Telugu khashmir tharangini kathalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

శేగోనగి .. న ల గ వ గను న భ్‌ అ స ష్‌ టు శీర! లా న గట్‌ పాలా. న” శ్రళ్శీరరాజతరంగిణి . క్త స లో ; గ్‌. 7 శ ట్‌ -గా (గ | వ్‌ కో అిబేసం స్‌ ణ్‌ కల్పణ మహాకవి వో క న 7886 శ్లోకాలలో పొందుపరచిన క్ట యయ క టే సా క. కళ్ళీర రాజుల చరిత్రను కల యల? ల్‌ తి ఉప ల నో! గ 6 కథలలో ప్రతిబింబించే ప్రయత్నం గ. భభో న! టై యక (టి. 4 ( న్‌ ; స్‌ + | ఫై శ్ర ' మరో భో టో ఇ. | సట భ్రవల్ళాం కు (4 అత యు త! 1 * ॥ మ... ఆస్ట / లాలా కస్తూరి 6 కృష్ణ / స రాగ [1/0

కల్పణ కళ్శీర రాజతరంగిణి కథలు కస్తూరి మురళీకృష్ణ ఎమెస్కో

క్ట కశ్మిరరాజతరంగిణి కధలు కస్తూరి మురళీకృష్ణ ప్రధమ ముద్రణ: ఎర్‌ ఏప్రియల్‌ 2006 ఖగ ళు న ర క్రీ ౮ వెల. రూ. 90/- 'సూ కూర్చు చ [+ = లో పల్లవి గ్రాఫిక్స్‌ పిట వ వా వా, స్‌ ౧0 ముద్రణ , సాయిశ్రీనివాన ప్రింటర్స్‌ ॥న్తో హైదరాబాదు. ఫోన్‌: 23322474 ప్రచురణకర్తలు ఎమెస్మోబుక్స్‌ ఏలూరు రోడ్డు, విజయవాడ -£ ఫోన్స్‌: 0866-2577498.

ముందుమాట

ఈ కధలు కల్పాణ విరచితమైన “కళ్ళీర రాజ తరంగిణి ఆధారంగా రాసిన కధలు. కల్షణుడు 11వ శతాబ్దం వాడు ఈనాటి చరిత్ర కారులకే మాత్రం తీసిపోకుండా అనేక పరిశోధనలు చేసి, శిలాశాసనాలు తవ్వి, వెలికి తీయించి, చదివి, దేశమంతా విసృతంగా పర్యటించి, సేకరించిన గ్రహించిన కళ్ళీర రాజుల చరి[తను కల్పణుడు ,కళ్ళ్మీర రాజతరంగిణిలో పొందు పరచాడు.

ఇకద్టెణుడో -ఈనాటి చరిత్రకారులు ప్రైేజానిక పరిశోధనలకే మాత్రం తీసిపోకుండా పరిశోధనలు చేసి, నిజానిన్‌క్పుయంగా, నిర్మాహమాటంగా, నిక్కచ్చిగా, ఉన్న దున్నట్టు తన దచనలొశ[పోయీంబించాడు. ఎటువంటి రాజాశ్రయం పొందకుండా, కేవలం, భరిత్రను/ భ్యావితరాలకు సజీవంగా అందించాలన్న తవనతో కల్షణుడు జజాజో తరంగిణిని రచించాడు. సాహిత్యకారుడికి ఉండే సొమ్వాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాడు.

కల్దణుడు 7836 శ్లోకాలలో పొందుపరచిన కళ్ళీర రాజుల చరిత్రను 16 కధలలో ప్రదర్శించే ప్రయత్నించేశాను. సముద్రంలోని నీటిచుక్క సముద్రనీటి సారాన్ని ప్రతిబింబించిన రీతిలో, రాజతరంగిణి సారాన్ని ఈ 16 కధలలో సూక్ష్మంగా ప్రతిబింబించే ప్రయత్నంచేశాను

రాజతరంగిణిలో ఉన్నవి చారిత్రక అంశాలే అనీ, అవి దేశంలో ఇతర ప్రాంతాల చరిత్రతో సరిగ్గా సరిపోతుందని, నిరూపిస్తూ కోట వెంకటాచలంగారు ఎంతో పరిశోధన చేశారు. ఆయన పరిశోధనల ఆధారంగా విశ్వనాధ సత్యనారాయణగారు అయిదు కళ్ళీర రాజవంశావళి నవలలు రాశారు పిలకా గణపతి శాస్త్రిగారు, పది కధలు, ఒక నవల కళ్ళ్మీర రాజతరంగిణి ఆధారంగా రాశారు అయితే, కళ్ళీర ఆవిర్భావం నుంచి కల్పణుడి కాలం వరకూ ఉన్న రాజతరంగిణిని కధలలో పొందుపరచే ప్రయత్నం ఈ కధలలో చేశాను.

ఒక కధకూ. మరొక కధకూ నడుమ ఉన్న కాలంలో రాజ్యం చేసిన రాజుల వివరాలను ప్రతి కధలో ఇస్తూ, కళ్ళీర రాజుల పరంపరను సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేశాను. చరిత్రకు కల్పన జోడించి సృజించిన కధలు ఇవి. ఆధునిక సమాజంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఎన్నో సమస్యలకు చరిత్రలో పరిష్కారాలను వెతికే ప్రయత్నంలో భాగం ఈ కధలు. ఈ కధల రచనలో చరిత్రను ఉన్నదున్నట్టు ప్రదర్శించటం జరిగింది జరిగినదాన్ని దేన్నీ మార్చకుండా 'ఇలా జరిగి ఉండవచ్చన్న ఆలోచనకే కల్పనను ఆశ్రయించటం జరిగింది. ఈ కధలు 1998-1999 ప్రాంతంలో జాగృతి వార పథత్రికలో ధారావాహికంగా వెలువడ్డాయి ఈ కధలు అప్పటి కాలాన్నే కాదు, వర్తమానాన్ని, భవిష్యత్తునూ కూడా అవగాహన చేసుకోవటంలో తోద్చడతాయి. ఈ కధలు చదువుతూంటే, ఎన్నో సమకాలీన సంఘటనలు, రాజకీయాలు గుర్తుకు వస్తాయి రచనాకాలం తరువాత జరిగిన అనేక సంఘటనలు సైతం, ఈ కధలలో కనిపిస్తాయి. ఉదాహరణకు, 'తురుష్కహర్నుడి" కథ చదువుతూంటే, సద్దాంహుస్సేన్‌ గతి గుర్తుకు రాకమానదు.

చరిత్ర కేవలం రాజుల పుట్టిన తేదీలు, ఓడిన సంవత్సరాలు కాదు. మానవగత చరిత్ర వర్తమానానికి మార్గదర్శి అయి భవిష్యత్తుకు బంగారు బాట నిర్మించుకోనటంలో తోద్చడాలన్నది మన పూర్వీకుల ఆశయం. ఆ దిశలో సృజనాత్మక రచయితగా నేను చేసిన ఒక ప్రయత్నం ఈ కళ్ళీర రాజ తరంగిణి కధలు

ఈ కధలు రాయటంలో నాకు ప్రోత్సావాన్నిచ్చి, సంపూర్ణ స్వేచ్చనిచ్చిన జాగృతి పత్రిక సంపాదకులు త్రీ వడ్డమూడి రామ్మోహన రావుగారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. కీ.శే. మారెళ్ళ కృష్ణమూర్తిగారు, శ్రీ ఘనశ్యామల ప్రసాద్‌గారు, బ్రహ్మశ్రీ తెలకపల్లి విశ్వనాధ శర్మగారు, శ్రీమతి జి. శారదగారు శ్రీ సామల రమేష్‌బాబు గార్ల సహాయ సహకారాలు లేకుండా ఉంటే ఈ కధలు రచన సాధ్యమయ్యేదికాదు. పెద్దన్నయ్య రాకాసుధాకర్‌ల ఇచ్చిన సలహాలు, చేసిన విమర్శలు వల్ల ఆరంభంలోనే ఎన్నో పొరపాట్లు గుర్తించి సవరించుకునే అవకాశం లభించింది. నా శ్రీమతి పద్మ ప్రోత్సాహం ప్రోద్భలం నా ప్రతి రచన వెనుకా ఉంటుంది. రాజతరంగిణి కధలు ఇందుకు భిన్నంకాదు. ఓ కోణంలోంచి చూస్తే నా ప్రతి రచనా, మా ఇద్దరి రచనగానే పరిగణించవచ్చు.

రాజతరంగిణ కధలను పుస్తక రూపంలో ప్రచురిస్తున్న ఎమెస్మో విజయకుమార్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాలోని రచయితను (ప్రోత్సహిస్తున్న శ్రీ విజయకుమార్‌గారికి సర్వదా కృతజ్ఞుడనయి ఉంటాను. భవిష్యత్తులో సైతం మా అనుబంధం ఇలాగే కొనాసాగాలని ఆశిస్తున్నాను.

రాజ తరంగిణి కధలు రాయటం నాకు అపూర్వమైన అనుభవం. ఈ కధల రచన వల్ల ప్రాచీన, వర్తమాన సమాజ మనస్తత్వం (గ్రహించే అవకాశం లభించింది. భవిష్యత్తుపై అవగాహన కలిగింది. ఈ కధలు చదువుతూంటే ప్రస్తుతం మన చుట్టూ జరిగిన, జరుగుతూన్న అనేక సంఘటనలు మదిలో మెదులుతాయి. భవిష్యత్తును కూడా ఈకధలలో చూడవచ్చు. దుష్ట పాలకుల 'హస్వదృష్ట అవినీతి, ఆరాచకం, సంకీర్ణ ప్రభుత్వాల లుకలుకలు, నాయకుల అనుచిత్ర ప్రవర్తనలు. .సర్వం ఈ కధలలో ప్రతీకాత్మకంగా కనిపిస్తాయి. ఈ కధలలో ఎటువంటి దోషాలున్నా, అనౌచిత్యాలున్నా దానికి బాధ్యత నాదే.

ఈ కధలను అమ్మకు, నాన్నగారికి, విశ్వనాధ సత్యనారాయణగారికి అంకితమిస్తున్నాను.

ఈ కథలపై పారకులు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరచాలని ప్రార్థిస్తున్నాను.

  • కస్తూరి మురళీకృష్ణ

కథాతక్రమం కళ్ళీరాః పార్వతీ 7 దామోదర సర్పం 16 ధర్మరక్షణ 265 గురుదక్షిణ 36 జలౌక మహారాజు అద్భుత జీవితం శీర్‌ ప్రజా పుత్వై సంభవంతి మహీభుజః 56 కిన్నరుని కోరిక 65 అజిత సింహుడి ఆత్మార్పణం క! సంధిమతి ఆదర్శ జీవితం 84 ధర్మదండం 92 సంభవామి యుగే యుగే 106 రాణీ సుగంధాదేవి 128 కళ్ళీర రాణి డిద్దాదేవి 151 తురుష్క హర్షుడి చరిత్ర 177 తరాల తరంగాలు లబ

కల ం గే సూ ఎ) లో ఈ ళో సే కశ్శీరాః పార్వతీ 'ర్రేప్పు స్వయంవరానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడట!? ఎలా తెలిసిందో ఈ వార్త, స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారుల్లో, రాజకుమారుల సైనిక శిబిరాల్లో, అంతటా దావానలంలా వ్యాపించింది “దామోదర మహారాజుగారి చిరకాల వాంఛ నెరవేరే రోజు దగ్గర పడింది'. దామోదర మహారాజ శిబిరంలో ప్రతి సైనికుడి నోట ఇదే మాట, ప్రతి సైనికుడి మనసులో ఇదే భావం. జేపటితో నేను చేస్తున్న యజ్ఞంలో మొదటిభాగం పూర్తవుతుంది అనుకున్నాడు అందరికీ దూరంగా కూచున్న రత్నగిరి. అంత దూరంలో కూడా రత్పగిరికి సైనిక శిబిరాల్లో జరిగే చర్చలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా కళ్ళీర సైనిక శిబిరంలో తన అనుయాయులు చేస్తున్న శ్రీకృష్ణ దూషణ మరింత స్పష్టంగా వినిపిస్తోంది.

“ఆ కృష్ణుడు వొట్టి మాయగాడు. స్వంత మేనమామను వధించిన ధూర్తుడు నీతి, జాతి లేని వాడు. ఏదో (ప్రజల మౌధ్యం వల్ల, మూర్ధత్వం వల్ల గొప్పవానిలా చలామణీ అవుతున్నాడు. ఇంతవరకూ పౌరుష ప్రతాపాలున్న రాజులనెవరినీ ఎదుర్యోలేదు కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నాడు !

“అవును ఏదీ, జరాసంధుడు యుద్దానికి రాగానే పారిపోలేదూ!*

“అవును. తనకు చేతకాకనే కదా భీముడితో చంపించాడు జరాసంధుడివి *

“ఆ కృష్ణుడొట్టి కీర్తకాముకుడు వేరే వాళ్లు కష్టపడి సాధించిన ఖ్యాతిని తనకు ఆపాదించుకుంటాడు. పైగా అన్నీ చేయించేది నేనే అని విర్రవీగుతుంటాదు.

'ఆ కృష్ణుడిదీ ఒక ధర్మమా? నీతి జాతీ లేదు. చేసిన కర్మఫలితాన్ని అనుభవించాలట. మరి ఇంక ఆ దేవుళ్లకు పూజలు, మంత్రాలు ఎందుకు? యజ్ఞాలు చేయటమెందుకు? ఏదో కర్మఫలితాన్ని అనుభవించక ఈ గొడవలన్నీ ఎందుకు?””.

అయినా ఆ వైదిక ధర్మమూ ఒక ధర్మమూ? మనిషే భగవంతుడట! (ప్రతి మనిషీ భగవంతుడట! ఎంత మూర్ధత్వం? అందుకే రాళ్లకూ రప్పలకూ, చెట్లకూ పుట్టలకూ మొక్కుతుంటారు ” హష్టాహ్హ, పెద్దగా నవ్వులు.

“ఇంతకీ ఆ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాడట భగవానుడట.” మళ్లీ అందరూ పెద్దగా నవ్వుకున్నారు.

“ఇదిగో ఇదే మాసం. ఆ మాయలోనే పడవద్దంటున్నాను. భగవంతుడు ఎక్కడయినా ఇలా ఉంటాడా? ఆ పదహారు వేలమందితో రాసలీలలేమిటి? అవి చాలనట్టు అసలుపై కొసరులా ఆ రాధతో సరసాలేమిటి?”

వింటూ నవ్వుకున్నాడు రత్నగిరి. ఆ మాట్లాడేది తన అనుచరుడే.

శేవ్రు దామోదర మహారాజు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం తప్పదా?” ఎవరో అడుగుతూంటే అ వైపు చూశాడు రత్నగిరి ఒక్కసారిగా తను సాధించిన దాన్ని తలచుకుంటే గర్వంతో అతని ఛాతీ ఉప్పాంగింది. రేపు ఈపాటికి పరిస్థితి ఎలా ఉంటుందో?” అనుకున్నాడు.

“ఆ దామోదరుడి తల నేల మీద వాలిన మరుక్షణం నుంచే తన అదృష్టం ఆకాశంలో మెరుస్తుంది" సంతృప్తితో నిట్టూర్చాడు రత్నగిరి.

“తన అదృష్ట తారనే కాదు సనాతన ధర్మం మీద తన మ్లేచ్చధర్మం విజయం సాధిస్తుంది.

దామోదర మహారాజు సైన్యంలో పదాతిదళంలో ఓ చిన్న అనామక సైనికుడు రత్నగిరి, రత్నగిరి తండ్రి మోహనగిరి. మొదటి గోనందుడి అంగరక్షకుడు మోహనగిరి. ఆయనకి గోనందుడు భగవంతునితో సమానం మమత ద తడక కస్తూరి మురళీకృష్ణ నా!

కళ్ళ్మీరంలో మొదట గోనందుడు రాజ్యం చేస్తున్న సమయంలో మధురలో కంసుడు, గిరివ్రజపురంలో జరాసంధుడు రాజ్యం చేస్తూందేవారు. గోనందుడికి జరాసంధుడికీ దూరపు చుట్టరికం ఉంది. జరాసంధుడు కంసుడి పక్షంవాడు.

శ్రీకృష్ణుడు కంసుడిని చంపి మధురను ఉగ్రసేన మహారాజుకు అప్పగించాడు. “మిట్రుని శతృవు, శత్రువు అన్న సిద్దాంతం ప్రకారం జరాసంధుడు కృష్ణునితో వైరం పూనాడు. జరాసంధుడు కృష్ణుడితో యుద్ధంలో తనకు సహాయంగా రమ్మని పిలవగానే, గోనందుడు, మనసులో కృష్ణభక్తి ఉన్నా మిత్రుని మాట మన్నించి తన సైన్యంతో మధురానగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు తన సైన్యాన్ని రక్షించుకునేందుకు బలరాముడు జరాసంధునికి సహాయంగా కళ్ళీరసైన్యంపై విరుచుకుపడ్డాడు. ఆ యుద్ధంలో గోనందుడు మరణించాడు

గోనందుడి అంగరక్షకుడు మోహనగిరి గాయపడిన మహారాజును యుద్ధరంగం నుండి దూరంగా తీసుకువెళ్లాడు ఆయన శ్వాస నిలపాలని శతవిధాలా ప్రయత్నించాడు కానీ గోవిందుడు చివరి శ్వాస రత్నగిరి బాహువుల్లో విడిచాడు. అయితే శాక్తేయుడయిన గోనందుడు చివరి శ్వాస “కృష్ణా అంటూ విడిచాడు ఆ క్షణంలో మోహనగిరి కృష్ణద్వేషిగా మారాడు.

గోనందుని తరువాత రాజయిన దామాదరుడు ఎన్ని రాజభోగాలున్నా నిరంతరం తండ్రి స్మరణతో మనశ్శాంతి పొందలేకపోయాడు. ఇది అదునుగా చూసుకుని కశ్మీర మందిరంలో సమయం కోసం పొంచి ఉన్న మ్తేచ్చగణాలు తలెత్తసాగాయి ఆ కాలంలో వేదబాహ్యులైన భారతీయులను మ్లేచ్చులనేవాళ్లు వేద ధర్మాన్ని నిరసించి భారతదేశం నుంచి బహిష్కుతులైన కొందరు, భారతదేశాన్ని విడిచి, పర్షియా దేశాల్లో స్థిరపడ్డారు. అయితే వారు తమని బహిష్కరించిన వేదధర్మంపై నిరసనను పెంచుకుని ఏ రకంగానైనా ఈ ధర్మాన్ని దెబ్బతీయాలని అదను కోసం ఎదురుచూడసాగారు. దామోదరుని కృష్ణద్వేషం వారికీ అవకాశం కల్పించింది. వీళ్లు శ్రీకృష్ణుని వేద ధర్మానికి ప్రతీకగా తీసుకుని, శ్రీకృష్ణ నిరసనను వేదధర్శంపై వైముఖ్యంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సాధారణంగా ప్రజలు రాజు మనోభావాలను అనుసరిస్తుంటారు. దామోదరుడు తండ్రి వధను నిత్యం స్మరిస్తుందటంతో, శ్రీకృష్ణుడు వైదిక ధర్మానికి ప్రతీకగా ప్రచారం జరగటంతో (ప్రజలు ధైర్యంగా మహారాజు ముందు వైదిక ధర్మం ప్రసక్తి తెచ్చేందుకు భయపడసాగారు. అంతేకాదు, ధైర్యంగా వైదిక ధర్మ అనుష్టానానికి కూడా వెరచేవాళ్లు. అది అదనుగా చూసుకుని మ్లేచ్చులు తమ తమ మత భావ పరంపరను ప్రజలకు నూరిపోసి వారిని వైదిక ధర్మచ్యుతులను చేయసాగారు. తమ మతంలోకి మార్చుకోసాగారు

రత్నగిరి తండ్రి మోహనగిరి ఈ ప్రచార ప్రభావానికి లొంగిన వారిలో ప్రధముడు మోహనగిరి వైదిక ధర్మాన్ని త్యజించి మ్లేచ్చ మతాన్ని స్వీకరించటమే కాదు- తన బంధువుల జజ కల్చణ కళ్ళీర రాజతరంగిణీ కధలు :23ై౭త౭త౭తతఊతఊతఊతఊతఊతఊఊఊఊ కి ఆజం

నందరినీ వైదిక ధర్మ పరిత్యాగానికి ఒప్పించాడు. బలవంతంగా తన కుటుంబ సభ్యులందరినీ నూతన మతంలోకి మార్చించాడు

తండ్రిని ఆరాధిస్తూ, అదర్శంలా తీసుకునే రత్నగిరి కరడు గట్టిన మ్లేచ్చ మతవాది తయారయ్యాడు. బంధాలు, బంధుత్వాలు అన్నీ బూటకం అని నమ్మటమే కాదు ఆచరించి చూపించి మ్లేచ్చ మతానుయాయుల్లో ఆగ్రగణ్యు డయ్యాడు అందరికీ ఆదర్భంలా నిలిచాడు.

ఒకనాడు అతని తల్లి, తండ్రికి తెలియకుండా చాటుగా, దొంగతనంగా సనాతన ధర్మాన్ని అవలంబించటం చూశాడు రత్నగిరి. తల్లిని నిలదీసి అడిగాడు. “నువ్వీ ధర్మం ఎందుకు పాటిస్తున్నావు?” అది పరమ నీచమైనదని నాన్నగారు చెప్పలేదా?”

దానికి అతని తల్లి నిట్టూర్చి చెప్పింది. “బాబూ! తాత్మాలికోద్రేకాలకు లోనై అశాశ్వతాల వెంట పరుగిడటం న్యాయం కాదు. మాఘలో పుట్టి పుబ్బలో నశించే ఈ పుట్టగొడుగుల్లాంటి మతాలను నమ్మి సాధించేదేమీ లేదు. ఆద్యంతాలు లేని శాశ్వతమైన సనాతన ధర్మాన్ని అర్ధం చేసుకో. నువ్వైనా నీ జీవితాన్ని సక్రమ మార్గంలో నడుపుకో.”

అయితే బంధుత్వాలన్నీ బూటకాలని నమ్మిన రత్నగిరికి తల్లి మాటలు రుచించలేదు వెంటనే తల్లి జుట్టుపట్టి ఈడ్బుకెళ్లి తండ్రి ముందు పడేశాడు. ఫలితంగా రత్నగిరి, మరికొందరు

మ్లేచ్చ మతానుయాయులు ఆమెను ఊరవతలకు తీసుకెళ్లి నిందిస్తూ రాళ్లతో కొట్టి చంపేశారు.

రత్నగిరి మతంలో నామరూపాళ్లేని ఆ స్వరూపస్మరణం ముందు మన కల్చనలన్నీ తుచ్చమైనవే. దేశమంతా మ్లేచ్చముయం చేయాలన్న గొప్ప ఆదర్శం ముందు అన్ని బంధాలు శుష్క సంబంధాలే!

పసి వయసులోనే తల్లి దోషిత్వాన్ని నిరూపించిన రత్నగిరి అంటే మ్లేచ్చ మత గురువులకు వల్లమాలిన (ప్రేమ ఏర్పడింది. దాంతో అతడిపై ప్రత్యేక (శ్రద్ధ చూపసాగారు. అనతికాలంలోనే రత్నగిరి మ్లేచ్చకూటమిలో అగ్రగణ్యుడిలా ఆరితేరిన వీరునిలా మారాడు. అంతేకాదు, చాప క్రింద నీరులా కశ్ళీరమంతా తిరిగి అనేకులను నయాన భయాన మ్లేచ్చమతంలోకి మార్చాడు

రత్నగిరికి ప్రభువు భయంలేదు. ఎందుకంటే (ప్రభువు కృష్ణద్వేషి. ప్రభువుకు ప్రీతిపాత్రుడయిన మంత్రి మ్లేచ్చ మతానుయాయి. రత్నగిరికి అతని అండదండలున్నాయి.

ఈ రకంగా రత్నగిరి మ్లేచ్చ మతానుయాయులందరికీ నాయకుడిగా మారాడు. ఈ సమయంలో అతనికి తాను పాటిస్తున్న మతకేంద్రం తురుష్మదేశం నుంచి ఒక రహస్య సమావేశానికి ఆహ్వానం వచ్చింది.

(ఇక్కడ తురుష్క అంట్బే మహమ్మదీయ మతం కాదు ఈ కధ కలియుగ ఆరంభం కన్నా ముందుది. ఈ కధ జరిగిన అనేక వేల సంవత్సరాల తరువాత కానీ మహమ్మదీయ మతం పుట్టలేదు). హెతఊెైజ 10 కతైతడకడతతతడడఊ2ఊ4ఊఊ4ఊఊ4ఊ442242222222222 కస్తూగ్రి మురళీకృష్ణ =

అప్పటికి దామోదరుడు రాజ్యానికి వచ్చి 3౩ ఏళ్లు పూర్తి కావస్తోంది. అప్పుడు రత్పగిరి రహస్యంగా తురుష్క దేశానికి వెళ్లి వచ్చాడు అక్కడ జరిగిన మ్లేచ్చ మూకల రహస్య సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది.

ఎలాగో దామోదరుడు కృష్ణద్వేషి ఏనాడో ఒకనాడు అతను కృష్ణునితో తప్పనిసరిగా యుడ్డం చేస్తాడు. ఆ మాయావి కృష్ణుడు ఏదో మాయాజాలంతో దామోదరుడిని హతమార్చటమూ తప్పనిసరి.

దామోదరునికి సంతానంలేదు. అతని భార్య యశోవతి కృష్ణ భక్తురాలు. ప్రస్తుతం కళ్ళీర దేశంలో సగం పైగా ప్రజలు మ్లేచ్చ మతానుయాయులయ్యారు. ఎప్పుడయితే దామోదరుడు కృష్ణుని చేతిలో మరణిస్తాడో అప్పుడే మ్లేచ్చ మతానుయాయులంతా కలసి పెద్ద ఎత్తున విప్లవం లేవదీయాలి. రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలి. ఈ కార్యక్రమం జరిపి, రాజ్యాన్ని మ్లేచ్చమతపరం చేయవలసింది రత్నగిరి

భారతదేశానికి కిరీటం కాశ్మీరం ఆ కిరీటం తమ హస్తగతమైతే ఇక దేశం సర్వం తమదవటం ఎంతో దూరం ఉండదు. ఇదీ ఆ సమావేశంలో రత్నగిరిపై ఉంచిన బాధ్యత.

తనపై అంత గురుతరమైన బాధ్యత ఉంచినందుకు పొంగిపోయాడు రత్నగిరి. కళ్ళ్మీరం తిరిగి వచ్చిన వెంటనే పనిలో దిగిపోయాడు

తన పధకం ప్రకారం అనేక మ్లేచ్చ మతానుయాయులను సైన్యంలో ప్రవేశపెట్టాడు మంత్రి సహాయంతో సైన్యంలో కీలకమైన పదవులన్నీ తన అనుచరులకే దక్కేట్లు చూశాడు

అయితే తనుమాత్రం, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, రాకపోకలపై నియంత్రణలేకుండా ఉండేందుకు సొమాన్య సైనికుడిలా ఉండి పోయాడు

అలాగే మారువేషంలో ఒకసారి ద్వారక కూడా వెళ్లివచ్చాడు. ద్వారకలో కొందరిని తనకనుకూలంగా తిప్పుకున్నాడు. ముఖ్యంగా శ్రీకృష్ణుని మంత్రి, సుబుద్ధి 'పేరు ఉచ్చరించేందుకు కూడా భయపడ్డాడు రత్నగిరి. చుట్టూ చూశాడు మనసులో మాటనెవరైనా గగ్రహించేస్తారేమోనని భయం అతనికి. ఆ మంత్రికి అనేక రకాల సహాయాలు చేసి తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక కృష్ణుడికీ దామోదరుడికీ యుద్ధం రావటమే తరువాయి .

అయితే ఆ సమయంలో మరో వార్త రత్నగిరిని కలతపెట్టింది అది దామోదరుడి భార్య యశోవతి గర్భవతి కావటం ఎంత మతం మార్చినా ఈ ప్రజల్లో ఇంకా కొన్ని పాత విశ్వాసాలు పూర్తిగా పోలేదు రాజుకి వారసుడు లేనంతకాలం ఫరవాలేదు కానీ వారసుడు ఉంటే రాజు పోగానే ప్రజలు పసివాడైనా ఆ రాజు సంతానాన్నే తమ పాలకునిలా భావిస్తాడు.

ఇప్పుడేం చేయాలి?

ఇంతలో మరో వార్త === కల్చణ కళ్ళీర రాజతరంగిణి కధలు 23322222 పే 23ఊిు

అప్పటికి ద్వాపరయుగంలో ఇంకా ముప్పయిఎనిమిది ఏళ్లు మిగిలి ఉన్నాయి. అంటే ఇప్పటి లెక్కప్రకరం ్రీస్తుపూర్వము మూడువేల నూటనలభై ఆరవ యేడు. గాంధారరాజు కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించారు. రాజులందరికీ వర్తమానాలు వెళ్లాయి. కానీ కృష్ణుడికి మాత్రం వర్తమానం పంపనివ్వలేదు దామోదరుడు. కానీ గాంధార రాజకుమార్తె ప్రభావతి శ్రీకృష్ణభక్తురాలు. దాంతో పిలిచినా పిలవకున్నా, సిగ్గులేని కృష్ణుడు స్వయంవరానికి తప్పకుండా వచ్చి తీరతాడు. దామోదరుడు అతడిని ఎదిరించి తీరతాడు. రత్నగిరి ఎగిరి గంతేశాడు 'కాగల కార్యం గంధర్వులే తీర్చారు” అనుకున్నాడు వెంటనే తన పధకాలను చకచకా అమలుచేయసాగాడు. శ్రీకృష్ణ మంత్రికి కబురు పెట్టాడు. శ్రీకృష్ణుని చేతిలో దామోదరుడు మరణించగానే కళశ్శీరాన్ని ఆక్రమించమని శ్రీకృష్ణుని ప్రేరేపించాలి. దాంతో తమ సైన్యంలో కృష్ణ వ్యతిరేకత మరింత పెరుగుతుంది. అయితే యశోవతి కృష్ణభక్తురాలు కాబట్టి ఆమె కృష్ణుని శరణు వేడుతుంది. ఆమె ఈ చర్య ప్రజల్లో యశోవతి పట్ల కూడ ద్వేషభావన కలిగిస్తుంది. దీనంగా కృష్ణుని ప్రాణభిక్ష వేడుకుంటున్న యశోవతిపై అసహ్యం కలుగుతుంది. ఇప్పటికే ఈ భావాన్ని ప్రజల్లో కలిగించే ప్రచారం కళ్ళ్మీరంలో ఉధృతంగా జరుగుతోంది. ప్రజలలో నిరసన వెల్లువగా పెరుగుతోంది తన అనుయాయులందరికీ సమాచారాలు అందేయి. అందరూ అప్రమత్తంగా ఉన్నారు. దామోదరుడు మరణించిన తరువాత రత్నగిరి సూచన అందగానే కోటలో యశోవతి, కడుపులోని ఆమె బిడ్డతో సహా హతమార్చ బడతారు. శ్రీకృష్ణుని శరణు కోరేందుకు వెళ్లోందన్న కారణంగా, తమ దేశానికి అవమానం, అప్రతిష్ట కలుగజేస్తోందన్న కారణంగా ఆమె హత్యను సమర్ధించు కోవచ్చు. సైనికులంతా తిరగబడి రాజ్యాన్ని ఆక్రమిస్తారు వారి నాయకుడిగా రత్నగిరి రాజవుతాడు. కాళ్ళ్మీరంలో సనాతన ధర్మపాలన అంతరించి మ్లేచ్చ ధర్మపాలన రత్నగిరి ఆధ్వర్యంలో ఆరంభమవుతుంది. కాస్సేపటి క్రితమే శ్రీకృష్ణ మంత్రి నుంచి సూచన లభించింది. అన్నీ సిద్ధమేనని ఇక తెల్లవారటమే తరువాయి. తెల్లవారితే ఏమౌతుందో? తెల్లవారింది! ఎదురుగా శ్రీకృష్ణ సైన్యం! రత్నగిరి హృదయం ఉప్పొంగింది ఇన్నాళ్లకు తన ఆశయం నెరవేరుతోంది మరోసారి తన అనుచరులందరికీ ప్రమత్తంగా ఉండమని సూచనలిచ్చాడు. సైనికులంతా తమతమ ఆయుధాలు తీసుకుని బారులు తీరి నిలుచున్నారు. ఎవరూ గమనించకుండా రత్నగిరి నెమ్మదిగా శ్రీకృష్ణ సైన్యం వైపు వెళ్లసాగాడు. 2౩23 [2 =2]ై2ఊఊ2జ22ఊ2224ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ4-222 కస్తూరి మురళీకృష్ణ ==

అతని మదిలో ఉద్విగ్నతతోబాటూ ఏదో తెలియని ఆవేదనకూడా ఉంది. ఎందుకు ఆవేదన? తనుచేస్తున్న పని సరైనదేనా? అతని మదిలో ఒక ప్రశ్న ఉదయించింది ఇంతకీ తమకు సనాతనధర్మం అన్నాా శ్రీకృష్ణుడన్నా ద్వేషం ఎందుకు? శ్రీకృష్ణుడిని తన తండ్రి ద్వేషించాడు కాబట్టి. తన తండ్రి శ్రీకృష్ణుడిని ఎందుకు ద్వేషించాడు?” ఆయన భగవంతునిలా భావించే గోనందుడు శ్రీకృష్ణుడి వల్ల మరణించాడు కాబట్టి కానీ గోనందుడిని చంపింది బలరాముడు. అదీ గోనందుడు తమ రాజ్యంపై దండెత్తి వస్తేనే! ఇంతకీ గోనందుడు యుద్దానికి ఎందుకు వెళ్లాడు? జరాసంధుడు పిలిచాడని జరాసంధుదెందుకు పిలిచాడు? అతనికీ కంసునికీ మితృత్వం కాబట్టి కృష్ణుడు కంసుని చంపాడు కాబట్టి. కృష్ణుడు కంసుని ఎందుకు చంపాడు? అతను తన తల్లిదండ్రులను చెరసాలలో ఉంచాడని కంసుడు క్రూరుడు ప్రజలను హింసిస్తున్నాదని. కృష్ణుడు చేసింది న్యాయమే! మరి ఈ ద్వేషం తమకెందుకు? ఆగిపోయాడు రత్నగిరి అంటే ఏ కృష్ణ ద్వేషాన్నయితే తాను అవలంబించి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలను కుంటున్నాడో ఆ ద్వేషానికి అర్ధం లేదా? అది కారణరహితమా? తమ ద్వేషం మూర్ధత్వమా? వ్యక్తిగత స్వార్థానికి పారమార్ధిక అర్థం కల్పించి తమని తామే మోసం చేసుకుంటూ ఒక అద్భుతమైన సత్యానికి దూరం అవుతున్నామా? అంతలో మరో ఆలోచన! తన తల్లిదండ్రిని చెరసాలలో ఉంచిన కంసుని వధించాడు శ్రీకృష్ణుడు. అంటే అతని తల్లిదండ్రుల పట్ల అంత గౌరవం అతనికి. అది అతని ధర్మం మరి తను? స్వంత తల్లినే జుట్టు పట్టి ఈడ్చి... రాళ్లతో కొట్టి. .. రత్నగిరి కళ్లముందు ఆఖరి క్షణంలో అతని తల్లి వదనం నిలిచింది అమె అన్న మాటలు గుర్తుకొచ్చాయి. “భగవాన్‌! వీరంతా పసిపిల్లలు. వీరి చర్యలకు భావాలకు వీరు బాధ్యులు కారు. శ్రీకృష్ణా! ఎప్పటికయినా వీరు తప్పు మార్గం విడిచి ధర్మమార్గం పట్టేట్లు === కల్టణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు 2322222222 కతి. జ

చూడు. వీరి కళ్లకు కమ్మిన పొరలు తొలగిపోనీ వీరిలో ద్వేషభావన అంతరించి (ప్రేమ భావన జాగృతం. కానీ, శ్రీకృష్ణా, శ్రీకృష్ణా” చనిపోయేంతవరకూ ఆమె ఇలా భగవంతుని ప్రార్ధిస్తూనే ఉంది. ఆమె ్రార్టించిన కొద్దీ తాము మరింత పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. రత్నగిరి హృదయం బద్దలవసాగింది. ఆమె అసలు తమని ద్వేషించనే లేదు. రత్నగిరికి అక్కడే కూచుని ఏడవాలనిపించింది. అంతలో ఏదో కలకలం వినిపించింది.

తుల్లిపడ్డాడు రత్నగిరి. తన కర్తవ్యం గుర్తొచ్చింది.

ఇదేమిటి ఏమైంది తనకు. తాను తన తల్లి గురించి ఇన్నేళ్ల తరువాత విలపించటమా? అదీ తన లక్ష్యసాధన ఇంత చేరువలో ఉన్నప్పుడు! ఇదీ కృష్ణమాయ కాదు కదా అనుకుంటూ ముందడుగు వేశాడు యుద్ధ రంగంలో అడుగుపెట్టిన రత్నగిరికి దామోదరుడు శ్రీకృష్ణునిపై లంఘించటం కనిపించింది. కనుమూసి తెరిచేలోగా దామోదరుడి శిరస్సు శరీరం నుండి వేరైంది. చిరునవ్వుతో శ్రీకృష్ణుడు కనిపించాడు.

'సైనికి శిబిరాల్లో కలకలం చెలరేగింది. ఎక్కడి వారక్కడ చెల్లాచెదురై పరుగెత్తసాగారు.

శ్రీకృష్ణదర్శనంతో రత్నగిరి శరీరంలో విచిత్రమైన మార్పులు కలగసాగాయి. రుధిరం గంగాప్రవాహమై పరవళ్లు తొక్కసాగింది. అతని ఇంద్రియాలు మామూలుకన్నా ఎంతో చురుకుగా పనిచేయసాగాయి. తనలో తెలియకుందానే వదో మార్పు కలుగుతున్నట్టుగా ఉంది రత్నగిరికి. తన కళ్లముందు కమ్మిన పొరలేవో కరుగుతున్నట్టుంది.

కృష్ణుడితో అతని మంత్రి సుబుద్ది ఏదో చెప్పటం వినిపించింది. దగ్గరగా వెళ్లాడు రత్నగిరి.

“ఇదే అదను శ్రీకృష్ణా. కళ్మీరానికి నరయిన రాజు లేడు. కళ్మీరంలో మ్లేచ్చ మతానుయాయులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మనం కళ్ళీరాన్ని ఆక్రమిం చేందుకు ఇంతకు మించి మంచి తరుణం రాదు.”

