముతోపాటు నాశ మైనది. ఆత్మ సొందర్యమున కుగాక

దేహసౌందర్యమునకే ప్రాధాన్య మొసంగినపుడనర్థము తప్పదు. ఇంద్రియములకు

దాసులగుటవలన గలుగు ననర్థ మీ రెండు నాటకములందును నితివృత్త మైనది.

ఒథెల్లోలో నాయికానాయికుల హృదయములు భగ్నములగుటతోపాటు వారి

జీవితములును లుప్తములైనవి. హృదయసంస్కారమునకు, అతీంద్రియమగు

సాఖ్యసిద్ధికి నవకాశము లేకపోయినది. 8616౪6 0! 86 64200664 అను పాశ్చాత్య

సిద్ధాంతమున కిది సరిపోవచ్చును. కాని భారతీయుల యాశయము వేరు.

జీవితనాశమువలన నుదాతాశయము సిద్ధింపదు. జీవితమును సంస్కరించి,

మానవత్వమును పరిపూర్ణముగ చెసె, అనిర్వచనీయమగు సాత్త్వికానందమును కూర్చుట భారతీయ కవి యాశయము. ఉదేకరహితములైన ప్రశాంత చిత్తములతో శకుంతలాదుష్యంతులు పునః చేరగలిగినారు. లోకకల్యాణమును గూర్చు సంతానము వీరి పునస్సమాగమమునకు మూలమగుటయు, భౌతిక ప్రపంచము నధిగమించిన దివ్యస్థానమున నా సమాగమము జరుగుటయు గమనింపదగినవి. దేహ సౌందర్యమునసకు లోనుగాక ఆత్మసౌందర్యమునకు ముగ్గుడైన “డాంటి" మహాశయుడు (పకృతిసౌందర్యమునే చూరగొని ఆనందింప గలిగినాడు. కనుకనే యతని జీవితము ఫలప్రదమై లోకకల్యాణమునకు తోడ్పడినది. ఈ విషయమున మహాకవ లెల్లరును నేకాభిప్రాయునైయున్నారు. కనుక నిట్టి యుత్కృష్టమగు చిత్త సంస్కారమును కలుగబేయునది సత్సారస్వతము.

అట్టి సారస్వత మెప్పుడును నుత్క్భృష్ట(పయోజనరహితమై యుండదు. ఉత్తమసృష్టి మానవకల్యాణ (ప్రతిపాదకము కాకపోదు. లోకహితమునుగూర్చు సంతానమే సంతానమని మన ప్రాచీనుల యాశయము. సప్తసంతానములని మనవారు పేర్కొను తటాకాదులుకూడ లోకహితాపాదకములై యున్నవి. అట్లే కావ్యము కూడ విశ్వశ్రేయమును గూర్చునది కావలెను. మానవకర్మ యడుదోవిధమున లోకమున కుపకరించినప్పుడే దాని కుదాత్తత

సిద్ధించును. అందు సుత్తమమగు కాప్యుకర్మ లోకకల్యాణ 'ప్రతిపాదకము గావలెననుట అస్వాభావికమును కాదు, నతిశయమును కాడు. “డాంటే" రచించిన “డివైన్‌ కామిడీ”, హోమరు రచితమైన “ఇలియడ్‌", మిల్టనుకృతమగు “పారడైజు లాస్ట్‌"

1692 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వ్యాసవాల్మీకి (పోక్స మహాభారత రామాయణములు, నిత్యాది మహాకావ్యములన్నియు విశ్వశేయమే ధ్యేయముగ రచితములైనవి. వేదవాజ్బ్ఞయ వృద్ధియంతయు లోకటాతము నుట్టెశించియే జరిగినది. (పపాపంచిక విముఖులె, పరబ్రహ్మతత్త్వజిజ్ఞాసువులై తపోనిరతులైన వ్యాసాది బుషిసత్తములు సారస్వత సృష్టి గావించుటకు లోకహితముకంటెను వేరు ప్రయోజనము కన్పడదు. వేదవేదాంగములు, ఉపవేదములు, ఉపనిషత్తులు, పురాణములు, స్మృత్మిగంథములు మున్నగు వాజ్బ్ఞాయ (పయోజనమంతయు లోకకల్యాణమే మయొయున్నది. మన బుషుల యజ్ఞకర్మ యంతయు విశ్వ్యశేయము నుద్దేశించియే జరిగినది. తన ఆంధ భారత రచనను వాజ్మయ రూప యజ్జ్ఞముగ పరిగణించిన కవిబహ్మ తిక్కన, ఆంధ్రావళి మోదము నుద్దేశించినాడు. విశిష్ట విజ్ఞాన రూప భారతామృత రసాస్వాదనచే నాంధ్రలోకము తరించుట యతని యుదాత్తాశయము. రచన వలన లోకమున కానందమో, జ్ఞానమో, తుదకు ధర్మబద్ధమగు సాఖ్యమో సిద్ధింపవలను. చిలుకలు పలికినట్లు, పికములు కూజిత మొనరించునట్లు స్వాభావికముగ కొందరు కవితాగాన మొనరింతురు గాక, ఐనను వారి రచనలకు లోక జీవితముతో సన్నిహిత సంబంధమున్నప్పుడే వాని కుదాత్తత సిద్ధించుచున్నది. లోక జీవితముతో _ సంబంధింపని రచనలు లోకము నాకర్షింపజాలవు. సాహితీ శబ్ద నిర్వచనమునందే యా యర్థమిమిడియున్నది. లోక జీవితముతో మన జీవితము ననుసంధించి, సానుభూతిని చిత్తవికాసమును గలిగించు నేరచన మయొనను ప్రయోజనకారియె కావ్యత్వసిద్ధిని బొందుచున్నది. ఈ కారణమును బట్టియే యనేకములగు శతకములు, చాటు ప్రబంధములు, "గేయములు నుత్తమ సారస్వతమున జేరుచున్నవి. “శాంతములేక సౌఖ్యములెదు" అను త్యాగరాజు కృతి యిందులకొక దృష్టాంతము. ప్రతి వ్యక్తి యనుభవమునకును వచ్చిన వధూలావణ్యము, పిల్లల తొక్కు పల్కులు మున్నగువానిని వమనోజ్జ్ఞవమగ వర్ణించుట సహృదయులగు వారి కెల్ల నానందదాయకము కాకపోదు. కనుకనే, “పెండ్లికూతురు” లావణ్యమును, (ప్రథమ సంతానమునుగాంచి “నీలాటిరేవు"”నకు వచ్చిన ముద్ద బాలింతరాలి మనోజ్ఞ సౌందర్యమును నితివృత్తములుగ రచితములైన ఖండకావ్యములు చిత్త వికాసమును కలిగించుచున్నవి. ప్రకృతి సొందర్యమున లీనుడై, యాసందపరవశుడై, ఎలుగెత్తి, 5061 [6465ల వల పాడు కవిరచన లనేకము లిట్టివి. కనుక, ఉదాత్తమగు

సారస్వతము: పరమౌర్దము భూవతి లక్ష నారాయణరావు 1693 లోకకల్యాణమో, సాత్త్వికమగు చిత్తశాంతియో, తాత్కాలికమగు చిత్తవికాసమో సాహెత్య ప్రయోజనమగుట తప్పదు. లోకకల్యాణ ముతోబాటు ఆనందవును గూర్ప్చుటకూడ సాహిత్య (ప్రయోజన మైయున్నది. పరమాత్మాను సంధానమున యోగులు బొందు పరమానందమునకును కావ్య రసాస్వాదనచే గలుగు నానందమునకును భేదమున్నదాయను విషయమున నభ్మిపాయ భిదము గలదు. కావ్యమే పరమావధిగ నెంచి శబ్బమును పర(బహ్మ స్వరూపముగ పరిగణించిన కవితావేత్తలు కొందరీ రెండును నభిన్నము లనిరి. తాత్త్విక దృష్టి ప్రధానమైనవారీ యభ్మిపాయముతో నేకీభవింపకున్నను, కావ్యాసందముసకు బ్రహ్మానందముతో సమానమగు స్థానమును, (ప్రతిపత్తిని సంగీకరించినారు. బ్రహ్మానంద సబహ్మచారియని వీరు కావ్యానందమును వర్ణించుటలో నిదియే ఆశయము. ఈ విషయమున పరమార్థ మేదిమైనను, ఆసందము కావ్య (ప్రయోజనమసుటలో విప్రతిపత్తి లేదు. అయిన, ఆసలంద శబ్దార్థ విషయముననే పొరపడుట జరుగుచున్నది. వినోదము, సంతోషము, తాత్కాలిక చిత్తవికాసము - ఇత్యాదులను ఆనందముగ (భమపడుటకు వీలులేదు. ఇంద్రజాలాది దర్శుసనమువలన గలుగు వినోదముకాని, ఇందియ తృప్తిపలన గలుగు సౌఖ్య సంతోషములుకాని, రమణీయ వస్తుసందర్శన మధురగీతి (శవణములవలన గలుగు చిత్తవికాసముకాని ఆనందము కాజాలదు. ఈ వినోదాదులన్నియు తాత్కాలికములు, ఇం[దియోద్చూతములు. అలసట చెందిన వ్యక్తి ఆసవాదులను సేవించుటచే తాత్కాలికోత్తేజనమును బొందపచ్చునసు. కాని, అట్టి యుత్తేజనము తాత్కాలికముసు, నింద్రియ మాత్ర వ్యాప్తము నగుటచే శాశ్వతము కాదు. అట్లే రత్యాడులపలన గలుగు నింద్రియ సౌఖ్యమును గూడ ఆనందపునుట పొసగదు. వేదాంతులీ విషయమును చర్చించుచు, రత్యంతమున గలుగు జుగుప్పును, విముఖతనుబట్టి యూ తాత్కాలిక సౌఖ్యమానందము కాదని త్రోసిపుచ్చినారు. కండూతిమర్హసము వలన గలిగిన హాయిని ఆనందమనుట చెల్లదని ఆలంకారికులు సూటిగ విపరించినారు. సాత్త్యకము, అలౌకికము, శాశ్వతము నగు చిత్తవికాసము కలిగిసప్పు డాసందము సిద్దించిసడని చప్పపచ్చును. అప్పుడే విశ్వముతో సమరసభాప మేర్ప్చడగలదు. ఇంద్రియాసుభూట కారణముగ వికాసము నొండిన భావచే పరిణామపైతియందడు (రసస్వరూపమున) నానందసిద్దిక్‌

1694 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నాధారమైనను, నా సమయమున ఇంద్రియములకు బసక్తి యుండదు. రసస్థితియందు లేక ఆనందానుభవమునందు, ఇంద్రియములన్నియు శాంతములై ఏకముఖనిష్టములై యుండునని తాత్త్వికుల యభిప్రాయము. ఆ స్థితియందు మానవుని దేహమందలి ప్రతి పరమాణువును తన్మయావస్థను జందియుండును. అట్టి సాత్త్విక స్థితిని ఒక్క క్షణమైన తన జీవితమునం దనుభవించిన వ్యక్తి జీవన్ముక్తుడనియే చెప్పవచ్చును. ఆ యానందానుభవ మనంతరము లుప్తమగునది కాదు. జీవితమునందు అది శాశ్వతమగు పరివర్తనమును గలిగించి, వ్యక్తి దృక్పథమునే మార్చునది యగును. కనుకనే కరుణరసానుభూతిని బొందిన సిద్ధార్ధుని జీవితము (ప్రబుద్ధమైనది. ప్రకృతి తత్త్వ జిజ్ఞాస నతనికి కలిగించినది. తద్విజ్ఞానము వలన నతనికి సుస్థిరమగు శాంతి చేకూరినది. అల్లే శ్రీకృష్టునందలి భక్త్యావేశమున లీనుడై, తన్మయతను జంది, ఆనందసిద్ధిని బొందిన చైతన్యుని జీవితము దివ్యమగు పరివర్తనమొందినది. సామాన్య మానవ జీవితమున భగవత్స్వ్వరూపమును దర్శించి, ఆత్మజీవితముతో సమన్వయ పరచుకొని యానందించిన గాంధీ జీవితము సాత్త్విక శాంతికి నిలయమైనది. ఆనందానుభూతిని గాంచిన వ్యక్తి ఇహలోక కష్టముల కతీతుడని చెప్పవచ్చును. నాగుల జీవితమును, గరుడుని జీవితమును గూడ నవగాహన చేసికొనగల సావరస్యము జీమూతవాహనునకు పూర్వజన్మ సంస్కారసిద్ధము. కనుక నతడు గరుడునియడ నేమాత్రమును విముఖతను ప్రదర్శింపలేదు. ఆత్మత్యాగ మతని కొక లీలగ దోచినది. శైశవమున తా ననుభవించినతల్లి యుత్సంగ సౌఖ్యముకంటెను. పయసతియగు మలయవత్యాలింగన సౌఖ్యముకంటెను నధికమగు, విశిష్టమగు నానందము నతడు వధ్యశిలాస్పర్శచే బొందగలిగినాడు. కరుణరసానుభూతి వలన సిద్ధించిన యానంద మతనిని బాధల కతీతునిగ నొనర్చినది. ఇతని దేహమును చంచువుచే చీల్చి మాంసమును భక్షించుచున్న గరుడునకే యితని స్టర్య మాశ్చర్యమును గొల్పినది. ఆహారమును మాని, నిశ్చేష్టుడై తన్ను జూచుచున్న గరుడుని జీమూత వాహనుడు “మహాత్మా, ఏల యాగితివి. నాయెడల నింకను మాంసముకలదు. రక్తమింకను (స్రవించుచున్నది. నీ క్షుధ యింకను తీరినట్లు లేదు. ఆకలి దీర్చికొమ్మ"ని ప్రోత్సహించినాడు. ప్రకృతియందలి ప్రత్యణువును, ప్రతి స్పందనమును భగవదంశమని గుర్తించిన సంస్కృతియే యిట్టి చిత్తవృత్తికి హేతువు. మానవుని ప్రతికర్మయు నతని జ్ఞానాజ్ఞానముల ప్రవృత్తియనియు,

సారస్వతము: పరమార్థము భూపతి లక్ష్మీనారాయణరావు 1695 జీవితమునందలి కష్టములన్నియు మన యజ్ఞాన పరిణామములనియు [గ్రహించిన (క్రీస్తు మహాశయునకు, యూదులు గల్పించిన హింస విశ్వలీలగ గన్పట్టినది. అతనికి వారియెడ [కోధముగాని బాధవలని దుఃఖము గాని కలిగినది కాదు. " (ప్రకృతితో సామరస్యము కుదిరిన వ్యక్తి ప్రవృత్తి యిట్టిది. ద్వంద్వాదుల నధిగమించు శక్తి అనందానుభవముచే సిద్ధించుచున్నది. కావ్యరసాస్వాదనచే ఆనందసిద్ధిని గాంచిన వ్యక్తి జీవితము సమగ్రము సాత్త్వికప్రధానము నగుచున్నది. ఉత్తర రామచరిత్ర ప్రదర్శనమున సీతారాముల హృదయపరివేదనను ప్రత్యక్షముగ జూచి, కరుణరసానుభూతిని పొందిన వ్యక్తి పిమ్మట స్త్రీవిషయికములగు నిందావాక్యములను సహింపలేడనుట నిక్కము. అట్లే ముద్రారాక్షసమున రాక్షస చందనాదుల అన్యోన్య స్నేహభావోన్నతికి ముగ్ధుడైన వ్యక్తి మిత్రదోహి కాజాలడు. నాగానందమున నాయకుని దయావీరముచే ఆనందసిద్ధిని బొందిన సహృదయుడు తన జీవితమున పరోపకారప్రవణు డగుట వింతకాదు. సాహిత్యమునకు గల యిట్టి శక్తిని గుర్తించియే పపాక్పుశ్చిమ ఖండములందలి రూపకకర్త లెల్లరును తపు రచనలచే నిట్టి విశిష్ట్రప్రయోజనమును సాధింపబూనినారు. ఇట్టి యుదాత్తప్రయోజనమును సిద్ధింపబేయు నానందము సాహిత్య ధ్యేయము. భారత రామాయణాది ఉద్దంథపఠనమువలన సిద్ధించున దిట్టి సాత్త్వికానందము. ఉదాత్తములగు “ఇలియడ్‌” పంటి కాష్యములసు మాత్రమేకాక ఉత్తమడ్రేణికి జెందిన పాశ్చాత్య నవలలను బరీక్షించినను నీ విషయము (ధ్రువమగుచున్నది. విక్టర్‌ హ్యూగో రచించిన “తే మిజరబల్స్‌”, హాల్‌ కేన్‌ రచించిన 06౭౫:16౭ 0౧౧912౧, 50406 9041 ఇత్యాదులును, మిసెస్‌ హెన్రీ వుడ్‌ రచించిన 0౧౧౧1౧౦9, [ం౧౭|6 *0168 అనునవియు, గిఇ102016] [౧241007068 చే రచితమైన 50261 1616? మున్నగునవి యన్నియు నిందులకు దృష్టాంతము లగుచున్నవి. వీనిని చింతనతో పఠించి, వీనియందు (ప్రతిపాదితమైన ప్రకృతి ధర్మములను (గ్రహించినచో సిద్ధించునది సాత్త్వికానందము. ఆసందసిద్ధికై చేదాంతగంథములను మాత్రమే చదువవలె ననుట అపోహ. తాత్కాలికమగు భావో(దేకమును, ఇంద్రియోత్తేజనమును మ్యాత్రమే కలిగించు రచనలు సత్సారస్వతమున జేరవు. కనుకనే గ4గ౦|౦9 నవల లంత యుత్తేజకములైనను నాంగ్గ సారస్వతమున సుత్తమ స్థానమున కర్లములు కాకపోయినవి.

1696 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ప్రథమ ప్రపంచ సంగ్రామానంతర మభివృద్ధిచెందిన సారస్వతములో చాలభాగము మానవ మనస్తత్వపదర్శన (ప్రధానమై యున్నది. స్థూలదృష్టికి గోచరముకాని, మానవుని మానసిక జీవితాంతర్భూతములగు విషయములను, నిగూఢభావములను, జీవితమున పప్రయోజనసిద్ధిని గాంచక లోననే ప్రజ్వరిల్లుచున్న విషయవాంఛలను విస్పష్టముగ వివరించి, యవి యెట్లు వ్య క్తిపవర్తన కంతటికిని కారణములగుచున్నవో వ్య క్త్రపరచుట ఈ రచయితల ప్రధాన లక్ష్యము. వీని పఠనమువలన మన జ్ఞాన మితోధికముగ విస్తృతిజంది, జీవిత సామరస్యమును, చిత్తశాంతియు చేకూరుచున్నది. ఎట్టి కావ్యమును పరఠించినను, ఎట్టి ప్రదర్శనమును జూచినను, ఎట్టి గానము నాకర్షించినను కడపట సిద్ధింపవలసినది సామరస్యము, చిత్తశాంతి. అట్టి మనస్థితిని గలుగజేయు కళాసృష్టి యంతయు సాహిత్యభాగ మనుట నిస్పందేహము. ఇక ఆనందము కాంతాసమ్మితములగు కావ్యాదులవలన మాత్రమేకాక శాస్త్రాదులవలనగూడ సిద్ధింపవచ్చును. కాని శాస్త్రాధ్యయనము సామాన్యుల అవధిలోలేదు. వ్యుతృన్నులగువారికి మాత్రమే శాస్త్రసారస్యతము (ప్రయోజనకారి కాగలదు. తర్కవేదాంతాది శాస్త్ర పరిశమయందు ప్రకృతితత్త్యము గోచరింప, దానిని విశ్వజీవితముతో సమన్వయింపజేసి, ఆనందసిద్ధిని బొందగల బుద్ధినక్తి పతంజలి శంకర శాయనులవంటి కారణజన్ములకు మాత్రమే సాధ్యమగుసు. (పకృతి శాస్త్రములలో కృషిచేసి, తత్పరిశోధనలయందే నిమగ్నులై, ప్రకృతి తత్త్వావబోధచే నానందానుభూతిని గాంచిన న్యూటను, డార్విను, థామ్సను, జీన్సువంటివారును లేకపోలేదు. శబ్దశాస్త్రము వలన నానందసిద్ధిబొందిన పాణిని, పతంజలి, భర్తృహరివంటి శాబ్దికులును గలరు. కాని యిట్టి మేధాసంపన్నులు మానవకోటిలో చాల నరుదు. కనుక కావ్యనాటకాదులే సాధారణు లెల్లరకు నుపాదేయము అగుచున్నవి.

(ప్రకృతియందు న్యాయాన్యాయములు, ధర్మాధర్మములు, కష్టసుఖములు ననునవి ద్వంద్వములు. ఒకదాని నొకటి యంటిపెట్టుకొని యుండు (పకృతి ధర్మము లివి. ఐనను నిత్యములగు సత్య ధర్మ న్యాయములును లేకపోలేదు. శ్రీకృష్ణుడు కౌరవసభలో,

సారస్వతము: పరమార్ధము భూపతి లక్షీనారాయణరావు 1697 “సారపు ధర్మమున్‌ విమల సత్యము పాపముచేత బొంచుచే పారముం బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు ల వ్వార లుపేక్షంజేసి రది వారలచేటగుగాని ధర్మ ని స్తారక మయ్యు సత్య శుభదాయకమయ్యుును దైవముండెడున్‌.” అని యుద్దాటించినట్లు, సత్య ధర్మములు దైవరక్షితములు, నిత్యములు. తాత్కాలికముగ, భౌతిక శక్తుల కాగలేక సత్యధర్మములు మరుగుపడినట్లుగాని, అడగినట్లుగాని యొకప్పుడు స్థూలదృష్టికి తోపవచ్చును. కాని తుదకు నిలుచునవి సత్య ధర్మములే. వేఘాూచ్చాదిత మైన సూర్యుడు తాత్కాలికముగ మరుగుపడియున్నను, మరల శీఘముగ మునుపటికంటె తేజోవంతముగ భాసించునట్లు, రాక్షసశక్తుల అంతరాయము తొలగిన వెంటనే సత్యధర్మములు మరల (ప్రకాశింపగలవు. భౌతికవిషయము అంతటి యున్నతము లైనవైనను, శిథిలములు కాక తప్పవు. వానికి స్వతంత్ర శక్తి లేదు. తేజోమయములగు సత్యధర్మములు స్వయంప్రకాశములు, (పకృతి విధాతలు. ఈ సత్యమును మనము (గహించినప్పుడే మనకు జ్ఞానము సిద్ధింపగలదు. ఇట్టి జ్ఞానమును కలిగింపని రచనలు మానవుని యున్నతికిని మానవత్వ పోషణకును నుపస్కారములు కావు. కనుక ఉత్తమ సారస్వత ముదాత్త సత్య ధర్మ ప్రతిపాదకము కావలెను. (ప్రత్యక్షముగః సూటిగ, సత్యధర్మములను బోధించుట కావ్యవిధానము కాదు. ఆ విధానము నీతిశాస్త్ర సాంఘిక శాస్త్రాదులకు సంబంధించినది. కావ్యములలో సత్య ధర్మములు భంగ్యంతరమున సాధ్యము కావలెను. అందు పోషితమైన లౌకికేతివృత్తమును బట్టియు, నాయక (ప్రతినాయకుల శీల ప్రవర్తనాదులసు బట్టియు, కథాపర్యవసానమును బట్టియు, నిత్యములగు న్యాయ సత్య ధర్మముల అవితథత్వమును, స్వతంత్ర శక్తియు పాఠకులకు సుష్య క్రము కావలెను. లేనిచో మానవ జీవితమున కొక ఉత్తమాలంబనమే లేకపోయి, జీవితము లక్ష్యశూన్య మై, (ప్రవర్తన కాదర్శము గానక వ్యర్థమగుట జరుగగలదు. ధర్మ న్యాయములయడ వివఎఖత కలిగించుట లోకదోహకర వునుట గవమునింపదగినది. అన్యాయాధర్మములకు లోకమున విజయము కలిగిన ట్లొాకప్పుడు స్థూలదృట్టికి గోచరింపవచ్చును. కాని సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడది భమయని తోచకపోదు. అధర్మాచరణచే సిద్ధించిన భౌతిక సౌఖ్యము స్టిరమును కాదు,

1698 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నిజమును కాదు. ౪౫6 నాటకమున, అన్నను జంప్‌ యతని రాజ్యమును, స్త్రీని కైవసము గావించుకొన్న క్లాడియసుకు చిత్తశాంతి లేదని అందే సూచితమైయున్నది. మాయాద్యూతమున పాండవుల రాజ్యలక్ష్మిని హరించి, పత్మివత కవాచ్యమగు నవమానమును గావించి, తాత్కాలిక సంతోషము ననుభవించిన దుర్యోధన దుశ్శాసనులకు చిత్తశాంతి లేదనుటకు వారికి గల పాండవ ఛీతియే నిదర్శనము. పాండవులు వనవాసమునకు బోయినది మొదలు ధృతరాష్ట్ర డనుభవించుచుండిన భయ మిందులకు మరియొక నిదర్శనము. అన్యాయ (ప్రవర్తనచే ద్రవ్య సంపాదన గావించియు, (దోహాచరణముచే పరుల నాశము గావించియు ఉన్నత స్థానమును బొందినవారు లోకమున గలరనుట నిజమే. కాని, వారి మానసములు వికలములు, నశాంతియుతములు ననుటలో సందేహము లేదు. అట్లే కామకోధాదుల తృప్తివలన సౌఖ్యము కలుగుననుటయు కల్ల. దుర్యోధనాదుల పాపాచరణకు దగిన పప్రత్మికియ గావించిన ధర్మజునకు మనశ్శాంతి లభించుటకు మారు నిర్యేదవము కలిగినది. “మానసము శోకాక్రాంతమయ్యెన్‌ మదిన్‌" అని యతడు యుద్ధానంతరము వాపోయినాడు. ఇట్లు, నిత్య సత్య ధర్మ (పప్రతిపాదకములైనప్పుడే రచనలు విశ్వశేయమును కూర్చుగలవు. ఆకారణముననే భారతీయ నాటకకర్తలు విషాదాంత రూపకములను రచింపరెరి.

మానవ జీవితమందలి శోకాదులనుండి కలిగిన తాత్కాలిక విరామమే సౌఖ్యమని జీవి తలంచి సంతోషించును. జీవితమునందిట్టి విరామమును గల్పించి, జీవితానందమును గూర్చుట రూపకముల ముఖ్య (ప్రయోజనము. అంతేకాక, భగ్నహృదయముల కాశ్వాసమును గలిగించుటకు నవి యంతయు నుపయుక్తములు. మరియు, దైనందిన జీవితమున గోచరముల నన్యాయాధర్మముల 'ప్రాబల్యమునకు లోనై, ఫీన్నుడై యుండు జీవికి చిత్తష్టైర్యమును గలుగ జేయుటయు, ధర్మన్యాయములయందు స్థిర విశ్వాస ముదయింపజేయుటయు, అమోఘమగు దైవశక్తియందు భక్తిని కలుగజేసి తద్ద్వారా శాంతిని బసాదించుటయు ననునీ యుద్దేశములతో కావ్యరచనకు గడంగిన రూపకకర్తలు విషాదాంత నాటకములను రచింపరెరి. ఉత్తర రామకథను విషాదాంతము గావించినచో నధర్మము జయించినట్లగును. పాపుల వాక్కులకు సత్యనాశక శక్తి సిద్ధించినట్లగును. సీతను నిందించిన నీచులు కూడ కడపట పరివర్తనమును జంది, సీతా పాతివ్రత్య

సారస్వతము: పరమార్ధము భూపతి లక్షీనారాయణరావు 1699 మాహాత్మ్యమున కంజలి ఘటించినపుడే సత్యము జయింపగలదు. అట్టి పర్యవసానమునే భవభూతి సప్త్రమాంకమున గల్పించినాడు. అట్లుకానిచో, ద్వంద్వముల కతీతులగు యోగులమాట యెట్లున్నను, సాధారణ సామాజికుల హృదయములు భగ్నములగుననుట అతిశయోక్తికాదు. అల్లే సారంగధర నాటకము విషాదాంత మగుటవలన నసత్యము విజయము గాంచినట్లు గోచరింపగలదు. జ్ఞానహీనులగు హృదయ దుర్చలులకు అన్యాయాచరణమునం దాసక్తియు, నధర్మమునందు విశ్వాసమును కూడ కలుగవచ్చును. పరస్త్రీ మానహానికి బూనుకొన్న మానవరూప రాక్షసుడగు కీచకుడు భీముని జయింపగల్సియుండినచో సాధ్వీమణులకీ సంఘమున గతిలేకయుండెడిది. ధర్మమున కపజయము కలుగునను భావము సామాన్యుల జీవితమున స్థిరపడినచో అనర్థములు సంభవించును. అన్యాయము నుపాధిగ నవలంబింపవలసిన స్థతికూడ యేర్చడగలదు. అదియే నైతిక పతనమునకు మూలమగును. విద్యావంతులైసవారిక్‌ కూడ విషాదాంతరచసలు వేదమును గలిగింపక మానవు. 1899 0! 06 ౪1౭7౧46|69 గాని, 006॥0 గాని గం 184 గాని పఠించిన పిమ్మట హృదయమున నేవోయొక విధమగు నలజడి కలుగుచున్నది. ఏ పాపము నెరుగని నాయికానాయకుల నాశముతో సామాజికుల హృదయములు ఖీన్నములగుట తప్పదు. (పపంచములో ననర్థములు కలుగవచ్చుగాక. ఇంద్రియ సంయమనము లేకుండుట, భౌతిక జీవితము ప్రాధాన్యము వహించుట ఇందులకు కారణములు. అట్టి యనర్థ కథనముపలన కలుగు ప్రయోజనము కూడ అనర్థకమే యగుచున్నది. అట్టి రచనల పలన విశ్వశ్రేయము సిద్ధించుటకు మారుగ, జుగుప్పయు, నిర్వేదమును గలుగగలవు. కనుక, ఉదాత్త రచనలు ధర్మన్యాయ (పతిపాదకము లగుచు, (పజలను సరసవమార్గమున తదున్ముఖులను గావించుచు, లోకకల్యాణమునకు తోడుడవలసెయున్నవి. “606 9683 901 *౪౭|15" అను 701910 రచిత కథ ఇందనుసంధింప దగియున్నది. కావ్యవస్తువు 'పప్రకృతిసత్యమున కుత్కృష్ట్రపతివింబమై యుండుట మరియొక సారస్వత లక్షణము. (పతిచింబమనుటచే, విషయము నున్నదున్నట్లు, బాహ్యచక్షువునకు గోచరించునట్లు మాత్రమే వర్ణించుటయని అర్థముకాదు. చక్షుర్లోదరమగు ప్రకృతి వర్ణన మాత్రమే చాలదు. చిత్రకారుడు ఛాయాగ్రాహకుడు కానియట్తే, కవియుసు విషయోపన్యాసకుడు కాడు. స్టూలప్రకృతికి ఎనుక దాగియున్న (పకృతి తత్త్వమును వివరింపగలిగినవాడే కవి. పాశ్చాత్యులుకూడ కవిని

1700 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము జీవితభాష్యకారుడని నిర్జేశించియున్నారు. జీవి పూర్వజీవిత పరంపరలసు, నందలి సుందరతర సుందరతమ దృశ్యములను వలువరించగలిగినదే కవిత. మానప్పుని ప్రవర్తనను వర్ణించుటలో వైశిష్ట్యములేదు. ఆ ప్రవర్తనకు హేతువులగు హృదయవ్యాపారములను, ఆ హృదయవ్యాపారములకుగూడ కారణములగు తత్పూర్వజీవిత సంఘటనలను, హృదయమునకు గలిగిన అఘాతములను, వ్యక్తి యనుభవించిన ఆందోళనమును, మరియు ప్రజ్ఞానిబద్ధముకాక హృదయమున సుప్తములుగ నుండు కారణపరంపరలను వెలువరించుటయే రచనయందు ముఖ్యవిషయములు. అనగా, మానవ్రవృత్తికి హేతుభూతమగు మానసిక తత్త్వవయమనం ్రదర్శించుటయే (ఏధాన విషయము. కీచకవధ, దుశ్శాసనవధ్యాసందర్భములందలి భీముని మనస్తత్వము బోధపడిననే తప్ప అతడు గావించిన వధ్యావిధానమును మనము [గహింపజాలము. కీచకుని జంపి, యతని కరచరణాద్యవయవముల నన్నిటిని శిరస్సుతోకూడ దేహమునం జొనిపె, మెదిపి మాంసపుముద్దగ జేసెనట్టియు, దుశ్శాసనుం బొదివి, కింద పడబైచి, యతని ముఖంబుపై బాకును రుళిపించి, హృదయమును జీల్చి, రక్తమును తన మోవిజేర్చినట్టియు భఖీమునియందు, సతీ విషయికావమానమునకు ప్రతిక్రియ గావించు భర్త మానసిక ప్రవృత్తి చిత్రితమైయున్నది. అల్లే ధృష్టద్యుమ్న వధ సందర్భమున నశ్వత్తామ రాక్ష స్య్రపవర్తనకు గారణమును సూక్ష్మ్మముగ నరయవలసియున్నది. బాల్యమాదిగ పాంచాలురపై తనకుగల కోపమును, శస్త్రసన్యాస మొనరించి నిలిచియున్న తన తండ్రి శిరోజములంబట్టి కంఠచ్చేడ మొనర్చిన ధృష్టద్యుమ్నునెడ తనకుగల (కోధమును - ఈం౮ండును అశ్వత్తామ బ్రాహ్మణజాతి విరుద్ధమగు ప్రవర్తనకు కారణము లగుచున్నవి. ఇట్లే 4102౧6 రచించిన 06615! లోని నాయకుని నిర్ణయా(ప్రవర్తన కతనికి గలిగిన హృదయాఘాతములును, సన్నిహిత బంధువర్గ మతనియిడ జూపిన నిర్దాక్షిణ్యమును హేతువులైనవి. ఇట్లు మనస్తత్వప్రదర్శన ముత్తమ సాహిత్యమున (ప్రాధాన్యము వహించుచుండును. కవికల్పనకూడ (ప్రకృతివిరుద్దమైనది కారాదు. అట్టివానిచే కావ్యప్రయోజనము సిద్ధింపదు. భావనకూడ హేతుబద్ధమై యుండపలెను. విపరీత వస్తుకల్చ్పన చిన్నపిల్లల వినోదార్థము పనికిరావచ్చును. ౪/0౧66? 51063, ౯202195

  • ఇత్యాదులన్నియు నిట్టివే. పంచతంత్ర హితోపదేశాదులందలి కథలలో మానపత్వ

జతిస్తట న 6 వత్తరం. నం పతి అజక్‌నారాయగారావ్చు 1701 మారొపంపబతీయుండుటచే సవ యాకర్షణీయము లగుచున్నవి. అంతియేకాని, మతి మ కాక సాహాత్య ముదాత్తభావసమస్వితమై యుండక తప్పదు.

  • హిటంనవంలతో వొప్పుని రచన ప్రయోజనశూన్యము. మానవృనిజీవిత “ఎలా వ్రన ఏటి కత యపత్యృృష్టభావసంపద కారణమగుచున్నది. జీవితమును చపల లన వైనము నరకృపాయముగవైనను బేయునవి భావములే. మన (ఎచత్తన కంతటకని వున ఖావములే వమూలములు. వీని యుత్తవు మధ్యుమధమత్వవముం ననుసరించి మన ప్రవర్తన యేర్చడుచున్నది. మనయం సలు మిల లు యత్న లబ్బము అని సంస్కారము రెండు విధములు. వీనిలో చం నిన వెం స్యైరము బలవత్తరమనుటలో సందేహము లేదు. ఐనను, ప్రయత్న అట్ట చలం చలంపె్య్మాతనునకు గూడ (పాధాన్యవఎ లేకపోలతదు. మమ్మును వన్బైంతరనులందు. జీవ చేయు. నుత్కృుష్ట ప్రయత్నహులన్నియు గుత్త రత్త ంములుతు సమింపగలవు. కనుక, నుదాత్తభావము లుదాత్తప్రవర్తనకు హేల స లటటిలుం ఆ ర్రవర్తన ఫలితముగ జీవి సంస్కృతి నందుటయు మన్నన ట్టు విద్టించిన సంస్కృతి మరల ఉదారోదాత్త భావసిద్ధికే ట్ర ర తలల నద్తుత్య్యుప్ట భావసంపడలపే మానవుని సంస్కృతి కంతటికిని ముం రు నరునుదున్నువ్‌ కనుకు ఆట్టి భావసంపడతో పరిపుష్టము కాని రచనలు (ర అన రనాతమువినము పి తవ్చుకాడు. ప్రపంచ సారస్వతము లన్నిటియందును రములు నరుల ఖాతిగారదమును బట్టియే గౌరవము నందుచున్నవి. భావములు చేశకాల వాహ్రాతుద అపువర్సి నరిగముంచి, విశ్వ జీవిత ప్రదర్శకములు కావలను. బం సంలు గోచరమగు మూయాఛన్న ప్రకృతియొక్క సత్యస్వరూపమును (౧ కను “బీయు భావము లుదడాత్తములైనవి. లౌకికజీవితమునందలి సంఘర్షణ. చలం వాప్తాస్‌ పదములు మున్నగు చత్తప్రవృత్తుల కన్నిటికిని ప్రకృతి మ అవవ నటెిచన్‌ హొతుచ్చు. ప్రకృతిసత్యము గోచరించినంతనే యిట్టి ననా నంలను. వతమ్యుత్యలన్నుయు. నడగి, హృదయము క్షాళతసుగును. , కవన కరము బారూముందలి పతి వస్తువును, ప్రతి మ్యక్త్రియు సూతనముగ

1702 పండిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 42 సాహిత్యము సమన్వితమై యుండవలను. భారతీయుల వేదవాజ్బయమును, అందును ముఖ్యముగ నుపనిషద్భాగమును, అట్టి యుదారోదాత్తభావ సమన్వితమై, విశ్వ జీవితమునకు వ్యాఖ్యానమై యుండుట బట్టియే, యది అఖిల నాగరక ప్రపంచ పూజల నందినది. ఆ కారణముననే మహాభారతము లౌకిక సారస్వతమున ప్రథమ స్థానము నందియున్నది. గీతకు ప్రపంచ సారస్యతమున గల యున్నత స్థానమున కందు ప్రతిపాదితములై యుండు నుదాత్తభావములే హేతువులు.

“నైనం ఛిన్టన్హి శస్తాణ్‌ నైనం దహతి పావకః

నవదైవం క్లేదయత్యాపో న శోషయతిమారుతళో అని యుదాత్తముగ నాత్మస్వరూపము వర్ణితము. 500౧0089 అను గీసు దేశపు రాజు, రూపకకర్త, శతుహస్తగతుడైనప్పుడు ఈ భావమునే 501/1 620౧01 06 ౧/66 అను వాక్యమున వ్య క్త్రపరచినాడు. జీవితముయొక్క నిత్యత్వానిత్యత్వముల గూర్చిన మీమాంస భారతీయులు గావించినంత యెక్కువగ నితరులు గావించినట్లు కన్పట్టదు.

“నిర్మానమోహా జితసజ్జదోషా

అధ్యాత్మనత్యా వినివృత్తకామాః

ద్వన్వ్వైర్విముక్తాః సుఖదుఃఖసజైః

గచ్భన్త్యమూఢాః పదమవ్యయంతత్‌” అను నట్టి లౌకికాతీత భావములు చిరకాలమునుండియు మనకు చిరపరిచితములై యున్నవి కనుకనే భారతభూమి యోగభూమియెనది.

“వినయము విద్యయుంగలుగు విప్రనియందు గోవునందు నొ

ప్పునెజయు హస్తియందు నొక పోకకు. బోవనికుక్కయందు దా

నినడిచి తెచ్చివండి తిను నీచపుమాలనియందు. దుల్యద

రనులు దదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్‌' అనునట్టి సర్వసమతాభావములు భారతమున నెలకొని తదౌన్నత్యమునకు హేతువులైనవి. కావ్యమున పోషితమగు నితివృత్తము లౌకికమేమైనను, అందు పతిపాదితములగు భావము లుదాత్తములై చిత్తసంస్కారమున కుపస్కారకములు కావలెను. ఇంద్రియతృప్తి నుపాదేయముగజేయు నే రచనయు నుత్తమ సాహిత్యముగ పరిగణింపబడలేదు. ఇంద్రియక్షో భవలన గలిగిన చిత్తవృత్తి వర్ణ్షనయే

సారన్వతము: పరమార్దము భూవతి లక్షీనారాయణరావు 1703 ప్రధానేతివృత్తమగు మేఘసందేశముపంటి లౌకికకావ్యమునగూడ యక్ష యక్షుల అచంచలమగు విశుద్మపణయము పునాదిగనుండుటచే కావ్యమునకు గౌరవము సెద్దించినది. ఐనను భారత రామాయణములకు గల స్పానము మేఘసందేశ వికమోర్వశీయ రత్నావళులపంటి కాప్యములకు గలుగుననుట కల్ల. అట్లే, 01/06 ౦గ౭౦) ౯౧2616 ఓ091 లకు గల గౌరవప్రతిపత్తులు బొనింగు రచించిన ౧6/82 661-30గ2 అను కావ్యమునకు కలుగదు. కనుక సారస్వత ముదాత్తభావములను 1ప్రతిపాదించుచు, మానవుని జీవితమును దివ్యత్వమునకు పురోగమించునట్లు చేయవలెను.

సారస్యతమునకు నీతితో సంబంధ మున్నదా యను ప్రశ్న పరిశీలింపదగినది. మానపజీవితము సంఘజీవితముయుండు కారణమున, సాంలఘకవ్యవస్థ కంతకును నాధారమషగు నీతిని పాటింపక తప్పుదు. నీతిసూతము లన్నియు మానవకల్పితములే యగును. సంఘ్యశేయము నుర్దేశించింపే, యాయా కాలములం దవసరముల బట్టి యివి సృష్టికి వచ్చినవి. ఎక్షైనను, సాంఘికసూత్రములను, నీతి సూత్రములను పాటింపక సామూజిక జీవితము నిలువజాలదు. సంఘ జీవితవుందలి సామరస్యమునకు, (ప్రశాంతతకు మూలాధారమైనది సాంఘికనీతి. దాని సనుసరించియే మాసవజీవితము సడువవలసియున్నది. లెనినాడు సాంఘకవ్యపస్ట భగ్నము కాగలదు. సాధారణముగ మానవకోటియంతయు తనకు తెలికుండగనే సాంఘకనీతి ననుసరించి ప్రపర్తించుచుస్నది. లేనిచో, తత్పలితము ననుభవింపక తప్పుడు. ఆయా కాలములందటి సాలంఘకవ్యవస్థననుసరించ నీతసూత్రములుకూడ మపూరుచుండు సనుట నిజడే. కాని, సంఘము ఆయా కాలములందు వ్యాప్తెిలోసుండు సాహిత్యము నీటి కాలంబనము కాకపోవృటకాని, తది్విరుద్ద ముగుదాసిని (పతిపాదించుటకాని జరుగరాదు. అట్లని, కావ్యములన్నియు న్‌తిని (ప్రత్యక్షముగ బోధింపనక్కరలెేడు. న్‌తై అనుభవముద్వారా ఆపేర్పడవలసినదేకాని (ప్రత్యక్ష బోధపలనకాదు. ఇతిషృుత్తమందలి పాతల గుణశీలములు, వారి ప్రవర్తనలు, వా రవలంబించు నీతసూతములు, తుదకు వా రొందు ఫలితములు - ఇత్యాదులను పుఠరస్కరించుకొవి జసులు నీతిని గగహింపవలస్‌యుండుసు. కనుక నిదియు కావస్ట్రపయోజనములలో నొకటి. ఏ నీతినిగాని బోధింపక, తాత్కాలికమగు మానసికోత్తెజసమును, చిత్తవికాసమును గలిగింపజాలు రచసలును గలప్పు. షెల్లీ రచించిన 5%/40గ6 0/0540గ% రచించిన 501100 ౧6౭౦6? మున్నగు ఖండకావ్య

1704 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము రచనలన్నియు నీవర్గమునకు చెందినవియే. వానికి కావ్యత్వసిద్ధి లేకపోలేదు. ఐనను, ఉదాత్తములు, సమగ్రజీవిత భాష్యములునగు మహాకావ్యములు, నాటకములు మున్నగువానిలో నీత్తి అంతర్వాహినియై పప్రవహింపకతప్పదు. విధివిలాస మవిలంఘ నీయమను సూత్రము మహాభారతమునం దాదినుండి తుదివరకును (ప్రవహించుచునే యున్నది. అట్లే ధర్మనిర్వహణ ముత్తమ మానవాదర్శము - అను సూత్రము రామాయణమున సమ([గ్రమముగ పోషితమైయున్నది. ఏధిని తోసిరాజని, ఆత్మశక్తి పైననే ఆధారపడిన దుర్యోధనుని జీవితము నీతిబాహ్య మైనది. తతృలితమే భారత మహాసంగ్రామము, జననాశము. నీతివిరుద్ధ్దమగు (ప్రవర్తనయే తుదకు యాదవుల నాశమునకుగూడ హేతువైనది. బలరామకృష్ణులవంటి మహాత్ములుకూడ తమవంశమువా రొనర్చిన పాపకృత్యముల ఫల మనుభవింపక తప్పెనదికాదు. బంధములకు లోనైన కారణమున నైతిక స్టైర్యహీనులై, పతివ్రతరక్షణకు బ్రయత్నింపని భీష్మద్రోణుల జీవితములుగూడ నట్లే వ్యర్థములైనవి. గాంధారీధృతరాష్ట్ర్రులు తమ యుదాసీన భావఫలమును సంపూర్ణముగ ననుభవింపవలసివచ్చినది. అదేవిధమున ఇంద్రియలోలుడు, అహంభావపూరితుడునగు రావణు డొనర్చిన పాపముల ఫలమును లంకావాసు లెల్లరు ననుభవించినారు. ఇట్లు దుష్ప్రవర్తన ఫలమును ఇతివృత్తము మూలమున వివరించి ప్రజలను నీతిపరులను గావించుట మహాకావ్యముల ప్రయోజనమగుచున్నది. ఈ విషయమున సాహిత్యవేత్త లెల్లరు నేకాభ్మిప్రాయులై యున్నారు.

ఇట్లు, నిత్యసత్యధ ర్మన్యాయ(పతిపాదకవైెం, విశ్వ .్రేయవుఎను ఆనందమునుగూర్చు కావ్యములందలి రచనయు విశిష్ణమగుట తప్పదు. రసోతృ్పప్తయంతయు రచనపై నాధారపడుచున్నది. రచన కాధారములగు భావముల భేదము ననుసరించి రచనావిధానమును మారుచుండును. కావ్యవస్తువుకూడ రచనావైవిధ్యమునకు కారణమగును. ఇతివృత్తపోషణ కనుకూలించు భావములు, తద్భావములను సమ్మగ్రముగ పోషించు సందర్భములు, రసోత్పత్తి కనుకూలించు సన్నివేశములు, (ప్రధానేతివృత్తమునకు పోషకములగు (ప్రాసంగికేతివృత్తములు, వర్ణితవిషయముల కంగాంగీభావసామరస్యము, భావవ్య క్తీకరణ రసపోషణకు వలయు భాషావైశిష్ట్రము - రచనాభాగములు. కావ్యమునందు పోషింపవలసిన యితివృత్తము ననుసరించి, తదుచితభావములను, పోషణవిధానమును నిర్ణయించుకొనవలసియుండును. శృంగారపధానమగు విషయమును పోషింప

సారస్వతము: పతమార్థము మూవతి లక్షీ నారాయణరావు 1705 వలయుసత నేయే భావములను పోషింపవలెనో, వేనిని విసర్జింప వలయునో, బెచితీపోషణ కేది యవసరమో, అనౌచిత్య మెట్లు పరిహరణీయమా - మున్నగు విషయములను చాల సూక్ష్మముగ పరిన్‌లింపపలసియుండును. దీనిని గషునించిలపే శ్రీనాథుడు వైషథమును తెనిగించునడ “బెచిత్యంబుం బోషించియు, ననౌచిత్యంబు పరిహరించియు"నని తన రచనావిధానమును గూర్చి తఆలిపెయున్నాడు. అనౌచిత్యదోషము నాలంకారికులు సమ[గ్రముగ వివరించి, అనౌచిత్యమే కావ్యత్వహానికి ప్రధానహేతువని నిర్ణయించినారు.

“అనౌచిత్య ప్రవృత్తత్వే ఆభాహోరసభావయోః, అని మమ్మటుడు అభాసకు హేతువులగు వానిని సర్వదా పరిత్యజింపవలసి యుండును, కసుకనే, నీరసములగు పస్తుభాగములను పరిత్యజింపవలయునసనియు, లేక, వాని కన్యధా గతివైస కల్పింప వలెననియు నాటకకర్తను శాసించియున్నారు.

ఇక, రసపోషణ విషయమున సన్నివేశములను గూర్చుటలో మిక్కిలి నైపుణ్య మపసరము. వస్తు వర్ణసకంటెను సహజ సన్నివేశము లక్కువ రసన్పోరకములు. కనుక సన్నివేశ కల్పన రసపోషణ కాధారవుగుచున్నది. శాకుంతల సప్తమాలకమందలి శకుంతలాదుష్యంతుల సమాగమ మట్టి సన్నివేశములలో నొకటి. పరిభవ భిన్నయు, తపస్వినియు నగు శకుంతలాహృదయమున నింకను దుష్యుంతునెడ నసురాగ రేఖలు మిగిలియున్నవా? మరల నామె దుష్యంతుని బూర్వమువలె (పేమించగలడా? అను సూక్ష్మాతిసూక్ష్మములగు నాంతరంగిక విషయములసు కాతిదా సాక లలిత సన్నివేశముచే ష్య క్త్రపరచినాడు, కంటి తడి'పెట్టుచున్న శకుంతలను జూచి దుష్యంతుడు,

“చూహాన్మయాసుతను పూర్యము పేక్షితస్తే

యోబడ్ధబిందురఢరం పరిబాధమానః

తంతావడాకుటల పక్ష్మవబలగ్న మధ్య

బాష్పం (పమాజ్యు వగతానుశలయోభవావింగో అని పలుకుచు. శకుంతల చెక్కిళ్ళ పై జారుచుస్న బాష్పములను స్వ్యహస్తముచే తుడుచు ఆ సన్నిచేశము. ఇతని స్పర్శచే నామెయండు గలుగు సాత్త్విక

1706 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (పత్మిపవృత్తి (౧౪౭౦10౧) అందురు. ఇది సహృదమయొకవేద్యము. ఇట్లే, పంచమాంకారంభమున, దుష్యంతుని పూర్వ(ప్రణయినియగు హంసపదిక గీతికామార్గమున నతని నుపాలంభించుటయు, ఆ గీత మతని జీవితమున సుప్తమైయున్ను స్కృతిగోచరముకాని పూర్వానుభూతిని స్పృశించి అతని మనక్షోభకు కారణమగుటయు అట్టి మరియొక సన్నివేశము.

“రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్‌

పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః

తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం -

భావస్థిరాణి జననాంతర సౌహృదాని” అని యతడు పర్యాకులుడైనాడు. అత డిట్టి స్థితియందున్నసమయముననే గౌతవీపురస్కృతయగు శకుంతలను కవి (పవేశింపజేసినాడు. ఇది శకుంతలాపరిభవఘట్టమునకు తగిన పశ్చాద్భూమి యగుచున్నది.

భాసకృత “ఊరుభంగ”ొమున, తొడలు విరిగి పాలికలనిలో బడియున్న దుర్యోధనున కతని చిన్నికుమారునితో సమాగమము గల్పించి, ఆ కుమారుని ముగ్గవాక్కులచే రసపోషణ గావించుటి కాక, కవి, పతితుడై యున్న దుర్యోధనునెడ సామాజికులకు జాలిపుట్టునట్లుకూడ చేసియున్నాడు. అంక మారోహింపవచ్చు కుమారుని మాన్వుచు భగ్నోరుడగు దుర్యోధనుడు, “ఏ కుమారుని స్పర్శ యింతకుపూర్వము చంద్రశీతలమై యుండినదో అది యిప్పుడగ్ని సదృశమైనది కదా” యని తన యవస్థాభేదమునుగూర్చి సకరుణముగ బల్కినాడు. “నాయనా, నీకికనా యుత్సంగము లభింపదని" దుర్యోధనుడు పల్కః: తదంతరార్థమును (గ్రహింపలేని కుమారుడు ముద్దుమాటలతో “తండ్రీ, ఎచ్చటికి పోయెదవు” అని యడిగినాడు. పరలోకమని కుమారునితో చెప్పుట కిష్టములేక దుర్యోధనుడు. “మి పినతండ్రులున్న చోటికి పోయెదన"ోని బదులు చెప్పినాడు. ఏమియు నెరుగని కుమారుడు “నేనును వచ్చెదను. గొనిపొమ్మ”ని యడుగుటయు, దుర్యోధనుడు డగ్గుత్తికతో “కుమారా, పోయి వృకోదరు నడుగుమ”ని పల్కుటయు గమనింపదగినది.

= దుర్యోధనునకు భీమునిమకైగల (కోధము, కౌరవకుల నాశమునకు భీము

డువ్విళ్ళూరుచుండుట చే కుమారునిగూడ చంప వెనుదీయడను భావము మున్నగునవెన్నియో “గచ్చ, పుత్ర, ఏవం వృకోదరం బూహి” అను వాక్యమున

సారస్వతము: పరమార్ధము భూపతి లక్షీనారాయణరావు 1707 వ్య క్తమగుచున్నవి, ఈ సన్నివేశమున కరుణము వఏశిష్టముగ పోషితమైనది. భారతాది మహాకావ్యములలో నిట్టి సన్నివేశము లెన్నియేని గలవు. ఇట్టి రసవత్తరములగు సన్నివేశములకు భవభూతి ఉత్తరరామ చర్విత ఉత్కృష్టమగు నాదర్శము.

ప్రధానేతివృత్తమున కుపస్కారకములుగ పోషితములైన ప్రాసంగి కేతివృత్తము లన్నియు తమ భిన్నప్రయోజనములను సాధించుకొనుచునే, ఏకముఖముగ ప్రవర్తించుచు వమ్వైక్యమును చేకూర్చువలెను. మరియు వివిధ కావ్యభాగములును తమ (పాధాన్యా పప్రాధాన్యమునుబట్టి సకపముముగ పోషితములైనప్పుడే కావ్యమునకు సౌందర్యము సిద్ధించును. ఇట్టి అంగాంగీభావ సామరస్యమే ప్రతి వస్తువుయొక్కయు సొందర్యోత్కర్షకు హేతువృు. కనుక కావ్యము వివిధాంగవయులకునంు (ప్రధానవిషయముతో చక్కని సామరస్యము కుదురు బెంతయు నావశ్యకము.

ఇక, అలంకారములును, భాషయుకూడ రచనాభాగములి, కాని అలంకారముల విషయమున నొక అపోహ కలిగినది. అధమేణికి చెందిన కొన్ని ప్రబంధములందలి కృత్రిమాలంకారములే యిట్టి అపోహకు కారణమునైనవని చెప్పవచ్చును. సహజముగనే కావ్యరచన అలంకారశోభిత మగుచున్నది. అట్లని, రచయిత కృతకాలంకారములకై ప్రయత్నింప నక్కరలేదు. సహజాలంకారములను విసర్జింప నపసరమునులేదు. అలంకారపీతి మానవునకు సహజాతమహైనది. అలంకరణాసక్తి సుంతయేని లేని సంసారి కానరాడు. దేవతారాధన విషయమునగూడ అలంకరణము మనకలవాబైనది. “అలంకారార్థ మక్షతాం సమర్పయామి” యని విగ్రహమునకు బొట్టుపెట్టుటకూడ మన సంప్రదాయము. దేహమును మాత్రమేకాక, ఇంటిని, ఊరిని, ఉద్యానములను, ప్రతివస్తువును అలంకారయుక్తముగ చేయుట నాగరకలక్షణము. మానవునకు గల సహజమగు సౌందర్యదిదృక్షయ యిందులకు హేతువు. రసస్పూర్తితో నొప్పు మన భాషణకూడ అలంకారయుక్తమగుట గమనింపపచ్చును. ఆవేశము కలిగిసప్పుడును, రసస్పూర్తి యుద్దిష్టమైసప్తుడుసు మనము సంభాషణలోకూడ అతిశయోక్తులను, ఉపమలను అ[ప్రయత్నముగనే వాడుచుందుము. అట్టిచో రసవంతమగు కావ్యరచన నిరలంకారమైయుండుట పొసగదు. చమత్కారము, వక్రోక్తి సహజోపమ, వ్యంగ్య వైభవము - ఇత్యాదులులేక కావ్యరచనయే జరుగదు. ప్రయత్నించి రచించినను, ఆ రచన ఆకర్పణీయముగ నుండడనుటలో సందేహములేదు.

1708 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

కవి తనకు గలిగిన అసనుభపమును కావ్యము మూలమున నితరులకు గలిగింప యత్నించుచున్నాడు. ఆ యనుభవము (ప్రత్యక్షగోచరమగు బాహ్య (పకృతి కావచ్చును, లెక, హృదయస్థమగు భావము కావచ్చును. అదియుగాక తనకు గలిగిన చిత్తవికాస మానసికాందోళనలు కావచ్చును. బాహ్యేంధదియగోచరమగు స్థూల పకృతి వర్ణనకంటెను మనోగతభావ చితణమును, భావ చితణముకంటిను చిత్తవృత్తి వర్ణనమును నుత్తరోత్తరము కష్టములనుట రచయిత లెల్లరకును ననుభవవేద్యమే. స్థూలపకృతి వర్ణనకూడ సులభముకాదు. శబ్దశక్తిసాహాయ్యుమున దృశ్యమును భావస్ఫోరకముగ మనోనయనము నెదుట సాక్షాత్కరింపజేసి, తన్మూలమున తనకు గలిగిన చిత్తవికాసమును పాఠకులకు గలుగజేయుట కవులకు మాత్రమే సాధ్యము.

“తరుణీరత్నము పువ్వుదీగ నొక చేతన్వంచి పాదాగముల్‌

ధరణిం మోపి యొకింతనిక్కి తసుమధ్యంబొప్ప కక్షద్వయ

స్ఫురణంబారం గుచంబులుబ్బ నయనంబుల్విచ్చి లీలన్ముఖాం

బురుహంబత్తియొకర్తుగోసె నెలమిన్‌ బుష్పుంబులత్తోటలోన్‌.”

కవికిగల వస్తు (ప్రత్యక్షీకరణ శక్తి కిది యొక యుదాహరణము. ఇందు, పాదాగ్రములమైనిల్చి, కొంచెము నిక్కి, పువ్వుదీగనందుకొని, ముఖము పెకెత్తి, పువ్వులు గోయునొక సుందరి రూపు చిత్రితమైయున్నది. ఆమె ప్రకృత స్టితి ననుసరించి సహజముగ సిద్ధించినవి = తను మధ్యము, కక్షద్వయస్ఫూ ర్తి, నయన వికాసము. వీనివలన గమ్యమానమగునది విలాసము (6/08). అందును, “తరుణీరత్ను” మనుటచే మనోజ్ఞత సిద్ధించినది. తారుణ్య కారణమున సౌందర్యమునకు లాలిత్య, లావణ్య: ముగ్ధత్యము లాపాదితములైనవి. ఈ వర్ణన పాఠకునియందు భావనను వికసింపపేసి, తస్మూలమున నతనిక్‌ సౌందర్యానుభూతిని సిద్ధింపజెసినది.

“శయపూజాంబుజము ల్లటిందడబడస్‌ జందోయి లేగౌనుపై

దయతప్ప నృసపాడి పాగడపుంబాదంబొప్ప జంగల్వ డి

గ్గి సీరచ్యుత మజ్జనార్థము గటిన్‌ గీలించి దివ్యప్రబం

ధయుగాస్యల్‌ ద్రవిడాంగనల్‌ నడతు రుద్యానంపులోదోవలన్‌.” అట్టిదే మరియొక మనోజ్జదృశ్యమీ పద్యమున వర్ణితము.

సారస్వతము: పరమార్ధము భూవతి లక్షీనారాయణరావు 1709 “తడబడస్‌, దయతప్పస్‌, పాగడపు పాదంబొప్పు, కటిన్‌ గీ లించి, దివ్య 1ప్రబంధయుగాస్యల్‌, ఉద్యానంపు లోదోవలన్‌” అను నిందలి 'ప్రయోగములచే, కవి, చితరచనకు సాధ్యముకాని సౌందర్య వైభవమును, అర్థస్ఫూ ర్తిని సిద్ధింపవేసినాడు. “చందోయిలేగౌను పై దయతప్పన్‌” అను (పయోగముచే సాందర్యముతో బాటు సంపూర్ణ యౌవనవమును గమ్యమానమగుచున్నది. ఉద్యానంపు లోద్రోవలగుటవలన జంకులేక నడచుటకును, దివ్యప్రబంధములను పెకి పాడుటకుసు వీలైనది. నిర్భయము, "స్వేచ్చ కారణములుగ నడక సవిలాసమైనది. ప్రబంధగానము శ్రావ్య మైనది. ఇట్లు కవి మనోహరమగు స్వభావోక్త్ష్యలంకారమును సరసముగ పోషించుటయేకాక, శబ్దశక్తి అర్థశక్తుల మూలమున వ్యంగ్య వైభవమునుగూడ సిద్ధింపటేసినాడు. “అంగదనాథు మింగిన వృకావలిదస్‌ వెసముట్టికొన్న స ర్యాంగములుల జలింప బెగడందుచు దిక్కులు సూచుచున్న సా రంగియపోలె నుండె గురురాజభవత్సుతుసేన భీష్కునా జిం గబళించి పాండవులు జృంభిత మికమలీలంబొల్ప్బుడున్‌” అను భారత పద్యమందలీి, అంగద, వృకావలి, ముట్టికొన్ను దిక్కులు సూచుచున్న, సర్వాంగములుం బలింప - అసు మాటలు భత్సృహీనయు, పృకాపలీ పరిషృతయునగు సారంగీ చిత్రము నొకైవుససు, పాండదాశ్రాంతము, భీష్మరహితము సగు కురుసైస్య చితమును వురి లుముక వైపునను, వున మనోనయనముల యొదుట కట్టుచుండుట లపేకాక, వివిదములగు వ్యంగ్యార్థములను స్ఫురింపజేయుచున్నవి. సహజాలలంకారములకు గల శక్తి యట్టిది. అట్టి యలంకారములను గూర్చుటలో మహాకవులు ప్రకృతి సహజములైన వస్తువులను సమాసములుగ బేసికొని, శబ్ద్బవయిలకుగల అభిధా, లక్షణా, వ్యంజనా శక్తులను సంపూర్ణవమగ నుపయోగించుకొని, రచన కుదాత్తతసు, రామణీయకమును నాపాదింతురు. కఎఐ ప్రయోగించు శబ్బబజాలము పస్తుతత్త్వ భావతత్తృముల ననుసరించుచుండును. శ్పంగార కరుణములను పోషించుపట్లి శబ లాలిత్యమును, కోధాడుల పర్ణసయందు శబ్ద పారుషుమును తప్పవు. శబ్రములు మాత్రమేకాక సమాసముల కూర్చు, అర్ధ సౌలభ్యము, నాదము, శయ్య మున్నగునవన్నియు వర్ణిత వస్తు స్వభావము

1710 పందిరి మల్లికార్టునడావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ననుసరించి యేర్పడును. ఈ విషయములను గుర్తించియే ఆలంకారికులు వృత్తి రీతులు కావ్యమునకు (పధానములని నిర్ణయించినారు. ప్రకృత వస్తువును మనోహరముగ చిత్రించుటతోబాటు హృద్యములు చిత్తవికాస హేతువులు నగు మానవ (ప్రకృతి విషయములను ధ్వనింపజేసి, వర్ణిత వస్తువును జీవితముతో ననుసంధింపజేయుట, కావ్యమునకు విశిష్టత నాపాదించును. ఇట్లు సాహిత్యము జీవితమునకు సమగ (పప్రతివింబమగుచు, ఇతివృత్తపోషణ, భావ చితణాదులచే చిత్తవికాస సద్యఃపర నిర్వ్భృుతులను గలిగించుచు, భంగ్యంతరమున సత్య ధర్మ న్యాయములను (పతిపాదించుచు, సంఘ జీవితముతో వ్యక్తికి సామరస్యమును గలిగించి విశిష్ట జ్ఞానానందములను సిద్ధింపజేయుచు, విశ్వ్యశ్రేయమును గూర్చునది మైయున్నది. (కిన్నెర: సంపుటము 4, సంచిక 12, డిశంబరు 1952) గ లు నన 1 టం వాళ ప లా, గ గా క

తలుగు సాహిత్యంలో కొత్త ఆన్నులు ఎ=ఏ రమణా లెడ్డి

అసంపూర్ణ విప్లవం: 1860-1914

తెలుగు సమాజంలోనూ, తెలుగు సారస్వతంలోనూ దాదాపు ఒకే కాలానికి, పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పు మూడు లింగాల నడిసీమకుమట్టుకే వచ్చినట్టిది కాదు. సమస్త భారతానికీ వచ్చిన మార్పుయొక్క ప్రభావమే మనమీదనూ పడింది. నిండు సంఖ్య వాడితే బాగుంటుంది కాబట్టి, 1850 యీ మార్పు సమయమని విభజించవచ్చును. కాకుంటే, 1860 అని పదేళ్ళు పొడిగించుకున్నా వచ్చే చిక్కు లేదు. రెండవదే మొదటిదానికంటె కాసింత మెరుగు. 1857 (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ఎట్లా భారతరాజకీయ జీవితాన్ని తారువూరు చేయగలిగిందో, అట్లాగే 1855లో లార్డ్‌మెకాలే భారత విద్యావిధానం గురించి చేసిన ప్రసంగం భారత సాంస్కృతిక సారస్వత చరిత్రలో అటువంటి గొప్ప మార్పును కొనిరాగలిగింది. భారత సంస్కృతి శవప్రాయమై పోయిందని, ఆటవిక (బ్రటనుకు నాగరక రోమ్‌ ఎట్లా విజ్ఞాన భిక్ష పెట్టిందో నాడు, అట్లా నాగరక బ్రిటను ఆటవిక భారతానికి విద్యా విజ్ఞాన సంస్కృతికి సారస్వత భిక్ష పెట్టవలెనని నేడు, దేశీయ విద్యాలయాలలో శాస్త్రాలనూ కళలనూ యింగ్లీషులోనే బోధించవలెనని, మెకాలే సూచించిన శాసనం నేటికీ చలామణీ అవుతున్నది. యూరోపియన్‌ హిందూ సంస్కృతుల బలాత్మ్సృత సంయోగం నుండి, రక్కసి కొండచలువ పందిరి మల్లీకొర్టునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1712 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వంటి గొప్ప మార్పు పుట్టింది. దీని ఫలితాలు [890 వరకు కానీ తెలియలేదు.అయినాకాని, మనం యీ సంయోగ కాలాన్నే మార్చుకు బీజంగా స్వీకరించాలి. భారత రాజకీయ సాంఘిక జీవితములో వచ్చిన మార్పుకు గుర్తులు, పాతకాలపు సంస్థానాధిపతుల దిగువ వరుసలో నిలుచున్న మధ్యతరగతి సంపన్నులు, విద్యావంతులు, జాతీయోద్యమ వికాసము, కాంగెసు పుట్టుక యిత్యాదయః పాలిత మహాప్రజలకు పాలక పీడకవర్గానికీ నడుమును, 'ప్రజాగ్రహతరంగాన్ని నడి నీటిలోనే చెల్లాచెదరు. ఛిన్నాభిన్నం చేసి తీరస్టులయిన విదేశీయ సామాట్టులసు రక్షించేటందుకు, జమీందారీ వ్యవస్థ ఒక్కదానితో మాత్రమే సంతృప్తిపడక, (బిటిషువారు, ఒక మధ్యతరగతిని కూడ సృష్టించి, కొందరిని ప్రమోట్‌ చేశారు. సిపాయి పితూరిగా చరిత్రలో వ్యవహరింపబడుతున్న ప్రథమ భారత స్వాతంత్య్యు సంగ్రామంలో మూలవిరాట్టులయిన సంస్థానాధిపతులకు పోటీగా, ఒకరిని లాలించి మరొకరిని బెదరించేటందుకు కూడా, యీ సాంఘిక పరిణామం యేర్చాటు చేయబడింది. ఉభయులూ పరాయివానితో చేతులు కలిపి, అట్టడుగున పడిపుస్న అగాధ జనావళి నడుములమీద తాండవం చేసేటందుకు కూడ యిది పుపకరించింది. తత్కాలానికిన్నీ దాదాపు నేటివరకున్నూ యీ విధాసం విజయవంతమయిందనే చెప్పవలసి వుంటుంది. పడగలిత్తిన కాళిందిని చడదొక్కిన గోపాలకృష్ణుల పాభవంతో భారతవుంతా కాళింది వముడుగయింది. అనాది నుండి వంశపారంపర్యంగా అనుగతమవుతూ వచ్చిన గృహ పర్శినములు కూలిపోయేసరికి, సాధారణ ప్రజలు భిక్షకులు కావలసిరాగా, కొత్త యంత పరిశమోత్పత్తివలన మధ్యతరగతివారు కొందరు సంపన్నులయ్యారు. ఈ విధంగా (బిటిషువారు భారత సమాజంలో వర్గభేదాలను మరింత యినుమడింప చేశారు. కర్షకులలో అనేకులు హలాలు విడిచి, పల్లెలు విడిచి, నగరాలకు వలస వెళ్లారు మూకుమ్మడిగా; భూఖామందులుకూడా, ఏ కొందరో, కొత్త కాపురాలు పెట్టి, [కొత్త ఆస్తిపాస్తులు మందటవుండి సరిచూసుకునేందుకు, తామూ నగరాలకు వెళ్లారు. ఈ విధంగా నగర నాగరకత (806౧006015 ౧౮1154810౧) భారత పల్లియ నాగరికతకు మీదుగా, (పక్కగా, హడలుగా వుతృన్నమయింది. శ్రీమంతులు సిరినే కాక, వాణినికూడ గుత్తకు తీసుకోవడం మామ్మూలేకదా. వీరు అస్నాదివైపు భావాలకొరకు చేషాచారాల కొరకు మోరలెత్తుక చూడసాగారు. తమ సీమ సమస్తమూ నిలువనీటి మడుగై గబ్బు కొట్టుకొంటూవున్న బురదలోని సనాతన పద్మవ్యూహంలో దిగబడి, అడే

ఆలుగు సాహిత్యంలో క్రొత్త ఆస్నులు తమణా థ్ణి 1713 స్వర్గతుల్యంగా ఆత్మవంచన చేసుకోవడం చూసినవారై, యీ నవ విద్యాలబ్ధులు ఒక్క పెట్టున “సంస్కరణ, సంస్కరణ” అన్నారు. 19వ శతాబ్ది చతుర్థ పాదమూ 20వ శతాబ్ది (పథమ పాదమూ యీ కొత్త చదువు వారి ఆవేశ ర్సుంరులతో ప్రచలించి పోయాయి. మూడు లింగాల నడిమి సీమకూడా వంతపాడింది. ఇది వంగదేశంలో వచ్చిన తుఫాను కొస విసురు. అయినా, దీనికి ప్రత్యేకంగా అస్తిత్వమంటూ వున్నది. సస్యశ్యామలమయిన గోదావరీ తీర భూములలో వీరేశలింగమనే విప్లవ సస్యం విజృంభించేటందుకు కూడా కారణం లేకపోలేదు. ఆ భూములు బ్రాహ్మణుల ఆయువు పట్లు. బ్రాహ్మణ జీవితం మూఢాచార వ్యవహారాలకు ఆలవాలమైపోయింది. తతిమ తక్కిన వర్ణాలవారు అనాదినుండి నేటి వరకు పితూరీదారులి. అగ్రవర్జుల మూఢాచారాలలో ముఖ్యమైనవి కట్టు, బొట్టు, పెల్లి, చావులకు సంబంధించినవే. వాటిమీదనే పంతులుగారు విరుచుకుపడినారు. వీరికి సపోర్టు యొవరు? కొత్త సిరివారు, కొత్త చదువువారు? ఆహార వ్యవహారాదులలో, పెల్లి చావులలో గూడుకట్టుకున్న శుష్కాచారాలను తెగడేకొరకు పంతులుగారు ప్రహసనాలని, నాటకాలని, నవలలని రచించారు. అనగా, ఫలానా ప్రయోజనం కొరకు కళను ఆయుధంగా ప్రయోగించారు. కళ కళ కోసమేననే పండిత వితండవాదానికి యిది పరశురాముడి గండ్రగొడ్డలి! ఇదే మొదటి గొప్ప మార్పు. సాహిత్య సంస్కరణలోనూ, సంఘ సంస్కరణలోనూ తెలుగు చరిత్రలో వీరేశలింగమే యుగనాంది. జమీందారీ వ్యవస్థకూ, శుద్ధ కళావాదాన్ని బలపరచే పండితమ్మన్యుల (ప్రాభవానికీ సంబంధమున్నట్టే దేవదాసీ భోగంమేళం పడుపు వృత్తుల వ్యవస్థకూ మూర్జాచారాల్లంపటత్వానికీ కద్దు. ప్రబంధ మహాయుగం విజయనగర స్మామాజ్యాస్తమయంతోబాటు అంతరించిపోగా, ఏకాతపత౦ [క్రింద సంఘటితమైయుండిన ఆంధ వసుంధరను కొల్లగొనే ముష్కరులగుంపు ఎట్లాగయితే ఒకవూరికి అరవూరికి (ప్రభువులని వ్యిరవీగే దురవస్థ యేర్పడిందో, మహాకవుల బిరుసు మాట[కింద అణగిమణగియుండిన ఆంధ్ర వాజ్మయ నిధిని బలాత్కరించి విరచి చరచి చెరిచిన “పండితుల” మొరటుమూక కపవులనిపించుకునే దుష్కాల మాసన్నమయింది. తెలుగుల రాజకీయ చరిత్రలోనూ, వారి సారస్వత చరిత్రలోనూ యివే "చీకటి యుగాలు” (౧౬% గర్పం5). మానవ పశువులయిన పరిపాలకుల లెక్కలేని దుర్ణయాలను మనము రాజకీయ పరిభాషలో జమీందారీ వ్యవస్థ అని పిలుస్తున్నట్లే పండిత పశువులయిన ఈ కవులను సాహత్య పరిభాషలో "పండిత వ్యవస్థ" అని పిలువవచ్చును. వీరి

1714 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చేతులలో, తేలికకు సౌకుమార్యానికీ లాలిత్యానికీ పేరుపడిన తెలుగుకు, మణుగు నాలుక యేర్ప్చడింది. గోమూ(తికాబంధము, కుండలి నాగబంధము, సర్వతోభృదబంధము వంటి కసరతు కుప్పిగంతులకు (పాశస్త్య మేర్చడింది. “నిరర్థక ఛేకాను ప్రాసలు, లాటాను ప్రాసలు, యమకాలతో, శ్లేషప్రధానాలైన కావ్యాలన్నీ క్షుద్రములే. జాతి సంప్రదాయానికి, ఉపజ్ఞతకును పూర్తి వ్యతిరిక్తములైన శబ్బప్రయోగాలు, శబ్దాలంకారాలు, దేశభాషల నుడికారాన్ని ధ్వంసం చేస్తాయి.” రసం యింకిపోయింది. నన్నయగారి సూటిమాటలు, తిక్కనగారి నేర్చరి శిల్పం, పెద్దన అల్లిక జిగిబిగి, వీరచర్శితలోని సాలభ్యం పోయాయి. పోగా, వచ్చిందేమిటి? ఇష్టముంటే చందరేభావిలాసం, కోపం వస్తే చండరేభా విలాపం, క్షణంలో తారుమారు, పేరులోనే కాదు, తీరులోకూడా. ఒకచోట శృంగార రసం వెల్లివిరిసే మరొకచోట పచ్చిబండబూతు! నిజమే, అది పాలకులలో వచ్చిన లోటుకూడా. మనుమసిద్ధి సింగభూపాలాదులు దాటిపోయి, నీలాదీయాచేందాదులు ధాటి వచ్చారు. కవిత్వం “రాజులకు” విలాస వస్తువులలో ఒకటి. కుక్కలకూ, కోళ్లకూ, పొట్టేళ్లకూ పోటీ పెట్టి, అవి కొట్టుకు చస్తూ వుంటే భళిగొట్టిన ప్రభువులే కవులకూ కవులకూ పోటీపెట్టి ఒకడు చకబంధంలో సిద్ధహస్తుడయితే, మరొకడు ఖడ్రబంధంలో నేర్పు చూపుతూవుంటే సెబాసులు కొట్టేవారు. ఈ రాజు కాకుంటే ఏమి. ఒక ఫర్లాంగు నడువకలిగితే మరొకడు ఎదురౌతాడు! నిర్లక్ష్యం పాగరుబోతుతనం దంభం దాష్టీకం - కవిత్వం వృత్తి అయింది; కవిత్వం శాస్త్రమయింది. వాడుకలోలేని పదాలు యెన్ని తెచ్చిపెట్టగలిగితే, అంత ఘటికుడు. సంస్కృతమే కాని తెలుగు మాటలా వాడేది? “సంస్కృతం బాహ్యప్రకృతి, [ప్రాకృతంబు ద్వితీయ ప్రకృతి. ఆంధ భాష వికృత, అని ఒక భాషాసిద్ధాంతాన్ని లేవదీయడం జరిగింది. ఛీ ఛీ, పనికిరావు, తేలిక మాటలు, సన్నజనం మాటాడుకునే వాటినా పండితులు వాడవలసింది? ఈ మాతృభాషా విదోహ ఫలితంగానే, తిక్కన వాడిన తెలుగు మాటలకు సంస్కృత పదాల కంటె దుర్గాాహ్యాలై పోయాయి. తిక్కన చూపిన దేశిమార్గం యీ పాషండులు అనుచరించి వుంటే, ఆ మాటలు జీవించి వుండేవి. కనుకనే శృంగార వైషధమన్నా మనము బోధపరచుకోవచ్చును గాని, పల్నాటి వీరచర్శిత మనము బోధపరచుకోలేము. ఈ సంస్కృత పండిత [ప్రాబల్యము తెలుగును చంపి, దేగికవితను (భష్ట సాహిత్యంగా చిత్రించింది. తెలుగు జీవించాలంటే, సంస్కృతాన్ని తరిమికొట్టాలి. తెలుగు జీవించాలంటే పాండిత్యాన్ని తరిమికొట్టాలి. తెలుగు జీవించాలంటే వారి రాక్షస సృష్టులను చంపివేయాలి.

తెలుగు సాహిత్యంలో క్రొత్త తెన్నులు. రమణారెడ్డి 1715 తెలుగు జీవించాలంటే జమీందారుల పిడికిళ్లు తెరిపించాలి. “మానవ సంఘము రాజకీయ సాంఘిక మత నైతిక దాస్యమునంబడి యాచార శృంఖలల మూలమున యంత చలితవుగు నొక (పతిభాశూన్య విగహవమువలె నున్నపుడు అట్టిసంఘముయొక్క మనము నవీన కల్పనలను జొరబాజదు. ఆ స్థితిని గల్లోలించి భావదాస్య భరమున మొగ్గుచున్న హృదయమునకు విశాల ప్రపంచ దృశ్యము కనబడునట్లు విప్లవము జరుగనిదే మానవ (ప్రకృతి నిర్ణిదము గాదు.” (దువ్వూరి రామిరెడ్డి; 1021) ఆ విప్లవమే సంఘంలో వీరేశలింగ విప్లవము, సాహిత్యములో గురుజాడ విప్లవము, సారస్వతములో గిడుగు విప్లవము. ఆధునికాంధ్ర జీవిత పెతామహులుగా యీ మువ్వురూ వంద్యులు, పూజ్యులు, స్మరణీయులూ! వీరేశలింగం పంతులుగారు వ్యావహారిక భాషావాదాన్ని తన మృత్యు శయ్యమీదనే అంగీకరించారు. కసుక ఆ రంగంలో ఆయన కృషి సలిపే అవకాశాన్ని యమపాశం లాగివేసింది. సారస్వత రంగంలో విప్లవ దళవాయి గిడుగు రామమూర్తి పంతులుగారు. విప్లవ వ్యతిరేక దళవాయి వేదం వేంకటరాయ శాస్తుులవారు. శాస్తుంలవారు మహాపండితులయినప్పటికి, వారు తీసుకున్న వాదము పసలేనిదయినందు చేత, ఆయనను కాలప్రభావం ఓడించి, పడదోసి, ఫీటు కొట్టింది. (గాంథికభాష అని వేంకటరాయ శాస్తు్రంలవారు సమర్థించిన భాష కావ్యభాష కూడా కాదని, గిడుగువారు సపమాణముగా ప్రదర్శించారు. అప్పకవీయములో ఎక్కువ వ్యాపహారికభాష వాడడం జరిగిందనీ, సంస్కృత భాషలోనున్న వైద్యము, జ్యోతిషము, గణితము మొదలయిన విద్యలకు, కళలకు తెలుగు పండితులు వ్యావహారిక భాషలోనే టీకలు, విపరణములు దవ్రాసినారని, వసుచరిత్ర, రాఘవ పాండవీయము మొదలయిన అఆనుగు ప్రబంధములకు తేటతెలుగు టీకలు వ్యావహారికములోనే వున్నపని చూపినారు. “అపరిమితమయిన ప్రయోజసనమయిన వ్యావహారిక భాష పండిత పామర సామాన్య మై వాస్తవమయిన దేశభాషగా (ప్రపంచమంతటా గౌరవము కలిగియున్నది. పరిమిత ప్రయోజనసమయిన కావ్యభాష పండితులు రచించే గ్రంథములలో ఉచితముగా నుండును. సంస్కృత భాషాపాండిత్యము. లేనివారికి అద్‌ సుబోధముకాదు; సుకరమున్ను కాదు. అల్పజ్ఞానముగం పండితంమన్యులు వచ్చీరాని ప్రాచిన కావ్యభాషలో నిర్దుష్టముగా కావ్యభాష వబ్రాయగలవారు మిక్కిలి అరుదు. వాయబూని చేతకాక, కృతక భాష సృజించి, ఆంధ్రభాషకుస్ను వాజ్మయమునకున్ను హాని కలుగచేస్తూ ఉన్నారు.” (అప్పుకవీయము. పీఠిక; గిడుగు రామమూర్తి పంతులుగారు). బిడారిలోని

1716 పందిరి మల్తికార్టునరాప్తు శతజయంతి. సందృుటము 1 హావ. బృహచ్చిలవలె, శిథిలాలను లేపనెత్తి నిలిపే భగీరథ ప్రయత్నంలో కృతకృతాం పలాల” వైఫల్యంవలన కలిగిన పుడుకుబోతుతనపు వికటచేష్టలతో, పంకట రాంలఘజంంగా ( ఒంటిగా చరిత్రలో నిలిచి పోయారు. తెలుగుజాతి గిడుగు విప్లవానికి ఆమౌాదవపుద వేసింది. సాంఘిక విప్లవ దళావాయి వీ రేశలింగానికి సారస్వతరంగంలో రగపాొంతనం గిడుగయితే, తన ఒక్కనిలో యీ వుభయులనూ యిముడ్వ్యుకిని, బం క ఫలితాన్ని ప్రదర్శించిన జగజిట్టి గురుజాడ అప్పరావు అనే సత్వగుణ వర్దావనుం... దావాగ్ని. వీరేశలింగం (పప్రహసనాలలో వినిపించే ఏడ్పించే మొండనప్పు, అవ్వారి కృతులలో తేలిక చులకన సరదా నవ్వు అవుతుంది. కత్తి అంచుకంటె వదనం గన విషమయినది భయంకరమయినదీ యీ ఆపహాసం. ఇది పికటం కాదు, తొన్టుచే, “కన్యాశుల్కం” తెలుగువారికి దేశీయ వాల్మీకి రామాయణం, వా్థసభారలు వంటిది. 19వ శతాబ్టి చివరి పదిలోని తెలుగు జీవిత సర్వస్వం యలదుల యిమిడివుంది. నగర (గ్రామ జీవితాలు, కొత్త పాత చదుపులూ, [కొత వా మనుషులూ, క్రొత్త పాత పద్ధతులూ వర్తమానాం(ధ్ర చర్వితకు ముదసరకు (1 [/216121) కన్యాశుల్కం (గంథ రూపం తీసుకుని వుంది. కళాసృట్ట గాకా క కన్యాశుల్కానికి “డాక్యుమంటరీ"గా కూడ చాల విలువపుంది. ఇండులో కనుమల ఒక్కొక్క ధోరణికి తెలుగు సాహిత్యంలో పదిరెట్లు ప్రతిబింబాలు టెలి కన్యాశుల్కాన్ని గురించి చేటభారతం రాయవచ్చు. కనుక దాసీినీ అమల? గురజాడ విప్లవాన్ని తాకుదాము. గిడుగువారు వచన (గ్రంథాల వవంయంల వ్యావహారిక భాషా ప్రయోగాన్ని సిఫార్సు చేశారు. కావ్యాల విషంహపంలో కన భాష పరిత్యాగావసరాన్ని సూచించారు. కాని అందులో వల్టనింపముంం. భాష మాత్రమే కాదు, రీతికూడా. ఇదే గురుజాడవారి ప్రత్యేకత! బంధాలలో ఏ సతమతమై వుక్కిరిబిక్కి రై నేడో రేపోనంటూ కాటికి కాళ్లుచాచి వుండిన లం. కావ్యామతల్లిని గురుజాడ స్పృశించాడో లేదో, జీవరక్తం వ్వులవికి చం." నృత్యం చేసి, జీవన్మూ ర్తి యవ్వన విలాసిని అయింది. ఆలుగుకు తొలితేలోో నాణ్యం, నాజూకు నునుపును ప్రసాదించిన కల్పవృక్షం గురుజాత; ఆం వేద; కుందేలయింది; వాపు వీగిపోయి కలుపు అగిపోయి బలుష్తు రవ లె పోడిమీ వచ్చాయి. ముత్యాలసరాలవంటి పాత చటాలలోనే లేలిక అలం దేశినుడులతో గీకు కథలుకూడ పలికించగలిగిన గురుజాడవారి (పము దవత వ్యక్తులసూ వాక్యాలనూ అధిగమించి మానవవాదం (1140406800) గా ఎలిదాంిం లుల

తలుగు సాహిత్యంలో క్రొత్త తెన్నులు రమణాంెథ 1717 కవిత్వాన్ని దేవతలనుండి మనుష్యులకు దించారు. దిగబడిన మనుష్యులను పెకెత్తమన్నాడు. శతాబ్దాలుగా “చరిత్ర అట్టడుగుసపడి కనుపించని దేశి సరస్వతీ (సవంతులు వున్నట్టుండి గురుజాడవారి కవిగాయక మనోహర వృద్ధమూర్తిలో నీటిబుగ్గగా కనుపించాయి. తదాది, మార్గకవత్వ భక్తులతో, సంస్కృత దాసులతో, తెలుగువారి అస్తిపాయమయిన దేశీ సాహిత్యం ఆ మృత్యు కలహ పరిష్యుంగంలో నిమగ్నమై వున్నది. సంస్కృతాన్ని మనము పూర్తిగా తప్పించుకోలేము. అది ఒకప్పుడు పాలకుల భాష అయినా, కాలక్రమాన అది తెలుగువారి మాటలలో కలిసిపోయింది; వారి జీవితంలోనే చోటు యేర్పరచుకుంది. రాముడూ, కృష్ణుడూ మసకు పూజ్యులెట్లా అయ్యారో, కాళిదాసు వాల్మీకి, భవభూత్యాదులుకూడ మాన్యులయ్యారు. కాని యిప్పుడు కోరవలసినదేమిటంటే, ఎట్లాగూ నన్నయ తిక్కనలాదిగా నిన్న మొన్నటివరకూ మా మహాకవులందరూ సంస్కృత మార్గాన్నే అవలంబించారు. కనుక వారి కవిత్వాన్ని మేము పోనాడుకోలీము. మా మొదటి సొంత సాహిత్యాన్ని సంస్కృతం హత్యచేసింది. యిప్పుడు తిరిగి తలెత్తుతున్న మా ఆత్మీయ సాహిత్యానికి నిలువనీడ కావాలి, తిరిగి మా జాసపద రీతులతోబాటు, జనభాషతోబాబు, జనసంబంధితమైస కావ్య వస్తువుతోబాటు, మేము దానిని పునరుజ్జీవింప జేయగోరుతున్నాము. సంస్కృత దాసులారా, మార్గకవులారా, మీరూ తెలుగువారు కాబట్టి మీ దుర్మార్గాన్ని వదలి, మా సన్మార్గానికి, మన స్వమార్గానికి మరలి రండయా, అని! ఇది గురుజాడవారు చేసి చూపారు. చెప్పక చెప్పారు, తెలుగువారిని పలువక పిలిచారు. కాని వీరేశలింగం - గిడుగు - గురుజాడ “విప్లవం” విప్లవం కాదు; పిరుగుబాటు! దురాచారపంకంలోని పద్మవ్యూహంలో తగుల్కొస్న మసుష్యులను వీరేశలింగం వీపు తట్టాడు: కాకుంటే, తన ఒక్కని చేయి ఆసరా యిచ్చి పెకి రమ్మన్నాడు. వచన్మగంథాలలో “శిష్ట” వ్యావహారికం వాడి, కావ్యభాష మాత్రం కృతకం కాని తీరు భాష వాడాలని గిడుగు “కన్సెషన్‌” యిచ్చాడు. మసుషులను చేశాభిమానానికి మేల్కొల్చి, గురుజాడ, ఆంగ్లేయుల స్వామిభక్తిని బోధించాడు. ఈ ముగ్గురి తిరుగుబాటు 41090215 చేసిన తిరుగుబాటు. కనుకనే యిది సంస్కరణను కోరింది. కాని పరిస్థితులు విప్లవాన్ని ఆహ్వానించాయి. పరిస్థితుల పైలుప్తుకు వీరు ముగ్గురూ చాలినంతగా తోడ్పడలేకపోయారు. పండితులసు, మూర్గాచారాలనూ, కృతకభాషనూ ఓడించారు. జమీందారుల చేతినుండి తీస సాహిత్యాన్ని మధ్యతరగతి సంపన్నుల - శీష్టుల - చేతికిచ్చారు. బీరేశలింగ

1718 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము విప్లవానికి తల వూచినవారూ, గిడుగు విప్లవానికి చేయెత్తారు; గురుజాడ విప్లవాన్ని మెచ్చుకున్నారు. కాని యీ సంపన్నులు దానిని కొనసాగించలేదు. వారి పెదిమలు మాత్రమే యీ విప్లవాన్ని సమర్థించాయి కాని మనస్సు విరోధించింది. కనుకనే యీ విప్లవపు పై రూపులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి, రీతిని మాత్రమే ఎత్తిపట్టి, అసలు నిగ్గును, వస్తువును, సారాన్ని దాచిపెట్టారు. ఇది “దుష్ట” జనానికి “గ్రామ్య” జనానికి అందితే (ప్రమాదం? ఎవరికి? తమకు. కనుక యీ విప్లవ దళాధిపతుల అస్తమయంతోడనే, వారి ఆశయాలుకూడా అస్తమించాయి. పై డొల్లమాత్రం మిగిలింది. సంపన్నులు, బూర్జువా వర్గం, గిడుగు గురుజాడ కందుకూరి విప్లవోద్యమ త్రయానికి ద్రోహం చేసింది. విప్లవం అసంపూర్ణంగా నిలిచిపోయింది. “సామాజిక సాంస్కృతిక, సాహితీరంగాల్లో సంస్కరణోద్యమాలు లేవదీసింది వంగీయుల తర్వాత ఆంధ్రులే...కాని ప్రతి వుద్యమం తాత్కాలికంగా ఉజ్వలంగా వెలిగి ఆరిపోతూ వచ్చింది. వెలిగి ఆరిన బూడిద గుట్టలు మ్మాతం అక్కడక్కడ (పోగుచేసి వాటికి వార్షికోత్సవాలు చేస్తూంటాం - వాటిలోని అగ్గిని తిరిగి రగిల్బే శక్తిలేక” (కిన్నెర: సంప్పుటము 5, సంచిక 1, జనవరి 1953) అ ళన యాతో గ్ర( న్‌ గ అ కా జగ్‌ ఎ చరా గ్గ టే

సారస్వతము: విమర్శ భూపతి లక్ష్మీనారాయణరావు

వస్తుతత్త్వమును తెలియకోరుట విమర్శ. మృశ్‌ ధాత్వర్థమునుబట్టి మనోవ్యాపారమున కందు [పాధాన్యము కలదని చెప్పవచ్చును. హేతుజిజ్ఞాసయే పరామర్శయని తార్కికులు నిర్వచించినారు. విమర్శకు పర్యాయపదమగు పరామర్శయే అనుషానమునకు హేతువు. దీనినిబట్టి భౌతిక చక్లుర్ణ్రాహ్యములుగాని వస్తుగత విషయములను, ధర్మములను, గుణములను మనస్సుచే పరిశీలించి తలిసెకొనుట విమర్శ యగుచున్నది. హేతు జిజ్ఞాస అనునది మానవుని సహజలక్షణము. ఇందియ గోచరములగు విషయములను యథాతథముగ గ్రహించి. తద్‌ జ్ఞానముతోనే సంతృషప్తివడుట మానవస్వభాపము గాదు. తన అనుభవమునకు వచ్చు ప్రతి విషయమును గూర్చియు తర్కించుట, కార్యకారణ సంబంధమును కనుగొనుటకై ప్రయత్నించుట అను లక్షణము మానపునియందు సహజసిద్ధమైనది. మన జీవితమందలి (ప్రతి విషయమును నిట్టి విమర్శకు గురియగుచున్నది. మానవుని సహజాతమగు బుద్ధిశక్తియే యిందులకు హేతువు. శాస్త్రవిషయిక విజ్ఞానమంతయు నీ హేతు జిజ్ఞాసాఫలితమే మైయున్నది.

మానవజీవితము సౌఖ్యప్రదమగుటకును, సంఘమున సామరస్య మేర్చడి శాంతి సెద్ధించుటకును, నండలి ప్యక్తుల దృక్పథము ముఖ్యకారణ మగుచున్నది. అట్టి దృక్పథమును బట్టియే మన (ప్రవర్తనాదు లేర్పడుచున్నపి. సరియగు దృక్పృథ మేర్పుడుటకు వివేచన అవసరము. ఉచితానుచిత జ్ఞాసము నొసంగు మానసిక పందిరి ముల్లికార్డుసరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము

1720 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము పవృత్తియే వివేకము. అట్టి వివేక సిద్ధికి ఆంతరంగిక విమర్శ యంతయు నవసరము. జీవితమునందలి (ప్రతి దశయందును, ప్రతి విషయము నందును నిట్టి విమర్శ యవసరమగుచున్నది. మన ప్రవర్తన, భావములు, ఆశయములు, మనోరథములు మున్నగు సమస్తవిషయములందును సదసద్విమర్శ ఆవశ్యకము. కేవలము భౌతిక విషయములగు నాహార వస్త్రాలంకార విషయమునకూడ విమర్శ తప్పనిసరి. జిహ్వాచాపల్యమునకు మాత్రమే పాధాన్యమొసంగినచో ననారోగ్యము తప్పదు. వస్త్రధారణ విషయమునను నట్లే వివేచన (ప్రధానమైనది. బుతుభేదములను బట్టియు, స్తీ, పుం విభేదములను బట్టియు, వృత్తి భేదములను బట్టియు వస్తువులు, దుస్తులు మారుచున్నవి. సౌందర్యమునందు మనకు గల యాసక్తి ననుసరించి వస్త్రధారణ మొక కళగా నేర్పడినది. అవ్లే భూషణరచన గూడ సునిశితవిమర్శకు గురిరై యుత్తమ శిల్పముగ సిద్ధించినది. కళలన్నియు నిల్ల (కమాభిపషృద్ధి చెందినవి. ఇట్లు మానవ జీవితమందలి ప్రతి వెషయమును నుత్తరోత్తరాభివృద్ధి గాంచుటకు విషుర్శ కారణమైనది. వస్తుతత్త్యమును, సౌందర్యతత్త్వమును ఆలియు నుద్దేశముతో

నారంభమైన ఏమర్శ వస్తు సౌందర్య పోషణకు కారణమైనది.

తత్త్వజిజ్ఞాస మానవునకు జన్మసిద్ధమైనది. కనుక వస్తువుల సృష్ట స్వరూపములకు, వాని స్వభావములకు, లక్షణములకు మూల హేతువులను వెదుక నారంభించినాడు మానవుడు. దైవదత్తమగు బుద్ధిశక్తి యాధారమున నతడు (గ్రహించిన ప్రకృతి రహస్యములను వివరించినాడు. అట్షేర్పడినవియే శాస్త్రములు. కేవలము భౌతికములగు శారీరకాది శాస్త్రములు మొదలు సంపూర్ణముగ మానసిక వృత్తికి సంబంధించిన తత్త్వశాస్త్రాదుల వరకును గల విజ్ఞానమంతయు మానవుని విమర్శ ఫలమైయున్నది.

ఇంద్రియ గోచరమగు ప్రపంచము చాల చిన్నది. భౌతికేందియములకు గోచరించునది ప్రపంచముయొక్క స్థూలరూపము మాత్రమే. ఆ స్థూల (పప్రకృతియందు నిహితమైయుండు ప్రపంచ మతి విస్తృతమైనది. వస్తుతత్త్యము స్థూలరూపమునం దంశామాత్రముగ వ్య క్షమగుచున్నది. అవ్యు క్తముగ నుండు భాగమే యెక్కువ. కనుక వస్తువుయొక్క స్టూలములగు నంశములు మాత్రమే చూచుట వలన వస్తుస్వరూపమును, వస్తు తత్త్వమును బోధపడవు. ఈ విషయము నొక పాశ్చాత్య విద్వాంసుడు చక్కని ఉదాహరణముచే వివరించినాడు.

సారస్వతము: విమర్శ భూవతి లక్షీనారాయణారావు 1721 దుఃఖాశ్రుజలమును విజ్ఞాన శాస్త్రరీత్యా వ్యాకరించిన మనకు లభించు జ్ఞాన మత్యల్పముః నప్రధానము. ఏయే లవణములేయే నిష్పత్తిలో నందున్నవో మనకు ఆలియగలదు కాని తదడ్రువులకు హేతువులగు వ్యక్తి హృదయ వ్యాపారములు మున కేవ్యాతమును గోచరించవ. కనుక భౌతికరూపవము నంతరమున నవ్య క్తమైయున్న విశాల ప్రపంచము భౌతిక చక్షువులకు గోచరమగునది కాదు. మన మందులకై నిర్మించుకొనిన సూక్ష్మాతి సూక్ష్మమగు సాధనసామగి కూడ నీ విషయమున సమర్థము కాకున్నది. పరమాణువును (బద్దలుగొట్టి మనము సంపాదించిన దందలి శక్తి మాత్రమే. అట్టి మహత్తరశక్తి నంతటి చిన్న వస్తు కణమునందిమిడ్చిన ప్రకృతి రహస్య మాత్ర మింకను నవ్య క్తముగానే యున్నది. కనుక స్థ్టూలరూపము వెనుకనున్న (ప్రపంచ స్వరూపమును [గ్రహించుటకు మనస్సునకు మాత్రమే సాధ్యము. తద్విషయికమగు మనఃప్రవృత్తియే విమర్శ.

వస్తుతత్త్వమును గూర్చిన జిజ్ఞాస యెట్లు మానవునకు సహజమైనదియో, అట్లే వస్తు సౌందర్య స్వభావాదుల గూర్చిన జిజ్ఞాసాయు సహజమైనదియే. సుందర వస్తు దర్శనముచే మొదట సిద్ధించునది మనోవికాసము. ఆ యనుభపము పూర్తియెన పిమ్మట మనకు కలుగునది ఆ సాందర్యమును గూర్చిన జిజ్ఞాస. ఏయే యంశములట్టి నాందర్యమునకు కారణములని తర్కించుటయు, ఆ వ్యక్తి దృక్పథము ననుసరించి కొన్ని యభ్శిపాయముల నొసంగుటయు జరుగుచున్నది. ఆ యభిప్రాయములు తాత్త్వక సత్యములు కాకపోవచ్చును. కాని ఆ సందర్భమును, సన్నివేశమును, తద్వ్య క్తి దృక్పథమును బట్టి పాక్షికముగ సత్యములు కావచ్చును. ఇల్లే ప్రకృతియందలి ప్రతి విషయమును గూర్చియు విమర్శలు, అభ్మిపాయములు నేర్చడినవి. (పకృతి తత్త్వజ్ఞానమున కీ విమర్శలెంతయు తోడుపడుచు బుద్ధి వికాసమునకు దోహద మొనర్చుచున్నవి.

ప్రకృతి తత్త్వజ్ఞాన మనోవికాసములు సంస్కృతి పథాన లక్షణములు. కళాసృప్ట్రాయంతయు సంస్కృతిపోషకమై యున్నది. అందును వాజ్మయప్రధానమగు సాహిత్యము మిక్కిలి విశిష్టమైనది. భావచాంచల్యమును, విరుద్ధజీవిత దృక్పథమును, కథాభినివేశలోపమును సరిదిద్దగలశక్తి భాషాపాటవముచే సిద్ధించగలడని యొక విమర్శకుడు వాజ్బయసాధనమునకు గల 1పపాధాన్యమును చక్కగ వివరించినాడు. జీవితమున సామరస్యమునుగూర్చి సంస్కృతిని సెద్ధింప జేయుటకు సాహిత్య

1722 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంప్పుటము శ: సాహిత్యము మొక యుత్కృష్ట సాధనమగుచున్నది. అట్టి సాహితీ ప్రయోజనము సిద్ధింపవలెనన్న సత్సాహిత్యమునుగూర్చి వివేచన అవసరమగుచున్నది. వివేచన లేనిచో నుత్తమ భావములు, నుత్తమాశయములు మన కలభ్యములె సంస్కృతి సెద్ధింపకపోవును. కనుక సాహిత్యవిషయమునను, నితర కళలవిషయమునను, సదసద్యివేకమును గలిగించుట విమర్శయొక్క (పధానాశయము.

(పతికళయందును ఉత్తమ మధ్యమాధమ భేదములున్నవి. తుచ్భము, తాత్కాలికము నగు నింద్రియతృప్తిని మాత్రమే కలిగించునవి అథమములు. స్థిరము, సాత్త్వికమునగు మనోవికాసమును గలిగించి శాంతిసామరస్యములను చేకూర్చునవి వుధ్యవశేణికి చెందినవి. విశిష్టజ్ఞానమును కలిగించి విశ్వైక్యభావమును, ఆనందమును సిద్ధింప చేయునవి ఉత్తమ కళారచనలు. విద్యాధ కులు కానివారును, ఆర్థ కదుర్దశ కారణవఎగ కళాఖి రుచి నలవరచుకొనలేనివారును. సహజముగనే వివేచనాశక్తి కొరవడినవారును నీ విషయమును ఉత్తమాధము వివక్షను చేయజాలరు. అట్టివారు ఇంద్రియ ప్రాబల్యమునకు దాసులగుట సహజము. కనుక, ఇంద్రియ (గురకములు, తాత్కాలికోత్తేజకములు నగు చిత్రములు, శిల్పములు, రచనలు వారి నెక్కువగ నాకర్షింపగలవు. సంఘమున నైతిక పతనమున కిది ప్రబలకారణము కాగలదు.

' నిజమగు కళాసొందర్యమును గ్రహింపలేనినాడు బా హ్యేంద్రియోత్తేజకములగువానికి లోనగుట తప్పదు. లలితకళలయం దభిరుచియు, నాసక్తియు నేర్పడినచో వానినుండి ఆనందమును బొందుటకు వీలున్నది. ఇహజీవితమందలి కష్టములనుండి విడుగడ పొందుటకును, తాత్కాలికముగనైన కొంత మానసిక విరామము ననుభవించుటకును నవకాశ మందువలన కలుగగలదు. అనుదినమును మన కర్తవ్యనిర్వహణముచే కలుగు విసుగు, అందు తప్పనిసరిగ నేర్పడు సంఘర్షణలు, వానికారణమున జనించు మానసికాందోళనము - ఇత్యాదులనుండి విడుగడపొంది కొంత విరామము నుల్లాసయుతముగ ననుభవించుట మిక్కిలి యవసరము. పాశ్చాత్య దేశము అందలి కర్మాగార కేంరదములలో నాటకశాలలు, చలనచిత్ర రంగములు, సంగీత నృత్యమందిరములు కార్మికుల యుపయోగము కొరకు నెలకొల్పబడినవి. కార్మికులు తమ విరామకాలము నందు కడపి మానసికోత్తజమును, చిత్తవకాసమును బొందుట కవకాశమేర్చడినది. అందు ప్రదర్శ్భ్శితములగు చిత్రములను, నృత్యాదులను

సారస్వతము: విమర్శ భూవతి లక్షీనారాయణరావు 1723 బట్టి కళాభిరుచి సిద్ధించుటకుకూడ వీలున్నది. వీనిలో తరతమ భావములను నిర్ణయించుట, ఉత్తమత్వ అధమత్వములను ప్రదర్శించుట, సరియగు నఖిరుచిని కలిగించుట విమర్శకుల కర్తవ్యము. ఆ దేశములలో సామాన్యులగు కార్మికులు మాత్రమేగాక మధ్యమశేణికి చెందినవారుకూడ (ప్రతిశనివారము మధ్యాహ్నమునను చిత్ర ప్రదర్శన శాలకో, నాటకశాలకో, గీతామందిరమునకో లేక క్రీడా రంగమునకో పోయి విరామకాలము నుత్సాహవంతముగ గడపుట పరిపాటి యయినది. వ్యక్తి తన కళాభినివేశమును, తనకు వానియందుగల యాసక్తినిబట్టి యాయా కళల నాస్వాదించి యానందింపకలుగుచున్నాడు. అట్టి కఠలాసక్తి లేనినాడు సంస్కారవిహీనులై మానవులు తుచ్చములగు నింద్రియభోగములనే యుపాధిగ నవలంబింపవలసిన వారగుదురు.. కళాభినివేశము లేనివారికి మద్యపాన, స్త్రీలోలుపతాద్యూతములు మాత్రమే ఉపాదేయము లగుచున్నవి. కనుక చిత్రకళా సంగీత నృత్య సాహిత్యములం దభిరుచి కట్టించుట సంస్కారపోషణమునకు చాల ముఖ్యము. అది విమర్శవలన సాధ్యము. కళారచనయందలి గుణమును, వైశిష్ట్ర మును గుర్తించుటకు అభిరుచి అవసరము. భావనాశక్తి బుద్ధిశక్తుల సంభయోగముననేగాని అభిరుచి సెద్ధింపదు. (పధానముగ రచన యందలి గుణవైశిష్ట్యగ్రహణమే విమర్శయొక్క యాశయము.

కవిత్వ మాదియందు మానవహృదయమునుండి భావావేశ కారణమున, నప్రయత్నముగ సృష్టికివచ్చినదయ్యును (క్రమముగనది విశిష్టమగు కళగా సెద్ధించినది. మానవుని ప్రతిసృష్టియు నాది యందొక కర్మమాత్రముగ జరిగిన దయ్యును (శ్రమముగ నది సౌందర్యపప్రధానమై కళగా పరిణమించినది. చతుష్షష్టి కళలును నిట్లే సృష్టికి వచ్చినవి. భావ(పకటనకు సాధనముగ మొదటి నేర్పడిన భాషకూడ [క్రమాభివృద్ధినిచెంది సుందరము, శక్తివంతము నయినది. వాక్సౌందర్యమే కవితలో (ప్రాధాన్యము వహించినది. కళాభిజ్జ్ఞత లేనినాడు కళావైశిష్ట్రము బోధపడదు. కావున కళాభిజ్ఞుడగు విమర్శకుడు కళావైశిష్యప్రదర్శకు డగుచున్నాడు. బాహ్యేంద్రియ[గ్రాహ్యములగు సంగీత నృత్య శిల్ప్చాదికళలు విమర్శక సాహాయ్యము లేకున్నను కొంతవరకు తృప్తినియవచ్చును. అనగా తద్దత స్థూల భౌతికసొందర్యముచేతనే మన కింద్రియతృప్తి కలుగవచ్చును. చిత్రమునందలి రూపరేఖా వర్జవిన్యాసములు, శిల్పము నందలి ఆకారసౌష్టవము,

1724 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నృత్యమునందలి వైఖరీభంగిమలు, గానమునందలి (శ్రావ్యత, వస్తువుల బాహ్యసౌందర్యము - ఇత్యాదులు బాహ్యేంద్రియములను తృప్తిపరచుటకు చాలియున్నవి. కనుక తద్విమర్శ లేకున్నను కొంతవరకు వానిప్రయోజనము సిద్ధించుచున్నది. కవిత్వము విషయము వేరు. శబ్దార్థముల్నపె నాధారపడునది కవిత. శబ్బ్దగతమగు నాదము బాహ్యేంద్రియగోచరమేమ్రునను బోధ్యమగు నర్థమునకు (శవణేంద్రియ మాధారముకాదు. అర్ధబోధకు మనస్సే ప్రధానము. శబ్బగతార్థము మనోగోచరమైనది. మరియు పూర్వానుభవము - అనగా శబ్బవిషయక సంస్కారము - లేనినాడు మనస్సుగూడ అర్థమును వివరింపజాలదు. ఇట్లు సంస్కారయుతమగు మనస్సు శబ్దార్ధబోధ విషయమున నాధారమగుచున్నది. అనగా భాషావిషయికమగు రచన అంతరిందియ గ్రాహ్యామైనదని యర్థము. మన యసుభవమున కిదివరలో రాని దృశ్యమును మనము చూచినపుడును, సుందరమగు నూతన వస్తువును దర్శించినపుడును, నవ్యమగు గీతము నాకర్ణించినపుడును వాని తత్త్వము బోధపడకున్నసు చిత్తవికాసము, సంతోషము కలుగవచ్చును. శబ్దార్థస్వరూపమే యాధారముగా గల సాహిత్యవిషయమున నట్లు జరుగదు. ఇదివరలో తలియని శబ్బముయొక్క యర్థము మనకు బోధపడదు. బోధయే లేనినాడు భావము గమ్యుమానము కాదు. అట్టిచో చిత్తవికాసమున కపకాశమేలేదు. మరియు శబ్బముచే బోధ్యమగు నర్ధమును లోక్షమునుండి (గ్రహింపవలసినదేకాని జన్మతః మన కది సిద్ధింపదు. శబ్దములు బోధించు సామాన్యార్థములు సంఘమునుండియు, కావ్యత్వ సిద్ధికి హేతువులగు లక్ష్యార్ధవ్యంగార్థములు సారస్వతాధ్యయనము నుండియు సిద్ధించుచున్నవి. కావున సమ[గమగు శబ్దార్ధజ్ఞానము సామాన్యుల అవధిలోలేదు. శబ్దార్ధములు భావములకును, భావములు చిత్తవికాస రసపోషణలకును నాధారములు. అట్లగుటవలన శబ్దార్థసంస్కారము లేనిచో భావము లగమ్యములై రససిద్ధి జరుగదు. అనగా కావ్యరసాస్వాదన సాధ్యముగాదు. కనుక కావ్యరసాస్వాదనకు విమర్శ అవసరమగుచున్నది. ఇక కావ్యపఠనచేగాని, కళానుభూతిచేగాని కలుగు చిత్త వికాసములలోగూడ అంతరములు తరతమ భావములు గలవు. చిత్రపట సౌందర్యమునకు మాత్రమే ముగ్గులమగుటి ఒక విధమగు చత్తవికాసము. తత్సొందర్య సిద్ధికి కారణములగు వివిధ విషయముల జ్ఞానము సిద్ధించినపుడు కలుగు సంతోషము వేరు. చితముచే

సారస్వతము: విమర్శ. భూపతి లక్ష్మీనారాయణరావు 1725 గమ్యమానములగు నుదాత్తభావములను, నంతరార్థములను, వానికి మన జీవితముతో గల సంబంధమును గుర్తించినపిమ్మట సిద్ధించు నానంద మంతకంటెను విశిష్టమైనది. ఉత్తర హరివంశములోని సత్యభామానరకాసురుల యుద్ధఘట్టమందలి వీర శృంగార వర్ణన శబ్బవిన్యాసము చేతనే అతి హృద్య మైనది. ఐనను శబ్దముల చేతను, అర్థములచేతను, గమ్యమానములగు భావవిశేషములు, మనోహర అప్రకృతార్థములు, రసస్ఫూర్తి ఇత్యాదులను (గ్రహించిన పిమ్మట గలుగు నానందము విశిష్టమైనది. “గనయంబున్‌ గొనయంలబు నెన్నడుముతోం గర్జావతంసంబుతో” అను పద్యమున కవి పోషించిన భావచ్శితము సహృదమొక చేద్యము. అట్లే, “బ్రరింజూచుస్‌ హరింజూచు6. జూచుకము లలదంద మందారకేసర” అను పద్యమున కవి చిత్రించిన సత్యభామ వీర శృంగారస్వరూపము అనన్యసాధ్య మైనది. ఇందలి కవితాశిల్పము సమీచీనమగు సమీక్షపలననే [గగ్రాహ్యము. “ఇయం గేహే లక్ష్మీ ఇయ మషృుతవర్తి రయసయో? అసు ఉత్తర రామచరిత్ర స్లోకము “విరహళో శబ్రముచే నంత్యమగుచున్నది. వెంటనే (పతీహారి పలికిన “పొప్తః దేవా” అను వాక్యమందలి 1పాప్తశబ్రముతో విరహశబ్దమునకు సంబంధ మేర్చడి భావికథకు సూచకమగుచున్నది. ఇది ఉప్మశుతి. కళాభిజ్ఞతవలనగాని ఇట్టి కావ్యశిల్పము గోచరింపదు. కళాసంబంధములగు నిట్టి సూక్ష్మ విషయము లనేకములు నిగూఢములై యుండును. అవి సాధారణులగువారి కందవ్పు. విమర్శ సాహాయ్యముస నవి [గాహ్యములై ఇతోధికాసందమును గల్గింపగలపు. శబ్దార్థముల విషయమున మాత్రమేకాక సన్నివేశముల విషయమునగూడ విమర్శసాహాయ్యు మవసరమగుచున్నది. శాకుంతలమున హరిణానుసారియగు దుష్యంతుని ప్రవేశముచే కవి భావ్యర్థమును గంభిరముగ సూచించినాడు. సత్త్వగుణప్రధానము, సుకమారము, పవిత్రము సగు నాశ్రమ మృగమ్ముపై రథాధిస్తుడు, కార్ముకహస్తుడు నగు దుష్యంతుడు దాడి ఎడలుట ముగ్ధ సుకుమార శకుంతలాజీవితముుపే రా జొసర్పబోవుదాడికి సూచనయగుచున్నది. “న ఖలున ఖలు బాణసన్నిపాళ్యోయమస్మ్‌న్‌ మృదుని మృగశరీరే పుష్పరాశా విచాగ్ని"

1726 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము అని బుషులు బాణప్రయోగమునుండి జింకను రక్షించుట శకుంతలారక్షణకు, కావ్యఫలసిద్దికి సూచనయగుచున్నది. “పుష్పురాశావివాగ్ని౯ అను నుపమాలంకారముచే శకుంతలాహృదయస్వభావాదులు మున్నగునవి వ్యంజ్యమానము లగుచున్నవి. ఇట్టి విశేషార్థములు, కావ్యప్రయోజనములు ఎన్నియో కావ్యములందు నిగూఢములై యున్నవి. వానిని వివరించి తద్వైశిష్ట్రమును ప్రదర్శించుట యవసరము.

ఉత్తమోత్తమ ్రేణికిచెందిన కవికిని, కళాకారునకును విమర్శసాహాయ మవసరము లేకపోవచ్చును. వ్యాస వాల్మీకాదులకు ప్రకృతి తత్త్వబోధ సహజాతము. వారి కవితాసృష్టి ద్వితీయ (ప్రకృతిగా సిద్ధించినది. ఇతరాదర్శములుగాని, కావ్య మార్గదర్శకములగు లక్షణ[గంథములుగాని, విమర్శలుగాని వారి కావశ్యకములు గావు. సాధారణకవుల విషయము వేరు. కళారచయితలకు విమర్శకుడు మార్గదర్శకుడు. దీపము సహకరించునట్లు కావ్యరచనయందు విమర్శ సహాయపడుచున్నది. అర్ధ భావ రసపోషకములగు కావ్య పరికరము లెవ్వియో, కావ్య సౌందర్యపోషణకు, నంగాంగీభావ సామరస్యమునకు నుపకరించు విధానములు, సన్నివేశములు ఏవో, కావ్యత్వహానికి కారకములగు అనౌచిత్యము లేవియో పూర్తిగ తెలిసియుండినచో కావ్యరచన స్మక్రమమార్గమున నడచుట కెక్కువ అవకాశమున్నది. కనుక పూర్వకావ్యములపై వచ్చిన సద్విమర్శ తరువాతి కవుల కంతయో సహాయకారియగుచున్నది.

(ప్రాచీన భారతీయ సాహిత్యవేత్త లుదాత్తవుగు వివుర్శక శక్తిని కలిగియుండినవారని కావ్యనాటకములపై వారు రచించిన సమగ్రవ్యాఖ్యలనుబట్టి నిర్ణయింపనగుచున్నది. కవుల భావములు, ఆయా సందర్భములలో వ్య క్తమగు కవిహృదయము శబ్ద శక్త్యర్థ శక్తులమూలమున వ్యంజ్యమానములగు విశేషార్ధ విశిష్టభావములు, కావ్యమున నిగూఢములై యున్న సూక్షా శ్రైతి సూక్ష్మములగు వూనవ హృదయవ్యాపారములు - ఇత్యాదులన్నియు నతి నిశితముగ వివరింపబడినవి. ఆంగ్ల సారస్వతమునందువలె కవులనుగూర్చిన (ప్రత్యేక విమర్శగంథములు మన (ప్రాచీనులు రచింపలే దనుట నిజమే. విమర్శ సర్వస్వమును వ్యాఖ్యలయందు చేర్చియుండు కారణమున (ప్రత్యేక [గంథరచన కవసర మప్పుడు లేకపోయినది. మరియు కావ్య నాటక శాస్తాది [గంథాధ్యయన మా కాలమున సార్వజనీనముగాదు. గురూపదేశముమై నాధారపడిన కొద్దిమందికి మాత్రమే అధ్యయనము సాధ్యమైనది. విద్యావంతుల సంఖ్య మిక్కిలిగ

సారస్వతము: విమర్శ భూవతి లక్ష్మీనారాయణరావు 1727 నభివృద్ధిచెందిన పాశ్చాత్య దేశములలో వచన[గంథముల ద్వారా విజ్ఞానవ్యాప్తి కవకాశము కలిగినది. కళాభిరుచిని, సాహత్యాభిరుచిని పంపొందించు విమర్శక గ్రంథములు వృద్ధికి వచ్చినవి. ఇట్టి సద్విమర్శ లాదర్శములుగ ప్రాచీన కవుల రచనలను సూతనదృప్టితో పఠించుట ఆరంభమైనది. భారతదేశ సాహిత్యవిషయమున నట్టి కృషె యొంతయు నవసరము. కళాసృష్టికి గడంగువారి కెల్లరకును లక్షణజ్ఞాన మవసరము. లక్షణము తత్కళకు సంబంధించిన బాహ్యురూపజ్జానము నొసంగుచున్నది. లక్షణము తెలియనిచో మొదట రూపసిద్ధికే భంగము కలుగవచ్చును. రూపసిద్ధికి వలయు రేఖలు, అంగాంగముల పరిణామములు, ఆయా స్థానములలో వ్య క్తముకావలసిన ఛాయావిశేషములు, ఉపయోగింపవలసిన వర్ణములు మున్నగునవన్నియు చిత్ర రచనావిషయమున లక్షణములగును. సర్యాంగసుందరము, సమ[గ్రమునగు రూపసిద్ధి కిట్టి లక్షణజ్ఞాన మవసరము. రూపము సిద్దించినంతమాత్రమున నది చిత్రకళ కాజాలదు. చైతన్యము, భావము చిత్రమున సువ్య క్తముగావలసు. చిత్రకారు డుద్దేశించిన భావమునకు చితముయొక్క (ప్రత్యంగమును పోషకమై యుండవలెను. లేనినాడు అది నిర్జీవప్రతిమయే కాగలదు. చిత్రకారుని పతిభనుబట్టియే చితమున జీవకళ సిద్ధించును. సంగీతవిషయమున గూడ నంతే. శాస్త్రము ననుసరించి పాడినంతమ్మాత్రమున అది గానకళకాదు. రాగభావ సాహిత్యభావములు "రెండును సమరసమున మేళవించి, శోతలయందు భాపవికాసమును కలిగించి శమముగ వారిని రసపరవశుల నొన ర్చినప్పుడే గానవుమ కళ యుగుచున్నది. సంగీతలక్షణజ్ఞానము లేనినాడట్టి కళాసృష్టి జరుగజాలదు. కనుక కళ లన్నిటి విషయమునను లక్షణజ్ఞాన మవసరము. మన ప్రాచీనులు రచించిన అలంకార (గ్రంథములన్నియు సాహిత్యవిషయక లక్షణగ్రంథములే యగును. అయినను గుణ దోషాలంకార నిరూపణతో మాత్రమే ఆగక వీరు కావ్యజీవితమును గూర్చికూడ సునిశితవుగు వివుర్శలు గావించియున్నారు. కావ్య సౌందర్యమునకును, కామ్య రసాస్వాదనమున జనించు ఆనందమునకును కారణములను వీరు వివరించినారు. అలంకారములు కాష్యత్వ సిద్ధికి హతుప్తులని భామహాదులుసు, రీతియే కావ్యాత్మయని వామసుడును, గుణములు ప్రధానములని దండియు తమతమ అభిరుచులను అభ్మిపాయరూపమున వెల్లడించినారు. కాప్యత్వసిధ్ధికి ప్రధానమగు హేతుపు ప్యంజనాపృత్తియని నిర్ణయించి

1728 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఆనందవర్ధనుడు ధ్వనిమతమును నెలకొల్పినాడు. దీనిపె ఖండన (ప్రతిఖండనము లనేకములు బయలుదేరినవి. జగన్నాథుడు రస్మప్రాధాన్యమును గూడ నంగీకరించుచు ఆనందవర్థనుని ధ్వనిమతమును శోభావంతముగ నొనర్భి స్థరముగ సాహిత్యలోకమున ప్రతిష్టించినాడు. రమణీయార్థ ప్రతిపాదకమైన రచన కావ్యమని సవున్వయము సెద్ధించినది. కావ్యజీవిత విషయమున వూ వేకాక కావ్యరసాస్వాదన, రసోత్పత్తి ఇత్యాదుల విషయమున ఆలంకారికులు గావించిన మీమాంస వారి విమర్శకశక్తికి తార్కాణము. కావ్యపఏిమర్శ విషయమున వీరు చూపిన మార్గములు అతి విశాలములైనవి. కావ్యత్వ విషయమున వీరికి గల యభిప్రాయము లుదారములైనవని వారి (గంథములే సాక్ష్యమొసంగుచున్నఎ. అలంకారములు లేకున్నను కావ్యత్వమునకు హానికలుగదని మమ్మటుడును, రసము లేకున్నను మనోహరార్థస్ఫూ ర్తియే చాలునని జగన్నాథాదులును వివరించినారు. అల్లే దోషములనుగూర్చి చర్చించుచు దోషజుష్టముగాని కావ్యమే లభింపదనియు, కనుక కావ్యదోషముల నెన్నుటలో బెదార్యమును పాటింపవలెననియు సహేతుకముగ నిర్ణయించినారు. కాని తరువాతి కాలమున గుణదోషప్రకరణములకు మాత్రమే ప్రాధాన్య మొసంగిన ఛాందసుల కారణమున కావ్యవివుర్శ కృత్రవువూర్గవలమన పడినది. అలంకారశాస్త ృవలునకు లక్ష్య [గ్రంథములుగ సంస్కృత కావ్యములను వీరు పరిగణించి, వీని యాధారమున నితర [గంథములకు విలువకట్టుట కారంభించినారు. దీనితో కావ్యముయిుక్క బాహ్యురచనకు (ప్రాధాన్యము హెచ్చినది. ఆంధధమున సృష్టకి వచ్చిన (ప్రబంధవాజ్మయ మీ వర్గమునకు చేరినది. ఆ కాలపు పండితుల మన్ననల కవి పాత్రములగుటచే కవులును నా మార్గముననే కావ్యరచన కావించినారు. పాశ్చాత్య సారస్వతములతో మనకు సంబంధ మేర్పడువరకును సాహిత్యమునుగూర్చి మన కిట్టి యభ్మిప్రాయములే యుండినవి. ఆంగ్ల విమర్శక గ్రంథపరిచయముతో మన దృష్టి మారినది. గుణగ్రహణమే విమర్శకు ప్రధానాశయమనియు, కావ్యమును పరిశీలించుటలో విమర్శక సూత్రములు సిద్ధాంతములు కావనియు, కవి జీవితము, కవికాలపు సాంఘీక వ్యవస్థ, కవి యుగద్దేశము మున్నగువానిని గమనించుట అవసరమనియు సాహిత్యవేత్తల యభ్మిపాయము.

దేశచరిత్ర, సారస్వతచర్శితలు పరస్పరాశయములు. ఒక కాలపు రాజకీయార్జిక సాంఘికపరిస్థితు లర్థమైననేకాని నాట్‌ వాజ్మయ స్వరూప మర్థముకాదు. శ్రీనాథునినాటి ఆంధ దేశస్థితి సవు్యగవుగ తెలిసిననేతప్పు అతని

సారస్వతము: విమర్శ భూవతి లక్షీనారాయణరావు 1729 కావ్యరచనావిధానమును (గ్రహింపలేము. నాటి తెలుగుదేశము సకల సంపదృరితము, భోగముల కాకరము. పూర్వసంప్రదాయముల నొకవైపు క్రియారూపమున పాటించుచు సంఘము నూతన దృక్పథమునకు లోనై క్రొత్తమార్గముల నడచినది. తిక్కననాటి తాత్త్వికదృష్టి శ్రీనాథ్టునినాటికి క్రీణించినది, జీవితము భౌతికపధానమైనది. తత్పలితముగ ఆహార వస్త్రధారణ విహారాదులన్నియు లలితములైనవి. నృత్యగీతములందలి యఖిరుచి అతిశయించి వేశ్యాసంఘ పోషకమయినది. శ్రీనాథుని రచనలే యీ విషయమున ప్రబల సాక్షములు. ఇల్లే విజయనగర రాజ్యకాలమునాటికి సంఘజీవితము - ముఖ్యముగ ఉన్నతవర్గమువారి జీవితము

  • కళాప్రధానమైనది. ఐహిక సౌఖ్యమునకు, సౌకుమార్యమునకు జీవితమున 'ప్రాధాన్యమేర్ప్చడినది. ఆ కాలపు (పప్రబంధములే కాక నాటి శిల్పముకూడ ఈ విషయమునకు నిదర్శనము. నన్నయ భారతరచనకును, నందును కర్మకాండ 'కెక్కువ ప్రాధాన్యము రచనయం దేర్పడుటకును, కారణమును చరిత్రవలననే తలియగలము. నన్నయకు సన్నిహితకాలమున చార్వాక సోమ సిద్ధాంత కాపాలికాది క్షు[ద్రమతములకు దేశముసందుండిన [పాబల్యమును, తదాచారములసు పాటింపలేక పాటించుచున్న ప్రజల దురవస్థను నిట్టి దుస్థితినుండి సంఘమును రక్షింపబూనిన పమారిల భట్టాచార్యుని (ప్రయత్నమును మనము (గహింపవలసియున్నది. నన్నయ భారతరచనావిధాన మర్హమగుటికీ చరితజ్ఞాన మవసరము. అట్లే తిక్కన ప్రతిపాదించిన హరిహరబ్రహ్మ భావము, నతడు పోషించిన యద్ర్వైతము, సాంఖ్య సిద్ధాంత ము, జానకాండ ఇత్యాదులకు కారణవఎల నాకాలపు సంఘుస్థితినిబట్టియే (గ్రహింపపలసియున్నది. నన్నయభారతముస (ప్రతిపాదించిన కర్మకాండ విధానము పాల్కురికి సోమనాథాది శివకవుల పపాబల్యముచే మరుగుపడినది. వీరతైవసిద్ధాంతములకు [ప్రాబల్యము హాచ్చి చేదోక్తకర్మలు నిరాసములైనవి. భక్తిమార్గప్రతిపాదకము, వర్జవిభేదరహితము నగు వీరతైవము ('ప్రజానీకము నాకర్షించినది. ఆ కాలముననే మరియొకపైపున వైష్ణవము ప్రబలి వీరవైష్ణవముగ విజృంభించినది. అట్టి పరిస్థితులలో హరిహరాభేదభావమునకు, జ్ఞాసకాండకు నెంతేని యపసర మేర్పడినది. రాజకీయములతో (ప్రత్యక్షసంబంధము లేకున్నను ఛాయామాత్రముగనైస సారస్వ్యతమున పతిబింబింపకపోచ్చ. కసుక నాయా కాలములండలి చార్మితకాంశముల జ్ఞానము ఆ కాలపు కళాసారస్వతముల నర్ధముచేసికొనుట కెంతయు సహాయపడుచున్నవి.

1730 పందిరి షుల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము భావములు, ఇతివృత్తములు, రచనావిధానములు మాత్రమే గాక, రచనాస్వరూపముగూడ కాలానుగుణముగ మారుట కలదు. ఇతివృత్త (ప్రధానములగు భారత రామాయణాది మహాకావ్యము లొక యుగమునను, రీతిప్రధానములగు నైషధాదికావ్యము లింకొక యుగమునను, ఉక్తిచమత్కార ప్రధానములగు (ప్రబంధములు మరియిక యుగమునను వృద్ధికి వచ్చినవి. కాలాంతరమున నాటకములకు, నవలలకు, కథానికలకు (ప్రాధాన్యము కలిగినది. ఈ విధమున కాలమునుబట్టి కావ్యస్వరూపములో మార్పులు కలిగినవి. యుగయుగమునను (పజల యఖిరుచులను గమనించి ఆకాలపు (గ్రంథముల విలువను నిర్ణయింపవలసియుండును. కనుక చారితక విమర్శ కాలానుగుణమైయుండును. ఒక దేశమునందలి పరిస్థతు లింకొక దేశమున నుండవృ. (పజల మనస్తత్త్యమునుబట్టికూడ సారస్వత స్వరూప మేర్పడుచున్నది. అట్టిచో జాతిసం[పప్రదాయముల నర్థము చేసికొనక రచనలను విమర్శించుటయు, వాని నితరజాతి రచనలతో పోల్చుటయు ఉచితముకాదు. అట్లే నేటి రచనలను పురస్కరించుకొని పూర్వయుగ రచనల విలువను నిర్ణయించుట విమర్శకాదు. పరిణామవాదము బలపడుకొలది చారితకదృషస్టియు ప్రధానమగుచున్నది. అయినను రచనల విమర్శించుచో కాలపరిస్థితుల ప్రభావ వర్దనకు ప్రాధాన్యము కలుగకూడదు. గుణగగ్రహణమునకు దోహద మొసంగునంతవరకే చరితసంబంధము విమర్శుకావశ్యకము.

కవి వ్యక్తిత్వమే యతని రచనలలో ప్రతిఫలించును. కవి జీవితమును పరిశీలించుచో దాని కతని రచనలపైగల ప్రభావము వ్యక్తము కాగలదు. కవి ప్రపంచానుభవ మెక్కువగుచో [గగ్రంథమున లౌకిక విషయము లెక్కువగ గోచరించును. కవి [ప్రాపంచిక విషయ విముఖుడై అంతర్ముఖుడైన జ్ఞానియగుచో నతని రచనల యందు దీపించున దాధ్యాత్మిక జీవితము. అవిరళ జపహోమతత్పరుడు, సంతత సంహితాభ్యాస నిరతుడు, రాజ పురోహితుడు నైన నన్నయ రచనలలో పూర్వ మీమాంసావిధాన మెక్కువగ (ప్రకాశించినది. గీత్మాపోక్తమగు నిష్కామకర్మ యోగమున సాధించిన వేదాంతియు, లోకకల్యాణ ముద్దేశముగ సాత్యవతేయ సంస్కృతి శ్రీవిభవాస్పదమైన చిత్తముతో వాజ్బయరూప యజ్ఞమును బ్రవర్తింపటేసిన సోమయాజియు, జ్ఞానియు నగు తిక్కన రచనలో ఉత్తరమీమాంసార్థము ప్రాధాన్యము వహించినది. తాత్త్విక దృష్టి సర్వత అంతర్వాహనిగ ప్రవహించినది. వేదవ్యాసయోగి నాదర్శముగ నిడికొని,

సారస్వతము; విమర్శ భూపతి లక్షీనారాయణరావు 1731 ద్యంద్వాదుల నధిగమించి, కవిత్వ దీక్షావిధినొంది, నిరాసక్తు డై సాక్షీభూతుడై (పపంచ విషయములను దర్శించు యోగి వల భార తేతివృత్తమును నిర్వహించినాడు.

శ్రీనాథుని విద్యాధికార పదవి, వివిధ రాజాస్థాన పండితులతో నిరంతర విద్యా వివాదము, సమకాలిక పండిత కవిలోకమున కవిసార్వభౌమ పదవీ నిర్వహణము కారణములుగ నతని రచనలలో పాండితీపప్రకర్ష్ణయు, ఉద్ధతియు నెలకొన్నది. (పతి పద్యమునను శ్రీనాథుని వ్య క్తిత్వము ప్రత్యక్షమగుచున్నది. ప్రాపంచిక భోగ విముఖుడు. సౌమ్యుడు. నిరాడంబర ప్రశాంత జీవిత మాకాంక్షించినవాడు. పరమ భాగవతుడు నగు పోతన రచన భక్తి రసపోషక మగుటలో నాశ్చర్యము లేదు. ఆయా ఘట్టములలో కవియు ప్యాతలయందు లీనుడై భక్తి పరవశత్వమున భగవంతుని కీర్తించినాడు.

(ప్రతాపసింహుని భోగకాంతయు, కభావతియు నగు ముద్దుపళని జీవితమే మోహ శృంగార భూయిష్టమైనపుడు, రాధికాసాంత్వన రచనయు నట్టిదగుట వింతకాదు.

వీరేశలింగముగారి జీవితమంతయు సంస్కారమునకై వినియుక్త మైనది. సంఘ మర్థ్ధరహితములగు పూర్వాచార శృంఖలల నుండి విడివడి అభ్యుదయ మార్గమున నడచుటయే యతని యాశయము. అతని రచన లందంతటను గోచరించునదీ స్వాతంత్య్య భావమే. ఇట్లు కవి జీవితము ఆలియుటవలన నతని వచనలను [గ్రహించుటకును, వాని విలువను నిర్ణయించుటకును వీలగుచున్నది. అట్లని కేవల జీవిత చరిత్రపైననే విమర్శకుడు దృష్టని కేంద్రీకరింపజనదు. కపినిబట్టి (గంథముసకు విలువను, స్థానమును నిర్ణయించుటయు తగదు. సమకాలీన విమర్శయందలి దోషములలో నిది ముఖ్య మైనది. రచయిత యొక్క సాంఘిక స్థానమును, అతనికి గల పలుకుబడిని, పదవిని బట్టి (గ్రంథము విలువ నిశ్చతమగుచున్నది. దీనివలన సత్యము మరుగుపడుటయేగాక అసత్య ప్రచారమునకు కూడ నవకాశమేర్పడుచున్నది. గ్రంథమునకు గల విలువకు

(గ్రంథమే పూటగాని యితరములు గావు. కనుకనే, (గ్రంథమును బట్టి తదచయిత జీవితమునకు విలువ కట్టుటయపే న్యాయమని పాశ్చాత్య విమర్శకులు కొందరభ్మిపాయ పడియున్నారు. కవి జీవితము తెలియుటవలన (గ్రంథ రచనయండు కవికి గల

1732 పందిరి మల్లికార్టునరాపు శతజయంతి సంపుటము 4; సాహిత్యము యుద్దేశము తఆలియుటయు, నది కారణముగ రచయితతో మనకు సానుభూతి యేర్పడుటయు జరుగగలదు. అట్టి సానుభూతి కారణముగ [క్రమపద్ధతిలో (గ్రంథమును పరామర్శింపగలుగుదుము. దేశకాల పరిస్థితులును, కవి జీవితమును నటుండ, సారస్వత దృష్టిచే మాత్రమే (గ్రంథమును పరిశీలించి, రచనలో గల గుణదోషములను తార్కిక దృష్టితో పరామర్శించి తత్వమును వెలిబుచ్చుట విమర్శ ముఖ్యభాగము. సార్వజనీనత, సార్వకాలీనత యనునవి యుద్గంథముల లక్షణములు. మానవ మూల(ప్రకృళలికి చెందిన విషయములకు [గంథమునందెంతటి [పాధాన్యమున్నది; భావముల యుదాత్తత యొట్టిది; సాధింపబడిన ప్రయోజన మేది; రచనావిధాన మెంతవరకు హృదయంగమమైయున్నది - అను సాహిత్య మూలతత్త్యములను పురస్కరించుకొని (గ్రంథమును పరామర్శించుట ఉత్తమ పద్ధతి. అలంకార శాస్త్రము కేవలము శిల్ప విషయికముయినది. బహిరషగు స్వరూపమును, రచనావిధానమును మాత్రమే శాస్త్రము నిర్దశింపగలదు. రచనపై నభ్నిపాయమును దెలుపుచు గుణగ్రహమునకు (తోవ చూపునది విమర్శ. రచన వలన పఠితల హృదయములందు గలుగు ఫలితము విమర్శ కవసరము. ఒక కాలముననే, ఒక దేశములోనే భిన్నములగు నభిరుచుల కవకాశమున్నరి. అయినను ఎల్లరు నంగీకరించిన సాహిత్యలక్షణముగూడ గలదు. ఆ కావ్యజీవితమే భిన్నకాలములలో భిన్నరూపములలో భాసించును. సార్వకాలీనమైన ఈ గుణమునుబట్టియే నాటికిని, నేటికిని మహాభారత రామాయణాది కావ్యము లాకర్ష్ణణీయము లగుచున్నవి. మానవ ప్రకృతియందలి మూలతత్త్వములను ప్రతిపాదించు సాహిత్యమున కెప్పటికిని జరామరణములు లెన్టు. ఎల్లరు నంగీకరించు కవితాగుణముల విషయమునగూడ వ్యక్తుల అభిరుచినిబట్టి కొందరికి కొన్నిగుణము లభిమానములు గావచ్చును. కనుకనే విమర్శలోకూడ భిన్నత్వము సిద్ధించుచున్నది. పరస్పర విరుద్ధాశయములు గల కవుల రచనలనుగూడ, వానిలో తనకు నచ్చిన గుణమున్నయెడల, విమర్శకుడు మెచ్చుకొనగలుగుచున్నాడు. సారస్వతము మానవ జీవితచరిత్రమే యగుటచే మానవ ప్రకృతియం దెంత భిన్నత్వమున్నదో సారస్వతమునందును నంతియే. ఆయా సారస్వత శాఖలలో ఎ విషయములు మనోహరములు, సరసములు నగునో వానిని గ్రహించుటయే విమర్శ యనవచ్చును. అట్లు గ్రహించినవానిని ప్రదర్శించుటయందే విమర్శకుని ప్రతిభ వ్య క్తముకాగలదు.

సారస్వతము: విమర్శ భూవతి లక్ష్రీనారాయణరావు 1733 కావ్యగుణనిర్ణయ మొనర్చుటలో విమర్శకుడు న్యాయమూర్తివలె తన తీర్పునకు గల కారణములను గూడ వివరింపవలను. ఒక కావ్య ముత్తమమైనదని ఊరక శాసించుటివలన ప్రయోజనము శూన్యము. కావ్యగుణ నిర్ణయములో విమర్శకుని ('ప్రతిభావ్యుత్చ్పత్తులు ప్రధానములగును. కావ్యగుణముల విషయమున సరియగు నభ్నిపాయముగూడ నావశ్యకము. అట్టి సదభ్యిపాయములు లేకున్నను, గుణములనుగూర్చిన అపోహలకు విమర్శకుడు లోనైనను పాఠకులు తప్పుత్రోవలో పడుదురు. కనుక సాహితీస్వరూపమును గూర్చిన కొన్ని సాధారణసూత్రము లుపాదేయములుగాకతప్పవు. విమర్శకునకు కొంతవరకు నివి సహాయకము లగుచున్నవి.

సుస్థిరాసక్తి (6౧౧౭౧6౧1 1౧16౧650 అనునదొక సాహిత్య లక్షణమని సారస్వత వేత్తల యభ్మిపాయము. ఈ లక్షణము కావ్యమున ప్రతిపాదితమైన విషయమునకు సంబంధించినది కాదు; అది రచనావిధానమునకు సంబంధించినది. శాస్త్ర(గంథమున విషయమునకు శాశ్వత మున్నదియేకాని (గంథమునకు కాదు. అదే విషయముపై కొత్తపుస్తకములు రచితమైనచో పాతది మరుగుపడవచ్చును. సాహిత్యగంథము రచనావిధానము.పె నాధారపడుటచే సారస్వ్యతసీమలో నది శాన్వతముగ నుండగలదు. భారత భాగవ తేతివృత్తములు కావ్యములుగ నెన్నిపర్యాయములు రచితములైనను కవితయ భారత, పోతన భాగపతములు మరుగుపడవు. శాశ్వతత్వపును గుణము రచనాసంబంధి. ఇట్టి శాశ్వతత్వ పరీక్షకు నిలుచుట ఉద్దంథ లక్షణము. "

మానవ హృదయవ్యాపార సంబంధియగు గుణము కాప్యముసకు శాశ్వతత్వము నాపాదింపగలడు. ఆయా సందర్భములలో వ్యక్తియందు గలుగు చిత్తవృత్తి తాత్కాలికము క్షణికమునైనను, మానవ సాధారణ ధర్మమగు భావుకత యనునది విశేషముగ మారునదికాదు. చిత్తమున నుద్చుద్ధములగు వివిధ వృత్తులన్నియు తరంగములవలె లేచుచు నడగుచునుండ భావుకత యను నీ ధర్మము స్థిరమైయుండును. ఈ ధర్మమే హృదయావేశ హేతువు. ఆవేశము వ్య క్రిత్వలక్షణము. హృదయజీవిత సర్వస్వమును నీ భావుకత్నపై నాధారపడియున్నది. కనుకనే సాహిత్యము జీవితమునకు వ్యాఖ్యయగుచున్నది. మానవహృదయమును, హృదయగతభావములను వ్య క్త్రపరచుచు, తస్మూలమున పఠితల హృదయములకు చైతన్యము గలిగించు శక్తి సాహిత్యమున కున్నది. కనుక నడి మానవజీవితమునకు

1734 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గంభీరమగు చరిత్రయు నగును. హృదయ వ్యాపారములతో రచనకు గల సంబంధమే (పధానమగు సాహితీ గుణము. భావనయు చిత్తవృత్తి విశేషమేయగుటచే సాహిత్యమున భావనకుగల ప్రాధాన్య మధికము. ఐన, భావనావృత్తికి కారణములగు భావములు ప్రకృతిసిద్ధములగు సత్యముల_పై నాధారపడియుండవలను. అట్లుకానిచో భావనకు స్టర్యమును భౌెన్నత్యమును సిద్ధింపవు. ఈ భావావేశము స్వార్ధజన్య మైనది కారాదు. తనకు జరిగిన యన్యాయాధర్మముల కారణముచే కవి భావావేశమునకు లోనైనచో నది సర్వజనాకర్షణీయము కాజాలదు. విశ్వజనీనమగు భావము నాధారపడిన యావేశముమాత్రమే సాహిత్యమున కర్ణము. సాధారణీకరణమను ధర్మమున కిదియే మూలము. ఈ సాధారణీకరణ ధర్మమే రసోత్పత్తి కాధారమగుచున్నది. కవి తన్ను మరుగుపరచుకొని, తన భావములకు విశ్వజీవితముతో సమన్వయమును గూర్చుట సాహిత్యసిద్ధి కవసరము. మానవునియందలి సహజసౌందర్య పిపాసను తృప్తిపరచు గుణ మొకటి సాహిత్యమున కలదని యందురు. ఇదియే ఆనందహేతువని ఆలంకారికులు ఇంద్రియముల సాహాయ్యమున నాత్మస్వరూపమును వ్య క్తమొనర్చు విశిష్టసాధనము సౌందర్యమని రస్కిను నభ్నిపాయము. దీనినిబట్టి బాహ్యసౌందర్యవర్ణన మాత్రమే ఆదర్శముకాదని తలియుచున్నది. రమ్యవస్తుదర్శనము, (శావ్యగీతాశవణము, మధురరసాస్వాదనము - ఇత్యాదులన్నియు కేవలము నింద్రియతృప్తితో మాత్రమే యాగక, చిత్తవికాసమునకు, సాత్త్వ్యకానందమునకును హేతువులు కావలను. అట్టి విశిష్టస్రాందర్యమెంతవరకు కావ్యమున ప్రతిపాద్య మైయున్నదను విషయమును విమర్శకుడు గమనింపవలను. భావావేశమును పరితలకు కలిగించుట కావ్యత్వలక్షణమనుట నిజమే. ఐనను నట్టి యావేశ ముచితవిషయకము కావలెను. తుచ్చువుగు కావుము, లోకవిదోహకరమగు వర్గవిద్వేషము - నిత్యాదుల నుపాధిగగొని జనుల కావేశమును గలిగించుట సారస్వత ప్రయోజనమునకు విరుద్ధము. కనుక, వస్తువు, భావము, రచన - ఈ విషయము లన్నిటియందును నౌచిత్యము పాటింపవలను. అనుచిత భావావేశమునకు (560[/%6౧100 హృద యుదౌర్బుల్యవు కారణవుని సాహితీతత్త్వవేత్తల యభ్మిపాయము. కవి భావము స్పష్టముగ వ్య క్త్రమైనప్పుడే పఠితల హృదయమున భావోదయమున కవకాశమున్నది. కవి భావము నిశితముగ వ్య క్తమగుచో నతని

సారస్వతము: విమర్శ భూవతి లక్ష్మీ నారాయణరావు 1735 హృదయావేశములను మనము [గహింపగలుగుదుము. భావ వ్య క్త్‌కరణ విధానమందలి యీ నిశితత్వమే పఠితలందు భావావేగమును గలిగించుటకు సమర్థమగుచున్నది. రచయిత (ప్రతిభావంతుడైనచో చార్మితక విషయములను గూడ భావస్ఫోరకముగ చెప్పగలడు. కార్లెలు రచించిన పరాసు ఏిప్లవ మిందులకు చక్కని యుదాహరణము. గిబ్బను రోము స్మామాజ్య పతనమును సిట్టి రచనయే.

కావ్యారంభము మొదలు నిర్వహణము వరకును రసభంగము కాకుండున ట్లితివృత్తమును పోషించుట కావ్యలక్షణములలో నొకటి. ఉపాధియగు భావమునకు గల స్థర్యముపై నీగుణ మాధారపడుచున్నది. కావ్యాంగములుగ పోషెంపబడు నితరేతి వృత్తములు, భావములు, నిత్యాదులన్నియు స్థాయి భావమునకు పోషకములు కావలయునేకాని తదృంగకరములు కారాదు. పపధాన భావ మేకముఖమున, నిరంతరాయముగ, నుత్తరోత్తరోత్కర్హను బొందుచు, నిలుకడ కలిగి, వికాసమును బొందినప్పుడే రససిద్ధి కవకాశమున్నది. కనుక సమస్త కావ్యాంశములును స్థాయీ భావ పోషకములై, దానికి సరత నాపాదింపవలయును. రామాయణమున (ప్రతిపాదితమైన ప్రతి భావమును పోషితమైన పతి ప్రాసంగిక ఎషయమును, ధర్మమూలకోత్సాహమునకు దోహద మొనర్చి ధర్మవీరముసు పోషెంచినది. మేఘసందేశమున వర్ణితమైన ప్రతి ప్రకృతి దృశ్యమును నాయికానాయక నిష్టమగు ధర్మరతిని పోషించినది. భావైక్య మంతయు (ప్రధానమనియు, రస వరుద్ధంబులు పరిత్యాజ్యములనియు మన లక్షణ కర్తలు శాసించుట పాశ్చాత్య విమర్శకులచే కూడ నంగీకరింపబడినది.

వైవిధ్యము (పకృతి లక్షణము. ఏ యిరువ్లురు వ్యక్తులును నొకేవిధముగ నుండరు. బాహ్య స్వరూపము విషయమున కొంత సామ్యుమున్నను నాంతరంగిక విషయములలో నట్లుండుట జరుగదు కనుక కావ్యమున ప్యాతల సృష్టిలో నీ (ప్రకృతి వైవిధ్య మెంత వరకు పాటింపబడియున్నదను విషయమును విమర్శకుడు (గహింపవలను. భారతేతివృత్తమందలి స్ప పాత్రలను గమనించినచో నీ ప్రకృతి సత్యము గోచరము కాగలదు. కుంతి, గాంధారి, ద్రౌపది, సుధేస్ట. సుభద లొక్కొకరును ప్రత్యేక స్వభావ వ్య క్తిత్వములు గల స్తీ మూర్తులు. పీరి భాపములలో, ప్రపర్తసలో, స్వభావములో - సమస్త విషయములందును వైవిధ్యము సుస్పష్టముగ గోచరించుచున్నది. ఇట్టి ప్రకృతితత్త్వము (పబంధములలో విస్మ్టృతదైనడసు

1736 పందిరి షుల్గికార్టునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కట్టమంచివారి విమర్శలో సత్యమున్నది. ఇట్లె, ఒకేవిధమగు సన్నివేశములలో భిన్నవ్యక్తులు భిన్న విధములుగ ్రవర్తింతురు. వీనిని గమనించనిచో రచన (ప్రకృతి స్వభావానుగుణముగ నుండదు. పాశ్చాత్య నవలా రచయితలలో కొంతమందికి స్త్రీస్వభావము తెలియదనియు వారు తమజీవితమున బాగుగ నెరిగిన ఒకరిద్దరి స్త్రీలను మాత్రమే తమ రచనలలో పాత్రలుగా జేసి చిత్రించినారనియు కొందరు విమర్శించియున్నారు. స్త్రీ స్వభావ వైవిధ్యము వీరికి తెలియకపోవుటచే స్త్రీ పాత్ర లందరు నొకే విధమగు మనస్తత్వమును, ప్రవర్తనను కలిగియున్నారని విమర్శకుల భావము. రవివర్మ చిత్రములు కూడ నిట్టి విమర్శకు గురియొనవి. అతని స్త్రీ చిత్రము లన్నియు భావరహితములుగ నుండుటచే వైవిధ్యము గోచరమగుట లేదు. లక్ష్మీ చిత్రమున భౌతిక సంపదగాని, సరస్వతీ చిత్రమున జ్ఞానసంపదగాని భావరూపమున ప్రదర్శితము కాలేదని కళావిమర్థ్శుకుల యభిప్రాయము. విశ్వమునందలి మానవ ప్రకృతిని స్వార్థరహితులై, నిస్సంగులై గ్రహించి వివరించు కళాస్రష్టలు మాత్రమే ప్రకృతి వైవిధ్యమును (ప్రదర్శింప గలుగుచున్నారు. అట్టి రచనలు మాత్రమే (పకృతికి (పతిబింబము లగుచున్నవి. వ్యాస వాల్మీకి ప్రభృతు లట్టివారు. 3601 ౧40% 10016, 50౧6561 [12600౧2గ వంటి నవలా రచయిత లట్టి వైవిధ్యమును పోషించినారు. భావనా (ప్రధానములగు గీతములను గేయములను రచించు కవులు, చాలవరకు, నొకటి రెండు చిత్తవృత్తులను (140069) వూ(త వె చిత్రింపగలుగుచున్నారు. ఆత్మాశ్రయ కవితా స్వభావమే యీ యవధికి హేతువు. విప్రలంభమును కొందరు, మానసికమగు సాత్త్విక ప్రణయమును కొందరు, నైరాశ్యమును కొందరు - ఇట్లు ఒకటో రండో చిత్తవృత్తులను మాత్రమే యభిమాస విషయములుగ వీరు పోషించుచున్నారు. భావ శబలత, గాంభీర్యము, భావ స్థెర్యము గేయకవిత్వమున నుండ వీలులేదు. భావావేగ, భావావేశముల ప్రాధాన్యమున రసోత్పత్తికలుగుట యీ రచనలందలి ముఖ్య లక్షణము. రచనయం దాదినుండి తుదివరకును నొకే చిత్తవృత్తిని, ఉత్తరోత్తర ముత్కర్ణబొందునట్లు పఠితల హృదయము లావేశపూరితములై రసానుభూతిని గాంచునట్లు చిత్రించవలెను. ఇది భావనాప్రధానమగు కావ్యరచనా విధానము. మేఘసందేశ గీత గోవిందాదు లిందుల కుదాహరణములు. భావ తీవతయే యిట్టి రచనలందలి ప్రధాన లక్షణము.

సారస్వతము: విమర్శ భూపతి లక్షనారాయణరావు 1737 ఐనను, పోషిత భావము మానవ ప్రకృతికి సహజమైనదా యను విషయము విమర్శకుడు గమనింపదగినది. జీవిత చితణమునందు కవికి గల యుద్దేశము రచనయందు నిగూఢమైయుండును. దానిని గుర్తించి వివరింపవలసిన బాధ్యత వమర్శకునిపై గలదు. ఉన్నతోదేశము లున్నత భావములకు (శేరకములై కావ్యమున కుత్కర్హ నాపాదింపగలవు. కావున, కావ్యమునకు విలువ గట్టుటలో, విషయమునకు (ప్రకృతితో సంబంధము, కావ్య రచనవలని ప్రయోజనము, భావౌన్నత్యము, భావములను పోషించిన విధానము - అను వివరములను విమర్శకుడు 'ప్రధానముగ గమనింపవలెను. ప్రకృతి విషయముల నిజస్వరూపమును మనోనయనముచే (గ్రహించి వానిని భౌతిక వస్తువులవలె ప్రత్యక్షీకరింపబేయు శక్తికి మన హృదయములపై గల (పభావ మధికము. మన భావావేశ సర్వస్వమునకును నిది హేతువు. ఈ శత్తియే భఖావనాశక్తి. ఇది లేనిచో రసోత్పత్తియే గలుగదు. మన జీవితమందలి యనుభవములనేవి, వాని పొందికచే నూతన సృష్టిని గావించునది సిసృక్షాత్మక భావన (0/8౭20౪8 1౧౧౭౦౧౬1౦౧). ఈ నూతన సృష్టి హేతుబద్ధమగుచో నుది (పకృతికి సన్నిహితమగుసు. 'హేతుబద్రముకాని భావన్నాస్యైరప్పృత్తి కామచారమగుచున్నది. పస్తుతత్త్యమును వివరించుటలో భావన యొక సాధనమనియు, దానికి వస్తువు నాంతర బీవితమును దర్శింపగల శక్తి కలదనియు వర్హువర్తు కవి. దృశ్యమును సూక్ష్యాతపూక్త్మముగ, విప్పులముగ వర్టించుట వలన ప్రయోజనము తక్కువ, అందువలన విసుగుకూడ జసింపగలదు. ఆ దృశ్యము తనలో రేకెత్తించిన భావమునకు, పోషకములగు నంశములకు మాత్రమే తగు [ప్రాధాన్యము నిచ్చి, దృశ్యముసకు నూతన రూపము నొసంగవలయును. అదియే కళారహస్యము. భావన యిందులకు తోడగుచున్నది. స్పృతిపథమున నిలిచిన చిత్రము ప్రత్యక్ష వస్తువుకంటెను సుండరముగ నుండుటకు భావనరిపే హేతువు. ఒక వ్యక్తి మన చిత్తమున ననురాగమును పికసింపబేసినచో నా వ్యక్తి రూపము తద్బావ పోషకములగు లక్రణములతో మస మసస్సున నేర్పుడును. తద్భావవిరుద్రములగు మనోఫలకముసకును గల ముఖ్య భేడమిది. మన భాపము ససుసరించి పోషకములగు లక్షణములు మాత్రమే మనోచిత్రమున స్టిరపడి, తక్కినవి బారిపోవుచున్నవి.

1738 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సుందరములగు వస్తువులు స్మృృతిపథమున సుందరతరముగ గన్పించుట కిదియే కారణము. వాస్తవదృశ్యమునందలి అరమ్యములు, అప్రియములు నగు నంశములపై మన దృష్టినిలువక, మనకు నచ్చిన యంశములపై మాత్రమే కేంద్రీకరించుటచే, వునోఫలకమునం దేర్చుడిన చితము చాలవరకు భావానుసరణముగ రూపొందుచున్నది. ఆ వస్తువు స్మరణకు వచ్చినపుడెల్ల, మన కా వస్తువునెడ గల భావము కారణమున, సంగతములగు నంశములే పధానములై మనోనయనమునకు గోచరింపగలవు. ఈ భావానావ్యాపారకారణముననే ప్రియులు (పియతములుగను, నప్రియులు వికృతరూపులుగను గోచరించుట. అనగా, వాస్తవదృశ్యము భావనాత్మకమైనదని యర్థము (1606811566). “నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు_పై జల్లడు మోమువాడు” అని కృష్ణు నన్వేషెంచు గోపికల హృదయములలో కృష్ణుని రూపము భావనాత్మకమూర్తిగ నెలకొన్నది. అల్లే, “దర్భాంకురేణ చరణక్షత ఇత్యకాండే తన్వీ స్థితా కదిచి దేవ పదానిగత్వా ఆసీద్వివృత్త వదనా చ విమోచయన్తీ శాఖాసువల్మ్కల మసక్తమపి దుమాణామ్‌” అని స్మరించుకొను దుష్యంతుని హృదయఫలకమున సవిలాసమగు శకుంతలా స్వరూపము భావనాత్మకమూర్తి యొ నిలిచినది. ఈ భావనా వ్యాపారకారణముననే తా వలచినది రంభగా గోచరించుట. ఇట్లు, అనుభవమునందలి దృశ్యములు ఖావనాత్మకరూపవమల నందుట రసోత్పత్తి కెంతయు నవసరము. జ్ఞానసముపార్దనకుకూడ భావనాశక్తియే ఆధారము. మన అనుభవమంతయు భావచిత్రముల రూపమున మనసున స్థిరమగుచున్నది. ఈ భావచిత్రముల మూలముననే యోచనాప్రవృత్తి జరుగుచున్నది. మానసిక జీవితమున కంతటికిని ఈ భావచిితములే సాధనములు. సాహిత్యము భావనావ్యాపార ప్రధానమైనది. కవికివలెనే వమర్శకునకుగూడ నిశితమగు భావనాశక్తి అవసరము. భావమయ జీవితమునకు భావనాసామర్థ్యము తార్కాణము. జీవితము భావమయమైననాడే ('ప్రకృతితత్త్వమును, కవి హృదయమును గమ్యములగును. కావున, హేతుబద్ధమగు

సారస్వతము: విమర్శ భూనతి లక్షీనారాయణరావు 1739 భావనావ్యాపారమునకు కావ్యమున నెంతటి 'ప్రాధాన్యమున్నది, అది యెంతవరకు పఠితహృదయములను భావమయములుగ నొనర్చినది యని పరిశీలించుట విమర్శన పద్ధతి.

గంభీరము, స్వాస్థ్యము నగు భావమున కుదాత్తమగు నొక సత్య మాధారమనవి ఏజ్ఞానవేత్తల నిశ్చయము. గంభీరోదాత్తభావములులేని సాహిత్యమున కుత్కర్ణ సిద్ధింపదనియు, ప్రతిపాదితమైన సత్యముయొక్క సారమును, విస్తృతినిబట్టి రచనకు మాన్యత కలుగుననియు (ప్రాక్స్రతీచీ పండిత విమర్శకుల నిర్ణయము. (ప్రకృతి సిద్ధములగు వస్తువులలో వినూత్నత లేదనియు, కనుక అపూర్వ వస్తుకల్పన కళ కవసరమనియు నొక యభ్మిపాయమును కలదు. కాని, ప్రకృతియందు లేనిదానిని కప కల్పింపడు. కల్పించినను నవి మనల నాకర్ష్ణింపవు. (పపకృతిసిద్ధములైన వానిని చిప్రించుటయందే కవి వినూత్నతను [పదర్శించును. మానవజీవితమునందలి సారవంతములగు సత్యములను, పరమార్థములను ఉల్లెఖించుటయందే వినూత్నత కలదు. వాని నావిష్కరించి, చ్మితించుటకై కవి గావించు సన్నివేశకల్పనయందు నవ్యతావ్య క్తిత్వములు వ్య క్తములు కాగలవు. కవి (పతిపాదించు సత్యములు కొత్తవికావు. వానిని చిత్రించు విధానము కొత్తది. ఆ చిత్రణవైశిష్ట్య్రమునుబట్టి పకృతిసత్యములు భావచిత్రములుగ హృదయమున నేర్పడుచున్నవి. అట్లేర్చడి స్థిరములైన భావచిత్రములు మన భావనాప్రవృత్తికి దోహద మొనర్చి, ఉపలబ్ధికి హేతువు లగుచున్నవి. కావ్యమున పోషితములైన పప్రకృతివిషయముల యుదాత్తతనుబట్టియు. రచనాకొశలముచే నేర్పడిన భావచ్చితవుల యుత్పేకమునుబట్టియు కావ్యమునందలి చిదంశము నిశ్చితవుగును, (పకృతివిషయముల అంతరార్థమును వ్రదర్శించుటకే కళాసష్ట (పయత్నించును. కళాదర్పణమున (ప్రకృతి ప్రతిబింబించునని పషేక్సుపియరు మహాకవి (&గ౧౦|6౩ గా|౯౦౯౮౦1౦ స౬|౪/6). విశ్వ జీవిత సంబంధముచే కావ్యవస్తువు భావనా మార్గమున బింబరూపముగ నేర్పడుచున్నది. అట్లు హృదయఫలకమున చిత్రితమైన ప్రకృతిబింబ మున్నతభావస్పోరకమై, ప్రకృతి తత్త్వజ్ఞానమును కలిగించును. ఉత్తరోత్తరము నుత్కృష్టమగు సౌందర్యమునకు దారిచూపుట సౌందర్యలక్షణము. అట్లే జ్ఞానమును విశిష్టజ్ఞానమునకు మూలమగుచుస్నది. కనుక, కావ్యమున ప్రతిపాదితమువైన భావాన్నత్య భావసౌందర్యములు, పకృతి సత్యములు - నిత్యాదు లెంతవరకు

1740 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4 సాహిత్యము పాఠకుల చేముషీవికాసమునకును, జీవితాన్నత్యమునకును పోషకము లగుచున్నవని విమర్శకుడు పరిశీలింపవలసియున్నది. ఇక, గద్య పద్యవిభాగవము, శబ్దాలంకారములు, శఇెలీత్యాదులు కవితాబాహ్యస్వరూపమునకు జెందినవి. ఐనను వీనికి పోషితభావముతో సన్నిహిత సంబంధమున్నది. గద్యపద్యములలో నేది యుద్దిష్టభావమున కనుకూలించునో కవి నిర్ణయించుకొనవలయును. వాచ్యార్థ(ప్రధానములు, విషయోపన్యాస 'పప్రయోజకములు నగు శాస్త్రవిషయములకు పద్యరచన పనికిరాదు. తార్కికచర్చయు, విషయ వివరణమును (ప్రధానములగు నుపనిషదాది వాజ్బయభాగమంతయు వచనముననే రచితమైనది. రసవంతమగు వస్తువుతప్ప నితరము పద్యమున కర్పముకాదు. భావోద్వేగ భావావేశముల కెక్కువగ ననుకూలించునది ఛందస్సు. భావవైవిధ్యమునుబట్టి ఛందస్సుకూడ ఖిన్నరూపముల నందుచున్నది. శబ్దముల యుపయోగము సమాసముల కూర్పు, శయ్య మున్నగునవి భావపోషణ కనుకూలింపవలెను. ఆలంకారికు లీ విషయములనే వృత్తి రీతి గుణములని వివరించినారు. పాశ్చాత్య విమర్శకులుకూడ రచనయందు వీనికిగల ప్రాధాన్యము నంగీకరించినారు. శబ్బములకు గల నాదసౌందర్యమునుకూడ వీరు గుర్తించి యది భావపోషణ కెట్లనుకూలించునదియు సోదాహరణముగ నిరూపించినారు. మన ప్రాచీనులు పేర్కొనిన వాచ్యార్థ లక్ష్యార్థ వ్యంగ్యార్థములను పాశ్చాత్య పండితులు (౧|౫౭౧/౧ 56000620/ 2౧61 5099651౪/68 గా౭౭౧1౧౦5) గుర్తించి, వానికి కావ్యత్వసిద్ధియందుగల (ప్రాధాన్యము నుగ్గడించినారు. అ(ప్రకృతార్థస్ఫూ ర్తిని వీరు భావసాహచర్యమని (ఉ55001410౧ 0 1౮625) పేర్కొని, యీ శబ్దార్థశక్తి యెట్లు కావ్యసౌందర్య పోషకమో వివరించినారు. ఐసను, నీ గుణములలో నేవి యంతవరకు పోషింపబడవలయునో, ఏవి భావపోషణ కుచితములో యను విషయములను చక్కగ గమనింపవలను. అనగా, స్వరూప రచనలో కవి మిక్కిలి జాగరూకత వహింపవలయునని అర్థము. సంయమనము యోగికివలనే కవికిని ఆవశ్యకము. ఈ సంయమనము లేకపోవుటవలననే ఆంధ్రప్రబంధములలో నంగాంగ భావ సామరస్యము ఛచెడినది. వ్య క్తిస్వరూప సౌందర్యమునకు 'ప్రత్యేకాంగముల సౌందర్య మేకాక వివిధాంగముల సౌష్టవమును ముఖ్యము (9/గ౧౭1౧). అప్పుడే సమగ్రస్వరూపము మూర్తిమంతమగును. అట్లేర్పడిన మూర్తి ఆత్మవంతముకూడ

సారస్వతము:; విమర్శ భూపతి లక్షనారాయణరావు 1741 నైనచో వ్యక్తిత్వము సిద్ధించుచున్నది. అట్లే, కావ్యవిషయమునకూడ, ఆకృతి రచనయు, రసభావ పోషణయు నన్యోన్యానుగుణముగ భాసిల్లవలయును. ఈ విషయమునందు కవి యట్లు కృతకృత్యు డైనదియు వివరింపవలసినవాడు విమర్శకుడు. ఇట్టి విశిష్టధర్మమును నెరవేర్చుటకు విమర్శకునకు సమగ్రమగు వ్యుత్పత్తి యవసరము. వివిధ శాస్త్రపాండిత్యము మాత్రమేకాక విశాలమగు (పపంచానుభవమును, భావనాత్మకమగు చిత్తమును నవసరములగుచున్నవి. బహుముఖవ్యాప్తము, సంకీర్ణమునగు జీవితమును సమ(గ్రముగ చిత్రింపగల శక్తి సాహిత్యమునకు మాత్రమే కలడు. కావున, జీవితమునకు సమ(గ్రవ్యాఖ్యానమగు సాహిత్యమును పరామరిాంచుటకు జీవితమును గూర్చిన అఖండజాన మవసరమగుచున్నది. సృష్టెసౌందర్యముసు, (ప్రకృతియందు నిగూఢములైయున్న రహస్యములను వెలువరించుట కవి యాశయము. ఐనను, నిట్టి యుద్దేశమే ప్రధానముగ కావ్యరచన కతడు బూనుకొనడు. ప్రకృతి సౌందర్యమునకునుః నందలి రసవత్తరములగు విషయములకును ముగులై, ఆనందపరవశులై కపుులు తమ యనుభవమును కవితా మార్గమున నభివర్జింప యత్నింతురు. భావావేశముచే తన్మయతను జందడుట కళాసృష్టికి మొదటి హేతువు. తదానందానుభూతి నితరులకు కళద్వారా వ్య క్త్రపరుపదలచుట "రండవ కారణము. విమర్శకుడును నల్లే, కవి సృష్టియందలి భావసౌందర్య రచనాసౌందర్యములకు ముగ్గుడై, తనకు గలిగిన ఆనందాతిశయము నకు కారణములగు రచనావిశేషములను విపరించును. ఈశ్వరసృష్టికి కవి భాష్యప్రణేతమైనట్లు కవి సృష్టికి విమర్శకుడు వ్యాఖ్యాత యగుచున్నాడు. కవివలనే విమర్శకుడును ఆవేశమునొలదియే విమర్శ రచింపగలడు. భావనాత్మకమగు హృదయమును, పకృతిసాౌందర్యముసు దర్శించగల దృష్టైయు, తన అనుభూతిని రసవంతముగ చెప్పగల త్తక్త్‌యు, కవికివలెనే విముర్శకునకును తప్పనిసరి. ఇవి లేనినాడు కావ్యరచనయు జరుగదు; విసుర్థు రచనయు జరుగదు. అనందానుభూతియే కళాసృష్టికిని, విమర్శ రచనకును మూలకారణము. తదనసుభవముచే సెద్ధాంచన విమర్శలయండే కామి శిల్పము గోచరించుచున్నది. ప్రకృతి సత్యములసు రమణీయమగు మార్గమున నుపదేశించుట కావ్యధర్మమని

1742 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఆలంకారికులు గావించిన నిర్దేశము విమర్శ విషయమునకూడ నన్వయించుచున్నది. కావ్యము నందలి గుణదోషముల జ్ఞానమును సరసమార్గమున పాఠకులకు గలిగించి, కావ్యరసాస్వాదన విషయకమగు నభిరుచిని విమర్శకుడు కలిగించును. (పకృతియందు నిగూఢములై యున్న సత్య సౌందర్యాదులు సామాన్యులకు గోచరములు కానియట్లే, కావ్యమున నిగూఢములైయున్న భావ విశేషములును, శిల్ప సాందర్యాదులును సామాన్యులకు గోచరములు కావు. అట్టివానిని రమణీయమగు విధానమున వివరించి పాఠకులకు చిత్తవికాస బుద్ధివికాసములను గలిగించుట విమర్శకుని ధర్మము. కలావిషయకమగు నభిరుచిని గలుకజేయుట విమర్శకుని (ప్రధాన కర్తవ్యము. ఆనసుషంగికముగ నాయా సందర్భముల ననుసరించి శాస్త్ర విషయక జ్ఞానమును కూడ విమర్శకుడు కలిగింపకలడు, వేదము వెంకటరాయశాస్త్రిగారి ఆముక్తమాల్యదా వైషధీయ వ్యాఖ్య లందుకు దృష్టాంతములు. ఈ విధమున సామాన్య పాఠకులు కూడ సంస్కారముసు బొంది, అభ్యాసవశమున కళాభిరుచి నలవరచుకొనగలరు. కావృన, కావ్య వివుర్శ సంస్కృతి

పోషకమగుచున్నది. పాశ్చాత్య దేశములలో కళాసంబంధమగు విజ్ఞాన మఖివృద్ధి జందుటకు విమర్శక (గంథములే కారణములనుట అతిశయీక్తి కాదు. కళాభిరుచ చాలవరకు జన్మతః సిద్ధింపవలననుట నిజమే. ఐనను, శిక్షణాభ్యాసములు కళాభినివేశమును, అభిరుచిని కొంతవరకు కలిగింపగలవనుట కూడ నిజమే. మనోహరములగు విమర్శలు కావ్యపఠనకు పాఠకుని పురికొల్చి, [క్రమముగ కావ్యసౌందర్యమునం దాసక్తిని కలిగింపగలవు. కళాసృృష్టికి వలయు ప్రతిభను విమర్శలు కలిగింపలేవు. కాని, కళానుభవమునం దాసక్తిని మాత్రము తప్పక కలిగింపగలవు. విమర్శకుడు తన అభిరుచులకు ప్రాధాన్యమిచ్చి పాఠకుల వ్య క్రిత్వమును నిరోధించుట తగదు. కళావైశిష్ట్రమును సహేతుకముగ నిరూపించుటయే విమర్శకుని లక్ష్యము కావలనుకాని, ఆత్మాఖభ్మిప్రాయ శాసనము లక్ష్యము కారాదు. రాగద్వేషాదుల కతీతుడైనప్పుడే విమర్శకు డఖండసత్యమును వివరింపగలడు. లేనిచో పాక్షిక సత్యము మాత్రమే యతనికి గోచరించును. ఇష్టుడగు కవి రచనలను పరామర్శింప బూనినపుడు అతిశయోక్తులకు నత్యుక్తులకు నవకాశమున్నది. కావున, విమర్శకుడు జాగరూకత వహింపనిచో, హేతుబద్ధమగు విమర్శకు మారుగ, వందిమాగధ స్తోత పాఠములు సిద్ధింపగలవు. మరియు,

సారస్వతము: విమర్శ భూవతి లక్ష్మీ నారాయణరావు 1743 కవినిగూర్చి యొక యఖభిపాయమును ముందే నిశ్చయించుకొని, తదభ్మిపాయ సమర్థన కావ్యమును పరిశీలించుటయు శాస్త్రీయ విమర్శకాదు. ప్రకృతి ధర్మములను వ్యాకరించి, వానిని బురస్కరించుగొని గాస్త్రజ్ఞ్జుడొక సిద్ధాంతమునకు వచ్చునేకాని, తన సిద్ధాంత సమర్థనక్రై (పకృతి ధర్మములను సరిపెట్టడు. తన కిష్టుడు కాని కవి రచనలను విమర్శించుపట్ల కూడ విమర్శకు డ(పప్రమత్తుడై యుండవలెను. లేనిచో కళకే యపకారము జరుగగలదు. పలుకుబడి గల విమర్శకుల అధర్మ రచనలకు గురియై, సత్కావ్యములు కవులు (కుంగిపోయిన సందర్చములు కూడ కలవు. వ్యక్తిగత ద్వేషమో, అభ్మిపాయ ఛభేదమో గల కవుల రచనలను విమర్శకుడు స్పృశింపకుండుటయే (శేయము. లేనిచో సారస్వతమునకే ద్రోహము కలుగవచ్చును. ఇక, కవుల నొండొరులతో బోల్చి తారతమ్య నిరూపణ గావించుటకుకూడ అభిలషణీయము కాదు. ఏ యిరువురు కవులును నొకే యుద్దేశముతో కావ్యరచన గావింపరు. ఇరువురి యభిరుచులును, భావములును, వారు పాటించు రచనా విధానమును నేకీభవింపవు. పోషిత వస్తు వొక్కటియేయెనను, సన్నివేశ కల్పన, రసపోషణ, కైలీత్యాదులలో నిరువురును భిన్నులగుట తప్పదు. వ్యక్తిత్వ లక్షణమే యిది. కావున కవుల నొండొరులతో పోల్చి న్యూనతాధిక్యములను నిరూపెంచుట అనుచితము, నశాస్త్రీయమునగును. అట్టిచో, భిన్నకాల భిన్నవ్యవస్థలకు చెందిన కవుల తారతమ్యము నేర్పరుపబూనుట విమర్శుకాదు. కావ్య రచనయందు కవి యుద్దేశ మెంతవరకు నెరవేరినది; తన్నిర్వహణమున కవి యవలంబించిన విధాన మెంతవరకు సరసమైయున్నది; కావ్య పఠనమువలన పాఠకునకు గలిగిన చిత్తవృత్తి యుట్టిది - అను విషయములను బురస్కరించుకొని కావ్యమును పరామర్శించుట తగిన పద్ధతి. మన కభిమానము గల కవి నాదర్శముగ జేసి, యతని రచనతో తక్కిన కవుల రచనలను పోల్చి, గుణ నిర్ణయ మొనరించుట కూడ తగిన పద్ధతి కాదు. బంగారమువంటి నిర్జీవ పదార్థము విషయమున మాత్రమే అట్టి పరీక్ష తగినది. (ప్రతిభావ్య క్తిత్వములు గల యేకవియు నితర కవిపలె రచింపడు; రచింపజాలడు. (ప్రపంచము మన యభిమాన విషయములకు మాత్రమేకాక ఇతరములకు కూడ స్థానము. లోకోభిన్న రుచి యను నానుడి విమర్శకుడు మరుపరాబది.

1744 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము కావ్యమునందలి వేర్వేరు భాగములను వేర్వేరుగా పరిశీలించి, కావ్యమును గూర్చిన యఖ్మిప్రాయ మొసంగుటయు సరియగు విధానము కాదు. విగ్రహము యొక్క వివిధాంగములను (ప్రత్యేకముగ పరీక్షించుటచే సమగ వ్యిగహ సాందర్య మవగాహన కాదు. సుందరములగు వివిధ భాగముల నొకచో చేర్చినను సుండర విగహము సెద్ధింపదు. కావ్యమును సమిష్టైగ, మనస్సుచే దర్శించినపుడే తత్సొందర్యము బోధపడగలదు. గ్రంథమునందలి వివిధ భాగములను పరిచి, దాని సంకలన పద్ధతిని వివరించి, అదియే దాని విలువ యనుట పొరపాటు. సారళ్యము నొకరు," అర్థశక్త్‌ నొకరు, అలంకార వైశిష్ట్ట్రము నొకరు పరిశీలించి, అభ్మిపాయములనన్నిటిని గలిపెన నది విమర్శ కాజాలదు. రచసయందలి రసవ్యుక్తి దెబ్బదినుటయే యీ పద్ధతికి ఫలము. కావ్యమున గుణములన్నియు కలిసె, పరస్పరము నొక దానిపై నొకటి (ప్రభావము చూపుచుండును. కనుక నొకదానినుంలడి వేరొకదానికి వేరుపరచుటకు సాధ్యము కాదు. విమర్శక సూత్రములను ముందుగా నేర్పరుచుకొని, వానిని కావ్ధ్యమునకు వర్తింప జేయుటకూడ సరియగు విమర్శక పద్ధతి కాదు. విమర్శక స్మ్నూతములు మార్గదర్శకములు మాత్రమే యగును కాని, ప్రకృతి సూతములవలె సిత్యములు నవిలంఘనీయములు కావు. ప్రజల యభిరుచి ననుసరింఓ విమర్శక సూత్రములు సార్వకాలిక సిద్ధాంతములు కావు. సూత్రములచే నుద్దిష్టమగు ప్రయోజనముసు (గ్రహించుటయే ముఖ్యము. లక్షణ (గంథములందలి దోష ప్రకరణమును బట్టి విమర్శించుచో మనకు కావ్యములే లేకుండ నగును. విషయ పరిజ్ఞానమునకు సహకరించుచు, కావ్య సమీక్ష యందు మార్గమును సూచించుట మాత్రమే యీ సూూత్రముల ప్రయోజనము. కవికాలపు సారస్వత సంప్రదాయములను నప్పటి ప్రజల యభిరుచులను,సాంఘిక పరిస్థితులను, కవి యుద్దేశమును, పురస్కరించుకొని విమర్శకుడు సూతముల నేర్పరచుకొనవలయును. విమరుక సూత్రములను పరోక్ష మార్గమున వర్తింపజేయువ లెనేకాని, (ప్రత్యక్ష మార్గమునకాదు. అసంగతములగు విషయములను, భంగహేతువ్పులగు పూర్వా్మిపాయములను మన విమర్శ మార్గ్లమునుండి తొలగించుటకు, సూతములు, సిద్రాంతములు నుపకరింపగలవే కాని, కావ్యమునందలి గుణమును జూపించుట కుపకరింపవని గ(౦౧|68. విమర్శకుని వ్య క్తిత్వముతప్పు విమర్శ లక్షణమును చేరొకటి యేర్చురుపజాలదు. సూత్రములను విమర్శకుడు విస్తరింప జేయగలడుకాని

సారస్వతము: ఏమర్శ భూవతి లక్ష్మీనారాయణరావు 1745 సూత్రములు ఏమర్శకుని శక్తిని విస్తరింప జేయజాలవని 00౧14669. ఎన్ని సూూతములున్నను, విమర్శకుని అభిరుచియు, ననుభవమును, నక్సిసామర్థ్యములును నతని రచనయందు ప్రతిఫలించుననుటయే సత్యము. అభిరుచికి వ్యుత్పత్తికూడ తోడైనచో విమర్శన కుదాత్తత సిద్ధింపగలదు.

కళాస్రష్టయ విమర్శ చేయుట కర్షుడని యొక అభ్మిపాయము కలదు. కళాసృష్టి చేయలేనివారు విమర్శకు లైనారని 013/2 విమర్శకులను నిరసించినాడు. ఈ యభ్మిపాయము విచారమూలకము. కళాసృష్టికంటెను కళావైశిష్ట్ర వివరణ మెక్కువ కష్టమైన కార్యమని 0902 ౪/06. షేక్సుపియరు రచనల వైశిష్ట్యము నుగ్గడించు వివమర్శకులందరు నట్టి రచనలను గావించినవ్నారై యుండవలెననుట అర్థరహితమైనది. కావ్యము బాగున్నదా లేదా యనుటకు విమర్శకుడవసరములిదు. ఎచ్చట గుణమున్నది, ఎచ్చట లేదు అని చూపుటకే విమర్శకు డవసరము. కళాకారుడే విమర్శకుడు కూడ నగుచో తద్విమర్శ్మయందు ఆత్మస్తుతి, పరనిందలు ప్రాధాన్యము వహింపవచ్చును. విమర్శకు డవసరము లేదనుట రసికుడే యవసరములేదనుట వంటిది.

“సరసులు దంతపుష్టి సరసంబగు నిక్షవుంజించి చీల్చిలోని రసముం[గోల నేర్తు రది నేరనివారిందదసంబు. జషకంబున నించి యొసంగునట్లు” కావ్య (ప్రకాశనము చేయుట విమర్శకుని కర్తవ్యము.

సారస్వత [పప్రపంచమందలి యుత్తమ భావములను [గ్రహించి వ్యాప్తి గావించు స్వార్ధరహిత (ప్రయత్నము విమర్శయని 112064 &గ౦|౦ యొక్క అభిప్రాయము. వివమర్ధు యన గుణ[గ్రహణమును రసానుభూతియునని గ౦౯౪గ ౧6. గుణ[గ్రహణశక్తిలేనిచో కవి హృదయ మర్థము కాదు.

రచనకు విలువను కట్టుటలో విమర్శనకును మార్గదర్శకమగునది సాంఘిక దృక్పథము. మానవుడిచ్చిన విలుపతప్ప కాంచనాదులకు గూడ వేరు విలువలేదు. అల్లే, రచనకును, విమర్శకును గల విలువకూడ సాంఘిక దృక్పథమునుబట్టి యేర్చడినదియే. కాలానుగుణముగ నభిరుచులును దృక్పృథములును మారుట తప్పుదు. కనుక విమర్శకుని అభ్మిపాయముల_ పె సాంఘికాభిపాయములకు (ప్రాబల్యమున్నది. ఐనను, ప్రతిభా వ్య క్రిత్వములు గల విమర్శకుడు సాంఘిక దృక్పథమును గూడ మార్పగలుగుచున్నాడు. శాస్త్రమార్గమును గాక కళావిధానము

1746 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ననుసరించు విమర్శకునకు సంఘముపె నెక్కుప (ప్రభావముండుట కవకాశమున్నది. వేమన గావించిన సాంఘిక విమర్శకుగల ప్రభావము నీతిశాస్త్ర (గంథములకు లేదు. శతక వాజ్బయమును, నందు ముఖ్యముగ నరసింహ శతక సర్వజ్ఞ శతకములు నిందుల కుదాహరణములు. సారస్వత విషయమున సంఘమును సక్రమ మార్గమున నడప్పుటకు విమర్శకున కపకాశమెక్కువ. ప్రజలను తప్పుతోవలలో (త్రిప్పుటకుకూడ నవకాశమున్నది. కనుక, లోకశేయము, సహృదయత, బెదార్యము, సర్వసమత్వము, ఆధ్యాత్మిక దృష్టి - విమర్శుకున కవసరములు. లేనిచో స్వార్థపరుడగు శాసకునివలన దేశమునకు (ద్రోహము కలుగునట్లు, విమర్శకునివలన గూడ సారస్వత జీవితము పతనము నందవచ్చును.

(ప్రాచీన సంస్కృతియు, సంప్రదాయములును నభివృద్ధి నిరోధకములనియు,

నవి నిర్ణీవములగుటచే పరిత్యాజ్యములనియు నొక యభ్మిపాయము సారస్వత రంగమున నేర్పడినది, ఇదియొక యపోహ. ప్రపంచమం దింతవరకును (పతిపాదితములైన యున్నత భావములే సంస్కృతికి మూలమనియు, కనుక నవి తప్పక గ్రాహ్యాములనియు ఆర్నాల్లు నభిప్రాయము. ప్రాచీన సంస్క ఎతిజన్యమే ప్రస్తుత సంస్కృతి యగుటచే ప్రాచీన విజ్ఞానము మూలముననే ప్రస్తుత సంస్కృతి నర్థము చేసికొనవలసియున్నది. ఉత్తమ నూతన సృష్టి యొక సాధనము. (ప్రాచీనాంశములును భావి బీజములును కూడ నేటి సృష్టియందు గలవు. కావున ప్రాచీన సంప్రదాయమును పూర్తిగ విసర్జింప వీలులేదు. అట్టి అవసరమును లేదు. పూర్వులు ధరించినట్టి వస్త్రములనే మనము ధరింప నక్కరలెదు. కాని పూర్వ సంప్రదాయమను మిషచే వస్త్రములనే విసర్జింపము కదా! వివాహము, గృహనిర్మాణము, సాంఘిక వ్యవస్థ - అన్నియు సంప్రదాయములే, కాలానుగుణముగ వానిని మన జీవిత వ్యవస్థ కనుకూలించునట్లు మార్చుకొనుచున్నామే కాని వానిని వదలిపెట్టుటలేదు. ఖాషయు సంప్రదాయ సిద్ధమైనదియేం. కనుక, కళావిషయికములగు సం(పప్రదాయములనన్నిటిని నిర్మూలింపవ లెననెడి యభఖి[పాయము బలహీనమైనది. వినూత్నమైన కల్పనయందే ప్రతిభ యున్నదనుకొనుటయు పొరపాటే. ఏదియు కొత్తగా నెంతో కాలముండదు. ప్రాచీన వస్తువే ప్రతిభాశాలురచే నూతనాతి నూత్నమగు రూపమునంది శోభిల్లగలదు. ప్రతి మహాకవియు తప్పక ప్రాచీన సంప్రదాయానుసారియు, నూతన మార్గగామియు

సారస్వతము: విమర్శ భూపతి లక్షీ నారాయణరావు 1747 కూడనైయున్నాడని ౬04 58161 యొక్క అభిప్రాయము. కవిత డిండీరమువలె ఎప్పటికప్పుడు నూత్నమును, కులపర్వ్యతమువలె పురాతనమును నైయుండవలెనని ౬%960౧ మహాశయుని అభ్మిపాయము.

కల్చ్పన స్వభావ విరుద్ధమనియు, కనుక సాహిత్యమున వాస్తవికతయే లక్ష్యముగా నుండవలెననియు నొక వాదము గలదు. వాస్తవికత సాధ్యమా కాదా యను (ప్రశ్న నటుంచి, అది వాంఛనీయమాయని చూడవపలసియున్నది. కవి భావనాప్రపంచమున విహరించుట నిజమే. ఐనను, నతని భావములు, నూహలు వాస్తవిక పరిస్థితులకు దూరముగ నుండజాలవు. భావనా వ్యాపారమునే నశింపజేసి వస్తు స్వరూపమును యథాతథముగ వర్ణించినచో హృదయ వికాసమున కవకాశమేయుండదు. సానపెట్టనిచో వజము కూడ ప్రకాశింపదు.

అల్లే, ప్రకృతి విషయములు భావనా సాహాయ్యమున తేజోవంతములగుచున్నవి. కనుక, కల్పన యనునది లేకున్న కళఠాసిద్ధి జరుగదు. వర్ణిత విషయము వాస్తవికత కెంత సన్నిహితమై యుండిన పాఠకునకంత సన్నిహితమై యుండగలదు. కేవల కల్పన సాధ్యమునూ కాదు. అసంభవమగు విషయము సాధ్య మైనను కావ్యరచనకు తగదనియు, సంభవనీయమగు విషయము సాధ్యముకానిదైనను కావ్యరచన కర్హ మగుననియు ఆరిస్టోటలు నఖ్మిపాయము. కేవలము వాస్తవికతయు, కేవలము కాల్వనికతయు నసాధ్యములు. రెండును పరస్పరము మిశితములై యుండుసు. కావ్యపస్తువు ప్రకృతి సిద్ధమా యని పరిశీలించుట ముఖ్యము కాదు. అది మానవ మనస్తత్వమునకును ననుగణముగ నున్నదాయని పరిశీలించుటయే ముఖ్యము.

“సాహిత్యమన. హృదయ వ్యాపారములను విప్పే చెప్పుటయే" యను నభ్మిపాయమును బట్టి యధ్యయనమును శిక్షణయు నవసరము లేదను వాద ముత్పన్నమైనది. కాని, సాహిత్యమొక శిల్పమనియు, దానికభ్యాసశిక్షణలు తప్పక అవసరములనియు లాటేను అసు విమర్శకుని భావము. పూర్వ కపుల మార్గములను మన మనుకరింపకున్నను వారి కవితారీతిని, రచనా విధానములను గమనించుట (ప్రయోజనకారి. కాలిక స్వరూపమునకును నర్ధమునకును గల సన్నిహిత సంబంధమే కవితాశైలియని ౧౦౧4౦5. కసుక నధ్యయనము తప్పనిసరియగుచున్నది. +

1748 పందిరి ముల్లికార్జునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సాహిత్యమునకు సాంఘికమగు విలువ నేర్పరచుటతో మార్కు మున్నగువారి సిద్ధాంతములు చర్చనీయాంశములైనవి. సంఘప్రవృత్తి కంతటికిని నార్థిక సమస్యలు హేతువులని మార్కు. కాని, భౌతికజీవితావసరమగు వస్తుసంపద విషయమున సామ్య సిద్ధాంతము పర్తింపవచ్చును కాని, కళావిషయమున నట్టిది సాధ్యము కాదు. భౌతికసంపదను పంచుటకు సాధ్యమగునుగాని, మానసిక ప్రవృత్తులను, బుద్ధిశక్తిని కళావిషయక (ప్రజ్ఞను, సౌందర్యమును పంచియిచ్చుటకు సాధ్యముకాదు. సౌందర్యప్రధానములగుకళల విషయమున వస్తునిర్దేశమును, రచనానిర్దేశమునుచేసి శాసించుటకు వీలులేదు. కళాకారుని దృష్టి సామాన్యదృష్టికంటెను భిన్నము, విశిష్టమునైనది. సౌందర్యము విషయమునకూడ నతని దృకృథము వేరు. కనుక, సామాన్యజీవితము మాత్రమే కళావస్తువగుట కర్ణమను వాదము ఉపకృతివిరుద్ధమైనది. మార్క్సియను ఆదర్శములను విమర్శించినవారి నందరిని అభివృద్ధినిరోధకులని పరిగణించుట మార్క్స్పిస్టులకు కలదు. (ప్రాచీన సారస్వతము నంతటిని బూర్జువా సారస్యతమని వీరు నిరసింతురు. కాని, నిజమునకు, ఇవి మార్కు అభ్మిపాయములు కావు. 120% పతిదినమును 5028506419, 04౧16 మున్నగువారి కావ్యములను చదివెడివాడని యతని జీవితచరిత్ర వలన తెలియుచున్నది. 5౧28250628, 606106, గీ౭50%)/645 మున్నగువారు తన యభిమానకవులని 142% తన ప్లుత్రికలతో నుడివినాడట. మానవజీవితమునకు సంబంధించిన ప్రతివిషయము నందును తన కభిమానమని యితడే పలికినాడు. [601% కూడ నిట్టి సహనబుద్ధిని, రసికతను ప్రదర్శించిన ట్లతని సతి సాక్ష్యమిచ్చుచున్నది. కళాభివృద్ధికిని తత్కాలపవు సాంఘికవ్యవస్థకును (ప్రత్యక్ష సంబంధమున్నట్లు గోచరింపదని 141౧ పలికినాడు. కళావిషయమున బూర్జువా సిద్ధాంతమునకు తావులేదనియేకదా దీని యర్థము. వర్గవిప్లవమును కళావస్తువుగా నొనర్పవలెనని కళాకారులను శాసించుట అన్యాయము. కళ కనుకూలించు వస్తువెందున్నను నతడు గహింపగలడేకాని, కళ కనర్హమగు విషయమును కళావస్తువుగ చేసి పోషింపలేడు. సామాన్య జనతాసంస్కృతి, సామాన్యజనతాసారస్వత మనునవి సాధ్యములుకావు. ఉదాత్త వస్తురచనల నుండియే సామాన్యులుకూడ మానవత్వమును, భావావేశములను, నప్రత్యక్షములగు మానసిక శక్తులను, నిగూఢ భావ(ప్రవృత్తిని [గహెంప వలసియున్నదని 17012%/ అభిప్రాయము. కార్మిక జీవితమును వస్తువుగా జసకొని,

నొరస్వతము: విమర్శ భూనతి లక్ష్మీనారాయణరావు 1749 కార్మికుల (ప్రయోజనము నుద్దేశించి, కార్మికుడే కావ్యసృష్టికి, కళారచనకు బూనుకొనవలెనన్నచో నిజమగు సారస్వతమే సృష్టికిరాదు. జాతి, వయసు, స్తీ పుం విభేదము, సాంఘికవర్గములు ననునవి మానవుని మేధాశక్తి నధిగమించునవి కావు. కార్మికవర్గమువారి జీవిత మున్నతవర్గమునందలి కవులకు బోధపడదను వాదము పాక్షికసత్యముతో కూడినది, కవితాదృష్టిని వర్గభేదము లడ్డుకొనభాలవు. అదికాక సంఘమునందలి వర్ణముల కెల్లల నేర్పరచుటకును సాధ్యముకాదు. సీగే డం సిద్ధాంతము ననుసరించి కవులను కార్మికులనుట కుదరదు. ౧0162౧20 ఆను పదమును [26౦౧ 404187 అని నిర్వచించినారు. అయినచో కపులనే పర్షమున చేర్పవలసియుండును? కనుక కళావిషయమున $42౧ సిద్ధాంతములను వర్తింపజేయుట తగదు. అది అతని అభ్మిపాయమునూ కాదు.

701510 ఆర్థిక సమస్యకు ద్వితీయస్థానము నిచ్చినాడు. మానవజాతిలో నన్యోన్యసౌహార్దమును, సౌభ్రాత్రమును పెంపొందించి, మానవుస కీశ్వరునితో నైక్యమును సిద్ధింపజేయుట కళ యుక్క పరమార్థమని 101510 అభ్మిపాయము. వర్గవిఫేదములు, పర్గ్షసంఘర్షణలు నతని కయిష్టములు. ఐనను, రక్తపాతరహితమగు విష్లపముద్వారా సంఘసంస్కారము జరుగుట యితని కిష్టమే. సాధారణముగ కావ్యుములలో పోషితమగుచుండిన ఇతివృత్తములను, ఉన్నతవర్గములవారి భావములను, వారి కృతిమ జీవితమును నితడు త్వీవముగ విమర్శించినాడు. వస్తువులో, భావములలో, ముఖ్యముగా జీవితదృక్పథములో మార్పు అవసరమని కంఠోక్తిగ చెప్పినాడు. కాని సర్వజనతాశిల్పమును సర్వజనతాసారస్యతమును నాకాంక్తింపలే దితడు. సార్వలౌకిక కళ (౮౧౫౪౪64! ఉగ) యతని ధ్యేయము. ఐనను, తసకాలప్తు సాహత్యరచనలందలి కృతిమస్వభావమును పురస్కరించుకొవి, సాహిత్యమే (ప్రయోజన శూన్యమనికూడ నితడు విమర్శించినాడు. ఓ65 1419620165 వంటి కొన్ని కావ్యములు తప్ప తక్కినవన్నియు నితని త్మీవవిమర్శకు గురియైనవి. స్యీయాభిపాయావేశమునకు లోనై యితడు కొంత అతి విమర్శను గావించిసనను, నా కాలపు టున్నతవర్గముదారి కళావిషయమున చాలవరకు సత్యమునే వెలిబుచ్చినాడు. (పప్రమోదము, ఆశ్వాసము, వినోదము - ఇవి కళకు పరమార్థవములుకావు; కళలాపయోజనము మహత్తరవైసది యను నతని యభిప్రాయము లుదాత్త భ్రైనవి.

1750 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సాహిత్యమందరికిని నర్ధ్థమగునట్లుండవలనని మరియుక వాదము. అనుభవము, మేధాశక్తి. జ్ఞానము మున్నగు విషయములలో తరతమ భేదము లెన్నడును తప్పవు. అట్టిచో 'ప్రతివిషయమును (పతివానికిని నర్థము కాజాలదు. అదికాక, వ్యక్తుల జీవిత పరిసరములు, విద్య. వృత్తి ఇత్యాదుల ననుసరించి, భాషావిషయమున కూడ .అవధు లేర్పడుచున్నవి. కనుక భాషావమూలక సాహిత్యమును సర్వ్యజన(గాహ్య వైయుండుట అసంభవము. అట్లనిన, సామాన్యులకు సారస్వతమనవసరమని యర్థముకాదు. సారస్వతమందలి వివిధ భాగములు, భఛిన్నరచనలు, భిన్న వ్యక్తులకు ప్రయోజనకారు లగుచున్నవి. మానవ జీవితమందెంత వైవిధ్యమున్నదో జీవిత ప్రతిబింబమగు సారస్వతమునను నంతియే. మానవ జీవిత సర్వస్వమును, నతని భవితవ్యతతో కూడ, సాహెత్యమున ప్రతిబించింపపలెను. అట్టి సాహితీ సౌందర్యమును, తత్త్వమును (ప్రకాశన మొనర్చు విశిష్టమగు కళ ఏమర్శ. (కిన్నెర; సంపుటము 5, సంచిక 1, జసవరి 1953) 1/ ర చా పా ౮1 తాపము య 0 రలతముల క గ వ్ర 1.1 చే పంపోళ త రటో ల ల రాల లో రంగ హావ [1 1.

అలంపురం సభలలో సాహిత్య సమారాధన డాక్టర్‌ గిడుగు సీతాపతి

=

ఇద్‌ " దరాబాద్‌ రాజ్యంలో రాయచూరు జిల్లాయందు అలంపూరు ఒక తాలూకాకు ముఖ్యగామం. [దోణాచలం - సికింద్రాబాద్‌ రైలుమార్గానపోయి కర్నూలు స్టేషన్‌ తుంగభ(దద్రానదిని దాటిన తర్వాత అలంపూరు రోడ్డు స్టేషనులో దిగి అక్కడికి ఆరుమైళ్ల దూరాన వున్న ఈ అలంపూరు (గ్రామం బస్సెక్కి పోయి చేరవచ్చు. ఇది యిప్పుడు చిన్న గగామమేకాని ప్రాచీనకాలమందు రాజధానీ నగరం. ఇప్పటికిని పుణ్య క్షేత్రం. ఉత్తరవాహినియగు తుంగభదడ్రాతీరమున దక్షిణకాశి యనే ప్రసిద్ధిపొందియున్నది. అంతేకాక ఇది శ్రీశైలానికి పశ్చిమద్వారమని కూడ పేరుపొందిన పవిత్ర స్థలం. చారిత్రకంగా కూడా ఇది ప్రభఖ్యాతమైనది. బౌద్ధ వైన సంస్కృతి చిహ్నములుకూడా కనబడుతున్నవి. ఆంధ్రరాజ్యము వెలసిన నాటినుండి ముసల్మానుల రాజ్యం విస్తరించినవరకున్ను గల వివిధ రాజ్యముల సంస్కృతి చిహ్నములుకూడా గుర్తించవచ్చును. అయితే, ఇప్పుడీ ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవ సభలు ఇక్కడ జరిపించడానికి పెన వివరించిన అలంపూరు ప్రాచీన ప్రఖ్యాతి కావలసినంత [ప్రాబల్యమును చేకూర్చుతున్నదన్న మాట వాస్తవమేకాని అంతకంటెను ఎక్కువ బలమైన కారణం లేకపోలేదు. ఈ సంస్థ హైదరాబాదులో స్థాపితమైనది. కనుక హైదరాబాడు రాజ్యమందే జరగడం కావలసినది. అది ఎక్కడ జరిపితే ఇవతల కోస్తాజిల్లాల ఆంధ్రులకున్ను అవతల రాయలసీమాంధులకున్ను సులువుగా అందుబాటులో ఉంటుందో ఆలోచించి మన హైదరాబాదు ఆంధ్రసోదరులు ఈ స్థల మెంచుకున్నారు. వేలకొలదిగా 'పందిలి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

1752 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సభలకు వచ్చిన అతిథులకు అభ్యాగతులకు వసతు లేర్పాటుచేయడానికి (గామంలో ఇండ్లు లేకపోయినా ఇసుకపైన తడకలతో కట్టిన గడులు, దేవుడిగుళ్లు, మండపములు సిద్ధపరచారు. వైజ్ఞానికాది వస్తుపదర్శనాలు, పుస్తకముల (ప్రదర్శనాలు కూడా ఇటువంటి వసతులలోనె ఏర్పరచినారు. ఆహ్వాన సంపుుంవారి సౌహార్దసౌజన్యంవల్లను, వచ్చిన వారి అదృష్టమువల్లను మేఘాలు కొద్దిగా బెదరించినా చినుకు పడలేదు. అన్నిటికంటెను. ఘనమైన ఏర్పాటు సమావేశ స్థలములందును, భోజనశాలలందును జరిగినవి. సభాపారంభసమయమున రాష్ట్రోపాధ్యక్షులయిన డాక్టర్‌ రాధాకృష్ణగారు వేదికపై కెక్కేసరికి సమావేశమందు సుమారు 25 వేల జనం కిక్కిరిసి యుండిరి. అక్కడి దేవాలయములకు పడమటి యావరణలో ఇంత విశాలమైన స్థలము సభాసమావేశమునకు దొరకడం దొడ్డవిషయం. విద్యుద్దీపాలు, మైకులు, లౌడుస్పీకర్లు, వీటికి కావలసిన పవర్‌వాను అన్నీ సిర్ధపరచియుంచడం చాలా మెచ్చుకోవలసిన విషయం. అంతకంటె ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయం భోజనాల ఎర్పాటు. పూటకు మూడువేల జనానికి భోజనాలు పెట్టారు. తీర్థయ్యాతకు వచ్చినట్టు వచ్చిన జనానికి ఊళ్ళో ఎట్లు భోజన సదుపాయాలు జరిగినవో! కాఫీ హోటళ్లు, మిఠాయి దుకాణాలు కొన్ని వ్యాపారరీతిగానే పెట్టినారు. ఆహ్వాన సంఘంవారు సమకూర్చిన భోజన సదుపాయాలలో లోప మేమీలేదు. అనుకొన్నవారికే కాక తక్కినవారికికూడా చాలమందికి తృప్తికరంగానే జరిగినవి. సాధారణ (శ్రేక్షకజనం ఏమి తినేవారో ఎక్కడ నిద్రించేవారో వారికి తిండిమీదనుగాని నిదమీదనుగాని దృష్టిలేదు. ఎంతసేపూ సభలలో ఉపన్యాసాలు వినడం, పెద్దల దర్శనం చేసుకోవడం పరమార్థంగా పెట్టుకొని ఆ నాలుగు రోజులున్ను ఆ చిన్న [గగామములో కాలక్షేపం చేశారు. సారస్వతసభలంటే జనసామాన్యానికి ఎంత ఆసక్తి! ఎంత ప్రీతి! కొందరు నాలుగు రోజుల సమావేశాలకున్ను హాజరై అన్ని ఉపన్యాసాలను (శ్రద్ధతో విన్నారు. ఇది మెచ్చుకోతగిన పెద్ద విశేషంగా ఎంచి కడపటి దినమున ఇట్టి (ప్రేక్షకులను సంభావింపదలచి వారిలో ఒక వయోవృద్ధుని (పేక్షకజన ప్రతినిధిగా వేదికపెకి రావించి పుష్పుహారం అతని కంఠమున వేయడంకూడా జరిగింది. కార్యక్రమం కొద్దిపాటి మార్పులతో యథ్మాకమం పాగినది. 11వ తేదీ సాయంకాలం సభావారంభం 4 గంటలకు కావలసియుడెను గాని సభాషప్రారంభకులు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, వారితో వస్తూవుండిన పెద్దలు స్పెషల్‌ (టెయిన్‌లో రావడం కొద్దిగా ఆలస్యమైనందున 5 గంటలకుగాని కార్యకమం

అలంపురం సభలలో సాహిత్య సమారాధన డాక్టర్‌ గెడుడు సీతాపతి 1753 ప్రారంభించలేదు. శ్రీ రాధాకృష్ణగారి దర్శనంకోసం నిరీక్షిస్తున్న సభాసదుల సందడి చెప్పనలవికాకుండెను. వారు వచ్చిన తర్వాత సభ [ప్రారంభింపగానే 25 వేల జనమున్ను గొప్ప శిక్షణకు లోబడినట్లుగా నిశ్శబ్దంగా నుండిరి. శ్రీ రాధాకృష్ణగారు ఆలుగులో రచితమైన తమ ప్రారంభోపన్యాసం చదువుతూ ఉన్నప్పుడు సభాస్థలమంతా ఆనందంతో నిండియుండెను. అందులో వారు మాతృభాషలయెడల గౌరవము, తలుగు భాషయెడల ఆదరం, సంస్కృతి వికాసమునకు గల (ప్రాధాన్యం, సాహిత్యాభిపృద్ధికి కడుపుసండా తిండి యుండవలసిన ఆవశ్యకత నొక్కి చెప్పినప్పుడు, వారి మాటలు శ్రోతలకు కర్దరసాయనముగా వినబడినవి. తెలుగుకంటె ఇంగ్లీషుభాషలో వారు ఎక్కువగా (పప్రఖ్యాతిపొందిన మహావక్తలు గనుక, ఆం(ధ్రేతర భాషాపటత్రికల విలెకరుల కోసమని సాకుచెప్పి కొంత సేపు ఇంగ్లీషుభాషలో ప్రసంగించవలసినదని వారిని సభాధ్యక్షులయిన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు కోరిన వెంటనే శ్రీ రాధాకృష్ణగారు తమ సహజశగక్తి సామర్థ్య సంపన్నతతో మరింత ఎక్కువ కర్ణరసాయనంగా కొంతసేపు ఇంగ్లీషు ఉపన్యాసం సాగించారు. పప్రభుత్వాస్థానాంధ్రకవియెన శ్రీపాద కృష్ణమూర్తి శాస్తింగారు తమ సందేశమును తెలియజేస్తూ తా మాంధీకరించిన భగవద్గీతను త్రీ రాధాకృష్ణగారికి సమర్చించినప్పుడు మరియొకసారి శ్రీ రాధాకృష్ణగారిచేత మాట్లాడించడానికి అవకాశం లభించినది. సకల వేదాంతతత్త్య పండితులైన రాధాకృష్ణ గారు భగవద్గీత గురించి చెప్పిన మాటలు (శ్రోతలందరికిని ఆహ్లాదకరములుగా నుండెను. ఇదంతా సభారంజకముగానే ఉన్నమాట వాస్తపమేకాని, కార్యు[క్రమము అనుకొన్నట్లు సాగుటకు మాత్రం అవకాశం చాలకపోయిసది. ఆరు వవధ (ప్రదర్శనములు ఏర్పడియుండెను. ఒక్కొక్క (ప్రదర్శసమున కొక్కొక్కరు ప్రారంభకులుగా ఆరుగురు నియమితులైయుండిరి. కాని, వేళ అతిక్రమంచినండున తలుగు భాషాసమితివారి సాంస్కృతిక వస్తుపదర్శనమునకు [ప్రారంభకులయిన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారే తక్కినవారి తరపున అన్ని ప్రదర్శనములకున్నూ [ప్రారంభకులుగా ఉపన్యసించవలసివచ్చినది. వారి ఉపన్యాసముతో ఆనాటి సభ పూర్తియయినది.

ఆ మరునాటినుండిన్ని వివిధ శాఖల సమావేశాలున్ను కొద్దిపాటి మార్చులతో యజథాకమంగానే సాగినవి. మొదట సాహిత్యశాభా సమావేశం. అధ్యక్షులుగా వుండవలసిన శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్తింగారు రాలేదు. వారిస్టానే శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారు అధ్యక్షత వహించారు. వీరి ఉపన్యాసం

1754 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చాలామందికి వింతగా తోచింది. ఒక్కొక్క వృత్తంగాని జాత్యుపజాతి పద్యంగాని ఒక్కొక్క రసానికే తగివుంటుందనిన్ని లఘువుతో ప్రారంభమైనది గాంభీర్యానికి, గురువుతో (ప్రారంభమైనది సౌకుమార్యాది విశిష్టమై ఉంటుందనిన్ని నిర్వచించి, అందుకు అనుకూలమైన పద్యాలు చదివి వినిపించారు. వారు చెప్పినదానికి వ్యతిరేకంగా ఎన్నైనా ఉదాహరణముల (ప్రదర్శించవచ్చునని వేదిక పైనున్న పెద్దలు అనుకొన్నారు. శ్రీనాథుని అనువాదం సరిగా లేదని, మూలక్షోకాలు చదివి వాటికి అనువాదములన్న శ్రీనాథుని పద్యాలు చదివి వినిపించి ఆక్షేపించినప్పుడు కొందరు సహించలేక పోయారు. శ్రీనాథుడు అనువాద పరీక్షకు దీక్షవహించ లేదనుకొన్నారు. ఇతరులకు వినబడేటట్టుగానే, ఏదో కానీయండి ఎవరి మతం వారిది అనుకొన్నాం. మహాకవి శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రిగారు సారస్వత, వాజ్మయ, సాహిత్యశబ్బముల నిర్వచనం చక్కగా చేశారు. విద్వాన్‌ పుట్టపర్తి నారాయణాచార్యులవారి ఉపన్యాసంలో క్రొత్త విషయాలు బయల్బడినవి. కన్నడ సాహిత్యముల (ప్రభావము నన్నయాదుల రచనలందు ఎట్లు (సరించినదో చూపించినప్పుడు చాలామందికి కనులు విడినట్లయినది. ఆతర్వాత జరిగిన సంస్కృత సాహిత్య గోష్టిలో ఆంధులు సంస్కృతభాషలోను సాహిత్యంలోను కృషిచేయవలసిన ఆవశ్యకత నిరూపితమయినది. భారతీయులకు సంప్రదాయ సిద్ధమైయున్న సంస్కృతి వికాసమునకు, సంస్కృత వాజ్బయమంతా ఆధారమన్న విషయం స్పష్టపరచడం జరిగింది. ఆ తర్వాత వర్తమాన రచనాగోస్టి శ్రీ శివశంకరస్యామిగారి అధ్యక్షతను జరిగింది. ఆచార్య శ్రీ రాయపోలు సుబ్బారావుగారు కవితాధర్మములను, శివశంకరస్వామిగారు రసపోషణమును ఎక్కువగా (ప్రశంసించారు. దాశరథి కృష్ణమాచారిగారు అభ్యుదయ రచనా విశేషములను సూచించారు. పిల్లలమరివారు వచనరచన ఎక్కువగా సరియైన మార్గముల కృషిచేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మైకు పాడుకావడంచేత వీరు తవు ఉపన్యాసం సగంలో ఆపివేయవలసి వచ్చినది. మైకుకు అలవాటుపడినవారి కంఠములు బిగ్గరగా చెప్పగలవి కావు. కనుక మైకు చెడిపోవు నప్పుడల్లా ఉపన్యాసములు రసాభాసము లవుతూవచ్చినవి. చారిత్రక కళాసమావేశం డాక్టర్‌ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారి అధ్యక్షతను చక్కగా నడచినది. శాస్త్రృసమ్మతంగా పరిశోధసలసు గావించి పమాణాధారముల ననుసరించి చరిత్ర రచించవలెనన్న సిద్ధాంతమును శ్రీనివాసాచార్యులుగారు నచ్చజెప్పారు. గోష్టిలో పాల్కొన్నవారందరూ దేశచరిత నిర్మ్శాణాంశములను, తవు

అలంపురం సభలలో సాహిత్య సపారాధస డాక్టర్‌ గిడుగు సీతావతి 1755 యనుభవములను బట్టిన్నీ కృషిని బట్టిన్ని లేల్చి వివరించారు. ఈ సమావేశములతో దినం గడచిపోయినది. రాత్రి భోజనాలయిన తర్వాత సుమారు 10 గంటలకు కవిసమ్మేళనం (పపారంభమయినది. నూరు మందికి పెగా కావ్యపఠతనమునకు ఉద్యుక్తులయినారు. అందుకు అందరికిన్ని అవకాశం కలిగించాలన్న వుద్దేశంతో అధ్యక్షులవారు ఒక్కొక్కరికి అయిదేసి పద్యాలు మాతమే చదవడానికి అవకాశమిచ్చామన్నా, కొందరు నియతిని అతిక్రమిసూ వచ్చారు.

ఆ మరునాడు తక్కిన శాఖల సమావేశములు కొనసాగినవి. కథక సమ్మేళనం అనుకొన్నంత సభారంజకంగా సాగలేదు. అందుకు రెండు కారణాలు. పాటపాడుతూ ఉన్నప్పుడుండే ఆసక్తి కథలు చదువుతూ ఉన్నప్పుడుండదు. అందులోను కథలు రచించడములో నేర్చున్నా కొందరికి చదివి ఏనిపించే నేర్పు లేకపోయినది.

“అందులోను మైకు చెడిపోతూ వచ్చింది. శ్రీమతి ఇల్లిందల సరస్య్వతీదేవిగారు రసవంతంగా అనేక కథలు రచించిన రచయిత్రి అధ్యక్షత వహించి నేర్పుతో కార్యక్రమం సాగించినది. ప్రపంచ కథారచన పోటీలో ద్వితీయ బహుమానం పొందిన శ్రీ పద్మరాజుగారు ఉపన్యాసంలో ఉత్తమకథల కుండవలసిన లక్షణాలను చక్కగా నిరూపించారు. వారి సోదరులు రామారావుగారున్ను కథారచనలో సిద్ధహస్తులై హైదరాబాదులో కథారచన పోటీలో రెండవవారుగా బహుమతి పొందినవారు. వీరి ప్రసంగంలో కూడా కొన్ని మంచి విషయములు వున్నవి. వయోజనవిద్యాశాఖా సమావేశమునకు అధ్యక్షులయిన పర్సా పెంకటిశ్వరరావుగారు, 1పారంభకులు శ్రీ పాతూరి నాగభూషణంగారు, ఇతర ఉపన్యాసకులు అందరూ వయోజన విద్యావ్యాపకోద్యమంలో కృషి చేసి అనుభవం పొందినవారు గనుక, వారి ప్రసంగములన్నీ ఉద్చోధకములుగా నుండెను. ఆనాడు కావలసిన జానపద సాహిత్య గోష్టి వేళచాలక మరునాటికి వాయిదా చేయడమయినది. ఆ గోష్టెకి అధ్యక్షత వహించవలసిన శ్రీవతి యల్నాపగడ సీతాకుమారిగారున్ను, పపారంభకులుగా ఉండవలసిన త్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారున్ను సమావేశమునకు రానందున ఉపన్యాసకులుగా నియమితుడనయిన నేనే మూడు పనులున్ను చేయవలసివచ్చినది. కావ్యభాషా లక్షణ కర్తల నియమములకుగాని, పండితుల ఆగ్రహానుగ్రహములకుగాని గురికాక ప్రజలలో సాగిన సాహిత్యమే జానపద సాహిత్యమనిన్ని అది పోతపాలతో పెరిగిన బిడ్డవల గాక తల్లిపాలతో పెరిగిన విడ్ణవలె ముద్దుగాను, ఎపుగాను పెరిగిందనిన్ని కాగితములమీదికి అచ్చుపడ్డది కాకపోవుటచేతను కొంత అంతరించిపోయిందనిన్ని అయినా

1756 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ప్రచారంలో అనుగుతంగావస్తూ నిలిచియున్నది; చాలా జనరంజకముగానున్నదనిన్ని తెలియజేశాను. జానపద గీతాలు వినిపించేవారు పెక్కుమంది ఉన్నారు గనుక, సవరభాషలోనున్న జానపదాలు మనోహరములయినవి కొన్ని విశదపరచాను. శ్రీమతి నాయని కృష్ణకుమారిగారు జానపద గీతాలలో (పప్రతియింటను పాడుకొనేవి కొన్ని ముద్దుగా వినిపించారు. అప్పటికి మధ్యాహ్నము కావచ్చినది. అప్పుడు శ్రీమతి ఇందుమతి దేవిగారు వేదికపైకెక్కి అరగంటకు పైగా (ప్రసంగించారు. కొన్ని గీతాలు చక్కగా పాడి వినిపించారు. భోజనానంతరము ఇతర శాఖల సమావేశములు వడివడిగా సాగినవి. కవి సామాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి స్నాతకోపన్యాసం ఆంధ్ర భాషాభిమానము, ఆంధ్ర సారస్వతాభిమానము, ఆంధ్ర సంస్కృత్యభిమానము (ప్రేరేపించి సభాసదుల కుద్వేగం కలిగించేదిగా వినబడినది. వారి సిద్ధాంతములు వేదవాక్యములుగా చెలరేగినవి. స్వయంకృషివలన తాము ఆలిసికొన్న విషయములతోపాటు ఎక్కడనో విని ఊహించుకొన్న విషయములుకూడా జోడించి ప్రవచించినారు. ప్రాచీనభారతీయ సంస్కృతి ఎంత గొప్పదయినా నేటి పరిస్థితులు పరిశీలించి దాని నెంతవరకు పునరుద్ధరించదగునో వారు పాటించలిదు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా సాగుతూ ఉన్న ప్రపంచ సంస్కృతిని (గ్రహించుట, నాక్షేపించుట సరికాదేమోనని నా అభ్మిపాయం. “అల్టిమేటమ్‌” అనగా కిల్లాకు, “శాపర్స్‌” అనగా ఎలుగోలు మూక అని వీరు చెప్పుటకు తగిన ఆధారం కనబడదు. మాండలిక (ప్రయోగాధారమున్నదందురేమో! అదియైనా వాడుకనుండి తప్పెినదే. ఈ మాటల కర్ణము (బౌణ్యవబమలో వివరించియున్నారు. చూచుకొందురుగాక! ఇట్టి మాటలను పునరుద్ధరించుటవలన (ఏప్రయోజనము లేదు. 'ప్రాచీనకాలపవు నాణెములు ఎంత గట్టి లోహముగలవైనా నేడు చెల్లవు. ప్రపంచమంతా కలిసి ఏకముఖంగా సంస్కృతి వికాసమునకు తోడ్పడవలసిన ఈకాలంలో సంకుచితబుద్ధితో భాషాభివృద్ధిని అరికట్టుట మేలుకాదు. బాల వాజయశాఖా సమావేశమునకు అధ్యక్షులుగా నుండవలసిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు సమావేశమునకు రాజూలనందున శ్రీ పందిరి మల్లకార్జునరావుగారు అధ్యక్షత వహించి బాల వాజ్బ్ఞయము అభిపృద్ధి పొందుతూ ఉన్నందుకు ఆనందించి, ఇంకను ఎక్కువగా వ్యాప్త్‌ చెందవలసియున్నదన్నారు. నేను నా ప్రారంభోపన్యాసము అదివరకే “త్రిలిజ్ఞూలో ప్రకటితమైన ప్రతిని చేతబట్టుకొని అందులోని ముఖ్యవిషయములను ప్రసంగించాసు. మహాసభలలో వ్యాసాలు చదివి వినిపించుట నాకు సమ్మతముకాదు. సభాసదులను చూస్తూ ప్రసంగించుటలో

అలంపురం సభలలో సాహిత్య సమారాధన డాక్టర్‌ గిడుగు సీతాపతి 1757 నాకు ఉత్సాహం మెండు. ఈ ఏషయంలో అనేకులు నాతో ఏకీభవిసారనుకొంటాను. “బాల” మొదలయిన బాల వాజ్మయ పత్రికలు పది పండెండు గలవనిన్నీ అయినా బాలబాలికలు దేశంలో లక్షలకొలదిగా ఉన్నారుగనుక ఎన్ని పత్రికలున్నా చాలవనిన్నీ అదిగాక బాలపటథత్రికల భాష బాలబాలికల బుద్ధికి అందుబాటు ఉండి, వారి చిత్తములను ఆకర్షిస్తూ ఉండవలెనని నేను విశదీకరించాను. శ్రీ ఏడిద కామేశ్వరరావుగారు బాల బాలికల సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్నవారు గనుక వారి అనుభవములో అన్ని విషయాలను తెలియజేస్తూ పెద్దల తోడ్పాటు కావలనని కోరిరి. డాక్టర్‌ కొండా శకుంతలాదేవిగారు కూడా బాలబాలికల జ్ఞానాభివృద్ధికి పాటుపడుతున్నవారు గనుక జానదాయకమయినవ బాలసాహిత్యములో ఎట్లు పాందుపరచవలసి యుండునో తలియజేశారు. వైజ్ఞానిక సమావేశ కార్యక్రమము చిట్టచివరకు జరుగుట చేత ప్రసంగించినవారికి అందరికిని తగినంత అవకాశం దొరకలేదు. శ్రీ వసంతరావు వేంకటరావుగారు పదార్థ విజ్ఞానవేత్తలు, కవులు, జనసామాన్యానికి వైజ్ఞానిక శాస్త్ర విషయాలు అందజేయవలనన్న కోరికతో శాస్త్రం విషయములను గేయరూపమున రచించిన వారు. శ్రీ వేమరాజు భానుమూర్తిగారు రచించిన మైన్నుకథ సారస్వత పరిషత్తువా రిదివరకే (ప్రకటించియున్నారు. అది . బహుజనోపయోగం కలదిగా పేరుపొందినది. వీరు పెద్ద శాస్త్రవేత్తలు కాకపోయినా సాధారణ సంస్కృతి పరిజ్ఞానం గలవా రెట్లు సయిన్సు విషయాలు నేర్చుకోవచ్చునో స్వయంకృషివల్ల తెలుసుకొని, జనసామాన్యానికి అందజేయుటలో నేర్పు అలవరుచుకొన్నారు. తక్కిన ఉపన్యాసకులు కూడా వైజ్ఞానిక శాస్త్రములు గ్రహించినవారే కనుక ఈ సమావేశం చక్కగా సాగినది; ఇంకా ఎక్కువ అవకాశము వీరికి వుంటే బాగుండుననిపెంచింది. కడపటిదినం సమావేశాల కార్యక్రమం ముగిసిన ప్పుడు వీడుకోలు వుఎచ్చుటలవలెనే ఒకరికొకరు తవు కృతజ్ఞతాఖివందనసమర్చణంతో సభలు పూర్తి అయినవి.

ఒక మహాసమావేశం ముచ్చట ప్రత్యేకించి చెప్పుట కుద్దేశించి ఇంతవరకును చెప్పలేదు. అది ఆం(ధ్రకళాకేంద్ర నిర్మాణమునకు సంబంధించినది. దీనిని గురించి సభలకు వచ్చిన పెద్దలండరును చర్చలు ఎక్కువ సాగించినట్టు సంస్థ ఒకటి ఏర్పడపఖాననిన్ను, ఇడి మైదరాబాడులోనే స్థావరం ఏర్పరచుకొని అటు కోస్తాజిల్లాల ఆంఢ్రులను ఇటు రాయలసీమాంఢడ్రులను మ్యాతమే గాక ఇతర ప్రదేశములందున్న ఆంధ్రులను కలుప్పుకొని అఖిలాంధ్ర సంస్థగా ఉపచరించవలనని ఏక్టగీవంగా కోరిరి. ఈ సంస్థ ఎట్లు ఏర్పడినదో, కార్యనిర్వాహక వర్గంలో ఎవరున్నారో,

1758 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4; సాహిత్యము సలహా సంఘంలో ఎవరున్నారో, ఈ విషయాలన్నీ పతికలలో ప్రకటితములయినవి. ఈ సంస్థకు శ్రీశ్రీని అధ్యక్షునిగా సభ్యులందరూ ఏకగీవంగా ఎన్నుకొనుట ముదావహం౦. ఈ సంస్థ ఆంధ్రుల సంస్కృతి వికాసమునకున్నుు అభ్యుదయ (గంథరచనకున్ను, కళాభివృద్ధికిన్ని ఎక్కువగా తోడ్పడగల సంస్థ కాగలదనినా నమ్మకం!

ఈ ఉత్సవ దినములలో ప్రతి రాత్రిన్ని వినోదములు, వేడుకలు కొనసాగినవి. ఇందులో నటనాచార్యులయిన రామకృష్ణగారి [ప్రసంగం వాద్యసహిెతంగా నృత్యాభినయములతో సభారంజకముగా సాగినది. భారతశాస్త్ర విశేషములు వీరు చక్కగా నిరూపించారు. ఒకనాటిర్వాతి “ఎదురీత నాటక (పదర్శనం” మదాసునుండి వచ్చిన నటీనటులు ప్రదర్శించారు. నాటక ప్రదర్శనం మెచ్చుకోతగిసదిగా నుండెను. నాల్గవనాటి రాత్రి “ఏకాంకిక నాటక ప్రదర్శనమున్ను, తోలుబొమ్మలాటయున్ను జరిగినవి.

మొత్తంమీద సమావేశములు, ప్రదర్శనములు, శిబిరములందలి ప్రసంగములు అన్నీ వైభవోపేతంగా సాగినవి. కొన్ని కొన్ని సమావేశములు జరుగుతూవున్నప్పుడు నేను ఏదో పనిఉండి బయటకు పోతూవస్తూ వుండుటచేత కొందరి ఉపన్యాసములను వినే భాగ్యము నాకు లేకపోయిసది. అందుచేత ఈ నా సమీక్షలో అందరి గురించిన్ని సూచనగానైనా (వాయలేకపోయాను. అధ్యక్షులున్ను, 'పప్రారంభకులున్ను అయినవారి ఉపన్యాసములు ముద్రితములయినవి. ప్రతులు సభాసదులకున్ను, పతికలవారికిన్ని అందజేసినారు కనుక వాటిని గురించి నేనంతగా వ్రాయలేదు.

ఆంధ్ర సారస్వత పరిషత్తువారు ఇట్టి మహోత్సవములు, సమావేశములు జరిప ఆంధుల వున్ననలకు అన్ని విధముల పాతులయినారు. ఈ సమావేశములవలన ఆంధ్రదేశానికి మహోపకారం చేకూరగలదని విశ్వసిస్తున్నాను.

  • ఆంధ్రప్రభ సౌజన్యంతో (కిన్నెర; సంపుటము 5, సంచిక 2, ఫిబ్రవరి 1953)

రూపకోత్పత్తి న్‌ భూపతి లక్ష్మినారాయణ రావు

రూపకము ఉత్తమ సాహితీస్వరూపమని ప్రాకృ్రతీచీసాహిత్యవేత్తల అభిప్రాయము. ఏజాతి సారస్వత వికాసమును పరిశీలించినను, తత్పరిణత దశయందు రూపకరచన జరిగినదని వ్యక్తము కాగలదు. సద్యఃపర నిర్వృతి విశ్వశేయములనెడు ఉదాత్తసాహితీ ప్రయోజసములను సాధించుటలో మిక్కిలి సమర్థమైనదియగుటచే రూపకములకు, అందును, నాటకమున కిట్టి ప్రాధాన్యము కలిగినది. బుద్ధివికాస మెక్కువగలేని మానవజీవిత [ప్రాథమికదశలో నుత్పన్నమగు సారస్వతము గేయసారస్వతము. (పకృతిసౌందర్యాదులకు ముగ్గుడైన మానవుని హృదయచైతన్యము అప్రయత్నముగనే గేయరూపమును గైకొనుచున్నది. కనుక గేయరచనయే సారస్వత చరితయందు ప్రధానఘట్టము. మానవుని హృదయావేశ ఆవేగాదుల ననుసరించి ఉత్పన్న మైన గేయసారస్యతము [కమముగ వికసించి గాథారూపమును గైకొన్నది. వీరశృంగారరస ప్రధానములగు దీర్ప రచనలన్నియు నీ మార్గముననే వృద్ధికి వచ్చినవి. వీని నాంగ్గమున 841265 అని వ్యవహరింతురు. భారతదేశమున కూడ అన్నిభాషల యందుసు నిట్టి గాథలనేకములు (ప్రాచీనకాలమున వ్యాప్తికి వచ్చినవి. చేదబుక్కుల రచనాకాలము నాటికిని, భారతరచననాటికిని మధ్యకాలమున ఇట్టిగాథలు కొన్ని యైనను వ్యవహారభాషలలో నుండియుండునని విశ్వసింపవలసియున్నది. వ్యాసుని జయేతిహాసము సంస్కృతమున రచితమైన (పపప్రథమగాథకావచ్చును. కాని, ఆ కాలపు వ్యవహారభాషలగు [ప్రాకృతాదులందు

1760 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గాథారూపమగు సారస్వతము వ్యాప్తియందుండిన కారణముననే వ్యాసుడు ఆ సారస్వతరూపము నాలంబనముగ గొని భారతేతిహాసమును (జయ) రచించినాడని చెప్పవలయును. ప్రచారమార్గమున సంఘమును సంస్కరించుట అతని యుబ్దేశమగుటచే 'గేయరూపముననున్న గాథధారచన నతడవలంపబించినాడు. సార్వలౌకిక కల్యాణము నుద్దేశించిన వ్యాసమహర్షి సులభమగుభాషను, (ఏచారవయమునకనువగు గాథారూపవును అవలంబించి జయగాథను రచించినాడు.రామాయణరచనయు నిట్టిదే. ఇతివృత్తవిషయమున నీ రెండును భిన్నములేమైనను కావ్యస్వరూపము విషయమున వీనికి సంపూర్ణమగు సామ్యుమున్నది. ప్రచారకులు దేశమున పర్యటనము గావించుచు, నీ గాథలను (ప్రజాసంఘముల సమక్షమున పాడి, విజ్ఞానవ్యాప్తి గావించుటయే ప్రయోజనముగా నివ రచితములైనవి. అట్లు ప్రచారముగావించువారిని సూతులని వ్యవహరించినట్లు అఆలియుచున్నది. సూత శబ్దమునకు రథకార రథసారథీ త్యాద్యర్థములు మాత్రమే కలవనియు, గాథాపాఠకులనెడు నర్థము లేదనియు దాసుగుప్తాగారి అభ్మిపాయము. కాని మొదట నీ సూతులనువారు పాఠకులు మాత్రమేకాక, పండితులు కవులు కూడ నైయుండిరని భారతమువల్లనే తఆలియుచున్నది. వైశంపాయన రోవుహర్షణాదులట్టివారే. కాలకవుమున ఈ సూతసం(ప్రదాయవే పౌరాణికసంప్రదాయముగ దేశమున నెలకొన్నది. సారస్వతము బహుముఖముల విస్తృతి చెందినను భారతరామాయణాది గాధారూపకావ్యములను పురాణములుగ చెప్పించి వినడివాడుక నేటికిని సంఘమున నిలిచియున్నది. ఈ పురాణపఠనము మధ్యమసంఘమువారి ప్రయోజనమునే యెొక్కువగ సాధించుచుండుటచే. పామరజనులలో వ్యావహారికభాషారచితములైన గాథలు వ్యాప్తికివచ్చినవి. దేశింగరాజు కథ, బాలనాగమ్మకథ, బాలవఏీరునికథ, మున్నగునవియన్నియు నిట్టివే. ఈగాథాసారస్వతపరిణామమున, పండితకవులతో నారంభమైన సూతసంప్రదాయ మెట్లు రానురాను విద్యావిహీనులగు గాయకులకు వృత్తిగ నేర్చుడినదో గవునింపతగిన విషయవు. భారతరచనాకాలమున, ఇతివృత్తమునకును, దానిననుసరించిన న్యాయ ధర్మప్రతిపాదనమునకును ఎక్కువ (పాధాన్యముండినట్లు తోచుచున్నది. కాని, రానురాను గాథలయందు రసపోషణ కెక్కువ అవకాశ మేర్చడి, తత్పోషకములగు సంగీతనృత్యములకు కూడ

రూపకోత్ప్చత్తి భూపతి లక్ష్రీనారాయణ రావు 1761 (పాధాన్యమేర్చడినది. గాథాపాఠకులెల్లరును, గాథలను వచనమువలె చదివి అర్థమును వివరించుటకు మారుగ, రాగయుక్తముగ పాడుచు, నృత్యమునుగూడ సాహాయ్యముగగొని, శ్రోతలను రసపరవశులుగ చేయుట పరిపాటియైనది. పాఠకుడు తొలిరోజులలో ఒక్కడే మైయుండినను, కాలక్రమమున నతనికి సహాయకవర్గము కూడ నేర్పడినట్లు తఆలియుచున్నది. సంగీతమునను, సంభాషణలందును, (పప్రధానపాఠకునకు వీరు సహాయులై, కథను రసవంతముగ నడపుటకు తోడ్పడినారు. కొంతకాలమునకు ఈ గాథాపాఠకవర్గమున స్త్రీలకుకూడ (ప్రవేశము కలిగినది. ఈ స్త్రీలు సాధారణముగ పాఠకుల కుటుంబవర్గములోనివారే మై యుందురు. ఇట్లు, ఈ వీరగాథలను పాడుట ఒకవృత్తిగా నేర్పుడినది. ఇతివృత్త మాకర్ష్ణణీయమగుటకును, అది రమణీయమగు మార్గమున ప్రజలయందు వ్యాపించుటకును, సంగీతనృత్య స్త్రీపాత్రలు దోహదమొనర్చినవి. నాటకరంగము కూడ ఈ పరిణామమునే అనుసరించినదని యూహించుటకు వీలున్నది. భారతరామాయణాది మహాగాథల లక్షణము లనేకములు రూపకములయందు, అందును వమటఖ్యవమగ నాటకవములయుందు, నెలకొనిళలయటం౦డుటను గషనింపవచ్చును. భారతరామాయణాది మహాగాథలసు ప్రచారము చేయుచుండిస సూతబ్బందమే కాలక్రమమున రంగప్రవర్తకులగు భరతబృందముగ నేర్చడి రూపకపదర్శనలు గావించిరా ? యని యూహించుటి కవకాశమున్నది. భారతీయ రూపకముల యుత్పత్తినిగూర్చి తెలియజేయు (గ్రంథము భరతముని ప్రణీతమని వ్యవహరింపపడు నాట్యశాస్త్రము. భరతుడెవ్వడో, ఏకాలప్పువాడో, అతనివృత్తి యేదో, అతని జీవితమట్టిదైయుండినదో, ఇదమిత్సమని తేల్చుట కాధారములు లేవు. ముని యను బిరుదు సంప్రదాయసిద్ధముగ నితనినిగూర్చి ప్రయుక్తమగుచున్నను, విశ్వామ్మిత వసిస్టాదులవంటి మునివర్గమునకు చెందినవాడా యితడు? అను సందేహముకూడ కలుగకపోదు. అతి ప్రాచీనములు, (పధానములు నగు విషయములకన్నిటికిని దివ్యత్వము నారోపించుటయు, బ్రహ్మాదులనుండి వ్యుత్పత్తిని చూపించుటయు. మన (ప్రాచీనుల అలవాటు. ఉత్తమసం్యపదాయములన్నియు వేద (ప్రతిపాదితములని చెప్పి, తద్ద్వారా వానికి గౌరవము నాపాదించుట పూర్వపద్ధతి. అట్లే, నాట్యశాస్త్రమునకుకూడ మన ప్రాచీనులు దివ్యత్వము నారోపించినారు. (తేతాయుగమున, జంబూద్వీపమందలి

1762 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ప్రజలు రజోగుణ(ప్రధానులై, వేదోక్తకర్మలను పాటింపక ధర్మపథదూరులై ప్రవర్తించుచున్నారనియు, వారిని ధర్మోన్ముఖులుగా చేయుటకు ఆకర్షణీయమగు రచన నేదియైనను గావింపవలననియు, ఇంద్రాదులు (బ్రహ్మను ప్రార్ధింప, బ్రహ్మ నాట్యవేదమును సృష్టించెనని నాట్యశాస్త్ర (ప్రథమాధ్యాయమున వర్ణితము. జనులు కామలోభవశంగతులై గ్రామ్యధర్మప్రవృత్తు లైరని ఇందాదులు 'ఘోషింపగా బ్రహ్మ లోకము నుద్ధరించుటకును, (ప్రజలను సరసమార్గమున ధర్మోన్ముఖుల గావించుటకును నాట్య వేదమును రచించెనని గలదు. ఆనాటికి వేదబాహ్యులగు నాల్లవజాతివారి సంఖ్య వృద్ధియెనది. వీరికి వేదోక్తములగు విషయములను, విధులను బోధింపవలసిన యావశ్యక మేర్చడినది. కనుక బ్రహ్మ, బు గ్వేదమునుండి యితివృత్తమును, సామవేదమునుండి సంగీతమును, యజుర్వేదము నుండి అభినయమును, అధర్వమునుండి రసమును [గగహించి, వాని సంయోగముచే నాట్యవేదమును కల్పించెనని వర్ణితమైయున్నది. “జగాహ పాఠ్యం బుగ్వేదాత్‌ సామధ్యో గీతమేవచ యజుర్వేదాదభినయాన్‌ రసానాధర్వణాదపి వేదోపవేదైః సంబద్ధో నాట్యవేదో మహాత్మనా ఏవం భగవతా సృష్టో బ్రహ్మణా లలితాత్మకమ్‌.” ఈ కారణముననే నాట్యశాస్త్రమునకు వేద మనెడు వ్యవహారము సిద్ధించినది. “న వేదవ్యవహారోఇయం సంశ్రావ్యః శూదజాతిషు తస్మాత్‌ సృజాపరంవేదం పంచమం సార్వవర్షికమ్‌.” బోధ్యములగు విషయములు వేదోక్తములే మొనను, బోధనవిధానము సరసము, మనోహరము నగుటచే, నది ప్రజల నెక్కువగ నాకర్షించినది. “ఇదమస్మాకం గుడప్రచ్చన్నకటుకాష ధకల్పమ్‌ క్రీరమధ్యావస్థితాషధోపయోగవత్‌.” బ్రహ్మరచిత ['ప్రథమరూపకమగు “ఇతిహాసమును” ప్రదర్శింపవలసినదిగ (బ్రహ్మ భరతునాదేశింప, భరతుడు తన నూర్గురుకుమారులకు నా రూపకప్రదర్శనమున చిక్షణ నొసంగెననియు, అప్పురసలు కూడ ప్రదర్శనమున పాల్గొనిరనియు

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1763 ఆలియుచున్నది. భరతుడు ప్రదర్శించిన “అసుర పరాజయ” మనెడి వ్యాయోగము తమ కవమానకరముగ నుండుటచే రాక్షసులు ప్రతిఘటింపగా (బ్రహ్మ వారి ననునయించెననికూడ వివరింపబడియున్నటి. రాక్షసులు కలిగించు విఘ్నములనుండి (1ప్రదర్శనమును రక్షించుటకై నాట్యవేశ్శమును కూడ ఏర్పరుపవలసివచ్చినది. ప్రథమప్రదర్శన సందర్భమున రాక్షసులు విఘ్నములు కలిగింపగా, ఇంద్రుడు ధ్వజకాండమును సాధసముగా గొని వారిని పారదోలననియు, నా కారణమున నిందధ్వజ ప్రతిష్ట తరువాతి (ప్రదర్శనల సందర్భమున సంప్రదాయమయ్యుననియు తలియుచున్నది. భరతుడు తరువాత ప్రదర్శించిన రూపకము “అమృతమంధనమోను సమవాకారము. పిమ్మట నతడు “త్రిపురదాహ” మను డిమమును శివుని సమక్షమున ప్రయోగింపగా శివుడు సంతుష్టుడై, సంగీతనృత్యములనుకూడ రూపకపదర్శనమున పవేశింపజేసెననియు తెలియుచున్నది. ప్రథమరూపకప్రదర్శనమును పురస్కరించుకొని బ్రహ్మ (పదర్శనమును చతుర్విధములుగా విభజించెననియు, అవింపే భారతి, సాత్త్వతి, కైశికి. ఆరభటి యను వృత్తులనియు విపరింపబడియున్నది. ఈ వృత్తుల లక్షణములను బట్టి రూపకపరిణామము కొంతవరకు బోధపడగలదు.

“యా వాక్చ్రధానా పురుషపప్రయోజ్యా

స్పీంవర్జితా సంస్కృతవాక్యయుక్తా

స్వనామధేయైః భరకైః పప్రయుక్తా

సా భారతీ నామ భవేత్తు వృత్తి” పురుషప్రయోజ్యము, సంస్కృతపదయుక్షము, వాకృధానమునైనది యితిషృళత్తము. స్పీీల కిందు ప్రవేశములేదు. ఈ పప్రదర్శనమున పాల్గొను నటకులు (భరతులు) తమ తమ నామధేయములతోనే వర్తింతురు. ఈ లక్షణమును బట్టి చూడగా, ఈ భారతీవృత్తియందు రూపధారణాదులును, సంగీతనృత్యాదులును లేవనియు, భరతులు ఇతివృత్తభాగములను అర్థయుక్తముగ పలుకుటయే ప్రధానమైనదనియు వ్య క్త్రమగుచున్నది. అనగా వాచికాభినయమే యిందు ప్రధానముగ గన్పట్టుచుస్నది. రూపకప్రదర్శనమునం దిది ప్రథమ దశ. [ఇతివృత్తము సంభాషణాత్మకమై

1764 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యండుటయు నా సంభాషణలు నటప్రయుక్తమగుటయు - నను లక్షణములనుబట్టి, యీ దశ గాథాపఠనమునకు తరువాతిదని చెప్పవచ్చును.) తరువాతిది సాత్త్వవీవృత్తి.

*వాగంగాభినయవతీ సత్త్వోత్థానవచనప్రకరణేషు

సత్త్వాధికారయుక్తా విజ్లేయా సాత్త్వతీవృత్తిఃో భావప్రధానమైన సందర్భము వాక్కుచేతను, ఆంగికాభినయముచేతను అనుసరింపబడుచున్నది. సత్త్వమున కిందు ప్రాధాన్యము కలదు. రసభావముల కాశ్రయమైనదియు, అవ్య క్తరూపమున నున్నదియు సత్త్వమని భరతుడే వేరొకచోట వివరించినాడు.

“అవ్య క్షరూపం సత్త్వం హ్‌ జ్డేయం భావరసాశయం

యథాస్థానరసోపేతం రోమాంచాశ్రాదిభిర్లుణైలొ దీనినిబట్టి సాత్త్వతీవృత్తియందు కథాపఠనము మాత్రమే కాక అభినయముకూడ కలదని వ్య క్తమగుచున్నది. నటకులు తమ వాచికాంగికాధినయములచే భావోత్పత్తి రసోత్పత్తులను కలిగింపవలనని, “రసాశయ” మను ప్రయోగమువలన గమ్యమానమగుచున్నది. భారతీదశయందు పఠనమాత్రమైయుండిన (ప్రదర్శనము సాత్త్యతీ దశయందు అభఖినయాత్మకమైనది. అనగా, రూపకప్రదర్శనము యొక్క (ప్రయోజనము రసోత్పత్తియని (గగ్రహింపబడినది. మూడవది కైశికీవృత్తి.

“కెశికీ గ్త్‌ వై పథ్యా శృంగారరససంభవా

అశక్యా పురుమైః సాధు ప్రయోక్తుం స్త్రీజనాదృతే”

“యా క్లక్ట నేపథ్యవిశేషచిత్రా

ప్త్రీసంయుతా యా బహున్ఫృత్తగీతా

కామోపభోగ (ప్రభావోపచారా

  • తాం కైశికీం వృత్తిం ఉదాహరంతీ” ఈ లక్షణమునుబట్టి, విషయము శృంగారపధానము, బహుస్త్రీపాతప్రయుక్తము, నృత్తగీతాతిశయవ్యాప్తము, నేపథ్యరచనాసంయుక్తము నని తెలియుచున్నది. నృత్తగీతముల యుపయోగము, వేషధారణము, స్త్రీపాతలను స్త్రీలుధరించుట
  • అనునవి కైశికీవృత్తినాటి కేర్పడినవి. ఇతివృత్తము శృంగార్వపాయమైనది. స్తీ

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1765 సహజములగు అనుభావాదుల పప్రదర్శనము స్త్రీలకు మాత్రమే సాధ్యమని గుర్తింపబడినది. కావున ప్పీంలకు రంగమున 1పపాధాన్యమేర్పడినది.

“యావ న్నిజహృదయ రసవిలస ద్వికస్వర నిర్వార చమత్కార పవిత్రతా నజాతా భగవత ఇవ తావత్‌ శిక్షాశతైరపి వైచిత్యమనాహార్య౦

కడపటిది ఆరభటీ వృత్తి.

“ప్రస్తావపాతప్పుతలంఘితాని

చాన్యాని మయా కృతమింద్రజాలమ్‌

చిత్రాణి యుక్తాని చ యత్ర నిత్యమ్‌

తం తాదృశీం ఆరభటీం వదన్తి.” పలువిధములగు గీతములు, యుద్ధము, నృత్యము, ఇంద్రజాలము నిత్యాదు లిందు క్రమముగా ప్రయోగింపబడుచున్నవి. కథయందలి ఆయా కార్యములు స్వభావానుగుణముగ (ప్రదర్శితములగుటకు రంగపరికరములు కూడ నాటి కేర్పడియుండినట్లు “యత్రనిత్యమ్‌” అను (ప్రయోగముచే గమ్యమానమగుచున్నది. అనగా, జీవితానుగుణముగా ఇతివృత్తమును (ప్రదర్శించు రంగపరికరములు ఆరభటీవృత్తి నాటి కేర్పడినవని చెప్పవచ్చును.

ఇట్లు, భరతశాస్త్రృమున వర్ణితములైన భారతీత్యాది నాలుగు వృత్తులును రూపకపరిణామచర్మితయందు నాలుగుదశలను సూచించుచున్నవని తోచుచున్నది.

రూపక (ప్రయోజనమును గూర్చి భరతుడిచ్చిన యభి,పాయుము గమనింపదగినది.

దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్‌

విశ్రామజననం లోకే నాట్య మేతదృవిష్యతి.

(వినోదజననం కాలే నాట్యమేతద్భవిష్యతి.) (ప్రాపంచికకష్టముల కారణమున దీనులెయున్న సామాన్యజనులకు విశ్రాంతిని వినోదమును కల్పించి, తాత్కాలికముగనైన మసశ్యాంతిని చేకూర్చుట రూపకరచనా (పయోజనమసి యిండుచే వ్య క్తమగుచున్నది. మరియు, బహుభావయుతమైన రూపకము సర్వజనులకును ఉపాదేయమనికూడ వివరింపబడియున్నది.

1766 పందిరి మల్లికార్ట్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “నాట్యం భిన్నరుచేర్చనస్య బహుధా ప్యేకం సమారాధనమ్‌.” భిన్నాఖిరుచులు గల వ్యక్తులందరు నొకచో ననుభవింపతగినది రూపకప్రదర్శనము. విశిష్టమగు రసపోషణ, ఆకర్షణీయములగు సన్నివేశములు, అభినయము, అర్థగాంభీర్యము, ఉదాత్తేతివృత్తము, చమత్కారములగు సంభాషణలు, ఇత్యాదులతోనొప్పు నాటకప్రదర్శునము ఆనందహేతువని భవభూతి వివరించియున్నాడు. “భూమా రసానాం గహనః [ప్రయోగః సౌహార్దహృద్యాని విచేష్టితాని , బెద్దత్యమాయోజితకామసూ[త్ర౦ థి చిత్రా కథా వాచి విదగ్ధతా చం” సాత్త్వికానందవమును గూర్చుట యే రూపకవుల పరమార్థవునియు, నితిహాసాదులవలన సిద్ధించు వ్యుత్పత్తిని మాత్రమే వీనినుండి యాశించుట బుద్ధీహీనతయనియు, ధనంజయుడు కూడ తన దశరూపకమున వివరించినాడు. ఆనందనిష్యందిషు రూపకేషు వ్యుత్పత్తీిమాత్రం ఫల మల్చబుద్ధిః యూ పీతిహాసాదివదాహ సాధుః తస్మై నమః స్వాదుపరాజ్ముఖాయ. విజ్ఞానముమాత్రమే రూపకప్రయోజనముగ నెన్నువారు అఆనందానుభూతినారుగని స్వాదుపరాజ్ముఖులని అభ్మిపాయము. రసాస్వాదన, ఆనందానుభూతి అనునవి నాటకముయొక్క (పధానప్రయోజనములని, ధనికాభినవగుప్తాది సాహిత్య వేత్తలెల్లరును నంగీకరించిన విషయమే. మానవజీవితమునందలి వ్యవస్థావైవిధ్యమును, మానవ ప్రకృతిని, మనస్తత్వమును ప్రదర్శించి. తద్వారా రసాస్వాదనానుభవమును గ్రేక్షకులకు కలుగబేయుట రూపకరచనయం దనుసరించబడిన విధానము. భారతరామాయణములు మానవజీవితమునకు సవ్యగ్రవ్యాఖ్యానములు. రూపకములందును నట్లే, జీవితమునకు సంబంధించిన రసవత్తరములగు సన్నివేశములు, ఘట్టములు ఇతివృత్తములైనవి. రచనావిధానమునకూడ ప్రాచీన రూపకకర్తలు ముఖ్యవిషయములలో భారతరామాయణముల ననుసరించియున్నట్టు తోచుచున్నది. ఈ మహాకావ్యములం దుపయుక్తమైన భాష సరళము, సులభమునై

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1767 సామాన్యప్రజానీకము వ్యవహరించుచుండిన భాషకు సన్నిహితమైయున్నదని చెప్పవచ్చును. ఆ కావ్యములు ప్రచారమున కుద్దిష్టములగుటచే తత్కావ్యకర్తలు (ప్రజలకర్థమగుభాషనే అవలంబించినారు.. వ్యాసుడు తాను రచించిన జయేతిహాసవయను శిష్యులగు జమినిసువుంలతాదులచే [ప్రచారము చేయించియుండుటయే యిందులకు ప్రబలసాక్ష్యము. రామాయణమును కూడ వాల్మీకి, కుశలవులచే అయోధ్యావాసులయెదుట పాడించియున్నాడు. రూపకరచస కూడ సామాన్యజనుల కుద్దిష్టమగుటచే భామావిషయముసం దట్టివిధాసమునే యనుసరించినది. తరువాతికాలమున రచితములైన సంస్క్పృతరూపకములు రాజాస్థానవములందలి కవులను పండితులను వినోదింప చేయుట కుద్దేశింపబడినవగుటచే సారళ్యమును గోల్పోయినవి. కాలిదాసమాఘబాణాదుల రచనావిధాన మా నాటకకర్తల కాదర్శముబ్రనవి. కసుకనే, భాసుని నాటకములందలి భాషాసారళ్యముకాని, జీవితసన్నిహితత్వముకాని అనర్హరాఘవ, రత్నావళి విద్ధసాలభంజికాది రూపకములందు కానరాడు.

రూపకరచనయందు [పాకృతములకు గల (ప్రాధాన్యము కూడ గమనింపతగిసది.

“నాట్యయోగేతు కర్తవ్యం కావ్యం భాషాసమాశ్రయమ్‌" అని భరతుడు, రూపకములందు తత్తత్పాంంతీయవ్యవహార భాషలకు (ప్రాధాన్యముండు టపసరషుని సూచించినాడు. దశరూపకకారుడును నళ్లే, రూపకప్రదర్శనమున (క్రియావేష భాషాదులన్నియు సంఘమునుండియే (గ్రహింపబడవలనని నిర్ణయంచినాడు,

“దేశభాణ[క్రియావేషా లక్షణాః స్యుః (పప్రపృత్తయః

లోకాదేవాధిగమ్యైతః యథౌచిత్యం (పప్రయోజలపేత్‌.” సంస్కృతనాటకవమల౦ దాదికాల వుయనుంలండియు (పాకృతవఎటలకు (పాధాన్యమేర్పడినది. సంభాషణమంతయు సాధారణముగా (ప్రాకృతముననే యున్నది. శ్లోకములు - అందును ఉత్తపు ప్యాతోక్తములెనవి మాత్రమే - సంస్కృతమునందు రచితములైనవి. భారతాదిముహాకావ్యములను గాథధారూపమున ప్రచారము గావించిన కాలముననే ప్రాకృతము లుపయుక్తములై యుండవలెను. కావ్యపఠనముచే మాత్రమే ప్రజల కర్థసిద్ది సంపూర్ణముగా కలుగజాలదు. కాప్పున, తద్వివరణము, (ప్రశ్నోత్తరములు, నిత్యాడులన్నియు ఆయా (ప్రాంతీయ వ్యవహారభాషలందు జరిగియుండవలెను. రూపకములందును నట్లె వివిధ

1768 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ప్రాకృతములు పాత్రోచితభాషలుగా నుపయుక్తములైనవి. నాటకవచనములం దుపయుక్తమైన (ప్రాకృతము - చాలవరకు శౌరసేని. భాసుడు మాగధిని - (స్వల్పముగా అర్ధమాగధిని) కూడ కొద్దిగా నుపయోగించినాడు.._ భాసుని తరువాత మహారాష్ట్ర ప్రాక్సృతమునకుగూడ ప్రవేశము కలిగినది. అశ్వఘోషుడు శౌరసేనీీ మాగధీ అర్ధమాగధులను వాడినాడు. ఇతని [ప్రాకృతములు ప్రాచీనములుగ గన్పట్టుచున్నవి. సాధారణముగ నాటకములన్నటియందును, (పధానముగా శౌరసేనియు, తరువాత మహారాష్ట్రియు ముఖ్యములు.

దీనినిబట్టి రూపకపదర్శనము సాంఘికజీవితమునకు అత్యంతము సన్నిహితమైయుండుట ప్రాచీనుల యాశయమని వ్య క్షమగుచున్నది. ఇతివృత్తమును కూడ సాంఘికజీవితమునుండి [గ్రహించి రూపకములను రచించినారు. భారతాది ఇతిహాసములనుండియే కావ్యువాజ్బయ నాటకవాజ్మయములు రెండును ఏర్పడినవనుట నిజము. రఘువంశ కుమారసంభవాది కావ్యములు, వాసవదత్త కాదంబరీ హర్షచరిత్రాది ఆఖ్యాయికాదులు భారతరామాయణాదుల ననుసరించినవి. శాకుంతల, ఉత్తరరామచరిత్ర, అనర్హరాఘవాది నాటకములును నా మార్గమునే యనుసరించినవి. ఐనను. [మహాకావ్యములందువల్లో లౌకికాతీత విషయములకును, సామాన్యమానవజీవితమున కందరాని విషయములకును రూపకరచనయందు (ప్రయోజనములేదు. కావున నట్టివి పరిత్యాజ్యములు. భాసుని నాటకములందు చిప్రితమెన ప్రతివిషయమును, ప్రతిసంఘటనయును, లోకజీవితమున కెంతయు స్వాభావికమైయుండుట యిందులకు తార్కాణము. శాకుంతలనాటకమందలి దుష్యంతుని దేవలోకగమనము, ఉత్తరరామచర్శితయందలి అలౌకికసన్నివేశములు నిత్యాదులు జీవితమునకు దూరములనుట నిజమే. అద్భుతరసపోషణకును, దైవశక్తిని ప్రజలకు (ప్రదర్శించుటకును నవి యుపకరించినవి. భారతీయుల మనస్తత్వమును బట్టి క్వాచిత్మములగు నా సంఘటనలు అసహజముగ దోపలిదు. అయినను అట్టి సన్నివేశముల కా నాటకములందు ప్రాధాన్యములేదు. అద్భుత విషయ(ప్రధానములగు రూపకము లేవియు (జల నాకర్షింపలేదనుట అతిశయోక్తికాదు. లౌకికజీవితమునకు చక్కని ప్రతిబింబమగు మృచ్చకటికవంటి రూపకమునకున్న వ్యాప్తి వికమోర్వశీయమువంటి వానికి లేదనుట నిక్కము. భరతుడుకూడ 'ప్రకరణరచనకే యొుక్కువ 'ప్రాధాన్యమిచ్చిన ట్లతడిచ్చిన (ప్రకరణ లక్షణమునుబట్టి యూహింపనగుచున్నది.

రూపకోత్పత్తి భూవతి లక్షీనారాయణ రావ్టు 1769

“యత్ర కవి రాత్మబుర్ధ్యా వస్తుశరీరంచ నాటకంబైవ

కౌత్పత్త్‌కం ప్రకురుతే ప్రకరణమేతత్‌ బుధైః జ్జేయం

విపపణిక్సచివానాం పురోహితామాత్యసార్హవాహనామ్‌

చరితం యదనేకవిద్ధం తత్‌ జ్లేయం (ప్రకరణం నామ.

నోదాత్తనాయకకృతం న దివ్యచరితం న రాజసంభోగం

బాహ్య జనసంప్రయుక్తం విజ్ణేయం (ప్రకరణంత జ్ఞ”

“సచివశేష్ట (బాహ్మణ పురోహితామాత్య సార్ధవాహానాం

గృహవార్తా యత్ర భవేత్‌”

ప్రకరణము స్వతంటతకల్చ్పన. (బ్రాహ్మణులు, వర్తకులు, పురోహితులు, మంతులు మున్నగువారి జీవితములందలి రసవత్తరములగు సన్నివేశములే యిందితివృత్తములు. సామాన్యకుటుంవీకుని (బాహ్యజన) గృహచరిత్రమే (పధాశనేతివృత్తముగ [ప్రకరణము రచితదైనది. దశరూపకముకూడ ఈ లక్షణమునే వివరించినది. దీనినిబట్టి, రూపకరచన సావూన్య్యప్రజల నుభ్ద్టెశించి యారంభమైనదనియు, సామాన్యమానవజీవిత మితివృత్తమగుట (ప్రాచీనుల ప్రధానాశయమునియు వదితవుగుచున్నది. ఇందు గవునింపవలసిన ముఖ్యవిషయమొకటి కలదు. బ్రహ్మ ఆదేశానుసారము దేవాసురయుద్ధ అమృృతవుథనాడి దివ్యువిషయకరూపకములను (దర్శించిన భరతుడు లౌకికవిషయప్రధానములగు ప్రకరణమువంటి రూపకములకు లక్షణ మెల రచించె నను ప్రశ్న కలుగకపోడు. (తేతాయుగ కాలమునకే, పకరణములందు చితితమైయున్న సాంఘకవ్యవస్ట లపేర్పుడినదా యను పప్రశ్నకూడ అపస్తుతము కాదు. [ప్రకరణాది రూపకభేదములు వ్యాప్తేకి వచ్చినపిమ్ముటనే నాట్యశాస్త్రము రచితమైనడని చప్పవలయును. లేదా, భరతముని రచితములైన స్యూతములు సంప్రదాయపరంపరగా వచ్చుచుండగా, తరువాతికాలముననెవరో వీనినన్నిటిని కోడీకరించి నూతనవిషయములను కూడ చేర్చి, (గంథరూపమున యున్నది. ఏకవచనము గాక నీ శబము బహువచసమున ప్రయుక్తమై యుండుటచే నాట్మపదర్శనవరమువారిక్‌ “చభరతో శబ్రము పాచకదైనట్లూహాంపనగుచున్నడి.

1770 పందిరి మల్లికార్డునరాప్పు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వేదకాలముననే భరతశబ్దవాచ్యులగు నొక వర్గమువారుండిరనికూడ తఆలియుచున్నది. వసిష్టమునివంశమువారు వసిష్టులని వ్యవహరింపబడినట్లే భరతుని వంశమువారు భరతులని పిలువబడియుందురు. ఈ వంశమునకు మూలపురుషుడగు భరతుడును, నతని నూర్గురు పుత్రులును, మొదట ఆర్యసంతతివారై వేదోక్తకర్మలను పాటించుచుండినను, నొకకాలమున నాటకప్రదర్శ్శునముల నారంభించి వానిని పోషించియుందురు. కళాభిరుచి కళాఖిజ్ఞతలు సహజముగ గల వ్యక్తులు రసపధానములగు రూపకప్రదర్శనముల కాలంబనమగుటలో నాశ్చర్యములేదు. నృత్యగీతాభినయబహుళమై, (ప్రజల నాకర్షింపజాలిన రూపకములను రచించియు, వానిని ప్రదర్శించియు భరతవంశీయులు సామాన్యప్రజానీకమునకు అభిమానపాత్రులైయుందురు. ఇట్లు వీరిజీవితము లౌకికవిషయ(ప్రధానమగుటచే, వైదికనిస్టాపరులగు నార్యులు వీరిని నిరసించి పంక్తిబాహ్యులుగ నొనర్చినారు. అంతటితో భరతులు నాటకప్రదర్శనమునే తమ వృత్తిగ నేర్చురచుకొని జీవింపనారంభించినారు. ప్రజాఖిమానమునకు పాత్రులయ్యును, రాజాదరణను మాత్రము వీరు, కొంత కాలమువరకును పొందినట్లు కనపడదు. వీరు [క్రమముగ పంచనదీ [ప్రాంతమునుండి మధ్యభారతమువైపు ప్రసరించి, కాలక్రమమున వింధ్య్మశేణి వరకును వచ్చినట్లున్నది. వైదికమతావలంబులగు ఆర్యుల సంఘమునుండి బహిష్కృతులైన వీరికి అనార్యులతో సంపర్క మెక్కు వైనట్లు అఆలియుచున్నది. నహుషుడు వీరి నాదరించినట్లును, నతని పోషణలో వీరు వర్థిల్లినట్లును సాక్ష్యమున్నది. దీనినిబట్టి, భరతవంశీయు లార్యులేయయ్యును లౌకికములగు కళలనవలంబించిన కారణమున సంఘబాహ్యు లె 6్రమముగ నాటక ప్రదర్శకవర్గముగ నేర్పడిరని వ్య క్తమగుచున్నది. రంగనిర్మాణము మొదలు చేషకల్పనవరకును గల ప్రదర్శనవిషయములన్నియు భరతుల యధీనములు. నటకులు మాత్రమేకాక ప్రదర్శనకు సంబంధించిన వారెల్లరును భరతులనియే వ్యవహరింపబడి యున్నారు. సంఫుచరిత కూడ నీ విషయమును (ధువపరచుచున్నది. చాలకాలమువరకును (బాహ్మణులే నాట్యశాస్తాాధ్యాపకులై యుండినారు. నాట్యశాస్తార్థమును ప్రపంచించుట మాత్రమే వీరి కర్తష్యముకాదు. అభినయనృత్యగీతాదుల నెల్ల నటకులచే నభ్యసింపబేసి, ప్రదర్శన విషయమున శిక్షణనొసంగుట వీరి వృత్తి. వీరు పుట్టుకచే [బాహ్మణులేయయ్యును నిష్టాగరిషస్టులగు

రూపకోత్పత్తి భూపతి లక్ష్మీనారాయణ రావు 1771 (బాహ్ముణవర్గమువారిచే గౌరవింపబడ లేదు. కాలకవువున ఈ భరతవంశబాహ్మణులు నటకులకు, గాయకులకు, వేశ్యలకు వృత్తిగురువులుగ నేర్పడినారు. భరతనాట్యము, గొల్లకలాపము మున్నగువానియందు నేటికిని (బాహ్మణులగు గురువులు పృాతలకాలంబనముగ నిలిచి తత్తత్పందర్శనముల నడపుచుండుట ప్రసిద్ధమే.. దీనినిబట్టి, రూపకరచన మిక్కిలి (పాచీనకాలముననే ఆరంభమైనట్లు చెప్పవచ్చును. నాట్యశాస్త్రము (బహ్మకల్పెతమనుటకు తచ్చాస్త్రృమునకు గౌరవము నాపాదించుటయే ప్రయోజనము. అది (ప్రాచీన సంప్రదాయము.

వేదాధికారములేని నాల్లవజాతివారికి జ్ఞానోపదేశము చేయుటయు, వారిని రజోగుణప్రధానమగు ప్రవృత్తినుండి మరలించి ధర్మమార్గోన్ముఖుల గావించుటయు (ప్రయోజనములుగ నాట్యశాస్త్రము రచితమైనది. సంస్కారహీనులగువారికి ఆదేశమార్గమున ధర్మన్యాయములను బోధించుట ఫలకారి కాజాలదు. చక్కెరలో పొదిగి కటుకౌషధమును సేవింపజేసినట్లు, మందును పాలలోచేర్చి పిల్లలచే (తాగించినట్లు, జీవితసన్నిహితమగు నితివృత్తము నాధారముగగొని, పరసమార్గము ననుసరించి జ్ఞానబోధ గావించుటయే పామరుల విషయమున సరియగు విధానము.. రూపకరచనావిధఢానమట్టిది. మహాభారత రామాయణములందలి యితివృత్తముల యాధారమున, సంగీతనృత్యాభినయాహార్యకాది సాధనముల సాహాయ్యమున (పజల మనస్సుల నాకర్షించి, వారి జీవితములను సంస్కరించుట రూపకములు సాధించు ప్రయోజనము. బుగ్యజుస్సామాధర్వములు వస్తుగీతాఛినయరసములను సమకూర్చినవి. నీవుడు రౌదాదులకనుకూలించు తాండవమును, సతీదేవి శృంగారకరుణాది లలితరసముల కుపకరించు లాస్యమును చేర్చినారు. విష్ణువు భారతీత్యాది చతుర్విఢధపృత్తులను జేర్చి రూపకప్రదర్శనమును సమ(గముగను, రసస్ఫోరకముగను నొసర్చినారు. [పదర్శనానుకూలమగు రంగస్థలము విశ్వకర్మ చే పరికల్పితమైనది. భరతశాస్త్రము రూపకపదర్శనమునస కిట్టి వ్యుత్పత్తిని (ప్రదర్శించుచున్నది. (బ్రహ్మాది దేవతావిషయకమగు నీ వ్యుత్పత్తని మనము విశ్వసించినను విశ్వసింపకున్నను, అతి పప్రాచీనకాలముననే భారతదేశమున రూపక్కపడర్శనవమమ సంగీతనృుత్యాఖినయాదులతో సమ(గగమై విలసిల్లి, సామాన్యుజనులకానందము సంస్కారము గూర్చినదనుట మాత్రము నిజము.

17/72 సందిరి మల్షికార్ట్డునరాప్పు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నాటకోచితములైన సంభాషణరూపమంత్రములు వేదములందు కలవనియు, నవియే రూపకోత్పత్తికి బీజములనియు కొందరు విమర్శకుల అభిప్రాయము. యమయమీ సంవాదము, ఊర్వశీ పురూరవ సంవాదము, నేమభార్గవ ఇందుల సంవాదము, ఇందాదితీవామదేవుల సంభాషణ, శరమాఫణుల సంవాదము, విశ్యామ్మితనదీ సంవాదము, ఇం(దవురుత్సంవాదవమ ఇత్యాదులు భావస్పోరకములైయుండుట నిజమే. కాని, వీనినుండియే నాటకసన్నివేశములు రసవత్తరసంభాషణములు కల్పితములయ్యుననియు, నవి [కమవికాసమును గాంచి రూపకరచనకు మూలములయ్యననియు నిర్ణయించుటకు తగిన యాధారములు లేవు. పై పేర్కొన్న సంభాషణలవంటివి తరువాతికాలపు వేదభాగములలో కానరావు. కనుక, [కకమపరిణామమును నిరూపించుటకు సాధ్యముకాదు. యజ్ఞ సవ్వుయవుబలలో, వుంతపాఠకులు రెండువర్గములుగా నేర్చుడి ఇం(దద్రమరుత్సంవాదము మున్నగువానిని పఠించుట ఆచారమై యండునని 142% 1406"(మాక్సుముల్లరు ఊహించినాడు. సామవేదమునాటికే సంగీత మేర్పడిన దనియు యువతులు చక్కగ నలంకరించుకొని నృత్యమయొనర్చుచు మంత్రములను గానమొనర్చ్భు నాచారము బుగ్వేదకాలమున కలదనియు ౧౧౦. 1౪౪4 మున్నగువారి . యూహ. విశ్వసృృష్టని సూచించు మతసంబంధములగు నృత్యములు పప్రాచినజాతులలో - అందును ముఖ్యముగా ఇండోయూరోపియను వర్గమువారిలో

  • ఆచారముగ నేర్పడినవనియు ఆ సంప్రదాయమే భారతీయార్యులలో కూడ నిలిచినదనియు, ౪౦౧ 50601066? పండితుడొక సిద్ధాంతమును పతిపాదించినాడు. ఇంద్రాదిదేవతలు నృత్యము చేసినట్లు వర్ణితమైయుండుట ఈ సిద్ధాంతమునకు ఆధారము. బ్రాహ్మణముల కాలమున జరిగిన యజ్ఞ క్రియాకలాపములలో నిట్టి నృత్యములకు సదృశములైనవి కలవు. ఈ మంత్రపఠనమే రూపకోత్పత్తికి మూలమని 0: 10161 అభిప్రాయపడుటయే కాక, తరువాతి వేదభాగముందలి సువర్జాధ్యాయము అట్లు (కమాభివృద్ధిచెందిన రూపకస్వరూపమని కూడ పేర్కొనియున్నాడు. ఈ (కమపరిణామము బెంగాలురాష్ట్రమున వ్యాప్తికి వచ్చెననియు, నవియే తరువాత రూపకరచనకు ఆధారములైనవనియు నితనిఅభ్మిపాయము. మై విధమున, సంభాషణాత్మక వేదవుర్యతములనుండి రూపకోత్పత్తిని నిరూపించుట సుసాధ్యముగనే కన్పట్టును. కాని, వేదమంటత్రములన్నియు మతసంబంధఢములగు

రూపకోత్పత్తి భూపతి లక్షీనారాయణ రావు 1773 క్రియాకలాపములకు చెందినవి కావు. లౌకికవిషయసంబంధము గల మం[తములుకూడ అనేకములు కలవు. వసిసష్టవిశ్వామిత్రుల కలహరూపసంభాషణ లౌకికమేయనుటలో సందేహంలేదు. వేదమం[తములనుండి రూపకములకుత్పత్తిని నిరూపించు ప్రయత్నమున అనేకములగు మంతములకు విపరీతార్థములుకూడ నూహింపబడినవి. వృషాకపేమంత్రము, ముద్గలమంటత్రము మున్నగువాని కిచ్చిన యర్థములు సందేహాస్పదములు. మండూకస్తుతికికూడా నిట్టి అపార్థమే 'పప్రతిపాదితమైనది. ఇదికాక, వేదమం[త్రములనుండి రూపకరచన యుత్పన్నమైనదని నిశ్చయింపవలె నన్నచో, సంగీతనృత్యాభినయములు కూడా మంటత్రపఠనమున తోడైయుండెనని నిరూపింపవలసియుండును. దాని కాధారములు లేవు. బు గ్యేదవుం[తతములు గానముచేయబడినవను నభిప్రాయము కూడ సం దేహాస్పదవే. సావువుం్యతతములను పాడియుండవచ్చును. కాని, బుగ్వేదమం(త్రము లేవిధమున పఠింపబడినది కూడ మనకు తెలియదు. 0॥ 116గ6! పేర్కొనిన సువర్జాధ్యాయము రూపకముగ నుద్దిష్టమైనదనుట కెందును సూచనలేదు. సంభాషణాత్మకములను నీ వేదమంత్రములు భావావేశమున కునికిపట్లగు సన్నివేశములకు సూచకములనియు వీనిసుండియే గాథధారూపమగు కావ్యరచనయు ప్రదర్శసరూపమగు రూపకరచనయు కూడ ఏర్పడియుండుననియు కూడ నొక విమర్శకాభ్మిపాయము కలదు. మంత్రములకును మంత్రములకును నడుమ వచనభాగములు కూడ రచితములై యుండెననియు, నవి గణబద్ధములు కాకుండుటచే కాలక్రమమున లోపించినవనియు ఈ విమర్శకుల పపతిపాదన. ఈ సిద్ధాంతములన్నియు నూహాకట్పితములే కాని 'హేతుబద్ధముగ నిరూపింపరానివి.

వైదికక్రియాకలాపములయందు రూపకవబీజములు నిహితములై యుస్నవనియు ఆ కర్మలనుండియే (క్రమముగ రూపకము పరిణమించినదనియు కొందరు (పాచీనవిమర్శకుల యభిప్రాయము. మతసలబంధములు పూజావిషయకములు నగు నృత్యములు, మూకాభఖినయములు మున్నగునవి రూపక ప్రదర్శనమునకు మూలములని వీరిభావము. సోమవ్మిక్రీతమను ఘట్టము అట్టి సన్నివేశములలోనొకటి. కాని, ఆనందమును గూర్పుట రూపకము యొక్క ముఖ్య ప్రయోజనము. వెదిక్కకియాకలాపములు అట్టి (ప్రయోజనమునుద్రేశించి రచితములైనవి కాపు. అవి యజ్ఞసంబంధవయలగు సంపడాయవుమలుగను. నియమములుగను

1774 పందిరి మల్లికార్జునరావు నతజయంతి సంపుటము 44: సాహిత్యము పరిగణింపబడినవి. ఈ శ్రియాకలాపములకు సంకేతార్థములుకూడా కలవసి యందురు. కావున, వీనినుండి రూపకోత్పత్తి జరిగినదని చెప్పుటకు సాధ్యముకాదు. మరియు, రూపకమున కెక్కువగ సంబంధించిన పరిభాషాశబ్దము లేవియు ప్రాచీనవేద భాగములందు లేవందురు. ఆనేకములగు వృత్తులను ఆ జీవికలను అనుసరించు వర్గములవారిని తెలుపు (వాచక) శబ్దములు యజుర్వేదమున పేర్కొనబడియున్నవి. కాని నట శబ్దము వానియందు లేదు. శైలూషశబ్దమొకటి కనబడుచున్నది కాని, యీ శబ్దము గాయకునకును నర్హకునకును కూడ సూచకమగుటచే నటశబ్దవాచకముగా దీనిని (గ్రహింప వీలులేదు. మహావ్రతసందర్భమునం దగ్నిచుట్టును ప్రదక్షిణము చేయుచు కన్యలు నృత్యవమచేయుచుండి రనియు, ఫలోత్పత్తి కనుకూలించు సువృష్టి తత్ప్రయోజనమనియు ఆలియుచున్నది. అట్లు వివాహసందర్భమున, తద్వివాహము సుస్థిరము, ఫలవంతము నగుట నుద్దేశించి ముత్రైదువలుకూడ నృత్యము చేయుచుండిరని కలదు. ఇట్టి నృత్యాదులన్నియు దేవతాప్రీత్యర్థమును, ఫలసిద్ధి నాకాంక్షించియు జరిగినవియే కాని, నాటకమునందువలె (ప్రేక్షకుల రంజనార్థము జరిగినవికావు. కావున, మం[త్రపఠనమునుండికాని, వైదికకియలకు సంబంధించిన నృత్యగీతాదులనుండి కాని, రూపకోత్పత్తి జరిగినదనుట ఊహామాత్రమే యగును. మరియు, వేదమం[తములును, యజ్ఞకర్మకలాపాదులును లౌకికసంబంధము లైనవికావు. ఇవి నిష్టాగరిస్టులగు బ్రాహ్మణుల యధీనములు. కావున వీనినుండి కేవలము లౌకికములు, ఇంద్రియలోలుపతా ప్రధానములు, రసోత్పత్తిమూలములు నగు రూపకము లేర్పుడినవనుట పాసగదు. వైదికకర్మయంతయు నలౌకికవిషయముగ నాడు పరిగణింపబడినది. లోకకల్యాణము నుద్దేశించిన యొక పవిత్ర ప్రయత్నము యజ్ఞకర్మ. ఇంద్రియాసక్తికిని, వినోద ప్రసక్తికిని యజ్ఞకర్మతో సంబంధము కుదరదు. ఆత్మసంయమనముతో లోకహితము నుర్దేశించి జరుపవలసిన నియమబద్ధమగు కర్మ యజ్ఞము. వైదికకర్మకలాపమంతయు నిట్టిదే. కనుక, నయననవణేంద్రియముల ద్వారా చిత్తవికాస సద్యఃపరనిర్వృతులసు గలిగించి, జీవితవును రసవుయవుగ నొనర్వ్చు దృశ్యకళారచన వెదికకర్మకాండనుండి యుద్భృవించిన దనుటకు వీలులేదు.

రూపకోత్పత్తి భూవతి లక్షీనారాయణ రావు 1775

(గీకురూపకముల యుతృత్తిని పురస్కరించుకొని పాశ్చాత్యు లీ యభ్మిపాయము నిచ్చియయందురని యరాహ౦పవచును. [పాచీనకాలవమున గ్రీసుదేశపూజావిధానములలో మంత్రముల నందరును కలిసి యుచ్చరించుట సంప్రదాయముగ నుండినది. తరువాతికాలమున నొకడు మం[తతపాదములను పాడుటయు తక్కిన వారతనిననుసరించి పలుకుటయు నలవాటుగ నేర్పడినది. (పప్రజాసమూహములువృద్ధియగుకొలది మం[త్రవఠనము ఎ కొందరియందుమాత్రమా నిలుచుట తప్పదు. పూజావిధాన మిట్లు సంభాషణాత్మకరూపమును గెకొన్నది. కాలక్రమమున స్తుత్యాత్మకమగు మంతమునకు మారుగ దైవసంబంధమగు గాథ పూజాసమయమున పఠింపబడుచువచ్చినది. అది క6్రమముగ భిన్నవ్యక్తులచే (పయుక్తమగుచు రూపకరచనకు మార్గము చూపినది. ఇది (గీకురూపకరచనకు మూలమని విమర్శకాభ్మిప్రాయము.

ఆంగ్లదేశమున కూడ పూజావిధానమే రూపకరచనకు మూలమైసదని పండితుల నిర్ణయము. రోమన్‌కాతలక్‌ చర్చిలో జరుగు 11293 అనెడి పూజావిధానమున సంగీతము, ఉదాత్తానుదాత్తస్వరితాది స్వరభేదములతో గూడిన మంత్రపఠనము, వేషాలంకరణాద్యాడంబరము - ఇత్యాదులు మిక్కిలి ప్రాధాన్యము వహించుచున్నవి. ఈ పూజావిధానమునుండియే (క్రమముగ రూపకప్రదర్శనము లేర్చడినవని యూహింపబడుచున్నది. (పథమాంగ్గరూపక (ప్రదర్శనములు మా్మాతము దేవగాథాసంబంధము లనుట నిక్కము. 14516165, 1410121188 అను పేరుతో, దేవతాసంబంధములగు కథలు (ప్రదర్శింపబడుచువచ్చినవి. వీనిని ప్రదర్శింపబేసినవారు కూడ మతప్రచారకులే. దేవునిప్రభావమును ప్రదర్శించు కైంఎస్తవమత సంబంధములగు గాథలను పామరజనసంఘమున (పచారముచేసి, తద్ద్వారా వారిని ధర్మబద్ధులుగ చేయు నుద్దేశముతో మతాధికారులు ఈ [ప్రదర్శనములను (ప్రవర్తింపజేసినారు. చర్చికి సంబంధించిన వారే వీనియందు ప్యాతధారులు. వీరివర్గము, తమ రంగపరికరములతోకూడ దేశమున పర్యటనము గావించుచు నీరూపకములను ప్రదర్శించుచుండెడివారు. ఆరు, లేక ఎనిమిది చక్రములచే కూర్చబడిన గొప్ప శకటము ఈ నాటకవర్గముచారికి యానముగను, ఆవాసముగను, రంగస్థలముగనుకూడ నుపకరించినది. కాలక్రమమున, సంఘముయొక్క అభిరుచి వికాసములను బట్టియు, లౌకికజీవిత లౌకిక

1776 పందిరి మల్షికార్డునరాప్పు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము సారస్వతాభివృద్ధి ననుసరించియు, లౌకికవిషయ్యప్రధానములగు రూపకము లర్పడినవి. అట్లేర్పడిన [పప్రథమరూపకములు సామాన్యసంఘ జీవితమునకు ప్రతివింబములైయుండుట గమనింపదగిన విషయము. 6ఉ4గ౧౭౯౮గ౦౧౩ 66616, కి ౧6౪ ౪౭౪ (0 ౧౫/ ౦16 66015, [5 201% 506 15 & ఈ౧౦|౪, ఉగ ౧౦౧౪౪1 ఉఆ౧౦/౪ మున్నగు

' నాదికాలపురూపకము లిందునకు చక్కని యుదాహరణములు. ఎలిజబెత్‌ యుగమువరకును చాలపరకు నిట్టి రూపకములే (ప్రచారముననుండినవి,. 86౧00౧౧5౦౧ 862000౧ 2౧6 [౧161006౯ మున్నగువారి నాటకములలోకూడ నిట్టివి చాల కలవు. చారిత్రకములు, ఉదాత్తేతివృత్త పప్రధానములు, ఉదాత్తభావపోషకములు నగు నాటకములు 5[4469062/65కు సన్నిహైతకాలమునం దేర్పుడజొచ్చినవి. భారతదేశమందువలెనే అందును, సామాన్యప్రజాజీవిత (పప్రదర్శకముగ నారంభించిస రూపకరచన, క్రమముగ రాజాస్థానములకు విద్యావంతులకు మాత్రమే యుపకరించు సారస్వతముగ సిద్ధించినది. వాస్తవికజీవితప్రవృత్తి ప్రాధాసన్యమగుటకు బదు లీ రూపకవఎులలో వమూనసికజీవిత (పవృత్తికి [పాధాన్యవేర్పడినది. పాశ్చాత్య దేశములందు జరిగిన యిట్టి రూపకపరిణావముము ననుసరించ, పాశ్చాత్యపండితులు భారతీయ రూపకములు కూడ నిట్లే యేర్పడియుండునని యూహించినారు. భారతదేశమందలి పరిస్థితులు పాశ్చాత్య దేశపరిస్థితులకు భిన్నములు. ఆ దేశములలో, పూజావిధానమునందు ప్రజలల్లరును పాల్గొనుటకు వీలున్నది. కులభేదములులేని కారణమున మత విషయక పూజావిధానము సార్వజనీనమగు విషయము. భారతదేశమునం దాదిసుండియు వైదికకర్మ కలాపము బుషులయొక్కయు, సద్చాాహ్మణులయొక్కయు నధీనమైయున్నది. లౌకికజీవితము ప్రధాసముగాగల (బాహ్మణులకుగూడ వేదకర్మ్శల కథికారములెదు. బహునియమములకు లోబడియున్న యొక విశిష్టవర్గమువారికి మాత్రమే అధికార మేర్చడినది. కావున లౌకికవిషయప్రధానములగు రూపకములు దికకర్మలనుంది జనించిన వను వాదము సత్యదూరమైనది.

(పజలయందు విజ్ఞానమును (ప్రచారము చేయుటకై, రచితములైన భారతరామాయణాది మహాకావ్యములే రూపకరచనకు మార్గదర్శకములైనవని చెప్పవచ్చుసు. కథను ఒకవ్యక్తి పఠించి యర్థమును వివరించుటకంటెను. భిన్నవ్యక్తు లాయా కథాపాత్రల వాక్యముల నుచ్చరించుటవలన కథాసన్నివేశము

రూపకోత్పత్తి భూపతి లక్షీనారాయణ రావు 1777 బాగుగ (గ్రాహ్యాముకాగలదు. పఠనమునకు వాచికాభినయాంగికాభినయములు కూడ తోడైనపుడు భావము బాగుగ వ్య క్రమగుననుట నిక్కము. వీనికి వేషము, రంగపరికరములు నృత్యగీతములుకూడ చేరినచో కథాప్రదర్శన మాకర్షణీయమును, చిత్తవకాసహేతువును కాగలదు. జీవితమునందలి రసవంతములగు సన్నివేశములు మనలను స్వాభావికముగనే యాకర్ణించును. అట్టి పూర్వేతివృత్తములను కథరూపమున విని యానందించుట ప్రకృతిసహజమగు మానవ ప్రవృత్తి. “ప్రాప్యావన్తీ నదయనకథాకోవిదగామవృద్ధాన్‌ పూర్యోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలామ్‌”" అని యీ విషయమునే కాళిదాసు మేఘసందేశమున వర్జించినాడు. మానవుని యీ కథాశ్రవణాసక్తియే ఆఖ్యానరచన, గాథారచన, రూపకరచనలకు హేతువైనది. ఇతివృత్తము ఇంద్రియ (ప్రత్యక్షమగుసట్లు చేసి రసోత్పత్తిని కలిగించుసది రూపకము. (గవ్యకావ్య పఠనమున కిట్టి శక్తి లేదు. రంగస్థలము, ప్యాతవేషాదికములు మున్నగునవి నయనేందియము నాకర్ణించి, తద్ద్వారా మనస్సును పరిసరములనుండి మరలించి, రంగముపె కేందీకరింపచేయగలవు. సామాజకుని మనస్సునందు వాసనా రూపమున సుప్తమైయున్న భాపము నుద్చుద్ధముచేయుటకు వాచకాంగికాఖినయ ములు సమర్థములగుచున్నవి. సంగీతనృత్యాదు లాభావమును పోషించుటకును, సామాజకుని మనస్సును రంగస్థలమందలి పాత్రపై కేంద్రీకరింపజేసి తన్మయతను కలిగించుటకును సహాయపడుచున్నవి. ఈ విధమున, గగ్రేుక్షకుడు తన భెతికపరిసరములను నిజజీవితవ్యవస్థను విస్మరించి భావనాజీవితమున తన్మయుడగుచున్నాడు. ఈ పరిస్థితియే రసానుభూతి కవసరముగు నాధారము. ఇట్టి శక్తి డ్ర్యకావ్యమునకు లేదు. రూపక ప్రదర్శనమునకుగల యీ వైశిష్ట్యము చాల (ప్రాచీన కాలముననే మానవునిచే గుర్తింపబడినది. మానవజీవితము భావనాత్మకమైనది. సకలకళాసృష్టికిని మానవుని యీ భావనాస్వభావమే కారణమైనది. భగవదంశములగు సౌందర్యాసక్తి సృజనాసక్తులు మానవుసకు సం[క్రమంచినవి. కళాసృష్టియు, సారస్వతసృష్టియు ఈ అంశాలఫలితములే, రూపక మందొక విశిష్టరచన.

1778 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము పాలభంజికాపదర్శనము రూపక్కపదర్శనమునకు మూలమని మరియుక అభఖ్మిపాయము కలదు. దారుమయములగు బొమ్మలను పాత్రలుగచేసి. వానిని ప్రదర్శించుచు కథను నడవు నలవాటు ప్రాచీనకాలమునుండియు కలదు. చేతులు, కాళ్లు, తల మున్నగు స్టూలభాగములు మాత్రమే కాక, (వేళ్లు మున్నగు సూక్ష్మములగు దేహభాగములు కూడ వేరువేరుగ కల్పించి, వానిని కీళ్ళ చేకూర్చి యీ బొమ్మలను చేసెడివారు. బొమ్మ దేహము బోలుగా నుండుటచే దారములను లోపలినుండి ప్రతియంగమునకును సంధించి, వానిసాహాయ్యమున నాయా యంలగములను కదలించుట కవకాశము కలదు. ఈ దారములన్నియు బొమ్మవీపులోనుండి వేర్వేరు అంగములకు ప్రసరించునవి యగుటచే ప్రదర్శకుడు వానిని (గ్రహించి, బొమ్మచే నంగవిక్షేపాదులను చేయింపగలుగుచున్నాడు. ఈ దారములకు సూ(తములని పేరు. ఈ సూతముల సాహాయ్యమున బొమ్మలనభియింపజేయుచు, సంభాషణలను తానే (ప్రవర్తింపజేయుచు, కథను సడుపువాడు ప్రదర్శకుడగుటచే వానికి సూూతధారుడని పేరు కలిగినదని యందురు. ఇట్టి సాలభంజికాప్రదర్థ్శన మొకవృత్తిగా నొకవర్గమువారి కేర్పడినది. తరువాతికాలమున తోలుబొమ్మలాట దీనిననుసరించి యేర్చడినది. స్త్రీపురుషులే ఆయాపాత్రలవల వేషములు ధరించి నటించుట బొమ్మల ప్రదర్శనముకంటె నాకర్ష్ణణీయముగను, సులభముగను తోచుటచే అట్టి రూపక ప్రదర్శనములు ఎర్పడిసవని యందురు. సాలభంజికాపదర్శనమున కూడ సంభాషణాదులన్నియు బొమ్మల నాడించు వ్యక్తులే (ప్రవర్తింపవలసియుండుటచే తామే యా బొమ్మల స్థానమున నిలిచి సటించుట సులభముగ గన్పడినది. అదికాక సన్నివేశానుగుణమగు అనుభవాదిపదర్శనకు కూడ నిందవకాశము కలదు. ఇక, వాచికాభినయరహితమై, కేవలము ఆంగికాఖినయ ప్రవృత్తమగు మూకాభినయము కూడ పూర్వము వ్యాప్తిలో నుండినట్లు తలియుచున్నది. నేటికిని, జావా, బాలీ ద్వీపములలో ఇట్టి మూకాభినయ(ప్రదర్శనములు వ్యాప్తిలోనున్నవి. 1937 సంవత్సర ప్రాంతములో, చీనాదేశపు దర్శకుడొకడు ఇట్టి ైలూషవర్షమును గూర్చికొని, రసవత్తరములగు వివిధకథలను ప్రదర్శించుచు భారత దేశపర్యటనము గావించినాడు. రామాయణమహాభారతాదులందలి సన్నివేశములు మాత్రమేకాక, ప్రజల సిత్యజీవితమందలి సంఘటనలు, సన్నివేశములు కూడ నిట్లు రసవంతములుగ (పదర్శితములగుచున్నవి. ఇట్టి మూకాభినయ(ప్రదర్శనములు (067౦ 5[0౪49)

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1779 ఆంగ్లదేశమునకూడ వ్యాప్తిలో నొకప్పుడుండినట్లు 5౧2485062/8 రచించిన ౫4౫61 నాటకము సాక్ష్యమిచ్చుచున్నది. చాలకాలము మరుగుపడియుండిన యీ (ప్రదర్శనములు నేడు సినిమా రంగమువారి ప్రోత్సాహమున పునరుజ్జీవతము లగుచున్నవి

సూతమనగా నాట్యశాస్త్రృసంబందమగు సం[పప్రదాయమనియు, దానిని (ప్రవర్తింప జేయువాడగుటచే ప్రదర్శకునకు సూూతదారుడను పేరు కలిగినదనియు కొందరు

సూత్రదారశబ్దము బారతమున మరియుిుక యర్ధమున (ప్రయుక్త మైయున్నది యజ్జబూమి నిర్మాణసందర్భ్చమున,

'స్టాపతిః బుద్రిసంపన్నో వస్తువిద్యావిశారదః

ధ ధ్‌ క

ఇత్య (బవీత్సూూతదారః సూతో పౌరాణిక స్తదా యని గలదు వస్తువిద్యావిశారదుడు, బుద్ధిసంపన్నుడు, పారాణికుడు, సూతుడు నగు సూ్యూతదారుడు సాపతి యని యీ వాక్యముచే వ్య కృమగుచున్నది.

థ వో

“యస్మిన్‌ దేశే కాలే చ మాపనేయం ప్రవర్తితం అను తరువాతి వాక్యముచే, యజ్ఞ బూమినిర్మాణమున కై బూమిని కొలుచుట సూత దారకర్తవ్యమని తెలియుచున్నది

“పుష్యునక్షత్రయోగేషు శుక్షం సూత్రం (పసారయేత్‌ అను వాక్యముచే, యుజ్జ బూమిని కొలుచుటకు పుష్యునక్ష తయోగము శుబభబలగ్నమనియు, తల్లనిదారముచే చూమినికొలుచుట ఆచారమనియు నర్ధమగుచున్నది ఈ సందర్చమునుబట్టి, స్మూతదారశబ్దమునకు శిల్పాచార్యుడను నర్థము సిద్ధంచుచున్నది పొరాణికుడగు సూతుడే తరువాతికాలమున, యజ్ఞశాలాస్థాపకుడుగ నేర్పడియుండ వచ్చునని ఊహింపవచ్చును చంద్రగుప్తుని నగరప్రవేశమునకు ముందు చాణక్యుడు పట్టణమండలి సూత్రదారులనెల్ల రావించి, పురము నలంకరింపవలసినదిగా వారి నాదేశించినట్లు ముదారాక్షసనాటకమున వర్ణితమైయున్నదడి దీనినిబట్టి, స్యూతదారశబ్దమునకు శిల్పిముబ్యుడను నర్థమున్నట్లు నిర్ణయింపవచ్చును మై బారతశ్లోకమున సూతుడే సూతదారుడని యుండుటచే

1780 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గాథాపాఠకుడగు పౌరాణికసూతుడే కాలక్రమమున రూపకపదర్శకుడుగా పరిణమించి యుండవచ్చునని తోచుచున్నది. బ్రాహ్మణస్త్రీయందు క్షత్రియునకు జన్మించిన సంతానవఎను సూతులని వ్యవహరించినట్లు కలదు. విలోమసంతానమేయైనను నున్నతవర్గము వారి సంతానమైన కారణమునను, వారి (ప్రాపున పెరిగిన కారణమునను నీ సూతవర్గమువారు విద్యావంతులు శక్తివంతులు నై వృద్ధికివచ్చియుందురు. స్వశక్తి సామర్థ్యములపై నాధారపడియే వీరు జీవించవలసియుండుటచే ననేకములగు వృత్తుల నవలంబించి, యందున్నతస్థానములను సంపాదించుకొనియుందురని తోచుచున్నది. యజ్ఞకర్మ, యుద్ధవ్యాపారము, పురాణపఠనము, శిల్పము, సారస్వతము - మున్నగు వానికి సంబంధించిన విషయములతో సూతుల కధికవుగు (పసక్తియున్నట్లు భారతాదులవలన వ్య క్తమగుచున్నది. గాథాపాఠకుడగు సూతుడు తనకు సహాయులుగ గాయకుల నేర్పరచుకొని యుండును. వీరికి కుశీలవులను వ్యవహారము కలదు. కొంతకాలమునకు ప్త్రీలనుగూడ సహాయులుగగొని నృత్య సంగీతా భినయాత్మకముగ కథను వర్ణించుట పరిపాటియైనది. (బొబ్బిలికథ మున్నగు గాథలను (పదర్శించువారు నేడును ఈ పద్ధతినే యవలంబించుచున్నారు] ఈ సూతవర్గమే శ్రమముగ, కథయందలి ఆయా ప్రధాన పాత్రల వేషములను ధరించి సంభాషణలతో కథను నడపియుందురు. సంగీతము, నృత్యము, అభినయము చేరిన కొంతకాలమునకు సాహిత్యము కూడ సహాయమైయుండును. అనగా, అభినయాత్మకప్రదర్శనము (పజామోదమును బడయుటతో రాజాదరణకూడ కలిగినది. ఉత్సాహవంతులు, సరసులు నగు కవులు రూపకములను రచించి, ఈ సూతబృందముచే ప్రదర్శింపజేసియుందురు. అంతకుపూర్వము సూతుడే రూపకకర్తయు, ప్రదర్శకుడును. నటుడును కూడ నై యుండెననుటలో సందేహము లేదు. అతని రచనలు కవితావిషయమునం దుత్తవుములుకాకపోవృటచే శిష్టులగు కవులు తామై రూపకరచనకు పూనుకొనియుందురు. సీతాప్రవాసవిషయమును ఇతివృత్తముగాబేసి వాల్మీకి రూపకమును రచించి, దానిని ప్రదర్శనార్థమై భరతమునికి పంపించెనన్న ఉత్తరరామచర్మితయందలి యంశము నీవిషయమునం దనుసంధింపనగును. చిత్రనలీయము, విషాదసారంగధర, ప్రతాపరుదీయము, కన్యాశుల్కము మున్నగు

రూపకోత్పత్తి భూవతి లక్షీనారాయణ రావు 1781 శిష్ణరూపకములకు పూర్వ మాంధ్రదేశమున వ్యాప్తియందుండినవి వీథినాటకములు. వీనినే (వీథి భాగవతములనియు వ్యవహరించెడి వారు. పంతొమ్మిదవ శతాబ్దపు " కడపటిభాగమువరకును నివియే సామాన్యప్రజల కుపాదేయములైనవి. రచనవిషయమున నా రూపకము లుత్తమములుగా శిష్టులచే పరిగణింపబడలిదు. తమిళ కర్ణాటక (పప్ర్రాంతములందును, బంగాలు, మహారాష్ట్ర ప్రాంతములందును కూడ రూపకపరిణామ మీమార్గముననే జరిగినదని ఆ వాజ్బయచర్మితలవలన తఆలియుచున్నది. దీనినిబట్టి, భారతరామాయణాది మహాకావ్యముల ననుసరించిన వీరగాథలతో నారంభమైన లౌకిక సాహిత్యమును, దానిని [ప్రజలయందు (ప్రచారము గావించిన సూతబృందమును, రూపకోత్పత్తి రూపకప్రదర్శనలకు మూలములని తోచుచున్నది. భారతమున నటనబ్ద ముపయుక్త మైయున్నది.. కాని, సందర్భమునుపట్టి చూడగా మూకాభినయప్రదర్శకు డను నర్థముకూడ నందు సరిపోవుచున్నది. రామాయణమునకూడ, నట, నర్తక, నాటక సమాజ శబ్దములు కనపడుచున్నవి. హరివంశ కాలమునాటికి నాటకపదర్శనము లుండినట్లు ఆధారములున్నపి. భారతరామాయణముల కాలమున నాటకప్రదర్శుసము లుండినవని రూఢిగ చెప్పుటకు తగిన యాధారములులేవు. నట, నాటక శబ్దములు నర్తక, అభినయములకుకూడ వాచకములని చెప్పవచ్చును. ఐనను ఈ మహాకావ్యములు రూపకోత్పత్తికి మూలములని చెప్పుటకు అవకాశమున్నది. వ్యాసశిష్యులచే నారబ్ధమైన భారతప్రచారము తరువాత పౌరాణికులచే నసుసరింపబడుచు వచ్చినది. రామాయణమును నటే ప్రచారమైనది. కథకు లనెడివారు వర్గములుగ నేర్చడి, యీ గాథలను దేశమున ప్రచారమొసర్చినారు. వీరిలో, కథాపఠన మొనర్చువారు పాఠకులనియు, వాని యర్ధ్థమును దేశభాషలలో వివరించువారు ధారకులనియు వ్యవహరింపబడెడివారు. సాంచీస్తూపమున నిట్టి విధానము చిత్రితమైయున్నది. వీరు సంగీతమును నృత్యమును గూడ సహాయముగగొని, అభినయముచే తత్తత్కథాప్యాతల భావములను మ్య కీకరించుచుండిరని ఆలియుచున్నది. కాలక్రమమున వీరికి మహాకావ్యపఠన మొకవృత్తిగా నేర్చడినడి. [కర్ణాటాంధ్ర మహారాష్ట్ర దేశములండు మొన్నటివరకుసు వ్యాప్తిలోసుస్న “హరికథావిధానము” గమనింపదగినది. కథకులు, పండితులు, గాయకులు నై యుండుట మాత్రమేకాక,

1782 పందిరి మల్ష్‌కార్డ్టునరావ్వు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నృత్యమును కూడ (ప్రయోగించుచుండిరి. సుప్రసిద్ధాంధ కథకులగు నారాయణదాసుగారి కథాపదర్శనమును జూచినవారికీ విషయము సువ్య క్తము. శ్రీ రామశాస్త్రింగారు మహారాష్ట్ర దేశమున ప్రసిద్ధిగాంచిన కథకులు.] ఈ వర్గమువారికి భరతులను పేరు కూడ కలిగినది. మూకాభినయముచే, క్రియారూపమున, గాథలను ప్రదర్శించు వర్గమువారు కూడ తరువాతికాలమున నేర్చడినారు. వీరికి శౌభికులని పేరు. పూర్వగాథలందలి ముఖ్యఘట్టములను అను[క్రమణికగా చిత్రములుగా రచించి వానిని ప్రదర్శించు వర్గమువారు ఎర్పడినారు.. ఇట్టి చిత్రపట [పప్రదర్శకు లిరువదియవ శతాబ్దారంభమువరకును దేశమున నందందు తిరుగుచు పొట్టబోసికొనుచుండినట్లు వినుచున్నాము. చిత్రపటములను చుట్టలుగాజేసి, పెట్టెలోనిమిడ్బి గాజుకటకము (8౧9) సాహాయ్యమున ప్రదర్శించుట నేటికిని గలదు. చిత్రపటప్రదర్శనము కొందరికి వృత్తిగా నుండినదని ముద్రారాక్షసనాటకమువలన ఆలియుచున్నది. అట్టి వేషమును ధరించియే జీవసిద్ధి రాక్షసుని అంగుళలీయకమును సంపాదించినాడు. కథలను రసవంతముగ వర్ణించి జీవించు వర్గముకూడ నాకప్పుడుండినది. వీరు (గంధథికులని వ్యవహరింపబడినారు. ఇట్లు, చిత్రపటష్మపదర్శనములు మూకాభినయ ప్రదర్శనములు, గాథావర్దనలు వున్నగునవి డేశమున చిరకాలమును౦డియు వా్థపించియున్నవని తెలియుచున్నది. పాణిని నటసూత్రములను పేర్కొనినాడు. అనద్యతనభూత విషయవర్జ్ద్షనయందు వర్తమాన క్రియారూప (ప్రయోగమునుగూర్చి పతంజలి విషుర్శించియున్నాడు. జరిగిపోయిన విషయముల ప్రదర్శనమును చూచినప్పుడు వాని వర్ణనలను వినిన ప్వుడును వూతమే యిట్టి భాషాపయోగము సహజమగుచున్నదనియు, నా కారణముచే పతంజలినాటికి శౌభికగంథికాదివర్గము లేర్పడి యుండినవనియు 1/606 మున్నగు పాశ్చాత్య విమర్శకుల అభ్మిపాయము. ఈ భాషాప్రయోగమును గూర్చి మొదట వివరించినవాడు కాత్యాయను డగుటచే, కాత్యాయనుని నాటికే యిట్టి ప్రదర్శములు దేశమున వ్యాప్తియందుండినవని చెప్పవలసియున్నది. పతంజలినాటికి రూపక ప్రదర్శసము సర్వాంగసమ్మగ్రముగ గాకున్నసు, ప్రాథమికదశ యందైన నుండినదని చెప్పుట కపకాశమున్నది. తరువాత, కృష్ణ సంబంధములైన గాథలును, రామాయణ గాథలును, భారత గాథలును ఏదో రూపమున (పదర్శితములగుచు వచ్చినవి. బౌద్ధమత (పచారమునకు రూపకప్రదర్శనము కూడ నొక సాధనమైనది. బౌద్ధమత [ప్రాథమికదశలో

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1783 రూపకసందర్శనము పరిత్యాజ్యమని భిక్తువులకు ఆదేశముండినది. కాని, తరువాతి కాలమున రూపకములు మతప్రచారసాధనములుగ బౌద్ధులచే నంగీకృతములైనవి. బుద్ధుని జీవితగాథలు ప్రదర్శన యోగ్యములగు రూపకములుగ దేశభాషలగు (పప్రాకృతములలో రచితములైనవి. “కువలయ” యను స్తీ సుప్రసిద్ధనటిగా నా కాలమున పేరు వడపినది. బుద్దభిక్షువు లీమె కళాసౌందర్యములకు ముగ్గులైరనియు, నంత బుద్ధుడీమెను శిక్షించెననియు నొక నైతిహ్యముకూడ కలదు. బింబిసారుని కాలమున నాటకప్రదర్శనము లుండినవని తలియుచున్నది. అశ్వ ఘోషుని రూపకములు వునకు లభించిన ప్రాచీన బౌద్దరూపకములు. బౌద్ధులు నృత్యగీతాభినయాదికళలను ఎక్కువగా పోషించిరనుటకు అజంతా శిల్చ్పములే సాక్ష్యములు. పాపపుణ్యముల సంఘర్షణను ఇతివృత్తముగజేసి బౌద్ధులు రూపకములను రచించి టిబెట్టుదేశవున (ఏదర్శించుచుండిరనియు తలియుచున్నది. జైనులుకూడ, లలితకళలకు ప్రథమమున విముఖులే యయ్యును, కాల్మక్షమమున తమ మతవ్యాప్త్‌కీ సాధనములుగా వాని నంగీకరించారు. వీనినన్నిటినిబట్టి, క్రీస్తుపూర్వము ద్వితీయశతాబ్టి మధ్య కాలమునాటికి సంస్కృతనాటకము ఏర్పడియుండునని 461% పండితుని అభిప్రాయము. నాట్యశాస్త ఏవఎనుబట్టాయు, సంస్కృత నాటకవఎలనుబట్టాయు, వ్యవహార(ప్రాకృతములకు రూపకములలో 'పాధాన్యమున్నట్లు వ్య క్తమగుచున్నది. రూపకములు తొలుత పప్రాకృతభాషలందే రచితములైనవనియు, తరువాతికాలముస, నిష్ణ్టకవులచే సంస్కృతము చేర్పబడెననియు కూడ నొక అభిప్రాయము కలదు. రూపకరచన పామరజనుల (ప్రయోజనము నుద్దేశించినది యగుటచే అట్లు జరిగియుండుట అసంభావ్యమును కాదు. శిష్ట పండితులు రానురాను ఈ (ప్రదర్శములందాసక్తు లై, సంస్కరించు నుద్దేశముతో నందందు మార్పులను గావించియుందురు. ఉత్తమ పాతల భాషను సంస్కృతముగ జెసియుండవచ్చును. రూపక ప్రదర్భ్శనములలో పాత్రధారులల్లరును, సాధారణముగ సామాన్య వర్గమువారే మై యుందురు. (నటవర్గమువారు గౌరవార్లులుగ పరిగణింపబడకుండుటయే యిందులకు సాక్ష్యము.) అట్టిచో వారు తమకు సహజమగు (ప్రాకృతములను వ్యవహరించుటయపే సమంజసము, సులభము. కావుననే ఆయాపాత్రల వ్యపస్థసుబట్టి ఛిన్న ప్రాకృతములు రూపకములలో బేరినవి. తరువాతి కాలమున నాటకములను రచించిన కాళిదాసాదులు తమనాటకములందడలి ఉదాత్త పాత్రలకు గౌరవమును

1784 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గూర్చుటకై సంస్కృతమును వాడి, ఇతర పాత్రలకు దేశభాషలగు ప్రాకృతములనే వాడియుందురు. రాజాస్థానగౌరవము లఅభించునాటికి శిష్ణవర్గమునందలివారు కూడ నాటకములలో పాతలను ధరించుటకు సాహసించియుండవచ్చును. ప్రాచీనకాలమునుండియు భారతీయులకు మతవిషయములందాసక్తి యేర్పడినది. కనుక, కృష్ణరామాది అవతారపురుషులకు సంబంధించిన గాథలు ప్రదర్శనములుగ నేర్చ్పడినవి. రూపకసందర్శునముచే భారతీయు లుద్దేశించినది వినోదము మాత్రమే కాదు. వినోదము, న్యాయధర్మాదిజ్ఞానము, ఆస్తికత, జీవితసంస్కారము - ఇత్యాదులన్నియు రూపకప్రయోజనములుగ నుద్దిష్టములు. కావున పురాణగాథలే యెొక్కువగ రూపకముల౦ దితివృత్తములైనవి. సాలభంజికాప్రదర్శనములందు కూడ పురాణగాథలీ యితివృత్తములు. సాలభంజికా (పదర్శనములును, ఛాయానాటకములును కూడ భారత దచేశవమన (పచారమునందుండినవని గంగం4 పండితుని అభ్మిపాయము. మహాభారత, కథాసరిత్సాగర బృహత్కథ, బాల రావూయుణాదులనుఎ బట్టి సాలభంజిక్షాపదర్శనములు వ్యాప్తిలో నుండినవని చెప్పవచ్చును. సుభటుడు రచించిన “దూతాంగదము" ప్రాచీన ఛాయానాటకమని విమర్శకాభిప్రాయము. కాని యీ ఛాయా నాటకములనుండియే నాటకము లేర్పడినవని చెప్పుట కాధారములు లేవు. “రూపోపజీవి, “జాయాజీవ” శబ్బములకు గంగ౧0౪* పండితుడు కల్పించిన అపార్థములే పై అభ్మిపాయమునకు కారణములగుచున్నవి. ఈ శబ్దములు నటులనుగూర్చిన నిందావాచకములు. భారాసాందరస్థము నాధారమున జీవించువాడని వీని కర్థము. రూపక పరిణామచర్మ్శితయందు సాలభంజికాప్రదర్శన, ఛాయానాటక మూకాభినయాదులు భిన్నశాఖలై యుండుననుటయే సమంజసము. సంస్కృతనాటకము పొరాణికగాథాపఠనవు వమూలముగ, స్వతంత్ర పరిణామమునకులోనై అభివృద్ధిచెందినదని మాత్రమే చెప్పగలము. అంకవిభజనవు, అపస్థావిభాగవు, (వేశనిష్క ్రవుణ జనాంతి కాద్యషాయువలలు, అంకాస్య అం౦ంకావతారాది కార్యోపక్షే కములు మున్నగువిషయములలో రోమనునాటకమునకును సంస్కృత నాటకమునకును గల సాదృశ్యమునుబట్టి, [గీకునాటకమునకు సంస్కృతనాటకముమకై (ప్రాబల్యము కలదని కొందరందురు. “యవనిక “జవనిక శబ్బములుకూడ ఈ యభ్మిపాయమునకు కారణములైనవి. కాని, ఈ యవనికాశబ్బమునకు నాటకరంగమందలి తెరతో ప్రత్యేక సంబంధము లేదు. పర్షియాకు సంబంధించిన వస్త్రవాచక మీ శబ్దము.

రూపకోత్పత్తి భూపతి లక్ష్మీనారాయణ రావు 1785 సంపన్నుని గృహములందుకూడ నీయవనిక లుపయుక్తమునలైనవి. అట్టి వస్త్రములు భారతదేశమున కత్సిపాచీన కాలములనే వచ్చియుండవచ్చును. అదికాక, (గీకునాటకములలో తెర లుపయోగింపబడెననుట కాధారములును లేవు. అట్లే, భారతదేశమందలి రాజుల దేహరక్షకులుగా చిత్రితులన యవను లనెడు స్త్రీపాత్రలు (యవనీ - ఏకవచనము) గీకునాటకములలో కానము. గీకుదేశపువర్తకులు సుందరులగు [గీకుయువతులను భారత దేశప్పు రాజులకు కుప్పలుగా విక్రయించినారు. వారు రాజులకు దేహరక్షకులుగా నేర్పడినారు. ఇక పై పేర్కొనిన అంకవిభజనాడులు నాటక రచనయందు తప్పనివి. రత్నావళీ మాలతీమాధవ మాళవికాగ్నిమ్ముతముల వంటి నాటకములందలి యితిషృత్తము (గీక్కుపాబల్యముచే నేర్చడినదని యొక అభ్మిపాయము కలదు. సాహిత్యమున ఇతివృత్తనిషయక సొదృగ్యములు తప్పవు. ధీరలలితనాయకులను శృంగారసన్నివేశములను భారతీయు లరువుతచ్చుకొన నక్కరలేదు. ఈ విషయములలో మనదేశపురాజులదే గురుస్థానమని ఖండితముగ చెప్పవచ్చును. రామాయణ కథ్రావృత్తాంతమునకును (టోజన్‌ యుద్ధ వృత్తాంతమునకును కొన్ని విషయములలో సాదృశ్యము కలదు. భారతకథకు “ఇలియడు” కథతో సామ్యములు లేకపోలేదు. అంతమాత్రముచే నన్యోన్యప్రాబల్యమును పతిపాదించుట పొసగదు. విదూషక, విట, శకారవాత్రలు కూడ (గ్రీకునాటకముల నుండి (గ్రహంపబడినవను అభ్మిపసాయముసు నిట్టిదియే. విటశకారుల వంటి వ్యక్తులు భారతసంఘమున నాడుసు నేడును కూడ కలరు. (ప్రాచీనసాహితీకర్తలు ప్రయత్నపూర్వకముగ గావించిన విశిష్టనిర్మాణము నాటకము. కవితారచన నాటకనిర్మాణమునందు పరాకాష్టదశ నందినదని పండితాభ్మిపాయము. (ప్రాథమికదశలో రూపకరచన ,[ప్రజానీకమునుద్దేశించి ఆరబ్ధమైనను, రానురానది ఉన్నతవర్గములవారి ప్రయోజనమునకే యుద్ధిష్టమైసదని చెప్పక తప్పదు. గ్రీకు రోము మున్నగు దేశములలో నాటకములు ప్రజామోదముసు

  • బడసినట్లు, సంస్క్టృతనాటకములు (పజానీకమున కుపకరింపలేదు అను నభ్మిపాయమునందు సత్యము లేకపోలేదు. శాకుంతలాది నాటకములు రచితములైన తరువాతికాలమున కూడ పురాణపఠనములకు, సాలభంజికా [పదర్శనములకు, వీరగాథాగానములకు, దేశమున గలిగిన వ్యాప్తినిబట్టి సంస్కృతనాటకములు సామాన్యప్రజలకు ఎక్కువ పప్రయోజనకరములు కాలేదనియే చెప్పవలయును. నాటకరచన చాలవరకును, రాజాస్థానములనే అంటి పెట్టుకొస్నది. నాటకకర్తలు కూడ రాజాస్థానవమల నా్యాశలయించిన బాహ్ముణకవృలె యున్నారు.