రత్నగిరి శ్రీకృష్ణుని ముఖం వైపే చూస్తూ అతనికి దగ్గరగా వెళ్లాడు మంత్రి సుబుద్ధి మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అది యమునానదిపై వీచిన చల్లని గాలిగా ఉంది. అంత క్రితమే దామోదరుని చంపిన తాలూకు ఉద్రేకపు ఛాయలే లేవు అసలీయనకు ఉద్రేకం, (పేమ, ద్వేషం వంటి భావా లున్నాయా?

శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు.

కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్జేయో హరాంశజః కడా పట తైైడననడడడనడడడకనతతతడకకడడకకడడనత 2242422222 కస్తూరి మురళీకృష్ణ లా!

నావజ్ఞేయస్స దుష్పోపి విదుషా భూతి మిచ్చతా

కశ్మీర భూభాగం పార్వతీ మాత. ఆ రాజు శివాంశజుడు అతడు దుష్టుడైనా పగలోక శ్రేయస్సు కోరి కశ్మీర రాజును అవమానించరాదు.

రత్నగిరి హృదయం బద్ధలయింది.

ఇదీ ధర్మం ఇదే ధర్మం.

తనదీ ఒక ధర్మమేనా? అకారణ ద్వేషంతో కూడిన తుచ్చమైన మతం తనది

ద్వేషభావన లేక అందరిలోనూ భగవంతుని దర్శించి అందరినీ (ప్రేమించే ఉత్తమ ధర్మం ఇది దానికి శ్రీకృష్ణుడు ప్రతీక.

ఈ ధర్మాన్నా తను నాశనం చేయాలనుకున్నది?

రత్నగిరికి తన దుష్ఫుత్యాలు, పూర్వకర్మలు అన్నీ గుర్తుకొచ్చాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తను జీవించతగడు. వెంటనే కత్తి పట్టుకుని “హే కృష్ణా అని అరుస్తూ కృష్ణుని మీదకు ఉరికాడు. అయితే అంతలో పట్టు తప్పిపడ్డాడు. అతని చేతిలో కత్తి ఎక్కడో పడిపోయింది. అతను సరిగ్గా శ్రీకృష్ణపాదాల మీద పడ్డాడు.

శ్రీకృష్ణ పాదస్పర్శతోటే రత్నగిరి శరీరం కంపించింది. అతని దుష్పృత్యాలన్నీ నశించాయి. అతనిలో సర్వపాపభావనలు, మ్లేచ్చవాసనలు అంతమయ్యాయి అతనికి జ్ఞానోదయమయింది. తాను చేసిన పాపాలకు నిష్కృతి మరణం కాదు. తానుపెంచిన విషపు వృక్షాన్ని తానే సమూలంగా నరికివేయాలి. ఏ శక్తియుక్తుల ఆధారంగా మ్లేచ్చమతాన్ని పెంచాడో, ఆదే శక్తియుక్తుల అధారంగా తాను మ్లేచ్చమతాన్ని సమూలంగా పెకిలించి సనాతన ధర్మాన్ని నిలపాలి. గతంలో తాను ద్వేషంతో చేసిన అకృత్యాలను ఇప్పుడు (ప్రేమతో సత్షృతువులుగా మార్చాలి.

“అవతు మామ్‌. అవతు మామ్‌ అవతు వక్తారమ్‌! ఓం శాంతిః శాంతిః శాంతిః అనుకుంటూ కళ్శ్మీర దేశం వైపు పయనించసాగాడు రత్పగిరి.

(ఓ దేవా! నన్ను రక్షించు. ఆచార్యుని (సనాతన ధర్మాన్ని రక్షించు. త్రివిధ తాపనాలు శమించుగాక)

అలా వెళ్తున్న రత్పగిరిని అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. రత్నగిరిని శ్రీకృష్ణుడు వాత్సల్యంగా, (ప్రేమతో చూశాడు.

శు యు ఈ

==వ= కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు ౭౭32222222 కర్‌. హె

హాసు ల్‌ యు ఖ్‌ | య్‌ జ్జ వంతి “ఈ వా?! నో దామోదర సర్పం “దామోదర మహారాజుకు విప్రోత్తములు శాపం ఇచ్చారటి. దావానలంలా వార్త కళ్ళీరమంతా పాకిపోయింది. కార్చిచ్చులా అది ప్రజల హృదయాలను దహించి వేయసాగింది. కాజు దోషం చేస్తే ఆ బాధ ప్రజలు అనుభవిస్తారు ప్రజలు దోషం చేస్తే ఆ బాధ రాజు అనుభవిస్తాడు ఎవరు చేసిన దోషమో ఇప్పుడు బ్రాహ్మణ శాపమై రాజును తాకింది.” తుఫాను అలల తాకిడికి నావ వణికినట్టు ప్రజలు వణికిపోసాగారు, చర్చించుకోసాగారు నాలికపై ఇదే ప్రశ్న “దామోదరుడు సామాన్యుడు కాడు. జలౌక మహారాజు తరువాత కళ్ళీరాన్ని పాలించే అర్హత కలిగిన ధీరుడు. “విప్రశాపం దామోదరుడిపై పని చేయదు ఆయన శివానుగ్రహపాత్రుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు. తన భక్తాగ్రేసరుడికి నష్టం కలిగే ఆజ్ఞ శివుడెందుకు ఇస్తాడు?” మా 10 కైక కస్తూరి మురళీకృష్ణ డడతఊ

'కళ్ళీర ప్రజల దౌర్బాగ్యం అలా ఉంటే దానికి ఎవరేం చేయగలరు?”

“దామోదరమహారాజు కుబేరుని ప్రియమిత్రుడు. యక్షులకు ఆప్తుడు. లేకపోతే అతి దీర్మమైన అద్భుతమైన గుద్దసేతువు (ప్రస్తుతం గుడసుధో) నిర్మించటం మానవమాత్రులకు సాధ్యమా? అంతటి వ్యక్తి కేవలం మానవుల శాపానికి భయపదతాడా?”

“సత్మార్యాలు చేసే రాజుకు, సచ్చీలునకు ఎటువంటి ఆపద రాదు.

దామోదరీయసూదం (ప్రస్తుతం దాందుర్‌ ఓదర్‌)లో మహారాజు నిర్మింపదలచిన వంతెన ప్రపంచంలోని అత్యద్భుత కట్టడాలకు తలమానికం వంటిదవుతుంది అటువంటి మహారాజుకు దైవమే నష్టం తలపెట్టడు ”

“నీకీ విషయం తెలుసా? దేశంలో అదుపు తప్పిన జలప్రవాహాల వల్ల దుర్హటనలు సంభవించకుండా యక్షుల సహాయంతో ఇంకా అనేక వంతెనలను నిర్మించాలని ఆలోచిస్తున్నాడు రాజు, ఇంటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న మహారాజుకు ఏ ఆపదా వాటిల్లదు'.

“మరి విప్రశాపం?'

“ఏమీకాదు. శాపమిచ్చిన విప్రులే దానిని ఉపసంహరించుకుంటారు కానీ మహారాజుకు కోపం వస్తే దాన్నెవరూ ఉపసంహరించలేరు ఉపశమించలేరు

ఇలా పలురకాల చర్చలు, వాదోపవాదాలతో కళ్ళ్శీరదేశం అట్టుడికినట్టు ఉడికిపోసాగింది (ప్రజలు పనులు మానేసి గుంపులు గుంపులుగా చర్చించుకోసాగారు ఇంతకీ విప్రలేం శాపమిచ్చారో, ఎందుకిచ్చారో ఎవరికీ సరిగ్గా తెలియటం లేదు

'రాయిని కమ్మని” ఒకరంటే, 'రాత్రిలోగా రక్తం కక్కుకుని చచ్చిపొమ్మ'ని శాపమిచ్చారని ఇంకొకరంటున్నారు అసలు సరైన సమాచారం తెలియక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు

ప్రజలకు ముఖ్య సమాచారం తెలియజేసే వార్తాహరులంతా రాజధాని వదలి రావటం లేదు దాంతో ప్రజల్లో పలు రకాల వదంతులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి ఏం జరుగుతోందో తెలియక ప్రజలు భయకంపితులవుతున్నారు

ఏం జరిగిందో తెలిసిన దామోదర మహారాజు పెదవి విప్పటం లేదు ఆందోళనగా అతని అంతరంగికులంతా రాజమందిరంలో సమావేశం అయ్యారు

“ఏం జరిగింది మహారాజా? రాజ్యమంతా మీకు విప్రులు శాపం ఇచ్చారన్న వదంతి మనిషి శరీరంలో ప్రవేశించిన విషం క్షణాల్లో దేహమంతా పాకినట్టు పాకిపోతోంది. కానీ ఏం జరిగిందో ఎవరికీ తెలియటం లేదు” ఆందోళనగా అడిగాడు మహామంత్రి,

“అయినా ఎంత కండకావరం ఆ విప్రలకు? శౌర్యంలో నరేంద్రుడంతటి వారు, ధనంలో కుబేరుడికి దీటు, దానంలో మీకు మీరే సాటి అటువంటి మిమ్మల్ని శపించే అవసరం ఏమొచ్చింది అ బ్రాహ్మణ ధూర్తులకు?' ఆగ్రహం వెళ్ళగ్రక్కాడు సేనాపతి'.

=== కల్డణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2323232323232332త22ఊ2త2త2దడడడడడడడ22 మేళ. జు

అతని వైపు నిరసనగా చూశాడు మహామంత్రి

“ఆవేశం కూడదు సేనాపతీ. ఈ సృష్టిలో కారణం లేకుండా కార్యంలేదు. బ్రాహ్మణులు శాపం ఇచ్చారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఇంతకీ మీకు వారిలోఎవరైనా తెలుసా మహారాజా?” అడిగాడు మంత్రి.

మహారాజు మంత్రి వైపు చూశాడు. 'తెలుసు. విశ్వనాధ భట్టు వాళ్ళలో ఉన్నాడు ”

తమ మధ్య కాలకూటవిషసర్పం పడగ ఎత్తి నిలుచున్నట్టు వణికిపోయాడు మంత్రి “ఆతడినెందుకు అవమానించారు ప్రభూ? విశ్వనాధభట్టు పడగ ఎత్తిన త్రాచుపాము లాంటివాడు. అతడితో చెలగాటం ఎందుకు ఆడారు ప్రభూ?” అడిగాడు మంత్రి ఆందోళనతో.

“శాపం ఇచ్చిన బ్రాహ్మణులలో విశ్వనాధభట్టు ఉన్నాడా?” అంతవరకూ మౌనంగా ఉన్న ఆస్థాన విద్వాంసుడు. పండితుడు, జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు అయిన సర్వోత్తమ పండితుడు అడిగాడు ముందుకు వంగి.

మహారాజు ఆయన వైపు నిర్లిప్తంగా చూశాడు.

“విశ్వనాధ భట్టు అంటే మీరంతా ఎందుకు భయపడుతున్నారు? కారణం లేకుండా భయపడుతున్నారు కారణం లేకుండా కోపం తెచ్చుకునేవాడు బ్రాహ్మణుడయినా ఒకటే, అ (బ్రాహ్మణుదైనా ఒకటే బ్రాహ్మణ్యం ప్రవర్తన వల్ల కానీ పుట్టుక వల్ల కాదు” అన్నాడు మహారాజు, ఒక్కక్షణం మౌనం తరువాత మళ్ళీ తనే నవ్వుతూ అన్నాదు 'వారిని ఆ క్షణంలోనే నా కత్తికి ఎరచేయకుండా, (బ్రాహ్మణులని వదలినందుకు బాధపడుతున్నాను".

“మహారాజా పుట్టుకతో బ్రాహ్మణులైన వారు నిజమైన బ్రాహ్మణులు కారన్నది నిజమే, కాని విశ్వనాధ భట్టు మహోగ్రతపశ్శాలి. మహోగ్ర తపశ్చాలులైన బ్రాహ్మణ తపోమహిమలు ఆనూహ్యమైనవి, అద్భుతమైనవి. వారు తలచుకుంటే మీరింత కాలంగా సంపాదించుకొన్న మహాత్తులను క్షణంలో చిత్తు చేయగలరు. భూకంపంలో కూలిపోయిన భూములను పునర్నిర్మించుకోవచ్చు శతృదాడుల్లో నాశనమైన మందిరాలను పునరుద్దరించుకోవచ్చు. దాయాదుల వల్ల ధ్వంసమైతే తిరిగి బలం పుంజుకోవచ్చు. కానీ బ్రాహ్మణులను అవమానించటం వల్ల చితికిపోయిన వంశాలు ఎప్పటికీ కోలుకోలేవు' అన్నాడు సర్వోత్తమ పండితుడు.

దామోదర మహారాజు నవ్వాడు

“అసలేం జరిగిందో తెలిస్తే సర్వోత్తమ పండితులు ఇలా అనరు వారు ఇంత కష్టపడి సంపొయించిన తపోశక్తులనెలా వ్యర్థం చేస్తున్నారో తెలుసుకుని చీదరించుకుంటారు' అన్నాడు మహారాజు.

“ఇంతకీ ఏం జరిగింది ప్రభూ?

దామోదర మహారాజు నిట్టూర్చాడు. వై [ద్ర :23ైడడడ2డడడ22డ:డ:2ఊ4222=444==== కస్తూరి మురళీకృష్ణ ==

'త్రాద్ధం కొరకు వితస్తా నదికి వెళ్ళేందుకు సిద్ధమవుతూంటే కొందరు బ్రాహ్మణులు స్నానానికి పూర్వమేభోజనం పెట్టాలని కోరారు' మంత్రి, సేనాపతులు ఆశ్చర్యంగాచూశారు. సర్వోత్తమ పండితుడు ప్రభువువైపు ఆలోచనగా చూశాడు

“స్నానానికి పూర్వమే భోజనం ఏమిటి” అర్ధం లేని కోరిక అన్నాడు సేనాపతి.

“నేను అదే అన్నాను వీలయినంత త్వరగా, కాలయాపన కాకుండా, స్నానం ముగించి వస్తానని అన్నాను కానీ వాళ్ళు వినలేదు స్నానానికి ముందే భోజనం పెట్టమని మొండి పట్టుపట్టారు'.

“'మూర్చులు' అన్నాడు సేనాపతి.

మంత్రి సాలోచనగా సర్వోత్తమ వండితునివైపు చూశాడు అదే సమయానికి సర్వోత్తముడు మంత్రి వైపు చూశాడు. ఇద్దరి కళ్ళలో ఒకే భావం లీలగా కదిలి మాయమైపోయింది. “బ్రాహ్మణులింత నీచమైన వింత కోరిక కోరటమే కాక మంకుపట్టు పట్టారంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అనిపించింది ఇద్దరికీ

(నేను వారి మాటలు పట్టించు కోకుండా వితస్తానదికి పయనమయ్యాను. కానీ అది (బ్రాహ్మణ మాయనో, నా భ్రమో తెలియలేదు. ఎంత నడచినా వితస్తానది అందకుండా పోతోంది. చివరికి ఆ నది కూడా బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాతే నన్ను తాకనిస్తానని అన్నట్టు నాకు తోచింది. నాకు పట్టుదల హెచ్చింది

భోజనం పెట్టమని పట్టుదల పడుతున్న బ్రాహ్మణులను చూస్తే కోపం ఇనుమడించింది. నేను స్నానం చేయందే మీకు భోజనం పెట్టను. ఆపసర్సులు కండు. అడ్డు తొలగండి అని చీదరించుకున్నాను.

అపుడు విశ్వనాధభట్టు కాబోలు అన్నాడు. “మమ్మల్ని సర్బలు అన్నావు కాబట్టి నువ్వే సర్పమైపో అని శపించాడు". అని నవ్వి 'ఇంకా నేను సర్పమైపోలేదు అన్నాడు దామోదరుడు కాస్సేపాగి 'ఇందులో నా తప్పేమీ లేదు కాబట్టి వాళ్ళ శాపం ఫలించటం లేదు. పైగా ఒక్క రోజులో రామాయణం వింటే శాపం తొలగిపోతుందని వాళ్లే చెప్పారు మీరే చెప్పండి స్నానం కాకుండా భోజనం పెట్టమునటంలో అర్ధం ఏమైనా ఉందా?” అన్నాడు

సర్వోత్తమ పండితుడు లేచి “ప్రభూ నేను విశ్వనాధభట్టును బాగుగా ఎరుగుదును. కారణం లేనిదే ఏ వనీ చేయడాయన. పైగా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ, ప్రజాక్షేమకార్యక్రమాలు అనేకం చేపడుతున్న మిమ్మల్ని నింత కోరిక కోరి శాపగ్రస్తులను చేశాడంటే దాని వెనుక ఏదో పరమార్ధం ఉండి తీరుతుంది. తమరు అనుజ్ఞ ఇస్తే నేను విషయం తెలుసుకుని వస్తాను'అన్నాదు

(సర్వోత్తమ పండితా! నాకేమీ భయం లేదు అయితే తమరి కోరికను నేను కాదనను" అన్నాడు దామోదరుడు

సర్వోత్తమ పండితుడు సెలవు తీసుకుని వేగంగా విశ్వనాధభట్టు నివాసం వైపు వెళ్ళసాగాడు.

లే === కల్టణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు 22కి 10 త

“రండి, దయ చేయండి" అంటూ సర్వోత్తమ పండితుని సాదరంగా ఆహ్వానించాడు విశ్వనాధభట్టు. తన సందేహానికి విశ్వనాధ భట్టు ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు సర్వోత్తమ పండితుడు

సర్వోత్తమ పండితుడు విశ్వనాధ భట్టు వైపు పరిశీలనగా చూశాడు విశ్వనాధ భట్టు మొహంలో కోపంగానీ, కల్మషం గానీ కనిపించటం లేదు. శాంతంగా స్వచ్చంగా ఉంది ఆయన వదనం.

సర్వోత్తమ పండితుడిని ఉత్తమ ఆసనంలో ఆసీనుడిని గావించి ఉచిత రీతిన సత్మరించాడు విశ్వనాధ భట్టు. తన సందేహానికి విశ్వనాధ భట్టు ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. సర్వోత్తమ పండితుడు.

“'మహారాజు ప్రకృతితో చెలగాటం ఆడుతున్నాడా? ఇదెక్కడి వింత ఆరోపణ?” ఆశ్చర్యంగా అడిగాడు సర్వోత్తమ పండితుడు.

“సర్వోత్తమ పండితా, మహారాజు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పైపైనే స్పృశించి వాటివల్ల కలిగే తాత్కాలిక లాభాలనే మీరు చూస్తున్నారు. కానీ వాటిని సూక్ష్మంగా విచారించి భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాల గురించి ఆలోచించటం లేదు”

“'మీరేమంటున్నారో నాకర్థం కావటం లేదు అయోమయంగా అన్నాడు సర్వోత్తమ పండితుడు

“మహారాజు నదులపై వంతెనలు నిర్మిస్తున్నాడు. మంచిపనే, కానీ నదీ జలాల దిశలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. నదీ ప్రవాహాలకు ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని చూస్తున్నాడు. యక్షుల ప్రభావానికి లోనై మహారాజు కళ్శ్మీరంలోని నదులను తన అదుపాజ్జలలో ప్రవహింప చేయాలనుకుంటున్నాడు. అదీ ప్రకృతితో చెలగాటం ఆడటమంటే' “విశ్వనాధ భట్టుగారూ, మీరు అనవసరంగా ప్రకృతితో చెలగాటం లాంటి విపరీత పదాలు వాడుతున్నారు మహారాజు చేయదలచింది మామూలు విషయమే. నదీజలాలు నిరుపయోగంగా ప్రవహించి సముద్రంలో కలిసి వృధా అయ్యే బదులు వాటిని జలాశయాల్లో బంధించి, జలలేమితో బాధపడుతున్న ప్రాంతాలకు తరలించటంలో దోషం ఏముంది? నీరులేక బీడై ఉన్న భూములకు నీటి ప్రవాహాన్ని మళ్ళించి ఆ భూములను సస్యశ్యామలం చేయటం ప్రకృతితో చెలగాటం ఆడటమా? అందరికీ జరిగే ఈ లాభంలో కొందరికి నష్టం కలుగవచ్చు కొందరికి నష్టం కలుగుతోందని అందరి లాభాన్ని వదలుకుంటామా?” ప్రశ్నించాడు సర్వోత్తమ పండితుడు

ఆవేశంగా

విశ్వనాధభట్టు నవ్వాడు. “సర్వోత్తమ పండితుల వారు సకల శాస్త్ర పారంగతులు వారికి నేను కొత్తగా చెప్పవలసిందేమీ లేదు భౌతిక ప్రపంచంలో సమతౌల్యం ఉందని అది చాలా సున్నితమైనదనీ తమరికి తెలుసు”. = 20 కడనక2డత32డడడతడడతతకడకడకతతడ2డత2డ2త2కడడడ222డ22ఊ2ఊఊఊఊ22= కస్తూరి మురళీకృష్ణ నాలా.

“అయితే ..?

“మహారాజు గారిప్పుడు చేస్తున్న పనులు ఆ సమతౌల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి ప్రకృతిలో పరస్పరా(శ్రైితమైన జీవుల సహ జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి తద్వారా భవిష్యత్తులో కశ్శీరంలో మానవుల మనుగడకే ముప్పుతెస్తున్నాయి'

“ఎలాగ?

'సర్వోత్తమ పండితా, ఆ కనిపించే హిమాలయాలే భూమి అస్థిరత్వానికి ఆకొాశమంటేంతటి ప్రతీక హిమాలయాల వెంబడే వచ్చే భూకంపాలు భూమి అస్థిరత్వాన్ని పెంచవద్దని మనకు చేసే హెచ్చరికలు. మన కళ్ళీరం అస్టిరత్వంలో ఒక సున్నితమైన స్టిరత్వాన్ని కలిగి ఉంది నదీ ప్రవాహాలు ఈ సున్నితమైన స్థిరత్వం అధారంగా, స్వాభావికంగా తమ ప్రవాహ మార్గాన్ని ఎంచుకొంటాయి. ఈ సున్నితత్వం ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో పంటలు పందుతాయి. ఈ సున్నితత్వం ఆధారంగానే (ప్రజలు తమ జీవనోపాధిని ఎంచుకొంటారు. అందుకే ఏయే ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి జీవాలు తమ తమ జీవన పద్ధతులను, అలవాట్లను ఏర్చ్పరచుకొంటాయి'.

మహారాజుగారు జలాశయాలను ఏర్పరస్తున్నారు అంటే ప్రాకృతికంగా వచ్చేది కాక కృత్రిమంగా పరిస్థితులను సృష్టిస్తున్నారు అంటే ఒక ప్రాంతంలో గతంలో కన్నా ఎక్కువ పరిమాణంలో నీటిని సమకూర్చటం ఆ ప్రాంతంలో నీటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది

నీటిని బంధించేందుకు జలాశయాలను నిర్మించేందుకు వాడే రాళ్ళ బరువుల వల్ల భూమిపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పైగా నీటి ప్రవాహాన్ని నియంత్రించటం ద్వారా ఆ ప్రవాహం ఏర్పరచిన సమతాౌల్యానికి భంగం వాటిల్లదా?

మరో విషయం ఆలోచించండి ఈ జలాశయాల వల్ల, జల ప్రవావోల గతి మార్చిడి వల్ల ఎన్ని ప్రాంతాలు నీటి పాలవుతున్నాయి. ఎంత మంది ప్రజల జీవితాలు వరద మునకలో అతీగతీ లేకుండా కొట్టుకుపోతున్నాయి? ఎంతమంది స్వాభావిక జీవితం నీటి పాలవుతోంది? ఎన్ని జీవాలు అదృశ్యమౌతున్నాయి? ఎన్ని చారిత్రక సత్యాలు, ఎన్ని పురాతన మందిరాలు, పవిత్ర స్థలాలు సజీవంగా జలసమాధి అవుతున్నాయి? ఇది చూస్తే ప్రకృతితో కలసి జీవించవలసిన మానవుడు ప్రకృతిని తన అదుపాజ్జలలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు లేదూ? ప్రకృతి వల్ల మనిషి ఉన్నాడా? మనిషి కోసం ప్రకృతి ఉందా?”

ఇవన్నీ ఒక ఎత్తు సర్వోత్తమ పండితా, ఎన్ని వృక్షాలు ఈ నీటి ముంపులో మునిగి పోతున్నాయి? సర్వోత్తమ పండితుడు నవ్వాడు

“మీకు మనుషులు, భూములు, మందిరాలు నీటి మునిగే కన్నా వృక్షాలు నీటిపాలవటం ఎక్కువ విషాదంగా ఉన్నట్టుంది" అడిగాడు వ్యంగ్యంగా. === కల్దణ కళ్ళ్శీర రాజతరంగిణి కధలు :=3=3=3==2=23=3=3=323క3డ232ఊ2ఊ2ఊ2ఊ 2 ==

విశ్వనాధభట్టు నవ్వాడు 'ఆరంభంలో సృష్టి సర్వం జలమయమై ఉంది. అప్పుడు సర్వాంతర్యామి నాఖి నుంచి కమలం ఉదయించింది ఆ కమలం నుంచి (బ్రహ్మ ఉద్భవించాడు అన్నాడు.

సర్వోత్తమ పండితుడు అయోమయంగా చూశాడు.

“సర్వోత్తమ పండితా! బ్రహ్మకన్నా ముందు కమలం పుట్టకపోతే బ్రహ్మకు పుట్టుకే లేదయ్యా. కదలని ఈ వృక్షాలే మన జీవనాధారాలు. 'అధారాత్య ఊయన్‌యత్‌ ప్రాచీం దిశం ్రవిశతి తేన ప్రాబ్యన్‌ ప్రాణాన్‌ రళ్ళిషు సన్నిధిత్తే? అన్న ఉపనిషద్వాక్యం వినలేదా?”

“తెలుసు. సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున ప్రవేశించినప్పుడు తూర్పుదిక్కు ప్రాణాలను తన కిరణాలలో ధరించి ఉన్నాడు, అలాగే అన్ని దిక్కులు, అన్ని మూలాలూనూ అన్నాడు సర్వోత్తముడు.

“అంటే ఎక్కడెక్కడ జీవము, ప్రాణము '్రకటితమౌతున్నవో అంతా సూర్యుని (ప్రేరక ప్రభావమే అని కదా శృతి ఉద్దేశ్యం.

“అవును.

“మరి' అన్నంవై (ప్రజాపతి స్తతోహవై తద్రౌతస్తస్మాదిమాః ప్రజాః ప్రజాయంత ఇది” అంటే అర్థం ఏమిటి?”

“అన్నమే నిజానికి ప్రజాపతి. అన్నం నుండి రేతస్సు కలుగుతుంది. దాని నుండే 'ప్రాణిజాతమంతా జన్మ ఎత్తుతుంది అనటంలోని గూధార్ధం?

“ఏముంది సూర్యుడే మనకు అన్నం ఇస్తున్నాడని”.

“కానీ సూర్యకిరణాలను అన్నంలా మార్చి మనకందించే వేమిటి?”

సర్వోత్తమ పండితుడు నోట మాటరాక విశ్వనాధభట్టు వైపు చూస్తుండి పోయాడు.

అనంత శక్తి కల సూర్యకిరణాలను జీవులు (గ్రహించగల ఆహారంలా మార్చే శక్తివంతమైన ఏకైక శక్తి వృక్షం. ఈ సృష్టిలో ఏది లేకపోయినా ఫరవాలేదు కానీ వృక్షం లేకపోతే సృష్టిలేదు. అందుకే బ్రహ్మ కన్నా ముందు కమలం ఉదయించింది.

సర్వోత్తమ పండితులు చాలా సేపు మౌనంగా ఉండి చివరికి అన్నాడు 'అంటే జలాశయాలు నిర్మించటమే మానెయ్యాలా?”

నవ్వాడు విశ్వనాధభట్టు.

“మరణం ఏనాడో తప్పదని ఈనాటి నుంచే బ్రతకటం మానేస్తామా? విచక్షణ, సర్వోత్తమా విచక్షణ. మనిషిని జంతువు నుంచి వేరు చేసేదే విచక్షణ. విచక్షణనుపయోగించి సూక్ష్మంగా ఇ 22 డడ కస్తూరి మురళీకృష్ణ మడ

విచారించి పనిచేయాలి కానీ తాత్కాలిక లాభాలు చూసుకుని శాశ్వత దుష్పరిణామాలను విస్మరించకూడదు. జలాశయాలు నిర్మించాలి. కానీ అందుకు అనువైన ప్రదేశం ఎన్నుకోవాలి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి పర్యావరణ విశేషాలను క్షుణ్ణంగా విమర్శించాలి ప్రకృతిని పూజించాలి. కానీ ప్రకృతిని దోచి నాశనంచేసి మనం (బ్రతకలేము. అది తనున్న కొమ్మనే నరకాలని ఆలోచించే వాడి పద్ధతి.

“మీరిమాట మహారాజుకెందుకు చెప్పలేదు?"

“మీరంతా పొగడ్తలతో పెంచిన అహంకారంతో తాను పరమభక్తుడనని తనమాటే వేదమని భ్రమసే మహారాజు ఇతరులమాట వింటాడా? ఆకలితో చచ్చిపోతున్నాం, ముందు అన్నంపెట్టి తరువాత నువ్వు స్టానం చేయవయ్యా, అంటే. నేను స్నానం చేసివస్తా, అప్పటి వరకూ బ్రతికి ఉంటే అన్నం పెడతాననే వాడు, తాత్మ్కాలికాలను దాటి శాశ్వతాలవైపు చృష్టిసారించ గలడంటావా సర్వోత్తమా?

సర్వోత్తముడు దిగ్భాంతితో విశ్వనాధ భట్టు వైపు చూశాడు.

రాజు ఎంత మంచివాడైనా, ఉత్తముడైనా అతను ద్రష్టలాంటివాడై ఉండాలి అతని దృష్టి ప్రస్తుతానికి పరిమితం కాకూడదు".

కానీ మహారాజును సర్పమై పొమ్మనటం భావ్యమా?”

“ఏ జలాలను నియంత్రించి తన ఆధిక్యాన్ని చాటుకోవలనుకుంటున్నాడో ఆ జలాల మీద ఆధారపడినా దప్పిక తీరకుండా బ్రతకటంకన్నా మించిన న్యాయమైన శిక్ష మరేముంది సర్వోత్తమా?”

సర్వోత్తముడు మరోసారి ఆశ్చర్యంతో విశ్వనాధభట్టు వైపు చూశాదు.

ఈయనకు ధర్మం తప్ప మరేమీ కనపడవా? ధర్మంకన్నా ఏదీ ? విశ్వనాధభట్టా సర్వోత్తముని ఆలోచనలు గ్రహించినట్టు అన్నాడు.” ధర్మోరక్షతి రక్షతః ఒక మహారాజు పోతే మరో మహారాజు వస్తాదు. ధర్మం దైవం కన్నా మిన్ను

అంతలో బయట కోలాహలం వినిపించటంతో ఇద్దరూ బయటకు వచ్చారు

బయట మహారాజు సైన్యం ఆగి ఉంది పల్లకీని దింపారు. పల్లకీ లోంచి మహారాజు బయటకు పాకాడు అతని శరీరమంతా పొలుసులతో నిండి ఉంది. ఎంత విడదీసినా కాళ్ళు దగ్గరకు వచ్చి అతుక్కుపోతున్నాయి. మహారాజు కదల లేకపోతున్నాడు.

విశ్వనాధభట్టుకు సాష్టాంగ నమస్మారార్ధం జోడించిన చేతులు మరి విడివడలేదు కాళ్ళు అతుక్కుపోయాయి. పై శరీరం ఊడి వచ్చేస్తోంది. లోపల శరీరమంతా పొలుసులు. మవాీరాజు భుజాల సహాయంతో పొకసాొగాడు. హడ=జ= కల్లణ కళ్ళీర రాజతరంగిణి కధలు కైత౭డడడడడడడడడడడడడ222ఊ2ఊ2ఊ4= 23 ==

విశ్వనాధభట్టును చూసి నోరు తెరిచాడు. తక్షణం అతని నాలుక రెండుగా చీలి వెగంగా బయటకూ లోపలకూ కదలసాగింది ఎవరో సాగదీసినట్టు అతని ముఖం, శరీరం సర్వం సాగిపోసాగాయి. అతని కాళ్ళు, చేతులు సరళరేఖలోకి వచ్చేశాయి. కళ్ళు రెంటినీ పక్కకు తోస్తూ ముక్కు ముందుకుసాగి తనతో మిగతా ముఖాన్నంతా లాగింది తాబేలు శరీర భాగాలను లోపలకు లాక్కున్నట్టు దామోదరుడి శరీర భాగాలు అద్భశ్యం కాసాగాయి. అదృశ్య శిల్సి దామోదరుని మానవ రూపాన్ని సర్పంలా మారుస్తున్నట్టు తోచింది. దామోదరుని శరీరం కుబుసం విడిచి బుసలు కొడుతూ దామోదర సర్పం బయటకు వచ్చి, తోక మీద లేచి నిలుచుంది. అంతవరకూ కన్నీళ్లు కారుస్తున్న ప్రజలు భయంతో చెల్లాచెదురయ్యారు. ప్రకృతిని నియంత్రించాలనుకునే దానవ యోచనలు చేసే వారికి గుణపారం నేర్పుతూ కలకాలం జీవించు” అని విశ్వనాధభట్టు జలాలను మంత్రించి వదిలాడు. దామోదర సర్పం బుసలు కొడుతూ విశ్వనాధభట్టు పాదాలున్న ప్రాంతాన్ని తాకింది ఆ బుసకు ఎగసి సర్పం శిరస్సుపై వాలిన ధూళి, విశ్వనాధభట్టు పాదధూళిని సర్పం శిరసున ధరించిందన్నట్టుంది. దామోదరుడు చివరిసారి ప్రజల వైపు చూసి బుసలు కొడుతూ వేగంగా అదృశ్యమయ్యాడు ఇప్పటికీ దామోదర సూదము అనే మడుగులో దప్పికతో శాపం వల్ల పుట్టిన వేడి చేత పుట్టిన విషశ్వాసల ధూమంతో ప్రజలకు కనబడుతూంటుంది దామోదర సర్పం ప్రకృతిని నియంత్రించి ఆధిక్యతను నెరపాలనుకుంటున్న వారందరికీ గుణపారంగా ఈనాటికీ ఆ ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి (బ్రతుకుతూనే ఉంది దామోదర సర్పం శ శే శ మజ లైల పతక కస్తూరి మురళీకృష్ణ 22

స్‌ ఉనా సట బాత ఫో గో వ్య న్‌ సస్నైట్ష ష్ట్ర ) ్‌ూ | ట్‌ నీ ధర్మరక్షణ క్రీ.పూ 15వ శతాబ్దం నాటి కధ ఇది. దామోదర మహారాజు విప్రశాపం వల్ల సర్పంగా మారటంతో కశ్ళీరం అల్లకల్లోలమయింది. ఆ సమయంలో హుష్ముడనే తురుష్కుడు (తురుష్క అంటే మహమ్మదీయ మతం కాదు తురుష్ములంటే తుర్మీస్థానం నుండి వలస వచ్చిన బౌద్ధ పండిత మహారాజులని భావము) కళ్ళీర రాజ్యాన్ని ఆక్రమించాడు రాజ్యాన్ని ఆక్రమించుకున్న హుష్కుడు అల్లరి మూకలను, అశాంతికారులను చెల్లాచెదురు చేశాడు. ఆ సమయంలో ఒక సుందర ప్రదేశం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ (ప్రాంతాన్ని కైలాసగిరి అంటారని అక్కడ ఓ పదిహేను బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే ఉంటాయని తెలుసుకున్నాడు. మె కల్దణ కశ్మీర రాజతరంగిణి కధలు :2డడడ22222224ఊ 25ర్‌ =22ా

కనుల పండుగ చేసే చెట్లతో, ఆకాశంతో మంతనాలాదే కొండలతో, సముద్రంతో చెలిమికై పరుగులిడే నదులతో, సరస్సులతో నిండిన ఆ (ప్రదేశం హుష్క మహారాజ హృదయాన్ని చూరగొంది. ఆ ప్రశాంత వాతావరణంలో, సమ్మోహనకారియై, విధాత సృజనాత్మక కళాకౌశలానికి దర్పణం పట్టేటటువంటి ఆ ప్రదేశంలో ఒక దచైత్యాన్ని బౌద్దభిక్షువులకొక మరాన్ని నిర్మించి, చిరకీర్తినార్జించాలన్న కోరిక హుష్క మహారాజుకు కలిగింది. వెంటనే తన కోరికను మంత్రికి వెల్లడించాడు. మంత్రి శేఖరుడు సేనాపతి శాక్యవర్ధనుడితో ఆ మాట చెప్పి “కైలాసగిరిలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు కళ్ళీర ఆవిర్భావం నుంచీ అక్కడే ఉన్నాయి. వారిలో ముఖ్యంగా విశ్వనాధ భట్టు అని ఓ పండితుడు ఉన్నాడు దామోదర మహారాజును 'సర్బం కమ్మని శాపం ఇచ్చిన విష్పలలో ఈయన కూడా ఉన్నాడు. వారంతా యుద్ధ విద్యలో కూడా ఆరితేరినవారు. మ్లేచ్చ గణాలను అణచటంలో అశోక మహారాజుకు సాయపడిన బ్రాహ్మణ వంశంలోని వారు వీరు. అతి జాగ్రత్తగా వాళ్ళతో మెలిగాలి” అని హెచ్చరించాడు. సేనాపతి శాక్యవర్ధనుడు నవ్వి 'మంత్రాలకు శాపాలకు భయపడే రోజులు కావివి. ఇప్పుడా మంత్రాలకంత శక్తి లేదు బ్రాహ్మణులలో ఆ వాక్స్ళుద్ధి లేదు. ఇవి బుద్ధదేవుని దివ్య బోధనల రోజులు. శాపాలకు కోపాలకు తావులేదు" అన్నాడు. అయితజే అతనికి త్వరలోనే ఆ స్థలం సంపాయించటం అంత సులభం కాదని తెలిసింది ఆ పదిహేను కుటుంబాలకూ కైలాసగిరొలో ఓ దేవాలయం ఉందని వారు ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాన్ని వదిలి వెళ్ళేందుకు సిద్ధంగా లేరని తాను పంపిన వార్హాహరుడి ద్వారా తెలిసింది. ఆ తరువాత పదిమంది భటులను పంపి బెదిరించినా ఫలితం కనబదలేదు. దాంతో శాక్యవర్దనుడు స్వయంగా ఒక యాభైమంది సైనికులతో కైలాసగిరి వచ్చాడు. “మీలో విశ్వనాధ భట్టు ఎవరు? అనడిగాడు శాక్యవర్దనుడు. ఎదురుగా ఉన్న బ్రాహ్మణు శేనే అన్నాడో ముసలి బ్రాహ్మణుడు “'ముష్క మహారాజులవారి ఆజ్ఞ ఇది. కైలాసగిరి దేవాలయం స్థానే ఒక మహా చైత్యాన్ని నిర్మించాలని ప్రభువుల కోరిక అందుకే మిమ్మల్ని ఈ ప్రాంతం విడిచి వెళ్లవలసిందిగా సవినయపూర్వకంగా అర్ధిస్తున్నాను' అన్నాడు శాక్యవర్దనుడు. ఎవరూ ఏమీ మాట్లాడకపోవటంతో శాక్యవర్దనుడు మళ్ళీ “మీకు అయిదు రోజులు గడువిస్తున్నాను. ఈ అయిదు రోజుల్లో మీ నిర్ణయాన్ని తెలపండి. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ చైత్యం నిర్మించటం మాత్రం ఆగదు” అన్నాడు శాక్యవర్దనుడు. అయిదు రోజుల తరువాత మళ్లీ వచ్చాడు శాక్యవర్దనుడు కైలాసగిరికి, ఈసారి తన వెంట వందమంది సైనికులను తెచ్చాడు లా వ మురళీకృష్ణ డు

“ఏం నిర్ణయించుకున్నారు?” అని అడిగాడు.

ఎవరూ ఏమీ మాట్లాడలేదు

“మౌనం అర్జాంగీకారమా? వ్యంగ్యంగా అడిగాడు.

“అర్ధ అనంగీకారం కూడా” అన్నాడా విశ్వనాధభట్టు

తిరస్కారంగా చూశాడు శాక్యవర్దనుడు.

'మీ అంగీకార అనంగీకారాలతో మాకు ప్రసక్తి లేదు మహారాజుగారికీ స్టలం కావాలి. మర్యాద కొద్దీ మిమ్మల్ని అడిగాము. మీరు ఒప్పుకోకపోతే చేయగలిగిందీ ఏమీ లేదు మీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. రేపు సూర్యోదయంలోగా మీరీ ప్రాంతం వదలి పోవాలి. లేకపోతే మీ ఆలయంతోపాటూ మిమ్మల్నీ నామరూపాల్లేకుండా చేస్తాను. ముందే హుష్క మహారాజుగారికి బౌద్ధేతరుల పట్ల అసహనం ఎక్కువ” అన్నాడు శాక్యవర్దనుడు బెదిరిస్తూ.

మరుసటి రోజు తెల్లవారకముందే వందమంది సైనికులతో కైలాసగిరి చేరాడు శాక్యవద్దనుడు

అయితే ఎవరూ ఊరు వదలి వెళ్తున్న జాడలేదు సైనికులిద్దరిని పంపి విశ్వనాధ భట్టును పిలుచుకురమ్మన్నాడు. వారిద్దరూ తిరిగి వచ్చేదాకా అసహనంగా గడిపాడు శాక్యవర్దనుడు

“ఏడీ వస్తున్నాడా? సైనికులు దగ్గరకు రాగానే అడిగాడు అసహనంగా.

“ఊళ్లోని సర్వ బ్రాహ్మణ కుటుంబాలు వారం రోజులు దేవాలయంలో ఏదో వ్రతం చేస్తున్నాయట. ఒక పిల్లవాడు దేవాలయం దగ్గర చెప్పాడు ప్రభూ” భయపడుతూ చెప్పారు సైనికులు

శాక్యవర్దనుడు కోపంతో ఊగిపోయాడు.

“ఇవాళ్ల ఊరు వదలి వెళ్ళాలని చెప్పాను కదా? ఈ పూటెందుకు పూజలు పెట్టుకున్నారు?' గద్దించాడు శాక్యవర్దనుడు.

సైనికుడు గడగడలాడాడు. “నాకు తెలియదు ప్రభూ అన్నాడు

శాక్యవర్దనుడు కోపంగా గుల్దం మీదకు ఉరికి, తన వెంట పదిమంది సైనికులను రమ్మని పిలిచి, దేవాలయం వైపు వేగంగా వెళ్ళాడు

దేవాలయం బయటే ఓ పిల్లవాడు అద్దుపద్దాడు. సైనికులను చూసి 'లోపలకు వెళ్లరాదు' అన్నాడు

“ఎవరు నువ్వు? అడిగాడు శాక్యవద్దనుడు కోపంగా

'విశ్వనాధభట్టు గారి మనవడిని, దామోదరభట్టును అన్నాడు ఆ పిల్లవాడు ఆ పేరు వినగానే కుతకుతలాడి పోయాడు శాక్యవర్దనుడు. “నిందా పదేళ్లు లేవు, అహంకారంతో ఉట్టిపడుతున్నాడు' అనుకున్నాడు శాక్యవర్దనుడు, పళ్ళు పటపటలాడిస్తు. == కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు 3322222222 2. జు

“పోయి విశ్వనాధభట్టును పిలుచుకురా, లేదా నన్ను లోపలకు పోనీ" అన్నాడు శాక్యవర్దనుడు కోపంగా. “తాతయ్యగారు పూజలో కూచున్నారు. వారం రోజులు కదలరు. మీరు బౌద్దులు అయినా లోపలకు భక్తుడిలా వెళతానంటే అభ్యంతరం లేదు. శాక్యవర్దనుడి కోపం తారాస్థాయిని చేరుకుంది. తన సైనికుడి వైపుకు తిరిగి 'వాడిని అడ్డం జరుపు ఆజ్ఞాపించాడు. ఆ సైనికుడు కదలలేదు. శాక్యవర్దనుడి కోపం మితిమీరిపోయింది “వాడిని ఎత్తిపారెయ్యి లేదా ఈ కత్తి నీ గుండెలో దిగబడుతుంది" కోపంగా అరిచాడు శాక్యవర్దనుడు “ప్రభూ, ఈ పిల్లవాడిని ఎత్తిపారేసి బ్రాహ్మణ శాపానికి గురయి ఏ పాములానో, కప్పగానో మారి చావలేక బ్రతికేకంటే ఒకేసారి మీ చేతిలో చావటం మేలనిపిస్తుంది” అన్నాడా సైనికుడు తలవంచుకుని. శాక్యవర్దనుడు ఎత్తిన కత్తి అలానే ఉండిపోయింది. దామోదర మహారాజు విప్రశాపంతో సర్బంలా మారి ఇంకా తిరుగుతూనే ఉన్నట్టు, ఎంతోమంది ఆయనను సర్ప్బరూపంలో చూసినట్టు శాక్యవర్దనుడు విన్నాడు. శాక్యవర్దనుడు మిగతా సైనికుల వైపు చూశాడు వారంతా తలలు వంచుకున్నారు. ఒక్కక్షణం తనే ఆ పిల్లవాడిని పక్కకు తోసెయ్యాలని అనుకున్నాడు కానీ ధైర్యం సరిపోలేదు ఏమూలో ఇంకా వదలని సంస్కారం పట్టి వెనుకకు లాగింది. కత్తిని దించేశాడు “సరే, వారం తరువాత వస్తాను. ఈసారి పూజ, గీజ అన్నా ఆగను ఇదే చివర హెచ్చరిక అని హుంకరించి వెళ్ళిపోయాడు శాక్యవర్దనుడు. 'వైత్యనిర్మాణం ఇంకా ఆరంఖించినట్లు లేదు?” అని హుష్క మహారాజు సభలో మంత్రిని అడిగాడు. మంత్రి సేనాపతి వైపు చూశాడు శాక్యవర్దనుడు లేచి నిలబడి 'ఆ ఊళ్లో ఉన్న బ్రాహ్మణులు వేరే స్థలం వెతుక్కునేందుకు గడువడిగారు ప్రభూ. రేపటితో గడువైపోతుంది. ఎల్లుండి కల్లా స్థలం మన చేతిలో ఉంటుంది” చెప్పాడు శాక్యవర్దనుడు. హుష్క మహారాజు దేవాలయాన్ని కూల్చి, చైత్యాన్ని నిర్మించాలని అనుకోవటం, పదిహేను (బ్రాహ్మణ కుటుంబాలు వారిని ఎదిరించటం, కళశ్మీరమంతా పాకిపోయింది. పైగా ఆ బ్రాహ్మణులు దామోదర మహారాజుకు శాపం ఇచ్చిన వారేనన్న వార్త తెలియటంతో ప్రజలలో కుతూహలం, ఉత్సాహంతో బాటు ఒకరకమైన భయం కూదా కలిగింది. యైతైై2. బడ్‌. :=2]32ఊఊఊఊ2 కస్తూరి మురళీకృష్ణ =

'హుష్క మహవారాజేమైపోతాడో?” అని అనుకోసాగారు ప్రజలు.

వారం గడువు పూర్తికాగానే అయిదు వందల సైన్యంతో శాక్యవర్దనుడు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాడు. ఈసారి శాక్యవర్దనుడి కన్న ముందే జనం తండోపతండాలుగా కైలాసగిరి చేరారు. వారిలో అనేకులు బౌద్ధ మతాన్ని అవలంబించేవారున్నారు.

శాక్యవర్దనుడికి ఎదురుగానే కన్పించాడు విశ్వనాధభట్టు

“గడువైపోయింది. ఇంకా ఇక్కడే ఉన్నారేం? త్వరగా వదలివెళ్ళిపొండి' అన్నాడు శాక్యవర్దనుడు

నవ్వాడు విశ్వనాధభట్టు

అ నవ్వు చూడగానే శాక్యవర్దనుడి కోపం ద్విగుణీకృతమయింది.

'వెళ్తున్నారా? లేక. ."

“లేక?”

'వెళ్లగొట్టమంటారా?”

“వీరి వాగ్వివాదం చూసి కైలాసగిరి కుటుంబంలోని మిగతా సభ్యులంతా ఆ వైపుకు వచ్చారు ప్రజలు ఉత్కంరంతో చూడసాగారు.

“వెళ్ళగొట్టి చూడండి” విశ్వనాధభట్టు అన్న తీరు శాక్యవర్దనుడికి ఆయనపై లంఘించటం తప్ప మరోదారి లేనట్టు చేసింది వొళ్లుపై మరచిపోయీ కోపంతో శాక్యవర్దనుడు కత్తి రుళిపిస్తూ గుర్రాన్ని విశ్వనాధభట్టు వైపుకు దూకించాడు

ప్రజలు హాహాకారాలు చేశారు

విశ్వనాధభట్టు ముసలివాడు పైగా నిరాయుధుడు అతని పైకి సేనాపతి కత్తి దూయటం, బౌద్దులకు కూడా నచ్చలేదు.

అయితే వారి వేదనాభరిత హాహాకారాలు క్షణంలో ఆశ్యర్యపూరిత హా!హా!కారాలుగా మారిపోయాయి.

తనపైకి దూకుతున్న శాక్యవర్దనుని వైపు ఒక అడుగు వేసి, శాక్యవర్దనుడు దగ్గరకు రాగానే వొంగి, ఒడుపుగా కత్తివేటు నుండి తప్పించుకుని, సేనాపతి చేయి మణికట్టు దగ్గర ఎగిరి పట్టుకుని, గుజ్జం మీద నుంచి క్రిందకు లాగటమే కాదు అదే ఊపులో అతని చేతిలోంచి కత్తి లాక్కుని క్రిందపడ్డ శాక్యవర్దనుడి గుండె మీద కాలుపెట్టి, కత్తిని అతని మెడపై ఉంచి నిలబడ్డాడు విశ్వనాధభట్టు.

ఏం జరుగుతోందో అర్ధమయ్యే లోగా జరిగిపోయింది. అందరూ కొయ్యబారి నిలుచుండిపోయారు. సైనికులు అడుగు కదల్పలేకపోయారు === కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు కె౭ైకడడడడతడతడతడ22222న22వ222డ2222ఐ 209. జ

శాక్యవర్దనుడు తన గుండెపై ఉన్న విశ్వనాధభట్టు పాదం బరువుకన్నా అవమానభారంతో క్రుంగిపోయాడు.

“మేము శాంతికాముకులం. మా ధర్మం జోలికి రానంతవరకూ ఎవరేం చేసినా సహిస్తాం, భరిస్తాం. మా ధర్మాన్ని కదల్పాలని చూసిన వారికి శాంతి లేకుండా చేయగలం కూడా. మా దేవాలయాలు మా ధర్మనిలయాలు. మా ధర్మమే మా బలం” గంభీరంగా అన్నాడు విశ్వనాధభట్టు.

ఆ మాటలకు కేవలం శాక్యవర్దనుడే కాదు, అక్కడ ఉన్న సైనికులు, సర్వప్రజలు వణికారు.

“నేను నిన్ను చంపాలనుకుంటే ఒక్క క్షణంలో చంపగలను కానీ అనవసర హింస మా ధర్మంలోనే లేదు. వెళ్ళి మీ రాజుతో చెప్పు. మీ మత దేవాలయాలు నిర్మించుకోవాలంటే కశ్శీరంలో అనేక సుందర స్థలాలున్నాయని చెప్పు. అని శాక్యవద్దనుని గుండె నుండి కాలుతీసి, అతనికి చెయ్యందించిలేపి, కత్తిని చేతికిచ్చి వెళ్ళిపొమ్మన్నాడు.

కత్తిని సరిగా పట్టుకోలేకపోయాడు శాక్యవర్దనుడు గుజ్టిం కూడా ఎక్కలేకపోయాడు. వెళ్తున్నది సేనాపతి శాక్యవర్దనుడా? లేక అతని శవమా? అన్న సందేహం చూస్తున్న అందరికీ కలిగింది

ఈ వార్త కార్చిచ్చులా కశ్మీరమంతా వ్యాపించింది. చూసిన వారు తాము కళ్ళారా చూశామని చెప్తున్నా వినేవారు నమ్మలేకపోతున్నారు ఒక వృద్ధ బ్రాహ్మణుడు సుశిక్షుతుడైన సీనాపతిని ఓడించటమా?

తెల్లవారేసరికి సేనాపతి శాక్యవర్దనుడు అదృశ్యమయ్యాడన్న వార్త విశ్వనాధభట్ను ఉదంతాన్ని నమ్మని వారికి కూడా నమ్మకం కలిగించింది దేశం అట్టుడికినట్టు ఉడికిపోసాగింది.

“'హుష్క మహరాజు) ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే సరి. అతనికే కాదు, దేశానికి క్షేమకరం” అనుకోసాగారు ప్రజలు.

హుష్క మహారాజుకీ విషయం, ఎంత కోధాన్ని కలిగించిందో, అంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతి సైనికుడినీ పిలిచి పేరుపేరునా “ఇది నిజమా, మీరు కళ్ళారా చూశారా?) అని అడిగాడు అయినా అతని సంశయం తీరలేదు. మంత్రిని అడిగాడు.

మంత్రి శేఖరుడు చెప్పాడు 'ఇది నిజం ప్రభూ, ఆ (బ్రాహ్మణుల్లో, ముఖ్యంగా విశ్వనాధభట్టు మరీ ప్రమాదకరమైన వ్యక్తి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది" అన్నాడు

కానీ ముష్క మహారాజు అందుకు అంగీకరించలేకపోయాడు. అతనికి ఈ విషయాన్ని అంతటితో వదిలేయటం పరువు నష్టంలా అనిపించింది. పైగా అతనికి ఒకసారి విశ్వనాధభట్టును చూదాలని ఉంది. ర మురళీకృష్ణ నా!

“నాకు విశ్వనాధబట్టును కలవాలని ఉంది ఏ విశ్వాసంతో అతను సర్వ సామ్రాజ్య సేనాధ్యక్షుడిని ఎదిరించగలిగాడో తెలుసుకోవాలని ఉంది. ఒక్కసారి విశ్వనాధభట్టును పిలిపించండి' అన్నాడు.

“తప్రభూ! విశ్వనాధభట్టు భయంకరమైన అగ్నీ వంటి వాడు. అగ్నితో చెలగాటం చేటు చేస్తుంది" అన్నాడు హెచ్చరిస్తూ.

హుష్క మహారాజు నవ్వాడు 'మంత్రివర్యా, నేను అగ్నితో చెలగాటం ఆడేందుకే భయపడేట్టయితే, ముళ్ళ కిరీటం లాంటి ఈ రాజ్యాధికారాన్ని తలనెలాదాలుస్తాను చెప్పండి? అనడిగాడు.

మరునాడు మంత్రి కొందరువండితులను వెంటతీసుకుని కైలాసగిరిచేరాడు. విశ్వనాధభట్టు మంత్రిశేఖరుని సాదరంగా ఆహ్వానించి కుశలప్రశ్నలు వేశాడు

'హుష్క్మ మహారాజుగారు మిమ్మల్ని ఒక్కమారు రాజ దర్భనానికి రమ్మన్నారు" చెప్పాడు మంత్రి

“అమాత్యశేఖరా నేను వయసుడిగిన వాడిని. ఈ వయసులో నాకు రాజుతో, రాచకార్యాలతో పని లేదు. పైగా అంతా సవ్యంగా జరుగుతున్నన్ని రోజులూ, రాజు దర్శనానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ అపసవ్యంగా జరిగేదేదో రాజు వల్లే అయితే ఇక రాజదర్శనం చేసి లాభం లేదు పైగా ఇక్కడ రాజు అభ్యర్ధి. అతనికీ కైలాసగిరి కావాలి అభ్యర్థి సవినయంగా అభ్యర్థిస్తూ రావాలి గానీ నన్ను ఆయన దగ్గరకు పిలవటం ఏ రకమైన మర్యాద?

మంత్రి విశ్వనాధభట్టుకు నమస్కరించి మౌనంగా వెనుతిరిగాడు.

మంత్రి మాటలు విని మహారాజు పెద్దగా నవ్వాడు 'బాగుంది అయితే రేపే సిద్ధం చేయండి. సకల సైన్య సపరివార సమేతంగా కైలానగిరికి నేనే వెళ్తాను చూస్తాను విశ్వనాధభట్టేమిటో' అన్నాడు మహారాజు నవ్వుతూ.

మంత్రి మహారాజును వారించబోయాడు. కానీ మౌనంగా ఉండిపోయాడు. మరుసటిరోజు కశ్మీర రాజధాని కైలాసగిరి తరలి వెళ్ళింది రాజసైన్యంతో పాటుగా ప్రజలూ నడవసాగారు. వారి పదఘట్టనలకు ఆకాశానికి ఎగిసిన ధూళి సూర్యుడిని కప్పేయసాగింది.

కైలాసగిరిని చేరిన రాజుకు స్వాగం పలికేందుకు ముందుకు వచ్చాడు విశ్వనాధభట్టు.

విశ్వనాధభట్టు తనను తాను పరిచయం చేసుకోగానే హుష్క మహారాజు “నీవేనా ఆ అహంకారివి?” అని అడిగాడు.

“నన్ను అభ్యర్థించేందుకు నా వద్దకు రావాలి అనటం అహంకారానికి సంకేతమైతే నేను అహంకారినే ప్రభూ అన్నాడు విశ్వనాధభట్టు వినయంగా

“తమరు అహంకారే కాదు మాటకారి కూడా” అన్నాడు హుష్క మహారాజు చిరునవ్వుతో. === కల్దణ కళ్శీర రాజతరంగిణి కధలు 2323333332 3. ===

“'మాటకారే కాదు గొప్ప కటారికారి కూడా' వంత పాడేడు మంత్రి.

“మీ బ్రాహ్మణులు ఖద్గవిద్య విశారదులు కూడానా?” వ్యంగ్యంగా అడిగాడు హుష్క మహారాజు.

“మా ధర్మంలో అందరికీ అన్ని విద్యలూ ఒకే గురువు ఒకేలా నేర్పుతాడు ప్రభూ. ఎవరికే విద్యలో ప్రావీణ్యం ఉంటే వారు ఆ విద్య ఉపాధిగా ఉండదే వృత్తిలో స్థిరపడతారు అందుకే నాకు ఖడ్గవిద్య వచ్చు. మంత్రాలు వచ్చు. ఆత్మరక్షణకు ఖడ్గవిద్య. ఆత్మదర్శనం కోసం సనాతన ధర్మపాలన” అన్నాడు విశ్వనాధభట్టు.

మహారాజు పల్లకీ దిగి విశ్వనాధభట్టు వద్దకు వచ్చాడు.

విశ్వనాధ భట్టు మహారాజుకు తమ కైలాసగిరి అంతా చూపించాడు. గతంలో దూరం నుంచి మాత్రమే కైలాసగిరిని దర్శించి ఆనందించిన మహారాజు, ఆ రోజు దగ్గర నుంచి చూస్తూ తరించాడు.

“ఇంత అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉండే మీరు ఎంత అదృష్టవంతులో” అన్నాడు మహారాజు విశ్వనాధభట్టుతో.

విశ్వనాధభట్టు చిరునవ్వుతో మహారాజును గుడి వద్దకు తీసుకు వెళ్లాడు. మవారాజు గుడిలోకి అడుగుపెట్టబోతూ ఆగాడు. “నేను తురుష్కుడను. మీ ఆలయంలోకి రావచ్చా?? అనడిగాడు.

విశ్వనాథభట్టు నవ్వి,'ప్రభూ మీరు తురుష్క దేశానికి వలస వెళ్ళిన బౌద్ధపండిత

నంతతికి చెందినవారు. బౌద్భులెవరు? ననాతన ధర్మాన్ని పరిత్యజించి బౌద్దాన్ని స్వీకరించినవారు. మతం మారినంత మాత్రాన మనిషి మారతాడా? అతనిలో ్రవప్వాచ్చే అతని పూర్వీకుల రక్తం మారుతుందా? అతని సంస్కారాలు మారతాయా?

పైగా కళశ్ళ్మీరం మాకు పార్వతీదేవితో సమానం. కళ్ళ్మీర రాజు శివాంశజుడు. కాబటి మీరు బెనన్నాా కాదన్నా మీలో భారతీయ ధర్మ సంన్మార బీజం నిక్షిష్తమై ఉన్నదన్నది సత్యం. ఇప్పుడు చెప్పండి మీరు మీ ప్రాచీనుల ఆలయ ్రవేశార్హతను ఎలా కోల్పోతారు?”

విశ్వనాధభట్టు వాక్యాలు మహారాజు హృదయాన్ని తాకాయి.

“మహారాజా, మా మందిరాలు కేవలం దైవ విగ్రహానికి పూజలకు మాత్రమే పరిమితం కావు. ఇవి మా చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విజ్ఞానాలకు అలవాలు. మా దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. మా హృదయ స్పందనలకు ప్రతిరూపాలు. మా ధర్మానికి జీవనాడులు మా దేవాలయాలు. అటువంటి దేవాలయాన్ని కూలగొట్టి మీరు మీ మతానికి సంబంధించిన కట్టడాలు కదడతానంటే మేమెలా ఒప్పుకుంటాము చెప్పండి?” సూటిగా అడిగాడు విశ్వనాధభట్టు. వత 02 2323223332 కస్తూరి మురళీకృష్ణ ===

హుష్మమహారాజు విశ్వనాధభట్టువైపు నిశితంగా చూశాడు.

“నాకీ ప్రదేశం నచ్చింది ఈ సౌందర్య కళాభరిత ప్రకృతి ఆకృతి నచ్చింది. ఇక్కడ బౌద్ధ భిక్షువులు ప్రశాంత జీవనం గడుపుతారు. ఈ తరుచ్భాయలలో బుద్ధభగవానునికి సాంత్వన లభిస్తుంది. నా పేరు చిరస్థాయిగా, ఆ చంద్రార్మం మిగిలి పోతుంది అన్నాడు మహారాజు,

“మహారాజా, ఇక్కడ మీ బుద్ధభగవానుని కన్నా ముందే పరమశివుడు కొలువై ఉన్నాడు. ఆయన ప్రశాంతతను భగ్నం చేయటం మీకు తగదు. మీ పేరు నిజంగా చిరకాలం నిలిచిపోవాలంటే ఇంతకన్నా సుందరమైన (ప్రదేశాలు కళ్శీరంలో బోలెడు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక ప్రదేశంలో మీరు ఒక గొప్ప నగరాన్ని నిర్మించవచ్చు. అనంతఖ్యాతిని సంపాయించ వచ్చు. ఇక్కడే నిర్మించాలన్న పట్టుదల మీకెందుకు?

“ఇది నా రాజ్యం. నేనీ భూభాగానికి అధిపతిని. మీరే వేరే చోటుకు వెళ్ళవచ్చుగా? ఇక్కడే ఉండాలన్న పట్టుదల మీకెందుకు?” ఎదురు ్రశ్నవేశాడు మహారాజు,

“మహారాజా, సృష్టి ప్రారంభం నుండి, దాదాపుగా 225 కోట్ల సంవత్సరాల నుండే కళ్ళ్మీర భూభాగమంతా సతీ సరోవరం అనే చిన్న సముద్రమంత సరస్సు ఉండేది. ఈ వైవస్వత మన్వంతరాదిలో కశ్యప ప్రజాపతి - (బ్రహ్మ ఉపేంద్రుడు, రుద్రుడు మొదలైన దేవతలను అవతరింపజేసి ఆ సతీ సరస్సులో దాగిన జలోదృవుడనే రాక్షసుడిని సంహరించి, ఆ సరస్సులోని నీటిని వెడలజేసి కళ్ళీర దేశాన్ని నిర్మించాడు. కశ్యపుడు నిర్మించిన మిర్రు కాబట్టి కశ్యప మేరు - కాళ్ళీరు ఇది.

వితస్తానది (ఇప్పుడు జీలం) ప్రవాహం దండంగా, అది జన్మించిన జలకుండాన్ని (వేరినాగ్‌) గొడుగుగా ధరించిన నీలనాగుడు అనాదిగా ఈ భూమిని రక్షిస్తున్నాడు.

పార్వతీదేవి వితస్తానదిగా అవతరించినందుకు మాకు కళ్ళీరం పవిత్రమైన పార్వతీదేవి స్థానం” అని మహారాజు వైపు తిరిగాడు విశ్వనాధభట్టు.

మహారాజు ఏకాగ్రతతో వింటున్నాడు.

“కశ్మీరరాజు మొదటి గోనందుడు బలరాముని చేతిలో మరణించిన తరువాత అతని పుత్రుడు దామోదరుడు రాజయ్యాడు. దామోదరుడు తండ్రి వధను స్మరిస్తూ కృష్ణునితో వైరం పూరి సురద్మనాయుధానికి బలయ్యాడు. అతని పుత్రుడు ద్వితీయ గోనందుడు మొదలుకొని లవ మవారాజువరకు కళ్మీరాన్ని 35 మంది రాజులు పాలించారు లవమహారాజుల తరువాత వరుసగా కుశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుదు రాజయ్యారు.

సురేంద్రునికి సంతానం లేకపోవటంతో వేరే వంశం వాడైన గోధరుడు రాజయ్యాడు. అతని తరువాత సువర్ణ మహారాజు, జనకుడు, శబీనరుడు రాజయ్యారు శబీనరునికి సంతానం లేకపోవటంతో శకుని ప్రపౌత్రుడు (గాంధారి సోదరునికి ముని మనుమడు), శచీనర జజ కల్దణ కళ్ళీర రాజతరంగిణి కథలు :22323ై3ఊకడ2డడడడడ2డ2డడడానడవణ ప్రతి. జజ

మహారాజుకు పినతండ్రికి పెద్దనాన్న కొడుకు అయిన అశోక చక్రవర్తి కళ్ళీరానికి రాజయ్యాడు. అశోకుడే శ్రీనగరాన్ని నిర్మించాడు. కళ్మీరంలో బౌద్దాన్ని ప్రవేశపెట్టాడు. దేశ విదేశాలకు బౌద్ధ ప్రచారానికై బౌద్ధ భిక్షువులను పంపించాడు. ఆ అశోక చక్రవర్తి పుత్రునికై చేసిన తపస్సు ఫలితంగా జలౌకుడు జన్మించాడు. జలౌకుని తరువాత దామోదర మహారాజు రాజ్యానికి వచ్చాడు. ఆ దామోదర మహారాజు వి'ప్రశాపం వల్ల సర్పంగా మారటంతో అల్లకల్లోలమైన కళశ్శ్మీరం మీ అధీనమైంది' అని ఆగాడు విశ్వనాధభట్టు.

మంత్ర ముగ్గ్దుడై వింటున్న మహారాజు కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు విశ్వనాధభట్టు “మహారాజా కళ్ళీర భూభాగానికి మీరు తాత్కాలిక అధిపతులు మాత్రమే. రాజులు మారతారు. రాజవంశాలు మారతాయి. మీ తరువాత ఇంకా అనేకులు వచ్చి వెళ్లిపోతారు. కానీ కశ్శ్మీర ఆవిర్భావం జరిగినప్పటి నుంచీ ఈ ప్రదేశంలో మా వంశం వారుంటున్నారు. మేముంటున్నాము. ఉంటాము కూడా. మా (ప్రభువు పరమేశ్వరుడూ ఉన్నాడు. ఇక్కడే ఉంటాడు. మాకు మీలాంటి తాత్మాలిక ప్రభువులతో సంబంధం లేదు. మాకు మా దైవంతో సంబంధం. సనాతన ధర్మంతో సంబంధం. శాశ్వత విలువలతో సంబంధం కాబట్టి మధ్యలో వచ్చి మధ్యలో పోయ్‌ మీరే వేత స్థలం వెళతుక్కోవటం ఉత్తమం' నిష్కర్షగా చెప్పాడు విశ్వనాధభట్టు.

“బాగుంది నీతో ఈ అనవసర చర్చల బదులు నాకున్న బాహుబలంతో, సేనాబలంత్రో మిమ్మల్ని మీ మందిరాన్ని మట్టిపాలు చేయగలను మీ మందిరం నుంచి కూల్చిన రాళ్లతో మాచైత్యానికి పునాది వేయించుకోగలను. మర్యాదగా మాట్లాడటం నా మంచితనం. చేతకానితనం కాదు” బెదిరించాడు హుష్క్మ మహారాజు

ప్రతిగా చిరునవ్వు నవ్వాడు విశ్వనాధభట్టు.

“మహారాజా, మీరు నిజంగా ఆ పనే చేయాలనుకుంటే మీకన్నా ముందు మీ సైన్యం వచ్చి ఉండేది. మేము కొనఊపిరి ఉన్నంతవరకూ మా ధర్మరక్షణ కోసం పోరాడి 'ప్రాణాలర్పించి ఉందేవాళ్ళం.

కానీ మీరందుకు రాలేదు. నిజానికిప్పుడు మీకిక్కడ చైత్యం నిర్మించాలన్న కోరిక లేనట్లుంది. మీరు కేవలం మా విశ్వాసం పరీక్షించేందుకు వచ్చారు మీ సైన్యాన్ని చూసి మా విశ్వాసం

సడలుతుందా, లేదా చూడాలని వచ్చారు.

చిరునవ్వు నవ్వాడు మహారాజు.

“మహారాజా, మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఏ రకంగా చూడాలని ఉంది? గొప్ప చైత్యాలు, విహారాలు నిర్మించిన వాడిగానా? లేక ఈ దేశం నుంచి బౌద్ధమతం సమూలంగా అంతరించేందుకు నాంది పలికినవాడి లాగానా?”

“అంటే?” క2ఊ2తత ప్రక డై. కస్తూరి మురళీకృష్ణ వతు

“దేవాలయాలు మా జీవనాడులు నేడు మీకు బలం ఉందని, అధికారం ఉందని మీరు మమ్మల్ని అణగద్రొక్కి మా ఆలయం స్టానే చైత్యం కట్టవచ్చు. కానీ (ప్రతి చర్యకూ (ప్రతిచర్య ఉంటుంది. మా ఆలయాల మీద చేయి వేసిన మరుక్షణం మీరు మా ధర్మం మీద దెబ్బకొట్టినట్టు. దాన్ని మేమే కాదు రాబోయే తరాల వారెవ్వరూ సహించరు. ఏనాడో ఒకనాడు సనాతన ధర్మం బలం పుంజు కోకమానదు. అనాడు మీ చైత్య శిధిలాల స్థానే మా మందిరాల పునరావిర్భావం జరుగుతుంది. మీ చైత్యాలు శిలలై శలాకలై మట్టిగొట్టుకు పోతాయి. మా పరమశివుడు నిత్యం వూజలందుకుంటూ వైభవోపేతంగా విలసిల్లుతాడు. ఇది జరిగితీరుతుంది. కానీ దానికి పునాదిరాయికి కారణం మీరు కారణం కాకండి. ఈ అపవాదును మీ తలపైకి తెచ్చుకోకండి. అంతేకాదు.

ధర్మయో బాధతే ధర్మోన సధర్శ్మః కుధర్మతత్‌॥

అవిరోధే తుయా ధర్మః సధర్మ ఇతి నిశ్చయః;

మరో మతంతో సహజీవనం చేయలేక ఘర్షణ పడేది నిజమైన మతం కాదు, ధర్మం కాదు. పరమత సహనం అవలంబిస్తూ అన్ని ధర్మాలతో శాంతి యుతంగా సంఘీ భావంతో, పరస్పర సహక్రారంతో నిలవగలిగేదే నిజమైన మతం, ధర్మం. ఇక మీ ఇష్టం. మీరు శివాంశజులు. మీపై మేము కత్తి దూయం. కానీ మీరు మా ధర్మంవైపు కన్నెత్తి చూస్తే నేనే కాదు, నా రాబోయే తరతరాల వారు మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు” అన్నాడు విశ్వనాధుడు.

హుష్క మహారాజు లేచి నిలబడ్డాడు. “విశ్వనాధభట్టు నేను సేనాపతిపై మీ చర్య రాజద్రోహమా? మీ ధర్మరక్షణకోసమా? అన్న విషయం తెలుసు కొనేందుకే స్వయంగా ఇక్కడికి వచ్చాను. మీకు కలిగిన (శ్రమకు క్షంతవ్యుడిని” అని మహారాజు ఆ మందిర గోపురానికి బంగారు పూత పూయిస్తానని ప్రకటించి వెళ్ళిపోయాడు

హుష్మ మహారాజు ఒక సుందరమైన ప్రదేశంలో హుష్కపురం (ఇపుడు ఉష్మోరో) నిర్మించి చిరస్థాయి నార్జించాడు. అతనిని ఆదర్శంగా తీసుకుని అతని తరువాత రాజయిన జుష్క కనిష్కులు జుష్కపురం (జోకోరో) కనిష్మపురం (కొనేస్సూర్‌)లు నిర్మించారు. జుష్మమహారాజు జయస్వామిపురం (జిహాస్సుర్‌) నిర్మించాడు. అంతేకాదు ఈ ముగ్గురు రాజులు శుష్మలేత్రం (హుఖలేత్రో)లో అనేక మరాలను, చైత్యాలను నిర్మించి మహాపురుషులుగా ప్రస్తుతి పొందారు.

న వెఉ౭ఉ కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2333333333 తర్‌ 222

ర మప ద రా య గహక 1 ము కిషా.. వో గురుదక్షిణ జగతి వేకువ తొలి కిరణాల్లో స్నానం చేస్తూండగా ఇద్దరు అశళ్వికులు నిశ్శబ్దంగా ఆ ఊర్పి సరిహద్దులో ప్రవేశించారు. వారిద్దరినీ చూడగానే వారు సామాన్య పురుషులు కారని అర్ధమైపోతుంది. యువక్పున్సి ముఖంలో రాజరీవి ఉట్టిపడుతోంది. పక్కనే కాస్త వయసు మళ్లినట్టున్న వ్యక్తి వదనంలో పాండిత్యం ప్రస్ఫుటమౌతోంది. క్రీపూ 12-14 శతాబ్దాల మధ్య కధ ఇది. అది కళ్ళ్మీరాన్ని జలౌక మహారాజు పాలిస్తున్న రోజులు. జలౌక మహారాజు అశోక మహారాజు పుత్రుడు. అశోక మహారాజు భారత భూమి అంతా మిడుతల దండులా వ్యాపించి ఉన్న మ్లేచ్చులను (అనాగరికులైన వేదభ్రష్టులైన భారతీయులు) తరిమి కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చాలామటుకు సఫలీకృతు డయ్యాడు. కానీ బౌద్ధధర్మాన్ని స్వీకరించిన తరువాత ఆయన యుద్ధం అంటేనే అసహ్యించుకోవటంతో సైన్య పోషణ పట్ల ఉదాసీన భావన వపించటంతో, అశోకుడి భుజబలానికి జడిసి దేశం వదలి పారిపోయిన మ్లేచ్చులు రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ దేశం మీద పద్దారు. అనేక దుర్గాలను ఆక్రమించుకుని జన జీవితంతో అకాండతాండవం చేయసాగారు. 2222 టట్‌ తడ కస్తూరి మురళీకృష్ణ వడ

దాంతో తాను సాధించిన విజయాల వల్ల లాభం లేకపోయిందన్న చింత అశోక మహారాజును తీవ్రంగా బాధించింది. పండితుల ప్రోద్భలంతో ఆయన దేశాన్నించి మ్లేచ్చులను తొలగించే సమర్ధవంతమైన పుత్రుడి కోసం పరమేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అశోక చక్రవర్తి తపస్సుతో పొందిన పుత్రుడే జలౌక మహారాజు, ప్రస్తుతం కళ్మీరానికి రాజు. ఊరి సరిహద్దు చేరగానే అశ్వికులిద్దరూ మౌనంగా గుజ్టాల మీద నుంచి దిగి, ముందుగా అనుకున్న రహస్య ప్రదేశంలో గుజ్టాల్ని కట్టేశారు. మౌనంగా చకచకా తమదుస్తుల్ని మార్చుకున్నారు. వారిద్దరూ ఇప్పుడు సామాన్య పల్లెప్రజల దుస్తుల్లో ఉన్నారు. అయినా మేఘాల దుస్తులు ధరించినా దాగని సూర్యకిరణ కాంతిలా వారి వర్చస్సు వారిద్దరూ సామాన్య పురుషులు కారని తెలియజేస్తూనే ఉంది. అశోకుడి కాలంలో బౌద్ధమత సిద్ధాంతం తీవ్రతమమైన రూపం దాల్చి హోరుమని ఒక మహానది వరదలో పొంగి ప్రవహించినట్టు కళ్ళీరమంతా ముంచెత్తసాగింది. ఆ ప్రవాహ వేగానికి వారు, వీరు అని లేకుండా ప్రతివారూ సనాతన ధర్మాన్ని వదలి బౌద్దులుగా మారసాగారు. నిజానికి బౌద్ధులు అంటే సన్యాసులని అర్ధం. కానీ సంసారులు కూడా బౌద్ధ మత సిద్దాంతాలను విశ్వసిస్తూ తామూ బౌద్దులమే అని భావించసాగారు. పైగా అశోక మహారాజు బౌద్ధానికి ఊతనిచ్చేందుకు రాజ్యంలో ఉన్నత పదవులన్నీ బౌద్దులకని (ప్రత్యేకంగా కేటాయించడంతో రాజాశ్రయం పొందాలంటే బౌద్ధ మతావలంబనం తప్పనిసరి అయింది. దాంతో రాజానుగ్రహం కోసం అధికారులు వారి అనుగ్రహం కోసం సామాన్యులు వేలంవెర్రిలా సనాతన ధర్మాన్ని త్యజించి బౌద్ధమతాన్ని స్వీకరించటం ఆరంభించారు. దాంతో బౌద్ధ శ్రమణులకు అనేక అధికారాలు అందసాగాయి. రాజ్యంలో బౌద్దులు కాళ్లూనినప్పటి నుంచీ సనాతన విద్యావ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నించసాగారు. కారణం, బౌద్ధులకు వేదాలపై నమ్మకం లేదు. పురాణాలపై విశ్వాసం లేదు. అవన్నీ కల్పితాలని కొట్టినేస్తారు. వేదాలస్టానే బౌద్దులకు బౌద్ధమత సంబంధిత సాహిత్యం, జాతక కధలు పప్రామాణికా లయ్యాయి. గురుకులాల స్టానే విహారాలు విద్యాలయాలుగా మారేయి, పెద్దపెద్ద విహారాలు విశ్వ కళాశాలలుగా రూపొందసాగాయి. దాంతో ఆ కాలంలో చదివిన వారన్నాా పండితుడు అన్నా ఈ విహారాల్లో చదివిన వారు తప్ప మరో చదువు చదువుకాదు, పాండిత్యం పాండిత్యం కాదు అని భావించటం పరిపాటి అయిపోయింది. అంతేకాదు వ్యక్తికెంత పాండిత్యం ఉన్నాా శంఖంలో పోస్తేనే కానీ తీద్దం కానట్టు, ఏదో ఒక బౌద్ధ సన్యాసికి శిష్యుడు కాకపోతే ఆ వ్యక్తి పాండిత్యానికి విలువ ఉందేది కాదు. ఆ పండితునికి రాజ మర్యాద లేదు; సంఘ మర్యాద లేదు. దాంతో ఆ కాలంలో ఏ రకమైన ఉపాధి కావాలన్నా బౌద్ధ విద్య నేర్వటం తప్పనిసరి అయిపోయింది అలా కాని వారికి నిలువ నీడ లేకుండా పోయింది. అందుకే అనేక వేద పండితులు కళ్ళీరం వదలి ఇంకా వేద పండితులను గౌరవించే ఇతర రాజ్యాలకు వలస వెళ్లిపోసాగారు. హా కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :22]ై2ైక22డడడడడడడతడడడడకడడతతడడడడడడడ2డ2డ2ఊడఊ త్ర ౩౭

వలస వెళ్లలేని వారు బౌద్ద మత ధర్మాలను మన్నిస్తూ, బౌద్ద సన్యాసులను పొగడ్డూ, బౌద్దులుగా (బ్రతకసాగారు.