1786 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వేదాంతాదిశాస్త్రములు (బాహ్మణ, క్ష్యత్రియవర్గములకు మాత్రమే ఉద్దిష్టములైనట్లు నాటకరచనకూడ ఉన్నతవర్గములవారికే యెక్కువ ప్రయోజనకారి యయినది. సంస్కృతభాషకు పప్రాధాన్యమేర్పడుటతో రూపకములు ప్రజాసమూహమునకు దూరములైనవి. ఆకాలపు కవులు భారతీయసంస్కృతిని జీర్ణించుకొన్న పండితులు. భారతీయతత్త్వశాస్త్రము వారికి శల్యగతము. కావున, వారి సారస్వత రచనయంతయు, చాలవరకు, లౌకికాతీతనుగు మార్గమున నడచినది. కావ్యరచనయందు ఇతివృత్తము ఆలంబనము మాత్రమే. దాని యాధారమున, జీవితతత్త్వము, కర్మసిద్ధాంతము, ధర్మన్యాయ(పవృత్తి, వర్ణాశ్రమవ్యవస్థ మున్నగువానిని వివరించుట వీరు ప్రధానముగా పరిగణించినారు. ఈ కారణముననే భారతము భారతీయవిజ్ఞానమున కంతకును నిలయమైనది. భారతరామాయణ హరివంశాది మహాకావ్యముల రచనావిధానము నాటికవులకు ఆదర్శ మైనది. వాటిరచనయందు కూడ కవులావిధానమునే యనుసరించినారు. లోకమందలి వాస్తవస్థితిని పోషించుటకుమారుగ నాటకములను భావనాత్మ కవిషయప్రధానముగ చేసినారు. మానవప్రకృతి సహజములగు ప్రవృత్తులను యథాతథముగ వీరు నాటకములలో చిత్రింపరు. ఆదర్శమున కనుగుణమగున ట్లితివృత్తమును, పాత్రల (ప్రవృత్తులను చిత్రించుట వీరిపద్దతి. సర్వవిషయములను భారతీయ సంప్రదాయముల కనుగుణముగ నుండునట్లు పోషించుట పరిపాటియైనది. ఎట్టిసందర్భమం దైనను, భార్య భర్త నధిక్షేపించుటకాని, తమ్ము డన్నకు మారాడుటగాని, అన్యాసక్తుడగు భర్తకు (ప్రతికూలముగ భార్య (పవర్తించుటగాని నాటకములలో జరుగుటకు వీలులేదు. భారతీయసం[ప్రదాయ మట్టిది. కాని మానవజీవితమందు మనకు గోచరమగువ్యవస్థ తద్భిన్నమనుటలో సందేహములిదు. భారతీయసాంఘికవ్యవస్థకంతకును మతమే ఆధారమగుటచే, మత సూత్రముల ననుసరించి సాంఘికవ్యవస్థను సర్దుట మన కాచారమైనది. తద్విరుద్ధములైన (ప్రవృత్తులు సహజములేయైనను, అవి సంఘమునందు బహుళములేయైనను వానిని మనవారాదరింపలేదు. మతస్తూతములకుసు, వానిననుసరించి రచింపబడిన ధర్మశాస్త్రములకును విరుద్ధములుగ గోచరించు మానవసహజ(ప్రవృత్తులను మన వారు గ్రహింపలేదు. ఆ కారణముచే నాటకమునందలి ఇతిపృత్తము, ప్యాతపోషణ మున్నగునవియన్నియు సంప్రదాయబద్ధమగు నొక ప్రణాళిక ననుసరించి నడచినవే కాని మానవ(ప్రకృతి ననుసరింపలేదు. కావుననే _పకృతివైవిధ్యము

రూపకోత్పత్తి భూపతి లక్ష్రీనారాయణ రావు 1787 నాటకములందెక్కువగ కానరాదు. మృచ్చకటికవంటి ఏ ఒకదానియందోతప్ప సాంఫుకసహ జ (ప్రవృత్తి కితరనాటకవబలలో ప్రాధాన్యములేదు. పాశ్చాత్యనాటకములకును భారతీయనాటకములకును గల ముఖ్యభేదములలో నిదియొకటి. ఇతివృత్త మత్యుదాత్త మైనది కావలయుననెడి నిర్ణయముతో నాటకరచనకూడ ఉదాత్తమార్గమున నడవక తప్పదు. పోషితములగు భావములు, అభిప్రాయములు కూడ సాధారణజీవితమునకు దూరములగుటయు తప్పుదు. ఈ కారణములచే, శాకుంతల, ఉత్తరరామచరిత్ర, మహావీరచరిత్ర, రత్నావళీ, నాగానంద, విద్ధసాలభంజికాది రూపకములకు సాధారణమానవజీవితముతో సంబంధమెక్కువగ లేకపోయినది. పొశ్చాత్యనాటకములలో కూడ 1420081, 12౫61 0940 మున్నగు నుదాత్తభావ ప్రధానములగు నాటకములతో సామాన్యజీవితమునకు సంబంధము స్యల్పమనియే చెప్పవలెను. ఐనను, ఆ నాటకములలో పాత్రల స్వభావములు, (ప్రవృత్తులు మున్నగునవి వారి వారి పప్రకృతుల కనుగుణముగ, ప్రకృతిసహజముగ పోషితములైనవి. రాజుసు చంపుటకిష్టపడక వెనుదీయుచున్న భర్తను పెరికివాడని అధిక్షేపంచి, అతనిని పాపకార్యమునకు పురికొల్పు “మాక్‌బెత్‌ సతో యందును, పాపియగు “కాడియసు”కు వశమై కుమారుని హృదయమును (గగ్రహింపలేని హామ్లెట్‌ తల్లియందును, ఇట్టి మానవప్రకృతి పోషితమైయున్నది. భారతీయనాటకములం దట్టి స్వాతంత్య్యుమును కవి వహింపలెేడు. కావున సంస్కృతనాటకరచన వాస్తవికతకు దూరమైనది.

సంస్కృతనాటక రచనయందు కవి (పధానోద్దేశము రసపోషణ. పాశ్చాత్యనాటకములలో ఇతివృత్తపోషణ పాత్రపోషణలు ప్రధానవిషయములు. వస్తువును కావ్యరూపమున ప్రవర్తింపజేయుచు, తదనుగుణముగ పాత్రల స్యభావాదులను వ్య క్తపరచి, నాటక (ప్రయోజనమును సాధించుట పాశ్చాత్యరూపకకర్తల ఆశయము. ఆనుషంగికముగ జరుగు రసపోషణ వీనికితోడై సామాజికుల చిత్తవికాసమునకు, హృదయటపక్షాళసమునకు హేతువగుచున్నది. ఉద్దిష్టరసము (ప్రేక్షకుని ృదయమునం దుద్బుద్ధమగునట్లొనర్చి, తద్వికాసముచే నతనికి తన్మ్నయతను గూర్చుట భారతీయరూపక కర్తల ఆశయము. ఇతివృత్తవిభజనము, సన్నివేశకల్పన, (పతిపాద్యములగు భావములు, నిత్యాదులన్నియు రసపోషణ కనుకూలింపవ లెను. సంగీత నృత్యాదుల (పయోజనముకూడ నిదియే. వచనమునకు రసపోషకశక్తి తక్కువయగుటచే ఛందోబద్ధములగు శ్లోకములు, గీతములు నుపయుక్తమునైనవి. విక్రమోర్వశీయ

1788 సందిరి షుల్గికార్డుసరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము చతుర్ధాంకమును పరిశీలించినచో గీతములెట్లు భావావిస్టుడైన నాయకుని చత్తవృత్తిని వ్య క్తపరచి విపలంభశృంగారమునకు పోషకములగుచున్నవో వ్య క్తముకాగలదు. నాటకమునం దితివృత్తమును సంశన్లిష్టముగ నొనర్పుట, అనేక పృాత్రప్రయుక్త మొనర్చుట, వివిధభావప్రవృత్తి కాకరమొనర్చుట - మున్నగునవి (పేక్షకచిత్త చాంచల్యమునకు హేతువులై, తన్మయతకు విచ్చేదమును కలిగించును. అది రసపోషణకు భంగకరము. కనుకనే (ప్రాచీనులు నాటకములను ఏకనాయ కేతివృత్త ప్రధానములుగ నొనర్చి, తక్కినభాగములను దానికంగములుగ పోషించియున్నారు. ప్రసిద్ధతివృత్తమును (గహించుటలో కూడ రసోత్పత్తియే యుద్దిష్టమైనది. ఇతివృత్తము (పసిద్ధమైనదగుచో (పేక్షకునిమనస్సు కథపై కేందీకరించుట కెక్కువ అవకాశముండును. నాయికానాయకుల భావములను గూర్చిన జ్ఞానము సామాజికులకున్న కారణమున భావవావ్యాపారమున కపకాశ మేర్ప్చడుచున్నది. నాటకసన్నివేశములు, అభినయము నిత్యాదులు రసోత్పత్తికి పోషకములగుచున్నవ. కవి యితివృత్తవుున గావించు వూరుంలకుగూడ రసపోష ణయే ప్రయోజనమగుచున్నది. ఆశమవాసినియగు ముగ్ధశకుంతల నాగరకుడు, సుందరుడు, యువకుడు, సరసుడు నగు దుష్యంతుని మోహం౦చి, ఇంద్రియవశంవదయొ, అతనికి లోపడుట ప్రకృతిసహజమగు విషయము. ఇట్టి యువతీయువకుల ప్రణయటప్రవృత్తి శృంగారరసపోషణకు ఉపాధి. కసుకనే కాళిదాసు, భారతమునందువలె రాజ్యప్రాప్తి విషయకవరమును శకుంతలచే అడిగింపలెదు. లాభాదివిషయక ప్రసక్తి యేమ్మాతమును లేక, యువతీయువకులు ప్రణయబద్ధులై (పవర్తించుటయే శృంగారరసపోషణకు ఆధారము. అట్లే దుర్వాస శాపవిషయమును, అంగుళలీకయవృత్తాంతమును అవసరములైనవి. ఇవి లెనిచో శకుంతలాదుష్యంతుల పునస్సమాగమము శృంగారరస పోషకము కాజాలదు. మసుపూర్వకముగ గైమించి వరించిన దుష్యంతుడు నిష్కారణముగ తన్ను విస్మరించినాడనెడు శల్యము మనస్సున నున్నంతకాలము పునస్పమాగమము సాత్త్వికమగుట కాని, రతిభావ ప్రధాసమగుటకాని జరుగదు. గాఢముగ (పేమించుకొన్న శకుంతలాదుష్యంతులు దుర్యాసశాపకారణముచె వియోగమునుజెంది, శాపావ చ్చేదముతో పరస్పరసమాగమమునక్రై పరితపించుచుండి, అకస్మాత్తుగ నట్టి సమాగమముసు గాంచుట శృంగార రసపోషణకు అవసరము. అట్టి సన్నివేశమునే కాళిదాసు కల్పించినాడు. భవభూతియు నట్లె రసపోషణకై ఇతిషృత్తమున గావించిన కల్చనసలు గమనింపదగినవి.

రూపకోత్పత్తి భూవతి లక్షీనారాయణ రొవు 1789

కరుణరసమును పోషించునుద్దేశముతో ఉత్తరరామచరి[తత తృతీయాంక సన్నివేశము కల్పితమైనది. దేహములు భిన్నములైనను ఎఏకమనస్కు లై విరహదుఃఖము ననుభవించుచున్న సీతారాములకు విచితమగు సమాగమమును కల్పించి హృదయవిదావకమగు కరుణరసఫ్థితిని, కవి పోషించిననాడు. తానై చేతులార పోగొట్టుకొన్న సీతావృత్తాంత మెట్టిదైనదియు తెలియక, ఆమెవలని వియోగమును భరింపలేక, పూర్వమున తానామె సహచర్యము నందనుభవించిన ఆనందమును చిరపరిచిత జసస్థానదృశ్యములచే స్మరించుకొని, హృదయావేగముచే మాటిమాటికి మూర్భకులోసగుచున్న రామునియవస్థ నొకవైపునను - తానత్యంతము వలచి వలపించుకొన్న భర్తవలని వియోగమును పం(డెండేండ్లకాల మనుభవించి, ఇపుడకస్మాత్తుగ కలిగిన భర్తృసందర్భ్శనముచే సంతోషదుఃఖములొక్కసారిగ నుప్పతిల్లుచుండ, (ప్రత్యక్షముగ నతని సమీపించుటకు నియమకారణమున సాహసింపజాలక, అతని దీనావస్థనుచూచి భరించలేక పరితపించు సీతయవస్థ నొకవైపునను, వీరిరువురి యవస్థలను చూడలేక దుఃఖమునకు లోనగుచున్న తమసావాసంతుల చిత్తపరిస్థితిని మరియొకవైపునను, అసాధారణవిధముగ పోషించి, భవభూతి సామాజికుల హృదయములను ద్రవింపజేసినాడు. ఇట్లు, ఇతివృత్తమున గావింపబడిన మార్పులన్నియు రసపోషణకుద్దిష్టములైనవి.

భావములను రసములను పోషించుటయండు కూడ భారతీయరూపకకర్తలకు స్వేచ్చ తక్కువ. మతసాంపదాయముల ననుసరించి అనుగుణములగు భావాదులకు మ్యాత్రమే నాటకములలో ప్రవేశము కలిగినది. మరియు, భారతీయ కర్మసిద్ధాంతము ననుసరించి మాసవుని జీవితపరిస్థితులు నిశ్చాతములగుచున్నవి. మానవుని ప్రవృత్తికంతకును నిట్లు పూర్వజన్మ సంచితప్రాబల్యమా హేతువని అంగీకరించుటతో మానవునకు వ్యు క్తిత్వ స్వాతంతం్య్యములు తగ్గినవి. మానవ(పవర్తనకు 'ప్రధాన్మపేరకమగు మనస్తత్వమునకు (ప్రాధాన్యము లెకపోయినది. జీవిపవృత్తికిని, అతడనుభవించు ఫలమునకుసు, పూర్వజన్మ కర్మ పరిపాకము కారణమనడి సిద్ధాంతముతో, కొంతవరకు, సాహెత్యమున తాత్త్వికదృష్టి ప్రధానమైనది. మానవ సహజప్రకృతి, మాసవజీవితముసకు (ప్రకృతిశక్తులతో నేర్పడు సంఘర్షణ ముస్నగునవి విస్మృతములైసవి. ఈ కారణముచే. భారతోయ నాటకములలో మానవప్రకృతి సరిగా చితితమైయుండలేదనెడి విమర్శ కవకాశ మేర్పడినది. పాతల హృదయములందుభాపసంఘర్తణ కవకాశమేర్చడినచో (క్రేక్షకుల మససులండుకూడ

1790 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (00౧1116101 6గా౦[0౧9) మానవజీవితమున స్యాభావికమేయెనను మన నాటకములలో పోషించుటకు వీలులేకపోయినది. ఈ కారణమువల్లనే, పాత్రపోషణమునకూడ ఉద్దిష్టరసవున కనుగుణవుగు మార్గమునే అనుసరింపవలసివచ్చినది. 'ప్రతినాయకుని యం దుదాత్తములగు గుణములెన్నియున్నను వానిని పోషించుట అనుచితమైనది. అట్లు పోషించినచో సామాజికుల కతనియందొక విధమగు నాసక్తిగాని, లేదా సానుభూతికాని కలుగుటయు, తత్కారణమున ఉద్దిష్టరసమునకు భంగముకలుగుటయు జరుగును. కావున ప్రతినాయకప్వాతను స్వాభావికస్థితికి కొంత దూరముగ నుండునట్లు పోషింపవలసివచ్చినది. ఈ విషయమున భారతరామాయణ కవులు వహించిన స్వాతంత్ర్య ముకూడ నాటకకవులు వహ్‌ంపరైరి. రత్నావళి - మున్నగు నాటికలందలి ఇతివృత్తమును గమనించినచో ఈవిషయ మింకను బాగుగ వ్య క్తముకాగలదు. సరసుడగు నాయకుడు బహుపత్నీకుడైయుండియు నాయికాసక్తుడగుట కుటుంబశాంతి భంగమునకు కారణముకాకపోదు. నాయకునిస్త్రీలు ఈర్ష్యాపరులగుటయు తతృలముగ వారు హృదయక్షో భకు లోనగుటయు తప్పుదు. ఇట్టి పరిస్థితి కొంతవరకు విక్రమోర్వశీయమాళవికాగ్ని మి(త్రములలో సూచితముకూడ నై యున్నది. కాని, సహజస్థితిననుసరించి వానిని చిత్రించుట శృంగార రససిద్ధికి భంగకరము. శృంగారమును పోషించి సామాజికుల నానందింపజేయుటయే కవి సాధింపదలచిన (ప్రయోజనమగుటచే, ప్రకృతి సహజములగు నిట్టి విషయములను స్పృశింపక, రసానుగుణములగు విషయములను మాత్రమే (గ్రహించినాడు.

రూపకేతివృత్తములను లోకజీవితమునుండి గ్రహింపక భారతరామాయణా దులనుండిమాతమే గ్రహించుటవలన కూడ భారతీయనాటకములు వాస్తవికతకు దూరమైనవి. ఉదాత్తభావములను, ఉన్నతాదర్శములను (ప్రతిపాదింపతలచిన నాటకరచయితలకు రామునివృత్తాంతమును, పాండవుల యితివృత్తమును అట్టి సన్నివేశముల నొసంగినవి. కాని, కథాసమస్తమును నాటకోచిత వస్తువు కాజాలదు. కొన్ని ఘట్టములు మాత్రమే రసవత్తరములై ప్రదర్శన యోగ్యములుగ నుండును. అది గమనింపనిచో రచనలు (పదర్శనయోగ్యములు కాజాలవు. అనర్హరాఘవ, ప్రసన్నరాఘవ, మహావీరచరిత్రము - మున్నగు నాటకములన్నియు నీ కారణముననే (ప్రదర్శనయోగ్యములు కాలేదు. ఇతివృత్తమును లోకజీవితము నుండి [గ్రహించిన మృచ్చకటికవంటి రచనలకు గల ఆకర్షణశక్తి యితరములకు లేము. నాటకములందు (పతిపాదితములైన భావములుకూడ సాధారణజీవితమునకు దూరములైనవి.

రూపకోత్పత్తి భూవతి లక్ష్మీనారాయణ రావు 1791 విద్యావంతులు, తాత్త్వికులు నగువారిచే మాత్రము (గ్రాహ్యములగు భావములే సర్వత్ర పోషితములైనవి. కంచుకి వ్య క్తపరచు భావము లిందులకుదాహరణములు.

“సతాంహి సందేహపదేషు వస్తుషు

(ప్రమాణ మంతఃకరణ(ప్రవృత్తయః?”

“మనోరధానా మతటాః ప్రవాహాః”

“లోకోత్తరణాం హి చేతాంసి కో జ్ఞాతు మర్హతి"

“సేవావృత్తి శ్వవృత్తిః" మున్నగువాని ననేకముల నిందులకుదాహరణములుగా నీయవచ్చును.

భావోన్నతిననుసరించి భఖాషయు వ్యవహారమునకు దూరమైనది. అలంకారములు, వక్రోక్తి, ఉక్తిచమత్క్భృతి, మ్యంగ్యార్థస్ఫూ ర్తి ఇత్యాదులకు (పప్రాధాన్యమేర్పడినది. రాజాస్థానమందలిపండితులు, విద్యావంతులగునాగరకులు మాత్రమే యీ నాటకముల నాదరించు స్థితి యేర్పడినది. ప్రాక్సాతములమాట యట్లున్నను నాటకములందలి సంస్కృతము ఆడంబరము, కృతిమము నైనది. భారత రామాయణములందలి భాషాసారళ్యమును తరువాతి గ్రవ్య కావ్య కవులు పాటింపనట్లే, భాసుని భాషను తరువాతి నాటకకవులనుసరింపలేదు. మాఘని నీశుపాలవథధ (శవ్యకావ్యములకును, భవభూతిరచనలు నాటకకవులకును ఆదర్శములైనవి.

రాజులు, మంత్రులు, విద్యావంతులగు శ్రీమంతులు సంస్కృతకవులకు పోషకులగుటచే, కవు లట్టివారి జీవితములనే యితివృత్తములుగబేసి రూపకములను రచించినారు. రాజాంతఃపురములందలి పప్రణయగాథలు, ఉద్యానవనములందలి నాయికా నాయకసమావేశములు, అంతఃపురస్తీంల పుష్పాపచయ మన్మథారాధన జల[క్రీడాదులు, నాయక విదూషకుల పన్నాగములు, సుషిరస్తంభాంతరములలో నాయికావిహారములు, గ్రేయసీవిముక్తు డైన నాయకు డున్మదావస్థయందు వనమునచేయు రోడనములు, ఇత్యాదులు సామాన్యుల జీవితావధిలోనివి కాకపోవుట చే సంస్కృత నాటకములు ప్రజల కుపకరింపకపోయినవి. కావుననే, భారత రామాయణాది పురాణములపఠనము, వీరగాథధాపదర్శన ములు, బొమ్మలాటలు, వీథినాటకములు మున్నగునవి ప్రజల కుపాదేయములైనవి. అట్టి ప్రదర్శనములలో కూడ సితివృత్తములు పురాణములండలివే యనుట గమనింపదగిన విషయము, భారతీయులకు మతమునండుగల ఆసక్తియే యిందులకు కారణమని

1792 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పండితవుహాశయుల స్వాభిపాయము. కాని, ఉపజ్జకలవారెవ్వరును జీవితసన్నిహితమగు నితివృత్తమును నాటకమున రచింపకపోవుట యిట్టిపరిస్థితికి . కారణమనుటయే నిజము. వీరగాథాగానము, సాలభంజికా (పదర్శనము, తోలుబొమ్మలాట - మున్నగునవి విద్యాహీనులగు నొకవర్గమువారికి వృత్తులుగా నేర్చడినవి. వంశపరంపరగా వారికి వచ్చిన కథలను గానముచేయుట, (ప్రదర్శించుట మాత్రమే వారు చేయగలిగినారు కాని నూతనవస్తువుసుగొని నాటకరచన గావించుశక్తి వారికి లేకపోయినది. కాలాంతరమున నట్టి నాటకములు కొన్ని సాహసులగు కొందరు విద్యావంతుల విప్లవప్రయత్న ఫలితముగ నేర్చడినవి. మహారాష్ట్రదేశమున పుండరీక, తులసీదాస, జ్ఞానదేవ, సక్కుంబాయి మీరాబాయి మున్నగు భక్తుల కథలు నాటకములుగ ప్రదర్శింపబడజొచ్చినవి. అంతటితో పురాణగాథలు వెనుకబడినవి. “శివాజీచరిత”. “తానాజీ మాలసురే వీరగాథ” ఇత్యాదులు ప్రజల నాకర్షించునట్లు భారతరామాయణగాథలు ఆకర్షించుటలేదు. నాటకకర్త, నటుడు, ప్రదర్శకుడు నగు “వామన్‌రావు” కర్ణాటకభాషయందు రచించి ప్రదర్శించిన “బాజీరావునాటకము” కర్ణాటకదేశమునం దెక్కువగ నాదరింపబడినది. ఆంధ్రదేశమున బొబ్బిలికథ, రామదాసుచరిత్ర, భక్తకబీరు, ప్రతాపరుద్రీయము మున్నగునవి పౌరాణికనాటకములను వెనుకకు (దొక్కినవి. పాశ్చాత్యసాహెత్య సాహచర్య కారణమున సృష్టికివచ్చిన కన్యాశుల్కమువంటి నాటకము లుట్లు (ప్రజల నాకర్షించినవో విదితమే. ఈ విధముననే, హిందీ, వంగ, కర్ణాటాది రాష్ట్రములలోకూడ, నవ్యరూపకరచన (పజాజీవితమునకు సన్నిహితమై, (గేక్షకులకు చిత్తవికాసమును, సంస్కృతిని కలిగించుచున్నది. కిన్నెర: సంపుటము 5, సంచిక 4, ఏప్రిల్‌ 1953) అల 'ఠతిగాంఅ

లహ

ర శెట్టళ్లానా

లల అలం ంలీి,

రూసక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు

(శవ్యకావ్య దృశ్యకావ్యముల రచనా విధానమున విశిష్టమగు భేదము కలదు. ఉపదేశమార్గము ననుసరించునవి శ్రవ్యకావ్యములు. పురాణేతిహాసములందలి ఇతివృత్తముల నాధారముగగొని ప్రజల యందు న్యాయధర్మాది జ్ఞానమును కలిగింంచుటయు, అనుషంగికముగ వారి హృదయములను ఆర్జ్రృములుగ నొనర్చి సాత్త్వికానందమును గూర్చుటయు, గవ్యకావ్యముల పధానపయోజనము. ఈ (ప్రయోజనమును సాధించుటలో కవి (ప్రత్యక్షముగ తానై విషయమును గూర్చి యుపన్యసించుటకును, న్యాయధర్మాదులు, సత్యాసత్యములు మున్నగువానిని తార్కికముగ వివరించుటకును వీలున్నది. భారత రామయాణుదుల రచనలో వ్యాసవాల్మీకులు పాఠకుల మనోనయనము నెదుట సర్వదా (ప్రత్యక్షమగుచునే యుందురు. సన్నివేశములనుబట్టి పాఠకులు తన్మయులగునట్టి స్టితి కూడ సాధారణముగ వర్జ్దనలనుబట్టి యేర్పడుచున్నది. ఇట్టి మహాకావ్యములలోకూడ కవులు మరుగుపడియుండి ప్యాతల సంభాషణా ప్రవర్తనాదుల మూలమున ఇతివృత్తమును పోషించిన ఘట్టములే ఎక్కువ ఆకర్షణీయములుగ, రసపంతములుగ ఉన్నపనుటలో సందేహములేదు. అనగా నాటకీయత అను లక్షణము [ప్రాధాన్యము వహించిన ఘట్టములే మిక్కిలి హృదయాకర్షకములగుచున్నవని తాత్పర్యము. సంస్కృతభారతమునసు అనువదించుటలో తిక్కన ఈ నాటకీయమార్గమునే ఎక్కువగా అనుసరించినాడు. గాథాపాఠకునివలె కథనుచెప్పుట త్‌క్కన అలవాటుకాడు. ఆయా మదన మక్తకర్టుదూన్త నతటయంలి. సంపుటము 4: సాహిత్యము.

1794 పందిరి షుల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము యితివృత్తప్రవృత్తికి వలయు పాత్రలను ప్రవేశింపచేసి మానవస్వభావోచితమగు వారిప్రవర్తనలను, సంభాషణలను, వారి భావావేశ, భావావేగప్రవృత్తులను మనకు (ప్రత్యక్షము గావించి తద్ద్వారా మన మనస్సులను తన్మయములుగ నొనర్చి ఆనందమును కలిగించుట తిక్కన అవలంబించిన పద్ధతి. తిక్కన భారతభాగములో నాటకోచితములగు ఘట్టము లనేకములట్టివి కలవు. శాంత్యనుశాసనికాది పర్వములందలి వేదాంతాది అలౌకిక విషయములుతప్ప తక్కిన ఇతివృత్తమునకు సంబంధించిన ఘట్టములనన్నియు రసవత్తరములగు సన్నివేశములచే తిక్కన రూపకవఎలవలె నడిఏంచియున్నాడు. వీరరస[పధానవఎటలగు యుద్ధపర్వములందుకూడ నిట్టి నాటకీయసంఘటనలు అనేకములితని రచనయందు గలవు. ఇతివృత్తమును (పజారంజకమొనర్చుటకు పౌరాణికపద్ధతి కంటెను నాటకపద్ధతి ఎక్కువగ సహకరించునని గుర్తించినవాండు తిక్కన. ఉపదేశమార్గమున గ్రహించుదానికంటె (పప్రత్యక్షదృశ్యముచే మానవుండు [గ్రహించు విషయమునకు మానవుని జీవితముపై [ప్రాబల్యమెక్కువ. ప్రకృతి విషయములను గ్రహించుశక్తి మానవుని బాహ్యేంద్రియములైదింటికిని కలదు. ఐనను నయనమునకు గ్రవణమునకుంగల (గాహ్యకశక్తి ప్రబలమైనది. దృశ్యము, నాదము, ఈరెంటికిని మనస్సుమై నున్నంత [ప్రాబల్యము రుచి, వాసన మున్నగువానికి లిదు. వస్తువునకును జిహ్వ: 'ఘాణ, త్వగిందియములకును సన్నిహితత్వ మేర్పడినపుడే వానిప్రవృత్తి కెక్కువ అవకాశమున్నది. అనంగా వీన్మిపవృత్తికొక యవధి స్వభావసిద్ధముగ నేర్పడినది. నయనేంద్రియ (శవణేంద్రియములకుంగల యవధి విశాలమైనది. కావున నయన(శవణేంద్రియములద్వారా మనస్సును లోగొనుట సులభము.

రూపకవున౦దు ఈవిషయవలయనకే పాధాన్య వొుొసంగబడినది. (ద్రతిపాదింపదలచుకొన్న భావమునకు ఆలంబనవుగు ఇతివృత్తమును వర్ణించుటకుమారుగ, పాఠకులయెదుట సాధ్య మైనంతవరకు సత్యస్థితికి సన్నిహిత వైయుండునట్లు ఇతివృత్త (పవృత్తిని (పత్యక్షీ కరింప జేసి పాఠకులహృదయవులను ఇతివృత్తవమున౦ందు నివుగ్నవటలొనర్చి వారిహృదయములయందు భావోత్పత్తి కవకాశముకల్సించుట రూపకరచనయం దవలంబెంపబడిన విధానము. ఈ విధముస రూపకరచన బాహ్యములగు నయనశవణేందియములకును, అంతరిందియ ప్రధానమగు మనస్సునకును

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రొవు 1795 మిక్కిలి ఆకర్షకమైనది. కావుననే శవ్యకావ్యములకంటెను రూపకములందు ఎక్కువ ఆదరము మనకేర్చడినది.

మరియు [శవ్యకావ్యపఠనమున [ోతలకును, కావ్యమునకును, మధ్య పౌరాణికుడొక డావశ్యకమగుచున్నాడు. విద్యావంతులగువారు స్వయముగ కావ్యములను అర్ధముచేసికొనగలరు. కాని పామరులకట్టి అధికారములేదు. ఒకడు పురాణమును పఠించుట, పండితుడగు పారాణికుడు దానియర్ధమును వివరించుట జరిగిననేతప్ప శ్రోతలు తత్ప్రృయోజనమును గాంచలేరు. కావ్యానుభవమంతయు వ్యాఖ్యాతయగు పొరాణికునిద్వారా కలుగవలసినదేకాని ప్రత్యక్షమగు రసానుభూతి (శ్రోతలకు కలుగు నవకాశమిందులేదు. క్యాచిత్క్మముగ నెందైనను పురాణపఠనముచే చిత్తవికాసము శ్రోతలకు కలిగినచో నది పౌరాణికుని సహజావేశజన్యమగు వాచికాంగికాధినయాదులవలన నేర్పడపలసినదే. రూపక ప్రదర్శనమునందట్లుగాక ఇతివృత్తమునందలి వ్యక్తులు ప్థాతలరూపమున (ప్రత్యక్షమగుచుండుటచే, వారి సంభాషణా ప్రవర్తనాదులు సామాజికులను మరపింపజేసి ఇతివృత్తకాలమునకు గొంపోయి తన్మయులుగ నొనర్చి వారియందు రసోత్పత్తిని కలిగింపగలుగుచుస్నవి. సంగీతనృత్య ఆహార్యక రంగ పరికరాదు లన్నియు నీ రసోత్ప్సాదననయందు దోహదములగుచున్నవి. ఇట్లు నాటకము మానవుస కానందముగూర్చు నొక విశిష్టమగు శిల్పముగా సిద్ధించినది. సంస్కృత నాటకరచయితలు సమగ చైతన్యముతో కూడిన సర్వాంగసౌష్టవమగు మూర్తిగా నాటకమును సిద్ధింపటేసినారు. ఈ మూర్తి నిర్మాణమున వీరుచూపిన శీల్పము అసామాన్య మైనది. స్టగితము, చిత్రకళ, నాట్యము, నృత్యము, సంగీతము, కవిత్వము మున్నగువానిలో నే కళను పరిశీలించి చూచినను, దాని స్వరూపమును సమగముగ, 'హేతుబద్ధముగ, పరిశీలించి తదహస్యమును సంపూర్ణముగ గ్రహించి దాని నాదర్శప్రాయమగునట్లు పోషించి, బెదాత్త్యమును సిద్ధింపజేయుట ప్రాచీనుల లక్షణమని వ్యక్తము గాకపోదు. కళాసౌందర్యమన నేమి? కళకు సౌందర్య దొట్లబ్బుచున్నది. సాందర్య పోషకములగు పరికరములెవ్వి? వానిని గూర్చు విధాన మెట్టిది, సర్వసాధారణమగు మానవపకృతి కేది సాత్త్వికమగు నానందమును గూర్చ్పుగలదు. మానవ మనఃపకృతికిని, బాహ్ట్ట్మపకృళికిని గల సంబంధటజుట్టిది. ఈరెంటికిని సామరస్యమును గూర్చు కళాపకియ ఎల్టది, అసు బషంయయములసు ఆమూల్యాగముగ

1796 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చర్చించి ఆయాకళలను వీరు పోషించుటయే గాక తమ అనుభవములను, మీమాంసానిర్ణయములను, లక్షణరూపమున రచించినారు. అట్లు కళలన్నిటికిని శాస్త్ర [గ్రంథము లేర్చడినవి. నాటకరచనవిషయమునకూడ వీరవలంచించిన విధానము ఎట్లు వీరిప్రయోజనమును సాధించినదియు గమనింపదగిన విషయము. భారతీయుల కవితాకళ నాటకరచనయందు పరాకాష్టదశను అందుకొన్నదన చెప్పవచ్చును. పండితకవులు (ప్రయత్నపూర్వకముగ దిద్దితీర్చిన కవితాశిల్పము నాటకరూపమును గైకొన్నది. కావుననది ఉన్నతవర్గమువారి ఆనందమునకై యేర్చడినదనియే చెప్పవచ్చును. (గీకు మున్నగు పాశ్చాత్య నాటకములు సార్వజనీనములైనట్లు సంస్కృతనాటకములు కాలేదు. 1పాచీనకాలమునుండియు వర్ణవిభేద కారణముగా నేర్పడిన వర్గవిభేదము సంఘమున నెలకొన్నది. ఉన్నతవర్గమువారగు బాహ్మణక్షత్రియుల కుపకరించినట్లు సంస్క్పృతనాటకములు సామాన్యప్రజలకు ఉపకరింపలేదు. తమ బుద్ధి (పాభవముచే వేదాంతాది వాజబ్మయమును సృష్టించినట్లే బ్రాహ్మణులు నాటకమునుగూడ అత్యుత్తమమగు కళగా సృష్టించినారు. ఆ కారణముననే భారతీయ విజ్ఞానము నాటకములందు గూడ స్పుటముగ ప్రతిబింబించినది. ఉన్నతాదర్శమును చిత్రించుట భారతకవుల లక్ష్యము. తల్లక్ష్యసాధనమున ప్రకృతి సహజములగు కొన్ని విషయములనుగూడ

  • అవి లక్ష్య్యమునకు విరుద్ధములైన చో - పరిత్యజింపవలసివచ్చినది. మానవజీవితమును ఉన్నదున్నట్లు చితించుట భారతకవి యుగద్దేశముగాదు. భారత సాంపదాయమును భారతీయ జీవిత తత్త్వమును అనుసరించి జీవిత మెట్లుండవలయును, ఎట్టి వ్యవస్థ ఆదర్శనీయము, ఏది అనుసరణీయము అను ఆశయములను కావ్యముల ఆధారమున ప్రతిపాదించుట ఈ కవుల లక్ష్యము. అనగా, జీవితసంస్కారమును, తస్మూలమున సామరస్యమును గూర్చుట, భారతీయ కవుల (ప్రధానాశయము. వేదవాజ్మయ సర్వస్వమును ఈవిధముననే నడిచినది. భారతరామాయణాదులు ప్రత్యక్షమగు నుపదేశమార్గమునగాక మహాపురుషుల జీవితచరిత్ర నాధారముగాగొని పరోక్షమార్గమున ఈ లక్ష్యమునే సాధించినవి. తరువాతి కావ్యవాజ్మయమున కవితాశిల్పము ప్రాధాన్యము వహించినను ఈ లక్ష్యమును మాత్రము విస్మరింపలేదు. నాటకములయండు గూడ నట్లె ఆదర్శపైతిని చితించుట ప్రధాన విషయమైనది. కవితా శిల్పముసు, ఇతర లలితకళలుసు,

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1797 ఈ లక్ష్యమును సాధించుటలో సహకరించినవి. అయిన ఇతిహాసరచనకును, నాటకరచనకును, ముఖ్యమగు భేదమొకటి కలదు. ఇతిహసరచనయందు విషయమునకు (పపాధాన్యమెక్కువ. నాటకమున రసమున కెక్కువ (ప్రాధాన్యము. అనగా మహాకావ్య రచయిత ఇతివృత్త చిత్రణముచే సాధించిన పరమార్ధమును నాటక కవి రసపోషణచే సాధింపదలచినాడు. (పేక్షకుల హృదయములను రసానుభూతిచే నార్జ్రృములుగ నొనర్చి తన్మూలమున విశ్వజీవితముతో సామరస్యమును గూర్చుట నాటక కవి యాశయము. కావున రసపోషణ నాటకరచన యందు ప్రధాన లక్ష్యముగ నేర్పడినది. తదనుగుణముగ విషయము, భావములు, సన్నివేశములు, ప్యాతపోషణ ఇత్యాదులు పోషితములైనవి. రససిర్ధికి అనుకూలింపనివియు, రసవిరుద్ధములు నగు విషయములు పరిత్యాజ్యములైనవి. ఈ కారణముచే నాటకములయందు ఇతివృత్త పోషణము అఆ(ప్రాధాన్యమగుటకూడ జరిగినది. (గీకు నాటకములకు ఇతివృత్తము ఆత్మ సదృశమైనదని “ఆరిస్టోటిల్‌' ననుసరించి ఆలియుచున్నది. భారతీయనాటకములందు ఇతివృత్త షమూాలంబనమును, రసపోషణ లక్ష్యమును నగుచుండుటచే నవి నాటకమునకు దేహము ఆత్మలపంటివని చెప్పవచ్చును. ఈ కారణముచే భారతీయ నాటక రచయిత రసపోషణ కనుకూలించు (పసిద్ధేతివృత్తము నాలంబనముగగొని, వలయుచో రసోచితములగు మార్పులనుగూడ కావించి, ప్రయోజనమును సాధించుచున్నాడు. కావున, ఇతివృత్తము వాస్తవజీవితమునకు కొంత దూరముగ సుండుటకూడ జరుగుచున్నది.

ఇదిగాక నాయికానాయకుల ఇతివృత్త మాధారముగ పోషింపదలచిన భావాడులు ఆర్యమత సంప్రదాయమునకు విరుద్ధములైనవి కాకూడదు. ఆర్యమత విరుద్దములగు భావములు మానవజీవితమున సహజ నిష్టములేళమైనను అవి (గాహ్యములుగావు. భారతీయ సంఘవ్యవస్థ కంతకును ఆర్యమతసంప్రదాయమే పునాది యగుటచే తద్విరుద్ధములగు భావాదులను ప్రతిపాదింవ వీలులేదు. మానపుని జీవితమును, నతని పప్రవృత్తియు, నత డీ జీవితముసం దనుభవించు ఫలమును, నతని పూర్వజన్మ సంచితమ్నుపై నాధారపడి యున్నది. ఇట్లు, జీవిత్వపవృత్తి యంతయు కర్మసిర్ధాంతముచే సమర్థింపబడుచున్నది. కావున, సంస్కృత నాటకవటలలో వ్యక్తి సాహస (ప్రయత్నాదులకు (ప్రాధాన్యములేదు. పాశ్చాత్యనాటకములండు వలె నాయకుడు ప్రకృతిశక్తులను ఎదుర్కొనుట, వానిని

1798 పందిరి మల్షికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నిర్దించుటకై సాహస్‌ించుట, ఒకప్పుడు వానిని జయింపజాలక నశించుట మున్నగు విషయములకు మన నాటకములలో ప్రసక్తిలేదు. (గేక్షకుడు పాశ్చాత్య నాటకములందలి నాయకునితోడను, ఒకప్పుడు (ప్రతినాయకునితోడను కూడ సానుభూతిని పొందగలుగు నవకాశమున్నది. భారతీయ కర్మసిద్ధాంతము ననుసరించి మానవ పప్రవృత్తియంతయు విధ్మిపాబల్యఫలితమే యగుటచే నాయక (ప్రతినాయకు లనుభవించు ఫలములు ఇదివజకే నిశ్చితములయియున్నవి. కావున (పేక్షకులకు తత్పరిణామమున ఆసక్తి రపేర్పడదు. నాటక సన్నివేశముల ఆధారమున పోషితమైన రసానుభూతికి లోనై విశ్వజీవితముతో వైక్యస్థితిని పొందుటయే ఇందు (గ్రేక్షకుడు పొందుఫలము. ఈ ముఖ్యభేదము కారణముగ గీకు నాటకములలో వస్తువు ప్రాధాన్యము వహించుచుండ, సంస్కృతనాటకములలో రసాస్వాదన ప్రాధాన్యము వహించుచున్నది. ఇక మానవజీవితమున కంతకును మూలాధారములైనవి శృంగారవీరములే యగుటచే నవియే నాటకమున పప్రధానరసములుగ పోషితములైనవి. మానవుని (ప్రయత్నము లన్నిటికిని రతియు, ఉత్సాహమునే ప్రధానకారణము లనుటలో సందేహము లేదు. వీనిని రసములుగ పరిణమింపచేయుటలో కవి అద్బుతరసమును సహాయముగ గ్రైకొనుట కలదు. భారతీయుల మనస్తత్త్యము ననుసరించి మానవ జీవితమునకు దివ్యశక్తితో సంబంధము తప్పదు. సత్యధర్మ న్యాయముల నపలంబించి లోకకళ్యాణ మార్గమున (ప్రవర్తించు వ్యక్తికి దైవము తప్పక తోడ్పడుననుట భారతీయుల విశ్వాసము. కావున ధర్మప్రవర్తకుడగు నాయకునకు అపజయము వాటిల్లుటగాని, అధర్మ ప్రవర్తకుడగు (ప్రతినాయకుడు జయించుట గాని, భారతీయ జీవిత తత్త్యమునకే విరుద్ధ్దమగుచున్నది. ఈ కారణములచే సంస్కృత నాటకములు విషాదాంతములగుటకు వీలులేదు. (పకృతిశక్తులను, అధర్మ (పాబల్యమును నాయకు డెదుర్కొనలేని సందర్భమేర్పడినచో, దివ్యశక్తి నాయకునకుతోడై ధర్మమును రక్షించుట జరుగవలసియున్నది. లెనిచో సత్యమునకు, ధర్మమునకు హానివాటిల్లుట జరుగగలదు. ఆది భారతమతమునకే విరుద్ధము. కావున నాటకములందు దివ్యశక్తి సాహాయ్యుమున అద్భ్బుతరసము పోషెింపబడవలసివచ్చినది. లోకహాతమునకై తనదేహమును తృణ(ప్రాయుముగ బలియొనర్చిన జీమూతవాహనుడును, సత్యవాక్చ్పరిపాలనకై సర్వస్వత్యాగము గావించిన

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1799 హరిశ్చం[దుడును పార్వతీపరమేశ్వరులచే రక్షితులగుటకును, నాటకములు మోదాంతము లగుటకును నిదియే కారణము. తన మహిమను, సచ్చీలమును లోకమునకు ప్రత్యక్షముగావించి, పరలోకమున కేగిన సీతాసతీపృత్తాంతముగూడ నీ కారణముచే నాటకమున భవభూతిచే మార్చబడినది. ఇట్లు సంస్కృత నాటకముల రచనా ప్రణాళిక భారతీయ సంప్రదాయములపై నాధారపడియున్నది. భారతీయుల ఇట్టి మనస్తత్త్వమునకు ఇందలి ప్రకృతి పరిస్థితులుగూడ కొంతవరకు కారణములని చెప్పవచ్చును. భారతదేశమున (ప్రకృతి స్వభావసౌమ్యు మైనది. ప్రకృతి సర్వదా జీవితసౌఖ్యమున కుపాధి యగుచున్నది. భగవంతుని వ్య క్తరూపమగు ప్రకృతి ఇట్లు సౌమ్యుము, సౌఖ్య హేతువు నై యుండుటచే మానవునకు దివ్యశక్తి యెప్పుడును తోడ్రైియుండునను భావము స్థరముగ నెలకొన్నది. పాశ్చాత్య దేశములందలి పరిస్థితులు వేరు. తీక్ష ములగు ప్రకృతిశక్తులను ప్రతిఘటింపవలసిన అపసరము మానవునకు కలదు. ఆత్మరక్షణకును, సాధారణమగు సౌఖ్యసంపాదసకును గూడ మానవుడు సర్వదా వుహాాపయత్నము చేయవలసియున్నది. పాశ్చాత్యమానవజీవితమునందు ఈ వ్యవస్థ నిత్యమైనది. వ్యక్తి ధర్మపరుడు అధర్మపరుడు నను వివక్షలేక, ఈ ప్రకృతి శక్తులకులోనై నశించుటకూడ నిరంతరము జరుగుచునే యున్నది. ఈ కారణముచే సంఘర్షణ యనునది వారిజీవితమున నిత్యప్రవృత్తిగ నేర్పడినది. అందు ధర్మమునకే విజయము కలుగుననుట కూడ ప్రకృతిసిద్ధమగు విషయముకాదు. దాని ననుసరించి విషాదాంతేతివృత్తములు వారికి నిత్యములుగను, ప్రకృతి సహజములుగను కనబడినవి. అధర్మమును, అన్యాయమును ఎదుర్కొనుటయు, వానిని జయింప (పప్రయత్నించుటయు, ఉత్తమాదర్శములే. అయినను, విజయము నిశ్చితము కాకుండుటచే జీవితము సాహస (ప్రధానమగుచున్నది. ఈ జీవిత వ్యవస్థయే వారి విషాదాంత నాటకములందును ప్రతిబింబించినది. ఈవిధమున పాశ్చాత్యనాటకములు ఇతిప్పుత్త విషయమున జీవితమునకు చాల సన్నిహితమైయుండుట తటస్థించిసది. కావుననే పాత్రల మనస్సులందు జరుగు భావసంఘర్షణ కూడ ఆ నాటకములలో చిత్రితమైయున్నది. సంస్కృత నాటకములందు అట్టి భావసంఘర్హ్దణకు అవకాశములేదు. స్థాయీభావ విరుద్ధములగు నితరభావములకు నాయికానాయకుల మనస్సులం దవకాశ మేర్పడినచో స్థాయికి భంగ మాపాదిల్లగలదు. అట్టిచో

1800 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము రసోత్పత్తికే అవకాశముండదు. అట్టిచో నాటకపధాన (పయోజనమే సిద్ధింపకపోవుచున్నది. నాటక రచనయం దుపయుక్తమైన శెలికూడా రసపోషణనే యనుసరించినది. ఆయా సందర్చములకు తగిన భావాదులను (పేక్షకుల హృదయములం దుతృన్నము చేయుటకు శెలి సమర్థమై యుండుట చూడనగును. శబ్ద అర్థ అలంకారధ్వని ఇత్యాదులన్నియు చాల జాగరూకతతో ప్రయుక్తవములై భావపోషణ కనుకూలించుచున్నవి. సంస్కృతభాషా పాండిత్యము గల (ప్రేక్షకుల కిట్టిరచనలు మిక్కిలి యాస్వాద యోగ్యములైనవి. సామాజికుడు కూడ పండితుడు కళాఖిజ్జుడు రసజ్జుడునై యుండవలెనని శాస్త్రము పేర్కొని యుండుటకూడ గమనింపదగిన విషయము. గ్రుక్షకుడు అట్టివాడైనచో రసోత్పత్తికెక్కువ అవకాశమున్నదని దీనివలన తఆలియుచున్నది. దీనినిబట్టి సంస్కృతనాటకములు విద్యావంతులైన ఉన్నతవర్గములవారి వినోదమున కెక్కువగ నుపకరించినవని చెప్పుటకు వీలున్నది. దీనికంతకును ఆ కాలపు సాం ఫుకవ్యవస్థ యే కారణవుగుచున్నది. కాళిదొసుకాలమునాటికి ఆర్యమత మున్నతదశలో నుండినది. తతృంప్రదాయములు సంఘమున స్మకకమముగ ననుసరింప బడుచుండినవి. కావున తద్విరుద్ధములగు భావములను విషయములను కవులు నాటకములయందు ప్రతిపాదింపరైరి. నాటకములం౦ దితివృత్తము కూడ దాని కనుగుణమగు విధముగనే పోషింపబడుచు వచ్చినది. ఇదిగాక రాజాన్థానములు రాజ[ప్రాసాదములు భోగములకాకరమైనవి. సంపద్వైభవము కారణమున వారి జీవితము, సుకుమారము, లలితమునై, లలితకళల కాకరమైనది. దానిననుసరించి సారస్వతరచన కూడ తదనుగుణముగనే గడచినది. కాళిదాసుని నాటికే అట్టి వ్యవస్థ సారస్వతమున నేర్పడినదనుటకు అతని విక్రమోర్వ్యశీయ మాళవికాగ్నిమిత్రములే సాక్ష్యములు. శృంగార్మ్వపధానములైన నాటికలన్నియు, అట్టి రాజులను, రాజస్థానమందలి నాగరికులగు సంపన్నులను వినోదింప చేయుటకే రచితములైనవనుట అతిశయోక్తికాదు. భోగములకు విలాసములకు ఆకరమైన నాగరకసంపన్నుల జీవితము ననుసరించి నాటకరచనయు శిల్పప్రధానమైనది. అనగా వస్తువుకంటను రచనావిధానమునకు 'పపాధాన్యమేర్పడినదని అర్థము. వివిధేతివృత్తములను నాటకముల౦దు చిత్రించుటకు వూరుగ ఒకవిధవుగు నితివృత్తమునే

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1801 ఆలంబనముగగొని కవులు రచనలను సాగింప నారంభించినారు. రత్నావళి, (ప్రయదర్శిక, విర్ధసాలభంజిక, మాళవికాగ్నిమ్మితములవంటివానిలో ఇతివృత్తమున వైవిధ్యము గోచరించుటలేదు. దీనినిబట్టి నాటకరచన రాజాంతఃపురములను ఆ్యశయించినదనియు, సాధారణ (పజాజీవితమునకు దూరమైనదనియు తెలియుచున్నది. భాషకూడ జనసామాన్యమునకు చాలదూరమైెనది. వివిధ (పాకృతములు, సంస్కృతము, వ్యాకరణాలంకారాది శాస్త్రములు, చతుష్షష్టికళలు

  • ఇత్యాదులన్నియు అభ్యసించిన పండితుడే నాటక రచయిత కానర్హుడని వివరింపంబడియుండుటంబట్టి నాటకరచన విశిష్టమగు నొకకళగా నేర్పడినదని చెప్పవచ్చును.

రసపోషణ భారతీయ నాటకకర్తల ప్రధానాశయము. ఉద్దిష్ట రసానుభూతిని ఇతివృత్త ప్రదర్శన మూలమున సామాజికులకు కలిగించుట రచయితయొక్క (ప్రధాన లక్ష్యము. సన్నివేశములు, సంభాషణలు, ప్రతిపాదించు భావములు, సంగీతనృత్యాదులు మున్నగునవి యన్నియు ఈ రసపోషణకు సాధనములు. ఉత్తరరామచరి్శిత నాటక (పదర్శనమునందు తన్మయుడై రసానుభూతిని గాంచిన వ్యక్తి హృదయము ఒకవిధవుగు సంస్కారమునకు లోనగుచున్నది. ఉత్తమదంపతులు, (మేయస్మ్‌పేయసులు నగు సీతారాములకు కలిగిన దుస్పహమగు వియోగబాధను పప్రదర్శనముద్వారా అనుభవించిన సాత్త్వికుడగు సామాజికుని హృదయమార్తు మై, కీతారాముల విషయమున నేర్పడిన సాసుభూతి లోకమందలి ఇతరదంపతుల విషయమునగూడ వ్యాప్తమగుచున్నది. పాపులగు కొందరు పౌరులనుండి పుట్టిన యపవాదమే సీతారాముల హృదయ పరితాపమునకు కారణమైనదనెడు జ్ఞానము కరుణ రసానుభూతి ఫలితముగ నేర్పడుచున్నది. పారాణిక వ్యక్తులగు ఏతారాముల యుదంత మాధారముగ సామాజికుని హృదయమునం దేర్పడిన ఈ చిత్తసంస్కారము జీవితమునందితని ప్రవృత్తి గూడ సంస్కరించుచున్నది. అట్టివ్య క్తి దంపతుల విషయకమగు నపవాదములను సహింపజాలడనుటి వింతకాదు. రసానుభూతివలన జీవితమునందిట్టి సంస్కార మేర్పడుచున్నది.

పురాణశవణదు వలనను గురూపదేశము వలనను సెర్డించు సంస్కారవబకంటెను రసానుభూతిచే నేర్పడు నీ సంస్కారము స్థిరము,

1802 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విశిష్టమునైైనది. ఇట్టి విశిష్టమగు రసానుభవ జన్యమగు సంస్కృతి సిద్ధించుటకు నాటక రచనా శిల్పమే ఆధారము. భారతీయ నాటకరచయిత లవలంబించిన శిల్పసర్వస్వమును రసపోషణ నుద్దేశించినది. రూపకముల విషయమున గీకు, రోము దేశనాటకకర్తల ఆశయమువేరు. కథాప్రవృత్తి పోషణమును, తన్మూలమున వివిధ పాత్రల స్వభావవైవిధ్య శీలప్రవర్తనాదులను పోషించుట పాశ్చాత్యుల ఆదర్శము. సాధారణ మానవప్రకృతి, వివిధసంఘటనల యందు వ్యక్తమగు మానవుల సహజప్రవృత్తి మున్నగువానిని యథాతథముగ చిత్రించి మానవ మనస్తత్వమును సామాజికులు [(గహించునట్లు చేసి, వారికి సంఘమున సామరస్యమును గూర్చుట ఆ నాటకముల ప్రయోజనము. ఆశ, కామము, (కోధము, ఈర్ష్య, దయ అనురాగము, ఇత్యాదులన్నియు మానవుని సహజస్వభావములే యనియు, అవి ఆయా మానవుని జీవితమునందు కలుగు సంఘటనలను, సంఘర్దణలను బట్టి ఆయా సందర్భములలో వెలికుబుకుననియు, గ్రహించినప్పుడు సామాజికులకు జీవితమును గూర్చిన సరియగు జ్ఞానమేర్పడుటకు వీలున్నది. సద్గుణలేశ మేమాత్రమునులేని దుష్టస్వరూపుండుగాని, లోపమేలిని సద్దుణమూర్తిగాని మానవులయందుండుట జరుగదు. అట్లే ఏ మానవుడును, ఇతరులందరకును మంచివాడగుటయు కూడ జరుగదు. మానవుని ఖిన్నప్రవర్తనలకు కూడ మూలములగు కారణములును నుండకపోవు. సాధారణ మానవ (ప్రకృతియే అట్టిది. అట్టి సాధారణ మానవ ప్రకృతిని రూపకములయందు చిత్రించినచో సామాజికులకు మానవతత్త్వమును గూర్చిన సదభ్న్శిపాయము కలుగుట కవకాశమున్నది. తోటిమానవుల లోపములతోడను, సుఖదుఃఖాదులతోడను, మనకు సానుభూతి యేర్పడి జీవితమున వూన పైక్యవు ఏర్పడుటకు ఇది యాధారమగుచున్నదని తత్త్యవేత్తల అభ్మిపాయము. ఈకారణమునుబట్టియే పాశ్చాత్యులు పాత్రపోషణకు ఎక్కువగా ప్రాధాన్యము నొసంగినారు. మరియు మానవుడెంతటి సన్మార్గపర్తి మైనను, న్యాయపరుడు ధర్మపరుడు నైనను, జీవితమున విజయవంతు డగుననుటకు సాధ్యములేదు. ఎందరో సత్పురుషులు ప్రకృతి ('ప్రభావముల నడ్డగింపలేక భగ్నహృదయులై నశించినారు. అది ప్రకృతి సత్యము. అట్టి ప్రకృతి సత్యమును రూపకములయందు ప్రదర్శించుట కూడ పాశ్చాత్యుల యాశయములలో నొకటి. విజయమును గాంచుటరపే జీవితమున ప్రధానవిషయము

రూపకరచన భూవతి అక్షీనారాయణ రావ్దు 1803 కాదనియు, జీవితము తుదకు భగ్నమైనను ధర్మమును, న్యాయమును, సత్పథమును వీడక స్థిరుడై ఉండుటయే ఉత్తమ మానవ లక్షణమనియు, (ప్రతిపాదించుట వీరి ఆశయము. కనుకనే పాశ్చాత్యులలో ననేకులు ఫలమెట్టిదను ప్రశ్నకూడ విచారింపక వీరకార్యముల కుత్సహెంతురు. న్యాయమున కొకప్పు డపజయముకలుగుట, అన్యాయము విజ్భృంభించుటకూడ (పప్రకృతిసహజములగు విషయములే. ఈ జ్ఞానమును రూపకముల ద్వారా (ప్రజలకు గల్పించుట అపసరము, అట్లుకాక న్యాయ మెల్లపుడును జయించియే తీరుననెడి అభ్మిపాయమును (ప్రజలయందు (ప్రతిపాదించినచో లోకమున తద్విరుద్ధమగు (ప్రవృత్తిని ప్రత్యక్షముగ గాంచుచు, ననుభవించుచున్న పామరుల మనస్సులు సందేహాస్పదములై క్షుబ్బములు కాగలవు. పాపముకూడ నొకప్పుడు బలవత్తరమై పుణ్యము నణచివేయుట ఏకృతియుందు కలదనియు, ఐనను పాపవం సర్యజనవ్న్షిదోహకరమగుటచే ఉపాదేయము కాకూడదనియు ప్రజలకు బోధించుట ముఖ్యము. ఇట్టి సంఘటనల అనుభవముచే సామాజికుల హృదయములు క్షాళితములై సంస్కృతి నందునని పాశ్చాత్యుల అభిపాయము. కావున పాశ్చాత్యులు (పకృతి సత్యమును యథాతథముగ (ప్రదర్శించుట, ప్యాతలను స్యభావానుగుణముగ చిత్రించుట, ఇతివృత్త (ప్రవృత్తిని జీవిత (పవృత్తితో సమన్వయపరచుట అను విషయములను నాటకరచనయందు ప్రధానాశయములుగ (గహించినారు. ఉదాళత్తతిపృత్తముయొక్క ఆధారమున సామాజికుల మనస్సులను సాధారణ మానవజీవితముతో సమన్వయపరచి అతీంద్రియమగు రసానుభూతిని కలిగించి, తద్ద్వారా హృదయమును శ్రాశ్యతముగ రసపరమగునట్లొనర్చి మానవత్వ సంస్కృతుల సిద్ధింప జేయుట భారతీయ నాటకకర్తల ఆశయము. జీవిత సామరస్యము, సంస్కారము, ఈరెండును భారతీయులయు, పాశ్చాత్యులయు ఆశయములని ఇట్లు వ్య క్రమగుచున్నది. ఐన, వానిని సాధించుటలో వీరవలంబించిన విధానములు వేరు. కథాప్రవృత్తి పాతపోషణాదులకు పాశ్చాత్యులు (పపాధాన్యమొసంగినారు. తద్రసపోషణమున భారతీయు అవలంబించిన శిల్చమట్టిది? అని పరిశీలింపవలసి యున్నది.

రూపకరచనయలదు ఇతిష్పత్త పాత రసపోషణలు (పధానాంశములు. నాటకమునకు సంబంధించిన విషయములను మూడు ప్రధాన వర్గములుగా

1804 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విభజింపవచ్చును. ఇతివృత్తము, తద్విభాగము, స్థాయీభాప పోషణము, దృశ్యసూచ్యాది విభాగము, ఇతివృత్తానుగుణమగు నాయికానాయక నిర్ణయము, పాత్రపోషణ, నాటకరచనయం దుపయుక్తముగు భాష, ఇవన్నియు నొకవర్గముగ నేర్పడుచున్నవి. నాటకరచయితకు సంబంధించిన వర్గమిది. రంగనిర్మాణ రంగ పరికరములు, ఆయాపాతలకు తగినటులను వారి ఆకారరూపగుణ శీలసామర్థ్యాదులంబట్టి ఎస్నుకొనుట, వారికి అభినయమునందు తగు శిక్షణ నొసంగుట, ప్రదర్శనమునకు తగిన ప్తీీప్యాతలను నిర్ణయించుట, తత్తద్భావ పోషణకనుకూలించు నృత్యగీతాదులను జతపరచుట, (ప్రదర్శనకు అనుకూల . పరిస్థితుల నేర్పరచుకొనుటి మున్నగునవి నాటకప్రదర్శకునకు సంబంధించిన అంశములై యొకవర్గముగ నేర్పడుచున్నవి. రసానుభవము, తదనుభూతిచే సిద్ధించు సాత్త్వికానందము, సంస్కృతి, నైతికనిష్ట మున్నగునవి సామాజికునకు సంబంధించిన విషయములు. భారతీయ దృక్పథము ననుసరించి రసోత్చాదన విషయకమగు నీ వర్గమునకు (పప్రాధాన్యమెక్కువ. నాటక రచనయందు కవి ప్రదర్శించు శిల్పసర్వస్వమును, నాటక పప్రదర్శకుడు రంగ పరికర నృత్య గీతాభినయాది విషయములలో వహించు (డ్రద్ధయు, నటులు వాచికాంగి కాఛినయములయందు (ప్రదర్శించు కళాకాశలమును - అన్నియు రసోత్పత్తియే ఉద్దిష్ట [ప్రయోజనముగా కలిగియున్నవి. నాటక (ప్రదర్శనకు సంబంధించిన రంగపరికర నృత్యగీతాది విషయములు, నటుల అభినయాది విషయములు నిత్యాదులు ఇతివృత్తగత సన్నివేశములను, భావములను, రమణీయముగ పోషించి రసోత్పత్తిని కలిగించు సాధనములు. ఈ సాధనసామ[గి ఎంతటి యుత్కృష్టమైనదైనను నాటకరచనయందు న్‌ల్పము కొరవడినచో రసోత్పత్తి కలుగజాలదు. నాటకప్రయోజనమును సిద్దింపదు. కావున నాటకములకు చెందిన వివిధవర్గము లన్నిటియందును నాటక రచనావిధానము శిల్పవిషయమునందు ప్రధానమగుచున్నది. రూపకమున పోషింపదలచుకొన్న 'ప్రధానరసమెద్దియో కవి ముందుగా నిశనృయించుకొని, తదససిద్ధికి అనుకూలించు ఇతివృత్తము, సన్నివేశకల్పనము, 'పధానేతివృత్తమునకు పోషకములగు [ప్రాసంగి కేతివృత్తములు, అంగిరసపోషకములు ననుకూలములునగు అంగరసములు మున్నగువానిని ఏర్పరచుకొనును. రసవత్తరమగు ఇతివృత్తభాగములను మాత్రమే రంగముమై ప్రదర్శించుట, రసహీనములైన కథాభాగములను ప్రసంగవశమున

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1805 పాత్రలచే సూచింపచేయుట, ఉదాత్తములు. చిత్తవికాసకరములు నగు భావములకు (శావ్యగీతారూపము నొసంగుట, కథయంాసక్తి సడలకుండునట్లు, ఆదినుండి తుదివరకును సామాజికుని చిత్తము రంగముమై కేంద్రీకరించునట్లు ఇతివృత్తమును నడపుట, ప్రకృతిసహజమగు [క్రమమున విభావాది పేరణచే నుద్చుద్ధమైన స్థాయీభావము పోషితమై రసముగ పరిణమించునట్లు సన్నివేశాదులను చిత్రించుట, ఇత్యాదులస్నియు నాటకరచనాశీల్పమునకు సంబంధించిన విషయములు. అదర్శమగు సన్నివేశ మాధారముగ హృదయమున బోధ చెందిన స్థాయీాభావమును ఆస్వాదయోగ్యమగునట్లు చిత్రించుట భారతీయ నాటకములందు ప్రధానవిషయము. ఈ స్టాయీభావమే (కగమపరిణామమునకు లోనై రసస్వరూపమున సామాజికునిచే ననుభవింపబడుచున్నది. కాపున నాటకరచనయందు కవి దృష్టి యంతయు స్థాయీభావపోషణ్నపై కేందీకరింపవలసియున్నది. తద్భావమునకు విరుద్ధములగు విషయము లేమాతము ఇతివృత్తమున పవేశించినను నవి తద్వికాసమునకు ప్రతిబంధకము లగును. అట్టిచో న్థాయీాభావము రసముగ పరిణమించు నవకాశమే కలుగదు. శాంతరస నిరూపణము (పధానముగాగల ఘట్టమున శృంగారవిభావముసు ప్రవేశింపజెయుట అట్టి రసవిరుద్ధమగు సంఘటనకు ఉదాహరణ. అల్లే శృంగారపధానమగు నాయికానాయక పప్రణయకలహాత్మక సన్నివేశమున నాయకుడు జీవిత అనిత్యతను క్షణభంగురతను ఉపన్యసించి నాయిక ననునయింపజాచుట అట్టిదే. _పేయసీ వియోగమునకులోనై కరుణవిప్రలంభము ననుభవించుచున్న నాయకునిచే ప్రకృతి రామణీయకమును వర్ణింపజేయుటవలన స్థాయిభావమునకు భంగము కలుగగలదు. అట్లే అన్యోన్య సమాగమమునకు చిరకాలమునుండి యువ్వ్యిళ్లూరుచున్న (పేయస్మీప్రేయసులు ఒకచో చేరినప్పుడు అన్యోన్యానురాగమును (పపదర్శించుటకు వూరుగ (ప్రయోజనశూన్యముగ దైవభక్తి ప్రదర్శనాది ప్రవర్తనయందు నిమగ్ను లైనట్లు చిత్రించుటయు నిట్టిదే. వీరపధానముగు యుద్ధఘట్టమున నాయకుడు, ప్రయోజనకూన్యముగ ప్రేయసీ విరహభావాదులకు లోవైనట్లు చిత్రించుటయు నిల్ల రసభంగ హేతువు. మరియు భాపమును అతిగా పోషించుటగూడ రసభంగ హేతువే. హృదయము ఉద్విగ్న మ్రైయున్నపుడు రసాసుభపముండదు. భౌతికపస్తు విషయకమగు అనుభవముకూడ ఒక అవధ్సికి లోరైయున్నపుడే యిది సాధ్యమగును.

1806 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము మితిమీరి ఆసవమును (గోలుటచే స్మృృతితప్పి అనుభవము సిద్ధింపనట్లు, భావమును అవధికిమీరి పోషించుటవలన హృదయము ఉద్వేగమునకులోనై రసానుభవమునకు అనర్హము కాగలదు. కనుక భావమును పోషించుటలో కూడ సంయమన మావశ్యకము. మరియు భావము నెంతవరకు వాచ్యముచేయవలెనో అను విషయముకూడ ముఖ్యముగా గమనింపదగినది. అందు ముఖ్యముగ శృంగారరస పోషణమునందు ఈవిషయమై మిక్కిలి జ్యాగత్త వహింపవలసియున్నది. శృంగారప్రధానమగు శకుంతలాదుష్యంతుల ప్రథమ సంయోగమున నాయకునిచే “కిం శీతలైః క్రమవినోదిభిరార్ట్రువాతాం సంచారయామి నలీనదళ తాళవృనైైః అంకే నిధాయ కరభోరు, యథా సుఖంతే సంవాహయామి చరణావుత పద్మత్మామౌ” అని ఎంత లలితముగ నాగరక విధానమున కవి పలికించియున్నాడో గమనించునది. నాయకుని హృదయము రతిభావపూరితమై ఆవేశమునకు లోనైన సందర్భమునగూడ కవి యతనిచే - “ఆపరిక్షత కోమలస్య యావత్‌ కుసుమస్యేవ నవస్య షట్పదేన అధరస్య పిపాసతా మయా తే సదయం సుందరి! గృహ్యతే రసో స్య.”- అని పలికించుటలో ఎంత బెచిత్యమును, ఎంత సంయమనమును పాటించినాడో సహృదమొకవేద్యము. దుష్యంతుని యీ వాక్యమందలి “గృహ్యతే రసో స్య” అను ప్రయోగము విశేషార్థ స్ఫోరకము. సమాగమమందలి పరస్పరావలోకన సల్గ్లాప స్పర్శాది జన్యవుగు హృదయు తన్మయత్వ వేం రసస్థితి. సాత్త్వికరసానందమునకు చిత్తము కామవికారరహితము, శుద్ధసత్త్వస్వరూపము నై యుండవలెను. విషయేచ్చ్భాప్రవృత్తివలన సిద్ధించునది ఇంద్రియసాఖ్యమేగాని సాత్త్వికానందముకాదు. విషయేచ్భాతృప్తి కలిగిన పిమ్మట నేర్పడు తద్వైముఖ్యమే. అది యానందము కాదనుటకు తార్కాణము. శృంగార రసోత్పాదనకును

రూపకరచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1807 కామతృప్తికిని సంబంధములేదు. సాత్త్వికమగు చిత్తవికాసమునకు సంబంధించినది రసవిషయము. కావున రసమును పోషించుటలో, నందును ముఖ్యముగ శృంగారమును చిత్రించుటలో కవిప్రతిభ వ్య క్తము కాగలదు.

“కిమపి కిమపి మందం మందమాసక్తియోగా

దవిరళత కపోలం జల్పతో రక్రమేణ

అశిథిల పరిబంధ వ్యాపృతైకైకదోష్టో

రవిదితగతయామా రాత్రిరేవవ్యరంసీత అను భవభూతి రచనకూడ సాత్త్వికశ్చంగారపోషణకు ఉత్కంష్టమగు నుదాహరణ.

నయనశవణేంద్రియముల సాహాయ్యమున హృదయమునకు వికాసమును కలిగించుటయే కర్తవ్యమనుట నాటకకర్త విస్మరింపదగని విషయము. (శమ, దుఃఖము, (ప్రాపంచిక కష్టములు మున్నగువానిచే భిన్నములైన మనస్సులకు వినోదమును కల్పించుట కూడ నాటక (ప్రధానపయోజనములలో నొకటియని గమనింపవలెను. కావున ఇతివృత్తపోషణ, భావపోషణాదు లెవ్వియును జుగుప్పావహములు కారాదు. నాయికానాయకుల చిత్తవృత్తి ప్రదర్శనముచే సామాజికుని మనస్సునందు సుప్తమైయున్న భావాదులను వికసింపజేసి సామాజికునకు రసానుభవమును కలిగించుట [ప్రధానమగు నాశయము. ఇట్లు రసపోషణయే భారతీయ నాటకమునందు ప్రధానాంశమగుటచే ఇతివృత్తప్రవృత్తి పాశ్చాత్యనాటకములందు వలె ప్రాధాన్యము వహింపదు. భారతీయ రూపకరచనయందలి ఈ దృక్పథము ఆలియక భారతీయ నాటకములందు ఇతివృత్తపవృత్తి కొరవడినదని వివుర్శించుట జరుగుచున్నది. పాశ్చాత్యనాటకముల౦దుకూడ పాతల చిత్తవృత్తుల (పపదర్శనమునకు (పాధాన్యమేర్పడిన సన్నివేశములలో ఇతివృత్త్మపవృత్తి స్తంభించుట కాననగును. హామ్లెట్‌ హృదయమున జరుగు సంఘర్షణసు కవి చిత్రించు ఘట్టములలో ఇతివృత్తము ముందునకు సాగక స్తంభించుట ప్రసిద్ధమె అయినను ఆ ఘట్టములు విమర్శకులచే ఉత్తమములుగ పరిగణింపబడుచునేయున్నవి. కావున కవి యుద్దేశమునుబట్టి రచనావిధానము ఏర్పడుచున్నదనుట గమనింపవలసు. రంగముపై ప్రదర్శితమగు నాయికానాయక విషయక రసస్థితి యాధారమున సామాజికుడు తత్సదృశమగు

1808 పందిరి మల్ల్‌కార్డునరాప్పు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము రసస్థితిని అనుభవించి ఆనందించుట భారతీయ నాటకముల యుద్దేశము. సామాజికుడిందు నాయకావస్థతో తన్మయీభవమును చెందుచున్నాడు. అతనికి సిద్ధించునది రసానుభూతి. పాశ్చాత్య నాటకములలో సామాజికుడు నాయకుని యవస్థతో తాదాత్మ్యమును చెందుటలేదు. నాయికానాయకుల జీవితావస్థలను, తతృ్పంవృత్తిని రంగవుబుమై చూచి సావూజికుడు చిత్తవికాసవలమను పొందగలుగుచున్నాడు. నాయకునియందడు ప్రదర్శితమైన స్థాయీభాపముసు అంతరంగానురూపమున భారతీయ సామాజికుడు పర్యవసింప జేసికొనుచున్నాడు. పాశ్చాత్య సామాజికుడు (ప్రదర్శితమైన నాయికానాయక జీవితమును బాహ్య మైనదిగనే పరిగణించి ఆయా సన్నివేశములతో సానుభూతిని ప్రదర్శించి రసము నాస్వాదింప కలుగుచున్నాడు. ఈ వైవిధ్యమునుబట్టియే భారతీయ నాటకకర్తకు రసపోషణ (పధానాశయమగుచుండ పాశ్చాత్య నాటకకర్తకు ఇపివృత్తప్రవృత్తి ప్రధానమగుచున్నది. రూపకరచనయుందు (పప్రధానవుగు రసమును పోషెంచుటలో కవి అనుసరింపదగిన విధానము నాట్యశాస్త్ర ము చే వివరింపబడినది. కవికి నాట్యశాస్త్ర ము కావ్యరచనయందు మార్గమును సూచించుచున్నడేగాని స్మృతిగంథములవల ఆదేశించుచుండుటలేదు.. ఇతివృత్తమున క్రైక్యమును, వివిధాంగములకు సావమురస్యమును గూర్చి శ్థాంయాఖావము రసముగ పరిణమించునట్లు రచించుటయే ముఖ్యము. అట్లొనర్చుటలో కవికి స్వాతంత్య్యూ మెాంతయో గలదు. అదివరకు 'పప్రచారములోనుండిన రూపకములన్నిటని పరిశీలించి వ్యాకరింపగా వాని రచనయందు గోచరించిన శిల్పవిషయములే నాట్యశాస్త్రమున సూత్రములుగ వివరింపబడినవి. కనుక ప్రతి నాటకకర్తయు వీనిని నియమములుగ పాటించి వానికి దాసుడై ప్రవర్తింపవలెనని ఎందుకు చెప్పెయుండలేదు. నాట్యాలంకార వ్యాకరణాదిశాస్త్రము అన్నియు పూర్వవాజ్మయ భాగములకు వివరణ[గంథములేగాని భావి రచయితలకు విధిసూ్మూత్య/0౦థములుకావ్పు. పూర్వురచయితల అనుభవమునంతను వ్యాకరించి ఖావిరచయితలకు మార్గదర్ధుకమగునట్లుగ వివరించుటయే యీ (గ్రంథముల యుగద్దేశము. నాట్యగాస్త్రమును నట్లే పూర్వనాటకకర్త లవలంబించిన రచనావిధానమును వారి ఆశయములను, రసపోషణయందు వారనుసరించిన ప్రకియను వారు చూపిన శిల్పమును వివరించుచున్నది.

రూపక రచన భూనతి లక్ష్మీనారాయణ రావు 1809

(ప్రజలకు వినోదమును కబ్పించుట మాత్రమేగాక సంఘమున వైతికవ్యవస్థను పోషెంచుటకూడ భారతీయరూపకముల యుద్దేశము. సాంఘికాభివృద్దికి, వ్య క్తిస్వాతంతంగ్యరక్షణకు, పురుషార్థసాధనకు, నైతికపమాణముల రక్షణ అవసరమని మన (ప్రాచీనుల భావము. ఈ కారణముననే మనవారు విశ్వశేయము సాహిత్యప్రయోజనములలో నొకటిగా పేర్కొనియున్నారు. అట్లే రూపకరచనయందు కూడ పురుషార్థములగు ధర్మార్ధకావుమోక్షములలో నేయొకటిమయైనను (పప్రయోజనముకావలెనని ఆదేశించినారు. మానవపయత్నముల నన్నిటిని స్థూలముగ ఈ నాల్గువర్గములలో నిముడ్పవచ్చును. వీనిని సాధించుటలో నాయకుడు అనుభవించు సుఖదుఃఖాదులను, అతడు (పదర్శించు వునోదార్థ్య నిశృలతాసాహసాదులను, అతడవలంబించు ధర్మ పథమును, తుదకు అతడొందు ఫలమును (ప్రదర్శించుటవలన, తదనుగుణమగు పవృత్తిగల సామాజికులు నాయకప్రవృత్తి ననుకరించుటకు (ప్రోత్సహింపబడుదురని [ప్రాచీనుల యభిప్రాయము. ఇట్లు ఉన్నతాదర్శమును సామాజికుల యెదుటనిడుట వీరి యుద్దేశమైనది. దానితో _ నాయికానాయకులును ఇతివృత్తమును కూడ ఉదాత్తములే కావలసివచ్చినవి. నాయకుడు పురుషార్థసాధనకై చేయు ప్రయత్నము ఇతివృత్తమగుచున్నది. ఈ యితివృత్తప్రవృత్తియే 4ం[0౧ అని వ్యవహరింతురు.

జనసామాన్యమునకు వినోదమునుకల్పించుట నాటకరచనయందు నొక యుద్దేశమేమయైనను అంతకంటెను ఉత్తమమగు ఆశయముకూడ నొకటి కలదు. సంఘమున నైతికవ్యవస్థను రక్షించుట, దానికి ఉదాత్తస్థితిని కల్పించుట అనునవి కూడ ముఖ్యములగు నాశయములు. వ్యక్తి జీవితమును, స్వాతంతృ్య్యమును, వ్యు క్షికి సంఘమునగల ఆర్థికాద్యధికారములను రక్షించుటకు, ధర్మార్థాది పురుషార్ధముల సాధన సుగమమొనర్చుటకును వైతోకవ్యవస్థ అత్యంతావశ్యకము. కావున భారతీయులు సాహిత్యమూలమున, అందును ముఖ్యముగ నాటకముల సాహాయ్యమున నైతికవ్యవస్థను పోషింపదలచుకొన్నారు.' పురుషార్థములను సాధించుటలో ధీరులగు మహాపవ్యక్తులు చూపిన ధైర్యసాహసాదులను, త్యాగముసు, వారు పాటించిన నైతిక స్నూతవఎలను, ఇతివృత్తవులుగనొనర్చి, ప్రజాసామాన్యమునకు ఉదాత్తజీవితము సం దుత్సాహమును కల్గించుట నాటకకర్తల ఆదర్శమైనది. ఉత్తమపురుషార్థముసు సాధించుటలో ఉత్తముమ్య క్తి జీవితమునకలిగిన

1810 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సంఘర్షణను ఆకర్షణీయమగునట్లు రసవత్తరముగ నాటకమును పోషించి ఉన్నత భాపోపేతులగు సామాజికులకు ఉద్చోధనుకలిగించుట వీరి ఆశయము. కనుక ఇతివృత్తమున సాధించవలసిన (ప్రయోజనమేది? దానిని సాధించువ్యక్తి ఎట్టివాడైయుండ వలయును? అను (ప్రశ్నలు నాటకరచనయందు (పథమ విషయములగుచున్నవి. అనగా (ప్రయోజనమును, నాయకుని నుద్దేశించి ఇతివృత్తవిభాగము గావింపవలసియున్నది. ఇతివృత్తప్రయోజనమును సాధించుటకు తగిన నాయకుడు నిర్ణయమైనంతనే రచయిత దృష్టెయంతయు నాయకపాత పోషణయందు కేంద్రీకరించుచున్నది. దీనినిబట్టి ధర్మార్ధాది పురుషార్థములలో నొకదానిని సాధించునట్టి నాయకుని చరిత 'పధానేతివృత్తముగ నేర్పబడుచున్నది. నాయకుని (ప్రయత్నముననే తప్ప ప్రయోజనసిద్ధి కలుగదు. కనుక, నాయకుని (ప్రయత్నము ఇతివృత్తమున (ప్రధానవిషయము. అనగా కథా(పవృత్తి (ఉం10౧) ఇతివృత్తపోషణమున ముఖ్యభాగముగ ఏర్పడుచున్నది. ఇట్టి కథాప్రవృత్తిని నడపుటయం దనుసరింపవలసిన విధానమెట్టిది? కథాప్రవృత్తి ప్రదర్శనము స్థాయాభావమున కనుగుణమైయుండక తప్పదు. భారతీయనాటకకర్తల ఆశయము ననుసరించి రసోత్పత్తి లక్ష్య్యమగుటచే తన్మూలమగు స్థాయాభావమునకు కథాాప్రవృత్తి అనుగుణమై యుండవలను. కావున స్థాయాభావమునకు వికాసమును పోషణను కలిగించుటకు ఎంతమాత్రము కథాప్రవృత్తి యవసరమగునో అంతమాత్రమే పోషింపవలసియుండును. అయినను కథైైక్యమునకు భంగము రాకుండుటకై, భావరసపోషణలకు అనుకూలింపని కథావిషయములను గూడ విసర్జింప వీలులేదు. అట్టివానిని రంగమున పప్రదర్శింపకున్నను వేరువిధమున సూచించిననే తప్ప సమగేతివృత్తమునకు భంగమువాటిల్లును. ఇట్లు ఇతివృత్తము (ప్రదర్శనీయయోగ్యము, సూచ్యము అని 'రెండువిధములగుచున్నది. దీనినే దృశ్యము, సూచ్యము ననియందురు. సరసమగు దృశ్యవస్తువును 'అంకములుగ విభజించి నీరసవుగు సూచ్యవస్తువును అంకమునకును, అంకమునకును మధ్య ప్మాతలసంభాషణల మూలమున పోషింతురు. విష్కంభక, ప్రవేశక, చూళికా, అంకాస్య, అంకావతారములనునవి సూచ్యవస్తుపోషణమున అపలంబించు ముఖ్యవిధానములు. ప్రయాణము, యుద్ధము, మజ్జనభోజనచుంబనాదివిషయములు సూచ్యములు. సాత్త్వికుడగు సామాజికుని

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1811 చిత్తమున క్షోభను, జుగుప్పను కలిగించు విషయములను ప్రదర్శింపకుండుటకై భారతీయనాటకకర్త మిక్కిలి జాగ్రతవహించును. మరియు నాటకరంగమునకును, రంగపరికరములకును గల అవధులను బట్టి కొన్ని కథావిషయములు (ప్రదర్శనసాధ్యములుకావు. అట్లే మరికొన్ని విషయములను వాస్తవికతకు సన్నిహితమగునట్లు (పదర్శించుటకును సాధ్యముకాదు. (వధ, యుద్ధము, విమానయానము మొ॥! కనుక అట్టి విషయములను సంభాషణలద్వారా సూచింపవలసినదేగాని పదర్శింపవీలులేదు.

మరియు పప్రతిఅంకమునందును పోషితమగు ఇతివృత్త విషయమునకూడ దేశకాలముల కొక అవధి యేర్చడుచున్నది. అనగా దేశకాలముల ఐక్యము (పతియంకమునను సద్ధింపవలననుట ముఖ్యము. దీనినిబట్టియే అంకమున (పదర్శితమగు కథ్యాపవృత్తియు విషయములును ఐదు ముహూర్తముల కాలములో జరిగినట్టివై యుండవలెనని ఆదేశించినారు. అట్టి కథాభాగము మాత్రమే నటులు అవచ్చిన్నముగ నటించుటకును, సామాజికులు ఇతరాంతరాయములకు లోనుగాకు విసుగుచెందక అనుభవించుటకును వీలగుచున్నది.

“అంకస్య ప్రయోగకాల పరిమాణమియదితి

దర్శయతి ఏకదివస [ప్రపృత్తమితి -

ఏకదివసేనేతి ముహూర్తపంచకేనైవ" అనగా జీవితమున పాధారణముగ ఒక దివసమునందుగాని, అంతకంటె తక్కువ కాలమునగాని జరుగగల విషయము మాత్రమే ఒక అంకమున ప్రదర్శించుట తగునని అర్థము. ఈ విషయపరిమితి వాస్తవిక జీవితమునకు సన్నిహితమును, స్వాభావికమును నగుచున్నది. దీనినిబట్టి, అంకవిభజన ప్రదర్శనమున కనుకూలించు విధానమని విదితమగుచున్నది. ఇంతకంటెను ముఖ్యమగు ఇతివృత్త విభజనము కలదు. కథాప్రపృత్తినంతను అయిదు భాగములుగ విభజించుకొని పోషించుట ఇట్టి విభాగము. వీనిని కార్యావస్థ అందురు. ఆరంభము, ప్రయత్నము, (ప్రాప్త్యాశ, నియతాప్తి, ఫలాగమము అను నీ యవస్థలు కథాప్రవృత్తియందలి అయిదు (పధానములగు దశలను పోషెంచుచున్ననవి. ఇందలి పతి యవస్థను వేరు వేరంకములయందు పోషింపవలును. ఒక దశకు సంబంధించిన ఇతివృత్తము ఒక అంకమున ఇముడకపోయినచో దానిని రెండంకములలో పోషించుకొనుటకు

1812 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వీలున్నది. అంతకుమించి అంకములను కల్పించుటవలన ఇతివృత్తము పలుచనై, భావతీవ్రతకు భంగము వాటిల్లకలదు. దీనివలన రసపోషణకు భంగము కలుగగలదు. కావున ఏ కార్యావస్థనుగాని "రండంకములకు దాటి విస్తరింపజేయకుండుట (గేయము. ఇట్లు ఐదు కార్యావస్థలను పోషించుటలో ఇతివృత్త మెంత విస్తృతమైనదైనను పది యంకములను దాటదు. ఐదవస్థలను వేర్వేరుగ పోషించుటకు కనీసము ఐదంకములైనను అవసరమగుటచే అయిదంకములు తప్పనిసరి యగుచున్నవి. కావుననే “ఆ పంచాంక మాదశాంకము నాటకము" అను లక్షణ మేర్చడినది. మూలకథయందు ఆయా ఇతివృత్తభాగములు జరిగినకాలము ఇంతకంటె విస్తృతమైనను వానిని కవి అంక ప్రదర్శనానుగుణముగ మార్చవలసియుండును. ఇట్లు కాలము విషయమున ఐక్యము నాటకకర్తలచే పాటింపబడియున్నది. అదే విధమున దేశమును గూర్చిన ఐక్యవు కూడ అంకవములయుందు పాటింపబడియున్నది. ఒక అంకమున పోషితపుగు నితివృత్తము బహుదూరములగు భిన్నప్రదేశములందు జరిగినట్లు వర్ణించుట కూడదు. ఆ యితివృత్తము జరుగుటకు పట్టుకాలములో ఆ (ప్రదేశములు సులభముగ చేరదగినవిమై యుండవలను. దూర(ప్రదేశములలో ఇతివృత్తము జరిగినట్లు పోషింపవలసివచ్చినచో ఆ భాగము వేరువేరంకములలో ప్రదర్శింప వలసియుండును. నాయకుడు దివ్యు డై విమానాది సహాయములు కలవాడగుచో నొకప్పుడు దూరదేశములలో కథ జరిగినట్టు కూడ

ఒకేయంకమున వర్ణింపవచ్చును.

“యః కశ్చిత్‌కార్యవశాత్‌ గచ్చుతి పురుషః ప్రకృష్ణ మధ్వానమ్‌!

తత్రాప్యంకచ్చేదః కర్తవ్యః పూర్వవత్‌ తజ్జెః॥

డిమాదినాయకస్య తు దివ్యస్య ఆకాశయానకాదినా సర్వంయుజ్యతే"

కాలవిషయము గూడ నిల్లే వివిధాంకములయందు పోషితములైన కథాభాగములకు మధ్య జరిగిన కాలమును విష్కంభకాదులచే సూచింపవలెనని తల్పుచు అందు కూడ ఆకాలము ఒక సంవత్సరమునకు మించరాదనియు నిర్దేశించినారు.

“అంకచ్చేదంకుర్యాత్‌ మాసకృతమ్‌ వర్షసంచితంవాప్‌

ఏతత్సర్వం కర్తవ్యమ్‌ వర్షాదూర్థ్యం నతు కదాచిత్‌

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1813

దివసే అవసానం సమాప్తిర్యస్య తత్పరం కార్యం

యద్యంకే ప్రత్య క్షేణ ప్రదర్శయితుం న యుజ్యతే।

తదా అంకచ్చేదం కృత్వా (ప్రవేశకై రర్శనీయం

అదృష్టమష్యర్థం హృది (ప్రవేశయంతీతి |” వీనినిబట్టి దేశకాల కథాప్రపృత్తులకు సంబంధించిన ఐక్యమును భారతీయ నాటకకర్తలు బాగుగ పాటించినారని వ్య క్రమగుచున్నది. ఈ విషయమున "కీత్‌ మున్నగు పాశ్చాత్యపండితులు గావించిన వివర్శ నిరవకాశము, పొరపాటు అని చెప్పకతప్పదు. (ప్రధానేతివృత్తమునకును స్థాయీభావమునకును విరుద్ధములగు సన్నివేశములుగాని, విషయములుగాని స్పృశింపగూడదనుట భారతీయు అవలంబించు ముఖ్యస్మూతము. కనుక కథైక్యము 1పాధాన్యము వహించుచున్నది.

భారతీయనాటకములలో కథాాప్రవృత్తి కుంటువడుచున్నదని మరియొక విమర్శ. భారతీయ నాటకకర్తల ఆశయము తెలియకుండుటయే యీ విమర్శకు హేతువు. నాయకుని హృదయమందలి స్థాయీభావమును పోషించుటకును తద్ద్వారా సహృదయుడగు సామాజికునియందు భావమును ఉద్భుద్ధము గావించుటకును కథా (1పవృత్తి ముఖ్యమగు సాధనమగుచున్నదే గాని అదియే ప్రధాన లక్ష్యము కాదు. సంస్కృత నాటకములయందు కథా(ప్రవృత్తి స్థాయీభావము మూలమున నేర్చడి నడచుచు, సామాజికునియందు భావవికాసమునకు కారణమగుచుండుటచే నిందు ఆత్మాశయ పరాశయ లక్షణములు రెండును చేరియున్నవి. కావున కథాాప్రవృత్తి సంస్కృత నాటకమునందు ఒక విశిష్టమార్గమున నడచుచున్నది. ఈ విషయమున భారతీయులకును పాశ్చాత్యులకును గల ముఖ్యభేదమును గుర్తింపవలసియున్నది. నాటక ప్రదర్శనము వలన సామాజికునియందు కలుగు భావములు సావూజికునకును కథానాయకునకు గల సంబంధవుైపై ఆధారపడుచున్నవి. నాయకుడు పురాణపురుషుడైనను చార్మితక పురుషుడైనను లేదా సంఘమునందలి ఉదాత్త పురుషుడే మొనను సామాజికునకంటె భిన్నుడే అను పరిజ్ఞానమున్నప్పుడు నాయకుని భావములతో సావమూజికునకు తాదాత్మ్యమేర్చడదు. నాయకుని భావములతోడను స్థితిగతులతోడను సామాజికునకు సానుభూతి యేర్పడి తద్ద్వారా చిత్తము ఆర్హ్రమగుచున్నది. పాశ్చాత్య నాటకములయందు సామాజికుడు నాయకుని భావముతో సానుభూతిని చూపగల

1814 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సాక్షిమ్యాత్రు డగుచున్నాడేకాని వానితో తాదాత్మ్యమును పొందడు. “హామ్లాటొను గాని “జూలియన్‌ సీజరు"ను గాని రంగమున చూచినప్పుడు సామాజికునకు నాయకభావములతో సాధారణీకరణత్వ మేర్పడుటలేదు. కావున తాను (ప్రేక్షకమాత్రుడై నాయకావస్థలను దర్శించి తత్తదవస్థానుగుణమగు సానుభూతిని (పదర్శించుచు ఆనందించుచున్నాడు. అనగా, తనకు సంబంధించని ఇతరుని జీవితేతివృత్తమును దర్శించునట్టివాడు పాశ్చాత్యనాటకము లందలి సామాజికుడు. కావున సామాజికునియండు కలుగు భావాదులు సాంఘిక సంబంధములైనవియేగాని వ్యక్తి సంబంధములైనవి కావు. భావము వ్య క్తిగతమైనప్పుడే ఆవేశమునకు, ఉద్వేగమునకు అవకాశమున్నది. అది లీనంతవరకు రసోత్పత్తి కవకాశములేదు. సంస్కృత నాటక పప్రదర్శనమున సామాజికుడు నాయకుని భావముతో తాదాత్మ్యమును బొంది తన్నును, బాహ్యపరిసరములను, నాయకుని కూడ విస్మరించి మానవత్వ సంబంధమగు తదవస్థయందు లీనుడై ఆనందింపగలుగు చున్నాడు. అనగా రసస్థితియందు మానవత్వసంబంధములగు రతి మున్నగు భావములకును తదాలంబములగు స్త్రీపురుష స్వభావములకును మాత్రమే సామాజికుని మనస్సునందు అవకాశ మేర్చడి తక్కినవన్నియు తాత్కాలికముగ విస్మృతము లగుచున్నవి. విశుద్ధమగు దర్పణమునందు బింబము భాసించునట్లు క్షాళితమగు సామాజికుని హృదయమున నాయికానాయకగత భావము సాధారణ స్త్రీపురుష సంబంధభావముగ అనుభూతమై రసోత్పత్తిని కలిగించుచున్నది. కావున భారతీయసామాజికుడు నాయక భావావేగాదులకు లోనై తన్మయతను చెందుచున్నాడు. హృదయము తన్మయమైయున్నపుడు ఇంద్రియ ప్రవృత్తి కవకాశము తక్కువ. హృదయము భావోద్వేగాదులకు లోనైయున్నపుడు బాహ్యేంద్రియ ప్రవృత్తికి వలయు ఆంతరనక్తి లోపించుచున్నది. ఆ కారణముచే బాహ్య(పవృత్తి వుందవుగుచున్నది. కావృననే స్థాయాభావపోషణ మే (పధానవిషయముగా గల భారతీయ నాటకమున కథాగమనమునకు ప్రాధాన్యము తక్కువ. నాయికానాయకుల యందు కలుగు భావానుభావాదులు వ్యభిచారి భావములు మున్నగునవి రసపోషణ కనుకూలించినవగుటచే (ప్రాధాన్యము వహించుచున్నవి. ఇతర సన్నివేశములన్నియు వీనికి పోషకములేగాని స్వతంత్రముగ ప్రయోజనకారులు కావు. కావున కథాప్రవృత్తి యనునది ఆప్రధానమగుచున్నది. పాశ్చాత్య నాటక (ప్రదర్శనమున సామాజికుని దృష్టి పర్మాశయమైనదియేకాని

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1815 ఆత్మాశయమైనది కాదు. నాయకుని జీవితము, అతని సంఘర్షణ, అతని కష్టసుఖాదులు సామాజికు నాకర్షించు విషయములు. రంగముఘై నివి (పదర్శింపబడుచుండునంతవరకు సామాూజికుని దృష్టి రంగము కేంద్రీకరింపబడియుండును. నాయకుని భావాదులతో సామాజికుని హృదయములకు తాదాత్మము లేనికారణమున సామాజికుని ఆనందము ఆత్మా(శశయమైనదికాదు. అతనికి గలుగు నానందము పరాశ్రయమైన దగుటచే రంగమున కథాప్రవృత్తి ఎడతెగక జరుగుచునేయుండవలయును. ఈ కారణమును బట్టియే పాశ్చాత్య నాటకములలో కథాగమనములకు (ప్రాధాన్య మేర్పడినది. సాధారణ జీవిత పరిసరములనుండి నాటక సన్నివేశమునకు సామాజికుని గొంపోయి, తన్నాటక సన్నివేశమందలి నాయికా నాయకుల జీవిత సంఘటనలను అతడు (పప్రత్యక్షముగ దర్శించునట్లు చేయుట పాశ్చాత్య నాటకములందలి పద్ధతి. ఇందు సామాజికుడు నాయికానాయకావస్థను దర్శించి సానుభూతిని ప్రదర్శించు ప్రత్యేక వ్యక్తి యగుచున్నాడే కాని వారితో నభిన్నుడగు వ్యక్తి కాడు. నాయికానాయకుల గుణశీలాదులు, సామాన్య మానవ సంఘమునెడ వారికిగల దయ, సానుభూతి, ధర్మ న్యాయముల రక్షణకై వారొనర్చు త్యాగము, తత్ప్రృయత్నమున వారనుభవించు కష్టములు, ఇత్యాదులు కారణములుగ సామాజికునకు వారియందు సానుభూతి అధికముగ నేర్ప్చుడుచున్నది. ఉదాత్త జీవిత సందర్శనము చేతను, ఉదాత్త భావానుభూతిచేతను సామాజికుని హృదయము క్షాలితమై సంస్కృతి నందుచున్నది. ఉత్కృష్ట జీవిత భావములతోడను, మానవజీవితముతోడను సామరస్య మేర్పడి ఆనందము సిద్ధించుచున్నది. నాయికానాయక జీవిత ప్రదర్శనమే సామాజిక హృదయమును ఆకర్షించుటకు హేతువగుచున్నది. అట్లాకర్షింపబడిన సామాజికుని చిత్తమునకు ఏక్యాగత సిద్ధించుటకు కథాప్రవృత్తి తప్పనిసరి యగుచున్నది. సన్నివేశ పరంపరలతో కూడిన ఇతివృత్తము రంగము పై వేగముగ నడచుచున్నంతకాలము సామాజికునిదృష్టి నాయకజీవితేతివృత్తముపె కేందీకరించుటకు వీలున్నది. కావున కథాప్రవృత్తి నిరంతరాయముగ జరుగుచుండవలను. లేనిచో సామాజికుని చిత్తమునకు ఉపాధి 'లేకపోపుటయు, నాకారణముచే నతని చిత్తము వాస్తవిక పరిసరములకు మరలుటయు జరుగును. ఇట్లు నాటకసన్నివేశమునుండి చిత్తము భంశమగుటయు, ఏకాగ్రతకు భంగము

1816 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. పంపుటము 4: సాహిత్యము కలుగుటయు కారణములుగ చిత్తవికాసమున కవకాశమే లేకపోవుచున్నది. సామషాజికుని చిత్తము బాహ్యవస్తువుఫై కేంద్రీకరించి తదుపాధివశమున ఆనందసిద్ధిని పొందుచుండుటచే పాశ్చాత్య నాటక ప్రదర్శసమున కథాప్రవృత్తి ప్రధానమగుచుస్నది. సామాజికుని చిత్తము భౌతికమగు బాహ్యవస్తువుపై కాక భావమయమగు అంతరంగము[ైొ కేంద్రీకరించి, భావకత్వము ఉపాధిగా ఆనందసిద్ధిని బొందు సందర్భములో బాహ్యవస్తువు అప్రధానము కాగలదు. భారతీయ నాటకమున రంగముకై ప్రదర్శింపబడు నాయికానాయక జీవితము సామాజికుని విషయమున నిమిత్తమాత్రమే యగుచున్నది. నాటకీయ సన్నివేశము, వాచికాంగికాద్యభినయము, రంగపరికరములు, నిత్యాదుల సాహాయ్యమున సామాజికుని హృదయమున భావము వికాసము పొందుటయు, తద్భావము ఉద్వేగమును జందుటయు జరుగుచున్నది. ఆపె సామాజికుడు చిత్తమును రంగము_పె నుండి మరలించి అంతరంగ జీవితమున (పవర్తింపచేయుచున్నాడు. రంగము పై కేందీకరింపబడియున్న నయనశ్రవణేంద్రి 'యములద్వారా కలుగు ననుభూతి చిత్తమున కుత్తేజనమును గల్పించి భావనావీథులందు సోల్లాసముగ (ప్రవర్తింపచేయుచున్నది. బాహ్యేంద్రియముల ద్వారా కలిగిన అనుభవము ఈవిధమున సావూజికుని చిత్మపవృత్తికి నిమిత్తమగుచున్నది. సామాజికుడు భావనాప్రపంచమున లీనుడై తన్నును, తన పరిసరములను, నాయక జీవితమును గూడ అధిగమించి, కేపలము భావమయమగు జీవితముతో తాదాత్మ్య్యమును పొందుచున్నాడు. అట్టి మనోజీవితమున అతడు గాంచునది సర్వమానవ సాధారణమగు ప్రకృతిధర్మమే కాని వ్య క్తిగతధర్మము కాదు. అభిజ్ఞానశాకుంతల చతుర్థాంక కథాసందర్శనముచే సామాజికునకు కలుగు భావము శకుంతలాకణ్వగతమైనది కాదు. కని పెంచిన కూతును అత్తవారింటికి పంపు సందర్భమున తల్లిదండ్రులును, బిడ్డ్ణయు సర్వసాధారణముగ ననుభవించు చిత్తస్థితి సామాజికునిచే ననుభూయమానమగుచున్నది. శకుంతలా కణ్వుల వృత్తాంతము నిమిత్తముగ సామాజికుని చిత్తము భావమయమై భావనాప్రవృత్తికి లోనై సాధారణమానవధర్మ మును దర్శించి దానితో తాదాత్మ క్టిమును పొందగలుగు చున్నది. అదియే సాత్త్వికమగు రసానుభవస్థితి. తనకంటెను బాహ్యమగు వస్తువు ఆలంబనముగ సాధారణ మానవధర్శముతో మనచిత్తమున కేర్పడు తాదాత్మ వ్ర్‌సైతిని సాధారణీకరణమనుపేర అభినవగుప్తాదులు వ్యవహరించినారు. ఇట్లు సాధారణీకరణ

రూపకరచన బూవతి లక్షీ నారాయణ రావు 1817 మేర్పడుట రసానందానుభూతికి హేతువు. అట్టి రసానందానుభవమును సామాజికునకు కలిగించుటయే నాటకకర్త ప్రధానాశయము. కన వివరించిన విధమున ఇట్టి రసానుభవమునకు సామాజికుని చిత్తప్రవృత్తియే ముఖ్యమని వ్యక్తము. సొమాజికునియందు భావమును ఉద్భుద్ధము చేసి కొంతవరకు వికసింపచేయుటకు ప్రదర్శనము ఆలంబనమగుచున్నది. సాధారణీకరణమునకును, దానినాశయించిన రసానుభవమునకును సామాజికుని మనోవ్యాపారమే (పధానమగు విషయము. కావున రంగముఘై జరుగు కథాప్రవృత్తి భారతీయనాటకకర్తకు ఒక సాధనము మాత్రమే కాని పరమార్థము కాదు. రసోత్పాదన యను పరమార్థమును సాధించుటలో కథాప్రవృత్తి సాధనము మాత్రమే. సామాజికుని హృదయమున నుత్పన్నములగు భావపరంపరలు, అనుభవాడులు, అతడు లోసగు సాత్త్వికాదులు మున్నగునవి మిక్కిలి ప్రధానములు. అనగా భారతీయ నాటకమున సామాజికుని మనోవ్యాపారమునకున్న (ప్రాధాన్యము సాధనమాత్రమగు కథాప్రవృత్తికి లేదు. ఈ తత్త్వమును బట్టియే సంస్కృతనాటకములలో కథాప్రవృత్తికి (పధానస్థాన మేర్పడలేదు. ఈవిషయమును గుర్తింపక పాశ్చాత్య నాటకముతో సంస్కృత నాటకములను పోల్చి తారతమ్య నిరూపణ గావింపబూనుట విమర్శకాదు.

సామాజికుని హృదయమును భావమయమొనర్ని అత్యుదాత్తమగు రసస్ధితికి గొంపోయి తదనుభూతిజన్యమగు ఆనందమును సామాజికునకు గల్గించుట భారతీయ రచయితల ఆశయము. వీరి నాటకరచనావిధానమంతయు ఈ యుద్దేశము ఫలించుటకు అనుగుణముగ నేర్పడినది. ఇతివృత్త వైశిష్ట్రము, రసపోషణాను కూలమగు నితివృత్త విభాగము వివిధ కథాంగములకును (ప్రధాన (పయోజనముతో ఐక్యము కల్గునట్లు కూర్చుటి, స్థాయాభావము (6కవమువికాసమునుజెంది రసపర్యవసితమగుటకు అనుగుణములగు సన్నివేశములను కల్పించుట, [పథాన (పయోజనమునకు భంగకరములు వఏరుద్ధములు నగు కథాంశములను ప్రయోజనానుగుణముగ మార్చుట, పాత్రల గుణశీలప్రవృత్తాదులను ప్రధాన పప్రయోజనసిద్ధికి దోహదమొనర్చునట్లు చిత్రించుట మున్నగునవి రచనాశిల్పమునకు చెందిన విశేషములు.

రూపకబేదములలో నాటకము సమగము, విశిష్టభావోపేతమునైనది. మానవజీవిత (ప్రవృత్తియందు ప్రధాన .పేరకశక్తు లైనవి శృంగారము, వీరము

1818 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నగుటచే వీనినే నాటకములయందు ప్రధాన రసములుగ పోషించినారు. ధర్మబద్ధమగు రతి మానవజీవితమున ఆనందమును సిద్ధిపపచేయుటలో (ప్రబలమైన హేతువు. ఆ భావమే తదనుగుణమగు పరిసరములయందు పోషితమై సంపూర్ణ వికాసమును బొంది, పరిణతస్థితియందు శృంగారరసముగ నాస్వాదింప బడుచున్నది. మానవ(ప్రవృత్తిలో మిక్కుటమగు భాగమునకు చాలవరకు ఈ రతిభావమే ప్రబలమగు కారణము. మానవ మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడగు “౧౭౪5 కూడ జీవిత ప్రవృత్తికంతకును రతిభావమే ఆధారమని నిరూపించినాడు. కావున శృంగారరసము జీవితప్రతిబింబముగు నాటకరచనయందు (ప్రాధాన్యము వహించుటలో నాశ్చర్యములేదు. ఇక రెండవది వీరరసము. ఉత్కృష్టమగు ఫలమును సాధించుటకై ఉత్సాహపడుట మానవ జీవితమున (ప్రధానమైన విషయము. ఈ యుత్సాహమే వీరరసముగ పరిణమించుచున్నది. ఉత్తమధర్మ్శమును, విశిష్ట్రపయోజనమును, లోకకళ్యాణమును సాధించుటకు ఉదాత్తుడగు వ్యక్తి ప్రదర్శించు నుత్సాహమే వీరముగ పర్యవసించుచున్నది. సాధారణముగ మానవజీవితమంతను శృంగార వీరముల పరిధిలో నిముడ్చుటకు వీలగుచున్నది. అదిగాక జీవితమున కుత్తేజమును, రామణీయకమును గూర్చుటలో ఈ రెండు రసములకును గల శక్తి రౌద్రబీభత్సాది ఇతరములకు లేదు. సాత్త్వికమగు నానందమును గూర్చుటలో వీరశృంగారములకున్న సామర్థ్యము ఇతర రసములకు లేదు. మరియు రౌదబీభత్సాదులును హృదయక్షోభ, జుగుప్పు మున్నగు వానికుపాదులగుటచే సార్వత్రికముగ వీనిననుభవించుట సాధ్యముకాదు. వాస్తవిక జీవితమునకూడ వీనిప్రసక్తి అ'ప్రధానమే. కావుననే నాటకములలో వీనిని అందందు క్వ్యాచిత్మముగ పోషించినారేకాని ప్రధానములుగ చేయలేదు. రతిభావము డేయసీపేయసుల విషయమున ప్రణయముగను, సంతానము విషయమున వాత్సల్యముగను, గురుపిత్రాదులయెడ గౌరవముగను, ఈశ్వరుని విషయమున భక్తిగను పరిణమించునని చెప్పవచ్చును. ఉత్కృష్టపప్రయోజనము నుద్దేశించిన ఉన్నతుడగు వ్యక్తి యొక్క ఉత్సాహము ఫలింపనినాడు శోక మేర్ప్చడి కరుణగా పర్యవసించుననియు కొందరి మనస్తత్త్వశాస్త్రజ్జుల యభ్నిపాయము. కావున శృంగార వీరములకు జీవితమునగల (ప్రాధాన్యము విస్తృతమైనది. దీనినిబట్టియే ఉదాత్తనాటకములన్నియు వీనినే ముఖ్యములుగ పోషించినవి. మానవ

రూపక రచన భూవతి లక్షీనారాయణ రావు 1819 ప్రయత్నములు ఎంత యుదాత్తములైనను ఎల్లప్పుడును ఫలించునని చెప్పజాలము. మానవుని యుత్ప్సాహ ప్రయత్నములు విఫలములగుట (పకృతిసిద్ధమగు విషయమే. కావున గోకమునకు కూడ మన జీవితమున అధికార మేర్పడినది. ఈ కారణమును బట్టియే ఉత్తరరామచరిత్రవంటి శోకభూయిష్టమగు రచననుగూడ మన మాస్వాదింపగలుగుచున్నాము. అయినను మానవోత్సాహవైఫల్యమును, తత్పలితవుగు శోకమును (పధానముగ నాటకములయందు పోషించి (ప్రదర్శించుటవలన ప్రజలకు వినోదము కల్గుటకు మారుగ క్లేశము కల్గుట కెక్కువ అవకాశమున్నది. జీవితమందలి కష్టములు, దుఃఖములు మున్నగువానిచే ఆర్హులైయున్న సామాన్య జనసమూహమునకు వినోదము కల్గించుట కూడ నొక (ప్రధాన ప్రయోజనముగ నుద్దేశించిన భారతీయ నాటకకర్తలు కరుణరస (పప్రధానములగు నాటకముల నెక్కువగ ఆదరింపనివారైరి. నాటకము జీవితమునకు సవుగ (ప్రతివింబమగుటయు జీవితమున రత్యుత్సాహములు (పధాన భావవములగుటయు కారణములుగ నాటకములలో శృంగార వీరములు (పధానరసములు కావలనని నిర్దశించినారు. జీవితమునం దాయా అవస్థా సన్నివేశములలో తాత్కాలికముగ మానవుడు హాస్య, రౌద్ర, భయానకాదుల ననుభవించినట్లి నాటకమున కూడ నివి [పపధానరసమును పోషించునవియె ఆందందు ఇతివృత్తానుగుణముగ నుపయుక్తములగుచున్నవి.

వస్తువు: భారతీయ నాటకకర్తలు పురుషార్థములను నాటక [ప్రయోజనముగ నెప్పుడుద్దేశించినారో అప్పుడే ఇతివృత్తము కూడ ఉదాత్తము కావలసివచ్చినది. ధర్మమును, ధర్మబద్ధమగు అర్థకామములను సాధింపబూనిన ఉత్తమపురుషుని ప్రయత్నమును, తత్పరిణామమును ఇతివృత్తముగ నేర్పడినవి. జన్మపరంపరను, కర్మ సిద్ధాంతమును, విశ్వసించిన భారతీయులు ఉదాత్త భావోపేతములగు కావ్యములను రచించుటలో ఇతివృత్తమును ఉన్నతవర్గములవారి జీవితములనుండి గైకొనుటలో ఆశ్చర్యములేదు. ఇదికాక రసోత్పత్తి కనుకూలించు స్థాయీభావము సామాజికునియం దుద్చుద్ధమగుటకు ఉదాత్త నాయికానాయకుల జీవితము (ప్రయోజనకారి కాజాలదు. మానవ మనస్తత్త్వము కూడ ఇందుల కనుగుణముగనే యున్నది. తనతో సాటియగు మానవుని జీవితపదర్శనమునందు సామాన్యముగ మానవు డాసక్తిని వహింపడు. ఒక విధమగు ఉదాసీన భావమును, లేక

1820 పందిరి మల్లికార్డునరావ శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నిరసనభావమును వహించుట షానవప్రకృతి. తనకంటెను ఉన్నతమగు జీవితముపై మానవునకున్న ఆసక్తి అమితమైనది. అట్టి ఆసక్తి యున్నపుడే అతని చిత్తము రంగముకై కేంద్రీకరించి ఏకాగమగుటకును, కడపట రసానుభవమును పొందుటకును అవకాశమున్నది. కావున రసోత్పత్తియ 'ప్రధానాశయముగ ఇడుకొన్న భారతీయులు ఉదాత్త నాయకేతివృత్తమునే నాటకములయందు వస్తువుగ నొనరించినారు. ఈ విషయమును గుర్తింపక పూర్వ నాటక కర్తలకు సామాన్యజీవితమునందు నిరసన భావమని విమర్శించుట తగదు. మొదట నాటకరచనయే సామాన్య ప్రజల నుడ్దెశించినది అనుట విస్మరింపరాదు. (గీకునాటకములలో కూడ ఉదాత్తనాయకేతివృత్తమే వస్తువుగనైనది. షేక్స్పియర్‌ నాటకములు గమనించినను ఈ విషయమే వ్య క్తముకాగలదు. మానవత్వ ధర్మములు, మనోవ్యాపారములు, చిత్తవృత్తులు, జీవితమందలి కష్టసుఖాదులు మున్నగువానినన్నిటిని ఉదాత్తులగువారి జీవితమునగూడ చూడగల్గుటచే సామాన్యులకు జీవితముతో సామరస్య మేర్ప్చడుచున్నది. భౌతికకష్టపరంపరల కారణముగ హృదయమున నేర్పడిన క్షు[దభావములు, దౌర్చల్యము ఇత్యాదులు క్షాళితములై సాత్త్వికస్థితి కలుగుటకు వీలున్నది. ఈ కారణములవలననే నాటకములలో వస్తువు ఉదాత్తముగ నుండవలెనని నిర్దేశించినారు. నాటక విషయమున మాత్రమే ఈ నిర్దేశము (ప్రధానమై యున్నది. ప్రకరణాదులలో ఇతివృత్తము సామాన్య జీవితమునకు సన్నిహితమై యుండుట గమనింపదగును. (సశేషము) (కిన్నెర; సంపుటము 5, సంచిక 5, మే 1953) వగల అంక మ... 9 నం

రూసక రచన భూపతి లక్ష్మినారాయణ రావు (గత సంచిక తరువాయి)

ఆం టకములందు సాధారణముగ ఇతివృత్తము ప్రఖ్యాతమైనదిగా నుండవలెనను నిర్దేశము కలదు. ఉత్పాద్యమగు వస్తువునకంటెను ప్రఖ్యాతమగుదాని కిట్లు ప్రాధాన్యమిచ్చుటకు కారణము లేకపోలేదు. కథ (ప్రసిద్ధమై సామాజికునకు తెలిసి యున్నచో నాటక ప్రదర్శనమున కథాప్రవృత్తిని సులభముగ అనుసరింపగలడు. అట్టిచో, కథ్మపవృత్తితో సామాజికుని చిత్తమునకు తాదాత్మ్య మేర్పడు నవకాశము కలుగుచున్నది. కథనుగూర్చిన పూర్వసంస్కారమున్నప్పుజడే భావన కవకాశ మేర్ప్చడుచున్నది. జరుగబోవు నితివృత్తము, పోషితములగు భావములు, పాత్రల హృదయములను ప్రదర్శించు సన్నివేశములు - ఇత్యాదులు సాషాజికుని చిత్తమున సంస్కారరూపమునసున్నచో, విభావానుగుణమగు భావముద్చ్భుద్ధమై పోషితమగుట కెక్కువ వీలున్నది. రంగమున (ప్రదర్శింపబోవు రసవత్తరసన్నివేశముయుక్క స్మరణయు, దానినిగూర్చిన భాపనావ్యాపారముసు హృదయస్పందనకు హేతువులై, రసానుభూతికి సహకరించుచున్నవి. దీని నాంగ్రమున గి౧॥160021[0౧ అని వ్యవహరింతురు. భావవికాస భావావేగముల కీ భావికథాప్రవృత్తి జ్ఞానము (ప్రబలహేతుపు. ఉత్తరరామకథను ఆరంభించుటతోడనే, కథ్రావిషయకసంస్కారముకల సామాజికుడు, కథాసన్నివేశము, సీతారాముల హృదయస్థితి - ఇత్యాదులను భఖావించుకొనగలుగం చున్నాడు. అనగా సావూజికునిహృదయువు పందిరి మర్త్‌కార్టునరావు శతజయంతి... సంప్పుటము. 4: సాహిత్యము

1822 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నాటకప్రదర్శనమున ఉన్ముఖమైయుండు పరిస్థితి యేర్పడుచున్నది. దీనివలన నాటకమున పోషతవుగు రసమున కనుకూలించు ఖభావావరణమున సామాజికుడుండుట యేర్పడుచున్నది. అట్టి సందర్భములో నటుల వేషధారణము, అభినయము, కవిరచన, సంగీతనృత్యములు మున్నగునవి భావావరణనిషస్టుడగు సామాజికుని హృదయమును ఎక్కువ సులభముగ ఆర్హ్ర మొనర్పగలుగుచున్నవి. ఇందువలన రసోత్పత్తికి సౌకర్యమేర్పడుచున్నది. ఈ మనస్తత్వమును (గ్రహించింపే (థఖ్యాతమెైన వస్తువు నాటకరచనయుం౦ం దుత్తవుమైనదని పాచీను లభిప్రాయపడియున్నారు. వస్తువు పూర్తిగ నుత్పాద్యమైనచో రసోత్పత్తియగుట కష్టము. కావున ప్రఖ్యా తీతివృత్తమును రసోచితమగునట్లు మార్చుటకు కవి గావించు కల్పన ఎక్కువ ప్రయోజనకారి యగుచున్నది. శాకుంతల ఉత్తరరామచరిత్రాది నాటకములిట్టివి. రసోచితమగు కల్పనతో గూడిన (పఖ్యాతేతివృత్తమును మిశ్రమేతివృత్తమని యందురు. పప్రహసనాది రూపకఖేదములలో పూర్తిగ నుత్పాద్యమగు వస్తువే ఇతివృత్తము గావచ్చును. భగవదజ్ఞుకమను ప్రహసన మట్టిదే. రాజశేఖరకృత విద్ధసాలభంజికయను నాటిక కూడ కల్పితమే. (ప్రబోధచందోదయమువంటి నిగూఢార్ధ్థపోషకమగు నాటకమున మాత్రమే వస్తువు పూర్తిగ కవి కల్పితమైనదిగా కనడుచున్నది.

నాయకసంబంధమైనదియు, ఫలపర్యవసితపర్యంతము అతనిచే నిర్వహింపబడు చున్నదియునగు ప్రధానేతివృత్తమునగు అధికారి కేతివృత్త మని పేరు. ఫలమున కధికారియగు నాయకునకు సంబంధించినదియగుటచే నతని యితివృత్తమునకు ఈ పేరు కల్గినది. ఈ ఆధికారికేతివృత్తమునకు సహాయకరములు, కవిచే నుపయుక్తములునగు నితర ఆప్రధానవృత్తాంతములకు ,[ప్రాసంగికేతి వృత్తములనిపేరు. ఈ యితరవృత్తములు స్వతంత్రప్రయోజనములు కలవ్విటు (పధానేతివృత్తపోషణ కుపకరించుచున్నవి. కథ్మాపసంగవశమున అందందు వచ్చునవియగుటచే వీనికి ప్రాసంగికములను పేరు కల్గినది. ఉత్తరరామచరిత్ర యందలి శంబూక వృత్తాంతము. మృచ్చకటికలోని గోపాలకశర్విలకుల వృత్తాంతములు, రావమాయణమందలి సుగీవజటాయువృత్తాంతములు - (పాసంగి కేతిపృత్తములు. ప్రధానేతివృత్తమున దీనికిగల [ప్రాధాన్యమును, విస్తృతిని బట్టి పాసంగికము ద్వివిధముగ పరిగణింపబడినది. కథయందు ప్రవేశించినది

రూపక రచన భూపతి లక్ష్‌ నారాయణ రావు 1823 మొదలు ఫలపర్యవసానము వరకును ప్రవర్తించుచు స్వ(ప్రయోజనమును గాంచు ప్రాసంగికేతివృత్తమునకు పతాక యని పేరు. స్వల్ప(పప్రయోజన ముద్దేశముగా కలిగి ప్రధానకథయం దొక భాగమున మాత్రమే పప్రవృత్తమగునది (ప్రకరి. సుగ్రీవవృత్తాంతము పతాకకును, జటాయువృత్తాంతము ప్రకరికిని నుదాహరణములు. షేక్స్‌పియరు 11౬/0౧8౧ 01 ౪౭౧108 లో జెసిక్కా లొలెంజోల యుదంతము (పపాసంగికవు. ఈ రెండు విధములగు (1పపాసంగి కేతివృత్తములును ప్రధానప్రయోజనమును సాధించుటలో ఉపకరించునవి యగుటచే అర్థ్ధప్రకృతులలో చేరుచున్నవి.

నాటకప్రయోజనమే యర్థము. దానిని సాధించుటలో ఉపకరించు సాధనములు అర్థప్రకృతులు.

“తతార్థః ఫలమ్‌ తస్య ప్రకృతయః ఉపాయాః

ఫలహేతవః ఇత్యర్థల

. బీజము, బిందువు, పతాక, ప్రకరి, కార్యము అని యివి ఐదు విధములు. నాటకకర్త

యుద్దేశించిన రసాసుభవము సిద్ధించుటకు స్థాయాభావ మాధారము. సహృదయుడగు సామాజికుని హృదయమున సుప్తమైయున్న స్థాయాభావమునకు ఉద్చోధను కలిగించుటకు తగిన వాతావరణమును రచయిత యేర్ప్చరుపవలసియున్నది. రంగమున (్రదర్శింపబడు దానిని ఇంద్రియములద్వారా (గ్రహించుటయే సామాజికుని ప్రవృత్తి. ఆత్మాభ్మిపాయము, సంకల్పము మున్నగువాని కిందు ప్రసక్తిలేదు. రంగమున ప్రదర్శింపబడు విషయమువల్లనే మనస్సునందలి భావమున కుద్చోధ కలుగవలసియున్నది. అట్టి భావబోధకు తగిన మానసిక పరిస్థితిని సామాజికునియందు కట్టించుట నాటకకర్త (ప్రథమకర్ణవ్యము. అట్టి మానసికపరిస్థితి కలిగించు సాధనమును బీజమని [ప్రాచీనులు వ్యవహరించినారు.

స్వల్పోద్దిష్టస్తు తద్ధేతు ర్చీజమ్‌ విస్తార్యనేకధా;

స్తోకోద్దిష్టః కార్యసాధకః పురస్తా దనేకపకారం,

విస్తారీ హేతువిశేషో వీజవద్చీజమ్‌ = ఇంతియేకాక నాటకమున పోషితవుగు _కథా(పప్రవృత్తికంతకును బీజమే మూలమగుచున్నది. నాయకుని జీవితమునం దొకభాగమును మాతమే

1824 పందిరి మల్ష్‌కార్డునరాప్పు శతజయంతి సంపుటము 4: సాహిత్యము 1పధానేతివృత్తము ప్రదర్శించుచున్నది. ఆ కథాప్రవృత్తికి హేతువగు పరిస్థెతి యొట్టిదో సామాజికునకు తెలియుట ముఖ్యము. అట్లు తలియచేయుటకూడ బీజమువలని పప్రయోజనములలో నొకటి. బీజమునుండి యుత్పన్న మైన అంకురము [కమాభిషృద్దినిచెంది వృక్షమై యెట్లు ఫలవంతమగుచున్నదో అట్లే ఫలపర్యవసితమగు కథాప్రవృత్తియంతయు స్వల్పమగు నీ కారణమువల్లనే యేర్పడుచుండుటచే నీ సాధనమునకు వీజమను పేరు కల్గినది. శాకుంతల (పప్రథమాంకమున దుష్యంతుని జూచిన శకుంతల “కిం ను ఖలు ఇమం ,పేక్ష్య తపోవనవిరోధినో వికారస్య గమనీయాస్మిసంవృత్తా" అని పలుకుట బీజమగుచున్నది. నాయికానాయకగత అనురాగమున కంతకును ఇదియే మూలము. ఇదివరకే శకుంతలను జూచి చిత్తవికారమునకు రాజు లోవైయున్నాడు. శకుంతలయు నిప్పుడు అట్టి వికారమునకు లోనగుచుండుటచే స్థాయీభావము వికసెంచి శృంగారముగ పర్యవసించుటకు వీలుకలిగినది.

“యత్తు స్వల్పముపక్షిప్తమ్‌ బహుధా విస్తృతిమ్‌ గతమ్‌

కార్యస్యకారణమ్‌ పాజ్జైః తద్బ్చీజమితి కథ్యతే"

అట్లే మాళవికాగ్నిమిత్రమున మాళవికా చిత్రపటదర్శనము అనురాగమునకు బీజమగుచున్నది. ప్రధానకార్యమునకు కారణమగునది బీజమని తాత్పర్యము. కథయందు అవాంతర కార్యములకు కూడ వేరుకారణము లుండవచ్చును. అట్టివానికి అవాంతరకార్యబీజవఎలని పేరు. వమాళవికాగ్నివితమున మాళవికాదర్శన ప్రాప్తి యనెడు అవాంతరకార్యమునకు హరదత్తగణదాసుల వివాదము కారణమగుచుండుటచే నిది అవాంతరకార్యబీజమగుచున్నది. ఈ యవాంతరకార్యబీజము కూడ (ప్రధానకార్యబీజము ననుసరించి యేర్పడినదియే యగుటచే దాని యందంతర్భావవమను బొందుచున్నది. [పప్రధానకథా ప్రవృత్తికంతకును ఆధారమగు సన్నివేశమేదికలదో అది బవీజమని సారాంశము. ఈ బీజము నాధారముననే తదనంతరేతివృత్తమంతయు ప్రవృత్తమై ఫలోన్ముఖము గావలసియున్నది. వీజము [క్రమముగ అభివృద్ది చెంది బహుముఖపిస్తృతమై పరిణామదశయందు ఫలమును సిద్ధింప చేయుచున్నది. కావున బీజమల్ట నక్తిసంపన్న మైనది కావలయును. అనగా కథాప్రవృత్తికి కారణభూతముగు

రూపక రచన భూవతి లక్షీనారాయణ రావు 1825 స్థాయీభావవికాసమునకు కారణమై, తదనంతర నాయకకృత (ప్రయత్నమునకు దోహదమునర్చునదియై ఫలపర్యవసాయియగువరకును నాయకుని ప్రయత్నమునకు విచ్చేదము రాకుండ కథను నడిపెంచుటకు సమర్థమై యుండవలెను. అట్టి బలవత్తరము, సమర్థమునైన సన్నివేశమే వీజముగా నుండుటకు అర్హమగుచున్నది. శకుంతలాదుష్యంతుల అనురాగోత్పత్తికి కవి కల్పించిన సన్నివేశ మట్టిది. యౌవనప్రాదుర్భావముననున్న శకుంతల అదేస్థితిలోనున్న అనసూయా (పఉియంవదలతో గూడి వృక్షసేచన వ్యాపారమునందుండుట, సఖులమధ్య వయోనుగుణము శృంగారానుకూలము నగు నర్మసంభాషణ జరుగుట, అట్టి సందర్భమున సుందరుడు, యువకుడు, నాగరకుడు, సరసుడు నగు దుష్యంతుడు ప్రవేశించుట - అను సన్నివేశము రతిభావపోషణకు తగిన వాతావరణము. సౌొందర్యసాకుమార్యములు, రత్యభిముఖమగు మన£పవృత్తి, భావమునకు సహజమగు దోహదమును గూర్చు సఖీజనము, (పకృత్యనుగుణముగ స్వేచ్చగ పెరిగిన ఆశమవనము కలిగించు పకృతి వాతావరణము - ఇవియన్నియు చేం నాయికానాయకుల హృదయములందలి రతిభావమునకు స్థిరమగు నుద్చోధను కలిగించుటకు సవుర్ధ మైన సన్నివేశవుగుచున్నది. నాయిక యొక్క సహజసౌందర్యము (పకృతిసౌందర్యమధ్యమున నాయకునిచే అనుభూతమైనది. అట్టిస్టితియందే నాయికదృష్టియు నాయకున్నిపై కేందీకరించి అనురాగోత్పత్తిని కలిగించినది. అనురాగవీజ మీవిధమున భావపోషకమగు పరిస్థితిలో సుక్షిప్తమైన కారణమున నది నాయక ప్రయత్నమునకును, దానిననుసరించు కథాప్రవృత్తి' పోషణకును, సవుర్థవుగుచున్నది. కావున చీజవు కథా,పపవృత్తికి సమర్థ మైయుండుటయు, దాని వికాసపోషణలకు సర్వవిధముల ననుకూలించు . భావావరణమును ఏర్పరచుటయు నాటకరచనయందు (ప్రధానవిషయము లగుఎచంన్నవి. నాటకారంభవుందలి _పస్తావనయు, నొకప్వుడు (పథమాంకారంభమందలి విష్కంభమును, అట్టివాతాపరణమును కల్పించుటకు సాధనములగుచున్నవి. ఇతివృత్తము సామాజికులకు చిరపరిచితమైనదిమొనచో ..... విష్కంభప్రయోగముతో నవసరములేకయే ఇతివృత్తము నారంభింపవచ్చును. శాకుంతలకథ లోకమున ప్రసిద్రమైనది యగుటచే ప్రత్యేకముగ విష్కంభముచే సామాజికులను భావోన్ముఖులుగా చేయు నవసరము లేకపోయినది. రత్నావలీ

1826 పందిరి ుల్లికార్టునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నాటకమున కఏవికల్పన ఎక్కువగ నుండుటచే కథారంభమునకు ముందు సామాజికుల మనస్సులను భావోన్ముఖముగ చేయు నవసర మేర్చడినది. యౌగంధరాయణుని వాక్యములు అట్టి భావావరణమును కల్పించుచున్నవి. ప్రసిద్ధకథలయందు ్రస్తావనయొకటియే ఈవిషయమున చాలియున్నది. ఇట్లు సామాజికుల హృదయములను నాటకమున పోషింపదలచిన భావమునకు ఉన్ముఖమగు నట్లొనర్చుట ఆఫై స్థాయాభావ ఉద్చోధకు తగిన నాటకీయవాతావరణము నేర్పరిచి కథాబీజమును వేయుట అనునది నాటకమునందలి ప్రథమఘట్టము. బీజముకారణముగ నేర్పడు కథాప్రవృత్తి ముందునకు సాగుటకు ననేకములగు నితరవిషయముల సహాయ మావశ్యకమగుచున్నది. అనగా ప్రధానప్రయోజనమును సాధించుటలో నితరములగు స్వల్పుపయోజనములు కూడ సాధింప బడవలసియుండును. [పప్రధాన ప్రయాజనమునకు అనుకూలములగు పరిస్థితుల నేర్పరిచిననే తప్ప అది సిద్ధింపజాలదు. కావున కథ యందు తత్సిద్ధికి ఉపకరించు కార్యములను (పప్రదర్శింపవలసియుండును. అట్లు (పదర్శింపబడు నీ యితరవిషయములు తాత్కాలికముగ ప్రధాన కథాంశమును మరుగుపరచునవి యగును. అనగా, అవాంతరకారణములచే ప్రధానాంశమునకు తాత్కాలికముగ విచ్చేదము కలుగుచున్నదని యర్థము. అట్టి కారణములవలని [ప్రయోజనము సిద్ధించినవెంటనే మరల (ప్రధానాంశమును సామాజికుల ఎదుటికి తేవలసిన అవసరమున్నది. లేనిచో పధానకథయు తదాధారమగు భావమును సామాజిక హృదయములందు స్థరపడక (కమవికాసమును కాంచలేకపోవును. కావున (ప్రధానాంశమునకు కారణాంతరములచే విచ్చేదము కలిగినపుడెల్లను తత్కారణము (పప్రయోజనసిద్ధి గాంచిన యుత్తరక్షణముననే ప్రధానాంశమును మరల స్మరణకు తెచ్చు సన్నివేశ మత్యంతావసరము. దీనికే నాటకపరిభాషయందు బిందువని పేరు. శాకుంతల ప్రథమాంకము నాయికానాయకుల హృదయములలో అనురాగ మంకురించుటకు తగిన కథాంశమును పోషించినది. (ఏథమాంకాంతమందలి వుదగజవృత్తాంతవును, ద్యితీయాంకారంభవుందలి విదూష కక్ళత మృగయావృత్తాంత వర్షనయు, నతని పురగమనాభిలాషయు, ఇత్యాది భాగము (పధానాంశమగు అనురాగేతివృత్తమునకు అడ్డువచ్చినది. ఈ విదూషకవృత్తాంతమును నితడు రాజు నాశమమున వదలి పురమునకు పోవుటయు నను విషయము

రూపక రచన. భూపతి లక్ష్మీనారాయణ రావు 1827 నాయికానాయకానురాగ మనెడి పపధానప్రయోజనమును సాధించుటకు అవసరమగుచున్నది. కనుక అవసరమగు నీ విషయము ముగిసినవెంటనే మరల (ప్రధానాంశము ప్రదర్శింప బడవలసియున్నది. “మాఢవ్యా! అనవాప్త చక్షుః ఫలో2 సి ఏనత్వయా దర్శనీయం న దృష్టమ్‌” అను దుష్యంతవాక్యముచే నిట్టి ప్రయోజనము సాధింపబడియున్నది. (పప్రథమవమాంకాంతవుందలి వుత్తగజాగవునఖీతి, ద్వితీయాంకాదియందలి మృగయా విషయ సేనాపతి వాక్యాదులు అను విషయువఎలచే వెనుకబడీన అనురాగవఎను వురల (ప్రదర్శించి అవిచ్భ్చేదకారణమగుచుండుటచే నీ వాక్యము బిందువనెడు అర్థ (ప్రకృతి యగుచున్నది. దుష్యంతుడు పల్కిన వాక్యార్థము అతనికి ప్రథమదర్శనమునందు కలిగిన శకుంతలావిషయకానురాగము ఎంత ప్రగాధమైనదియు సూచించుచున్నది. అనురాగవీజ మంతటి సమర్థ మైనది కావుననే నాయకుని ఫలపర్యవసాయియగు నిరంతర (ప్రయత్నమునకు హేతువు కాగలుచున్నది. బిందువు ఇట్లు ప్రయోజనకారియగుట నాటక పోషణ ద్వితీయావస్థయందు తప్పనిసరి యగుచున్నది. అంతమ్యాతమున నిది తదనంతరభాగములలో ప్రయుక్తము కాగూడదని కాదు. (పపధాన [పప్రయోజనమునకు విచ్చేదము కలిగినవుడెల్లను ప్రయుక్తమగుచు. అవిచ్చేదకారణమగు విషయము బిందువే యగుచున్నది. కావున బిందువు అను అర్ధ ప్రకృతి పలచోట్ల పప్రయోగింపబడవచ్చును. పతాక కరు లనెడు అర్థ ప్రకృతులతో నవసరములేని నాటకములలో బిందువే తత్ప్రయోజనమును సాధించునదిరై యున్నది. ఈ ద్వితీయార్థ్మపకృతి కిట్లు నాటకమున వ్యాప్తి ఎక్కువగా నుండుటచే జలపతిత తైలబిందుప్రసార సాదృశ్యమునుబట్టి దీనికి బిందువని 'పేరు వచ్చియుండపచ్చును. ప్రధానకథాభాగము కారణాంతరములచే మరుగుపడినపుడెల్లను నాయకుడు దానిని మరల స్మరణకు తచ్చుకొని (ప్రయోజనసిద్ధియందు తనకుగల సాధనోపాయసం పత్తిని పరామర్శించుకొని ప్రయోజనసిద్ధికై ప్రయత్నమును మరల సాగింపపలసియున్నది. లేనిచో కథాప్రవృత్తికిని, ఫలసిద్ధికిని అవకాశమే లేకపోవుచున్నది. కావున బిందువు నాటక రచనయందు మిక్కిలి ప్రధానమగు సాధనము. నాయకునిచే నైనను నాయకసహాయులచేనైనను బిందువు ప్రయుక్తము కావచ్చును. ఈ విధానము పాశ్చాత్యనాటకములయందు గూడ కాననగును. హాచ్లాట్‌ నాటకమున నాయకుని

1828 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (వృత్తికంతకును కారణముగునది అతని తండిహత్య. తత్చ్పంతెకియ యనెడుప్రయోజనమును సాధించుటలో అవాంతరకారణములు కలిగినపుడెల్లను నాయకుడు తన తండ్రి హత్యను గూర్చి స్మరించుకొనుచుండుటయు, నా స్మృతి భావిపయత్నమున కతనిని (ప్రేరేపించుటయు జరుగుచున్నది. (పప్రయోజనసిద్ధి కలుగునంతవరకును నీ పరిస్థితి తప్పదు. శాకుంతల తృతీయాంకమున రసోస్ముఖముగ పోషితమైన నాయికా నాయకానురాగవృత్తాంతమునకు చతుర్ధాంక కథాభాగము విభిన్నమైనది. సామాజికహృదయములం దిదివరకును వికాసమును పొందిన రతిభావవమ చతుర్థాంకవిష యవబమచే వురుగుపడినది. శృంగారమునకంటెను కరుణకే చతుర్ధాంకమున ఎక్కువ (ప్రాధాన్యము కలదు. కావున ప్రధాన ప్రయోజనసిద్ధి నాశించి మరల రతిభావము ప్రదర్శితము కావలసియున్నది. పంచమాంకారంభమందలి హంసపదికావృత్తాంతము ఇట్టి ప్రయోజనమును సాధించునదిమై యున్నది. “అభినవమధులోలుప స్త్యం తథా పరిచుంబ్య చూతమంజరీం, కమలవసతిమాత్రనిర్వృతో మధుకర విస్మృతోఇ స్యేనాం కథమ్‌.”

అను గీతార్థము శకుంతలాదుష్యంతుల ప్రణయవృత్తాంతమును స్మరణకుతెచ్చి సామాజికులను మరల (ప్రధానమగు అనురాగ వృత్తాంతమున కున్ముఖులుగా జేయుచున్నది. ఈ యర్థ ప్రకృతికి పతాకాన్థానమను నామమే యయ్యును దీనిచే సాధింపబడు ప్రయోజసముసు బిందువు ప్రయోజనషును నొక్కటియే యగుచున్నది. అట్లే పంచమాంకకథాభాగమందలి శకుంతలానిరాకృతిచే అనురాగ విషయమునకు విచ్చేదము కలుగుచుండ షష్టాంకాది యందలి జాలరివృత్తాంతము విచ్చేదము కలుగకుండ చేయుట కుపకరించుచున్నది. అంగుళీయకదర్శనముచే రాజునకు శకుంతలాస్మృతి కలుగుటయు, నతని హృదయము శకుంతలానురాగపూర్ణ మగుటయు జరిగి సామాజికుని హృదయమునందు రతిభావవికాసమునకు కారణమగుచున్నది. జూలరివృత్తాంత మిట్లు ప్రధానాంశము విచ్భేదము కాకుండునట్లు చేయుచు బిందుప్రయోజనమునే సాధించుచున్నది. ఈ యర్థ ప్రకృతికి ప్రకరి యని పేరు. బిందువు సాధింపవలసిన ప్రయోజనమును సాధించుట కూడ పతాకాప్రకరుల ప్రయోజనములలో నొకటి.

రూపక రచన భూవతి రిక్షీనారాయణ రావు 1829

ఇంతియకాక పతాకాపకరులనెడు అర్థ ప్రకృతులు (పధానేతివృత్త (ప్రయోజనమును సాధించుటలో సాధనములగుచు స్వప్రయోజనమును గూడ సాధించుకొనుచున్నవి. ఇందు పతాకావృత్తాంతము కథయందు ప్రవేశించినది మొదలు వ్రధానేతివృత్తము ముగియునంతవరకును పప్రవృత్తియందుండి [ప్రధానకథకు సహాయపడుచు స్వప్రయోజనసిద్ధిని గూడ గాంచుచున్నది. ఈ వృత్తాంతమును స్వతం(త్రమగు అప్రధాన ఇతివృత్తముగ పోషించు నవకాశము గూడ కవికి కలదు. (ప్రకరికి నాటకమునం దిట్టి ప్రాధాన్యము లేదు. అల్పము, ఏకదేశప్రవృత్తము నై యుండునది (పకరి. అదియుగాక పతాకానాయకునిచే [ప్రధానకథానాయకునకు నుత్కృష్టమగు సహాయముగూడ సిద్ధించుచున్నది. సుగ్రీవుడు వాలివధ ఆధారముగ రాజ్యప్రాప్తియనెడు స్వప్రయోజనమును గాంచుటయేగాక ప్రధానకథాంతము వరకును రామునకు సహాయ పడియున్నాడు. (ప్రకరియం దిట్టి విశేషము లేదు. దశరూపకకర్తయుగు ధనంజయునిచే సూచింపబడని యా భేదమును అభినవగుప్తపాదుడు వివరించినాడు. (ప్రకరి కథాప్రవృత్తికి ఉపకారమగుచున్నదే గాని స్వప్రయోజనసిద్ధిని గాంచుటలేదు.

“యద్వ్యృత్తం హి పరార్థం స్యాత్‌ [ప్రధానస్యోపకారకమ్‌

(పధానవచ్చ కల్చ్యేత సా పతాకేతి కీర్తితా -

“యస్య సంబంధి వృత్తం సంవిదనుసంధానమ్‌ పరస్య

(వ్రయోజనసంపత్తయే భవదపి స్వప్రయోజనమ్‌

సంపాదయతి, అతఏవ (పధానపచ్చకల్ప్యే

తేతి సచేతనాసుసంధానా పతాకాసిద్ధిః

ప్రధానస్యోపకారిణీ న పతాకామాత్రవదుపయో

గిత్వా దియం పతాకేతి చిరంతనాః -

పరార్థమేవ కేపలం సర్వమనుతిష్టతి సా (పకరీ

వేణీసంహారే భగవాస్‌ వాసుదేవః ప్రకర్షేణ స్వార్థా .

నపేక్షయా కరోతీతి యుద్ధమునం దుపయుక్తమగు పతాకము (ధ్వజము) వలన (ప్రయోజనమున్నసు అది నాయకునకు స్వయముగ సహాయపడుచుండుట లేడు. నాటకమందలి

1830 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము పతాకావృత్తాంత మట్టిదికాదు. పతాకనాయకుడు తానై కథానాయకునకు తోడ్పడుచు స్యపపయోజనవుఎను కూడ కాంచుట వుభఖ్యము. ఈ భఇభదవును గుర్తింపవలసియున్నది.

కార్య మను ఐదవ అర్ధ ప్రకృతి ప్రయోజనసిద్ధికి హేతువగుచున్నది. నాయకుడు (పయోజనమును సాధించుటలో నుపయోగించు భౌతికమాన సికాది సాధనోపాయసామ[గియంతయు కార్యమని వ్యవహరింపబడుచున్నది. అనగా ఉద్దిష్టప్రయోజనసిద్ధికై నాయకుడు ప్రయోగించు సర్వోపాయసాధనసామగి కార్యమని పిలువబడుచున్నది. ఇట్లు బీజము, బిందువు, పతాక, ప్రకరి, కార్యము

  • అను అయిదును ప్రయోజనసిద్ధియందు కవి ప్రయోగించు విశిష్టసాధనములగుటచే వీని కర్థప్రకృతులను శేరు కలిగినది.

ఇక (పధానేతివృత్తమును అయిదు భాగములుగ విభజించుకొని పోషించుట నాటకకర్త లవలంబించు విధానము. సాధింపనగు ప్రయోజనమును నిశ్చియించుట, తత్సాధనకువలయు నుత్సాహమును, సాధనములను, నిర్ణయించుట అనునది ఇతివృత్తపోషణయందు ప్రధానభాగము. ప్రయోజనసిద్ధికై చేయు ప్రయత్నాదికము రెండవభాగము. పప్రయత్నఫలితముగ ప్రయోజనము సిద్ధించుననెడి ఆశ కలిగినను ప్రతిబంధకముల పప్రాబల్యముచే తత్సిద్ధినిగూర్చిన శంకకూడ కలుగుటయు, ఈ పరిస్థితులచే (ప్రయోజనము అసిర్ధారితమగుటయు అను వ్యవస్థ మూడవభాగము. నాయకునియొక్కయు, తతృహాయులయొక్కయు, నిరంతర ప్రయత్నముచేతను, దైవ సహాయముచేతను కూడ ప్రతిబంధకములు తొలగి ఫలసిద్ధి నిశ్చితమగుట నాల్లవభాగము. ఇంతవరకును నాయకునివర్గముచే (ప్రయుక్తమైన సాధనోపాయ సంపత్తియంతయు (ప్రవర్తించి ఫలము సిద్ధించుట అయిదవ ఘట్టము. కథాప్రవృత్తికంతకును నైక్యముగూర్చి ఇతివృత్తమును సమాహారరూపమున (ప్రదర్శింపదలచుకొన్నప్పుడు ఈ అయిదుభాగములు తప్పవు. పాశ్చాత్య నాటకములయందును, అందు ముఖ్యముగ షేక్స్పియర్‌ నాటకములందును ఈ విభజన స్మక్రమముగా పాటింపబడియున్నది. భారతీయులును నాటకవస్తువును ఇట్లయిదువిధములుగ విభజించుకొని నాటకముల రచించినారు. ఈ విభాగములకే కార్యావస్థలని పేరు. ఆరంభము, ప్రయత్నము, ప్రాప్వ్యాశ నియతాప్తి, ఫలాగమము

  • అను నీ దశలు రసోత్పత్తి కెంతయు నావశ్యకములు. నాయికానాయకులన్యోన్యము

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1831 వీక్షించుకొని అనురాగయుక్తులగుట, ఏ అంతరాయములులేక త్వరలో వారు వివాహితులై సంసారసాఖ్యము ననుభవించుట అని ఇతివృత్తము పోషింపబడుచో సామాజికుడు రసానుభూతిని పొందుట కవకాశ వే యుండదు. ఎట్టి యుత్కృష్టప్రయోజనమును సాధించుటయందైనను మానవుడు ఉత్సాహించుట, 'ప్రయత్నాదిక మొనర్చుట, ప్రయత్నమునకు ప్రతిబంధకములు ఏర్పడుట, వానిని వ్యక్తి సాధించి తొలగించుకొని ఫలమును పొందుట అను సమగేతివృత్తమే రసపోషణ కనుకూలించును. ప్రకృతిసహజములగు అట్టి సమగ్రవిషయములే నాటకరచన కనుకూలించుచున్నవి. ఈ దశావిస్తృతి లేని కథావస్తువు నాటకరచనకే పనికిరాదు. ఈ విషయమును గమనించియే నాటకకర్తలు వస్తువును ఐదవస్థలుగా విభజించుకొని వానిని వేరువేరంకములలో పోషించినారు. కావుననే నాటకమున అయిందకములు తప్పనిసరి యగుచున్నవి. వీనిలో, ఏ యవస్థకైనను చెందిన యితివృత్తము పెద్దదియై, ఒక యంకమున నిముడ్చుటకు వీలుకానిచో నా భాగమును రెండంకములలో పోషించు స్వాతంత్య్యుము కవికి కలదు. అయినను ఏకావస్థను రెండంకములకు మించి పోషెంచుటవలన భావతీవతకు భంగము వాటిల్లగలదు. కావుననే నాటకము ఎంతపెద్దిదిమయెనను పదియంకముల నతి[కకమించుటకును వీలులేదని నిర్దేశించినారు. నాయకుడు కాని లేక ఉద్దిష్ట్రపయోజనమున కనుకూలురగు నితరులు గాని తత్సిద్ధిక్రై చూపు నౌత్స్పుక్యము పప్రారంభషుగుచున్నది. ఉద్దిష్టప్రయోజనసిద్ధికి వలయు సాధనసామ[గి అదివరకే సిద్ధమై యుండవచ్చును. లేక వానిని సవుకూర్చు కొనవలసియుండును. సిద్దమైయుండినచో (ప్రయోజనసిద్ధియందు వానికిగల సామర్థ్యమును గూర్చి విమర్శించుటయు, వాని నుపయోగించుటకు నిశ్చయించుటయు అనునది ప్రారంభము. లేనిచో సాధనసావు[గిని సంపాదించుకొనుటయందు చూపు నుత్సాహ వ ఆరంభమగుచున్నది. శాకుంతల (పథమాంకమున శకుంతలావిషయానురాగమునకు లోనైన రాజు

“అసంశయం క్ష త్రపరిగహక్షమా

యదార్యమస్యా మభిలాషి మేమనః

సతాంహి సందేహపదేషు వస్తుషు

ప్రమాణ మంతఃకరణః ప్రవృత్తయః =

1832 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అని నిశ్చయించుట ఆరంభమగుచున్నది. భావికథా ప్రవృత్తి కిదియే ప్రారంభము. అల్లే రత్నావళీనాటక ప్రథమాంకమున నాయక సహాయుడగు యౌగంధరాయణుడు ప్రయోజనసిద్ధికై చూపు నౌత్సుక్యమే ఆరంభము. నాయకుడు ఫలసిద్ధికై చేయు (పప్రయత్నాదికమే ప్రయత్నము. ఉద్దిష్టప్రయోజనమును సాధించుట కుపకరించు విధానములను నిశ్చయించుకొనుట, వానిని దృఢసంకల్పముతో ననుసరించుట

  • అనుటయే ప్రయత్నము. వాసవదత్తయంతఃపురమున సాగరిక యను మారుపేరుతో నున్న రత్నావళి ఉదయనుని గుర్తించి బద్ధానురాగమయె అతని చితపటమును లిఖించుకొనుట [పప్రయత్నవుగుచున్నది. శాకుంతలమున దుష్యంతుడు శకుంతలాబద్ధానురాగుడై ఆశ్రమమున నిలుచుట, ఆమె సందర్శనార్థ మై మార్గములన్వేషించుట, చెలులకు శకుంతల తన హృదయభావమును దెలిపి తామరపాకున జాబును వాయుట అను ప్రయత్నాదికమే ప్రయత్నము. ఈ (ప్రయత్నమే భావి తృతీయాంకాంతమందలి వీరి సంగమమునకు ఆధారమగుచున్నది.

“ఉపాయాపాయశంకాభ్యాం ప్రాప్యాశా ప్రాప్తిసంభవాః 7 ఉద్దిష్టప్రయోజనసిర్ధికి (ప్రయత్నము జరుగుచుండగా (పతిబంధకము 'లేర్పడుటయు, వానికారణముచే ప్రయోజనము అనిశ్చితమగుటయు, (పాప్త్యాశావస్థయందలి విషయము. ఫలసాధనోపాయము లోకవర్గముగను, (ప్రతిబంధకములు మరియొక వర్గముగను నిందేర్పడుచున్నవి. ఈ యవస్థలో నొకప్పుడు నాయకుని ప్రయోజనము సిద్ధించు నవకాశము లేర్పడుటయు, మరియికప్వ్పుడు భంగపడునట్టి పరిస్థితి యేర్పడుటయు జరుగును. ఇట్టి అనిశ్చితస్థితి ఏర్పడి నాయకుని హృదయమును తదాధారమున సావూజికుని వునస్సును కూడ డోలాందోళితవముగుటయు జరుగును. సామాజికునిదృష్టి నాయకావస్థ యందు కేంద్రీకరించుటకును, సామాజికుని హృదయమును నాయక హృదయభావవుయువుగుటకును నీ సతి ఆవశ్యకమగుచున్నది. ద్వితీయకార్యావస్థ యందలి నాయికానాయకకృత (పయత్నవు హేతువుగ నాటకమునందలి (పధానప్యాతలెల్లరును (ప్రావ్త్యాశావస్థయందు రెండువర్గములుగ నేర్పడుచున్నారు. ఒక వర్గముచే ప్రయత్నమునకు దోహదమును, మరియొకవర్గముచే దాని కంతరాయమును కలుగుట ఇందలి ప్రధానవిషయము. ఈ పరిస్థితులచే ప్రయత్నమొకప్పుడు

రూపకరచన భూపతి లక్షీనారాయణ రావు 1833 ఫలోన్ముఖమగుటయు, మరియొకప్పుడు అంతరాయములచే వెనుకకు తగ్గుటయు జరుగుచుండును. ఇట్లు ఫల వమనిశ్చితవుగుటయు, తత్కారణముచే నాయకహృదయము ఆందోళనకు లోనగుటయు నిందు జరుగుచున్నది. కథావిషయకమగు నాసక్తి సామాజికున యందు తీవమగుటకును, హృదయము భాపోపేతమై రసోన్ముఖ మగుటకును నీయవస్థ తోడ్పడుచున్నది. సాధనసంపత్తి కారణముగ ఫలాగమమును గూర్చిన యాశయు, అంతరాయ[ప్రాబల్యకారణముగ ప్రయోజనసిద్ధి విషయమున సందేహమును, నాయకున కిందేర్పడుచుండుట చే నీ యపస్థకు (ప్రాప్త్యాశ యనుపేరు సిద్ధించినది. శాకుంతలనాటక చతుర్థాంక కథాభాగము ప్రాప్త్వ్యాశావస్థ యగుచున్నది. శకుంతలను భర్తయొద్దకు పంపుటకైె కణ్వాదులు చేయు ప్రయత్నము ఫలసిద్దికి సహాయపడుచుండగ దుర్వాసశాపము తత్సిద్ధికి (ప్రతిబంధకముగ నేర్చడినది. నాయికహృదయము కూడ భరసమాగమ మనెడి ఫలాగమ విషయమున సందేహాస్పదమగునట్లు ఇత్తివృత్తము కల్పితమైనది. దుర్వాస శాపవిషయము నెరిగిన అనసూయాప్రాయంపదలు రాజాంగుళియకమును (ప్రత్యభిజ్ఞానముగ రాజునకు చూపమని శకుంతలతో పలుకుటయు, అందుకు శకుంతల,

“సభ్యా! అనేన సందేహేన వామా కంపెతాస్మి" అని పల్క్కుటయు నిందనుసంథింపవచ్చును. పంచవూంకవుఎన గౌతమీశార్ల్ణరవాదులు నాయికానాయక సమాగమమునకు దోహదమొనర్పుచుండ దుర్వాసశాపప్రభావము తత్ప్రతిబధంక మగుచున్నది. కణ్వుసం దేశము, గౌతమీ, శకుంతలా, శార్జ్ణరవాదుల వాక్యములు, పూర్వవృత్తాంతస్మరణమును రాజునకు కలిగించుటకు (పప్రయత్నించుచున్నవి. కాని శాపకారణముచే రాజునకు కలిగిన మరపు బలీయవైై అంతరాయముగుచున్నది. ఇట్టిస్థితిలో అనిర్జారిత మనస్కు డైయున్న రాజును విశ్వసింపచేయుటకై శకుంతల,

“భవతు యది పరమార్థతః పరపరిగహశంకినా తృయా

ఏవం ప్రవృత్తం అభిజ్ఞానేన అనేన తవ సందేహమపనేష్యామి” అని పలుకుటయు, రాజలందులకు అంగీకరించి "ఉదారఃకల్ప౯ అని పలుకు టయు, నాయికానాయక సమాగమ ఫలవిషయకమగు నాశను మరల కలిగించుచున్నవి. కాని, శకుంతల తనచేతినిచూచికొనగ అంగుళియకము కానకుండుటయు.

1834 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము “హాధిక్‌, హాధిక్‌, అంగుళలీయశూన్యా మే అంగులిొ" అని ఉద్విగ్నయగుటయు, ననువిషయము ఆశను మరల విఫల మొనర్చునదియై యున్నది. శకుంతలను రాజాస్థానమున వదలి శార్జరవాదులు తపోవనమునకు వెడలిపోగా ఏమిచేయుటకును పాలుపోక ఉద్విగ్నమనస్కు జైయున్న రాజునకు పురోహితుడొసంగిన అనుశాసనముచే మరల ఆశ కొంత యేర్పడుచున్నది. రాజునకు గల్లు (ప్రథమ సంతానము చక్రవర్తిలక్షణో పేతుడగు కుమారుడని రైవజ్జులచే నిదివరకే నిశ్చితమై యుండుటచే శకుంతలకు కలుగు సంతానమట్టిది యగుచో రాజామెను పరి[గ్రహింపవలసినదని పురోహితుడుపదేశించుటయు “యథా గురుభ్యో రోచతే” యని రాజందుల కంగీకరించుటయు, ఫలాగమనాశను కలిగించుచున్నది. కాని యింతలో అద్భుతవిధానమున శకుంతలను మనక మారీచాశమమునకు గొంపోవుటచే ఆశ ఫలింపకపోవుచున్నది. ఇట్లీ ఘట్టమున ఫలాగమ విషయమున ఉపాయాపాయములు రెండును కలుగుచు ప్రయోజన మనిశ్చితమగుచున్నది. రత్నావళీనాటకమున సాగరికాసుసంగతలు చిత్రించిన పటము రాజు చూచుటయు, సాగరిక పపంచుచున్న శారి కాభాషణవుచే రాజునకు సాగరికాహృదయము తెలియుటయు అను విషయము ప్రయోజనసిద్ధికి సహాయపడుచున్నది. కాని వాసవదత్తాగమనము, విదూషకునిబుద్ధిహినతచే చితపటము రాణ్‌కంటబడుట - అను విషయములు నాయికానాయక సమాగమమునకు విఘ్నమగుచున్నది. రాణి సుసంగతకు సాగరిక నప్పగించుటలో ఉపాయాపాయములు రెండును నిహితములై యున్నవి. సుసంగత సాగరికకు సఖియు, నాయికానాయకసమాగమమునందు ఉత్సుకయు నైయుండుటయే యిందులకు కారణము. సాగరికాసుసంగతలు వాసవదత్తా కాంచనమాలలవలి వేషములు వెచికొని రాజునెడకుపోవ్వ ప్రయత్నము ఫలసిద్ధికి దోహద మొనర్చుచున్నది. కాని ఈ పన్నాగము నెరిగిన వాసవదత్త ముందుగనే సంకేతస్థలమునకు వచ్చి రాజును భంగించుట ప్రయోజనసిద్ధికి (ప్రతిబంధక మగుచున్నది. పిమ్మట కుపితమొన వాసవదత్తను అనునయించుటకై పోవుచున్న నాయకుడు మధ్యమార్గమున ఆత్మహత్య కై (ప్రయత్నము సేయుచున్నట్టి వాసవదత్తావేషముననున్న సాగరికను చూచి గుర్తించుట అను సన్నివేశము ఇతివృత్తప్రయోజనమునకు సాధకమగుచున్నది. కాని భర్త ననునయించుటక్రై

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1835 మరలివచ్చుచున్న వాసవదత్త వీరినిగాంచి కోపించి సాగరికను బంధింపనాజ్ఞాపించి వెడలిపోవుట అను విషయము ఫలమునకు మరల నంతరాయమగుచున్నది. ఇల్లీ ఘట్టమున ఇతివృత్తము ఒకప్పుడు ఫలోన్ముఖమగుచు మరల నంతరాయములచే వెనుకకు తగ్గుచు నుండును. ఈ భాగమునం దితివృత్త ప్రవృత్తి రెండు విరుద్ధపయత్నముల్నపె నాధారపడియున్నది. పొత్రలం దొక వర్గము ప్రయోజనమును సాధించుటకు (ప్రయత్నమొునర్చుచుండ "రెండవ వర్గమువారు ఆ (ప్రయత్నమును విఫల మొనర్చుటకు యత్నించుచుందురు. ప్రయోజనమిట్లు అనిర్ధారితమై యుండుట ఇందు ప్రధాన విషయము. నాయికానాయకుల చిత్తవృత్తికూడ నిట్టిస్థితియందే యుండును. కార్యసాధనమున తమకు గల ఉపాయసంపత్తిచే ఆశ యొక వైపునను, ప్రతిబంధకముల ప్రాబల్యమును ఆలిసియుండుటచే (పయోజనసిద్ధివిషయమున సందేహమును - ఈరెండును నాయికానాయకుల మనస్సులను డోలాందోళితముగ చేయుచున్నవి. ఇట్లు కథాప్రయోజనమును నాయక చిత్తవృత్తియు రెండును ఈ ఘట్టమున ఉపాయాపాయశంకలకు లోనైయున్నవి. అపాయాభావతః ప్రాప్తిర్నియతాప్తిః సునశ్చ్‌తా! అపాయాభావా దవధారికఆాకాంతా ఫలప్రాప్తిర్నియతాప్తిరితి! తృతీయావస్థ యందేర్పుడిన అంతరాయములు నాయక వర్గమువారి పకృష్ణప్రయత్నముచే తొలగుటయు, ఫలాగమము నిశ్చితమగుటయు నాల్గవ యవస్థయందలి యితివృత్తము. దీనికి నియతాప్తి యని పేరు. ప్రతిబంధకము తొలగుటచే నిశ్చితదైన ఫలలాభమే నియతాప్త్యవస్థయందలి కథాంశము. నాయకుడును, తత్సహాయులును, తమకుగల సాధనసంపత్తినంతను ప్రయోగించి (ప్రతిబంధకములను తొలగింతురు. దానిచే నాయకుని (ప్రయోజనము ఫలోన్ముఖమగుచున్నది. అయినను తక్షణమే ఫలసిద్ధి ఆగునని భావముకాదు. వెంటనే (ప్రయోజనము సిద్ధి్ధంచుట నాటకీయవిధానమునకు విరుద్ధము. అంతరాయములు తొలగినపిమ్ముట నాయకకృత ప్రకృష్ణపయత్నము క్రమముగ ఫలోన్ముఖమగుచు తుదకు ప్రయోజనసిద్ధిని గాంచవలసియున్నది. అట్టి (ప్రయోజనసిద్దికి అనుగుణమగు ఇతివృత్తపరిణామమే ఇందలి కథాంశము. అంగులీయకదర్శనముచే శాపవిముక్తి కలిగి, దుష్యంతునకు శకుంతలా

1836 పందిరి మల్లికార్టునరాపు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము సమాగమస్మృతి కల్గుటయు, నతడామెనుగూర్చి పరితపించుటయు, ఇత్యాది కథాభాగము నియతాప్తి. సానుమతీ వృత్తాంతము, మాతలి ఆగమనము - అను విషయములు శకుంతలాదుష్యంతుల పునసమాగమమును నిశృ్చయముగ సూచించునవియె యున్నవి.

“మునిసుతాప్రణయస్కృతిరోధినా

మమ చ ముక్తమిదం తమసా మనః

మనసిజేన సఖే 'ప్రహరిష్యతా

ధనుష్‌ చూతశరశ్చ నివేశిత?” = అను దుష్యంతునివాక్యములచే ఫల్వపతిబంధకవుగు దుర్వాసశాపము తొలగినదనియు నతని హృదయము వరల శకుంతలా విషయమున రతిభావసమన్విత మైనదనియు వ్య క్తమగుచున్నది. శకుంతలాచి్మితపట సందర్శ్గనముచే హృదయపరితాపము అపనయింపచేసికొనుచున్న రాజును చూచి సానుమతి,

“తతో అ_స్యైః భర్తుర్చహుముఖమనురాగం నివేదయిష్యామి” - అని పల్కిన పలుకువలన ఫలాగమమునకు అనుకూలపరిస్థితి యర్పడుచున్నదని విదితమగుచున్నది.

మేనకా కిల తవ సఖ్యా జన్మప్రతిస్టేతి శృతవానస్మి

తత్సహచారిణీభిః తాం హృతాం మే హృదయమాశంకతే. అను దుష్యంతుని వాక్యమువలనను,

“అస్తి సమాగమః కాలిన తత భవత్యా”

“న ఖలు మాతాపితరౌ భర్హవియోగ దుఃఖితాం

దుహితరం చిరం [దష్టుం పారయతః-” అను విదూషక వాక్యములవలనను సప్త్రమాంకగత ఫలము నిశ్చిత మగుచున్నది. ఇట్లె రత్నావళినాటకమున దేవ్మీపసాదనము తప్పు పయోజనసిద్దికి వేరుమార్గము లేదని రాజు నిశృయించి ఆమెను వశపరచుకొనుటతో ప్రతిబంధకము తొలిగినది. వసుభూతి యాగమనము, ఇందదజాలప్రదర్శనము, యౌగంధరాయణుని

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1837 ఆగమనము నిత్యాది కథధాభాగము నాయికానాయకుల భావిసమాగమమును నిశ్చిత మొనర్బుచున్నది. భర్తమై తసకుగల అనురాగముచే వాసవదత్త అతని సౌఖ్యము నపేక్తించి సుముఖురాలగుటతో ప్రతిబంధకములు తొలగినవి. తరువాతి కథాభాగము అందును ముఖ్యముగ యౌగంధరాయణుడు వివరించిన విషయము రత్నావళలీయుదయనుల భావి వివాహమును నిశ్చితమొనర్చినది.

అట్లు నిశ్చితమైన ప్రయోజనము సిద్ధించుటయే ఐదవ కార్యావస్థయందలి ఇతివృత్తము. దీనికే ఫలాగమమని పేరు. అంతరాయములు తొలగి నిశ్చితమైన ఫలము శీఘముగ సిద్ధించుట యెంతయు ముఖ్యము. చతుర్ధావస్థయందు నిశ్చితమైన ఫలము వెంటనే సిద్ధింపకున్నచో స్థాయీభావమున కుద్వేగము తగ్గు నవకాశ మేర్చడగలదు. కావున ఫలాగమావస్థయందు ఇతివృత్త ప్రవృత్తిని పెంచక (ప్రాసంగికాది విషయముల కేమ్మాతమవకాశము నీయక, నాయకేతి వృత్తముపపై సర్వమును కేంద్రీకరించి ఇతివృత్తమును ముగింపవలసియుండును. కానిచో రసానుభూతికే అవకాశము కలుగదు. శాకుంతల సప్త్రమాంకమున శకుంతలాదుష్యుంతుల పునస్పమాగమమే ఫలాగమము. సాధ్వియగు శకుంతల యొక్కయు, సత్పుత్రునియొక్కయు, సమాగమ ప్రాప్తి దుష్యంతునకు లభించుట సమగఫలాగమమై యున్నది.

“దిష్ట్యా శకుంతలా సాధ్వీ సదపత్యమిదం భవాన్‌

్‌ద్ధా విత్తం విధిశ్చేతి తృతయం వసమాగతమ్‌.” అని ప్రయోజనసిద్ధి వర్ణితమైుయున్నది. అల్లే రత్నావళీనాటకమున ఉదయనునకు రత్నావళి 'ప్రాప్రయు, ఫలాగమములై యున్నవి.

“సమ్మగ్రఫలసంపత్తీః ఫలయోగో యథోదితః।

యథా రత్నావళ్యాం రత్నావళీలాభ చడకవర్తిత్వావాప్తిరితి"

ఇట్లు కథా(పవృత్తి అయిదు అవస్థలుగా పోషెంపబడుచున్నది. పాశ్చాత్యనాటకముల యందుగూడ నీ విధానమే పాటింపబడుచున్నది. ఇతివృత్తము నాటకీయమున పోషితము కావలెనన్నచో ఈ విధానము తప్పదు.

ఇక ఇతివృత్తమునుగూడ కార్యావస్థల కనుగుణముగ విభజించుకొని పోషించుట నాటకరచనయందు అవలం౦బింపబడు విధానము. అంగాంగ

18368 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సౌష్టవముతో నొప్పు సచేతనమగు నిర్మాణము నాటకము. వ్య క్రిదేహముయొక్క వివిధాంగములకును సామరస్య మేర్పడియున్నట్లు నాటకభాగములు కూడ సమరసభావమున మేళవించి నప్పుడే నాటకస్వరూపము శోభింపగలదు. ఇతివృత్తవిభాగము రసానుగుణమై యుండవలెను. నాటకమునకు ఇతివృత్తము దేహము, రస మాత్మయు నై యున్నవని సాహిత్యవేత్తల భావము. దేహము సమగ్రము, సర్వాంగశోభితము వైయుండుట ఆత్మస్వరూపమునకు సూచకము. కావున ఇతివృత్తము రసానుగుణముగ విభజింపబడి సర్వాంగసుందరము, సచేతనము నగు మూర్తిగ కూర్ప్చుబడుచున్నది. పాశ్చాత్యులుకూడ నీ నాటకస్యరూపనిర్మాణము నందు ఎక్కువ శ్రద్ధ వహించినారు. ఉద్దిష్టమగు నాటక (పయోజనమును సాధించుటలో నేయే యితివృత్తభాగము ఎంతవరకు పోషింపబడవలెను, ఆయాభాగములందు ఏ సంఘటనలు సన్నివేశములు (ప్రాధాన్యము వహింపవలయును, ఏ విషయములు (పప్రదర్శనీయములు అను విషయములను జ్యాగత్తగ గమనించిననే తప్ప నాటకస్వరూపమున సౌష్ట వము సిద్ధింపదు. భారతీయనాటకమున ఇతివృత్తభాగములన్నియు ఏకముఖముగ (పవృత్తములై ప్రధానప్రయోజనమగు రసోత్పత్తికి ఉపకరింపవలయును. ఇతిప్పత్తము నాధారమున స్థాయీభావము (క్రమముగ పోషితమై రసముగ పర్యవసించుచుండుటచే ఇతివృత్తభాగము అట్టి పరిణావువునకు తోడుడవలసియున్నది. ఇట్టి ప్రయోజనమునకై నాటకకర్తలు ఇతివృత్తము నైదు భాగములుగ పోషించినారు. ఈ భాగములే పంచసంధులను పేర వ్యవహృతము లగుచున్నవి. నాటకపప్రకరణములందు మాత్రమే ఇతివృత్త మిట్లు అయిదు భాగములలో పోషితమగుచున్నది. తక్కిన రూపకములలో ఇతివృత్తము ఇంత సమ(గ్రమైనదిలేడు కాకపోవుటచే నందు ఇన్ని భాగములు ఉండుటకు వీలులేదు. ఇతివృత్తవిస్తృతినిబట్టి వ్యాయోగాదులందు మూడుభాగములుగను, సమవాకారాదులలో నాలుగు భాగములుగను, (ప్రహసనాదులలో ర౮0డు భాగములుగను మాత్రమే వస్తువు పోషితమగుచున్నది. నాటకమునం దితివృత్తము నమ్మగమైనదియగుటచే పంచసంధులుగ విభక్తమగుటకు వీలుకలిగినది. ప్రకరణమును నట్టిదియే. ఆరంభాది కార్యావస్థలైదును వరుసగ ఈ అయిదు ఇతివృత్తభాగములతో ననుసంధించు చున్నవి. అనగా ఇతివృత్తవుందలి [పథవుభాగవము ఆరంభవునసెడి

రూపక రచన భూవతి లక్షీనారాయణ రావు 1839 కార్యావస్థరూపవమున (పతివృత్తవముగుచున్నది. ఉద్దిష్ట్రప్రయోజనమును సాధించుటయందు నాయకుడు పపదర్శించు నౌత్పుక్యము ఆరంభమగుటచే తదౌత్సుక్యమున కాధారమగు ప్రబలహేతువు కూడ అందే యుండక తప్పుదు. అట్టి (ప్రబలహేతువే వీజమనెడి యర్థప్రకృతి. కనుక బీజమనెడి యర్ధప్రకృతియు ఆరంభమనెడి కార్యావస్థయు నాటక ప్రథమభాగమున కలియుచున్నవి. ఇల్లే నాటకమందలి తక్కిన భాగములలో కూడ ప్రయత్నాది కార్యావస్థలకును, బింద్వాది అర్థపప్రకృతులకును సంయోగ మేర్పడుచున్నది. కావుననే అర్థ(ప్రకృత్యవస్థా సంయోగము సంధి యని నిర్వచించినారు. కాని ప్రతినాటకమునను పతాకాప్రకరు లనెడు అర్థప్రకృతులు ఉండితీరవలెనను నియమము లేదు. పతాకాప్రకరులులేని నాటకములలో బిందువే ఆయా కథాభాగములందు వ్యాపించి కార్యావస్థలతో కలియుచున్నది. “న సర్వత్ర సర్వా అర్థ ప్రకృతయో పితు యస్య నాయకస్య యేన అర్థ ప్రకృతి విశేషణ (పప్రయోజనసంపత్తిఃొ

దశరూపకకారుడు చెప్పినట్లు ఆరంభాద్యవస్థలు బీజాద్యర్థప్రకృతులతో క్రమముగ కలియవలెననుట నాటకములన్నింటికిని వర్తింపకున్నది. ఇతివృత్త [ప్రథమభాగమగు ముఖసంధియుందు బీజారంభవుఎలు చేరుటయు, తుదిఖభాగవుగు నిర్వహణసంధియందు కార్యఫలాగమములు చేరుటయు నెట్లును తప్పదు. తక్కిన మూడు భాగములందును బిందుపతాకాాపకరులుగాని, లేక బిందువేగాని పప్రయత్నాద్యవస్థలలో చేరవచ్చును. అభినవగుప్తపాదుని యీ యభిప్రాయము ఏనాటకమునకైనను వర్తించునది యగుటచే సమంజసముగ నున్నది.

" బీజోక్షేపముతోగూడి స్థాయాభావవికాసమునకును (ప్రధాన పృాతల స్వరూప (పదర్శ్శనమునకును, నాధారమగు కథాభాగము ముఖసంధియగుచున్నది. కథారంభము మొదలు నాయికానాయకులయందు స్థాయీాభావమునకు వికాసమును కలిగించి, ఉదాత్త (పయోజనమును సాధించుటకు వారిని ప్రోత్సహించు సన్నివేశములతో కూడిన (ప్రథమభాగమే ముఖసంధి. అట్లు ప్రోత్సృహింపబడిన నాయికానాయకులు ప్రయోజనసిద్ధికె యొనర్బు (ప్రయత్నమే రెండవభాగమున

1840 పందిరి మల్ష్‌కార్టునరాప్పు శతజయంతి సంపుటము 4; సాహిత్యము కథావస్తువగుచున్నది. దుష్యంతుడు కణ్వాశమమున బ్రవేశించి శకుంతలసు చూచినది పుుదలు (పథవాంకాంత వున వనగజభీతి కారణముగ నాయికానాయకులు వడలిపోవునంతవరకును గల కథాభాగము ముఖసంధి యగుచున్నది. శకుంతలను చూచుటతో రాజునందు కలిగిన యాసక్తి “కిం ను ఖలు ఇమం (క్రేక్ష్య తపోవన విరోధినో వికారస్య గమనీయాస్మి సంవృత్తా” అని శకుంతల నాయకునెడ సుముఖురాలగుటతో అనురాగబిజముగ సెద్ధించినది. శకుంతలాజననవృత్తాంత కథనముచే నాయకుని సందేహము తీరి అతనిచిత్తమున రతిభావోదయము కలిగినది. అనసూయా(ప్రియంవదల నర్మగర్భ్చితాలాపముల (శేరణమున నాయిక (ప్రదర్శించు శృంగారచేష్టలచే నాయికాహృదయమున గూడ భావోదయమైనదని వ్య క్తమగుచున్నది. ప్రియంవద “సట్టి! శకుంతలే! మోచితాస్యనుకంపినా ఆర్యేణ, అథవా మహారాజేన గచ్చ ఇదానీం” అని పలికినప్పుడు శకుంతల ఆత్మగతముగ పలికిన *యది ఆత్మనః (ప్రభవిష్యామిా అను మాటలవలన నాయిక నాయకునియందు బద్ధానురక్తమయైనదసి నిశ్చితమగు చున్నది. ఈవిషయమునే కాళిదాసు నాయకునిచే (ఆత్మగతముగ) స్పష్టముగ చెప్పంచియున్నాడు. “కం ను ఖలు యథా వయమస్యాం ఏవం ఇయమఏప అస్మాన్‌ (పతిస్యాత్‌? అథవా లబ్ధాపకాశా మేటప్రార్థనా కుతః -” “వాచం న మిశయతి యద్యపె మే వచోఖిః కర్ణం తదాత్యభిముఖం మయి భాషమాణే, కామం న తిష్టతి మదాననసం ముఖీసా భూయిష్ట మన్యవిషయా నతు దృష్టిరస్యాళ్‌ = ఇట్లు అనురాగము సారవంతము, దృఢము నగు బీజముగ నేర్చడుటయు, నాయికానాయకుల చిత్తములు రతిభావోపేతములగుటయు, వీరి అన్యోన్యానురాగము ఫలించుటకు అనసూయా[ప్రయంవదలు సాధనసంపత్తిగ నేర్పడుటయు అను

రూపక రచన భూవతి లక్షీనారాయణ రావు 1841 (ప్రధానకథావిషయములతో నీ భాగము సమాప్తమగుచున్నది. మదగజవృత్తాంతమును గల్పించి కవి అనురాగకథాప్రవృత్తికి విచ్చేదమును కల్పించుచున్నాడు. ఇట్లు ఫలపర్యవసాయమువరకును [కమాభివృద్ది చెందగల రసవంతమగు నితివృత్తమునకు తగిన హేతువగు బీజమును, స్థాయీభావవికాసమునకు పోషకమగు కథాప్రవృత్తియు (ఆరంభము) నీ భాగమందలి ప్రధానాంశములు. ఇట్లే రత్నావళి నాటకారంభము వెొందలు నాయిక వున్మథపూజాసంద ర్భ్సవమన ౦దుం ఉదయునుఎని గుర్తించునంతవరకును గల కథాభాగము ముఖసంధియగుచున్నది.

ముఖసంధియందు ఉత్నిప్తమైన బీజము తరువాతికథాభాగమున అంకురముగ నేర్పడుచున్నది. ఈ భాగమునకు ప్రతిముఖసంధి యని పేరు.

“లక్షా శ్రలక్ష్యత యోద్భేదస్తస్య, (ప్రతిముఖం భవేత్‌” అను ధనంజయుని అభిప్రాయమును బట్టి వీజము ఇందు కించిత్వ్రకాశితమై యుండునని చెప్పవలసియున్నది. అభినవగుప్పుననుసరించి ముఖసంధియం దేర్చుడిన బీజము తరువాతి సంధులలో (కమాఖివృద్ధినిజెంది కడపట ఫలవంతమగునని వ్య క్తమగుచున్నది. కథాబీజము [కమవికాసమునుబొంది రసోత్పత్తికి హేతువగుచు ఫలవంతమగుటయే ప్రయోజనమగుటచే వివిధ సంధులలో బీజముయొక్క (క్రమాభివృద్ధి పోషోతమగుటయే సమంజసమని నిశ్చయము. ప్రతిముఖసంధియందు బీజము మరుగుపడినట్లు స్థూలదృష్టికి కన్పించవచ్చును. కాని యది గోచరముకాకుండియు అంకురముగ నేర్పడుచుండును. భూమిలో వేయుటకు ముందు స్పష్టముగ కనబడుచుండు బీజము తదనంతరము మట్టిచే కప్పబడి కంటికి కనబడకుస్నను అంకురోన్ముఖముగ నభివృద్ధి చెందుచుండునట్లే (పతిముఖసంధియందును వీజమొకప్పుడు మరుగుపడియున్నను వికాసము గాంచుచుండును.

“తస్మాదయమర్థః చీజస్యో ద్దాటనమ్‌ తావతృ్భలానుగుణో

దశావిశేషః తదదృష్టమపి విరోధిసన్నిధేర్నష్టమివ

పాంసునా పహితస్యేవ వీజస్యాంకురరూపముద్దాటనమ్‌” - అను అభినవగుప్పుని వివరణ మిందనుసంధింపతగినది. నాయకునిచేతను, నాయుకవర్గవబవారి చేతను చేయబడు ఫలానుకూల్మ|పయత్నమును, స్థాయాభావముసు రసోన్ముఖముననొసర్చు కథ్మాపవృత్తయు (పతిముఖసంధియందు

1842 పందిరి మళ్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (పధానాంశములు. నాయికానాయకులయందును, తద్వర్గమువారియం౦దును (ప్రయోజనసిద్ధినిగూర్చిన యుత్సాహము కథాప్రవృత్తికి ్రేరకమగుచున్నది. శాకుంతలనాటక ద్వితీయ తృతీయాంకములందలి కథాభాగము (ప్రతిముఖసంధి యగుచున్నది. సేనను, విదూషకుని పురమునకు బంపి, రాజు ఆశమమున నిలుచుటకు నిశ్చుయించినది వెొొందలుగ తృతీయాంకాంతవుందలి శకుంతలాసంయోగము వరకును జరిగిన కథాభాగము (పతిముఖసంధి. శకుంతలానురాగ విషయమును రాజు విదూషకులకు వివరించుచు ఆశ్రమపదమున నిలుచుట కుపాయము నన్వేషించుట, మునుల యభ్యార్థనచే నట్టి యవకాశమేర్పడుట, విదూషకాదులు వెడలిపోయినపిమ్మట రాజు భావావిష్టుడై శకుంతలనన్వేషించుట, శకుంతల పూర్వరాగావిష్టమయై చెలులకు నిజహృదయము నెరింగించుటను రాజు (పప్రచ్చన్నుడై వినుట, నాయికానాయకుల తదనంతర సమాగమము - ఇవి యీ భాగమందలి [పపధానాంశములు.

“చక్రవాకవధూకే! ఆమన్త్రయస్య సహచరం ఉపస్థితారజనీ" అను అనసూయాప్రాయంవదల హెచ్చరికతో నీ కథాభాగమునకు విచ్చేదము కలుగుచున్నది.

“లతావలయ, సంతాపహర, ఆమన్తంయామి

భూయోపి పరిభోగాయ” అను శకుంతలవాక్యములచే నితివృత్తమున కింతటితో విచ్చేదము కలుగలేదని సూచించుచు కవి ప్రతిముఖసంధిని ముగించుచున్నాడు. నాయికానాయకుల అనురాగేతివృత్తము 'కగ్రమముగ నభివృద్ధిచందుటయు, హృదయము లందుద్చుద్ధమైన స్థాయీభాపము నృృంగార రసోన్ముఖముగ వికాసమును జందుటయు నీ ఘట్టమందలీ ప్రధానవిషయమలు. రత్నావళీయందలి ద్వితీయాంక కథాభాగము ప్రతిముఖసందధి యగుచున్నది. ఇందు సాగరికానురాగబీజము వికాసమును గాంచినది. సాగరికకు రాజుమవై నేర్పడిన యనురాగము సుసంగతా విదూషకులకు మాత్రమే తఆలిసియుండుటచే కించిద్భృుష్టమును, చితపటకారణముగ వాసవదత్త ఆఅనుమానించినను దృఢముగ ఆలియకుండుటచే కించిదదృష్టమును వైయున్నది. మరియు సాగరికానురాగబీజము వసంతోత్సవముచే మరుగుపడినట్లు గోచరించినను తదుత్పవకారణముననే అంకురముగ నేర్పడుచున్నది. ముఖసంధి యందు సూచింపబడిన వీజము పతిముఖసంధియందు వ్యక్తము గావింపబడుచున్నవి.

రూపక రచన భూవతి లక్షీనారాయణ రావు 1843 అనగా బీజమున నిగూఢమైయున్న వృక్షస్వరూపమెట్లు అంకురదశయందు బాహ్యముగ వ్య క్తమగుచున్నదో అట్లే ముఖసంధియందు అవ్య క్తమైయున్న విషయము (పప్రతిముఖసంధియందు సువ్య క్షమగుచున్నది. కావుననే ఈ భాగమునకు (పతిముఖసంధి యను వ్యవహారమేర్పడినది. తరువాతి కథాభాగము గర్భసంధి. ప్రతిముఖసంధియందు అంకురముగ నేర్పడిన ప్రయోజన మిందు వృక్షరూపముగ అభివృద్ధిచెందుచున్నది. అయినను తదభివృద్ధినిరోధకములగు అంతరాయము లేర్పడుటయు, తత్కారణమున (పయోజనసిద్ధ సందేహాస్రదవముగుటయు నిందలి వుఖ్యాంశములు. మానవప్రయత్నము నిరంతరాయముగ ఫలించుట సర్వసాధారణవుగు విషయముకాదు. ప్రయత్నమున కంతరాయములేర్పడుటయు, వానిని తొలగించి ప్రయోజనసిద్ధి గాంచుటకు వ్యక్తి తన శక్తి సామర్థ్యములను వినియోగించుటయు, అట్టి పరిస్థితియందు అతని హృదయము (పప్రయోజనసిద్ధిని గూర్చిన సందేహమునకు లోనగుటయు నను విషయములు మానవ జీవితమునందు సాధారణములు. అంతరాయముల వలన నేర్పడిన అట్టి పరిస్థితియే గర్భసంధియందు ఇతివృత్తవుగుచున్నది. శాకుంతల తృతీయాంకమున ఫలోన్ముఖమైన శకుంతలాదుష్యంతుల అనురాగమునకు దుర్వాసశాపము అంతరాయముగ నేర్పడినది. ఈ అంతరాయమే వీరి సమాగమమునకు ప్రతిబంధకమైనది. ప్రయోజనము సిద్ధించుటకు అనుకూలపరిస్థితులిర్పడుట, ఇంతలో అంతరాయముల ప్రాబల్యమున 1పయోజనమునకు భంగముకల్లుట, మరల అనుకూలపరిస్థితి యేర్పుడుట, వరల దానికి పతిబంధకము కలుగుట, ఇట్లీభాగమున పయోజనమునకు అనిశ్చితస్థితి యేర్పడుచున్నది. నాయికొనాయకుల హృదయములలో కూడ నిబ్లే[పయోజనసిద్ధినిగూర్చిన యాశయు, తద్విషయక సందేహమును, మరల మరల కలుగుచుండును. (అట్టిస్థితిలో నాయకుడును, ._ నాయక వర్గవువారును వుహాాపయత్న మొనర్చి అంతరాయవుల నిర్జింపవలసియున్నది. అట్టిపరిస్థితి దైవికముగ కూడ నేర్పడవచ్చును. తదనంతరవిషయమే అవమర్శసంధియందలి యితివృత్తము.) శకుంతలను భర్త్శృగ్భృహమునకు బంపుట మొదలుకొని నిరాకృత శకుంతలను మేనక కైకొనిపోవుటవరకును గల వృత్తాంతము గర్భసంధి యగుచున్నది. ఇట్లే రత్నావళినాటకమున సాగరికారచితమైన చిత్రపటమును రాజు చూచినదిమొదలు వాసవదత్త సాగరికను బంధింపచేయుసంతవరకును గల కథాభాగము గర్భసంధి.

1844 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

'ప్రయోజనసిద్ధికి కలిగిన అంతరాయములు తొలగుట, ఫలప్రాప్తి నిశ్చితమగుట, అను విషయము తరువాతిభాగములోనిది. ఈ భాగమునకు అవమర్శసంధి యని పేరు. నాయకుని ప్రయత్నముచే గాని, నాయకవర్గమువారి ప్రయత్నముచేగాని, లేక దైవికముగగాని అంతరాయములు తొలగవచ్చును. వీరరసప్రధాన నాటకమగుచో నాయకుడు తన సర్వశక్తులను, సాధనములను (ప్రయోగించి అంతరాయములను తొలగించుకొనును. ఈ పరిస్థితి నాయకునకు ఉదాత్తతను సిద్ధింపచేయుచున్నది. (ప్రబలములగు ఆటంకములను ఎదుర్కొని నిర్ణించుటలో నాయకునియందు ఇంతవరకును నిగూఢములైయున్న శౌర్యసాహసాది సద్దుణములన్నియు వ్య క్తములగుచున్నవి. ఆటంకముల కారణముగ ప్రయోజనసిద్ధి విషయమున సందేహమేర్పడుట, (ప్రయత్నఫలితముగ నాటంకములు తొలగ ప్రయోజనసిద్ధి శక్య్యమనెడి విశ్వాసముదయించుట, నిజసాధనసంపత్తి ప్రయోజనమునుగాంచి ఫలము నిశ్చితమగుట అనునవి అవమర్శసంధియందు [క్రమముగ జరుగు విషయములు. శాకుంతల షష్టాంకకథాభాగము అవమర్శసంధి యగుచున్నది. అంగుళలీయుకప్రాప్తచె దుర్వాసశాపప్రాబల్యము తొలగి రాజునకు శకుంతలావిషయకస్మరణ కలిగినది. రాజు పశ్చాత్తప్పడగుట, శకుంతలావిషయక విరహమునకు లోనగుట, ఇత్యాదులచే నితివృత్తము మరల ఫలోన్ముఖమగుచున్నది. సానుమతీవృత్తాంతముచే శకుంతలాస్థితిగతులు సామాజికులకు తలియుటయు, మరల నాయికానాయకులకు పునసృ్పమాగమము జరుగుననెడి ఆశ స్థరమగుటయు జరుగుచున్నది. రాజిందలోకమునకు పోవు సన్నివేశ మేర్పుడుటతో అట్టి 'పునస్పమాగమము నిశ్చితమైనది. అట్లే రత్నావళీ నాటకమున దేవ్మీపదానమునకై (ప్రయత్నింపవలెనని ఉదయనుడు నిశృయించుట మొదలు ఇందజాలకల్పిత అగ్నిపమాదమువరకును గల కథాభాగము అవమర్శసంధి. రాజు ప్రయత్నముచే వాసవదత్త ప్రసన్నురాలగుటతో ప్రధానాంతరాయము తొలగినది. వసుభూతి సాగరికను తమరాజపుథత్రిగా గుర్తించుట, యౌగంధరాయణుడు తన పన్నాగమును, ఉద్దెశమును వాసవదత్తాఆదయనులకు వివరించుట అను విషయములచే పతిబంధకములు పూర్తిగ తొలగుటయేగాక రత్నావలీయుదయనుల వివాహఫలము నిశ్చితమైనది.

తదనం౦ంతరకథాభాగవు నిర్వహణసంధి. అందు పోషతవుగు కథా(ప్రవృత్తియంతయు ఫలాగమమునకై దోహదమొనర్చును. శాకుంతల సప్త్రమాంకమున మాతలి మారీచ్మాశమమునకు దుష్యంతుని కొనివచ్చుట. తాపసస్వ్రీల అనునయమునకు లొంగకున్న కుమారభరతునితో రాజునకు

రూపకరచన భూపతి లక్షీనారాయణ రావు 1845 సమాగమమేర్పడుట, కుమారునన్వేషించుచు వచ్చిన శకుంతల దుష్యంతుని చూచుట అను విషయములన్నియు (క్రమముగ ఫలసిద్ధి కనుకూలించినవి. శకుంతలాదుష్యంతుల పునస్పమాగమ(ప్రాప్తియే ఆ ఫలము. అల్లే రత్నావళీ నాటకవలమిన రత్నావ ళలీయుదయునుల వివాహవలఎట, ఉదయునుని సార్వభొమపదవీలాభము ఫలములగుచున్నవి. ఈ కథాభాగమే నిర్వహణ సంధి.

ఈపిధముగ నాటకవస్తువును ఉచితరీతి విభాగించుకొని రూపకముగ రచించుటయందు ఉత్తమశిల్పము నిహితమైయున్నది.

మరియు కథాభాగములగు సంధులను రచించుటలో ప్రతిసంధియందలి వస్తువును మరల చిన్న విభాగములుగ నొనర్చుకొని కూర్చుట నాటకకర్త లవలంచించిన విధానము. ఇతివృత్తమును [క్రమముగ వికసింపచేయుటి, రసాస్వాదన కనుగుణమగునట్లు ఇతివృత్తభాగములను ప్రదర్శించుట, (పదర్శింపబడు ఇతివృత్తముచే నాసక్తిని కలిగించుట, భావానుగుణమగు చిత్తవృత్తిని కలిగించు వ్యవస్థ నేర్పరచుట అనునవి ఈ విభాగములవలని [పప్రయోజనములు. ఈ కథావిభాగములకు సంధ్యంగములని పరు. ఇతివృత్తపదర్శ్శనమును మనోహరమగునట్లొనర్చి (గ్రేక్షకులకు నాసక్తిని కలిగించి (యేక్షకుని హృదయమును నాయికానాయకావస్థయందు కేందీకరించునట్లు చేయుటకు ఈ యంగములు తోడ్చ్పుడుచున్నవి. అయినను నాట్యశాస్త్ర ృ్యవఎన పేర్కొన్న ఆయా సంధ్యంగములన్నియు నాయా సంధులయందు ప్రయోగింపవలనసు నియమము లేదు. నాటకములం దెన్నివిధములగు సంధ్యంగములు [1పప్రయుక్తములై యున్నవో అవి శాస్త్రమున వివరింపబడియున్నవి. నాటకవస్తువును బట్టియు, పోషెితమగు రసముననుసరించియు అనుగుణములగు సంధ్యంగములను రచయిత నిశ్చయించుకొనవలసియున్నది. అదిగాక శాస్త్రమునందు పేర్కొనబడిన (క్రమము ననుసరించి సంధ్యంగములను ప్రయోగింపవలె ననెడి నియమములేదు. కథాప్రవృత్తి ననుసరించి ఆయాసందర్భమునకు తగినట్లుగ ఆ సంధియందలి యంగములను (ప్రయోగింప వచ్చును. ఒక సంధ్యంగమునే అవసరమున్నచో రెండుమారులు కూడ (పయోగింపవచ్చునని అభినవగుప్పుడు వివరించియున్నాడు. నాట కేతివృత్తమును కొస్ని (ప్రధాన ఘట్టములుగ విభజించుకొనుటయు, ఆయాఘట్టమందలి వస్తువును మరల చిన్న పృత్తములుగను అంశములుగను విభజించుకొని పోషెంచుటయు శిల్పవిషయము, ఈవిభాగము వలన (ప్రదర్శన

1846 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4; సాహిత్యము సులభగుచున్నది. (పేక్షకుడు ఇతివృత్తమును (గ్రహించుటకు కూడ నిది సహాయపడుచున్నది. నాటక (పదర్శనమున పాల్గొను వివిధనటకులు ఏయేవృత్తములను ఎంతవరకు (పదర్శింపవలసినదియు, వాచికాంగికాభిన యాదులకు భావానుగుణముగ అవధుల నేర్పరుపవలసి యుండుటయు మున్నగు విషయములకు గూడ నీ విభాగము ఉపకరించుచున్నది. వస్తువు నీవిధముగ ఆయాయవస్థల కనుగుణముగ విభాగమొనర్చుకొని రచించుట రూపకకర్త లల్లరును నవలంబించు విధానమైయున్నది.

ఇక కథావస్తువు నంతను రంగమున ప్రదర్శించుటకు సాధ్యముకాదు. కథకు సంబంధించిన అల్పవిషయము అనేకములు (పప్రదర్శనయోగ్యమలు కావు. మరియు నీరసమగు వస్తువును రంగముమై (ప్రదర్శించుటచే సాధింపనగు నాటక ప్రయోజనముగూడ తక్కువ. మీదుమిక్కిలి స్థాయాభావము మరుగుపడుటకును నిది హేతువు కాగలదు. కావున కథావస్తువునందలి (పప్రదర్శనయోగ్యముగాని వస్తువును వేరుమార్గముచే సూచింపవలసియున్నది. ఇతివృత్తము సమ్యగ్రమగుటకు ఈ వస్తుసూచన అవసరమగుచున్నది. ఒక యంకమందలి కథకును, తరువాతి యంకమందలి కథకును మధ్య జరిగిన వృత్తాంతము సామాజికులకు ఆలియనిచో వారు కథ ననుసరింప లేకపోవుదురు. ఒకప్పుడు కాలదేశముల విషయమున నేర్పడిన భిన్నవ్యవస్థలనుగూడ సూచింపవలసిన యవసరముండును. భారతీయరూపకకర్తలు వస్తువును సూచించుటలో విశిష్ణమగు మార్గము నవలంబించినారు. నాటకమునకు సంబంధించిన పాత్రలు అంకములకు మధ్య ప్రవేశించి సందర్భానుసారముగ జరుపుసంభాషణ మూలమున వస్తువును సూచించుట యిట్టి పద్ధతి. వీనినే విష్కంభ ప్రవేశకములని పిలుతురు. మధ్యమపాత్రల సంభాషణవూలవమున ఆగతానాగత వృత్తాంతములు సూచింపబడుట విష్కంభమనియు, నీచప్యాతలచే వస్తువు సూచింపబడుట ప్రవేశకమనియు వ్యవహరింపబడుచున్నవి. వుధ్యమనీచప్శాత (ప్రయుక్త మైనదానిని మి(శ్రమవిష్కంభముని పెలుతురు. సంస్కృతనాటకములందలి విష్కంభ 'ప్రవేశకములను పరిశీలింపగా వీనికిగల యొక విశిష్టభేదము గోచరమగుచున్నది. ఇతివృత్తమున కవి గావించిన ప్రధానములగు మార్పులను, [పధానేతివృత్తమునకు సంబంధించిన ముఖ్యములగు ఆగతానాగతవృత్తాంతములను సూచింపవలసిన సందర్భములలో విష్కంభములు (ప్రయుక్తములైయున్నవి. (పవేశకములవలన నిట్టి ముఖ్యప్రయోజనము సాధింపబడియుండుటలేదు. తరువాతియంకమున

రూపక రచన భూవతి లక్ష్మీనారాయణ రావు 1847 ప్రవేశింపబోవు పాత్రలను, తత్పరిస్థితులను సూచించుటకు మాత్రమే [ప్రవేశకము లుపయుక్తములైనట్లు కన్పడుచున్నది. శాకుంతల ద్వితీయాంకారంభమందలి విదూషక స్వగతవాక్యరూపమగు ప్రవేశకము ఇతివృత్తమునకు సంబంధించిన ముఖ్యాంశమును దేనినిగాని సూచించుచుండుటలేదు. రాజు మృగయావ్యాపారము నుండి విరమించుననియు, దానివలన నతడు శకుంతలానురాగవిషయమున నిమగ్నుడనియు నిది సూచించు చున్నది. కాని ఈ (ప్రవేశకము లేకున్నను, రాజునకును విదూషకునకును తరువాత జరిగిన సంభాషణచేకూడ నది సాధ్యమగుచున్నది. కావున నీ ప్రవేశకము కథాప్రవృత్తి కత్యావశ్యకమని చెప్పుటకు వీలులేదు. తృతీయాంకారంభమందలి శుద్ధవిష్కంభ మట్టిదిగాదు. ఈ విష్కంభముచే శకుంతలకు రాజుపైగల యనురాగాతిశయమున కలిగిన యవస్థ సూచితమై సామాజికులకు భావికథ్యాపవృత్తిని తెలుపునదియైయున్నది. అదిగాక

“అహమపి వ్రైతానికం శాన్తుదకం గౌతమీహస్తే విసర్ణయిష్యామి" - అను వాక్యము తృతీయాంకాంతమున గౌతమీప్రవేశమునకు సూచకమగుచున్నది. తృతీయాంకాంతమునం దనౌచిత్యము వాటిల్లకుండుటకుసు గౌతమీప్రవేశ మెంతయు నవసరము. యాథార్థ్యజీవితమున జరిగిన విషయమును కూడ ప్రదర్శనమున కనుకూలించునట్లు, బౌచితీభంగము వాటిల్లకుండునట్లు ఇతివృత్తవమును మార్చుటవసరము. కావుననే కాళిదాసు గౌతమీపప్రవేశమును తృతీయాంకాదియందే నిశ్చయించినాడు. అట్లే చతుర్థాంకారంభమందలి అనసూయా(ప్రియంవదల సంభాషణరూపమగు విష్కంభము శకుంతలాదుష్యుంతులసమాగమమును, దుర్వాసశాపమును, అంగులతీయ దర్భ్శనముచే శాపమోక్షణమును - ఇత్యాది (ప్రధానములగు కథాంశములను సూచించుచున్నది. ఈ సూచ్యవిషయజ్ఞానము (గ్రేక్షకుల కవశ్యము కలుగవలసియుస్నది. ఇక షష్టాంకారంభమందలి పప్రవేశకముచే అంగుభీయకము లభించిన విషయము మాత్రమే సూచింపబడుచున్నది. కాని ఇది లేకున్నను, షష్టాంకాదియందు ప్రవేశించిన కంచుకీవాక్యములచే గూడ నీ యంగుళీయక విషయము స్పష్టముగ సూచితమై యుండుటచే నీ ప్రవేశకముచే సాధింపబడిన (ప్రయోజనమత్యల్పమనియే ఇప్పవలసియున్నది.

“శుతం రాష్ట్రాయముభాత్‌ యావదంగుళలియకదర్శనం

యదైవ స్వాంగుళియకదర్శనాదనుస్మృతం దేవేస”

1848 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము “సత్యమూఢపూర్వా మయా తత్రభవతీ రహసి శకుంతలా మోహాత్ప్రంత్యాదిస్టా” “ఇతి తదాపభృత్యేన పశ్చాత్తాపముపగతో దేవో అను వాక్యము లీ ప్రయోజనమును సాధించుటకు చాలియున్నప. . “వృత్తవర్తిషృమాణానాం కథాంశానాం నిదర్శకః సంక్షేపారస్తు విష్కంభో మధ్యపాత్రప్రయోజితః" అను విష్కంభలక్షణమున మధ్యమపా(త్రలను నిర్చశించి యుండుటయు, “తద్యదేవానుదాత్తోక్త్యా నీచప్యాతప్రయోజితః (పవేశోః జ్కృద్వయస్యాంతః శేషార్థస్యోపసూచకళ అను 'పవేశలక్షణమున సనీచపాత్రలను నిర్దేశించియుండుటయు, పై యభ్మిపాయమును బలపరచుచున్నప. “శ్తషార్థా మను ప్రయోగము అప్రధానములగు కథ్ధావిషయములకు సూచకమని చెప్పవచ్చును. స్వప్నవాసవదత్తనాటకమున ద్వితీయచతుర్ధపంచ మాంకముల యాదియందు గల (ప్రవేశకములు తర్వాతి యంకములందలి పాతప్రవేశాదులను సూచించుచున్నవియే గాని ఇతివృత్తసంబంధమగు విశిష్ట్రప్రయోజనమును సాధించుచుండుట లేదు. షష్టాంకమందలి విష్కంభ మట్లుగాక రంగమున ్రదర్శింపని (ప్రధాన కథాంశమును సూచించునదియె యున్నది. ఇట్లే ఉత్తరరావచరిత యందలి విష్కంభములను గూడ పరిశీలింపవచ్చును. ద్వితీయాంకారంభమందలి విష్కంభము (పథమాంక ద్వితీయాంకములందలి కథాభాగముల మధ్య గడచిన పండెండు సంవత్సరముల కాలములో జరిగిన వృత్తాంతములను సంక్షేపముగ సామాజికులకు తెలియుజేయుట కుపకరించుచున్నది. చతుర్దాంకాదియందలి విష్కంభము కరుణరసానుగుణమగు వాతావరణము నేర్చరచుటకును, దండకారణ్య ప్రదేశమున నితివృత్తము జరుగునని సూచించి (ేక్షకుల హృదయముల నా పరిస్థితులలో నుంచుటకును, ఉపయోగించుచున్నది. షష్టాంకాదియందలి విష్కంభము ప్రదర్శనసాధ్యముగాని లవచందదకేతువుల యుద్ధమును సూచించునదియై యున్నది. విష్కంభప్రవేశములకు గల యీ ప్రధానభఖేదమును కాళిదాసు ఎక్కువగ గమనించిన ట్లతనిరచనలను

రూపక రచన భూపతి లక్ష్మీనారాయణ రావు 1849 బట్టి చెప్పవచ్చును. వికమార్వశీయ తృతీయాంకాదియందలి విష్కంభముచే నాయికానాయకుల పునస్పమాగమమును, నూర్వశికి పురూరవుని యందుగల అనురాగాతిశయమును, సమాగమావధియు సామాజికులకు విదితమగు చున్నవి. ఈకథావిషయక జ్ఞానము లేకున్నచో చతుర్ధాంకపంచమాంకమందలి నాయకుని యవస్థతో సామాజికునకు సానుభూతి యేర్చడదు. కావున రంగముపై (ప్రదర్శింపనట్టియు, కవికల్పితములు నగు (ప్రధానకథాంశములు విష్కంభముచే సూచ్యములగుచున్నవి. (ప్రసిద్ధమగు ఇతివృత్తమును, మార్పులేవియు గావింపక కవి ప్రదర్శించు సందర్భములలో విష్కంభములతో నవసరమే కలుగదు. బెచిత్యపోషణకై కవి ముఖ్యములగు మార్పులను గావించుచో నా విషయమును దెలుపుటకై విష్కంభ మవసరమగుచున్నది. శాకున్తల తృతీయాంకాదియందలి విష్కంభమును, చతుర్ధాంకాదియందలి విష్కంభమును నీ విషయమునకు చక్కని దృష్టాంతములు. భాస కాళిదాసాదులచే పాటింపబడిన యీవిష్కంభ(ప్రచేశక ప్రయోజన భేదము తరువాతకూడ కొంతవరకు పాటింపబడినది. ఉత్తరరామచరిత్ర యిందులకు ముఖ్యమగు నుదాహరణ. కవిచే నూతనముగ కల్పితములైన సన్నివేశములును, పూర్వకథయందు గావింపబడిన నాటకోచితములగు వమార్పులును, (ప్రధానేతివృత్తపోషకములై 1పదర్శన యోగ్యములుకాని కథాంశములును నీ విష్కంభములచే సూచ్యములనై యున్నవి. మాలతీమాధవ పకరణమునను నీ విష్కంభవైశిష్ట్రము వ్యక్తమగుచున్నది. ప్రథమాంకాదియందలి విష్కంభముచే కథావస్తువు సామాజికులకు విదితమగుచున్నది. ఇతివృత్తము భారత రామాయణాదులవల సుప్రసిద్ధముకాని కారణమున, కవి యీ పర్దతి నవలంబింపవలసివచ్చినది. కాళిదాసుకూడ మాళవికాగ్నిమిత ప్రథమాంకమునం దీ విధానమునే యవలంబించినాడు. మాలతీమాధవ పంచమ, షష్టాంకములందలి విష్కంభములు కవి గావించిన కల్పనలను, అపూర్వసన్నివేశములను సొమాజికులకు సూచించి వారిని కథాప్రవృత్తియం దున్ముఖుల గావించుచున్నవి. ద్వితీయ, తృతీయ, సప్తమాష్టవూంకాదులలోని ప్రవేశకములచే నట్టి విశిష్ట ప్రయోజనము సాధింపబడుటలేదు. ఆయా యంకములందలి పాాతల[పవేశమును, (ప్రాసంగి కేతివృత్తప్రవృత్తిని మాత్రమే యివి సూచించునవిమైయున్నవి. వీనిని బట్టి విష్కంభము (పధానేతివృత్తపోషణకు సంబంధించిన శిల్పవిషయమనియు, ప్రవేశకము ప్రదర్శనకనుకూలించు సాధనముమాత్ర మనియు గోచరించుచున్నది.

1850 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (ప్రయోజనమునందిట్టి ముఖ్య భేదమే లేకున్నచో విష్కంభప్రవేశకము లనెడి విభాగమే యనవసరమగుచున్నది. మధ్యమనీచప్యాతల భేదమునుబట్టియే యిట్టి విభాగ మేర్చడుచున్నదనుట హేతుబద్ధము కాదు. నాటకరచనయందు ప్రధాన ప్రయోజన మేదేని యుద్దిష్టమై యున్ననేతప్ప ఇట్టి శాస్త్రీయ పారిభాషిక విభాగ మేర్చుడుట జరుగదు. మరియు “పవేశక" శబ్దార్థము కూడ గమనింపదగియున్నది. అంకమునాదియందు, ప్యాతల ('ప్రవేశమును, తత్పరిస్థితిని సూక్ష్మముగ సూచించి సామాజికులను కథాంశమున కున్ముఖుల గావించుటయే (ప్రధానోద్దేశముగ నీ విభాగ మాదికాలమునం దేర్చడి యుండును. ప్రయోజన మిట్టి స్వల్చ్పమైనది యగుటచే నీచప్నాతలిందులకు నియుక్తులైనారు. 'ప్రధానేతివృత్తమునకును నాయికా నాయకులకును సంబంధించిన రచనాశిల్పవిషయములను సూచించుటకు మధ్యమపాత్రలు (ప్రయుక్తమగుటయు సమంజసముగ గనడుచున్నది. ఐనను, విష్కంభప్రచేశములకు గల యీ విభేదము రానురాను విస్మ్టాతమగుచు వచ్చినదని తరువాతి రూపకములను బట్టి తోచుచున్నది. శ్రీహర్దునినాటికీ భేదము చాలవరకు సమసిపోయినట్లు కన్పట్టుచున్నది. నాగానంద చతుర్ధాంకాదియందలి విష్కంభముచే సాధింపబడిన విశిష్టప్రయోజన మేదియు కన్పడదు. ముందు నాయకుడు ధరింపబోవు రక్తాంబర విషయమును, సము(దతీరనిర్దేశనమును వూతమే యిది సూచించునది యగుటచే ప్రవేశకముకంటెను విశిష్టమైనదికాదు. మధ్యమపాత (ప్రయుక్తమగుటచే హర్షుడు సం[పదాయానుసారముగ దీనిని విష్కంభవుని వ్యవహరించినాడు. రత్నావళియందలి ్రవేశకములన్నియు నిట్లు ముఖ్యముగ ప్యాతప్రవేశమునకు మ్యాతమే సూచకములై స్వల్వప్రయోజనమును మాత్రమే సాధించుచున్నవి. ఇట్లు విష్కంభప్రవేశకముల ప్రయోగమునం దాదియందు విశేషభేదముండి నట్లును రానురాను ఈ భేదమును కవులు పాటింపనట్లును వ్య క్తమగుచున్నది. ఇవి రచనావిషయమున కవులు పాటించిన మార్గములు. నాటకప్రదర్శనమును 'పప్రారంభించుటలో వీరనుసరించిన విధానము కూడ గమనింపతగినది. ప్రదర్శనము ప్రస్తావనతో నారంభమగుచున్నది. భాసుని నాటకములో దీనికి స్థాపనయని వ్యవహారము. ఇదిసాధించు పప్రయోజనమునుబట్టి ఆముఖమను నామాంతరముకూడ దీనికేర్పడినది. భాసునినాటకములలో “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారళొ

రూపక రచన భూవతి లక్రీనారాయణ రావు 1851 అను వాక్యముతో స్థాపన ఆరంభమగుచున్నది. నాటకవస్తువును సూక్ష్మముగ సామాజికులకు దెలిపి వారిని ప్రదర్శసమునకున్ముఖులుగ నొనరు ఏటయే స్థాపనవలని (ప్రయోజనము. నాటకకర్తను గూర్చికాని, యతని కాలముసు గూర్చికాని, ప్రశంస భాసునినాటకములలో కానరాదు. తరువాతికాలమున నీ విషయములన్నియు నిందు చేరినవి. సంగీతనృత్యములకు గూడ భాసునిస్థాపనలో ప్రవేశము లేదు. నాటక మారంభమగువరకును (పేక్షకులు వివిధవిషయములందు మగ్నులె యుందురు, అట్టి వారిదృష్టిని రంగముపైకి మరలించి, యందు కేంద్రీకరించునట్లు చేయుట సూత్రధారుని ప్రయత్నము. తెరవెనుక నాందీశ్లోకము పఠింపబడుటతో (శేక్షకసమాజమున కొంత యలజడి తగ్గుట కవకాశము కలుగుచున్నది. ఆపె స్యూతధారప్యాతప్రవేశము చాలవరకు ,పేక్షకుల నాకర్ణింపగలుగు చున్నది. సూ(ంతధారుడు ఇతివృత్తవును సూచించి నిర్గమించుటయు, వెంటనే కథాపాత్ర(ప్రవేశవు జరుగుచుండుటయు కారణములుగా సామాజికులు కథాప్రవృత్తారంభము ననుసరించుటకు వీలున్నది. కథ ప్రసిద్ధమైనదిగానున్న నాటకములలో సూత్రధారుడు ఇతివృత్తమును విస్తరించి సూచించు నవసరములెదు. కావుననే శాకుంతలోత్తరరామచరితాది నాటకములలో కథారంభసందర్భము మాత్రమే సూచితముఖైయున్నవి. మృచ్చకటికవంటివానిలోని ప్రస్తావన యట్లుకాక, ఇతివృత్తమును సంక్షేపరూపమున తెలియజేయునదిమై యున్నది. అల్లే మాలతీమాధవమున కథాసారాంశము కామందకిచే వివరింపబడియున్నది. ఇతివృత్తమును సామాజికులకు సూచించి, వెంటనే సూతధారుడు నాటకమునందలి యుకపాత్ర భూమికను ధరించుటయు, నితరపాత్రల (ప్రవేశమును సూచించుటయు గలదు. “పయుజ్య విధినైవం తు పూర్వరంగం ప్రయోగతః స్థాపకః (ప్రవిశేత్‌ తత సూత్రధారగుణాకృతిః.”

అను భరతునివాక్యమునుబట్టి సూత్రధారుడే స్థాపకుడని వ్య క్తషుగుచున్నది. దీనిననుసరించియే తరువాతి నాటకములలో నాందీప్రవర్తకుడగు సూత్రధారుడు నిర్ణమించిన వెంటనే తదాకారవేషాదులతో నొప్పు మరియొక సూత్రధారుడు (పవేశించి కథాపస్తావనను ప్రవర్తింప జేయుచున్నాడు. (ప్రదర్శన కిది శంకుస్థాపనవంటిదగుట చే దీనికి స్థాపన యని పేరు గలిగియుండును. నాటకప్రదర్శనకు పీఠిక వంటిది యగు నీ స్థాపనయే సంగీత స్త్రీప్యాతలతో

1852 పందిరి సుల్ల్‌కార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నొప్పి తరువాతి కాలమున (ప్రస్తావనగా సిద్ధించినది. కుశలవుల సాహాయ్యమున సంగీతమును ప్రవర్తింపజేసి సూత్రధారుడు (గ్రేక్షకుల చిత్తమును రంగమున కుస్ముఖముగావించుట జరిగినది. (పప్రదర్శనారంభము నింకను ఆకర్ష్ణణీయమొనర్చు నుద్దేశముతో నటిని ప్రవేశింపజేసినారు. నృత్యగీతాభినయాది సంస్కారముచే నొప్పు నటీప్రవేశము సామాజికులను రంజింపచేయుటలో వింతలేదు. ఆమెచే బుతుగానమును చేయించి సామాజికుల చిత్తములను తన్మయములొనర్చుటంపే కాక, నాటకారంభసందర్భమునకు తగిన భావావరణమును కూడ కల్పించినారు. నాటక పప్రదర్శనములు సాధారణముగ వసంత శరత్కాలములందు జరుగుట దేశీయసంప్రదాయమగుటయు, శృంగార వీరపధానములగు నాటకముల క్రీ బుతువులు పోషకములగుటయు కారణములుగ నీ రెండు బుతువులే నాటకములలో (ప్రధానములైనవి. ప్రస్తావన శబ్దమునకు “పకృష్ణమైన స్తవనము”" అనువ్యుత్పత్తి నీయవచ్చును. నాటకేతివృత్తమునుగూర్చియు, దానియందు పోషితమైన రసభావాదులను గూర్చియు ప్రకృష్ణమార్గమున (పశంసించునది యగుటచే నీ వ్యుతృత్తి సమంజసమగుచున్నది.

ఇట్లు సంస్కృతనాటకకర్త లవలంచించిన రచనావిధానము లన్నియు నర్ధ్థవంతములు, విశిష్ట (ప్రయోజనకరములునై సహృదయులగు సామాజికుల చిత్తములను రసానందానుభూతికి లోనగునట్లు చేయుటకు సమర్థములై యున్నవి. (కిన్నెర: సంపుటము 5, సంచిక 6, జూన్‌ 1953) కతా? (౯9 . గ!

“న్దేన్సు వ్రాసిన వేమిటంటి ”; “క సములు” వ్రాసిన వమిటంట ; “కల్చనావ్యాణబిలు కవికొండల వేంకటరావు [ఈ అంశమును గురించిన యుపన్యాసము 29.7.1951 తేదీని త్త కవికొండల వేంకటరావుగారు -శ్రీ కొండకొలంకు - వికసెతోత్పల -రాణ్మ హేంద్రవర కేరదప్రభ పదేండ్లపండుగ సందర్భములో ఇచ్చినది.] భగవంతుని కృపవలన తిరుగ మనం ఇక్కడ సమావేశము కాగలిగాం. ఇంతమంది నే డీ యుత్సవమందు పాటొాంటూ వున్నారు అంటే, నే వాకుచ్చునది వింటూపున్నారు అంటే, అది ఈ యుద్యమముపట్ల మీకున్న సామరస్యమును వేనోళ్ళ. చాటుతూ ముంది. కొలతకాకపోతే కొంతైనా నా రచనములను అర్థము చేసెకోగలరసి, ఈ “ఆఖినవాంధ్రకార్యస్థానము వారి ప్రచురణాదికమును వ్యర్థముకానీయరని నను ఊహిస్తున్నాను. జో 2 అచ్చుపడుతూవున్న పుస్తకములు ఎప్పటకప్పుడు మీచేతుల్లోకి వచ్చి మిమ్ములను ఇతోధికపాఠకులనుగా చేయనగునుగాని అచ్చుపడకుండాపున్న రచనలు ఈ యుపన్యాసములగుండా తఆవిసెకోవలసెనదే. ఈ శీర్షికనియ్యది ఆరున్నాకటవ యుపన్యాసము -“కల్చ్పనా వ్యాసము"లను గురించి - లోగడ ఇచ్చిన ఆరు ఉపన్యాసములున్ను పరుసగా (1) గీతికలు (2) ఖండకావ?ములు (3) ఆయత నిర్వచన పద్యకావ్ణుములు (4) మహాగీతికలు

1854 పందిరి ముల్లికార్ద్డుసరాప్పు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (ఈ నాటకాదులు (6) కథలు, వీనిని గురించినవి. మీకు జ్ఞాపకమున్నదో లేదో 26-2-1950 న సుమారొక సంవత్సరము గడచిపోయినది, కథనుగురించి నేను మాట్లాడినాను.

ఆ మాత్రము వ్యవధివుండబట్టే, కథలనుండి కల్పనావ్యాసాల్ని వేబుచేసి దానినొక ప్రత్యేకవిషయముగా నేడు మీ ముందుంచి మాట్లాడగల్గుచున్నాను. నిజానికి కల్పనావ్యాసాలుకూడా కథలవంటివే. చదువమొదలు పెడితే పేజీనుండి సేజీ అవిరళంగా అవగాహనచేసికొంటూ చిపరివరకు వెళ్ళేదాకా విడువబుద్ధికాదు. వేడుక పూర్తికాదు. అవితే కథలు కథలే, కల్పనావ్యాసాలు కల్పనావ్యాసాలే అని నా సూచన. దాని పూరా వివేచన ఎప్పుడు జరుగగలదు అంటే “వ్యాసము” అన్న శబ్దాన్ని ముందు అర్థం చేసికొన్నప్పుడే.

“వ్యాసము” అంటే వ్యాసమహర్షి రచించిన భారత భాగవత(గంథాల్లాంటిదే అని కాడు నేటి నిర్వచనము. ఇంగ్లీషులో “ఎస్సే” వంటిదని. “ఎస్సే శబ్రం అవలకుపెట్టి యోచిస్తే తెనుగు శబ్దం దొజుకదా? దొజకవచ్చు; ఏరైనా “ఏరో ప్లేసు"కు “వాయు విమానము"లాగ “రేడియోకి “ఆకాశవాణిలాగా. అవితే ఆ శబ్దం వ్యాసమువల్లగాని, వ్యాసమునకు వెనక హంగుగానుండి స్ఫురించే “ఎస్సే” వల్లగాని కలిగేటంత భాపగంభీరత కలుగకపోచ్చు. ఇంతకూ తఆనుగు సారస్వతంలో నేడు “వ్యాసము” అన్న శబ్దము ఒకానొక విధమైన గద్యరచనాకారమును సుబోధము కావిస్తూవున్నప్పుడు, మరోమాటకోసం మరోమాటకోసం నెమకులాడ్డం అనుచితం.

వ్యాసాల్లో అనేక రకాలున్నాయి. ఇపన్నీకూడా సారస్వతపు మట్టానికి లేస్తాయా అంటే; లేవవు, లేవనేరవు. “ఆర్థికవ్యాసాలు” “రాజకీయవ్యాసాలు" “సంఘసంస్కరణ వ్యాసాలు” ఇలా, అంకెలు అక్షరాలు తు.చ, తప్పకుండా సరిపుచ్చుతూ (్రసిడ్ల సిద్ధాంతాలమీద ఆధారపడి వ్రాసినవి ఉన్నా అవన్నీ సారస్వత సన్నివేశం కలదై రసస్ఫూర్తి నొడగూర్చవు. కాని వాటివలనే, నిజంమీద కొంతవరకు ఆధారపద్‌. “అవును” “జరిగిందే” అని అనిపిస్తూన్న మనలను వెంటవెంటనే మజపించి మరో మంచి త్రోవకు మల్లించే మహోత్కృష్టతగల వచనఖండికలు (ప్రతీభాషలోను వెలువడి వున్నాయి. మన భాషలోను వెలువడీ వున్నాయి. అవి, యివ్‌ అన మనం నేర్వడంలోనే స్థితప్రజ్ఞ వుంది.

నేను వ్రాసిన వేమిటంటే: కల్పనావ్యాసములు.. కవికొండల వేంకకురావు 1855

(ప్రయాణాలు, ప్రమోదాలు, ప్రమాదాలు, పరాభవాలు, రచయితలకు సంబంధించిన కొంత సావకాశాల నన్నింటినీ తనవి కానట్టు తలపోసికొంటూ, కలతచెందకుండా, కలలాగు చిత్రించుకొంటూ, వెనక్కు తిరుగచూచుకొన్నప్పుడు, తనకు సంబంధించని తారుమారు స్వరూపంలో తానై ప్రతిఫలించడంవుందే అదే కల్పనము. అది యొక విధమైన కనికట్టు.

అందుకే “జంటలు” అన్న పుస్తకాన్ని 1930లో (పచురించినప్పుడు “హుషార్‌ అని మకుటం పెట్టి పాఠకులను హెచ్చరించాను. “ఇందు నిజ మెంత కల్పన మంత అని పాఠకులు తెలిసి కొనబోయేరు కనక. ఏమో? ఆయాస్థలాలు స్వయంగా చూచివచ్చి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో” అని.

నిజానికి “ఉండవల్లి, కొండపల్లి, భువనేశ్యరము, జగన్నాథము, అంతర్వేది, మొగలిత్న్మురు, పెద్దతిరుపతి, చంద్రగిరి, రాణ్మ హేందదవరము, ధవళేశ్వరము” ఈ వూళ్ళన్నీ ప్రతీమానవుడు తిరుగవచ్చు. తలిసికోవచ్చు. కాని వారికి "చందు" ఎక్కడ కనిపించగలడు? “సంకు” ఎక్కడ దొరకగలడు? మరిన్నీ చందదగిరి చూచినప్పుడు “కీర్తిచీరా ఏలా తోచగలదు? ధవళిశ్వరము చేరుకునేలోగా “జవరాలి జడగంటలు” ఎలా (మైోగగలవు? - ఈ వ్యాసాలు చదవకపోతే.

అవన్నీ పది వ్యాసాలు. ఒక ఊరికి ఒక ఊరు దగ్గజసావుండి, రెండేసి రెండేసి వూళ్లుగా నిరూపించడంచేత “జంటలు” అని దానికి నామకరణం గావింపబడింది.

“జంటలు అనేవి ఎప్పుడున్నాయో “విజ్ఞోళ్లు” అనేవి రాకమానపు. కాని జంటలను విడదీయగా వచ్చిన విజ్ఞోళ్లు కావు అవి. అవి ఒండొంట మరోరకం బాదరాయణ సంబంధముకలవి. అవింకా పూర్తికాలేదు. పూర్తి సంఖ్య “పది” చేయగలనని వాటినికూడా అచిరకాలంలో అని నా నమ్మకం. అయితే అవి దూరపయాణములమీద ఆధారపడివుండే వ్యాసాలు అవి. అలాంటి ప్రయాణాలు లోగడ మూడు పర్యాయములు మాతమే నాకు తటస్థ్‌ంచి వూరుకుంది. (1) బెజవాడ - బెంగుళూరు (2) బెంగుళూరు - బెజవాడ. ఠండూ ఏకంచీసుకు ఊహీంచుకోవడంలో ఒక రైలు పట్టా మార్గవలయం తోచకమానదు. అదీ ఆ 'రెండు వ్యాసాలకూ గల అన్యోన్యసంబంధం. 'రండూకూడా “ఆసందవాణిోలో

1856 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అప్పుడప్పుడు పడ్డాయి. ఒక వ్యాసంలో “అప్పుడో నల్లటి పిల్ల తెల్లటి చీర కట్టుకున్నది - పెద్ద ముస్తాబూ అదీ లేకపోయినా ముద్దుగుమ్మే” అని చిత్రించాను. ఇది నిజమా అంటే ఎవరు చెప్పను? నిజమల్లా రైలు మార్గమొక్కటే నాటికీ నేటికీ కానవస్తుంది. ఆ పిల్ల? ప్రయాణాన్ని ఉత్తుత్తిపయాణంగా తోచనీయని కనికట్టు! మధ్యను విసుగుగొల్చే స్టేషనులు వేడుగ్గా పాఠకుడు దాటెయ్యడానికి రచయిత ఏర్పరచిన చిన్న సన్నివేశం. అదే కథలో అవితే ఆ పిల్ల కథానాయిక అయి వుండేది. మరి బెంగుళూరునుంచి బెజవాడకు తిరిగిరావడంలో నల్లటి పిల్ల, ఆల్లటిపిల్లగా మారిపోయింది. “ఒక యురేపియన్‌ యువతి అని వర్జింపబడుతుంది. దారి చూపిస్తుంది రయిలుకు. “ఎజ్జటి గౌను, పెదాలకు లిప్‌స్టిక్‌, పాదాలకు మోహీల్తు షూస్‌ * అవితే ఆమె నాతో రైలు వదిలేపర్యంతమే వుందికాని తరువాత గుడ్‌నైల్‌! గుడ్‌బై - ఆవల కాంతి సున్న గట్టుమీదా గండిమీదా గాఢాంధకారమే. ఈ వాక్యాల పొందికలో వుంది సారస్వతపు చమక్‌! ఈలాంటివి లేకపోతే రచన వ్పుత్తి ౩ల్వే గైడ్‌ షో! మూడో ప్రయాణం రాజమండ్రినుండి కలకత్తాదాకా నే చేసిన 1917లోని (ప్రయాణం - నేనప్పట్లోనే “కాంగెసు%” సమావేశానికి డెలిగేట్‌గా వెళ్ళిందీని. సర్వసాధారణంగా అలాంటి ప్రయాణాల వర్ణన అంతా రాజకీయవ్యవహారాలను గురించే అయివుండగలదు. కాని, నేనో? ఒక డయరీని కలిపించి, రోజువారీ వారంరోజుల దినచర్య అందులో చూపించినట్టు వ్రాశాను. అదే రాజకీయవ్యాసం అయియుండి, మితవాది అతివాదుల పరస్పరవాగాడంబరం పూస గుచ్చినట్టు పొందుపజచబడివుంటే, తప్పకుండా ఆ రోజువారీ చిరా చూపించమని వుందురు. నేనున్ను మీరడగిన వెంటనే చూపించే బాధ్యత వహించి వుండివుందును. కాని ఇది కల్పనా వ్యాసం కావడంవల్ల, పాఠకుడలాంటివేమే అడుగడు. దేశభక్తి పూరితుదై. 541/2] 5 ౧౫ 814౧ [1౩౧ అని “జనగణమన” పాడి తన్మయుడౌతాడు. మజి విజ్ఞోళ్లు (ప్రస్తుతం వ్రాసినవి లేవు. కాని మజోగుంపు ఒకటి తయారు అయిందివుంది. అది “పంచారామాలు” అన్న చిన్న గుంపు. దీనిమార్గం ఇలాగ్గా తయారౌతుంది అని ఎన్నడూ నేను అనుకోలిదు. అసలు ఆంధ్రదేశంలో ఈ మాదిరి మానసికదైతస్యం కలిగించే ఒకానొక దేవాలయ సమీకరణము వుందనే మున్ను ఎజుగను. ఒకటి

నేను వ్రాసిన వేమిటంటే: కల్పనావ్యాసములు కవికొండల వేంకటరావు 1857 రెండు చూచినతరువాతను “ఆరామ” శబ్దంగల ఇతరస్థల నామధేయాలు అన్నీ తెలుసుకుని అప్పుడు (గహించగలిగాను. "పంచారామాలు" అన్న గుంపు. అన్నిచోట్ల కాలూది కలంపట్టడంలో - ఊహాగోళమ్మీద మెజసి, మేలుకొల్పింది ఒకానొక తేజోరేఖ - అదే నేలమీద గీతగీసి చూస్తే గీతమ్మట, “కుమారారామం, దక్షారామం, క్షీరారామం, (ప్రాచ్యారామం, అమరారామం” దృగ్గోచరమయ్యాయి. అస్నే ఆంధ్రదేశంలోనివే; సామర్లకోట భీమవరం, (ద్రాక్షారం, పాలకొల్లు, గుణుపూడి భీమవరం నాలుగు చెప్పానా? అయిదోది, అమరావతి. పోల్నాడునుండి పల్నాడుదాకా ఒకే జాలు. అన్నీ కళాఖండికలే! ఒకదాన్నిమించి ఒకటి కనిపిస్తూ, తుదకు కళాశిఖరాగ్రమా అన్నట్టు అమరావతి చేరేం. “గోడలమ్మట పురాతనపుం గళ కొత్తకోడలి బంగారు వొడ్డాణవు పువ్వులా అన్నట్లు మిజుమిట్లు గొలిపింది”” ఇప్పట్ల ఒక గీతిక చే వ్రాసినది “కళకు ఆయుక్షీణమా?” అన్నది చదపుకోడం, అప్రయత్నం కాదనుకొంటాను. (చింత చిగురులో కలసిమెలసి అన్నది. “విశాలవిశ్వము” లో ఈ దరిమిలా అచ్చుపడింది) కళకు ఆయుక్షీణత పుండదని ధ్వని. ఎన్నాళ్ళు చూచినా కళ కళే! వముజికొన్ని వున్నాయి ఈ “కల్పునావ్యాసా లకు చేరికైనవి, ఈ శీరికనుండదగ్గవీని. అవి పాగకర్రలు అని ఎనిమిది వ్యాసాలు. “పొగకర” అన్న శబ్దానికి మీలో పెక్కుమంది కర్థంతెలియక పోవచ్చు. కాని కృష్ణాపత్రికాసంపాదకులు చక్కగా అర్థం చేసుకొని ఒక రచన "“సిల్లాటి నృత్యాలు” అన్న దాని సెత్తుకొని, తమపత్రికలో అచ్చొత్తిస్తూ ఇలా పాఠకలోకానికి ఎయుకపజచారు. “ఏవేవో, అనుకోని, అందని విచిత్రవిషయాలనేరి - చిత్రకల్పన చేస్తుంది. ఇటీవల. "పొగకర” లనే శీర్దికలో వీరు వాస్తున్న వ్యాసాలలో ఇది ఒకటి. ఈ సిల్లాటీ సృత్యాలలో - కవి తండ్రి మరణించినపుడు ఆ మునిమాపువేళ సూర్యాస్తమాసంలాగా పలిగే మహాజ్యోతి, దానివద్దనే కదిలే నల్లని నీడలు కొన్ని కనిపించాయి - భాపవీథిలో. చాటి ప్రతిబింబమే ఈ వ్యాసం” అంటూ. వ్యాసం అంతా చదవడం అంటే ఇప్పుడు కాలయాపన. “పెద్దకాంత్‌, పెద్దమంటి, పద్దచెరువుగట్టుకింద మెజక తూము పోరనే మామిడి చెట్టుమీద (పకాశమానంగా ఊగుతూవుంది, ఆ వెలుగుముందు నల్లని నీడలు ఏవో కరలుచ్చుకు కదలిస్తూ వున్నట్లు గోచరించినాయి” = నిజానికీ కావ్యంలోని ఆ డెలుగు ముండు ఎవరు నిలబడ్డా సిల్లాటిచాయగా మారకమానుడు.

1858 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఈ వ్యాసానికి ముందు వ్యాసము “మాతృచిహ్నము” అన్నది. “నిలువునా నేలమీద పండబెట్టి మా అమ్మమీద నాటి రాత్రి కప్పినట్టి ఓ తెల్లటి దుప్పటిరేకు* ఆ తెల్లటి దుప్పటిగూడ, రాజహంస రెక్కల్లా విప్పారి, కనిపిస్తూ కవికి నైజనైర్మల్యాన్ని ఎప్పటికప్పు డొడగూరుస్తూ వున్నదనడమే ఈ వ్యాసమునందలి ప్రతిపాదకము. మృత్యువునుగురించి ఎజుగని అమాయకపు శైశవానుభవము అంతకుమించి ఎట్లుండేని? అలా సంఖ్య లింకా ఆరు వ్యాసాలు కలవు ఈ రకంగా. ఒకదాంట్లో మా బామ్మ, ముసిలావిడ, పోతే, ఆమె చితాభస్మం బుట్టకట్టి ఓ వెదురుపాదలో వుంచుతారు, కోటిలింగాలరేవులో కలపడానికి. దాన్ని బండికెక్కించకుండానే అంతకు ముందురాత్రి దొంగ లా బుట్ట ఏదో బెల్లపుబుట్టలని పట్టుకుపోతారు. ఆ విషయాన్ని పొందుపరుస్తూ ఒక కల్చనావ్యాసం “బామ్మ - అమ్మమ్మ -కక్కబామ్మ” అన్నది తయారయింది. “ఆంధమహిళ"లో అచ్చుపడింది. ఈ గుంపులో మొన్నమొన్ననే పప్రకటితమైంది “సీసాలోగాలి. మీలో చాలమంది కది ఆలిసేవుంటుంది. అయినా ఇప్పుడు దాని బిరడా తీసేకన్న మజోగుంపునకు చేరడం మేలు.

అది “అనిమేషములు అన్నది. అవి అన్నీ పది వ్యాసాలు. వరుసగా 1899 మొదలు 1908 వణకు సంబంధించినవై యుంటాయి. ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్కవ్యాస మంటగట్టవచ్చును. మజిన్నీ కవియొక్క పాఠశాలావిద్యార్థిదశ నివి నిరూపిస్తూ కొంత నెనరు కొంత నీతి బోధిస్తాయి. “నీడలనడవొతో ప్రారంభమై “అయితే మెటటిక్యులేటు లేకుంటే ఫేటు” అన్న వ్యాసంతో ఆగుతాయి.

చదివి ఆలిసికోవలసినదేగాని చెప్పడానికి సాధ్యంకాదు. ఈ వ్యాసాలగుండా కవికి “వంతనకకిందుగా పాపికొండల కూనలు” కనిపిస్తాయి! కళింగలాలపొర్లునే “విభుదేందు భూపాలు”" మెజుస్తాయి; బజారు బిల్లులో బిలనాయకుడి ధనుష్టంకారము వినిపిస్తూంది; “బడిగంటలో బండిగంటలూో మాజ్యుమోగుతాయి. “చింతచెట్టు కొట్టివేయబడ్డంలో పెద్ద శూన్యాకాశము విచింతనం గొల్పుతుంది; పేకమేడనుండి టార్పెడోదాకా అంతా మన ప్రజ్జే కనిపిస్తూంది. ఇక 1906లో కవి హూ్యూబర్ట్‌ అండ్‌ ఆర్థరులో ఆర్థరు పాత్ర ధరిస్తాడు. 1007లో “వందేమాతరం” సంకీర్తనం గావిస్తాడు. 1908లో పోల్‌స్టార్‌ ఫొనినీషియా, యురేనస్‌ యురేషియా, ఐసోధెర్మవలైన్సు, ఐసోబారిక్‌లైన్సు. ఒరుగ్వేపెరుగ్వే, ఈక్వినాక్సు ఈక్వేటర్‌”

నేను వ్రాసిన వేమిటంటే: కల్పనావ్యాసములు _. కవికొండల వేంకటరావు 1859 మున్వైన యావత్తు ఖగోళధర్మాలు, ఖనిజమర్మాలు కనుగొంటాడు. ఎక్కడ? “ఫల్రిప్సు మాడెరన్‌ స్కూలు ఎట్లాసూలో! ఈ పది వ్యాసాలు ఒకదానివెనుక నొకటి చదువుకొంటూ పోతే గొలుసుకత్తుగా కొద్ది పాఠశాలాలయాలు ఈవూళ్ళోవే కనిపించకమానవు; అన్నింటిల్లోను ఎప్పుడో వొకప్పుడు కవ (పాతవిద్యార్థియే! మెట్టుమీద ఈ కల్పనావ్యాసాలన్నవి ఇప్పటికో నలఖై యున్నాయి. కాని కవికి ఏళ్ళు గడచినకొద్దీ పెబుగదగ్గ శీర్దిక ఈ సీర్దికే. హెచ్చు అనుభవంమీద ఆధారపడి, ఆ అనుభవాన్ని అన్యునిదిగా భావిస్తూ దానికి ఆనందరూపం కట్టడమనేదే యీ కల్పనా వ్యాసాల పరమావధి. గీతిక నీ యెత్తుకు నన్నెదుగనిమ్ము; నీ సత్తువ నన్నెజబుంగనిమ్ము; ఆసకొద్ది అనుభవంబు అంత నాదె అని జుజ్జిన జిహ్వాగము చివర నిలుచు మాటలోనె కలదు వింత; వింత వాలియు విధమువేయు - అనుభవంబు, నీ రచనము గనుచేసుక, (క్రమశిక్షణ మున వర్ణన సేయుటంపే వింత తెలియువిధము దేవ; (కిన్నెర: సంపుటము 5, సంచిక 5, మే 1953) కలి

66 ర 9 ఊర్వశి: రఏింద్రుని సౌందర్య కల్పన బెజవాడ గోపాలరెడ్డి వ్యోక రవీంద్రుని జయంతిదినము నేడు. తొంబదిరెండు సంపత్పరముల

[క్రితము వారు జన్మించిరి.

వారు రచించిన సహసస్రాధికములగు ఖండకావ్యములలో, గానములలో, నాటికలలో, కథలలో, నవలలలో, వ్యాసములలో వారి సర్వతోముఖమగు కవితాప్రతిభ వెల్లివిరిసి, విశ్వసాహెత్యమున ఉన్నతపీఠము నధిష్టించెసు. వారి దివ్యస్మృతి, వారి కావ్యసమీక్ష సర్వదా వినూత్నోత్సాహముల కలిగించుచుండును.

వారు అపూర్వ్యకల్పనతో, నూతన [ప్రాణప్రతిషా యనునటుల తన ముప్పదినాల్లవయేట “ఊర్వశీ” యను పద్యమును రసజగత్తునకు అందిచ్చిరి. ఊర్వశి మనకు చిరపరి చితమే. బు 'గ్వేదములోను, పురాణములలోను, నాటకములలోను ఆమె దిప్యమంగళవ్మిగహమును కాంచియే యున్నాము. ఆమె విశుద్ధ లావణ్య సముజ్వృలయనియు, రంభ, మేనక, తిలోత్తమాది అప్సరసల సోదరియనియు, దేవేందునికొలువున యుండిన సురవేశ్యకాంతయనియు మనకు విదితమే. కాని రవీంద్రుడు ఆ ప్రసిద్ధితో తనివి చెందక, నవీనరూపమున ఆడిలేని, తుదిలేని సౌందర్యమూర్తిగా ఆమెను సృష్టెంచెను.

దేశకాలముల పొలిమేరల దాటి త్రిలోకములలో బాంధవ్య బంధనముల (ఆంచుకొని వెలసి ఎకాకిగ విహరించు చిరయౌవని ఊర్వశి. పాలకడలిలో ఎగసి, వసంతసవీరముల మె తలిపోయి, స్యర్గఉదయాచలమున కనులవిప్పి నందనవనమున నివసించి సురల సమ్ముఖమున ఏశ్వవేదికమై లాస్యముచేసెన పందిరి పుల్తికార్టుసరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

ఊర్వశి; రవీంద్రుని పౌందర్య కల్పన _ బెజవాడ గోపాలరెత్రీ 1861 భువనమోహిని ఊర్వశి. అమానమైన రూపరాశి, చిరంతనమైన లావణ్యపుంజము ఆమె. దేవతలు అభిలషించునది దేహసౌందర్యమునేకాని దేహరక్తమాంసములు కావు. అమరకాంక్షితమైన సౌందర్యలహరులచే, వారికి అపారఆనందోత్సాహములు కొల్పు అనంతవిలాసిని ఊర్వశి.

మానవశరీరమునందే సౌందర్యము పరమావధినిపొందును. దాని పరాకాష్ట తరుణసుందరీ దెహలతయుందం, అట్టి చరవుస్థతిని పాందిన నారీయావనలావణ్యమూర్తిని, తన అంత్య కళాసృష్టిగ బ్రహ్మ ఊర్వశిని ఊహించాను. దాని సాక్షాత్కారము ఎపరికివారు తపు కల్పనలలో చేసికొనవలసినదే. స్వప్నసీమల ఆమె అందియల చప్పుడులు వినవచ్చునేగాని, జాగృతజగత్తున కాదు.

“చిరయావన పాతలో రూపామృతము ఉఊర్వశొ అన్నాడు రవీం[దుడు. సుర సురాపాన సభల సభియ యైనను, స్వర్గనర్తకియెనను, అనిందితమయైనను, విశ్వ[్రయసి ఊర్వశి. ఆశలచేతను, కల్పనలచేతను, చేదనలచేతను, విలాపములచేతను మాత్రమే ఆమె చేలాంచలమును స్పర్శింప వీలగునేమోగాని, భౌతికశరీరముతో కాదు. ఆమె అలౌకిక సొందర్యమూర్తి యొ, బంధనరహితయై అందరిని సమ్మోహనపరచిన శోభ యని రవీం(దుని కల్పన.

అంతియకాదడు. ఊర్వశి పద్యములోని నిగూఢమైన వెరొక సౌందర్యకల్పనయు కలదు. (ప్రకృతిలోని అందములన్నిటికిని అందని అందమే ఊర్వశియనియు, ఆమె ఛాయలు ప్రకృతిలో కొద్దిగా కాన్పించుచుండుననియు వారి కల్పన. అనంత యౌవనముల మధ్య ఆది సాందర్య మై వసంతములోను, జ్యోత్స్నలోను, ఉషస్సులోను, విద్యుత్‌లోను యూషణ్మాతముగ తన దివ్య వైభవమును చూపుచుండుననియు వారి భావస. పరాశక్తియొక్క సుందర పకృతి ఊర్వశి. ప్రకృతిసౌందర్యశక్తికి నారీత్వము ఆపాదించి ఆసండించెను రసలబ్ధుడగు రవీండదుడు. అట్టి మహదుదాత్తకల్పనలకు ఆస్పదయె, మధురరసాబ్దిలో లబ్ధమైన కవితాసుందరి ఊర్వశి.

“మాతవుకావు, కన్యవుకాపు,

వధువుకావు

సుందర రూపసిపి

ఓ నందన వాసినీ ఊర్వశ్‌ొ అని ఆమె నిస్పాంగత్యమును తొట్టఠొలుతనే ఉద్దాటించుచున్నాడు.

1862 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము . “ఉషోదయ సమముగ

అనవగుంఠితవు

నీవు అకుంఠితవు" అని ఆమె అకలుషిత పరిపూర్ణతతో పరిచయము చేయుచున్నాడు.

“వృంతహీన పుష్పసమముగ,

నీలో నీవు వికసించి

ఎప్పుడు నీవు

(పప్రస్ఫుటించితివి ఊర్వశీ!” అని పూర్వపు ఇతిహాసమేమియులేక తనలో తాను పుట్టి పూచిన అందాల పువ్వుయని సంబోధించుచున్నాడు.

బహు ఆంతరంగిక సంక్షోభముల పిదప ఆమె జన్మించిన దనియు, జన్మించగనే వసంతోదయమైనదనియు, జీవనమరణములు, సుఖదుఃఖములు ఆమె చేతిలోని పనులనియు, అట్టి తేజోపుంజము తన గర్భమున జన్మించెనా యని సాగరుడే అచ్చెరువొంది నిశ్చలుడాయెననియు వర్జించుచున్నాడు. అంధకారమహార్దవమున పొడిచిన తొలివెలుగు ఊర్వశి.

“ఆదిమ వసంత(ప్రాతమున లేచితివి

మంధిత సాగరమున

దక్షిణహస్తమున సుధాపాత్రము,

వామకరమున విషభాండము

తరంగిత మహాసింధువు,

మం్యత్రశాంతభుజంగము రీతి

పడియుండెను పదపాంతమున,

ఉచ్చ్వసిత

ఫణ లక్ష శతముల

అవనత మొనర్చి

కుంద శృుభ నగ్నకాంతి

సురేంద్ర వందితవు

నీవు అనిందితవు”

ఊర్వశి: రవీంద్రుని సౌందర్య కల్పన బెజవాడ గోపాలరెడ్డి 1863 నీ జన్మస్థానమగు సముద్రతలమున ఎన్నో అజ్ఞాత వైభవములున్నవే. వానితో నీ శైశవస్కృతులు గొబ్బిళ్ళు ఆడుకొనెనా, అచ్చటి వజములు, ముత్యములు, పగడములతో ఒంటరిగ ముగ్గులు వేసికొంటివా, నీవు అచ్చట నిద్రించుచుండుట చేతనా “ధీర గంభీర మౌన మహిమ” పరివ్యాపించియున్నది. నీ మేల్కొలుపే విశ్వమునకు యౌవనవికాసమా యని ఆమె లేత గులాబీబుగ్గలను స్పర్శించుచు కవి ప్రశ్నించుచున్నాడు. “ఎన్నడైన ఉంటివా, ముకుళికబాలిక వయస్వినివై ఓ అనంతయౌవన ఊర్వశీ, అంధకార సింధుతలమున, . ఏకాకినివిగ కూర్చొని ఎవరి గృహమున మాణిక్యముక్తములతో నొనర్చితిపి శైశవాఖేలనముల? మణిదీప దీప్త కక్ష్యముల, సముద్ర కల్లోలసంగీతముల అకళంకహాసముఖమున, (ప్రవాళపర్యంకమున నిద్రించెడిదానవు ఎవరి అంకమున? విశ్వమున మేల్కాంచిసపుడే, యౌవనగఠితవు మునుల ఉగ్రతపములే దారుణములై కాగుచుండ, నీవు భంగమొసర్చి వర్షించుచున్నావు. నీ చూపుచేతనే యౌవనవ్యాకులత యేర్చడి. గ్రుడ్డియుగ్గ కన్నువిచ్చి, మూగకోకిలశారిక తియ్యని మాటలాడుచుండ, మృుత్వపాయమైన తరులతలు చిగురుముసుకులలో నునుసిగ్గుల చూపుచుండ, గీతాంజలుల చీ కవులు ప్రణయవేదనల (ప్రకటించుచుండ మేఘగర్జనలబోలు నూప్పురధ్యసులతో, దక్షిణ సమీరములలో తొలగిపోవు అంచలముతో, దిగంత పిద్యుత్‌ వలె మెరస్‌

1864 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మాయమగుచున్నావు. చిత్తమును పూర్తిగ ఆవరించి కనులకు సూక్ష్మముగ కాన్సించి, చేతికందని మాయామోహిని అని వాపోవుచున్నాడు.

“యుగయుగాంతరములనుండి

నీవు కేవలము విశ్వపయసివి

ఓ అపూర్వ శోభనఊోర్వశీ,

ధ్యానభంగమొనర్చి మునులు,

నీ పదతలమున అర్చింతురు

తపఃఫలముల

నీదు కటాక్షాఘాతమున,

త్రిభువనములు యౌవన ,

చంచలములు

నీదు మదిరగంధమును మోయును

నల్గడ అంధవాయువులు

మధుమత్తభృంగసమముగ,

ముగ్ధ్గకవి తిరుగును లుబ్ధచిత్తముతో

ఉద్దామ సంగీతముతో

నూపురముల ముఖరించుచు

వెడలెదవు, ఆకుల అచంచలవు |

విద్యుత్‌ చంచలవు” యౌవనసాందర్యముల ఒరసి పారు కళలానైపుణ్యముతో, హావభావ విలాసభంగిమావిన్యాసములతో నృత్యముచేయు రమణికన్న అందమైనది సృష్టిలో వేరులేదని కాబోలు ఊర్వశిని అమరావతిలో నాట్యముచేయించి చూపుచున్నాడు. అదే విశ్వతాండవమైనది. సముద్రము, భువనము, ఆకాశము పరవశత్వ మొందుచున్నవి. తరంగములు తాళవమువేయుచుండ, తరుపపకృతి తలలాడించుచుండ, నక్షతములు కన్నులార్చక చూచుచుండ, సౌదామిని తొంగిచూచుచుండ ఆమె యౌవనోన్మాదతాండవము చేసినది. అట్టితరి, వివేక విచక్షణలుగల పురుషులును చిత్తముల కోల్పోయిరన్న అతిశయమేమి? అవి ఆమె పాదతలమున త్రొక్కబడుచున్నవి కాబోలు. కనుడు, నాట్యసుందరి ఊర్వశిని.

ఊర్వశి: రవీంద్రుని సౌందర్య కల్పన బెజవాడ గోపాల రెథ్ధి 1865 “సురసభాతలమున ఎన్నడు నృత్యమొన ర్బెదవో పులకోల్లాసివై ఓ విలోల కల్లోల ఊర్వశీ, ఛంద ఛందమున నృత్యమొనర్చును సింధుమధ్య తరంగదళము, సస్యశీర్ణముల వణకి కంపించిపోవును ధరాంచలము, నీ స్తనహారమునుండి జారిపడును తారలు నభస్థలమున, తన్ను పోగొట్టుకొనుచు చిత్తము అకస్మాత్తుగ పురుషులవక్షమున నాట్యమాడును రక్తధారలు తటాలున విసరిపడును నీ మేఖల దిగంతమున ఓ అసంవృతా! నిశాంత తిమిరాలత ఉషోమూర్తిగను ఆమెను కవి చూచుచున్నాడు. “ఉషఃకాలాధిష్టాత్రీ దేవతా ఊర్వశ” యను ఆర్యోక్తి కనుగుణ్యముగ హెమాచ్చాదన, రక్త అరుణత్వము అనుసరించియుండు దిగంత మేఘమాలికలమధ్యః ఏ సాగరతరంగడోలికలోనో కనుల విచ్చుచున్నది ఊర్వశి. మానపసరస్సులో వికసితవాంఛాకమలమును తన కోమల చరణముల ఊపించి లేపుచున్నది. “స్యర్ణఉదయాచలమున ఉషో మూర్తిమతివి నీవు ఓ భువనమోహని ఊర్వశీ, జగత్తు అశ్రుధారలచే ధాతము నీ తను పేశలత త్రిలోక హృదయరక్షముచే చితితము నీ చరణగోణిమ ముక్తవేణీవివసనవై, వికసిత విశ్వవాంఛ ఆరవింద మధ్యమున ఉంచితివి నీ పాద పద్మముల అతి లఘుభారమున,

1866 పందిరి మల్లీకార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

అఖిల మానసస్వర్గమున అనంత

విలాసినివి స్వప్నసంగినివి.” ,

అట్టి అపూర్వసుందరిని సృజించి, ఆమె సాక్షాత్కారము పూర్తిగ ధరణియందు గోచరించుటలేదని కవి విలపించుచున్నాడు. భూవ్య్యూకాశములు ఆ సౌందర్యాన్వేషణము చేయుచు పరితపించుచున్నను ఆమె సపెడచెవినిపెట్టి అలభ్యముగ నున్నదనియు ఆక్రోశించుచున్నాడు. ఆ పూర్ణవికాసముతో ఆ తొలినాడు దేవతలకు దానవులకు కాన్చించిన దృశ్యము తిరుగ భూలోకమున కాన్పించునా యనియు, ఆమె సర్వాంగములు వర్ణించుట, ఏవేని తీవ్వదష్టులు ఆమె మెత్తని శరీరముపై పడుటచేత కాబోలునని, అట్టి వర్షాదినముల విరహిణీనదులు నూతనజీవములపొంది రాగా, బహుభార్యాసుఖమున జనకుడు సముదుడు ఉప్పొంగుచున్నాడనియు కల్పనచేయుచున్నాడు.

తన మనోహర రూపముతో ఊర్వశి తిరిగి కాన్పించదనియు, ఉషస్సు వెండివెలుగులను పంచిపెట్టుచు తీర్థయ్యాతసల్చి అస్తాదిని కనకాభిషేకముచేసి వెడలిపోగా, నిరాశాతమస్సులు వ్యాపించెననియు, సంతోషపడువేళల ఏదో తఆలియరాని ఆవేదన చిత్తమున ఆకులమొనర్చుననియు, ఊర్వశి ఒక మరవరాని స్కృతియె, పొందరాని ఆశయ సదా వెంటాడుచుండుననియు నిట్టూర్చుచున్నాడు

ఆవె రూపవుఎను చూడ లెకపోంయిననం, సాక్షాత్కారవుఎ పాందజాలకపోయినను ఆమెను విడజాలనేరమనియు, మనోచితమునుండీ తుడిచివేయజాలమనియు, ఏడుపుకొలనులో కోరిక తేలుచునేయుండుననియు, నిరాశలో ఆశ పొడ చూపుచుండుననియు, చీకట్లే ఉషస్సును చుక్కల పల్లకీలో మోసుకొనిరాగలవనియు ఓదార్చుచున్నాడు కవి. అట్టి ఆశాజ్యోతియే లేకున్న జీవితము దుర్భరము కాగలదు. ప్రకృతిలో అట్టి ఆశ ప్రదర్శింపబడుచునే యున్నది. హేమంత శిశిరబుతువుల పిదప వసంతము. చీకటిలో కూడ వెలుగు.

పురాణప్రసిద్ధయైన ఊర్వశిని అవలంబనగా చేసికొని ప్రకృతిలోని నిగూఢమైన మహత్తును వర్ణించెను రవీంద్రుడు. కవి పురుషుడై, ఊర్వశిని ప్రకృతిగా భావించి సల్లాపించెను.

1867 ఆమెయే విచితరూపిణి. ఆమెయే మానవసుందరి. ఆమెయే చిరకామిని, చిర విజయిని. ఆమే వసంతశోభ, పూర్ణిమ్మాపభ, అరుణోదయ ఆభ మరియు విద్యుత్‌ ప్రతిభ. గగనమునందలి వెలుగులు, సము[దమునందలి ధ్వనులు, ధరణియందలి వర్ణములు ఆమెయే. తారుణ్య మందార లావణ్య సుందరి యౌవన యమునా సౌందర్య లఅహరి ఊర్వశి, ఊర్వశి! (మే 8 న ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రంనుంచి శ్రీ గోపాల రెడ్డిగారు (బాడ్‌కాస్టు చేశారు.) (కిన్నెర: సంపుటము 5, సంచిక 6, జూన్‌ 1953) గే ఫట స! త న 11. ర స( గ్ర లోటని. గ ను. గంగ ష్టళాన్నా ర్ల్లాడ్టు. "నో ॥ ఘే ర్‌

జలుగు సాహిత్యంలో క్రొత్తతెస్నులు: 3 “కన్యాశుల్క౦” రముణా౮ెడ్‌ి ఆతి ఉస్ట్రనమైన రచన” “కీన్యావల్కం" 'రెండవకూర్చు. పీఠికలో గురజాడ అప్పారావుగారు. “కొత్త ఆలుగుభాషను పరిణతిచెందించేవి వాడోపవాడాలు కావని నేనెరుగుదును. ఒక గొప్ప రచయిత దాన్నిరాసి సృష్టించాలి. ఆ గొప్ప తచయితకోసం మనం పునాదులు వేడ్తాం". అని రాశారు. అంటే, ఎ (గంథాన్ని రెంచవతూరి తానచ్చువేయిస్తూవుందినారో, దాని పూర్తివిలువ ఆయన [గ్రహించలేక పోయారు. కాని తనదీ ఒక గొప్ప గ్రంథమే అని కనుగొన్నారు. తన మృతుడూ శిషుుడూ ఆయిన శ్రీయుత ఒంగోలు మునిస్తుబహ్మణ్య శర్మగారికి (యిప్పుడు ఒంగోలులో నా్య్రాయవాదులు. వారు దయతో నాకిచ్చిన అప్పారావుగారి “లేఖల” నుండి కొన్ని (కొత్త విషయాలీ వ్యాసంలో వాడుకున్నండుకు క్షమార్తుణ్ణి - రచయిత) లేబలో, “వినయం అటుంచి, నేనొక ఘనమైన రచన చేశాననుకుందున్నాను : దానికీ పరీక్ష ఎమిటంటే, అది నన్నే సమ్మూహపరుస్తూవుంది" అంటూ. రాశారు. పాంతిత్యానికీ కవిత్వానికీ నడుమ పోటాపోటీ జరిగి, ఎస్నకచేయమని శ్రీ విశ్వనాత్ష సత్యనారాయణగారిని జడ్జిగా నియమిం చేపక్షాన, ఆయన పాండితాానికే ఎక్కువ మార్కులిస్తారు. కాబట్టే గురజావ అప్పారాపు “వద్ద స్తూతకాతుడు” అన. గిడుగువాఏప

కన్యాశుల్కం రమణారెద్ధ 1869 మిన్నుల కొత్తుతారు. (కృష్ణాపత్రిక, భాషా సంక్రాంతి సంచికు. అనగా, గిడుగువారు, “భాష్యకార మహాప్రభువులు”. నవ్యసాహిత్య పరిషద్సప్తమ వార్షికోత్సవాధ్యక్షో ప న్యాసములో (1910) కూడ త్రీ సత్యనారాయణగారు గిడుగు గురజాడల తారతమ్యాన్ని చూపబోయి, వారి అనుచరుల తారతమ్యాలను చూపినందుచేత, గురజాడవారికి అన్యాయం చేశారు : “శ్రీ గురజాడ అప్పారావు పంతులుగారు తీసిన నూత్న కావ్యమార్గం వెయ్యిమంది పోషిస్తూవస్తే, వారు తీసిన వ్యావహారిక భాషావాదం శ్రీ, రామమూర్తి పంతులుగారొక్కరు వెయ్యిమంది సెట్టుగా పోషించారు”. నిజమే, కాని అంతమాత్రాన గురజాడవారి ప్రాముఖ్యత తరుగదు. గిడుగువారి వాదోపవాదయుద్ధసంరంభం ముందు పండితమ్మన్యుల పటాటోపాలు జెరికో గోడలవలె తమంతటతాము నేలమట్టంకాగా, అవి సామాన్యప్రజానీకపు సామీప్యాసికి వెళ్ళలేకపోయాయి. ఏలనంటే, అవి శాస్త్రచర్చలు, పైగా భాషాశాస్త్ర చర్చలు. సామాన్యులా నిరక్షరాస్యులు. లేదా, మిడిమిడి చదువులవారు. “మాటలో గిడుగువారి ప్రపంచం. కావ్యసృష్టి ఆయనదికాదు. ఆ మాట ఆయనే అనేవారు “నేను రాయలేనుగామరీ - ఇప్పుడు అప్పారావు మరిలేడుగా! వాడు రాస్తుండేవాడూ! వాడింకా ఎన్ని రాసిచ్చేవాడో” (భమిడిపాటి కామేశ్వరరావుగారి వ్యాసం, కృష్ణాపత్రిక భాషాసం[క్రాంతి సంచిక “మాతృభాష హక్కు" ధార్వాడ్‌ నాటకసమాజం మొట్టమొదట తెసుగుదేశానికి 1881వ సంవత్సరంలో వచ్చింది. లాభాలు తినమరిగింది. పౌరాణిక నాటకాలకూ, ప్రజాసామాన్యపు నిరక్షరాస్యతకూ మూఢవిశ్వాసాలకూ చాల దగ్గరచుట్టరిక మనే మాట నొక్కి చెప్పనక్కరలిదు. ఈ సమాజం 1885లో తిరుగవచ్చింది. ఇదిచూసి, గోదాపరీ మండలయువకులు కొందరు వుత్సాహం వెల్లివిరియగా, ధార్వాడ నాటకసమాజం నుండి పేచీపడి విడిపోయిన వామనభట్‌ జోషీ ప్రోద్బలంతో, దేశీయనాటకసమాజం లేవదీశారు. దీనిపేరు ఏలూరు కంపెనీ. కాని వీరుకూడ తెలుగులో నాటకములు వెయ్యక, హాందీలోనే నాటకాలాడసాగారు. తెలుగుభాష నాటకరంగానికి అనువైసదా, కాదా, అనే సందేహం వుండింది. కసుక “మాతృభాష హక్కు”ను స్థరపరచేటందుకు అప్పారావుగారు “కన్యాశుల్కం” రాశారు.

1870 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “కల్పనాదారిద్య్యం*

ఏలూరు నాటకసమాజాన్ని చూసి, అన్ని ముఖ్యాం[ధధనగరాలలో నాటకసమాజాలు లేవడం, కాని నాటకాలు తెలుగున ప్రదర్శనయోగ్యా లైనవి తక్కువవుండడం, కనుక నాటకరచన కితోధిక్షపోత్సాహం కలగడం క్షణంలో జరిగిపోయింది. ఈ నూత్నోత్సాహం౦లో వచ్చిన నాటకాలే చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి “కీచకవధ" (1889), “గయోపాఖ్యానం” (1890) మొదలైనవి. “సప “డిమేండ్‌” పద్ధతి ననుసరించి చిలకమర్తివారు నాటకాలు రాశామని “స్యీయచరిత్ర"లో చెప్పకచెప్పుతారు; “సమాజములోని సభ్యులనుబట్టియే నాచేత నాటకములు వ్రాయబడుచుండెడివి. ఈ సమాజమువారికి వచననాటకములే యాడవలెనను సంకల్పము గలుగుటకు నొకటిం౦డు కారణములు గలవు; సంగీతజ్ఞానము లేకపోవుట యొకటి. చక్కగా భాగములు చదివి ప్రయోగించిన పక్షమున, పద్యనాటకములకంటె, వచననాటకములే యుక్కువ మనోహరముగ నుండునను నభ్శిపాయ మొకటి” ఈ విధముగా రచయితలు కళాకారులుకాక, వ్యాపారుల గుమాస్తాలు కావలసి వచ్చింది. లాభాలు రావలతెనంటే, పౌరాణికాలే కావాలి. కాని సాంఘికాలు పనికిరావు. కాబట్టి మహాభారత, రామాయణాలలోని వస్తువునే వాడినదానిని తిరుగవాడుతూ, స్వీయపతిభ వికసించే మార్గాలను చూసికొనక, “కల్పనాదారి దా్య్యా”న్ని బయట పెట్టుకుంటూ రచయితలు “నెమరువేస్తూ” వుండిన రోజులలో అప్పారావుగారు “కన్యాశుల్కం” రాశారు.

ఇదేవేళకు, (బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్తుంలు వారు “*ప్రతాపరుద్రీయ” నాటకం రచించారు. “కన్యాశుల్క" రచన ఎట్లా ఒక మార్గానికి అ(గేసరమో, “పతాపరుద్రీయ” రచన మరొక మార్గానికి అట్లాగే. “ముత్యాల సరాలు" వాస్‌ అప్పారావుగారు దేశిసారస్వత పునరుద్ధారకుడు, దేశిపునస్సంస్థాపక పితరుడూ అయితే, “కన్యాశుల్కం” వాసి, ప్రయోజనయుత సాంఘిక సాహిత్య (బహ్మ అయ్యాడు. కొందరు వీరేశలింగంగారికి యీ పదవి నివ్వవచ్చునుగాని, వీరేశలింగంగారి రచనలలో సాహిత్య కళాపోషణకంటె, సంఘసంస్కారోద్దేశాల పాళ్లు హెచ్చు. ప్రయోజనయుత సాహిత్యం, సాహిత్యగౌరప మార్టించుకొనవలెసంటే, కళాత్మకంగా ఆపపదృష్య మై వుండాలికూడ; వీరేశలింగంగారు గొప్ప కళాకారులు కారు; యీ విషయంలో నేటి అభ్యుదయ రచయితలు గురజాడవారి

కన్యాశుల్కం రమణా రెథ్జ 1871 గిష్యులనిపించుకునేందుకంటే, వీరేశలింగంగారి శిష్యులనిపించుకునేందుకు అర్హులు. గురజాడవారి గుణాన్ని గ్రహించక, వీరేశలింగంగారి అవలక్షణాన్ని అమలుపరుస్తున్నందుకు నిందార్హులు. వీరేశలింగం పంతులుగారి “ప్రహసనాలు” నాటకనామార్లులు కావు; ప్యాతల వైవిధ్యం కృశించి, అందుకుతోడు రచయిత రచనలో నెల్లడా ప్రత్యక్షమైనందుచేత నాటకశిల్పం దెబ్బతినింది; అన్ని పాత్రలూ రచయితయొక్క ప్రతి రూపాలే; అన్ని ప్యాతలలోని నీటిలో ఒక సూర్యుడే ప్రతిబించించాడు. అదిన్నీగాక, ఆనాటి జీవిత మప్పటికే పాతక్రొత్తల సంఘర్షణతో నిబిడమై వుండినప్పటికిన్నీ, గొప్ప సాంఘుకనవలలన్నో వికసింపగల అవకాశాలుండినప్పటికిన్నీ తాను స్వతహాగా గొప్ప పరిశీలకుడూ సంస్క ర్హా అయ్యిన్నీ వీరేశలింగంగారు అశేషమైన యీ ముడిపదార్థాన్ని సరిగా వాడుకోలేకపోయారనేందుకు, సమకాలిక సమస్యలపై ఆయన “ప్రహసనాలు” తప్ప మరేమీ రాయలేదనేదే నిదర్శనమవుతుంది. అప్పారావుగారే అన్నారు. “విషమ సాంఘిక పరిస్థితులను ముందుపెట్టే ఆధునాతనజీవితాన్ని, (పహసనాలకు తప్పు, నాటకరచయితలు వృపయోగించుకోవడం లేదు” అని. ఇక వేంకటరాయశాస్తింగారికి “అధునాతన జీవితం”అఖ్మరలిదు. ఆయన దృష్టి గతంలో తగుల్కొంది. ఆంధ్రుల పూర్వాన్నత్యానికి “పతాపరుద్రీయం” ఒక నివాళి అయింది. గురజాడవారు దీనిని గ్రహించి, “మన దేశచరిత్రలోని వ్యురూతలూగించే ఘట్టాలలో ఒకదానిని చేబూని నాటకీకరించడంలో రచయిత విజయవంతంగా పునర్నిర్మించగలిగిన, దేశాభిమాన సంయుతమైన, సాహిత్య రూపమైన కాల్బనిక వాతావరణం నాకీ [గంథంలో అతిబాగానచ్చిన విషయం." అన్నారు. కాని అదే సమయాన, శాస్తు్రులువారు చరిత్రకు అపచారం చేశారనికూడ పంతులుగారు తెలుసుకున్నారు. యుగంధరుడనేవాడు లేడన్నమాట వాస్తవమే అయినప్పటికిన్నీ, “రాచబందీ విమోచకి బిరుదాంకితుడైన రేచెర్ల సింగమనీడే యుగంధరుడని సమాధానపెట్టుకోవచ్చును. కాని దేశచరిత్రలో అవమానించవలసిన ఒక ఘట్టాన్ని గర్వింపవలసిన ఘట్టంగా శాస్త్రులవారు చేయబోయినగారడీకి చరిత్ర బలికావలసి వచ్చింది. అబద్ధమైన రెండవ(ప్రతాపర్వుదుని కాలపు ఆంధ్రవైభవం నాటకంలో సత్యమయింది. క్రీణదగలోని స్నామాజ్యం (0 ప్రాభవ దశ విలాసంగా చూడబడింది. కృష్ణపక్షాన్ని శాస్త్రులవారు శుక్లపక్షం చేయబోయారు. కాల్పనికోద్యమంలో, గతంలోని దొసగులదెసకూడవున్న దురభిమానం వేంకటరాయశాస్త్రిగారితో మొదలై, కొడాలివారి “హంపీక్షే తం”

1872 పందిరి మళల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “........ ఎన్నగా6 దెల్లుతల్లులు మున్ను శౌర్య రసమొడిచి యుగ్గుంబాలతో రంగరించి బొడ్డుకోయని కూనకే పోయుదురట!”, అని, “..... ఇటనెచట త్రవ్వినను బంగరేనంట, యది యెంత శ్రీయొ ... * అని, తాతలనాటి అవ్వకథలను నమ్మింపచూసే విశ్వనాథ సత్యనారాయణగారి “ఆంధపశస్తి వరకూ సాగుతూవున్నది. ఈ నిష్పులమైన దురభిమానప్పు ఫలితమేమిటో, సదరు వి. సత్యనారాయణగారే చక్కని పద్యంలో యిలా చెప్పారు: “పాడిన గీతమే మజలం బాడెద6 గూడిన భావమే మజిం గూడెద నేమిసేయవలె గుండియగోషిలి దుఃఖవేదనన్‌ గాడిన నా హృదంతరముఖంబున మా తొలినాంటి కీర్తి రా పాడిన నాదువాక్కు తెగబాఅదు నూత్నపథాలవెంబడిన్‌” గతైకమనస్కత వర్తమానంలో నిరూపయోగత అవుతుంది. నూత్నపథాలవెంబడి వాక్కూ మేధా ప్రవహింపదు. ప్రవాహలక్షణం సమసిపోయి, అచలగుణం స్థరమవుతుంది. “కన్యాశుల్కం” చిత్రించిన జీవితం యుగసంధిలోనిది. భిన్నజాతి సంస్కృతిసాంపదాయ సంగమశ్రీ కన్పిస్తుంది. కనుకనే గురజాడవారు, “వెనకచూచిన కార్యమేమోయ్‌? మంచి గతమున కొంచెమేనోయ్‌, మందగించక ముందుకడుగెయ్‌ వెనుకబడితే వెనకెనోయ్‌! అని జాతిని వికసించే విలసిల్లే వర్ధిల్లే పథాలవెంబడి కొనిపోయేందుకుగాను, తొలుదొలత తమలోని లోట్లను పెరికి, సంఘటితం కమ్మన్నాడు. నాటకమే యేల? | ఆ కాలంలో విద్యావంతు లరుదు; నిరక్షరాస్యులు పెచ్చు. అప్పారావుగారు వుత్తీజంపదొరకొన్నది సామాన్యులను. కనుక కావ్యంలో తన భావాలను కుదిస్తే, వారు సులువుగా (గ్రహింపలేకపోవచ్చును. తన లక్ష్యమే తొలగిపోపచ్చును.

కన్యాశుల్కం రమణా లెడ్డి 1873 సంఘంలోని చెడుగుల జాబితానిస్తూ, ఒక గ్రంథమే వ్రాస్తే పుస్తకపఠిత లెంతమంది? కనుక సామాన్యుల సానుభూతికూడ కలిగి, సంస్కారోద్యమాలలో వారి సహకారంకూడ లభించడమే ఆయన లక్ష్యమయితే, హెచ్చుఫలితాన్ని సుకరంగా సాధింపగల ప్రచారరీతి అవసరమయింది. ఈ సాధనం నాటకమని గ్రహించడం జరిగింది. “పజాసామాన్యానికి గ్రాహ్యామయ్యే నాటకంలో (యీ) చెడుగును వెల్లడిచేసి, ఆందోళనను (పేరేపెంచడానికి, “యిటువంటి సత్ఫలితం నాటకరంగంనుండి మాత్రమే ఆశించవలసివుంటుంది. ఇతివృత్తం

విశాఖమండలంలో మూడు సంపత్సరాలకాలంలో జరిగిన వివాహాల లెఖ్కలను విజయనగర ప్రభువులైన ఆనందగజపతి మహారాజు తీయించారు. అవి గురజాడవారిని పప్రకంపింప చేశాయట; ఐదేళ్ళ వయసున 99 మంది, నాల్దేళ్ళ వయసున 44 మంది, మూడేళ్ళ వయసున 36 మంది, రెండేళ్ళవయసున 6౮ మంది, ఏడాదివయసున 3 మంది బాలికలు పెళ్ళిళ్లు జరగడమే ఆశ్చర్యం కలిగించలేదు : “కడుపులోవున్న పిల్లలకోసంపైతం అప్పుడప్పుడు బేరాలుజరిగేవిగ పల్లి యీడు గురించి, పెల్లిపద్ధతిని గురించి, స్త్రీదాస్యాన్ని గురించి, ఆదర్శ స్త్రీ పురుషసంబంధాలు గురించి ఆవరకే అప్పారావుగారు విశేషమైన ఆలోచనలుచేసి, విశిష్టమైన నిర్ణయానికి వచ్చివున్నవారు, అభిప్రాయాలు కాలానికి వంద సంవత్సరాలు ముందుగా పరుగెత్తించినవారు, యీ అఘాయిత్యాన్ని చూసి, “అవినీతికరములైన విషకిములతో కూడుకున్న దుర్భరబానిసత్వం నుండి దిక్కులేని మన స్త్రీలను కొందరిని రక్షించడానికి” కాసె బిగించారు. గురజాడవారి చూప్పులో “స్తీ”

స్ప్రీ పురుష సంబంధాలనుగురించి, హెందవ సమాజం స్త్రీకి చేసిన మహాపరాధాన్ని గురించి, గురజాడవారికి వఠి సెంటిమెంట్లు - హేతుబద్ధం కానటువంటి యిష్టానిజ్ఞాలు - లేవు. ఉన్నవి పరిశోధనలవలన పరిశీలనలవలన విచారణలవలన యేర్పడిన దృఢాఖ్మిపాయాలు. వృద్ధులలో - చాలమట్టుకు 19వ శతాబ్దికే చెందిన వారిలో దురభిప్రాయాలులేక శాస్త్రీయాభిప్రాయాలుండడం మన కాశ్చర్యం కలిగించే విషయం. అప్పారావుగారేకాదు - వీరేశలింగం మాట

18/74 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చెప్పనేల, గిడుగు పంతులుగారుకూడ హేవలక్‌ ఎల్లిస్‌, ఐవాన్‌ బ్లాక్‌గారల [గ్రంథాలు చదివి, “వాళ్లు చెప్పే విషయాలు ఎంతవరకు వాస్తవములో అని మనుష్యులను పరిశీలిస్తూవచ్చారు.” “స్త్రీ పురుష సంబంధాలను గురించి సాయప్రదాయికమైన దురభిప్రాయాలనే ఎరరదివ్వెను కట్టిపెట్టి, సమగ్రంగా వాటిని పరిశోధించవలెనని నా యభిప్రాయము.” అని అప్పారావుగారు వ్రాశారు. ఆ సంబంధాలనుగురించి మనకుకల అభిప్రాయాలన్నీ పురుషునియెడల పక్షపాతం చూపేవేకాని, స్త్రీమనస్సులోని యిష్టానిష్టాలను తృణప్రాయంగా త్రోసిపారేసేవి. పాక్షికదృష్టికలిగిన చట్ట మెప్పుడూ లోపభూయిష్టము కనుకనే పరిశోధనయొక్క ఆవశ్యకత. “నిర్భాగ్యు లైన మగలు, కురూపులైన మగలు, దుర్మార్గులైన మగలు, నిస్పారులైన మగలు ... వీరిని గురించి వీరి భార్య లేమనుకుంటారో ఆలోచించు. దుర్మార్గులైన భార్యలు, కురూపులైన భార్యలు తదితరులు - వీరివిషయ మేమిటి, అని నన్నడగవచ్చు. అయితే వాళ్లు బానిసీళ్ళాయిరి! వారు మననుంచి అడిగే దానికంటే యెక్కువ పావిత్ర్యాన్ని వారి నుంచి మనము ఆశిస్తున్నామాయె! ఈ స్వల్పాంశమే ఎంతో గొప్ప తేడా కలిగిస్తుంది. పవిత్రులుకాని మగవారి నందరినీ సనువ్వసహ్యాంచుకొని వారిని నిరాకరిస్తావనుకో. నీ స్నేహితులలో ఎంతమంది యీ పరీక్షకు నిలిచి నీకు మిగులగలరు?౫” అని అప్పారావుగారు ఒక స్నేహితుని (ప్రశ్నిస్తారు. అట్లని, స్త్రీలు కూడ పురుషుల మోస్తరు విచ్చలవిడిగా శాసనోల్లంఘనంచేసి చరించవలసిందని ఆయన అభిమతంకాదు. సంఘం విధించిన చట్టాలు కొన్ని శిరోధార్యాలని ఆయన ఒప్పుకుంటారు. ఆ కొన్నిటిలో స్తీ పురుష సంబంధాలను గురించినది కూడ ఒకటి. “సంఘశాసనం లోపభూయిష్టమని నువ్వు ఖావిస్తేనేతప్పు, బహెరంగంగా నిర్భయంగా దానిని నువ్వు సంస్కరించదలస్తేనే తప్ప, తక్కిన సందర్భాలలో దాని నుల్లంఘించడం శిక్షార్హమైన నేరచర్య” కాని అప్పారావుగారికి దాని సంస్కారావశ్యకత తెలిసింది. కనుకనే బహిరంగంగా ఆయన దానిని తిరస్కరింప పూనుకున్నారు. అంటే, ఆయన వ్య క్తిజీవితంలో కాదు - రచయితగా. "స్త్రీ పురుష - సంబంధాలను గురించి నేటి సంఘశాసనాలు ఎవరూ అందుకోలేనంతటి మహోన్నత(ప్రమాణాన్ని విధించాయి.” కనుకనే శాసనోల్లంఘనాలు అగణ్యాలయినవి. ఈ దృష్టిలోనే మనము “కన్యాశుల్కము"లోని మీనాక్షి పాతను చూడాలి - ఆంటే సానుభూతితో! మీనాక్షి చుష్ప్రవర్తనలకు బాధ్యత సంఘానిది కాదూ! మీనాక్షి వితంతువు - వితంతువుల ...... సమస్యనటుంచి, పునిస్త్రీల సంగతి చూసినా, యీ శాసన సంస్కారావశ్యకత

కన్యాశుల్కం రమణారెడ్డి 1875 బోధపడగలదు. పెల్లిపద్ధతి పూర్తిగ మంచికే దారితీయడంలేదు. సంఘపురోగతిలో యీ సంస్థ చాల వుపకరించిందని అప్పారావుగారు (గ్రహించారు. ఇతర సమాజాలవలెనే, హైందవసమాజంలోకూడ, బెద్దాలకి అయిన శ్వేత కేతువు కామశాస్త్రమును సంక్షేపించుటకు పూర్వము, “పక్వాన్నమెట్లు సర్వసాధారణమైనదో, సర్వులకు అనుభవార్హ మైనదో, అల్లే స్త్రీలును సర్వసాధారణలు అనుకొనెడివారు. దీనిని సంస్కరించి, లోకులు మద్యపానము నుండియును, అధమవర్ణ్దమువా రుత్తమవర్దమగు బ్రాహ్మణ కన్యల వివాహమాడు నాచారమునుండియును, పరస్త్రీ గమనమునుండియును సనిషిద్ధులని చేత కేతువొక నియమము నేర్పరచెను” (వాత్సా్యాయన కామసూత్రములు: జయమంగళ వ్యాఖ్య) దారలే లేనప్పుడు, పరదారాభిగమనము నేరముకాదు. అట్టి సమాజము లోపభూయిష్టమయినది. కాని అది స్త్రీ రాజ్యము. ఏమంటే, బిడ్డకు తండ్రి యువరో తెలియదు - తండ్రులనేకులు

  • తల్లి ఒక్కతే. “మాది ఫలానా ఆమె వంశము” అని చెప్పినంత సులువుగా పురుషునివంశమని చెప్పుటకు పీలులేదు. ఈ “తల్లి - హక్కు” (4006౯- [9౧౪ [క్రమేణా స్తీంకి సంఘాధిపత్యమిచ్చినది. అట్టి మాతృసమాజము (1420౧20౧21
  1. నుండి సంఘము పితృ సమాజమునకు పయనించుటకు తోడ్పడిన వాహనమే వివాహమసనెడి సంఘసంస్థ. కనుక యీ సంస్థ యొక్క ఒక ఫలితము, సంఘములో శుచి, నియమము. నిర్నిబద్దమైన స్త్రీ పురుష సంబంధము జాతి క్షయహేతువుకదా! మరొక ఫలితము, స్తం ప్రాభవము పరిమిత మగుట - అనగా, స్త్రీ పురుషుని ఆస్తిగా మారుట. ఆస్తి పావిత్యు సిద్ధాంతపు శాఖయే మంగళసూత పావిత్య్యు సిద్ధాంతము. స్త్రీ కూడ వస్తుప్రాయయొనది - కనుక దాసియొనది. ఇది (గ్రహించిన అప్పారావుగారు. వివాహసంస్థ అనే వృక్షము ముదిరి కుక్కమూతి పిందెలు తొడుగుట కూడ చూడగలిగారు. ఈ సిద్ధాంతము “లక్కలేని వుల్లిఖితాలుకాని దారుణ విషాదాంతాలకు” దారితీసిందని చెప్పారు “ఆధునిక వనిత మానవచరిత్రను పునరుల్లేఖించగలదు”. ఇక, వివాహబంధానికి కట్టుబడనటువంటి, కాని సంఘానువముతితో మాతృరాజ్యపద్ధతులను కొనసాగిస్తున్నటువంటి ప్త్‌ీంలు - వెలయాళ్లు - అప్పారావుగారి దృష్టి నాకర్షించారు. మధురవాణిలేని “కన్యాశుల్కం” ఏమీకాదు. మధురవాణి పాత్రను సృష్టించినవారే. దానిని చోహించారట వాణిని బహ్మవలె. ఈ చిత్రణ అతి చిత్రణా? మధురవాణి దుర్గ్లుణము ఆమె సౌజన్యంలో అణగి మణగి పోయిందా? మధురవాణిని అభిమానిస్తున్నప్పుడు మనము దుర్గుణాన్ని

1876 పందిరి ముల్లికార్డుసరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆరాధిస్తున్నామా? ఈ (ప్రశ్నలు అప్పారావుగారికే వేశారు ఆయన మిత్రులు మునిసుబహ్మణ్యంగారు. ఈ నాటకం నైతిక ప్రయోజనాల కుపకరించక, అపచారం చేస్తున్నదని ఖండించారు. యువజనం౦ చెడిపోతుందన్నారు. మీనాక్షీమధురవాణులు సమ్మోహాస్తాలు కనుక, అప్పారావుగారు సమాధానమసూ, తాము దుర్గుణాన్ని ఆకర్షవంతం చేయలేదని వుద్దాటించారు. మధురవాణి చివరకు సంస్కరింపబడినందుచేత, నాటకానికి ఒక నైతికోదాత్త గుణం సంక్రమించిందన్నారు. ॥ కాని మధురవాణిని ఏ సన్యాసినిగనో - శరత్‌బాబు చాలమంది పతిత స్తీంప్మాతలను చేసినట్లు - చేస్తేనే యీ విమర్శకులు తృప్తిపడేపక్షంలో, అప్పారావుగారు సుముఖులుకారు. మధురవాణి అంత గొప్పతప్పు ఏంచేసిందని? ఆమె మానవికాదా? “నీ, నా సుఖదుఃఖాదికా లెంత త్మీవమైన విషయాలో, ఆమెవీ అంతే. భోగంపిల్ల కంటె, భర్త కనుచాటున వ్యభిచరించే భార్య, భార్య కనుచాటున వ్యభిచరించే భర్త ఎల్లా గొప్ప? ఇటువంటివారితో సమాజం నిండివుంది. భోగంపిల్ల తాల్చిన గుర్తు కపటానికి తావియ్యదు. కాని యీ భర్త పేరుకు భర్త, భార్య పేరుకు భార్య. వివాహబంధపావిత్యుత ఏది, ఎక్కడ? కాని భోగంపిల్ల ఎటువంటి వివాహబంధాన్నికూడ (తెంచడంలేదు.” వాస్తవికత : కన్యాశుల్కం ఇక్కడే, అప్పారావుగారు వాస్తపికతనుగురించి ప్రస్తావిస్తారు. లేని తప్పులు అంటగట్టి భోగంపిల్లను వెలివేయడం, వున్న తప్పులు కళ్లుమూసి దాంపత్యాన్ని అతిశయంగా (ప్రస్తుతించడం యథార్థవాది అయిన రచయిత చేయవలసిన పనిగాదు. రచయిత న్యాయాన్ని పంచిపెట్టడంలేదు. అది అతని పనిగాదు. యథా జీవితచ్శితణ అతని పని. “వాస్తవవాదరచన వైతికబుద్ధికి చిక్కు కలిగించి నొప్పెపుట్టించే విషయాలను మెకెత్తక తప్పదు. నేను జీవితాన్ని చితిస్తున్నాను - దానిని కళాత్మకంగా ఆదర్శప్రాయం చేస్తూనే. కళ నా ప్రభువయినప్పటికీ, సంఘంయెడల నా బాధ్యత అంటూ జఒకటివృంది. జీవితంలో నేను చెర్లాటవూడను” అన్తీలవుని యథాజీవితచిత్రణను మానడం వాస్తవికతకు గొడ్డలిపెట్టు. అట్లని, అశ్లీలాన్ని మట్టుకే చిత్రించడం బ్రతుకులోని వెలుగుకు కళ్తుమూసికోవడమవుతుంది. జీవితం ద్వంద్వాల సమ్మిశ్రం. మంచిచెడ్డలు వేరువేరు నిష్పత్తులలోవున్నప్పుడు, పూర్తిగ మంచినికాని, పూర్తిగ చెడ్డనికాని చిత్రిస్తే, అది వాస్తవవాద చ్యితణకాదు. “చిన్నతనంలో బొమ్మలాట నేర్చివుండుటచేత, లోకమనే రంగంలో చిత్రకోటిరీతులను ఆటాడే మనుషులనే

కన్యాశుల్కం రమణా బెడ్డ్‌ 1877 పాత్రముల సాగసునే కనిపెట్టడము నాకు అలవాబైసది. సొగసులేని మనిషేవుండడు. స్నహమూ - (ప్రేమా - అనే అనాది అయిన్నీ ఎప్పటికీ సరికొత్తగావుండే, రెండు వెలుగులను నరులమీద కాంతి తిప్పి కాంచితే, వింతవింత సొగసులు బయలురేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా రపేక నలుపే” బ్రతుకులోని మురికిని చూపు సాహసం, వుంచిని చూప* సౌజన్యం, మంచి అనిపించుకో నేదానిలోని చెద్దసు, చెడ్డ అనిపెంచుకొనేదానిలోని మంచిని ప్రదర్శించే గొప్పదనం - యివి అప్పారావుగారి లక్షణాలు. రోమాంరోలాం అన్నట్లు, “కళ, సత్యము కలిసి జీవించలేకపోతే, కళ నాశనంకానీ! అప్పుడు జీఏతచ్యితమపుతుంది సత్యం. కళ అబద్ధమవుతుందిల మనుషులలోని సొగసును కనిపెట్టడంలో బుచ్చవ్ముకూ మీనాక్తి కీ, మధుతవాణికీ సాజన్యారావుకూ, గిఠీశానికీ రామప్పంతులుకూ అప్పారావుగారు ఏకాససమిచ్చి, మానవవాదిగా తమ్ముదాము నిరూపించుకున్నారు. జీవితాన్ని చూసి అసహ్యించుకొని అరణ్యాలవైపు గుహలవైపు మానవులను తరుషురు. కట్టమంచి రామలింగారెడ్డిగా రన్నట్లు, “అప్పారావుగారి ప్యాత్రలు సంపూర్ణంగా మానవత్వంతో నిండినవి. [పాణమున్న (పతిఒక్కరిలోనూ అవి జీవించి, జీవితాన్ని ఉత్సాహవంతంగా చేస్తాయి” (శిన్నెరః సంపుటము 5, సంచిక 7, జూలై 1895న ళు వ /

అభ్యుదయ కావ్యాల్లో “అగ్ని” సి. నారాయణ రెడ్డి

తెలుగు భాషలో వెలువడిన అభ్యుదయ కావ్యాలను తరచిచూస్తే “అగ్ని అనేపదం విరివిగా లభిస్తుంది. ఆంగ్లభాషా సాహచర్యంవల్ల మనకబ్చిన కవితారీతుల్లో ఈ “అగ్ని" ప్రయోగం ఒకటి. పాశ్చాత్యులు శీతలదేశస్థులు కావడంవల్ల వాళ్లు నిత్యం అగ్నిని ఆశిస్తూవుంటారు. అంచేత వాళ్లు “అగ్నిని వివిధ వస్తువులకు సాం కేతికం(5%౧00॥ల) గా తీసుకుంటారు. ఆంగ్ల సాహిత్యంలో కాల్చ్పనికోద్యమానికి బాటలుతీసిన షెల్లీ, కీట్సు, స్వింబర్ను మొదలగు కవులు అగ్నిని స్వేచ్చగా వాడుకున్నారు తమకావ్యాల్లో. "502164 29 0గ 2౧ ౪౧అగ౧౩౮|౩౧66 ౧6౭గ౧, 25063 2౧6 [2౧౧65 ౧౧ ౪0/65 2౧౧౦౧ గా౭౧|౧౮"”; (మండుతున్న కుంపటినుండి బూడిదను నిప్పులను వెదజల్లినట్లు మానవకోటి మధ్య నా శబ్దాలను విస్తరింపచేతును) అన్నాడు మహాకవి షెల్లీ. సప్రాణహైన శబ్దం అగ్నిమయం అని షెల్లీ అభ్మిపాయం. నిత్యజీవితంలో అగ్నికి అత్యంత సాన్నిహిత్యం ఉన్నందువల్ల పాశ్చాత్యకవులు అగ్నితో అంతగా ఆడుకున్నారు. కాని ఉష్టదేశంలో ఉంటున్న తెలుగు కవులకు అగ్నిపై ఇంత మోజు వుండడం ఎందుకు అనే ప్రశ్న కలుగుతుంది. ఎంత ఉష్టదేశంలో వుంటున్నా మన నిత్యవ్యవహారంలో అగ్నికున్న విలువ ఏమాత్రం తగ్గిపోలేదు. అగ్ని అనే శబ్దం వినేసరికి మన జీవనాలాల్లో సంచలనం, ఉత్తేజం కలుగుతుంది. ఎవనినైనా మెచ్చుకోవాలంటే “అగ్గిరాముడురా” అని అంటాం. పవిత్రతకు నిదర్శనం కావాలంటే అగ్నిని తీసుకుంటాం. ఆవేశంతో

అభ్యుదయ కావ్యాల్లో అగ్ని సి. నారాయణ లెడ్టి 1879 ఊగిపోయేమనిషిని చూస్తే అగ్గివలె మండిపోతున్నాడని అంటాం. సాక్షా ్య్రనికి శరణ్యం అగ్నియే. ఇట్లాగే అగ్నిని తెలుగు ప్రజలు నిత్యం వ్యవహరిస్తుంటారు.

మన (ప్రాచీన కావ్యాల్లో అగ్నిపయోగం ఇంతవిరివిగా అగుపడదు. ఉన్న కొన్ని వర్ణనలు స్వభావోక్తిలోనే వున్నవి. “రవికాంతపాషాణ రత్నమ్ములందుచ్చి, అగ్నిప్రత్యుత్ఞాన మాచరింప" అని శ్రీనాథుడు సూర్యోదయసమయాన్ని వర్ణించాడు. ఈ వర్ణనలోని అగ్ని కేవలం స్వాభావికమే. సాంకేతికం కాదు. కెంప్పురాళ్లను నిప్పుకలని మరికొందరు కవులు అఖివర్దించారు. కాని నేటివల అగ్నికి సాంకేతిక స్వరూపం యేర్పడలేదు. ప్రాచ్యపాశ్చాత్య కవితావృత్తులను జీర్ణించుకున్న శ్రీశ్రీ, తఆలుగులో కొన్ని అభినవ్యకల్పనలను జొప్పించినాడు. కావ్యాల్లో అనాదినుండి ఉంటూవస్తున్న “కవిసమయా”ల నతి[క్రమించి నూత్నకావ్య ఫక్కికలను సంతరించుకున్నాడు తన మహాప్రస్థాన గీతాల్లో. “కనపడలేదా మరోప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు" అంటూ వైతన్యం వెల్లివిరిసిన సంపూర్ణచేతనా జగత్తువేపు మన దృష్టిని మరల్చాడు. చిరకాలంనుండి చీకటిలోయల్లో [బతుకుతూ స్తబ్ధతాభారం మోయలేక సతమతమవుతున్న పీడితజీవులకు దూరదూరతీరాల్లో మెరుస్తున్న “అగ్నికిరీటం” ఆశను, ఉత్సాహాన్నీ (పేరేపిస్తుంది. “చావు పుట్టువుల పొలిమేరలలో అవులించె నొక చితాగ్నికుండం” అంటూ జీవసంధ్యాచితణ జరిపాడు శ్రీశ్రీ. బ్రతుకును వెన్నాడుతూ మృత్యువు పయనిస్తుంటుంది. చావునీడల్లోనే (బతుకు జీవపవనం పీలుస్తుంటుంది. చావు పుట్టువులు రెండూ మానవునితో నిరంతరం సంఘుర్షిస్తుంటాయి. ఈ నగ్నసత్యాన్ని చిత్రించడానికి చావుపుట్టువుల పొలిమేరల్లో చితాగ్నికుండం ఆవ్పలించినట్లు శీశ్రీ ఊహించాడు. జీవసంధ్యావస్థను అగ్నికుండంతో పోల్చి చక్కని భావస్ఫూర్తిని వెల్లడించాడు- “కంచువృషభముల అగ్నిశ్వాసం (కక్కే గ్రీష్మం” అని గానం చేస్తాడు శ్రీశ్రీ. ఇందులో గ్రీష్మబుతువులో భీష్మిస్తున్న ఉష్మాన్ని అగ్నిశ్వాసతో పోలుస్తాడు. శ్రీశ్రీ అనుయాయుల్లో నారాయణ బాబు, రమణారెడ్డి మొదలగువారు అగ్నిని విశేషంగా వాడుతూవచ్చారు. అనిసెట్టి “అగ్నివీణ” అను పేరుతో గేయసంపుటి ప్రకటించాడు.

అగ్నిఫణాలకు నిజంగా ఉద్విగ్నతాండవం నేర్పినవాడు దాశరథి. శిలను నవనీతంలా మలిచే ఉలి నైపుణిలాగే దాశరధికలంలో అగ్నిని అనుకున్నట్లు మండించే మహత్తంది. అతని కావ్యమే “అగ్నిధార” - కావ్యంలో గళలాలువిప్పి

1880 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము మార్మోంగేవి “అగ్నిగీతాలు” - అవి అప్పుడప్పుడు దేశంమీదపడి నగ్నంగా పరుగెత్తుతుంటే వాటిని రమ్మనిపిలిచి “అగ్నిచేలాలు"తో అలంకరిస్తాడు. మధుమాసంలో అరుణపుష్పాలలో మెరసిపోతున్న మోదుగుచెట్లను చూస్తే దాశరథిహృదిలో అగ్ని జ్వలించకతప్పదు. “నగ్నతనువులందు అగ్నిచేలమ్ములు కట్టుకొనె పలాశగణవుదేల” అని పృచ్చించుకుంటాడు. “నిప్పుపోవుల మోదుగుకొప్పులోన, అడవిజడ యెల్ల ముడివడి అడిగియుండె” అని మరోచోట అంటాడు. చివరికి “మోదుగు ముత్తెదువు"ను “నిప్పుకైదువు" అనంది ఊర్కోలేదు. ఈ కవితాఖండికల చదివిన తర్వాత మోదుగు వృక్షాలను మన స్మృతిపథంలోకి యీడ్చి తెచ్చుకుంటే అవి నిప్పృుగుడ్డలు తొడుక్కొని, నిప్పుపూలసు సిగలో తురుముకొని సర్వాంగసుందరంగా అగుపిస్తాయి. కవి కల్పనకు వమన అనుభూతులను జోడిస్తేనే కవిత వాస్తవిక రూపంలో సాక్షాత్కరిస్తుంది. పచ్చగా తెల్లగా విచ్చిన పుష్పాలనుచూచి “అగ్నిపుష్పాలు పూచె ఉద్విగ్నముగను అని పాడుకుంటాడు దాశరథి. అంతకే ఆగక “చల్లచల్లని వూలలో జ్వాల లెగసి (కమ్ముకున్నవి దిగ్గిగంతమ్ము లందు" అని గమ్మత్తుగా ఊహిస్తాడు. పూలల్లో జ్వాల లేమిటి? అని విరసులకు వెటకారంగా తోచవచ్చు. కాని వెచ్చని అనుభూతులతో వికసించిన కవిహృదయ నేత్రాలకు పూలు నిప్పుల్లాగా, వాటి నిట్టూర్పులు జ్వాలల్లాగా అగుపిస్తాయి. ఈ వర్జ్దనవల్ల సహృదయులకు ధ్వనిగా వేరొక భావం ద్యోతకమవుతుంది. పేదలు పెకి నిస్పహాయతవల్ల ప్రశాంతులుగా అగుపించినా, వారి హృదయాంతస్సులలో కృథాజ్వాలలు, అశాంతి తరంగాలు మసలుతుంటాయి. వాళ్లు చల్లని పూవులవంటివారే. కాని వాళ్లలో చెలలేగే క్రాంతిభావనలు జ్వాలలపంటివని దాశరథి మనకు వ్యంగ్యధ్వనితో ఇబుతాడు. సామాన్యుని ఊహకందని వస్తువు కవిహృదయాన్ని సంస్పందించగలుగుతుంది. అప్పుడే ఆతని వమునస్తం[తికలనుండి అవ్య క్తభావం రవళించి కావ్యరూపంలో బహిర్గతమవుతుంది. నా కలంలోగూడ అగ్ని చొరబడి వింతవింత విన్యాసాలతో వలి కుబుకుతుంది. ఓచోట “కోమలాంగారశయ్యలు" అని ప్రయోగించాను. అంగారశయ్యు లుంటాయా? ఉన్నా అంగారంలో కోమలత్వ ముంటుందా? అనే ప్రశ్న లుదృవింపవచ్చు - జగత్తులో కొందరు మృత్యుమార్గంలో (బతుకును దొర్లిస్తుంటారు - వీళ్లు శాంతికీ,

అభ్యుదయ కావ్యాల్లో అగ్ని. ని, నారాయణ లెత 1861 సౌఖ్యానికీ దూరమయి క్షుభితజీవితం గడి పేవాళ్లు - మృత్యువుకి ఆస్థానపీఠమగు శ్మశానంలోనే శాంతి లభిస్తుందను మసస్తత్వంగల ఈ రకం మనుషులకు చితాగ్నియే శయ్యగా రూపొందుతుంది. ఆ అగ్నిశయ్య కోమలంగా మృదులంగా ఉంటుంది. ఇంకో గేయంలో “ఉష స్పంధ్యాసోత స్సులో మసలే అగ్నిసుధలు అని ప్రభాతవేళను వర్ణించాను - ఇందులో అగ్నిసుధలు అను పదప్రయోగం “అంధాధుంద్‌ో గా చేయలేదు. దానికో (ప్రత్యేకత ఉంది. అమృతం హాయిగొలిపే అంత తీయగావుంటుందని అనాదినుండ్తి వస్తున్న విశ్వాసం. ఇది కేపలం ఊహాగానం మ్యాతమే. చూచినవాళ్లైవరూ. లేరు. అయినప్పుడు అమృతం మంచులాగా చల్లగావుంటుందని ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారమేది? అగ్నిలాగా కణకణలాడుతుందని వర్జించడంలో త ప్పేముంటుంది? పొగల్నుగక్కే టీ కాఫీలను అమృతంలాగా 'సేవిస్తున్నవాళ్లు వేడివేడి ఒరిజినల్‌ అమృతాన్ని చూస్తే ఎగిరి గంజేయరా? ఉషస్సు సుప్తజీవితాల్లో సంచలనం కలిగిస్తుంది. (ప్రాతఃకాల (పొగ్లిశ నవలోకిస్తే అనిర్యచనీయానందల వెల్లివిరుస్తుంది. కారణం? ఉషసృంధ్యాససోతస్సులో అగ్నిసుధలు మసలుతూ వుండడంవల్లనే, ఇట్లాగే నేడు ఉత్తమురచనల సృష్టస్తున్న అభ్యుదయ కవులందరూ “అగ్ని"ని కావ్యాల్లో ఉచితరీతిలో మలచుకుంటున్నారు. అగ్నిసరస్సు, అగ్నిరసం, నిప్పు చెక్కిళ్లు. నిప్పు "పెదవులు, అగ్నివర్షం, అనలదాహం మొదలగు ప్రయోగాలు ఎన్నో అగుపిస్తున్నవి. అయితే అన్నిచోట్లా (గుడ్డిగా అనుకరించక, కేవలం వ్యంగ్యమర్యాదలను చూపేచోటా, రస(ప్రవృత్తిని చిత్రించేచోటా ఈ అగ్నిని ఉపయోగిస్తే దీనివిలువ నశించక దినదినం యినుమడిస్తుంది. (కిన్నెర: సంప్పటము క సంచిక 7, జూలై 195) గి కషతేనె! ప్రై

అల్లి ఇల్లి శృంగారషష్టము డాక్టర్‌ నేలటూరి వేంకట రమణయ్య శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు “కవల షష్టముూ అను (గంథముగూర్చి యిట్లు పాసియున్నారు :

“ఇది యెవ్వరు చేసినదో తెలియలేదు. పుస్తకముయొక్క పేరునుబట్టి యిది యనేక కవులు చేరి చేసినట్టూహింపందగియున్నది. “తృతీయవర్గసరళమునకు రాచమల్లువారి షష్టస్క౦ధములో6 బయోగమ”ని యప్పకవి వ్రాసియుండుటచే నిది రాచమల్లు వారను నింటిపేరు గల కవృలచే రచియింపంబడినట్టు స్పష్టమగుచున్నది. ఆ కవులన్నదమ్ములయి యుండవచ్చును.

శా. శ్రీరామామణి సీత నాథునియురస్సీమ నిజచ్చ్భాయం గ న్నారం గన్గొని యాత్మ నన్యవనితేర్ష్యం బూన: దత్కంధరన్‌ హారం బున్నుచు నింకం జూడుమనం దా నౌటం (దపంజందం6 జ ల్వారున్‌ రాముండు ప్రోచుగాత మింక దిమ్మాధీశు తిమ్మాధిప్పున్‌

శా చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మ విధ్వస్తపా షండం బైనత్రిలింగభాగవత షష్టస్కంధ కావ్యంబు నీ కుం డక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీజ వాణీమనో భాండారోద్ధత చూజకారబిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్‌॥

పందిరి మల్లికార్ద్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

శృంగారషష్టము. డాక్టర్‌ నోలటూరి వేంకట రమణయ్య 1883 అని కవిసంశయవి చ్చేదములోను, సర్వలక్షణసారములోను గవుల షష్టమునుండి యుదాహరింపంబడిన పద్యములనుబట్టి యీ (గ్రంథము తిమ్మయపుతుండయిన తిమ్మయ కంకితము సేయబడినట్టు తెలియవచ్చుచున్నది. ఈ తిమ్మయ యచ్యుతదేవరాయని మంత్రులలో నొకడయిన ట్లొకానొకరు వ్రాసియున్నారు. అదియే నిజమైనపక్షమున, బమ్మెర పోతరాజకృత భాగవతము శిథిలముకాంగా పోయిన భాగములో నొకటియయిన యీ షష్టస్కంధమును 1530-42ల మధ్యను రాచవుల్లువారు చేసియుందురు. దీనియందు శృంగార ముధి కవుగా వర్ణింపంబడినందున దీనికే శృంగారషష్టము అను నామాంతరము కలిగియున్నట్టు కనబడుచున్నది” శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు “నంది సింగనయు ఘంటమల్లయయు6

గలసి యార్వీటి తిమ్మరాజున కంకితముగా షష్టస్కంధమును శృంగారషష్ట మనుపేర రచించిరి” అని వచించినారు.”* కవిగారి వాక్యములను సంశయించుచు, దీనిని “లక్షణ [గంథకర్తలు రాచమల్లువారి శృంగారషష్ట మని యుదాహరింతురు. ఇది యెొట్లో యని (ప్రయోగరత్నాకరములోనిదని పె నుదాహృతమైన “చండాంశు ప్రభవీక్షై యను పద్యము నెత్తిచూపిరి.” వీరేశలింగముగారి యభ్మిపాయముతో (ప్రభాకరశాస్తింగారు కొంతవజ కేకీభవించుచున్నారు. శృంగారషష్ట మును రచియించినది రాచమల్లు వారని వీరిద్దరును వక్కాణించుచున్నారు. కృతిపతి యగు తిమ్మయపుత్రుడయిన తిమ్మయ అచ్యుతరాయల మంత్రియనియు నగునేని రాచమల్లువారు 1530-42ల మధ్య శృంగారషష్టమును రచించి యుందురనియు వీరేశలింగముగా రూహించినారు. ఇందుకు విరుద్ధముగా రామకృష్ణ కవిగారు పై శృంగార షష్టమును రచించినవారు నంది సింగయ ఘంట మల్లయ లనియు వారా [గంథమును ఆరవీటి తిమ్మరాజున కంకిత మొనర్చెననియు బల్కుచున్నారు. వీరిలో నెవరి యభిప్రాయము సమంజసమైనదో కనుగొనవలసి యున్నది. మొట్టమొదట విచారింపందగినది గ్రంథకర్తల విషయము. వీరి నానవాలుపట్టుటకు దగిన సాధనము అెవ్వియు నింకను లభ్యపడలేదు! కాని రామకృష్ణ కవిగా రే

  1. ఆం్రకవుల చరిత్రము. పుట 344

  2. క్రీడాభిరామ పీఠిక.

1884 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యాధారమునుబట్టి నంది సింగయ ఘంట మల్లయ లా (గ్రంథమును రచించిరని చెప్పిరో తెలియదు. వీరేశలింగముగారును, ప్రభాకరశాస్తుంల వారును బాచీన లక్షణ్య(గంథముల నాధారపఅచుకొనియే తద్దృంథకర్తలు రాచమల్లువారని నిశ్చయించిరి. ఇది సమంజసముగనే కన్పట్టుచున్నది. ఇంక కృతిపతి విషయము నారయుదము. ఇతండు అచ్యుతదేవరాయల మంత్రియని వీరేశలింగము పంతులవారి యభ్మిపాయము. మన కెబుకపడినంతవజకు నచ్యుతరాయల కొలువున తిమ్మన నామధేయులు మువ్వురుండిరి. అందు ప్రథమమున గణింపదగినవారు అచ్యుతరాయల బావమరదులగు సలక రాజపుత్రులు పెద్ద తిరుమలరాజు, చిన్న తిరుమలరాజు లను వారిద్దరు. వీరిద్దరుగాక కందాచారాధిపతి నంజరసు తిమ్మయ యొక్కడు కలండు. వీరిలో నెవ్వరును శృంగారషష్టకృతిపతి యని చెప్పుటకు వీలులేదు. ఏలనంగా మై నుదాహరింపంబడిన ఠెండు పద్యములలోను నతండు చిక్కతిమ్మయ పుత్రుండైనట్లు చెప్పేయున్నది. అచ్యుతరాయల బావమరదుల తండ్రి పేరు సలకరాజు. కందాచారము తిమ్మయ తండ్రిపేరు నంజరసు. మజియు శృంగారషష్ట కృతిపతి “వాణీమనోభాండారోద్ధత చూజకారచబిరుద ప్రభఖ్యాతుల” జైనట్లు చెప్పేయున్నది. సలకరాజప్పుతులకుగాని నంజరసు తిమ్మయకుగాని యీ బిరుదుండెనని తలంచుట కాధారములేదు. కావున, వీఠవ్వరును నృంగారషష్ట కృతిపతులని యెంచుట కవకాశములేదు. ఇక రామకృష్ణకవిగారు చెప్పునట్లు శృంగారషష్టకృతి ఆరవీటి తిమ్మరాజగునేమో చూతము. ఆరవీటివారి వంశాపలినిబట్టి చూడగా నా వంశమున దిమ్మరాజనామధారులు పెక్కండ్రు గానవచ్చుచున్నారు. ఈ వంశమునకు జెందిన శాఖలు ముఖ్య మైనవి మూడు కలవు : 3. ఇందు మొనట పద్యము చతుర్థపాదమ్లున - “ఇల్వారున్‌ రాముండు ప్రోచుగాత మింక దిమ్యూఫీశ తిమ్మాధిపున్‌ అని యున్నది. ఇది - “రాముండు ప్రోచుగాత చికతిమ్మథీశ తిమ్మాధిపున్‌” అని యుండవలయును.

శృంగారషష్టము. డాక్టర్‌ నోలబూరి వోకు తమణియ్య 1885 శే నంద్యాల స్టాళ్లు ఈ శాఖలో ఏమ్మరా జొక్కడే కానవచ్చుచున్నాడు బుక్కరాజు సింగరాజు సరసింగరాజు నారపరాజు నరసెంగరాజు తిమ్మరాజు 2. అవుకు శాఖ (అ) బుక్కరాజు | రామరాజు | త్‌మ్మరాజు తమ్మరాజు చినతిమ్మ రాజు పాపతిమ్మ రాజు చినకొండమరాజు | / లా చినతిమ్మరాజు కోనేటితిమ్మరాజు ఇందు రావురాజు తిమ్మరాజూనకు తమ్మ, చనతిమ్మ, పాపతిమ్మ, చినకొండలను ప్పుతులును, చినకొండనికి చనతిమ్మ కోనేటి తిమ్మలను పుత్రులును గలరు.

1886 వందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అప్పుకు శాఖ (ఆ) బుక్కరాజు రామరాజు పెదకొండాజు కోనేటిరాజు తిమ్మరాజు ఈ శాఖయందొక తిమ్మరాజు కలడు. 3. కందనవోలు శాఖ బుక్కరాజు రామరాజు శ్రీరంగరాజు తిమ్మరాజు అళియరామరాజు తిరుమలరాజు వెంకట్నాది పెదతిమ్మ చినతిమ్మ శ్రీరంగ | చినవెంకట తిరుమల వంకట తిమ్మ

శృంగారషష్టము. డాక్టర్‌ నేలటూరి వేంతడు రమణయ్య 1887

ఇందు తిరుమలనామధేయము గలవా రిర్వురును, తిమ్మనామధారు లిర్వురును, చినతిమ్మ యను నాతం డొక్కండును గానవచ్చుచున్నారు; కాని యారవీటివంశజు లందరిలోను దిమ్మరాజు కుమారుడగు తిమ్మరా జొక్కడే కానవచ్చుచున్నాడు. ఇతండు అవుకుశాఖ (అ)కు చెందిన బుక్కరాజు రామరాజు కుమారుండగు తిమ్మరాజు. ఇతనికి పెద తిమ్మరాజనియు నామాంతరము గలదు. ఇతనికి చిన తిమ్మరాజు, పాపతిమ్మరాజను తమ్ములు గలరు. ఇతడే శృంగారషష్ట కృతిపతి యని శ్రీ రామకృష్ణ కవిగారు వక్కాణించిన యార్వీటి తిమ్మరాజు. కాని యీ తిమ్మరాజు తండ్రిపేరు తిమ్మరాబే కాని చిక్కతిమ్మరాజు కాదు. మజియు నార్వీటివా రెవ్వరికిని వాణీమనోభండారోద్ధత చూజకారుండను బిరుదు లేదు. కావున, శృంగారషష్ట కృతిపతి యార్వీటి తిమ్మరాజు కాజాలండు.

చిక్కతిమ్మయ తనూజుండగు తిమ్మయ వీరేశవింగము పంతులుగారు సెలవిచ్చిన ట్ల్రచ్యుతరాయల మంత్రియుగాండు; రామకృష్ణ కవిగా రూహించిన ట్లార్యీటి తిమ్మరాజునుగాండు. అతండాంధ్రచోళ వంశజుడు. ఈ [క్రింది కన్నడ శాసనమువల్ల నిది విదితమగుచున్నది.