కోసుకుపోతున్న ('ప్రవాహవేగానికి చలించక నిలబడే బండరాళ్లలా కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అక్కడక్కడా నిలచి ఉన్నాయి. ఒకోసారి ఊరంతా బౌద్భులు, ఊరిలో రెండుమూడు సనాతన ధర్మ కుటుంబాలు వేరుగా ఉండేవి. ఆయా ఊళ్లలోని బౌద్భులు వీరిని వెలివేసినట్లు చూస్తారు. ఊరి పెద్దలు ఈ (బ్రాహ్మణ కుటుంబాలను బౌద్ధధర్మం స్వీకరించమని, అలా చేస్తే రాజాస్థానంలో ఉన్నత ఉద్యోగాలిప్పిస్తామని వారికి కటిక దారిద్ర్యం నుంచి విముక్తి ప్రసాదిస్తామని ఆశ చూపిస్తూంటారు. అయినా లొంగని వారిని దౌర్దన్యంతో బెదిరిస్తూంటారు. ఈ కుటుంబాల మీద రాజోద్యోగులకు అనేక విషయాలు కల్పించి చెప్పి వారిని రాజదండనకు గురి చేస్తుంటారు. ఆ తరువాత మగ సంరక్షణ లేని కుటుంబాలను బలవంతాన బౌద్దానికి మార్ప్చో అలా కుదరకపోతే వారిని ఊరి నుంచి బెదిరించి తరిమేసో, వారి ఆస్తిపాస్తులను పంచుకోవటం చేస్తూంటారు.

ఇప్పుడా ఇద్దరు అశ్వికులు ప్రవేశించిన ఊరిలో అలా ఇంకా బౌద్ధ మతం స్వీకరించని మొండి సనాతన బ్రాహ్మణ కుటుంబాలు రెండున్నాయి. సూర్యోదయంలోగా ఆ రెండు

కుటుంబాలు సనాతన ధర్మాన్నయినా వదలాలి, లేకపోతే ఊరయినా వదలి వెళ్లిపోవాలి అన్సి

ఆ ఊళ్లోని బౌద్ధ విహారాధ్యక్షుడు ధర్మపాలుడు హెచ్చరించాడు ఇలా హెచ్చరించినా పట్టించుకోని

మొండి వారికి సజీవ దహనం తప్పదనీ హెచ్చరించాడు. ఆ కాలంలో సజీవ దహనాలు బౌద్భులకత్యంత ప్రీతిని కలిగించేవి.

ఆ ఇద్దరు అశ్వికులు ఊళ్లో ప్రవేశించేసరికి, ఆ ఊళ్లోని బౌద్దులంతా ఆ రెండు కుటుంబాల

ఇళ్లను చుట్టుముట్టి ఉన్నారు. వారిలో బౌద్ధ విహారాల్లో ఉండే సన్యాసులు కూడా అనేకులున్నారు

బరు.

'శోణోత్తరా, చంద్రమౌళీశ్వరా, మీకు ఇచ్చిన గడువు అయిపోతోంది త్వరగా నిర్ణయించుకోండి. మీరీ ఊరు వదలి వెళ్లిపోతారా, లేక బౌద్ధంలోకి మారి పోతారా? బౌద్ధేతరులెవ్వరూ కళ్ళీరంలో ఉండకూడదని జలౌక మహారాజుగారి ఆజ్ఞ. ఈ గ్రామం విడిచి వెళ్లినా మీ సమస్య పరిష్కారం కాదు. కళ్ళీరమే విడిచి వెళ్లిపోండి. లేకపోతే మీరు జలౌక మహారాజుగారి నిశిత కరవాల ధారకు ఎర అవుతారు. గట్టిగా అరిచాడు ధర్మపాలుడు మూసి ఉన్న తలుపులకు ఎదురుగా నుంచుని.

లోపల నుంచి అలికిడి లేదు.

'శోజోత్తరా, నువ్వు ముసలి వాడివైపోయావు. నువ్వున్నా ఒకటే, లేకున్నా ఒకటే, కానీ ఇంకా పసిపిల్లవాడైన నీ మనుమడి గురించి ఆలోచించు. బౌద్ధంలోకి మారితే వాడి తెలివికి వచ్చే గుర్తింపు గురించి ఆలోచించు. తన తెలివికి సరైన గుర్తింపు లేదని ఈ లోకాన్నే వదలి వెళ్లిపోయిన నీ కొడుకుకు పట్టిన గతే నీ మనుమడికి పట్టనివ్వకు.” కెజి ఏరీ 2=23త3ై2ై22ైతడడతతఊఊజఊడడ2222ఊఊ2ఊఊఊఊఊఊఊఊఊఊఊజు కస్తూరి మురళీకృష్ణ ౩౭౩33

ఇళ్లలోంచి అలికిడి లేదు.

“చంద్రమౌళీశ్వరా, శోణోత్తరుడు ఛాందసుడు, బూజు పట్టిన సనాతన ధర్మాన్నే పట్టుకుని వ్రేలాడేవాడు. ఏ రకమైన భేద భావాలు లేక అందరినీ సమానంగా (ప్రేమించే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించటం వల్ల మీకు లాభమే కానీ నష్టం లేదు. తినటానికి తిండి లేని నీవు బౌద్ధంలోకి మారిన మరుక్షణం ధన ధాన్యాలతో తులతూగుతావు.”

లోపల నుంచి అలికిడి లేదు.

ఇంతలో అక్కడ ఉన్న బౌద్దుల్లో ఒకడు “వీళ్లతో మాటలు అనవసరం. వీళ్లకింత పట్టుదల ఎందుకు? ఏముందా ధర్మంలో? మతం మారిన మనం ఏమన్నా నష్టపోయామా? భ్రష్టు పట్టామా? మాటలకు లొంగరీ మూర్చలు?” అంటూ దగ్గరే ఉన్న రాయిని తీసుకుని ఆ ఇంటి మీదకు విసిరాడు.

పెద్ద శబ్దంతో పై కప్పు మీద పడి క్రిందకు జారిందా రాయి.

దాంతో అక్కడి గుంపులో ఒక ఉత్సాహం ప్రవేశించింది. బౌద్భులంతా కసిగా రాళ్లు విసరసాగారా ఇళ్లపై, అరుస్తూ! తిడుతూ!

ఇదంతా చూసూ. ఉండలేక రాజరీవితో ఉన్న యువకుడు ఆవేశంతో అడుగు ముందుకేశాడు. కానీ పక్కనే ఉన్న పండితుడు అతడిని వారించాడు. ఆ ఇళ్ల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే ఆక్రోషంతో నిస్సహాయంగా చూస్తూ ఉన్నారిద్దరూ.

కాస్సేపటికి రాళ్లవర్షం ఆగింది.

“శోణోత్తరా, చంద్రమౌళీశ్వరా, మీ మొండి పట్టుదల మానండి. మీ వేదాలకు, సనాతన ధర్మానికి కాలం చెల్లింది. రాజాశ్రయం లేని ధర్మమూ, భర్త లేని భార్య వంటిది. హింసకు పెద్దపీట వేసే మీ కర్మకాందల్ని సనాతన ధర్మాన్ని వదలండి. శాంతి, అహింస బోధించే పరమోతృష్టమ్తైన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఇదే చివరి హెచ్చరిక గట్టిగా అరిచాడు ధర్మపాలుడు.

ఇంతలో ఒకరిద్దరు నిప్పు రాజేసే ప్రయత్నాల్లో పడ్డారు.

శోణోత్తరా, చంద్రమౌళీశ్వరా మీకు పదిహేను నిముషాల సమయం ఇస్తున్నాను. ఈలోగా మీరు తలుపులు తెరచుకుని బయటకు వచ్చారో సరి, లేదా సజీవ దహనం చేస్తాం” అన్నాడు ధర్మపాలుడు. అని నిట్టూర్చు విడచి అక్కడే ఒక చిన్నరాయిపై కూచుండిపోయాడు.

ధర్మపాలుడు “సజీవ దహనం” అవటంతోటే బౌద్భుల్లో ఉత్సాహం మిన్ను ముట్టింది. వారిలో వారు సజీవ దహనం గురించి చర్చించుకోసాగారు. గతంలో వారు చూసిన సజీవ దహనాల గురించి కధలు కధలుగా చెప్పుకోసాగారు.

ఆ రెండు ఇళ్లల్లోంచి ఎటువంటి స్పందన లేదు. హెఊ= కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు 33కి ణ తికి ==

పండితుడు పక్కనే ఉన్న (శ్రమణుడిని అడిగాడు “ఏం జరిగింది? ఎందుకు ఈ కుటుంబాలకీ శిక్ష?” అని.

శఛమణుడు కోపంగా చెప్పాడు. 'ఈ మొత్తం గ్రామానికి వీళ్లే బౌద్దేతరులు. వీళ్లు బౌద్దాన్ని మన్నించరు. పరివ్రాజకుల్ని గౌరవించరు. పైగా బౌద్ధాన్ని కించపరుస్తూ వాదిస్తారు. అందుకనే వీళ్లనీ ఊళ్లో ఉండనివ్వకూడదు.'”

పక్కనే ఉన్న మరో బౌద్దుడు అందుకున్నాడు “మొన్ననే ఈ ముసలి శోణోత్తరుడు ఏమన్నాడో తెలుసా? బౌద్దంలో వర్జభేదాలు సమసిపోవటం అనేది ఉట్టి బూటకం. వివాహాల్లో, ఇతర వ్యవహారాల్లో బౌద్దులు వర్ణభేదాలు పాటించటం లేదా? పైకి వర్ణభేదాలు నశిస్తాయని చెప్పినా అంతకప్రవాహంగా బౌద్దం ఇవే వర్ణభేదాలను పాటిస్తోంది. మతం మారినా వర్ణం మారటం కల్ల. సనాతన ధర్మానికీ బౌద్దానికీ ఈ విషయంలో ఏమీ తేడా లేదన్నాడు. ఇలాంటి దుష్ప్రచారం చేసే వీళ్లని తరిమి తరిమి కొట్టాలి.”

“అంతేకాదు. ప్రపంచంలో ఏది ఎలా జరగాలన్నా అది పరమేశ్వరుని చేతిలో ఉంటుంది. అది ఈ అల్పులైన బౌద్దుల చేతిలో ఏమీ లేదు. మేము భగవంతుని యందు విశ్వాసం కలిగిన వారము. మీ బౌద్దులకు, భగవంతుడే లేడు. మీది శూన్యవాదమైనా మీకు మీఠే భగవంతులు అని ఎకసెక్కాలాడతాడు. ఇప్పుడు వీళ్లలా సజీవ దహనం కావటం కూదా పరమేశ్వరేచ్చ కాబోలు” అన్నాడు ఇంకొక బౌద్దుడు.

“ఊరు ఊరంతా బౌద్దులుగా మారినా ఈ రెండు కుటుంబాలు మాత్రం సనాతన ధర్మాన్ని పట్టుకు పాకులాడుతున్నాయి. అంత మొండి పట్టుదల ఎందుకు వీళ్లకు? అందుకే వీళ్లను కాల్చి బూడిద చేయాలి” ఇది మరొక బౌద్దుని కోపం.

ట్‌! ది

బౌద్దులంతా ఆ రెండు కుటుంబాల దోషాలను పోటీ పడి వివరించసాగారు.

౯ /. 7

నన్ను వాదనలో ఓడిస్తే నేనే బౌద్దం స్వీకరిస్తానని అన్నాడు”.

“కానీ వాడిని ఎవరోడించగలరు? సిద్దుడి తరువాత శోణోత్తరుడే.

ఆ కాలంలో సిద్దుదనే ఒక అవధూత, ఒక మహా పురుషుడు బౌద్ద పండితులతో వాదిస్తూ, బౌద్ద సిద్ధాంతాలలో దోషాలను నిరూపిస్తూ దేశ సంచారం చేస్తున్నాడు. అతని శి చ న పేరు వింటేనే బొద్దుల గుండె జారిపోతోంది. అతనిపై బౌద్దులు అనేక దుష్ట శక్తులను ప్రయోగించారు. కానీ ఆయన వాటన్నిటినీ తిప్పి కొట్టాడు.

ఆ సిద్దుడు దక్షిణాది రాజుల ఆస్థానంలో బౌద్ద పండితులను ఓడించి రాజులను తిరిగి వైదిక ధర్మానికి మార్చాడు. దాంతో దక్షిణాదిదేశం యావత్తూ మళ్లీ వేదపరన ఘోషతో దద్దరిల్లుతోంది.

వై డ్రే0. కకక: కస్తూరి మురళీకృష్ణ వ

ఇప్పుడా సిద్ధుడు కశ్మీర దేశంలో ప్రవేశించి జలౌక మహారాజు సమక్షంలో బౌద్ద పండితులతో వాదిస్తూ, వారిని ఓడిస్తున్నాడని, ఇలాగే కొనసాగితే కళ్ళీరంలో కూడా బౌద్ధం తొలగిపోతుందని ఒక వార్త దేశమంతా వ్యాపించింది. ఆ సిద్దుడి వాదనా విధానం వింతగా ఉంటుంది బౌద్దులేదైనా సిద్దాంతం చెప్పి వివరిస్తే ఓపికగా విని ఆ తరువాత ఆ సిద్దాంతానికి సరిపోయే ఒక వేదవాక్కో ఉపనిష ద్వాక్యమో చెప్పి ఊరుకుంటాడు అంటే బౌద్దం కొత్త సిద్ధాంతం కాదనీ అది వేదాల్లో ఉన్నదేనని నిరూపించటం అన్నమాట.

అందుకే శోణోత్తరుడిని సిద్దుడితో పోలిస్తే నవ్వి ఆ పండితుడు “అంత గొప్పవాడా మీ శోణోత్తరుడు?” అని అడిగాడు.

'తలా తోకా లేని వితండ వాదం శోణోత్తరుడిది. అంతా క్షణికమైతే, రెండవక్షణం వచ్చేసరికి మొదటి క్షణంలో ఉన్న వస్తువు లేదు. ఎందుకంటే పూర్తిగా కొత్తదైన ఇంకో వస్తువు ఉదయిస్తుంది కాబట్టి. కాబట్టి రెండవ దానికి మొదటిది కారణం కాదు. రెండవది మొదటి దానికి కార్యం కాదు. అంటే రెండో వస్తువు శూన్యం నుంచి వస్తుందా, మొదటి వస్తువు అదృశ్యం కాగానే? అది అసంభవం. అని వెరిమొగ్రిగా వాదిస్తూంటాడు. ఏమీ అర్ధం కాదు.” చేతులూపుతూ చెప్పాడో బౌద్దుడు.

ఆ మాటలు విని పెదవులపై చిరునవ్వు కదలాడుతుండగా ఆ పండితుడు తన సహచరుడి వైపు చూశాడు. ఆయన సహచరుడు మందస్మితం చేశాడు. ఆ పండితుడు ఆ బౌద్దుడితో మరో రెండుమార్లు ఆ వితండవాదం చెప్పించుకుని విన్నాడు.

'ధర్మపాలుడు వాదించాడా శోణోత్తరుడితో' అనడిగాడు పండితుడు.

'ఆ వాదించి ఓడిపోయాడు” అని చెప్పాడా బౌద్దుడు

“అంటే వాదించి ఓడి దౌర్జన్యానికి దిగాడన్నమాటి అనుకున్నాడు పండితుడు.

సమయం అయిపోయినట్టుంది. ధర్మపాలుడు లేచి నిలబడ్డాడు.

శోణోత్తరా, చంద్రమౌళీశ్వరా, ఇది జలౌక మహారాజు గారి ఆజ్ఞ. కళ్ళ్మీర దేశం సర్వం బౌద్దమయమవాలి. కళ్ళీర దేశం బౌద్ద ఆరామాలతో, బౌద్ద భిక్షువులతో అలరారాలి. బౌద్దేతరులకు సజీవ దహనం తప్పనిసరి ఇది రాజాజ్ఞ” అని అరిచాడు ధర్మపాలుడు.

'జలౌక మహారాజు ఇటువంటి ఆజ్ఞనిచ్చాడా? ఆయనకు పరమతసహనం ఉందని విన్నాను అంటూ ఓరకంట తన పక్కనే ఉన్న సహచరుడి వైపు చూశాడు. అప్పటికే సహచరుడి ముఖం కోపంతో ఎరుపెక్కింది.

'ఆ అదంతా పైపై మాటలు లెండి. జలౌక మహారాజు తండ్రి గారి వల్లే బౌద్దం కశ్శీరంలో నలుమూలలా పాకింది. జలౌకుడిప్పుడు బౌద్దాన్ని నలుదిక్కులా వ్యాపింపటేస్తాడు. అందుకే బౌద్ద మతానుయాయులకే రాజోద్యోగాలు, సన్మానాలు అన్నాడు ఓ వ్యక్తి. వతు కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు :233]32333డడదతక2తడడడత222242424242 త్వ జా

“కాల్చండి. ఇంకా చూస్తారేం?” అని అరిచారెవరో వెనుకు గుంపులోంచి. అంతే అక్కడ గుమిగూడిన వారు ముక్తకంరంతో “సజీవ దహనం' 'సజీవ దహనం” అని అరవసాగారు. పండితుడు రెండడుగులు ముందుకేసి ధర్మపాలుడి ముందు మోకరిల్లి,

“కనికరించండి. మరొక్కసారి నచ్చచెప్పి చూడండి బుద్దదేవుని అనుయాయులు మీరు. సజీవంగా దహనం చేయటం మీ సిద్దాంతానికి శోభనివ్వదు' అన్నాడు ధర్మపాలుని బ్రతిమిలాడుతూ.

ధర్మపాలుడొక్క నిముషం ఆలోచిస్తూ నిలబడ్డాడు. తరువాత ఏమనుకున్నాడో ఏమో, దబదబా తలుపులపై బాదసాగాడు.

లోపల నుంచి సమాధానం లేదు.

ఇంతలో ఉత్సాహం హెచ్చి గుంపులోని వారిద్దరు ముగ్గురు బలంగా తలుపులని తన్నసాగారు. ఈ మోతకు పక్క వాయిద్యం అన్నట్టు, పూజ సమయమైందని సూచిసూ దగ్గరలోనే ఉన్న విహారం నుంచి పెద్దగా తూర్యఘాష ఆరంభమయింది. య

పెద్దశబ్బంతో తలుపులు తెరచుకున్నాయి. ఆవేశంగా లోపలకు ఉరికిన బౌద్దులు అంతే వేగంగా వెనక్కు పరుగెత్తుకు వచ్చారు.

రెండు బ్రాహ్మణ కుటుంబాలు ఒకే గదిలో ఉన్నాయి. శోణోత్తరుడి చేతిలో పురా (గ్రంథాలు, తర్మ వ్యాకరణాది శాస్తాలు ఉన్నాయి. మరణించి కూడా అతను వాటిని ఆప్యాయంగా పట్టుకునే ఉన్నాడు. చంద్రమౌళీశ్వరుడు, తన స్వామినెవరూ తన న్వంఐ వేరుచేయలేరన్నట్టు శివలింగాన్ని కరచుకుని చనిపోయి ఉన్నాడు. వారి భార్యలిద్దరూ భర్తల పాదాల మీద పడి ప్రాణాలు విడిచారు. ఇద్దరు పసిపిల్లలు ఇంకా నిదురపోతున్నట్టే ఉన్నారు

ప * వారి ముఖాల్లో ప్రశాంతత హృదయాన్ని పిండేట్టుగా ఉంది.

“విషం తీసుకుని చచ్చార్రో' అని ఎవరో కేకేశారు. దాంతో బయట గుంపులో ఉన్న వారిలో, వారు తమ చేతికి చిక్కకుండా తప్పించుకున్నారన్న కసి, ఉక్రోషం పెరిగిపోయాయి.

ధర్మపాలుడు తన సహచరులను దగ్గర పిలిచి ఏదో గుసగుసగా చెప్పటం విని పండితుడు, ఆ యువకుడు వారికి దగ్గరగా జరిగారు.

“ఇళ్లు కాల్చేయండి. ఈ దుష్ట బ్రాహ్మణులేదో క్షుద్ర దేవతోపాసన చేస్తూంటే ఏదో పొరపాటు జరిగి ఇళ్లు అగ్నిలో దగ్ధమైపోయాయని ప్రచారం చేయండి". అని చెప్పి ఎవరూ గమనించకుండా నెమ్మదిగా అక్కడ నుంచి జారుకోబోయాడు ధర్మపాలుడు. అతని అనుచరులు కాగడాల కోసం ఆ వైపు వెళ్లబోయారు.

'ఆగండి' అని గట్టిగా అరచి ముందుకొచ్చాడు యువకుడు. పైత డ్రేటై వుడడదననడడడడ2వడావంమంయయ. కస్తూరి మురళీకృష్ణ =

“ఎవరు నువ్వు?” అన్నాడు ధర్మపాలుడు కోపంగా వెనుదిరిగి.

ఇంతలో ధర్మపాలుడి అనుచరులు ఇళ్లపైకి కాగడాలు విసిరారు. ఆ రెండు ఇళ్లపై అగ్నిదేవుడి విలయతాండవం ఆరంభమయింది అదే సమయానికి విహారంలో పూజ అంతిమ దశకు చేరుకుందన్న సూచనగా తూర్యారావాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి

పూజ అయిపోయిందన్న తొందరలో ఉన్న ధర్మపాలుడు వెళ్లకుండా అద్దు పడ్డాడా యువకుడు.

'నా త్రోవకు అద్దురాకు. అద్దువస్తే ఆ మంటలే నీ చితిమంటలవుతాయి' హెచ్చరించాడు ధర్మపాలుడు ఆ యువకుడిని. అంతే కాదు, తన వెంటే ఉన్న సహచరులకు, ఆ యువకుడిని పట్టుకోమని సౌంజ్ఞ చేశాడు.

ధర్మపాలుడి సహచరులు ఆ యువకుడి మీదకు లంఘించారు. అయితే ఒక మెరుపులాంటి కదలికతో ఆ యువకుడు ఇద్దరు బౌద్దుల కుత్తుకలుత్తరించటమేకాదు, మరొక మహాద్భుత విన్యాసంతో ధర్మపాలుడిని క్రిందపడవేసి తొక్కి పెట్టి, మీదకు వచ్చిన పది మంది బౌద్దుల్ని తన చుట్టుపక్కలకు రానీకుండా చేస్తున్నాడు.

అంతవరకూ వికృతవాదాలు, వికటాట్టహాసాలు చేస్తున్న బౌద్దులు ఆశ్చర్యంగా ఈ వైపుకు చూడసాగారు. అంతలోనే తెలివి తెచ్చుకుని ఎవరో సనాతన ధర్మామయాయి ధర్మపాలుడి మీద విరుచుకు పడ్డాడని ధర్మపాలుడి సహాయానికి ఆ వైపుకు రాబోయారు. అంతో అక్కడే ఉన్న పండితుడు ఒక విచిత్రమైన ఈల వేశాడు. అర్ధం తెలిసిన వారికి అది ఒక సంకేతం. ఆ ఈల విన్న మరుక్షణం భూమిలోంచి పుట్టుకొచ్చినట్టుగా రాజభట్టులు ఆ ప్రదేశంలో పుట్టుకు రాసాగారు. అక్కడ గుమికూడిన వారెవరూ పారిపోకుండా అడ్డుపడుతున్నారు.

ఆ యువకుడి మీద దాడి చేస్తున్న బౌద్దులు క్షణంలో బందీకృతులయ్యారు. ఆ యువకుడు తన ఖడ్గాన్ని ఒక సైనికుడికి అందించి ధర్మపాలుడి మీద నుంచి కాలు తీశాడు. వెంటనే ధర్మపాలుడిని చుట్టుముట్టారు సైనికులు. ధర్మపాలుడికే కాదు అక్కడ గుమిగూడిన వారెవరికీ ఏమీ అర్దం కావటం లేదు.

'మేం చేసిన నేరం ఏమిటి?” అని ధర్మపాలుడు తనని బంధించిన వారిని గట్టిగా ప్రశ్నించాడు.

“స్వంత లాభాల కోసం, కక్ష సాధింపుల కోసం లేని రాజాజ్ఞను సృష్టించటం మొదటి నేరం. అది రాజద్రోహం. అమాయకులను హింసించి, పరోక్షంగా, ప్రత్యక్షంగా వారి మరణానికి కారణం కావటం రెండవ నేరం. ఇది హత్యానేరం' అన్నాడు పండితుడు

“నా మీద నేరం మోపే అధికారం నీకెక్కడిది? నువ్వెవరు?” ప్రశ్నించాడు ధర్మపాలుడు కోపంగా. == కల్షణ కళ్ళీర రాజతరంగిణి కధలు 3ైైడైతతతతతతతతతతతతత222222ఊ2ఊ= 4 ===

'ఆ అధికారం నేనే ఇచ్చాను. నా పేరు జలౌకుడు. ఈ కళ్ళ్శీర సామ్రాజ్యాధిపతిని" అన్నాడా యువకుడు ముందుకొచ్చి గంభీరంగా, ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాలల్లోని వేడి, తీవ్రత, అతని ముఖంలో ప్రతిఫలిస్తుండగా చూసి ధర్మపాలునితో సహా, అక్కడున్న వారంతా గడగడా వణికిపోయారు. "క్షమ ప్రభూ, క్షమ అని వేడుకోసాగారు.

జలౌక మహారాజు వారందరివైపు ఒకసారి తీక్షణంగా చూసి రండి పండిత మహాశయా” అంటూ వడివడిగా వెళ్లిపోయాడు. అ పండితుడు ఆయన వెనకే వెళ్లిపోయాడు.

“'ఆయనెవరు?”' అని ఎవరో అడిగారు.

“ఆయనే అవధూత, సిద్ద పురుషుడు. చేరదేశంలో బౌద్ధ నిర్మూలనం చేసిన పండితుడు. ఇప్పుడు కళ్మీరంలో అడుగు పెట్టాడు అని చెప్పారింకెవరో.

శే రే ఈ కరుణార్ధ్ర హృదయులవాల్సిన బౌద్దులింత కర్మశంగా (ప్రవర్తించటం వెనుక వారికా ధైర్యం, అండదండలిచ్చిన దోషం తనదేనని గుర్తించిన జలౌకుడు తల్లడిల్లిపోయాడు. సిద్దుడు జలౌకుడిని ఊరడించి సనాతన ధర్మమనే మహావృక్షానికి బౌద్దం ఒక శాఖ అని వివరించి చెప్పాడు. రాజు ప్రజలను వారి మత విశ్వాసాలను బట్టి వేరుగా చూడకూడదని, ప్రజలంతా రాజు కన్నబిడ్డల వంటి వారనీ బోధించాడు. సిద్దుడి వద్ద జలౌక మహారాజు సనాతన ధర్మ ద్‌క్ష తీసుకున్నాడు. 'ఈమం తప్పకుండా ప్రతిరోజూ విజయేశ్వర, నందీశ్వర క్షేత్రాల్లోని జ్యేష్ట రుద్రదేవుని పూజించే వ్రతాన్ని స్వీకరించాడు.

సిద్దుడు జలౌకునికి జ్ఞానోపదేశం చేసి గురుదక్షిణ కోరాడు. “సముద్రమే మొలనూలుగా కలిగిన భూభాగన్నంతా జయించి, భారతదేశాన్ని ఆవరించి ఉన్న మేచ్చులందరినీ నిర్మూలించాలి” ఇదీ సిద్ధుడు జలౌకుని కోరిన గురుదక్షిణ.

జలౌకుడు గురుదక్షిణను అక్షరాలా చెల్లించాడు. జలౌక మహారాజు జైత్రయాత్రకు మ్లేచ్చులు గడగడలాడిపోయారు. ఆయన ప్రతాపాగ్ని కీలల్లో శలభాల్లా మాడిపోయారు.

ఆయన మ్షేచ్చులను సమూలంగా నిర్ణించిన స్థలాన్ని “ఉజ్జటడింభం”' అంటారు. అంటే డింభులను (మ్లేచ్చులను) ఉద్దాటన చేసిన చోటు అని అర్థం.

జలౌక మహారాజు కన్యాకుబ్దము మొదలు, కళ్శీరేతర భూభాగాలను జయించి, దేశమంతా వర్ణాశ్రమ ధర్మాలను నెలకొల్పాడు. ధార్మికులైన రాజోద్యోగులను నియమించాడు. తాను జయించిన భూభాగాల్లో తన ప్రతినిధులు నియమించాడు. ఆయన పాలనలో వేద ధర్మం మూడు పూలు అరు కాయలుగా వర్ధిల్లింది.

ప

2కి టే తతత కస్తూరి మురళీకృష్ణ మమ2తతఊఊడా

(నగ?! ం న ఫా టై ట్‌ ల తే ను గో (9 1 జలౌక మహారాజు అద్భుత జీవితం జలౌక మహారాజు మనస్సు అల్లకల్లోలంగా ఉంది. ప్రచండ వాయువేగంతో ఎగసిపడే అలలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న (ప్రకృతిలా ఉంది అతని మనస్సు. మనిషి ఆవేశంతో విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి పశుతుల్యుడు. ఆలోచనారహితంగా ప్రవర్తిస్తాడు. ఎంత నిజం! ఇక ఈ రాత్రికి నిదుర పట్టదని తెలిసిపోయింది. జలౌక మహరాజుకు కళ్లు మూసినా, తెరచినా అతని కళ్ల ముందు ఆ దృశ్యమే కనిపిస్తోంది. చెవుల్లో అమాయక ప్రజల ఆర్తనాదాలు తుఫాను వాయుధ్వనిలా వినిపిస్తూనే ఉన్నాయి. తాను చేసింది తప్పా? తన మనసు కాదంటోంది. కానీ తన మెదడు అవునంటోంది? తన కల్దణ కళ్మీర రాజతరంగిణి కధలు :2222202022ఊఉఊఊ22222222222222222222 45 2

“మహారాజా! ఈ అనిత్య శీల ప్రపంచంలో పరివర్తన శీలమైనది, ఏదేది ఉందో అంతా భగవంతుని చేత ఆవరించబడి ఉంది. ఆ సృష్టికారుడి నుంచి వచ్చిన ప్రపంచం మళ్లీ ఆ సృష్టికారుడితో లీనమైపోతుంది. అలాగే మన మనస్సు నుండి బహిర్గతమైన ప్రతి ఆలోచనా ద్విగుజీకృతమై మళ్లీ మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ద్వేషంతో ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే ఆ ద్వేషం ద్విగుణీకృతమై మళ్లీ మన దగ్గరకే చేరుతుంది. ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పదు.”

సిద్ద పురుషుని వాక్కులు జలౌకుని హృదయంలో ్రతిధ్వనిస్తున్నాయి.

“కానీ తానీ పని ద్వేషంతో చేయలేదు అది తన కర్తవ్యం. తాను తన విద్యుక్త ధర్మం నెరవేర్చాడు. కానీ తన చర్యకు ప్రతిచర్య తప్పదా? ఆ ప్రతిచర్య వల్ల నష్టం కేవలం తన వరకే పరిమితమైతే ఫరవాలేదు కానీ అది ప్రజల మీద ప్రభావం చూపిస్తే...”

ప్రస్తుతం తన కర్తవ్యం ఏమిటో, తాను చేసింది దోషమే అయితే ఆ దోషం వల్ల కలిగే దుష్ఫలితాలను ఎలా నివారించుకోవాలో బోధపడటం లేదు. సలహా చెప్పేందుకు సిద్దపురుషుడు కూడా అందుబాటులో లేడు.

భారతదేశంలో సనాతన ధర్మ సంస్థాపన కోసం కంకణం కట్టుకున్న సిద్ద పురుషుడిని కళ్ళీరంలోనే ఉండిపొమ్మని జలౌక మహారాజు అడగలేకపోయాడు. సిద్దపురుషుడు మహారాజు సనాతన ధర్మం స్వీకరించాక 'ప్రాతిష్పురానికి వెళ్లాడు. అత్యవసరంగా రమ్మని దూత ద్వారా జలౌకుడు కబురు పంపాడు. కానీ అంతవరకూ తాను ఎలా ఉండగలదు? అన్న బాధ మహారాజును బాధిస్తోంది.

ఆకాశం వైపు చూశాడు, మహారాజు. తారలు ఎర్రగా కనిపించాయి. అవి తన చర్యని తప్పుగా భావించి సిగ్గుతో ఎర్రబడ్డాయా? లేక క్రోధంతో కళ్లెర్రచేస్తున్నాయా? అనుకున్నాడు జలౌక మహారాజు,

జలౌక మహారాజు అశోకుని పుత్రుడు. అతను అత్యద్భుత శక్తులు కలవాడని ప్రతీతి. జలస్తంభన విద్యతో నీటిని స్తంభింపజేసి నాగకన్యలతో క్రీడించి వచ్చినవాడు జలౌకుడు. ప్రాణి దయతో గుజ్జపు స్వారీని మహారాజు నిషేధించి నప్పటి నుంచీ, రాజు భూతదయకు మెచ్చి అదృశ్య నాగు రాజును కావలసిన చోటికి మోసుకుపోతున్నాడు.

జలౌక మహారాజు గురువుకిచ్చిన మాట నెరవేర్చుకునేందుకు కన్యాకుబ్దము నుండి కళ్ళీరేతర భూభాగాలు జయించి సనాతన ధర్మస్థాపన చేశాడు.

సిద్దపురుషుడి సలహాలతో జలౌకుడు తనకు పూర్వము 15 వందల సంవత్సరాలనాడు ఉన్న యుధిష్టిర మహారాజు పరిపాలనను తలపుకు తెచ్చే రీతిలో, ధర్మబద్ధంగా, రాజ్యపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వ2=జ= డేర్‌ 3కు: కస్తూరి మురళీకృష్ణ ===

జలౌక మహారాజు సంపాదించిన ధనాదులతో కశ్మీర మండలమంతా ధన సంపత్తి గల దేశంలా వెల్లివిరియసాగింది

ఆయన తన పరిపాలనను ధర్మాధ్యక్షుడు, ధనాధ్యక్షుడు, కోశాధ్యక్షుడు, సేనాపతి, రాజదూతలు, పురోహితులు, జ్యోతిషవేత్తలు అనే ఏడు విభాగాలుగా ఏర్పాటు చేశాడు.

ఆ కాలంలో అవూర్వ రాజకీయ సంస్కరణ ఇది. అన్నీ రాజాజ్ఞల ప్రకారం నడచే పద్ధతిని వదలి, సుశిక్షుతులై, ధర్మ నిరతులై, తమ తమ కార్యకలాపాలలో నిష్టాతులైన వారిని ఆయా విభాగాలకు నిర్వాహకులుగా నియమించి పాలనను ప్రజల చేతికే పరోక్షంగా అందించిన గొప్ప సంస్కరణకర్త జలౌక మహారాజు. (క్రీ.పూ 15వ శతాబ్దిలోని గొప్ప పరిపాలనా సంస్కరణ ఇది. చరిత్రకారులు 12వ శతాబ్దికి చెందిన హమ్మురవియే ప్రధమ పరిపాలనా సంస్కర్త అని పొరబడుతూ జలౌకుడిని విస్మరిస్తూ వస్తున్నారు.)

జలౌక మహారాజు ధర్మపత్ని ఈశానదేవి రాజాంతఃపుర ద్వారాది ప్రదేశాల్లో మవా ప్రభావోపేతాలైన మాతృ చక్రాలను ప్రతిష్టించింది.