“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వరుషంగళు 1443 వైయ విక్రమ సంవచ్చరద మాఘ శుద్ధ? లూ శ్రీమతు శ్రీరామచంద్రదేవర భండారకె ఉత్తమగండ గండరగండ గండభేరుండ సరస్యతీమనోభండార సూజెగార బిరుదాంకితరాద యేరువ సింహాసనాధీశ్వర శ్రీమత్‌ కాశ్యపగ్యోతద శ్రీమన్‌ మహామండలేశ్వర చికతటిమ్మయదేవ మహా అరసుగళ కొమారరు తిమ్మరాజగళు కొట్ట ధర్మశాసన దక్రమవెంతందెరె శ్రీరామచంద్ర దేవర అమృత పడిగె శ్రీ వీరకృష్ణరాయ మహారాయరూ సమర్పిస్త సాండూరు సీమ హాలిగణ తాళూరగ్రామదలు ...” ఇత్యాది.

ఇందు బేర్కొనబడిన తిమ్మరాజు చిక్కతిమ్మరాజు కుమారుండు; మజియు సరస్వతీమనోభండార సూజేగార బిరుదాంకితుండు;ః కావున, నితడె శృంగారషష్ట కృతిపతి యని దృఢముగ బలుకవచ్చును. అగునేని యతండు కృష్ణ దేవరాయల సామంతుడనియు క్రీ. శ. 1521-22 సంవత్సరమునం దేబువసీమ నేలుచుండె నని నిశృయమగుచున్నది. శృంగారషష్ట రచయితలగు రాచమల్లు వారును నప్పుడె వర్ణిలియుండవలయును.

1888 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అరణి (చెంగల్పట్టు జిల్లాలో శ్రీ పందిరి మల్లికార్డునరావుగారి అధ్యక్షతను జరిగిన “ఆంధధసంస్కృతి మహాసభిలో శ్రీ నిడదవోలు వేంకటరావుగారు ఉపన్యసిస్తున్నారు. ఉపన్యాసకులు (ఎడమనుంచి కుడికి) శ్రీ కోట సత్యరంగయ్య | గన. . ౧||. సా / * “కిట న్య అదితి న ధే తో 1 లీగల్‌ జ్‌ ఇక (7 ట్‌ “ప్‌? శ ర్య క్త శ ర " షే | శ ఓ ఎక 7 “క్‌ ఆల్బా క్‌ న ౮. ॥ వ ( శాస్తింగారు, శ్రీ పిలకా గణపతి శాస్త్రిగారు, శ్రీ నిడదవోలు వేంకటరావుగారు. శ్రీ పందిరి మల్లికార్డునరావుగారు (సభాధ్యక్షులు), శ్రీ వాసిరెడ్డి రాధాకృష్ణగారు ఉన్నారు. (ఎడవ్య్య పక్క నిలుచున్నవారు) వుహాసభఖ కార్యదర్శి శ్రీ డి. సుబహ్మణ్యంగారు (కుడిపక్క నిలుచున్నవారు కోశాధిపతి శ్రీ ఎం. కుప్పయ్యగారు. ఫోటోగ్రాఫర్‌ ; శ్రీ ఎన్‌, కృష్ణయ్య గారు. (కిన్నెర: సంప్పుటము క, సంచిక 7, జూలై 1953)

కావ్య విమర్శన సంప్రదాయములు శిష్టా రామకృష్ణ శాస్త్రి విమర్శ శబ్దమునకు మూలపదమగు *కిటిసిజం” అను మాటకు (1పాడ్వివాకత్వమని యస లర్థము. విశాలార్థమున నీ పద ముపయోగించినను గూడ నీ యర్థమే సాధారణముగ స్ఫురించుటచే గాబోలు ఈ కాలమున సామాన్యముగ విమర్శకుడనగ, మరణదండనసు బొందబోవు నేరస్టునియందుపలి, కావ్యకర్తయందు దోషములను జూపి ఖండించువాడనియు, విమర్శయనగా దోషారోపణచేసి నిందించుటయనియు నొక దురభిప్రాయము ప్రబలినది. యథధార్థమున కిది శుద్ధవ్యత రేకము. సౌందర్యతత్త్వమును బహుస్పష్టముగ వివరించుటే లలితకళోపాసకుని లక్ష్యము. ఒక వస్తువందలి వాస్తవస్వరూపమును చూచి, యున్నదున్నట్లు నిర్ణయింపగల్లుటే సత్యమైన విమర్శ యనబడును. కళాభిజ్జుడు ప్రతిపాదించు (పతికళాకార్యమును, (పకృతి యందును, మానవజీవితవుంలదునుగల సుందరరూపములును, (పత్యేకానందమును గల్గించు శక్తులుగా నతడు పరిగణించును. ఈ మహత్తును దాననుభవించి, దానిని విచిధ విభాగములుగ విభజించి వ్యాఖ్యానించుటి కత డభిలషించును. చితపటమునందును (పకృతియందుగల సంధ్యారాగాడులు గాని, ప్రపంచమునను కావ్యముసనుగల విశేష సుందరమూర్తులుగాని, రసానందానుభవమును గల్గించు నమూల్య లక్షణములతో (ప్రకాశించును. ఆనందమును గల్గించు చితపటాదులందలి సుందరవమూర్తులందుగల విశిష్ట గుణవమలను (పత్యేకపజుచి, యా

1890 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము యానందానుభవమును వివరించి, దాని ననుభవింపచేయు మార్గముల నుపదేశించుటయే కళావిమర్శకుని ధర్మము. ఆ ముఖ్యలక్షణముల నేర్ప్చజచి గుర్తించినచో నతడు కృతకృత్యుడగును. కావ్యము లలితకళలలో నొకటిగాన, కావ్యవిమర్శకూడ మైధర్మములు గల్గియున్నదని (గ్రహింపనగును. కళాకార్యము దేనిన్రైసను విజ్ఞానవివేకములతో నభినందించుచు, తతృలితముగా దాని న్యూనతాధిక్యములను, స్థానమును నిర్ణయించుటయే విమర్శ యగును. కావ్యవిమర్శకు డనగా కావ్యమందలి గుణదోషములను విచారించి దానికై దన యభిప్రాయమును దెల్పు పండితుడని ముఖ్యముగా నెంచబడును. ఈ విచారణలో “అభిరుచి” అను పదము సాధారణముగ నుపయోగింపబడును. ఈ శబ్దమునకు “కళాభినందనశక్తి - రసజ్ఞత” యని యర్థము. ఇది విజ్ఞానావేశముల కూడికయేకాని యొక తత్త్వము గాదు. వా్బయమందలి ముఖ్యలక్షణములను నిర్ణయించి, వివిధ వాజ్బయశాఖలందు ద్యోతకమగు నా లక్షణములనుగూర్చి విచారించుటయ విమర్శకుని కర్తవ్యము. సారస్వతనిర్మాణ లక్ష్యములైన భావన, రసావేశము మొదలైన విషయములు, మాధుర్యప్రసాదములు మొదలైన రచనాగుణములసుగూర్చి సారస్వతవిమర్శ విచారించును. సమన్వయమునకు వలయు (ప్రత్యేక లక్షణములను బోధింపక, విమర్శ సర్వసామాన్య సారస్వతధర్మ ములను కనిపెట్టి తెల్పుటకు మాత్రమే ప్రయత్నించును. విమర్శకుని ప్రధాన కర్తవ్యము కావ్యాభినందనము; కాని వాజ్బ్ఞాయమున దాని స్థాననిర్ణాయకత్వము ద్వితీయపప్రయోజనము మాత్రమే. కవుల శక్తితారతమ్యములను నిర్ణయించుట సులభము, నుచితముగూడ గాడు. ఉత్తమకవులలో ప్రతిభ యనేకవిధములై యనన్యసామాన్యముగ నుండును. కాన వారిలో తారతమ్యమును చూపుట దుర్లభము. మరియు “లోకోభిన్నరుచిఃొ, కాస నొకరికి నచ్చిన యొకానొక గుణము మరియొకరికి నచ్చకపోవచ్చును. అందుచే నీ తారతమ్మ్యనిరూపణముగూడ సర్వజనాదరణప్యాతము గాదు. నన్నయ తిక్కనలం౦దుగాని, శ్రీనాథ పోతనలందుగాని, పెద్దన సూరన రామరాజభూషణులందుగాని న్యూనతాధిక్యముల నిర్ణయించుట కష్టము. “ఒకానొక కావ్యమెందుకు బాగుండలేదు. మరియొక కావ్యమందులకు బాగున్నది. కావ్యముస రసానందశక్తి యెందున్నది. అది సకలజనాదరణ పాత్రమై యింతకాలము , నశింపకుండుటకు కారణమేమి" అను ప్రశ్నల సమాధానమునందే కావ్యవిమర్శ సూత్రము లిమిడియున్నవి.

కావ్య విమర్శన సంప్రదాయములు శిప్రా రామకృష్ణ శాస్త్రం 1891 కావ్యసృష్టి - విమర్శనృష్టి

(పపంచమున బ్రహ్మ మానవులను సృష్టింపగ, కవి కావ్యమున మానవజీవితమును ్రతిపాదించును. బ్రహ్మ సృష్టించిన ప్రపంచమున గొన్ని లోపములున్నవి. వానిని కవి తన కావ్యమున సంస్కరించి చూపును. ఇందుచే కావ్యము ప్రపంచమునకు కేవల మనుకరణముగాక మెరుగుపెట్టి నట్లగును. కనుకనే కావ్యము మానవజీవిత విమర్శ యనబడినది. అనగా కావ్యరచన విధివిధాన విమర్శ యన్నమాట. కవి తన పప్రయత్నమున నే మార్గమవలంబించెనో, యందెంతవరకు కృతకృత్యుడయ్యెనో, యతని విధానమందలి గుణదోషము లేవో విమర్శకుడు విచారించును. మొత్తముమీద విధివిధానమును విమర్శించుట విమర్శకుని పనియగుచున్నది. |

(ప్రపంచమున రక్తమాంసాదులతో మానవులను (బ్రహ్మ సృష్టించి వారికి వివిధభావములను గల్గించును. కాని యా మానవునకు సౌందర్యము, తేజస్సు, ఆకర్ష్ణణీయవిగ్రహము, శీలము, విజ్ఞానము, నాగరకత మొదలైన సుగుణములతో నాదర్శపప్రాయమైన యొక వ్య క్తిని ధాత సృష్టింపదలచినప్పుడు, ప్రకృతియందలి కొన్ని లోపములవలన నా సృష్టింపబడిన వ్యక్తిలో నేదోయొక గుణము కొజతపడుచునేయుండును. అంత కవి, గుణలోపములేని యాదర్శపాయమైన వ్యక్తిని మనస్సున భావించి, కావ్యమున సృష్టించి పాఠకుల నానందపెట్టును. ఈరీతిగ జగమున నంతర్లీనమైయున్న సౌందర్యానందములను కవి ప్మాతల యాకారచితతణము, భావపోషణము మొదలైన విధముల రసమయరూపముగా నొనర్చును. ఇక విమర్శకుడు కావ్యమున షానసవజీవితమును వ్యాఖ్యానరూపమున ననువదించును. కావ్యము మానవజీవిత (పతిపాదనముగాన, కావ్యవిమర్శ మానవజీవిత తత్త్వానుగుణముగ నుండ వలయునను మాట మరుపరాదు. పద్యకావ్యము, నాటకము, నవల మొదలైనవి ప్రత్యక్షముగా మాసవజీవితముతో సంబంధించి యుండును. ఇక సారస్వత విమర్శ పద్యనాటకాది కావ్యములతోడనే సంబంధించియుండును గాన, వివధరూపములుగల కావ్యసృష్టై మానపజీవిత వ్యాఖ్యానమని నిర్వచించినచో, ఆ వ్యాఖ్యానమునకును దానిని వ్యక్తీకరించిన ఆ కళాస్వరూపవబమలకును వ్యాఖ్యాన ముని విమర్శ వాజ్మయువమను నిర్వచింపవలయును. మానవజీవితవుఎతో (పత్యక్షపంబంధవఎమగల కావ్యవాజ్బయమునకును, కావశ్షవాజ్మయముతో సంబంధించిన విమర్శ

1892 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. పంప్పుటము 4; సాహిత్యము వాజ్బాయమునకు విశేషఫేదము లేదు. జీవితములో మన కభిరుచికరమగు ముఖ్యమైన విషయములతో వాజ్మయము గూడియున్నది. కవి, మానవజీవితమునే వస్తువుగా గ్రహించి కావ్యముగా రచించినట్లే, యా కావ్యమున (పతిపాదింపబడిన వివిధ మానవతత్త్వములను పరిశీలించును గాన, విమర్శకుడుగూడ మానవజీవితమునే తమ విమర్శనకు వస్తువుగా [గగ్రహించును. కవితాసృష్టి మానవజీవితము నుండి ప్రత్యక్షముగా వస్తురసాలంబన భావాదులనుు గ్రహించునట్లే, విమర్శనగూడ మానవ జీవితమునుండియే వస్తురసాలంబన భావాదులను పొందును. జీవిత పరమార్థమును గూర్చి తన విశాలాభ్మిపాయములో పాఠకులు పాల్గొనునట్లు కవి చేయుచో, సారస్వత పరమార్థమునుగూర్చి తన విశాలాభ్మిపాయములో పాల్గొనునట్లు విమర్శకుడొనర్చును. కాన విమర్శగూడ నొకవిధముగ సృష్టియగుచున్నది. విమర్శకుడుగూడ కవితో సమానధర్మము గలవాడగుచున్నాడు. విమర్శాపశ్యకత

కవుల (ప్రభావము మహోన్నతమైనది. గంభీర భావపూరితములగు వారి యుద్గ్ద్యంథములు జనసామాన్యమునకు, భాషాపాండిత్యలోపము వైననేమి, రస[గ్రహణలోపమున నేమి సులభగ్రాహములు గాదు. వీనికితోడు కవి తన భావములను చమత్కారముగను, వ్యంగ్యముగను చెప్పునేగాని వాచ్యముగ పచ్చిగ చెప్పడు. మరియు సారస్వతాభిరుచులు ప్రతికాలమునను మారుచుండుటచే, తర్వాతకాలమువారు పూర్వకావ్యములును పూర్తిగ ([గహంపజాలరు. కాని కావ్యరసానందానుభవమున ప్రతి మానవునకు సమానమైన హక్కుగలదు. కనుక, లోకకల్యాణార్థము రచింపబడిన కావ్యములను పరిపూర్ణముగ నర్థముచేసికొని, రసానంద మనుభవింపవలననిన వ్యాఖ్యలు, విమర్శలు, భాష్యములు తప్పక కావలయును. అవిలేనిచో కావ్యము లర్థముకాక పాఠకులు క్లేశపడుటయేగాక, వాని ప్రయోజనమే సిద్ధింపదు. కాన విమర్శలు, వ్యాఖ్యలు పాఠకులకు మార్గదర్శకము లగును. విమర్శ పై దోషారోపణము

కావ్యముఖ్య(ప్రయోజన మైన రసానందజనకత్వమును (ప్రత్యక్షముగ చదువుకొనుట వలననే సిద్ధించుచున్నది. కాని మధ్య విమర్శకులు చదువుటవలన

కావ్య విమర్శన సంప్రదాయములు శిష్టా రామకృష్ణ శాస్త్రి 1893 పాఠకుడితరులు చెష్పిన యభ్మిపాయములమీదనే యాధారపడవలసి యున్నది. మధ్య యితరుల (గ్రంథములను చదివి కాలయాపనము చేయనేల? మజియు విమర్శలు మిడిమిడిజ్ఞానమునే గల్గించును గాని, సంపూర్ణజ్ఞానమును, రసానందమును గల్గింపవు. కాన విమర్శ్శవలన (ప్రయోజనములిదని పూర్వపక్షము. మూల్యగంథములను మూలదోసి, విమర్శలు కుప్పలుకుప్పులుగా పెరిగి, యసలైన విషయమును గప్పిపుచ్చుచున్న యీ కాలమున నీ యాక్షేపణ యథార్థముగానే కనబడుచున్నది. కాని విమర్శనకు స[కమమైన పప్రయోజనమును, స్థానమును లేకపోలేదు. విమర్శవలన లాభనష్టములను గుర్తింపవలసిన యవసరమున్నది. విమర్శపఠన మెప్పుడు మోసగించునో, యెప్పుడు సహాయకారియగునో, స్వానుభవము వలననే తేలికగా (గ్రహంపగలము. ఒక కావ్యమును గూర్చి పరిపూర్ణమైన విశేషజ్ఞానమును సంపాదింపవలెననిన, మనము ప్రత్యక్షముగా దానిని చదువుటకు బదు లితరులు దానినిగూర్చి చెప్పెన దానితో సంతృప్పెపడినయిడల విమర్శ మోసమగును. మొదట కావ్యమును చదివి (గ్రహింపగల్లిసంత (గగ్రహించిసతర్వాత విమర్శసలు చదివినచో, నేదోషము నుండదు. మరియు కావ్యమును చదువునపుడు వాఠకులు (గహింపజాలని విశేషములసు విమర్శలు చూపి యధికానందమును గలుగచేయుటయే కాక, యింకముందు గూడనా దృష్టతో చదివి గ్రహించుటకు సహాయపడును. కావ్యమును చదువుచు పాఠకుడానందమును పొందుచున్నానని తా భావింపవచ్చును. కాని యది యథార్థమగు స్థిరమైన రసానందమో లేక యా కావ్యము తన మనస్తత్త్వమునకుగాని, కాలాభిరుచికిగాని యనుగుణముగా నుండుటచే పొందిన రసానందాభాసమగు తాత్కాలికోల్లాసమో నిశృ్చయించుటకు అధికగుణియగు విమర్శకునికే సత్యమైన గక్తిగలదు గాని, సామాన్య పాఠకునికి సాధ్యముగాదు. సామాస్యపాఠకు డానందమును బొందుటకు మాత్రమే కావ్యమును చదువునుగాని, దానితోకూడ కవిత్వశిల్పము నుండి కవి వ్య క్రిత్వమును గనుగొసు దృష్టితో చదువడు. అతని కాశక్తిలేదు. ఇక విమర్శకు డా విధముగ చదువుటకు శక్తిగలవాడు.

జ్ఞానసంపాదనకు ప్రతిశాస్త్రమందును, వాజ్యయమండుగూడ లాఘవపర్ధతు అధికముగా 'పెరిగిపోపుచున్నటి. లోకము ధారాళముగా మాట్లాడు బహురచయితలను గూర్చి (ప్రత్యక్షముగా ఆలిసికొనుటకు తీరికగాని, సహనముగాని లెని యీ

1894 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కాలజీవితపవాహమునను, భిన్నాభిరుచుల సంఘర్షణమునను, వారినిగూర్చి తెలిసికొన గోరువారు లాఘవపద్ధతులమీదనే పూర్తిగ నాధారపడుదురు. వ్యాస వాల్మీకి కాళిదాసాదులు, నన్నయ తిక్కన పోతనాదులు, హోమరు, షేక్సియరు మొదలైనవారి పెద్ద పెద్ద గ్రంథములను ప్రత్యక్షముగా చదువుటకు సామాన్యజనులకు కాలము చాలకపోవుటయేకాకు యితర తాపష్తత్రయము లనేకముండుటచే సాధ్యపడదు. కాన వాని సంగ్రహములో, విమర్శలో వారి కోరికలను దీర్చును. అంతమాత్రముచే నది దోషముగాదు. ఎందుకన, మ మహాకవులను గూర్చి (గ్రంథములనుగూర్చి యజ్ఞానమున నుండుటకంటె, సంగ్రహ విమర్శల మూలమున కొంతమొన తెలిసికొనుట మేలుకదా. మానవుల జీవితకాలము స్వల్పము; తీరికయు పరిమితమే. ఇక వారివారి వృత్తులు ఖిన్నములు. ప్రపంచమున నుత్తషు సారస్వతము విశాలమైనది. ఉత్తమకవు లనేకులగూర్చి తెలిసికొనగోరు కోరిక తమశక్తికి నవకాశమునకుగూడ మించిపోయిన విషయము. కనుక వారినిగూర్చి యితరులు రచించిన లఘురచనలను చదువుట సమంజసమేకాని దోషముగాదు. లోకమందలి యుత్తమకవుల (గ్రంథముల నామూలా[గ్రము చదువుట సాధ్యము గాదు. కాన వాని సారమును మాత్రము సవిమర్శకముగ (గ్రహించుటయే యుచితమును లాభదాయకముగూడ. కాన నిట్టి పరిస్థితిలో కవులను వారి కావ్యములనుగూర్చి యితరుల యభి(ప్రాయములపై నాధారపడరాదనుట సమంజసముగాదు. రెండవ యాక్ష్తేపణ యుపదవమైనది. ఒక కావ్యమును గూర్చి యితరుల వాక్యములను, నిర్ణయములను పాఠకు లంగీకరింపవలసివచ్చునప్పుడు, విమర్శకుడు విశేష విద్యావంతుడును, మేధావియునగుచో పాఠకులతనికి లోబడిపోయి యాతని వాక్యములను పరమప్రమాణములుగా [గ్రహించుదురు. అందుచే నా కావ్యమాతని బుద్ధిప్రకారము పరిశీలించినవారగుదురేగాని, తమ స్వంత బుద్ధితోగాదు. అతడు (గ్రహించినది మాత్రమే పాఠకులు (గగ్రహింతురు. కాని యతడు జారవిడిచినది పాఠకులుగూడ వదులుదురు. కాన పాఠకునకునా కావ్యమునకు మధ్య నాత డాటంకముగా నుండునేకాని వ్యాఖ్యాతగా నుండడు; మార్గదర్శకు డగుటకు బదులు మార్గకంటకు డగును. అందుచే (ప్రత్యక్ష్తసంబంధ మవరోధించి యా కావ్యముమై పాఠకునికి స్వతంత్రాఖ్నిపాయమున కవకాశము లేకుండ విమర్శచేయును. మరియు నీ విమర్శలు సామాన్యముగ కవిని తిరస్కరించి పాఠకునకు కవియందుసు కావ్యమందును గౌరవమును చెడగొట్టునన పూర్వపక్షి మరియొక యాక్షేపము గలదు.

కావ్య విమర్శన సంప్రదాయములు... +ిప్టా రామకృష్ణ శాస్త్ర 1895 విమర్శువలని దోషములు దారుణములైనను, దానివలన ననేక లాభము లున్నవనుట నిస్సందేహము. దానిని తిరస్కరించుట యనగా, తమకంటె నావరు తెలివిగలవాడు లేరనిగాని, పరుల వివేకానుభవములవలన పాఠకులకు లాభములేదనిగాని భావించుటయే. ఈ సందర్భమున పాఠకు లహంకారమును మాత్రము తీసి వేసికొనవలెను. లేనిచో, వేదాంత (విషయ్యగ్రహణ) మందువలిె, దీనియందును కావ్యవిషయతత్త్వము నున్నదున్నట్లుగా (గ్రహింపలేరు. విమర్శ ముఖ్యప్రయోజనము విశేష జ్ఞానోత్సాహములను గూర్చుటయే. యథార్థమైన విమర్శుకునకు సామాన్య పాఠకులకంటె నధికమైన విశాలదృష్టియు. నా విద్యలో పరిపూర్ణమైన జ్ఞానము నుండును, మరియు నతనికి సూక్ష్మ్మదృృషస్టయు, నతీంద్రియజ్ఞానము, తీక్షణాలోచన మొదలైన విశిష్టలక్షణము లుండును. అట్టివాడు మహాకావ్యమున సామాన్యపాఠకులకంటె విశేషము (గహింపలేడని భావించుట యపచారము. అతనిసాయమున పాఠకులు కావ్యమందలి శక్తినాలదర్యాది గుణములు, నభిరుచి సౌభాగ్యమును, విశేషార్ధములను గసుగొసలేరని తలంచుట గొప్పదోషము. వాని సాయములేనిచో వారు విశేషగుణములసు గసుగొనలేని యంధులగుదురనుటకు సందేహములేదు. విమర్శకు డెపుడును పూర్తిగ నూతన దృక్పథమును గూర్చును. పాఠకునికి లీలామాత్రముగ నస్పష్టముగ గోచరించు భావములకు స్పష్టమైన రూపము నొసగి వ్యాఖ్యానము చేయును. అతడొకప్పుడు (కొత్తదారులు తీయును. పాఠకుడొకప్పుడు దారిలో దాటిపోపు చిరపరిచిత వస్తువులందు గూడ, నపూర్వవిషయములను జూపు మిత్రుడగును. ఈవిధముగ సూక్షాగ్జిభినందన శక్తితోడను, నిశిత పరిజ్ఞానముతోడసు తిరిగి చదువున ట్లతడు మన కుపదేశించును. ఇంతేకాదు. మన దోషభూయిష్ట మైన నిర్ణయములసు సరిదిద్ది, మన పూర్వాభ్మిపాయములను గూర్చి సలహానిచ్చుటయేకాక, యుత్సాహపరచి యెల్లప్పుడు మనకు సాయముచేయును. అతని యుపదేశములను సారస్వతమువలె చురుకుగా, జాగరూకతతో, పరిశీలించితిమేని, యతడు చెప్పిన దానితో మన మేకీభవించినను, లేకున్నను దోషములేదు. ఏవిధముగనైస మస మతని సంపర్కమున సూక్ష్మదృప్టని నూతనశక్తి నలపరచుకొందుము. తర్వాత రెండాక్షేపణలును విమర్శకాభిప్రాయభేదముల వై నాధారపడినవి. మూడవ యాక్షేపణ యేదనగా, “లోకో భిన్న రుచిక్‌ కాస వ్య క్రిగతాభిరుచులు సహేతుకములని బుజువుగావు. అందుచే నవి నిర్ణ్మయముసకు ప్రమాణము కాపనిరి. ఒక కావ్యముమై భిన్నాఖిపాయములుస్నపు డొకదానికంటె మజియొకదాని కక్కువ

1896 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (పామాణికమిచ్చుట సమంజసముగాదు. అభిరుచికి బాహ్య్యపమాణము లుండజాలవు. కావ్యము శ్రోతల కానందముగూర్చుట కుద్దేశింపబడినది. కాన నది యానందముగూర్చినచో బాగున్నదందుము. అట్లే యది పలువుర కానందముగూర్చినచో పలువురచే మెచ్చుకొనబడి (పజాదరపాత్ర మగును. కాని వీనియందు హెచ్చు తగ్గు లుండగూడదు. అభిరుచి నిరంకుశమును, నిర్హేతుకముగ నుండును గదా! కాన వానిని నియమబద్ధముచేయ వీలులేదని వాదము. .

ఈ యాక్షేపణ సామాన్య మానవస్వభావమునకు విరుద్ధముగా నున్నదని మాత్రము చెప్పవలసివచ్చును. సాధారణముగా సారస్వతమున న్యూనతాధిక్యములు గుర్తింపబడినపవి. ఈ యఖిరుచి వ్యత్యాసములకు గొన్ని నిర్ణాయక్కపమాణము లుండితీరును. కాని యవి యస్పష్టములై నిర్వచింపబడుట కష్టసాధ్యము కావచ్చును. అభిరుచి విషయములలోగూడ న్య్యూనతాధిక్యము లున్నవనియు, వానిభేద మధిక జనసంఖ్యాభిప్రాయముమీద నాధారపడదనియు పండితులందరు సామాన్యముగ నంగీకరించిరి. కాలప్రవాహమునగాని, తదితర కారణములవలనగాని యొక కావ్యము బహుజనులకు నచ్చవచ్చును. అంతమ్మాత్రముచే నది యుద్గుంథము గాజాలదు. సామాన్యజనులకు కావ్యపఠనకాలమున నానందమొందు దృష్టియేకాని విమర్శకదృష్టి యుండదు. అందుచే వారికి గ్రంథాధిక్యనిర్ణయాధికారము లేదు. అధిక గుణయుతుడును, సహృదయుడు నగు విమర్శకుడే యందుల కర్షుడు. కాన బహుజనాభిప్రాయమైనను సద్విమర్శకాభిప్రాయము నెదుట నిలువలేదు. ఇట్టి విషయములలో సంఖ్యాబలము గణనీయముగాదు. రంగూన్‌రౌడి నాటకము అభఖిజ్ఞానశాకుంతల నాటకముకంటి నెక్కువజనుల నాకర్షించినంతమా[త్రమున నది శాకుంతలముకంటె నుత్కృష్టమైనదని నిర్ణయింపరాదుగదా.

నాల్గవ యాక్షేపణ యెక్కువ తీవ్రమైనది. సమర్థులైన (ప్రాడ్వివాకులలో గల యజభ్శిప్రాయభేదము. ఒక జాతియందలి ప్రసిద్ధ విమర్శన, మజియొక జాతినుండి భేదించుచున్నది. ఒక్కజాతి యందే యభిరుచిపమాణములు కాలకాలమునకు

...... విశేషముగ మారుచున్నవి. మజియు నొక్కజాతియందే, యొక్క కాలముననే సమాన శక్తిగల ప్రసిద్ధ విమర్శకులలో ముఖ్యవిషయములందే యభ్మిపాయభెదము గలుగుచున్నది. ఉదా : నన్నయ తిక్కనల కవితా ('ప్రాశస్త్యవషయము. సమర్థులగు

కావ్య విమర్శన సంప్రదాయములు. శిప్రా రామకృష్ణ శాన్త్రి 1897 వివుర్శకులలోనే యభ్మిపాయభేదము లుండుటనుబట్టి సర్వసమ్మతమైన విమర్శసూత్రములను కూర్చపయత్నించుట యాశాభంగకరమగునని పూర్వపక్షము.

కాని యథార్థమునకు విబధజాతులందును, కాలములందును వ్యక్తులందుగల రుచిభేదము, వారియొక్క భావముకంటె బహు స్య్వల్పముగనేయున్నది. అంగీకరించిన విషయములు భేదించినవాని సంఖ్యకంటె నధికముకాకపోయినను, నెక్కువ ముఖ్య మెనవి. అట్లుగానిచో లోకమున శాశ్వతవాజ్బయ ముండుటయీ సాథ్యముగాదు. (ప్రపంచమున కళ, లక్ష వాజ్మ్బయమే శాన్వతముగ నిల్చియుండునది. మిగిలిసనవన్నియు [పాతపడి, నాగరకతాభిపృద్ధివలన మరుగుపడిపోవునవే. కాళిదాసు కాలమందలి ప్రతివషయము నేడు మారిపోయిససు, కాళిదాసు కవిత్వము మాత్రము (ప్రాతపడలేదు. అతని కవిత్వమును రెండువేల సంవత్సరముల పూర్వమున్న జనులఖీనందించి నట్దె, మన మిప్పుడుగూడ నభినందించుటయేకాక వారు మెచ్చుకొనిన ముఖ్యమైన కావ్యగుణములే, నేడుగూడ మసలను మెచ్చుకొనునట్లు చేయుచున్నవి. కాళిదాసునకాలప్పు జనుల దృష్టిలో కవిత్వమన నెట్లుండెనో, నేటిజనుల దృష్టైలోగూడ కవిత్వమన నట్లేయున్నది. లేకున్నచో మన మాతని కవిత్వము నేడు మెచ్చుకొనియుండ నేరము. కాళిదాసు కవిత్వమునకు మురిసిపోయిన వారు భారతీయులేకాక పాశ్చాత్య దేశములలోగూడ నున్నారుగదా. అట్లి ఆం గ్లేయకవియగు షేక్స్పియరు కవితను మసముగూడ మెచ్చుకొనుటలేదా. ఇందుచే నభిరుచియందు ముఖ్యమైన [మొక్కము గలదనిరపే మనము నిశృయింపవలెను. కాన విశ్వజనీన సమనస్వయముగల విమర్శన సూత్రములు గలవని స్పష్టము. ప్రసిద్ధ విమర్శకులలో నొకేకావ్యమునుగూర్చి యభిప్రాయబభేదములు గల్లుట కా కావ్యమందలి విశ్‌ష్టలక్షణములందు వారికిగల (ప్రత్యేకాఖిమాన గౌరవములే ముఖ్యకారణము; కాష్యగుణములుగా నంగీకరింపబడిన యొకొక్కలక్షణము ప్రత్యేకముగా నొక్కొక్క విమర్శకుని కితరములకంటె నధికముగా నాకర్షించుటయే. ఈ యాకర్ణణ మీ విమర్శకుని తత్త్వము_పె నాశ్రయించియుండును. సారస్వత విమర్శ యిట్టి ప్రత్యేకాభిమానముల కవకాశమియ్యవలసినదే. ఇది మూలైక్యభావమునకు సామరస్యము గల్లియేయున్నుది.

మిగిలిన యాక్తేపణలు కెండును సారస్వత తత్త్వముపై నాధారపడియున్నవి. “అనంతో వై రసాల అను విషయము చాజ్బయమున ననుభవపూర్వకముగ నందరిచే నంగీకరింపబడనది. కాన వానినన్నింటికి నొక లక్షణముచేయుటకాని,

18986 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సారస్వత రచనల నన్నింటియందుకల సమానమైన లక్షణములను చూపుటకాని సాధ్యముగాదు. వాజ్యయమందలి గుణము లెన్నియోవిధములుగ నసంఖ్యాకమువై, భిన్నభిన్నములుగనున్నపి. వివిధదృష్టులు గల వారి కైక్యభావముగూర్చుట కష్టముగాదు. కాఐ, సారస్వతమునగల యనంతములైన వివిధలక్షణములందు సవమానగుణవములను నిర్ణయించుట వ్యూతము సాధ్యముగాదు. విశాల సారస్వతాభినందన శక్తి గల విమర్శకుడు నన్నయ యుక్షరరమ్యుతను, (పసన్నకథాకవితార్థయుక్తిని మెచ్చుకొనుటయేకాక, తిక్కన రచనయందలి “యల్పపదములతో అనల్బ్పభావమునుగూర్చి రసపోషణచేయు” ప్రజ్ఞను గూడ స్తుతించును. మజియు శ్రీనాథుని దీర్తసమాసభూయిష్ణ శైలితోపాటు చేమకూర వెంకన్నయందలి సరససుకుమారకైలికి ముగ్గుడగును. కావ్యము చిన్నదైననుః పెద్దదైనను గుణము ముఖ్యము. శిల్పకాశలము "పెద్ద శిలావిగ్రహమందును, వజపు టుంగరముననుగూడ సమానముగ ప్రదర్శింపబడును. అట్లే యొక కావ్యము బుద్ధిని వికసింపచేయవచ్చును. మజియొక కావ్యము హృదయమును (వింపచేయవచ్చు. ఇంకొకటి రచనాస్వరూపమందలి సాకువూర్యము లోబర్చుకొనవచ్చును. ఇట్లు బహువిధములైన సారస్వతతత్త్యముల నేకముఖమునకు దెచ్చి లక్షణబద్ధము చేయుట అసాధ్యమని ఆక్షేపణ. వివిధ కావ్యములందలి రసవంతములైన విషయములను వివరించి చూపుటయే విమర్శకర్తవ్యముగాని, యా [గ్రంథ న్యూనతాధిక్యములను నిర్ణయించుటగాని, కావ్యాఖినందనార్హ (ప్రమాణములను నిర్ణయించుటగాదు. కావ్యము తన కభిరుచి గల్గించినట్లే, యితరుల కభిరుచి గల్గించు విషయములను దిక్సూచివలె విమర్శకుడు చూపును. విమర్శ ప్రాశస్త్యము విమర్శకుని వివేక సాహృదయముల మీదనే పూర్తిగా నాధారపడియుండును. విమర్శ లక్షణములను నిర్ణయించుటకు పై యాటంకము లంగీకరింపవలసినవేకాని యంతమాత్రముచే నవి సారస్వతము నభినందించి, దాని యర్హతను నిర్ణయించుట నసాధ్యముగ చేయజాలవు. ఎందుకన సారస్వత లక్షణములను గుర్తించి, కావ్యార్హతలను నిర్ణయించుటకు (పయత్నమారంభిం చినతోడనే, వానిని విభాగించుసందర్చమున కొన్ని గుణము అంగీకరింపబడి వూర్గదర్శకవలలగును. కాన. నా (ప్రయత్నము నిరుత్సాహకరముగాని యాశాభంగకరముగాని యొంత మాటత్రముగాదు. ఉదాహరణమునకు - భావన అనేకవిధములుగ నుండును. కాని యది యేరూపముననున్నను వాజ్బ్ఞయమునకు కావలసిన ముఖ్యలక్షణ మేకదా. కాన

కావ్య విమర్శన సంప్రదాయములు... శిప్రా రామకృష్ణ శాస్త్రి 1899 భావనస్వభావము, దాని కార్యవిధానము, లీలనుగూర్చిన విచారణ, యది యెక్కడ ప్రదర్శింపబడిననుగూడ, మన యభినందనమునకు సహాయకారి మొతీరునుగదా.

ఇక నారవ యాక్ష్తేపణ మిగిలినవానికంటె నెక్కువ బలమైనది. సారస్వతము వ్య క్తిగతాభ్మిపాయ [ప్రకటినమని ఆలుపబడినది. కావ్యశక్త్యానందదాయకత్వములు ప్రతిభ లేక ఆత్మీయతపై నాధారపడియుండునుగదా. ఆ (ప్రతిభాలక్షణములను వర్చించుటకు గాని, నిర్వచించుటకుగాని, వివరించుటకుగాని సాధ్యముగాదు. అది యనిర్వచనీయమును, వర్దనాతీతమునైనది. ప్రతిభను వ్య క్తీకరించు ప్రతికావ్యము నూత్నమెనది. “ప్రతిభా నవనవోన్మేషశాలిత్వ” మని పెద్దలు వాకొనిరి. కాన దానిని నియమబద్ధము చేయబూనుట దుర్లభము. ప్రతిభను నియమబద్ధముచేసిన నవనవోన్మాషశాలిత్వము నశించును. గాన ప్రతిభయే నశించును. శాస్త్రబద్ధమైన విమర్శ మనకు గావలసిన ముఖ్యగుణమునే తీసివేయును. ఏలన, నియమబద్ధము చేయబడిన విమర్శ సాదృశ్యములతోడను, లక్షణానుగుణ్యములతోడను సాగును. తత్పలితముగ నొక కవిరచన మరియొక కవిరచనతో నెక్కడెక్కడ పోలియున్నదో, చివర కందరు కవులు కళాకావ్యసూతముల నెట్లు పాటించిరో వివరింపబడును. కాని మనకు కావలసినది యిదిగాదు. మనకు ముఖ్యముగా కావలసినది యుకానొక కవిరచనలోగల విశిష్టలక్షణమేమి? ఇతరులకు నితనికిగల భేదమేమి? అతని కావ్యరసాస్వాదనము చేయుటకు విమర్శకు డంతవరకు సాయపడును - అని. ఈ విధముగ నొక కవి నభినందింపచేయుటకు సామాన్యవిమర్శకుడు చాలడు. ఏవిధమైన విమర్శకూడ పూర్తిగ నీ పని నిర్వహింపలేదు. ఒక కవి రచనమును పూర్తిగ రుచిచూడవలనన్న తానే (ప్రత్యక్షముగా దానిని చదువవలగాని యితరులెవ్వరు తనకొజకు రుచిచూడలేరు.

ఈ పూర్వపక్షమున నతివ్యాప్తిదోషమున్నది. ఎందుకన, స్వంతరుచిపై నాధారపడెడు విమర్శకుని కేవల ప్రాడ్వివాకత్వము చాలదు. కావ్యముయొక్క బాగోగుల కారణములును, సాక్ష్యవివరణమును కావలసియుండును. కాన నీ (పాడ్వివాకత్వము నరపుటకు గొన్ని ప్రమాణము లుండవలను. కాన కవి ప్రతిభను, ఆత్మీయతను వివరించిచూపుటకు గొన్ని ప్రమాణములు, లక్షణములు నున్నట్లు భావించుకొనదలను. ప్రతభావంలతుని కృతియందలి విశిష్టలక్షణములసను విపరించి, వర్గీకరింప సాధ్యముకాకపోయినను, ఆ కృతిని విమర్శించు ప్రయత్నమున నా

1900 పందిరి షుల్లికార్డునరాప్పు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (ప్రమాణము లేవో యొక రీతగనున్నవనియే ముందు భావింపవలసియుండును. విమర్శ్మయనగా స్వతంత్రాభ్మిపాయముగాదనసి ముఖ్యముగా నజబుగవలయును. అది కొన్ని పవమాణములకు బద్ధముగా నుండితీరవలయును. ఈ వివర్శపవమాూణములు కావ్యనిర్మాణ సూతములుగా పరిగణింపరాదని గుర్తింపవలెను. ఉత్తమ కళాకార్యము నియమములకు బద్ధముగాదు. అది స్వతంతమైనది. నియమములన్నియు వాజ్బయమునుండి గ్రహింపబడినవి. కాని నియమప్రమాణముల నుండి వాజ్బయము పుట్టలేదు. ఏ కావ్యమందలి బాగోగులను నిర్ణయించుటకైనసు లఘువైన పద్ధతిని విమర్శప్రమాణములు లేవు. విశ్వజనీనత, ఉదాత్తత, రామణీయకము, భావనాబలము, ఉపజ్ఞ వైచిత్రి, రసము, ధ్వని, యౌచిత్యము మొదలైనవన్నియు కలిసి విమర్శప్రమాణములు గాదగునుగాని, వీనిలో నేడో యొక్క దానినే యాశయించి విమర్మయంతయు నాధారపరచినచో సంతృప్తికరముగా నుండదు. మహాకావ్యములలో ననేకవిశేషములు గల్సి, బహువైవిధ్యముండును. కాన వానినన్నింటిని కొలది (ప్రాథమిక లక్షణములతో కొలిచి యభినందింపగల్గుదుమని యాశింపరాదు. ఈ [ప్రమాణము లెంత విలువగలవైనను, విమర్శ కుండవలసిన వానిలో నివి ముఖ్య మైనవిగావు. విమర్శన కుండవలసినవి ముఖ్యముగా సహృదయత్వమును, రస్యగహణశక్తియు, (ప్రాడ్వివాకత్వము నెరపుటకు పూర్వము విమర్శకుడు కావ్యమును స్వంతముగా చదివి యనుభవించి చూడవలయును. ఈ _ప్రవూణలక్షణవములు కావ్యరసాన ందానుభవ మునకు ముఖ్యావసరమైన రస్యగహణ శక్తని, సాధారణధర్మములుగా చేయలెకపోయినను, మన సహృదయత్వముసకు దారిచూపి, విపరీతరుచులను సరిదిద్ది, మన సద్యస్సురితాభిపాయమును శాన్వతమైన స(క్రమప్రాడ్వివాకత్వమున కనుగుణముగ నుండునట్లు చేయును. కావ్యవిమర్భన మార్గములు

కావ్యవిమర్శన పద్ధతులు నాల్గు విధములుగ నున్నపి. మొదటిది, కఏకృతకావ్యములను మా[తత్రము చదివి యందలి విశేషములు దెల్పుచు వాన్‌తో తృప్తిపొందుట. ఇది సామాన్యముగా పురాణపఠననపణములం దవలంబింపబడుసది. రెండవది సాహిత్యపద్ధతి, లేక యాలంకారిక పద్ధతిని కావ్య గుణదోషరీఆ పాకశయ్యాలంకారవిశేషములను స్పష్టపరచి యా కవి ప్రాచీనలక్షణకర్తల నియమములను పాటించెనా, లేదా, పాటించినచో ఎంతవరకు పాటించెసని విచారించి.

కావ్య విమర్శన సంప్రదాయములు. శిప్రా రామకృష్ణ శాస్త్ర 1901 దానినిపట్టి యా కావ్యప్రాశస్త్యము నొన్నుటి. ఇది మన (పాచీనవ్యాఖ్యానకర్త లవలంబించిన మార్గము. ఈ మార్గముననే యాంధభారత భాగవత రామాయణమును వసుచరితాది కావ్యముల యుపోద్దాతములం దనుసరింపబడినది.

మూడవది, వాజ్బయ మా జాతీయజీవితమందలి పరివర్తనములను (పపతిపాదించునుగాన, నా దేశకాలపరిస్థితులకు నా కావ్యమునకు గల సంబంధమును గుర్తించి, యా కాలమందలి కవితాభిరుచులతో గూడిన రీతులకు, నాయాకవుల రచనలకు సమన్వయమునుజూపి, యా కవి కాలప్రవాహానుగుణముగ రచించెనా, లేక నూత్న మార్గముల నవలంబించి తన వ్య క్తిత్వమును ప్రతిభను చాటెనా యని విచారించి యాయా యుగములం దా కవులస్థానమును నిర్ణయించి, యా సారస్వతమందలి వివిధశాఖల పరిణామమును దెల్పుట. ఎందుకనగా వాజ్ఞయము చరిత్ర కుపదేశముఖము. పత్మిగంధథ మా కాలచర్శిత జ్ఞానావశ్యకతల నరయుచున్నది. ఉదా - ఆ కాలపు రాజకీయచర్చలు, వక్తృత్వము, నిందాగర్భరచనలు మొదలైనవి. ఆంగ్రసారస్వతమున బర్కు, స్విఫ్ట, కార్తెలు మొదలగువారి రచన లిట్టివి. సంస్కృతమున రాజతరంగిణి, తెలుగున పల్నాటి వీరచరి[త్ర, రంగనాయ చరిత్ర, కృష్ణరాయవిజయము నిట్టివి. ఇవి యా కాలప్పు సాంఘిక మానసిక తత్త్యములను వెలిబుచ్చుసు. ఆ కాలమున జరిగిన సంఘటసలు దెలియనిచో వీరి రచనల పరిపూర్ణార్ణ మవగతముగాదు. ఆ కాలపు నైతిక, రాజకీయ, సాంఘిక మతాభ్మిపాయములకు, నాకాలపు [ప్రామాణిక సారస్వత లఅక్షణములకు, తాత్యికబుద్ది మొదలైనవానితో ననుసరణముగాని, విష్లవముగాని విచారింపనిచో కొండరి కప్పలనుగూర్చి దురభ్మిపాయము పడవలసివచ్చును. 0 ౮౦౧౧5౦౧'$ ౬6 ౦1 11110౧ యెల్లీకాలపు రాజకీయ చార్మితకపరిసరముల జ్ఞానములేనిచో నతని కవిత్వము దుర్చోధకమగుసు. మరియు నా కాల్మపభావము వాజ్మయ స్వరూపమునుగూడ నిర్ణయించును. ఒక్కొక్క యుగములో నొక్కొక్కవిధమైన వాజ్బయస్యరూపము (ప్రభావము నెరపును. ఒకప్పుడు పురాణములు, మరొక్కప్పుడు ప్రబంధములు, నింకొకప్పుడు నాటకములు, ఒకమారు నవల, మరొక్కప్పుడు గేయము, నింకొకమారు కథానిక మొదలైనవి (పాముఖ్యము వహించును. ఆ యుగము గొన్నివిధములైన రచనలను గౌరవింపకపోయినను, అ పరిసరముల కనువైన సారస్వతమే నిలుచును. ఒకయుగమున నిరాడంబరదైన. సరళమగు స్మక్రషుప్తూర్వక రచన గౌరవింపబడును. మరియొకాలమున శబ్దాడంబరముగల దిరసమాస భూయిష్ట 3లి యాదరింపబడును.

1902 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఇంకొకప్పుడు భావగాంభీర్యము, కల్చ్పనాపటిమ (ప్రాధాన్యము వహించును. ఉదా

  • పురాణములనాటి సరళశైలి, రెడ్డిరాజులకాలపు శ్రీనాథుని సంస్కృతజటిల సమాస రచన, ప్రబంధముగమునాటి శ్లేషకవిత్వము మొదలైనవి. చారిత్రిక విమర్శ యాయా యుగములందలి గుణములను గొప్పగా మెచ్చుకొని, కొన్ని దోషములను చూచియు చూడనట్లు దాటిపోవును. తత్పలితముగ కవిత్వ(పప్రామాణికత్వమును, మహాకావ్యగౌరవమును కాలకాలమునకు మారుచుండును. ఒకే గొప్ప చారిత్రకసంఘటనము భిన్నజాతులలో భిన్నపరిణామమును గలుగజేయును. జాతీయ జీవితమందలి చారిత్రిక, నైతిక ప్రభావములను చారిత్రిక విమర్శకుడు సూక్ష్మదృష్టితో గమనింపవలెను.

నాల్గవది, కావ్యమందలి విశేషాంశములకును కవి జీవితచరిత్రకును గల సంబంధమును గనుగొని, యారీతి కావ్యము నాత డట్లు వ్రాయుటకు గల కారణమును, సాధనసంపత్తిని తెలిసికొని వానికిగల సంబంధమును సమన్వయమును గల్పించుచు నా [గ్రంథము నాతని యితరకావ్యములతోడను, తత్స్పదృశమైన యితరకవుల కృతులతోబోల్చి, యద్దానివలన (గహింపనగు స్వారస్యములను వలువరించుటి. కావ్యమును కవిజీవితముతోసహా యెందుకు పరిశీలించవలెననిన, కవి వ్య క్తిత్వమునుండి, యాత్మీయతనుండియే కావ్య ముద్భవించునుగాన, నాతనికావ్యమును పూర్తిగ నఖినందింపవలననిన కవిజీవితచరిత్రతో పరిచయము సాధ్యమైనంతవరకు గల్గియుండవలను. అది తన స్వానుభవఫలితముగ జనించినదగుటవలన, నాతని యనుభవములనుగూర్చి యెంత విశేషముగ నితరాధారములవలన (గ్రహించిన, నంత పరిపూర్ణముగ నతని కావ్యతత్త్యమును (గ్రహించి, దాని నభినందింపవీలగును. కాని యా కావ్యోత్క్భృష్టతను నిర్ణయించువిషయమున విమర్శకుడు కవి వ్య క్రిగతాభిమానమును జూపరాదు. కవిజీవితము నాతని కావ్యమునుబట్టి నిర్ణయించుట ధర్మముగాని, యతని కావ్యోత్కృష్టత నతని జీవితచరిత్రనుబట్టి నిర్ణయింపజూచుట యుచితముగాదు. ఏ యుత్తమకావ్యమందైన నేదేని విశిష్టలక్షణముండును. కాన నా కవి విశిష్టత నాతని జీవితమందలి నిర్ధారితసంఘటనల జ్ఞానముతో పరిశీలింపదగును. కావ్యమందలి కొన్ని విరుద్ధముల నాతని జీవిత చరిత్రయందలి సంఘటనలబట్టి సమర్థింపనగును. అట్టివానితోడి పరిచయమువలన నా కవితో సహృదయభావము నెజప్‌ యతని కావ్యములను ద్విగుణీకృతముగ నభినందింప వీలగును. వీనిలో చివరి రెండు పద్ధతులు మనకు పాశ్చాత్యవిద్యాసంపర్క ప్రభావముచే గలిగినవి. మొదటి రెండును మన (ాచీనాలంకారికు లవలంవించిన మార్గములు.

కావ్య విమర్శన సంప్రదాయములు శిష్టా రామకృష్ణ శాస్త్ర 1903

కొన్ని యుత్కృష్టకావ్యముల రచనాకాలమునుగూర్చిగాని, తదచయిత లనుగూర్చిగాని మనకేమియు దెలియరాదు. కాళిదాసు, హోమరు, నన్నయ మొదలగుకవుల కాలపప్రభావములుగాని, వారి జీవితచర్నిత్రలుగాని మనకు దెలియవు. మరియు నా విషయములను గూర్చి మనము ఆలిసెకొన నవసరముగూడ లేదు. ఆ కావ్యములు సకల కాలములకును జెందినవి. మహాకావ్యము లన్నియు నింతే. షేక్సయరునుగూర్చి బెన్‌ జాన్సను “అత డొకకాలమునకు జందినవాడుగాడు, సర్యకాలములకు జెందినవా” డనెను. అట్లే సకల మహాకావ్యములును, మహాకవులుగూడ. వీరు కాలప్రభావమునకు లొంగని విశాల మానవాభ్శిపాయములతోడను, సంబంధముల తోడను వ్యవహరించుటచే, కాలము వారికావ్యములకు ప్రాచీనత్వము గూర్చలేదు. డాంటి, మిల్టను, షేక్సి ి యరు, కాళిదాసు మొదలైనవా రిట్టివారు.

భారతీయులు లక్షణశాస్త్రములను సమన్వయముచేయుచు రచించిన వ్యాఖ్యలేకాక, పూర్వపక్ష సిద్ధాంత చర్చలతో భాష్యములను రచించినారు. కాని వారు సాహిత్యగంథములకు వ్యాఖ్యలను మాత్రమే రచించిరి. భాష్యములను వేదవేదాంత, తర్కవ్యాకరణాది శాస్త్రములకు మాత్రమే రచించిరి. శాస్త్రవిషయము లగాధములు, నతిసూక్ష్మములుగాన వాని కట్టి ప్రక్రియ కావలసివచ్చినది. మరియు భారతీయులు శాస్త్రములనన్నింట నుచ్చదశయం దాధ్యాత్మి కవిద్యతో సమన్వయించినారు. అట్టి తర్కవేదాంతవ్యాకరణాది శాస్త్రములు పరస్పరము కలిసిపోయి యాధ్యాత్మిక తత్త్వమును (ప్రతిపాదించుట కొకదానికి మజియుకటి సహాయపడెను. ఇట్టి క్లిష్ట విషయములను విపులముగా వివరించుటకుగాను పూర్వపక్షసిద్ధాంత చర్చలతో మన (ప్రాచీనులు భాష్యములను రచించిరి. కాని లౌకికములు నాదిభౌతికములైన సాహిత్యగ్రంథముల క్రీ భాష్యప్రక్రియ నవలంబింపక మన ట్రాచీనులు లాఘవములైన వ్యాఖ్యలతోడనే సమాధానపరిచిరి. కాని పాశ్చాత్యులు సాహెత్య(గంథముల కే భాష్య (పక్రియ నవలంబించిరి. ఆధ్యాత్మవిచారణకై పాశ్చాత్యుల దృష్టి నిశితముగా పసరింపకపోవుటచే, నాదిభౌతిక, తర్క, మానసికాది శాస్త్రముల సహాయ సమన్వయములతో సాహిత్యగ్రంథములను పరిశీలించి భాష్యుములను రచించిరి. వీనికిదోడు మనవాళ్లు శ్రద్దవహింపని చరిత్ర వారికి మూలాధారమై చార్తితిక విమర్శకు బహుసహాయకారిమై విమర్శకు పుష్టిగల్లించినది. ఇదే వీరి విమర్శునతత్త్వ్యము. ఇట్టి ప్రక్రియ మన ప్రాచీనులు సాహిత్య(గ్రంథముల కలవడబేయమిచే మన కిది యిపుడు నూతనముగా నున్నది.

1904 పందిరి సుల్లికార్టునరావు శతజయంటి సంపుటము 4: సాహిత్యము మన యలంకార (గంథములందుకూడ నక్కడక్కడ మంచి విమర్శకసూత్రములు మాతము లేకపోలేదు. రసవిషయమునుగూర్చియు, నలంకారములనుగూర్చియు నతిసూక్ష్మవుమగ వునవాళ్లం తరిచిచూచిరి. కాని పాతపోషణాది విషయములనుగూర్చి గాఢపరిశీలనము చేయలేదు. చేసినవి సాంకేతికములై పోయినవి. ఉదా - నాయికానాయక లక్షణములు. " లక్షణ శాస్త్రము - విషుర్శ

లక్షణ శాస్త్రమునకు విమర్శకు ముఖ్యభేదములు నాలుగు గలవు. ఒకటి. లక్షణ శాస్త్రము కావ్యముల నుత్తమ మధ్య మాధమ భేదముల నిర్ణయించును. కావ్యము లందలి ప్రత్యేక లక్షణములను మాత్రమే విమర్శ నిరూపించును గాని, వాని న్యూనతాధిక్యముల నిర్ణయించుట ప్రధానముగాదు. రెండు. బాహ్యములైన నైతికరాజకీయ ధర్మములు మానవుని శాసించినట్లుగ, లక్షణశాస్త్రము సారస్వత సూత్రములతో కవి ననుశాసింపదు. విమర్శకుని కట్టి చట్టములులేవు. అతనికి సారస్వత లక్షణములు బైటనుండిరావు. ప్రకృతి శాస్త్రృజ్ఞునికి ప్రకృతి లక్షణము లెట్లు ప్రకృతిలోనే యుండునో, విమర్శకునికి నట్లే సారస్వత లక్షణము లాకావ్యముననే యుండును. అందలి సత్యములనే లక్షణములుగా మార్చి చెప్పును. (ప్రకృతి ధర్మములను భౌతిక శాస్త్రజ్ఞుడు ప్రత్యక్షముగ పరిశీలించి, స్మృకమముగ వానిని సామాన్య న్యాయములుగ నొనర్చి చెప్పుటే (కృతి ధర్మసూతములగును. సర్వవిధముల నదే విధముగ సారస్వత సూత్రములను (గహింపవలను. అది యున్నవానినే చెప్పునుగాని యుండవలసినవాని నూహించి ఇప్పడు. కాళిదాసుని నాటక కళాసూూతములెక్కడో బైటనుండి వచ్చి, వాని ననుసరించుట కతడు బాధ్యుడై యుండుటకు, నతనిమై నారోపింపబడలేదు. కాని యవి యాతని నాటకములను వ్యాకరించుటవలన మనము [గ్రహించిన లక్షణములే. అతని నాటకములను ప్రత్యక్షముగా పరిశీలించి, యందలి లక్షణములను గుర్తించి వానిని సామాన్యధర్మముల (క్రింద తల్పుటే విమర్శకుని ధర్మము. .

మూడు. లక్షణ శాస్త్రజ్జులు శాస్త్ర పాండిత్యము చేతను, కొన్ని సాంకేతికములును సమయసిద్ధములైన యాచారములందలి యభిమానముచేతను, అవిమర్శ మూలకములైన కొన్ని లక్షణములను ప్రమాణముగా (గ్రహించి, వానినిబట్టి కావ్యోత్కృష్టతను నిర్ణయించిరి. ఈ ప్రమాణములు వివిధ కాలములలోను, వివిధ లాక్షణికులలోను భేదించినవి. ఈ కారణములచేతనే లక్షణశాస్తృము వశేషముగ

కావ్య విమర్శన సంప్రదాయములు శిప్రా రామకృష్ణ శాస్త్రం 1905 నగౌరవముపాలైనది. అయినప్పటికి నట్టి కొన్ని ప్రమాణములు స్యీకరింపబడినవి. విమర్శ యట్టి స్థిరప్రమాణముల నామోదింపదు. మరియు నట్టివి సాధ్యమనిగూడ నంగీకరింపదు. శాస్త్రములందలి తత్త్వృములవలె, వాజ్బయము పరిణామముగలది. దాని చరిత్ర యెడతఆగని పరివర్తనముల చరిత్ర. కనుక శాశ్వత విమర్శ స్తూత్రములకై వెదుకుట తప్పక పరాజయమొసగును. ఎందుకనగా నంతములేని వస్తువుల ప్రకృతిలో నంతము నూహించుట గాన. నాలుగు. లక్షణ శాస్త్రము కావ్యమెట్లు రచింపవలయునో తెల్పును. కవి రచించిన కావ్యము నభినందించు మార్గములను విమర్శ యుపదేశించును. లక్షణ శాస్త్రము ముఖ్యముగా కావ్యస్వరూపమును గూర్చి మాత్రమే బోధించును. కాని యది యా కావ్యము (వ్రాయదగినదా, కాదాయని నిర్ణయించుటకు (ప్రయత్నింపదు. విమర్శ ముఖ్యముగా కావ్యవస్తువుతోడను, కావ్యతత్త్వము తోడను వ్యవహరించును. ఉదా : కవిత్వ తత్వవిచారము (క. రామలింగారెడ్డిగారి రచన) కవి యే తత్త్వముతో కావ్యమును రచింపవలయునో, పాఠకున కెట్టి శక్తిని గూర్చువలయునో విమర్శ తెల్పును. కాన విమర్శ లక్షణశాస్త్రముకంటె నున్నతమైనది. విమర్శగూడ శైలిని, రచనాస్వరూపమును గూర్చి విశాలదృష్టితో విచారించును. కాని లక్షణశాస్త్రముకంటె విమర్శ విశాలమును, నిశితమునైన పరిశీలనముగలది. కాని వివమర్శసూ(తతములు లాక్షణికసూ(తములవలె స్పష్టమైనవిగావు. ఈ కారణములచే లక్షణశాస్త్రముకంటె విమర్శ భిన్నమైనదగుట స్పష్టము. విమర్శ యిటీవలెనే పాశ్చాత్య విద్యాపరిచయ ప్రభావమువలన మనకు కల్సినది. అది మన కసలు (కొత్తది. కాన లాక్షణిక స్యూతములను సమన్వయించి (ప్రాచీనులు రచించిన వ్యాఖ్యానములు భాష్యములును విమర్శకంటె భిన్నములైనవని చెప్పవలయును. " -. అనుమేయ విమర్శ పెన దెలిపెనట్లు వివుర్శ (పప్రయోజనములైన కావ్యవ్యాఖ్యానార్హ నిర్ణయకత్వములను రెంటి నిటీవల వరకు పండితులు సామాన్యముగా కలిపెయ వ్యవహరించిరి. ఎందుకనగా ననేక విమర్శకులు (ప్రాడ్వివాకత్వమునే విమర్శ ముఖ్యప్రయోజనముగా నెంచి, దానికి సాధనముగా వ్యాఖ్యానమును స్వేచ్భగా నుపయోగించుకొనిరి. ఇటీవల వీనిభేదమునకు (ప్రాముఖ్యమిచ్చి, పండితు లీ

1906 పందిరి మల్లికార్టునరావు శతజయంతి నంవుటము 4: సాహిత్యము రెండు ప్రయోజనములను (ప్రత్యేకపరచి, విమర్శకుని ముఖ్యకర్తవ్యము వ్యాఖ్యానించుట మాత్రమేకాని, కావ్యార్లతను, అభిరుచినిగూర్చి యెప్పుడు విచారింపరాదని సరసముగా (్రతిపాదించిరి.

(ప్రస్తుతము వాదమునకు విమర్శ, వ్యాఖ్యానమాత్ర మిత ప్రయోజనమునే యంగీకరించినను, విమర్శకు డనువాదకుడై నిర్వహింపదలచిన దేది యను (ప్రశ్న అప్పటికి నతని కర్తవ్య మతిక్షిష్టమైన పనియే యగును. తాను విమర్శింపదలచిన (గ్రంథమును లోతుగా పరిశీలించి యందలి శక్తిసౌందర్యములను విశిష్టలక్షణము లను వివరించి, దానిలోని తాత్కాలికగుణములను శాశ్వత గుణములనుండి వేర్పరచి, యందు నిగూఢముగానున్న కళానైతిక ధర్మములను వెలువరించి, తన కృషి యథార్థ మార్గదర్శకమగునట్లు చేయుటయే విమర్శకుని ముఖ్యకర్తవ్యము. కావ్యమునగల వివిధభాగముల పరస్పర సంబంధమును,

నాయా (ప్రత్యేకభాగముల కా (గంథముతోగల సంబంధమును అనగా అంగాంగీభావమును గూడ నతడు చూపును. ఆ కావ్యమున చెదిరియున్న వివిధతత్త్యములను చేర్చి, దాని స్వభావమును నిర్ణయించును. ఈ రీతిగ విషయములను వ్యాఖ్యాసంచుచు, తత్త్యములను స్పష్టపరచుచు, గుణములను వివరించుచు, నా కావ్యకళారహస్యమును వలువరించును. ఇంతవరకు విచారించి దాని యాధిక్యమును నిర్ణయింపక వదిలివేయును. కావ్యమందలి ముఖ్యగుణములను గుర్తించుట, వానిని సమన్వయముచేయుచు వ్యాఖ్యానించుట, గుణాగుణములను నిర్ణయించుట యను .మూడు విషయములు విమర్శకుని ముఖ్యధర్మములు. అట్టి విమర్శకుడు తన కావ్యసిర్వహణమునకు తన కష్టమైన మార్గ మవలంబించును. ఒకప్పుడతడు విమర్శించు (గంథముతోమాత్రమే సంబంధముంచుకొని దానియందు తాను గనుగొను విశేషములనుగూర్చి మాత్రమే పూర్తిగ తన లక్ష్య్యముంచవచ్చును. మరొక్కప్పుడు తద్గుంథకర్తయొక్క యితర రచనములను [క్రమముగా సూచించుచు దానిని వ్యాఖ్యానింపవచ్చును. ఇంకొకప్పుడు తారతమ్యపరీక్షకొర కితరు లావస్తువుమీద రచించిన (గ్రంథములతో పోల్చి, బాహ్యాంగణమునుండి యా కావ్యము ననువదింపవచ్చును. కొన్ని సమయములం దింకను దూరమునకుబోయి చార్మితికానుసార ధర్మముల నన్వేషించి తనభావములను వ్య క్తీకరింపవచ్చును. అతని పద్ధతి యేదైన నా కావ్యమును తాను పూర్తిగ నవగాహనము చేసికొని, మనముగూడ సానుభూతితో నర్థము చేసికొనగల్గుటకు సాయపడుటయే యతని ముఖక్టలక్ష ణవుఎ. కాని యతని యఖిరుచి (పకారముగాని, వివుర్శ సాంప్రదాయానుగుణముగగాని యా [గ్రంథముపై నెట్టి ప్రాడ్వివాకత్వము నెరపడు.

కావ్య విమర్శన సంప్రదాయములు శా రామకృష్ణ శాస్త్ర 1907

అనుమేయ విమర్శ నిష్పాక్షికమైన యాథార్థ్యము నన్వేషించును. అది వాజ్బయమున గల నికరమైన లక్షణములను వివరించి, తత్భలితమగు నానందము నొందచేసిన ధర్మసూతములను విచారించి, వానిని సక్రమపరుచుటకు ప్రయత్నించును. ఈ విమర్శ సూతములకు ఆ కావ్యమేతప్ప వేరితర బాహ్య[పప్రమాణములేవియు నుండవు. కాన ప్రకృతిశాస్త్రజ్జుడువోలె విమర్శకుడు కేవలము పరిశోధకదృష్టితో వాజ్బ్యయమును పరిశీలించును. శిల్పనిర్మాణములందే యా శిల్పసూతములను విమర్శకుడు గాంచును. శిల్పము ్రకృతివలనే యవిచ్చిన్నాభివృద్ధిగలదిగా పరిగణించును విమర్శకుడు. ఆ శిల్పకావ్యములు (ప్రతికవికిని, తత్త్వమునకును (పప్రత్యీకముగానుండి, యొకదానితో మరియొకటి భేదించుచుండును. కాన వాని నా ప్రత్యేకదృష్టితో పరిశీలించినగాని పూర్తిగ నర్థముగావు. పురాణమును పురాణదృష్టితోడను, ప్రబంధమును ప్రబంధదృష్టితోడను, ఖండకావ్యమును ఖండకావ్యదృష్టితోడను చూచినగాని యవి యర్థము గావు. (పబంధమును పురాణదృష్టితోడను, ఖండ కావ్యమును (ప్రబంధదృష్టితోడను పరిశీలించినచో రసాభాసముగ నుండును. బాహ్యాగత స్యూతములవలన నది సాధ్యముగాదు. ఈ దృష్టిప్రకారము కావ్యముయొక్క విలువగాని, దానినిగూర్చిన యభ్మిపాయములనుగాని దెల్పుటకు విమర్శకు తావులేదు. వ్యక్త్యాభిరుచులను, గుణాగుణవిచారమును వదిలి, (పకృతిశాస్త్రజ్ఞుడువోల విమర్శకుడు గూడ పరిశోధనయందే లక్ష్యముంచును. కావ్యలక్షణముల నా కావ్యమందే వెదుకును. ఆ (గంథసూతముల నితర కావ్యముల కన్వయింపరాదని భావము. కాన వానిని గుణాగుణ నిర్ణాయకసూూతములుగా వినియోగింపరాదు. లక్షణశాస్త్రమందలి లక్షణములు పూర్వ మొకప్పుడున్న సారస్వతధర్మములను విమర్శించి చూపినవి. కాని రాబోవు కావ్యములకు కట్టుబాట్లు చేసి నిర్బంధించుటవలన కవి స్వేచ్చకు భంగముగల్గించి ప్రతిభను చంపును. భౌతికశాస్త్రం - అనుమేయవిమర్శల భజేదము

అనుమేయ విమర్శ యంత యమూల్య మైనదైనను దానిఫలితమువలన వాజ్మయ జిజ్ఞాసువు పూర్తిగా తృప్తిచెందడు. ఇది విమర్శకు మంచి సాధనమేయైనను, నితర విమర్శప్రయోజనముల నన్నింటిని సమగ్రముగా సాధింపలేదు. ఎందుకన, అనుమేయ విమర్శనకు సారస్వత మందలి మంచిచెడ్డలతో పనిలేదు. అతనికి సారస్వతమందలి వివిధ భేదములు తలియునేకాని, హెచ్చుతగ్గుల ఫేదము తెలియదు.

1908 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంవుటము 4: సాహిత్యము వాజ్మయశాఖలలోని లక్షణాలను నిరూపించి, సక్రమముగా సూత్రీకరింపగలడేకాని, దానిపై తన యభ్మిపాయమును చెప్పడు. ఆయా వాజ్బయశాఖలలో (పతిపాదింపబడిన మానవజీవిత (ప్రతిపాదనము స(క్రమముగా నున్నదా? లేదా? కళానిర్మాణము బాగున్నదా? లేదా? యను విషయము లాతని శాస్త్రీయవిచారణకు బాహ్య మైనవి. అట్టి సాధారణ ప్రశ్నలకు సమాధాన మవసరమును, స్మృకమము గూడనైా మన (గంథపరిశీలనముమై తొందరచేయును. కాన వానిని మనము త్రోసివేయజూలము. (గంథపఠనమున ముఖ్యముగా మనకు మార్గదర్శనమే కావలయునుగాన నట్టి (ప్రశ్నలకు సమాధానము నాశించుట మన ముఖ్యకర్తవ్యము. ఇక్కడనే వాజ్యయమునకును (ప్రకృతిశాస్త్రమునకును గల సాదృశ్యము విచ్చిన్న మైనది. పకృపిశాస్త్రృమందు వక్తిత్వ, సత్యాసత్య, రసభావన, శక్తి, సౌందర్య, శిల్పఫలాది విషయము లుండవు. వాజబ్బయమున నిట్టి విషయములే (పధానములు. ఇవి కళారూపములోనున్న మానవ జీవితము ననువదించుటక్రై యున్నవి. ('ప్రకృతిశాస్త్రము విషయ తత్త్వము, దాని యుత్పత్తిమాత్రమే విచారించును. ఆ విషయము స్పష్టపడిన తర్వాత దానియందు మన కిక నభిరుచియుండదు. కాని వాజ్మయమున నీ విచారము మజియుక విషయమగు దాని (ప్రాముఖ్య గుణాగుణముల నిర్ణయమునకు డేరేపించును. కావ్యమును (ప్రకృతిశాస్త్రరీతిని విమర్శించువానికిగూడ గుణాగుణవిచారణ ముండదని తర్కించుట నిరుపయోగము, తిక్కనాదుల కవితయందలి గుణాగుణములను నుత్కృష్టతను నిర్ణయించుటకే వారి కవితాశిల్ప లక్షణాదులను పరిశీలింపదలచుటకు ముఖ్యకారణములు. (ప్రారంభముననే కొంత విశేషము వారి కాపాదింపబడి గుణము గుర్తింపబడినది. ఇదే మన మాశించునది. శాస్త్రృీయవిమర్శనుగూర్చి మన మెంత (ప్రసంగించినను వాజ్య్మయమున గుణాగుణనిర్ణయవఎు తప్పుదు. [గంథపఠకు డెవ్వడు తాను చదువు కావ్యవలయనుగూర్చి యెట్టి యభ్మిపాయువమును లేకుండయుండడు; వెలిబుచ్చకుండనుండడు. గుణాగుణ నిర్ణ్మయముచేయక వస్తువివరణము చేయునది భౌతికశాస్త్రము మాత్రమే. గుణాగుణవిచారములేక కావ్యవివరణము పూర్తిగాదు. సారస్వతవిమర్శ యది లేనిది సమగ్రముగాదు. బాలురుగూడ తాము విను కథలలో బాగోగులను విచారించుట స్వభావసిద్ధము. శాస్తీ్యయవిమర్శ యలంకారశాస్త్రమును పూరించును. ఇది వాజ్బియమున గల మంచిభాగమును చెడుదానినుండి (ప్రత్యేకపజచి చూపును. కాని లక్షణశాస్త్రమునకు విమర్శలో స్థానమును (ప్రయోజనమును లేకపోలేదు.

కావ్య విమర్శన సంప్రదాయములు శసష్టా రామకృష్ణ శాస్త్రం 1909

కావ్యరచనా హేతుభూతములైన ముఖ్యధర్మములగు రసావేశము, భావన, విజ్ఞానము, రచన అనునవి ప్రతికావ్యమందును గాననగును. కాని 'పప్రతికావ్యమందు నీ యుత్తమధర్మములన్నియు నుండవు. ఇవియన్నియు నుండుచో మహాకావ్యము అనబడును (01298109). కాని వీనిలో నే యొకటైన నుత్తమకావ్యములందు విశిష్టముగ నుండును. దీనిని వివరించి స్పష్టపజుచుటే విమర్శయగును. ఈ నాలుగు ధర్మములును కావ్యనిర్మాణపరిస్థితియందు కవియందే యుండును. వీనినే ప్రతిభ, వ్యుత్పత్తి, యభ్యాసమందురు. ,

  1. రసావేశము (010400)

లోకమున కవి యొక దృశ్యమును జూచి, రసావేశమునొంది, దానిని తన రచనానైపుణ్యముమూలమున పాఠకున కందబేయును. కాని రచనాలోపమున్నచో నా యావేశము పాఠకులందు గల్గదు. కాన పాఠకునకు గల్గిన రసావేశమువలననే కావ్యమందు భావావేశముగలదని బుజువై ప్రామాణికమగుచున్నది. ఈ రసావేశమున కైదు లక్షణము లుండవలిెను. (1) భవ్యత్యము (౧౧౦౧౧66/ 0 ౮౪౬5106) ఆ రసావేశముయొక్క భవ్యత్వముగాని, క్షుదత్వముగాని యది యాశయించిన వస్తువుపై నాధారపడును. ఉదా : ఆముక్త మాల్యద - తారాశశాంక విజయము. (2) శక్తి (౧౦౮౪౭౧) ఆ భావము హృదయసంచలనము గల్గించు శక్తిగలదిగా నుండవలెను. (3) స్థిరత్వము (5182610699) ఆ భావము సంచారీభావముల మూలమున మధ్య విచ్చి సన్నముగాక స్థిరముగా నుండి, రసముగా పరిణమింపదగినది కావలను. (4) వైవిధ్యము ౧౧౭౧౪) అది వివిధభాపముల కాకరముగా నుండవలను. (5) గుణము (00481100 ఆ భావ ముచితముగా నుండవలను. అనగా రసముగా పరిణమింపదగినది కావలెనుగాని, రసాభాసముగా నుండరాదు. ఇది నైతికము నుదాత్తమువైయుండవ లెననుట. ముఖ్యముగా నీ భావావేశము భవ్యమై రసపర్యంతము పోషింపబడవలిెను. 2. భావనాశక్తి 1022102401)

కవి తాను పొందిన భావావేశమును పాఠకునకు గల్గించుటకును, తాను చూచిన దృశ్యమును పాఠకునికిగూడ జూపించుటకును భావనాశక్తి మూలమునగాని సాధ్యముగాదు. కాన భావోద్రోకముతో నెడతెగక భావనాశక్తి గూడ కవిలో, ననగా కావ్యమున నుండవలెను. ఇది వస్తువర్ణ్షనమున ముఖ్యముగా నుపయూోగించును.

1910 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తె. విజ్ఞానము (11611600

కావ్యమున పాతపోషణము సంభాషణాదిసందర్భముల యౌచిత్యమును గూర్చుటకు ముఖ్యముగా విజ్ఞానము - వివేకము గావలసియుండును. ధర్మప్రతిపాదనమునకును, ప్రపంచ రహస్యమును గుర్తించుటకును విజ్ఞాన మవసరము. ఇదిలేనిచో కావ్యమందు గౌరవములేక (ప్రామాణికత్త్వము నశించి, యితర శక్తులుగూడ నీరసములగును. కాని విజ్ఞానము మాత్రము కావ్యమున (ప్రాధాన్యమువహించి, రసభావనలను కమ్మివేసినచో, దానికి కావ్యగౌరవముపోయి శాస్త్రగౌరవము మాత్రమే సిద్ధించును. 4. రూపము (₹0౧1)

కావ్యకన్యకకు శబ్దరచన శరీరము వంటిదికాగ, రసభావము లాత్మవంటిదగును. కాన వీనిరెంటికి తగిన యానుకూల్యముండవలను. శబ్దరచనమున ముఖ్యముగా మాధుర్య ప్రసాదగుణములు రెండుండవలెను. మాధుర్యగుణము వలన కావ్యము గ్రుతిమనోహరముగ నుండును. లేనిచో, భావములెంత రమణీయములైనను (శుతికరోరమై యనుభవించుట కది కంటకముగా నుండును. ఇక ప్రసాదగుణమువలన నీఘముగ రసభావముల ననుభవించి యభినందించుటకు యోగ్యత గర్గియుండును. లేనిచో నన్వయక్షేశము గల్గించును. కాని శబ్దరచనకు ప్రాధాన్యము గలిగి, రసభావవులకు అ(ప్రాధాన్యవున్నచో నా కావ్యకన్యక యాత్మలేని బాహ్యసాందర్యము మాత్రము గలదైయుండును. ఆలంకారికులలో వామను డీరీతియే కావ్యమున కాత్మయని ప్రతి పాదించినాడు. కాని దీనిని తర్వాతవారు ఖండించిరి. ప్రసాద మాధుర్యములుగల రచనతో నొప్పెిన కావ్యములు సంస్కృతమున దండికృత దశకుమారచరిత్రమును, తెలుగున చేమకూరి వెంకట కవికృత విజయవిలాసమును (పసిద్ధములు. ఈ శైలికిగూడ వైజ్ఞానిక, యావేశిక, కళాలక్షణములు మూడున్నవి. 1, సరళత (11064610 వాక్యరచనమును మృదుపదములతోగూర్చి పసాదగుణము

గూర్చుట.

  1. ఉచితపద బంధము - సందర్భమునకు తగిన పదజాలమును వాడుట.

కావ్య విమర్శన సంప్రదాయములు శిప్రా రామకృష్ణ శాస్త్ర) 1911

  1. సామరస్యము - వర్ణితవస్తువునకు, నుపయోగించిన శబ్బజాలమునకు తగిన పొందికయుండుట, భావద్యోతకములగు పదప్రయోగము అనునవి వైజ్ఞానిక లక్షణములు.

  2. ఆవేశలక్షణములు: తీవ్రత, శక్తి, ధ్వని, సూచన గల పదపయోగము. ఈ లక్షణములు పాఠకునికి కవి భావమును మాత్రమే యందజీేయుటయేగాక, కవి యనుభవించిన యావేశముల బోలినవానిని పాఠకుని హృదయములలో ప్రేరేపించి కవి యాశించిన రూపములను పాఠకుల మనస్సులలో గల్గించును.

  3. కళాలక్షణములు: లలితము, సుకుమారము, మృదువు, మధురముగల పదములు. ఇట్టి పదములు కవి వ్య క్రీకరించు భావములను సూచించుటమాత్రమేకాకు స్వతస్పిద్ధముగా శేలి నానందదాయకముగా నొనర్చును. విమర్శకుని లక్షణములు

విమర్శవలన కవులను కావ్యములను గూర్చి సంపూర్ణముగ తెలియ గలుగుటయే కాకు విమర్శకుని యాత్మీయత, భావములు, పద్ధతులు, నాశయములు మొదలైనవానితో కూడిన యాతని స్వవిషయములుగూడ తెలియును. కవులను గూర్చియు, కావ్యములను గూర్చియు ఏిమర్శకుని వాక్యములు సంతృప్తికరముగా లేకున్నను, అవి పరమప్రయోజన సాధకములు గాకపోయినను, విమర్శకుని వాక్యము లభిరుచికరముగనే యుండును. కాన విమర్శ (ప్రప్రథమమున సాధనముగ (గహింపబడినను నది సాధనమాత్రమే కాదు. అందుచే నదికూడ వాజ్బయమున నొక శాఖవంటిదే యగుటచే దానికొకరే యది పరిశీలింపతగినది. వాజ్బాయమున నాత్మీయత యత్యావశ్యకమైన లక్షణముగాన, విమర్శకుని గూర్చియే మొదలిడుదుము. అతడు వ్యాఖ్యాతయు, నిర్ణతయు నగుట కతని యర్షతనుగూర్చి విచారించవలెను. ఒక కవిని గూర్చిగాని, కావ్యమును గూర్చిగాని తెల్పుట కతనికి ప్రత్యేక యోగ్యత గల్గినగాని యాతని వాక్యముల నెవరును కుతూహలముతో వినరు. కాన నాతని కుండవలసన వమఖ్యగంణవయలను గళార్చి విచారింపవలసియున్నది.

ఉత్తమ విమర్శకునకు నిశితమైన బుద్ధి, సూక్ష్మదృష్టి. విషయ[గ్రహణశక్తి, భావోన్ముఖత, కవితో సహృదయభావము, విశాలహృదయము మొదలగు ముఖ్య గుణము లుండవలిను. అతడు వస్తువు నున్నదున్నట్లు చూడగల్సి, పక్షపాతబుద్ధిలేక

1912 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యుండవలయును. జాతిమతాభిరుచులకు చెందిన యెట్టి యభిమానములేక నిర్వికారమనస్కుడుగ నుండవలయు. కాని విమర్శకుడు గూడ మానవమాత్రుడే కాన నీ లక్షణములే విమర్శకునందును సంపూర్ణముగ నుండజాలవు. కాన వాని ప్రతిలోపమును జాగ్రత్తగా పరిశీలింపవలసియున్నది. విమర్శకు డొకానొక కవియందారోపించు ప్రత్యేకతత్తమా విమర్శకునందే ముఖ్యముగా నుండునట్లు గొన్ని సందర్భములందు (గ్రహింపబడును. సమర్థులగు విమర్శకులు గొందరు తమ వికారమైన మనస్తత్త్య కారణమున దమ విమర్శనములను దోషభూయిష్టముగ చేసివైచిరి. మతాభిమానముతోగాని, వ్య క్రిగతదోషముతోగాని విమర్శకుడు కావ్యమందలి గుణములను మాత్రమే ఆల్చి, దోషములను జూపుట మానినచోగాని, లేక కేవలము దోషములను మాత్రమే జూప్‌, గుణములను వివరింప మానినచోగాని యది యాతని పక్షపాతదృష్టిని దెల్పును. ఉదా : అఆంగ్లమున ౮౦౧౧9౦౧5 1118 01 11110౧. విమర్శకుడు వీని యన్నింటికి నతీతుడు గావలయును. మరిగొందరు విమర్శకులు తమ యుక్తి నైపుణ్యము చేతను, పాండిత్యముచేతను కావ్యమందలి సుగుణములను గూడ దోషములుగా వ్యాఖ్యానము సేయుదురు. ఉదా : కాశీభట్ల బ్రహ్మయ్య, సుబ్బృయ్యశాస్తి గార్ల తిక్కన భారత, మనుచరిత్రల విమర్శలు. ఇక గొందజు కావ్యమందలి లేని గుణములనుగూడ నున్నట్లు కల్పించుదురు. ఉదా : కొందరి భావ కవులపై విమర్శ. కొందరొకానొక కవియందుండు నభిమానముచే నతని కావ్యమందుండు సర్వమునుగూడ స్వారస్యమని నిర్హేతుకముగ స్తుతించుదురు. ఉదా : తిక్కన కళాస్నామాజ్యము - కర్త - కాళ్లూరి గోపాలరావు. ఈ విమర్శ దోషములు సకలదేశకాల భాషావాజ్బ్యయములందును గలవు. కాని వానికి విమర్శ వాజ్బయమున గౌరవస్థానము లేదు కదా, తత్క ర్తలు సారస్వత (ద్రోహులుగా పరిణమించుదురు.

విమర్శకుని సామర్థ్య మాతని స్వాభావిక గుణములమీద మాత్రమే యాధారపడదు. అతని కార్యనిర్వహణమునకు వలయు నర్హసాధనములమీద గూడ నుండును. స్వల్పపాండిత్యముండి లక్షణనిక్షలేని కొందరు స్వభావసిద్ధముగ సారస్వతగుణములను గుర్తించి యభినందించెడు శక్తిగలవారుందురు. ఒక కావ్యము. సమర్థుడైన సామాన్యపాఠకుని నిష్పాక్షికాభ్మిపాయ మెప్పుడును తిరస్కరింపతగదు. అది స్వతంతమై, నిష్పాక్షికమై, నూతన మగుచో దానికి

కావ్య విమర్శన సంప్రదాయములు శిష్టా రామకృష్ణ శాస్త్ర 1913 విశేష గౌరవము తప్పక యుండును. ఐనను సక్రమమైన విమర్శనము చెప్పుటకు పాండిత్యమును, లక్షణశిక్షయు నవసరములు. అనగా వ్యుతృత్యభ్యాసము లుండవలెననుట. (ప్రతిభయుండవలెనని ప్మపథమముననే తెల్బ్చబడినది. కళావిమర్శకునికి ప్రత్యేక విద్య యవసరము. విద్యయనగా విజ్ఞానార్హనమును, బుద్ధిసంస్కారమును. విశాలదృష్టి చూపి తీర్పుచెప్పుటకును, తగిన ప్రమాణము నొసగుటకును వివుర్శ్ధుకునకు విజ్ఞానము గావలయును. ఆ జ్ఞానము నుపయోగించుటకు చిత్త్సంస్కార మవసరము. మిగిలిన విషయములు సమానమగుడు, వ్యాఖ్యాతగాను, ప్రాడ్వివాకుడుగాను, అతని సామర్థ్యమతని విజ్ఞానబుద్ధి సంస్కారవములకు దగినట్లుండును. అతడు కవిత్వము చెప్పలేకపోయినను కవి కున్నంత ప్రజ్ఞ గల్గియుండవలెను. కవి హృదయమును వివరించి చెప్పుపట సహృదయుడై కవికంటె మించిన (ప్రజ్ఞగలవాడుగూడ గావలయును. ఈతని (ప్రతిభ తన వ్యుత్పత్తికి మెరుగుపెట్టినదిగా నుండవలెను. కేవలము వ్యుత్పత్తి మ్యాతము గలవాడు దోషైక దృక్కుగలవాడగును. ఇవి లోపించినచో నతని యభిప్రాయము లెంత యభిరుచికరములైనను, నుద్చోధకములైనను గౌరవకరములు గావు. ఉదా : వార్తాపత్రికలందలి సారస్వత విమర్శలలోని యర్థములేని పొగడ్తలకు గౌరవము లేదు.

కనుక వివుర్శకుని రచనలను స(కవుముగా పరిశీలించున పుడు గమనింపవలసిన విశేషము లనేకము లున్నవి. అతని స్వభావ విద్యాసంపదలును, అవి తన విమర్శనయం దెట్టి సాయమునుగాని, యాటంకముగాని యొనర్చినది విచారింపవలయును. అతని పాక్షిక దురభిమాన సూచనములను గమనించి, వానికారణ (పప్రభావములనుగూడ విచారింపవలసియున్నది. అతని విమర్శధోరణిని, నిర్ణయముల బలమును ముఖ్యముగా గమనింపవలయు. విమర్శకుడు కవిభావముల నర్థముచేసికొని, వాని ననువదించి న్యాయమొనర్చుటకు నిష్కల్మషమైన భావముతో వాయవచ్చును. లేకయా విమర్శమూలమున తన పాండిత్యమును, యుక్తిని (ప్రదర్శించుటకు రచించవచ్చును. లేదా, గుణమును మాతమే గుర్తించుటలో సహృదయత్యము, నాతురత 'జూపవచ్చును. లేక దోషైక దృష్టతో విమర్శింపవచ్చును.

1914 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తారతమ్య పరిశీలనము .

సమానవిషయముమె విమర్శించిన వివిధ విమర్శకుల యభ్శ్మిపాయములను పోల్చి, వారివారి శక్తిసామర్ధ్యములను ప్రత్యేకముగ గుర్తించి, యా విషయముమై సిసలైన యభిపాయమును నిశ్చయింపవచ్చును. సాధారణపఠనమువలన సంతృప్తిచెందకపోయినను, వారి యభ్మిపాయములందలి యేకీభావమునుగాని, భేదముగాని గుర్తించుటలో మనకు సంతృప్తి గలుగును. కాని వ్యక్తిగత లక్షణములును, పద్ధతులును, అభిరుచులు, మనస్తత్వము మొదలైనవాని మూలమున వెడలువారి యభ్మిపాయములందలి భేదసాదృశ్యములను మనము జ్యాగత్తగా పరీక్షింతుము. ఇట్టి తారతమ్యపరిశీలనము వస్తుతః వినోదకరముగ నుండుటయేగాక, విమర్శకుని నీలము, విద్య, ఆశయములతో గూడిన లక్షణములను గుర్తించుటకు తోడ్పడును. ఈ విమర్శాభ్మిప్రాయముల నంతమందితో బోల్చిననంత విశేషభేదము గానుపించును. సామాన్యముగా వీరు ముఖ్యవిషయములలోగూడ నేకీభవింపరు. అందుచేతనే విమర్శ పై గొందరకు రోతగూడ గల్గుట. ఈ భేదములు ముఖ్యముగా వ్య క్తిగతములు. ఇవి యా కాలాభిరుచులపె నాధారపడియుండును. కాన వివిధకాలములలో నొకే కావ్యము.పై యభ్శిపాయములు మారుచుండును. అందుచే విమర్శచరిత వాజ్బయచరితను పూరించు ననవలిను. (కిన్నెర: సంపుటము 5, సంచిక 7, జూలై 1953)

నాటకము: రనానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు

సొమాజికునకు రసానుభూతిని కలిగించుట రూపకముల విశిష్ట [ప్రయోజనమని, “రసనిష్యందిషు రూపకేషు” అను పప్రయోగమునుబట్టి నిశ్చితమగుచున్నది. ఇట్లు స్థూలముగా, రూపకముల వలన సామాజికునకు రసానుభూతియు, తతృలమగు ఆనందమును సిద్ధించునని తలిపియున్నను, సూక్ష్మముగా పరికించుచో నాటక్కపకరణముల వంటి ఉదాత్త రూపకభఖేదముల నుద్దేశించియే ప్రాచీను లీ అభ్మిపాయము నిచ్చియున్నట్లూహింపనగుచున్నది. రసశబ్దమునకు మన ప్రాచీను లిచ్చిన విశిష్టార్థమును బట్టి చూడగా ప్రహసనము, వీథి, ఇత్యాది రూపకభేదములవలన సామాజికు డనుభవించునది వినోదము మాత్రమే యనియు, బ్రహ్మానంద సటబహ్మచారి యని వర్ణింపబడిన కావ్యరసానందము నాటకమువలన మాత్రమే సిద్ధించు ననియు చెప్పవలసియున్నది. శుద్ధ సాత్తి్రికము, లౌకికవాసనారహితము, ఇం(దియ(పాబల్యముక్తవు రజస్తమోమాలిన్యవిరహిత విశుద్ధాత్మానుభ వైకవేద్యము నగునది రసమనియు, నది పరబహ్మసదృశమనియు మన ఆలంకారికుల మతము. సంస్కారము గల సాత్తి్వికుడగు సామాజికుడు నాటకరసాస్వాదనచే ననుభవించు ఆనందము, పరమాత్మానుసంధానముచే యోగి అనుభవించు (బబహ్మానందమునకు సన్నిహితమని వివరింపబడినది. కావున సామాజికుడు సత్త్వగుణప్రధానుడు, సంస్కారము కలవాడు నైయుండుట యొంతయు నవసరమగుచున్నది. ఈ కారణముననే

1916 పందిరి షల్లికార్డునరాపు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము నాట్యశాస్త్రమున (పేక్షకలక్షణములు వివరింపబడియున్నవి. సారస్వత, కళా, శిల్పాదికజ్జానము, నాట్యశాస్త్ర సంబంధమగు కౌాశలము, వాగంగాభిసయజ్ఞానము, రసభావముల సూక్ష్మజ్ఞత, దేశభాషాపరిజ్ఞానము, నానాశాస్త్రవిచక్షణత, యశోధర్మములం దనురక్తి, బుద్దిసూక్ష్మత, రాగద్వేషరహితమైన చిత్తవృత్తి, సచ్చీలము, అభిజాత్యము, ఇందియని[గ్రహము, ముఖ్యముగా రసపరమగు హృదయము - ఇత్యాదులు (పేక్షక లక్షణములని వివరింపబడియున్నది. _ “చారిత్రాభిజనోపేతాః గ్రాంతవృత్త శ్రుతాన్వితాః

యశోధర్మ్శరతాశ్చ్చైవ మధ్యస్థా వయసాన్వితాః

షడంగనాట్యకుశలా అలుబ్ధాః శుచయః సమాః

చతురాతోద్యకుశలా వృత్తజ్ఞా స్తత్త్వదర్శినః "=. దేశభాషావిధానజ్ఞాః కలాశిల్పప్రయోజకాః

చతుర్ధాభినయజ్ఞా శ్చ రసభావవికల్పనే

శబ్దచ్భందోవిధానజ్ఞా నానాశాస్త్రవిచక్షణాః _

అవ్య గై ౨రిందద్రియైః శుద్ధ ఊహాపోహవిశారదః

వ్య క్తదోషోఇ నురాగీ చస నాట్యే (కేక్షకః స్మృతః

యస్తుష్టే తుష్టిమాయాతి శోకే శోక ముఫైతిచ

  • దైన్యే దీనత్వ మఫ్యైతి స నాట్య (పేక్షకః స్మృతః

నవైవేతేగుణాః సర్వే ఏకస్మిన్‌ గ్రేక్షకే స్మృతాః ఇందు పేర్కొన్న లక్షణములన్నియు కలిగియున్నవారు మాత్రమే రూపకములను దర్శింప నర్హులనియు, నితరులకు రూపకములవలన ప్రయోజనము లేదనియు అర్థము కాదు. దుఃఖార్తులు, (శ్రమార్తులు, దీనులు నైయున్న సామాన్యులకు వినోదమును, విశ్రాంతిని కల్గించి, వారికి చిత్తవికాసమును గూర్చుట రూపకముల 'పప్రధానప్రయోజన మని ఆదియందే వివరింపబడియున్నది. ఐన పెన పేర్కొన్న విధమున (ప్రేక్షకునియందు విశిష్టమగు సంస్కారము, పాండిత్యము, ఆభిజాత్యము నిత్యాదుల నాశించుట యందుల కను ప్రశ్నకు సమాధాన మియ్యవలసియున్నది. అత్యుదాత్తము, అనిర్వచనీయము, అనుభ వైకవేద్యము, (బహ్మానందసదృశము నగు కావ్య రసానందానుభవమునకు (ప్రేక్షకుడు సంస్కారయుతుడు, సహృదయుడు, విశిష్టగుణో పేతుడు నైయుండవలయునని వీరి యభ్మిపాయమని తోచుచున్నది.

నాటకము: రసానుభూతి భూపతి లక్షీనారాయణ రావు 1917 యోగ్యతను, అధికారమునుబట్టియ కావ్యరసాస్వాదనశక్తియు,: ఆనందానుభవమును సిద్ధించుననుట నిజము. కళావిషయకమగు ననుభపమంతయు నిట్టిదే. సుందరమగు చిత్రమును దర్శించునపుడును, శ్రావ్యమగు గానమును ఆకర్ణించునపుడును మనకు గలుగు చిత్తవికాసమునకు మనకు ఆ కళల యందుగల సంస్కారమును బట్టి అవధి యేర్పడుచున్నది. విశిష్ట శిల్పముతోనొప్పు చితపటసందర్శనమున హృదయ మార్ద్రమై, అనిర్వచనీయమగు నానందము (ప్రేక్షకునకు సిద్ధంపవలెనన్నచో నా వ్యక్తికి తత్కృళారహస్యము బోధపడియుండుట అవసరమగు చున్నది. సహృదయత, కళాభిజ్ఞత ఉన్ననాడే రసానుభవము సాధ్యమగుచున్నది. గానకళాప్రాబల్యమునకు సాధారణముగ నెల్లరును లోనై సంతోషించినను రసానుభవము సహృదయులగు కళాభిజ్ఞులకు మాత్రమే సాధ్యమగుచున్నది. “విశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిఃొ అను వాక్యము గానకళకుగల నక్తిని స్థూలముగ మాత్రమే (పశంసించునదియై యున్నది. నృత్యమువిషయమునను నట్లే తద్విషయక సంస్కారము మున్నగునవి (ప్రేక్షకునియం దవసరమగుచున్నవి. ఇక శబ్దార్థమూలకమగు కవిత్వము విషయమున పాఠకున కట్టి సంస్కారము, పాండిత్యము, సహృదయత అవసరమగుచున్నవో సర్వజనవిదితమే. ఈ లలితకళలన్నియు నాటకమున మెళవించినవి. కావున నాటకము విశిష్టమగు సమాహారకళ యగుచున్నది. అతి విశిష్టమగు కళ యగుటవల్లనే నాటక ప్రదర్శనము ప్రజల నాకర్షింపగలిగియున్నది. ఐన (క్రేక్షకులెల్లరును రసానుభవ జన్యమగు ఆనందమును పొందుదురని చెప్పుటకు వీలులేదు. ప్రేక్షకుల దైహిక మానసిక తత్త్వములు, సహజాతములగు ప్రవృత్తులు, వయస్సు, 'పప్రాపంచికానుభవము, అభిరుచులు - ఇత్యాదులనుబట్టి వారు నాటకదర్శనమున బొందు ననుభవము నిర్ణయమగుచున్నది. మరియు, వారి వారి జీవితములుకూడ కావ్యరసాస్వాదన విషయమున అవధుల నేర్పరచుచున్నవి. ఇం[దియ(ప్రవృత్తి (ప్రధానమైన జీవితమును గడపుట కలవడినవారు అలౌకికమగు కావ్యరసాస్వాదనజన్యమగు నానందసిద్ధిని బొందలేరు. ఇంద్రియముల (ప్రాబల్యము నధిగమించిననే తప్ప చిత్తమునకు రసాస్వాదనశక్తి చేకూరదు. పప్రాపంచికసంబంధము, ఇంద్రియసంబంధము నగు మాలిన్యమంతయు క్షాళితమై, చిత్తము విశుద్ధముగ నుండిననేతప్ప రసాస్వాదన సాధ్యముకాదు. ఈ విషయమునే అభినవగుప్తపాదుడు లోచనమున విపరించినాడు.

1918 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము “యేషాం కావ్యాభ్యాస అనుశీలనవశాత్‌ విశదీభూజే మనో ముకురే వర్ణనీయ తన్మయీభావన యోగ్యతా తే హృదయసమవాదభాజః సహృదయాళో కావ్యాభ్యాశానుశీలనచే లలితము, విశుద్ధమునైన మనస్సును, వర్ణనీయవిషయమున తన్మయతను బొందగల చిత్తవృత్తియు గలవారే సహృదయులనియు, వారే కావ్యరసాస్వాదన కధికారులనియు నతని భావము. మానవప్రకృతి వైవిధ్యము ననుసరించియు, అవస్థాభేదములనుబట్టియు అభిరుచులు ఏర్పడుచున్నవి. కావున నాటక ప్రదర్శనముచే (ప్రేక్షకులు తమతమ అభిరుచులను, యోగ్యతలను, శిక్షణను, సంస్కారమును అనుసరించి తాత్కాలిక వినోదమో, చిత్తవికాసమో, రసమో అనుభవింపగలుగుచున్నారు. మరియు ప్రతి నాటకవస్తువును సర్వజనాకర్ణణీయము కాకపోవచ్చును. దీనికిని మానవ(ప్రకృతి వైవిధ్యమే కారణమగుచున్నది. నాట్యశాస్త్రమునందీ విషయమే వివరింపబడియున్నది. తుష్యుంతి తరుణాః కామే విదగ్ధా సమయాశ్రితే అ ర్థష్వర్ధపరాశ్ర్రైవ మోక్షేష్యథ విరాగిణః నానాశీలాః ప్రకృతయః శీలే నాట్యం ప్రతిష్టితిమ్‌ శూరా బవీభత్సరౌ[దేషు నియుద్ధేష్వాహవేషు చ ధర్మాభ్యానపురాణేషు వృద్ధాస్తుష్యంతి నిత్యశః బాలా మూర్థాః స్త్రియశ్వైవ హాస్య నేపథ్యయో సదా॥ ఏవం భావానుకరతై ర్యో యస్మిన్‌ ప్రవిశేన్నరః (గ్రేుక్షకస్తు స మంతవ్యో గుణై రేతై రలంకృతః॥ ఇట్టి మానవప్రకృతితత్త్వమును గగ్రహించియే రూపకకర్తలు పలువిధములగు రూపకములను రచించినారు. ఇట్లు, విశిష్టసంస్కారముతో నొప్పు సహృదయులు మాత్రమే రసము నాస్వాదింపగలరనియు, తదితరులు వారి వారి యోగ్యతల ననుసరించి నాటకసందర్శ్గనమున సంతుష్టి నందగలరనియు వ్యక్తమగుచున్నది. సంతోషవినోదములు భౌతికసంబంధములైనవి యగుటచే పరాశయమైనవి. బాహ్యవిషయకానుభవము మన ఇం[దియములకు కలుగుటతోడనే సంతుష్టి కలుగవచ్చును. తాత్కాలికమగు నింద్రియ తృప్పితోడనే సంతుష్టినందుట

వాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1919 సామాన్యవిషయము. సంతోషానుభవ మనెడి వ్యాపారము మనస్సునకు సంబంధించిన దేయయ్యును, ఇందు భావనావ్యాపారమునకు మనస్సు లోనుకావలెననెడి యవసరములేదు. ఇంద్రియములకు విషయములతో సంయోగ మేర్పడుటతో నింద్రియక్షోభ తాత్కాలికముగ నడిగి తృప్తికలుగుచున్నది. ఈ తృప్తియే జీవికి గలుగు సాధారణసంతోషమునకు వినోదమునకు నాధారమగుచున్నది. కాని, యీ తృప్తి భౌతికవిషయికము, ఇంద్రియోద్భూతము నగుటచే పూర్తిగా పరాశ్రయము, తాత్కాలికము నైయున్నది. రసాస్వాదనవిషయము వేరు. భావోత్పత్తికి బాహ్యేంద్రియప్రవృత్తియే కారణమైనను, తద్భావము రసముగ పర్యవసించుటకు భావనావ్యాపారమే ఆధారమగుచున్నది. భావోత్పత్తికి హైతువగు వస్తువుతో వ్య క్తికిగల (ప్రత్యక్ష భౌతికసంబంధము ప్రాధాన్యము వహించియున్నంతవరకును రసోత్పత్తి కవకాశముండదు. తద్వస్తువుయొక్క భౌతికస్వరూపాదులను వ్యక్తి విస్మరించి, అమూర్తములగు గుణశీలపపభావాదులపై మనసును కేందీకరింపజేసి, తద్వస్తువుయొక్క తాత్త్వికజీవితముతో నైక్యము పొందినప్పుడే రసాస్వాదన కవకాశ మేర్పుడుచున్నది. ఉత్తరరామచరిత్ర నాటకమున నాయకుడగు రాముడు సీత్రాదేహస్పర్శచే విశిష్టమగు సాత్త్వికానుభూతికి లోనై, తత్‌స్పర్శజన్యమగు మానసిక వికారమును గూర్చిన భావనకు లోనగుచున్నాడు.

వినిశ్చేతుం శక్యో న సుఖ మితివాన దుఃఖమితివా

(ప్రమోహో నిదా వా కిము విషవిసర్పః కిము మదః

తవ స్పర్శే స్పర్తే పరిమూఢేం[దియగణః వికార .

శ్రైతన్యం భమయతి చ సమ్మీలయతి చ నాయికాస్పర్శజమగు నింద్రియసౌఖ్యముతో మాత్రమే తృప్తి చెందుచో రసోత్వత్తి కవకాశమే యుండదు. అట్లుకాక నాయకుడిందు భావనకు లోనగుచుండుటచే రసాస్వాదన కాధార మేర్చడు చున్నది. మరల నిదేఘట్టమున రాముడు, సీతనుగూర్చి భావనకులోనై .

“ఇయం గేహేలక్ష్మీ ఇయ మమృతవర్తి ర్నయనయో?" అని యుల్లేఖించు సన్నివేశమును సట్టిదే. నాయికయొక్క భౌతిక జీవితముమై నుండి నాయకునిదృష్టి మరలుటయు, నాయికజీవితమునకు నాయకుని జీవితముపై

1920 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము గల సాత్తికము స్థిరము నగు ప్రభావముపె అది కేంద్రీకరించుటయు జరిగినప్పుడే యిట్టి పరిస్థితి యేర్పడగలదు. అనగా, వ్యక్తి దృష్టి భావనావ్యాపారముచే నేర్పడిన అమూర్తస్వరూపముమై కేంద్రీకరించుట రసోత్పత్తి కంతయు నవసరము. కావున రసాస్వాదన యనునది మనస్సునకు సంబంధించిన విషయము. తనహృదయము నాకర్షించిన వస్తువుపై మనస్సు కేందీకరించుట, తద్వస్తుగుణప్రభావాదులను గూర్చిన ధ్యానమననాది వ్యాపారమునకు మనస్సు లోనగుట, [కమముగా నింద్రియ(ప్రసక్తి లోపించి చిత్తము సాత్త్వికస్థితిని బొందుట, అట్టి నిర్వికారమగు చిత్తము తద్వస్తువుయొక్క అమూర్తస్వరూపముతో నైక్యమును జందుట - యనునవి (క్రమముగా జరిగినప్పుడు రసాస్వాదన కనుకూలపరిస్థితి యేర్పడుచున్నది. అట్టి తాదాత్మ్య స్థితిలో వ్యక్తి హృదయ మార్ద్రమై అనిర్వచనీయమగు నొక యవస్థకు లోనగుచున్నది. అదియే రసస్థితి. ఆ స్థితిలో వ్య క్రిదేహమునందలి (పతిపరమాణువును తదనుభవమునకు లోనై ఆర్జీఫభావమును గాంచుచున్నది. అంతరంగమున పరమాత్మస్వరూపమును దర్శించి తన్మయుడైయున్న యోగిదేహమునందువలెనే రసస్థితికి లోనైయున్న వ్యక్తి దేహమునగూడ అప్రయత్నజములగు అ(శ్రుస్వేదాదులు తదానందస్థితిని వ్యక్తమొనర్చును. అట్టి రసానుభూతిచే వ్య క్తిజీవితమున శాశ్వతమగు మార్చుకూడ కలుగుచున్నది. ఇం[దియవాసన లడగుటయు, భౌతికజీవితమాలిన్యము నశించుటయు జరిగి వ్య క్తిజీవితము శాశ్వతముగా సాత్త్వికము కాగలదు. పిమ్మట నట్టి వ్యక్తి ఇందద్రియక్షోభ కేమాత్రమును లోనుగాక ప్రపంచమును దర్శింపగలడు, ఆనందింపగలడు. రసానుభూతికి కారణభూతమైన వస్తువు విషయమున గూడ నతని (ప్రవృత్తి వేరగుచున్నది. దుష్యంతుడు శకుంతలను అనాఘాతపుష్పముగ నెన్ని,

“న జానే భోక్తారం కమిహ సముస్థాస్యతి విధికో అని సాసూయగా పలికినపుడును, శకుంతలాముఖమున దిరుగుచు నామెను పీడ్రించుచున్న (భమరమునందు పురుషత్వ మారోపించి,

“చలాపాజ్బం దృష్టః స్పృశసి బహుశో వేపథుమతీం

రహస్యాఖ్యాయీవ స్వనసి మృదు కర్ణాంతికచరః

కరం వ్యాధూన్వత్యాః పిబసి రతిసర్వస్వమధరం

వయం తత్తాన్వేషా న్మధుకర హతాః త్వం ఖలు కృతీ

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్రీనారాయణ రావు 1921 అని హృదయగత విషయేచ్చను వ్య క్షపరచినపుడును, నతని భావము సంపూర్ణముగ ఇంద్రియజుష్టమైయుండుటచే సాత్త్వికమగు రసానుభూతి కింకను తగిన పరిస్థితి యేర్పడలేదు. అభిజ్ఞాన సందర్శనముచే గకుంతలాస్మృతి కలుగగా రాజు క్రమముగా పూర్వవిషయము నంతను మననము చేసికొని పశ్చాత్తప్పుడైనాడు. శకుంతలా చిత్రపటమును ముందిడుకొని రాజు “దర్శనసుఖమనుభవత స్సాక్షాదివ తన్మయేన హృదయేన స్క్రైతికారిణా త్వయా మే పునరపి చిత్రీకృతా కాంతా” యని బాష్పాకులుడగుటయు, ఆ బాషుములు దృష్టిని నిరోధించుచుండగా, “ప్రజాగరాత్‌ స్టలిభూత స్తస్యా స్వప్నేసమాగమః బాష్పస్తు న దదాత్యేనాం [దష్టుం చితగతామపి” అని దుఃభించుటయు - జరుగునాటి కతనిస్థితి వేరు. కావువాసనా భూయిష్టమైయుండిన భావ మిప్పటికి క్షాళితమై సాత్త్వికస్థితిని బొందినది. “సంరోపి2 తే ప్యాత్మని ధర్మపత్నీ త్యక్తా మయా నామ కులప్రతిస్థా కల్పిష్యమాణా మహతేఫలాయ వసుంధరా కాలఇవో ప్తవీజా” యని రాజు, “కులప్రతిష్థ, ధర్మపత్ని” యని శకుంతలను భావించుస్థితికి వచ్చియున్నాడు. నాయకుని మనస్సు తప్తమై విశుద్ధమైన దసుట కిది తార్కాణము. మారీచాశ్రమమున వ్రకైకనిష్టయైయున్న శకుంతలస్థితి - వసనే పరిధూసరే వసానా నియమక్షామముఖీ ధృతైకవేణీ అపి నిష్కరుణస్య శుద్ధశీలా మమ దీర్ణం విరహ్మవతం బిభర్తి అని వర్ణితమైయుండుట గమనింపదగినది. ఇందు భౌతికసౌందర్యమున కేమాత్రమును ప్రసక్తిలేదు. మాతృత్వపరిపూతమైయున్న సతీస్వరూపమే యిందు దుష్యంతునకు గోచరించునది. ఇంద్రియక్షా ళితమై, విశుద్ధమై యతని మనస్సు రసము నాస్వాదించుట కర్ష మైయున్నది. ఇదివరకే పరితప్తమై రసోన్ముఖముగనున్న నాయకుని హృదయము, సతీసుతసందర్శ్గనము కారణముగా (దవీభవించినది.

1922 పందిరి ముల్లికార్డునరావు శతజయంతి సంప్పటము 4: సాహిత్యము నాయకునిజీవితవు నాయికాజీవితముతో తాదాత్మ్యమును గాంచినది. భావపరంపరల కారణముగా తప్తముళలై, పరిపక్వములె రసోన్ముఖములై యున్న సామాజికుల హృదయములును ఈస్థితియందే ఆర్ధ్రములై (ప్రశాంతతకు లోనగుచున్నవి. ఏదియో అనిర్వచనీయమగు సంతృప్తిని, అలౌకికమగు సంతోషమును, సామాజికు డనుభవింపగలుగుచున్నాడు. కావున రసాస్వాదన యనునది మనోవ్యాపారముమైననే ముఖ్యముగా నాధారపడియున్నది. సంస్కారము గల సహృదయుని మనస్సునందు స్మరణకారణముగాకూడ భావముద్చుద్ధమై, భావనావ్యాపారముచే (క్రమవికాసమును గాంచి, పరిణతస్థితియందు రసముగా పర్యవసింపవచ్చును. కావున భౌతికమగు వస్తువువల్లనే భావోత్పత్తి కావలెననెడి నియవముములేదు. వమన యిందియములకు (ప్రత్యక్షముగా గోచరింపని వస్తువునందుకూడ మన కాసక్తి యేర్పడుటయు, నాకారణమున భావోత్పత్తి కలుగుటయు జరుగుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్షముగ చూడకున్నను, వినికిడివలననే రుక్మిణి కతనియందు భావముత్పన్నమైనది. దీనికి పూర్వసంస్కారమే కారణమని చెప్పవలసియున్నది. , “లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాండు గోవిందుండు ద్విగ్నంబయ్యుడి మానసంబు వినెనో వృత్తాంతమున్‌ బ్రాహ్మణుం డగ్నిద్యోతను: డేటికిం దడసె నా యత్నంబు సిద్ధించునో భగ్నం బైచనునో విరించికృత మెబ్బంగిన్‌ (బవర్తించునో” అని రుక్మిణి అనేకములగు భావపరంపరలకు లోనగుటతో ప్రధానమగు భావమునకు స్థరత యేర్పడుచున్నది. “చెప్పదు తల్లికిం దలంపుంజిక్కు దిశల్‌ దరహాసచందికం గప్పదు వక్త్సృతామరసగంధసమాగత భృంగసంగమున్‌ రొప్పదు నిద్రంగైకొన దురోజపరస్పరసక్తహారముల్‌ విప్పదు కృష్ణమార్గగతవీక్షణపంక్తులు [ద్రిప్పదెప్పుడన్‌” అను స్థతికి నాయిక వచ్చునప్పటికి భావము క్షాళితమై రసోన్ముఖమగుచున్నదని తెలియుచున్నది. రుక్మిణి గావించిన గౌరీ స్తవమును బట్టి యీమె భావ మెట్లు విశుద్ధము, సాత్త్వికపధానమునై యున్నదియు వ్య క్షమగుచున్నది

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1923 “నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్‌ మిమ్ము6 బురాణదంపతుల మేలు భజింతుంగదమ్మ మేటి పె

  • ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతింజేయుమమ్మ నిన్‌ నమ్మినవారి కెన్నండును నాశము లేదుగదమ్మ యీశ్వరీ.” భావ మిట్లు అప్రత్యక్షమగు వస్తువునాధారమునగూడ నుద్భుద్ధమై భావనావ్యాపార కారణమున వికాసమునుగాంచి రసముగా పర్యవసించుటకు వీలున్నది. భక్తిరసోత్పత్తి కిదియే మార్గమగుచున్నది. భగవత్స్యరూపము అవ్య క్తము, అప్రత్యక్షము నైనను, తద్విషయకమగు నాసక్తి కారణముగా భావము హృదయమున నుతృన్నమగుటయు, పిమ్మట ధ్యానమననాది మనోవ్యాపారముచే భావము వికాసమునుగాంచి రసముగ పర్యవసించుటయు జరుగును. “హరిగుణ గావత నాచుంగీ మైతో - (పభుగుణ గావత నాచుంగీ” అని మీరాబాయి భక్త్యావేశమున పలుకుట యిందుల కుదాహరణ మగుచున్నది. ఏ వి[గ్రహమునుగూడ ఆలంబనముగా గొనక మహాభక్తులు కొందరు ధ్యానమననాది వ్యాపారమువల్లనే భగవత్ప్యరూపముతో తాదాత్మ్య్యమును బొంది రసానుభూతికి లోనగుదురు. కావున రసాస్వాదన విషయమున భావమును భావనయు (పప్రధానములు. సంస్కారము, కావ్యపఠనాభ్యాసము, కళాభిజ్ఞత కల వ్య క్తియెనచో హృదయము చైతన్యవంతము, కోమలమునై యుండగలదు. సూక్ష్మభావములను (గ్రహించుశక్తియు ఇంద్రియ (ప్రత్యక్షము గానివానిని భావనచేసికొనగల సామర్థ్యమును మనస్సునకు కావ్యానుశీలనాదిశిక్షణ చే సిద్ధించుచున్నవి. అట్టివారికి కావ్య రసాస్వాదన సులభసాధ్యమగుచున్నది. ఐన, సామాజికుని మనస్సున ఖావము నుద్చుద్ధముచేసి, దానిని వికసింపచేయుటయు, నతనిని భావనావ్యాపారమునకు లోనుచేయుటయు నెట్లు, అను ప్రశ్న యుదయించుచున్నది. ఉద్దిష్టభావమును సామాజికుని హృదయమునం దుత్పన్నము చేయగల సన్నివేశకల్పన (ప్రధానవిషయము. సామాజికుని జీవితమున సంస్కారరూపమున నెలకొని, సుప్తమైయున్న భావమున కుద్చోధను కలిగించు శక్తిసంపద సన్నివేశము నందుండవలను. అదియునుకాక సామాజికునియందుకూడ నా భావము

1924 పండిరి ముల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: పాహెత్యము పూర్వసంస్కారరూపమున నుండినప్పుడే దానికి బోధకలుగుట కవకాశమున్నది. కనుక అట్టివారియందు మాత్రమే భావోదయము కలుగుచున్నది. సంస్కారము లేనివారుకూడ కలరన్సియు, వారికి భావోదయము కలుగజాలదనియు, నట్టివారు దారువిగ్రహములవంటివారనియు వివరింపబడియున్నది. రసపరులగు వారిలో నుదయమొందిన భావము తదనంతర సన్నివేశాదులచే వికాసమును గాంచుచున్నది. అట్లు వికసించిన భావము కారణముగా మనస్సున సజాతీయ విజాతీయములగు భావపరంపర లుత్పన్నమగుచు, నడగుచు హృదయమును మథధించుచున్నవప. (పధానభావమును పప్రథమదశయం దంటియున్న తామసిక రాజసిక మాలిన్యము, తతృలితముగా క్షాళితమగుటయు, ప్రధానభావము శుద్ధ సాత్త్వికరూపమున ప్రకాశించుచు హృదయమున స్థిరతనొందుటయు జరుగును. ఇట్లు విశుద్ధమైయున్న భావమే పరిణామదశయందు రసముగా నాస్వాదింపబడుచున్నది. తామసికప్రవృత్తితో జడస్వరూపమున నున్న నీరము ఉష్టసంపర్కముచే తప్తమైః క్రాగి క్రాగి, తామసిక రాజసిక ప్రవృత్తులను గోల్పోయి శుద్ధమగు ఆవిరిరూపము నొందుచున్నది. అది నీరముయొక్క సాత్త్వికస్వరూపమని స్థూలముగా చెప్పవచ్చును. ప్రశాంతమగు చల్లని వాతావరణ మేర్పడుటతోడనే ఈ ఆవిరి అచ్చు బామబిందురూపమును (గ్రహించు ప్రకృతివిధానమును రసోత్పత్తివిషయమున భౌతికోదాహరణముగా గైెకొనవచ్చును. ఈ దృష్టాంతము భౌతికవస్తువునకు సంబంధించినదనియు, స్థూలముగ మాత్రమే రసోతృ్పత్తివిషయమున దీనికి సాదృశ్యము వర్ణితమైనదనియు గుర్తించవలయును. సంపూర్ణముగ మానసికసంబంధమైనది రసవిషయము. మనసా అనుభ వైకవేద్యమగు నీ విషయమునందు సమగమగు దృష్టాంతమే సిద్ధింపదు. భావనావ్యాపారము ప్రధానముగా, హృదయముక్షా ళితమై, విశుద్ధమగు, భావముతో తాదాత్మ్యమును గాంచినప్పుడు సిద్ధించునది రసానుభూతి. కావున మానవవునస్తత్యవే. ఆధారముగా రసాస్వాదనయను విష యమును వివరింపవలసియున్నది. మానవజీవితమున కత్యంతసన్నిహితము హృదయాకర్ణకము నగు సన్నివేశ సందర్శనముచే (మన చిత్తమున భావముత్పన్నమగుట యీ వషయమున (పథమఘట్టము. ఐన, అట్టి సన్నివేశమును దర్శించుటచే స్వాభావికముగ మనయందుత్పన్నములగు భావము లిట్టివి యనెడి ప్రశ్న కలుగుచున్నది. వాస్తవజీవితమునందలి సన్నివేశముల కారణముగా మనయందు కలుగు

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు , 1925 భావములకును, నాటక సన్నివేశము కారణముగా వున హృదయము నందుత్పన్నములగు భావములకును పూర్తిగా సాదృశ్యముండుటకు వీలులేదు. వాస్తవజీవితమున మన ప్రవృత్తి వేరు. సామాజికులుగా నాటకముసు దర్శించునప్పటి మన ప్రవృత్తి వేరు. శోకము, హర్షము - ఇత్యాది కారణములవలన మనయందు వాస్తవజీవితమున శోకహర్షాదులే యుత్పన్నములగుననియు, నాటకములందలి విభావాదులు అలౌకికములగుటచే, మనయందు హర్షమునే కలిగించుననియు ఆలంకారికుల మతము. ఈ అభ్మిపాయము ననుసరించియే, నాటకమున పోషితమైన రస మేదియైనను, సామాజికుడనుభవించునది ఆనందమే యని వీరు నిశ్చయించినారు. కావున కావ్యరసాస్వాదన యనునది అలౌొకికవిషయమని నిరయమగుచున్నది.

“తేన నాట్యవివ రసా న లోక ఇత్యర్థః అని అభినవభారతియందు వివరింపబడినది. భావోత్పత్తికి కారణమగు సన్నివేశమును లేక వస్తువును విభావమని శాస్త్రమున వ్యవహరించినారు. లౌకికజీవితమున రత్యాదిభావముల యుత్పత్తి కాధారములగునవి కారణములు (యేతువులు) అనియు, కావ్యవమున వానియుత్పత్తి కాధారములగునవి విభావములనియు అభినవగుప్పడు వ్యవహరించినాడు. సావూజికుల హృదయములయందు వాసనారూపమున బీజప్రాయములై యున్న రత్యాదిభావములు వీనిచే అంకుర ప్రాదుర్భావయోగ్యము లగుచున్నవి.

“విభావ్యంతే అస్వాదాంకురపాదుర్భావయోగ్యాః -

(క్రియంతే సామాజిక రత్యాదిభావాః” ఈ నిభావము ఆధారముగా మన హృదయములలో నుద్చోధజెందునది భావము. విభావము కారణమును, భావము కార్యమును నగుచున్నవి. విభావము భావము నుద్భుద్ధముచేయుటయేకాక, దాని కుద్దీపకముకూడ నగుచున్నది. కావున విభావమును ఆలంబనము, ఉద్దీపనము నని ద్వివిధముగా పరిగణించినారు. హృదయమున బీజ్సపాయముగా సంస్కారరూపమున నున్న రత్యాదిభావమున కుద్చోధను కలిగించునది ఆలంబనవిభావము. సుప్తమైయున్న భావము బోధచెందుటకు ఈ సన్నివేశము లేక వస్తువు ఆలంబన మగుచుండుటచే దీనికి ఆలంబనవిభావ మను వ్యవహారము సిద్ధించినది.

1926 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “ఆలంబనం నాయకాది స్తమాలంబ్య రసోద్దమాత్‌” శృంగారరసము నుదాహరణముగ నిరూపించుచో - నాయకుని యందు రతిభావోదయ మగుటకు నాయిక ఆధారము గాన నాలంబనవిభావ మగుచున్నది. = అట్లే నాయికయందు భావోదయమగుటకు నాయకు డాలంబనమగును. అట్లు బోధజెందిన రతిభావము నుద్దీపింపజేయునవి వారి సౌందర్యము, ప్రాయము, భూషణములు మున్నగునవి. బోధజెందిన భావము సంపూర్ణ చైతన్యమును గాంచి వికాసమునందుట కుద్దీపనవిభావము హేతువగుచున్నది. “ఉద్దీపనవిభావా స్తే రస ముద్దీపయంతి యే” అని ఉద్దీపనవిభావములు రసము నుద్దీపిపంజేయునవిగా పేర్కొనబడినవి. ఇందలి రసశబ్బమునకు స్థాయాభావమనియే యర్థము. యౌవనసౌందర్యచేష్టాదులు రతిభావ పోషకములగుట ప్రకృతి సహజమగు విషయము. ఇట్లు, ఆలంబనోద్దీపన విభావాదులు కారణములుగా హృదయమున వికాసమును గాంచిన భావము నాయికానాయకుల మనోదేహములైై [్రాబల్యమును వహించి వారి ననేకములగు (ప్రవృత్తులకు లోనుజేయుచున్నది. హృదయమున వికాసముగాంచిన భావము కారణముగా దేహమున గలుగు మార్చులన్నియు అనుభావములే యగుచున్నవి. భావవికాసమునకు అవ్యవహితముగా నేర్పడు కార్యము లగుటచే “అను = పశ్చాత్‌, భావః = ఉత్పత్తి; యేషాం తే” అను వ్యుత్పత్తి ననుసరించి వీని కీ వ్యవహారము సిద్ధించినదని చెప్పవచ్చును. అంగజములయిన యీ మార్పులు హృదయమున 'ప్రాబల్యము వహించియున్న భావమునకు సూచకములగుచున్నవి. | ఈ అనుభావములలో కొన్ని అయత్నజములు. హృదయగత భావావేశము కారణవలుగా దేహమునగల్గు - స్యేదరోవూంచాదులన్నియు నిట్టివే. భావప్రాబల్యమునకు లోనై వ్యక్తి తానై చేయు శృంగారచేషస్టలును అనుభావములే. కటాక్ష (భూవిక్షేపాదిచేష్టలు యత్నజములు. ఐనను హృదయగతమగు స్థాయీభావావేశమునకు లోనైయున్న వ్యక్తి యొనర్చు యత్న మత్యల్పమనియే - చెప్పవలయును. సాధారణమగు నితర కార్య(ప్రవృత్తియందు సంకల్పమును యోచనాదికవ్యాపారమును (ప్రధానము లగుచున్నవి. చేష్టారూపానుభావముల విషయమున యోచనాదిక వ్యాపారమునకును, సంకల్పమునకును ప్రసక్తి లెదనియే చెప్పవచ్చును. హృదయము నావేశించియున్న స్థాయీభావము వ్యక్తిచే నీ చేష్టాదికమును చేయించుచున్నది. అట్టి అనుభావములకు తాను లోనైయున్నాననెడి

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1927 జ్ఞాన మొకప్పుడు వ్యక్తికి లేకపోవచ్చను. రతిభావావేశమునకు లోనైయున్న ముగ్ధనాయికా చేష్టాదికము నిందుదాహరణగా గైకొనవచ్చును. (కోధావిష్టుడగు వ్య క్తిచేష్టలును నిట్టివే. ఇవికాక, వ్య క్షిపయత్నాదిక మేమాత్రమును లేకయే దేహమునందు గలుగు స్వేద, రోమాంచ, కంప, వివర్ణతాదులగు మార్పులుకూడ గలవు. వీనిని సాత్త్వికభావములని వ్యవహరించినారు. సాత్త్వికభావమనెడి 'ప్రయోగముకూడ పారిభాషికమే. అనుభావములవలె నివియు కార్యములే. ఐనను, అనుభావసాత్త్విక భావములకు ముఖ్యమగు భేద మొకటి కలదు. హృదయము స్థాయీభావ (పాబల్యమునకు లోనుగాకుండినను, వ్యక్తి కటాక్ష భూవిక్షేప ఆంగికవిక్షే పాదులను ప్రయత్నపూర్వకవముగ (పవర్తింప జేయగలడు. వాచికాంగికాద్యభినయమున శిక్షణ నొందిన నటుల (ప్రవర్తనయే యిందుల కుదాహరణము. సాత్త్విక భావప్రవృత్తి దీనికంటెను భిన్నమైనది. హృదయము భావావిష్టమైననేతప్ప దేహమున సాత్త్వికములగు మార్పులు కలుగవు. హృదయమున నిలిచియున్న రత్యాదిభావములను పెకి (ప్రకాశింప జేయు నాంతరధర్మము సత్త్యమనియు, తజ్జన్యములగు మార్పులు సాత్త్వికములనియు లక్షణము గలదు. రజస్తమస్పృష్టముకాని మనస్థితి సత్త్వమనియు, దానినుండి జనించినవగుట నివి సాత్త్వికములనియుకూడ వివరింపబడియున్నది. పరుల సుఖదుఃఖాదుల యెడ సుముఖమగునట్టి విశుద్ధాంతఃుకరణధర్మ మేదికలదో అది సత్త్యము. హృదయము సాత్త్విక (ప్రధానమై యున్నప్పుడే మనకు పరుల కష్టసుఖాదులతో సానుభూతి యేర్చడుచున్నది. అట్లు సత్త్వ(ప్రధానమైన హృదయము భావానుభూతికి లోనైనప్పుడు, తత్పత్వమునుండి కలుగు దైహికములగు మార్పులు సాత్త్యికములు. కావున సాత్తికోదయమునకు, హృదయము రజస్తమోగుణరహితమై విశుద్ధమై యుండుటయు, పరగత సుఖదుఃఖాదులయెడ సుముఖమై యుండుటయు (పధానవిషయములు. హృదయ[గంథివీడి, ఆర్జంవుగుచున్నదనుట కీ సాత్త్వికభావములు సూచకములు.

“స్తంభః స్వేదొజథ రోమాంచః స్వరసాదొఇథ వేపథుః

వైవర్ణ్య మగ్రు ప్రళభయః ఇత్యష్టా సాత్త్వికాః స్కృతాళొ ఇట్లు సాత్వికము లెనిమిది యని నాట్యశాస్త్రమున పేర్కొనబడియున్నది.

స్థాయీభావ ప్రాబల్యమువలన నిట్లు దైహికములగు మార్పులు మాత్రమేకాక, మనస్సున భావపరంపర లుద్చుద్ధమగుట కలదు. ఈ భావపపరంపర హృదయమున

1928 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము స్థిరముగా నిలువక, వెంటవెంటనే లేచుచు నడగుచు నుండుటచే వీనిని సమ్ముదము నందలి యలలతో బోల్పవచ్చును. వీనికి వ్యభిచారిభావములు, సంచారిభావములు అని శాస్త్రమున వ్యవహారము. “వివిధ మాభిముఖ్యేన రసేషు చరంతి ఇతి వ్యభిచారిణః వాగంగసత్త్యోపేతాన్‌ ప్రయోగే రసాన్‌ నయంతీతి వ్యభిచారిణః॥”

హృదయగతమగు భావావేశము మాత్రమేకాక శారీరాదిక వ్యాపారములుకూడ ఈ సంచారీభావముల యుత్పత్తికి కారణములు కావచ్చును. కాని రసానుకూల వ్యాపారవఎటన నివి సహాయములగుచుండుటచే, వీని యుత్పత్తికి కారణములైనవానికికూడ స్థాయీభావమే ఆధారము కావలను. నిర్వేదము, శ్రమ, దైన్యము మున్నగు నీ సంచారీభావములు ముప్పదిమూడును చిత్తవృత్తి విశేషములే యగును. ఒక వస్తువునందలి ఆసక్తికారణముగా మనస్సున భావమేర్ప్చుడుటయు తద్విషయకమగు ఆలోచనకు వ్యక్తి లోనగుటయు పకృతిసహజమగు విషయము. శృంగారరసవిషయము నుదాహరణగా గెకొన్నచో, నాయికావిషయకమగు రతిభావము నాయకుని హృదయమున నుద్చుద్ధమైః నాయికాసంబంధములగు యౌవన భూషణ శృంగారచేస్టాదికములచేతను, తటస్థములగు చంద మలయానిలాదులచేతను వికాసమును గాంచి స్థాయిగా నేర్పడుచున్నది. పిమ్మట, ఈ స్థాయీభావప్రాబల్యమునకు లోనై నాయకుడు నాయికావిషయికమగు నాలోచనకు, భావనకు లోనగుచున్నాడు. తతృలితముగా ననేకములగు భావము లొకటివెంబడి యొకటిగా మనస్సున నుదృవించును. మరల నందే లయించుచుః హృదయమును మధథించుచున్నవి. ఒకప్పు డొత్పుక్యము, ఒకప్పుడు దైన్యము, ఒకప్పుడు శంక, ఒకప్పుడు వితర్క్మము - ఈవిధముగా భావములు తాత్కాలికముగ పొడముటయు, మరల లయించుటయు జరుగుచుండును. ఇట్లు జనించు ఈ వ్యభిచారిభావముల [ప్రాబల్యమునకూడ అనుభావోత్పత్తి కలుగుచున్నది. ఇట్లు సంచారిభావోత్పత్తికి మరల భావములే విభావములగుచున్నవి. ఇట్లు ప్రవర్తించు సంచారీభావములచే స్థాయీభావము పుష్టమై రసపర్యవసితమగుచున్నది. హృదయగతభావము సారవంతమైయున్న సందర్భమున, తత్కారణముగా జనించు భావాంతరములు - విరుద్ధములైనవికూడ - దానికి పోషకములేయగును. ఇది మానవటప్రకృతికి సహజమగు విషయము. అట్లు రసపర్యవసిత మగువరకును నిలిచియుండగల శక్తివంతమైన ప్రధానమగు చిత్తవృత్తినే స్థాయీభావమని

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు 1929 వ్యవహరించినారు. ఈ సంచారిభావములును చిత్తవృత్తులే యగుటచే నివియు కార్యములే యగుచున్నవి. దుఃఖము, ఈర్ష్య ఇత్యాది చిత్తవృత్తులు కారణములుగా నిర్వేదమనెడి చిత్తవృత్తి జనించుచున్నది. దీర్ప నిశ్వాస రోదనాది వ్యాపారముచే నీ దైన్యము వ్యజ్యమాన మగుచున్నది. ఇందు దుఃఖాదులు విభావములుగా బైన్యమనెడి సంచారిభావ ముత్పన్నమై, దీర్సనిశ్వాసాది అనుభావములచే వ్య క్తమగుచున్నది. ఇట్లు వివిధభావాదులు సంచారిభావోత్పత్తికి కారణములగు చున్నవి. కావున రత్యాదిస్థాయాభావములుకూడ వేరువేరు సందర్భములలో సంచారులు కావచ్చును. దీని ననుసరించి సంచారిభావములు నలుబదియొక్కటి యనికూడ చెప్పవచ్చును. సంచారిభావము లెన్ని కలిగినను వానికి స్థాయీభావమే యా్యశ్రయమనుట గమనింపదగిన విషయము. అట్లుకానిచో రసోత్పత్తి కాధారమే యుండదు. సము[ద్రమందలి అలలన్నియు సము[దదము నందలి జలభాగములేకాని భిన్నములు కావు. ఈ అలలు లేచుట, లయించుట అను ప్రవృత్తి కంతకును సముద్రము నందు గల ఆంతరశక్తియే ఆధారము. ఈ తరంగముల ప్రవృత్తి సముద్రమున కున్నతిని, ఉల్తేజమును కలిగించుచు తత్‌స్థితికి పోషకమగు చున్నది. వీన్మిపవృత్తిని బట్టియే సముదస్వరూపము మనకు వ్య క్తమగుచున్నది. అట్లే, స్థాయాభావము నాధారమున నుతృున్నములైన సంచారిభావములును తత్పోషకములగుచు, తత్స్వరూపమును వ్య క్త్రముచేయుచున్నవి.

ఐన, ఇంతటి శక్తిసంపన్నమైన స్థాయీభావ స్వరూపమెట్టిది?

“భావశబ్దేన తావచ్చిత్తవృత్తివిశేషా ఏవ వివక్షి తాః” అని అభినవగుప్తపాదుడు చిత్తవృత్తివిశేషమే భావమని వివరించినాడు. _

“నిర్యికారాత్మకే చిత్తే భావః ప్రథమవ్శికియా” విశుద్ధమగు నంతఃకరణమున గలుగు మొదటిమార్పు భావమనియు వివరింపబడియున్నది. అనగా శక్తిసంపన్నము, విశిష్టము నగు విభావము నాధారమున గలుగు చిత్తవృత్తివిశేషమే భావము. ఇంతవరకును మనస్సు నిర్వికారమైయున్న కారణమున నిపుడు కలిగిన భావము హృదయమును సంపూర్ణముగ నాక్రమించుట కవకాశమున్నది. పిమ్మట నెన్నియఘాతములు కలిగినను, చలింపక నిలిచి, అనుకూల పరిస్థితులలో వికాసమును గాంచి ఆస్వాద్యమానమగు పరిణతికి లోనగుచో, నట్టి భావము స్థాయీభావమని

1930 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వ్యవహరింపబడుచున్నది. అనగా, విశిష్ణమగు సన్నివేశమునాధారమున సహృదయుడగు వ్య క్రహృదయమున (ప్రకాశమునుగాంచి, రసస్ఫూ ర్తివరకును నిలిచియుండు భావము స్థాయీభావము.

“చిరం చిత్తే నతిష్టంతే సంబద్ధ్యంతే2 నుబంధిఖిః

రసత్వం య్‌ 'ప్రపద్యంతే (ప్రసిద్ధాః స్థాయినో2 (తతే” అనుభావాదులచే వ్య క్తములై, చిత్తమున స్థిరముగా చిరకాలము నిలిచి, తుదకు రసత్వమును బొందునవి స్థాయీాభావములు అని అర్థము. “నిర్వికార చిత్తము “చిరకాలము నిలిచియుండుట” “రసత్య్వమును బొందుట” అను విషయములు గమనింపదగినవి. విరుద్ధభావాదుల (పప్రాబల్యమునకు లోనైయున్న చిత్తమున విభావానుగుణమగు భావోత్పత్తికి అవకాశమే కలుగదు. విభావము నాధారమున నుద్బుద్ధమగు భావము సారవంతము, స్థిరము నైనది కాకున్నచో తదనంతరము కలుగు నాఘాతములకు నిలువజాలక మధ్యనే లయించిపోవచ్చును. అప్పుడది సంచారియే యగునుకాని, స్థాయి కాజాలదు. మరియు, చిరకాలము చిత్తమున నిలిచియుండుటయేకాక, క్రమముగ వికాసమునుగాంచి ఆస్వాద్యయోగ్యమగునట్టి పరిణామమును గాంచవలయును. అప్పుడే వ్యక్తికి అనిర్వచనీయమగు ఆనందము సిద్ధింపగలదు. అట్టి శక్తిసంపన్నమైన చిత్తవృత్తివిశేషమే స్థాయీాభావము.

ఈ స్థాయీభావమే విభావానుభావవ్యభిచారిభావసంయోగముచే రసముగా నిష్పన్నమగునని ఆలంకారిక సిద్ధాంతము. ఐన, సొమాజికుని విషయమున రసానుభవ మెట్లు సిద్ధించుచున్నది, అతనియందు భావోదయమును గలిగించు విభావాదులేవి, ఇత్యాది (ప్రశ్నలను విమర్శింపవలసియున్నది.

(సశేషము) | (కిన్నెర: సంపుటము 5, సంచిక 8, ఆగస్టు 1953)

నాటకము: రసానుభూతి. భూపతి లక్ష్మీనారాయణ రావు (ఆగస్టు సంచిక తరువాయి)

రసాస్వాదన యనునది మనస్సునకు సంబంధించిన విషయమనియు, దానికి భావనావ్యాపారము (ప్రధానముగా నాశయ మగుచున్నదనియు నిదివరలో వివరింపబడినది. సామాజికునియందు రసోత్పత్తి యట్లు కలుగుచున్నదనెడి విషయమునుగూర్చి చర్చించుటకు పూర్వము మానవమనస్తత్త్వ్రమునుగూర్చియు, చిత్తవృత్తులగు భావముల స్వభావమును గూర్చియు, నీ ఠెంటికిని గల పరస్పర సంబంధమును గూర్చియు కొంత విమర్శ యవసరమగుచున్నది. కారణ రూపమగు నాలంబన విభావము నాధారమున భావము మనస్సునందుద్చుద్ధమై, ఉద్దీపన విభావాదులచే వికసించి స్థాయిగా నేర్పడుచున్నది. అట్లు మనస్సున నెలకొన్న స్థాయిభావ ప్రాబల్యమున చిత్తము పరిపరివిధములగు నలజడికి లోనగుచున్నది. సంచారిభావోత్పత్తికి ఈ యలజడియే సన్నిహితమగు హేతువు. (ప్రత్యక్షము, ప్రబలమునగు విభావము, ఆలంబనము కాకుండుటవల్లను, చిత్తము ఇదివరకే సారవంతమగు నొక భావముచే నాక్రాంతమై యుండుటవల్లను, ఈ సంచారులు తాత్కాలికముగా మాత్రమే ప్రవర్తించును. మరియు, చిత్తము నాక్రమించియున్న స్థాయీభావమే యీ తాత్కాలిక భావపరంపరల యుత్పత్తికి సన్నిహితాలంబన మగుటచే దానిని (త్రోసిరాజనుటకు వీనికి శక్తియును లేదు. కావున సంచారులగువానికి రసముగ పర్యవసించు నధికారము లేదు. స్థాయాభావము మాతమేకాక (ప్రత్యక్షమగు సన్నివేశమో విషయమో ఆధారముగా పందిరి మల్లికార్టునరావు శతజయంత సంపుటము 4: సాహిత్యము.

1932 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నిట్టి తాత్కాలిక భావములు మనసున పొడమవచ్చుసు. వీని యుత్పత్తి కాధారమగు నా విభావ మల్చమైనదియై యుండుటయే యీ భావములు తాత్కాలికము లగుటకు కారణము. కావున అల్పవిభావముల వలన నుతృన్నములైన భావములు సంచారులుగ మాత్రమే ప్రవర్తింపగలుగుచున్నవి. ఆలంబనము ప్రకృష్ణము, సమర్థము నై యున్నప్పుడే మనస్సు నందుద్చుద్ధమైన భావము మనస్సు నాక్రమించి, స్థిరపడి, దానిపై నధికారమును వహింపగలుగుచున్నది. అట్టిభావమే స్థాయి యగుచున్నది. ప్రశాంతముగనున్న కొలనునీటిలో బరువగు వస్తువు పడుటతో నొక 'పెద్దయల యుత్పన్నమై నలువైపుల ప్రసరించుటయు, నాయల యితరములగు చిన్నచిన్న యలల యుత్పత్తికి కారణమగుటయు ప్రకృతిసిద్ధమగు విషయము, న్థాయిసంచారి భావముల విషయమున నిది స్థూలమగు భౌతిక దృష్టాంత మగుచున్నది. తరంగోత్పత్తికి కారణభూతమగు వస్తువుయొక్క భారమును, పరిమాణమును, వేగమును ననుసరించి తరంగమున కున్నతియు, శక్తియు సిద్ధించునబ్లే, విభావషముయొక్క ప్రకర్షము ననుసరించి భావము స్థాయియో సంచారియో అగుచున్నది. స్వల్పమగు శక్తియు, తాత్కాలిక ప్రవృత్తియు మాత్రమే కల సంచారికి రసపర్యవసాయియగు సామర్థ్యము లేదు. మానవ మనస్తత్వమున కీ విషయముతో సమన్వయము చక్కగ కుదురుచున్నది. జీవితమున నేర్పడు 'సంఘటనలన్నియు మనస్సు నలజడి నొందింపజాలవు. అల్పవిషయము లన్నిటికిని మనస్సు పై నట్టి ప్రాబల్యమే యున్నచో జీవితము నడచుటయే దుర్హటము కాగలదు. జీవితమున మన కయిష్టములగు నల్బవిషయములు జరుగుటయు, తత్కారణముగా మనస్సున ఖేదమో, కోపమో, విసుగో తాత్కాలికముగ నేర్పడుటయు సహజమే. ఈ ఖేదాది చిత్తవృత్తులు తాత్కాలిక ప్రవృత్తిని కల్గి మరునిముషముననే లయించిపోవుచున్నవి. చిత్త వున్యభావమున కాకరవుగుచున్నది. భయత్రాసములకును, (కోధరోషములకును గల భేద మీవిషయమును సువ్య క్షము చేయగలదు. “వ్యాఘఘదర్శనాదిజన్మా పరమానర్థ విషయకో వైక్షబ్యాఖ్య శ్చీత్తవృత్తివి శేషః భయం”

అను లక్షణమును బట్టి పరమార్థవిషయకమగు వైక్షబ్యము భయమని ఆలియుచున్నది. ఇందు వ్యాఘాదులవలన వ్యక్తికి మరణాది రూపమగు భావము కలుగుచున్నది.

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1933

“స్పీంనీచప్రకృతికం గురురాజాపరాధశ్వాపదశూన్యాగారాటవీ

పర్వతగహన గజాదిదర్శన నిర్భ రృనకాంతర దుర్దిన

నిశాంధకారోలూక నక్తంచరారావ శవణాదులు” భయమునకు కారణములుగను (విభావములు) కరచరణ హృదయ కంపనములు, ముఖకోషణ జిహ్వాపరిలేహన, శ్వేద వేపథు సంభ్రాంతాదులు, (కార్యములుగను) అనుభావములుగను నాట్యశాస్త్రృమున పేర్కొనబడినవి. రౌద్రమూర్తియై తమ్మా[క్రమింపవచ్చు భీముని గని, ఉపకీచకులు,

“ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని రింకెట్తొక్కొాయంచున్‌ భయం

బొదవం బల్లములందు డాంగియు సమీపోర్చీజముల్‌ వ్రాంకియుం,

జఇెదజం బాజీయు, నీరు సొచ్చియును నిశ్చేష్టం బదద్వంద్వముల్‌ గుదివడ్డం బెగడొందియున్‌, భరితసంక్షో భాత్ము లై రత్తరిన్‌”

ఈ వర్ణన భయమునకు చక్కని లక్ష్యము. _ప్రళయకాలాంతక మూర్తి యగు భీముని రాక ఉపకీచకులకు ప్రాణాంతమగు మహానర్థమైనది. కావున ప్రాణఖీతిచే వారు సంక్షో భాత్ము లై (ప్రవర్తించినారు. అఆనుభావరూపమగు వారిప్రవర్తనచే చిత్తప్రవృత్తి చక్కగ వ్య క్తమగుచున్నది. ఇందు విభావము ప్రకృష్ణమైనది యగుటచే చిత్తమునకు కలిగిన అలజడియు, తతృలమగు అనుభావరూప బాహ్యప్రవృత్తియు కూడ (పకృష్ణములే మై యున్నవి. కావున, భయమనెడి చిత్తవృత్తికి స్థాయితార్హత కలిగినది. ఇక, త్రాస విషయము వేరు. “ఆకస్మికభయా చ్చిత్తవిక్షోభ స్త్రాసఃి అనియు, విద్యుదుల్కాశనినిపాత నిర్హాతాంబుధర మహాసత్త్వ పశురవాదుల వలన గలుగు చిత్తవృత్తివిశేషము త్రాసమనియు,

“నీరో ర్లోరసత్త్వదర్శన స్ఫూర్దధు

(గ్రవణాది జన్న్మా చిత్తవృత్తివిశేష స్త్రాసళొ అనియు లక్షణములు. ఇందు పేర్కొన్న విభావములు సామాన్యములగుటచే హృదయమునం దేర్పడిన భావము కూడ నల్పమైనదియే యగుచున్నది. మరణాదిరూపమగు మహానర్జశంక యిందేమ్యాతమును లేదు. సెలగోల పట్టి తన్ను దండించుటకై వచ్చు యశోదను చూచి కృష్ణుడు పరుగిడుచు,

1934 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

“స్తంభాదికంబులు తనకు నడ్డంటైన నిట్టట్టుసని పట్టనీనివాని

నీతప్పు మైరింపు మింక దొంగిలంబోవ నేనని మునుముట్టనేడ్చువానిం,

గాటుక నెజయంగం గన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని,

నేదెస వచ్చునో యిది యని పలుమాజు సురుగుచు. (గేంగంటం జూచువాని, యను వర్జ్దన (త్రాసమునకు లక్ష్యృమగుచున్నది. కృష్ణున కిందు కలిగిన భీతికి కారణము సామాన్యమైనదియే కాని, మహానర్థకారి కాదు. [ప్రాణాపాయశంక యిందేమ్మాతమును లేదు. కావున చిత్తమునకు కలిగిన యలజడి కూడ స్వల్ప వైైనదియే. రసగంగాధర లక్ష్య మీవిషయముననే బాగుగ వ్య క్తమొనర్చుచున్నది.

“మాకురు కశాం కరాజ్దే కరుణావతి, కంపతే మమ స్వాంతం

ఖీలన్నజాతు గోమై రంజ విలంబం కరిష్యామి” అని కృష్ణుని పల్కు. కావున, హఠాత్తుగా గలిగిన యీ చిత్త విక్షోభము శీఘ్రమే అణగునదే కాని, హృదయమున కావేగమును కలిగించునదికాదు. కావున త్రాసము సంచారి యగుచున్నది. అట్లే, నాట్యశాస్త్రమున,

ఆధర్దణాకృష్ణకలహవివాదప్రతికూలాదులు [కోధమునకు విభావములుగను, వికృష్ణనాసాపుట ఉద్వ్భొత్తనయన సందోష్టోష్ట పుట గండస్సురణాదులు అనుభావాదులుగను వివరింపబడియున్నవి.

“గురుబంధువధాది పరమాపరాధజన్మా .

ప్రజ్వలనాఖ్యః చిత్తవృత్తివిశేషః (కోధళ”ొ అను రసగంగాధర లక్షణమునందలి “పరమాపరాధజన్మా” “పజ్య్వలనాఖ్యఃా చిత్తమును ప్రజ్యలింపచేసెడు పరమాపరాధ మిందు విభావము. అపరాధినాశముతో గాని చిత్తమునకు స్తిమిత మేర్చడదు. కావుననే “అయం చ పరవినాశాది హేతు” అనియు వివరింపబడియున్నది. దుశ్శాసన కీచకకృత (దౌపదీవిషయక మహాపరాధము భీముని చిత్తమును 'ప్రజ్యలింపజేసినది. తదపరాధులు నశించు వరకును భీముని చిత్తము క్రోధభావాక్రాంతమై యుండక తప్పదు. అల్లే, ఉపకీచకకృత (ద్రౌపదీవిషయక పరిభవముచే చిత్తము ప్రజ్యలింపగా భీముడు,

నాటకము: రసానుభూతి. భూవతి లక్ష్మీనారాయణ రావు 1935 “వికటథూకుటి ఘోరఫాలకలిత స్వేదోదృటుండుం జల ద్వికృతోష్టద్వయుండుం (బమర్దనదశావిర్భావసంభావితాం గకుండుం జిత్తవిదాహదోహలసమ[గ్రక్రోధవేగుండునై"

శుంభన్మూ ర్తివిస్ఫూ ర్తితో విజృంభించి నూటయేవు రుపకీచకులను ననుయించి

శమితక్రోధుండైనాడు. కనుక నీ చిత్తవృత్తి స్థాయి యగుచున్నది. ద్రౌపది హృదయము

కూడ నిల్లే దుశ్ధాసనవధాంతము వరకును కోధమునకు నిలయమై యున్నది. “నెట్టిన నిట్టియల్క మదినిల్చితి రక్కెసతాల్మి6 జిచ్చొాడిం గట్టినయట్లు ెద్దయునుగాలము." “ఈవెండ్రుకలు వట్టి యీడ్చిన యాచేయి దొలుతగాం బోరిలో దుస్పసేను తనువింతలింతలు దునియలె చెదరి రూపజియున్నం గని యుడుకాబుగాక యలుపాలం బొనుపడునట్టి చిచ్చే యిది”

ఇత్యాది [దౌపదీవాక్యము లిందనుసంధదేయములు. ఇక, అమర్ద మనెడి (రోష)

సంచారిభావము యొక్క లక్షణమును బరికింతము.

“విద్యైశ్వర్యబలాధికై రధిక్షిప్తస్య

అవమానితస్యవా సముత్సద్య తే” - యని, విద్యాశౌర్యాదులం దధికులైనవారిచే జరిగిన అవమానాదులు ఉత్సాహులగు వారియందు రోషమునకు కారణములుగా నాట్యశాస్త్రమున పేర్కొనబడియున్నవి. శిరణప్రకంపన స్వేదాదులు, అధోముఖ విచింతనాదులు మున్నగునవి యిం దనుభావములు.

“పరకృతావజ్ఞాది నానాపరాధజన్యః మౌనవాక్యాది పారు

ష్యాది కారణీభూత శ్చిత్తవృత్తివిశేషో_మర్షః” అను రసగంగాధర లక్షణమునుబట్టి స్వల్పకారణోత్పన్న మైన కోపలేశము అమర్హమనియు., నది తాత్కాలికమనియు వ్య క్తమగుచున్నది. అపరాధులగువారి విషయమున మౌనమువహించుట లేక పరుషవాక్కులను బల్కుట యిత్యాదులవలన నిది గమ్యమానమగుచున్నది.

1936 " పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము “క్సు[దాపరాధజన్మాతు పరుషవచన ఆసంభాషణాది - . - హేతుః అయమేవ అమర్హాఖ్యో వ్యభిచారీతి వివేకళొ

అను వివరణ మీవిషయమును వ్య క్రమొనర్చుచున్నది.

. “ఇంతుల నేచుపాతక మదింతట నంతటం బోదు పాంథలో కాంతక నిన్ను ఘోరతమమై ఘనమై యజహత్కళంకమై వంతలం బెట్టి యాజుపది వక్కలు సేయక పూర్వపక్షపుం గంతులకేమి చూచెదవుగా తుది నీ బహుళార్తిఖేదముల్‌.”

అను గిరికాకృత చందదూషణ మిందు లక్ష్యమగుచున్నది. ఇట్లు భయత్రాసముల

విషయమునను, కోధరోషముల విషయమునను నొసంగిన లక్ష్ర్యములు

స్థాయిసంచారులకు గల భదమును సువ్యక్త మొనర్చుచున్నవి. కారణములగు విభావాదుల యోగ్యత ననుసరించి హృదయమున గలుగు భావము స్థాయిగనో, సంచారిగనో ప్రవర్తిల్లుననుట గమనింపదగిన విషయము. | “భావశబ్టేన తావ చ్చిత్తవృత్తివిశేషా ఏవ వివక్షితాః !. - తేషాంతు యోగ్యతావశా ద్యథాయోగం స్థాయిసంచారి విభావానురూపతా సంభవతి!!” అను వివరణ మీ విషయమునం దనుసంధేయము. అదికాక, “స్థాయినో వ్యభిచారితా భవతి న తు వ్యభిచారిణాం స్థాయితా | ఏవం హీ సతి తదాస్వాదే రసాంతరమపి స్యాత్‌॥” -. నస్థాయీభావము లాయా సందర్భములందు సంచారులుగా ప్రవర్తిల్లగలవు గాని, సంచారులకు స్థాయితార్హత లేదనియు పప్రవాక్యము తెలుపుచున్నది. థి ఖ్‌ ల

వున సున్నాకవిం చియున్న న్ధాంయిభఖావకారణవలటగా నుత్పన్న మైన

సంచారిభావమునకు కూడ స్థాయిత్వమే సిద్ధించుచో, ఆస్వాదననసందర్భమున

రసాంతరమునకు గూడ నవకాశ మేర్ప్చడగలదు. ' అది ప్రకృతికి విరుద్ధమగు విషయము. రతిభావము [క్రమముగా పరిపుష్టమై శృంగారముగా ఆస్వాద్యమగు పరిస్థితిలో, తత్పోషణయందు సహకరించిన హాసమునకుగాని, కరుణకుగాని

(ప్రసక్తి యుండదు. బాహ్యేంద్రియప్రవృత్తి యడగుట, చిత్తము రసోన్ముఖముగ

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు 1937 పరిణతిజెందిన రతిభావముతో తాదాత్మ్యమును పొందుట జరిగినప్పుడే శృంగార రసాస్వాదన కవకాశమున్నది. అట్టిచో మరియొకభావము చిత్తము నా[క్రమించుట జరుగజాలదు. కావున, స్థాయిభావ పోషకములగు సంచారులకు స్థాయితార్హత లేదు.

మరియు, సందర్భమును బట్టి యొక సంచారిభావము మరియొక సంచారిభావముయొక్క యుత్పత్తికి కారణము కావచ్చును. అప్పు డట్లుతృన్నమైన రెండవ సంచారిభావము మొదటిదానికి సంచారి యగుచున్నది.

“వ్యభిచారిణా మపి చ వ్యభిచారిణో భవంతి !

యథా నిర్వేదస్య చింతా, శ్రమస్య నిర్వేద ఇత్యాది!” . అని, నిర్వేదమునకు చింతయు, శ్రమమునకు నిర్వేదమును సంచారులగునని వివరణము. అతిశయదుఃఖీర్ద్యాదుల వలన కలిగిన విషయద్వేష మనెడి చిత్తవృత్తి నిర్యేదము. రోదన, దీర్ణశ్వాస దీనముఖాదులు అనుభావములుగా నిర్వేదము వ్య క్తమగును.

“యది లక్ష్మణ సా మృగేక్షణా న మదీక్షాసరణిం సమేష్యతి

అమునా జడజీవితతేన మే జగతా వా విఫలేన కిం ఫలమ్‌” అని రసగంగాధర లక్ష్యము. ఫీత్రావియోగము కారణముగా రామునకు గలిగిన శోకము నిర్వేదమునకు హేతువైనది. ఈ నిర్వేదము చింతకు మాత్రమే కాక వితర్మమునకు కూడ కారణము కాగలదు. చింతకు పూర్వమును పిమ్మటను కూడ వితర్క్మమనెడి సంచారి భావమునకు (ప్రవృత్తి కలుగునని

“వితర్కో2 స్యాః క్షణీ పూర్వే పాశ్చాత్యే వోపజాయతే అను వాక్యమున

'_ వివరింపబడినది. ఇట్లు, స్థాయీభావ(ప్రాబల్యము కారణమున నుతన్నములైన

సంచారులు కూడ నితర సంచారి భావముల యుత్పృత్తికి కారణములు కావచ్చును.

“యత్రాపి వ్యభిచారిణి వ్యభిచార్యంతరం సంభావ్యతే.

తద్యథా పురూరవస్య ఉన్మాదెఇపి తర్కచింతాది :

తత్రాపి రతిస్తాయిభావమ్యైవ వ్యభిచార్యంతరం యోగః

స కేవల మమాత్యస్థానీయేనోన్మా దేన కృతోపరాగః 1”

1938 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అని అభినవగుప్తుడు, వికమోర్వశీయ చతుర్ధాంకమందలి పురూరవుని చిత్తస్థితి యుదాహరణముగా నీ విషయమును వివరించియున్నాడు. విపలంభము ననుభవించుచున్న వురూరవు డున్మాద మనెడి సంచారిభావమునకు లోనైయున్నను, తర్కచింతాదులు కూడనా స్థతియందు 'ప్రవృత్తమగుచున్నవి. అందును రతిభావమే స్థాయాియనియు, ఉన్మాద మమాత్యస్థానమును మాత్రమే వహించి దాని కుత్కర్ణ నాపాదించుచున్నదనియు వ్య క్తీకరించియున్నాడు. సంచారులగు నీ తర్కచింతాదులు స్థాయియగు రతిభావమునకు పోష కములగునేకాని, ఉన్మాదమునకు కాదు అని, “తత్రాపి రతిభావస్యైవ వ్యభిచార్యంతరం యోగః అను వాక్యమున వ్య క్తపరచి యున్నాడు. కావున స్థాయిభావాకాంతమైయున్న మనస్సున, తద్భావప్రాబల్యముచే భావపరంపర లొకదానివెంబడి యొకటిగాగాని, యొకప్పుు డేకకాలమునగాని యుత్పన్నము కావచ్చును. సంచారి భావము లన్ని కలిగినను స్థాయికిగల (పాధాన్యమున కేమాతమును భంగము కలుగజాలదు. రసముగా పర్యవసించు సామర్థ్యము స్థాయికి మాత్రమే కలదనియు, సంచారులకు లేదనియు నాట్యశాస్త్రమున లౌకికదృష్టాంతముచే వివరింపబడియున్నది.

“యథా హ్‌ సమానలక్షణా స్తుల్యపాణిపాదోదర శరీరాః

సమానాంగప్రత్యంగాః అప్‌ పురుషాః కులశీలవిద్యాకర్మ

శీల్పవిచక్షణత్వా (దాజత్వ మాప్పువంతి, తత్రైవ చాన్యేఇ

ల్పబుద్ధయ స్పేషా మేవానుచరా భవన్తి, తథా విభావాను

భావవ్యభిచారిణః స్థాయిభావా నుపాశితా భవన్తి !

బహ్వాశయత్వా త్చ్యామిభూతాః స్థాయినోభావాః

తద్వత్‌ స్థానీయపురుషగుణభూతా అన్యేభావాః తాన్‌ ఉపాశయన్తేగో పురుషులు సమానలక్షణములు, సమానాంగప్రత్యంగములు కలవారే మొనను, వారిలో కులశీలవిద్యాదులందు విశిష్టులైనవారు మాత్రమే ప్రభువులగుట, నితరులు పరిజనులగుటయు లోకప్రసిద్ధమగు విషయము. అట్లే విభావానుభావవ్యభిచారులు స్థాయిభావము నాశ్రయించి వర్తించును. విభావానుభావ వ్యభిచారి పరివృతమైన స్థాయాభావము రసమని వ్యవహృతమగుచున్నది. ఈవిధమున, (ప్రకృష్ణ విభావము కారణముగా నుద్చుద్ధమై అనుభావాదులచే వికసించి స్థాయిగా నేర్పడిన భావమనెడీ

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు 1939 చిత్తవృత్తి, సంచారులనెడి యితర చిత్తవృత్తుల యుతృత్తికి కూడ కారణమగుచున్నది. మానవ స్వభావము ననుసరించి అట్లుతృన్నములగు చిత్తవృత్తులు అసంఖ్యాకము లనియే చెప్పవలెను. ఐనను, వానిలో పప్రధానములు, సువ్య క్తములు నైనవానిని మాత్రమే (గ్రహించి వానిసంఖ్య నలుబదితొమ్మిది యని ఆలంకారికులు వివరించినారు.

త(త్రాష్టాభావాః స్థాయినః (త్రయస్తింంశ ద్వ్యృభిచారిణః

అష్టా సాత్త్వికా ఇతి త్రిభేదాః ఏవ మేతే కావ్యరసాభి

వ్య క్రిహీతవ ఏకోనపం చాశద్భావాః (ప్రత్యవగంతవ్యాః

ఏభ్యశ్చ సామాన్యగుణయోగేన రసా నిష్పద్యంతే. స్థాయిభావము లనిమిదియు, సంచారులు ముప్పదిమూడును, సాత్త్వికము లెనిమిదియు చేరి నలుబదితొమ్మిది. ఇవియే కావ్యరసాభివ్య క్తి హేతువులనియు, వీనినుండియే సామాన్యగుణయోగమున రసములు నిషృన్నములగుననియు నాట్యశాస్త్రము వివరించుచున్నది. కాసి, వీనిలో సాత్త్వికములు అయత్నజములుగ దేహమునందు గలుగు కార్యములే యగుటచే నవి చిత్తవృత్తులు కావు.

“సత్త్వం నామ మనఃప్రభవమ్‌, మనసః సమాధా

సత్త్యనిషృత్తిర్భవతి, తస్య చయోఇసౌ స్వభావో

రోమాంచాగ్రువైవర్ణ్యాది లక్షణో యథాభావోపగతః

స న శక్యో అన్యమనసా కర్తు మితి” భావముపపై మనస్సు కేంద్రీకరించియుండు సమయమున (భావ సమాధి) మనస్సునుండి సత్త్వము నిష్పన్న మగుననియు, రోమాంచాశ్రువైవర్ద్యాది తల్లక్షణములు భావస్వభావము ననుసరించి పైకి వ్య క్తములగుననియు తెలియుచున్నది. దీనినిబట్టి రోమాంచాదులు సత్త్వప్రదర్శకములగు కార్యములే కాని చిత్తవృత్తులు కాజాలవని వ్యు క్తమగుచున్నది. కావున, సాత్త్వికములగు వీనిని పరిహరింపగా, మిగిలిన స్థాయిసంచారులు, నలుబదియొకటి మాత్రమే చిత్తవృత్తులగుచున్నవి. శాంతమునకు స్థాయిభావముగా కొందరు పేర్కొన్న శమముయొక్క స్థితియే వివాదగ్రస్తము కనుక అది చిత్తవృత్తియా యను ప్రశ్నకూడ అనిశ్చితమే. మరి కొందరు మాత్సర్య, ఉద్వేగం సంశయ, ఈర్ష్యాదులు కూడ చిత్తవృత్తులే యనియు, ఇవికూడ సంచారులలో చేరుననియు తెలిపినారు. కాని

1940 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము యివి భరతాదులు పేర్కొన్న ముప్పదిమూడు సంచారి భావములలోనే యంతర్భావమును బొందుచున్నవి. మాత్సర్య మసూయయందును, ఉద్వేగము (తాసమునను,' ఈర్ష్య రోషమునను, సంశయము వితర్మమునను చేరిపోవుచున్నవి. ఇట్లే స్థాయిభావయోగముచే అసంఖ్యాకములుగ హృదయమునం దుతృన్నములగు భావాంతరములన్నియు ముప్పుదిమూడు సంచారులలో గాని, యితరములగు స్థాయీభావములలోగాని చేరిపోవుచున్నవి. కావున భరతాదుల ననుసరించి స్థాయిసంచారులని వ్యవహృతములగు చిత్తవృత్తుల సంఖ్య నలుబదియొక్కటి యని నిర్ణయము. ఐనను, భరతాదులు భావములని పేర్కొన్న సంచారులన్నియు చిత్తవృత్తులేనా యను ప్రశ్నకు అవకాశమును లేకపోలేదు. భరతాదు లొసంగిన లక్షణలక్ష్యములను బట్టి యేవి చిత్తవృత్తులో, యేవి కావో పరిశీలింతము. రతి; యువతీయువకులందు అన్యోన్యాలంబనము కారణముగా కలుగు (పేమయనెడి చిత్తవృత్తి'విశేషము రతి. “స్త్రీపుంసయో రన్యోన్యాలంబనః ప్రేమాఖ్య న్చీత్తవృత్తివిశేషో రతిః స్థాయిభావళో రతి చిత్తవృత్తి విశేషమని లక్షణమున వాచ్యముగనే యున్నది. అదియుగాక యిది మనఃప్రవృత్తి యను సత్యము స్త్రీపురుషులెల్లరకును అనుభవసిద్ధమే.

హాసము: “వాగంగాది వికారదర్శనజన్మా వికాసాఖ్యో హాసఃొ అను లక్షణమునుబట్టి వికృతాకార వాగ్వేషచేప్టాదుల దర్శనమువలన గలిగిన చిత్తవికాసము హాసమని తెలియుచున్నది. రదనప్రకాశన నయనవికాస అడ్రుపాతాదులగు కార్యములచే అంతరంగప్రవృత్తి వ్య క్తమగుచున్నది. ఈ అనుభవాద్యుత్పత్తికి దైహికములగు కారణము లేవియు లేకుండుటవలన చిత్తవృత్తియే కారణమని అంగీకరింపవలను.

శోకం: “పుత్రాది వియోగ మరణాది జన్మా వైక్షబ్యాఖ్యశ్చిత్తవృత్తివిశేష శోకళి అని లక్షణము. అప్పులు, ప్రియులు నగువారికి కలిగిన మహానర్థము, వారివలని యెడబాటు మున్నగునవి కారణములుగా చిత్తమునకు వైళ్లబ్యము కలిగినది. ఈ అలజడి మనస్సునకు సంబంధించినది యనుట సువ్య క్తము. రోదన దీర్పనిశ్వాసాద్యనుభావములును, నిర్వేదాది సంచారులును దీనివలన కలుగుచున్నవి. కనుక శోకము చిత్తవృత్తి కాకతప్పదు.

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1941

క్రోధము: గురుబంధవధాది పరమాపరాధములు కారణములుగ కలిగిన చిత్తపజ్వలనము (కోధము. చిత్తమునకు గలిగిన యీ అలజడి కారణముగా భృకుటీభంగ, రదనపీడన, నేత్రరక్తిమాదులగు ననుభావములు కలుగుచున్నవి. దైహికములగు నీ మార్పులకు చిత్తప్రజ్వలనమే హీతువగుటచే కోధము చిత్తవిశేషమని నిశ్చయమగుచున్నది.

ఉత్సాహము: “పరపర్శాకమ దానాది స్మృతిజన్యా బెన్నత్యాఖ్య న్చిత్తవృత్తి విశేష ఉత్సాహళవో అని లక్షణము. ఉదాత్త కార్యనిర్వహణాదులందు ఇతరుల నధిగమింపవలెననెడి చిత్తొన్నత్యము కారణముగా ముఖవికాసాద్యనుభావములు కలుగుచున్నవి. అట్టి చిత్తవృత్తికి లోనైనవ్యక్తి అసాధారణ (ప్రయత్నాదికమునందు (ప్రవర్తిల్లును.

భయము: “వ్యాఘ్రదర్శనాదిజన్మా పరమానర్థవిషయకో వైళ్లబ్యాఖ్య శ్చిత్తవృత్తి విశేషః భయం” వ్యాఘ్రము, విషసర్పము, [క్రూరశత్రువు మున్నగువానిని చూచుటవలన మరణాదికమగు భీతి మనస్సున నేర్పడిః తతృలముగా కంపము, ముఖశోష ఇత్యాదనుభావములు కలుగును. (ప్రాణరక్షణార్థమై పరుగిడుట అరచుట మున్నగు చేష్టలయందు వ్యక్తి (ప్రవర్తిల్లును. చిత్తము భావ(ప్రాబల్యమునకు లోనగుటయే యిందులకు హేతువు.

._ విస్మయము: “అపూర్వవస్తుదర్శనా చ్చిత్తవిస్తారో విస్మయో మతః” “అలౌకికవస్తుదర్శనాదిజన్మా ఆశ్చర్యాఖ్యో విస్మయం” అలౌకికము: అసాధారణము, అపూర్వము నగు వస్తుదర్శనము వలన గలుగు చిత్తవిస్త్పృతి విస్మయ మనెడి లక్షణమును బట్టియు, విస్మాయమునకులోనైన వ్యక్తుల చేష్టాద్యనుభావములను బట్టియు నిది భావమని నిశ్చయమగుచున్నది.

జుగుప్ప: “కదర్యవస్తువిలోకనజన్మా విచికిత్సాఖ్య శ్చిత్తవృత్తివిశేషో జుగుప్పాో అని లక్షణము. పురీషాదివస్తువులను జూచుటవలన మనస్సున కేవగింపు కలుగుటయు, వ్యక్తి తద్వస్తువులనుండి దూరముగ బోవ ప్రయత్నించుటయు జరుగును. ముఖ సంకోచ నిష్టీవనాది చేష్టలును, నొకప్పుడు వమనాదికమును కూడ జరుగవచ్చును. డైహికములగు నీ కార్యములన్నిటికిని చిత్తవృత్తియే హేతువనుట సువ్య క్తము.

1942 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఇట్లు రతిహాసశోకాదులగు నెనిమిదియు సంపూర్ణముగ చిత్తవృత్తులని నిర్ణయమగుచున్నది. ఇక సంచారులను బరిశీలింతము.

నిర్వేదము: “నీచపురుషేషు ఆక్రోశన అధిక్షేప వ్యాధి తాడన దారిద్యూ ఇష్టవిరహ పరసంపద్దర్శనాదిభిః, ఉత్తమేషు తు అవజ్ఞాదిభిః జనితా విషయద్వేషాఖ్యా, రోదన దీర్ణశ్వాస దీనముఖతాది కారిణీ చిత్తవృత్తి ర్నిర్వేదళొ అతిశయమగు దుఃఖ ఈర్ష్యా తిరస్కారాదుల వలన చిత్తమునకు విషయములందు గలుగు అరతి నిర్వేదమని లక్షణము. నిశ్వాస రోదనాదు లిందనుభావములు. ప్రాపంచిక విషయములండు విముఖత చిత్తసంబంధి యనక తప్పదు.

చపలత; “అషర్హాదిజన్యా వాక్సరుష్యాది కారణీభూతా చిత్తవృత్తి రృపలతా.” “మాత్సర్యద్వేషరాగాదే శ్చాపల్యం తు అనవస్థితిఃో అను లక్షణములను బట్టి, చిత్తమునకు గలిగిన అనవస్థితియే చాపల్య మని తెలియుచున్నది. జడత యను చిత్తస్థితి కిది పూర్తిగ విరుద్ధమగుట చిత్తప్రవృత్తియగును.

అవహిళ్ణ: “వీడాదిభిర్నిమిత్తై హర్షాద్యనుభావానాం గోపనాయ జనితో భావవిశేషో వహిత్సమ్‌”

భఖావ(ప్రాబల్యకారణముగా కలిగిన హర్షపషులకాది కార్యవయలను మరుగుపరచుటకై మనసున కలిగిన భావవిశేషము అవహిళ్ణ యనుటచే వ్రీడాదు లిందు విభావములగును. అనుభావాదులను చూచి యితరులు మనోగతభావమును గుర్తెరుంగుదురని తలియుటయు, తదనుభావములను వురుగుపరచు ప్రయత్నమున కింద్రియములను పురికొల్పుటయు మనోవ్యాపారమే యగుటచే అవహిళ్ధ చిత్తవృత్తి యగుచున్నది.

త్రాసము: “ఆకస్మికభయా చ్చిత్తవిక్షోభ స్తాసఃొ అను లక్షణమునుబట్టి దీనిని భయమనడు స్థాయిభావమున చేర్పవచ్చును. ఐనను, విభావముల విషయమునను, సందర్భము విషయమునను గల భేదములను బట్టి త్రాసము తాత్కాలికము, అల్బము నగుటచే సంచారిగా పరిగణింపబడినది. భయత్రాసములకుగల భేద మెట్టిదైనను త్రాసము చిత్తవృత్తి యనుట నిస్సందేహము.

శంక: “కిమనిష్టం మమ భవిష్యతీత్యాకార శ్చిత్తవృత్తి విశేష శృంకా”. అనిష్టమగు కార్యము జరుగునేమో యనెడి జంకు చిత్తవృత్తియే. ముఖవివర్జత, కంపము, పనులయందు తొటువాటు, స్తిమితములేకుండుట మున్నగువాని కిది హేతువగుచున్నది.

నాటకము: రసానుభూతి భూపతి లక్ష్మీనారాయణ రావు 1943 హర్షము: “ఇష్టప్రాప్త్యాదిజన్మా సుఖవిశేషో హర్షః.” ప్రసన్న ముఖన్మేతములు, మాటలయందు తొటుపాటు, పులకాంకుర స్వేదాదులు, అశూదయము ఇత్యాది కార్యములచే నీ చిత్తవృత్తి వ్య క్త్రమగుచున్నది. దైన్యము: “దుఃఖ దారిద్య్యాపరాధజనితా స్వాపకర్షకారణాది హేతు శ్చిత్తవృత్తివిశేషో దైన్యమ్‌.” అతిశయదుఃఖ, దారిదా్యాదులవల్ల వ్యక్తికి స్వశక్తిసామర్థ్యములందు విశ్వాసము నశించుటయు, తత్కారణముగా నతడు తన్ను గూర్చి జాలివుట్టునట్లు పలుకుటయు, మున్నగునవి లోకవృత్తములు కనుక దైన్యము చిత్తవృత్తియనుట నిస్సందేహము. ఉగ్రత: “అధిక్షేపాపమానాది[పప్రభవా కిమస్యకరోమి ఇత్యాద్యాకారా చిత్తవృత్తి రుగ్రతా” అవమానము, నింద మున్నగువాని వలన చిత్తమున కొక్కసారిగా గలుగు ప్రజ్వలన ముగ్రత. ప్రచండమగు నీ చిత్తవృత్తిచే వధేచ్ళ బొడముచున్నది. వ్యక్తి తన్ను మరచి పరునిపై బడి కొట్టుట వధించుట మున్నగు (పవర్తనకు లోనగును. ఈ చిత్తవృత్తి చాలకాలముండునది కాదు; క్షణికమైనది. ఉగ్రతకు లోనై దీర్ణకాలము (పవర్తించుటకు చిత్తమునకు సామర్థ్యములేదు. కావున నిది సంచారి యగుచున్నది. కోధము చిరకాలము నిలిచి యుండునది కావున నది స్ధాయి యగుచున్నది. “నాష్యసౌ [కోధః తస్య స్థాయిత్వేన అస్యాః సంచారిణీత్వే నైవ భేదాత్‌.” అని “ ఉగ్రతకును క్రోధమనెడి స్థాయిభావమునకును గల భేదమును రసగంగాధరకారుడు వివరించినాడు. చింత; “ఇష్టాప్రాప్త్యనిష్టాపాప్త్యాది జనితా ఆధ్యానపరపర్యాయా, వైవర్జ్య భూలేఖన, అధోముఖత్వాది హేతు శ్చిత్తవృత్తివిశేష శ్చింతా.” ఇష్టమైనది సిద్ధింపకుండుటయు, అనిష్టమైనది జరుగుటయు మున్నగు కారణములవలన గలిగిన ఆధ్యానమనెడీ చిత్తవృత్తియే చింత. వైవర్జ్యము, నూనస్యదృష్టి. నిశ్వాసము, నేలనువాయుట, తల వంచుకొనియుండుట, యిత్యాదులచే నీ చిత్తవృత్తి వ్య క్త్రమగుచున్నది. అసూయ: “పరోత్కర్హదర్శనాదిజన్యః పరనిందాది కారణీభూత న్చిత్తవృత్తివిశేషోం సూయా” "

1944 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఇతరుల యుత్కర్దను చూచి సహింపలేని మనః ప్రవృత్తి అసూయ. వారియెడ కోపముగ టప్రవర్తించుట, తూలనాడుట, యిత్యాదులచే నీ మనోభావము వ్య క్తమగుచున్నది.

అమర్ష; పరకృతమగు అవజ్ఞారూపాద్యపరాధములవలన జనించిన కోపవిశేషమే అమర్షవమని యిదివరకే వివరింపబడియున్నది. (కోధభఖేదముగా దీనిని పరిగణించుటకును నవకాశమున్నది. ఎట్లున్నను, రోషము చిత్తవృత్తియనుటలో సందేహములేదు. "

గర్వం: “గర్వోమదః ప్రభావ శ్రీ విద్యా సత్కులతాదిజళ౯ొ “రూపధనవిద్యాది (ఉప్రయుక్తాత్మోత్కర్హజ్ఞానాధీన పరావహేలనం గర్వబొ అను లక్షణములనుబట్టి ఆత్మోత్కర్హజ్ఞానమువలన గలిగినదియు పరులను నిరసించునదియు నగు చిత్తవృత్తి గర్వమని ఆలియుచున్నది. ఇతరులను గణింపక పలుకుట, ఆటోపముగ నడచుట

వీడ: “స్త్రీణాం పురుషముఖావలోకనాదేః పుంసాం చ ప్రతిజ్ఞాభంగపరాభవాదే రుత్పన్నా వైవర్జ్య అధోముఖత్వాది కారణీభూత శ్చిత్తవృత్తివిశేషో వీడా” (పతిజ్ఞాభంగపరాభవాదులు కారణములుగా షురుషులయందును, పురుషముఖావలోకనాదులచే స్త్రీలయందును గలుగు చిత్తవృత్తివిశేషము వ్రీడ. వైవర్ణ్యాధోముఖత్వాదులకు చిత్తవృత్తియే కారణము.

ఆవేగము: పియాప్రియప్రాప్తి సందర్భమున గలిగిన మనస్సం(భ్రమము ఆవేగము.

“అనర్థాతిశయజనితా చిత్తస్య సంభమాఖ్యావృత్తిరావేగం” అను లక్షణమును బట్టియు నిది చిత్తవృత్తియే. ఇక, అనర్థాతిశయమును మాత్రమే విభావముగా జప్పనవసరములేదు. ప్రియము సిద్ధించినప్పుడు గూడ మనస్సునకు సంభ్రమము కలుగవచ్చును.

వితర్కము: “తర్జో విచారః సందేహాత్‌"

. “సందేహాద్యనంతరం జాయమాన ఊహో వితర్మళో అను లక్షణములను బట్టి సందేహమేర్పడినపుడు తన్నిర్ణయజ్ఞానమునకు తోడ్పడు ఊహ వితర్మమని ఆలియుచున్నది. సందేహ విషయమున వినిశృయమునకు సాధనమగునది చిత్తప్రవృత్తియే యగుట నిస్సందియము.

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1945 విషాదము: “ప్రారబ్ధకార్య అసిద్ధ్యాదే ర్విషాదళొ “ఉపాయాభావజన్మాతు విషాదః సత్త్వసంక్షయళొ అను లక్షణములను బట్టి, ప్రయత్నసిద్ది కాకుండుటవలనను, నిస్సహాయతాదుల వలనను గల్గు అనుతాపము విషాదమని తెలియుచున్నది. ముఖసంకోచ, నిశ్వాసాదులచే విషాదము వ్య క్తమగును. - బెత్సుక్యము: “అధునైవా స్యలాభో మమాస్తు ఇతీచ్చా బెత్పుక్యమ్‌” అను లక్షణమును బట్టి, ఇష్టవిషయమును బొందుటలో మనస్సు చెందెడి తొందరపాటు బొత్సుక్యమని తఆలియుచున్నది. వాంఛితమును బొందువిషయమున చిత్తమునకు గల తొందరపాటు అనుటచే నిది చిత్తవృత్తియనుట నిక్కము. ఇట్లీ పదునేడు సంచారులును సంపూర్ణముగా చిత్తవృత్తులని నిర్ణయింపవచ్చును. ఇక = గ్లాని: “రత్యాయాస మనస్తాప క్షుత్పిపాసాది సంభవా గ్లాని ర్నిష్ప్రాణతాకంపకార్యనుత్సాహతాదికృత్‌” “ఆధివ్యాధిజన్య బలహానిప్రభవో వైవర్జ్యశీథిలాంగత్వ దృగ్భంమణాది హేతుః దుఃఖవిశేషో గ్లానిళొ సురతాయాస, మనస్తాప క్షుత్పిపాసాదులవలన గలిగినది గ్లాని యనియు, ఆధివ్యాధిజన్యమగు బలహీనతవలన గలిగిన దుఃఖవిశేషము గ్లానియనియు వివరింపబడినది. దుఃఖవిశేషమే గ్లాని యగుచో నిది కోకమునం దంతర్భావమును బొందగలదు. మరియు సురతాయాసము కారణముగా మనస్సునకు గలిగిన అనుభవవల దుఃఖవిశేషవు కాజాలదుకదా? వైవర్జ్య శిథిలాంగత్వ్య దృగ్భ్రమణాదులకు బలనాశ, ఆయాసములు హేతువులగుచున్నవే కాని చిత్త (ప్రవృత్తికాదు కదా? కావున గ్లాని చిత్తవృత్తియా యను విషయము సందేహగ్రస్తము. శ్రమ “శమః భేదొ2.ధ్వగరత్యాదేఃొ “బహుతర శారీరవ్యాపారజన్మా నిశ్శా శసాంగసమ్మర్ద్హకారణీ భూతః భేదవిశేషః శ్రమఃొ ప్రయాణము, సురతము, వ్యాయామము మున్నగు శారీరవ్యాపారాదులు

1946 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కారణములుగా కలిగిన ఖేదవిశేషము శమ యని లక్షణము. నిశ్శ్యాస, అంగసమ్మర్హ, నిద్రాదులు అనుభావములుగా పేర్కొనబడినవి. శరీరవ్యాపారమువలన కలిగిన అలసట దేహమునకు సంబంధించినదియే కాని మనస్సునకు సంబంధించినది కాదుకదా? శరీరవ్యాపారాతిశయవుఎవలన వునస్సునకు కూడ అలసటకలుగవచ్చునని యొప్పుుకొన్నను, అలసటను చిత్తప్రవృత్తి యన వీలులేదుకదా? అలసట చైతన్యమును తగ్గించునదియే కాని, ప్రవర్తింపజేయునది కాదు. మరియు, సురతాదిక వ్యాపారముచే దేహమునకు అలసట గలిగినను మనస్సునకు గల్లునది ఉల్లాసమే యగును గాని భేదము కాజాలదు కదా? ఈ కారణములనుబట్టి శమ చిత్తవృత్తి యనుట విమర్శనీయాంశము. కావున, శ్రమ మనసునకు గలిగిన అనుభూతి విశేషమే యనియు, నిది గ్లానివంటిదే యనియు చెప్పవలెను.

ధృతి: “జ్ఞానాభీష్టాగామాదై శన్తు సంపూర్ణస్పృహతాధృతిః అను సాహిత్యదర్పణ లక్షణమును బట్టి అభీష్టసిద్ధి వలన సంపూర్ణమగు మనస్పంతృప్తి లేక కృతార్థత ధృతి యని తెలియుచున్నది. ఇది ప్రశాంతమగు చిత్తస్థితిని సూచించుచున్నది. “చాపలాద్యుపశమోనుభావ ౫ అని మనస్సు చాపలమునుండి యుపశమించి యుండుట అనుభావముగా జగన్నాథుడు పేర్కొనియుండుటయు, *ప్రాప్తానామ్‌ ఉపభోగః అప్రాప్తే నశోకః” అని, ప్రాప్తించిన దాని నుపభోగించుట, ప్రాప్తింపనివానిక్రై వెతపడకుండుట అనునవి ధృతిలక్షణవులుగా నాట్యశాస్త వు వివరించియుండుటయు కారణములుగా, ధృతి యనునది చిత్తస్థితియేకాని చిత్తవృత్తి కాదని తెలియుచున్నది.

అలసత: “అతితృప్తి గర్భ వ్యాధి శ్రమాదిజన్మా చేతసః కక్రియానున్ముఖతా ఆలస్యం” క్రియల విషయమున మనస్సునకు గలిగిన వైముఖ్యము ఆలస్య మగుటవలన నిదియు చిత్తస్థితియే గాని చిత్తవృత్తి కాదని తెలియుచున్నది. (క్రియాప్రవృత్తి యందు వైముఖ్యమును చిత్తప్రవృత్తిగా నొెన్నుట యెట్లు ?

జడత: “చింతోత్క్మంఠా భయ విరహ ఇష్టానిష్టదర్శన (శవణాదిజన్యా, అవశ్యకర్తవ్యార్థ (పతిసంధానవికలా చిత్తవృత్తిర్ణడతా.” చింత, భయము, విరహము, ఇష్టానిష్టదర్శన [శవణాదులు కారణములుగా జడత కలుగుననియు, నిది కారణముగా నవశ్య కర్తవ్యముల విషయమునను వ్యక్తి విమూఢ్రుడగుననియు లక్షణము. చింతాదులు విభావములనియు ఇతికర్తవ్యతావివవూఢ త్వ మనుభావమనియు ఆశయము. కాని, ఇతికర్తవ్యతావిమూఢత్వము చిత్తము యొక్క

నాటకము: రసానుభూతి భూపతి లక్షీనారాయణ రావు 1947 స్థితివిశేషమని యేల చెప్పకూడదు ? (చింతాదులు కారణముగా చిత్తము జడతారూపమున ప్రవర్తిల్ల విమూఢత్వమును కలిగించుననుట మానవ మనస్తత్వముతో సమన్వయమగునా ?) న

స్కి: “సంస్కారజన్యం జ్ఞానంస్కృతి౯ొ సంస్కార రూపమున నున్న పూర్వానుభవ జ్ఞానము స్మృతి యని యర్థము. సదృశవస్తువుయొక్క అవలోకనచింతనాదుల కారణముగా పూర్వానుభూతమగు విషయము చిత్తమునకు వచ్చుట స్మృతి యని ఆశయము. సంస్కారరూపమున నణగియున్న అనుభవము ప్రతిబోధకు వచ్చుట చిత్తవృత్తి యెట్లగుచున్నది? పూర్వానుభవము ప్రతిబోధకు వచ్చుటకు కారణభూతమైన చిత్తప్రవృత్తి స్పృతి యన్నవచో పైలక్షణము కుదురదు. కనుక స్మృతి చిత్తమునందు జరుగు నొక వ్యవస్థాపరిణామమే యగుచున్నది కాని చిత్త ప్రవృత్తి కాదు.

మరణము: “రోగాదిజన్యా వమూర్భారూపా మరణ(ప్రాగవస్థా వురణం౦” మూర్భారూపమగు మరణపూర్వావస్థయే మరణమని గ్రహించినను, నది చిత్తవృత్తి కాజాలదు కదా? మరణమున కున్ముఖమగు చిత్తపవృత్తి యని చెప్పిననే యిది భావము కాగలదు.

మదము: “హర్దోత్కర్లో మదఃొ అను లక్షణముననుసరించుచో నిది హర్షభేదమే యగుచున్నది. “మద్యాద్యుపయోగజన్మా ఉల్లాసాఖ్యః శయనహసితాది హేతు శ్చిత్తవృత్తివి శేషో మదశిమద్యపానాదులవలన చిత్తమునకు గలిగిన ఉల్లాసము వుదవునియు, నిద్రాహసితవాచాలతలు కారగ్టవములనియు అర్థము. మోహసంతోషములు ఏకకాలమున కలుగుననియు, వానికలయిక మదమనియు కూడ వివరించినారు. “సమ్మాహానందసందోహో మదోమదో్యోపయోగజః మదిరాదిద్రవ్యముల యుపయోగముచే మోహము కలుగవచ్చును కాని ఆనందము కలుగుననుట సందేహము. మద్యపానమువలన నింద్రియములు ప్రకోపించి నిద్రావాచాలతాది కార్యములను కలుగజేయుచున్నవా, లేక ఉల్లాసమనెడి భావము మద్యపానముచే నుద్చుద్ధమగుచున్నదా యని ప్రశ్న కావున మదమును చిత్తవృత్తి యనుట పొసగదు.

సుప్తి: “నిద్రావముగ్నస్య విషయానుభవ స్వప్నః కోపావే గభయగ్గాని సుఖదుఃఖాదికారకళొ నిదయందున్న వ్యక్తికి గలుగు విషయానుభవము స్వప్నము. జాగ్రదాపస్థ్టయందు వ్యక్తి అనుభవింపగల సుఖదుఃఖాది భావములనన్నిటిని వ్యక్తి

1948 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము స్వప్నమునందును ననుభవింపగలడు. ఇది అంత శ్ర్రైతన్యము యొక్క విపరీత ప్రవృత్తి యని చెప్పవచ్చును.

నిద్ర: “శమాదిపయోజ్వం చేతస్పమ్మీలన౦ నిదా” (శమాదులు కారణములుగా కలిగిన చిత్తసమ్మీలనము న్మిదయగుచో, నది చిత్తవృత్తి యగుట యెట్లు? చిత్తప్రవృత్తి ఆగుటయేకదా నిద్ర? దీని నొక చిత్తస్థితి యనవచ్చునే కాని చిత్తవృత్తి యనజాలము.

విబోధ: “నిదానాశోత్తరం జాయమానో బోధ్గో విబోధఃి. నిద్రానంతరము గలుగు మెలకువ విబోధము. అక్షిమర్దన, జృంభాదు లనుభావములుగా 'పేర్కొనియున్నారు. మెలకువ చిత్తముయొక్క స్థితియే కాని ప్రవృత్తి కాదనుటకు వీలున్నది. జాగ్రదావస్థకు చిత్తమువచ్చుటయే కదా విబోధ? అట్టి పూర్వవ్యవస్థను తదనంతరప్రవృత్తి యనుట యెట్లు?

అపస్మారము: “వియోగ కోక భయ జుగుప్పాదీనా మతిశయాత్‌ (గ్రహావేశాదేశ్చ ఉత్పన్నో వ్యాధివి శేషోపస్మారఃొ పఏయవియోగము, శోకము మున్నగువాని అతిశయమువలన గలిగిన వ్యాధివిశేషము అపస్మారమనుట వలన నిది చిత్తవృత్తి కాదని తోచుచున్నది. వియోగాదులవలన చిత్తస్వాస్థ్యమునకు కలిగిన భంగమే వ్యాధివిశేషమన్నను, అపస్మారము చిత్తస్థితియగునే కాని చిత్తప్రవృత్తి కాదని చెప్పవలసివచ్చును.

మోహము: “భయవియోగాది ప్రయోజ్యా వస్తుతత్త్వా నవధారిణీ చిత్తవృత్తి ర్మోహః౯ొ అను లక్షణమును బట్టి మోహము చిత్తముయొక్క అస్వస్థస్థితి యని చెప్పవలసియున్నది. వస్తుతత్త్వమును ఆలియజాలనట్టి చిత్తస్థితి వియోగాది కారణముగా నేర్చడినది. మోహోవిచిత్తతా భీతిదుఃఖావేగానుచింతనైై అను లక్షణము ననుసరించి, భీతి దుఃఖావేగాదుల కారణముగా కలిగిన విచితతయే మోహమని తెలియుచున్నది. విచిత్తతను చిత్తప్రవృత్తి యనుటకు వీలులేదు. కావున మోహము చిత్తస్థితియే. కాని చిత్తవృత్తికాదు.

మతి: “శాస్తాందివిచారజన్యం అర్థనిర్ధారణం మతిః అను లక్షణమును బట్టి అలజడిలిని మనస్థితి మతి యని ఆలియుచున్నది. శాస్త్రవిచారముచే అర్థసిర్ణయమైన పిమ్మట మనస్సునకు ప్రవృత్తి యెట్టిది? హర్షమో, సంతుష్టియో కలుగవచ్చును.

వ్యాధి: “రోగవిరహాదిప్రభవో మనస్తాపో వ్యాధికో రోగాదికారణములుగా మనస్సునకు గలిగిన తాపము వ్యాధి యన్నచో నది చిత్తమునకు గలిగిన యనుభవమే కాని చిత్తవృత్తి కాజాలదు.

నాటకము: రసానుభూతి భూవతి లక్షీనారాయణ రావు 1949 ఉన్మాదము: “విపలంభ మహాపత్తి పరమానందాది జన్మా అన్యస్మిన్నన్న్యావ భాసః ఉన్మాదళొ విపలంభ మహాపదాదులు కారణములుగా జనించినట్టిదియు, ఒక వస్తువును మరియొక వస్తువుగా (భమింపజేయునట్టియు చిత్తవృత్తివి శేష మున్మాదము. “చిత్తసందేహ ఉన్మాదః కామశోకభయాదిభిఃొ అను లక్షణమునుబట్టియు, చిత్త్తమ్మోహ మున్మాదమగుచున్నది. ఇది చిత్తముయొక్క స్థితివిశేషమే కాని (ప్రవృత్తి యని చెప్పలేము. చిత్తము స్వాస్థ్యమును గోల్పోవుటయేకదా ఉన్మాదమునకు కారణము? ఇట్టీ పదునాలుగును సంపూర్ణముగ చిత్తవృత్తులా యను విషయమున సందేహమున కాస్పదమున్నది. ఐనను వివిధములగు నీ వ్యవస్థలన్నియు నంతరంగమునకు సంబంధించియుండుటయు, సారవంతమగు భావము నాధారమున నేర్పడుటయు కారణములుగా వీనిని చిత్తవృత్తిభేదములుగా ఆలంకారికులు పరిగణించినారు. కావున భావములసంఖ్య నలుబదియొక్కటి యను పరిణామము సంప్రదాయముగ నేర్చ్పడిసనది. వీనిలో సంచారులగు ముప్పది మూడు భావములును అల్పవిభావములవలన నుత్పన్నమై తాత్కాలికముగ మాత్రమే ప్రవర్తించుననియు, కనుక అవి రసపర్యవిసితములు కాజాలవనియు ముందే వివరింపబడినది. ఇక స్థాయిభావములగు రత్యాదులన్నిటికిని రసముగ పర్యవసించు గక్తి కలదని చెప్పుటకును వీలులేదు. మానవ జీవితమునందు మిక్కిలి ప్రధానములుగా పర్తించునవి రత్యుత్పాహములు రెండే యని అంగీకరింపక తప్పదు. అనురాగము, వాత్సల్యము, (పేమ, భక్తి మధురము, ఇత్యాదులన్నిటికిని రతిభావమే మూలమనుటలో విప్రతిపత్తి లేదు. ఏదో యొక రూపమున మానవ జీవితమునంతను రతిభావ మాక్రమించియున్నది. కావున రతి రసముగ పర్యవసించి ఆనందమును గూర్చకలదు. అట్లే, మానవుని ప్రయత్న సర్వస్వమునకును, అతడొనర్భు (ప్రతికార్యమునకును ఉత్సాహమే మూలము. ఉత్సాహ శూన్యమగు మానవజీవితము నిరర్థకమనుట నిస్పందేహము. కావున ఉత్సాహము కూడ రసముగ పర్యవసింపగలదు. శోకము కూడ జీవితమున సర్వసాధారణము. మానవమాత్రుడైనవానికి ఇష్టజనవినాశక్షేశాదులు తప్పనివగుటచే శోకము మనలను వెన్నాడుచునే యుండును. కావున శోకము కూడ కరుణగా నాస్వాద్యమానమగు చున్నది. రత్యుత్సాహశోకములకు జీవితమున గల (ప్రాధాన్యము హాసక్రోధాది

1950 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యితరభావములకు కలుగదు. హాస్మకోధభయవిస్మయజుగుప్పలు జీవితమునం దప్పుడప్పుడు ప్రవృత్తమగుచు మరుగు పడుచుండునే కాని సార్వకాలికములుగ ప్రవర్తింపవు. వీరశృంగారముల ననుభవించిన విధమున చిరకాల మితరముల ననుభవింపజాలము. హాస్యప్రధానములగు ప్రహసనములు నాటక ప్రకరణములవలె దీర్దరచనలు కాకుండుట కిదియే కారణము. జీవితమునందు ఉచితసందర్భములలో హాస్యమును తాత్కాలికముగ మాత్రమే ఆస్వాదించి యానందింపగలము. (కోధమొకప్పుడు జీవితమున చిరకాలము నిలిచియుండవచ్చును. కాని త(దసానుభవవమ వూతవు సార్వకాలికమైనది కాదు. రొ దవమును సర్వకాలసర్వావస్థలందును అనుభవింపగల సామర్థ్యము మనస్సునకు లేదు. అట్లే, భయవిస్మయజుగుప్పాదులకు గూడ జీవితమున ప్రాధాన్యము తక్కువ. కావున నీ భావములు రత్యుత్సాహములవలె రసపర్యవసితములై, ఆనందమును కలిగించునా యను సందేహము కలుగకమానదు. భయజుగుప్పాదుల నాదినుండి తుదివరకును విభావానుభావ[క్రమమున పోషించి రచించిన కావ్యములు మృగ్యములు. ఇవి కావ్య నాటకములలో నందందు అంగములుగా పోషితములై యున్నవే కాని, అంగిరసములుగా పోషితములు కాలేదు. వివిధభావముల శక్తిసామర్థ్యములను, వానికి జీవితముతోగల సంబంధమును, మానవ మనస్తత్వమును గుర్తించియే భరతాద్యాలంకారికులు శృంగారవీరములను మాత్రమే నాటకార్హములగు రసములని నిర్ణయించివారు. ఇక లౌకికజీవితమున స్థాయిభావోత్పత్తికి హేతువులగు విభావముల విషయమునకూడ మానవచిత్త్మపవృత్తియందు వైవిధ్యముండుటకు వీలున్నది. మానవ మనస్తత్త్య వైవిధ్యము, జీవితపరిస్థితుల వైవిధ్యము మున్నగునవి ఇందుకు హేతువులగుచున్నవి. ఒకానొక యువతియుొక్క సౌందర్యాదులకు ముగ్ధుడై యొకవ్యక్తి రతిభావమునకు లోనుకావచ్చును. తద్భావప్రాబల్యమతని యందు చేష్టాది రూపకానుభావములను కూడ కలిగింపవచ్చును. తావలచిన యువతి యదుట తన యనురాగమును ప్రకటింపవచ్చును. అంతమాత్రముచే నా యువతియందు రతిభావోదయము కలుగునని 'చెప్పజాలము. తద్విరుద్ధముగ విసుగో, కోపమో కలుగుట కూడ పకృతిసిద్ధమగు విషయమే. (దీనినే రసాభాసగా ఆలంకారికులు పేర్కొనియున్నారు.) [ద్రౌపదీ విషయమున కీచకుని (ప్రవృత్తి యిట్టిదే. అట్టి సందర్భములో సామాజికులయందు కూడ అమర్హము కలుగునే కాని రతి ఉద్బుద్ధము కాజాలదుకదా? అభినవకౌముదిని వలచిన శల్యాసురుని ప్రవర్తననుకూడ ఇందనుసంధించవచ్చును. సాత్త్వికుడగు పాఠకునకు శల్యాసురుని

నాటకము: రసానుభూతి భూవతి లక్ష్మీనారాయణ రావు 1951 హృదయగత భావముతో సానుభూతి సావమరస్యము లేర్పృడజాలవు. తద్విరుద్ధభావములే యుప్పతిల్లును. స్త్రీహృదయమున రతిభావము నుద్చుద్ధము చేయుటకు అనురూపములైన గుణాదులు పురుషునియందును, అట్లే ఆ పురుషునియందు రతిభావోత్పత్తి కనురూపములగు గుణములా స్త్రీ యందును నున్నప్పుడే వారన్యోన్యము విభావములు కాగలరు. ఎదియో ఆంతరమగు నొకానొక సంబంధము, ఇరువురి యందును (్రకృతిసిద్ధముగ ఉన్నప్పుడే విభావానురూపమగు భావోదయము కలుగగలదు. ఈవిషయమునే భవభూతి, “వ్యతిషజతి పదార్థా నాంతరః కోపి హేతుః న ఖలు బహిరుపాధీ న్వ్రీతయః సంశ్రయన్తే.” అను వాక్యమున సూచించినాడు. మరియు, రతిభావావిష్టులైయున్న (కేయసీశ్రేయసుల నాలోకించుటచే నెల్లవారియందును, సర్వావస్థలయందును రతిభావోదయమగుననియు చెప్పజాలము. తదాలోకనకాలమందు వ్య క్రియొక్క మానసికస్థితిని, నతడుండు పరిస్థితులను మున్నగువానినిబట్టి యీ విషయము నిర్ణయమగుచున్నది. (ప్రియురాలి వురణముచే తపించుచున్నవాని హృదయము అట్టివిభావము వలన శోకాకాంతమగుటయు మానవ ప్రకృతికి సహజమే. కావుననే చిత్తము భావాంతరస్పృష్ట మైయుండకూడదను విషయము, “నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమవి[క్రియా” యను వాక్యమున వివరింపబడినది. చిత్త మన్యభావాక్రాంతమై యుండుట భావవైపరీత్యమునకును హేతువు కాగలదు. శత్రువు లగువారి యింట జరుగు వివాహద్యుత్సవదర్శనముచే హర్షమునకు బదులు అసూయకలుగుటయు సహజమే. ఐనను, అట్టి సందర్భము చిన్నపిల్లల హృదయమున మాత్రము హర్షమునే కలిగించుననుట గమనింపదగిన విషయము. చిన్నపిల్లల హృదయములు విశుద్ధములై యుండుటయే యిందుకు కారణము. కావున విభావానురూపమగు భావోత్పత్తికి చిత్తము, నిర్వికారము, విశుద్ధము నై యుండు టెంతయు నవసరము. రజస్తమోగుణస్పర్శలేని శుద్ధసత్త్వ రూపమగు మనస్సునకు ఆనందమనెడి ధర్మము కలదనియు, అదియే స్థాయియనియు. కూడ వివరింపబడియున్నది. సమర్థము ప్రకృష్ణము నగు విభావమును, అనుకూలపరిస్థితులును నేర్పడినపుడే

1952 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విశుద్ధమగు నంతఃకరణమున విభావానురూపమగు భావముద్బుద్ధమగుట కవకాశమున్నది. మరియు, వ్యక్తి మనస్సునం దాభావము వాసనా (సంస్కార) రూపమున నుండుట కూడ యవసరము. అట్టి పరిస్థితులయందు బోధచెందిన భావము అనుభావాదులచే వికాసమును గాంచి వ్యాప్తి నందుచున్నది. దీనినే, విభావాదిదర్శనాదికముచే సహృదయుని సత్త్వగుణ ముదిక్తమగుచున్నదనియు, తదుదేకకారణముచే వాసనారూపమున నున్న స్థాయిభావము విభావానుగుణమగు రత్యాది రూపమున నుద్బుద్ధమగుననియు ఆలంకారికులు చెప్పుదురు. విభావానుభావములు పదేపదే భావితములై వ్యభిచారులను స్ఫురింపజేయును. అనగా, విభావానుభావచర్వణము వ్యభిచారచర్వణమున పర్యవసించుచున్నది. వ్యభిచారు లనెడు చిత్తవృత్తుల చర్వణమునకూడ స్థాయిభావము తదాధారముగ మెలగుచునే యుండును. హారమందలి మణులన్నింటికి నాధారమగు సూత్రము లోపలనుండునట్లు స్థాయి (పవర్తిల్లునని దీనిని దృష్టాంతముగా నిచ్చియున్నారు. ఇట్లు వ్యభిచారిచర్వ్యణయందు స్థాయి కూడ చర్వితమగుచున్నది. కావుననే వ్యభిచారులు స్థాయికి పోషకములని చెప్పుట. ఈ విభావానుభావవ్యభిచారి చర్యణమే రసస్ఫూ ర్తి కాధారము. ఇట్లు చర్వితమైన స్థాయి చిత్తవృత్తియే పరిణతస్థితిలో రసముగా నాస్వాద్యమగునని కొందరి మతము. స్థాయిభావము జడమగు నంతఃకరణధర్మము మాత్రమే యనియు, రసము చిద్దనమగు నాత్మస్వరూప మగుటచే నది వేరనియు కొందరి మతము. విభావానుభావచర్వణ మూలమున చర్వితమగు స్థాయియే రసచర్వణ మొదవించి, దానిని సంస్కరించు ననియు, నప్పుడు రసము స్ధాయి రూపోపహితమై ఆస్వాదింపబడుననియు వీరి వాదము. ఏది నిజమైనను, విభావానుభావసంచారీభావముల చర్వణ రసానుభూతి కాధారమగుచున్నదనుటలో విప్రతిపత్తి లేదు. ఇట్టి రసానుభూతి సామాజికుని విషయమునం దెట్లు కలుగుచున్నదో పరిశీలింతము.

(సశేషం) (కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953)

రంధి న న గ న్‌ గ ప పటు డు జగం ఏకా రీ త

లి ఇల్లీ సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము స్ఫూర్తిశ్రీ

నౌహిత్యము సత్త్వసంబంధమైనది. సత్త్వసంజనిత భావసంపద కాకరమైనది సాహిత్యము. సాహత్యముకంటెను విస్తృతమగు పరిధి కలిగినది వాజ్బయము, వికారార్థమునను, (ప్రాచుర్యార్థమునకు మయట్పంత్యయము వచ్చును. ఇచ్చట వాకృబ్దమ్చుపై మయట్ప్రత్యయము వికారార్థమున వచ్చినది. అవ్య క్తమగునది భాషాసహాయమున వ్య క్తరూపము నందినయడల వాజ్మ్బియము కాగలదు. వాజ్బయము వాగ్రూపము గాని, లిఖితరూపము గాని యుండవచ్చును. సాహిత్యము సర్వమును వాజ్బయము కాగలదు. కాని వాజ్బయమున కొంతభాగము మాత్రమే సాహిత్యమై సంభావితమగును.

సాహిత్యపదమును పూర్వు లనేక విధములుగా నిర్వచించిరి. “సహితస్య భావః సాహిత్య” మని యొకరు. “రస సహితత్వమ్‌ సాహిత్య”మ్మని మరొక్కరు. “రసేన సహ భావః సాహిత్య"మ్మని యింకొక్కరు భావించిరి. పలువురు పలువిధములగు భావములను సాహిత్య పదార్థ నిర్ధారణ విషయమున (గుమ్మరించిరి. సజీవమై, రససమంచితమై, హితకారకమై, లోకవృత్త ప్రదర్శకమై సందేశ సంసూచకమగు భావశ్షిష్టమగు శబ్ద్బస్వరూపము సాహిత్యమనుట సమంజసమేమా!

సాహిత్యము బహుధా విభక్తము. గద్య పద్య చంపూరూపములను, గేయాది రూపములను పొంది సాహిత్యము లోకమున వ్యాప్తిగాంచినది. లా పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము

1954 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

పూర్వులు విశ్వ(శేయోదాయకమగునది కావ్యమని తెల్పిరి; కాని విశ్వశేయో దాయకమునగున వనేకములు కలవు. వైద్యశాస్త్రము విశ్వశేయస్సు కొరకు ఉపయోగ్యము; కాని అది కావ్యము కాదు. రమణీయార్థ ప్రతిపాదక శబ్దము కావ్యమగునని పండితరాయలు పలికినాడు. ఇదియు మొదటిదానివలెనే, ఏకభావ బోధకమే కాని సమ్మగ స్వరూప నిరూపణ సమర్థము కాదు. రమణీయమగు అర్థమును బోధించు శబ్దము మాత్రము కావ్య మైనచో ప్రపంచమునకు కావ్యములతో పనిలేక .పోయిడిది. కేవలము రమణీయ శబ్దమే కావ్యమై సమాజమును సమ్మోహింపజేయునెడల, కాంతాకనకములకంటె కావ్యమునకు ఘనత యబ్బుట అబ్బురము. రమణీయార్థ ప్రతిపాదకము, జగదస్తిత్వ[ప్రదర్శకము, సందేశవాహకము నగు శబ్దము కావ్యము. అట్టి కావ్యవాజ్యయమే సాహిత్యము.

కవి ద్రష్ట; ్రష్ట- విమర్శకుడు దష్ట; ప్రదర్శకుడు. కవి తాను గాంచిన విషయములను తన భావనాపటిమచే పరిశీలించి, వానికి అసాధారణమగు ఒక రూప మొసగి మన ముందుంచును. కన్నవిషయమును కన్నట్లుగాక దానికి రమణీయమగు ఆభరణముల గూర్చి ఆనందదాయకము, ఆకర్ణణీయము నగునట్టు లొనరించును. కవి తాను గాంచిన విషయమునకే తన భావనా జగత్సాహాయ్యమున [కొత్త రూపమును జతగూర్చును. విమర్శకుడు దానిని గాంచి వస్తుతత్త్యమును (పప్రదర్శించును.

మై విషయములను బట్టి సాహిత్యమున లోకవృత్తముండక తీరదని తల్లమగుచున్నది. కవి తాను నివసించులోకమును, కాలమును విడిచి ఎక్కడకును పోజాలడు. అందువలననే సాహెత్య విమర్శన సందర్భమున కవికాలము నెరుగవలసిన అక్కరయున్నది. దేశకాలముల నెరుగక చేయు విమర్శ కువిమర్శ యగును.

దేశకాలముల బట్టియు కవితాకల్పనమున మార్పులుండట సాజము. తిక్కన్ననాటి పరిస్థితు లీనాడు మననాట గాన్పింపవు. తిక్కన్నలోని సారస్యము ననుభవించి ఆనందింతుము. కాని, తిక్కన్న ననుసరించి “మక్కికి మక్కి”గా ఒకడిప్పుడు వాసిన యెడల, అతనిని లోకజ్జాన శూన్యడనుట సాహసము కారాదు.

ఏనాడో వ్రాసిన తిక్కన్నగాని, మరేకవిగాని నాటి జనుల మన్ననలను పొందినట్లు ఈనాడు పొందలేడు. నాటి జనుల హృదయమును స్పందింపజేయ గల్గినట్టు లాకావ్య మీనాటి జనులను గావింపలేదు. కావ్యము పప్రాతవడుట దానికి హేతువుకాదు;

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్చూర్తిశ్రీ 1955 కావ్య వస్తువునకును లోపమురాదు; కాని అందలి వాతావరణము కవి నివసించిన వాతావరణమునకు వలె మనకు సన్నిహితము కాదు.

భారతమునందలి యుద్ధఘట్టమునే చూతము. నాటి రథములు, రాజులు, వారణములు, ధనుర్భాణములు అందు వర్ణితములు. కాని, ఈనాడు మనము దానినిగాంచి “ఓహో! మన పూర్వులట్లు యుద్ధమును గావించిరి కాబోలు" అనంకొనుంచంన్నావల. అంతియెకాని కవి ఖావవఎనం షూర్తిగా ప్రత్యక్షీకరించుకొనలేము. మనయందింకను ఆ రక్తము ప్రవహించుచుండుటవలన కొంత అనుభూతిని పొందగల్గుదుమేమో సందియము. అదే ఘట్టము నొక పాశ్చాత్యుడు చదువునెడల (పప్రత్యంగచ్చేదము చేసి పరిశీలింపగల్గునుగాని అనుభూతిని, వలసిన ఆనందమును పొందజాలడు. ఆతడందు వర్ణితములగు వస్తువులకు మిక్కిలి దూరుడగుటయే కారణము.

మధ్యయుగమున శృంగార కావ్యము లధికముగా తలయెత్తినవి. దానికి కారణము నాటి జనాఖిరుచి.

సారస్వతము కొందరు విశిష్టలవలన ఎప్పుడును ఆదరింపబడును. సమాజము సమస్తము విద్యాసంపన్నము కానందున విద్యావంతులగు విశీష్టుల మత్సిపతిభా విశేషముల ననుసరించి సారస్వత నిర్మాణము సాగును.

తొలుత నన్నయభట్టారకుడు ధర్మ(పప్రబోధకమగు భారతాంధ్రీకరణమునకు నృప(ధ్రేరితుడై పూన్కి వహించినాడు. ఆ కాలమున జనులు ధర్మసంబంధి విషయములందు ఆసక్తి కనబరుచుట దానికి హేతువు. ఇక కావ్యవస్తువు అన్నదమ్ముల కలహము. అచ్చటచ్చట అలౌకికవిషయ ప్రసంగమున్నను కావ్యము లోకవృత్త (పప్రదర్శకము. లోకములోని దాయాదులకు వలెనే తగువులాటలును యుద్ధములును అందుగలవు. నాటి నృపుల కలవాటులగు జూదము, పానము, వేట మున్నగునవి కూడ వర్జింపబడినవి. అంతియేకాక, నాడు ధర్మముగ వ్యవహరింపబడిన విషయముల ప్రసక్తకూడ కలదు. ఇట్టులే భారతమున నాటి వాతావరణమును (ప్రదర్శించు అనేక ఘట్టములు ద్యోతితములగును.

ఇంక నన్నయభట్టారకుడు రూపించిన (బౌపదీపాతమునకును, తికృయజ్వ నిర్మించిన [ద్రౌపదికిని మనస్తత్త్వమున భేదము గలదు. కాని, అది దౌెపదియందుగల భేదమునుగాక, కవుల విభిన్న స్వరూపముల సాక్షా త్కరింపజేయును. నన్నయనాటి పజాదృష్టికిని, తిక్కననాటి పప్రజాదృష్టికిని భేద మేర్పడినది. నన్నయ ద్రౌపది

1956 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంపుటము 4: సాహిత్యము కేవల ధార్మిక తిక్కన ద్రౌవది రాజకీయధురీణ. అది కవుల విభిన్న మనస్తత్త్యములకు, విభిన్న వాతావరణములకు తలయొగ్గి మార్పుచెందినది.

౧6 గంగడ6 0 నిం6[/ ౧౫౮51 (61601 ౧౦౦౧1౫

106 1౧61౪10621 ౪౧1/౪౧56 01 16 గిం 001 &|50

1౧68 800141 ౪౧౧/6౧56 0 ౪1100 ౧6 159 20౧ [౧0౧80618౧6

ఎంగ గక&01%

లోకమునందు తాను పొందిన అనుభూతిని సందేశరూపమున సౌందర్యశివముగా వ్య క్తీకరించుట కవిత్వము. (పప్రత్యనుభూతియు వ్య క్తీకరణము నొందకపోవచ్చును; (ప్రతి వ్య క్రీకృతియు సందేశము కాకపోవచ్చును. కాని (పతిసందేశమునకు వ్య క్రీకృతియు, వ్య క్తీకృతికి అనుభూతియు ఆవశ్యకములు. కవిత్వము సందేశ సంవాహకము కాకపోయినను, కేవలోద్దాటనమైన కావలయును. అప్పుడును అనుభూతి అవసరము. హృదయమున ఏదేని విషయము గాటముగా నాటుకొన్నప్పుడుగదా - ఉద్దాటన మొనర్చనగును. వస్తువులేనిదె ఛాయ ఏర్పడదు. భావము వినా ఆకారముండదు. అల్లే అనుభూతిలీని అభిభాషణ ముండదు. అంతియే కాదు-

“౦ 400% 20 6౫06౧6౧0౦6 13 10 అగ[253 11016౧౧౭ ” - గంగాజంగ గ801.

అట్టియెడ, అనుభూతి అంతర్హ్దర్శ్గన మన్నమాట! ఆంతరంగికముగ అవలోకించిన విషయమును బహిరుద్దాటించుట వ్య క్తీకరణము. దీని నందరును చేయలేరు. అనుభూతి నందరును పొందగల్గుదురు. కాని దానిని వ్య క్తీకరించుట కొందరికి మాత్రమే సాధ్యపడును. అట్టి వ్య క్తీకర్త లందరును కవులు కాజాలరు.

ఆకసమున శరదభమాలికల నందరును గాంతురు. తన్మూలమున అందరు అన్నివిధముల అనుభూతులు నొందుదురు. సామాన్యుడు వానినిగాంచి వాని అఆలుపుదనమును చలువదనమును (గ్రహింపగల్గునేమో! అంతకంటెను, ఒక భావుకుడు వానిని గాంచినపుడు వానితో సాదృశ్యముగల మరేవిషయమునో తలుచుకొనును. వేదాంతికి మన జీవితమే జప్తికిరావచ్చును. “మన జీవితము శారద మేఘమువలె నిస్ప్సారముగదా!” అని నిస్పృహ నందవచ్చును. కుమారకవి మేఘాంచల 'పప్రతిఫలిత స్వర్ణవర్జారుణకిరణ పంక్తిని గాంచి పరవశుడు కావచ్చును. ఒక భక్తుడు మొయిలు కొనలగలుగు ధౌతవర్ణమునుగాంచి ధౌాతనగశిఖరమున వసించు ఆదిమ దంపతుల కీర్తింపవచ్చును. వస్తువొక్కటియె, కాని అనుభూతు

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్ఫూర్తిశ్రీ 1957 లనేకములు. అంబుదము సామాన్యముగ అగపడు వస్తువు, కాని దానిమూలమున నగు అనుభూతి వివిధాంతస్సులలో లోకలోకాంతరముల లోగొన్నది.

“౬౯9౧6౧౦6, అ(0!95910% 2౧6 ౦0౧౫౧౪౧|౦౪1౦౧ 2/6 (10645) 5660౧ 10 06 611668౧1 120613 0 116 54006 ఇ౦["- గంగు౭౧ గదడ౦11."

కవి తాను కాంచిన విషయమును సందేశసంయుక్తము గావించి వెలువరించును. సామాన్యుడు విషయమును గాంచును. ఏదో అనుభూతి నందును. అంతతో సరి. ఒకవేళ దానిని చెప్పినను కేవల స్వరూపమును మాత్రమే చెప్పగల్లును. కవి అట్లుకాక మహత్తర విషయప్రదర్శనము గావింపగల్లును.

వై విషయములను (కోడీకరించి, సమీక్షించినయడల కవియే విషయమును విలిఫించినను లోకవృత్తప్రమేయము లేకుండ నుండదని తేలును.

"౦ 116 ౧౦౪1 62గ౧ 15 ౧15 ౧౦0౧౧౪

౭2౧6 [౧8౭౪6౧ ౧15 ౧౦౧06. *- 5. గి౭ర౧౭%6గ౧9౧౧౭౧.

కావున, కవి తనయందు పరిసరవాతావరణము నుంచుకొని తత్త్వప్రధానముగా కావ్యనిర్మితి గావించును. నేల విడిచి సాము చేయుట సాగదు కనుక కవిత్వము భౌమవాసనల కోసరిల్లి మనజాలదు. “దిగిరాను దిగిరాను దివినుండి భువికి" అనువారుకూడ దివినుండి భువి కెందుకు దిగిరారో చెప్పుకోవలను. భూమియందు వారికి సరిపడని సంగతులేమిటో, నాకమందు వారి నాకర్షించు విషయము లేమిటో చెప్పవలయును. అప్పుడును లోకవృత్త మధమము సూచితమైన కావలయును, కళాఖండమునందు సూచనకును, కంఠోక్తికిని భేదమంతగా కాన్చింపదు - లేదు. అందువలన ఏదో యొకట్లు లోకవృత్త ప్రసక్తి రాకపోదు.

“6/6 1౧6 ౧౧1౧౮ 15 ౪1౧0౪1184౯ అను రవీంద్రుని గీతము భావసముద్భృవమగు లోకమును భావించుచున్నను ప్రస్తుతము తానున్న లోకమునుకూడ స్పృృశించుటను (పకటించుచున్నది. తాను వాంఛించు వస్తువులు ప్రస్తుతము తానున్న జగమున లబ్ధములు కావనియు, అట్టివికల అన్యజగమునకు తన దేశప్రజలను గొనిపోవలయుననియు అతని యూహం. +

భారతదేశము పారతంత్య్య పంకమునందుబడి మునుగుచు, వెలువడజాలక, వ్యసనపడు దినములందు వ్రాసిన గీత మది. అది ఆనాటి పరిస్థితులను, (ప్రజాహృదయమును ప్రతిఫలింపజేయును.

1958 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

. ఛం తొందల ధఫంటి బ్బంటదేీ

గండ అ్యతఉ చడ"ద్స

ంగ్గంగ ఆయడంరు అహాందొడో శిధంటి

"గంరత ధిఆద ఆగదా అడ్‌ .ఎఅడతదింధ వాం (62 .ఎడవంండ తరం డ6ంర్రికి యంయ్కండిర 6అ త్య౦6త్సడం కడిల్రాణ ,6726వాణటిదరళ వటథ్యండిర 6ం౧యయకద్‌ డయింఆ్యాకయడ తయత్రి రొిడఆడందంఅ .శొడల్లాణ దిక టిం .ండఆాంబడయ 607260దఠ6ఉండగ ॥ -$్రక్రీత్మాబొం

య శ్రగభాతంయ్యలీ8 (ఉంంపబ్దాంయండిో

శణయడడే దొద్దంట ఇరుడిల్‌

6౧8 లక్‌ దగాల్తా లృటింల యజండ్‌

యెదబిదడయ్య అలర జ్యకయదివంత

ట్‌ యత్య్యహ్యాడ ండరగంటర్జ్యుడ ఢి

డడ6ద్పి యబెంల గ్రంటంర్‌

డఆొడా శ్రంఈతంత్టడ అయండయద్యయ్య్మతంగా

యంిదటియల గియయులణియ ఉఅరుక్రిః

శరీజడ్‌ అడఆక ఢి ఎడ్‌ డ"ండ్‌ఆ?౭

యథకే ఫృియ్‌ అ అక్‌ డడం శృయల

వర్ణిరంయల్లక ౧ద్యతల ;్చియ్‌ం అథశంట్దక

"చెంచంటరు దిలట్రదత్యకలా |రిచ దిడడండధంట యరకుదీడ్రిదిాణ లొడంత 6దృండేండద్తండేర డయ్యందేక్మకడి 20ఆఅ ఉండిత్యణంట డయడయయలడతింశాద యఆఅయడడథయఅ రత అగఆయడక్ష్యతద్ప ఉక డయంకిద్‌ంట యయడపహండడ్క ఉంజాయత యల్గం డరి%

యడహ్ర్యైడకోఆ భయద కఎ ఉరడతం'కే దింంతతంటయడడి దరదంరొాటదయ టొ తరయఅ ఉడఎద్య్మతదక .దిడఠత్‌ 6దయరుఅడ?౭ యడత్యరిదద్స డంద్యతడండ యడయడరిడడ్య్మడళకేఆ ంయడయడతడిపి శజలడదాడ తళయఅఆ ద్దీఅ యయడయరడడఅ డభఇఎయడక్షోరిడ .2077యడక్ష్యతడ్స డదఅడయంఅ .దిర౦క్‌ అరుడయ్మఫఅఆడయడల ,ందరడళి యడయాద్రడ ఉయంరిం్ధుిడ 6ద్యదతశచంచి క్రిలదృత్యదశిఆ

త్రదకిఆ ఉడ్య్భురలడ దిడరయథయటఉంటిగ్గచి ఆగక్రోడెాధ్యల్‌ యంఅయద్యదం౭ కం08ి యడకరరదథ్స

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్ఫూర్తిశ్రీ 1959

“మాత్రసంచి తలాడగా మార్గవేది

నొక్కం డార్యలు గీతలొండొకండు దాను

భాషితంబులుగా. దోడి బాహ్మణాఘ

ముబుసుపోకకు( జదువం బరున్నవేళ

  • ఆముక్తమాల్యద.

మై పద్యమున పరదేశియగు బ్రహ్మణుడు వేసగికాలమందు తాను పరున్నవిధమును తెల్పినాడు. ఆ యాచారము గ్రామసీమలందు ఇప్పటికిని చూడనగును. [గీష్మకాలమున, ఆరుబయట ముంచములను వైచుకొని, నిద్రపట్టునంతవరకు లోకాభిరామాయణమో, కాక పురాణాది కాలక్షేపమో, కాక గీతికా గానమో - ఏదో యొకటి ఉబుసుపోకకు గావింతురు. అది లోకవృత్తము. కాని కేవలము ప్రపంచమున జరుగు ప్రతివిషయమును వరుసతప్పక చెప్పుట కావ్యోద్దేశముకాదు. ఇచ్చట విల్లిపుత్తూరు భక్తిరసపాదోధి నీదులాడుచుండునని తల్పుట కవి యుద్దేశము; అందుల కిదొక మార్గము. సహజమగు లక్షణమునుగ్రకొని, తన్మూలమున భక్తి భావమున కాధిక్యమును ఘటించుట కవి చాతుర్యమునకు నిదర్శకము. సాధారణమగు ఒక వస్తువును గైకొని కావ్యవస్తువునకు మెరుగులు దిద్దవలను. “మరొక పప్రదేశమునందైనచో పౌరులు వ్యర్థసంభాషణములతో కాలము వ్యయింపవచ్చును. కాని విల్లిపుత్తూరునందలి జనులు సత్కాలక్షేపము గావింపగల నేర్పరులు; భక్తినిధులు” అని తెల్పుటు కవి భావము. అంతియేకాని చార్వితక సత్యములను ప్రదర్శించుట కవి మతముకాదు.

(ప్రతికథయందు ఇతివృత్తము లోకవృత్తమే. రామాయణగాథ సాధారణముగ జరుగు చర్యయే; కాని కొందరియందు అతిలోకములగు గుణములుమాత్ర మారోపితములు. జననము, వివాహము, వనగమనము, సీతాపహరణము, రాక్షసహననము (ప్రభృతములు రామాయణాంతర్గత ఘట్టములు. తండి వాక్యానుసారవలు రాముడు వనమున కేగుటయందు ఆదర్శపుటతుని గుణమారోపితము; అది అతిలోకము కాదు. సీత రాముని వనమున కనుసరించుట యందు సహధర్మచారిణీలక్షణ మభివర్డితము. సీతయందు ఉత్కటమగు పాతివ్రత్యప్రభావమును కనబరిచి నారీలోకమునకు ఆదర్శమును ప్రదర్శించాను. సీత సామాన్య స్త్రీయే; కాని ఆమెయందు నారీజగత్తున కాదర్శములు కాదగిన భావములను పుంజీభవింపజేసెను. సీత అగ్నిప్రవేశము, భూగర్భ[ప్రవేశమును వాస్తవమునకు దూరములు. పతివ్రతామహాత్మ్యమును, పాతివ్రత్య మహాత్మ్యమును

1960 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 44: సాహిత్యము పాఠకుల హృదయములందు స్థిరముగ పాదుకొల్పుటయే కవి ఉద్దేశించినది. కవిత్వము లోకమునకు కాంతిని ప్రసాదింపవలయును. సంఘమును సంస్కరించి, సన్మార్గమున నుంచవలయును. రావబణునికి పది తలలుండుట, ఇరువది బాహువులుండుట - అతని మేధాశక్తికి, దైహికశక్తికి నిరూపకములగు అంశముల కాలంకారిక చిితణ. వాస్తవికతకు విరుద్ధముగా కన్పట్టు ఆ యంశమునందు అంతర్నిహతమై యాథార్థ్యమున్నది. శంబుకవధ నాటి సాంఘిక నిర్బంధములను నిరూపించును. శ్నూదుడు తపస్సుచేయుట నాడు నిషిద్ధము. శాసనోల్లంఘన మొనర్చిన శ్వూదుని శిక్షింపవలసిన బాధ్యత రాజపీఠము నధిష్టించిన రామునిమై నున్నది. అందువలన అతనిని చంపవలసివచ్చెను; ఇది సామాన్యమగు రాజధర్మము. కాని, అతనిని చంపుటయందు రాము డుపయోగించిన అస్త్రములు, . శంబుకునినుండి వెలువడిన దివ్యతేజము కవి కాల్బ్పనికములు. అల్లే భారతము మొదటినుండి చివరివరకు లోకవృత్త మే, కొట్టకొనను కల్పింపబడిన ('ప్రస్థానముమాత్రము కాల్చనికము, అలౌకికము. అల్లే అంతయో, యింతయో లోక్షవృత్తము లేకుండ కావ్యము నిర్మితముకాదు. కళాపూర్జోదయమునందు, రంభామాయారంభల సంవాదము, నలకూబర కుహనా నలకూబరుల తగవులాట లోకవ్యవహార సూచకములు. “అంత మదింపకువేయని పల్కిన, నంత మదింపకువే యనుచున్‌ గంతు లడంచెద లెమ్మని పల్కిన, గంతు లడంచెద లెమ్మనుచున్‌ రంతుల నేమిఫలంబని పల్కిన, రంతులనేమి ఫలంబనుచున్‌ బంతము చూడగదేయని పల్కినం. బంతము చూడగదేయనుచున్‌” “ఒకతా మగనికి నాసించు టొప్పదనిన, నొకత మగనికి నాసించు టొప్పదనుచు” ఇరువురు రంభలును కలహమాడిరి. ఇది లోకవ్యవహారమున సుప్రత్యక్షము. ఒకతె ఒక మాటాడెనేని రెండవదియు అదియె అనును; అర్థముకూడ [గ్రహింపదు. కాని పురుషులైనచో అట్లుకాదు. పురుషుల తగవృ భుజబలముతోనే 'ప్రారంభింపబడును. అట్లుకాకున్న తత్తుల్యముగనైన. అంతియేకాని మాటలడై మాటలు పేర్చుట, ఒకని నొక డనుకరించుట జరుగదు. నలకూబర మణికంధరుల తగవులాట దీనికి తార్కాణము. “ఇదె ఖండించెద వీని మామక మహాహేతిప్రకాండంబుచేం దుద శోధించెదుగాని నీకుంగల యుక్తుల్మీఐ నాసత్యమున్‌”

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్ఫూర్తిశ్రీ 1961 అనుచు నలకూబరుడు మణికంధురుని సంహరించుటకే సన్నద్ధమైనాడు. తాను మణికంధురుని చంపునట! ఆపిమ్మట సత్యాసత్యములు సంశోధింపవలయునట! ఇట్టిదేకదా ఉ(దేకగస్తవివేకము! పురుషుల కలహ మన్నివిధముల ఈ కలహమును బోలియుండుటలో సందియములేదు. అట్టులే సిద్ధునివంటి మాయావేషు లేనాడును లేకపోరు; వారిచే వంచింపబడు అమాయికలును లేకపోరు.

ఇట్టులే కావ్యములందు లోకవృత్తము యత్రతత్ర కన్పట్టుచుండును. కాని కేవలము లోకవృత్తప్రదర్శకములగు కావ్యములే యున్నయెడల వానికి శాశ్వతత్వము లభ్యముకాదు. మానవుని దైహికజగత్తు కేవల వస్తు జగత్తుచేతనే తృప్తిపడును; కాని మానసిక జగత్తు తద్భిన్నమగు తత్త్యమునకై అన్వేషించును. అందువలననే తత్త్య్యములేనిచో కవిత్వమునులేదు. తాత్తి్వికుడు కాగలిగినపుడే కవి లోకశేయస్పంవిధాయకమగు కవితాసృష్టి గావింపగల్గును. “త్రాత్త్వికుడుకాని కవి కవికాడు” - రవీందుని వచస్సు. ఇచ్చటను భేదాభ్మిపాయము లుండుట కాస్కారముకద్దు.

“సత్యమునందు సౌందర్యమున్నది = కాని స్వాభావికత్వమునకాదు; కవిత్వము సృజనము = కాని అనుకరణముకాదు” అన్న రవీంద్రుని పల్కులు యాథార్థ్యమును 'ప్రకటించును. బాహ్యన్నేతములకు గోచరమగునది మాత్రమే సత్యమనియు, తక్కటి దంతయు అసత్యమనియు తలపరాదు. కవిత్వము పాక్షికముకాదు; సమ్మగము. దృశ్యము, అదృశ్యమునగు ఉభయసత్యములను సమన్వయపరచి ప్రదర్శించుట కవిత్వము లక్ష్యము. మానవుని భావజగత్తు ఉభయలోకసంస్థిత సత్యసందర్శనము ననే (ప్రశాంతిని పొందగల్గును.

సాహిత్యము బౌద్ధిక మానసిక వృత్తుల సామంజస్యము. వ్యక్తము, అవ్య క్తమునగు విషయముల యేకత్వము సాహిత్యవృత్తమై కవిత్వమున ప్రసక్తమగును.

భారతదేశము బానిసతనమునకు పాల్పడిన అనంతరము తన అస్తిత్వమును గోల్పోయినది; అనుకరణను ప్రారంభించినది. పాశ్చాత్య దేశములతోడి సాంగత్యమువలన ఆయాదేశముల ఆచార వ్యవహారములు, భాషావేషములు పపాప్తించినవి. మంచిచెడ్డల విషయముతో మనకు పనిలేదు. కాని, దానిఫలితముగ గద్యము, ఖ౦డకావ్యము, నాటకము, ప్రహసనము మున్నగు సారస్వత కళాభదములు మన సాహిత్యమున చేరినవనుట మరవరానిది. వర్డువర్తు, బైరసు, కీట్సు మొదలగు

1962 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము కవివరుల రచనములకు అనుకరణలు బహుముఖాలుగా బయలువడలినవి. కళకోసమే జీవితమనునట్టులు కావ్యరచనము సాగినది. అందును, కవితావృత్తము; (పేయసికొరకు పరితపించిన ఎండుగుండె విషాదనివేదనము; (బతుకు బరువై, కాలచ[క్రము[క్రింద పడి, నలిగి, నెత్తురు చిమ్మి, దిక్కులేక చేసిన య్యాకందనము; పుష్పవాటికయందు తేనెకొరకు అన్వేషించు తేటిపాట; కన్పించని కాంతికొరకు, విన్పించని నాదముకొరకు వెదుకులాడిన యాట్రికుని జీవితవిశేషము.

_ ఇవన్నియు రూఢములగు సత్యములు. బాహ్యులోచన ములు పరికింపలేకపోవచ్చును. కాని, సంస్కారముగల హృదయము వానిని గ్రహించుటలో సర్వవిధముల సమర్థము.

“కరుణ పట్టును క్రీ బిచ్చగానిచేయి

చాచికొనినాడ మృత్యుఘోషమ్మె మరచి;

వట్టిబయలున నొకమోడు చెట్టువోలె

ఎత్తినది కరమెత్తినల్లే కృశించె.” - శ్రీ కృష్ణశాస్తి.

పై పద్యము చదువునప్పుడు “కాఫీ హోటలు సమీపములో, బాటప్రక్క బిచ్చగాడు చెయ్యిచాచుకొనుట, అదే సమయములో ఒక “కారు” అతనిమీదినుండి పోవుట - మనకు భావనాపథమున గోచరించును. మన హృదయము విహ్వాలత

నొందును; విలవిల కొట్టుకొనును; కొంతకాల మాగినకాని తరువాతి పద్యమును

చేరలేము. కవి ప్రణయభిక్షకు చేయి చాచినాడు; కాని పాొంచియున్న మృత్యువును గుర్తింపలేదు. తత్‌క్షణము మృత్యువాతనిని కబళించి వేసింది; ఎత్తినచేయి ఎత్తినల్లే మిగిలిపోయినది. ఎంత విచారము! అంతేకాదు. నల్గురు చూడని జీవిత మాతనిది. ఎడారిలో ఎండిపోయిన వృక్షశాఖవలె నిలిచిపోయిన దాతని హస్తము. నిలిచిపోయెడు హస్తము నిలువవచ్చును. కాని, నాలుగు కన్నీటిచుక్కలు - అభిమానార్ధృవచనములు లేని ఆ మరణముకంటె దుఃఖకరము, వేదనాభరము అనువిషయ మింకేమి కలదు? హృదయమును పరపరకోయు ఈ వర్ణనము మనకింత సన్నహితమగుటకు కారణము తదంతర్లీనమై ప్రవహించు సత్యస్రవంతి; పరోక్షముననుండి ప్రతిఫలించు లోకగతదారుణ దుఃఖము.

“వలపుటాకలి (స్రుక్కు నా బ్రతుకుమీద

ఇనుప పాదాల నిడి లోకమిపుడు నడుచు” - శ్రీ కృష్ణశాస్తిం.

సాహిత్యము లోకవృత్త ప్రదర్శకము న్ఫూర్తిశ్రీ 1963 కవి స్వాతంత్యము సాంఘిక నిర్చంధములచే దెబ్బతిన్నది. లోకములోని పౌరుష్య మాతని వాడిపోయిన హృదయమును నలిపివైచినది. అంతఃకరణ వైశాల్యమును పరిమితము చేసినది. “రెండు పొలిమేర లొకటైన రేఖమీద నేను నీ యొడియందున మేనుమజచి నిదురపోడును జోలపాడుదువు నీవు చిచ్చికొట్టుచు చీకటుల్‌ విచ్చుదనుకి - శ్రీ నాయని. తన ఒడిలో పండుకొనబెట్టుకొని తన తల్లి కవిని జోకొట్టుచు, జోలపాడుచు రాత్రి కడచుదనుక నిదురింపజేసెను. ప్రతి మాతృదేవియు శిశువు నట్లే చూచును. కాని, కవి తన పదముల తూగుచే మనల నూగిసలాడించును. రెండు పొలిమేరలు కలిసినది, సమన్వయత కన్నది - ఆ ఒడి. ఆ ఒడిలో నిద్రపోయిన కవి కాలవశాన అట్టి సుఖమునకు దూరమైనాడు. అప్పుడు అట్టివాని దుఃఖ మపారము. ప్రతివస్తువు తన శోకమునకు బెల్బణ్యము కలిగించును. “ఏను స్నానమ్మునకు బావి కేగునప్పుడు లేత సూర్యుని బంగరుపూతలందు మురియుచును దల్లియొడ్డును ముద్దుగొనుచు “అమ్మ యేదిరా?” అన్న వా యలలు నన్ను. పెని వేంచేసి యూపిరి పట్టుకొనుచు చిన్ని తాబేలు నన్ను వీక్షించి జలము (తవ్వుకొనుచేగె కూపగర్భమున దాగ పె నలముకొన్న సుళ్లు నాపాల విసరి. “నీీక్టు లేదమ్మ" యన్నది నీటిపాము పెకగసి యొక్క కప్పను బట్టుకొనుచు “నాకు లేదమ్మ” యన్నాను శోకవహ్ని తప్రహృదయుండనై యింటి దారిపట్టి" - శ్రీ నాయని, గాలికి రేగిన అలలు కూలము తాకుట తథ్యము. కాని ఆ తరగలు తన్ను ఎకసక్కమాడుచున్నట్లు తోచినవి - మాతృహీనుడగు కవికి. మనుష్యుల అలికిడికి నీటిపైనున్న తాబేళులు, చేపలు లోనికిపోవుసు; నీరు కదలిక నొందును; అందువలన

1964 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము వలయము లేర్చడును. కాని సంతప్తస్వాంతుడగు కవికి తాబేలు తన్నవమానపరిచి, తనవైపు సుడులు పచరించి, మరుగుపడినట్లు తోచినది. నీటిపాము పెకెగసి కప్పను పట్టుకొన్నది. అదియును “నీకు అమ్మలేదు అన్నది. మున్ముందు విచారముతో కుందుచున్న డెందము; పైని అవమానపరంపర. గుండె బరువెక్కినది; కవి ఖీన్ను డైనాడు; “లేదమ్మ” అన్నాడు; విచారముతో వెనుదిరిగినాడు. అచట నిల్చుటకు ముఖము చెల్లలేదు. దుఃఖములోనున్న మానవుడు ఫైవిధి ప్రవర్తించుటలో ఆశ్చర్యమేమున్నది? లేనిమాటలనుకూడ వినగలడన్న వింత ఏమున్నది?

కాని, కాలిన హృదయము కాలినట్లు కన్పించదు. విశ్వకవి రవీందుడు వచించినట్లు శిరములు రక్తము (సవించుచున్నను ఉన్నతములు.

శీ శ్రీరంగం శ్రీనివాసరావు కన్నులకు కట్టినట్లు సత్యమును కనబరచును. అతని కవిత్వమునకు ఆచ్చాదనము లేదు; తత్త్వము మ్మాత్రమున్నది. తాను చూచినది చూచినట్లుగా సూటిగా చెప్పగలడు.

“పతితులార! భష్టులార!

బాధాసర్చ దష్టులార!

(బతుకుకాలి, పనికిమాలి

శనిదేవత రథచ[క్రపు

టిరుసులలో పడినలిగిన

హీనులార! దీనులార! = శ్రీ. శ్రీ.

(పప్రతిమానవుడును దుఃఖభితుడే; బాధితుడే. ప్రపంచమున హతభాగ్యు లధికులు. అందువలననే కవి సమాజమును సూటిగా సంబోధింపగలిగెను.

ఇట్టులే సాహిత్యమున ఏయుగమందైనను లోకవృత్తము ఉండకపోదు. లోకములోని పద్ధతులు, వ్యవహారములు, ఆచారములు, జీవితవిధానములు - ఏదోవిధిని కవిత్వమున (ప్రతిబింబితములు కాకతప్పదు. (కిన్నెర: సంపుటము 5, సంచిక 9, సెప్టెంబరు 1953)

ట్ట]

ఆలీ అల్ల ఇల్లీ దొరకిన షష్టస్కంధము పోతనకృతమా ? మిన్నికంటి గురునాథ శర్మ.

ఆతభ్‌ల సాహిత్యకళాభివర్ధక సంసత్కార్యదర్శిగారు షష్టస్కంధము నచ్చుప్రతి నొకదానిని నాకిచ్చి ఇది పోతరాజకృతమగునా? కాదా? పరిశీలింపం గోరెదను. క్రొత్తగా దొరకినది. అచ్చు వేయించుచుండిరనిరి. ఆ పొత్తము నేను మహాకుతూహలముతో సంభ్రమంబున నాద్యంతములం: జూచితి. మొదటి పద్యము తర్వాత “వుహనీయ గుణగరిష్టులగు నవమ్ముని (శేష్టులకు నిఖిల పురాణవ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుండిట్లనియె. నట్లు...” అనియు, (గంథాంతమున గద్య “ఇది త్రీపరమేశ్వర కరుణాకవిత కవితావిచిిత కేసనమంతత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య పప్రణీతంబైన...” అని యుండెను. మహానుభావు6.డైన పోతరాజుగారి కృతి యంతకాలమునకు లభించినది! అని యానందముతో భావించి మొదటిపద్యమును జదివితిని. సంశయము కలిగినను. మరల. జదివితి.

కం॥ శ్రీ విశ్వభారభరణ - (ప్రావీణ్యవిభాసమాన ఫణిరాణ్ణిభ బా హావిపుల! విజయమోహన! రావణమదకరిమృగేంద్ర! రామనరేందా! ఈమొదటి పద్యము మూండవచరణమున నంత్యప్రాసము లేదు. పోతన

యిట్లు వాయండే యని సంశయించితి. “బాహావైభవ నిస్తంద్రాగొఅని వ్రాయకుండునా యని భావించి యావలిపద్యముం జూసితి. నా కాలుసేతులు చల్లబడెను. ఆ పద్య మిది. పందిరి మల్లికారుసరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1966 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సీ॥ వ్రేదాంతరూప నివృత్తి మార్గంబును వరుస సంసారప్రవర్తనంబు ప్రకృతిజంబైన స్వర్గంబు పాతకభోగ్యనరకలక్షణము మన్వంతరములు దరణిం బియనవ్రతోత్తానపాదుచరిత్ర, వార్థినదీద్వీపవర్షములును సరవి భూగోళసంస్థానంబునక్ష (త, వసుమహీంద్రాశ్రమవాసములును మొదలుగాం గల సర్వంబు6 దుదకు వెడల వింటి మీవల్ల యోగీంద్ర వేడ్కతోడ "

  • యాతనలంబొంది నరులు నేరీతి నరక +. మనుభవింతురు తలియంగ నానతిమ్ము 6 శ్లోకముల యాంధ్రీకరణ మిది. ఇవిగో క్లోకాలు. శ్లో॥ నివృత్తిమార్గః కథిత ఆదౌ భగవతా యథా (శకమయోగోపలబ్ధేన బ్రహ్మణాయద సంసృతిః క్షే (ప్రవృత్తి లక్షణశ్చైవ త్రైైగుణ్యవిషయోమునే యోసావలీనప్రకృతేర్గుణసర్గః పునః పునః 2 అధర్మలక్షణా నానానరకశ్చానువర్ణితాః - మన్వంతరశ్చ వ్యాఖ్యాత ఆద్యస్స్వాయంభువోయతః _ తె (పియవతోత్తానపదోర్వంశ స్తచ్చరితాని చ " ద్వీపవర్షసము[దాది సద్యుద్యానవనస్పతీన్‌ డే ధరామండలసంస్థానం భాగ, లక్షణ, మానతః జ్యోతిషాం వివరాణాం చయథే దమస్ఫృజద్విభుః వ్‌ అధునేహ మహాభాగ యథైవ నరకాన్నరః భాగవత 6 స్కం. ఈ శ్లోకముల నాసీసముం జదివి యిది యెక్కడి పోతనకృతము. పోతన యిట్లు తప్పులతో వ్రాయుననుకొనుట యంతయపచారము! ఇది పోతనకృత షష్టస్కంధము కాదని నిశ్చయించుకొంటిని. ఏర్బ్చూరి సింగన యీ క్లోకభావములు చెడకుండం జక్కగా నాంధ్రీకరించెను. ఈ యజ్ఞాతకవి 6వ క్షోకమును సరిగా

దొరకిన షష్టస్కంధము పోతనకృతమా ? మిన్నికంటి గురునాథ శర్ళు 1967 నన్వయించుకొనలేదు. “యథానరః నానోగయాతనాన్నరకాస్‌ నయియాత్‌ నగచ్చేత్‌ తన్మే అధునా వ్యాఖ్యాతుమర్హసి” నరుండు నరకయాతనలబొందని తెజంగు నాకిప్పుడు చెప్పుము. అని యన్వయించుకొనక యాతనలంబొంది నరులు నేరీతి నరకమనుభవింతురని వాసెను. నరులు నరకయాతనల నేరీతి ననుభవింతురని చెప్పందలచెం గాబోలు మన యజ్ఞాతకవి. సీసమందలి కడమదొసంగుంల జదువరులక వదలెదను. సింగన సరిగనే వాసెను. 41 ప. చూడుడు. 4వ వచనము. “అని పలికిన రాజుకు ...” 7వ వచనము “అనిన రాజిట్లనియె” పోతన యిట్లు (తుంచివేసి వ్రాయండు. రాజేంద్రుం డనియో, పరీక్షిన్నరేందుండనియో (వాయును. ద్‌వ్ర పద్యము కం!!! మనమునం గాయంబున వా - క్కునజేసిన పాతకంబు [కూరంబగు యౌ తనంబొంది నరులు నరకం - బున గూలుదు రధికదుఃఖమున6. బరవశులై దీని మూలక్షోకము: నచేదిహైోవాపచితిం యథాం హసః కృతస్యకుర్యాన్మన ఉక్తిపాణిభిః , (ధ్రువంసలై (ప్రేత్య నరకానుపైతి యేకీర్తితామే భవత స్తిగ్షయాతనాన్‌ 7 “ఓ రాజేందద్రా! ఏ నరుండు మనోవాక్కాయములచేం జేసిన పాపములకిచట6 బ్రాయశ్చిత్తము చేసికొనండో యానరుండు చచ్చి కూరయాతనలుగల నరకములను బొందునని నీకుం జెప్పితి” ఈ తాత్పర్యము పద్యమునలేదు. వృత్తరచనంగూడం జదివిచూచెదరా? - చం॥! [ప్రకటమనుష్యదేహములం బర్విన రోగచయంబులన్‌ జికి త్సకుండు విమర్శచేసి యవి జాజెడునట్లుగ నాషధక్రియన్‌ సుకరముతోడ నిచ్చుకియం జొప్పగు మృత్యువురాకమున్నె పా తకములనొంపంగావలయు. దద్దయు శ్రీహరినామకీర్తనన్‌ ర

1968 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దీనికి మూలశ్లోకము: . తస్మాత్పు రై వాశ్విహపాపనిష్కృతౌ _ . యతేతమృత్యో రవిపద్యతాత్మనా దోషస్యదృష్ట్వా గురులాఘవం యథా " భిషక్చికిత్సే తరుజాన్నిదానవిత్‌ ప్రి పద్యరచన యట్లున్నను మూలభావము మాత్రము కొంచెము దాపునకు వచ్చినది. కాని “అవిపద్యతాత్మనా అవిపద్యతా = అహీాయ మానేన, అమియమాణేత్యర్థ ఆత్మనా = దేహేన. యద్వా, అవిపత్‌ = విపత్తిరహితో. యావత్‌, యతాత్మనా = సంయతేనమనసా. ఈ రెండు భావములు పద్యమున రాలేదు. సింగన వచ్చునట్లు వాసెను. 44ప. చూడు. తెనిగింపున కింకొక్కటి చూపి మానదను. “ అనిన రాజట్లనియె. 7 కం॥ కలుష్పపాయశ్చిత్తం - బులు సేసెడి నరుల పాపములు నశియింపన్‌ గలభస్నానము [క్రియగను - దలంచెద మనమునను సర్వతత్త్వార్థనిధీ 8 మూలము. - దృష్టశుతాభ్యాం యత్పాపం జానన్నప్యాత్మనోహితం "కరోతి భూయోవివశః ప్రాయశ్చిత్తమథోకథమ్‌ " ౦ క్వచిన్నివర్తతేభద్రాత్‌ క్వృచిదాచరతే పునః (ప్రాయశ్చిత్తమథోసార్థం మన్యే కుంజరశౌచవత్‌ 10 “వినుకలింగను కలింబాపముల నెజింగి యవిచేయంగూడవ్స్‌వని పరితప్పుం డై శ! (పప్రాయశ్చిత్తానంతరము మరల వివశుండై పాపములంబజేయు నరునికి: బ్రాయశ్చిత్త మున్నదా? ఎప్పుడైన నొకప్పుడు పాపములు చేయకున్నను మరొకప్పుడు చేయువానికి6 (బాయశ్చిత్తము వలన లాభము లేదు. గజస్నానమువల వ్యర్థము.”

దొరకిన షష్టస్కంధము పోతనకృతమూ ? మిన్నికంటి శురునాథ శర్గు 1969 ఈ భావములన్నియు6 బై చిన్నిపద్యము వలన స్పష్టపడుట లేదు. ఇట్లున్నది తెనింగింపు. దీనిని బోతనకృతమనుట భావ్యము కాదు. ఇంకను గవితాధార కుదాహరణములు కావలయునా? తరువాతి పద్యము, చం॥! అనయము మానవుండు రుచిరాన్నము పథ్యముతోడుతన్‌ భుజిం చినయుడ నొండురోగములు చెందనిమాడ్కి హరి ప్రియంబుగా మునుకొని నిత్యకర్మములు ముందుగ నాచరణంబు వేడ్కంజే సినపుడ పాపసంఘములు చేరవు పుణ్యములబ్బునెయ్యెడన్‌ 10 మూలక్షోకము. నాశ్నతః పథ్యమేవాన్నం వ్యాధయోభి భవంతి హి ఏవం నియమకృద్రాజ్యం శనైః క్షేమాయకల్పతే. ఇది మూలమున 12వ శ్లోకము. 11వ న్లోకము నాం(ధ్రీకరింపలేదు. ఈ శ్లోోమునకా పద్యమెంత శాస్త్రీయముగా రచింపంబడినదో చూడుండు. సింగన కందము , హితవుగల కుడుపుమజిని - గ్వితతులం6 బొడమంగనీతు విధమున నతిస ద్వంతుండైనవాండు నిర్మలమతిచే నఘరాశినెల్ల మట్టము సేయున్‌ తం ఇంక నేనీపొత్తము వినోదముగా నందందు6 జూడ గణ యతి(ప్రాస సంధిదోషాదులు గోచరించినవి. గీ॥ ఆచరింతురె మీబోంట్లు ఆర్యచరిత శత గీ॥ _ పెక్కుమాటలు నింకనేల ప్రియముతోడ 45 ॥ ఇత్యాది సంధిదోషాలు . గీ॥ పడుచు తిరిగెడి (గామ్యపశువుగాండె 64 . గీ॥1! ప్రాతఃకాలమున హరినామపఠనసేయ 66

1970 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆ|॥వె! ఆ యజామీడుండు హర్షంబురెట్టింప దాసియందు వరుసం దనయవరుల బదురం గాంచియందు6 దుదసంభవించిన కొడుకుమీది కూర్మి మిగులమెజయ తం కం॥! ....-=సం |! భవమెల్ల వింటినింకనను భవస్వర్గము వినంగవలయు భవగుణరహితా 108 గీ॥ అందుమూలమున సృష్టివిఖ్యాతింబొదలు 126 ఇట్లు గణదోషములు పెక్కులు. యతిప్రాస దోషాలకు - ఆ|| చిత్త మధికతీక్‌ష్ణతన్‌ ఖడ్గధారాభ తక్‌ చం॥ పరిమిత ఘోష భీషణ మహార్దవమందు6 (బ్రమాదమగ్ను. డై 223 ఉ|| దానవవీరులేచిన.........అని యుత్పలవలటతో మెొదలిడి “దినమణిభాసమానపటుదివ్యరథంబులనెక్కి యొక్కెడన్‌” అని చంపకముతో ముగించెను. | 263 _ ఉ|| పుంస్రవనప్రభావమును బుణ్యమహావ్రత మాచరింపనే _ మాస్త్రము ముఖ్యమై తనరు. (ప్రాసదోషము) తడ త్రే॥ హృదయ ! విష్ణ్టురూప మొనరంగం దల6పుము జిహ్వ ! హరిగుణంబు6 జెలగిపలుకు దేహ! యొక్కు మాదిదేవుని పదపద్మ మమలబుద్ధితోడ హర్షమలర 304 చం! ... దు | స్తరసృజనావహంబు లనంజాలిన మాయాగుణంబులందు సం |! చరణమొనర్ప 104

దొరకిన షష్టస్కంధము పోతనకృతమా ? మిన్నికంటి గురునాథ శర్మ 1971 సీ భాసురవిష్టునాభసరోరుహమునందు 79 కం!॥ బహుజన్మాంతరపుణ్యంగ్రహితుండె మనుజుండంత (బాహ్మణుండై

249 ఇట్లు వివిధ దోషములు గలవు. ఇంక నొక పిచ్చి లయ[గాహ్‌ని జూపి మజొకవిషయమున కేగెద.

విప్పుగ నజాండమును జెప్ప నది చిత్రముగం గప్పుకొన భయమునను నొప్పులువిడంగా ॥

దప్పిగొని రక్కసులు చప్పుడెడవించి వడిదప్పుదెరువుంలజనగ నుష్పరములోనన్‌

అప్పులను రుల్లనుచు నిప్పులొగిరాల. గనునొప్పివడ దనుజపతిదప్పి6 గొనగోళ్ళన్‌

ముప్పిరగు రోషమున నప్పుడటుచీరి మీయొప్పుగన సురల కివి చొప్పులె నృసింహా. 232

అప్పకవి “ఇంబడర6గా భజసనంబుల తుదనృజసనంబుల పదంపడి

భయంబులు లయగా! హింబరగు" నన్న లక్షణమునకీ లయగ్రాహిలోం బడదు.

282, 293 సంఖ్యల లయ[గగాహులలో. బడును. మీయను నక్షరమునైన మార్చిన

నిదియొకరకపు పద్యమగును. ఒక కవి రెండు తావుల రెండు రీతుల నొకవృత్తమును

రచించునా ? ఇట్టి కవిత్వమును బోతనగారి కంటంగట్టుటయా? మజొక చిత్రము. కం॥ మాతేజములాయుధములు - చాతురివృత్రాసురుండు సమయించెనువా! డేతజంగున నిహతుండగు........... 234

ఫీ॥ _......కృష్ణసృష్ట్యాధిపకీర్తి విభాజితభవపాంధనిలయ భూభారహరణ సత్పురుషార్పితస్వాగతనిరవంద్య నిరుపమావ్యయరూప నిర్మలాంగ నాచరించెద మతిభక్తి నఖిలజనక 235

1972 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము సురలు హరిని బ్రార్థించుచుం బైభయమనిరి. ఈ ైభయమున 234వ పద్యములోం జప్పంబడిన భయము. ఇటల్లెవ్వ రైన రచించిరా? అం(ఘివైభవమున నంఘ్రైభజనమని చెప్పుదురా యేమి?

శా! .... భావజ్ఞాయ కృపాకరాయ హరయే భక్తార్తి సంధదాయినే

గోవిందాయ సమస్త దైత్యనివహక్రూరాయతుభ్యం నమః 227 గుర్తించిన పదముల గమనింపం గోరెదను. “భక్తా ర్తిసంహారిణే” - “దైత్యనివహ ధ్వంసాయ” అని పోతన రచించలేకపోవునా?

వ॥ వృత్రాసురుండు.... .... నవ్వుచుం దనలో నిట్లనియె. 308

క౦0!1.... ....నిర్ణతదానవభావంబుతోడం దనరితి వనఘా 3౮09

కం! రాజసమున నసురులకును - రాజవురక్షకుండవగుచు6 బ్రబలిననీకుం

దేజంబున హరిపాదాం - భోజంబుల భక్తి యెట్లు పొడమె మహాత్మా 310

వ॥।! అని పలికిన విని పురందరుండు మహదాశృర్యంబు నొందుచు 311 ఇచట వృతుండు తనలో ననుకొనెనని కలదు. కాని యీ పద్యములు నిందదునికుండవలసినవి. అట్లెన 311 వచనమున “అని పలికిన విని పురందరుం”డనుట సరిపడదు. ఇచ్చట (గంథపాతము జరిగియుండునందురా?

కం|॥ నారాయణుం డను తనయుని - గారవమునం జీరిచీరి క్రంఠగతుండై

యారూడఢ్లితనువు విడిచెను - మీఠి యజామీళుండపుడు మేదినిమీందన్‌

వ్‌తె

కంఠగతప్రాణుండై యనుటకుంగాబోలు కంఠగతుండై యనెను. పద్యమెంత సాగసుగా నడ్తిచినదో చూడుండు. సింగన పద్యములు.

ఈ నూతన షష్టస్కంధమున 153 మొదలు 183 వజకు, 253 మొదలు 262 వజకు మరల 276 మొదలు 294 వజకు నున్న పద్యములు సింగన షష్టస్కంధమున. గలవు. పోతన పద్యముల సింగన [గగ్రహించెనా? సింగన పద్యముల నీ యజ్ఞాతకవి గ్రహించెనా? పద్యములలో నందందు ఠెంటికి భదములు కొన్ని కన్పట్టుచున్నవి. దొరకిన [కొత్తప్రతిలో

దొరకిన షష్టస్కంధము పోతసకృతమా ?. మిన్నికంటి గురునాథ శర్దు 1973 వ॥ అని దక్షప్రజాపతి శపియించిన నారదుండు తచ్చాపం బంగీకరించి చనియ. నయ్యవసరంబున 152 వ! జలజాసనప్రార్థితుండై యా ప్రజాపతియు నిజపత్నియగు నశక్ని యందు రూపవతులైన కూతుల న్నరువదింటం గనియె. నిట్లా కూతులను ధర్మునకు 153 నడుమ పద్యములేకుండ 152 వచనము నానుకొని వేజుగా 153 వచనముంటకు నిమిత్తమేమి? పోతన రెండు వచనములంగలిపి వ్రాయమికి6 గతంబేమి? సింగన వచనము నంత్యభాగము నందుకొని యీ 153వ వచనము వ్రాయంబడియున్నది. సింగన 252వ వచన మిట్లున్నది “....పితామహుండు చనుదెంచి మజియు6 (బ్రజా సర్జోపాయంబుపదేశించిన నా ప్రజాపతి ప్రియభామమైన యసిక్ని యందు6 బితృవత్సలలైన ప్వుతికల నజువదుం(డ్రంబుట్టించి వారిలో ధర్మునకు...” మజియు సింగన వచనమున *....దార్‌క్ష్యుండను నామాంతరంబుం దాల్చిన కశ్యపునకు మరలం గడమనలువురను...” అని యుండ నీ క్రొత్తపాత్తమున “దార్‌క్షునకు నలువురను" అని మాత్రమే కలదు. సింగన “వారలెవ్వరనిన భానువులంబయుంగకుప్పు...” అని వ్రాయ నీ క్రొత్త పుస్తకమున “భానువులంబయు కుముదయు" అని కలదు. “భాను ర్లాంబాకకుజ్ఞామిని అని సంస్కృత వాలము. నేను వావిళ్ల ప్రతి ననుసరించుచున్నాండ. అందు సింగన. న్నదనం [గోధవళాఖ్యయున్‌ సురసాఖ్యయున్‌ సురఖిన్మునిన్‌ మొదలుగా6 దిమియున్నిళాఖ్య సుముఖ్య యాసరమాదిగా 256 అనియుండ దొరికిన షష్టస్కంధమున, “............దూమయున్‌ విదిత [కోధవశాఖ్య సారసవేడ్కతో సురభిన్మునిన్‌ మొదలుగా దివియున్‌ యిల ప్రాయముఖ్య మాసరమాదిగా శే57

1974 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అని కలదు. ఇందలి యచ్చుతప్పులం (దోసివైచి కడమ భేదము నరయం గోరెద. వావిళ్ల ప్రతిలో “చాలంగందిమికిని జలచరంబులు ఫుట్టె మజి శ్వాపదులు సరమకును (బజలు” అనియుండంగా (ఘింగనది) దొరికిన (ప్రతిలో “ఛాలగదవికిని జలచరంబులు పుట్టె, మరికిరాతులు సరవకునుగునులుూ 158, అని కలదు. అచ్చుతప్పులను దీసివేసి కడమవానిం దిలకింపుండు. కం॥ అప్పుడు యిందుని కన్నుల. - గప్పిన 164, [కొత్త ప్రతి అప్పుడు సురపతి గన్నుల - గప్పిన 264, వావిళ్ల ప్రతిలో సింగన. ఈ మార్పు నెవరుచేసిరి? ఇట్టివెన్నేని 6 గలవు. పద్యము మార్పున కొకటి. భాగవతము వావిళ్లప్రతిలో 267వ పద్యము: పారమేస్ట్యమయిన పదవినొందిన భూపు లెట్టివారికైన లేవవలదు విబుధులిట్లు సెప్పు విధమన్న వారలు ధర్మవేత్తలనుచు6 దలంపంబడరు (అని సింగన) దీనికి పొత్తమున 167వ పద్యము. పారమేస్థ్యకరుణ పదవినొందినవారు లెస్స వారికెదురు లేతురనుచు విబుధవరులవలన వినంబడెనేనియు నదియి పరమధర్మమండు మొదల. ఇదిగో యిచటనొక యతుకులబొంతం (బదర్శించెద దాని రహస్య మేమో విచారింపుండు. సురలు బహ్మను (బార్థించి “.......ఆ నిశాటుల నేరీతి నణపవచ్చు నిట్టిచందంబు మా కానతీయవలయు ననుచు విబుధులు (పార్థింప నజ్జ్ఞజాతుం డమరపతితోడ ననియె నిట్లాదరమున. 181 కం! ఆఖండలుండు మొదలుగ - లేఖభానీకముల (బ్రహ్మ లేనగవున ని త్యాఖండసత్కృపారస - శేఖరవాక్యముల వారి సేదలుతీర్చెన్‌ 182

దొరకిన షష్టస్కంధము పోతనకృతమా ?_ మిన్నికంటి గురునాథ శర్ళు 1975 .వ॥ ఇట్లు బ్రహ్మదేవుండు దేవే్యద్రప్రముఖులైన దేవతల కనుకంపాతిశయంబున నభయంబొసంగి యిట్లనియె. 183 చం॥ వినుము సురేంద్ర! రాజ్యమదవిహ్వలితాక్తుండవై సభాస్థలం బునకు గురుండు వచ్చినను బూజయుినర్పక 1ేర4 ఈ పద్యములు దొరకిన ప్రతిలోనివి. అమరపతితోడ ననియెనిట్టాదరమున. వినుము సురేంద్ర! అని 181వ పద్యము పిదప 184వ పద్యమున్నచో నన్వయము కుదిరి సమంజసముగా నుండెడిది. అట్లుగాక నడుమ 182 - 183 పద్యవచనములు వచ్చి కథాధోరణిని జడంగొట్టినవి. ఈ రెండును సింగనవి. చూడుండు. ఉ॥ ధాతకు దేవతావిభవదాతకు6 బుణ్యజనానురాగ సం ధాతకు సర్వలోకహితదాతకు వైదికధర్మమార్గ ని సింగన. షష్ట. 278 కం! అఖండలుండు మొదలుగ......... అనునీ పె 182వ పద్యము పెదపనీ మె 183వ వచనము (వాస్‌ యావల “ఉ|| నెట్టిన పాపకర్మమున నేరమింజేసితిరి....” అని సింగన రచించెను. ఆ పద్యవచనములు (182 - 183) సింగన రచనకు సరిపడినవి. మనకు లభించిన యీ క్రొత్తపుస్తకమున ఉ|| ధాతకు దైవతావిభవధాతకు6 బుణ్యజనానురాగ సం ' ధాతకు న్న్వమలోకహితదాతకు వైదికకర్మమార్ల ని అని యించుకమార్చుతో పె సింగన పద్యమే దొరికిన ప్రతిలో 1768వ పద్య సంఖ్యతో నున్నది. ఆవల 179, 180, 181 పద్యములు కొత్తవి కలవు. పెదప మరల 182, 183 పద్యవచనములు సింగనవే కలవు. ఇట్లీ లభించిన క్రొత్తపుస్తకమున పోతన రచనయే మైనచో నుంటకు. గతమేమి? మీర యూచించుకొనవలయును.

1976 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము పుంసవన (వత విధానముగల 19వ యధ్యాయము నేటికో సింగన యాంధ్రీకరింపలేదు. లభించిన పొత్తమునం దెనిగింపు కలదు.

మ॥ కనియెన్‌ విప్రకుమారుం. డచ్చటను...... ఆననన్‌..... ఈక్షణన్‌..... ఇట్లంత్యపప్రాసరహితముగా దొరికిన ప్రతిలో నీ పద్యమున్నది. సమాపక [క్రియతోం బద్యము నెత్తుకొని యంత్యపపాసము లేకుండ6 బోతన పద్యము చెప్పునని తలంచు వెజ్టులున్నారా? ఈ దొరికిన పొత్తమునంగల యజామీఢోపాఖ్యానముం జదివిన పిమ్మటం గూడ నిది పోతన రచనయే యనువారున్న వారికి. బదివేల నమస్కారములు.

ఈ స్కంధాంతమునం గల ఫలశ్రుతిన వాసి ముగించెద. కం! ఈ కథ వినినం బఠించిన - లోకంబుల జనులు సర్వలోకోత్తరులై ఆపేకాలంబును స్తురతసు - ఖాకరుల మనుదురాయురారోగ్యములన్‌.464

ఇదియా ఫలము. ఇట్లా పోతన రచించునది. ఒక్కమాట యీ (గంథమునిండ నచ్చుతప్పులు గలవు. మన ముదాక్షరశాల లెప్పుడు బాగుపడునో - ఆంధ్రగ్రంథముల కెన్నడు మంచిరోజులు వచ్చునో - నేనందందు. జూచి యిట్లు వాసితి. ఇప్పుడు లభించిన యీ భాగవత షష్టస్కంధము పోతరాజుగారి రచనగాదని నాయభ్శ్మిపాయము. (కిన్నెర: సంపుటము 5, సంచిక 10, అక్టోబరు 1953)

త (4

తో శ్‌

కవిత 3౦నా సాధనం

సి, నారాయణ రెడ్డి 'క్రొ౦చమిథున వియోగ సందర్శనంవల్ల ఆదికవి వాల్మీకి హృదయసాగరం నుండి పొరలివచ్చిన శోకమే శ్లోకంగా రూపొందింది. ప్రాపంచిక సాౌఖ్యాలకు పరాజ్ముఖుడై వైరాగ్యపథంలో పరిభమించిననాడే ప్రజాకవి వేమన వేనవేల పద్యాలు పాడుకోగలిగినాడు. నిరంతర జాజ్వల్యమాన పరంజ్యోతిస్సులను తన పావన మనోపీఠికపై ప్రతిష్టించినపుడే త్యాగయ్య గళమూ, కలమూ కమనీయ గీతికా ప్రవంతికలను ప్రవహింపజేశాయి. కానరాని తీయని వేదన గుండెను కలచివేసినపుడే నేటి కవి కావ్యాలను సృష్టించగల్లుతున్నాడు. హృదయవీణా తంథత్రికలలో కల్గిన ఈ మధుర స్పందనమే కవితావతరణానికి కారణభూతమైంది. ఇట్టి కవిత్వం ఎట్లా ఉద్భవిస్తుంది అనే ప్రశ్న చిరకాలం నుండి తలెత్తుతూ వచ్చింది. ప్రతిభా వ్యుత్పత్యభ్యాసాలు - ఈ మూడుంటేనే కవి అనిపించుకుంటాడని కొందరు విమర్శకులు సిద్ధాంతీకరించినారు. ఈరకంగా సిద్ధాంతీకరిం చేకన్న నిజమైన కవికి ఈ మూడే ఊడిగం చేస్తాయనడం మంచిదేమో? “చిరుమల్ల చెట్టుకింద రామూలమ్మ - చిన్నవోయి కూర్చున్నవు రామూలమ్మ” అని ఏనాడో వచ్చని వచ్చికబయళ్లమై కూర్చొని పాడుకున్న జానపదునికి ఏమాత్రం వ్యుత్పత్తి ఉంది? “ఏడువకు ఏడువకు యెజ్జినాయన్న - ఏడిస్తే నీకళ్ల నీలాలు గారూ,” అని పసిపాపని మిసిమిపాటలతో జోకొడుతున్న కన్నతల్లి ఎన్నడైనా ఛందోపాఠం నేర్చుకుందా? వర్థిది. అంతమాత్రాన ఈపంక్తుల్లో కవితావాసన లోపించిందా?

పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

1978 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లేదు. పైగా మన అనుభూతులను ఇవి అద్దంలో లాగా ప్రతిబింబిస్తున్నాయి. మన మనస్సులను మంచులా కరిగిస్తున్నాయి. అందుకే కవిత్వాన్ని కొలిచే ఏకైకసాధనం సహృదయుని హృదయం. ఇంతకుమించిన సాధనం మరోటిలేదు. కవిత్వనిర్వచనం కష్టసాధ్యమైన విషయమని విమర్శకులందరూ అంగీకరించారు. ఇట్లా అంటూనే ఓప్రక్క నిర్వచించారు. ఈట్పు కవి, డి. వెల్లీ అనే కవయిత్రికి రాసిన ఉత్తరాల్లో కవిత్వ నిర్వచనం గురించి తన అభిప్రాయాలు క్రింది విధంగా వెల్లడించాడు. నం “| *౦గ 2౧౮6 1౧1౧4 80గ౪౦౧ €౪ 1౧91౧౦1 14౧ 0౫ ౧8490౧, 41 | 2౧౫ ౮౧4౦16 10 6611౧9 ౧౦6(౧/ 001 10౧% 10 [9000౧126 ఓ ౪0౪6 5404 ౪౦౮ &/9 16 594౧6. న6గ)409 ౧౧౦౩1 0641769 ౧6౦౧16 42/8 90.” కల్పనాశక్తిగలవాళ్లు కవిత్వాన్ని నిర్వచించలేరని ఈట్సు అభిమతం. కవి కల్పనాజగత్తులో కాలూనినప్పుడు తన కవిత్వానికి కావలసిన లక్షణాల సరంజామా ఉందా లేదా అని కంగారుపడి వెనక్కి తిరిగి చూడడు. నగ్నంగా నర్తిస్తున్న అతని భావనలకు భయపడి శబ్దచేలాలు గుంపులు గుంపులుగా పరిగిత్తుకొని వచ్చి అతన్ని ఆశ్రయించుకుంటాయి. వాటిలోనుండి కావలసినవి ఏరుకుని కొన్నిటిని కత్తిరింపులు చేసి తన భావనాంగాలకు తొడిగిస్తాడు. అలంకరిస్తాడు. ఆనందిస్తాడు. నాపనికూడా అంతే. కవిత్వాన్ని నిర్వచించాలని (ప్రయత్నిస్తే కంపలో కాలువేస్తానేమో అనే భయం నాకుంది - ఇకపోతే కవిత్వం అసలు రాయడమెందుకు? కొందరు ఆనందంకోసం మరికొందరు ప్రయోజనంకోసం వ్రాస్తారు. నేను ఈ 'రెండిటికోసం వ్రాస్తాను. నేను వ్రాస్తున్న వద్యాలూ, గీతాలూ ఆనందానికీ ప్రయోజనానికీ ఆనకట్ట లేర్పరచాలని నా ఆకాంక్ష - ఈ విషయం నేను కొత్తగా కనిపెట్టిందికాదు - ఇంతవరకే పలువురీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినారు. “రాబర్ట్‌ లిండ్‌” అనే విఖ్యాత రచయిత “౧౦61౫ ౧25 60౮016 01గ. ౧89 & ౮1112౧4౧ 1206౯౭౧౮ 26910610 గాం౪6౧” అని అన్నాడు. కవిత్వానికి ప్రయోజనమనే తండి, సౌందర్యం అనే తల్లి ఉంటాయని లిండ్‌గారి అఫ్సిప్రాయం. సౌందర్య సందర్శనంవల్ల ఆనందం (ప్రతిపాదితమౌతుంది. కాబట్టి ఇతని దృష్టిలోకూడా (ప్రయోజనమూ, ఆనందమూ ఇవి రెండు కవిత్వానికి (్రధానాంగాలు. అయితే ఇవి రెండూ ఏకకాలంలో సాధ్యమవుతాయా అనే సందేహం కల్గుతుంది. ఒకానొక గీతం విన్నప్పుడు వునకు ఆనందం మాత్రమే కలుగుతుందనుకొండి. క్షణకాలంపాటు మనమీ జగత్పంబంధమైన బాధలను

కవిత్వం నా సాధనం సి, నారాయణ రెడ్డ 1979 వేదనలనూ మరచిపోతాము. గీతం ముగిసిన తరువాత మన హృదయాలు యథాస్థాయిని చేరుకుంటాయి. ఇంతవరకు మన మాస్వాదించింది ఆనందమే. కాని సజీవమైన గీతం ప్రభావం ఇంతవరకే ఆగిపోదు. అది మన మనస్సులలో తిన్నగా సంచలనం కలిగిస్తుంటుంది. మనలోమనం ఆ గీతాన్ని మననం చేసుకుంటున్నకొద్ది మనలో ఏ కోశాన్నో పేరుకొనివున్న స్తబ్ధత కరగిపోతుంది. భావనలు పదునెక్కి పవనతరంగాల్లాగా కదులుతుంటాయి. మనమప్పుడు కర్తవ్యోన్ముఖులమౌతాం. ఆ గీతంలో ధ్యనించిన సత్యాలవేపు మనం నడక సాగిన్తాం. తుదకి గమ్యస్థానాన్ని చేరుకుంటాం. కవిత్వం వల్ల కల్గ (ప్రయోజనమిదే. కొన్ని గేయాలవల్ల మనకు ఆనందం ప్రయోజనం రెండూ ఉత్పన్నమవుతే మరికొన్ని కేవలం ప్రయోజనాన్ని ప్రతిపాదిస్తాయి. “మాకొద్దీ ఆల్లదొరతనం” లాంటి దేశభక్తి గీతాలు కేవలం ప్రయోజనాత్మకమైనవని చెప్పాలి. “దేశమును (ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నాొ, *ఏ దేశ మేగినా ఎందు కాలిడినా”, “నా తెలంగాణ కోటిరత్నాలవీణ” లాంటి గేయాలు కళాత్మకంగా ఉన్నాయి. ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. అందుకే ఆనంద ప్రయోజనాలు ఆండూ ఉండాలని నా ఆశయం. “నవ్వని పువ్వు”ను గానం చేస్తుంటే చాలామంది (తరుణ దశలో వున్నవారు సుమండి!) “హాయ్‌ హాయ్‌” అని తలూపుతుంటారు. వీళ్లు కివలం ఆనందాన్ని మాత్రం అందుకుంటారు. మిగిలిన కొందరు సాహిత్యకులు మాత్రం గంభీరంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఆనందానికి అందని మరో విషయాన్ని వీరు ఆశిస్తుంటారు. దాన్నే ప్రయోజనాత్మకదృష్టి అంటాను. ఈ నాటికలో వ్యంగ్యంగా ధ్వనిస్తున్న నైతిక విలువను వీళ్లు తదేకదీక్షతో గమనిస్తుంటారు. “నవ్వి నా పరువమ్ము నలిపివేయుటకన్న నవ్వకయె లోనున్న (కొవ్వలపులే మిన్న” అని మొగ్గ ముగించేసరికి వీళ్లు సంతృప్తితో అరనవ్వును (ప్రదర్శిస్తారు. వాళ్లు కోరుతున్న నైతిక స్థాయిని అందుకొన్నానని నన్ను అభినందిస్తారు. కవిత్వాన్ని పవిత్ర జీవితాశయంగా పెట్టుకుని కావ్యరచనలు సాగిస్తున్న కవిజగత్తులో నేనూ ఒక అణువుని. భావనాపక్షాలతో అంతుతెలియని లోకాల్లోకి ఎగిసిపోతున్నప్పుడు అప్పుడప్పుడు ఫెకి తేలే మానవసహజమైన సంకుచిత మనస్తత్వం అంతరాంతరాలకు కృంగిపోతుంది. అమాయక్వం, అమలినత్వం పురివిప్పి నృత్యం చేస్తుంటాయి. నిజంగా కవితావాసన గుబాలించిన హృదయంలో, .: ద్వేషాలూ, అసూయలూ పటాపంచలై పోతాయి. పావన జీవన సంధ్యారంగాలలో నటిస్తున్న వెలుగునీడల మధ్య కుసుమపరాగంలా (పసరిస్తుంటాడు కవి. అతనివేపవు

1980 సందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వేలు చూపించే దుష్టశక్తులు అస్తమయంలో తలదాచుకుంటాయి.. కవిలో సంపూర్ణ మానవత్వం ఆవరిస్తుంది. అందుకే పాశ్చాత్య విమర్శకులొకరు “౯౦615 & ౧6గ౭౦ ౧౭౧” అని అన్నారు. రవీంద్రుడు, పోతన, బెర్నార్డ్‌ షా మొదలగు మహాపురుషులు కవితాసోపానాల అధిరోహించడంవల్లనే వేదాంతులు కాగల్లినారు.

కవి గగనవిహారి మాత్రమే కాడు. సంఘజీవికూడా. సమాజంలోని వివిధ రంగాలలో జరుగుతున్న పరిణామాలకు అంటకుండా “తామరాకువై నీటి బిందువు” లా వుండలేడు. దాశరథిగారన్నట్లు కవి హృదయం బిగించిన వీణ తీగ. ఏమాత్రం వాయుచలనంతోనైనా దానిలో స్పందనం కలుగుతుంది. కవి విశ్వవేదనలను తనలో పలికిస్తాడు. తన “వేదనావేదాన్ని” విశ్వానికి విప్పి చెప్పుతాడు. “నేను పతం విశ్వసృష్టికి అశ్రు వొక్కటి ధార వోశాను, “నేనుసైతం (ప్రపంచాబ్దపు అల్లరేకై పల్లవిస్తాను” అని విశ్వనిర్శాణంలో తన పాత్రను ఎలుగెత్తి చాటుతాడు. ఈ అనంతవిశ్వంలో తనకూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వ ముందని వ్య క్తం చేస్తాడు కవి.

భిన్నభిన్నార్ధ్థస్సురణం నాకు నచ్చిన కవితారీతి. అందుకే “జీవన సంధ్యా గీతం, భిన్న స్వర సంకేతం” అని పాడుకున్నాను. కష్టసుఖాలు రెండు పరస్పరం ఒరసికొని ప్రవహించే జీవిత (సోతస్వినిని చ్మితించడం నాకెంతో ఇష్టం. “పగలు విరిసిన చీకటిబాటలోన; మంచువలుపలులేక చరించినాను, రాత్రి కురిసిన కాంతి వర్షమ్ములోన; తడిసి చీకటి యుడుపులే తొడిగినాసు” అనే పద్యంలో ఈ అభ్మిపాయమే అభివ్య క్తం చేశాను. కాటుకను మింగిన కారుమబ్బుల్లో పాఠరాడుతున్న వెలుగునురుగులు, పాలవన్నె శంపాపథాలవెంట నడయాడుతున్న నీలినీడలు నాకు అత్యాకర్ణణీయమైన కవితావస్తువులు. ఈ వెలుగు, నీడ అనే రెండు వస్తువులను ఇష్టమొచ్చిన వృత్తిలో, రీతిలో మలచుకోవచ్చు. ఇవి జననమరణాలకు, కష్టసుఖాలకు, ఉదయాస్తమయాలకు, ఆనందవిషాదాలకు, వేటికైనా సంశేతాలు కావచ్చు. పరస్పర వైరుధ్యంకల్లిన ప్రతి విషయాన్ని ఈ వెలుగునీడలతో పోల్చి గమ్మత్తు చేయవచ్చు. ఇట్లాంటి విచిత్ర సంకేతాలవల్ల కావ్య వైచిత్రికి చక్కని స్వరూప మేర్పడుతుంది. (శ్రేయసిని సంబోధిస్తూ మహాకవి స్వింబర్ను ౧౧౪ ౧౧౦౮1 15 ౧266 ౦1/8 2౧6 41౧6" అని విచిత్రంగా పర్షిస్తాడు. మరోచోట [1090 ౧79 (నిప్పు పెదవులు) లాంటి ప్రయోగాలు చేస్తాడు. నేటి తెలుగు కవులలో ఆర్వుద ఇట్లాంటి చమత్కారాలు అనేకం చేస్తుంటాడు. *“బేన్‌లో (టెన్‌గన్‌% “మెస్మరించింది యవ్వనం”, *“సంగీతంలాంటి సన్నని నడుము"లాంటి ప్రయోగాలు ఇందుకు నిదర్శనాలు.

కవిత్వం నా సాధనం సి. నారాయణ ండ్రి _ 1981 కవిత్వ మనేది ఒక శక్తివంతమైన సాధనం. ఈ సాధనం ద్వారా వైయక్తికంగా కాకుండా సాంఫకంగా బృహత్పరివర్తనను కలించవచ్చు. కవిత్వాన్ని ప్రజామండలిలో గానంచేసి నీరవహృదయాల్లో ర్సుంర్వులు రేపే అవకాశముంది కాబట్టి ఇతర రచనా సంవిధానాలకన్న కవిత్వం చాలా (పభావపూరితమైంది. కథలను ఎంతసేపూ ఒకేవ్యక్తి చదువుకొని తనలోతాను ఆనందాన్ని పొందుతాడు. కథ చదివిన తర్వాత అతనిలో భావపరివర్తన కలగాలంటే అతని బుద్ధిసూక్ష్మత, మేధాస్తోమత ఇవే రెండు ఉద్దీపకాలు. కవితాగానం వింటున్న సహృదయునిమై వ్యక్తిగతంగా కాకుండా సాంఘిక (భావంకూడా పడుతుంది. కవిసమ్మేళనంలో తన చుట్టూ కూర్చున్నవాళ్ల ముఖవికాస, భ్రూవిక్షేప, శిరశ్చాలనాది సాత్వికభావాలను అవలోకించినప్పుడు అతనిలో ఒకరకమైన ఉత్తేజం ఉరకలు వెట్టుతుంది. [క్రమేణా ఆ వుత్తేజం క్షణికావస్థను దాటి శాశ్వతపీఠం చేసుకొని కూర్చుంటుంది. కాబట్టి కవిత్వంవల్ల మానవుని హృదయంలో వైయక్తికంగా, సామాజికంగా చెరిగిపోని ముద పడుతుంది. సాహిత్యాన్ని ఉద్యమంరూపంలో నడపడంలో కవిత్వానిదే అ(గతాంబూలం. భాషాసంస్కృతుల పున రుద్ధరణకు వముణిదీపాలు వెలిగించుకుంటున్న యీనాడు కవిత్వం అందుకున్న స్థాయి విస్మరించరంానిది. కవిత్వాన్ని ఇంతగా ఎత్తుకుంటున్నప్పుడు, తమకుతాము శాస్త జ్జుల మనుకునేవాళ్ల “పేషన్‌ గోయీ”లు (ఊహాగానాలు) జ్ఞాపకాని కొస్తున్నాయి. అసలు కవిత్వమనేది కొన్నాళ్లకు, కొన్నేళ్లకు, జగత్తులో నిల్వబోదనీ, అది త్వరలో నశిస్తుందనీ వీళ్లు అంటారు. మానసికశక్తులను వొప్పుకోని భౌతికవాదులు ఈ వాదానికి తాళం వేయవచ్చు. కాని కళోపాసకుడూ, హృదయమున్న వాడు ఎప్పుడూ ఈ వాదాన్ని అంగీకరించలెడు. కవిత్వం మరియు ఇతర కళలన్నీ హృదయ[గంథులలో బంధితాలు కాబట్టి హృదయం నిల్చినన్నాళ్లు ఇవీ నవనవోన్మేషంగా వుంటాయి. ఒకవేళ కళలన్నీ విలువలేకుండపోయినా కవిత్వంమా[తం క్షీణావస్థకు రాజాలదని కొందరు పాశ్చాత్యప్రవక్త లభ్మిపాయపడినారు. “౧౭౧1౧౦ 1062౫ ౧౭9 ర0౧6 10 1౧6 0216, 0౮1 ౧౦౭౧)/ 1౧౮౪౧ &| 06 600/5 0 006 00౧64/0గ|. 1౧ 5, 1! ౧1౧% ౦61౧ 5 గాం(8 (211/1 (0 16 26140౧ 01 1౧6 &గ8 అని రాబర్ట్‌ లిండ్‌గారన్నారు. “చితకళ [కవుంగా కాఫ్రీహోటల్లోదాకా ప్రస్థానం చేసినా కవిత్వం మాత్రం పవిత్రంగా వుంటుంది. ఇది కళాసంప్రదాయాలకు చాలా సన్నిహితంగా వుంద” ని లిండ్‌గారి అభిప్రాయం. ఇతని అభిప్రాయంతో నూటికి నూరుపాళ్లు ఏకీభవించకున్నా ఇతర కళల్లో కవిత్వానికున్న ప్రత్యేక పీఠాన్ని త్రోసిపుచ్చలేము. ఈ కవితాసాధనం పదునెక్కి

1982 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (పప్రయోజనాత్మకం కావాలంటే అభ్యాసం అత్యవసరం. అభ్యాసం లేకపోవడం వల్లనేమో నాకు ఆదర్శపప్రాయాలుగా ఉండి రచనాప్రవాహినులను జాలువార్చినవాళ్లు నేడు నామమాతావశిష్టులైనారు. ప్రతీరచన ఉత్తమ కళాఖండం కాకపోవచ్చును. నాబోటి కవులు వాస్తున్న గేయాలు కాలమనే మహాజలపాతానికి తట్టకోలేక కొట్టుకొనిపోవచ్చును. పక్కవుంతలు దొక్కవచ్చును. ఎదురొడ్డి రొమ్మువిరిచి నిల్వనూవచ్చును. కృష్ణ శాస్త్రిగా రనుకున్నారా తాను తరుణవయస్సు తరలివస్తున్నప్పుడు సరదాగా పాడుకున్న “ఆకులో ఆకునై' అనే గీతం తలమానికంగా నిలుస్తుందని? “గుండె గొంతుకలోన కొట్లాడుతాది” అని లోలో పాడుకున్న తొలిపాట “యెంకిపాటల”కు నాందివాచకం పాడుతుందని నండూరివారు మాతం ఊహించుకున్నారా? కాబట్టి రచనలు సృష్టించడం, విరివిగా సృష్టించడం, రచయిత కర్తవ్యం. వాటికి మార్కెట్టువుందా లేదా అని కొన్ని హంగులు సమకూర్చడానికి ప్రయత్నించడం మంచిదికాదేమో? ఈ అభిప్రాయాన్ని “ఈట్సు” మహాశయుడు ఉత్తమంగా వెలిబుచ్చినాడు. “48౪064 ౦౦౧ ౪111౧0 2౧6 101౧6౧9, ౪౦౪౯ 10629 ౪|| &౯/2౧౩6 [౧6౧౧561౪69 239 54౧6 51640 ౪౧౦౧ 380066 ౧౭౧౦౧గఆ౧1 ౦065.” కవితా సాధనకు కావలసిన ఉత్తమ లక్షణాలను దాశరథిగారు ముక్తసరిగా మూడు మాటల్లో “ఊహించగల మేధ స్పందించగల హృదయం, రాటుదేరిన కలం” అని చెప్పినారు. నిజంగా ఈ మూడు సమన్వయం పొందిననాడే కవితాసాధనానికి పక్వతరావస్థ కల్గుతుందని విశ్వసిస్తున్నాను.

(కిన్నెర; సంపుటము 5, సంచిక 10, అక్టోబరు శే95క)

౯ మ సీ

ల ఒల్లో వమన సాహిత్య సంగ్రామములు గొ(ంపాటి వెంకట సుబ్బయ్య

సౌహాత్యాన్ని ప్రజలకందుబాటులోనికి తేవాలని ప్రయత్నించినప్పుడల్లా సంప్రదాయకులు అడ్డుతగులుతూనే ఉన్నారు. సంప్రదాయులకూ, సంస్కారులకూ ఈ సందర్భములో అనేక సాహిత్యసంగ్రామములు జరిగినవి.

ప్రథమ సాహిత్య సంగ్రామము భారతాంధ్రీకరణ సమయమందు జరిగినది.

ఈనాడు విద్యయనగా ఆంగ్లమని భావించుచున్నట్లే ఆనాడు సంస్కృతమే విద్య. అది కేవలం (బాహ్మణాధీనం. క్ష(తియులకు కాస్తోకూస్తో అందులో ప్రవేశమున్నా ఇతరులకు ఎట్టి అర్హతాలేదు. వారందరు కేవలం నిరక్షరాస్యులు. భూసురులు దేవభాషయందు పరిపూర్ణవిద్వాంసులు. వారు మతము మొదలగు విద్యలు తక్కువ కులమువారికి ఆలియకుండా వుండవలయునన్న తలంపుతో గట్టి కట్టుబాటు చేసుకొనిరి. అందుచేతనే వారు దేశభాషలో (గ్రంథరచన చేయరైరి. వారికి దేవభాష భాషగాని దేశభాష కేవలం శూద్రభాష. అది ఎందుకూ పనికిరానిది.

అట్టిస్థితిలో నన్నయ పంచమవేదమును అనువదించునప్పుడు పూర్వాచార పరాయణు లూరకుందురా? అందుచేత అపభంశభాషలో భారతమువంటి పంచమవేదం అనువాదము చేయరాదని సంస్కృత భాషాభిమానులు, ఛాందసులు వ్యతిరేకించిరి. నన్నయ్యకు వారికి మోరరణం జరిగినది. ఈ సంగతి భారత అవతారికలో కలదు. ఈసందర్భములో నన్నయకు రాజరాజు, నారాయణ భట్టు తోడ్పడిరి"

  • ఉత్కళ భాషలో భాగవత మనువదించిన కవిని పూర్వాచార పరాయణులు వెలిపెట్టిరి. ఇది ఆ

నాటి వారి సిత) లా పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము

1984 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

సంస్కృతమునకే నేటికీ పూజ్యత కలదు. అయినను సంస్కృత కవితా సౌందర్యము సన్నగిల్లుచున్న సమయమున నన్నయ్య భారతాంధ్రీకరణ చేసి తలుగు భాషకు సభాగౌరవము, తెలుగువారికి పురాణపరిచయము కలిగించి పూజ్యత గాంచెను.

ద్వితీయ సంగ్రామము పాల్కురికి సోమనాథుని కాలమున జరిగినది.

సంస్కృతమునకును, దేశభాషలకును చిరకాలమునుండి సంగ్రామము జరుగుచునేయున్నది. పండితులు సాధారణముగా సంస్కృతభాషాభిమానులు. సంస్కృత విజ్ఞానప్రియులు. సామాన్య ప్రజలు సహజముగా దేశభాషాప్రియులు. పండితులు సంస్కృతాభిమానులై సహజమైన దేశభాషావికాసమునకు అవాంతరములు అధికంగా కలిగించుచుండిరి. అయినను సజీవమైన దేశభాషలు స్వయంవ్య క్రిత్వము కలిగి వర్ధిల్లుచునే ఉన్నవి.

సాహిత్యములో అభ్యుదయము మననాటిది మాత్రమే కాదు. పాతదారులను పరిహరింపవలసివచ్చినప్పుడల్లా ఈ అభ్యుదయ వాంఛ పొడచూపుచునే యున్నది. భవికవులకును, శివకవులకును సాహిత్య సం[గామము 12వ శతాబ్టిని జరిగెను.

శవకవులు తెచ్చిన అభ్యుదయమును గురించి తెలుసుకొనుటకు పూర్వం తత్పూర్వ స్థితి ఆలుసుకొనుట అవసరం. శివకవులకు పూర్వం వెలసిన కావ్యములకు వస్తువు సంస్కృతమునుండి తీసుకొనుచుండిరి. ఆనాడు స్వతందత్రరచనలంటూ లేవు. అన్నియు అనువాదములే. అందలి భాష సంస్కృత పదభూయిష్టము. ఛందస్సు తెలుగుభాషకు సరిపడని సమాసభూయిష్ట సంస్కృత వృత్తప్రధానము. దీనినే మార్గకవిత అందురు.

పండితైకవేద్యముగా నున్న సాహిత్యమును ప్రజలందరకు పంచిపెట్టాలనే తలంపుతో శివకవులు వస్తువునందును, కవితయందును, భాషయందును, ఛందస్సునందును మార్పుతెచ్చి అభ్యుదయమునకు తోడ్పడిరి.

శివ కథావస్తువుతో దేశకవితాసంప్రదాయము ననుసరించి జానుతెనుగున జాతిఛందమున కవితలల్లిరి. దీనినే దేశికవిత యందురు.

ఆనాటి కాలప్రవాహమున ఎదురీది ద్విపదయందు వైద్య భావమును ఎదిరించి తన భావమును ఇట్లు స్పష్టీకరించినాడు పాల్కురికి సోమనాథుడు.

“ఒప్పదు ద్విపదకావ్యో క్తినాజనదు......

ఆరూఢగద్య పద్యాదిప్రబంధ

మన సాహిత్య సంగ్రామములు గ్యొరెపాటి వెంకట నుబ్బయ్య 1985 పూరిత సంస్కృత భూయిస్టరచన మానుగా సర్వజన మాన్యము గామి _ జానుతెనుగు విశేషంబు ప్రసన్నతకు...... ఉరుతర గద్య పద్యోక్తులకంటె సరసమై పరగు జానుతెనుగు చర్చింతుగా ఫర్యసామాన్యమగుట గూర్చెద ద్విపద గోర్కె దైవార దెలుగు మాటలనంగవలదు, వేదముల కొలదియకా జూడు డిలగ* _ తనకు పూర్వము తనకాలమున ఉన్న గద్య పద్యో క్త ప్రబంధములకును తాన్ను తెనుగున రచించు కృతులకును తారతమ్యమును పేర్కొనుచు తాను చెప్పదలచిన జానుతెనుగు సర్వసామాన్య మగుటచే ఆదరము పడవలసినదని నిరూపించెను. నన్నయ మార్గకవితకు మార్గదర్శి యెనల్లే పాల్కురికి సోమనాథుడు దేశికవితకు మార్గదర్శి. ఆయన ఆనాటి మన గిడుగు పిడుగు. తృతీయ సం[గామము ఆంధ్రకవితాపితామహుని కాలమున జరిగెను. పురాణయుగమున పురాణములతో కాలక్షేపం చేయు కాలమున రసికజనవేద్యమగు ప్రబంధమును (ప్రవేశ పెట్టుటేగాక వేశ్య నాయికను, పరభాషాప్రయోగమును చేసిన మన పెద్దనతో పూర్వాచారపరాయణులు సం[గామమొనర్చి యుండిరి. అయినను వారికి అపజయమే కలిగను. ఆంధ్రసాహిత్యం సంస్కృతకావ్య సంప్రదాయ శృంగములతో నున్న సమయమున స్వీయకల్చనా విశేషము విరివిగా ఉపయోగించి పెద్దన ప్రబంధరచన చేసి ఆంధ్ర కవితాపితామహు డనిపించుకొనెను. ఈ (ప్రబంధరాశే ఆంధ్రుడు తమ ప్రత్యేక కావ్యసిద్ధిగా కొనియాడతగిన ప్రక్రియ. దక్షిణదేశ ఆంధ్రవాజ్బయ సందర్భమునకూడ లాక్షణికులకు ఆనాటి కవులకు సం[గ్రామము జరిగెను. . వారు సాహిత్యము ప్రజలకు చాలా అందుబాటులో వుండాలనే సంకల్పముతో ఛందోభంగమొనర్చుటేగాక వ్యాకరణ శృంఖలాలను కూడా తెగదదెంచిరి.

1986 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మనకాలమున మరి మూడు సం[గ్రామములు జరిగినవి. వీరేశలింగంగారు సారళ్యమగు గాంధికశైలి తెచ్చినందున ఆయన భాషను

పాడుచేయుచున్నాడనే నెపముతో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కాశీభట్ట

బ్రహ్మయ్య శాస్త్రంగారలకును ఘోరసాహిత్య సంగామము జరిగెను.

అనగా వీరేశలింగంగారి సులభశైలికి, కొక్కొండవారి ప్రబంధశైలికి జరిగిన భీషణసం[గ్రామములో వీరేశలింగంగారే జయించిరి.

ప్రబంధముల పస తగ్గి, కేవలం పాండిత్య పప్రకర్షే ప్రదర్శించిన కాలములో భావకవులు ఆత్మాశయమైన భావకవిత్వమును తెచ్చి ఆంధసాహత్యమున ఒక నూతన శకోదయం కావించిరి. దీనికి పండితప్రకాండులు, పూర్వఛాందసులు, అభ్యుదయ నిరోధకులు అడ్డుబడిరి. అయినను భావకవిత్వమే విజృంభించినది.

గిడుగువారి వ్యావహారిక భాషావాదమునకును, జయంతి రామయ్య పంతులుగారి గ్రాంథికవాదమునకును తుదిసారి మోరసం[గ్రామము జరిగెను.

పండితులు, ప్రభుత్వము ఆంధ్రసాహిత్య పరిషత్తునకు అండ. ప్రజలు, అభ్యుదయ శక్తులు గిడుగు రామమూర్తిగారికి అండ. నేటికిని ప్రభుత్వమువారు, ఆంధ్రసాహిత్య పరిషత్తువారు వ్యావహారికభాషావాదమును అంగీకరించకపోయినను, నైతిక విజయము రామమూర్తిగారిదే. ఈనాటి రచయితలలో నూటికి తొంబదిమంది వ్యావహారికములో రచన చేస్తున్నారు.

నాటినుండి నేటివరకు ఇటుల లాక్షణికులు, సంస్కృత భాషాభిమానులు, అభ్యుదయ నిరోధకులు సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేకుండా వుండవలయుననే అడ్డుపెట్టుచున్నారు. కాని విజయం అభ్యుదయ వాదులదే.

(కిన్నెర: సంపుటము 5, సంచిక 10, అక్టోబరు 1953)

కవి: ప్రచురణ శ్రీపాద సుబహ్మణ్య శాస్తి9

యివరి గంథం వారే అచ్చువేయించుకోవలసిరావడం కంటే మరి . దౌర్భాగ్యం లేదు కవులకు.

వనితలకు తమంత తామయి వలచివెళ్ళవలసి రావడం వంటిది కవుల కిది.

“తన రచన తన డబ్బుతో అచ్చువేయించుకోడమే కవికి దౌర్భాగ్యం అయితే, యాచించి తెచ్చిన యితరుల డబ్బుతో అచ్చు వేయించుకోడం మరీ దౌర్భాగ్యం కాదూ?” అంటే కాదనే చెప్పుతాను.

ఏమంటే?

. అచ్చువేయించుకోవలసిన బాధ్యత కవిమీద పడడమే, అసలు, దౌర్భాగ్యం. అది తప్పనప్పుడు ద్రవ్యం యెవరి దయినా వొకటే, యెలా వచ్చినా వొకటే, మెగా, ప్రచురణకర్తలు ముందుకి రానప్పుడు, తా నయినా తన (గంథం

అచ్చువేయించుకోకపోతే - అదీ దౌర్భాగ్యమే అవుతుంది, కవికి.

కాగా, అందుకోసం, యాచించి అయినా యితరుల డబ్బు సంపాదించుకోడం, ఇల్లు కట్టించుకోడానికి యాచించడమూ, బిడ్డలకు చదువుసంధ్యలు చెప్పించుకోడానికీ శుభకార్యాలు నిర్వహించుకోడానికీ యాచించడమూ వంటిది కాదు.

1988 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

అవి జానెడు పొట్టకోసం చెయ్యవలసిన కృత్యాలు.

ఇది, అచ్చంగా, ఇతరులను ఆనందపెట్టడానికి చేసే మంగళకార్యం.

ఇతరుల చిత్తవృత్తులను మృదువుపరచడానికీ, పరిణతి కలిగించడానికీ చేసే దోహద[క్రియ.

సభ్యత అలవరచి జాతిని ఒక మార్గాన నడిపించడానికి చెయ్యవలసిన విధికృత్యం. .

మొత్తంమీద, కవి బాధ్యత యిది.

కవి [పప్రాప్యమున్నూ యిదీ.

ఇది తెలిసిన సందర్భంలో = నలుగురూ చదవడమూ, పాఠకుని మొగం ఆనందోత్సుల్లం కావడమూ, ఆ మనిషి కెంతో కొంత సంస్కారం అబ్బడమూ, ఆవిధంగా తమ జీవితం ధన్యం కావడమూ - ఇదీ తమ రచనవల్ల కవులు ఆశించే భాగ్యం.

నలుగురూ తవు (ప్రతిభ గుర్తించడమూ, కొంచె వముయినా తమని మెచ్చుకోడమూ కూడా యీపద్దులోవే, సందేహంలేదు.

అయితే, గౌణాలివి.

ఆనుష౦గికాలున్నూ.

అవి సిద్ధిస్తేనే సిద్ధిం చేవిన్నీ యివి.

“నిజమే! కాని అచ్చుపడే ప్రతీ గంథానికీ యీశక్తి వుంటుందా?” అంలే, వుండేదాని మాట?

చెట్టున పుట్టే ప్రతీ పిందే సారవంతంకాదు.

నిలవనూ నిలవదు. ,

మరి, నిలిచే దేదో యెలాగా చెప్పడం?

అలాంటిదే కవుల [గ్రంథాల విషయమున్నూ.

కాక - "

పూర్వకవులు రాసిన [గ్రంథాలు కొంచెమే వున్నాయి, మన కిప్పుడు.

కవి: ప్రచురణ శ్రీపాద నుబ్రహృణ్య శాస్త్రి 1989

ఆ రోజుల్లో యివి మాత్రమే పుట్టాయా?

కవులున్నూ వీరు మాత్రమే వుండినారా అప్పుడు?

నన్నయ్య భారతాది మాత్రమే రచించలేదు.

తిక్కనకూడా భారతోత్తరభాగం మాత్రమే రచించలేదు.

ెపెద్దన్నా. తిమ్మన్నా రామరాజభూషణుడూ మొదలయిన వారున్నూూ యిప్పుడు మనకు అభ్యపడివున్న 'పన్నిధులు మాత్రమే రచించివుండలేదు.

అలాంటి నికరమైన శక్తి అబ్బడానికి, వారు, ఎన్నో పద్యాలూ, శతకాదులూ రచించివుంటారు. సాధకావస్థలో.

అయితే, యిప్పటి అనేకుల్లా కాక, వారు అపరిమితమైన సంస్కారం కలవారు కనక, వారి అప్రాథమికరచనలున్నూ జనసామాన్యం ఆదరించే వుంటుంది.

కాని, తపస్సిద్ధి కాక పూర్వం రచించినవి కనక, అవి కాలం సుడిగుండాలు తప్పించుకోలేకపోయి వుంటాయి.

అలా పోయినవిపోగా, రత్నాలే మనకి మిగిలాయి.

ఎప్పుడయినా గట్టిగింజలే మిగులుతాయి; కాని పొల్లుకున్నూ పని తప్పనిదే.

కనక, [గంథం తయారయిందా, అచ్చుపడవలసిందే యిప్పుడు.

దానివల్ల యితర్లకు ప్రయోజనం కలిగినా కలక్కపోయినా, తన గ్రంథం అచ్చుపడడంవల్ల మరో (గంథం రచించాలన్న గేరణ కలుగుతుంది, కవికి.

కవి అయినవాడికి, ప్రాణాలకంటేనూ విలవ అయినది, యీ (శేరణ.

కవి అయినవాడికి, నిద్రాహారాలకంబేనూ యెక్కువ ఆవశ్యక మయినది. యీ (ప్రేరణ.

ఈ (ప్రేరణ దీక్షపుట్టిస్తుంది. కవికి.

ఈ (ప్రేరణ ఆ దీక్షకు ఏకాగ్రత సంఘటిస్తుంది.

దాంతో రాతకు కూచుంటాడు కవి, తాదాత్మ్యంతో.

రాయగా రాయగా భాష స్వాధీనం అవుతుంది. .

రాయగా రాయగా, రచనావిధానం సుపరిష్కృతం అవుతుంది.

1990 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంప్పుటము శ4: సౌహిత్యము

రాయగా రాయగా, క్రాంతదర్శిత నిశితం అవుతుంది.

రాయగా రాయగా, తపస్సిద్ధి కలిగి మహర్షి అవుతాడు కవి.

“నాన్ఫషిః కురుతే కావ్యమ్‌”

మహర్షి కానివాడు కావ్యం రచించలేడు.

మహర్షి కానివాడు రచించినది కావ్యమూ కాదు.

మరి, వొక్కరోజులో మహర్షి అయిపోతాడా యెవడయినా?

సోపాన[క్రమంగా యెంతో సాధన కావాలి, దానికి.

అచ్చు(ప్రతి అయినా రాతప్రతి అయినా, గ్రంథం, నలుగురి చేతుల్లోనూ పడడం ఆ సోపానాలలో ఒకటి.

అలాగ, వొకటి తరవాత వొకటిగా యెన్నో సోపానాలెక్కితేగాని తత్క ర్తకు తన భంగపాలేదో తెలియదు.

తనకి సాధ్యం - సాధించుకోవలసిం దేమిటో అవగాహన కాదు.

అది తెలిస్తేగాని అడుగు ముందుకి పడదు.

పడితేతప్ప సిద్ధి యెక్కడిదీ?

తన గ్రంథం తానే అచ్చువేయించుకోవలసివస్తే మాత్రం, ప్రేరణ దుర్చలమూ, సిద్ధి దుర్లభమూ అయిపోతాయి కవికి.

ఈ సందర్భంలో కొందరి విషయమై అపవాద (మినహాయింపు) లుండవని కాదు; కాని, మొత్తాని కిది కవులకు దౌర్భాగ్యం.

ఏమంటే ?

తన [గంథం తానే అచ్చువేయించుకుం టే, పెట్టిన డబ్బు తిరిగీ రాబట్టుకోడవదూ, తన సంసారం నిర్వహించుకోడానికీ, వురో (గంథం అచ్చువేయించుకోడానికీ తగినంత లాభం లాగడమూ - ఇలాంటి ధోరణిలో పడిపోతాడు. కవి.

దానివల్ల అతని కవితాతపస్సు భంగపడిపోతుంది.

కవికి కాదు, తెలుసుకోగలిగితే జాతికే తీరని నష్టం అది.

కవి;ప్రచురణ శ్రీపాద నుబ్రవ్యుణ్య శాస్త్ర 1991 అయితే, కవి అయినవా డల్లా దరిదు డయి వుండాలని కాదు, చెప్పడం. కవి అయినవా డల్లా ధనికు డయి వుండకూడ దనిన్నీ కాదు, చెప్పడం. ధనికత్వమూ, నిర్ధనికత్వమూ లోకసామాన్యాలు. మరి, కవి? లోకాతీతుడు. కనక - ధనసంపాదన మాత్రం కవికి ధ్యేయం కాగూడదు. కవికే కాదు, ధనసంపాదన యే కళావేత్తకూ ధ్యేయం కాగూడదు. నిశ్చింతగా - చిన్నయెత్తున అయినా అతనికి కాలక్షేపం జరిగిపోవాలి - అంతే. పంచభక్ష్యపరమాన్నాలే అక్కర్లేదు, _చారునీళ్లతో కాలక్షేపం చేసిన్నీ ఉద్యంథాలు రచించగలడు కవి.

దారిద్య్యామూ ఐశ్వర్యమూ కూడా (ఢేరకాలూ కాలేవు, భంజకాలూ కాలేవు కవిత్వానికి.

టాగూరు, జమీందారు కనకనే - సాంసారికా లైన వడిదుడుకు లెరగనివాడు కాబట్టే అలాంటి ఉద్గుంథాలు రచించగలిగా డనీ, నోబిలు బహుమానమున్నూ గడించుకున్నా డనీ అనుకుంటాడు, అనుకర్త,

కవితాసమాధిలో కూచున్నాడా - సరి అయిన తాదాత్మ్యం సిద్ధించిందా, ఇక అతనికి భోగాలమీదికీ దృష్టిపోదు, కష్టాలూ కనబడవు.

నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోగూడదు, పేగులు మాడి దృష్టి చెదిరిపోగూడదు - ఈ (ప్రతి బంధకాలు కలక్కుండా వుండడానికే కవికి ఆహారం.

ధనికుడ్రైనవాడి కయినా కవితావేశం కలిగినప్పు డిదే ప్రవృత్తి.

పర్పులో (బహుమితంగానే) డబ్బుండినా, దృష్టి రచనా వ్యగ్రమై కదలలేక, కూరలకోసం బజారుకి వెళ్ళా లన్న స్ఫురణేకలక్క “కూరగాయ లేమీ నిలవలేవు, మరి" అంటూ వంటింట్లో నుంచి కేక వినవచ్చినా ప్రకృతిలో పడలేక - వేళకి

1992 పందిరి మల్లికార్డునరావు శతజయంతి పంపుటము శ: సాహిత్యము మాత్రం పీట మీదికి వెళ్లి - ఆ పూటకు వూరుగాయతోనూ చారుమజ్జగనీళ్లతోనూ, భోజనం అయిం దనిపించుకుని, చెయ్యి ఆరడం తడువుగా మళ్లీ కలంపట్టి - దాంతో, ప్రపంచం మరచిపోయిన దినా లెన్నోవున్నాయి నా జీవితంలో.

“ఏదో” రాయకుండా వుండలేని నాస్థితీ యిలా వుంటే, పద్యబంధం చేసినా వచనరచనే చేసినా మహాకవులే అయి వుండిన వారి స్థితి యెలా వుండనూ?

తెలుసుకోగలిగితే, యీ భౌతిక దేహం నిలుపుకోగలగడానికి, ఫలానా మాత్రమే ఉపయోగపడుతుం దన్న నిర్దారణ లేదు.

మహోజ్వలవేషంతో వీథిలోకి వస్తాడు, కవి, ఒకొక్కప్పుడు..

“ఎంత డాబురా" అనుకుంటారు అల్బబుద్ధులు.

చింకిపాతలతో కనబడతాడు కవి, మరొక్కొక్కప్పుడు.

“వో - ట్టి దరిద్రుడ” అనుకుంటుంది మాయలోకం.

పరిశీలిస్తే, ఆ భావనా యీ ఘోషణా కూడా అవివేకజన్యాలే.

ఏమంటే?

అతను, మహర్షి అనడానికి నిదర్శనం అది.

భిల్లాంగనతో మన్మథతంథత్రంలో మునిగిపోయి వృండిన వాల్మీకి శ్రీమదామాయణం రచించగలిగాడు.

గాఢారణ్యాలలో తపోనిష్టు డయివుండిన కృష్ణద్వైపాయనుడే మహాభారత యుద్ధంలో ప్రముఖపాత్ర కాగలిగాడు.

అంటీ అంటని మహాకవుల యీ అవస్థ, జనసామాన్యం బోధపరచుకోనూలేదు, అనుసరించాలేదు.

“ఆయన దరిదుడే! కాని సకలసంపదలకూ కారణం. వల్లకాటిలోనే తిరుగుతూ వుంటాడు; కాని (త్రిలోకాలకూ నాథుడాయన. భయంకరంగా కనబడతాడు; కాని సౌమ్యరూపు డనే చెప్పాల” అంటూ నిర్వచించి “మహేశ్వరుని యాథార్థ్యం తెలిసిన వారు లేరు” అంది, పార్వతి.

కవి యాథార్థ్యమూ అలాంటిదే, మహామహా వ్యాఖ్యాతలు గూడా నిర్ధారణ

  • చెయ్య లేకుండా వున్నారది.

కమి ప్రచురణ. 'శ్రీఫాద నుబహ్మణ్యా శాస్త్రి. - . 1993

మనిషి యెంత నిర్లిప్పడు కావచ్చునో అంతా నిర్లిప్పడూ కాగలడు, ఎంత లిప్పుడు కావచ్చునో అంతా లిప్పడూ కాగలడు కవి,

ఇచ్చామాత్రా లాదశ లతనికి.

అతని చూపుమాత్రం యేదశలోనూ వొక్కటే.

అది యేకాగం.

అదే క్రాంతదర్శిత.

కనకనే, ఆకాశసౌధాలలో విహరించే ఆగర్భ శ్రీమంతుల భోగభాగ్యావస్థలూ వర్ణించగలడు, ఎలకల కలుగుల వంటి గుడిసెల్లో నివసించే కటికి దర్శిదుల యమయాతనలూ చిత్రించగలడు కవి, యథాతథంగా.

దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా దేనిమీదికీ దృష్టి పోదు, మనిషికి.

రకంలో భిన్నమేగాని, రాశిలో అలాంటి మనోధర్మమే కవిదిన్నీ.

అయితే, జీవయాత్రలో భంగపాటు తటస్థపడితే ప్రపంచం మునిగిపోయినట్టు గోలపెట్టేస్తాడు మామూలు మనిషి.

కాయికంగా మాత్రమే బాధపడుతూ - ఆ స్థితిలో కూడా, మానసికంగా నిర్వికల్పు డయిపోతాడు, కవ.

అతని తాదాత్మ్యతకు నిదర్శనం అది.

రసలోలుపత అలాంటి సిద్ధి కలిగిస్తుందతనికి.

“రసో వై సః

నిజమే; కాని రసనిష్ట రసికునకూ కలుగుతుంది. మరి, కవివిశేషం యేమిటీ?

అంతానూ.

ఒక్కమాటలో ఇప్పాలంటే, రసికుని రసనిష్ట యేకదేశం. ,

రసికు డైనవాడికి, కవి రచనలో, వొకప్పుడొక వాక్యంతో - లేదా - వొక

పద్యంతో బుద్ధి చమత్కృతం అవుతుంది.

హృదయం స్పందిస్తుంది.

రసానుభూతి కలుగుతుంది, దాంతో.

మరి, మరొకప్పుడు?.

1994 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; పాహిత్యము

మరి, తక్కిన వాక్యాల - లేక - పద్యాలమాట?

ఏ రసికుడూ కూడా “ఈ కావ్యంలో యిక్కడే రసం - యింతే వుంది.” అంటూ నిర్ధారణా చెయ్యలేడు, పరిమితీ కట్టలేడు.

కాళిదాసు రచనల కెందరో వ్యాఖ్యానాలు చేశారు.

ఎందరో, ఎన్నో సారస్యాలు చేశారు.

పూర్తి చెయ్యగలిగారా?

ఇంకా, యింకా, యెందరో , కొత్త అందాలు చూపించ గలుగుతున్నారేం?

అయినా, యింకా యింకా యేదో నిగూఢంగా వుండిపోయినబ్టే అనిపిస్తోందేం? " "

కవికీ రసికునకూ వుండే అంతరం అదిగో, అది.

రసికుని సత్తా సావధికం.

కవి సత్తా నిరవధికం.

ఇంతేకాదు -

అది భౌతికం. .

ఇది ఆధ్యాత్మికం.

అఖండగోదావరిలో జలపానం చేసే యెర్రచీమదీ, కవి రచనలో రసం ఆస్వాదించే రసికునిదీ వొక్కటే అంతస్థు,

ఏమంటే?

రసికుడు రసపెపాసి.

కవి, రసస్రష్ట.

కాని, ధనలోభం పుట్టిందా, కవికి, ఈ రసనిష్ట యెగిరిపోతుంది.

అది దౌర్భల్యమూ, యిది పతనమూను, కవికి.

ఇలాంటిది తటస్థించకుండా వుండాలంటే, రసికులైనవారు కవిని కనిపెట్టుకుని వుండాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ.

కవికి, తనగంథా లచ్చువేయించుకోవలసిన దౌర్భాగ్యం పట్టకుండా జాగ్రత్త పడాలి.

కవిప్రచురణ శ్రీపాద నుబహ్మణ్య శాస్త్రి 1995 అది చాలదు.

కవిని అందలా లెక్కించాలి.

కవికి, కనకాభిషేకం చెయ్యాలి.

ఇంతా చేస్తే, కవి కిది “పత్రం పుష్పం ఫలం తోయ” మున్నూ మాత్రమే.

రసికులకు మాత్రం పరాకాష్ట ఇది.

ఈ బాధ్యత అంతా యిప్పుడు జనులమీద పడింది. మునుపు రాజులు చూసుకునేవారు.

“ఈ రాజ్మ్యాశయం, అప్పుడు కవుల సమద్దర్శనసత్తా భంగ పరచలేదా?” అంటే, ఇలా అడిగే చిత్తవృత్తి వుండిందా అప్పటి జనులకు?

ఇలాంటి చిత్తవృత్తి యిప్పుడుందిగదా, మరి, జనులు కవుల నారాధిస్తున్నారా మన తెనుగుదేశంలో?

ఆరోజులే నయం, ఏ రాజో యే మంత్రో యే దండనాథుడో యే రాజబంధువో అఆవచి తిప్పయ్య వంటి యే రాజవణిక్కో కవులదీ తమదీ సత్తా ననుసరించి (ద్రవ్యమా మాన్యమో వృతో అ(గహారమో యిచ్చి ఆదరించేవారు, కవిని.

కవికి కాలం గడిచిపోయేది.

రాజాస్థానంలోనో, దేశాటనం చేస్తూ రసికుల సన్నిధినో తన రచన చదివి వినిపించి తన విశిష్టత (పకటించుకునేవాడు, కవి.

[గ్రంథం మంచి దన్నమాట పుట్టిందా, యెంత దూరమైనా నడిచివెళ్లి, పచ్చిపులుసుతో అత్తిసరు మెతుకులు తింటూ దానికి ప్రతులు రాసుకునేవారు రసికులు, అన్ని పనులూ విడిచి.

ఈ విధంగా కవికి ఉత్సాహం 'రేకత్తుతూ వుండేది.

వెనకటి అలాంటి రసికులే నిలుపుకుంటూ వచ్చారు ఉద్దంథాలు, తత్క ర్తలు కారు._

ఆ (గ్రంథాలు చదివి ఆసందముగ్గులూ అయేవారు వారు.

మరి యిప్పుడు?

ప్రజాసత్తాకం వచ్చింది. జనులకు నిరంకుశప్రభుత్వపిశాచం వొదిలిపోయింది.

1996 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

అచ్చు వచ్చింది, రసికులకు ప్రతులు రాసుకోవలసిన కష్టవమూ తొలిగిపోయింది.

మరి కవికి?

ఈ రెండింటివల్లా కవి పని మాతం అస్తవ్యస్తం అయిపోయింది.

ఏ వొక్క వ్యక్తికీ కవిని పోషించే శక్తి లేదిప్పుడు.

అధికారంతో పాటు, కవుల నారాధించవలసిన బాధ్యతా మీద పడిందన్న జ్ఞానం లేదు, మన “పజాస్వామ్య” ప్రభుత్వానికి.

పోనీ అంటే, నా చిన్నప్పటికే కా, దిప్పటికీ తగిన ప్రతిఫలం యిచ్చి కాపీరైటు కొనుక్కొనే (ప్రచురణకర్తలు బయలుదేర లేదు, మన తెనుగుగడ్డమీద.

ఇది ప్రచురణకర్తల తప్పూ కాదు, మన తెనుగువారి వాజ్మయ ప్రీతి అలా వుంది, మరి.

కవి సంగతి అలా వుండగా -

కవి కిచ్చిన క్రయధనమూ, అచ్చుపనులకు ప్రకటన కార్యాలకూ పెట్టిన పెట్టుబడీ వచ్చి తాను లక్షణంగా తినడానికీ మోటార్లమీద తిరగడానికీ తగినంత (ప్రతిఫలం రావాలి, ప్రచురణకర్తకు.

వచ్చిన లాభం కాస్తా వడ్డీ మింగెయ్యకుండా వెంటవెంటనే పుస్తకా లమ్ముడు పోవాలి, ఎలాంటి ఉద్గంథాలయినా అచ్చువేయించడానికి (ప్రచురణకర్త సిద్ధపడాలంటే.

మరి, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారా మనవాళ్లు?

ఉన్నలోటల్లా యిది.

మరో పెద్ద లోటు మనకు నాయకుడు లేకపోవడం.

రాజ్యాలకు రాజు లెంత అగత్యమో (ప్రజాసత్తాకాలకు నాయకు లంత అగత్యం.

నాయకులు పరంపరగా వెలుస్తూ, యెప్పటికప్పుడు సరి అయిన దారిలో పెడుతూ వుంటే గాని ఏ జాతీ నిలకడగా వొక అంతస్థులో వుండదు, ఎన్నడూ.

ఏ జాతికి నాయకుడు లేడో, ఆ జాతివారు, చదవవలసినవి చదవరు, చూడవలసినవి చూడరు, చెయ్యవలసినవి చెయ్యరు, మానవలసినవి మానరు, తమవారు చెబితే లక్ష్య పెట్టరు, మైవారు చెబితే దాసోహం అనకమానరు.

కప్పల తక్కెడకూ ఆ జాతికీ మాతమే పోలిక.

అచ్చంగా యిప్పటికీ మన జాతికి స్థితి యిదీ.

కవివప్రచురణ శ్రీపాద నుబవ్య్ముణ్య శాస్త్రి 1997

కనకనే మన కన్నీ లోలట్లే, అన్నీ లొసుగులే.

కాగా -

మన కవులకు, ఎవరి (గంథం వారే అచ్చువేయించుకోడం తప్పనిసరి అయిపోతోంది.

నోటు రాస్తే యెవరో వొకరు అప్పిచ్చేవారు దొరక్కపోరు.

డబ్బు చేతిలో పోస్తే పుస్తకం అచ్చువేసి యిచ్చే ముద్రాపకులూ లేకపోలేదు.

మరి, అచ్చుపని ముగిశాక ?

అచ్చు వెయ్యడం యెందుకో అది అచ్చువేశాకే (ప్రారంభం అవుతుంది.

దానిపేరు వ్యాపారం.

దాని సరణి వేరు.

దాని కావలసిన (ప్రవృత్తిన్నీ వేరు.

అది కవులకు దూరం. - .

అంటరానిదిన్నీ.

కాని తన (గంథం తానే అచ్చువేయించుకునే కవి అది అలవరచుకోక తప్పదు.

నిజమే; గాని సరిగా నడవదు, అది కవికి.

(ప్రతిభ లేక కాదు, ప్రకృతి కాక.

అంచేత పెట్టిన డబ్బు తిరిగి రాదు.

రాదంటే రాకాపోదు, మల్లీ.

కాస్త కాస్త వస్తుంది. అది పులుసులోనే పడిపోతూ వుంటుంది, యప్పటికప్పుడు.

ఇక అప్పులవాడు మిగులుతాడు. ॥

అప్పులవాడిదీ వొక దారే, ఎపరిది వారు భద్రపరుచుకోడం ధర్మమే కనక.

అప్పుల బాధ అలా వుండగా, (గంథాలయాలవారు కొందరూ, పరిచితులు కొందరూ [గగంథకర్తలమీద పడతారు.

గ్రంథా లూరికే యిమ్మంటారు.

1994 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము పోస్టేజీ భరించిన్నీ పంపమంటారు, కొందరు. దానా దీనా దృష్టి చెడిపోయి మరో [గంథం రాయడం అసాధ్యం అవుతుంది, కవికి. కనీసం దుర్చులం అయినా అయిపోతుంది, ధోరణి. తెలుసుకోగలిగితే, జాతికే చుట్టుకుంటుంది యీ దౌర్భాగ్యం, అటు తిరిగి యిటు తిరిగి. ఇలా కాక - ఏదో విధంగా తన [గంథం అచ్చుకాకపోయినా కవికి నిరుత్సాహమే. అదీ అతను మరో గ్రంథం రాయలేకపోడానికి కారణమే, చాలా సందర్భాలలో. కాని, యెంత చెబితే మాత్రం మనవారి కీ సత్యం అవగాహన అవుతుందీ? శ్రీపాద నుబవ్మాణ్య శాస్త్రిగారి అముద్రిత “అనుభవాలూ, జ్ఞాపకాలూ” రెండో భొగం నుంచి. (కిన్నెర: సంప్పుటము 5, సంచిక 11, నవంబరు 195ఏ) 1 ర్త (చాయా (సలుల ౫ ల గత్తిగ వ్ర గ నే [ ప వో? తయో మైన గ్‌ రం రో రంల మన ళో 1 1 1.

అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు నండూరి రామకృష్ణమాచార్య “అఖిలభారత సాహిత్య పరిషత్తు త్వరలో ఏర్పడబోతోంది. ఈ పరిషత్తు ఏనాడో ఏర్పడవలసింది. ఈనాటికైనా కేంద్ర ప్రభుత్వం యీ విషయంలో పూనుకోడం యొంతో సంతోషం. భారతదేశంలో యెన్నో భాషలున్నై. భారతదేశ భాషా పరిశోధనలో (11గ- ర్ర౮510 56౧/9 ౮ 1౧౦12) సుమారు రెండువందల యిరవై దేశభాషలు ఉన్నట్లు “గియర్పన్‌” తేల్చారు. కాని ఈ భాషావైవిధ్యం సమిష్టి సంఖ్యాబలంబట్టి, సాహిత్య సౌష్టవంబట్టి, ముఖ్యంగా కొన్నిటినే ఏరుకోవచ్చు. భారతదేశంలోని ముఖ్య భాష లన్నిటికీ, వేటి ప్రత్యేకత, ప్రాముఖ్యం వాటికున్నా అన్నింటికీ సాహిత్యంలో, అలంకారసామగ్రిలో - సారస్వత సాంప్రదాయాలలో ఎన్నో సామ్యాలున్నై: సంస్కృత సాహిత్యం - భారత, భాగవత, రామాయణాలు - పురాణాలు అలంకార, శాస్త్ర[గ్రంథాలూ దేశభాష లన్నింటిలో ఉన్నవి. యావత్‌ భారతదేశానికి ఏకభాష (1౫9౩ ౯2౧002) ఎంత అవసరమో అన్ని భాషలలో ఉండే ఏకత్వం - సన్నిహిత బాంధవ్యం - భేదసామ్యాలు నిరూపించి అనేకత్వంలో ఏకత్వం, వ్యష్టైలో సమిష్టి సాధించి భారతజాతి మొక్యత ప్రదర్శించడానికి అఖిలభారత సాహిత్య పరిషత్తు అవసరం. భారతదేశంలో ఉన్న సాహితీపరులందరకూ ఏకవేదిక లభించాలి. అప్పుడు దేశభాషలలో ఉండే పందిరి మల్ల్‌కార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

2000 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పగతి ఉద్యమాలకు ఉత్సాహదోహదాలు లభిపై. భారత జాతీయతలోని ఏకత్వం (ప్రదర్శితమౌతుంది. భిన్నభాషలతో - భిన్నమతాలతో, ఆ సేతుహిమాచలం ఏకజాతిగా వర్ధిల్లిన భారతదేశంలో ఈ అఖిలభారత సాహిత్య పరిషత్తువల్ల యుగయుగాలనుండి అంతర్వాహినిగా ప్రవహించే ఏకత్వం జీవనస్రవంతిగా నేడుకూడ వెల్లివిరుస్తుంది. ఆఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు కేంద్ర భారత సాహిత్య పరిషత్తుకు అనుబంధంగా దేశభాషా పరిషత్తులు వర్ధిల్లుతాయి. భారతదేశంలో సంఖ్యాబలంబట్టి చూస్తే తెలుగుభాష ఈనాడు రెండవది. మొదటిది హిందీ. సారస్వత దృష్టితో చూస్తే తెలుగు హిందీ కంటె (ప్రాచీనం. ఆంధ్ర సాహిత్య చరిత్రకు సహస్ర సంవత్సరాల వయస్సు. ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు తెలుగులో ఏనాడో పుట్టాయి. హిందీ, హిందూస్తానీ, ఉర్దూలను ఒకేభాషగా పరిగణిస్తే, సారస్వతం ఈమధ్యనే పుట్టినా, భారతదేశంలో అధికసంఖ్యాకులు ఆ భాషే మాట్లాడుతున్నారు. అందుచే హిందీ కేంద్రప్రభుత్వం గుర్తించిన జాతీయభాష అయినా, అంతకంటె (ప్రాచీనమునుండి సారస్వతంకల తలుగు, కన్నడం, తమిళం, మళయాళంవంటి దక్షిణాది భాషల ప్రాముఖ్యంకూడా గుర్తించి ప్రభుత్వం వాటి ప్రత్యేకతకు, సాహిళ్యానికీ తగిన ప్రోత్సాహగౌరవాలు చూపించాలి. లేకపోతే భారతజాతీయత కే ముప్పు వాటిల్లవచ్చు. " " " - - లం తెలుగుదేశంలో తెలుగు భాషతోనే సాహిత్యపరిషత్తులు పుట్టాయి. ఆ సాహిత్యపరిషత్తులలోనే తెలుగు సారస్వతం పుట్టింది. నన్న్మయ మహాకవి “రాజమహేంద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజి అని రాజరాజనరేంద్రుణ్ణి సంబోధిస్తాడు. అంతేకాదు. " " ం “పరమవివేక సౌరభవిభాసిత సద్గుణ పుంజవారిజో త్కరరుచిరంబులై సకలగమ్య సుతీర్ధములై మహామనో హరసుచరిత్ర పావనపయఃపరిపూర్ణములైన సత్సభాం తర సరసీవనంబుల ముదంబొనరంగొనియాడి వేడుకన్‌” అనినాడు. రాజరాజనరేందదుని నిండుకొలువులో సమావేశమైయున్న “అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తుకు ధన్యవాదాలర్చించి నన్నయ “తెలుంగునన్‌” మహాభారత

అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు నండూరి రామకృష్ణమాచార్య 2001 సంహిత “జగద్ధితంబుగా” ఆరంభించాడు. ఆనాడు అందరికీ అందుబాటులోలేని పంచమవేదం తెనిగించి జగత్తుకు హితమాచరించాడు నన్నయ. వేదతుల్య మైన భారతం తెలుగులో వ్రాయడం సనాతనులకు ధర్మమని తోచకపోయినా జగత్తునకు హితం కాబట్టి ఆనాటి సాహిత్య పరిషత్తు అంగీకరించింది. విశ్వజనీనమైన భారతం తెలుగులో అవతరించింది. ముదణాయంత్రాలులేని ఆరోజులలో నన్నయ భారతం వాయించి ప్రచారం చేసింది నాటి సాహిత్య పరిషత్‌ సభ్యులు - రాజరాజనరేంద్రునకు ముందునుంచీ చాళుక్య రాజులు ప్రజల భాషయైన తెలుగునకు రాజపూజ్యత, సభాగౌరవం కల్పించారు. “మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశికవిత పుట్టించి తెనుంగును నిల్చి రంధ్ర విషయంబున”ొ అని నన్నెచోడుడు చాళుక్యులను గురించి అన్నాడు. అంతకుముందు సంస్కృత (పాకృతాలే రాజభాషలు. తెలుగునకు సాహిత్యమర్యాద నిచ్చి కవీంద్ర సమాజాలకు కల్పవృక్షాలైనవారు చాళుక్యులు. తమిళంలో సంఘవాజ్మయం మొదట ఒక మహాయుగంగా విస్తరిల్లింది.

ఈ సంఘవాజ్మయం సాహిత్యపరిషత్తుల మధ్య వికసించింది. శ్రీకృష్ణదేవరాయల కొలువుకూటం ఒక అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు మాత్రమేగాక దక్షిణభారత సాహిత్య పరిషత్తు అని చెప్పాలి. అష్టదిగ్గజాలలో తెలుగు, కన్నడ, తమిళ కవులుండేవారు. ఆ సాహితీసమరాంగణ చక్రవర్తి “దేశభాషలందు తెలుగు లెస్స” అని చాటాడు. పూర్వక్తాలం రాజులు, రారాజులు, మంత్రులు, సామంతులు, మన్నీలు, జమీందారులు కవులను పోషించారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో తెలుగుకవి పొందిన మర్యాద అద్వితీయం. “హేమపాత్రాన్నాలు, రత్నాంబరాలు, కస్తూరి, గండపెండరాలు, మళత్తేభవాహనాలు, అంభోజాక్షే చతురంతయాన తురగీ భూషాడులు, అగ్రహారాలు" తెలుగు కవికి లభించాయి. కాని అది ప్రాచీన చరిత్ర.

నేటి స్వతంత్రభారతంలో ప్రజాస్వామికయుగం ఆరంభమైంది. ప్రగతిశీలమైన (ప్రతిఉద్యమానికీ కవులే వైతాళికులై ముందు ఉత్సాహం కల్పించేది. ఇదివరలో ప్రభుత్వం జరిపిన రాజులు కవులను పోషిస్తే, ఇప్పుడు ప్రభుత్వ యంత్రాన్ని నడిపే ప్రజలే కవులను ప్రోత్సహించాలి. అధునాతన యుగంలో కూడ అన్ని దేశభాషలలోను ప్రజాసహకారంతో సాహిత్య పరిషత్తులు ఏర్పడ్డాయి. 1. హిందీ సాహిత్య సమ్మేళన్‌ 2. తమిళ సాహిత్య కజగం 3. కన్నడ సాహిత్య పరిషత్తు

2002 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము 4. కేరళ సాహిత్య పరిషత్తు మొదలైనవి. భారతదేశంలోని ప్రముఖమైన పదునాల్గు దేశభాషలలో సమ(గ్ర సాహిత్య పరిషత్తు తెలుగుభాషకే లేదు. ఇదివరకు తెలుగులో ఏర్పడి సాహిత్యసేవ చేసిన

  • చేస్తూన్న సంస్థలున్నై. ఆంధ్రసాహిత్య పరిషత్‌ (కాకినాడ), రాయలసీమ సాహిత్యపరిషత్‌, నవ్యసాహిత్య పరిషత్‌, మైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్‌, తెనుగు భాషాసమితి మొదలైనవి. _ ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఎన్నో పుస్తకాలు ప్రచురించింది. పరిషత్‌ పత్రిక కూడ నడిచింది. వారి కృషి ప్రశంసనీయమైనదే. కాని వారు తెలుగుదేశంలోని సాహితీపరులందరినీ ఏకోన్ముఖం చెయ్య లేకపోయారు... వారు సనాతన సాహితీప్రియులు కావటంవల్ల (గాంథికాంధ్రాన్ని మాత్రమే స్వీకరించారు. అందుచే నవ్యసాహిత్యపరిషత్తు ఏర్పడింది. యువకులందరూ కలిసారు. “ప్రతిభొ పత్రికను వెలువరించి చాలా కృషిచేసారు. ప్రస్తుతం నవ్యసాహిత్య పరిషత్తు సమావేశాలు జరగడంలేదు. “ప్రతిభ వెలువడటమూ లేదు. మైదరాబాదులో ఉత్సాహులైన యువకులు, సాహితీపరులు, ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించారు. వారు ఇంతవరకు ఎంతో నిర్మాణ కృషి చేశారు. వారి ప్రచురణలు, దేశభాషా పండితుల విషయమై వారి ఆందోళన ఫలప్రదమైనవి. హైదరాబాదులో మాతృభాషను విస్మరించి ఉర్దూను తెలుగు పిల్లలు అభ్యసించవలసి వచ్చింది. ఉన్నతవిద్య ఆంగ్లంలో కాకుండా ఉర్దూద్వారా నేర్చుకోవలసి వచ్చింది. దేశభాషలలో ఉన్నతవిద్య నేర్పటం ప్రశంసనీయమైనదని కొందరు రాజకీయ విద్వాంసులు వకనీతి ఉపన్యసించారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధన భాష అయితే అది అక్కడివారికి ఎంత దేశభాష అవుతుందో ఉస్మానియాలో ఉర్దూ హిందీలు మోదరాబాదీయులకు అంతే అవుతాయి. కేంద్రప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చేపట్టి హిందీ బోధనాభాషగా ఉండేటట్టు నిర్వహించాలను కున్నప్పుడు మైదరాబాదాంధ్ర సారస్వత పరిషత్తువారు తీవ్రమైన ఆందోళనచేసి (ప్రతిఘటించి నిల్చ్పగలిగారు. వీరికి స్ధానిక (ప్రభుత్వ సహాయంకూడా లభిస్తున్నది. అయితే హైదరాబాద్‌లో మాత్రమే వీరీసేవ చేస్తున్నారు. అయినా విశాలాంధ్ర నిర్మాణంలో ఈ పరిషత్కార్యవర్గంకూడా సుముఖులు కావడం సంతోషం.

అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు నండూరి రామకృష్ణమాచార్య 2003 యావదాంధ్రదేశానికే ఏకైక సాహత్యపరిషత్తు ఆంధ్ర రాష్ట్రావతరణ మహోదయంలో ఉదయించాలి. అది విశాలాంధ్రకు నాంది కాగలదు. ఇతర దేశాలలో యిట్టి సాహిత్యపరిషత్తులు సేవ చేస్తున్నాయి. (ఫ్రాన్సులో మూడు శతాబ్దులనుండి సాహిత్యపరిషత్తు పనిచేస్తున్నది. ఇంగ్లండులోకూడా సాహిత్యవరిషత్తు ఆవిర్భవించి ఈ శతాబ్దారంభంలోనే ప్రభుత్వాదరణ పొంది వర్ధిల్లింది.

ఈ పరిషత్తులకు సహాయం ఉండాలికాని (ప్రభుత్వజోక్యం పనికిరాదు. ఇవి ప్రజాసంస్థలుగానే ఉండాలి. ప్రభుత్వం పెత్తనం వహిస్తే మునిసిపల్‌ పార్కులవలె ఏదోఒక ఎత్తుకు ఎదుగుతాయి కాని సహజస్ఫూ ర్తితో సారస్వత సంస్థలు విజృంభింపలేవు. అందుచే తెలుగు భాషాసమితివలె ప్రభుత్వసహాయం పొంది ఏదో పరిమిత ప్రయోజనంకోసంకాక రాజకీయాల కతీతమై అందరి మన్ననలకు పాత్రమైః ప్రజాహితం కోసం సర్వతోముఖంగా వికసించే సంస్థ ఏర్పడాలి.

అఖిలాంధ్ర సాహిత్యపరిషత్తు ఆంధ్ర సాహిత్యపరిషత్తు వంటి సనాతన సాహితీప్రియులకు, నవ్యసాహిత్య పరిషత్తువంటి నవసాహితీప్రియులకు, హైదరాబాద్‌

  • రాయలసీమలలోని సాహితీపరులకు, రాష్ట్రేతరాంధ్రులకు, అందరకు ప్రాతినిధ్యం వహించే ఏకైక పరిషత్తుగా ఏర్పడాలి. సాహిత్యంలోనైనా బహునాయకత్వం ఆరంభశూరత్వం విస్మరించి రాజకీయాలు మరచి ఆంధ్రులందరూ ఏకం కావాలి. ఈమధ్య వికసించిన అభ్యుదయ రచయితలుకూడా ఇందులో చేరాలి. సాహిత్యంలో రాజకీయాలు లేవు. ప్రాంతీయత లేదు. “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయల్ని, ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని ెద్దనను, అష్టదిగ్గజాలను కన్న రాయలసీమలో మాతృభాష ఆంధ్రభాష కాదా? భాగవతం పుట్టినచోటు,

_ భారతం విన్నచోటు ఓరుగల్లు. రావమాయణ౦ కాకతీయ దండనాథుడు సాహిణిమారునికి అంకితం - ఆంధ్ర మహాభారతం, మహాభాగవతం, రామాయణానికి కారణమైన హైదరాబాదు రాష్ట్రంలో మాతృభాష ఆంధ్రభాష కాదా? ఢిల్లీలోనున్నాా బొంబాయిలోఉన్నా తెలుగువారు తెలుగువారే. శ్రీనాథుడు చెప్పినట్లు “చీకటియున్‌ కళింగమును చిల్కసరస్సు" వరకును, తెల్లుదేశమే కదా! ఆంధ్రరాష్ట్రంలో చేరలేకపోయినా!

2004 పందిరి మల్లికార్టునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అందరూ చేరి అచిరకాలంలో అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు నిర్మించడం అవశ్యకర్తవ్యం. దేశభాష లన్నింటికి సమ్మగ సాహిత్య పరిషత్తులున్నై. ఇంతవరకు తెలుగుభాషకు లేదు. ఈమధ్య సాహితీపరులు, పశ్చిమ గోదావరిమండలం, ఏలూరులో సమావేశమై అఖిలాంధ్ర సాహిత్యపరిషత్తు నేర్పరచాలని ఆహ్వాన సంఘాన్ని నిర్మించారు. త్వరలో అఖిలాంధ్ర సాహిత్యపరిషత్సభలు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నై. ఆంధ్రులందరూ సహకరించి అచిరకాలంలో అఖిలాంధ్ర సాహిత్యపరిషత్తు రూపొందేటట్లు చూడాలని (పార్థన. (కిన్నెర: సంపుటము 5, సంచిక 11, నవంబరు 1953) శ ళా సస టట ఈ) పష (సం.

కవి; విమర్శకుడు కాండూరు నరసింహాచార్యులు

న్ధార్ధముల రచనావైశిష్ట్రముద్వారా లోకోత్తరవర్ణనా వైచిత్యుముచే, ప్రకృతి నలంకరించి భావనాబలమున సహృదయుల హృదయములను రసోత్తరంగముల గావించువాడు కవి. ప్రకృతి చిత్రణ సంకల్పమున నా ప్రకృతిలో లీనమైపోవు నా కవికి శక్తి నిపుణత, లోకశాస్త్రకావ్యాద్య వేక్షణములు ఆతని విశిష్ట రచనకు మెయిగు పెట్టి నిరంతరము చెక్కుచెదరని యలంకారముతో నవనవోన్మేష శాలిత్వమును సమకూర్చుచు, లోకోత్తరత్వమును సాధించును. కవి తన కిష్టములైన కొన్ని పదముల నేరుకొని భద్రపరచి యా పదముల యల్లికచే నా రచనమును సాగించెద ననువాడుగా నుండడు, అట్టి రచనము కృతిమమగుటచే కుంటికుంటి నడచుచు రసికజన హృదయంగమము కాకపోవుటయెగాక పరిహాసాస్ప్పదము నగును. పదములు మున్నగువాని నేర్చికూర్చి హృదయదర్పణమున కవితా కాంతాసౌందర్యమును దిద్దుకొని మురియుట విమర్శకుల పని. రచనాదృష్టి వేరు. వివుర్శనాదృష్టి వేరు. దృఢవమూలమైన కవి సంకల్పమునకు తత్తద్రసానుకూలమైన శబ్బజాలము అహమహమికతో పరుగిడివచ్చి ప్రత్యక్షమై రచనావైశీష్ట్య్రమునకు తోడ్పడుచుండును. ఇందుకు కవికి దిట్టమైన లోకానుభూతి, భావనాబలము సాధనములు. పదముల నేరుకొని రచనకు కూర్చుండువాడు పలుకులు నేర్చిన చిలుక.

2006 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

కవి విమర్శకుడు కావచ్చును. విమర్శకుడు కవి కావచ్చును. కాని కవి[మైనప్పుడు విపుర్శకుడు కాడు. విమర్శకుడైనపుడు కవి కాడు. కావ్యమును చితించిన తర్వాత తన కావ్యమును తాను విమర్శించుకొనువాడౌగాక.

కవి హృదయము నవగాహన చేసికొని కావ్యమునందలి గుణదోషముల వివరించుచు. రసభావాద్యాచిత్యముల తేలుుచు, అందలి సారమును ప్రపంచమునకు చాటువాడు విమర్శకుడు. నిష్పక్షపాతబుద్ధి వ్రకృతిసమన్వయదృష్టి యతనికి విశిష్టగుణములు. విమర్శనమున తన ప్రత్యేకత నవలంబించువాడు వెతండికుడు. వైతండిక హృదయము ద్వేషాసూయలకు మార్గము చూప్పును. సత్యము నెజింగి తత్త్వమును నిరూపింపజాలకపోవుటయేగాక తన స్వరూపమును బహిరంగపరచు కొన్నదగును.

ఇతివృత్తము, సంఘటన, కల్పన, గుణములు, పదవాక్యవిశిష్టత, పాకము, (ప్రకరణాద్యాచిత్యము, భావగాంభీర్యము మొదలగు నంశములు రసాభివ్యక్తి కెంత మాత్రము తోడ్పడునన్న విషయమును నిరూపించుట నిజమైన విమర్శకుని పని.కేవలాభిమానమును ప్రదర్శించువా డసూయాపరుడు. కొన్ని విషయములలో నభిమానము మంచిదేమోగాని యిట్టివిషయములలో నయ్యది సత్యమును తారుమారు చేయగలదు. నిష్పాక్షికుడైన విమర్శకుడు కవి ప్రతిభ్యాపతిష్టలను విశ్వవ్యాప్త్రముల చేయగలడు.కుత్సితుడు కేవలాభివమానపూర్యుకములైన [పప్రచారములచే ప్రపంచమునకు ద్రోహి యగును.ఇందుకు ఆత్మశ్షాఘులు, పరనిందలు తోడ్పడెనేని నోరెత్తవలసిన యవసరమే యుండదు. గుణములను శ్లాఘించుట, దోషముల నుపేక్షించుట, లేదా సరసమార్గమున సవరించుట యుత్తమ లక్షణము.

“గుణదోషా బుధోగృహ్హన్నిందు క్షేళావివేశ్వరః

శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చ్భతి”

(శివుండు చందురు గరళము నవధరించు

పోల్కి బుధుడును గుణదోషముల (గ్రహించు.

మొదటిదానిని శిరమున మోసి మురియు

దక్కుదానిని కుత్తుక నొక్కియడచు.)

కావ్యుగుణములను పరిశీలించుట విమర్శకుని మొదటి పని.

కవిః విమర్శకుడు కొండూరు నరసింహాచార్యులు . 2007 “శేషః ప్రసాదస్సమతా సమాధి ర్మాధుర్యమోజః పదసౌకుమార్యమ్‌, అర్థస్య చ వ్య క్తిరుదారతా చ కాంతిశ్చ కావ్యార్థ గుణాదశైతే” అని కావ్యగుణవయలను వివరించిరి. కాని, “వూధుంర్యము, ఓజస్సు, (ప్రసాదము”అనునవి మాత్రము రసాస్వాద హేతువులగు గుణములని నిశ్చయించిరి. చిత్తమును కరుగనిచ్చి యానందపరవశము గావించు గుణవిశేషము మాధుర్యము. ఇయ్యది సంభోగశృంగార కరుణ, విప్రలంభ శాంతరసములయందు (క్రమముగ నతిశయించును. దీనికి కఠినవర్ణవర్డితమైన విడివిడి పదముల రచనగాని, కొద్దిపాటి సమాసములతోడి పదముల రచనగాని యనుకూలించును. చిత్తమును విస్తారముగా వికసింప చేయు గుణము ఓజస్సు. ఇది వీర, చీభత్స, ర్మౌాదరసవమలయందు [కవుముగా నతిశయించును. దీనికి దీర్పసమాసములతోడి యుద్ధతరచన యనుకూలించును. ఎండుకట్టెల నిప్పు రగుల్కొనునట్లు త్వరగా చిత్తము నందు వ్యాప్తిచెందు గుణవిశేషము (ప్రసాదము. ఇది యన్ని రసములయం దతిశయించును. అన్ని విధములైన రచనలు దీని కనుకూలించును. అనంతరము విమర్శకుడు [పఖ్యాతోద్బాద్యమిశ్రములగు నితివృత్తముల కనుగొని కవి (ప్రాచీనుడగుటయు నవీనుడగుటయు నెజింగి, యతని దేశకాలమును, పరిసరములు, సాంఘికవృత్తి, యతడు లోకమున కియ్యదలచిన సందేశము మున్నగునవి గుర్తించి,కావ్యనిర్మాణమున నతడు చూపిన చతురత, జాతీయత, సంస్కృతి, పరిణామములు అవగాహన చేసికొని, దోషెకదృక్కు కాక, కావ్యమునందలి భావగాంభీర్యమును, ప్రకరణాద్యాచిత్యమును: రసపుష్టిని నిరూపించి, కవి ప్రతిభాప్రతిష్టల కెల్ల లేర్పురచు వాడు గావలయును. (ప్రాంతాభిమానములకును, సంఘాభిమాసములకును నెంతమాత్రము చోటిచ్చువాడు కాగూడదు. పరిశ్రమలేకయే దొరికిన వస్తువునకు మెబుగుపెట్టి భ(దదపరచుటవంటిదగు (ప్రఖ్యా తేతివృత్తకకావ్యమునందు భావపుష్టి, రచనా చమత్కృతి గమనించవలసిన

2008 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యంశములు. [శ్రవుపడి [కొత్తవస్తువును సంపాదించి మెజుగుపెట్టి భద్రపరచుటవంటిదగు కల్పితేతివృత్తకకావ్యమునందు కల్పనాచమత్కృతి, రచనావైశిష్ట్రము, భావపుష్టి గమనించవలసియుండును. మిశ్రకావ్యమునందు పె విషయములతోపాటు ప్రకరణాద్యాచిత్యమును గమనించవలయును. ఇంతకు తేలినదేమన, కవియను లోకోత్తరపురుషుడు ఉత్తమపురుషార్థసాధక దృష్టిచే నవనవ భావ కుసుమోన్న్మేషవిలసితంబులగు క్రొంగ్రొత్త కావ్యోద్యానముల సృజియించి, ప్రజాజీవిత విధానమునకు మార్గదర్శకుడై, వారికి మానసిక విశ్రాంత్యానంద సౌఖ్యముల చేకూర్చుచు, నాచంద్రార్శము యశశ్చందదికల లేజరిల్లుచు, చిరంజీవి యగుగాక. విమర్శకరసికు డా కావ్యోద్యానముల (ప్రవేశించి, యాహ్లాద జనకములగు

గుణములను మానోజ్జకమార్గముల సంచరించుచు, నందలి రీతులను తిలకించుచు, లలితపదవాక్యవిస్ఫురణశారికాకీర కోకిలధ్వనుల కలరుచు, భావాంకురవిలాసమున కుల్లసిలుచు, చి(త విచితాలంకారపద్దతుల క చ్చెరువందుచు, బెచిత్యకుసుమవికాసముల కానందించుచు, నవరసఫలాస్వాదమదోన్మత్తు డై కవి కావ్యపతిష్టా మధురగీతికను పాడుకొనుచు దీర్జాయువై వర్థిల్లుగాక. (కిన్నెర; సంప్పుటము 5, సంచిక 11, నవంబరు 1953)

అ హైహావాల వావిష.9

6, కసత ఇషళ్‌ ప్రి

లట అలలింంంలి,

ఆమా ౨9

ప్రజాకవి “దాశరధి * పి. వి. రత్నం 'తెలుగునాడులో శ్రీశ్రీకి నేడు ఎంతో గౌరవం, పేరు ఉన్నాయ్‌. అలాగే _ తెలంగాణాలో “దాశరథికి మంచి ప్రతిష్ట, మర్యాద ఉన్నాయ్‌. కారణం ఇద్దరూ ప్రజాకవులే. విప్లవభావా లున్న వారే. అభ్యుదయ దృక్పథంతో, ప్రజా సమస్యలను వారు పరిశీలిస్తారు. వారు (ప్రజలకోసం, దేశ బెన్నత్యానికి, తీవకృషి చేస్తారు. విశాలహృదయులు కాబట్టే, వారి కలాలకు “విలువలు ఏర్పడ్డాయి.

దాశరథిలో యువకరక్తం పొంగుతుంటుంది. పీడిత ప్రజల కష్టనష్టాలకు అతను గిలగిల కొట్టుకుంటాడు. అయినా నిరుత్సాహపడడు. ఆశావాది; త్మీవవాది. బానిసత్వం హేయమైనదంటాడు. పీడించే శక్తుల్ని తుదిముట్టించాలంటాడు. నిరంకుశత్వం నశించాలంటాడు.

“*జనవాణి"ని వింటాడు. చక్కగా పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటాడు. అదే “దాశరథి”లోని విశిష్టత. నిత్యం (ప్రజానీకంతో సన్నిహిత సంబంధ బాంధవ్యా లుంచుకుంటాడు. అందుకే అతని కలం “పేదల కన్నీరును తుడిచివేస్తానంటుంది. అదే అతనిలో ప్రత్యేకత.

ఐక్యపునాదులు బలంగా వున్నప్పుడు, చైతన్యం ఉట్టిపడి నప్పుడు సాధించలిని దేముంటుందంటాడు. మచ్చుకు:

“రానున్నది యేది నిజం ?

అది ఒకటే సోషలిజం పందెం మల్లకార్డుసరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

2010 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

కలపండోయ్‌ బుజం బుజం

కదలండోయ్‌ గజం గజం.” దాంతో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. హృదయాల్లో నాటుకునిపోయే అతని మాటలు, నగ్నసత్యాలనిపించి, ఒక అభ్యుదయపథంలో పరుగులు పెట్టిస్తాయ్‌. అందుకే నిరాశ, నైరాశ్యాలతో ఏమీ తోచక వున్న ప్రజాబాహుళ్యానికి ఒక సందేశం

వినిపించడంతో, ఎగిరి గంతువేస్తాడు. ఆర్థిక సాంఘిక సమానత్వం ఏర్పడాలని

గొంతెత్తి చాటుతాడు. ఇలాంటి గేయాలే మనకు కావాలి. ఇలాంటి “దాశరథు"ల్నే మనం కోరుకునేది. ం.

అతను ఆశావాదని చెప్పేనుగా. ఆకలిమంటల్ని చూసి అతను జాలిపడుతాడు. వాటిని ఆర్బాలి. అభాగ్యుల్ని ఆదుకొని ఆదరించాలి. అతని ఆకాంక్ష అది. ఉజ్జ్వల భవిష్యత్తు, నవవసంతం ఎప్పుడెప్పుడని ఎదురుచూచే స్వభావం అతనిది. ఈ కన్నీరూ, ఈ బాధలూ, ఈ నిట్టూర్పులూ, ఈ విషమ క్షామ పరిస్థితులూ ఎప్పుడు పోతాయో అని ఆలోచించే వ్యక్తి అతడు. వినండి ఇది:

“అన్నార్తులు అనాథధు లుండని

ఆ నవయుగ మదెంత దూరమా?

కరువంటూ కాటకమంటూ

కనుపించని కాలా లెప్పుడో?” ఇలా అతని కలం చిందులు తొక్కుతుంది. ఇంతవరకూ ఎవ్వరూ ఊహించని, చెప్పలేని నిగూఢ సత్యాల్ని మనకు వినిపెస్తాడు. దర్శిదుల ఘోష పాపం విన్నారా అంటామేగాని, వారి ఆలోచనలు, ఆశలు, మనస్తత్వాల్ని సూటిగా ఆలోచించ లేకపోయాం. కాని మన విష్లవప్రజాకవి “దాశరథి” ఏమంటున్నాడో వినండి.

“అణగారిన అగ్నిపర్వతం

కనిపించని “లావా” యెంతో

ఆకలితో చచ్చే పేదల " |

శోకంలో కోపం యెంతో?” ఒ అబ్బ! చిన్న వాక్యంలో ఎంతటి విషయాన్ని వల్లడించగల్లాడో! బీదల పొట్లు ఇన్నిన్ని కావు. కృంగి, కృశించి, “కర్మ” అనుకుంటూ ఉసూరుమంటూ, కాలాన్ని నెట్టుకొనిపోయే నిర్భాగ్యుల శోకంలో, బాధలో, ఎంత కోపం వుంటుందో, ఎప్పుడు,

ప్రజాకవి దాశరథి ప్‌. వి. రత్నం + 2011 ఎక్కడ వుంటుందో, ఇంతవరకు ఎవ్వ రైనా చూశారా? పోనీ చెప్పారా? అదే , “దాశరథి” గొప్పదనం.

(ప్రపంచం మారుతుంటుంది. అప్పుడే ఎన్నో పరిణామాలు కన్చిస్తాయ్‌. మానవుని పురోగమనంలో ఆగి, వెనక్కి తిరిగిచూసుకుంటే ఆశ్చర్యం, ఆనందం కల్గుతాయ్‌. ఎన్నెన్నో అమర సత్యాలు బయటపడుతాయి. ఇంతటితో మానవుడు ఆగిపోలేదు. ఇంకా ఇంకా అభివృద్ధిపొందాలని అతను కోరుకుంటాడు. మన “దాశరథి” ఏమంటున్నాడో కొంచెం ఇటు వినండి.

“భూగోళం పుట్టుకకోసం

కూలిన సురగోళా లెన్నో?

నరమానవ రూపంకోసం

జరిగిన పరిణామా లెన్నో?”

చరిత్రపుటలు తిరగవేస్తే తొలి జీవకోటికి, నేటి మానవుని మనుగడకు దొర్లిన ఘట్టాలు కళ్లకు కనిపిస్తాయ్‌.

స్వాతంత్య్యం, శాంతి, స్వేచ్చ: అభ్యుదయంకోసం శ్రీశ్రీ, దాశరథి అవిరళమైన కృషి చేస్తున్నమాట నిజమే. కాని శ్రీశ్రీ రష్యా సామాజ్యవాద కమూ్యనిస్టు నియంతృత్వంకోసం - అది తప్పిస్తే మిగతాదంతా భూతలస్వర్గమే అనుకున్నా- కలం పరవళ్లు (త్రొక్కితే, దాశరథి కలం కేపిటలిస్టు కుళ్లు వ్యవస్థను తొలగించి, సోషలిస్టు సమసమాజ నిర్మాణానికి ప్రజలను సుసంఘటిత పరచడానికి ముందుకు ఉరుకుతోందనేది యథార్థం. పోతే, ఎవరు ఏయే బాటల్లో పోతున్నా, కాలం నిర్ణయించాలి ఎవరి దృక్పథం 'రైటనేది.

(కిన్నెర: సంపుటము 5, సంచిక 12, డిశంబరు 1953) యమ్‌ గొ) ీ, ళం: ఇ నాన. శ శు నం: అ వయ (గళ ధాటాను యటం గ్‌ మా క్‌ వం చ్‌ 4 గ్‌ బ్బ! 95ం/ స | (వేప యు. [ ల [ 1 వ ల గ స నాయాల

మన సాహిత్య సంగ్రామములు కేతవరపు వేంకట రామకోటి శాస్తం “కిన్నెరా అక్టోబరు సంచికలో ఫై శీర్దికతో శ్రీ గ్యారెపాటి వెంకటసుబ్బయ్య గా రొక వ్యాసం వ్రాసిన విషయం పాఠకులకు విదితమే. “సాహిత్యాన్ని ప్రజల కందుబాటులోనికి తేవాలని పప్రయత్నించినప్పుడల్లా సంపప్రదాయకులు అడ్డుతగులుతూనే ఉన్నారు. సంప్రదాయులకూ, సంస్కారులకూ ఈ సందర్భములో అనేక సాహిత్య సంగ్రామములు జరిగినవి ఇది వారి వ్యాసంలోని మొదటిపేరా. ఇందులో సాహిత్యమన్న పదాన్ని శ్రీ వెంకట సుబ్బయ్య గా రెంత పరిమితార్థంలో వాడారో మనం గమనించాలి. వారుమాత్రం ఈ విషయాన్ని ఆ వ్యాసంలో ఎక్కడా పేర్కొనలేదు. సాహిత్యం అన్న పదంతో మూడువంతులు కవిత్వాన్నీ, ఒకవంతు భాషనూ (గ్రహించినట్లు ఆ వ్యాసాన్ని కొనదాకా చూస్తే మన కవగాహన అవుతుంది. అంటే శ్రీ వెంకట సుబ్బయ్యగారు తమ వ్యాసంలో వుద్దేశించింది మన కవిత్వంలో జరిగిన సంగ్రామాలనూ, భాషలో జరిగిన సం[గామాలను అన్నమాట. ముందు కవిత్వం విషయం ఆలోచిద్దాం. కవిత్వం అంటే - మేధశ్శక్తి చేతసంయతమునూ, సంభావితమునూ ఐ, లయ తాళ సమన్వితమైన భాషలో వ్య క్తీకరింపబడిన, మనోహరమును, ఉత్కృష్టమును ఐన భావోద్వ్యృత్తి. దీన్ని సహృదయుడు గమనించి ఆనందిస్తాడు. కవియొక్కయు, కవిచేత కల్పింపబడిన పాతలయొక్కయు, సంస్కార విశేషానుగుణమైన యనుభూతులతో నఖేధ “పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంవుటము 1: సాహిత్యము

మన సాహిత్య సంగ్రామములు _ కేతవరపు వేంకట రామకోటి శాస్త్ర 2013 ప్రతిపత్తినందగల సంస్కార విశేషానుగుణమైన అనుభవ హృదయముగలవాడే సహృదయుడు - ఇది అసలు సిద్ధాంతం. ఇక దీన్ని ప్రజల కందుబాటులోనికి తేవాలని ప్రయత్నించటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. అసలు ప్రజలు అన్న శబ్దాన్ని సాహిత్యవిషయకమైన చర్చలో విశృంఖలంగా వాడరాదు. కొంత అధికారం గలిగిన ప్రజాసమూహానికే సాహిత్యం అవసరం. ఈ అధికారంలోగూడా తరతమ భేదాలున్నాయి. ప్రజలందరికీ సాహిత్యం అందుబాటులో ఎప్పుడూ వుండదు. ఒకవేళ తానుగా ప్రజలందరికీ అందుబాటులో వుండాలని సాహిత్యమే కోరి సమీపిస్తున్నా “నీతో మాకేంపని" అనే ప్రజలు కొందరుండక తప్పదు. అందువలన సాహిత్యం పరిమితిగల ప్రజలకు మాత్రమే. ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆనందించేవారి అధికారంలో గల తరతమ భేదాల ననుసరించే సాహిత్యంలో మార్పులు వస్తూవుంటవి. ఈ మార్చులనే శ్రీ వెంకట సుబ్బయ్యగారు సంప్రదాయులకూ - సంస్కారులకూ జరిగే సాహిత్య సంగ్రామముల ఫలితమన్నారు. దేనికైనా ఒక సంప్రదాయం వుంటుంది. అది అనుసరణీయం. దాన్ని అనుసరించకపోవటం సంస్కారం గాదు. సంప్రదాయాన్ని వదలకుండా నూతన వికాసాన్ని పొందటం సంస్కారం. తనుగువారికి అన్నీ సంస్కృత సంప్రదాయాలే. ఇది అనాదినుంచీ వస్తూవుంది. నన్నయ సంస్కృత సంప్రదాయాన్ని వదలి భారత రచన చేయలేదు. తన తనుగు కవిత్వం అంతా సంస్కృత సంప్రదాయానుసరణమే. శ్రీ వెంకట సుబ్బయ్యగారు “పథమ సాహిత్య సం[గ్రావుము (సంప్రదాయులకూ - సంస్కారులకూ) భారతాంధ్రీకరణ సమయమందు జరిగినది" అని వాశారు. ఇందులో గల విశేషము పాఠకులు గమనించగలరు,

ఈ విషయం ఈలా వుండగా “....ఆనాడు సంస్కృతమే విద్య. అది కేవలం (బాహ్మజణాధీనం....వారు మతము మొదలగు విద్యలు తక్కువ కులమువారికి తెలియకుండా వృండవలయునన్న తలంప్పుతో గట్టి కట్టుబాటు చేసికొనిరి. అందుచేతనే వారు దేశభాషలో (గ్రంథరచన చేయరైరి.” అని సిద్ధాంతముగా నొకదానిని ప్రతిపాదించిరి. ఇందలి సత్యమును కొంచము పరిశీలించవలయును. ఆనాటి విద్య మైన సంస్కృతము కేవలం బాహ్మణాధీనం అన్న వాక్యాన్ని

201% పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మనం ఒప్పుకొనితీరాలి. అయితే చిన్న ప్రశ్న. నేటి విద్యమైన ఆంగ్లం ఎవరి ఆధీనం? చదువుకొన్నవారి ఆధీనం - అంతేనా? చదువుకోనివాడికి ఎవిద్యమైనా ఏలా వస్తుంది? ఇన్ని కాలేజీలు - ఇన్ని హైస్కూళ్లు - ఇంత ముద్రితమైన సాహిత్యం - ఇన్ని పతికలు ప్రబలిన ఈకాలంలోనే మనదేశంలో చదువుకొన్న వారి సంఖ్య అత్యల్పం అని అనుకుంటూ - ఏవిధమైన అవకాశమూ లేని ఆరోజుల్లో

  • విద్య కేవలం మననం చేసికొనవలసిన ఆరోజుల్లో - ఆ విద్య ఒక్క (బాహ్మణాధీనమేనని - వారు ఇతరులకు తెలియబరచలేదని - నిందించటం - ఉత్తమ నాగరికులమైన మనం చేయవలసిన పనిగాదు. గుండెమీద చేయివేసుకొని ఆలోచిద్దాం - ఆంగ్లం వనం ఎంతమందికి నేర్పి అందుబాటులోనికి తీసుకురాగలుగుతున్నాం? - నిందలవలన ప్రయోజనం లేదు. ఇతీర కులాలవారికి తెలియకుండా వుండాలని దేశభాషలో (గ్రంథరచన చేయలేదనటం దూరం విచారించకుండా అన్నమాట. నాడు (ప్రాముఖ్యత గీర్వాణభాషకు గలదుగాని దేశభాషకు లేదు. నాటి రాజకీయ వ్యవహారమంతయు గీర్వాణముననే. ఆ భాష నేర్చుకొనినవారే పండితులు. అన్నివిధముల ప్రాముఖ్యము గలిగిన ఆ సంస్కృతమున పండితుడైనవాడు (గ్రంథరచన మింకొక భాషలో చేయునా? చెయగలడా? ఇంత దేశభాషాభివూనము రేకెత్తిన ఈరోజులలో విశ్వవిద్యాలయములందు శాస్త్రపరిశోధనలను జరిపి వ్రాయు 1706515 ఆంగ్లముననా? ఆంధ్రముననా? ఆవిధముగా నాంగ్లమున 106515 వ్రాసిన వాని యభిప్రాయము తాను వ్రాసినది దేశీయులకు ఆలియకుండా ఉండవలయుననియా? కాదుగదా! మరి వెనుకటి సంస్కృత పండితుల విషయమును అంతేగదా! వారిని నిందించటం అపచారం. పూర్వాపరములకు సంబంధించిన నిశితమైన ఆలోచనలేకపోవటం. లేకపోతే నలుగురిచేత ఓహో అనిపెంచుకోటంకోసం. సాహితీవేత్తల కీపద్ధతి సమంజసమైనదిగాదు. నేటి మనదృష్టితో వెనుకటి వారిని విమర్శింపరాదు. ఆ పరిస్థితులను అర్థము చేసికొనవలయును.

“ద్వితీయ సం[గామము పాల్కురికి సోమనాథుని కాలమున జరిగినది... పండితులు సంస్కృతాభిమానులై సహజమైన దేశభాషావికాసమునకు అవాంతరములు అధికంగా కలిగించుచుండిరి.” పాల్కురికి సోమనాథుని కాలమున సం(గ్రామ

మన పాహిత్య సంగ్రామములు కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 2015 మేదియు జరుగలేదు. వైదికమతము ముందు నిలువలేక నశించుచున్న శైవము నుద్ధరించుటకు సోమనాథుడు పూనుకొనెను. సోమన కడ్డుతగులుటకు ఘటికులవ్వరూ లేరు. నన్నయ నాటికే గతించెను. తిక్కన ఉద్భవింపలేదు. సోమనాథుడు తన మతమును ప్రచారము చేసికొనవలయును. మతప్రచారమనగానే ప్రజాసామాన్యము లోనికి పోవలయును. అనగా జానపదములలో మతప్రచారము సాగవలయుననుట. ఆ మతవిషయములను పాటలుగా పాడుకొనుటకు తగినట్లు కూర్చినగాని పల్లీజనులు మననం చేసుకోలీరు. ఆ పాటలనే వారానందించగలరు. ఈ విషయాన్ని గమనించే సోమనాథుడు ద్విపదలో తన మతప్రచారానికి గ్రంథాలు వాశాడు. ఇందులోగల అభిప్రాయం సాహిత్యాన్ని ప్రజలకందుబాటులోకి తొద్దామనిగాదు, మతాన్ని, ప్రజలలో ప్రచారం చేసుకుందామని. ఏలాగైనా సాహిత్యం కొంచం దగ్గరకొచ్చిందని చెప్పాలి. అయినా ఇందులోవున్న విశేషాలు ఎందరికి అర్థమయ్యాయి? సోమనాథుని బసవపురాణం - పండితారాధ్య చరిత చదివినవారికి వానిలోగల పాండిత్య ప్రకర్ష అవగతముగాక తప్పదు. నిజమునకు సాహిత్యము (ప్రజలకందుబాటులోనికి తేవలయుననియే సోమనాథుని అభిప్రాయమైనచో తన వేద వేదాంగ స్మృతి పురాణేతిహాసముల పాండిత్యమును ధర “బ్రాహ్మణో స హంతవ్య” “హరిగుంహరతం” “బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో2 ధిపతిః” “తద్ధ్విష్టోః పరంపదమ్‌” “కృతం కర్మ శుభాశుభం" “*రాజానుమతో ధర్మం” ఈ విధముగా వెల్లడించి యుండడు. ఇతడు పేర్కొనిన “జానుతెనుగు” రచనలో నంతగా లేదు. కనుక "పండితైకవేద్యముగా నున్న సాహెత్యమును ప్రజలందరకూ పంచిపెట్టాలనే తలంపుతో శివకవులు వస్తువునందునూ కవితయందునూ, భాషయందునూ, ఛందస్సునందునూ మార్పుతెచ్చి అభ్యుదయమునకు తోడ్పడిరి” అను శ్రీ వెంకట సుబ్బయ్యగారి వాక్యమునందలి సత్యమును పాఠకులే గమనింతురుగాక!

  • “తృతీయ సంగ్రామము ఆంధ కవితా పితామహుని కాలమున జరిగెను అని వ్రాసిరి. పెద్దన కాలమున జరిగిన సంగ్రామమేమో నా కవగత మగుటలేదు. పెద్దన కెవరితో జరిగినదా సంగ్రామము? ఎవరూ వినకుండ వీరణం వాయించటం ఎట్లా? వేశ్యను నాయికనూ - పరభాషా పదప్రయోగమును - చేసినాడట పెద్దన. నాయికనగా వరూధినియే గదా? ఆమె వేశ్య యనుట విచార్యము. ఇక

2016 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము పరభాషాపదములా - రూఢములైనవానిని కవి (గ్రహించును. అందు విశేషము లేదు. నేడు “రైలు” “రోడ్డు శబ్బము లుపయోగించి కవిత్వము (వ్రాసినంత మాత్రమున ఒకరు దూషింపరు. వాని ధైర్యసాహసములకు మెచ్చి మరొకరు అందల మెక్కింపరు. ఇది నగ్నసత్యము. | దక్షిణదేశ ఆంధ్రవాజ్బ్యయ సందర్భమునగూడ లాక్షణికులకును ఆనాటి కవులకును సం[గామము జరిగెనని మాత్రమే వ్రాసిరి గాని శ్రీ వెంకట సుబ్బయ్యగారు ఒక్క సంగ్రామమును పేర్కొనలేదు. వెంటనే “వారు సాహిత్యము (ప్రజలకు చాలా అందుబాటులో వుండాలనే సంకల్పంతో ఛందోభంగ మొనర్చుటేగాక వ్యాకరణ శృంఖలాలను గూడా తెంచిరి” అని వ్రాసిరి. ఛందోభంగమైతీనున్నూ - వ్యాకరణ శృంఖలాలను (తెంచుకుంటేనున్నూ సాహిత్యం (ప్రజలకు చాలా అందుబాటులోనికి వస్తుందా? (ప్రజలకు సాహిత్యం చాలా అందుబాటులోనికి రాకుండా వుండగలందులకేనా ఛందస్సు - వ్యాకరణం - పుట్టింది? ఈగతి ఒక్క ఆంధ్రభాషకే పట్టిందా? లేక ప్రపంచభాష లన్నింటికీ "పట్టిందా? ప్రపంచకంలో ఏభాషకు చెందిన సాహితీవేత్తైనా ఈ అభిప్రాయాన్ని ఎన్నడైన వెలిబుచ్చాడా? ఛందస్సంటే ఏమిటి? అదొక భూతమా? కవిత్వంలోని సంగీతమేగదా ఛందస్సు 1! శిశువులనుండి పశువులవరకు తన్మయత్వము నొందించునది సంగీతమేగదా! అది కవిత్వములో భంగమైననాడు ఎవరికి? కనుక ఛందోభంగము అభ్యుదయ సూచక మనుకొనుట పొరబాటు. ఇక వ్యాకరణం అంటే ఏమిటో చూద్దాం. “వ్యాక్రియంతే వివిచ్య ప్రదర్శ్యంతే అనేకశబ్దాః ఇతి వ్యాకరణం” అని భాష్యకారుని నిర్వచనం. అంటే భాషలోని శజ్ఞాల రూపనిష్పత్తిని చూపిస్తూ వాక్యంలో వుపయోగింపబడినప్పుడు పరస్పర సంబంధమెట్లుండునో నిరూపించటం వ్యాకరణం చేసేపని. ఈ నిరూపణలేకపోతే సాహిత్యం మనకేమి అర్ధమౌతుంది? అర్థంగాని సాహిత్యమేం జేసుకోను గనుక? - అయితే ఇక్కడ ఒక విషయం. వ్యాకరణం కేవలం భాషకు సంబంధించింది గనుక కొంత మార్పు చెందుతూ వుంటుంది. వైయాకరణి దేశంలోని ప్రతివ్యక్తి పలికే పదాన్ని సాధించి ప్రయోగయోగ్యత గలుగజేయలేడు. ఏ కవీగూడా అన్ని పదాలను (గ్రహించి ప్రయోగించలేడు. కవి ప్రయోగించినవన్నీ గూడా వైయాకరణి తనకు

మన సాహిత్య సంగ్రామములు .. కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 2017 నచ్చకపోతే సాధించడు. తరువాత కొంతకాలమునకు సాధింపబడుతుంది. ఈవిధమైన నియమాలుంటే సాహిత్యం నియమాలు గ్రహిస్తే అంతా అర్ధమవుతుంది. ఏవిధంగా చూచినా ప్రజల కందుబాటులోనికి తేవటానికి సాహిత్యాన్ని - ఛందస్సునూ = వ్యాకరణాన్నీ అత్మికమించారని దక్షిణాంధ్ర కవులను పేర్కొనటం అంత సమంజసంగా కనుపించటంలేదు.

ఆత్మాాశయమైన భఖభావకవిత్వానికీ గూడా పండిత (పకాండులు, పూర్వఛాందసులు, అభ్యుదయనిరోధకులు అడ్డుబడినారట. పండితుడనగా శ్రీ వెంకట సుబ్బయ్యగారి భావన సంస్కృత పండితుడే గదా! భావకవిత్వము వాసిన ఆంధ్రులలో సంస్కృత పండితులు కానివా రెవరు? వీరి దృష్టిలో, ఏదేని ఒక క్రొత్త పనిని మొదలుబట్టుట అభ్యుదయమనీ, ఆ కార్యమును హర్టించలనివా రందరూ అభ్యుదయ నిరోధకులనీ ఉన్నట్లున్నది. ఇది అంత మంచి అభ్గిప్రాయముగాదు. ప్రతి క్రొత్త విషయము మంచిదికాకపోవచ్చును. అట్లే ప్రతి పాతది చెడ్డదికాకపోవచ్చును. అందువలన మొదటిదాని నెదిరించినవారు అభ్యుదయ నిరోధకులని - రెండవదాని ననుసరించినవారు పూర్వఛాందసులనీ నిందించుట (శ్రేయస్కరము గాదు. మన మాయా పరిస్థితులను సమగ్రముగా అర్ధముచేసికొని ఆయా కాలములందలి కవితారీతులను గమనించి ఆనందించవలెను. భాషావిషయికమైన సం[గ్రామముల నంతగా శ్రీ వెంకట సుబ్బయ్యగారు పేర్కొనలేదు. వీరేశలింగంగారిని, గిడుగువారిని పర్కొనినారు. ఆ విషయమును వారే పూర్తిగా చర్చించలేదు. మనమును దాని నట్లే వదలవలయును. ఇక చివరి వాక్య మొకటి గలదు. వ్యాసములో తాము చెప్పిన విషయము పాఠకున కెక్కినదో లేదోనని “నాటినుండి నేటివరకు ఇటుల లాక్షణికులు, సంస్కృత భాషాభిమానులు, అభ్యుదయనిరోధకులు సాహిత్యాన్ని (ప్రజలకు అందుబాటులోకి తేకుండా వుండవలయుననే అడ్డుపెట్టుచున్నారు. కాని విజయం అభ్యుదయ వాదులదే” అని సూత ప్రాయముగా నెక్కించుచున్నారు. త్రీ గొరెపాటి వెంకట సుబ్బయ్యాగారి లాంటివారు ఈవిధమైన అభ్మిపాయములను వెలిబుచ్చుట చూచి కొంత ఆశ్చర్య పడవలసియున్నది. వారియందు నాకు గౌరవప్రపత్తులులేక ఈవిధంగా వ్రాశానని పాఠకులు

2018 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము (భమింపగూడదు. నాకు ఇష్టమైన రచయితలలో ముఖ్యముగా విమర్శకులలో వీరొకరు. కాని నాకు తోచిన సత్యమును ఆలియజేయకుండుట ఎట్లు? దేశకాలములను బట్టి అన్నింటియందును మార్పులు వచ్చును. అందొకదానిని దూషించుటగాని, మరొకదానిని భూషించుటగాని పనికిరాదు. రెండింటియందును గల నిగ్గును తిలకించి నిరూపించి చెప్పుటయే అవసరము. ఆవిధముగానే తదనుగుణమైన దోషమునుగూడ నిరూపింపవలయును. దూషణముగాని భూషణముగాని విమర్శకు లక్షణములు గావు. (కిన్నెర: సంపుటము 5, సంచిక 12, డిశంబరు 1953) యాను (షు ల్‌ (మము. మ గ్‌ ్ట్‌ (రై /6 మ్య లోగ సషజాళ ర్‌

మున నాహెత్య సంగ్రామములు: సమాధానములు గొపాటి వెంకట సుబ్బయ్య నేను “క్రిన్నెర” అక్టోబరు సంచికలో “మన సాహిత్య సం[గగామములు” అనే వ్యాసమును వాసిన సంగతి పాఠకులకు విశదమే. డిశంబరు సంచికలో శ్రీయుత శీతవరపు వేంకటరామకోటి శాస్త్రిగారు నాయందెంతో గౌరవము కలదని యొకవైపు చెప్పుతూ మరియొకవైపున నేను అసత్యాలను వాసితినని, పూర్వులను నిందించానని, యిది నాగరిక లక్షణముగాదని, నన్ను మందలిస్తూ నా వ్యాసములోని (పతి అంశము ఖండించ (ప్రయత్నించారు. వారు నన్ను పేరుపెట్టి దూషించలేక పోయినా, వారి ఆరోపణలు అసత్యములు, పరస్పర విరుద్ధములు, అమర్యాద కరములు, వారు సత్యమని నమ్మినవి వ్రాసినట్లే నేనూ వ్రాశాను. నావి అసత్యములు కావని, నా కెవ్వరిని నిందించవలసిన అవసరము లేదని, అది నా స్వభావమునకే వ్యతిరేకమని, ఆయా కాల పరిస్థితులను ఆలియజెప్పుటకే నేను కృషి చేసితినని నా మనవి. వారి ఖండన అంతకు సమాధాన మిచ్చుటకంటే స్థాలీపులాక న్యాయముగా యిచ్చిన చాలునని భావిస్తున్నాను.

2020 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నేను పనిబడి ఎవ్వరిని (ప్రశంసించలేదు నిందించనూలేదు. ఆయా కాల పరిస్థితులను మాత్రమే పొందుపర్చాను. ఎప్పుడూ సంప్రదాయకులకూ (10 0౧2౧౮౭౧) సంస్కారులకూ (౧|౦-౦౧౬౧౩- 6/5) సం[గ్రామము జరుగుతూనేయుంటుంది. అది వికాసానికి మార్గము. అది సాహిత్యములోనే కాదు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయము లన్నిట జరిగెడిదే. ఇక (ప్రస్తుత విషయమునకు వద్దాము. “ఈనాడు విద్య యనగా ఆంగ్లమని భావిస్తూన్నట్లే ఆనాడు సంస్కృతమే విద్య అది కేవలం బాహ్మణాధీనం. అనే నా వాక్యాన్ని - ఆనాటి విద్య మైన సంస్కృతము కేవలము (బ్రాహ్మణాధీనం అనే వాక్యాన్ని మనం ఒప్పుకొని తీరాలి. దాన్ని అలా ఒప్పుకొంటూ మరల “ఆ విద్య యొక బ్రాహ్మణాధీనమేనని - వారు ఇతరులకు తెలియపర్చలేదని - నిందించటము - ఉత్తమ నాగరికులమైన మనము చేయవలసిన పనికాదు. గుండెమీద చేయివైచుకొని ఆలోచిద్ధాము. ఆంగ్లము మన మెంతమందికి నేర్చి అందుబాటులోనికి తీసుకురాగలుగుతున్నాం? నిందవలన ప్రయోజనము లేదు అంటారు శ్రీ శాస్త్రెంగారు. ఒకవైపున అది (బాహ్మణాధీనం అన్నమాట తామంగీకరిస్తూ, నేను (బాహ్మణుల పైన నిందమోపినానని చెప్పటము ఏమి న్యాయము? అది ఆనాటి పరిస్థితి అంతేగాని నిందగాదు. “శూదమక్షర సంయుక్తం దూరతః పరివర్ణయేత్‌” అన్నది కూడా ఆనాటి సితే తల్పును. ఇక అప్పకవి సంగతి అందరెరిగినదే. “ఉపమ గలిగిన శయ్యల నొప్పియున్న నం(ఘ్రిభవుని కావ్యమ్ము గగ్రాహ్యంబుగాద” న్నాడు కదా. ఈర్ష్య అసూయలు ఎవరిమీద ఎవరికో విజ్ఞులకు వివరించ నక్కరలేదు. అది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు నేను వారినిగాని, వారివారినిగాని నిందించుటలేదు. ప్రపంచమంచట ఒకనాడు యిట్టివారి వాక్యమే ప్రతిదేశమందున చలామణియొనది. ఈనాడు ఎంతమందికి ఇంగ్లీషు నేర్పుతున్నాం అంటున్నారు వీరు. దానికి నా సమాధానమేమిటంటే; సంస్కృతమును నేర్చుకొనుటకు ఆనాటి వర్ణవ్యవస్థ

మన సాహిత్య సంగ్రామములు: సమాధానములు... గ్యొరెపాటి వెంకట నుబ్బయ్య 2021 ననుసరించి కొందరికే విద్యాపప్రవేశము గలదు. ఈనాటి పరిస్థితులనుబట్టి ఆంగ్లము చదవరాదని విధినిషేధాలు లేవు. అన్ని కులాలవారు చదువుకుంటున్నారు. విద్య అధికముగా ప్రచారము గాకపోవుటకు గల కారణము ప్రభుత్వ విధానములో యున్నది. అది లోగడ పరాయి (ప్రభుత్వమగుటయే కారణము. మరియొక సంగతి. ద్వితీయ సంగ్రామము పాల్కురికి సోమనాథుని కాలమున జరిగినదని నేనంటే శాస్త్రిగారు “పాల్కురికి సోమనాథుని కాలమున సంగ్రామము ఏదియు జరుగలేదు అన్నారు. ఈయొక్క సత్యాన్ని (గ్రహిస్తే మా ఉభయుల' చిత్తశుద్ధి సహృదయులకు విదితము కాగలదు. “ఒప్పుదు ద్విపద కావ్యోక్తి నాజనదు ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన - మానుగ సర్వజన మాన్యంబుగామి జాను తెనుగు విశేషము ప్రసన్నతకు" - (పండితారాధ్య చరిత్రము పె పలుకులు ఏమి చెప్పను? ద్విపద కావ్యభాషగా పనికి రాదు అనెడివారు వుండుటచేతనే గదా ఆయన యీ సంగతులు చెప్పినది. అదే సాహిత్య సంగ్రామము. సోమన కడ్డుతగులుటకు నన్నయ తిక్కనాది ప్రతిభావంతులు లేరు గనుక అది యెలా పొసగునంటారు. ఎవరూ లేకపోతే సోమనాథుని సమాధానము ఎవరి నుద్దేశించి చెప్పినట్లు? _మార్గకవుల నుద్దేశించి చెప్పినట్లు మనకు స్పష్టమగుచున్నది. దీనికి నిదర్శనము ఈ చిన్న ఉదాంతాన్ని గమనించండి. ఆనాడు సోమనాథునియందు, ద్విపదయందు భావికవులకు ఎంత ద్వేషము. కలదో కనుగొనవచ్చును. [పతాపరుదుడు ఓరుగల్లులోని దేవాలయమునకు వెల్లినప్పుడు శైవులు మంటపముమీద కూర్చుండి బసవపురాణము వినుచుండిరి. అదేమిటని రాజడుగగా “మొన్న నీనడుమ పాల్కురికి సోమపతితుడు మధ్య వళ్లు పెట్టి యల్సిన యప్రమాణ బసవ ద్విపదపురాణపఠన” మని ఒక బ్రాహ్మణుడు సమాధాన మిచ్చెను.

2022 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కనుక మై సంగతులు ఏమి చెప్పును? ఆనాటికి అమలులో వున్న మార్గకవితక్తు భిన్నముగా సోమనాథుడు దేశకవితను ప్రవేశ పెట్టినందుకు ఆగ్రహము తఆలియబేయును. (పజల కందుబాటులోనికి భాష తెద్దామనిగాక మతపచారముకోసము సోమనాథు డట్లా వ్రాశాడంటారు శాస్త్రిగారు. నన్నయ భారతరచనకూడా అందుకే

  • అన్న సంగతి అందరూ ఎరిగినదే. ఉభయులు మతప్రచారముకొరకే వాశారు. కాని వారి మార్గాలు మాత్రము భిన్నము. నన్నయ అనాటి పరిస్థితి ననుసరించి మార్గకవితకు మార్గము చూపాడు. అలాగే తన పరిస్థితులనుబట్టి సోమనాథుడు ఇక యీ విషయములో తేల్చిన సారాంశ మేమిటంటే “ఎలాగైనా సాహిత్యము కొంచెము దగ్గరకు వచ్చినదని చెప్పాలో అని అంగీకరిస్తూ మరల దానికి వ్యతిరేకముగా యిలా వ్రాస్తారు. “నిజమునకు సాహిత్యము (ప్రజలకు అందుబాటులోనికి తవలయుననియే సోమనాథుని అభ్మిపాయమైనచో తన వేద వేదాంగ స్మృతి పురాణేతిహాస పాండిత్యమును “బాహ్మణో న హంతవ్య” హరిగుంహరతం - యీ విధముగా వెల్లడించి యుండడు” అంటారు శాస్తింగారు. అది వాదఘట్ట మగుటచేత ఆ సందర్భాన్ని అనుసరించి అట్లా చెప్పవలసివచ్చింది. కొన్ని సంస్కృత శబ్దాలు ఉన్నంతమాత్రాన అది సంస్కృతపదభూయిష్ట రచన యని అనరాదు. [గంథం ఆసాంతం ఎలా సాగినదో సహృదయులకు లఆలియనిదికాదు. |
  • వారి మాట నా మాట విడిచి పూజ్యులగు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుగారు పలికినది పరిగ్రహించండి. “సోమనాథుడు బసవ పురాణమును, పండితారాధ్య చరిత్రమును తేట తెనుగు ద్యిపదయండు రచియించెను (ఆంధ వాజ్మయ సూచిక. పుట 67.) సత్యాసత్యములను పాఠకులే పరిశీలింతురుగాక. మరొక ఆరోపణ “ఇతడు పేర్కొనిన “జానుతెనుగు” రచనలో అంతగా లేదు. కనుక పండిళైకవేద్యముగానున్న సాహిత్యమును ప్రజలందరకు పంచిపెట్టాలనే తలంపుతో శీవకవులు వస్తువునందును, కవితయందును, భాషయందును, ఛందస్సునందును

మన సాహిత్య సంగ్రామములు: సమాధానములు గ్యొరపాట్‌ వెంకట నుబ్బయ్య 2023 మార్పు తెచ్చి అభ్యుదయమునకు తోడ్పడిరి అను శ్రీ వెంకట సుబ్బయ్య గారి వాక్యము నందలి సత్యమును పాఠకులే గమనింతురుగాకి అంటారు శాస్త్రిగారు. అంటే నేను ఒక అభూతకల్పనను కల్పించి అసత్యాన్ని ప్రతిపాదించినట్లు శాస్త్రిగారు సిద్ధాంతీకరించారు. దీనివిషయమై మరి నేను వ్రాయుట మంచిదికాదుగదా. మరొకరి మాటలచే యిందలి మర్మమును తెలియజెప్పుదును. శ్రీయుత పింగళి లక్ష్మీకాంతముగారు పాల్కురికి సోమనాథుని గురించి వ్రాసినది గ్రహించనగును. *....సోమనాథుడే దేశకవితా వ్యపదేశమును చాలవణకు సార్ధకముచేసిన కవి. ఈయన (గ్రంథములలో భాష, ఇతివృత్తము, ఛందస్సు అను మూడు కావ్యాంగములును దేశీయములే” (పుట 282. ఆంధ్ర సర్వస్వము) , ఇక యితర సంగతులేల? పై సంగతులే శ్రీ శాస్త్రిగారు సత్యమును ప్రతిపాదించిరో, నేను ప్రతిపాదించినది సత్యమో పాఠకులకు తెలియజేయును. (కిన్నెర: సంపుటము 6, సంచిక 1, జనవరి 1954) | షో గహన: మ సనా ఈ మ) ఛీ. లూ (౭ౌా ళా శీ ఓ (గ క్‌

తెలుగు సాహిత్యంలో క్రొత్త తెన్నులు : 4

ళ6 అలో ఇల్లీ ఠ్రి్ఫ ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918 - 30)

రమణారెడ్డి యుగభానుడు గురుజాడ అప్పారావుగారు, పథమ ప్రపంచ మహాయుద్ధ పరిసమాప్తిని చూడలేకపోయారు. దాని కారణాలనూ ఫలితాలనూ సరిగా అర్థం చేసుకోలేక పోయారనడం దుస్సాహసం కాదు; అర్థం చేసుకుంటాడని ఆశించడం వెరితన మవుతుంది; అర్ధం చేసుకోలేదు కనుక ఆయనను చులకన చేయడం తప్పనిసరిగా తప్పు అవుతుంది. 1952లో నుండి, మార్కు యిచ్చిన చారిత్రక భౌతికవాదపు సులోచనాలతో, నేను గతాన్ని బోధపరచుకొన్న తీరుననే అప్పారావుగారు ఎట్లా చేయగలరు? ఆయన పరిసరాల వాతావరణం అట్లాంటిది. విజయనగర ప్రభువుల నాశయించుకొనినవాడు, జాతీయవాదశక్తి రవులుకుంటూ మట్టుకే వుండిన దినాళ్లలో, ప్రథమ (ప్రపంచ యుద్ధంలో “పభువు"లయిన బ్రిటిషువారికి గాంధీ అంతటివాడు సహకరించి, యుద్ధానంతరం “న్యాతంత్రా్యాన్ని" పొందగలమని ఆశలు పెట్టుకున్న తెలివితక్కువ రోజులలో, గురజాడవా రెట్లాగు యుద్ధపు సామాజ్యవాద స్వభావాన్ని కనిపెట్టగలరు? “వచ్చె నిది బంగారు కాలము ఆంగిలేయుల ధర్మరాజ్యము”, అనినా, “నిన్న వచ్చా

ఆత్మ విశ్వాన సూర్యోదయంబు... (1918 -30) రమణారెడ్డి 2025 రింగిలీషులు. మొన్న వచ్చిరి ముసలుమనులోయి మొన్న వచ్చిన వాడవీవని మరచి. పేరులు పెట్టుకోకోయ్‌” అని భారత పీడిత ప్రజలకూ బిటిష్‌ పీడకులకూ సహపంక్తి అమర్చినా, “పాతసంధులు పాతిపెట్టుము. యుద్ధముల కవి వునికి పట్టులు, అని భవిష్యద్దర్థ్శనం చేయకలిగారు కనుకనే గురజాడ వారు అభినందనీయు అవుతున్నారు. కాని యుద్ధానంతరం మరుక్షణమే మరో మహాయుద్ధానికి రక్కసివిత్తు చల్లబడింది. సామ్రాజ్యపు పందెంలో పోటీదారయిన జర్మనీని బటను చితుకగొట్టింది. జర్మన్‌ జాతీయ ప్రతిష్టను కించపరచేటటువంటి సంధినియమాలను ప్రయోగించి, జర్మన్లు ప్రత్మకియా తత్పరైక మనస్కు లయేటట్లు చేసింది. జర్మను సామాట్టునయితే తరిమి, సామాజ్యాన్ని కూల్చగలిగిందికాని, జర్మన్‌ పెట్టుబడిదారివర్గాన్నీ జీవాలతో నిలుపడమే కాక, దాని కోరలు నూరి పదునుపెట్టి దాని కొమ్ములు చివ్వి కూచి చేయడం బిటనుకు అవసరమయింది. ఏమి? ఎందుకు? శత్రువెట్లా కనురెప్పపాటు కాలంలో మిత్రు డయ్యాడు? అవతరించింది సామాన్య మానవ సమూహ సమానవాదయుగ భానుబింబం! సామ్రాజ్యవాదపు గొలుసులో ఒక లంకె తెగిపోయింది. దీని ప్రభావం వెంటనే జర్మనీమీద ప్రసరించింది. బవేరియావంటిచోట్ల “సోవియటొ గణతంత్ర (ప్రభుత్వాలు యేర్పడ్డాయి. రష్యాతోబాటు, జర్మనీకూడా “బోల్సివిక్కల చేతపడితే, యిక యూరోప్పఖండమంతా చేయి జారిపోయినల్లే! కాబట్టి యీ ప్రభుత్వాలను అణచి, జర్మనీలో పెట్టుబడిదారీ (తి - విప్లవ (004౧16-8౪01610౧4౧) ప్రభుత్వాన్ని రుహర్‌ బొగ్గుగనులవంటి రక్కసి పరిశ్రమల లాభాలతో, తుపాకులతో, వీటి రెండి రక్కసి రతిలో పట్టిన జరాసంధుని వంటి నాజీవుద్యవుంతో, నెలకొల్పేటందుకు, జర్మనీని సోవియట్‌ రష్యా (ప్రవాహానికి అడ్డుకట్టగా నిలిపేటందుకు, బ్రిటిషువారు పాటుబడినారు. అట్లాగే జపానులో ప్రజావిప్లవ నిరోధకమైన పెట్టుబడిదారీ ప్రతివిప్లవశక్తిగా సైనికనియంతృత్వ [ప్రభుత్వాన్ని యేర్పాటయ్యేటట్లు చూశారు. తూర్పునుండి పడమటినుండి సోవియట్‌ శిశు వ్యవస్థను నొక్కి చంపాలని చూశారు. పుట్టిన భస్మాసురుడు విజృంభించి వరదుడికే ముప్పుతేగల వరాలను గద్దించి అడిగేసరికి, వాడు యొదురుతిరిగి పెబడకుండగలందులకుగాను మంచూరియా, ఎధియోపియా, ఆస్ట్రెయాలతో మొదలైన కన్సెషన్లు, బ్రిటన్‌, అమెరికాలను మార్గాంతరంలెని ద్వితీయ ప్రపంచ

2026 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మహాయుద్ధ నరకపు నోటిలోపలికి నెట్టివేశాయి.. వీటిని గురజాడ ముందుగా వూహించలేడని ఒప్పుకుందాము.

కాని బ్రిటిషు పరిపాలకులు భారతదేశంలో “ధర్మప్రభువు లెట్లయ్యారు? వారు 1857కు ముందునుండి, మార్క్స్విస్‌ ఆఫ్‌ హేస్టింగ్సు గవర్నరు-జనరలు గిరీనుండి 1918 వరకు కూడా భారత (ప్రజలమీద (ప్రత్యక్ష బహిరంగ యుద్ధం (ప్రకటించారు కారూ? ఉన్నదానితో సంతృప్తిపడక, పంజాబును, నేపాలును, బర్మాను, రాజపుత్ర సంస్థానాలను తమ స్మామాజ్యంలో బలాత్కరించి విలీనం చేసుకోలేదూ? రష్యా జ్వరాన్ని నటించి, రష్యా దుర్మాకమణ బూచిని చూపెట్టి, సరిహద్దులలో తుపాకులు (మోగించి, “భారత రక్షణ చట్టాల” పేరుతో భారత (పజల [ప్రాథమిక మానవ స్వత్వాలను అరికట్టారు కారూ? అప్పారావుగారు గాంధీగారివలెనే బిటిషువారి కాపట్యాన్ని చూసి భ్రమపడినారు. 1918 తర్వాత యీ భమలు వీడిపోయి కళ్లు ఆరుచుకుని చూశారా అంటే, వారు అసలే లేరు. కళ్లు శాశ్వతంగా మూతలు పడిపోయాయి. మృత్యువు వారిని జమకట్టుకుంది. జాతీయోద్యమ ప్రజ్వలనకు మునుపే, జాతీయకవి కాదగిన అప్పారావుగారు చావుపాలు కావడం విషాదకరమయిన దుస్సంఘటన!

కాని తెలుగుదేశం గొడ్డుపోలేదు. 19వ శతాబ్దపు కడపటి దశాబ్ది (1890 - 1900) ఆలుగు సాహిత్యానికి డోలిక. 1950లలో కూడ సాహిత్య రాజ్యాన్ని యేలుబడిచేస్తూవున్న కిరీటధారులందరూ వరసగా నింగి నీలాలనుండి వూడి తెలుగుతల్లి ఒడిలో కేవురుమన్న సమయ మది. కవనంలో కోకిలలూ, సమాట్టులూ, శిల్చులూ వెలుగు చూశారు. నండూరి సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, గరం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు 1895లో పుట్టారు. 1891లో రాయప్రోలు సుబ్బారావు, 1892లో వూధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి, తల్లావరుల శివశంకర శాస్తి, 1894లో బసవరాజు అప్పారావు, 1896లో అబ్బూరి రామకృష్ణరావు, 1897లో దేవులపల్లి కృష్ణశాస్తి, 1899లో నాయని సుబ్బారావు పుట్టారు. 1918 నాటికి వీరిలో అనేకులు నూనూగు మీసాల నవయవ్వనులు - లేదా, చలంగారు ౭6010508౧06 కు సృష్టించిన తెలుగు మాట “యవనవ్వనం” వీరందరి సాధారణ (పాయం. కనుక ప్రథమ (ప్రపంచ మహాయుద్ధ పరిసమాప్తి తదనంతరం వీరిలో అనేకులు కలం పట్టుకున్నారు.

ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918 -30 రమణారెకి 2027 వీరందరూ జాతీయోద్యమాల పాఠశాలలో పడి చదివినవారే అయినా, వీరి ధోరణులు వెనువెంటనే పరస్పర భిన్నాలైపోయాయి. మొట్టమొదట, గురజాడ అప్పారావుగారి సాంప్రదాయాన్ని, వ్య క్తంగానో అవ్య క్తంగానో కొనసాగించిన ఘను డెవ్వడయినా వీరిలోకలడా అని తరచితరచి చూస్తే, ఆ గురజాడవారి దివ్యవసనం దువ్వూరి రామిరెడ్డి భుజాలను స్వయంగా వరించిందని నా అభ్మిపాయం.

“తరచి తరచిలో అని యందుకన్నాను? అంటే, నేడు రామిరెడ్డిగారి రచనలలో ఆయనకు ఘనతను ఆపాదిస్తున్నవనుకునబ డేటటువంటి రచనలలో “పానశాల” (పప్రథమస్థానగర్వాన్ని చూరగొంటున్నది. కాని తత్వాలమాట నటుంచి, గురజాడవారి ॥ దేశీయతత్వం మాట చూసేపనయితే, రామిరెడ్డిగారి కావ్యాలను పారవేసి, అతని “ఖండకావ్యాల” ను మనం చేబూనవలసివుంటు౦ది. బహుముఖమయిన రామిరెడ్డిగారి వ్య క్రిత్వవికాసానికి యీ ఖండకావ్యాలు సాక్ష్యాలు ! అవి మరుగున పడిపోయాయి. వాటిని వుద్ధరించాలి! అసలు రామిరెడ్డిగారే మరుగున పడిపోయారు. వారిని మన ముద్ధరించాలి. ఆయనే కొంతవరకు తన విస్మృటికి కారకులు! “7౧690061 ౪/49 146 & 911 2౧0౮6 64/61 2041” అని మిల్దను మహాకవిని గురించి వర్చువర్తు అనిన మాటలు, నేను రామిరెడ్డిగారిని గురించి, “06 1110 ౪౭5 46 & 5(2౯2౧6 0౪/64! 20&గ...” అని వాడేందుకు వెనుదీయను. ఆయనకు సాహిత్య పుత్రులు, ఆరాధకులు, శిష్యులు, లోకానికి విప్పిచెప్పేవారు లేనట్లే, ఆయనకు సాహిత్యపితరులు, గురువులు లేరు. ఆయనకూ యే యితర సాహిత్య సంస్థకూ వుద్యమానికీ సంబంధాలు లేవు. నవ్య సాహిత్య పరిషత్తులోని అన్నలూ బావలూ పరిచయస్తులై కూడ ఆయన్ను అంటలేకపోయారు. పరస్పరాభినందన సమాజమయిన నవ్య సాహిత్య పరిషత్తులో కులపతి కాలేదు. సభాపతి కాలేదు.

. అదే విధంగా, అభ్యుదయ రచయితలతో వ్య క్తిగత పరిచయమేకాని అభ్యుదయ రచనోద్యమంలో చొరబారలేదు. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో దేశానికి గల ముక్తిమార్గాన్ని చూడగలిగిన యీ దూరదష్ట, అరడజను విదేశభాషావాజ్మయాలతో (ప్రవేశం కలిగి, యింగ్లీషు, పార్శీలలో పాండిత్యం కలిగిన యీ మేధావి, తన ప్రతి రచననూ భావాన్ని కూడ సంపూర్ణ వ్యక్త మనస్థితిలో (561 0౦౧౩౦1[0649౧653) వాడినాడు. కనుకనే “ఖండకావ్యాలు” చిన్నవయినా, మనము ఎత్తి చూడగా, బహుముఖంగా (ప్రభాసించే వెలగల రాళ్లవల, తరళించుతాయి.

2028 పందిరి మల్లికార్టునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గురుజాడ అప్పారావుయొక్క ఏఏ ధోరణులకు రామిరెడ్డిగారు వారసులు అని మనం మనని ప్రశ్నించుకున్నయెడల, (ప్రముఖంగా వెనువెంటనే మనకు కనిపెంచేటటువంటి విశేషం, వారిరువురకూ సాధారణ గుణవుయిన సారళ్యసౌజన్యం, సౌలభ్యం, దేశితనం, వారిద్దరి విశాలదృష్టి (1061215౧). పల్లె పండుచేల నడుమ పంటకాలువల నడుమ గరికబయళ్ల నడుమ తోటల నడుమ

  • అవధిలేని మహాసుశ్యామ సము[దద్రంవంటి ఆంధ్ర (గామీణ దృశ్య వైశాల్య మెంతో, రామి రెడ్డిగారి హృదయానిదీ అంతే. తాను “పచ్చపొలాల కాపు” అట. “ప్రకృతితల్లి స్తన్యంబున ప్రబలినాడొట ! కనుక దేశస్వభావ విరుద్ధాలయిన అపచారాలకు రామిరెడ్డి తావలం కాబోడు.' తన కవిత్వజీవితాన్ని మొదలెట్టిన తొలిరోజలలోనే, తనకు భవిష్యన్మార్గదర్శకంగా, నియమాలుగా కొన్ని పద్యాలలో తన అభ్మిపాయాలు (ప్రకటించుకున్నాడు. ఒకటి, తన కావ్యా లెట్లా వుండాలి ? అంటే,

“భావరసప్రసంగములు పాయంగరాదు; సుధామయోక్తులం

బోవిడరాదు; మార్దవమునో (శ్రుతికంటకమైన పల్కు సం

భావన సేయరాదు ; మది భారముతోంపంగరాదు; శైలి సొం

పేవగంజూడ నిక్షురస మీనెడునట్లు రచింపు కావ్యమున్‌”

“బాలురుమైత మొక్కరిని పద్యగతార్థము వేడరాదు !..

(1916) - “రసికజనానందము” కవితాలతాంగికి “పరమశత్రు. డెనలేని ఛాందసుం” డట! ఎందుచేత?

“ముద్దుమాటలువల్క్మ మోము చిట్లించుచు

శబ్బసంస్కారంబు చాలదనుచు...” అని “పండిత ప్రతిజ్ఞూ అనే కావ్యములో (1923) రాశారు. ఇవి వూరకే తేలికగా విసరిన పదాలు కావు. రామిరెడ్డిగారు మహ్మాదష్ట. ఈ కావ్యములలో ఆయన ఒక దృక్పథాన్ని ఖండిస్తున్నారు. తన అభ్మిపాయాలను “ఖండకావ్యాలొకు వుపోద్దాతములో యిట్లా 'రాశారు:

“పూర్వులలో6 గొందజు కవిత్వమును శాస్త్రముగం బరిగణించిరి. ఇది చాల గొప్ప పొరపాటు. శాస్త్రమున నానందము లేదు; నగ్నసత్యము కలదు. శాస్త్రకారునికిని, శిల్చ్పికిని జాల వ్యత్యాసము గలదు. వారి మార్గములు (ధ్రువములవలెం బరస్పర భిన్నములనిన సత్యబాహ్యముగాదు....

ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918 - 30) రమణారెడ్రి 2029 “న్వాతంత్య్య్యమున6 గొంత సాహసము గలదు. సాహస మనునది మానవప్రకృతిని నవీన మార్గావలంబనమునకు6 బురికొల్పును. మానవసంఘము రాజకీయ సాంఘిక మత వైటీక దాస్యమునంబడి యాచార్యశృంఖలల మూలమున యంత్రచరితమగు నొక (ప్రతిభాశూన్యవిగహమువలె నున్నపుడు అట్టి సంఘము యొక్క మనము నవీన కల్చ్పనలకు6 జొరంబాజదు. విశాల (పపపంచదృశ్యము కనంబడునట్లు విప్లవము జరుగనిదే మానవ ప్రకృతి నిర్జిద్రముగాదు....

“పపంచ చరిత్రమును బరికోధించి చూచినయెడల, పూర్వులకు భవిష్యత్స్పంతతి వారిని. దమతమ అభిప్రాయాచార మూలమున బంధించు చాపల్యము అమితముగ నుండినట్లు దోంచుచున్నది. ఇది యసంగతమేగాక హాస్యాస్పదమును. ఇట్టి యారోపితాధికారము ముత సాంసఫుక రాజకీయ విషయముల౦దేకాక, కవిత్వమునంగూడ నాటుకొనియుండినది. కావ్యలక్షణము ప్రథమమునం గవుల రచనలనుండియే యుదృవించినదయ్యు. బ్రత్యేక లాక్షణికుల యధికారముద్రవలన ఆ లక్షణమే కవులను నిగళబద్ధులను గావించినది.

“పూర్వకవులకు రాజులే యాశ్రయులు. రాజులు పండితులను సులోచనముల వవాలవమన 6౬ గావ్యపరీక్ష గావించుచుండిరి. ఇంక6 బండితులు రసార్ధ్రచిత్తముతోంగాక శుష్క మైన లాక్షణిక మానదండములతోం గావ్యశిల్పమును గొలతవేయుచుండిరి - కాని, యిప్పటి కాలస్వభావము, పరిస్థితులు మారినవి. [గ్రంథములు సర్వజనసామాన్యమునకు సులభమగుచున్నవి. ప్రజలయభిరుచియు మారినది. ఇందుకు6 జాల చారిత్రక కారణములు గలవు. పాశ్చాత్య సారస్వత సంబంధమువలనను, తన్నాగరికతా సంపర్కమువలనను ప్రజల భావములు ఆదర్శకములు మారంజొచ్చినవి. సంఘమునందు6 గొంత జీవచలనము (ప్రారంభమయినది.... ౨ (1921)

అనగా, గురుజాడ - గిడుగుల తిరుగుబాటును నిజాయితీపరుడు రామిరెడ్డి అంగీకరించాడు. ప్రపంచ యదార్థాన్ని చూడనొల్లక యిసుకలో తలదూర్చే వుష్ట్రపక్షుల గుంపునుండి విడివడి, జాతీయపరమైన పరిణామ రవిప్రభను తేరిపార చూశాడు. ఇదే అతని విశిష్టత. అతని కావ్యధోరణికి పునాది. గురుజాడవారికీ, రామిరెడ్డిగారికీ వుధభయసాధారణమైన మరొక లక్షణ మేమిటంటే, సరళమయిన కానీ సుందరమయిన ఛందోరీతులను వారు తెలిసి కావాలని యిన్నుకున్నారు. ఒకరు ముత్యాల సరాలు వెలికీడ్చారు; మరొకరు ద్విపదను చేబూనినారు. అహో ద్విపద ! ద్విపద పేరు చర్చిస్తేనే, దేశికవిత్వపు పన్నిధి కళ్ల కదురు నిలిచి

2030 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆహ్వానిస్తూ వుంది. బసవపురాణమా, పల్నాటి వీరచర్మితమా ! పలనాటి వీరచరిత్రకు పాఠనిర్దేత అయిన పండిత శ్రీ ఉమాకాన్త విద్యాశేఖరులు శ్రీనాథుని వైలక్ష్యం గురించి రాస్తూ , “ప్రతాపరుద్రీయంలో విద్యానాథుణ్ణివల త్రైలింగ వీరతేజస్సు ఇతణ్జి పరవశుణ్ణి చేసినట్లు కనబడుతున్నది” అని చెప్పి, నిదర్శనంగా, ద్వితీయాక్షరపు ఆట లేకపోవడంవల్ల సగం తుక్కు వదలడం యితని ద్విపదలో మొదటి విశేషమని, దేశ్యపద్యంలో బసవపురాణాదులవలె వుండడం రెండవ విశేషమని పేర్కొంటారు. అట్లాగే 1921-25ల నడుమ రాసిన కావ్యఖండాలను “నైవేద్యముగా సంపుటీకరిస్తూ, “విన్నపముూలో తన ఛందోవైపరీత్యాన్ని గురించి యిట్లా రాస్తారు : “ద్విపద రచనయందు సంప్రదాయసిద్ధములగు గణములేగాక చంద గణములోని *నలలము”, “భలము” అను పంచమాత్రాక గణములను, అప్రయత్నపూర్వకముగ పడినచోట అంగీకరించితిని. అట్టి గణభేదమువలన ద్విపదయొక్క యక గతియందలి విసుగువేసటలు తొలంగునని నా యుద్దేశము..." ఈ కావ్యఛందస్సు పూర్తిగా ద్విపదను మాత్రమేకాక, మామూలుగా జనము పాడుకునే పాటలకైలిని తీసుకుని రామిరెడ్డిగారు “గేయాలు” కూడ రాశారు. ఈ గేయాలలో కొన్నింటిలో అచ్చము వ్యవహారభాషనే వాడినారు.

గురుజాడవారి “దెశభక్తి” గీతములో జాతీయవాదము చాల మోతాదుగా (పిస్కై్రైబ్‌ చేయబడింది. అసలు జాతీయ వాదానికీ దేశాభిమానానికి వున్న ఎల్లలుకూడ మందమందంగా నయినాసరే అందు కనుపెంచితీరుతాయి. దేశ “భక్తొకీ దేశాభిమానానికీ, వున్నాదికీ విజ్ఞానికీ, యుక్తాయుక్త విచక్షణాశూన్యతకూ కార్యకారణసంబంధ పరిజ్ఞానానికీ ఎంత తేడావున్నదో, అంత తేడా కలదు. దేశభక్తి మితిమీరితే అంతర్జాతీయోప్మదవానికి దారితీయవచ్చు. లేదా, దేశభక్తిని మోతాదు మీరి సేవిస్తే, దాని వెనుక రాష్ట్రభక్తి, మండల భక్తి, ప్రాంత భక్తి, కుల భక్తి మత భక్తి - ఎన్నో అగణ్యమయిన అవివేకాలు పుట్టవచ్చు. కనుక, “దేశభక్తి” గీతంలో నిజానికి అప్పారావుగారు దేశాభిమానాన్ని ప్రబోధించాడు. దేశమంటే మనుషులు కాబట్టి, యీ మనుషుల సుఖమే దేశ గర్వకారణమని సుదృఢమయిన సంపుష్టమయిన జాతిని శాస్త్రరీత్యా పెపొందించవలనని (౯606౧109), వ్యాపారాది దేశలాభదాయక క్రియలు పెంపొందవలెనని, మత, వర్ణ, కులభేదాలు వర్జనీయాలని, ఛాయామ్మాతంగా గురుజాడ సూచించాడు. కాని ఆంగ్ల్రపరిపాలకులయెడల

ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918 -30) _ రమణాలెడ్డి 2031 ఆయన (ప్రదర్శించిన వైఖరి, 1857 (ప్రత్యక్ష నిదర్శనం తర్వాత: సహించవీలైనదికాదు. బహుశా, ఆయన “విశాల” దృష్టినుండి, మానవులంతా అన్నదమ్ములనే కాగిలినుండి. తేళ్ళగుంపువంటి కత్తిమొనలవంటి సామాజ్యవాదులు జారిపోయారేమా ! ఎంతకాలం జనులను పీడితులను మభ్యపెట్టగలరు ? 1918లో “దీర్ణయుద్ధపు లంగరు" దించిన తర్వాత, ముల్లు “ధర్మపక్షం” వైపు చూపినతర్వాత, బిటిషువారి నుండి స్యపరిపాలనాస్వత్వ(ప్రదానాన్ని ఆశించిన గాంధీ భంగపడిపోయాడు. సత్యాగ్రహం వచ్చింది. దేశమంతా కదలి కుతకుతలాడింది. భారతీయులు తమ సత్తాను గుర్తించుకోగలిగారు. దాస్యం పూర్వజన్మ పాపపరిపాకమనుకున్న ధోరణి ఓడిపోయింది: “కర్మవిధిచేష్ట దైవనిగ్రహమటన్న +. పెచ్చివేదాంతముల బోయె పెద్దప్రొద్దు అత్మవిశ్వ్యాస సూర్యోదయంబుకెలన నిద్దురతమంబు కాలూని నిలువగలదె ? “అపయశః పంకిలంబైన యాత్మకన్న చచ్చుటే కొంత మానరక్షణముసుమ్ము: పారతంతృ్య్యభారంబున బడలి సడలి యదవత్రావుడు త్రావెదోయమ్మ నీవు? కలలకును వీడుకోలుగా6 బులుంగు లిపుడు గానములు సేయుచున్నవి ; కనవా ? వినవొ?” (మేలుకొలుపు 1921-25) అని కవికోకిల మాతృభారతానికి 'పప్రభాతకాలాన్ని చూపింది. ఈనాటికే రామి ెడ్డిగారిలో శుష్కజాతీయోన్మాద మంతరించిపోయి, వివేకం వుదయించింది. కాని 1916 - 18ల నడుమ రాసిన “పథమ కవిత్వము”లో “సెంహ(ప్రబోధ"మనే ీర్దికకింది పద్యములు, “దేశమాతృస్తవపము”అనే శీర్షిక క్రింది పద్యములు, కుర్రతనపు తలతిరుగుడులో వచ్చిన అసంబద్ధ (పలాపాలుగా కనుపించకున్నా, “మాతృశతకము”లోని పద్యాలు అట్లా కనుపించక మానవు. ఉదాహరణకు,

2032 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “గీకుల్‌ మూఢతనుండ, జంతువులటుల్‌ క్రీడింప రోమన్లు, ఘో రాకారంబుల నీలిరంగుల శరీరాద్యంతముంబూసి కొం. చేకాంతారములందొ యాంగ్లజనముల్‌ హేయంబుగా నుండ నీ కాకాలంబున మించె నాగరక విద్యాసంపదల్‌ మాతరో!ొ .

ఇది చారిత్రకంగా నిజమే అయినా, యీ మనస్తత్వం - తమ గొప్పను

డప్పుకొట్టుకునేందుకు మరొకరిని చులకనచేసే మనస్తత్వం - (క్రమంగా, తొండ వూసరవిల్లి అయినట్లు, ఫాసిజానికి దారితీయగలదు. తన నిరంతర పఠనలవల్ల రామిరెడ్డిగారు తన హృదయావధులను నిరంతరంగా విస్తరించుకోగలిగారు. భారత దేశ నైచ్యస్థితికి నిజమయిన కారణం “సామాజ్యవాదమ”ని, సామాజ్యవాదం ఆర్థికపీడన అని, తనంతతాను, అసహాయంగా, గుర్తించకలిగాడు. దేశమాత యిప్పుడు “ముసలి మాలత"రూపంలో (ప్రత్యక్షమయింది. ఆముదివగ్గు బహుశా, “స్వార్ధపరస్వాంతుండౌ రాజుచేంబడి లావుదూలిన దేశలక్ష్మి యొక్కొ !

అహో, ఒక్క సీసపద్య చరణంలో టబిటిషువారి దౌర్జన్యబలాత్కార సహిత

భారతధనాపహరణను ఎట్లా యిముడించాడో! భారతదేశం భిక్షుకి అయిందన్నమాట!

రాయస్రోలువారి వూహల్లోని అసంబద్ధ భారతమాతృమూర్తికీ యదార్థానికీ ఎంత తేడా! ఆత్మవంచనకూ వాస్తవదృష్టికీ శుష్క ఆత్మప్రశంసకూ వాస్తవపరిస్థితుల గుర్తింపుకూ కలట్టిది!

“తిరిసపెమెత్తి తిన్న తీలునా యాంకలి”

ఆకలిజాతికి అలవాటైపోయింది. స్వరాజ్యమే మనకు తిండినివ్వగలదు. కనుక

“ఏలనోయీ గద్గదస్వనము? ఆ(క్రోశగానము? చాలు చాలింక విఫల యాచనము! వీరపూజోత్సవపు సమయమున:

  • బూరింప లమ్ము , ఘార భీషణ విజయశంఖమును! ఏల తఆలియక సంశయించెదవు? భారతకుమారా, డీలుపడి వెనుకంజ వేసెదవు ?” (1923) . |

ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918 -30) రమణారెడ్డి 2033 భారతకుమారునికి ఆలియని ఎది రామిరెడ్డిగారికి ఆలిసివచ్చింది, బుద్ధుడికివలె? (దష్టవలె (89) దేని నితరులకంటె ముందు దర్శించకలిగాడు ? తన తరమువారి కనేకులకు బిటను ప్రజాతంత్రమని నమ్మకమున్నప్పుడు, ఆ తరమువారి మనస్సులను మేధస్సులను బిటనే తయారుచేసినప్పుడు, తానొక్కడే ప్రవక్తవల అసాధారణ కావ్యాలను ఏల నోట బట్టాడు? ముందు రాబోయే దేమిటో తఆలియక, ఏదో తనుమట్టుకు చూసినదానిని, అప్పుడప్పుడు, వుదేకం వుప్పెనవలె ఎగసిన అలౌకిక క్షణాలలో, సందేశవు బరువుచే తడబడే వాక్యాలతో, చీకటిలో ఎందుకోసం తడిమాడు ? ఇట్లాంటి లక్షణాలున్న కవిత్వాన్ని, సర్‌ హెర్బర్ట్‌ (గీర్పన్‌ “ప్రవక్తృ కవిత్వం” (0౯00616౧06) అని కేటాయించినట్లు, 14110౧10 564౧9 అనే వుస్తకంలో డాక్టర్‌ ఇ. యం. డబ్ల్యు. టిల్యార్డ్‌ రాసివున్నాడు. ఖండకావ్యాలలో యిటువంటి కావ్యఖండాలు చెల్లాచెదరుగా పడివున్నాయి... వాటిని ఒక్కచోట కూర్చి, రామిరెడ్డిగారి దృక్పథానికి సమగ్రతను కొనిరా ప్రయత్నిస్తాను.

రామిలెడ్డిగారి ధోరణి, అది వెలువడిన కాలానికి విచిత్ర మయినటువంటిది. (బ్రిటిషువారిని సహృదయులుగానే భావించే రోజులలో, వ్యక్తులనుగాక సామ్రాజ్యవాద ఆర్థికవ్యవస్థ నిజస్వరూపాన్ని మార్కిస్టువల స్ఫుటంగా విపరించకలిగిన విజ్ఞానం కలుగడమే అద్భుతమైన విషయం! ఇందుగురించి నేను చేసిన దర్యాప్త్పుల ఫలితంగా, రామిరెడ్డిగారు అప్పుడప్పుడు కమ్యూనిస్టు సారస్వతాన్ని తీసుకుని చదివేవారని, ఖ౦డవిల్లి కృష్ణారావుగారినుండి ఆలిసింది. కాని అది 1930, 40 లలో. నేను పేర్కొనబోయే కావ్యాల రచనాకాలం 1920లు. బహుశా యిది సోవియట్‌ విప్లవ విజయఫలితంగా ఖండాంతర ఫీడ్రితజాతులలో కలిగిన సంచలన ప్రభావమై యుండవచ్చును. ఎది ఎబ్లెనా, రామిరెడ్డిగారి యీ కావ్యాలు ఆంధ్ర సాహిత్య చరిత్రలో విస్మరింప వీలులేని గొప్ప సంఘటనలు! “ఖండాంతరంబుల కపటనాటక” మైన సామాజ్యవాద స్వరూపాన్ని దాని పశుముఖాన్ని రామిరెడ్డిగారు 25-10-1922 నాడు చిత్రించారు. అంతకు 18 రోజులకు మునుపే అంటే 7-10-1922 నాడు భవిష్యత్తును రామిరెడ్డిగారు దర్శించారు. మొదట పేర్కొనిన కావ్యములో రామిరెడ్డిగారు సామాజ్యవాద ముఖలక్షణాలనన్నిటినీ చితించకలిగారు. కాని రెండవదానిలో ఆయన భావనకాని చిత్రణకాని చాలమట్టుకు యదార్ధమైన భూమిని వదలి రెక్కలు కట్టుకుని మేఘాలలోకి వెల్లింది - దీనిలో, మార్కు మహనీయుని

2034 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సౌహిత్యము అవతరణకు మునుపు మానవ సమానవాదం గురించి మహాపథాలనుండి సిద్ధాంతాలు (౮10010) సత్తా కనుపిస్తుంది. ఈ భవిష్యద్దర్థ్శనకాలంలో ఆయన,

“సగము జాగ్రదవస్థ, సగము స్వప్నమున

భావించుచును గట్టుపైన గూర్చుంటి.

సత్యమో, భాంతియో, స్వప్నంబాగాని,

యింద్రజాలమువోలె నెదుటం గన్పట్టె.

అది సత్య మైయున్న నాశ్చర్యకరము! .

అది కలయేమైన నానందమయము!

మావితోంటను బర్జ్ణమంటపమందు

జనరంజకంబైన సభయొండు జరిగి...

...రారాజు కొంబచ్చ జాగడ్జె డిగ్గి

యందజతో6 బాటె యవనిం గూర్చుండెం;

బనిపాటు లేనట్టి బంటు సిపాయి

(తుప్పుపట్టిన కత్తి తొంటిమపై రాయం

దనపూర్వజయముల6 దలపోయుచుండె;

బురద చిట్టలుపడ్డ పుట్టముల6 గాపు6

వర్తించె నృప పరివారంబు6 గలసి;

కూలినాలియొనర్చి కుడుచు నిరుపేద

యజమాని సరిబంతి నాశీనుండయ్యు.

సకల మానవజాతి సంతతులు కులప్పు

వర్జభేదంబుల: బాటింపంబోక

యొక్కకడుపునం బుట్టి యొక చన్నుంబాలు

(దావినరీతి సౌందర్యంబు గలిగి

యన్యోన్యసాహాయ్య మర్థించువారు

సృృటికప్యాతంబున శాంత్యాసవంబు

ధర్మదేవత తెచ్చి తనిపె నందజిని;

ఏకకుటుంబమై యీ ప్రపంచంబు .

స్వర్గంబు భూమిఫై స్థాపింపంబడియె.

అభ్యుదయాంశువు లన్నిమూలలను

నవనవోజ్వుల జీవనంపు దీపముల

అత్మ విశ్వాన సూర్యోదయంబు... (1918 - 30) రమణారెడ్డి 2035

వలింగించుచుండె; నీ విశ్వమంతయును

మానవకళ్యాణ మందిరంబయ్యె...” ఎంతమంచి కలో, అంత సాధింపవీలులేని కల! రామిరెడ్డిగారు కులాలను వర్ణాలను మాత్రమే సమాధాన పరచ కలిగాడు. కాని దేశాలు కొన్ని సామాజ్యాలుగానూ, కొన్ని వలసలుగానూ వున్నవి. “సమరతృష్ణ" గీతములో, దేశాలనడుమకల వైరుధ్యాలను ఎత్తిచూపుతాడు. రామిరెడ్డిగారి సర్వమానవ సమానవాదాన్ని సామాజ్యవాద దేశాలు ఓటుపరుస్తున్నాయి.

“దేహంబు నలుపైనం దెలుపు పసుపైన

నాత్మబంధులుగారె యఖీలజనం౦ంబు ?

కామంబు, [కోధంబు, గర్వంబు, జాతి,

దేశంబు, భాషయున్‌ దెరలు చింపంగ

సర్వసామాన్యమై చను మానవత్వ

మొక్కతీరునం గాకయున్నె వేర్వేజ?”

నిజమే. ఈరకమయిన వాదాన్ని రామిరెడ్డిగారికంటె బిగ్గరగా సామాజ్యవాదులే యిళ్లెక్కి చాటగలరు. కాని వారెందుకు దేశాలను పీడిస్తున్నారు?. స్వజాతి సంపన్నం కావడానికంటారు. దానికి రామిరెడ్డి ఎదురు సవాలు.

“సాంత యక్కజకన్న నెంతొ యొక్కుడుగ

వస్తుల నిర్మించి వాని వెలపుచ్చ

జనసంఘముల బానిసలుగ6 జేయుదుర?

ఇట్టి యన్యాయ మింకంత కాలంబు

అవును గాదనకుండ రవులుకొనంగలదు? ఇదేనా అందరిచేత “నాగరకత"”గా చాటబడుతున్న రాక్షసి! అయితే యిది “ఐశ్వర్యవంతుల యజచేతి ఫలము. కష్టజీవుల పాలి కంఠపాశంబుూ” ఈ వాణిజ్య దేసత పాదచిహ్నాల “సంగర పశుగక్తొ చచ్చికూడా చావక మనుతుంది. కనుక స్మామాజ్యవాద దేశాల కొలువుకూటమిమయైెన నానాజాతి సమితి (1162046 0 ౭0౧9) సంగర పశుశక్తిని చంపుతుందనే హామీలేదు. పునరుజ్జేవింపకపోతే చాలు:

“శాంతి నానాజాతి సమితి చేకూర్చుం

జాలునే, చిత్తముల సలసలంగ్రాగు

2036 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పాషాణరసములు పెకిం బొంగంగ? సమరపరాజిత శ్మతువర్గముల

  • . కొల్లద్రవ్యము పంచుకొను వేడ్కంబెద్ద భాగంబులకు6బోరు “పరమ సాహార్ద చకవర్తుల” కేల శాంతిపీడనము? ఈ “కపటనాటకము” ఏనాడో ఒకనాడు బయటపడుతుంది అని వూరుకుని, యీ అనుక్షణ ప్రమాదాన్ని ముట్టుకోకుండా వదలివేస్తే, మనం ఆత్మ విద్రోహులంకామా? కనుకనే రామిరెడ్డిగారు దేశదేశ కవులందరికీి ఒక విజ్ఞప్తి చేశాడు. “భావిసంగరముష్టి6 బట్టుపడనీక జగతినిం గాపాడ సకలదేశముల కవిమహాశయు లొక్క కట్టుగావలయు ఇదియె నా స్వప్నంబు; నిదియె నా యాశ.” .

  • యూరోపులో రోమారోలా6, హెనీ బార్బూజ్‌వంటి ప్రముఖ కళాకారులు యిదే ఆశతో, మహత్తరమైన ఒక వుద్యమాన్ని లేవదీశారు. కాని యింత పెద్ద భారతదేశంలో రామిరెడ్డిగారివలె ఆవేదనపడిన మానవవాదిని ఒక్కరినీ చూడలేము. ఆయన యిచ్చిన నినాదం యీనాటి మనకూ అనువర్తిస్తుంది :

“అఖిల మానవహృదయధ్య్వంసి కీట

కములకు6 దల్లియౌ కటికదురాశ

సమయింప సంగ్రామ సన్నద్ధులగుండు!” జాతులనడుమ పీడక - పీడిత సంబంధాలను చూడకలిగిన కవి, ఆత్మ పరుడయ్యేపక్షాన, స్వజాతిలోనేవున్న అటవంటి సంబంధాలను చూడకలుగుతాడు; చూసి వర్ణించడమేకాక, గర్హించకలుగుతాడు. రామిరెడ్డిగారు ఆత్మపరుడయిన (దష్ష; నిర్భీకుడయిన (ప్రవక్త! దేశంలో సాంఘిక ఆర్థికరంగాలలో వందేళ్ళతరబడి అన్యాయం ఘనీభవించి వుంది. దీనిని కళ్లతో చూస్తూనే ఎట్లా సహృదయుడయిన కవి తానేమీ యెరుగనట్లు నటించగలడు? ఖయ్యాము వాదము ్రకారం, (పప్రాపంచికమైన భయంకర వాస్తవాన్ని కర్మ సిద్ధాంతాలలో నిర్లక్ష్యంచేయవచ్చునేమో!

అత్మ విశ్వాన సూర్యోదయం... (1918 - 30) రమణారెడ్డి 2037 కాని యిది అవశ్యం పరిష్కరింపవలసిన సమస్య! “హృదయములోని చిరుత అ(క్రమాన్నయితే (దాక్షాసవంలో ముంచివేయవచ్చు: కాని ప్రపంచంలోని మహాదురన్యాయాన్ని కత్తితోమట్టుకే తుదముట్టించగలము” అని ఒక మహానుభావు డనినప్రకారం, రామిరెడ్డిగారు వ్యక్తియొక్క సంకుచిత పరిధినుండి సమష్టి సమస్యల రంగంలోకి వచ్చారు. 1917లో నెల్లూరులో సమావేశమయిన రెడ్డిజన మహాసభలో ఆయన చదివిన పద్యాలకు, తర్వాత కొద్ది సంవత్సరాలకు మరల అదేవిధమయిన సభలో ఆయన చదివిన పద్యాలకూ వుండుకున్న వ్యత్యాసాన్ని గమనిస్తే, రామిరెడ్డిగారిలో వచ్చిన మార్పు కనుపిస్తుంది. మొట్టమొదటిదానిలో, అస్తంగతమై దాదావు విస్ట్రాతమయిన రెడ్డిరాజ్యాన్ని తగపొగడి, రెడ్డికుల వీర్యత్రీని (ప్రబోధించడం జరిగింది. కాని తరువాతిదానిలో, యీ 'రెడ్జికులములోని రైతులకూ రెడ్డిరాజులకూవున్న అంతస్తు తేడాను కవి చూడ కలుగుతాడు. ఇంతవరకూ తాను కర్షకు డేదో దివ్యస్వర్గా లనుభవిస్తున్నాడనుకుని భ్రమపడినానని, ఆ భ్రమలు తొలగిపోయాయని గుర్తిస్తాడు. రెడ్లు కర్షకులు కాబట్టి, కృషియే ముఖ్యమని మాటాడక, “సర్వతోముఖకార్యదక్షత” వహించాలని కోరుతాడు. కాలానుసారముగా వస్తున్న మార్పులను అందుకోకుంటే, అభ్యుదయము అసాధ్యమవుతుంది.

“సగముచచ్చిన పూర్వసంప్రదాయంబుల

విడలేక మిడుకుట వెజ్టితనము;

మనజీవితము యుద్ధమనం జల్లు, | దానిలో నగగామియె పొందు నధికఫలము.” కాని కర్షకుల ప్రకృతస్థితి దుర్భరంగా వుంది. రైతు బ్రతుకు సౌఖ్యాసాగర మనుకుని అహంకృతిని (ప్రేలిన కుకవిని, “నగ్నయాదార్థలోకగతి నన్వేషింపుమోయీ” అని లేవగొడుతున్నాడు.

“దొరతన మొక్కవంక, తెగదోచు వణిగ్గణ మొక్కవంక; ఈ

తిరుగలిరాళ్లమధ్య. బడి దీనులు రైతులు నుగ్గునూచలై తజింగిరి నిస్సహాయతను......లలలుటో

“అడ్డులేనిమార్గ మాశించుపాలన; మంచి సెబ్బరనెడు మాటలేదు;

2038 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కాకినోరుగొట్టి (గ్రద్దకువైచును; మోడుగోళ్లుముక్కు తీడికొనుము.” “సమరకాలంబునందైన, శాంతినైన, కర్షకుల నెత్రుపీల్చు నిక్కచ్చి విడదు; డిగయైషను రంపకోంత పం(డెండు సమలు; ఇంక సమీరనిర్బ్భంధము

లన్నియేండ్లో!”

బ్రిటిషువారి “శాంతి” భారతదేశానికి, నిజంగా “యుద్ధం”. టబబ్రిటిషువారి పరిపాలన

సమస్తం ఒక ప్రచ్భృన్నయుద్ధం; సామాజ్యవాద దేశాలలోనేకాక పెట్టుబడిదారు

దేశాలన్నిటిలోనూ 1927 నుండి ఆర్థికవ్యవస్థ ఫల్టీకొట్టింది. ఈ శాఖ భారతదేశానికి, ముఖ్యంగా రతాంగానికి సమ్మెటపోటుగా కొట్టాంది. సొంతదారులు పాలికాపులయ్యారు; పాలికాపులు దినభత్యగాళ్లయ్యారు; దినభత్యగాళ్లు బిచ్చగాళ్లయ్యారు. వర్గవ్యత్యాసాలు వురింత దూరవుయ్యాయి. ఈ దారుణపరిస్థితులు రామిరెడ్డికి మరొక పాఠాన్ని నేర్చాయి. భవిష్యత్తు వర్తమానంవలె వుండబోదు.

“తేటనీరము మైదేల; దిగెను జిడ్డు

అడుగునకు; నెల్లకాలంబు నటులనుండ;

దించుమించుల సరిదిద్ద నెప్పుడైన

విశ్వవిప్లవశక్తి యావిర్భవించు.” దాని స్వరూప మెట్లుంటుందో, గతి యొట్లావుంటుందో, ఏ తక్షణ పరిస్థితులు దానిని కల్పిస్తాయో ఆయనకు తెలియదు; కాని కాలగర్భంలో కొట్టుకొంటున్న (కొత్తగుండెనుమట్టుకు ఆయన చెవులు వినకలిగాయి. ఆయన చూసినమట్టుకే చాటకలిగాడు. అస్పష్టమయిన తనకు కనుపించే దృశ్యాలను యీవిధంగా చిహ్నాప్రాయంగా (9/౧౦0|0) సంపుటీకరించి,

“అతిగ మెక్కి యజీర్తిని అడలువాని

మెసవుటకు లేనివాం డాక్రమింపవచ్చు.” నని భవిష్యత్తును మనకు లీలగానయినా చూపించగలిగాడు. ఈ విధంగా జరుగవచ్చు అనే అర్థమే “ఆక్రమించవచ్చు” అనేదానిలో తీసుకోవలెగాని, ఆక్రమించడం అక్రమంకాదు ఆనే అర్ధం యిందునుండి రాదు అని ఎవరైనా

ఆత్మ విశ్వాస సూర్యోదయంబు... (1918-30) రమణారెడ్డి 2039 రామిరెడ్డిగారి న్యాయదృష్టికి అన్యాయం చేయబోయేయెడల, ఆయనయొక్క మరొక పద్యమే తన ధోరణిని విపులీకరించగలదు.

“కడుపునకు6 గూడు దొరకక గాసింజెంది

అన్నమును దొంగిలించిన యతడు దొంగ ?

రాజ్యలోభంబునను బర్మ్వపజల హత్య

సలుపపూనిన ధర్మశాసను. డతండు!”

“దినమున కొక్కపూటయినం. దిండికిలేక దరిదమానవుల్‌

వనరుచునుండ నీ ధనము వాసనకట్టు బిగించికట్టియే

అనుభవమందబోయెదవొ ? యందర బీదల వేడియార్పులం

దనరు దవాగ్ని నీబతుకు దగ్ధము సేయదె యొక్కపెట్టునన్‌ ?" కనుకనే రామిరెడ్డిగారి భుజాలను గురుజూడవారి దివ్యవసనం స్వయంగా వరించిందని చెప్పాను. గురుజాడవారి ప్రేమకవిత్వ మెలాగయితే వ్యక్తులను వాక్యాలను అధిగమించి మానవవాదంగా రూపొందిందో, ర౮ామిరెడ్డిగారి ఖం౦డకావ్యమల్లాగే చరణాలను పదాలనూ అధిగమించి పపజావాదంగా రూపొందింది. కనుక గురుజాడకూ శ్రీశ్రీకి నడుమ, గురుజాడవారి ప్రజావాద ధ్యజాన్ని రామి రెడ్డిగారు చేదాల్చి, వారి సమానవాద జ్యోతిని ప్రజ్ఞ్యలింపచేశారు. జగన్నాథ రథచథకాలను శ్రీశ్రీ గగనవీథినుండి మరలించక పూర్వము, రామిరెడ్డిగారు అక్కడ స్వాతంత్య్యరథాన్ని ప్రజలు మోకులతో లాగుతుంటే చూశారు. -

“పూర్వసింహాసనంబులు, (పోజ్బలంపు

మణిమయకిరీటములు భోగమందిరములు

చ(క్రసంఘర్హ్దణంబునం జదిసిపోయి

యవి యివి యనంగరాక రూపజెడు నేండు."

“ఆ రథమందు దీప్తిమయమై కనుపట్టె నిజప్రభావ దు

ర్వార పవిత్రమూర్తి కనుపండువు సేయుచు, ధర్మజీవనా

కారమొ ! శాంతిబింబమొ ! యకల్మషసత్యనికేతనంబొ ! సం

సారఫలస్వరూపమొ ! ప్రజాహృదయంబా | యనన్‌ వెలుంగుచున్‌౯

2040 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “ఒకచేతన్‌ రుధిరంపుంబాత్రమును, వేజొక్కంటం బీయూష పా (త్రికయుం గైకొని, సభ్యతామిషమునన్‌ దేశంబులందెల్ల నిం తకు ధర్మంబులుగాంగ నెన్నంబడు నన్యాయంబు లీనాంటితో వికలంబైచనుంగాక యంచు గరుణావేశమ్ము దీపింపంగన్‌”ో

కాని శ్రీశ్రీ రథము “జగన్నాథ” రథము - ప్రపంచ సౌఖ్యాల నన్నిటినీ సృష్టించి,

సౌందర్యాల నన్నింటినీ నిర్మించి, చరిత్రకంతకూ అధినాథులైన ప్రపంచ (శ్రామిక

మహాప్రజల మహా ప్రస్థానం ! రామిరెడ్డిగారిదో “స్వాతంత్య్యు" రథము - సామాజ్యవాద వ్యతి రేకదశలోని భారత జాతీయోద్యమ విజయపరంపరల కూటమి! ఆంధ్ర సాహిత్యచరిత్రలో, రామిరెడ్డిగారు, జాతీయోద్యమ మహాకవి; జాతీయోద్యమంలో (ప్రముఖ భాగస్వాములయిన మహాపజలతరఘు మనిషి ! కాంగెసువారు మంచివారుగా పురోగాములుగా వుండినకాలంలో యీయన “కాం(గేసువాలా” నాటకం రాశారు. నేడే బ్రతికివుండినట్టయితే, దానిని తగులపపెట్టేవారు.. కాని ఆకాలంలో కాం(గెసు వ్యామోహం తప్పుకాదు. ఏమంటే అప్పుడు కాం(గెసునే సమస్త భారతజాతి నమ్ముకుంది. రామిరెడ్డిగారు “లోకహితంబు నాలోచించు పనియె కఠినంపు విధిగా యెంచుకున్నారు.

ఓసి జాతీయతా, నీ బలోజ్ఞలత్వ

మెంత ! నీ శక్తిసామర్ధ్థ్యమెంత ! నీదు

శంఖరవమునంగల యిందజాలమెంత !'

అస్థిపంజరములుుసైత మాడువౌర 1౫ (కిన్నెర: సంపుటము 6, సంచిక 1, జనవరి 1954)

రై నీ. 9 | నో [6 త షయమానన థి ఉక్త ్య్యగభా

బాలవాజ్బయం గొశిపాటి వెంకట సుబ్బయ్య

“పొప్రాయి ముద్దు - రూపాయి ముద్దు

పాపాయి పలుకులు పాటలు ముద్దూ

పాపాయిని పలికించినా రూపాయిని చూచినా ముద్దూ ముచ్చట. అ ౦టే వాపాయి అనే సంపద రూపాయి యనే సిరి, ఆనందాన్ని కలిగిస్తవి. సిరిసంపదలకంటే పాపాయి పలుకులు పరమానందాన్ని కలిగిస్తాయి.

ఇట్టి సంతానమే దేశముయొక్క సంపద. దేశపు భావి భాగ్యోదయమంతా వారిమీదనే ఆధారపడియున్నది. వారు భావి కాలంలో గురుతర కార్యభారము వహించవలసినవారు కాస్త బాల్యమున వారికి తగుశిక్షణ యివ్యవలసిన బాధ్యత గలదు. వారి కిచ్చు శిక్షణనుబట్టే వారి బాగోగు లుండును. అట్టి శిక్షణను యిచ్చునది యెవ్వరు? ఆ బాధ్యత తల్లితండ్రులవైనను ఉపాధ్యాయులమీదను, సంస్క ర్తలపైనను, (వ్రభుత్వముమీదను, ఏద్యాపంతులమీదసు, వారు వీరు అననేల? దేశాభివృద్ధి కోరు పప్రతీవారిమీదను కలదు.

మన ఆంధ్రములో బాలవాజ్మయం లేదనే చెప్పవచ్చును. ఇతరులతో పోల్చిచూస్తే మనచేశములో నున్నది ఆవగింజలో అరవయ్యోవంతు లేదు.

ఆంగ్ల సాహిత్యములో అత్యధికంగా ఉన్నది.

2042 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము రష్యాలో వివిధ దేశాలనుంచి చిత్రకారులను రప్పించి, చక్కని చిత్రములతో ముచ్చటగా పిల్లలకొరకు కోట్లకొలది పుస్తకాలు ముదించారు. అమెరికా సంగతి అడగనక్కరలేదు. ఆ నూతన (ప్రపంచంలో పసిపాపలే పత్రికలు నడుపుతున్నారు. దీనికి కారణమేమిటో తెలుసా? అమెరికా సామెత ఏమిటంటే *॥ ౪7౦౪ ౧౭౪6 & ౧1౧౮16 10 904/9 18800 ౪0౪ 0౧|॥|6 ; ౪70౪4 ౧2౪6 & 06౧1 9640218 ౧౫౮ నీకు క్షణం అవకాశముంటే నీ పాపకు బోధించు ; నీకు ఒక దమ్మిడీయుంటే అది పాపాయికి వినియోగించు.. అట్టి దేశం అన్ని విధాల అభివృద్ధికాక ఎలా ఉంటుంది? విదేశాల్లోనే గాక, మన హిందూదేశములోకూడా ఇతర ప్రాంతాలలో అభివృద్ధి పొందుతున్నది. బెంగాలీ భాషలో విశ్వకవి రవీంద్రుడు పెక్కు పాటలను, కథలనుకూడా పిల్లలకై ప్రత్యేకించి రచనచేసి బాల వాజ్బయములో కూడా కీర్తిగాంచాడు. వంగ సాహిత్యములో బాల వాజ్ఞయం బాగా వృద్ధిచెందింది. హిందీలో బాలురకు ఆకర్షణీయమైన బొమ్మలతో వివిధ [గ్రంథములు ము[దించుటేగాక, నేడు పిల్లలకు ఆ భాషలో పది పత్రికలకు పైగా ఉన్నవి. అంతదూర వెందుకు ? వున సరసనున్న కర్ణాటకులు చక్కని బాలవాజ్బయమునేగాక, బాల విజ్ఞాన సర్వస్వమునుకూడా ప్రకటించారు. బాలవాజ్బియమును గురించి నేడు మనలో ఆలోచనలు అధికంగా జరుగుచుండుట అభినందనీయము. ఈ సందర్చములో బాలవాజ్బయమంటే ఏమిటి? వారి చిత్తప్రవృత్తులు ఎలా ఉంటవి ? వారికి అభిమాన రసాలేవి ? ఎటువంటి గ్రంథాలు వారికిష్టం ? పిల్లలంటే ఎవరు ? ఈమొదలుగాగల విషయాలు ఆలోచించు టవసరము. - బాలవాజ్బయ మంటే - పిల్లలకు సంబంధమైన రచన లన్నమాట. . ఈ సాహిత్యాన్ని [ప్రాచీనము, అర్వాచీనమని రెండు భాగాలు చేయవచ్చును. ఈ సాహిత్యాన్ని మరొక విధంగా రెండు విధములుగా విభజించవచ్చును. ఒకటి పిల్లలను వస్తువుగా స్వీకరించి, పెద్దలు రచించినది. "రెండవది పల్లలుగాని, పెద్దలు పిల్లలుగా భావించిగాని రచించినది. (ప్రాచీనమైన బాలవాజ్మయం చాలా ఉన్నది. అది తల్లుల తలవాకిళ్ళలోను, పిల్లల పుక్కిటా ఉన్నది. అది అధికంగా గేయరూపములోనే ఉన్నది. మరికొంత సంప్రదాయక కథలు, పిట్టకథలు, పొడుపుకథలు రూపంగా కూడా కలదు.

బాలవాజ్మయం గ్యాంపాటి వెంకట నుబ్బయ్య 2043

మన ప్రాచీన సాహిత్యములో అధికం బాలురను ఉద్దేశించి చెప్పెనదే కలదు. దానికి కారణం లేకపోలేదు. ఈ సాహిత్యానికి మాతృహృదయమే కర్తృత్వము వహిస్తుంది.

మన (ప్రాచీనులు “సంగీత మపి సాహిత్యం, సరస్వత్యా కుచద్వయం” సంగీత సాహిత్యాలు రెండు సరస్వతీదేవి పాలిండ్లు అన్నారు. అంటే అందరూ సంగీత సాహిత్యాలు [గోలాలన్న మాట. ఈ ఉపమానం బాలవాజ్బయం విధుల బాగా సార్థకమవుతున్నది. తల్లిగర్భమునుండి చేటలో పడ్డప్పుడునుండి, తల్లి తన చనుబాలతోపాటు సరస్వతీదేవి స్తసద్వయమగు సంగీత సాహిత్యాలు కూడా రుచి కరపుతుంది. తెలుగుతల్లులు తమ బిడ్డలకు ఉగ్గుపాలతోపాటు సంగీత సాహిత్య రసాలనుకూడా రంగరించి పోశారనుటకు జోలపాటలు, లాలిపాటలు నిదర్శనము.

“ఇశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణి? పసిపాపలు, పశు, పన్నగాలు సంగీతమంటే చెవి కోసుకుంటవి అన్నమాట అంద రెరిగినదే. అందుచేతనే “సంగీతం సద్యోఫలం” సంగీతపు ప్రయోజనము వెంటనే అనుభవములోనికి వస్తుందన్నారు. అది ఆపాతమధురం. చెవి సోకగానే భాష ఆెలియకపోయినప్పటికి ఆనందప్రదము. -

సంగీతము పెద్దలకంటే పిల్లలకు అధిక అభిమానం. అందుచేతనే తల్లులు తమ సంతానంకొరకు పాటలు పాడుతూ ఉంటారు.

గణబద్ధమగు పదసముదాయమునందు గానమున్నది. అట్టి గానములో ఆనందమున్నది. ఈ ఆనందాన్ని శిశువు పుట్టినప్పటినుండి (పమమయియగు తల్లివలన నిరంతరము అనుభవించుచునే యున్నది. తల్లి హాయిగా “హాయి హాయి ఆపదలు గాయి. చిన్నవాండ్రనుగాయి శ్రీ వెంకటేశ” అంటూ జోలపాటలు పాడినప్పుడు చెవి చేటంతచేసుకొని శిశువు ఆనందిస్తూనే ఉన్నది. ఆ ఆనందములో మైమరచి నిద్రించును.

అలాగే కాస్త పెద్దదైనతర్వాత తల్లి ఎత్తుకొని గుజ్జనగూడు తినిపిస్తూ “చందమామ రావా - జాబిల్లి రావె" అని పాట పాడినప్పుడు అల్లరి ఆగములేక హాయిగా అన్నము తింటున్నది.

అంటే పిల్లలకు పాటలంటే ఆనంద మన్నమాట. కనుక వారి లతహృదయాలకు నచ్చినబాటనే వారికి దోహద మివ్వవలసి యుంటుంది.

2044 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము బిడ్డల సహజ (పకృతి, ఉత్సాహం ఉప్పొంగినప్పుడు - భావం ఉ(దేకించినప్పుడు వచ్చీరాని మాటలతో పాడుతూ ఆడుతూ ఉంటారు. విశ్వకవి రవీంద్రుడు పిల్లల మనస్తత్వాన్ని గురించి పై సంగతినే ఇలా అన్నాడు: “౧౧/౫౪ 2౧6 గగగ06గ00 ౧2469 0౧|॥68౧ 640౧0౦6 అని ౧౧/౫6 &౧౮6 ౬౧౧1౧6౧ ౧౧౭69 2 00॥6 90౧౦ మన సాహిత్యంలోనే కాదు. ప్రతిసాహిత్యంలోనూ ప్రప్రథమమున అవతరించినది 'గేయమే. తర్వాత పద్యము పిమ్మట గద్యము వెలసినవి. అనగా జాతి శైశవావస్థలో పుట్టిన గేయమే. అందుచేతనే శ్రైశవావస్థలోనున్న బాలుర హృదయం అధికంగా గేయాన్నే ఆకర్షిస్తుంది. ఏదో అజ్ఞ్జాతలయ వారి లేతహృదయాలలో నర్తిస్తుంది. ఈ సంగతి మన ప్రాచీనులు అధికంగా (గ్రహించారు కనుకనే బాలవాజ్మయం అధికంగా గేయరూపంగానే ఉన్నది. బాల సాహిత్యం పరికిస్తే పాటలేని ఆటలెదు. పాటలేని కథలేదు. అందుచేత బాలురను అధికంగా ఆకర్షించే పాటలోనే బాలవాజ్బయముండుట అవసరమని లేలుతున్నది. పాటతర్వాత బాలుని అధికంగా ఆకర్షించేది కథ. మన అవ్వలు అనేక కథలు చెపుతూఉంటారు. పిల్లలు మాటలు వచ్చిన తర్వాత ముసలమ్మనో, తల్లినో నాకొక కథ చెప్పవూ అని వాళ్ళకు లంకెచేయుట మన అనుభవములోని విషయము. పేదరాసి పెద్దమ్మ కథ, ఈగ కథ, పేను కథ, చేపల కథ ఇటువంటి కథ లెన్నో మనదేశములో అధికంగా వ్యాప్తేలో వున్నవి. ఇవి మాటలలో ఉన్నా, పాటవలె భేదంలేకుండా దేశమంతటా ఒకేతీరున చెప్పటం గమనించతగినది. ఇలాంటి కథలన్ని మన మాతృదేవతలు మన హృదయఫలకాలమీద వ్రాశారు. ఈ సందర్భములో ఈ సంగతి కూడా గమనించుటవసరము. రష్యాలో బాలసాహిత్యాన్ని ప్రభుత్వమే అధికంగా పప్రచురిస్తున్నది. తమ భావిపౌరులను హేతువాదముతో పెంచి పెద్దలను చెయ్యాలని పిట్టకథలకు స్థానంలేకుండా చేశారు. ఇంతటితో తృప్తినొందక పిట్టకథలను నిషేధించారుకూడా.. వీనివలన పిల్లల్లో హేతువాదము పెంపాందకపోగా వారి భావనాపటిమ నశిస్తున్నదన్న సంగతి (గ్రహించి పిట్టకథలకు అగ్రతాంబూల మిచ్చుచున్నారు. వివిధ దేశములలోని పెట్టథథలనుకూడా అచ్చు వేయించారు. పొడుపుకథలుకూడా బాలసాహిత్యములో అధిక ఆకర్షవంతములు. వీటిలో కౌతుకము యెక్కువగా నున్నది. పిల్లలు కొంతసేపు ఆడుకున్న తర్వాత అలసట

బాలవాజ్యయం గ్యరెపాటి వెంకట నుబ్బయ్య 2046 తీర్చుకొనుటకు పొడుపుకథలలోకి దిగుతారు. ఒకరు కథ పొడిస్తే మరొకరు విప్పాలి. ఈ కథలన్ని పాటలలోనే ఉన్నవి. ఇవి పిల్లల్లో ఆనందాన్ని వివేకాన్ని కలిగిస్తవి.

“గోడమీద బొమ్మ - గొలుసుల బొమ్మ

వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ” అలాగే

“అడవిలో పుట్టింది - అడవిలో పెరిగింది

మాయింటి కొచ్చింది కైతక్క లాడింది"

సారాంశ మేమిటంటే పాటకు కథకు బాలసాహిత్యములో (ప్రాముఖ్య మున్నదన్నమాట.

బాలుర చిత్తప్రవృత్తుల కనుకూలమైన సాహిత్యాన్ని మన ప్రాచీనులు అధికంగా సృష్టించారు. ఆ సాహిత్యాన్నంతా (గ్రంథస్థం చెయ్యవలసిన అవసరం అధికంగా ఉన్నది. కారణ మేమిటంటే, ఈ తరంతో మన ముసలమ్మలు మూటాముల్లెలు కట్టుకొని కైలాసయాతత్ర సాగిస్తారు. కనుక వారు మనిఉండగానే వాటినన్నిటినీ సేకరించి ప్రచురించవలసిన బాధ్యత మనందరిమీదా ఉన్నది.

నవనాగరికతవలన కలిగిన నష్టాలలో మన మహిళలలో కళాహృదయం నశించినది. తల్లులకు నేడు పాటలేరాపు. పిల్లల లేతహృదయాలలో కళాబీజము ఎలా పెంపొందగలదు? ,

మన పెద్దలు రసాలు తొమ్మిదన్నారు. అందులో శృంగారానికి పెద్ద సీట్ర వేశారు. పెద్దలకు, పిన్నలకు రుచులలో, భావనా విధానములో చాలా ఖేదమున్నది. పెద్దలకు శృంగారరస మిష్టము. పిల్లల అభిమానరసాలు వేరు. హాస్య, అద్భుతాలు వారి కభిమాన రసాలు,

ఈ సంగటి (గహించుటచేతనే పిల్లలకోసము రచింపబడిన “పంచతంత్రము” అద్భ్బుతరసములో నున్నది. పిల్లలకు సంబంధించిన కథలు అధికంగా ఈ రెండు రసాలకు చెందినవే.

ఆనాలి రామకృష్ణుని కథలు, పరమానందయ్య శిష్యుల కథలు రానివారు లేరు. వారుభయులు మన తెలుగుదేశములో పుట్టి పెరిగినారు. ఆ కథలన్నీ హాస్యరసభరితములే.

2046 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

పిల్లలకొరకై పుట్టిన “పంచతం[తము" (ప్రపంచమంతటా పాకింది. దానికున్న (ప్రచారం దేనికీ లేదు. కాని మన పిల్లలకు అది అందుబాటులో లేదు. చక్కని వాడుకభాషతో, ముచ్చటైన అచ్చుతో, మంచి మంచి బొమ్మలతో పంచతంత్రాన్ని మనము (్రచురించుకోవలసిన అవసరమున్నది. అలాగే రామలింగని కథలు, పరమానందయ్య శిష్యుల కథలను ప్రకటించవలసిన అవసరమున్నది.

పిల్లల కేయే (గ్రంథాలు యిష్టము? దీనికి సమాధానము కొంతవరకు ఇదివరకే వచ్చినది. వారికి గేయం అధిక ఆప్యాయత కలిగిస్తుందని అటుతర్వాత కథ కమనీయంగా ఉంటుందని.

రస సందర్భములో పిన్నలను అధికంగా ఆకర్షించేది హాస్యరసము, అద్భుతరసము., భాషయేగాక విషయముకూడా వారి కందుబాటులో ఉండాలి. అచ్చు ముచ్చటగా ఉండాలి. పిల్లలకు రంగులంటే పరమట్రీతి. వారు మనవలె తెల్లగుడ్డలకంటే రంగు రంగు గుడ్డలను అధికంగా ఆదరిస్తారు. అందుచేత రంగులలో కూడా పుస్తకా లుండాలి. బొమ్మలంటే వారికి ఆప్యాయత అధికం. మనం చెప్పే విషయం అక్షరరూపంతోపాటు బొమ్మలతో కూడా ఉండాలి. అటువంటి పుస్తకాలను వారు ఆదరిస్తారు,

ఇక పపెల్లలంటే ఎవరు ? అనగా వారి వయస్సు నిరారణ చెయ్యవలసియుంటుంది. వయస్ప్సునుబట్టి వారిని తరగతులుగా విభజించవలసిఉంటుంది. బాలసాహిత్యం సంగతి వచ్చేసరికి, మూడు సంవత్సరాలనుండి పదిహేను సంవత్సరాలని (గ్రహించుటవసరము.

వయస్సునుబట్టి వారిని మూడు విధములుగా విభజించవచ్చును. వారి సాహిత్యాన్నికూడా ఇట్లాగే మూడు విధములుగా విభజించవచ్చును. శ్రవ్య సాహిత్యం, దృశ్యసాహిత్యం, పఠన సాహిత్యం. అయిదేళ్లు అంతకులోపు, ఐదు పదేళ్ళకు మధ్య వయస్సు, పది, పదిహేను ఏళ్ళ మధ్య ఈ దశలను గుర్తిస్తే ఆయా (ప్రమాణాలకు తగిన భాష, భావాలను రచనలో పాదగవచ్చును.

బాల సాహిత్యంలో ముఖ్యంగాలైన శ్రవ్య దృశ్య, పఠన సాహిత్యాలలో ఏయే దశలకు ఏది ఉపకరించునో పరిశీలిద్దాము. ఈ మూడు సాహిత్యాల్లో అధికంగా బాలురకు ప్రీతికరమైనది శవ్య సాహిత్యం. భాషా, భావాలెరుగని వయస్సునుండి ఈ సాహిత్యం వారిని ఆకర్షిస్తుంది. (శ్రవ్య సాహిత్య మంటే పిల్లల నుద్దేశించి తల్లులు పాడే పాటలు. ఈ సాహిత్యం మనలో అధికంగా ఉన్నది. జోలపాటలు, లాలిపాటలు మొదలగునవి ఈ (శ్రేణిలోనికి చెందినవే.

బాలవాజ్బయం గొరెపొటీ వెంకట నుబ్బయ్య 2047 కథలుకూడా ఈ సాహిత్యములో చేరినవే. పాట లధికంగా ప్రథమ దశలో వారిని ఆకర్షించును. ద్వితీయ దశలో పాటలు, కథలు కూడా ఆకర్షించును.

(పథమ దశలో వారికి కథలు, పాటలు వినిపించాలి. వారికి చదువు రానక్కరలేదు. వారు వింటూనే నేర్చుకుంటారు. వారికి శ్రవ్యసాహిత్యం అధికంగానూ, దృశ్యసాహిత్యం (అనగా బొమ్మలతో కూడుకొన్నది) ద్వితీయంగా ఉండాలి.

ఐదు - పదేళ్ల మధ్య వారికి దృశ్యసాహిత్యం ప్రథమంగానూ, (శ్రవ్యసాహిత్యం రెండవదిగానూ, పఠనసాహిత్యం మూడవదిగానూ ఉండాలి, పది - పదిహేనేళ్ల మధ్య వారికి పఠనసాహిత్యం ప్రధానమైనదిగా ఉండాలి. దృశ్యసాహిత్యం ద్వితీయంగా ఉండాలి.

మన తెలుగులో బొమ్మల పుస్తకాలు లేవనే చెప్పవలసి వుంటుంది. రంగు రంగు బొమ్మలు పిల్లలను అధికంగా ఆకర్షిస్తవి. ఈ బొమ్మల పుస్తకాలు ఇంగ్లీషులో అధికంగా నున్నవి. పీప్‌ బుక్స్‌, షో బుక్స్‌, క్లాత్‌ బుక్స్‌, వీల్న్‌ బుక్స్‌, టాయ్‌ కార్డ్స్‌ ఎన్నో చిత్ర చిత్రాలతో పిల్లలకు (ప్రియమైన పుస్తకాలు ఎన్నో ఉన్నవి. వారు మనకంటే ఐశ్వర్యవంతు లన్నమాటి. నిజమే. వారిలో నూటికి నూరు చదువుకున్నవారనే సంగతికూడా కాదనజాలము. ఐనప్పటికి మనం కూడ అటువంటి బొమ్మల వుస్తకాలను ముచ్చటగా ముద్రించి మన పాపలకు పంచిపెట్టాలి. బొమ్మల ద్వారా వారికి కథలను గరపాలి. శ్రవ్య సాహిత్యం మనలో చాలా ఉన్నది. దానిని సేకరించి ముద్రించుకొనుటే మనము చేయవలసిన పని.

దృశ్యసాహిత్య మంటే (బొమ్మల పుస్తకాలు) మనకు లేనేలేవు. మనము అధికంగా అచ్చువెయ్యవలసిన అవసరమున్నది. పఠనసాహిత్యం మన ప్రాచీన సాహిత్యంలో కొంత ఉన్నది. మనము చాలా ఈ సాహిత్యాన్ని సృష్టించుకోవలసిన అవసరమున్నది.

నేడు పిల్లలకై పఠనసాహిత్యం కొంత వస్తున్నది. కాని ఆలోచించి చూస్తే

. వీరి కెంత ఉపయోగపడుతుందో అనుమానం,

ఈ సందర్భములో బాల వాజ్మయ (్రష్టలను స్మరించుట కూడా అవుసరం.

మన తెలుగు ప్రజలను దిద్దిన సంస్క ర్త, మన తెలుగు భాషకు రూపురేఖలు దిద్దిన గద్యతిక్కన యగు వీరేశలింగం పంతులుగారు తెలుగుభాషను

2048 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వ్యావహారికానికి ఆఅతిసన్నిహితంగా తెచ్చి, సరళంగానూ, మృదువైనదిగానూ చేసి, బాల వాజ్శియానికి దోహదము చేయుటేగాక ఈసప్‌ కథలను, పంచతం౦ం[తమునుకూడా అనువదించి బాల వాజ్మయాన్ని సృష్టించారు. గిడుగు వెంకటరామమూర్తిగారి వ్యావహారికభాషావాదుల వల్ల [ప్రజలకెంతో ప్రయోజనం కలిగింది. ప్రజల కందుబాటులోనికి వచ్చింది భాష. ఆ మహామహుడు బాలురక్రై ఎట్టి రచన చెయ్యకుండానే బాలవాజ్బయసృష్టికి అపారమైన అవకాశం కలుగబేశారు. వారి [ప్రోత్సాహమువల్లనే చింతా దీక్షితులుగారు బాలవాజ్బయ రచనలకు పూనుకున్నారు. ఆ అభినవ వాగనుశాసనుడి అభిప్రాయాన్ని గ్రహించే వారి కుమారులగు సీతాపతిగారు బాలవాజ్మ్బయ రచనకు (ప్రారంభించారు. వీరుభయులు బాలవాజ్మయ [బహ్మలుగా పరిగణింపదగినవారు. వావిలికొలను సుబ్బారావుగారు మన ప్రాచీన సాహిత్యమునుండి బాలుర కుపయోగకరంగా, సులభ [గాంథికములో చిన్నచిన్న కథలను, చిత్రపటములతో సహా ముచ్చటగా “ఆర్యకథానిధొ అను పేరుతో ఎనిమిది సంపుటాలు (పకటించారు. ఇది [ప్రాథమిక పాఠశాలలో పెట్టబడి అధిక ప్రచారము పొందినది. ... వీరు ఇంకను “బాలక హితచర్య”", “కుమార హితచర్య”, “బాలిక హితచర్య, “కుమారీ హితచర్య” కూడా రచించారు. నాళం కృష్ణరావుగారు బాలుర కవియని ప్రఖ్యాతిగాంచారు. ఆయన భాష మృదుమధుర మగుటచే “మధురకవి యనికూడా పేరుగాంచినా ఆయన అచ్చంగా బాలుర కవి. ఆయన రచనలు అధికంగా బాలురనుగురించి బాలురకొరకు కలవు. బాలురకొరకు పెక్కు మధుర గీతికలు వ్రాయుటతోపాటు వారి చిత్తవృత్తుల ననుసరించే ఆ గీతికల గ్రంథనామములు “గోరుముద్దులు, “మీగడ తరకలు", “పన్న బుడగలు”, “పాల తరగులుి మొదలగు పేళ్లు పెట్టెను. వెంకట పార్వతీశ్వర కవులు పెద్దలకొరకు పెక్కు (గ్రంథములు రచించినట్లే పిల్లలక్రై “బాల గీతావళొ రచించుబేగాక భారత భాగవత రామాయణాలుకూడా రచించి ప్రసిర్ధిగాంచారు. కవరావుగారు ఆధునికుల్లో అభినందింపతగినవారు. నార్ల చిరంజీవి పిల్లలక్రై _ పాటలు, పద్యములు వ్రాస్తూ పసిద్ధినొందిన బాల కవి.

బాలవాజ్బయం గ్యారపాటి వెంకట నుబ్బయ్య 2049 కె. సభాగారుకూడా పత్రికల్లో రచనలుచేస్తూ ఆ మార్గాన అభివృద్ధి పొందుచున్న యువరచయిత. ఈ మాదిరివారు ఇంకా లేకపోలేదు. ఇలాగే తెలంగాణాలో వెల్టుర్తి మాణిక్యారావు, సదాశివరావుగారలు బాలవాజృ్బయ రచయితలుగా ఖ్యాతిగాంచారు. కాని వారి రచనలన్నీ పత్రికలలో నుండిపోయినవి.

  • కొందరు (ప్రచురణకర్తలనుకూడా ఈ సందర్భములో స్మరించవలసియున్నది. మాగంటి బాపినీడుగారిని యెరుగనివా రుండరు. వారు పిల్లలకొరకు “తెలుగు తల్లో, “పిల్లల బొమ్మల భారతం” (ప్రచురించారు. సరియైన బాలవాజ్యయం వారితోనే [పప్రారంభమైనదని చెప్పవచ్చును. పెద్ద అక్షరాలతో ముచ్చటగా ముద్రించటం, మనోహరమైన బొమ్మలు చేర్చటం గమనింపతగినది. ఇదివరకు ఏిల్లలకొరకు రచింపబడిన [గ్రంథాలు టెక్ట్సృబుక్‌ కమిటీవారిని దృష్టిలో పెట్టుకొని (వాసిరికాని, పిల్లలను మనస్సులో పెట్టుకొని ప్రచురించినవి తక్కువ. వీరి (పచురణతో బాల వాజ్మయంలో ఒక నూతనశకం ఆరంభమైన దనాలి.

అటుతర్వాత ఆ మార్గమునే అనుసరించినవారు కాళహస్తి తమ్మారావ్‌ అండ్‌ సన్స్‌, రాజమండ్రి.

మన (ప్రాచీన గేయవాజ్బయములోని కొన్ని పాటలను అందంగా “పిల్లల పాటలు అను పేరుతో ప్రచురించారు. బాపినీడుగారి పద్ధతినే వెంకట పార్వతీశ్వర కవులచే “పిల్లల బొమ్మల రామాయణం” భారతము, భాగవతముకూడా వ్రాయించి ప్రచురించారు. పిల్లలకొరకు కొన్ని కథల పుస్తకములుకూడా ప్రచురించారు. వీరి కృషి కొనియాడతగినది.

(గగాంథికములో వ్రాసే దానికంటె వ్యావహారిక భాషలో వ్రాయుట ఎంత కష్టమో, పెద్దల కొరకు వాసేదానికంటె పిల్లల కొరకు వ్రాయుట అంత కష్టం. బాల వాజ్బయసృష్టి సామాన్యమైనది కాదు. అందుకై ప్రత్యేక కృషి అవసరము.

బాలవాజ్మయ రచన చేయదలచినవారు మన ప్రాచీన బాలవాజ్మయం తరచి చూడవలసిన అవసరం అధికంగా ఉన్నది. ఇంతటితోనే పూర్తికాదు. ఇంకా వారు బాల బాలికల చిత్తప్రవృత్తులు, భావనలు, ఊహలేగాక, చిన్నపిల్లల వ్యవహారములోవుండే మాటలను కూడా బాగుగా ఆలుసుకోవలసిన అవసరమున్నది. అట్లు తెలుసుకొని రచన చేయువారే బాలవాజ్మయ నిర్మాతలు కాగలరు.

పఏల్లలకొరకై ప్రచురించిన ప్రతి పుస్తకం పిల్లల పుస్తకం కాజాలదు. నేటి బాలవాజ్బయంలో నూటికి తొంభై పాళ్లు దాని పేరు సార్థకం చేసుకోలేదు.

2050 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము బాలవాజ్బయ రచన చక్కని వాడుకభాషలో జాతీయాలతో వుండాలి. భాషతోపాటు భావముకూడా బాలుర కందుబాటులో ఉండాలి. పెద్ద అచ్చుతో, ముచ్చటగా ముద్రింపబడి రంగుబొమ్మలతో రాణించే పుస్తకాలే పిల్లలను ఆకర్షించుతాయి. అట్టి వాజ్మయమే బాలవాజ్బయ మనవలసివస్తుంది. దేశముయొక్క భావిభాగ్యోదయమంతా పిల్లలమైనే గలదు. కనుక వారి చదువుసంధ్యలను చిన్నచూప్పుతో చూడక పెద్దలు దానికై పెద్ద ప్రయత్నము చేయవలసిన అవసరమున్నది. పాపాయికై రూపాయిని వెచ్చించినప్పుడే మన జాతి ఉత్తమజాతి కాగలదు. (కిన్నెర: సంపుటము ఈ సంచిక 1, జనవరి 1954 ్న షా ల గ్‌ వై షా , (గూ మా (ర | (ట్ర (ర్‌ ఖో గ యమో క్ష

మన సాహిత్య సంగ్రాముములు: సమాధానములు కేతవరపు వేంకట రామకోటి శాస్తి

“కిన్నర” జనవరి సంచికలో శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు మె శీర్షికతో డిశంబరు సంచికలోని నా వ్యాసమునకు సమాధానములను వ్రాసిరి. వారి సమాధానములందలి మొదటి పేరాలోని చివరి వాక్యము గమనింపదగినది. “వారు నన్ను పేరు పెట్టి దూషించలేకపోయినా, వారి ఆరోపణలు అసత్యములు, పరస్పర విరుద్ధములు, అమర్యాదకరములు” దీని యర్థమేమి? నేను పేరు పెట్టి వారిని దూషించగలిగితే, నా ఆరోపణలు అసత్యములు - పరస్పర ఏరుద్ధములు, అమర్యాదకరములు కావలసియుండగా నేను దూషించలేకపోయినను నా ఆరోపణ లావిధముగా తయారైనవనియా?? ఐనను దూషించలేకపోవుట యేమిటి? సునాయాసముగా ఎవరైనను దూషించగలరు. కాని సంస్కారము గలిగి సహృదయులైనవా రాపని చేయరు. మైగా నా వ్యాసమున వారిని దూషించుటకు నేను ఉద్దేశించి యుండలేదుగదా - ఆ ఉదర్దేశమున్తు నెరవేర్పజాలనని నా అశక్తతను శ్రీ వెంకట సుబ్బయ్యగారు ఎత్తిచూపుటకు - వారిని దూషించవలసిన యవసరము నాకేమున్నది? వారు చెప్పిన విషయము సోపపత్తికముగా చర్చింపబడి సిద్ధాంతీకరింపబడినచో అంగీకరింతును. లేనిచో విషయ నిరూపణమునందలి బలహీనతను జూప్పుదును. అంతమాత్రమే. సందర మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

2052 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంప్పుటము 4: సాహిత్యము ఇక “(వారు) నా వ్యాసములోని ప్రతి అంశము ఖండించ ప్రయత్నించారు... .... .. వారి ఖండన అంతకు సమాధానమిచ్చుటకంటె స్థాలీపులాక న్యాయముగా యిచ్చిన చాలునని భావిస్తున్నాను" అని వ్రాశారు త్రీ వెంకట సుబ్బయ్యగారు. మంచి భావన - అనగా వారి వ్యాసములోని ప్రతి అంశము ఖండించుటకు వీలైనదనియు - అనగా ప్రతి అంశమును అంత బలహీనమైనదనియేగదా ద్యోతకమగుచున్నది. నా ఖండనమును అంత బలహీనముగా నున్నచో చీల్చి చెండాడవచ్చునుగదా? అట్టిచో శ్రీ వెంకట సుబ్బయ్య గారికి స్థాలీపులాకన్యాయ మొకటేల శరణము గావలసివచ్చినదో సహృదయులగు పాఠకులకు విశదమగుచునే యుండును. శ్రీ వెంకట సుబ్బయ్యగారు చూపిన అప్పకవి మొదలైన వారి వాక్యపరంపరను

చాలకాలము [క్రిందటనే పండితులు నిరాదరించి, నిరాకరించియున్నారు. అట్టివానినే తిరిగి ఎత్తి వాసి చూపుటవలన పాడినదే పాడరా ఏదో దాసరీ అన్నట్లున్నది. అభ్యుదయ వాదులమైన మనము వెనుకటివానినే తవ్వి తలకుపోసికొనుట మంచిది గాదు - కేవలము సంస్కృత విద్యాంసులగు పూర్వులను నిరసించుటకే “సంస్కృతమును నేర్చుకొనుటకు ఆనాటి వర్ణవ్యవస్థ ననుసరించి కొందరికే ప్రవేశము గలదు. ఈనాటి పరిస్థితులనుబట్టి ఆంగ్లము చదువరాదని విధినిషేధాలు లేవు" అని వ్రాశారు. అవుడు “వర్ణవ్యవస్థ” ననుసరించి యైనచో ఇపుడు “ధనవ్యవస్థ" ననుసరించి. ఈ కొంచమే వ్యత్యాసము.

ం “ద్వితీయ సం[గ్రామము పాల్కురికి సోమనాథుని కాలమున జరిగినదని నేనంటే శాస్త్రిగారు “పాల్కురికి సోమనాథుని కాలమున సంగ్రామము ఏదియ జరుగలేదు" అన్నారు. - ఈ యొక్క సత్యాన్ని (గ్రహిస్తే మా ఉభయుల చిత్తశుద్ధి సహృదయులకు విదితము కాగలదు" అని వ్రాశారు శ్రీ వెంకట సుబ్బయ్యగారు. (ప్రథవు సంగ్రామము నన్నభట్టారకుల భారతాంద్రీకరణ సందర్భమున జరిగినదనుటవలన అట్టి సంగ్రామ మేదియు సోమనాథుని కాలమున జరుగలేదని నేను వాసితిని. కాని శ్రీ వెంకట సుబ్బయ్యగారు “ఒప్పదు ద్విపద కావ్యోక్తి నాజనదు.... .... జాను తెనుగు విశేషము ప్రసన్నతకు” అను పండితారాధ్య చరిత్రము నందలి పంక్తుల నుటంకించి “ద్విపద కావ్యభాషగా పనికిరాదు అనెడివారు వుండుటచేతనేగదా ఆయన ఈ సంగతులు చెప్పినది. అదే సాహిత్య సంగ్రామము" అని (వాసినారు. అదే యొక సాహిత్య సంగ్రామమైనచో ప్రస్తుతము మేము

మన సాహిత్య నంగ్రామములు;: సమాధానములు. కేతవరవు వేంకట రామకోటీ శాస్త్రి 2053: వ్రాసికొను విమర్శన ప్రతి విమర్శనములు గూడ యొక ప్రపంచ సాహిత్య విమర్శన మహా సంగ్రామము గావలసివచ్చును. చిత్తశుద్ధియు తెల్లము గావలసి వచ్చును. కాకుండును గాక....! ,

సోమనాథుడు పల్లీజనులు పాడుకొనుటకు దగిన ద్విపదను స్వీకరించి (గ్రంథరచన చేయుటవలన - ఉద్దేశము మతప్రచారమే మొనను - సాహిత్యమును ప్రజలను కొంత సమీపించినదనియు - ఐనను అందలి మిశేషము అందరు సామాన్యుల కర్థమైనవనియు - నిజమునకు సాహిత్యమునే (ప్రజలకు అందుబాటులోనికి తవలయునని సోమనాథ్టుని అభ్మిపాయమైనచో తన వేద వేదాంగ స్మృతి పురాణేతిహాస పాండిత్యమును (గ్రంథముల నంతగా వెల్లడించి యుండడనియు నేను వ్రాసితిని. ఇందులో ఏదో నే నంగీకరించి మరల వ్యతిరేకముగా వ్రాసినట్లు శ్రీ వెంకట సుబ్బయ్యగారు అభ్మిప్రాయపడినారు. ఇందలి సత్యమును పాఠకులే గమనింతురుగాక. |

నేను సోమనాథుని (గ్రంథములలో తెలుగుదనము పూజ్యము అని (వ్రాసియున్నవో శ్రీ, వెంకట సుబ్బయ్యగారు సాక్ష్యముగా గొనివచ్చిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారి వాక్యమును, శ్రీ పింగళి లక్ష్మీకాంతముగారి వాక్యమును సార్ధకములయ్యుడివి.. కాని నే నట్లు వ్రాసియుండలేదుగదా? అందువలన నెత్తిచూపబడిన వాక్యములవలన నీ సందర్భమున ప్రయోజన మంతగా గానరాదు. శ్రీ లక్ష్మీకాంతముగారు చెప్పినట్లు కావ్యాంగములు మూడును (భాష - ఇతివృత్తము

  • ఛందస్సు) దేశీయములే. కావని నేనుమాత్రమంటినా? నే ననినది “పండితైకవేద్యముగానున్న సాహిత్యమును (ప్రజలందరకును పంచిపెట్టాలనే తలంపుతో శివకవులు వస్తువునందును, కవితయందును, భాషయందును, ఛందస్సునందును మార్పుతెచ్చి అభ్యుదయమునకు తోడ్పడిరి"అను వాక్యమునందలి సత్యమును గమనించమని. ఆంధ సర్వస్వము నుండి (గగ్రహింపబడిన శ్రీ లక్ష్మీకాంతముగారి వాక్యము మై శ్రీ వెంకట సుబ్బయ్య గారి వాక్యమును సమర్థించునేమో?

“ఇక యితర సంగతు లేల? పై సంగతులే, శ్రీ శాస్త్రిగారు సత్యమును ప్రతిపాదించిరో - నేను ప్రతిపాదించినది సత్యమో పాఠకులకు ఆలియజేయును”

2054 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అని వ్యాసమును ముగించిరి. తప్పక తెలియజేయగలవు. అసలు శ్రీ వెంకట సుబ్బయ్యగారు కైన చర్చించిన సంగతులెన్ని?- ఇతర సంగతు లేల లెమ్మని విరక్తిభావమును చూపనేల? ఇతర సంగతులను శ్రీ వెంకట సుబ్బయ్యగారు స్థాలీపులాకన్యాయము ననుసరించి స్పృశించి ఖండించకపోయినను పాఠకులు గమనించగలరు - అసలు శ్రీ వెంకట సుబ్బయ్యగారి వ్యాసమున, నా ఆరోపణలు అసత్యములనియు, పరస్పర విరుద్ధములనియు, అమర్యాదకరములనియు, (పపప్రథమమున నుడివిన నుడువు లెంత సమంజసముగా నిరూపింపబడి బుజువుచేయబడినవో నేను వేరుగా వ్రాయునక్కర యుండదు. కడనుడి - అస లింతగా చర్చింపవలసినదిగా దీ విషయము. అందరును చేయిచేయి కలిపే ముందడుగు వేయవలసిన ఈ రోజులలో ఈ విషయములలో రచ్చకెక్కి పరస్పరము వివదించుట (శేయస్కరముగాదు. ఇందుకే యీ సమాధానము. శ్రీ వెంకట సుబ్బయ్యగారిని కాదనుటయే నా పరమావధిగాదు. వారిని దూషించ వలయునని దూషించలేకపోవుటయే నా నిత్యకృత్యముగాదు. ఇక నీవిషయమున వాదమును లేదు. ఉపవాదమును లేదు. (కిన్నెర: సంపుటము 6, సంచిక 2, ఫిబ్రవరి 1954) యు /

  • మై గ్గ గో యమైూహడమే ఏ ళా
  • ఈయ! హ్రో6ా శ్ర [గ్ర -. యమ. (////[11

నేటి కవితా రచన మాదిరాజు రంగారావు .

నన్నయ కాలంనుండి నేడు శ్రీశ్రీ వరకూ ఎన్నో స్వరూపాలు మారుతూ వస్తూన్న కవితానిర్హరి నేటివరకూ ఎంతో గంభీరంగా విశాలంగా ప్రవహిస్తూనేవుంది. రమణీయార్థ ప్రతిపాదక శబ్ధం కావ్యం “వాక్యం రసాత్మకం కావ్యం” ఇత్యాది అలంకారిక నిర్వచనాలు వృన్నా “విశ్వశేయః కావ్యం” అని విశ్వానికి (శేయోదాయకమైనదే కావ్యము. ఈ నిర్వచనం దృష్ట్యా కావ్య పరిశీలనం ప్రజానీకంమై వదలివేయబడింది. ఏవో కొన్ని నిబంధనలకు బద్ధులై కావ్య రచన సాగించి కావ్యాన్ని కొన్ని సూత్రాలలో బంధించినంత మాత్రాన పతివొక్క రచన కావ్యం కానేరదు.ఆలా బంధించనంత మాత్రాన ప్రతివొకటీ దుష్ట కావ్యము అంటానికి వీలులేదు. మనోహరంగా చిత్రించిన మహాకావ్యం ప్రజానీకం హృదయాలను ఆకర్షించే అయస్కాంతం. మహాకావ్యం గద్యం, పద్యం రెండు విధాలా వుండవచ్చు. గద్యం పద్యం అను భేదం వుండడం అసహజమైనదే, . అందుకే “7౧6 6|51/౧;00 0614661 గ౦6(౮/ ౩౧6 ౧7056 ౪16/5 15 2 ౪౮19౮౯ 6౧౧౦౯ అన్నా డొక మహాశయుడు. ఈ దృష్టితో ౧110, 800. కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఇత్యాదులు మహాకవులే. “గ ౧06౫ 15 1౧6 ౪౭౧/ 1౧౫౭96 0 116 అం 065560 10 19 అరం! 140” జీవితం యొక్క ప్రతిబింబమే మహాకావ్యము. సహజంగా కవి 1౧౭౩6౫ 668౧ 18౧6 లో ౪౭8౭00౧6 లాగా విహరిస్తుంటాడు కాబట్టి అన్నీ చిత్ర విచిత్రమైన ఊహాకల్చ్బనలు ఎక్కువగా అతని కావ్యంలో కనుపిస్తుంటాయి. పందిరి షుల్లికార్దునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

2056 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మనలో, ఊహపర్జాలు తిని జీవించి, ఊహాజగత్తులో విహరించే మహాకవి కృష్ణశాస్త్రి తనతోపాటు మనలను కూడా కాస్త తిప్పుతాడు. కవి ఎప్పుడూ కొన్ని గిరలు గీసుకొని, కొన్ని సరిహద్దుల్లో ఏకాంతంగా వుండకుండా ఎప్పుడూ విశాల దృక్పథంతో [ప్రపంచంలోని మూలమూల జరిగే మార్పులను గమనిస్తూ విశ్వశేయస్సుకు సంబంధించిన రచనలు చేయాలి. అంతేకాకుండా కవిత్వంలో ఒక నూతన మార్గాన్ని అన్వేషించి ప్రవేశపెడుతుండాలి. నేడు శ్రీశ్రీ సాహతీ ప్రపంచంలో తెచ్చిన మహావిప్లవం, నేడు ఎంతమందో మహాకవులను సృష్టించి - ప్రజల్లో చైతన్యాన్ని ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎప్పుడూ పాత ఫక్కీలలో పాత స్వరూపాల (పతిబింబాలే తిరిగి చిత్రించడంవల్ల ఒక కళాకారుడు గొప్పవాడనబడడు. ఎప్పటికప్పుడు (్రతినిముషం ఒక [కొత్తదనాన్ని కాలానుగుణ్యంగా (ప్రవేశపెడుతూండాలి. సాధ్యమైనంతవరకు చిత్ర విచిత్ర రూపాలుగా కవితా శిల్పాన్ని మలచడానికి యత్నించాలి. కళ ఏ వొక్కడి సొత్తూ కాదు. అది ప్రజానీకం సొత్తు. విశాల విశ్వంలోని ఏ దేశంలోని ఏ మూల ప్రజానీకమైనా సరే అనుభవించి, ఆనందించి, ఆదరించే అధికారం వుంది. అందుకే ఏమూలో ఒక బ్రహ్మాండమైన విప్లవం వస్తే అది గబగబా విశ్వవ్యాప్తమౌతుంది. అప్పుడు రచయితలు తమ దేశంలోని (ప్రజానీకానికి తెలిసే భాషలో, తహతహలాడే (ప్రజలకు ఎంతో ఉత్సాంహతో అందించడానికి పూనుకుంటారు. అంతటా నేడు జరుగుతూన్నదీ యిదే! వ్యంగ్యంగా హృద్యంగా గంభీరమైన భావాలను, (ప్రజానీకం అభిరుచులను, దృక్పథాన్ని దృష్టిలో నుంచుకొని కావ్య రచనలు చేయాలి. అప్పుడు ఆ కావ్యం ప్రయోజనం విశేషంగా అగపడుతుంది. భారత రామాయణాదులవంటి మహాకావ్యాలు నేటి కవులు సృష్టించలేరని కాదు. ప్రజానీకంలో మొదటి భారతంగాని రామాయణంగాని చదివి అనుభవించే ఆనందం ఈ కావ్యాల్లో రెట్టింతలున్నా ఓపిగ్గా చదివి అందులోని ఆనందం అనుభవించలేరు. అందుకు కారణం రచయితల దృక్పథం, అభిరుచి, పఠితల దృక్పథం, అభిరుచి వేరు కాబట్టే - కాలాన్ని బట్టి పరిస్థితులనుబట్టి కూడా విలువ హెచ్చుతూ తగ్గుతూ వుంటుంది. నేడు జగద్వ్యాపృతమైన సాహిత్యంలో, భావాల్లో, భాషలో రచనావిధానంలో ప్రజానీకం అభిరుచుల్లో వచ్చిన ఈ మార్చే ఒకనాటికి అమాంతంగా మారిపోవచ్చు.

నేటి కవితా రచన మాదిరాజు రంగారావు 2057 క్షణంక్షణం మారే కవిత్వాన్ని - జీవాన్ని నిర్వచించటం ఎంత కష్టమో అంత కష్ట౦. అందుకే *నిం61[0 |5 ౧0600876 2౧౮ [౧౧౮౭-౧౯ అని అన్నా డొక మహాశయుడు. ఎప్పటికప్పుడు క్షణం క్షణం మారుతూండడం దాని సహజ స్వభావం. అందుకే ఓ కాలం కవిత్వం ఆకాలం వరకే ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంటుంది. ఒక యుగంలోనుండి కొత్త యుగంలోకి ప్రవేశించబోయేటప్పుడు కొంత ఘర్షణ కూడా తప్పకుండా జరుగుతుంది. అప్పుడు పాత రుచులను ప్రజలు చవిచూచి వుండడం మూలాన నవీన (ఏంథాకే) యుగానికి ఎక్కువ (ప్రాముఖ్యత యిస్తారు. ఈ [ప్రాముఖ్యత ఎంతకాలం (ప్రాముఖ్యత వహిస్తుందో? ఎంతకాలం నిలవదొక్కుకొని నిలుస్తుంది అన్న విషయం రచయితలపై ఆధారపడి వుంది.

వృక్షానికి సహజంగా ఆకులు వచ్చినట్లు స్వతఃసిద్ధంగానే కవిత్వం అబ్బుతుంది. పాణిని, భారవి మొదలగు [గ్రంథాలు వల్లేసినంతమాత్రాన కవిగాడు కాని పండితుడు. అట్లా ఊోహా కల్పనలు లేకుండా శబ్దాలతో కసరత్‌ చేసి రచించిన కావ్యాలు పాతాళందాకా మన కంటికి కానరాకుండా అణగిపోతాయి.. నేడు, పాండితీ ప్రకర్ష, ఊహాకల్పనా చమత్కృతి రెండూ కలిగి “కవి పండితుడు కాడు పండితుడు కవికాడు” అను సామెతను అపాస్తమొనరించినది కవి సామాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు వొక్కరే. అయితే భాషాసంస్కారం అవసరం కాదనడంలేదు. ఈ సంస్కారం వల్లనే ప్రతి కవికి ఒక (ప్రత్యేకమైన శైలి అలవడుతుంది. ఈ శైలిని బట్టే అతని కవితా ప్రతిభ, వ్యుత్పత్తి సులభంగా నిర్ణయించవచ్చు. ఒకకవి శైలి 1౧01200౧ చేసే రచయిత త్రిశంకు స్వర్గంలోనే వుండిపోతాడు. “౫౧౫40౧ 15 $01066 అన్నా డొక మహాశయుడు అందుకే కామాలు!

సంగీతం శ్రావ్యంగా పాడిన తరువాత దానిలోని మాధుర్యం వంటనే మనకు స్ఫురిస్తుంది. ఒక నాటకం స్టేజిపై వేయబడిన తరువాత దాని (ప్రాముఖ్యత గుర్తిస్తాం. కాని కవిత్వం చదివినంత మాత్రాన అందులోని భావం మనకు చప్పున తెరమైనీ బొమ్మలా స్పష్టంగా అగపడదు.

భావాన్వేషణ కోసమే అన్వేషించాల్సి వుంటుంది ఒకొక్కమారు. అందుకే “00౭|౧/ (ప్రశాంతంగా ఆకళించుకునే ఆవేశం” అన్నాడు కారల్‌.

2058 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అర్ధరాత్రి మనలను మేల్కొల్పి తరాలనుండి గాఢంగా హ్యపృతమైన మైకం వదలిపోయేట్టు వైప్లవ గీతాలు పాడీ భాషలో భావంలో ఛందస్సులో రచనా విధానంలో (బహ్మాండమైన మార్పు అచ్చి “మరో ప్రపంచం . మరో ప్రపంచం, మరో(పప్రపంచం” అని ఎలుగెత్తి - “పదండి ముందుకు " పదండి ముందుకు పదండి (తోసుక పోదాం మైమైకి" అని ఉత్సాహం రేకెత్తిస్తూ “కదం తొక్కుతూ , పదం పాడుతూ . హృదంతరాళం గర్జిస్తూ - పదండి. . నదీనదాలు అడవులు కొండలు, ఎడారులూ” గడచి గడచి. వయస్సు మళ్లిన ఎముకలు కక్రుల్లిన సోమరులను విడిచివైచి ప్రతియువకుణ్ణీ మెనికుణ్ణిగా తయారుచేసి “హరోం! హరోం! హరహర హర హర హరోం హరోం హరా అంటూ, శ్రీశ్రీ దింపిన మరో (ప్రపంచంలోని శ్రీశ్రీ జగన్నాథ రథచ్మక ఘోష విని, [ప్రజానీకం హృదయాలు చలికి హిమశిలీభూతమై పోకుండా అగ్నిధారలు కురిపించి, “హమంబయి పోవునేమొ.... ....బొంతలు లేవు కప్పుటకు వాయింతును రుద్రవీణ పయి యించుక వెచ్చన అగ్ని గీతములొ అని రుద్రవీణాతంత్రులపై

నేటి కవితా రచన మాదిరాజు రంగారావు 2059 అగ్ని గీతాలు పలికించాడు దాశరథి. ఆరుద్ర కంటి కగుపడని గోడలను మనం ఎల్లా బద్దలు చేయాలని మొన్నటిదాకా ఆలోచిస్తూ నిన్ననే కార్యరంగంలోకి దూకాడు పఠాభితో సహా. సహచరులతో.... ఆంధ్రావని మొత్తం మీద నిజంగా (ప్రజాకవి అంటే కాళోజీ నారాయణరావు. అతని నా గొడవ 8/0౪/0109 ౧9౦౧౦- 109102! ౧౦౪1౧ ని జ్ఞప్తికి తెస్తుంది. నేడు సాహితీ భారాన్ని ఎక్కువగా మోస్తున్న తెలంగాణా సాహితీ సౌధ స్థంభాలు (ప్రఖ్యాత రచయితలు) సి. నారాయణరెడ్డి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరు రంగారావు, కవిరాజ మూర్తి. (కిన్నెర: సంపుటము 6 సంచిక 3, మార్చి 1954) పరల రం షు యర న గ్‌ క్‌. స్‌ | గ్‌ గా గ ఈ శీ గ్గ రె చ నే (గో (( నౌ డ్రి ప్రి గ చం లం ఘూ

“నృ ధ్రుకలశము””

కొమరగిరి నరసింహా రావు, ఎం.ఎ. సాహితీ నమితి

శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి “మధుకలశా"న్ని ప్మృపథమంగా ఆంధ్ర రసజ్ఞ లోకం “భారతి” ముఖాన రుచి చూచింది. నేటికి సుమారు ముప్ఫై సంవత్సరాలు అయినవి. ఈలోపల పుస్తకరూపంలో వెలసి ఆంధ్రదేశంలో అందరి పప్రశంసలనూ అందుకున్నది.

ఉమరు ఖయ్యాం పారసీ “రుబాయతు” ను ఎడ్వర్లు ఫిట్సు గెరాల్డు ఆంగ్లంలోకి అనువదించి 1859 సంవత్సరంలో ప్రకటించాడు. ఫిట్సు గెరాల్డు పద్యాలనే శ్తీ సుబ్బారావుగారు తెలుగులోకి అనువదించారు. అనువాదమే అయినా ఫిట్సు 'గెరాల్డు పద్య సంపుటి స్వతంత్ర కావ్యంగా ఆంగ్ల సాహితీలోకంలో ప్రఖ్యాతి పొందింది. మొదట ఈ ఆంగ్ల కవి ధైర్యం చాలక తన ఈ చిన్న కావ్యాన్ని అనామకంగా ప్రచురించాడు. ఆ మరుసంవత్సరమే యిది ప్రఖ్యాత ఆంగ్ల కవులు స్విన్‌బరన్‌, రాసెట్టీల దృష్టి నాకర్ణించింది. అయినా వెంటనే గణుతిలోకి రాలేకపోయింది. తరువాత ఎనిమిది సంవత్సరాలకు రెండవ ముద్రణ వెలువడింది. అదేమి చిత్రమా, వెంటనే ప్రచండంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆంగ్ల సాహితీపరులను ఆశ్చర్యచకితులను చేసింది. నైతిక సాంఘికాచార శృంఖలాబద్ధులై కృంగిపోయే యువకులందరికీ ఇది నూతన ప్రపంచాన్నీ నవ్య జీవిత పథాన్నీ, నిర్మల స్వేచ్భావాయుపూరాన్నీ ప్రసాదించింది. నాటి యువకులందరికీ “ఉమరు” పద్యాలు కంఠస్థమే. విప్లవ ప్రచలితమైన యువక హృదయాలను ఉమరు తత్వం ఉత్తేజితం

మధుకలశము కొమరగిరి నరసింవో లావు, ఎం.ఏ, (సాహితీ నమితా 2061 చేసింది. హార్డీ, బెనిసన్‌ వంటి ప్రఖ్యాత కవులుగూడా యీయన ప్రభావానికి లోనుగాకుండా ఉండలేక పోయినారు.

ఫిట్సు గెరాల్డు మూలంగానే ఉమరు తత్వం ప్రపంచ విసృతమయింది. ఎన్నో భాషలలోకి ఉమరు కావ్యం అనూదితమయింది. తరువాత ఫిట్సు గెరాల్డు తన కావ్యంలో ఎన్నో మార్పులు చేశాడు. అయినా ఆయన మొదటి అనువాదమే స్థిరపడిపోయింది. “మధుకలశా"”నికి యీ మొదటి అనువాదమే మాతృక. ఆంగ్లసారస్వతంలో ఫిట్సు గెరాల్డు కావ్యంవలె తఆలుగులో “మధుకలశం” స్వతంత్ర కావ్యంగా మూలానికి మెరుగులుపెట్ట జాలినదిగా ప్రశస్తి పొందింది.

ఫిట్సు గెరాల్డు కావ్యానికీ ఉమరు కావ్యానికీ ఒక భేదం ఉన్నది.

శాస్త్రదృష్ట్యా పరిశీలిస్తే “రుబాయతును కథాకావ్యం అనటానికి వీలులేదు. అందులో ఆద్యంతమూ విస్తృతమై గంథానికి మూలాధారంగా నిలిచే కథావస్తువుగానీ, అనుస్యూతంగా ఒక తత్యంగానీ గోచరించటం లేదు. అంతేకాదు. ఉమరు తన రుబాయీల నన్నటినీ ఏకలక్ష్యంతో ఒక మాటుగా (వాయలేదు. తన జీవిత కాలమంతా తోచినపుడు ఏదో ఒక చక్కని భావం తన మనస్సును కదలించినప్పుడు ఒక్కొక్క పద్యంగా చెప్పినాడు. ప్రతి పద్యమూ ప్రాకృతములోని “గాథాసప్తశతి”, సంస్కృతములోని “అమరుకము", “ఆర్యాసప్తశతి” వలె సమగ్ర భావ పరిపూర్ణమై వుంటుంది. అందువల్ల పతి పద్యమూ రసాత్మకమయిన వాక్యము - ముక్తకము. ఏకలక్ష్యంతో వ్రాసినవి కాకపోవటంవల్లనే యీ రుబాయీలు కొన్ని పరస్పర భావవిరుద్ధములుగా కనబడతవి. మరొక విశేషం: ఉమరు ఖయ్యాం పేరుతో వాడుకలో ఉన్న పద్యాలన్నీ ఆయన వ్రాసినవి కావు. ఆయనవి అనుకొన్న పద్యాలు చాలా యితర పారసీక కవుల [గ్రంథాలలో గూడా కనుపించినట్లు పరిశోధకులు ప్రకటించారు. అనామకములైన పద్యా లెన్నో భావాన్ని బట్టి ఉమరు పేరు [క్రింద వ్యాప్తిలోకి వచ్చినట్లు కొందరు విమర్శకులు స్పష్టం చేశారు.

ఈ స్థితిలో పెట్సు గెరాల్డు చేసిన ఘనకార్యం యిదీ ; ఉమరు ఖయ్యాం రుబాయీల నన్నింటినీ ఆమూలా(గ్రం చదిఐ, చర్చించి, అందలి తత్వసారాన్ని కాచి వడబోసి పరిపూర్ణ కావ్యరూపంలో (ప్రపంచాని కందజేశాడు. ఒకే కాలానికి గాని, ఒకే కవికిగాని చెందక విభిన్న భావాశయములై ఒక కవి పేరుతో ప్రచారంలో ఉన్న పద్యాలను అవగాహన చేసుకుని నిర్ణీత జీవిత పథాన్ని వ్యక్తం చేస్తూ

2062 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము రసవత్తరమైన కావ్యాన్ని అల్లాడు యీ మహాకవి. ఈయన అనువాద రీతిగూడా చాలా విచ్శితమయింది. తనకు నచ్చిన రుబాయీల నయినా అన్నింటినీ యథాతథంగా అనువదించలేదు. ఒకమాటు ఒక పద్యంలోని ఒక పాదాన్నే ఆంగ్లంలో పద్యంగా విస్తరించాడు. మరొకమాటు కొన్ని పద్యాలలోని భావాలను సమీకరించి ఒకే ఒక పద్యంలోకి కుదించాడు. ఇంకొకమాటు తనకు అస్పష్టంగా

| జ్ఞాపకమున్న యితర పారసీక కవుల కావ్యాలలోని భావాలను ఉమరు భావాలతో జోడించాడు. ఇంత స్వతంత్రించినా ఉమరు మూలానికి దూరం కాకుండా ఉదాత్తమయిన భావాలను ఉత్తమమయిన శైలిలో మనోజ్ఞంగా వ్యక్తం చేశాడు. అందుకే యాయన అనువాదానికి కావ్యత్వం అబ్బింది. ఈయనకు ఉత్తమ కవి అనే ప్రఖ్యాతి లభించింది.

ఇదీ ఫిట్సు గెరాల్డు అనువాదానికి ఉమరు “రుబాయతు"కూ ఉన్న ఖేదం. ఒకటి అనువాదమయినా కావ్య సిద్ధిని పొందింది. రెండవది మూలమయినా విభిన్న భావ సంపుటిగానే ఉండిపోయింది.

ఫిట్సు గెరాల్డు పద్యం మాత్రం రూపంలో ఉమరు ఖయ్యాం రుబాయికి అత్యంత సన్నిహితంగా ఉందని చెప్పవచ్చును. రుబాయి నాలుగు పాదాల పద్యం. మూడవ పాదంలో తప్ప మిగిలిన మూడు పాదాలలోనూ అంత్య[పాస నియమం ఉన్నది. ఫిట్సు గెరాల్డు పద్యం గూడా యింతే. ఇందుకు అనుగుణంగానే త్రీ సుబ్బారావుగారు “మధుకలశం"”లో అన్నీ వృత్తాలనే ఉపయోగించారు. అవీ చాలా భాగం ఉత్పృలమాలలూ, చంపకమాలలే. మధువు, వసంతము, లేగులాబి వాసనలు, (శేమ, (ప్రేయసి, “పరిమళ శయ్య పై ప్రణయ భాగవతమ్ములూ”, ఉత్పల చంపకమాలలూ - ఎంత చక్కని సాంగత్యము. ఎంత సుందరమయిన భావాలకు ఎంత సుందర తరమయిన వృత్తాలు!

(ప్రపంచాన్నంతా తన భావనా బలంతో సంచలింపజేసిన యీ, ఉమర ఖయ్యాంలో ఏదో ఒక విశిష్టత ఉండి తీరాలి. ఆయన ప్రకటించిన జీవితపథంలో ఏదో అపూర్వమయిన నూతనత్వం యిముడి వున్నదేమో. కాని నిశితంగా పరిశీలిస్తే అతని తత్వ ప్రపంచంలో ప్రాచీన దష్టలు దర్శించిన భావశబలతలో

విలీనంకాని విశేషకాంతు లేమీ గోచరించటం లేదు. అనాదినుంచీ మహర్తి హృదయాలను కలవర పెట్టిన ప్రశ్నలే యీాయననూ ఎదుర్కొన్నవి. అనిత్యమూ,

మధుకలశము కొమరగిరి నరసింహా రావు, ఎం.ఎ, (సాహితీ నమితి 2063 అవిలంఘ్యమూ అయిన యీ మానవ జీవిత రహస్యాన్ని తఆలుసుకోవాలని ఎంతో మథనపడ్డాడు. లాభం లేకపోయింది. సకల శాస్త్ర పారంగతులైన పండితులతోనూ, తాత్వికులతోనూ చర్చించి, పోయిన దోవనే తిరిగి వచ్చాడు. ఆయనే గొప్ప పండితుడు. శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు. జ్యోతిష శాస్త్రంలో అపారమైన కృషి చేశాడు ; ఘైగా తాత్వికుడూ కవీ కూడానూ. ఆయన నాస్తికుడని కొందరి అభిప్రాయం. కాని అది పొరపాటు. భగవంతు డున్నాడా లేడా అనే భావం గూడా ఆయనను బాధించలేదు. ఇవన్నీ మానవుని పరిమితమైన జ్ఞానానికి అతీతమైన విషయాలు. ఇలాంటివాటి కోసం వృథా కాలయాపన యెందుకని ఆయన మతం. అందుకనే అర్ధరహితమైన తాత్విక చర్చలలో కాలాన్నీ, విజ్ఞానాన్నీ వెచ్చించే మూఢ తాత్వికులంటే ఆయనకు ఏవగింపు. అపారమైన యీ విశ్వసాగరంలో మానవ జీవితం శేవలం బుద్బ్చుదప్రాయం. సర్వవ్యాప్తమయిన యీ అంధ తమస్సులో మన జీవిత కాలం మెజుపువంటిది. ఈ వైభవమూ, ఈ బెన్నత్యమూ యేనాటికయినా నశించేవే. విధి అత్యంత బలీయమయింది. ఈ (పపంచ గమనమంతా సృష్ట్యాదినే నిర్ణీతమయిన విధినియమానుసారం నడచిపోతూంటుంది. అయితే మనం భగవంతునిచేతిలో కేవలం కీలుబొమ్మలం. చదరంగపు పావులవలె మనను ఒక్క క్షణకాలం ఆడించి తుదకు తిరిగి ఆ అనంత విశ్వగర్భ పేటికలోకి విసరి వేస్తాడు. అవును. అయినా అంతమాత్రాన మనం భయభభ్రాంతులం కాకూడదని ఉమరు అభ్మిపాయం. సృష్టి స్ధితి లయకారకుడైన భగవంతుడు దయామయుడే. చివరి కంతా శుభప్రదమే అవుతుంది అని ఆయన దృఢ విశ్వాసం. మరి ఆయన నాస్తికు డెట్లా అవుతాడు? సప్తవ్యసనాలలో చేర్చి వేటిని నిషిద్ధమని పెద్దలు ఆజ్ఞాపించారో ఆ మధువు, ఆ స్త్రీ, ఉమరుకు ఆరాధ్యవస్తువులైనవి. జీవితం క్షణికమూ, అస్థిరమూ అని ఆయనకు తెలుసు. అందుకనే ఆ అస్థిరమయిన క్షణమాత్ర వ్యవధిలోనే జీవితమూ (ప్రపంచమూ మనకు (ప్రసాదించే సొఖ్యాన్నంతా “రేప” అనే చింతలీకుండా అనుభవించమని ఆయన ఉద్బ్చోధిస్తాడు. క్షణంలో ఎం జరిగేదీ మనకు తలియదు. గులాబీ సుమ సౌకువూర్యం కసుగందక పూర్వమే, పాన పాథత్రికలోని సుధామధుధారలు ఎండిపోవకముందే, (ప్రేయసి వదన సౌందర్య రేఖలు మాసిపోవకమునుపే వాటిలోని సౌఖ్యాన్ని ఆ క్షణ మాత వ్యవధిలోనే హాయిగా తనివితీరా అనుభవించాలని ఆయన ఆశిస్తాడు. అంతమాత్రాన ఆయనను

2064 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విషయలోలుడు అని అనుకోవటం చాలా పొరపాటు. ఆయన రసజ్జుడు, స్వచ్చంద సౌందర్యోపాసి. ఉమరు ఖయ్యాంకు ఇంత (ప్రశస్తి రావటానికి కారణం ఆయన ఉదాత్త భావ సంపన్నత కాదు, ఆయన చూపించిన నూతన జీవిత మార్గమూ కాదు. అందుకు ముఖ్యమయిన కారణం ఫిట్సు గెరాల్డు వీటిని అనువదించి కావ్యరూపంలో ప్రపంచాని కందించటమే. ఈ కావ్యంలో ఈయన మధురమయిన భావాలను ఎంతో మధురమయిన పద్యాలలో వ్య క్తం చేశాడు. సునిశితమూ, ఉన్నతమూ అయిన భావాలను ఎంతో సంక్షిపముయిన పదజాలంలో పొందుపరచాడు. అన్నిటినీ మించిన ఆయన కవితాశైలిలోని అతులిత మాధురీమహిమ రసజ్జలోకాన్ని ఉజ్జూత లూగించింది. అంతేకాదు. ప్రాచ్య వేదాంత స్వరూపాన్ని బాగా గ్రహింపజాలని పాశ్చాత్య [ప్రపంచం ఉమరు తత్వాన్ని జూసి భమసి, వెెరెత్తి, దానికి అర్థంలేని అంతంలేని ప్రచారాన్ని ఇచ్చింది. ఉమరు “రుబాయతును ఆంధ సారస్వతలోకానికి సుపరిచితం చేసిన ఘనత త్రీ సుబ్బారావుగారిదే. “మధుకలశం” లోని పద్యాలు మొదట 1924వ సంవత్సరంలో “భారతి"లో అచ్చయినవి. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకుగాని యితరుల అనువాదాలు వెలువడలేదు." “భారతి"లో అచ్చయిన “మధుకలశా”నికీ తరువాత 1935వ సంవత్సరంలో పుస్తకరూపంలో వెలువడిన “మధుకలశా"నికీ ఎంతో భేదమున్నది. తిరిగి (ప్రకటించేటప్పుడు మొదట అచ్చయిన పద్యాలలో (పతిదానినీ కొంత సవరించారు. ఏదో కొంత మార్పు పొందని పద్యం ఒక్కటీ లేదు. ఎన్నో పద్యాలకు చక్కని మెజుగులు తీర్చారు. మరొక విశేషమేమిటంటే, యీ పదునెనిమిది సంవత్సరాల వ్యవధిలో ఈ కవివరులకు కొన్ని ప్రాథమిక వ్యాకరణ సూత్రాలమీద ఉన్న గౌరవం కొంత సడలినట్లు కనుపిస్తుంది. మొదట అచ్చయిన పద్యాలలో ద్రుతప్రకృతికములమీద సరళముగా మారిన పరుషములు రెండవవూాటు పరుషములుగానే నిలిచిపోయినవి. మొదటివూాటున్న *.. దువ్వూరి రామిరెడ్డిగారి “పానశాల” 1928 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి “భారత సంచికలలో అచ్చయింది. అనంతరము పుస్తకరూపము ధరించింది. తర్వాత అనేకులు తెలిగించారు.

మధుకలశము కొమరగరి నరసింహా రావు, ఎం.ఎ. (సాహితీ నమిత 2065 అర్జానుస్వారాలు తరువాత మాయమైనవి. మొదట ఉన్న కొన్ని పద్యాల పాఠాంతరాలు తరువాత అదృశ్య మైపోయినవి. . తీగ 1౧15 66100601 16౧1 ఈ౧౦56 19౧౮6? 6౧86౧ ౧160063 1౧6 గిగ6గ9 ౬1౧ 0౧ ౪౧100 ౪6 1620 గిల, 1620 ౮౧౦౧ 1 1౧|| 10 ౪1౦ 6౧౦0౪5 ౯౧౦౧౫ *౧41 0౧౦6 ఓ0౪60/ ౬12 1 90౧౧95 ౮౧౨6౪౧ 1 ఈ 19 వ పద్యానికి మొదటి అనువాదం చూడండి : కలకల 6 బోవు తేట సొన కమ్మని వాతెజ నంటి, పల్లవాం గుళి బ్రతిమాలుచున్న యనుగుం బువు తీవియ యోర్తు, చూచితే కలికి! నఖక్ష తిన్‌ మధువు (గ్రక్కని యే చెైలిచాయ మోవియీ చెలియలి తీవెకున్‌ మనసు చెల్లని కోర్కుల నప్పగించెనో ! తరువాత దీనికి ఎలాంటి వన్నెలు తీర్చారో గమనించండి : కలకల నవ్వు తేట సాన కౌగిట నూగుచు బాలపల్లవాం గుళి బ్రతిమాలు ఈ హరితకుంజలతన్‌ కదలింప కంతగా కలికి ! నఖక్షతిన్‌ మధువు (గక్కని యే చెలి కావిమోవి ఈ చెలియలి తీవెకున్‌ మనసు చెల్లని ముచ్చట లప్పగించెనో ! “మధుకలశం” లో మిక్కిలి ృదయంగమమయిన పద్యాలలో ఇదొకటి. దీనిలో మూలంలోని భావంకంటే రసవత్తరమయిన భావాన్ని పొందుపరచారు. “మధువు గ్రక్కని యేచెలి కావిమోవి, “చెలియలి తీవ, “మనసు చెల్లని ముచ్చటలు” - ఎంత రసోచితమయిన పదజాలం! కవి దెంత దయార్దృహృదయం! ఈ భావంలో, ఈ మాటలలో ఆయనలోని కరుణ పొంగి వెల్లువలై ప్రవహిస్తున్నదా అనిపిస్తుంది. ఈ పద్యాన్ని తిరిగి తిరిగి చదువుకుంటుంటే మనము చెల్లని ముచ్చటలతో కృంగి కృశించి రాలిపోయే నవజవ్వని దీనవదనం జాలిగొలుపుతూ దృగ్గోచర మవుతుంటుంది. ఉమరు “రుబాయతు"లో ఆద్యంతమూ ఏదో ఒక విధమైన, ఏదో అర్థంకాని బాధాయుతమయిన జాలి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది. అదొక (పత్యేక మనః(ప్రవృత్తి. దాన్నే అంటే ఆ భావాన్నే కాకుండా ఆ

2066 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మనఃప్రవృత్తినిగూడా “మధుకలశం”లో వ్య క్తం చేయగలిగారు సుబ్బారావుగారు. ఒక కవి భాషనూ, భావాలనే కాకుండా ఆ భాషకూ, భావాలకూ మాటున ఉన్న కవి హృదయాన్నీ మనస్సునూ, మనస్తత్వాన్నీ గూడా అర్థంచేసుకుని దాన్నే తిరిగి వ్యక్తం చేయాలంటే ఎంతయినా ప్రతిభ కావాలి.

మూలంలోని భావాన్ని ఉద్దీపితం చేయజాలిన మరొక పద్యం : 23వ పద్యభాగం

0451 1010 0696 4౧6 ౪౧౮6 0651, [0 16,

5205 ౪/16, 9403 50౧9, $92౧35 510066౧ 2౧6 = 580౧5 ౬౧౮ |! దీనికి అనువాదం :

త అం ఆం = అటుపిమ్మట ధూళి ధూళితో

నెనసి యణంగిపోవు, మధు వెండును, పిమ్మట గాన మాగు,గా

యనులును నిద్రవోదురు, లయశ్రుతులున్‌ చెవి కంద వాపయిన్‌” ఉమరు రుబాయీలలో లేని శోభను చూపించాడు తన పద్యంలో ఫిట్సు గెరాల్డు. దానికి మరీ శోభను చేకూర్చారు సుబ్బారావుగారు.

ఫిట్సు గెరాల్డు తన కావ్యంలో ఉమరు “రుబాయతు”లోని కొన్ని పారసీక సాంప్రదాయాలను, కొందరు వ్యక్తుల పేర్లనూ మార్చి, ఆంగ్ల పాఠకులకు సుపరిచితం కావటానికి తదనుగుణమయిన సాంప్రదాయాలనూ, పేర్లనూ ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు: 851 044౧ ౦01 గ౧ం౦ఉంగ|౧౮; “4/౧0100-50౧66101 ౪1౧91640" "డగ ౪0 6189[4110 క06౧ 66౪156 (౧6 50267 అనే ప్రయోగాలు ఆంగ్లేయ సాంప్రదాయానికీ, ఆంగ్ల ప్రజానీకానికీ బాగా పరిచితమైనవే.

అదేవిధంగా “మధుకలశం”లో కవి మైందవపురాణ ప్రసిద్ధమైన భావాలను కొన్నింటిని వాడారు. 24వ పద్యంలో

“క [1406221౧ 1౧0గా 19 046801 014౧695 065 అనే పదాన్ని

“పాడెడు చిత్రగుప్తుడు తమాల నికుంజము నుండి....” అని ఎంతో యింపుగా అనువదించారు.

మధుకలశము కొమరగిరి నరసింవో రావు, ఎం.వి (సాహితీ నమిత్తి 2067 మరొకచోట 42వ పద్యంలో . “|ిగ౧౮ 142161 0౪ 16 14/67 00! 292069, 04౧76 5(92100 1౧0000 1౧6 009% &౧ తీ౧96| 50209 _ 864గ౧౦ & ౪65561 0౧ ౧1౩ 50౧006166౧” అనే పద్యభాగాన్ని . “కడ్డ కొక సందె చీకటిని, కాంచన భాండము నంస భాగమం దిడిమెలమెల్ల కాలిడియె నేకత మీ మధుశాల నాకిటన్‌ పడతి యొకర్తె... ౨... అని అనువదిస్తూ పురుష స్వరూపుడయిన ౫౧౫౪|ను ప్ప్రీమూర్తిగా మార్చి యిందలి భావాన్ని మనకు హృదయంగమం చేశారు. సుబ్బారావుగారు ఉమరు ఖయ్యాం తత్వంలోని ఉచితానుచితాలను శంకించలేదు.. ఫిట్సు గెరాల్డ్టు వలె తన భావాలకు అనుగుణంగా ఉమరు భావాలను మార్ప్చుచేయ (ప్రయత్నించలేదు. మరికొందరివలె అందలి గూఢార్థాలను విశదీకరించవలెనని ఆశించలేదు. “మధువు”, “మధుకలశం”, “పేయసి” వంటి పదాలకు బాహిరమై స్థూలదృష్టికి గోచరించే అర్థాలే కాకుండా మరేవో గూఢమైన అర్థం ఉన్నదని కొందరి వాదము. “మధువు” అంటే లౌకిక పారలౌకిక జ్ఞానమనీ, “పేయసి” అంటే యీ అనంత విశ్వాన్నీ తన నిర్మల గుమ ప్రభావం వలన సమ్మోహితం చేస్తూన్న అధిమానవ (ప్రేమైకమూర్తి అనీ కొందరు పండితుల అభ్మిప్రాయం. ఏది ఎట్లా ఉన్నా ఒకటి మాత్రం తథ్యం. ఉమరుకు భగవంతునిలో గాఢమైన విశ్వాసం ఉన్నది. ఆయన నాస్తికుడు కాదు. ప్రవంచమంతా సర్వమయుడైన భగవంతుని చిన్నయ లీలావిలాసమే అని ఆయన నమ్మకం. అందుకే ఆయన ఎన్నో రుబాయిలలో “త్వ మేవాహమ్‌ త్వమేవాహమ్‌” అని ఎలుగెత్తి చాటాడు. ఇ కవి, అనువాదకులు అయిన శ్రీ సుబ్బారావుగారికి ఈ అస్తినాస్తుల నిశిత " వేదాంత చర్చ అసందర్భము అని తెలుసు. అందుకనే విశేషించి వాటి ప్రమేయం లేకుండా ఫిట్సు గెరాల్డు ఆంగ్లానువాదాన్ని రసవత్తరంగా తెలుగులోకి అనువదించారు. ఆయన ప్రతిభా విశషమూ, ఆయన కావ్యంలోని పదలాలిత్యమూ,

2068 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము భావగాంభీర్యమూ, శ్రావ్యమయిన శైలీ యింకా స్పష్టం కావాలంటే ఎన్నయినా ఉదాహరణ లీయవచ్చును. అయినా యీ కవిలోని యీ గుణాలను ఇంకా విపులంగా తలుసుకొని ఆనందించాలంటే (ప్రఖ్యాతమైన ఆయన యితర స్వతంత్ర కావ్యాలను చదవాలి. ఉమరుకు మధువు అత్యంత (పేమ పాత్రము. ఆయన సముజ్వల తత్వసారానికి

  • మధుకలశం సరి అయిన చిహ్నం. సుబ్బారావుగారి కావ్యానికి “మధుకలశం” అనే శీర్షిక ఎంతయినా సమంజసంగా ఉంది. అందుకనే ఆయన “మధుకలశం” రసజ్ఞులకు ప్రీతిపాత్రమై ఆంధ్ర సాహితీలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. (కిన్నెర: సంపుటము 6. సంచిక 3, మార్చి 1954) . సూ కట్ల క ం్నే థ్‌ (| “స్స్స్‌ రో

ఊహలో కవిచౌాడప్పు . రమణారెడ్డి

" (వ్రేవళ్లివాడ శానో కాదో కాని, తంజావూరు సంస్థానం మట్టుకు “అంగ భవ మల్ల రంగమై” రంగుమీరిన రోజు లవి. ప్రబంధ సాహిత్యం ఉచ్చస్థితినుండి దిగజారిపోయి, కుక్కమూతి పిందులు తొడగసాగింది. అల్లసాని పెద్దనలోనే అక్కడక్కడ తొంగిచూచిన “బూతు” క్రమేపీ దక్షిణాంధ్ర సాహిత్య గగనమంతటా విస్తరించి, భూలోకాన్ని బురదగుంటగా చిత్రించేటంత వరకు విశ్రమించలేదు. ప్రబంధాలలో బంధాల వర్ణన హెచ్చుకాగా. శృంగారం పేరిట యింద్రియలోలుపత రాజాస్థానాలలో చొరబారింది. విజయనగరపు పాలెగాళ్లుగా నుండిన నాయకరాజులు, రక్తస తగడీ మహాదురంతానంతరం స్వతంత్రులయ్యారు -

.. సర్వతంత్ర స్వతంత్రులు. కృష్ణరాయల ఒరవడివారికి అబ్బిందికాదు. ఆయన నిశితమైన చూపు లేదు. బెచితి నెరుగరు. పాండిత్యమా అంతంత. మందలించేవాడు లేడు. చండశాసనుడైన కవి యెక్కడో ఒకక్కడ వుండి కోపిస్తాడు, గర్హిస్తాడు, అనే భయమా లేదు. తాము చేసేది ధర్మం, చూసేది సత్యం, ఆచరించేది నీతి, అనుసరించేది బుజుమార్గం, అనేటటువంటి నిర్భయమనస్థితి ప్రకోపెంచిన ఒకానొక భూస్వామ్య మైనిక వ్యవస్థ తంజావూరు రాజ్యం! తమ కోర్కెల జాగిలాలు సంది మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

2070 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము జనపదాలపైబడి, సంసారులను సానులను చ్యూ, పంటమాగాణులనుండి ఖజానాలోనికి బంగారు కాల్వలు (తవ్వి, ఆస్థానాన్ని అనంగ రంగభూమి గావించి, కవులను స్తోతపాఠకులుగా తప్ప కొరగాని వారినిగా చేసి, విలాసవతుల సుహాసాలనుండి బయల్వెడలిన సుగంధాలలో జోగి తూగే ప్రభువులు! తమ కొంప యేమోతమ గాడి యేమో, తమ సంసార మేమో తమ సంపాద్య మేమో తప్ప లోకవృత్తంలో ఆసక్తిలేని పాలిత అమాయక మహాప్రజ ! వీరిరువురి నడుమ, ఒకరి ఆనాసక్తతను మరొకరి నిశ్శక్తతను స్వప్రయోజనాలకు వినియోగించుకొని, కరణాలుగా, ఆస్థానికులుగా, అధికార పదవులలో వంశపారంపర్యంగా పీఠాసనం వేసికున్న “ఫీతిరిగద్దలు: యిది తంజావూరి రాజ్య పరిధిలోని అనుసాంవత్సరిక జీవిత వలయం! అభివృద్ధి ఆగిపోయిన యీ పరిధుల నడుమనున్న బతుకు బతుకుకాదు. తన దౌర్చల్యాన్ని అనువుగా చేసుకొని తనను తానే కొరికి తింటున్న పిశాచం! ఇట్టి సమాజం మాన్యమైన యే ఒక్క సాహిత్య విజయాన్నీ సిద్ధింప చేయగల చేవ లేనట్టిది. కనుకనే తంజావూరు నాయకరాజులు దక్షిణ నాయకులుగా తయారుకాగా, ముద్దు పళనిబోటివారు రాధికలు, ఇళలు అయ్యారు. వారు కట్టే కట్టు, మాటాడే మాట, చేసే రచన, చూసే చూపు - అంతటా క్షైణ్యం కన్పిస్తుంది. భోగం పద్య రచనా విధానంలోనూ [ప్రద్యోతక మవుతుంది. అవినీతి పదాల కూర్పులోనూ కనిపిస్తుంది. రసహీనత శుష్క జీవితంలోనేకాక, వర్ణనలోనూ కన్పిస్తుంది. రసం పాలు హెచ్చినందువలననే, రసానుభూతి లోపిస్తుంది కాబోలు! శృంగారం వికటం కాగనే, అది బూతు అయింది కాబోలు 1! భోగం మితిని మీరగనే, అది పాశవికోన్మాద ప్రవృత్తి అయింది కాబోలు! నిజాయితీపరుడుకూడ ధీశాలికూడ యీ మురుగుకాల్వలో బడి, అనాదరణ పొంది. పోషకుడులేక, తన సామర్థ్యాన్ని తప్ప్యుదోవల పెట్టి, హేళనను బూతును తన కలంలోనుండి విదిలించవలసివచ్చింది. ఆ నిజాయితీపరుడు మరెవరో కాదు - కవి చౌడప్ప! “రాజుల్‌ నీచులు వారి సేవ నరకప్రాయంబు అనిన ధూర్జటి(?), కావ్యకన్యకను “కర్ణాట కిరాత కీచకుల కమ్మసనిన పోతన, రాజుల సేవలో చేసిన వేయి తప్పులకు పరిహార్వపాయంగా వీరచరిత్ర విరచించిన శ్రీనాథుడు.... వారి చాలులోనివాడే చౌడప్ప. వారి పాండిత్యము తనకు లేకపోవచ్చును, ప్రతిభ లోపించవచ్చును;

కని చౌడప్ప రమణాంెడ్రి 2071 కాని స్వభావములో వారి ముగ్గురిని తనలో లీనపరచుకొన్నాడు. పోతనలోని భక్తి, శ్రీనాథునిలోని శృంగారము, ధూర్జటియొక్క సూటిమాట యితనిలో వున్నవి. పోగా, వేమనవలె యితనిలో నీతిబోధ కూడ కద్దు. కాని కాలముగాని కాలమున పుట్టి, పాండిత్యపప్రకర్షలేక, అసలు పోత్సాహమేలేక, పడటతోవబట్టి, తాను గర్హించదలచినవారి మార్గమందే వారికంటి యెక్కువగా పోయినందుచేత అపార్థము చేసికొనబడి, చీకటిలోనే వుండిపోయాడు చౌడప్ప.

అతడు చెప్పదలచుకొనిన నీతులనందరును వినవలెనని తాష్రతయపడినాడు. లేకు బోధయొక్క (ప్రయోజనమేమి? కనుకు వేమన ఆటవెలదికినలె, తాను కందపద్యమును (గహించాడు.

“అందములై వినవినం జవి

కందములై మంచి నీతి కందము లయితే

అందు చదువుదు రభినవ " .

కందర్వా... ..” చౌడప్ప కందములు చాల చలాకిగా, తేలికగా, వడివడిగా తన భావములను మోయగల వాహనములు. కందపద్య రచసయందు తన కెవరూ నాడు యీడురారని అతని గర్వము క

“కందము నీవలెం జెప్పే

యందము మథిం గాన యెవరియందును...ో

“కందముల (ప్రాస గణ యతు

లందముగా గవిత నంద రల్ల రిపుడు నీ

కందంబులు రసవన్మా

రందంబులు...”

*... నవరసఘటనా

కందంబులు నీ కవితాకందంబులు...” పూర్వీకులలోనూ, ఒక్క తిక్కన సోమయాజినే, యీ పద్యరచనలో తనకంటె మిన్నగా చౌడప్ప యెంచుకొంటాడు :

2072 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శే: సాహిత్యము “ముందటి దినములలోనం గందమునకు సోమయాజి ఘను డందురు, నే " డందబజు నను ఘను డందురు కందమునకు...” . ఏ సాధారణగుణం తనకు కనుపించింది తిక్కనలో తన కనుకూలంగా? నీతులు చెప్పేవాడు తేటతెల్లంగా చెప్పగలిగితేనే సఫలుడౌతాడు. మరి, తెనుగువారికి సంస్కృతంలో బుద్ధిచెప్పితే యేమయినట్టు కనుక,

  • కుందవరపు చెడుని నీతుల్‌ వినుటకును తేటతెను6గై కనపడుంగద ఏమిటి యీ ఘనుడు కొత్తగా చెప్పదలచుకొన్న నీతులు? బూతుల తడకగా రచన సాగించాడని కదా, మన కాతనిమీద కలిగిన అభిప్రాయం! మరి, బూతుబట్టు నీతిని బోధించేదేమిటి? పొరపాటు ఒక్కటే చేశాడు చౌడప్ప. బూతును గర్హించేందుకు మరింత పెద్ద బూతు వాడాడు. కాకుంటే, తన లక్ష్యం సిద్ధించదనుకున్నాడు కాబోలు!! తాను వ్రాసిన బూకతుకొరకైనా తనను వినేవారు చదివే వారుంటారు. మరి చదివితే వింటే బూతును తెగనాడుతారు. సంఘంలోని “బూతును” మాటలబూతు బూటుతో కొట్టదలిచాడు చౌడప్ప. అతని కోపమంతా లోభులపైన; కరణాలపైన; తనకు ప్రోత్సాహ మీయని (ప్రభువులపెన;ః ఆగొన్నవారికి అన్నంపెట్టని వారిపైన; మగ డుండగా వేరు మగని వెదికే మగువమైన; పసిపాపలను పెళ్ళాడిన ముదుసళ్లపైన. లోభులంటే దీనుడికి పరమశ్యాతవులు; వారిని కొట్టడానికి కూడ చౌడప్ప వనుదీయడు; కాని వారు కయ్యానికి పిలిచినా రారు; కనుకనే చౌడప్పకు వారంటే చెప్పలేనంత అసహ్యం: “కుక్కుటము లూరంబందులు కుక్కలు తమ కడుప్పు మపెంచుకొనవా? ధర బక్కండ్ర మనువంజాలమి కక్కూజితి....!;

కవి చౌడప్ప రమణా రెడ్డి 2073 “ఇయ్యంగ నిషప్పించంగల యయ్యలకేకాని మీస మందరికేలా? రొయ్యుకు లేదా? మీసము కయ్యమునకు....!' “తగుపాటి కవుల కియ్యని మొగముండల కేల గల్గె మూతిని మీసల్‌? దగ గొరగండాయె మంగలి, ఖగరాడ్చల!..” “ఎ కొందరు లోభుల్‌ కొయ్యవలె బిగిసి, రారే కయ్యమునకు?...” *..పొగడంగా నియ్యలేని భూపతి (బతుకున్‌” ఎవ రీ భూపతి? రఘునాథ రాయలా? రఘునాథ రాయలను తానే పొగడినాడు కదా, “*నేరుతునని మాట్లాడగ వారిజభవునంతవాని వశమా, తంజా వూరి రఘునాథ రాయని | గారెరుంగంగ... అని? కాని నృపతి చెంగటనున్నవారు తనకు (ప్రభుసవూశయము లేకుండచేసినట్లున్నది: “నృపతుల ఇంగట కొందరు నుపకారములేని పశువు లుండంగ..” ఈ “కొందరు” యెవరై వుంటారు? ఆస్థానకవులా. వారికంటె తాను తీసిపోయాడా? వారెందులో తన కధికులు? “పది నీతులు పది బూతులు పది శృంగారములు గల్గు పద్యములు సభం

2074 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము

జదివినవా6ండే యధికుండు

గదరప్పా!...” కాని, యీ “అధికుడు” పద్దనవంటి ప్రబంధ కవితాపతావుహఎలను మర్కటించుటలోనే అధికుడై వుంటాడు; స్వతంత్ర కావ్యరచనా సామర్థ్యం లోపించివుంటుంది :

  • “పెద్దనవలం గృతిజప్పిన6

పెద్దనవల; నల్పకవిని పెద్దనవలెనా?

ఎద్దనవలె మొద్దనవలె

(గద్దనవలె....”

“పెద్దలమంచును రాజుల

వద్దను గూర్చుండి నీచవాక్కులు పలికే

పెద్దలు భువిలో: బీతిరి

(గద్దలురా....!” రాజాశయం లభించలేదు కనుక అఖ్ధరలేదు. ఉన్నారుగా వూరూర రాజుకాని రాజులు, కరణాలు! వారి నాశ్రయిస్తే యేదైనా తృణమో పణమో రాలుతుందేమోనని బయలువెడలినట్టున్నాడు చౌడప్ప! కాని వారు అధికారాంధులు. సుమతిశతక కర్తకు కరణాలంటే యంత పడదో, అంతకుమించి చౌడప్పకు పడనిదానికి వారి బధిరాంధకశవ ధోరణి కారణమైవుంటుంది.

“*“కరణంబని తను నడిగిన6 _

గరుణం బిలిచి యొక్క కాసు కవి కియ్యనిచో6

గరణము పేరు సపిండీ

కరణమురా....” . వీళ్లెంత వీళ్ల బ్రతుకు లెంత? పరమదుర్మార్గ్లులు, మాయవులు, కపటులు.

“ధర గవి భట మాన్యంబులు

హరియింపగ లక్క కవివల నటించెడి యా

కరణము...”

కవి చౌడప్ప రమణారెథ్ధి 2075 తిరిగి ఆస్థానకవులద్వారాకాక, రాజుకు సన్నిహితువైనవారిద్వారానైనా, నాలుగు రూకలు చేత బడవేయించుకొంటే దినం గడుస్తుందని తోచినట్లుంది చౌడప్పకు. విష్ణువు రాజు; గరుడు డతని బంటు; బంటుద్వారా రాజును లోబరచుకోవచ్చు. కనుక గరుడుని వంటివారి కెందరికో సలాములు కొట్టినట్లుంది. వారినే యాచించినట్లుంది. కాని ప్రయోజనం లేకపోయింది :

“బండ గులాములు యాచక |

తండంబున కివ్వలేరు, తము దండించే

మిండల కిత్తురు ధగడీ -

గండలు..

“....లంజతమ్ములకైతే

దండిగ నియ్యంజూతురు...” ఈ రాజు లేమి రాజులు. యీ వుద్యోగు లేమి వుద్యోగులు? కృష్ణరాయలేకాక, అతని వుద్యోగులు తిమ్మరుసాదులు కవులను పోషించారే, వీరేమి టిట్లా పశుసముల పోయారు. దేశంలో కవిత్వానికి ప్రోత్సాహం గొడ్డుబోయిందా యేమిటి?

“విద్దెాల మేలెజుంగని నరు

డెద్దే సరి, గడ్డితినెడి టెద్దా? పసులం “

దెద్దుకు. గొంత వివేకము

కద్దప్పా....” ఇంత కోపం వచ్చేటందుకు, యింత అసహ్యం పుట్టేటందుకు చౌడప్ప ఆశించిన దేదైవుంటుంది? ఏదో అత్యవసరమైనదై వుంటుంది. ఏది లేకపోతే ప్రాణపోషణ దుర్రటమో అదికూడ అతనికి లభించకపోతేనే యింత ఆగ్రహం పుట్టుతుంది. యింత ఆవేశం వస్తుంది. అదిన్నీగాక, అతనివి కొన్ని పద్యాలే ఆగొన్న అతని కోధఘూర్జిత హృదయాన్నీ తిండివస్తువులు చూస్తేనే అతనికి గలిగిన ఆత్రతను తఆలియచేస్తాయి:

“పట్టెడైన లెస్స బాగైన వరికూడు

చిట్టెడైన నేతిబొట్టు లెస్స...”

2076 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము గుత్తివంకాయకూర తొడిమ మొదలు తినగోరుతాడు ; అతిమధురమంటాడు; కాకరకాయలు “వేయాజువగల కూరలు కాయ లనేకములులో “నాయకము”లట; దినభోజనం భార్య వడ్డిస్తే, అన్నదమ్ములతో, తనయులతో కలిసి భుజించడమే “ఘన విభవము": అతిథి ఆగొని వస్తే, వాకిట నిలబెట్టి యింటివాడు తాను లోపల భోంచేయడం “మన్ను గుడుచుటి; కాక, లోనికి పిలచి తనయునికి, పెనిమిటికి, పరదేశికి “భుక్తి నొక్క విధముగ నిడు నా వనితలె పుణ్యాంగనలు.” - కవి చౌడప్ప భోజనప్రియుడు గాడు; అన్నార్తుడు! దుర్మార్గులు ధనవంతులైయున్నారు. తనవంటి సామాన్యునికి గ్రాసంలేదు. యిదేమి న్యాయం! న్యాయమే వుంటే, దుర్మార్గుడు ఆకట మాడాలి, సజ్జనుడు భుజించాలి, సాంఘిక వ్యవస్థ తారుమారు గావాలి ;

*న్సడ్రవడి గలవాండేసా

పడవలరా పదియు నైదు పాకంబులు చా

రెండు నెయి రాజాన్నము మీ6

గడి పరుంగున..” కాని యిట్టిది జరుగదు. కనుకనే అతని కంత వుకోషం. ఆ వుకోషం అతన్ని బూతురచయితగా మార్చివేసింది. ఈ పద్యాలయితే అందరూ చదువుతారు. తనకు (అపుకీర్తి వస్తుంది. దానితో పొట్టగడుస్తుంది. ఈ బూతులు దుర్దనులకు; సజ్జనులు అందులోని నీతులు గ్రహించనీ :

“నీత్రులకేమి?యుకించుక

బూతాడక దొరకు నవ్వు పుట్టదు, ధరలో

నీతులు బూతులు, లోక

ఖా్యాతులురా.....౯

“బూతులు కొన్నిటం గొన్నిట

నీతులు చెప్పితిని, బుధులు నీతులు, ధూర్తుల్‌

బూతులు మెచ్చందగు...” ఈ బూతు - నీతులు త్వరలో చౌడప్పకు (అపుఖ్యాతిని, (అ)ప్రతిష్టను ఆచ్చిపెట్టి, అతని బాధలను నివర్తింపచేసినవేమో; తన పేరంటేనే కాకులకు తుపాకి రవమువలా కాకవులకు “ఆలాగే” అయిందట. దొరల పేరిట తా నెందుకు పద్యాలు కట్టాలి;

కవి చౌడప్ప రమణారెక్డీ 2077 వా రేమీ యాయరు; తాను అచ్చమైన కవిత్వం రాయాలంటే, దొర ధర్మాత్ముడు కావలె; ప్రజకు సిరి కావలె. ఇవి నాడు (నేడు?) లేవు కనుక తన మార్గమే తనది;

“ఎంతెంతో దీర్హాయు

షుంతుండవై మిగుల బుద్ధిమంతుడంవై శ్రీ

మంతుండవై మను, లక్ష్మీ

కాంతుని కృపం గుందవరపు కవి చౌడప్పా!

ఈ వ్యానం పరిశోధనమీద ఆధారపడి నవ్రాసినట్టొది కాదు. ఈవి చౌడప్ప శతకమందలి వద్యాలనుండీ యీ ఊహా చేశాను.” (కిన్నెర: సంపుటము 6, సంచిక వె, మార్చి 1954

షట గోగ్నా

కథకాదు సంజీవదేప్‌

“ఆబ్బా, ఈ నీళ్లు త్రాగలేను; చల్లదనం పోవడమేగాక కొంచెం వెచ్చబడినయి కూడ” అంటూ కాత్యాయని నగిషీ చేసివున్న కూజాలోని నీళ్లు ఉత్తర పంజాబులోని పఠాన్‌కోట ప్లాట్‌ఫారంమీదకు రైలులో నుండి పారబోసింది. ఎవరో పాపం క్రొత్త సెల్కుసూటు వేసుకొని కొంచెం దూరంలో నిల్చొనివున్నాడు. ప్లాట్‌ఫారం మీద నీళ్లు పడేవరకు దుమ్ముతో కలసిన నీళ్లతో అతని సిల్కుసూటుమీద మరకలుకూడ పడినయి. ఆ యువకుడు ఒక్కసారి కొంచెం కోపంతో రైలువైపుకు తలత్తిచూచి - నవ్వి వూరకున్నాడు.

సిల్కుసూటులో వున్న యువకుడు కూడా రైల్లోకి ప్రవేశించాడు. రైలు పఠాన్‌కోట నుండి కాంగా లోయకు పోతుంది. ఇంకా రైలు కదలటానికి ఆలస్యం వున్నది. రైలుయొక్క సిఖ్కు గార్డు ఒక చేతిలో జండాలు పట్టుకొని రెండవ చేతితో గడ్డం సవరించుకొంటూ, కులూ లోయనుండి దిగుమతయిన యాపిల్‌ బుట్టలను పరిశీలిస్తూ నిల్చున్నాడు. సిల్కుసూటు యువకుడు కాత్యాయనితో కూజాలో నీళ్లు పారబోశావేమని అడిగాడు. కాత్యాయని కారణం చెప్పింది. వెంటనే, అమృతసర్‌ నుండి నా నీళ్ల సంచిలో పట్టుకొచ్చిన ఐసు నీటిని గ్లాసులో పోసి కాత్యాయనికిచ్చాను. ఆ వేసవిలో అందులో మధ్యాహ్నసమయంలో ఆ హైమజలాలు గొంతు దిగేవరకు, కాత్యాయని ముఖం వికసించి తన కృతజ్ఞతతో నిండిన ధన్యవాదాలతో నన్ను నింపివేసింది. 'పందెరి మల్ల్‌కార్టునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

కథకాదు. నంజీవదేవ్‌ . 2079 అైలు సాగింది. ఉత్తర పంజాబులోని మాడ్చే వేడినుండి కాంగ్రాలోయలోని చల్లదనానికి పోతున్నామనే సంతోషంతో వున్నాం మేము. ధవల్‌ధార్‌ హిమశిఖరాలు ఇంకా కొంతసేపటికి గాని గోచరించవు. . కాత్యాయనికి యీ ఉత్తర పంజాబ్‌కూ, కాంగ్రా లోయకూ రావటాని కిదే (పథమం. [క్రమేణ మా పరిచయం సన్నిహితం కాజొచ్చింది. ఆ సిల్కుసూటు యువకుని పేరు ఆనంద కపూర్‌ అట; ఆయనకు కాత్యాయనితో వివాహం కొద్దిరోజుల క్రితమే జరిగిందట. వారిద్దరూ మధుమాసాన్ని గడపటానికని కులూ లోయలోని మానాలీకి పోతున్నారు. వెంట ఒక మొగా, ఒక ఆడా నౌకర్లున్నారు. ఆనంద కపూర్‌ ఢిల్లీ విశ్వవిద్యాలయపు పట్టభదుడు. కాత్యాయని ఇంకా విద్యార్థినే. -.. కాత్యాయనికి ఇరవయి సంవత్సరాలుంటయి. ముఖంలో కావ్యాల్లో వర్దించే విశేష సౌందర్యం ఏమీ లేదుకాని మనసులోని సుకుమార భావాలూ, సానపట్టిన అభిరుచులూ, సౌరభోపేతమైన అనుభూతులూ స్పష్టంగా ముఖంలో ప్రతిబింబిస్తూ ముఖమ్మదను ఒక విధమైన అలౌకికంగా మార్చినయి. అందువల్ల ఆమెతో సంభాషిస్తున్నంత సేపూ ఏదో ఒక అజ్ఞాత (ప్రభావానికి లోనవుతాం. మానసిక కృషి శరీరంమీద ఎలాంటి మార్పులను తెస్తుందో ఈమెను చూసే స్పష్టంగా బోధపడుతుంది. నిజంగా-ఆమె ముఖం ఆమెలోపలి సవిత్రాగ్నితో వెలుగుతూంది; ఎంత గంభీరమో అంత సరసమైన స్వభావం కూడ. కొంతసేపటికి వైలు మిట్ట లక్కటం (ప్రారంభించింది. ఎక్కుడు [పారంభించి నప్పటినుండీ వాతావరణంలోని వేడి చల్లదనంగా మారజొచ్చింది. చాల దూరాన ఆకాశంలో తఆల్లని శరత్‌ మేఘంలాగా ధవల్‌ధార్‌ హిమశ్శంగాలు గోచరించ సాగినయి. రైలు కటూ ఇటూ కొండలూ, లోయలూ, సెలయేళ్లూ గోచరించ _ప్రారంభించినయి. మేం కాంగ్రా లోయలో ప్రవేశించాం. . ఇంకామా రైలు ఆగాలిసినచోటు మూడు గంటల ప్రయాణపు దూరంలో వున్నది. కాత్యాయని ప్రకృతి దృశ్యాలను చూచి చూచి మళ్లీ మానవాకృతులవైపుకు మళ్లింది. నా చేతిలో ఆల్జన్‌ హక్సలే [వాసిన “౨6/8౧౧|౭| ౧౧|౦౩౦౧౧” వున్నది. కాత్యాయని నా చేతిలోని పుస్తకాన్ని తీసుకొని అటూ ఇటూ (తిప్పెచూచి “ఇలాంటి (ప్రత్యేక పుస్తకాల్ని చదవాలని నాకెంతో అభిలాష; కాని చదవటం పడదు. నేను మైన్సు విద్యార్థిని అయినా నా కిలాంటి విషయాలమీద ఎంతో ప్రీతి. సరేకాని,

2080 పందిరి మల్ల్‌కార్టునరావు శతజయంతి సంపుటము శ4ీ; సాహిత్యము మీరు చల్లని నీళ్లతో నా దాహం తీర్చారుకాని, నేను మాత్రం ఇంతవరకూ మీ ఆకలిని తీర్చలదు” అంటూ పేముపెట్టెలోనుంచి టోస్టూ, వెన్నా ఇంకా కొన్ని తియ్యని పదార్థాలనూ, రెండు కులూ యాపిల్‌ పండ్డనూ తీసి నాకిచ్చి తానూ ఆనందకపూరూ కొన్ని తిన్నారు. ఆనంద కపూర్‌ మితభాషి. గా అన్నాడు “మేము పంజాబీలం. మీ . దక్తిణాదివారితో ఇంగ్లీషులో సంభాషించాలంటే భయపడతాం.” కాత్యాయని అందుకొని అన్నది “భయమెందుకు, మాతృభాష సరిగా మాట్లాడలేనట్లయితే భయపడాలి, సిగ్గుపడాలి. అంతేగాని పరాయి భాష సరిగా మాట్లాడలేనప్పుడు భయ మెందుకు, సిగ్గెందుకు?” ఆనంద కపూర్‌ ఏమీ జవాబు చెప్పలేడు. అప్పుడు నే ననుకున్నాను - ఆనంద కపూర్‌ భార్యగానూ, కాత్యాయని భర్తగానూ అయివుంటే ఎంత సమంజసంగా వుండేదా అని. బయటికి అనివేయాలనిపించింది కాని, ఇందుకు కాత్యాయని సంతోషించినా కపూర్‌ చిన్నపోతాడని నేను ఆ మాటలను బయటికి అనకుండానే మింగివేశాను.

కాత్యాయని మరికొంతసేపు హిమాచ్చాదితమైన ధవల్‌ధార్‌ పర్వతమాలను చూచి మళ్లీ నావైపు తిరిగి, నా దగ్గరున్న కాయితాల సంచిని తిరగేసి, అందులో వున్ననేను వాసిన కొన్ని ఇంగ్లీషు వ్యాసాల్ని తీసి చదవసాగింది. నా వ్యాసాల్లోని “గిఆ5[౧610 ౪1510౧” అనేదాన్ని తీస్‌ “ఈ వ్యాసం పేరు మాత్రం బాగున్నది లోపల ఎలా వుందోగానిొ అని వ్యాసంలోని మొదటి వాక్యం చదివి “ఇది నాకు సరిగా అర్థం కావటంలేదు, మీకు అర్ధమై వాసిందేనా?” అని నవ్వసాగింది. ఆనంద కప్పూర్‌ మా దగ్గరగా జరిగి వ్యాసం చూచి, తనకు ఆ వాక్యం అర్థం అవుతూందికాని, ఆ అర్ధం సరైన అర్థమో లేక అపార్థమో తెలియటం లేదు కనుక, నన్ను ఆ

  • వాక్యాన్ని దీర్ణంగా వ్యాఖ్యానించమన్నాడు. కాత్యాయని నా వ్యాసంలోని [ప్రథమ వాక్యాన్ని చదవసాగింది:

0౧11041 ౪1510౧ ౧౭౧౦61౪765 1౧6 న౧౭౧౦గ౧౪౧౬| 10౧౧, ౧౪516 ౪1510౧ 39669 ౮06 గింంగాంగ2! 10గ౫ “౧61825 6 26502616 ౪1510౧ 20౧8౧6౧6౮5 106 ౧౧6౧౦౧౫6౧౫ 10గ 1౧066 ౪1౧ 8 910% 01 16 గ౧౦౮గా6౧4| 10గా.

సరే, పై వాక్యాని కేదో కొంత అర్థం విశదీకరించి చెప్పాను; దంపతు లిద్దరూ సంతృప్తిని ప్రకటించారు. కాతాస్టయని అన్నది “నిజంగా మీ వాక్యానికి మీకు అర్థం తెలుసునే. కొందరు రచయితలు వ్రాసేటప్పుడు వ్రాస్తారు కాని వ్రాసిన తరువాత అర్థం చెప్పమంటే నానా అవస్థా పడతారు.” అందుకు నే

కథకాదు. నంజీవదేవ్‌ 2081 నన్నాను. “తాను వ్రాసిందానికి స్వయంగా తానే అర్ధం చెప్పగల రచయిత గొప్ప రచయిత కాదు. తాను వాసిందానికి స్వయంగా అర్థం చెప్పలేని రచయితే గొప్ప రచయిత. ఒకవేళ అర్ధం చెప్పినా, ఆ అర్థం వినేవాళ్లకు అర్థంగాని ఫక్కీలో చెప్పగలిగితే ఇంకా గొప్ప రచయితన్నమాట.” అందుకు కాత్యాయని అన్నది, “మీరు మాకు సులభంగా అర్థమయే లాగా చెప్పారు కనుక మీరు మంచి రచయిత కాదన్నమాట.” అందరం అందుకు నవ్వుకున్నాం. సాయంత్రం మూడయింది. రైలు ఏదో స్టేషన్‌లో ఆగింది. కాంగ్రా స్త్రీలూ పురుషులూ రంగురంగుల దుస్తుల్లో ప్రాట్‌ఫారం పైన నిండివున్నారు. అందులో ఒక పద్ధెనిమిదేళ్ల అమ్మాయి పసుపురంగు లాగూ దానిమైన గులాబి రంగు చొక్కా తొడుక్కొని, లేత ఆకుపచ్చ రుమాలును ముందునుంచి వెనక్కు కప్పుకొని, చంకలో ఒక శిశువును (అమ్మాయో, అబ్బాయో తఆలియలేదు) ఎత్తుకొని మాకెదురుగా ఎవరితోనో మాట్లాడుతూ నిల్చొని వున్నది. కాత్యాయని మాటలు మాని ఆ శిశువువైపు ఏక్నాగదృష్టితో చూడటం మొదలుపెట్టింది; ఆమె ముఖంలోని చాంచల్యం అంతా ఒక గాంభీర్యాన్ని తాల్చింది; ఆమెలోని పేయసీపాత్ర మరుగుపడి మాతృస్వరూపం మైకుబికింది. ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని కాత్యాయనితో నే సన్నాను “మీకేమైనా పిల్లలా” అని. ఆనంద కపూర్‌ నప్వసాగాడు. కాత్యాయని ముఖాన్ని ఇంకా గంభీరం చేసి “మా పెల్లి అయి వారంరోజులు మాత్రమే అయిందని తెలిసికూడ ఏమైనా పిల్లలా అని అడుగుతారు. మీ మనసుకేమైనా ఆరోగ్యం లోపించిందా ఏమి? అన్నది. అందుకు నేనన్నాను, “అబ్బే లేదు, మానసిక ఆరోగ్యం బాగున్నందువల్లనే మిమ్మల్ని అలా అడిగాను; మీకు పెల్లి అయిందని ఆలియబట్టే పిల్లలేమైనా వున్నారా అని అడిగాను. అంతేకాని పెల్లి కానివాళ్లను పిల్లల సంగతి అడుగుతానా?” కాత్యాయని ముఖంలోని గంభీర ముద్ర కరగిపోయి ఆనంద కపూర్‌తోపాటు ఆమెకూడి నవ్వసాగింది. పెద్దగా అన్నది “మీ దక్షిణాదివారికి వళ్లంతా చమత్కారం లాగా వున్నదే? రైలు మళ్లి బయలుదేరింది. వచ్చిన కొలదీ ప్రకృతి దృశ్యం ఇంకా మనోహరంగా గోచరిస్తూన్నది. ధవల్‌ధార్‌ పర్వతమాల మాకు సమీపానికి రాజొచ్చింది. ఆ పర్వతమాల మీది మంచు చల్లదనం మమ్మల్ని స్పర్శిస్తున్నదా అన్నట్లున్నది. అడుగడుక్కూ సెలయేటి వంతెనలమీడుగా పోతున్నాం. కొన్ని లోయలు చాలా

2082 పందిరి మల్షికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లోతుగా కనిపిస్తూన్నాయి. లోయలో వుండి ఎత్తైన దృశ్యాన్ని చూచేదానికంటే, ఎత్తుమీద వుండి లోయలోని దృశ్యాన్ని చూస్తే ఎక్కువ రమ్యంగా తడుతుంది. ఈ సత్యం ప్రకృతి దృశ్యాలవరకే కాదు; మానవజీవితాల వరకు కూడ వర్తిస్తుంది. వైతన్యంయొక్క క్రింది అంతస్తులో మానవుడున్నంతవరకు తన (క్రింది అంతస్తులో వుండే విశేషాన్నిగాని, తనకంటే పై అంతస్తులో వుండే విశేషాన్ని గాని గుర్తించలిడు. దచైతన్యంయొక్క పై అంతస్తు కెక్కగలిగినప్పుడు తన పై అంతస్తులోని విశేషాన్నేకాక తనకంటే [కింది అంతస్తులోని విశేషాన్ని కూడ అవగతం చేసుకోగలడు, ఆనందించగలడు.

ఈ విషయాన్ని గురించే నేను ఆనంద కపూర్‌తో చెప్పుతున్నాను. నేను చెప్పే విషయాన్ని కాత్యాయని సరిగా వింటూన్నట్టు లేదు; ఆమె కన్నుమూసి అర్థనిద్రలోవుంది. కొంచెం చలివేయసాగింది. ఆ వేసవిలో ఆ చలి సుఖంగానే వున్నట్లనిపించింది. మా కెదురుగా ఒక విచితమైన పూలచెట్టు కనిపించింది. దాన్ని చూడమని కాత్యాయన్ని తట్టిలేపాను. ఆమె తలెత్తి చూచేవరకు ఆ చెట్టు అవతలికి దాటిపోయింది. ॥

నగోటా స్టేషన్‌ వచ్చేసింది. రైలుదారి ఇంతవరకే. ఈ రాత్రికి రైలు ఇక్కడే వుండి మళ్లి రేపుదయం వెనక్కుపోతుంది. నేను ఆ ర్యాత్రికి నగోటాలో వుండిపోతాను. నూతన దంపతుల కొరకు అక్కడొక కారు సిద్ధంగా వున్నది. వారు ఆ సమయానే బయలుదేరి పోతారు. మాకు వియోగ ఘడియలు సమీపించినకొలదీ నూతన దంపతుల ముఖాల్లోనూ, నా ముఖంలో కూడ చీకటితెరలు కనిపెంచసాగినయి. కాత్యాయనీ ఆనంద కపూూరులు నాదగ్గర విషాదపు వీడ్కోలు అందుకొని కారులో కూర్చున్నారు. నేనన్నాను “యోగంలో వుండే వాళ్లకే సంయోగం, వియోగం ఇచ్చే సుఖదుఃఖాలు తప్పవు. ఇక మనలాంటివాళ్లకా అవి తప్పేది?”

(కిన్నెర: సంపుటము 6, సంచిక 4, ఏప్రిల్‌ 1954)

తనుగులో నవల చల్లా రాధాకృష్ణ శర్మ గేయ వాజ్బయము శ్రీకారము కాగా తెనుగు సాహిత్య చరిత్ర ప్రారంభ మయినది. కాలక్రమమున గేయ వాజ్బయమునకు పిమ్మట పద్యవాజ్బ్యయము ప్రచారములోనికి వచ్చినది. గేయము శ్రవణసౌఖ్య ప్రసాదియెనచో పద్యము భావస్ఫోరకము. గేయము గిలిగింతలు పెట్టి, అవ్యక్త మాధుర్యమును (ప్రతిపాదించుచో, పద్యము మధురభావ కిరణములతో హృత్క్మమలమును వికసింప జేయును. కావున రెండును రసహృదయుల కాస్వాదనీయములు. ఈ రెండును మాత్రాబద్ధములే. కాని గేయము పాట. పద్యము పాటకాదు. అయినను గేయమునకును పద్యమునకును సన్నిహిత సంబంధము కలదు. ఏ భఖాషావాజ్బయమైనను తొలుదొలుత గేయ, పద్య వాజ్బయములతోనే (ప్రారంభమగును. ఇటుల [ప్రారంభమగు వాజ్మయము కాలము గడిచినకొలది శాఖోపశాఖలతో విలసిల్లు మహావృక్షమగును. నన్నయభట్టారకుని కావ్యావిష్కరణ మహోత్సవముతో కావ్యత్వము సిద్ధించిన తఆనుగు వాజ్బాయమున నేడు నవ్యశాఖ లెన్నియో వెలసినవి; వెలయుచున్నవి. ప్రపంచ వాజ్బయమును కూడ స్వీకరించుటకు ఆనుగు నెలత సన్నద్ధయై యున్నది. ఇతివృత్త స్వీకరణము, కథాకథనము, కవితారీతులు - మున్నగువానిలో వైవిధ్యము, నూతనత్వము కనబడుచున్నవి. ఇట్టి నిత్య నూతనత సాహిత్య సుందరోద్యానమున

  1. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మొగ్గదొడుగు చుండును. అప్పుడు కాని సాహిత్యమునకు సజీవత్వము సెద్ధింపదు. జీవములేని సాహిత్యము నిర్ణంధకుసుమము. ఆధునిక సాహిత్య సర్వస్వ శాఖలలో నవల ఒకటి. నవల వచనమునకు దగ్గజీ చుట్టము. పద్యవాజ్యయమునకు పిమ్మట వెలసినను, వచన వాజ్బ్యయము సువిశాలమైనది. ఈ వాజ్మయ మందలి శాఖలు వ్యాసము, విమర్శ, కథ మొదలైనవి. వచనము అన్నంతనే గద్యము స్ఫురణకు వచ్చుట పరిపాటి. నేడు గద్య వచనములు సమానార్థ్ధకములుగా వ్యవహృతములగుచున్నను, అవి భిన్నములు. పద్యమువలె గద్యముకూడ ఛందోబద్ధమయినదే. ఛందోబద్ధ గద్యలే మన ప్రాచీన కావ్యములందు దో్యోతకములు. వచన కావ్యమని వ్యవహరింపబడు సముఖము వేంకటకృష్ణపునాయని జ్రెమిని భారతమందలి వచనము ఛందోబద్ధమైనది కాదు. ఆ వచనములోని గతి నేటి వచనమందలి నడకను స్పురింపజేయదు. వచనము ఛందోరహితము. ఆధునిక వచన రచనములలో ఛందో నియమములున్నట్లు కనబడదు. కావున నేటి వచనరచనయు, ఛందోబద్ధమగు గద్యరచనయు విభిన్నములని చెప్పవచ్చును. వచనమువలె నవలకూడ మన వాజ్యయమున వెలసిన ఒక [కొత్తశాఖయే. మన సాహిత్యమందే కాదు. ప్రపంచ భాషా వాజ్బయములందును నవల నవ్యశాఖ యని పేర్కొనుట సమంజసము. నవల వేరు; కథ వేరు. కథావాజ్బయము మనకు నూతనము కాదు. మన పురాణములు గాథలతో నిండియున్నవి. మన కావ్యములు కథలు, గాథలతోను నిండియున్నవి. బృహత్కథ, కథాసరిత్ప్సాగరము, కాదంబరి, పంచతంత్రము మొదలగు కథా కావ్యములు మనకు సుపరిచితములే. అఢధునాతనముగా వెలసినను కాశీమజిలీ కథలు మున్నగునవికూడ గమనార్హములు. కనుక కథావాజ్బయము కొత్తది కాదనుట అత్య్యు క్తికాదు. గద్య, వచన రచనలకు సన్నిహిత సంబంధ మున్నటులనే, కథ, నవలలకు కూడ అట్టి దగ్గరి చుట్టరికమే కలదు. ఒక పెద్ద కథ కొన్ని విశిష్ట లక్షణములతో విరచితమైనచో, ఆ కథయే నవలగా భాసించుచున్నది. తెనుగుభాషవలె తీయని తేనె లొలుకు ఇటాలియన్‌ భాషా వాజ్మయములో తొలుతగా నవల వెలసెను. పిమ్మట ఆంగ్ల, గ్రైంచి వాజ్బయములందును నవలకు స్థానము లభ్యమయ్యును. కనుక నవల పుట్టుపూర్వోత్తరములను

బెనుగులో నవల చల్లా రాధాకృష్ణ శర్థు 2085 తెలిసికొనుటకు పాశ్చాత్య భాషా వాజ్మయ పరిశీలన మత్యవసరము. మధ్యయుగములలో వెలసిన పద్యకావ్యములు నవలా (ప్రాదుర్భావమునకు దారితీసినవి. ఏతత్కావ్యములందు రాజ కుటుంబములవారికిని, ధనికులగు ('ప్రభువరేణ్యులకును సంబంధించిన విషయములే వర్ణితములై యుండెను. ఆ కాప్యములు ప్రభువులకే రుచించినవి కాని సామాన్యులకవి అరుచ్యము లయ్యును. సామాన్య ప్రజానీకము వాంఛించినది వేరు. వీర యోధులు, వెజ్ఞి వెంగళప్పలు, కొంటె కోణంగులు - మొదలగువారు సామాన్యులకు సుపరిచితులై యుండిరి. వీరికి సంబంధించిన పరిహాస ప్రసంగపూూరిత కథలు కావలయునని సామాన్యులు కోరిరి. సారస్వత వీరులు బలవత్తరముగ నుండిన యీ ప్రజావాంఛను గుర్తించి, తదనుగుణ్యముగ రచనలు చేయసాగిరి. ఆనాటి వారి కిట్టి రచనలు నూతనములుగ తోచెను. కారణము: ఇతివృత్తములు స్మమాట్టులవి కాక సామాన్యులవి. రచన పద్యములోగాక వచనములో సాగినది. ఇట్టి నూతన వచన రచనమునకు ముగ్ధులై వీనిని నావెల్ల (110౪688) అని వ్యవహరింప దొడగిరి. “క్రొత్త కథలు" అను అర్థ మిచ్చు “*నావెల్ల” ఇటాలియన్‌ శబ్దము. ఈ నావెల్ల నుండియే నావల్‌ అను ఆంగ్లశబ్ద మేర్పడినది. ఆంగ్లనావెల్‌ తెనుగులో నవలగా మారినది.

(క్రీశ. 1348సం!1! [ప్రాంతమున ఇటలీదేశస్థుడు 6104౧౧1 5000280010 ఒక కథల పుస్తకమును ప్రకటించెను. ఆ యుద్గ్ధ్యుంథము 0602060౧ (పది రోజులు) అనునది. ఇందు వంద కథలు కలవు. బహుశః యీ కథలన్నియు పది రోజులలో చెప్పబడియుండుటచే ఈ పుస్తకమునకా పేరు వచ్చియుండనోపును.

... ఈ కథలు కేవలము కల్పితములు. అంతేకాని చారిత్రాత్మకములు కావు. ఇట్టి [కొత్త చిన్న కథకు నావెల్ల యను వ్యవహారనామ మేర్పడెను.' కాని నేడు (కొత్తదియ్యు పెద్దదియు నగు కథకు నావల్‌ అనిపేరు. ' అయినను పాశ్చాత్య నవలా వాజ్య్బయవమ 8000120010 రచన తోనె ఆరంభ వుయె్యెనని భావింపబడుచున్నది. కాని నిజమైన నవల క్రీశ. 1700 సం॥ పప్రాంతముననే వెలసెను. డేనియల్‌ డిఫో వ్రాసిన రాబిన్‌సన్‌ [క్రూసోయే (1719) ఆ తొలినవల. ఈ నవల తరువాతి నవలాకారులకు వరవడి నవలగా విరాజిల్లనది. అటుపిమ్మట ఆంగ్ల వాజ్బయవమునందు నవల లనేకములు వెలసెను. పాశ్చాత్య నవలావాజ్బయమును పరిశీలించునపుడు తొలుతగా గ్రైంచి నవలా సాహిత్యము

2086 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము స్ఫురణకువచ్చుట పరిపాటి. కెంచి నవలలో కొన్ని సార్వజనీన [గ్రంథములుగా చిరయశస్సు గడించినవి. రష్యన్‌, అమెరికన్‌ భాషలలో పదునేడవ శతాబ్ద చతుర్ధపాదము, పదునెనిమిదవ శతాబ్ద ప్రథమ పాదములందు నవలలు వెలసినవి. పదునెనిమిదవ శతాబ్దము నుండియే నవలా వాజ్బయమునకు ప్రపంచ సాహిత్య చరిత్రలో ప్రముఖస్థానము లభించినది. ఇతర వాజ్మయ శాఖలను కూడ మించి నేడు నవల బహుళప్రచారము నందికొన్నదని చెప్పవచ్చును.

నవల సంఘజీవన దరృ్వణము. కండ్లకు కట్టినట్లుగా సామాజిక జీవనమును చిత్రించుటకు నవల తోడ్పడినట్లు మజియొక సాహిత్యశాఖ తోడ్పడదు. వివిధ కోణములనుండి వీక్షించినచో నవల సాహిత్య స్వరూపముగ గోచరించును. రసపోషణకును, కథాకథనమునకును, శయ్యాసాకుమార్య ప్రదర్శనమునకును, వ్యక్తుల మనఃప్రవృత్తి చితణమునకును, సంఘ సంస్కరణోద్దేశ వివరణమునకును, రాజకీయసాంఘికాది పరిస్థితులను వ్య క్తీకరించుటకును = ఇట్టి వివిధ విషయముల నభివర్ణించుటకు నవలలో అవకాశము కలుగుచుండును. ఒకవిధముగా చూచినచో నవల మనోహర కావ్యముగా గోచరించును. మజొకరీతిగా పరిశీలించినచో నవల యొక దేశపు సాంఘిక చరిత్రగా కనబడును; హాయి హాయి యనిపించు కథగా ద్యోతకమగును. న్యూటన్‌ రంగులచ[కము తిరుగుచున్నంతసేపు చక్రమందలి రంగులన్నియు కరుడుగట్టిన ముద్దవలె కన్పించినను, ఆ చక్రములో వేర్వేరు వర్ణములు కలవు. అటులనే నవల యొక ప్రధాన విషయము నభివర్షించు (గ్రంథమేయైనను, అందలి విషయములు విభిన్నములు.

కల్పితము, దీర్ణము, సంఘమునకు సంబంధించినట్టిదియునగు వచనరచనము సాధారణముగా నవలయని పేర్కొనబడును. సంఘమునకు సంబంధించినది కావున, సంఘ జీవులగు బాల బాలికలు, స్తీ పురుషులు నవలాప్రపంచమున విహరించుచుందురు. ఎట్టి వ్య క్తికిని నవలలో స్థానము కలదు. ధీరోదాత్తులు, ధీరలలితులు మున్నగువారెల్లరు నాయికా నాయకులగుట కవకాశమున్నది. సింహపీఠి నలంకరించి రాజ్యముచేయు స్మమాట్టు, చీపిరి పుచ్చుకొని వీథులు శుభ్రముచేయు సామాన్యుడు, పండితుడు, అపండితుడు - వీజందరిని నవల యాదరించును. వ్యక్తుల మనఃప్రవృత్తిచితణము సాధారణముగ నవలలో

తెనుగులో నవల చల్లా రాధాకృష్ణ శర్మ 2087 జరుగుచుండును. కావున వారేమి చేయుచున్నారు, ఎందులకు చేయుచున్నారను ప్రశ్నలకు నవల ఒక వివరణ (గగ్రంథముగ నుండును. ఎలయన మానవుడు సంఘజీవి యగుటచే, సంఘమునందలి వాతావరణము సాధారణముగా మానవుని శీలమును నిర్ణయించుచుండును. ఒకవ్యక్తిని నావరించియుండు పరిసరముల ప్రభావ మాతనిలో గోచరించును. మానవుల మనః్రవృత్తులు విభిన్నములుగ నుండుట కిదియొక (ప్రబల కారణము. పరిసరముల (ప్రభావమువలి, విద్యాసంస్కారము, వంశానుగతమగు సంస్కారములును గమనార్హములు. ఇచట మజియొక విషయమును పేర్కొనవలసి యున్నది. ఒక సంఘము నందలి పరిస్థితులనుగాని, ఒక (ప్రదేశమునుగాని గుజించి సవివరముగా (గగ్రాహ్యాము చేసకొనదలచినచో అందులకు నవల సహాయకారిగ నుండును. నవలలో కాలైక్యమును పాటించి తీరవలయునను నియమము లేదు. నవల యందలి కాలము భూత భవిష్యద్వ ర్తమానములకు సన్నిహైతముగ నుండవచ్చును. లేదా కల్పితముగనైననుండవచ్చును. ఏది యెట్లున్ననుసరే - సామాన్య ప్రజానీకమునకు వినోదదాయకముగ నుండుటకుగాను నవల తొలుత రచింపబడినది. కాని నేటి నవలాకారుల దృక్పథములో నవల యట్టిదికాదు. నవల విజ్ఞాన, వినోదముల నొసగుచుండవలయును. నవల యొక పెద్దకథ. కథ చిన్నదిగా వుండును. కథలో సాధారణముగా కాలైక్యము పాటింపబడును. నవల విజ్ఞానము, వినోదముల నొసగును. కథ విజ్ఞాన్నపదము. ఏదో యొక సందేశము నిచ్చుచుండును. కథ చదివినంతనే దీనియందలి సందేశ (నీతి) వేమి? అను (పశ్న సాధారణవుగా స్పురించుచుండును. ఇట్టి నియమము నవలలో లేదు. నవల సందేశరహితముగా నురడవచ్చును. అందువలన నవల కేవిధమగు లోపమూ వాటిల్లదు. ఒక్కొక్కతూరి సందేశము కన్చించినను కన్చించును. సంఘజీవన మందలి బాగోగులను వ్య క్రీకరించుట, వ్యక్తుల మనః ప్రవృత్తిని చిత్రించుట - యిట్టి విషయాదికమునందు నవలాకారుడు సాధారణముగ నిమగ్నుడై యుండును. వివిధ, విభిన్న విషయములను వివరించుటకు నవలారచయిత కపకాశము కలదు. ఇట్టి సదపకాశము కథారచయితకు లేదని నుడువదగును. ఒకవేళ కథలో లక్కకు మీజిన విషయము లుదాహృతమైనచో, అందువలన మూలకథకు తీరని యన్యాయము కలిగినను

2088 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము కలుగవచ్చును. అంతేకాదు. సారస్య్యముకూడ తగ్గిపోవును. కాని నవలలో ఎన్ని విషయములు చేర్చబడినను, అవి మూలకథకు మెజుగులు దిద్దునట్టివిగ నుండును. తరుచుగా హృదయాకర్షణీయము, అత్యద్భుతమువైన సంఘటనతో నవల (ప్రారంభమగును. అది నాటకమువలె తోచును. నాటకములో వలె, నవలయండదును ప్రధాన కథయొకటి, ఆ కథనావరించి మతికొన్ని చిన్న కథలు నుండును. వర్ణనాంశములు, పాత్ర, రసపోషణములు మొదలగునవి మూలకథకు వన్నెలు చిన్నెలు సమకూర్చుచు దానిని కండ్లకు కట్టినట్లుగా చేయును. ఈ హేతువుచే నవల వచనదృశ్య కావ్యమని నుడువదగును. ఇట్టి యపూర్వావకాశము కథారచయితకు కలుగుట దుర్లభము, పాశ్చాత్య నవలా వాజ్మ్బయమును ఐదు విభాగములుగ విభజింపదగును. (1) కాల్బ్చనిక నవల (౧0గ౭౧(౦ 1౪0౪690) (2) చరిత్రాత్మక నవల (141510/16 0౪61) (3) సాంఘిక నవల (50621 %0౪6) (4) మనఃప్రవృత్తి చితణ నవల (౧9౪/౦0- 100162] 10౪6) (ఈ) అపరాధ పరిశోధకనవల (061601/6 ౫0౪60). కాల్పనిక నవలయందలి యితివృత్తము కల్పితముగనుండునని వేరుగ నుడువ నవసరములేదుగదా! (ప్రేమ, సాహసకృత్యాదులు కాల్చనిక నవలలో _ ప్రధానములుగా నుండును. చరిత్రాత్మక నవలయందలి ప్రధాన కథ చరిత్రకు సంబంధించినదిగా నుండును. ఇందలి వాతావరణము వర్ణితవుగు చారిత్రకాంశమును బట్టి యుండును. సంఘజీవనమును సజీవముగ చిత్రించునట్టి రచనము సాంఘిక నవలయని వ్యవహరింపబడును. నవలాకారుని కాలమున కనుగుణ్యముగ సాంఘిక నవలయందలి వాతావరణముండును. తనకాలపు సాంఘికాచార వ్యవహారములను నవలారచయిత చిత్రించును. ఒకవిధముగ చూచినచో, సాంఘికనవల సామాజిక విమర్శ గ్రంథముగనున్నట్లు ద్యోతకమగును. అపరాధ పరిశోధక నవల యందు సన్నివేశ కల్చ్పనము కంటె, అందు చేయబడు సూచనలు ముఖ్యములు. ఈ సూచనలు కథాగమనమును (గ్రాహ్యము చేసికొనుటకు తోడ్పడును. ఇక, మనఃప్రవృత్తిచితణ నవల అధునాతన సారస్వత సృష్టి. ఇది వివిధ కోణముల నుండి మానవుని పరీక్షించుచు నతని విజస్వరూపమును పాఠకలోకమునకు తెలివిడి యొనర్చ్బును. మానవుని వ్య క్తిత్వమును, నీలమును,

తనుగులో నవల చల్లా రాధాకృష్ణ ళర్గు - 2089 మనోవ్యాపారములను చిత్రించుటకు మనఃప్రవృత్తి చిత్రణ నవలాకారుడు యత్నెించును.

ఇంతవజకు పాశ్చాత్య నవలా వాజ్మయ పరిశీలనము జరిగినది. ఈ పాశ్చాత్య నవలయే భారతీయ నవలా వాజ్బయమునకు మాతృక. భారతీయ భాషలలో తొలుతగా వంగభాషలో నవల వెలసెను. వంగ నవలలు భారతీయ హృదయమును వశంవదము చేసికొనెను. అమరకవియగు బంకించంద్ర ఛటర్జీ మహాశయుని మధుర రచనములు పేర్కొనదగినవి. మన జాతీయ గీతమగు “వందేమాతరం” ఆ పుణ్య పురుషుని ఆనందమఠము నుండి (గహింపబడినది. అంధకారమున నణగిమణగియున్న తెలుగులను మేల్కొలిపి, తెనుగుజాతి వికాసమునకు కారకుడును, సత్కావ్యములను సృష్టించిన మహాకవుల జీవిత వృత్తాంతములను చీకటి కోణములనుండి వెలుగు రేఖలలోనికి తీసుకొనివచ్చిన మహావ్య క్తియునగు పూజ్యశ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారి పుణ్యమా యని తెనుగున క్రీ. శ. 1880 సం॥న నవల వెలసెను. ఆ తొలి నవలయే రాజశేఖర చరిత్ర, ఈ నవలకు మాతృక గోల్డ్‌ స్మిత్‌ మహాశయుడు రచించిన “వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌” అను ఆంగ్ల నవల. ఈ విషయమును పంతులుగారు తమ రాజశేఖర చరిత్ర పీఠికలో తలియజేసిరి. అయినను ఈ నవలకును గోల్ట్య్మొత్‌ రచనమునకును సన్నిహిత సంబంధ మున్నట్లు కనబడదు. కాని యొక్క విషయము మాత్రము స్పష్టము. వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డును చదివిన పిమ్మట, తదచనమువంటి రచనమును తెనుగున వెలయింపజేయవలయునను భావము కందుకూరివారికి కలిగియుండనోపును.

పాశ్చాత్య నవలా వాజ్బయమును విభజించినటులనే నేటి తెనుగు నవలా వాజ్బయమునుకూడ ఐదు విభాగములుగ విభజింపదగును. కాల్పనిక, చారిత్రక, సాంఘిక, అపరాధపరిశోధక, మనఃప్రవృత్తి చితణ నవల లనునవి యీ విభాగములు. , ఆనుగు నవల యందు పాశ్చాత్య నవలల ప్రభావమున్నటుల స్థూలదృష్టికి కూడ తలియవచ్చును. ఆంగ్ల, గ్రెంచి, రష్యన్‌ నవలారచయితలను మన నవలాకారులు గౌరవించిరని నుడువవచ్చును. పాశ్చాత్య నవలలు కొన్ని నేడు యథాతథముగా తెనుగు చేయబడుచున్నవి. మజికొన్ని యథాతథముగా గాకున్నను ఛాయాను

2090 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వాదము చేయబడుచున్నవి. విశ్వసాహిత్యమును హృద్గత మొనరించుకొనవలసిన అవసరము గల యీ దినములలో, ఇట్టి అనువాద సాహిత్య మవసరమని వేజుగ నుడువనవసరము లేదు. పాశ్చాత్య నవలలే కాక భారతీయ నవలలుకూడ కొన్ని తెనుగు చేయబడుచున్నవి. ముఖ్యముగా వంగ, మహారాష్ట్ర, హిందీ భాషల యందలి ప్రసిద్ధ నవలా రచనములు తెనుగులోని కనువదింపబడినవి. ఈ విషయాదికమును పరిశీలించినచో, తెనుగు నవలా వాజ్మయము విశ్వసాహిత్యమును స్వీకరించుటకు సన్నద్ధయై యున్నదని నుడువుట అత్యుక్తి కానేరదు. ఇది సాహసముగ కనబడినను, అభ్యుదయ లక్షణమని పేర్కొనవచ్చును. (కిన్నెర: సంపుటము 6, సంచిక 5, మే 1954) వల్‌ స్‌! న లాగ్‌ రష

జపాన్‌ నాటక కళ విశిష్టత నార్మన్‌ స్మిత్‌

అమెరికన్‌ నాటక రంగంకైన జపాన్‌ నాటక రీతుల (ప్రభావం విశేషంగా వున్న సంవత్సరంగా దీనిని మనం నిర్ణయించవచ్చు. (ప్రస్తుతం న్యూయార్కు నగరంలో మదాం టొకుహో అజూమా దర్శకత్వం [క్రింద కబూకీ నృత్య, గాయకులు (ప్రదర్శనాలు జరుపుతున్నారు. జపాను దేశం నాటకరంగానికి సమర్పించిన మహత్తరమైన కానుకలలో ఈ కబూకీ నృత్యగాన ప్రదర్శనాలు ఒకటి. వీటిని చూచి న్యూయార్కు (గ్రేక్షకులు ముగ్గులవుతున్నారు.

అంతేగాక, “ది టీ హౌస్‌ ఆఫ్‌ ది ఆగస్ట్‌ మూన్‌" అనే నాటకం కూడా విశేషంగా (ప్రజాదరణము పొందుతున్నది. “పాచ్య దేశీయుల నిగూఢమైన అద్భుత విశేషాలొను గురించి అమెరికన్‌ (ప్రేక్షకులకు మనోరంజకంగా, గంభీరమైన ఫక్కీలో ఆలియజెప్పడానికి ఈ నాటకం చాలావరకు తోడ్పడింది.

జపాను దేశస్థుల సంస్కృతిని అజూమా కబూకీ బృందం వారు యథాతథంగా చిత్రిస్తున్నారు. పాత్రలలో చలనం ప్రధానంగాగల నటన వీరిది. పాశ్చాత్య ప్రమాణాల ననుసరించి వీరి నటన యొక్క విశిష్టతను నిర్ణయించడానికి ప్రయత్నించ కూడదు. ఐనప్పటికీ, అమెరికాలోని [ప్రముఖ నృత్య నాటక విమర్శకులు ఈ ప్రదర్శనాలను ఎంతో ప్రశంసించారు.

ఇంత (ప్రశంసనీయంగా ఈ బృందంవారు నిర్వహిస్తున్న ప్రదర్శనాలలో గల వివిధ అంశాలను గురించి వివరంగా తాలియజేయడానికి ఇక్కడ వీలుపడదు. ఈ కబూకీ (ఈ పదం సంగీతం - నృత్యం - సామర్థ్యం అనే మూడు పదాలకు పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము

2092 పందిరి మల్లికార్జునరాపు శతజయంతి సంపుటము 4; సాహిత్యము సంకేతంగా సృష్టించబడిందని విన్నాను.) ప్రదర్శనాలలో చిత్రించబడే వాతావరణం ఎంత హృదయంగమంగా వుంటుందో అమెరికన్‌ నాటకకర్త, నాటక విమర్శకుడు అయిన పాల్న్‌గీన్‌ కళ్లకుకట్టేటట్లు వర్ణించాడు.

మధ్యాహ్నం పదకొండు గంటలవేళ ఈ కబూకీ ప్రదర్శనం ప్రారంభం కావడానికి కొద్ది క్షణాలముందు టోకియో థియేటరులో కూర్చున్నప్పుడు తాను పొందిన అనుభూతిని ఆయన ఇలా వర్ణించాడు : “గంట గణగణా (మోగడం (ప్రారంభమయింది. (పేక్షకులలో ఉత్కంఠ ఇనుమడించింది. నారింజ రంగు, నలుపు రంగు, ఆకుపచ్చ రంగు గల సువిశాలమైన ఆర ఇటువైపు, అటువైపు ముడుచుకుంది. కిటకిటలాడుతున్న (ప్రేక్షకులలో అనిర్వచనీయమైన ఆనందానుభూతి, ఉత్కంఠ (ప్రబలింది. +

“తెర తొలగడంతో వన్నెచిన్నెల స్వప్నజగత్తు మాముందు ప్రత్యక్షమయింది. రంగస్థలమంతట చెజ్జీవృక్షాలు పగోడాలు (దేవాలయాలు), పైనస్‌ తోటలు కానవచ్చాయి. వాటికైన వెలుగు వెల్లువలాగు ప్రసరిస్తూ నేతపర్వంగా వుంది. వాటికి అల్లంతదూరాన్నుంచి, ప్యూజీపర్వత శిఖరం తెల్ల తెల్లగా మిణుకు మిణుకుమంటూ కనుపిస్తున్నది. |

“ఈ ప్రదర్శనాలను చూడవచ్చినవారిలో జపాను చక్రవర్తి ఆత్మీయులైన ఉన్నత వర్గాలకు చెందినవారు ఒక డజనుమంది దాకా వున్నారు. వారు రంగస్థలానికి దగ్గరగా ముందు కూర్చున్నారు. వారు ధరించిన విలువైన దుస్తులు ఒదులు ఒదులుగా వుండి ఇటూ అటూ జాలువారుతున్నాయి. బుద్ధ విగ్రహాల్లాగా నిశ్చలంగా కూర్చునివున్నారు వారు. వారికి తరువాత వరుసలో వారి అనుచరులు మరొక డజనుమంది బాసినపట్టు వేసుకుని కూర్చునివున్నారు. వీరుకూడా ఎవరికినచ్చిన దుస్తులు వింతవింతవి ధరించారు. రంగస్థలానికి కుడివైపున ఆర్కెస్ట్రావాళ్ళున్నారు. వీరిలో 24 మంది సామిసెన్‌ అనే వాద్యాన్ని తారస్థాయిలో వాయించడం (ప్రారంభించారు. రంగస్థలానికి ఎడమవైపున కిటికీవంటి ఏర్పాటు వుంది. రంగంహన ప్యాతల నటనకు అనుగుణంగా కథకుడు అక్కడనుంచి కథను గేయరూపంలో వివరించడం ప్రారంభించాడు...”

జపాన్‌ నాటక కళ విశిష్టత నార్జున్‌ స్ఫిత్‌ - 2093 (ప్రస్తుతం న్యూయార్కు నగరంలో జపాను నృత్య నాటక ప్రదర్శనాలు జరుగుతున్నాయి. జపాను నృత్య, నాటక ప్రతిభా విశేషాలను కళ్లారా చూచి తెలుసుకొనడానికి చాలామంది అమెరికనులకు లభించిన ప్రథమావకాశమిది. ఈ (ప్రదర్శనాలను పత్రికా విమర్శకులు ఎంతో ప్రశంసించారు. ఈ విమర్శలను పట్టిచూస్తే - ఈ నృత్య నాటక ప్రదర్శనాలు (గేక్షకుల ఆసక్తిని విశేషంగా చూరగొన్నాయన్నమాట. ఇటువంటి వాటిని ఇంకా మరికొన్నిటిని చూడాలని వారు కుతూహలపడుతున్నారన్నమాట. జపాను వెళ్లడం సంభవించిన కొంతమంది మైనికులు, రాజకీయవేత్తలు, యాత్రికులేగాక, అమెరికాలోని సామాన్యపౌరులు కూడా కొంతమంది ఈ కబూకీ ప్రదర్శనాలను చూడడానికి ఇప్పుడు వీలయింది. ఇలా ఒక దేశపు సంస్కృతిని మరొక దేశంవారు తెలుసుకొనడానికిగాను ఈవిధంగా తద్ధ ఇనుమడించడానికి అనేకమైన కారణాలు చూపించవచ్చు. ఇతర దేశ విషయాలపట్ల ఆసక్తిని కలిగివుండడం ఆమెరికనుల స్వభావం. జపాను దేశీయులు ధరించే దుస్తుల వన్నెచిన్నెలు కూడా అమెరికన్‌ (పేక్షకుల మనసును విశేషంగా ఆకర్షించి వుంటాయి. అంతేగాక, జపాన్‌ దేశపు అత్యద్భుత చలన చిత్రం “రోషో - మన్‌” రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో (ప్రదర్శించబడింది. ఈ చిత్రం అమెరికన్‌ (కేక్షకుల పప్రశంసను విశేషంగా చూరగొన్నది. కబూకీ ప్రదర్శనాల పట్ల అమెరికన్‌ (పేక్షకులు ఇంత విశేషంగా ఆసక్తిని చూపడానికి ఈ “రోషో - మన్‌” చిత్రమే చాలావరకు కారణమై వుంటుంది. ఈ చిత్రం యొక్క ప్రభావం అమెరికన్‌ చిత్రాలపైన, ముఖ్యంగా కథాకథనం మైన అప్పుడే బాగా గోచరిస్తున్నది. కథలోని పాత్రలు వేటికవి వాటివాటి దృష్ట్యా కథను వివరించి చెప్పే పద్ధతిని అమెరికన్‌ చలన చిత్ర నిర్మాతలు కూడా అవలంబిస్తున్నారు. అలాగే జపాన్‌ సంస్కృతిపైన కనీసం సినిమా రంగం మెన - అమెరికా (ప్రభావంకూడా తక్కువగా ఏమీలేదు. “సింటిమెంటల్‌ జర్నీ” అనే అమెరికన్‌ చిత్రం యుద్ధానంతరం జపానులో (పదర్శింపబడిన విచేశ చిత్రాలలోకల్లా అత్యంత విజయవంత మైనదని

2094 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము (ప్రకటింపబడింది. “గాన్‌ విత్‌ ది విండ్‌”, “స్నో వైటొ అనే చిత్రాలకంటె కూడా దీనికి ఎక్కువ డబ్బు వచ్చింది. ఐతే ఈ చిత్రం అమెరికన్‌ చిత్రాలలోకల్లా అత్యంత విలక్షణమైనదేమీ కూడా కాదు.

డోనాల్స్‌రిచీ అనే అమెరికన్‌ పత్రికా రచయిత (ప్రాచ్య దేశాలలో చాలకాలంపాటు గడిపాడు. జపానువారు విదేశాల ఫిలిములను చూచి కేవలం వినోదాన్ని మాత్రమే పొందరు. వాటి నుంచి చాలా విషయాలను నేర్చుకుంటారుకూడా నని ఆయన తెలియజేశాడు. ఆయన ఇంకా ఇలా కూడా అన్నాడు :

“స్వయం కృషిద్వారా అభివృద్దిలోనికి రావడానికి అలవాటు పడిన దేశం జపాను. పాశ్చాత్యుల సంప్రదాయాలను, సంస్కృతిని తుచ తప్పకుండా తెలియజేయదగ్గ సాధనం చలనచ్విత్రమని చాలా కాలంగా చాలామంది విశ్వసిస్తున్నారు. అమెరికా చిత్రాలనుంచి (పజాస్వావ్యూన్ని గురించి తెలుసుకోవచ్చు. ఇంగ్లీషు భాషను నేర్చుకోవచ్చు. అత్యంత నవీనమైన అనేక విషయాలను గురించికూడా నేర్చుకోవచ్చు. అమెరికన్‌ చిత్రాల ప్రభావం జపానులోని చిత్ర నిర్మాతలకైన సామాన్య (గ్రేుక్షకులపైన కూడా హెచ్చుగావుంది. అమెరికన్‌ సినిమాలలోని కొన్నిసీనులకు సీనులనే యథాతథంగా మామూలు జపాను సినిమాలలో (ప్రవేశ పెట్టబడుతున్నాయి”

ఒక జపాను చిత్రానికి “సంటిమెంటారు జొర్నీ అని రొమాజీ (రోమన్‌ అక్షరాలలో వ్రాయబడిన జపాన్‌ భాష) లో పేరు పెట్టబడింది. ఈ పేరు వినగానే, చనిపోయిన ఒక స్త్రీ సమాధిలోనుంచి లేచివచ్చి తన కుమార్తెను, భర్తను జా(గ్రత్తగా పరిశీలించి, అంత విచారంలోను ఒక విధమైన సంతృప్తితో తిరిగి తన సమాధికి చేరుకున్న దృశ్యం మనకు గుర్తుకు వస్తుంది.

జపాను నాటక రంగాన్ని గురించి బాగా తెలిసినవారు ఈ చిత్రం ఇంత విజయవంతం కావడంలో ఆశ్చర్యం లేదంటారు. ఆధ్యాత్మిక సంబంధమైన పరిత్యాగాన్ని - వాంఛకు, బాధ్యతకు మధ్య సంఘర్షణ చెలరేగినప్పుడు మానవుడు చేసుకునే నిర్ణయాన్ని- జపాను నాటకాలు, సినిమాలు ప్రధానంగా చిత్రిస్తూవుంటాయి. ఉదాహరణకు : “అనుకూలుడైనొ ఒక యువకుని ఒక యువతి (ప్రేమిస్తుంది. కాని తన బాధ్యతను దృష్టిలో వుంచుకుని ఆమె ఆ యువకునిపట్ల తనకున్న అనురాగాన్ని పరిత్యాగంచేసి, ఆదర్శ్మపాయంగా జీవితాన్ని గడుపుతుంది. ఇటువంటి కథలను

జపాన్‌ నాటక కళ విశిష్ణత నార్మన్‌ స్మిత్‌ 2095 అనేకమైన వాటిని అల్లటం నాటక రచయితలకు తేలికైన పనే. కాని ఇటువంటి కథలన్నిటి వెనుక దాగిన ఏకైకభావం పరిత్యాగమే. నిజానికి ఈ పరిత్యాగభావం జపాను కళాకారుల ప్రత్యేక లక్షణమని చెప్పవచ్చు. కబూకీ, బనకు, నోవా సంప్రదాయ నాటకాలు, నవలలు, పద్యాలు, తదితర సాహిత్యం అంతలోను ఇమిడివున్న ముఖ్య భావం ఇదే. ప్రపంచ సంస్కృతికి జపాను సమర్పించిన ముఖ్యమైన కానుకలలో ఒకటి ఈ పరిత్యాగ భావం. ఐతే; ఇంతకు పూర్వం ఉదాహరించిన “టీ హౌస్‌” అనే నాటకంలో ఈ పరిత్యాగ భావం ఇమిడివుందో లేదో చెప్పడం కష్టమే. అయినప్పటకీ మానవులు చేసే చిన్న చిన్న తప్పిదాలను, వివిధ విషయాలకు వారిచ్చే విలువలను, ప్రాక్‌ పశ్చిమ దేశాలలోని మంచి చెడ్డలను వివరించి ఒకరు మరొకరి వద్దనుంచి ఎలా నేర్చుకొనవచ్చునో ఆ నాటకం బోధిస్తుంది. అసలు ఈ కథను వెర్నసస్నెడర్‌ అనే ఆయన నవలగా వ్రాశాడు. దానిని జాన్‌ పాట్రిక్‌ అనే ఆయన నాటకంగా తయారు చేశాడు. ఒకిసావా దీవిలోని (గామీణులకు [ప్రజాస్వామ్య సిద్ధాంతాలను గురించి బోధించడానికిగాను పంపబడ్డ ఒక అమరికన్‌ మెనికాధికారిని గురించిన నాటకమిది. ఈ దీవిలో ఒక పాఠశాలను నిర్మిద్దామని అమెరికన్‌ అధికారులు సూచించగా ఆ ద్వీపవాసులు తమకు . బోధించబడిన ప్రజాస్వామ్య సిద్ధాంతాన్నే వినియోగించి, స్వేచ్చగా జరిగిన ఎన్నికలద్వారా, తమకు పాఠశాలకు బదులుగా ఒక టీ దుకాణం కావాలని నిర్ణయిస్తారు. ఇది పాశ్చాత్య రచయితలచే, పాశ్చాత్యులకోసం (వాయబడిన దైనప్పటికీ (ప్రాచ్యదేశాల కళారీతులు ఇందులో చాలా ఎక్కువగా చొప్పించబడినాయి. అంతేగాక నాటకంలోని దాదాపు 20 పాత్రలు ఆసియావారివే. వాస్తవికంగా వుండాలనేఉద్దేశంతో వ్రాయబడిన నాటకం కాదిది. పాకీ, నోవా నాటకరీతుల ప్రకారం వరుసగా కొన్ని సంఘటనల చిత్రణ ద్వారా ఇందలి కథాగమనం జరిగింది. ఈ నాటకంలోని పాత్ర (ప్రవర్తనలో కార్యకారణ సంబంధం స్ఫుటంగా గోచరించదు. కబూకీ, నోవా నాటక సంప్రదాయాలలోవలెనే ఈ నాటకంలోని "ప్రధానపాత్రలలో కూడా వ్యక్తిత్వం గోచరించదు. కొన్ని . భావాలకు కొందరు వ్యక్తులకు ఆ పాత్రలు చిహ్నాలు మాత్రమే.

  1. పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఏమైనప్పుటికీ న్యూయార్కు నగరంలో ప్రస్తుతం జపాన్‌ నాటక ప్రదర్శనాలు చాలా జోరుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు న్యూయార్కు నగరంలోని జపాను కాన్సల్‌ జనరల్‌ హషషీమా షిమాజూ తన సంతోషాన్ని ఈవిధంగా తెలియజేశాడు.

“ఒక దేశంవారు తమ దేశంయొక్క సంస్కృతిని పరాయి దేశస్థులు ప్రశంసించినప్పుడు గర్వపడినంతగా మరెప్పుడు గర్వపడరు. తమ దేశ సంస్కృతి తాము గర్వింపతగినట్టి అసాధారణమైనదనే గౌరవభావం ఆ దేశస్థులలో కూడా వున్నప్పుడు ఈ విషయం మరింత నిజమౌతుంది”

షమాజూకు తోడు మనం మన (ప్రశంసను కూడా జతచేర్చవలసివుంది. కాని ఈ విషయాన్ని కూడా, ఆయన మాటలలో కంటే మనమేమీ బాగా చెప్పలేము! “ఒక దేశపు (ప్రజలు తమ సంస్కృతిని మరొక దేశపు ప్రజలకు తెలియజెప్పి, వారి సంస్కృతిని తాము తలుసుకొనబూనడం అంతర్జాతీయ సుహృద్భావసాధనకు శాంతియుతమైన రాజబాట.”

(కిన్నెర: సంపుటము 6, సంచిక 5, మే 1954) కే జపా యి నధ కం ళో ల్‌!

జర్మను సాహి త్యము ప్రాచీన వాజ్బయ రచనలలోని కొన్ని ఘట్టాలు డాక్టర్‌ వి. ఎన్‌. శర్మ

జర్మన్‌ సాహిత్యం అతి పురాతనమైనది. భారత ఆది సాహిత్య మైన సంస్కృత వాజయమునకూ జర్మను సాహిత్యానికి అనాదినుండి ఎంతో సంబంధ బాంధవ్యం వుంది. మన దృక్పథం వలె, వారి భావనాధర్మములు అతి ఉన్నతములయినవి. మతం, సాంఘికజీవితం, తత్త్వార్థసోపానములు, అవి యివి అని చెప్పనేల, అన్నీ యీ భూతల [ప్రపంచంనుండి, ఆకాశపథమును అమాంతంగాదాటి, అతీతమైన, జన్మమరణా లేమిలేని శాశ్వతలోకానికి నిజముగా మన ఆది ప్రపంచానికే తీసికొనిపోతాయి. అచ్చటి నిరంతారానందామృతమును చవి([గోలి తీసెకొనివస్తవి. తిరుగ భూతలప్ర దేశానికి భూతలాన్నే తద్వారా అపరస్వర్గాన్ని చేస్తవి. ఇదే వారి సంస్కృతిలోని రహస్యం. ఈ రహస్యాన్నే వారి సాహిత్యవీథులలో నిరంతరం చూడవచ్చును. ఎప్పుడీ సాహిత్యవాహినులు జర్మనుజాతిలో [ప్రారంభమయినవి? ఇది గొప్ప (ప్రశ్న! క్షిష్టపూర్వకమయిన (ప్రశ్న! దీని నింకను జర్మను పండితులు పరిష్కరించుటకు భయపడుతున్నారు. కొందరు బహుశా క్రీ. శ. 700 సం! నుండి ఈ సాహిత్యం పుట్టినదంటారు. మరికొందరు, క్రీస్తుశకానికి పూర్వమే, జర్మనుభాష అవిచ్భిన్నముగా వర్ధిల్లివున్నదని చెప్పుతారు. ఆకాలమున అల్లబడిన పాటలూ, పద్యాలూ ఎన్నో బయటికి

2098 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము వచ్చుచున్నవి. భాషారూపం, కొందరు పండితులన్న (క్రీశ ,. 700 సం॥ నాటికి, వేరుగానున్నా, భావోల్లాసమంతా ఒకటీ చిరకాలం వర్ధిల్లుచున్న మనో పరంపరలు అన్నీ ఒకటే. అనాదికాలంలో జర్మను రచనలు (గ్రంథస్తము కాలేదు. ఆనాటినుండి ఈనాటికి, ఈనాటినుండి ఇంకొకనాటికి రచనలు బయలుదేరి అన్ని దేశములలోను సంచారం చేసినవి. ఆయా దేశ వాతావరణములబట్టి, ఆయా కాలములలోని ప్రజల మనోసంపత్తిని బట్టి ఎన్నో మార్పులను చెందినవి యీ రచనలు. ప్రజావాజ్బయం ఇది. (ప్రజలే దీనిని తమసొంత సొత్తుమాదిరిగా ఆదరించారు, ఎన్నో సంవత్సరములకాలము. కాదు, కాదు, ఎన్నోవేల పర్యంతము, మనం మన వాజ్మయాన్ని కాపాడుకొన్నరీతిగా. రాజకీయ వాతావరణము జాతిని కొంతకాలం హతమార్చింది. మరికొంతకాలం వారి జీవితాన్ని ఎంతో మార్చివేసింది. కాని, కాని, యీ వృద్ధిక్షయాలకు దాసానుదాసురాలయినా సాహిత్యలక్ష్మి మాత్రం చావలీదు. తన నిజరూపాన్ని మంటకలపలెదు. జీవకళతో విలసిల్లినది సర్వావస్థలలో. ప్రారంభాన మన జనపద వాజ్బయంవల బు[రకథలతో ప్రారంభమయింది యీ జర్మను సాహిత్యం. మొదట రైవస్తుతులు, వీరకీర్తనలు, తరువాత గాథలు. జాతీయుల ధైర్యసాహసాదులను ప్రకటించునవి, పదరూపమున - చాలవరకు వీనిని మన యక్షగానములతో పోల్చవచ్చును - కోటానుకోట్ల బయలుదేరినవి. (ప్రజలను తన్మయావస్థలో దించి, వారి భౌతిక కష్టపరంపరలను పటాపంచలం చేసినవి. జర్మనుజాతి అనాదినుండి స్థావర మేర్ప్చరచుకొనివున్న ఉత్తరదేశములకూ మనదేశాలకు ఖేదంవుంది ఎంతో ప్రకృతి వాతావరణంలో. మనకు ఆరు బుతువులు. ఈ ఆరు బుతువులూ, మన ('ప్రజాకోటి భౌతిక పరిస్థితులనూ, మనోపరిస్థితులనూ సంవత్సర పర్యంతమూ అనేక రూపముల మార్చుచుండును. అన్ని బుతుకన్నెలనూ మనము సరిసమానముగానే ఆదరించి సంతోషించుతాము. వాని వాతావరణమును చక్కగా మన మనోశక్తులను పరిపూర్ణానికి దెచ్చుటకు వుపయోగించుకొంటాము. మన జీవితావస్థలవలె అవి అన్నియు మారుచుండును. ఒక నెల, లేదా రెండు నెలలు కొంత ఓపిక పెట్టుకొనివుంటే మనలను పీల్చి పెండి చేస్తున్న గ్రీష్మకన్య మాయమవుతుంది. వానదేవుడు వస్తాడు. భూమినంతను

  • తన వర్షధారలతో నింపి హాయిని ఇస్తాడు. శరదృతువు, హేమంతములు శ్యామలమగు సస్యములను భూమినంతటిని నింపుతవి. శిశిర రుతువు వస్తుంది.

జర్మను సాహిత్యము. డాక్టర్‌ వ. ఎన్‌. శు 2099 దానివెంటనే వసంతలక్ష్మీ ప్రత్యక్షమౌతుంది. శీతోష్టస్థితియా, 85 డి[గీలనుండి 100 డిగ్రీలవరకు మాత్రమే. అప్పుడప్పుడు ఎండాకాలములో 110 డిగీలకు అప్వుడప్పుడుపోయి మనలను బాధపెట్టినా ఈ బుతుకన్యలన్నా, మన కవులకు, గాయకులకు, శిల్పులకు ఎంతో ప్రేమ. వీరి రూప సౌభాగ్యాన్ని అవి యొంతవరకు మనల నాకర్షించి, మన మనోభావాలను ఆనందసాగరమున దింపి యీ భూప్రపంచపు కష్ట పరంపరలను పటాటోపం చేయునో కవిప్పుత్రులు ఎంతో సౌజన్యంతో తవు రచనలలో చిత్రించివున్నారు. ఈ మార్గాన్నే ఇతర కళాచిత్రములలోకూడా చూడవచ్చును. కాని ఇట్టి శీతోష్టపరిస్థితులు మన సోదరజాతికి లేవు. వారి బుతువులా నాలుగు. ఇందులోకూడా అయిరోపాలోని దాక్షిణాత్యులకూ ఉత్తరాదివారికి అందు ముఖ్యంగా, జర్మనీరాజ్య వుత్తర (ప్రదేశాలలో వున్నవారికి, వానికి ఇంకా పైనున్న స్కాంతినేవియా దేశములలో నున్నవారికి, వుంది, వుంది, చాలా వ్యత్యాసం. ఆరునెలలకు పెగా ఈ వుత్తరప్రాంతాలలో చలికాలానికే యజమానత్వం. సూర్యోదయం బొత్తుగా వుండనేవుండదు. చలి, చలి, సర్వకాలం చలే! నీతలం 30, 40 డిగ్రీలకు మెగా పోదు. పగటి కాలం కొద్దిమాత్రమే. నాలుగు, అయిదు గంటలకే చీకటి భూ భాగంనంతటినీ ముంచివేస్తుంది. మర్నాడు పొద్దున, 8, 9 గంటలవరకు ఈ బేవతా తన నిజశక్తిని చూపించుచుండును. ప్రకృతి దేవతా! ఈ కాలమున గాఢ నిద్రావస్థలో వుండును. చెట్లచేమలలో పచ్చనిరంగు విమాత్రం కానబడదు. హిమమయం దేశమంతా. పోగల శక్తిగల పక్షిజాతమంతా దక్షిణదేశాలకు ఈ చలిభారాన్ని తప్పించుకొనుటకు పలాయనమగును. జలమా మంచుగడ్డల రూపమున నుండును. కర్షకులకా పనియేముంది, పొలములలో ఈచలికాలమున, మంచుగడ్డల లంకలలో. రాత్రింబగళ్ళు (గ్రామీణులు ఇంట్లో, చలిమంటలు వేసికొనుచు, కూర్చొనవలసి వుండును. మనము విని, కనని, ఉన్ని దుస్తులను అందరూ ధరించితీరవాలే. లేకపోతేనా ! 1పాణములే నిలువవు. చలికాలం ! హేమంతకాలం |! రక్షించాడు, రక్షించాడు, భగవానుడు, అందరినీ రక్షించాడు, హాయి అయిన ఉన్ని దుస్తులనిచ్చి, మారిపోయింది భూదేవతారూపమే.

2100 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దట్టంగా, అంతా చుట్టివున్న మంచుతో, వెచ్చదనం ఇస్తున్నవి యీ చలిమంటలు, జ్వాలాయమానంగా 'ప్రజ్వరిల్లుచూ ఇంకేమి భయం, భయం ఎందుకూ మనకు, ఈ జ్వాలాగ్ని ముందుకూర్చున్నపుడు, మీరు ధన్యులు, మీ ఇల్లు నేడు ధన్యురాలు, మీ నిప్పుకుంపట్లూ ధన్యాత్మలు, కీర్షించండి, పాడండి. ఆనందరాజ్యమును మీకు ప్రసాదించిన దేవుని, ఆదిదేవుని, స్తుతించండి ఆయననే, ఆయన వర(ప్రసాదంవల్లనే గడపగలుగుచున్నాం, ఈ చలికాలాన్ని ఈ మంచుకాలాన్ని. అని పాడుతాడు ఒక జర్మనుకవి యీ క్లిష్టభూయిష్ట మగు వాతావరణంలో కూడా తన జీవితానందాన్ని గుర్తించుచు. జనపదవాజ్యయమంతా ఇట్టి వాతావరణంలోనే ఆవిర్భవించింది. ప్రతివారూ, భాగ్యవంతులు కానీయండి, పేదజనం కానీయండి ' అందరూ, జాతి, మత, వర్జభేదములను ఏమాటికిని పాటించకుండా పోషించారు, ఈ కవితాకన్యను. వారి యింటిదేవత ఈమె. వారి కులదేవత ఈమె. వారి జూతిదేవత ఈమె. ఈమె కవితాగానమేలేపింది యీ ప్రజను గాఢనిద్రలోనుంచి. “ల, తే మేలుకో, మేలుకో, హృదయమా మేలుకో, మేలుకో, పాడు, పాడు, వాడు, గానం చెయ్యి, గానంచెయ్యి, సర్వావస్థలలో, మీ తంత్రి కీర్తిని,

జర్మను సాహిత్యము. డాక్టర్‌ వి. ఎన్‌. శర 2101 యీ గాఢాంధకారంలో కూడ. నిన్ను, నిన్నే మేలుకొలుపుచున్న, భగవానుని స్తుతించు. అని ప్రజల గాఢాంధకార కాననములో తమ జీవితములను గడుపుచున్న ప్రజాకోటిని, ఆదికాలపు ఒక కవి. ఇంకొక కవి కుమారుడు ఎట్టివుత్సాహమును, ఎట్టి ధైర్యమును తన సోదరులకు (పసాదించుచున్నాడో చూడండి ! కోరుకో, కోరుకో నీ వాంఛలను, నిక్కచ్చిగా అడుగు, హృదయంలోని ఆశలనన్నిటిని, పోగొట్టుకొన్నవానిని తిరుగతెచ్చుకో, ఎందుకా వేదన, ఎందుకా బాధ నీకు, చెప్పూ. మరీ ఇప్పూ. సౌభాగ్యాన్ని వాంఛించు, ఆనందాన్ని చూడు, చూడు, చూడు, ఎప్పుడూ " వీనినే చూడూ, అదిగో చూడు, చంద్రుడూ, సూర్యుడూ, ఎంత ప్రకాశమానంగా వున్నారో, పోరు, పోరు, వారెప్పుడూ, నిన్ను వదలి. నీ కొరకే వున్నారుంవారు ఇక్కడా, అక్కడా అన్ని చోట్లా! పరాయివారు కారు, వారు, ఎంతో దూరస్థలాల్లోవున్నా నిన్నే శాంతమార్గాన నడుపుటకూ

2102 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నిన్నే నిరంతరం సేవించుటకూ దోవలో బాధలు పడుచున్న నదిని సము[దముఖానికి నడుపుచున్నట్లు వున్నారు, వున్నారు, వారు, నిన్నే సేవించుచు, ఆనందించుచు, నిరంతరం ఆనందించు, నిర్భయంగా కోరుకో, వాంఛలన్నీ హృదయంలో దాగివున్న ఆశలన్నిటినీ చెప్పుకో, చెప్పుకో, ఎందుకీ బాధ, ఎందుకువచ్చిన బాధ ఇది, లే, లే, మేలుకో, అడుగు, అన్నిటిని అడుగు, సంతోషాన్ని చూడు, ఆనందాన్ని అనుభవించు.” వారి పండుగలు, పర్వదినాలు అన్నీ యీకాలంలోనే వస్తవి. [క్రీస్తుమత వాతావరణము క్రమేణ వీరి దేశాన్ని వ్యాపించినను, వీరి నందరినీ తన మార్గానికి సామదాన దండభేదాలతో త్రిప్పుకొన్నా జర్మనుజాతి తన సంస్కృతిని ఏమాత్రము మన్నుపాలు చేయలేదు. క్రైస్తవమత రూపాన్నే ఈ సంస్కృతి శక్తిచే మార్చివేసింది. పాత సాంపప్రదాయములు క్రైస్తవ సంస్కృతిలో నిలిచిపోయి,ఆ సంస్కృతికే శాశ్వతమైన శక్తి సంపదలను (పసాదించినవి. చలి రాత్రిళ్లు! చలి రాతిళ్లు, అదే సుకాలం! ఆనంద కాలం, కష్టపడి చేస్తానికి, హాయిగా ఆనందించటానికి! కలుసుకొంటాం౦,

జర్మను సాహిత్యము. డాక్టర్‌ వి ఎన్‌, శర 2103

అందరం కూడుతాము,

ఈ చలి రాత్రిళ్లలో,

వడుకుతాం, నేస్తాం,

అల్లుతాం, బాగువరుస్తాం,

పిల్లలమాదిరి ఆనందిస్తాం,

జీవిత బాధలను మరిచిపోతాం,

ఈ రాత్రిళ్లలో, చలిరాత్రిళ్లలో

మనసార చదువుతాం,

(వ్రాస్తాం, వ్రాస్తాం అన్నిటినీ

దీర్జ మైన రాత్రుళ్లు,

చలిరాత్రిళ్లు విసుకుపుట్లె రాత్రిళ్లు,

అయితేనేమి, మరి అయితేనేమి,

కురుచ చేస్తాం,

ఆటలతో, పాటలతో,

కట్టుకథలను అల్లుటతో.

ఇట్టి ఆనందరాజ్యాన పుట్టి పెరిగి, సకల సౌందర్యకళలతో తేజరిల్లిన జర్మను సాహిత్యము అందు ముఖ్యంగా ప్రజాసాహిత్యము నేడేకాదు, ఆనాడు - ఎన్నివేల సంవత్ప్సరముల[కిందటి నుండో - ప్రజాకోటిలో నూతన తేజమును రగుల్కొలిపించింది. ఆ తేజబబంచేతనే ప్రజ నిరంతరం దేశ వాతావరణములు, రాజకీయంగా, సాంఘికంగా, మరి యితరత్రా మారినను ఇట్టి సాహిత్య రత్నాలను నిలుపుకొన్నది.

ఒక కవి - క్రీ. శ. 1000ల [ప్రాంతమున వున్నవాడు - పేరు తెలియదు - తన హృదయాందోళనమును ఏరీతిని చిత్రించుతాడో వినండి!

భగవానుని పాదపద్మముల సన్నిధిని,

నిద్రపాయ్యాను,

ఎంతో ఆనందదాయకంగా,

ఈ రాత్రిపూట

2104 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నిద్రపాయ్యాను నేనే, అదృష్టమంటే నాదే. నాకుకాక మరెవ్వరికీ యీ ఆనందం, ఈ రాత్రి, చీకటి రాత్రిలో, నేనాయన బిడ్డను, ॥ ఆయనే చూపుతాడు శాంతిమార్గాన్ని ఈ శాంతిమార్గాన్ని, జీవిత రథాన్ని నడుపుతాను ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తాడు ఆయనే. ఆయన ఆశీర్వచనంవల్లనే, జరుపుకొంటాను, నిర్విఘ్నంగా, ఈ కార్యకలాపాన్ని నా శక్తిసంపదలన్నీ ఆయన ప్రసాదించినవే, యీ బిడ్డకు, ఆయన బిడ్డకే, నా సాత్తంతా ఆయనే, ఆయనే నా స్వర్గం. . _ భూతలమంతా స్వర్గ మైంది ఆయన కరుణా కటాక్షాలతో. అందుచేతనే సూర్యచందాదులు, నా సహోదరులు, నా ఆదర్శమూర్తులు. దేవా, దేవా, నిన్నే వేడుచున్నాను. నా జీవితరథాన్ని నడువు, నీవే దీనిని నడుపు, సారథ్యం వహించి, నిన్నే ప్రార్థించుచున్నాను, నీతో నడుచుటకు, ధైర్యం, ఆనందం ప్రసాదించు, గక్తిసంపదలను ఇమ్ము నాకు, ఓ మాయామూర్తీ,

జర్మను సాహిత్యము. డాక్టర్‌ ని. ఎన్‌. శళ్ళు 2105 నా తల్లివి నీవే, నీవుకాక మరెవరున్నారమ్మా నాకు, నిన్నే సేవించుతాను, నీ పాదపద్మాలను పట్టుకొని, నిరంతరం వానిమీదే నా ధ్యానంవుంచి, నీవే తల్లివి నాకు, నా సర్వస్వం ఇచ్చిన దాతవు నీవే, అన్నిటిని నీకే అర్పించుచున్నాను, భయభక్తులతో, నీ *సేవొ పరాయణతకే సమర్పించుచున్నాను, సర్వస్వం. నీవేనమ్మా, ఓ తల్లీ, నీ కుమారుని, , యీ క్రీస్తుకుమారుని, మమ్ముల రక్షించుటకూ, మమ్ములను స[క్రమమార్గాన నడిపించుటకూ, మాకిచ్చినావు, ఓ తల్లీ! అమరుడాయన, అమరతవు నీవు, - కన్యాకుమారి అంటే, మరీ అంలే, ఎవరున్నారమ్మా, నీవుకాక, మరెవరున్నారు, చెప్పు తల్లీ! నీవుచూపిన దోవనే నడుస్తాను, ఎట్టి కష్టవాహినులను ఎదుర్కొనవలసివచ్చినా, భయపడను. పిరికితనాన్ని పారద్రోలుతాను, నిన్నే భజించుతాను సర్వావస్థలలో, నీవుండగా భయమెందుకు, భీరుత్వం ఎందుకూ, నాకూ!

2106 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఎందుకు నాకు బిడియం అంతా నీవే, అంతా నీ కుమారుడే ! మీదికాకపోతే ఇదంతా మరెవ్వరిదీ ? నిన్నే (మొక్కుతాను. ఆశీర్వదించుము. నన్ను ఆశీర్వ్యదించుము. నీ సేవ చేస్తానికి, నా జీవితరథాన్ని " నీ దోవనే నడిపించుటకు, ఓ తల్లీ | ఓ జగజ్జననీ, శాంతి,శాంతి, శాంతిః. ఇంకొక గాయకుడు - కవియే ఆకాలమున గాయకుడు, తన చిన్న తంబురను మీటుచు పాడుచున్నాడు ! (ప్రభూ ! సర్వేశ్వరా ! నీవు నా వాడివి, . నేనా నీవాడిని, ఇదే సత్యం, ఇదే మర్మం. రహస్యమంతా ఆలుసును నాకు! ఆసీనుడవై వున్నావు, నీవు, నా హృదయపీఠానా. . మూసివేసారు తలుపులను, తాళం వేసారు వీరందరూ, తాళంచెవి పోయింది, పోయింది అది ఎక్కడో ! " అయితే, అయితేనేమి, నాకేమి భయం

జర్మను సాహిత్యము డాక్టర్‌ ఎ. ఎన్‌. శర్జు 2107

నీవు ఇక్కడ వుండగా,

ఎక్కడికి పరిగెత్తిపోతావు ఇప్పుడూ,

ఎలాగు పారిపోతావు నన్ను వదలి?

వుండు, వుండు, వుండు.

ఎప్పుడూ ఇక్కడే వుండు. .

నా హృదయమే నీ మందిరం.

అదే నీ పీఠం, _

నా పూజాస్థలం అదే.

నేను నీవాడిని.

నీవు నావాడివి.

ఇదే సత్యం, ఇదే మర్మం.

అలుసు, తలుసు, తెలుసు

ఈ రహస్యమంతా నాకు.

జర్మనుజాతి విశాల (ప్రపంచాన్ని వారి మృత్యుంజయశక్తులను మనకు తెలుపు జానపదగానాన్ని మీకు వినిపించుతాను. ఒక్కసారి యీ వాజ్మయ కథనమును ముగించుటకుముందు.

లేవోయి, లేవోయి,

మరి లేవోయి, యా గాఢనిద్రలోనుండి,

అదిగో, అదిగో, కండ్లు తరచిచూడూ,

ఒక్కసారి చూడు, చూడూ ఆ దిక్కున,

సూర్యోదయమైంది,

అప్పుడే సూర్యుడు తూర్పుసందంలోనుండి లేచాడు,

నిన్ను లేపుటకు,

నీకన్నీ ఇచ్చుటకూ,

లేచాడు, లేచాడు సూర్యుడు

లేవోయి, లేవోయి,

ఓ నిద్రాదేవతా !

2108 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లేవోయి, నీ గాఢన్నిదలోనుండి, ఎంత శోభాయమానంగావుంది. . సూర్యకాంతి, ఆ సూర్యకాంతి, ఎంత సుదినం, ఈ దినమెంత సుదినం, ఆనందం ఇచ్చే యీ దినం. ఆయనే ఇచ్చాడు. ఈ సుదినాన్నిి నీకే, నీకే, ఇచ్చాడు ఆయన, లే లే, నీ గాఢనిద్రలోనుండి. (కిన్నెర: సంపుటము 6, సంచిక క, మే 1954) గ రా గో చమూ లావి ల రత గ? హైమ! ఆ జీల రంగ మైన. మ్య? ల స యఅ స - 1 1.

సాహిత్యములో పరమార్ధ దృక్పథము ॥ థి ఈ ఆట వెల్దండ ప్రభాకర రావు

“స్పేష్పుత్రానాం భావః సాహిత్యమ్‌” యని సాహిత్య శబ్ద నిర్వచనముగా నీయబడినది. దీని (ప్రమాణము విషయము సందియ మొదవును. ఇందు భిన్నఖిన్న నభ్మిపాయము లున్నను వాటిని పరిశీలించుటవసరము. అంతేగాక సార్వకాలీనత సార్వజనీనత లుండుట చేత కూడ నమరత్వము నందినదే సాహిత్యమనిగూడ దాని కొక విశేష 'యూగ్యతను నిర్ణయించినారు. సాహిత్యమున కొక విశిష్టత యుండుటచే సారస్వత, వాజ్మయ, పరిధులకుకూడ కేంద్ర వలయమైనది. పాఠకునకు రచయితకు పరోక్షంగా పరిచయం కలిగించి పాఠకుని తనతో నూహాప్రపంచమునకు లాగుకొని పోవుటకు, రసానుభూతికి, తన్మయత్వమునకు, సర్వార్ధసాధనము సాహిత్యము. సర్వలక్షణ లక్ష శీసమన్వయము సాహిత్యముయొక్క గుణముగా కాలానుగుణముగా సంభవమగు మార్పులవలన మానావమానములు కలుగుచుండును. సాహిత్య శబ్ద నిర్వచనమును గూర్చి నొక నిశ్చితమగు నేకాఖ్మిపాయము లేదు. పెక్కు సిద్ధాంత రాద్ధాంతములకు గురియైనది పరమార్థ దృక్పథమును గూర్చిన ్రశంసావేశము. సాహిత్యవేత్త కట్టి దృక్పథ ముండునని మీమాంస యొనర్చినప్పుడది యతని యాత్మీయతను, వ్య క్తిత్వమును బట్టి మారుచుండును. సాహిత్యము కాంతాసమ్మిత మని, శివేతరక్ష యను ప్రయోజనములు కలదై యున్నను, సాహితీవేత్త భావగభీరత యొక్క యున్నతి యెట్టిది? విశ్వమానవ కల్యాణానికి ప్రయోజనకారి యగు సాహిత్యమున కెట్టి

2110 పందిరి షుల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దృక్పథ ముండవలయును? సాహితీవేత్త కేవలం సరస్వతీ ప్యుతుడుగా నుండవలనా? (ప్రవక్తవలె జాతినంతటిని శాసించగల దక్షుడుగా నుండవలెనా? ఒక కార్యమునక్రై మహానుభావునివలె నవతరించవలెనా? యివన్ని సమస్యలు బయట్టేరుట తథ్యము. కొందరు తవు దృక్పృథవమును సూటిగా చెప్రుదురు. కొందరు పృథక్పృథగ్విధవబలుగా వక్కాణింతురు. ఇది కాలానుగుణముగా

  • , మౌరుచుండును. పరమార్థ దృక్పథమే సాహిత్యమునకు మూలసూత్రం వంటిదిగా యున్నట్లు కన్పట్టెడిది. ఏలనన శబ్బబహ్మము నారాధించినగాని సమగ్ర సాహిత్య స్వరూపము సాక్షాత్కారము కాజాలదు. అక్షరాభ్యాసము గావించు విద్యార్థులకు “ఓ నమ శివాయెయను నైదక్షరములే ప్రాతిపదికగా దిద్దపెట్టుదురు. మొదటి యక్షరమునకు కడపటి యక్షరమునకు విసర్గలు చేర్చినచో పావనమగు శివపంచాక్షరీ మం(త్రరాజమగును. ఏదేని యనుభూతి పొంది యానందమో, దుఃఖమో చెప్పవలసివచ్చినప్పుడు సాహిత్యమే సాధనమగుచున్నది. మన దుఃఖాతిరేకమును గాని, యానందాతిశయమునుగాని, మన మనుఖవించినది యొరులకు ప్రయోజనకారి యగునని కాని యందుండు నిమ్నాన్నతములవలన గుణపాఠమై వారి జీవితములను సరిదిద్దుకొనుట కురవడియగునని స్పురించినగాని మన మేదియును చెప్పము. ఇట్టి చెప్పదగినది కలదని నిర్ధరించి ప్రకటించుట కచంచలమగు నాత్మవిశ్వాసము కావలయును. వేదాంతోపన్యాస మిచ్చిన వినువారలెవ్వరు? (పకృతిసిద్ధముగా సృష్టి శృంగారాత్మ కము. దానిని చూచి యానందించి నా తన్మయత్వ మొరులకు స్పురించు విధముగ వ్యాఖ్యానము ... చేసిచెప్పుట కుద్యుక్తులగుచున్నారు సాహిత్యవేత్తలు. ఈ కతనముననే మనకు పరమార్థ దృకృథమావశ్య మగుచున్నది. “రవి గాంచనిచో కవి గాంచునే కదా యను నార్యోక్తి ననుసరించి సామాన్య మానవు లూహించలేనిదానిని సాహిత్యవేత్త యనాగతవేదియొై దానిని నిదర్శించి యా ప్రత్యేకతను తెలుపవలయును. ఇట్లు చెప్పుట కతడు సాంగోపాంగముగా సమగ్రంగా (గ్రహించి యుండవలయును. ఎల్లరకు తెలిసిన విషయమును చెప్పుటచే కలుగు (ప్రయోజనమేముండదు. ఏదేని ప్రత్యేకత యున్నగాని దానికి విలువ కలుగును. సాహిత్య స్వరూప సాక్షాత్కారము పూర్వ వుణ్య తపుఫలమని యందురు. వాజ్మానసులకు గోచరింపని యతీతమగునదే పరమార్థము. దానిని చెప్పుటవలన ప్రయోజన మేర్పడును.