మహారాజు కూడా 'వారచాలి (వారబలొ) వంటి అగ్రహారాలను ఎన్నో స్థాపించాడు. సిద్దపురుషునికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీనగరంలో జ్యేష్ట రుద్రుని ప్రతిష్టించి, జ్యేష్టేశుని అనుదినం సేవిస్తున్నాడు.

జలౌక మహారాజు ననాతన ధర్మం స్వీకరించటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బౌద్దులనేకులు అతని దైవభక్తిని హేళన సాగిస్తుందేవారు. అయితే వారందరి నోళ్లూ మూతపడే సంఘటన ఒకటి జరిగింది.

జలౌక మహారాజు జ్యేష్ట తీర్ధంలో రుద్రుని సేవించే ముందు, సోదర తీర్ధంలో స్నానం చేసి బాహ్యాంతర పరిశుద్దుడౌతాడు. ఒకరోజు జలౌకుడు రాజకార్యాల్లో మునిగి స్నానం మాట మరచాడు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆదరాబాదరాగా సోదరతీర్ధంప్రయాణమయ్యాడు. కానీ సమయం మించి పోతోంది. పూజవేళ దగ్గరపడుతోంది. ఆ ఆందోళనలో మహారాజు రుద్రదేవుని స్మరిస్తూ వేగంగా అడుగులు వేయసాగాడు రాజుతో పాటుగా పరిచార జనం, ప్రజలు వేగంగా నడవసాగారు.

అంతలో ఒక మహాద్భుతం జరిగింది.

రుద్రదేవుని స్మరిస్తున్న మహారాజు కాలికి తడి తగిలింది. కళ్లు తెరచిన జలౌక మహారాజు ఆశ్చర్యానికి అంతులేదు. అంతవరకూ నిర్జనంగా ఉన్న ప్రదేశం నుండి బుసబుసా నీళ్లు పొంగి రాసాగాయి. మతి కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు హెెైైడైతతడతడడతడడతడతతత2డడత2డ ట్ల? క

తన సేవలకు వచ్చే జలౌక మహారాజు ఆలస్యాన్ని భరించలేక రుద్రదేవుడు తన జటాజూటంలో బంధించిన గంగ ఒక పాయను విడిచాదేమో అన్నట్టు, పాతాళ గంగ పొంగి పరవళ్లు తొక్కుతూన్నట్టు భూమిలో నుండి నీరు ఊరసాగింది.

ప్రజల పారవశ్యానికి పరిమితిలేదు. జలౌక మహారాజు ఆనందానికి, ఆశ్చర్యానికి అంతులేదు.

'శానంటే పరమశివునికి ఇంత ప్రీతియా? తన కోసమని సోదర తీర్జానికి సోదర తీర్థాన్ని సృష్టించాడా? ఈ పవిత్ర వారిధారా రాశి తన కోసమేనా? వినమ్రుడై వంగి నమస్కరించాడు జలౌకమహారాజు.

ఆ కొత్తగా పుట్టిన నీటి ఊట జలజలా ప్రవహిస్తూ ఉంటే ప్రజలకు ఆ ప్రవాహం వెన్నెల వలె తెల్లనైన పార్వతీదేవి చేలాంచల కదలికగా తోచి, దివ్యానంద తరంగాల ఊగుతున్న భావన కలిగింది.

ఆ నూత్ననదీ వయ్యారపు నడకలు భాగీరథీ సోయగాన్ని తలపుకు తెచ్చాయి. భాగీరధీ నవ్వులు ఈ సోదరనదీ నురుగులుగా, భాగీరథీ వళులు ఈ సోదరనదీ తరగలుగా, కన్నులు మీనులుగా దర్శించి ప్రజలు ధన్యులయ్యారు.

ఒక్కొక్కరికా నది ఒక్కొక్క రూపున తోచింది. ఒకరికి ఆ తరగ చాలుల మధ్య తళతళా మెరుపు ధర్మధ్వజ రెపరెపలుగా తోచింది. మరొకరికా నదీ గలగలల్లో పార్వతీదేవి చిరునవ్వు ధ్వని వినిపించింది. మరొకరికా నదిపదుపు కట్టినలేళ్ల కదుపులా తోచింది. కదలు తెల్లని పూల నదిలా కదిలింది. వదలు తెల్లని తాచు పడగలా విరిసింది.

జలౌక మహారాజుకా నదీ కదలికల్లో రుద్రదేవుని తాండవ హేల తోచింది. ఎగసిపడే కెరటాలు విడివడని జటాజూటపాయలై పోయాయి. "

పారవశ్యంలో మైమరచి ఆ నదీ వీచికల్లో స్నానం చేస్తున్న మహారాజు ఆ రుద్రదేవుని తాండవ లయలో లీనమై వాళ్లు మరచిపాడసాగాడు.

జటాటవీ గలజ్జల ప్రవాహ పాలి స్థలే గలేన లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం

డ్డ్దమడ్డమడ్డమన్నినాద వడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతు నళ్ళివళ్ళివం

జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్హరీ విలోల వీచి వల్లరీ విరాజ మాన మూర్థనీ ధగద్దగద్ధగ జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చం(ద్రశేఖరే రతిః ప్రతి క్షణం మమః।

ఆ శబ్దనాదాల జనించిన తరంగాలు మనస్సులలో నిండి సృష్టించిన సజీవ చిత్రాల నృత్య తరంగాల డోలలో ఊగిపోయారు ప్రజలు. కళ్ళ్మీర రాజు శివాంశజుడు కాదు, శివుడే కళ్ళీర రాజు. ఆ రాజు ఆ నదీజలాల్లో చేస్తున్న తాండవమే అనంత శివ తాండవం. ఆ మహాద్భుత శివ తాండవ నృత్యకేళీ విలాసాన్ని కళ్ళారా చూసి పరమ శివుని తాండవాన్ని 2 శీర్‌ వైైతఊజకతతఊజడడ+2+4ఉఊఉఊఊఊఊ=+4ఊ0ఊఊఊ=22ఊ2ఊఊఊ222222222 కస్తూరి మురళీకృష్ణ వత

ప్రత్యక్షంగా దర్శించిన రీతిలో తన్మయమై పోయింది ప్రకృతి. అక్కడ సమయం స్తంభించి పోయింది.

జయత్వదథభ్ర విభ్రమద్భుజంగా మశ్వస ద్వినిర్గ

మత్షమ స్బురత్‌ కరాళ భాల హవ్యవాట్‌

ధిమిద్దిమిద్దిమిధ్వ న నృదంగ తుంగ మంగళ

ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవళ్ళివః

తమ కళ్లముందు జరుగుతున్న ఆ ప్రచండ తాండవ హేల దర్శించిన సర్వ ప్రజలు, తరు తళులు, సర్వ ప్రకృతి ఆ మహారాజుకు, ఆ మహారాజు ద్వారా బహిర్గతమౌతున్న పరమ శివుని దివ్యకేళీ విలాసానికి శిరస్సులు వంచి నమస్కరించారు.

ఆ రోజు జలౌక మహారాజు రుద్రదేవుని పూజ చేస్తుంటే రుద్రుడు తన పూజ తానే చేసుకుంటున్నాడని, శివుడు తానై శివుని కొలిచినట్టుందన్న భావనలతో (ప్రజలు పులకించిపోయారు. పరమశివుని ప్రత్యక్షంగా దర్శించగలిగిన తమ భాగ్యానికి వారు ఎంతో సంతసించారు. విగ్రహారాధన వ్యక్తి తనలో నిక్షిప్తమై ఉన్న విశ్వజ్యోతి సందర్శనంలో ప్రథమ సోపానం అన్న నిజం ఆ రోజు ప్రజల (గగ్రహింపుకు వచ్చింది. వారికి పరమశివుని విగ్రహానికి, జలౌక మహారాజుకు తేదా తెలియలేదు. అంతేకాదు, పూజ పూర్తయేసరికి ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరిలో వరమశివుదున్నాడన్న భావన కలిగింది. విశ్వం సర్వం పరమశివుని ప్రతిరూపమన్న నిజం ఆ రోజు ప్రస్ఫుటమయింది. ఆ రోజు నుంచి ప్రజల్లో జలౌక మహారాజు పట్ల గౌరవం పెరగటమే కాదు సనాతన ధర్మంలోని బెన్నత్యం గ్రహింపుకు వచ్చింది.

అయితే బౌద్ద (శ్రమణుడు ధర్మపాలుడు మాత్రం సోదర తీర్థానికి సోదర తీర్ధం వెలిసిందన్న నిజాన్ని ఒవ్పుకోలేదు. ఈ ధర్మపాలుడు గతంలో అనేక ననాతన ధర్మానుయాయులను హింసించి బౌద్దంలోకి మార్చిన వ్యక్తి. అయితే సిద్దపురుషుడి వల్ల ధర్మపాలుని నిజరూపం (గ్రపొంచిన జలౌకుడు ధర్మపాలుడికి శిరచ్చేదం చేయాలని నిర్ణయించాడు. అప్పుడే సిద్దుడు జలౌకునికి, “ఏ పని చేసినా ఢ్రేమతో చేయాలి గానీ ద్వేషంతో చేయకూడదని బోధించాడు. ధర్మపాలుడు అలా ప్రవర్తించటంలో జలౌకుడి దోషం కూడా ఉందని నిరూపించటంతో జలౌకుడు ధర్మపాలుడిని విడిచిపెట్టాడు. బౌద్దులపై కూడా ఎటువంటి ఆంక్షలు విధించకుండా, ఎవరి ధర్మం వారు సక్రమంగా నిర్వర్తించే స్వేచ్చనిచ్చాడు.

కానీ ధర్మపాలుడు జలౌక మహారాజును క్షమించలేదు. ఇప్పుడతని స్థితి కోరలు తీసిన పాములాగా, వళ్లు పీకిన పులిలాగా ఉంది. గతంలోలాగా ప్రజలు బౌద్ద మతంలో చేరేందుకు న! కల్డణ కళ్శీర రాజతరంగిణి కధలు తై డర కడు

ఉత్సాహం చూపటంలేదు. పైగా, పై సంఘటన జరిగినప్పటి నుంచీ (ప్రజలు బౌడ్డ విహారాలవైపు కూడా రావటం మానేశారు. దాంతో ధర్మపాలుడికి జలౌకుడిపై కోపం మరింత పెరిగింది.

అందుకే ఒక రోజు జలౌకుడు నూతన సోదర తీర్ధంలో స్నానం చేసేందుకు వెళ్తూంటే ప్రజలందరి సమక్షంలో ధర్మపాలుడు జలౌకుడిని నిలదీశాడు.

“ఇది సొచర తీర్ధం పాయ అని ఎలా నమ్ముతున్నారు?” ఎవరైనా మీకు ఆ మాట చెప్పారా? మనకు తెలియని అనేక కారణాల వల్ల భూమిలో మార్పులు జరిగి ఆ మార్పుల వల్ల ఇక్కడ నది ఏర్పడింది. అది మీ పూజకు ఆలస్యం అయిన రోజే ఏర్పడటం యాదృచ్చికం. దానికి మీరు అది దైవఘటన అని మీ మూర్ధత్వంతో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు" అని వాదించాడు.

అతని వాదన విని కోపోద్రిక్తులైన ప్రజలు అక్కడే ధర్మపాలుడిపై విరుచుకు పడేందుకు సిద్దమైపోయారు.

కానీ జలౌకుడు వారిని వారించాడు.

'సందేహించే హక్కు ప్రష్షించే స్వేచ్చ మన రాజ్యంలో (ప్రతి వ్యక్తికీ ఉంది. ధర్మపాలుడి హక్కును మీరు ప్రశ్నించరాదు. అవును నేనూ ఆలోచించలేదు. నా మూర్థత్వం వల్లనో, భక్తి పారవశ్యం వల్లనో, ఇదే సోదర తీర్థం అని భావించాను. కానీ ఇదీ సోదర తీర్ధం ఒకటేనని బుజువేమిటి?” అన్నాడు జలౌకుడు.

ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు. వారి మనస్సులలో ఇదీ, సోదర తీర్దం ఒకటేనని తోస్తోంది. నీటి రంగు, రుచి విషయంలో, ఈ రెంటిలో ఏమీ తేడా లేదు. కానీ మన నమ్మకం బుజువు కాదుగా?

చివరికి ధర్మపాలుడే ఈ నదీ, సోదర తీర్ధం ఒకటేనని ఎలా బుజువు చేయవచ్చో సూచించాడు. ప్రజలందరి సమక్షంలో ఒక బంగారు చెంబు మూతిని లోపలకు నీరు పోకుండా బిగించాడు. దాన్ని సోదర తీర్ధం అడుగున తానే ఉంచి చెప్పాడు 'ఒక వేళ ఈ తీర్ధం, ఆ ఊట ఒకటే అయితే ఈ చెంబు ఆ ఊటలో తేలాలి. అలా కాని పక్షంలో ఈ

రెండూ వేరేనని తేలిపోతుంది.”

ఆ రోజు జలౌక మహారాజు పరమ శివుని తీవ్రంగా ప్రార్ధించాడు. మరుసటి రోజంతా

ప్రజలు కొత్త సోదర తీర్ధం పొడుగునా ఆత్రంగా వెతికారు. బంగారు చెంబు జాడ లేదు. రెండవ రోజు చెంబు కనబడక పోయేసరికి ప్రజలలో సంశయం కలిగింది. ధర్మపాలుడు

ఆ అపనమ్మక జ్వాలలను ఎగసన తోశాడు. ఆ రోజు జలౌక మహారాజు పూజకు (ప్రజలు

తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. పూజ మందిరం బయట ధర్మపాలుడు ప్రజలకు

“దేవుడు లేడు, నందికేశుడు, ఈశ్వరుడు కొలువై ఉండటం అన్నది కేవలం కల్పన. మనుషులను మూర్చులను చేసి పబ్బం గడుపుకోవటం తప్పించి మరేమీ కాదు. సోదర తీర్దం, ఈ ఊట ఒకటే అనటం ఎంత అబద్దమో కైలాసంలో శివుడు ఉండటం అంతే అబద్దం' అని ప్రజలలో అపనమ్మకాన్ని మరింత పెంచాడు.

మహారాజివేమీ పట్టించుకోలేదు. ఏకాగ్రతతో పూజ పూర్తి చేసి నూతన సోదర తీర్ధం వైపు వెళ్లాడు. ప్రజలు అతడిని అనుసరించారు. మహారాజు నీటి గట్టున నుంచుని పరమ శివుని ప్రార్ధించాడు.

'రెండున్నర రోజులయింది. ఇంకెక్కడి చెంబు. అదీ పాటికి ఎక్కడికో కొట్టుకుపోయి ఉంటుంది. మంత్రాలకు ఇక్కడకు వస్తుందని ఎదురు చూస్తున్నారా? అని ఎగతాళి చేశాడు ధర్మపాలుడు.

అతని ఎగతాళి పూర్తికాక ముందే ప్రజలందరి కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నీటి అలలపై రాయంచలా తేలుతూ కదలుతున్న ఆ చెంబు సూర్యకాంతికి తళతళా మెరుస్తూ కనిపించింది సనాతన ధర్మ నౌక పయనంలా తోచింది ఆ చెంబు ప్రయాణం. ఆ చెంబు కదలికల్లో మరి కొందరికి కాళీయ సర్పాన్ని మధిస్తున్న బాలకృష్ణుని నృత్యం కన్పించింది.

(ప్రజలు భక్తి పారవశ్యంతో శివ స్తోత్రాలు గానం చేయసాగారు. 'హరహర మహాదేవ, శంభో శంకర” నినాదాలు మిన్నంటాయి.

అది చూసి ధర్మపాలుడు అక్కడ నుండి జారుకోబోయాడు. కానీ ప్రజలు అతడిని పోనివ్వలేదు. మవోరాజుని క్షమాపణలు వేడుకోవాలని వారు ధర్మ పాలుడిని నిర్చంధించసాగారు.

ఈ అలజడికి ఏకాగ్రత చెడి మహారాజు ఆ వైపు చూశాడు. విషయం (గ్రహించి “అతడిని వదిలేయండి. అతని వల్ల కాకపోతే మన ఈ సంశయం తీరేది కాదు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఈ సందేహాన్ని లేవనెత్తి మన నమ్మకాలపై బురద జల్లేవారు మనల్ని ఆ ఘోర విపత్తు నుంచి కాపాడిన ధర్మ ప్రాలుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉందాలి" అన్నాడు జలౌకుడు.

ధర్మపాలుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచీ ధర్మపాలుడు మళ్లీ విహారం దాటి బయట ప్రజలకు కనపడలేదు. ఆనాటి నుండి ప్రజలు జలౌక మహారాజును మానవ భోగాలు అనుభవించేందుకు జన్మించిన నందికేశ్వరుడిగా భావించి పూజించసాగారు.

అయితే అంతా సంతోషంగా, హాయిగా ఉన్నా జలౌక మహారాజును అప్పుడప్పుడూ ఒక పీడకల బాధిస్తూ ఉంది. అది అనేక అమాయక కుటుంబాలను బౌద్దులు సజీవ దహనం చేస్తున్న దృశ్యం. అందుకు తానూ పరోక్షంగా తోడ్డట్టంమవష్మర్సి మైతడిని భయంకరమైన కలగా బాధిస్తుందేది. యు? రాఖం | య === కల్పణ కశ్శీర రాజతరంగిణి కథఃఈ శో న వళ యాయ 51 ౩౭

స చి

ఆ కలల్లో మంటల్లో మాడుతూ మనుషులు వేసే కేకలకు బౌద్ధ విహారాల్లోని తూర్యఘోష పల్లవి పాడుతూండేది. అందుక్తే మామూలుగా రాజ కార్యాల్లో మునిగి ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా బౌద్ద ఏవాహాల్లోంచి తూర్య ఘోష వినిపిస్తే మహారాజు ఉలిక్కి పడేవాడు. అతని ఒళ్లు జలదరించేది.

ఆ రోజు జలౌక మహారాజుకు దుర్దినం!

ఉదయమే, ధర్మపాలుడి అండతో కొందరు శతృసైనికులు సరిహద్దు దాటి వచ్చి సనాతన ధర్మానుయాయులను సజీవదహనం చేశారన్న వార్త మహారాజుకు అందింది.

వెంటనే అదృశ్య నాగు సహాయంతో మహారాజు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ అక్కడ దుర్గంధం, కాలిన మానవ శరీరాలు, ఆ శరీరాల మీదపడి రోదిస్తున్న వారిబంధువులు తప్ప దుండగులెవరూ లేరు. వారు దగ్గర లోనే బౌద్దవిహారంలో తలదాచుకున్నారని చారుల ద్వారా మహారాజుకు తెలిసింది.

ఆ దృశ్యం చూస్తున్న మహారాజు కళ్ల ముందు అతని పీడకల సత్యమై వికృత రూపంలో నిలుచుంది. ఏ పీడకలనైతే తాను మరచిపోవాలని చూస్తున్నాడో, అదే పీడకల సత్యమై తన కళ్ల ముందు నిలచిన క్షణంలో మహారాజు సర్వం మరచిపోయాడు. ఆవేశంతో అతని శరీరం వణకసాగింది.

అంతలో మరో వార్త!

విహారంలో దాగిఉన్న హంతకులను పట్టుకోవాలని వెళ్లిన సైనికులను విహారంలో అడుగు పెట్టనివ్వలేదు సరికదా, వారిపై మరణాయుధాలతో దాడి జరిగింది.

ఆ వార్త విన్న మహారాజు క్రోధంతో ఊగిపోయాడు.

'విహారాలైనా, దేవాలయాలైనా పరమ పవిత్రస్థలాలు, ఆ పవిత్ర స్థలాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలి కానీ మనిషిలోని పాశవికత్వాన్ని (వ్రకోవింవప చేసే మారజాయుధాలుండకూడదు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి, వవిత్ర స్థలాల్లో మారణాయుధాల నుండనిచ్చే వారు దండనార్హులు కోపంగా అన్నాడు జలౌకుడు. ఆ దుందడుగులను పట్టి తెమ్మని 'సైన్యాధికారిని ఆజ్ఞాపించాడు.

మహారాజు మనస్సులో గతంలో ధర్మపాలుడు సనాతన ధర్మాను యాయులను హింసిస్తుంటే తాను చూసిన సంఘటన మెదలుతోంది. అంతేకాదు ఆ సంఘటనకు సంబంధించిన తూర్యారావఘోష కూడా చెవుల్లో మార్మోగుతోంది. -

ఆ రోజు మధ్యాహ్న భోజనానంతరం విథ్రమిస్తున్న రాజుకు మళ్లీ పీడకల వచ్చింది. ఆ పీడకలలో మళ్లీ తూర్యారావాలు తారాస్థాయిలో విన్పించసాగాయి.

ఉలిక్కిపడి లేచాడు మహారాజు, ఎదురుగా రక్తసిక్తమై ఉన్న సేనాపతి, మహామంత్రి కన్పించాడు. హైడు క్‌2 కైతతతక2కకతడతతతతకకకడనడానననడడానడడాడడంయయయ. కస్తూరి మురళీకృష్ణ ==

దూరంగా బౌద్ద వివారాల్లోంచి తూర్యారావాలు వినిపిస్తున్నాయి.

“ఏమయింది?” గంభీరంగా అడిగాడు జలౌక మహారాజు.

“మహారాజా! ఆ విహారంలో దాగి ఉన్నది కేవలం దుండుగులే కాదు, బౌద్ద శ్రవణుల వేషంలో ఉన్న శతృరాజ్య సైనికులు ప్రభూ. బౌద్దమతం వీడి తమరు సనాతన ధర్మం పట్ల చూపుతున్న ఆదరణకు నిరసనగా బౌద్దులు తమను ఆదరించే శతృరాజుల పరం ఈ రాజ్యాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభూ. రాజు అనుసరిస్తున్న పరమత సహన విధానాన్ని ఆసరాగా తీసుకొని విహారాలను శత్రు స్థావరాలుగా మారుస్తున్నారు ప్రభూ.” చెప్పాడు సేనాపతి.

'మహారాజా! జీవహింస చేయకపోవటం పరమోతృష్ట ధర్మం.కానీ కాటేయ వచ్చిననాగును జీవహింస చేయకూడదని చంపకుండా వదలటం పరమ మూర్ధత్వం'.సిద్దపురుషుడి వాక్యాలు మహారాజ స్మృతికివచ్చి మార్గోపదేశం చేశాయి.

సేనాపతిని వైద్య సహాయం కోసం పంపి, మంత్రి వైపు తిరిగి అన్నాడు జలౌకుడు “ఏయే బౌద్దారామాల్లో శతృ సైనికులు తలదాచుకున్నారో ఆ ఆరామాలను నేలమట్టం చేయండి. పుట్టలో దాక్కున్న విషనాగు వెలికి రావాలంటే పుట్టను సమూలంగా నేలమట్టం చేయాలి. శతృవులకు ఆశ్రయమిచ్చి దేశద్రోహం చేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా నరికి వేయండి.”

వణికిపోయాడు మహామంత్రి. (ప్రభూ, పవిత్ర ప్రదేశాల మీద చేయి వేసిన ఏ ప్రభువూ ప్రశాంతంగా ఉండలేదు. అలాంటి దేశంలో ప్రజలూ సుఖంగా ఉండలేరు. ప్రతివ్యక్తిలో పరమాత్మను చూడమన్న సిద్దపురుషుడి మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి" అన్నాడు బ్రతిమిలాడుతూ.

నవ్వాడు జలౌకుడు. 'అవింకా పవిత్ర స్థలాలెలా అవుతాయి? శతృ సైనికుల పాదస్పర్శతో, మారణాయుధాల మృత్యు స్పర్శతో, దురాలోచనలతో కలుషితమై పవిత్రతను ఎప్పుడో కోల్పోయాయి. ఇప్పుడు పవిత్ర స్థలాలు కావు. శత్ఫ సైనిక శిబిరాలు మాత్రమే” అన్నాడు. కానీ ప్రభూ....”

మంత్రి మాటలకు అద్ధొచ్చాడు జలౌకుడు. 'కళ్ళీరం పార్వతీ సమానం. రాజు శెవంశజుడు. పార్వతీదేవి కురులను తాకాలని ప్రయత్నించే పురుగునైనా క్షమించి వదలడు శివుడు. కళ్ళ్శీరాన్ని శతృ హస్తగతం చేయాలని, అందుకు విహారాలను ఆధారంగా చేసుకునేవారికి ఇంక క్షమలూ, ఆలోచనలూ అనవసరం. వారిని క్షమించటం దైవద్రోహమే అవుతుంది” అన్నాడు జలౌకుడు.

గత్యంతరం లేక అయిష్టంగానైనా రాజాజ్ఞలను తూచ తప్పకుండా పాటించాడు మంత్రి.

నగరమంతా విరిగిన కట్టడాల నుండి ఎగసిన ధూళితో నిండిపోయింది. నిరాశ్రయులైన పక్షుల కేకలతో నగరం దద్దరిల్లిపోయింది. అనేక విహారాల్లో శతృ సైనికులకూ, కశ్మీర 'సైనికులకూ తీవ్రమైన, భయంకర పోరాటాలు జరిగాయి. ఖణేల్‌, ఖణేల్‌మనే కత్తుల గర్జనలు, వా కల్ప కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :23332డడకడకడడతడడదద2జడర2222ఊఊఊ2ఊ రక =

ఆ కత్తులపై మెరిసే సూర్యకాంతి మెరుపులు, ఆకాశంలోని ఉరుములు మెరుపులు కశ్శీర నగరంలో భూమి పైకి దిగి వచ్చాయనిపించింది.

రాజప్రాసాదం నుండి ఆ దృశ్యం చూస్తున్న మహారాజు మదిలో అవేశం తగ్గింది. ఆలోచన కలిగింది. 'ఎట్టి పరిస్టితులలో తన రాజ్యాన్ని రక్షించుకోవటం తన ధర్మం విహారాలు పవిత్ర స్థలాలు. కానీ శతృస్థావరాలయిన మరుక్షణం అవి తమ పవిత్రతను కోల్పోయాయి. అయినా సరే ఒక వేళ నా ఈ చర్య వల్ల పాపం ఏదైనా వస్తే అది నాకే రానీ దాని వల్ల ప్రజలకు ఎటువంటి హానీ కలగకూడదు” అనుకున్నాడు మనసులో.

కానీ ఆయన మనసులో ఏ మూలో తన ఈ చర్య వల్ల ప్రజలకు ఏదైనా దుష్పలితం కలగవచ్చునేమోనన్న ఆలోచన బంధించసాగింది. తెల్లవారింది. మహారాజు రాజమందిరంలో ప్రవేశించాడు.

“మహారాజా రాజధాని నగరంలోని విహారాలన్నీ నేలమట్టం అయ్యాయి గూళ్లు కూలిపోతే చెల్లాచెదురైన పక్షుల్లా బౌద్దులు చెల్లాచెదురయ్యారు. అనేక శతృ సైనికులు హతులయ్యారు. మిగతా వారు బందీలయ్యారు. ఇదంతా ధర్మపాలుడి పన్నాగం ప్రభూ. ధర్మపాలుడు దేశం వదలి పారిపోయాడు” చెప్పాడు మంత్రి.

“నేను పూజకు వెళ్లేలోగా నగరంలో మిగిలి ఉన్న బౌద్దులనూ, వారి నాయకులనూ అందరినీ సమావేశపరచండి” ఆజ్ఞాపించాడు జలౌకుడు.

“ప్రభూ, మీ అద్భుతమైన చరిత్రలో ఈ సంఘటన ఒక కళంకంలా మిగిలి పోతుంది. మీరుచేసింది దేశక్షేమంకోసమే అయినా అది పాపం. ఇంకా బౌద్దులను హింసించటంవల్ల సాధించేదేమీ లేదు” గద్గద స్వరంతో అన్నాడు మంత్రి.

మహారాజు విచిత్రంగా నవ్వాడు 'మంత్రివర్యా దేశాన్ని కాపాడటం నా ధర్మం. ధర్మపాలన నా కర్తవ్యం. నా కర్తవ్య నిర్వహణలోని దోషాలకు నేనే బాధ్యుడను, బౌద్దులను పిలిపించండి? అన్నాడు.

రాజ ప్రాసాదం ముందు బౌద్దులంతా సమావేశమయ్యారు. వారు మహారాజును పరుష పదాలతో దూషిస్తూ, శాపనార్థాలు పెడుతున్నారు. ఇంతలో మహారాజు వస్తున్నాడన్న సూచనగా గంట (మోగింది. అందరూ నిశ్శబ్దమైపోయారు.

ఆ రోజు మహారాజు వినూత్న కాంతితో మెరిసిపోతున్నాడు. “మీ విహారాలను నేలమట్టం చేశానన్న కోపం మీది, అవునా? అడిగాడు మహారాజు.

బౌద్దులు ముక్తకంఠంతో అవునన్నారు. మా ర్‌క 22న. కస్తూరి మురళీకృష్ణ నా.

“పరమత సహనం చేతకానితనం కాదు. (ప్రతి వ్యక్తికీ తన బుద్దిననుసరించి తనకు ముక్తినిస్తుందనిపించిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చనిచ్చింది మనిషి మనిషిగా ఎదగాలనే గానీ దేశద్రోహం చేయాలని కాదు. ఆ స్వేచ్చను దుర్వినియోగం చేసి దేశద్రోహం తలపెట్టిన వారిని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదు. వారు బౌద్దులైనా, సనాతన ధర్మానుయాయులైనా, ఎవరైనా సరే, దేశద్రోహం క్షమార్హ నేరం కాదు.

విహారాల్లో దాగి ఉన్న శతృవులను వెలికి తెచ్చేందుకు విహారాలను కూలగొట్టిన నాది తప్పయితే, ఆ విహారాల పవిత్రతను నాశనం చేస్తూ వాటిల్లోకి శతృవులను మారణాయుధాలతో రానిచ్చిన మీది ఇంకెంత తప్పు? నన్నెలా శాపనార్థాలు పెడుతున్నారో, అలాగే ఆ రానిచ్చిన వాళ్ళనూ, అలా వస్తూంటే మౌనంగా ఉండిపోయిన వారినీ శాపనార్థాలెందుకు పెట్టరు? అప్పుడెందుకు మౌనంగా ఉండిపోయారు?”

బౌద్దులు మౌనంగా ఉండిపోయారు.

“ఇకనైనా మీరు దేశద్రోహం ఆలోచనలు మాని మీ ధర్మపాలన సవ్యంగా చేసుకోండి చాలు. ఇతరులను ఉద్దరించాలనే ఆలోచన మానండి. మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి చాలు.”

బౌద్దులు మౌనంగా తలలాడించారు.

మహారాజు చిరునవ్వు నవ్వాడు “నాకు మీమీద ద్వేషం లేదు. కానీ ఒకటి నిజం. నేరం చేసేవ్యాడికన్నా ఆ నేరం జరుగుతోందని తెలిసి మౌనంగా ఉండిపోయేవారి అపరాధం మరింత ఎక్కువ. కాబట్టి మీ విహారాలు భవిష్యత్తులోనైనా ఎటువంటి ఆపద లేకుండా ఉండాలంటే వాటిని దైవ ప్రార్ధనలకు, పవిత్ర కార్యాలకు మాత్రమే వినియోగించండి. కూల్చిన మీ విహారాలన్నీ తిరిగి నిర్మించే బాధ్యత నాది.

బౌద్దులు జయజయ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.

మహారాజు మంత్రి వైపు చూశాడు. మంత్రి మహారాజును ఆశీర్వదించాడు.

ఆ తరువాత ప్రశాంత మనస్సుతో మమారాజు దైవప్రార్దనకై విజయేశ్వర దేవాలయానికి పయనమయ్యాడు.

మార్గమధ్యంలో ఒక ప్రీ ఎదురుపడి మహారాజును ఆపింది.

“మహారాజా! ఆకలిగా ఉంది. భిక్ష భిక్షు అనడిగింది.

జలౌకుడు ఆశ్చర్యపోయాడు. 'నా రాజ్యంలో అకలిగా ఉన్న వారికి అన్నం దొరక్క పోవటమా?” ఇదేదో నా దోష ఫలితం నన్నిలా బాధిస్తూ ఉండి ఉంటుంది" అని ఆమెకు 22త3ఊ2=ు కల్ప కళ్మీర రాజతరంగిణీ కధలు :23322ఉ2ఉఊఉఊ2ఊఉఊఉఊ4ఊఊ 55 చె

రుచికరమైన భోజనాలిమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ స్త్రీ అందరూ ఖీతిభ్రాంతులయ్యే వికారరూపం ధరించింది. ఆమె దం నుండి కవోష్ట రక్తం కారుతూండగా “నరమాంసం కావాలిరాజా నరమాంసరి అని వికృతంగానవ్వంది.

ప్రజలంతా బెదిరిపోయారు. హాహాకారాలుచేశారు.

జలౌకుడు చిరునవ్వు నవ్వి ఓ వికృత రూపిణీ, నా పాపమే నీ వికృత రూపం ధరించి వచ్చినట్టుంది. నీవు నన్నే ఆహారంగా చేసుకో” అన్నాడు.

వెంటనే ఆ వికృత రూపథధారిణి మహారాజు కాళ్లమీద పడింది.

“మహారాజా! నీవు సత్యగుణవంతుడవు. నీవు మహాత్ముడవు. నీకు నేనే కాదు దైవశక్తి కూడా ఏ అపకారమూ చేయలేదు” అంది.

జలౌకుడు “అమ్మాయీ ఎవరు నువ్వు అనడిగాడు.

“రాజా మ్లేచ్చ బౌద్దులను దేశం నుండి తరిమి, విహారాలను కూల్చటం వల్ల క్రోధితుడై నీకు ప్రత్యపకారం చేసేందుకు ధర్మపాలుడు మంత్రశక్తితో (ప్రయోగించిన క్షుద్రబౌద్ద శక్తిని, లోకాలోక పర్వత పార్య్వంలోని తమస్సులో ఉండు చీకటి కృత్తికను నేను. బోధిసత్వుని శరణు పొందిన దానిని నీ దర్శనంతో నా కటిక చీకటి స్వరూప తమో గుణము నశించింది. నీవు బోధిసత్వుడవే ప్రభూ' అంది అకృత్తిక.

“బోధిసత్వుడనగా ఎవరు?” ప్రశ్నించాడు మహారాజు.

“బోధిసత్వుడంటే అదిలేని ఆదికాలపు లోకనాధుడు మొదల్మొని ఇంతవరకూ ఏ జీవాత్ముడే కానీ మనసులో నొప్పి పడకుండా ఎవరుంటారో వారంతా బోధిసత్వుని అంశలే ప్రభూ. వారు అపరాధం చేసిన వారిపై కూడా కోపింపరు ధర్మనిరతులు. ఎవరికీ ప్రత్యపకారం చేయరు. వారి వలననే విశ్వమూ, సమాజం ఇంకా నిలచి ఉంది. బౌద్దమరముల కూలగొట్టించిన నీ పాపం ఈ ప్రసంగం వలన నశించింది. నా పాపం నీ దర్శనం వల్ల నశించింది.”

ధర్మపాలుడు మంత్రశక్తితో జాగ్భృతం చేయగా వస్తున్న నన్ను బోధిసత్వుడు అపి '*ఓ కళ్యాణీ జలౌక మహారాజు మహాశాక్యుడు. గొప్ప బౌద్దుడు. ఆయనను హింసించేందుకు నీ శక్తి చాలదు. ఆయన దర్భనంతోటే నీ చ్రీకటిరూపం నశిస్తుంది అని నాచేతికి బంగారపు మూటలిచ్చి మీకివ్వవలసిందని ఆజ్ఞాపించాడు. ఈ బంగారాన్ని ఉపయోగించి కూలగొట్టిన మరాలను పునర్చిర్మించండి. ఆ పనివల్ల విహారాలను కూలగొట్టిన పాపమేకాదు. మీరాకార్యం చేసేందుకు పరోక్షంగా కారకులైన వారందరి పాపాలూ తొలగిపోతాయి. బోధిసత్వుదే అంతగా పొగిడిన నీ సత్త్వ్వశక్రిని పరీక్షించేందుకే నేను ఆహారం అడిగాను. నీవు రాజుగా ఉండగా రాజ్యంలో ఎవరికేమి కొదువ ప్రభూ అని బంగారపు మూటలు రాజు చేతిలో ఉంచింది. 23212. గధ తడ కస్తూరి మురళీకృష్ణ డడ

జలౌకుడు ఆ బంగారపు మూటలను స్వీకరించిన మరుక్షణం ఆ చీకటి స్వరూపం ఒక్కసారిగా మహాద్భుతమైన సహస్ర సూర్య ప్రభలతో వెలిగి అంతర్జానమైపోయింది.

ఆ సంఘటన వీక్షించిన ప్రజలు, బౌద్దులు మహారాజుకు జయకారాలు పలుకుతూ సాష్టాంగ ప్రమాణం కావించారు. , జలౌక మహారాజు ఆ బంగారంతో కృత్సాశ్రమమనే విహారం నిర్మించి తమస్సు క్షీణించిన కృత్సాదేవిని ప్రతిష్టలో బంధించాడు. నందిక్షేత్రములో భూతేశ దేవాలయం రాతి కట్టడంతో నిర్మించి, ఆ దేవుని ప్రతిదినం రత్నాలతో పూజించేందుకు తగినన్ని కోశాలను ఏర్పాటు చేశాడు.

తాను ప్రతిష్టించిన జ్యేష్టరుద్రుని దేవాలయంలో సాయంకాలమందు, ఉత్సవాల సమయంలో నృత్యాలు చేసేందుకు నూరు మంది అంతఃపుర స్త్రీలను సమర్పించాడు.

చీరమోచన తీర్ధం అడుగుభాగంలో బ్రహ్మాసన స్టితుడై కదలిక, స్పందన లేని శరీరంతో అనేక దినాలు తపస్సు చేశాడు. ఈ రకంగా అనేక భోగైశ్వార్యా లనుభవించి, ధర్మాన్ని స్థాపించిన జలౌక మహారాజు తన జీవిత కార్యాలన్నీ సాధించిన పిదప ధర్మపత్ని ఈశానదేవితో కూడి చీరమోచన తీర్ధంలో ప్రవేశించి పరమశివుని సాయుజ్యం పొందాడు.

ఇదీ భారతదేశ రాజుల ఉత్తమత్నానికి బెన్నత్యానికి ప్రతీక అయి, రాబోయే రాజులకు మార్గదర్శకుడైన కశ్మీర రాజు జలౌక మహారాజు అద్భుత జీవితగాధ.