సాహిత్యములో పరమార్థ దృక్పథము వెల్దండ ప్రభాకర రావు 2111 వాల్మీకి యెంతో కాలము తప మాచరించినాడు. తత్పలితముగ నీశ్వర్మప్రసాదము గాంచినాడు. కాని యా ప్రసాదము విశ్వమానవ కల్యాణమున కుపకరించవలసి యుండినది. దైనందిన నిత్యకర్మానుష్టానములను దీర్చుటకు తమసాతీరము చేరుట నచట కావమోహితవుగు [కొంచమును వ్యాధుడు గురిపెట్టి సంహరించుటయు, మానిషాద ప్రతిష్టాత్వమగ మశ్యాశ్వతీస్పమాః: యత్‌ క్రాంచమిథునాదేక మవధీః కామమోహితమ్‌ యని వాల్మీకి శపించుటయు రెండు నేకకాలమున నప్రయత్నముగ జరిగినవి. అట్టి తపోరాశి వాక్కుల కెట్లన్యథాత్వము కలుగును. ఆ క్లోకమే రామాయణమై = వెలసింది. అట్టి ప్రయత్నమున వెలువడినశ్లోకమందు రామాయణార్థముకూడ యిమిడియున్నది. బ్రహ్మ యాదేశానుసారముగ నారదునితో విన్నవిధముగ నార్దదృష్టితో యాగత యనాగతములను భావించి, దర్శించి, కరతలామలకముగ రామాయణమును రచించినాడు. అనుష్టుష్పందస్సులో 25000 శ్లోకములలో యనుస్యూతముగా జాలువారినది. సంస్కృత సాహిత్యమున కాదికవి యొనాడు. వేదములు పురాణములు ప్రభుసుహృత్పమ్మితములు గాన యవి విశ్వమానవ కల్యాణం చేకూర్చువలసిన కాల మంతరించినది. కొత్త మార్గ మవశ్య మైనది. అందులకే వాల్మీకి యవతరించినది. రామాయణము వాల్మీకి హృదయగహ్వరముల నుండి వెలువడిన తపోరూపమగు పీయూషలహరి. నవాసినదీ రామచందుడి _కథయే. చదువునప్పుడు మనకు స్పురించు విషయ మదియే. మానవమాతత్రునిగ నవతార మెత్తిన భగవంతునిగాథయే మైనను నాతడు పితృవాక్సరిపాలనార్థము, దడేవతానికాయంబులకు చేయవలసిన దశగీవోపసర్గము సవుస్తవు పూర్తిగావించినాడు. చతుర్వింశతి సాహసప్రిక సంహితయగు నీ రామాయణ మందు ప్రాచేతసుడు గాయత్రీ మంత్రరాజ బీజాక్షరముల నిమిడించి నాయా .- సన్నివేశములచే మానవుని మనఃఫలకముమై రామాదివవర్తవ్యం నతు రావణాదియని _ సుస్పష్టంగా వ్య క్తంచేసినాడు, ఇందలి యక్షర పరమామ్నాయమే పాఠకునకు మంచి భావ విభూతిని పాండితీ ప్రకర్తను కల్గించును. ఆతని ప్రయోజనము పూర్తియైనది. పోతన శ్రీరామచంద్రుని గూర్చి తపమాచరించినాడు. భగవానుడు కోదండరామస్వామి రూపమున (ప్రత్యక్షమై మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుంగు చేయుము, నేను శ్రీరామచందుడను, భవబంధములను బాయుదునని

2112 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యానతిచ్చినాడు. సహజ పాండిత్య పోతనామాత్యుడు భగవత్వ్రుసాద మందినవాడును సరస్వతీ కంఠాభరణముగా భాగవతము రచించినాడు. దివ్య ప్రబంధ గాథలే చర్విత చర్వణములైనను యందుండు విశిష్టత రచయితకు గాని పఠితకు గాని విసువు కల్గింపదు. ఏలనన యనిత్యములగు పదార్థములకన్న నాశ్రయింపతగినది నాధ్యాత్మిక జ్యోతి యొకటే పరమోత్కృష్టమని నిరూపించునది. దీనివలన సాహిత్యమునకు పరమార్థ దృక్పథమున కవినాభావ సంబంధమున్నట్లు స్పష్టమగుచున్నది. అది సాహిత్యమున యెంత సమన్వయమైనదో పరిశీలింతము. గీర్వాణాంధ్రాంగ్ల సాహిత్యములను పరిశీలన చేసిన కొంతవరకు నీ సంబంధ మవగతము కాగలదు. ఆంగ్ల సాహిత్యమందు మిల్టన్‌ మహాకవి, షేక్సుపాయరు గొప్ప నాటకకర్త. మిల్టను నిరంతర నిర్విరామ కృష్‌ ఫలితంగా మహాకావ్యమగు పారడైజ్‌ లాప్ట్‌ రచించినాడు. అందు పాపపుణ్యములు భూలోకమున కెట్లు విస్తరిల్లినవో వివరించినాడు. ఈప్‌, ఏడమ్‌ నిషేధింపబడిన ఫలమును తిని ధర్మనియమోల్లంఘన చేసినందుకుగాను ప్రపంచమందు నా చర్య మానవుల నైతిక పతనాని కెట్లు కారణభూతమైనదో వివరించినాడు. ఇది బైబిలులోని గాథ. ఆంగ్ల సాహిత్యమునకు (గీకు, లాటిను. భాషలు ప్రాతిపదిక. వాటి (ప్రభావ మీ సాహిత్యంపై తప్పక నంతర్లీనమై యుండును. అయితే బైబిలుండగా నిట్లీ కథ కావ్యరూపమున వాయబడుట వలన ప్రయోజనమేమి? బైబిలు చదివి దానినే పరమార్థమని యందురు. తు. చ. దీని సూ[తముల పాటించువా రరుదైన కాలమున సత్యమే వేజొక రూపమున ప్రజల కుద్చోధింప బడవలయును. సామాన్యులకు తెలియునది (ప్రేయసీ ప్రియుల గాథ యనియే, దాని మూలసూత్రమనగా వారి యవమానమునకు, . నైతిక పతనానికి ధర్మసూత్ర నియమోల్లంఘనమేయని పరిశీలించినగాని తేటపడదు. హోమరు వ్రాసిన ఇలియడ్‌, ఒడిస్సీ మహాగ్రంథము లాంగ్లమున ననువదింపబడినవి. ఇవి వీరగాథలు. (గ్రీకు భాషలోనుండి యనువదింప బడినను స్వతండత్రములట్లు భాసిల్లుచున్నవి. కొంతకాలము దాటిన తర్వాత ప్రకృతి సొందర్యమున నది యిచ్చు గుణపాఠముల ద్వారా సత్యప్రచారము కల్గింది. బైరను మహోదధివలన నేర్చుకోగలిగినది చాలా కలదని యుగ్గడించినాడు. వర్షువర్తు పచ్చికబయళ్లు: సంధ్యల రక్తికన్న మరొండు లేదని నొక్కి వక్కాణించినాడు. ఆంగ్ల సాహిత్యమున పరమార్థ దృక్పథము చాలా తక్కువ. భోగలాలసులై విషయసుఖలోలులైన వారికీ దృక్పథము కల్గుట చాలా యరుదు.

సాహిత్యములో పరమార్థ దృక్పథము. _ వెర్రండ ప్రభాకర రావు 2113 గీర్వాణ సాహిత్యము భారతదేశమందలి యన్ని సాహిత్యములకు మాతృకగా నున్నది. అష్టాదశ పురాణములు, భాగవతము, భారతము, హరివంశము, రామాయణము నివియే యనర్హములు. సామాన్యంగా అన్ని భాషలలో వీటి యనువాదాలుగాని, యందలి గాథలైనా నాధారంగా కొని వివిధ కావ్యగతులను ంపొందించినారేగాని వేరుకాదు. కాకపోతే కొందరు నాయా మతప్రవక్తల, వీరుల గాథలను కూడా చేర్చినారు. అయితే నవి చాలా యరుదు. ఆ విషయ మటుంచి యీ పరమార్థ దృక్పథము సంస్కృతాంధ్ర సాహిత్యములలో యెట్లనువర్తింపబడి సమన్వయం చేయబడిందో సవివరంగా చర్చింతును. వేదములు పురాణములు వ్రాయబడినపేదప కాలగతిని సంభవమగు మార్పుల వలన రామాయణ, భారత, భాగవత, హరివంశములు వెిలయవలసిన యగత్యము వచ్చినది. పాత యొక రోత కొత్త యొక వింత యనుట సుప్రసిద్ధమేకదా. వామలూరి తనయుని తపశ్చర్యాఫలితంగా రామాయణము సరస్వతీ సారభూతముగా వెలువడినది. ఆ కావ్య విశిష్టత యేమనగా దానిని సమగ్రంగా నక్కథానాయకుడగు శ్రీరామచం(దదుడు తన కొడుకులు గానము చేయగా వన్నాడు. సభాసదులకు విన్పించినాడు. నాడే రామాయణమున కపరిమతమగు (ప్రచారము కల్ఫింది. అందును వాల్మీకి శ్రీరామచంద్రుని సమకాలికుడు. వాడవాడలందున కావ్యము గానము చేయబడుటచే నెల్లెడల నాధ్యాత్మిక జ్యోతి వెలసినది. ఏతత్కారణము వల్లనే రామాయణమునకున్న దివ్యత్వము గౌరవాదరములు ప్రశంసనీయములుగ నున్నవి. నేడును నైహికాముష్మికములకు (ోయోగక్షేమం” అన్న గీతాచార్యుల పదమునకు పర్యాయపదము) సాధనముగా దైవచింతన గలవారు పారాయణ యోగ్యమని యెంచినట్లు చేయుచున్నారు. సాత్యవతేయుని మహాభారతము బృహద్దుంథము. పంచమవేదమని భారత సంహితకు నామాంతరముకూడ కల్గింది. అయితే యిందు భ్రాతృవధ, కలహములు,రాజకీయ వాతావరణముండుటే రామాయణమునకు దివ్యత్వమునందు లభించిన ,శేణి దీనికి లభింపదయ్యెను. భారత సంహితయందు భగవర్గీత ఘట్టమే నాయువుపట్టు. ధర్మమునకు, అధర్మమునకు కలిగే సంఘర్షణ తత్పరిణామములు చక్కగా చిత్రింపబడినవి, ఇప్పటికిని భారతమందలి విరాటపర్వము పారాయణము చేసిన యనావృష్టి కలిగిన (ప్రదేశములలో కుంభడోణములుగా వర్షం కురియును. ఈ భారత

2114 పందిరి ముల్షికార్డునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము సంహితయందును నసంఖ్యాకమగు నుపాఖ్యానములు కలవు. భారతగాథ కూడ జరిగినదే, కాని యేకారణము చేతనో భారతమున కంత ప్రచారం లభింపలేదు. రామాయణము సాక్షాత్ప్వరమేశ్వరుని గాథ. భారతమందు నరనారాయణులు మూలపురుషులు. హరివంశము, భాగవతములు కూడ సంపూర్ణంగా నాధ్యాత్మిక బోధలమయమే. కాళిదాసుడు రామాయణ గాథనే గొని రఘువంశ మహాకావ్యమును రచించినాడు. భారతమందలి మరొక్కగాథతో శాకుంతల నాటకము రచించినాడు. సోమదేవ భట్టారకుని కథాసరిత్సాగరము చాట భారతమైనను గంధర్వుల గాథను వర్ణించును. దినిని బాలరామాయణమని కూడ యందురు. సంస్కృత సాహిత్యమున నీ రామాయణ గాథలు, భారతగాథలు, భాగవత గాథలే మాతృకలుగా గైకొని (గ్రంథరచన చేసినవారు చాల కలరు. దానికి వారి సమాధానము - సమర్థన యొకటే “గంగాజలైర్భువి భాగీరథయత్న లభ్జెః కింతర్పణం నవిదధాతిజనః పిత్తాణామ్‌"యని భోజుడు చంపూరామాయణమందు స్పష్టం చేసినాడు. మతప్రవక్తలు కూడ తమ బోధలు గావించుచు కావ్యరూపంలోనూ, నాటకరూపంలోనూ, యీ పరమార్థ దృక్పథాన్ని స్తూత్తప్రాయంగా వివరించినారు. అట్టిదే శివానంద లహరి, సౌందర్య లహరి, ఆత్మబోధ, కృష్ణకర్ణామృతము, భర్తృహరి సుభాషితములు, ప్రబోధ చందోదయము, సంకల్ప సూర్యోదయము, ముకుందమాల. వెంకటాధ్వరి కూడ లక్షీ సహస్రమనుస్తుతికావ్యమును రచించుచు లక్ష్మీ ప్రాశస్త్య ముగ్గడించినాడు. లీలాశుక కవీంద్రుడు తన కృష్ణకర్ణామృతంలో భగవంతుని స్వరూపమును మనోహరంగా వర్ణించినాడు. అతనికి సాక్షాత్కరించిన గోపాలకృష్ణ పరబహ్మము. పూర్వజన్మమందు భోగలాలసుడై సంసారమును త్యజించి బృందావన పావనభూముల పర్యటించి మనస్సు పరివర్తనజెంది కృష్ణపరబ్రహ్మము సాక్షాత్కరించిన విధమును చక్కగా వర్ణించినాడు. వేణీమూలే విరచిత ఘనశ్యామపుఇ్భావచూడో విద్యుల్లేఖావలయిత ఇవ స్నిగ్ధ పీత్రాంబరేణ మామాలిజ్ఞన్మరకత మణిస్తమృగమృీర బాహుః స్వప్నే దృష్టస్తురుణ తులసీభూషణో నీలమేఘః

సాహిత్యములో పరమార్థ దృక్పథము. _ వెల్రంత(వభాకర రావు 2115 అన్ని యవతారములలోనికి కృష్ణుని యవతారము సర్వజన సేవ్యమై మనోహరమై వెలసినది. కులశేఖరుడు కూడ ముకుందమాల యందు బాహాటంగా పరమార్థపథమును బోధించినాడు.

హేమర్హ్యాః పరమం హితం (శ్రుణుతవోవక్ష్యామి సంక్షేఫతః

సంసారార్థవమావ దూర్మియుగళమ్‌ సమ్యుక్ప్రవిశ్వస్థితాః

నానాజ్ఞాన మపాస్యచేతసి నమోనారాయణాయేత్యముం

మం(తం సపప్రణవం ప్రణామసహితం (ప్రావర్తయధ్వం ముహుః జయదేవుడు కూడ గీత గోవిందమును రచించి హరి గుణగణములే ధ్యానించినాడు.

భారతము (పభ్యాతేతిహాసము. అది నీతిశాస్త్రజ్ఞులకు నీతిశాస్త్రముగను, నైతిహాసకులకు నితిహాసముగను, నధ్యాత్మవిదులకు వేదాంతముగాను పరిగణింపబడునని భట్టారకుడు వచించెను. పైగా భారతము పంచమవేదము. కవీంద్రుల కది మహాకావ్యము. అట్టిదానిని వినుటకు రాజరాజన రేందు డువ్విళులూరినాడు. పొయికపాకశాసన భారత ఘోరరణం౦బునందు నారాయణుడట్లు నారాయణభట్టు సహాయము చేయ నన్నయభట్టు తన యేలిక నభీష్టమును నెరవేర్చి వాగనుశాసనుడైనాడు. తిక్కనకూడ కవిబ్రహ్మ యొనాడు. నన్నయ భట్టారకుడు మూల([గ్రంథముకన్న సంస్కృత పాండిత్యమున మించినాడు. శకుంతలోపాఖ్యానము, నలోపాఖ్యానము, రామోపాఖ్యానము మొదలగు వివిధోపాఖ్యనములచే నలరారుచున్నది మహాభారతము. శకుంతల దుష్యంతుని నష్టవిధవివాహములలో గాంధర్వవిధిని పంచభూతముల సాక్షిగా వివాహమాడినది. సామాన్య మానవుల నేలనో నాదర్శముగా నుంచుకొనుటకు భారతీయులు సమ్మతింపలేదు. గృహిణి పత్మివతగాను చతుర్విధ పురుషార్థములకు సాధనముగా నిరూపింపబడినది. పతిభక్తియే కాంతల కాభరణమని యుళ్లేభింపబడినది. ఆ ('ప్రభావముననే వారలసాధారణ కృత్యములొనర్చి విశ్రుతికెక్కి ప్రభ్యాతయశులైరి. శకుంతల తన వృత్తాంతంబంతయు నాకాశవాణి ద్వారా చెప్పించెను. ప్రాచీనకాలంలో కొంతవరకు గృహస్థాశమమును పాటించి, ప్రజారంజకముగ రాజ్యమేలి వృద్ధాప్యమున ఘోరారణ్యముల కేగి తపోధనులై జీవన్ముక్తులగుచుండిరి. ఒక నియమ(పకారమున నడచుటయందే పరమార్థము కలదు. పరమార్థముయొక్క (ప్రత్యేక విశిష్టత యంతే. “నా విష్ణుః పృథ్వీపతి? యనుటే నృపుల సిద్ధాంతము.

2116 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంప్పుటము శ: పాహిత్యము ఈ సిద్ధాంతమును పాటించబోయిన పాశ్చాత్యరాజన్యులు వాటి నుద్ధరింపదలచి పతితులైరి. “ఆత్మవత్సర్వభూతాని” “పరోపకారార్థమిదం శరీరమ్‌” “రాజ్యాంతే నరకం ధ్రువం” “వాగ్యూషణమ్‌". “భువి నృణాం వైరాగ్యమేవాఇ భయం” యను వాక్యము లశ్రాంతముగ కర్ణపుటములందు వినబడుటేగాక నవి (గ్రంథస్థములు కూడ నైనవి. గీతాచార్యు డర్జునునకు పరమార్థమునే బోధించినాడు. గురుశుశ్రూష ఫలితముగ కచుడు మృతసంజీవని యను విద్యను పొందకల్గిను. దానిని దేవతల కర్పించి కచుడు వారి మన్ననలకు పాత్రుడయ్యెను.. గురుభక్తి యట్టిదేకదా. “ఆచార్య సహరిః సాక్షాన్నర రూపీ న సంశయః యని యుపనిష ద్యాక్యము, గురువన్న యజ్ఞానాంధకార పటలములను పటాపంచలు చేయగల నతీతజ్యోతి. గురువు విజ్ఞానఖని, జ్ఞానసూర్యుడు. తిక్కన యజ్ఞము చేసి సోమయాజిమొ, భారతము పదునేను పర్వములు న్రాసినను నిర్వచనోత్తర రామాయణము వ్రాయని దతని కాత్మసంతృప్తి కలుగలేదు. ఎజ్జాప్రగడ అరణ్యపర్వము పూర్తిచేసినను హరివంశము వ్రాయని దతనికి పాలుపోలేదు. ఎజ్జన హరివంశము ప్రశస్తతరముగాదని యందు పరమార్థము విశేషంగా (పకటించవలెనని ఉత్తర హరివంశము పూరించినాడు. సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి సర్వజ్ఞ యను బిరుదద్వయ విభూషితుడై నాచనసోము డాంధ్ర శారదాంబకు నుత్తరహరివంశమును వ్రాసి వరివశ్య గావించినాడు.

సూర్యచంద్రులవలె పోతన శ్రీనాథు లలరారి శృంగార భక్తిరసములతో చమత్కృతితో నతిరమ్యుముగా హృదయంగమంబుగా వర్ణించి యశఃకాయులైరి. శ్రీమన్నారాయణుని కటాక్షవీక్షణమునకు పాత్రుడై పోతన శ్రీమద్భాగవతమును విద్వన్మణులు సంస్తుతింప పూరించెను. శృంగార భక్తిరసముల సమ్మిళితము చేసి పుష్పమునకు సౌరభమువలె నవినాభావ సంబంధం కల్గించి నొప్పుల కుప్పల మెప్పించినాడు. అతడు తనకు సాక్షాత్కరించిన నిష్టదేవతా స్వరూపమును గుర్తింపలేకపోయినను మనోహరముగ వర్ణించినాడు. ఇది యాతని నమాయకమగు భక్తిిపపత్తులకు తార్కాణము. అతనికి సాక్షాత్కరించినది ఒంటిమిట్ట కోదండరామస్వామి విగ్రహము. “రాజముఖ్యు డొక్కరుడు నా కన్నుగవకు నెదుర గానపడియె” నన్నాడు. కల్యాణాత్మకమైన విష్టుకథలందాసక్తుడైన పోతన భాగవతము రచించి పునర్జన్మ రాహిత్యమొనర్చుకొనినాడు. అతడు దశమస్కంధమున నపరిమితంబుగ విజృంభించినాడు. భగవంతుడు గోపికలతో రాసక్రీడలు చేయుట, బాల్య క్రీడలు గడుపుట నతి రసవంతముగ నప్రతిమాన కవితాప్రతిభతో వర్ణించి

సాహిత్యములో పరమార్థ దృక్పథము _ వెల్రండ ప్రభాకర రావు 2117 భగవంతుడు శైశవమాది గోపికలతో చెలిమి పాటించి యుండెను గావున నతనికి పరభామలు లేరు.అందరూ స్వకాంతలే కావున దానికి తగవు లేదన్నాడు. ఇందనురాగపూరితమైన భక్తి సుస్పష్టంగా వ్య క్తమగుచున్నది.

మ॥ ఘనులై యవ్వని పాదపంకజ పరాగధ్యానసం(ప్రాప్త యో గనిరూఢత్వముచే మునీందులు మహాకర్మంబులంబాసి బం ధనిరోధంబులులేక విచ్చలవిడిన్‌ దర్చింతు రా దివ్యశో భను డెట్లుండిన నుండెగాక కలవే బంధంబులుర్వీశ్వరా.

కాంతలు శ్రీకృష్ణుని యాకాంక్షించిన నార్తరక్షణము భగవంతుని ధర్మము గావున వారి యవీష్ట మీడేర్చుట యాతని విద్యుక్త ధర్మమని కూడ వివరించినాడు. భక్తిభావముల నింత రసవత్తరముగ వర్దించినవారిలో పోతనామాత్యు డగ్రగణ్యుడు. అతనికి కల్సిన యాటంకములను (యోగక్షేమములను) తీర్చుట కెన్నో విధముల " తోడ్పడి యతనికి జరుగబోవు యవమానములనుండి. కాపాడినాడు. ఈ భక్తి (ప్రాశస్త్యము భాగవతపఠనవలన భాగవతోత్తములగు పాఠకులకు భావగత మగును. పోతన కావ్యకన్యకకు వరివన్య గావించుచు పండిత పామరజనా మోద ముద్రనుగూడ వడసినాడు. పోతన కవిత్వంలో నాధ్యాత్మిక జ్యోతియే కేంద్రీభూతమైనట్లు మరెక్కడ కాలేదు.

శ్రీనాథుడు శైవుడు. పరమ మహేశ్వరాచార పరాయణుడు. చింతామణి

మంత్ర చింతన వరప్రసాద సాహిత్యతత్వజ్ఞుడు. ఆతడు కూడ శృంగార నైషధము దక్క, శెవవుత (ప్రాశస్త్యమును దెల్పు (గంథములను వాసినాడు. స్కాందపురాణమందు కాశీఖండ భాగవత మతనికి కంఠస్థము. వాటినే వేర్వేరుగా కాశీఖండము, భీమేశ్వర పురాణము, హరవిలాసమను పేర యుత్కృష్ట (గంథరాజములను వ్రాసినాడు. విద్వదౌషధమగు శృంగార నైషధమందు కూడ నిత్య కర్మానుష్టానములను, సరస్వతీ స్తోత్రమును గావించినాడు. ఈ గ్రంథమందలి సరస్వతీ దండక మెంతో హృదయంగమంబుగను భక్తిరసప్రధానంబుగా, సంస్కృతాంధధ వాగ్గుంభనాగుంభితముగ నలరారుచున్నది. పల్నాటి వీరగాథలను వర్ణించి, వీరత్వము కొత్తది కాదు బుగ్వేదమందలి యింధద్రుడు కూడ వీరుడనియే నిరూపించినాడు. సరస్వతీ సాక్షాత్కారమును చక్కగా వర్ణించినాడు. అతని కది జరిగియుండనోపును. వర్ణనలో మాత్రము శృంగారరస సామ్రాజ్య రమైకలోల

2118 పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సార్వభౌముడై వెలసినాడు.. శివర్యాత్రి మహాత్యమును వర్ణించి శివలీలా విలాసంబులను వర్ణించి జీవన్ముక్తి పొందిన మహా కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఉపలములకంటె కఠినంబు లొక్కవేళ కుసుమములకంటె నొకవేళ కోమలములు కాన లజ్ఞాభయంబులు కలవాొ లేవొ " ం పువ్వుబోణుల హృదయంబు లెవ్వ డెలుగు. స్త్రీల వనస్తత్వమును శ్రీనాథుడు చక్కగా వర్ణించినాడు. అంతేగాక కర్మసిద్ధాంతముమై తనకున్న నమ్మకమును, వ్యాసుని దుర్దశ వర్ణించుచు, అనుభవింపకపోవంగ నలవియగునె, కమలజునికైన 1పారబృ్ధకర్మఫలమని నొక్కి వక్కాణించినాడు. త్రీనాథునికి భారతీ సాక్షాత్కారముతోపాటు కనకాభిషేకం జరిగింది. కంకంటి పాపరాజ కవిచంద్రు డుత్తరరామాయణమును రచించి తన కవితకు నితర కథలు [వాయుటవలన కలుగని మహత్వమును సంపాదించినాడు. చర్విత చర్వణమగు రాఘవేశ్వరుని చరిత్రమాయని ప్రాజ్జుల, రసజ్ఞుల, తజ్జుల నిరసించవలదని సంటప్రార్థనము గావించినాడు. అంతేగాక పప్రాచేతసుని పీయూషధారయగు రామాయణమును మరెందరో యనువదించిరి. పాల్కురికి ॥ సోమనాథుడు కూడ హరలీలావిలాసంబులను సుబోధకమగు ద్విపద రూపమున వర్ణించినాడు. అదియే పండితారాధ్య చరిత్రము. శ్రీ తైల మల్లికార్జునస్వామి వైభవము, (భ్రమరాంబికా మహాత్యమును వర్ణించు కావ్యరాజము. అతనికి శ్రీశైల మల్లికార్డనుడే నుపాస్యదైవ వుయినాడు. ఇతడు తత్వవుసి, అహం బహ్మాస్మి యను నుపనిషద్వాక్యముల యథార్ధతను చాటినాడు. వీరశైవ ప్రాబల్యము (ప్రశస్తతరముగా చాటుటకు ప్రచారమొనర్చుట కానాడు పండితారాధ్య చరిత్ర బాగుగ నుపకరించినది. ఇది యిట్లుండ నాంధ్రభోజుడగు కృష్ణరాయ సార్వభౌము డరుదెంచి కాంతకుగాని, పురుషునకుగాని (పేమగాని, భక్తిగాని యున్నయెడల యది భగవంతునియందు జ్ఞానసంబంధముగనో, అనురాగపూరితముగనో నుండవలెనేగాని నితర్యపేమ లశాశ్వతములు, కృష్ణ పేమ యొక్కటే నిత్యము సత్యమని వచించినాడు. ఆత్మ నారాయణ స్వరూపమని విశిష్టాద్వైత సిద్ధాంతమును నిలువబెట్టుటకు యత్నించినాడు. తిరుమల తాతాచార్యుని శిష్యుడగు శ్రీకృష్ణరాయలు “ఏకో నారాయణో హరిః యని వాకొన్నాడు. ఆ సార్వభౌముడొక్కడే

సాహిత్యములో పరమార్థ దృక్పథము. వెట్టండ [వ్రఖాకర రావు 2119

“పాణికోటికెల్ల బంధంబు మోక్షంబు

చేరుటకును మనసు కారణంబు

విషయసంగిమయైన విను బంధకారి

నిర్విషయమైన ముక్తి విభవకారి” యని శాసించిన విద్వచ్చ[కవర్తి. ప్రబంధ నిర్మాతలు కృష్ణరాజేండ్రుని సభాస్థలి నలంకరించిన వారెల్లరు కృతిమగాథలను గైకొనక వావిరిపుట్టురత్నములగు పౌరాణిక గాథలను మాతృకలుగా గైకొని తమకావ్యములందు “అంగనాజన విలాసాలాప లీలాసమ(ప్రాదుర్భావములు”గా నొనర్చినారు. అల్లసాని ద్దన్న గృహస్థాశమ విశిష్టతను, నాతిథేయ సత్కారమును వివరముగా వర్ణించినాడు.

మీ మాటలు మంటత్రంబులు

మీ మెట్టినయెడ [ప్రయాగ మీ పాద పవి

(తామలతోయము లలఘు

ద్యోమార్గరురాంబు పీనరుక్ష్యము లుర్విన్‌. ఇందు “అభ్యాగతః స్వయం విష్టుళొ అను భావము చెప్పబడినది. విష్ణ్టుపాదమువద్ద జనించినడి గంగ. విష్ణ్టువాక్కులే మంత్రములు. ఇట్టివింకెన్నియో కలవు. ముక్కు తిమ్మన్న సత్యాకృష్ణుల విలాసముల రచించుచు (ప్రేయసీ పణయకలహవశంబున నాథుని తన్నినను తప్పులేదనిపించినాడు. కృష్ణుడు సత్య ననునయించు పద్యమెంతో హృదయంగమంబుగ నున్నది. "

ఓ లలితేంద్ర నీలశకలోపమ కైశిక యింత వంతనీ

కేల లతాంత మాత్రమునకే గలుగన్విను నీకు దేవతా

కేలివనంబు సొచ్చి యనిక్చిలసూదను డెత్తివచ్చినన్‌

దీలుపడంగదోలి యిట దెచ్చెద నిచ్చెద పారిజాతమున్‌. సత్యభామ కలహాంతరిత. కృష్ణునిమై సర్వాధికారములను చలాయించవలెనని పట్టుదల. తన మాట వినకుండ పోవుచున్నాడని నమాయకమగు దురభిప్రాయము. దీనికితోడు నాటకమాడించుటకు కలహభోజనుడు. కృష్ణుడు కూడ పరస్త్రీ పరాజ్ముఖుడు కాడు. పాండురంగ మహాత్యము కూడ పండరీపుర క్షేత

2120 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము మహాత్యమును తెలుపు (గ్రంథము. అందు మరికొన్ని గాథలుకూడ చేర్చబడినవి. పుండరీక చరిత్రము రమణీయముగా నుండును. ఇందలి వారణాశి వర్జన యత్యంత సుజన భాజనీయంగా నున్నది. (పప్రాలేయాచల కన్యకావదన శుంభత్పద్మ సౌరభ్యమున్‌ (గోలంగల్లియు దుష్టిలేక మునిహృత్కోడాబ్ద సేగంధ లీ లాలిత్యము గోరునొక్క సితరోలంబంబు నైజాకృతిన్‌ డాలొందించు బరుసులన్‌ భమరకీట న్యాయరీతిన్‌ బురిన్‌. ధూర్జటి కాళహస్తి మహాత్యము వ్రాసినాడు. పశుపక్ష్యాది పిపీలకములే బ్రహ్మాండ మావరించియున్నందున - మానవులకన్న గంధసింధురము, సాలప్పురుగు, సర్పముల భక్తిపపత్తులే (శేయస్కరములని తారతమ్య పరిశీలనవలన నిరూపించినాడు. పింగళి సూరనార్యుడు రాఘవులను పాండవులను స్మరించి నుభయతారకమును పొందినాడు. కళాపూర్జోదయములో దివ్యగాథలే వర్ణింపబడినవి. అయ్యలరాజు రామభదకవి రామాభ్యుదయమును రసవత్తరముగా వాసినాడు. ఇట్లెన్ని ప్రబంధములు వెలువడినను పరమార్ధ దృక్పథమునే వెలువరుచుటకు యత్నించినారు. దీనికి ప్రబల కారణము మరొకటి కాన్పించుచున్నది. ప్రాక్తన పూర్వజన్మ ఫలితంబున సాహితీ వాసనలుగాని, పాండిత్యముగాని వ్యక్తము కాదు. అట్టి బహుప్రయాస ఫలముగ లభించిన సంపదను వ్యర్థము చేసికొనుటకన్న దివ్య ప్రబంధగాథలను వర్ణించి యజరామరులగుటకు యత్నించినారు. వారీనాడు (గ్రంథవలల రూపములోనే సజీవృలైనారు. కట్టా వరదరాజేం[దకవి భూతలవైకుంఠమగు శ్రీరంగమును తత్‌క్షే[ తమహాత్యమునే (గ్రంథస్థము గావించినాడు. అతని శ్రీరంగ క్షేత్రవర్దన రమ్యంగా ఉన్నది. గురులీలం విరజోపకంఠమున వైకుంఠంబునన్‌ దివ్య భా సుర భోగంబుల నిందిరాసహితుడై శోభిల్లు నెబ్భ్బంగి దా హరియాభంగిని తత్కవేర తనయాభ్యర్ణంబునన్‌ మంగళా కర రంగన్మణిధామముఖ్యముగ సౌఖ్యత్తీల జెన్నారెడిన్‌. శ్రీరంగము కలియుగ వైకుంఠమని ప్రతీతి. అందును నైతికపతనము, నాధ్యాత్మిక వాసన లడుగంటిన నేడును ముక్కోటికి లక్షలాది ప్రజలు వచ్చుటచే మూలవిగ్రహ

సాహిత్యములో పరమార్థ దృక్పథము _ వెర్రండ వ్రభాకర రావు 2121 దర్శనము దుర్లభమగును. ఆనాడు రత్నాల చొక్కా తొడిగించి రంగనాథుని దేదీష్యమానమగునట్లు చేయుదురు. ఈ విశేషములన్నియు శ్రీరంగ మహాత్యమందు కలవు. కామియెైకాని మోక్షగామి గాడు యన్న సూత్రము నాచరించు వేదాంతులగువారు కొందరు, నిరాశజెంది పరమార్థము నాశ్రయించుటకు నిర్ణయించుటకాని చేదాంతులయినవారు నాడును నేడును కలరు. మార్గమందు భిన్నత్వం కన్పట్టినను నాదర్శ మొక్కటే. కాకపోతే మొదటి తరగతికి జందినవారే నియమబద్ధమగు వారగుటకలదు. కవులు వేదాంతులవంటివారే కాని వేదాంతులు మాత్రము కారు. తత్కారణమున వారి రచనలం దాధ్యాత్మి కజ్యోతి కేవలం స్యోత్కర్లకో, విశ్వమానవ కల్యాణానికో, కాక తప్పనిసరిగానో, తమ కావ్యములలో వెలయింతురు. అందువలన పరమార్థ మందరికీ యేర్చడింది. మొదటి తరగతికి చెందినవాడు వేమనయోగి. ఇట్లసంభఖ్యాకములగు [గ్రంథములు వెలువడినవి.

రామాయణానువాదము లింకను నిలిచిపోలేదు. వావిలికొలనువారిది, గోపీనాథ కవీంద్రులది యింతవరకు వెలువడినవి. విశ్వనాథవారిది యింకను పూర్తికాలేదు. కంబరామాయణము గూడ యనువదింపబడింది. విశ్వనాథవారు శృంగార వీథియందు రాధామాధవుల గాథనుకూడ వర్జించినారు. దీనికి మూలం (వణయతత్వమే. ళీ ఆత్మకూరి గోవిందరాజాచార్యులవా రుత్తర రామాయణము రచించినారు. తిరుపతివారి బుద్ధచర్విత్రము, దేవీభాగవతములు వెలసినవి. ఇటీవలనే నోరి నరసింహ శాస్త్రిగారి, సరిపెల్ల విశ్వనాథ శాస్త్రిగారి దేవీభాగవతములు వెలసినవి. ఈవిధముగ సాహిత్యంలో పరమార్థ దృక్పృథమున కెంత యవినాభావ సంబంధమున్నదో తెల్లమగుచున్నది-

“సరస్వతీ శ్రుతి మహతీ మహీయతాం” (కిన్నెర: సంపుటము 6, సంచిక 6, జూన్‌ 1954)

సాహిత్యము జాస్తి వేంకట నరసయ్య

రసాత్మకములైన శబ్దార్ధముల సహభావమే సాహిత్యము. “సహితయోర్భావః సాహిత్యం” అని సహితశబ్బముచే శబ్దార్థములు వివక్షితము లగుచున్నవి. “సహితానాం శాస్త్రాణాం భావః సాహిత్యం” అనగా సర్వశాస్త్రముల కలయికయే సాహిత్యమని చెప్పుచున్నారు. శాస్త్రములందు మంచి పరిచయముగలవారే కావ్యరచన చేయగలరని దీని భావము. సాహితీమూర్తికి శబ్దార్థములు స్థూలరూపము, ఇతివృత్తము సూక్ష్మరూపము లనవచ్చును. తన ప్రతిభచే కవి లోక(శ్రేయస్సు కొజకు మహాపురుషుని చరితను ఆధారము చేసికొని రచించిన రమణీయార్థ ప్రతిపాదక శబ్ద సమూహమే సాహిత్యము. *“విశ్వశ్రేయః కావ్యం” “నాన్ఫషిః కురుతే కావ్యం” “స్వస్థాన వేష భాషాభిమతాస్సంత౯” మున్నగు వాక్యములచే విశ్వకల్యాణమే కావ్యలక్షణమగుచున్నది. సాహిత్యము, వైదిక పౌరాణిక, కావ్యభేదముచే మూడువిధములు. వైదికముంతయు ప్రభుసమ్మితము. పౌొరాణికమంతయు సుహృత్పమ్మితము. కావ్యములు కాంతా సమ్మితములు. సాహిత్యముయొక్క ప్రయోజనము లోకకల్యాణము. ప్రజలకు కర్తవ్యోపదేశ మొనర్చ్బుటయే కావ్యముయొక్క ఆదర్శము. భిన్నకాలములందలి సాహిత్యము ఆయాకాలములందలి జనుల సంస్కృతిని, నాగరికతను సాంఘిక విశేషములను (ప్రకటింపగలుగుచున్నది. సంఘసంస్కరణ వ్యాసుని ఆశయము. ఆదర్శ ధర్మగుణములను చెప్పుట వాల్మీకి ఆశయము. . పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

సాహిత్యము. జూస్తి వేంకట నరసయ్య 2123 “అపారే కావ్యసంసారే కవిరేకః ప్రజాపతిః . “యథామ్మైరోచతే విశ్వం తధేదం పరివర్తతే అన్నట్లు కవిబహ్మ, లోకమును

తన భావములకు తగినట్లు చేయగలుగుచున్నాడు. “రవిగాననిచో

కవిగాంచకుండునే....?” అను ఆర్యోక్తి సుప్రసిద్ధము. సాహిత్యమునకు (ప్రజల జీవితమునకు అవినాభావ సంబంధముండవలయును. అప్పుడే సాహిత్యము సర్వసాధారణమగును. సమాజములోని అర్థిక అసమత, అజ్ఞానము మున్నగు క్లష్టమస్యలు రచయితలను కూడ ఆకర్షించి వారి భావనాశక్తికి ఉద్దీపన కలిగించును. అంతట వారు కలవరమొంది ఆ సమస్యలకు సంబంధించిన సాహెత్యమును సృష్టింతురు. సంఘముయొక్క (ప్రతిబింబమే సాహిత్యము. ప్రజాసమస్యలను కళాశిల్పమున చిత్రైంచినను సాహిత్యమున శాశ్వతస్థానమును పొందజాలవని కొందరు వాదించుచున్నారు. ప్రతిభావ్యుత్పత్తులతో కూడిన రచన, ఆ కాలమునందలి ప్రజాసమస్యలను చిత్రించు సాహిత్యమున శాశ్వత స్థానమును పొందుసు. శ్రీనాథుని పల్నాటి చరిత్రమే ఇందుకు తార్కాణము! భాషలోను, భావములోను అభ్యుదయము వలయును. మన దేశరక్షణ కలమునవాతతో భావవిప్లవము ఆచ్చు కవులమీద యెక్కువగా ఆధారపడియున్నది. (ప్రజాసమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించు గేయాలు, నాటికలు, పదాలు, బుజ్జకథలు మున్నగునవి సాహిత్యములో మంచి స్థానమునందుచున్నవి. 'ప్రజాజీవితముతో సంబంధమున్న సాహిత్యము ప్రజాదరము పొందగలదు. శివాజీ, రాణా ప్రతాపసింహ, గాంధీ మహాత్ముడు మున్నగు వారి జీవితములు కవితాశిల్పమున చిత్రింపబడి సాహిత్యమునకు అలంకారములైనవి. కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావుగార్లు ఆంధదేశమున దేశకాల పరిస్థితులనుబట్టి భాషయందు భావమునందు మార్పులు దెచ్చి (ప్రజాసేవచీసిన నవయుగ నిర్మాతలు. (ప్రజాహృదయంలో మార్పు తెచ్చేది సాహిత్యము. సంఘ జీవితమునుండియే సాహిత్యము పుట్టును. సాహిత్యము, సంగీతము, కళ అను మూడు జీవితమును ఆనందమయముగా చేయగలవు. ఇవి మూడు ఒకదానినొకటి ఆశ్రయించి యుండును. సంఘముయొక్క (శ్రేయస్సే వీనియొక్క లక్ష్యము. సాహిత్యము సంగీతమును కళను తనతోబాటు (ప్రజాభ్యుదయమార్గమున నడిపెంపవలయును. సాహత్యకారులు సమాజ (శేయస్సు గోరుచు

2124 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము జ్ఞానమొనరించుచు (ప్రజాహృదయ శాసకులు కాగలరు. సమాజవికాసము కలిగించువారిలో రచయితలు ముఖ్యులు. వారు న్నిదాణమైన జాతిని మేలుకొలుపు వైతాళికులు. సత్య శివ సుందర మార్గమున, సంఘమును నడిపెంప సమర్థులు. జాతీయ సాహిత్యము ప్రజలను దేశభక్తులనుగా జేసి విశ్వకల్యాణ మొనరించును. కృష్ణాష్టమి, దీపావళి మున్నగు పండుగలవలె ఈ కాలమున గాంధి జయంతి, పొట్టి శ్రీరామ జన్మదినోత్సవము, ఆగస్టు 15 మున్నగు జాతీయములగు పండుగలు జరుపబడుచున్నవి. వీరేశలింగం మొదలగువారి జయంతులు జరిపి, వారి సేవాదీక్షను స్మరించి, కార్యరంగమున కటిబద్ధులగుచున్నాము. సాహితీ (ప్రచారమువలననే ఇట్టి మార్పు ప్రజలలో కలిగినది. కలము హలమ్ముపట్టు డికం గల్గును జాతికి దేజ మెంతయున్‌ “నిత్య కల్యాణరాశియై నెగడునట్లు దిద్దుకొనుడయ్య దేశమ్ము 'ఆలు6ంగులార!గ అని తెలుగువారు మేలుకొలుపబడుచున్నారు. జయన్తితే సుకృతినోరస సిద్ధాః కవీశ్వరాః (కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై 1954) అగా జ్ర

  • ల స్నా! ఆకట్టు

తెలంగాణ సీమ : కవులదర్శనము డి. రామలింగం

జెయస్తే విశాలాంధ్ర జననీమతల్లికా !

(్రీయస్తే తెలంగాణ చికురనవమల్లికా ! "

అని మహాకవి శ్రీ రాయ(పోలు సుబ్బారావుగారిచే వినుతింపబడిన తెలంగాణ సీమ ఆంధ్ర సంస్కృతికి కాణాచి. ఇక్కడి ప్రతి అంగుళం భూమి చరిత్ర కందని కాలంవరకు - అంటే మూడు నాలుగువేల సంవత్సరాలవరకు ఆంధ్రుల ఆచార వ్యవహారాలను, ధర్మాభిరతిని, శిల్పకళానైపుణ్యాన్ని చిత్రకళా విన్యాసాలను, సంప్రదాయాలను, నడవడులను, అందచందాలను, సభ్యతను చాటుతూ ఉంటుంది. ఒకానొక చరిత్రకారు డన్నట్లు తెలంగాణాలోని ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్పః గుట్ట, మిట్ట ఆంధుల చరిత తాలూకు ఉదంతాలను వ్య క్తపరుస్తూ ఉంటాయి. ఆంధధులకు పవిత్రమైన భూమి, ఆవేశ మిచ్చే ప్రదేశము తెలంగాణా. ఇట్టి పుణ్యభూమిని ఇచటి కవులు పీరు తీరులుగా దర్శించి, ఇక్కడ వెలసిన శిల్పకళా లక్ష్మికి నీరాజనము లిచ్చి, ఇచటి (ప్రాచీన వైభవాన్ని సగర్వంగా కీర్తించారు. “రామప్ప గుళ్ళలో రవణించు మూర్తుల, యందచందంబుల నాకళించి! పాకాల చెరువులో బాలనురుగుల తేట, సరస మాధుర్యంబు సంగ్రహించి" ఈ [ప్రాంతం కవులు వైతాళిక గీతాలు పాడారు. ఇట్టి రచనలలో నాకు లభించిన కొన్నిటిని ఈ వ్యాసంలో ఉదహరిస్తాను. చందం మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము.

2126 పందిరి షుల్లికార్డునరాపు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము

తెలంగాణా ప్రప్రథమ ప్రజాకవి అని పలువురి (ప్రశంసలకు ప్యాతుడైన శ్రీ కాళోజీ నారాయణరావు ఓరుగల్లు నగరంలో జరిగిన దశమాం[ధ మహాసభ స్థాయిసంఘ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం చెబుతూ ని

పోతన నాగలి చాలుబారినా

పుణ్యక్షేత్ర మిద్దీ,

ఖ్యాత చర్తిత్రుని విద్యానాథుని

గాంచిన దేశంబూ. "

ప్రతాపర్నుదుడు పరిపాలించిన

పట్టణరాజంబూ, .

తొమ్మిది లక్షల ధనుర్ధరులకూ

దొరమయై వెలిగాడూ.

కొమ్ములు తిరిగిన యోధులందరో

కొల్చుచుండి రతని,

పతాకమెత్తీ ఆంధ్ర చరిత్రము

ప్రకటించే నతడూ.

పూతచరిత్రులు, ధీరులు వీరులు

పుట్టిన చోటిద్దీ.

పాడిపంటలకు ట్టినపేరై

వర్ధిల్లిన పుడమి.

కాలవశంబున పూర్వ వైభవము

గంగను కలిసినదీ,

.. కోలుపోయి మా సర్వస్వంబును

గుందుచు నున్నాము.

. అని సభాసదులకు తెలంగాణీయుల గోడు విన్నవించుకొన్నారు.

(ప్రాచీనాంధ్ర నగరాలలో ఒకటియె, ఆంధ్రులకు శాశ్వత కీర్షిని తెచ్చిపెట్టిన కాకతీయ స్నామాజ్యానికి రాజధానియైన ఓరుగల్లు నగరం చరిత్రప్రసిద్ధి కెక్కిన నగరాలలో ముఖ్యస్థానాన్ని అలంకరిస్తుంది. ఈ నగరాన్ని చూచి, దీని కథలు, గాథలు విని తన హృదయావేదనను ప్రకటించని తెలుగు కవి లేడు. తలంగాణా సారస్వత రంగంలో ప్రముఖులైన శ్రీ దేవులపల్లి రామానుజరావు ఈ నగరాన్ని గూర్చి వాస్తూ : .

ఇలంగాణ సీమః కవులదర్శ్గనము._ డి. రామలింగం 2127 ఆంధ నగరీయని అల్లారుముద్దుగా పిలిచె విద్యానాథ డెలమి నీమ్‌ అల్లుని స్యేచ్చకై నెల్లూరి నెరజాణ పరఠియిం చె నిచటనే భారతంబు జానుతెనుంగున శెవప్రబంధము ల్మొలకెత్తి యిచటనే మొగ్గ దొడగె సుందరమందార సుమదామ మొక్కటి పోతన (గ్రుచ్చె నీ పాలమునందు ఆర్జృహృదయాన నెందరో ఆంధ్రకవులు ఆలపించిరి యిచటనే ఆత్మగీతి + తలచినంతనె మేనెల్ల పులకరించు అక్కటా నాటి శోభ యేమాయె నేడు ! అని వితర్కించుకొని ఆలంగాణ దుస్థితికి కారణాల నరసి మాతృభాషావ్యాప్తికి సేవచేయ నుత్సహించి తదాదిగా అదే కృషిలో నిమగ్నులై ఉన్నారు. టరుగల్లు శిల్పసంపద అనన్య సామాన్యమైనది. చారిత్రకంగా ఈ నగరాని కెంతటి ప్రశస్తి కలదో దీని శిల్పకళాసంపద కూడా అంతే ప్రశస్తి గాంచినది. ఈ శిల్పసంపదను గూర్చి శేషాది రమణ కవులు ఎన్నడో వ్రాసిన పద్యం ఇది : చెదరి వీథులబడ్డ సింహవిగ్రహములు గజరాజముల మేనగలిపికొమ్ము . బల్లెంబుగొని కొచ్చవచ్చు రాహుతుమేను " శిథిలాశ్వ తనువులో జేర్చుకొమ్ము కూలిపోయిన శిలాకుంభముల మహోన్న తద్వార శిఖరముల దార్చుకొమ్ము విరిగిన రమణీయ విగ్రహావళి దేవ నిలయ సీమలలోన నిలుపుకొమ్ము అవల కనుదోయి మూసి మహాంధ్ర నగర దివ్యతర రూపరేఖ చిత్రించుకొమ్ము ఆంధ్రసోదర నీకు మహాంధ్రనగర గురుతర మహస్సు మదిలోన గోచరించు.

2128 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

ఓరుగల్లు కోట ఆం(ధదేశములోని ప్రఖ్యాత దుర్గములలో ఒకటి. ఇది 12వ శతాబ్దంలో గణపతిదేవునిచే నిర్మించబడింది. గణపతిదేవుని అనంతరం ఆయన కుమార్తె రుదాంబ ఓరుగల్లు కోటను బాగా దృఢపరచి శృతుదుర్భేద్యంగా చేసింది. ఈనా డీ కోటనుచూస్తే హృదయం ఉద్విగ్నమవుతుంది. పూర్వపు కాకతీయ సామాజ్య చరిత్ర ఒక్కుమ్మడిగా స్ఫురించి గగుర్పాటు కలుగుతుంది. “పోతన చరిత” కావ్యకర్త శ్రీ వానమామలై వరదాచార్యులవారు ఓరుగల్లు కోటను

కుక్కలు జింపువిస్తరిగ గూలిన ఓర్గలు కోట గంటివే

ముక్కున బాణముండియును మూతికి మీసముగల్ల నాంధ్రుడా

తక్కిన మాట లేమిటికి తన్నిన వెన్నున చప్పుడాయె ని

ప్పెక్కడనో యటంచు వెనకేనియు చూడని సోమరుల్‌ నృపుల్‌

దిక్కయి దీని కింత గతి దెచ్చిరి! కాకతి బెబ్బులుల్‌ రుసల్‌

(గక్కెడి చోట గర్జిలెడి గడ్డపుమేకలు గూబమూక లిం

దొక్కకరంబు ఫాలమున నుంచెడు నా బహుపాపమంచు ఆ

చుక్కల చందమామ తలనూపడిె తిరిగి ప్రతాపర్షుదుడై. అన్నారు.

కాకతీయ రుద్రదేవ చక్రవర్తి లలిత కళాభిమాని. ఇతడు రాజధానిమైన హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడి అని వ్యవహరింపబడుతూ ఉన్న దేవాలయాన్ని అతిరమణీయంగా నిర్మించాడు. (క్రీ.శ. 1163లో చిత్రభాను సంవత్సరాన ఈ ఆలయనిర్మాణం జరిగింది. వెయ్యి స్తంభాల దేవాలయంలో మూడు దేవాలయాలను కలుపు మండపంలో స్తంభములమైగల లతావితానం, సుమమాలికలు, గొలుసుల చక్కదనం అపురూపమైనది. మండపముపై జీవకళ లుట్టిపడు దేవతామూర్తుల శిల్పం వర్ణనాతీతం. ఈ శిల్పాన్ని వరదాచార్యులగా రిలా (ప్రస్తుతించారు :

నీలపు రాలదంతముల నీడలు కనడ చెక్కినట్టి దే

వాలయమూర్తులం వడియవైచిన తుమ్మెద వన్నియల్‌ కలా

శాలలు గట్టుకొన్న విటు; చేయడ చప్పున జారు శిల్ప ఖం

డాలన్రవత్కలాధనుల నాట్యములాడుట నేత్రపద్మముల్‌.

తెలంగాణ సీమ: కవ్పులదర్భనము డి. వామలింగం 2129

వెయ్యి స్తంభాల దేవాలయంలో వాసుదేవరకు అభిముఖంగా ఉన్న నంది చూడవలసిన శిల్బాలలో ఒకటి. ఇది పడుకున్నట్లుగా ఆరడుగుల ఎత్తున చెక్కబడింది. దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలుగా కాలవిపర్యాసాలన్నిటికీ తట్టుకొని నిల్చింది ఈ నంది. దీని పతి అవయవము ఎంతో సొంపుగా చెక్కబడింది. ఆంధ్ర దేశ (ప్రాచిన పశుసంపద కిది తార్కాణమేమో అనిపిస్తుంది. వరదాచార్యులవారు దీనినిగూర్చి వ్రాసిన ఈ మూడు పద్యాలు చిత్తగించండి :

కదిలెడిని మూపురం బద్దొ గంగడోలు

వ్రేలునటుదోచు చెవులూపు విధమగుపడు,

పంచకరిగిన కొమ్మునాడించదు గిద,

(ప్రాణమున్న యాబోతిది! ప్రతిమగాదు.

ఎందునుగాంచ నంధదెకను నేమి చివాలున లేచిరాదుగా

అందెలు గజ్జియల్‌ గొలుసులామెడ గంటలు మార్యుమోగ ని

ట్లందముగా పరుండి నెమరానుచు జీవము[గక్కుచున్న నీ

నందినిగాంచి మర్షుగొని నాకెడి రాయెదమొన ఛధేనువుల్‌,

నీళ్లు మేత ముట్టక నంది నేలబట్టి

కినిసి పడియున్న దేటికీ తెలుగునేల?

ఆంధ్ర సామాజ్యమిచటికీ నస్తమించె

గోవులను పీకికొని తిను మోరకాల

మరుగుదెంచుట దలచి బండగుచు కూల!

వెయ్యిస్తంభాల గుడి కాకతీయుల శిల్పకళా సంపదకు ఒరవడి. దేవలయద్వార శాఖలపై రమణీయ శిల్పవిన్యాసాల వెలయించుట కాకతీయ శిల్పమునందలి వైశిష్ట్యం. దేవాలయం లోపలి నర్తకుల దివ్యమూర్తుల అంగవిన్యాసాలు అప్పురూపములు. వీనిని చూడగానే ఎంతటి మితభాషికైనా మాటలు పెకల్చుకొని వస్తాయి. వరదాచార్యుబవారంటారు ;

కలకలలాడు లే నగుమొగమ్ముల జీవములొల్క నాట్యముల్‌

సలిపెడి శిల్పకామినుల జారెడి చీరెల కోర్కులూర న

వ్యులు నగుచెంత కాలమిటు లుందురయారె ఇదెంత వింత వీ

రల గిలిగింత బెట్టిన కరమ్ముల శిల్చి అదెంత చిలిపియో!

2130 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తెలంగాణాలో ఆలంపూరు సుప్రసిద్ధ యాత్రాస్థలం. ఇది రాయచూరు జిల్లాలో తుంగభద్రా నదీతీరాన ఉన్నది. శ్రీశైల పశ్చిమద్వారమని, దక్షిణకాశియని ఖ్యాతిగాంచినది. ఇక్కడ భారతవర్షములోని మతశాఖ లన్నిటికీ సంబంధించిన దేవతా మూర్తులుండడం ఒక విశేషం. శ్రీ కేశవపంతుల నృసింహశాస్త్రిగారు ఈ క్షేత్రాన్ని గూర్చి వాస్తూ : తలప శ్రీశైల పశ్చిమద్వారమగుచు వరలి బహ్మేశ్వరాఖ్యాన పరమశివుని కాపురంబున దక్షిణ కాశియగుచు బొలుపుమీరును మా యలంపురము సతతము. అన్నారు. ఇచట ప్రాచీన చాళుక్య, పశ్చిమ చాళుక్య, కాలచుర్య, కాకతీయ, తెలుగు చోళ, విజయనగర సార్వభౌముల కాలంనాటి శాసనా లన్నో ఉన్నవి. ఈ శిలాశాసనాలను (గంథరూపంలో వివరించిన శ్రీ గడియారం రామకృష్ణశర్మగారు ఆలంపూూరు క్షేత్రాన్ని దర్శించవచ్చినవారితో అంటారు : " శాతవాహన రాజులీ తటంబున నాంధ సామ్రాజ్య బీజముల్‌ చల్లినారు చాళుక్య కురరాజ చందులీ గడ్డను తమ దానధారల తడిపినారు చోళ సామంతు లిచ్చోటనే ధర్మస స్యములకు తగుపోది సలిపినారు మత్తారులను గోసి మా తుంగభదలో కాకతీయులు కత్తి కడిగినారు విజయనగరాననీశుల్‌ విపులమీద పున్నెములపంట పెనురాశీ బోసినారు పుణ్య గుణభూమి మా అలంపూరు సీమ స్వాగతము బల్కె మీకు సుస్వాగతంబు నేడు తెలంగాణా యువకవ్లులలో దాశరథి అగ్రగణ్యుడు. తలంగాణా పేరు చెప్పగానే కవులలో చప్పున దాశరథి స్ఫురణకువస్తాడు. తెలంగాణాయే దాశరథి. దాశరథియే తెలంగాణ మనునట్లుగా ఈయన రచనలు చేశాడు. “నా తెలంగాణ

ఉలంగాణ సీమ: కవులదర్శనము.. డి. రామలింగం 2131 కోటి రత్నాలవీణ” అని ఈయన గొంతెత్తి చాటాడు. ఎక్కడ కవి సమ్మేళనంలో పాల్గొన్నా మొదట తాను (వాసిన ఈ మూడు పద్యాలు చదివి తరువాత ఇతర రచనలేవైనా చదువుతాడు : కోటి తెలుగుల బంగారు కొండకింద ' పరచుకొన్నట్టి సరసు లోపలవసించి (పొద్దుప్రొద్దున అందాల పూలుపూయు నా తెలంగాణతల్లి కంజూతవల్లి. " వేయిస్తంభాలగుడి నుండి చేయిసాచి ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్చి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాల జాణ. మూగవోయిన కోటి తమ్ములగళాల పాట పలికించి కవితాజదమ్ము కూర్చి నా కలానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాలవీణ ! చిరుతప్రాయంనుంచే కవితారచన చేస్తూవచ్చిన ఈయన తెలంగాణాలో నేకాక యావదాం(ధమునకు సంబంధించిన సంఘటనలను, చారిత్రక విశేషాలను ఇతివృత్తాలుగా తీసుకొని ప్రాఢమైన రచనలు చేశాడు. హైద్రాబాదు ప్రజాపోరాటంలో బందీమై నిజామాబాదు సెంట్రలు జైలులో కారాగారవాసశిక్ష అనుభవించాడు. అది అసలు కారాగారము కాదు. ఇందుపుర దుర్గమని మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ అనుచరుడైన రఘునాథరాయలు కట్టించిన కోట. దానినే నిజాం నిరంకుశ ప్రభుత్వహయాంలో జైలుగా మార్చారు. అది ఒకప్పుడు సంగతి తెలిసి దాశరథి ఇలా తలపోశాడు. నశియించెన్‌ రఘునాథయోధుని దివాణమ్ముల్‌; మహారాష్ట్ర వీ రశివాజీ గురురామదాస రసనాగ్రవ్య[గమంత్రౌాఘముల్‌ నశియించెన్‌ రఘునాథ దేవళము లీనాడీ నిజాంరాక్షసీ నిశితాసిన్‌ బడి బందిఖానయయి కన్చించెన్‌ వికారమ్ముగా.

2132 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తెలంగాణా శిలుకళా సంపదకు (ప్రభావితమైన దాశరథి లీఖినినుండి ఉత్తమమైన పద్యాలు వెలువడినవి. అయితే ఈయన ప్రత్యేకంగా ఏదో ఒక్క శిల్పమునే వర్ణిస్తూ (వాయలేదు. రామప్ప గుళ్ళగోడలమై తీర్చిన లతావలయాలు, దేవతామూర్తులు, నాట్యము చేయు కాంతల వివిధములగు భంగిమలు, గణపురం నృత్యమూర్తులు, పానుగల్లు శిల్పకాంతలు, పాలంపేట శిల్పఫలకములు, వేయిస్తంభాల దేవాలయద్వారం పై వివిధ భంగిమలతో నృత్య వాద్య ప్రదర్శనం గావిస్తున్న స్త్రీమూర్తులు, బెరంగాబాదు గుహాలయంలోని యక్షిణీ కిన్నెరలు, ఆలంపూరు నటరాజ విగ్రహము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి శిల్పకళాఖండాలు. “తాజమహలు నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ లవ్వరొ” అను అభ్యుదయ దృక్పథాన్ని అనుసరించి ఈయన తెలంగాణా శీల్పాలనుగాక శిల్పినే కీర్తిస్తూ “శిల్పి” అను పద్యాలు వ్రాశాడు. ఈ పద్యాలను ఈయనే స్వయంగా చదివి వినిపిస్తే శిల్పి పనివాడితనమంతా ఒక్కసారి శ్రోతల కళ్ళముందు ప్రదర్శింపజేసినట్లవుతుంది. శిల్పెని సంబోధిస్తూ అంటా డీయన : నినుగని కొండలన్ని రమణీకుచపాళికలై, కపోల మో హనఫలకమ్ము ల భుకుటులై, కుటిలాలకజాలమై, సురాం గనలయి రూపుదిద్దుకొనగా ఉలితో అమృతముచల్లి, జీ వనములు పోసిపోయెదవు బహ్మవు నల్చి కులావతంసమా |! తెలంగాణాలో మంజీరానది ప్రవహిస్తూంది. ఈ నది బాలగిరి కనుమల్లో ఉద్భవించి, తెలుగింటికి జారివచ్చిన తెలంగాణా ముద్దుబిడ్డ. దీనికి నిజామాబాదు జిల్లాలో ప్రాజెక్టు కట్టబడింది. అదే నిజాంసాగర్‌ ప్రాజక్టు. ఈ పప్రాజక్టువల్ల మూడు లక్షల ఎకరాల ఎర్రని ఎడారి పచ్చని పంటచేనుగా పరిణమించింది. దీనినుంచి విద్యుచ్చ క్తికూడా ఉత్పత్తిఅయి అనేక పట్టణాలకు కాంతిని ప్రసాదిస్తున్నది. గంజి దొరకని కర్షకులకు అపరంజి దింపిన నదీమతల్లి మంజీర. ఈ నదినిగూర్చి దాశరథి చక్కని ఖండకావ్యం వ్రాశాడు. మంజీరతో ఈయన అంటాడు ;: ఎవరిగజ్జెల రవళివే నీవు! మంజీర ఎవరికజెల బాష్పధారవే! మంజీర నీవు పారినదారిలో పెక్కుదండాలు నీవుజారిన జాడలో అమృతభాండాలు నీవు దూకిననేల మాకు విద్యున్మాల

తెలంగాణ సీమ: కవులదర్శనము . డీ. రామలింగం 2133 నీవు పాకిన పథము మాకు చైతరథమ్ము ఎవరికొరకయి పరుగులెత్తి వచ్చితివి? ఎవరిజూచి తటాకమై నిల్చిపోతివి? నా తెలుగునింగి నీడల నడచి నడచి తెలుగు నడతలు నేర్చుకోగలిగినావు. ఆకలితీర్చుకన్న ఘనమైన మహాయజనమ్ము కాన మీ లోకమునందు: నీ మనసులో నొకనాడు తదీప్సితమ్ము చీ కాకొనరింప వాకవయి, కాలువవై, ర్వురివై, తటాకమై, మాకొర కేగుదెంచితిసుమా! కమనీయపయోభరమ్మునన్‌. మెదకు మండలంలో ఒకచోట మంజీరానది ఏడు పాయలుగా చీలుతుంది. ఏడు పాయలుగా మంజీర చీలినచోట “ఏడు పాయల దుర్గాదేవొ వెలిసింది. అక్కడ యేటేటా జాతర జరుగుతుంది. కవి మంజీరను (ప్రశ్నిస్తాడు : ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలుచేసి రవ్వల్ల వీణగారాగమెత్తిరి నిన్ను? “ఏడుపాయల దుర్గి ఏమన్నదే నిన్ను? యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ? మంజీరకు మౌనభంగం కలిగి చల్లని చూపుల జల్లులతో అంటుంది : “ఏడు పాయల దుర్గ యెదురుగా వచ్చింది పాడుకొమ్మన్నాది, పరుగులిడమన్నాది స్వరమొక్కపాయగా సాగిపొమ్మన్నాది. బంగారు పండించి (ప్రజలకిమ్మన్నాది.” కవి అంటాడు : . “మంజీరామ తల్లి . తెలంగాణా రైతుల కల్పవల్లి” కృష్ణ, గోదావరి, తుంగభద కిన్నెరసాని నదులు ఇటు తెలంగాణాలోను, అటు ఆంధ్రప్రదేశంలోనూ (ప్రవహిస్తున్నాయి. ఇవి కొన్ని కొన్నిచోట్ల ఆంధ్ర, హెద్రాబాదు రాష్ట్రాలకు ఎల్లలుగా కూడా ఉన్నవి. ఈ నదీమార్గాలలో ఒక ఒడ్డువైపు

ప పుత సందడికి మల్లీకార్టునదాప్పు శతజయంటే పంప్పుటము. శే! సాహిత్యము ఉండే ఆంధ్రులు ఒక రాష్ట్రంలోను, అదే నది అవతలి ఒడ్డునవున్న ఆం్రులు మరో రాష్ట్రంలోను ఉండడం అసహజంగా కస్పట్టింది దాశరథికి ఆ నదులచెంత నిలబడి అటూ ఇటూ ఒడ్డులను పరికిస్తే రెండు ప్రాంతాలూ ఏకం అమ్మ్యేటల్లే కన్పించాయి. ఈయనకు. కనుకనే మహాంధ్రోదయంకొరకై మాతృభూమితో ఇలొ అన్నాడు : తుంగభదానదీ భంగమ్ము లిరుకేల భొరపారుచు రుచు లరసియుచుఐడ కృష్ణవేణీ తరంగిణి నాలుకలుసాచి దరులకెండిటి మజాలరసిపోవ బోదావకి పీచికాడివ్య హస్తమ్ము లిరుకలంకుల మన్ను తరచుచుండ బోటికిన్నారసాని మాటిమాటికి పొంగి ౩ండు శ్రేవల దరులండగొనగ ఇటునటును తెల్లునేల లారటముజెంది కలిసిపోజూచుచున్న యట్టులనె తోచు, కలిపిచేయుము నా తెలంగాణ తల్లి మూడుకోటుల నొక్కటే ముడి బిగించి! (శిన్నెర: సంపుటము ఈ సంచిక 7, జూలై 1954) ఘే రు వ్‌ వనక. 9 ఇ సపలి అతల ల్లి వలల లర్‌ కిం లలి,

ఆలంగాణా మహో జ్వల కవి “ఉత్పల , ఆ మాడపాటి భాస్కరరావు, ఎం.వి దొెదాపు దశాబ్దానికి పైగా మదాసులో కాళిదాసుగారి సంపాదకత్వాన వెలువడే “ఆనందవాణిోలో ఆనాటి రచయితలందరూ అభివ్య క్త్రమవుతూండేవారు. శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యగారి గేయాలూ, పద్యాలూ ఆనాటి ఆనందవాణిః ఆంధ్ర వారపత్రిక నవోదయ వారప(త్రికలలో వస్తూండేవి. అప్పటి వారి గేయాలలో “మేఘ మం[దస్వరం"” ఒకటి. ఆషాఢ మేఘానికి ఉత్పలవారి స్వాగతం - దూరదిగాంతాలనుండి “ఘర్హర ఘర్హర” మంటూ ఆషాఢమేఘం వస్తూన్నది - *“దుఃఖాంతఃపుర ద్వారాలను తోసివేసి రారమ్ము శామికజన నిస్త్రాణపు చెమ్మట దిగదుడుచు ధాత్రీ తృషారధరమ్ముల దాహం తీరిచిపో - పందిరి మల్లికార్టునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

2136 పందిరి మల్లికార్డునదావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

సవ్యసాచి గురుతుల్యుడవై

శరసరంపరల వర్ణించు -

బధిర విశ్వపు మారుమూలల

నినదించు నీ మంద్రధ్యని"

ఇప్పటికీ గేయం నా శ్రవణ కుహరాలలో నినదిస్తూనే ఉన్నది. ఉత్పలవారి గేయకవితాదశ కొలదికాలమే సాగింది. “రిక్షావాలా”, “అడవి బతుకు" మొదలైన గేయాలు సుప్రసిద్ధాలు. తర్వాత కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలోని శ్లోకాలు కొన్నిటిని గేయాలుగా రచించారు.

ఇప్పటికి మూడుసార్లు ముద్రితమైన ఉత్చలవారి “కచుని వీడ్కోలు" “నవ్రజీవన"వారప(త్రికలో క్రమానుగతంగా ప్రచురితమైనది. ఉత్పలవారి కవితా ప్రతిభను ప్రశంసిస్తూ కవి సామ్రాట్‌ విశ్వనాథవారు “ఉత్పల గొప్ప కవితాశక్తి కలవాడు. పద్యాలలో నెన్ని పోకడలైనను పోగల శక్తిమంతుడు. ఈయన పద్యాలలో నవ్యతయేకాక కాళిదాసు కావ్యాలలోని పరువము, పూర్వకవుల శిల్చము క్రొత్త ఒయ్యారాలతో కులుకుచున్నదిో అన్న మాటలకు శ్రీ ఉత్పల అన్నివిధాలా అర్హులు. “కచుని వీడ్కోలు” కావ్యం “నవ్యసాహిత్య పరిషత్‌” ముమ్మరంగా సాగే రోజులలో (ప్రకాశితమైనది. కాబట్టే ఆ కావ్యంలో విశ్వనాథ, వేదుల మొదలయిన కవుల ప్రభావం బహుళంగా కనిపిస్తుంది. అప్పుల్లో ఉత్పలవారికి పేరుప్రతిష్టలను విశేషంగా సమకూర్చి పెట్టినది “భీమపరితాపం) ఉత్తమ కావ్యఖండిక. మహాభారతంలో శాంతమే అంగిరసం. సర్వ పురుషార్థాలకంటే మోక్షానికే ఎక్కువ (ప్రాధాన్యమున్నది. “భీమపరితాప” కావ్యఖండికలో భారతయుద్ధం, నిస్సారమైన విభూతులకు అసురాగులుకావడం మొదలయిన విషయాలను ఉద్రిక్తమైన ఊపుతో ఉద్దాటిస్తూ భీముడే తుదకు “శాంతి సందేశం" భావిభారతీయుల కందబేస్తాడు. ఇటువంటి రసవద్దట్టాలను కవితావస్తువులనుగా స్వీకరించడంలోనే ప్రతిభతోపాటు కవి వ్యుత్పత్తి కూడా గోచరమవుతుంది.

మహోజ్వల కవి ఉత్పల మాడపాటి భాన్సరరావు, ఎం.వి, 2137

పూర్ణిమనాటి సంధ్యారాగంలో అరవిచ్చిన కల్హార కళిక వీరి “ఉత్పలినీ” ఖ౦డకావ్య౦. అందులో వారి చిన్ననాటి రచనలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వీరికున్న తాత్త్వికదృష్టి అప్పట్లో ఉన్నట్లు కనబడదు. అందుకనే “నన్ను మనసారగా ఏడ్వనీరు మీరు” కృష్ణశాస్త్రివలె, “రండు చిమ్మటలార! నావలెను ఏడ్చు మీరేను నాకు సఖులు" వేదులవలె, “నా కున్నటువంటి దా వ్యధయె ఉంచుమునాకది చాలునో ప్రభూ” అని తృప్తిపడినారు "“ఉత్పల”. నిరుద్దేశ్య మైన ఆకాంక్షలు - కారణము తఆలియని బెంగ - అస్పష్టమైన ఆవేదన - (ప్రమ విషాదం, ఈ అన్నిటికి హృదయం ఎచటికి చేతులు జావుతుందో అచటి భావాలకు సుకుమారమైన రూపమిచ్చి, సుమధుర సంగీతం తోడ్పాటుగా శ్రోతల హృదయాలలోనికి పంపుతాడు

  • “ఉత్పల” “ఉత్పలినీ కావ్యగానం చేసేప్పుడు.

తర్వాత రవీంద్రుని కృతికి అనువాదమైన “గాంధారి” ఉత్పలవారి నాల్గోకావ్యం, “గాంధారి” కావ్యంతో ఉత్పలవారి బాణీ ఉత్పలవారిదే అయింది. అప్పటివరకూ విశ్వనాథ, వేదులవారిని అనుకరించి తాము మూడవ సత్యనారాయణమయైన ఉత్పలవారు తమ మార్గానికి తాము వచ్చారు. భావాన్ని పద్యంలో చెప్పునప్పుడు శబ్దంలోని బలం, క్రమంలోని జిగి సన్నగిల్లకుండా “గాంధారి"లో ప్రతి పద్యమూ రసవంతంగా నడిపారు. “ఎలమజ్జులో మలబారు “దుర్యోధనల అమానుష కృత్యాలకు (ద్రవించి, మొరబెట్టే కాం[గెసు వృద్ధుల్లా కనిపెస్తుంది గాంధారి" అని రాంషాగా రొకచోట ఆ కావ్యాన్ని గుజించి వ్రాస్తూ అన్నారు.

తపతీ సంవరణుల ఉజ్వల (ప్రేమగాథను ఒక మధురకళాఖండంగా రూపొందిన “తపతి” ఉత్పలవారి ఐదవ స్వతంత్ర కావ్యం. “సాయంకాలపు టెండ”లో పాయలపాయల సూర్యపుతి ప్రవహిస్తూ “జగదేకమోహన సముజ్వల యౌవనరూపొ ఆయిన ప్రకృతిని రమణీయంచేస్తూన్న సమయంలో “తపతి” తొలి దర్శనం మనోజ్జ్ఞమయింది. ఉద్రిక్తమైన ఒక్క ఊపుతో ఉప[కమించి, కావ్యగతి పొడుగునా, హృదయాన్ని తూగుటూయెల తత్రొక్కిస్తూ సచ్చిదానంద మధురానుభూతిలో జీవనసాఫల్యాన్ని సమకూర్చి పెట్టారు ఆ కావ్యంలో ఉత్పల.

2138 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. . సంపుటము 4: సాహిత్యము “దాంభికముల్‌ జరామరణ తత్త్యములీ రజవీ నితంబనీ లాంబర నిర్మలాంచలములందుననుండి చలించి మంచి ము త్యంబొకటేని జారిపడెనా! నవయౌవన విశ్వపూర్ణ పా (తంబున పొంగియున్న అమృతంబొక బిందువు బీరువోయినా నవనవోన్మేషమైన ప్రాకృతిక యౌవన సౌందర్యంలో అణుమాత్రం వృద్ధాప్యం పొడసూపలేదంటూ “చిరలావణ్య జగన్ముఖమ్మున జరాజీర్జత్వపున్‌ ధూళిధూసర చిహ్నమ్ములు నష్టరేఖలగుపించన్‌ లోదని నిర్ధారణ చేస్తాడు. “కడల ఏమారుమూల నెక్కడనొకాని, తనరుచుండును....ఒక్క బృందావనమ్ము” అని ఆకాంక్షిస్తాడు. బుతువుల్ని పూలపళ్లెముగా వర్జిస్తూ - " “బుతువుల పూలపళ్లెరము లెప్పటిమాదిరి నిండుచున్న వ ద్భ్చుతముగ నెన్నానా కనులముందర నా నలువైపులందునన్‌ (ప్రతిసుమమందు ('ప్రత్యగమునన్‌ నవయౌవన దివ్యుదీప్పులే అతిశయితమ్ము ల శతశతాబ్బసమృద్ధుల నుద్ధరించెడిన్‌.” తన తీవప్రవాహాన్ని “పారావారమ్మును చేరగావలయు”నని అర్ధోక్తిగా జీవన సాఫల్యాన్ని నిర్దేశించాడు కవి ఆ కావ్యంలో.

సర్వ్యాంగసుందరమైన ఆ కావ్యంలో విశిష్టమైన ప్రత్యేకతలను గుర్తించడం కష్టం. అదొక ప్రాకృతిక వర్ణచిత్రం. అందులోని పద్యాలు ఉత్పలవారి కవితాప్రతిభ కెత్తిన వైజయంతికలు.

“భారతొ ఆంధ్రషత్రికలలో ప్రచురితమవుతూన్న ఇటీవలి పద్యాలనుబట్టి చూస్తే ఉత్పలవారిలో రానురాను తాత్త్విక పరిణామం ప్రస్పుటంగా కనిపెస్తూన్నది. దేశానికి శాంతి ప్రదానం చేసేదీ, గృహస్త జీవనానికి మంగళప్రదమైనదీ ఆధ్యాత్మిక చింత ఒక్కటే. ఇట్టిది నేటి కవులలో ఉత్పన్నతాపరంగా ఇప్పుడిప్పుడే కొందరిలో కనబడుతూన్నది. శ్రీ ఉత్పల ఒకడుగు ముందు వేశారనవచ్చు - దైన్యావస్థలో

  • దట్టమైన చీకట్లలో తలుపులు మూసుకొని నిద్రిస్తూన్న సమయంలో ఒక ప్రాభాతిక

మహోజ్వల కవి ఉతృల మాడపాటి భాన్మరరావు, ఎం.వి 2139 విహంగ కంఠంనుండి వినిపించిన విశ్వశాంతి గీతంలా ఉన్నది ఆంధపటత్రిక ఉగాది సంచికలోని ఉత్పలవారి “ఉగాది (ప్రార్ధన.

“ఈ యఖిలాండమెల్ల జగదీశ్వర నిత్య నివాస దివ్య దే

వాయతనమ్ము - మంగళమయమ్మును - సర్వజనీనసేవ్య ని

(ేయసతా పదమ్మిదియె లెండికనో అమృత ప్రసూతులా

రా! యరుదెంచుడో సుజనులార! మహోదయమయ్యొ పాగ్జ్గిశన్‌”

భారతదేశం తన వేదికపై నిలబడి మానవసమాజంయుక్క భీదవిభీదాలను దాటి ఈ వాణినే మరొకసారి ఉద్భోధిస్తున్నట్లుగా ఉన్నది. “శృణ్వన్తు విశ్వే అమృతస్య పుత్రా ఆయే దివ్యధామానితస్థూః వేదాహమేత౦ పురుషం మహాన్తం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత ఉదయ శిబరంనుండి వినిపించిన ఈ (ప్రభాతిక మంత్రం ఉత్పలవారిద్వారా మరొకసారి మార్నుమోగింది. దీపం తన వెలుగును తనలోనే దాచుకోలేదు - మహాన్తం పూరుషం - మహాపురుషుని పరిచయం పొందినవారు ఇంక కవాటాన్ని బంధించుకొని ఉండలేరు. వా రొక్కసారిగా లోకంమధ్య నిలిచి ఉంటారు. వారి కంఠాన్ని అఆశ్రయించినదేదో ఘోషిస్తూనే ఉంటుంది. దివ్యధామం తనకు నలువైపులా ఆవరించి ఉన్నట్లుగా చూస్తారు.

“అమ్మెయి వజగర్జిత మహాధ్వని గుండెల మారుమోసినన్‌

ముమ్మురమైన నా కనుల ముందరి అంధతమి(స్రమెల్ల దూ

రమ్మయిపోయి నా పరిసరమ్ముల మంగళవాద్య ఘోష లొ

క్కుమ్మడి రేగి ఈ భువనగోళము దేవళమై కనంబడెన్‌” ఆత్మవిశ్వాసం లేక, నిరాశా నిస్పృహల అంధకారంనుండి ఆవిర్భవించి, జీవనయాత్రలో తైనాతిగా వెంటదగిలిన నాస్తికత్వంయొక్క దారుణకర్తృత్వంనుండి లోకాన్ని సముద్ధరించడానికి, మానవుల్ని సచేతనుల్ని చేయటానికి (బహ్మానందంతో జీవితాన్ని పరిపూర్ణం చేయటానికి ఉత్పల తన కవితాప్రయోజనంగా భావించాడు. అమృత(పప్రసూతులారా! అని సంబోధించి విశ్వవాసుల్ని సుజనులను చేసి “నిమ్న

2140 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దేశాలవైపుకు నీరు పారు" నట్లుగా, “వత్సరమ్ముల (ప్రాపుకే వచ్చు నెలలుగా మానవ (ప్రవాహాన్ని సర్వభూతాంతరాత్ముని సాన్నధ్యానికి మరల్చటానికి ఉదయశిఖరాన నిలబడి మరల ఆ (ప్రాభాతిక మంత్రాన్ని గానంచేసి “ఉత్పల” భారత కవితా వెతాళికుడైనాడు. “అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః యథామ్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే” (కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై శేంవ4) షా ఊహలు 1 (4. కల ల. ఘం | భో (గ

విమర్శ స్ఫూర్తిశ్రీ పెమర్శకుడు పథ(ప్రదర్శకుడు. విమర్శనము నిర్ణీతమగు మార్గము. విషయవిమర్శనము చేయు అధికారము కొందరికి మాత్రమే కలదు. ఆయా విషయములందు సరియగు జ్ఞానముకలవారు మాత్రమే సాహిత్యవిమర్శకు సముద్యమింపవలయును. లేనియెడల సాహిత్యస్వరూపమునకు, దానిమూలమున సమాజ సర్వస్వమునకు హానిచేసినవా రగుదురు. సహృదయుడును, విషయవిజ్ఞుడు నగువాడు మాత్రమే విమర్శకు పూనుకొనవలయును. అట్టివాడు మాత్రమే వస్తువును సమ్యుక్కుగు సమ్మగ్రముగ చర్చించి, దానిపై తన అభ్మిపాయమును ఆలుపగలుగును. మన మిప్పుడు “విమర్శని మనుపేర వ్యవహరించునది అధునాతన యుగమున మాత్రమే ఆవిర్భవించినది: ఆంగ్లమున గల “6గ108గ” అను పదమునకు సమానార్థ్ధకముగా మన భాష యందు నిర్మింపబడినది. సంస్కృతమునందు పెద్దపెద్ద [గ్రంథములకు భాష్యములు కలవు; ప్రశంసలు కలవు; సుందరములగు టీకలు గలవ్ఫ; టిప్పణులు గలవ్చ. కాని, అందేయొక్కటియు నేటి విమర్శనముతో తుల్యముకాదు. సాధారణముగా - వారు ఒక [గంథమును అభినందింపసాగిరా - కడదాకా అభినందించుటయే; ఒక (గ్రంథమును అభిశంసింపసాగిరా - కడదాక అభిశంసించుటయే. మంచిచెడ్డల రెంటిని పరికించి, వర్పరించు సమదృష్టి వారిలో కన్పట్టదనుట సాహసముకాదు.

2142 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము

అందువలననే సాహిత్యలోకములో - సామాన్యజనానీకములో విమర్శకు డనగా రంధ్రాన్వేష్‌ యను అపషప్రథ కలిగినది. తప్పులు వెదకుటయే విమర్శకుని పని యను విశ్వాసము ప్రబలినది. “విద్వాన్‌ విపశ్చిన్‌ దోషజ్ఞః - పురోభాగీ దోమషెక దృక్‌ అనుదానికి మిక్కిలి ప్రచారము కలిగినది.

అది (ప్రాచీనుల విషయం. అదే ప్రణాళికతో నేటి విమర్శకుడు వ్యవహరించినచో, కవి మార్గమును - తన మార్గమునుకూడ అతడు కంటకితము గావించుచున్నా డనవలయును,. +

నేటికాలమున ప్రశంసామాత్రప్రధానములైన విమర్శలవలన ప్రయోజనములేదు. విమర్శకుడు విషయవిన్లేషణ సమర్థుడు కావలయును; వస్తుగతమైన నిమ్నోన్నతములను (గ్రహించి ప్రదర్శించు శక్తిమంతుడు కావలయును; మంచిచెడ్డలను నిరూపించవలయును. ఏఏ తత్త్వముల ఆధిక్యమువలన కావ్యము గౌరవము గడించుకొన్నదియు, ఎందువలన నాందర్యము సన్నగిల్లినదియు

._ వివేచించి నిరూపించుట అవసరము.

నేటి విమర్శకుడు కావ్యమును మాత్రమే కాదు - కావ్యమునకు కారణమైన కర్తనుకూడ అర్ధము చేసికోవలయును. కావ్యము మైని కర్షృవైయక్తిక జీవితమున కెంతో ప్రాధాన్య ముండి యుండవచ్చును. (ప్రత్యక్ష జ్ఞానమే (ప్రధానముగా కవి కావ్యనిర్మాణము గావించియుండవచ్చును. కేవల కల్చ్పనమే ఆతని కాలంబము కావచ్చును. వీనినన్నింటిని వివేచించు పని విమర్శకునిది.

, ఇంతటితోనే అతని మహత్తర కర్తవ్యము కడముట్టినదనరాదు. అతడు మంచిచెడ్డలు నిర్ణయించునపుడు - ఏది యెందులకు మంచిదయ్యెనో, చెడ్డ్దదయ్యెనో సహేతుకముగా బలపరచుకొనవలయును. చెడ్డను పరిహరించుటికు, సాహితీస్వరూపమునకు సౌష్టవమును సౌందర్యమును గూర్చుటకు తగిన సూచనలనుగూడ అతడు చేయనగును. కాని, ఇట్టి సాహసము సామాన్య విమర్శకులకు కలుగదు - కలుగరాదు.

సాహిత్యమునకు శాశ్వతత్వ మొసంగగల సామర్థ్యము విమర్శకు కలదు. విమర్శయే భవిష్యల్లోకమునందు సాహిత్యమునకు వెలుగుదారులు చూపగలది.

విమర్శ న్ఫూర్తిశ్రీ . 2143

విమర్శనము సమ్యుక్పథప్రదర్శకమును. బెచిత్యవిశిష్టము నైనంతవరకు సాహిత్య భవిష్యత్‌ స్వరూపమునుగూర్చి ఆలోచింపవలసిన అవసరములేదు. కాని, విమర్శకుడు స్వార్థద్వేషములకు సాగిలబడి - అహంభావము నాశయించినచో, సాహిత్యము సారహీనమై శుష్క మై నాశనోన్ముఖమగును. నిజమగు సాహిత్యకుడు తగిన పప్రోత్సాహములేక శారదాపీఠమునుండి వైదొలగియుండును. ఆనవసర ప్రశంసల నందుకొన్న కవిమ్మన్యుడు తన కవితయే మూర్థన్యమని చెప్పుకొనుచు సమాజమునంతను సంచలితము గొవించును. సాహిత్య మూల్యము చెడిపోవును. స్వాత్మతృప్తే నందజాలని, సారస్యసంపర్కములేని సవూజవము సాహితీపరాజ్ముఖమగును. వెన్వెంటనే కాకపోయిన, కొంతకాలమునకైన అట్టి సరిణామము కలుగును. అట్లు కాకపోయిన, కవిబ్రువుల ప్రవర్ధమానమగు కీర్తికి లోభపడ్డి, (భ్రమతో, నిజమగు సారస్వతేయులుకూడ వారి మార్గమునే అనుగమించి, అక్షరసరస్వతికి అవనతిని గూర్తురు. కావున, సమాజ సాహిత్యసమున్నతికి సమర్థుడైన విమర్శకుడు వివేకహీనుడై స్వార్ధద్వేషాహంభావములకు లొంగి సంచరింపరాదు.

విమర్శనముకూడ సాహిత్యసంబంధి యగు ఒక విశిష్ట రూపము,

సాహిత్యమూల్య నిర్ధారణ సామర్థ్యసంపన్న మగుటచేతనే కాక, ఆత్మగుణ సౌహిత్య స్వాతంత్యుమువలనకూడ విమర్శనము (ప్రశంసనీయము. ఒక కావ్యముగాని, కథనుగాని, నాటకమునుగాని, చదువృనప్పుడు కలుగు ఆనందానుభూతియే ఒక చక్కని విమర్శనమును చదువునస్పుడుకూడ కలుగును. సమర్థుడగు విమర్శకుడు సల్పిన సమాలోచనము పండితుల శిరఃుకంపనములకును, (ప్రశంసలకునుగూడ పాత్రము కాగలదనుటలో సందియములేదు.

విమర్శనము వాయుపూరణముకాదు. అది (ప్రగాఢమును, పరిశీలనాత్మకము నగు విషయము. మనోమస్తిష్కముల రెండింటి వ్యాపారము విమర్శ్భయందు అవసరము. హృదయసంబంధి యగు కళ, మేధాసంబంధియగు శాస్త్రము విమర్శనమందు విశిష్ణవిధానములో మేళన మొందును. నిర్మాణపిధియు, నిర్ణయ(్రవృత్తియు సమ్మిళితము లగును. విమర్శనము కేవల కళగాని, కేవల శాస్త్ర్రముగాని కాదు - అది రెండును.

2144 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము విమర్శకుడు కావ్యమును శస్త్రచికిత్సకునివలె విశ్లేషించి చూడవచ్చును. "కాని, కర్తను సొముఖ్యముతో చూడవలయును. విమర్శకుని లక్ష్యము కవిని సమర్థించుటయు, సంస్కరించుటయు మాత్రమే కావలయును. విమర్శ సాహితీలోకమునకు వెలుగుబాట - సంజీవి. విమర్శనము ('పోత్సాహకము - స్ఫూ ర్తిసంధాయకము. అది కర్తవ్య నిస్టాపటిష్టమైననాడు గక్తిమంతమై, సత్యసందీప్తమై భాసింపగలదు. ఒక కవికి విజయమునుగాని, అపజయమునుగాని కూర్చు అనంతమైన శక్తి విమర్శకునిలో గలదు. విమర్శ ఆధునిక యుగములో, కావ్యజగములో అనంతశక్తి సంపన్నమగు ఆయుధము. (కిన్నెర: సంపుటము ఈ, సంచిక 7, జూలై 1954) ॥ న్యు స!

రసచర్చ ఆంధ్రసాహిత్యము - హాస్యము వసంతరావు రామకృష్ణరావు, బి.ఎ. శేరూపమును దాల్చినది సాహిత్యము. ప్రపంచములో ఏ సాహిత్యమైనను సమాన గుణ ధర్మములు కలిగియుండును. దోషరహితము, గుణసహితము, రసభరితము అయిన శబ్దార్థములు గలది సాహిత్యము. సాహిత్యలక్షణములను నిర్ణయించు సందర్భములలో ఆలంకారికులకు భిన్నాభ్మిపాయములు గలవు. అయినప్పటికి సాధు శబ్బార్థసహితమైనది సాహిత్యమని అందరు అంగీకరించి ఉన్నారు. సజీవములె, సద్యఃపరనిర్వృత్తిని కలిగించు కావ్యములు సాహిత్యముయొక్క (ప్రయోజనమును సాధించునట్టివి. _ అవి ఉత్తమ శిల్ప లక్షణముల కలవియె, రసానంద సంధాయకములై సాహిత్యమునందు సౌందర్యమును, సత్యమును స్ఫురింప చేయుచున్నవి. ఆంధ సాహిత్యము ఆనంద రసోత్పాదకము = సాధు శబ్దార్థసహితము - అందువలననది “దేశభాషలందు లెస్ప”మొనది - పాశ్చాత్యులచే “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కొనియాడబడినది. సంస్కృతభాష యందలి గాంభీర్యము, (ద్రావిడ భాషయందలి సరళత ఆం(ధ్రవాణిలో పాదుకొనియున్నవి. గాసమునకు పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ: సౌహిత్యము

2146 పందిరి షుల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము రాగము ప్రధానమైనట్లు సాహిత్యమునకు రసరామణీయకములు ప్రధానములు. ఆంధ సాహిత్యము సరసము; రసాలంకార సహితము. ఆదికవి నన్నయ్యనాటి నుండి నేటివరకు “ఇంతింతై....తానింత్రె ...నభోవీథిపై .... నంతై” మధురముగా, మార్దవముగా, మానసాసందకరముగా, మంగళాకరముగా, ఆంధ్ర సాహితీ స్రవంతి 'ప్రజాజీవనవాహినితో పెనవేసికొని ప్రవహించినది. ఆంధ్ర సాహిత్యము, తేటతెల్లని పదజాలములతో జీవితమున తీయని తేనియ లూరించి హృదయముల నూగించి యూగించి చక్కిలిగింత లిడునట్టిది. ఆంధభాష యందు అనిర్వచనీయమైన గాన మాధుర్యము గలదు. అది కవితాచిత్రణమునకు రసస్ఫూ ర్తికి నాలవాలము.

పూర్వ కవిత్వము రాజుల జీవనమునకు సంబంధించి యుండినది. రాజులే కవిత్వమునకు రాజపోషకులైరి. కవులుగూడ ఆనందాస్పదమై రసోత్సాదకమై, మనోహరత్వమును మూర్తీభవింపజేయు కావ్యరచనకు పూనుకొనిరి. ఆనాటి కవుల జీవితములు భోగభాగ్యములకు తావలములు. “నిరుపహతి స్థలంబు రమణ్మీపియ దూతిక దెచ్చి ఇచ్చుకప్పురవిడె మాత్మకింపయిన భోజ్యము, ఉయ్యెల మంచము” లుండిననే కాని కవిత్వము (ప్రవహెంచెడిది కాదు. “కప్పురంబులు కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపైగప్పిన [క్రియ విరిపొట్లము విప్పినగతొ ఘుమ్మనునట్లు ఆనాటి కవులు కవిత చెప్పిరి. ఆ కవిత్వ మొక అమృతధార !

చెవులకు జవులై చల్లగ

కవులకు దవులై సమస్త కావ్యకళాబం

ధువులై రససింధువులై

అవుృరాయని"..... ఆనాటి కవిత్వము విలసిల్లినది. పూర్వ కవులు తమ కావ్యములందు సమస్త సమకాలీన సాంఘిక పరిస్థితులను సమగ్రముగా (పస్ఫుటము చేసిరి - పూర్వ కవులు సమకాలీన భావ ప్రతినిధులు. నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథుడు: పెద్దన, తిమ్మున మొదలైన మహాకవులందరు ఆంధ్రభాషా సరస్వతికి అలంకారపాయమైన సముజ్వల కావ్య రత్నములను సృష్టించిరి.

ఆంధ్రసాహిత్యము: హాస్యము వనంతరావు రామకృష్ణరావు, వివ, 2147

రాజుల జీవనమునకు సంబంధించిన పూర్వ కవిత్వమునకు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు స్వస్తివాచకము పలికిరి. వారు తొలిసారిగా ప్రజలకు కవిత్వము నందించినవారు. వారి కవిత్వము ప్రజల జీవనము నైక్యముచేసి సాంప్రదాయ బద్ధము గావించినది. .

భారత జాతీయ ఉద్యమముతోపాటు ఆంధ్ర సాహెతీరంగములో నూతన ఉద్యవుము బయలుదేరినది. [పప్రబంధయుగమునాటి భాషాభావముల వైభవ్యపాభవములు సన్నగిలి, సభ్యతావిదూరమైన సాహత్యము సృష్టింపబడిన అంధయుగపు విషాద సీలిమచ్చ్భాయలను పారదోలిన నవయుగము “కందుకూరి” భానూదయముతో [ప్రారంభమైనది. చిలకమర్తి, గురజాడ, గిడుగువంటి భాషా సేవకులు, నాగేశ్వరరావువంటి వదాన్యశేఖరులు, ఆంధ్రలోని కావ్య రచనా ఉద్యమానికి బలమైన చేయూతనిచ్చిరి.

ఆధునిక సాహిత్య వేత్తలు కావ్యమునందు హాస్యమునకుగల ప్రయోజనము గుర్తించి, హాస్యరసపోషణము చేసిరి. |

కవి, (సస్ట - కావ్య నిర్మాత - అతని మానసిక స్ధితి మృదువైనది. కవుల భావములలో మార్పులు వచ్చినవి. తీవ్రమైన భావ సంచలన ఫలితముగా, భాషాస్వరూపము మారి, అది సంఘ సంస్కరణమునకు దారి తీసినది.

అంతకు పూర్వము, ఆంధ్ర కవులు హాస్యమునకు గల ముఖ్య ప్రయోజసమును అంతగా గుర్తించలేదు. “సద్యఃపర నిర్వృృతి"కి కారణభూతమైన సునిశిత హాస్యరసమునే వారు తమ కావ్యములందు ప్రవేశపెట్టిరి. హాస్యము పఠితల వినోదమునకే యనునది వారి ఆశయమైయుండును,

ఫూర్వాంధ్ర కవిత్వమున సృష్టింపబడిన హాస్యమునకు సంస్కృత నాటకములు కావ్యములు మూలములు. సంస్కృత నాటకములలోని విదూషక పాత్ర కేవలము హాస్యరస ప్రధానమైనది. ఆ పాత్రలకు వినోదము కల్పించు పని ప్రధానమైనది - దానివలన ఇతర (ప్రయోజనములు సాధింపబడవు - కొన్ని విదూషక పాత్రలు సునిశిత పరిహాసము చేయకపోవుటయు నున్నది. మృచ్చ్భకటికములోని శకారుని పాత్ర సరసమైన హాస్య కళాస్వరూపమును ధరించలేకపోయినది.

హాస్యమనగా నేమి? - సాహిత్యమున దానికిగల ప్రయోజనమెట్టిది? అను విషయములు చాల ముఖ్యములైనవి.

2148 పందిరి మల్లికార్డునరావు శతజయంతి పంప్పుటము 4: సాహిత్యము

హాస్యము నవరసములలో నొకటి. “విభావానుభావ వ్యభిచారి భావ సంయోగాదస నివృత్తి” అని భరతముని రసలక్షణము పప్రవచించెను. హాస్యజనకమైన అలౌకికానందప్రదమైన చమత్కార కల్పనమును హాస్యము అని అందుము. ఆంగ్ల రచయిత, అడిసన్‌, హాస్యమును నిర్వచించుటకంటే హాస్యము కానిదానిని నిర్వచించుట సులభమని చెప్పెను. హాస్య రససృష్టికి మృదువైన మానసిక స్థితి ఆవశ్యకము - కళామయమై రసోద్దీపకము కాగల హృదయము హాస్యరచనకు కారణము. కవి, చిత్రకారుడు, నర్తకుడు, గాయకుడు మొదలైనవారివలె హాస్యశీలుడు, సత్యమును, సౌందర్యమును సమానదృష్టితో సందర్శించును. వోస్యరచన నిర్దుష్టమైన గొప్ప కళావిశేషము.

హాస్యము, నేడు, మన జీవితములో చాల ప్రయోజనములను సాధించుచున్నది. సాంఘిక సంస్కరణమును సున్నితమైన హాస్యరచన మూలమున సాధింపవచ్చును. జీవితములందు ఆనంద విలాసములను ప్రతిపాదించుటకే కాక, అసత్యము నిరసించి, సౌందర్యమును పోషించుటకు హాస్య ముపకరించును. చమత్కారశీలత లోకాతీతమైన ఒక దివ్యశక్షి హాస్యమునకు ప్రసాద గుణము ముఖ్యము. హాస్యమునకు సహృదయత, విశాల దృక్పథము అవసరము. కళాశీలుని చమత్కార కల్పనము హాస్యమగును.

జీవితములో, హాస్యప్రయోజనము కావ్య(పప్రయోజనమును పోలియుండును. జర్మను కవిశేఖరుడైన "గత (68009) “౬20౧ 206 [౭8 50౧౩ 0 569200” అని నుడివినట్లు, చమత్కార కల్పనము హృదయ వికాసమునకు, సౌందర్య సత్యముల శాశ్వతత్వమును సందర్శంచి ఆనందమును (ప్రసాదించుటకు తోడ్పడును.

హాస్యము త్రేష్టమైన ఒక కళావిశేషము. ఆనందాస్పదమైన రసము నుత్పాదించుటయే లలితకళల గర్తవ్యము. హాస్యము ఒక విలక్షణమైన మనోహరత్వమును మన యెదుట మూర్తీభవింపచేసి, హృదయ వికాసమును, విలాసమును, విజ్ఞానమును కలిగించును. హాస్యమున రామణీయకతకు విలక్షణ స్థానమున్నది. వినోదకరమై, అలౌకికానందప్రదమై, అనుభవైకవేద్య మైన హృదయ వికాసమును ప్రతిపాదించునట్టిది హాస్యము. కవి, శిల్పి, చిత్రకారుడు. భక్తుడు, హాస్యశీలుడు - వీరందరు ఏది “సత్యం, శివం, సుందరొమో దానినే సందర్శించుచున్నారు. “కావ్యప్రకాశిక యందు మమ్మటుడు, “హ్లాదైకమయము,

అంధ్రసాహిత్యము: హాస్యము వనంతరావు రామకృష్ణరావు, బివి, 2149 అనన్య పరతంత్రము, నవరస రుచిరము అని కవి సృష్టిని కొనియాడెను. మృదువైన లోకోత్తరమగు చిత్తవిస్తారకారకమైన విస్మయ రచనానైపుణ్యము సృష్టిలోని శాశ్యతమై నాశనములేని సత్యముయొక్క స్వరూపమును వెల్లడి చేయును. దీనినే విశ్వనాథుడు “చిత్తవిస్తార రూపమగు విస్మయము” అని నిర్వచించెను.

కవిత్వ కల్పనాశక్తి అనన్యసామాన్య మైనది. కవి భావనా శక్తి మహోద్వేలమైన కాల (ప్రభావాన్ని తిరస్కరించి విశ్వంతో ఏకీభవించునట్టిది. ఈ భూతసృష్టి అంతయు చమత్కారశీలునకు ఆనందజనకమైనదే -

“ఆనందా దేవఖల్విమాని భూతానిజాయంతి,

ఆనందాదేవ జాతాని జీవంతి,

ఆనందం (ప్రయాన్న్యభి సంవిశంతి” అనగా సృష్టియంతయు ఆనందమునుండి పుట్టుచున్నది. ఆనందమున వృద్ధియగుచున్నది. ఆనందము దిక్కునకే (పయాణమగుచున్నది. తుదకు ఆనందమున స్థాయి కుదుర్చుకొనుచున్నదని భావము. కనుక ఆనందప్రదమైన హాస్యశీలత మానవ జీవిత పరిణతికి ఒక అనివార్య కారణమగుటలో ఆశ్చర్యము లేదు.

ఆంధ్ర సాహిత్యమున శబ్బ్దాశయ అర్థాశయములతో హాస్యరచన కొనసాగినది. నవ్యత, విజ్ఞత, నాగరికతలు హాస్యరసమున ద్యోతకమగును. ఆధునిక ఆంధ్ర సాహిత్యములో కందుకూరి, పానుగంటి, గురజాడ మొదలైన మహాకవులు విలక్షణమైన హాస్యరచన కావించిరి, కాని కేవలము హాస్య రసమునే ఆధారముగా చేసికొనిన స్వతంత్ర కావ్య నిర్మాణము చేయుట చాల అవసరము,

సామాన్య మైన వస్తువులలో అనంతమైన సౌందర్యమును దర్శించు మహానుభావు లెందరో గలరు. అది ఒక ప్రత్యేకత. భమిడిపాటి, మునిమాణిక్యం తెలుగు వచన రచనలలో అపురూపమైన హాస్యమును (ప్రతిపాదించిన చమత్కారశీలురు.

హాస్యమునకు చాల (ప్రయోజనము లున్నవి. విజ్ఞాన వినోదములను ఆపాదించుటకే కాక - సాంఘిక దురాచారముల నిర్మూలించుటకు ఇది తోడ్పడినది.

2150 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము పద్యమునకంటె గద్యమునందు హాస్యరచనము మిక్కిలి భావస్పోరకముగా నుండును. కావున, రసానంద సంధాయకమై, సద్యఃపర నిర్వృతిని కలిగించునట్టి సముజ్వల హాస్యరచనమునకు నేటి సంఘము తగిన పోత్సాహమొసగవలను, అన్యభాషలందు కూడ హాస్యము చదువరులకు రసోద్దీపనము కావించి, హృదయమునకు వికాసము నిచ్చి, కొన్ని సాంఘిక (పయోజనములను సాధించినది. మనోహరమైన, మోహన రూపమును సాక్షా త్కరింప చేయగలశక్తి హాస్యమునకు గలదు. అది సజీవ విలసితము - అలౌకిక ఆనంద ప్రతిపాదిని. హాస్యరచనయందు రచయిత ప్రతిభాసంపత్తి వెల్లడియగును. ఆంగ్ల రచయితలనైన అడిసన్‌, డికెన్స్‌ మొదలైనవారు సునిశిత హాస్యరచనమున పేరు గాంచినవారు. అట్టి హాస్య రచనమే సాంఘిక ప్రయోజనములను సాధించి, సాహిత్యములోని ఉత్కృష్టతను ప్రతిపాదించును. (కిన్నెర: సంపుటము 6, సంచిక 7, జూలై నా. సు టంట. (౮౯౪౭, 4, (షు! ర్త క షళ [= /బ్హో

రసదృష్టి యి సంజీవదేవ్‌ (ఏపిల్‌ “కిన్నెరి లో వెలువడ్డ నా “కథకాదు అనేదానిలోని నా “6510660 ౪150గ యొక్క మొదటి వాక్యాన్ని చదివి కొందరు ఉత్సాహపరులైన “కిన్నెర” పొఠకులు నా “46510610 ౪1910౧” అనే వ్యాసాన్ని తెనిగించి “కిన్నరొలో (ప్రచురించమని బలవంతపెడుతూ లేఖలు వాసారు. అందుకు ఫలితమే యీ అనువాదం. నా ఆంగ్ల వ్యాసాన్ని నేనే స్వయంగా తెలుగులోకి మార్చుకోటంలో కొంత సొలభ్యం తట్టినా అంతకుమించిన కష్టం తట్టకపోలేదు. - సంజీవదేవ్‌) నేదృష్ట భౌతికరూపొన్ని చూస్తుంది. తాత్వికదృష్టి ఆత్మిక రూపాన్ని తిలకిస్తుంది. కాని రసదృష్టి ఆత్మికరూప కాంతితో మెరుస్తున్న భౌతికరూపాన్ని 'దర్శించగలుగుతుంది. లౌకిక వ్యక్తి యొక్క దృష్టి దృశ్యమయానికవతల చూడలేదు; తాత్వికుని దృష్టి అదృశ్యమయాన్ని మాత్రమే చూడగలుగుతుందిః; ఇక కళాకారుని దృష్టి అదృశ్యమయపు సుగంధంతో పరిమళిస్తూన్న దృశ్యమయాన్ని నీక్షిస్తుంది. కనుక రసదృష్టి వాస్తవానికీ కల్పనకూ మధ్య - మంటికీ మింటికీ మధ్య, భౌతికానికీ ఆత్మికానికీ మధ్య- ఒక సంధి అన్నమాట. కళాకారుడు ఇటు తన ఇంద్రియగ్రాహ్యాల వాస్తవఛాయలనూ విసర్జించడు. అటు తన అతీంద్రియాను భూతుల అస్పష్టకాంతులనూ అలక్ష్యపరచడు. ససీమకూ అసీమకూ మధ్య కళాకారు డొక గొప్పు వంతెన.

2152 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నిత్యం వెలువడుతయి పూర్వదిగంతంలో గులాబీ సూర్యోదయం, పశ్చిమ దిగంతంలో సిందూర సూర్యాస్తమయం. కాని యీ దీప్తివంత దిగంతాలను ఎంతమంది ప్రజలు తన్మయ దృష్టితో నిత్యం వీక్షిస్తున్నారు? ఏ కొద్దిమందో మాత్రమే. ప్రతిమాసం నెలవంక, ముగ్గవధువు మాదిరి మృదువుగా సిగ్గుగా సాంధ్యాకాశంమీద ప్రత్యక్షమవుతుంది. కాని ఎంతమంది దానివైపు ఒక్క కటాక్షం ప్రసరించే శ్రద్ధ చూపుతారు? బహు కొద్దిమంది మాత్రమే. ప్రతి సంవత్సరం శరత్‌ (ప్రభాతం గడ్జ్డిమొలకలమైన _ఇంద్రధను వర్ణాలతో ధగధగలాడే మంచుబిందువులతో ప్రత్యక్షమవుతుంది. శారద నీలాకాశం [క్రింద యీ మెరుస్తున్న రంగుల హిమకణాలు సున్నితహృదయాల్లో నిజంగా అనంతంయొక్క ఆనంద

  • ప్రకంపనలను రేకెత్తిస్తయి. కాని ఈ శరత్‌ దృశ్యాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారు? ఏ కొద్దిమందో. ఎందువల్ల ఈ నిర్లక్ష్యం? దైనందిన కార్యకలాపంనుంచి తీరికలేకనా? కాదు. రసదృష్టి లోపించి నందునే.

సాంధ్యరాగపు ఆకాశాని కడ్డంగా ఏకాంతంగా నిలచివున్న ఒక వెదురుపొదను ప్రకృతిలో ఆనందించలేని వ్యక్తి దాన్నే ఒక బొమ్మలో చూచినప్పుడు ఆనందిస్తాడు. నందలాల్‌బోసు వేసిన “గ్రామకుటీరాలు” అనే చిత్రంలోని వెదురుపాదనుంచి వచ్చే మౌనసంగీతంలో ఎవరి హృద్‌వీణాతంత్రులు మేళవించకుండా వుండగలవు! ఈ చిత్రం */1496 ౧౮౪” అనే పేరుతో “30166౧ 800%0! 10018" అనే సంపుటంలో రంగుల్లో ముద్రితం అయివుంది. ఒకే వస్తువు (ప్రకృతిలో వున్నపుడు దర్శకునికి ఆనందం ఇవ్వలేకుండా వుంటుంది. కాని అదే వస్తువు బొమ్మలో చిత్రితమైనపుడు అదే దర్శకునికి ఆనందం ఇవ్వగలదు. (ప్రకృతి సాధించలేనిదాన్ని కళ సాధించగలుగుతున్నది.

(ప్రకృతిలోని ఆ ఏకాంతపు వెదురుపాదను ఆనందించలేని వ్యక్తిలో రసదృష్టి లేదు. కనుకనే ఆ ఏకాంతపు వెదురుపొద ఆ వ్య క్తిదృష్టిలో అతి సామాన్యమైన నీరస వస్తువు; సుందరవస్తువు కాక కేవలం ఒక ఉపయోగవస్తువు మాత్రమే. కాని ఆ వెదురుపొదనే బొమ్మలో చూచినప్పుడు ఎందుకు ఆనందిస్తాడంటే కళాకారుడు తన రసదృష్టిద్వారానూ, తన హస్త నైపుణ్యం ద్వారానూ ఆ వెదురుపాదను తన బొమ్మలో ఒక అసాధారణంలోకి రూపాంతరపరిచాడు గనుక.

రనదృష్టి నంజీవబేవ్‌ 2153

రసదృష్టి లేంది సొందర్యమే లేదు. నిజానికి ఈ జగత్తులోని ఏ వస్తువులో కూడ వస్తుగత సౌందర్యం అనేదే లేదు. సౌందర్యం అనేది వ్యక్తిగతం కనుక అది రసదృష్టిలో మాత్రమే వుంటుంది. సౌందర్యం అనేది వస్తుగత సత్యమే అయివుంటే సుందర వస్తువు ప్రతివారికీ ఒకేరకమైన ఆనందాన్ని కలుగటేసేది. కాని అదృష్టవశాత్‌ అది ఆవిధంగా కాకుండావుంది. (ప్రతివ్యక్తీ సౌందర్యాన్ని గురించి తన స్వంత భావాన్నీ తన స్వంత అనుభవాన్నీ కలిగి వున్నాడు. ఒకరికి సుందరంగా గోచరించింది ఇంకొకరికి కురూపంగా గోచరించవచ్చు. అందుకని సౌందర్యం వస్తుగతం కాదు, వ్యక్తిగతం మాత్రమే. సౌందర్యం వస్తువులోకాక వ్య క్తి యొక్క హృదయంలో మాత్రమే వుంటుంది. కనుకనే ఎమర్సన్‌ అన్నాడు “పపంచాన్నంతా సౌందర్యం కోసం నీవు ఎంత వెదికినా అది స్వయంగా నీలో వుండనప్పుడు దాన్ని నీవు కనుగొనలేవు.” అని.

స్వయంగా వ్యక్తి రసదృష్టిని కలిగివుండనంతవరకు ప్రకృతిలోని సౌందర్యాన్ని ఆ వ్యక్తి స్వయంగా ఆనందించటానికి అశక్తుడవుతాడు. ప్రపంచంలోని కళలన్నీకూడ రసదృష్టి యొక్క నిర్మాణాలే. కళ భౌతిక మాధ్యమికాల ద్వారా కాక రసదృష్టి ద్వారా నిర్మించబడుతుంది. కళావిదుడైన షారీన్‌ అడుగుతాడు “మనిషి రంగులతో చిత్రిస్తాడని ఎవరు చెప్పారు? రంగులను కేవలం ఉపయోగిస్తాడు, అంతే. చిత్రించటం మాత్రం తన అనుభూతులతో మాత్రమే” ఈ పాశ్చాత్య కళావిదుని సుభాషితం “లంకావతారసూ(డత” మనే ఒక ప్రాచీన సంస్కృత (గ్రంథంలోని ఒక (ప్రవచనాన్ని గుర్తుకు తెస్తుంది “రంగే న విద్యతే చితం న భూమౌ నచభాజనే"

  • చిత్రం అనేది రంగుల్లోనూ వుండదు; ప్రదేశంలోనూ వుండదు; రంగుల పాత్రలోనూ వుండదు. భారతీయ రసతత్వజ్ఞుల ద్వారా శతాబ్దాల క్రితం ప్రవచించబడ్డ ఈ సత్యం నేటికీ అంతర్జాతీయ రసజ్ఞులద్వారా ఆచరణా, ఆదరణా పొందుతూనే వుంది.

ఒక కళావస్తువు నిర్మాణంలో భౌతికమాధ్యమికానికి విలువ లేదనీ, కళాకారుడి హస్త నైపుణ్యానికి స్థానం లేదనీ అర్థం కాదిక్కడ. దృశ్యసత్తా పనిచేయందే కేవలం కంటికి చూచేశక్తి వుండదు. అదేవిధంగా ఏ భౌతికమాధ్యమికం కూడ స్వయంగా కఖావస్తువు కాగల సామర్థ్యాన్ని కలిగివుండదు; కేవలం కళాకారుని రసదృష్టి

2154 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము ఆ భౌతిక మాధ్యమికంద్వారా పనిచేసినప్పుడు మాత్రమే అది కళావస్తువుగా రూపొందగలుగుతుంది. అయితే, కన్ను అనే అవయవం లేందే కేవల దృశ్యసత్తా చూడజాలదు అనే సత్యాన్ని కూడ ఎవరూ కాదనలేరు. సక్రమంగా సాగాలంటే సత్తా, అవయవం రెండూ సమంగా పూర్ణత్వాన్ని కలిగుండాలి. ఇదేమాదిరి, కేవలం రసదృష్టినిగాని, లేక మనోచిత్రంగాని వున్నంతమాత్రాన అది భౌతిక అస్తిత్వాన్ని కలిగుండజాలదు; అది ఏదైనా భౌతికమాధ్యమికం ద్వారా వ్యక్తమైనపుడు మాత్రమే ఒక కళావస్తువుగా రూపొందగలుగుతుంది. కళాకారుడి హస్త నైపుణ్యం వల్లనే రసదృష్టి ఒక ఉత్తమ కథాఖండంగా రూపాంతరం పొందుతుంది. అయితే, కళానుభూతిని గాని, లేక రసదృష్టినిగాని అలవరచుకొనే దానికంటే కళలోని ఏ శాఖయొక్క నిర్మాణ విధానాన్నయినా అభ్యసించటం సులభతరం. ఒకదానిమీద చిత్రించేదానికంటి ముందు మనోచిత్రాన్ని నిర్మించుకోటం కష్టతరం.

ఒకానొక కాలంలో చీనాలో ఒక గొప్ప చిత్రకారు డుండేవాడట. ఆ చిత్రకారుణ్ణి చీనా చక్రవర్తి ఆహ్వానించి తనకొక మహత్తరచిత్రాన్ని రచించమని ఆజ్ఞాపించాడు. ఆరోజు మొదలు సంవత్సరంనాటికి ఆ చిత్రాన్ని పూర్తిచేయటానికి చక్రవర్తి అనుమతించాడు. ఆ చిత్రకారుడు చకకవర్తి ఆతిథ్యాన్ని తృప్తిగా అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు ఏ పనీ చేయకుండా. చిత్రాన్ని ప్రారంభించాడా అని చాలాసార్లు చక్రవర్తి దర్యాప్తు చేస్తూ వచ్చాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఎన్నిసార్లు అడిగినా ఇంకా మొదలే పెట్టలేదని జవాబు. రోజులు మాసాల్లోకి మారినయి. మాసాలు [కమేణ సంవత్సరంలోకి మారివస్తూన్నయి. కాని చిత్రాన్ని ప్రారంభించిన సూచన లేమీ గోచరించవు. గడువురోజు వేగంగా దగ్గర పడుతూన్నది; చిత్రాన్ని ప్రారంభించనేలేదు. ఇక చిత్రకారునికి మరణదండన తప్పదని ప్రజలు భయపడసాగారు. కాని చిత్రకారుడు మాత్రం ఎంతో ఆనందంతో వుంటూన్నాడు. ఇక గడువు రేపే అనే రోజు వచ్చింది. కాని చిత్రకారుడు చిత్రాన్ని (ప్రారంభించనే లేదు. ఆరాత్రి ప్రభాతంలోకి మారింది. ఇక ఆరోజునే చితకారుడు తన చిత్రాన్ని చక్రవర్తి ఎదుట ప్రదర్శించాలి. అకస్మాత్తుగా ఆ చితకారుడు తన చిత్రంతో సహా రాజదర్చారులోకి హాజరయాడు. ఆ మహత్తర చిత్రాన్ని చూచి దర్చారీలూ, చక్రవర్తీ చకితునలైనారు. అప్పుడు చిత్రకారుడు చెప్పాడు ; “నేను సంవత్సరం అంతా

రసచృష్టి సంజీవదేవ్‌ 2155 చిత్రాన్ని మొదలే పెట్టకుండా సోవరిగానే వుండిపోయాను; రోజులన్నీ మనోధ్యానంలోనే గడిపాను. కేవలం నిన్నటి రాత్రిమాత్రమే చిత్రాన్ని ప్రారంభించటం, పూర్తిచేయటం కూడ జరిగింది. ఈ సంవత్సరం అంతా నేను మనోచిత్రాన్ని నిర్మించుకోటమే సరిపోయింది. భౌతిక చిత్రాన్ని నిర్మించేదానికంటే మనోచిత్రాన్ని నిర్మించుకోటం కష్టతరం

ఈ చీనావారి కథ ఏం రుజువుచేస్తున్నదంటే సృష్టించేదానికంటే సంకల్పించటమే కష్టమనీ, నిర్మాణానికంటే భావమే కష్టమనీ, ఆచరణకంటే అనుభూతే కష్టమనీ. కళయొక్క మాధ్యమికాన్ని నిరంతరం అభ్యసించటం ద్వారా కళలోని నిర్మాణకాశలాన్ని సులభంగా అలపరచుకోవచ్చు. కాని రసదృష్టిని మాత్రం అలవరచుకోటం కష్టం, అది జన్మతః మనలో వుండందే. కళాకారులు జన్మిస్తారేకాని నిర్మించబడరు అని అన్నప్పుడు దాని అర్ధం మనం రంగుల్ని కలపటం చేర్చుకోలేమనికానీ, వాటితో వెలుగునీడలను సృష్టించలేమనికానీ, పెన్సిలుతో ఒక వస్తువుయొక్క సారూప్యాన్ని గీయటం నేర్చుకోలేమనికాసీ కాదు. దాని అర్ధం మనం మనోచిత్రాన్ని గాని, రసదృష్టినిగాని అలవరచుకోలిమని. నిర్జీత శిక్షణ ద్వారా రసదృష్టిని వికాసపరచుకోగలిగినా అది పుట్టుకతో రావాలిసిన వరం, అయితే నిర్మాణకౌశలం మాత్రం అభ్యాసం ద్వారా లభ్యమయీ పస్తువు.

కేవలం భాషమీదా, ఛందస్సుమీదా (ప్రాబల్యం సంపాదించినంత మాత్రాన ఎవరూ కవిగాలేరు. కేవలం ధ్వనిలోని మర్మాలపైన ప్రాబల్యం సంపాదించినంత మాత్రాన ఎవరూ సంగీతశిల్చి కాజాలరు. కేవలం 'రేఖలమీదా, రంగులమీదా ప్రాబల్యం సంపాదించినంతమాత్రాన ఎవరూ చ్విత్రకారులు కాలేరు. ఒకర్ని కవిగానూ, సంగీతశిల్పిగానూ, చిత్రకారునిగానూ చేసేది నిజానికి హృదయంలోని రసానుభూతి మాత్రమే. ప్రతి ఒకరూ రసదృష్టినిగాని, సొందర్యబోధనుగాని వికాసపరచుకోటానికి చిన్నతనం నుంచీ సుయోగాలు కలిగించబడాలి. అప్పుడు ఎవరైనా తమ అభిమానకళలోని నిర్మాణకొశలాన్ని సులభంగా లోబరచుకోవచ్చు

  • ఆ కళ పదానికి చెందింది కావచ్చు! నాదానికి చెందింది కావచ్చు; లేదా రూపానికి చెందింది కావచ్చు. గతికి చెందింది కావచ్చు.

కాని, రసానుభూతి అనేది జన్మతః కలిగే వరమేకాని నిర్మించబడేది కాదనేది ఎంతవరకు సత్యం? ఇది పూర్ణసత్యం కాదనిపెస్తుంది. ఆధునిక మనస్తత్వ

2156 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము పరిశోధనలు ఏం తెలుపుతవంటే సక్రమ మానసిక శిక్షణనిచ్చి అరసిక చకవర్తిని కూడ రసిక శిఖామణిగా మార్చవచ్చునని. కనుక ఇప్పుడు “కలాకారులు జన్మిస్తారేకాని నిర్మించబడరు" అనేది పోయి “కళాకారులు జన్మిస్తారు. నిర్మించబడతారు కూడ” అనేది రావాలి. కేవలం కళాకారులూ, కళా విమర్శకులూ మాత్రమే ఈ రసదృష్టిని కలిగుంటే చాలదు. సామాన్య మానవుడు కూడ దీన్ని కలిగివుండాలి. లేనట్లయితే, జీవితం కటువుగానూ, నిరానందంగానూ వుండిపోతుంది. ఈ రసదృష్టి లేనప్పుడు నిత్య జీవితం తన ఆకర్షణ్ణి పోగొట్టుకొని అదొక మోయలేని బరువుగా వుండిపోతుంది. రసదృష్టి అనేదీ ఏవో కొన్ని సమయాల్లో ఏ కొందరికో కలిగే అసహజమైన ఆవేశంకాదు. అది (ప్రతి అంతస్తులోని వ్యక్తి యొక్క నిత్యజీవితంలో చాలా అవసరం. మామూలు మనిషి చూచి భయపడే భయంకర నిశీథంలోని భీకరమైన తుపానునూ, మధ్యమధ్య (పళయాకాశంలో మెరిసే మెరుపుల్న చెవులూ హృదయంకూడ (బద్దలయేలాగ ఉరిమే ఉరుముల్నీ ఎంతో తన్మయత్వంతో ఆనందించటానికి మనకు తోడ్పడేది యీ రసదృష్టే. మరణశయ్యమీద పడుకొని రాబోయే మరణంవల్ల కలిగే బాధను చిరునవ్వుతో

ఆనందించటానికి మనకు తోడ్పడేది యీ రసదృష్టే. ఈ రసదృష్టి మూలానే జీవితంలోని (ప్రతివేదనా మనకు ఆనందంగా తడుతుంది. ఈ రసదృప్టిని కలిగుంటే మనం ఎలాంటి నల్లటి విపత్తుల మధ్య నైనా నిశృలంగానూ, ఆనందంగానూ వుండగలం. రసదృష్టి ముదిరితే యోగదృష్టి అవుతుంది!

(కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954)

యమ వవ ం3

శరశ్చంద్రుని స్తం పాత్రలు అటో వాసిరెడ్డి సీతాదేవి

బెంగాలీ సుప్రసిద్ధ రచయిత అయిన శరశ్చంద్ర చటోపాధ్యాయుని పేరు విననివారూ, అతని రచనలు చదవనివారూ, తెలుగుదేశంలో చాలాతక్కువనే చెప్పవచ్చును. ఒక్క తెలుగుదేశంలోనే కాదు, యావద్భారత దేశంలోనే శరశ్చం[ద్రుడు అందరికీ ప్రియపాత్రుడయాడు. దానిక్కారణం అతని పాత్రలు స్వప్నవీథుల్లో విహరించే వున్నతవర్గానికి కాకః సర్వసాధారణ మధ్యతరగతికి చెందినవి కావటమే.

శరత్‌బాబు తను ప్రత్యక్షంగా చూసిన విషయాలనుగురించి, తన జీవితయా[తతలో హృదయద్వారంవరకూ (ప్రవేశించిన వ్యక్తులను గురించిన విషయాలనే తన రచనలలో కొద్ది మార్పులతో చిత్రించేవాడు. శరత్‌బాబు జీవితాన్ని తెలుసుకున్నవారు అతని రచనలలోని కథానాయకులు అతని ప్రతిబింబాలే అనే విషయాన్ని తెలుసుకోగలరు. “శరత్‌బాబు"చిన్నతనం నుండే దేశదిమ్మరి. “శ్సీకాంత"లో శ్రీకాంతుడు, “చరిత్రహీనులొలో సతీశుడు, “బడదీదీ”లోని సురేంద్రుడు కూడ దేశద్రిమ్మరులే. “దేవదాసులో దేవదాసు కూడ చివరకు అలాగే తయారయాడు.

పోతీ యిక మన చర్చనీయాంశమైన స్త్రీపాత్రలను గురించి తెలుసుకుందాము. శరత్‌బాబు స్త్రీపాతలు ప్రతివారి హృదయాలను యిట్టే ఆకర్షించి కదిలిస్తాయి. జాందూ సమాజంలో కఠోర నియమాలనే ఇనుపచేతుల్లో నలిగిపోతూ, చంద మల్లదర్దునలపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

2158 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అవమానింపబడుతూ, పతితయౌతున్న భారతనారి ప్రతియొక్క అడుగునూ సానుభూతితో పరిశీలించి వారి హృదయాల లోతులను తెలుసుకున్న శరత్‌ స్త్రీ పాత్రలసు ఒక్క బెంగాలీ ప్త్రీలేకాకుండా, యావద్భారతదేశ స్త్రీలూ ఎంతో ఆదరంతో అభినందించారు.

“శరత సామాన్య కుటుంబాలలోని ప్త్రీలనే ఎక్కువగా తన కథానాయికలుగా ఎన్నుకొనేవాడు. మూఢవిశ్వాసాలనే అచంచల విశ్వాసంతో అంటిపెట్టుకొన్నవాళ్లూ, హృదయంలో లేచే అశాంతినీ, ఆవేదననూ, హోరునూ అణుచుకుంటూ సంఘ నియమాలను పాటించుతూ జీవించే వితంతువులూ, (గేమించి నిరాశ చెంది జీవచ్చవాలలా బతుకుతున్న కులీన యుపతులూ, వంశ గౌరవాలను తలుచుకుంటూ కాలంగడిపే వృద్ధ స్త్రీలూ, ముఖ్యంగా జీవితాన్నంతా ఇతరులకొరకు త్యాగం చేసి తమ మాతృహృదయాల బెన్నత్యాన్ని చాటుకున్న ప్తీీలూ ఆయన ముఖ్యకథానాయికలు. సాధారణంగా అతని ప్ప్రీ పాత లందరూ, తమ ప్రేమపాతుల యెడల తల్లిలాగ ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తారు. వారిప్రేమలో తల్లియొక్క వాత్సల్యంలోని మార్దవం, త్యాగం గోచరిస్తాయి.

శరత్‌ స్త్రీహృదయంలోకి ప్రవేశించి దాని లోతుపాతులను, మంచి చెడ్డలను కూలంకషంగా తెలుసుకోగలిగాడు. ఆమె హృదయంలో నిరంతరం రేగే తుఫానుహోరులో తనుకూడ వుక్కిరిబిక్కిరయాడు. అందువల్లనే మధ్యతరగతిలోని బాలవితంతువుల గాయపడ్డ హృదయాలను పాఠకులకు స్పష్టంగా విప్పి చూపెంచగలిగాడు.

శరత్‌ రచనలలో వీరకాంతల జీవితాలు కూడ ఎంతో సానుభూతితో చిత్రించబడ్డాయి. వారిలోకూడ కులాంగనలలో వుండేలాంటిదే ఒక హృదయం నిరంతరం శబ్దంచేస్తూ వుంటుందనీ, అదికూడ (ప్రేమానురాగాలతో స్పందిస్తుందనీ నిరూపించాడు.

“శ్రీకాంత"లోని రాజ్యలక్ష్మి వేశ్యవృత్తిలోనిది కాకపోయినా సంఘబహిష్కృత పతిత. ఆమె ఉజ్వలమైనచరిత్ర చదువుతుంటే, ఆమె యడల ఏహ్యభావం కలుగుతున్నప్పటికీ, మన హృదయాంతరాళాల్లో ఎక్కడో మనకు తెలియకుండానే ఆమెపట్ల ఆదరంతో కూడిన సానుభూతి కలుగుతుంది.

శరశ్చందుని స్త్రీ పాత్రలు. వాసిరెడ్డి వీతాదేవి 2159 మృత్యుశయ్యమీదవున్న శ్రీకాంతుని రక్షించుకోవటానికి ఆమెచేసిన సేవ ఏ పతివత స్ప్వీకీ తీసిపోదు. శ్రీకాంతుడు రాజ్యలక్ష్మినుండి విడిపోతున్నప్పటి ఆమె హృదయంలోని గంభీర ప్రమా, అవ్యక్త ఆవేదన, మూగబాధ ఏ పాఠకుని హృదయాన్ని (ద్రవింపజేయదు? స్త్రీ ఒకసారి (ప్రేమిస్తే ఏమిచేయగలదో, ఎంత త్యాగానికి సిద్ధపడగలదో రాజ్యలక్ష్మిప్మాత మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. “దేవదాసు"లోని చంద్రముఖి వేశ్యావృత్తిలో జీవించేదయినా దేవదాసును (క్రేమించినతర్వాత ఎంతగా మారిపోతుంది? దేవదాసు చదువుతుంటే అనిపిస్తుంది

  • స్తీంకి (గ్రేమించినంత మాత్రంచేతనే పురుషునిమీద పూర్తి అధికారం వుంటుందనుకుంటే, దేపదాసు ఎవరివాడు? పార్వతివాడా లేక చంద్రముఖివాడా? అని. పార్వతి గ్రేమలో అభిమానం, స్వార్థం వున్నవి. చంద్రముఖి (గేమలో త్యాగం, సంయమము వున్నవి. పార్వతి (పేమమూర్తి. చంద్రముఖి త్యాగమూర్తి. ఒకావును సంపుం గౌరవిస్తుంది, ఆదరిస్తుంది; రెండవ ఆమెను చీదరించుకుంటుంది.

రాజ్యలక్ష్మి: సావిత్రులముందు చంద్రముఖి పాత్ర కొంచెం పేలవంగానే కన్పిస్తుంది. దానికి కారణం చందముఖిని మనము మొదటిసారిగా చూసినప్పుడు ఆమె సాధారణ వేశ్య కావటమే.

“శ్రీకాంత"లోని రాజ్యలక్ష్మి పాత్రకు, చరిత్రహీనుల్లోని సావ్మితిపాత్రకు ఎంతో సామంజస్యం కన్పిస్తుంది. రాజ్యలక్ష్మి లాగానే సావితికూడ సతీశుని హృదయాన్ని జయించినప్పటికి, కొన్ని ఆదర్శాలను, నియమాలను సృష్టించుకొని అతన్నుండి విడిపోతుంది. కాకపోతే సావిత్రి మొదటి అధ్యాయంలోనే విడిపోతుంది. రాజ్యలక్ష్మి చివరి అధ్యాయంలో శ్రీకాంతుని మరల కల్పుకుంటుంది. కొంతమంది వుద్దేశ్యం మొదట శరత్‌బాబు చరిత్రహీనులు, శ్రీకాంత ఒకే రచనగా రాశాడనీ, చాలా పెద్దది కావటంవల్ల మరల రెండుగా విభజించాడనీ, అందువల్లనే రెండు రచనలలోని పాత్రల్లో కొద్దిమార్పులుతప్ప కాత్తదనమేమీ లేదనీ అంటారు. ఈ రెండు రచనలను చదివినమీదట ఆ విషయంలో కొంత నిజం లేకపోలేదని మనకూ అనిపిస్తుంది.

2160 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

చరిత్రహీనుల్లోని “కిరణ్మయి” ఒక విలక్షణమైన పాత్ర. ఆమె వివాహము

ఒక విద్వాంసునితో జరుగుతుంది. ఆమె అతన్ని చివరివరకు గురుభావంతోనే

...... చూడగలిగిందికాని ప్రేమించలేకపోయింది. చివరకు విచిత్ర పరిస్థితుల్లో దివాకరునితో

లేచిపోతుంది. కిరణ్మయి పాత “శేష ప్రశ్నూలోని “కమర్‌” పృ్యాతను ఎంతో

పోలివుంటుంది. కిరణ్మయిమీద మనకు ఆదరాభిమానాలుకాని, (ప్రేమకాని కలగదు.

కాని ఆమెను మాత్రం మనము మర్చిపోలేనంత ప్రభావం మన హృదయాలమీద పడుతుంది.

శ్రీకాంతలోని “అభయ” ఒక సంఘ విప్లవకారిణి రూపంలో మనముందుకు వస్తుంది. భర్తచేత అవమానింపబడి, రోహిణీబాబుతో వచ్చేస్తుంది. శ్రీకాంతను చూసి వులిక్కిపడుతుంది - “జన్మ జన్మాంతరాలనుండీ తగిలే మూఢవఏిశ్వాసాల దెబ్బలను సహించలేక పారిపోయాను. శ్రీకాంత్‌, నా వాస్తవికహృదయాన్నినా యీ నికృష్ణపుపనితో తూచి చూడవద్దు" అంటుంది. ఆమె సంభాషణలో ఎంతో సంస్కృతి, తర్కం కన్పిస్తుంది. -

“గృహదాహొ లోని అచల ఒక విచిత్రమైన బైప్‌. సురేశ, మహిమ్‌ యీ యిద్దరు (ప్రేమికుల మధ్యలో యిరుక్కుని విచిత్ర పరిస్థితిలో పడిపోతుంది. తన (గేమను యిదమిత్ధమని తేల్చుకోలేకపోతుంది. “మహిమ్‌” ను వివాహం చేసుకొనికూడ తనను తను అర్థం చేసుకోలేకపోతుంది. చివరకు సురేశు ఆమెను మోసంతో తీసుకెల్లినప్పుడు ఎదురుతిరుగుతుంది. బాధపడుతుంది. కాని సులేశును జబ్బునుండి రక్షించటానికి ఎంతో ప్రయత్నిస్తుంది. ఒకేచోట వుంటూకూడ భార్యాభర్తలులాగకాకుండా స్నేహితుల్లాగ జీవితాన్ని గడుపుతారు. ఈ పాత్రలో విచిత్రం ఏమంటే - ఆమె హృదయం దేనికొరకు తహతహలాడుతుందో ఆమెకే తెలియదు. చివరివరకూ ఆమెను ఏదో అర్ధంకాని అసంతృప్తి వెంటాడుతూనే వుంటుంది.

“పల్లీ సమాజములో రమ బాలవితంతువు. ఆమె స్వభావసిద్ధంగానే (ప్రేమమూర్తి, సాధుశీల, సత్యప్రియ. కాని సమాజపు కఠోర బంధాల్లో నలిగిపోతూ కూడ, సమాజంలో తన ఆదరాభిమానాలను నిలుపుకొని చివరకు తన (పపాణాలకంటె ఎక్కువగా [ప్రేమించిన రమేశుని అబద్ధం సాక్ష్యం చెప్పి జైలుకు పంపుతుంది.

శరశ్చంద్రుని స్త్రీ పాత్రలు వాసిరెడ్డి సీతాదేవి 2161 వితంతువుకు (కప్రేమించే అధికారం లేదని వుగ్గుపాలతోనే నేర్చుకున్న రమ తన (ప్రేమను తన హృదయం దగ్గరనే ఒప్పుకోకుండా ఆత్మవంచనకూడ చేసుకోవటానికి (ప్రయత్నిస్తుంది. ఈ రచనలో ముఖ్యంగా (గామీణ సమాజములోని భయంకర కట్టుబాట్లను చూపించటానికే శరత్‌ ప్రయత్నించాడు.

“బడదీదీ" లోని “మాధవి శరశ్చందుని కవిత్వ పూర్ణ సృష్టి. యువక కళాకారుడైన “శరత్‌” తన హృదయంలోని మాధుర్యాన్నంతా యీ మాధవిలోనే నింపాడా అనిపిస్తుంది. మాధవిలో, కిశోరావస్థలోని సుందరకల్పనా, యౌవనంలోని మధురమైన తీవ ఆకాంక్షా, హందూ వితంతువులోని అణకువాః సిగ్గూ, పరసేవాపరాయణత మొదలైన గుణాలు మూర్తీభవించివున్నాయి. తియ్యని మధువుతో తొణికిసలాడుతున్న ఆమె హృదయం చిన్న కదలికతో మధువును చిందిస్తుంది. బాధ్యత తెలియని, స్వశక్తిమీద నిలబడలేని అందమైన యువకుడు “స్తురేంద్రుని చూసి ఆమె ప్రేమపూరిత హృదయం ఒక్కసారిగా మధువును చిందించింది. ఆమెలో స్త్రీసహజమైన మాతృత్వపు తీవ్ర ఆకాంక్ష కూడ కన్పిస్తుంది. ఆమె గ్రేమలో మాతృత్వంలోని వాత్సల్యం స్పష్టంగా కన్పిస్తుంది. మాధవి సాంఘిక అన్యాయాలకు గురై కూడ స్త్రీత్వంలోని విశుద్ధ ఆదర్శాలను మర్చిపోలేదు. “స్ప్రుర్రేనో ఆమె ఒడిలో పసిపాప తల్లి ఒడిలో నిదపోయినంత నిశ్చింతగా (ప్రాణాలు

విడిచాడు.

“దేవదాసులోని పార్వతిలో వాత్సల్యభావం కంటే వైవాహిక అభిలాష ఎక్కువగా కన్పిస్తుంది. పార్వతి, సౌదామిని, అచలా - వీరి (ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. వారిలో, తమ (ప్రమపాత్రులకు ఏమి యివ్వగలమనే తహతహకంటే, వారినుండి తమకు ఏమి లభించగలదనే తహతహ ఎక్కువగా కన్పిస్తుంది. షోడశీ, మాధవీ, సావిత్రీ, రాజ్యలక్ష్మీ వీళ్లలో మాతృహృదయంలో కన్పించే త్యాగం, వాత్సల్యం, తమ (ప్రేమపాత్రులకు ఏమి యివ్యగలమనే తహతహ మొదలైన గుణాలు కన్పిస్తవి. వారు తమ త్యాగానికి ప్రత్యామ్నాయంగా ఏమీ కాంక్షించరు.

శరత్‌ [గ్రేమ, పవిత్రత, సేవాభావము, త్యాగము మొదలైన గుణాలతో నిండివున్న స్త్రీలను మాత్రమే చిత్రించి అంతతో తనపని పూర్తి అయిందనుకోకుండా, మూఢవిశ్వాసాలను గుడ్డిగా నమ్ముతూ, అహంభావముతో నాలుగు గోడలమధ్య

2162 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము శాసనం చేసే స్త్రీలనుకూడ చిత్రించాడు. సిద్ధేశ్వర్‌, విశ్వేశ్వరీ, హేమాంగినీ, నరాయనీ మొదలైన తల్లులయొక్క శరీరంలోని ప్రతి జీవాణువు మూఢవిశ్వాసాలతో, వంశగౌరవమనే మిథ్యా అహంకారంతో నిండివున్నది. వారి హృదయాలు స్నహపూరితములైనప్పటికీ, కరోరమైనవి. వాళ్ళలో అధికార పిపాస ఎక్కువగా కన్పిస్తుంది. ఇప్పుడు మనము శరత్‌ స్త్రీప్మాతలతో కొంత పరిచయమును పొందాము. అతని రచనలు నారీపధానమైనవని చెప్పటంలో అతిశయోక్తి ఏమీలేదు. సావిత్రి, కిరణ్మయీ, అభయా, మాధవీ, రాజ్యలక్ష్మీ: చంద్రముఖీ మొదలైన పొత్రలు చాలా విలక్షణమైనవి. యీ పాాతలు పాఠకుల హృదయాలమీద శాశ్వతంగా ముదవేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, శరశ్చందుని స్త్రీ పాత్రలు తరతరాలుగా సాంఘిక బంధనాలలో బంధింపబడి, నిద్రాణమైవున్న స్త్రీ జాతిని మేల్కొలిపి, సాంఘిక విప్లవాన్ని ప్రజ్వలింపజేసి, స్తీ) జాతికే వెలుగుబాటను చూపాయి. (ఆలిండియా రేడియో సౌజన్యంతో) (కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954) మం. ఇమ. లే చ. (న్ని ద్యోల్రాహ్రుల/డ్ళు

ఏంటస్‌ చెఖోవ్‌ ప్రొఫెసర్‌ వ్లాదిమిర్‌ ఎర్మిలోవ్‌ ప్రముఖ రష్యన్‌ రచయిత అయిన ఏంటన్‌ చెఖోవ్‌ మృతి చెంది, 1954వ సంవత్సరం జూలై నెల 15వ తేదీకి యాఖై ఏళ్లవుతుంది. అనేక భాషలలోకివచ్చిన అనువాదాలమూలంగా? (ప్రపంచంలో అన్ని బేశాలలోని పాఠకవర్గాలు అతని రచనలను చదువుతున్నారు. చెఖోప్‌ రచనలు (ప్రారంభించినకాలం, అంటే 1880 మొదలు 1890వ సంవత్సరం వరకు ఉన్నకాలం, అభివృద్ధి నిరోధకత్వం విజృంభించినందువలన పత్రికలకు చాలా గడ్డుగా ఉండేది. పతైికలను అణగదొక్కి వేయడం, సాంఘిక వింతను పూర్తిగా “నిషేధించి వేయడమే తన ముఖ్యకర్తవ్యంగా పరిగణిస్తుండేది జారిస్టు ప్రభుత్వం. ఒక్క చవుకబారు హాస్యరస పత్రికలు మట్టుకు కుక్కగొడుగుల్లాగ వుట్టి వర్ధిల్లుతూండేవి. కాని విచిత్రమైన విధంగా యిటువంటి మధ్యరకపు రష్యన్‌ పత్రికల చెత్తలోనుంచే పురాతనమైన భూస్వామి నిరంకుశత్వ. పెట్టి బూర్జువా రష్యాకి మానవత్వాన్ని నీచమొనరించే జీవితమార్గాన్ని బట్టబయలుచేసి చండాడే శత్రువు ఉద్భపించాడు. తన వ్యక్తిత్వాన్ని; “ఆస్‌టోషా చెభాంటో అన్నమారుపేరులో మరుగుపరచి రచనలు వాస్తూండిన ఒక వినూత్నమైన, శక్తివంతుడైన రష్యన్‌ రచయితయే ఈ శత్రువు. అప్పటికింకాః తన నూత్న పంథాయొక్క శక్తి ప్రాబల్యాలు తనకే తెలియలేదు. మధ్యతరగతి మేధావి కుటుంబీకుడిని, గొప్ప తరగతికి ఇందని చిన్న ఆఫీసు గుమాస్తాననుకోండి, నైతుననుకోండి, మొత్తానికి సామాన్య మానవుడిని ఈ రచయిత తన కథానికలకు నాయకునిగా ఎన్నుకున్నారు. లామా వాయు పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

2164 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చెఖోవ్‌ తొలి రచనలలో ప్రజాస్వామ్య సాంప్రదాయం, ప్రత్యేకించి తన వ్యంగ్య కథలలో వ్య క్తమవుతుంది.

ఈ కథ వెలువడినకాలంలో, తిరోగామి శక్తులకు, జాత్యాభివృద్ధిని అడ్డుకోవాలన్న వాటి ప్రయత్నాలకు ప్రిషిబియేవ్‌ పాత్ర చిహ్నమైంది. కొద్దిపుటల కథలో అంత బ్రహ్మాండమైన వ్యంగ్యాన్ని సృష్టించడానికి, స్వాతంత్య్యు ప్రియత్వం, నిరంకుశత్వంపట్ల ద్వేషం వల్ల కలిగిన ఎంతటి వున్నత శిల్ప నైపుణ్యాన్ని యువకవి చూపించగలిగాడో!

అభివృద్ధి నిరోధక శక్తుల [ప్రాబల్య కాలంలో వాస్తూ, రష్యన్‌ సాహిత్యంలోని స్వాతంత్య్య ప్రయ వ్యంగ్య రచనయొక్క అద్భుత సాంప్రదాయాలను చెఖోవ్‌ పునరుద్ధరించగలిగారు.

రష్యాదేశపు పెట్టుబడిదారీ విధానంతోపాటు పరిపక్వం చెందుతూ వచ్చిన రష్యన్‌ ప్రజాస్వామ్య మేధావివర్గం మధ్యతరగతుల రచయితలలో చెఖోప్‌ అగ్రస్థానం ఆక్రమించుకున్నారు కనుక యీ మేధావివర్గపు గుణగణాలు, లోటుపాట్లుకూడా ఇతని రచనలలో కనవస్తాయి. ప్రజాస్వామ్య ప్రియత, పారతంతం్య విద్వేషం, ఆస్తిపాస్తుల ఆధారభూతమైన సంఫుంయెడల నిరాకరణ, సావుంత, బూర్జువావాదాలు, రాచరికం, బూర్జువా హృదయసారళ్యం వీటితోపాటు విప్లవ పంథాకు దూరంగా ఉండడం, తద్వారా కలిగే, పెట్టి బూర్జువా లక్షణాలయిన అయోమయత్వం, అవ్యాజ కరుణ రసపోషణ, అనవసరమయిన అనుమానాలు, సందేహాలు కూడా అతని రచనలలో (ప్రతిబింబిత మౌతాయి.

" సాధారణ మానవుని యెడల, గ్రామికుని యొడల తుదికాలంలో తనకున్న విధి బాధ్యతలను మనస్ఫూర్తిగా గుర్తించి, తన జీవితాన్ని కృతులను అతనికే అంకితం చేసి తన రచనలకు నాయకునిగా ఎన్నుకొనడంమూలాన చెఖోవ్‌ రచనా నైవుణ్యం, నిల్పం నిశితమైంది. ,

సామాన్యత్వంలో సౌొందర్యావలోకనం, అమాయకులయిన సామాన్యుల దైనికజీవితంలో రమ్యాలోకం చెఖోవ్‌ రససృష్టిలో విశిష్టలక్షణం.

. వంటన్‌ చెభోవ్‌ ప్రొఫెనర్‌ వ్లాదిమిర్‌ ఎర్విలోవ్‌ 2165 చెఖోవ్‌ సాహిత్య రచనంతా అవేశపూరితమైన, అచంచలమైన, అతి జటిలమైన అన్వేషణ, చర్విత నూత్నదశలో, కర్తవ్యం ఏమిటి? అన్న పురాతన (ప్రశ్నకు సమాధానంకోసం, వాస్తవికత పట్ల సత్యసంపూర్ణ విజ్ఞానాధారభూతమయిన సుస్పష్ట సంయోగిత ప్రపంచ దృక్పథంకోసం అన్వేషణ. క్రిషిబియేవ్‌ వాదం నుంచి తప్పించి దేశాన్ని నూత్నమార్గాన నడిపించడానికి, ఒట్టిమాటలు కట్టిపెట్టి, గట్టి మేల్‌ తలపెట్టగల నాయకుని కోసం అన్వేషణ.

ఈ అకాంక్షే అతన్ని సఖాలిన్‌ యాత్రకు (ప్రేరేపించింది (1890లో). సఖాలిన్‌ అంటే ఒక భయంకరమైన ద్వీపం, జారుకాలంలో ఆజన్మాంత శిక్షితులను బంధించే కారాగారం. జారు ప్రభుత్వం మానవ నిర్బంధ, పీడనా, వివిధ విధానాలనూ అక్కడ కోడీకరించింది. సఖాలిన్‌ వెళ్ళివచ్చినతరువాత చెఖోవ్‌ రాజకీయాలలో త్రద్ధ తీసికొనడం [పారంభించాడు. ఆనాటి రష్యాలోని జీవితంలో దుర్భరమైన సంకెళ్ళనూ, కారాగార వాతావరణాన్నీ గుర్తించడానికి అతని కాయాత్ర తోడ్పడింది. నాలుగు రాతిగోడల మధ్య జీవితం, వార్డెన్లు, కటకటాల కిటికీలు, సంకెళ్లు కళ్లకు కట్టినట్టు ఆనాటి జీవితం అతనికి కనిపించింది. ఇదే పేరుపొందిన “ఆరవ వార్డుకు మూలకారణం.

ఈ కథానికలో రష్యాదేశమంతా, తిరోగామి శక్తుల ప్రాబల్యాన్ని కళ్ళారా చూచింది. దేశమే “ఆరవ వార్డులో ఉన్నట్టనిపించింది. ఈ కథానిక పోరాటానికి శంఖారావమైంది.

అనందసామీష్యం, జాతీయ జీవనంలో మహత్పరిణామం, ఒక కొత్త చేతనాశక్తి చెఖోవ్‌ రచనలలో ప్రవేశించింది. సముద్ర ప్రాంత పట్టణంలో ఉంటే ఎదురుగా కనిపిస్తున్నా లేకపోయినా, సమ్ముద సామీప్యం మనకెప్పుడూ గుర్తుంటుంది. అలాగే, గత శతాబ్దాంతంలోనూ, ప్రస్తుత శతాబ్దాదిని రచించిన చెఖోవ్‌ కథానికలను చదువుతూంటే, ఆ విషాదచ్చ్భాయల మరుగుల్లో, అనంతమైన జీవిత ఉచ్చ్య్వాసనిశ్వాసాలు వినిపిస్తూనే ఉంటాయి.

1805వ సంవత్సర [ప్రాంతాలలో ఛచెఖోవ్‌ వాటకరచనలో కూడా చాలా విజయాన్ని సాధించారు.

2166 పందిరి మల్లికార్డుసరాపు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము

1895వ సంవత్సరంలో ఆంటన్‌ చెఖోవ్‌ “సీగల్‌ అనే రచన ప్రారంభించాడు. 1896వ సంవత్సరంలో సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని అలెగ్జాండ్రిన్‌స్క్‌ నట బృందమూ, రెండేళ్ళ తరువాత మాస్కో ఆర్డు థియేటరువారూ దీన్ని ప్రదర్శించారు. చెఖోవ్‌ రచనా నైపుణ్యాన్ని ఈ నాటకం నిరూపించి, (ప్రముఖ రష్యన్‌ నాటక రచయితలలో కూడా అగ్రగణ్యుడని తెలియజేసింది.

కళాకారుని జీవిత ప్రయోజన మేమిటి అన్న విషయంపై ఏండ్లతరబడి ఆలోచనల సారాంశం చెఖోవ్‌ రచించిన “సీగలొ. దాని కథావస్తువే కళ, వీరోచిత కార్యాలున్ను. వీరోచిత కార్యాలు నెరవేర్చగలిగిన వారికే కళావిజయం ప్రాప్తిస్తుందని సందేశం.

అన్నీ తుడుచుకునిపోయే తుపానువచ్చింది. చెఖోవ్‌ పుట్టిన దేశం అద్భుతమైన పూదోటగా మారింది. “సత్యం, సుందరం” ఆధునిక జీవితసూత్రాలు.

“వజలను గౌరవించడం ఎంత ముదావహం” అని వ్రాశారు చెఖోవ్‌, తన నోటుపుస్తకంలో.

ప్రపంచంలో “సత్యం, శివం, సుందరం” నలకొనాలని ఏఖోవ్‌ కలలుగన్నారు.

వినాశం, దౌర్జన్యం నిరంకుశత్వం అంటే ద్వేషించాడు. అందువల్లనే, చెఖోవ్‌ అతి సహజంగా చెఖోవ్‌ సారళ్యంతో ఈనాటి అజేయమైన, శక్తివంతమైన ఉద్యమంలో, (ప్రపంచ శాంతి సొఖ్యస్థాపకుల ఉద్యమంలో పవేశిస్తున్నాడు!

(సోవియట్‌ భూమి నుంచి) (కిన్నెర: సంపుటము 6, సంచిక 8, ఆగస్టు 1954) న

సి, నారాయణ రెడ్డిగారి గయ నాటికలు డి. రామలింగం కళ ఆల ణప్రాయంగా రచయిత తన నాటికలను చదివి వినిపించగా ఆయనకు నిజమైన కావ్యాత్మ కలదని నాకు గోచరించింది. నచ్చవని అనుకొన్ననా నాటికలను సమర్థులైన నటకులు (పప్రదర్శించగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. నారాయణ రెడ్డిగారు నా కోవకే చెందినారని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది.” గత సంవత్సరం సికింద్రాబాదులో శ్రీ సి. నారాయణరెడ్డిగారు రచించిన “నవ్వని పువ్వు” (గేయ నాటికల సంపుటి) ఆవిష్కరణోత్సవ సందర్భంలో త్రీ తల్లావజ్ఞల శివశంకరస్వామిగారు (ప్రసంగిస్తూ నారాయణ రెడ్డిగారి గేయనాటికలను గూర్చి పె విధంగా తమ అభ్మిపాయాన్ని వెలువరచారు. నవ్య సాహిత్య వికాసానికి (పధానకారకులు, “పద్మావతీచరణ చారణ చ(క్రవర్తి, “రాజమాతా” “నోణకజాయ” మొదలగు గీతికా సల్లాపకాల నెన్నింటినో రచించి, తెలుగుసాహిత్యంలో వినూత్నమైన గేయ నాటికలను ప్రవేశపెట్టిన ఉత్తమ సాహిత్యకులు శ్రీ శివశంకర స్వాములవారి పై వాక్యాలు రచయితకూ, శ్రోతలకూ ఎంతైనా ప్రోత్సాహకరంగా ఉన్నవి. శ్రీ శివశంకరస్వామిగారు రచించిన గీతికా సల్లాపకముల ఫక్కీలోనే సి, నారాయణరెడ్డిగారు గేయనాటికలు (వాశారు. ఈయన నాటికలలో కూడా పాత్రలు వచనంలోగాకు గేయంలో మాట్లాడుకుంటాయి. నారాయణరెడ్డిగారు స్వయంగా రాగ లయాత్మకంగా చదువగలరు గనుకను, అనేక కవిసమ్మేళనాలలో పందిరి మల్లికార్జునరాపు శతజయంతి సంపుటము డే సాహిత్యము

2168 పందెం షువ్లికాలుంతా జ్ర ఎలవమయింటి.. సఅలజట్రైచయి శః వాహచ్యము “వగ్గశాంతి". “ఐస్నపస్వురాలు". “ముతుపులతాణి" వత్యేకంగా బప్పుకోచగినవి. ఇవి శ్రప్యప్రఛానమైనవి. వీటని మూకాఖినయపర్ధతి ససుసరింబ నేపథ్య గానంతో (ప్రదర్శించవచ్చు అనికూడా గత సంపత్సరం 'హద్రాబాదు అఫిల కళాశాల తలుగు ఏద్యార్థి సంఘముల అధ్వర్యాన జరిగిన ఆం్రాభ్యుచవయోత్సవాలలో ఖ్‌ ప్రదర్శింపబడిన “నప్వుని పువ్వు" నాటక్యాపదర్శనంవల్ల అలుస్తుంది. షుఠరొక విసేషమేమంలే, వీ గేయనాటకలలో పాత్రలు పొరాణిక చారిత్రక వ్య కులో లేక (1 1 థ్‌ ఈనాట్‌ సమాజంలోని వ్యక్తులో కారు. ఈయన సృృష్టించీ ప్మాతలు చితమైనవి. -పాత్రలేగాక సంఘటసలు కూడా విచిత్రంగా ఉంటాయి. కవియొక్క కల్పనాచాతురికి. భావ వైవిధ్యానికీ ఈయన నాటికలలోని పాత్రలు, కథా సంఘటనలు. సంభాషణలు. నీదర్థనాలు. ఉదాహరణకు “నవ్వని పువ్వు”లో మొగ్గ. తీగె, తుమ్మెద. పవనుడు (ప్రధాన పాత్రలైజీ “వలపురేచూలో నేయి, కలువ, తార, చల్వదుడు ప్యాతలు. అలాగే “దగ్ధశాంతిొలో నాంతి, మానవుడు, దానవత, కొన్ని అపరిచిత కంఠాలు పాతలైతే “విన్నస్వరాలు"లో కళాజీవి, లోకం, ప్రణయిని, అనాథ ప్యాతలు. రమ్యమైన పాత్రలనే తీసుకొని ఈయన నాటికలు సృష్టించారు. ఆనందదాయకంకాదని అపోహపడడానికి అవకానమున్నట్టి “దర్థశాంతి" నాటికలో మైతం ప్రభాతమందారాల కమనీయమైన కాంతి, పచ్చని జీవనవాటులు ద్యోతకం కాకపోవు. ఇతివృత్తం, సంఘటనా ఏదైనప్పటికీ రమ్యార్థ ప్రతిపాదకంగా రచన ఉండడంవల్ల వీరి నాటికలు జనరంజకం కాగలుగుతున్నాయి. నారాయణరెడ్డిగారికి విశేష ఖ్యాతి నార్జించిపెట్టిన నాటిక “నవ్వని పువ్వు. తే న్న ట్‌ ఇది శృంగారప్రధానమైంది. కవి సమ్మేళనంలో నారాయణ 'రెడ్డిగారున్నారంబే గ్రేుక్షకులవద్దనుంచి “నవ్వని పువ్వు చదవండి" అని చీటీలు రావడం పరిపాటి. ఆంధ్రాభ్యుదయోత్సవాలలో ఈనాటికా ప్రదర్శనంలో సమర్థులైనవారు పాల్గొన్నారు. శ థఫఖా గ బాలికలే నటించారు. నటుల మూకాఖినయానికీ, నేపథ్య గానానికీ బాగా శృతి కలిసి ప్రదర్శనం రక్తికట్టింది. అంతకుముంచే పలువురు శోతలకు పరిచయమైన

సి. నాతాయణ పద్దిగాలి సేయ నావికలు.. చ్‌ తామలిలం 2169 ఈ నాటిక, (పచతర్శనయాగ్యం అవికూడా బేలిపోపవచబతో ఇటువంటి నాటికల " ప్రయోఐసం స్పష్టమైంది. ఈ నాటిక ఏ తంత భాపస్పోరకంగా- చతుతంగా అందో దీని ఇతివ్పత్తం కూదా అంత అహ్లావకరంగా ఉంది.

“ఉచయభానుకరొల సుధలు బావేవేళ, చిప్పురు టాకులలోన మంచు నాయకి.

“వే కను సన్నల నీచలలోనా

నీ కను వన్నెల జూడలలోనా

సలిచి తపించే తుమ్మెచనే

నీకయి నా బతు కష్మాదనే" అని మొగ్గకన్నెతో తీయని మాటలు చప్పి. ఆమె చిరునవ్వుకై వేచి ఉన్నళుమ్మాద దీనిలో నాయకుడు. తుమ్మెద వలపు మాటలకు మొగ్గ మురిసిపోయి :

“యుమ్మని (దమ్ము తుమ్మదరాణా

నీ కలగాన సుధాధునిలోనా

కిలకిల నవ్వుదునా

వలపుల రువ్వుదునా" అంటూ తుమ్మాదతో ప్రణయకలాపానికి సిద్ధమవుతుంది. కాని తుమ్మెద చేయబాయ్యే మోసం తీగెతల్లికి తెలుసు. వికసించే మొగ్గలోని మధువును (గోలడానికే తుమ్మాద ఈ పన్నాగం పన్నిందనీ, ఆ మధువు కాస్తా అయిపోతే మళ్ళీ దాని దరిదాపులకు కూడా రాదనీ తీగె అంటుంది కన్నెమొగ్గతో :

“మల్లికను విడనాడి, మధుర గీతులపాడి

మధు రసమ్మును (గోల మరిగినాడే బాల!

మీబోటి మొగ్గలను మెల్లగా నవ్వించు

తీయ తేనెలు ద్రాగి హాయిగా విహరించు

కాంక్ష దీరినయంత కనరాడు నీచెంత -

నవ్యుకే నాయమ్మ, నవ్వబోకే తల్లి

2170 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము లాభం లేకపోయింది. తుమ్మెద ఆట సాగిరాలేదు. అయినా అంతటితో వదలిపెట్టకూడదు. మరో ఎత్తు వేయాలి. అండుకోసం తన చెలికాడైన పవనుడి దగ్గరకు వెళ్లుతాడు తుమ్మెద రాణా. మంచి మాటొకటుంది చెబుతాను రమ్మంటాడు. సంగతేమిటి? ఎవరిపై కన్ను వేశావు అని అడుగుతాడు పవనుడు. సరిగ్గా ఊోహించేవు మిత్రమా అంటూ వృత్తాంతం చెబుతాడు అళిరాజు;

“నవ్వదట ఆకోన మువ్వన్నె పూజాణ

నీవు నేనూ కలిసి నపవ్వింత మెల్లన

తేనియలు' నావంతు, తావులే నీవంతు.”

పవనుడికి కూడా ఇందులో స్వలాభం ఉంది! సరే పద, నా గంధవహ బిరుదం సార్ధకం చేస్తానంటాడు. ఇద్దరూ మొగ్గను సమీపిస్తారు. గిలిగింత పెడతాను, నవ్వవే ఒకసారి నా ప్రేమబాణీ అంటాడు పవనుడు. కలగీతి పాడతాను, నవ్వవే ఒకసారి నా (ప్రేమ రాణీ అంటాడు తుమ్మెదరాణా. ఈ నాటకమంతా కనిపెడుతూ ఉంటాడు కవి. మొగ్గయొక్క సౌందర్యాన్ని ఆరాధిస్తూ తన హృదయానందాన్ని గీతాలద్వారా వెలిబుచ్చుకుంటున్నవాడు కవి. ఇంకా చెప్పాలంటే అమలిన శృంగారంపద్ధతి మనిషి. వాళ్ల మాటలకు లొంగిపోయి మొగ్గ తన మకరందాన్ని, సౌరభాన్ని పోగొట్టుకోవడం కవికి ఇష్టంలేదు. కనుకనే మొగ్గకు హితవు చెబుతాడు:

“కలగీతి పాడినా, గిలిగింత సలిపఏినా

ఆకులను (గుమ్మినా, "రేకులను చమ్మినా

నవ్వకే వారెంత కవ్వించిపోయినా.”

తీగె చెప్పిన మాటలు, కవి హితోక్తులు మొగ్గలో కలిగిన చాంచల్యాన్ని పోగొట్టి ఉదాత్తమైన సౌశీల్య భావాన్ని కలుగజేస్తాయి. మొగ్గ నవ్వనని అంటుంది:

“నవ్వ నే నాతల్లి, నవ్వలే నో కవీ

నన్నెంత రేపినా నవ్వించలేరింక ,

నవ్వి నా పరువమ్ము నలిపివేయుటకన్న

నవ్వకయె లోనున్న [కొవ్వలపులేమిన్న

నవ్వనో తుమ్మెదా, చాలించు నీ పాట

నవ్వనో తెమ్మెరా, సాగిపో నీ బాటా

సి, నారాయణ రెడ్డిగారి గేయ నాటికలు. ఢి. రామలింగం 2171

ఈ నాటికలో నాయికపాత్ర మొగ్గ. నాయకుడిపాత్ర తుమ్మెద, అతడి చెలికాడు పవనుడు - వీరంతా మన సమాజంవారు కారు. అయినా మానవ సమాజానికీ, ముఖ్యంగా నేటి సమాజంలో కళాశాల విద్య నభ్యసిస్తున్న యువజనావళికీ ఈ నాటికలో పర్యవసానంగా చూపబడిన ఆదర్శం (పబోధాత్మకమైంది. ,

నారాయణరెడ్డిగారి తరుణలేఖినినుంచి వెలువడిన మరో గేయనాటిక “వలపురేడు. ఇదికూడా శృంగార [ప్రధానమైందే. ఇందులో రేయి, కలువ, తార, చంద్రుడు పాత్రలు. చంద్రుడు నాయకుడు. రేయి, కలువు తార ముగ్గురూ చందుని ప్రియురాళ్లు. సంజవేళ, ముగ్గురూ వేరువేరుగా తమ (్రియునికోసం నిరీక్షిస్తూ ఉన్నారు. దినరాజు పశ్చిమదిశన సొమ్మసిల్లి పొయ్యాడు. రేయి వచ్చింది, దెసలన్నీ పరికించి చూస్తూంది. మృదుల వాయువులు వీస్తున్నాయి. కాని నిశానాథుడు రావడంలేదు. కలువమ్మలో దరహాస చంద్రికలు తల లూప్పతున్నాయి. నవరాగ లోకాలు చివురిస్తున్నాయి. కాని కలువరేడు ఇంకా రాలేదు. వీరిద్దరి నిరీక్షణ ఇలా ఉంటే తార షోకుచేసుకొని మినుకుమినుకుమని కులుకుతూ సన్నగా రాగం తీస్తుంది:

“ఆకాశమంత సంధ్యాకాంతి కుసుమించె

నా కనుల [కొందళుకు రేకలు గుబాళించ

మబ్బు నావలదేల, మనమైన యీ నాడు

తారామనోహరుండే రాకయున్నాడు!”

కలువచెలి, రే రాణి, తారా రమణి తన రాకకై నిరీక్షిస్తూన్న సంగతి చంద్రుడికి తెలుసు. కాబట్టే బిరబిరా సాగివస్తాడు. ఆకాశ మంతా వెన్నెల జల్లులు కురుస్తాయి. తన నీలి ముంగురులలో నిల్చిపోవడానికీ, తన బాహువల్లరులలో బందీ కావడానికీ తనరేడు వచ్చాడని రేరాణి సంబర పడుతుంది. తనమోవి అందాలలో మురిసిపోవడానికీ, తన పరీమళవీచిలో మునిగిపోవడానికీ (పెయుడు వచ్చాడని కలువమ్మ మురిసిపోతుంది. చల్లని చూపుల తన జోడు వచ్చాడని తార తనిసిపోతుంది. చంద్రుడు ముగ్గురినీ రమ్మని (్రమపూర్వకంగా పిలుస్తాడు. కలువ, రేయి తమ ప్రియుణ్ణి చేరవస్తారు. తార ఇది సహించదు. ఆమెలో ఖండిత నాయిక లక్షణాలున్నాయి. కొంచెం రాజసటప్రవృత్తి గలది. చందుడికి

2172 పండిరి ముల్లికార్టునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము తానే ఏకైక పత్నిననీ, ఇతరులెవరూ తన ఈ సొత్తులో పాలు పంచుకోరాడనీ ఆమె పట్టుదల. వెంటనే సవతులిద్దరి మీదికీ జగడానికిపోతుంది. సవతుల పోరు ఘట్టాన్ని శ్రీ నారాయణ రెడ్డిగారు కడువాస్తవంగా, అత్యంత రసవత్తరంగా నడిపారు. తార అంటుంది; *ఆగాగు రేబాల! ఆపు నీ సరసాల . ఎవరవే ఓ కల్వ! నీవేలయిటు నిల్వ? రమ్ము చలువలరేడ, రవల వలుగులమేడ నడువు తారానాథ, నాప్రేమ నదులీది అయితే రేరాణి, కలువమ్మ మఠీ అంత నోరులేనివారు కారు. చండుడి ఫై తమకూ హక్కు ఉందనీ, ఆ హక్కును కాపాడుకోవాలనీ వాళ్ళకూ అలుసు. అయితే ఇద్దరూ ఐక్య సంఘటన ప్రదర్శించరు. ఆ ఇద్దరిలోనూ తార మనస్తత్వం కొంచెం లేకపోలేదు. కనుక ఎవరికివారే యమునాతీరే! రేరాణి తారకు జవాబిస్తుంది; “బాగుంది నీ వరుస, సాగ దీ తలవిరుసు నా నిశానాథుణ్ణి నడవమంటా "రేల నీవు,నీ కలువమ్మ చావండి యెందైన నా రేడు నను విడిచి జారలే డడుగైనం” తారను ఎదుర్కోవడంలో 'రేరాణి తనప్రసక్తి తేవడాన్ని కలువమ్మ సహించడు. తానూ ఆమెపై విరుచుకుపడుతుంది; “ఎందుకే నా జోలి, ఓ రేయి గయ్యాళి, కలువరాయని పేరు పిలువజాలరు మీరు, నా రాయడే నన్ను పేరెత్తి పిలువగా నీవు, నీ తారమ్మ చేయుచుంటిరి దగా” తాను ఒకవైపు పాొమ్మనమంటూంటే వీళ్ళిద్దరూ అక్కడ నిల్చొని తగాదాపడడం తారకి బొత్తిగా ఇష్టంలేదు. వాళ్ళిద్దరిని తాను దుయ్యబట్టుతుంది. దానితో యుగళగీతి పోయి ముప్పేట ముడిపడుతుంది : తార ఏ గుతిమంచిపోయె మీ మతిలేని మాటలూ సుతరాము సహియించ మీరున్న యీపంచ

సి, నారాయణ రెడ్డిగారి గేయ నాటికలు. డీ. రామలింగం 2173 మోహనాంగా నీవు మూగవైనావేల! ఏకైకపత్ని తారా కాంత అనవేల! చేయి. : అబ్బ! యెంతటి మాట అబ్బెనే నీనోట రేయిరాయని [ప్రాణగ్రేయసిని నే కాన? కలువ : ఎంతకైనా తగుదురే మీరు చాలులే! ఇలా ముగ్గురూ వాదులాడుకుంటూ హాచ్చుస్థాయికి పోతారు. నువ్వు కదలమంటే నువ్వు మూతిముడుచుకు పొమ్మని రెచ్చించు కుంటారు. ఇద్దరు భార్యలమొగుడు ఇరకాటాన పడెరా అన్న సామెత అవుతుంది చందదుడిపని. సహించలేక, తన మౌనాన్ని చాలించి, ముగ్గురితో - “ఆపండి మీ గోల అలసిపోయితి చాల మీ మువురి కయ్యాల నన్ను చంపెదరేల బాపురే మీ బాధ నోపలేకున్నాను సన్యాసమును బూని సాగిపోదు నెటైన” - అంటాడు. కాని చందుడు లేనిది ఘడియైనా జీవించలేనంటుంది తార. తన ఆశ అడియాస చేయవద్దని (బతిమాలుతుంది రేయి. నిన్ను చూచుకొనైనా తనిసిపోతాను సఖా అంటుంది కలువమ్మ. అక్షైతే నామాట అంగీకరించండి అంటాడు చంద్రుడు. సెలవియ్యి, శిరసావహిస్తాము అంటారు ముగ్గురూ. చండ్రుడు వాళ్ళకు ఉన్న సంగతి చెబుతాడు : “తార నా ప్రణయ శోభారాణి దివిలోన కలువ నా వలపు వన్నెలరాణి భువిలోన రేయి నా ప్రియరాణి దివిలోన, భువిలోన ముగురు నా నవ (పేమమూర్తులే యౌతారు” ఈ నాటికలోని హృదయంగమమైన కమ్మని భావన, తీయని తేనె పలుకుల సంభాషణలు (శ్రోతలను నిస్సందేహంగా రంజింపజేస్తాయి. బుతువులు కవులకు కావ్య వస్తువులు. బుతువర్ణ్దన అంటే (ప్రతిభావంతుడైన కవికలం పంచకళ్యాణి వలె పరుగులు తీస్తుంది. ఈ బుతువులనే పాత్రలుగా తీసుకొని నారాయణ రెడ్డిగారు చ్మితమైన గేయనాటిక వ్రాశారు. నాటికపేరు “బుతువులరాణో. అది మధుమాసంవచ్చే సమయం. ప్రకృతి సాంతం నవ్య

2174 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము జీవనంలో ఓలలాడేండుకు సిద్ధమవుతూ ఉంటుంది. మధుమాసానికి సుస్వాగతమిస్తూ బృందగీతులు వినిపిస్తూ ఉంటాయి : “మృదు సుమాల పదవులపై నిదురలేచు దరహాసం శిశిర నగ్న లతావళికి ఘసృణాంబర విన్యాసం చివికిన రసహృదయాలకు నవయౌవన సందేశం మధుమాసం, మధుమాసం” బృందగీతులు, కలగానాలు, మధుర మంద్రస్వరాలు ఇలా మేలుకొలుపులు, స్వాగతగీతాలు పాడుతూ ఉంటే మాధవుడు తన్యప్రేయసి అయిన బుతువులరాణిని కలువడానికివస్తూ " “జుమ్మను రాగమ్ముల విరజిమ్మువేల తుమ్మెదలు? పంచదార గొంతుల పలికించవేల కోకిలలు? మావి మావి క్రొందేనియ మాటమీట దేలా? - ఏది నా వసంతరాణీ ఇంతవరకు రాదేలా!” అని పాడుతూ ఉంటాడు. బుతువులరాణి ఆకువన్నా జిలుగుకోక సవరించి కొప్పులో మందార సుమాలు ముడుచుకొని, పండుమోదుగు పూలదండలల్లుకొని మాధవస్వామిని తలచుకొని ; *ఇంత వేళాయె పియుడెంతగా వేచెనో ఎదురు తెన్నులు జూచి ఎంతగా వగచెనో ఓ నా ప్రియసఖా! ఓవైత్రరథికా .

సి. నారాయణ రెడ్డిగారి గేయ నాటికలు. డి. రామలింగం 2175

నీ కనుల వర్తింప, నీమోల నర్తింప

నీలో ప్రణయ కింకిణీ నాదములు నింప

కానలను, కోనలను గడచివస్తున్నాను

కరివోని తారుణ్య భరము మోస్తున్నాను” అంటూ మందయానంతో ఒయ్యరంగా, విలాసాలు విరజిమ్ముతూ వస్తూ ఉంటుంది. అప్పుడే శిశిరుడు తన పదవీకాలం అయిపోగానే ప్రకృతినుంచి నిష్క్రమిస్తూ ఉంటాడు. తలవని తలంపుగా బుతువులరాణి ఎదురవుతుంది. ఆమె సౌందర్యాన్ని చూచి శిశిరుడు సమ్మోహితుడై బుతువులరాణి దారి కడ్డంగా వచ్చి నిల్చొంటాడు. ఆమె భీతిల్లి :

“ఆకు రాలిన వృక్ష మటులున్న తనువుతో

ఊడల విధాన పాఠరాడేటి జడలతో

ఎవరవయ్యా నీవు ఎదురుగా నిలిచేవు

చేదు చూపులలో యెొగాదిగా చూచేవు.” అని అడుగుతుంది. తాను శిశురుడననీ, ఇన్ని రోజులుగా హేమంత వయస్విని కన్నులెదుట నర్తిస్తూ వృక్షకాంతల వలిపాలు దిగలాగి వాటిని నగ్నంచేసి, ఇప్పుడామె అధరాంచలపీయూషానికై వేచిజఉన్నానంటాడు. ఆమె భీతహరిణేక్షణయైె శిశిరుడి మాటలను ఏవగించుకొంటుంది. మాధవుడే తన జీవిత సహచరుడనీ, అన్యులకు (పేమపాత్ర నందించలేననీ, పక్కకి తొలగిపొమ్మనీ అంటుంది. కాని వాడు వింటాడా? వసంతలతాంగి మనస్సును హరిద్దామని సరాగాలకు దిగుతాడు :

“జడిసెదేల బేలా, వాల్దడ పువ్వులు జారె

కోపంతో నీ వదనం గులాబీగ మారె

దాటలేవు నా ఘనహస్తాల పంజరాల

ఈ నిశీధి నాతోనే ఊగుము సుఖడోల.” " కాని బుతువులరాణి లొంగదు. అయితే నిస్పహాయస్థితిలో పడింది. తప్పించు కొనేందుకు మార్గం ఆలోచిస్తూ తన విషాద గాథను బుతురాజుకు చెప్పిరమ్మని సమీరుణ్ణి వేడుకొంటుంది. సమీరుడు కదులుతాడు. బుతువులరాణి సందేశం పంపుతుంది: ..

“నిని ర హస్తాలలో చిక్కుపడియున్నాను

అసహాయురాలనై అలమటిస్తున్నాను

2176 పందిరి మల్లికార్జునరావు శతజయంతి ' సంపుటము 4: సాహిత్యము , గడియలో బతుకు పంకమ్ములో దిగునయ్య తడవు సేయక వచ్చి విడిపించిపోవయ్య” మాధవునికి తన్యప్రేయసి అవస్థ తెలిసి, హస్తాన అగ్నిబాణాలు సంధించి, శినిరుణ్ణి అనలవృషప్టితో నుసిజేస్తానని శపథం జేసి పక్షాలతో కదలివస్తాడు. సుందరాంగుడు, పరాక్రమవ్శిక్రమములు గలవాడైన మాధవుణ్ణి చూచి వికృతాకారుడు, 1 పెరికివాడూ అయిన శిశిరుడు భయసంభమాలతో పారిపోతాడు. వసంతరాణి పరుగెత్తి మాధవుని కౌగిలిలో వాలుతుంది. (ప్రకృతిలక్ష్మి ఆ గేయసీప్రియులకు నీరాజనములిచ్చి మంగళగీతం పాడుతుంది: “యుగయుగాలు తీరినా జగతి యంత మారినా సర్వ బుతువులల్లో వా సంతకాలమె విశేషం మధుమాసం, మధుమాసం.” ఇటువంటి నాటికల రచనలోను, వాటి (ప్రదర్శనంలోను తమకు కలిగిన అనుభవాలను దృష్టియందుంచుకొని శ్రీ సి. నారాయణ రెడ్డిగారు ఆంధ్రసాహితీ సంపదకు మరికొన్ని ఉత్తమ గేయ నాటికలను చేర్చుతారని ఆశిస్తాను. (కిన్నెర: సంపుటము 6, సంచిక 9, సెప్టెంబరు 1954) యట! భర “లీడ్‌, షా స్ట " ర్ట టకు. ల నా ల క్‌ స ర కం టీ 6) స న తా. [యా ౧ స్ట్‌ న కం! టో! ర సనా గం, ; లూ కాసు?

శరత్‌బాబు గొరెపాటి వెంకట సుబ్బయ్య జకనాడు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి నవలలు అధికంగా ఆదరింప బడినవి. అటు తర్వాత ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల నవలలు ఆం(ధ్రదేశమంతటా వ్యాప్తిగాంచినవి. కొంతకాలానికి చలం ప్రవేశించి అన్ని రచనలను అణగతొక్కాడు. కొవ్వలి (గ్రంథాలు కొందరిని ఆకర్షించాయి. అనంతరం సెక్సుషటత్రైకలు వ్యాప్తిలోకి వచ్చాయి. నేడు శరత్‌బాబు రచనలకున్న వ్యాప్తి ఎ రచనలకూ లేదు. ఆయన బెంగాలీ వాడన్న మాటే మరిచారు. ఆంధ్రుడని అనుకొనేంత ఆదర పాత్రుడయ్యాడు. తెలుగు పాఠకులమీద ఆయనకున్న (ప్రభావం అధికము. ఆయన రచన చదవని అంధ్రుడుండడు. ఆయన రచనలన్నీ రామాయణంలాగ ఎందరెందరి చేతనో అనువదింపబడుతున్నవి. సామాన్య విషయములతోనే సకల హృదయములను చూరగొన్న శిల్పి శరత్‌బాబు. స్త్రీ హృదయాన్ని ఆయనవలె అనుప్తూర్వికంగా చిత్రించిన వారున భూతో స్త్రీల యెడల, సభ్యసమాజంలో తృణీకరింపబడిన మానవుల యెడల ఆయనకు గాడానురాగము కలదు.

2178 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

వారిలోగల బెన్నత్యాన్ని చాటిన అమరశిల్పి శరత్‌. నవలకు నవజీవము పోసిన నవలాచ[కవర్తి ఆయన, సంఘదృషప్టిచే చెడువారని చెప్పబడుచున్న వారియెడల శరత్‌బాబుకు గాఢానురాగము కలదు.

ఆదర్శవాదము, యథార్థవాదము, కాల్చనికవాదము అనే రూఢమైన వాదాలను రూపుమాపి కరుణాహృదయుడగు శరత్‌బాబు మానవవాదాన్ని నెలకొల్పెను.

కవులు విలాసప్రాయులను, ఆచారదాసులను అధికంగా వర్ణించారుగాని సంఘదూరులైనవారి సంగతి సాహిత్యములో ప్రవేశపెట్టలేదు. ఇంతవరకు ఇతరులు విడిచిపెట్టిన కార్యాన్ని శరత్‌బాబు చేశాడు.

చరిత్రహీనులకు చరిత్ర కలిగించిన శరత్‌బాబు చరిత్ర తెలిసికొనుట అవసరముకదా.

భారతభూమిలో ఆంగ్ల పరిపాలన ఆరంభమైనది వంగదేశమున. ఆ కారణముగా వారి నాగరికత వంగీయులకు వంటబట్టినది. ఆ దేశము అన్నివిధాలా అధికంగా చైతన్యం చెందినది. తాను చైతన్యం పొందుటతో తృప్తిచెందక నిదాణమైన భరత ఖండాన్ని మేల్కొల్పినది.

ఈ సంగతినే సుప్రసిద్ధ దేశభక్తుడగు గోపాలకృష్ణ గోబ్లే 4/02 860021 1౧45 1062౪ 1౧61 11౧%5 (0గ౦గ౦౪”.(“వంగదేశము నేడు ఆలోచించిన విషయాన్ని భారతదేశము రేపు ఆలోచించును) అన్నాడు.

ఆధునిక భారతభూమికి పిత రామమోహనరాయ్‌. ఆయన రాజకీయ నాయకుశే కాదు; గొప్పరచయిత, సంస్కర్త, తత్వవేత్త, బ్రహ్మసమాజ స్థాపకుడు.

ఆ బహ్మసమాజము భారతదేశమంతటా వ్యాప్తిగాంచక పోవచ్చు. కాని దేశములో నవవైతన్యం కలిగించిన దదే. అదే భారతీయులను దేశభక్తులనుగా, సంస్కారులనుగా, సంస్కర్తలనుగా విలసిల్లబేసినది.

ఈ విషయాన్నే ఇంకొకవిధంగా చెప్పతలచిన యూరపు ఖండంలో ఇటలీ ఐరోపా వికాసానికి తోడ్పడినట్లే వంగదేశము భారతవర్హానికి ఒక శతాబ్దము ఆచార్యప్‌ఠం అలంకరించినది.

విశేషించి సాహిత్యముయెడల అది మరింత ప్రస్ఫుటమైనది. ఈనాడు మన దేశభాషల్లో భావకవిత్వము, నవలలు, నాటకాలు, కథలు మొదలగు నవ్యసాహిత్యం అభివృద్ధిగాంచిందంటే అది వంగీయుల ప్రభావమే.

శరత్‌బాబు గ్యొరెపాటి నెంకట నుబ్బయ్య 2179 అట్టి వంగదేశమునందలి హుగ్లీజిల్లాలోని క్కగామమగు దేవానందపురమున 1876 సెప్టెంబరు 15 తేదీన శరత్‌ జన్మించాడు. ఆయన తండ్రి మోతీలాల్‌ ఛటోపాధ్యాయ్‌. లలితకళలందన్నిటా ప్రవేశముకలవాడు. అందులో సాహిత్యమునం దధిక అభిరుచి కలవాడు. కథ, నవల, నాటకం, కావ్యం మొదలగు సాహిత్య శాఖలన్నిటా సంచరించాడు ఆయన. ఆయన అనేక [గ్రంథాలు ప్రారంభించాడుకాని పూర్తిచేసిన దొకటీ లేదు. ఆయన నిరంతరాధ్యయన తత్పరుడు. దృఢథాభిప్రాయంగలవాడు కాడు. ఏ కార్యమునందును అభిమానములేదు. వారిది కులీన బాహ్మణ వంశము. కులీనులకు వంగదేశములో గౌరవము . అధికము. మోతీబాబు కడు బీద. అయినప్పటికి ఆయన అధికంగా కాల్పనిక జగత్తులోనే సంచరించెడి కళాకారుడు. ఆయన భార్య భువనమోహిని ఏదోవిధముగా చారెడు కాసి పోసేది. ఆయనకు పెక్కు సంతానము కలిగిందిగాని నిలిచింది మాత్రము తక్కువ. ఆయనకు అనిలాదేవి ప్రథమ సంతానం. అనంతరం అమరశిల్చి శరత్‌బాబు కలిగాడు. శరత్‌బాబు తర్వాత నలుగురు పుత్రులు పుట్టారుకాని పురిటిలోనే పోయారు. అటుపిమ్మట మోతీబాబుకు ఇద్దరు బాలురు, ఒక బాలిక జన్మించారు. అందులో ఒకాయనపేరు ప్రభాసచందుడు. ఆయన సన్యసించాడు. వారి కుటుంబంలో ఆరుతరాలనుండి సన్యసించటము జరుగుతూనే వున్నది. మోతీబాబుకు పిల్లలయొడల (ప్రేమ ఎక్కువ. దీనివల్లను, అధికంగా భావజగత్తులో , సంచరించుటచేతను పిల్లలను అదుపు ఆజ్జలలో వుంచలేదు. . శరత్‌బాబుకు చిన్నప్పటి నించి చదువుసంధ్యలయందు కంటే ఆటపాటలయం దధిక అభిమానము. చేపలు పట్టటమంటే అధిక సర్దా. పిల్లల జట్టు ఎప్పుడూ ఆయనవెంట వుండేది. వారితో ఆడటం, పాడటం, అల్లరిచేయటం ఆయన అనుదిన కార్యకలాపం. కాస్త పెరిగినపిమ్మట పెద్దలు కసరత్తు చెయ్యటం చూచి తానూ సాము గరిడీలు చెయ్యసాగాడు. ఈ అభిమాన విద్యలన్నీ ఆయన రచనల్లో దో్యోతకమగును. ఇట్లా చదువుసంధ్యలులేక తిరగటము చూచి ఆయన తండ్రి తన తనయుణ్ణి మేనమామల ఇంటికి పంపాడు - అక్కడైనా అక్షరపుముక్క అంటుతుందేమోనని. భాగల్పూరు వచ్చిన తర్వాత కాస్త డొక్కశుద్ధి ఏర్పడిందిగాని ఆటపాటలందు ఆదరాభిమానాలు మాత్రము తగ్గలేదు. రం

2180 పందిరి మల్లికార్డునరావు శతజయంతి పంపుటము 4 సాహెత్యము

1894 ఎంగటెన్సు పరీక్షలో గెలిచాడు. ఆ కాలములోనే ఆయనలో సాహిత్యాభిరుచి కలిగింది. కలగటమేకాదు, రచనకూడా చేయసాగాడు. “వాస” అనే నవల రచించాడు. కాని అది ఆయనకు రుచించనందున చించిపారవేశాడు.

ఈ విధంగా పెక్కు రచనలు బాల్యములో చేశాడుగాని అవి అన్నీ ఆయనకే తృప్తి కలిగించనందున చించిపారవేశాడు. నేటి కొందరు యువరచయితలవలనే ఆయనకు అభిరుచివున్నది గాని అర్హతలేదు. నిరంతరసాధనవల్ల ఆయన గొప్ప రచయిత కాగలిగాడు. “సాధనవల్ల పనులు సమకూరు ధరలోన” అన్న వేమన నీతి ఆయన సార్థకము చేశాడు.

కళాశాలలో ప్రవేశించినపిమ్మట బంకిం నవలలను, రవీంద్రుని రచనలను, థాకరె, డికెన్సు, మిసెస్‌ హెనీీవుడ్డు నవలలను బాగా చదవసాగాడు.

మిసెస్‌ హెనీవుడ్‌ ప్రముఖనవల “ఈస్టలీన్‌ ఆధారంగా తీసుకొని “అభిమాన్‌" అనే నవల రచించాడు. ఇంకా కొన్ని ఆంగ్లానువాదాలు కూడా చేశాడు. కాని వాటిని అచ్చువేయలేదు.

బంకించందుని నవలలు అధికంగా చదవటమువల్ల అవి ఆయనకు కంఠస్థమైనవి. అందుచేత ఆయనలో బంకిం అనుకరణ అధికమైనది. కాని సాధనవల్ల దానిని జయించగలిగెను.

ఈ కాలములోనే ఆయనకు ఒక ఉపాధ్యాయుడు యథార్థ విషయాన్ని ఎరుకపరిచాడు. అదేమంటారా? పాఠశాలలో పఠించుట వల్లనే విద్యరాదని విశదీకరించాడు. పర్యవేక్షణవల్ల అధికంగా లభించునని అన్నాడు. అందుచేతనే ఆయన వాడవాడలా తిరుగుతూ అందరి అంతరంగములను కనుగొనసాగాడు. నిజంగా విశ్వవిద్యాలయమువల్లనే ఆయన అధిక అనుభవాన్ని సంపాదించాడు. అది కలకత్తా విశ్వవిద్యాలయము మాత్రము కాదు. ఈశ్వర నిర్మిత విశ్వమనే విశ్వవిద్యాలయములోనే ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. పర్యవేక్షణ వల్లనే ఆయన (ప్రముఖ రచయిత కాగలిగాడుకాని పాండిత్యమువల్ల కాదు,

_ ఆయనకు ఆరంభంలో కవిత్వమునం దధిక అభిమానం కలిగింది. ఎంత కృషిచేసినా అది ఆయనకు అబ్బలేదు. ఆఖరుకు విసిగి గద్యరచనకు గడగాడు. అయినప్పటికీ కవికి శబ్దాలయందెంత అభిమానముంటుందో ఆయనకు అంత

శరత్‌బాబు. గ్యాంపాటి నాంకట నుబ్బయ్య 2181 ఉండేది. అందుచేతనే ఆయన శబ్దాలను ఆలోచించి వాడెడివాడు. కవిత్వమునందు గల గాఢాభిమానం ఆయన గద్యరచనలలో అక్కడక్కడ మనం గాంచగలము.

ఆయన కళాశాలలో చదువుచున్న రోజులో ఆయన ఆధిపత్యాన ఒక సాహిత్యగోష్టి ఏర్పడింది. ఆందులో ఆయన సోదరి అనిలాదేవి, మరికొందరు సహాధ్యాయులు ఉండెడివారు. కథారచన చేయడం, కవిత్వం చెప్పడం ఈ గోష్టి కార్యక్రవుము. అప్పుడప్పుడు రవీంద్రుని రచనలనుకూడా పరామర్శించేవారు. ఈ యువ సభాపతి వారం వారం సభ్యుల రచనలను చదివి గుణదోష నిరూపణ చేసెడివాడు. వారంతా ఆయన అభిప్రాయాన్ని అధిక - ఆదరంతో ఫ్వీకరించేవారు. ఆనాటి గోష్టైలోనివారందరూ అనంతరం వంగసాహిత్యములో అధిక ఖ్యాతి గాంచారు.

ఇంతవరకు శరత్‌బాబుకు సంఘ నిజస్వరూపం తెలియదు. ఆ కాలంలో సంస్కరణవాదులకూ, సనాతనవాదులకూ అధిక ఘర్షణ జరిగేది. ఆయన సంస్కరణవాదులపక్షము వహించుటచేత మేనమామ ఇంటినుండి వెడలగొట్టాడు. ఆ సమయంలోనే, అనగా 1895లో ఆయన మాతృదేవత మరణించింది. ఎఫ్‌. ఎ. పరీక్షకు ఫీజుకట్టలేని అసహాయస్థితిలో వుండుటచేత ఆయన విద్యకు స్వస్తి చెప్పవలసివచ్చింది.

తండ్రి పరిస్థితి [గ్రహించి శరత్‌బాబు నొకరిలో ప్రవేశించాడు. అందులోనూ హత్తుకొనక సన్యాసివేషంలో దేశమంతా సంచరించాడు.

తండ్రివలెనే శరత్‌బాబుకూడా స్థరచిత్తములేనివాడు. అటూ ఇటూ తిరిగి చివరకు భాగల్పూరు చేరుకున్నాడు. అప్పట్లో ఆయన స్నేహితులు ఆయనకొక ఆలోచన చెప్పారు - అప్పట్లో జరిగే కథల పోటీకి ఆయన కథ పంపితే తద్వారా కొంత ఆర్థికస్తోమతు ఆయనకు కలుగుతుందని. తనకు తాహతులేదని తలచి సురేంద్రనాథ్‌ అను స్నేహితుని పేరుతో “మందిర్‌ అనే కథ పోటీపరీక్షకు పంపాడు. ఆనాడు పోటీకివచ్చిన 150 కథల్లో ఈ కథకే బహుమతి వచ్చింది.

ఆయన ప్రతిభ ఆయన బంధుమిత్రులలో మార్పు తేలేదు. ఆయనకు ఆర్థికస్తోమతూ కలగలేదు. పుట్టిన దేశాన్ని విడిచి పట్టెడన్నంకోసం పొట్ట చేతపట్టుకొని పరదేశాలకు పోవాలసిన పరిస్థితి ఆయనకు కలిగింది. ఆ కాలంలో దరిద్రులకు

ర్తాల డ్రా న ల ల అ యమ వగ న కవ ః న పదపద మత్సినా్టునువాస్చు. వయమువుడు... సంన్రైయిముు శ సాహాచ్య్ధము క త వా వం న 2 ఉ టా వా దూ ల ప ష్య ల కా న స ప అ జ. శం మ్య్య్యోంంలాం వ లు చలో వాయు నాటే ము ముం నం భం యింట మ లు వం యో అష ల లాడ్‌ లత ఈ ఆం మెరినా ల్‌ జయమును చెం వందవ న నేపుదనమును టు యా వాలీ టు పదాం యం టా ఓ లుల లి పం చ య్యంము ఉం డ్యాం వందాాపిలా శన లట స ఇటుల వ్వ స న క య క టు. టా స క య న. న న కష ఈ ౩. టు వ స న ఈక వ నా క జ. (క ఈ జ. ఫు న. . న. కా న మ ఇ ౩ లో రై కంల ల టం ఉక్‌ యుల త చా న నర న స ర హా. క క క (క క గ. భే వి వు నజ! జ వ లచ లంచం వా వో ళల నా ఉం అల వా క పాల. వత్రం ల్‌ సాగా వ. నక న తక వష వ న ల న్య స. లు. జీ జు తో లు టబ క వ్ర బటల ఉం వాం లం నాలం కై ఇ నాఆ నను మం సంత తి వాం నో న వా బ్య త క ప రాత క స జ ద గ న = శు లంచ తం. అం లన్‌ క 2, న శ. సెంటు తి ఎటు చంకన ముక మానా. న ర న న క స న కతత యు మ ఎట్టి నం జిలా మ” శప న ముదు ముంచ కింక మవ ఆఅచుంరమవు కంల యవ కో బం ఎ పజటాిమ్‌. పోయటం అ ళు తరు గిన లంత సం లె క టక క 1 ఇ జూ న న న న క న ౪ క స వ నవ క! గ వ న క వ అంతు శ ళా వ్‌ షు వు న లల టలు క త న క పం కనున రేం టాం గ. ర ల స నా టా ఎ. ద ప కమా ంంమువా టూ మం తై మాడ్‌ క అ క క క ర న వ కు న ౧ య శ ళల 4 మ శ 4 ఎ చివ ణల, పాలి ను ల న స జ ల్ల వ వర ను వ టవ నక వ వ వ నా వ క ఆ న చ అట్లీ అ ఆ న న వ. చు చ నేల మాలు వం దష మాల ల్యలు సలుల వాం నువ సం ఓం జం అం వింంలి శయ ఆ కక జ జ న జా శ వ స స య. త వా! లు వ్‌ ౪ క్‌ ఉం న. క మలంలో అ, - క క క క స వ వ వ అంప జట యో ల డె లం ఎ క కిబు 4 4 4 ఒరే ట్‌ ల మ లలి తం ఎం ఎ మెం టినా మరక న చది సునత మచివనంచ ఆల మరవ విజిల్‌ ఆం అంత్‌ ఎటో ఆ తీ శ జ అ . జ. న న... న ఖు. సాగా న న ర మ వ టం రు కలో జం లంద చం బి కు నైవ ఉం పస ప ప లా కాం గ్‌ 2 +. పేరా ఉం ళ్‌ ఇబ ఇలము వచుచ ముచ వపవికు వవ కుండా వ ర క మ వ న క క న | అ షు సై నా చిల్ల జ్‌ ళల టట | న = (= వ లాడు కం 22 టు న్యా చాకు యుల నా బ్న త. క్‌ క తయ వ అ ల క ర క చయచాపా జ. సు నో ఇనా మ | హో కాచి వరా చెం క శాఖల టు కత సర జ మొత త మజ ఎల గ ను స్త అం గ ర ర క ౫ ఇ న తళ క క య య ప లాం చక లాల జ్‌ నలా కా య టో టాం చం న షు ర అ ర. లలు బం తుం ము కీ టం లకి ట్య న్‌ చం నాన శాం పాటా * గట క్యా. ఖా? | వ. జ్‌ ం వం పాం లా గ ఆయన వెౌపనమముముయ అముము ఉచ ఎటెాదవుభనను చెపు చిలి టు న ల భా స నన న స పయిట వీ ఆ మామ హీ ట అటి విల టి ల నత షి క క హయ కాంతం వ ఉ . 1. ళా లా జు . కం వాంచ ఆ వింక్‌ చఎచావాముద చంప ల పంచు వహిసాప్‌ ఆఅ వుంటాది షః నా జా న స న న క య ఆ కయ. ౨ ౨ జు

శరత్‌బాబు. గ్యొపపాబి వంయు నుద్టుయ్యా 2183 బర్మాలో ఆయనకు అస్వస్థత ఏర్పడినది. ఇంటికి పొమ్మని డాక్టరు సలవో యిచ్చాడు. సరిగా ఈ సమయానికే గురుదాస్‌ చటర్జీ అంచు సన్స్‌ అనే ప్రచురణకర్తలు నెలకు నూరు రూపాయల వేతనంమీద ఆయనను ఆహ్వానించారు. ఆ ఆహ్వానం అందుకొని రంగూన్‌ వీడి కలకత్తాలో కాపురం పెట్టాడు. శరతీ రచనలకు గల చలామణి చూస్తే ఆయన గొప్పదనం గోచరించగలడు. ఆయన “*పద్దేర్‌దాచి” (భారతి) ప్రచురించిన తొలిరోజుననే, మూడు తూపాయల వైల అయినప్పటికీ వెయ్యి కాపీలు అమ్ముడుపోయినవి. అప్పటికి ఏ గ్రంళఛమూ ఈ మాదిరి అమ్ముడుపోలేదు. దాని మొదటి ముదణ మూడువేల కాపీలు ఒక్క మాసంలో అమ్ముడుపోయినవి. మలి ముద్రణ అయిదువేల కాఏ్‌లు మూడు నెలలు ముగియకముంచే విడుదలైనవి. దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌ను ఎరుగనివారుండరు. ఆయన గొప్ప, రాజకీయ నాయకుడే కాదు; భోగీ, త్యాగి, యోగి. ఆయన గొప్ప కవికూడా. “సాగర సంగీత్‌ ఆనే ఆయన [గ్రంథాన్ని చదివిన ఆయన గొప్ప గోచరముకాగలదు. ఆయన పత్రికాధిపతి కూడా. “నారాయణ” అనే ష్యత్రిక ఆయన సంపాదకత్యాన వెలువడేది. ఆయన కోర్కెమీద శరత్‌బాబు “స్వామి” అనే కథను పంపాడు. ఆ కథను దేశబంధు దాసు ఆదరంతో చదివి తన్మయుడై తిరుగుటపాలోనే శరత్‌బాబు పేరివఏ ఒక కాళిచెక్కును పంపించాడు. అందుతోబాటు ఆయన రాసిన ఉత్తరముకూడా వున్నది. అందులో ఆ దేశభక్తుడు ఇలా రాశాడు; “మహోన్నతమైన ఒక రచయిత నుండీ మహా గొప్ప కథను సంపాదించాను. దాని విలువకట్టే సాహసం నాకు లేదు. అందుచేత ఈ కాళి చెక్కును పంప్పుతున్నాను. ఈ కథకుగాను మీ యిుస్టమువచ్చినంత ధరను వేసుకొని మార్చుకోవచ్చును” దేశబంధ్లు దాను కేవలం పత్రికా సంపాదకుడు కాదని పాఠకులు గమనించాలి. ఆయన ప్రఖ్యాతిగాంచిన గొప్ప వకీలు. జమీందారులు ఆయన బంట్లు. రెండుచేతులా ఆర్జించిన కుబేరుడు. శరత్‌బాబు ఎంత పెద్ద మొత్తాన్నైనా చెక్కుమీద రాసుకొని సులభముగా మార్చుకొనగలిగి ఉండును. కాని ఆయన తీసుకొన్నది వంద రూపాయలు మాత్రమే. అది ఆనాటి ఆయన (ప్రభావము. ఆయనతో సరితూగగల రచయిత నాడూ నేడూ కూడా లేడు.

2184 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

సృష్టికర్త తన సృష్టిలో తాను' ఇమిడినట్లు ప్రతి రచయితా తన రచనలో ప్రతిబించిస్తాడు. శరత్‌బాబు రచనలో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన స్వభావమే కాదు ఆయన రచనలలో కనపడేది, ఆయన స్వానుభవం. వేయేల? ఆయన రచనలన్నీ స్వానుభావాలని ఎరిగినవారికి విప్వచెప్పాలిసిన అవుసరంలిదు. ఆ అనుభవాన్ని సాహిత్యరూపంలో పెట్టుటకు కొంత మార్పుచేగాడు. అందుచేతనే ఆయన రచనలన్నీ సజీవ రచనలుగా గోచరించును. అందులో "దేవదాసు, “చరిత్రహీన్‌”. “శ్తీకాంత"లు అధికంగా ఆయన స్వానుభవాలే అందురు. “శ్రీకాంత” ఒకవిధంగా ఆయన స్వీయ చరిత్రయేనని ప్రసిద్ధి గలదు.

ఆయన 'ప్రథమదశలో అనువాదము, ఛాయానువాదము చేసేవాడు. అటుతర్వాత ఆయన స్వంత రచనలు చేయసాగాడు. శిల్ప దృష్ట్యా శరత్‌ గొప్ప కళావేత్త. ఆయన అమర కావ్య శిల్పాన్ని మన కందించిపోయాడు. మన భరతభూమిలో నవలా రచయిత లందరికంటే ఆయన స్థానం మహోన్నతమైనది. కథా సంవిధానంలో గల ఆయన అశేష విశేషాలు, సంభాషణా నైపుణ్యం, భాషా మాధుర్యం, భావలాలిత్యం, లలితహాస్యం, పాత్రపోషణలో ప్రజ్ఞా నైపుణ్యం - ఇవన్నీ ఆయనలో గుమిగూడి ఆయనకు అమరకీర్తిని అలవడజేసినవి.

“బడదీది ఆయనకు ప్రప్రథమముననే పేరు తెచ్చినది. ఆ ప్రతిష్టా నిఖరమునుండి ఆయన ఎన్నడూ దిగలేదు. ఆఅమరణాంతం ఆ అంతస్తుని ఆయన కాపాడుకొన్నాడు.

“బడదీది ఆయనకు ప్రప్రథమమున పేరు తెచ్చినల్లే, “చరితహీన్‌” అనే నవల ఆయనకు చెడ్డపేరు తెచ్చినది. అనంతరం ఆయనకు అధిక ఖ్యాతిని సమకూర్చినది అదే. కారణ మేమన, మంచిచెడ్డల కతీతమైన మానవత్వాన్ని ప్రతిపాదించే ఆ మహత్తరమూర్తియొక్క నక్తిని తర్వాత తర్వాత తాలుసుకొన్నారు.

నరత్‌ చేసినంత అధికంగా రచనలు చేసినవారిని చేతులమీద లెక్క పెట్టవచ్చు. ఆయన అచ్చుపడ్డ రచనలే గుట్టలు గుట్టలుగా తేలుతవి. ఆయనకు కొందరివలె ఏ ఒక్క గ్రంథంవల్ల అధిక ఖ్యాతి రాలేదు. ఆయన రచనలన్నీ అధిక ప్రభ్యాతి గాంచినవే. ఆయన నవలల్లో “చేవదాసు” గొప్పదంటారు కొందరు. “*చరితహీన్‌" గొప్పదంటారు మరికొందరు. “శ్రీకాంత” గొప్పదని మరికొంద రంటారు. “ద్వేష ప్రన్న” గొప్పదనాన్ని ఆదిచేషుడు కూడా చెప్పలేడంటారు మరికొందరు. “గృహ

శదత్‌బాబు. గ్యొరెపొటీ వెంకు నుబ్బయ్య 2185 దహనంో గొప్పదంటారు కొందరు. “దత్త” అన్నిటికంటే అధికమైనదంటారు కొందరు. ఇట్లా వారి వారి అభిరుచులను బట్టి ఆయన నవలల యుక్క గొప్పదనాన్ని గమనిస్తారు.

(ప్రఖ్యాత రచయిత రోమన్‌ రోలండు “త్రీ కాంత ప్రథమ భాగం చూచి ఇది నోబుల్‌ బహుమతి ఇవ్వదగిన గ్రంథమన్నాడు.

మేధావియగు యం. యన్‌. రాయ్‌, “శేష ప్రశ్న నోబుల్‌ బహుమతి పొందడగినదని ప్రస్తుతించాడు.

ఈమాదిరగా పఖ్యాతరచయితలు, విమర్శకులూ ఆయన (గ్రంథాల గొప్పదనాన్ని ప్రస్తుతించారు.

దీనికంతకూ కారణం - ఆ అమరశిల్పి హడావుడిగా ఎన్నడూ రాసేవాడు కాడు. (వ్రాతప్రతి ఎన్నో మారులు సవరించేవాడు. ఎన్నో మార్పులు, చేర్చులు చేసేవాడు. శ్రైలీమాధుర్యం కోసం ఆయన ప్రత్యేక కృషి చేసేవాడు, అధిక గ్రమపడి ఆయన రచనచేసేవాడు. రచన చేయటమునేది క్యాగరాజువలె, పోతనవలె ఆయన దృష్టిలో ఒక దైవకార్యం. అందుచేతనే అవి మనకు ఆనందప్రదాలుగానూ, అభిమానపాత్రాలుగానూ అలరారుచున్నవి,

గాంధీ మహాత్ముని అసహాయోద్యమం భారత స్వరూప స్వభావములనే మార్చివేసినది. ఎందరెందరినో ఆకర్షించిన సంగతి ఆబాలగోపాల మెరిగినదే,.

ఆవిధంగానే మహాత్ముని ప్రభావం శరత్‌చండ్రునిమైన కూడా పడినది. 1922లో ఆయన అసహాయోద్యమములో చేరాడు. హౌరా కాం్యగెసు కమిటీకి ఆయన అధ్యక్షుడైనాడు. ఈ సందర్భం గమనించి ఒక కవి “తమరు కలాన్ని విడిచి రాజకీయాల్లో ప్రవేశించుట ఉచితంకా”దని అంటే, అందు కాయన చిరునవ్వు నవ్వుతూ “నేను కొంతకాలం కలాన్ని కట్టిపెట్టి చరఖాని చేపట్ట దలిచాను అని చెప్పాడు. . వంగీయుల నిత్యజీవితాన్ని నిపుణతతో నిర్వహించిన కీర్తి ఆయనకు ఒక్కనికే గలడు. ॥

విశ్వకవి రవీంద్రుడు 1938 సం! లో ఒక ప్రసంగంలో శరక్‌చండ్రుని గురించి పలికిన పలుకులు గమనింపడగినవి: “శరత్‌చందుని దృబ్బ బంగాలీల

2186 పందిరి షుళ్ష్‌కార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము హృదయకుహరాలలో మునిగితేలింది. సుఖంలో - దుఃఖంలో, కలయికలో - ఎడబాటులో ఘటిల్లుతూ ఉండేటటువంటి విచిత్ర సృష్టిని ఆయన బంగాలీల కళ్లకు కట్టినట్లుగా వర్జించాడు. దీనికి నిదర్శనం బంగాలీల తరగని ఆనందమే. ఆంతరంగికంగా ఆయన రచనలతో తృప్తిపడినట్లు వారు ఏ యితర రచనలతోనూ తృప్తిపడలేదు. ఆయనకంటె గొప్ప (ప్రతిభావంతులు, అధిక (ప్రశంసలు పొందినవారు వున్నారుకాని, ఆయనవలె అందరి హృదయాలను ఆకర్షించినవారు లేరు. అందుచేతనే 1926 నుంచి ప్రతి సంవత్సరం వంగీయులు ఆయన జన్మదినోత్సవాలు చేసి ఆయన సాహిత్య సేవను కొనియాడెడివారు. 1932 సం[॥లో బంగాలీలు అందరూ కలసి ఆయనకు కలకతా టవున్‌ హాలులో గొప్ప సన్మానం చేశారు. ఆనాడు ఆయనను (ప్రశంసిస్తూ చదివినవన్నీ “శరత్‌ వందన్‌” అనే పేరుతో సన్మాన సంఘంవారు ప్రకటించారు. 1933లో బెంగాలీ స్త్రీలందరూ కలసి ప్రత్యేకంగా ఆయన 57వ జన్మదినోత్సవం చేసి ఆయనకు సన్మానం చేశారు. ఆ రోజున ఆయన స్త్రీీజాతికి చేసినసేవ కొనియాడుతూ కృతజ్ఞతాపూర్వకంగా ఒక సన్మానపత్రం సమర్పించారు. కలకత్తా విశ్వవిద్యాలయంవారు ఆయనకు “జగత్తారిణ్‌” పతకము ఇచ్చి బహూకరించారు. , ఢక్కా విశ్వవిద్యాలయంవారు డి. లిట్‌. బిరుదు ఇచ్చి (ప్రస్తుతించారు. ఇటుల ప్రజలచేతను, విశ్వవిద్యాలయములచేతను సన్మానింపబడిన గొప్ప కళాకారుడు శరత్‌. - సంఘంచే బహిష్కరింపబడినవారి యెడల అపారమైన సానుభూతి ఆయనకు కలదు. సంఘ బహిష్కృతులు పొందు సమవేదనే గరత్‌ సాహిత్యంప్రేరణ. అందుచేతనే మనకు అవి ఎక్కువ ఆదరణీయాలగుట. వాల్మీకి క్రాంచపక్షివియోగానికి తల్లడిల్లుటచే శోకము జ్లోకముగా మారినట్లే దీనులు, పతితులు పొందుచున్న వేదనకు వ్యథపడి ఆయన రచనలన్నీ కన్నీట్‌ కాలువలుగా వెలువడినవి. అనుకంపమైన పాత్రపోషణే శరత్‌ సాహిత్యంయొక్క వైశిష్ట్యం. సంఘ బహిష్కృతుల వ్యథావేదన ఆయన " రచనలలో అధికంగా ప్రతివింబింపబడెను. స్వప్న సౌందర్యం, భావమాధుర్యం కాదు ఆయన రచనలలో కనపడేది. సానుభూతి, సమవేదనా మాధుర్యమే గనరత్‌ సాహిత్యంలో గోచరించేది. సంఘనిషేధాలవల్ల నలిగి నశించే పీడిత మానవుల

శరత్‌బాబు. గ్యొరెపాటి వెంకట నుబ్బయ్య 2187 యడల పరమకారుణ్యంచే కంపితుడైన శరత్‌వంటి ప్రముఖ రచయిత ఇంతవరకు లోకంలో అవతరించలేదు. మానవత్వం మూర్తీభవించిన మహర్షి ఆయన.

“నేను తరుచు పాపుల చరిత్రనే వర్దించాను. బహుశా వారు పాపంకూడా చేసిఉండవచ్చు. అంతమాత్రానికే వారికి ఉరిశీక్ష వేయవలసిందేనా? మానవాత్మను నేనెన్నడూ తిరస్కరించలేదు. ఎవరినైనా సరే “నువ్వు పాపివి” అని అనటానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకమాటు చెడిన మానవుడు మరల బాగుపడలేడా? మంచిచెడ్డలు మానవులందరిలోనూ ఉంటవి. కొందరిలో చెడు అధికంగా ఉండవచ్చు. అంతమాత్రానికే వారు తిరస్కారప్మాతులా? నేను పాపం మంచిదనటంలేదు. పాపము చెయ్యమని కూడా నే నవరినీ (పోత్సహించను. చెడ్డవారిలోగల మంచిని కూడా మనమందరమూ ఒప్పుకోవాలని నా ఉద్దేశము” ఆ కరుణాంతర కథాశిల్పి అన్న మాటలు ఆనాటి బుద్ధభగవానుని, ఏసుక్రీస్తును విస్మరింపజేయును.

మన బ్రహ్మరి శ్రీ రఘుపతి వెంకటరత్నం అన్నట్లు భగవానుడు. ప్రత్వితపాపనుడే కదా!

ఆయన సంఘదెౌష్ట్యాన్ని గర్హించాడు గాని గార్హస్థ్య జీవిత గౌరవాన్ని అత్మికమించలేదు. ఆయన అధికంగా చరిత్రహీనులనే చిత్రించాడు గాని, వారిలో

' ఉన్న గొప్పతనం గోచరించేటట్లు చిత్రించాడు. చరితహీనులకు చరిత్ర కల్పించాడు.

ఆయన పురుష పాత్రలకన్న స్త్రీ పాత్రలు ఉజలమైనవి. వారు ఆదర్శవంతులి కాదు. అభిమానధనులు కూడా. వారు కామో(దేకులు కారు; అనురాగిణులు.

వేయేల? శరత్‌ ప్యాతలు మనకు ఆత్మీయులుగా, అభిమానులుగా కన్పిస్తారు.

నిస్వార్థ సమర్ప్చణే శరత్‌బాబు జీవన మంత్రము.

శరత్‌బాబు రచనలు భారతీయ భాషలన్నిటిలోకి అనువదింపబడినవి. విదేశ భాషల్లోకి కూడా పరివర్తనములైనవి.

మన తెలుగులో ఆయన రచనలు దాదాపు ఇరువదిమంది అనువదించారు.

గరత్‌ సాహిత్యాన్ని ఆంధ్రులకు మొట్టమొదట చవిచూపిన. గౌరవం సరస్వతీ (గ్రంథ మండలివారికి దక్కుతుంది. ఆదిలో “అరక్షణీయ"ను అనువదించిన గౌరవం సహదేవ సూర్యప్రకాశరావుగారికి కలిగెంది.

2188 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పెండ్లిదండ (పరిణీత), మాధవి (బడదీదీ), పార్వతి (దేవదాసు) వీటిని జొన్నలగడ్డ సత్యనారాయణగారు (గాంథికంలో అనువదించారు. “రాముని బుద్ధిమంతతనము", “తీరని తలపులు” మొదలగునవి పిమ్మట (ప్రచురించినది వేలూరి శివరామశాస్త్రిిగారు. “అంధకారంలో ప్రకాశం” - దీన్ని సూర్యదేవర వెంకట సుబ్బయ్యగారు అనువదించారు. “హరిచరణ” దీన్ని ఈదర లక్ష్మీనారాయణగారు అనువదించారు. జబడదీదీ, “దేవదాసు”, “పరిణీత”, “పెంచిన ప్రేమి, “దత్త”, “పల్లీయులు" మొదలగునవి (ప్రజల్లో వ్యాప్తిలోకి అఆచ్చిన గౌరవం చక్రపాణికి చెందుతుంది. దేశికవితామండలి పనికట్టుకొని శరత్‌ సాహిత్యాన్నంతా 14 సంపుటాలుగా ప్రచురించి ధన్యతగాంచింది. శరచ్చందుని నామము సర్వవిధాలా సార్థకము. వేదనాకాతర కథాశిల్పి ఒక్క వంగీయులకేకాదు, సమస్త భారతీయులకు వంద్యుడు. శరత్‌బాబు 1938 జనవరి 16 తేదీన కీర్తిసషుడయ్యాడు. ఆయన భౌతికదేహము భస్మ మైనది. ఆయనకీర్తి అమరమై విలసిల్లుతున్నది. (కిన్నెర: సంపుటము ఈ సంచిక 9, సెప్టెంబరు 1954) న సు

ఒక అజాతకని కా వాసిరెడ్డి రాధాకృష్ణ ణ భవన భర్తయు బాలులాదిగ భవన మందలి సర్వజనులూ కబళమడిగే కాని యుకుతిని కసరి పొమ్మనిరి విసరికొట్టెడు ముసురుగాలిలొ కడుపుమంటకు తాళలేకనె కబళమడిగే చిన్నదానికి మిగిలిపోయిన గుప్పెడన్నము తినుటకిస్తే పాపమొస్తుందా? యువతిచంకను చలితొ వణికే బీదనిసుగుకు కూడు పెడితే నరక మొస్తుందా! జీర్ణదేహము చింకిపాతతొ చుట్టవేసిన ఆమె కూతుని క్షుత్తు దీర్చిన వాని దేవుడు కోపపడునేమో! | అని నేటి సంఘ సం[గామ సాగరతరంగాలలో వీరఘోష లేవదీసి ప్రశ్నిస్తాడు ఒక మహాకవి పైవిధంగా. పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

2190 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఆయనే చిట్టూరి సత్యనారాయణ. సత్యాన్వేషణ మూర్తీభవించిన స్వరూపానికి తగిన పేరు. వీరు తూర్పుగోదావరి జిల్లాలో పామళ్డు అనే (గామంలో పుట్టినారు. రాజవముండి, గుంటూరులలో వరుసగా విద్యాభ్యాసం చేసి వదాసులో వైద్యకళాశాలలో తగు శిక్షణ పొంది, గౌ॥డా!!శ్రీ పే.వి.-చెరియన్‌గారి లాలన పాలనలలో మెలుగొంది గురువును మించిన శిష్యులైనారు. ఇత నొక కళాకారుడు, సంస్కర్త, కవి, డాక్టరు. ఇంకా ఎన్నో- వీరి హృదయ వీణాతంతి ఎల్లప్పుడును “నిండారిన వెన్నెలలో విప్పారిన కన్నులలో వికసించిన పూవులలో ఉదయించిన సూర్యునిలో (వియించెడి జలములలో పరుగెత్తెడి మేఘములో రేగు కళలు నింపు నాదు హృదయము నెపుడున్‌" అనే గీతాన్ని మీటుచుండును. మానసిక భావచ్చ్భాయలే కవిత్వం. శూన్యత్వానికి జీవనమిచ్చి శోభ గూర్చునది కవిత్వం. కవి క్షణంలో భూలోకం మీదుగాను, ఆ మరుక్షణంలో ఆకాశవీథిలోను అందరాని ఊహాసౌధాలలో ఆనందశయ్యలలో విహరించు విలాసాలమీదికి దృష్టిని ప్రసరించగలుగుతాడు. జీవిత సమాధికి పరమావధిని సాధించే శాంతిదూతగాొ (ప్రయోగిస్తాడు కవిత్వాన్ని ఒక మహాకవి. మన సత్యనారాయణగారు కూడ కవిత్వంలో “విశ్వ సౌభాగ్య సౌభాగ్య సీములందు మించివికసించు కుసుమప్రతతిని జూచి (ప్రణవనాదమున కంఠము లగించి పాడు తుమ్మద కొలంబు మాది రసాస్వాదనమే మానిత్యజీవనంబు.” . అనే అభిప్రయభావం కలిగినవారే. భావో[దేకముతో ఆదేశించునపుడు

ఒక అజ్ఞాతకవి. వాసిరెద్ధ్‌ రాఛాళ్ళష్ణ 2191 “దృఢవిశ్వాసము నీ తమ్ము లెప్పుడు చీకు చింతలతో కుళ్ళిపోనీకు సుమా" అనే పద్ధతిలో పట్టుదలతో భావిజీవితంలో గాఢానురాగ కర్తవ్యదీక్షతో హెచ్చరించు చున్నారు. కవిత్వం అంటే, పుట్టుకతో వచ్చే అమృతవాహిని. కల్పనా సౌందర్యపటిమ గారాబంతో అనుసరించి ఆదరించగా కలిగే ఆదర్శ సంపద. దుఃఖానికి కవిత్వము సోదరి. ఆవేదనపడే వ్య క్రియొక్క కన్నీటి బిందువులే మాటలు. బరువెక్కిన ఆ హృదయవేదనా ప్రతిధ్వనియే కవిత్వం. చిట్టూరివారు చిన్నతనమునందే రాజకీయ కారణాలచే జైలులో నుంచబడినారు. ఆ రోజుల్లో ఒకరోజు “ఒక చిన్న కాగితపుముక్క ఒక పెన్సిలో సిరా కలమో హృదయము పకల్చి విడివడు _ బాధనంతా కాగితముమీద బంధించ కాంక్షించినారు." అని వ్రాసియుంచి కవిత్వ నిజస్వరూపాన్ని వలిబుచ్చినారు. లేత వయస్సులోనే పెండ్లియాడిన ఈ కవి కవిత్వం ఒక నవయౌవన సుందరాంగి; అందు గోచరించు సౌజన్య సౌహార్ద, మార్దవఫణితివల్ల ఆనందం అనుభవించగలుగుతాడు కవి అనే రహస్యాన్ని తెలుసుకొని “ఈ విజ్ఞాన సమాధిలో మే మిరువురము జంట పూవువలె జతకట్టినాము." అవి తమ దాంపత్య జీవితాన్ని పెక్కువిధములుగా చిత్రించినారు. .... పరులచే నిందార్డ మైన పదజాలాన్ని కూడ శోభ గూర్చు శృంగార కవిత్వంలో పాందుపజచి, సమాజానికి ఇంతో అంతో సేవజేయువాడు కవి. ఆ తెజుగును ఈ [కింది ఉదాహరణలు సూచించును. ఎ. - “జగదీశ్వరి సృష్టించిన విశ్వ శృంగారకావ్యం పఠించలేక దూషించే

2192 పందిది మల్షీకార్టునరావు నతజయంతి సంపుటము 4: సాహిత్యము వాళ్లే మెబజుగుదురు! " వాళ్లెట్లెరుగుదురు? ఎ “అల్లరి”

బి. “వీథి చివర నెవరో కొందరు ఏడ్చుచూ . పోయిరి శవమువెంట పంటచేను ప్రక్క పాలికాపు తొలగగా మిర్రిచూచెను గుంటనక్క వాళ్లు రాష్ట్ర స్వాతంత్య్య మన్నారు - వీళ్లు కూలీల రాజ్యమన్నారు అంతా గొల్లుమన్నారు ఆ పండితుడు “కర్మ” మన్నాడు - “కర్మ” ఊహించి, స్వాభావికంగా ప్రశ్నించే కవిత్వంలో చాలా నేర్పరి మన కవి, “జలములో డాగియుండెడి స్వచ్చమైన నీలి రక్తిమ ఎవరికి గానుపించు? . తొలిరోజులలో, అనగా (ప్రారంభదశలో మొట్టమొదట కవిత్వం (వాయ పూనుకొనినపుడు పదునొకండు వయః॥ప్రాయంలో “సంపంగి పూచింది, కలువ కనువిప్పింది విరజాజి మొగ్గలే నవ్విపోసినవి అను రూపంలో చిట్టూరివారిని వరించింది. వీరు తమ పదునాల్గవ యీట, మానవుడు ఆత్మగౌరవము చంపుకొని, బానిస జీవితంలో దాసోహమ్మని, భారతీయ ప్రతిభను మజచి, జీవన్మృతుడై: బతుకు బరువై సంసారం సాగదీయుటను చూచి, ఆ ఫలితంగా హృదయంలో 'రేకెత్తి విజృంభించిన సంస్కారమును ఆధారంగా కొని “భగ్న కుంభము" అనే మహోత్కృష్ట నాటకము రచించి, జనరంజకమై రాణించిన ఆ నాటకముచే సమాజంలో ఒక నూతన చైతన్యమును లేవదీసినారు. వీర విహారంలో అగ్రస్థాన మలంకరించునట్లే ప్రేమ వాహినిలోకూడ సంచరింపే గలుగుచున్నారనుటకు అతని “జీవన సంగీతం” అనే నాటిక నిదర్శనం. ఉదాహరణకు వేరొక ఈ [క్రింది పద్యంకూడ దోహదమివ్వగలదు.

మల్‌ అప్హ్లాతకని వౌనింద్హు రావాష్రుట్లు 2193 నివు కొాసుపంచపుగా వి. “నన్ను కములాత కాంచకలగిన జాలు నీ కసుపవోయికొంతి రత్నరువవవ శనాంతిగొల్పు గీతికలు [కించ వ్రాయుచున్నాను. 1.. 16 ౧0110000౧1 2 1116 ౧/౮6, 5౧౧846౮106 2౧6 ౧౦౪౭! 5[1గ 2౧౮ 0616 1౧ 2 1౧0౪౩౧1 15 ౧౦1 1౧0౮0౧1 & 116 159 ౧౦ 16 2 1000901 - 2. ౦04101 116 ౧4౧౦౩ 0 న&1౧ 7౧6 ౧1813066 ౧౫2౩ 00౧౧౭ 0౪101 106 6660 646 ౧19౧1 7౧6 గాంగ) 5 00గ 00101 16 18560655 *4౪65 01 [౧006901 7౧6 5611౧655 ౧23 00౧06 0.101116 140గ౮% 01 ౧౪ 2900౫ 1౪150 ౪0౪ - 3. /౧6౧ 1! 5౧౦౪ ౪౭ 26 6151201 గ10/ గా౧౮ 1810565 10 04౧ ॥ 11158 6660 61% ౧౫౦౧1 1౧41 ౭01 ౦5 3602216 0041 ౪౭ 8/6 0౧6 - 4. 01621" 218 106 ౧౧౧౩121 ౧0|166 ౪2/65 0 గడ౧0080 64౧9 01౪1! &(8 1౧6 5గ౧65 01 1౧౧౦౦౭౧1 02065 01 18౧౮౭! 106 0192౯ 8/9 106 500 గా౦|166 ౧62%5 019౧0౪౫ 1౧ 06 14 ౧|గ౫|2/25

2194 పందిరి మల్తికార్టునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము 0194 15 ౧౫ 5111 ౧6౭గ 70 018? ౪0౪ 1 15 ౧౮/8 1౧౧౦౦౭౪౧౦6. = నిండు గుండెల బండబాజిన నీరసపు కోర్కెలు, విశ్వక్షోభను తలచినప్పుడు గోచరించెడి విషాద గీతికలు. తోడి మానవుని హీనతను గుర్తించినపుడు రేకెత్తు ఆవేదన. ప్రయత్న ఫలితము విఫలమైనపుడుద్భవించే నిండుకష్టము. (శేయసి కౌగిలిలో తొలకరించే పారవశ్యము - ఇవన్నీ ఇంకా ఎన్నోో మానవదైతన్య . హృదయ స్వరూపాలు భాషముసుంగులో కవిత్వ కన్నెలై మెల్లమెల్లగా నాలుకగుండా మొదటి సోపానమునుండి దిగివచ్చుచున్నవి. వానికి మన కవిగారి ఉదాహరణములు కొన్ని:

  1. చించివైచిన పూవురేకుల మధువు నాస్వాదనము చేసే గుణము నీ కెవడిచ్చెనోయీ - “సుగుణ”
  2. (గుడ్డిలోకము నీవు నేనును రెండు అన్నా లెక్క వద్దోయ్‌ నీవు నేనును ఒక్కటే - “లీనమ్‌”
  3. పొలము వెన్నెలలో దూరభూమియట్లు గోచరించుచునున్న దీ స్కృతిపటమున ఆయానందరేఖ ఆ నిర్మలజ్యోతి కొరకె వేచియుంటి నింకా వేచియుందు నిట్ల - “నిరీక్షణ”
  4. రాద్ధాంత సిద్ధాంత రాజ రహస్యములేల నిలుపుకో నీ దృష్టి నీ లోన - లోలోన నీకె విజయమహో నీకె విజయమహో - “ఆశ” 5, పూర్ణిమ వన్నెల నిండిన ఈ నవ వసంతరేయిని - కాంతా " (శగ్రేమతొ నిండిన నీ హృదయమునా నాకు భాగమీరాదా - యువతీ!

ఒక అజ్జాతకవి వాస్‌ిరెద్ధి రాధాకృష్ణ 2195 6. ఆ సన్నజాజిపూవులే నేటికీ నా హృదయమ్ము కదలించువేయు గాఢన్నిదలో స్మృతివచ్చి దూరదేశ యాత్రలో పోగొట్టుకొన్న చిన్నతనపు చెలిమికాడు వచ్చి నన్ను గాఢమ్ముగా కాగిలించినయట్లు ఏదొ జ్ఞప్తియందె లేని మహాద్భుతగాథ స్మృతికి వచ్చి సుఖమంత బాధగా మార్చునపుడు పొందు సంచలనమ్ము పొందుడు నప్పుడపుడు సన్నని తీయని సన్నజాజిపూలు దర్శించు వేళ - “సన్నజాజి పూలు “రెండు గీతలు, మూడు రంగులు, మూడు వంపులు దిద్దువాడు మాత్రం కళాకారుడు కాడు; ఎవరైతే జీవితంలో ఆసందాన్నిి అందాన్ని చూస్తారో, చూడటమే కాదు, దాంట్లో లీనమై ఆ శీల సంపత్తితో బ్రతుకుతారో వాళ్ళే నిజమైన కళాకారులు _ అసలు నిజవైన కళాకారుడు దవృడ” అనే అభి[ప్రాయంతో కళోపాసనచేయుచున్నారు శ్రీ సి. సత్యనారాయణగారు. చిత్ర, శిల్ప నృత్యాది లలితకళలలో ఇతనికి మంచి ప్రవేశము కలదు. చిత్రము మూగ కవిత్వము; కవిత్వము మాట్లాడు చిత్రము; చిత్రము పదాలులేని ఒక కవిత్వము - అనగా ఒక గది నిండుగా పటములతో అలంకరించబడి యున్నదనగా, ఆ గది పెక్కు ఉద్దేశాలంకృతమైనదని యర్థము - మానవునిమై, కనుపించగానే ఒక విధమైన నూతన భావోద్రేకమును ప్రసరింపజేసి, అతనిని ఆ స్వరూపంలో ముగ్ధుణ్జిజేసి, ఆనందాన్ని. మనోవికాసాన్ని కల్పించే చిత్రమే అత్యుత్తమమైనది. . రూపమును పరిమాణంలో అణువణువుకు (ప్రసాదించి, జీవకళ లుట్టిపడేవిధంగా బింబాల్ని సృజిస్తాడు శిల్పి. అవి మాట్లాడలేకపోయినా, మూగనోము వహించి మూర్తీభవించిన భావ సంపదలు. మానవ మారణహోమంలో మరిగిపోయిన తరతరాల నాగరకతను బంధించి భవిష్యత్తుకు అందజేసే త్యాగబింబములు ఈ శిల్ప కళాసంపదలు. అమరలేఖకులగు శిల్పులచే ఏవిధంగాను ప్రకృతిలో

2196 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లీనమైపోని శిలలమై అవతారం పొందిన వీ విగ్రహములు. వీని రహస్యాలు చెప్పే రాకశ్రైనాసరే, సంస్కృతిని రక్షించే రక్షక శిలలైనాసరే, పతనమైన నష్టస్మామాజ్యాల ప్రతాపాల్ని విస్ఫుటంగా పలికించే శిలాహృదయాలన్నా సరే, శిల్పం శిల్పమే.

చిట్టూరివారిని ఎక్కువగా ఆకర్షించి అతని జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపింది మహాత్మాగాంధి జీవితం, బుద్ధజీవితం.

“పపంచంలో ఉత్కృష్టమైన శీల్పసంపదను స్వీకరించి రక్షించేది ఎల్లోరా కైలాసనాథ దేవాలయం. ఉివునియొక్క రూపాలను మూర్తులుగా ఆ దేవాలయపు ఆవరణలో చెక్కియుండుట చూడగా, అనాటి శిల్ప నైపుణి, నాగరకతా ప్రభావం, కళాపోషణ, కళోపాసన, అన్నీ స్పష్టంగా బోధపడగలవు”

“లంకేశుడు కైలాసాన్ని ఎత్తేటటువంటి దృశ్యం చెక్కడం అత్యద్భుతంగా వర్ణింపబడి ఉంది”

_ “అక్కడే లేజశ్ళ క్తికిని, తమశ్శ క్తికిని జరిగే పోరాటం విశదీకరింపబడి ఉంది”

చిత్రకళలో అజంతా పరిపూర్ణత్వం పొందినదని వీరి అభ్మిప్రాయం - రంగులోను, వంపులోను, సామ్యములోను, భావప్రకటనలోను పరిపూర్ణత్వం పొంది ఇప్పటికీ ఆదర్శపాయమై ఉన్నది.

-శెండు కొలతల పరిమాణంలో చిత్రాలు చిత్రించినప్పటికీ, శిల్పంలాగే మూడు పరిమాణ కొలతలవలె కనుపెించుట వముహత్తర చిత్రనైపుణిని వెలిబుచ్చుచున్నది. .

అజంతా ఒక విశ్వవిద్యాలయము వంటిదనియు, ఎల్లోరా ఒక తీర్థము వంటిదనియు వీ రనుకొంటారు.

భరతనాట్య ఉపాసన ఒక యోగసాధన లాంటిదని వీరి అభిప్రాయం.

అభినయములద్వారా మానవ భావో[దేకములను నిశితంగా వెలిబుచ్చే ఈ కళ, యోగసాధన లాగే, లలితకళలలో ఇహపరసాధనానికి తోడ్పడే సోపానంలాంటి ఆరోగ్యానంద బీజం అనికూడ చెప్పవచ్చును.

"ఈ నాట్య కళోపాసన మనవారికి దాదాపు 20 సంవత్సరాలుగా గలదు.

1190101912 లో ఇతని నాట్యకళా కాశల్యము కళాభిమానులను ముగ్ధులనుజేసి

ఒక అజ్ఞాతకవి వాసిరెడ్డి రాధాకృష్ణ 21097 నాట్యకళకు ఒక నూతన జీవకళనే ఇచ్చుచున్నారేమో అన్నంత సంశయము కలుగును.

సంగీతంలోకూడ ఎక్కువ అభిరుచిగల వీరు సంగీతం రెండుభాగాలనీ, ఒకటి భావాన్ని పోషించేదనీ, రెండవది సంగీతాన్ని పోషించేదనీ విశ్వసించెదరు. భావ (5£[00100) ప్రకటన హిందూస్థానీ సంగీతంలో ఎక్కువగా కనుపించు చున్నదనియు, వ్యాకరణ పద్ధతుల విశిష్టత కర్ణాటక సంగీతములో అమూల్యముగా కలదనియు వీరి గాఢవిశ్వాసము. అన్ని సంగీతాలు ఈ రెండింటి మధ్యనే ఇమిడియున్నవని నమ్ముచున్నారు. సాహిత్య సంగీతం ప్రజానీకాన్ని భావసంగీతం ప్రతిపత్తిని ప్రబోధించుచున్నదని వీరి మతం.

ఇక భాషావిషయంలో వీరి అభిప్రాయం కనుగొనవలెను గదా? “జీవితానికి సమానం జీవితమే; అట్లే సజీవమైన భాష ఎప్పుడును వాడుకభాషే” అనే గాఢాభ్మిపాయులు వీరు.

రవీంద్రులంటే వీరికెంతో ఇష్టం. ఆయనగారి “018908౧1గ000౧” ను తెనుగులో అనువదించారు. మువ్వగోపాలుని పదాలంటే డాక్టరుగారికి అంత ఇష్టం.

పూర్వకవులలో నన్నయ, తిక్కన, శ్రీనాథాదులును, శ్రీకృష్ణదేవరాయలును, ఆధునిక కవులలో శ్రీ రాయపోలు సుబ్బారావుగారు, శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారును అంటే ఎంతో ఇష్టం.

గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” పె అమిత ఆదరాభిమానాలు కలవు. స్నేహానికి అడివి బాపిరాజుగారిని వీరు మరువలేరు.

సృష్టిలో లయించి గోచరించే శబ్దమే సంగీతం. కానరాని ప్రపంచంయొక్క ప్రతిబింబమే శబ్దమై విలసిల్లే సంగీతం. సంగీతం యొక్క అందచందాలను అనుభవించి ఆనందించే స్వభావం లేని వాణ్ణి నమ్మరాదు. స్వర్గ్షారోహణకు వెళ్లే దారిలో కనుపించే ముందు వాకిలి సంగీతం. ఈ ద్వారంగుండా లక్ష్యసాధనం మిక్కిలి సులభం.

నవరంధ్రాల కుత్పుకత కల్పించి ఆనందతాండవము గావించే ఆహ్లాద హృదయాన్ని ప్రసాదించి, తద్వారా మానవత్వాన్ని అర్ధం చేసుకొనడానికి ఉపయోగపడే తేజోదీపికయే సంగీతం. భగ్న హృదయులకు అమృతతుల్యం సంగీతం.

2198 పందిరి ముల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వీరి ఖండకావ్యములు చాల అద్భుతమైనవి. సృష్టిలో కనబడే ప్రతివస్తువును జూచి, దాని ప్రయోజనాన్ని అర్థం చేసుకుని మానవుడు జీవించగలిగిన సంస్కృతి వికాసం సంఘంలో కలిగిననాడే మానవాళియొక్క జీవితం అమరతుల్యమౌతుందని వీరి అభ్మిపాయం. ... వీరి సతీమణిగారు కూడ మంచి విద్యాది విమర్శనాజ్ఞానములను పొంది యుండుటచెే, వీరి కవిత్వతృష్ణ తరుగక అభివృద్ధి పొందుచునే యున్నది. శస్త్ర చికిత్సాదికములయందు ఆరితేరిన చేయి వీరిది. నిశితంగా, సున్నితంగా, (ప్రస్ఫుటంగా శస్త్రచికిత్స చేయువారికి ఇట్టి కళాకాంతులు ఎట్లు సిద్ధించెనని తలచుటకు అవకాశమున్నది. ఏ ఒక్క వృత్తియందైనను ఒకరికి అమితమైన, కొజతలేని నైపుణియున్నచో వారు దేనినైనను సులభముగా సాధించగల్గుదురు అను నానుడిని వీరి విషయంలో ఉదహరింపవచ్చును. తమిళ విజ్ఞాన సర్వసముడైన నత్కీరునివలె, దాక్షిణ్యం లేకుండ, అనుకొన్న సమ్మతినో, అసమ్మతినో ముఖంమీద (ప్రస్ఫుటంగా చెప్పివేయుటలో ఎంతయు వెనుదీయరు. నిగర్విగాః నిరాడంబరపు జీవిత సమాధికి కృషిెజేయు ఈ శిల్చి ననుసరించుట (డ్రేయస్కరము. సంఘం మొత్తంమీద స్త్రీ పురుష జాతు లను "రెండు తప్పః వేరు చిల్లర జాతి విచక్షణలను పెంచుట సమాజానికి (శ్రేయస్కరము కాదను వీరి కోరిక త్వరలో సఫలము కాగల సూచనలు నేటి సాంఘిక పరిణామములో పొడసూపుచునే యున్నవి. సామాన్య సంఘ జీవి ఇట్టి ఆదర్శ పురుషుల సూక్తుల ననుసరించి జీవితమార్గాన్ని చక్కబఅచుకొనుటకు ప్రయత్నించుట శుభఫలముల నొసగగలదు. (కిన్నెర: సంపుటము 6, సంచిక 10, అక్టోబరు 1954) రిట్‌ గ

కొన్ని కావ గ్టలక్ష, ణాలు పారనంది జగన్నాథస్వామి

కం సౌందర్యం కావ్యానికి ముఖ్యధర్మం. పతీ కవినీ కళా ప్రపూర్ణునిగా భావింపగలుగునట్లు అతని కావ్య సృష్టి ఉండవలను.

ఒకదానిని చూస్తూ, ఒకదానిని వింటూ, ఒకదాని గురించి భావిస్తూ ఆనందించే టప్పుడు అది సౌందర్యం కలదని నిశృయము. వేరే తర్కము అక్కరలేదు. భాగాలన్నీ సరిపాళ్లలో కూర్చబడి యున్నప్పుడు, ఆ అంగిని భావనలో ధ్యానించినప్పుడు దాని సౌందర్య కుతూహలం కలుగుతుంది. భాగాల కూర్పుకు ఒక్క శరీరమే కాదు, ఏ కావ్యవస్తు వైనా సరే. మేఘజాలమో, గోచరప్రదేశమో, శీల్పవిగ్రహమోః చిత్రపటమా, భవనమో, సంగీతమో, వ్యాసమో, కవనమో, భావమో, ఆశయమో - ఏదైనా సరే, సరిపాళ్ల భాగాలలో కూర్చబడి యుండాలి సౌందర్యావిష్కరణకు.

ఈ సౌందర్యాన్ని గ్రహించగలిగేది రుచివిశేషము అని అనుభవము. సాక్షాత్తుగా ఏ ప్రత్యేకకారణ సామగీ అవసరము లేకుండా కలిగే అనుభవము. ధర్మ గ్రహణానికి అంతరాత్మ ఎట్లో, సౌందర్య (గ్రహణానికి రుచి అట్టిది.

ఇందుకు ఏ వస్తువైనా ఉపకరిస్తుంది. ఇట్టి వస్తువులే అనే ఎట్టి నర్ణ్మయమూ లేదు. కూలీలను, చేవపలుపట్టే వారిని, కొట్లమీద గుమాస్తాలను, ఇండ్లలోని నాఖరీలను కవనవస్తువుగా చేసిన ఆధునిక కవులు ఉన్నారు. రేఖాగణితంలోని ఒక ఉపపాద్య పంచన మలకాద్దననావు చవయంతి సంపుటము 4: సాహిత్యము.

2200 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గణితాన్ని (౬౪4641.47) కావ్యవస్తువుగా చేసిన కవి ఒకడు ఉన్నాడు, కావలసినది వస్తువిశేషము కాదు. ఆనంద పరవశత పొంది, మానవ హృదయాన్ని ఎత్తుకొని తీసుకొనిపోయి, గగనవీథులలో విహరింపించే అనుభవము అయి యుండాలి. భావనానుభవములో గంభీరమై, ఉన్నతమై, విశాలమై భాసించగలదేదో అది. అట్లు భాసింపజేయగలవాడే కవి. శాంతావృత భావనా గభీరములో అనుభవము కవికి ఎంత విశిష్టమా, అది అంత సుష్టుగా మానవ హృదయంలో స్పందించాలి. అట్లు చిత్రించినవాడు కవి.

ఈ చిడత్రించడానికి తగిన భాషను, ఈ అనుభవము పాఠకునికి కలిగించగలిగే, ఈ వప్రబోధాన్ని పప్రోత్సహించగలి'గే భాషను కవి ఎంచాలి. వస్తుసౌందర్యమంతా శబ్బసొందర్యంగా కూడా పరిణమించాలి. అందుకు కావ్యభాష. పదముల ముఖ్యార్థ బోధకే కాకుండా లక్షణార్థ సూచనకుకూడా సరిపడాలి ఆ శబ్ద ప్రయోగము. ధ్వనివల్లనూ, ఛందోబద్ధలయగతివల్లనూ (శవణేంద్రయ గతమైన అనుభవము చాక్షుషానుభవముతో భావనలో మిళితమై, ఇతర ఇంద్రియాల అనుభవాలకు సూచనలను పొందించగలిగితే, ఆ వృత్తి భాపనలో [క్రమంగా పూర్ణతనొంది, అంశాలను, భాగాలను విస్తరింపజేస్తూ ఉండే చిత్రం సుకావ్యం. ఆ చిత్రం సుపరిశీలసలోనూ, చింతిత పరీక్షలోనూ, నిత్యానుభవములోనూ స్ఫురిస్తూ, కావ్యవస్తువుయొక్క [ప్రయోజనాన్ని ఉద్దేశాన్ని వ్య క్షపరుస్తుంది. ఇదంతా ఎంత తర్మగతమో అంత అంతర (కేరితముకూడా. కవియొక్క ఆనందం పాఠకులకు అంటురోగం వలె అంటుకొన్నప్పుడే కవనగౌరవము.

“దేవతల సమూహాలు చిక్కగా

గుంపులు గుంపులుగా

నేలమీదా, గాలిలోనూ .

రెక్కల ర్సుజ్ముధ్యమలతో

గుమిగూడెను.

వృషభసూర్యుని వసంతంలో

గూటినిండా గుంపులు గుంపులుగా పిల్లలు పెట్టిన

కొన్ని కావ్యలక్షణాలు పొరనంది జగన్నాథస్వామి 2201

భ్రమర యౌవనులు గుమిగూడి

నవతుషార పూరిత పుష్పచయాలనుండి

గడ్డి గూళ్ళమీదికి ఎగురుతున్నట్లు

వచ్చి చేరారు ఆ దేవతా సమూహాలు.

(గ్రామం బయటను గుంపులుగా కూడి

తెలిసీ ఆలియని రాజ్యవ్యవహారాల

చర్చలలో గొల్లు చేసే గ్రామీణులా

అన్నట్లుండెను ఆ తుమ్మెద గుంపులు.” మహాకవి మిల్టను చిత్రము ఇది. (ఇంగ్లీషులో ఉన్న సౌందర్యాన్ని నాకు చేతకాక తెలుగులో బాగా తేలేకపోయాను.) ఈ చిత్రానికి జీవమైన ఉపమద్వారా దేవతా సమూహాల రాక ఉనికి కళయెదుట పట్టము కట్టబడింది. కళ్లకు, చెవులకుకూడా సూచన కలదు. తుమ్మెద ప్రవర్తన దేవతలకు ఆరోపింపబడి వారిని కళ్లతో చూడగలిగే అనుభవము కలుగుతుంది. అంతేకాదు. తుమ్మెదల (ప్రవృత్తి ప్రయోజనాలవల్ల ఆ దేవతలవి కూడా ఊహించబడగలవు. తుమ్మైదలను మనుష్యులతో సరిపోల్చి ఉపమను పెంచడమువల్ల చిత్రం ఎక్కువగా విస్తరింపబడి పోషెంపబడినది. దేవతలు తుమ్మెదలను, తుమ్మెదలు మనుష్యులను, మనుష్యులు దేవతలను సూచించి ఆ చిత్రానికి పుష్టిని తెచ్చినవి ఆ ఉపమలు,

మరొక ఉదాహరణ షెల్లీ అనే మహాకవినుండి :

“నా ఆత్మ ఒక ఇంద్రజాలిక నావ

.న్మిదబోతున్న హంసవలె

నీ సుఖ సంగీతముయొక్క

రజత తరంగాలకై తేలుతున్నది” ఇందులో ఒక రూపకం, ఆ రూపకంలో ఒక ఉపమ మేళవింయై, ఒక భావవృత్తిని చితించినవి. కాని ఇట్టి కలయికను అంగీకరించని శాస్త్ర విమర్శకులు ఉన్నారు. చిత్రము మాత్రము ఎంత చక్కగా ఉన్నదిగదా.

2202 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము

భాషా శైలివలెనే రచనారూపం కూడా ముఖ్యమైన లక్షణం సుకవనానికి. కవనవస్తువు: దానిభాగాలు ఎంత వివిధములుగా ఉండి మిశితములై ఒకే చిత్రముగా నిషృన్నము అవుతవో, అలాగే భాషాశైలివలన పదార్థము ఎట్లు విన్యస్తమై అలరుతుందో, అలాగే రచనా రూపమువలన ఛందస్సుయొక్క లయాది గుణాలద్వారా కూడ వస్తు భాషాశైలి విశేషాలు చిత్ర నిష్పత్తిలో ఐక్యతను పొందాలి. ఈ ఐక్యతను భావనలో సంపాదించేది రచనారూపము.

ప్రతీ కవనమూ షునకు ఇష్టమై, మనకు కావాలనే కోరికపై భాసించే ప్రపంచ ఖండముయొక్క బుద్ధిచేత కల్పితమైన ఆదర్శ వ్యాపారము. ఈ కల్పన ప్రధానంగా రూపవిశేషము. రూపం యొక్క ఘనత దానిలో భాసించే మేళవింపు ఐక్యత; వస్తు భాషా శైలి ఛందస్సుల ఐక్యతావిర్భావం. ఇది చిత్రం. ఆ చిత్రం ఆ ప్రపంచాన్ని ప్రతిఫలిస్తుంది. ... కొందరు కవులు - ప్రతీ మహాకవీ అని చెప్పినా చెప్పవచ్చును - ఒకానొక స్థలంలో కేవల శ్రవణ సౌందర్యాన్నే ప్రతి ఫలింపజేసే ప్రయోజనంతో ఎంచిన పదధ్వని సమ్మేళనం చేస్తాడు. పద చమత్కృతులు, ధ్వనిని పోషించే వ్యక్తి నామవాచకాలు, (మోగే ధ్వ్యనిగల పదాలు, దీర్హాచ్చులు: మధుర ధ్వనిగల హల్లులు

  • ఇట్టి విశేష ధ్వనులనుగల పదాలను గుంపులుగా అమర్చడం అక్కడక్కడ కలదు. ఈ కూర్పు ఒకవిధమైన సౌందర్యావిర్భావము.

కవనఘనతకు ఇది ఒక్కటే లక్షణమని చెప్పను. భిన్న మతాలు ఉన్నవి. జీవితాదర్శములను పరిశీలనా పూర్వకంగా హృదయలగ్నమయేటట్లు చేయడం కవిత్వము. జీవితానుభవతత్వ వ్య క్తత్వము అని దానినే నిర్వచన చేయడము కలదు. విజ్ఞులు గ్రహించే అనుభవాన్ని హృదయస్పురణకు తేవడము. భావగతంగా విమర్శించే జీవిత తత్వం అది కాదు; సాంఘికాన్నత్యా పేక్షయావర్తమానాన్ని భవిష్యత్తుతో సంప్రదించి చేసే పర్యవేక్షణ. సంఘంలో ప్రజ్యలిస్తూ ఉండే ప్రశక్తులను (గ్రహించగలిగేటట్లు హృదయ గత భావాలను ఉజ్వ్వలింప జేసే పద్యము...ఇట్టి నిరూపణలోకూడా సౌందర్యానందాల స్థానం తగ్గిపోదు. అనుభవములోని సాధారణాంశాలను సర్వతోముఖమైన ఆదర్శాలుగా చిత్రించినప్పుడు ఈ సౌందర్య ప్రమాణముయొక్క నిష్పత్తి గోచరము కాగలదు.

కొన్ని కావ్యలక్షణాలు పారనంది జగన్నాథస్వామి 2203 ఇంతకూ ఆత్మ సంస్కారము, హృదయ గ్రహణము (పప్రధానమైనవి అని సర్వాంగీకారము. ఇందుకే కవి, పాఠకుల మధ్య విమర్శకులవంటి మధ్యవర్తి ఒకడు కావాలి. సామాన్య వాక్కులోవలెనే కవన విషయంలో కూడా తుల్యార్థులు ఇద్దరు. ఆ వాక్కును, ఆ కవనాన్ని పాందుపరచిన కర్త; దానిని సమన్వయించుకోవలసిన శ్రోత, లేదా పాఠకుడు. వీరిద్దరకూ మధ్యస్థుడు భాష్యకారుడు. కాని కర్త సర్వస్వతం(త్రుడు. . *సేన్తంగీకరించినవాటిని దూరంగాను నేను సంపాదించినవాటిని తృణంగాను చూసేవారు పదిమంది ఉంటూ ఉంటే ఎవరుగదా తీర్చు చెప్పగలిగేవారు? ఆ పదిమందికీగల కళ్లూ చెవులూ నాకున్న లాటివే; వాళ్లూ నేనూ అందరమూ ఊహించవలసిందే గదా! వారు దీనిని, నేను దానిని ఎంచితే, నా హృదయము దేనిని నమ్ముతుంది గదా!” అని బౌనింగు మహాకవి ఉద్దోషించాడు. (ఆబర్‌ క్రాంవీగారి వ్యాసంలోని ఒక భాగానికి అనువాదం) (కిన్నెర: సంపుటము 6, సంచిక 10, అక్టోబరు క్షేం5డ)

  1. యంంరంధిడుయాంా ( థ గం లర న | ర్స్‌స్ప్ట సహానా లో ద్‌ వ

మట్లవారిమింది మజికొన్ని చాటువులు తిమ్మావజ్ఞల కోదండరామయ్య

మట్లవాం సంస్థానము తెలుంగునాటి సంస్థానములలోం బేరన్నిక గాంచినది. మట్లవారు మహామైన్యముతో విజయనగర ప్రభువులకు సంగ్రామ రంగములయందు బాసటయమొ నిలిచిన మహామండలేశ్వరులు. కృతులు సెప్పి చెప్పించుకొనిన భాషావిశారదులు. విజయనగర రాజకుటుంబముతో వీరు వివాహాది సంబంధ బాంధవ్యములు గలిగియుండి రనంగా వీరి వంగగౌరవ మెట్టిదో విశదము కాంగలదు. కకుత్ధ్స విజయ మను రసవత్తర 'ప్రబంధమును రచించిన మట్ల యనంతభూపాలునకు6 బినతండ్రి యగు మట్ల వరదరాజు శ్రీకృష్ణ దేవరాయలవారి కల్లుండు. రాయలవారి కుమార్తె యగు వెంగళాంబ నాతండు వివాహ మాడెను. రాయలవారి కుటుంబముతో సంబంధము నెజపెన యీ సంస్థాన పరిపాలకులపై నానాండు వారి సంస్థానము నందుండిన భట్రాజులో, మజి యెవరో రచియించిన చాటువు లనేకములున్నవి. వానిలో నప్పటిదాంక నుపలబ్ధము లయిన చాటువులను గొన్నిటిని మాత్రము 1950 సంవత్సరము ఏప్రిలు నెలలో ఆంధ్రపథత్రిక సచిత్ర వారపత్రికయందు “మట్లవారిమీ6ది చాటువులు” అనుపేరం బూర్వము ప్రకటించియుంటిని. ఇటీవల నా సంస్థాన పరిపాలకులమీ6దివి మజికొన్ని చాటువు లుపలబ్ధము లయినవి. మట్లవారిని గూర్చిన పద్యములు, శాసనములు, నితర విశేషములు గల చారిత్రక తా *క్టూడుండు. ఆంధ్రపత్రిక సచ్చితి వారపత్రిక సంచికలు 5-4-1950, 12-4-1950, 19-4-1950.

మట్లవారిమీది మజికొన్ని చాటువులు. తిమ్మావజ్ఞల కోదండరామయ్య 2205 సామగ్రిని ప్రసిద్ధ విద్వత్కవులుః “శతక వాజ్మ్బయ సర్వస్వ” (గ్రంథకర్తలు నగు శ్రీవేదము వెంకట కృష్ణ శర్మగారు కార్వేటి నగర సంస్థానమునుండి సేకరించి యుండిరి. మట్లవారిని గూర్చి పరిశోధనము సలిపి నేను వ్యాసములు ప్రకటించి యుండుటచే వారు తమ సేకరమునెల్ల నా కొసంగి యం దేవేనిం (గొత్త విషయము లున్నచో వానిని నన్ను వెల్లడింప6 గోరిరి. అందు. బూర్వ 'ప్రకటితములయిన చాటువులతోం బాటు మజికొన్ని క్రొత్త చాటువులును గానవచ్చినవి. అవ్యవస్థగా, నొక క్రమమునలేక కలసిపోయి యుండిన యాచాటువుల నెల్ల నాయారాజులమీందివి వేటువేబుగాం గూర్చి వానిలో నప్రకటితములయిన చాటువులను, గ్రొత్తవానిని మాత్రమే యిందు6 (బకటించుచున్నాండను. మట్లవారి శాసనములను మజొకప్పుడు ప్రకటింతును. హృద్యము లయిన యీ చాటువులు మట్లవారిని గూర్చిన నూతన విషయములను దెలియం జేయుచు. జారిత్రక ప్రాధాన్యము గలిగియున్న వనుటలో సందియము లదు. మట్ల అనసంతరాజు క॥ ఎంతటి వారలు. దమపను లంతయు సమకూరుదాంక నణంగుందు రయా! కుంతీతనయులు గొలువలె మంతనమున విరటుచెంత మట్ల యనంతా!

2206 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము ఉ॥ “ఎంచంగలం డనంత వసుధేశుని యిక్షు వనంబు నోళ్ల ఖం డించిన నక్కలన్‌ విషపటిష్టపు6 బద్యము6 జప్పి వానిని ర్జించిన నింటిపేరు దయచేసిరి నక్కలపాటివా రటం (7) చంచిత మొప్ప జెడ కవినాథుని పద్యఫల (ప్రభావతన్‌. పీ॥ బలిమి నేదులఖాను పట్టణం బదరెను గోలకొండకుం బుట్టె గుండెదిగులు లా *ఈ పద్యము “నక్కలపాటి సంజీవరాయకవి” రచించినదిగా చాటు పద్య రత్నాకరమునం గలదు. అం దిట్లు కలదు:

“మల్లె యనంత భూపాలుని చెజకుందోంటను నక్కలు పాడుచేయ నా భూరమణుం డీ కవిరాయనిం బిలిచి నక్కలు పోవునుపాయముం జెప్పు మనెనంట! అంతట నీ కవి పద్యమొకటి తాటియాకుపై లిఖించి యిచ్చి యాయాకు6 దోంటవాకిటం గట్టించు మని చెప్ప నాతం డట్లొనరింపంగా నక్కలరాక తగ్గెనంట! ఆ పద్య మిది:

క॥ ఆశీవిషసమ మగు నా

యాశుకవిత్వంబుచేత నటు వంచకముల్‌

నాశము గావలం జూడుమ

హీ శాంభవి! చౌడమాంబ! హే శర్వాణీ! అట్లు నక్కలకు వాకట్టు కట్టుటవలననే రాజుగారు తన కాయింటిపే రొసంగి నట్లు పద్యమునం జప్పికొన్నాండు.

ఉ॥ ఎంచంగలం డనంత వసుధేశుని యిక్తువనంబు నోళ్ల ఖం

డించిన నక్కలన్‌ విషపటిష్టపుం బద్యము. జెప్పి వానిని

రించిన నింటికేరు దయచేసిరి నక్కలపాటివా రటం

చు......యయయటలయలలలలలనీ ఇందు లుప్తమయిన భాగము పయిచాటువునందు6 గానవచ్చుచున్నది. నక్కలపాటి సంజీవరాయకవి పద్యముగా నున్న యీ పద్యము “కవి చౌడప్ప" పద్యముగా నా లుప్త భాగమువలన6౬ దేలుచున్నది. ఇది యెల్లో? చౌడప్ప మట్లెవారి సంస్థానమునుండియే తంజావూరు పోయినట్లు తెలియుచున్నది. కానం బయిపద్యము “కవి చౌడప్ప"దే యయియుండు ననుటలో సందేహము లేదు. “ఆశ్సీవిషసమమగు" నను పద్యము కూడం గవి చౌడప్పదే యయియుండును. నక్కలపాటి సంజీవరాయకవిదే యనుటకు. బద్యమునం గాని, మజి యెక్కడం గాని యాధారము కానరాదు. శతకవాజ్బయ సర్వస్వముకూడ నీ పద్యమును “కవి చౌడప్పది” గానే కేర్కొనుచున్నది. చూడుండు. “శతక వాజ్బయ సర్వస్వము”.

చాటుపద్యరత్నాకరము - పుట 32.

మట్లవారిమీది మజికొన్ని చాటువులు తిమ్మావజ్ఞల కోదండరామయ్య 2207 కటకంబు ఢిల్లియు6. గకవికలై పోయె నుత్తరదేశంబు తత్తరిం చె6 ,

బాళెముల్‌ జడిసెను భమసె6 దంజాపురి మధురకోటను జేరె మందుగుండు కలగుండుపడి చచ్చె6 గంచి తల్లడ మందె6 బడివీడు వేలూరు పగిలిపోయె గీ॥ మీజి నీవును రావెళ్ళవారి గెల్చి జయము ఛచేకొన్న వార్తలే సకలదిశల సమరరఘురామ! గెల్పుల సార్వభౌమ! విజయ హనుమంత! మట్లెల్ల విభుననంత! సీ॥ కర్ణాటకక్షో ణి గడికిం బెట్టనికోట యాంధ్ర మండలికి వజాంగి జోడు యవనాశ్వపతికి సాహసకశాఘాతంబు అత్వ్ముగ గజపతి కంకుశంబు గిరి దుర్గముల కెల్ల నుజుముల దంభోళి స్థలదుర్గ నిర్బంధ సాధనంబు పరరాజదాసుల పాలిటి దినగండ మన్యభూపతుల కల్పాంతవహ్నా తే॥ కడంగి నాడాడి మత్తిట్ల కావరించి ం కడంగి బిరుదులు గలవారె గండవీరు ఇలంగి నీమోల నేరాజు చెనకం గలండు విజయ హనుమంత! మట్లెల్ల విభుననంత! ఓీ॥ గండరబాల! నీ ఖడ్గంబు శత్రు భూ మండలాధీశుల గుండె దిగులు దేవచోళ కులప్రదీప! నీచే నని అయివరగండ! నీ యశ్వహేషాఘోష

2208 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యాఖుదా కర్ణ శూలాయుధంబు కటకపురీ చూరకార! నీటెక్కెంబు పెక్కు మన్నీలకు. జుక్కడాలు గీ1॥ అవును గాకను నీఢాక కళికి రాజు (లెల్లగ కుడు?) కూర్మరాజు వైరి మట్ల యెల్ల ధరాధిరాణ్మణి యనంత! ఉ|| కొద్దిని రాండు బెట్టుజికి కోటలు6 గొమ్మలు గన్న శూరు. డా (గద్దరి గబ్బ్చిరాచపులి గండర బాలుండు మట్లనంతు. డే ప్రొద్దున వ్రచ్చి భూభుజుల పొంక మడంచను గల్గినాండు మీ ెద్దజికాలు సాగ వింకం (బేలకుండీ కడు మన్నెభూపతుల్‌. క॥ భట్లన్న సమరభూముల పట్లన్నను డింప దాని (ప్రాభవ మేరా యిట్లా నెజఖుంగవలదా మట్లెల్లమరాజనంత! మానుషవంతా! కృ॥ సతులముందర నీటు సమరంబులో6 బాటు వెదకు మన్నె కొమాళ్ల వెన్నుతరటు పాళేన బెక్కులు బవరాన (మొక్కులు (మొక్కు మన్నె కొమాళ్ల ముక్కుంగోయు గరడిలో లాగులు కదనాన జాగులు చేయు మన్నె కొమాళ్ల శిరము కొట్టు దొరవద్ద మురువులు దురములో6౬ బరువులు పాజు మన్నె కొమాళ్ల పాలి విటుండు గీ॥ అనుచు ని న్నెంతు రేప్రొద్దు నాంధ్రసింధు మగధమాళవ నేపాళ మత్స్యసభల సరస గుణధామ! గెల్పుల సార్వభౌమ! విజయ హనుమంత! మట్లెల్ల విభుననంత!

షుట్లవారిమీది మజికొన్ని చాటువులు. తిమ్మావజ్ఞల కోదండరామయ్య 2209 ఫీ॥ చటుల సర్వదిగంత! శ్మతురాజ కృతాంత! మహితరూప జయంత! మట్లనంత! యవనాశ్వ రేవంత! ధవళకీర్తి నితాంత! మకుటకీర్తి నితాంత! మట్లనంత! శరణాగతోదంత! షణ్ముదిత స్వాంత! మనువంశభాస్వంత! మట్లనంత! గీ॥ పరమహీకాంత సిద్ధాంత పటలి కాంత! టలలులమట్లినంత! శ్లో లిఖితం ధాతృలిఖితం హరిశ్చంద్రవచో వచః సు(గీవాజ్జా యథైవాజ్ఞా మట్లనంత మహీపతేః. మట్ల కుమార అనంతరాజు మ! భువి నీడెంతు. గుమారనంతవిభుతో భూతిప్రభావైభవా హవవేగద్యుతి చిద్విలాస సుకళా యౌదార్యశార్యంబులన్‌ భవు భానున్‌ భిదురాస్తు9 భీష్ము భుజగప్రత్యర్థి భూర్యద్రిభే ద్భవు భౌమేశ్వరు భోజు భానుసుతునిస్‌ బంధీరు భర్గాత్మజున్‌. ఉ॥ తెట్టు పవిల్చి శ్రుత మదించుచు ని న్నెదురించుసేనలన్‌ దట్లకు వంచి వాజిని ముదంబునం బై దుమికించి వేగ బల్‌ గట్లకుం బాజందదోలి శితఖడ్గమునన్‌ విదళించి తౌ భళీ! _ మట్లకుమారనంత! నృపమత్తతరాడ్డ్విప సింహ విక్రమా! సీ॥ నీఖడ్గ మొకదిక్కు నిర్గంబు బెట్టినం గర్జాటకం బెల్లం గల6గిపోవు6

2210 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము బరివారమెల్లను భత్యముల్‌ పట్టినా యరవరాజ్యం బల్ల నరసి యుటుకు వెలిగుడారము నీవు వేయంగా సెలవియ్యల6 బడమటి ఘట్టముల్‌ భగ్నమౌను విజయడమారంబు వేయించినంతనె తురకదేశంబు తుందుడుకు పడును గీ॥ రాజదేవేంద్ర! నీయంత రాజు గలండె భళిర! యేమనవచ్చు నీభాగ్యమౌర! తాత తండ్రుల మించితౌ ధరణిలోన మట్ల తిరువేంగలేంద్రు కుమారనంత! సీ ప్రత్యర్థులకును వాగృంధనం బైనట్టి మత్స్య ధ్వజం బిచ్చె మట్లప్పురికి6 " గపట శత్రువులకు గర్భముల్‌ పగులంగా మహాచ్చైన ముత్యాలకుచ్చు లిచ్చెం చెంపజీ పగతురు కంపంబు నొందంగా | " దయచేసి పికిలి పూదండలిచ్చెం నల్లుండును గొమాళ్లుం జల్లు నౌ నని నుతుల్‌ సేయ రత్నాంగి కుళ్ళాయి యిచ్చె గీ॥ రాజసం బను సామాజ్య తేజి నెక్కి వచ్చె నాసామిరూపున6 బచ్చవిల్తుం గేరి నవ్వుచు నౌర! కుమారనంత భూరితేజుండు మట్లెల్ల(ఏభూభుజుండు. సీ॥ నీధాటి పటువేగ నిర్భిన్నరవికోటి నీయీటె దంభోళి నిశితధార

మట్లవారిమీది మజికొన్ని చాటువులు తిమ్మావజ్ఞల కోదండరామయ్య 2211 నీభేరినాదంబు భూభృద్విభేదంబు నీ డాలు మదపుటేనికల తిండి నీకఠారి శఠారి నృపభిన్నపకుఠారి నీకరం బరిరాజ భీకరంబు - నీకోప మరిభూప నికరసంతాపంబు - నీమాట కాకుత్సృ రామశరము

గీ॥ నీవు కడు హెచ్చు రిపులల్ల నీకు లొచ్చు తగదు చాలించు మసమానదండనంబు అనుచు శరణాగతార్థులై రహితవరులు

...... మట్ల తిరువేంగళేంద్ర కుమారనంత!

చ॥ వితరణవంత! మట్ల తిరువేంగళనాథు కుమారనంత! నీ చతురవచః ప్రసంగములు సౌప్తెకపర్వము లోభికోటిెకిస్‌ జాతులకు నాదిపర్వము కవీంద్రులకెల్లను గర్జపర్వ ము ద్ధతులకు భీష్మపర్వము ('ప్రధానులకున్‌ గురుపర్వ మిద్ధరన్‌.

శ్లో! జయసూక్తి యశశ్శీకా శ్రీమన్నట్ల కూలాంచితా, కుమారానంత రాజేంద్రముదా సదాజవల్లభా.

ఇది మొహరునందలి శ్లోకము.

మట్ల వంకటరామరాజు సీ॥ మారాజు సలలిత మతి వీరఫణిరాజు ధర జనపాలన ధర్మరాజు ప్రాభవ మలరంగ వైభవసురరాజు చారుతరముగ ధైర్య శైలరాజు మహిత తదంగనా మదరిపు మృగరాజు

2212 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము అమితవిమల సద్గుణాబ్ధిరాజు సత్యంబునకు హరిశ్చం[ద మహారాజు తగ గానమునకు గంధర్వరాజు గీ॥ పుడమి బుధు లెంచ విద్యల భోజరాజు రాజితం బగు సిరులకు రాజరాజు మంజుతరకీర్తి రేరాజు మట్లరాజు రమణ రతిరాజు వేంకటరామరాజు. ఉ|| గట్లదరెన్‌ దిశల్‌ చెదఠె. గంధులు ఘూర్జిలె దారకావళుల్‌ చిట్లెను జెట్లు పెల్లగిలెం జందరవందర లయ్యజాండముల్‌ పెట్టెను నీ సముదృటహ భీమధణంధణ ధంధణార్భటిన్‌ మట్లకులాభిరామ! నవమన్మథ! వేంకటరామభూవరా! ఉ|| భట్లు మహీశులున్‌ బిరుదుబంట్లును జాణలుగాణలాశితుల్‌ జట్టు (ప్రధానులున్‌ నెజవజీరులు సంగడిరాకొమాళ్లు నె చ్చోట్లను సందడింప బలసూదనుకైవడిం గొల్వుదీర్చి తౌ మట్ల కులాభిరామ! నవమన్మథ! వేంకటరామభూవరా!

ఉ|| ఎట్లు లిఖించు వేల్పు వెలయింతుల కీల్ణడకొట్లు కూర్మిరా కట్టును మోవికాట్లు విరిగుత్తుల ్రేట్లును నీకరాచురీ పోట్లకు లోంగి గట్లకయి పోయిన పందనృపాలకోట్లకున్‌ మట్లకులాభిరామ! నవమన్మథ! వేంకటరామభూవరా!

ఉ॥ ఉట్లు వజాంగనాజనము లుంచిన యీ నవనీతకందపుం జట్లను డించి మెక్కియును జాలక నాకలమోవితేనెలో గుట్లు బయల్‌పడన్‌ రహినిగ్రోలిన వేల్పులు మిమ్ముంబోవుతన్‌ మట్ల కులాభిరామ! నవమన్మథ!వేంకటరామభూవరా!

మట్లవారిమీది మణికొన్ని చాటువులు తిమ్మావజ్ఞల కోదండరామయ్య 2213 క॥ "స్వామి! విను మట్ల వెంక (టామక్షితిజాని! నీదు రణజయభెరీ ఢామండుమధ్వని విజబుగండె వేముల చినబసివినేని వేంకట నృపతీ! క॥ లా కేత్వ మిచ్చు దొరలకు జేకొని నీపాదరజము శిరమున నిడినన్‌ జోక వహాంతురు భువిలో వీంక బుధస్తోమ! మట్ల వెంకటరామా! మట్ల వెంకట రాఘవరాజు చ॥ విరివిగ మట్లవంశభవు వెంకట రాఘవరాజు కీర్తి భీ (7) కర యవుదార్య రూపముల కల్కి కళంకము. జెందె సోముండున్‌ గిరి గుహం: జొచ్చె నభ్రమును ఈదులంజందెం గృతాపరాధు.డై మరుండు ననంగు. డయ్యు నింక మానవనాథులు సాటివత్తురే? పలా

*ఇది నక్కలపాటి సంజీవరాయకవి రచించిన పద్యముగా “చాటుపద్య రత్నాకరమున; బేర్కొనంబడినది. చూడుండు-

“మల్లె వేంకటరామరాజుగారికిని వేమల నేంకటరాజాగారికిని నిరంతర వైరము. అట్టి సందర్భములో నక్కలపాటి సంజీవరాయకవి యొక్క కందముతోనే యిరువురివలనను బహుమానము లందెనంట! ఆ కందపద్య మిది -

“స్వామి! నిను మల్లె వేంక

(ట్రామక్ష్మాజాని నీదురణజయభేరీ

ఢామధ్య్వని విని జరగండె

వేమల చినబసవరాయ వేంకటనృపతీ”

ఇతండు ఎవరిని దర్శింపంబోయినప్పుడు వారిని సంబోధించి సమన్వయించి తన యుక్తి సామర్థ్యములం జూఫీ వారి మన్ననల నందియుండు. ఇంచుక దోషమున్నను నీతని యుక్షిమ్మాతము కొనియాడందగియున్నది!

చాటుపద్యరత్నాకరము - పుట 31.

2214 ఫందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము సీ _ శ్రీమన్మహారాజనేఖర! విను భవ న్మహిత వంశజుండు కుమారనంత రాజు నిగూఢార్థ రచనం గుముద్వతీ కల్యాణ మనియెడి (గ్రంథ మమర రచియించె మజియును రాజయ్యపుత్రుండై రాజిల్లు చేంకటరామరాజు అభిషిక్త రాఘవం బనెడి [గ్రంథం బొక టంది పెం పొందెను నఖిలదిశలు గీ|॥ ఇట్టి గ్రంథము లెల్లను హితవు మీజ విని ప్రకాశింప6 చేయుండీ పృథివియందు సమరరిపు భీమ! మట్ల వంశాభ్ధి సోమ! రాజదేవేంద! వంకట రాఘవేంద! (కిన్నెర: సంపుటము 6, సంచిక 11, నవంబరు 1954) + శు ర లల రో

మన రచనా శిఖరాలు మనూనా వ్య కవితా రచనంలో భారతీయ కవితా రీతి విశిష్ట వ్య క్రిత్వం కలది. అందునా తెలుగు కవిత మరీ నాగరికమైంది. సాంస్కృతీయ రచనా మార్గాల పసందుల్ని తనలో లీనం చేసుకొని మన రచన విలక్షణవైచిత్రీ చితణంతో అలరింది. మహా కవితా విశారదుల ప్రతిభాజనితమైన ఆంధ్ర రచన అసమాన [గ్రంథావళితో ('ప్రష్పుల్లమైంది. నన్నయభట్టారకుని ప్రసన్న కథాకలితార్థ యుక్తితో మార్గము తీసి ప్రబుద్ధమైన ఆంధ్ర కవిత తిక్కన, నన్నెచోడ, శ్రీనాథ, పోతన, పాల్కురికి, నాచన సోమన, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, వేమనార్యాదుల ప్రతిభా సముజ్వలితమైన అసామాన్య కృషితో మూర్తిమత్వము ధరించి మించింది. పురాణ ప్రబంధకావ్య ఫణితుల్లోంచి మార్గ దేశి కవితారీతుల్లో ప్రత్యేక వ్యక్తిత్వం పొందిం దీ తెలుగు కవిత్వం. అయితే ఆయా కాలాల్లో ఆయా రాజాశయకవనాలు ప్రజల కంటే సన్నిహితమై వున్నవిగా రూపించవు - ఏ లవలేశమో తప్పిస్తే. అవును. ప్రజల అభిరుచులు, కష్టసుఖాలతో రాజాదరణ పాతులై బంగారు తూగుటూయలల్లో కప్పురవిడెవుందుచు సుఖోపవిష్టులయిన కవృలకు సంబంధమేల?

2216 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కొన్ని శతాబ్దాల పిమ్మట విశ్వమంతటా కల్గినట్లే మనలోనూ వైతన్యం కల్గింది. అర్ధ్థశతాబ్దికి పూర్వం వీరేశలింగం పంతులు తెలుగుజాతికి మేలుకొల్చులు

పాడేరు.

కందుకూరి ఉత్తేజంతో ఆంధ సంఘమూ, సారస్యతమూ సంస్కారం పొందసాగేయి.

గురజాడ, గిడుగులు ఆంధ్ర ప్రజా జీవనంలో ప్రవేశ మార్గం ఏర్పరచేరు రచనకు.

తిరుపతి వేంకటకవులు తెలుగువారిలో కవితాభిరుచికి పాదులు పెట్టేరు.

చిలకమర్తి చిలుకూరు, కట్టమంచి, వేటూరు, పంచాగ్నులు, సురవరం, ఏటుకూరు, అడవి బాపిరాజాదులు ఆంధ్ర సాహితీరంగంలో చిరస్మరణీయమైన కృషి చేసిపోయేరు.

అయిననూ వారి ఆత్మలు నూత్న కాయాల్ని ధరిస్తాయి. ఉత్తమ కవితా లీలల పాఠకుల్ని ఉన్నత పథాలకు వీసుకపోతాయి.

వర్తమానంలో ఆంధ్ర కవిత్వ సంపద బహుముఖంగా విస్తరిల్లుతూనే వుంది.

నవ్యులగు వర్థమానులకు మార్గదర్శకులయి విశ్వ కవితా సంసారమునకే సుందరాలంకారాల్ని కూర్చి తెలుగు కవితల తేట నిగ్గుల కమ్మదనాన్ని రుచిచూపి అలరించిన సరస్వతీ అవతారమూర్తులగు కొందరు మహాంధ్రరాజ్యాన్ని మధురరస రాజ్యంగా వెలయించేరు.

ఆహా! అలనాటి వారి కవితా కల్పనాలత దినదిన (ప్రవర్ధమానమై నవకుసుమ వికసిత సౌరభముల అలరారుతూన్నది.

లలితా రూపమున తృణకంకణ ధారిణియై రమ్యాలోకమున విహరిస్తూ.

జలాంజలితో మల్లికామూర్తి యై ఊహాగానం చేస్తూ, సెలయేటి పాటల శుతికల్పి కృషీవల జీవనం చేస్తూ క్రమానుగత శోభల పరిపూర్ణరూప యౌవనముల మెరసి మరయించింది.

ఏ సుప్రభాతాన గురజాడ మహాకవి ముత్యాలసరాల క్రొత్త తొడవులతో తెలుగు తల్లిని కలకలలాడించెనో, ఆనాటి మొదలు నేటివరకూ ఆంధధ్రకవితా వధూటి మురిపము గొలుపు నవ్య రచనా పథముల ముందడుగు వేస్తూన్నది.

వేంకట పార్వతీశ్వర కవుల ఏకాంత సేవతో కృష్ణపక్షవీథుల చీకటి బాటల మధుర సుఖాన్వేషణమున పయనించి, వేదుల దీపావళీ కాంతుల ఉత్సహించుతూః

మన రచనా శిఖరాలు. మనూనా 2217

పింగళి కాటూర్ల సౌందర్య నంద నందనం దర్శించి, విశ్వనాథ కిన్నెరసాని పాటల మాధుర్యం క్రోలి, వేయిపడగల చిత్రభంగిమల్ని అరసి, ఉన్నవవారి మాలపల్లెలో సామరస్య మెరిగి, శివశంకరుల హృదయేశ్వరిని పరామర్శించి, తాప్‌వారి జనవాణి కాగడా వెళ్గులలో, గడియారమువారి శివభారతము నెరుగుచూ, సుబహ్మణ్య శాస్తుంల కథావిలాసాల్ని తిలకించుతూ, నాయని ప్రణయయాత్రా విశేషాల్ని తలియుచూ, బహు చిత్ర విశిష్ట కవితా వాహినులలో యానంచేస్తూ దేశ కాలాలకు అతీతమౌ రచనా బ్రహ్మాన్ని అర్చించి ఆంధ్రావళి ధన్యమౌతున్నది.

అద్భుత శక్తియుక్తులతో విశ్వజీవనమున నలుదెసలా స్యేచ్చ్భగా విహరించే మహదవకాశాన్ని ప్రసాదించు శతగుణోత్సాహం యువలోకాన కల్గించే ధీమంతువైన రచయితలు సాహెతీ రాజ్యాన నాయకత్వం వహించటం జనావళి అదృష్టకారకమయింది.

కమ్మని తెలుగు నుడికారపు సొంపుల రసరాజ్యంలో అపూర్వ పాత్రల సృష్టించి చిరంజీవత్వమిచ్చిన జాషువా, కరుణశ్రీలూ,

జగన్నాథ రథచక్రాలు వచ్చి బాధా సర్పదష్టులకూ, దగాపడిన తమ్ములకూ సుగతుల కల్పిస్తాయని ఓదారుస్తూ, నవలోకం దర్శించి విశాలాంధ్రావనినీ మరో ప్రపంచం వేపు నడిపించిన అనన్య సామాన్య కవితావేశం కల మహాకవి శ్రీశ్రీ,

సామాన్య సంసారుల విషమజీవన వలయపు కంచుగోడల్ని భేదించి వారికి స్వేచ్భాసుందరమయిన సౌఖ్య జీవన వాతావరణం ఒనకూర్చి తరింపజేయాలనే నూత్న రచనాశయంతో సాహిత్య రంగంలో ఉద్యమించి అభ్యుదయ దృక్పథానికి మార్గదర్శకులైన కొడవటిగంటివారూ, అట్టి వ్రతిభాశక్తులే కల గోపీచంద్‌, బుచ్చిబాబు, పద్మరాజులూ,

మధుకీలల జ్వలియించే విప్లవాశామూర్తిగా స్త్రీమూర్తిని ఆరాధించే మల్లవరపువారూ,

ఆలుగు సమాజంలో పాతరోతల్ని రూపుమాపి యువతీ యువకులకు స్వేచ్భా (ేమారాధనాన్ని నేర్పే విశ్శంఖల (ప్రేమ తపస్విమై అసదృశ రచనా శిల్పసాధకులైన చలంగారూ,

సంసారాల్లోని మధుర హాస్యఘట్టాల్ని కథావస్తువులుగా సంగ్రహించి పాఠకుల హృదయాల్ని గిలిగింతలు పెట్టే మునిమాణిక్యంవారూ, -

2218 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము

విభిన్న సారస్వత రూపాల్ని తమ కూలంకష విజ్ఞానంతో, తరచి

_ సాహిత్యసర్వస్వపు నిగ్గుల మనకు రుచిచూపిన విజ్జ విమర్శకులు శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, ఇం[దకంటి ప్రభృతులూ,

వ్యంగ్యరచనా పారీణులు మాచిరాజు, జరుక్‌నాథ్‌లూ, అనంత గంభీర జీవన లహరిలో మధురానుభూతుల్నీ మనసు కరగించే ఆవేదనల్నీ రమ్యంగా చిత్రించే కళాశీలియెన నాటికాకర్త గోరా శాస్త్రిగారూ,

అన్యభాషా వాజ్ఞయాల్లోని రచనాహృదయాన్ని ఆంధ్రీకరించిన చ(కపాణీ, నీలకంఠం, బొందలపాటివారూ,

అగాధ జీవనగాథల అంతరంగాలన్ని తరచి తరచి హృదయార్హుంగా రచించే విశ్వం, బైరాగి (ప్రయాగ కవితిలకులూ,

(ప్రజలతో కాలంతో మహావేగంగా అనుసరించి లోకస్టుల స్థితిగతుల్ని అర్ధంచేసుకొని నవ్య కవితోదయ కాంతి కిరణాలై తనరిన అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి మున్నగు కవి మితులూ,

కల్పనా వైచ్యితితో హృదయాల్ని కదలించే ఉత్తమ కథారచయితలు శ్రీ బలివాడ కాంతారావూ, జీవితపు లోతుల్ని చూసి సహజసుందరంగా సృజించి గంభీర భావోన్మీలనం చేసే శ్రీ కాళిపట్నపు రామారావూ, మానవ గాథల్లో ఆనంద వేదనల్ని విశోధించి కళావిలసనంతో రచించి తెలుగు కథానికకు కొత్త సింగారం కూరుస్తున్న శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రిగార్లవంటి వ్యుత్పన్నులైన వర్థిష్టువులూ ఆంధ సాహితీ క్షేత్రాన్ని ఫలవంతమూ, (ప్రకాశవంతమూ చేస్తున్నారు. "

ఈ సుక్షేత్రంలోని ఫలాల్ని అనుభవిస్తూ కల్ల కపటాల్లేక కలకల్లాడే మధుర మానవత్వంలో మనమంతా వర్ధిల్లుదాం.

సర్వతోముఖ విజ్ఞానమూర్తుల కవితాసాధనలో ప్రవర్తిల్లిన ఉన్నత రచనా శిఖరాల్ని దర్శించే జీవితాశయంతో మనమందరమూ పురోగమిద్దాం.

(కిన్నెర: సంపుటము 6, సంచిక 111, నవంబరు క్షేం54) ర ళా స

రసశక్తి

ట్స

హిమకర రసస్వరూపుడగు పరాత్పరుని తేజము సమస్తము తత్సుందరతా స్ఫోరకముగ సర్వ(పప్రకృతియం దనుగతమై, విహితమై ప్రభాసించుచున్నదని విశిష్ట మతము. చరాచరమగు పరమ సృజనమునందు విలక్షణ చరితుడు మానప్పుడు నిసర్ణరమణీయ శేముషీ వైభపగుణోదాత్తుడు. అతడు నిఖిలేశ్వరుని స్నిగ్రకమనీయ చిదంశము సమంచితముగ గలవాడు. పరబ్రహ్మ స్వరూప్పుడు, వైజమగు నానందోద్భ్బాసితు డనినపు డాతని వాసనావాసితుడగు మానవుడు సౌందర్యచ్భవి కలవాడనియే తర్కము. ఈ తర్కము సుమనస్కుల కెల్లఅకును ప్రజ్ఞాభాస్కర భాసురమగు నుత్పథము. ఏతద్విశిష్టగుణోత్కృష్టుడయ్యు మనుష్యుడు కర్మ [ప్రభావమున దనకుగల సర్వస్వమును వ్యంజితము సేయలేకపోవచ్చును. కాని విశిషస్టుడగు మానవుడు తద్విషయమున విశేష (ప్రయత్నమును దప్పకచేయును. ఈ సలుపు సర్వ వ్యవసాయఫలితము చిదానందస్వరూపావిష్కరణము. ఈ చిదానందస్వరూప సాక్షాత్కార విషయమున నొక కోణమున మానవుడు ప్రదర్శించు శక్తినిగూర్చి

యుక్తికొలది గమనింతము. [ప్రకృతకోణము రసశక్తి

మానవుని జంతువిలక్షణుని గావించి సర్వసృష్టి స్థిత సౌందర్య్యగహణ పారీణుని జేయునట్టిది రసశక్తి. సమస్త వస్తు నిస్తులమగు 1ప్రపంచమునుండి నాందర్య సంస్క్ఫురణమే మవూనవున కేతత్కార్యకలాపమునకు వలయు -... విశిష్టసత్త్వము నొసగుచున్నది. ఇట్ణయ్యు మానసికమగు ప్రతిప్రస్ఫురణ శక్తికిని స్పందనవహింప సమర్థమగు నింద్రియమో, అంగమో, యేదియో యొకటి యుండపలయును. సమాలోకసశక్తి నేత్రమునకుసు, సమాకర్ణన బలము కర్ణముసకును

2220 పందిరి షుల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము గలుగుట ప్రభృతి విషయము సకల జనులకు సువిదితమే. శక్తియన మానసికమగు (పేరేపణము బలమున నేదేని అవయవద్వారమున నాయా వస్తుతత్త్యములను (గ్రహింప నవసరమగు సామర్థ్యము. సమస్త (ప్రకృతి విలసితమగు సౌందర్య స్ఫురణ కలుగవలయుననిన నేదేని అవయవద్వారమున నది సూటిగ సాధ్యము కాదు; మజీ సౌందర్యమయమగు మానవుని హృదయ సత్త్వమాధారముగ నాయా యవయవసహకారమున జరుగును. (పతి విశిష్టమగు నవయవమునకు నాయా పరిస్థితుల కనుగుణముగ విలక్షణమగు (గ్రహణశక్తి యుండును. ఈ [గ్రహణశక్తి మనస్పంకల్పము వలన సంసిద్ధించుట తెల్లము. వస్తుగతమగు నాందర్య గవేషణమున నాయా యవయవములు కంపన వహించుట యనునది వానియందలి సామాన్య ధర్మము. దీనినే కళాజ్ఞానమందురు. ఈ సౌందర్యదృష్ట్‌కి జవికి, గంటికివలె బ్రత్యేక స్థానమనునదికాని, ఏకాగత యనునదికాని లేదు. అది యన్నిటిసహాయమున వ్యాపించి (పప్రవర్థమానమగును,. ప్రకృతిగతమగు వస్తువునకు గల సుఖదుఃఖానుభూతులకును, సౌందర్యగవేషణమునందు వాని ఛాయలకును సంబంధములేదు. ఆ సౌందర్యగవేషణము స్వేచ్చగు విశిష్టముగ నాయాసమయము లందు మధురానుభూతుల నందును, క్షణికములగు న్నుదేకములకు లోనైననే సౌందర్యాన్వేషణములు జరుగునని పరమానందమగు పారవశ్య వెషయమున జింతించుట పొరపాటు. సౌందర్యాన్వేషణమున నానందకరమగు నింద్రియజ్ఞాన మవసరము కాదు. అనగా నహంభావ పరిత్యాగ మవసరమని భావము. అహంభావమన “గర్వ”మని కాదు - ఇట “నేను, నో మొదలగు వాని నుద్దేశించినదని సంగతార్థమునే సం[గ్రహింపవలెను. సౌందర్యాన్వేషణమున, లేక విశిష్ణమగు నీ యానందవిషయమున బారవశ్యమునందు సహృదయము మాత్రమే కావలయునుకాని లౌకికములగు నెట్టి వాదములుకాని, అభ్మిపాయములుకాని కలుగునెడల తద్విరుద్ధములుగా బరిణమించును. మనస్పృంబంధమగు జ్ఞానమున్నంత వజకు హృదయ సంబంధమగు నానంద ముదృవించుటకు వీలులేదని సారము. సౌందర్య ప్రభావాన్వేషణ సమయమున వ్యథాకులమగునే

కించిదిర్యద్రియ బోధమైనను మధురముగను, మనోమోహనముగను బరిణతినందును. కళాఖండములందును, సౌందర్య సమ్మిశ్రితములగు నెట్టి కావ్యములందును నాయా పాత్రము లనుభవించు సుఖదుఃఖానుభూతులు నిజములుకావు. అవి

రసశక్తి . హామళర 2221 ప్రకృతియందలి వానికి బ్రతిచ్చాయలు మాత్రమే. ఇది ఎట్టిదయ్యును మనము తత్సందర్శనమున ననుభవించునది సుఖదుఃఖములనునవిమ్యాత్రము కాదు = కేపల మానందము మాతమే - దానినే పారవశ్యమందుము. విశిష్టమగు కావ్యమునందలి యొట్టి విషాద సంఘటనమును, (బకృతి యందలి యా యా విషాదకరములగు స్థితిగతుల ననుసరించి యనిష్టదముగనసు, సహజముగను నేర్పడు సూర్యాస్తమయమును, దుర్దినకళంకితమగు నీతభ్రానుచ సవియు, శీశిరబుతు సహజముగ నాకులు రాల్బు చెట్టును మఠ్‌ యిట్టి విచారకరములగు ఘట్టము లన్నిమయైనను సౌందర్యాస్వాద విషయమున సర్వాంగీణ సుందరములేకాని తదపకర్షాహేతుపులు పాత్రము కాజాలవు. కన్నులలో దైన్యము, హృదయములో నావేదన, ముఖములో మాలిన్యము, గమనములో గజిబిజి గనిపింపజేయు నెట్టి భిక్షాబాలయు, ప్రపంచములో దన నిత్యజీవితమున దానట్టిదయ్యు సౌందర్యవశమున కొప్యమునందు తచ్చాయ్యాపభావము ననుసరించి విశిష్టసుందరమగు నట్టిదియే. రస్యగ్రహణ శక్తికి సొందర్యమే పరమార్థము కావున జూచుటలో, వినుటలో, కదలుటలో నికనట్టి సమస్తములో లౌకికములగు విషాద సౌఖ్యములలో నది సౌందర్యమునే ఆరాధించును, అన్వేషించును. తజచుగ రసశక్త్యనుభవ ఫలితము[దలు ఆయా యిం[దియానుభూతులతో కలగూరగంపమొ గజిబిజిగా నుండును. వివిధ చిత్ర విచిత్ర వర్ణభాసురములగు పాత్రములందు (ప్రకాశించు స్వచ్చమగు వర్గరహిత జలమువలె నది వ్య క్షమై (ప్రేక్షకుని గందరగోళమున ముంచుచుండును. ఒకడు హృదయ సమాకర్షణములగు విషాదకరములో, ఆనందావహములో యగు మోహన గీతములను వినినాడనుకొనుడు. అట్టి సందర్భమున సౌందర్య (గ్రహణశక్తి ఒకదానిని (గ్రహించి మజి మిగిలినదానిని విడచుటను బేయదు. హృదయ పుష్టెమంతమగు రసాస్వాదనశక్తి సూక్ష్మమగు నెట్టి మూర్తికిగాని, గీతమునకుగాని, వర్ణమునకుగాని లాస్యము సేయును. దానినే మానవ (ప్రతిభ సౌందర్యమని పెలిచి సంభావించినది. అది హృదయమును తగిలించునట్టి స్వభావము గలిగి వ్యాపించి, (ప్రకాశించి, విచ్చిత్తినంది విషాద సౌఖ్యభేదముల కతీతమగు సౌందర్యాన్వేషణ శక్తిమై తేజస్వతులగు దేవతామూర్తులపై చెంగలించును. విరక్తుడగు యోగి మాత్రమే బాధాప్రమోదములలో పరబ్రహ్మ సాక్షాత్కారము నంది వాని సంసేవించును.

2222 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఇంతియ కాక ఈ సౌందర్య జ్ఞానశక్తి నిత్య సంతాపాయత్తచిత్తుడగు పేదపారుని యందును, నిరంతరానంద సాగరమగ్న మానసుడగు నదృష్ట మూర్తియందును, బాధయందును, (పప్రమోదమునందును సత్యస్వరూపమగు సౌందర్యమునే యన్వేషించును. ఈ శక్తి మానవుని యుద్వేగాలోల జీవిత భాగమునందును దన ప్రతిరూపమును గలిగియుండును. ఇది తర్కశక్తివల సత్యాన్వేషణమునందును, నిరానందా నందములందును దన మహానుభావమగు ప్రతిచ్చాయను కలిగి యుండును. ఈ విషయము విమర్శించి వీక్షింప గలిగిన మానవ హృదయస్థమగు సౌందర్య గవేషణాసక్తి శక్తి సువిదితమగును. మానవుడు నాగరకమగు జీవితము ననుభవించుచుండియు నా యా వస్తువుల పరమార్థమును పరిగహింపలేక వాని కడపటి విలువలమీదనే దృష్టిని కేంద్రీకరించుచుండుట విచారకరవిషయము. నిజమునకు నాగరకత యనుదాని కీ దౌర్భాగ్య మొక నిరోధము. మానవుని నాగరకత వైయక్తికము కాదు - మటి సాంఘికము. అది ఎప్పుడు నంతియ. కాబట్టి తత్సృంబంధమగు నీతిచేతను, ఆర్థికాది వ్యవస్థలచేత నది బంధింపబడుచున్నది. మానవునిదైన యీ నాగరకత ననుసరించి జీవిత పరమార్ధము ప్రసరించి విశిష్టవుగు పరిగణనతా సంపూర్ణత్వమువైపు ప్రయాణించును. విశ్వవ్యాప్తములుగ నశాంత్యసంతృప్ప్తులు తతృలితముగ సంప్రాప్త్రమగుట సహజమైన విషయము. అయిన నొక్క విషయము. ఈ యశాంత్యసంతృప్హులమధ్య రసజ్ఞానశక్తినిలిచి తత్కారణమున జనించు సంక్షోభములను స్వీయమగు నంతస్పారశక్తి చేత శాంతింపజేసి సత్యపథమునకు వెలుగులను సూచించును. ఆ మార్గము పరమోత్తమము, యథార్థ విశిష్టమును. అది శాశ్వతమగు మోక్షమున కూతమొ లౌకికములగు సర్వవిషయములందు పరివ్రాజనము నుద్చోధించునదై విశ్వశాంతిని విలసిల్లజేయును. మానవుని సామాన్య జీవితము వివిధావసరములతో నాతనికి విడువరానిదైనది. ఇది యాతనికి లౌకికములగు విషయములందు గల యాకాంక్షను ద్యోతకపరచును. అవసరములందు మానవుని దృష్టివిహితమగును. కావున వానికి వినియోగ మార్గమందు స్వార్థము వెజితలలు వేసినది. స్వార్థభావ కలుషితమై జీవితము దుర్భరమైనపుడుగదా అతనికి కష్టములు కలుగుట కలుగును. సహజావబోధమగు

రసశక్తి హిమకర 2223 నాతని యాత్మవ్యవస్థీకరణము నిరవచ్చేదముగ కించిత్త్యాగముతో నొకని దౌర్భాగ్యుని గావించి తతృ్భలమున సంతృప్తిపడుట దైత్యత్వమును ద్యోతిలజేయును. మానవుని జ్ఞానము సృుగ్యమైనవుడు, స్వార్ధము వొజితలలు వేసినపుడు విశ్వవిలయ మువృఎంచు. భొాఆకములగు వస్తువులపై నపేక్ష మానవున కేనాడు తొలగునో, అధ కల్వ గాచియములమై నాతని మనస్సేనాడు కేంద్రీకృతమగునో అనాడు ఆలం చంలార్థుడగును. జివసంభరణ కొజకు భౌతిక వస్త్యపేక్ష మానవున కుండవలసినదే. అంతమాత్రమున స్వీయమగు జ్ఞానమార్గమును వదలి అంతస్పార రహితుడై నశ్వరమగు నైహిక సొఖ్యములందే దృష్టినిడుకొనిన నాతని జీవితమున కశాంత్యసంతృప్పులు తప్పనివగును. ఏనాడు మానవుని జీవనమార్గము సౌొందర్యమగు సమరసమార్గము ననుకరించునో ఆనా డాతని జీవితము సువ్యవస్థితమగును. ఏనాడు మానవుడు మానవుడై ఆధ్యాత్మికానందము ననుభవించి రసరూపుడును, ఆనందమూర్తియును నగు పరబహ్మసందర్శన మాచరించునో ఆనా డాతని జన్మ చరితార్థమగును. ఇట్టి పరమోదాత్తత నాతడందవలెననిన ఒక మార్గమున్నది. అది యిది:

మానవృడు నిత్యజీవితమున సవున్వయమార్గమున కష్ట సుఖములలో, ని వ్నూన్నతములలో సవురసస్థితి నందగలుగుట. అది సౌందర్య సందర్శనమునగాని జనింపదు. ఆ సౌందర్య సందర్శన మనుభూతమగునెడ నాతని కనుభావ ముదయించును. ఆ యనుభావమునకు దగిన శక్తి అతనియం దనుగతమై యుండును. అది రసశక్తి.

(కిన్నెర: సంపుటము 6, సంచిక 12. డిశంబరు 1954)

టా గ

ఎర్నెప్ట మహైమింగే 8 న్‌ కున్సి కృష్ణ హే క ౫) కూ సాహిత్య రచనకు ఎర్నెస్ట్‌ హెమింగ్వే ఉపయోగించినంతటి సునిశితమైన శైలిని చాలా కొద్దిమంది రచయితలు మాత్రమే ఉపయోగించారు. నిజానికి 1954వ సంవత్సరపు నోబెల్‌ సాహిత్య బహుమానం ఆయన కివ్వబడింది. “ఆయన ఇటీవల “ది ఓల్న్‌మేన్‌ అండ్‌ ది కీ” (ముసలివాడు - సము[దం) అనే నవలా రచనలో (ప్రదర్శించిన సునిశిత, నవీన సాహిత్య శిల్చానికి, శైలి నిర్మాణ (ప్రావీణ్యానికి అని (ప్రకటించబడింది. హమింగ్వే వయస్సు 56 సంవత్సరాలు. ఈ సంవత్సరం నోబెల్‌ బహుమానం పొందిన అమెరికనులలో ఈయన నాలుగవ వాడు. నోబెల్‌ సాహిత్య బహుమానం ఇవ్వడం ప్రారంభించిన గత 53 సంవత్సరాలలోను ఈ ఉన్నత గౌరవాన్ని పొందిన అమెరికనులలో ఈయన ఐదవవాడు. ఈయనకు పూర్వం సింక్షేర్‌ లవిస్‌, యాజీన్‌ ఓనీల్‌ పెరల్‌బక్‌ విలియం ఫాక్‌నర్‌లు ఈ బహుమానాన్ని పొందారు. స్వీడిష్‌ సాహిత్యపరిషత్తు “ఆదర్శవాద దృక్పథం” గల గ్రంథాలకు ఈ బహుమానాన్ని ప్రదానం చేస్తూ వుంటుంది. ఈ బహుమానంగా ఒక బంగారు పతకం, 165,000 రూపాయలు ఇవ్వబడుతూ వుంటాయి. ఈ బహుమానం గీతాంజలి రచించినందుకుగాను ఇదివరలో రవీంద్రనాథ టాగూరుకు కూడా ఇవ్యబడిందని తలిసిందే. హైమింగ్వే రచించిన “ది ఓల్మమేన్‌ ఎండ్‌ ది ఫి అనే నవలలోని ఇతివృత్తం ఎంతో ఉత్తేజకరమైనది. ఇందులో ఒక ముసలి పల్లవాడు “బ్లూ మార్లిన్‌” జాతిచేప చందం మల్లకాద్దునరావు శతవయంతి. సంపుటము 4: సాహిత్యము. న!

ఎర్నెస్ట్‌ హెంంగ్వే కుని కృష్ణ 2225 బహ్మాండమైన దానిని ఒకదానిని పట్టడానికిగాను మూడురోజులపాటు ఒంటరిగా పోరాడుతాడు. కాని చిట్టచివరకు ఆ చేపను షార్క్‌ చేపలు తినివేస్తాయి. “బ్లూ మార్షిస్‌"చేపయొక్క అస్థిపంజరాన్ని మాత్రం పట్టుకుని ఆ పల్లెవాడు "రేవుకు తిరిగి వస్తాడు. ఆ చేప ఎంత పెద్దదో తఆలియజేయడానికీ అతడు దానిని పట్టాలని ఎంత తీవ్రంగా పోరాడాడో తలియజేయడానికీ నిదర్శనంగా చివరకు మిగిలింది అస్థిపంజరం. ఇతివృత్తం చాలా సూక్ష్మ మైనదే. కాని ఈ నవలలోని సంఘటనలన్నీ ఎంతో విస్పష్టంగా వున్నాయి. భావ (ప్రకటన ఎంతో సునిశితంగా వుంది. ఇది ఈ నవలలోని ప్రత్యేకత. అయితే “ది ఓల్య్‌మేన్‌ అండ్‌ ది ఫీ" అనే కథ ఒక ముసలివాడు ఒక పెద్ద చేపను పట్టడం, పట్టకపోవడం మాత్రమేకాదు; అది బహుముఖ సాంకేతికమైన (పెద్ద బ్లూ మార్షిస్‌ చేపను పట్టడం ద్వారా) తాను తన వ్యక్తిత్వాన్ని (గహించడానికిగాను ఒకవ్య క్తి (ముసలివాడు) బలీయమైన ్రత్యర్థులతో (షార్క్‌ చేపలతో) జరిపిన పోరాటాన్ని ఈ నవలలో హెమింగ్వే సమర్థిస్తున్నాడు. సమష్టిగా చూపబడే ఆ(గహాన్ని ఎదుర్కొనడానికిగాను వ్యక్తి గత బలాన్ని నిలుపుకొనడం తక్షణావసరమని “ది ఓల్న్‌మేన్‌ ఎండ్‌ ది ఫీ! అనే నవల వక్కాణిస్తున్నది. ఈ నవలలోని ఇతివృత్తం ఈ నవలలోని రస, భావాలు తెలియచేస్తున్నది. వ్యక్తి స్వాతంత్యా్యాలను సమర్థించే పక్షం వారికి, సమష్టి సిద్ధాంతాన్ని (పబోధించేవారికి మధ్య ఈనాడు ఆదర్శాల విషయంలో జరుగుతున్న పోరాటానికి ఈ కథ సూక్ష్మ మైన రూప చిత్రణ మాత్రమే. ప్రతివారు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి కీవలం అనుచరులుగా మాత్రం తయారవడం, వ్య క్తిత్వప్రదర్శనానికి అవరోధాల నేర్పరచడం, ప్రతివారి వ్యక్తిత్వాలను మినహాయించి సామూహికంగా గుర్తించడం పరిపాటి అయిన ఈ కాలంలో, తన వ్య క్తిత్వాన్ని గుర్తించి, తన విశ్వాసాల కోసం జీవిస్తూ (తన విశ్వాసాల కోసం మరణించే) శక్తిసామర్థ్యాలు, ధైర్య స్టైయిర్యాలు కల వ్యక్తి చాలా అరుదుగా కనుపిస్తాడు. అటువంటి వ్యక్తిలో ఒకవిధమైన మాధుర్యం వుందనీ, అటువంటి మాధుర్యం ఈనాడు చాలా కొరత అయిపోతున్నదనీ, అటుపంటి మాధుర్యం చాలా అవసరమనీ "'హామింగ్వే మనకు గుర్తు చేయవలసి వచ్చింది. హైమింగ్వే యొక్క జీవిత సంఘటనల ప్రభావం ఆయన శైలిమైన, ఆయన రచనల ఇతివృత్తాలపైన ఎంతో ఎక్కువగా వుంది. ఆయన జీవితం, ఆయన

2226 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము రచనలు ఒకదానితో వురొకటి సమ్మిళితమై వున్నాయి. “పకృతిని పతిచించింపజేయడమే” కళ అయితే, ఎర్నెస్ట్‌ హైమింగ్వే రచనలలో కళగా (ప్రతిబింబించింది ఆయన (ప్రకృతే. -

“ది సన్‌ ఆల్ఫో రైజెస్‌” (సూర్యుడుకూడా ఉదయిస్తాడు) అనేది ఆయన మొట్టమొదటి విజయవంతమైన నవల, ఈ నవల (పథమ ముద్రణ 55,090 (ప్రతులు మాత్రమే అమ్ముడుపోయింది. ఈ నవలను ఆయన తన 28వ ఏట (వాశాడు. ఆశలన్నీ ఉడిగి దేశాంతరవాసం పోయినవారిని గురించిన దీనవల. ఈ నవల అంతటా నిరాశ, నిస్పృహ తాండవిస్తూ వుంది.

ఆ తరువాత సంవత్సరంలో “మెన్‌ వితౌట్‌ వుమన్‌” (స్త్రీలు మినహాగా పురుషులు) అనే కథానికల సంపుటి వెలువడింది. ఐతే ఆయనకు పప్రపంచభఖ్యాతి వచ్చింది 1929 లో “ఫేర్వెల్‌ టు ఆమ్స్‌” (ఆయుధాలకు వీడ్కోలు) అనే నవల ప్రచురించబడిన తరువాతనే. ఆదర్శ (ప్రేమను యుద్ధ బీభత్సంతో పోల్చుతూ వాయబడిన నవల ఇది.

హెమింగ్వే 1928 నుంచి 1948(?) వరకు ప్రశాంత జీవితం గడిపాడు. చేపలు పట్టడం, వేటాడడం, బాక్సింగు మొదలైన [క్రీడా వినోదాలతో కాలక్షేపం చేశాడు. ఈనాడు కూడా ఆయనకు చేపలు పట్టడమంటే సరదా. ఒక విచ్వితమైన చేపకు తన పేరు పెట్టారని గర్వపడుతూంటాడు కూడా.

ఇవి యిల్లా వుండగా, 1928 నుంచి 1938 మధ్య ఆయన టైప్‌రైటర్‌నుంచి ఎన్నో చిన్నకథలు, నవలలు బయటికొచ్చాయి. నవలలు వాస్తూనే, మధ్యమధ్య వీలు చేసుకొని, సమీప [ప్రాచ్యంలో అప్పుడు జరుగుతున్న చిన్నచిన్న యుద్ధాలను గురించి పత్రికలకు వ్రాసేవాడు. శ్యానిష్‌ అంతర్యుద్ధం సమయంలో వార్హాపతిక విలేఖరిగా కూడా పనిచేశాడు. పన్నెండు సంవత్సరాలు స్పెయిన్‌లో నివసించివున్నాడు గనుక ఆ అంతర్యుద్ధం విషయంలో ఆయనకు వ్యక్తిగతమైన

గద్ధ కలిగింది.

బుల్‌హైటర్లు గురించి, బుళ్ఫైటింగ్‌ [క్రీడగురించి (అంటే ఎనుబోతును గోదాంలోకి వదలి, దానితో ఒకవ్య క్తి పోరాడే క్రీడ) ఆయనకు ఎన్నెన్నో విషయాలు తెలుసు. ఈ సంగతి ఆయన “డెత్‌ ఇన్‌ ది ఎరీనా” అనే నవలలో ద్యోతకమౌతుంది. ఇది 1932లో ఆయనచే ముద్రించబడింది. 1934లో వేటకోసం ఆథఫికాకు వెళ్లాడు. తత్ఫలితంగా “గీన్‌ హల్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా" అనే నవల తయారైంది. దాని

ఎర్నెస్ట్‌ హైంంగ్వే వున్ది కృష్ణ 2227 తరువాత ఆయన రచించిన “టు హేప్‌ అండ్‌ హేవ్‌ నాటొ' అనే నవలను అతిగా పొగిడిన విమర్శకులూ వున్నారు; చెడతిట్టిన విమర్శకులూ వున్నారు.

దాని తరువాత హెమింగ్వే “ఫర్‌ హూమ్‌ ది బెల్‌ టోల్స్‌"” అనే నవలను రచించాడు. అది 1940లో వెలువడింది. మొదటిసారి అది 75,000 'కాప్‌లు అచ్చువెయ్యబడింది. దీనిలోని ఇపివృత్తం శ్చానిష్‌ అంతర్యుద్ధానికి సంబంధించినది. హామింగ్వే పుస్తకాలన్నింటిలోకి ఇది బహుళ (పప్రచారమైన నవల. దీనిని ఫిలింగా కూడా తయారుచేశారు. "ధైర్య సాహసాలు, దేశభక్తి శ్రార్యం, రాక్షసత్వం, వీరత్వం, ధీరత్వం” ఇవన్నీ చిత్రించబడిన మహోజ్వల (గంథం ఇది.

ద్వితీయ ప్రపంచ యుద్ధంలో ఆయన యూరప్‌లో మళ్ళీ విలేఖరిగా పనిచేశాడు. ఇదివరకులాగే యుద్ధంలో పాల్గొనేవాడు. మితరాజ్య మైన్యాలు జర్మన్‌ మసెన్యాలమై దండయాత్ర [ప్రారంభించినప్పుడు హామింగ్వే ఆస్పతిలో కోలుకుంటున్నాడు. కారు ప్రమాదంలో దెబ్బలు తగిలాయి కనుక ఆస్పత్రిలో చేరాడు. అలాగ కోలుకుంటున్న సమయంలోనే మిత్రరాజ్యాల మైన్యాలతో కలిసి (ఫాన్సుకు వెల్లాడు. యుద్ధంలో ఆయన చేసిన సహాయానికి అమెరికా (పభుత్వం ఆయన కొక పతకాన్ని బహూకరించింది.