న

ఊడ కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2౭ైఆంజడ౭డ౭డ౭ఒడ2ఊఊఊఊఊఊఊఊ ర్‌? ===

శ “ఓ 1 | జ్యా రకాాత్తక్యూ నా శ గి ఛీ మ్‌ | శ, దహ వ య ళ్‌ న ఘనా టం గే కాన ధ్‌ ధ్‌ ఈధ్‌ క్త ప్రజా పుత్వైః సంభవంతి మహిాభుజ9

అది చాలా విచిత్రంగా ఉంది.

తుఫానులా మంచు కురుస్తోంది. దారుల నిండా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి ఉంది. దూరంగా మంచులో చిక్కుకున్న ప్రజల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. కానీ చిత్రమేమిటంటే ఆ మంచు తామున్న వైపు మృదువుగా పడుతోంది. ఇతర ప్రాంతాలలో మంచుపడటం అదేదో కక్ష తీర్చుకుంటున్నట్టు, కసితీరా పడుతోంది. తమ వైపు మాత్రం అలసి సొలసి నిద్రిస్తున్న శిశువు ఫాలభాగాన్ని తల్లి తన చల్లని చేతులతో మృదువుగా స్పృశిస్తున్నట్టు పడుతోంది.

“ఏమిటి విచిత్రం నాగనాధాచార్యా?” ఆశ్చర్యంగా అడిగాడు చంద్ర దేవుడు. చంద్ర దేవుడు కాశ్యప గోత్రజుడు. ఇటీవలే భారత పర్యటన పూర్తి చేసి కశ్మీరం చేరాడు. దేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. పవిత్ర తీర్థాలలో పరిశుభ్రుడయ్యాడు. అనేక యోగులతో, ఆధ్యాత్మిక అన్వేషకులతో ధార్మిక చర్చలు చేసి అనేక విషయాలు గ్రహించి తిరిగి కళ్ళ్మీరం చేరాడు చం(ద్ర దేవుడు. జజ ర్‌దీ.:2223ఊ3డడ2ఊడడకనడనడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడఊ = కస్తూరి మురళీకృష్ణ తత

అయితే అతను కళ్ళీరం వదలినప్పటికీ ఇప్పటికీ కళ్మీరంలో అనేక మార్పులు సంభవించాయి, భౌతికంగా, రాజకీయంగా!

ఇంతకు ముందూ కళ్ళ్మీరంలో మంచు తుఫానులుండేవి కానీ అవి ఇంత తీవ్రంగా ఉండేవి కాదు. ఇలా ఆరునెలలు అవిచ్చిన్నంగా మంచు తుఫానులు వచ్చేవికావు. ఈ మంచు తుఫానులలో విచిత్రం ఏమిటంటే మంచు కొన్ని ప్రదేశాల్లో విపరీతంగా, దారుణంగా విజృంభించి పడుతోంటే మరికొన్ని ప్రాంతాల్లో మృదువుగా పడుతోంది. చంద్రదేవునికి బోధపడనిది ఇదే.

చంద్రదేవుని ప్రశ్నకు నాగనాధాచార్యుడు, అతనితోపాటూ ఉన్న మరో యువకుడు నవ్వారు. “నిన్ను ఇంత దూరం ఈ మంచు తుఫొనులో రప్పించింది ఇది చూసేందుకే చంద్రదేవా” అన్నాడు నాగనాధాచార్యుడు ఆప్యాయంగా. “నాకు అర్ధం కావటం లేదు నాగనాధాచార్యా' వినయంగా అన్నాడు చంద్రదేవుడు.

“నువ్వు కళ్ళ్మీరం వదలి వెళ్ళినప్పటి నుంచీ దేశంలో అనేక మార్పులు సంభవించాయి. బౌద్దులు విజృంభించారు. భారతంలోని ఇతర దేశాల నుంచి అనేక మంది బౌద్దులను నాగార్జున బోధిసత్వుడు కళ్ళీరం రప్పించాడు. వీరు గతంలో జలౌక మహారాజు రాజ్యం చేస్తున్న సమయంలో కళ్ళ్మీరు వదలి పారిపోయిన బౌద్దులు.

“అంటే రాజద్రోహం చేయదలచి విహారాలలో శతృసైనికులకు అండనిచ్చిన వారు కదా?” అడిగాడు చంద్రదేవుడు.

“అవును వీరు వైదికాచారానికి పరమద్వేషులు. పైగా ఇతర దేశాలలో నేర్చిన చిత్రవిచిత్ర కుతర్మ పద్దతులన్నీ కళ్ళీరంలో వేదపండితులపై ప్రయోగించి వారిని చిత్తుచేసి తమ బౌద్దంలోకి బలవంతంగా మార్చుకున్నారు. దాంతో సనాతన ధర్మానికి గడ్డు రోజులు వచ్చి పడ్డాయి” విషాదం ధ్వనించింది నాగనాధాచార్యుల స్వరంలో. 'అదేమిటి, అభిమన్యు మహారాజు శశంక శేఖరుని ప్రతిష్ట చేసి వైదిక ధర్మాన్ని నిలిపే ప్రయత్నాలు చేస్తున్నాడని విన్నాను. పాతంజల మహాభాష్యాన్ని కళ్శీరానికి తెప్పించి చంద్రాచార్యుని సహాయంతో పొతంజల వైయాకరణ మహాభాష్యాన్ని ప్రచారంలోకి తెచ్చాడని విన్నాను. చంద్రాచార్యుల వారు చాంద్ర వ్యాకరణాన్ని రచించి చిరకీర్తినార్దించారని విన్నాను" ఆశ్చర్యంగా అడిగాడు చంద్రదేవుడు.

“అవును అన్నీ నిజమే. కానీ తరచి చూస్తే అది ఆరిపోయే దీపం ఒక్కసారిగా వెలిగి ఆరిపోతుంది చూడు అలాంటిదనిపిస్తుంది అన్నాడు నాగనాధాచార్యుడు.

“శివ! శివీ సనాతన ధర్మం గురించి అటువంటి అలోచన ఎలా వస్తోంది మీకు? ఆద్యంతాలు లేని ధర్మాన్ని మీరు ఆరిపోయే దీపంతో పోల్చటం తగదు. యదాయదాహి ధర్మస్య... గుర్తు తెచ్చుకోండి" అన్నాడు చంద్రదేవుడు వినయంగా.

నిస్పృహగా నవ్వాడు నాగనాధాచార్యుడు. === కల్పణ కళ్ళ్మీర రాజతరంగిణి కధటు :=222ఊ2ఊ2ఊఉఊజఉఊజ24ఊ2ఊ2ఊఊఉఊఊఊఊ4ఊ4ఊ42420.2424ఊ22222 59 =

నీకు తెలియనిదేముంది, జలౌక మహారాజు కాలంలో కళ్ళీరమే స్వర్గం అన్నట్టు ఉండేది. బౌద్దుల క్షుద్ర శక్తులు సైతం ఆయననేమీ చేయలేకపోయాయి. ఆయన తరువాత వచ్చిన దామోదరుడు వేదోక్త ధర్మంపై అనురాగం కలవాడు. కానీ బ్రాహ్మణ శాపానికి గురై సర్పంలా మారి పోయాడు. అప్పటి నుంచీ కశ్మీరం అల్లకల్లోలమై పోయింది. హుష్క జుష్క కనిష్ములనే బౌద్ద తురుష్కులు వరుసగా కళ్ళీరాన్ని పాలించారు. వీరి కాలంలో కళ్ళీరం బౌద్దులకు భోజ్యంలా మారింది. ఆ తరువాత అభిమన్యుడు రాజయ్యాడు. ఇతని కాలంలో వైదిక ధర్మం తలెత్తుకోగలిగింది. కానీ వెళ్ళూనేలోగా కాళ్ళ క్రింద భూమి కదలిపోయింది. నాగార్జున బోధిసత్వుడి ప్రభావంతో ప్రజలంతా బౌద్దం వైపు ఆకర్షితులయ్యారు. దాంతో అనాదిగా ప్రవర్తిల్లుతూన్న నీలమత సాంప్రదాయం విచ్చిన్నమైంది నాగనాధాచార్యుని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఇద్దరి మధ్య కాస్సేపు మౌనం రాజ్యం చేసింది.

చివరికి చంద్రదేవుడే అడిగాడు. “ఇంతకీ నా సందేహం తీరనేలేదు'.

“ఏమిటది?”

“ఈ మంచు తాకిడి కొన్ని ప్రాంతాలలో ప్రాణాంతకంగా ఉండి, మరి కొన్ని ప్రాంతాలలో ప్రేమమయంగా ఉండటం ఏమిటి?' అడిగాడు చంద్రదేవుడు.

“ఇదంతా నీల నాగుడి కేళీ విలాసం” అన్నాడు నాగనాధాచార్యుడు.

“అంటే?

“కళ్ళీరం అంతా ఒకప్పుడు సముద్రమంతటి సతీ సరోవరమనే సరస్సు. ఈసరస్సు అడుగున నాగదేవతలు అనేకమంది నివాసం ఏర్పరచుకుని ఉండేవారు. (త్రిమూర్తులతోపాటూ వారు కళ్శీరంలో నివాసం వర్పరచుకున్నారు. నాగ దేవతలచే సంరక్షింపబడుతున్న పవిత్రభూమి మనది. కళ్మీరంలో నాగదేవతలు అందుకుంటునన్ని పూజలు ప్రపంచంలో మరెక్కడా అందవనటం అతిశయోక్తి కాదు (కశ్మీరంలో ఉన్నన్ని ప్రాచీన నాగదేవతా చిహ్నాలు భారతదేశంలో మరెక్కడా కనిపించవు. నీలనాగ్‌, అనంతనాగ్‌, శేషనాగ్‌, కర్కోటకనాగ్‌, కృకర్‌నాగ్‌ ఇలా ఎన్నో.

“అవును, కళ్ళీరం పార్వతితో సమానం. రాజు శివాంశజుడు. శివుని ఆభరణం నాగుసర్పం. కాబట్టి నాగదేవత మనకు ఆరాధ్యనీయం” అన్నాడు చంద్రదేవుడు.

“ఇక్కడ మనం గమనించవలసింది నేడు కశ్మీర ప్రజలు ఆ నాగ దేవతలను విస్మరించటమే. ఈ మంచు తుఫాను నాగ దేవతల కోపానికి ప్రతిరూపము. కైలాసగిరి శిఖరం అంచు నుండి కోపంతో నాగులు బుస కొడుతున్నాయి. ఆ బుస బుసల ధాటికి మంచు తుఫానులా ఎగిరివచ్చి కళశ్ళీరాన్ని ముంచెత్తుతోంది. సంవత్సరానికి ఆరునెలలు వజ (0 232: కస్తూరి మురళీకృష్ణ ===

ఇదే పరిస్థితి. రాజు ఈ మంచు తాకిడికి తట్టుకోలేక సంవత్సరానికి ఆరు నెలలు మంచు కురియని దార్వాఖిసారంలో తలదాచు కుంటున్నాడు.

కానీ కొన్ని ప్రదేశాల్లో మంచు తీవ్రంగా ఉండటం లేదు కదా?”

“ఎవరైతే నాగబలిహోమాలు చేసి నాగదేవతలకు ప్రీతి చేస్తున్నారో, ఆ వైపు మంచు తీవ్రతను తగ్గిస్తున్నారు నాగదేవతలు. బౌద్దులున్న ప్రదేశంలో మాత్రం మంచు మెత్తని తెల్లని పులిలా వారిని కబళించి వేస్తోంది. నాగదేవతల క్రోధాగ్ని మంచై వారిని దహించి వేస్తోంది" చెప్పాడు నాగనాధాచార్యుడు.

“ఈ విషయంలోనే నేను మీ సహాయాన్ని అర్జిస్తున్నాను. బౌద్దులైనా, సనాతన ధర్మానుయాయులైనా అందరి ప్రాణం ఒక్కటే. అందరం మనుషులమే. అందరి దేవుడు ఒక్కడే. దైవంలో భిన్నత్వం గోచరించటం మన అజ్ఞానానికి, (హ్రస్వదృష్టికి తార్కాణం.

ఎలాగయితే నదులన్నీ సముద్రంలో కలుస్తాయో, అలాగ ఏ దైవాన్ని ఏ రకంగా పూజించినా అది ఆ సర్వాంతర్యామికే చెందుతుంది. అందుకే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ అపార ప్రాణ నష్టాన్నుంచి కళ్మీరాన్ని కాపాడండి. నాగదేవళకై తపస్సు చేసి, వారి కోపాన్ని శాంతింప చేసి కశ్మీరంలో మంచు తుఫానుల తాకిడిని ఉపశమింప చేయగలిగింది మీరొక్కరే మీకు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను' అంతవరకూ మౌనంగా ఉన్న యువకుడు చంద్రదేవుని అభ్యర్థిస్తూ సాష్టాంగ ప్రణామం చేశాడు.

ఆశ్చర్యపోయి చూస్తున్న చంద్రదేవుని చూసి వాత్సల్యంగా నవ్వి నాగనాధాచార్యుడు “యువకుడు మహా పురుషుడు, కళ్ళీర రాజ్యలక్ష్మిని చేపట్టిన నూతన రాజు. గోనంద వంశానికి ఆద్యుడు మూడవ గోనందుడు' అని ఆ యువకుడిని చంద్ర దేవునికి పరిచయం చేశాడు.

'గోనందుడంటే......?”

“అవును చంద్రదేవా. నేను వైదిక ధర్మాచార పరాయణుడనే. కానీ ఎప్పుడయితే ఈ రాజ్య బాధ్యతను నా భుజస్మంధాలపై ఎత్తుకున్నానో అప్పుడే ఈ ప్రజలంతా వారి ధర్మాలతో ప్రమేయం లేకుండానా వాళ్ళయ్యారు. వారి మంచి చెడ్డలునా బాధ్యత. వారికేదైనా నష్టం కలిగితే అది నాలోని దోషం వల్లనే అవుతుంది. అందుకే కళ్ళీరాన్ని సుభిక్షం చేయమని కోరుతున్నాను. బౌద్దులైనా, సనాతన ధర్మానుయాయులైనా అందరూ నా ప్రజలే. వారి బాగోగులు నా బాధ్యతి అన్నాడు మూడవ గోనందుడు చంద్రదేవుని (బ్రతిమిలాడుతూ.

గోనందుడిని వాత్సల్యంగా లేవనెత్తి ఆశీర్వదించాడు చంద్రదేవుడు.

“యస్తు సర్వాణి భూతాన్య తృన్యే నాను పశ్యతి!

సర్వభూతేషుచాత్మానం తతోన విజుగుష్పతే!! === కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు :=332323232323జ32323ఊ2ఊ2ఊ232ఊ2ఊ2జ:2=22=2ఊ2=2=======22=.. (1. ==

(అన్ని జీవులు తన ఆత్మ కంటే భిన్నములు కావనీ, తన ఆత్మయే అన్ని జీవులలోని అత్మ అని దర్శించే ప్రాజ్ఞుడు ఆత్మబలం చేత దేనిని కూడా ద్వేషించడు)

మహారాజా! నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. నాగదేవతలను మెప్పించే ప్రయత్నం చేస్తాను మాట ఇచ్చాడు చంద్రదేవుడు మహారాజుకు మనస్ఫూర్తిగా.

“నీ లక్ష్యం నెరవేరుగాక' ఆశీర్వదించాడు నాగనాధాచార్యుడు.

న

చంద్రదేవుడి మనను ఒక విషయం మీద నిలవటం లేదు. వరివరివిధాల పరిగెడుతోంది. కళ్లెం లేని గుర్రంలా కదను తొక్కుతోంది.

చంద్ర దేవుడికి తెలుసు. మనసును బంధించకపోతే తన లక్ష్యసాధనలో మొదటి అడుగు కూడా వేయలేదని.

చిత్తం కారణ మర్థానాం తస్మిస్సతి జగత్రయం

తస్మిన్‌ క్షీణే జగత్‌ క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్చతః

చిత్తమే సర్వార్ధ్థాలకూ హేతువు. అదే జగత్తు. చిత్తం నశిస్తే జగత్తు లేదు. దానికి ధ్యానం అవసరం.

చంద్రదేవుడు వినాయకుని రూపాన్ని మనసులో నిలుపుకుని వినాయకుని ధ్యానించాడు. ఆ తరువాత పరమ శివుని ధ్యానించాడు. సుఖమైన ఆసనాన్ని ఎంచుకున్నాడు.

'స్తిర సుఖమాసనమ్‌' ఆ తరువాత మనసులో నీలనాగుడిని ఊహించుకుని మంత్ర జపం ఆరంభించాడు. “స్వాధ్వాయాదిష్ట దేవతానం ప్రయోగఃి మంత్రాన్ని జపించటం వలన ఇష్ట దేవతా సొక్షాత్మారం అవుతుంది.

“తస్మిన్‌ సతిశ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేదః ప్రాణాయామః ఉచ్చ్వాస నిశ్వాసలను నియంత్రిస్తూ మంత్ర మననాన్ని తీవ్రతరం చేశాడు. “బాహ్యాం భ్యంతర విషయాక్షేపీ చతుర్ధః ' నీలనాగుడిపై నర్వావయవాలను, ఇం(ద్రియాలను కేంద్రీకరించి (ప్రాణాన్ని నియంత్రించసాగాడు. *తతః క్షీయతే 'ప్రకాశావరణం” దాంతో చిత్తంపైన ఆవరించి ఉన్న మాయపార తొలగింది. అతని సర్వేంద్రియాలు మనసులోకి ముడుచుకుపోయాయి. ఇప్పుడతని మనసే శరీరం పై ఆధిపత్యం వహిస్తుంది.

“ధారణాసు చయోగ్యతా మనసః ఇప్పుడతని మనసు ధారణార్దతను పొందింది. 'దేశ బంధళ్చిత్తస్వధారణా ఏదైనా ఒక విషయం పైనే మనసును కేంద్రీకరించటం ధారణ. చంద్రదేవుడి మనసు నిండా నీలనాగుడి రూపం నిండిపోయింది. *'తత్రప్రత్యయైకతానతా ధ్యానం” దృష్టి కేంద్రీకరించిన విషయం గూర్చిన అవిచ్చిన్న జ్ఞానవాహినే ధ్యానం.

ఊం ధం తతత కస్తూరి మురళీకృష్ణ నా!

చంద్రదేవుడు చంద్రదేవుడు కాడిప్పుడు. అతనొక (ప్రత్యేక వ్యక్తి కాడు. అతని ప్రత్యేక వ్యక్తిత్వం నాగదేవునిలో లయించిపోయింది. అతనే నీలనాగుదై పోయాడు. నీలనాగుడికి చంద్రదేవునికీ భేదం లేని పరిస్థితి ఏర్పడింది.

'తదేవార్ద మాత్ర నిర్భాసం స్వరూపమాన్య మివ సమాధిః స్వరూపం శూన్యమై కేవలం భావం మాత్రమే మిగిలే స్థితి సమాధి. ధారణ, ధ్యానం, సమాధి స్థితిగతులను కలిపి సమ్యమాం అంటారు. సమ్యను సాధన జ్ఞానరోచిస్సులను ప్రసాదిస్తుంది.

న

“మహారాజా! కళ్ళీరాన్ని బాధిస్తున్న మంచు తుఫానులను నేను ఉపశమింప చేస్తాను. అందుకు ప్రతిఫలంగా మీరు దేశమంతా నీలమత పురాణాన్ని వ్యాపింప చేయాలి. గతంలోలా దేశంలో నాగయాత్రలు, యజ్ఞయాగాలు నిరాటంకంగా సాగాలి. మీదే మతమైనా కావచ్చు. మీరే దేవతనైనా పూజించవచ్చు.కానీ దేశంలో నెలకొని ఉన్న ఈ దేశానికి అత్మవంటి పురాతన సత్సంప్రదాయాలను నిలబెట్టాలి. ఎలాగైతే పండుటాకులురాలి చిగురుటాకులు ఏర్పడినా వృక్షం మారదో, అలాగే నూతన పద్ధతులెన్ని వచ్చినా సనాతన ధర్మ ఆత్మ మాత్రం చిరంజీవిలా ఉండాలి ఆత్మనాశనమైతే సర్వం నాశనమౌతుంది" గంభీరంగా అన్నాడు చంద్రదేవుడు నిండు రాజ సభలో గోనందుడితో. గోనందుడు అవనమ్మకంగా చూశాడు. 'కేవలం నాగపూజలు, యాత్రలు జరపటం వల్ల మంచు తుఫానులు ఉపశమిస్తాయా?” ప్రశ్నించాడు మూడవ గోనందుదు.

చంద్రదేవుడు నవ్వాడు 'మంచు తుఫానులు ఉపశమించటమే కాదు ఇంకా ఏం జరుగుతుందో చూడండి” అని అడుగు ముందుకు వేసి మహారాజు శరీరాన్ని తన చేయితో మృదువుగా స్పృశించాడు.

మహారాజు శరీరం కంపించీ పోయింది. అసలు అది అతని శరీరం కాదనిపించింది. తాను సర్వ (ప్రకృతి అయిపోయాడు. తానే కాలం అయ్యాడు. అదృశ్యంగా ఉన్న వింత జగత్తులో తాను భాగమై పోయాడు.

అతని కళ్ళముందు తను 85 సంవత్సరాలు రాజ్య పాలన చేయటం కనిపించింది. తన కుమారుడు విభీషణుడు 58 సంవత్సరాల ఆరునెలలు పాలించటం తెలుస్తోంది. ఇంద్రజిత్తు 35 సంవత్సరాల ఆరునెలలు పాలించటం కనిపించింది. రావణ మహారాజు 35 సంవత్సరాల పాలన కళ్ళముందు కదిలింది. అతని కుమారుడు విభీషణుడు 35 సంవత్సరాలు పాలించటం తెలిసింది. నరుడు రాజై గొప్పగా పాలించటం కనిపించింది.

కానీ అయ్యో అదేమిటి? ఏం ఘోరం చేస్తున్నాడు నరుడు? అంతగొప్ప రాజుకీ దర్చుద్ది ఏమిటి? అయ్యో! === కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు ఇడ 683. 222

సర్వనాశనం అయిపోయింది. అయ్యో కళ్ళీరం, గోనంద వంశ పాలన నరునితో ఆఖరు?

బాగాతప్తుహ్నారయుంతో కారిష కమీక్టు మెన్యు, దదంతే ఉలిస్కిపడ్డాడు సుపొరాజు.

తాను దర్శించింది కొన్ని వందల సంవత్సరాల భవిష్యత్తు. కానీ గడిచింది లిప్రకాలం మాత్రమే!

గోనందుడు చేతులు జోడించి (స్వామీ మీరన్నట్టే చేస్తాను దేశంలో నీల మత సంప్రదాయాలను పునరుద్దరిస్తాను సనాతన ధర్మ్శకేతనాన్ని హిమాలయాలపై ఎగరేస్తాను” అన్నాడు

కాలేకాలే ప్రజాపుద్యైః సంభవంతి మహీ భుజః

యైర్మండలస్య క్రియలేదూరో త్సన్న స్య యోజనం' అన్నాడు చంద్రదేవుడు.

(ప్రజల పుజవశము చేత పవిత్రమైన వేద ధర్మాన్ని రక్షించేందుకు ఆయాకాలాల్లో ఎంతో కాలం నుండి ఆగిపోయిన పవీత్ర వైదిక సంప్రదాయాలను పునరుద్దరించేందుకు పాలకులు పుడుతూ ఉంటారు.

మూడవ గోనందుడు చంద్ర దేవుడికి వినమ్రంగా నమస్కరించాడు.

“యే ప్రజాపీడన పరాః

తేవినశ్యంతి సాన్వయాః

నష్టంతు యే యోజయోయుః

తేషాం వంశానుగాశ్రియః అన్నాడు చంద్రదేవుడు. (ధర్మవోని చేయటం వల్ల (ప్రజా పీడన చేసే రాజులు వంశంతో సహా నశిస్తారు. ధర్మయోజన చేసే రాజుల వంశాలలో జన్మించినవారు శ్రీమంతులై ఉంటారు) నరుని వలన కళ్ళీరానికి సంభవించే విపత్తు అవగతమయింది మూడవ గోనందుడికి. మూడవ గోనందుడే కాదు ప్రజలంతా చంద్ర దేవుడికి ప్రణమిల్లారు. “ఇత్యేతశ్ష్రత్తి వృత్తాంతం దేశేస్మిన్‌ వీక్ష్య లక్షణం భావినాం భూమి పాలానాం ట్రాజ్జైెర్టే యం శుభాశుభం”* రాబోయే తరతరాల పాలకులకు మార్గదర్శనం చేశాడు చంద్రదేవుడు. (ఈ విధముగా ఈ దేశంలోని ప్రతి రాజ వృత్తాంతంలో ఉన్న ఈ లక్షణాన్ని గమనించి భవిష్యత్తులో పాలకులంతా విజ్ఞతతో శుభాశుభాలను తెలుసుకోవాలి) ఇదీ చరిత్ర జ్ఞాన పరమార్ధం. ఈ కధ కలియుగాది నుండి 1955వ సంవత్సరం అంటే క్రీ.పూ 1147 నాటిది. శశ ఈ :జ=జు. ట్ర క2తజడడకడడదడడుడడడడడడ2డడకనడడడడుడవవ జజ. కస్తూరి మురళీకృష్ణ ===

రూ ర చా వ గతీ | 1! వు కెన్నరుని కోరిక

అరుదెంచుతున్న ఉషారాణికి స్వాగత వచనాలు పలుకుతున్న ద్విజ సమూహాల కిలకిల నాదాలతో జగతి పులకరిస్తోంది.

ఆ కిలకిల నాదాలు హింకార, స్తనిత, పూతృత నాదాల కలగలుపు కలకలంలా వినిపించి కిన్నర మహారాజును ఉద్రేకపరుస్తున్నాయి. అతని కళ్ళముందు చంద్రలేఖ వదనం అనేక భంగిమలలో మెరుపులా మెరిసి మాయమవుతూ ఉంది.

పక్షుల కలకల నాదాలలో రతి కూజితాలను సీతృతాలను దర్శించి కాబోలు సూర్యదేవుడు వడివడిగా ఏడు రంగులు పూన్చిన రథారోహణం చేసి అత్యుత్సాహంతో ఉషారాణిని వెంబడిస్తూ అకాశమార్ధాన వేగంగా పయనమయ్యాడు. సూర్యదేవుని రథాలు స్పృశించిన చోట తనువెల్ల పులకరించగా ఆకాశం ఎర్రబడసాగింది.

'ఆ ఎరుపు దోసిళ్ళలో పట్టి చంద్రలేఖ పాదాలకు పారాణిలా పూయని తన జన్మ ఒక జన్మమేనా?”' అనుకున్నాడు కిన్నర మహారాజు. దడతఉఊ కల్పణ కళ్ళ్శీర రాజతరంగిణి కథలు 224 65 =

ఏనాడూ లేదు. ఈనాడు ప్రకృతి అణువణువూ కిన్నర మహారాజుకు స్రీ పురుష సంయోగ క్రియకు ప్రతీకాత్మతంగా గోచరిస్తూ ఉద్రేకపరుస్తోంది. చూసేవి కన్నులయినా, చూపించేది మనసే! కిన్నర మహారాజు మనసు నిందా చంద్రలేఖ రూపం నిండి ఉంది. అతని అణువణువూ చంద్రలేఖ సంగమానికై ఉవ్విళ్ళూరుతోంది. పగలు లేదు. రాత్రి లేదు, సమయం లేదు, సందర్భం లేదు, సర్వజగత్తు ప్రీ పురుష సంయోగం తప్ప, అదీ చంద్రలేఖ, కిన్నరుల సంయోగం తప్ప మరొకటి లేదనిపిస్తోంది కిన్నర మహారాజుకు. కిన్నరుడు తాళలేకపోతున్నాడు. అణువణువునా రుధిరం చెలియలికట్ట దాటాలన్న ఉత్సాహంతో తీరాన్ని ఢీకొనే కల్లోల తరంగిత సముద్రంలా పరవళ్ళు తొక్కుతోంది. ఇంకాస్సేపటిలో చంద్రలేఖ తన బాహువుల్లో ఉంటుంది. ఆ ఆలోచన అతడిని నిలువనీయటం లేదు. కిన్నరుడి కోరిక తీరేందుకు ఇంకా ఎంతో సమయం లేదు అనుకున్నాడు కిన్నర మహారాజు. అది కల్యాది నుండి 2150 సంవత్సరము అంటీ క్రీ.పూ 952 సం॥ కళ్ళీరాన్ని కిన్నరుడనే నామాంతరం కల నరమహారాజు రాజ్యం చేస్తూ దాదాపుగా 39 సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి కావస్తోంది. కిన్నరుడు గోనంద వంశానికి చెందినవాడు. కలియుగాది 1955వ సంవత్సరం అంటే క్రీ.పూ 1147 నుండి కళ్ళీరంలో గోనంద వంశపాలన మూడవ గోనందుడితో ఆరంభమయింది. గోనందుడు 35 సం॥ ధర్మంగా పాలించాడు. ఆయన తరువాత అతని కుమారుడు విభీషణుడు 35 సంలు పాలించాదు. అతని పుత్రుడే కిన్నరుడు. కిన్నరుని భార్య మవా అందగత్తె, కిన్నర (గ్రామంలోని ఒక బౌద్దమఠంలో నివసించే బౌద్దుడు యోగశక్తితో కిన్నరుని భార్యను అపహరించాడు. దానితో కోపోద్రిక్తుడైన కిన్నరుడు వేలకొలది బౌద్ద విహారాలను కాల్పించాడు. బౌద్దుల స్వతంత్ర గ్రామాలను ఆక్రమించుకొని అవన్నీ బ్రాహ్మణులకు అర్పణం చేశాడు. అయితే కేవలం ఒక్క బౌద్దుడి కామం వలన అమాయకులైన వేలకొలది పౌద్దులకు కలిగిన దుష్ఫలితాలను గ్రహించి తన మది నుండి కామాన్ని వెడలగొట్టి ధర్మబద్ధంగా జీవించసాగాడు. కిన్నరుడు గంధర్వుల తలదన్నే నగరాన్ని నిర్మించాడు. అతను దిగ్విజయాలలో సంపాదించిన ధనం ముందు కుబేరుని ఆస్తి వెలతెలపోయింది. కిన్నరుదు నిర్మించిన పట్టణంలో రాజ మార్గంలోని అంగళ్ళు చిత్ర విచిత్ర వస్తు వ్రదర్శనాలయాలుగా అలరారేవి. ప్రతి రోజూ కళ్ళీరంలో నౌకాయానాలు జరిగేవి. పుష్పఫలాలతో నిండిన వృక్ష సమూహాలతో ఆ నగరం భూలోక స్వర్గంలా భాసిల్లేది. అయితే ఒకనాడు కిన్నరుడు తన భవన ప్రాంగణంలో నుంచుని సాయం ప్రకృతి విన్యాసాలను వీక్షిస్తున సమయంలో ఒక మెరుపు దారి మరచి ఆకాశంలో బదులు భూమిమీద మెరసినట్టుతోచింది. అబ్బురంతో ఆవైపు చూశాడు కిన్నరుడు. ననన సి మురళీకృష్ణ 2222న

అతనికప్పుడు కనిపించిన దృశ్యం ఆతడిని ఈనాటికీ వెన్నాడుతోంది. కిన్నరుడు నడిచే మెరుపును చూశాడు. ఒక విద్యుత్తటిల్లత వయ్యారంగా, వాలు చూపులతో, వికసించిన యవ్వనంతో, మందగమనంతో కదలటం చూశాడు. కిన్నరుడు తనని తాను మరచిపోయాడు. బంగారు వన్నె కల శరీరము, ఎర్రగా ఉన్న అధరోష్టము, చంద్రుని వన్నె కలిగిన మోము, కర్పూర తిలక పరాగం వల్ల తెల్లనైన లలాటాకాశంలో మేఘల్లా తేలి ఆడే వీలాలకలు, మన్మధుడు పెద్ద విల్లుని గురి కుదిరేంత వరకూ అల్లె తాటికి ధనుర్దండానికీ మధ్య ఎక్కుపెట్టి లాగుతున్న కలువ బాణాల వంటి కడగంటి చూపులూ, తామరతూడుల వంటి బాహువులూ కిన్నరుడిని ఫిచ్చివాడిని చేశాయి. ఆమె దారి వెంట మొలచిన చెట్లు పూచిన పుష్పాలు, ఆమె పాదస్పర్శకు పుడమి తనువు పులకలెత్తినట్లు తోస్తోంది. ఆమె అడుగుతీసి అడుగు వేస్తున్నది భూమి మీద కాదు తన హృదయం మీద అనిపించింది కిన్నరుడికి. ఆ భావం రావటంతోటే అతని శరీరం సమస్తం పులకాంకితమయింది. అనాటి నుండి కిన్నరుడికి ఆమె స్మరణ తప్ప మరో ధ్యాన లేదు. ఇన్నాళ్ళూ తొక్కిపెట్టినట్టువంటి కామ భావనలు కట్టు తెగిన ప్రవాహంలా ఒక్కసారిగా విజృంభించి అతడిని ముంచెత్తసాగాయి. కిన్నరుడు ఉక్కిరి బిక్కిరి అవసాగాడు. “ఎవరామె?” తెలుసుకోమని చారులను పంపించాడు. “అమె పేరు చంద్రలేఖ విశాఖుని ధర్మపత్ని నివేదిక అందింది. చారుల ద్వారా విశాఖుని జీవిత కథ తెలుసుకున్నాడు కిన్నరుడు. విశాఖుడు ఒకనాడు ఉద్యాన వనంలో వివారిన్తూంటే దేవతల తలదన్నే సౌందర్యవతులిద్దరు సరస్సున మొలచిన గడ్డి గింజలను తినటం చూసి ఆశ్యర్యపడి, వారిని వారించి వారికి తన భోజనాన్ని అర్చించాడు. వారు సుభ్రవసుడనే నాగదేవత పుత్రికలు ఇరావతి, చంద్రలేఖలని మాటల్లో గ్రహించాడు ఇదావతికి విద్యాధర రాజుతో వివాహం నిశ్చయమయిందని తెలుసుకున్నాడు. ప్రధమ వీక్షణంలోనే చంద్రలేఖ సౌందర్యం అతడిని ఆకర్షించింది. అంత సొందర్యవతులు దుర్భర దారిద్య్యంతో గడ్డి గింజలను తినేందుకు కొరణం అడిగాడు విశాఖుడు. దానికి వారు నిట్టూర్చి జ్యేష్ట మాస కృష్ణ ద్వాదశి నాడు జరిగే తక్షక యాత్ర మహోత్సవంలో తమ తండ్రి సుశ్రవ నాగరాజుని కలసి, ఆయన ద్వారా విషయం గ్రహించమని చెప్పారు. వారు చెప్పినట్టే విశాఖుడు సుశవసుడిని కలిశాడు. 'వేద మంత్రాలతో ఆగ్రయణముచేసి భుజింపని పంటలను మేము తాకము. ఈ దేశంలో ప్రజలు మమ్మల్ని మరచి ఆగ్రయణం చేయకుండా భుజిస్తున్నారు. అందుకని రుచికర భోజన ప్రాప్తి లేక గడ్డి గింజలను తిని బ్రతుకుతున్నాము” విచారంగా చెప్పాడు సుశ్రవసుడు. ఊఉ కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు == 67. ==

అది విని విశాఖుడు ఆగ్రయణం చేసి భుజించాడు. వెంటనే సుశ్రవసుడు వడగళ్ళ వాన కురిపించి పంటలను పండించి తనివి తీరా తృప్తిగా భుజించాడు. విశాఖుడిని నాగ లోకానికి తీసుకువెళ్ళి అతిధి మర్యాదలు చేసి, తన పుత్రిక చంద్రలేఖనిచ్చి వివాహం చేశాడు. ఆ చంద్రేలేఖనే నరమహారాజు నేడు మోహించాడు. కధ విని నిట్టూర్చాడు కిన్నరుడు. కధ నమ్మశక్యంగా లేదు. కానీ చంద్రలేఖ సౌందర్యం సామాన్య మానవుల సౌందర్యం కాదు. అది దేవతా స్త్రీల సౌందర్యం. మహారాజు ఆలోచనా ధోరణిని (గ్రహించిన మంత్రి మహారాజును వారించాడు. “మహారాజా, అన్య కాంతలను మాతృభావంతో చూడాలి. పైగా రాజు (ప్రజలకు తండ్రి వంటివాడు. తమరు చంద్రలేఖను మోహించటం తండ్రి కూతురును మోహించటం వంటిదే. అది తమవంటి విజ్ఞానవంతులకు తగని పని” అని నచ్చచెప్పాడు. మంత్రి మాటలలోని నిజం (గ్రహించిన మహారాజు చంద్రలేఖ నుండి మనసు మళ్ళించాలని ప్రయత్నించాడు. కానీ తనను తాను మరచిపోయినా చంద్రలేఖను మరవటం దుస్సాధ్యం అని గ్రహించాడు. చివరికి ఉండలేక చంద్రలేఖకు అనేక సందేశాలు రహస్యంగా పంపించాడు. ఒక ఆకు కదిలితే అది చంద్రలేఖ ఆగమనానికి సంకేతం అనుకున్నాడు. ఆకాశంలో కదిలే మబ్బులు చంద్రలేఖ పంపిన సంకేతాలను మోసుకువస్తున్నాయని ఆశగా ఎదురు చూడసాగాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు. తన బాధ తెలిసి తనను కనికరించి చంద్రలేఖ వస్తోందని పరుగులు తీసేవాడు. అతనికి ప్రతి యువతి, ప్రీ, రాయి, చెట్టు, పుట్ట, సర్వం చంద్రలేఖ మయంగా కనిపించేది. కానీ చంద్రలేఖ నుండి సమాధానం లేదు. చంద్రలేఖ మౌనం ఆమెపై నరుని వ్యామోహాన్ని రెట్టింపు చేయసాగింది. ఇంతలో రాజ్యమంతా ఒక విచిత్ర వార్త వ్యాపించింది. చంద్రలేఖ హస్తముద్ర గుజ్జం వీపుపై బంగారు హస్తముద్రగా కనిపిస్తోందన్న వార్త వినగానే రాజు పరుగులెత్తి ఆ విచిత్రాన్ని చూశాడు. హస్త ముద్ర చూడగానే అతని హృదయం ర్ఫుల్లుమంది. అది చం(ద్రలేఖ సుందర సుకుమార కరముద్ర తప్పించి మరొకటి కాదని అతని హృదయానికి తెలిసిపోయింది. అది చూసిన మహారాజుకు చంద్రలేఖ వాంఛ వ్యాధి ద్విగుణికృతమయింది. సిగ్గు విడిచి విశాఖునికి కబురు పంపాడు. విశాఖుని చూడగానే మహారాజు హృదయం భగ్గుమంది. విశాఖుడు చంద్రలేఖకు సరిజోడి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వ్యక్తికి చంద్రలేఖపై సర్వాధికారాలున్నాయన్న భావన మహారాజు మదిలో ముల్లులా గుచ్చుకుంది. చంద్రలేఖ చిరునవ్వులు, అలకలు, సంతోషాలు అన్నీ విశాఖుని స్వంతం అన్న భావన అతని మదిని తొలిచివేయసాగింది. ఊఊ రీ 233333. కస్తూరి మురళీకృష్ణ ===

విశాఖుడు చేతులు జోడించి మహారాజుకు నమస్కరించాడు. ఈ చేతులు చంద్రలేఖ తనువుపైన ఎన్నిమార్లు, ఎంత (ప్రేమగా స్పృశించి ఉంటాయో? చంద్రలేఖ వదనం మందార పువ్వులా ఈ రెండు చేతుల మధ్య ఎన్నిమార్లు ఒదిగి ఉంటుందో?

విఖాఖుడి హస్తాలను నరికి వేయాలన్న కసి కలిగింది మహారాజుకు. నర మహారాజు తనలో చెలరేగుతున్న అసూయా జ్వాలలను అదుపులో పెట్టలేకపోయాడు. విశాఖుడిని తనకు చంద్రలేఖను అప్పగించమని అభ్యర్థించాడు.

విశాఖుడు చిరునవ్వు నవ్వి 'తమకిది తగదు మహారాజా” అన్నాడు.

“ఎన్ని మార్లు ఈ స్వరం చంద్రలేఖను లాలనగా, (ప్రేమగా బుజ్జగించి ఉంటుందో! ఆర్తిగా పలకరించి ఉంటుందో!'"అన్న ఆలోచన మహారాజు మదిలో మెదిలింది. వెంటనే అసూయ జ్వాలలు ఆకాశానికి ఎగసాయి.

'నిన్నీ క్షణానే చెలసాలలో బంధించి, చంద్రలేఖని స్వంతం చేసుకుంటాను' బెదిరించాడు మహారాజు.

విశాఖుడు బెదరలేదు. “మహారాజు! తమరు సకల సద్గుణవంతులు. మీలో ఈ దుర్చుద్ధి జనించటం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. పరాయి స్రీని వాంఛించి లంకకు చేటు తెచ్చిన రావణాసురుని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ కోసం కాకపోయినా కళ్ళ్మీర ప్రజల క్షేమం కోరి మీ మనస్సును అదుపులో పెట్టుకోండి. విజ్ఞానం సారధిగా మనస్సుపై కళ్ళెం బిగించండి. చంద్రలేఖ సౌందర్యంపై మీ వ్యామోహం క్షణికమైనది. దాన్ని జయించండి. అంతకన్నా పరమాద్భుత సౌందర్యం సృష్టి అంతా వెదలజల్లబడి ఉన్న విశ్వాత్మది. మీ దృష్టిని ఆ సౌందర్యంపై కేంద్రీకరించండి చెప్పాడు విశాఖుడు.

నరమహారాజు బెదిరింపు మాని మళ్ళీ బ్రతిమిలాడాడు. మళ్ళీ బెదిరించాడు. కానీ విశాఖుడి సమాధానం మారలేదు.

చివరికి విసిగి నరమవోారాజు *“విశాఖా, తెల్లవారేలోగా చంద్రలేఖను నాకు అప్పగించకపోతే నేను నా సైన్యంతో నీ ఇంటిపై దండెత్తి, నిన్ను సంహరించి చంద్రలేఖను తెచ్చుకుంటాను" అని బెదిరించాడు.

విశాఖుడు మౌనంగా వెళ్ళిపోతూ, ఒక్కసారి మహారాజు వైపు తిరిగి, 'మహారాజా, మీ భార్యను అపహరించాడన్న కోపంతో బౌద్ద ఆరామాలను ధ్వంసం చేశారు మీరు. నా భార్యను అపహరించాలన్న ఆలోచనే కశ్మీర విధ్వంసానికి కారణమవుతుంది. రాజుకో నీతి 'ప్రజలకో నీతి కాదు. తప్పుచేసిన సామాన్య పౌరుడి కన్నా తప్పుటాలోచన చేసిన రాజు మరెక్కువ శిక్షార్డుడుూ అని వెళ్ళిపోయాడు. నా కళ్ళీర రాజతరంగిణి కధలు :2332222ఊ2ఊ2ఊ2డకడడడడడడడ22222424ఊ4ఊ42ఊ2ఊు 69 ==

మహారాజు కుతకుత థఉడికిపోయాడు. మహారాజును శాంతింప చేయాలని మంత్రి చేసిన 'ప్రయత్నాలు ఫలించలేదు. “ప్రభూ, నియమం నాగరికత. అతి బలవంతులైన సూర్య చంద్రులు తమని తాము నియంత్రించుకుని నియమం పాటిస్తున్నారు. వారు నియమం ఉల్లంఘిస్తే జగత్తు సర్వనాశనం అవుతుంది. అలాగే సముద్రుడు కూడా తనని తాను నియంత్రించుకుని చెలియలి కట్ట దాటడు ప్రభూ. సముద్రుడు చెలియలి కట్ట దాటితే జగత్తు జలమయం అవుతుంది. చెలియలి కట్ట దాటితే సముద్రం కన్నా జగళతికే నష్టం ఎక్కువ. అలాగే మీరు నియమం దాటిజే మీకన్నా ప్రజలే ఎక్కున నష్టపోతారు ప్రభూ. “నియమం, నియమం, నియమరి గట్టిగా అరిచాడు నరమహారాజు. “ఎవరు విధించిన నియమం ఇది? నాకీ నియమాలతో పని లేదు. నాకు చంద్రలేఖ కావాలి. తక్షణం మీరు నా ముందు నుంచి వెళ్ళిపోండి? అని మంత్రిని పంపించేశాడు. నీతులూ, సూక్తులూ, మహారాజుకు నచ్చట్లేదు. అవును, తన ఆలోచనల్లో తప్పేముంది? స్త్రీ పురుష సంయోగం ప్రాకృతికం, ప్రకృతిని నియంత్రించేదెవరు? సృష్టి దైవకల్పన. ఆలోచనలు దైవ సంకల్పితాలు. దైవం కల్పించిన ఆలోచనలలో దోషం ఏముంటుంది? ఈ విధంగా తన ఆలోచనలను సమర్ధించుకోసాగాడు మహారాజు. తెల్లవారి విశాఖుడు చంద్రలేఖను తెచ్చి అప్పగిస్తాడా? లేదా? అన్న ఆలోచన అతడిని వేధించసాగింది. రాత్రే పారిపోతే? వెంటనే సేనాపతిని పిలిపించాడు. 'ఈ అర్థరాత్రి, ఈ క్షణానే విశాఖుడి ఇల్లు చుట్టుముట్టండి. విశాఖుడిని చంపైనా సరే చంద్రలేఖను పట్టుకురండి. అడ్డువచ్చిన వారిని చంపి పారెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచీ మహారాజు కలల్లో తేలిపోసాగాడు. తెల్లవారేసరికి చంద్రలేఖ తన బాహువుల్లో ఉంటుంది. ప్రకృతి తమ కలయిక కోసం ఎదురు చూస్తున్నట్లు కనబడుతోంది నరమహారాజుకు. సూర్యోదయమై సూర్యుడి ప్రకాశం పెరుగుతూ, అతని కిరణాలు తీక్షణమవుతున్నకొద్దీ మహారాజు వాంఛ తీక్షణమవసాగింది. ఉషారాణిని తనలో కలుపుకున్న సూర్యుడు రెట్టించిన ఉత్సాహంతో వెలుగులు వెదజల్లుతూ తమ కలయిక కోసం పరుగులెత్తి వస్తున్నాడనిపించింది. మహారాజుకు తమ కలయిక చూసి, మనసు చెదిరి సూర్యుడు మరింత వేగంగా సంధ్యారాణి సంగమానికై పరుగులు తీస్తాడనిపించి నవ్వుకోసాగాడు మహారాజు.

వెనుక అడుగుల సవ్వడి వినఐడటంతో ఆలోచనలు మాని వెనుకకు తిరిగి చూశాడు మహారాజు. వెనుక సేనాపతి కనిపించాడు. వాం 70 22న కస్తూరి మురళీకృష్ణ 22222

“ఏదీ చంద్రలేఖి ఆత్భతగా అడిగాడు నరమహారాజు.

“మహారాజా, మేము విశాఖున్ని భవనాన్ని చుట్టుముట్టి అణువణువునా గాలించాం. వారిద్దరూ మన రాకను పసిగట్టి ముందే సొరంగమార్గం గుండా పారిపోయి ఉంటారు ప్రభూ” తలవంచుకుని చెప్పాడు సేనాపతి.

మవోారాజు ఆగ్రహోద(గుడయ్యాడు. “ఒక్కరాత్రిలో ఎంతో దూరం పోలేరు. నలుమూలలా వెతకండి అని పిచ్చిపట్టిన వాడిలా అరిచాడు నరుడు. అంతలో ఒక ఆలోచన వచ్చింది. చంద్రలేఖ ఎక్కడికో ఎందుకు వెళ్తుంది? తన తండ్రి సుశ్రవసుడి సరస్సుకే వెళ్ళి ఉంటుంది. ఆ ఆలోచన రావటంలోటే 'చంద్రలేఖ” అని అరుస్తూ పిచ్చిపట్టిన వాడిలా పరుగెత్తాడు మహారాజు.

కామాంధుడై సిగ్గు విడచి వీధుల్లో పరుగిడుతున్న రాజును అశ్చర్యంతో చూడసాగారు ప్రజలు. ఇంత నిర్లజ్జగా ప్రవర్తిస్తున్న రాజు వల్ల దేశానికి ఎటువంటి కీడు సంభవిస్తుందోనని వణకిపోసాగారు విజ్ఞులు.

“చంద్రలేఖ” అని పిలుస్తూ సుశ్రవసుడి సరస్సును సమీపించసాగాడు మహారాజు. అతని వెంటే సైన్యం యావత్తూ రాసాగింది.

ఇంతలో జరగబోయే ఘోరం చూడలేనట్టు సూర్యుడు మబ్బులచాటుకు వెళ్ళిపోవటంతో మిట్టమధ్యాహ్నమే చీకటైపోయింది. వీచే గాలుల వేగం పెరిగింది.

(ప్రళయారంభానికి సంకేతంగా విడుగులు గర్జించాయి. ఆ గర్జింపు ఘోషకు భయభ్రాంతులై ప్రజలు, సైన్యం, రాజు తలెత్తి ఆకాశం వైపుచూశారు. గతంలో ఒక మెరుపు సౌందర్యం చూసి మైమరచిన రాజు నేడు ఆ మెరుపులో నిబిడీకృతమై ఉన్న తీవ్రతను, మహాభయంకర శక్తిని దర్శించి వణకిపోయాడు.

గర్జించినవి పిడుగులుకావు. తన పుత్రికను అవమానించిన రాజుపై, ఆ రాజు పాలనలో ఉన్న ప్రజలపై కోపం వహించిన సుశ్రవసుడు తోకపై నిలుచుండి మహా భయంకరమైన మేఘాల నుండి పిడుగులు పడ్డట్టు గర్జించాడు. ఆ గర్జింపుకు కళశ్మీరం కదలిపోయింది కొండల పైని రాళ్ళు పగిలిపోయాయి. భూమి కదలిపోయింది. అదుపు తప్పిన అవేశంతో 'ప్రతీకారాగ్ని ప్రజ్వలిస్తూండగా సుఢ్రవసుడు పిడుగులు సృష్టించి కళ్మీరంపై విసిరివేయసాగాడు.

అగ్ని పిడుగుల వేడికి సగం జనులు మాడిపోయారు. నరమహారాజు కామం అవిరై గాలిలో కలసి పోయింది. కామాగ్నిలో చంద్రలేఖ పరిరంభానికై ఉవ్విళ్ళూరుతున్న నరమహాధాజు సుశ్రవసుడి ప్రతీకారాగ్ని కౌగిలిలో దగ్ధమైపోయాడు. కళ్ళు మూసి తెరిచేలోగా పట్టణం సర్వం నేలమట్టమై పోయింది. ఆకాశాన్నంటే భవంతులు బూడిదైపోయాయి. నా కల్దణ కళశ్ళ్శీర రాజతరంగిణి కధలు 2222222222 1 22

భయంతో హాహాకారాలు చేస్తూ (ప్రజలు దిక్కుతోచక పరుగిదసాగారు. వేలాదిమంది శరణుకోరుతూ చక్రధర దేవాలయంలో తలదాచుకున్నారు. కానీ ఆ రోజు చతక్రధరుడు కూడా వారి మొర వినలేదు. అదుపుతప్పిన కామంతో నియమోల్లంఘనం చేసిన పాపానికి క్షమలేదని నిరూపిస్తూ సుశ్రవసుడు విసిరిన పిడుగుపాటుకు రెండు ఘడియలలో చక్రధర దేవాలయం, అందులోంచి ప్రజలు మాడి మసే పోయారు. రాజు తప్పిదం బాధ్యత నుంచి ప్రజలు తప్పించుకోలేరని మరోమారు చరిత్రలో బుజువయింది. సుశ్రవసుని సోదరి రమణ్యా, సోదరునికి సహాయం చేసేందుకు పెద్దపెద్ద కొడలనుండి రాతి గుండ్లు విరిచి పట్టణాలపై, పల్లెలపై విసిరి వేయసాగింది. ఆ బండలు పడ్డ అయిదు ఆమడల వైశాల్యం వరకూ గ్రామాలు అరణ్యాలుగా మారిపోయాయి. అందమైన హర్య్యాలతో, కన్నుల కింపైన వనాలతో, వివిధ సంపదలతో అలరారిన కిన్నరుని నగరం క్షణంలో నాశనమైపోయింది. విరిగిన మేడలతో, కాలిన మాంసపు ముద్దలతో, వెదజల్లబడిన మానవ అంగాలతో స్మశానం కన్నా భీభత్సమై పీనుగుల దిబ్బ అయిపోయింది కిన్నర నగరం. కాలిన అసంభ్యాకమైన మనుష్యుల నుండి కారిన కొవ్వుతో,రక్తాలతో విత్తస్తానది జలాలు తెట్టెలు కట్టాయి. ఎన్నో సంవత్సరాలపాటు ఎందరో శ్రమించి, నిర్మించిన కళ్ళీరం ఒకరాజు కామాగ్గికి దగ్జ్గమై క్షణంలో బూడిద అయిపోయింది. కళ్ళీరాన్ని బూడిద చేసిన సుత్రవసుడు ఆ పట్టణ సరోవరం వదలి తన కూతురు, అల్లుళ్ళతో కలసి జన సంచారానికి దూరంగా, కొండల మధ్య ఉన్న సరోవరం చేరాడు. తన అల్లుడిని కూడా నాగునిగా మార్చి మరో సరోవరంలో అతడికి భవంతిని నిర్మించి ఇచ్చాడు. ఇప్పటికీ అమరనాథ్‌ యాత్రికులు 'సుశ్రవనాగ్‌, 'జామానాగ్‌” అనే పేర్లు కల ఈ సరోవరాలను దర్శిస్తారు. సుశ్రవుని సోదరి రమణ్యా, విసిరిన బండల వల్ల పెద్ద పెద్ద కొండగుళ్ళు బిలాలు కలిగిన 'రమణ్యాటడవి" ఏర్పడింది. ఇప్పుడీ అడివిని '6మ్‌ ఆడు” అంటారు. అయితే గోనంద వంశం అంతటితో అంతరించలేదు. కిన్నర మహారాజు కుమారులలో 'సిద్దుడు' అనేవాడిని అతని తల్లి విజయక్షేత్రమనే క్షేత్రంలో దాచి ఉంచింది. సిద్దుడు తన తండ్రి విచక్షణ రహిత కామవాంఛ వల్ల వాటిల్లిన అపార నష్టాన్ని గ్రహించాడు. తన తండ్రి వృత్తాంతం అతనికి జ్ఞానాన్ని బోధించి, పుణ్యోపదేశం చేసింది. దాంతో సిద్దుడు తన మనస్సు మలినం కాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రింబవళ్ళు పరమశివుని ధ్యానంలో గడుపుతూ, నిష్కామంగా రాజ్యాన్ని పాలించటమనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. 222 72. 2222222222 కస్తూరి మురళీకృష్ణ నా

ఆయన నేలమట్టమయిన కళ్ళీరాన్ని పునర్నిర్మించాడు. నిరంతరం శివనామ జపం చేసే మహారాజుకు తగిన తోడు అతని భార్య రాజశ్రీ. ఇరువురు ధర్మం తప్పకుండా జీవిస్తూ, కళ్ళీరానికి పూర్వ వైభావాన్ని సంతరించారు. తమ పూర్వీకుల జీవితాల నుండి గుణపారాల నేర్చుకున్న వారే ధన్యజీవులని సిద్దుడి జీవితం నిరూపిస్తుంది.

ఆయన అరవై ఏళ్ళు ధర్మంగా రాజ్యపాలన చేసి సశరీరంగా శివలోక ప్రాప్తిని పొందాడు.

కిన్నర మహారాజును ఆశ్రయించిన సేవకులు ఆయనను ఆశ్రయించి నశించారు. ఆయన కుమారుడు సిద్దుడిని ఆశ్రయించిన సేవకులు భువన వంద్యులయ్యారు. అందుకే 'యధారాజా తధా ప్రజా” అంటారు.

యాత్సుణ్రితః వెల సమాశ్రయణీలభ్యం

నింద్యాం గతిం జగతి సర్వ జనార్చితాం వా

గచ్చతధః తృణగుణః శ్రత కూప యం(్రః

పుష్పోశ్రయీ సురశిరోభువి రూఢి మేలి

దారం బావి గిలకను చేరి అధోగతిని పొందుతుంది. అదే పుష్పాన్ని ఆశ్రయిస్తే దేవతల శిరస్సుపై వెలుస్తుంది. అలాగే మానవులు తాము ఆశ్రయించిన వారి గుణదోషాలను అనుసరించి ఊర్ధ్వ ఆధోగతులకు పోతారు.

న

=== కల్టణ కళ్ళ్శీర రాజతరంగిణి కధలు 2౭22222 73 నడ

౮ సా. ఖే గ్‌ [టా షమ స్‌ ఓ! కా అజిత సింహుడి ఆత్మార్పణం అది కళ్ళీరాన్ని అంధ యుధిస్టిరుడు పరిపాలిస్తున్న రోజులు. కలియుగాది నుండి 2,830 సంవత్సరాలు గడిచాయి. అంటే దాదాపుగా క్రీ.పూ. 284వ సంవత్సరం. కిన్నరుడి స్రీవాంఛ ఫలితంగా దగ్ధమైన కళ్ళీరాన్ని సిద్దమహారాజు పునర్నిర్మించాడు. ఆయన తరువాత ఉత్పలాక్షుడు 30 సంవత్సరాల ఆరునెలలు, హిరణ్యాక్షుడు 46 సంవత్సరాల ఆరునెలలు, హిరణ్యకుడు 51 సంవత్సరాలు, వసుకులుడు 60 సంవత్సరాలు వరుసగా పాలించారు. దక్షిణాదిన ఉన్న యమునికి పోటీగా ఉత్తరాదిన మరో యముడు వెలిశాడనిపించేట్టు వసుకులుని కుమారుడు మిహిరకులుడు కళశ్మీరాన్ని పాలించాడు. ఆయన చర్యలు పరమ క్రూరంగా, కిరాతకంగా కనిపించినా, దేశం నుంచి మ్లేచ్చ మూకలను నిర్ణయగా తరిమి తరిమికొట్టిన మహావీరుడు, దేశభక్తుడు మిహిరకులుడు. ఆయన శ్రీలంక రాజును ఓడించి తెచ్చి తన భార్య పాదాల మీద పడేసిన మహాశూరుడు. మిహిరకులుని పాలనలో *ద్రోహం' అన్న పదాన్ని తలపుకు తెచ్చుకునేందుకే ప్రజలు గడగడలాడిపోయారు. 2 టి 2కకడకతడకనకడకడకడతతత2త2త2 కస్తూరి మురళీకృష్ణ నా.

గ్రీష్మ బుతువు వెంటనే చల్లని వర్షబుతువు వచ్చి సేద తీర్చినట్టు మిహిరకులుని తరువాత అతని కుమారుడు బక మహారాజు జనాహ్హాదకరంగా రాజ్యపాలన చేశాడు. ఆయన కాలంలో ధర్మం ప్రవాసం నుండి తిరిగి వచ్చి కశ్మీరంలో స్థిరపడింది. బకుడు 63 సంవత్సరాల 18 రోజులు పాలించాడు. బకుడి కుమారుడు క్షితినందుడు 380 సంవత్సరాలు, అతని కుమారుడు వసునందుడు 52 సంవత్సరాల రెండు నెలలు పాలించారు. వసునందుని తరువాత రాజైన నరమహారాజు 60 సంవత్సరాలు, ఆయన కుమారుడు అక్షుడు 60 సంవత్సరాలు కళ్ళీరాన్ని పాలించారు.

అక్షుని కుమారుడు గోపాదిత్యుడి పాలన కృతయుగాన్ని తలపుకు తెస్తుంది. ఆయన భారతదేశం నలుమూలల నుండి పవిత్ర బ్రాహ్మణులను కళ్ళీరానికి రప్పించి వళశ్చికాది గ్రామాల్లో నివసింపచేసే వైదిక ధర్మానికి స్వచ్చమైన పురాతన వైభవాన్ని సంతరింపచేశాడు. ఈయన కళ్ళీరాన్ని 60 సంవత్సరాల ఆరు రోజులు పాలించాడు.

గోపాదిత్యుడి కుమారుడు గోకర్టుడు 57 సంవత్సరాల 11 నెలలు కళ్ళీరాన్ని పాలించాడు. అతని కుమారుడు నరేంధద్రాదిత్యుడు 36 నంవత్సరాల 100 రోజులు పాలించి దివంగతుడయ్యాడు. ఆయన కుమారుడే యుధిష్టరుడు. ప్రస్తుత కళ్శీరరాజు. అతని కళ్ళు చిన్నవిగా ఉండటంతో ప్రజలు ఆయనను అంధ యుధిష్టిరుడు అని పిలిచేవారు.

అంధ యుధిష్టిరుడు తన పూర్వీకులు ఏర్పరచిన బాటలో ఎంతో జాగ్రత్తగా రాజ్యం చేయటం అరంఖించాడు.

యుధిష్టిరుడు రాజ్యానికి వచ్చిన సమయంలోనే మ్లేచ్చులు సరిహద్దులు దాటి కళ్ళ్మీరంలో ప్రవేశించి అల్లకల్లోలం చేయసాగారు.

కళ్ళీరాన్ని అల్లకల్లోలం చేసి రాజును బలహీనరపరచి, తద్వారా రాజుపై ప్రజలకు విశ్వాసం పోయేట్లు చేసి కళ్ళ్మీరాన్ని ఆక్రమించాలని కిరాత, బర్బ్చర, ఉత్తర జ్యోతిష మ్లేచ్చులు పధకం

స్‌ సాగారు. వేశారు. ఆ పధకంలో భాగంగా మిడుతల దండుల్లా మ్లేచ్చులు కళ్శీరంలోకి చొచ్చుకురా 1 వారు కళ్మీరంలో అనేక ప్రాంతాలపై మెరువుదాడులు చేసి ఆస్తినష్టం, (ప్రాణనష్టం కావించి, ప్రజలను భయభ్రాంతులనుచేసి పారిపోతూందేవారు. ఈమ్హేచ్భులు కళ్ళ్మీర రాజధానిలో కూడా అల్లకల్లోలం సృష్టించగలిగేంత పట్టు సంపాయించారు.

వీరు ధనాశ చూపి, బెదిరించి రాజు ఆంతరంగిక సలహాదార్లను తమ వైపు తిప్పుకున్నారు. సలహాదార్లు రాజును అనేక దురలవాట్లకు, అసంస్కృత పద్దతులకు బానిస చేసి, తప్పుమార్గం పట్టించసాగారు.

మ్లేచ్చ మూకలను తరిమి దేశంలో ప్రశాంతతను నెలకొల్పవలసిందిగా పదే పదే (బ్రతిమిలాడిన ఉగ్రసేనుడి మాటలను అంధ యుధిష్టిరుడు పెడచెవిన పెట్టాడు. 'హఊఆ= కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు ::22జజ23ై3ైతతతతతతతతడకకకతకతతతతతతతతతతతతతత2222222డడడ2ఊ ర్‌ తత

కళ్ళ్మీర రాజ్యంలో మ్లేచ్చుల శక్తియుక్తుల గురించి, శౌర్య ప్రతాపాల గురించి ఎటువంటి ప్రచారం జరిగిందంటే రాజ సైన్యం మేచ్చులను ఎదుర్కొనేందుకు భయపడసాగింది. దాంతో మేచ్చ మూకల ప్రవాహానికి కళ్ళ్మీరంలో ఎటువంటి అడ్డంకి లేక నిర్విఘ్నంగా సాగిపోసాగింది. పరిస్టితి ఇలాగే కొనసాగితే కళ్మీరం మ్లేచ్చులకు త్వరలోనే పూర్తిగా హస్తగతమౌతుందని (గ్రహించాడు మంత్రి ఉగ్రసేనుడు.

ఎందుకంటే మ్లేచ్చుల కొన్ని పద్ధతులు సామాన్య ప్రజలకు ఆకర్షణీయంగా కనబడి జనజీవితంలో భాగాలైపోసాగాయి. వారి విచిత్రమైన సంగీతం పట్ల (ప్రజలు అమితంగా అకర్చితులయ్యారు. ఆ సంగీతంలో లయకు తప్ప మాధుర్యానికి ప్రాధాన్యం లేదు. సంగీతం, వ్యక్తి ఎదలో నిద్రాణమైన ఉన్న సున్నిత భావనలను జాగృతం చేసి మనిషి మనీషిగా ఎదిగేట్టు చేయాలన్న భావన కంటే సంగీతం, శరీరానికి ఊపునిచ్చి పాశవికానందాన్ని ప్రకోపించేస్తే, అదే అద్భుతం, అన్న భావన ప్రజలలో నాటుకొంది. సంగీమే కాదు సాహిత్యంతో సహా తదితర కళలన్నీ ఇలాగే భ్రష్టుపట్టి మ్లేచ్చ మయమయిపోయాయి. మ్లేచ్చులలో స్త్రీ, పురుష విషయాల పట్ల ఉన్నటువంటి తుచ్చ భావలన్నీ అద్భుత భావనలుగా 'ప్రచారమయ్యాయి. సనాతన ధర్మాన్ని త్యజించి మ్లేచ్చ పద్దతులను అనుకరించటం ప్రగతి పధంలో పషయనంలా, అభ్యుదయ మార్గంలా ప్రజలు భ్రమపడేట్టు మ్లేచ్చ (పేరేపితులైన రాజ సలహాదార్లు ప్రజలను నమ్మించసాగారు. వారు 'ప్రజలకన్నా ముందే రాజును తమ వైపు తిప్పుకున్నారు.

రాజు సభలో అందరి ముందు మర్శచ్చేదకములగు అశ్లీల పదప్రయోగం ఆరంభించాడు. స్త్రీలతో అతని ప్రవర్తన మిక్కిలి జుగుష్సాకరమై సభ్యత హద్దులు దాటి అసభ్యాకాశంలో స్వేచ్భావిహారం ఆరంభించింది.

ఈ సమయంలో కళ్శీరమనే మాంసపు ముక్కను అపహరించేందుకు ఎదురుచూస్తూ ఆకాశంలో తిరుగుతున్న డేగల్లాగ మ్లేచ్చులు కళ్ళ్మీర సరిహద్దులలో పొంచి ఉన్నారు.

రాజు తన మాటలు వినకపోవటంతో మంత్రి ఉగ్రసేనుడు రాజుతో నిమిత్తం లేకుండా

$నే మ్లేచ్చులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సైన్యాన్ని నియుక్తులను చేయాలని ప్రయత్నించాడు. నినీ సైన్యంలో సగం మంది మ్లేచ్చభక్తులు, మిగతా సగం ప్రాణం మీద తీపి ఉన్నవారు.

దాంతో మ్లేచ్చుల ఆగడాలు మితిమీరిపోయాయి.

ఇటువంటి సమయంలో అజిత సింహుడనే సామాన్యుడు దేశం నుండి మ్లేచ్చులను తరిమేందుకు కంకణం కట్టుకున్నాడు. మహామంత్రిని అనుజ్ఞనిమ్మని అడిగాడు.

'మ్లేచ్చులను తరమగలనని నీకింత నమ్మకం ఏమిటి?” అడిగాడు మంత్రి అజిత సింహుడిని.

“'మంత్రివర్యా నాకు కలలో పరమశివుడు కనిపించాడు. నా భూమిలో జరిగే ఈ అత్యాచారాలను ఎదుర్శొలేనివాడికి తన నామజపం చేసే అర్హత లేదన్నాడు. శివనామ జపం మ 70 :డ3డఊడఊడడడ3ఊ3డఊడ్డడడడడడడడడడనడడడడడడడడడడ వ కస్తూరి మురళీకృష్ణ వడ

చేయనిదే నేను మనజాలను అందుకే మ్లేచ్చులను నిర్జించాలని కంకణం కట్టుకున్నాను. అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు.

మహామంత్రి అజిత సింహుడిని ఆశీర్వదించి అతను కోరినంత మంది సాయుధులైన సైనికులనిచ్చాడు.

కొద్ది మంది సైనికులను వెంట తీసుకుని అజిత సింహుడు మ్లేచ్చులకు పెట్టని కోట వంటి 'తరుణగిరి' పై దాడి చేశాడు. అజిత సింహుడి యుద్ధవ్యూహరచనా పద్దతి మిహిరకులుడి యుద్ద రచనా పద్దతి వంటిదే. ఎంతో సామాన్యమైనది. కానీ అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది.

మ్లేచ్చులు పగళ్ళు పొరుగు రాజ్య పొలిమేరల్లో విశ్రాంతి తీసుకుని రాత్రి కాగానే సరిహద్దు దాటి ఊళ్ళపై విరుచుకుపడేవారు.

అజిత సింహుడు ముందుగా మ్లేచ్చులకు ఆశ్రయమిచ్చే సానుభూతిపరుల వివరాలు సేకరించాడు. మారణకాండ జరిపే ముందు, తరువాత మ్లేచ్చులు ఎవరి ఇళ్ళలో సేద తీరుతున్నారో తెలుసుకున్నాడు. హరాత్తుగా, ఒక తెల్లవారి గుట్టుచప్పుడు కాకుండా అజిత సింహుడు, సైన్యంతో ఆయా ఇళ్ళనుచుట్టుముట్టి, ఇంట్లో మనుషులందరినీ ఊరు అవతలకు తరలించాడు. ఆ సమయంలో ఎవరైనా మ్లేచ్చులు పట్టుబడితే వారిని ప్రత్యేక చెలసాలల్స్‌ ఉంచి, హింసించి, వారి ద్వారా ఇతర మ్లేచ్చుల స్థావరాల గురించిన రహస్యాలు తెలుసుకుని వారిని చంపేసేవాడు. ఆ వెంటనే మ్లేచ్చ మూకల స్థావరాలపై మెరుపుదాడి చేసేవాడు.

మ్లేచ్చ సానుభూతి పరులను కొరడాతో కొట్టి వారి ద్వారా నిజాలు కక్కించి, దేశద్రోహం చేయమన్న వాగ్దానం తీసుకుని వదిలేసేవాడు. అయితే అలా వదిలేసిన వారి కార్యకలాపొలపై నిఘా ఉంచేవాడు. వారు మళ్ళీ మ్లేచ్చులకు సహాయం చేస్తున్నట్టు తోస్తే చాలు నిర్దాక్షిణ్యంగా వారిని చంపేసేవాడు. దాంతో అజిత సింహుడి పేరు వింటే చాలు మ్లేచ్చులే కాదు మ్లేచ్చ సానుభూతిపరులు కూడా గడగడలాడసాగారు.

ఎప్పుడయితే మ్లేచ్చులకు ప్రజల సహకారాలు అందటం తగ్గిపోయిందో అప్పుడే వారి విజయ పరంపరలకు ఆటంకం కలిగింది. ఒక్కసారి అజిత సింహుడు మ్లేచ్చమూకలను తిప్పికొట్టటంతో, మ్లేచ్చులు రాక్షసులు వారినెవ్వరు ఓడించలేరన్న అపోహ ప్రజలలో తొలగింది. ఇదే సమయంలో ఉగ్రసేనుడు, అజిత సింహుడి కలను కాస్త మార్చి ప్రచారం చేశాడు. మ్లేచ్చులను తరిమివేయటంలో శివుడు అజిత సింహుడికి సహాయం చేస్తానని మాటిచ్చాడనీ ప్రచారం చేశాడు.

" చ్లేచ్చులు ఓడిపోతూండటంతో, మ్లేచ్చులు దైవ ప్రేరితులు, వారికి దైవ సహాయం ఉందన్న ప్రచారం వెనుకపడసాగింది. అంతేకాదు మ్లేచ్చుల తుచ్చ దైవశక్తిని తరిమికొట్టగలిగే సనాతన ధర్మసింహం నిదుర లేచిందన్న భావన ప్రజలలో కలిగింది. కడు కల్పణ కళ్ళీర రాజతరంగిణి కథలు 3౭32333222 [7 తత

అజిత సింహుడు గగ్రామంలోంచి మ్లేచ్చులను తరిమివేసిన తరువాత ఆ (గ్రామంలోని ప్రజలనందరినీ సమావేశపరిచాడు. 'ఇది మన మాతృభూమి. తరతరాలుగా మన పూర్వీకుల నుండి మనకు లభిస్తున్న ఆస్తి మన సంస్కృతి. మనకు ఇతర రాజ్యాలను ఆక్రమించి దోచుకోవాలన్న ఆశలేదు. కానీ మనల్ని దోచుకోవాలని మనమీద విరుచుకుపడుతున్న దుష్టులకు లొంగిపోయేంత నిస్తేజులం కాకూడదు. రాజో సైన్యమో వచ్చి మనల్ని రక్షించాలని ఎదురుచూడటం రాజద్రోహమే కాదు, దైవం మనపై ఉంచిన పవిత్ర బాధ్యతను విస్మరించి దైవద్రోహం చేసిన వారము కూడా అవుతాము.

ఇది ద్లైవభూమీ. మన ధర్మం నిలచి ఉన్నంతవరకే ఈ దేశంలో శాంతి సౌభాగ్యాలుంటాయి. ఆ ధర్మాన్ని కాపాడటం కోసమే మనం జన్మించాము. అందుకే ప్రతి పౌరుడూ, ప్రతి వ్యక్తి, స్రీలు, పురుషులు, బాలురు, వృద్దులు అన్న తారతమ్యం లేకుండా అందరూ అన్ని సమయాల్లో ధర్మ రక్షణ కోసం సిద్దంగా ఉండాలి. ధర్మం త్యజించటం ఆత్మహత్యా సదృశం. అందుకే ఎవరో వచ్చి రక్షించాలని ఎదురుచూసే బదులు మనల్ని మనమే రక్షించుకొనే ప్రయత్నం చేయాలి" అని ప్రజలకు ఉద్చోధించి, వారికి శారీరక వ్యాయామాల్లో, యుద్ద విషయాల్లో శిక్షణనిచ్చేందుకు కొందరు సైనికులను ఆ గ్రామంలో ఉంచి మరో గ్రామం నుండి మ్లేచ్చులను తరిమేందుకు వెళ్ళేవాడు.

ఇందువల్ల ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి సుశిక్షుతుడైన సైనికుడిలా అప్రమత్తంగా ఉండేవాడు. మ్లేచ్చులను గ్రామంలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. దాదాపుగా ప్రతి గ్రామం వీరులకాలవాలం అవసాగాయి.

ఇలా ముందుగా సరిహద్దు పరిసర గగ్రామాలన్నిటినీ సుశిక్షుతులైన ప్రజల సైన్యాలతో నింపి అజిత సింహుడు మ్లేచ్చుల వరదకు అడ్డుకట్ట కట్టాడు. అంతేకాదు మ్లేచ్చులకు ఆ(్రయమిస్తున్న పొరుగు రాజ్యాల మేర (గ్రామాల్లో కూడా మెరువుదాడులు చేని 'మ్లేచ్చులకాశ్రయమిస్తే యుద్దం తప్పదని హెచ్చరించి వచ్చాడు. ,

ఆ తరువాత తన దృష్టిని రాజ్యంలో ఇమిడిపోయి జన జీవితంలో ఒక భాగమయిన మ్లేచ్చుల సంహారంపై కేంద్రీకరించాడు అజిత సింహుడు.

అజితసింహుడి విజయ పరంపర చూసి ప్రజల దృష్టిలో కూడా మార్పు వచ్చింది. అజిత సింహుడు, ప్రతిచోటా ప్రజలలో దేశభక్తిని (శ్రేరేపించటమే కాక (ప్రజలకు సనాతన ధర్మంలోని జెన్నత్యం, సనాతన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అవశ్యకత వివరిస్తూ ఉండటంతో అజిత సింహుడు తమని మ్లేచ్చుల బారి నుంచి రక్షించేందుకు వచ్చిన వీరుడిలాగానే కాక తమని ధర్మ మార్గంలో నడిపించేందుకు వచ్చిన ప్రవక్తలా భావించసాగారు (ప్రజలు. మజా ?ద్రీ తతత వాంన కస్తూరి మురళీకృష్ణ మడడన

ఒకచేతిలో కత్తి, మరొక చేతిలో భగవాధ్వజం ధరించిన అజిసింహుడి పటాలు ఊరూర వెలిశాయి ప్రజలు అజిత సింహుడిని దైవ అవతారంలా భావించసాగారు. అతడిని 'ఖడ్గధారి దేవత” అని పిలిచేవారు.

అయితే అజితసింహుడి పరాక్రమాలు, సాహస కృత్యాలు కళ్ళీర రాజు అంధ యుధిష్టిరుడి చుట్టూ చేరిన మ్లేచ్చ భజనపరులకు ఆందోళన కలిగించాయి. వారు అజితసింహుడిని కాదనలేరు అతడు చేస్తున్నది దేశకార్యం. అతడి బోధనలను ఖండించలేరు. అతడు చేస్తున్నవి ఆధ్యాత్మిక బోధనలు. దాంతో వీరంతా ఆలోచించి మహారాజు మనసులో విషబీజం నాటారు.