హామింగ్వే స్టూలకాయుడు. ఆయన కప్పుడు 56 సంవత్సరాల వయస్సు. అయినప్పటికీ దృఢంగా, ఉత్సాహంగా వుంటాడు. అతడు ఉక్కుమనిషనీ, సాహసవంతుడనీ అనేక కథలు వొప్పుకుంటారు. ప్రమాదం వస్తుందని భయపడడు. నీతికి కట్టుబడి వుంటాడు. ఒకసారి అతడు హోటలునుంచి బయటకు వస్తుండగా లెండు పెద్ద కుక్కలు కలియబడి కాట్లాడుకుంటూ వుండగా చూచి వెంటనే వాటి దగ్గరకు పరు గెత్తుకువెళ్లి చెరో రెక్కతోను విడదీశాడు - అవి కరుస్తాయని భయమైనా లేకుండా.

హెమింగ్వ్యే జీవితంతో ఆయన నవలలు పెనవేసుకొని వున్నాయి. ఆయన అనుభవాలు వాటిలో ప్రతిఫలిస్తూ వుంటాయి. అందుచేత సాహిత్య విమర్శకులు తరుచు ఆయన జీవితాన్నీ, రచనలనూ కూడా విమర్శించారు. కాని, ఆయన విమర్శకులను ఎన్నడూ లక్కచెయ్యనే లేదు. “సత్యం బయటపెట్టడమే రచయిత విధా అంటాడు హెోమింగ్వే. “రచయిత సత్యవ్రతుడై వుండాలి. అతడేది కల్పన చేసినా, అది తప్పకుండా అతడి అనుభవ జనితమై వుంటుంది. అందుచేత అది సత్యసంబద్ధమై వుండాలో. ఇవి ఆయన 1942లో అన్న మాటలు. ఈ సూక్తి హామింగ్వేయొక్క ఇరవై సంవత్సరాల అనుభవసారం.

2228 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 44: సాహిత్యము “ఎక్రాస్‌ ది రివర్‌ అండ్‌ ఇంటుది టీస్‌” అనే నవలమీద జరిగిన విమర్శలకు హెమింగ్వే సమాధానంగా మౌనం దాల్చి, అచంచల విశ్వాసంతో తనపని తాను చేసుకుపోయాడు. ఆ విమర్శలకు సమాధానం యిచ్చాడా అన్నట్టుగా 1052లో “ది ఓల్టమేన్‌ అండ్‌ ది సీ" ప్రచురించాడు. ఈ రసవత్తర నవలా రాజం (25000 పదాలు) రచించినందుకు ఆయనకు 1953లో పులిట్టర్‌ బహుమానం యిచ్చారు. సున్నితమై, సునిశితమైన రచనగా దీనిని కొనియాడారు. -

“ఈ నవలను రచించినప్పుడు చిత్తుప్రతిని పదేపదే సరిచూచుకోడానికి మితిమీరిన శ్రమపడడం వల్ల చివరకు అలసిపోయాను. చక్కని వచనం వ్రాయాలంటే ఎంతో అదృష్టం వుండాలి” అని హెమింగ్వే ఈ మధ్యనే అన్నాడు.

“నా యీ (గ్రంథంలోని ముసలాడు అదృష్టవంతుడు. ఇలాంటివి ఇంకా కొన్ని పుస్తకాలు వాయదలచాను. ఇదికాక, ఇంకా నాలుగు పుస్తకాలు పూర్తిచేశాను. ఈ చిత్తు ప్రతులు హవనా బ్యాంకు బీరువాలలో భద్రంగా దాచబడ్డాయి. వీటిని రెండుసార్లు సరిచూచాను. ఇంకా ఎన్నోసార్లు సరిచూడాలి.” అవి కూడా హెమింగ్వే చెప్పాడు.

ప్రపంచ (ప్రఖ్యాతి చెందిన నవలా రచయితలలో ఒకడైన హెమింగ్వే యొక్క గొప్పతనం ఆయన శైలి. వసంతోదయంలోని నవ్య మాధుర్యం ఆ శైలిలో ఉబికి వస్తుంది. క్రూరత్వం. వీరత్వం గురించిన చక్కని కథలను, ద్వేషం, ధైర్యం గురించిన చక్కని కథలను రచించినందున ఆయన ప్రపంచ సాహిత్య లోకంలో శాశ్వత స్థానాన్ని అలంకరించాడు.

(కిన్నెర: సంపుటము 6, సంచిక 112, డిశంబరు 1954) శు (శై టే

కవులు - సంఘాభివృద్ది ధ్‌ కాండూరు నరసింహాచార్యులు క్వ కావ్యములను వ్రాయగలడు. కావ్యగానము చేసి తా నానందించుటలపేకాక సంఘము నానందింప జీేయగలడు. కాని సంఘాభివృద్ధి కెట్లు తోడ్పడుచున్నాడు? కవి రాజగునా? కావ్యములు రాజశాసనము లగునా? కవి తన కావ్ట్థములద్వారా లోక సంగ్రహణము చేయుచున్నాడని పెద్దలు చెప్పుచున్నారు. ఎట్లు? లోక సయ్యగహణమునకు (పభుసమ్మితములైన వేదశాస్త్రము లున్నవి. _ సుహృత్సమ్మితమునైన పురాణేతిహాసము లున్నవి. ఇంక కావ్యములద్వారా చేయగలిగిన ప్రయోజన మేమున్నది? ఇదియే లోకము [గ్రహించవలసిన విశేషము. శబ్దార్థముల వైశిష్ట్య్రముద్వారా లోకోత్తర వర్దనావైచిత్యూముచే ప్రకృతి నలంకరించి భావనాబలమున సహృదయుల హృదయములను రసోత్తరంగముల గావించువాడు కవి. రాజ్యములేలు రాజులకంటెను రచనలద్వారా సంఘమును చక్కని దారిని నడుపగల శక్తి కవిరాజులకడ నున్నది. వారి యాయుధము ఎంత మృదువైనదో యంత సునిశితమైనది. దాజశాసనములుగాని, లఛాజకీయాయుధథములుగాని చానీముందు పనికిరావు, అదియే కాంతాసమ్మి తత్వ మనబడుసది. కనుకనే పూర్వము మహారాజులు, చ[క్రవర్హులు కవుల నాదరించి పోషించుట. లోక సంగ్రహణమునకై కవిరాజుకు సిబ్బంది యవసరములేదు. ఆజ్ఞాష్యతములు చెల్లవు. ఉన్నచోటునుండి కదల సండిరి మల్లికార్జునరావు శతజయంతి. నంప్పుటము. 4: సాహిత్యము

2230 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నవసరములేదు. అతని కాపూటకు లేకున్నను సదా భోగి. రాజ్యము లేలకున్నను రాజ పరివృతుడు. నిత్య దర్శిడుడయ్యును వనవిహారి. నిశ్చలుడు, నిశ్చింతుడు. కనుక పప్రతివిషయమునను రాజులను మించువాడే యగుచున్నాడు కవిరాజు.

“రాజయి పుట్టుకంటె కవిరాజయి పుట్టుట కొంత మేలు, రే

రాజు వసంతరాజు వలరాజును గొల్బ్పంగ నిశ్చలాత్ము6 డై

రాజిలు కావ్యకాంత వనరాజముల న్విహరించుచుండు, రా

రాజయినం ధరితి పొగరాజున రాజకముండ కుండునే”

[కళింగ మల్లునిచే తరిమివేయబడిన మహేం[ద్రపర్మ చింతించుచున్నాడు. (నా “అశోకరాజ్యము” నుండి.)

కవి కావ్యము సంఘసంస్కారము కానిపక్షమున నన్నయ, తిక్కన, శ్రీనాథుడు మొదలగు మహాకవుల నామములు శాశ్వతములై నిలుచుటకు కారణ మేమున్నది!

కవి లోకోత్తర పురుషుండు. ఇతడు ఉత్తమ పురుషార్థ సాధక దృష్టిచే నవనవ భావకుసుమోన్మేష విలసితంబులగు క్రొంగొత్త కావ్యోద్యానముల సృజియించి (ప్రజాజీవిత విధానమునకు మార్గదర్శకు6డై వారికి మానసిక విశ్రాంత్యానంద సాఖ్యముల నొడగూర్చుచుండుసు.

విధినిషేధములు కవికి తెలియవు. తన్మయీభావనముచే నానందపరవశుండై కావ్యగానము చేసికొనుచుండుట యాతని విధి. ఆ గానములోనే విశ్వశేయస్సును సాధింపగలుగుచున్నా డాతడు. చూడుడు.

ఇప్పటి మన [గామజీవితమును దృష్టాంతముగా దీసికొందము. ప్రాచీన (గామజీవితమునకును, ఇప్పటి [గగ్రామజీవితమునకును సంప్రదాయమునం దెంతో తేడాయున్నది. (ప్రాచీనుల సాంఘికపద్ధతి వేజు. వారి సంస్కృతి, పట్టుదల, కార్యనిర్వహణాసక్తి మొదలగు ధర్మములు ఇప్పటివారియందు గాన్పించుట లేదు. ఇక (గామజీవితమును సంస్కరించవలయునన్న కవి యేమి చేయును?

“పూర్వము గ్రామములలో పశుసంపద మిక్కుటముగా నుండెను. సాంఘిక జీవనమునకు పశుసంపద వృద్ధికావలయును. మీ రా పద్ధతి నవలంబింపుడు" అని చెప్పుటకు బదులుగా.

కప్పులు: సంఘాభివృద్ధి కొండూరు నరసింహాచార్యులు 2231

“మందలు మందలై గుమిగ “మూ” యను అంకెల కోడెదూడ లా

నంద మెసంగ మెకెగిరిన న్వడికొమ్ముల (ుమ్ములాడుచున్‌

పొందికలేది కొండలకు. బోవుచు వచ్చుచు నుండు గోవులన్‌

సందెల వెంబడించు గ్రుతిసంగత గోపకవేణు గానముల్‌”

(అని పాడుకొనుచున్నాడు.)

“వుఅబియ్యవబము మంచివిగావ్వ. దంపుడుబియ్యము మేలు. వడ్లు దంచుకొనుటకు సోమరులై పల్లెలవారు మజిబవియ్యము మరిగి యారోగ్యము చెడగొట్టుకొనుచున్నారు. ఇది మంచిపద్ధతిగాదు. సౌఖ్యమునకై శరీరములు వంచి పనిచేయు” డని చెప్పుటకుమాజు-

“ధిమ్మన ధుమ్మనం దకతధిమ్మని మోగెడి భుగ్‌భుగధ్వనుల్‌

పమ్మిన కాపురమ్ములు శుభంకరమై యెసగంగ శుద్ధ స

త్వమ్మగు యౌవతంబు తన ధర్మగతిం దలపోసి పల్లెలన్‌

సమ్మతి వర్డు దంచగ నెసంగెడి జోకటిపోటు మద్దెలల్‌.”

(అని గానము చేయుచున్నాడు)

“భార్యాభర్త సంబంధము పరస్పర సహకారముపై నాధారపడియుండును. లీలా విలాసములకు మాత్రమేకాదు. పల్లెటూరి పడుచు లీ భావముల కెంతమాతము చోటిచ్చుట సమంజసము గా” దని బోధించుటకు -

“అన్నపుబుట్ట నెత్తిపయి నచ్చుగ చంకను పాజకోలయున్‌

చెన్నుగ నాకుసంచి యొక చేతను బూని సభీజనంబుతో

మన్నన ముచ్చటించుచు నమాయికమౌ ముఖ మందగింపగా

పన్నుగ పల్లెకాంత తన భర్తకు సాయముచేయ నేగెడిన్‌”

(అని గొంతెత్తి పాడుచున్నాడు)

“పూర్వము (గ్రామీణులు ఆడువారు రాట్నములతో నూలు వడుకుచుండగా

మగవారు (త్రాళ్ళుపేనుచు సాంఘికాభివృద్ధికి తోడ్పడుచుండిరి. ఇప్పు డా ధర్మము

2232 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లడుగంటినవి. సాంఘిక (శేయోభిలాషు లా ధర్మమును మరల పెంపాొందింపు” డని (ప్రచురించుటకు కవి - “రమణులు చెట్లకింద తమ రాట్నము6 ద్రిప్పుచు పాటపాడుచుం ఘుమఘుమలాడు భావములు గుప్పుచు భర్తల గేలిసేయ, హృ త్కమల గుహాంతరమ్ములను గట్టిగ గట్టుదుమన్న మాడ్కి సూ క్షములగు తాళ్లు పఏేనుచును సంతసమందు యువాళి గంటివే? " (అని గానము సేయుచున్నాడు) “ఎల్లప్పుడు కర్మనిమగ్ను లైయుండుట తగదు. విశ్రాంతి సౌఖ్యములు లేని జీవితవబలు విసిగించును. సాయంకాలము విశ్రాంతి సవుయము., యువతీయువకులు సాయంకాలముల విశ్రాంతి ననుభవింపుడని చెప్పుటకు బదులు - | “పాయంకాలము తీరుబాటు నొసగన్‌ సంకోచముల్మాని, ఆ ప్యాయంబొప్పగ నూత్నయౌవనమునం భాసిల్లుచున్‌ కాముకుల్‌ మాయల్వాసిన వ్యంగ్యభంగిమముల న్మాటాడు చొప్పారయన్‌ ధ్యేయంబౌ సుకుమార సూక్ష్మగతి నుద్దీపించు శృంగారమున్‌” (అని హాయిగా నాలాపన చేయుచున్నాడు). “స్తుఖములుగోరి పట్టణములు చేరవద్దు, నిజమైన సుఖములు పల్లెలలోనే గలవు. పల్లెలు క్షీణించుచో పట్టణములు పనికిరావు. ఆరోగ్యభాగ్యములు వృద్ధిపొందవలయునన్న పల్లెల నాశ్రయింపు"మని బోధించుటకుగాను = “బాధలులేని జీవిక శుభపదమై యెసగంగ నిచ్చలున్‌ వ్యాధులు నాథులుం గలుగ కచ్చపు దేహము లుల్లసిల్ల, ని ర్భాధముగాగ రాత్రులను బల్లెలవారల దన్వుచుండెడిన్‌ పీథుల బొమ్మలాటలును, వేడుకనించెడు వీథినాటకాల్‌!” ఇందువలన [గ్రామీణుల విజ్ఞానహేతువులగు వినోదములను గూడ వివరించుచున్నాడు కవి -

కపులు;: నంఘాభివృద్ధి కొండూరు నరసింహాచార్యులు 2293 “పల్లెలలో పనివాండ్రందరు తమతమ పనులలో నిమగ్నులై యుండవలయును. సోమరితనమునకు చోటీయరాదు. సోమరుల కిహపరసౌఖ్యములు లేవు. స్వతంత్ర జీవికలచే పాటుపడువారికి సౌఖ్యము కొజవడదు.” అని బోధించుటకు - “ఒక్కట సేద్యగాడు, మజియొక్కట కుమ్మరి కమ్మరీండ్రు, తా నొక్కట దారుకారుడును, నొక్కట వెజ్జువు, నొజ్జ్ఞయొక్కటం చక్కటి కార్యసాధకులు ధర్మపరు ల్పనులెల్ల తీర్పగా నిక్కముగాగ పల్ల లవనిన్‌ సుఖజీవ కళావిలాసముల్‌.” (అని గానముచేయుచున్నాడు కవి) “పూర్వము పల్లెలు సమస్తసంపదలు గలిగియుండెను. ప్రజలు ధార్మికులై యుండిరి. ఇప్పుడు ద్వేషాసూయలతో నొండొరులు కలహించుచు సంపదలను పొడుచేసికొని పేదవారై యున్నారు. మీమీ సంపదలు వృద్ధికావలయునన్న మీ ధర్మములను మీరు గమనించి యాచరించవలయును.* అని బోధించుటకు మాటుగా - “కలుముల కిక్క లైయవని, కాంచనగర్భుని పూలతోటలై సలలిత జాతి సంస్కృతికి చక్కని నాటకశాలలై, విని ర్మల సువినీతి తేజమలరంగను నొప్పిన పల్లెలిప్పు డా కళలథజి దుష్టకార్యముల గాడ్పుల పేద మొగంబు లల్లడన్‌” (అని పాడుచున్నాడు కవి.) ఈ (ప్రకారముగా కవి సంఘ సంస్కరణమునకు పాటుపడుచు దేశశేయస్సును సాధించుటకు కంకణము కట్టుకొన్న వారిలో మొదటివాడగుచున్నాడు. ఈ పని రాజులచేతగాని, శాసనములచేతగాని సవరణ కాజాలదు. కవుల కావ్యములు సాధించునంత సాంఘికాభివృద్ధి మరి దేనిచేతను గాదని చెప్పుటలో అతిశయోక్తి యుండదని తలంచెదను.

2234 పందిరి మల్లికార్దునరావు శతజయంతి . పంపుటము 4: పాహెత్యము “వలయ జగమ్మున న్విభవవృద్ధికి మూలము ధర్మవృద్ధి, యా యలఘు విశుద్ధధర్శ్మమున కాశయమెక్కుడు సజ్జనాళి, యిం పొాలయంగ ధర్మకర్మముల కున్నతి (పప్రాపుకవీంద్రుపల్కు లేం దలంచెద నట్టి ధర్మనిరతార్యకవీంద్రుల కార్యసిద్ధికై...” (నా “రామరాజ్యము” నుండి) కవుల కాదరము, ఆశ్రయము హెచ్చిననేగాని సాంఘిక జీవనమున వికాసము కలుగనేరదని పలుకుచు విరమించుచున్నాను. (కిన్నెర: సంపుటము 6, సంచిక 12, డిశంబరు 1954) 1/ తా మూ [06 తనమ న ఈ (ంపన్టనలి 6 1 [కరతి గం 01 సం రతర పయన - నమో ౧ ౧, 1 1 1.

భారతదేశ నాటక సాంప్రదాయాలు

కాళిదాసు శకుంతల నాటకం

కౌళిదాసుని ఈ అద్వితీయ రచనయొక్క కమనీయత, ఉదాత్తత 1789లోనే సర్‌విలియమ్‌ జోన్స్‌ అనువాదం ద్వారా యూరపీయ ప్రజల హృదయాలను మంత్రముగ్ధం చేసింది. అంతేకాదు. గెటే రచనలపై ఈ నాటకంయొక్క (ప్రభావం మిక్కుటంగా కన్పిస్తుంది. శకుంతల నాటకం ఉపోద్దాతానికీ, “ఫాస్ట్‌” పీఠికకూ ఎన్నో పోలికలు వున్నాయి. ఏది యేమైనా, (ప్రపంచంలోని గొప్ప నాటకాలలో, “శకుంతల” మకుటాయమానమైనదని సారస్వత వేత్తలు ఏకగీవంగా అంగీకరించిన విషయం.

సంస్కృత నాటక భాండారంలో కాళిదాసు రచనలు మహోజ్యలమైన మణిహారం వంటివి. అయితే ఈయనకు పూర్యమూ, అనంతరమూ కూడా ఉత్కృష్టమైన రచనలనేకం వలవకపోలేదు. “మాళవికాగ్ని మిత్రానొకి వ్రాసిన ఉపోద్దాతంలో, “భాస, సౌమిల, కవిపుతవంటి గొప్ప రచయితల కృతులను మనం నిరాకరించడం సమంజసమా? అట్టివారి కావ్యాలనే ఉ పేక్తిస్తున్నప్పుడు, కాళిదాసు వంటి ఆధునిక కవుల కావ్యాలనా ,(ప్రేక్షకలోకం ఆదరించేదిగ్‌ అని కాళిదాసు వినయప్తూర్వకంగా (ప్రశ్నిస్తాడు.

సంస్కృత నాటకం అసలు ఎప్పుడు పుట్టింది? దీని ఉత్పత్తి ఏమిటి? అని పశ్నిస్తే ఖచ్చితమైన జావాబివ్వటం కష్టం. ఒకవిధంగా చూస్తే భారతదేశంలో

2236 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహెత్యము నాటక సంప్రదాయం వేదకాలం నాటినుంచే [ప్రారంభమైందని చెప్పవచ్చును. సంవాదాలతో నిండివున్న బుగ్వేదమే సంస్కృత నాటకాలకు బహుశా బీజమై వుంటుందని వూహించవచ్చు. అనంతరం పురాణాలూ, (కతువులూ, ఉత్సవాలూ ఈ సంప్రదాయానికి తప్పక ోదిచేసి వుంటాయి.

చైనీస్‌ టర్కీస్తాన్‌లో పురావస్తుశాఖవారికి దొరికిన భూర్జ్చపత్ర లిఖితమైన నాటకావశేషాలే సంస్కృత నాటక సాహితీ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈవిధంగా దొరికిన శిథిలీభూతమైన మూడు నాటకాలలో ఒకటి అశ్వ ఘోషుని కృతిగా పేర్కొనబడింది. ఈ అశ్వఘోషుడు కనిష్కుని ఆస్థానకవి అని బౌద్ధమతస్థులలో కర్దాకర్ణిగా ఒక ప్రతీతి వినవస్తూంది. అశ్వ ఘోషునికి చాలాకాలం పూర్వమే సాహిత్యరంగంలో నాటకశైలి అవతరించిందనీ, ఆయన కృతులు పండి పరిపక్వమైన ఫపూర్వకాల సంప్రదాయానికి ప్రతీకాలనీ మనకు దొరికిన నాటకావశేషాలు బుజువిస్తున్నాయి. సంస్కృత నాటక సంప్రదాయంలో పేరుమోగిన ముఖ్యకవులలో భాస, భవభూతి, శూద్రక, విశాఖదత్త, శ్రీహర్హులనుకూడా ఉదాహరించవలసి వుంది.

(ప్రపంచంలోని ఉత్తమ నాటక సంప్రదాయాలకు సంస్కృత సంప్రదాయం ఏమాత్రం తీసిపోదు సరికదా, ఆయా సంప్రదాయాలకు సన్నిహిత సారూప్యం గోచరిస్తుంది. ఎలిజబెత్‌ కాలంనాటి నాటకాలలో “ఫూల్‌ పాత్ర ఎలాటిదో, పూర్వ సంస్కృత నాటకాలలో “విదూషకుని" పాత్ర అలాటిది. అదీకాక, ఎలిజబెత్‌కాలపు నాటక రంగమూ, సంస్కృత నాటకరంగమూ కూడా అనవసరమైన పటాటోపాలకూ, ఆడంబరాలకూ పోవు. ప్రసంగ చమత్కృతితో, వర్దనా చాతుర్యంతో ఈ పటాటోపాల అవసరమే లేకపోయేది. అయితే సంస్కృత నాటక సంప్రదాయంలో వున్న ముఖ్యమైన విశీష్టత ఏమిటంటే, సంస్కృతంలో విషాదాంతమైన నాటకాలు మచ్చుకుకూడా కన్పించవు. 11వ శతాబ్దపు నాటక సాహితీవేత్త ధనంజయుడు ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, “నాటకాలు జ్ఞానార్ధన సాధనాలేగాని, వినోదానికి వాటిని ఎంతమాత్రం ఉపయోగించకూడదని వాదించేవారికి ఒక్క నమస్కారం” అన్నాడు. ప్రేక్షకుల రంజింపచేయడం, వినోదపరచడం ఏదో నీచమైనపని అన్నట్టుగా నిరసించకూడదని ఆయన సిద్ధాంతం. భారతీయుల దార్శనిక దృక్పథం అంతా

భారతదేశ నాటక సాంప్రదాయాలు 2237 మాయావాదంపై ఆధారపడివున్నదనే దురభ్మిపాయం ఒకటి పాశ్చాత్యులలో వ్యాపించి వుంది. నిజానికి విషాదాంత నాటకాలు సంస్కృత సంప్రదాయానికి విజాతీయం, పొట్ట చక్కలంపే హాస్యం యూరపీయ నాటకాలలోకన్నా ఇనుమిక్కిలిగా సంస్కృత నాటకాలలో కనిపిస్తుంది. శూదదకుని “మృచ్చకటికొ ఇందుకు పరమోదాహరణం. ఈ నాటకంలో ఒక దృశ్యంలో, జూదరి ఒకడు అప్పులవాళ్ల చేతుల్లోంచి తప్పించుకోవడం కోసం, వాళ్ల ముందు తను నిర్జీవమైన ఒక శిల్మాపతిమలాగా చిగదీసుకు కూర్చుంటాడు. వాళ్లు అతన్ని నఖశిఖపర్యంతం పరీక్షగా చూసి, గిల్లి, నిజంగా రాతి బొమ్మే అని నిశ్చయించుకొని అతని కట్టెదుటే పాచికలు ఆడటం ప్రారంభిస్తారు. ఆటచూస్తూ వుండబట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జూదరి, తన శిలాప్రతిమాభంగిమ వదిలిపెట్టి అమాంతం ఆటలోకి దూకుతాడు. ,

సంస్కృత నాటక సంప్రదాయానికి మూలకందమైన దృక్పథం ఒకటి వుంది. జీవితంలో కష్టాలూ, విషాదం వుండకుండా వుండవు. కాని అంతిమంగా వాటిని అధిగమించగల సత్తా మనుష్యుడిలో వుందనే విశ్వాసమే సంస్కృత నాటకాలకు (ప్రాతిపదిక. [గీకునాటక సంప్రదాయం ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించలేకపోయింది. తన తండ్రి అయిన ఆగెమర్నుస్‌ను చంపినందుకు తల్లినిచంపవలసిందిగా ఒరెస్టేస్‌కు భగవంతుడు ఆదేశించినట్లూ, ఆ ఆదేశాన్ని ఒరెస్టేస్‌ విధేయతతో నిర్వ ర్తించినట్లూ...[గీకు పురాణాలలో ఒక ఇతిహాసం వుంది. సౌఫాక్షీన్‌ యితిహాసాన్నే యథాతథంగా తీసుకొని ఒక నాటకాన్ని రచించాడు. ఈ యితిహాసం ఈస్పులన్‌కు విపరీతమైన జుగుప్స కల్గించింది. యూరిపిడీసుకుకూడా ఈకథ దుర్సరమనిపించింది. “ఈ పాపకృత్యం చేయవలసిందిగా ఒరెస్టేస్‌ను ఆదేశించింది నిజంగా ఈశ్వరుడే అయితే, ఆ ఈశ్వరుడు నాకలోకానికి ఈశ్వరుడా, రాక్షసలోకానికి ఈశ్వరుడా అని శంకించవలసి వుంటుంది" అన్నాడు యూరిపిడీన్‌

  • తన జుగుప్పనంతా వ్య క్తీకరిస్తూ. ఒరెస్టేస్‌ను సహితం ఇదే అసుమానం పట్టి కీడ్రిస్తుందిగాన చివరికి ఆ ఆదేశాన్ని విధిగా నిర్వ ర్తిస్తాడు.

2238 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శ: సాహిత్యము సంస్కృత నాటక సంప్రదాయానికీ, గ్రీకు సంప్రదాయానికీ ఈ విషయంలో ఉత్తర దక్షిణ (ధ్రువాలకు వున్నంతదూరం వుంది. మానవుని భాగధేయాన్నీ భవితవ్యాన్నీ నిర్ణయించేది మానవుని “కర్మే” గాని గ్రహచారం ఎంతమాత్రం కాదు. ప్రతివ్యక్తీ తన భాగ్యానికి లానే విధాత అనే దృక్పథం సంస్కృత నాటకాలలో (ప్రతిచించితమౌతుంది. “కింగ్‌ లియర్‌ నాటకాంతాన వున్న “పండి పరిపక్వం కావటమే పరమావధి" అనే సూక్తి సంస్కృత నాటకాలకు మూలసూత్రం. “నశకుంతలొలో కూడా విషాదం, కరుణ రసం లేకపోలేదు. అయితే అది తాత్కాలికమైనదేగాని విషాదంలో పర్యవసించేది కాదు. బుష్యాశమంలో ప్రశాంతమైన వాతావరణంలో పెరిగిన బాలిక ఏవిధంగా దుర్భరమైన కష్టాలకు లోనైందీ, ఆ మనస్తాపంతో, వ్యథతో మనస్సు ఏవిధంగా క్షాళితమై పరిపూర్ణతను, పరిపక్వతను సంపాదించిందీ ఈ నాటకంలో పర్దించబడింది. మనుష్యుడు జీవితంలోవచ్చే కష్టాలనూ, దుఃఖాలనూ ఎలా తరించాలో ఆ పరిష్కార మార్గాన్ని ఈ నాటకం లోకానికి నిర్దేశిస్తూంది. పంజాబు నాటకరంగం న్యూఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ నాటకోత్సవాలలో (ప్రదర్శించబడిన “పాటలనాడు" అనే నాటకం పంజాబీ జానపద నాటక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది. పంజాబులో నాటకసాంప్రదాయం ప్రధానంగా జానపదమైనది. దీని [ప్రభావం మనకు అడుగడుగునా ద్యోతకమవుతూ వుంటుంది. సంస్కృతనాటకాల అనువాదాలుకూడా (ప్రచారంలో వున్నవి. కాని వాటపభావముమాత్రము అంత పరిగణ్‌ించదగింది కాదు. నిక్కుమత ధర్మాల (ప్రశస్తిని, బెన్నత్యాన్ని ఉగ్గడిస్తూ భాయి వీరసింగ్‌ అనేక నాటకాలు వ్రాశాడు. కాని వాటిని దృశ్యనాటకాలనడంకంటే శ్రవ్య నాటకాలనడమే బహుసమంజసం. అవి నటించడానికికంటే చదువుకొని ఆనందించటానికి ఎంతో బాగుంటాయి. మొదటినుంచీకూడా పంజాబు నాటకాల్లో జానపద సాంప్రదాయం బీజప్రాయంగా ఉంటూనేవచ్చింది. దహదీలనబడే వీణ పాటకులు ఊరూరూ తిరుగుతూ శివపురాణవీరుల శౌర్యాన్ని, శిక్కుగురువుల యశోగాథలను, జానపద

ఖారతదేశ నాటక సాంప్రదాయాలు 2239 'గేయాలలోని కథానాయకుల సాహస పరాక్రమాలను కీర్తించే చారణ గీతాలను పాడుకుంటూ వాటికి ఆ బహుళవ్రచారాన్ని సంతరించిపెట్టారు. ఖాండులు, మరాటీలు అనబడే దేశద్రిమ్మరి జాతులు ఈ కథలనుచెప్పి ప్రచారంలోకి తీసికొని రావడమేకాక, అవకాశం ఉన్నప్పుడల్లా అప్పటికప్పుడు నాటకాలుగా ప్రదర్శిస్తూ ఉండడంకూడా పరిపాటి.

ఆధునిక సాంప్రదాయమునకు చెందిన తొలి పంజాబీ నాటకాన్ని ఆచార్య ఐ. సి. నంద 1914లో రచించాడు. దీని ఇతివృత్తం సాంఘికమైనది. ముగ్ధఅయిన ఒక నవ వధువు భావిజీవితం, సమాజంలో ఆమె స్థానం ప్రధానంగా ఇందులో వర్ణితమైంది. అప్పటినుంచి, ఆ తర్వాత ఆయన సాంఘికేతివృత్తాలుగల అనేక నాటకాలు రచించాడు. అందులో ఎకాంకికలు ఉన్నాయి. పెద్ద నాటకాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆచార్యనందా పంజాబు నాటకరంగానికి చేసిన అమోఘసేవ ఏమిటంటే, అంతవరకు బహుళప్రచారంలోఉన్న అసహజ అసంబద్ధ సంఘటనలతో నిండివున్న ఉర్దూ నాటక సంప్రదాయాలకు స్వస్తిచెప్పి కొత్త బాణీలో నాటకాలు నడిపించడం. అపూర్వ సంఘటనతోకూడిన ఈ పాత నాటకాలకు కళాశాలల వర్గాలలో విశేష [ప్రోత్సాహం లభించేది.

ఆ తర్వాత ఆచార్యనందా అడుగుజాడల్లో శ్రీ హరిచరణ్‌శింగ్‌, మోహనశింగ్‌, రోషన్‌లాల్‌ అహుజా, అమృతశింగ్‌, గురుదయాళీ్‌శింగ్‌ పుల్‌, బల్‌బీర్‌శింగ్‌, జి. యన్‌. కోస్లా, శ్రీ బలవంత్‌గాగర్లే ప్రభృతి [ప్రముఖులు పంజాబు నాటకరంగానికి కొత్త మెరుగులు దిద్దారు.

ఈనాటి పంజాబీ నాటక రచయితలలో శ్రీగార్గి నిస్సందేహముగా అగ్రగణ్యుడు. ఆయన అనేక ఏకాంక నాటికలను, అరడజనుకు ఫెగా పెర్ధనాటకాలను రచించాడు. నాటకీయరచనలోఆయన కొన్ని పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరిం చినప్పటికీ ఇతివృత్తాలనుమాత్రం సుదృఢమైన, సుందరమైన, మనోహరమైన దేశీయ జానపద గాథలనుంచి ఫ్వీకరించి, పాంచాలసీమ పరిమళం గుబాళింపును (ప్రేక్షక మనోరంజకంగా అందజేయడంలో సిద్ధహస్తుడయినాడు. ఆయన రచించిన “కస, “కనక్‌దీబలి” అనే శృంగార గేయాలు స్వచ్చుమయిన, అమలమయిన పంజాబు వల్లెటి ప్రజల ఉజ్వల ప్రణయానికి మణిముకురాలు. ఆయన “లోహకుటొ నాటకమంతా పల్లెటూరి కమ్మరి సమ్మెట మోతలలో అడుగడుగునా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

2240 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సంఘంలో వాస్తవిక పరిస్థితిని చిత్రించడానికి ఒకవంక ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతూఉండగా, వేరొకవంక సంగీత పప్రధానములూ, హాస్య(పప్రధానములూ అయిన యక్షగానాలు, ప్రహసనల రచనకూడా వృద్ధిపొందుతూ వచ్చింది. ఈ కోవకు చెందిన రచయితలలో శ్రీమతి షీలాభాటియా నిరోమణివంటిది. ఈమె ప్రసిద్ధ కవయితి. ఈమె పంజాబు ప్రజలలో పాతుకుపోయిన సహజమాధుర్యాన్నిి గానఫ్రయత్వాన్ని తన రచనల్లో గుచ్చెత్తింది. . అస్సాం నాటకరంగం భారతదేశానికి తూర్పు సరిహద్దు అస్సాంరాష్ట్రం. దానినే పూర్వకాలంలో “కామరూపం” అని వ్యవహరించేవారు. కర్ణపేయమైన సంగీత ధ్వనులు, మనోహరమైన మధురగానంతో కూడిన నృత్య (ప్రదర్శనలే ఆనాటి అస్సాం ప్రజల వినోద కాలక్షేపం. ఇప్పటికీ అస్సాం పల్లెప్రాంతాల్లో “ఓజా పాలిస్‌” అనే బృందగానాన్ని హస్తాభినయంతో సహా శ్రవణానందంగా గాయక సంఘాలు పల్లెప్రజలకు వినిపిస్తూ వుండడం కద్దు. ఈ నృత్యప్రదర్శనల పరిణామమే నేటి నాటకం. . అసలు పదహారవ శతాబ్దంలోనే శ్రీ శంకరదేవ అస్సామీ భాషలో తొలిసారిగా నాటకరచన కుప[కమించాడు. అస్సాం నాటక పితామహు డీయన అని చెప్పాలి. ఈయన స్వయంగా చిత్రకారుడు కావడంతో, కథ ననుసరించి ఆయా సందర్భాల కనువైన, నేత్రపర్వమైన మనోహర దృశ్యాలను రంగస్థలంపై సృష్టెంచగలిగాడు. ఈయన గద్యంలోనే తన రచనను కొనసాగించి నూతన పంథా నవలంబించాడు. ఈయనా, ఈయన నిష్యుడు మాధవదేవ (వాసిన “అంశేయ నటొ' అనే యేకాంక నాటికలు యూరోపియన్‌భాషలోని ఆశ్చర్యాత్మక, ప్రబోధాత్మక నాటకాలను పోలివుంటాయి. సాత్రాస్‌ అనే వైష్ణవమత కేంద్రాల్లోనూ, నామ్‌ఘర్‌ అనే గ్రామీణ రంగస్థలాల్లోనూ నేటికీ యీ నాటకాలు (ప్రదర్శింపబడుతూనే వున్నాయి. ఇక, 19వ శతాబ్బంలోనూ, 20వ శతాబ్దపు మొదటిభాగంలోనూ వెలువడిన అస్సాం నాటకాఐపై పాశ్చాత్య నాటకాల (ప్రభావం అడుగడుగునా మనకు ద్యోతకమవుతూ పుంజంది. యూరోపియన్‌ భాషల్లోని ప్రణయం, పరాక్రమం

భారతదేశ నాటక సాంప్రదాయాలు 2241 (ప్రధాన కథావస్తువులుగా గలిగిన నాటకాల పంథాలో వున్నాయి యీ నాటకాలు. దుర్గశ్వరశర్మ వాసిన “పార్థ పరాజయ” అనే నాటకంలో శాస్త్రీయమైన “స్థలం కాల, పాత్రౌచిత్యము” అతినైపుణ్యంతో పాటించబడింది.

(పథమ, ద్వితీయ, సహాయ నిరాకరణోద్యమాల కాలంలో నాటకరంగంలో నూతనశకం (ప్రారంభమైంది. దేశభక్తి (ప్రపూరితమైన నాటకాలు యీ కాలంలోనే వెలుగును చూశాయి. రాణాప్రతాప్‌, శివాజీలాంటి జాతీయనాయకుల జీవితాలను చిత్రించే నాటకాలు అస్సాం ప్రజలను కదిలించివేసి, స్వాతంతృ్య పోరాటం వైపు వారిని మరల్చాయి. అన్సాం చరిత్ర, “బురాజిలకు సంబంధించిన నాటకాలు కూడా యీ కాలంలోనే వెలువడ్డాయి.

ఇక, యీ శతాబ్దంలోని మూడవ దశాబ్దంలో దేశంలో వచ్చిన ఆర్థికసంక్షో భం రచయితలను సాంఘిక సమస్యలపై తమ రచనలు కొనసాగించడానికి పురికొల్పింది. అప్పుడే నాటకరచనలో నూతనాధ్యాయం ప్రారంభమయింది. సాంఘిక నాటకాలూ, వ్యంగ్య నాటకాలూ చాలా అవతరించాయి. లక్ష్మధర్‌శర్మ చాల సమర్థతతో ఇంగ్లీషు ఏకాంకికలను అనుకరించాడు. సంఘంలోని అవినీతులను బయటపెట్టడానికి ఆయన తన కలాన్ని వినియోగించాడు. జాతీయోద్యమంలో పాల్గొని యాయన వైలుకెళ్ళాడు. పాపం, బైలులోనే క్షయవ్యాధితో కళ్లుమూశాడు.

ఇక, జ్యోతీ ప్రసాద్‌ అగర్వాలా అస్సాందేశపు జానపద నృత్యాలను ఆధునిక పద్ధతులలో నిర్వహించాడు. తన నాటకాల్లో కూడా వీటిని ప్రవేశపెట్టాడు. ఈయన ఐరోపాలో సంగీతా న్నభ్యసించాడు. ఈయనకు నటన ఉగ్గుపాలతో పెట్టిన విద్య. మొట్టమొదటగా అస్సాంభాషలో ఈయన “జైమతీ అనే ఫిల్మును నిర్మించారు. దానికి యాయనే దర్శకుడు కూడా. సంఘ దుర్నీతులను నాటకాల్లో ఘాటుగా విమర్శించే సంప్రదాయం ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలంలోనూ, తరువాతకూడా (పప్రబలమైంది. కాని, ఆ సంప్రదాయాన్ని అనుసరించే రీతుల్లో మాతం మార్పు కానవచ్చింది.

ప్రబిన్‌ఫుకన్‌, లాక్ష్యాధర్‌ చౌదరి, ప్రభాత్‌శర్మ - నేటి నాటక రచయితలలో (ప్రముఖులు. ప్రబిస్‌ఫుకస్‌ నాటకరచనలో సిద్ధహస్తుడు. ఆయన అనేకరకాల

2242 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నాటకాలను అతిసమర్థతతో (వాశాడు. అన్నీ విజయంగాంచాయి. ఆయనభాష మృదుమధురం. ఆయన పా్యాతలలో సహజత్వం ఉట్టిపడుతూ వుంటుంది. సంఘ సమస్యలను, సంఘ దుర్నీతులను నాటకాలద్వారా బట్టబయలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

ఆయన [వాసిన “మణీరామ్‌ దివాన్‌”, “కాలపరిణయి, “అస్సాం హాలీవుడ్‌” అనే నాటకాలు అత్యుత్తమమైనవి.

ప్రఖ్యాత ఇంగ్లీషు నాటకరచయిత “ఇబ్బెన్‌” సంప్రదాయం (ప్రకారంగానే ఆయన లక్ష్యంకూడా "ఆయా సమస్యలనుగురించి ప్రజలకు తలియజెయ్యడమేగాని పరిష్కరించడం కాదు.” తమిళనాటక సంప్రదాయం

మూకాభినయాలు, సాహిత్య నాటకాలు ప్రాచీన తమిళ [గ్రంథాలలో పేర్కొన బడినప్పటికీ, ఈనాడు ఒక్క ప్రాచీన తమిళనాటకం కూడా మచ్చుకైనా కన్పడదు. భరతనాట్యం, కథాకాలక్షేపాలు ఈనాడు ఎక్కువ 'ప్రాముఖ్యంలోకి వచ్చినందున పె రెండూ మరుగున పడిపోయివుండవచ్చు.

[క్రీస్తు తర్వాత 7వ శతాబ్దంలో రాజవంశానికి చెందిన రచయిత, రాజమహేంద్రవర్మ, సురాపానాన్నీ మతదురభిమానాన్నీ అవహేళనచేస్తూ ఒక చిత్రమైన నాటకాన్ని రచించాడు. “భక్త విలాస ప్రహసనం” అనే ఈ నాటకం సంస్కృతమూ (ప్రాకృతమూ కలిసిన ఒక మి్మిశమభాషలో రచించబడింది.

11వ శతాబ్దంలో, తంజావూరులోని సుప్రసిద్ధ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడు, ఈ దేవాలయ ప్రాంగణంలో ఏటేటా నాటకాలు వేయించే ఆనవాయితీ (ప్రవేశ పట్టాడు. కాని, ఈ ఆనవాయితీ ఆయనతోనే అంతరించిపోయింది. అదీకాక, నేటి నాటక నిర్వచనం దృష్ట్యా చూస్తే, ఆనాటి నాటకాలను ఆ పేరుతో వ్యవహరించడానికి వీలులేదేమో అనిపిస్తుంది.

నాటకకైలి అనేది, మొట్టమొదటగా, వీథి నాటకాల వల్లనూ, వీథి నృత్యమేళాల ద్వారానూ ప్రజలకు పరిచితమైంది. పల్లెలలో చాకళ్ళూ, కుమ్మరులూ మొదలైనవాళ్లు,

ఖారతదేశ నాటక సాంప్రదాయాలు ॥ 2243 ముఖ్యంగా చాకలులు, నల్లతంగాళవంటి పురాతన నాటకాలనూ, పౌరాణిక నాటకాలనూ అభినయించేవారు. వేషాలువేయటానికి కావలసిన దుస్తులూ, ఇతర సాధన సామగీకూడా వీరివద్ద వుండేది. కొన్ని ప్రాంతాలలో ఈ వీథినాటక ప్రదర్శనలు యిప్పటికీ ప్రచారంలో వున్నాయి. అయితే ఈ నాటకాలలో అభినయంకంటే సంభాషణలకు, పాటలకే ఎక్కువ (ప్రాముఖ్యం వుండేదని వేరే చెప్ప నవసరం లేదు.

తంజావూరు మరాఠా పరిపాలకుల హయాములో, ముఖ్యంగా శరభోజ మహారాజుకాలంలో తమిళ సంస్కృతీ, కళ పరాకాష్ట నందుకున్నాయి. ఆ రోజుల్లోనే కురవంజి అనే నూతన నాటకశైలి రంగంమీదికి అవతరించింది. జానపద గేయాలు, నృత్యం, అభినయం - వీటి సమ్మేళనమే కురవంజి. (ప్రేమ, వియోగం, పునస్సమాగమంవంటి సార్వజనీనమైన మనోభావాలనూ, హృదయోద్వేగాలనూ అభినయించి, వేషధారులు చూపరుల మనస్సులను చూరగొనేవారు. అనగా ఈ కురవంజిని ఒక విధమైన నృత్తమని చెప్పవచ్చును.

19వ శతాబ్దం ద్వితీయార్థంలో, నాటకకళ మళ్లీ కొంగ్రొత్త రూపాలు తాల్చి దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. పుదుచ్చేరిలో 1866లో సారంగ అనే నాటకం ప్రదర్శించబడింది. బెంగాలీ రచయిత గిరీశ్‌చంద్ర వ్రాసిన “పూర్ణచంద” కథకూ, దీనికీ చాలా పోలిక వుంది. మరికొన్ని అంశాలలో ఇది హిందీలోని “పురాణభగత్‌ నాటకాన్ని" జ్ఞప్తికితెస్తుంది. 1870వ సంవత్సరం (ప్రాంతాల తంజావూరు జిల్లాలో నాటక సమాజాలు వెల్లివిరిశాయి. ఈ నాటక సమాజాలు దేశంలో దశదిశలా పర్యటించి, ఊరూరా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవి. వీరు ముఖ్యంగా వల్లి, కోవిలన్‌, హరిశ్చంద్ర నాటకాలు వేసేవారు. వీటిల్లో, దేశకాలపాత్ర బెచిత్యాలతో నిమిత్తంలేకుండా వేషధారులు ఏకటాకీన పాటలుపాడుతూ ఉండేవారు.

ఇలా వుండగా, తమిళనాటక రంగంమీదికి పాశ్చాత్య (ప్రభావం (ప్రసరించి, దానిని కొత్తవరవడిలో తీర్చిదిద్దింది. దీని ఫలితంగా, సుందరంపిళ్లె మానన్‌ మనియం, లక్ష్మణపిళ్లె సత్యవతి, వి. జి. సూర్యనారాయణశాస్త్రి రూపవతి కళావతులు అనే కొత్త నాటకాలు ప్రచారంలోకి వచ్చాయి.

2244 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము 20వ శతాబ్ది (ప్రారంభంలో, మద్రాసులో సుగుణవిలాస సభ అవతరించింది. ఇదే తమిళ నాటక సంప్రదాయంలో నూతనాధ్యాయానికి నాందీ ప్రస్తావన. ఈసభకు నాయకులలో ఒకరైన శ్రీ పి. సంబంధమొదలియార్‌ ఆధునిక యూరోపీయ పంథాలో, సామాజిక సమస్యలు కథావస్తువుగా, చక్కని నాటకా లనేకం రచించారు. ఆయనా, ఆయనమిత్రులూ నాటకరంగంలో అనేక సంస్కరణలను (ప్రవేశపెట్టారు. వారి కృషివల్ల, దేశంలో నాటకాలకు మన్నన, ఒక అపూర్వమైన ప్రతిపత్తీ లభించాయి. దీంతో, మద్రాసు సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ నాటక సమాజంవంటి పెక్కు ఇతరసంస్థలు దేశంఅంతటా అసంఖ్యాకంగా వెలిశాయి. వేషధారణ, నాటకరంగ సజ్జీకరణలో కన్నయ్యకం పెనీవారు సిద్ధహస్తులని పేరు ప్రఖ్యాతులు పొందారు. నేటి తమిళ నాటకరంగానికి నవాబ్‌ రాజమాణిక్యం నాయకాగ్రణి. అతని నాటక ప్రదర్శన లంటే జనం విరగబడతారు. కాని, ఆయన సమాజం ఎక్కువగా సాంప్రదాయికమైన నాటకాలనే ప్రదర్శిస్తుంది. టి. ౩. ఎస్‌.సోదరుల వంటి ప్రఖ్యాత నటకులు తమిళ నాటకరంగాన్ని తీర్చి దిద్దడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలో ఇవాళ (ప్రదర్శించబడనున్న “ని వక్రామియిన్‌ శపథం” వంటి నాటకాలను తమిళ సారస్వతంలోని ఉత్కృష్ట రచనలకు ఉదాహరణగా పేర్కొనవచ్చును. ఈ నాటకంలోని కథ పల్లవులు, చాళుక్యుల కాలంలో జరిగినట్లు చిత్రించబడింది. సామాజిక సమస్యలను పురస్కరించుకొని ఇటీవల వ్రాసిన నాటకాలకు “రత్తపాశం” అనే నాటిక మంచి నిదర్శనం. ఒరియా నాటకరంగం ఒరియా నాటకరంగంలో అతిప్రాచీన సంప్రదాయానికి చెందిన “వీథి నాటకాలు" పురాణేతిహాసాలలోని పాత్రలను (గ్రామ ప్రజలు చక్కగా అర్ధంచేసుకొని, వాటిని ఆకళింపు చేసుకోడానికి విశేషంగా తోడ్పడ్డాయి. మోహన్‌ గోస్వామి రచించిన భక్తిరస ప్రధానమైన నాటకాలు, రాధాకృష్ణుల పవిత్రకేమను వివరించే నాటకాలు (గామప్రజలను ఎక్కువగా ఆకర్షించాయి. కాని, అదే సమయంలో సాంఘిక నాటకోద్యమం తొలిసారిగా ప్రారంభమైనది. బాలకృష్ణ మహంతి, బైస్‌నాబ్‌పాణి లలితమైన సుఖాంత నాటక రచనలు చేశారు.

భారతదేశ నాటక సాంప్రదాయాలు 2245 తర్వాత ఒరియా నాటక రంగంలో రెండవదశ ప్రారంభమైనది. వీథినాటకాల శకం పోయి, నాటకశాలలలో (థియేటరులలో) నాటకాలు (ప్రదర్శించడం, పురాణేతిహాసాలను విడనాడి చారిత్రిక నాటకాలను ప్రదర్శించడం జరిగింది. కాళింది చరణ్‌ పాణిగ్రాహి రచించిన “ధమ్మపది” అనే నాటకంలో అశోకుడు కళింగ యాత్ర పూర్తిచేసినతర్వాత ఆయనలో కలిగిన మానసిక పరిణామం వ్య క్తంచేయబడింది. అశ్వినీకుమార్‌ ఘోష్‌ రచించిన “కోణార్క” అనే నాటకంలో ప్రఖ్యాత సూర్యదేవాలయానికి “విమానాన్నిో నిలబెట్టడంలో 1200 మంది సాంకేతిక పనివారు విఫలులవగా, ఆ పనిని అతి సునాయాసంగా నెరవేర్చిన “ధర్మ” అనే పన్నెండేండ్ల బాలుని చరిత్రను ఇతివృత్తంగా తీసుకొని ఆ నాటకం రచించబడింది. ఒరియా నాటకరంగంలో ఇటీవలే ఆధునికవిధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. రంగస్థల అలంకరణ, సంగీతం, విద్యుద్దీపాలు (ప్రవేశపెట్టబడ్డాయి. నేటి నాటకరచయితలలో కాళిచరణ్‌ పట్నాయక్‌ అగ్రగణ్యుడు. ఆయన రచనలలో పాత కొత్తల మేలు కలయిక స్పష్టంగా కన్పిస్తుంది. జయదేవుని “గీతగోవిందం” ప్రధానమైనది. నిరుద్యోగ నిర్మూలనకు కృషిచేసే “బికార్‌", సాంఘిక న్యాయాన్ని బలపరచే “భట్టి కూడ పేర్కొనదగినవి. పట్నాయక్‌ స్వచ్భ మైన వాడుక భాషలో రచనలు సాగిస్తారు. ఆయన “ఫటాభూయిన్‌"” అనే పద్యనాటికను రచించారు. తర్వాత చెప్పుకోదగిన నాటక రచయితలలో మనోరంజన్‌ దాస్‌ ఒకరు. ఆయన రచించిన “భక్తిజగబంధు “ఆగస్టు 9 అనే నాటకాలు దేశభక్తిని ప్రబోధిస్తాయి. భంజా హే పట్నాయక్‌ గోపాల్‌ భట్రాయ్‌, రామచంద్రమిగ్రాలు రచించిన నాటకాలలో మధ్యతరగతి ప్రజల జీవితాలకు ఎక్కువ 'ప్రాధాన్యముంటుంది. ఒరియా నాటకరంగంలో ఏకాంకికలకుకూడా ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఒరియా ఏకాంకనాటకాలలో కళకు, (బతుకు తెరువుకు గల సంఘర్షణను చిత్రిస్తూ హరికృష్ణ మెహతాబ్‌ రచించిన నాటిక గొప్ప నాటికలలో ఒకటి. సురేస్‌మహంతి, గోపీనాథ్‌ మహంతీ ఏకాంకికలను రచియించినవారిలో ముఖ్యులు. రేడియో నాటికలుకూడా ఇప్పుడు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. సురేన్‌మహంతీ, నరసింహ మహాపాత్ర, జతీస్‌దాస్‌, శామ్యూల్‌నాయక్‌ నిత్యానంద

2246 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 44; సాహిత్యము మహాపాత్ర, నవకుమార్‌దాస్‌, నాగేంద్రరాయ్‌ ప్రభృతులు రేడియో నాటికా రచయితలలో ముఖ్యులు. మారణాయుధాల వినాశక శక్తిని వివరిస్తూ జితిన్‌దాస్‌ “అబిస్కార్‌” అనే నాటికను రచించారు. ఆయన “మిమాంస” అనే నాటికలో సాంఘిక అవరోధాలను నిరసించారు. నరసింహ మహాపాత్ర రచించిన “సింధూరొ అనే నాటిక ప్రేమ ప్రధానమైనది. సంఘంలో “స్త్రీ”కి గల ఉన్నత పాత్రను వివరిస్తూ నాగేంద్రరాయ్‌ “నారో అనే నాటికను రచించారు. (కిన్నెర: సంప్పుటము 6, సంచిక 12 డిశంబరు 1954)

  • జయజకు గ ఇరా న గ్‌ ' యీడ్‌!((ట/ హాళ్లు రట 1 .. షి గ రెరఉి టా

ఒక అజ్ఞాత రచయిత్రి నాయని కృష్ణకుమారి

కిన్నెరలో ఒకసారి అజ్ఞాతకవిని ఒకరిని పాఠకలోకానికి పరిచయం చేసే వ్యాసమొకటి పప్రచురింపబడ్డది. నా మనస్సు ఆ వాక్టసకర్తను అభినందించకుండా ఉండలేక పోయింది. నిజానికి ఇటువంటి వ్యాసాలు ఎన్నైనా కావాలి. ఎందరో అజ్ఞాత రచయితలు అడుగున పడిపోకుండా ఉద్ధరించడాని కివే సమర్థాలు.

మనుష్యులంతా బొడ్డున మాణిక్యాలతో పుట్టరు. ఒక వ్యక్తి రాణించడానికి అంతర్గతమైన ప్రతిభకు తోడు అవకాశాలుకూడా కలగాలి, కాని యీ అవకాశాలనేవి అందరికీ కలగవు. కలిగించే బాధ్యత కొంతవరకైనా యీనాటి పత్రికా ప్రపంచం భుజాల కెత్తుకుంటే మాటుపడిన మాణిక్యా లెన్నో వెలుగు తరలు చిమ్మక మానవు.

ఇంతకూ, కిన్నెరలోని వ్యాసమే నా యీ వ్యాసరచనకు దారితీసింది. లోకంలో చిత్రమేమిటంటే, బ్రతికి జీవితంలో ఒకస్థితిని అందుకోవాలని పెనుగులాడే వ్యక్తిని గూర్చి ఎవరూ చెప్పుకోరు. అట్లా చెప్పుకుంటే ఎమి చిక్కులో? చెప్పేది నచ్చనివారివలన ఎటువంటి విమర్శలైనా రావచ్చును. వాటి నన్నిటినీ భరించే ఓర్పు అందరికీ ఉండదు. ఇక విగతజీవుల విషయం వేరు. గొడ్డు చచ్చింతర్వాత పాడి బయట పడుతుందన్నట్లు ఈ లోకం విడిచినవారి మంచితనాన్నే అందరూ నెమరువేస్తారు. వాళ్లమీద వ్యాఖ్యానాలుగానీ, విమర్శలుగానీ, ఎప్పుడూ అప్రీతికరంగా మాతం వెలువడవు. మనుష్యులలో ఆ సుగుణం ఉంది.

ఇంతకూ నా రచయిత్రి జీవించే ఉన్నది. ఆవిడలో పురోగమన వాంఛ అనుక్షణమూ జీవితంతో ఘోరయుద్ధం చేస్తూనే ఉంది. కాని ఆవిడ పేరుమాత్రం

2248 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము పత్రికల్లో పదిసార్లు మోగలేదు. పుస్తకాలు ప్రచురించడం కానీ, సాంస్కృతిక సమావేశాల్లో ఉపన్యాసా లివ్వడం గాని ఆవిడ యింతవరకూ సాధించలేదు. కాని ఆమె వాస్తుంది; పాడుతుంది. ఆవిడ (వాసేవి ఎక్కువగా కథలూ, గేయాలూ. వయస్సును మించిన జీవితానుభవం, దాని మూలంగా ఆవిడ సొత్తయిన హృదయావేదనా ఆమె ప్రతిరచన లోనూ హత్తుకుని మనలను పలకరింపక మానవు. ఈ ఒక్క గుణమేకాదు నన్నాకర్షించింది; చెప్పదలచుకున్న భావాన్ని తిన్నగా చెప్పే గుణంకూడా ఆవిడ రచనలో ఉంది. ఆమె చేతిలో తిరిగే పదాలన్నీ అతి చిన్నవీ, తేట తెలుగుపదాలూనూ. సంస్కృత సమాసాలు వెయ్యడానికి ఆవిడ పండితురాలు కాదు. అట్లా కాకపోవడమే ఆవిడ రచనల్లోని లాలిత్యాన్ని కాపాడింది. కాలమూ, దైవమూ కలిసి రాలేదుగాని, ఆవిడ గేయాలనుగూర్చి నేనుకాదు పరిచయం చేయవలసింది. ఆవిడ ప్రతిభలో నా కంత గౌరవం ఉన్నది.

ఈ కాలంలో కలం పట్టనేర్చిన ప్రతివ్యక్తీ రచయితే. కొల్లలుగా వ్యాసాలూ, గీతాలూ, కథలూ, ఖండికలూ వెలువడుతూనే ఉన్నవి. వాటిలో కళ్లు మెరమెర 'లాడించే తైక్ష్యమూ, హృదికి హత్తుకునే కొత్తదనమూ ఎక్కడోగాసి కన్పించవు. ఈవిడ వ్రాసిన ప్రతీదీ నవ్యతకు నిలయమేనా అని నన్నడగకండి. ఆ మాటంటే పరిణత ప్రజ్ఞ్జులకు అపచారం చేసినట్లూ, ఆవిడను ఆకాశాని కెత్తి నా వాక్కును అతిశయోక్తి దూషితం చేసుకున్నట్లూను. కాని ఒక్క మాటమాత్రం చెప్పగలను. ఒక్కసారి చదివి నిర్లక్ష్యంగా అవతలకు విసిరివేసే రచనలు మాత్రం కా వావిడవి. అవి సర్వాంగసుందరమై, నిర్దుష్టమైన సాహిత్య రూపానికి నీడలూ, జాడలూ! ఆ మసకలు ఫోవడానికీ, పరిపూర్ణత కలగడానికీ కొంత పరిశ్రమా, శ్రద్ధా, అన్నిటినీమించి నలుగురి ప్రోత్సాహమూ అవసరం,

సాహిత్యంలో గేయాని కుండే స్థానం ప్రతివారూ గౌరవించి నెత్తిన పెట్టుకున్నది కాకపోయినా, చక్కని గేయాన్ని విన్నప్పుడు మనస్సు ఉయ్యాల లూగుతుంది. హృదయాన్ని తల్లలా జోకొట్టి నిదపుచ్చే ఆ గుణం మళ్లీ పద్యానికి లేదు. పద్యం

కర్ణాటకసంగీతం వంటిది. గేయం లలితగానం వంటిది. గేయాలనగానే నా మనస్సుకు ఒక్క కవీ, ఒక్క గేయంమాత్రమే స్ఫురించి వెలుగుల్ని నింపుతారు. ఆ కవి కృష్ణశాస్త్రీః, ఆగేయం -

ఒక అజ్ఞాత రచయిత్రి నాయని కృష్టకుమారి 2249 “జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! అన్న అమరసృష్టీ. అయితే నీ రచయిత ఇట్లా వ్రాస్తుందా అని నన్నడగకండి. ఆవిడ యిట్లా వ్రాయలేదు. వ్రాయడానికి తగిన పరిశ్రమా, సామగ్రీ ఆవిడకు లేవు. అయినా ఆవిడ రచన నలుగుర్నీ తన దగ్గరకు ఆకర్షిస్తుంది. ఒక స్త్రీ హృదయగత వాంఛ లెటువంటివై ఉంటవో చెప్పాలనుకున్న గేయం చూద్దాం , “రవలు నవరతనాలు రాసు లెన్నో పోసి ఆ మేటి రతనాల స్వామి వీవంటే వద్దంది నా మది మరలైన చూడక తిరిగి వచ్చేశాను తిన్నగాను. కోటి విద్దెల నేర్పు - కొమరు ప్రాయమ్ము కొల్ల కొల్లలు చేర్చి కోరుకోమంటే వద్దంది నా మది మరలైన చూడక తిరిగి వచ్చేశాను తిన్నగాను. అంద చందాలను అపరూపు సిరులను అచట (ప్రోవులుపోసి అందుకోమంటే వద్దంది నామది మరలైన చూడక తిరిగి వచ్చేశాను తిన్నగాను.

2250 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మగని వాత్సల్యమ్ము మాతృత్వ మొక చిన్న భరిణలో దాచగా పొరలి పొంగులు వారి సిగ్గును తలవంచి చెయిజాప్‌నాను పదిలమ్ముగా హృదిని భదపరిచాను. ఇందులో స్పష్టంచేసిన భావం అతిసహజమైనదీ, మధురమైనదీని. ఇంతకంటే స్త్రీ హృదయ స్వరూప ప్రకటన చేయడానికి కిక నేం మిగిలింది? ఆవిడ స్త్రీ కాబట్టి ఆ హృదయపు లోతులు ఆమెకి నిశితంగా అవగాహనమవుతా యంటారు. అదీ నిజమే కాని, ఊహ కందిన (ప్రతి విషయాన్నీ ఇంత సూటిగా, సులువుగా అందరూ చెప్పగలరో లేదో కాని, ఈవిడమ్యాతం చెప్పింది. కవియొక్క సృష్టి మనోరంజకం కావాలంటే, అందులో జీవితంలోని వివిధ ఘట్టాలలో సుఖంతోనూ దుఃఖంతోనూ కవిపొందిన సంఘర్షణ తప్పకుండా గోచరించాలి. సుఖానికంటే దుఃఖానికీ, మనస్ప్సంతోషానికంటే హృదయావేదనకూ కవిత్వంలో ప్రముఖమైన స్థానం ఉంది. ఇంతకూ ఈమె దుఃఖజీవిని. ముత్యాలవంటి ముగ్గురు బిడ్డలున్నా కొన్నాళ్లు భర్తకు దూరమై యేకాకి జీవితాన్ని గడిపింది. అత్తవారింటా, పుట్టింటాకూడా భర్త దూరంగాఉన్న భార్యకు (ప్రాప్తించే అన్ని అవస్థలనూ చవిచూసింది. తన బిడ్డల ముఖం చూస్తూ చావని ఆశతో, కమ్ముకువచ్చే నిరాశతో రోజులు బరువుగా వెళ్లదీసింది. అటువంటి మానసిక సంక్షోభం మధ్యః ఆవిడ కలం నడిచి ఆకారం వహించిన గేయాలనిండా ఆవిడ జీవితపులోతులే. ఒక విచారమిభిత నిస్పృహారేఖ, బాధా కులిత స్త్రీ హృదయగతి వాటిలో మనకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటుంది. . ఒకనాటి సంధ్యవేళ రచయిత్రి ఆలోచిస్తూ ఉంది. గడుస్తున్న జీవితపు విషమగతిని మరచిపోవడానికి గడిచిన చిన్ననాటి జీవితాన్ని నెమరువేసుకో బోయింది. కాని దానివల్ల ఆవిడ అందుకున్న దేమిటి? ఉత్త కలత, చూడండి - “చిన్ననాటి ఆట పాటల వన్నె చిన్నెల చిలిప్‌ గాథలు తలచినంతనె మనసు కలగింది ఈ సంధ్యవేళ.

ఒక అజ్ఞాత రచయిత్రి నాయని కృష్ణకుమారి 2251 మంచుకురిసే మనక వెలుగున మాటి మాటికి తిరిగి చూచి ఆల్లవారేసరికి కట్టుగ పిల్లలంతా కలసి కట్టిన చిన్ననాటి యిసుక మేడల తలచినంతనె మనసు కలగింది ఈ సంధ్యవేళ. ఓడ నడిపే యోధ ననుకొని వాన నీటి పిల్ల కాల్వల కాగితాల పడవ నడిపఏ తప్ప మునిగితె చప్పుటులతో కొత్త పడవల తేల్చియాడిన చిన్ననాటి పడవలాట తలచినంతనె మనసు కలగింది ఈ సంధ్యవేళ” అట్లాగే మరొకసారి తన బాల్యాన్ని నెమరు. వేసుకుంటూ ద్రాసుకున్న ఇంకొకగేయం హృదయాన్ని కదిలిస్తుంది. చిన్ననాడు బొమ్మలపెండ్లిండ్లూ, బాల్య[క్రీడలూ ఆడినదశ, అక్క చెల్లెళ్లతో ఎక్క సెక్కాలాడిన సతి, ఏ పనైనా తనంత తాను చేయబోయి, “ముదినాపసానిలా బయలుదేరుతున్నావ్‌! నీకేం తెలుసే?" అని తల్లి చేత మందలింపులుతిన్న అవస్థ, చివరకు దుఃఖాలే మిగిలిన పడుచు ప్రాయం - అన్నీ ఒక్కటొక్కటిగా తన కన్నుల ముందు గిజ్జున తిరుగగా ఈవిడ పడే ఆవేదనంతా ఈ "గేయంలో కనిపిస్తుంది మనకు. చూడండి : “కమ్మ గుజ్జన గూళ్తు బొమ్మలా పెళ్ళిళ్లు ఆడి పాడిన ప్రాయ మది పోయిందీ అయిపోయిందీ. అక్క సెల్లెండతో ఎక్క సెక్కెములాడి

2252 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కూడి యాడిస [ప్రాయ మది పోయిందీ అయిపోయింది. ఏమంత పెద్దవూ ఏమెరుంగుదువనే మా తల్లి గారాము మాసిపోయిందీ అయిపోయింది. ఎల జవ్వనమ్ములో కులికేటి (ప్రాయాన తాపాల శాపాల గుంపు మిగిలిందీ ఆశపాశల తోటి ఆకాశ మంటేటి గాలిమేడల వరుస కూలిపోయిందీ కడగండ్ల పూచింది కష్టాల కాచింది కన్నీట పండింది యెండిందీ అడివిగాచిన వెన్నె అయ్యింది యీ బదుకు కడకు నేలకు వ్రాలిపోనుందీ” ఇది ఆవిడ జీవితపు సింహావలోకనం. ఒకసారి తనను మాటిమాటికీ నిస్పృహలో ముంచియెత్తే మనస్సును నిలదీసి అడుగుతుంది - “నవ్వుకు తావే లేదన్నావే నువ్విక త్రోవే లేదన్నావే నిశీథ మంతం కాదన్నావూ నిరాశకే తుది లేదన్నావూ ప్రశాంతి రానే రాదన్నావూ నశించి కృశించి పొమ్మన్నావూ” నాగతి చివరి కంతేనా అని ఆవిడ మనోవేదన. ఒక్కొక్కసారి బాధపడే మనస్సును ప్రబోధిస్తూ “ఏడవకు, నీకూమంచిరోజులు వస్తయ్‌. నీ జీవితంలో

ఒక అజ్ఞాత రచయిత్రి నాయని కృష్ణకుమారి 2253 కూడా వసంతం అడుగుపెడ్డ్తుందిొ అని ఆశ నింపుకుని వ్రాసిన గేయాలూ ఉన్నయ్‌. అటువంటివాటిల్లో ఒకటి - “పూవుల్లు పూచేటి రమ్మా కాయల్లు కాచేటి కొమ్మా కన్నీరు కార్చ నేలమ్మా నిన్నన్నవా రెవ్వరమ్మా నీదు నెత్తావూల నంతా నీదు మకరందాల నంతా తేటి గోలే దొక్క వింతా మరచి పరుగెత్తితే వంతా! అందాలు చిందేటి రెమ్మా కోరికలు కుసుమించు కొమ్మా కుంది కృశియింప బోకమ్మా వాసంత మరుదెంచునమ్మా వరుడు నీదరి జేరునమ్మా” జీవితమంటే ఇంకా అనుభవించకముందు అందరికీ ఒక పూలరథంలాగో, నందన వనంలాగో కనిపించవచ్చు. తరువాత అందులో తామాసించిన మధురమయఘుట్టాలు కాక చేదునే రుచి చూడవలసివస్తే ఎవరైనా జీవితమంటే తమకు వెనకనున్న అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఒక స్త్రీ జీవితంలో ఈ "రెండు విధాలయిన స్థతులనూ రచయిత్రి ఒక గేయంలో ఎంత చక్కగా (ప్రస్ఫుటం చేస్తుందో చూడండి : “ఆనా డామెను చూచాను అన్నీ ఉండే వావిడకు నవ్వే కళ్లూ, నాజూకు ముఖం ఇల్లూ వాకిలి పిల్లా జల్లా (పియుడూ పఉయమూ అందం గర్వం అన్నీ ఉండే వావిడకు పలుకరింపగా అన్నది నాతో (గేమ శాశ్వతం (పణయమే స్థిరం సంసార సుఖం సుందర స్వప్నం.”

2254 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆ స్ధితి గడిచిన కాలంలో, “*ఈనా డామెను చూచాను కంపితనాదం కృశిత శరీరం కన్నీటిమయం భిన్న స్వరూపం పలుకరింపగా అన్నది నాతో బురద నీటిలో బుడగ వంటిదీ (బదుకే చెడుకల బంధమె లోకం బ్రతికి యుండగా సౌఖ్యం శూన్యం స్వర్గంలోనే సౌఖ్యం సర్వం! ఇట్లా ఉంటాయి ఈవిడగేయాలు చాలావరకూ. తనజీవితానుభవ ఛాయలకు దూరంగా కేవలం తాను ప్రకృతిలో పరికించే విషయాల మీద తన భావాలను పొదిగిన గేయాలూ ఉన్నవి. అటువంటి వాటిలో ఒకటి - గొప్ప బీదలకూ, సుఖదుఃఖాలకూ, సంతోష విషాదాలకూ గల సంబంధాన్ని తెలిపేది. చూడండి : “మనసు కలిస్తే యోజనం గజం కలియక పోతే గజం యోజనం దగ్గర దాపు, దూరం భారం అంతా ఒకటే అందుకో నిజం! కలకలలాడే నెలవే స్వర్గం వెలవెలబోయే నిలయం నరకం . మేడ మిద్దెలూ పూరిగుడిసెలూ అంతా ఒకటే అందుకో నిజం! విషాద జీవికి వేషమే విషం సంతోషికి తన

ఒక అజ్ఞాత రచయిత్రి నాయని కృష్ణకుమారి 2255 స్వల్పమే సుఖం

జిలుగు వలువలూ చిరుగు పాతలూ

అంతా ఒకటే అందుకో నిజం.”

ఈ గేయంలో మలచిన భావాన్ని ఇంత సులువుగా, నిరాడంబరంగా ఎలా ప్రత్యక్షం చేయగలిగిందా ఈవిడ అనిపిస్తుంది నాకు. అంతర్గతమైన ప్రతిభ కిటువంటివే మచ్చుతునకలు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉదాహరించాల్సి వస్తుంది. ఇందులో ఏ ఒక్కటీ ఇంతకుముందు బయటికి వచ్చినవికావు. నిజానికి గేయాలకు స్థానమిచ్చే పత్రిక లేమున్నయ్‌? ఒకవేళ ఉండి, ఉన్న అరవై డెక్ఫై పేజీలలో ఏ మూలనో ఒక గేయం (ప్రచురిస్తే చదివేవారుమాత్రం ఎవరు? “ఖండ కావ్యగీతికా సముచ్చయ"మనో, “ఆధునిక గేయగుచ్చ"మనో పుస్తకరూపంలో అచ్చువేస్తే చూచినవాళ్లు చూస్తారు, లేనివాళ్లు లేదు. ఇక ఈ రచయిత్రి బయటికి రావడానికి అవకాశమేముంది?

ఇంకొక విషయం. మన దేశంలో సాహిత్యారాధకుడికి తిండి దొరకడం అరుదు. వాడిచేతులో ఉన్న కళ వాడికి తిండి పెట్టలేదు. అన్నీ సవ్యంగా సమకూడితే వాడికి కాస్త పేరుమాత్ర౦ వస్తుంది. అదీ (బతికిఉన్నంత వరకే. ఇప్పుడు ఈవిడ సంగతే చూద్దాం. తోటివారికంటే ఈ రచనాశక్తి ఈవిడలో అధికంగా ఉన్నందుకు కలిగిన (ప్రయోజనమేమిటి? అందులో ఆర్థికంగా సహాయం అవసరమైన ఈవిడ తన కలాత్మ కశక్తితో ఏం పొందగలుగుతున్నట్లు? డబ్బు సంపాదించడానికి డిగీలూ, ఉద్యోగాలే కాని లలితకళలు ఉపయోగపడడానికి ఇది వెనుకటి భారతదేశం కాదు.

అయినా నాదొక చిన్న మనవి. ఈ నాడుకో అంటే కొల్లలుగా సినిమాలు వచ్చి పడుతున్నయ్‌. వాటిని (ప్రేక్షకులూ బాగానే ఆదరిస్తున్నారు. ఎంత అక్కరలేదనుకున్నా వాటికీ సాహిత్యం అపసరమే. చెపుల తుప్పు వదలగొట్టే చక్కని మాటలూ, పాటలూ కల చిత్రం మనస్సును జోకొడ్డుంది. ఎంతసేపూ నటీనటులనూ, ప్రొడక్షన్‌ విలువలనూ మాత్రమే చూస్తున్న దర్శకులు సినిమా సాహిత్యానికి కూడా తమ దృష్టిలో కొంత స్థానమిస్తే ఎంతో మేలు జరుగుతుంది. పైన నేను ఉదహరించిన గేయాలలో దేన్ని రాగయుక్తం చేసినా చక్కని సాహిత్యంతో

2256 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కూడిన గీతమై తీరుతుంది. దర్శకులు, తమతమ చిత్రాలకు పాటలు వ్రాయమని ఒక్క కవిని గుత్తకు తీసుకుని ఆకట్టుకోకపోతే, సందర్భోచితంగా కనిపించే ఇటువంటి గేయాలను ఎందరివైనా సరే ఎందుకు ఏరుకోరాదు? దానివల్ల ఎంతమందికైనా ఆర్థిక సహాయం కలిగించినట్లవుతుం దనడంలో సందేహమేమిటి? కాకపోతే అనువైనవాటిని ఏరుకోవడమూ, ప్రతిభగల కవులను వెదికి పట్టుకోవడమూ కొంత (ప్రయాసతో కూడిన పనే. కళలను పోషించాలనీ, జాతీయ సంస్కృతిని కాపాడలనీ ఆవేశంతో కేకలు వేసేవారైనా ఈ మాతం (శ్రమ చెందకపోతే ఎట్లా?

ఇంతకూ నా వ్యాసం అయిపోవస్తున్నది. ఇంత వాయడం వల్లనా రచయిత్రికి నిజంగా ఏమైనా మేలు కలుగుతుందో లేదో చెప్పలేనుగాని, ఒక అజ్ఞాతశక్తిని ఆంధ్ర లోకానికి ఎత్తి చూపించానన్న తృప్తిమాత్రం నా పరమైంది. ఇంతవరకూ ఆమె పేరు చెప్పడం మర్చిపోయాను. ఆమె పిల్లుట్ల శారదా దేవి. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి శే55) -

సాహితీ సాధన నవల - ప్రధానాంగాలు స్పూర్తిశ్రీ,

నవల అనే సాహిత్యభేదం ఖండకావ్యమూ మొదలయిన వాటికి మల్లేనే నవీనయుగంలో బయలుదేరింది. కొందరి ఉద్దేశం (పకారమూ సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం నవల జపానులో తలయెత్తింది. క్రమంగా యూరోపులో కాలుమాపి గౌరవం గడించుకున్నది. ఇటలీ నివాసియైన బొకాషియో యూరోపులో నవలా సాహిత్యానికి సర్వపథముడని కొందరి ఉద్దేశం. (ప్రారంభంలో ఈ (ష్మక్రియ అంటే వైముఖ్యమే ప్రత్యక్ష మైనా పద్ధెనిమిదవ శతాబ్ద (ప్రారంభానికే పలుకుబడి నిలుపుకోగలిగింది. సమాజంలో దీని ప్రాభవం నాటకం మొదలయిన ఇతర సాహిత్య (ప్రక్రియల కంటే (ప్రబలింది. క్రమక్రమంగా నాలుగుమూలలా ప్రాకి (ప్రస్తుతం (ప్రపంచంలో సర్వోత్తమ స్థానాన్ని సంపాదించుకున్నది.

నవల భారతీయ వాజ్మయంలో క్రొత్తగా ప్రవేశించింది. ప్ర్మకియనూ, పరిభాషనూ తెచ్చుకున్నట్లే విమర్శన విధానాన్ని కూడా పాశ్చాత్యుల నుంచే (గ్రహించవలసి వస్తుంది. అందువల్ల నవలా నిర్మాణం గురించి “హడ్పను” (పభృతుల అభ్మిపాయాలను (కోడీకరించి, ఇక్కడ పొందుపరుస్తున్నాను.

నవలకు నియమాలను .నిర్మించడంగాని, వాటిని ఉల్లంఘించడంగాని, విమర్శన విధానాన్ని నిర్ధారించడంగాని తేలికయిన పని కాదు. అయినా, సాహిత్య

2256 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము విమర్శకులు ఇంతకంటే విశ్చంఖలంగానూ, విరూపంగానూ ఉండే సాహిత్య (ప్రక్రియలను కూడా సాధించి, నియమబద్ధంచేసి, విశేషించి, అంతర్నిహితమై ఉన్న ఒక్కొక్క తత్వాన్నీ విమర్శించి (ప్రదర్శించారు. నవలాసాహిత్యం కూడా 'ప్రధానాంగాల విషయంలో ఇతర సాహిత్య ప్రకియలతో సంయోజనం కలిగి ఉన్నది. నాటకాంగాలూ, నవలాంగాలూ ఇంచుమించు కలసి మెలసి ఉంటాయి; వాటి లక్ష్యంలో మాత్రం వైవిధ్యం ఉన్నది.

వ్యక్తి నిష్క్రయుడుగా ఎప్పుడూ ఉండడు; గమనశీలం కలిగి దైనందిన జీవితంలో ఒక యాత్రికుడుగా ఉంటాడు. ఈ గమన,[క్రియా శీలమే జీవితం. జీవితం ఎన్నో సంఘటనల ద్వారా, సవూవేశాల ద్వారా, ఎన్నో వాగ్య్యవహారాల ద్వారా, క్రియా కలాపాల ద్వారా తన సౌందర్యాన్ని సాక్షాత్కరింప జేస్తుంది. నవల సమ[గ్రమానవ జీవన చిత్రణం. అందువల్ల మానవజీపన విధానంలో ప్రధానమైన సంఘటనలూ, సమావేశాలూ, వాగ్వ్య్యపహారాలూ, క్రియా కలాపాలూ నవలా (ప్రపంచంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ సముదాయాన్నంతటినీ నవలకు “ఇతివృత్తంగా (గహిస్తాం. ఈ సముదాయాన్నంతటినీ సృష్టించి, నిర్వహించే మానవులు “పాత్రలు.” ఆ పాత్రలు తమ భావాలను వ్యక్తీకరించడానికి పరస్పరమూ ఉపయోగించుకునే భాషా వ్యవహారం “సంభాషణ”. ఈ సముదాయానికంతటికీ ఆశ్రయమైన ఒక దేశమూ, కాలమూ అవసరం. ఒక ప్రత్యేక కాలంలో, ఒక (ప్రత్యేక ప్రదేశంలో సంభవించిన సంఘటనలు దేశకాలాల ప్రభావంవల్ల ఒక (ప్రత్యేకతను సంపాదించుకుంటాయి. దీనిని “వాతావరణం” అని పిలుస్తారు. ఈవిధంగా నాలుగు తత్త్వాలు నవలా ప్రక్రియలో మనం చూశాం. ఈ నాలుగూకాక ఐదవదిగా మరొక తత్త్యాన్ని కూడా గ్రహిస్తున్నారు. నవలా రచయిత తఆలిసికాని, తఆలియకుండాకాని ప్రపంచ మంటి ఎమిటో తన దృకృథాన్ననుసరించి వివరిస్తాడు. తాను జీవిస్తూ ఉన్న సమాజం ఆశ్రయంగా, తనచుట్టూ ఉన్న మనుషులు పాత్రలుగా (గ్రహించి, వారి దైనందిన జీవన సమస్యలనే నవలలో సమస్యలుగా చిత్రించే రచయిత తన భావాలనూ, పరిష్కారాలనూ అఆవిష్కరించవలసిన అవసరం కూడా ఉన్నది. దీనిని “సందేశం” అనికాని, “జీవన తత్త్వం” అనికాని అంటారు.

ఈవిధంగా చూస్తే నవలకు ప్రధానాంగాలుగా ఇతివృత్తం, పాత్రలు, సంభాషణ, వాతావరణం, సందేశం అన్నవి ఐదూ అగపడతాయి. వీటిని విశ్లేషించి వేరువేరుగా చూద్దాం.

నవల: ప్రధానాంగాలు న్ఫూర్హిశ 2259 1 ఇతివృత్తం

నవలలో ఉండే కథను ఇతివృత్తం అంటారు. ఆ ఇతివృత్తాన్ని సంఘటించి, సమర్థంగా నిర్వహించడంలో నవల కళౌన్నత్యాన్ని గడించుకుంటుంది. నవలా రచయిత ఒక విశిష్టమైన దృష్టితో ఇతివృత్తాన్ని నిర్మిస్తాడు; విశిష్టమైన క్రమంలో సంఘటనలను సమావిష్కరిస్తాడు. కొందరు విమర్శకులు నవలలో ఇతివృత్తం అవసరం లేదంటారు. “మన జీవితంలో పూర్వనిర్ణయం (ప్రకారం సంఘటనలు (క్రమబద్ధంగా సంభవించవు. మరి, జీవన చిత్రణమే నవల ఐనప్పుడు నవలలో మాత్రం విశిష్ట సంయోజనమూ, సమ సంఘటన సంవిధానమూ కల ఇతివృత్తం ఎందుకుండాలి?” అని వారి ప్రశ్న. నీట్చే “పూర్వ నిర్ణయం సర్వమూ సత్యవిరుద్ధొ మన్నాడు. జీవితంలో ఎన్నో అనుభవాలు ఒక [క్రమాన్ని అనుసరించి ఉండని మాట అబద్ధం కాదు. అలాగే ఒక అనుభవానికీ, ఒక అనుభావానిక్తీ, ఏ విధమైన అనుబంధమూ కూడా ఉండకపోవచ్చు. జీవన వాహిని స్వచ్చందంగా ప్రవహిస్తూ, ఒక గతి విధానాన్ని అనుసరించదు. అయినా నవలా రచయిత ఈ (కమ విహీనమయిన జీవితం ఆధారంగా ఒక [కమాన్నీ ఒక సంయోజననూ, ఒక సమావేశ శృంఖలనూ సాధిస్తాడు. విరాట్‌ స్వరూపంతో, విచిత్రాతివిచిత్రంగా ఉండే విశ్వసాౌందర్యాన్ని సాక్షాత్కరింపపేయడానికి ఒక విశిష్టమైన అభివ్యంజన విధానమూ, సన్నివేశ సంయోజనమూ అత్యంతపమూ అవసరం. అందువల్లనే ఎన్నో నవలలున్నా కర్పృ (ప్రత్యేకతను అనుసరించి, ఎన్నో విధాలుగా కనిపిస్తున్నాయి. అది వాటివాటి సంయోజనంలోని సామర్థ్యం.

(ప్రపంచమూ, జీవితమూ ఎంతో వ్యాపకత్వం కలిగి ఉంటాయి. రచయిత ఒక సామాన్యమైన వ్యక్తి. ఇంతగా వ్యాపకత్వం పొందిఉన్న క్షేత్రంలో తాను వేటివేటిని (గ్రహించాలో, ఏవిధంగా అషరించాలో తెలుసుకోవాలి. ఈ రహస్యంలోనే నవలా రచయిత సాఫల్య రహస్యం కూడా ఇమిడి ఉన్నది. రచయిత తనకు జీవితంలో ఎదురువడిస సమస్యల నన్నిటినీ అనుభవంలో ఉన్న సంఘటనలనన్నిటినీ, జ్ఞాపకంలో ఉన్న సర్వ విషయాలనూ చిత్రించడానికి సిద్ధపడితే, సాధారణంగా ఆ నవల ఎప్పటికీ సంపూర్ణం కానేకాదు; ఒకచేళ అయినా, పర్వతంలాగు కొన్ని సంఘటనల రాశి ప్రత్యక్షమౌంతుది కాని, హృదయస్పందన కలిగించగల చక్కని

2260 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహెత్యము నవల సాక్షాత్కరించదు. నవలా రచయిత తన జీవితం పైని ఎక్కువ ప్రభావాన్ని (ప్రదర్శించిన అనుభూతి విశేషాలను మాత్రమే హస్తగతం చేసుకోవాలి; వాటినే ఒక [క్రమంలో ఆస్వాదయోగ్యంగా అమరించాలి. అలాగు కానినాడు నవలా రచయితకు అవసరమైన వాటిని మరచిపోవడమే కాక, అనవసరమైన వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా ఒక లోపంగానే పరిణమిస్తుంది. నవలలో ఇతివృత్తం ఇంపుగా ఉండాలి. చదువృతున్న కొద్దీ చదివించగలుగుతూ, చవులూరిస్తూ ఉండాలి. మనోరంజనం కోసం మనం సాధారణంగా నవలలు చదువుతూంటాం. దైనందిన జీవన సంఘర్షణలో శ్రమించి, అలసిపోయి, అనందంకోసం ఒక గంటో రెండుగంటలో నవల పట్టుకుంటాం. అందువల్ల ఇతివృత్తం తక్కువ వ్యవధిలో మనలను ఆకర్షించి, అసలు ప్రపంచాన్ని మరపించి, అతృప్తినీ ఆయాసాన్నీ పొగొట్టి తన ప్రపంచంతో పారవశ్యం కలిగించాలి. ఈ నవలా ప్రపంచం వాస్తవ ప్రపంచంలో ఉన్న లోపాన్ని సవరించాలి. ఈ సందర్భంలో నవలా రచయిత ఒక విషయాన్ని గుర్తించాలి. ఆనందమీయడం కోసమూ, ఆకర్షణీయంగా ఉండడంకోసవూ ఇతివృత్తాన్ని అతిలోకంగా నిర్మించకూడదు; విలక్షణంగా ఉంటూకూడా సలక్షణమై, అసంగతంగా ఉంటూకూడా సుసంగతంగా ఉండేటట్లు రచయిత తన భావనా సాహాయ్యంతో ఇతివృత్తాన్ని కల్పించుకోవాలి. అతివేలమూ, అసంబద్ధమూ ఐన కల్పన అసహ్యకారణ మౌతుంది. , అందువల్ల నవలాకారుడు ఇతివృత్త కల్పనలో వాస్తవికమైన అనుభూతిని ఆశ్రయించుకుని ఉండడం అవసరం. జీవితంలో అనుభవంలేని వ్య క్తి జీవితాన్ని వ్యాఖ్యానించడం సాధ్యమూ కాదు; సమంజసమూ కాదు. ఇదే విషయంలో (ప్రస్తావిస్తూ జార్జి ఇలియట్‌ "స్త్రీేపురుషులలో ప్రకృతి భేదమున్నది. అయినా కొందరు స్త్రీలు పురుషుని దృష్టికోణంతో పురుషునిలాగు (వాయాలనే ప్రయత్నం చేశారు" అని చెప్పుతూ, అటువంటి అనుభవం లేని విషయాలను వ్రాయాలనడం వివేకం కాదన్నది. స్త్రీ ప్త్రీప్రకృతిని తెలుసుకోగలిగినట్లు పురుష ప్రకృతిని తెలుసుకోలేదు. స్త్రీపురుషుల సంభాషణను చిత్రించగలదు; కేవలము స్త్రీల సంభాషణను చిత్రించగలదు. కాని కేవలమూ ప్పురుషుల సంభాషణను చిత్రించడం

నవల: ప్రధానాంగాలు న్ఫూర్తిశ్రీ 2261 స్వాభావికం కాదు. జార్జి ఇలియట్‌ తన నవలల్లో ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించింది. పురుషుడుకూడా కేవలమూ స్త్రీల సంభాషణాదికాన్ని చిత్రించడం స్వాభావికంకాదు. చిత్రించినా, అటువంటి చిత్రణ రచయిత కల్పనాశక్తి పైనా దృకృథం_పైనా ఆధారపడి ఉంటుంది కాని, సత్యం మెని ఆధారపడిఉండదు. అందువల్ల రచయిత అనుభవంలేని విషయాలలో హస్తక్షేపం చెయ్యకూడదు. రచయిత బుద్ధి కల్పనాశక్తి మహితమైతే జీవితాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా భావించి చిత్రిస్తాడుః వాయుస్పందనానికి కూడా జీవన ప్రదానం చేస్తాడు. అయినా కాని, కల్పనకు ఆధారశిల అంటూ ఒకటి అవసరం. ఇల్లు విడిచి వెళ్ళని ఒక యువతి సెనిక శిబిరాలను గురించి చితించబోతే, అటువంటి అనౌచిత్యానికి పాల్పడవద్దని వాదించడం సాహసంకాదు. అనుభవంలేని రచన అనాచిత్య దోషజుష్టం అవ్పుతుంది. అయితే, అనుభవమంటే వైయక్తికమైన అనుభవంగానే హద్దు ఏర్పరచకూడదు. ప్రత్యక్షమైన అనుభూతితో సమానమైన ప్రభావంతోనే మనం పుస్తకాలనుంచీ, చుట్టుప్రక్కల వ్యక్తుల నుంచీ జ్ఞానాన్ని సంపాదించి, మానసికమైన అనుభూతిని పొందుతున్నాం. కథాసామగి గురించి ఆలోచించాం. ఈ సామగిని సఫలంగా ఉపయోగించు కోవాలంటే రచయితకు శిల్చశక్తి అవసరం. శిల్పశక్తిమెనే నవలకు పరమప్రయోజనమైన మనోరంజనం ఆధారపడి ఉన్నది. సంఘటనలను సమర్థంగా సంయోజనంచేసే విషయంలో రచయిత సంతతధ్యానపరుడు కావాలి. ఒక్కవిషయమూ జారిపోయినట్టుగాని, అసంబద్ధంగా ఉన్నట్టుగాని ఉండకుండా, సర్వసంఘటనల్లోనూ సామ్యమూ, సామీచీన్యమూ సాక్షాత్కరించాలి. సన్నివేశ కల్పనలో అల్పాల్ప భాగాలుకూడా అనుకూల్యం కలిగి, ప్రధాన విషయంతో (ప్రస్ఫుటంగా బద్ధంకావాలి; సన్నివేశాల్లో ఎంత వైలక్షణ్యం అన్నా ఉండవచ్చు. కాని, దానికి ప్రాతిపదికగా (ప్రాక్కథిత సన్నివేశాలు సహాయంగా ఉండి, తర్కసంగత ఫలితాలను 'ప్రతీతం గావిస్తూ, స్వాభావికత్వాన్ని సహజంగా పరిపుష్టం చెయ్యాలి. ఇదంతా నవాలాకారుని శిల్చశక్తికి నికషోపలం. ఇతివృత్తం ఆధారంగా నవలలను రెండువిధాలుగా విభజించవచ్చును - శథకథా నవలలు; స్ఫుటకథా నవలలు.

2262 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము శథకథానవల కొన్ని సంఘటనల సమాహారం మాత్రమే. సాధారణంగా ఒక సంఘటనకూ, ఒక సంఘటనకూ స్వాభావికమూ, తర్కసంగతమూ ఐన సంబంధం కన్పించదు. నవల సర్య్వవూ నాయకుని వ్య క్తిత్వం ఆధారంగా చుట్టూ అల్లుకుంటుంది. నాయకుడే ఈ భిన్నభిన్న సంఘటనలూ, ఈ వికీర్ణవికీర్ణతత్త్యాలకూ సంబంధాన్నీ సమైక్యాన్నీ సాధిస్తాడు. నాయకపాత్రమైని కాంతులు నింపడమే ఈవిధమైన నవలలో ఇతరమైన అంగాల ప్రయోజనం. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన వివిధ సన్నివేశాలను ఒకచోట చేర్చి. నిర్మించిన చరిత్రయేమో అనిపిస్తుంది

  • ఈవిధమైన నవల. ఇందులో అనేక మనోహరమైన సన్నివేశాలు ఉండవచ్చు; కాని వాటిని ఏకసూటత్రం గావించే సంయోజనవిధానం లేదు. నవలాకారుని కోరికలకు (ప్రతిబింబంగా అతని మనస్సునుబట్టి ఏర్పడుతుంది. సన్నివేశాలకు యుక్తిసంగతమైన సంయోజనం ఉన్నదీ లేనిదీ అత డాలోచించడు. కొన్ని సన్నివేశాలు లేకపోయినా, (ప్రధానకథకు ప్రస్ఫుటమైన నష్టమేమీ కలుగదు. సన్నివేశాల క్రమం మారినాకూడా ప్రధాన కథలో, ఆకర్షణలో మార్పు కలుగదు. సు ఎటకథా నవల చక్కని సన్నివేశ సంయోజనం కలిగి ఉంటుంది. సాధారణంగా సన్నివేశాలను లోపింపజేయడంగాని, [క్రమం మార్చడంగాని సాధ్యపడదు. పతి సన్నివేశమూ పరిణామ స్వరూపంగా ఉపసంహారోన్ముఖమై ఉంటుంది. అన్ని సన్నివేశాలూ అత్యంతమూ అల్లుకొని ఉండడంవల్ల వాటిని వేరువేరుగా చూడడమే సాధ్యంకాదు; అలాగు చేస్తే కథాసొందర్యం సన్నగిల్లుతుంది. స్ఫుటకథా నవల చెయ్యితిరిగిన శిల్చిచేతిలో హొయలు సంతరించుకుంటుంది. సామాన్య రచయితలకు ఆయా సన్నివేశాలను సమపాళ్ళలో సమ్మిశ్రణంచేసి సౌందర్యసర్థన కావించడం సాధ్యంకాదు.

ఈ రెండు భేదాలూ సాధారణ దృష్టికి సాక్షాత్కరిస్తాయి; సూక్ష్మపరిశీలనం అవసరంలేదు. ఇతివృత్త నిర్మాణానికి సారభూతంగా రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి - ఎ విధమైన కృ(త్రిమత్వానికీ చోటు కల్పించకుండా, కథా ప్రవాహం స్వాభావికంగా సాగిపోవాలి; కథా వికాసానికి తోడ్పడే ఘటనలు వాతావరణానికి సరిపడుతూ, యుక్తియుక్తంగా ఉండి విశ్వసనీయాలు కావాలి.

నవల: ప్రధానాంగాలు న్ఫూర్తిశ్రీ 2263 2. పాత్రచిత్రణ నవలలో ఇంతవరకూ చెప్పిన సర్యవిషయాలకూ సంశ్రయణం పాత్ర చ్యితణం. సంతోషానికీ సంతాపానికీ, రాగానికీ రోగానికీ, కష్టానికీ సుఖానికీ - సర్వానికీ సంశ్రయమైన మానవప్యాతలకు రూపురేఖలు దిద్దడం పాత్రచితణం. అందువల్ల పాత్రచ్శితణ ఫలవంతంగా ఉండాలంటే నవలా రచయిత ఏఏ సాధనలు సంగ్రహించుకోవాలో, ఏఏ రహస్యాలు (గ్రహించుకోవాలో, ఏఏ విశేషాలను ఆవిష్కరించాలో తెలుసుకోవడం అవసరం. సమ్మగ మానవజీవన చిత్రణమే నవల అని మనం సమ్మతిస్తే నవలకు (ప్రధానమైన ఆవశ్యకత పాతల సజీవత. నవలా రచయిత తన మనఃకల్పిత (ప్రపంచానికి వాస్తవిక (ప్రపంచంతో అనురూప్యం కల్పించకపోతే, లేదా మనకు ఆవిధంగా కన్పించకపోతే మనం ఆ పాత్రలతో సానుభూతిని పొందలేము; దానివలన సారస్యం చెడుతుంది. ఏదో మనకు ఆలియని లోకంలోని పాతలు మన చేతస్సు లోతుల్లో దాగిఉన్న భావభాండారాలను బయటికి తీయలేవు. మనలాగానే మనం చూస్తూన్న ప్యాతలు రాగమూ ద్వేషమూ, ఆదరమూ ఆ(గగహమూ మొదలయిన భావాలను ప్రకటిస్తే, విశేష పరిస్థితుల్లో ప్రవర్తిస్తే మనంకూడా ఆ పాత్రల సుఖాన్ని మన సుఖంగా, ఆ పాత్రల కష్టాన్ని మన కష్టంగా భావించి పంచుకోగల్లితే, అప్పుడు ఆ పాత్ర చిత్రణ సమర్థంగా ఉన్నదన్నమాట. అలాగు కాకుండా స్వచ్చంద సంచరణశక్తి లేక, సంకల్ప సమ్మోదశక్తి లేక, కేవలమూ రచయిత ఆడించినట్లల్లా ఆడితే, ఆ పాత్రలను మానవ ప్రతిబింబాలుగా కాక, మట్టి బొమ్మలుగా భావించాలి. పాత్రచిత్రణ ప్రభావవంతంగా ఉన్నదనడానికి ఒక్కటే 1పత్యయం - పుస్తకం మూసిన తరువాత కూడా స్వల్పంగా ఉండే సంఘటనలూ, సన్నివేశాలూ సమసిపోయినా, పాత్రలు మన కళ్ళకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండాలి. ఇటువంటి సజీవ పాతచిత్రణ సమర్థుడైన రచయితకు మాత్రమే సాధ్యం. జనసామాన్యాన్ని (గద్ధగా పరిశీలించి, వారివారి మనోవృత్తులనూ, ప్రవర్తన విధానాలనూ చక్కగా గ్రహించి, ఆ అనుభవం ఆధారంగా రూపకల్పనచేసి, రంగులు దిద్దిన రచయితకు మాత్రమే సాఫల్యం సమకూరుతుంది. అతివ్యాప్తికాని అవ్యాప్తికాని అందానికి ఆటంకాలుగానే ఉంటాయి.

2264 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము నాటకాలలో పాత్రలను పాఠకులకుగాని, (గశేక్షకులకుగాని పరిచయం చేయడానికి అనేక సాధనవిధానాలు ఉన్నాయి. అభఖినయంద్వారాః అలంకరణద్వారా, దృశ్యాలద్వారా నాటకంలో పాత్రలను పరిచయం చేయవచ్చు. కాని నవలలో ఇటువంటి సాధనలు సాధ్యంకావు. అందువల్ల రచయితకు అందుబాటులో ఒకే ఒక మార్గము ఉన్నది. కథా కల్పనలోనే నవలారచయిత ఆయాపాత్రల ఆకార ్రకారాలను ఆలోచింపగల అవకాశాన్ని కలుగజెయ్యాలి. అది అతని వర్ణన వైశిష్ట్యం పైని ఆధారపడి ఉన్నది. తన వర్ణనద్వారానే నవలా రచయిత తన పాత్రలకు రూపకల్పన చేస్తాడు; ప్రాణ ప్రతిష్ట చేస్తాడు; ప్రత్యక్షీకరిస్తాడు. కాని, ఇది సులభంగా అరయ్యేపనికాదు. పాత్రల బాహిర విశేషాలనూ, ఆంతర విశేషాలనూ సూక్ష్మాతిసూక్ష్మంగా (గహించినవానికి మాత్రమే ఇది సాధ్యం. అందుకోసమని పాతచితణలో అనావశ్యకమూ, అసంబద్ధమూఃఐన చిన్న చిన్న ఘటనలను వర్ణించడం కూడదు. దీనివల్ల సజీవ పాత్ర నిర్మాణానికి బదులు నీరసపాత్ర నిర్మాణం జరుగుతుంది. పాత్రల నీలం చిత్రించడానికి పాత్రల ఆచార వ్యవహారాలూ, ప్రవర్తన ప్రవృత్తులూ, సంభాషణ సంవిధానమూ మొదలైన వాటిలో ఏది యెంతవరకు అవసరమో గ్రహించి, అనుసంధించడం (ప్రధానం. పాత్రచిత్రణ విషయంలో ప్రస్తుతం 'రెండుపద్ధతులు అవలంబిస్తున్నారు. 1.విశ్లేషాత్మక పద్ధతి, 2.నాటకీయపద్ధతి. మొదట్లో రచయిత పాత్రలను నిస్పంగదృష్టితో పరిశీలిస్తాడు. వాళ్ళభావాలనూ,; (ప్రవృత్తులనూ, ఆలోచనలనూ విశ్తేషిస్తాడు; అప్పుడప్పుడూ అధికారిగా నిర్ణయంకూడా ఇస్తాడు. కాని నేటి రచయిత పద్ధతి 'రెండవదానిని అనుసరిస్తూ వున్నది. నేటి పాత్రచిత్రణ విధానం కొత్తతీరులో ఉంటుంది. రచయిత తన పాత్రలకు 'పప్రాణంపోసి జీవనవేదికమీద విడిచిపెడతాడు. జీవితంలో ఉండే సుఖదుఃఖాలనూ, ఘాత ప్రతిఘాతాలనూ, ప్రకర్షాప్రకర్షలనూ అనుభవించి పాత్రలు తమంత తామే ప్రత్యక్షమౌతాయి; వాటి కురూపతనూ సురూపతనూ వాటికవే ప్రదర్శిస్తాయి. రచయిత దూరంగా కూర్చుని వాటివాటి మార్గాలను పరిశీలిస్తూ ప్రాణవాహినిని ప్రవహింప జేస్తుంటాడు. (బహ్మసృష్టిలాగానే కవిబహ్మసృష్టికూడా ఒకసారి రూపుదాల్చిన తరువాత కార్యకరణనియమ చక్రంలో బడి స్వయంగా సంచరిస్తుంది.

నవల: ప్రధానాంగాలు న్చూర్తి్రీ 2265 ఈ సృష్టిలో (ప్రాణులు తమ శీలవికాస (పకాశాలకు రచయిత కలంపెని " ఆధారపడిఉండరు; తమ సంభాషణల ద్వారా, తమ (క్రియాకలాపాలద్వారా తమనుతామే పోషించుకొని (ప్రత్యక్షమౌతారు. రచయిత వాళ్ళమధ్యకు రావడంకానీ, మాట్లాడడంకానీ, వ్యాఖ్యానించడంకానీ అంతగా అవసరంకాదు. ఒకవేళ ఐనా ఇతర పాత్రలద్వారా తాను మాటాడడమా వ్యాఖ్యానించడమో చేస్తాడు. ఈ పద్ధతివల్ల భావాలనూ, ఆలోచనలనూ సూక్ష్మాతి సూక్ష్మంగా సఫలంగా తీర్చిదిద్దవచ్చు. వాస్తవిక జీవితంలో మనుష్యుల ప్రవర్తన వాళ్లశీలాన్ని ప్రకటీకరిస్తే నవలా జీవితంలో పాతలశీలాన్ని సంభాషణ సమర్థంగా (ప్రకటిస్తుంది. భావప్రవాహమూ, (ప్రవృత్తి వెరుధ్యమూ మొదలైన అనే కాంతరిక వ్యాపారాలు [క్రియాపరిణామానికి దోహదం చేస్తుంటాయి. అంటే క్రియ అభివ్యక్తం కాకపూర్వమే మనోవ్యాపార పరంపర కొంత ఉంటుంది. దానిని చదువరులకు సాంకేతికంగానైనా అఆలుపవలసిన అవసరం ఉన్నది. అప్పుడు సంభాషణతప్ప మనకు మరొకసాధనం లేదు. పాడుగుపాటి వర్ణనలూ, వ్యాఖ్యలూ కథాగమనానికి అడ్డుదగుల్లూ ఆకర్షణను తగ్గిస్తాయి. పాత్ర చితణవిషయంలో నాటకీయ పద్ధతి సజీవమూ, స్వాభావికమూ ఐ పాఠకులను ఆకర్షించడానికి సర్వసమర్థంగా ఉన్నది.

కాలాన్నిబట్టి అభిరుచి మారుతుంది. సర్వవిషయాలలోనూ ఈ అభిరుచి భేదం కన్చిస్తూనేఉన్నది. కావ్యజగత్తులో ఉదాత్తమైన పాత్రలనూ, సాధారణలోకానికి ఆదర్శంగా ఉండే పా్యాతలనూ చూడటం జరుగుతూజఉన్నది. కాని ఈనాడు కావ్యజగత్తులో వాస్తవిక జగత్తుకు ప్రతిబింబం చూడాలనే జిజ్ఞాస పాఠకునిలో ప్రబలింది. గుడిసెలలో నివసిస్తూ కూడులేక మాడే కూలిజనం, పొలాలలో ఎండవానల్లో కష్టపడే కర్షకజనం, ఆకాశహర్మ్యాలలో హాయి భుజించే ధనస్వాములూ ఈనాటి నవలలో పాతలు. ఆభిజాత్యమూ, ఐశ్వర్యమూ, సౌందర్యమూ, ఆదర్శజీవనమూకూడా నేటి ప్రధానపాత్రలకు అవసరాలుకావు. సజీపతా, స్వాభావికతా నేటి పాతచ్శితణకళకు ఆదర్శాలు.

అభిరుచిమార్చులో మరొకవిషయంగురించి ఆలోచిద్దాము. బాహ్యపరిస్థితులు వ్య క్తిజీవితానికీ, శీలానికీ ఏలాంటి ప్రభావాన్ని కలుగజేస్తున్నాయో చూడడంలో అభిరుచితగ్గింది. ఆంతరంగికమైన ద్వంద్వాలను ఆవిష్కరించడంలో ఎంతో ఉత్సాహం కనిపిస్తున్నది. నేటి నాయకుడు స్వార్థపరులైన మనుష్యులతో, సమాజంతో

2266 పందిరి మల్ల్‌కార్డునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము సంఘర్షించడంకంటే తన హృదయంతోనే ఎక్కువగా సంఘర్షిస్తూ ఉన్నాడు. నేటి నాయకుడు విశిష్టమైన లక్షణాలు కలిగి, రూపుదాల్చిన ఆదర్శంగా కనిపించడు. ఒక నిశ్చితమైన విధానంలో చుట్టూ గిరిగీసుకుని బ్రతికే కొయ్యబొమ్మకూడా కాడు. అతడు మూడుమూర్తులా మనకు (ప్రపంచంలో కనిపించే మానవుడు; సర్వాంగ సుందరుడూ కాదు; కేవల వికారుడూ కాదు. అతని ఎదుట ఎన్నో క్లిష్ట్టమస్యలు ఉంటాయి; అతడు వాటితో నిరంతరమూ పోరాడుతూనే ఉంటాడు; అతనికి ఎన్నో (ప్రలోభాలు ఉంటాయి; వాటికి అప్పుడప్పుడు చిక్కుకుంటూ ఉంటాడు; అప్పుడప్పుడు వాటిని జయిస్తూఉంటాడు. ఈ విధంగా చైతన్యం తొణికిసలాడే పాత్రలు ఆదినుంచి అంతందాకా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతివృత్తానికీ పాత్రలకూ సమర్థంగా సంయోజనం కలిగించడం నవలారచనలో ఒక సపెద్దప్రశ్న. ప్యాతలను దృష్టిలో పెట్టుకుని ఇతివృత్తాన్ని నడపకపోయినట్టయితే, బాహ్య వాతావరణాన్ని అనుసరించి పాత్రలు కీలుబొమ్మలులాగానో, మట్టి బొమ్మలులాగానో కనిపిస్తాయి. వాటిలో జీవం లుష్తమౌతుంది. ఇతివృత్తమూ, ప్యాతలూ నవలాప్రవాహంలో లీనంకావాలి. ఒకదానికీ మరొకదానికీ కార్యకారణ బంధమూ, క్రియా ప్రతిక్రియా సీలమూ ఉండాలి. ఇతివృత్తం సరళమైనా జటిలమైనా, దాని వికాసమే పరిణామ ఫల స్వరూపంగా నిలుస్తుంది. విశిష్టమైన భావాలూ, (పవృత్తులూ, ఆలోచనలూ కల మనుష్యులు అటువంటి పరిస్థితులలో తాము ఏవిధంగా నిలుస్తారో పరిశీలించాలి. ఒకళ్ల ప్రభావం మరొకళ్లపైన పడుతుందో, లేక వాళ్లు పరస్పరమూ ప్రతిద్వంద్వులుగా నిలుస్తారో పరీక్షించాలి. పరిస్థితులకు (ప్రాధాన్యం ఉన్నదన్నమాట ఎంతైనా వాస్తవం అయినా, అటువంటి పరిస్థితులలో వైయక్తిక ప్రతిక్రియ ఆకర్షణకు ఆశయంగా ఉంటుందన్న విషయం విస్పష్టం. ఈ విధంగా సన్నివేశానికి మూలం పాత్రలే. అందువల్ల వాటి వ్యాఖ్యకూడా ఈ విధంగానే చేయడం సముచితం. 3. సంభాషణ _ పాత్ర నిర్మాణంలో సంభాషణకు సంభాపనీయమైన స్థానం ఉన్నది. ఈ సంభాషణ సంవిధానాన్నే “కథోపకథసం” అనీ, “వాకోవాక్యం" అనీకూడా పిలుస్తారు. వాస్తవిక జీవితంలోని సంభాషణలతో సారూప్యంకలిగి ఉండడమే నవలలో సంభాషణలకు సాఫల్యం. నవలలోని మానవులు (ప్రపంచంలోని మానవులకు

నవల: ప్రధానాంగాలు న్ఫూర్తిశ్ర్‌ 2267 (ప్రతిబింబాలు. అందువల్ల నవలలోని సంభాషణ సంవిధానం ప్రపంచంలోని సంభాషణ సంవిధానానికి ప్రతిధ్వని కావాలి. పాత్రల సంభాషణ స్వాభావికంగానూ, సంఘటనానుకూలంగానూ ఉన్నప్పుడే ఏనవలయినా సాఫల్యం పొందుతుంది. స్వాభావికత్వం అనడంవల్ల మాటాడే పాత్రకు సరిపడేదిగానూ, సన్నివేశ విశేషానికి సరిపడేదిగానూ ఉండాలని భావం. సంభాషణ స్వాభావికంగా ఉండాలనే శ్రద్ధతో సంభాషణ విధానం నీరసపడకుండా జాగత్త తీసుకోవలసిన అవసరం ఉన్నది. రచయిత రమణీయతను తగినంతగా పోషించుకుంటూ రావాలి. వాస్తవికత్వమూ, రమణీయత్వమూ పరస్పర విరుద్రగుణాలు; వాటిని సమర్థుడైన రచయితమాత్రమే సంయోజనంచేసి నిర్వహించుకు రాగలడు. మానవుల దైనందిన జీవనంలోని సంభాషణను సంగ్రహించగల్గితే అంతకంటే స్వాభావికంగా ఇంక ఎక్కడా ఉండదు. కాని అటువంటి సంభాషణ అత్యంత నీరసంగానూ, ప్రభాపహీనంగాసూ ఉంటుంది. దానివల్ల పాఠకునికి మనోరంజనం కలుగదు. అలాగుకాకుండా, నాటకీయ పద్ధతిలో సంభాషణను రమణీయంగానూ, ప్రభావవంతంగానూ చేయాలనే ప్రయత్నంచేస్తే సంభాషణ కృత్రిమంగా సాగడానికి ఎంతో అవకాశం ఉన్నది. అటువంటి కృత్రిమ సంభాషణ చదువరుల హృదయాలను వశపరుచుకోలేదు. అది కేవలమూ రచయిత శబ్బలౌల్యానికి సాక్ష్యమౌతుంది. అందువల్ల నవలా రచయిత ఎంతో నియమంతో పనిచెయ్యవలసిన అవసరం ఉన్నది. అధికమైన స్వాభావికత్వం కాని, నీరస శబ్బలౌల్యంకాని చేపట్టి రచయిత సహజ మానవ సంభాషణ సంవిధానాన్ని అవహేళనచెయ్యడం తగనిపని. ఈ రెండింటినీ అతిగా గ్రహించకుండా సమంగా, సరిపడేటట్లుగా సమన్వయించడంలో రచయితృ శిల్చ్పశక్తి సార్థక మౌతుంది. వాస్తవిక సంభాషణలకు ఒక (కొత్తరంజనా, ఒక క్రొత్త వ్యంజనా (ప్రతిష్టచేసి పాత్రలను ప్రాణవంతంచేయాలి. సాధారణ సమాజంలోని స్త్రీ పురుషుల సంభాషణలనే ఒక నాటకీయ గతితో, ఒక నాటకీయ శక్తితో, సన్నివేశ సంగతంగా, సహజంగా సాక్షాత్కరింపజేయాలి.

రచయిత సంపుటం పెద్దదిగా ఉండాలనే ఉద్దేశంతో మాటలు పేర్చడం మానుకోవాలి. సంభాషణ కథాాగతికీ, చరిత్రవికాసానికీ తోడ్చడేదిగా ఉండాలి. లేకపోతే ఉద్దేశ్యపూర్తికి ఉపయోగించని ఆ సంభాషణ అసంబద్ధంగానూ, అతివేలంగానూ అగపడుతుంది. ఆదర్శమైన సంభాషణసంవిధానం పాత్రల భావాలనూ, ప్రవృత్తులనూ, ఆవేగావేశాలనూ ఆవిష్కరిస్తూ, ప్రత్మిక్రియా పద్ధతిని

2268 పందిరి మల్లికార్డునరాప్పు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము (పత్యక్షీకరిస్తూ: కార్యప్రవాహాన్ని ముందుకు నడిపించాలి. నవలలో తక్కిన అంగాలమల్లేనే సంభాషణకూడా “ప్రభావ సమన్వయతిను దృష్టిలో ఉంచుకుని సాగాలి,

సంభాషణ విషయంలో వ్య క్రిత్వరక్షణ అన్న దొక పెద్ద సమస్య. సాధారణంగా రచయిత దీనిపై గ్రద్ధచూపడంలేదు. పరిస్థితుల ననుసరించి పాతల సంభాషణ మారుతూఉంటుంది. ఆ మార్పు ప్యాతల కనురూపంగానూ, వైశిష్ట్య (ప్రదర్శకంగానూ ఉండాలి. నవలలో ఒకఘుట్టాన్ని తీసుకుని, ఒక సంభాషణ చదివి, “ఇది ఫలానా పాతది" అని చెప్పగలిగిఉండాలి. అది సంభాషణ సంవిధానంలోని సామర్థ్యం. ప్రధానమైన పాత్రలు విశేషమైన రీతిలో పనులు చేసినట్లుగానే విశేషమైనరీతిలో ఆలోచన చెయ్యడమూ, మాటలాడడమూ (ప్రధానం.

కొందరు రచయితలు సంభాషణలద్వారానే తమ నిర్ణయాలనీ, సిద్ధాంకాలనీ, కల్పనలనీ - జ్ఞాన సర్వస్వాన్నీ అందజయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అధికారం దుర్వినియోగం చెయ్యడం. ఏదైనా విషయంగురించి వివరంగా వివేచించాలంటే ఒక వ్యాసం వ్రాసుకోవడం ఉత్తమం. అంతేకాని, రచయిత తనకున్న భావాలను నిర్ణయంకోసం చర్చారూపంలో పాత్రలనోట పలికించడం

పాఠకుల జ్ఞానంపైని ప్రబలమైన ఆఘాతం కలిగించడమే అవుతుంది. “ఆర్లో

బేట్సు" అన్నట్లు ఉద్ధరణ చిహ్నాలు తగిలించి నంతటిలో ఏ మాటలయినా సంభాషణలుగా మారుతాయనుకోవడం తెలివైన పనికాదు. 4. వాతావరణం

నవలాసృష్టి సజీవంగానూ. సలక్షణంగానూ, సంబద్ధంగానూ ఉండాలంటే దేశకాలచిత్రణ లేక బాహ్యపరిస్థిత్‌ చితణ చాలా అవసరం, అంటే, వాతావరణ కల్పన మన్నమాట. వాతావరణం (ప్రభావవంతంగా లేకపోతే పాత్రలు శూన్యంలోశూన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మానవులతో సమానమైన ప్రవర్తన పాత్రలలో కన్పించదు. ఈ దేశ కాల చిత్రణలోనే ఇతివృత్తానికి ఆవశ్యకమైన ఇంప్పుసొంపుులు వస్తాయి. బాహ్యపరిస్థితులు, ఆచార విచారాలు, రీతినీతులు, ప్రకృతి పరిస్థితులు - ఇంకా ఇటువంటి సాధనలన్నీ దేశకాల చిత్రణలోనే నిహితమైఉంటాయి. ఈ విధమైన వాతావరణం సామాజికంగానూ, భౌతికంగానూ

  • రెండు విధాలుగా విభక్తమౌతుంది.

నవల: ప్రధానాంగాలు స్పూర్తిశ్రీ 2269

నేటి కథా వాజ్బయ(ప్రవృత్తి ప్రధానంగా వైశిష్ట్యం వైపు ప్రసరిస్తున్నది. ప్రస్తుత నవలా సాహిత్యం ప్రపంచంలోని సర్వవిషయాలనూ ఆక్రమించుకుని, విస్తృతమైన జీవితంలోని విశేషాలను వివేచిస్తున్నది. ఈ (ప్రవృత్తిఫలంగా నవలలో వర్ధ్యవస్తువు వైవిధ్యం పొంది, విభాగాలుగా ఉపవిభాగాలుగా రూపొందింది. అయినా, అక్కడక్కడా విస్తృతమైన విధానంగల నవలలు లేకపోలేదు. జీవితంలో ఒకభాగమోా, ఒకరూపమో, ఒక విశేషమో ఆలంబంగా (గ్రహించి, రచించే నవలలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే కొన్నినవలలు ధనికవర్గాన్నీ, కొన్నినవలలు మధ్యవర్గాన్నీ కొన్ని నవలలు కేవలమూ నిమ్నవర్గీయులైన కార్మిక కర్షకులనూ ఆలంబంగా అల్లుకుంటున్నాయి. కొందరు రచయితలు కళాకారులనుగురించీ, ఉద్యోగులను గురించీకూడా తమ రచనలు సాగిస్తున్నారు. వీటన్నింటినీబట్టిచూస్తే, ఈనవలల సాఫల్యం ఆయావర్గాల, ఆయా ప్రదేశాల చిత్రణ యాథార్థ్యం పైని ఉన్నది.

భౌతిక వాతావరణ నిర్మాణం కథకు బిగినీ, జిగినీ యిస్తుంది; సృష్టిలోని జీవన వైశాల్యాన్ని సమర్ధంగా పరిచయం చేస్తుంది. ఈ వాతాపరణాన్ని కళాకారుడు వివిధ (ప్రక్రియా విధానాలతో ప్రతిష్టిస్తాడు. జీవితంతో సంబంధంలేని ఒక మనో నిష్ట చిత్ర ప్రతిష్టకోసమో, ఆధారభూతమైన యాథార్థ్యాన్ని స్పష్టసందర్శనీయం గావించాలనే సంకల్పంతోనో, భావనా (పభావితమైన ఆవేగానురాగాలను ఆవిష్కరించడం కోసమో భౌతిక వాతావరణాన్ని ఉపయోగించుకుంటాడు. అదే సమయంలో భౌతిక వాతావరణం నవలా నిర్మాణకళలో కేవలమూ ఒక అంగం అన్న విషయం రచయిత మరచిపోకూడదు. కథాగతికి చరిత్రోన్మీలనానికీ తోడ్పడని వర్ణనలకు రచయిత ప్రాధాన్య మీయకూడదు. అలాగు కాకపోతే, ఆ అనవసర వర్ణనలవల్ల కథాాపవాహం అవరుద్ధమౌతుంది. కొందరు రచయితలు పాత్రల ప్రత్యేక పరిస్థితులతోబాటు పరిసరాలలోని ప్రతి వస్తువునూ పర్షించడం ప్రారంభిస్తారు. దీనివల్ల కథాపవాహం అడ్జిపోతుంది; పాఠకుడు వివరాలన్నీ గుర్తుంచుకో లేడు; అటువంటి ప్రయత్నంవల్ల నవలకు పప్రయోజనమైన ఆనందం అంతరిస్తుంది.

అందువల్ల నవలలో అసలే వర్ణన లుండరాదని అర్థంకాదు. ఉచితమైన సలంలో ఉచితమైన విధంగా వర్ణసలుండడం ఉచితం. ఒక్కొక్కప్పుడు వాతావరణం ప్రస్ఫుటంగా వర్ణితం కాకపోవడం వల్ల పాతల స్వరూపస్వభావాలు స్పష్టం

2270 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము కాకుండా పోతుంటాయి. సఫలమూ, సమర్థమూ ఐన వాతావరణ చితణవల్ల కథ కమనీయంగా కనిపిస్తుంది; విశేషమూల్యాన్ని గడించుకుంటుంది. భౌతిక వాతావరణ చిత్రణవల్ల మరొక ప్రధానమైన ప్రయోజనం ఉన్నది. రచయిత మానవపకృతికీ, (ప్రకృతికీ గల సామ్యాన్నిగాని వైషమ్యాన్నిగాని సాక్షాత్కరింపబేస్తాడు. విపత్తులు జడలు విప్పుకుని విలయతాండవం చేస్తుంటే (ప్రకృతిని పరమ మనోహరంగా చితించి. చీకటి వెలుగుల చిన్న్మయనాట్యం సృష్టిస్తాడు; మానవుని అవస్థలను చూచీ చూడనట్లుగా ప్రకృతి బెదాసీన్యం వహిస్తున్నదని వ్యంగ్యంగా విరూపిస్తాడు. అప్పుడప్పుడు మానవనితో బాటు (పకృతికూడా సుఖదుఃఖాలలో పాల్గొంటూ ఉంటుంది. సాధారణంగా రచయితలు వైషమ్యంకంటే సంవేదన శీలాన్నే ప్రకృతినుంచి సమాదరిస్తున్నారు. సంవేదనాత్మకమైన బాహ్యవాతావరణ చిత్రణ ఆంతరంగిక వాతావరణానికి (ప్రతీకగా పనిచేస్తుంది. ఈ విధంగా భౌతిక వాతావరణం కథాప్రవాహానికి పొడుగూ, వెడల్పూ, లోతూ, శక్తీ, సౌందర్యమూ సంపాదించి పెడుతుంది. (ప్రధాన కథకు ఆలంబంగా, గౌణంగా ఉన్నంతవరకే భౌతిక వాతావరణానికి కళా ప్రాధాన్యం; కాకపోతే, సాహిత్యంలో దీని అస్తిత్వమే సందేహాస్పదమౌతుంది. సామరస్యమూ, సామంజస్యమూ లేని వాతావరణ చిత్రణ కీవలమూ నిరర్ధకమూ, నిస్సారమూ అవుతుంది. 5. సందేశం సమగ మానవజీవన చ్యితణం నవల. నవల విషయ విశేషణం చేస్తుందని, సత్యసందర్శనం గావిస్తుందనీ అనవచ్చు. ఈ మాటలకుగల అర్ధాన్ని స్మకమంగా (గ్రహిస్తే రచయిత సందేశం స్పష్టమౌతుంది. అన్ని సాహిత్య ప్రక్రియలకు మల్లేనే నవలకూడా సమాజమానవ జీవితంతో సంబద్ధమై ఉంటుంది. స్తం పురుషుల దైనందిన జీవితాన్ని వివిధ దృష్టికోణాల్లో, వివిధ పరిస్థితులలో చిత్రిస్తున్న రచయిత తనకు తెలిసికాని, తెలియకకాని, జీవితమంటే తనకున్న అభిప్రాయాలను ఆవిష్కరిస్తాడు. ఎంత చిన్నకథ చదివినా, పాత్రలకూ పరిస్టితులకూ వెనుక వైతికస్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అత్యంత సామాన్యమైన నవల కూడా నిశ్చితమైన ఒక జీవిత విచేషానికి ప్రతీకగా ఉంటుంది. రచయిత తన

నవల: ప్రధానాంగాలు న్పూర్రిశ్రీ 2271 కృతిలో సామాన్యమైన ఎన్నో నియమాలను సమీకరించి, ఒక చిత్రాన్ని సిద్ధం చేస్తాడు. ప్రతిభావంతులయిన కొందరు రచయితలు సమాజాన్ని సమీక్షించడం మాత్రమే కాక, సమాజం గురించి ఆలోచన కూడా సాగిస్తారు. మానవ చరిత్రా, ఆవేగానురాగాలూ, సత్యమూ, సౌందర్యమూ, సమస్యలూ, పరిష్కారాలూ - ఇవన్నీ కలసి రచయితృ విలక్షణమైన కళాకౌశలంతో అల్లుకుని నవలకు ఒక గాంభీర్యాన్ని యిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచమంటే రచయిత కున్న భావానికి ఒక నైతికమూల్యం లభిస్తుంది. నవలలో ఈ దర్శన తథ్యానికి చాలావిలువ ఉన్నది. అందువల్లనే ఒక మంచి నవలను విమర్శించాలంటే, జీవితాన్నే విమర్శించవలసి వస్తుంటుంది. పూర్వనిర్జీతమైన ఉద్దేశ్యం కలిగి ఉండడమే నవలలోని దర్శన తథ్యం అని అనరాదు. రచయితకుగల అభిప్రాయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాతలనూ, పరిస్థితులనూ నడిపిస్తూ ఉంటాయి. అయినా, కళకు ఆధారంగా ఉండేవి దైనందిన జీవితంలోని మానవుల ఆలోచనలూ, [క్రియాకలాపాలే కాని రచయిత పూర్వనిర్ణయాలు కావు. రచయిత ఏదో అభిప్రాయాన్ని ఖండనమండనాలు చేసి, సిద్ధాంతాన్ని ప్రతిష్టిస్తాడనుకోరాదు. రచయిత సమాజంలోని వ్యక్తులసు సందర్శించి, సమీక్షిస్తాడు. అందులో మూలభూతమైన సత్యం ఇమిడి ఉంటుంది. దానిని ఆలోచకులు ఆవిష్కరిస్తారు. కాబట్టి ఎంత మహత్తరమైన నవలలోనైనా సర్జనశక్తి సంపన్నమైన మానవజీవన సంబంధి సమీక్ష మాత్రమే ఉంటుంది. ఈ సమీక్షలోనే ఆలోచనద్వారా, (పతిపాదనద్వారా రచయిత నిత్య మైన సత్యాన్ని సాక్షాత్కరింపటబేస్తాడు. నవలలో ఉండే సందేశానికి ఇదే అర్థం. జీవన రహస్యాన్ని నవలా రచయిత సందేశరూపంగా రెండువిధాలుగా అందజేస్తాడు. మొదటిది నాటకకర్తలాగు పొత్రల ద్వారానూ, సన్నివేశాల ద్వారానూ; రెండవది మధ్య మధ్య ఆలోచన ద్వారానూ, స్వయం పరిచయం ద్వారానూ. మొదటి పద్ధతి (ప్రకారం రచయిత మానవ జీవన సామగిని సమీకరించి, సంఘటిస్తాడు. తాను సమాజాన్ని ఏ దృక్కోణంలో చూస్తాడో, ఏవిధంగా (గ్రహిస్తాడో పాత్రపోషణ ద్వారా, కథాావికాసం ద్వారా స్ఫురింపజేస్తాడు. ఈ చెదరువాటుగా ఉన్న సత్యాలను చేరదీసి, వాటినుంచి ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచడం విమర్శకుని పని. నాటక కర్తకంటే నవలా రచయితకు ఈ విషయంలో ఎక్కువ స్వాతంత్య్యం

2272 పందిరి మల్లికార్జునరాపు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము " ఉంటుంది. గౌణంగానూ, కంఠోక్తిగానూ కూడా నవలా రచయిత తనభావాలను అందజేస్తాడు. ఈ అధికారాన్ని అంకించుకున్న తరువాత రచయిత తాను కల్పించుకున్న జగత్తుకు వ్యాఖ్యాతగా సాక్షాత్కరిస్తాడు. ఇటువంటి సమయంలోనే నవల “సామాజిక దర్శనం"”గా రూపొందుతుంది. ఈవిధంగా స్థూలంగా చూస్తే, నవలా నిర్మాణంలో ప్రధానాంగాలుగా ఈ ఐదూ కనిపిస్తాయి. నవలా నిర్మాతకూ, నవలా పాఠకునికీ కూడా ఈ ఐదు అంశాలపైనా ఎంతో గ్రద్ధ అవసరం. ఇంతేకాక, నవల వస్తువునుబట్టీ, ప్రక్రియనుబట్టీ ఎన్నోరకాలుగా విభక్తమౌతుంది. వాటినన్నింటినీ ఇక్కడ వివరించడం అంత (ప్రధానం కాదు. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955) యి. న? _ ళీ , య అటు భేటి

ఒల్లో మను చరిత్రము - మార్కండేయ పురాణము బులుసు వేంకట రమణయ్య టే ౧ొస్టతంత్ర పద్ధతిని రచింపంబడిన 'ప్రబంధములలో మనుచరిత్రమే మొట్టమొదటి దనియు, అంతకుంబూర్వము శ్రీనాధాదుల యొక్కయు, ప్రబంధపరమేశ్వరుని యొక్కయు గ్రంథములు వెలువడినను - అవి యించుమించు సం స్కృతానువాద వమబలే యగుట వలన స్వత ౦(త రచనలుగా.6 బరిగణింపంబడలేదనియు చాలమంది సాహిత్య విమర్శకులు తలంచుచున్నారు. కవిత్వమున నొక (కొత్తపుంత త్రొక్కి ప్రబంధమును రచించుటవలననే అల్లసానివాని “కాంధ్రకవితా పితామహ” అను బిరుదము లభించెనని కొందరు విద్వద్వరులు తలంచుచున్నారు. ఆనంద ముదాలయమున తొలిసారి “మనుచరిత్రము"సు సంస్కరించి వెలువరించిన శ్రీ తేవప్పెరుమాళ్లయ్యగా రిట్టి యభ్శిపాయమునే వెల్లడించిరి. కాని మనుచరిత్రమును రచించుటకుంబూర్వమే పెద్దన కీ బిరుద మున్నట్లు కృత్యవతరణికలో శ్రీకృష్ణదేవరాయలు పలికిన

“పతుండవు; చతురవచోనిధి:

వతుల పురాణాగమేతిహాసయుతార్థ

స్కృతియుతుండ; వాంధ్ర కవితా

పతామహుండ; వెవ్వ రీడు పేర్కొన నీకున్‌” అనుదానివలన6 దెలియుచున్నది.

ఈ “ఆం(ధకవితా పెత్రామహో బిరుదము తొట్టతొలిగా పెద్దనామాత్యునకే లభింపలేదు. కక్రీ॥శ॥ 1260 ప్రాంతమున ఓరుగంటి ప్రభువగు శ్రీ కాకతి గణపతిదేవ వ్యా పందిరి ముల్షికార్డునరాపు శతజయంతి. సంప్పుటము 4: సాహిత్యము

2274 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము చక్రవర్తికి గురువును, "పురుషార్థసార” కర్తయు నగు శ్రీ శివదేవగురువునకును, క్రీశ! 1300 [పప్రాంతమువాండును, “రామాయణ” రచయితయు నగు ఖీమకవికిని ఈ బిరుద ముండెడిది.” పెద్దనామాత్యుని కవితాపాటవము ననుసరించియే “అతని కీ బిరుదము లభించినదనియు “మనుచరిత్ర” రచనతో దీని శెట్టి సంబంధము లేదనియు (గ్రహింపవలసియున్నది. ' పెద్దన రచించిన “వమనుచరితమునకు మార్కండేయ పురాణము మూలమనియు, మార్కండేయ పురాణమునం జప్పుంబడినరీతినే దానిని రచింపవలెనని రాయలు పెద్దనను కోరియుండెననియు “మునువులలో స్వారోచిష మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌ విన నింపు; కలి ధ్వ్యంసక; మనఘ! భవచ్చుతురరచన కనుకూలంబున్‌. కావున మార్కండేయ వురాణోక్త ప్రకారంబునం జప్పుమని కర్పూర తాంబూలంబు పెట్టిన ౮ అను నవతరణికా భాగమువలన౦ దెలియవచ్చుచున్నది. పెద్దనయు6 దన యేలికకోరిక ననుసరించి యందలి కథాసంవిధానమును మార్చుక, వలయునెడ కొలంది మార్పులను మాత్రము రసానుగుణముగ నొనర్శ్చిః యించుమించు నూటయేంబది పద్యములలో నున్న మూలకథ నెనిమిదివందల పద్యముల పెద్ద (ప్రబంధముగా రచించెను. పెద్దన మార్కండేయ పురాణమును చదివి, మారన యాశయములను (గ్రహించి యున్నను, ఆదికవిస్తుతిలో నాంధ్రకవులను సంస్మరించునపుడు కవిత్రయమును మాత్రము పేర్కొనెను. తనకు. బూర్య ముండిన శ్రీనాథాది లా

  • చూ. “ప్రథమాంధ్ర కవితా ఫితామహుండు - శివదేవయ్య” శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి వ్యాసము. (భారతి = పార్థివ - ఫాల్గుణము).

మను చరిత్రము: మార్కండేయ పురాణము. బులును వేంకట రమణయ్య 2275 మహాకవుల పలుకుబడులను, రచనా పద్ధతులను తాను (గ్రహించి యున్నను వారిని పేర్కొనలేదు. చూడుడు - “వ్యాసరచిత భారతామ్నాయ మాంధభా షగ నొనర్చి జగతి6 బొగడు6గనిన నన్నపార్యుం దిక్కనను గృతక్రతు, శంభు దాసు నెజ్జనుకవిం దలంతు భక్తి" ఈ పద్యమున6 గవిత్రయ (ప్రశస్తి మాత్రము కలదు. కాని, యింతమాత్రమున౦ బెద్దన కవికి ప్రాచీనాంధ్ర కవుల యొడల గౌరవము లేదనికాని, వారిని ప్రశంసించుట యతనికి సమ్మతము కాదనికాని నిర్ణయింప వీలు లేదు. ప్రాచ్యకవులను సంగ్రహముగా స్తుతింపందలంచిన పెద్దనకవి సంస్కృతకవుల కొక పద్యమును, ఆంధ్రకవుల కొక పద్యమును (ప్రత్యేకించి. వానిలో ఇముడునంతవజకు మాత్రము కవులను నుతించెనని చెప్పనగును. లేదా - పెద్దన భారతమునే ఆమ్నాయముగ [గ్రహించి స్తుతించుచు, దానిని రచించిన కవితయమును మాత్రము (ప్రశంసించెననియు6 జప్పవచ్చును. ఇంతమాత్రమున నీతండితర కవులను నిరసించెనని చెప్పుట సమంజసము కాదు. ప్రవరునిపంటి యుత్తమ పాత్రను సృజించి, యుత్తమశీలసంపన్నుండనియు, ఉదార హృదయుండనియు పేరుపొందిన ఆంధ్రకవితా పితామహుండు వారి పలుకుబడులను [గహంచియు, (ప్రాచీనకవుల యెడల సననాదరము చూపెననుట యుక్తిసహము కానేఅదు.

పెద్దన మూలముగా (గ్రహించిన మారన కవికృత మార్కండేయ పురాణోక్తమగు స్వారోచిషమను వృత్తాంత మిట్లున్నది -

“వ్రర్రుణాతటినీ తటమున అరుణాస్పద మను పురము కలదు. అందు ప్రవరాఖ్యుండగు ధరణీసురవరుండు, ఉదాత్తుండు, వేదపారగుండు, అతిధిజనార్భ నాభిరతుండైనవాండు ఉండెను. అతండెప్పుడును శైలకాననాంచిత సకలాపనీతల విశేషము లెల్లను గన్గానం గోరుచుండును. ఇట్లుండ నొకనాండొక యౌషధసిద్ధుండాతని యింటికి వచ్చెను. ప్రవరు6 డాతని నాతిథ్యమున సంహృష్ట చిత్తుగాం జేసె,

2276 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటిము 4: సాహిత్యము ఇమ్మహింగల విశేషపు' జోద్యములను దెల్బ్పంగోరెను. సిద్ధుండు తాను పెక్కు దేశములను తిరిగితిననియుం, బెక్కు చోద్యములను గాంచితిననియు6 జప్పెను. దానికిలబవరుండు “మునివల్లభ! వృద్ధుండవొండె గావు; లేం. బ్రాయపువాండ; వదివనరమ్యములైన యనేకదేశముల్‌ ధీయుత! యల్పకాలమునం ద్రిమ్మర శక్యమె నీకు నెమ్మెయిన్‌? వేయును నేల? నమ్మ నెద నీ పలుకు అని మోమోటమి లేక పలికెను. అంత నా యోగి - “ఏ నొక సిద్ధుండన్‌ ఫవియుమ హీస్తురశేఖర! ధాతి యంతయున్‌ మానుగం బాదలేప మను మందు ప్రభావమునన్‌ జరించితిన్‌; దానిం బదంబులందు6 దగ6 దాల్చిన నెంతయు నిర్జితశ్రముం డై నరుం డేంగు యోజన స హసము నాపగలింటిలోపలన్‌” అని చెప్పి ప్రవరుని సందేహమును పోంగొట్టెను. పిదపం బవరుండు ప్రార్థింపంగాః సిద్ధండు పాదలెప మాతనికిచ్చి వెళ్లి పోయిను. ప్రవరు6 డౌ మందు పాదములకు6 బూసికొని హిమాలయమున కేంగి, యచటి వింతలం గొన్నింటిని చూచి, మిగిలిన వానిని మజునాండు చూడందలంచి, ఇంటికి మజలిరా నుద్యమంచిను. కాని పాదలేపము కరంగిపోయినందున పాదములు రాక మిగుల విచారించి, యా హిమవత్తటమున వరూధిని యను నొక గంధర్వ్యయువతిని గాంచి, యామెను తనయూరికి మార్గము నడిగెను. ఆమె యాతనింగాంచి, మోహించి, యాతండు సమ్మతింపక పోయినను అతనిని గౌంగిలించెను. కాని ప్రవరుండు చలింపక యగ్నిదేవుని స్తుతించి, యాతని ప్రభావమున తన యూరికేంగెను వరూథినియు నాతనియెడంగల మక్కువచే మిగుల విలపించుచుండెను. కలి యను గంధర్వు డొకం డిదివణకు వరూథినిని (ప్రేమించి, యామెచేం దిరస్కృతుండై తిరుగుచు, దివ్యజ్ఞానంబున వృత్తాంతమంతయు నెజ్‌ంగి, ప్రవరుని

మను చరిత్రము: మార్కండేయ పురాణము... బులును వేంకట రమణయ్య 2277 వేషమున నామెను వంచించి, యామె (ప్రేమను చూజగొనెను. పిదప వరూథిని గర్భవతియయ్యును.

ఆమె యీవజలో ప్రవరునితో “నీకు నిజగృహంబునకు నవశ్యంబు నరుగవలయునేని కొండొక కాలంబు నాతోడ నిష్టోపభోగంబు లనుభవించి మజి యరుగుము అని చెప్పయున్నందున మాయాప్రవరు6 డామెను ప్రియవచనంబుల నూజడించి, వరూధిని యనుమతింపంగా నివేచ్చం జనియును. వరూథిసికి స్వరోచియను పు(తుండు కలిగెను.

స్వరోచి దినదినాభివృద్ధింగాంచి, యువకుండై యస్త్రశన్తాంది విద్యలయం దాజితేజతీ మంథర్యాద్రితటములందు విహరించుచు నొక నాం డొక రాక్షసునిచే వెంటందజఖుమం బడుచున్న యొక సుందరాంగిని గాంచెను. ఆ యువతి తన వృత్తాంతము నీరీతిని స్వరోచి కెజింగిం చెను;

“ఆర్యా! నేను మరుదశ్వప్పుతికయం దిందీవరాక్షుండను గంధర్వరాజునకుం గల్గితిని, నా పేరు మనోరమ. మందార విద్యాధరుని ప్లుతిక విభావరియు, పారుండను మునికుమార్తె కళలావతియు నా చెలికళత్తలు. ఒకప్పుడు నేను చెలికత్తెలతోంగూడ కైలాస ప్రాంతమున కేంగి, అచట నొకచో వికారముగనున్న యొకమునిని చూచి నవ్వితిని. అతండు కోపించి “రాక్షసగృహీత వగుదువు గాక” అని నన్ను శపించెను. నవ్వినంతమాత్రమున ఇట్లు శపించి నందున నా చెలికత్తె లా మునిని నిందించిరి. అతండు వారికై కోపించి, యొకతెకు కుస్టరోగము కల్గునట్లును, వేరొకతెకు క్షయరోగము కల్గునట్లును శపించెను. వా రా రోగములచేం బీడింపం బడుచున్నారు. మూండు దినములనుండియు నన్నొక రాక్షసుండు వెంబడించుచున్నాండు. నీకు శరణుంజొచ్చితిని. నా కస్తృహృదయంబను విద్య తెలియును. దాని మూలమున నెట్టి శ్వతువునైనను జయింపవచ్చును. నేనునీకా విద్య నుపదేశించెదను. ఆ రాక్షసుని చంపి, నన్ను కాపాడుము”

స్వరోచి దావి కంగీకరించి, యా విద్య నామెపలన నేర్చి యావైపు వచ్చిన రాక్షసునిపై బాణము ప్రయోగింపంగా నది యా రాక్షసునికి విపరీతపుందాపమును కలిగించెను. వెంటనే వాండు చేతులు జోడించి, స్వరోచి కిట్లు విన్నవించెను

2278 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము “నేను నలనాభుండను గంధర్వుని కుమారుండను; నా పే రిందీవరాక్షుండు; ఈ మనోరమ నా పుతైక. నేను (బహ్మమి(త్రుండను మునిని మోసగించి, యాయుర్వేదము నేర్చినందున, అతండు కోపించి నన్ను రాక్షసుండ నగుసట్లు శపించెను. పిదపం బ్రార్థింపంగా దయదలంబ “నీ ప్లుతికం జంప వంటాడునపుడు ఒకవీరుని దివ్యాస్త్రము తగిలిన వెంటనే శాపవిముక్తి యగు సని చెప్పేను. ఆ రీతినే నీపలన నాకు శాపవిముక్తి కలిగినది. నీవుచేసిన యుపకారమునకు బదులుగా నా యాయుర్వేద విద్యతోంబాటు నా పుత్రికను నీకిచ్చి వివాహము చేసెదను. అంగీకరింపుము.” పదప మనోరమ తండ్రితో “తండ్రీ! మహోపకారియైన యీతనిం జూచినతోడనే నా కీతనియెడ గ్రేమ కలిగినది. ఈతనిని భర్తగా. బడయుట కెంతయు సంతసమగుచున్నది. కాని, నా మూలమున రోగపీడితలై చెలులు కష్టపడుచుండంగా, నేను సుఖించుట యొట్లు?” అని పలికెను. అంత స్వరోచి తాను వారి రోగములం బోంగొట్టెదనని మాట యాయంగా మనోరమ మిగుల సంతసించెను. పిదప మనోరమా స్వరోచులకు వివాహము జరిగెను. పిదప స్వరోచి భార్యతోంగూడ ఆమె చెలికత్తిలున్న యుద్యానవనమున కేంగి రోగమును నశింపంజేయు దివ్యాషధములిచ్చి వారి రోగముల: బోంగొట్టెను. వారు మిగుల సంతసించిరి. _. ఆ యిర్వురిలో విభావరి “నాక సమస్తపాణుల భాషల నెజుంగంగల విద్య వచ్చును. దానితోంబాటు నన్నుకూడ నీకు సవుర్పించుకొనుచున్నాను. (గ్రహింపుము” అనెను. అంత రెండవ యువతి యిట్లనెను : “నేను పారుండను మునికి, పుంజికస్థల యను నచ్చరకు జనించినదానను. నన్నుకనిన తలిదండు లడవిలో నన్ను విడిచిపోయిరి. నేను చంద్రకళల నాహారించుచు దినదినాభివృద్ధిం గాంచితిని. ఇది యెజింగి నాతండ్రి వచ్చి నన్ను దీసికొనిపోయి పెంచుచుండేసు. చంద్రకళలచే వృద్ధి పాందుటవలన నాకు “కళావతొ యను పేరు కలిగినది. నాకు వివహయోగ్యవయస్సు రాంగా దేవాది యను గంధర్వుండు వచ్చి నన్ను దనకిచ్చి వివాహము చేయవలెనని మా తండ్రిని కోరెను. మా తండ్రి సమ్మతింపలేదు. అంత నా దురాత్ముండు మా తండ్రిని వధించెను. నేనును ఆత్మహత్యకు(

మను చరిత్రము: మార్కండేయ పురాణము. బులును వేంకట రమణయ్య 2279 (బయత్నించుచుండంగా పార్వతీదేవి ప్రత్యక్షమై నన్ను నా పయత్నమునుండి మాన్పించి పద్మిని యను విద్యను ప్రసాదించుటయేగాక "స్వరోచి నీకు భర్త కాంగలండు” అని తెలిపెను. కావున పద్మినీవిద్యతోంబాటు నన్ను పరిగ్రహింపుము.” ఆ యువతు లిర్వురు నిట్లు కోరంగా, వారివలన నా యా విద్యలను (గ్రహించి,

వారిని వివాహమాడెను. ఇట్లతండు ముగ్గురు భార్యలతోను, పద్మిని మున్నగు విద్యలవలన ననేకసుఖము లనుభవించుచుండెను.

స్వరోచి తన మువ్వురు భార్యలతోను మంథరగిరి సానువులందు విహరించు చుండంగా నా చెంగటి కొలనిలోనున్న హంసి యొక్కటి చూచి, “యాతండు మిగుల ధన్యులొడని చెంతనున్న చకవాకితో. బలికెను.' చకవాకి “పెక్కురు భార్యలతోం గూడిన వానికి సొఖ్యములేదు; అతండు ధన్యుండు కాండు. వీరికిం బరస్పరము గల (గేమ యథార్థము కాదు” అనెను. వాని భాషల నెజీంగిన స్వరోచి యా మాటలు విని సిగ్గుపడియు, మజీ నూజేండ్లు వారితో సుఖము లనుభవింపసాగెను.

అతడు మజియొకసారి తన వనితలతో విహరించుచు నొక మగజింకచే నిందింపంబథిను. స్వరోచికి లజ్జకలిగెను; కాని యది తాత్కాలికమే. ఆ పిదపంగూడ నతండు భోగలగ్నుండయ్యను. అతనికి మనోరమయందు విజయుండు, విభావరియందు మేరునందు£డు, కళావతియందు (పభాసుండు నను పుతులు కలిగిరి. పద్మినీ విద్యాప్రభావమున స్వరోచి తూర్పున విజయునికి విజయవురమును, ఉత్తరమున మేరునందునకు నందవతియను నగరమును, దక్షిణమునం (టబభాసునకు తాళంబను పట్టణంబును నిర్మించి యిచ్చెను,

ఒకనాండు స్వరోచి ధనుర్చాణములను ధరించి యొంటరిగా నడవి కేంగి యొక్క వరాహముంగొట్ట నుంకింపంగా నొక్క యాండు లేండి యడ్డువచ్చి “ఆర్యా! దానిం జంపనేల? అన్యవనితాసక్తుని శ్రేమించి నిరర్ధకజీవననగు నన్ను చంపిన మేలు”అనెను. స్యరోచి దానిమాటల కచ్చెరువంది “నీ వెవ్వరిని (కేమించితివి?” అని ప్రశ్నించెను. అది “నేను నిన్నే వలచితిని. నన్ను కాంగిలించిన నంతియ చాలూ ననెను. ఆతం డట్లు చేయంగా నా జింకయొక దివ్యవనితగా మాజిపోయి, యాశ్చర్యపడుచున్న స్వరోచితో “నేను వనదేవతను. సురల కోరికపయి నీవలన భూరక్షాదక్షుండగు మనువును బడయంగోరి వచ్చితిని. న న్నంగీకరింపుము”

2280 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అనెను. స్వరోచి యందుల కంగీకరించెను. వారికి మనువు జనించెను. స్వరోచిస్పంతానమగుట నాతనికి స్వారోచిషమనువను నామము కలిగను" మార్కండేయ పురాణమునందలి పై కథ నాధారముగథ జసికొని, కథావిధానమున మార్ప్చులుచేయక, ఎడనెడ నందలి నుడికారములనే గ్రహించుచు ఉత్తమ(ప్రబంధమును రచించెను. పెద్దన మార్కండేయప్పురాణోక్తకథనే (గ్రహించినను, వలయుచోట్ల రసానుగుణములును, ఉచితములు నగు చిన్న మార్పులను గొన్నింటి నొనర్చెను. మార్కండేయ పురాణమున మాయాప్రవరుని పేరు “కలొగా చెప్పంబడినది. అది యనుచితముగా నున్నదని కాంబోలు పెద్దన్న దానిని విడిచెను. మనోరమ చెలికత్తె “విభావరి” మనుచరితలో “విభావసొగా మార్చంబడెను. అట్లే “మేరునందు6డు" “మేరునందనుండుగను, “వందవతి(2)” “గంధవతి"గను, “పభాసుండు” “విభావసుండు"గను, “తాళ"నగరము “ధారా"నగరముగను ఆల్పంబడెను. ఈ మార్పు కొంతరసవంతమైనదే! . ప్రవరుండు సిద్ధునితో “వేయును నేల? నమ్మ నెద నీపలుకు” అని మోమోటమి లేక, అనాదరముగం బల్కినట్లు మార్కండేయ పురాణమున నుండంగా, వునుచరితలో “అద్దిరయ్య! మా కెజబుంగందరంబె? వీవుహోవు లీర యెజుంగుదురేమి చెప్పుదున్‌ ?అని వినయవిధేయత లుట్టిపడునట్లు సంభాషించినట్లు కూర్పుంబడినది. వరూథిని ప్రవరుని వలచి, సంభాషించినపుడు కడసారిగా “నీ వింటికి6 బోవుటయే తప్పనిసరి మొనచో, కొంతకాలము నాతో ఇష్టోపభోగంబు లనుభవించి యాఫవైని పొమ్ము” అని పల్కినట్లు మార్కండేయ పురాణమున నుండంగా, అది అనుచితమని తలంచి, దానిని పెద్దన విడిచివేసెను. అందువలన మాయాప్రవరుండు వరూధథినిని అంగీకరింపంజేసి వెళ్ల్తునపుడు సిద్ధుండు తన గృహము స్థితిగతులు తెల్పినట్లును, పోక తప్పదనునట్లును, పాదలేపము మూలమున నప్పుడప్పండు వచ్చుచు. బోవుచుందుననియును చెప్పినట్లు వర్ణింపవలసి వచ్చినది. స్వరోచి స్వయముగనే వేంటకు వెల్లినట్లు మార్కండేయ పురాణమున నుండంగా, ఆటవికుల కోరికపై వెళ్లినట్లు మనుచరిత్రములో రసవంతముగ వర్ణింపంబడినది.

మను చరిత్రము; మార్కండేయ పురాణము. బుటును వేంకట రమణయ్య 2281

ఇందీవరాక్షుండు మనోరమను స్వరోచి కిచ్చి వివాహము చేయ నిశ్చయింపంగా ఆ వివాహమునకు ముందే యామె తన చెలికత్తెల దుస్థితిని తండ్రికి దెల్చినట్లు మార్కండేయ పురాణమునం గలదు. అట్లు కూర్చుట కొంత విరస మను తలంపుతో పెద్దన వివాహానంతరము మనోరమ తన భర్తతో తన చెలికత్తెల వృత్తాంతమును తల్పనట్లు మార్చెను. తండ్రికి బదులుగా భర్తకు విన్నవించుటయు, ఇయ్యది వివాహానంతరము జరుగుటయు ఎంతయు సరసమైనది.

స్వారోచిషమనువు జన్మించిన యనంతరముకూడ స్వరోచి విహరించుచు హంసమిథునమును గని, తన్ను నిందించు మగహంస పల్కు లాలించి, విరక్తుండై భార్యలతోంగూడ తపంబొనర్చి దేవలోకమున కరిగినట్టు మార్కండేయ పురాణమునం గలదు. మనుచర్మితమున మనువు పుట్టుటతో స్వరోచి వృత్తాంతము విడువంబడినది. ఇట్లు విడిచిననే కథ సరసమై యుండును.

ఇట్లు రసవంతముగ పెద్దనామాత్యుడు కొన్ని మార్పులు చేసినను బెషధసిద్ధుండు కుతపకాలమునం దన గృహమునకు వచ్చినట్లును, అతండు ప్రవరుని పాదమున కొక పసరు పూసి వెడలిపోయినట్లును వర్ణించిసందున సారస్వతలోకమున తీవవిమర్శనలు, వాదోపవాదములు వెలయుట కవకాశ మేర్పడినది. పురాణములో సిద్ధండు కుతపకాలమున వచ్చినట్లుగాని, పసరును ప్రవరుని పాదమునకు6 దానే పూసినట్లు గాని లేదు. సిద్ధుండు ప్రవరునికి పాదలేపము నిచ్చినట్లును, (పవరుం డా దివ్యాషధమును తన పాదములందు దాల్చి హిమగిరి కరిగినట్లును మాత్రము మార్కండేయ పురాణమునం గలదు. పెద్దన యథామూలముగ నా విషయమును గ్రహించి యుండినచో ఎంతయు సమంజసమై యుండెడిది.

ఆంధధ్రకవితా పితామహుండు తన రచనకు భారతమును, శ్రీనాథ మహాకవిని మేల్చంతులుగం గైకొన్నాండు. మజియు నితని (గ్రంథము మార్కండేయ పురాణము ననుసరించిన దగుటచే అందలి వాక్యము లిందును కొన్ని యెడల కానంబడుచున్నవి. ఆనంద ముదణాలయమువారు ప్రకటించిన మసుచరిత్రమునకు విపుల పీఠికను కూర్చిన కీ॥శే॥ శ్రీ తంజనగరము - తేవెప్పెరుమాళ్లయ్య గారు “ఎక్కడి వాడొ!..... తరుణీ! రప్పును వమూపు....అనఫు! వుందార విద్యాధరాత్మభవను...” అను మూడింటికి మాత్రము పోలికలను చూపి, “మజియు నిట్టివి ెక్కులు గలవు” అని తెల్పియున్నారు. అట్టి పోలికలను మజికొన్నిటి నిచ్చట చూపుట అప్రస్తుతము కాదు.

2282 " పందిరి మళ్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

  1. “వరుణా తటినీ తటమున

నరుణాస్పద మను పురంబునందు +" (మార్కండేయ)

“వరుణాద్వీపవతీ తటాంచలమునన్‌ -

  • అరుణాసదంబనగ - పురమొప్పున్‌. (మనుచరిత్ర
  1. “అతి సుకుమారమూర్తి ప్రవ

రాఖ్యు. డుదాత్తుండు వేదపారగుండు" (మార్కండేయ)

“మకరాంక శశాంక మనోజ్జమూర్తి -

  • అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుండు (మనుచరిత్ర)
  1. “ఒక యౌషధసిద్ధుండింటికిన్‌ - వచ్చిన” (మార్కండేయ)

“చే రెం డద్దేహ మౌషధసిద్ధు6 డొకండు” (మనుచరిత్ర) 4. “ప్రీతిందగిలి చూచుచు సంచరించునతని

చరణతలముల మందెల్లం గరంగిపోయెం

దుహిన జలముల నెంతయుం దొప్పదోంగి” (మార్కండేయ)

“అనుచు6 (గ్రమ్మబజువేళ నీహారవారి

బరసి తత్పాదలేపంబు6 గరంగిపోయె” (మనుచరిత్ర) 5. “ఇంతదూరమైన యిగ్గిరీంద్రమునకు

నేల నన్ను దైవ మిట్లు తెచ్చె” (మార్కండేయ)

“హా! నన్నిట్లు దైవంబ! తె

చ్చితెయీ దూరవన ప్రదేశమునకున్‌” (మనుచరిత్ర) 6. “నిత్య నైమిత్తికములైన నిఖిలకర్మ

ములకు నాజడి యిట్టులు పుట్టె వెడంగ

నైతి; నింటికి. జనునుపాయంబు వేండి

కొనంగ నిచ్చట నొక తపోధనుండు లేండె” (మార్కండేయ)

“అతిథి సంతర్పణంబు లేమయ్యెనొక్కొ!

యగ్ను లేమయ్యునొక్కొ! నిత్యంబులైన

మను చరిత్రము: మార్కండేయ పురాణము. బులును వేంకట రమణయ్య 2283 నను నిలుసేరు నుపాయం బొనరింపంగం జాలు సుకృతి యొకండొదవండొకోగ్‌ (మనుచరిత్ర) 7. “మునితనయక! విను వరూథిని యను నచ్చరలేమ ననఘ! యనుపమబహు ర . త్ననితాంత కాంతి సంపద నొనరిన యిగ్గిరి6 జరించుచుండుదు నెపుడుస్‌” (మార్కండేయ) _“పేరు వరూథిని, విప్రకుమార! బహురత్నద్యుతిమేదురోదరదరీ భాగంబులం బొల్బుని మ్మిహికాహార్యమునం జరింతు మెప్పుడున్‌" (మనుచరిత్ర) రి. “దయంబోల వధ్వరంబులు దయంబజోలవు వివిధభూరి దానచయంబుల్‌ దయంబోలవు జపతపములు దయ తలపోయంగ విశిష్టతమధర్మ మిలస్‌” (మార్కండేయ) “చేసితి జన్నముల్‌, తపము చేసితినంటి దయావిహీనతస్‌ జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము అన్నియేనియున్‌ బేసినవారి సద్దతియె చేకులు భూతదయార్జ్హుబుద్ధి; కో భూసురవర్య! యింత తల పోయవు; నీచదు వేలచెప్పుమా!” (మనుచరిత్ర) 9. “అని యమ్మహాభాగు. డాచమనమొనర్చి ' నియతుండు శుచియునై నిలిచి గార్హ పత్యాగ్నిదనమది భావించి వందన మొనరించి యిట్టను “ననిలమిత! నీయంద యాహవనీయాగ్నియును, దక్షి . ణాగ్నియు. బ్రభవించె; నభవిలదేవ తలకును దృష్తి నీవలన సిద్ధించును; సకలలోకముల కాశయము నీవ;

2284 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము నిత్యసత్యమూర్తి! నీ ప్రసాదంబున నినుండు (గగుంకకుండ నిపుడ యింటి కరుగువాండ6ంగాక యాగమోదిత కర్మ జాతనైస్టికుండ నైతినేని. క. పరనారీ పరధనరతి పరత్వ మెన్నడును నాకు6 బాటిల్లని యా స్థిరసత్యమహిమ నతిస త్వరిత గమనసిద్ధి గలుగవలయు హుతవహాగ” (మార్కండేయ) “.వార్చి పప్రవరుండు గార్హపత్య . వహ్ని నిట్లని పాగడె భావమునం దలంచి. " మ. దివిషద్వర్గము నీముఖంబునన దృప్తింగాంచు; ని న్నీశుగా స్తవముల్‌ సేయు (గ్రుతుల్‌? సమస్త జగదం తర్యామియున్‌ నీవ; యా హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుదృ్భవించుం గ్రతూ త్సృవసంధాయక! నన్ను గావంగదవే స్వాహావధూ వల్లభా! ఉ. దానజపాగ్ని హోత్రపర తంటత్రుండనేని, భవత్పదాంబుజ ధ్యానరతుండనేని, బరదారధనాదుల. గోరనేని స న్మానముతోడ నన్ను సదనంబునం జేర్పు మినుండు పశ్చిమాం బోనిధియందు6 [గుంకకయమున్న రయంబున హవ్యవాహనా!" (మనుచరిత్ర) 10.వ“మహాత్మా! నేను మరుదశ్వపుత్రికిని, నిందీవరాక్షుండను గంధర్వునకును (ప్రభవించినదాన; నా పరు మనోరమ; మందార విద్యాధరపుతి వఏిభావరియును. పారుండను మునికూంతురు కళావతియును నా సఖులు.” (మార్కండేయ) ॥ క. “మరుదశ్వపుతి కిందీ వరాక్ష గంధర్వరాజువలనం బొడమితిన్‌ నరవర! వెలసితి. గళలం దు రమించుటంజేసి భువి మనోరమ యనంగస్‌.

మను చరిత్రము: మార్కండేయ పురాణము. బులును వేంకట రమణయ్య 2285 గ్‌. దేవ! పారర్దిపట్టి కళలావతియును, నల్ల మందారవిద్యాధరాత్మజన్మ యగు విభావసియును నాకు. బ్రాణసఖులు.” (మనుచరిత్ర) 11.ఉ. “నాన యొకింత లేక తననాతులయొద్దన యొక్క నాతియుం దాను రమించు నీతం డొకధన్యుండె? యొక్కని కర్థిం గూర్తురే మానుగం బల్వు రంగనలు వీనికింగారు (ప్రేయసులు; మానిని! కావున నీ లతాంగులున్‌ వీండును గాండు ప్రియుండు వారికిస్‌” (మార్కండేయ) చ. “ముదమున నిమ్మ హీశుం డొకముద్దియ చూడంగ నొక్క కాంతతో పదమదమై కడంగి రతిసల్పుట ఆల్లముగా నెజింగియున్‌ మది వివరించి రోయ కభిమానము దక్కిన వీరి కూరుముల్‌ వదలక పెద్దచే సెదవు... ఇవ్వెలందులయందు6 గూర్మిపస వీనికి నేమియు లేదు; వినియం దలవడం గల్ల దీ జలరు హాక్షులకుం బియ మెవ్విధంబునస్‌” (మనుచరిత్ర) 12.క. “విను కలహంసీ! యుక్కని మన యొక్కఆతయందు, నొకని మన మొక్కతెయం దు నిలుచు6 దిరమయి, యది వల పనంగాందగు6; బ్రియము పలువురందు. గలుగునే? గీ. ఏను గడు ధన్యురాల; నియ్యిల మదీయ విభుండు గడు ధన్యుండు...” (మార్కండేయ) ఆ. “తగులు నెవ్వండొక్క తరుణికి; నొకనికి మెలంత వలచు నదియ మేలనంగ వచ్చు.గాని; క్కు వనితలపైం గూర్మి కలుగుననుట బొంకు గాదె తరుణి! చ. పలుకులు వేయు నేమిటికి? భాగ్య సమన్విత నేను; మద్విభుం డిలం గల ధన్యుండు” ఎ (మనుచరిత్ర)

2286 పందిరి మల్లికార్జునరావు నతజయంతి. సంప్పుటము 4; సాహిత్యము 13.గీ. "మనము లలర6 జూడ్కులు గడు [మాలం జెవులు (వాల హరిణాంగనలు రాగలోల లగుచు6 - జేరి హరిణేంద్రు నెమ్మోాము మూరుకొనుచు నజ్జు నాకుచునున్ననా హరిణవిభుండు. ఆ.ఏ స్వరోచింగా; నొకింతయు నే లజ్జ విడువనట్టి (తోవ విడుతు వినుండు

  • లజ్జ మాకు6 గడ తొలంగుండు తొలంగుండు విగతలజ్జ్ఞమతుల వెనుక6 జనుండు” (మార్కండేయ) ఘనముగం దమచెవుల వాలుంగన్నులు సోలన్‌ మునసెలవి యెత్తి ప్రియునా ననమున్‌ మూర్కొనుచు నల్జునాకెడువేళన్‌.” శా.హుంకారం బొనరించి “వే తలంగుం డోహో! నేను స్వారోచినే? పంకేజాక్షులతోడ నెల్లపుడు దర్పస్ఫూర్తిం గ్రీడింప; ల జ్ఞాంకూరం బడంగించినారు; తలపోయన్‌ నాకు రోంతయ్యె; మీ రింకం బోయి వరింపుండొక్కరుని; భోగేచ్చ న్నివారించితిన్‌.” (మనుచరిత్ర) పరిశీలించి చూచినచో నిట్టివింకను కానరావచ్చును. తనకంటె (ప్రాచీనుల పలుకుబడులు, మూలానుసరణములును తర్వాతి వారి (గంథములందు దొరలుట స్వాభావికము; దొరలకుండుట అస్వాభావికము. ప్రాచీనుల నుడికారములును, అనుసరణములును [గ్రంథమున కుత్కర్షను కల్లించును. అవి అపకర్ణాధాయకములు కావు. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జసపరి 1955) యు ఎం యర గరా ుంంటా శత (శతి: 66 వు తయన నా . జ్ఞ ని-అటొ లలి అభ్ధా లో

సంస్కృతరూపకములు - భాణము బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు

“వరరుచి రీశ్వరదత్తశ్శా్యామిలక శ్యూద్రకశ్చ చత్వారః,

ఏతే భాణాన్‌ బభణుః కా శక్తిః కాళిదాసస్య ||”

వరరుచి “ఉభయాఖిసారికా” భాణమును, ఈశ్వరదత్తుడు “ధూర్తవిట సంవాదొభాణమును, శ్యామిలకుడు “పాదతాడితకవుూును, శూూదకుడు “పద్మ(ప్రాభృతకము"ను రచించారు. ఈ “చతుర్భాణొలో వ్యక్తమగు కవితాచమత్కృతి ముందు కాళిదాసుని కవితా శక్తి మాత మెంత? - అని ఈ గ్లో తాత్చర్యం. ఉత్తమ కవితా క్తి సంపన్నములై ఉండటమేకాక, ఉపలభ్య మైనంతలో ఈ నాలుగు భాణాలే అత్యంత (ప్రాచీనమైనవిగా కూడా కనిపిస్తున్నవి.

భాణం ఏకాంకరూపకము; ఏకప్వాత రూపకము కూడాను. సూత్రధారుడు ప్రస్తావన నిర్వ ర్తించిన వెంటనే ధూర్తుడు, విద్వాంసుడు, విదగ్గుడు అయిన ఒక విటుడు ప్రవేశించి తనవికాని, ఒరులవికాని వివిధ శృంగారానుభవాలు ఉపన్యసిస్తాడు. ఉదయం తన ఉంప్పుడుకత్తె ఇంటినుండి నిద్రలేచి బయలుదేరిన విటుడు ఆ సాయంత్రం జరుగనున్న ఏ మదనమహోత్సవంవంటి ఉత్సవం నిమిత్తమో తన మరొక భోగకాంత ఇల్లు చేరుకునే లోపుగా త్రోవలో అతనికి తటస్థపడే వివిధ సన్నివేశాలు భాణంలో వర్ణితము లవుతవి. అనగా భాణంలోని కథ ఒక పగటిపూట జరిగిన కథే అయిఉంటుంది. వేశ్యావీథివెంట ఆ విధంగా బయలుదేరిన విటునికి పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము.

2288 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పటము 4: సాహిత్యము తనచే పూర్వానుభూత లైన వెలచేడియలు, తనతోడి విటమిత్రులు ఎందరో ఎదురవుతారు. ఆకాశభాషితాలతో వారితో విదగ్ధ సల్లాపాలను విటుడు జరుపుతాడు. ఆకాశభాషిత మనగా వారిని ఏదో ఒక ప్రశ్న వేసి “కిం బవీషి?...ఏవమితి” (ఏమంటున్నావు?...ఇలా అనా!) అంటూ వారి ఆ సమాధానాలను కూడా తానే ఏకరువుపెడుతూ సంభాషణ సాగించటం. అందుచేతనే - రంగం మీద కేవలం ఒకే పాత్ర కనిపించినా - అనేక ఇతర పాత్రల ప్రస్తావన, ఆ పాత్రల తాలూకు సంభాషణలు కూడా భాణంలో వస్తున్నవి. కనుక, నిజానికి భాణాన్ని ఏకపాత్ర రూపకమనటం కంటె, ఏకపాత్రాభినయ రూపకం - అనగా అనేక పాత్రలు ఒకే పాత్రచే అభినీతములగు రూపకం అనటమే సమంజసం! భాణంలోని విటుడు సర్వసాధారణంగా తోవలో కనిపించే గొజ్జెపాటేళ్ల పందెం, కోడిపుంజుల పందెం, మల్లయుద్ధం, ఒకే వేశ్యనిమిత్తంగా ఇరువురు సరసులు జరిపే ఖడ్గయుద్ధం, పాముల వాడొకడు పామును, కోతిని ఆడించడం. గారడీవాడు [బ్రహ్మరుద్రాది దేవతలను, వారి నివాసస్థానములైన పర్వతాలను (ప్రదర్శించటం ఇటువంటి ఆయాకాలాల సాంఘిక జీవనాన్ని (ప్రతిబింబించే వివిధ దృశ్యాలను, ఉదయ, మధ్యాహ్న సాయం సమయాలను వర్దిస్తాడు. ఉజ్జయిని, కాంచీపురం, విద్యానగరం, కొల్లాపురంవంటి మహానగరాలలోని వేశ్యావీథులే భాణాలలో కథా రంగాలుగా గ్రహించబడినవి. ఆ మహానగరాల రాజవీథులను, కుసుమ విపణులనుకూడా విటుడు వర్ణిస్తాడు. ఆ రాజవీథులలో సంచరించు మహారాష్ట్ర, నేపాల, పాండ్య చోళ, (ద్రవిడ, కర్ణాట, ఆంధ్రాది వివధ (ప్రాంతీయ కాంతలలో స్ఫురించు భిన్నభిన్న అవయవ విన్యాస సౌందర్యమును విటుడు ఉగ్గడిస్తాడు. ధనముడిగిపోయిన వెంటనే విటులను మెడ బట్టి గెంటు వేశ్యమాతలను ఇతడు మందలిస్తాడు. ప్రణయ కలహములవల్ల ఎడమొగము పెడమొగముగా ఉన్న ప్రేయసీ ప్రియులకు తిరిగిపొత్తుకల్పుతాడు. ప్రియుని గూర్చి అభిసరిస్తూ కొందరు, ప్రియునికై విరహముతో వీణపై విరహగీతము లాలాపిస్తూ కొందరు, కందుకక్రీడనో, డోలా [్రీడనో అనుభవిస్తూ కొందరు - ఈవిధంగా వేరు వేరు అవస్థలలో ఉన్న వేశ్యలు విటునికి ఎదురవుతారు. అందరూ ఎంతో ఆప్యాయంగా ఇతనిని పలుకరిస్తారు. వారితో నర్మగర్భంగా ఛలోక్తులాడుతూ విటుడు ముందుకు

సంస్కృతరూపకములు: ఖాణము బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు 2289 సాగిపోతాడు. ఇక - ఈతని కెదురుపడు పురుష వ్యక్తులలో కవులు, వైయాకరణులు అయిన విటులేకాక చాటుచాటుగా వేశ్యావీథులలో (ప్రవేశించు వైన, బౌద్ధాది భిక్షువులు, వివిధ మతాచార్యులుకూడా ఉంటారు. వారి లోగుట్టు బయటపెట్టి విటుడు వారిని పరిహసిస్తాడు. ఈవిధంగా భాణంలో ఒకే కథ కాకుండా వివిధ సన్నివేశాల పరంపర అభివర్షితమవుతుంది. అయితే - విటుడు ఒక ప్రత్యేక ప్రయోజన సాధనకై బయలుదేరటంతో భాణాదిలో ముఖసంధి, ఆ ప్రయోజనం సిద్ధించటంతో భాణాంతంలో నిర్వహణసంధి మాత్రం నిబద్ధము లఅవుతవి. అనగా ప్రధాన కథకు ఆది, అంతము మాత్రమేగాని [కమపరిణామము ప్రదర్శితము కాదు. కోడిపుంజుల పందెము వర్ణించుట మొదలైన లక్షణాలు భాణానికి అత్యావశ్యకమైనవనే సంప్రదాయం ఇటీవలి కాలంలోనే దృఢపడి ఒక కృతిమమైన, నిర్జీవమైన మూస భాణానికి విర్పడింది. ప్రాచీన భాణాలలో అప్పటికి ఇటువంటి మూస ఏదీ లేకపోవటం వలన వైవిధ్యంతో ఏ భాణాని కాభాణం సజీవంగాను, సరసంగాను కనిపిస్తుంది. శిల్పంలోనే కాక, పేళ్లలో కూడా (ప్రాచీన అర్వాచీన భాణాలమధ్య ఇట్టిభేదం చూడవచ్చును. (ప్రాచీన భాణాలకు “పద్మ ప్రాభృతకమ్‌”, “పాద తాడితకమ్‌” అని ఆ యా ఇతివృత్తాల కనుగుణమైన పేళ్లు ఉన్నవి. ఇక

  • అర్వాచీన భాణాలకు శృంగార చందిక, శృంగార మంజరి, శృంగార శృంగాటకము, శృంగార జీవనము, శృంగార సుధాకరము, పంచబాణ విజయము, అనంగ సర్వస్వము వంటి మాన్మథ సూచకములైన ఒకేరకపు పేళ్లు ఉంచబడినవి. “చతుర్భాణొలోని భాణములు నిజముగా “కా శక్తి కాళిదాసస్య” అన్న ప్రశంసకు
  • తగిఉన్నవి. శూదక మహాకవికృతమైన “పద్మప్రాభృతకము”లో శశుడనే విటుడు తన ఆచార్యుడైన మూలదేవునివద్దనుండి ఆయన ప్రియురాలు దేవసేనకు ప్రణయసందేశమును తీసికొని బయలుదేరుతాడు. (త్రోవలో 7గురు విటులతోను, 6 గురు గణికలతోను, అతి విదగ్ధాలాపములతో ఆకాశ సంభాషణ జరిపి, తుదకు దేవసేనను కలసికొని ఆమెవద్దనుండి తన ఆచార్యునకు ప్రాభృతముగా (కానుకగా) ఆమె విలాసముగా చేతులో ధరించే లీలాపద్మమును తీసికొని నిష్క్రమిస్తాడు. ఈ భాణములోని 13 సన్నివేశములలో దేనికదే విలక్షణమైనది. ఉదాహరణకు - శైషిలకుడనే విటుడొకడు శశునికంట బడకుండా ముఖం చాటుచేసికొని పోవ

2290 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము యత్నిస్తాడు. దానికి కారణము శశుడెరుగును. ఆ శైషిలకుడు తన ప్రేయసి తనవద్దకు దూతికగా పంపిన ఒక శాక్యభిక్లుకితో రమించిన (ప్రబుద్ధుడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు. కాని శశు డాతనిని నిలదీసి అతనిచేతనే ఆ వృత్తాంతమునంతా చెప్పిస్తాడు. తాను బలవంతముగా అ[కమించగా ఆ సంరంభములో శాక్యభిక్తుకి ఆడిన మాటలను శ్రైషిలకుడిలా చెబుతాడు : సంపాతే నాతిభూమిం ప్రసరసి శఠ హే! మాన్యాః ఖలువయం దౌత్యేనాభ్యాగతాయాశ్చపల! నసదృశం యత్తే వ్యనసితమ్‌! కృచ్చాద్ధురద్ధాస్మి జాతాపరగృహ వసతిం సం(ప్రాప్యవిజనే మామైవంహా ప్రసీదప్రియ! విసృజ - పురా కశ్చిత్ప్రవిశతి॥ . శఠ, చపల, ప్రాయ అనే సంబోధనల (కమపరిణామంలోను, “మేము మాన్యలము. దౌత్యమునకై వచ్చిన మమ్మింత చేయుట నీకు తగదు" అంటూనే “అదిగో! ఎవరో వస్తున్నట్లున్నారు” అని వ్యంగ్యంగా తన ఆమోదాన్ని తెలిపిన తీరులోను ఆ శాక్యభిక్లుకి మనస్థితి క్షణాలమీద ఎట్లా పరిణామం చెందిందీ అతి మనోహరంగా, అత్యంత సహజంగా ఈ శ్లోకంలో చిత్రితమైంది. ఇక - వీరగ్రాంథికము మాట్లాడే అక్షరకోస్టాగారుడైన ఒక వైయాకరణినీ, తనవార్థక్యమును మరుగుపరచుకొన పడరానిపాట్లు పడుచు వేశ్యాజనమునుండి “భావజరద్గవు"డని పరిహాసనామము పొందిన ఒక “పురాణనాటక” విటునీ శశుడు పరిహసించే సన్నివేశాలు ఈ భాణంలో అత్యంత హృదయంగమంగా నిర్వహించబడినవి. చతుర్భాణిలోని మిగిలిన మూడు భాణాలుకూడ కవితా చమత్క్భృతిలోగాని, సన్నివేశ కల్పనలోగాని, తత్తత్కాలీన సాంఘికదృశ్య నివేదనములోగాని “పద్మ[ప్రాభృతకమూనకు ఏ మాత్రమూ తీసిపోవు. ఈశ్వరదత్త విరచితమైన “ధూర్తవిటసంవాద”ొ భాణ మొక విచిత్రమైన భాణము. ఇంచుమించు ఈ భాణములో కథ మృగ్యము. వేశ్యావీథివెంట బయలుదేరిన విటుడు ఐదుగురు వేశ్యలతో మాత్రమే ఆకాశసంభాషణ జరిపి, అంతలో తనమిత్రుడైన విశ్వలకధూర్హుని ఇల్లుచేరి, అచ్చట కామతంత్రములో ఆ ధూర్తునకు కలిగిన సంశయాలను తీర్చుటకు పూనుకుంటాడు. భాణంలోసగంపై చిలుకు ఈ (ప్రశ్నోత్తరాలతోనే నడుస్తుంది. కథగాని, సంఘటనలుకాని విశేషంలేకుండా భాణాన్ని అంత రసవంతంగా నిర్వహించటం ఈశ్వరదత్తుని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఉదాహరణకు

సంస్క్పృతరూపకములు: భాణము.. బొమ్మకటి శ్రీ నివాసొచార్యులు 2291 ధూర్తవిటుల సంవాదములోని ఒక అంశము “ధనముతోడిదేగదా - వేశ్యలకు పురుషులతోగల సంబంధము. ఇక వారిలో ఉత్తమాధమ మధ్యమత్వములను గుర్తించటం ఏలాగు? అని ధూర్తుని ప్రశ్న. దానికి విటుని జవాబు -

“దానా ద్రాగ ముక్రైతి వేశయువతి ర్నిష్కారణాద్వాధమా.

మధ్యా రూపమవేక్ష్య యౌవనయుతం దానేనవా హృష్యతే,

దాతారం విగతస్పృహం సువయసం రూపాధికం బైవ భో

దాక్షిణ్యేన విభూషితం ఖలు నరం నార్యుత్తమాసేవతేగో

అధమమొన వేశ్య కేవలం డబ్బుచూచి ఇతరకారణ నీర పేక్షంగానే రాగాన్ని పొందుతుందటి. మధ్యమవేశ్య ధనంతోపాటు రూప, యౌవనాలనుకూడా కోరుతుందట. ఇక ఉత్తమవేశ్య దాత, విగతస్పృహండు, వయోరూపవిలసితుడు, దక్షిణ నాయకుడు అయిన నరునిమాత్రమే సేవిస్తుందట! ఈ ధూర్తవిట సంవాద భాణంలో కనిపించే మరొక విశిష్టలక్షణం - ఇతరభాణాలలోవలె వసంతర్హువును వర్ణించటంతోకాకుండా, వర్దర్తువర్ణనతో ఈ భాణం ఆరంభమవుతుంది.

వరరుచికృతమైన “ఉభయాభిసారికొ అన్నిటిలోకీ ప్రాచీనమైన భాణం. పరిమాణంలో చిన్నదే అయినా, అనేక అర్వాచీన భాణాల కిది ఒరవడి పెట్టింది.

శ్యామిలకుడు వ్రాస్‌న “పాదతాడితకం”లో వివిధ సన్నివేశాలు కాక మొదటిసుంచి చివరవరకు ఒకే కథ పర్దితమైంది. సురాష్ట్రదేశపు వేశ్య మదనసేనిక ప్రణయకోపంలో తన పాదాలసె వాలిన ప్రియుడు విస్టునాగుని శిరస్సును తన్నివేయుట దీనిలోని కథ. ఈ భాణంలోని స్థాపన అర్వాచీన భాణాలకు దగ్గిరగా ఉన్నది. మిగిలిన మూడు భాణాలలోవలె కాక ఈ భాణంలో సూత్రధారుడు కృతినిగూర్చి, కృతికర్తనుగూర్చి ప్రస్తావించి, పాత్రప్రవేశమును, భవిష్యత్కథార్థమును కూడా సూచిస్తాడు.

స్థాపనలో తుదిశ్లోకం

“జయతి మదనస్య కేతుః కాంతం (ప్రత్యుద్యతో విలాసిన్యాః

శిరసొ ప్రార్థయితవ్యః సాలక్షక నూప్పురః పొదః!॥!” అని.

“లత్తుకతోను, అందెలతోను అలంకృతమై మన్మథుని విజయధ్వజమువలె ప్రకాశిస్తూ, పురుషునిచే నిత్యము శిరసాప్రార్థింపదగిన విలాసిని పాదము జయించుగాక”అని భాణంలో రాబోరపే కథను ఈ స్లోకంలో సూత్రధారుడు

సూచిస్తాడు.

2292 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంపుటము 4: సాహిత్యము

భాణమనగా భణితము, ఉక్తి. “భారతీవృత్తిపధానత్వాద్భాణవి భారతీ వృత్తి (ప్రధానముగా గలది గనుక భాణమైనదని దశరూపక కర్త ధనంజయుని నిర్వచనము. భారతీవృత్తి అనగా సంస్కృత బహుళ వాక్ప్రధానమైన నట్మాశయ వ్యాపారము. కాని ఈ నిర్వచనంకంటె అభినవ భారతిలో అభినవగుప్తపాదుల పరిష్కారమే భాణశబ్దానికి ఎక్కువ సమంజసంగా కనిపిస్తున్నది. ఆయన ఇలా అన్నారు: “ఏకేన పాత్రేణ హరణీయః సామాజిక హృదయం ్రాపయితవ్యోర్థః యత్ర స భాణః. ఏకముఖేనైవ భాణ్యంతే ఉక్తిమంతః క్రియంతే అప్రవిష్టా అపి పాాత్రవిశేషాః యతే భాణః” = ఒకే పాత భణితముద్వారా మనోహరమైన అర్ధమును సామాజిక హృదయమునకు సమర్పించునది భాణము - లేక, ఒకే పాత్రచే రంగముపైకి రాని ఇతర పాత్రల మాటలు కూడ అనువదింపబడునది భాణము. నాట్యదర్పణకర్త చెప్పినట్లు సాత్వికాంగికాభినయాలు కాక, వాచికాభినయమొక్కటే భాణ ప్రదర్శనలో ఆదరణీయము గనుక, వాచికాభిన మైకాశయమైన రూపకవుగుటచే భాణమైనదనిగూడ చెప్పవచ్చును. ॥

కాల్మకమమున భాణస్వరూపములో అనేక పరిణామములు వచ్చినవి. (ప్రాచీనభాణాలలో కనరాని నాందీ భరతవాక్యాదులు అర్వాచీనభాణాలలో (ప్రత్యక్ష మైనవి. ఆలంకారిక మతానుగుణంగా నాయకసహాయుడుగానే విటుడు (పాచీనభాణాలలో చిత్రితుడైనాడు. అర్వాచీనభాషలు మాత్రము విటుని ఒక ప్రత్యేక శృంగారనాయకునిగా ప్రదర్శించినవి. ప్రాచీనభాణాలు ప్రయోగానుకూల్యమును దృష్టిలోనుంచుకొని [వాసినట్లు తోచును. అప్రవిష్టప్యాతల భాషితములు అందు కురుచలుగా ఉండి, విటుని మాటలే విస్తరించి యుండును. ఇటీవలి భాణాలలో విటుడు అనువదింపవలసియున్న తెరచాటు పాత్రల భాషితములు పుటలకొలది వ్రాయబడినవి. దీనినిబట్టి అర్వాచీనభాణములు రచింపబడునాటికి భాణమును ప్రదర్శించే సంప్రదాయం నశించినట్లు తోస్తున్నది.

భాణస్వరూపములోని పరిణామము ననుసరించి భాణలక్షణములో కూడ మార్పువచ్చినది. భరతముని భాణములో శృంగారరస నిబంధనమును మాత్రమే ఒప్పినాడు. కాని క్రమంగా “సూచయేదీశ్వర శృంగారే శార్యసాభాగ్యసంస్త వై అని దశరూపకకర్త శృంగారముతోపాటు వీరమునకుకూడ భాణంలో స్థానం కల్పించాడు. ఇక నాట్యదర్పణకర్తకలానికి ఈ వీరశృంగారాలతోపాటు ' హాస్యానికికూడా భాణంలో (యోజ్యత్వము సిద్ధించినది.

భాణమే మొట్టమొదట వెలసిన రూపకభేదమనీ, దాని నుండే మిగిలిన తొమ్మిది రూపకభేదాలున్ను క్రమంగా రూపొందినవనీ 0.8.41౧0626 ప్రభృతులు:

సంస్కృతరూపకములు: భాణము బొమ్మకంటి శ్రీనివాసొచార్యులు 2293 నవీనులు కొందరు ఒక క్రొత్త సిద్ధాంతమును లేవదీస్తున్నారు. కాని రచనాశిల్పంలోను, అభినయ శిల్పంలోనుకూడ అత్యంత క్లిష్టమైన భాణం ఆదిమరూపకభేదం అనటం అసమంజసం,. అదిగాక - ఇతర రూపకభేదాలన్నింటికీ నాటకమే ఆదిమసపకృతి అని రసార్ద్ణవసుధాకరకర్త సర్వజ్ఞసింగ భూపాలుడు కంఠోక్తిగా చెప్పినాడు.

“ఆహుః ప్రకరణాదీనాం నాటకం ప్రకృతి రృుధాః

అతిదేశబలప్రాప్త నాటకాంకోపజీవనాత్‌

అన్యాని రూపకాణి స్యు ర్వికారా నాటకంప్రతి!॥” అని.

అర్వాచీన భాణాలలో వామనభట్టబాణుడు వాసిన శృంగార భూషణభాణం విపులప్రశస్తి గడించుకొన్నది. ఈ వామను డాంథధ్రుడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానవిద్వాంసుడు. ఈ భాణమునకు రంగస్థలము విద్యానగరము. విలాసశేఖరు డను విటుడు అనంగమంజరి అనే గణికపథమార్తవ మహోత్పవమునకు పహోజరగుట ప్రధానేతివృత్తము. మొత్తము 18 సన్నివేశము లిందు వర్ణితము లైనవి.

ఇటీవలి భాణాలలో మరొక చెప్పుకోదగిన భాణం కాశీపతి (వ్రాసిన ముకుందానందభాణం. ఇది ద్వ్యర్థి. విటుడైన భుజంగ శేళలురుడు ఆత్మపరంగాను, శ్రీకృష్ణ పరంగానుకూడా అన్వయించునట్లు శృంగారానుభవాలు వర్ణిస్తాడు. మరొకవిశేషం - ఇది మిశభాణం. అనగా - సంస్కృతప్రాకృతాలు రెండూ వాడుకచేయబడిన భాణం. వరదాచార్యకృతమైన వసంతతిలక భాణమొకటి మంచి (పౌాఢమైన భాణం. ఇవిగాక ఇంకను శృంగారతిలక, శృంగార సర్వస్వము, రససదనమువంటి రసవంతములు, రసజ్జజన అవశ్యపఠనీయములు అయిన భాణా లెన్నో ఉన్నవి.

తెలుగులో సంస్కృత భాణాలకు కొన్ని అనువాదాలు ఉన్నవే కాని స్యతంత్రభాణము నా ఎరిగినంతలో ఒక్కటివూడత్రవే. కనిపిస్తున్నది. సుమనోవినోదనభాణము ఛిలకపాటి రామానుజశర్మ కృతము. కవితాప్రాథిమలోను, శృంగారరసబంధురతలోను ఈ భాణము సంస్కృతభాణాల కేమాతము తీసిపోవునది కాదు.

ఇక - ఈ వ్యాసము ముగించేముందు - అసభ్యముగ పచ్చి శృంగారాన్ని వర్ణించునట్టి ఈ భాణము శిష్టజన సమాదరణీయము కాదని “కీత్‌ పండితుడు మొదలైనవారు చేసిన విమర్శ ఒకటి విచారింపవలసియున్నది. నిజమున కీసమస్యను భరతమునే పరిష్కరించాడు. “సతతం కార్యో బుధైర్భాణః” అని ఆయనశాసనము. బుధులైనవారు రచించే భాజాలు స్వీకార్యములే అని, అభినపగుప్పుడీ శ్లోకపాదమును

2294 పందిరి మల్లికార్డుసరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము వ్యాఖ్యానిస్తూ “లోకోపయోగి వ్యవహారాత్మకమైన భాణము పృథగ్దనములకు వ్యుత్పత్తి కలిగింపగలదు కనుకను, రాజపుత్రాదులకైనను అవంచనార్థ్ధము - మోసపడకుండుటకు- వేశ్యావిటాది వృత్తాంత పరిజ్ఞాన మావశ్యకమే కనుకను భాణము అవశ్య సంప్రయోజ్యమే!” అని నిర్ధరించినాడు. భారతీయులకు కావ్యము రసాత్మకము, సద్యఃపరనిర్వృతికరము. లౌకిక ప్రయోజనసాధనము కాదు. కావ్యజగత్తులో రస సమృద్ధిముందు లౌకికమూల్యములు అ(పధానములు. అందుచే రసములకు రాణిఅయిన శృంగారముగాని, శృంగారరసభూయిష్టమగు భాగముగాని ఎట్టి పరిస్థితులలోను భారతీయులకు పరిహార్యములు కానేరవు. “శృంగార ఏవ మధుర?” అని భారతీయసిద్ధాంతము! (కిన్నెర: సంప్లుటము 7; సంచిక 1, జనవరి 1955) ల అన్న గో ని కూ న వ న యమ్‌ లి

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ

ప్రస్తావన

యౌదాలాపంగా ఒక సాహిత్యప్రియతో ప్రసంగం వచ్చింది. ఆమె హిందీ సాహిత్యంలో పెద్ద పరీక్షలిచ్చి అధ్యాపికగా ఒక ఉన్నత విద్యాలయంలో పనిచేస్తున్నది. తెనుగుసాహిత్యంలో కొద్ది ప్రవేశం ఉన్నది. ప్రసంగంలో హెందీసాహిత్యాన్ని ప్రశంసచేస్తూ చటుక్కున ఒక పెద్దమాట తెనుగుసాహిత్యంమీద ఆమె విసరింది. “తెనుగు సాహిత్యంలో ఏమున్నాయి? ఈనాటి సాహిత్యంలో మంచినవల ఒకటైనా ఉందా?” అని ఆమె హీళన ధోరణిలో ఆరంభించింది.

నేను చకితుణ్జి అయ్యాను. వంటనే ఆమెను ప్రశ్నల పరంపరతో ముంచివేశాను. తిరిగి జవాబుచెప్పడానికికూడా ఆమెకు ఊపిరి ఆడనీయలేదు. “మీరు తెనుగుసాహిత్యంలో ఏ (గ్రంథాలు చదివారు? జాందీలో ఏమిచదివారు? తెనుగు సాహిత్యంలో వచన గ్రంథాలు చదవకపోతే మానె. పోనీ పేరులయినా విన్నారా? (గంథకర్తల పేరులు విన్నారా? ఇవేమీ చదువకుండా తెనుగులో నవలలు లేవనడం సాహసంకాదా?” అని (ప్రశ్నించాను. ఈ ప్రశ్నలన్నింటికీ “వేదు” అనే జవాబు పొంది - అపుడు తెనుగునవల గురించి కొంచెంసేపు నేనుచెప్పాను. ఈ ధోరణిలో ప్రసంగాలు నాకు కొత్తకాదు. హాందీలోను, ఆంగ్లంలోను (గ్రంథాలు చదివి, పరీక్షలిచ్చి ఆయాభాషల అభిమానంతో హిందీ మానసపుత్రులు, ఆంగ్ల దం ముట్టూస్టనరాపు శరజయంతి సంపుటము 4: సాహిత్యము.

2296 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము మానసప్పుత్రులు అనిపించుకోదగిన ఆంధ్రవిద్యార్థి విద్యార్థినులు, అధ్యాపికలు, సాహిత్యవిమర్శకులు అనేకులున్నారు. వీరిలో ఎక్కువమంది మాతృభాషతో పరిచయంలేకుండా, ఆ సాహిత్యాన్ని గురించి త్మీవవిమర్శలు చేస్తూఉంటారు. ఆ విమర్శలు ఇష్టాగోష్టులలోను, చిన్న సమావేశాలలోను అయితే హానిలేదు. కాని అఖిలభారత సాహిత్యసభల్లోను, పరిషత్తుల్లోను ఇటువంటి అభ్మిపాయాలు వెలిపుచ్చితే అవే శిలాశాసనాలుగా, చెరగని సత్యాలుగా నిలిచిపోతాయి. ఉదాహరణగా - ఈమధ్య మదాసులో అభీలభారత సాహిత్య అకాడమీ సలహా సంఘసమావేశం జరిగింది. తనుగుసాహెత్యం పక్షాన ఆరుగురు సలహాదారులుండగా నలుగురుమాత్రం హాజరయ్యారు. ఇద్దరు రాలేదు. ఆ సమావేశంలో చర్చించిన విషయాలలో ఒకటి తెనుగులో మంచినవల ఏదైనా ఉంటే అది హిందీలోకి తర్జుమాచేయించాలని, మన టప్రబుద్ధుల్ని ఒకనవల సూచించమంటే తెలుగులో నవలేలేదు అన్నారట. ఉత్తరాదినుండి వచ్చిన ఒక ప్రముఖుడు - మిగతా విషయాలలో ఎలాగఉన్నా నవలా రచనలో ఆలుగుసాహిత్యం అంత ముందంజవేయలేదటగా అని నాతో అన్నాడు. “ఎవరుచెప్పారునీకు? వారు ఏమితెలిసి అన్నారు” అని, దానికి ప్రత్యుత్తరంగా “ల్రేకపోవడ్రం ఏమిటి? తలుగులో కూడ చక్కని నవలలు వచ్చాయి. ఇవి ఇతరదేశీయభాషలలోని నవలలకు ఎంత మాత్రం తీసిపోవు” అని చెప్పాను. సాహిత్యంలో కొమ్ములుదీరిన "పెద్దలు అని పిలిపించుకొని సలహాసంఘంలో సభ్యులుగా కూర్చున్నవారు మరొకలాగు చెప్పిన కారణంచేతనో ఏమో ఆ పెద్దమనిషి నా మాట విని అంతగా నమ్మినట్టు కనిపించలేదు. ఇటువంటి మీమాంసే పదిహేను సంవత్సరాలక్రితం వచ్చినపుడు నేను "రెండు సుదీర్ణవ్యాసాలు (వాశాను; నవలావాజ్మయం, తెనుగు - ఇతరభాషలు అనే శీర్దికతో యీ వ్యాసాలు “ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో 26-1-41 2-2-41 సంచికల్లో అచ్చయ్యాయి. ఆ వ్యాసాల్లో ఉపసంహారవాక్యాలు ఉదాహరిస్తాను. “నవలా విభాగంలో - ఒక్క బెంగాలీ సాహిత్యాన్ని మినహాయిస్తే తెలుగు సాహిత్యంతో తులతూగగలిగిన అర్హత మరి యే భాషా సాహిత్యానికీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. దక్షిణదేశ భాషల్లో తెలుగుసమీపంలో చేరజాలే

'శెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2297 సమర్షత ఒక్క భాషకూ లేదు." 41వ సంవత్సరంలో చెప్పిన యీ మాటలు నేటికీ నిజమే. నాటికీ నేటికీ నవలారచనలో మనసాహిత్యం మరింత ముందడుగు వేసిందని నిశ్చయంగా చెప్పవచ్చు. కాని ఏ కారణంచేతనో మన తెనుగువారికీ

  • ఇతరులకీకూడా తెలుగులో మంచి నవలలు లేవనే అపోహ ఏర్పడిపోయింది. ఈ అపోహ తొలగించాలనే ఉద్దేశంతోనే యీ చిన్నపరిచయం వాయవలసివచ్చింది. నేటి సాహిత్య మనగా మన విశ్వకళాపరిషత్తులకీ, విద్యాలయాలకీ సింహస్వప్నం. వాడుకభాష అంటేను, (ప్రగతిశీలవాజ్బయం అంటేను వారికి భయం!! ఆధునికసాహిత్యం నీతిచంద్రికతో వారికి ఆగిపోయింది. 19వ శతాబ్దానంతరంవచ్చిన వచనరచనలు వారిదృష్టిలో సాహిత్య(శేణిలోకి చేరవు; ఆ విద్యాలయాలలో, ఆ యధ్యాపకులవద్ద శుశ్రూష చేసిన మన తెనుగువిద్యార్థులకి వారి గురువుల సద్చురద్ధులే అలవడ్డాయంటే అతిశయోక్తిలేదు. గురువుల అభ్మిపాయాలకి భిన్నంగా అంతకు భిన్నమైన అభ్మిపాయాలను విద్యార్థులకు కలిగించలేవు. వారి ఆలోచనలుకూడా గురుపీఠాలు నిర్ణయించే దుస్థితికి వచ్చారు. ఈ దుర్గతి ఒక్కతెనుగుభాషకే పట్టింది. కారణం తనుగుభాష దురదృష్టవశాన అటువంటి వ్రబుద్ధులు ఆయా విశ్వవిద్యాలయాలలో ఆచార్య పీఠం అధిష్టంచి పుష్కరాలపాటు ఎకచ్చత్రాధిపతులుగా ఏలుబడి చేయడం. సిండికేటు, అకడమిక్‌ కౌన్సిలులోకూడా వీరే ప్రత్యక్షం. వీరే పరీక్షకులు, వీరే విషయనిర్ణాయకులు, (గంథనిర్జేష్టలు, కులపతులు. వీ రాడినది ఆట, పాడినది పాట! స్వలాభాపేక్షతో తమ (గ్రంథాలు, తమ ఆశ్రితులగ్రంథాలు పాఠ్య(గ్రంథాలుగా చేసుకొన్నారు. తమ యభ్శ్మిప్రాయాలకే విస్సన్న చెప్పిన వేద పదవి ప్రతిష్టించుకొన్నారు. విశ్వవిద్యాలయ సరిహద్దులలో యీ మహనీయులు ఒక కృత్రిమ వాతావరణం సృష్టించి అందులో తాము ఉక్కిరిబిక్కి రై తమవద్ద చదువుకొన్నవారిని నొక్కివేశారు. ఇతరభాషలలో అలాగకాదు. ఆ యా సాహిత్య విభాగాలమీద ఎందరో పరిశోధనలు చేశారు; డొక్టరుడిగ్రీలు సంపాదించారు. హిందీలో పమచందు రచనలమీద ఎన్ని పరిశోధనలు? నవలమీద, కథానికమీద ఎన్నిపరిశోధనలు? తెనుగులో ఆధునిక
  • కవులమీదగాని, వారి రచనలమీదగాని అభ్మిపాయమే వెలిపుచ్చకూడదు. ఖండకావ్యము, గేయము, కథానిక, ఏకాంకిక నవల మొదలయిన ఆధునిక

2298 పందిరి మల్లికార్డునరాప్పు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సాహెత్యవిభాగాలు విశ్వవిద్యాలయాల దృష్టిలో ఉండీ లేనట్లే. ఈ విభాగాలపై అధికారులకిపట్టిన “రేజీకటో కథలోని దేవతావస్తాాల రాజరికమువంటిది. అందుకే వీరికి తెనుగు సాహిత్యంలో నవల లేదు. ఈ విద్యార్థుల్నీ, విద్యాలయాలనీ వారి వారి అభిమానవిషయాలకి వదలివేసి, ముఖ్యవిషయమైన యీ నవలా సాహెత్యవిభాగంమాట తీసుకుందాం. తొలి నవల

తఆెనుగులో “నవల” అనేమాట ఎన్నో సన్నివేశాలు కలిగిన పెద్దకథకు వాడుతున్నాం. ఈ పేరునుబట్టి ఆంగ్లంనుండి యీ రకపుబీజాలు తీసుకొన్నట్టు తేటతెల్లంఅవుతోంది. దేశీయభాషల్లో - మరాటీ, గుజరాతీ, కన్నడ సాహిత్యాల్లో నవలకి “కాదంబరి” అంటారు. సంస్కృతంలో “కాదంబరి” కావ్యంవంటిదని వారి అభిప్రాయంకనుక “కాదంబరి” నవలకు పర్యాయపదంగా వాడారు. ఇంక బెంగాలీ, ఒరియా, అస్సామీ, హిందీ, పంజాబీభాషల్లో నవలను “ఉపన్యాసం”అని వాడుతారు. ఉర్దూలో “నవల” అనే అంటారు. తెనుగులో నవల అనే పేరు తెనుగుతనం తెచ్చుకొన్నది. ఇంగ్లీషునుండి సంగ్రహించడంలో - వీరేశలింగం పంతులుగారే అనేక సాహిత్యవిభాగాలకు ఆరంభకునైనట్లే తొలినవలకుకూడా కర్త లైనట్లు చెప్పుకొంటారు. వారు రచించిన “రాజశేఖరచరిత్ర” ఆం(ధ్రభాషలో ఆదినవల అని ప్రసిద్ధి. అయితే ఇది ఆంగ్లభాషలో ఆనాడు (ప్రసిద్ధిగాంచిన ౪1:2 01//24666 అనే (గ్రంథానికి అనుసరణ అనికూడా ఒక అభ్మిపాయం ప్రబలిఉన్నది. అదినిజంకాదు. పంతులుగారి రాజశేఖర చరిత్రలో పాత్రలూ, సన్నివేశాలూ, వాతావరణం అన్నీ తెనుగుదేశానికీ, తెనుగువారికీ సంబంధించినవి. ఆంగ్ల(గ్రంథంలో కథానాయకుడే ఒక మతాచార్యుడు. అటువంటి మతాధిపతిగాని అతని కుటుంబంగాని తెనుగుగ్రంథంలో కనిపించరు. పెగా పంతులుగారి రచన స్వతంత్రరచన కాకపోతే అది తిరిగి ఆంగ్లభాషలోకి అనువదించడంలో అర్థంలేదు. పంతులుగారి రచన చదివి ముగ్గుడై ౮. ౧౦౦౭| ౧౮1001౧50౧ అనేదొర ఇంగ్లీషులోకి 1887లో పరివర్తన చేశాడు. పంతులుగా రీ (గ్రంథంలో తెనుగునాటి సాంఘిక దురాచారాలను నిశితంగా విమర్శించారు. అయితే 1872లోనే నరహరి గోపాలకృష్ణ సెట్టిగారు “త్తీరంగరాజచరిత్ర" అనే నవల (ప్రకటించినట్లు

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2299 చెప్పుకొంటారు. ఇదిగాక తొలితెలుగునవలగురించి అనేకవాదాలున్నాయి, 1867లోనే కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు “మహాశ్వేత"” అనే తొలినవల రచించినట్టు వేంకటరత్నం పంతులుగారి జీవితం (వాసిన శివశంకరపాండ్యా పేర్కొన్నారు. (చూ. - ఆంధ్రవాజ్బయము - రచన; నిడదవోలు వేంకటరావుగారు.) ఆెనుగుభాషలో నవలారచన (ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజమ హేంద్రవరంనుండి కందుకూరి వీరేశలింగం పంతులుగారి సంపాదకత్వాన వెలువడే “చింతామణి" పత్రిక పోటీలుజరిపేది. ఈ పోటీలు 1892 - 99 వరకు జరిగాయట. ఈ పోటీల్లో బహుమతులుపొందిన రచనలు, “చింతామణి” షతికలో వరుసగా వెలువడుతూ ఉండేవి. ఆ పోటీకి వచ్చిన నవలలకు నిర్ణాయకులు, పరీక్షకులు న్యాపతి సుబ్బారావు పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, వావిలాల వాసుదేవశాస్తింగారలు. " 1893లో ఖండవల్లి రామచం్యదుడు రచించిన “ధర్మ వతీవిలాసము” అనే నవలకు (పథమ బహుమానం, తల్లాప్రగడ సూర్యనారాయణ రావుగారు రచించిన “సంజీవరాయ చరితికు ద్వితీయ బహుమానం వచ్చాయి. 1894లో ప్రసిద్ధ నవలారచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారి “రామచంద్ర విజయము" అనే నవలకు మొదటి బహుషుతి వచ్చింది. శెండస బహుమతి గోటేటి కసకరాజుగారి “వివేక విజయం” అనే (గ్రంథానికి లభించింది. 1895లో టేకువుళ్లో రాజగోపాలరావుగారి “త్రివిక్రమ విలాసము"నకు ప్రథమ బహుమానం, ఖండవల్లి రామచంద్రుడు రచించిన “మాలతీ రాఘవము" అనే గ్రంథానికి రెండవ బహుమతి యిచ్చారు. రెంటాల వెంకటసుబ్బారావుగా రీ సంవత్సరంలోనే “కేసరీవిలాసం"అనే నవల ప్రకటించారు. 1896లో తిరిగి చిలకమర్తివారి కే “చింతామణొ బహుమానం వచ్చింది. వారి నవల “హేమలతొ చరిత్రాత్మకకథ; 1897లో కూడా వారికే “అహల్యాబాయి” అనే నవలకు వచ్చింది. 1898లో చిలకవుర్తివారి “కర్పూరమంజరి"కి [ప్రథమ బహుమానం, కూనపులి లక్ష్మీనరసయ్యగారి "భక్షీ' అనే నవలకు రెండవ బహుమానం వచ్చాయి." *. ఈ వివరాలు నిడుడవోలు వెంకటరావుగారు రచించిన “ఆంధవచన వాజ్మ్బయము” అనే (గ్రంథములో చూడవచ్చును, "

2300 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పోటీ నవలలు మొత్తంమీద ఇతర భాషలలో పెద్దకృషి జరగని సమయంలోనే తెనుగు సాహిత్యంలో నవలారచన (ప్రారంభమయింది; విరివిగా సాగింది. అనేక ఉద్దుంథాలు వచ్చాయి. ఇతరులు నవలలు వాసినప్పటికీ సాహిత్య చరిత్రలు ఉత్తమ (గ్రంథాలు రచించిన విఖ్యాతి ఆ కాలపువారిలో కందుకూరివారికీ, చిలకమర్తివారికీ మాత్రం దక్కాయి. ఆంధ్రదేశ జీవితాన్ని యథాతథంగా (పతిబింబింపజే సేటట్టు కందుకూరివారు రాజశేఖర చరిత్ర వ్రాశారు. అందుకే ఆ గంథానికి తొలినవల అనే ప్రఖ్యాతి వచ్చింది. అలాగే చిలకమర్తివారు అనేక నవలలు చక్కని కెలిలో కండ్లకు కట్టినట్టు చితాలు చూపించే వర్జనలతో ఆంధ్రదేశంలో సుపరిచితమైన పాత్రలతో రచించారు. వారి “రామచంద్ర విజయం" గోదాపరి కద్దరినున్న కోనసీమకు ఛాయాచిత్రం వంటిది. “అహల్యాబాయి, “హేమలత”, “కర్పూర మంజరి" చక్కని చరిత్రాత్మక కథలు. చదువరుల శ్రద్ధ పోనీయకుండా కథారచనలో ప్రతి పుటలోను చమత్కారాలని ప్రదర్శిస్తూ వ్రాసే పద్ధతి చిలకమర్తివారికే చెల్లింది. చిలకమర్తి వా రీ బహుమతులకోసం వాసినవేగాక ఇంకా యొన్నో నవలలు రచించారు. కేవలం హాస్యరస ప్రధానమయిన ధోరణిలో “గణపతి” అనే నవల వ్రాగారు. ఇందులో “గణపతి” మొద్దబ్బాయి; చదువు లేదు, సంధ్య లేదు; ధనమూ లేదు, ఐశ్యర్యమూ లేదు. కాని అతడు జీవితంలో పడేపాట్లు చదువుతుంటే అవిచూచి చదివేవారికి జాలితోపాటు నవ్వు కూడా కలిగిస్తాయి. ఈ నవల మన సాహిత్యంలో ఒక ఉత్తమ్మశేణికి చెందుతుంది. ఇలాగే “సౌందర్య తిలక అనే చరిత్రాత్మక నవల కథాసన్నివేశానికి, వర్ణనలకు పెట్టినది కశేరు. గ్రంథధమాలలు పత్రికలు నవలారచనను ్రోత్సహించినబ్లే కొన్ని గ్రంథమాలలు కూడా నవలా రచనలను పోత్సహించాయి. వీటిలో మొట్టమొదట పేర్కొనవలసింది క్రీ శే॥ కొమజ్జాజు లక్షణరావుగారు స్థాపించిన “విజ్ఞాన చందిక” గ్రంథమాల. వీరు ఉత్తమ నవలకు అయిదువందల రూపాయల బహుమతి యిచ్చేవారు. వారి బహుమతులు పొందిన, “విజ్ఞానచందిక' ప్రకటించిన (గంథాలలో ముఖ్యమైనవి భోగరాజు నారాయణమూర్తిగారు రచించిన “వివ్రులాదేవి” కేతవరపు

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2301 వేంకటశాస్తింగారు రచించిన “రాయచూరు యుద్ధం”, దుగ్గిరాల రాఘవచందద సచ్చ్భాస్త్రిగారు రచించిన “విజయనగరస్నామాజ్యం”. ఈ (గ్రంథాలన్నీ ఆంధ్రదేశపు చరిత్రకు సంబంధించినవే. భోగరాజు నారాయణమూర్తిగారు ఇంకా ఎన్నో నవలలు వాసి, వివిధ సంస్థల పక్షాన బహుమతులు పొందారు. రాణాప్రతాప సింహుని చరిత్రకు సంబంధించిన “అల్లాహో అక్పరు” అవేనవల చిరస్మ రణీయమైనది. వారు కొన్ని సామాజిక నవలలుకూడా (వ్రాశారు. కేతవరపు వేంకటశాస్తింగారు “ఇచ్చినీకుమారి” మొదలైన చరిత్రాత్మక నవలలతోపాటు "పూర్ణానందం” “అ(గ్రహారం” వంటి నవలలుకూడా వ్రాశారు. బెంగాలీ సాహిత్యంలో ఈ సమయంలో చక్కని నవలలు వచ్చాయి. 20వ శతాబ్ది ఆరంభంలో బంకించందదుడు, (ప్రభాతకుమార్‌, పాంచకడీదేప్‌ మున్నగువారి రచనలు బెంగాలీలో బహుప్రచారంలో ఉన్నవి. తెనుగునాట సర్‌ రఘుపతి వేంకటరత్నం నాయుడు, వీరేశలింగంపంతులు మొదలయినవారి ద్వారా (బహ్మసమాజమూ, సంఘ సంస్కరణ ఉద్యమాలుగా (ప్రచారంలోకి వచ్చిన రోజులవి. సంస్కరణాభిలాషులందరూ బెంగాలీ నేర్చుకొని ఆ భాషలో కృషిచేశారు. అంతేగాక బెంగాలీ నుండి ఉత్తమగంథాలు అనువాదం చేశారు. ఇది జరిగిన సాహిత్య కేంద్రం పిఠాపురం. బంకించందదుడు రచించిన (గంథాలన్నీ ఇంచుమించు తనుగులోకి తెచ్చిన కీర్తి వేంకట పార్వతీశ్వర కవులకి చెందుతుంది. దుళ్లేశ నందిని, నవాబు నందిని, విషవృక్షం, వసుమతీ వసంతం, రజని, యుగళాంగుళలియకం, కృష్ణకాంతుని మరణశాసనం మొదలయిన నవలలు తర్జుమాచేశారు. ఈ [గ్రంథాలన్నీ మాతృకలకు ఎంతమాత్రం తీసిపోవు. ఆ రోజులలో _ ఆంధ్ర ప్రచారిణీ (గ్రంథమాల ఒకటి స్థాపించి, రెండేసి మాసాలకు ఒక [గ్రంథం చొప్పున మొత్తం 60డుమూడు వందల నవలలు ప్రకటించారు. ఈ నవలల్లో వేంకట పార్వతీశ్వర కవులు అనువాదాలేగాక స్వతంత్ర రచనలు కూడా చేశారు. వానిలో చెప్పదగినవి “శ్యామల” “మాతృమందిరం”, “పమదావనం” = ఇవన్నీ కథావస్తువులోను, వర్జనలోను బెంగాలీ నవలల్ని జ్ఞాపకం చేస్తాయి. ఆంధ్ర " ప్రచారిణీలో వేంకట పార్వతీశ్వర కవులతోపాటు ఇద్దరు ముగ్గురు ఇతర రచయితలు అనువాదాలు చేశారు. చాగంటి శేషయ్యగారు, చిల్లరిగె శ్రీనివాసరావుగారు ఈ రచనలు చేసినవారిలో ముఖ్యులు. “మాయావి, “మాయావిని", “హత్యా రహస్యం”, “జీవన్మృత రహస్యం" మొదలయిన అపరాధ పరిశోధక నవలలుకూడా అనేకం

2302 పందిరి మల్ల్‌కార్టునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము వచ్చి - పాఠకులకి నవలా పాఠంలోనూ, (గంథమాలలోనూ అభిరుచి కలిగించాయి. ఈ (గ్రంథమాల నడపడానికి ప్రధానకారకులు కీ.శే. కొవ్వూరి చ్హంద్రారెడ్డిగారు. వీరి రాజపోషకత్వం[క్రింద - ఎంత వ్యయమైనా సరే లెక్కచేయక చక్కని ముద్రణతో, బయిండింగుతో ముచ్చటగా రెండేసి మూడేసివందల వుటల పుస్తకాలు వెలువడుతూ ఉండేవి. ఇవిగాక అనుబంధ (గ్రంథాలుగా చిన్నచిన్న పుస్తకాలు కూడా వెలువడుతూఉండేవి. ఈ యనుబంధ (గ్రంథాలుగా ఆనాడే శరత్‌సాహత్యం వెలువడింది. “అరక్షణీయ”, “అభాగినొ మొదలయిన నవలలు ఆనాడే వచ్చాయి. రవీంద్రుని నవలలు - “గోరా “నౌకాభంగం” వేంకట పార్వతీశ్వరకవులు (ప్రకటించారు. దరిమిలా వాడుకభాషలో రవీంద్రసాహిత్యం అనువాదంచేసిన కారుమూరి వైకుంఠరావు కోభనాదేవిగారలు “ఇంటా బయటా” అనే నవల అనువదించారు. రవీంద్రుడు రచించిన “కంటిలో నలుసు “బోఖిర్‌బాయి”, “నాలుగు అధ్యాయాలు” (చార్‌ అధ్యాయ్‌), ఆఖరి కవిత (శేష్‌కవిత) అనే పుస్తకాలు ఇంకా

అనువాదం కాలేదు. ఆంధ్ర ప్రచారిణీ (గంథమాలవంటిదే - రాజమహేంద్ర వరం నుండి 1920

  • 30 సంవత్సరాలలో అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడుగారి యాజమాన్యం క్రింద "సరస్వతీ (గ్రంథమాల అనేపేరున (ప్రారంభంచేశారు. దీనికి సంపాదకులు సాహెతీసమితి సభాపతి తల్లావర్సుల శివశంకరశాస్తి9గారు. ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలో వచ్చిన (గ్రంథాలన్నీ ఒక్క గ్రాంథికభాషలోనే ఉన్నవి. కాసి సరస్వతీ (గంథమాలలో వాడుక భాషారచనలుకూడా వచ్చాయి. అనువాదాలు అనేకం; స్వతంగత్రాలు బహుస్వల్పం. ఈ [గంథమాల (పకటించిన అనువాదాలలో ఎక్కువభాగం జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చెంగాలీనుండి చేసినవే. వానిలోను అపరాధ పరిశోధకనవలలు ఎక్కువ. శివశంకర శాస్త్రిగా రీ (గ్రంథమాల పక్షాన “కుంకుమభరణి" అనే నవల (బెంగాలీలో ప్రభాతకుమార్‌ ముఖోపాధ్యాయ రచనకు అనువాదం) రచించారు. ఈ నవల చదివినవారు - ఇందులోని కథానాయిక సుశీని ఆమె బసచేసిన డాక్‌బంగళాలను అక్కడ వారు సేవించిన ఛోటా హజీలను అక్కడి వాతావరణాన్ని మరచిపోలేరు. శివశంకరశాస్త్రిగారు వాడుకభాషలో (వాస్‌ యీ నవలకు ఎక్కడలేని సరళ సౌలభ్యం తీసుకొనివచ్చారు.

తలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2303

ఇంత బహుజనాదరం పొందకపోయినా చిత్రాడలో చెలికాని లచ్చారావుగారి యాజమాన్యం[కింద “రామవిలాస [గంథమాల" అనేపేరున మంచి [గ్రంథమాల ఉండేది. ఈ మాలలో వెలువడిన పుస్తకాలు కొద్ది అయినా అత్యుత్తమమైనవి వచ్చాయి. వీరి యాస్థానకవి వంగూరి సుబ్బారావుగారు “ప్రభాతం” అనే నవల (ప్రకటించారు. ఇందులో ఆంధధ్రులచరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర ప్రధాన ఇతివృత్తాలు. “పభాతం” తెనుగు వాజ్యయశీర్షికల్లో ఉత్తమశేణి సార్జించుకొంటుంది.

ఇదేసమయంలో బరంపురంనుండి ఆంధధవిశారద తాపీధర్మారావు నాయుడుగారి యాజమాన్యంకింద ఒక [గ్రంథమాల పెట్టారు. అదే “వేగుజుక్క” (గ్రంథమాల! రులాగే వారు (ప్రకటించిన [గ్రంథాలుకూడా అచ్చతెనుగు పేరులతో వచ్చాయి. “కొవ్వురాళ్ళు" “పొద్దుపాడుపు” మంచినవలలు. “ప్రొద్దు పొడుపు” “పభాతం” లాగునే ఆంధ్ర సాహిత్యచర్నిత ఇతివృత్తంగా పెట్టుకున్నది. “నేనే, “వాడే వీడు” వీరు ప్రకటించిన [ప్రథమశేణి డిటెక్టివ్‌ నవలలు. ఈ పుస్తకాలద్వారానే “జుమీలియా” “ఫూల్‌సాహోబ్‌' “కాలూరాయి" వంటి హంతకులూ, “అరిందమ్‌” వంటి డిటెక్టివ్‌లూ తెలుగునాట అందరికీ పరిచితులయ్యారు,.

తమంతతాము (గంథమాలలు స్థాపించి తమ (గ్రంథాలే ప్రకటించుకొన్నవారు కొందరున్నారు. వారిలో శ్రీపాద సుబహ్మణ్య శాస్త్రిగారు కలాభివర్థనీపరిషత్తు అనేపేరుతో “మిథునానురాగం” “శ్మశానవాటిక” అనే నవలలు (ప్రకటించారు. ఇవి (గాంథికంలో వ్రాసినవి. తరవాత వీరే “రక్షాబంధం” అనే డిటెక్టివ్‌ నవల వాడుకభాషలో వ్రాసి ప్రకటించారు. ఇందులో అపరాధ పరిశోధనకంటె తూర్పుగోదావరిజిల్లా రాయవరం పరిసరాల్లో గ్రామాల వాతావరణం చక్కగా చిత్రింపబడింది. శ్రీపాద సుబహ్మణ్యశాస్తింగారి నవలల్లో వేవర్లీనవల్సు హార్టీనవల్సులోని స్థానిక వాతావరణంలాగు ఆంధ్రదేశ వాతావరణం చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. మధ్యతరగతి ఛాందసకుటుంబాలలో ముఖ్యంగా (బాహ్మణులు వాడుకొనేభాష యథాతథంగా వినిపిస్తుంది. సుబహ్మణ్య శాస్త్రిగారు “వడ్గగింజలు”, *“అంతేకావాలి"వంటి మంచినవలలు చాలా రచించారు. ఉత్తమ నవల

ఆంధ్రదేశంలో జాతీయోద్యవుం (ప్రబలంగా సాగింది. ఆంధ్రులు

. సహాయనిరాకరణంలోను, సత్యాగహంలోను భారత భూమిలో అగగగాములయ్యారు.

2304 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శ; సాహిత్యము ఆ సమయంలో దేశ సాంఘిక పరిస్థితులలో బహుముఖమైన పరివర్తన వచ్చింది. ఈ సమాజవిప్లవాన్ని చితిస్తూ ఉన్నవ లక్ష్మీ నారాయణగారు ఒక పెద్ద కథ వ్రాశారు. ఇది తెలుగునవలల్లో ఉత్తమోత్తమమయిందని ప్రఖ్యాతి వహించింది. ఇది పాందీలోనికి అనువదించే ప్రయత్నాలు జరుగుతూన్నట్టు వినికిడి. ఈ[గ్రంథం బిటిషుప్రభుత్వంవారు చాలాకాలం నిషేధించారు. అందుచేతనే యేమో తెనుగువారిలో ఈ నవలకు రావలసిన ప్రచారంరాలేదు. ఏిడెనిమిదివందల పేజీలున్న ఈ నవలలో గ్రామజీవనం, అందులోని కక్షలు, హరిజనులు - వారిలో తెగలు, పగలు, వారిని ఉద్ధరించడానికి చేసే ప్రయత్నాలలో సవర్డులు ఎదుర్కొనే ('ప్రతిఘటనలూ అన్నీ చాలా శక్తివంతంగా వర్ణించబడ్డాయి. ఇందులో ప్రతిపాత్ర ఆదర్శజీవిగానే భావించుకోవచ్చు. నిత్యజీవితంలో ఇటువంటిపాత్రలు మనకు కనిపించవు. కాని ఈ పాత్రలు ఎదుర్కొన్న సమస్యలూ, ఆ సమస్యలు సృష్టించిన సంఘం మనం నిత్యమూ ఎదుర్కొనేవే; సందేహంలేదు. అందుకే ఇది మంచినవల అయింది. చలంగారి రచనలు

లక్ష్మీనారాయణగారే “తిక్కన” గూర్చి మరొక నవల వ్రాసినట్లు వదంతి. అది యింతవరకు వెలువడలేదు. “మాలపల్లి” నవల రాజకీయంగా విప్లవం తీసుకొనివస్తే సాంఘికంగా విప్లవం తీసుకొనివచ్చిన నవల గుడిపాటి వేంకటచలంగారి “దైవమిచ్చిన భార్య” ఈ (గ్రంథంలో వివాహ సంప్రదాయాన్ని

  • ఆ పేరుతో జరుగుతూ వున్న అత్యాచారాన్న్‌ రచయిత దుయ్యబట్టారు. అంతేకాదు, స్వేచ్చా గ్రేమతత్వాన్ని ప్రతిపాదించి, పతితస్త్రీలను బలపరిచారు. అందుకే “చలం”గారి (గ్రంథాలు ఆ రోజులలో సాహిత్యకారుల నిషేధం పొందాయి. ఆ పుస్తకాలు కొని చదవడానికే భయం. “కన్నీటి కాలువ” “సత్యం, శివం, సుందరం” “నశిరేఖ”, “బాహ్మణీకం” మొదలయినవి చలంగారి రచనలు. “శనిరేఖొ సరస్వతీ [గ్రంథమాల అనుబంధంగా వచ్చింది. అది చదివి చాలామంది నిషేధించమనే వాదం బయలు దేరతీశారు. చలంగారి భావాలు, వాదాలూ సాంఘిక మర్యాదల్నీ, " ఆచారాల్ని త్మీవంగా ఎదిరించాయి. కొత్త విప్లవభావాన్ని [ప్రచారం చేశాయి. స్త్రీలోని శక్తిని వారు గుర్తించారు. ఈ రచనలోని శక్తి ప్రభావాల్ని ఎవ్వరూ కాదనలేరు. కొన్ని కొన్ని కామేచ్చను, సెక్సును ప్రకోపింప జేసేవిగా ఉండడంచేత

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2305 యీ రచనల్ని తిట్టేవారే రహస్యంగా వీటిని సేకరించి ఒక విధమైన తృప్తి తీర్చుకొనేవారుకూడా లేకపోలేదు. తెనుగు సాహిత్యంలో చలంగారి రచనలు నాటి “శశిరేఖొ లగాయతు నేటి “జీవితాదర్శం” వరకు నూతనపంథా తొక్కాయి. అవి అనుసరించిన మార్గంలో ఇతరుల్ని తాత్కాలికంగానైనా మంత్ర ముగ్ధుల్ని చేసి నడిపించాయి. ఈలాంటి రచనలు - దేశీయభాషా సాహిత్యాలు ఎందులోనూ లేవు. విశ్వవిద్యాలయ బహుమతి

తనుగులో నవలారచన (పపోత్సహించే నిమిత్తం ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఒక బహుమతి యేర్పరిచారు. ఈ బహుమతి కోసం నలభై యాఫై మంచి నవలలు వచ్చాయి. వాటిలో విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన “వేయిపడగలు” అనే నవలకు, అడవి బాపిరాజుగారి “నారాయణరావు"అనే నవలకు బహుమతులు లభించాయి. “వేయి పడగలు" మూడుతరాలవారి కథ. హిందూ సమాజ (ప్రత్యేకత అయిన చాతుర్వర్హ్య విభాగాలు ఒక తండ్రి బిడ్డలుగా తీసుకొని తిరిగి ఆ బిడ్డల నాలుగు కుటుంబాలు, ఆ కుటుంబాల చరిత్ర యీ (గ్రంథంలో నిరూపించారు. చక్కని గ్రాంథిక2ైలి. ఈ [(గంథమంతా ఒక కావ్యంలాగ వినిపిస్తుంది. విశ్వనాథవారు వ్రాసిన అన్ని నవలలు కవితాధోరణిలో నడచినవే. ముఖ్యంగా = వారు వ్రాసిన “ఏకవీర” తొలుదొల్త “భారతలో ధారావాహికంగా వెలువడింది. ఈ నవలలోని పాత్ర చితణంలోను, కథా సంవిధానంలోను, వాక్య నిర్మాణంలోను రచయిత అసాధారణమైన నిగ్రహము ప్రదర్శించారు. అదే ఈ నవలారచనలో అపరూపాలంకారమైనది. వీరు ఇటీవల (యుద్ధానంతరం) “వీరవల్లడు” “బద్దన్న సేనాని, “చెలియలికట్ట”, “జేబుదొంగలు” వంటి నవలలు రచించారు.“స్వర్గానికి నిచ్చెనలు” “తఅచిరాజు" మొదలయిన అధునాతన రచనల్లోకూడ “ఏకవీరొ “వేయి పడగలు” రచనలలో చూపిన పాటవం చూపలేకపోతున్నారు. “ఏకవీరొలో వారండుకొన్న స్థాయి - శైలిలో - ఇంకెవ్వరూ అందుకోలేరేమో! విశ్వనాథవారికి భాషమీద (పభుత్వమున్నది; భారతీయ సంస్కృతిమీద, ఆర్య విజ్ఞానంమీద, హిందూ సంఘంమీద అమితగౌరవం ఉంది. వ్యక్తులను, సమాజాన్నీ కడగంటితో చూచి, సమాజాన్నీ సంఘాన్నీ ధిక్కృతిచేసి ఒక ఉన్నత పీఠంనుంచి ఆదేశించే ఉపదేశికుడుగా ఆయన రచిస్తారు. ఆయన

2306 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము భావాలు, వాదాలు ఎక్కడికో వెనుకకు మరల్చుకొని పోయేటట్టు కనిపించినా రచనల్లోని సాహిత్య ప్రతిభ, పాత్ర చితణా వైదగ్ధ్యమూ చదువరులచేత బలవంతంగానైనా చదివిస్తాయి.

విశ్వవిద్యాలయ పరీక్షకు పంపిన నవలల్లో బహుమతి పొందకపోయినా ప్రసిద్ధినార్జించుకొన్నవి చలంగారి “మైదానం”, కవికొండలవారి “ఇనుపకోట”,

బహుమతి లభించిన అడివి బాపిరాజుగారు “నారాయణరావు” నవలలో కథా సంవిధానం, అంతప్రశస్తంగా నిర్వహంచలేకపోయినా ఏ ఘట్టాని కా ఘట్టం చక్కగా చిత్రించారు. ఆంధ్ర గామజీవనంలోని కొన్ని దృశ్యాలు బాపిరాజుగారి రచనల్లో అమరత్వాన్ని అందుకొన్నాయి. యుద్ధకాలంలోను, తదనంతరమూ వారు అనేకరచనలు చేశారు. వాటిలో పేర్కొనదగినవి తుఫాను, హిమబిందు, కోనగన్నారెడ్డి. వారు కీర్తిశేషులు కాకముందు నారీ హృదయాన్ని చితిస్తూ వాసిన “జాజిమల్లో అనే నవల ఆంధ్రమహిళవారు ప్రచురించారు. బాపిరాజుగారు గీయకవి; చిత్రకారుడు; కళాకారుడు; శిల్పి. అందుచేత వారు పాటలు వాస్‌నా, చిన్న కథలు వ్రాసినా, పెద్ద నవలలు వ్రాసినా వారి కళాభిరుచిసంపూర్ణంగా ప్రతిబించించేట్టు తమ రచనలు చేసేవారు. వారిలాగే వారు సృష్టిచేసిన పాత్రలు కూడా ఆదర్శాలకోసం బతుకులు బలిగావించిన మనుషులు. అందుచేత వారి రచనలలోకూడా స్వాభావికత (ప్రకృతి పరిశీలనలో తప్ప పాత్ర చిత్రణంలోను, కథా నిర్మాణంలోను కుంటుపడుతుంది. కాని వారి నవలలు తెనుగు భాషాయోషకు అమూల్యాలంకారాలని ఒప్పుకోక తప్పదు.

యుద్ధానికి పూర్వం - 30 - 40లలో నవలా రచనకు దోహదమిచ్చినవి కొంతవరకు ప(ికలు. తరవాత చిన్న [గగ్రంథమాలలు. కాగితము, అచ్చుధరలు పెరగడంచేతను, ప్రజలలో పుస్తకాలమీద శ్రద్ధ తగ్గడం చేతను పెద్ద నవలలు హెచ్చుగా రాలేదు. చిన్నవే నూరు, నూటయాబై పుటలుగలవి యెక్కువ వచ్చాయి. ఇవి యేదో ఒక పత్రికలో సీరియల్సుగా (ప్రకటనవడం, తరవాత (గంథరూపం దాల్చడం. అలాగ వచ్చినవే చలంగారి “బాహ్మణీకం”, విశ్వనాథవారి “మా బాబు” “వీరవల్లడు”, “చెలియలికట్ట మొదలయినవి. విశ్వనాథవారే “హాహా హూహూ” అనే నవల గంధర్వులను పాత్రలుగాపెట్టి ఒక అప్రసిద్ధ పత్రికలో (ప్రకటించారు. అది [గ్రంథ రూపంలో రాలేదు. కాని కథావిధానంలోను, ప్యాతచిత్రణంలోను ఒక విలక్షణ వైశిష్ట్యాన్ని ఆర్జించుకొన్న నవల అది.

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2307 అనువాదాలు

స్వతంత్ర రచనలుకాకు అనువాదాలుగా ఎన్నో నవలలు ఇతర భాషలనుండి మన తెనుగులోకి అనువదించారు. ఇతరభాషలన్నపుడు వ్యత్యాసం లేకుండా సువిశాలదృష్టితో అన్ని భాషలనుండి మనవారు అనువాదాలు చేశారు. నేటికీ చేస్తున్నారు. ముందు బెంగాలీ భాషనుండి శతాధిక [గ్రంథాలు అనువాదం చేశారు. శరత్‌చంద్ర ఛటర్జీ వ్రాసిన నవలలకు పది పదిహేనుమంది అనువాదాలు చేశారు. పూర్వం గ్రాంథిక భాషలో వచ్చినవి లెక్కలోకి తీసుకోకపోతే యీ కాలంలో అనువాదం పొందిన (గ్రంథాలలో ఉత్తమాత్తమమైనవి “చక్రపాణొ రచనలు. ముందు “చక్రపాణో అనువాదాలు (ప్రజాబంధు, చిత్రగుప్త పత్రికలలో సీరియల్పుగా వచ్చినవి. వాటినే యువ [గ్రంథమాల పెట్టి పుస్తకాలుగా (ప్రకటించారు. ఇలాగ (ప్రఖ్యాతి గాంచిన గ్రంథాలు “దేవదాసు”, “బడదీదీ, “పల్లీయులు". తరవాత వీరి సంపాదకత్వం (కింద “ఆంధ్రజ్యోతి” వచ్చిన తరవాత “వాగ్దత్తి మొదలయిన రచనలు వచ్చాయి. తెనాలినుండి, విజయవాడనుండి అనేకులు ఈ శరత్‌ సాహిత్యం అనువాదాలు చేశారు. వీరిలో మద్దిపట్ల సూరి, పురాణం కుమార రాఘవశాస్తి9, ధనికొండ హనుమంతరావుగార్ల అనువాదాలు పేర్కొనదగినవి. విజయవాడ నుండి బొందలపాటి శివరామకృష్ణగారు దేశి కవితామండలి అనే పుస్తకాలయం స్థాపించి శరత్‌ సాహిత్యంలోని సమస్త [గ్రంథాలూ విడివిడిగాను, (ప్రత్యేకసంపుటాలుగాను ప్రకటించారు. ఇవి అనేకుల మన్ననల నందుకొన్నాయి. సాహిత్యాభిమాను లందరి కరకమలాలను అలంకరించాయి.

అంగ్లంనుండి అనేక ఉద్దంథాలు తర్జువూ అయ్యాయి. ఇప్పటికీ అవుతున్నాయి. ఆ కాలంలో కొందరు పేరులు మార్చి తెనుగు వాతావరణం వచ్చేటట్టు అనుకరించి వ్రాశారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారి “రాజశేఖర చరితి అటువంటి దంటారు కాని అది ఒప్పుకోవడానికి వీలులేదు. పూర్వ (ప్రసిద్ధిచెందిన ఫవుష్టు (4090 అనే నవల దొడ్ల వేంకట రామారెడ్డిగారు అనుకరించి “యుగంధర విజయము" అనే రచన చేసినట్టు ప్రతీతి. కాని యీ రచన అనువాదంలాగ కనిపించక స్వతంత్ర రచనలాగే చకచక సాగిపోవును. సరస్వతీ (గంథమాలవారి ప్రచురణల్లో “జాగిలం” అనే (గ్రంథం సీరము సుభద్రమాంబగారు (ప్రకటించారు. ఈమె సెట్టి లక్ష్మీనరసింహంగారి సోదరీమణి. ఆంగ్లంలో (ప్రఖ్యాత

2308 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము నవలా రచయిత 951! 4గగం' ౧1౧౦౧౮౦6 రచించిన గ౦౦౧౮ 01 16 643460/%66 ఆధారంగా యీ జాగిలం వ్రాశారు. ఈ రచనలో శైలి చాలా ఉత్తమ శ్రేణికి చెందింది. 51/౪4/1216 5001 రచించిన “ఐవన్‌ హో”, టాలిస్‌ మన్‌” యథాతథంగా అనువాదాలుచేయించి వావిళ్లవారు (ప్రకటించారు. ఇటీవల 416౪2౧66 0౮౧౭౩ (వ్రాసిన 816% 7౪॥౧ అనే నవల కాటూరు వేంకటేశ్వరరావుగారు అనువదించి “నల్లకలువో అనే పేరున [గగంథరూపంగానే (ప్రకటించారు. ఆంధ్రపత్రిక దిన పథత్రికలోను, వార పథత్రికలోను అనేకులు అనువాదాలు చేసి సీరియల్పుగా నవలలు (ప్రకటిస్తున్నారు. డాస్టో విస్కీ “౯౬/౧6 2౧6 50౧9" (తండ్రులూ కొడుకులూ) పాలగుమ్మి పద్మరాజుగారు అనువాదం చేశారు. పెంచి భాషలో సుప్రసిద్ధమైన నవలోంం౭॥ _ 0౧గ౧౩౦౦|౧6౭౯ - రోమా రోలా (౧౦గాజ|౧ గం|[2౧౦) వాసింది _ విద్వాన్‌ విశ్వంగారు “మానవుడు అనే పేరున తర్జుమాచేసి “ఆంధ్రప్రభొలో ప్రకటించారు. ఇటీవల 004౧1[01140౧10౧310, ౮౧౦౧ 820% 00176 0206 మొదలైన నవలలు సూరంపూడి సీత్రారామ్‌గారు అనువాదంచేసి ప్రకటించారు (కవుంట్‌ ఆఫ్‌ మాంటికిస్టో, ఘంటారావం). తన్నేటి సూరిగారు అనువదించిన 72160740 016, వామనరావుగారి 0 ౮౪/01 & 14౧ 4౮66 కూడ సపేర్కొనదగినవే. -విశ్వంగారి 02౪416 00౧06 1616, ౬41% అనువాదాలు ఆంధ్రప్రభలో వచ్చాయి. సీరియల్సు ఇచ్చిన అవకాశంవల్ల యుద్ధకాలంలోను, యుద్ధానంతరమూ పత్రికల ప్రచారం పెరిగింది. పటత్రికలవల్ల రచయితలకు, రచయితలవల్ల పత్రికలకు (ప్రచారం పెరిగి ఉభయతారకమైనది. ఈ సంధియుగంలో అనేక ఉత్తమ రచనలు నవలలుగా వెలువడ్డాయి. ఈ విషయంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక ఆంధ్రజ్యోతి, (ప్రజాబంధు మొదలయిన పత్రికలు చేసిన సేవ మరువరానిది. ఇలాగ (ప్రకటించిన నవలల్లో, విశ్వనాథ, శ్రీపాద వారికేగాక కొత్త కొత్త రచయితలు ముందుకి రావడంచేత వారి (గంథాలకీ (పాశస్త్యం వచ్చింది. నోరి నరసింహశాస్త్రిగారు ఈ (ప్రకారంగా ఆంధ్రదేశ చరిత్ర నాధారంగా తీసుకొని “నారాయణభట్టు, “రు.దమదేవి అనేనవలలు రచించారు. చరిత విషయాలు మార్చకుండా, ఆ వాతావరణానికి అనుగుణమైన కల్పనచేసి యీ రెండు నవలలు శాస్త్రిగారు చక్కగా రచించారు. ఇదే విధంగా చరిత్ర గాథ నాధారం చేసుకొని

తెలుగు సాహెత్యంలో నవల శ్రీవాత్సవ 2309 నాయకరాజల కాలంనాటి చరిత్రతో పిలకా గణపతి శాస్త్రిగారు రచించిన “మీనాంబికో నవలకూడ ఉత్తమ వర్గంలోకి చెందుతుంది. విశ్వనాథనాయకుని ఇతివృత్తంతో రచించిన యీ నవలలో తంజావూరు, మధుర రాజ్యాలమహోన్నతిని చిత్రించే చిరస్కరణీయ ఘట్టాలున్నవి. మానసికశాస్త్రం = నవల

మానసిక శాస్త్రం ఆధారంగా తీసుకొని ఆంగ్లభాషలోను, యూరపియను భాషల్లోను అనేక నవలలు వచ్చాయి. ఆ ధోరణిలో రచనలు తెలుగులో తీసుకువచ్చే పప్రయత్నంచేసినవారు గోపీచంద్‌, జి. వి. కృష్ణారావుగారలు. “అసమర్థుని జీవయాత్ర"లో రచయిత స్వీయచరిత్ర చెప్పున్నాడే అనే అనుమానం పలుతావులలో కలుగజేస్తాడు. “పరివర్తన” అనే నవలలో ఒక అభాగ్యుడు పత్నిని గోల్పోయి పొందిన సంతాపం, ద్వితీయ వివాహంలో తిరిగి నూతనవాతావరణానికీి అలవాటుపడటం ఇవన్నీ చక్కగా చిత్రించబడ్డాయి. కృష్ణారావుగారి నవలల్లో “జఘన సుందరోకి 7౧0౧౧144౧౪ రచన అధారం అంటారుకాని, ఇలాంటి అలౌకిక గాథలు తెనుగు, సంస్కృతకథలు చదివినవారికి కొత్తకావు. మొండెం ఒకరిది, తల ఒకరిది అయిన వ్య క్తిలోను, ఆ వ్యక్తులు శ్రేమించిన సుందరిలోను వచ్చిన మానసిక విభేదాలు యీ నవలలో చిత్రించారు. “కీలుబొమ్మలు"అని కృష్ణారావుగారు రచించిన మరొక నవలలో తెనుగు [గ్రామసీమలోని రాజకీయపక్షాలు, పరస్పర ద్వేషాలు చక్కగా వర్ణించారు.

కేవలం కథానిర్వహణలో చమత్కారాలు చూపినవారు వి. డి. ప్రసాదరావుగారు. వీరు ప్రకటించిన “నాకబలిొ, “బికారి” అనే నవలలు మన సాంఘీకజీవనంలోని కొన్ని అపరిచిత దృశ్యాలను అద్దంపట్టినట్టు చూపించాయి.

పాశ్చాత్య వాజ్బయంలో నవలారచనలో ఇటీవల "పెద్ద మార్పు వచ్చింది. దీని ప్రకారం కథకు, పాత్రలకు ప్రాముఖ్యం యివ్వకుండా కథలో వచ్చేపాత్రల మనస్సుల్లో ఏమేమి జరుగుతుందో అవి యథాతథంగా వర్జించి అప్రయత్నంగా

  • అజ్ఞాతంగా ఉన్న భావాలనుకూడా వ్రాశారు. ఈ పద్ధతి రచనలలో జేమ్సు జాయిస్‌, వర్జీనియా వృల్య్బు కృషి చేశారు. వునస్సులోని ఖావాలు -

2310 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చెప్పరానివైనాసరే - అవి [గంథరూపంలో వాస్‌వెయ్యడంవల్ల అవి అసభ్యంగా కనిపించి, మొదట్లో 'సంఘనీతి సంప్రదాయాలకు వ్యతిరేకం అనిపించాయి. అయినాగాని ఎన్నో నిషేధాల కోర్చి ఆ (గ్రంథాలు (ప్రకటించారు. మనవారి రచనలలో అవినీతి లేకపోయినప్పటికీ, అజ్ఞ్జాతభావాలకు ప్రతిరూపం ఇచ్చే (ప్రయత్నాలు జరిగాయి. ఈ రకం రచనలో అగ్రతాంబూలం “బుచ్చిబాబూగారి “చివరికి మిగిలేది” అనే నవల కియ్యాలి. ఇందులో కథానాయకుడు “దయానిధి అసందిగ్ధ పరిస్థితుల్లో జీవితాన్ని ఎదుర్కొని అసహాయుడుగా మిగిలి, అనేక స్త్రీల పరిచయంతో అనుభవాల గీటురాయితో ఆరితేరినవాడై, జీవితసమస్యల్ను ఎదుర్కొని సంఘం దృష్టిలో (ప్రయోజకుడవుతాడు. కాని ఆతని జీవితమంతా తల్లి గారిపైన నీలాపనింద నీడలాగ వేలాడి వెన్నంటుతూఉంటుంది. దానివల్ల మానసికంగా తిన్న ఆఘాతాలవల్ల నిగ్గులుతీరిన నిధిమై కామిమైన మోక్షగామి అవుతాడు. అతన్ని వేధించే ప్రశ్నే చదువరుల్నీ వేధిస్తుంది - ఈ జీవితంలో “చివరికి మిగిలెదేమిట్‌” అని. “బుచ్చిబాబు రచనల్లో చలంగారి రచనల్లోలాగ కామ(ప్రేరేపణ ఎక్కువగా ఉంటుంది అంటారు. అది యెట్లా ఉన్నా జీవితంగురించి, వ్యక్తులగురించి “బుచ్చిబాబూచేసే వ్యాఖ్యలు సుభాషితాలులాగ వినిపిస్తాయి. అతని ప్యాతలలో ఒకవిధమైన సాసుభూతి పాఠకులకి కలిగి, వారి నడతలకి నవ్వుతోపాటు జాలికూడా తప్పక కలిగిస్తాయి. “చివరికి మిగిలేది” తెనుగులో ఉత్తమోత్తమరచన.

ఈ ధోరణిలో యింతకంటే మరొక అడుగు ముందుకిపోయి చైతన్యధోరణిలో రచనచేసినవారు రాచకొండ విశ్వనాథశాస్తింగారు. “అల్పజీవి” అని వీరు వ్రాసిన నవలలో కథానాయకుడు ఆఫీసు గుమాస్తా సుబ్బయ్య. జేమ్సు జాయిన్‌ ప్రభావం ఈ రచనలో కనిపెంచినాగాని పూర్తిగా అంత అయోమయధోరణిలో రచన సాగిందనడానికి వీల్లేదు. ఒక విద్యాధికుని మనస్సులో ఒకరోజు బయలుదేరిన ఊహలూ, ఉల్లాసాలూ, ఆవేశాలూ, ఆశాభంగాలూ, నిస్పృహలూ, నిరాశలూ ఈ నవలలో చక్కగా చిితించబడ్డాయి.

, ఇదేధోరణిలో బుర్రా సుబ్రహ్మణ్యంగారు విజయి అనే చక్కని నవల వ్రాశారు. ఇందులోకూడా ఒక మధ్యతరగతి యువకుడు తాను (ప్రేమించిన యువతిని పొందలేక పడిన పరితాపం, ఆ యువతి మనస్సులో కలిగిన పరివర్తనం వర్ణించబడ్డాయి. నేటి కాలపు విద్యాధికుల సాంఘికజీవనంలో గల నిరామయం

లుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2311 ఈ నవలలో చూడవచ్చు. స్యగతాలుగా ఆ యా పాత్రలచేత మాటలాడించి కథ చెప్పించే ధోరణిలో తెలుగులో చాలా నవలలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా చెప్పతగినవి మునిమాణిక్యం నరసింహారావుగారి “తిరుమాళిగ”, మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి “ఎకోదరులు. నరసింహశాస్త్రిగారు వ్రాసిన “బారిష్టరు పార్వతీశం” లోకప్రసిద్ధిచెందిన హాస్యగ్రంథం అనే సంగతి అందరికీ తెలిసిందే. పార్వతీశం నరసాపురంనుండి లండన్‌ బయలు దేరడానికి చేసిన సన్నాహాలు - ఓడ ఎక్కి రేవుదాబటేవరకు - చక్కని హాస్యసన్నివేశాలతో, ఈ సీమపప్రయాణాన్ని శాస్తింగారు అద్భుతంగా వర్ణించారు. ఎటువంటివారిచేతనైనా ఈ [గ్రంథం కడుపుబ్బ నవ్వించేవరకూ వదలదు. ఈ పుస్తకం ఎంత హాస్యధోరణిలో వ్రాశారో, అంతజాలిగా కన్నీళ్ళు కరిగించేటట్టు వ్రాసిన గాథ “ఏకోదరులు" అనేనవల. ఇందులో ఒక కులీన బ్రాహ్మణ యువకుడు వర్ణాంతర వివాహం చేసుకొన్న కారణంచేత కుటుంబానికి, కులానికి, సంఘానికీ, వేరుపడి ఎలాగ ఎదురీత యీదవలసి వచ్చిందో కరుణారస పరిపూర్ణంగా వర్ణించారు.

మునిమాణిక్యం నరసింహారావుగారు “తిరుమాలళిగొలో భార్యను గోల్పోయి విధురుడయిన ఒక పురుషుడు జీవితంలో నిస్పృహ చెందిఉన్న సమయంలో ఒక అపరిచితస్త్రీ తటస్థ పడటం, ఆమెవల్ల అతనిజీవితంలో కొత్త వెలుగు రావడం ఇతివృత్తంగా తీసుకొని ఇద్దరిపాత్రల స్వగతాలద్వారా చాలాజాలిగా చెప్పించారు. ఇది చదివినవారికికూడా జీవిత సామరస్యానికి స్త్రీ దివ్యజ్యోతి అనే సూక్తి తేటతెల్లం అవుతుంది. దాంపత్య జీవనంలోని కష్టసుఖాలను ఇద్దరు స్త్రీ పురుషుల స్వగతాలద్వారా వ్య క్రం చేసిన మరొక నవల ఉప్పల లక్ష్మణరావుగారు రచించిన “అతడు - ఆమె”. లక్ష్మణరావుగారు ఉన్నతవిద్య అభ్యసించడానికి యూరపు పోయి జర్మనీలో చిరకాలం ఉండి ఒక జర్మనుస్త్రీని వవాహం చేసుకొని దేశానికి తిరిగివచ్చి అధ్యాపకులుగాను, ఇంజనీరుగాను, వ్యాపారిగాను బహుముఖ జీవితాన్ని చవిచూచినవారు. అందుచేత యీ నవల కొంత స్వీయచరిత్రలాగు, కొంత కథలాగు అనేకానుభవాలతో - అభివర్షనలతో ఆనందకరంగానే ఉంటుంది. అభివర్ణిత విషయాలకు తగిన శైలి, భాష కనిపెంచనందున నడక కుంటుపడుతుంది. కాని “అతడు - ఆమో అనే నవల ఒక విలక్షణకథకు దృష్టాంతం. ఉత్తమపురుష ఏకవచనంలో కథలుగాచెప్పిన నవలలు కూడా తెనుగులో చాలాఉన్నవి. వీటిలో

2312 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము మంచి నవలిక రుక్క్మిణీనాథ శాస్త్రిగారి “దేవయ్య స్వీయచరిత్ర. దేవయ్య చిలకమర్తి వారి గణపతిని స్ఫురింపజేస్తాడు.

భాషమీద (ప్రభుత్వం లేకపోయినప్పటికీ తాముచెప్పే విషయాన్ని బలంగా ముక్కుమీద (గుద్దినట్లు చెప్పగలిగేవారు కొందరున్నారు. అట్టివారిలో “చలం”, “కుటుంబరావు"గారలు అగ్రగణ్యులు. వారి రచనలు చదువుతూఉంటే, మొదట్లో అన్వయాలు, కారకాలు ఇంగ్లీషు వాక్యాలని స్పురింపజేస్తూ ఉండేవి. కాని రాను రాను అలవాటు పడిపోయినతర్వాత తమ స్వంతశైలి అలవరచుకొని తమ విశిష్టతను నిలుపుకోగల [గ్రంథాలు వాశారు. “చలం”గారి మొదటినవల “దైవమిచ్చిన భార్య"తీసుకొని ఇటీవల వెలువడిన “జీవితాదర్శం"తో సరిపోల్చితే యీ సంగతి తెలుస్తుంది. ఇలాగే “చలరోగారిలాగే వ్రాస్తూ ఒక విలక్షణ సౌకుమార్యంతో రచనలు చేసినది ఆయనకుమార్తె “సారీస్‌”, ఈమెనవ్రాసిన “ఆనావీలర్‌ అనే రచన అపూర్వమైనది. నవలికలు

కుటుంబరావుగారు 'ెద్దకథలు - చిన్న నవలలువంటివి చాలా వాశారు. ఈ రకపు రచనలు చేయడంలో వీరిది అందెవేసిచేయి. వీటిని “నవలికి లందాం. ఈ నవలికలు వ్రాయడంలో నవల కుండవలసిన వాతావరణసృష్టి, పాత్రచిత్రణ, కథా సంవిధానం చక్కగా నిలుపుకొంటూ కథానికల కుండవలసిన సూక్షీ కరణ, ఆశ్చర్యం, అద్భుతరసం నిర్వహిస్తారు. కుటుంబరావుగారి కథల్లో మనము చకితులమయ్యేది వారి కథానిర్మాణకళగురించీ, పాత్ర చిత్రణగురించీ. సన్నివేశాలు అస్వాభావికంగా ఉండవు; సంఘటనలు విచ్చితంకావు; పాత్రలు అసామాన్యులు కారు. కాకపోయినా, వీటి కలయికలో ఒక అపూర్వసృష్టి జరుగుతుంది. వీరి పాత్రలు సాధారణులయ్యుండీ కూడా అసాధారణ 'ప్రజ్ఞలు సాధిస్తారు. సామాన్యులుగా మామూలుసంఘంలో జీవిస్తూ సంఘానికిఎదురీది కొన్ని మంచిఫలితాలు సాధిస్తారు. కుటుంబరావుగారు ఆశావాది; కనకనే వీరిప్మాతల్ని కూడా ఆశావాదుల్ని చేశారు. వారు సృష్టించిన పాత్రలు ఎలాంటి కష్టపరిస్థితుల్లో, ఎన్ని క్లిషస్టమస్యలు ఎదుర్కొన్నా

. చివరికి తమ జీవితసమస్యలు పరిష్కారం చేసుకొంటారు; స్వయంకృషి చేత

విజయం సాధిస్తారు. పాపాలు చేయరు; దుర్మార్గాలు చేయరు. అలాంటివి చేసినవారిని అణుస్తారు; గెలుస్తారు; గుణపాఠాలు నేర్పుతారు. ఆత్మహత్య చేసుకోరు; అత్యాచారాలు చెయ్యరు; చేసినపనులు - తప్పువైనాసరే - దాపరికం

తలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2313 చెయ్యరు. కుటుంబరావుగారు వ్రాసినన్ని నవలికలు మరెవ్వరూ (వ్రాయలేదు. “కులంలేనిపిల్ల” “లేచిపోయిన మనిషి, “ఆడజన్మ”, “చదువు” “సీతారామాభ్యా న్నమఃొ, “మారు పేరులు” = వీటిలో ఏ నవలిక తీసుకొన్నా ఏదిచదివినా, దినదినమూ మన చుట్టూ జరుగుతూవున్న సంఘటనలు చూచినట్టే వుంటుంది. మనం రోజూ కలిసి మాటలాడుతూవున్న జనంతో మసలుతూఉన్నట్టే ఉంటుంది. కాని జరిగిన ఉదంతాలు మనం అనుకోనంత ఆశ్చర్యంగా మారుతాయి. కథానిర్మాణంలో కుటుంబరావుగారికున్న నేర్పు మన రచయితలవ్వరికీ లేదు. అందుకే వారు రచించిన కథలుగానిి నవలలుగాని ఇతరభాషలలోనికి తర్దుమాచేస్తే బహుజనాదరం పొందలగవని నిష్కర్హగా చెప్పవచ్చు; అలాగ జనాదరణ పొందాయి కూడాను.

కుటుంబరావుగారిని అనుకరించి యీ నవలికలు వ్రాయడానికి (పయత్నించి విఫలులయినవారు ఒకరిద్దరు రచయితలున్నారు. వారిలో ధనికొండ హనుమంతరావు, యస్‌, ఆర్‌. చందూర్‌గార్లు ముఖ్యులు. హనుమంతరావుగారు చెప్పే విషయంలో నిష్కాపట్యం ఉన్నదికాని దానికి తగినంత శిల్చం లేదు. అదీగాక ఆయన తీసుకున్న సన్నివేశాలు అత్యంత సాధారణమైనవి. అందరికీ పరిచితమైనవి. అవి అసాధారణంచేసే నేర్పు ఆయనరచనలో లేదు. అందుకే ఆయన పెద్ద దెబ్బతిన్నాడు. చందూర్‌గారి రచనల్లో కూడా ఇదేలోపం కనిపిస్తుంది (ఉదా - కుబేరా ప్రచురణ “శిక్ష, సన్నివేశాలు సాధారణం అయినప్పటికీ పాత్రచ్చితణలోగాని, వాటి కలయికలోగాని రచయిత తన ప్రజ్ఞాపాటవం చూపించి వదులు వదులుగాఉన్న నూలుపోగుల్ని చక్కని పువ్వుగా అల్లలేకపోయాడు.

నవలా రచయితకి కావలసింది అల్లిక ఆ యల్లిక చేయడంలో అసాధారణమైన ఓర్బూ, నేర్చూ కావాలి. మన యువరచయితల్లో తొందరపాటు ఎక్కువై యా ఓర్పు లేదు కనుకనే దెబ్బ తింటున్నారు. కొడవటిగంటి కుటుంబరావుగారిలో ఆ (ప్రజ్ఞ అత్యధికంగా ఉంది. ఒకోసారి యీ అల్లిక మరీ క్షిష్టమై విడదీయని చిక్కుగా ఉండిపోతుంది. ఆ చిక్కులు విప్పుకోగల ఓపికగల వారికి యీ నవలలు చదివితే చక్కని ప్రతిఫలం దొరుకుతుందని నిష్కర్షగా చెప్పవచ్చు (చూడండి వారి కొత్తనవల “సరితా దేవి డైరీ). ఇద్దరు కొత్త రచయితలు

ఇటీవలి రచయితల్లో చటుక్కున వెలుగులోకి వచ్చిన యిద్దరిపేరులు చెప్పకుండా యీ వ్యాసం ముగించలేను. వారు “పినికెట్టొ, “శారద”. వీరుభయులూ

2314 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శ: పాహిత్యము ఆంగ్లవిజ్ఞానం అంతగా లేని వారు. వీరి కళాశాలజీవితం, వీరి విజ్ఞానం, అనుభవం, వీరి పాండిత్యం - బ్రతుకుమొగసాల. అందుకే వీరిరచనల్లో గండుశిలల్లోని కజకుదనం, గులకరాళ్లలోని గుల్ల, అడవిమల్లెలోని అతిశయం, అత్యంతపరిచితుడిలోని చనువు కనిపిస్తాయి. ఉదాహరణగా [కిందటి సంవత్సరం ఆంధ్ర వార పత్రికలో వచ్చిన పినిశెట్టి శ్రీరామమూర్తిగారు రచించిన “దత్తతొలో కథా సంవిధానం, పాత్రలు స్వాభావికంగానే ఉన్నాయిగాని, ఆ పాత్రలు కథలోని మనుషులు అన్నమాట మరచిపోయి తన ఆప్షలనుకొని వాళ్ల పక్షాన వఖాలత్‌ పుచ్చుకొని రచయిత వాదించడం మొదలుపెట్టేటప్పటికి తాను దెబ్బతిన్నాడు. రచన కళాత్మకంగా ఉండాలా, 'ప్రయోజనాత్మకంగా ఉండాలా అనే ప్రశ్న ఉన్నది. సాంఘిక ప్రయోజనం కోసం (వాసే పుస్తకాలన్నీ ఆ ప్రచారం అడుగడుగునా చేస్తూ వ్యక్తుల ఉపన్యాసాలతో నిండి ఉండనక్కరలేదు. సామ్యవాద సిద్ధాంతాలు ప్రతిపాదించే రచనలు చేయడం పారపాటుకాదు; కాని అది వాచ్యంగా సుమతీ శతకంలాగ చెప్తేమాత్రం ఎవరూ హర్షించరు. పినిశెట్టి ఆ పని చేయడంవల్ల ఇట్టే విఫలం చెందిపోయాడు. శ్రీ కుటుంబరావు, ఆరుద్ర, అనిసెట్టి మొదలయినవారు సాంఘిక (ప్రయోజనాలతో కథలు (వాశారు. కాని వాచ్యంగా తాముగాని, తమ పాటతలు గాని సిద్ధాంతాలు ప్రచారం చెయ్యలేదు. ఉపన్యాస ధోరణిలో కొన్ని ప్యాతలు ఇతర పాత్రలమీద విరుచుకునిపడలేదు. అందుచేత నేటి రచయితలు కేవలం పప్రచారకులుగా తయారై రచనా కళయొక్క ప్రధాన ప్రయోజనం వినోదం అనేమాట మరచిపోతున్నారు. "వ “యిజానికీ చెందకుండా, తాను కన్నదీ విన్నదీ కశ్శలాలతోసహా ఏకరువుపెట్టినవారు “శారద”. వీరు వ్రాసిన “మంచీ - చెడూ ఉత్తమ శ్రేణి నవలల్లోకి వస్తుంది. ఇందులో దాపరికంలేదు. మధ్యతరగతి కుటుంబాలలో దిగువమెట్టులో చేరిన అభాగ్య అనాథ స్త్రీ జీవితం తీసుకొన్నాడు. ఆమె పతిత, కులట. కాని ఆ స్థితికి ఆమెను తేవడానికి ఎవరు కారకులు? ఆమెచుట్టూ ఆవరించియున్న సంఘాన్ని చూపించి, ఆ సంఘంలోని దురాచారాల ప్రకోపంవల్ల బయలుదేరిన ఒక వ్రణాన్ని ఆయన చూపించాడు. దానికి శస్త్రచికిత్స చెయ్యాలో, బలాత్కార పీడన చెయ్యాలో, నిస్సహాయ పరిత్యాగం చెయ్యాలో పాఠకులకి వదలివేసాడు. ఈ రచయిత జన్మతః తమిళుడు; తెనుగుదేశంలో అనేకరకాల వర్గాలతో కలసిమెలసి బతికినవాడు; వారితో అష్టకష్టాలుపడి తన అనుభవాల సూట్‌కేసుతో తొలిసారి సాహిత్యపు మెయిలు టటెయిన్‌ ఎక్కినవాడు. తొలీ

తెలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2315 ప్రయత్నంలో ఈతడు కృతకృత్యు డైనట్టు మనం ఒప్పుకోలేక పోయినా ఈతని తొలినవల చదివిన తర్వాత “సెభాష్‌, బాగుంది, మరొకటి కానొఆఅని బుజం తట్టకుండా ఉండలేము. కాఫీహోటలు సర్వతుగా, గుమాస్తాగా రకరకాల అనుభవాలుపొంది విఖిన్నరకాల వ్యక్తుల జీవితాలను చదివినవాడు. వాటిని ఆకళించుకొని తపిస్తూ ఉన్నా నిండు హృదయంతో నిష్కపటంగా (వ్రాస్తున్నాడు. ఈ రచనలో కొంత కరకుదనం, కొంత జుగుప్స, కొంత అసభ్యత ఉన్నవంటే వాటికి మనం భయపడనక్కరలేదు. ఈ జీవితపు మహారణ్యంలో కమ్మని పువ్వులున్నపుడు ముండ్డచెట్లూ ఉంటాయి . పెద్దపులులతోపాటు చిన్న జింకలూ ఉంటాయి; మంచి గంధపుచెట్లకోపాటు మహాసర్పాలూ ఉంటాయి. ఇపన్నీ చూచి ఇపుడపుడే విచక్షణ చెయ్యడానికి వీలులేదు. తెనుగు సాహిత్య రంగంలో - ముఖ్యంగా నపలా విభాగంలో “శారద”కి మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్పకతప్పుడు. “శారద” అనే పేరు చూచి అతడు స్త్రీ అని అపోహపడి పాఠకులు చాలా లేఖలు వ్రాశారట. “శారద” అసలుపేరు “నటరాజస్‌". ఆ పేరుతో రచసలు పంపిస్తే మర్నాడు అవి పత్రికలవారు తిరిగి పంపించేవారట. “పేరులోనే వుంది పెన్నిధి అని పేరు మార్చుకొని “శారద” పేరుతో రచనలు పంపేటప్పటికి ఎన్ని పంపిస్తే అన్నీ అచ్చు అయ్యాయి. కాని, ఇది దాచకుండా ఈయన తన పేరు వెల్లడించాడు. తెనుగులో స్త్రీ రచయితల పేరులతో కొన్ని రచనలు వస్తాయి. మన దురదృష్టవశాత్తూ వాటిలో ఎక్కువభాగం మగవారు వ్రాసినవే. ఇటువంటి ప్లేబాక్‌ చిరకాలంనుండి జరుగుతోంది. కాని యిలాంటి దొంగపేర్లవల్ల ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. ఈనాటికీ కొందరు స్త్రీ రచయితలు - యీ (ప్రయత్నలబ్ధప్రతిష్టలో అబద్ధపు బతుకులు (బతుకుతూనే ఉన్నారు. సన్మానాలు చేయించుకొంటున్నారు. బహుమతులు తీసుకొంటున్నారు. తెలిసినవారు సాహిత్యలోకంలో జరుగుతూ ఉన్న యీ అసత్యాన్ని బయటపెట్టడం మంచిదేమో. స్త్రీల నవలలు తెనుగు నవలలు వ్రాసిన స్త్రీలు లేకపోలేదు. పూర్వకాలంలో పులుగుర్త లక్షీ నరసమాంబ, పీఠము సుభదాంబ మున్నగువారున్నారు. ఇటీవలి యువరచయితల్లో, “ఆనా వీలరొ లాంటి రచనలు చేసిన సారీస్‌ ఉత్తమ।శేణిలోకి వస్తుంది. తెలంగాణావారిలో ఇల్లిందల సరస్వతీడేవిగారు మంచి రచయితి.

2316 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఆమె వ్రాసిన “పండుగ బహుమానం” సాంఘిక జీవనానికి మంచి ప్రతిబింబం. కనుపర్తి వరలక్షశామ్మగారు నవల వ్రాయకపోయినా పెద్దకథలు - “ఒట్టు, “మూడు తీర్మానాలు” “వరద రాజేశ్వరి” చక్కగా వ్రాశారు. ఇటీవలి రచనల్లో హెచ్‌. కావేరీబాయిగారు వాసిన నవల (పరిణామం) ఆంధ్రపత్రికలో సీరియల్‌గా వచ్చింది. (క్రిందటి సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం వా రిచి ఏన బహుమానం తంజావూరు నాయకుల చరిత్రకు సంబంధించిన నవల, “తంజావూరు పతనం” - వాసినందుకు మల్లాది వసుంధరాదేవిగారికి లభించింది. స్వతంత్రంగా వాయగలవారు, (వాస్తున్నవారు తెనుగు స్త్రీలలో లేరని కాదు; ఉన్నవారు సరియైన కృషిచెయ్యడం లేదు. తవు కృషిఫలితాలు ఉన్నతస్థాయి నందుకునే [ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. రాచకీయ నవల నవలా సాహిత్యంలో కావలసింది వాతావరణం. కథావస్తువు ఏ కాలానికి | చెందిందయితే ఆ కాలానికి తగిన పాత్రలను, సన్నివేశాలను సృష్టించాలి. మన నవలలో తజచు వివాహ సమస్యలూ, [పేమగాథలూ, హెచ్చుగా కనిపిస్తాయి. ఎటర్నల్‌ ట్రయాంగిల్‌ అనే మూడు స్తంభాల (పేమ) ఆటే తరచు ఇతివృత్తం అవుతుంది. ఇద్దరు వరులు ఒక వధువు, ఇద్దరు వధువులు ఒక వరుడు ఇవే - ఒకర్నిఒకరు (గ్రేమించడం, ఆ (కేమ వైఫల్యం తరవాత - ఈ నాయికానాయకుల ఆత్మహత్య లేక్ష వినాశం. ఇదే తరచు దేశీయసాహిత్యం వ భాషలోనైనా నేటి నవలలకు కథ. తెనుగులో యీ (శేమకథలతోపాటు ఇతర కథలుపసైతం చక్కగా చర్చించబడ్డాయి. వర్జాశ్రమధర్మాలు, హరిజనసమస్య, వ్యవసాయ సమస్యః చదువు, సవతితల్లులు, ఉమ్మడిసంసారం మొదలయిన విషయ వైవిధ్యం స్ఫుటంగా కనిపిస్తుంది. రాజకీయాలవల్ల తెనుగుదేశంలో వచ్చిన తెరుగుబాటులు పురస్కరించుకొనికూడా అనేక నవలలు వచ్చాయి. రెండు మహాయుద్ధాల విప్లవం, స్వాతంత్య్యు సమరప్రభావం, ఆంధ్రోద్యమఫలితాలు, తెలంగాణా పోరాటం ఇవన్నీ కూడా అంతో యింతో మన సాహిత్యంమీద ముద్రవేసుకొన్నవి. అలాగ . రాజకీయప్రభావం ప్రత్యక్షంగా కనిపించే కొత్తనవల మహీధర రామమోహనరావు గారు ఇటీవల రచించి ప్రకటించారు. ఇందులో రచనాశైలి తగినంత ఉదాత్తంగా లేకపోయినప్పటికీ, చెప్పదలచిన విషయము రాజకీయభావ సంఘర్షణతో చాలా గంభీరత పొందిఉన్నది. తెలంగాణా ఉద్యమంవలన వచ్చిన చైతన్యాన్ని చిత్రిస్తూ

, జలుగు సాహిత్యంలో నవల శ్రీవాత్సవ 2317 మరొక రాజకీయనవల వట్టికోట ఆళ్వారుస్వామిగారు రచించారు. “ప్రజల మనిషి అనే యీ నవల హైదరాబాదు దేశోద్ధారక (గ్రంథమాలలో వెలువడవలసియున్నది.

తెనుగు సాహిత్యంలో నవలగురించి స్థాలీపులాకంగా గావించిన యీ పరిచయం తెలుగులో నవల లేదనేవారికి కనువిప్పుగా ఉంటుందనుకొంటాను. ఈ వ్యాసంలో ఉదాహరించిన నవలలేగాక యింకా యెన్నోనవలలు - అనువాదాలు, స్వతంత్రనవలలూ ఉన్నాయి. పిల్లలకు నవలలు

బాలసాహత్యం పేరుతో వివిధ పథతికలు [ప్రారంభించిన శీర్దికల్లో ఎన్నో నవలలు వస్తున్నాయి. ఇటువంటి (ప్రయత్నంలో ఆంధ్ర వారపతికలో 1947లో ప్రారంభమైన “పెళ్ళాడేబొమ్మ” పనాకియో కథ (అనువాదం) - యీ రచయిత చేసింది - ముందుదారి చూపింది. తరవాత “అల్లిబిల్లీలోకంలో అమ్మాయి", “రాజూ-పేదొ, “టామ్‌ సాయర్‌"మొదలయిన నవలలు వచ్చాయి. ఈ విషయంలో వి. డి. [పపసాదరావు, నండూరి రామమోహనరావు, స్వర్గీయ విశ్వాత్ముల నరసింహమూర్తిగార్లు చేసిన కృషి గణనీయం.

పిల్లలకు వ్రాసిన స్వతంత్ర నవలల్లో ప్రారంభం చేసినవారు బాలవాజ్బయ(బ్రహ్మ చింతా దీక్తితులుగారు. వారు వాసిన “సూరి సఫీతి వెంకి” కథలూ, “లీలాకువూరి"కథలూ వురవరానివి. ఇటీవల వెలువడినవానిలో నోరి నరసింహశాస్త్రగారి “కర్పూర ద్వీపయాత్ర”, కుటుంబరావుగారి “తండ్రీ కొడుకులు", పిలకా గణపతి శాస్తింగారి “అయిదు పువ్వుల రాణి" (ప్రత్యేకంగా పేర్కొనదగినవి. వీరుగాక శ్రీ పాలంకి రామచంద్రమూర్తి, కనకమేడల వేంకటేశ్వర రావు, ముళ్లపూడి వేంకటరమణ మొదలయినవారు పిల్లలకి మంచి నవలలు వ్రాసే ప్రయత్నాలు చేశారు. ముందుముందు బాల వాజ్బయంలో ఇప్పటికంటే మంచి ఫలితాలు సాధించగలరని ఆశించవచ్చును. ఉపసంహారం

సమకాలిక సాహిత్యాన్ని మెచ్చినా, విమర్శించినా అనేక రచయితల యిష్టా యిష్టాలతో నిమిత్తంలేకుండా ఉన్న మాట చక్కగా చెప్పగల్లిన విమర్శకులు అరుదైనారు. మంచి పాఠకులు వస్తేగాని మంచి నవలలు రావు. మంచి విమర్శలు

2318 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వస్తేగాని మంచి పాఠకులు రారు. మంచి నవలలు వస్తేగాని మంచి విమర్శలు రావు. అన్నింటికంటే యెక్కువ - ప్రస్తుతం సీరియల్సు ప్రకటించే పత్రికలు తామిచ్చే పారితోషికం ఎక్కువచేసి పోటీలుపెట్టి కొత్త నవలలు ప్రోత్సహించాలి. కొత్త నవలలు (ప్రకటించే (గంథమాలలు రావాలి. పాఠకుల సంఖ్య వృద్ధిపొంది రచయితకు తగిన బహుమానం ఇప్పించాలి. అప్పుడే మన తెనుగు నవల మంచి వృద్ధిలోకి వస్తుంది. రచయితలకు కొదువలేదు; రచనల్లో వైవిధ్యానికి లోపంలేదు. కాని (ప్రజాదరణలో, సాహిత్య విమర్శకుల ఆదరణలో లోపమున్నరది. ఇతర భాషలలో అన్ని పుస్తకాలలోను నవలకు ఎక్కువ ప్రచారం. మన 'ఆనుగు సాహిత్యంలోకూడా అటువంటి పరిస్థితి కల్పిస్తే తెనుగు నవల ఇంతకంటే ద్విగుణీకృతంగా వికాసం పొందుతుంది.

ఇంత దీర్హవ్యాసంలో ఏదో నవలల ఉనికి ముచ్చటించడం జరిగింది కాని ఆధునిక సంఘ పరిస్థితులకీ యీ నవలకీ ఏమి సంబంధం. మన నవలల్లో సాహిత్యరీత్యా గీటురాయి వేసిచూస్తే ఎన్ని ఉత్తమశశ్రేణికి నిలువ గల్గుతాయి. వీటి విలువ ఏమిటి అనే చర్చ జరగలేదు. అలాంటి చర్చ లేనప్పుడు ఇది కేవలం ఒకజాబితా క్రిందనే మిగిలిపోతుంది. ఇలాంటి నవలలు ఉన్నాయనికూడా తెలియని బహు సంఖ్యాకులయిన సాహిత్య (ప్రియులకు ఇది కొంచెమైనా ఉత్సాహం కలిగించి తెనుగునవల చదవడానికి దోహదం కలిగిస్తుందని యీ రచయిత సంకల్పం. ఆ సంకల్పం ఎంతవరకు ఫలించిందీ నిర్ణయించవలసినవారు నిజమైన సాహిత్య జిజ్ఞాసగల సహృదయ పాఠకులు. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955) రః ఖో తీ ళొ అ౨ తాత | సీ అలీ ఈ. *తళా ల _తఊోఆలరెం-

నాహిత (ంలో వినోదం ఎమ్‌. ఎస్‌. శాస్తి9 "

చిన్నప్పటి మాట - అనకాపల్లిలో నాలుగో తరగతిలో చేరుదామని వెళ్లగా, కనకం మేస్టారు “కాకుల సమస్యను ప్రశ్నగా ఇచ్చారు.“ఒక చెట్టుమీద నూరు కాకులున్నాయి. ఒక వేటగాడు వచ్చాడు. తుపాకితో ఒక కాకిని కొడితే ఎన్ని మిగిలివుంటాయి?” నేనూ, నా తోడి పిల్లలూకూడా “తొంభై తొమ్మిది” అనిచెప్పాంగ“కా” దన్నారు కనకం మేష్టారు, తెల్లబోయాం మేమంతా, ఆయన జవాబు విని.

మన భారతీయ విజ్ఞానంలో బాలచందుల బుద్ధిబలాన్ని పరీక్షించే లక్షల సమస్యలలో ఇది ఒకటి. మన విజ్ఞానంలో పిల్లలకూ, పెద్దలకూ - పండితులకూ, పామరులకూ - స్త్రీ జనానికీ - ఎవరికి తగిన సమస్యలు వారికి ఉన్నాయి. నిజానికి మన వాజయమంతా సమస్యాపూరితమైవుంది. మన (ప్రాచీన కథా సారస్వతంలో చాలా భాగం సమస్యల పుట్ట. వీటిని తరిచి చూచినట్టయితే “మన జీవితమే ఒక సమస్య” అని అనిపించడం అబ్బురం కాదు.

మన సమస్యలను విభజించినట్టయితే, చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలుయుక్తి లక్కలు, (ప్రహేళికలు, పదపూరణములు, పాదడపూరణములు, గూఢార్థములు, శబ్బజాలంతో ఇంద్రజాలం - మొదలైన అనేక శీర్షికల కిందికి వస్తాయి.

  • పూర్వ (ప్రకృత సందర్భాలతో - పరిణామాలతో, విదేశీయుల సమస్యలకు

గల పోలికలతో ఇప్పుడు వీటన్నిటినీ సూచీమాత్రంగా సమీక్షించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

2320 పందిరి సుల్లికార్జ్డునరాప్తు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఒక గొప్ప పండితుడు. గణితశాస్త్రంలో ఘటికుడు. రాజదర్శనానికి వెళ్ళబోతున్నాడు. దారిలో ఒక పసులకాపరి తారసపడగా తాను ఫలానా అని చెప్పాడు. ఆ కుర్రవాడు గుప్పిటితో ఇసుకతీసి “ఇది ఎంత” అని అడిగాడు. దానికి పండితుడు కోపగించుకొని “నీ ముఖంలాగే వుంది ప్రశ్న! ఈ ఇసుక రేణువులు లెక్కపెడుతూ కూర్చోమంటావా? అన్నాడు. అందుకు గొల్లడు పకపక నవ్వి - “ఇదే చెప్పుకో లేవుటయ్యా, బాపడా! పిడికిట ఇమిడిన ఇసుక “పిడికెడు అని తెలీదా? అని పరిహసించాడు. ఈ విధంగా యుక్తికి తట్టుకోలేక పరిభవింపబడిన మహాపండితుల గాథలు ఎన్నో. పగటివేషాల్లో గొల్ల వేషగాడుకూడా పండితుల్ని పల్టీ కొట్టిస్తాడు; “మరి ఇన్ని శాస్తిరాలు సదివినావు గందా, బాబయ్యా! నే నొక్కటడుగుతా సెప్పు - “కరుక్కు - జరజర- దుబుక్కు -మేలో ఈ ప్రశ్నకి జవాబు చెప్పు" మంటాడు. విద్వాంసుడు విస్తుపోతాడు. దొడ్డిలో పాకమీదికి వాళ్లతాత ఒక ఆనపపాదు ఎక్కించాడుట. ఆ పాకకిందే వాళ్లు మేకని కట్టేశారుట. ఒక అర్థరాత్రి ఒక దొంగవాడు పాకఎక్కి ఆనపకాయని కత్తితో “కరుక్కు”ని కోస్తే, అది పాకమీంచి "“జరజర” పాకి “దుబుక్కు” ని పడితే మేక “మేలో అని అరిచిందట! ఇంగ్లీషు చరిత్రనుండి ఒక చిన్నగాథ : జాన్‌ పరిపాలిస్తున్నాడు అప్పుడు. కాంటర్చరీ మత గురువుకు మూడు సమస్యలు ఇస్తాడు రాజు. గడువులోపల చెప్పలేకుంటే తలతీయిస్తామంటాడు. మతగురువుకు మతిపోయినంత పని అవుతుంది. అప్పుడు సరిగ్గా ఆయననే పోలివుండే వాళ్ల గొల్లవాడు యజమానికి ధైర్యంచెప్పి, గడువునాటికి తనే రాజువద్దకి వెల్లి సమస్యలకు తృప్తిగా జవాబులు చెప్పి బహుమతులతో తిరిగివస్తాడు. మతగురువుకు గండం తప్పుతుంది. కాశీమజిలీల్లో మణిసిద్ధుడు ఒక గొల్లవాణ్ని వెంట పెట్టుకు వెళుతాడు. ప్రతి మజిలీలోనూ ఏదో వొక వింత చూసివస్తాడు గొల్లడు. ఒక్కొక్క ఏంత ఒక్కొక్క కథ. మచ్చుకి: “భూపతి జంపితిన్‌ మగడు భూరిభుజంగముచేత జచ్చె” అనే పద్యసమస్యకి జవాబు గొల్లభామకథ. “చేపనవ్విన కథలో గూఢార్థములు హెచ్చుగా కనిపిస్తాయి.

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎస్‌, శాస్త్రి 2321

“స్త్రీ చమత్కార"పు కథలలో కూడా గూఢార్థములు ఎక్కువ. “మానం కప్పే చెట్టుదగ్గిరకి రమ్మం"టుంది కథానాయిక, అంటే పత్తిచెట్టు అని గహించలకపోతాడు రాజు.

“భత్రాళపంచ వింశతి"లోని సమస్యకథలు ఎవరెరుగనివి?

“యక్ష ప్రశ్నలొకు యుధిష్టిరుడు సరియైన సమాధానాలు చెప్పిన తరవాత కదా - పంచపాండవులు మూర్చనుండి తేరుకొన్నారు?

దీనిని పోలినదే “అజగరోపాఖ్యానం” కూడాను. నహుషుడి కథ ఇది.

విచారణలు, తీర్పులు (ప్రస్తావించవలసి వచ్చినప్పుడు - ఖాజీ తీర్పులు, మర్యాద రామన్నపీర్పులు పేర్కొనాలి.

ప్రసిద్ధమైన “హాతింతాయి” కథల్లో రాజకుమార్తె ఏడు సమస్యలిచ్చి వాటిని చెప్పుకోగలిగిన రాజకుమారుణ్నే పెల్లి చేసుకుంటానని ప్రతిజ్ఞపడుతుంది.

శ్రీ బులుసు వేంకటరమణయ్య గారు రచించిన “పదహారు రాత్రులు” అనే అద్భుతకథల్లో - రాజకుమారి తాను విప్పిచెప్పుకో లేని సమస్య ఇవ్వగల సమర్థుణ్నీ ెల్లాడుతానని శపథం చేస్తుంది.

పండిత రంజకమైన “హంసవింశతిొలో హంస ఇచ్చే సమస్యలుకూడా కథారూపకమైనవే.

“వెయ్యి న్నొక్కర్యాతులు” అనే అరేబియన్‌ నైట్సు కథలూ, సోమదేవుని “కథాసరిత్సాగరమూ”, “అన్నదానఫలం” కథా - ఇవన్నీకూడా సమస్యలతో నిండినవే.

పూర్వజన్మవాసనగల ఒక బాహ్మణుడు “అంతకు ఇంత అయితే, ఇంతకు ఎంతో” అని ఒక సమస్య ఇచ్చి అందరనూ జవాబు చెప్పుమంటూవుండేవాడు. ఎవళ్యూ చెప్పుకోలేకపోయారు. చివరకు మరొక బాహ్మడువచ్చి “అయ్యా! కిందటిజన్మలో మీరు గుమ్మిడిపళ్లు దానంచేసిన ఫలితంగా ఈ జన్మలో ధనిక కుటుంబంలో జన్మించారు. ఇప్పుడు మీరు మామూలువికాక బంగారపు గుమ్మిడిపళ్ళూ అవీ దానం చేస్తున్నారు. పూర్వజన్మంలో చేసిన అంతకీ ఇంత ఫలితం అయితే ఈ జన్మలో బంగారపుపళ్లే దానం చేస్తున్నందుకు ముందుజన్మలో మరెంతఫలితం ఉంటుందో అనే ఆశతో ఉన్నారు. అయితే, ఇదివరకు నిష్కామయా చేయడం వల్ల ఇంత ఫలం వచ్చిందికాని - ఇప్పుడు బంగారపుపళ్లు

2322 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దానంచేసినప్పటికీ మీరు ఫలితం ఆశించి చేస్తూవుండటంవల్ల పుణ్యం ఏమీ లేదు అని విప్పి చెప్పాడుట. పూర్వకాలపు ప్రభువులు ఆస్థానాల్లో మహామహులు, హేమాహేమీలు అయినటువంటి బుద్ధిశాలులు ఉండేవారు. వారు సమస్యలు ఇవ్వడంలోనూ, పూరించడంలోనూ, చిక్కులను పెట్టడంలోనూ, విడదీయడంలోనూ కూడా సర్వసమర్థులే. ఈ కోవకు చెందినవాళ్లు కాళిదాసు, తెనాలి రామలింగడు, తిమ్మరుసు, రాజా బీర్బల్‌. పెద్దగీతను చెరపకుండాచిన్నగీతను చేయడంలోనూ, ఏనుగుల పంపకంలోనూ అప్పాజీ ప్రయోగించిన యుక్తులు పిల్లలకు కూడా తెలుసు. భోజరాజు ఆస్థానంలో కాళిదాసు పూరించని సమస్య లేదు; పొందని బహుమానం లేదు. . తెనాలి రామలింగడూ, వీరబల్‌ - వీరిద్దరూ వినోదాలకే కాదు, సమస్యలను, చిక్కులను ఎదుర్కొనడంలోనూ సిద్ధహస్తులే. చంద్రగుప్పుడి కాలంలో నవనందులకి ఒక చిక్కు తటస్థించింది. పర రాజొకడు సింహపు బోనును పంపించి “తలుపు తెరవకుండాసింహాన్ని బయటకు తీయా"లన్నాడు. అప్పుడు బుద్ధి కుశలుడైన చంద్రగుప్తుడు అసలు సంగతి (గ్రహించాడు. ఎరగా కాల్చిన ఇనుపకడ్డీలు తెప్పించి ఆ సింహానికి తగిలించాడు. అది “లక్క సింహంొకావటంచేత నిమిషంలో కరిగిపోయింది. “మల్కిభరాము"డనే చక్రవర్తి ఇచ్చిన సమస్యలలో మచ్చుకి ఒక్కటి : “అంగొ అనే పదంతో అంతమయేమాటలు; . “గుడిలోని అంగి పేరు? - మాతంగి " అడవిలోని అంగిపేరు? - శివంగి తోటలోని అంగి పేరు? - ముల్లంగి జడలోని అంగి పేరు? - సంపంగి - ఇలా. సర్వసిద్ధి సరసులు, రావూరు రసికులు, నెల్లూరు నెజజాణలు - వీరిమధ్య అనేకరకాల సమస్యలు, చిక్కు ప్రశ్నలు, యుక్తిప్రయుక్తులు నడిచేవని వాడుక. (ప్రపంచ-విజేత అలెగ్జాండరు మనదేశం వచ్చినప్పుడు కొంతమంది దిగంబర సన్యాసులకు వేదాంతపరమైన కొన్ని సమస్యలిచ్చాడు. అందులో కొన్ని ఇవి;

సాహిత్యంలో వినోదం. ఎమ్‌. ఎన్‌, శాస్త్రి 2323 నలుగురిలో మన్ననపొంది మంచివా డనిపించుకోవడానికి మార్గం ఏమిటి? మానవుడు దైవత్వం ఎలా పొందగలడు? జీవితమా, మరణమా = విది ఎక్కువ బలీయమైనది? మానవుడు ఎంతవరకు జీవించడం మేలు? ఈజిప్టు దేశంలో స్ఫింక్స్‌ (5001౧00 అని ఒక రాక్షసి. అది ఇచ్చిన సమస్య చెప్పుకుంటే అది తల బద్దలు గొట్టుకొని చస్తుంది. దాని దగ్గర ఉండే అపారమైన ధనం తీసుకోవచ్చు. చెప్పుకోలిని వాళ్ళను అది చంపేసేది. అది వేస్తూ వచ్చిన ప్రశ్న: “పొద్దున్న నాలుగు కాళ్ళతోను, మధ్యాహ్నం రెండు కాళ్ళతోను, రాత్రి మూడు కాళ్ళతోనూ నడిచే జంతువు ఏది?” చట్టచివరకు “ఈడీపన్‌” అనేవాడు దీనికి “మనిషి"అని సమాధానం చెప్పాడు.

శామ్‌సన్‌ అనే వీరుడు “ఫిలిస్టినులకు” సమస్య ఇచ్చినట్టు పాత నిబంధన (గంథం.

సోలోమస్‌ చ[కపర్తికి షేబారాణి అనేక సమస్య లిచ్చినట్టు పాశ్చాత్య [గ్రంథాలు చెబుతున్నాయి. సోలోమన్‌ చకకపర్తి అతి ప్రతిభావంతుడు. ఆయనకూ, టైర్‌ చక్రవర్తి అయిన హీరామ్‌కూ ఒకప్పుడు “సమస్యల” పోటీ పడింది. అందులో సోలోమన్‌ హీరామ్‌ను చిత్తు చేశాడు; అందుకుగాను బోలెడంత ధనం 'గెల్చుకున్నాడు. ఐతే - ఇంతటి ప్రతిభాశాలినీ మళ్ళీ పోటీలో, హీరామ్‌ ఆస్థానంలో ఉండే ఒక చిన్న ఉద్యోగి ఓడగొట్టి ఆ ధనాన్ని తిరుగ తీసెకొన్నాడు! దీనిని ఆనాడు విజ్ఞులు ఒక “వేదాంత జూద” మన్నారు.

ఇక - కవితా విషయం ఎత్తుకుంటే - “దీని భావమేమి తిరుమలేశొ అనే మకుటంతో పిన్న పెద్దలను కలవరపరిచే పొడుపు పద్యాలు మనకు కొల్లలుగా ఉన్నాయి:

“నడవలేని బజ్లె నాల్గు సేరుల పాలు

రేపు మాపు నిచ్చు మేపులేదు

కుడువ దూడలేదు గొల్లబోయండుండు

దీని భావమేమి తిరుమలేశ!

2324 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము చిన్నప్పుడు నేర్చిన ఈ చక్కటి పద్యాలు ఎవరు మరువగలరు? “పొడుపు కథల” విషయం చెప్పనే అక్కరలేదు. సామెతల్లాగే చక్కని మాటల

పొందికతో జాతీయత గుబాళిస్తూ ఎప్పటికప్పుడే కుతూహలాన్ని రేపుతూ

వుంటాయి. “గణికుండు కొనితెచ్చె ఖర్జూర ఫలములు సగపాలు మోహంపు సతికి నిచ్చె” అని ఇలాగ యుక్తిలెక్కలుకూడా పద్యరూపంలోనే ఉండటంచేత కంఠతాపట్టి మరిచిపోకుండా ఉండటానికీ, గణితశాస్త్రంలో పిల్లలకు అభిరుచి కలిగించటానికీ మంచి దోహదము కలిగింది. లెక్కలలోనూ, మాటలలోనూ కూడా (పహేళికలు, వినోదాలు అమరివున్నాయి. ఈనాడు మనం అనుదినమూ పోటీచేస్తున్న స్క్వేర్‌వర్డ్స్‌, కామన్‌ సెన్స్‌ పజిల్పు, వినోద చదరములు - ఇవన్నీ ప్రహేళికల కిందికివస్తాయి. ఎటుకూడినా చెప్పిన మొత్తం రావడం, ఎటువైపు చదివినా ఒకేమాటగా ఉండటం - ఇలాంటివన్నీ కూడా వినోదపద్యరూపంలో ఉండటం గమనించదగినది. “లక్షణోపఏం(ద! కృష్ణ రాయక్షి తీం(ద!” అనే వుకుటంతో కొన్ని వినోదసీసపద్యములు వెలసివున్నాయి. అందులో ఒకటి : =... “ఏనుగు సింహంబు నెలనాగయును గూడి యొక మాటలోపల నుండవలయు.6 బక్షియు వస్త్రంబు6 బాషాణమును గూడి యొకమాటలోపల నుండవలయు ఫణిరాజు ఫణివైరి ఫణి భూషణుండు గూడి యొకమాటలోపల నుండవలయు రారాజు రతిరాజు రాజరాజును గూడి యొకమాటలోపల నుండవలయు దీని యర్ధంబు జప్పంగా ధీనిధులకు . నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను చెప్పునాతండు భావజ్ఞనేఖరుండు " లక్షణోపేంద్ర! కృష్ణరాయ క్షితీంద!

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎన్‌. శాన్త్‌9 2325 సాహిత్యప్రియులైన రాజులకు తమ ఆస్థానకవులను, పండితులను సమస్యలను పూరించమనడం ఒక వేడుకగా ఉండేది. అందుకనే ఈ (శ్రేణికిచెందిన కవిత్వం , ఒకప్పుడు చాలా విరివిగా వ్యాప్తిలో ఉంటూవచ్చింది. సమస్యగా ఇచ్చే పాదం చాలా లోక విడ్డూరంగా ఉంటుంది. దాన్ని పూరించడంలోనే కవి (ప్రజ్ఞ బయట పడుతుంది.

“రంకులు తేం బోయి యేడు రాత్రిల్లాయెన్‌” అనే సమన్య వినగానే విపరీతంగా తోస్తుంది. అయితే కిందివిధంగా కవి పూర్తిచేసిన తరువాత చదివితే మన ఆహ్లాదం అంతింతకాదు ;

“అంకయ వంకయ గూడుక

వంకాయలపాటి తోవ వడిగాం బోవన్‌

ఇంకను రాకుండిరి గో

రంకులు తేం బోయి యేడు రాత్రిళ్ళాయున్‌”

సమస్యల సరదా పూర్వపు రాజులకేకాదు. ఈనాడు మన మెరిగివున్న శ్రీ వ్మికమదేవవర్మ మహారాజులుంగారు కూడా కొన్ని సమస్యలను, యుక్తి లక్కలను సృష్టించడంలో కుతూహలం చూపారు. శ్రీవారి రచనలనుండి రెండు ఉదాహరణలు-

సమస్య: “తలపీసి యఘంబడంగ దానముంబేసెన్‌

“వెలలేని రత్నములు భూ

తలనాథు. డొకండు కంధితటమున భూదే

వుల కెలమిం బట్టల మూ

తలం దీసి యఘంబడంగ దానము. జేసన్‌” వింత లెక్క - ప్రశ్న

*ఒకండు (తిమూర్తుల కొసంగం గొన్ని సుమాలు

గోసి ముంపంగ నొక కొలనునందు

నది యయ్యె 'రెండింత లందు6 గొన్నింటిని

బొమ్మకు నిడి శేషపుష్పములను

2326 పందిరి మత్షికార్టునరావు శతజయంతి వపంపుటము 4: పాహిత్యము దిరుగ నీటను ముంప ద్విగుణంబుం గాంగ టబ హ్మకు విచ్చి నన్నియే హరున కిచ్చి శేషసుమంబుల6 జెజువున ముంపంగా 'రెండింతలయి యవ్వ నృహరి కిడిన పువులతో సరిగాంగ నాపూల లచ్చి కిచ్చి రిక్తహస్తుం డయి యింటికేగె నతండు గోసిన పూలసంఖ్యను వచింప నేడుదినముల గడవు మీ కిచ్చినాండ” దానికి జవాబు “కోసినట్టి పువ్వుల లెక్క వాసి యేడు దానిద్విగుణంబు మజశీయును దాని ద్విగుణ మిట్టులన్నెన్ని ద్విగుణము లన్ననగును సెద్ధమందార, గోపికా చిత్తచోర?” అవధానములలో మిగత పరీక్షలతోపాటు సమస్యాపూరణంకూడా ప్రముఖస్థానం వహించివున్నది. ఈ “సమస్య” లనేవి కేవలం వినోదంకోసమే కాదు. కాకుంటే మరి ఏమిటి? ఆ విశేషాలు వచ్చేసారి. (కిన్నెర: సంపుటము 7, సంచిక క, జనవరి 1955) [| గ 4 / (డవ జ్‌ 2 శ ఇక్‌ భక 5 (1.

ఇల్లీ మధుబాల - సమీక్ష టు. బి. ఆదిలక్ష్మమ్మ, ఎం.ఏ.

'బ్రీనివాసమ్మన శ్రీచక్రమనంగ

పారమ్య మౌనది పద్మాకరమ్ము

వాణీవసంత వీణానాద మనంగ

ఆ పరీసరము (బహ్మానందకరము. అంటూ (బ్రహ్మానందకరమైన మధుబాలా నివాసస్థల వర్ణనతో రసానందాన్ని చేకూర్చే కావ్యాన్ని [పారంభించాండు కవి. |

సాధారణముగా నాయికా నాయకాదుల జననమాదిగా కథను చెప్పడం కావ్యాలన్నిటిలో పరిపాటి. కాని ఒక్క కళాపూర్ణ్జోదయంలోనే “కార్యకారణ పద్ధతి” అవలంబింపబడినదని కట్టమంచివారు ప్రశంసించారు. ఈ విధానంవల్ల పఠితలకు ఉత్కంఠత హెచ్చి పుస్తకము నామూలాగ్రముగా చదివిగాని వదలలేరన్న విషయం వారు తెలియం జేశారు. కవి భీమన్న యీ పద్ధతినే కావ్యాన్ని ప్రారంభించాడు. పరిసర వర్ణనలో లక్ష్మి, సరస్వతి, పార్వతుల యునికిని స్ఫురింపం జేస్తూ ఆ (ప్రదేశం (బబ్రహ్మానందకరం కావడానికి కారణాన్ని చెప్తారు . అచ్చటి నవ్యారామము అద్ధమువలె నున్నదని, దానిలో ఎవరిదో యాదర్శము అందాలు చిందుతుందని మధుబాల ఆదర్శ జీవితాన్ని మనకు నాందిలోనే స్ఫురింపజేస్తాడు. “పరమ సుషుప్తిలో స్వప్నమ్మురీతి, స్వప్నజగత్తులో జాగృతివోలె, జాగృతిలో భావ పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

2328 పండిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము సంచారమట్లు” - రకరకమ్ములుగా ఆ ఆశ్రమం రమణీయమైనదని అనుభవ పూర్వకంగా మనకు ఆలియంజేస్తాండు. అట్టి యాశ్రమంలో “జాలిచూపులు చూసే” సాయం సంధ్యలో “జలజాప్పు వెన్నంటి చనుచున్న రశ్మి రాత్రిని గడుపంగా రమణి రూపమున నేతెంచినవిధాన నెవరొ యా బాల ఏదో వచించు నా పూందీవెతోడ.” అని నాయికయగు మధుబాలను (ప్రవేశపెట్టాండు. అతిగారాబముతో తాను పెంచిన గులావీతీగ ననదేరుకొన్నది. జంటమొగ్గలు వేసింది. అందులో నొకదాని నెవరో (తుంచివేసారు. ఒంటరి మొగ్గను చూడగానే ఆమె హృదయం కళవళించింది. ఆ మొగ్గను పుడికిన హస్త కర్కశత్వాన్ని, తుంచడానికి ప్రోత్సహించిన హృదయ కాఠిన్యాన్ని సహించలేక తనకు సహచరులైన తుమ్మెదలను, పికాలను, వనలక్ష్మిని *మీరైన కరుణగీతము పాడి ఆ హృదయాన్ని కరిగించలేక పోతిరా?” అని ప్రశ్నించింది. ప్రకృతి పుత్రికలందు తానూ ఒకతె కాంబట్టి తీగయందలి పూవు తునిగిపడిపోగానే కలిగిన యావేదనతో, తనప్రయుండు చీంకటి పడినప్పటికి రాకపోవడం అనే మజాక ఆవేదనచేరి ఆమె హృదయంలో విషాద జ్వాలలను విజృంభింపం జేశాయి. విషాదజ్వాలతో వియోగాగ్ని ప్రజ్వరిల్లంది. జంటపువ్వులలో మిగిలిన వువ్వు ప్రియుని బాసి ఒంటరిగానున్న తన స్థితిని జ్ఞప్తికి దెచ్చినది. తక్షణమే దానినీ తుంచి పర్దశాలలోనికి వెల్లిపోయినది. అచ్చట భారతమాత కిరువైపుల లక్షీ సరస్వతుల పటములుండినవి. వానిిమోల నీ పృవ్వునుంచి ఉత్కంఠాపూరితంగా, ఆశాపూర్వకంగా ఇట్లు ప్రార్థించింది. “ఏమమ్మ పరదేవతా మూర్తులార నా సఖు నాకు కన్చరచి, లోకముకు తెలుపుడు వట్టి బొామ్మలము కామంచు”"

మధుబాల: సమీక్ష. బి. ఆదిలక్ష్మమ్మ, ఎం.వ, 2329 ఆ దేవతలు తమ యస్తిత్వమును నిరూపించుకొనిరో అన్నట్లు

“సమ్యక్కృషీయత్న సాధ్యమేకాని

కూర్చున్నచోటికి కోరి రాదెద్ది - కష్టేఫలీ.” అన్న కమోక్తి ఆమెకు అంతరంగమునుండి వినిపించింది. మధుబాల స్థితికి తగినట్లుగా చీంకటివర్జ్షన చేయబడినది. పశ్చిమాశారమ దినమెల్ల విరహవేదనపడి, వలవంతతో నెదురుతెన్నలు చూచి చూచి, చేతికందిన భానునితో గృహాంతర్భాగమును ప్రవేశించినది. పారవశ్యమున ఆమె చిమ్మిన శిరోజావళివలె చీకటి లోకమంతటా వ్యాపించినది. ఆమె తలయందలి చుక్కపూదండలు మింట కోబించినవి.

మధుబాల ఎట్లయిన గౌతముని జాడ తఆలిసికొనవలెనని నిశ్చయించి, ఆవరించియున్న చీకటిని లక్ష్య పెట్టక, అగమ్యములు, అజ్జాతములు అయిన మూగదారులలో ప్రయాణం సాగించింది.

మధుబాల ప్రయుని వెదకికొనుచు పోవునప్పు డామె యెదలో రేగిన భావపరంపరలు (ప్రాచీనాలంకారికులు నిరూపించిన సూక్షా శతి సూక్ష్మ వ్యవస్థలకు లక్ష్యములగుచున్నవి. అట్లని యామె ప్రబంధనాయికావేషము ధరింపలేదు. ఆమె భావములన్నియు ప్రకృతి స్నెిగ్ధములు. పవిత్ర (ప్రేమపాశాబద్ధములు.

ఒకవైపు గౌతముండు కన్చింపండేమోయన్న భయము, వేజొకవైపు (ప్రియాసమాగమమును గూర్చిన నిశ్చయాత్మక హృదయము, ఒకచో ప్రకృతిమాత యందలి భక్తి తత్పరత, వేజొకచో తన వ్య క్రిత్వమునందుగల పూర్ణ విశ్వాసము, ఒక్కయెడ స్త్రీజన సహజమగు బేలతనము, వేజాకయెడ సమయస్ఫురణగల పట్టుదల మధుబాల హృదయరంగమున సంఘర్షణచెంది సమరమొనర్చి సమైక్యమును సిద్ధింపజేసినవి. దీనితో కావ్యమందలి మొదటి ఘట్టము ముగిసినది. ఇందు మధుబాల హృదయంలో రేగి సంచారులైన భావాలు స్థాయీభావమునకు దోహదమిచ్చినవి.

మిత్రుని వెదకుచు మధుబాల ఒక పర్వతగుహను చేరుకున్నది. అలసిపోయి అచ్చట కూర్చున్నది. అప్పుడు సుఖనిదగొను ధరాసుందరి మేన విషమ[గ్రహాదుల

2330 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము. 4: పాహిత్యము ఫీడ్రలేకుండ కరుణతో చందుండు దోమతెర కప్పెనా అన్నట్లు వెన్నెల వనములండు నదులందు ప్రవహించినది. ఆ ప్రవాహపు తరంగావళి వడికి ఆ కువలయేశుండే కొట్టుకొనివచ్చెనా యన్నట్లు డోలాయమానుండును, బాల వయస్కుండును అగు గౌతముండు కనుపించెనంట. చందుని ఈ ఉపమానముతోను, ఈ సందర్భమున వాడిన భావగర్భితములైన పదములవల్లను నాయకుని స్వరూపము మన కనులకు కట్టినట్లయినది. పక్షి పండ్లున్న చెట్టునే పసిగట్టినట్లు, తేటి పూవున్న తీగెకే పోవునట్లు ప్రేమకోసమై పయనించు (కేమజీవులను గేమమే అన్వేషించుకొనుచు వచ్చి చేరునని ఈ కవి సిద్ధాంతము. మధుబాల మనఃఫలకమునందున్న గౌతముని స్వరూప మూహావ్యవస్థను దాటి సహజరూపమున సాక్షాత్కరించినదట. ధ్యేయమైన వస్తువు నారాధించి, దానికై జీవిత సర్వస్వమును ధారబోయ నిశ్చయించు కొన్నప్పు డది ప్రత్యక్ష మైతీరవలసినదే! అప్పటి గౌతముని స్ధితిని కవి సమాధిస్థుండౌ ఒక యోగితో పోల్చినాండు. “వస్తుకాల జ్ఞాననాస్తికుండతండు. పరమార్థనిర్మాణపరుండైన శిల్పి” అంటాడు. నిల్చి భావప్రపంచములో నున్నప్పుడు బాహ్యప్రపంచానికి సంబంధించిన వస్తు కాలపరిజ్ఞానము లేకుండుట సహజమేకదా. ఇక్కడి శిల్పి పరమార్థ నిర్మాణ తత్పరుండు. దీనినిబట్టే అతండేదో మహోద్యమమునుగూర్చి యోజించుచున్నాం డను ధ్వనికూడ కలదు. అతనిని చూచిన మధుబాల కాస్వరూపమతని ఆత్మ యేనేమో యను నాశంక కలిగినది. సత్యాన్వేషణలో అనుమానము ప్రథమ సోపానముకదా. మధుబాల ధైర్యమును చిక్కబట్టి తన పాణిపల్లవము నతని భుజముఫై వైచినది. అప్పుడాతండు భావలతా పరంపరల్‌ ఆగి అంతరాళ సౌధములు కూలగా చింతామహోదగ్ర శిఖరాలనుండి పడి, తల్విగొని, ఉలికిపడిలేచి కొంతసేపటి కావేగము అణగిపోగా ఎదుటనున్న మధుబాలను కేలిచ్చి ఆసీనను చేసినాడు. మాట్లాడుట కెవరికీ, ఏమీ తోచలేదు. నిశ్శబ్దముగా నొక నిమేషము గడిచినది. సమశక్తిగల అయస్కాంత యుగ్మకమువోలె వారిస్థితి యుండెనట. ఇప్పట్టునంగల

మధుబాల: సమీక్ష బి. ఆదిలక్షృమ్మ, ఎం.వి, 2331 నూతన వైజ్ఞానిక సిద్ధాంత (కమవివరణ గమనింపదగినది. గౌతముని మనస్సును ఇంత సూక్ష్మముగా వర్ణించుటలో కవికింగల అనుభవజ్ఞత విశదమగుచున్నది.

ఇటువంటిదే ఇంకొక సన్నివేశము. విరక్తిమాటలు పలుకు గౌతముణ్ణి రాగోన్ముఖునిగా చేయుటకు మధుబాల యత్నించు సందర్భమున కవి “పేమించువారలు (పేమించరేని హృదయమొందెడిబాధ కెక్కడి దవధి” అన్న లోకసత్యాన్ని ఉగ్గడిస్తాడు. చిన్నప్పుడే తలిదండ్రులకు దూరమై ఒంటరిగా వనములో (బతుకుచున్న మధుబాలకు గౌతము డుద్ధరించువానిపలె కనిపించాండు. రుంర్లూ విభగ్నమై జలరాశినడుమ తల్లినాక మునుంగగా తల్లడమందు సుకుమారి మధుబాల. ఆమెకు గౌతము6 డొక యానికవలె చేతికందినాండు. తద్వారా ఆమె గట్టెక్కుదమనుకున్నది. అయ్యో! అదియు సముద్రపుటలలలో లీనమైపోవునేమో యని ఆమెబాధ.

“సృష్టి నెన్విధినైన జీవనమ్మునకు

ఆధారమును బట్టి ఆకార మడరు

ఏరీతిగా నిరాధార జీవనము

నేనని అంతరాళాన నిల్బ్చెడును" అని దుఃఖీస్తుంది.

ఇప్పుడు కవి నాయిక హృదయమును *“ఆకటి కంటితో నవకాశవీథులెల్లను గాలించి" తుదకు ఫలభరితమైన కేదారము నాశ్రయించిన బాలశుకితో పోల్చి, గౌతముని వైరాగ్యపు మాటలు గోదావరీ లంకలలో శీతల ప్రభాతములలో, చేలగట్లను, కాపుబాలుడు త్రిప్పు ఒరిసెలరాలై ఆమె హృచ్చు కమును బాధపెట్టినవని వర్ణించును. అక్కడి యీ విమర్శను చూడండి.

“క్షే తపాలకు. డొరిసెలం గొనివైచి

హృదయమ్ము. జించిన నెవ్వరు దిక్కు

ఒరిసెలపని యేమిటుండుగాకున్న?

విచ్చలవిడిగాగ విడుచునా పాలము?”

2332 పందిరి మక్ష్‌కార్టునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్కము “ఆకలి పుట్టించి, అన్నమ్ము చూపి ఒరిసెల గట్టించి యుంచెనా దరినె . ఎవ్యండో యీ సృష్టినెల్లను జేయు వాండర్భకుండొ, పెచ్చివాండొ, రక్కసుండొ?” ఒరిసెల బాధపడిన చిలుక యీ మాటల ననుకొనెనో లేడో గాని కవి మాతము ఈ సందర్భమున సృష్టివైచిత్యుమును వ్య క్తీకరించి యున్నాండు. సాధారణముగా కవులకు స్థానికాభిమాన ముండుట సహజము. నన్నయవంటి మహాకవియే తన స్వస్థలమగు వేంగి దేశమును, రాజమహేండడ్రవరమును వర్ణించియున్నాండు. మన కవియు తన జన్మస్థలమగు గోదావరి లంకలయండలి దృశ్యము నొకదానిని ఇక్కడ వర్జంచినాడు. ఈ [పకరణవున౦ందు నాయికా నాయకుల పరస్పరాభ్మిపాయము లేకముఖముగా ధ్వనింపనందున - అఆపగశ్రుతియని సార్థకముగా పేరుపెట్టబడినది. కర్తవ్యమునకు, కరుణకు పొందడు కుడురుట కష్టము. కవి “కర్తవ్యమున లేదు కరుణకు. దావు స్వార్థమ్మునకు (ప్రేమ శత్రువే యగును" అని తన యనుభవమును వెల్లడించినాండు. మూండవ ప్రకరణము సంశకోధన - గౌతముండు మధుబాల నిర్మలహృదయ మిట్లు మారిపోవుటకు తానే కారకుండనని “మానవ స్నేహ వాసన నిను మార్చి వేసనో చెలువ?” “బంగారమౌ నీ స్వభావమ్ము నేను పాదరసమ్మునై పాడొనర్చితినే?” “భువనమోహన గీతము నాలపించు పక్షిరాజమునకు పరభాషనేర్పి ఊదివైచితి నుపజ్జా దీపకళిక.” “అనుకొన్న దొక్కటి ఐన దింకొకటి అని విచారించును. గొప్పవారి స్వభావ మిట్టిదే కదా! ఆమెతో తాను సఖ్యము చేసికొనుటకు గల కారణమునుగూడ చెప్పును. “దివ్య సాందర్యము దిక్కుమాలినదిగా” అడవినిగాచిన వెన్నెల యగు నేమో యని చింతించి, “యోగ్యమౌ రీతి నామెను లోకమునకు” చేకూర్చుటకై అవసరధర్మ విద్యా విశషముల నిధినిగా చేసితినని, కావున ఒక లతనెట్లయితే ఆమె ప్రేమిస్తుందో ఆరీతినే తన్నుగూడ చూడవలసినదని వేడుకుంటాండు. “వసంతము వచ్చువచ్చునంచెంతో వేచియుండియుూుే “వచ్చిన వెడలిపోకుండ దాంచుకోలేని వ్యర్థ (ప్రపంచ మిది

మధుబాల: సమీక్ష బి. ఆదిలక్ష్యమ్మ, ఎం.వి, 2333 అని సంయోగ వియోగాలు, కష్టసుఖాలు మన చేతిలోనివి కావని, కాలచ(కము నడ్డగలుగువా రెవరని చెపు గౌతముండు వెల్లిపోవుటకు ప్రయత్నించాడు. అప్పుడు మధుబాల “విధివిలాసమున ఒక గుత్తిపూలమై వికసించాము. విడివిడిగా ఎందుకు రాలి పడవలను? జంటగా భువనమాధురులల్ల ననుభవించి కాలము వచ్చినప్పుడు రాలిపోవుదొ మన్నది. “నను నీవు లోకమునకు చేకూర్చు పనిలేదు. నీవేనా లోకము. ఈ వనసీమకు చ[క్రపర్తివై నన్నాదరింపు” మన్నది.

దానికి గౌతముండిచ్చు సమాధానము - “ఆదర్శమునకు, అనుభవమునకు గల ఛేదమే నీకును నాకును గలొదని. జగము నిశితకంటకషుయమని] మధుబాలవంటి సుకుమారి అట్టి తాకుళ్ల కోర్యజాలదని, తన్ను పూర్తిగా మరచిపోవలసినదని, “స్మరణమ్ము బెంగ కాశయమిచ్చు నెప్పుడు" అది విరుగుడులేని విషమని, సౌఖ్యమును నాశమొనర్చునని ఆమెకు లోకప్రవృత్తిని వెల్లడించును.

“ఒకపూవు ముకుళించె నొకతార రాల

ననుకొని నీ శకుంతాది మిత్రముల గలసి" పూర్వపురీతి స్వేచ్భాజీవితము గడుపుమని యామె నాదేశించి వెళ్ళి పోంబోవును. మధుబాల ఆశ్రయమువీడిన తీగవల నేలబడి మూర్శిల్లినది. గౌతముండా కరుణామూర్తి నోదార్చి, ఉప్పొంగి వచ్చు తన దుఃఖమున నామె దుఃఖము బాపినాండు. ఇప్పటి కాతని మనసు పూర్తిగ కరిగినది. అప్పుడు

“కర్తవ్యమును మించి కరుణ గొప్పదిర

కరుణనుమించి లోకములేదు గదర! అని [పాంతమందలి వెదురుగుట్టలో పవమానుండు పాడినాడని కవి గానము చేసినాండు. పాతల సంభాషణల వమూలముగనే నాయికా నాయకుల హృదయాంతరాళములలో దాగియున్న భావములను శోధించి ప్రకాశమాన మొనర్చిన కారణముననీ (ప్రకరణమునకు సంశోధన యను పేరు సమంజసముగ నున్నదనవచ్చును.

మధుబాల మూర్చనుండి ఆప్పరిల్లిన తర్వాత గౌతముడు తన జీవితవాహిని జీవనాధిపుని సంగమింప6ంగబోవుచు జటిలమార్గములో పొందే అవస్థలలో

2334 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము తుదిమలుపు ఆమెతోడి చెలిమియేనని, శాంతి చేకూరినను సముద్రముచేరి జీవితమోక్షము నందుట దాని కర్తవ్యముకాన తాను ఆమెను వీడి వెల్లితరవలెనని చెప్పును.

“మనుజులు కారు కావున వనప్రియ సఖాళినిన్‌ పొమ్మన కాదరించెదొరని, ఈర్ష్యాదిభావములు మానవులను పట్టి గుంజునే కాని ప్రణయరూపిణియెన ప్రకృతిదేవతకు స్వపరభేదము లేదని ప్రకృతిలోని పరమధర్మమును ఇక్కడ ఎలుగెత్తి చాటినాం డీ కవికోకిలము.

మధుబాల అతనిని అంతకూ వదలక “కల్పాంతమందైనను మన కెడబాటు కలుగుటకు వీలులోదని, అతని సమస్యకు రెండే పరిష్కారమార్గములు కలవనినది _ ఈ వనసీమలోన అతడుండి పోవుట లేదా అతనితో నామెనుగూడ తీసికొని వెళ్లుట. మూడవమాట లేదనినది.

ఈ ప్రకరణమున కవి సంభాషణలను రసవంతముగా నాటకీయముగా సంతరించుటయేగాక - మధుబాల ఆశ నొకవైపు, గౌతముని నిరాశను మజొకవైపు తులదూచి చర్చలుసాగించి, చివరకు ఆశవైపే మొగ్గు చూపినాండు. _పైంగా ఇచ్చటి కవి నిసర్గ కవితా మాధురితో ఆతని విషయపరిజ్ఞానము, విమర్శ సమ్మిళితములై మనోహరత నాపాదిస్తున్నవి.

సమరకేళి యను నాల్గవ (పకరణములో గౌతముండు తన కథనంతటిని మధుబాలతో చెప్పి తనతోవచ్చుట అపాయకరమని ఆమెకు తెలియంజెప్పును.

“అనురాగమును ప్రణయము నెందుంబోవు?

బతుకుతర్వున కవి బాధ కారాదు అని (ప్రారంభించి మాతృదేశపు సేవలో తన తలిదండ్రులు శిక్షితులైరని తన తండ్రి గాథను వీరరసము పొంగి పొరలునట్లుగా వర్ణించును. ఆయన అభిమన్యునివలె గర్భమందున్నప్పుడే వీరగాథలను వినెనట. శివాజీకివలెనే అతనికి అతని తల్లి వీరరసమును ఉగ్గుబాలతో రంగరించి పట్టినదట. “నూనూగు మీసాల నూత్న యౌవనమున బాలచంద్రుని గాథయు, రూంసీసతీ వీరరుంకారమును అతని పారుషలక్ష్మికి పదునుబెట్టినవట. అతండు మాతృదేశమును దాస్యపంకమునుండి దరికెత్త ప్రయత్నించి, నిరంకుశ పరిపాలనా దురితాగ్నుల నాలుకలలో

మధుబాల: సమీక్ష. బి. ఆదిలక్ష్యమ్మ. ఎం.ఎ, . 2335 కూలిపోయనటి. అతనివెంటనే గౌతముని తల్లియు, చిన్నతమ్ముండును, చెల్లెలును స్వర్గమును జేరిరట. ఇట్లాతని “పూర్ణ కుటుంబ కాసారము* పూడిపోంగా చదువుకొక నమస్కారముచేసి ఏకాకిగా లోకాన బడినాండట. ఈ సందర్భమున ఆనాండు బుద్ధునికెట్లయితే వేదాంత చర్చలు రుచించలేదో గౌతమునికి గూడ “ఆలయమ్ముల విగ్రహమ్ముల మాడ్కి ఫలశూన్య మైన మిథ్యాపపంచ వాదములు" రుచించలేదు. అంతట నతండు వ్యర్థ వైరాగ్య మిథ్యాధర్మ సేవ చాలించి -

“మాతృ భారతదేశ మహితపాదార

వింద సేవాసుధానంద మాధురుల” ను [గోలడానికి ప్రయాణమైనాండు. సేవాగ్రామమందు గాంధీమవాత్ముని ఆదరాభిమానములకు పాతుండై పగరకు వెన్నుచూపక పోరాడి చీరాల, బార్డోలి, చెన్నపట్టణము మొదలైన ఉద్యమాలలో “లాటికి శిరము, తూటాకు రొమ్ము”ను మోపి (బతుకెల్ల పైలున కంకితము చేసినాండు.

అహింసా కార్యక్రమము అపజయము పొందగా సాయుధ పోరాటంలో పాల్గొాంటాండు గౌతముండు. ఒక గుహలో స్వాతంత్య్య మసైన్యమునుకూర్చి కస్తూరిమాతను, గాంధీమహాత్ముని కారాగారవిముక్తుల గావింప యత్నిస్తాండు. అప్పటి అతని అనుభవాలు లోకపుతీరును సువ్య క్తపరుస్తాయి. “ప్రజలు గొజ్జెలవంటివారు; తమంత మిత్ర, శత్రు విభేద మెంచుకోలేరు; స్వార్థపరాయణ స్వాముల నమ్మి తమ సంకెలలు తామె తగిలించుకొందు.”

కొందటు [ద్రోహులు స్వార్థంకోసం శత్రువాగురులలో గౌతముని, అతని స్నేహితులను పడదోస్తారు. కాపలా భటులను గమ్మత్తుచేసి మారువేషము దాల్చి వైలునుండి గౌతముండు పారివచ్చి మధుబాల ఉండే అడవిని ప్రవేశించాండు. కథంతా చెప్పి గొప్పవారితో చేరిన సామాన్యులకు గౌరవ మబ్బినల్లే తన యాశ్రయ మామెకు కష్టములను దెచ్చిపెట్టునని తెలియజేయును.

మధుబాల అతని పొరుషమునకు మెచ్చుకొని తన తండ్రి కూడ అంతటివాడే యని, ఎంతటి కష్టమువచ్చినను తా నాతని వదలదను దృఢనిశృ్చ్వయమును వ్య క్త్రపరచును. ఆమెను వదలి వళ్లుటకు గౌతమునకును కాల్లాడలేడు. మధుబాల “రత్నాకరుని గోరు రత్నమెంత్రైన లోతులు తలపోసి భీతినందెడునె” అని చెప్పి

2336 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము. 4: పాహిత్యము తన జీవితమునకు తానె బాధ్యురాల నగుదునని తన కుటీరము నొకసారి చూచి ప్రయాణము సాగింతమని అతనికి సలహానిచ్చినది.

అంత వా రిరువురు మౌనముగా మనమై వచ్చి “భూమాత ప్రక్కలో పురిటిమంచమున ఊకొట్టుచున్న ఉద్యానవనమునుచేరి అందలి పుషృగ్భృహమును (ప్రవేశించి భారతాంబ పటమును భక్తితో తీసి తన కనులకద్దుకొని మధుబాల అచ్చటి తన సఖులను వీడ్కోలివ్వ వేడుకొనును. అప్పటి మధుబాల మాటలు ఫీడ్రిత మానవ సంఘానికి, పీడించు, అధికారవర్గమునకు కూడ అన్వయమగునట్టివి.

“నా స్వార్ధపరతలో మీ స్యాదుజీవ

నారామములు శ్మశానము లయ్యె నకట."

“మీ స్వారాజ్యమ్మును మీ రేలుకొనుండు అను మధుబాల మాటలు భారతీయులకు స్వాతంత3్యమునిచ్చి ఇంగ్ల్గండునకు వెళ్ళిపోము ఆంగ్లపాలకవర్గమును జ్ఞప్తికి6 దెచ్చుచున్నవి.

ఆ వనమందలి “చిరకాల పరిచయ స్నేహపాశములు" ఆమెకు బాధను కలిగించినవి. “చేయాడకున్నది సెలవు గైకొనంగ అడుగాడకున్నది విడనాడి పోవ" అని అనుచు ఆ వనమును వదలి గౌతమునివెంట పయనమైనది.

“పరమేశ్వరునకును ప్రకృతిదేవతకు.

మధ్యనిల్చిన మాయమర్మ్శ్మమో" అన్నట్లు చంద్రబింబమునకు, సఖులకు మధ్య తరులతాదికము దట్టముగా వ్యాపించి ఉండినదట. అడ్డమువచ్చిన సెలయేటి నీది ఇంతవరకెరుగని క్రొత్త దారులలో తమ నీడయే తమ్ము తడంబాటు పరుపగా వెనుకముందులకు వంతెనలను గట్టుకొనుచు ఒక రసాలపు కొమ్మ మై వారు ఉపవిష్టులైనారు. కొంతసే పట్లు విశ్రమించి “మూర్జుని మానసము” వలెనున్నఅడవిలో “పాక్తన పుణ్యసంపద”*

వలె నొక మిణుగురు తోవ చూపగా, వారు ఎండు డొంకలకు నిప్పంటించి వానిచుట్టు గుమిగూడి గంతులువేయు కోయ గూడెములను చూచి కొజవిదయ్యములేమో అని భయపడిరట. పొదలలో మెరసెడి పులికండ్లుచూచి

మధుబాల: సమీక్ష బి. ఆదిలక్ష్మమ్మ, ఎం.వి. 2337 వేజ్యుతోవలబట్టిరట. ఇచ్చట అడవి వర్ణన కొంతవరకు ప్రబంధములందలి దానిని బోలియున్నదనవచ్చును.

ఒక మజ్ఞిచెట్టుకింద మంచెలపై నిదురించు పోలీసువారిని చూచి గౌతముండు భయపడి మధుబాల నెత్తికొని మారుదారిని నడక సాగించినాండు. అప్పటి ప్రభాత వర్ణన కథాసందర్భృమునకు చక్కగా నతికినట్లున్నది. (శవుజీవులకు శుభస్వాగతమ్మొసగు ప్రభాతము కాగానే

“డూకిన రవితోడ గూకిన యతని -

హృదయమ్ము పొడిచిన ్రొద్దుతో బొడిచినదట” ప్రభాత వర్ణన కొంతదీర్ణముగా, సాంప్రదాయసిద్ధముగా చేయంబడినది.

“నాతోవచ్చిన సుఖమనుభవించితివా?” అని గౌతముండు, “నీ స్వేచ్భకు నే నడ్డమైనాననొ మధుబాల కొంత చర్చించుకొందురు.

ఈ సంభాషణలు రసవత్తరములు. షూతృదేవి పదార్చనమునకై ఒక కార్యమును కల్పించి దానిని ఇర్వురము నిర్వహింతమని తీర్మానించుకొంటారు. “తారాపథమ్మున తావు లేదేని మాతృగర్భములేదె మనల నోదార్చ” అని తృప్తిపడతారు. ప్రస్థాన మను నీ పంచమప్రకరణంలో నాయికానాయకుల ప్రయాణం వర్దితమైనది. అజ్ఞాతమగు వనమునుండి గొప్ప ఆదర్శంతో, లోకపు వెలుగునకు రావడానికి ముందుకలిగే మానసిక అనుభవా లీ ప్రకరణంలో వ్య క్తీకరింపం బడ్డాయి.

పరమావధి అనే తుది (ప్రకరణములో నాయికా నాయకులు ఆండుకొండల నడుము ప్రవహించే సెలయేటిని ఈది దగ్గరనున్న ఒక కోయగూడెము చేరుకుందామని బయలుదేరుతారు. అక్కడ మార్గమధ్యంలో ఒక చెట్టున స్వర్ణసూత్ర సంబద్ధ మాంగల్యం (వ్రేలాడుతూ - వారికి కనిపించింది. ఆ సూత్రం వారిద్దరిని ఒక సూత్రాన జోడించినది. ఈ (ప్రకరణంలో కవి చక్కని అనుభవ పూర్వకములైన మాటలను సూక్తులవలె చెప్తాండు. భూతకాలపు లోతుల నెంత పంకమున్నను పైకి పద్మాలు పూస్తాయట. “ఆనందమునకు పునాది దుఃఖమొకొ అని ప్రశ్నిస్తాండు. “కారణమొక్కటి కార్యముల్‌ వేరు” అని పూరింటి బంతిమొక్క వికసించడాన్ని కల్పతరువగు పారిజాతం వూయడాన్ని వివరిస్తాడు.

2338 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

ఇంతలో వారల కొక వృద్ధమునీందుండు గోచరిస్తాడు. నమస్కరించినవారల నాశీర్వదించి రెండుపూలనెత్తి వారికిచ్చి తన దారిన పోసాగినాండు. మధుబాలా గౌతములు అతనిననుసరించి ఒక పర్వత గుహను చేరుకుంటారు. అది యొక కళలామంటపము. దానిలో గల చిత్రములు సజీవములు. తద్వర్దనలో కవి ఆంగ్లకవియగు కీట్సుతో “ఎం806 *₹%%, ౧౫ 5 86409” అన్న సిద్ధాంతమున నేకీభవిస్తాడు. శిల్పమును గూర్చి, చిత్రకళను గూర్చి తనకుంగల యభ్మిప్రాయమును వెలిబుచ్చుతాడు. “మహినెల్ల నొక యిక్షు మధురఖండముగ కళగాక చేకూర్చంగలదేది లేదు”

ఆ కళామందిరములో కళాదేవత పాదముల(మోల పరమేష్టివోలె మునీంద్రుం డాసీనుండై యుండెను. అతనిముఖాన్ని నవ శరత్కాలంతో పోలుస్తాడు కవి. బోసినోటను బుట్టు హాసప్రభాసములు చందికయట. తెల్లమీసాల మేఘాలు గడ్డపు వెండి కొండలను (పకాశింపజేసినవట. ఈ వర్జనాధోరణి మన ప్రాచీన కవులను స్మరణకు దెచ్చునది. గంభీరనిస్వనంతో ఆ గురుదేవుండు

“పృథ్వి నేదియులేదు (ప్రేమను మీజి

ఆరాధనమె (పేమ కతి సూటి దారి” అని, “అద్వైతసిద్ధి తుదిమోక్షమునకు తొలిమెట్ట”ని.

“పరమేశుండొక మహాపార నీరనిధి

(పకృతి యనేక నిర్షరిణీ స్వరూప,

రూపభేద మ్మింత రుచిభేద మింత

సమసిన నొక్కటే శక్తిగా మిగులు” అని వారికి తెలియజెప్పి “సర్వమానవ సమాజము మధుమాసముగ జేసి నీనామమును సార్థకము జేసెకొనుమని మధుబాలను నూత్న సమాజ నిర్మాణమునకు కర్త కావలయునని, గౌతముండని పేరిడిన నీ పితరుల యాశయము నెరవేర్పుమని

మధుబాల: సమీక్ష బి. ఆదిలక్ష్మమ్మ, ఎం.వి, 2339 గౌతముణ్ణి ఆదేశించి, నేంటి సమాజ దౌర్భాగ్యస్థితికి కారణములు పరపీడనము, పారతంత్యూము, దారిద్యూములని, దీనికంతటికీ మందు “సర్వోదయ సంస్థాపన"మని చెప్పి తన [ప్రాణములను వదులును. “దారముతెగిన రాట్నమువల” ఆత్మ పరమాత్మయందైక్యము కాంగానే తనువువ్యర్థ మైనది. ఏమియు తోచక నిర్విణ్ణురాలైయున్న మధుబాలకు గౌతముండు మునీంద్రుండు పరమపదించినాండని తెలియచేసి -

“చీకటి తెర జింపు సిద్ధి నీకున్న

ఈశ్వర తేజంబు వీక్షింపంగల” వని, మానవజీవిత చరిత్రలోన త్రిప్పినపుట మజిత్రిప్పగాలేమని యామె

“.. కుద్చోధించును. ఆ గుహయందాయుధములు సమకూర్చబడి యుండుటనుజూచి

“పజలంద రక్కర పడి కోరరేని ఆయుధమ్ములు ఆచ్చునా స్వరాజ్యమ్ము" అన్న యథార్థమును వాకుచ్చును.

అంతట వారా గురుదేవున కంత్య[కియలుచేసి స్వారాజ్య మొక్కట సాధించుకొజకు వూనవలోకమును (పవేశించిరి. వారి (పవేశంతో నవభారతాభ్యుదయభానుండు ఉదయమయ్యాండు. ఇంతటితో ఈ చిన్న కావ్యం ముగిసినది.

భావాలలోను, భాషలోను, కథావస్తువులోను, గమనికలోను కొత్తప్రాతల మేలికలయికల కొమ్మాజుగులు తురంగలించేటట్లుగా సంతరించిన ఈ కావ్యంలో ఛందస్సం[ప్రదాయాలు ఎలా సమన్వయింపబడ్డాయో చూడండి. ఇటీవల ఒక కవిశేఖరుండు చెప్పినట్లు

“బహుపాశబద్ధమై పరువు గోల్పడిన; నాల్గుపాదముల నడక నాకేల” అని మనకవి మంజరీద్విపదలమీద మధుుబాలను నడిపించాండు. మనిషికి సహజమైన నడక రెండు పాదములతోనేకదా! కావ్యంలో ఒక్కొక్కచోట భావాన్ని నాలుగు పాదములలో ఇమడ్చడము కూడ కలదు.

2340 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “తెరపిలేకుండంగ తిరిగెడు విశ్వ రాట్నాన జీవసూత్ర మ్మేల తెగును? ఒక మేకు ముగిసిన, నొక యేకుంబట్టి విరతి నెరుంగని విధి సాంగిపోవు. ఈ కావ్యంలో ప్రధానముగా మధుబాలా గౌతములే అంతటా కనిపిస్తారు. ఇద్దజూ నడుస్తున్నప్పుడు నాలుగు పాదా లుండడము న్యాయమే. మంజరులలో [పప్రాసయతిని పాటించకూడదని ప్రాచీన సంప్రదాయం. “శ్రీమందిరాకారు, జితదైత్య ధీరు గీర్తించుచో6 బుణ్యవర్తనుం డంచు నిట్టుల [పాసంబు లిడగరాదు | అని అనంతుండు ఐదు శతాబ్దాల్మకిందట అనుశాసించాండు. కవితా స్వాతంత్యా్యానికి కంకణంగట్టిన యీ రోజుల్లో కాలానుగుణ్యంగా (ప్రాసయతిని పాటించడం సమర్థనీయమే అవుతుంది. పైగా ప్రాచీన జాతీయకవిమైన పాల్కురికి సోమనాథుండు ధారాళంగా [పప్రాసయతులను ద్విపదలలోనే వాడినాండు, పండైండవ శతాబ్చినాండే. నవీన జూతీయకవి భీమన ఇరువదియవ శతాబ్దిలో దీనిని వాడి ఈ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపంజేసినాండు. “వస్తు కాలజ్ఞాన నాస్తికుండతండు" “వేరు చేసితినేని ఘైరింపు మింత” “వట్టి బాధలు తెచ్చిపెట్టుకోనేల” “*పారము ముట్టంగా నేరదు (శేమ” “విడనాడిపోవ నాయడు గెట్లు పడును?” ఇట్టి వెన్నియేని ప్రాసయతి కుదాహరణముగా లభ్యమగును. మహోన్నతములైన భావాలను మనస్సుకు తట్టేటట్లు చేసేది మంజరి యనవచ్చును. ఆ భావాలు రెండేసి పాదాలలో చక్కగా పొందుపడి సూక్తుల్లాగ

మధుబాల: సమీక్ష వి. ఆదిలక్ష్యమృ్మ, ఎం.వి 2341 తయారౌతవి. అట్టి అవకాశాన్ని “మధుబాల” కవి సంపూర్ణంగా వినియోగించు కున్నాండు. “నిశ్చలోపాసనాన్వితమైన (ప్రేమ లోంగొనలేనిది లోకాన లేదు” “భావము గాఢమై వాస్తవమౌను ఆధారమౌ దేనికైన తపస్సు” “చంద్రమానునితోడ సఖ్యమ్ము నెజపి ఆరాటపడనేల నమవసరాగ?” “వట్టి మాటలతోడ వలపులతోడ వెలలేని కాలము వృథంబేయనేల?” “అనుకొన్నదొక్కటి, ఐన దింకొకటి కాలగర్భపు లోంతు కనుగొను టెట్లు?” “స్వార్థపరాయణ స్వాముల నమ్మి తమ సంకెలలు తామె తగిలించుకొందు" “న్వాతంత్య్యముం గోరి సంగ్రామసీమ చావు మంచిది సేవకావృత్తికన్న” “పాలించు నేండొక్క స్వార్ధమే జగము స్వచ్చమౌ (శేమకు స్థానమే లేదు.” “ఆత్మీయములలోన నమితప్రియమ్ము మధురాతిమధురము మాతృగృహమ్ము" _ ఇట్టి సూక్తిశుక్తిజములను కవి తన కావ్యహారంలో ఎన్నైనా పాదిగించాండు. కావ్యం చదివేకొద్దీ ఛందశ్ణృంఖలాలకు కవి బద్ధుండు కాలేదని, అతనికే ఛందస్సు చెప్పుచేతలలో మెలగుతుందనే భావం కలుగుతుంది.

2342 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. పంప్పుటము. 4: సాహిత్యము

మంజరీ ద్విపద పదసాహిత్యంలో చేరినది కాబట్టి పాడుకోడాని కనుకూలంగా నుండే ఈ కృతి 'గేయసాహిత్యంలో కూడ విశిష్టస్థానం గడించుకుంటుంది.

ఇందలి తలి అడుగడుగునకును, తెనుగుదనమును, జాతీయమును ధ్వనింపంజేయుచు స్వచ్భమైన సెలయేటి గమనము ననుకరించునదై యున్నది. కొందజు కవుల రచనలవలె కేవల మయోమయమును, దుర్గ్రాహ్యమును గాక ఇందలి రచన మృదువై, దేశీయమై, మధురమై, సుగ్రాహ్యమై యున్నది. జానపదుని అమాయక హృదయమువల ఇందలి రచనయు నిర్మలమై నిసర్గనిశితమై యున్నది. ఇందలి పదముల కూర్పునం దొక ప్రత్యేక విశిష్టత, స్వతం[త్రత గోచరించుచున్నవి. ఇందు ఇతరుల అనుసరణము లెక్కువ కానరావు. కవి ప్రతిభా విశేషమును వెల్లడించు నీ[కింది భావబంధురములగు పదముల కూర్పు పై విషయమును నిర్ధరింపంగలదు.

“కరుణకు లంగరువేయుట”

“పాణమంతయు కంటిపాపలో నిల్చి”

“అవకాశ వీథులనెల్ల గాలించుట”

“ముసుగొత్తిగిలుట”

“పారతంతృ్యుపు పాముపడగలు”

“అదృష్టదేవత జాడ కనిపెట్టి వెన్నంటు గడుసరులు

“కొలబద్ద చదువు” ,

“పాలుపట్టని లేత పైరు” కేవల శబ్బసౌందర్యము కోసము నిస్సార నిరర్ధకపదజాలాన్ని నింపిన రచనామార్గాన్ని

తోసిపుచ్చి, సహజములు, సరళములు, జాతీయములు నైన పదములకూర్చుతో

కవితను దిద్ది తీర్చడానికి మధుబాల దివ్యమైన వెలుగుబాట.

ఇందలి అలంకారములనుగూర్చి యించుక ప్రశంస. “ఎరువు సొమ్ము బరువుచేటు” అన్నట్లుగా మధుబాలయందలి అలంకారములు ప్రబంధపు టంగడినుండి కొని తెచ్చి పెట్టినవిగాక సహజమై అప్రయత్నముగా వెలువడినవి.

మధుబాల: సమీక్ష బి. ఆదిలక్ష్యమ్య, ఎం.వి, 2343

“ఉపమా కాళిదాసస్య” అన్న ప్రఖ్యాతి అందజికి తెలిసినదే. సరియైన ఉపమానాలను వాడడం కవియొక్క ప్రజ్యేకతకు తార్కాణము. రూఫకము,. కావ్యలింగాది అలంకారములను ఇందు గాననగును. అవి కథాగమనములో సమన్వయము జెందినవి గాని ప్రయత్న పూర్వకముగా కేవల అలంకారమాత్రములు కావు.

“కుసుమగంధము పీల్చి గుణ్థిడుచున్న

కొండదేవతప్రక్క” మధుబాల అలసికూర్చున్నది.

“పూడిపోయినది మా కుటుంబ కాసారము

“గాఢప్రళయరాత్రి గర్భమ్మునుండి

వెల్వడు నూతన విశ్వమ్ము వోలె

రమణీయమై ప్రభాతము వచ్చెనంత

శ్రమజీవులకు శుభస్వాగతమ్మీయా”

“పకృతిసిద్ధములైన ఫలధాన్యములను -

ఆహారముగంజేసి యమరుచున్నట్టి

పచనకారుని వోలె రచనకారుండును

వెలయించుచుండును కళగా (ప్రకృతిని” వృద్ధయోగి గాత్రము క్రొత్త “ఖాదీ దారో మట్టు లున్నదంట,.

ఇట్టి యలంకారములను ఎన్నియని యెన్ని చూపంగలము!

ఉదాత్తమైన ఈ కృతిలో దోకమైక దృక్కు లైన లాక్షణికులకు శబ్బగతములగు నెరసులు కనంబడకపోవు. అవి కవిస్వతం(త్ర కవితాప్రవృత్తిని నిరూపఏంచునుగాని, కావ్యగౌరవమును తగ్గించవు. స్వచ్భందమైన మందాకినిని బోలిన ఈ కవి నిసర్గకవితా ప్రవాహమున కివి అడ్డుతగులవు.

2344 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము

ఆనాండు కవి తిక్కన (ప్రతి పర్వాంతమునను ఆనంద పదమును నెలకొల్పి కావ్యరసానందపదమును సూచించియున్నాండు. ఈనాండు కవి భీమన (బ్రహ్మానంద పదముతో కావ్య,ప్రారంభము చేసి తదసానుభవమును పాఠకలోకమున కందిచ్చినాండు. అద్యతన కావ్యములలో అన్నివిధముల అ(గగశ్రేణీలో జేరదగినది “మధుబాల”. (కిన్నెర; సంపుటము 7, సంచిక 1, జనవరి 1955)

గంభరరర్‌ రెంట్‌ రా తన . సంస ఇమా. సప ను ( నా య గ్ర

లి ఒల్లో జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డాక్టర్‌ వి. ఎన్‌. శర్మ టె (మన సాహిత్య పరిణామంలో గల లోటుపాట్లను తెలుసుకొని, దాన్ని నవ్యమార్గాన తెచ్చుకొంటానికి ఇతర దేశాల్లో జరుగుతూవున్న ప్రయత్నాలను మనం కొంచెం తెలుసుకోవడం చాలా అవశ్యం. ఆంగ్ల వాజ్బయపంథా మనకు చాలావరకు తెలుసు. (ఫెంచి సాహిత్యమార్షాలను తెలుసుకోడానికి మనవారిలో నేడు చాలామంది ప్రయత్నం చేస్తూనే వున్నారు. జర్మను వాజ్యయం అవలంబించిన పంథాను కొంచెం మననం చేసుకోవడం ఎంతో అవసరం. జర్మను సాహిత్యం విశ్వసాహిత్యమయింది. ఆ సాహిత్యంతో మనకూ అవినాభావసంబంధం ఎంతో వుంది. జర్మను సాహెత్య రచయితలు అనాదినుండి భూతలస్వర్గపు మటుమాయలకు మోసపోక, దాని కపతలనున్న లోకాన్ని చూడడానికి వాంఛించారు. దాన్ని అవలోకించి తన్మయులై పోయారు. రెండులోకాల మధ్య సున్న ఊపెనుగోడలను పడగొట్టి రెంటినీ సమన్వయం చేశారు. తద్ద్వారా మనం వాంఛించే సచ్చిదానంద (బహ్మత్వాన్నే సాహిత్యమూ (ప్రజాసముదాయానికి ప్రసాదించింది.)

  1. జర్మను భాషాపరిణామం జర్మనుభాష భాషా చరిత్రకారులు నిర్వచించే ఇండో - జర్మానియా భాషా సంప్రదాయానికి చెందిన భాష. జర్మను వ్యాకరణపు పంథా చాలావరకు సంస్కృత భాషా వాతావరణంలోనే నడుస్తుంది. సంస్కృత భాషలోనుండి నేడు లావాలా పందిరి మల్లికార్డుసరావు శతజయంతి. సంపుటము 4; పాహిత్యము

2346 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము వాడుకలోనున్న భారత (ప్రాంతీయ భాషలు ఏలాగు పైకి వచ్చాయో అదేవిధంగా ఇంగ్లీషుభాష, స్కాండినేవియను భాషలు, డచ్చి భాష, అయిస్‌లాండు భాష ప్రాచీన జర్మను భాషా సంప్రదాయాల్లోనుండే వుత్పత్తి అయ్యాయి. నేటి జర్మను గ్రాంథిక భాషకూ, వ్యావహారిక భాషకూ తేడా ఏమాత్రమూ కన్పించదు. (గ్రామ్యభాషసైతం నేటికి ఎంతో జీవవంతంగా వుంది. ఆ యా [ప్రాంతీయ వాతావరణాన్ని బట్టి అందులో కూడా ఎంతో తేడాను చూడవచ్చు. పండిత పామరులూ గగ్రామ్యభాషపట్ల ఎంతో సద్భావాన్నే చూపెట్టుతూ వున్నా రచనల్లోకి మాత్రం దానికంత [ప్రాముఖ్య మీయబడలేదు.

నేటి జర్మను భాషలో మూడురకాల సంప్రదాయాలను మనం గుర్తించవచ్చు. ఇవీ అనాదినుండే నూతనశక్తిని, కళాకాంతులను ప్రసాదించి జర్మను భాషనే జీవవంతం చేశాయి. ఉత్తర జర్మను [ప్రాంతాల్లో వాడబడే భాషను నీడర్‌ జర్మను భాష అని పేర్కొంటారు. దీన్ని చాలావరకు మన గంజాం, శ్రీకాకుళం, విశాఖపట్టణ మండలాల వ్యావహారిక భాషతో పోల్చవచ్చు. దక్షిణ ప్రాంతాల్లో వ్యవహారంలోనున్న భాషను హోక్‌ జర్మనుభాష అని పిలుస్తారు. దీన్ని మన మధ్యాంధ భాషతో కొంతవరకు పోల్చవచ్చు. మిటిల్‌ జర్మనుభాష జర్మను మధ్యరాష్ట్రాల్లో వాడబడుతుంది. దీన్ని పూర్తిగా కాకపోయినా, కొంతవరకు మన రాయలసీమ, తఆలంగాణా వ్యావహారిక భాషలతో పోల్చవచ్చు. ఈనాడు వ్యవహారంలోనున్న జర్మను సాహిత్యం హోక్‌ జర్మను భాషనుండే పలురూపాలతో పైకిలేచి తన ప్రాచీన సంప్రదాయాలను నేటికిని నిలువబెట్టి తన కోమల కళాసొౌందర్యాన్ని మనకు చూపెట్టుతూనే వున్నది.

జర్మను లిపి అనాదినుండి ఎన్నో మార్పులను చెందింది. ఉచ్చారణలో మైతం ఇట్టి మార్పులనే చూడవచ్చు. జర్మనుభాష ప్రజాభాష. ప్రజాకోటి దీని నెంతో ఆదరించి తను జాతి మనస్తత్త్యాలను జీవవంతం చేశారు. మధ్యయుగంలో జర్మనుభాష రాజభాష అయింది. ఇంతవరకూ పరాయి భాషలను, అందు ముఖ్యంగా లాటిను, రష్యను, (ఫెంచి భాషలను రాజ్యాంగ వ్యవహారాలకు వుపయోగించిన రాజులు జర్మను రాజ్యంలో చిరస్థాయిగా నివాస మేర్చరచుకొన్నాక జర్మను భాషకే అనుదిన వ్యవహారాలకు (ప్రాధాన్యత నిచ్చి ధన్యులయ్యారు.

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డాల్‌ వి ఎన్‌. ళ్ళు 2347 విద్యాసంస్థలు లాటిన్‌ భాషను రెండవ భాషగా పరిగణించి, జర్మను భాషలోనె విద్యాచక్రాన్ని నడిపాయి. రాజదర్చ్భార్ల ఆదరణ (క్రింద జర్మను భాషకు ఇంత (ప్రాముఖ్యతనిచ్చిన మహనీయుడు లూథర్‌ పండితుడు. 1483 సం॥లో పుట్టాడు. 1546 సం॥లో కీర్తిశషుడయ్యాడు. జర్మను గ్రామీణుల మనస్తత్త్వాన్ని చక్కగా ఆలుసుకొన్న మహానుభావుడు లూథర్‌. ఇంత వరకూ లాటిన్‌ భాషలో పఠింపబడుతూ వున్న బబిలు మతగ్రంథాన్ని లూథర్‌ జర్మను వ్యవహార భాషలోకి అనువదించాడు. మతాచార్యులొకవైపున, పండిత (పప్రకాండులు మరొకవైపున లూథర్‌ చర్యను (పారంభాన ఖండించారు. కాని వా రేం చేయగల్లుతారు (ప్రజాకోటి బైబిల్‌ జర్మను అనువాదాన్ని ఆదరించి దాన్నే పారాయణ (గ్రంథంగా వుపయోగిం చుకొన్నాక? ఒక బైబిలును అనువదించడమే కాక లూథర్‌ జర్మను భాషలోనే కైఎస్తవమత సిద్ధాంతాలకు సంబంధించిన సమస్యలన్నింటిని ప్రజాసముదాయానికి చక్కగా వివరించి చెప్పటానికి ఎన్నో గ్రంథాలను స్వయంగా రాశాడు. ఆయన లాటిన్‌ భాషా వాతావరణంలో పుట్టి పెరిగినా, తన రచనల్లో జర్మను నుడులను ఎంతో చక్కగా వాడాడు. జాతీయాలను, తన భావాలను చక్కగా సామాన్య ప్రజలకు నచ్చచెప్పటానికి ఎంతో సునాయాసంగా వాడాడు. ఈ కార్యాన్ని జయప్రదంగా కొనసాగించటానికి జర్మను దేశాన్నంతా చుట్టివచ్చాడు. ఎంతోకాలం (గామీణులమధ్యనే నివసించి వారిమనోభావాలను చక్కగా తెలుసుకొన్నాడు. లూథర్‌ను జర్మను భాషయొక్క తంథడడే అని చెప్పాలి. ఈయన చేసిన నిరంతర సేవమూలకంగా ఉత్తర దేశపు వ్యాపహారికభాషకు, దక్షిణాది వ్యావహారికభాషకు, మధ్య దేశపుభాషకు ఒక్క విధమగు సమన్వయత కలిగింది. ఇదే లూథరుకాలంనాటి నుంచి వ్యావహారికభాషలు (గాంథికభాషారూపాన్ని దాల్చాయి. వ్యావహారికభాషలు ఈ రూపాన్ని ధరించినా ప్రజలు తమతమ (ప్రాంతాలలోని సాంప్రదాయాలను ఏమాత్రం మరిచిపోయినవారు కారు. పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈ రూపాన్ని ధరించిన (గాంధికభాషలోనే పుస్తకాలను చదువుతూవున్నాః రాజమందిరాలల్లో, న్యాయస్థలాల్లో, మరి ఇతర మత, సాంఘిక సంస్థల్లో ఈ భాషనే విచ్చలవిడిగా వుపయోగించుతూవున్నా, అనాదినుంచి జీవవంతంగా వాడుకలోనున్న భాషనే పండితులు కాకపోయినా సామాన్య జనాంగమంతా తమతమ అనుదిన వ్యవహారాల్లో వాడేవాళ్లు.

2348 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము

ఈ పరిణామంలో 17వ శతాబ్దంవరకూ పరాయిపదాలను వాడటానికి జర్మను భాషావేత్తలు ఏమాత్రం ఇష్టపడినవాళ్లు కాదు. అనాదినుండీ వస్తూవున్న భాషా సంప్రదాయాలను స్వచ్భరూపాన్నే నిలువజుట్టడానికి భాషాపరిషత్తులను స్థాపించారు. ఇందు ముఖ్యంగా (గింసోదర్లను (యోకొబ్‌, విల్‌హెల్మ్‌) ఈ సందర్చాన పేర్కొనవలసివుంది. నేటి జర్మనుభాషా చరిత్రకు పునాదివేసిన వాళ్లు ఈ (గింసోదరులే అని చెప్పాలి. వీళ్ల పరిశమవల్ల నెలకొల్పబడ్డ జర్మను భాషాసమితి నేటికిని జర్మనుభాషా స్వరూపాన్ని అన్యభాషాపదాల నేమాత్రం దాన్ని చెడగొట్టనీయకుండా - నిలువ బెట్టుతూనేవున్నది. ప్రభుత్వం ఈ భాషాసమితిని ఆదరించుతూ, విశ్వవిద్యాలయాల కిచ్చిన స్థానాన్నే దీనికి ప్రసాదించి ధన్యత గాంచింది. పండితవర్గాలూ ఈ సమితిసలహా ననుసరించే జర్మను సాహిత్యం నవ్యకళలతో వర్ధిల్లజేయడానికి ఎంతో తోడ్పడి ధన్యులయ్యారు.

భాష కొంచెం దూరదృష్టితోచూస్తే జీవనదివంటిది. అది నడిచేమార్గం ఎప్పుడూ అంత సులభమయిందికాదు. దోవలో ఎగుడు దిగుళ్లు ఎన్నో వుంటాయి. దానిలో కలిసిపోడానికి దోవమధ్య ఎన్నో ఉపనదులు వస్తాయి. అవీ ఎన్నో రకరకాల అందచందాలను తమవెంట ఆెచ్చుకొంటాయి. అసలు నదిలో అవి కలిసిపోయినా తమతమ వ్య క్తిత్వాన్నే నిరంతరం నిలుపుకోటానికి భగీరథ ప్రయత్నాలూ చేస్తాయి. నదీదేవత వీటిని తనలోకి ఆహ్వానించాలి. వాటితత్వాలనూ తనలోనే సమన్వయం చేసుకోటానికి తానూ ఆ విశ్వసము[ద్రంలో చేరుకొని తన నామరూపాలనే మటుమాయం చేసుకొనవలసి వచ్చినంతవరకూ వాటి కీర్తి పరంపరలనూ నిలువబెట్టాలి. అప్పుడే భాష - ఈ జీవనది తన విధ్యు క్తధర్మాన్ని స్మకమంగా నెరవేర్చుకో గలుగుతుంది. ఎప్పుడూ సంస్కారం - ఆత్మసంస్కారం కావాలి. ఈ సంస్కారంవల్ల పుట్టేది సాహిత్యం. ఇట్టి సాహిత్యలక్ష్మీ జాతిని తరింపజేస్తుంది. ఒకజాతి అంచేత తరింపబడ్గిందంటే చుట్టుపక్కలనున్న జాతులూ తరింపబడుతాయి. తద్వారా విశ్వప్రపంచమే పరమపావనమవుతుంది.

జర్మనుభాష ఈవృన్నతాదర్శాన్నే కొనసాగించటానికి పుట్టింది. అది ఎప్పుడుపుట్టిందో ఇదమిత్సమని చెప్పడానికి సాధ్యంకాదు. కొంతమంది వాజ్బయ చరిత్రకారులు క్రీ శ, 800సం!! రాలనుండే జర్మనుభాష ఒకరూపానికి వచ్చిందని అంటారు. మరికొందరు క్రీ.పూ.500 సం॥ రాల క్రిందటే జర్మనుభాష ప్రజాభాషగా

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డా. వి ఎన్‌. శు 2349 వర్ధిల్లుతూవుండి ఆ కాలపునాటి ప్రజాలోకాన్ని పావనంచేసిందని చెప్పుతారు. ఇంకా కొంతమంది క్రీ. పూ. 1500-1000 సం! రాల మధ్యే జర్మనుభాష ఎంతో సజీవవంతంగా వుండివుందని పేర్కొంటారు.

పూర్వకాలంలో మన వేదవాజ్ఞయంవలె జర్మను భాషా సాహిత్యం పదాలద్వారా, పాటలద్వారా ఆ కాలపు జర్మనుజాతిలోనే కాక జర్మను వర్తకులూ, జర్మను నావికులూ చుట్టితిరిగి వచ్చిన యితరప్రాంతాల్లోనూ వ్యాపించింది. కవులు ఎవరో మనకు తెలియదు. గాయకు లీపాటలను అందరికీ వినిపించుతూ వుండేవారు. ప్రజలూ వాటిని కంఠస్థం చేసుకొని తరతరాలుగా వాటిని నిలువ బెట్టారు. ఆఅనోటా ఈనోటా పడిపోయిన ఈ సాహిత్యం అసలు రూపాన్నుంచి కొత్త రూపానికి వచ్చింది. జర్మనులు సూర్యోపాసకులు; ప్రకృతి దేవతారాధకులు. తరువాత [క్రీస్తుమత వాహినులు వారిమీద పడ్డాయి. తద్వారా ఈ కొత్త మతతత్వాలు ఆ సాహిత్యంలో మిశ్రమయిపోయాయి. 2. జర్మనుసాహిత్య రంగాలు

  1. అజ్ఞాత యుగం (క్రీ. శ. 1180 వరకు)

క్రీ. శ. 800 సం॥ ప్రాంతాన ప్రాచీన జర్మను వాజ్బయం గ్రంథస్థమయింది. ఆనాటివరకూ ఈ వాజ్మయం ఎట్టి రూపాన్ని దాల్చిందీ సుప్రసిద్ధమయిన హిల్‌డెబాండు గీతంలో మనం చూడవచ్చు. ఎడ్డా అనేది అతి పురాతనమయిన జర్మను సాహిత్యం. అనాదికాలంలో నివసించిన జర్మను జాతి జీవితాన్ని ఇది ఎంతో చక్కగా చిత్రించుతుంది. వేదాలలోవలె ఇందూ ఎన్నో స్తుతులు వున్నాయి. వాటిలో కొన్ని దేవతా స్తుతులు. మరికొన్ని ఆనాటి జర్మనువీరుల కీర్తి పరంపరలను స్తుతించుతూ వివరించే పాటలూ, పద్యాలు. ఇవే (గ్రంథస్థమవడానికి కీ. శ 900 _ 1000 సం॥ ల వరకు వేచి వుండాలసి వచ్చింది. ఆ కాలంలో జర్మను రాష్ట్రాలను పాలించిన చార్లస్‌ చకవర్తి భాషా పోషకుడు. ఈయన సహాయం వల్లనే కొంత ప్రాచీన వాజ్మయం [గ్రంథస్థం కాగల్గింది. మెర్సిబుర్గర్‌ నగరంలో ఈ పని ఆరంభింపబడినందువల్ల ఈ వాజ్మయాన్ని మెర్ప్చిబుర్గర్‌ పురాణగాథలని చిత్రకారులు పేర్కొంటారు.

2350 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

అయిన్‌హార్ట్‌ అనే పండితుడు ఈ చార్లన్‌ చడక్రవర్తి చరిత్రను రాశాడు. అందు ఈ రాజుకు పూర్వాన వున్న కవులను గురించి రాస్తూ, 830 సం॥! రానికి పూర్వమే ముస్‌పిల్లె అనే కవి వుండేవాడని ఆ కవి తనకాలపు ప్రజల అసహాయదశను వివరించుతూ కొన్ని గీతాలను అల్లాడని అంటున్నాడు. ఇందులో జర్మను జాతి శక్తి సంపదలు ఎంత గొప్పవయినా, క39స్తవమత వాయువులు దేశాన్ని నానా చిందరవందరం చేశాయి అని ఈ కవి విచారించుతున్నాడు. ఈ వాయువులవల్లనే [ప్రాచీన వాజ్యయమూ తాత్కాలికంగా పెద్ద దెబ్బతిన్నదట. కాని క్రైస్తవమత సాంప్రదాయాలు ఈ అనాదిశక్తిని కబళించుకోలేదు. జర్మను సంస్కృతే వీటిని తనలోకి లాగి వేసుకొన్నది.

ఆ కాలంలోనే నివసించివున్న హేలియండ్‌ అనే పండితుడు క్రీస్తుపభువునే జర్మను సేనానాయకుడని తన (గ్రంథంలో పిలిచాడు. మరికొందరు కవులు తమ రచనలో నూతన మత విషయాలను చర్చించుతూ, అనాది సిద్ధంగా వస్తూవున్న జర్మను పండుగలనూ, పర్వాలనూ క్రీస్తుమత వుత్సవాల్లోకే దింపివేశారు.

ప్రాచీన వాజ్బయం [క్రమేణా గ్రంథస్థమవుతూ వస్తూవున్నా పన్నెండవ శతాబ్దాంతంవరకూ కొత్తకొత్త రచనలు లాటిన్‌ భాషలోనే కొనసాగించబడుతూ వచ్చేవి. కాని వీటిలోకూడా రచయితలు ప్రాచీన సంస్కృతికే ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. వాల్తరియిస్‌ ఆనాటి జర్మను జీవిత ఘట్టాలను చిత్రించుతూ లాటిస్‌ భాషలో పెద్ద వచన కావ్యాన్ని అల్లాడు. టేగర్న్‌ నదీ ప్రాంతపు మతాచార్యుడు ఈ పంథాలోనే 1030 సం॥ లో పద్యకావ్యాన్ని రచించాడు. మరికొందరు రచయితలు తా మా కాలాన చూచిన దృశ్యాలను - ప్రకృతి చిత్రాలనూ, ఆ కాలపు వీరానువీరుల సాహసకృత్యాలనూ - జానపదాల్లో చిత్రించారు. ఒక కవి ఆ కాలపు జంతుజాలాన్ని గురించి పెద్ద పురాణాన్ని ప్రాచీన సాహిత్యమార్గాన్నే లాటిన్‌ భాషలో రచించాడు. 2. సువర్ణయుగం (క్రీ శ 1180 - 1250)

జర్మను సాహిత్య చరిత్రలో క్రీశ. 1180-1250 సం॥రాల మధ్యకాలాన్ని సువర్ణయుగమని చెప్పవచ్చు. ఆ కాలాన మన దేశంలోవలె జర్మను దేశంలో

. ఎన్నో రాష్ట్రాలు వుండేవి. కొన్ని చిన్నరాజ్యాలు; మరికొన్ని పెద్దరాజ్యాలు. అన్నీ రాజాన్యులపాలనలోనే వుండేవి. రాజులు విద్యాప్రియులు. తమతమ దర్భార్లలో

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డా. వి, ఎన్‌. రు 2351 సాహిత్యగోష్టిని నిరంతరమూ కొనసాగించేవారు. రచయితలను పోషించారు. వారిచేత కావ్యాలను రాయించారు. వీరి మన్ననలను పొందడానికి దూరదేశాలనుండీ ఎంతోమంది కవులూ, పండితులూ వారి సంస్థానాలకు వచ్చేవారు. రాజులు వారలకు చేయవలసిన సత్కారాలను చేసి ధన్యులయ్యారు. ఇట్టి రచయితల్లో ముఖ్యంగా పేర్కొనవలసినవారు హార్ట్‌మాన్‌ వాన్‌ అవే, గాట్‌ ఫీడ్‌ వాన్‌ స్ట్రాస్‌బర్ల్‌, వోల్ప్‌రాంవాన్‌ ఏషన్‌బాక్‌ అను కవులు. ఆవే ప్రాచీన వీరగాథలను చిత్రించుతూ పెద్ద పద్య కావ్యాన్ని రాశాడు. దీన్నే హైన్‌రిచ్‌ ఇతిహాసమంటారు. ఇది స్వాతంత్య్యురచన, భక్తిమార్గాన నడుస్తుంది. స్ట్రాస్‌బర్గ్‌ జర్మను (ప్రజాకోటికి ఆదర్శమూర్తిఅయిన ట్రెస్టాన్‌ అనే యోధా(గేసరుని చరిత్రను ఎంతో రక్తివంతంగా "రచించాడు. ఏషన్‌బాక్‌ ప్రాచీన గాథల్నే సేకరించి వాటిని ఆ కాలపు భాషలో (గ్రంథస్థం చేశాడు. వీటిలో ప్రత్యేకంగా ఏర్కొనదగినవి పార్సివాల్‌, టిటురేల్‌, విల్లేహాలెం కథలు. ఇవి జర్మను ప్రాచీన సంస్కృతిని మన కెంతో చక్కగా చిత్రించుతాయి. ఈ కాలంలోనే మరొక కవి (ఆయన [గ్రంథంలో తనపేరు చెప్పుకోలేదు) జర్మను ప్రాచీన సాహిత్యానికి పట్టుకొమ్మ అని చెప్పదగిన ఎడ్డాగాథనే నేవిలుంగన్‌గాథలు అను పేరుతో పల్లెపదాల ధోరణిలో సామాన్యప్రజే దాన్ని చదివి తన్మయత్వం పొందడానికి పెద్దయక్షగానాన్ని రచించాడు. ఈ యక్షగానాన్నే ఆ కాలపు జంగాలు రాజదర్చార్లలో పాడి వినిపించేవారు. అంతేకాదు. వీర్ల జట్టును ప్రతిగ్రామంలో చూడవచ్చు. ఇట్టి జంగాలను ఆకాలాన మిన్నెసింగర్పు అని పిలిచేవారు. వారు గాయకులే కాదు, కవులుకూడా. జర్మనుజాతిలో అనాదినుండీ స్త్రీలూ ఎంతో త్యాగం చేసినవారే. వారి ధైర్యసాహసాలనుగురించీ, వారికి భర్తల పట్లగల భక్తివిశ్వాసాలనుగురించీ, అంతేనా - దేవతారాధనల్లో వారు చూపెట్టిన భక్తిశద్ధలనూ ఎన్నో పల్లెపదాలల్లో, ఈ గాయకులు ఎంతోరమ్యంగా చిత్రించి, వాటిని ప్రతిచోటాపాడి ఆకాలపు వ్రజాసముదాయానికే నూతనతేజాన్ని ప్రసాదించి ధన్యులయ్యారు. ఇట్టి జంగాలలో (ప్రత్యేకంగా మనం తఆలుసుకొనపలసింది వాల్‌టర్‌ వాన్‌ ఫోగల్‌ వైడ్‌ అనే గాయక చక్రవర్తిని గురించి. ఈయన స్వదేశం ఆస్ట్రియా రాష్ట్రంలోని తిరోలుప్రాంతం. తన మాతృ దేశాన్ని వడలివేసి పశ్చిమ జర్మనీదేశపు రాజు నాశ్రయించాడు. ఆ రాజు కవి, పండితుడు, సరసుడు. తన రాజును,

2352 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము రాజకుటుంబాన్ని సంతోష పెట్టడానికి ఫోగల్‌వైడే శృంగారరసోపేతాలగు పదాలను రాశాడు. శృంగారంకూడా [క్రమేణ విషాదఘట్టంలోకి దిగుతుంది కాదూ, దానిహద్దునుమించి మనంనడుస్తే! అట్టి అవస్థా ఆ దేశానికి పట్టింది. దాన్ని చిత్రించుతూ ఈ కవి కొన్ని కావ్యాలను జానపద పద్ధతిలోనే రచించాడు. 'ఇట్టి కవనాన్నే “మిన్నిసాంగ్‌' అని జర్మను సాహిత్యచరిత్ర పేర్కొంటుంది. ఇట్టి కవనాన్ని అల్లడంలో ఆయనదే సిద్ధహస్తం. తరువాతికాలంలో కొత్తరాజులు వచ్చారు. వారి దృష్టీ సాహిత్యవీథుల్లో మరో మార్గాన పడిపోయింది. పల్లవాజ్బయం ఈ నూతన వాతావరణంలో, ఆదరించే రాజులులేక, రాజమందిరాల్లో నశించిపోవడానికి ఆరంభించింది. కాని చావలేదు. (గామీణులు దీన్ని ఆదరించారు. ఈ విషమావస్థనుగురించి నైడ్‌ హార్ట్‌ వాన్‌ రొయెన్‌తాల్‌ అనే కవి రాజుల చిన్న చూపుల కేవగించి, ఎంతోకాలం అజ్ఞాతవాసంలో వుండిపోయాడు. ఆయన ఆ కాలంలో అల్లిన జానపదాల్లో ఈవిషాదావస్థను మనం చదవవచ్చు.

తె. మధ్యయుగం .

(క్రీశ. 1250-1500 మధ్య కాలాన్ని ఈ సాహిత్య చరిత్రలో మధ్యయుగమనే చెప్పాలి. నివురుకప్పిన నిప్పువలవున్న జానపద వాజ్మయం తిరిగీ తన నిజరూపంతో పైకిలేచింది. రాజులు తాము ప్రజాసాహిత్యానికి చేసిన మహాపరాధాన్ని (గ్రహించారు. రాజన్యం ఎలా నడుస్తే పండితులూ ఆ మార్గాన్నే జీవితరథాన్ని నడుపుతారు కాదూ మరి? పండితులు రాజాదరణను పొందడానికి, జానపద సాహిత్యంలోనే ఎంతో వుత్సాహంతో సేవజేయడానికి ముందంజ వేశారు. ఇక (గామీణుల సంగతి చెప్పనక్కరేలేదు కదా? వారు ఎంతో వుల్లాసంతో భక్తిగీతాలనూ, శృంగారపదాలనూ అల్లడానికి మొదలుపెట్టారు. పొలాల్లో వీరు రాసిన పదాలనే కృషికులు వాడసాగారు. కర్మాగారాల్లో కూలినాలి చేసుకొనే పాటక బృందమూ ఈ గానామృతంలోనే మునిగి ఆనందించింది. ఇట్టి పాటక జనాంగంలో నుండి కవితాప్తుతులు బయలుదేరారు. వీరిలో హాన్స్‌సాక్స్‌ దర్జీ, ఆ కాలపు సం[(ప్రదాయాన్ననుసరించి తానున్న నూర్‌న్‌బర్గ్‌ నగరవాసులకు పాదజోళ్లనుకుట్టేవాడు. ఆయనదగ్గర ఈ పనులను నేర్చుకోడానికి ఎంతోమంది యువకులు నానాదేశాలనుండీ వచ్చి ఏండ్లతరబడి ఆయనదగ్గిరే శుడూష చేసేవారు. ఈయన పెద్దకవి. ఆయన అల్లిన పదాలకు పరిమితీలేదు. ఆ దేశపు రాజు సాక్స్‌కవిని

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డా. ని. ఎన్‌, శర్మ 2353 తన ఆస్థానానికే క్పిల్రిపించుకొని ఆయన కవితా మాధుర్యాన్ని తానే విని తన్మయుడవడం కాకుండా ఇతర్లకు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి అవకాశమూ ఇచ్చాడు. ఏక్‌హార్ట్‌ గొప్ప మతాచార్యుడు తన మనోభావాలు ఆ కాలపు మతాచార్యులకు నచ్చునందున, ఆ పదవికి నమస్కారం పెట్టి కార్మికుడయి తన అంత్యకాలాన్ని ఆనందంగా గడిపాడు. ఆయనా పెద్దకవి. ఎన్నో భక్తిపదాలను అల్లాడు. వీరిపంథానే సాయిసే, టౌలర్‌ అనే పాటకకవులు ఎన్నో భక్తి కావ్యాలను రచించారు. యోహాన్‌వాన్‌ లేప్లే రైతాంగంలో పుట్టి పెరిగిన కవి. ఆయన తన జన్మ దేశమగు బౌాహెమియా [ప్రాంతంలోని రైతుల జీవితాన్ని ఎంతో కళావంతంగా తన జానపదగేయాల్లో చిత్రించాడు. వీటినే యోహాన్‌టేప్లే పదాలని పిలుస్తారు. ఆ కాలంలోని కవులందరూ ఈయనదోవనే కవనాన్ని అల్లారు. త నవ్యసాహిత్యంలోని మొదటిఘట్టం (16వ శతాబ్దం) మధ్యయుగపు వాతావరణం ఎన్నో పూర్వాచారపు మూఢవిశ్వాసాలతో నిండివున్నా, నశించిపోతూవున్న ప్రజాసాహిత్యాన్ని నిలువబెట్టి ధన్యతగాంచింది. దాంతో జర్మను సాహిత్యచరిత్రలో అరుణోదయం (ప్రారంభమయింది. దీన్నే జర్మను భాషా చరిత్రకారులు “రెనయ్‌సాన్స్‌” అని పిలుస్తారు. మార్దిన్‌లూధర్‌ పండితుడు ఈ యుగానికి చక్రవర్తి అనే చెప్పాలి. 1534 సం॥లో ఈయన బైబిల్‌ (గ్రంథాన్ని ప్రాచీనకాలపు అరామిక్‌ (గీకుభాషల్లో నుంచి తనకాలపు (ప్రజాభాషలోకి అనువదించాడు. ఈయన పుట్టిందీ, పెరిగిందీ క్యాతలిక్‌మత సాంప్రదాయంలో. లాటిన్‌ భాషలో అఖండ పండితోత్తముడు. అరామిక్‌, గ్రీకుభాషల్లో అందెవేసిన చేయి. క్యాతలిక్‌ వాతావరణం జర్మను సాహిత్యవీథులకు అడ్డువచ్చి, ప్రజల మనోభావాలన్నింటినీ లాటిన్‌ సంస్కృతిలోకి లాగుకొనిపోయింది. ఇట్టి క్లిష్టపరిస్థితిని “లూథర్‌ అంగీకరించలేకపోయాడు. ఆయన క్రీస్తుభగవానుని సేవావతంలోనే నిమగ్ను డైనవాడే. వై)స్తవ జీవకళలను దేశవాతావరణానికి విరుద్ధమయిన భాషలోకాక, దేశభాషామూలకంగానే తెలుసుకోవాలి. అప్పుడే ('ప్రజాకోటి ఆ మత సిద్ధాంతాలను చక్కగా అర్థం చేసుకోగల్గుతుంది. ఇదే లూథర్‌ పట్టు. ఈయన ఒక కవి, పండితుడేగాక, కై9స్తవ మత సిద్ధాంతాలకే నూతనతేజాన్ని ప్రసాదించాడు. క్యాతలిక్‌ చర్చి నుండి విడిపోయి, ప్రాటెస్టెంటుమతాన్నే స్థాపించిన మహానుభావుడు. నూతనమత సిద్ధాంతాలకు సంబంధించిన (గ్రంథాల నెన్నింటినో ప్రజల భాషలోనే

2354 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము రాశాడు. పూజాపునస్కారాదులకు అనుగుణ్యంగా (ప్రార్థనగీతాలను రచించాడు. నేటికీ ఈ గీలాలనే జర్మను ప్రాటెస్టెంటు చర్చీలలో వుపయోగించుతారు. జర్మను గృహాల్లో ఆయన రచించిన పాటలనూ, పదాలనూ అనుదినమూ (పజాకోటి మననం చేస్తూ తన్మయత్వం పాొందుతూవున్నది. ఈయన కార్యదీక్షలో సహాయపడ్డ కవి హూటన్‌ అనేఆయన. ఈయనా స్వయంగా ఎన్నో భక్తిగీతాలను రచించాడు. ఒక మత సాహిత్యమేకాక, వ్యంగ్యో క్తిరచనలూ ఈ కాలాన్నే పెకిలేచాయి. ఎట్టి సంస్కారాన్నయితేనేం, బలవంతాన, అదుపాజ్జలతో, మతవిషయాల్లో, సాంఘికజీవితంలో ప్రవేశపెట్టితే, జాతి సహజవికాసమే చెడిపోతుంది. ఈ సంగతినే ఒకకవి, (బాంట్‌ అనే ఆయన వ్యంగ్యో క్తిగా ప్రజాకోటికి నివేదించడానికి “వెరివాళ్ల పడవప్రయాణం”” అనే కావ్యాన్ని రచించాడు. ఈయన పంథాలోనే మూర్నర్‌, ఫృష్‌హార్డ్‌ అను కవులూ ధైర్యసాహసాదులతో కవితారచనకు ముందుకువచ్చారు. సంస్క ర్తలకు ఇట్టి రచనలు ఏమాత్రం నచ్చాయికావు. వారూ ఈ వ్యంగ్యోక్తి కవితా ధోరణిని తొక్కివేస్తానికి చేయాలసిన భగీరథ (ప్రయత్నాలను చేశారు. వీరిలో నాయకా(ేసరులు ఏరాస్‌ముస్‌ (డచ్చి దేశపు మతాచార్యుడు), రొయ్‌కీలిన్‌ అనువారు. వీరు తమదోవనే సమర్థించడానికి వాసిన గ్రంథజాలానికి పరిమితేలేదు. ఈ కాలంలోనే, 1587 సం॥ లో, పాశ్చాత్యఖండంలో (పతిఇంటా తాతలూ, ముత్తాతలూ ఎంతో వుల్లాసంతో చెప్పుకొనుచుండే ఫవుస్టుకథ - (ప్రాచీన గాథల ననుసరించే - వ్రాయబడ్డది. దీన్ని సేకరించి పదరూపంగా అల్లిన కవిపేరు మాత్రం ఎవరికీ తెలియదు. ఈ కథ ఇతరదేశాల్లో [క్రమేణా వ్యాపెంచబడ్డాక ఎన్నో రూపాల్లోకి మారిపోయింది. గోథే మహాకవి, మూలకథ నేమాత్రం మార్చకుండా, తనకాలంలో పెద్ద నాటకాన్ని రచించి, ప్రాచీన సాంప్రదాయాలను నిలువబెట్టాడు. -. 5. నవ్య సాహిత్యంలోని రెండోఘట్టం (బబరోకయుగం - 17వ శతాబ్దం) ప్రజాకోటిచేత ఇంతవరకూ ఆదరింపబడుతూవున్న భాషను ఒకవిధమగు కట్టుదిట్టానికి తఆస్తానికి పండితులు 17వ శతాబ్దంలో చేయవలసిన (ప్రయత్నాలన్నింటిని చేశారు. 1624 సం॥లో ఓపిట్స్‌ అనే పండితుడు ఈ పనికి ముందంజవేసిన మహానుభావుడు. రచనలు - అవి గ్రాంథికభాషలోవున్నా లేక వ్యావహారిక భాషలో

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు. డా. వ. ఎన్‌, శర్టు 2355 రచించబడ్డా - ఒకపంథాలో నడవబడాలని ఈయనవాద౦ం. ఈ వాదాన్ని సమర్థించడానికి వ్యాకరణాన్ని స్వయంగా తయారుచేశాడు. దాంతో వూరికవున్న ఘటమా ఇది? జర్మను సాహిత్యాన్ని చవి చూడదలచినవారు (పవథమంలో నేర్చుకోవలసిన పద్యాలు ఇవి అని (ప్రాచీన వాజ్బయంలోనుంచి తనకు మంచివనితోచిన పద్యరత్నాలను సేకరించి ఒక అంథాలజీ సంపుటాన్ని సెద్ధంచేశాడు. ఆయన మార్గాన్ని నడిచినవారు కొద్దిమందే. ఇతరకవులు ఈయన్నే ఎదిరించుతూ, తమ సహజ పద్ధతుల్లోనే (గ్రంథరచనకు ఆరంభించారు. వీరిలో అనేకులు శృంగారకావ్యాలను రాశారు. (గిఫియిస్‌ అనే కవి మన కింతవరకు తలిసివున్న నాటకాన్ని - జర్మను (ప్రజాజీవితాన్నే చక్కగా చిత్రించుతూ వ్రాశాడు. మతగితాలను అల్లినకవులూ ఎంతోమంది ఈ కాలంలో వుద్భవించారు. నేడు. మనం “నవల” అని పిలిచే వచనకావ్యానికి పునాదులు వేసిన రచయిత మోషెరోష్‌ అనే ఆయన. ఆయన వచనకావ్యాలకు ఇచ్చిన ఈ కొత్తరూపా న్ననుసరించే (గింసెల్‌ హౌసెస్‌ అనేకవి “సింప్లిజిస్‌సిముస్‌” అను నామంతో ఆ కాలాన జరిగిన యుద్ధ సంక్షోభాన్ని గురించీ, దానివల్ల ప్రజలు పడ్డ అష్టకస్టాలను గురించీ పెద్దనవలను రాశాడు. మరికొందరు రచయితలు శైలిలో, పదాల సముచ్చరణంలో ఎంతో గాంభీర్యతను చూపెట్టుతూ, గ్రంథ రచనకు దిగారు. ఇవి ఎన్నో అతిశయోక్తులతోనిండి, అర్థంలేని సంభాషణలతో పాఠకులకు విసుగుబుట్టిం చేవి. ఇట్టి రచనలో ఆ కాలపు నవ్యసాహిత్యవీథుల్నే కొంతకాలం గాఢాంధకారంలోకి దింపివేశాయి అని చెప్పిన దోషమేమాత్రం వుండదు. అంతేకాదు. సాహిత్య లక్ష్మి వీరల మూలకంగా పెద్దదెబ్బ తిన్నది అనీ చెప్పవచ్చు. తద్వారా (పజాసాహిత్యం కొంతకాలం తనజీవితాన్ని అజ్ఞాతవాసంలో గడపాలసివచ్చింది. 6. విజ్ఞానయుగం (18వ శతాబ్దం) .

ఈ యుగాన్ని జర్మను సాహిత్యంలో విజ్ఞానయుగమని చరిత్రకారులు పేర్కొంటారు. జర్మనుసాహిత్యం అజ్ఞాతవాసంలో నుంచి తిరిగీ బయటపడ్డది. తన సహజశక్తి సంపన్నతను సవ్య మార్గాన, ప్రజాకోటికి చేయవలసిన సేవావతాన్నే దృష్టిలో నుంచుకొని కార్యరంగానికి ప్రవేశించింది. కవిత్వం, పద్యరచన మూలంగానైతేనేం లేక వచనరూపంగా నైతేనేం మానవ మనోవికాసానికి అత్యవసరమైన కళ అని ఆ కాలపు పండితులు పూర్తిగా అంగీకరించారు. కాని

2356 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అదంతా హేతుమార్గాన నడవ బడాలని కొందరు పెద్దలు పట్టుపట్టారు. ఇట్టికళను ఎట్టి (ఈమ పద్ధతుల్లో నడపాలనే విషయాన్ని చర్చించుతూ 1729 సం॥లో గోట్‌షెడ్‌ అనేఆయన “పద్యకళాతత్త్వము” అనేపేరుతో పెద్ద (గంథాన్ని ప్రచురించాడు. పద్యాలను ఎవరికిష్టం వచ్చినట్టు వారు అల్లడానికి వీలులేదని ఈయనవాదం౦. ఆ కాలాన గ్రఫంచిభాష ఎంతో కట్టుదిట్టాలతో నిండిఉన్నది. జర్మను పండితులకు ఆ భాషమీదే ధ్యాస. ఆ భాషాసాంప్రదాయాల ననుసరించే జర్మను ఛందస్సునూ ఈయన తయారుచేశాడు. గీకు, రోమనుభాషలూ అనాదినుండీ ఈ పంథానే అనుసరించాయి, (్రంచిభాషా ఆ మార్గాన్నే అవలంబించింది. ఆ కాలాన ్రంచి సాహిత్యంలో సిద్ధహస్తులు రాసిన్‌, కొర్నేలి, మోలిర్‌. గోట్‌షెడ్డూ తానువ్రాసిన రచనలను ఆ పంథాలోనే నడిపాడు. వీటిలో వచన (గ్రంథాలు వున్నాయి. _ పద్య[గంథాలూ వున్నాయి. దాంతో తృప్తిపడక కొన్ని నాటకాలనూ వాశాడు.

ఈయన మార్గాన్ని ఖండించిన జర్మను రచయితలూ ఈ యుగంలో ఎంతోమంది వున్నారు. వీరిలో స్వెడ్డరులాండు దేశపు కవులు - బోడ్‌మేర్‌, (బయిటింగర్‌ అనేవారు నాయకులు. వీరి ఆదర్శగంథం మిల్‌టన్‌కవి రచించిన పారడీస్‌ లాస్ట్‌. ఆ మార్గాన్నే ఈ ఇద్దరుకవులూ తమ మనోభావాలను ఏమాత్రం చెడగొట్టనీయకుండా, వున్నవి వృన్నట్లుగా చిత్రించడానికి సాహసించి ధన్యులయ్యారు. వీరికన్నా మరియెక్కువగా గోట్‌షెడ్‌కవిని ప్రతిఘటించిన కవి క్లోవ్‌స్టాక్‌ అనేఆయన. 1748 సం॥లో క్షోప్‌స్టాక్‌కవి తానురచించిన “మెస్సయ్యా” అనే రచనలో, కవికే సంపూర్ణ స్వాతంత్యుమిచ్చిన, ఆయన తన కవితాశక్తిని ఎంతసవ్యంగా, రమ్యంగా చూపగలడో స్వయంగా ప్రకటించాడు.

ఇట్టి స్వాతంత్య్యుం కవితా పుుతులకు లభించాక, జర్మను సాహిత్య వీథులను కళావంతంగా అలంకరించడానికి తూర్పు దేశాల సాహిత్యాలమీద వారి దృష్టి మరలింది. పారశీకదేశపు కవితారసం జర్మను వాహినిలోకి వచ్చిపడింది. సంస్కృతవాజ్మయ రసాన్ని ఆస్వాదించడానికి రచయితలు ముందుకువచ్చారు. పారశీక ధోరణిలో గ్లెం అనేకవి జీవితయాత్రను నౌకాయా(తతో పోల్చాడు. ప్రేమ వుంటుంది. ఈర్ష్య పైకి వస్తూ వుంటుంది. వాటితో విషాదమూ పెచ్చు పెరిగిపోతూ వుంటుంది. వీటిని వోపికతో ఎదుర్కొని జయించినవానికి ఆత్మశాంతి (ప్రసన్నమవుతుంది. ఆత్మశాంతి వచ్చిందా, జీవితసమస్యలన్నింటినీ సునాయాసంగా ఎదుర్కొనవచ్చు. ఈ ఆత్మశాంతిని వాంఛించేవారు క్రైస్తవ మతతత్త్వాన్నే తెలుసుకొని తృప్తిపడితే లాభంలేదు. ఇట్టి కిరణాలను మనకు ప్రసాదించడానికి

జర్మను సాహిత్యంలోని కొన్నిఘట్టాలు డా. వి. ఎన్‌, ళ్ళు 2357 ఇతర మతతత్త్యాలూ వున్నాయి. వాటినీ చక్కగా (గ్రహించాలి. గైెంకవి రచనల్లో ఈ వాతావరణాన్ని మనమెంతో చక్కగా చూడవచ్చు. ఈయనదోవనే క్లేడియిస్‌ అనే ఆయన నడిచాడు. ఈయనతర్వాత ఈ ధోరణిలోనే రచనకు బూనుకొన్నవాడు అఆస్పింగ్‌కవి. ఆత్మవికాసానికి జ్ఞానసంపన్నత అత్యవసరమని ఈయన ఘోషించుతూ ఎన్నో నాటకాలను రాశాడు. వీటిలో లోకపభఖ్యాతిగాంచింది నాధాన్‌ మహాజ్ఞాని అనేది. కైంస్తవులకూ. ముసల్మానులకూ, యూదులకూ ఆ కాలంలో రేగిపోతూ వున్న వైషమ్యాగ్నిని అపుచేస్తానికి లెస్సింగ్‌కవి ఈ రచనల్లో ఎంతో (ప్రయత్నించాడు. అన్ని మతాలపట్ల ఏలాగు సహనభావం అవసరమో, దాన్ని కథానాయకుడు కార్యరూపాన ఏరీతిని చూచి విజయవంతుడయ్యాడో తన నాటకాల్లో ఎంతోస్పష్టంగా చిత్రించాడు. వీలాండ్‌, బూర్గర్‌కవులూ ఈ కేవాసాధనకే తమ రచనలసు సమర్పించారు.

మరికొందరు రచయితలు విదేశీయుల మార్గాల నేమాత్రం అనుకరించకుండా, జర్మను (ప్రజాజీవితఘట్టాలను చక్కగా చిత్రించారు.

ఇట్టి రచనలమూలకంగా జర్మను సాహిత్యలక్ష్మి ఈ యుగంలో దిష్యతేజాలతో పాశ్చాత్య దేశాల్లోని సాహిత్యవీథులకు ఆదర్శమూర్తియయినదనే చెప్పవచ్చు. తద్వారా జర్మనువాజ్యయం చిరంజీవిత్వాన్నే పొందిందనీ చెప్పవచ్చు. -

తరువాతికాలంలో జర్మను సాహిత్యం నవ్యకళలతో ఏ రీతిని వికసించి జర్మను సంస్కృతి కే నూతనతేజాన్ని ప్రసాదించిందో ముందువచ్చే వ్యాసాల్లో పాఠకులకు చిత్రించడానికి నా శక్తివంతంగా ప్రయత్నంచేస్తాను. (కిన్నెర: సంప్వటము 7, సంచిక 1, జనవరి శేఫవన)

ల లను య!

హిందీ వాజ్బ్ఞయము కామాక్షి రావు

“ీళ్ఫాంది” పదము ఫారసీభాషకు చెందినది. ఫారసీభాషలో ఈ పదమున కర్థము “*హిందూదేశమునకు సంబంధించిన" అని యగును. “హిందీ” పదమునకు శబ్దార్థము హిందూ దేశస్థుడు లేక హిందూదేశపు భాష అని కావచ్చును. కాని నేడు “హింద్‌ పదము ఉత్తర హిందూస్థానపు మధ్య దేశమున వ్యవహరింపబడుచున్న ఆధునికమగు ఖడీబోలీకిని, మర్వాడీ, వ్రజ, అవధి మొదలగు ప్రాచీన వాడుకభాషలకు వాడబడుచున్నది. ప్రాచీన భాషలయిన వజ, అవధి, మైథిలి, మార్వాడీ మొదలగు భాషారూపములకు, నేడు దేశీయభాషగా అంగీకరించబడిన హిందీ రూపమునకు చాల తేడా కనబడుతుంది. కాని ఈ తేడా క్రియారూపములలోను, విభక్తిరూపములలో మాత్రమే కనబడుతుందిగాని ధాతురూపములలోగాని నామవాచకములలో గాని కనబడదు.

నేటి హిందీ భాష, ప్రాచీన హిందీభాష అపభంశములనుండి వికాసము పొందినదే. హిందీ వాజ్బ్ఞయము మొట్టమొదట దాదాపు క్రీ! శ॥ 1000న (ప్రారంభమయి నేటివరకు వృద్ధిపొందుచు సర్వవిధ సంపన్నమగు వాజ్బయముగా పరిణమించినది. ఈ 1000 సంవత్సరముల వాజ్మ్ఞయచరిత్రలోని ముఖ్యమగు పోకడలు మాత్రము చర్చించుటయే ఈ వ్యాసముయొక్క ముఖ్యోద్ధేశము. ఈ వాజ్మయమును నాలుగు ముఖ్యమగు యుగములుగా విభజించవచ్చును.

హిందీ వాజ్బ్యయము కామాక్షిరావు 2359

  1. వీరగాథలు యుగము క్రీ! శ! 1000 - 1220
  2. భక్తియుగము క్రీ! శ 1220 - 1645
  3. రీతియుగము క్రీ! శ! 1645 - 1845
  4. ఆధునిక యుగము _ శ్రీ॥ శ॥ 1845 నుండి. వీరగాథల యుగము హర్షవర్ధనుని రాజ్య మంతరించిన పిదప ఉత్తర హెందూస్థానమంతటను చిన్న చిన్న రాజ్యములు తలలఅత్తినవి. చిన్నచిన్న (ప్రాంతములకు వేరువేరు రాజు లేర్చడిరి. ఈ రాజులు తమతమ రాజ్యములను విస్తరింపజేసికొనుటకై పొరుగు రాజ్యములపై దండెత్తుచుండిరి. ఇదేగాక తమ పరాక్రమములను కనబరచి పొరుగు రాజ్యపు రాజకుమార్తెలను వివాహము చేసుకొనవలెననెడి కోరిక వారికి లస్ప్సగాయుండెను. అందువలన దేశమంతటను యుద్ధములు సహజముగ జరుగుచుండెడివి. ఆనాటి కవులు రాజానశితులైనందున, తమ ఆశయదాతల కీర్తి గానము చేయుట వారి విధియైయుండెను. రాజులకుగాని, కవులకుగాని సమగ భారతదేశమును ఒకే దృస్టితో చూచు జాతీయభావము లేకుండినది. అందువలన ఆ కాలపు కవులు తముతమ ఆశ్రయదాతల బలపరాక్రమములను గొప్పగా వర్ణించుటయందే తమ కవితా శక్తినంతను ధారపోసిరి. యుద్ధకారణములయిన రాజకుమార్తెల సౌందర్యము, వారిని వివాహము చేసకొనుటకు రాజకుమారులు చూపిన బలపరాక్రమములును కథావస్తువులుగా తీసికొని, కపులు తమ కావ్యరచన గావించెడీవారు. అందువలన ఆ కాలమున శృంగార, వీరరసభరితములైన కావ్యములు మెండుగా కనబడుచున్నవి. ఇందులో కొన్ని వీరరస గేయములు, కొన్ని వీరరస ప్రబంధరచనలు. చందవరదాయీచే రచించబడిన “పృథ్వీరాజరాసోొ యను (ప్రబంధకావ్యము చాల ప్రసిద్ధిజెందినది. హిందీ వాజయమున “పృథ్వీరాజరాసోొ ప్రథమ కావ్ధ్ణుమని ఎన్నబడుచున్నది. తమలో వఐకమత్యములేక రాజులు పరస్పరము యుద్ధములందు నిమగ్నులై యుండినందువలన [క్రమక్రమముగా రాజుల శక్తి క్షీణించుటచే మహమ్మదీయుల

2360 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము దాడి ఎక్కువైనది. మహమ్మదు గజనీ, మహమ్మదు ఘ్రోరీలు ఒకరి తర్వాత మరియుకరు హిందూదేశముపె దండయాతలు సాగించి దేశమును ఛిన్నాఖిన్నము చేసి తమ మహమ్మదీయుల రాజ్యమును స్థాపించుకొనిరి. మహమ్మదీయుల రాజ్యస్థాపనతో మహమ్మదీయుల మతమగు “ఇస్తాము” ఈ దేశమున అడుగు పెట్టినది. మతసంబంధమైన కలహములు దినదినము చెలరేగుటయేగాక, హిందూ దేవాలయములఘై దాడి ఎక్కువైనది. హిందూ దేవాలయములను రక్షించి, హిందూమతమును ఉద్ధరించగల రాజు కరువాయెను. దేశములో మహమ్మదీయుల దాడికి సహించలేని హిందువులకు భక్తవత్సలుడగు పరమాత్ముడే శరణమయ్యును. హిందూ కవుల న్యాశయించు దాత లేకపోయెను. ప్రజల కడగండ్లు దినదినమునకు ఎక్కువగుచుండెను. అటువంటి సమయమున భగవంతుని వైవుకు హిందువుల దృష్టి మరలుట సహజమే! భగవంతుడే శరణ్యమనియు, అతడే దుష్టశిక్షణ, శిష్టరక్షణ కావించి తమజాతిని కాపాడగలడను విశ్వాసము హిందువులలో

' నెలకొల్పుట చాలా అవసరమయ్యాను.

ఉత్తర హిందూస్థానములో ఆనాడు మతముల స్థితి చాల అయోమయముగా నుండెను. మతమనగా నేమి? మతమునకు, జీవితమునకు ఏదైనను సంబంధ మున్నదా? అని విచారించువారు లేకుండిరి. ఒకవైపు బౌద్ధమతప్పు వజయాని శాఖకు జెందినవారు తమ చమత్కారములను చూపి, తమ మతమే ముక్తిసాధన మనియు, వేరొకవైపు గోరఖనాథుని శిష్యులు యోగవిద్యయే ముక్తిసాధనమనియు, ఇంకొకవైపు కాపాలికులు శక్తి పూజయే ముక్తిసాధనకు తరుణోపాయమనియు (ప్రజలలో పలుకుబడి సంపాదించు కొనుచుండిరి. శంకర భగవానుల అద్వైత తత్వము పండితులకు మాత్రమే అవగాహ్యమగుటవలన అది సామాన్య జన సమూహమును తనవైపునకు ఆకర్షించజాలకపోయెను. భాగవత మతావలంబులు కులభేదముల నెక్కువ పాటించుచు, బ్రాహ్మణులకు తప్ప మిగతవారలకు వేదాధ్యయనమున కధికారము లేదనువాదము ననుసరించి, పూజలు, ఆచారములనే మతము లనుకొనుచుండిరి. ఈ సమయముననే శ్రీరామానుజాచార్యుల శిష్యకోటికి జందిన శ్రీరామానందులవారు భక్తిద్వారా మోక్షసాధనము సులభమని బోధించుటయేగాక కులమతములను పాటించక అందరిని తము శిష్క్యులుగ జసెికొనసాగిరి.

హిందీ వాబ్బయము. కామాకిరావు 2361 నిరాశాంధకారమున పడియున్న (ప్రజలకు భక్తియే శరణ్యమయ్యెను. ఇట్లు భక్తికి సంబంధించిన కావ్యరచన కాధార మేర్చ్పడెను. ఈ కాలమున పలువురు భక్తికవులు భక్తికావ్యములు రచించిరి. ఇవి 'రెండువిధములు; (])నిర్గుణ భక్తి కావ్యములు, (2) సగుణ భక్తి కావ్యములు. “కబీరు” నిర్గుణశాఖకు చెందిన కవి, భక్తుడు. మహమ్మదీయుడైనను శ్రీరామానందుల శిష్యుడై వేదవేదాంగ పురాణముల నాలకించి, వానిని అవగాహన చేసుకొన్న పరమ భాగవతోత్తముడు. భగవంతుడు నిర్ణుణుడనియు, జ్ఞానహీనమగు భక్తి ఆచారములు, కర్మలు నిరర్ధ్థకములనియు అతడు (ప్రజలకు ప్రబోధించుచుండెను. చదువురాని వాడయ్యును, అసమాన వ్రతిభాసంపన్నుడగుటచే, తన ఉపదేశములను పద్యరూపమునను, 'గేయరూపమునను చెప్పగల్గిన సమర్థుడు. కబీరు సాహిత్యము హిందీ వాజ్బియమున చాల మహత్తరమైనది. అదే సమయమున కొందజు మహమ్మదీయభక్తులు భగవంతుడు (పమస్వరూపుడనియు, తదేక నిష్టగా . భగవంతుని స్మరించుచు తపెంచుచుండిన, భగవంతుడు సాక్షాత్కరించుననియు నమ్ముచుండిరి. వీరిని “సూఫీ” లందురు. (సూఫీ లనగా జ్ఞానులని అర్థను). వీరుకూడ భగవంతుని నిర్దుణుడనే నమ్ముచుండిరి. కాని ఆనిర్గుణుని జ్ఞానభక్తి మూలమునగాక, (ట్రేమభక్తి మూలమున సాధించవచ్చునని నమ్ముచుండిరి. నిర్గుణుడు,నిరాకారుడైన భగవంతుని (శేమించడమనునది జనసామాన్యమునకు దుర్గాహ్యమగు విషయము. అందువలన తమ సిద్ధాంతమును సాధారణ ప్రజలకు అర్థమగునట్లు (ప్రేయసీ ప్రియుల (ప్రేమ రూపకములద్వారా బోధించుచుండిరి. (ప్రేయసికొజకు ప్రియు డెట్లు తపించి, కష్టించి ఏవిధముగా తన (ప్రేయసి (ప్రేమకు పృాతుడగునో అదేవిధముగా ఆత్మ పరమాత్మల సంబంధము దాంపత్య గేమవంటిదనియు, ఆత్మ పరమాత్మ కై తపించిన, పరమాత్ముని పాందగలదని వారి వాదము. చాలమంది మహమ్మదీయకవులు హిందూ దేశపు జానపద (యేమగాథలద్వారా ఈ వాదమును ధ్వనింపజేయు కావ్యములు వ్రాసిరి. ఆ కావ్యములందు మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ వ్రాసిన “పద్మావతి” అను ప్రబంధకావ్యము చాల ప్రసిద్ధి జెందినది. సగుణభక్తి కావ్యములు "రండు విధములు

  • రామభక్తి కావ్యములు, కృష్ణ భక్తి కావ్యములు. శ్రీరాముని తన “ఇష్ట దేవత"”గా

2362 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము నమ్ముకొని కావ్యరచన గావించినవారిలో శ్రేష్టుడు భక్త తులసీదాసు. తులసీదాసుని అమరకావ్యములు మూడు - రామ చరితమానస్‌ ( రామాయణము), కవితావళలి (రామాయణ కావ్యమే, ముక్తకరూపమును, వినయ పత్రిక (భక్తి సంబంధమైన గేయ సంగ్రహము). ఇవిగాక తులసీదాసు రచించిన [గ్రంథములు 10 వేరుగా

॥ నున్నవి. హిందీ వాజ్బాయములో తులసీదాసు రామాయణమునకు ఆంధ్రమున మహాభారతమునకున్న స్థానము కలదు.

కృష్ణభక్తి కావ్యములు. అనేకులు రచించిరికాని అందు భక్త సూరదాసు అగ్రగణ్యుడు. సూరదాసు అంధుడని (పతీతి. అతడు కృష్ణుని తన “ఇష్ట దేవత"గా భావించుకొని భాగవత పురాణపు దశమస్కంధమునందలి కృష్ణచరిత్రను గేయరూపమున గానముచేసెను.

అతడు రచించిన గేయములు దాదాపు నాలుగైదువేలవరకు ఇప్పుడు లభించుచున్నవి. భక్తిరసవూర్జమగు సూరదాసు హృదయావేశము అందలి పతి గేయమునందును ప్రతిబింబించుచున్నది. అందు కృష్ణలీలలు, భమరగీతలు హిందీ వాజ్బయమునకు వన్నె తెచ్చు రత్నాభరణములు.

ఈ భక్తి కాలమున సర్వగుణ సంపన్నమగు సాహిత్య సంపద ఊ3పఎంపాొందుటకు అవకాశము కలిగియుండినందున భక్తి యుగము హిందీ వాజ్బియమున స్వర్ణయుగమని ప్రసిద్ధికెక్కినది. రీతి యుగము

క్రీ॥ శ॥ 1645 సరికి దేశమున మహమ్మదీయ రాజ్యము బలపడి శాంతి ఏర్పడియుండెను. ఉత్తర హిందూ స్థానమునందలి రాజపుత్ర రాజులు మొగలుల సామంతులై తమతమ రాజ్యములందు జీవితమును విలాసముగ గడుపుచుండిరి. (ప్రజల మధ్య వర్ధిల్లుచుండిన కవితాకన్య మరల రాజదర్చారుల నాశ్రయించెను. (ప్రతి రాజు దర్చారునందు కవులు ఆశయము పొందజొచ్చిరి. ఇట్లు సాహిత్యముకు

సామాన్యజనముతో సంపర్కము తక్కువయ్యెను. కవుల హృదయములను ఆందోళన గావించునట్టి పరిస్థితులు లేకపోయెను. ఇంతవరకు కృష్ణభక్తి సాహిత్యము ప్రజలను

హిందీ వాజ్మయము.. కామూక్షిరావు 2363 ఆనంద పరవశులుగా చేయుటలో చాల సఫలమై యుండెను. రాధాకృష్ణుల (పేమగాథను భక్తకవులు వాసనారహితముగా విశుద్ధ (ేమపూర్ణమగు హృదయముతో ఇంతవరకు గానము చేసియుండిరికాని, రీతికాలమందలి కవులు రాధాకృష్ణుల [ప్రేమను అడే దృష్టితో చూడలేకపోయిరి. రాధాకృష్ణులు వారికి సాధారణమగు నాయక నాయికలవల కనబడిరి. ఇప్పటివరకు కవులకు సంస్కృతలక్షణ (గ్రంథములే తమ కావ్యరచనకు తోడ్పడుచుండెడివి. హిందీభాషలో లక్షణ[గ్రంథములు ఇంతవరకు రచియింపబడి యుండలేదు. సాధారణముగ అక్ష్య్య్య్మగంథములు ఆవిర్భవించి తరువాతనే లక్షణ్మగంథముల నిర్మాణము జరుగుచుండును. అదేవిధముగ హిందీ సాహెత్యమునందు ఇంతవరకు అసంఖ్యములగు లక్ష ్య(గంథవులు పెలువడియుండెను. లక్షణ్యగంథరచనకు అవసరము, అవకాశము ఇప్పుడు కలిగినది. రసములలో శృంగారము “రసరా” జని పిలువబడుట లోకవిదితమే. ఆ శృంగారరస నిర్వచనము, నాయక నాయికాభేదములు, అలంకార లక్షణములు మొదలగు కావ్యాంగములను లక్ష్య సహితముగ నిర్వచించుట ఈ కాలపు కవుల వబభ్యోద్దేశవంయ్యెను. ఇందువలన కవులు తవు ఆశ్రయదాతలను ('ప్రశంసించుటయేగాక రీత్మిగంథములను కూడ నిర్మింపగల్లిరి. ఈ కాలపు కపులలో పలువురు ఇట్టి కావ్యాంగ నిర్వచనమున కనర్హులయ్యును, ఈ పద్ధతినే అనుసరించి కావ్యములను రచించిసాగిరి. “నరస భూపాలీయము” వంటి కృతులన్నియో వెలువడెను. రీతికాలపు కవితయంతయు ముక్తరూపముననే కనబడుచున్నది. కొందజుకవులు రసములను మాత్రము నిర్వచించిరి. మజికొందరు రసాలంకార ఛందస్సులను లక్ష్యసహితముగా నిర్వ్యచించిరి. ప్రబంధకావ్యమనదగ్గ ఒక రచనమైనను ఈ కాలమున కనపడదు. ఈ కాలపు కవులలో “బిహారీలాలు, . “భూషణుడు” ముఖ్యులు. బిహారీలాలు “ఆర్యాసవ్లశతొని, “గాథా సప్తశహొని ఆధారము గావించుకొని “బిహారీ సప్తశతి యను శృంగార రసభూయిష్టమైన మహోత్కృష్ట (గ్రంథమును రచించెను. ఇతనితరువాత పేర్కొనదగినవారు “భూషణకవి". ఈతడు శివాజీ శౌర్యమును తనకావ్యమున కాధారముచేసుకొని వీరరసభరితములైన పద్యములను రచించెను.

2364 పండిరి మల్షికార్డుసరావ్వు శతజయంతి సంపుటము శే: సాహిత్యము ఆధునిక యుగము (క్రీ॥ శ॥ 1845 నాటికి హిందూ దేశమున ఆంగ్లసామాజ్యము సుస్థిరముగా స్థాపింపబడెను. ఇంతవరకు ఉత్తరహిందూస్థానమున “ఉర్దూ” భాష కచేరీలలోను, పద్య రచనకు [వజభాషయును ఉపయోగింపబడుచుండెడివి. ఉత్తర హిందుస్థానమున సామాన్యజన వాడుకభాష (ప్రాంతప్రాంతమున వేరువేరుగా యుండెను. పాఠశాలలో ఇంగ్లీషుతో “ఫారసీ బోధింపబడుచుండినది. ఉత్తర భారతదేశవముంతట అర్థము చేసుకొనబడుచున్న “ఖడీబోలీ” యొక్క గద్యవికాసమునకు అవ కాశవే. లేకుండెను. దానికి పాఠశాలలలోకాని, సాహిత్యమునందుకాని స్థానము లేకుండెను. ఈ సమస్య హందువులను చాల కలవర పపెట్టుచుండెను. హాందూదేశమున ము[దణాలయములు స్థాపెంపబడిన తరువాత క్రమముగా “ఖడీబోలొ గద్య వికాసమునకు అవకాశ మేర్చడెను.“ఖడీబోలొ గద్యమునకు ఒక రూప మేర్ప్చరుచుటలో ఇంగ్లీషు మిషనరీలు చేసినసేవ అపారము. వారికి తమ “బైబిలును దేశభాషలో అనువదించవలసి వచ్చినపుడు వారు “ఖడీబోలో గద్యములోనే బైబిలును అనువాదముచేయించిరి. ఇదియేగాక కలకత్తా నగరములోని “పోర్టు విలియమ్‌"కాలేజీ అధ్వర్యమున “ఖడీబోలొ గద్యములో [గ్రంథ రచనకు అవకాశము ఏర్పడెను. ఇట్లు క్రీ! శ॥ 1860 ప్రాంతమున ఈనాడు దేశీయభాష యగు హిందీగద్యమునకు రూపమేర్పడెను. అటుతరువాత ఈ “ఖడీబోలీిని పాఠశాలలలో బోధనా విషయముగా పవేశింపజేసి వార్తాపత్రికలలోను, కచేరీలలోను దీనికి అవకాశము కలిగింపజేసి అన్ని విధముల దానివికాసమునకు తోడ్పడిన సంస్థ “కాశీ నాగర్‌ ప్రచారణిసభా. ఈ సభ ఆధ్వర్యమున మొట్టమొదట గబ్బకోశము, వ్యాకరణము వ్రాయబడినవి. అటు తరువాత ఈ ఖడీబోలీనే పద్య గద్య సాహిత్యవమనందుకూడే (పవేశింపజేయుటికు [ప్రయత్నముజీసినవాడు “భారతేందు హరిశ్చందుడు” భారతేందు హరిశ్చందుడు నవ్య వాజ్మయవ్యాప్తికి మూలపురుషుడు. తెలుగున “వీరేశలింగంపంతుల” వంటివారు. గద్య రూపమును చక్కదిద్ది నాటకం, నవల మొదలగు గద్య ప్రవృత్తులను ప్రారంభించి, హిందీ భాషకు అమూల్యమైన సేవ చేసిన వ్యక్తి. అటుపిమ్మట హిందీ వాజయమునందలి విభిన్న (ప్రవృత్తులను వేరు వేరుగా చర్చించుట సమంజసము.

హిందీ వాజ్యయము . కామాక్షిరావు 2365 నవలలు, చిన్నకథలు క్రీ! శ॥ 1870 ప్రాంతమున నవలలు, కథల రచన 'ప్రారంభమయినది. మొదట ఇవి హఠాత్సన్నివేశములతో గూడి ఉపదేశాత్మకమై యుండెను. కొందజు సంఘ సంస్కారముల నుద్దేశించి కథలను, నవలలను వాయుచుండిరి. మజికొందజు పూర్వాచార పరాయణులై పూర్వాచారముల అధోోగతిని నిరసించి, తమ నిరసన కథలమూలమున ఆలుపుచుండిరి. అటుపిమ్మట ఘటనా చాతుర్యము కల నవలలు, “డిటెక్టివ్‌” నవలలు వెలువడినవి. వీటితరువాత ఈ కథా సాహిత్యపు రంగములో గొప్ప మార్పు గల్లినది. దాదాపు క్రీ! శ॥ 1920 నాటికి హిందీ సాహిత్యములో ఒక గొప్ప కళాకారుడు అవతరించినాడు. ఆతనిపేరు *పేమ్‌చంద్‌". _పేమ్‌చందు తన కథలలో ఎన్నియో సంఘ విషయములకు, దేశభక్తికి స్థానమిచ్చిః కథారచనను (కొత్తమార్గమున నడిపించినాడు. అతడు తన పాత్రల శీలమును చిత్రించుటలో అద్భుతమైన కౌశలమును చూపించినాడు. అతని తరువాత నవలా సాహిత్యము, కథాసాహిత్యము ఆన్నులు లేకుండ వృద్ధిజందినవి. ఆంగ్లభాష సాహిత్యప్రభాపము, బంగాలీ సాహిత్య ప్రభావముగూడ చాలవరకు హిందీ కథా సాహిత్యముమీద పడినది. ఈనాడు కథారచయితలు తమ కథలలో పాత్రలశీలమును చిత్రించునపుడు మనస్తత్త్వశాస్త్రృమున కనుకూలముగ చిత్రించి, మనస్సునందు పరిపరివిధములుగ పరిడవిల్లు [ప్రవృత్తులను మనోహరముగా చిత్రింపగలుగుచున్నారు. కొందజు రచయితల'పై “౯2౭౮66 ప్రభావము స్పష్టముగ కనబడుచున్నది. నాటకములు నాటకరచనకూడ దాదాపు క్రీ!శ11870 ప్రాంతమున (ప్రారంభమయ్యెను. మొదట నాటకములు గద్యపద్యమయములై యుండెను. అందు పాశ్చాత్య నాటకపభావము, సంస్కృత నాటకప్రభాపము స్పష్టముగ కసబడుచున్నవి. నాంది, (పస్తావన మొదలగు నాటకాంగములు ఇండు కనబడుచున్నని. నాటకవస్తువు పారాణికముగాని, చార్మితకముగాని అగుచుండెడిది. (క్రమక్రమముగా ఈ నాటకరచసలో వికాసముకలిగెను. బెంగాలీ సుండి స్కుపసెద్ధ నాటకరచయిత యగు"ద్విజేండ్రలాల్‌ రాయ్‌" నాటకములు, “షేక్‌స్పియర్‌ నాటకములు హిందీలోకి అనువదింపబడెను. క్రీశ! 1920 వాటికి నాటకరచనలో అద్భుతమైన మార్పు

2366 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కల్గినది. జయశంకర (ప్రసాదు తననాటకములద్వారా నాటక సాహిత్యమునండు గొప్ప అభ్యుదయము గావించెను. అతని నాటక శైలి ఉత్కృష్టమైనది. పాత్రపోషణమునందు అద్భుతమైన కౌశలమును చూపిన గొప్ప కళావేత్త ఇతడే. ఇతనితరువాత పలువురు సాంఘిక నాటకములను అత్యుత్తమమైన పద్ధతిని (వాయదొడగిరి. కొందజు నాటకకారులపై “ఇబ్‌సన్‌”, “బర్నార్ట్‌షా” ప్రభావము స్పష్టముగా కనబడుచున్నది. ఈనాడు పెద్ద పెద్ద నాటకములకు హిందీలో ఎక్కువస్థానములేదు. ఏకాంకికలు విరివిగ వాయబడుచున్నవి. సమీక్ష

సమీక్షా సాహిత్యము హిందీలో వృద్ధిచెందినంత భారతీయ భాషలలో మరియేభాషలందు వృద్ధిజందలేదనుట అత్యుక్తి కాదు. ప్రాచీనకవులనుండి నేటివరకు హిందీ సాహిత్యమునందలి కవులు నవలారచయితలయొక్క కృతులను నిష్పాక్షికముగను, శాస్త్రీయపద్ధతిని విమర్శించి వారికృతుల బాగోగులను వెల్లడించుటకు చాలమంది సమీక్షకులు కృషిచేసియున్నారు. మాసప(త్రికలందు వలువడు విమర్శనలేగాక (పతి కవికృతులను విమర్శించుచు వ్రాసిన గ్రంథములు వందలకొలది యున్నవి. ఈ సమీక్షను శాస్త్రీయపద్ధతులపై (పపారంభించినవారు “రామచంద్ర శుక్లొ అను ప్రతిభా సంపన్నుడు. అతనిని ఆదర్శముగా తీసుకొని అతని శిష్యకోటికి చెందినవారెగాక చాలమంది ఇతరపండితులుకూడ సమీక్షా సాహిత్యమును అత్యద్భుతముగ వృద్ధిచేయుచున్నారు. కావ్యరచన

ఆధునికయుగమున, దేశములో అన్ని భాషలలో వతి హిందీలోకూడ నవ్యకవిత్వము (పపారంభమయినది. నవ్యకవిత్వము (పపారంభమగుటకుముందు సంధికాలములో కొన్ని ప్రబంధ కావ్యములు రచింపబడినవి. ఈ కావ్యములలో నవ్య కవిత్వపు బీజములు కనబడుచున్నవి. ప్రకృతిపట్ల ఒక విశిష్టమైన దృష్టి కవుల కేర్పడినది. ఆ కాలమునకు దేశమంతట ఇంగ్లీషు సాహిత్యము ప్రాకినది. “వర్చువర్తు" “కీట్సు” “షెల్లో మొదలగు ప్రసిద్ధ ఆంగ్లేయకవుల రచనల ప్రభావము

యువకహృదయములమీద [క్రమక్రమముగా పడసాగినది. దేశములో దుర్భరమైన

హిందీ వాజయము కామాక్షిరావు 2367 బీదతనము, మనుష్యుని జీవితసంఘర్హ్షణ, వ్యక్తి స్వాతంత్య్య భావము ఇవన్నియు యువకుల హృదయాలను ఆందోళనపరచినవి. కవి తనభావాలకు ఎక్కువ (పాధాన్యమివ్యడము [ప్రారంభించినాడు. (ప్రకృతిని దర్శించినపుడు తన మనస్సునందు కలుగు భావములను పద్యరూపమున (ప్రకటించుటకు అతడు (్రయత్నించినాడు. ఇట్టి ప్రయత్న ఫలితముగ నవ్యకావ్యములలో రెండు విధములైన కావ్యములు బయలుదేజెను. అవి :

  1. ఛాయావాద కావ్యము, చై. రహస్యవాద కావ్యము

ప్రకృతిని చూచినపుడు కవి ప్రకృతియందు ఒకవిధమగు చైతన్యము ననుభవించి ప్రకృతికూడ తనవంటిదేనని భావించి ప్రకృతిపట్ల ఆత్మీయతను వాలిబుచ్చు కవితలు ఛాయావాద కావ్యములుగ పరిగణింపబడుచున్నవి.

(పప్రకృతియందు అలౌకిక సౌందర్యమును చూచుటయో లేక రమణీయమగు (ప్రకృతినే విశ్వాత్మయొక్క (పతిబింబమని భావించుటయో రహస్య వాదమని పిలవబడుచున్నది. దీనితోబాటు కవి తన భావాలోకపు సుందరిని ఊహించుకొని వాసిన కవిత్వములుకూడ ఆ కాలమున ఎక్కువగనుండినవి. ఈ కావ్యములకు వస్తువు అంత (పధానముకాదు. భావముల లాలిత్యము, అట్టి భావములను వ్యక్తపరచు హృదయస్పర్శమగు శెలిసౌందర్యము (ప్రధానములు. ఇట్టి నవ్యసాహిత్యమున కవులు తమ అద్భుతమైన భావనాశక్తిని, కల్పనాశక్తిని ప్రదర్శించి కొన్ని అమరకృతులను నిర్మించినారు, అట్టికృతులలో “జయశంకరప్రసాదూచే రచింపబడిన | “కామాయనీ” అను మహాకావ్యము విశ్వసాహిత్యమున (ప్రథమస్థానము పొందుటకు యోగ్యమైనది. క్రమక్రమముగా కవులు ప్రకృతి నారాధించుట వదలి తమ స్వప్నలోకమును త్యజించి సంఘమువైపు దృష్టిని మరల్చినారు. సంఘములోని దుర్భరమగు జీవితము, పొట్టబోసికొనుటకు పడు (ప్రజలకష్టములు, వారి కన్నీటిధారలు, సంఘమునందు ప్రబలియున్న మత కులద్వేషమున కాహుతి యగు నట్టి ప్రజాదుఃఖము కవులకు కావ్యవస్తు వైనది. ధనవంతుడు, ధనహీనుడు అను భేదములను రూపుమాపి వర్గరహితమైన సంఘ నిర్మాణమే మానవజాతికి (ేయస్సును చేకూర్చునని విశ్వసించి ఈనాడు కొందజుకవులు అటువంటి

2368 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము భావములను తవు కావ్యముల౦దు కనబరచుచున్నారు. ఇట్టికవులను “పగతివాదులు ” అందురు. వీరే కాకుండ మజికొందజు కవులు మానవుని అర్ధచేతనావస్థను చిితించుటలో తమ (ప్రావీణ్యము చూపుచున్నారు.

ఇట్లు హిందీ వాజ్బయము దినదిన(ప్రవర్ధమాన మగుచున్నది. దేశమునందలి వివిధభాషల సహకారముతో హిందీ జాతీయసాహిత్య నిర్మాణము చేయగల్లునని విశ్వసించవచ్చును. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1, జనవరి 1955)

00 గి

  • స్య ాటో

ఆంధ్ర వచన సారస్వత స్వరూపము బొజ్జా రాధాకృష్ణమూర్తి ఒల్లో ౦౪ద్యము భావప్రధానము. గద్యము వివరణ (ప్రధానము. భావమును సహృదయుడు తన సంస్కారబలమున హృదయమునందు సాక్షాత్కరింప జేసికొని రసానందము పొందును, వివరణ మాతని మనస్సునకు సూటిగ తగిలి తర్కబలము నాపాదించును. విశ్వ సాహిత్యమందలి గద్యపద్యములకు ఈ విభిన్నత కన్పట్టును. ఆంధ సాహిత్యమందును పద్యము, గద్యము ఈ భేదము ననుసరించియే వృద్ధిగాంచినవి. సాహిత్యము నవనవోన్న్మేష చైతన్యస్రవంతి. అది లోకపృత్తమునకు ప్రతిబింబము. ఆ లోకవృత్తమే నిరంతరము మానవహృదయముల రసార్జ్ర మొనరించును. లోకవృత్తమును పఠితల కందించుటలో ననేకరీతులు గలవు. వానిలో పద్యము, వచనము ముఖ్యములు. పద్యము కవి హృదయాచేశమునుండి యుద్భృవించిన రాగతాళములు గల మాట. వచనము లోకమును నిష్పాక్షికదృష్టితో పరిశీలించి వివరించిన తాత్వికుని మనసునందలి యూట. వచనరచనకు నిర్మలమైన మనస్సు కావలెను. పద్యము రచించువాడు (శ్రేమికుడు. వాని వస్తువునెడ వానికి పాక్షికత జనించును. పద్యము నర్థముచేసికొనుటకు భాషాజ్ఞానము చాలదు. భూతకాలమందలి స్వకీయానుభూతు అవసరము. వచన మటుల కాదు. అది సర్వులకు సర్వకాలములందు సుగ్రాహ్యమై వెలయు నుదాత్త సారస్వతము. కావ్యశబ్దము పద్యగద్యములయెడ నన్వర్థము. కాని పద్యములో వ్యంగ్యమున్నది. ఆలంకారికధ్వని యున్నది. అది వచనములో లేదు. వచనములో వాచ్యార్థమే సందరి మల్లికార్టునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

2370 పందిరి మళ్లికార్డునరాపు శతజయంతి పంపుటము 4: సాహిత్యము (ప్రధానమీ. పద్యము గద్యముకన్నను ప్రాచీనమైన సాహితీశాఖ. వాల్మీకికవి శోకము క్లోకరూపమును మాత్రమే పొందినది. అది యావేశజన్యము. అది శోకానుభూతితో (దవించిన హృదయమునుండి జాలువారిన సెలయేరు. కాని మానవుని బుద్ధి నిశితముగ (ప్రసరించినపుడు వెలువడిన కవిత వచనమగును.. బుద్ధి నిశితముగ (పసరించుటకు ముందు ఆవేశము కల్గితీరవలయును. అందువలన గద్యము కన్నను పద్యమే ప్రాచీనము. 521006౧/ అనినాడు : *[1$ &80గ40100గగా౦గ ౫0౦6 01 ॥18/20/ ౧1౩1౦౧/ ౬1 ౪౪౧56 158 &|4/2)/5 0166 (౧౭౧ ౧౧౦9౭ 2౧౮6 1౧ 1౧6 0856 0 గొం91 116/౧2[60/౧659 - +6౪90601410/ గ౧౦౮6/౧౧ ౦0౧౪౪9 ౨ |1 13 21గ౦951 69౧౦౧౩౧290 50-” నేటి కాలమున గద్యము, వచనము పర్యాయ పదములు. కాని, నన్నయ నాటికి గద్యము, వచనము విభిన్నార్థ (పతి పాదకములు. గద్యమన్న ఆశ్వాసాంతమున కవి తన వంశ వర్ణనమునకు, తానా ఆశ్వాసమునందు రచించిన కథాభాగ సూచనకు వాడిన, శబ్దాలంకార సమాస భూయిష్ట రచన. వచనమన్న కథా సంవిధానమునకు, తత్త్వ వివరణకు, ప్యాతల విపుల మనస్తత్త్వ వర్జనకు కవి వాడిన లలితమైన పదముల కూర్చు. గద్యలలో వృత్తములందువలె లక్షణ భేదము గలదు. వచనములం దా భేదము కన్పించదు. | నన్నయకు పూర్వమున్న వివిధ శాసనములందు నెక్కువ భాగము గద్య మయములే. కాని వానియందు తెలుగు పదములు చాల తక్కువ. అక్షరములు వాయు [క్రమము సంస్కృత పద్ధతి ననుసరించి యున్నది. సమాస పూర్ణములైన శాసనములలో తెలుగు వచన రచనాభివృద్ధి కన్పించదు. కావున నన్నయతో నాంధ్ర గద్యము రూపకల్పన పొందినదని చెప్పవలయును. నన్నయ గద్యగాని వచనముగాని శబ్దాలంకార భూయిష్టము కాదు. ఆయన రచించిన యాశ్వాసాంత గద్య నేటి యచ్చు ఏ పుస్తకములందలి విషయసూచికవల సుబోధకమై వాలయుచున్నది. నన్నయ వచనమును కథా ప్రయోజనమునకు వాడినాడు. ఆయనగారి యాత్మీయత వచనమునందుకూడ స్ప్ఫురించును. శబ్దాలంకార మాయన వచనముల నంటలెదు. కేవల వివరణ మాత్రమై నన్నయ వచనము భాసిల్లినది. అందువలన నన్నయ పద్య రచనకు వినియోగించిన బుద్ధి వినేషమును వచనమునెడ కూడ జూపినాడని తలంచవలను. నన్నయ శైలి పౌరాణికము ($1/21/9) రెండు పద్యముల మధ్య పాతా సూచ్యార్థము వచనమందు నన్నయ వాడియున్నాడు. ఈ విధమగు

ఆంధ్ర వచన సారస్వత స్వరూపము _బొజా రాధాకృష్ణమూర్తి 2371 వచన పరమ (ప్రయోజనము నన్నయలో సిద్ధి పొందినది. కాని జాతీయత నాత్మీయతగా గల్గిన తిక్కనలో యీ విశిష్టత కన్చించలేదు. ఆయన గద్యలు నన్నయ గద్యలవలె లేవు. అనుప్రాసాలంకారము, తాళ ప్రధానము నై తిక్కన గద్య నడచినది. తిక్కన వచన శైలిలో సంభాషణా శిల్పము మెరయుచున్నది. నన్నయలో, ఆఖ్యానాత్మక వచనశైలి తిక్కనలో సంభాషణా వచన లి ఎజ్జనలో భావ వివరణ శైలి గలదని విమర్శకాఖ్మిప్రాయము.

“ఆరూడఢ గద్యపద్యాది (ప్రబంధ పూరిత సంస్కృత భూయిస్టరచన

మానుగా సర్వసామాన్యంబుగామి జానుతెనుంగు ప్రసన్నతకు...” అని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో వ్రాసినాడు. మరియు నాతడు బసవపురాణమునందు -

“ఉరుతరగద్యపద్యోక్తులకంటె సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా

సర్వసామాన్యమగుట” = అని వ్రాసినాడు.

ఈ మాటలవలన సోమనాథునికి పూర్వమే సంస్కృత భూయిష్ట వచనరచన గలదనియు, నయ్యది శబ్దాలంకారాదులతో నిండియుంట సామాన్య (పజాళికి (ప్రయోజనకారి గాదనియు చెప్పగలము. సోమనాథుని కాలమునాటి కే “గద్య” యను కావ్య విభాగము గలదనియు, అది పద్యమునకు, వచనమునకు సరిపోనిదై విభిన్నరీతిని రచింపబడెననియు, శైవసాహిత్య సృష్టికి నాటి యీ “ఉరుతర గద్యపద్యోక్తులు"” కారణములనియు చెప్పగలము. ఆనాడే కాదు. పందొమ్మిదవ శతాబ్దము చివరివరకు నాంధ సాహిత్యమ్నుపై సంస్కృతభాషా (ప్రభావము విపరీతముగ (్రసరించినది. అది భాష కనర్థము గల్గించినదని యనరాదు. కాని భాషను సంస్కృత పండితుల చేతిలో పెట్టిన దీ ప్రభావమే. దేవభాషకు సహజ సౌందర్యము నాపాదించు అనుప్రాసాది శబ్దాలంకారములు మన వచన వాజ్మయ జాతీయతత్త్యమును హరించినవి. అదియే శైవకవులు గుర్తించి చక్కదిద్దుటకు (బయత్నించినారు. కాని కట్టలు (ఆంచుకొని దేశముపై ప్రవహించు సంస్కృతభాషా (ప్రవాహము నాప వారికి శక్యముకాలేదు. వారి గ్రంథములు సెతమా (ప్రవాహవశమున నశించినవి. పర్తమానకాలమున మరల జన్మించినవి. "

2372 పందిరి మల్తికార్టునరావ్వు శతజయంతి. వంవుబము. 42 సాహిత్యము

సంస్క్యృతభాషా సంప్రదాయముల ననుసరించి తెలుగులో జన్మించిన వచన పాడుట కనువైన గద్యలున్నవి. అవి “సింహగిరి నరహరి వచనములు", “శరగోప విన్నపములు మున్నగునవి. ఇవి పదునేనవ శతాబ్ది మధ్యకాలమునండలి వని రచనలు పాడుట కనువై యున్నవి.

పురాణములలో సత్ర మున్నది. కాని ప్రబంధములందు సత్యమునకు మెరుగులు డిడ్దిన సత్మ సౌందర్య మున్నడి. ప్పురాణ ై€కి, ప్రబంధ శైలికి - పురాణ వర్ణనలకు, ప్రబంధ వర్ణనలకు భేద మున్నడి. పురాణములలో వివరణము మెండు. ప్రబంధములలో వివరణమును బంధించి మెలికలు ్రిప్పిచేయుచు పాఠక హృదయములలో సంచలనము కల్గించు వర్ణనలు మెండు. ఈ భేడమె పురాణ వచనమునకు, ప్రబంధ వచనమునకు గలదు. మార్కండేయ పురాణ మండలి (ప్రవరుని స్వరూపము వేరు; మనుచరిత్ర యందలి ప్రవరుడు చేరు. పురాణ వచనము లలితమై, హృదయంగమమై కథతోపాటు నడచినది. ప్రబంధ గద్యము స్వాతంత్య్యుతా విరహితము. సుడీర్హములైన వాక్యములు దరిలేని సాగరములవలె సాగినవి, కాని ఆంధ్ర భాగవతము ప్పురాణమైనను, శ్రీనాథుని కాలమునందలి రచనయగుట వచనతైలి పురాణరీతికి భిన్నముగ నున్నది. భాగవతమందలి వచనము వృక్షలతా భీకర మృగసంయుత మహానగమువోలె నుండును. పద్యములందలి సరళత నాస్వాదించిన పాఠకుడు ఈ మహా పర్వతము నతి శ్రమావలంబనమున నథిరోహించి తీరవలయును. ప్రబంధ రీతిలో న్‌ విధముగ వచనము కుంటువడి కథాగమనమును కుంటువడ జేసినది.

ప్రబంధ కవితకు సర్వోపకరణముల నందించిన మహాకవి సార్వభౌముడు శ్రీనాథుడు వచన రచనలో తన బుద్ధి సూక్ష్మతను చాటినాడు. ఆయన హార్ద వైష ధాంధ్రానువాద మిందులకు తార్కాణము. నైషథ క్లోకపరివర్తనతో నీయబడిన వచన మిందుల కుదాహరణము. పెద్ద భావముల ప్రస్తరించునపుడు డ్రీనాథుడు వచనము వాడినాడు. శ్రీనాథుని వచనము కఠినమైనను, సందర్భోచితముగ నుంట మెచ్చడదగినది. పద్యమునం దిముడని భావములను సంస్కృత శబ్ద

ఆంధ్ర వచన పారస్యత స్వరూపము బొజ్జా రాధాకృష్ణమూర్తి 2373 పూర్ణ వచనమునందు శ్రీనాథుడు జొప్పించి వచన పరమ ప్రయోజనమును ఆల్పినాడు. ,

శ్రీనాథుని వచన రచనారీతులు తరువాతివా రనుసరించిరి. పిల్లలమళ్టి పెన వీరభదుడు శాకుంతలానువాదమునందు తన వచన శైలిని శ్రీనాథునినుండి పొందినాడు. ఇక ప్రబంధము లవతరించినవి. వానిలోని పద్యములు చాలవరకు సంస్కృత పదమయములు. అట్టి యెడ వచనములుకూడ నా స్థితిని పొందినవి. లేకున్న రచనలో నెగుడు దిగుడు లేర్చడునని ప్రబంధ కవుల భావమేమోా? వసుచరిత్రయందు, మనుచరితయందును నాంధ్ర వచన స్వరూపము లేనేలేదు. అది రాయలవారి ఆముక్తమాల్యదలో నున్నది. పింగళి సూరన యల్లిన “కలాపూర్జోదయమునం దున్నది. రాయలవారు తాత్వికులు. ఆయనకు ప్రతి విషయమునందు చొరబడి దానిని సాంతముగ పరిశీలించువరకు నిద్రపట్టదు. పరిశీలించిన యనంతరము (ప్రజలకు తద్య్విషయమై, సర్వ విషయముల తెల్పువరకు వ్మిశమించడు. ఆయన వచనములో రచించిన తత్త సంప్రదాయ పర్ణన, ముఖ్యముగా విశిష్టాద్యైతమును బోధించిన మాలదాసరి - (బహ్మరాక్షస కథయందలి వచనము చెప్పదగ్గదిది. ఇక పింగళి సూరన పలనాటివీర చరిత్రను కథగా జప్పు “పిచ్చి గుంటల” వానివంటివాడు. ఆయన వచనమును కథాగమనమునకు తగిల్చి దానిని పరువెత్తించినాడు. చతుర్ముఖునితో శారదాదేవి జరిపిన శృంగార కలాపమే కావ్య జన్మ హేతువు. ఈ (ప్రణయ కార్యకలాపము నాతడు వచనములో నైదవ యాశ్వాసమునందు జప్పించి పాఠకులను విస్మితుల నొనరించినాడు.

“పాండురంగ విభుని పద గుంభనము పచనమునందును గలదు. తెనాలి రామకృష్ణుడు తక్కిన ప్రబంధకవుల మార్గమును విడిచి మురారివలె కావ్య మొనరించెనుగాన ఆతని వచన రచనసయు ప్రత్యేక మార్గమును దొక్కినది. వాతావరణమును ప్యాతకు విప్పి చెప్పునెడల నీతడు నిగమశర్మోపాఖ్యానమున వచనమును వాడినాడు. ఇతని వచనశైలి మాత్రము ఆ యడ విశిష్ట మార్గమున నడచినది.

పిల్లవసుచరి్య(త లుద్భవించిన దక్షిణాంధ సారస్వత యుగము ప్రసిద్ధులైన సాహితీ చరితకారులకు “కీణయుగో మైనను ఆంధ్రవచన వాజ్మయాభివృద్ధి క్రీ యుగము దోహదమొనరించినది. వచన వాజ్బయమే కాదు, కవి హృదయము

2374 పండిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము (పప్రస్ఫుటముగ భాసిల్లి, స్వాతంత్యుము సారస్వతములో సంపూర్ణముగ నీ యుగమందే ప్రవేశించినది. వచనమువంకకు ప్రజాహృదయ సుప్తభావములు పరుగిడిన దీ యుగమునందే. ఈ చైతన్యమును నాటిరాజులు, రాజాశ్రయము నందిన సారస్యతేయులు గుర్తించినారు. ఈ యుగమునందు మరువరాని తెలుగు రచయితలు గలరు. వారిలో మొదటివాడు సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు; 'రండవవాడు విజయరంగ చొక్కనాథ భూపతి. విజయరంగ చొక్కనాథుడు రాయల వంటి రాజు. మధురనేలుచు, కావ్యముల వచనములో రచించినాడు. సముఖము వేంకటకృష్ణప్ప తదాశితుడు. ఈతని [గ్రంథములైన జైెమినిభారతము, సారంగధర చరిత్రము నేడు ప్రసిద్ధములు. ఈ కవి శైలి చిన్నయసూరి శైలికి మెరుగులుదిద్ధినది. ప్రాచీన వచన శైలులకు చాలనవ్యము. ఈతని (గగ్రంథమునందు సామెతలు జాతీయతకు దోహదమొసంగును. కళువె వీరరాజు, అతని కుమారుడు నంజరాజు వచన కావ్యముల రచించిరి. ఈ మహా సంచలనమును బట్టి చూడ దక్షిణాంధ్ర రాజ్యమునందు, భారతాది పురాణములను సర్వులకు నందించ యత్నము జరిగినది. (ప్రఖ్యాతమైన వచనములో వ్యావహారికము నాడు గలదు. “రాయవాచకిమనబడు సామంతుని దినచర్య ఈ కాలమునాటిదే. అందు నాటి వ్యావహారిక వచన స్వరూపము విదితము. పుష్పగిరి తిమ్మన ఈకాలమునందు భాగవతమును వచనముగా జేసెను. ఇది తమిళభాషలోనికి అనూదితము. ఈవిధముగ నాయకరాజుల పరిపాలనయందు వచన వాజ్మయ మొక విశిష్టరూపమును పుణికిపుచ్చుకొన్నది. సామాన్యునికి మహాపురాణేతిహాసములందు, వైష్ణవాది మతధర్మములందు ఆసక్తి కల్గినది. ఈ తృష్టను తీర్చుటకే వచన (గ్రంథములు వెలసినవి. ఈ ఒరవడి నాధారముగగొని ఈస్టిండియా కంపెనీవారి (ప్రవేశముతో ఆంధ్రభూమిని కత్రొక్కిన కై9స్తవ మిషనరీలు వచనమునం దెన్నియో (గంథములు ముదించినారు. వీరి బైబిలు తెలుగునందు రచింపబడి యచ్చొత్తబడినది, మత ప్రచారార్థము తెలుగు ముద్రాయంత్రములనుండి ప్రజలలోనికి ప్రాకినది.

క్రైస్తవ ఫాదరీలకు తెలుగు (దావిడభాషయని తెలియును. వారికి సంస్కృత సాహచర్యము కలదు. ఆంగ్లము వారి మాతృభాష. వారు తెలుగు తమిళముల మాటలాడ, వ్రాయ నేర్చిరి. వారి మాటలే వేరు. వారి వ్రాతలు, మాటలు నొకటిగా

ఆంధ్ర వచన సారస్వత స్వరూపము. బొజ్టా రాధాకృష్ణమూర్తి 2375 తోచును. ఈ జ్ఞానముతో వారు [గ్రంథముల విపరీతముగ బకటించిరి. ఇంగ్లీషు ఇడియమ్‌ తఆలుగులోనికి బరివర్తితమైనది. మన వత్తులు తమిళ మెరింగినవారికి నచ్చలేదు. అవి యుచ్చారణనుండియు, వ్రాతనుండియు తిరోహితములైనవి. వారు నేటికిని [గంథముల నల్పమూల్యమున కమ్మెదరు. కాని వాటిలో తెలుగువచనము లేదు. క్రైస్తవమతము గలదు. నాటికి నేటికి కై)స్తవమత [గ్రంథములందు, ముఖ్యముగా వచనశైలిలో భేదము లేదు గావున దానిని ప్రత్యేక సారస్వృతశాఖగా గుర్తించి విడిచివైతుము.

కాని పాశ్చాత్య వచనరచనా సంప్రదాయము అఆలుగు వచనమునందు 'ప్రవేశింపకపోలేదు. అది మిషనరీలు తెచ్చినది కాదు. తెలుగువారిలోని ధీమంతులు, ఆంగ్ల సాహిత్యమును కూలంకషముగ పఠించితెచ్చిన సంప్రదాయము. చిన్నయసూరితో నది పారంభముకాలేదు. నన్నయకు పూర్వ మాంధమున వాజ్బయమున్నటులే చిన్నయకు బూర్వమును “గాసట బీసటొగా వ్యావహారిక (గాంథికములందు కథాసాహిత్య మున్నది. “భెతాళ పంచ వింశతి కథలు” మున్నగునవి. చిన్నయకు ఇంగ్లీషు వచ్చును. చిన్నపిల్లల మనస్సు తెలియును. కాని వారికి భాషాజ్ఞాసమును, వినోదమును, నీతిని అందింపవలయునని చిస్నయగారి ఆశయము. అదింసీ నీతి చందికలో నుతృన్నమైనది. చిన్నయభాష కఠినమైనది కాదు. ఆయన భాషలో సౌకుమార్యము లేకపోలేదు. ఆయన పశుపక్ష్యాదుల మనస్సులను వర్ణించి నటుల మానవ హృదయములను వర్ణించ చాలమంది కపులకు కుదురలేదు. చిన్నయ భాషను సంస్కరించినాడు. రచనా విధానమును (కొత్తప్పుంతల దద్రొక్కించినాడు. చిన్నవాక్యములు. ఒక్కొక్కయడ హృదయమునకు సూటిగ దగులు నీతి. పిల్లల కా నీతిచందదిక నేడు [గ్రాహ్యము కాదేమో! కాని చిన్నయనాడు తెలుగు నభ్యసించు పిల్లల కీయన కథలు గగాహ్యములే. ఈ కథలు చదువునాటికే ఆ పిల్లలు భారత భాగవతములు పూర్తిబేసెడివారు. ఈ విధముగ నన్నయవోలె చిస్నయ భాష ననుశాసించి, లక్ష్యలక్షణముల సమగ్రముగ సమకూర్చి, (పాక్‌ పశ్చిమ విద్యావంతుల మన్ననలకు పొత్రుడైనాడు.

దక్షిణదేశపు ధువతార యవతరించినది. సాహిత్య (ప్రపంచములో నాడు ప్రాగ్లిశను, పశ్చిమమును సమానముగ నర్థము చేసికొన్న పండితుడు లేడు. ఆ కొరత వీరేశలింగము పంతులుగారితో తీరినది. ఆయన విశాల హృదయుడు.

2376 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము విరామము నెరుగని జీవితమును గడిపి, తన జీవితములోని పతి క్షణమును దేశీయాభ్యుదయమునకు వెచ్చించిన సర్వాంధ్ర (ప్రజానాయకుడు. ఆయన కవి. నిష్పాక్షిక దృకృథముతో ప్రాక్సశ్చిమ కావ్యముల జదువనేర్చిన యొకేయొక ఆంధ్రుడు. ఆయన భావమును పప్రజాసమక్షమున నిశితముగ (ప్రదర్శించగల వక్త ఆయనతో నేడు విశాలమైన సాహిత్య మేర్పడినది. నేటి ప్రతి వాజ్బ్యయశాఖకు పునాదులు నిర్మించిన దాయనయే. వచనమే సుప్త ప్రజాహృదయ వీణాతంత్రులచే కల్పింపబడిన మధురనాదమని, వీరు నమ్మిరి. సాహిత్యముతో సంఘమీను సంస్కరించి, యీ మహావ్యక్తి 'పేరొందినాడు. తెలుగులో ఈయన భుజ భారముమీద ఎన్నియో క్రొత్త శాస్త్రములు, కావ్యములు తలలిత్తినవి. సాహితీశాఖ లాఛాడు పంతులవారిచే దోహద మొనరింపబడి నేటికి మొగ్గ తొడిగినవి. ఆయన పత్రికలు నడిపినాడు. బెంగాలునందు ప్రజాకవు లందుకొన్న పాశ్చాత్య భానుకిరణజనిత చైతన్యము నీయన యాంధ్రమున కందించినాడు. నవల, నాటకము, ప్రహసనము, విమర్శనము, సాహిత్యచరి(త్ర, శాస్త్రము, వ్యాసము, ఉపన్యాసము, జీవిత చిత్రణ పంతులుగారితో ప్రారంభమైన వచనసారస్వతోపశాఖలు. వీరికన్న ముందు తెలుగులో నవలారచన గలదని “చింతామణి” పత్రికా ముఖమున వానికి బహుమతు లొసంగువారని నిడుదవోలు వారి పరిశోధనవలన తేలినది. ఆంధ్రమున పప్రథమనవల “ధర్మవతీ విలాసొ మట. కాని నవలా వాజ్బయమున కొక స్వరూపము “రాజశేఖర చరిత్రము"తో నేర్పడినది. “/102/01//24616160 అనబడు 60169గా॥% నవలా (ప్రభావ మీ గ్రంథమున కొంతవరకు గలదు. పంతులుగారి సహజశైలి రాజశేఖర విలాసములో కన్పట్టును. పాత్ర చితణమందు, వితంతు హృదయ వర్జ్దనమందు, భాగ్యవంతుని ఇంటి బంధువుల వంచనా ప్రదర్శనమందు పంతులుగారు జూపిన నైపుణ్యము నేడుకూడ ఇంత నవలా సాహిత్య మభివృద్ధి గాంచిన యనంతరము, ఆశ్చర్యము గల్పింపక మానదు. 5411- 661౪63 72౪69 అను గ్రంథము వీరు “సత్యరాజా పూర్వయా(త”లను [గ్రంథముగా తెలుగున రచించినారు. ఆంగ్ల నవలల నాంధ్రీకరించుటలో పంతులుగారు జూపిన పద్ధతి కడుంగడు సమర్థనీయము. చివరకు షేక్సుపియరు నాటకములందుకూడ వారు ఆంధ్ర దేశీయ వాతావరణమును గల్పించినారు. పేరులు మార్చినారు. వీలైనచోట్ల సందర్భము ప్రకారము కథను మార్చినారు. వారి “జీవిత చరిత్ర" వారి గ్రంథములలో నతి స్వతంత్రమైన

.... ఆంధ్ర వచన సారస్వత స్వరూపము బొట్టా రాధాకృష్ణమూర్తి 2377 యావేశపూరిత రచన. ముసలిపంతులుగారు, చిన్ననాటి తన గాథను పల్కుచు నెన్ని చమత్కృతులనో వాడిరి. వారు తర్కమును, ఛందస్సును వ్యాసరూపమున (బకటించిరి. విభిన్న రీతులు గల మనుష్యులు భాషించు భాషా స్వరూపముతో వారికి పరిచయ విశేషము గలదనుటకు వారి ప్రహసనములే తార్కాణము. ఈవిధముగ వచన వాజ్మయ సరస్వతికి పంతులుగా అతెనలేని సేవ యొనరించిరి. ఆయన కలమునుండి యుదృవించిన (ప్రతి యంగుళము వచనము ఆంధ్రజాతి మరువరాదని తలంతును..

పంతులుగారి సమకాలీనులు కొక్కొండ వేంకటరత్నముగారు “విగ్రహము” రచించిరి. ఇది పిల్లలకు వ్రాయబడిన వచనమైనను పెద్దలకు గూడ గ్రాహ్యాము గాదు. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు పంతులుగారి పిలుపందుకున్న సాహితీవేత్త. హాస్యరసమునకు మూలకందమైన వారి “గలప్రతొని తెలుగుదేశము మరువలేదు. ఈ గణపతికి తరువాత పుట్టిన గురజాడవారి “గిరీశం"తో, మొక్కపాటివారి “పార్వతీశం”తో స్నేహము కల్గినది. వీరి “కర్పూరమంజరి", “రామచం(ద విజయము” “రాజస్థాన కథావళి” మున్నగు నవలలు, కథలు అక్షరాస్యు డైన యాంధ్రుడు చదువవలసిన (గ్రంథములు. చిలకమర్తి జీవిత చర్నితలో నాంగ్లభాషా సాహిత్యము నభ్యసింపలేదని వాసికొన్నాడు. ఆయన నవలలోని “పాత్ర చిత్రణ”, “సన్నివేశ కల్పన” చూచిన మనము నవ్యత్వము (ప్రవేశించినటుల అబ్బుర పడగలము. వారిది దివ్యచక్షువు. వేంకట పార్వతీశ్వర కవులు “పమదావనము” రచించిరి. ఇది బెంగాలీ నవల. తెలుగు వాతావరణ కల్పనతో నద్భుతముగ మారిపోయినది. ఈ జంటకవుల రచనలు నాడు చాల ప్రసిద్ధిగాంచిసవి. ఇవి చాలవర కసువాదములుఅగుట వర్తమాన సాహితీ చైతన్యములో వీనిని ప్రజ గుర్తింపలేదు.

ఇది ఇరువదియవ శతాబ్ద మధ్యభాగము.. నేడు వచనమే సర్వసాహిత్య సామాజ్యాధిదేవత. నేడు విజ్ఞాని కనిపెట్టిన సత్యము బహిర్గతము కావలెనన్న వచనము కావలెను. ఆ వచనము వేరు. పదార్ధతత్వమును విప్పిచెప్పేవరకే ఆ వచన ప్రయోజనము. ఆ వచనమున కలంకారములు లేవు. సమాసములు లేవు. అది పూర్వము సంస్క్ట్రృతభాషలో ఆయుర్వేదాది శాస్త్రవివరణకు వాడీన భాషవంటిది. కఠినపడము లుండవు. తెలుగులో ఈ వచనము ఆంగ్రమునందు

2378 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పరిణామ మొందినటుల మారలేదు. కాని ఆంగ్ల పారిభాషిక పద సాహాయ్యమున తాలుగుశాస్త్రజ్ఞ్జులు ఈ వచనశాఖను వృద్ధి నందించుచున్నారు. వీరిలో (ప్రఖ్యాతులు

  1. కాళీపట్నపు కొండయ్య: 2. వసంతరావు వేంకటరావు, 3. విస్సా అప్పారావు. (పంతులుగారు భౌతిక శాస్త్రమును మొదట తఆనుగులో రచించిరి.) కొండయ్యగారి “విశ్వరూపము” (ఆంధ్ర విశ్వవిద్యాలయ (ప్రచురణ) తలుగులో ప్రసిద్ధ జ్యోతిష (గ్రంథరచన. వేంకటరావుగారి వైజ్ఞానిక వ్యాసములతో “భారతి” యలంకృత యగుచున్నది. 'విస్సావారి “ఆటంబాంబు” తెలుగుశాస్త వాజ్బయములో నొక వలుగు. భాషాశాస్త్రముపై గంటి జోగి సోమయాజిగారు, కోరాడవారు [గ్రంథముల రచించియున్నారు. వర్దులవారు వ్యాకరణముప్రై తలుగులో “సర్వస్వసంహిత" (ప్రకటించినారు. లక్ష్మణరావుగారి వ్యాసావళి, వారి ఆంధధ్రవిజ్ఞాన సర్వస్వము మరపునకురాని [గంథములు. లక్ష్మణరావుగారి శైలియందు శాస్త్రము చక్కగ బోధపడినది. ఇంక విభిన్న శాస్త్ర విషయములపై తలుగునందు పత్రికలు, (గ్రంథములు, వ్యాసములు నిత్యము వెలువడుచున్నవి. ఈ వాజ్బయమే నేటి భౌతిక ప్రపంచమునకు శిరోధార్య మై, చాల విధముల నుపయుక్తమగుచున్నది. కృష్ణా పత్రికతో ప్రారంభమైన పత్రికలు దినదినము సంఖ్యయందు పెరుగుచు, వచన వాజ్బయమును వృద్ధి చేయుచున్నవి. పథత్రికాభాష గిడుగువారు కలలుగన్న వ్యావహారికము, విశ్వనాథ సత్యనారాయణగారి విశిష్ట వచనశైలితో తలుగు వచనము క్రొత్త రూపమును దాల్చినది. అది భాషకు గాంభీర్యమును సంతరించినది. ఆయన వచనములో పద్యమునందువలె ధ్వని యున్నది. దానియందు వ్యంగ్యమున్నది. అది గూఢవస్తువయ వచనవుని యనుకొందును. ఆయన నవలలు విశ్వసాహిత్యమునందు స్థాన మాక్రమింప గలవు. వీరి “వేయి పడగలు వచన (ప్రయోజనమును నిర్వచించు తాత్విక (గ్రంథరాజము. అడివి బాపిరాజు మున్నగు భావుకుల కథానికలు, నవలలు తెలుగు యువకుల న్నురూత లూగించినవి. బాపిరాజుగారి “హిమబిందు” తెలుగువచన వాజ్బయ చరిత్రలో మరువరాని నవల. దినదినము కథానికలు, ఏకాంకికలు రచింపబడుచు ప(తికా ముఖమున వెలువడుచున్నవి.

ఆంధ్ర వచన సారస్వత స్వరూపము _ బొజ్జా రాధాకృష్ణమూర్తి 2379

గిడుగు రామమూర్తిగారి శిష్ణవ్యావహారిక భాషావాదముతో వచన మొక కొత్తపుంత దొక్కినది. ఆంగ్లేయుల గగ౮9 ౬౧15౧ వలె నేడు సర్కారుజిల్లాల భాష రేడియోలలో, పత్రికలలో ప్రముఖ స్థాన మాక్రమించినది. కాని మాండలిక భాషయందును రచన జరుగుచున్నది. భమిడిపాటివారి రచనలు దీని కుదాహరణము. నేడు రాకపోకలకు, వార్తా ప్రసారమునకు పూర్వమందువల నిబ్బందులు లేవు. కాన మాండలిక రచనవలన సాహిత్యాభఖివృద్ధి ఆగిపోదు. విశ్వవిద్యాలయము లీ వ్యావహారిక భాషా వాదము నంగీకరింపలేదు. కాని శిష్టవ్యావహారికమందును, (గ్రాంథికమందును భేద మంతగ కన్పట్టుటలేదు. శిష్టవ్యావహారికమే కొన్నియెడల కృతకమైన భాషారూపముగ గన్పట్టుచున్నది. శ్రీ జమ్ములమడక మాధవరామశర్మ మున్నగు సంస్కృత విద్వాంసులు రచించు శిష్ణవ్యావహారికములో తెలుగుదనపు పాలు లేదు. పటత్రికలవార్తలు కూడ నేడు విశేష సంస్కృత పదభూయిస్టములై వెలువడుచున్నవి. ఇందువలన తలుగు జాతీయత నశించుచున్నదని యనరాదు. మనభాషప్రై సంస్కృత సారస్వత (ప్రభావమట్టిది. నేడు కొందరి వచనములలో నాంగ్లపదములు సందర్శ్భోచితముగ (పయోగింపబడుచు, తలుగుభాష కందము చేకూర్చుచున్నవి. గుడిపాటి వెంకటచల౦ (వ్రాయు 14091099, కథానికలు, నవలలు, వ్యాసములు, నాటికలు మన వచన సారస్వతమునందు నవ్యత్వమును (బవేశ పెట్టినవి. చీలంగారివంటి శైలి వ్రాయువారు విశ్వమునందే యరుదు. (కిన్నెర: సంపుటము 7, సంచిక 1 జనవరి 1955)

జైసా మ్‌

అ ఒల్లో ఇల్లీ ఒల్లో సాహిత్య శాస్త్ర సంప్రదాయములు భి పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఏ.

  1. సంస్కృత సాహిత్య శాస్త్ర పరిచయము

ఒల్లో

౧ఆఎఅస్కృత సాహిత్యమందు “అలంకార శాస్త్రము” ఒక అనుపమ నిధి యనుసత్యము వేత్తలకు సువిదితమే. కాని తత్పరిచయము లేనివారికి “అలంకార శాస్త్ర” మన్నప్పుడు అనుప్రాస, ఉపమ, రూపకాది శబ్దార్ధాలంకారములను గూర్చిన వివరణ మనెడి అభ్మిపాయము మాత్రమే కలుగుచుండును. బహుశః ఈ భావముతోనే వారు పాశ్చాత్య “విమర్శ గ్రంథములను అభిమానించుటయు, భారతీయాలంకార శాస్త్ర గ్రంథములను పరిహసించుటయు చేయుచుందురు. అలంకార శాస్త్రమును గూర్చిన మై యూహ సత్యదూరమనుట కెట్టి సంశయమును లేదు. ఓపికతో కాని, అభిమానముతో కాని, అలంకారశాస్త్ర [గ్రంథములందు చర్చింపబడిన విషయములను ఒకసారి పరిశీలించినచో అవి కేవలము కావ్య బాహ్య స్వరూపమును చర్చించునవి మాత్రమే కావనియు, కావ్యమునకు ప్రధానమైన అంతస్తత్త్వములను వైజ్ఞానిక దృష్టితో తార్కికముగా వివేచనముచేయు శాస్త్ర్య్యగంథము లనియు బోధపడగలదు.

అలంకార శాస్త్ర ప్రమేయమును (అలంకార శాస్త్రమందలి చర్చనీయాంశము లను) క్రింద పేర్కొనుచున్నాను' - నా 1 మహామహోపాధ్యాయ శ్రీ పి. వి. కాణే ఈ విషయములను ఒక క్రమములో పేర్కొనియున్నారు.

దాని ననుసరించితిని. (11౧౯౦౦64010% 10 54010/26204౧4, ౧. 331, 332) +

పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంి శ్రీరామ అప్పారావు, ఎం.వి, 2381 “అలంకార శాస్తం (పథమకర్తవ్యము కావ్యపయోజనములను (కవి, సహృదయుడు - ఉభయుల దృష్టిలో) వివరించుట. పిమ్మట కావ్య హేతువులను గూర్చిన చర్చ. తరువాత కావ్య నిర్వచన ప్రయత్నము. ఈ నిర్వచనములో శబ్బమునకో, అర్థమునకో ప్రాధాన్య మొసగిన పిమ్మట కావ్యమునకు “ఆత్మ” యేమో నిర్దేశింపబడును. (కావ్యాత్మ విషయములో చాల మత భేదములు కలవ్వే) శబ్దార్థములు రెండును కావ్యాంగములే కాన శబ్దశక్తులు శబ్దార్థముల సంబంధము నిరూపింపబడును. ఈ (ప్రసంగములోనే అభిధాది శబ్దశక్తులు, వాని భీదములు, వాచ్యాది అర్థములు, వ్యంగ్య భీదములు వివరింపబడును. తరువాత కావ్య భేదములను గూర్చిన చర్చ - బాహ్య స్వరూపమునుబట్టి (గద్య, పద్య మిశ్రభేదములు); భాషనుబట్టి (సంస్కృత ప్రాకృతాదులు); ధ్వనినిబట్టి (ఉత్తమ, మధ్యమ, అధమభేదములు); ప్రదర్శనా పేక్షనుబట్టి (దృశ్య, శ్రవ్య భేదములు) మొదలగునవి. దృశ్య, శ్రవ్య విభజనము విశాలమైన “రూపక చర్చకు దారి తీయుచున్నది. ఏ కావ్య మైనను గుణ మహితముగా నుండవలయునుగాన ఆ కావ్య గుణములు, ఆ గుణములచే నేర్పడు రీతులు తరువాత చర్చింపబడును. కావ్యము దోష రహితముగా నుండవలయునుగాన పిమ్మట పద, వాక్య, అర్ధాది దోషములు నిరూపింపబడును. చిట్టచివర కావ్యము నలంకరించెడి శబ్ద, అర్థ, మిశ్రాలంకారములు వివరింపబడును. కొన్ని గ్రంథములు కవి శిక్షాదులనుగూర్చి వివరించుటయే కాక అలంకార శాస్త్రమునకు సంబంధించిన పెక్కు ఇతర విషయములను (ఉదా ॥ భూగోళజ్ఞానము మొ |) గూడ చర్చించుచున్నవి" = కావ్య జీవితము “రస"మే యనువారు పపారంభమునందు ప్రత్యేకముగాను, కేవలము రూపక చర్చ చేయువారు దాని కన్వయించియు, ధ్వనివాదులు రసధ్వనినిగూర్చి చర్చించునప్పుడును సమగ “రస” చర్చ చేయుదురు. రస చర్చకంటె ముందుగా వివిధ నాయకులను, నాయికలను గూర్చిన విపుల విపరణ ముండును. అంతేకాక ఆయా సందర్భములందు కావ్య: శాస్త్ర తారతమ్యము; కవిలక్షణము, వాని సామి; కావ్య సౌందర్య నిర్ణయము; “ఆనంద” స్వరూపము; కావ్యానందమునకు 2... ఈ వివిదమతములను ఈ వ్యాస తృతయభాగములో వివరించి యున్నాను. 3... చర్చనీయాంశములందు “అలంకారముల” స్థానము గమనార్హము.

2382 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అధికారియగు సహృదయుని లక్షణము మొదలగు పెక్కు విషయములు సూక్ష్మాతిసూక్ష్మముగా వివేచింపబడుచుండును. (ఈ సర్వవిషయములు అన్ని (గంథములందును పూర్ణముగా వివరింపబడలేదని మాత్రము గుర్తింపవలసియున్నది. ఆయా (గగంథకర్తలు తమ తమ అభిరుచినిబట్టి కొన్ని అంశములను గాని, అన్ని అంశములను గాని వివరించుచు వచ్చిరి. అలంకార శాస్త్ర్యమందు చర్చనీయాంశములైన పై విషయములను పాశ్చాత్య విమర్శ [(గంథములతో పోల్చి చూచినచో అలంకారశాస్త్రృము కేవలము “అలంకారములను గూర్చి చర్చించునది మాత్రమే కాదనియు, అది కావ్యతత్త్య వివేచనమునకు సంబంధించిన సమగ్ర శాస్త్రమగుటయే కాక పాశ్చాత్య విమర్శ (గంథములకంటె ఎంతో గంభీరమైనదనియు, ఎంతో అభివృద్ధిని పొందినదనియు బోధపడగలదు. ఈ విషయమునుగూర్చి శ్రీ బలదేవ్‌ ఉపాధ్యాయ ఈ క్రింది విధముగా పేర్కొనియున్నారూీ - సాహిత్య సిద్ధాంతములకు సంబంధించిన పాశ్చాత్యుల (ప్రధాన (గ్రంథములు మూడున్నవి. (గీసుదేశీయుడైన “అరిష్టాటిలొ రచించిన (1) “గ౦6॥09 (కావ్య: నాటకముల సమీక్ష; (2) “2౧6౭10గ౮" (వక్సృత్వము

  • తదుపయోగిమైన గద్యము యొక్క గుణదోష విచారణ) అను రెండు (గంథములును, ఇటలీ దేశస్థుడు “కోసీ” రచించిన “485061౮ (కావ్యసౌందర్య, స్వరూప, తత్త్వ, మహత్త్యములకు సంబంధించిన దార్శనిక సమీక్ష అను మూడవ (గ్రంథమును. ఈ మూడును మూడు భిన్నశాస్త్రములు. ఈ మూడింటియందును చర్చింపబడిన భిన్న సిద్ధాంతములెల్ల భారతీయాలంకార శాస్త్రమందు ఏకత్ర బహు సుందరముగా వివేచింపబడినవి. ఇట్లనుటచేత పాశ్చాత్య కావ్యాలోచనపద్ధతి హీనమని అర్థము చేసికొనరాదు. (పాశ్చాత్య “సాహిత్య విమర్శ” కూడ గంభీరము, బహుముఖము, శాస్త్రీయము, అమూల్యము అని అంగీకరించుటలో ఎవ్వరికిని మతభేదములేదు. కాని దానికి అలంకార శాస్త్రము తీసిపోదని చెప్పుటయే ఆశయము.) కాని అలంకార శాస్త్రముతో పోల్చి సామాన్య విమర్శకులు దాని కారోపించు మహత్త్వమును నిజముగా అది పొందజాలదని చెప్పవచ్చును. లా
  1. “భారతీయ సాహిత్య శాస్త్రృము” (ద్వితీయ ఖండము) అను తన ఉత్తమ హిందీ [గ్రంథమునకు శ్రీ బలదేవ్‌ ఉపాధ్యాయుని పీఠిక.

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వ. 2383 కావ్యమునకు ఆత్మభూతమైనది రసము. ఆరసము యొక్క సాంగోపాంగ వివేచనీమే అలంకార శాస్తోద్దేశ్యము. అలంకార శాస్త్రమనగా “రస శాస్త్రము. లేదా “సౌందర్య శాస్త్రము” అని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఈ శాస్తాానుశీలన, మననములు రెండు వేల సంవత్సరముల నుండి భారతదేశమున జరుగుచు వచ్చినవి. మొదట పేర్కొన్నట్లు అలంకార శాస్త్రము అపరిచితులకు అపోహను కలిగించుచుండుటయకాక భయమునుగూడ కలిగించుచుండును. తక్కిన భారతీయ శాస్త్రములవలె అలంకార శాస్త్రము కూడ తర్కవాదముతో నిండియుండుట; భాష సంస్కృతమగుట - ఈ రెండును ఈ భయమునకు కారణములు. (ప్రథమ భయకారణమును గూర్చి వ్యాఖ్యాతృ శిరోమణి యనదగిన శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగా రీ [కిందివిధవముగా పేర్కొనియున్నారుగే “ఫపూర్వాచార్యులు తమ సిద్ధాంత స్థాపనమునకు6 దర్క సాహాయ్య మపేక్షించిరి. కావుననే మన భారతీయ శాస్త్రములన్నియు దర్క న్యాయము లను నినుప పునాదులమీంద నిర్మింపంబడిన వజపు కోటలు. ప్రత్యల్ప విషయము కూడ హేతుబద్ధమై, సామాన్య బుద్ధులకు గహనమై, దుర్భేదమై యుండును. దేనికేని లక్షణము సెప్పవలయు నన్నవో నవ్యాప్తి, అతివ్యాప్తి అసంభవాది దోషరహితముగా నుండవలెను. అట్టి నిర్వచనము తార్కికునకే సాధ్యమగును. తర్కవాసన గిట్టనివారికిని, అది లేనివారికిని నీ శాస్త్రము తలదిమ్ము కలిగించును" కాని సహృదయముతో సమ్యక్పరిశీలనము చేసినవారి కిది బుద్ధివికాసమును, ఆశ్చర్యమును, ఆత్మానందమును కలిగించుననుట నిస్సందేహము. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంత (గ్రంథము లిట్లు తర్కయుక్తి పరిష్కృతములు కావని చెప్పుటలో అతిశయోక్తి లేదు. వాని కలవాటుపడిన మన కిది నూత్నముగా గోచరింపవచ్చును గాని బాధాజనకము మాత్రము కాదు. ఆదిలో పాశ్చాత్య విమర్శకుల సంస్కృతమును 5. తమ “కావార్థిలంకార సంగ్రహ” వ్యాఖ్యకు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి “మలిపలుకు" - పుట 6. వీరి వ్యాఖ్య వలసినంతలో సమగ్రమును, ఉన్నంతలో సుబోధమును అగుటచే ఉత్తమ ్రేణికి చెందియున్నది. విద్వాంసు లీవిధముగా ప్రధాన సాహిత్యశాస్త్ర (గ్రంథముల కుత్తమ వ్యాఖ్యలు వెలయింతురుగాక!

2384 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము (గద్ధతో జదివికొని ఉత్తమ విమర్శలు, అనువాదములు ప్రకటించియున్నారు. పిమ్మట శ్రీ పి. వి. కాణే; శ్రీ యస్‌. కె. డే మొదలగు భారతీయులు అలంకార శాస్త్రమును గూర్చి దీర పరిశోధనలు చేసి ఆంగ్ల్రమున (గ్రంథములు రచించియున్నారు. అలంకార శాస్త్ర (గ్రంథములను, అందుపై వచ్చిన వివిధాంగ్ల విమర్శలను హిందీ భాషలోని కనువదించి సులభ (గ్రాహ్యము చేయుటకై హిందీ విమర్శకులు పూనుకొని, సాధించుచున్నారు. అంతేకాక (ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంత సమన్వయమునకై వారు ప్రయత్నించుచు “తులనాత్మ కోమైన విమర్శలు వెలయించుచున్నారు. తెలుగులో ఈ రెండు విధములైన ప్రయత్నములు ఏకత్ర చేసినవారిలో పప్రధానులుగా శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్తింగారిని పేర్కొనవచ్చును. ఇంతకును “అలంకార” పదమే మై అపోహకు కారణమని చెప్పవచ్చును. భామహాది ప్రాచీనాలంకారికులు తమ (గ్రంథములను “అలంకార” పదముతో వ్యవహరించి యున్నారు - భామహ “కావ్యాలంకారము”; ఉద్భట “కావ్యాలంకార సార సంగ్రహము"; వామన “కావ్యాలంకార సూత్రము” రుద్రట “కావ్యాలంకారము" మొ॥!. అందులకు కారణము వారి గంథములం దలంకారముల కక్కువ ప్రాధాన్య ముండుటయే. ప్రాధాన్యమును బట్టియే పేరేర్పడుచుండుట సహజము. (ప్రాధాన్యేన వ్యప దేశా భవంతి). తమ [గ్రంథములకు “అలంకార” నామము పెట్టకపోయినను దండ్యాదులు (కావ్యాదర్శము మొ॥) కూడ తమ (గ్రంథములందు నాల్గింట మూడువంతులు అలంకారములను గూర్చియే చర్చించి యున్నారు. ఆదిలో ఇట్లు అలంకారములు (పాధాన్యము వహించుటచే ఈ శాస్త్రమునకు “అలంకారశాస్త్రృ"మనియు, తత్క ర్తలకు “ఆలంకారికోలనియు వ్యవహారము వ్యాప్త మైనది. మై విమర్శకులందరు తమ [గ్రంథ నామములకు మొదట “వావ్య” పదమును చేర్చుకొని యుండుట గమనార్హము. ఈ “అలంకారొ పదమునకు రెండర్థము లున్నవి- “కావ్యం (గాహ్యమలంకారాత్‌”: “సౌందర్య మలంకారళవో అనెడు నిర్వ్యచనములను బట్టి అలంకారమనగా “సౌందర్య” మనియు (వ్యవహారమునందును

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి. 2385 ఇంచుమించు ఇదే అర్ధము); సౌందర్య మున్నప్పుడే కావ్యము (గ్రాహ్యామనియు; కావ్యాలంకార మనగా కావ్యమునకు సొందర్యాపాదకములైన ధర్మములను (౧0౪61౦ 092640/ 1౧ 6౧621) నిర్జేశించు శాస్త్రమనియు నర్థము. ఇంక రెండవ అర్ధము ఉపమాది అలంకారములనియే. ఈ ఉపమాద్యలంకారములవలన కావ్య మలంకరింపబడును. (అలం[కియతే అనేన ఇతి).

"అలంకార శాస్త్రమునకు “సాహిత్య శాస్త్రమని యింకొక పేరు కలదు. దీనినే రాజశేఖరుడు కావ్యమీమాంసయందు “సాహెత్యవిద్య” (పంచమీ సాహిత్యవిద్యా ఇతి యాయావరీయః) యని వ్యవహరించెను. అల్లే “సాహిత్యదర్శన" మనియు నందురు. “సహితము యొక్క భావమే సాహిత్యము. “శబ్దార్థముల సాషాత్యమే కావ్యము"(శబ్దార్ధా సహితౌ కావ్యం - భామహుడు.) అనెడి నిర్వచనమునుబట్టి శబ్దార్థ సహితమగు కావ్యమును గూర్చి చర్చించు ఈ శాస్తృమునకు “సాహిత్య శాస్త్ర” మను పేరు వచ్చియుండునని విమర్శకుల నిర్ణయము. ఇందులకు రాజశేఖరుని” “శబ్దార్థములను ఉన్నవానిని ఉన్నట్టులుగ సహభావముతో ్రవర్తిల్ల బేయునట్టి విద్య కావుననే ఇయ్యది సాహిత్యవిద్య యనబడినది” (శబ్దార్ధ యో ర్యథావత్సహభావేన విద్యా సాహిత్యవిద్యా) అనెడి నిరుక్తి బలము నొసగుచున్నది. ఇంక కావ్య, సాహిత్య శబ్దములు "రెండును పర్యాయపదము లనియే చెప్పవచ్చును. (కావుననే హిందీ విమర్శకులు “౧౦6105”ను “కావ్య శాస్త్ర"”మని అనువదించి యున్నారు.) మమ్మటుడు తన (గ్రంథమును “కావ్య (పకాశొమనగా విశ్వనాథుడు “సాహిత్య దర్పణ” మని తన (గంథమునకు పేరిడుట గమనార్హము. సారాంశ మేమనగా, ఈ వాజ్బయమును అలంకార శాస్త్రమని పిలుచుటకంటె “సాహిత్య శాస్త్ర"మనుటయే ఉచితముగీ అంతేకాక శ్రీ బలదేవ్‌ ఉపాధ్యాయ పేర్కొన్నట్లు “సౌందర్య శాస్త్ర” (18510610 అను నర్ధమందు) మనియు; “రస శాస్త్ర” మనియు చెప్పవచ్చును. “1162౧ 8. క్రీ.శ. 900 (రాజకేఖరునకు) ముండే “సాహిత్య శాస్త్రము" అను పేరు వ్యవహారములోనికి

వచ్చియుండునని శ్రీ పి, వి. కాణే నిర్ణయము. (1౧|౦6౮౦|౦౧ 10 520%/86260204 = ౧. 329.)

2386 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము 0గ%015౧” అను నర్ధ్థమునందు “సాహిత్యాలోచని లేదా “సాహిత్య సమీక్ష యనియు, “సమీక్షాశాస్త్ర” మనియు పేర్కొనవచ్చును.

  1. సాహిత్యశాస్త్ర గ్రంథములు సాహిత్య శాస్త్రరచన ఎప్పుడు 1ప్రారంభమైనదో స్పష్టముగా నిర్ణయించి

చెప్పుట చాల కష్టము. బుగ్వేదమునం దుపమాద్యలంకారములు బహుళముగా నున్నట్లు ౧౧01 ౫.0. ౪6౬౧627 (౮.8.8. ౧.4.5. ౪0114 ౯౧ 1-47 2౧6౪౦116 5౧. 1-49) మొదలగు విమర్శకులు నిరూపించియున్నారు. ఆలక్ష్యములకు లక్షణము (అలంకార శాస్త్రము) ఎప్పుడు జనించినదో తెలియదు. బుగ్వేద కాలము నుండి (క్రీస్తుశకము వరకు గల మధ్యకాలములో ఈ శాస్తాంభివృద్ధిః వికాసములను నిర్ణయించుటకు విమర్శకులు ప్రయత్నించియున్నారు. ఆ ప్రయత్నము లెట్లున్నను, మనకు లభ్యమైన (ప్రథమాలంకారిక [గ్రంథము భరతుని “నాట్యశాస్త్రము”. ఇది (క్రీస్తుశక ప్రాంతమున రచింపబడినదని అంగీకరించినచో అప్పటినుండి పందొమ్మిదవ శతాబ్చివరకును రూపక, రస, భావ, అలంకార, గుణ, రీతి, వృత్తి, పాక, శయ్యా, ధ్వని, వక్రోక్తి అనుమితి, బౌచిత్య, కవి శిక్షాది వివిధ కావ్య నాట్య విషయములను గూర్చి ఆలంకారికులు రచించిన సాహిత్య శాస్తం (గ్రంథములు, తద్విమర్శలు కలిసి సుమారు “వేయిఉండునని శ్రీ పి. వి. కాణే తెలిపియున్నారు. * వీనిలో ముుదణ భాగ్యమును పొందినవి (వ్యాఖ్యలు కాకు ఇంచుమించు ఒక వందయుండును. వీనిలో పఠన, పాఠన వ్యవహారమునందున్నవి సుమారు ఒక నలువది యుండును. ఇందులో కొన్ని[గంథములను విమర్శకులు నిర్ణయించిన కాలక్రమములో” [కింద పేర్కొనుచున్నాన:

  1. నాట్యశాస్త్రము (క్రీపూ. 200 - క్రీశ 300 - భరతముని (ప్రణీతము. 36 అధ్యాయములు (బొంబాయి ముద్రణమందు 37 అ 6000 న్లో రస, రూపక, అభినయ, గీత, వాద్యాదులు వివరింపబడిన బృహద్భృంథము. తరువాతి

ం. (100660110౧ 10 54010/2602గ02౧04 £0. 377 - 423 ఈ పుటలయందు అకారాదిగా

ఏతద్గ్యుంథములు, వానిని గూర్చిన లఘువివరములు కలవు.

  1. పెక్కు రచయితల కాలనిర్ణ్మయము లిప్పటికిని సందిగ్ధముగానే ఉన్నవి. వేను శ్రీ కాణేను

అనుసరించితిని, కాలనిర్ణయవాదములకు వారి సాహత్యదర్పణోపోద్దాతమును పరిశీలింతురుగాక!

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఏ. 2387 అలంకార శాస్త్ర (గ్రంథము లన్నింటికిని ఇదియే మూలకందము. (దీనికి నా అనువాదము “సంస్కృతి” (రాజమండ్రి) పథతికలో వరుసగా ప్రకటిత మగుచున్నది.)

  1. కావ్యాదర్శము (క్రీ.శ. 660 - 680)'1- కర్త “దండి”. 3 పరిచ్చేదములు (కొన్ని ముద్రణములందు నాల్గు) 660 క్లో. కావ్యలక్షణ, భేదములు; అలంకారములు, చితబంధాదులు, దోషములు వివరింపబడినవి. (దీనిని శ్రీ అవ్వారి సుబహ్మణ్యశాస్త్రిగా రనువదించియున్నారు.)

  2. కావ్యాలంకారము (700 - 750)” కర్త “భామహుడు”. 6 అధ్యాయములు, 400 క్లో, కావ్యలక్షణ, భేదములు; అలంకారములు; దోషములు; శబ్బసాధుత్వము

  • ఇవి వివరింపబడినవి. (దీనికి నా “అనువాదము” “కిన్నెర”లో వరుసగా ప్రకటితము కాగలదు.)
  1. కావ్యాలంకార సారసంగ్రహము (750 - 850) - కర్త “ఉద్భటుడు". 6 వర్గములు, 79 కారికలు, ఒక వంద ఉదాహరణములు - 41 అలంకారములు చర్చింపబడినవి.

  2. కావ్యాలంకార సూత్రము (800 ప్రాంతము) - కర్త “వావునుడు”. 5 అధికరణములు, అందు 12 అధ్యాయములు - 319 సూత్రములు - కావ్యలక్షణ, రీతి, దోష, గుణ, అలంకార, ప్రయోగములు చర్చింపబడినవి. దీనికి వామనుడే వ్రాసిన “వృత్తొ కలదు. (దీనికి శ్రీ వేదాల తిరువేంగళాచార్యులుగారు ఆం(ధలక్ష్య సహితముగా తెనిగించిరి.)

  3. కావ్యాలంకారము (825 - 875) - కర్త “రుదటుడు”. 16 అధ్యాయములు, 734 శ్లో - శాస్తం, కావ్య (ప్రయోజనములు, రీతి, భాషాలక్షణము, యమకభేదములు, రసచర్చః శేషబంధాదులు, అలంకారములు మొ॥

౭ సర్వవిషయము లించుమించుగా చర్చింపబడిన (ప్రథమగంథ మిది (నాట్యశాస్త్రము తరువాత). తతా

11... భామహుడు, దండి - వీరిలో ఎవరు పూర్వులనునది బహు క్లిష్ట సమస్య. దండియే

పూర్వుడని శ్రీ కాణే నిర్ణయము.

  1. ఆంధ్రమున గల ప్రాచీనర్వాచీన ఆలంకారిక (గంథములను శ్రీమాన్‌ ఈయూజణ్ణి వీరవేంకట

రాఘవాచార్యులుగారు “ఆంధ్ర ప్రతాప రుద్ర యశోభూషణ” పీఠికలో పేర్కొనియున్నారు.

  1. దండికంటె భామహుడే పూర్వుడనుట బహుజన సమ్మతము.

2388 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

  1. ధ్వన్యాలోకము (850 - 875) - కర్త “ఆనందవర్ధనుడు"”.* 4 ఉద్యోతములు -129కారికలు; వృత్తి, ఉదాహరణ సమేతము - ధ్వనిని గూర్చిన వాదనలు, వ్యంగ్య (అర్థ) భేదములు; వ్యంజక (శబ్ద) భేదములు; ధ్వన్నిపయోజనము వీనిని గూర్చిన చర్చ లిందు కలవు. అబభినవగుప్పుని “లోచన” వ్యాఖ్యాసహితమైన ధ్వన్యాలోకము సాహిత్యశాస్త్రృమునకు గుండెకాయ వంటిది. (శ్రీ వేదాల తిరువేంగళాచార్యులుగారు ఆంధ్రలక్ష్య సహితముగా దీనిని తెనిగించిరిఎగే

8 కావ్యమీమాంస (880 - 925) - కర్త “రాజశేఖరుడు” 18 అధికరణములు. గద్యమయము. రస, అలంకారాదుల చర్చ లేకపోయినను, 'పెక్కువిషయముల కిది గనివంటిది. కవి శిక్షకు సంబంధించినది. (శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు దీని నాంధ్రీకరించిరి.)

  1. వక్రోక్సి జీవితము (950 - 1000) - కర్త “కుంతకు(లుడు” - 4 ఉన్మేష ములు. కారికా, వృత్తి, ఉదాహరణ (500 శ్లో. పైగా సహితము - కవిత్వ వైచిత్యు. లావణ్యాదులు; వర్ద విన్యాస, పదపూర్వార్థ, (ప్రత్యయ, వాక్య వైచిత్యు, ప్రకరణ, ప్రబంధ వ(క్రతలు ఇందు చర్చింపబడినవి.

  2. “అభినవ భారతి”; “లోచన” వ్యాఖ్యలు (980 - 1020) - కర్త “అభినవ గుప్పుడూ. ఇవి వరుసగా నాట్యశాస్త్ర, * ధ్వన్యాలోకములకు వ్యాఖ్యలు. ఇవి వ్యాఖ్య లైనను మూల [గంథములకు వన్నెపెట్టినవై పతంజలి, శంకరుల వుహాభాష్యవులకున్నంత (పసిద్ధిని పొందినవి. అలంకారశాస్త్ర “భాష్యకారూడను పేరు వీనియందే సార్థకము.

  3. “కారికా" మాత్ర గ్రంథమునకు “ధ్వని యనియు, “వృత్తికి “ఆలోకో మనియు పేర్లు. రెండును కలిసి “్వ్యన్యాలోకొమైనది. కారికా కర్త, వృత్తి కర్త (ఆనందవర్ధనుడు) భిన్నులని కొందరి యభిప్రాయము. ఇరువురును ఒకరేయని మజికొందరందురు.

  4. ధ్వన్యాలోకమును “ఆంధ్ర ధ్వనొ యను పేర శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు, “ధ్వనిసారా మను పేర శ్రీ జమ్మలమడక మాధవరామశర్శగారు, “అభినవాంధధ ధ్వన్యాలోక” మను పేర శ్రీ భాగవతుల కుటుంబశాస్త్రిగారు అనువదించియున్నారు.

  5. కొన్ని భాగములకు (ముఖ్యముగా 7వ అ.) “అభినవభారతీ" వ్యాఖ్య లభింపలేదు. ఈ

..... వ్యాఖ్యతోకూడ “నాట్యశాస్త్రము" బరోడాయందు ముద్రింపబడినది. తత్సంపాదకులు శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు.

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి. 2389

  1. దశరూపకము (974 - 996) - కర్త “ధనంజయుడు”. 4 ప్రకాశములు, సుమారు 300 కారికలు. నాట్యపరిభాష, దశ రూపకములు, నాయక నాయికా భేదములు, (ప్రదర్శనకు సూచనలు, సంధులు, తదంగములు, రసవిచారము ఇందు కలవు. (త్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు దీనిని తెనిగించిరి.

  2. వ్యక్తివివేకము (1020 - 1100) - కర్త “మహిమభట్టు" - 3 విమర్శలు. ఇది

ధ్వనిధ్యంసక గ్రంథము. ధ్వని విమర్శనము, అనౌచిత్య విచారము, అనుమాన మతస్థాపనము ఇందు కలవు. (దీనికి శ్రీ భాగవతుల కుటుంబశాస్త్రింగారి అనువాదము “ఆంధ్రసాహిత్య పరిషత్పథతిక (కాకినాడులో వరుసగా ప్రకటిత మగుచున్నది.)

13, శృంగారప్రకాశము (1005 - 1054) - కర్త “భోజుడు”. 36 ప్రకాశములు - కావ్య నాట్యాది సర్వవిషయములు చర్చింపబడిన బృహద్దుంథముది. (డా॥ వి. రాఘవన్‌ - మాసు విశ్వవిద్యాలయము - ఆంగ్లమున దీనిపై ఉత్తమ విమర్శను సవిస్తరముగా వలయించినారు.)

  1. బొచిత్య విచారచర్చ (990 - 1066) = కర్త “క్తేమేందుడు". 39 కారికలు. వృత్తి, ఉదాహరణ సమేతము. రస జీవిత భూతమైన బెచిత్య మిందు బహు ముఖములుగా చర్చింపబడినది, (గ్రంథము చిన్నదైనను సాహిత్యశాస్త్రమున దీని కత్యున్నత స్థానము కలదు.'”(దీనిని శ్రీ వేంకట రామకృష్ణకవులు అనువదించిరి).

  2. అగ్నెపురాణము అలంకారశాస్త్ర భాగము (900 - 1200) - ఇందులో 382 అధ్యాయములున్నవి. ఇందలి పది (336 - 346) అధ్యాయములు మాత్రమే అలంకార శాస్త్రభాగములు. ఆదికాలములో లేని ఈ భాగము తరువాత ఇందు చేర్ప్చబడియుండుసని విమర్శకాభ్మిపాయము.

  3. కావ్యప్రకాశము (1050- 1100) - కర్త “మమ్మటుడు” - 10 ఉల్లాసములు, 143 కారికలు లెదా సూత్రములు. నాట్య విషయములు తప్ప తక్కినవన్నియు చర్చింపబడినవి. దీనికి మొత్తము 75 వ్యాఖ్యలు కలవనెడి విషయమే దీని (ప్రాధాన్యమును వివరింపగలడు. “అలంకార మంజరి యను పేర శే. వే. రాఘవయ్యంగారు దీని ననువదించిరి).

17, బెచిత్యస్థానమును నిరూపించు వివరణము ఈ వ్యాస తృతీయ భాగాంతమున కలదు.

2390 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంప్పుటము 4: సాహిత్యము 1/7. అలంకార సర్వస్వము (11135 - 1150) - కర్త “రుయ్యకుడు” - 86 సూత్రములు, వృత్తిసహితము - అలంకారముల విషయమున (ప్రామాణిక (గ్రంథము. 18. కావ్యానుశాసనము (1136 - 1143) - కర్త “హేమచంద్రుడు” - 8 అధ్యాయములు. సూత్ర, వివరణ, ఉదాహరణ సహితము. కావ్యప్రకాశమును

పోలిన ఉత్తమ [గంథము. -

  1. భావప్రకాశనము (1175 - 1250) - కర్త “శారదా తనయుడు”. 10 అధికారములు, నాట్య, రసములపై భరతాది పూర్వాచార్యుల మతములను ఆవిష్కరించుచున్న బృహద్గ్ధ్యంథము.

  2. చంద్రాలోకము (1200 1250) - కర్త “జయదేవుడు”. 10 మయూఖములు, వైం0 శ్లోకములు - ఇతర కావ్య విషయములు చర్చింపబడినను, అలంకారముల విషయమున ప్రసిద్ధి కెక్కినది. (దీనికి పెక్కు వివరణములు, ఆంధ్రీకరణములు కలవు. శ్రీ ఉమాకాన్తవిద్యాశేఖరుల “అలంకార” వివరణము పేర్కొనదగినది.)

  3. ఏకావళి (1285 - 1325) - కర్త “విద్యాధరుడు” 8 ఉన్మేషములు, రూపకచర్చ తప్ప తక్కినవన్నియు నిందు కలవు.

  4. ప్రతాపరుద్ర యశోభూషణము (14వ శతాబ్ది ప్రథవు భాగము) - కర్త “విద్యానాథుడు”. ఇత డాం(ధధుడు. 9 ప్రకరణములు. నాయక, కావ్య, నాటక, రస, దోష, గుణ, శబ్ద, అర్థ, మిశ్రాలంకారములనుగూర్చిన చర్చ యిందు గలదు. భట్టుమూర్తి “కావ్యాలంకార సం[గహము చాలవరకును, అనంతామాత్యుని *“రసాభరణము” కొంతవరకును దీని ననుకరించినవి. (దీనిని శ్రీ చలవుచర్ల రంగాచార్యులుగారు, శ్రీ జవ్ములవుడక మాధవరామశర్మ గారు వేర్వేరుగా ఆంధ్రీకరించిరి.)

  5. సాహిత్యదర్పణము (1300 - 1380) - కర్త “విశ్వనాథుడు”. 10 పరిచ్చేదములు

  • నాట్య కావ్య విషయములు సర్వ మిందు కలవు. సరళతశైలిలో నున్నది. (శ్రీ వేదం వేంకట రాయశాస్త్రిగారు దీని నాంధ్రీకరించిరి.)
  1. రసార్ణవ సుధాకరము (1330 ప్రాంతముల) - కర్త “శింగ భూపాలుడు". ఆంధ్రుడు. 3 విలాసములు. రసచర్చ (ప్రధానము. చివర రూపకచర్చ కలదు. (దీనిని శ్రీ, బులుసు వేంకట రమణయ్యగా రాంధ్రీకరించినారు.)

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి, 2391 25. రసమంజరి (1450 - 1500) కర్త “భానుదత్తుడు” - నాయికా నాయకులు, తత్సహాయులు - వీరిని గూర్చిన చర్చ. (దీనికి చాల అనువాదములు కలవు.)

  1. ఉజ్వల నీలమణి (1470 - 1554) - కర్త “రూపగోస్వామి. చ్రైతన్యస్వామి కృష్ణభక్తి (పేరకము కాగా, ఈతడు ఆ దివ్య భక్తిని, తత్సంబంధాదులను రసచర్చ కన్వయించి, ఐహిక వాతావరణము కల్పించి భక్తిరసమును ఆలంకారికముగా (పతిపాదించెను.

  2. కువలయానందము (1554 - 1626) - కర్త “అప్పయ్య దీక్షితుడు” - ఇందు అలంకారములు మాత్రమే చర్చింపబడినవి. (చాల ఆంధ్రీకరణములు కలవు. వీనిలో శ్రీ కంభంపాటి సత్యనారాయణ శాస్త్రిగారి అనువాదము పేర్కొనదగినది. శ్రీ బులుసు వేంకట రమణయ్యగారు “కువలయానంద సారొమను పేర ఆంధ్రీకరించిరి.)

  3. రసగంగాధరము (1620 - 1660) - కర్త “జగన్నాథుడు” - ఆంధధుడు. 2 ఆననములు మాత్రమే లభించినవి - కావ్యనిర్వచనము, హేతువులు, భేదములు, రసచర్చః గుణములు, ధ్వనిభేదములు, అలంకారములు చర్చింపబడినవి. ఇదియే కట్టకడపటి (ప్రామాణికమైన ఆలంకారిక (గంథము.”* ఇది ఆంధ్రులకు గర్యకారణ ము. (త్రీ జవ్మ్శులవుడక వమూధవరావుశర్మగారు (ప్రథమాననమునుమాత్ర మాంధ్రీకరించిరి.)

అజ్ఞ్జాతకాలమునుండి 19వ శతాబచ్చివరకు గల కాలములో సాహిత్యశాస్త్ర వికాసమును డా! యన్‌. కె. డే నాల్గు యుగములుగా విభజించియున్నాడు.” పె గ్రంథముల రచయితలను మాత్రమే దాని ననుసరించి విభజించుచున్నాను. 1 ప్రారంభిక కాలము - అజ్ఞాతకాలమునుండి భామహుని వరకును. ఈ కాలమున తెలిపినవా డొక్క భరతుడు మాత్రమే. న 18... ౮౭౦2౧౧౭1౧2 15 106 1251 0721 4/19! 0౧ 520541 00609. 70681018 ॥ 15 0/006౯ [0 0౧౧౦ 1౧15 ౧౭|| 0! 106 560601 10 & ౦56 21 1159 3209. = గ ౧.౪. కజ౧6 (1౧0666110౧ 10 52010264గ0202 = [.313) 19. 1510001 540941 ౧06105 6౫ 6౧ 5.406. ౪౦| ! - ౯? 336-337.

2392 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము "2 రచనాత్మక కాలము (600 - 850) - భామహునినుండి ఆనందవర్ధనుని వరకును. &. భామహ, ఉద్భట, రుద్రటులు - “అలంకార సంప్రదాయము.” 5. దండి, వామనులు = “రీతి” సంప్రదాయము. 0. ఆనందవర్ధనుడు - “ధ్వనొ సంప్రదాయము. వె. నిర్ణయాత్మక కాలము (850 - 1050) - ఆనందవర్ధనుని నుండి మమ్మటుని వరకును - అభినగుప్పుడు, కుంతకుడు, మహిమభట్టు, ధనంజయుడు, భోజరాజు మొ! త్స వ్యాఖ్యానాత్మక కాలము (1050 - 1750) మమ్మటుని మొదలు జగన్నాథుని వరకు - & మమ్మట, రుయ్యక, విశ్వనాథ, హేమచంద్ర విద్యాధర, విద్యానాథ, జయదేవ, అప్పయ్య దీక్షితులు. (ధ్వని) 0. శారదాతనయ, సింగభూపాల, భానుదత్త, రూపగోస్వాములు. (రస) 6. రాజశేఖర, క్షేమేందులు. (కవిశిక్ష) 6. జగన్నాథుడు. (రసధ్వని 3. సాహిత్యశాస్త్ర సంప్రదాయములు సంస్కృత భాషయందు సుమారు వేయి సాహిత్య శాస్త్ర రచనలున్నట్లు గుర్తించితిమి. సంస్కృతమందే కాదు. మరి యే యితర భాషయందైనను పెక్కు గ్రంథములు (ఒకే శాస్త్రమునకు సంబంధించినమి బయలుదేరుటకు కారణమేమను ప్రశ్నకు సమాధానము నరయవలసి యున్నది. భరతుడు నాట్య శాస్త్రమందు పపధానముగా “రూపకచర్చ” చేసినను, ఆ చర్చ్భయంతయు *రసొమును కేంద్రీకరించుకొని యున్నది. అనగా, కావ్యనాట్యములందు “రసము (వధానమని సారాంశము. ఈ 'పాధాన్యమును పురస్కరించుకొనియే రసము కావ్యమునకు “జీవిత”మనియు, కావ్యమునకు “ఆత్మ” యనియు పేర్కొందురు. అనగా భరత మతములో కావ్యాత్మ “రసము. (ప్రాసంగికముగా, సంక్షిప్త రూపమున

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి తశ్రీరాను అప్పారావు, ఎం.ఎ. 2393 అలంకార, గుణ, దోషములనుగూడ భరతుడు నాట్యశాస్త ఎవుందు చర్చించియున్నాడు. కావున భరత మతములో వీనికి పప్రాధాన్యములేదు, ఈ సంప్రదాయము తరువాతి వారికి నచ్చలేదు. నాట్యమున వానికి ప్రాధాన్యము లేకపోవచ్చును గాని, కావ్యమునందు వానికే ప్రాధాన్యము కలదని నిర్దేశించుచు తరువాతి ఆలంకారికులు అలంకారాదులను విస్తరించుటకు పూనుకొనినారు. అట్లు బయలుదేరినదే “అలంకార సంప్రదాయము". దీనికి మూల పురుషుడు భామహుడు. వీనిని కొంద రనుసరించిరి. ఇదియును కొందజకు నచ్చలేదు. “గుణ”ము, లేదా *“రీతొ ప్రధానమని వారి (దండి, వామనుల) అభిప్రాయము. వీరందరును రసమును పూర్తిగా విస్మరించినట్లే. అటుపిమ్మట రసము నంగీకరించిన “ధ్వనొ సంప్రదాయము (ప్రారంభమైనది. దీనిని (ప్రతిష్టించి, పోషించినవారు ఆనందవర్థన, అభినవగుప్పులు.వెంటనే ధ్వని ధ్వంసక మతములు (రసము అంగీకార్యమే. ధ్వనికి మాత్రము వ్యతిరేకము. “అనుమతి” మొ॥) బయలుదేరినవి. కాని ఈ మతములకు అనుయాయులు లేకపోవుటచే అవి నామమాత్రావశేషములైనవి. తరువాతి వారందరును “ధ్వని మతమును శిరసావహించి “రసధ్వనిని కావ్యాత్మగా ఆంగీకరించిరి. ఈ రసధ్వనులకు మెజుగు పెట్టినది “బచిత్యము. ఈ మతములకు సాహిత్య సంప్రదాయము లనియు, సాహిత్య ప్రస్థానములనియు పేర్లు కలవు. ఆంగ్లమున వీనిని స్థూలముగా “500008” అందురు... (నేను “సంప్రదాయ” పదమును వాడుచున్నాను.) వీనిని, కాలకమములో, సంగ్రహముగా [క్రింద వివరించుచున్నాను -

  1. రససంప్రదాయము: భరతముని ఈ సంప్రదాయ స్థాపకుడు. అంతకుముందు “రస” జ్ఞానము లేకపోలేదుకాని దానిని విస్తృతపరచి, సమ్మ్యగ్వివేచనముచేసిన ప్రథముడు భరతుడు. నాట్య శాస్త్ర షష్ట,సప్త మాధ్యాయములందు రస, భావ నిరూపణము కలదు. ఈ భాగము సాహిత్యశాస్త్ర ప్రపంచమం దొక అపూర్వఘుట్టము. భరతుడు రసములను నాట్యపరముగా నన్వయించి వానిని “నాట్య రసమూ" లని వ్యవహరించెను. రస సంప్రదాయమునకు మూలభూతమైనది “విభావానుభావ వ్యభిచారి సంయోగా (ద్రసనిష్పత్తి౯ో అను ్రసిద్ధసూత్రము. ఇది చూపులకు చిన్నది మైనను "పెక్కు వ్యాఖ్యానములకు (జగన్నాథుడు ఎనిమిదింటిని ఫేర్కొనెను.) భిన్నమతములకు దారితీసినది. ఆ వ్యాఖ్యాతలలో (ప్రామాణికుడు

2394 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము అభినవగుప్పుడు. వాని “అభివ్య క్రొ వాదానుసారముగా - సంస్కార ఫలితములైన స్థాయి భావములు సహృదయుని హృదయమున వాసనారూపమున నుండును. సుప్తములైన ఆ భావములు నాటకమును చూచునప్పుడుగాని, కావ్యమును విన్నప్పుడుగాని విభావాదులవలన సహృదయునియందు “అఖివ్య క్తము”లె ఆనందమయ “రస” రూపమును పొందుచున్నవి. స్థాయిభావములు తొమ్మిది. రసములు తొమ్మిది. సాత్త్విక భావములు 8. వ్యభిచారి భావములు 33. భరతు డష్ట రసములనే (ప్రతిపాదించెను. “శాంతము” కలిసి తొమ్మి దైనవి. పిమ్మట రృుదటుడు “పేయస్సు"ను, విశ్వనాథుడు “వాత్సల్యమును, రూపగోస్వామి “మధురొమును రసములుగా (ప్రతిపాదించిరి. రసము లనంతము లనువారును గలరు. (పసిద్ధములైనవి తొమ్మిది మాత్రమే. లోకమున బాధాకరములును, దుఃఖజనకములు నైనవికూడ కావ్య, నాట్యములందు చితితములై రసత్వమును పొంది ఆనందమునే కలిగించుచున్నవి. ఈ రసమతమే సర్వోత్కృష్ట మైనది* 2. అలంకార సంప్రదాయవుఎ: ఈ సంప్రదాయ స్థాపకుడు భరతుని రససిద్ధాంతమును ఎజీగియుండియు, ఆతడు దృశ్య కావ్యమునకు రసము 'ప్రధానమనుటచేత, (శ్రవ్య కావ్యమునకు అలంకారములే ప్రధానమని తాను నిరూపించుటకు పూనుకొనెను. రస, భావములనుగూడ నీత డలంకారములుగానే పేర్కొనెను. చమత్కార పాణములైన అలంకారములే కావ్యమందు సర్వ ముఖ్యమని వీని ప్రతిపాదన. ఆ చమత్కారము “వకోక్తొ వలన సిద్ధించును. అనగా వక్రోక్తి యున్నప్పుడే కావ్యము గ్రాహ్యము. (ఈ సంప్రదాయమునుగూర్చి “భామహుడు - కావ్యాలంకారము" అనెడి వ్యాసములో తరువాత విపులముగా చర్చింతును.) 3. గుణసంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకుడు దండి, భామహునని దృష్టిలో అలంకారములు కావ్య (పప్రాణములైనట్లే దండి దృష్టిలో “గుణములు” సర్వముఖమని చెప్పవచ్చును. గుణములను సవిస్తరముగా నిరూపించిన ప్రథము డితడు. వీని లా 20. "గిడం4 5 & [౧1౦౧౪4౫ 0 0/1015గ ౧౦1 ౦౧|౫/ 10 1౧౮14౧ 111626 0౪1 490 10? 16 5126 0 60100680 116౧2048, 2 968 2౧6 ౧౭గ౭|౧ గాం([౧00.” 1గ. 5. గంం06548గ౧౫౫ 5831) = (19౧ ౪2౫/5 2౧6 కొం25 01 11612౧/ ౦౧4౦15౧) 1౧ 5205661 - ౧. 28.

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి, 2395 దృష్టిలో అలంకారములు బాహ్యసౌందర్య హేతువులనియు (కావ్యశోభాకరాన్‌ ధర్మా నలంకారాన్‌ ప్రచక్షతే, గుణములు అంత స్పౌందర్య హేతువులనియు పేర్కొనవచ్చును. ఈతడు దశగుణములను (గ్దేష, (పసాదం, సమత, మాధుర్యం, సుకుమారత, అర్థవ్య క్తి ఉదారత, ఓజస్సు, కాంతి, సమాధి) పేర్కొని ఇవి “వైదర్భీ” మార్గమునకు పప్రాణములనియు, ప్రాయశః తద్విపర్యయమే *గౌడీ" మార్గమనియు నిర్జేశించెను. మార్గ, రీతి పదములు పర్యాయపదమలు. కాగా “మార్గములను గూర్చిన చర్చ యధికమగుటచేత దండి “రీతివాది యని యస్‌. కే. డే ప్రభృతులు; గ్రంథమున నాల్లింట మూడువంతులు అలంకారచర్చ యుండుటచే దండి “అలంకారవాదోొ యని ఇతరులు; ఈ రెండింటికిని చెందినవాడని శ్రీ పి. వి. కాణే పేర్కొనుచున్నారు. దండి “గుణొవాది యని యంగీకరించినను మజికొందరు దీని నొక సంప్రదాయముగా గణించుటలేదు. భోజుడుకూడ గుణములయం దధికాదరమును చూపించియున్నాడు.

భరతుడును దశగుణములను నిరూపెంచెను. భామహుడు మాధుర్య, ఓజః (పసాదములు మూడింటినే అంగీకరించెను. వామనుడు దశగుణముల నంగీకరించి శబ్ద, అర్థఫదములు వివరించెను. భరత, దండి, వామనుల గుణము లొకటేకాని లక్షణ నిర్వచనమున సామ్యము లేదు. ఆనందవర్ధనుడు భామహుని మూడు గుణములనే (గ్రహించి వానిని రసధర్మములుగా నిర్ణయించెను. దీనినే మమ్మటాదు లంగీకరించిరి. భోజుడు మాత్రము 24 గుణములను పేర్కొని అర్థ, శబ్బఫేదములచే 48గా విభజించెను. 4. రీతి సంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకుడు వామనుడు. భరతుడు, భామహుడు, దండి - మువ్వురునుగూడ కావ్యాత్మనుగూర్చిన విచారము సూటిగా జేయలేదు. కావ్యాత్మను గూర్చి స్పష్టముగా నిర్దేశించిన ప్రథము డితడు. ఈతడు మార్గ పదమును వాడక “రీతొపదము నుపయోగించి, ఆ రీతియే కావ్యాత్మయనెను (రీతి రాత్మా కావ్యస్య్ర). దండి వైదర్శ్భీ, గౌడీ రీతుల కీతడు మూడవదియగు పాంచాలీరీతిని చేర్చెను. రీతి యనగా విశిష్ట పదరచన (ఆ విశిష్టత గుణములవలన కలుగును.) ఆయా దేశీయు లాశ్రయించిన విశిష్ట పదరచన (రీతి) కాదేశ నామము లేర్పడినవి (విదర్భ దేశీయు లాశ్రయించినది “వెదర్భి” మొ॥). గుణ, అలంకారముల భేదమును స్పష్టముగా నిరూపించిన ప్రథముడు వామనుడు. “కావ్యమునకు శోభను కలిగించు ధర్మములు గుణములు, తదతిశయ

2396 పందిరి మల్తికార్డునరావు శతజయంతి. సంప్పుటము. 4: సాహిత్యము హేతువులు అలంకారములు" - ఇట్లు వావమునుడు గుణముల కిచ్చిన ప్రాధాన్యమునుబట్టి గుణసంప్రదాయము, రీతి సంప్రదాయము ఒకటే యనువారును కలరు. ఈతడును రసమును “కాంతొ యను గుణములో అంతర్చవింపజేసెనే కాని, దాని (ప్రాధాన్యమును గుర్తింపలేదు. అట్లే “ధ్యని"నికూడ వక్రోక్తిలో అంతర్భవింపజేసి యూరకొనను. పె మూడు రీతులకు రుదటుడు “లాటియా” రీతిని, భోజుడు “మాగదీ, అవంతీ” రీతులను చేర్చిరి. మొత్తము రీతు లారైనవి. శారదాతనయుడు 105 రీతులను పేర్కొని చివరకు నాల్గింటిని మాత్రమే అంగీకరించెను. కాని రీత్మితయ సిద్ధాంతమే బహుజన సమ్మతమైనది. 5. ధ్వని సంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకు డానందవర్థనుడు. రూపకతత్తమును (ప్రదర్శించిన ఖ్యాతి భరతునకు చెందగా కామ్యతత్త్యమును (పదర్శించిన ఖ్యాతి యానందవర్ణనునకు దక్కినది. ఇంతవరకు “నాట్యరసములు”గానే యున్న రసములు ఇప్పటినుండి "కావ్యరసములు"కూడ నైనవి. “ధ్వనివిచార మానందవర్థనునకు బూర్వముకూడ లేకపోలేదు. కాని దానిని పూర్వపక్ష రహితముగా సిద్ధాంతించి, స్థాపించినవా డీతడే. “కావ్యమునకు “ధ్వని” ఆత్మ” యని వాని సిద్ధాంతము. గబ్బమునకు మూడు నక్తులున్నవి. మొదటిది (అభిధాశక్తి వాచ్యార్థమును బోధించును. వాచ్యార్ధము కుదురనప్పుడు రూఢినిబట్టికాని, ప్రయోజనమునుబట్టికాని వాచ్యార్థముతోనే సంబంధముగల వేరొక యర్థమును (లక్ష్యార్ధము) బోధించునది రెండవశక్తి (లక్షణాశక్తి. ఇంక వాచ్యార్థము పొసగిన పిమ్మట రమణీయమైన అర్థాంతరమును స్ఫురింపజేయునది మూడవశక్తి. ఇదియే వ్యంజనాశక్తి. ఇది ఆనందవర్ధనుని సృష్టి. ఈ అర్థాంతరమునే “పతీయమానార్థ మనియు, “వ్యంగ్యార్థ"” మనియు, “ధ్వని” యనియు పేర్కొందురు.. “ఎందు శబ్బములుగాని, అర్థములుగాని, ఉపసర్జనీకృత (అ్మపధానవముగా జేయబడిన) స్వార్థము లె (ప్రతీయవమానార్థవమను అభివ్య క్త్రముచేయునో ఆ కావ్యవిశేషము ధ్వనియగూనని ఆనందవర్ధనుడు నిర్వచించెను.

ఇట్టి ధ్వని త్రివిధము - వస్తుధ్వని, అలంకారధ్య్వని, రసధ్య్వని. (వీనిలో మరల భేదములు కలవు.) వీనిలో “రసధ్యని” ప్రధానము. అదియే నిజమునకు కావ్యాత్మ. వస్త్వ్రలంకారధ్వనులును తత్పర్యవసాయులే కావలయును. ఇట్లానందవర్థనుడుః భామహ, దండి, వామనులు స్పష్టముచేయలికపోయిన వాచ్యః వ్యంగ్య భేదములను

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వ, 2397 వివరించి (ఇవి రెండును భిన్నములైనను వ్యంగ్యమునకుగూడ వాచ్యమే మూలమను విషయవును గుర్తింపవలసెియున్నది. కామన న వ్య ం గ్య్యవమను “వాచ్యసామర్థ్యాక్షిప్తు మని పేర్కొనినాడు.) ధ్వని స్వరూపమును నిర్ణయించుటయే కాక మూలపడిన భరతుని “రస సిద్ధాంతము"నకు తిరిగి ప్రాణము పోసెను. అసలు ధ్వనిమతము రసమతమునకు భాష్యమనియు, తద్భిన్నము కాదనియు విజ్ఞుల యాశయము,. “రసము వాచ్యరూపముగా కాక వ్యంగ్యరూపముగా నుండవలయు" ననుటయే ఆనందవర్ధనుడు ప్రతిపాదించిన విశేషములలో ప్రధానమైనది. నాట్యశాస్త్ర, ధ్వన్యాలోకములు రెండింటిని లోకోత్తరముగా వ్యాఖ్యానించిన అభిసవగుప్ప డీ “రసధ్వనొనే అభిమానించి అదొక్కటియ కావ్యాత్మ యనెను. అర్వాచీనులపై ఈ మతమే [ప్రాబల్యము వహించినది. (ఈ ధ్వని సిద్ధాంతము వైయాకరణుల “స్ఫోట” వాదమునకు రూపాంతరము) ఫైన పేర్కొన్న (తివిధములగు ధ్వని “అభిధామూలక” మైనది. ఇంక లక్షణామూలకమైన ధ్వని ద్వివిధము. ఇట్లు ధ్వని (ప్రధానముగా పంచాత్మకమని జగన్నాథుడు పేర్కొనెను. న ధ్వని వివక్షితాన్య పరవాచ్య ధ్వని అవివక్తిత వాచ్య ధ్వని (అభిధావవూలకము) (లక్షణావమూలకవు) రసథ్వని 6 విధములు వస్తు, అలంకార అర్థాంతరసం [కమిత అత్యంత తిరస్కృత ధ్వనులు (41) వాచ్య్థధ్యని(2) వాచ్యధ్యని(2) (అఆసంలక్ష థ్మక్రవు ధ్వని) (సంలక్ష ్య(క్రవుధ్యని లేదా (అజహ త్స్యార్థ (జహత్స్య్వార్థ అనురణన మ్యంగ్యము) వమాలవు) వదాలవల) మొత్తము 51 ప్రధానభేదములు. ఇవి మరల పెక్కు ప్రభేదములను గలిగియున్నవి. మమ్మటుడు చూపిన ధ్వని భేదముల మొత్తము 10,455. 6. పక్రోక్తి సంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకుడు కుంతకుడు. అతడు తన [గంథమునకు “వకోక్తి జీవిత ళో మనియే పేరిడుకొనెను. వక్రోక్తి అనగా (వక్ర + ఉక్తి) సర్వసాధారణమైన ఉ కికంటె భిన్నమును, అలౌకిక చమత్కార

2398 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము యుక్తమునైన ఉక్తి యని అర్థము. సర్వాలంకారముల కీ వక్రోక్తియే జీవనాధాయకమని భామహుడు ్రతిపాదించెను. వక్రోక్తి, స్వభావోక్తి (ఈ రెండును పరస్పర విరుద్ధములు.) రూపమున వాజ్బయము ద్వివిధముగా నుండునని దండి పేర్కొనెను. ఇట్టి వకక్రోక్తిని చేకొని కుంతకు డదియే కావ్యజీవిత (ఆత్మ) మని ప్రతిపాదించి స్వభావోక్షిని తిరస్కరించెను, కుంతకుడు ధ్వనివుతమును ఎరుగకపోలేదు. ఎరిగియు ధ్వని 'ప్రపంచమునంతను ఈతడీ వక్రోక్తియందే అంతర్భవింపజేసి తన స్వతంత్ర కల్పనాశక్తిని వెలయించినాడు. “కవి వ్యాపార వక్రతయే వకకోక్తి” యని కుంతకుని ఆశయము. దీనినే ఆతడు “వైదగ్ధ్యభంగీ ఫణితి” యనెను. ఈ వకోక్తి 6 విధములు - (1) వర్జవిన్యాసవ[కత; (2) పదపూర్వార్ధవక్రత; (3)

  • (ప్రత్యయ వ్మకత; (4) వాక్యవకత; (5) ప్రకరణ వ[కత; (6) ప్రబంధవ్మక్రత. వ(కోక్తి చవుత్కారకారి యనుట యందరకు నిష్టవేం. కాని అదే కావ్యజీవితమనుట కంగీకరింపరు. కావుననే ఈ సం[ప్రదాయమున కనుయాయులు లేరు. కుంతకుని తరువాత వక్రోక్తి కేవల మొక యలంకారముగా మాత్రమే నిలిచినది.
  1. అనుమితి సంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకుడు మహిమభట్టు. కావ్యాత్మ రస మనుటలో మహిమభట్టునకు విప్రతిపత్తి లేదు. ధ్వనికి మాత్రమే అతడు విరోధి. ఎల్లధ్వనులను “అనుమానము” * నం దంతర్భవింప జేయుటకే తాను “వ్యక్తి వివేకము”ను రచించుచున్నట్లు తెలుపుకొనినాడు. ఆనంద వర్ధనుడు ధ్వనికి మూడు శక్తులు (అభిధ లక్షణ, వ్యంజను) లున్నవనెను. మహిమభట్టు అభిధాశక్తిని మాత్రమే అంగీకరించి (లక్షణను అనుమూానములోనే కలిపెవేసినాడు). [ప్రతీయమానము లఅగుననెడి యర్ధ్థాంతరములన్నియు అభిధాశక్తి మూలముననే “అనుమవమాూనింప బడుూననియు, అర్థముకాని, శబ్దముకాని వ్యంజకములు 21.“నాట్యవిషయములను విస్తరించి చెప్పుట అసాధ్యము. కాన వాని సంగహమును (గ్రంథార్థబోధకములైన అల్బసూత్రములందు వివరింతును. అవి అల్పనసూత్రములైనను అనుమాన 'పపసాధకములే (కింత్వల్ప సూత్ర (గ్రంథార్థ మనుమానప్రసాధకమ్‌ - నాట్యశాస్త్రము 6వ అ. 8వ గ్లో అనుచు భరతుడు “అనుమాన” పదము నుపయోగించుట గమనార్హము.

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి 2399 కాజాలవనియు, కావున “వ్యంజనాశక్తొ కల్పన మనావశ్యకమనియు సిద్ధాంతించెను. ఈ యనుమానము కార్యకారణ భావము నాశ్రయించి యుండుననియు, కాన ఉత్తమకావ్యములన్నియు కార్యకారణ సుబద్ధములై ఉండవలయుననియు వాని నిర్దేశము. వాచ్యార్థమునుండి ఏ యర్థాంతర మనుమానింపబడునో అది “అనుమేయము”. ఈ అనుమేయము (ఇచ్చటినుండి ధ్వని వివరణము, నిదియు నొక్కటియే.) వస్త్వలంకార రసరూపమున తివిధముగా నుండును. అందు వస్త్వలంకారములు వాచ్యరూపముగా కూడ నుండును. రసముమాత్ర మెప్పుడును అనువేుయు రూపముననే యుండును. ఈ సం(పపదాయమునకు కూడ అనుయాయులు లేరు. దీనికి వ్యాఖ్యవ్రాసిన రుయ్యకుడు గూడ ధ్వనిమతమునే ఆదరించి మూలకర్త మతమునెడ ననాదరము చూపెను. వ్యాఖ్యాన చరిత్రలో నిది విచిత్ర విషయము. 8. బెచిత్య సంప్రదాయము: ఈ సంప్రదాయ స్థాపకుడు క్లేమేందుడు. రససం(ప్రదాయమే సర్యోత్కృష్టమైనదని గుర్తించియున్నాము. అట్టి రసమునకు గూడ బెచిత్యము జీవితభూతమని (రసజీవిత భూతస్య) యీతడు ప్రతిపాదించెను. “గ్రని కేదితగునో అది ఉచితమనియు, ఆ ఉచితముయొక్క భావమే బెచిత్య”మనియు శ్లేమేంద్రుడు వివరించెను. పద, వాక్య: అర్థం గుణ, అలంకార రస, క్రియ, కారక, దేశ, కాల, లింగ, వచన, నామాది బహుస్థలములందు బెచిత్య స్వరూపము నీతడు నిరూపించెను. ఇంతకుముందువారు బెచిత్యమును గుర్తింపకపోలేదు. కాని అదే సర్వముఖ్యమని నిరూపించినవా డిత డొక్కడే. “అనౌాచిత్యము వినా రసభంగకారణ మింకొకటి లేదనియు, బెచిత్య నిబంధనమే రసముయొక్క పరమరహస్యమనియు"నిర్జేశిం చెడి ధ్వన్యాలోక కారిక క్లేమేంద్రుని బచిత్య సంప్రదాయమునకు మూలకంద మనవచ్చును. (పాత్రల వేషవిన్యాస నిర్దేశమందు భరతుడుచేసిన వివరణమును గూడ క్షేమేంద్రు డనుసరించియున్నాడు.) బ్‌చిత్య తత్త్వమును సుస్పష్టముగా (ప్రదర్శించిన ఖ్యాతి క్లేమేంద్రునకు దక్కినది. పెన పేర్కొన్నట్లు సాహిత్య శాస్త్ర సంప్రదాయములు ఎనిమిది విధములుగా గోచరించుచున్నను అందు (ప్రధానమైనవి మూడే - బెచిత్యము, రసము, ధ్వని. వీనిలో బెచిత్యము తక్కిన 'రెండింటికంటె విశిష్టమైనది. రసము, ధ్వని - ఇవి "రెండును దీనికి లోబడి (అచితీ సహితములై) తమ గౌరవ మర్యాదలను నిలుప్పకొనుచున్నవి. బెచిత్య హీనములైన రసమునందు సరసతకాని, ధ్వనియందు

2400 పండిరి మల్తీకార్టునరావు శతజయంతి. పంపుము. 4: సాహిత్యము మహత్త్కము. కాని శూన్మమగును. ఇవియే కాక సర్వ సాహిత్య శాస్త సంపదాయములును బచిత్యమునకు లోబడియున్నవని మహా మహోపాధ్యాయ రసము స శు న్‌ శ్రీ యస్‌. కుప్పుస్వామి శాస్త్రిగారు ఒక కారికలోను తన్నిరూపకమైన పటములోను వివరించి యున్నారు. (988 “౫19౧4౭5 2౧6 కగ42/5 0 116/౧2౧/ ంగ౧౦౦15గా 1౧ 520- 51/- ౯౧. 27 - 29) వానిని ఈ [కింద వివరించుచున్నాను.చే “పక్క పటములోని పెద్ద వృత్తము క్షేమేందుని “బెచిత్యము”. అందిమిడియున్న పెద్ద త్రిభుజము మూడు సంప్రదాయములను సూచించుచున్నది. దీని శీర్షకోణము భరతుని “రసము”. దీని విషయమై భేదాభ్మిపాయము లేదు. ధ్వనిమతము, తద్విరోఢ మతములుకూడ రసమును కావ్యాత్మగా నంగీకరించినవి. క్రింది కోణములు ెండును పరస్పర విరుద్ధములైన రెండు ప్రసిదధ్ధమతములు - ఆనందవర్థనుని “ఢ్వనోః మహిమభట్టు “అనుమితి". (అనుమితి ధ్వనివిరోధిమతముల కుపలక్షకము.)

  • వీని వైరుద్ధ్యము “రసాభివ్యక్తి"కి సంబంధించినది మాత్రమే. పెద్ద (త్రభుజము లోపలనున్న చిన్నవృత్తము కుంతకుని “వకోక్తొ. దీనియం దిమిడియున్న చిన్న (తిభుజముయొక్క శీర్ణకోణము వామనుని “రీతొ. ఇది క్రిందకోణములు రెండింటికంటె _ దండి “గుణము; భామహుని “అలంకారము - గుణాతిశాయి యనుట నిస్సందేహము. “అలంకారము” నుండి యీ సంప్రదాయములు ఒకదానికంటె లా
  1. ఈ వివరణమందు డా!) వి. రాఘవన్‌గారిని అనుసరించితిని. (50గ౭ ౧౦౧౦౭౧ ౦ జీ!2౧52/డె 5291౧2 - ౧౯౧. 256 - 257

సాహిత్య శాస్త్ర సంప్రదాయములు పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఎ 2401 ఇంకొకటి విశిష్టమును, విస్త్రృ్యతమును అగుచున్నవి. అలంకార, గుణ, రీతుల విమర్శనాపద్ధతులు వాగ్విన్యాసమునకు సంబంధించినవైః “వ (కోక్తొప ఆధారపడియున్నవి - ఇవి యన్నియు కావ్య బహిరంగ సాధనములు మాత్రమే. ఇంక పెద్ద (తిభుజము కావ్య అంతస్తత్త్వమునకు సంబంధించినదై రసమును, కవి దానిని సాధించు విధానమును, సహృదయుడు దాని ననుభవించు విధమును వివరించుచున్నది. (రసాభివ్యక్తి “వ్యంగ్య” మార్గమునా? “అనుమాన” మార్గమునా? అనెడి చర్చ.) ఇందలి మూడు కోణములను (రస, ధ్వని, అనుమితి) పెద్దవృత్తమైన బెచిత్యమును ఆశయించుకొని యున్నవి. సర్వ కావ్య విషయములకు సంబంధించిన ఆ బెచిత్యమును తక్కిన సం[పదాయములన్నియు వెంటనంటియుండును. ప్రతి కావ్యాంగమందును అనురూప్యము, సౌందర్యము సహజములై యున్నవన్నచో, అది ఈ “బెచితి య. (ామహుని “కావ్యాలంకారానువాదము ” ఉపోద్దాతనహితముగా ఫీబవరి నంచికనుండి వరునగా ప్రకటింవబడును - నంపాదకుడు.] (కిన్నెర: సంపుటము 7, సంచిక క, జనవరి 1955) చే _ ౯వ సన ప్న్న ( భ్ర/, స్‌ో

నాహిత సంలో వినోదం ఎమ్‌. ఎస్‌. శాస్తి, 8.50.,(420) సమస్యా వాజ్మయానికి గల ప్రత్యేక లక్షణాలు : పిన్న పెద్దలకు ఉత్పాహం కలిగించటం, ఆలోచనా పూరితులను చేయడం, ఎవళ్లం ముందుగా చెప్పుకోగలమా అని ఉరకలు వేయించే ఆవేగం, చెప్పుకోలేకుంటే సిగ్గుపడవలసివస్తుందే! అని పట్టుదల. సమస్య ఇచ్చింది మొదలు అక్కడ వుండే బుర్రలన్నీ తీవ్రంగా పనిచేస్తూనే వుంటాయి. పొడిచినప్పుడు కొరకరాని కొయ్యగా కనిపించడం, తీరా విప్పిచెప్పేస్తే “ఇంతేనాగ్‌ అని అనిపించడం - ఇదే సమస్యలలోని చిత్రం. వినోదార్థం బయళ్దేరిన ఈ సమస్యలు ప్రభువుల వేడుకలతోనూ, పండితుల (పజ్ఞాప్రదర్శనాలతోనూ ఆగలేదు. సమస్యా వాజ్మయం కథలలోనేగాక మతంలోకూడా దూరి, ఈనాటికీ అమల్లో ఉంటున్నది. అశ్వమేధ యాగంలో ఒకానొక ఘట్టమందు సమస్యలు అడగటం, వాటిని విప్పేచెప్పటం అనే మతకర్మ నడుస్తుంది. నాట్యప్రదర్శనాల కోసం పలు గ్రామాలనుండి వచ్చి సమావేశమైన “గోండు” జాతివారు రెండు కక్లలుగా ఏర్పడి, సమస్యల పోటీలతో నృత్యప్రదర్శనాలు జరిపించే ఆచారమున్నది. పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎస్‌, శాస్తి, 8.50., (౬౧|4) 2403 అడవి, కొండ జాతుల్లో పాటల రూపకంగా వాడుకలో ఉన్న “పొడుపులు - విడుపులు” వెరియర్‌ ఎల్‌విన్‌ మహాశయుడు ఎన్నో సేకరించి వున్నాడు. మచ్చుకి: “కొండ యెక్కిన కొక్కెర | నాల్కలేని కొక్కెర గడ్డి ఎంతయినా మేస్తుంది నీళ్లు తాగితే చస్తుంది” -దీనికి జవాబు నిప్పు. మరొక్కటి - “*“దనక్‌పూర్‌లో జరిగింది చోరీ చటక్‌పూర్‌లో దొరికాడు దొంగ గడ్డీపూర్‌లో చెప్పారు తీర్పు నఖన్‌పూూర్‌లో తీశారు బ్మురి ఇది “పేనుూను గురించిన కథ. ప్రాగ్గేశాలలో (ప్రసిద్ధమైన ఒక గాథ కలదు : ఒక సుందరీమణికి కర్మవశాన మరణశిక్ష విధింపబడింది. కాని, ఎలా ఐనా ఆమెను రక్షించాలని న్యాయమూర్తుల ఉద్దేశం. అప్పుడు వా రొక షరతు పెట్టారు - వారు విప్పి చెప్పుకోలేని ఒక సమస్యను ఇవ్వాలి ఆమె. ఇస్తే, శిక్ష రద్దు చేస్తామని. ఆమె సమస్య ఇవ్వనూ ఇచ్చింది. న్యాయమూర్తులకు బ్యుర వేడెక్కింది కాని, ఏమీ స్ఫురించలేదు. కోర్టుపని సాగడం మానివేసింది. విధిలేక ఆమెను వదిలేశారు. దీన్ని బట్టి చూడగా _ సమస్యలు “ప్రాణాలు నిలిపేవీ, ప్రాణాలు తీసేవొ కూడానని తేలుతున్నది. కొన్ని ఆటవికజాతుల వైవాహికాల్లో సమస్య లివ్వడవు ఆచారమున్నది. పర్దాన్‌ జాతిలో మగపెల్లివారు పిల్లను తీసి తెచ్చుకోడానికి ముందు కొన్ని చిక్కువ్రశ్నలకు వరుడు జవాబులివ్వాలి. కొండజాతులలో పెల్లిమాటలు చాలవరకు గూడార్థాలతో కూడివుంటాయి. మగపెల్లివారు పిల్లకోసం వెళ్ళినప్పుడు “మీ అమ్మాయిని మా అబ్బాయి కిస్తారా? అని శుద్ధ వైదికంగా అడగరు. వారేమంటారూ? - మచ్చుకి, బస్తరు [పాంతంవారు:

2404 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. పంపుటము 4: సాహిత్యము “మీ ఇంట్లో ఒక చక్కటి పరిమళ పుష్పం వికసించిందని విన్నాము. దాన్ని మా శిరసున ధరించాలని అభిలాష” అంటారు. ఇటువంటి సందర్భం మన తెనుగునాటకూడా వుంది : ఏదయినా సంబంధం కలుపుకోవాలన్నప్పుడు వరసపెట్టి పిలిచి - “మాకు పప్పూ అన్నం ఎప్పుడు పడతారు? లేదా, “మాకు బూరిముక్క లెప్పుడు?” అని పలకరించడం కద్దు. సెల్తిళ్లు అన్నప్పుడు - “కేయూరబాహు చరిత్రంొలోని ఒక చిన్న కథ జ్ఞాపకానికి వస్తుంది: కాంచన గుప్పడనే వైశ్యుడు కాంచీపురంలో ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. వానికి పళ్ళీడు రావడంతో సంబంధం కోసం బంధువులను నలుమూలలా పంపించాడు. వాళ్లు తెలివైన పిల్లకోసం వెతుకుతున్నారు. ఇంతలో ఒక పరదేశి బియ్యం తెచ్చుకొని “బియ్యానికి సరికి సరి నూనె పోస్తారా"అని వర్తకుల్ని అడుగుతున్నాడు. అయితే ఏడు మానికెల బియ్యానికి మానెడు నూనె పాయ్యడం ఆ వూరి వాడుక. అందుచేత పరదేశి కోరిక చూసి ఆ వర్తకులు గేలి చేశారు. అయినా వాడు లక్ష్య పెట్టక అలా అరుస్తూనే పోసాగాడు. అప్పుడు ఒక వైశ్యబాలిక ఆ కేక విని వాణ్ణి పిలిచింది : “అబ్బీః నావద్ద నూనె ఉంది. బియ్యానికి సరికిసరి తీసుకొందువుగాని - రా! దేనితో బియ్యం ...... ల్రీసుకొంటానో దానితోనే దిగబారా నూనె కొలుస్తాను. ఎన్ని బియ్యానికి నూనె కావాలో అన్నీ వేరే పెట్టు. తరవాత పేచీలు పనికిరావు అంది. వాడు ఒప్పుకొన్నాడు. అప్పుడు బాలిక ఒక పల్లం ఆచ్చి దానినిండా బియ్యం కొలిపెంచుకొంది. తరవాత అంచులు దిగబారేటట్టు నూనెపోసి వానికి యిచ్చింది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న కాంచనగుప్పుని చుట్టాలు చెప్పగా “తగిన కోడలు దొరికిందని అతడు సంతోషించాడు. ఒక (ప్రేమికునికి ప్రియురాలు ఒక చిక్కు పెట్టింది. అది ఏమిటీ అంటే: ఈగపాలు, తియ్యటి గడ్డి, వండక తినే ఆకు - పట్టుకొని కలళ్లులేని గ్నురం ఎక్కి రావా లంటుంది. ప్రియుడికి ఎంతకీ సమాధానం తోచలేదు. యుక్తిపరుడయిన మిత్రుని సాయంతో చిక్కు విడింది. ప్రియుడు తేన, చెజకు, తమలపాకు పట్టుకొని జోడు తొడుక్కొని ఆమెవద్దకు వెళ్లగానే సమస్య పరిష్కారమై, వానికోరిక సఫలమైంది.

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎస్‌. శాస్తిణ 8.50., (4౧4) 2405 శ్రీ నందిరాజు చలపతిరావుగారి “నిజమైన కాశీమజిలొల్లో కూడా “చేప నవ్విన” కథ ఒకటి ఉంది. అండులో రాజకుమార్తె ఒక చిక్కుపని కల్పిస్తుంది. కాని డబ్బు విలువలో - ఒకటి లోపల తీపి, ఒకటి బయట తీపి, ఒకటి అంతా తీపి అయిన వస్తువులు మూడు కొని మూడు టోలీలు తిరిగి తీసుకు రమ్మంటుంది. “అరటిపండు, ఖర్జూరపండు, కలకండ మూడూ కొని మూడు టోలళీలు తిరిగి పట్టుకు వెళ్లమని ఉపాయం చెప్పిన మంత్రినే ఆమె పెల్లాడుతుంది. ఈవిధంగా సమస్యలు, చిక్కుప్రశ్నలు, యుక్తి ప్రయుక్తులు, గూఢార్థములతో కూడిన కథలూ, గాథలూ అన్ని దేశాలలోనూ విరివిగా వ్యాపించి వున్నాయి. బుద్ధిబలాన్ని పరీక్షించే ఈ సాహిత్యమంతా శక్తి యుక్తులతోనూ, లోకజ్ఞాసంతోనూ కూడుకొని వున్నది. ఇక - పదపూరణము ; ఇది విద్యార్థులకు నిత్యపాఠాల్లో పరిపాటే - (4-౪6 416 012౧69), ఈ కోవకు చెందినదే పదనిర్మాణం (14/06-0646109) నోరు తిరగని పదజాలాన్ని గబగబ పలికించడం - ఇది కూడా చిన్నపిల్లలకు గిలిగింతలు పెట్టే వినోదం. మచ్చుకి; . “నిష్టలవారి జ్యేష్టుడు బెస్టుగా కష్టపడి హిష్టరీలో ఫస్టు మార్కు ఆచ్చుకొన్నాడు.” “గాదికింద పందికొక్కు - గాదిలోని కందిపప్పు -నక్కి నక్కి బొక్కుచుండె” వీటిని ఇంగ్లీషులో 10౧0౮6 415165 అంటారు. వీటిని పలకడంలో తడబడకుండా నాలిక తిరగాలి. అయితే - నోట పలికేవన్నీ వ్రాతలో పెట్టలేము. ఈ తరగతికి చెందినదే మన తఆనాలి రామలింగడు నరసకవికి చెప్పిన “తృవ్వట బాబా...” అనే పద్యం. “సాంకేతిక భాష" అనేది పూర్వకాలంనుంచీ వాడుకలో వస్తోంది. దీన్ని “006౪ అంటారు. వినోదం కోసమే కాదు; విషయములు గుట్టుగా ఒకరికొకరు తెలుపుకోడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. ఇది ముఖ్యంగా ఉపయోగపడేది (పేమలేఖల్లో ఎ యుద్ధసమయాల్లో ం వాణిజ్యంలో. అందరకూ తఆలిసిన తంతివారా విధానంకూడా ఒక సాంకేతికమే.

2406 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము చిన్నప్పుడు పిల్లలు “క భాష, “తలక్రిందుల భాష” మాటాడుకోవడం మన మెరుగనిది కాదు.

ఈ సందర్బంలో శ్రీ మారేపల్లి రామచంద్రశాస్తిగారు వారి “తెనుగు - తోబుట్టువు"లలో వ్రాసిన మాటలు గమనింపదగి వున్నాయి.

“ఒక సంఘములోనే మెలంగుచుండు జనులు కొందజు _ప వారికి తలియని భాషారూపములను కల్పింతురు. ఇటులు కల్పింపంగా ఏర్పడినవే నేరగాండ్రభాష, బేరగాండ్ర భాష, పారిభాషిక భాష. మోటువాండ్ర భాషయు, కుజ్జవాండ్ర భాషయుకూడ వీనిలో చేరును”

ఒకప్పుడు దొంగలబారిని పడిన సాలెవాండు తమ సాంకేతిక భాష ఉపయోగించి తెలివితీటలుగా దొంగల్ని పట్టిన గాథ ఒకటి ఉన్నది. ఇది మిత్రులు శ్రీ చంద్రశేఖరంగారు సంతరించినది:

పదిమంది సాలీలు జట్లుగా పోయి, వ్యాపారం చేసుకొనేవారు. ఒకనాడు వాళ్లు పట్నానికి పోయి బట్టలమ్ముకుని సాయంకాలానికి ఇంటికి చేరుకుంటూ వుండగా, దోవలో ముగ్గురు దొంగలు అటకాయించారు. దొంగలు ముగ్గురే ఐనా, వాళ్ల దగ్గర కత్తులూ కటార్లూ వుండడంచేత, సాలీలు భయపడి తమ రూపాయలసంచీలు నేలమీద పడవేశారు.

అంతటితో పోక, దొంగలు "గోచీలు పెట్టుకుని, మీ మొలబట్టలు కూడా విప్పెపెట్టండి" అన్నారు. సాలవాండ్రు అలానేచేసి, తలలు వంచుకు నిలబడ్డారు.

అప్పటికీ ఊరుకోక దొంగలు నవ్వుతూ వేళాకోళంగా “ఏదీ, ఒక్కసారి నాట్యం చెయ్యండయ్యా, చూస్తాం” అన్నారు. పాపం - ఆ సాలీలకు నాట్యం తెలియదు. బదులు చెప్పలేక, గుడ్డు మిటకరిస్తూ చూస్తున్నారు. అప్పుడు దొంగలు సాలీలను చూచి “ఆడరేం? అంటూ కత్తులెత్తారు.

ఆ సాలిలలో ఒకడు చాలా గడుసువాడు. వాడు కాళ్లు మైకెత్తి ఎగురుతూ, తక్కిన వాళ్లనుకూడా అలానే చేయమని సంజ్ఞచేశాడు. తక్కినవారూ వాడిలాగానే ఆడటం మొదలుపెట్టారు. గడుసువాడు ఇలా ఒకపాట అందుకొన్నాడు :

“వులిగలము పులికోచలూ

లెయితెయి తకతక, తిరుమంది తిమ్మన్నలూ ,

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎన్‌. శాస్త్రం ర.50., (గ4గ4) 2407 ఆయితెయి తకతక,

సవనాకు సరి తిరువురూ

ఆయితెయి తకతక మెడపట్టి ఆడచుంతురూ తెయితెయి తకతక సవనాకు మిగిలుండగా తయితెయి తకతక తిరువూరి పొగ రడచుగా తెయితెయి తకతక చుట్టో పట్టో కట్టో తయితయి తకతక.”

ఈ వర్తకులకు కొన్ని గుర్తులున్నాయి. ఆ గుర్తులు అంగడివాండకు తప్ప మరెవ్వరికీ తెలియవు. వారు ఆ గుర్తులనే ఇతరులు తెలిసికోకుండుటకుగాను సరకులమీదకూడ వేయుట అలవాటు. సాలీలు పాడిన పాటలోని పదాలన్నీ చాలవరకు వర్తక రహస్యపు గుర్తులే. అందులో - సవన = ఒకటి, తిరు = మూడు, పులి = పది అని అర్థాలు. పులి కోచలనగా సాలీలు. తిమ్మన్న లనగా దొంగలు. ॥

ఆ పాట సారాంశ మిది ;

“సాలవాండ్రము మనం పదిమందిమి ఉన్నాము. దొంగలు ముగ్గురేను. ఒక్కొక్క దొంగను ముగ్గురు చొప్పున పట్టుకొంటిమా, మిగిలి ఉన్న పదవవాడు వారిని కట్టివేయగలడు.” అని. "

“చట్టో పట్టో కట్టో అనేసరికి, వెంటనేవారు అమాంతంగా ఒక్కొక్క దొంగమీద ముగ్గురేసి సాలీలు కలియబడి, కాళ్ళూ చేతులూ గట్టిగా పట్టుకున్నారు. తక్కినవాడు వారిని కట్టివేశాడు.

షావుకార్లుకూడా రోజువారీ బేరాల్లో కాతాదారులకు ఆలియని పర్ధతిలో “సంజ్ఞలో భాషను ఉపయోగిస్తారని ప్రతీతి. .

1781లో బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ “డ్యూమా” అనే ఆయనకు ఒక సాంకేతిక లేఖ వాగాడు. ఆ లేఖలో ఆంకెలూ, అక్షరాలూ నేటికికూడా ఎవరూ కనిపట్టలేక పోతున్నారట.

2408 సండిరి మల్తికార్టునరావు శతజయంతి. సంపుటము 42 పాహిత్యము సెల్లూరు నెజజాణలకూ, రాప్తూరు రసికులకూ (ప్రసిద్ధములని వచెప్పాముకదా! ఈ మాటను రూఢిపరచే - వారి మధ్యు నడచిన ఒక వినోద లేఖ : “నెల్లూరు నెఅజాణలకు రావూరు రసికులు వ్రాసి పంపిన వైనంఏమనగా _ మాలో పాములరాజు కొడుకైన నీటి తలవానికి వర్తమాన కోతి సంవత్సరం, పరిక్షిత్తు తల్లి అయనం, దారితల మాసం, మునుల లెక్క దివసం, ఉపాధ్యాయుడి వారం, ఏడు గుజ్జాలవాడు కనుపడినది మొదటు అనస్థాల గడియలకు లోపల భార్యా భర్తల లగ్నమందు మూడవకన్ను జరిగించుటకు ముసలివాళ్లు రెండు గడియల కాలమును నిర్ణయించినారు. దీనికిగా మీరు నాలుగు బుంగల గుమ్మడి పండ్లున్నూూ నాలుగు భాగముల బిం దెలున్నూూ కోయక పెల్లగింపకుండా యొక బండి తోటకూర కాడలున్నూ వండక తినే ఆకులున్నూ- పది కట్టలు పీచుపండ్ల ఇెట్ల పత్రాలున్నూ - సిగ్గు తండులానికి నాలుగు ముంతల సింగం బియ్యమునూక పంపకోరినాము. మజియు మావూరి బావినీళ్లు ఉప్పగా వుంటున్నవి కనుక ఈ కార్యం అయ్యేవరకున్నూ మీరొక మంచినీళ్ల బావిని పంపి, పాపం కానిదాన్ని కట్టుకోవలెనని కోరుచున్నాము. ఇంతే సంగతులు.”

  • ఇటువంటివి ఎన్నో [ప్రాచీన తాళప్యత్రములలో లభిస్తున్నట్టు వినికిడి. (3 లేఖను సేకరించినవారు శ్రీ పురాణం పిచ్చయ్య శాస్త్రిగారు.) అదృష్ట ఫలితాలు జెలిపే “ఫీత్రారామ చక్రం”, నక్షత్రాల గడులు, పుట్టిన తేదీ చెప్పుకోవడం, తలుచుకొన్న అంకె ఏదో చెప్పుకోవడం - ఇవి మరికొన్ని వినోదాలు. 'ప్రహేళికలు ధనార్జ్దనకు సాధనంగానే కాకుండా వాణిజ్య (ప్రచారానికి కూడా బాగా ఉపయోగిస్తున్నాయి... సినిమా అభిరుచి అతిగయిస్తున్న ఈ రోజులలో సమస్యలు కూడా అందుకు అనుగుణంగా రూపొందుతున్నాయి - కొన్ని ముఖభాగాలిచ్చి ఆయా తారలను గుర్తించమనడం ఇలాటిదే. ఇంగ్లీషులో గ1౮౮16౩, 00౧6౮౧రగుగాక, ౯౮౧౩, వఆం8600665, నృా౭265, ₹0గరఓ06ా 116/6 అని పేర్కొనబడే సాహిత్య వినోదాలన్నీ మన భాషలో విస్తృత వ్యాప్తిలో ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉందికదా! ఈనాడు ఇటువంటి వింతలూ - విశేషాలూ ప(త్రికాముఖమున, శడియోలోనూ “కిజో (౧012) అనే పేరిటకూడా మనకు సాక్లాత్కరిస్తున్నాయి. లెక్కలేని సాహిత్య వినోదాల్లో ఇవి కొన్ని:

సాహిత్యంలో వినోదం ఎమ్‌. ఎన్‌. శాస్తం 8.50. (౯4౧4) 2409 శ్రీ రెంటాల వెంకట సుబ్బారావుగారు ఏర్చి కూర్చిన “పొడుపు - విడుప్తొలలో కొన్ని ఉదాహరించడంతో ఇప్పటికి ఈ వ్యాసం సమాప్తి ;

  1. తీసినకొద్దీ పెద్దదయ్యే దేమిటి?
  2. కాశీనుంచి కలకత్తాకు కదలకుండా పొయ్యేదేమిటి ?
  3. కొయ్యడం, ముక్కలు పంచిపెట్టడమే కాని, యెవరూ తినేదిలేదు.
  4. ఎగువ పలక, దిగువ పలక, పలకలనడుమ మెలికలపాము.
  5. ఇదివరకు లేనిది, ఎప్పుడూ ఉండేది, ఎవరూ చూడనిది.
  6. ఇళ్లు లేని పట్నాలు, నీళ్లులేని సముద్రాలు.
  7. ఈనదు, పొల్లదు, బందంవేస్తే బిందెడుపాలు. - [జవాబులకీి తిప్పెచూడండి] “యగి2లల ల య్లాణల్ల నల 9 2 9 వంటి 7 కర్హార్‌ర్ధై € యిం "౭ కిణంటి 1? (రాం “ఇెరుమలేశ' శతకం దొరకడం దుర్లభమవుతున్నదని వినికిడి. పెద్దలు సంతరించి వుంచిన ఈ సారస్వతం అంతరించి పోకుండా చూడడం మన విధి. (కిన్నెర: సంప్పుటము 7, సంచిక 2, ఫీబవరి 1౪55) హాని రా రి సయం గ న పం

ఆలో కావ్యాలంకార పరిచయము ళ్‌ పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఎ.

  1. భామహుడు

కాలము ; భామహుడు, దండి - ఈ యిరువురి కాలములను నిర్ణయించుటలోను, అందున ఈ యిరువురిలో ఎవరు పూర్వులను విషయములోను విమర్శకులలో భేదాభ్మిప్రాయము లున్నవని తెలిపి యున్నాను. ఈ భేదములకు ముఖ్యకారణములు:

  1. కావ్యాలంకార, కావ్యాదర్శములు 'రెండింటియందును, అర్థమునందే కాక శబ్బమునందును, పరస్పరము సంవదించు భాగము లనేకము లుండుట];

  2. దండి భామహుని, భామహుడు దండిని పరసృ్రరము విమర్శించుచున్నట్లు న

  3. ఇందులకు లెండు మూడు ఉదాహరణముల నొసగుచున్నాను:

  4. “సర్గబంధో మహాకావ్యమ్‌", కావ్యాలంకారము 1-19 ; కావ్యాదర్శము 1-14.

  5. “మంత్రదూత ప్రయాణాజి నాయకాభ్యుదయెశ్చ యత్‌” కావ్యాలంకారము 1-20, “మంత్రదూత

ప్రయాణాజి నాయకాభ్యుదమయొరపి” కావ్యాదర్శము కేం17. 3. “పేయో రసవదూర్ణస్వి పర్యాయోక్తం సమాహితం" కావ్యాలంకారము 3-1; కావ్యా దర్శము 2-5. లాలా పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి, 2411 కన్పట్టు భాగములు రెండు గ్రంథములందును బహుళముగా నుండుట. ఈ కారణములు రెండును విభిన్న వాదములకు దారితీసినవి. ఇట్లు బయలుదేరిన వాదముల సారాంశమును ఈ [క్రిందివిధముగా పేర్కొనవచ్చును : 1, దండికంటె భామహుడే పూర్వుడు. అనగా భామహుడు (క్రీ. శ. 400 (ప్రాంతము) ముందరివాడు; దండి (క్రీశ. 700 (ప్రాంతము) తరువాతివాడు; ఇరువురికిని మధ్య శతాబ్బముల అంతరమున్నది - ఇది శ్రీయుతులు బలదేవ్‌ ఉపాధ్యాయ: బతుక్‌ నాథశర్మల నిర్ణయము. 2. భామహునికంటి దండియే పూర్వుడు. అనగా దండి (క్రీశ,

660-680) ముందరివాడు. భామహుడు (క్రీశ. 700-750) తరువాతివాడు;

ఇరువురికిని మధ్య కొన్ని దశాబ్బముల అంతరము మాత్రమే కలదు. అంతియేకాని

శతాబ్బముల అంతరములేదు; ఒకరు ఇంకొకరి [గ్రంథమునుండి [గ్రహించినారు. లేదా ఒకరిని ఇంకొకరు విమర్శించినారు అని అనుటకంటె ఇరువురును తమకు పూర్వు వైన ఆలంకారికుల నెవ్వరినో అనుసరించియుందురనుట సమంజసము.

  • ఇది మహామహోపాధ్యాయ శ్రీ, పి. వి. కాణే నిర్ణయము” ఇంక తక్కిన విమర్శకుల

అభ్మిపాయములన్నియు ఈ రెండు వాదములలో ఏదో ఒకదానికి ఇంచుమించుగా

సరిపోవును.

  1. ఇట్టి భాగములను కావ్యాలంకారొనువాదములో ఆయా స్థలములందు వివరింతును. రెండు పక్షములకు రెండుదాహరణముల మాత్ర మిచ్చట నోసంగుచున్నాను.

(1) భామహుడు కథా, ఆఖ్యాయికలు రెండింటికిని భేదములు పాటించి వేర్వేరు నిర్వచనము ” లొసంగియున్నాడు (1-25-29). కాని దండి అవి అభిన్నములనియు, కథ, ఆభఖ్యాయిక - అనునవి రెండును ఒకేజాతి రచనకు భిన్న నామములు మృాతమే యనియు పేర్కొనెను. ఇచ్చట దండి భామహుని విమర్శించుచున్నట్లుగా కావ్యాదర్శ వ్యాఖ్యాతయగు తరుణ వాచస్పతి వివరించెను. కాని ఇతడు క్రీ. శ. 13వ శతాబ్ధివాడగుటచేత కాలనిర్ణ్భయమున వీనిని ప్రమాణముగా గ్రహింపరాదని శ్రీ కాణే అభ్మిపాయము. (2) నిండోపమ, ప్రశంసోపమ, చిఖ్యాసోపమ, అనెడి ఉపమాభేదములు మూడింటిని దండి కాన్యాదర్శమందు నిర్వచించియున్నాడు (2-30, 31, 32). కాని ఈ విషయమును గూర్చి భామహుడు చేసిన వివరణము దండిమీది విమర్శగా గోచరించుచున్నది- “నిందా, ప్రశంసా, చిఖ్యాసాభేదముల చేత, ఉపమాలంకారము (త్మిపకారమని కొందరు మహాత్ములందురు. కొని “సామాన్యగుణ” నిర్దేశముచేత ఈ మూడింటిని మే మిదివరకే చెప్పియున్నాము" - కావ్యాలంకారము, 237, 36.

  1. చౌకాంబా సంస్కృత సీరీస్‌ (కాశ) ముద్రణమునకు వారి ఉపోద్దాతము. పుట - 40.

  2. “మేధావి యనువాని ననుసరించి ఉపమాదోషములను పేర్కొనినట్లు ఖావమహుడు చెప్పుకొనుట్టనుబట్టి అంతకుముందే కొండరు ఆలంకాశికులుండిరనుట స్పష్టము. వారి గ్రంథము లిప్పు డ్రేవియును లభింపకపోయినను దండి భామహులకు అవి తెలీసియేయుండునని యూహించుట అసమంజసము కానేరదు.

వ్‌ సొహిత్యదర్పణోపోద్దాతము, పుట 94.

2412 పందిరి షుల్లికార్జుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము భామహునికంటె దండి పూర్వు డను వాదమును లేవనెత్తిన వారు శ్రీ యమ్‌. టి. నరసింహ అయ్యంగార్‌. ప్రా॥ ఏ. చి. కీత్‌ అభిప్రాయమును ఇదియే. కాని శ్రీ కె. పి. త్రివేది, డా! జాకోబి, ప్రా॥ రంగాచార్య, శ్రీ గణపతిశాస్తి9, డా!) నోబెల్‌ మొదలగువారు పె వాదమును ఖండించి భామహుడే (ప్రాచీనుడని తేల్చిరి, డా| ఎస్‌. కే. డే. డా! శంకరన్‌, డా! వి. రాఘవన్‌ మొదలగు పరిశోధకుల అభి[పప్రాయమునందు కూడ భామహుడే ట్రాచీనుడు. శ్రీయుతులు బలదేప్‌ ఉపాధ్యాయ, బతుక్‌నాథశర్మ లిరువురును కాశీ ముదణమునకు తాము (వ్రాసిన ఉపోద్దాతమందు (క్రీ. శ. 1929 పూర్వము బయలుదేరిన వాదములను చాలవరకు చర్చించి, దండికంటె భామహుడే పూర్వుడని నిర్ణయించియున్నారు. ఇంక త్రీ పి. వి. కాణే తన “సంస్కృత సాహిత్య శాస్త్ర చరిత్ర" (సాహిత్య దర్పణోపోద్దాతము = క్రీశ. 1951) యందు “భామహుడు పూర్వుడు” “దండి పూర్వుడు" అనెడి "రెండు వాదములను కూలంకషముగా చర్చించియున్నారు. మొదటి వాదమునకు చెందిన ఆధారములను తొమ్మదింటిని, రెండవ (తను వాదమునకు చెందిన ఆధారములను పదునేడింటిని ఆయన పేర్కొనెను. (మొత్తము ఆంగ్లాక్షరమాలను 4 10 2 పూర్తిచేసియున్నారు). " కావ్యాలంకార షస్టాధ్యాయవుందు భావుహుండు “న్యాసకారున” పేర్కొనియున్నాడు. ఈ న్యాసకారుడు క్రీశ. 700 ప్రాంతములందున్న “జినేంద్రబుద్ధొ (పాణిని సూూతములకు వ్యాఖ్య మొన “కాశికొ మీద మరల పెద్ద వ్యాఖ్యానమును “న్యాస” మను పేర రచించెను. యని ప్రా॥ పథక్‌ శ్రీ పి. వి. కాణీ మొదలగు వా రంగీకరించియున్నారు. వానిని పేర్కొన్న భామహుడు క్రీ.శ. 700 తరువాతివాడగుచున్నాడు. ర్ముదటాలంకార వ్యాఖ్యాత యగు “నమిసాధువు” దండిని భామహునికంటె పూర్వునిగా పేర్కొనుట (దండి, మేధావి ర. ఈ “న్యాసకారా పదము పెక్కు విమర్శలకు గురియెనది. “న్యాసొ మను పేరుగలిగిన వ్యాకరణసంబంధమైన రచనలు చాల ఉన్నను క్రీశ. 700 పూర్వము రచింపబడినది జినేం్యదబుద్ధి న్యాసము మాత్రమే యని శ్రీ కాణీ నిర్ణయము. కావ్యాలంకార పంచమాధ్యాయమందలి “అనుమానాదులా నిర్వచనములు కొన్ని ధర్మకీర్తి (క్రీ.శ. 650 (ప్రాంతములు) “న్యాయబిందువు" నందలి నిర్వచనములతో సంవదించుచున్నవి. భామహుడు ధర్మకీర్తిని అనుసరించియుండునని అంగీకరించిసచో భామహుడు క్రీ.శ. 700కు తరువాతివాడే కాగలడు.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి. 2413 రుద, భామహాదికృతాని) శ్రీ కాణే వాదమునకు చాల బలము నొసంగుచున్నది. ఈ చివరి విషయమును చర్చించిన పిమ్మట శ్రీ కాణే తెలిపిన అభ్మిపాయమును ఈ [క్రిందివిధమున సంగ్రహముగా పేర్కొనవచ్చును.

“ఇంతవరకును పేర్కొనబడిన ఆధారములు పూర్వపక్షరహితములని చెప్పజాలను. కావున ఇరువురిలో ఎవరు పూర్వు లెనప్పటికిని ఇరువురిమధ్య వ్యవధానవమ చాల తక్కువయనియు, ఇరువురును క్రీశ. 600-750 మధ్యకాలమునకు చెందినవారనియు చెప్పవచ్చును... ఒకరినుండి ఇంకొకరు [గ్రహెంచియుందురని కాని, లేదా ఒకరినొకరు విమర్శించియుందురని కాని అంగీకరింపవలసి వచ్చినప్పుడును, పూర్వాలంకారికుల నుండియే ఇరువురును (గ్రహించి యుందురనుట అంగీకార యోగ్యము కానప్పుడును - దండి పూర్వుడను వాదమునే నేను సమర్థింతును.”

శ్రీ కాణే చేసిన నిర్ణయము (ప్రామాణికమును, పక్షపాత రహితమును అయినప్పటికిని, కాలనిర్ణయము లెట్లున్నప్పటికిని, దండికంటె భామహుడు పూర్వుడనుటయే బహుజనసమ్మతము.

దేశము : భామహుడు తన తండ్రిపేరు తప్ప స్యవిషయము లింకేమియును తెలుపలేదు. అందుచేత దేశ నిర్ణయమును వివాదాస్పదమే యొనది. కాశ్శ్మీరీయుడైన ఉదృటుడు “భామహ వివరణము” (కావ్యాలంకారమునకు వ్యాఖ్యయగునేమో?) రచించినట్లు ఉద్భటాలంకార (కావ్యాలంకార సారసం[గహ) వ్యాఖ్యాతయగు (పతీహారేందురాజు పేర్కొని యున్నాడు." అది లభింపలేదు; లభించియున్నచో పెక్కు సమస్యలు తీరియుండెడివి. ఉద్భటుడు చూపిన అభిమానమునుబట్టి భామహుడును కాశ్మీరీయుడై యుండునని ఊోహింపవచ్చును. “భామహుని జన్మ చేత కాశ్మీరదేశము అలంకృతమైనొదని అచ్చటి పండితులు గర్వపడుచుందురట!

మతము : షష్టాధ్యాయాంతమున తాను “రక్రిలగోమి సూనుడనని భామహుడు చెప్పుకొనెను. “గోమి" పదము బౌద్ధ నామములను తలప్‌ంచుచున్నదనియు, ఆ 7. సాహిత్యదర్పణోపోద్దాతము - పుట 108.

8... "విశేషోక్తి లక్షణేచ “భామహవివరణే" భట్టోద్భటేన వికదేశ శబ్దః ఏవం వ్యాఖ్యాతగా కావ్యాలంకార సార సంగ్రహవ్యాబఖ్య.

2414 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: పాహిత్యము పేరుగల బుద్ధుని శిష్యుడొక డుండెననియు, చాంద్ర వ్యాకరణ కర్తయగు “చంద్రగోమి” బౌద్ధుడనియు ఈ కారణములనుబట్టి “రక్రిలగోమి” యును బౌద్ధుడగుననియు, తత్సూనుడగు భామహుడును బౌద్ధుడే యగుననియు కొందరి వాదము. అంతేకాక మంగళాచరణ శ్లోకమందు “ప్రణమ్యసార్వం, సర్వజ్ఞం” అని భామహుడు రచించి యుండుటయు నిందులకు బలము నొసంగుచున్న దందురు. కాని తక్కిన విమర్శకులు “గోమి” పదము పూజ్యవాచకము మాత్రమే యందురు. “గోమ” పదము క్రీ.శ. 4, లేదా 5వ శతాబ్దినాటికి కేవలము బౌద్ధనామ చిహ్నముమాత్రమే కాదనియు, బౌద్ధులు కానివారికికూడ ఆపేరున్నదనియు శ్రీ కాణే నిరూపించియున్నారు. మంగళాచరణమందలి “సర్వజ్ఞ పదము శివునకు, బుద్ధునకుకూడ పర్యాయపదమే. ఇంక “సార్వ” పదము బుద్ధునకు పర్యాయపదమే కాదు. “అందరకును హితుడు” అని మాత్రమే దాని కర్థము. అంతేకాక భామహుడు బౌద్ధుల “అపోహ” వాదమును (6 - 17, 18, 19) తిరస్కరించి యున్నాడు; (గంథమం దెచ్చటను బుద్ధునకు, బౌద్ధులకు సంబంధించిన సంఘటనలను పేర్కొనలేదు; రామాయణ, మహాభారత, బృహత్కథాదులందలి సంఘటనలను బహుళముగా ఉదాహరించి యున్నాడు - ఈ కారణములనుబట్టి ఈతడు బౌద్ధుడు కాదనుట స్పష్టము. భామహుడు వైదిక ధర్మావలంచియెన బాహ్మణుడనుట బహుజన సమ్మతము. భామహునిచేత పేర్కొనబడిన రచయితలు, రచనలు రచయితలు - మేధావి (2 - 40; 88; రామశర్మ (2 - 19; 58) కణభక్షుడు (5-17); న్యాసకారుడు (6-36 ); శాల్లువర్ధనుడు (2-46) మొదలగువారు. రచనలు - అశ్శకవంశము (? - 33); అచ్యుతోత్తరము (2-19); రాజమిత్రము (2-45; 3-10); రత్నాహరణము (3-8) - ఈ (గ్రంథము లేమియును లభింపలేదు. అంతేకాక శాఖవర్థనుడు, అశ్శకవంశము, అచ్యుతోత్తరము, రాజమి[(త్రము, రత్నాహరణము - ఈ ఐదుపేర్లును మజి యే యితర [గగ్రంథమందుకూడ స్మరింపబడలేదు - బృహత్క్మథయందలి వత్సేశ, నరవాహన దత్తుల కథలు ఉదాహరింపబడినవి. ఇంక కొన్నిచోట్ల పేర్లు చెప్పకయే “అపరే, అన్యే, శీషాంచిత్‌" లలా 9 3-7 గ్లోకమునందు కర్ణ, పార్థ, శల్యులు పేర్కొనబడిరి; వ్‌ = ఉత శ్లోకమునందు రామ, పరశురాములు పేర్కొనబడిరి - ఇట్టివి అనేకములు కలవు.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి 2415 మొదలగు పదములతో ఇతరుల మతములను పేర్కొని యున్నాడు. నాటకాదుల విషయమున “ఉకో2 వ్యైస్తస్య విస్తర (1 - 24) అనుట భరతుడు మొ॥| నాట్య శాస్త్ర కర్తలను సూచించుచున్నది. పాణినిని “సాలా తురీయ”, “సూతకృత్‌” అనియు కాత్యాయనుని “పదకారు” డనియు, మహా భాష్యమును “ఇష్టప్రయోగ” మనియు పేర్కొనెను. “పదము” (1/06) ను నిర్వచించు సందర్భమునందు “గురుభిః కింవివాదేన?” (4 - 7) అని చెప్పుటలోని “గురువు” లవ్వరో తెలియదు. భామహుని పేర్కొన్న అర్వాచీనులు: కావ్యాలంకార మందలి నూరు, నూటపాతిక శ్లోకములు అర్వాచీన (గంథములందు, పలు మతములకు చెందిన పలువురిచేత, భామహుని పేరుతోను, భామహుని పేరు లేకుండగనుకూడ పేర్కొనబడినవి.” ఈ శ్లోకములను పేర్కొన్నవారిలో ముఖ్యులు ఉద్భట, వామన, ఆనంద వర్ధన, కుంతక, అభినవగుప్త, మమ్మటాదులు. ఇంక విద్యాధర, రుయ్యకాదులు వీనికి ఉన్నత స్థానమిచ్చి (పాచీనాచార్యునిగా పేర్కొనియున్నారు. భామహునిపేరుతో కావ్యాలంకారమునుండి పేర్కొనబడిన శ్లోకములు కొన్ని- ధ్వన్యాలోకమందు - 2 - 85 క్లో. పేర్కొనబడినది; ఉద్భటాలంకార వ్యాఖ్యలో -1-17; 3 - 33 మొ॥ శ్లోకములు పేర్కొనబడినవి; “లోచన” యందు 1-9 శ్లో, మొ॥ శ్లోకములు పేర్కొనబడినవి. భామహునని పేరు లేకయే కావ్యాలంకారమునుండి పేర్కొనబడిన శ్లోకములు కొన్ని - ధ్వన్యాలోకమందు 1-2, 6 36; 2 - 23, 27, 68, 69 మొదలగు శ్లోకములు. కావ్యప్రకాశమునందు - 1 - 13, 14. 15 2 - 47, 55, 57 మొ! “పూ ర్వేభ్యో భామహాదిభ్యః సాదరం విహితాంజలి౯ొ అని విద్యాధరుడును; ". “భామహోద్భట (్రభృతయః చిరంతనాలంకార కారా? అని రుయ్యకుడును భామహుని సగౌరవముగా పేర్కొనియున్నారు. “అతిశయోక్తి"ని గూర్చి చర్చించెడి తలా 10. శ్రీ కె.పి. త్రివేది ప్రతాపరుదయశోభూషణమున కనుబంధముగా ప్రకటించిన “కావ్యాలంకారొ మందలి అధస్పూచికలలోను; కాశీముదణానుబంధమునందును ఈ విషయము సవిస్తరముగా కలదు. 11. “వైషా సర్వైవ వథ్రోక్తి:.” - ఈ శ్లోకమును అనేకులు పేర్కొనియున్నారు.

2416 పందిరి మల్లికార్టునరావు శతజయంతి. సంప్పుటము. 4: సాహిత్యము సందర్భములో “ఆకలే దర్శితమ్‌ అనుచు వీరరాఘవభట్టు శాకుంతల వ్యాఖ్యానములో భామహాలంకారమునుండి ప్రమాణము నుదాహరించి యున్నాడు, కావ్యాలంకారమునుఆకర” (77646418 ౧౦0౪96) మనుట గమనార్హము. ఇతర రచనలు: అర్వాచీన [గ్రంథములండు, వ్యాఖభ్యానములండు భామహునివిగా పేర్కొనబడిన శ్లోకములు కొన్ని కావ్యాలంకార ము(ద్రణములందు కస్పట్టుటలేదు. అవి ఛభందస్సునకు, అలంకార శాస్త్రమునకు సంబంధించి యున్నవి, ఇతర([గ్రంథములేమైన రచించెనేమో ఆలియడు. వరరుచి “ప్రాక్కత (ప్రకాశ "ళు భామహుని వ్యాఖ్య ఒకటి కలదు. ఆ భామహుడును, ఈ భామహుడును ఒకరే యగుదురో, కారో అను విషయము వివాదాస్పదమైనది. ఇంతకుమించి భామహుని ఇతర రచనలను గూర్చిన వివరమింకేదియును లేదు. స్వభావము; భామహుడు చాల స్వతంత్రుడు. ప్రసిద్ధమైన “నాట్యరస” ప్రవాహమున కదురీదినవాడనుట ్రసిద్ధమే. “అలంకార విధిని స్వబుద్ధితో సర్ణయించి చెప్పితినొ (3 - 58); “స్యధీశక్తిచేత కావ్యలక్ష్మములు నిర్ణయింపబడినవి" (6 - 64) అని ఖభావంహండు స్వాతిశయవుగా చెప్పుకొనినాడు. ఇంచువుంచుగా ఉదాహరణములన్నియు భామహుని సొంతములనియే చెప్పవచ్చును. గోస్వయం కృతైరేవ నిదర్శ నైరియం మయా ప్రక్షప్తాఖలు వాగలంకృతిన 2 - 96). శబ్దతత్త్వాది నిర్ణయములందు వ్యతిరేకులను స్పష్టముగా తిరస్కరించుటయే. కాక పరిహసించియున్నాడు (కొందరు సుధీవంతులిట్లందురు" 1 - 31; ఆ విద్వాంసులకు నమస్కారము 4 - 46 మొదలగునవి. అయినను భామహుడు గర్వరహితుడనియే చెప్పవలెను. చతుర్థ పరిచ్చేదాంతమున తన్ను గూర్చి చాల వినతుకై చెప్పుకొనియున్నాడు. మోతాదును మించని ఆ స్వతంత్రత, ఈ వినయము = ఇవి రెండును తరువాతి ఆలంకారికులకపై తమ (ప్రభావమును చూపి వారిని వశపరచుకొన్నవని చెప్పవచ్చును; ఇంచుమించు 400 శ్లోకములు మాత్రమే కలిగిఉన్న కావ్యాలంకారమునుండి నూరు, నూటపాతిక క్షోకములు అర్వాచీసులచేత ఉదాహరింపబడుట ఆలంకారికులయందు భామహుంని స్థానమును సుస్పష్టముగా నిరూపించుచున్నది. “భామహ*ి నామము సహజ నామము కాదనియు, పెట్టుకొన్నపేరు (౧6? ౧౫గ౪) అయి యుండుననియు, “భామహ” పదమునకు “0౧6 *గ౦ ౧46 [1166 08 876౧ ౪౧ 2౧౩౪౯ అని అజ్ధమనియు శ్రీ ఏ. వి, నాగనాథశాస్త్రిగారు తమ ఆంగ్లానువాద క్పీర్రికలో సేర్కొనిరి.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి 2417

  1. కావ్యాలంకారము

ముద్రణములు: 1. క్రీశ. 1909 లో శ్రీ కె. పి. త్రివేది” కావ్యాలంకారమును

'ప్రప్రథమముగా, విద్యానాథుని పప్రతాపరుద్రీయమున కనుబంధముగా

(ప్రకటించెను. (30గ౦ఇ౫/ 54౧5401 56౧69)

  1. క్రీశ. 1927లో శ్రీ పి. వి. నాగనాథశాస్త్రిి కావ్యాలంకారమును ఆంగ్లానువాద సహితముగా (ప్రకటించెను. (4/11406 ౧౧౧౪౧౦ ౧/89, 2౧0౧8)

  2. క్రీశ. 1928లో శ్రీయుతులు బతుక్‌నాథ శర్మ, బలదేవ్‌ ఉపాధ్యాయులు ఇరువురును సంస్కృతమూలమును (ప్రకటించుచు, ఇంచుమించు 80 పుటల ఉపోద్దాతమును వాసినారు.(0[0౪104గ04 5409601 56౧65, 86౧౭౯85)

  3. క్రీశ. 1934 లో శ్రీ డి. టి. తాతాచార్య శిరోమణి స్వీయ సంస్కృత వ్యాఖ్యా (ఉద్యానవృత్తి) సహితముగా కావ్యాలంకారమును (ప్రకటించిరి (5/01/1294 ని?655, 71007860). ఉదృటుని “భామహ వివరణము” లభ్యముకాని లోపమును శ్రీ తాతాచార్యులవారు తీర్చిరని చెప్పవచ్చును.

రచనా ప్రణాళిక : షష్ట పరిచ్చేదాంతమున రెండు శ్లోకములలో భామహుడు

తన (గంథరచనా ప్రణాళికను స్థ్టూలముగ నిరూపించియున్నాడు. షస్ట్యా శరీరం నిర్ణీతం, శతషష్ట్యా త్యలంకృతి:!

పంచాశతా ద్రోషదృషప్టి* సప్తత్యా వ్యాయనిర్ణయః|! షష్ట్యా శబ్రప్యశుద్ధిః స్యాదిత్యేవమ్‌ వస్తుపంచకమ్‌! ఉక్తమ్‌ షడ్భిఃపరిచ్చే డైః భామహేన[కమేణవః॥

మొతము 6 పరిచ్చ్భేదములు, అందు ఐదు విషయములు వివరింపబడినవి.

ఇంచుమించుగా 400 శ్లోకములు కలవు :

క కావ్యశరీరము (ప్రథమ పరిచ్చేదము - 60 శ్లోకములు) - కవిత్వ (ప్రయోజనాదులు, కావ్య భేదములు, రీతి, పది సామాన్య దోషములు మొదలగునవి చర్చింపబడినవి.

  1. అలంకారములు (ద్వితీయ, తృతీయ పరిచ్చేదములు - 160 శ్లో - వై గుణములు, 2 శబ్దాలంకారములు, ఏ6 అర్థాలంకారములు లక్ష్యః లక్షణ

  2. చిరకాలముగా లభ్యముకాని కావ్యాలంకార ప్రతిని ప్రపథమముగా సంపాదించిన ఖ్యాతి

పొ॥ రంగాచార్యగారికి దక్కినదని “కవిరాజమార్గా ఉపోద్దాతమండు శ్రీ కె. వి. పథక్‌ (1898) పేర్కొనియున్నారు. ఇంక ప్రప్రథమముగా ముద్రించిన ఖ్యాతి శ్రీ త్రిదేదికి లభించినది.

2418 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము సహితముగా వివరింపబడినవి. ఇందు కేవలము నామమాత్రావశేషులైన కొందరు కవుల (గగంథములనుండి ఉదాహరణము లొసంగబడినవి.

  1. దోషములు (చతుర్థ పరిచ్చేదము = 50 శ్లోకములు.) - పది విశేష కావ్యదోషములు లక్ష్య, లక్షణ సహితముగా వివరింపబడినవి.

4, న్యాయ నిర్ణయము” (పంచమ పరిచ్చేదము - 70 శ్లోకములు) - ఇందు 11వ దోషము (ప్రతిజ్ఞా, హేతు, దృష్టాంత హీనత్వము) చర్చింపబడినది.

, కావ్యరచనకు, న్యాయశాస్త్రమునకు గల సంబంధము (10010241 100004- .. 1ం౧9 0 ౧0610 తత్సంబంధమైన దోషములు వివరింపబడినవి. కు శబ్బశుద్ధి (షష్ట పరిచ్చేదము - 60 శ్లోకములు) - “శబ్ద” నిర్వచనము, శబ్ద సాధుత్వాసాధుత్వ వివేచనము, సౌశబ్బ్యమూలకములైన వ్యాకరణాంశములు నిందు కలవు. విషయ పరిశీలనము

  1. కావ్యలక్షణప్రయోజనములు: “శబ్దార్థా సహితౌ కావ్యం” (1 - 16) అనునది భామహని ప్రసిద్ధ కావ్యనిర్వచనము. (దీని నుండియే “సాహిత్యము”, “సాహిత్య శాస్త్రృవమ” అను పదము లేర్పృడియుండునని గుర్తించి యున్నాము.) శబ్దార్థసహితమైనదే కావ్యమన్నప్పుడు ఏ రచనయొనను కావ్యము కాగలరు. ఈలోపము పరిహరించుటకు మరల “యుక్తం వక్రస్వభావోక్త్యా సర్వమేవై తదిష్యతౌ (1 - 30) అని వివరించియున్నాడు. కావున ఈ రెండును కలిసి యేర్పడిన “వక్రోక్తి యుక్షములైన శబ్దార్ధ్థములతో కూడినదే కావ్యము” అనునది భామహుని కావ్యలక్షణము కాగలదు. ఇంక కావ్య ప్రయోజనమును గూర్చి చర్చించుచు “సాధుకావ్యము ధర్మార్థ కామమోక్షములందును, కళలయందును వైచక్షణ్యమును. ప్రీతిని, కీర్తిని కలిగించును.” (1 - 2) అని పేర్కొనియున్నాడు. ఈ (ప్రయోజనములకు మవమమ్మటుడు “కాంతా సమ్మితమైన ఉపదేశము గూడ చేర్చెను. ఈ 13.న్యాయ నిర్ణయము అలంకారశాస్త్రమునకు సంబంధించిన భాగము కాదని దండి నిరసించియున్నాడు. ఇంక షష్టపరిచ్చేదము “శబ్బశుద్ధొయు నట్టిదే. కాని వామనుడు ఒక్కడు మాత్రము ఈ భాగమును మరల కావ్యాలంకార సూతములో పంచపాధికరణమునందు సవిస్తరముగా వివరించి యున్నాడు.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ని 2419 ప్రయోజనములందు “పీతొయే ప్రధానమని అభినవగుప్పుని నిర్ణయము (ఆనంద ఏవ పార్యంతికం ఫలం) కాని భామహుని “పీతొయు. (షి 08గ41౧ 01829201 6౫086౧6౧౦6), అభినవగుప్పుని “ఆనందము” ను (46510610 అ౭గ౧౭౧౦౭) ఒకటియేయని చెప్పజాలము. ఇంతకును భామహుడు “కవిత్వానుభూతి"ని గూర్చి చర్చింపనేలిదు. కావ్యప్రయోజనములను గూడ “పరిత” దృష్టితోకాక “కవిని దృష్టిలో పెట్టుకొనియే చెప్పెను. అయినను “కవి, “పఠితొ ఇరువురును సమానానుభూతి కలవారేయని అభినవ గుప్తాదులు తరువాత నిరూపించియున్నారు కాన ఖామహుడు “కవి పరముగా చెప్పిన (టీతిని *పరిత” అనుభూతికి కూడ అన్వయింపవచ్చును. 2. రీతులు: వైదర్భ, గౌడీరచనలు“ రెండింటిని మాత్రమే భామహుడు పేర్కొనెను. కాని ఈ రెండింటికిని తరతమ ఫేదములనాత డంగీకరింపలేదు. “అలంకారవంతము, అ(గ్రామ్యము, అనాకులము, అర్ధ్థవంతము, న్యాయ్యము అయినప్పుడు రెండు విధములగు రచనలును (గాహ్యములి" (1 - 35) అని వాని నిర్ణయము. కావుననే “అతిమాత” మైనప్పుడు వైదర్భియు నసహ్యమగును; “సదర్ధ" మైనప్పుడు గౌడియు మనోహరమేయని భామహు డంగీకరించెను. కాని దండి భామహుని అభిప్రాయమునకు పూర్తిగా వ్యతిరేకి యనవచ్చును. “వెదర్శ్భి” యందాత డధికాదరమును జూపెను.

  1. గుణములు: మాధుర్యము, ప్రసాదము, ఓజస్సు - ఈ మూడింటిని మాత్రమే భామహుడు పేర్కొనెను (2-1, 2, 3. భామహునకు ముందున్న భరతుడు “దశ గుణము"లను నిర్వచించి యుండెను. దండికూడ “దశ గుణమూలను విపులముగా వివరించెను. భామహుని ఈ మూడు గుణముల నిర్వచనములైనను తక్కినవారి నిర్వచనములతో పూర్తిగా నేకీభవించుటలేదు. దండి నిరూపించినట్లు భామహుడు గుణములకు, రీతులకు గల సంబంధమును గూడ స్పష్టముగా నిరూపింపలేదు. కాని వైదర్భ రచనను విమర్శించినప్పుడు “పసన్నమ్‌ (పసాదము), బుజు, తతత
  2. భామహుడు "రీతి" పదము నుపయోగింపలేదు. దండి కూడ “రీతొ పదమును గాక “మార్గ

పదమును వ్యవహరించియుం డెను.

2420 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కోమలమ్‌, [గ్రుతిపేశలమ్‌” (1-34) అనుగుణములను, గౌడీరచనను వివరించు నప్పుడు “అనాకులమ్‌.. అ[గ్రామ్యమ్‌” (1-35) అనుగుణములను వివరించియుండుట గమనార్హము. అంతేకాక “భావికత్వము”ను “ప్రబంధ గుణముూగా (002% 141 0610005 10 2 60గ౧౧౦91$౦౧ &9 2 ౪00019) నిర్వచించియున్నాడు. భామహుడు గుణములకు, ఆలంకారములకు భేదమును పాటించినట్లు కానరాదు.

  1. దోషములు; భామహుడు మూడు వర్గములుగా, మొత్తము ఇరువదియొక్క దోషములను పేర్కొనెను. 1. నేయార్థము, క్లిష్టత, అన్యార్ధ్థము, అవాచకము, అయుక్తిమంతము, గూఢనబ్దాభిధానము - ఈ ఆరును మొదటివర్గము; 2. శ్రుతిదుష్టత, అర్థదుష్టత, కల్పనాదుష్టత, శ్రుతికష్టత - ఈ నాల్లును ద్వితీయవర్గము - ఈ పది దోషములును సామాన్య దోషములు. ఇవియన్నియును ప్రథమ పరిచ్చేదాంతమున (37 నుండి 53 శ్లో. వరకు) వివరింపబడినవి; 3. ఇంక చతుర్థ పరిచ్చేదము (ప్రత్యేకముగా దోష ప్రకరణము. ఇందు మటి పది విశేష దోషములు వివరింపబడినవి. పంచమ పరిచ్చేదమందు పదునొకండవ దోషము - ప్రతిజ్ఞా హేతుదృష్టాంత హీనత్వము - విపులముగా వివరింపబడినది. మొదటి పది దోషములు గుణములుగా నయ్యెడి సందర్భములనుగూడ (పథమ పరిచ్చేదాంతమున భామహుడు వివరించియున్నాడు. కాని తరువాతి దోషముల నట్లు వివరింపలేదు. వీనినేకాక “ఉపమా దోషములను" ఇంకొక ఏడింటిని భామహుడు పేర్కొనెను ( 2-39 నుండి 44). అల్లే “వైదర్భరచని సందర్భమునందుకూడ కొన్ని దోషములను సూచించియున్నాడు (1-34).

  2. కావ్య భేదములు: నాలుగురకములైన కావ్యభేదములను భామహుడు పేర్కొనియున్నాడు (1-16, 17, 18). కావ్యము - 1. గద్య, పద్యభేదములచేత ద్వివిధము; 2. సంస్కృత, ప్రాకృత, అప్మభంశ (భాషా) భేదములచేత (త్రివిధము;

  3. వృత్తదేవాదిచరితశంసి, ఉత్పాద్య కలా, శాస్త్ర (విషయ) భేదములచేత చతుర్విధము; 4. సర్గబంధ, అభినేయార్థ, ఆఖ్యాయికా, కథా, అనిబద్ధభేదముల చేత పంచవిధము. ఈ చివరి విభజనయే (ప్రధానమైనది. ఈ భేదములను (“అభినేయార్థము” తప్ప) విపులముగా వివరించియున్నాడు.

కావ్యాలంకార పరిచయము. పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఏ 2421 | 6. అలంకారములు: తాను నిర్వచించిన యలంకారములన్నింటిని భామహుడు నాలుగు వర్గములుగా"* విభజించి యున్నాడు.

  1. అన్నుపాస, యమక, రూపక, దీపక, ఉపమలు (“అవ్వైః ఉదాహృతా?” అని పేర్కొనియున్నాడు - 2 - 4)- నాట్యశాస్త్రమందు “అనుప్రాసము” లేదు. తరువాతి కాలములో ఇది అలంకారముగా పరిగణింపబడియుండును.

  2. ఆక్షేప, అర్థాంతరన్యాస, వ్యతిరేక, విభావనా,, సమాసోక్తి, అతిశయోక్తులు షడలంకృతయోర్ల్ణ వరాళి - 2 - 6ర6ు. ఇది ద్వితీయవర్గము. “పిమ్మట “హేతు, సూక్ష్మ, లేశొ లంకారములు వదూడును, “"వార్తోయును పేర్కొనబడినను వక్రోక్తి రహితములగుటవలన భామహునిచేత అవి అలంకారములుగా పరిగణింపబడటేదు (2 = 86, 87). ఈ నాలుగును రెండవ వర్గమునకు చెందినవే.

  3. యథాసంఖ్య, ఉత్పే9క్షలు (అలంకారద్వయంవిదుః - 2 - 88) ఇది తృతీయవర్లము. “స్వభావోక్షొ యును ఈ వర్గమందే వివరింపబడినది (కేచిత్‌ ప్రచక్షతే" - 2 - 93).

  4. 23 అలంకారవములను ఏకవర్గముగా తృతీయ పరి చ్చేదవుందు వివరించియున్నాడు. ఇది చతుర్ధవర్గము. తృతీయ పరిచ్చేదాంతమున “ఆశీస్పు”ను కూడ పేర్కొనెను (శేషాంచిదలంకార తయా మతా - 3 - 55). ఈ పర్గములు అలంకారముల అభివృద్ధిని సూచించుచున్నవనుట స్పష్టము.

ఉద్భటుడును ఇట్లే ఆరువర్గములను కపేర్కొనియుండెను. కాని [క్రమముగా ఇట్టి

వర్గీకరణము పోయి శబ్ద, అర్ధ ఉభయ (మిశ్ర) భేదములేర్పడినవి. అందు

  1. ఈ విషయమును గుర్తించిన ప్రథముడు డా. జాకోచి.

  2. “కేచిత్‌ ప్రచక్షతొ అనుదానిమై ఆధారపడి “స్వభావోక్షొ వి గూడ భామహు డంగీకరింపలేదనియు, “వకోక్తి సర్వముబఖ్య మైన వాని ప్రణాళికలో తద్విరుర్ధమైన “స్వభావోక్షికి తావు లేదనియు కొందరి వాదము. ఇది సరియైన అభ్మిపాయము కాదు. “స్వభావోక్తో యందుకూడ అంతో ఇంతో “వక్రత” లేకపోలేదు. “స్వభావోక్తి యనగా “*వార్త" (016120 అధ/౭590౧) అని భ్రమంపరాదు. డా॥ వి. రాఘవన్‌ “స్వభావోక్తి అనువ్యాసమునందును (547% 60౧6౯౧15 ౨ 412౧62/2 525902). శ్రీ తాతాచార్య శిరోమణి “06040౧ 0006197 అను వ్యాసమునందును మై చొదమును ఖండించి యున్నారు.

2422 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “అర్థాలంకారములు” మరల కొన్ని వర్గములుగా విభజింపబడినవి. ఈ నూత్న రా వర్గీకరణమును ఈ వ్యాస తృతయభాగమున వివరింతును. భామహుడు స్పష్టముగా శబ్ద అర్ధ భేచములను వివరింపకపోయినను, ఆతడు వివరణ [ప్రారంభములో జా ఆ పేర్కొనిన “అన్నుపాస, యమకములు” రెండును శబ్దాలంకారములు; సంసృష్టి (3-49) మిగ్రాలంకారములు; ఇంక తక్కిన ముప్పదిరైపదును అర్థ్ధాలంకారములు. 7. సౌశబ్బ్యము: గబ్దార్థాలంకార భేదమును స్పష్టముగా చెప్పకపోయినను ఆ చన వామహుడు పేర్కొనిన ఆనాటి వివాదమును, దానిపై భామహునని నిరయమును ౮ న క ణు ఒక విశిష్ట విషయమును సూచించుచున్నవి. “రూపకాద్యలంకారములు “బాహ్యము" యి లని కొందరండురు. వారి దృష్టిలో “సువ, “తిజ్హాల (శబ్దములు) వ్యుత్పత్తయే వాగలంకుతి; అదియే సౌశబ్వము; అర వుషతంతి (అర్హాలంకారము) ఇలిది కాదు. ర. ఎల నే ల 6-2 ఖ్‌ ద్‌ వ్‌ వ్‌ కాని శబ్ద, అభిభఛేయ (అర్ధ) అలంకార శైదమును ఆంగీకరించిన మాకు రెండును జా వి ఇష్టమే.” (1 - 1, 15) - దీనినిబట్టి గబ్రాలంకారు అర్హాలంకార ఇదము భామహునకు కి శా అన జా ఆలియునని చెపువచ్చును. కాని ఇచ్చట భామహుడు చెప్పిన శబ్దాలంకారము అన్నుపాస, యమకాదిరూపమైనదిగా కన్పట్లదు. నాటి అలంకారికులు కొందరు శబ్దమున కక్కువ వపాధాన్యమిచ్చుం “సాశబ్బ్యమ ముఖ్య వాగలంకృ్యతియన ళ్‌ ౮ శ త వాదించుచుండితన్న మూట. కావృన వీరి దృష్టలో “సాశబ్ద్యవబి ఆభ్యంతరాలంకాతము; ఇంక రూపకాదులు బాహ్యాలంకారములు (అప్రధానములు) చ్‌ రూ ల ల అంగన్‌ చ్‌ వూతవే. తక్క్వినవారు “అర్హవబెనక పాధాన్యమిచ్చి రూపకాడదుల ౮ ఛి స ల న! ముబ్యమనుచుండ్తిరె. భఛామహుడు మాృాతము రెండింటిక్‌ని ప్రాధాన్యమిచ్చి వ వ్‌ వి వ్‌ యున్నాడు. కావృననె, రూపకాది అర్జాలంకారములను ద్యిఆయ, తృాయ ళో వావ్‌ లి ల వావ వ నా షం వరిచ్చేడములండు వివరించినళే, “శబ్దకుదియనెడి షష్ట వరిచ్చ్శేడమున ఆనాడు షా న్‌ మ = శట్దాలంకాతముగా పరిగణింపబడిన “సౌశబ్బ్యమును విప్పులముగా వివరించాను. అల్ల ం వాన యం టై టూ ణు ట్స్‌ ల నం. ఫామహుు వ్తీ *గబ్లగుది ని కేవలము *వా నైకరణ దృష్టితో కాక కావ్యసౌందర్యాతిశాయ వ ఉం పై జ్‌ ను ర న్‌ న ఇ ల. తి హేతువనెడ్తి దృప్టైకు వివరించియుండుట గమనారక్షము. న్‌ జన్‌, జ చ్‌ వాయ ంయైే 8. వక్రోక్తి: "=దెచయే వకోకి. ఇది సరా౭లంకారములండు నునాది. దీనివలననె అనే యు జె ము మో ॥ వా వల యం నాంది చ చటం ఇ చంటి దీనికే అర్థములు వవావ్యుములనును ఫమితెషముగా. భావింపబడును]. కవులు ౨నతై యత్నించు కార్యము. వక్షొక్తి లవిచో అవి అలంకార మెబ్లగునునె నష

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి, 2423 అనుచు భామహుడు వక్రోక్తి ప్రాముఖ్యమును ఉలిపియున్నాడు. వ[కమైన ఉక్తియే (వక్ర + ఉక్తి గీ 06గ4౧ 84141౧00 0౯ 6ఆఈ/121౧0 అ(౦'953510౧) వకకోక్తి. ఇది కవి వ్యాపారమునకు సంబంధించినది. ఈ వ్యకతయే సర్వాలంకార జీవితభూతము. కావుననే వక్రోక్తి రహితములైన “హేతు, సూక్ష్మ, లేశ, వార్తలను భామహుడు తిరస్కరించి యున్నాడు. (2 - 86, 87). అంతేకాక వక్రోక్తి రహితమైన వైదర్భరచన, గుణవంత మైనప్పటికిని, “గేయ” తుల్యమగునే కాని (శ్రుత పేశలత్వమువలన) కవిత్వము కాజాలదనెను (1 - 34). “ఉక్త” యందలి ఈ “వ[క్రతొయే “వార్తను (0161020 0/85910౧ 0 గ౧౪/6 ౧64౨) కవిత్వమును (౧౦9౭10 6:0/6556100) వేరు చేయుచున్నది. కావున భామహుని దృష్టిలో “అలంకారములు కావ్యమునందు (ప్రధానము. ఆ అలంకారములకు ప్రాణము వకోక్తి". ఇట్టి వక్రోక్తిని అతిశయోక్తికి పర్యాయపదముగాకూడ భామహుడు వాడియున్నాడు (2-85). వక్రోక్తి సిద్ధాంతము భామహుని నూత్నసృష్టి” కాకపోయినను, వక్రోక్తి పదమును ఉపయోగించి దాని [ప్రాముఖ్యమును పదే పదే నొక్కి చెప్పిన ప్రథముడు భామహుడిే. కావుననే “వక్రోక్తి రేవ కావ్యానాంపరాభూషేతి భామహూ” అని భోజుడు శృంగార ప్రకాశయందు పేర్కొనెను. స్వభావోక్తి (ర౭9౦గ౧౧౦౧ 0 1౧09 28 ఓ9/ 2౧89); రూపకాది వివిధాలంకార సమూహము (మొదటిదానిలో వక్రోక్తి తక్కువ; ఇందు వకకోక్తియే (పపాణము); రసవదలంకారము - ఈ మూడును వకక్రోక్తి మయములే యగుటచేత భామహునిదృష్టిలో వాజ్బ్ఞయ ప్రపంచము ఏకవిధమే. కాని దండి స్వభావోక్తిని, వకక్రోక్తిని విడదీసి వీనిచేత వాజ్బ్యయము ద్వివిధమని పేర్కొని యున్నాడు (భిన్నం ద్విధా స్వభావోక్తి ర్వక్రోక్సి శ్చేతి వాజ్ఞాయమ్‌.) ఈ విభజనలోకూడ రసవదలంకారము వథ్రోక్తిలోని భాగమే. పిమ్మట భోజుడు రసవదలంకారమునుకూడ విడదీసి వాజ్మయము త్రివిధ మనినాడు (వకోక్తిశ్చ, రసోక్తిశ్చ, స్వభావోక్తిశ్చ వాజ్యయమ్‌). వామనుడు “వక్రోక్తొని కేవలము ఒక అలంకారముగా మాత్రమే నిర్వచించి యున్నాడు (సాదృశ్యాల్లక్షణా వక్రోక్తిఐ. అర్వాచీనాలంకారికు లందరును ఇట్లే చేసిరి. కాని ఒక్క కుంతకుడుమ్మాత్రము మరల వక్రోక్తి ప్రాముఖ్యమును వెలయించి దానినే “కావ్యాత్మ"గా పప్రతిపాదించెను. 17. తన నూత్న సృష్టి కాదు కావుననే భావఐహుడెచ్చటను వకకోక్తిని స్పష్టముగా నిర్వచించియుండలేదు. భరతుని “*లక్షణము"ను, భామహుుని “వకోక్తొ యును ఒకటియేయని డా! కె. సి, పాండే అభ్మిపాయము. (1౧61౧ షీం51[06103 ౪6. 1. ౯, 399.)

2424 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము 9. రసము: నాట్యమందు “రసమూ ప్రధానము. కావున “కావ్యలక్ష్మ” వివరణమునకు పూనుకొనిన భామహుని దృష్టిలో రసమునకు (ప్రాధాన్యము లేడు. అయినను ఆనాటికి స్థరపడిన “నాట్యరస” సిద్ధాంత 'ప్రాబల్యమువలన రసమునకుకూడ కొంత (ప్రాధాన్యము నొసంగియున్నాడు. సర్గబంధమును నిర్వచించునప్పుడు “రపైశ్చ సకలైః పృథక్‌” (1 - 21) అనియు, రసవదలంకారమును నిర్వచించునప్పుడు “రసవద్దర్శిత స్పష్ట శృంగారాది రసం” (3 - రు అనియు, కావ్యమందు శాస్త్రాదుల ఉపయోగమును గూర్చి చెప్పునప్పుడు “స్వాదు కావ్యరసోన్మిశం శాస్త్రమ ప్యుపయుంజతే” (5 - 3) అనియు భామహుడు రసప్రసక్తిని తీసికొని వచ్చెను. దీనినిబట్టి “రస సిద్ధాంతము” భామహునకు తఆతలియునని చెప్పగలము. కాని విభావాది పదముల నాత డెచ్చటను ఉపయోగింపక పోవుట చిత్రము; దీనికి సమాధానము నీ క్రిందివిధముగా నూహింపవచ్చును. భరతుని దృష్టలో “కవివ్యాపారము" చేత కావ్యమందు ప్రతిపాదితములైన విభావానుభావ వ్యభిచారి ఖావవముల యొక్క సంయోగవఎవలన స్థాంయభావ వము రసముగా నిష్పన్నమైనప్పుడే అది కావ్యమగును. కాని భామహుని దృష్టిలో “కవివ్యాపార మందు వక్రోక్త్సి యున్నచో చాలును; అది కావ్యమగును. కావున అతడు విభావాది పదముల నుపయోగింపవలసిన అవసరము లేదు. అంతేకాక కావ్యమందు “రసమే ప్రధానము అనుట కాతడు వ్యతిరేకియనియు చెప్పవచ్చును. “కావ్యము రసవంత మైనప్పటికిని అహృద్యము, అసునిర్చేదము నైనచో అది అపేశలమే" (5 - 62) అని అతడు పేర్కొనుట ఇందులకు తార్కాణము. కావుననే భామహుడు రసమునుకూడ ఒక అలంకారముగామాత్రమే (రసవదలంకారము, 3 -€) పరిగణించినాడు.

“సెషా సర్ర్యైవ వకకోక్సి రనయార్థో విభావ్యతే” (2 - 85) అనెడి భామహ శ్లోకమునందలి “విభావ్యతే” అను దానిపై “లోచని మం దభినవ గుప్తుడు “పమదోద్యానాదిః విభావతాంనీయతే విశేషేణచ భావ్యతే రసమయీ క్రియత ఇతి అని వ్యాఖ్యానించుట గమనార్షము. ఈ వ్యాఖ్యానము ననుసరించి “రసము, అలంకారము - ఈ రెండును “వక్రోక్తొ నుండియే జనించును అనునది భామహుని అభ్మివాయముగా (గహింపవచ్చును.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం,వ, 2425 10. ధ్వని; భామహుని నాటికి ధ్వని సిద్ధాంతము లేదనుట (పసిద్ధమే. కాని “పతీయమానార్థము"ను గూర్చిన సూచనలు కావ్యాలంకారమందు లేకపోలేదు. “సమాసోక్తొని నిర్వచించుటలో “యళ్రోక్తే గమ్యుతేఇ_న్యోఇర్థవ (ఎచ్చట “ఉక్తి" యందు అన్యార్థము గమ్యమానమగునో, 2 - 79) అనియు, “పర్యాయోక్తముూను నిర్వచించుటలో “యదన్యేన ప్రకారి ణాభిధీయతే' (ఏదీ అన్యవిధముగా చప్పబడునో, 3 - 8 అనియు చెప్పుట ఇందులకు ఉదాహరణములు. ఇట్టివి మజికొన్ని కలవు. ఈ సందర్భములన్నియు ధ్వన్యాలోకకారుని “ఏణీభూత వ్యంగ్యమూన కుదాహరణము లగుననియు, కొందరు తలంచునట్లు భామహుడు “ధ్వన్యభావవాది" కాదనియు జగన్నాథ పండితుడు పేర్కొనియున్నాడు.

వైన పేర్కొన్నట్లు భామహ దండ్యాదులకు “రససిద్ధాంతము" తెలిసినను దానియందు వారు సుముఖత్వమును చూపలేదు. అంతేకాక దానివి కావ్యమున కన్వయింపలేకపోయి రనియు చెప్పవచ్చును. ఇంక (ప్రతీయమానార్థమున్నట్లు వారు గుర్తీంచినను “ధ్వని సిద్ధాంతమును స్థాపించుటకు కాని, దానినే “కావ్యాత్మ”గా ప్రతిపాదించుటకు కాని వారు పూనుకొనలేదు. “రసమును కావ్యమున కన్వయించుట, “ధ్వసోొని కావ్యాత్మగా స్థాపించుట - ఈ రెండు పనులను తరువాతి కాలములో ఆనందవర్ధను డొనర్చియున్నాడు. 11. కవి, కావ్యము: కవి “పరిశ్రమను గూర్చి విపులముగా చర్చించిన ప్రథముడును భామహుడే! “కావ్యాంగము కాజాలని శబ్దము శబ్బమే కాదు. వాచ్యము వాచ్యమే కాదు. న్యాయము న్యాయమే కాదు. అహో! మహాకవుల భారము!” (5 - 4) అని యీతడు పేర్కొనెను. ఇంకొకచోట కవిని “మాలాకారునితో పోల్చి యున్నాడు (1 - 59). "అకవిమైన వాని శాస్త్రవేత్తృత్వము (1 - 3), సత్కవిత్వరహితమైన వాగ్విదగ్ధత (1 - 4) వ్యర్థములు, విలక్ష్మ మైన కావ్యమువలన తత్కర్త లలనా 15. “ధ్య్వనికారా త్పాాచీనై: భామహోద్భట [పభృతిభ్సిః స్వగ్రంథేషు కుత్రాపి ధ్వనిగుణీభూత

వ్యంగ్యాది శబ్దా న ప్రయుక్తా ఇత్యేతావలైవ తః ధ్వన్యాదయో నస్వీక్రియంత ఇత్యాధునికానాం

వాచోయుక్తి అయుక్తెవ యతః సమాసోక్తి వ్యాజస్తు త్యప్రస్తుత ప్రశంసాద్యలంకార నిరూపణేన

కియంతోపి గుణీభూత వ్యంగ్యభేదాః తైః అపినిరూపితాః అపరశ్చ సర్వేపి వ్యంగ్య

(ప్రపంచః పర్యా యోక్తకుక్షో నిక్షిప్తగి

    • రసగంగాధరము = ద్యితియాననము

2426 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కుప్పుతవంతునివలనే నిందపాందును (5 - 11). అకవి యగుటవలన వ్యాధినికాని, అధర్శ్మమునుకాని, దండనమునుకాని పొందడు. ఇంక కుకవియెనచో సాక్షా నృృతియే యని మనీషు లందురు (5 - 12). సత్కృతి కర్తలు స్వర్గస్థులైనను నిరాతంకమును, కాంతమును అయిన వారి “కావృ్యమయ శరీరము” లోకమందు వసించును (1 - 6” - ఈ విధముగా ప్రతి పరిచ్భేదమందును ఆ యా సందర్భములందు “కవి పరిశ్రమోను గూర్చి, “కావ్య విశిష్టతను గూర్చి వివరించెను. ఈ రెండింటిని గుర్తించినవాడు కావుననే “కావ్యము ఒకానొక (ప్రతిభావంతుని వలన - ఒకానొకప్పుడు మాత్రమే - జనించును (1 - 5) అని భామహుడు సుస్పష్టముగా చెప్పినాడు. 3. అలంకార సంప్రదాయము సాహిత్యశాస్తూ చరితయందు ప్రధానముగా మూడుదశలు గోచరించుచున్నవి.

  1. అలంకారశాస్త్రము రూపకచర్చలో ఒక అల్ప భాగమగుట మొదటిదశ. ఈ దశకు చెందినదే భరత “నాట్య శాస్త్రము. (పాశ్చాత్యుల సాహిత్య శాస్త్రముకూడ రూపకచర్చ తోడనే - 4510165 ౦౪109” - (ప్రారంభమగుట గమనార్హము). 2. అలంకారశాస్త్రము, లేదా కావ్యచర్చు స్వతంత్రతను పొందుట రెండవదశ, కావ్యాలంకార, కావ్యాదర్శ, కావ్యాలంకార సారసం[గ్రహ కావ్యప్రకాశాదు లీదశకు చెందినవి. (పాశ్చాత్యుల 06గ||గ౧౮9 “౧56/6” 2౧౮ 60౧౩1౧౮5 “0గ 1౧6 56011గ6” ఇట్టివేే 3. ఇంక రూపకచర్చ అలంకార శాస్త్రములో ఒక ముఖ్యభాగమగుట మూడవ దశ. ఈ దశయందే “సాహెత్యశాస్త్రళ” నామ మన్వర్థము. కావుననే సర్వ నాట్య, కావ్య విషయములను వివరించెడి తన (గంథమునకు విశ్వనాథుడు “సాహిత్య దర్పణ"”మను పేరు పెట్టెను. విద్యానాథుని “ప్రతాపరుదయశో భూషణమును ఇట్టిదే. . అలంకార సంప్రదాయము పైవానిలో రెండవదశకు సంబంధించినది. కావున ఈ సంప్రదాయ ప్రధానధర్మ్శ్మము “కావ్యతత్త్వ” విరూపణమనుట స్పష్టము. అందుచేతనే భామహాదు లందరును తమ [గంథనామములందు “కావ్య” పదమును వాడుచువచ్చిరి. రూపక చర్చయందు “రస నిరూపణము ప్రధానము కాగా

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరాను అప్పారావు, ఎం.వి 2427 కావ్యచర్చయందు కావ్యాంగములైన వివిధాంశముల” వివరణము అవసరమైనది. నాట్యానుభూతి విషయమున భరతుడు “రసాస్వాదొమను పదమును వాడగా కావ్యానుభూతి విషయమున భామహుడు “ప్రీతి"'యను పదము నుపయోగించుట గమనార్హము.

ఈ అలంకార సంప్రదాయమునకు ప్రధానాచార్యుడు భామహుడనియు, కావ్యాలంకార మీసం[పదాయమును స్థాపించిన (ప్రథమ (గ్రంథమనియు గుర్తించియున్నాము, ఉద్భటుడు ఈ సంప్రదాయమును పోషించియున్నాడు. ఈతడు స్వయముగా కావ్యాలంకారమునకు “వివరణము” (ప్రతీహారేందురాజు మొదలగువారు పేర్కొనినది వ్రాయుటతో తృప్తిచెందక, తత్సంప్రదాయవ్యాప్తి కై తాను ప్రత్యేకముగా “కావ్యాలంకార - సార - సంగ్రహము"ను (వ్రాసి యున్నాడు. దండి, రుద్రటు లిరువురినికూడ ఈ సంప్రదాయ పోషకులనుగా పేర్కొనవచ్చును. దండి కావ్యాదర్శ ప్రథమ పరిచ్చేదమందు “గుణమూలయొడ అధికాఖిమానమును చూపించినను గ్రంథమునందు మూడింట రెండువంతులు “అలంకార చర్చ”నే చేసినాడులో ఇంక రుద్రటుడు ప్రప్రథమముగా అలంకారములను కొన్ని నిర్దిష్ట వర్గములుగా విభజించినవాడు.” కావుననే వీరిని పోషకులని పేర్కొనియున్నారు.

_ ఈ అలంకార సంప్రదాయ మహత్త్యమును గుర్తించినవాడు కావుననే

ధ్వన్యాచార్యుడుకూడ అలంకారమునకు “కావ్యాత్మ"లో స్థానమంగీకరించి ఈ

సంప్రదాయమున కుదాత్తత నాపాదించియున్నాడు. ఈతడు (ప్రత్యీకముగా అలంకార

నానా.

  1. అలంకారము, గుణము, రీతి మొదలైనవి. వీనిలో ఒక్కొక్క దానియందు ఒక్కొక్క శాస్త్రకర్త అధికాభిమానమును చూపించియుండుటచేత పెక్కు సంప్రదాయము లేర్పడుట కవకాశము కలిగినది.

  2. ఈ కారణబముచేత దండి అలంకార సంప్రదాయమునకు చెందిన వాడని కొందరి అభ్మిపాయము. దండి గుణ సంప్రదాయ ప్రవర్తకుడని ఇంతకుముందు గుర్తించియున్నాము. ఈ గుణములవలన రీతులేర్చుడును కాన దండి రీతి సరపదాయమునకు చెందినవాడని మజికొందరి అభ్మ్నిపాయము.

21.భామహ, దండి, వామనులు విస్మరించిన “రసచర్చ”ను పునరుద్ధరించిన ప్రథముడును ర్నుదటుడే యగుటచేత ఈతడు రస సంప్రదాయమునకు చెందినవాడని కొందరందురు. కాని అతడు చేసిన అలంకార చర్చనుబట్టి అలంకార సంప్రదాయమునకు చెందినవాడేయని మజికొందరి అభిప్రాయము. కాని రెండింటియందును సమానాదరమును చూపినాడనుట లెస్స.

2428 పండిరి మల్షికార్జునరాప్పు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము చర్చ చేసి యుండలేదు. కాని ధ్వనివాదియేయైన మమ్మటుడును, రసవాదిమయైన విశ్వనాథుడును. రసధ్వని వాదిమైన జగన్నాథుడును సవిస్తరముగా, ప్రత్యేకముగా అలంకార నిరూపణమును చేసియున్నారు. ఇంచుమించుగా ఆలంకారికు లెల్లరును (ధనంజయుడు, శింగభూపాలుడు మొదలగువారు కాకు అంతయో, ఇంతయో “అలంకార చర్చ” చేసినవారే యనెడి సత్యము ఈ సంప్రదాయ మహత్త్వమును నిరూపించుచున్నది.

దశరూపకాది [గ్రంథములు కేవలము రూపక చర్చకొర కుద్దిష్టములైనల్లే అలంకార సర్వస్వము, కువలయానందము మొదలగు [గ్రంథములు కేవలము అలంకార నిరూపణమునకు బయలుదేరినవి. భామహోద్భృటుల తరువాత అలంకార సాంప్రదాయికులలో (ప్రధానముగా నెన్నడగిన రుయ్యుకుడు, అప్పయ్య దీక్షితుడు

అ య శా [క్రమముగా పై గ్రంథములను రచించిరి. వీరందరి. దృష్టైలో “కావ్యము"నకు “జీవితము” అలంకారములే. నిరలంకారమైన కావ్యము వారి దృష్టిలో కావ్యమే కాదు. “కాంతమైనప్పటికిని నిర్భూషమైన వనితాననము విభాసింపనళ్లే నిరలంకారమైన కావ్యము శోఖింపదు” (1-13) అని భావుహండు " పేర్కొనియున్నాడు. కావ్య నిర్వచనమునందు " ...అనలంకృతీ పునః క్వా2 పొ

అనిన మమ్మటునిప3పై ఆగ్రహించి “కావ్యము ఆనలంకృతిగా నుండవచ్చునని యంగీకరించు నతడు అగ్ని ఉషప్ట్ణరహతముగా నుండునని యెందుల కంగీకరింపడు?ే అని జయదేవుడు ప్రశ్నించియున్నాడు. లతలా 22. “కావ్య జీవితము" లేదా “కావ్యాత్మ” అనెడి పదములను భామహాదు లెచ్చటను ఉపయోగింపలేదు.

అందుచేత అలంకారమును ఒక సంప్రదాయముగా పరిగణించుటకు కొందరంగీకరింపరు.

అయినను వారు అలంకారమున కిచ్చిన ప్రాధాన్యమునుబట్టి దానిని ఒక సంప్రదాయముగా

పరిగణించుట అసమంజసము కానేరదని తక్కినవారి అభిప్రాయము. “తచేవమలంకారా ఎవ

కావ్యే ప్రధానమితి

ప్రాచ్యానాం మతమ్‌” అని రుయ్యకుడు పేర్కొనియున్నాడు. 23. అంగీకరోతి యః కావ్యం శబ్దార్థావ నలంకృతీ,

అసౌనమన్యతే కస్మాదనుష్ణమనలంకృతీ॥ చంద్రలోకము 1-8

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు. ఎం.వ, 2429 “అలంకార” నిర్వచనము: “అలం” అనగా “భూషణము” (0/౭గ౫౭౧౪ అని అర్థము. దీనినుండియే “అలంకార” పదము వచ్చినది. దీనికికూడ “భూషణ” మనియే అర్థము. ఇంక కావ్యాలంకారములనగా కావ్యమునకు భూషణములనుట స్పష్టము. భామహుడు “అలంకారమును నిర్వచింపలేదు. అలంకార నిర్వచనము చేసిన ప్రథముడు దండి. “కావ్యశోభాకరాన్‌ ధర్మాన్‌ అలంకారాన్‌ ప్రచక్షతే” - ఇది దండి నిర్వచనము. వామనుని నిర్వచన మింతకంటె మేలని చెప్పవచ్చును. ఆతడు గుణములకు, అలంకారములకు బేదమునుగూడ వివరించెను = “కావ్యశోభాయాః కర్తారో ధర్మా గుణాః. తదతిశయ హేతవస్త్వలంకారాళక్‌ (సౌందర్య మలంకారళొ అనెడి వామన నిర్వచనములో కూడ అలంకారమనగా కావ్య సౌందర్యము = ౧0610 09400 1౧ 06౧6౧౫! - అని అర్థము.) ఇంక “అలంకారములు కావ్య శోభాజనకములు అనునది తక్కిన నిర్వచనముల సారాంశమని చెప్పవచ్చును. అలంకార ధ్వని: కావ్యాత్మ మొన ధ్వని రస, వస్తు, అలంకార భీదములచేత (తివిధముగా నుండునని గుర్తించి యున్నాము. వాచ్యార్థమును అత్మికమించి స్ఫురించెడి విశిష్టార్థమును “వపతీయమానార్థొ మందురు. ఈ ప్రతీయమానార్థము లౌకికము, కవి వ్యాపారగోచరము అని ద్యివిధము. ఇందు రెండవది “రసధ్వని". మొదటిదానియందు వివిధ రూపములున్నను అందు వస్తు, అలంకార భేదములు ప్రధానములు. ఇవి రెండును వాచ్యరూపమున గూడ ్రతిపాదితములు కావచు ఏను. అలంకారము వాచ్యముఖమున (ప్రతిపాదిత మైనప్పుడు 'కీవలము “అలంకార” మనబడును (అ(॥855 11906018 0 506600). ఇంక అలంకారము (పతీయమాన మైనప్పుడు “అలంకార ధ్వనొ యనబడును (1౫0186 0 5640865186 11౮/6 01 906600). అనగా ప్రతీయమానావస్థయందు అది సాక్షాత్తుగా అలంకారముకాడు. కాని అట్లు స్ఫురించిన అర్ధమును తగినంత పదజాలముతో వ్య క్తము చేసినప్పుడు మాత్రము అది అలంకారము కాగలదు. అట్లు వాచ్యావస్థలో దాని రూపము అలంకారము కావునను, ఇప్పుడు ప్రతీయమాన (ధ్వని రూపమున నుండుటచేతను

2430 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అది “అలంకారధ్యని" యొనది. (దీనినే “బాహ్మణ డశమణ” న్యాయ మందురు.) కాగా “పతీయమానార్థమందు అలంకారము స్ఫురించుట అలంకార ధ్వనియగుే నని పిండితార్థము. ఇది కేవల అలంకారముకంటె రమ్య మైనది.

అలంకార సంఖ్యాభివృద్ధి: భరతుడు నాట్య శాస్త్రమందు 4 అలంకారములను మాత్రమే (ఉపమ, రూపకము, దీపకము - అర్థాలంకారములు; యమకము - శబ్దాలంకారము) వివరించి వానితో బాటు 36 కావ్యలక్షణములను, 10 గుణములను పేర్కొనెను. కావ్య నిర్మాణమును (ప్రాసాద నిర్మాణముతో పోల్చుచు “లక్షణ యోజనము భిత్తిస్థానీయము; అలంకార గుణ నివేశనము చిత్రకర్మ ప్రతిమము" అని లక్షణములకును, గుణాలంకారములకును గల భేదమును అభినవ గుహ్హడు వివరించియున్నాడు. కావ్యాలంకారమందు “లక్షణ” వివేచనమే లేదు. భరత, భామహుల మధ్యకాలములో ఈ “లక్షణములు” క్రమముగా అంతరించి పోయినవి. (విశ్వనాథుడు మాత్రము “నాట్యాలంకారము"లను పేర పునరుద్ధరించియున్నాడుం అందు కొన్ని “ఆశీస్సు” మొదలైనవి, భామహునకు పూర్వమే అలంకారములుగా పరిగణింపబడినవి. అంతేకాక “లక్షణ”యే ఒక అలంకారమైన దర్వాచీన కాలమున. భామహు “డాశీస్సు” మొదలగువానిని అలంకారములు కావని తిరస్కరించినను దండ్యాదులు పరిగ్రహించియున్నారు. లక్షణ, అలంకారములు రెండును “కావ్యశోభా జనకము”లే యనెడి అభిప్రాయము ప్రబలుటయే ఈ రెండింటి సమ్మేళనమునకును కారణము. అల్లే గుణ, అలంకార సాంకర్యమును జరిగినది. ఒకే పేరుగల అలంకారమును పేర్కొనినను నిర్వచనమునందు మాత్రము కొందరు పరస్పరము భేదించుచున్నారు. కొందరు చెప్పిన అలంకారములను మథజికొందరు చెప్పలేదు. ఇంక కొందరు నూత్నములు, వినూత్నములునైన అలంకారములను సృష్టించుచువచ్చిరి. ఇన్ని విధములుగా అభివృద్ధిని పొందుచు వచ్చిన అలంకారములు కువలయానందము నాటికి సుమారు నూటపాతిక మొనవి. ఈ అభివృద్ధిని స్థూలముగా పట్టిక రూపములో వివరించుచున్నాను ఫ్‌

పా 24. ధ్వని త్రయమునకు “వాచ్య సామర్థ్యాక్షిప్తత్వ" మనునది సామాన్య లక్షణమైనప్పటికిని

“అలంకార ధ్వని"కి “వ్యంగ్యసామర్థ్యా క్షిప్తత్వము"ను లక్షణముగా చెప్పవచ్చునేమో!

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.వి. 2431 అలంకార సంఖ్య నాటా రకా కాకా భరతుడు క్రీపూ. 200 - శ్రీత. 300 నాట్యగాస్త్రము | వె - శ భామహుడు (క్రీశ. 600 - 750 కావ్యాలంకారము 2 | 36 38 , దండి క్రీశ. 600 - 750 కావ్యాదర్శము 2 వెన్‌ 37 ఉద్భటుడు | " 750-850 _ | కావ్యాలంకారసార సంగహము 4 | 37 | 4 వామనుడు * 779-813 (| కావ్యాలంకార స్యూతము| 2 | 31|| -| 33 ర్యుదటుడు ” 825-875. | కావ్యాలంకారము 5, 68, + 7౫ భోజుడు " 1005 - 1054 | సరస్వతీ కంఠాభరణము (24 | 24| 24 72 మమ్మటుడు | * 1050 - 1101 | కావ్యప్రకాశము 6 | 59 2 67 రుయ్యకుడు | " 1135-1150 | అలంకార సర్వస్వము (9 | 73|| 2 ఈ జయదేవుడు | “" 1200-1250 | చందాలోకము 61100, = 106 విద్యానాథుడు |14వ శ. ప్ర. భాగము | ప్రతాపరుదయశో _ భూషణము 5 |, 66 2 7౫ విశ్వనాథుడు | ” 1300 - 1380 | సాహిత్యరర్పణము 11 75 2 28 అప్పయ్య డీక్తితుడు! "1554 - 1626 | కువలయానందము | 124 124 ప పట్టికనుబట్టి అలంకార సంఖ్యాభివృద్ధియందు మార్పులు, కూర్చులు, ఈం ద్‌ [నే భి కోతలు కలవనుట స్పష్టము. అసంపూర్ణముగా లభించిన జగన్నాథుని గంథములందు పతలతతలలవతవతతతనానానాడానాలాలవనవవరావానానావాాడా శ క్రీ శ 500 - 800 మధ్యుకాలమందు మాృాతమే అలంకారముల సంఖ్య 40 [పప్రాంతములండున్నది. 10 వ శతాబ్బమునాటికి అలంకారముల సంఖ్య విపరీతముగా పెరిగిపోయినది. అయినను 12 వ శతాబ్దివాడైన నన్నిచోడుడే కాక గ₹షట్త్రింశదలంకారాలంకృతంబై) 14 వ శతాబ్టీవాడైన విన్నకోట పెద్దనకూడ 36 (అర్థ) అలంకారములను మాత్రమే పేర్కొనుట గమనార్హము. అంధ్రులమీడ దండి భామహుల పాబల్యమట్టిది.

2432 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: పాహిత్యము 70 అలంకారములున్నవి. ఆతడెన్ని చెప్పెయుండెనో తెలియదు. భోజుడు అన్ని విషయములందువలెనే అలంకారములందును తన ప్రత్యేకతను చూపినాడు.ే ఒక [గ్రంథమునందు (కువలయానందము) కన్చించు గరిష్టసంఖ్య 124 అయినను, ఆలంకారికులందరును విడివిడిగా పేర్కొన్న అలంకారముల మొత్తము సంఖ్య 200 దాటియుండును. ఇందులో మరల ఒక్కొక్క అలంకారమందు పెక్కు (పభేదములుకలవు. ఒక్క ఉపమాలంకార (ప్రభేదములనే ముప్పదికిపైగా దండి నిరూపించియున్నాడు. ఈ అలంకార సృష్టియంతయును ఆలంకారికుల నిశితమేధా శక్తికిని, సూక్ష్మ విశేషణ శక్తికిని తార్కాణమని చెప్పనగును. అలంకారముల వర్గీకరణము : అలంకారములు శబ్ద, అర్థం, ఉభయ (మిశ్ర భదములచేత (తివిధమనియు, అర్థాలంకారములు కొన్ని వర్గములుగా విభజింపబడియున్నవనియు గుర్తించియున్నాము. అర్థాలంకారములను ర్ముడటుడు (పప్రథమముగా _నాలుగునిర్దిష్టవర్గములుగా విభజించియున్నాడు. 1. వాస్తవ మూలకములు (23 అలంకారములు); 2. బెపమ్య మూలకములు ( 21 అలంకారములు); 3. అతిశయ మూలకములు (12 అలంకారములు); 4. శేష మూలకములు (12 అలంకారములు). ఇంక తరువాతి ఆలంకారికులును యథాశక్తిగా అలంకారములను వర్గీకరించియున్నారు. వారిలో రుయ్యకుని వర్గీకరణము (10 వర్గములు) సమ(గ్రమును, సమంజసమును అని చెప్పవచ్చును. విద్యాధర విద్యానాథ, జగన్నాథులు స్వల్ప భేదములతో దీనినే అంగీకరించిరి. రుయ్యకుని వర్గీకరణము;ో 1. సాదృశ్య గర్భములు (28 అలంకారములు

  • ఇందు మరల పలుఖభేదములు కలవు); 2. విరోధగర్భములు (11); 3. శృంభఖలా బంధములు (4); 4. తర్క్మన్యాయమూలకములు (2౫; 5. వాక్య (కావ్య) 25, రీతిని ఒక అలంకారవఎటగా పేర్కొనుటయు, ఉపవూ, రూపకాదులను ॥ ఉభయాలంకారములనుటయు, జాతి మొదలగు అలంకారముల విశిష్ట నిర్వచనములు మొదలగునవి భోజుని ప్రత్యీకతలలో కొన్ని - వనితకు భూషణము లెట్టివో కావ్యమునకు అలంకారము లట్టివని ఆలంకారికుల నిర్ణయము. ఈ అభ్మిపాయమును పెంచి శబ్బార్ధాభయాలంకారముల భోజు డీ [క్రిందివిధముగా వివరించుట _ గమనార్హము. (1) బాహ్య (శబ్ద) అలంకారములు - వస్త్రమాల్య విభూషణాదులవంటివ; (2) ఆభ్యంతర (అర్థ) అలంకారములు - దంతపరికర్మ, నఖచ్చేద అలక కల్పనాడులవంటివి. (3) బాహ్యాభ్యంతర (ఉభయ) అలంకారములు - స్నానధూపవిలేపనాడులవంట్‌వి.
  1. . శ్రీ కొమజ్ఞాజు లక్ష్మణరావు పంతులుగారు ఈ. వర్గీకరణమును “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ” .... ద్వితీయ భాగములో “పట్టిక రూపములో నిచ్చి యున్నారు.

కావ్యాలంకార పరిచయము పోణంగి శ్రీరామ అప్పారావు, ఎం.ఎ 2433 న్యాయమూలకములు (8); 6. లోకన్యాయ మూలకములు (౫); 7, గూఢార్థ (ప్రతీతి మూలకములు (56); 8. రసాలంకారములు (4); 9. పృథగలంకారములు (3); 10. సంకరాలంకారములు (2).

ఈ అలంకారములందు విది ప్రధాన మను విషయమునగూడ మతభేదము కలదు. వామనుడు “ఉపమ”ను సర్వాలంకారబీజ భూతముగా పరిగణించి తక్కిన అలంకారములను తత్ప్స్పంబంధములుగా నిరూపించను. మమ్మట, హేమచంద్రుల దృష్టిలో “అతిశయోక్తి” సర్వాలంకారవీజ భూతము. (భామహుడు అతిశయోక్తి, వ(్రోక్తులను సమానార్థ్ధకములుగా [గ్రహించుట గమనార్హము). అప్పయ్య దీక్షితుడు మరల వామన మతానుసారియై “ఉపమ ఒక్కటియే శైలూషి (నాట్యకత్తై వలె చిితభూమికలు ధరించి కావ్యరంగవమున నృత్యవుచేయు * నని పేర్కొనియున్నాడు. “ముఖము చందునివలె ప్రకాశించు చున్నది. అనెడి ఉపమాలంకారము ఉక్తి భంగీ భేదముచేత పెక్కు అలంకారములుగా మారగలదు. ఉదాహరణము - “ముఖచం[దుడు" అనునప్పుడు రూపకము; “ముఖమా? చంద్రబింబమా?” అనునప్పుడు సందేహము... ... ... మొదలగునవి.

అలంకారౌచిత్యము: పైన వివరించినట్లుగా పెక్కు అలంకారము లున్నను, అవియున్నియమునం ఎల్లప్పుడునం (ప్రయుక్తవటలుకావు. “పె క్కు అలంకారములున్నను, సమర్థుడైన కవికూడ ఆనందావహములైన ఉపమాది బహు స్యల్పాలంకారవములను మవూతవే వాడుచుండు"నని వుహా ముభట్టు సేర్కొనియమున్నాడు. (వ్య క్తివివకవుందలి రెండవ “వివుర్శ”లో అలంకారౌచిత్యమును గూర్చిన చర్చు కలదు.) “అలంకారము లెప్పుడును అంగభూతములుగానే ఉండవలయును. అవియే కావ్యమందు ప్రధానములు కారాదు. “అలంకారములు అతిషూత్రముగా ప్రయుక్షము కారాదు. ప్రయుక్తమైనంత వరకును అవి (ప్రతీయవమానములే అగుచు రసపోషకముగా మాత్రమే ఉండవలయును.” - ఇది ధ్వన్యాచార్యుని అభిప్రాయ సారాంశము. క్లేమేం[ద్రుడు “ఉచిత్య విచారచర్చ”లో “అలంకా రౌచిత్యముూును వివరించి బెచిత్యమున్న గోకములను, లోపించిన క్లోకములనుగూడ ఉదాహరించి యున్నాడు. ఈ విధముగా “బిచిత్యమూ" అనెడి పరిధిని దాటనంతవరకు అలంకారములు కావ్యమునకు నిజముగా అలంకారములే; వాచ్య ముఖమున ప్రతిపాదితములైన అలంకారములు

  1. ఉపమైకా శెలూషీ సంటప్రాప్తా చిత్ర భూమికా భేదాన్‌! రంజయతి కావ్యరంగే నృత్యంతీ తద్విదాం చేతః॥

2434 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము లౌకికములైన భూషణముల వఠల రసమునకు బహిరంగములుగా పరిగణింప బడినను, ప్రతీయమానములైన అలంకారములు మాత్రము అట్టివికావు; అవి కర్డుని కవచకుండలముల వంటివి. పెట్టెలోనుండి తీసి ధరించుకొను నట్టివి కావు; రసములో లీనమైయుండునవి. మహాకవి వీనికొరకు ప్రయత్నెంపడు; యథావసరముగా అవియే దొర్లుకొనివచ్చును. ఉపమాద్యలంకారములు కొన్ని “అప్రత్యక్ష మై, అనుభూతము కాకున్న వస్తువును ప్రత్య క్షముచేసి అనుభవమునకు దెచ్చు సను. ఎట్లన, “ముఖము చందునివల నున్నది.” అను నుపమ ముఖమునందు మనకు (బత్యక్షముగాని సౌందర్యమును (బత్యక్షము సేయుచున్నది.” ఇది కావ్యమునం దేకాక వ్యవహారమునందును పరమసత్యమే. “ఆ యిల్లు ఫీత్రలేని పర్ణశాల”; “ఆ దంపతులు చిలకా గోరింకలలాగా ఉన్నారు”... అని యీ విధముగా ప్రతి మాటలోను నలంకారమే. అందున నావేశము వచ్చినచో విశేషించియు నవి వెలువడును. అలంకార మననేమో తెలియకయే యాబాలగోపాలమును నలంకారయుక్తముగా భాషింతురు. అలంకార యుక్తమగు భాష జీవద్భాషోో అని శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారు పేర్కొని యున్నారు లతలా 28. “౮5968 2౧౮ 20096 01 12౧122 1౧ 52౧5670 అను వ్యాసములో డా. వి. రాఘవన్‌ ౫౦ 6౦౧౦1౮6, ౧౦61౧/ 15 ౧61౧6౧ 96౧6 6౧౧౦1౦౧ 2౧6 1౧000 ౧0౯ గా౭౧9 ౧౧8౧౧6౬ తి 062401౪1 1062 గొంక 200౧00౧860 1౧౧౩గ౫౭16 1561 10 & 0620411 అ(౦౧౭5510%. 7౧19 ౮61౧65 శీ!2౧%22 ఇగి6 119 ౧1808 2౧6 +4౧0110౧” (50గ6 60౧6౪౧15 0 గ12౧£2/2 5825172 - 5. 89.) అని కేర్కొనుటయు గమనార్హము. 29. కావ్యాలంకార సంగ్రహ వ్యాఖ్య - పుట 711. కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫిబ్రపరి కేవకు (₹ టా క ్యి' కే

ఆంధ్రమున వాజ్మయ విమర్శ కేతవరపు వేంకట రామకోటి శాస్తి9

మునకు చెప్పుకొనదగిన వాజ్మయావిర్భావము జరిగినది నన్నయగారి కాలమున. సంస్కృత భారతము నాత డాంధ్రీకరించినాడు. ఏ సుముహూర్తమున నన్నయ ఆం ధ్రీకరణోద్యమమునకు సాందీ వాక్యము పలికినాడో, నాటినుండియు ఈ శతాబ్దారంభము వరకును ఏదో ఒక రకముగా ఆంధ్రీకరణ వాజ్బయమే పంపొందినది. అనగా ఉత్పాద్య వైన వాజ్బాయము లేదనుట. ఈ శతాబ్దారంభమునకు పూర్వముననే ఆంగ్లభాషా, వాజాయములతో మనకు సన్నిహిత సంబంధ మేర్ప్చడినది. కారణము తద్భాషా భాషీయులు మనకు పాలకులగుట. నాటినుండియు సంస్కృతముతో గల సంబంధము తగ్గించుకొని ఆంధ్రము ఆంగ్లముతో చేయిగలిపినది. ఈ విషయమున ఆంధ్రికి చేయూత నిచ్చినవారు శ్రీ వీరేశలింగము పంతులు. విస్తృతమైన వాజ్బయము గలిగిన ఆంగ్లమున గల శాల్లులు వివిధములు. ఆ శాఖా వైవిధ్యము ఆంధధ్రమునను మూర్తి కట్టుకొనినది. అందు ప్రస్తుతము మన కుపాదేయము విమర్శనము.

మనకు విమర్శన మనునది క్రొత్తగా వచ్చినదా? లేక పూర్వమునుండి కలదా?- లేదని చెప్పుటకు వీలుపడదుగాని నేటి స్వరూపముతో మాత్రము లేదు. ఆంధ్ర వాజ్బయము గీర్వాణముననుసరించినదగుట, వివర్శనమును తదనుసరణమే యగుట విప్రతిపత్తిలేనిది గావలయును. సంస్కృతము . వేదవాజ్బయముతో నారబ్ధము. కావ్య స్వభావ మందు భాసించుచున్నది. అర్ధవాదాత్మకమైన గాథలు - వక్రమార్గమున వస్తు నిర్దేశము మొదలైనవి పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

2436 పందిరి మల్ల్‌కార్డునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము కావ్యస్వభావమును తమయం దిముడించుకొనినవి. యాస్కుని నిరుక్తమునందే కావ్యవిమర్శనమున కాధారములైన సూచనలు గలవు. క్రీపూ. 2వ శతాబ్బ్దమున భరతర్షి నాట్యశాస్త్రము నొకదానిని రచించెను. అందు నాట్య లక్షణములతో రసచర్చకూడ యున్నది. అభఖినవగుప్తవాడుల కాలమునాటికి రసచర్చ పరిపూర్ణావస్థను బొందినది. దృశ్యములనుండి శ్రవ్యములవైపుగ దృష్టిని ప్రసరింపజేసిన వారిలో భామహుడు ప్రసిద్ధుడు. తరువాత క్రమముగా దండి, వామన, ఆనందవర్థనాదులు కావ్య (శ్రవ్య) మార్గ నిర్ణయమున ఒక్కొక్క మెట్టు ముందునకు సాగిరి. తరువాత అభినవ గుప్తపాదులవారు వచ్చు సిద్ధాంత మొనర్చిరి. మహిమభట్టు, కుంతకుడు, క్షేమేంద్రుడు మొదలైనవారుకూడ కావ్యాత్మను గూర్చిన మీమాంస సలిపిరి. వీరందరును తమతమ సిద్ధాంతములను నెలకొల్పుకొనుటకు యత్నము చేసిరేగాని కావ్య వాజ్బయముతో నన్వయపరచి నిరూపించలేదు. అనగా ఏ [గ్రంథమును సమ్మగముగా ఏ సిద్ధాంతాసుగుణముగనైను పరామర్శింపబడ 'లీదనుట. గుణదోష విచారణ సందర్భమున మాత్రము కొన్ని కావ్యములనుండి కొన్ని శ్లోకములు ఉటంకింపబడి పరామర్శింపబడినవి. సంస్కృతాలంకారికులు నాడు చేసిన దంతమాతమే. కొందరు పండితులు తెనుగునను సంస్కృతమును బోలిన లక్షణ [గంథములను రచించిరి. ఇందు మొదటి వాడు విన్నకోట పెద్దన. తరువాత పర్కొనవలసినవాడు రామరాజ భూషణుడు. ఇతడు 'పేర్కొనకపోయినను ఈతని “కావ్యాలంకార సం[గహము” విద్యానాథుని “పతాప రుదీయము ననుసరించినది. అనగా ఇంతవరకును లక్షణ నిర్ణయమే కానీ లక్ష్య లక్షణ సమన్వయము జరుగలేదు.

ఇక వ్యాఖ్యాన మనున దొకటి కలదు. సంస్క్పృతమునందలి మహాకావ్యము లన్నింటికిని వ్యాఖ్యలు గలవు. వ్యాఖ్యానము నందలి ప్రధానోద్దేశము కవ యభ్మిపాయమును బయలుపరచుటయే. అనగా కవి ప్రయుక్త శబ్దార్థ నిర్ణయము

  • వ్యాకరణాంశములను వివరించుట - అలంకారమును పేర్కొనుట - ఇత్యాదులు. కావ్యకళాసౌందర్య చర్చ అందులేదు. తెనుగునను అట్టి వ్యాఖ్యానపద్ధతి కొంత నడచినది. ఇందును సంపూర్ణమైన విమర్శన స్వభావము లేదు.

సంస్కృతమునకంటె తెనుగుననే విమర్శనము అధికముగానున్న ట్ల్లూహించుటకు అవకాశమున్నది. తెనుగు కావ్యములలో “కుకవినింద" అనునొక

ఆంధ్రమున వాజ్మయ విమర్శ కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 2437 విశేషము అవత్రారికలలో నున్నది. కుకవి స్వభావాదులు ఆయా కావ్యకర్తలు పేర్కొనియున్నారు. మొదటి మారుగా నన్నెచోడుడు

“చెనస్‌ గుణమైన దోషంబు సేయనేర్చు -

కుకవి కృతులందు దోసంబు గుణముసేయ

నేరం డది యట్ల దొంతులు సేరి నాయి

దోర్చ నేర్చుగా కదియేమి సేర్పనేర్చు” కుమా. ఆ 1.ప29 అనినాడు. కృతులయందలి గుణములను దోషముగా నిరూపింపగలడుగాని, దోషములను గుణములుగా నిరూపింపలేడు. ఎట్లనగా కుక్క దొంతులను పడగొట్టగలదుగాని అమర్చలేదు. అట్టివాడు కుకవి. అనగా గుణదోష విచక్షణ ఆ కాలమున నున్నదనవలెను. అప్పకవియు తప్పును మాత్రమే కని ఒప్పును అడచి పుచ్చువాడు కుకవి యనినాడు. గుణ దోషములను తెలిసికొని దోషమునే వాకొని గుణమును (ప్రశంసించనివారు కొందరు గలరనుట నిర్వివాదము. గుణమును చెప్పకపోవుట లోపమేయైనను దోషమును వాకొనుటవలన విషయ పరిశీలనము స్పష్టము. విమర్శనమనగా రసానంద ప్రతిపాదకమగు వస్తువుయొక్క గుణగణముల యాథార్థ్యమును సహృదయముతో పరామర్శించిన తగవరితనము. పపైన పేర్కొనబడిన కుకవులయందు సహృదయములేదని మాత్రమేగదా కావ్యకర్తల అభియోగము. దానిని మన మంగీకరించినను వారు విమర్శకులు కాకపోరు, వారిని కువిమర్శకు లనుకొనవచ్చును. అట్టిచో విమర్శక శబ్దము వాడక కవి శబ్ద మేల వాడిరి అన్నది (ప్రశ్నము. కవిశబ్ద మనేకార్థములలో వాడబడినది. “కవి ర్మనీషీ పరిభూః స్వయంభూ?” అని వైదికమంత్రములం దున్నది. ఇట పరమాత్మ పరముగా నర్ణవమ చెప్పవలయును. ఇంకొకచోట వునీషన్‌ అని చెప్పుకొనవలయును. అదియునుగాక ఈ విమర్శన శబ్దము పూర్వమునుండి ఈ యర్థమున వాడుకలోలేదు. ఆంగ్లమునందలి 0/॥168గ అను పదమునకు సమానార్థ్ధకముగ బహుళ ప్రచారమున విమర్శన శబ్దము నేడున్నది. నాడు లేదు. కనుకనే ఆంధ్ర కావ్యకర్తలు నాటి విమర్శకులను “కుకవు"లని పేర్కొనిరి. అట కవి శబ్బమునకు విద్వాంసుడని యర్థము చెప్పనగును. సామాన్యునకు విమర్శన శబ్దార్థ మన్వయించదు. సామాన్యు డైన వానిని వారు లెక్కచేయరు. ఎవరుసు

2438 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము చేయరు, విద్వాంసుడై గుణదోష నిర్ణయము చేయువాడే నాటి “కుకవి. మరి,

_ కుకవి యని నీచముగా ఏల నిరూపించిరి యన్నది ప్రశ్న, ఏ కావ్యమును కేవలము గుణ భూయిస్టముకాదు. దోషము లనివార్యములు. తన్నిరూపణమువలన కావ్యగౌరవము కొంత లఘుత్వమును పొందక తప్పదు. ప్రతిష్టా కాముకుడైన కవి దానిని సహించలేకపోవుట సహజము. అసహన శీలుడైన కవి గుణదోష నిర్ణయకర్తలను “కుకవులని నీచముగా చిత్రించుటలో ఆశ్చర్యములేదు. అదియునుగాక విమర్శకుడైనవా డుత్తమకవి కాకపోవచ్చును. కాడు కూడను. తదనుగుణముగ వానిని *కుకవి" యనియుండవచ్చును. మరియు నా విమర్శకులు అధికముగా తప్పులు వెదకువారై యుండవచ్చును. అందువలనగూడ కావ్యకర్తలు వారిని “కుకవు"” లని పేర్కొనియుండవచ్చును. కవుల కున్న ఆదరణాదికములు వారికి లేవుగనుక వారు ప్రశస్తికి వచ్చియుండలేదు.

ఈ విధముగ సంస్కృత సంప్రదాయానుగుణముగ లక్షణ (గ్రంథములు రచింపబడుచు, కుకవులచేతనే కావ్యములందలి గుణ దోషములు లోకమున కత్తి చూపబడుచు వచ్చిన ఆంధ్ర వహజ్మయమునకు 19వ శతాబ్బమున ఆంగ్ల వాజ్బయముతో సంబంధమేర్పడినది. నాటికే ఆంగ్లమున విమర్శనమున్నది. అరిష్టాటిలు నుండి అనుసరింపబడిన విమర్శనము 17, 18 శతాబ్బములలో వివిధ విధముల పరిణమించినది. విమర్శన శాస్త్రము పెరిగినది. విమర్శకు లొక పృథగ్జాతిగా పరిగణించబడుట ఏర్పడినది. వాజ్మ్బయమును మించిన విమర్శనముగల ఆంగ్లము పాలితులమైన మన కవశ్యపఠనీయమైనది. తన్మూలమున వాజ్మయ పరిశీలన మనునది మనవారిలో పొడసూపినది. కవి జీవిత చరిత్రలు ఆంగ్లమున గలవు. తదనుసరణమై శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారి (1851 - 99) “ఆంధ్రకవి జీవితములు” వెలువడినది. అందు దేశకాల నిర్ణయమునకు (ప్రాధాన్యము హెచ్చు. శ్రీరామమూర్తిగారి (గంథమున పుక్కిటి పురాణములకుగల స్థానము చారిత్రాంశములకు లేదు. అందువలననే అది (ప్రథమ (గ్రంథమైనను దాని స్థానము మాత్రము [వ్రథమము గాదు. తరువాత పేర్కొనదగినది శ్రీ, కందుకూరి వీరేశలింగము పంతులుగారి “ఆంధకవుల చరిత”. ఇందు వీలైనంతవరకు స(ప్రమాణమైన దేశాకాల నిర్ణయము జరిగినది. (గంథస్థములైన గుణదోషములు బహుస్వల్పముగా నిరూపింపబడినవి. ఈ కాలముననే కొన్ని సాహిత్య పత్రికలు

ఆంధ్రమున వాజ్మయ విమర్శ కేతవరపు వోంకట రామకోటి శాస్త్ర 2439 బయలుదేరి కొంత కార్య[క్రమము నిర్వహించినవి. త్రీ పూండ్ల రామకృష్ణయ్య గారు (1860-1904) చాలకాలము “అముదిత గ్రంథ చింతామణి"అను పత్రికను నడిపిరి. అందు అధికముగా శాస్త్రచర్చులు, అనగా వ్యాకరణము, ఛందము, శకట రేఫ - సాధురేఫ నిర్ణయము, పూర్ణానుస్వార ఆ అర్ధ్థానున్వార నిర్ణయము - ఇత్యాదులుండెడివి. వీరేశలింగముగారి “వివేక వర్ధని”, కొక్కొండవారి “ఆంధధభాషా సంజీవని” పత్రికలు పైదానివంటివే. ఇందు అధికముగ పరస్పరము ఒకరి కృతు లొకరిచేత ఖండింప బడుచుండెడివి. ఇంతలో (గ్రంథ విమర్శనమునకు కొందరు పూనుకొనిరి. వారిలో కొన్ని వర్గము లేర్పడినవి. ఒక వర్గమువారికి “మను చరిత్ర” గొప్ప గ్రంథము. 'రెండవవారి కది పనికిమాలినది. ఈ ధోరణిలో చర్చలు సాగినవి. శ్రీ కాశీభట్ట (బహ్మయ్యశాస్తింగారికి “మను చరిత్రను చూడగనే “మూలమునందున్న కథనైనను సందర్భ శుద్ధిగ జప్పలేకపోయినాడు పెద్దన” అను నభ్మిపాయము గలిగినది. శ్రీ వేటూరివారికి, వరులవారికి, వెన్నేటి రామచం(దరావుగారికి, కేతవరపువారికి ఆ (గ్రంథము అమృతోపమమైనది. ఎజ్జన హరివంశము మనోహర సృష్టియొనది శ్రీ రాళ్లపల్లివారికి. సోముడు సర్వజ్ఞుడుగా సాక్షాత్కరించినాడు శ్రీ నడకుదుటి వీరరాజుగారికి. ఈ విషయమున వారు చాలకాలము అంధ సాహిత్య పరిషత్వ(త్రికలలో నిశిత విమర్శనము సాగించిరి. నాటి విమర్శనమున వ్య క్తినిందయు గలదు. ఎట్లయినను కొన్ని విశేషములు నిరూపింపబడినవి. తరువాత వచ్చిన విమర్శన గ్రంథములలో ముఖ్యములైనవి (1) తె.

నారాయణరావు (కవిత్వవేది) గారి “ఆంధ్రవాజ్బ్ఞయ చరిత్ర సంగ్రహము. ఇందు నన్నయనుండి దాదాపు దువ్వూరి రామిరెడ్డిగారివరకు గల వాజయమును దేశచరిత్రతో మేళవించి గుణదోష నిరూపణము చేయుటకు ప్రయత్నము జరిగినది. ఇందు విమర్శకున కుండవలసిన సంయమన సంభావనములకు మించి కవి కుండవలసిన భావోద్వేగము కనుపించుచున్నది. ప్రయత్నము మాత్రము (ప్రశంసింపదగినది. ఇంతకుమించిన సమ్మగ వాజ్మయ విమర్శన (గ్రంథము మనకు లేదు. ఈ [గంథమునకు పూర్వమే రెండు (గంథములున్నవి గాని (1. ఆంధ్ర వాజ్ఞయ చరిత్ర - వంగూరి, ॥. ఆంధ కవిత్వ చరితము - భోగరాజు) అవి పరిపుష్టములు గావు. (2) కేవలము విజయనగర రాజుల కాలమునందలి వాజ్బయమునే (గ్రహించి విమర్శించిన టేకుమళ్ల అచ్యుతరావుగారి (గ్రంథము.

2440 . పందిరి మల్లికార్టునరావు శతజయంతి సంపుటము. 4: సాహిత్యము ఇందు కవికాల నిర్ణయము దేశ నిర్ణయము కవి [గ్రంథములు కథా భాగములు మూలములు కృతిపతి కథా సంవిధానము శైలి నీతి పాతపోషణము కావ్యగౌరవము అను వివిధములైన శీర్షికలుగా విమర్శనము సాగును. ఎడనెడ ఆంగ్ల వాజ్బయమునుండి ఉదాహరణము లుద్ధరింపబడును. శ్రీ అచ్యుతరావుగారి మార్గముననుసరించి ఆంధ్రవాజ్బయ చరిత్ర నొకదావిని సిద్ధము చేయవలయును. (3) కాశీనాథుని నాగేశ్వరరావుగారి “ఆంధ్ర వాజ్బయ చరిత. ఇది చాల సంక్షిప్తము. ఆంధ్ర వాజ్మయ మననేమో ఆలియనివారికి ఇది యుపకరించును. (4) కట్టమంచి రామలింగారెడ్డిగారి “కవిత్వ తత్త్వ విచారము. ఇది పింగళి సూరన రచించిన “కళాపూర్ణోదయ” [గ్రంథ విమర్శనము. కొంత “ప్రభావతీ పప్రద్యుమ్నము” మైనను గలదు. ఈ రెండు [గంథము లాధారముగగొని త్త రెడ్డిగారు ఆంధ్ర ప్రబంధ వాజ్మయవమును విమర్శించిరి. ఆంగ్లభాషా నిష్థాతులగుట రెడ్డి గారికి ఆంగ్లవిమర్థునపద్ధతులే ఉపాదేయములైనవి. తదనుగుణముగ (ప్రబంధ వాజ్మయమును పరామర్శించిరి. ఆ దృష్టితో వీనిని దర్శించరాదు. ఇది యొక శిల్పము. దీనికొక వైశిష్ట్యము గలదు. భారతీయాలంకారిక పద్ధతి ననుసరించి ఆయా (గ్రంథములను విమర్శించవలయును. లేనిచో నేలవిడిచిన సామగును. శెడ్డిగారు చేసినదదియే. కాని వారి వాక్య విన్యాసములోని చమత్కారము హర్షింపదగినది. సునిశితమైన తార్కికబుద్ధి రెడ్డిగారి గ్రంథమున సర్వత్ర గోచరించును. విమర్శకునకు కావలసినదిదియే. (5) ఖండవల్లి లక్ష్మీరంజనముగారి “ఆం(ధసాహిత్య చరిత్ర సంగ్రహము”. ఇది విమర్శన (గ్రంథము గాదు. కవుల యొక్కయు, వారి కృతులయొక్కయు పట్టికమాత్రమే. వాజ్బ్యయచరిత్ర వ్రాయువారికి కొంత యుపకరించును. (6) కాళూరి వ్యాసమూర్తిగారి “కవిత్వ తత్త్వ విచార విమర్శనము". ఇది శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారి [గ్రంథ విమర్శనము. కొంతవరకు రెడ్డిగారి వాదము ఖండింపబడినది. వీరి 30డవ (గ్రంథము “తిక్కన కళాసామాజ్యము". ఇది ఇంకను పూర్తికాలేదు. కొంత భాగము ముద్రింపబడినది. రచన సాగుచున్నది. తిక్కన భారతమును గురించిన విపులమైన విమర్శన మిది. అనేకములైన విశేషాంశములను అందు ఆలియజేయుచున్నారు. (7) భూపతి లక్షీ నారాయణరావుగారి “భారతము - తిక్కనరచన”. ఇందు తిక్కన భారతమంతయు సమగ దృష్టితో పరిశీలింపబడలేదు. ఉద్యోగ పర్వమునందలి

ఆంధ్రమున వాజ్మయ విమర్శ కేతవచపు వేంకజీ రామకోటీ శాస్తి? వశత విశేషములు మాత్రము కొంతపరకు ప్రశంసనీయములు. పోనుపోను ప్రతి పర్వము సంకుచింపబడినది.. ఈ [గంథమువలన తిక్కన రచనలోని మెరుగులుగాని, లోపములుగాని గాఢముగ నిరూపితములగుటలేదు. ($) జయంతి రామయ్య గారి “ఆధునికాంధ్ర వాజ్మయ వికాసవైఖరొ. ఇది ఆరు అధ్యాయముల విమర్శన (గ్రంథము. ఇందు నాటకములు - కృతి విమర్శనము - భావ కవిత్వము - (గ్రామ్యవాద విమర్శుసము అనునవి సోపపత్తికముగ చర్చింపబడినవి. (9) అక్కిరాజు ఉమౌాకాంత విద్యాచేఖరుల “నేటికాలపు కవిత్వము”. ఇది కొంచెము విపరీత ధోరణిలో సాగిన నవ్యకవిత్వ విమర్శనము. (10) కోరాడ రామకృష్ణయ్య గారి “ఆంధ్ర భారత కవితా ఏమర్శనము". ఇందు నన్నయకంటిె తిక్కన పొగడబడినాడు. పాక్షికదృష్టి యొకటున్నట్లు విమర్శన (గ్రంథావలోకనమున విస్పష్టము. వీరు చూపిన నన్నయ తిక్కనలలోని భేదమును ఇంకను పరిశీలించవలసియున్నది. వీరిదే మరియొక (గ్రంథము “కాళిదాసుని కళాప్రతిభలు”. ఇది నిష్పాక్షికమై విమర్శకుని సహృదయమును ఆల్లము చేయుచున్నది. (11) మధునాపంతుల సత్యనారాయణ శాస్తి గారి “ఆంధ రచయితలు”. ఇందు పరవస్తు చిన్నయసూరినుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి వరకును గల దాదాపు నూర్గురు రచయితల చరిత్ర సంఘటిత పరుపబడినది. [గ్రంథ విమర్శనమున కిం దంత స్టాన మీయబడలేదు. ఈ (గ్రంథమును చదివిన తరువాత ఈ వేటూరి ప్రభాకరశాస్త్రగారి “ధ్వన్నిపాయమైన చతురకవితా విమర్శనముతో - వక్రోక్తి చమత్కృతితో - రసవత్కావ్యమువల గంభీరార్థమై మనోజ్జ మై యున్నది” అను వాక్య మా (గగంథమున కన్వయించు ననిపించదు. (12) శ్రీమతి ఊటుకూరు లక్ష్మికాంతమ్మగారి “ఆంధ రచయిత్రులు” ఇదియు మైగంథము వంటిదే. రచయిత్రి పేరు - కావ్యములు - శైలికి మచ్చుపద్యములు అను ధోరణిలో సాగినది. చాలమంది రచయిత్రులు ఈ [గంథమున చేరలేదు. (13) “నవ్యాంధ సాహిత్యవీథులు”. ఇది మొదట కురుగంటి సీతారామయ్య గారిచే వ్రాయబడినది. తరువాత పిల్లలమళఖ్ఞి వేంకట హసుమంతరావుగారుకూడ కలిసిరి. ఇది కొంతవరకు సమ్మగమైన నవ్యాలధ్ర వాజ్బ్ఞయ చరిత్రను నిర్మించినది. దీనితోబాటు విపులమైన (గ్రంథ విమర్శనముకూడ నున్నచో సర్వాంగసుందరమును, సంపూర్ణమును అగును. (11) గడియారము పేంకటశేషశాస్తిగారి “శ్రీనాథ్డుని కవితా సామాజ్యము”.

2442 పందిరి మల్స్‌కార్డునరావు శతజయంతి సంపుటము 44: పాహిత్యము ఇందు శాస్తింగారు కవిగనే దర్శనమిచ్చుచున్నారు గాని విమర్శకుడుగా గాదు. అంత ఆవేశముతో కూడియుండరాదు విమర్శనము. అప్పు డది విమర్శనమే కాదు. గ్రంథమునందలి శీర్షికలు సమంజసముగనే యున్నవిగాని విషయ విన్యాసమే కవిత్వమువలి నున్నది. విమర్శనము కవిత్వమువల నుండరాదు. అట్లగుచో వేరు విమర్శన మెందులకు? (15) గుజ్జము సుబ్బరామయ్యగారి “కవిత్రయ కవితా విమర్శనము”. పుస్తకము కొద్దిదగుటచేత వస్తు విస్తరణమున కవకాశము లేకపోయినది. ఇందు కవ్యితయము వారి అనువాదసరణియే అధికముగా పరిశీలింపబడినది. (16) పింగళి లక్ష్మీకాంతముగారు ఆంధ వాజ్మ్ఞయ చరిత్ర నొకదానిని సమకూర్చిరి. అది అముదితము. కవి కాలనిర్ణయాదులు సోపపత్తికముగ

  • చమత్కారముగా నిరూపింపబడినవి. కొంత కావ్యవిమర్శనమున కిందు (ప్రయత్నము జరిగినది. కొనసాగినది. అవశ్యము ము[దితము గావలయును. విమర్శనకు (ప్రధానమైన సంయమనము - సంభావనము ఇందు సర్వత్ర గోచరించును. (17) డాక్టరు కాకర్ల వేంకట రామ నరసింహముగారి “ప్రబంధోత్పత్తి
  • వికాసము" అనునది కేవలము (ప్రబంధశాఖకు సంబంధించినది. ప్రబంధ వాజ్మయ పరిశీలనమున కాగ్రంథముపకరించును. ఇది అముద్రితము. కేవలము దక్షిణాంధ్ర సాహిత్య విమర్శన [గ్రంథమొకటి తామీమధ్య సమకూర్చినట్లు నాతో చెప్పియున్నారు. అదియు అముదితమే. ఈ (గ్రంథములు ముదితములైనగాని ఏ విషయమును నిశ్చితముగ చెప్పవలనుపడదు. (18) వంగూరు సుబ్బారావుగారి “శతక కవుల చరిత”. ఇది ఆంధ వాజ్బయమునందలి శతక కవులను గురించిన [గ్రంథమని నామమునుబట్టియే మనము (గగ్రహించవచ్చును. పండితారాధ్యుని “శివతత్త్వ సారము" మొదలుకొని, “బాలచ[క వేమ” శతకము వాసిన రామా జెట్టి వరకు గల 200 కవుల శతకములు స్పృష్టములైనవి. కవి కాలనిర్ణయము - శతకమునుండి శైలికి మచ్చు పద్యములు - ఇంత మాత్రమే ఇందు జరిగినది. శతకవాజ్మయా విర్భావమునకు సంబంధించిన విపులమైన “గ్రంథ (ప్రవేశము పఠనీయార్హము. (19) చాగంటి శేషయ్యగారి “ఆం(ధకవి తరంగిణి". దీని రచన ఇంకను సాగుచున్నది. కొంతభాగము ముద్రితము. ఇందు కవుల దేశకాల నిర్ణయమే అధికభాగ మా[క్రమించినది. కావ్యవిమర్శనమున కిందు తావులేదనిపించుచున్న దనుట స్వభావోక్తిమ్మాతమే. కవి కాలనిర్ణయాదులవలన పూర్తిగ లాభములేదని

ఆంధ్రమున వాజ్మయ విమర్శ. కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 2443 నేనననుగాని కొంత వృథాప్రయాసగలదని మాత్రము చెప్పగలను. ఎంతనసరిగా లక్కలుగట్టి కవికాల నిర్ణయము చేసినను కొంత ఊహమీద ఆధారపడక తప్పదు. అట్టి నిర్ణయము వీరేశలింగముగారివలన జరిగియేయున్నది. చేసినదానినే చేయుటవలన వాజ్మయమునకు పుష్టికూడదు. రెండు సంవత్సరము లొక కఎఐని ముందు వెనుకలుగా శేషయ్యగారు నిర్ణయించిన మాతమున కలుగు 'ప్రయోజనమేమి? దానివలన వాజ్బయ చరిత్రలో ఎట్టి మార్పును రాదు. వాయ చరిత్రకును దేశ చరిత్రకును సంబంధమున్నది. సాంఘికమైన వ్యవస్థ మారదని నేననను, దానివలన వాజ్బ్ఞయమును మారును. ప్రతి ఒకటి రెండు సంవత్సరములకు సంఘము మారదు. వాజ్బ్ఞయమును మారదు. మనకు కావలసినది సాంఘిక చరిత్రముతో అవినాభావసంబంధము గలిగిన వాజయ చరిత్రగాని కవుల చర్విత గాదు. (20) నిడుదవోలు వేంకటరావుగారి “ఉదాహరణ వాజ్మయ చరిత. ఉదాహరణ కావ్యమనునది దేవతాస్తుతి రూపమైన (గ్రంథము. ఈ కాలపు ఖండ కావ్యములవలె నుండును. ఈ కావ్యలక్షణములను అనంతుడు, అప్పకవి మొదలగువారు తమ లక్షణ (గంథములందు చెప్పిరి. సంస్కృతమునను ఇట్టి ఉదాహరణ కావ్యములు గలవు. వీని పుట్టుపూర్వోత్తరములను గూర్చి ఆ (గంథమున విపులముగా చర్చించబడినది. వీరిదే మరొక [గ్రంథము “ఆంధ్రకవుల జీవితచరిత్ర”. (ప్రథమ సంపుటము మాతమే వెలువడినది. నన్నయకు పూర్వమునందున్న కవృలను దాదాపు 100 వరకు అందెత్తి చూపిరి. అందు చాలవరకు శాసనకర్తలందరును కవులుగా పేర్కొనబడిరి. ఈ (గంథముమీద వచ్చిన విమర్శనము లంత (్రోత్సాహకరములుగా లేవు. వీరిదే మరొక [గ్రంథము “అఆం(ధవచన వాజబ్మియము". ఆంధమున వచన రచనాభివృద్ధిని నిరూపించు (గ్రంథ మిది. ఈ శతాబ్దారంభమువరకు గల వచన రచన మిందు స్పృష్టము. వచన వాజ్బయమును గూర్చిన (గ్రంథము లింతకు పూర్వమున లేకపోలేదు. అట్టివానిలో (2) మల్లాది వేంకటరత్నముగారి “తెనుగువచన కావ్యాభివృద్ధిో. (0) గొబ్బూరి వేంకటానంద రాఘవరావుగారి “గద్య వాజ్బయ చరిత్ర”. (౨) గిడుగు రామమూర్తి పంతులుగారి “గద్య చింతామణి". - ఇందు పూర్వముననున్న వ్యావహారిక రచనలు కూర్చబడినవి. (4) పిల్లలమళ్ణి వేంకట హనుమంతరాపుగారి వ్యాసములు, ముఖ్యములు. వీని నన్నింటిని పరిశీలించి, తాము స్వయముగా

24ీతడ పందిరి ముల్లికార్డునరాపు శతజయంతి సంప్పుటము శీ; సాహిత్యము కృషిచేసి వేంకటరావుగారు ఈ వచన వాజ్బయమును రచించిరి. (21) వేదము వేంకట కృష్ణశర్మగారి “శతక వాజ్బయ చరిత. వంగూరు సుబ్బారావుగారి (గ్రంథము సమగ్రము గాదని చేసిన ప్రయత్నమిది. అందు సత్యము లేకపోలేదు. ఇంకను [గంథ రూపమున వచ్చినట్లులేదు. రెండు సంవత్సరములనుండి “మాతృసేవ” లో వరుసగా (ప్రకటింపబడుచున్నది. (22) నండూరి బంగారయ్య గారి “శాకుంతల విమర్శనము. ఇది కాళిదాసు నాటకమును దృష్టిలో పెట్టుకొని చేయబడిన విపులమైన విమర్శనము. ఎడనెడ వ్యాసుని భారత కథతో పోల్చి తారతమ్య పరీక్షయు చేయబడినది. పాత్ర పోషణము, రసనిర్వహణ మిత్యాది శీర్ణికలలో విమర్శన సాగినది. కాళిదాసు కావ్యములపై ఆంధధ్రమున నింత వివుల విమర్శన (గ్రంథ మింతవరకు నేను చూడలేదు. వెనుక చాలకాలము [క్రిందట గంటి జోగి సోమయాజిగారు “భారతి"లో కాళిదాసుని (గ్రంథములను నిశితదృష్టిమై విమర్శించియున్నారు. (23) బండారు తమ్మయ్యగారి “పాల్కురికి సోమనాథుడు”. ఇందు సోమనాథుని దేశము - కాలము - వైదుష్యము _- రచనా పాటవము సవు(గవలగా చర్చింపబడినవి. కావ్యకళను గూర్చి యింకను వాయబడియుండవలసినది. (24) వేటూరి ప్రభాకరశాస్తిగారి “మీగడతరకలు”. ఇందు దేశి సంపపదాయమునకు సంబంధించిన విషయము లనేకము చర్చింపబడినవి. వీరిదే “సింహావలోకనము"”. ఇందు రెడ్డిరాజుల భాషాసేవ - హరవిలాసము - మనుచరిత్ర - రంగనాథ రామాయణము (కర్తృత్వ నిర్ణయము) కొంతవరకు విమర్శింపబడినవి. ఇందును కావ్యకళా శిల్పమును గూర్చిన విచారము స్వల్పమే. “శృంగార శ్రీనాథము” కేవలము శ్రీనాథుని జీవితచరిత్ర. “తలుగు మెజుగులూ” భాషావిషయిక వ్యాసములు. (25) దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారి “నన్నెచోడదేవ కవిచరిత్ర. ఇం దధికభాగము నన్నెచోడుని కాలనిర్ణయమునకే వినియోగము. కావ్యవిమర్శనము లుప్తము. (26) శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారి “కుమారసంభవ విమర్శనము”. నన్నెచోడ దేపకవి కాలనిర్ణయమే ఇందు వస్తువు. “ప్రయోగ విశేషాదులను పరిశీలింపగా నన్నిచోడుడు తిక్కనకు దర్వాతివాడని నాకు తోచినది” అని లక్ష్మీపతి శాస్త్రిగారు తమ యభిప్రాయమును స్థాపంచుట కా (గగంథవుఎను రచించిరి. ఇందు తెలిసకొనవలస్‌ిన ముఖ్యవిషయములు కొన్ని యున్నవి. (27) గొ(రెపాటి వెంకటసుబ్బయ్యగారి

ఆంధ్రమున వాజ్మయ విమర్శ కీతవరపు వేంకట రామకోటి శాస్త్రం 2445 “అక్షరాభిషేకము”. ఇందు నవ్యులైన కథకులనుగూర్చి వ్రాయబడినది. ఆంధ్ర కథానికావాజ్బయమును గురించి వ్రాయబడిన కొద్ది గ్రంథములలో ఇది ముఖ్యమైనది. జానపద సాహిత్యము, బాల సాహిత్యము మొదలైన వ్యాసములనేకము లున్నవి వీరివి.

ఇవి ముఖ్యములని నాకు తోచినవి. ఇవిగాక “విజయవిలాసము"పై తాపీ ధర్మారావ్చగారి |గంథము, దివాకర్ల వెంకటావధానిగారి [గంథము, లనాలిరామకృష్ణుని “పాండురంగ మాహాత్మ థ్రముూ" మీద పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచన, “నన్నయ ప్రసన్న కథా కలితార్థ యుక్తిని గూర్చి విశ్వనాథ వారి వ్యాసములు. “సౌందరనందొకావ్యముమీద పొట్లపల్లి సీతారామారావుగారి యొక్కయు - “సురభి-” పిలకా గణపతిశాస్త్రిగారి వ్యాసములును గలవు. వీరుగాక పత్రికలలో [వ్రాయువారు చాలమంది గలరు.

పెన పేర్కొనబడిన (గగంథములన్నియు కావ్యవిమర్శనమే (పధానోద్దేశముగా గలవిగావృ అని తేలినది. వమునవారిని పట్టిపీడించు సవుస్య కవి కాలనిర్ణయాదికములగాని కావ్యసాందర్య మీమాంసగాదు. దౌర్భాగ్యావస్థలలో నిది యొకటి. ఒక [గంథమును విమర్శించుటకు సంప్రదాయ సిద్ధముగ చదువుకొనినవాడు కావలయును. ఇతరములైన రెండు మూడు వాజ్బయములలో పరిచయ మాతని కుండవలయును. అప్పుడే తారతమ్య పరీక్షకు అవకాశము _ కలుగును. ఉత్తమ విమర్శన మున్నగాని ఉత్తమ సాహిత్యము రాదు. వైదుష్యము _ సహృదయము - కళాభిజ్ఞత - సానుభూతి లేనివాడు విమర్శకుడు కాలేడు. విమర్శనమనగా నొకవిధమైన తగవరితన మనియున్నాను. నిర్మమత్వ మేర్చడినగదా తగవరితనము సార్థకమగుట, కవికాల నిర్ణయాదులు వెనుక జరిగిపోయినవి. ఇక కావ్యవులు చదివి వివుర్థ్శించుట మిగిలినది. దానికి వునచేం పూనుకొనవలయును. అందుకు తగిన యుపపత్తిని సేకరించుకొనవలయును. వున వాజ్మయము మొదటినుండియు సంస్కృతానుసరణము. కనుక సంస్కృతాలంకారిక (గ్రంథములు నరమునకు పట్టినగాని మన పూర్వ వాజ్మయ మవగతముగాదు. నేడు మన వాజ్మయము ఆంగ్లవాజ్బ్యయము నసుసరించుచున్నది. కనుక ఆంగ్లాలంకారిక వాజ్బాయమున వైదుష్యుమును సంపాదించవలయును. అనగా (ప్రస్తుత ఏమర్శకులకు సంస్కృతాంగ్లములు రెండును పుపరిచితములు

2446 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము గావలయు. దీనికితోడు తెనుగు వాజ్బయమందలి నుడికారపు సొంపు సిరా పథములలో గమనింపబడవలయును. విమర్శన మప్పుడు.

మన కవులకు పత్రికలకు విమర్శనలకు స్వాగతమీయగల స్థయిర్యము రాలేదు. కవి విమర్శనమనిన భయపడరాదు. విమర్శన మనగా దూషించుట గాదు. “0గ41015గ 15 ౧41 1 2౧40263, 1౧6౧౧6౦5 2౧6 6/244169 ౪౧6 ౪౧౧౦16 01 ౪౧1౧9 10 161618౧006 10 106 6౧1/6 *౦గ6 01 (౦౮0౧1 2౧6 2010౧”. కొంతచర్చ జరిగిన మీదగాని కావ్యమునందలి శక్తి నామర్ధ్థ్యములు బయలుపడవు. ఈ సందర్భమున (ప్రబోధచందోదయము నందలి ఈ పద్యము ముఖ్యముగా కవృలు గమనించవలసినది.

పారి పొరి నొప్పు సలాకల

నొరసిన కుందనపు బూదెయును బోలె సభన్‌

సరసుల సంఘర్హ్దణమున

వరకవి కావ్యంబు మిగుల వన్నెకునెక్కున్‌. నంది మల్లయ్య, ఘంట సింగయ్యగారి కాలమునందువలె నేడు రాజసభలు లేవు. నేటి పత్రిక లా కార్యమును నిర్వహించవలయును. దోషములు చూపిన మాత్రమున ఆ విమర్శకు డా కవికి విరోధి యనరాదు. లోపములను చూపి సవరించుకొనుమనునది హితుడుగాని అహితుడు గాదు. విమర్శనమున్నగాని వాజ్బియమునకు పుష్టిరాదు. పాఠకుల కుత్సాహము కలుగదు. ఈ విషయమున వాజ్మయ జిజ్ఞాసువులు శ్రద్ధ వహించెదరని విశ్వాసము. (కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫిబ్రవరి 1955) .

గురుజాడ అప్పారావుగారు (సాంప్రదాయాలమీద ఆధునిక కవుల తిరుగుబాటు)

  • శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

ఆుప్పారావుగారు నేడు జగమెరిగిన బ్రాహ్మణుడు! ఆధునిక కవుల మూలపురుషుడు. కరడుగట్టి ఘనీభవించిపోయిన పాత సంప్రదాయాల నన్నింటినీ భగ్నం చేసి కవిత్వంలో కొత్త వ్యవసాయం ప్రారంభించిన ఉపజ్ఞావసానుడు. తలుగు పాఠకులకు ఆయనను గురించి కొత్త విషయాలు చెప్పడము కష్టము. అయినా తిరుగుబాట్ల (ప్రశంసచేస్తూ మొదటి తిరుగుబాటుదారుని వదిలేయడం

అసందర్భం కాబట్టి పాత మాటల్నే కొత్తరకంగా చెప్ప యత్నిస్తాను.

" ఆధునిక కవులలో అసలైన తిరుగుబాటుదారు అప్పారావుగారు ఒక్కరే, తక్కినవారి తిరుగుబాటుకి బీజాలు వారికి ముందుగానే ఏ కొద్దో ఏర్పడే వుండినవి. లేదా తొలి రోజుల్లో సంప్రదాయాల్ని మన్నించి ఆ నియమాల్లో రచిస్తూనే క్రమంగా మారి తిరుగుబాటు చేశారు శ్రీశ్రీ వంటివారు. కాని అప్పారావుగారు మాత్రము మొదటినుంచీ పదహారణాల తిరుగుబాటుదారు. వారికి పూర్వము కవిత్వానికి సుదీర్హ రచనే వాహనము. పేచీకోరులకు వినోదము కల్పించే కజ్జా రచనలకి కావ్యత్వసిద్ధి లేదని ఒప్పుకుంటే గురజాడవారి “బాల్య” యుగములో మిగిలెవి బుద్ధ చరిత్రమూ, శ్రవణానందమూ వంటి (ప్రబంధాలే. (బతికున్న లోకోక్తులూ, జాతీయాలూ వీటిలో అక్కడక్కడ మెరిసినప్పటికీ వీటి రచన మాత్రం మొత్తానికి పందిని మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము.

2448 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము “లాక్షణికపు రస్తొ మీదే నడిచింది. పూర్వ కవులు వాడిన వృత్తాల్నే తిరుపతి కవులు కూడా ఉపయోగించారు. కావైతే పూర్వ కవులు తమ ప్రబంధాలలో సరోవరాలూ, మలయ మారుతాలూ, ఇందిందిర బృందాలూ, పూల పాన్పులూ, పూర్ణ చంద్రికలూ, రమ్య హర్మ్యాలూ వుండే ఉహా ప్రపంచాన్ని సృష్టిస్తే తిరుపతి కవులు యమ్మారార్వైలతో, టింగు రంగా యని వాస్తవిక ప్రపంచాన్నే సృష్టించారు తమ కావ్యాల్లో. వీరి కవిత్వంలో సౌందర్యాని కంటె వైచితైచే పైచేయి; వర్ణించిన వస్తువుకంటె వర్ణించిన ఫక్కీయే సుందర మైనది. కాగా వీరి రచనలు పరిస్తే ఆనందముకంటె మెప్పే స్థాయిగా నిలుస్తుంది మన మనస్సులలో. కాబట్టి తిరుపతి కవుల రచన ప్రాచీన కవిత్వమ్మీద తిరుగుబాటు అనడము కంటే ప్రాచీన కవిత్వానికి “తిరుగ మూత"అనడము ఎక్కువ నిజమేమో అనిపెస్తుంది నాకు. అప్పారావుగారిది మాత్రం అణువణువునా కొత్తపుంతే. వారు చేపట్టినది “ముత్యాలసరము" అనే మాత్రాఛందము.. ఆలుగు పదాలన్నీ అజంతములే కావడమువల్ల సంస్కృత పదాలలాగా గుత్తులుగా అతకడానికి వీలులేదు. శార్దూల మత్తేభాది వృత్తాలు సమాసభూయిష్టమైన సంస్కృత భాషకే గాని ఎక్కడికక్కడ తెగిపోయే తెలుగు భాషకి (అందులోనూ వ్యావహారికానిక్సి అనువైనవి కావు. అందువల్లనే ఆలుగులోని జానపద కవత్వము మాత్రా ఛందస్సులనే వాడుకుంది. అఆలుగుభాష జీవము మాత్రా ఛందస్సులలోనే బయల్ప్బ్పడ గలదు అనే సత్యమును మొదట (గ్రహించి, ఆచరణలో పెట్టిన కవి గురజాడ అప్పారావుగారే. ముత్యాల సరాల్లోనే తన రచనల నెక్కువగా చేస్తూ , తక్కిన కూర్చులేవైనా అందముగా ఉండునేమో అని, “నీలగిరి పాటలిలోనూ, “పూర్ణమ్మా” , “కోరుకొండ” మొదలైన పాటలలోనూ ఇతర ప్రయోగాలు కూడా చేశా రీయన. ప్రయోగాల ఫలితము మాట అటుంచి, అంతవరకూ పద్యాల పంజరాలలోనే నర్తించిన కవితా సరస్వతి వీరి ప్రయత్నం వల్ల పాటలలోకూడా అడుగు బెట్టి పాటలకు కావ్యత్వసిద్ది చేకూర్చింది. గురజాడకి పూర్వము పాటలన్నీ సంగీత కళలోవే, వాటిలో కవితా వాసన గుప్పు మంటున్నా పాటల్ని కవిత్వ మని ప్రజలనుకోలేదు. ఈయన నీలగిరి పాటలలో సంగీతము మాట నాకు తెలియదు గాని సాహిత్య వాసన జోరుగా ఉన్నదిః “వేవొకో మంత్రములు లేమగా జేయ నినులా వపుడు బయలుపడు నొక్కొ. కావనుచు నీ లాటి కాంతునకు జిక్కి నీ భావమున నలయికను బడుదొ” వంటి

గురుజాడ అప్పారావుగారు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 2449 భావాలు చాలా ఉన్నాయి నీలగిరి పాటలలో. ముత్యాల సరాలు కూడా పాటలే. “గుమ్మడేడే గోపి దేవో పాటది ఆ వరసే. అయితే ఈ పాటలలోని గతి పద్యపు నడకని పోలివుంటుంది. కాబట్టి చరచరా నడిచిపోతాయి.. గురజాడవారు వాడిన “పూర్ణమ్మ”, “కాసులూ” వంటి ఖండముల వరసలూ పద్య వరుసలవలె వేగ గతి గలిగినవే. వీరి తరవాత ఎంకి పాటలూ, బసవరాజు గేయాలూ, తురగా వెంకట్రామయ్య పాటలూ, కవి కొండల గీతికలూ సాహిత్యానికి చేరే పుట్టినవి. ఛందస్సుని మలచుకోడము గురజాడతోనే మొదలు.

భాషాభేషజాలు చెయ్యకుండా తేటైన మాటలతో కావ్యరచన చెయ్యడం అప్పారావుగారి తిరుగుబాటులో రెండో ఎత్తు. తేటైన మాటలతోపాటు వ్యవహారంలో వున్న మాటల్ని కూడా వారు ధారాళంగా ఉపయోగించారు. ఈ మార్ప్చువల్ల వర్ణిత వస్తు సౌందర్యానికీ వర్దన సౌందర్యానికీ చక్కని సమ్మేళనము సాధించారు వారు, “

అంతకుముందు కవులు ధారాళంగా సంస్కృతపు బొంతలు కప్పి తమ కవిత్వపు నిస్సత్తువను దాచేసేవారు. తేటమాట లుపయోగించి నట్లయితే, బాజాభజంత్రీలు లోపించిపోయి, కవులు తమ రచనల్లో ప్రాఢ సంస్కృతాని కంటకట్టే కవితా శిశువు మొర వినబడిపోతుంది. అప్పారావుగారి రచనల్లో మాత్రము చెప్పే విషయమూ, చెప్పే పద్ధతీ, వేర్వేరుగా కనపడవు. ర0డూ ఒకటై పోతాయి. వారు సృష్టించే ప్రపంచం మనకి పరిచితమైన (ప్రపంచమే. ఆ ప్రపంచంలో తూర్పు బలబల తెల్లవారుతుంది. కోళ్ళు మేలుకొలుపులు కూస్తాయి. ఎక్కడనో వొక చెట్టు మాటునించి వొక్క కోకిల పలకడం మొదలుపెడుతుంది. పీత్రువలికైనా ఇనుని వేడికి వాడి వుండదు. నారింజ, ఆలివు వృక్ష షండములూ, ద్రాక్ష పందిరులూ,

" ఇంటి పంటలూ కోళ్ళకి విందు చేస్తాయి. కొండల నడుమ నున్న కోనలలో

కిలకిలమని పలుకుతాయి కీరములు. తాడి వనములు తూర్పు కొండను గొడుగు లెత్తుతాయి. చల్ల గాలులు అలలుగా సాగి జల్లుజల్లున పూలు రాలుస్తాయి. ఈ (ప్రపంచములోని వ్యక్తులో? మాలతని చూడండి. ఆలివి యొలికెడి అతేటకన్నులూ, మురువు గులికెడి ముద్దు మోమూ, వేల్పు చేడియలైన నేరని గానమాధురీ, చిత్తరువులందైన గనని పవిత్ర రూపపు సౌష్టవమూ ఉన్నవట ఆమెకి. ఆమె

2450 పందిరి ముల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము తండ్రిని చూడండి ; పండు 'గెడ్డము; నిండు కన్నుల సిండ శాంత రసంబు; పలుకుల కడలి గాంఛీర్యమూ, ఒడలిసి దివ్యతేజమూను. ఇతర వ్యక్తులో, ఎల్ల లోకము వొక్క యిల్ల వర్ణ భేదము లెల్ల కల్లె వేల నెరుగని గ్రేమ బంధము వేడుకలు కురియ " _- వతెనని ఒక సాంఘికుడు. మరులు (ప్రేమని మది దలంచకు; ॥ మరులు మరలును వయసు తోడనె; మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారి కొక్కటే (బతుకు సుకముకు ఛాజమార్గము ం

  • అని ఒక గేయసుడు! మంచి చెడ్డలు మనుజు లందున ఎంచి చూడగ రెండె కులములు ' మంచి యన్నది మాలమొతే =. పాలనే అగుదున్‌
  • అని ఒక మూర్ధభిషిక్తుడు | నాటునను గల యట్టి యిడుములు _ కాటి యందును కలవు ఓరిమి యేటికైనను మందు; కలిగిన కలుగు సౌఖ్యంబుల్‌
  • అని రావి కిందను రచ్చ శిలపై కూర్చునే పల్లి పెద్ద ! పట్ట. మేలే రాజు అయితే రాజు నేలే దైవ ముండడొ పరువు నిలపను పొరుషము మీ కేల కలగదొకొ?

గురుజాడ అప్పారావుగారు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 2451

  • అని రెచ్చగొట్టే కన్యక!

గురజాడవారు సృష్టించినది చిదానంద ప్రపంచము! తేట మాటల రచన ఈ (ప్రపంచాన్ని వ్రైతన్యవంతము చేసిన పూర్ణ జ్యోత్స్న

పుస్తకాల్లో విన్న సౌందర్యాన్ని కాక స్వంతంగా గుర్తించిన సౌందర్యాన్నే రచనల్లో పొదిగి ఇవ్వడం గురజాడవారి తిరుగుబాటులో మూడవ ఎత్తు. అంతవరకూ కవులు పూర్వ కావ్యాల్లో చదివిన సౌందర్యాన్నీ పూర్వ కవుల పద్ధతినే సాగిపోయి కనిపెట్టుకున్న అలంకార సంపదనీ వమాటతవే. యెక్కువగా ఇచ్చారు. 'పప్రబంధరత్నావళలిని చదివినట్లయితే ఒక పేద దస్తాతోనే గారడీవాడు ఎన్నో తమాషాలు చూపించినట్లు సంస్కృత కావ్య వస్తువునే రకరకాలుగా మడతపెడుతూ ఏదో కొత్త కోసము దేవుళ్ళాడిన ప్రబంధ కవుల గారడీ మొగ్గలు గోచరిస్తాయి. గురజాడవారి రచనలలో ప్రబంధ కవుల సౌందర్య సామి - సరిదాజ హంసములూ, శుక కేళి పంజరాలూ, కలాపినీ పప్రావృడంబుదాలూ, అవనీ వచైత్రాగమాలూ, (మిగతా సామ్యగికోసము పారిజాతాపహరణంలోని చివరి పద్యాలు చూడండి) ముఖ, కర, పాద పద్మాలూ - ఏవీ గోచరించవు. తన చైతన్యమే కన్నుగా, ప్రతిభే దారి చూపే జ్యోతిగా సాగిపోయి గురజాడ కవి నిరాడంబర కవిత్వము రచించినారు. విరులు కన్నులు విచ్చి చూశాయట. చెట్లు చామలు కోటి చెవులను (గోలి యలరగ పాటపాడే పల్లవాధరికి తాటివనమున నాగి చంద్రుడు తాను చెవి యొగ్గెనట. కరముబట్టి యురంబు యురమున జేర్చి, ముద్దిడి కురులు దువ్వితే తాళవనమును వెడలి చందదుడు పక్కున నవ్వేడట. ముసలి మగని యింటికి పోయే పూర్ణమ్మకి బలబల కన్నుల కన్నీరొలికిందట. కన్నులు తుడుచుకు కలకల నవ్విందట పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. మునివేష ధారుడై అర్జునుడు ద్వారకకి పోయినప్పుడు

. కపట మౌని జూచి కన్నియ జూచుచు

గన్నె జూచి కపట మౌని జూచి

చిత్తమలర దలచె (నట) చిత్తజ జనకుడు

“నేడు గంటి నలువ నేర్ప" టంచు. అప్పారావుగారి “సుభద” చెకు తునుక ! వారు ఆ కావ్యాన్ని పూర్తిచ్చేయకపోవడము మన దురదృష్టము.

2452 పందిరి మల్లికార్టుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము పాండిత్య ప్రకటనము కోసమూ, ఉక్తి వైచిత్రి (ప్రాగల్భ్యము కోసమూ కాక, చదువరులకు ఒక సందేశమో, ప్రబోధమో ఇవ్వడము కోసము కావ్య రచన చెయ్యడము గురజాడవారి తిరుగుబాటులో నాలుగో ఎత్తు. ముత్యాల సరములూ, కాసులూ, లవణరాజు కలా, కన్యకా, డామన్‌ పితియసూ, పూర్ణమ్మా, దేశభక్తీ -

  • అన్నీ ప్రబోధ కావ్యములే. చదువరులకు చెప్పడానికి అప్పారావుగారికి కావలిసినంత బుద్ధీ వివేకమూ ఉన్నాయి. ఆయన ఆస్తి కోసమూ కీర్తి కోసమూ కవిత్వము చెప్పలేదు. తెలుగు పాఠకులకి సౌందర్యమూ వెలుగూ చూపించడానికి జాబిల్లివలె జ్యోత్స్నా [ప్రకాశమును వెదజల్లినాడు. ఆ చరీద్రుడి కిదొక నూలిపోగు. (కిన్నెర: సంపుటము 1, సంచిక 5, జూలై 1949) ల సో ఈగంచముల 1 ర నర/0.! స్ట సద్య సలా క్ష - స, _ నటికి. చయ నో 1 1 1.

తెనుగు సాహిత్యంలో క్రొత్త తెన్నులు గురజాడ అప్పారావు రమణారెడ్డి

గురజాడ అప్పారావుగారు విశాఖమండలంలో పుట్టారు. కాని ఆంధ్రదేశానికి కంతా చెందిపోయారు. నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కాని సమస్త వర్దాలవారికీ చెందిపోయారు. 1861 నవంబరు 30వ తేదీ జన్మించారు. కాని చనిపోలేదు కనుకనే 1952 నవంబరు 30వ తేదీనకూడా మన మాయనను స్మరిస్తున్నాము. మహనీయులకు జన్మతారీఖు మాత్రమే వుంటుంది - యిక వారు యమదూతలకు భయపడవలసిన అగత్యంలేదు - మూడుకోట్ల తెలుగు గుండెలలో స్థరవాస వేర్పరచుకున్నారు అప్పారావుగారు. నశ్వరమైన పంచభూతాల సమ్మిశమమయిన దేహం ఆయనది 1915 నవంబరు 30వ తేదీని పనికి శాశ్వతంగా సమ్మె కట్టింది. కట్టక యేమి చేయగలదు? తెలుగుదేశపు వేడిమికూడా సహించలేని దుర్చలత్వంతో పుట్టిందికదా. విజయనగర ప్రభువుల వెంట నీలగిరులెక్కి యేటేటా రెండు మూడు మాసాలక్కడ వుండిందికదా, చొక్కామై చొక్కా, కోటుమీద కోటు వేసుకుంది కదా, తిన్న పిడికెడు తిండినీకూడా హరించుకోలేక పోయిందికదా, ఆజన్మమరణాంతమూ అజీర్జానికి [క్రుంగి పోయింది కదా, బ్రతికియుండగా రెండెడ్డ బళ్ల మీద విశాలంగా సుఖంగా బూరుగు దూది దిళ్లకు ఆనుకోవలసివచ్చింది కదా, పెపెచ్చు విజయనగర (పభువంశీయుల పందిరి షుల్లికార్డుసరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

2454 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము శీ: సాహిత్యము వారసత్వపు దావాలో పది పూర్తి సంవత్సరాలు నిర్విరామంగా నిర్నిద్రగా ఎలా పని చేయగలదు? కనుకనే ఆనాడు సమ్మెకట్టింది. “పెద్దచెవులు, చవకపు చెక్కిళ్ళు, సొగమైన యవననాసం, అతి విశాలమైన ఫాలం”, “పెద్ద కళ్లు, నిండుగల గడ్డం, యింపుగా కొనలుసాగిన మీసం” - యిన్నీ చల్లబడిపోయాయి. కాని “కన్యాశుల్కం.” “కొండుభట్టీయం,” “ముత్యాలసరాలూ” ఆయన యొక్క అమరాత్మాగ్ని ప్రభాసంభరితాలయ్యాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టుగా, “గురజాడ అప్పారావు 1915లో చనిపోయినా, 1915 తరువాతనే జీవించడం ప్రారభించాడు".

ఆయన జన్మకాలం విచిత్రమైనదీ విలక్షణమయినదిన్నీ భారతజీవితమంతా క్రొత్తపాతల నడిలోయలో పడినడిచే రోజులవి. పాత పడిపోనూ లేదు. క్రొత్త పెకొననూ లేదు. రాజకీయంగా 1857 ప్రథమ భారత స్వేచ్చా సంగ్రామం రూన్సీ లక్ష్మీబాయి యొక్క అడ్డమూ తెగిన వీర దరవాసాంచిత కాళివదనంవలె, రంగూను చెర కటకటాలనడుమ యావజ్జీవ బందీయైన మొఘల్‌ సామాజ్య రమ నిలిచి వెలిగే బహదూర్‌ షా మోముమీది నిరాశనిసినీడవలఠె, మిగిలి పోయి, (పతీకారవాంఛ ముష్ర్ప్రైకోట్లు గుండెలలో చేరిపోయింది. కాని నిరాశ నిస్పృహ సర్వత్రా దుశ్యోభిస్తున్నయి. బ్రిటిష్‌వాడి రైలుదారి దేశం గుండెల కొనలకు తుపాకుల బాటలు వేసింది. [బిటిషువాడి తంతిదారి దేశం గుండెలలో మెదిలే చిట్టి పొట్టి కోపస్పందనలను ఢిల్లీ, మదరాసు, కలకత్తా, బొంబైల చెవిలో వూదింది, బాకావలె, సిద్ధంగా వున్నై సన్నద్ధమైన బ్రిటిష్‌ పశుబలాలు మైబడెను. మరి, సంఘమో చింపిరితలలాగు తయారయింది. యమశాసనాలు, ఆంక్షలు, బహిష్కరణలు, దుర్శదాలు, దుర్మోహాలు నిండి నిబిడీకృతమై ఆముదాల సంచివల తయారైంది మహోందవ సంఘం. భూమిని కౌలుకు తీసుకుని, సాంతదారయిన బ్రిటిష్‌ వాడి చరణాంగుళులకు తలలు చేరవేసే జమీందారులు, తమ కౌలుదారులమైని (త్రివ్మక్రము లయ్యారు. బ్రిటిష్‌ సామాజ్యస్వత్వాన్ని ఎవరెవరైతే బేషర్తుగా అంగీకరించారో, ఆ సంస్థానాధీశులు మన గలిగారు. ఈ జమీందారుల ఆగాలభోగాలకు వందిమాగధులైన అగ్రవర్జంవారు భూస్వామ్యవ్యవస్థలో అంతర్భాగమైపోయారు. ఇనాములూ, పసదనాలు, కృతిభర్తృత్వాలు, అర్చకత్వాలు, పారోహిత్యాలూ పాండిత్యాలూ - యీ విధంగా స్థానిక ప్రభువర్గమైన జమీందారీ భూస్వామ్య

గురజాడ అప్పారావు రమణారెడ్డి 2455 వ్యవస్థకూ (బాహ్మణవర్గంవారి భూదేవత్వానికీ లంకె యేర్పడింది. భూదేవులు దేవభాషనేకాని దేశభాషలను ముట్టుకోరు. సంస్కృతము ద్వారానే బ్రాహ్మణజాతి (ప్రత్యేకాధిపత్యముకూడా యేర్చడినది. శ్రీ నిడుదవోలు వెంకటరావు అన్నట్లు “కీ.శ. 11వ శతాబ్దినాటికి వుత్తమసాహితీ విశిష్టత యేర్పడిన తెనుగున, వైదిక మతృప్రాధాన్యమువలన సాహిత్యమంతయు సంస్కృత పండితాధీనమైనది. సంస్కృత భాషాగౌరవము, బ్రహ్మణజాతి ప్రత్యేకతయు వ్యాపించినవి. మత సంబంధమగు నాధ్యాత్మిక విషయ ముత్తమసాహిత్య ద్వారమునగాని ప్రజాసామాన్యమున కందుబాటులోనికి రాకపోయినది. కేవల దేశిసాహితీకవితల యందాదరము సన్నగిల్లినది. దేశీయముగాని మార్గకవిత (పకృష్ణస్థాన మా(క్రమించినది.” స్థరమైపోయిన సంస్కృతభాషా మర్యాదలు జీవద్భాష అయిన తెనుగు మెడనుకట్టిన రోకటిబండలయినవి. మహాభారతానువాదంతో 11వ శతాబ్దిలో నన్నయతో మొదలయిన సంస్కృతభాషా దాస్యం 1850 నాటికి కుక్కమూతి పిందెలు తాల్చిన చెడేకాలము దాపురించిన చెట్టువంటిదయింది. తేలిక నుడిపోయి తెనుగు మణుగు నాలుకయింది. తిక్కనగారి ఇచిత్యం, బొన్నత్యంపోయి, దౌర్జన్యం, దౌర్బల్యం మొదలయింది. పెద్దనగారి సౌందర్యం సౌకుమార్యంపోయి, తిట్టూ ఒట్టూ మొదలయింది. విశిష్టతను గద్దె దింపి భ్రష్టత ఎక్కికూర్చుంది. వాచస్పతులకు మారు వాజమ్మలు పుట్టారు. సామర్థ్యానికి మారు దర్పం పెరిగింది. కవితయ మొక్కటై అహర్పతి కాగా, యీ అంధయుగ సాహిత్య సమస్తం అమవస పతిచింబించిన వృద్ధదరృణమయింది. సరస్వతి యీ కాకవుల చేతిలో సాని అయింది. కవిత్వం వృత్తి అయింది. కళ శాస్త్రమయింది. పండితులే కవులయ్యారు, పరిస్థితి గొప్ప మార్చును, పునాదులను తాకగలిగేటంత లోతు మార్పును కోరింది. వికృతి అయిన ప్రకృతి అంతా శోక భయ విహ్వలమై మార్పును కోరింది - మార్పును.

ఆ మార్పు వచ్చింది. రాక తప్పదు. స్థితి పురోగతికి ప్రతిబంధకమైనప్పుడు మార్పు వచ్చితీరుతుంది. పూర్వం వైకుంఠంనుండి శ్రీమన్నారాయణమూర్తి అవతరించేవాడు. కాని యింతటితో అవతారాలు ఆగిపోయి, సామాన్యమానవుల నుండి అధిరోహణ (ప్రారంభమయింది. విశ్వాసయుగం గతించి విజ్ఞానయుగం వచ్చింది. ప్రభుయుగం పోయి సామాన్యయుగం వచ్చింది. “జనంనుండి

2456 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము జనంకొరకు జనంచేత” జీవిత రంగమంతా పరిపాలింపబడాలి అని అబహం లింకన్‌ ప్రవచించాడు. ఈ జనం పాటక జనం కాదు - అలగా జనం కాదు - “నిష్టులు” - మధ్య వర్గపు పై (శేణివారు. నగర సంస్కృతి (పపారంభమయింది. పాలం, దేవాలయం, దర్చారులనుండి ఒక్కవుదుటున ఆఫీసు, హోటెల్‌, సమావేశాలకు జీవితం లంఘించింది. అచ్చు వచ్చింది. సామాన్యులుకూడా విద్యనభ్యసించే అవకాశం కలిగింది. ఈ విద్య పాత విద్యకాదు - హూణం గీర్వాణాన్ని ఫీటు కొట్టింది. మెకాలే బ్రహ్మ దేవుడయ్యాడు; 1855 ఈ రెండు యుగాల నడిమి సంవత్సరం. గురజాడ అప్పారావూ (866) గిడుగు రామమూర్తి (1863) వీరేశలింగమూ యీ క్రొత్తయుగపు తొలి ప్రతినిధులు. తరువాతి తెలుగు జీవితానికంతా వీరు మూలపురుషులు. వీరిని విడదీయడమే తప్పు. . “మూట పారెడు రక్త మొక్కటె, మూట వెలిగెడు తేజ మొక్కటె మూడనుటె తప్పు?” అనవచ్చును. ముగ్గురూ మూడు రంగాలలో గొప్ప మార్పు కలిగించారు. వీరేశలింగం గారి సంఘసంస్కారమూ, గిడుగువారి భాషాసంస్కారమూ, గురజాడ వారి సాహిత్య సంస్కారమూ ఒక్క బోదె నుండి పుట్టిన శాఖలె. గిడుగూ గురజాడా చిననాటినుండి సహాధ్యాయులు. వీరేశలింగమూ గిడుగూ మిత్రులు. గురజాడా వీరేశలింగమూ పరిచయులు. వీరు ముగ్గురూ ఆంగ్లవిద్యనుండి తమ సంస్కారభావాలను (గ్రహించారు. కాని ఎవ్వరూ ఆంగ్లానికి బానిసలుకారు. పదహారణాలు తెలుగువారు కనుకనే, తెనుగు జీవితాన్ని సర్వతోముఖపరిశుభం చేయపూనుకున్నారు. కనుకనే ఆంగ్లవిద్య భారతీయులకు “తలవని వరం” వంటిదయింది. తన సాంఫుకసంస్కరణోద్యవుంద్వారా వీరేశలింగం పంతులు హోందవమతాచారా లనే సవాలు చేశారు. విధవా వివాహాలు, సానిమేళాల నిషేధాలు విధవలనూ, సానులనుకూడా మానవులలోనే చేర్చాయి. కనుక మానవవాదం (గంగ౧౭౧|౩గ)) వీరేశలింగోద్యమానికి పునాది. తన భాషాసంస్కరణోద్యమం ద్వారా గిడుగు సంస్కృత భాషాచారాలనే సవాలు చేశారు. వ్యావహారికభాషోద్యమం

గురజాడ అప్పారావు రమణాెడ్ధి 2457 సామాన్యుల (శ్రేయస్సు నుద్దేశించి జరిగింది. కనుక మానవవాదం గిడుగు వుద్యమానికి పునాది. తన సాహిత్య సంస్కరణద్వారా గురజాడ సంఘబహిష్కృతు లలో బెన్నత్యం, సంఘాధిపతులలో నైచ్యం చూపాడు. సాహిత్యానికి సంఘాభ్యున్నతియే ప్రయోజనమని చెప్పాడు. శ్రీ కిళాంబి రంగాచార్యులన్నట్లు, “ప్రజాసామాన్య సారస్వత రక్తధ్వజం ఎత్తబడింది. ఈ రక్తధ్వ్యజమే పండిత ' వృషభములకు రక్తవస్త్రశకలం అయింది... ఈ రక్తధ్వజాన్ని ఎత్తినవారిలో నగ్రగణ్యులు గురజాడ వేంకట అప్పారాయకవి” కనుక మానవవాదమే గురజాడ సాహిత్యోద్యమానికి పునాది. ం , ఈ మూడు వుద్యమాలలో ఏదో ఒకదాని నెదిరించినవారే లేరు. ఉంటే, మూటినీ ఎదిరించినవా రున్నారు. శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి వ్యావహారిక భాషోద్యమాన్నే కాక సంఘసంస్కరణోద్యమాన్నికూడ ప్రతిఘటించారు. శ్రీ కొక్కొండ వేంకటరత్నం పంతులు, శ్రీ జయంతి రామయ్యపంతులుకూడా యిందులోనివారే. కాని జయంతివారికి పిఠాపురం రాజావారి మద్దతువున్నది. జయంతివారు గురజాడ కావ్యాలనుకూడా దుయ్యబట్టారు. కనుక యీ మూడు సంస్కరణోద్యమాల విరోధులు ఎవరయ్యా అంటే, (1) సంఘాధిపత్యం కొనసాగింపదలచిన అ[గ్రవర్జంవారు, (2) సంస్క ఎతభాషను విరివిగా ప్రయోగించి, జూనుతెనుగును ఖూనీచేసి, పాండిత్యం చూప తద్వారా విజ్ఞానాన్ని గుత్తదీసుకోదలచుకున్నవారు. (3) యీ సామాన్యుల వుద్యమం మధ్యతరగతి సంస్కరణకర్తలతో ఆగిపోక, సమాజపు అట్టడుగున పడివున్న వారివరకూ వేరు తన్నుకొని, వారి కళ్లు తెరచి, వారికి నాలుక యిచ్చి, తెలివిచేసి, దారిచూపి తమ హక్కుభుక్తాలను లాగివేయడానికి పూనుకునే సమగ్ర సాంఘిక విప్లవంగా పరిణమించగలదని కనుపెట్టిన పెఠ్రాపురం రాజావంటి దూర(దష్టలు (“1911వ సంవత్సరమున శ్రీ జయంతి రామయ్యపంతులుగారు.... “ఆంధ్ర సాహిత్య పరిషత్తను ఏర నొక సంఘము స్థాపించిరి. దానికి ట్రీ వెంకటగిరి మహారాజాగారు, పిఠ్రాపురము మహారాజాగారు, వుయ్యూరు రాజాగారు మొదలగు మహాపురుషులు (ప్రధాన పోషకులై, వేలకొలది ధనమును విరాళముగా నిచ్చిరి.” అనీ, “1914వ సంవత్సరమున దెనుగులో (గ్రామ్యభాష నుపయోగింప వలెనా, (గాంధికభాష నుపయోగింపవలెనా యన్న సమస్య మిక్కిలి త్మీవముగానుండెను....

2458 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము విశాఖపట్టణము వ్యవహారిక భాషావాదుల కాటపట్టు. అక్కడకు వళ్ళి (గగాంధికభాషను గురించి గట్టి యుపన్యాసము లీయవలసినదని (పిఠాపురము) మహారాజావారు ఖర్య్బులిచ్చి నన్ను, పురాణపండ వుల్ల యుశాస్తి గారిని, పానుగంటి లక్షీ నరసింహరావుగారిని, కూచి నరసింహముగారిని బంపిరి" అనీ, చిలకమర్తి

' లక్ష్మీనరసింహము పంతులుగారు తమ “స్వీయ చరిత్ర"లో రాసుకున్నారు) కాబట్టి సమాజంలో అధికారస్థానాలలో వున్నవారే యీ వుద్యమత్రయానికి అడ్డు

  • తగిలారు. కాని వేంకటరాయశాస్తి9గారి (ఏచండ పరశువు నిరుపయోగమైపోయి, ఆ అఖండ (ప్రతిభాశాలి చివరకు శిథిలాలనడుమ ఎడారిలో నిలిచిన బృహచ్చిలవల వుండిపోయాడు. కొక్కొండవారి “మచ్చెకంటీ, బిచ్చమిచ్చువారు లేరు పొమ్మనే

  • చాదస్తము నవ్వులపాలయింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు పేరిట కొద్దిరోజులు చలామణీ అయిన జయంతివారి నాయకత్వం[కింది పిఠాపురం రాజావారి జేబు సంస్థ నిఘంటు సేకరణకు పూనుకోవలసి వచ్చింది. శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు విలపించినట్టు, “వ్యావహారిక” భాషావాదానికి “గ్రామ్య”మని

. నామకరణము చేసి గ్రామ్యశబ్దము చెడ్డదికాబట్టి, (గ్రామ్యభాషా ప్రచారమీ సంస్క ర్హల వుద్దేశ్యమని ప్రజలతో చెప్పితీ, అట్టి చెడ్డభాషను ఎలాగైనా సంహరించడములో వారెంతో తమకు తోడవుతారని ఆశపడిన జయంతి రామయ్యపంతులు కడపటికి

. ఓడిపోయినారని చెప్పవచ్చును. గిడుగువారు చూపిన దారి తెనుగు దేశమంతా అనుసరిస్తూ వుంది. కాని ఆ నడుమ యీ వుద్యమాన్ని విడిచి, వీరేశలింగంగారి వుద్యమపు వేడిమిని తీసివేసేటందుకు ప్రయత్నాలు జరిగినవి. పిఠాపురం రాజాగారే దీనికిని పోషకులు. కార్యనిర్వాహకులు పానుగంటి లక్ష్మీనరసింహారావు. “నవ్యాంధ్ర సాహిత్యవీథులు"లో కురుగంటి సీతారామయ్యగా రన్నట్టుగా, “వీ ర్రేనలింగంగారు యువకులలో కలగజేసిన సంప్రదాయ నైరశ్యాన్ని ఆపటం కొందరికి అవసరమని తోచింది. దానితోపాటు సంఘంలో ఉన్న కొన్ని దురాచారాలుకూడా విమర్శిస్తేగాని పూర్వ సంప్రదాయాలమీద సరియైన ప్రత్యయం కలగడానికి వీలులేదు. అంతేగాక పూర్వ సంప్రదాయాలను మూఢవిశ్వాసంతో గాకుండా, తర్క్మమూలంగా, నమ్మ జెయ్యటంతో, వాటిమీద అభినివేశం సకారణమై, చిరస్థాయి అవుతుంది... ఈ పనికి పానుగంటివారు పూనుకొన్నారు... ఏఠికాపురాధీశ్వరుడికి ఆస్థానకవి... స్త్రీ స్వాతంత్య్యు వాదం, [గ్రంథ విమర్శనాపద్ధతి, (గ్రామ్య (గాంథికభాషావాదం

గురజాడ అప్పారావు రమణారెడ్డి 2459 మొదలైన సాంఘిక సారస్వతాది విషయాలన్నీకూడొ యాయన విమర్శకు గురైనవి” కొన్ని దురాచారాలను విమర్శించి, తద్వారా తానూ సంస్క ర్తల కూటమిలోని వాడనేననిపించుకుని, తర్వాత సంస్క ర్తల క్రిందికి నీళ్ళు కొనిరావడం - పానుగంటివారు అచ్చమైన ఆషాఢభూతి! కురుగంటి సీతారామ భట్టాచార్యులు పానుగంటివారి శిష్యగణములో ఒకరు. కనుకనే వీరేశలింగంగారికీ గిడుగువారికీ నడుమ గోడకట్టి చూశారు. *వీరేశలింగము పంతులుగారు మత సాంప్రదాయాలను నిరసించి యువకమండలిలో వైరాశ్యము ఉత్పత్తిచేసినా, భాషా సాంప్రదాయాలను నిరసించలేదు.... ఈయన భాషాసాంపప్రదాయాలికి ఒక్క ఉదాహరణ మిస్తాను. “శుద్ధాం నిరోష్ట్య నిర్వచన నైషధ” మనే (గ్రంథ మొకటి వ్రాసినాడు." అని యీయన రాశాడు. అయితే, వీరేశలింగము పంతులుగారే తమ స్వీయచరిత్రలో రాసుకున్నట్లు, “ఇన్ని నిర్భంధములతో తుద ముట్టించిన గ్రంథము... యర్థసారస్వతాది యోగ్యతలచేత నెంత మాత్రమును పాగడదగినదిగా యుండ నేరదు. వీరేశలింగంగారి సులభశైలికీ, కొక్కొండవారి ప్రబంధశైలికీ జరిగిన భీషణ సంగ్రామంలో, “వ్యవహారికభాషాశయమైన సులభశైలి తరపున వీరేశలింగంగారు నాయకత్వం వహించేరు. తరువాత వ్యవహారిక భాషా పప్రవర్తకసమాజం అధ్యక్షత నంగీకరించి వీరేశలింగంగారు వ్యవహారిక భాషా ఉద్యమంతో ఏకీభవించి, దానికి నైతికబలాన్ని చేకూర్చారు.” (“గురజాడ అప్పారావు ; మహాకవి. మహాపురుషుడు.” సెట్టి ఈశ్వరరావు) గిడుగు రామమూర్తి సహకారంతో వ్యవహారిక భాష కొక వ్యాకరణాన్నీ రాయడానికి కూడా సిద్ధపడ్డారు. “విషయానుగుణముగా తత్తదుచిత రీతిని (గావ్యుభాషయందు సహితము (గంథములను వాయవచ్చుననికూడా నాయభ్మిపాయము.”

సెట్టి ఈశ్వరరావుగారు రాసినట్లు, “వ్యవహారిక భాషను వీరేశలింగంగారు (ప్రహసన రచనకు మాత్రమే వినియోగించేరు. ఆయననుండి అప్పారావుగారు, రావుమూర్తిగారు నైతికదీక్షను అలవరచుకొని, తెలుగు సంస్కృతిని పెంపొందించడానికి, వ్యవహారిక భాషను వినియోగించేరు. వీరేశలింగంగారు ఉంచిన ఆ కాస్త ముసుగునుకూడా తొలగించి, వ్యవహారిక భాషకు గౌరవమైన స్థానాన్ని సంపాదించడానికి పూనుకున్నారు.

2460 పందిరి మల్లికార్డుసరాప్తు శతజయంతి సంపుటము 4; సాహిత్యము గురజాడ అప్పారావుగా రొక్కరే యీ భాషాసంస్కరణోద్యమపు భావిగతిని చూడకలిగిన మహాదష్ట. "ఆనుగు భాషను పెద్ద నాగరికతా సాధనం చెయ్యాలంటే, = అనవసరంగా వ్యవహరింపబడుతున్న పదాలనుండీ సంస్కృతపదాలనుండీ తెలుగు భాషకు విముక్తిని కలిగించాలి. పరిపూర్ణమైన వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలి... చాలా కృత్రిమమైన సారస్వతభాషా నియంతృత్వం వల్లనూ, అన్నుప్రాసముతో కూడుకొని కఠినమైన పద్యరచనా పద్ధతివల్లనూ, చాలాకాలమై గతించిపోయిన పురాతన సారస్వత పద్ధతులవల్లనూ, తెలుగు మేధస్సు ప్రమాదకరమైన కూపంలోపడి పోయింది... వ్యవహారిక భాషలో రచింపబడిన సారస్వతం మన దేశంలోని రైతులను మేలుకొల్పుతుంది...” అని కన్యాశుల్కం రెండవ కూర్పు సీరికలో ఆయన రాశారు. (కిన్నెర: సంపుటము 5, సంచిక 4, ఏప్రిల్‌ 1953) [ళో సట? గై టాక్‌ (టి యం.

ఇల్లీ గురజాడవారి వ్యాసచంద్రిక పారనంది జగన్నాథ స్వామి “కరి శషులైనవారి తప్పు లిన్నినను బిక్కు కలగబోదు ” అప్పారాయ కవి

ఈ యుగపు సారస్వత తీర్థాలలో గురజాడ అప్పారావుగారిది ఒక ప్రత్యేక విశిష్ట పూజ్యతను పొందింది. అందుచేతనే వారి గ్రంథాల (పప్రచురణసందర్భాన వారి ముదితాముదిత రచనలను సేకరించి “వ్యాసచందదికొ అనే నామధేయాన్ని శ్రీ అవసరాల సూర్యారావుగారు ముద్రింపించారు. దానికి ఒక పీఠిక్మవాసి అప్పారావుగారి సారస్వత సేవను ఉగ్గడించారు. గురజాడవారి “మేధా సంపత్తీ, అభ్మిపాయ గౌరవమూ"ఈ వ్యాసాలనుండి (గ్రహించ వలసిన సిరిసంపదలు. “ఆంధ్ర సారస్వతానికి సారస్వతాభిమాను లకు ఇవి అయివేజు”. అందుచేత వాటిని ఎంత దీక్షతో పరిశీలిస్తే అంత కృతార్ధులము కాగలము. .

రెండువిధాల ఈ వ్యాసాలను ఉపయోగించుకోవచ్చును. అందు పొందుపరచబడిన విషయము, వాటి రచనాస్వరూపము ఆ ర0డూ, అప్పారావుగారు విద్యావేత్తగాను. భాషావేత్తగాను, విమర్శుకునిగాను ఈ వ్యాసాలలో విదితులు కాగలరని పీఠికాకారులు స్పష్ట పరచారు. కొన్నాళ్ళ అప్పారావుగారు ఉపాధ్యాయులుగా పని చేశారు; ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయ సెనెటులో సభ్యులు. వ్యావహారిక భాషావాదములో ముఖ్యస్థానాన్ని వహించారు. భాషాదృష్టి వారికి కన్యాశుల్క రచనాకాలానికే స్థిమితపడింది. అట్టి పూర్వ పరిసరాలు వారి విమర్శక నైపుణ్యానికి నిదర్శనాలు. ఈ మూడు విషయానుసారంగా ఈ వ్యాసాలను పందిరి ముళ్ల్‌కార్టునరావు శతజయంతి. సంప్పటము 4; సాహిత్యము

2462 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము వర్ణిస్తే విద్యాసంబంధమైనవి మూడున్నూ, భాషా సంబంధమైనవి నాల్గున్నూ, ఉన్న తొమ్మిదీ విమర్శన (ప్రపంచానికి చెందినట్లు నిరూపించవచ్చును. విద్యాసంబంధమైన మూడింటిలోను రెండు ఆంగ్లభాషలో వ్రాయబడినవి; విశ్వవిద్యాలయ వ్యవహారసందర్భాన అవి పప్రసక్తమైనవి. భాషాసంబంధమైన నాల్గింటిలో ఒకటి వారికిగల కన్నడ భాషా జ్ఞానాన్ని తెలుపుడు జేసేటందుకు వ్రాయబడినది; మిగిలినవి వాడుక భాషావాదములో పుట్టినవి. విమర్శన సంబంధమైనవాటిలో సాహిత్యానికి చెందేవి ఏడు, చరిత్రకు చెందినవి రెండు. సాహిత్య సంబంధమైన వాటిలో ఒకటి ఆంగ్లకవి గురించి, మూడు బంగాళీ కవుల గురించి, నాలుగు మాత్రమే ఆంధ్ర సంబంధమైనవిన్నీ ఈ తొమ్మిదింటిలో రెండు ఆంగ్లభాషలో విరచితములు. ఈ వ్యాసాలలో రెండు అసంపూర్ణములైనవి అని పీఠికాకారులు చెప్పుతున్నారు. ఇంత విపులంగా ఈ వివరాలను సేకరించడానికి ప్రయోజనము ఈ వ్యాసాలు ఎట్లు ఆంధ సారస్వతానికి, సారస్వతాభిమానులకు అఆయివేజుకాగలవో ఒంటపట్టించుకోవడములో సహకారం కావాలని. దీని గురించి చదువరులు ఊహించుకొందురు. చరిత్రతోను, వివాదముతోను, వెక్కిరింతఫక్కీని నడచినవి ఎంతవరకు సాహిత్మీశేణికి అలంకారములు కాగలవు అని విచారించవలెను. వారి అభ్మిప్రాయములతో ఏకీభావము ఉండవచ్చు. వ్యాసాలన్నీ మాత్రము ఒక జాతికి చెందినవికాక, గారడీవాని సంచిలోని వస్తువులవల భిన్న మూల్యముగలవి అయినవి. వివాద్మగస్త వైన వ్యాసాలు సారస్వత జాతికి చెందవని పండితాభ్మిపాయము; అవీ వాజ్బయమే అని అన్నా, వాటికి శాశ్వతత్వము ఉండ వీలు ఉండదు. రస్కిను అన్నట్లు అవి తాత్కాలిక పుస్తకాలు - 80050106 ౧౦౮౯ వ్యాసాలు సుష్టుగా కొనసాగలేదు. వ్యాసానికి పెట్టిన పేరునుబట్టి ఆ విషయము సాహితీచర్వితలో ఉత్కృష్ట స్థానాన్ని అలంకరించినది కావడముచేత, చదువరులకు ఉత్సాహము పుట్టుతుంది. అప్పారావుగారి వంటి విద్యావంతులు, కళారాధకులు, విమర్శనా(గ్రేసరులు ఆ విషయాన్ని చర్చిస్తున్నారు గనుక, అది పూర్ణముగా, నిండుగా, పరిపక్వముగా విశదపడుననే ఆశ చదువరులకు కలుగును. అన్ని భాషలతోను, అన్ని సారస్వతాలతోను, అన్ని శాస్త్రాలతోను సుష్టు పరిచయంగలవారు అప్పారావుగారు. ఆంగ్లు గ్రీకు, లాటిను, జర్మను, ్రెంచి మొదలైన పాశ్చాత్యములు,

గురజాడవారి వ్యాసచంద్రిక పారనంది జగన్నాథ స్వామి 2463 సంస్కృత ఆంధ్ర కన్నడ బెంగాళీ మొదలైన చేశీయములు వారికి సుగాహ్యములు. సాహిత్యము, కళ, చర్విత, శాసనపరీక్ష, రాజకీయము మొదలైనవి వారికి అనర్గళములు. అట్టివారు (వాసినపుడు చదువరులకు భాగ్యము అని ఆశ వుట్టును. కానీ తీరా వ్యాసము అంతానికి రాగానే చెప్పలేనంత ఆశాభంగము, నిరుత్సాహము కలగక తప్పదు. చెప్పదలచుకొన్న ముఖ్యవిషయము పోషింపబడలేదు. వ్యాసంలోనికి అంగములుగా ప్రసక్షమైన అభ్మిపాయాలు ముఖ్యమైపోతూ ఉండెను; ముఖ్య మైనదానితో చక్కని పొత్తుకుదరక, ఒకదానితో మరొకటి ఆనుషంగికంగా సంబంధించి ఉండక, పౌర్వాపర్యము చెడిపోయినది. వ్యాసము తుదకు వచ్చీసరికి కాశీవెళ్లదలచిన ప్రయాణము కరాచీకి అయినట్లు పరిణమించింది. ఆరంభాన పూనుకొన్న ముఖ్యాంశము మాయమైపోతూ ఉంటుంది. నలుగురి మధ్యను కూర్చొని మాట్లాడుతూ మాటల మధ్యను గభీమని లేచి వెళ్ళిపోయినవాని ప్రవర్తసవలె వ్యాసంలోని అంశాభ్మిపాయాలు నడుస్తవి. ఇంకా ఏదో చెప్పవలసింది ఉంది అన్నట్లు తోస్తూఉండగా వ్యాసం అంతమొందిపోతుంది. "కలమునకు వచ్చినట్లు వ్రాయడము,” “కళ్లెము వదలి చిత్తమును పరుగిడనివ్వడము", “ఏది స్కృతికివస్తే దానిని చెప్పడము” (ఇవి అప్పారావుగారి వాక్యాలు) ఈ వ్యాసాలలో కనిపిస్తవి. “ఆ కథ ముందుచెబుతాను”, “మరియొకచోట చెప్పదలచితిని అని వృథా ఆశలు పెట్టారు అప్పారావుగారు.

వ్యాసం [వ్రాయాలసుకొన్నప్పుడు, వ్యాసంలో చెప్పదలచుకొన్న విషయమును, దాని భాగాలను ఊహించి, ఒక్కొక్కభాగం పూర్తిజేసి రెండోభాగాన్ని ప్రారంభించి, పూర్వాపరములను చక్కబరిచి గదా వ్యాసం పూర్తిజేయవలెను. ఈ పద్ధతిని శ్రీ అప్పారావుగారు అవలంబించినట్లు లేదు. ఒకమారు (వాసినడానిని తిరిగీ విచారించినట్లు గానరాదు. ఇంగ్లీషు వ్యాసాల గురించి తీసుకొన్న (గద్ధ వారు తలుగువాటిగురించి తీసుకొన్నట్లు లేదు. ఆంగ్ల రచనాపద్ధతిని అనుసరించి వ్యాసభాగాలను పేరాలక్రింద ఏర్పరచారు. బాగానే ఉంది. కాని ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క ప్రత్యేక విషయభాగం ఇమడాలనిన్నీ ఒకపేరానుండి తరువాతి 'పేరాకు విషయ్మకమ సందర్భము ఉండాలనిన్నీ అన్ని పేరాలూ మొత్తముగా ముఖ్య విషయ పోషకాలుగా ఉండి విషమయైక్యతను సాధించాలనిన్నీ వ్యాసరచనా లక్షణము. ఈ లక్షణం పేరాలోని వాక్యాలకు కూడా వర్తిస్తుంది. ఈ విధి ఈ వ్యాసాలలో

2464 పందిరి మల్లికార్జునరావు శతజయంతి పంపుటము 4: సాహిత్యము నిరాకరింపబడింది. ఈ నిరాకరణ తుదకు ఒక్క వాక్యంగల పేరాలుగా పరిణమించినది. అలాగు ఉండకూడదా అని పూర్వపక్షం చేయవచ్చు. ఒక్కమాట గల వాక్యం, ఒక్కవాక్యంగల పేరా, ఒక్క పేరా అయిన వ్యాసం ఇవి అపవాదాలు. ఏదో ఒక విశేషముంటే, ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనానికి ఇవి ఉపచరిస్తని. వ్యాసచంద్రికలో సందర్భ మైన వాటిసంఖ్యనుబట్టి చూస్తే అవి అపవాదములుగా గానరావు. విషయ వికాసము పొందికగా ఉన్నప్పుడే సాగసుగా అల్లబడిన సరము (ప్రకాశించగలదు. అదే సాహితీకళను పోషించిన అలంకారము కాగలదు. అప్పారావుగారికి ఈ లక్షణము, ఈ నియమము తఆలియవని ఎవరూ అనరాదు. అయితే ఇట్టి లోపాలు సాధారణముగా పత్రికలకు పంపే రచనలలో కనబడుతూ ఉంటవి. ఆ రోజు సంచికకు అందజేయాలనే తొందర ఒక ముఖ్యకారణము. తామే స్వయంగా వ్రాయక ఒకరికి చెప్పుతూ వ్రాయింపిస్తే, ఆలాగు తయారు అయినదానిని సరిజేయడానికి తగిన వ్యవధి లెనప్పుడూ ఇట్టి లోపము సంభవిస్తుంది. ప(త్రికకుగదా, ఆ రోజుతో పరాకుకు వచ్చేదిగదా అనే ధీమాకూడా ఉండవచ్చు. అట్టిదానిని, తిరిగీ లోకాన్ని చూడాలని నిర్ణయించబడనిదానిని, బయటపెట్టితే ఈ ఆపద సంభవించకతప్పదు. శ్రీ అప్పారావుగారి అన్యకార్యపరత్వము అందరికీ బాగా తెలిసిందే; పీఠికాకారులు చెప్పనే చెప్పారు. ఏ కారణముచేత అసంపూర్ణ వ్యాసాలు లోకంలోకి వచ్చేయో, అదేకారణము ఈ లోపభూయిష్ట వ్యాసాలు సిద్ధంకావడానికి. ఇది నా వ్యాఖ్యానము.

ఈ వ్యాసాలలో చాలా భాగం వాదోపవాదాలలో (ప్రతిపక్షులకు ఇచ్చిన జవాబులుగా తయారైన వస్తువు. ఎక్కడి కక్కడే తునకలుగా, స్పృహకు వచ్చినదానికి (ప్రత్యుత్తరముగా సిద్ధమైనవి కాబట్టి (ప్రసంగ సరణిని అవి తప్పగలవు. వాద సరణిలో పడిపోయినవి. (ప్రతిపక్షులవాదాన్ని పోషించక, ఖండనకే ఆవేశంలో దుమికినప్పుడు సందర్భశుచి చెడకతప్పుదు. (గామ్యశబ్దవిచారణలో కళింగదేశ చరిత్ర, చుట్టుచూవులేని విద్యలో సంవత్‌ వ్యుత్పత్తి అట్లు ప్రసక్తములైనవే. అందుచేత ఈ వ్యాసచంద్రికలోని స్వతంత్ర విషయక వ్యాసాలు ఈ వాద వ్యాసాలకంటె ఎక్కువ సమంజసంగా ఉన్నవి. మూలాపేక్షలేని చోట స్వతంత్ర కల్పనకు అవకాశం ఎక్కువగదా.

ఈ మీద పేరాలలో నిరూపించిన అభిప్రాయాలకు నిదర్శనాలను చూపలేదు. (గంథవిస్తృతి భయము ఒక కారణము. రెండోది, ఏ వ్యాసాన్నైనాసరే (ఒక్క

గురజాడవారి వ్యాసచంద్రిక పౌరనంది జగన్నాథ స్వామి 2465 విశ్వవిద్యాలయాలు తప్ప) తర్కిస్తే చాలు; ఈ లోపాలు విశదపడగలవు. అలాగని కూడా నిదర్శనాల చర్చ చేయలేదు,

“తప్పులుంటే దిక్కుమాలిన హాస్యోక్తులతో ఎదుటివారి మనస్సుకు నొప్పిగలుగ చేయకండి.”= అని ఆకాశరామన్నగారు శ్రీ, అప్పారావుగారిని బ్రతిమాలు కొన్నారట; వెక్కిరించడములో గొప్ప (ప్రావీణ్యముగలవారు అప్పారావుగారు. ఈ ఫక్కీని చాలా వ్యాసభాగాలు నడచినవి. వ్యాసమంతా కూడా వెక్కిరింతే అయినవి లేకపోలేదు. ప్రతిపక్షఖండనానికి తిరస్కారము ఒక ఆయుధం కావచ్చు. తిట్టితే తిట్టిననోరు చెడినట్లు తిట్టబడినవాని మనస్సు నొవ్వదు. శీలంపై, హృదయ సౌశీల్యం పై తిట్టథమునకు ఎంత ప్రభావముఉందో విచక్షణులు (గ్రహించగలరు. తిట్టడం ఆవేశంలో వస్తుంది. వెక్కిరింతో! తిట్టడానికి తమ్ముడు. ఆవేశం లేనిదీ చేసే వెక్కిరింతకు ఎక్కువ తీక్‌ష్ట్రత ఉంటుందిగదా. [గ్రామ్య భాషా నిరసనులను ఆపడానికి ఒక సాధసంగా ఇది ఉపయుక్తమైనది. మద్రాసు కాం(గెసులోని వెక్కిరింత అట్టి సందర్భంలోనిది కాదు గదా. [గ్రాంథికవాదుల [వాతలలో వ్యాకరణ దోషాలు, కృతక (ప్రయోగాలు, లక్షణ విరుద్ధాలు, (గ్రామ్యాలు చాలాచాలా ఉన్నవనే వాదతర్కాన్ని విపులంగా ఉపయోగించిన వారు గిడుగువారు. రామమూర్తిగారు వేసిన దెబ్బ పిడుగు. దానికిన్నీ అప్పారావుగారు ఆవిధంగానే వేసిన వెక్కిరింత దెబ్బకిన్నీ చాలా భేదము ఉన్నది. అందుకే పాపము ఆకాశరామన్నగారు ఆ (ప్రార్థన చేశారు! ఇది కాదు నాకు ప్రసంగమైనది. ఇట్టి వెక్కిరంత ఫక్కీని వ్రాసిన వ్యాసాలు ఎంతవరకు సారస్వతానికి అయివేజుకాగలవు? కులట అని వారు అంటే, బూతులబుంగ అని వీరు అంటే, అసభ్యత ఇద్దరిదీ ఒక్కటే అనినా మనవి. అసభ్య మైన వ్రాతలు సారస్వతాపేక్షయా భూషణాలు కాలేవుగదా.

కాని ఎన్నవలసిన గుణములు లేకపోలేదు. ముఖ్య మైనది, జంకూ చిడియమూ, ఏమాత్రమూ లేకుండా దోషాలను ధైర్యంగా, నిష్పక్షపాతంగా వారు ఖండించేరు. దేశంలో పెద్దలన్నవారిని, ఆంధ్రసేవకు ప్రతిష్ట సంపాదించినవారిని, వీరేశలింగం పంతులు, కొమ్మరాజు లక్ష్మణరావు, వేదం వేంకటరాయశాస్తి9, భోగరాజు నారాయణమూర్తి, విజ్ఞానచందికామాల (గ్రంథాలు, విజయనగర స్మామాజ్యకర్త, కట్టమంచి రామలింగారెడ్డి - ఈ సేర్లు చాలును - వారి వారి దోషాలను చూపవలసివచ్చినప్పుడు అప్పారావుగారు ఉపయోగించిన కత్తి చాలా వాడియైనది. కొన్నిచోట్ల అతి అయి ఉండవచ్చును. వారి అభిప్రాయాలను పూర్తిగా అంగీకరించక

2466 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 44: సాహిత్యము పోవచ్చు; కాని సత్యాన్వేషణాపరత అనన్యము. వీరేశలింగంగారు పచ్చిబూతు శృంగారాన్ని విడవలేదన్నప్పుడు, లక్ష్మణరావుగారి చరిత్రజ్ఞానము లోపభూయిష్ట మన్నప్పుడు, నారాయణమూర్తిగారి నవలలోని భాష కృతకమని దోషాలను బయట పెట్టినప్పుడు, విజ్ఞాన (గ్రంథాలు బడిపిల్లల కృతములని నిరసించినప్పుడు అప్పారావుగారు చూపిన విమర్శక వీరత్వానికి చేతులెత్తి జోహార్లు. ఈ ధర్మమే నా ఈ వ్యాసోత్సాహానికి శరణ! వారి ఖండన కార్యకలాపములో వారు నుడివిన రెండు మూడు ధర్మసూత్రాలను విశదపరచవలను. “వొకరు అన్నమాటే మనంకూడా అనడమా?” “*“పథమంలో తీర్పుచెప్పివేశాం గనక, యిక ఆ తీర్పు నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము”. “యుద్ధంలో జారక నిల్వడం కష్టం”. వీటి మంచి చెడ్డల గురించి చర్చ అనవసరము; పాఠకులకు విడిచివేస్తాను. అప్పారావుగారు నియంత. అదికాదు ఇదికాదు అనే పరిష్కార ధోరణిలో చెప్పేవారు; విన్నవారు వినుకోవాలి. అంతేకాని సందేహించేవారి బోధనార్ధమై ఆ అభ్నిప్రాయాజ్ఞలను సోదాహరణముగా వ్యాఖ్యానించడము అవసరముగా వారికి తోచినట్లు లేదు. ఉదాహరణ ఒక్కటి! “బహ్మయ్యశాస్తు్రులు ఉదాహరించిన యింగ్లీషు పుస్తకములు ప్రస్తుతవాదానికి పప్రసక్తములు కావు”. కావు అంటే కావు. ఏవి అవి, ఎట్లు కావు ఏమీ వివరణము చేయరు. “విద్యాబోధన పద్ధతులంటే ముక్కు మొహము ఆలయనివారు, పాండిత్యానికి కావలసిన ఆధునికవిజ్ఞానం లేనివారు వాటితో ప్రమేయం పెట్టుకోవడం ఎంతో హానికి, ముప్పుకు కారణము” - నాకు వచ్చును, వారికిరాదు, ఇట్టి అధికార ధర్మము అనేక స్థలాలలో “నేను *నా” అనే స్వీయానికి తావు ఇచ్చింది. “నేనుకూడా దాని గురించి వ్రాయదలచినాను"అనేమాట వస్తూ ఉంటుంది. అవును, పీరికాకారులు చెప్పేఉన్నారు. “వారు అనేకములు [వ్రాయదలచుకొంటిరిగాని వాయలేక పోయినారు” అని. ఇంతవరకు విషయము, రచనాపద్ధతి అనే రెండింటిగురించి తర్కించాను. వారు ఉపయోగించిన భాష గురించి రెండు మాటలు చెప్పి ఈనా వ్యాసాన్ని పూర్తి చేస్తాను. అప్పారావుగారు సుప్రసిద్ధమైన వ్యావహారిక భాషావాదులు. (గాంథికభాష అసంగతము, అసాధ్యము అనిగదా వారివాదము. గగాంథికభాష . అనే పేరున హేయమైన కృతకభాష తయారైంది. బాగానే ఉంది. కాని వారుమౌత్రం

గురజాడవారి వ్యాసచంద్రిక పారనంది జగన్నాథ స్వామి 2467 (గాంథిక భాషాప్రయోగాలను విడిచివేయలేదు. వాడుక రూపాలకు బదులు (గాంధికరూపాలనే వారు ఎంచుకొన్నారు. (ప్రహసనములు అంటారుగాని ప్రహసనాలు అనరు. ము-అంత పదాలు సర్వసాధారణము. (వాయవలయునని, రహస్యమును, కూడ, గోటితో, చెప్పివేశాము, కోవడమునకు, కలిగినదని, వెల్లిడుతున్నప్పుడు = ఇట్టివి. సంధి విరివిగా చేశారు; ముస్లిం సెనికులనేకమంది, ఉపన్యాసమిలాగ, అంటకాగింది యడాగమనడాగమాలు, సరళాదేశములు, కెపవిభక్తికము మొదలైన (గాంథికాలు వారిని వదలలేదు. ఇవి వాడుకభాషవి కాదుగదా.

“నియమంలేని భాషే వుండదు". వాడుక భాషకు నియమము లేదనిగదా పూర్వపక్షము. సుమారు ఏఖై సంవత్సరాలు అయింది ఈ వాడుకభాషావాదము బయలుదేరి. అనేకులు దీనిని వాడుతున్నారు. ఎవరు ఎలాగు ఉచ్చరిస్తే, లేదా ఉచ్చరిస్తామని ఊహిస్తే ఆలాగు కత్త౦ంపబడే ప్రయోగాలు వాడబడుతూ ఉన్నవి. శ్రీ గిడుగువారు మాత్రము శీష్టజనవ్యవహారం అన్నారు; అప్పారావుగారుకూడా దానిని అంగీకరించినవారే. పదాదిని “అ” “ఉలకు బదులుగా “యి” “వోల ఉచ్చరణ శిష్ట్ణజనవ్యవహారం కాదు. అప్పారావుగారు ఆలాగు ఉచ్చరించేవారు కారు. వాక్యారంభమందు హల్లు ఉచ్చరణ ఉండదు శిష్టులు అన్నవారిలో. కాని అప్పారావుగారు సార్వత్రకంగా హల్లే వాడారు. ఇది అతి అయిందికూడా; సూత్రాలను వుల్లంఘించారు. టెక్ట్సుబుక్కులకు యీ నియమాలు, ఎలా వుండవలెనో అలాగునే వున్నది. హాశ్చర్యము, ఏలావస్తే, ఆనాడు వుండే, వొలం, ఇస్కూలు. ఇవి (వయోగాలు. నియమరాహిత్యం సంస్కృతపు (ప్రయోగాలనుకూడా తిరస్కరించింది ; ప్రతిష్ట అప్రతిష్టలు, చారిత్రక యితివృత్తజనితాలు, (బాహ్మణవుద్యోగస్తులు, బహుశహ, శయిలి, కూణత, నవలిక, సంకేతిత సుప్రసిద్ధ మొదలైనవి.

నియమ స్వాతంత్ర్య మేనా కారణము ఆం(ధ సంప్రదాయము కాని (ప్రయోగాలకు? (1పాచీన కావ్యాలను విద్యార్థులకు వేస్తే, వ్యాకరణాలమీద కృషి, మంచి పుస్తకాలు వచ్చేవరకు, బుద్ధికి గొలుసులు, అధ్యాయంలో యాయబడిన, సాహిత్యం ఎదుగుతూ ఉంది - ఇట్టివి. ఒకే వ్యక్తికి ఒకచోట ఏకవచనం, ఒకచోట బహువచనం; కర్త ఏకవచనం, క్రియ బహువచనం సంభవించినవి. కారణం? అ(శబ్ధేనా? ఇంగ్లీషుకు తెలుగు చేయడంల్లో ముక్కకు ముక్క చేసో, అర్థం తప్పెపోయో తప్పు సంభవించింది. '56గ౧/66 1211కి “నమ్మిననీతొ అన్నారు;

2468 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంప్పుటము. 4: సాహిత్యము “న్ససిషే బంగారం" = ఆంగ్లకవి అభ్మిపాయం సరిగ్గా అర్ధంకాదు. చాలావాక్యాలను సరిచేసి ఎక్కువ సమంజసమైన అన్వయశుద్ధి కలిగేటట్లు చేయసాధ్యము: మసపస్సులోకూడ [5, నాణముమై 17. సాహిత్యములు 25, దానిని 140, కవిత్రయమువారి 25. కలకత్తా తిరిగి 32, లోపల 34, కలకత్తాలో 37 ఇవి చాలును; అనేకములు ఉన్నవి. ఇంగ్లీషు పదాలను తెలుగు లిపిలో వ్రాసేటప్పుడు, లేదా వాటి నుండి తత్సమాదులను కల్పించినప్పుడు, వాటి ఉచ్చురణ ముఖ్యముగదా! ఒకచోట ఒకలాగు, మరియొకచోట మరొకలాగు ఉంటే ఏలాగు? బయిబిలు 28, బైబిలు 78; యింగిలీషు 31, యింగ్లీషు 16 గ్రైంచి, ఫైంచ్‌ జర్మన్‌, జర్మను, నవలి, నవల; ఏప్రియలు, సివెల్పు, ఇస్కూలు, ్రందీ లండాఫ్‌దీ - ఈ మొదలైనవి.

ఇంత విపులంగా ఈ చర్చ సాగించడానికి ముఖ్యకారణము నాకు

అప్పారావుగాళి యొడల ఉండే గౌరవము. నేను వారిని ఎరుగుదును. ఈ వ్యాసచందిక మ్యుద్రితప్రతి వారి కీర్తిని ఎక్కువ చేసేటట్లు ఉండకపోవడము నన్ను బాధించింది. నా ఈ వ్యాసారంభాన పొందుపరచిన అప్పారావ్లుగారి వాక్యమే నాకు శరణ. (కిన్నెర: సంప్పటము 6, సంచిక త, ఆగస్టు 1954)

చస్తోఖన ల్‌ రి ఛి

ఫి లిస్తుమై ఆటీన్‌

వ గల లం లి,

అట్లీ జ! గురజాడవారి వ్యాసచంద్రిక; ఇల్ల విమర్శకులకు సమాధానం అవసరాలసూర్యారావు “విద్యావివాదాలలో పెద్దలయెడల కనపరచవలసిన విలువలు వినయాదిగుణములు పిన్నలు మరువరాదు. "పెద్దలు పిల్లలయెడ వాత్సల్యత మరువరాదు” మహాకవి గురజాడ 'ఇటీవల విశాలాంధ్ర ప్రచురణాలయం వారు అచ్చొత్తించిన గురజాడవారి “వ్యాసచందికొను విమర్శిస్తూ “కిన్నెరా ఆగస్టు సంచికలో శ్రీ పారనంది జగన్నాథస్వామి గారు వొక ద్‌ర్ణ వ్యాసాన్ని (ప్రకటించారు. *నేను వారిని ఎరుగుదును"”అని చెప్పిన త్రీ జగన్నాథస్వామిగారు అప్పారావుగారి వ్యాసాలను చదివి యింత విపులంగా విమర్శించినందుకు సంతోషం. అయితే అప్పారావుగారిని “తెలిసిన” శ్రీ జగన్నాథస్వామిగారు వారినీ, వారి వ్యాసాల స్వభావాన్నీ ఆలియనట్టూ, తెలిసీ ఆలియనట్టూ విమర్శించిరని చెప్పవలసి వచ్చినందుకు పెద్దలు శ్రీ పారనందివారు నన్ను మన్నిస్తారనే అనుకుంటాను. చర్చను వొదిలి పాఠకులను తరమడం | పందిరి మళల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము

2470 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము

“వారి ఖండన కార్యకలాపములో వారు నుడివిన రెండు మూడు ధర్మసూత్రాలను విశదపరచవలెను.” అంటూ శ్రీ జగన్నాథస్వామిగారు అప్పారావుగారి వాక్యాలను కొన్నింటిని ఉదహరించారు : “వొకరు అన్నమాటే మనంకూడా అనడమా? “ఫథమంలో తీర్పు చెప్పివేశాం గనక, యిక ఆ తీర్పును నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము" “యుద్ధంలో జారక నిల్వడం కష్టం.” ఇలా ఉదహరించి శ్రీ పారనందివారు “వీటి మంచి చెడ్డలను గురించి చర్చ అనవసర"మని తీర్పు చెప్పి వేశారు. అలా చెప్పినవారు, పోనీ ఊరుకున్నా బాగుండును. “పాఠకులకు విడిచి వేస్తొనని వాటి మంచి చెడ్డలను ఎటూ తేల్చక, పాఠకులను మాత్రం విడిచిపెట్టలేదు. “అప్పారావుగారు నియంత. అదికాదు ఇదికాదు అనే పరిష్కార ధోరణిలో చెప్పేవారు; విన్నవారు వినుకోవాలి” అంటూ విమర్శకులు తమకుగల లేనిపోని (భమలతో పాఠకులను వెంట తగిలారు! విమర్శకుల లేనిపోని భ్రమలు

“విన్నవారు వినుకోవాలి, లేనివారు లేదు” అనే ధోరణీ, నేను చెప్పినదే వేదమనే అహంకారమూ, నాది సుగీవాజ్ఞ అనే నియంతృత్వ పోకడా అప్పారావుగారికి ఉన్నట్లు వారి వ్యాసాలను చదివిన సహృదయులవరికీ కనిపించదు.

“విద్వాంసుల జుత్తులు తగిపోవడము., యీ శబ్బమువల్లనే, రామన్నగారు ఒక మాటకు ఒక అర్థం చేసి, ఉపన్యాసం ఆరంభిస్తారు... తరువాత ఆ వాదములో జొరబడే పెద్దలు పిన్నలు తలొక అర్థం లాగుతారు. తుదకు అర్థం అనర్థమవుతుంది. యిది లోకసాటి. నేను లోకంలో వాడనే అవుటను దాట్లు వెయ్యడంలో ్రవీణుడనే. మీరంతా వున్నారు కనుక, అట్లా దాట్లు వేసేటప్పుడల్లా హుంకారం చెయ్యండి. యీ కట్టుదిట్టంతో చర్చ వుపష్మక్రమిత్తాం” అని అప్పారావుగారు చెబుతూనే వున్నారు. తాను తప్పు చేసినప్పుడల్లా హుంకరించమని విమర్శకులను ఆహ్వానిస్తూనే వున్నారు. “ఇప్పుడు మన పత్రికలలో రెండు విమర్శన మార్గములు కనబడుతున్నఎ. ఇష్టులైన కవులను పొగిడి వారి (గ్రంథములందు తప్పు లెన్నక పోవడము, అయిష్టులగు కవుల [గగ్రంథములయందు ఉన్నవి లేనివి తప్పులెన్ని గుణములను మరుగుపరచడము - ఇంతకన్న భాషకు కీడు వుండబోదు” “నియమమంటే యేమిటో, సంస్కారమంటే యేమిటో, వాటి స్వభావమెట్టిదో, వాటి చరిత్రమెట్టిదో, స్పష్ట వముగానూ, విష్టలవుబగానూ ఎవ్వలేని ఉపన్యసించి వుమ్ము తరింపజేయుదురు గాక!” ఈ విధంగా విమర్శకు అప్పారావుగారు సుముఖత

గురజాడవారి వ్యాసచంద్రికః విమర్శకులకు సమాధానం అవనరాల నూర్యారావు 2471 ప్రకటిస్తే, యీ వాక్యాలను చదివికూడా శ్రీ పారనంది వారు అప్పారావుగారు “నియంత” అనీ, “నాకు వచ్చును, వారికి రాదనే ధోరణి ఆయనకు కలదనీ ఎలా (భమిస్తున్నారో అర్థం కాకుండా వుంది.

ఒక వివాదగ్రస్త విషయాన్ని తాడో పేడో తేల్చీ, “ఇదీ” అని నిష్కర్షగా, ఖండితంగా ఆయా విషయాలపై అధికారం గల పండితులు చెప్పడం కద్దు. తాము నిజమని నమ్మినదానిని ఖండితంగా చప్పడంలోనూ, దానిని సిద్ధాంతంగా నిర్వచించడంలోనూ దోషం లేదు. అప్పారావుగారు అలాగ నిష్కర్షగా తాము విశ్వసించిన సత్యాలను ప్రతిపాదించారు. ఇటు సాహిత్యంలోనూ, అటు భాషలోనూ వారు చేసినదే అదే. గిడుగువారూ యింతే చేశారు. చిన్నయసూరీ యింతే. ఇందులో నియంతృత్వం లేదు. కాని వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఎవరైనా సోపపత్తికంగా తప్పు అని నిరూపించినపుడు తమ వాదనే యథార్థమైనదని అప్పారావుగారూ, గిడుగువారూ పట్టుదల చూపలేదు. ఖండన మండనలు జరగ వలసినదే. జరగనిదే నిజం తేలదు. చర్చ అనవసరమా? "

ఇక “వొకరు అన్నమాటే మనంకూడా అనడమా?ి “ప్రథమంలో తీర్పు ఇచెప్పివేశాం గనక యిక ఆ తీర్పు నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము.” “యుద్ధంలో జారకనిల్వడం కష్టం” అనే అప్పారావుగారి వాక్యాలను శ్రీ జగన్నాథస్వామిగారు ఉదహరించి “వీటి మంచి చెడ్డల గురించి చర్చ అనవసరొమని టూకీగా తేల్చి పారచేశారు. ఈ మాటలు దోషాలని విమర్శకుల అభ్మిపాయమా? లేక ఈ వాక్యాలలో అప్పారావుగారి నియంతృత్వ ధోరణి కనిపిస్తున్నదని శ్రీ జగన్నాథస్వామిగారు సెలవీయదలుచుకున్నారా? చర్చ అనవసరమంటూ వాటికై తమ నిర్ణయాలను (ప్రకటించడం దేనికి? విమర్శకులు అప్పారావుగారి పై వాక్యాలను ఉల్తేఖించడంలో వారి అభ్మిపాయమేమో చెబితే సమాధానం పొందడం కష్టం కాదు.

అప్పారావుగారి “వ్యాసచంద్రికొలోని వ్యాసాలను గురించి ముచ్చటిస్తూ విమర్శకులు “భాషా సంబంధమైన నాల్గింటిలో ఒకటి వారికిగల కన్నడ భాషాజ్ఞానాన్ని తెలువుడు చేసేందుకు వ్రాయబడినది అని స్వర్లీయులైన అప్పారాపుగారి పాండిత్య ప్రకర్షను చాటుకోవాలనే ఉబలాటాన్నీ బులపాటాలనూ *వారిని నేనెరుగుదు”నన్న

2472 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము శ్రీ జగన్నాథస్వామిగారు చెబుతున్నారు. కాని “కన్నడ వ్యాకరణము"లనే అప్పారావుగారి వ్యాసం, పాపం, విమర్శకు లనుకున్నట్లుగా ఉబలాటం కోసం (వాయబడ్డది కాదు. కన్నడ వ్యాకరణములలోని వ్యాఖ్యానం ఏవిధంగా తెలుగు భాషకు అనువర్తింప జేసుకోవచ్చునో తమ వ్యాసంలో చెబుతూ, కన్నడమునకు, తెనుగునకు గల సంబంధమును ముచ్చటించదలుచుకున్నారు. అయితే యిది అసంపూర్ణ మైనది. ఆ విషయం వ్యాసం అడుగుభాగాన వున్న నోటులో వుంది. సంస్కృతానికి, తెలుగుకు జన్యజనక భావ సంబంధం లేదని “ప్రాచీన [దవిడము” నుంచి ఆంధ్ర కర్ణాటక తమిళ మళయాళములు విభాగిల్లేయని అప్పారావుగారు కొన్ని పరిశోధక వ్యాసాలను వ్రాయ సంకల్పించినట్లు ఆయన డైరీలలో కలదు. అట్టి పరిశోధనలో వెలువడినదే “కన్నడ వ్యాకరణా"లనే వ్యాసం. మరి యీ వ్యాసం విమర్శకులన్నట్లు “వారికిగల కన్నడ భాషాజ్ఞానాన్ని తెలియ” జేసినట్లయితే, అందుకు ఆ వ్యాసకర్తే కాదు, ఏ వ్యాసకర్తైనా చేయగలిగేదేముంది? ఆ వ్యాసకర్తలకుగల భాషాజ్ఞానాన్ని “విమర్శకులు నిందించవల”. విమర్శకులకు గీటురాయి ఏది?

“వ్యాసాలన్నీ మృాతము ఒక జాతికి చెందినవికాక, గారడీవాని సంచిలోని వస్తువలవల భిన్న మూల్యము గలవి అయినవి" అని విమర్శకులు పాఠకులకు కనుకట్టుకట్టి “మోళీ” విద్యను (ప్రదర్శించ ప్రయత్నించారు. వ్యాసాలన్నీ ఒక జాతికి చెందినవే వుండాలనే నియమం ఎక్కడవుందో మాత్రం విమర్శకులు చెప్పారుకారు!

“వివాదగ్రస్తమైన వ్యాసాలు సారస్వతజాతికి చెందవని పండితాభిప్రాయము.” విమర్శకులు ప్రయోగించిన “వివాద(గ్రస్త మైన వ్యాసాలు అంటే అర్థం ఏమిటి? వ్యాసాలు వివాదగ్రస్త మైనవనా? లేక వివాద(గస్తమైన విషయాలపై వ్రాసిన వ్యాసములనా? “అవి సారస్వత జాతికి చెందవని పండితాభిప్రాయ"మంటే ఆ పండితులెవరో, ఎందుకవి చేరవీలులేదో విమర్శకులు సెలవివ్వాలి కదా! శాశ్వతత్వమనేది నిర్ణయించడానికి విమర్శకుల గీటురాయి ఏది?

“చరిత్రతోను, వివాదముతోను వెక్కిరింత ఫక్కీని నడిచినవి ఎంతవరకు సాహితీ(శేణికి అలంకారములు కాగలవు అని విచారించవలెను" అన్నారే కాని

గురజాడవారి వ్యాసచంద్రిక: విమర్శకులకు సమాధానం అవనరాల నూర్యారావు 2473 విమర్శకులు ఎక్కడా తమ వ్యాసంలో తర్కించలేదు. “అవీ వాజ్బయమే అని అన్నా, వాటికి శాశ్వతత్వము ఉండ వీలు ఉండదు” అని రెండు “ఉండదులితో అటు పాశ్చాత్య భాషల్లో వెలువడుతున్న యిటు మన భాషలో వెలువడుతున్న వఎలువడిన అట్టి తరహాకు చెందిన వ్యాసాలను ఠపీమని విమర్శకులు కొట్టిపారవేశారు. కొన్ని విషయాలు తర్క వితర్కాలతో కాని ఎటూ తేలవు. జిజ్ఞాసలేనిదే నిజం వెలుతురులోకి రాదు. వొక సత్యాన్ని స్థాపించేందుకు అనేక వివాదాలు రాకతప్పవు. చర్చలు జరగకమానవు. ఇట్టి చర్చలతో తర్క వితర్మాలతో సాగిన సాహిత్య వ్యాసాలు విమర్శకులన్నట్లుగా వాజయంలో చేరక మన్నుకొట్టుకు పోవలసిందేనా? “వెక్కిరింత ఫక్కీని నడిచిన వ్యాసాలు ఎంతవరకు సాహితీ ేణికి చెందగలవు” అని (ప్రశ్నించిన పారనందివారిని స్పెస్టేటరు వ్యాసాలనూ, సాక్షి వ్యాసాలనూ ఒకసారి చదివి తేల్చుకోమని మనవి. “సాక్షి వ్యాసాలికు ఆంధ్ర వాజ్మియమున చోటు లేదని వివుర్శకులు (తిశంకు “నరకి మొకటి సృష్టించదలుచుకున్నారు కాబోలును! సాక్షి వ్యాసాలలో లేని మార్దవం అప్పారావుగారి వెక్కిరింత వ్యాసాలలో వుంది. ఆకాశరామన్నకు సమాధానంగా గురజాడవారు వ్రాసిన వ్యాసంలో ఉన్నదంతా శిష్టహాస్యమే. ఆత్మశక్తిని ఎరిగి రచియించిన వ్యాసమది. అప్పారావుగారి వెక్కిరంతలో సున్నిత హాస్యమూ, వునుషులయుందు సవుభావవబూ వెల్లి విరుస్తాంయ,. అప్పారావుగారు విమర్శకులన్నట్లు “అసభ్య మైన వ్రాతలు” (వాయలేదు. అవి అసభ్యమైన వ్రాతలు కావు. సున్నితమైన వాతలు! సెటైర్‌ అనే సాహిత్య ప్రక్రియకు వాజ్మయంలో స్థానమే లేదా? ఆకాశరామన్నకు జవాబుగా అప్పారావుగారు వ్రాసిన వ్యాసాన్ని పేర్కొంటూ , శ్రీ పారనందివారలు “ఆకాశరావుంన్నగారు శ్రీ అప్పారావుగారని (బతిమాలుకొన్నారట.... శీలంపై, హృదయ సౌశీల్యం మై తిట్టడమునకు ఎంత * (ప్రభావము ఉందో విచక్షణులు (గ్రహించగలరు. తిట్టడం ఆవేశంలో వస్తుంది” అని ఏమేమో 'వాసుకొచ్చారు. . వాడుకభాషను “లంజ సంతతి" అనీ, “ఆంధ్ర భాషావఢూటీ గృహాంగణమున దాసి” అనీ గ్రాంథిక భాషావాదులు బరి దిగిన రోజులు అవి. ఆకాశరామన్నగారు

2474 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము శ4: సాహిత్యము ఆనాటి (గ్రాంథిక 'భాషావాదంలో ఆవేశం పట్టలేక “మీకు నాయుత్తరమువల్ల బుద్ధి వచ్చునటుల ప(త్రికాముఖమున (పచురించండి” అని అప్పారావుగారికి ఉత్తరం (వాయగా చమత్కారంగా ఆయన జవాబిచ్చారు. ఆకాశరామన్నలే కాదు, ఆనాడు శ్రీ ఎనమండ్ర నారాయణమూర్తిగారివంటి తన ముఖ్యమిత్రులు సైతం “మీరు మద్రాసులో బొడిచే పొడుపుకై యెదురు చూచుచున్నాను. రామయ్యను రెండు సంగతులలో గెల్బుకొందురు....ఆం[ధ ప్రపంచమంతయు మీ తోకకు తాటాకులు కట్టక మానదు” అని ఎదురుచూసిన రోజులు! .

“మీ వ్యాసము ఆ కల్లుత్రాగెడివారి వ్యాసమువలె తోచుచున్నది” అని ఆకాశరావున్నగారు వముద్యపాన నిషేధం అవులులోలేని ఆ రోజులలో అప్పారావుగారికి ఉత్తరం వ్రాయగా, “భగవంతుడు ప్రతి మనిషికీ లావో కొంచెమో (ప్రతిభ యిస్తాడు. యెక్కువ యివ్వలేదని తక్కువ వున్నవాడు సోమరియై వుండకూడదు. తన స్వల్పప్రతిభను పూర్తిగా వినియోగించవలసి వుంటుంది. గాన నాకు చేతనైనరీతిని యిటుపైనికూడా రాయడమునకే తలచియున్నాను. గాని ఆగతలుచుకోలేదో అని అప్పారావుగారు బదులు చెప్పారు. “బుద్ధివచ్చినటుల ప(త్రికాముఖమున ప్రచురించండి” అని ఆకాశరామన్నగారు జారీచేసిన ఫర్మానాకు “చిన్ననాటి బెత్తపు దెబ్బలవల్ల బుద్ధిరాలేదు. పెద్దలమాట వినక దాట్లు వేసినప్పుడు కాలు విరిగినా బుద్ధిరాలేదు. నాటికి నేటికి యెప్పటికప్పుడు బుద్ధిని యెంత ఆసక్తితో బతిమాలి పిలిచినా రాలేదు. అరవైంపేళ్ళకి అగ్గిగండం అన్నట్లు యిప్పుడు మా మిజత్రులు నొక్కినొక్కి వ్రాసిరని బుద్ధిని విరచికట్టి తెచ్చిపెట్టుకున్నా భరించడం

  • కష్టం. ఆశ్రమకు నేను పూనుకోజూలను. మిగిలివున్న నాలుగురోజులూ కొంచెం స్యేచ్చ్భగా బతకవలెనని వున్నది. యొవరికుండదు? అంతేగాక నా వంటివాళ్ళకు గూడా బుద్ధి కలిగితే బుద్ధి చవకైపోతుంది. కనక ఆ బుద్ధన్నదేదో ఆకాశరామన్నగారు భద్రంగానూ రహస్యముగానూ దాచుకుంటేనే విలువ” అని అప్పారావుగారు ఆకాశరామన్నను చెంపలు వేసుకొనేటట్లు చమత్కారంగా మందలించారు.

“ఆకాశరామన్న ఉత్తరాలు అనే గురజాడవారి వ్యాసంలో “విద్య వొకరి సొమ్ము కాదు. అడుగుపెట్టిన చోటల్లా జ్ఞానపు గనులున్నపి. కన్ను తరిచి చూసేసరికి గనులలో లక్ష్మి పెల్లోవచ్చి నిలుస్తుం"దనే మాదిరి వాక్యాలు అనేకం. ఎపుడుపడితే అప్పుడు ఉదహరించుకునే, ఎప్పటికీ మరవలేని యిట్టి వాక్యాలు శాశ్వతమైనవి. ఇవి చిరస్మరణీయాలు. "

గురజాడవారి వ్యాసచంద్రిక: విమర్శకులకు సమాధానం అవనరాల నూర్యారావు 2475

“వెక్కిరంత ఫక్కీని వాసిన వ్యాసాలు ఎంతవరకు సారస్వతానికి అయివేజు కాగలవు” అని శంకతో బాధపడుతున్న శ్రీ పారనందివారు (పపంచసాహిత్యంలో సెటైర్‌ అనే వొక సాహిత్య ప్రకియ వుందనీ, దీనికి సాహిత్యంలో అగ్రస్థానం వుందనీ గమనించినట్లయితే, అది వారి శంకకు మందుగా ఉపయోగపడగలదు. ఇవి నిషిద్ధములా?

అప్పారావుగారు “వాడుక రూపాలకు బదులు గ్రాంథిక రూపాలనే వారు ఎంచుకున్నారని చెబుతూ కొన్ని మువర్ణాంత పదాలను విమర్శకులు ఉదహరించారు. వాక్యంలో తూకం కోసం ఒక్కొక్కప్పుడు “ము” వర్దాంత పదాలను వాడవచ్చును. గ్రాంథిక భాషలోగల పదాలనన్నిటిని త్యజించేటంతటి ఛాందసులు కారు వ్యావహారిక భాషావాదులు. “చేశాం” అని అంటున్నప్పుడు వాక్యం తుంచినట్లుంటే దానిని ఒక్కొక్కప్పుడు “చేశాము” అని (ప్రయోగించడం దోషం కాదు. ఇంతకూ గ్రాంథిక పదాలని శ్రీ పారనందివారు చెప్పిన “చెప్పివేశాము, కోవడమునకు, అనేకమంది, ఇలాగొ అనే వాటిని గ్రాంథిక భాషాపదాలని ఏ సూత్రాల ప్రకారం సాధించగలరు? “గోటితో” అనేశబ్దం వాడుకభాషలో ఎలా వుంటుందో శ్రీ పారనందివారు నిర్ధారించగలిగితే అంతకన్నా భాషకు ఉపకారం వుండబోదు.

“ముస్లిం మైనికు లనేకమంది, అంటకాగిందిః ఉపన్యాసమిలాగ, యడాగమన శ్రాగమాలు, సరళాబేశములు, బెపవిభక్తికము మొదలైన (గ్రాలథికాలు వారిని వదలలేదు. ఇవి వాడుకభాషవి కాడు కదా” అని శ్రీపారనందివారు విమర్శించారు. సంధి చేయరాదనే నియమం ఎక్కడైనా వుందా? వ్యావహారిక భాషలో సంధిపరిత్యాజ్యమా? “అలటకాగింది” అనేది వాడుక భాషలోని పదము. కాదని అన్నట్లయితే దానిని ఎలా వాడవలెనో శ్రీ పారనందివారు చెపితే యిప్పుడీ “అ౦ంటకాగింది" అనే పదాన్ని వాడుకుంటున్న విశాఖపట్టంజిల్లా (ప్రజలు దానిని విడిచివేసి, శ్రీ పారనందివారు సృష్టించబోయే “కృతక పదాన్ని" స్వీకరిస్తారు!

అప్పుడప్పుడు, అన్నప్పుడు, వాడలాగ, చెప్పునన్నాడు ఇత్యాది వాడుకభాషలోని సంధులు విడగొట్టి (పయోగించముని వివుర్శకులు సెలవిచ్చనట్లయితే బడిపిల్లలవలె వ్యాసకర్తలు, కవులు నేటినుంచి పత్రికలలో అలాగునే వ్రాసుకుంటారు.

24/76 పందిరి ముల్గికార్డునరాపు శతజయంతి సంపుటము 4: సాహిత్యము “సరళాదేశములు, యడాగమనడాగమాలు, బెపవిభక్తికములు మొదలైన (గాంథికాలు వారిని వదలలేదు. ఇవి వాడుకభాషవీ కాదుగదా” అని శ్రీ పారనందివారు ఆక్షేపించారుకదా. వాడుకభాషలో వున్న వాడు వచ్చియిచ్చాడు. ఆమె యిలా చెప్పింది మొదలైన యడాగమాలకీ, రెండుంబావు, ఒకటిన్నర అనే నడాగమాలకీ, చేతి సంచి, నూతిమీద, కంటిచూప్పు మొదలైన బెపవిభక్తికాలకీ దారి ఎటు? ఇవి వ్యావహారిక భాషకు సహజం కాదా?

“ఇంగ్లీషు పదాలను తెలుగులిపిలో వాసేటపుడు, లేదా వాటినుండి ' తత్పమాదులను కల్పించినపుడు వాటి ఉచ్చరణ ముఖ్యము గదా! ఒకచోట ఒకలాగు, మరియొకచోట మరొకలాగు ఉంటే ఎలాగు” అంటూ “యిన్ని లాగులు”

  • వుండకూడదని చింతబరికె పట్టుకొని పిల్లల్ని బెదిరించే బడిమాస్టారువలె శ్రీ పారనందివారు గడబిడ చేశారు. “బయిబిలు - బైబిలు, యింగిలీషు - యింగ్లీషు” మొదలైన పదాలను యిందుకు ఉదాహరణగా ఎత్తిచూపారు. “ఇస్కూలు, స్కూలు అని రెండు విధాలుగా వాడరాదని శ్రీ పారనందివారి ఆక్షేపణ. తత్పమాలని వారు అంటున్న “బయిబిలు, యింగిలీషు, ఇస్కూలు"లు, తత్సమాలుకాక, తద్భవము లనుకుంటాను. తత్పమాలకు, తద్భవాలకు వ్యత్యాసం వుంటున్నప్పుడు మరి వాటిని వేరువేరుగా వ్రాయరా?

ఇవేకాక, లు - రయిలు, రైతు - రయితు మొదలైన తత్సమ తద్భవాలు శిష్టులు వాడేవే. వీటినేకాక దేశ్యాలనుకూడా శిష్టులు రెండువిధాలుగా వ్రాస్తున్నారు. చౌక-చవుక, పైరు-పయిరు, వైపు-వయిపు, వర్ణక్రమంలో యీ వ్యత్యాసం కద్దు; కమీజు-కమిజు. ఈ పదాలకు యిట్టి వాడుకలు వున్నవని చెప్పడమే అలాగ .(వాయడానికి కారణం. ఇంతకూ విమర్శకులు ఏ వాదులు?

“ము - అంత పదాలు సర్వసాధారణము" అని వ్యాసచంద్రికలోని వ్యాసాలను విమర్శించిన శ్రీ పారనందివారి కొకమాట. మాటకాదు, ప్రశ్న విమర్శకులు వ్యావహారిక భామావాదులా? కాక (గాంధిక భాషావాదులా?

భయము, ప్రత్యుత్తరము, ముఖ్యాంశము, వికాసము, అలంకారము, లక్షణము, తిరస్కారము, వివరణము, ప్రయాణము, అంశము ఇత్యాది ము - అంత పదాలు శ్రీపారనందివారి వ్యాసంలో లెక్కకు మించినన్ని.

గురజాడవారి వ్యాసచంద్రిక; విమర్శకులకు సమాధానం అవసరాల సూర్యారావు 2477 విమర్శకులు గుర్రాలపై ముసిరే జోరీగలు కారాదు.

అర్థ స్ఫూర్తికొరకు కవులు కొన్ని ప్రత్యేక విశిష్టపదాలను ప్రయోగించడమనేది యిటు మనకూ, అటు పాశ్చాత్యులకూ పరిపాటి. యూరపులో కలిగిన చైతన్యాన్ని గురించి చెబుతూ, “ఇటలీలో గ్రీకులాటిను సరస్వతి ఉదయించగానే జనులకు కళ్ళమసక మాసినది... యూరపులో “బుద్ధికి గొలుసులు" విడినవి అని అప్పారావుగారు వ్రాశారు. ఇక్కడ “బుద్ధికి గొలుసులు" అనేది కవితాపద్ధతీ, భాషల సారూ తెలిసిన బుద్ధిమంతులు మెచ్చుకోవలసిన ప్రయోగం. “చేతికి గొలుసులు” వలనే “బుద్ధికి గొలుసులు”. ఇట్టి స్వతంత్రమైన, లలితమైన ప్రయోగాలు (ప్రాచీన అర్వాచీన ఆధునిక కవులలో అనేకం. కవులను విమర్శించవచ్చును కాని, గృురాలమై వాలే జోరీగలవలఠె విమర్శకులు కపులమీద ముసరకూడదు!

ఇవి దోషాలని “బహుశహ, హాశ్చర్యము” అని శ్రీ పారనందివారు ఉటంకించిన (ప్రయోగాలు అప్పారావుగారివి కావు. ఆకాశరామన్నగారు అప్పారావుగారికి వ్రాసిన లేఖలోనివి. ఆఅమాటలను వారు ఉదహరిస్తూ వుంటే అవి అప్పారావుగారివేనని పారనందివారు నందిని పంది చేయడానికి ప్రయత్నిస్తే అవునని నమ్మే బడిపిల్లలు లేరు! ఆకాశరామన్న ఉత్తరం: “శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు మున్నగువారిని గురించి తాము ప్రసంగించిన సంగతులేమో చాలా “హాశ్చర్యము” కలుగచేయుచున్నది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదనినటుల మీ చర్య తోచుచున్నవి. బహుశహ...” ఆకాశరామన్నగారి మాటలను అప్పారావుగారికి అంటగట్టడంలో శ్రీ పారనందివారికి ఆకాశరామన్నగారిమీద ఎందు కింత మక్కువ!

అప్పారావుగారి వ్యాసాలు సాహిత్యానికి అయివేజువంటిపని నాపంటి పిన్నలూ, “అవి ఎట్లగునని” శ్రీ పారనంది వారివంటి పెద్దలూ తలచడంలో తప్పులేదు. అయితే, “కలమునకు వచ్చినట్లు వ్రాయడము “కళ్ళెమువదలి చిత్తము పరుగిడనివ్వడము” “ఏది స్మృతికివస్తే దానిని చెప్పడము” (ఇవి అప్పారావుగారి వాక్యాలు) ఈ వ్యాసాలలో కనిపిస్తవని ఆయనా, కాదని నావంటి పిన్నలూ భావించవచ్చునుగాని ఈ “బెగాములను” నిర్ణయించవలసినది పాఠకులే. విమర్శకులకు కలిగిన అసలు చిక్కు

“కృత్తద్ధితల రూపుమాపి, అింగమ్యత్యయం చీసి, యిన్ని విధాల (గాంథిక భాష తగలబడుతూ వుంటే” “ఇప్పటి నాగరకలు, శిస్టులును వ్యవహరించు

24/78 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము భాషనే రాసుకొనరాదా? (ప్రొాఢ గద్యకావ్యములనూ, పద్యకావ్యములనూ (వాయువారు (గ్రాంథిక భాషలోని యింపగు పదములు తీసుకొందురుగాకి అని చబబుతూ*సులభ సాధ్యమగు నవీన వ్యావహారిక భాషాకటి ప్రబలినయెడల, బుద్ధి బలము కలిగియు, మూగులైవున్న మనవా రెందరు (గగంథములను వాసి భాషను అభివృద్ధి చేయరు?.. వాడుక భాషలేకదా కవులు రాయరాయ [గాంధికభాష లనవని వివరించే అప్పారావుగారి వ్యావహారిక భాషావాద స్వరూపస్వభావాదులు తెలిసిన శ్రీ పారనందివారు “కలము వదలి” “చిత్తమునకు కళ్లెం బిగించకి తమ వ్యాసాన్ని యిలాగున దూకుడుగా పరుగెత్తించడానికి ప్రయత్నించి వుండరు!

“నాది ప్రజల ఉద్యమం. దాన్ని ఒకరిని సంతోష పెట్టడానికై వొదులుకోలోనని మాగ్నాకార్జా (పపకటించిన (ప్రజాస్వామికవాది శ్రీ అప్పారావుగారు.

“కాదు, ఆయన నియంత?” అని శ్రీ పారనందివారు భ్రమిస్తున్నారు. పోనీ, మాటవరసకు ఆయన నియంతే అని అంగీకరించినా, అప్పారావుగా రిపుడు లేరు.ఆ భయం శ్రీ పారనంది వారి కిక అనవసరం.

కనుక “కళ్లెమువదలి చిత్తమును పరుగిడనిస్తూ” “ఏది స్మృతికి వస్తే దానిని ఇెబుత్తూ" “కలమునకు వచ్చినట్లు” శ్రీ పారనందివారు తమ వ్యాసాలను దూకుడుగా గుప్పించవచ్చును! భవతు!

(కిన్నెరం సంపుటము ళ, సంచిక 10, అక్టోబరు కే౦5కశ) (ై స్‌ |

శృంగారము-గురజాడ అప్పారావుగారు రమణారెడ్డి

గురజాడ అప్పారావుగారు అప్పుడప్పుడు వాసిన వ్యాసములను సంకలించి అవసరాల సూర్యారావుగారు “వ్యాసచంద్రికొగా ప్రచురించారు. నాటి సమాజమును కలవరపరుస్తూవుండిన సమస్యలను తీసుకొని వ్రాసిన యీ వ్యాసములు తత్కాలానికి మాత్రమే సంబంధించిన విలువ కలిగినట్టివా, లేక చిరము మనగలిగినట్టివా అనే సందేహానికి తావులేదు. ఏమంటే, నవ్యాంధ్ర సాహిత్యపితామహులలో ఒకరు, నవ్యాంధధ సమాజ నిర్మాతలలో ఒకరు అయిన గురజాడ అప్పారావుగారు నాటికిమట్టుకే చెంది మరునాటికి యెండిపోగల వ్యక్తి కారు; కాకపోగా, ఆయన వర్తమనానికి, అంతకంటె భావికికూడ చెందగలట్టి ఘనతగల వ్యక్తి. ఒక చార్మితక ప్రముఖ వ్యక్తియొక్క రచనలు నిన్నటికే కాక, నేడు, రేపులకుకూడ సార్థకాలయిన డాక్యుమెంటరీలుగా నిలిచిపోగలవు.

కాని, నేడు దిక్కుమొక్కులేని రస్కినుగారి వ్రాత నొకదాని నుద్ధరించి శ్రీ పారనంది జగన్నాథస్వామిగారు “భారతి” సెప్టెంబరు సంచికలో ఈ (గ్రంథాన్ని 800401 ౧6 10647 [క్రింద జమకట్టివేశారు. వారి వివేచనాశక్తితో నాకు తగువులేదు. కాని వారు కందుకూరి వీరేశలింగము పంతులుగారిని వెనకవేసుకొని, గురజాడవారిని అబద్ధీకుడుగా నిరూపింపబోయి “కావ్యాలలో శృంగారము” అనే వ్యాసం గురించి చేసిన అక్షరయుద్ధం గురించి మట్టుకే ముచ్చటిస్తాను. సదరు జగన్నాథస్వామిగారు వయోవృద్ధులు. తమకు పై యిద్దరితోను పరిచయమున్నదని

2480 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అంటున్నారు. కాని వారి పరస్పర సంబంధ బాంధవ్యాలను గురించి వీరు బాధాకరమయిన “ఊహా”లు చేసి, యిద్దరిని జుట్టుపట్టుకొనేటట్లు చేశారు. ఇది ఎంత అసత్యప్రచారమో దేశమెరుగును. వీరేశలింగంగారిని పారిశుద్ధ్యవాదిగా నిరూపించడానికి చాలా (శమ తీసుకొన్న జగన్నాథస్వామిగారు గురజాడవారి “కన్యాశుల్కం” అసభ్యతకు ఆలవాలమనికూడా సూచించారు. “దీనిలోని ప్రతిఘట్టం వీరేశలీంగంగారి మొడల అప్పారావుగారు చూపిన అవినీతి, పరకీయ శృంగారం, వ్యభిచారం, జంకు, సాని, ముద్దు, ఆలింగనం, చన్నులు, స్తీ పురుషుల శరీరాంగ స్పర్శనలు మొదలైన పచ్చిబూతు శృంగారమని వారు అన్నది నిండుగా దొర్లుతూ కనబడుతుంది.” అసలు జగన్నాథస్వామిగారు అప్పారావుగారి వ్యాసాన్ని సరిగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. వీరేశలింగంగారి ప్రహసనాదులలో అప్పారావుగారు చూపించిన తప్పులు “జంకు, సాని, ముద్దు, ఆలింగనం, చన్నులు” - వీటికి సంబంధించినవే కావు. జగన్నాథస్వామిగారికి గురజాడవారి నాటికి ప్రచారమందు వుండిన వీరేశలింగంగారి (గగంథాలే లభింపలేదంటున్నారు. ఇక గురజాడవారు సూచించిన సంఖ్యలు గల పుటలను వీరేశలింగంగారి రచనల [కొత్త సంపుటంలో గుర్తుంచి (ఊహ” చేసినతర్వాతు బహుశా గురజాడవారు వీటిని వీటిని తప్పుల [కింద జమకట్టి వుంటారని ఆలోచించి, ఈ (భ్రమలను యథార్థాలుగా విశ్వసించి జగన్నాథస్వామిగారు చేసిన యుద్ధం శూన్యంలో చేసిన యుద్ధమే కాని, అసలు విషయాలనుమట్టుకు వారు చూడనైనా చూడలేకపోయారు. “ఒక్కొక్క పుస్తకమునుబట్టి దానిలో పది పంక్తులు తీసి, వాటిని పచ్చిశృంగారంగా యించి, పుస్తకమును [గగ్రహించుటన్నది అల్పదృషప్టి" అని వ్రాసిన గురజాడవారే ఆ తప్పు వెనువెంటనే చేయరుకదా! ఇక “పచ్చి శృంగారము" అంటే వారనేదేమిటి? “పచ్చి శృంగారము రెండు రీతులుగా నుండును. రత్యాది వర్ణనమును. స్త్రీల అవయవములను వర్ణించుటయు నందొకటి. నిజమయిన పచ్చిశృంగారమన్నది పరకీయ శృంగారము.” (వ్యాసచందిక : పుట 9). కామప్రకోపము కలిగించగల వర్దనలు గర్హా్యాలు కావా? “స్త్రీ పురుషుల సంపర్కము తెరమరుగులేక వర్ణించబడితే, పఠితృలోకమందు పశుభావ విజృంభణమే తప్ప ఉన్నతభావ వికసనము కలుగుతుందా? సాహిత్య ప్రయోజనమమేమిటి? సాహిత్యములో శృంగారమునకు గల స్థానము, పరిమితులు యేమిటి? వీటి విషయములో

శృంగారము: గురజాడ అప్పారావుగారు. రమణూరెడ్డ 2481 గురజాడవారి అభ్మిపాయాలేమిటి? ఈ విషయాలనే చర్చించదలచుకొన్నాను కాని భవులపాలై తికవుకపడి నందినిచేయబోయి పందిని చేసిన జగన్నాథస్వామిగారిని యిక్కడ దిగవిడిచివేస్తాను.

మానవ సంబంధాలనుగురించి గురజాడ అప్పారావుగారు చేసినంత గాఢ పరిశోధన, పరిశీలన మరి యిటీవలి ఆంధ్ర సాహిత్య మహామహులు యొవ్వరూ చేసినట్లు కనుపించదు. అతి మానుషామానుష లక్షణాలు రెండూ మనుష్యునిలో వున్నవి. మానవుడు దేవదానవ లక్షణ మిశ్రీభూత చేతస్కుడు. నీట్టే అన్నట్లు “జాంతవమును, దివ్యమును కలుపుతూ పపాత మొకదానిమీద విస్తరించుకొని వున్న పాశమువంటివాడు మానవుడు”. పట్టు లతెగిపోయెనా, జాంతవాగాథమందు పడుతాడు. జాంతవ దశనుండి యీ పాశము పట్టుకొని దివ్యము వైపుగా ప్రయాసభరితమైన అధిరోహణ చేస్తూవున్నాడు. జాంతవము నణచిపెట్టినంతవటి కే దివ్యుడు కాగలుగుతున్నాడు. కనుక జాంతవలక్షణ పునర్విలసనమునకు దోహదమొసగగల ప్రతిచర్య నీచమయినదికాగా, తద్విరుద్ధమైన ప్రతిచర్య ఉచ్చమయినదవుతుంది. సాహిత్యానికి యే ఇతర ప్రయోజనము లెకున్నా మానవుని ఊర్జ్వ్యుముఖ (ప్రయాణానికి తగిన జవసత్త్వాలనేమి, ఉత్సాహమునేమి, దీక్షా పాటవమునేమి కల్పించగలుగుటలో ఏకైక ప్రయోజనమున్నది. అనగా, సాహిత్యము మానవుని నియమపరునిగా, శుచిగా, నీతివంతునిగా చేయాలి. కాని తద్విరుర్ధమైనదిగా చేయరాదు. సాహితీపరునిపై మహత్తరమైన బాధ్యతవున్నదిః వీలైనంతవరకు మానవునిలో దివ్యమును వికసింపజేయుట. ఇది యెొట్లాగు జరుగుతుంది? ఉదాహరణకు, స్తీ పురుష సంబంధ చితణలో రచయిత చాలా జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది. సభ్యతను పాటించవలసి వుంటుంది. తానే అసభ్య రచనాపంకమగ్ను డైతే, పఠితలుకూడా తన్ననుసరించ గలరు. అసాధారణ ప్రతిభావంతులైన రచయితలే యీ పారబాటులో పడినప్పుడు యిక సామాన్యుల మాటేమిటి? “పల్నాటి వీరచరిత్ర” పాఠ నిర్దేత అయిన పండిత శ్రీ ఉమాకాంత విద్యాశేఖరులు తిక్కన భారతానువాదం గురించి వ్రాసినది ఉదహరింప దగినది. “తిక్కన విరాట పర్వస్థ కీచకవధలోని చేర్చడాలు గొప్ప కవిత్వమని కొందరు తలుస్తున్నారు.... సీతావిషయకమైన రావణ రతి, ద్రౌపదీ విషయకమైన కీచక రతి రసాభాసం. అంతేగాక అది హేయం. ఈ హేయత్వాన్ని వివరించవలసిన పని లేదు. "నేటి కాలపు కవిత్య"మనే కృతిలో శృంగారాధికరణంలోను, క్షు[ద కావ్యాధికరణ౦లోను (దష్టవ్యం. సంచారి భావాది సావుగి నాయకుల

2482 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము రతిసందర్భంలో శోభిస్తవిగాని రత్నాద్యలంకరణం మురుగుడు బురద నీటికుండకువఠఅ దుష్టరతికి హేయం; అత్యంతం అనుచితం. నింద్యత (ప్రకటితమయ్యేవిధంగా ఇట్లాంటి రతిని తెలుపవలెను గాని చీము పుండుమీద యీగవలె దానియం దాసక్తి కనబరచడం అ్రశస్తం" ....తిక్కన, మూలగ్రంథకర్తలు చూపించిన “వివేకం కోల్పోయి, కీచకరతిని అనేకమార్గాల విస్తరింపజేసి ఆసక్తితో దాన్ని ప్రతిపాదించి యీగపని చేశాడు - సంభమంతో వర్ణించాడు.... వుబుకుతో మనకు తెలిపినాడు.... చిన్నచిన్న పద్యాలతో తృప్తిలేక కాబోలు అడుగడుక్కూ సీసాలను ఆహ్వానిస్తాడు, ఈ సీసాలు బాగా వున్నవిగదా అంటే అది కులటావిలాసం వంటిదని చెప్పుతున్నాను... తవుడు తింటూ వయ్యారం అన్నట్లు ఈ పాడు పనిలో దరువులుకూడా వేశాడు. రసాభాసం కాష్యంలో అంగంగా ఉండదగినది... హేయ రసాభాసం అంగం కాక (పధానమైతే కావ్యం భష్టమై దూష్యకోటిలో చేరగలదు” ఇక ముద్దుపళనివంటి వేశ్యా కవయిటత్రులు చెలరేగిన తంజావూరు మధురాది దక్షిణ నాయకుల పరిపాలనలో బయలుదేరిన “శృంగార”కావ్యాలను గురించి చెప్పపనిలేదు. “భోగం పద్యరచనా విధానంలోనూ 'ప్రద్యోతక మవుతుంది. అవినీతి పదాల కూర్పులోనూ కనుపిస్తుంది. రసహీనత శుష్కజీవితంలోనే కాక పర్దనలోనూ కన్పిస్తుంది. రసంపాలు హెచ్చినందువలననే రసానుభూతి లోపిస్తుంది కాబోలు! శృంగారం వికటం కాగానే, అది బూతు అయింది కాబోలు! భోగం మితినిమీరగానే, అది పాశవికోన్మాద ప్రవృత్తి అయింది కాబోలు!”

“పది నీతులు పది బూతులు

పది శృంగారములు గల్గు పద్యములు సభం

జదివినవాండే యధికుండు...”

“నీతుల కేమి? యొకించుక

. బూతాడక దొరకు నవ్వుపుట్టదు. ధరలో

నీతులు బూతులు లోక

ఖ్యాతులురా...” , అని కవి చౌడప్ప వాపోయిన కాలమది.

ఈ “శృంగార” యుగము వెనువెంటనే వీరేశలింగంగారు, అప్పారావుగారు (ప్రభవించారు. కాని ఈ సంపపదాయమును అప్పారావుగారు నిరాకరించారు. వీరేశలింగంగారు దీని దుష్ప్రభావం నుండి తప్పుకోలేకపోయారు. “త్రీ

శృంగారము: గురజాడ అప్పారావుగారు రమణా రెడి 2483 పంతులుగారు భాషా సంస్కరణ కర్తలును, సంఘ సంస్క ర్తలును నైనను రక్తబలముచేత మన [ప్రాచీనకవుల శృంగారము వీరికి ఆమూలా[గ్రముగా నచ్చినది.” చన్ను, అంకు, ఆలింగనము వంటి పదములు వాడినందుచేత, యీ మాటలంటున్నారా అప్పారావుగారు పంతులుగారిని? కానే కాదు. ఈ రచనల ప్రయోజనం రచనా విధానంవల్ల ఓడిపోతుందని అంటున్నాను. “ఈ గొప్పకథ (అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము) వలన వ్య క్తమగు నీతియెద్దియో శ్రీ రాయిబహదర్‌గారు తెలుపవలసి యున్నది. దుష్టవర్తనకు తగినశిక్ష జోడు కంచుకాగడాలు వేసి వెతకినను గానరాదు. ఇది పచ్చిబూతు శృంగారమునకు గొప్ప నిదర్శనము.” (వ్యాసచందిక, పుట13 ) అప్పారావుగారి దృష్టిలో “నీతి (ప్రముఖమైనది. నీతికొరకని రచయిత అవినీతి వర్ణ్షనయం దాసక్తి కనుపరిస్తే, అవినీతిదే పైచేయి అవుతుంది. ఈ నీతి అవినీతుల సక్రమ నిష్పత్తిని అప్పారావుగారు వాడినారు. వీరేశలింగంగారు వాడలేదు.

స్త్రీ పురుష సంబంధాలను గురించి గురజాడవారికి వర్థి సెంటిమెంట్లు - హేతుబద్ధం కానటువంటి యిస్టానిష్టాలు - లేవు. ఉన్నవి పరిశోధనలవలన, పరిశీలనవలన, విచారణవలన యేర్పడిన . దృథాభ్మిపాయాలు. “స్త్రీ పురుష సంబంధాలను గురించి సాంప్రదాయకమైన దురభిప్రాయాలనే వరదివ్వెను కట్టిపెట్టి, సమ్మగంగా వాటిని పరిశోధించవలెనని నా అభిప్రాయము,” అన్నారు. ఆయన యొరుగును - జీవితం మంచి చెడుగుల కలగాపులగమని, ఉచ్చ నీచ లక్షణ సముపేతమని, సాహితీపరుడు యథార్థవాది అయితే ద్వంద్వాలను రెంటిని చితించవలెనని. కాని జీవితమందలి జూంతవ ప్రకృతిని వర్ణించుటలో ఆయన జ్యాగత పడినాడు. “వాస్తవవాద రచన నైతిక బుద్ధికి చిక్కు కలిగించి నొప్పి పుట్టించే విషయాలను వెలిపరచక తప్పదు. నేను జీవితాన్ని చిత్రిస్తున్నాను - దానిని కళాత్మకంగా ఆదర్శప్రాయం చేస్తూనే. కళ నా ప్రభువు - అయినప్పటికి సంఘం యెడల నా బాధ్యత అంటూ ఒకటి వుంది. జీవితముతో నేను చెర్లాట మాడను” అశ్లీలమని యథాజీవిత చితణను మానడం వాస్తవికతకు గొడ్డలిపెట్టు. అట్లని అశ్తీలాన్ని మట్టుకే చ్మితించడం బతుకులోని మంచికి, అందమైన దానికి, వెలుగుకు కళుమూసికోవడమవుతుంది. జీవితం ద్వంద్వాల సమ్మిశ్రం. మంచి చెడ్డలు వేర్వేరు నిష్పృత్తులలో వున్నప్పుడు, పూర్తిగా మంచినిగాని, పూర్తిగా చెడ్డనుగాని చిత్రిస్తే, అది వాస్తవవాద చిత్రణకాదు. అట్లని చెడ్డను ఆకర్షవంతం చేయడమా? “కన్యాశుల్కం” నాటకం నైతిక ప్రయోజనాల కుపకరించక, అపచారం

2484 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము చేస్తున్నదని, యువజనం చెడిపోగలదని, మీనాక్షీ మధురవాణులు సమ్మోహనాస్తాా లయ్యారనీ మిత్రులొకరు సూచించగా, తాము దుర్గుణాన్ని ఆకర్షవంతం చేయలేదని అప్పారావు గారు ఉద్దాటించారు. మధురవాణి చివరకు సంస్కరింపబడి నందుచేత, నాటకానికి ఒక నైతికోదాత్త గుణం సం[క్రమించిన దన్నారు. స్త్రీ పురుష సంబంధాలు వస్తువుగా కలిగిన కావ్యాలు ఉన్నత సాహిత్యంలో అ(ప్రధాన స్థాన మా(క్రమిస్తున్న వన్నారు. “బతుకులోనూ, సాహిత్యమందునూ లైంగిక సుఖాలు ఉచితస్థానం తీసుకోవాలి... ఆదర్శప్రాయం చేయదగిన నిజమైన (ప్రేమ క్రైస్తు, షెల్లీ, బుద్ధులు బోధించిన మానవ(పేమ.” స్త్రీ భోగ వస్తువుమాత్రమే కాదు. శారీరక భోగము జీవితములో అప్రధాన విషయము. ఇవి అప్పారావు గారి విశ్వాసాలు. జీవితములోని నీచ ప్రకృతికి లోనైన మధురవాణి, మీనాక్తులలోకూడ మానవత్వాన్ని దర్శించగలిగిన మానవవాది అప్పారావుగారు. జీవితములోని ఉచ్చప్రకృతికి చెందిన పాత్రలనుకూడ ఆయన సృష్టించినారు. పూర్ణమ్మ, కన్యక, మెటిల్దాలవంటి వారు. ఎక్కడా అవినీతిని అపయత్నంగానైనా ఆదరించడం చేయరు. ఆయన గురి మానవహృదయ సంస్కరణ. ఆయన సాధ్యాన్ని సిద్ధింపజేసిన థి మహాసిద్ధుడు! (కిన్నెర: సంపుటము 6. సంచిక 111, నవంబరు 19954) సర సనన! ళ్యగ్లోళ్లీ ర. న్‌ వో " ఫం 1 | (యు 4 గ్ర ౫ /ఈ

తెలుగు సాహిత్యంలో క్రొత్త తెన్నులు

గురజాడవారి బహుముఖప్రతిభ

రమణారెడ్డి

ఈశేడు లోకాలను ఉదరాన తాల్చిన జగన్నాథు డెట్లో, గురజాడ అప్పారావుగారు అట్లే. సూతకారుడు, భాష్యుకారుడు, (ప్రవక్త, కవి, నాటక కర్త, కథారచయిత, వ్యాసకారుడు, శాసన పరిగోధకుడు, చరిత రచయిత, బహుభాషా పండితుడు, సంఘ సంస్కరణాఖిలాషి, భాషా సంస్కరణాఖిలాషి, (దష్ట, పరిశీలకుడు, చతురుడు, హాస్యప్రయుడు, దేశాభిమాని - యిన్ని వివిధ మూర్తులను తన ఒక్కనిలో మేళవించుకొనిన యీ మహావ్యక్తి ప్రాతః స్మరణీయుడు, వంద్యుడు, పూజ్యుడు. ఏకముఖంగా మాత్రమే (ప్రకాశింపక, అనేక ముఖాలుగా విరాజిల్లిన ఆయన వ్యక్తిత్వము నిజానికి ఆశ్చర్యజనకమైనది. సులువుగా విడమర్చి లేల్చిచెప్ప వీలుకానిది. అవసరాల సూర్యారావుగారి అహోర్యాత పర్మిశమ ఫలితముగా, “విశాలాంధ్ర ప్రచురణాలయము” వారి ధర్మాన, అప్పారావుగారి డైరీలు ఆంధ్రులకు అదృష్ట సౌభాగ్య నిధులుగా వెలువడినవి. వాటినుండి (గగ్రహించతగినది చాలావుంది. 1880 మొదలు చేసికొని 1914 వరకు తన బ్రతుకున సంఘటిల్లన ముఖ్య విషయాలను ఆయన వాసిపెట్టుకొన్నాడు. డైరీలు వాయడమనేదే అలవాటు లేనివారు తలుగు రచయితలు. అహంభావ మతిశయించి బాధ్యతలనేవి గుర్తించని మహావ్యక్తుల వల కాక, ఆగామి ఆంధ్రజనత పట్ల తమకు వుండుకొన్న బాధ్యతలను

2486 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4; సాహిత్యము గుర్తెరిగినవారు కనుకనే అప్పారావుగారు డైరీలు వ్రాయడము జరిగివుండవచ్చును. తన కృషియొక్క మూల్యమందు తనకుండిన నమ్మికకు యిదే తార్కాణము. తనతోబాటుగా దురంతమందగలిగిన క్షణమిత ప్రయోజకాలయిన కుక్కగొడుగు వాదాలను సమర్థించిన రచయితకు యింతటి ఆత్మవిశ్వాసము వుండదు. తనను మీరి బ్రదుక గలిగిన మహావాదాలను సమర్థించినందుచేతనే, అప్పారావుగారికి అంత ఆత్మవిశ్వాసము వుండింది. ఇది అనుపమమైనది. సమకాలికులైన మేధావులందరికి యదురుత్రొక్కి, సానుభూతి సహకారాలే క్షామమై, ఈసడింపులు అపహాసాలు, అప్రతిష్టలు, అపనిందలు, అవమానాలు మట్టుకే తామరతంపర అయిన దినాలలోనూ ఆయనలో తొటుబాటు, వెనుకంజ, సందేహము అనే పంచమాంగదళ శక్తులు (ప్రవేశించలేదు. దుర్గంవంటిది ఆయన వ్యక్తిత్వము. దీపస్తంభ మాయన. ఎంతటి పెనుగాడ్పులకుకూడ చెక్కు చెదరని దా దీపశిఖ. ఆత్మవిశ్వాసమే అందు నూనె. ఆయన మార్గదర్శి. దష్ట కానివాడు మార్గదర్శి . . కాలేడు. ప్రవక్త కానివాడు నమ్మిక పుట్టించలేడు. ఆయన దదష్ట. ప్రవక్త. దూరాన నిలుచుని నీతులుచెప్పేవానియెడ గురి కలుగదు. జీవిత సాగర మథనము చేసి, హాలాహలమునూ అమృతమునూ విడదీసిన అప్పారావుగారు సర్వులకూ సమీపవర్తులు, సహభాగులు, సహచరులు. తాను దిగి పడివున్నవారిని పైకెత్తినారు. తాను చూచి, బోధించినారు. తాను తిని రుచి నిర్ణయించినారు. కనుకనే ఆయన ఆప్తులు, రక్తబంధువులు, ఆత్మీయులు. కాని ఆయనలో కొన్ని విశిష్ట గుణా లుండుకొన్నవి. చెడుగును కోపించి చేసేదేమిలేదని ఎరుగుదురు; ఇబెడు గనేది విడిగా ఒకటి లేదని ఎరుగుదురు. నరులలో కొన్ని అవాంఛనీయ లక్షణాలను చెడుగుల [కింద జమకట్టినారని ఎరుగుదురు. కనుక మనఃపరివర్తననే ఆయన ఆకాంక్షించినారు కాని చెడుగును సిర్మూలించడానికి చెడు మనుష్యులను హతమార్చ పూనుకోలేదు. కనుక వారి మనస్సుల కెక్కే తీరున, తిరుగ జాలి దయ, ధర్మము అనే దైవగుణాలు దారితప్పినవారిలో మొలకెత్తవలెనని, వారు పదుగురేగు త్రోవ త్రొక్కవలెనని ఆయన అనుకున్నారు. అందుచేత నిందాగర్భిత పరుషవాక్కులు నిషృ్ర్రయోజకాలని గుర్తెరిగినారు. నిందాగర్భిత చతుర వాక్కులలోని అధికతరసత్త్వాన్ని గమనించినారు. అధిక్తేపణకంటె, ఆర్భాటానికంటి ఆవేశానికంటె పటుతరమయిన మరో మహాయుధాన్ని చేదాల్చినారు. ఆ వాడీ

గురజాడవారి బహుముఖప్రతిభ రమణా౮త్రి 2487 కత్తిమొనకు నవ్వును అంటించారు. అది వికటమైనది కాదు. విరసమైనది కాదు, వాడినదికాదు. వుత్తిది కాదు - తలవంపులు ఘటించ కలిగినది, ఆత్మ పరిశోధన చేయించకలిగినది, స్వాపరాధాలను గుర్తింపచేయ కలిగినట్టిది, పశ్చాత్తాపం పుట్టించకలిగినది, ఉన్నదారి వదలి మంచిదారి పట్టించగలిగినది. కనుకనే సహచరులు, సహభాగులు, సహాభిలాషులు అయిన వీరేశలింగం పంతులుగారు ఎందుచేత వీగినారో, అందుచేతనే అప్పారావుగారు నెగ్గినారు. వీరేశలింగంగారిలోని లోపాలే అప్పారావుగారిలో సుగుణాలు. కొందరు విమర్శకులు అప్పారావుగారి “కన్యాశుల్కం” నాటకాన్ని (ప్రహసనంక్రిందకీ జమకట్టినందుచేత, యింతగా నొక్కి చెప్పవలసి వచ్చింది. (ప్రహసనమనేది దశవిధ రూపకాలలో ఒకటికనుక, ప్రహసనమని పేరు "పెట్టినప్పటికి అప్పారావుగారి క్ర్‌ర్తి శరత్తుకు ఏమాత్రము కళంకము రాబోదు. కాని హాస్య మెంతపని చేయగలదో ఆయన గుర్తించినారు కనుకనే సంఘాన్ని ఆయన అపహసించినారు. కనుక శ్రీపాద కామేశ్వరరావుగారు అన్నట్లు, ఈ ఉద్దుంథమును “చులకనచేసి “1న 216౯4 & ౧8౧06" అనుట విచారకరము.” ఇక డైరీల విషయానికి వస్తాను. మొదట, అప్పారావుగారి యిష్టానిష్టాలను గురించి యిందునుండి చాలావరకు తలిసికోవచ్చును. ఆయన పఠనాప్రియులు. చరా ఏట్రయులు. “౧౬౦106 0 ౬1000(10౧”, “౫/౧9 ఉం[ంణ. “4115 0౧ 8100610౧”, “తీ ౦0% గింం౧6 ౬1612166”, “&ిగి21/515 01 6౬౧౩115౧ (2౧౫౮౭౦౯౪”, “౧164566 01 069641100/ ౧6261౧౮”, “వాగ్విధాయిని, “కథ్దాసప్తతి", “అభిజ్ఞానశాకుంతలము”, 110119200౧ దొర, ౬౦! దొర భండార్కరుగారలు సేకరించిన శాసన సంపుటాలు, “51206 462014 110౧9 ౦01 5%4465062/6”. “౧6 ౧6౧912౧ [230౧100 ౧14, “90౧2గ4|0 5914240౧ 4౧06 0- గా౭(౦ 00౧426౮67౯ ,౧౧6 00/౭౮ ౦1 1౧౦౪”, “తీ 506% 1౧ ౬0౦౧1 ౬1610౯8”, “౧9 ౧6 48౯ 1౧ 0౧1౧4౬”, 706 080150 సీడ10041 7౧64069”, “106 తీగ 0 0గ౪165౧౧”, “షగ0189౧| ంగాం౪గ, “గిగ : ౧6|8[100 10 గాడగొ, “14గాంలగ, “ఉిగాంగండ0 గేో౪గాంటగ, “500141 ౬16 1౧ తగ, “గిగ 2౧6 140౧3107, “5౯౧౮15౧ [0/21 గ0616/7, “౬1౧16 2౧6 గ65106103 01 1006౧ ౧౦౭౧7. “0184106120 [౦౬ 50౧09”, “౧6 506% 0 06110 ౬1672046”, “౯౦61౫ 01 114118౧ 01416015", “9426”, “1240041 004266౯, “౧6 86గ౫656 ౧601069” వంటి రచనలను ఆయన చదివినందుమీదట ఆయన రచన లేవిధాన మార్చు చెంద గలిగినవో నిర్ణయించడం అంత కష్టంకాదు. ఆయన కృషికి మూల్యం యెంత కట్టవలనోకూడ ఆలుస్తుంది. నానాదేశ జానపద సాహిత్యాలు, నాటకరంగాలు, జాతిలక్షణాలు, నానాదేశ హాస్య చతురత, కళావిషయాలు, పాత్రపోషణ, విదూషక పాత్రలు, నాయిక పాత్రలు, సాహిత్య విమర్శారీతులు - వీటన్నింటియెడ అపారమైన ఆసక్తిని

2488 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము కనుపరచినాడు. స్యీయ రచనలద్వారా యీ పథాలలోనే అసవూను డనిపించుకొన్నాడు. తొలి సాంఘిక నాటకరచనయీ కాక, ఆపూర్వ పృాతపోషణా నైపుణి, దేశిసాహితీ పునరుద్ధరణ, హాస్య చతురత, సాహిత్య ఐమర్శా విధానము

  • యివన్నీ సాహితీపరుడుగా అప్పారావుగారు నెలకొల్పిన ప్రజాతంత్ర రచనా సంప్రదాయానికి నిర్వచనాలైనవి.

ఆయన చర్చాప్రియు లన్నాను. మహారాజావారి ఆస్థానములో ఏర్పడిన డిబేటింగ్‌ క్లబ్‌కు ఉపాధ్యక్షుడైనంత మాత్రాన నే నా అభిప్రాయానికి రాలేదు. “మానవులలో పశుప్రవృత్తిని గురించి, “జ్ఞానప్రదమైన సాహిత్యము, శక్తివంతమైన సాహిత్యము” గురించి, లిటరరీ సొక్రైటీలను గురించి, పైకా నిర్వహణ పద్ధతులను గురించి, భాషాంతరీకరణలను గురించి, విద్యావిధానం గురించి, మాతృభాషా బోధనలోని లోపాలను గురించి, పాఠ్యగంథాలను గురించి, కాంపోజిషన్లను

గురించి, బోధనా పద్ధతులను గురించి, ఆంధ్రదేశ రాజవంశాలను గురించి -

ఒకటేమిటి, సాహితీ పునరుజ్జీవనానికి అత్యవసరాలైన ప్రతియొక అంశాన్ని విదేశీయులతోటీ, దేశీయులతోటీ, కళాశాలలలోనూ, యిళ్లలోనూ చర్చించడం ఆయన వృత్తులలో ఒకటి.

ఆయన గొప్ప పరిశీలకుడు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు తమ కంటి కానినవాటినన్నిటిని గుర్తుంచుకొన్నాడు. తుమ్మచెట్లు కింద పచ్చిక మాసికలు, ఆముదపుమైరులు, అడ్మిరాళ్టీ హౌస్‌లోని తోట, బెంగుళూరు బావులు - యిటువంటి అచేతనాలేకాక, ఆయన ముఖ్యంగా మానవ పరిశీలకుడు. నటనలు, అసూయలు, మోసాలు వంటి మానసిక భావాలేకాక, ఉచ్చరణలు, యాసలు, మాటతీరు - యివీ గమనించి గుర్తుంచుకొనే వాడుక. నాటకాలు, సభలు, సమావేశాలు, రాజకీయపు కాన్ఫరెన్సులు, పాట కచ్చేరీలు - అన్నిటికి పోయాడు. చూశాడు. విమర్శించుకొన్నాడు. మానవులలో లోతులు తరచి చూడగల సూక్ష్మదృష్టిని అలవరచుకొన్నందుచేతనే, ప్రాణం తొణికిసలాడే ప్యాతలను సృష్టించాడు. పామరజనాన్ని బాగా ఆకర్షించగల “ఏకాంగి” అనే యోగిక్తీ కన్యాశుల్క నాటకంలో

వైలాసయా(తచేసి అప్పుడే విజయం చేసిన యోగికీ కాస్త కూస్త పోలిక వుంది.

మెటిల్జ్టా అనేపాత్ర యేతీరున రూపొందిందో తెలిసికోవడానికి, వంటలక్క చెప్పినకథ (డైరీలు, పుటలు 112, 113, 114, 115, 116. 117) కొంత వుపకరిస్తుంది.

గురజాడవారి బహుముఖప్రతిభ రమణారెడ్ధి 2489 అట్లాగే “బిల్లణీయం”లో కర్టమహారాజు పాత్రకు తన జీవితంలోనే అప్పారావుగారికి నమూనా దొరికింది: ఆనంద గజపతి మహారాజులుంగారు. ఆయన యెన్నో వ్రాద్దామనుకున్నారు : “ఒక వ్యాకరణము, భారతదేశ చరిత్ర, ఆంగ్లదేశ చరిత్ర, ఇంగ్లండులో ప్రచురించుటకై ఆంగ్లములో కొన్నికథలుః (గీసు రోము చరిత్రలను తారతమ్యములతో రచించుట, ఆధునిక జీవితమును అభివర్జిస్తూ ఇంగ్లీషున నవలారచన.*” ఎట్టి విప్రతిపత్తి లేని దక్షిణ భారతదేశ చరిత్రను ఆదరువు చేసికొన్న కొన్ని చారిత్రక నాటకాలు, మహారాజావారి వంశ చరిత్ర, ఆంగ్లో యిండియన్లను గురించి ఒక నాటకము. కాని యిది జరుగలెదని ఇెప్పనక్కరలేదు. ఆయన వ్రాసినదే చాలు, ఆయనను స్మృతిలో చిరంజీవి నొనర్చేటందుకు, విశ్రాంతి యెరుగక పరిశ్రమించారు. “నాకు “విశ్రాంతి” అనేది కల్ల. నా మెదడు ఎప్పడూ పనిచేస్తూనే వుంటుంది. ఈ కృషినుంచి నేను తప్పించుకుంటా ననేది పొసగని మాట. డాక్టర్లు ఎన్ని సలహాలిస్తేనేమి! వాటిదారి వాటిదీ : దీని దారి దీనిదీ! శ్రమ అధికమై, ఇక నే నేపని చేయజాలని పరిస్థితే కలిగినప్పుడు, నా కిక బతుకుమీద ఆశేలేదు. పనిచేయలేకపోవడమనేది ఒక విషమ పరిస్థితి.” ఏ ప్రయోజనాన్ని ఆశించి యింత నిర్విరామకృషికి పూనుకొన్నాడో అందరూ ఎరుగుదురు. అందుకే ఆయనఎడల కృతజ్ఞులై వున్నారు. (కిన్నెర: సంపుటము 7, సంచిక 2, ఫిబ్రవరి 1955) స్ట: పచ న

నన్నెచోడ దేవ దేశికవి (క్రీశ 828-882) టేకుమళ్ళ కామేశ్వర రావు నన్నెచోడ దేవుడు మహాకవి అని నేటివారమైన మన మందరం ఎరుగుదుము. కాని వెనుకటివారిలో అతని పద్యాలను వాడుకోని ఆంధ్ర మహాకవి లేకపోయినా అతన్ని నేరుగా ప్రశంసించినవాడూ లేడు. మరొక విధంగా అయినా నన్నెచోడుని పేరును స్మరించిన వాడు అధర్వణ కవి. అధర్వణ కవి పద్యం అధర్వణాచార్య కవి క్రీ.శ. 1200 ప్రాంతంవాడు కావచ్చు. అతను నన్నెచోడ దేవుణ్ణి గురించి - క. మగణమ్ము గదియ రగణము వగవక కృతి మొదట నిలుపువానికి మరణం బగు నిక్కమండ్రు మడియడె యగునని యిడి తొల్లి బేంకణాదిత్యుడనిన్‌. అని పేర్కొన్నాడు. దీనిలో చెప్పబడ్డ టేంకణాదిత్యుడు నన్నెచోడుడే! అతనే యుద్ధంలో మరణించేడు. నన్నెచోఢుడు ఎంతో పూర్వపువాడు కాబట్టి అధర్యణుడు “తొల్లి అను మాటను ప్రయోగించేడు. నన్నెచోడుని బహు ప్రాచీనతను మాత్రమే ఆ శబ్దం సూచిస్తూంది. ఈ పద్యంలో నన్నెచోడుని మరణాన్ని స్మరించడానికి మరొక కారణం లేకపోలేదు: చోడుడు వయఃపరిపూర్ణుడు కాకుండా యుద్ధంలో మరణించడం బట్టికూడ ఈ పద్యం పుట్టి ఉంటుంది. పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము

నన్నెవోడ దేవ దేశికవి క్రీ.శ. 828-882... టేకుమళ్ళ కామేశ్వర రావు 2491 అతని తలిదండ్రులు నన్నెచోడ కవి తన తలిదండ్రులను గురించి, వంశాన్ని గురించి చాల కొంచెంగా మాతవే చెప్పుకొన్నాడు. వారు ఫలానా కాలంవారని శాసనాధారంవల్లకూడ స్పష్టంగా చెప్పడానికి వీలుకావడం లేదు. నన్నెచోడ దేవుని తండ్రి చోడబల్లి. తల్లి హైహయ (కాలచుర్య) వంశజురాలైన శ్రీదేవి. హైహయులు చాలా పూర్వకాలం నుంచి చరిత్రలో కనబడుతున్నారు. రెండవ విజయాదిత్యుని (క్రీ.శ. 806-846) సవతి తమ్ము డై ఉండవచ్చని చెప్పబడ్డ నృపరుద్రుడి తల్లి హైహయ వంశస్థురాలు.' కాలచుర్యులు అంతకుముందు అటు తర్వాతకూడ ఉన్నారు. నన్నెచోడ దేవుడు తన వంశ చరిత్ర అతి క్లుప్తంగా చెప్పుకోడానికి కారణ మేమంటే - అతను ఉండిన కాలంనాటి సంప్రదాయమది. ఈ అంశం అతనికి సమకాలికులైన తూర్పు చాళుక్యరాజుల శాసనాలనుబట్టి తెలుస్తుంది. “పూర్వ చాళుక్యు లైన కుబ్బ విష్ణు వర్థనుని నుండి అయిదవ విష్ణువర్ధనుడిదాక (క్రీశ. 624-847) వారు ముగ్గురి పేళ్ళను అనగా దాత (దాన మిచ్చినవాడు) ఆతని తండ్రి, అతని తండ్రి (అనగా తాతుని మాత్రమే సాధారణంగా తెలుపుకొనేవారు. వారు ముఖ్యమైన చారిత్రకాంశాలనే చెప్పుకొనేవారు కారు. “ఇది పూర్వరాజుల లక్షణమని పాటించవచ్చు. నాల్గవ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో పరిపాలించేరని చెప్పదగిన ఇక్ష్వాక రాజులలో (ప్రముఖుడైన వీరపురుష దత్తమహారాజు తన శాసనాలలో తన తండ్రి మాటేకాని తాత సంగతి చెప్పకపోవడం చేత అతని పేరే తెలియడంలేదుోో కళింగ దేశాన్ని పరిపాలించిన పూర్వ గంగవంశపు రాజులు తమ శాసనాలలో సాధారణంగా తమ తండ్రుల పేళ్ళను మాత్రమే చెప్పుకొనేవారు, బహు సకృతుగా తాత పేరును తలియజేసేవారు” నన్నెచోడుడు తన తాత సేరైన చెప్పుకోవడం అనవసరంగా భావించేడు. అతని తలిదండ్రుల పేళ్టు దొరికిన శాసనాలనుబట్టి నేరుగా కనుక్కోవడానికి సాధ్యం కావడంలేదు. తలా

  1. చిలుకూరి వీరభదరావుగారి ఆంధ్రుల చరిత్ర మొదటి భాగం, పుట 276.
  2. 7౧6 ౬25667 0జ|౮న/88 0 ౪౭౧౦| 0/ 0౧ స. ౪9౧౬812/2గ2౧2)౧/8 ౬1.
  3. ఆంధ్రదేశ చర్విత సంగ్రహము - మల్లంపల్లి సోమశేఖర శర్మగారు రచించినది, పుట 16. ౩౭. గీ గేగి.5. ౪0౫18 ౯ 116.

2492 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము నన్నెచోడుని పేరు నన్నెచోడుని తండ్రిపేరు బల్లిచోడుడు కదా! ఈ కవిరాజు తన పేరులోని వంశనామాన్ని మార్చివేసేడు. దీనికి కారణం అతని రాజ్య విస్తృతియే కావచ్చు. తాను ఉట్టి చోడుడు కాడు. “వోడ దేవుణ్ణి అని కుమారసంభవ కావ్యగద్యలో చెప్పుకొన్నాడు. ఆకాలంలో ఉన్నటువంటి అనేక చిల్లర చోడ వంశాలనుంచి తన వంశాన్ని గుర్తించుకోడం కోసమే అతను వంశనామాన్ని అట్లు మార్చేడని మనం సమాధానం చెప్పవచ్చు. ఈ శబ్బసంపుటిని ఇటునుంచి అటు మార్చడానికి వీలులేదు. వంశనామంలోను బిరుదులోను ఉండే కరాకండితనమే అది! అతని _ వంశంలోని మొదటి చోడ దేవుడు అతనే నేమో! అతని పేరును అటుతర్వాత “దేవ చోడుల” మని చెప్పుకొన్నవారి "పేర్లతో గజిబిజి పడరాదని నా మనవి. కవిత్వ పరిస్థితులను బట్టి ఈ వంశనామాలు కొంచెం మెత్తపడ్డా గద్య (ప్రశస్తులలో అట్టిది సాధారణంగా జరుగదు. అతని బిరుదులు నన్నెచోడ దేవకవికి “బెంకణాదిత్యుడు” (ఆ.1 ప 54), “కవిరాజ శిఖామణి (ఆ 1 ప 57), “రవికుల శేఖరుడు” (ఆ 1 ప57), అను ముఖ్య బిరుదులున్నాయి. మొదట్‌ రెండు బిరుదులను గురించి ఇటు తర్వాత మరొకచోట విపులంగా చర్చిస్తాను. “రవికుల శేఖరుడు” అను బిరుదు ఎట్లేర్పడిందో? క్రీ.శ. 850 ప్రాంతపు దక్షిణ హిందూదేశ చరితను పరిశోధిస్తేనే కాని ఇది తెలియదు. అంతకి పూర్వమే ఈ మోస్తరు బిరుదులు కొన్ని ఉండి ఉండాలి. పరిశోధిస్తేనే కాని ఆలియదు. క్రీ.శ. 950 ప్రాంతంలో కులశేఖర అను ఒక కేరళరాజు మహాభారతంలోని రెండు కథలను “సుభద్రా ధనంజయము" ,“తపతీ సంవరణము” అను పేరుగల సంస్కృత కావ్యాలుగా రచించేడు. ఆంధ్రము : తెనుగు ". నన్నెచోడ దేవుని కాలంనాటి కింకా “ఆంధ” శబ్ద మేర్పుడలేదు. కాబట్టి అతను “అంధ్ర” అను మాటనే వాడేడు (ఆ 1] ప23;ఆ3ప 54). అప్పటికింకా “తెలుగు” అను మాట కూడ ఏర్పడలేదు. కాబట్టి “తెనుగు” అనే ఉపయోగించేడు (ఆ 1 ప 23; ప 35).

నన్నెచోడ దేవ దేశికవి శ్రీశ. 828-882 బేదమళ్ళ కామేళ్చుర రావు 2493 మార్గకవి స్తుతి - అతని కాలంనాటికి కవులందరు రెండు రకాలు - మార్గ కవులు, దేశి కవులు. మార్గకవులన్న పేరుకి కారణ మిది - మహా కవులు సంస్కృత భాషలోనేగాక [ప్రాకృత భాషలలోకూడ ఉన్నారు. హిందూమతానికి సంబంధించిన (గంథాలు, కావ్యాలు సంస్కృత భాషలో విశేషంగా ఉన్నా, వైన బౌద్ధ మతాలకు సంబంధించిన (గ్రంథాలు ప్రాకృత భాషలలో ఉన్నాయి. ఇదంతా కలిపి పేర్కొనాలంటే, మార్గకవిత్వమనీ, మార్గకవులనీ చెప్పాలి. అందుచేత నన్నెచోడుడు వాజ్బయ సందర్భంగా మార్గశబ్దం వాడేడు. ఆ కాలంలో మార్గశబ్దం కొన్ని ఇతర పద సంపుటులలో కూడ కనబడుతూంది. వాటికి భిన్నమైన అర్థాలు ఉండవచ్చు. అమోఘ వర్షుడు “కవిరాజ మార్గ” అసు కన్నడ (గ్రంథాన్ని రచించేడు. అతనికి సమకాలికుడైన తలకాడ గంగరాజు పేరు “నీతిమార్గ విక్రమ.” నన్నెచోడ దేవుని మార్గకవిస్తుతి అతని కాల నిర్ణయానికి ఒక సరిహద్దుగా ఏర్పడుతూంది. ఆ కప్పులలో ఆఖరివాడైన ఉదృటుడు అలంకార శాస్త్రంలో కుమారసంభవ కథను ఇమిడ్చిరాసేడు. ఉదృటకపి (క్రీశ. 780 - 820 మధ్యవాడు. కాబట్టి నన్నెచోడ కవి కాలనిర్ణయానికి అది పూర్వ సరిహద్దుగా ఏర్పడుతూంది. దేశికవి యుగం నన్నయభట్టుకి పూూర్వయుగానికి ఒక్కటే పేరు తగి ఉంది. అదేదంటే - దేశికవి యుగం. ఈ యుగంలో తెలుగు దేశికవిత్వాసికి సంబంధించిన [ప్రారంభం, ఇతర పరిస్థితులను నన్నెచోడ దేవుడు రెండు మాటలలో తెలియజేసేడు - క. మునుమార్గ కవిత లోకం బున వెలయగ దేశికవిత బుట్టించి తనుం గున నిలిపి రంధ్ర విషయం

  • బున జనంసత్యాశ్రయుడు దొట్టి చాళుక్య నృప్పుల్‌. (ఆ. ప 23) 1ఆఖరి చరణంయొక్క పాఠాంతరం చాళుక్యరాజు మొదలగు పలువ్వురి.] నన్నెచోడుడు తెలియజేసిన సత్యాశయుడు రెండవ పులకేశి (క్రీశ. 609 - 642). ఇతను ఆంధ్రదేశాన్ని జయించేడు. నన్నెచోడుడు చాల (ప్రాచీనుడు కాబట్టి అంతటి పూర్వపు సంగతులను మనకు చెప్పగలిగేడు. సత్యాశ్రయుడు (అనగా

2494 - పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము రెండవ పులకేశి ఆంధ్రదేశాన్ని జయించి ఊరుకోలేదు. తెలుగు కవులను ఆదరించేడు. పండిత కావ్య రచనను వృద్ధిచేసేడు. అతన్ని తక్కిన చాళుక్యరాజులు అనుసరించేరు. వీరంతా సత్యాశ్రయులు కారు, సత్యాశ్రయ కుల తిలకులు మాత్రమే! సత్యాశ్రయుడు పశ్చిమ హిందూ దేశంలో ఉంటూ కూడ తెలుగుతో రాజకీయ సంబంధం కలిగి ఉండి, వారి రాజకీయాభివృద్ధికి కారకు డయేడు. ఇతని సభలో తెలుగు కవులుకూడ ఉండడంచేతే ఆ తర్వాతి కాలంలోకూడ వేంగి దేశంనుంచి పంప, పొన్న మొదలగు కవులు వెల్లి పశ్చిమ రాజసభలను అలంకరించి, ఆ రాజులు కోరినట్లుగా కన్నడ కావ్యరచన చేసేరు.

సత్యాశ్రయుడు వేంగీ దేశాన్ని జయించిన తర్వాత కొంత కాలానికి అక్కడ రాజప్రతినిధిగా తన తమ్ము డైన కుబ్జ విష్ణు వర్ధనుణ్ణి క్రీ.శ. 624లో నియమించేడు. తలుగు దేశంలో వేంగీనాడు ఒక చిన్న భాగం. అది సత్యాశ్రయ పులకేశి చేతికిందే ఉంది. అందువల్లే అతనికి తెలుగు సాహిత్యాన్ని పోషించే అవసర మేర్చడింది.

నన్నెచోడుని నాటికి అనగా క్రీ.శ. 850 నాటికి ఉండే సంస్కృత ప్రాకృత కర్ణాటాది కావ్యలక్షణాలను, భాషాలక్షణాలను తెలుసుకొంటేగాని అతని కవిత్వం పూర్తిగా అర్ధం కాదు. అతను భాషలోను, భావంలోను, ఉండే చమత్కారాలను బైటపెట్టేడు. ఇది ఆ కాలపు కవిత్వ లక్షణం. అతని కాలానికి ప్రాణములు పది, అలంకారాలు ముప్పై ఆరు మాత్రమే! (ఆ 1 ప 45)

నన్నెచోడుడు ఆనాటి దేశికవులలో ఒకడు. ఈ కవి కాలానికి దేశికవిత్వం

" కొత్త మార్గాలను తొక్కింది. వాటిని మాత్రమే ఇతను అనుసరించేడు. ఆ విషయం

ముందు ముందు చూద్దాం. దేశికవి స్తుతి

నన్నెచోడుడి కాలానికి ప్రత్యేకంగా ఆంధ్రకవులనీ, కన్నడ కవులనీ భేద మున్నట్లు కనబడదు. వీరందరు మొత్తంమీద దేశికవి వర్గంవారే! ఇతను తెలుగు కవులనీ, తెలుగు కవిత్వమనీ చెప్పవలసిన చోబ్లెల్లా దేశికవులనీ, దేశికవిత్వమనీ అన్నాడు. మైగా ఆంధ్ర దేశమంటే ఒక్క తెనుగుదేశమనే అర్థమున్నట్లుగా కనబడదు. ఆంధ్రదేశమంటే చాలా విస్తారమైనది. దానిలో మాట్లాడే భాషలలో ఒకటి మాత్రమే తనుగు భాష!

ఇతను మార్గకవులను వేరువేరు పేర్లతో స్తుతించినట్లుగా తెనుగు కవులను స్తుతించలేదు. దానికి ఈ కింది కారణాలు కనబడుతున్నాయి.

నన్నెచోడ దేవ దేశికవి క్రీశ. 828-882 బేవమళ్ళ కామేశ్వర రావు 2495

  1. మార్గకవులను విడివిడిగా స్తుతించినట్లుగా తక్కినకవులను స్తుతించే సంప్రదాయం ఏర్పడలేదు. ఈ సంప్రదాయమే కవి జనాశ్రయ కర్త అవలంబించేడు. ఈ

. సంప్రదాయం నన్నయభట్టు నాటికికూడ మారలేదు.

  1. మతముల స్పర్ధలు. ఏ మతానికి ఆ మతమే ప్రజలనందరిని వశపరచుకోవాలని చూసేది. జైన బౌద్ధ మతాలను కుమారిల భట్టు, శంకరుడువంటి మతోద్ధారకులు కూలదొయ్యడానికి బయలు దేరేరు. ఇట్టి సందర్భంలో పెర మతస్థులైన కవులను కవిస్తుతిలో చెప్పడానికి కవులకు మనస్కరించలెదు. ఈ మతం పట్టుదల అటు తర్వాతి కాలంలో కూడ అలాగే ఉండేది. పన్నెండో శతాబ్దంలో వీరశైవ మతం విజృంభించింది. పాల్కురికి సోమనాథ మహాకవి బయలుదేరేడు. కాని ఇతన్ని ఆ తర్వాతి స్మా ర్తకవు లెవరూ కవిస్తుతిలో చేర్చలేదు. అబ్లే వీరశైవ కవులున్ను. ఇంతకీ వీరశైవం కన్నడ దేశంలోలాగు తెలుగు దేశంలో పెరగలేదు. దీనికి స్మార్త (అద్వైత) మత పప్రాబల్యమే కారణం.

  2. దక్షిణదేశ భాషాకవులకు మొత్తంమీద దేశికవులని కదా పేరు... నేటి కాలంలోలాగు ఆనాడు భాషాభేదాలు బిగిసిపోలేదు. ఒకే కవి ఇతర భాషలలో (గ్రంథరచన చేసేవాడు. ఈమోస్తరుగా చేసిన కవులు బోలెడుమందున్నారు. రాజులు అన్యభాషా కవులను ఆదరించేవారు. శుద్ధ తెలుగుదేశపు రాజైన గుణగ విజయాదిత్యుడు (క్రీ. శ. 849 - 6901) గుణగాంకియంో అను కన్నడ (గ్రంథాన్ని అంకితం పొందేడు. శుద్ధ తెలుగువారైన పంపకవి (క్రీ శ.

  1. కన్నడ గ్రంథాన్ని (కిరాతార్జునీయాన్న్ర. రచించేడు. వారు భాషల భిన్నత్వాన్ని (గ్రహంచకపోలేదు. ఒక కవి తెనుగు భాషలో (గ్రంథాన్ని రచిస్తూ

కన్నడ భాషా కవులను స్తుతించడం అసందర్భంగా కసబడుతుంది. ఇట్టి కారణాలవల్ల దేశికవిస్తుతి నామమాత్రమయింది. - తతా

  1. దేశి అను పదం పూర్వకాలంలో ఉత్తర హిందూస్థానంలో కూడ వాడుకలో ఉండేది. క్రీ.శ.

1000 ప్రాంతంలో అపభంశ భాషలో మునిరామసింహ వ్రాసిన “సాహుడ్‌ దోహా” అను పుస్తకానికి హీరాలాల్‌ ైస్‌గారు వాసిన పఏర్రికలో దేశిని గురించి ఈ [క్రింది అంశాలు చెలియపాసేరు. దండికి తర్వాత భామహుడు, రుద్రటుడు, రాజశేఖరుడు, నమిసాడ్డు, వాగ్భటుడు మొదలైన ఆలంకారికులు అపభంశ కావ్యాన్ని సంస్కృత, (పాక్ళృత కావ్యంత పాటు అంగీకరించేరు. ఒక్కొక్కచోట అపభ్రంశాన్నే దేశభాష అని వారు పేర్కొన్నారు. (పుట 39). దేశి, అప్మభంశ అను పదాలు రెండూ ఒకదాని కొకటి పర్యాయ పదాలు. కాని కపులు మాత్రం ఆ భాషను అవ్మభంశ మనక దేశి అనేవారు. వ్యాకర్తలు మాత్రం దానిని తరుచుగా అప(భంశమనే చెప్పుతూ వచ్చేరు. (పుట 6). " 306 గుణగాంకియం ఇప్పుడు లభించడంలేడు.

2496 ॥ పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 44; సాహిత్యము బుధస్తుతి నన్నెచోడ దేవుని కాలంలో తక్కినవాటితోపాటు బుధ (పండిత) స్తుతి ఉండేది. ఈ మహానుభావులు ఎంతంటే అంత! వారు ముద వేస్తేనేకాని కృతికి మోక్షంలేదు. ఈ దిగ్గంతుల మెప్పు వడసినదే కావ్యం. [ప్రాచీన అరవ వాజ్మయాన్ని పరిశీలిస్తే ఈ అంశం విశదమవుతుంది. అరవదేశంలో “సంగమ” సభలు ఏయే కావ్యాలు ఉత్తమమో నిర్ణయించేవి. కాబట్టి బుధస్తుతి కూడా ఆనాటి కావ్యాలలో స్తుతులలో ఒక భాగం. నన్నెచోడుడు వీరి నిట్లు స్తుతించేడు - కు. గులు తెజిగి వస్తుచయమున కొజగెడు నా దీపవర్తియునుబోలె నిజ మ్మెజిగి కృత వస్తుసమితికి వజలక మది నెజుగు విబుధవర్గము దలతున్‌. (ఆ 1ప 26) అరవదేశంలోలాగే ఈ ఆచారం అటుతర్వాత కనబడదు. ఏక కవి రచన ఒక్క కవే పుస్తకమంతా రచించాలనే నియమం పూర్వకాలంలో అంతగా లేదని చెప్పవచ్చు. సంస్కృతభాషలో ఎట్లున్నా తెలుగు దేశంలో ఇట్లుండేదని తలవవచ్చు. కావ్య రచనను కవి, అతని మిత్రులు లేక ప్రధానశిష్యులు పంచుకొనేవారు. ఛందో [గ్రంథాన్ని రచిస్తూన్న రేచన, వాచకాభరణుని సాయం తీసుకొని కవిజనాశయ రచనను [ప్రారంభించేడు. నన్నయభట్టుకి నారాయణభట్టు తోడయేడు. తిక్కన భారతాన్ని కొంతవరకు నడిపించి తక్కినదానిని ఇతరులకు వదిలేశాడు. రంగనాథ రామాయణం అట్టిదే! గోన బుద్ధారెడ్డి రామాయణమనడం నిష్ప్రయోజనం. భాస్కర రావాయణ౦లో పక్కువుంది చేతులు కనబడుతున్నాయి. పోతనకి ఇతరులు సాయపడ్డారు. ఈనాడు ముఖ్యసంపాదకుడు (0౧1౪౬64100 చేస్తూన్నట్లే ఆనాటి మహాకవులు సమర్థులైన వారని తోచినపక్షంలో, ఇతరులకు కొంత పనిని అప్పగించేవారు. అయినా ఈ (గ్రంథాలు ప్రధానకర్త పేరుననే చెప్పబడతాయి. తెలుగుదేశంలో ఘనకవులత్తోపాటు ఈ విధానంకూడా తొలగిందా?

నన్నెచోడ దేప దేశికవి క్రీశ. 828-882... బేకుమళ్ళ కామేళ్ళుత రావు 2497

నన్నెచోడుడు తాను ఒక్కడూగాక (గ్రంథరచనను “సత్కవి బుధ గురు బలము వడసొ (ఆ 1 ప 34) చేయదలచుకొన్నాడు. ఇతని గురువు మల్లికార్డున ముని కదా! అతను జ్ఞానంలోను, చాతుర్యంలోను, సాధనలోను, వస్తు కవిత్వంలోను సామాన్యుడు కాడు! అతనిలోని ఇన్ని లక్షణాలు కనిపెట్టే నన్నెచోడుడు అతన్ని ఉట్టి మల్లికార్డునుడని గాక చరిస్తూన్న (జంగమ) మల్లికార్జున దేవుడనే భావించేడు. ఈ మునిపుంగవుడు మునిపల్లెలోను, శ్రీకవైలంమీద, రాజసభలోను కూడ (ప్రత్యక్షమయవాడు. ఇతడు నన్నెచోడుడికి కావ్యరచనలో ప్రధానంగా సహాయపడ్డాడు. ఈ కవీంద్రుడు (ఆ 9 ప 164) లేకపోతే ఈ కావ్యమూ లేదేమో! ఇదంతా ఎరిగే ఈ కవిరాజు

ఎ ఎ జంగమ మలయ

వరమునందుగనిన వస్తుకవిత

దగిలి వారియంద నెగడింతు రవికి దీ

వనమున నర్చన లిచ్చు పగిదివోల (ఆ 1 ప 49) అని కృతి సహాయకుడికే కృతిని సమర్చించేడు. కావ్యము

నన్నెచోడుడు తన కావ్యాన్ని ప్రత్యేకంగా ప్రబంధమని చెప్పుకోలేదు. దీనిని కావ్యము, కృతి, కల్పము మొదలైనవిగా చెప్పుకొన్నాడు. గద్యలో కుమారసంభవ కథ అని మాత్రమే తెలియజేసేడు. ఈ పుస్తకానికి పెట్టిన పేళ్ళలో ప్రబంధ మొకటి మాత్రమే! వన్తు కవిత్వము; నిగూఢత్వము

వస్తుకవితలో నన్నెచోడుడు ఆనాటి కవులను (ఆ 1 ప 17 - 22) రెండు విధాలుగా పర్గీకరించేడు. వాల్మీకి (ఇతనూ వస్తుకవే, వ్యాసుడు, కాళిదాసు “పురాణ కవి సంఘమునకు సంబంధించినవారు. భారవి, ఉద్భటుడు, బాణుడు ఉత్తమమార్గ సత్కవీశ్వరులు. మొదటి గుంపుకి, "రండో గుంపుకి రచనా పద్ధతులలో ఛాలా లేడా ఉంది. పురాణ కవులు సరళ రచనకు పెంపొందించగా, మార్గ సత్కవీశ్వరులు క్లిష్ట సమాసాలు, అలంకారాలు, అంతరార్థాలు మొదలైనవాటితో రచించేరు.

2498 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము మల్లికార్జున ముని శిక్షణవల్ల నన్నెచోడుడు రెండోపద్ధతిని అవలంబించి తన కావ్యంలో సూక్తులు, భావాలు, మెజుగులు, కాంతి, వర్ణన, దేశిమార్గాలు, వివిధాలంకారాలు, పదార్థం మొదలైనవాటితో (ఆ1 ప 36) నింపేడు. ఇంకా, కావ్యం పైకి చూస్తే ఒకలాగుంటుంది. లోపలచూస్తే మరొక చిత్రముంటుంది (ఆ 1 ప 37). అంటె అంతరార్థ కథ ఉంటుంది. ఇంకా అతని రచనలో అర్థనివహం, చతురోక్తులు, రసార్ధోన్నతి ఇత్యాదులుంటాయి. చదువుకొన్న చదువంతా అందులో ఉంటుంది. కాళిదాసు కుమారసంభవ కావ్యరచనలో పురాణ కవుల సరళ మార్గాన్ని తొక్కేడు. నన్నెచోడుడు ఆ కథనే సంక్షిష్టవస్తు కవిత్వంతో నింపివేసేడు. ఈ మార్గం ఇతనికి చూపించింది మల్లికార్జున మునే (ఆ 1 ప 49) కాని ఇతరులు కారు. అంతరార్హ కథ నన్నెచోడుడు ఈ కావ్యంలో తన రాజాధిరాజు చరిత్రను అంతరార్థ కథగా ఇమడ్చ దలచుకొన్నాడు. సమకాలపు చరిత్రను తెలిపేటప్పుడు కొన్ని అంశాలలో గూఢత్వం అవసరం. ఈ కాలంలో కూడ యథార్థ విషయాలను కళలోకి ఎక్కించి కోర్టులకెక్కిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం. కాబట్టి యథార్థ విషయాలను చెప్పడంలో _ మెళుకువ అవసరం. సమకాలపు రాజుల చరిత్ర చెప్పడం మాటలతోపాటుకాదు. ఫెగా నన్నెచోడుని రాజ్య నిర్దేశం (51628100) కూడ అట్టిదే! అతను రాజాధిరాజుగా తూర్పు చాళుక్య రాజును అంగీకరించేడు. కాని, తనకు పొరుగుననే (బ్రహ్మాండమైన రాష్ట్రకూట రాజ్యముంది! వారితో శత్రుత్వానికి ఇదివరకే కొన్ని కారణాలుండగా కొత్త కారణాలను కల్పించుకోడం తగనిపని. కాబట్టి అతను ఆనాటి చరిత్రను అతి గూఢంగా చెప్పవలసి వచ్చింది. అతను తూర్పు చాళుక్యుల పక్షంవాడు. అందుచేత వారిని దేవతలతో పోల్చేడు. రట్టులను (రాష్ట్రకూటులను) రాక్షసులతో పోల్చేడు. దేవాసురయుద్ధమను నెపంతో ఆ రెండు రాజవంశాల కలహచరిత్రను వర్ణించేడు. వస్తుకావ్యంలో గూఢత్వం ఒక లక్షణం. పెకి కుమారసంభవ కథలాగు కనబడుతూన్నా లోపలంతా చాళుక్య రాష్ట్రకూటుల యుద్ధమే! ఇది ఆనాటి కవిత్వ సంప్రదాయం. దానిని అనుసరించి ఈ కవి అసమాన కావ్యాన్ని సృష్టించేడు.

సన్నెచోడ దేవ దేశికవి క్రీ.శ. 828-882. బేకుమళ్ళ కామేశ్వర రావు 2499 ఆ సంప్రదాయాన్ని అనుసరించే పంప అను కన్నడ కవి (క్రీశ. 941) భారతకథ (విక్రమార్జున విజయలంిలో తన కృతిపతియెన అరికేసరిరాజును అర్జునుడిగా చేసి కథను నడిపించేడు. రన్న (క్రీ.శ. 993) అను కన్నడకవి అజిత పురాణంలో భీముని పాత్రలో కైలపుని కుమారుడైన సత్యాశయుళణ్ణి ఐక్యపరచి ఆనాటి చరిత్రాంశాలను పడుగుపేకగా అల్లివేసేడు. వీరికి పూర్వు డైన నన్నెచోడుడు ఆ పద్ధతిలో అసమాన కావ్యాన్ని సృష్టించి తర్వాతి వారికి దారి చూపించేడు. మల్లికార్డున ముని నన్నెచోడుడు తన కావ్యాన్ని మల్లికార్డున మునికి అంకితమిచ్చేడు. ఈ మునిని అతను వందలకొద్ది పదసంపుటులతో స్తుతించేడు. వాటిలో “జంగమ” శబ్ద మొకటి. “మనుజాకర మహేశుడు” అను మాటలను “జంగమ మల్లికార్జునుడు” అని పరివర్తన చేసేడు. ఆ ముని కదులుతూన్న మల్లికార్జున దేవుడని ఈ కవి భావం. జంగవు అనేది జంగవు స్థావరవుఎలు అని చెప్పబడు పదసముదాయంనుంచి (గహించినదే! “కదులుచున్న” అను భావం అవసరం వచ్చిన చోటెల్లా అతను దేనికిపడితే దానికి “జంగమ” శబ్దాన్ని వాడేడు. ఏనుగులను గురించి “జంగమ కుత్కీలంబులు” (ఆ1 ప 20) అన్నాడు. కదులుతూన్న ఏనుగు లెట్లున్నాయంటే “జంగమ నగంబులభంగి"” (ఆ 11 ప 90), “జంగమ పర్వతంబులో యనగ” (ఆ 12 ప 71) అన్నాడు. తీగెలను గురించి “కాలు జంగమ లతలు” (ఆ 3 ప 14), “జంగమ లతా మధ్యంబున” (ఆ ౩ ప 16). “జంగమ లతలు” (ఆ 5 ప 20) అన్నారు. జంగమ అంటే అతని భావం కదులుతున్న అనే కాని మరొకటి కాదు. శ్రీనగం మీద స్థావరంగా ఉంటూన్న మల్లికార్జున దేవుని యొక్క జంగమ రూపమే మల్లికార్జున ముని. ఆ విషయంలో మనం పొరపడకుండా “జగంబుల ప్రత్యక్షం బై 'ప్రవర్తిల్లుట జంగమ మల్లికార్జున దేవుండై” (ఆ 1 ప 58) అని విశదీకరించేడు ఈ కవి. ఈ మహాముని జీవితాన్ని కొంతవరకు ఈ కవి ఈ కథలోనే ఇమిడ్చేడు - తీ 15106 ౮ 1౧౦1 ౧౭గ 1 0౫ 5గ కడ. సీ||24౬2012 52510 9.283.

2500 | పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4 పాహిత్యము ఉ. వాసనగా శివాగమము వర్ణనకెక్క (దయీపదార్థముల్‌ దేసిగనాత్మ శిష్యులకు దెల్పుచు సద్విధినున్న నిష్కళా భ్యాసమునందు లీనమగు భావము నిల్చి వెలుంగుచున్న స ద్యూసుర ముఖ్యు విప్రమునిపుంగవు జంగమ మల్లికార్డునున్‌. మత్తకోకిల: వృక్షమూల నివాసునాతత వేదవేది ననూవరు (దాక్షధారినఘారి నత్యమరాంగు నున్నత మోక్షసా పేక్షితున్‌ నిరపేక్షితున్‌ బుధవృద్ధవంద్యు ననింద్యును (గాక్షపాద సహోరుహార్చకు నాత్మవిత్తము సత్తమున్‌ (ఆ 6 ప 79, 80) (పై రెండో పద్యంలోని పసను [గ్రహించి మరికొన్ని అలంకారాలను చేర్చి మత్తకోకిల లక్షణాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నన్నయభట్టు అద్భుతమైన “వారిభక్లుల” పద్యాన్ని నలోపాఖ్యానంలో రాసేడన్న సంగతి మనకు స్పురించక మానదు.) మల్లికార్డునముని “భవ్యుడు" (ఆ 1 ప 14). అతనేగాక మహామునీశ్వరులందరూ భవ్యులేనట : క. కృష్ణాజినో త్తరీయులు గప్టాచారాపహరులు కృతకృత్యులు సం కృష్ణోదితార్చకులు గత తృష్ణోంతఃకరణపరులు దివ్యులు భవ్యుల్‌ (ఆ6ప 63) అచల మల్లికార్డునుడు నడుస్తూ పెండ్లికి వెళ్ళగా జంగమ మల్లికార్డును డయేడట. (ఆకిపర1, 62) కవి ఈ కృతిని తన గురువైన మల్లికార్జున మునికి మాత్రమే ఇచ్చేడని భావించ నక్కరలేదు. శ్రీతైల మల్లికార్డునుణ్ణి కూడ “జంగమ మల్లికార్జునుడే” (ఆశ ప 163) అన్నాడు. ఈ కవి తాను ఉపయోగిస్తున్న జంగమ పదం తనకి తర్వాత మూడువందలేళ్లకి వీరశైవ మతకర్త ఒక భాగపు ప్రజకి రూఢి నామంగా చేస్తాడని కలనైన ఊహించలేక పోయేడు! అందుచేతే - -

నన్నెచోడ చేవ దేశికవి క్రీశ 828-882 బేవమళ్ళ కామేశ్వర రావ్లు 2501

క. జంగమహివంత మునురు

జంగమ రజత్నాది యెక్కి చనువిధముననో

జంగమనీయ గవేశు భు

జంగమరాట్కటకు డెక్కి చనునెడ నొప్పెన్‌ (ఆకిప 28) అని జంగమ శబ్దాన్ని విరిచి విరిచి చూపించేడు. ఆ విషయమై ఇంక అతన్ని మనం కదపవద్దు.

పెన చెప్పిన వర్దనలనుబట్టి చూస్తే మల్లికార్డున ముని కాలాముఖయోగి అని తెలియరావడం లేదు. ఆ మునిసత్తముణ్ణి వందలకొద్దీ పదసంప్పుటులతో స్తుతించేడు కాని ఒక్కసారి కూడ కాలాముఖపదాన్ని ఎత్తలేదు. “హరికంకాలము” (ఆ4వ 77,76) పద్యాలలోనిదానిని కాలాషుఖీగా విమర్శకులు గణించ దలచుకొంటె దానికి వేటూరి ప్రభాకర శాస్త్రిగారు “కాలాముఖులు - వీరి సిద్ధాంత మేదో స్పష్టంగా తెలియరాదుో అని సమాధానమిచ్చేరు.

ఈ మునీశ్వరుడు “కుంభజతత్త్వజ్ఞుడు” (ఆ 12 ప 227). ఇతను బ్రాహ్మణుడు. సిద్ధుడు. ఈ యోగీశ్వరుడు (ప్రపంచకంలో సర్వమున్నూ! కాబట్టే ఇతను “విష్టుండు” (ఆ 12 ప 227). మరేమి కాదు?

మల్లికార్జున ముని *కవి నీరేరుహ రవి (ఆ9ప 1) “కవీం[దుడు" (ఆ౪9పవ 164), “పరమహంస స్వరూపుండు” (ఆ 1 ప 58) “సుచరితా భరణాంకుడు" (ఆ 5 వ 175). ఇట్లున్నవాడిని పట్టుకొని, ఇతను ముందు పెళ్లాడేడు. వెనక పెళ్లాడేడు. ఎక్కడో పెల్లాం పిల్లలున్నారు అని విమర్శకులు చెప్పబోతే అది అవాచ్యము!

ఈ గురు మల్లికార్జునుడు క్రీశ. 840 పప్రాంతంవాడు. ఇప్పటికి ప్రకటింపబడ్డ శాసనాలలో ఇతనికోసం పరిశోధన అవసరం. ఎవరికి కావలసిన మల్లికార్జునుడు వారికి దొరుకుతాడనే నుడి విమర్శకులలో ఏర్పడింది. కాబట్టి దొరకడనే భయం మనకు అక్కరలేదు.

పరమశైైవానికి అద్వైతానికి సరిపడకపోడంచేత ఈ కావ్యంలో శంకరాచార్యుడు (క్రీశ. 788 - 820) స్తుతించబడలేదు. మల్లికార్జునుడు జైన బౌద్ధాలను విధ్వంసం 5... కాకతీయ సంచిక పుట 58

2502 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము చేసే కార్యంలో ప్రముఖ పాత్ర వహించేడు. “పరవాదీంద్ర ఘనాఘనానిలుడు” (ఆ 8 ప 197) అను బిరుదు సంపాదించుకొన్నాడు. ఈ మహానుభావుడు 3వ తత్త్వాన్ని గురించి గ్రంథాలు రాసి ఉంటాడు. సాహిత్యపరుల తీవపరిశోధన అవసరం.

ఇక్కడ ఒక సంగతి చెప్పక తప్పదు. మల్లికార్జున శబ్బంలోనె ఈ కవి తన గురువును, శ్రీశైల దేవుణ్ణి కలిసేడన్న సంగతి విదితమే; అంతేకాదు, ఈ శబ్బంలోనే తన “పతిని అనగా రాజాధిరాజును కూడ చేర్చేడు. ఆ సంగతి ముందుముందు చూద్దాం. ఒక్కమాటలోనే మూడు అర్థాలను ఇమిడ్చేడు! ఈ విషయమే చెప్పక చెప్పుతూంది ఈ కావ్యంలో అంతరార్థ కథ ఉండవచ్చని!

ఈ కావ్యంలోని జంగమ శబ్దం వీరశైవ సంబంధం కాదు. అంతకు ముందుండే శబ్దాలనే వీరశైవులు తర్వాత రూఢిపరుచు కొన్నారు. మహేశ్వర శబ్ద విషయం చూడండి. కలి విష్ణువర్థనుడికి (క్రీ.శ. 848) “పరమ మహేశ్వరుడు” అని బిరుదు ఉంది. అత నెప్పటివాడో వీరశైవ మెప్పటిదో చూడండి! శాసనాలు

నన్నెచోడుడు అను శబ్దంగల శాసనాలు పన్నెండో శతాబ్దం ఆ చుట్టుపట్ల కొన్ని కనబడుతున్నాయి. వాటిలోని చోడుడుకి ఉండే కొన్ని (ప్రధాన బిరుదులు ఇక్కడ ఉదహరిస్తాను -

క మోదేపల్లి - నన్నూరుపాడు (నెల్లూరుజిల్లా శాసన సంపుటం 3, పుట 1072, నాం 92) శాసనంలో (క్రీ.శ. 1097 నాటిది) సూర్యవంశమను మాటే ప్రధానంగా కనబడుతూంది.

  1. కాకతీయ గణపతిరాజు కాలంలోనిదైన పెద్ద చెజుకూరి శాసనంలో “ప్రదీపాహిత కుమార గజాంకుగ, భయలోభదుర్లభ, సత్య రత్నాకర" అను బిరుదులున్నాయి.

  2. నెల్లూరి శాసన సంపుటంలో నెం. డి. 48 (క్రీ.శ. 1145-49), ఓ19 (క్రీశ. 1153-54). డి. 49 (క్రీ.శ. 1166-67) శాసనాలలో పైన ఉదహరించబడ్డ బిరుదులలో కొన్ని ఉన్నాయి. అదనంగా “మహామండలేశ్వర” అను బిరుదు ఉంది (చూ. కం. వీరేశలింగంగారి ఆంధ్ర కవుల చర్మితము. పుటలు 191,

సన్నెచోడ దేవ దేశికవి క్రీశ 828-882 లేకుమళ్ళు కామేశ్వర రావు 2503 4. మైసూరు శాసనాలలోని ఒక శాసనంలో “జగదేక మల్ల” అను బిరుదుంది. (చూ. కం. వీరేశలింగంగారి ఆం(ధకవుల చరిత్ర. పుట 192). పె శాసనాలలో చెప్పబడిన బిరుదులలో ఒక్కటీకూడ నన్నెచోడుని కుమార సంభవంలో కనబడదు. ఇతను తన కావ్యంలో “రవికులనేఖరుడు, టెంకణాదిత్యుడు, కవిరాజ శిఖామణి” అను చిరుదులను ప్రధానంగా చెప్పుకొన్నాడు. అవి పై శాసనాలలో కనబడవు. కాబట్టి మై శాసనాలలో రాజులు వేరు. కుమార సంభవ కుమారసంభవ రచనాకాలానికి ఇంకా మహామండలేశ్వర శబ్దం ఏర్పడలేదు. అప్పటికీ సామాన్యంగా వాడుకలో ఉన్నది “సామంత” గబ్బమే! ఈ పద సంపుటులలో వచ్చే “అనంత” శబ్దం చిత్రంగా ఉంది. దానికి కొన్నిచోట్ల అపారం అనే అర్థమున్నాా మరి కొన్నిచోట్ల అది సరిపడదు. “సామంత” అన్న రాజకీయ పదవి అన్నట్టే ' “అనంత” అనే పదవికూడ ఉన్నట్టుగా కనబడుతుంది. నస్నయభట్టు ప్రయోగాన్నిబట్టి అది ధధ్రువపడుతూంది. వీటన్నిటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను -

  1. అనంతదానవ సామంత (ఆ 11 ప 75)
  2. నిజస్వజన సామంతాద్యనంత చతురంగబలములు (ఆ 12 ప 163) ౩. దనుజానంత దంతి సంతానంబు (ఆ 12ప 175)
  3. గీర్వాణానంత సామంతులు (ఆ 11 ప 163) 5, నిజానంత సామంత (ఆ 12ప 61)
  4. సామంత (ఆ 11ప99;ఆ 12ప 10) 7, వాజివరూఢదంతి సామంత విలాసినీ స్వజన (ఆ 3ప 96)
  5. సామంత (ఆ 12ప 162) మండలిక అను శబ్దం ఒకచోట మాత్రమే నన్నెచోడుని కావ్యంలో కనబడుతూంది. ఐతే ముందు ముందు మహామండలేశ్వర శబ్బ్దంగా మారిందనవచ్చు - “అనంత మండలిక మహా సామంత దండనాయకామాత్య బృత్యాది...” (ఆ 11 ప 32). నన్నయభట్టు నాటికి కూడ మహామండలేశ్వర శబ్ద సంప్పుటి ఏర్పడలేదా? అతను మహా భారతంలో రాజనరేందని కొలువు వర్ణిస్తూ “మంత్రి పురోహిత శనానాయక దండనాయక దేవారిక మహాప్రధానానంత సామంత విలాసినీ పరివృతుండయి” (ఆ 1 పరు అవ వర్ణించేడు.

2504 పందిరి 'మల్లికార్డునరావు శతజయంతి సంపుటము 4; సాహిత్యము ఆ కాలంలోని శాసనాలలోకూడ “మహాశబ్బ మహాసామనాధి పతి” అని ఉంది" కాబట్టి నన్నెచోడుడు “మహామండలేశ్వరొ బిరుదు బయలు దేరిన

కాలంనాటివాడు కాడు. అంతకు పూర్వంవాడు. అతని కాలంలో సామంత పదం

మాత్రమే ఉందని చెప్పవచ్చు. అతను కేవలం స్వతంత్రుడు కాకపోయినా రాజప్రతిపత్తితోనే నడుచుకొన్నవాడని చెప్పవచ్చు. ఈ విషయమై ముందు ముందు

చూద్దాం. ,

టెంకణాదిత్యుడు నన్నెచోడుని కాలనిర్ణయంలో అతనికున్న రెండు బిరుదులు,

“టెంకణాదిత్యుడు, కవిరాజ శిఖామణి” - చాల సహాయపడుతున్నాయి. “ఆదిత్య”

అను బిరుదున్న పూర్వపు తెలుగు చోళ రాజులు ఈ కిందివారు -

  1. విక్రమాదిత్య చోళ మహారాజు.

  2. శక్తివర్మ విక్రమాదిత్యుడు.

  3. చోళమహారాజాధి రాజనాదిత్యుడు. వీరు కడప ప్రాంతంలో ఏలిన రాజులు. ఈ రాజులు నన్నెచోడుని లాగే కరికాలవంశపు రాజులు, సూర్యకులులు. వీరు తమ శాసనాలలో కాలాన్ని తెలుపుకోలేదు. కాని చరిత పరిశోధకులు వీరిని గురించి ఎనిమిదో శతాబ్దానికి పూర్వులు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేరు.” నన్నెచోడుడు తన టెంకణాదిత్యుడను బిరుదునుబట్టి ఈ రాజులకు సమీపంలోని వాడవుతున్నాడని స్థూలంగా చెప్పవచ్చు.

నన్నెచోడుడు “టెంకణ” దేశానికి ఆదిత్యుడు. ఈ టెంకణ దేశ మెక్కడిది. ఇది కడపజిల్లాలోనిది అని చారిత్రక పరిశోధకులు కనుక్కొన్నారు" టెంకణ శబ్దమే తర్వాత అనేక విధాలగా మారింది. క్రీశ. 1200 [ప్రాంతంవాడైన అధర్వణ కవి దీనిలోని మొదటి అక్షరానికి దీర్హమిచ్చి “టేంకణాదిత్యుడనిన్‌" అని (వ్రయోగించేడు. క్రీ.శ. 1224 - 25 నాటి ఒక శాసనంలో “టేంకణాదిత్య” అని ఒక 6. _ చిలుకూరి వీరభద రావుగారి ఆంధ్రుల చరిత అయిదవ భాగం పుట 45 7. ఆంధ్రుల చరిత్ర, ప్రథమ భాగము - చిలుకూరి వీరభ్యదరాయ కృతము పుట 349. 8. భారతి 1931 సర్వ్యోత్తమాచారిగారి వ్యాసం శాసన పద్యమంజరి భా 1పు 77 నెం 58.

నన్నెచోడ దేవ దేశికవి క్రీశ. 828-882 పేవమళ్ళ కామేశ్వర రావు 2505 చోడరాజు చెప్పు కొన్నాడు. క్రీ.శ.1343లో టెంకణరాయ బీరయదజణ్జాయకు డొకడున్నాడు. జక్కరాజు వేంకట కవి (క్రీ.శ. 1584) కామందక నీతి శాస్త్రంలో, క. టేంకట చోళ ద్రావిడ కోంకణ భూపాల దళిత ఘోటీ పేటీ సాంకవ తతికిన్‌ దిమ్మయ వేంకట జనపతికి నీతి విలసితమతికిన్‌."” అని వ్రాశాడు. టెంకణ శబ్దం అన్ని విధాలా మారింది. ఒరయూరు . నన్నెచోడుడు శ్రీశైల సమీపంలోని రాజై ఉండి తాను “ఒరయూరి పురాధిపతిని” (ఆ 1వ 54) అని చెప్పుకొన్నాడు. కావేరీ తీరమందున్న ఒరయూరికి తెలుగు చోళరాజులు అధికారులుగా ఉండడం అసంభవం. ఒరయూరి ఉనికినికూడ చరిత్ర పరిశోధకులు కనుక్కొన్నారు. ఇదికూడ శ్రీకైలం (ప్రాంతంలోదే. ఇక్కడ చోడులు ఒరయూరును ముఖ్యపట్టణంగా పరిపాలించేరు.'! ఒరయూరు చాల కాలంనుంచి ఇక్కడి ఆలుగు చోడులకు ముఖ్యపట్టణంగా ఉండేదని మనం నమ్మవచ్చు. క్రీ.శ. 640 ప్రాంతంలో యువాన్‌ చ్వాంగ్‌ అను చీనా యాత్రికుడు ఈ చోళ దేశాన్ని దర్శించేడు, వర్ణించేడు.” దీని రాజధాని రెండు మైళ్ల విస్తీర్ణం కలిగుంది. ఈ దేశంలో బౌద్ధ సంఘారామాలు శీథిలమవుతున్నాయి. అనేక దేవాలయాలున్నాయి. దిగంబర జైను లున్నారు అని ఆ యాత్రికుడు ఆలియజేసేడు. అతను చెప్పిన రాజధాని ఒరయూరే కావచ్చు. తతత 9. గజగాంట 2006 ౪121202023/2 6 1. ౪6౧౧భి2(2గ౭0/8 ౯31. 10. తంజావూరు సరస్వతీ పుస్తకశాలా (గ్రంథముల తెలుగు కేటలాగు (ఆంధ్ర యూనివర్శిటీ వారి ప్రచురణ) పు. 308. 11. ఎమ్‌. వెంకటరమణయ్యగారు శ్రీశైలం వద్ధ ఉన్న ఒరయూంరిని గురించి చేసిన పరిశోధన యొక్క వివరాలు ఆలియరాలేదు. - 12. విదేశ యాత్రికులు - ప్రాచీనాలథ దేశను - భావరాజు వేంకట కృష్టారాయ కృతము. పుట 91.

2506 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము ఇక్కడి బౌద్ధ మతం క్షీణదశలో ఉండడంబట్టి అతను ఈ ఊరి నామమును గ్రద్ధతో పేర్కొనలేదని తలచవచ్చు.

ఈ చోడ రాజ్యంలో పాకనాడు ఒక భాగమనే సంగతి నన్నెచోడదేవుని అవతారిక పద్యాలు తెలియజేస్తున్నాయి. ఒరయూరి మాహాత్మ్య్యన్ని కవిఆ 1ప 54లో తెలియజేసేడు. అక్కడి దేవాలయాలలోని “కలుకోడి" కూస్తుందట! “కలుపొన్న పూస్తుందట!

నన్నెచోడుడు కలుకోడి, కలుపొన్నను వర్షించేడుకదా! వీటి యథార్థమేమిటంటే

  • కలుకోడి అనగా కుక్కటేశ్వరస్వామి అను దేవుడు ఒరయూరిలో ఉన్నాడని చెప్పవచ్చు. ఆ పేరుగల స్వామి దేవాలయం అతి పురాతనమైనది - ఈనాటికీ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఉంది. కుక్కుటేశ్వరస్వామి మాహాత్మ్యన్ని గురించి ప్రజలు చెప్పుకొనేదే కవి తలియచేసేడు. కలుపొన్న విషయమేమంటే
  • కలుపొన్న నెక్కినట్లుగా చెక్కబడ్డ బాల.గోపాలుని విగ్రహం ఆ యూరిలోని వైషస్టవాలయంలో ఉండగా, ఆ స్వామి మాహాత్మ్యాన్ని గురించి ప్రజలు చెప్పుకొనే మాటలనే నన్నెచోడుడు వర్ణించేడు. నన్నెచోడుడు శివపారమ్యము మాత్రమే కోరిన వైష్ణవ ప్రియుడు. కాబట్టి ఆతను విష్ణుదేవుని ఘనతను కలుపొన్న విషయంలో వెల్లడిచేసేడు.

ఒరయూరు క్రీ.శ. 640 ప్రాంతంనుంచి (యువాన్‌ చ్వాంగ్‌ కాలంనుంచి) నన్నెచోడ దేవుని కాలందాక చోడ రాజ్యానికి రాజధానిగా ఉందనే భావించవచ్చు. అది అంతకు పూర్వం ఎంత కాలంనుంచి రాజధానిగా ఉందో పరిశోధన అవసరం. కవిరాజ శిఖామణి

నన్నెచోడ కవి కాలనిర్ణయానికి కవిరాజ శిఖామణి అను బిరుదు కూడ సహాయపడుతూంది అని వెనకే తలియజేసేను. అతనికి సమకాలికుడైన రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు (క్రీ.శ. 814 - 880) ఇతను కన్నడ భాషలో కవిరాజమార్గ అనే ఛందో గ్రంథాన్ని రచించేడు. అనేకవిధాలగా నన్నెచోడుడికి అమోఘవర్దుడికి పోటీ! అతనిమీద పోటీగా నన్నెచోడుడు కవిరాజ శిఖామణి అన్ని బిరుదు పెట్టుకొన్నాడో లేక కవిరాజ శిఖామణిని చూసి అమోఘవర్డుడు కవిరాజమార్గం రచించేడో పరిశోధించవలసుంది.

నన్నెవోడ దేవ బేశికవి క్రీ.శ. 828-882... లేకమళ్ళ కామేశ్వర రావు 2507 నవనాధులు

నన్నెచోడుడు తన పుస్తకంలో “*నవనాథాదు లనాదిసిద్ధులు” (ఆ౪9ప 128) అను పద సంపుటిని ప్రయోగించేడు. మల్లికార్జున గురువే ఒక సిద్ధుడని ఈ కవి నమ్మకం. కాబట్టి ఈ గురువు చేరిన నవీనసిద్ధగణం గాక ప్రాచీన సిద్ధగణమనే ఉద్దేశంతో ఈ కవి “అనాది సిద్ధులు” అని తెలియజేసేడు. కాబట్టి ఈ సిద్ధులకోసం మనం క్రీస్తుశక ప్రారంభకాలమందు వెదకవలసిందే! “మత్స్య్యేంద్రుడు, గోరక్షకుడు మొదలగు తొమ్మండుగురు నవనాథ సిద్ధులనుపేర క్రీస్తుశకము రెండవ శతాబ్దము నుండి హీమాలయమందుండెడి వారనియు, వారు అష్టసిద్ధులను బొంది రస అ(భకసత్త్వసాతనాదుల తెలిసికొని రససేవచే శాశ్వత శరీరవలమను పొందగలిగిరనియు చెప్పుదురు” నన్నెచోడుడు ఈ అనాదిసిద్ధులనే స్మరించి ఉంటాడని చెప్పవచ్చు. ఇది అతని ప్రాచీనత కొక నిదర్శనం. నన్నెచోడుని ప్రతిపత్తి

కుమారసంభవ కావ్యరచనా కాలం నాటికి నన్నెచోడుడు ఒరయూరు రాజధానిగా చోడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. (ఆ 1ప 51 - 54). అతని తండ్రియైన బల్లిచోడుని కాలంలోనె పాకనాడు వారి రాజ్యంలో చేరింది -

“ఇరువది యొక్కవేయిటి

కధీశుడు నాజను చోడబల్లి * (ఆ 2 ప 53) పాకనాడు ఈ చోళ రాజ్యంలో ఎప్పుడు చేరినదో చెప్పలేము. కాని దానిని పాలిస్తూ వచ్చిన పల్లవుల అధికారం [కమంగా క్షీణిస్తూండగా తలుగు చోళులు తమ (ప్రక్కనున్న పాకనాటిని వశపరచుకొన్నారని భావించవచ్చు.

నన్నెచోడుని చిన్న రాజ్యానికి పశ్చిమాన బ్రహ్మాండమైన రాష్ట్రకూట రాజ్యం, తూర్పున వేంగీ చాళుక్య రాజ్యం, దక్షిణాన పల్లవరాజ్యం ఉన్నాయి. ఎవరికివారే చోడరాజ్యాన్ని మింగజాలిన వారు. అతను ఎవరికో ఒకరికి దాసోహమనక తప్పదు. అతనికి భాషా సందర్భంగా వేంగీ చాళుక్యులతో ఎక్కువ సంబంధముంది. స షాంఠయ విజ్ఞానము. డాక్టరు ఆచంట లక్ష్మీపతి కృతంపుట81.

2508 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహెత్యము నన్నెచోడుడు పూర్తిగా స్వతంత్రుడు కాదని అతని గ్రంథమే తెలియజేస్తూంది. అతను ఒక రాజాధిరాజును “పతి"గా భావించేడు. ఈ “పతి” శబ్దాన్ని మొదట కనిపెట్టినవారు దేవరకొండ వెంకట కృష్ణారెడ్డిగారు. ఆ “పతి” ఆకాలంనాటి తూర్పు చాళుక్యరాజేకాని మరెవరూకారు. అతనిపేరు గుణగ విజయాదిత్యుడు. ఈపట్టున గుణగ విజయాదిత్యుని చరిత (క్రీ.శ. 848-891) కొంత తెలిసికోవలసుంది. అతను క్రీ.శ. 848లో రాజ్యానికి వచ్చేడు. పాకనాటిలోని కందుకూరి ప్రాంతాలలో బోయలు తిరగబడగా పండరంగడు అనే పైన్యాధిపతిని పంపించేడు. ఆ మైన్యాధిపతి బోయలను లొంగదీసి, నెల్లూరిని తగలబెట్టాడు."* ఇక్కడ ఒక ప్రశ్న పాకనాడు నన్నెచోడుని అధీనమందుండగా ప్రై విషయాలు ఎట్లు సంభవించేయి? నన్నెచోడుని బలం కొంచెమే అవడంచేత గుణగుడు కలుగజేసుకొన్నాడు. అటుతర్వాత పండరంగడు రాహణను, నోలంబవాడి (బళ్ళారి (ప్రాంతం). రాజైన మంగని గెలిచేడు. గుణగ విజయాదిత్యుని విజయాలను ఆలియజేసే ఈ శాసనాలలో చోళుని పేరు చెప్పబడడం లేదు. చోళుడు వీరితో మై(త్రిగా ఉంటూండి, రాజాధిరాజుగా పరిగణించి ఉండడంవల్ల అతన్ని జయించవలసిన సమస్యే లేదు. ఇట్లు చోళుని స్నేహం పరోక్షంగా (ధ్రువపడుతూంది. చోళుని రాజ్యముగుండా చాళుక్యరాజు మైన్యాలు వెళ్ళి నొలంబవాడి రాజుతో యుద్ధంచేసి ఉంటాయి. - నన్నెచోడుడు మరొకవిధంగా కూడ తూర్పు చాళుక్యరాజుతో దగ్గర సంబంధమున్నవాడు. నన్నెచోడుని తల్లి హైహయరాజు యొక్క పుత్రిక. గుణగ విజయాదిత్యుని తాతమయైన రెండవ విజయాదిత్యుని (క్రీ.శ. 806-846) సవతి సోదరుడైన నృపరుడుని తల్లి హైహయ వంశజురాలు. ఇట్లు వీరు పరస్పర సంబంధాలు కలిగి ఉన్నారు. నన్నెచోడుడు గుణగుని “సత్పు్రభుడు” (ఆ! ప 46) “పతి”, “నిజేశుడు"(ఆ 1 ప 50) అని తలియబేసేడు. పతి ఎవరు? నన్నెచోడుడు, “దేవుడు, గురువు, పతి ఈ ముగ్గురు - ఒక్క పేరు గలవారు అనే గ్రంథమందు సూచించేడు. దేవుడు మల్లికార్జునుడు. గురువు తా 14. 6 ౬€4516గ 0౧4|45/29 0౪6౧091 0౪ 0౧ న. 9౧|%4(4/2గ8౧2|4౧, ౧ 93. /

నన్నెచోడ దేవ టేశికవి క్రీ.శ. 828-882 లేటుమళ్ళ కామేశ్వర రావు 2509 మల్లికార్డున ముని. ఇప్పుడు పతిపేరు కూడ పె వాటితో సరిపోవాలి. అది ఎట్లు? గుణగ విజయాదిత్యుడికి “త్రిపురమర్హ్య మహేశ్వర" అను బిరుదుంది. మహేశ్వర శబ్దం మల్లికార్జున శబ్దానికి పర్యాయపదమే కాబట్టి కుదిరింది.

అంతరార్థాలకు నిధియైన ఈ నన్నెచోడుని కవిత్వంలో మరొక అర్ధానికి కూడ అవకాశముంది. నన్నెచోడుడు “గరువున కిష్టదైవమునకున్‌ పతికిన్‌ గృతిసెప్పిన”(ఆ 1 ప 50) పద్యం కిందే తన తండ్రియెన చోడబల్లిని (ప 53) వర్ణించేడు. బల్లి శబ్దం మల్లయ శబ్దం నుంచి ఏర్పడినదే! “శాసనములలో నొక్కనినే చోడపల్లి, చోడబల్లి, చోడమల్లి, బల్లిచోడుడు, బల్లయ చోడుడు మొదలైన నామములతో వ్యవహరించు చున్నారు.” మల్లయ అన్నా మల్లికార్జునుడు అన్నా ఒక్కటే అనే సంగతి నన్నెచోడుడు అనేకచోట్ల (ఆ 1 ప 46, వ 61) ఆలియజేసేడు. ఈ విధంగా నన్నెచోడుడు ఊహించిన “పతొ అతని తండియైన బల్లిచోడు డే కాని మరొకడుకాడని వాదించవచ్చు. కాని, అది సరిపడదు. ఎందుచేతంటే ఈ కవి చిన్న రాజు. అస్వతం్రుడు. అతను తన రాజాధిరాజును ముఖ్యప్వాతగా వర్ణించ తలపెబ్టేడుకాని తన తండ్రిని కాదు. ఆనాటి కావ్యాలలో కృతిపతులు (పధానప్యాత్రలలో ఇమడ్చబడేవారు కాని కవులు తమను గురించి (గంథాలు (వాసికోలేదు. ఈ కథలో అనేక అంశాలు గుణగ విజయాదిత్యునికి సరిపడతాయి కాని మరొకరికి కుదరవు. ఈ విధం ఈ కావ్యంలోని “పతి” గుణగవిజయాదిత్యుడే కాని మరొకరు కాడు.

మల్లికార్డున నామం పైముగ్గురికి సరిపోయినట్లే “ఆదిత్య” పదంకూడ సరిపెట్ట బడింది. మల్లికార్డునుడు దేవుడు కాబట్టి ఆదిత్య పద మతనికి తొలుతనే ఉందని భావించవచ్చు. గుణగ విజయాదిత్యుని పేరులో ఆదిత్య శబ్బముంది. గురువును “సజ్జ్ఞనాంబుజాదిత్యుడు" (ఆ3౩ప 111) అన్నాడు కవి.

కృతి పతిత్వంలో గుణగవిజయాదిత్యుని కూడ చేర్చినపుడు కవి ఆ రాజాధిరాజును రాజలాంఛనాలతో సంబోధించాలికదా! ధర్మవర శిలా శాసనంలో ఆ రాజు ఇట్లు తెలుపబడ్డాడు. - “విజయాదిత్య పాదపద్మ (భమరాయమాణ శ్రీమత్క డెయరాజు గుణగణాభరణుడు”' లా 15. కం. వీరేశలింగ కవి - ఆంధ్ర కవల చరిత్ర ప్రథమభాగము పుట 191. 16. ధర్మవర శిలాశాసనము - భారతి సం. 5 పు. 613.

2510 సందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము పె విధానాన్నే నన్నెచోడుడు తన కావ్యగద్యలో అనుసరించేడు - “మల్లికార్జున (దేవ) దివ్యశ్రీపాదపంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి నన్నెచోడదేవ”. ఇట్టి సాదృశ్యాలు సమకాలతను నిరూపిస్తాయి. దైవజ్ఞుడు : సుకృతి . నన్నెచోడుడు తన కావ్యము యొక్క వస్తువును సంగ్రహంగా - అన్యకతార కవితతుల నాదరించి వెలయ సత్కవి బుధ గురుబలము వడసి ఒనర దైవజ్ఞునట్ల శుభోదయమున దివ్య సుకృతి బ్రతిష్టెంతు తిరముగాగ(ఆ 1 ప 34) అని సూచించేడు. దీనికి గల అనేక భావాలలో ఒకటి ఏమంటే - అమోఘవర్డుడు, ఇతరులు (అనగా అన్యతార కవితతులు) తనను (నన్నెచోడుణ్ణి)) అనాదరించి ఉంటున్నారు. కాబట్టి నేను సత్కవి, బుధః గురువుల సహాయంతో, దైవజ్ఞునిలాగె (గుణగవిజయాదిత్యునిలాగె) ఒక మంచి పనిని చేస్తాను. ఇక్కడ కవి చేసే పని సద్దుంథరచనే, అనగా కుమారసంభవ కావ్య రచన. దైవజ్ఞ్జుడు అంటే అంకకారుడు. అనగా గణిత శాస్త్రజ్ఞుడు అని అర్థం. గుణగుడు గణితశాస్త్రంలో ప్రజ్ఞకలవాడు

  • “అంకకారః సాక్షాత్‌”. కాబట్టి అతనికి గణక విజయాదిత్యుడని పేరు వచ్చింది. ఇదే గుణగ శబ్దంగా కూడ చెప్పబడింది. గుణగుడు చేసిన మహత్కార్యమేమంటే, అమోఘవర్హుణ్ణి జయించి లొంగదీసేడు. గుణగుడు అట్లు ఒక సుకృతి చేయగా, నన్నెచోడుడు అతనిలాగె మరొక సుకృతిని (అనగా మంచి కావ్యమును) చేయదలచుకొన్నాడు. గుణగుడు కూడ ఏదో గ్రంథరచన చేసేడని మనం చెప్పలేము. దానికి ఆధారం లేదు. తార కవి ఎవరు? *. రాష్ట్రకూటరాజైన అమోఘవర్డుడు చోడ రాజ్యానికి, తూర్పు చాళుక్య రాజ్యానికీ కూడ గర్భశత్రువు. అమోఘవర్డుడు కవిరాజ మార్గ అను (గ్రంథాన్ని

నన్నెచోడ దేవ దేశికవి క్రీ.శ. 828-882 టేకుమళ్ళ కామేశ్వర రావు 2511 కన్నడ భాషలో రచించేడు. నన్నెచోడుడు ఆదిత్యుడు (టెంకణ - ఆదిత్యుడు). ఆదిత్యుని తేజస్సు ముందు అణిగిపోయేది తార (నక్షత్రం). నన్నెచోడు డతనికి శత్రువైన అమోఘవర్షుడికి “తార కవి” నామాన్ని పెట్టేడు. ఇంతే కాకుండ అమోఘవర్డుడికుండే బిరుదులలో అతనికి “తార”కి సరిపోయే బిరుదుందేమో పరిశీలించాలి. తార కవి అను మాటకే ఈ కవి కుకవి అను భావాన్నికూడ కలిగించేడు. “తార కవితతుల” పద్యానికి ఈ కింది అర్థాలు ఈ సందర్భంలో సరిపోతాయి.

  1. తారక (నక్ష(తము) వితతులు (సమూహములు) అని అర్ధం చెప్పుకొనగా, (టెంకణ) ఆదిత్యుడుమైన జెప్పిన నక్షత్రాల తేజస్సును, కవి (శుక్రుడు), బుధుడు, గురుడు అను[గ్రహముల సహాయంతో హరిస్తాడు.

  2. తారకవి (= అమోఘవర్తుడు) తతులు (అతని అనుయాయులు) ఆదిత్యుని (నన్నెచోడుని) అనాదరించి ఉండగా, ఆదిత్యుడు (నన్నెచోడుడు) సత్కవి (= మంచి కవుల), బుధ (= పండితుల), గురువుల సహాయంతో కావ్యము రచించి తార కవి యొక్క కీర్తిని మాయజేస్తాడు.

బెంకణాదిత్యుడు సుకృతిని దైవజ్ఞుని లాగే చేస్తాడు! దైవజ్జుడు (గణకుడు)

అను పదంలో కవి తనకు సమకాలికుడు, రక్షకుడు అయిన గణక విజయాదిత్యుని

నామాన్ని తెలియబేసేడు. గణక విజయాదిత్యుడు (క్రీ.శ. 848-891) ప్రముఖుడైన

తూర్పు చాళుక్యరాజు కదా! “విజయాదిత్యుడు గణిత శాస్త్రవముందు

పండితుడగుటచేత గణక విజయాదిత్యుడని పిలువబడుచువచ్చెను. అంకకారః

.. సాక్షాత్‌ అని కంచుమజ్జు శాసనంలో స్పష్టమగుచున్నది”” నన్నెచోడుడు కూడ

విజయాదిత్యుడు గణిత శాస్త్రజ్ఞుడు అని అర్థాన్ని దైవజ్ఞ పదంలో చేర్చేడు.

అంకకారుడు అనగా ఇక్కడి అర్థం గణకుడు, గణిత శాస్త్రజ్ఞుడు ఆఅనేకాని మరొకటి కాదు అని నన్నెచోడుని ప్రయోగంవల్ల రుజువవుతూంది.

న

  1. ఆంధ్రుల చరిత, మొదటి భాగం పుట 272.

2512 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము ఈ పద్యంలో నన్నెచోడుడు తన జాతకంలోని (గ్రహకూటాన్ని కూడ చెప్పుకొన్నాడు. దానిని మరొక సందర్భంలో తలియజేస్తాను. “అన్యతార కవితతుల” పద్యానికుండే ఇతర అర్థాలను కూడ మరొక సందర్భంలో తఆలియజేస్తాను. మొత్తంమీద ఈ కవి [గ్రంథ [ప్రారంభంలోనే కొన్ని ప్రధాన పాత్రలను సూచించేడు - గుణగ విజయాదిత్యుడు, అమోఘవర్ష్దుడు. నన్నెచోడుడు మరొక విషయాన్నికూడ బైట పెట్టుకొన్నాడు. తాను ఒక్కడూ గాక సత్కవి బుధ, గురు సహాయంతోనే ఈ (గ్రంథరచనకు పూనుకొన్నాడు. ఈ [గంథం ఏక కవి రచన కాదు. (సశేషము) (కిన్నెర: సంపుటము 6 సంచిక 4, ఏప్రిల్‌ 1954) 1111, ల? [్‌్‌: త్త! [గమ శ్రా సల! స4/౮/5 [(/.

నన్నెచోడ దేవ దేశికవి క్రి శ 828- 882 టేకుమళ్ళ కామేశ్వర రావు (గత సంచిక తరువాయి) తారకు డెవడు? ఆతుమోఘవర్ష్దుడితో నన్నెచోడుడికి, వేంగీ చాళుక్యరాజుకి చాల విధాలైన పోటీలున్నాయి. వాజ్మయంగా, రాజకీయంగా అమోఘవర్డుడికి వాజ్బ్ఞాయపరంగా “తారకవి"” అని పేరును ఏర్పాటు చేసి, రాజకీయంగా “తారకుడు” అని పేరును నన్నెచోడుడు పెట్టేడు. తారకుండు రిపువిదారకుం డని వార్యవ్మికముండు దనుజ చకవర్తి. (ఆ4ప 23) అమోఘవర్డుడు నన్నెచోడుడి పక్షం వారికి శత్రువు కాబట్టి అతనికి ఒక రాక్షసుడి పేరు పెట్టేడు. ఆ పేరే నిర్ణయం చెయ్యడానికి కొన్ని కారణాలున్నాయి. కుమార సంభవకథలో తారకుడొక పాత. అది సరే! ఇతర విధాలగాకూడ ఆ పేరు సరిపోతేనే కాని ననెచోడకవి నిర్ణయం చెయ్యడు. అమోఘవర్షుడి బిరుదులలోనే దీనికి కుదిరే బిరుడుందేమో ఇంకా పరిశీలించవలసుంది. ఆ సంగతి అలాగుంచి “తార” అనుమాటకి “తారకో ఒక పర్యాయపదం మాత్రమే. దీనికంటె బలమైన కారణం కోసం వెతకాలి. ఒక కారణంతోస్తూంది. అమోఘవర్తుడి తాతపేరు (ధువుడు. (ధ్రువుడు ఒక నక్షత్రం, అనగా తార. తాతపేరు మనుమడికిపెట్టే పందిరి మల్లికార్జుసరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము

2514 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి సంప్పుటము 4: సాహిత్యము ఆచారం మనలో అనాదిగా వస్తూంది. కాబట్టి మనుమడైన అమోఘవర్షుడికి “తార” నామాన్ని నన్నెచోడు డేర్చాటు చేసేడు. దాని పర్యాయపదమైన “తారకి శబ్దం రాక్షసపరంగా సరిపోయింది. ఈ విధంగా నన్నెచోడుడు అంతరార్థ కథ నడిపించేడు. రట్టులను రాక్షసులనడం న్యాయమా? శత్రువులైనప్పుడు వీరిని వారు వారిని వీరు రాక్షసులని, చోరులని తూలనాడుకోడం సహజం. రామాయణ మహాభారతాలలోనెగాక ఇటీవలి రచనలలో కూడ కనబడుతున్నాయి. కన్నడ గ్రంథమైన కుమార రాముని చరిత్రలో మహమ్మదీయులకు దానవులని, సుల్లానుకు దానవాధిపుడనీ పేరు పెట్టబడింది. కొన్ని తలుగు (గ్రంథాలలో మాలిక్‌కాఫూర్‌ని కాలయవనుడన్నారు. “నేమి” అనగా కాలనేమి అను రాక్షసవీరుని సం[గ్రహనామం. మాలిక్‌కాఫూర్‌కి, అతని తర్వాత వచ్చిన ఖ్వాజా జహాన్‌కి కూడ “నేమి అనే పేరు పెట్టేరు.” శత్రువులు చోరులుగా వర్ణించబడ్డ ఘట్టం ఈ దిగువది. వీరు (పల్లవులు) అన్య దేశమునుండి ద్రావిడమందు (బవేశించిన వారగుటచేతనే తమిళరాజునకును, వీరికిని శాశ్వతవైరము గల్గుటకు గారణము. తత్కారణముననే పల్లవ శబ్దమునకు చోరులను నర్థమును అజవవారు గల్పించుకొనిరి.'”* నన్నెచోడుడు తనకు ఆశ్రయులైన తూర్పు చాళుక్యరాజు తరపువారినందరిని దేవతలని, అమరులనీ అన్నాడు. తమకు శత్రువులైన రాష్ట్రకూటులను, వారి పక్షంవారిని రాక్ష్తసులన్నాడు. ॥ రాష్ట్రకూటులను శాసనాలలో రట్టులని వ్యవహరిస్తూంటారు. తూర్పు చాళుక్యరాజులకు, రట్టులకు వైరానికి చాలవరకు రాష్ట్రకూటులే కారణంగా తోస్తూంది. వారు దగ్గర సంబంధాలనుకూడ పాటించకుండా దాడివెడలి, నానాగల్లంతు చేసేవారు.. నాలుగో విష్ణువర్థనుని పెద్ద కుమారుడైన రెండో విజయాదిత్యుడు లా 174. గాం 206 42402041 0 06 స, ౪6౧4212/2౧020౧4౮4 ౯18 నుండి అనువదించబడింది. 178 నేలటూరి వెంకటరమణయ్యగారి “చరిత్ర” అను గ్రంథము పుట 45.

నన్నెచోడ దేవ దేశికవి క్రీ. శ 828 - 882 బేకమళ్ళ కామేళ్చుర రావు 2515 (క్రీశ. 806 - 846) రాజ్యానికిరాగా రాష్ట్రకూట రాజైన మూడో గోవిందుడు (క్రీశ. 791 - 814) రెండో విజయాదిత్యుని తమ్ము డైన భీమసలూకి పక్షం వహించి రెండో విజయాదిత్యునిమీద దండయాత్ర చేసేడు. ఈ పోరు సరిగా పన్నాండేళ్లు జరిగింది. 108 యుద్ధాలు జరిగేయి. అసాధ్యుడు కాబట్టి రెండో విజయాదిత్యుడు సింహాసనాన్ని దక్కించుకొన్నాడు. ఇంతాచేస్తే వీరు పిల్లలను ఇచ్చి పుచ్చుకొంటూన్న దగ్గర సంబంధీకులు. మూడో గోవిందుని యుద్ధం రాక్షసచర్యయే! అమోఘవర్డుడు (క్రీ.శ. 814-880) రాష్ట్రకూట రాజ్యానికి వచ్చేడు. పన్నేండేళ్ళ బాలుడు! అనేకమందిసామంతులు తిరగబడ్డారు. ఆ సందర్భంలో రెండో విజయాదిత్యుడు రాష్ట్రకూటులను నమ్మలేక తిరగబడ్డాడు. రాజులిద్దరూ బాంధవ్యం కలుపుకొన్నారు. గుణగ విజయాదిత్యుడు (కీ.శ. 848-891) చాళుక్య సింహాసనానికి రాగానే మళ్ళీ పోరు మొదలు పెట్టింది. గుణగ విజయాదిత్యుడు చివరికి ఓడిపోయి దాస్యం చేసేడు. ఎలాగో తేరుకొని మళ్లీ యుద్ధం చేసేడు. క్రీ.శ. 886 ప్రాంతాలలో రాష్ట్రకూటులచేత దాసోహ మనిపించేడు. ఏదయినా రాష్ట్ర కూటులు పరిపాలనచేసిన రెండువందల సంవత్సరాలూ ఇట్లాగె ఉంది. నన్నెచోడుడి చిన్నరాజ్యంమీద ఈ బలాలు ఎన్నిసార్లు నడిచేయో! తూర్పు చాళుక్యులతో అవినాభావ సంబంధ మేర్పరుచుకొన్న నన్నెచోడుడు అమోఘవర్షుణ్ణి అతని బలాలను రాక్షసులని గాక మరి ఏమని వర్ణిస్తారు! రాష్ట్రకూటులు పరిపాలననుంచి వదలి పోయినందుకు జనులు సంతోషించేరు. వారిని ధ్వంసంచేసిన లైలవుడను పశ్చిమ చాళుక్యరాజును గురించి “కైలవుడు శ్రీకృష్ణుని అవతారమనీ, అతను రట్ట రాక్షసులతో 180 యుద్ధాలు చేసి, 88 కోటలను వశపరుచుకొన్నాడనీ జనశుతి"”* నన్నెచోడుడు వీరికి పెట్టిన పేరు సరిమయైనదని చరిత్ర రుజువుచేస్తూంది.

అమోఘవర్దుడితో నన్నెచోడుడికి పోటీ ఎందుకు? వారిద్దరు ఇరుగుపొరుగు రాజ్యాలవారు. అమోఘవర్హుడిది బ్రహ్మాండమైన రాజ్యం. నన్నెచోడుడిది పక్కనే ఉన్న చిన్నరాజ్యం. అతను ఎప్పుడో ఒకప్పుడు తనను కబళిస్తాడని భయం! ఇది రాజకీయపు శతుత్వం. 18. 11910౧0 01౧612 02|1. 0౫ గ. గ. [11262౧2 54510/ ౧.240.

2516 పందిరి మల్లికార్టుసరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అమోఘవర్డుడు కవిరాజ మార్గకర్త (ఇతను ఆ (గ్రంధాన్ని రచించలేదన్న వాదాన్ని అటుండనియ్యండి). నన్నెచోడుడు కవిరాజ శిఖామణి: ఇది సాహిత్యపు పోటీ. అమోఘవర్ష్డుడు జైనమతం వైపు మొగ్గేవాడు. నన్నెచోడుడు పరమశైవుడు. ఇది మతవిషయమైన పోటీ. ఈ మోస్తరుగా నన్నెచోడుడు అమోఘవర్షుణ్ణి కావ్యంలో పెట్టి మచ్చ మాపేడు. కుమారు డెవడు? ఆకాలపు సంప్రదాయమేమిటంటె కవి తన (గ్రంథాన్ని ఎవరికైతే కృతిగా ఇస్తాడో అతనినే కథలో ప్రధాన వీరుడితో ఐక్యపరచి వర్ణించడం. ఈ కవి “పతిగా గుణగ విజయాదిత్యుని గ్రహించేడు కాబట్టి గుణగుని ఈ కథలోని ప్రధాన పాత్రలో మిళితం చేసేడు. ఈ ప్రధానపాత్రలో నన్నెచోడుడు తననే మిళితం చేసేడని చెప్పరాదా? అది సంప్రదాయానికి విరుద్ధం, గా తానొక చిన్నరాజు. అంత తాహతులేదు. తారకుణ్ణి ధ్వంసం చెయ్యగలిగినవాడు కుమారుడేకాని తానుకాదు. కాబట్టి ఈ కవి తన పతిని (గుణగ విజయాదిత్యుని) కుమార పాత్రలో ఐక్యంచేసేడు. గుణగ విజయాదిత్యుని తాతయెన లెండవ విజయాదిత్యుడు గుణగుని తండియైన కలి విష్ణువర్ధనుడు ఒకటిన్నర సంవత్సరం మాత్రమే రాజ్యంచేసి, నలుగురు పుత్రులను విడిచిపెట్టి స్వర్గలోకం చేరుకొన్నాడు. వీరిలో పెద్దవాడైన గుణగుడు రాజ్యానికి వచ్చేడు. ఇతను రాజ్యానికి వచ్చేటప్పటికి ఇరవై సంవత్సరాల వాడై ఉండవచ్చు. కుమారసంభవ కథంతా గుణగుడు సింహాసనమెక్కక పూర్వం జరిగిందే : అతను బాలుడిగా ఉన్నప్పటికి ప్రతాపమే ఈ కావ్యంలో వర్ణించబడింది. పూర్వపురాజులు బాల్యంలోనె ఘనులని చెప్పుకొనే కథలకు లక్కలేదు. జానపద కథలనిండా అవే! ఆ కారణంవల్లే జానపద కథావీరుల పేళ్లకుముందు “కుమార” అనీ “బాల” అని ఉంటుంది. స్త్రీ పురుషులకివి సమానాలే! బాలరాజు, బాలవర్థరాజు, కుమారరాముడు, బాలనాగమ్మ, బాలసన్యాసమ్మ ఇత్యాదులు. కుమారస్వామి పేరు ఇట్టిదే. గుణగ విజయాదిత్యుని కాలానికి సమీపంలోనె బాల్యదశలోనే ఘనులైన వారున్నారు. అమోఘవర్దుడు పన్నెండేళ్ళకే సింహాసనాన్ని అధిష్టించేడు. చాళుక్యభీముని పుత్రుడైన ఇమ్మ ర్తి గండడు పదహారోయేటే మహాయుద్ధంలో

నన్నెచోడ దేవ దేశికవి క్రీ శ 828 - 882 టేకుమళ్ళ కామేశ్వర రావు 2517 పాల్గొని వీర స్వర్గాన్ని పొందేరు.” కాబట్టే మహావీరులు బాల్యంలోనే ప్రసిద్ధి చెందేరను లోకపు పలుకు! గుణగుడు అట్టివాడే! అతను సామాన్యుడు కాడు. “తూర్పు చాళుక్య రాజులందరిలోకి గుణగుడు గొప్పవాడు.ో అతని బాల్యదశ ఎంత అద్భుతమైనదో ఈ కవి తెలియజేసేడు. కాని ఇక్కడ ఒక్కసంగతి చెప్పవలసుంది. గుణగుని పసితనంలో అనగా ఇంకా రాజ్యానికి రాకపూర్వం చూపించిన ప్రతాపమంతా అప్పుడు రాజుగా ఉంటూన్న అతని తాతమైన రెండో విజయాదిత్యుడు అనుభవించేడు. రండో విజయాదిత్యుని (నరేంద్ర మృగరాజుకి వచ్చిన అపార ఘనతకి అతని మనుమడే కారణమని మనం (గ్రహించవచ్చు. ఈ కారణంవల్లె గుణగునియిక్క ఈ బాల్యఘనత మనకు ఆనాటి చరిత్రలో కనబడదు. అతను రాజ్యానికి వచ్చిన తర్వాతే ఘనుతని చరిత్ర చెప్పుతూంది. దానికి పూర్వ చరిత్రను ఈ కవి మనకు ఆలియజేసేడు. తారకాసురుడు (అమోఘవర్దుడు) కుమారుణ్ణి (గుణగ విజయాదిత్యుని) గురించి అలక్ష్యంగా - క. బహుముఖమటె తన రాజ్యము బహుదోషాఢ్యుండటె తాను బాలుండటె వా డు హరుండైనను నీతి వి రహితంబది, యిట్టి పతికి రణజయమగునే! (ఆ10.ప 147) అని పలుకుతాడు. దేవదూత కుమారస్వామి (గుణగ విజయాదిత్యు)ని గురించి తారకాసురుడి (అమోఘవర్దుడి) లో - క. ఇనుడుదయింపక ముందఆఅ ఘనముగ వర్తించుందారకపభ మాక య్యిను డుదయించిన పిమ్మట కనుగొన లోకమునం దారకప్రభ గలదే (ఆ1!0ప. 152) 19... 706 ౬25187 020625 0 ౪౭౧౮| 0౪ 0౧ |. ౪౭౧4212/2గా2౧2)0/2. ౧ 141. 20. 1016, 5131.

2518 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము అంటాడు. అంతరార్థాలుగల ఇట్టి పద్యాలు లెక్కలేనన్ని! గుణగ విజయాత్యుడే ఈ (ప్రబంధంలో కుమారస్వామి పాత్రవహించేడు. ఈ కావ్యానికి గుణగ విజయాదిత్య విజయమనిపేరు పెట్టవచ్చును. గుణగుడు తన విజయాలను స్పురింపజేస్తూ “నృపమార్తాండుడు” అను బిరుదునుకూడ దాల్చ్బేడు.

గుణగ విజయాదిత్యుడికి కుమారస్వామి నామ మెట్లు సరిపోయింది? గుణగునికుండే పేరులో గాని బిరుద నామాలలో కాని నేరుగా కుమారస్వామి అని అర్థం వచ్చే మాట ఉందో లేదో ఇంకా వెతికి చూడాలి. కాని ఈ వంశంవారి, అనగా తూర్పు చాళుక్య వంశంవారి దేవతలు కౌశికి (దుర్గ), కార్తికేయుడు (కుమార స్వామి).*' గుణగ విజయాదిత్యుడు చాళుక్యరాజుల బానిసత్వాన్ని వదలగొట్టినవాడు. కాబట్టి అతన్ని కవి కుమారస్వామిగా పోల్చేడు. ఆ వంశంవారి దేవుడైన కుమారస్వామే గుణగ రూపాన్ని వచ్చేడని కవి భావం!

కుమారసంభవ కథలో పరమేశ్వరుని వివాహం చిత్రభాను సంవత్సరంలో జరిగిందని (ఆ 8. ప 191) సూచించబడింది. కుమారస్వామి జననమూ ఆ సంవత్సరమే! కుమారస్వామి బాల్యం పూర్తియెనట్టి, తారకాసురుణ్ణి గెల్చ్బినట్టి సంవత్సరం విజయ అని (ఆ 12.ప 191) సూచించబడింది. చిత్రభాను నుండి విజయ పన్నెండో సంవత్సరం. కాబట్టి కుమారస్వామి పన్నెండో సంవత్సరానికి తారకుణ్ణి గెల్బేడు. కాని ఈ సంవత్సరాల పేర్లు కవి విష్ణువర్ధనుని, గుణగ విజయాదిత్యుని కాలపరంగా సరిపోవడంలేదు. ఆ కాలంలో చిత్రభాను సంవత్సరం (క్రీ.శ. 802లోను, విజయ సంవత్సరం క్రీ.శ. 813లోను వచ్చేయి. క్రీశ. 829 (ప్రాంతాలలో గుణగుడు జన్మించి ఉంటాడని నా వాదనకాబట్టి పెనిచెప్పిన సంవత్సరాల పేళ్లు గుణగుని పుట్టుక, బాల్యానికి సరిపోవు. కవి ఆ సంవత్సరాల పేళ్లను ఇట్లు ఐక్యపరచలేదనే చెప్పవలసివస్తూంది. దీనిని గురించి మరికొంచెం ముందుముందు చర్చిస్తాను.

కుమారస్వామి శరవణ (ను సరస్సు (ఆ 10 ప 30లో జన్మించేడు. ఈ సరస్సు సముదంలాగుంటుంది. దీని నీరు సుధారసం (ఆ 10 ప 22) లాగుంటుంది. ఈ సరోవరం పేరు పెట్టి కవి కొల్లేటిని వర్ణించేడు. గుణగుని జననం కొల్లేటి దగ్గిర నున్న కొలనుపురం అయుంటుంది (ఏలూరు). లా 21. ₹06 ౬4518గ 0414%/28 0 ౪6౧0! 6 06 [౮/6౧62131208028)౧/8 ౧ 63.

నన్నెచోడ దేవ దేశికవి శ్రీ శ. 828-882 బేపుమళ్ళ కామేశ్వర రావు 2519

గుణగుడు చిన్నతనంలోనె పరాక్రముడు కాగా “రాజధరు డర్భకుని యువరాజు జేసే” (ఆ 12 ప 199). ఇతని కీర్తి ముందు, తండి కీర్తి తాత పేరుకూడ మాసిపోయేయని చెప్పవచ్చు. అతని తండ్రి శతురాజ్యంలో బందిఖానాలో ఉండడంచేత గుణగుడు యువరాజుగా చేయబడి యుండవచ్చు. పరమేశ్వరు డెవడు?

“సకల భువనస్వామి” (ఆ 2 ప 91). “విశ్వభువనాధిప” (ఆ 2, ప 88), “సకల భువనాధీశ్వరుడు” (ఆ 3, ప 2), "అఖిల భువనాధీశ్వరుడు" (ఆ 7 ప 32), ఈ పదసంపుటులలోని “సకల” పదం బహు ముఖ్యమైనది. అదే స్థితిలో “విశ్వ” “అఖిల” అను మాటలు ఉపయోగింపబడ్డాయి. కాని ఈ “సకల” యొక్క ఉద్దేశమే వేరు. ఇది ఆ సమీపకాలంలోని (గంథాలను పరిశీలిస్తేకాని బయటపడదు. పంపకవి (క్రీశ. 941) తన కావ్యంలో చాళుక్య రాజులను గురించి చెప్పవలసి వచ్చి “సకల చకవర్తి" అని వాడేడు. చాళుక్యరాజుల సందర్భంగా “సలూకి “సల్కి” పదాలను వింటూంటాం. ఈ పదాన్నే కవిత్వానికి సరిపోయేటట్లా “సకల” అని కవులు మార్చేరని చెప్పవచ్చు. ఇట్లు మార్చినందువల్ల కలిగిన లాభమేమంటే, “సకల”కి ఉండే పర్యాయపదాలైన “అభీల, విశ్వ” మొదలైనవి సుళుపుగా వాడవచ్చు. చాళుక్య రాజైన జయసింహ వల్లభుడికి “సకల లోకాశయ” అను బవిరుదుంది. రెండో విజయాదిత్యుడికి “సమస్త భువనాశయి” అను బిరుదుంది. గుణగుడికి “సమస్త భువనాశయు"డనే బిరుదుంది.

అమోఘవర్దుడి సందర్భంగా కవి “అఖిల భువన భవనాధీశ్వరుడు” (ఆ 11, ప 191) ఇత్యాదులు వాడేడు. కాని సకల శబ్దాన్ని వాడినట్లుగా తోచదు. సకల శబ్దం చాళుక్య పరంగా వాడబడుతూంది.

తూర్పు చాళుక్య రాజులు [ప్రారంభంలో విష్ణుభక్తి (ప్రియులుగా కనబడుతున్నారు. కాని వీరు [క్రమ్మకమంగా శైవాన్ని అభిమానించి కొందరు తమ బిరుదులలో పరమేశ్వర శబ్దాన్ని ధరించేరు. కలి విష్ణువర్ధనునికి “పరమ మహేశ్వరుడు” అను బిరుదు ఉంది. గుణగుని (కుమారస్వామి) తండ్రియైన కలి విష్టువర్థనుడే ఈ కథలో పరమేశ్వరుడు, అతనికుండే బిరుదే ఈ కథలో పేరుగా వాడబడింది.

2520 పందిరి మల్లికార్డునరాపు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము గుణగుని ఆశ్రయించిన చోడు డెవరు?

క్రీ శ. 885 ప్రాంతంలో ఒక చోళుడు తనమీద శత్రురాజులు పడగా ఎదిరించలేక పరుగెత్తుకొనివచ్చి గుణగుని ఆశయం పాందేడు.

దణ్జులై వచ్చిన బెజణ్ఞిన చోళునిం

జేకొని కాచె భూలోకం బెజుంగ [ధర్మవర విలాశాసనము]

ఇతని పూర్తిపేరు శాసనంలో చెప్పబడలేదు. చోళ శబ్దాన్ని పట్టుకొని మనం"

సాధించగలిగినదీ కనబడదు. ఎందుచేతంటే నన్నెచోడుని కాలపు శాసనాలలో

“భి *ీడ” భేదాలున్నా, పెన జప్పబడిన శాసనం అతని కాలంలోది కాదు. కన్నడ

సంపర్కమున్న తూర్పు చాళుక్య రాజులు “చోళా శబ్దాన్నీ గ్రహించి ఉండవచ్చు.

కాబట్టి చోళ, చోడ శబ్దాలు మనకేమీ సాయపడవు. ఈ చోళుని పూర్తిపేరు చెప్పబడక పోడానికి ఒకటే కారణమని తోస్తూంది. ఇతను పెద్ద రాజులతో సమమైనవాడు కాడు. శత్రువు కాడు. అరవదేశంలో చోళులు (ప్రాముఖ్యానికి వస్తున్నారు. ఈ చోళుల సంబంధమైనవాడైతే రాజకీయ కారణాలవల్ల దానిని పెద్దజేసి పేరు మొదలైనవి చెప్పేవారులో కాని అతను ఆంధ్రదేశంలోని ఒక రాజు. కాబట్టి అతని పేరు చెప్పబడలిదు. ఈ చోళుడు నన్నెచోడుడనే భావించవచ్చు.

శతురాజులు మీదపడగా తన (ప్రభువైన గుణగ విజయాదిత్యుని క్రీశ. 881

(ప్రాంతాలలో శరణు జొచ్చేడు. గుణగుడు అతనికి తగిన మైన్యసహాయం చేసేడు.

కాని నిష్ప్రయోజనం. ఈ యుద్ధాలలోనె ఒకదానిలో నన్నెచోడుడు మరణించి

ఉంటాడు. అతను యుద్ధంలోనె మరణించినట్టుగా అధర్వణుని పద్యం సాక్ష్యం. ఆనాటి కొన్నిచారిత్రకాంశాలు =

క్రీ.శ. 830 ప్రాంతవు శాసనాదులలోవచ్చే కొన్ని మాటలు ఇప్పు డర్ధమవడమే కష్టం. ఆనాటి మహారాజుల విశేషాలు తెలియడమే కష్టం. అటువంటి సందర్భంలో లా

  1. భారతి 5 వ సం. పుటలు 659 - 20.

  2. డాక్టరు నేలటూరి వెంకటరమణయ్యగారి ఊహలు ఈ విషయమై భిన్నంగా ఉన్నాయి. వీరు తమ ఆంగ్ల గ్రంథమైన వేంగీచాళుక్యులు ఈ చోళుడు దక్షిణాది చోళుడై ఉంటాడన్నారు. పుట 122. కాని భారతి (సర్వజిత్తు పుట 497లో, ఈ చోళుడు పశ్చిమాంధ్రంలో పాలిస్తూన్న ఒక చోళుడై ఉంటాడు అన్నారు.

నన్నెచోడ దేవ దేశికవి క్రీ శ. 828 - 882 బేవమళ్ళ కామేశ్వర రావు 2521 అప్పటి పరిస్థితులను విశదీకరించడానికి కుమార సంభవం బాగా తోడ్పడుతూంది. మచ్చుకి ఇక్కడ కొన్నిటిని ఆలియజేస్తాను.

  1. పంచమహాశబ్ద ఈ మాట ఆనాటి శాసనాలలో వస్తుంది. దీని అర్థం సరిగా తెలియక చారిత్రక పరిశోధకులు అనేక విధాలుగా వాస్తున్నారు. పంచమహాశబ్ద మంటే అర్థమేమిటో నన్నెచోడుడు విశదీకరించేడు -. . మ. సమదానేక ప బృంహితంబు, హయహేషా ఘోషమున్‌ గీతవా ద్య మృదు ధ్వానము, వేదరావము, భటోద్ధండోక్తులుం భూరి పం చ మహాశబ్దరవంబు - (ఆ9ప 123)
  2. ఇక్ష్వాకుడు (ఆ 12ప 62) ఇతను తూర్పు చాళుక్య రాజులపక్షాన్ని ఉండి తారకుడితో యుద్ధంచేసేడు. కాని ఇక్ష్వాకుని పూర్తిపేరు ఆలియడం లేదు. ఇక్ష్వాకులు తొమ్మిదోశతాబ్బంలోకూడ రాజ్యం చేస్తున్నారని దీనినిబట్టి చెప్పవచ్చు.
  3. పండరంగడు | ఇతను గుణగ విజయాదిత్యుని మహా సేనాధిపతి. కాని అయితే ఈ పండురంగడు ఎప్పటినుంచి ఉన్నాడో శాసనాలవల్ల స్పష్టం కావడంలేదు. ఇతను గుణగుడికి పూర్వుడు కాడని చర్మితకారుల అభిప్రాయం. కాని కుమార సంభవకర్త పాండురంగని పేరును పరవేశ్వరుడితో జతచేసి అంతరార్థంగా ఇట్లు తెలియజేశాడు - , పాండురంగోన్నత (పభకంటె ముందర పర్వె లిప్తామల భస్మ దీప్తి (ఆ7ప5?) పాండురంగాదుల బహుళధీధితులను పూర్ణ చంద్రాత పాకీర్ణరుచులు (ఆరప 64) పాండురంగ విశుద్ధాంగ భాతి (ఆ7పరశ4) వీటినిబట్టి కలి విష్ణువర్ధనుని (పరమేశ్వరుని) తో పాండురంగడు ఉండేవాడని ద్యోతకమవుతూంది. కాని ఇక్కడ ముఖ్యమైన సంగతేమంటే - కవి విష్ణువర్ధనుడు ఒకటిన్నర సంవత్పరాలు మట్టుకే రాజ్యపాలన చేసేడు. అంతకుముందు అతను

2522 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము రెండవ విజయాదిత్యుని (అనగా తండ్రీ) చాటున యువరాజుగా ఉండేవాడని తలచవచ్చు. కాబట్టి పాండురంగడు రెండవ విజయాదిత్యుని కొలువులోనె ఉండేవాడని చెప్పవచ్చు! కలి విష్ణువర్ధనుడు రాష్ట్రకూట రాజుయొక్క కుమార్తెయెన “శీలమహాదేవిని వివాహం చేసుకొన్నాడు. అది రాష్ట్రకూటుల ప్రధాన నగరంలోనె జరిగింది. దానికి ఈ కవి హేమగిరి (మాన్యఖీటు) అని పేరు పెట్టేడు. పాండురంగడుకూడ ఆ వివాహానికి వళ్ళినట్లు వర్ణనలనుబట్టి తెలుస్తూంది.

కలి విష్ణ్టువర్ధనుని వివాహంనాటికి చాళుక్యుల రాజధాని జజవాడ (రజతాద్రు. అంతరార్థంగా దీనినే కవి (ఆ 7 ప 142 - 157 ) వర్ణించేడు. రాజధాని అనగా ముఖ్యపట్టణం వేంగీపురంనుంచి బెజవాడకి అంతకి పూర్వమే మారిందని చెప్పవచ్చు. వేంగీపురానికి సహజమైన రక్షణమేదీ లేనందువల్ల బెజవాడకి మార్చబడి ఉంటుంది. న

అమోఘవర్తుడికి గుణగుడికి జరిగిన యుద్ధంలో పరమేశ్వరుడు పాల్గొనలేదు. అది కారణంగా పాండురంగని పేరూలేదు.

పండరంగడు రెండో విజయాదిత్యుని (క్రీశ. 806-846) కాలంలోను, గుణగ విజయాదిత్యుని (క్రీశ. 848-891) కాలమంతా, అటు తర్వాతకూడ జీవించి ఉన్నాడని చెప్పవలసి వస్తూంది. ఈ విధంగాచూస్తే ఇతను నూరీళ్లుదాటి జీవించేడనీ, అంళేకాదు అధమం నూరేళ్లేనా ఉద్యోగం చేసేడనీ చెప్పవలసి వస్తూంది. ఇది బేసబబు! ఈ పట్టున మరొక సంగతి పరిశీలించ వలసి వసూూంది. శాసనాలలో చెప్పబడినవాడు పండరంగడు కాని పాండురంగడు కాడు. కుమార సంభవంలో చెప్పబడినవాడు పాండురంగడు.

గుణగ విజయాదిత్యుని సైన్యాధిపతియెన పండరంగని తండ్రిపేరు కటకరాజు అని శాసనాలనుంచి తెలుస్తూంది. ఇతనికి మరొకపేరు కడియరాజు; (కటకము: కడియము) కాబట్టి ఇతనికి ర0డుపేర్లు సరిపోతున్నాయి. పండరంగని తండ్రి కటకరాజు కదా! తరము మార్చి తరముగా ఒకేపేరు పెట్టుకొనడం పూర్వం నుంచి మనలో వస్తూన్న ఆచారం. కాబట్టి పండరంగని తాతపేరు పండరంగడని ఊహించవచ్చు. పండరంగని పుత్రుడు పాండరంగడు కావచ్చు. ఎట్లంటే, వాసుదేవుని పుత్రుడు వాసుదేవుడుకదా! కాబట్టి పండరంగని పుత్రుడు పాండరంగడు (కటకరాజు) ఈ కవి పరమేశ్వరుని పరముగా ఈ పదము సరిపోవడానికి “పాండరంగొ శబ్దాన్ని “పాండురంగ” డిగా మార్చేడు. ఇట్టిస్వల్పమైన మార్పులు అంతరార్థ

నన్నెచోడ దేవ దేశికవి శ్రీ శ 828 - 882 లేకుమళ్ళ కామేశ్వర రావు 2523 కథకి తప్పవు. ఈ కథలోనె “శీలమహాదేఏొ పేరును “శిలమహాదేవోొగా మార్చి రచించిన విషయం ముందుముందు విశదంగా చూద్దాము.

కటకరాజు (పాండరంగడు) కలి విష్ణునికాలంలో ప్రసిద్ధి పొంది గుణగ విజయాదిత్యుని కాలంలో యుద్ధాలుచేస్తూ మరణించేడులే ఇతని పుత్రుడైన పండరంగడు ఆనాటి సైన్యాధిపతులలో మేటి అనిపించుకొని గుణగ విజయాదిత్యుని అనంతరం కూడ జీవించి ఉన్నాడు.

  1. నీలకంఠ అను పేరకూడ (ఆ 6 ప 164) లో చెప్పబడింది. ఇదికూడ ఒకసైన్యాధిపతి పేరేమో! ఇట్లే కాల, మహాకాల అనుపదాలుకూడ వస్తూంటాయి.
  2. బ్రహ్మ, విష్ణువు

ఈ అంతరార్థ కథలో చెప్పబడ్డ [బ్రహ్మ విష్ణువులయొక్క ఆసలుపేర్లు తెలియడంలేదు. బ్రహ్మ అనగా రాజగురువు, విష్ణువు అనగా మంత్రి అని ఇక్కడి భావం. ఆనాటి చరిత్రలోని తబిపీళ్లు తెలియనిదే వీరి అసలు పేళ్లు ఆలియవు. కాని ఇవి వారి అసలు పేళ్లకి పర్యాయ పదాలన్న సంగతి వేరే చెప్పనక్కరలేదు. 6. అమోఘవర్తుడు

కవి విష్టువర్థనుణ్ణే (పరమేశ్వరుణ్ణి) ముఖ్య సేనాధిపతులతోకూడ, అమోఘవర్డుడు చెరబట్టి, తూర్పు చాళుక్యరాజ్యం మీదికి దండెత్తి వెళ్లి గెల్చి, ధూర్జటి (7) చేత నీళ్లు మోయించి మంత్రి (విష్ణువు) చేత పశువులను కాయించేడు (ఆ 4 ప 25). పన్నెండేళ్ళకి పైగా వేంగీరాజ్యం అమోఘవర్షుడి అధీనంలో ఉండి పోయింది.

  1. రాహణ పండరంగడు అను తూర్పు చాళుక్య సైన్యాధిపతి రాహణను లొంగదీసేడు. లోవాసనంబెక్కి రాహను నొడచిన వల్లభు కొల్పున నెల్లనెజటుంగే లల
  2. అడిగ గి. 5. ౪౬ 114.
  3. ధర్మవర శిలాశాసనము, భారతి 5 వ సంపుటం, పుటలు 619 = 20.

2524 పందిరి మల్లికార్డునరావు శతజయంతి సంప్పుటము 4; సాహిత్యము ఈ రాహణ ఎవరు?

వేంగీ చాళుక్యరాజైన మొదటి విజయాదిత్యుని (క్రీశ. 753-770) కాలంలో రాహప్ప అనుపేరుగల వీరు డొకడున్నాడు. ఇతను అప్పటి రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణునిమీద తిరగబడి ఓడిపోయేడు. ఈ తిరుగుబాటుకి వేంగీ చాళుక్కుని ప్రోత్సాహం కొంత ఉండవచ్చని చరిత్రకారులు ఊహిస్తున్నారు.

గుణగ విజయాదిత్యుని (క్రీశ. 848-891) కాలంలోని రాహణకి రాహప్పకి పేరు సామ్యముంది. పేర్లు కన్నడపువిగా కనబడుతున్నాయి. రాహప్ప యొక్క వంశంలోనివాడె రాహణ కావచ్చు. కాని తక్కిన పరిస్థితులనుబట్టి ఆ కాలంలోని రాహప్ప వేంగి చాళుక్యుని వైపు వుండగా ఈ కలంలోని రాహణ వేంగీ చాళుక్యుని ఎదిరించడం చూస్తే, అతను స్వాతంత్య్యుం సంపాదించుకొని బలమైన రాష్ట్రకూటుల వైవు ఉండడానికే అని ఎదిరించేడని చెప్పవచ్చు. కాని అతను మర్దించబడ్డాడు.

రాహణను మర్దించిన సేనాధిపతి పండరంగ అని ధర్మవర శిలాశాసనం నుంచి తెలుస్తూంది. ఈ మైన్యాధిపతి అనేకమందిని జయించి “రణమర్ద” బిరుదు పొందేడు*” ఇతను యుద్ధంలో జయాలు పొందడ మేకాకుండ, కొంత ప్రదేశానికి అధికారియెనట్లుగా కూడ ఉంది. ఇతనిదే, “రణమర్ద” కుటుంబమయింది. చాళుక్య భీముని (క్రీశ. 892 -922) పరిపాలనా కాలంనాటికి ఈ రణమర్ద కుటుంబంలో స్టీం సంతతే కాని పురుషసంతతి లేకపోగా, వారి అల్లుడైన కుసుమాయుధుడు (ముదుగొండ చాళుక్య వంశీయుడు) ఈ (ప్రదేశానికి పప్రభువయేడు.” కుసుమాయుధుని చరిత్ర ఇటు తర్వాత చెప్పబడుతుంది. 8. ముదుగొండ చాళుక్యులు కుసుమాయుధుడు.

మొగలి చెరువు దానశాసనము, మరికొన్ని ఆధారాలనుంచి చరిత్రకారులు ముదుగొండ చాళుక్య వంశవృక్షాన్ని కొంతవరకు కనుగొనగలిగేరు. వారు కనుగొన్న దానిలో మొదటి మూడు తరాల వంశ వృక్షాన్ని మాత్రమే ఇక్కడ ఆలియబేస్తానుగ 26. 06 ౬62518గ7 0414/886 0 ౪౭౧౦| 0 0% స. ౪6౧8818/300404)6/8 ౧ 82. 27. కొజవిశాసనం 28. 1౧6 ౬583167 ౧౭|౮౧/25 01 ౪6౧01 ౧. 144. 29. 706 6౯2916౧ 04140/29 0 ౪9౧0! 0 0౧ |. ౪౪౧6౬౬12/2గ2౧812% ౧. 145

నన్నెవోడ దేవ దేశికవి క్రీ శ 828 - 8482 టేదమమళ్ళ కొమేశ్వూర రావు 2525

కోకి రాజు(=ఇతని భార్య రణమర్హనుని కుమార్తె)

| కుసుమాయుధుడు 1... | విజయతుడు

విజయుతుడు క్రీ.శ. 930 - 935 [ప్రాంతంవాడనీ, అతని తండ్రియైన మొదటి కుసుమాయుధుడు, కోకిరాజు పుత్రుడు కావచ్చనీ, ఈ కోకిరాజు ఆ వంశపు మూలపురుషుడనీ అన్నారు. ఈ మూలపురుషుడు చాళుక్య భీమునికి (క్రీ.శ. 892 - 922) సమకాలికుడనీ పై చరిత్రకారులే అన్నారు.

కాని ఈ కోకిరాజు కూడ మూలపురుషుడు కాడు. ఇంతకంటె పూర్వమున్నవా రున్నారని నన్నెచోడుని కావ్యంనుంచి తెలుస్తూంది.

రాష్ట్రకూటరాజు చెరబెట్టిన కవి విష్టువర్ధనుణ్ణి విడిపించడానికి ఇతరుల (పోద్చలంమీద కుసుమాయుధుడు (ఆ 4 ప 33 - 47) వళ్లేడు. ఇతని తల్లిదండ్రులు విష్ణువు, లక్ష్మి అని పర్యాయ పదాలతో మాత్రమే చెప్పబడ్డారు. (కోకి = విష్ణువు) కాబట్టి అతని తల్లిదండ్రులు కోకిరాజు, లక్ష్మీదేవి అని చెప్పవచ్చు. కుసుమూయుధుడు వేంగీచాళుక్యు డైన కలి విష్టువర్థనుణ్ణి చెరనుంచి విడిపించడానికి చేసిన యుద్ధంలో మరణిం చేడని చెప్పవచ్చు. ఇక్కడ ఒక అంశం చర్చించవలసుంది. కుసుమాయుధుణ్జి పరమేశ్వరుడు యుద్ధంలో చంపివేసేడు. ఈ పరమేశ్వరు డెవడు?

కలి విష్ణువర్థసుడు తనసు చెరనుండి విడిపించడానికి వస్తూన్న కుసుషూయుధుణ్ణి చంపివేసేడని చెప్పడం అసందర్భం. కాబట్టి కుసుమాయుధుణ్ణి చంపిన పరమేశ్వరుడు కలి విష్ణువర్ధనుడు కాడు. మరి ఎవరు? కవి ఈ పట్టున మాటలలోని ద్వందార్థాన్ని (ప్రయోగించేడు. అమోఘవర్షుడికి - అనగా, రాష్ట్రకూట రాజుకి “మహారాజాధిరాజ పరమేశ్వర పరమ భట్టారక అను బిరుదుంది. ఈ బిరుదులోని పరమేశ్వర గబ్బమే ఇక్కడ (గ్రహించబడింది. కాబట్టి రాష్ట్రకూటరాపైన అమాఘపర్హుడే ఉన్న పరమేశ్వర బిరుదాన్ని కవి ఇక్కడ చమత్కరించీడు. పురాణకథ సందర్భంగా

2526 పందిరి మల్లికార్జునరావు శతజయంతి. సంపుటము 4: సాహిత్యము ఒక అర్థమూ, చారిత్రక కథ సందర్భంగా మరొక అర్ధాన్ని చూపించి మన ఆశ్చర్యానికి పాత్రుడవుతున్నాడు. ఇప్పుడు ఆ ఘట్టంలో ఏమీ క్లిష్టత కనబడదు.

కలి విష్ణువర్థనుని విడిపించే యత్నంలో కుసుమాయుధుడు నశించేడని చెప్పవచ్చు. అతని సంతతివారు మాత్రం తూర్పు చాళుక్యరాజ్యంలో అధికారులుగా ఉంటున్నారు. ఏ స్థలమందు? అమరావతి పరిపాలకుని కింద కుసుమాయుధుడు ఉంటున్నాడు. కాబట్టి అమరావతీ పరిపాలకుడైన సురేశ్వరామాత్యుడు (ఆ4ప 28) కుసుమాయుధుణ్ణి పిలిపించి పరమేశ్వరుడి (అమోఘవర్షుడి) మీదికి దండెత్తబంపేడు. కాబట్టి ఈ కుసుమాయుధ వంశీయుల తొలిస్థానం అమరావతి (గుంటూరు జిల్లాలోనిది) పరిసరాలని భావించవచ్చు. కుసుమాయుధుని తాలూకువారు పూర్వంనుంచి అక్కడే ఉంటున్నారు. ఇతనిది ముదిగొండ చాళుక్య వంశంకదా!

ముదుగొండ చాళుక్య వంశం కలి విష్ణువర్థనుడికి ముందు నుంచీ ఉంటూందని చెప్పవచ్చు - అనగా, క్రీ.శ. 800 [ప్రాంతం నుంచి ఉంటుందని చెప్పవచ్చు. వీరి వంశవృక్షాన్ని చూస్తే వీరు తరం మార్చి తరముగా కోకిరాజు, కుసుమాయుధుడు పేర్లు ధరిస్తూన్నట్లుగా తెలుస్తూంది.

మరొక అంశమును గమనించవచ్చు. కుబ్జ విష్ణువర్ధనుడికి “మకరధ్వజుడు అను బిరుదుంది. దీనికి కుసుమాయుధ రాజునకు ఎట్టి సంబంధముందో చరిత్ర పరిశోధకులను విశదీకరించకోరుతున్నాను.

ఈ సందర్భంలోనె చెప్పతగిన మరొక చిత్రమైన అంశముంది. జానపద గేయంలో ఉన్న కొక్కిరాజు ఈ ముదుగొండ చాళుక్య వంశంవాజే కావచ్చు.

కొండమీద వెండిగిన్నె

కొక్కిరాజు కాలువిరిగె

దానికేమి మందు

వేపాకు చేదు

వెల్లుల్లి గడ్డ

నూనియ బొడ్డు

నూటొక్క ధార

నన్నెచోడ దేవ దేశికవి క్రీ శ. 828-882. భవమళ్ళు కామేశ్వల రావు 2527 అనికదా గేయం. కొండమీద వెండిగిన్నె అంటే చంద్రుడు. చాళుక్యులది చం్యదవంశము కదా! ఈ వంశపువాడు కొక్కిరాజు. “కోకిరాజు” అను పదమే జనుల నోళ్ళలో “కొక్కిరాజు” అయింది. ఈ కోకిరాజు ఏదో ప్రసిద్ధ యుద్ధంలో దెబ్బతిని పడిపోగా పై గేయం పుట్టించనవచ్చు. ఆ కోకిరాజు ఎన్నో తరంవాడో చెప్పడానికి జానపదగేయంలో తగినంత పదార్థం లేదు. ఏదయినా ఈ జానపదగేయం అర్థరహితమని కొట్టిపారవేయడానికి లేదు.

రతి మన్మథ సంవాదం కాళిదాసు రచించిన కుమారసంభవంలో లేదు” కుసుమాయుధ పాత్రతో కూడ నన్నెచోడ కవి దానిని జతపరచేడు. ముదుగొండ చాళుక్య వంశాన్ని గురించి మరికొంత వస్తువును ఆలియబేసేడు. 9. కలి విష్ణువర్హసుని ప్రథమ వివాహం .

కలి విష్టువర్ధనుడితో (పరమేశ్వరుడితో) దక్షుడు సంబంధం చేసేడు. ఈ దక్షుడు “బహ్మబంధుడు” (ఆ ౨2 ప 7) “పాజుడు” (ఆ 2 ప 82). ఈ మాటలు భట్టారక శబ్దాన్ని సూచిస్తున్నాయి. దక్షుడు అనేది ఆ పరిపాలకునియొక్క అసలుపేరు గాక పర్యాయపదం కావచ్చు. డక్త్ష భట్టారకుడు “వల్లభుడు (ఆ3ప 90) అని చెప్పబడుతున్నాడు. ఇతను రాష్ట్రకూటరాజ సంబంధీకుడు కావచ్చు.

దక్ష భట్టారకుడికి నలుగురు కుమార్తెలు. వారిలో “సతి” అను ఆమెను గీసతి పేరు కూడ అసలు పేరుకి పర్యాయపదమే కావచ్చు) కలి విష్టువర్థనుడికి ఇచ్చి వివాహం చేసేరు.

ఈ రాజదంపతులకు ఒక కుమూరుడు కలిగేడు. అతని పేరు విఘ్నేశుడు. (ఇదికూడ అసలుపేరుకి పర్యాయపడమే అయుంటుంది. లేక పరమేశ్వరుని

సతీదేవి చిరకాలం జీవించలేదు. ఆమె మరణానంతరం రెండు కుటుంబాల వారికి కలహం వచ్చింది. ఆ యుద్ధంలో యువరాజైన విఘ్నేశుడుకూడ పాలుగొన్నాడు. దక్షుణ్ని లొంగడీసేరు.

విఘ్నేుడి పెష్కుట ఉదంతం ఆలియరాపడంలెదు. అతను సింహాసన యెక్కలేడన్న సంగతి స్పష్టం. అటు తర్వాత దక్షుని ఇంటిలోనె ఉండి పోరపేడేమో! 30. వావిళ్లవారు ప్రకటంచిన కుమూర సంభవము (నన్నెచోడునిది) టరిక, పుట 3.

2528 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంప్పటము 4: సాహిత్యము

కలి విష్టువర్ధనుని ప్రథమ వివాహాన్ని ఆనాటి శాసనాలు (ధువపరచడంలేదు. అసలు ఆ కాలానికి సంబంధించిన శాసనాలే తక్కువ. వాటిలో చెప్పబడిన అంశాలు మరీ తక్కువ. అందుచేత మై ఉదంతం ధ్రువపరచబడడంలేదు. కాని ఆనాటి చరిత్రను అంతరార్థకథగా చెప్పదలుచుకొన్న నన్నెచోడుడు అట్టి ఘటన ఉండడం బట్టే కావ్యంలో చేర్చేడు. భావికాల పరిశోధనవల్ల కాని అది బైటపడదు. 10. కలి విష్ణువర్ధనుని "రెండో వివాహం

కలి విష్ణువర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోదలిచేడు. ఒక రాజు తన కుమార్తె మైన శీలమహాదేవిని అ(గ్రమహిషిగా (ఆ 7 ప 141) ఇయ్యదలిచేడు. శిలమహాదేవే ఆనాటి శాసనాలలో శీల మహాదేవిగా చెప్పబడింది. “శీల అను పదాన్ని కవి తనకథకి అనుకూలంగా “శిల” అని మార్చేడు. ఇట్లు మార్చగా ఈమె తండ్రి “శిలోచయోత్తముడు” (ఆ 7 ప 138) “తైలుడు” ఇత్యాదులుగా పేర్కొనబడ్డాడు. ఈ శిలోచయోత్తముడే ఆనాటి చరిత్రలోని ఇంద్రజ భట్టారకుడు.

“నీలో మహాదేవి “శిల” మహాదేవిగా చెప్పబడడానికి ఈ కింది అంశంకూడ కారణమేమో పరిశీలించవలసుంది. క్రీ.శ. ఏడవ శతాబ్బమందు కళింగదేశానికి, ఓడ్ర దేశానికి మధ్య కన్యోఢ రాజ్యముండేది. దీనిని శైలోద్భవులను రాజవంశంవారు పరిపాలించేరు*' ఈ రాజులకు రాష్ట్రకూటులకు ఉండే సంబంధ బాంధవ్యాలనుబట్టి - నన్నెచోడుడు “శిల, శైలజ” వంటి పదాలను గ్రహించేడేమో పరిశోధన అవసరం,

రెండు రాజవంశాలయొక్క ఐకమత్యంకోసం రాష్ట్రకూటులిట్టి వివాహం చెయ్యదల పెట్టేరేమా! కాని కలి విష్ణువర్ధనుడు మట్టుకు (ప్రథమంలో ఈ సంబంధాన్ని నిరాకరించేడు. కారణాలు మనకు తెలియవు. రాష్ట్రకూటులకు కోపం వచ్చింది. దీని ఫలితం మట్టుకు దారుణంగా ఉంది.

ఏ కారణంచేతో కలి విష్టువర్ధనుడు పాండరంగాదులతో కూడ తమ రాజ్యం యొక్క పశ్చిమ సరిహద్దుదగ్గర ఉండగా రాష్ట్రకూటులు హఠాత్తుగా మీదపడి కలి విష్ణువర్ధనుణ్ణి ముఖ్యమైన వారిని చెరబట్టేరు. అటు తర్వాత వేంగీరాజ్యం పై దండెత్తేరు. మహాకాలుడు, గోపాలుడు అను సైన్యాధిపతులు ఎదిరించేరు. (ఆ 4 ప20, 21) కాని ఓడిపోయేరు. చాళుక్యరాజ్యం శత్రువశమయింది. ధూర్జటి (7) నా 31. “విదేశయా(తికులు - ఆంధ్రదేశము” - భావరాజు వెంకట కృష్ణ రాయ కృతము పుట 13.

నన్నెచోడ దేవ దేశికవి క్రీ శ. 828-882... బేదుమళ్ళ కామేళ్చుర రావు 2529 చేత నీళ్లు మోయించేరు. విష్ణువు (మంత్రి) చేత పసువులను కాయజేసేరు. ఓడిపోయిన రాజులచేత ఇట్టి పనులు చేయించడం ఆనాటి దురాచారం. గుణగ విజయాదిత్యుడికి కూడ ఇట్టి ఊడిగంతప్పలేదు. పెన జప్పబడిన ధూర్జటి కలి విష్ణ్టువర్థనుని తండ్వియెన రండో విజయాదిత్యుడు కావచ్చు. అతనికి “రాజపరమేశ్వరుడు” అను బిరుదు ఉంది. పరమేశ్వరుడికి పర్యాయపదం ధూర్జటి. కలి విష్ణువర్ధనుడు రాష్ట్రకూట రాజ్యంలో బందీగా ఉన్నాడు. అతన్ని విడిపించే యత్నమేమిటి? కౌశిక (ఆ 4 ప 44) గోతుడైన సురేశ్వరామాత్యుని ప్రోద్చలంమీద కుసుమాయుధుడు సమసైన్యంగా రాష్ట్రకూట రాజుమీదికి దండెత్తేడు. కాని మృతుడయేడని తోస్తూంది. ఇంద్రజ భట్టారకుని కుమార్తెయైన శీలమహాదేవిని చేసుకోడానికి కలి విష్ణువర్థసుడిచేత ఒప్పించేరు. ఈ వివాహం రాష్ట్రకూటుల ముఖ్యపట్టణమైన మాన్యభేటులోనె జరిగింది. ఇక్కడ ఈ రెండువంశాల సంబంధాన్ని ఆలియవేసే వంశవృక్షాలను గుర్తిస్తాను. రాష్ట్రుకసులు. వేంగీ రాళ్ళుక్యులు (్రువుడు (క్రీశ 708 - 792) నరేయద మృగరాజు | రెండో విజయాదిత్యుడు (క్రీశ. 806-846) కంభ కర్క గోవింద 3. ఇంధద్రజరాజు లేక సువర్ణవర్దుడు. 792-814 ఇంద భట్టారకుడు | అమోఘవర్హుడు 1. _ (నృపతుంగుడు).... కర్కరాజు. శీలమహాదేవి = భర్త. కలి విష్ణువర్ధనుడు 814-880 సువర్ణ వర్డుడు 846-847 లలా 32. ఈ వంశవ్యక్షాలు కె. వి. నీలకంఠశాస్తింగారి ఆంగ్ల (గ్రంథమైన హిండూదేశ చరిత్రనుంచీ, భారతి సర్వజిత్తు అధిక శ్రావణ సంచికలోని, డాక్టరు నేలటూరి వేంకటరమణయ్య గారి వ్యాసములో 144వ పుటనుంచి తసుకోబడ్డాయి.

2530 పందిరి మల్లికార్జునరావు శతజయంతి సంపుటము 4: సాహిత్యము కవి విష్ణువర్ధనుడు రాణితోకూడ వేంగీరాజ్యమందే ఉంటున్నాడు. కాని

వారికి రాజకీయ స్వాతంతృ్య్యం లేదు. రాష్ట్రకూటులకు వేంగీ చాళుక్యులకు ఐక్యత కలుగులేదు.

కవి విష్టువర్థనుడికి గుణగ విజయాదిత్యుడు (కుమార స్వామి) జన్మించేడు. వేంగీ చాళుక్కులు స్వాతంత్య్యం కోసం గట్టి ప్రయత్నం చెయ్యదలచుకొన్నారు. గుణగుడు ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. అమోఘవర్డుడు (తారకుడు) పూర్తిగా ఓడిపోయేడు. వేంగీ చాళుక్యులు స్వాతంతృ్య్యపు జండాను ఎగరవేసేరు.

పరమేశ్వరుడి వివాహం చిత్రభాను సంవత్సరంలో అయినట్లుగా సూచించే పద్య (ఆ 8 ప 191) ముంది. ఆ సంవత్సరమే కుమారస్వామి జననం. కుమారస్వామికి బాల్యదశ అనగా పన్నెండేళ్లు నిండినట్లు సూచించే పద్యం (ఆ 12 ప 191)లో విజయ అని ఉంది. చిత్రభానునుంచి విజయకు పన్నెండేళ్ళ: కాని ఈ పద్యాలలోని కాలం కలి విష్ణ్టువర్థనుని జీవితాంశాలకు సరిపోదు. ఆ కాలమందు చిత్రభాను క్రీశ. 802, విజయ క్రీశ. 813 అయేయి. ఈ క్రీస్తుశక సంవత్సరాలను కలి విష్టువర్ధనుని పరంగా సమర్థించలేము. ఎందుచేతంటే, గుణగ విజయాదిత్యుని జన్మ క్రీశ. 829 ప్రాంతమయుంటుంది. కాని క్రీ.శ. 802 అవడానికి వీలులేదు. కాబట్టి చిత్రభాను, విజయ సంవత్సరాలు గుణగ విజయాదిత్యుని పక్షాన చారిత్రక సూచకంగా గాక (గుణగ విజయ) + అదిత్యుడు అను పేరుకి తగినట్టుగా చితభానులో జన్మించేడనీ, అతను నిర్వహించిన యుద్ధ విజయం దానికి తగినట్టుగా విజయలో జరిగిందనీ, శబ్ద సామ్యాన్ని చూసి సంతోషించవలసి వస్తూంది.

రెండు తరాలవారినే కాని వారికి పూర్వపు తరాన్ని చెప్పే అలవాటులేని ఈ కవి పరమేశ్వరుణ్ణి, గుణగ విజయాదిత్యుణ్ణి గురించే చెప్పేడు కాని పరమేశ్వరుడి తండ్రియు, ఆనాటి పరిపాలకుడైన రెండో విజయాదిత్యుణ్ణి (నరేంద్ర మృగరాజును) గురించి చెప్పనేలిదు. కాని దీనిలో సింహానికి సంబంధించి పోలికలు, ఉపమానాలు చాల చెప్పబడ్డాయి. వాటికి ఈ నరేంద్ర మృగరాజు బిరుదులోని “మృగరాజు” కారణమేమో!

చరిత్ర ప్రకారం క్రీ.శ. 818 [ప్రాంతంలో రెండవ విజయాదిత్యుడు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించుకొని తన మరణ కాలందాక అనగా ర46 దాక ఎ

నన్నెచోడ దేవ దేశికవి క్రీ శ. 828- 882 పకుమళ్ళ కామేళ్టుర రావు 2531 ఇబ్బందులూ లేకుండ కాలక్షేపం చేసేడని కనబడుతూందిలే కాని కుమారసంభవం (కారం 818 నుంచి 840 దాక కూడ వేంగీదేశం దుస్థితిలోనే ఉందనీ 840 (ప్రాంతాలలో గుణగ విజయాదిత్యుడు తలెత్తి అమోఘవర్దుణ్ణి యుద్ధంలో ధ్యంసంచేసి దేశాన్నే కాపాడేడనీ కనబడుతూంది. ఈ విభేదాన్ని తొలగించే ఆధారాలు ఉ త్తరోత్తరా లభించవలసిందే నేమో!

నన్నెచోడుని జననకాలం

గుణగుని వయస్సు నన్నెచోడుని వయస్సు ఇంచుమించుగా సమమనే భావించవచ్చు. గుణగుని తండ్రి ఒకటిన్నర సంవత్సరాలు (క్రీ.శ. 846-847) మాత్రమే రాజ్యం చేసి దివంగతుడయేడు. కాబట్టి చిన్న వయస్సులోనే గుణగుడు (క్రీశ. 848లో సింహాసనమెక్కేడు. అప్పటి కతనికి ఇరవై ఏళ్లు ఉండవచ్చు. అతని జన్మ 829 [ప్రాంతం కావచ్చు. గుణగుని వయస్సు నన్నెచోడుని వయస్సు ఇంచుమించుగా ఒక్కటే అని ఇచ్చటి వాదన. కాబట్టి నన్నెచోడుడు కూడ 829 (ప్రాంతాలలోనే జన్మించి ఉండవచ్చు.

నన్నెచోడుని “అన్యతారక కవుల” పద్యం చదివితే దానిలో అతను తన జన్మ[గ్రహాదికములను గూడ చెప్పుకున్నాడనే అనుమానం తట్టకమానదు. ఆ (గ్రహాలు సత్కవి బుధ గురు (గ్రహాలు. దీనిలో అతని జన్మకాలం కూడ ఉందా?

నేనొక చరిత గంథంో తిరగవేస్తూండగా కాలచుర్య (హైహయ) శకం క్రీ.శ. 25-5-249 నుంచి ప్రారంభమని చదివి నన్నెవోడుని తల్లి హైహయ రాజవంశస్తురాలు కదా, నన్నెచోడుడు ఈ శకాన్నితన పద్యంలో చొప్పించేడేమో చూద్దామని పరిశ్రమ చేసేను.

“అన్యతారక" పద్యంలో చెప్పబడ్డ (గ్రహాల స్థానాలను లెక్కించి ఆచారం ప్రకారం ఆ సంఖ్యను తలక్రిండుచేసి కాలచుర్య శకంలో ఏ సంవత్సర మవుతుందో చూసేను. ఎట్లంటే - జ్యోతిశ్శాస్త్రంలో (గ్రహముల వరస 1 ఇన 2 శశి 3 కుజ 4 రాహు 5 జీవ (=గురుడు) 6 మంద 7 జ్ఞ (బుధుడు) 8 కేతు 9 భ్సగు (=గుకుడు). నన్నెచోడుడు చెప్పుకొన్న [గ్రహాలు కవి (=గుకుడు), బుధ, గురుడు. లతలా 33... 7౧6 ౬25167 6210౮3 01 ౪౭౧౦ 0౫ స. ₹6౧6212/2గ౭౧౫20 ౧9 89.90 34. ౧510౧ 61౧612 085 1 0౫ 6. డి. [22౧12 52510/ ౯ 206

2532 పందిరి మళ్షికార్జువరావు శతజయంతి సంపుటము 4: పాహిత్య్మము పె వరసలో వీటి స్థానాలు 9, 7, 5. ఇట్టి అంకెలను సాధారణంగా తలకిందులుచేసి సంఖ్యగా గ్రహిస్తారు. కాబట్టి వీటిని అట్లు చేయగా 579 అయింది. ఇది కాలచుర్య శకం తాలూకు సంబ్య. దీనిని (క్రీస్తుశకంలోకి పూర్చాలంటే 249 చేర్చాలి. అప్పటి కిది క్రీ.శ. 828 అయింది. నేను అనేక ఉపపత్తులతో నన్నెచోడుని జన్మ సంవత్సరం ఆ (ప్రాంతంలోనె ఉంటుందని చెప్పిన సంవత్సరానికి సరిపోయింది. కాబబ్జి నన్నెచోడుని జన్మ క్రీ.శ. 828 అని భావిస్తున్నాను. నన్నెచోడుడు కమ్మచ్చులోంచి లాగినట్లుగా పద్యాలను వాయగలడు. అటువంటివాడు అన్యతారక కవుల పద్యాన్ని ఎగుడుదిగుడుగా వ్రాయడం దానిలో అనేక అర్థాలను ఇమడ్చడానికి పడ్డ డమే అని తోస్తూంది. కుమార సంభవ రచనాకాలం

ఈ [గ్రంథరచనా కాలానికి నన్నెచోడుడు లేతవాడు కాడు. అనేక యజ్ఞాలు చేసినవాడు (ఆ 1 ప 55). యుద్ధాలు చవిజూచిన వాడు. అప్పటికే కవిరాజ నిబామణి, కావ్యకర్త. ఇతని “పతొ గుణగ విజయాదిత్యుడు కదా!

నన్నెచోడకవి గుణగుడు సింహాసనాన్ని ఎక్కిన తర్వాతి చరిత్రను (వాయడంలేదు. గుణగుని బాల్యవిజయాలనె అంతరార్థ కథగా వర్ణించ దలచుకొన్నాడు. గుణగునికి పన్నెండేళ్ల వయస్సు 841 ప్రాంతానికే ముగిసింది. అతను $48లో కాని సింహాసనారూడుడు కాలేదు.

తాను కావ్యరచనలో, విద్యలో పరిణత పొందితేగాని నన్నెచోడుడు గ్రంథరచన [ప్రారంభించలేడు. అతనికి అధమం ఇరవై అయిదు సంవత్సరాలేనే ఉంటేనేకాని ఇంతటి ఘనకార్యానికి పూనుకోలేడు. నన్నెచోడుడికి ఇరవై యెదేళ్ల వయస్సు క్రీశ. 853 ప్రాంతానికి కాని రాదు. కుమారసంభవ కావ్య రచన రివ ప్రాంతానికీ పూర్తిమయై ఉండవచ్చు. ఆ కాలానికి గుణగుడింకా తన రాజ్యపుబెల్లను విస్తరించుకొంటూ విజయాలను పొందుతున్నాడు. ఇటువంటి వృద్ధి దశలోనే ఈ (గ్రంథరచన పూర్తియై ఉంటుంది.

ఇక్కడ ఒక ఎదురుప్రన్న పుట్టవచ్చు. నన్నెచోడుడు గుణగుని బాల్య విజయాలుగాక అతను 886 నాటికీ గావించిన మహత్తర విజయాన్ని ఈ క వర్ణించి ఉండరాదా? నన్నెచోడుడు తన పతి యొక్క జాల్యదశలోని విజయాలను

నన్నెచోడ దేప దేశికవి క్రీ శ 828 - 882 బేపమళ్ళ కామేశ్వర రావు 2533 కుమారస్వామితో సరిపోల్చి వర్ణించదలుచుకొన్నాడు కాని, మరణానికి ముందు గుణగుణ్ణి కుమారుడని పేరుపెట్టి వర్ణించదలుచుకోడు. వూర్తికాలం జీవించకుండానె నన్నెచోడుడు ఏదో యుద్ధంలో మరణించేడనితెలుస్తూంది కాబట్టి క్రీ.శ. 886 (పాంతానికీ నన్నెచోడుడే దివంగతుడై ఉంటాడు. ఇంకొకరీతిగా ఎదురువాద ముండవచ్చు. తారకాసురుడి (అమోఘవర్షుడి) మరణాన్ని ఈ కవి వర్ణించేడు, అమోఘవర్షుడు క్రీ.శ. 880కి మరణించేడు కాబట్టి ఈ (గంథం 880 తర్వాత రచించబడి ఉంటుంది అని. దీనికికూడ వె సమాధానమే చెల్లుతుంది. తన పతియొక్క బాల్య విజయాలనే ఈ కవి వర్ణించబోతున్నాడు. ఆ విజయకాలానికి పరమేశ్వరుడు (కలి విష్ణువర్ధనుడు) జీవించి ఉన్నాడు. అమోఘవర్దుని మరణంవరకు (గ్రంథరచన నిలుపు చేయవలసిన అవసరంలేదు. అమోఘవర్తుని సంపూర్ణ అపజయాన్నే అతని మరణంగా భావించి కవి కావ్యరచనకు పూసుకొన్నాడు. నన్నెచోడుడు తనకు అమోఘవర్ష్దుడిమీద ఉండే శత్రుత్వంవల్ల అతని అపజయాన్నే మరణంగా అతిశయోక్తిగా చేసేడు. మానవులను దేవతలు, రాక్షసులు అన్నట్టే ఈ అతిశయోక్తికూడ,. కాబట్టి ఏ విధంగాచూసినా కుమారసంభవ రచన 855 దాటదు. అయితే కళావిలాసం ఎప్పుడు రచించబడింది? కళావిలాసం సంస్కృతంలో శ్లేమంద్ర విరచితం. కుమార సంభవ రచనా ప్రారంభానికే నన్నెచోడుడు తాను “కావ్యకర్తను (ఆ 1 ప 57) అని చెప్పుకొన్నాడు. అతను తనను గురించి చెప్పుకోని విషయాలు బోలెడున్నాయి. ఇంతకీ కళావిలాసం లభించలేదు. కుమార సంభవం గురించి నన్నెచోడకవి జీవితాంశాలు కొంచెం మాత్రమే తెలుస్తున్నాయి. అతను సూర్యవంశానికి చెందిన చోడరాజు. కాశ్యప గోత్రజుడు. తండ్రిపేరు బల్లిచోడుడు. హైహయ వంశస్తురాలైన శ్రీదేవి ఆతనితల్లి. నన్నెచోడుడు క్రీశ. 828 (ప్రాంతంలో జన్మించేడు. వీరిది చోడరాజ్యం. దాని ముఖ్యపట్టణం ఒరయూరు. బల్లిచోడుని కాలంలోనె పాకనాడు ఈ చోడరాజ్యంలో చేరింది. నన్నెచోడుడు (క్రీశ. 848 (ప్రాంతంలో సింహాసన మెక్కి ఉంటాడు. ఇతనికి టెంకణాదిత్యుడు. రవికులశేఖరుడు, కవిరాజ శిఖామణి అను ముఖ్యమైన

2534 పందిరి మల్లికార్డునరావు శతజయంతి. సంపుటము. 4: సాహిత్యము బిరుదులున్నాయి. ఇతని కొలువులోకూడ కవులు మొదలైన వారుండేవారు, నన్నెచోడుడు పూర్తిగా స్వతం[తుడుకాడు. అతని రాజాధిరాజు గుణగ విజయాదిత్యుడు. చోడరాజ్యానికి పశ్చిమాన రాష్ట్రకూట రాజ్యముంది. దానిని మొదటి అమోఘవర్దుడు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి నన్నెచోడుడికి శత్రుత్వం. నన్నెచోడుడు పరమ శైవకవి. అతను 855 (ప్రాంతాలలో గుణగుని విజయాలను తఆలియజేసే కుమార సంభవ కావ్యాన్ని రచించేడు. అమోఘవర్ష్డుడు 880లో మరణించేడు. అప్పుడు గుణగ విజయాదిత్యుడు స్వాతంత్య్యు సమరం చేసేడు. ఆ సమరంలో నన్నెచోడుడుకూడ పాల్గొన్నాడు. ఇతనిమీదికి శత్రురాజులు పెద్ద మైన్యంతోరాగా ఎదిరించలేక గుణగ విజయాదిత్యుని శరణుజొచ్చేడు. గుణగుడు సైన్యసహాయం చేసేడు. కాని ఆ యుద్ధాలలోనె నన్నెచోడుడు 882 ప్రాంతాలలో మరణించేడు. ఇతర భాషాపదాలు; ప్రాచీన భాష

నన్నెచోడుని రాజ్యానికి పశ్చిమపు సరిహద్దు కన్నడదేశం. ఆనాటి దేశి కవిత్వంలో అన్య భాషాపదాలు ఉండకూడదనే నియమంలేదని చెప్పవచ్చు. మనం కన్నడ పదాలని చెపుతూన్న వెన్నో ఆ కాలంలో ఉభయ భాషలకి సమానపదాలై ఉంటాయి. నన్నెచోడుడు ఉపయోగించిన కర్ణాటక పదాలు పశ్చిమంలో ఉన్న చోడరాజ్యంలోని మాండలిక పదాలేకాని మరేమీ కావని చెప్పవచ్చు. పదోశతాబ్దం ముగిసేదాక తెలుగు కన్నడ భాషలకి ఒకటే లిపికదా!

తెలుగుకి కన్నడానికి ఉండే సంబంధం విస్తారం. “తెలుగు కన్నడముల చుట్టరికము"అను వ్యాసంలో” తెలుపబడింది. కన్నడదేశంనుంచి వచ్చిన కుబ్బవిష్ణువర్ధనుడే వేంగీదేశాన్ని పరిపాలించేడు. “చాళుక్యులు, కన్నడిగులు వారితో వారి పరివారములున్ను చతురంగ బలములును.... ఉద్యోగులును... వైశ్యులు, శ్యూదులు వచ్చిరి .... పశ్చిమాంధ్రము, తెలంగాణమును బాదామి చాళుక్యుల వశమునను, తీరాంధ్రభూమి పూర్వ చాళుక్యులయధీన మందును ఉండినవి. చాళుక్యులు కర్ణాటకులు ... కన్నడ పదములు పలుకుబడులు పెక్కు తనుగున (వేశించినవి. ఆంగ్ల భాషా సంపర్కమువల్ల నెట్టివార్పు గలిగినదో 35... ఈ వ్యాసకర్త పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. ఇది సుజాత మే, 53వ సంచికలో

అచ్చయింది.