“మహారాజా, అజిత సింహుడు పైకి దేశభక్తుడిలా నటిస్తున్నాడు. కానీ వాడు రాజద్రోహి. వాడు ప్రజల అభిమానాన్ని చూరగొని, ప్రజలందరినీ తనవైపు తిప్పుకుంటున్నాడు. ప్రజలందరికీ సైనిక శిక్షణ ఇస్తున్నాడు. ఇదంతా ఏదో ఒక రోజు తమమీద తిరుగుబాటు లేవదీసేందుకే ప్రభూ' అని వారు మహారాజు చెవిలో నూరిపోయసాగారు.

ఆరంభంలో మహారాజు వీరి మాటలు నమ్మలేదు. ఎందుకంటే అజిత సింహుడికి సత్కారాలు చేసే సమయంలో అతడి రాజభక్తి మహారాజుమనసుకు తోచింది. కానీ దెబ్బపై దెబ్బ పడుతూంటే బండరాయి కూడా ముక్కలు కాక తప్పదు. అంధ యుధిష్టిరుడో లేజ్ఞా?

“ఏ నేరం (క్రింద అజిత సింహుడిని బంధించవచ్చు?' ఈ ప్రశ్న రాజునే కాదు, రాజు అంతరంగిక సలహాదార్లయిన మ్లేచ్చులను కూడా వేధించసాగింది.

ఇంతలో రాజుకోవార్త అందింది. 'దేశంపై మిడుతల దండులా దాడిచేసిన మ్లేచ్చ మూకలను తరిమికొట్టి అజిత సింహుడు రాజధానికి వస్తున్నాడు.

ఈ వార్తవిని రాజధానిలో మారువేషాల్లో ఉన్న మ్లేచ్చులు గడగడలాడసాగారు. అజితసింహుడు రాజధాని చేరితే తమ ఆట కట్టినట్టే అని వారు గ్రహించారు. ఎలాగయినా అజిత సింహుడు రాజధాని చేరేలోగా అతడిని సంహరించాలి. లేదా రాజధాని చేరగానే అతడిని చెరసాల పంపే ఏర్పాటు చేయాలి అని ఆలోచించసాగారు.

అన్ని అద్దువచ్చిన ప్రతి వస్తువునూ భస్మం చేసినట్టు అజిత సింహుడు తనపై హత్యా ప్రయత్నాలు చేసే వారిని సంహరించాడు. సంహరించే ముందు వారినెవరు ఈ పని చేసేందుకు ప్రేరేపించారో తెలుసుకున్నాడు.

అజిత సింహుడిపై హత్యా ప్రయత్నాలు నెరవేరకపోవటంతో రాజధానిలోని మ్లేచ్చులు రాత్రికి రాత్రే దేశం వదలి పారిపోయేందుకు సిద్దమవసాగారు.

ఇంతలో కళ్శ్మీరంలో దురదృష్టం తలెత్తింది. ఒక అనాధ మూగ బాలుడు రాజధానిలో సంచరించసాగాడు. చారులు ఆ బాలుడి వివరాలు సేకరించారు. ఆ బాలుడు తరుణగిరికి నా! కల్దణ కశ్మీర రాజతరంగిణి కధలు :2ై2డ222తతతడడడడడడడడడడడడకత22డ 2242222222 79 ==

చెందినవాడు. అతని తల్లిదండ్రులు మ్లేచ్చుల సానుభూతిపరులు. అజితసింహుడి చేతిలో మరణించారు.

రాజధానిలో మ్లేచ్చాధికారులు ఎగిరి గంతేశారు వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. ఆ రాత్రి రాజును మద్యపాన పరవశుడిని చేసి 'రాజా! అజిత సింహుడు మ్లేచ్చ మూకలను తరిమే వంకతో తన పాశవిక ప్రవృత్తులను సంతృప్తిపరచుకొంటున్నాడు. అమాయక ప్రజలను హింసిస్తున్నాడు. ప్రజల స్వేచ్చా స్వతంత్రాలను హరిస్తున్నాడు. ఇందుకు ఆ అనాధ బాలుడే నిదర్శనం" అని చెప్పి నమ్మించారు.

అంతేకాదు వారు అనేక ఇతర (గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు వెతికి వాటికి మసిపూసి మారేడు కాయ చేసి, అజిసింహుడిపైనా, అతడి సైన్యం పైనా అనేక నేరారోపణలు చేశారు. వారు తమశక్తివంతమైన దుష్ప్రచారంతో అజిత సింహుడు అమాయక ప్రజల రక్తం తాగే రాక్షసుడన్న భావన కలిగించారు. అజిత సింహుడి సేన రాక్షస సేన అని, వారు అమాయకుల ఇళ్లల్లో చొరబడి, వారిని హింసించి, చంపి, స్త్రీల మానభంగం చేసే పరమకిరాతకులుగొ చిత్రీకరించారు. అందుకు తగ్గ సాక్ష్యాధారాలు సృష్టించారు. అజిత సింహుడి భగవాధ్వజం కంకాళ ధ్వజంలా, అతడి కత్తి నెత్తురు తాగే రాక్షసిలా ప్రచారం చేశారు.

ఇవేవీ తెలియని అజిత సింహుడు కర్తవ్య నిర్వహణ పూర్తయిందన్న సంతృప్తితో రాజధానిలో అడుగుపెట్టాడు. రాజధానిలో అడుగుపెట్టిన అజిత సింహుడికి పూలదండల బదులు సంకెళ్లు స్వాగతమిచ్చాయి. స్తోత్ర పాఠాల బదులు నిందలు ఎదురొచ్చాయి. అజిత సింహుడు నిర్విణ్ణుడయ్యాడు. అతని హృదయం గాయపడింది. ప్రాణాలకు తెగించి మ్లేచ్చమూకలను దేశాన్నించి తరమినందుకు ఇదా ప్రతిఫలం?

అయితే అజితసింహుడు తన మనసులో ద్వేషభావనలకు తావివ్వలేదు. తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. దానికి ఫలితం ఇదే అయితే అది దైవేచ్చ. 'బహుశా తన అసలు పోరాటం ఇప్పుడే ఆరంభమవుతున్నట్టయింది. ఇన్నాళ్ళూ తాను ఎదురుగాకనబడుతున్న బాహ్య శతృవులతో పోరాడేడు ఇప్పుడిక రాజ్యం నరనరాల్లో నిక్షిప్తమై ఉన్న అంతః శతృవులతో పోరాడాలి అనుకున్నాడు.

అజితసింహుడు సంతోషంగా చెరసాలలో అడుగుపెట్టాడు. రాజ్యం అట్టుడికినట్టు ఉడికి పోసాగింది. అజిత సింహుడి పైన నేరారోపణల్లో నిజానిజాలు ప్రజలకు తెలుసు. తాము దైవంలా భావిస్తున్న అజితసింహుడిని చెరసాల పాలు చేసిన రాజుపై ప్రజలలో అసంతృప్తి పెరిగిపోసాగింది. అజితసింహుడిని చెరసాలలో దేశద్రోహులను కట్టేసినట్టు సంకెళ్ళతో కట్టేశారన్న వార్త తెలిసి ప్రజలు కన్నీరు కార్చారు. 'దేశభక్తికి ఇదా ఫలితం?” అన్న ఆలోచన (ప్రజలందరి మనస్సులలో కలిగింది. ఇైత=లీ0 =232323303ఊ3023232ఊ32323ఊ323ఊ3ఊ32ఊ3232ఊ3ఊ2ఊ222222=2222222=== కస్తూరి మురళీకృష్ణ 2”

రాజసభలో అజితసింహుడిపై విచారణ ఆరంభమయింది. మ్లేచ్చులు ప్రవేశపెట్టిన సాక్షులు అజితసింహుడు తమపై సాగించిన అత్యాచారాలను విపులంగా వర్ణించసాగారు. వారు సభలో చెప్పేవి కొన్ని నిజాలయినా, ఆ నిజాలకు వారు సృష్టిస్తున్న దృక్కోణం అబద్దం అని అందరికీ తెలస్తోంది. కానీ సాక్షి మాట తప్ప మనస్సాక్షికి విలువివ్వని న్యాయస్థానంలో సాక్షి చెప్పిందే వేదం. సాక్షి అవుననకపోతే వేదం కూడా వేదం కాకుండా పోతుంది.

తనపై జరుగుతున్న నేరారోపణలకు అజితసింహుడి నమాధానం చిరునవ్వే. యుధిష్టిరుడు అజితసింహుడి సైనికచర్యల వల్ల నష్టపోయిన మ్లేచ్చ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించసాగాడు. అతని ఈ చర్య అజితసింహుడిపై మోపిన నేరాన్ని రాజు సమర్దిస్తున్నాడన్న భావన ప్రజలలో కలిగించింది. అంతే కాదు- మ్లేచ్చ మూకల దాడుల్లో నష్టపోయిన వారికి లేదు నష్టపరిహారం. అది నష్టం కాదా? తాము మనుషులం కాదా? మ్లేచ్చులను ఎదుర్మొని ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకేదీ సహాయం? దేశ ద్రోహులకు అండనిచ్చిన వారికి రాజాశ్రయము, దేశద్రోహులతో పోరాడి ప్రాణాలు విడిచిన కుటుంబాలకు రాజ దండనమూనా?

ప్రజలు కుతకుతా ఉడికిపోసాగారు. ఒత్తిడి అధికమయిన అగ్పిపర్వతంలా ఉంది కళ్మీరంలో పరిస్థితి.

అజితసింహుడి పైనే కాదు. అతడి సేనపై కూడా 'ప్రజా హింస) అభియోగాలు మోపారు. వారందరినీ చెరసాలల పాలు చేశారు. గ్రామాల్లో సుశళిక్షుతులైన ప్రజల దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు రాజభటులు. అంటే మ్లేచ్చ దాడుల నుంచి తమని తాము రక్షించుకోవటం రాజద్రోహమా? ప్రజల ఆవేశం హద్దులు దాటసాగింది. రాజసభలో అజితసింహుడి నేరాలు నిరూపించబడ్డాయి. అజితసింవుడు అమాయక (ప్రజలను హింసించి, వారి స్వచ్చా స్వతంత్రాలను కాలరాశాడన్నది ఒక నేరం ఫెయితే, ప్రజలకు సైనిక శిక్షణనిచ్చి, వారికి ఆయుధాలు సరఫరా చేయటం ద్వారా రాజును పదవీచ్యుతుడిని చేసి రాజ్యాన్ని అపహరించాలనే 'రాజద్రోహం' రెండవ నేరం. మొదటి నేరానికి అనాధ కుటుంబాలు బుజువులయితే రెండవ నేరానికి ప్రజల ఇళ్ళల్లోంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు నిదర్శనాలు.

రాజు తీర్చునిచ్చే ముందు అజితసింహుడి వివరణ కోరాడు. అజిత సింహుడు చిరునవ్వు నవ్వాడు.

“నేరం రెండు విధాలు, ఒకటి నిషిద్ధ కర్మలను ఆచరించటం. రెండవది విద్యుక్త కర్మల నుండి విరమించటంి.

అథ చేత మిమం ధర్యం, సంగ్రామం న కరిష్యసి

తతః స్వధర్శం కీర్తించ, హిత్వా పాప మవాస్ర్యసి === కల్టణ కశ్మీర రాజతరంగిణి కధలు డైతడ౭౭డడడడడడడ222జ2డడ2222= 0 ==

స్వధర్మం, కర్తవ్యం అయిన ధర్మయుద్ధం చేయకపోతే ధర్మ హాని, కర్తవ్య లోపం వంటి పాపాలు చేసినట్టు అవుతుందని భగవదాజ్ఞ.

నేను నా కర్తవ్య నిర్వహణలో ఎవరినీ ద్వేషించలేదు. ఎవరినీ (ప్రేమించలేదు. నేను అలా నిర్ణయగా ప్రవర్తింపకపోతే మ్లేచ్చులు లొంగేవారు కారు. చేత కత్తి పట్టుకుని చంపవచ్చిన వాడిపై శాంతి వచనాలు పనిచేయవు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. దేశాన్నుంచి మ్లేచ్చులను తరిమి, దేశాన్ని శక్తివంతం చేయటం పరమేశ్వరాజ్ఞగా భావించి నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను.

నియతం సంగరహితం, అరాగద్వేషతః కృతమ్‌

ఆఫల ్రొప్పునా కర్మ, యత్తత్సాత్విక ముచ్యతే

రాగద్వేషాలకు లోనుగాక అభిమానం వీడి ఫలాపేక్షను త్యజించి చేసే విద్యుక్త కర్మను సాత్వికం అంటారని మన ధర్మం చెప్తుంది. నేను నా ధర్మాన్ని పాటించాను. నిస్వార్ధబుద్దితో తోటి మానవుల ప్రాణ రక్షణ కోసం అహింసాధర్మాన్ని పాటించటంతో హింస వాటిల్లినా ఎట్టి కళంకంరాదని ధర్మశాస్త్రం చెపుతుంది.

మ్లేచ్చుల తాకిడి తుఫాను తాకిడి లాంటిది. దాన్ని తుఫాను తాకిడిలాగే ప్రతిఘటించాలి. తుఫాను గాలులు వీచినప్పుడు చెట్టు, పశువులు, క్రిమికీట కాదులతో పాటుగా మానవులూ మరణిస్తారు. అది ప్రాకృతికం స్వాభావికం. ఇది నాపై మొదటి నేరానికి సమాధానం. నాకు రాజ ద్రోహపుటాలోచనే లేదు. అందుకు ఇదే నిదర్శనం” అంటూ పక్శనే ఉన్న భటుడెపై లంఘించి అతడి ఒరలోని కత్తి లాక్కుని తన గుందెల్లో దింపుకున్నాడు అజిత సింహుడు.

క్షణకాలం ప్రకృతి స్తంభించిపోయింది. వెంటనే ఒక ఆవేశ వెల్లువ ప్రజలను ముంచెత్తింది. అంతవరకూ ఉడుకుతున్న అగ్నిపర్వతం బద్దలయింది. శిఖరాన్ని బేదించి రాతిద్రవం ఆకాశానికి ఎగజిమ్మింది. ఆ అగ్ని ప్రవాహంలో కళ్ళ్మీరాన్ని పట్టిన మేచ్చులు మలమలా మాడిపోయారు. ఆ విస్పోటనా బలానికి అంధ యుధిస్టిరుడి సింహాసనం కదిలిపోయింది.

ప్రజల చేతికి అందిన ప్రతీదీ ఆయుధమే అయింది. రాజభటుల చేతి లోని ఆయుధాలు వెన్నముద్దల్లా కరగి పోయాయి.

(ప్రజలు రాజభవనాన్ని చుట్టుముట్టారు. భటులు చెల్లాచెదరయ్యారు. రాజు సలహాదార్లు ఆకలిగొన్న సింహానికి చిక్కిన మేకల్లా చచ్చారు. వారికి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయే సమయం కూడా లభించలేదు. ఎందుకంటే ప్రజలు ముందుగా వారి అరచేతులను ఖండించారు.

కన్నుమూసి తెరిచేలోగా కళ్మీరంలో వీధులన్నీ రణరంగంలా మారిపోయాయి. (గ్రామాల్గు యుద్దభూముల్లా మారిపోయాయి. మతం టిం 333తతతడడడడతడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడఉడడడడా2= కస్తూరి మురళీకృష్ణ 2డ33ఊ

పరిస్థితిని, ప్రజలు అభీష్టాన్ని గ్రహించిన ఉగ్రసేనుడు అంధ యుధిష్టిరుడిని, అతడి పరివారాన్ని రాజ్యం విడిచి పారిపొమ్మన్నాడు. చెప్పుడు మాటలు విని సనాతన ధర్మాన్ని వదలి తప్పుడు దారిపట్టిన రాజుకు కారడవే దిక్కు అయింది.

రాజు, రాజకుటింబీకులు అడవిలో సొమ్మసిల్లి నిద్రిస్తున్న సమయంలో ప్రాకృత జనులు వారిని చూసి 'ధూ' అని ఉమ్మివేసేటప్పుడు మెలకువ వచ్చి వారి దుఃఖము మరింత పెరిగేది. దేశభక్తుల త్యాగాన్ని గుర్తించని పాలకులు ప్రజల ఆవేశాగ్నిలో దగ్ధమవక తప్పదని యుధిష్టిరుడి జీవితం నిరూపిస్తుంది.

యుధిష్టిరుడి తరువాత మంత్రి ఉగ్రసేనుడు 'ప్రతాపాదిత్యుడనే, కళ్ళీర రాజ వంశానికి చెందిన యువకుడిని రాజు చేశాడు. అతడు 382 ఏళ్ళు ధర్మబద్దంగా పొలించిన తరువాత అతని సుతుడు జలౌకసుడు రాజయ్యాడు. జలౌకసుడు 32 ఏళ్ళు రాజ్యం చేసిన తరువాత అతని సుతుడు తుంజీనుడు రాజయ్యాడు. తుంజీనుడు దివ్య ప్రభావశాలిని అయిన తన రాణి వాక్పుష్టాదేవి శాసనాలను అక్షరాల పాటిస్తూ జనానందకరంగా రాజ్యం చేశాడు.

మ

హె=ఊ=== కల్దణ కశ్మీర రాజతరంగిణి కధటు 360222 ర3 ఉడా

వా ఊడాచచకరములాా ఎ (జే జీ ౧౧౫! సంధిమతి ఆదర్శ జీవితం “ఈ విషయం మహారాజుకెలా చెప్పాలి?” రాజ కుటీరం దగ్గరవుతున్నా కొద్దీ మంత్రి మనసులో ఇదే ప్రశ్న మెదలుతోంది. “మళ్ళీ చరిత్రలో ఇటువంటి వ్యక్తిని రాజుగా పొందే భాగ్యం కళ్శీరానికి ఎప్పుడు వస్తుంది? సేనాపతి మనసులో ఈ సందేహం సుళ్ళు తిరుగుతోంది. రాజ కుటీరం దగ్గరవటంతో మంత్రి, సేనాపతి, వెనుక ఉన్న భటులు తమ గుట్టాలను అపి దిగారు. 'ఇంకా తెల్లవారలేదు. కానీ దూరం నుంచే మహారాజు మేల్మొని ఉన్నట్టు తెలుస్తోంది. యోగిలాంటి మహారాజు సంధిమతి పూజకు పూలు కోస్తున్నాడు. అతని పెదవులు 'ఓం నమఃశివాయా?' అంటూ శివనామ జపం చేస్తూనే ఉన్నాయి. పూలుకోస్తున్న మహారాజు వదనంలోని ఆనందాన్ని వర్ణించేందుకు భాష చాలదు. ఇంకాస్సేపటిలో ప్రపంచ నిర్మాత పరమేశ్వరుడి పాదాలను అలంకరించబోయే పూలను స్పృశించే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ, ఆ పూలను స్పృశిస్తూ పరమశివుని పాదాలనే స్పృశిస్తున్న అనందం అతని వదనంలో ద్యోతకమవుతోంది. మయం దిక్త డడ కస్తూరి మురళీకృష్ణ 2౭22

అది కల్యారంభమయిన 8022వ సంవత్సరం అంటే క్రీ.పూ. 1215వ సంవత్సరం. అంధ యుధిష్టిరుడిని రాజ్యం నుంచి తరిమివేసిన తరువాత అతని మంత్రి ప్రతాపాదిత్యుడిని రాజు చేశాడు. అతని తరువాత అతని కుమారుడు జలౌకసుడు రాజయ్యాడు. జలౌకసుడి తరువాత తుంజీనుడు రాజయ్యాడు.

తుంజీనుడు రాణి వాక్స్పుష్టాదేవి దివ్య ప్రభావశాలిని. రాజ్యం పాలించేది తుంజీనుడే అయినా అతని చేత పాలింపచేసేది రాణి వాక్పుష్టాదేవియే. వారిద్దరి పాలనాకాలం అత్యద్భుతమయినది.

కరువు కాటకాలతో కళ్ళ్శీరం అల్లల్లాడుతుంటే రాజు, రాణి ధన కోశంలో ఉన్న ధనమంతా ప్రజలకు పంచారు. స్వయంగా ప్రతి గృహంలోకి వెళ్ళి ప్రజలను పరామర్శించి వారికి తగిన సహాయం చేశారు. అయితే ఎంతకీ కరువు పరిస్థితి మారకపోవటంతో తన దోషమేదో తన ప్రజలను కరువు రూపంలో బాధిస్తోందని భావించి రాజు అగ్నిప్రవేశం చేయాలని నిశ్చయించాడు. అప్పుడు రాణి పరమ శివుని ప్రార్దించగా తెల్లవారే సరికి ఆకాశం నుంచి ఆహారం కురిసింది. ఆ తరువాత మళ్ళీ వర్నాలుకురిసి కళ్ళీరం సస్యశ్యామలమయింది. ఈరకంగా ధర్మబద్దంగా ఆ దంపతులిద్దరూ వాక్కునుంచి అర్ధాన్ని విడదీయ లేనట్టు కలిసిమెలిసి 36 ఏళ్ళు రాజ్యపాలనచేశారు.

అయితే ఆ రాజదంపతులకు సంతానం లేకపోవటంతో కశ్మీరానికి వేరే రాజవంశానికి చెందిన విజయాఖ్యుడు రాజయ్యాడు. అతని ఎనిమిదేళ్ళ పాలన తరువాత అతని పుత్రుడు జయేంద్రుడు రాజయ్యాడు. జయేంద్రుని మంత్రి సంధిమతి.

ఒకనాడు రాజుసభలో కొందరు పండితులు సంధిమతి కళ్ళీరానికి రాజు అవుతాడని భవిష్యత్తు చెప్పారు. అది విని ఆగ్రహించిన రాజు సంధిమతి ఆస్తులను స్వాధీనం చేసుకుని మంత్రిని చెరసాలలో బంధించి అనేక విధాల హింసించాడు.

కొన్నేళ్ళ తరువాత మరొక పండితుడు కూడా భవిష్యత్తులో సంధిమతి కళశ్మీరరాజు అవుతాడనే చెప్పటంతో రాజు కోపం పట్టలేక శూలంతో మంత్రి సంధిమతిని పొడిచి చంపి అడవిలో పారేయించాడు.

సంధిమతి గురువు ఈశాన యోగి సంధిమతికి పట్టిన గతికి విచారించి కనీసం అతనికి దహన సంస్మారాలన్నా చేయాలని సంకల్పించి సంధిమతి కళేబరాన్ని వెతుకుతూ వెళ్లాడు. సంధిమతి కళేబరాన్ని చూసిన ఈశానయోగి, "కళేబరం తలపైన ఒక రంధ్రం నుండి గాలి వీచటం చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు. సంధిమతి ఫాలభాగంలో విధి లిఖితం “బ్రతికినన్నాళ్ళు లేమితో బాధపడి, వదిశరుత్తులు కారాగారంలో బంధించబడతాడు. శూలఘాతంచే నేలకొరగిన ఇతడు కశ్మీర రాజవుతాడు” అని చూసి ఆశ్చర్యపోయాడు. జజ కట్టణ కశ్శీర రాజతరంగిణి కథలు 2223323222 కిర్‌. తజ

“మృతుడు రాజెలాగవుతాడు?” అన్న ఆలోచనతోపాటు 'అద్భుతమైన విధి ఘటనా శక్తిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని ఈశానయోగి సంధిమతి శరీరాన్ని భద్రంగా కాపాడుతూ అడవిలోనే ఉండిపోయాడు.

ఈ సమయంలో 37 ఏళ్ళ రాజ్యపాలన తరువాత 'జయేంద్రుడి మరణించటంతో అతనికి వారసులెవరూ లేనందున కశ్మీర సింహాసనం అనాక్రాంతంగా ఉండిపోయింది.

అడవిలో ఈశానుడి ఎదురుచూపులు ఫలించాయి. ఒకనాటి రాత్రి కాంతి పరివేష మధ్య భాగస్టులైన కొందరు యోగినులు అడవిలో పడి ఉన్న సంధిమతి అస్థిపంజరాన్ని తీసుకుపోసాగారు. కత్తి చేబూని ఈశానుడు వారిని అనుసరించాడు. వారు సంధిమతి అస్థిపంజరాన్ని ఒక వనంలోకి తీసుకువెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం చొప్పున కంకళానికి సంబంధించిన సంపూర్ణ పురుషాకృతి కలిగించారు. 'అష్టపురిలో మరణదశలో ఉన్న వ్యక్తి నుండి ప్రాణం సంగ్రహించి తెచ్చి దాన్ని సంధిమతి శరీరంలో ప్రతిష్టించారు.

సంధిమతి మృతదశ నుంచి సతి దశకు వచ్చే సమయానికి ఈశానుడు భేరీనినాదాలు చేస్తూ వారిని సమీపించాడు. ఈశానుడిని చూసి యోగినులు 'మా శక్తులతో ఇతడిని పునర్జీవితుడిని చేశాము. అనాక్రాంతంగా ఉన్న కళ్శ్మీర సింహాసనం ఇతడి పాదాక్రాంతం ఉన్న చేయమని ఈశానుడికి సంధిమతిని అప్పగించారు. కానీ రాజ్యభారం వహించేందుకు సంధిమతి ఒప్పుకోలేదు.

“'ప్రపంచమెంత అనిత్యమో, జీవితమెంత స్వప్నతుల్యమో నా అనుభవానికి వచ్చింది. అల్పమై క్షణికాలైన రాజ్యాలు, భోగాల పట్ల నాకు వాంఛలేదు. వీటి వెంటపడటం అంటే గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోవటమే.

జానామ్యహం శేవధిరిత్య నిత్యం

సహృధ్భృమై ప్రాప్యతే హి ధృవంతత!

శాశ్వత వస్తువు అశాశ్వత వస్తువుల చేత పొందటం దురళ్లభమని నేను గ్రహించాను. కాబిట్టి నన్ను భగవధ్యానంలో గడపనీయండి. అయాచితంగా లభించిన నా ద్వితీయ జన్మనైనా నన్ను సద్వినియగం చేసుకోనీయండి' అని ఈశానుడిని బ్రతిమిలాడాడు.

కానీ విధి లిఖితాన్ని చూసిన ఈశానయోగి తన పట్టు విడదవలేదు.

'సంధిమతీ, నిన్ను రాజభోగాలు అనుభవించమనటం లేదు. నిన్ను రాజ ్రాసాదాల్లో కులకమని అనటం లేదు. నిన్ను పొరుగు రాజ్యాలను కొల్లగొట్టమనటం లేదు. దక్షుడైన మార్గదర్శకుడు లేక కళ్శ్మీరం సారధిలేని రథంలా దిశ కోల్పోయింది. కశ్మీర సామ్రాజ్యానికి క దిశను చూపవలసింది నీవే. జయేంద్రుడి మంత్రిలా రాజ్యపాలనలో అపారమైన అనుభవం = గిర కకత కస్తూరి మురళీకృష్ణ ===

నీకుంది ఆ అనుభవాన్ని ఉపయోగించి కళ్ళీరానికి దక్షమైన పాలనను ఇవ్వమంటున్నాను. శక్తి ఉండి, అవసరమయినప్పుడు దాన్ని వాడక, (ప్రజలు కష్టనష్టాలకు గురవతూంటే చూస్తూ ఊరుకోవటం, దానికి వైరాగ్యమనే ముసుగు కప్పుకోవటం ఆత్మవంచన అవుతుంది" అన్నాడు ఈశానయోగి.

సంధిమతి కాస్ప్సేవు ఆలోచించాడు. 'ఈ చరాచర ప్రపంచంలో కళ్ళ్శీరాన్ని నేనే సంరక్షించగలనా? నేను లేకపోతే కళ్ళీరం నాశనమవుతుందని అనుకోవటం నా అహంకారం కాదా? పైగా మళ్ళీ కర్మ బంధాల్లో తగుల్కాంటే శాశ్వత ఆత్మశాంతి నాకు దూరం కాదా?” ఆవేదనగా అడిగాడు సంధిమతి.

ఈశానయోగి సంధిమతి శిరస్సుపై చేయి ఉంచి చెప్పాడు (భగవంతుడి సృష్టి రచనలో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక పాత్ర ఉంటుంది. ఒకో పాత్ర ఒకోసారి ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. కానీ సృష్టి రచనలో ప్రతిపాత్ర ఎంతో అత్యవసరమైనదే. ప్రతిక్షణం ఎంతో విలువైనదే. ఎలాగయితే సముద్రంలోకి విసిరిన చిన్న ఇసుక రేణువు కూడా తనశక్తి ప్రకారం అలలు సృష్టిస్తుందో అలాగే 'ప్రత్యిక్తి జీవితం, ఎంత అల్పంగా తోచినా విశ్వరచనలో (ప్రాధాన్యం ఉన్నదే. దాని ప్రభావం దానిదే. కళ్ళ్మీరానికి రాజువై, భావితరాలకు రాజు ఒక యోగిలా ఎలా ప్రవర్తించాలో, నిష్కామంగా రాజ్యబాధ్యతలనెలా నిర్వర్తించాలో చూపించేందుకే నీ జీవితం. ఇదే నీ బాధ్యత. నువ్వు పునర్జీవితుడవయింది అందుకే.

ఈ క్లిష్ట సమయంలో రాగద్వేషాతీతుడవై, మనోవాక్కాయ చిత్తశుద్దితో, నీవు నీ కర్తవ్యం నిర్వర్తించు.

బ్రహ్మణాధ్యాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరో తియః

విష్యతే నసపాసేన, పద్మపత్ర మినామృసా.

కర్మలన్నీ ప్రకృతిపై గానీ, ఈశ్వరునిపై గానీ ఆరోపించి, ఆసక్తి లేక వ్యవహరించేవాడిని, నీరు తామరాకును స్పృశించనట్టే కర్మఫలాలు స్పృశించలేవు. అయినా జనానికి దూరంగా ఉంటూ సన్యసించటం గొప్పకాదు, అన్ని భోగాలు అందుబాటులో ఉన్నా కూడా ఏ ప్రలోభానికీ లొంగకపోవటమే గొప్ప.

సంధిమతి ఈశానయోగి పాదాలకు నమస్కరించి కళశ్మీరం వైపు అడుగు వేశాడు.

మరణించినవాడు పునర్జీవితుడెలా అయ్యాడని కళ్ళ్మీర ప్రజలు సందేహించారు. కానీ ఈశానయోగి ద్వారా జరిగినది తెలుసుకుని సంధిమతిని సంతోషంగా సింహాసనం మీదకు ఆహ్వానించారు. హెతఊ= కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2333222222 రి? ౭వ

రాజు అయిన సంధిమతి రాజభవనంలో నివసించడు. తన చుట్టూ భృత్యులను, వందిమాగధులను, భట్రాజులను చేరనివ్వలేదు. సంధిమతి నిత్యం శివనామ జపం చేస్తూనే ఉంటాడు. అనుదినం వరుసగా భూతేశుడిని, విజయేశుడిని, శివుని అర్చించిన తరువాత గురువు ఈశానుడిని దర్శించి రాజ కార్యాలందు నిమగ్నుడవుతాడు. తన పూజకు పూలు తనే కోసుకుంటాడు. స్వయంగా స్వామి విగ్రహానికి తనే జలకాలాడిస్తాదు.

సంధిమతి ప్రతిరోజూ వెయ్యి శివ ప్రతిరూప లింగాలు ్రతిష్టిస్తాడు. కళ్మీరం అణువణువునా శివ స్వరూపాలతో నింపి కళ్ళీరాన్ని శివమయం చేశాడు సంధిమతి. దిగుడు బావులలో (పతిష్టించిన శివలింగాల వల్ల బావులలో నీరు నర్వం తీర్టోదకాలంత పవిత్రమయ్యాయి. అసంఖ్యాక శివలింగాలను నదీగర్భాలలో ్రతిష్టించటంతో కళ్శ్మీరంలో జలాలన్నీ పవిత్ర జలాలయ్యాయి.

నంధిమతి రాజకార్యాల మీద ఎక్కడికయినా వెళ్ళవలని వస్తే వూజకు ఆలస్యమవుతుందని అడుగడుగునా శివాలయాలు నిర్మించి ఆలయ పోషణకు అనేక (గ్రామాలను దానమిచ్చాడు. ఆయన నిర్మించిన మందిరాల్లో అడుగుపెడుతూంటే ప్రజలు భక్తి పారవశ్యులయ్యేవారు. కళ్మీరం సర్వం మరో కైలాసంగా భాసిల్లింది సంధిమతి పాలనలో.

రాజధానిలో ఒక వనంలో పర్ణశాల నిర్మించుకొని సంధిమతి దాంట్లో ఉండేవాడు. ప్రతిరోజూ భిక్షాటన చేసేవాడు. అలా లభించిందే అతని ఆహారం. రాజు రాజ్యంలో కాలినడకన పర్యటించేవాడు. అతనికి అంగరక్షకులు ఉండే ప్రసక్తి లేదు. 'నన్ను చంపాలనే ద్వేషమే కనుక ఎవరిలో నైనా కలిగించిన వాడినైతే నాకు జీవనార్దతే లేదు అనేవాడు. ఎవరైనా అంగరక్షకులను ఉంచుకోమ్మని మరీ మరీ బ్రతిమిలాడితే “నేను ప్రజల ఆస్తి సంరక్షకుడను. నన్ను ఆ ప్రజలలో ఎవరైనా సంహరించాలని అనుకుంటున్నారంటే అర్ధం నేను ప్రజల ఆస్తి సంరక్షణలో ఏదో లోపం చేస్తున్నట్టే అనేవాడు.

రాజ కార్యాలు లేని సమయంలో రాజు యోగులతో పారమార్దిక చర్చలతో, భగవధ్యానంతో కాలం గడిపేవాడు. అలా 47 ఏళ్ళుగా రాజ్యం చేస్తున్నాడు సంధిమతి. అయితే రాను రాను సంధిమతి రాజ కార్యాలకన్నా దైవ చింతనలోనే ఎక్కువ కాలం గదపటంతో రాజ కార్యాలు స్థంభించి పోయాయి.

గుజ్ట్బాలు దూరంగా ఆపి కాలినడకన మందిరం చేరారు మంత్రి, సేనాపతి, భటులు.

సంధిమతి పూజ ముగించుకుని మందిరం వెలుపలకు రాగానే వారు లేచి నిలబడి మహారాజుకు నమస్కరించారు.

మహారాజు ప్రతిగా నమస్కరిస్తూ “ఈశ్వరార్చణం* అన్నాడు. నడాణ రిది. 22న కస్తూరి మురళీకృష్ణ తతత

“ప్రభూ తమరు కళ్ళీరానికి రాజై 47 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి. తమరు కళ్ళీరాన్ని కైలాసమంత పవిత్రంగా పాలిస్తున్నారు అన్నాడు మంత్రి. ఎవరైనా తనను “ప్రభూ అని సంబోధిస్తే రాజు మనసులో ఈశ్వరుడికి నమస్కరిస్తాడు.

'అంతా పరమేశ్వర విలాసం” అన్నాడు మహారాజు.

“ఇటీవలి కాలంలో తమరు రాజకార్యాలకన్నా దైవధ్యానంలోనే సమయం అధికంగా గడపటంతో రాజకార్యాలు సాగటం లేదు ప్రభూ అన్నాడు 'సీనాపతి.

“ఎన్నాళ్ళు నాకీ రాజ్యభారం, చెప్పండి నా హితులారా?” జాలిగా అడిగాడు సంధిమతి.

మంత్రి సేనాపతులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

“ప్రభూ, రాజ్యపాలనకు సంబంధించిన విషయాలపై తమరి నిరాసక్తత పట్ల ప్రజలు అసంతృస్తులుగా ఉన్నారు. తమరు రాజ కార్యాలు నిర్వర్తిస్తున్న యోగిపుంగవులు. తమరికి వారసుడు లేడు. తమరి తరువాత రాజ్య భారం వహించేదెవరు? అన్న ప్రశ్న అందరినీ బాధిస్తోంది వినయంగా అన్నాడు మంత్రి.

సంధిమతి నవ్వాడు. “ఇన్నాళ్ళకు నాకు విముక్తి లభిస్తున్నదన్నమాట. ఇంతకీ ఎవరు మీ దృష్టిలో భావి కళ్మీరాధిపతి?” అడిగాడు సంధిమతి వారి మనసులో మాట (గ్రహించి. మహారాజుకు నమస్కరించి చెప్పాడు మంత్రి “దాదాపుగా ప్రతి రాజు దృష్టీ కశ్మీరంపైనే ఉంది. అయితే కళ్ళీర వంశాకురం గాంధార దేశంలో పెరుగుతోంది ప్రభూ".

“అంధయుధిష్టిరుడి వంశానికి చెందిన గోపాదిత్యుడి తనయుడు మేఘవాహనుడు దివ్యలక్షణ సంపన్నుడు. దృఢశరీరుడు చెప్పాడు సేనాపతి.

“అతడు పితృనాజ్ఞతో ప్రాగ్జోతిష్పుర రాజ పుత్రిక అమృత (ప్రభను స్వయం వరంలో గెలిచి పరిణయమాడాడు ప్రభూ” చెప్పాడొక భటుడు ముందుకు వచ్చి.

“అన్యులెవరికీ నీడనివ్వని వరుణదేవుని ఛత్రం మేఘవాహనుడికి నీడనిస్తూ అతడి వెంటే ఉంటుంది ప్రభూ. ఇదినేను కళ్ళారా చూశాను చెప్పాడొక భటుడు ముందుకు వచ్చి.

నంధిమతి నంతోషంగా నవ్వాడు 'కళ్మీర రాజ్యలక్ష్మిని వరించమని అతడినే ఆహ్వానించండి అన్నాడు.

మంత్రి, సేనాపతులు మళ్ళీ ఒకరి మొవాలొకరు చూసుకున్నారు.

“మేఘవాహనుడిని ఆహ్వానించేందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు ప్రభూ. కష్ణ సమయంలో మీ అభీష్టానికి వ్యతిరేకమైనా ప్రజా క్షేమం కోరి రాజ్యభారం చేపట్టిన వా కల్పణ కశ్ళీర రాజగేర౦గిణీ కధలు హతెెైతైడడడడ ఏ9 హేడ

మిమ్మల్ని కాదని, ఇన్నేళ్ళ తరువాత మరొకరిని రాజుగా ఆహ్వానించటం సమంజసంగా తోచటం లేదు ప్రభూ” అన్నాడు మంత్రి. 'పరరాజు రాజ్య స్వీకరణకు వస్తూంటే అతడిని ఎదిరించి పోరాడకపోవటం క్షాత్ర ధార్మానికి విరుద్ధం అనిపిస్తోంది ప్రభూ అన్నాడు సేనాపతి. సంధిమతి వాత్సల్యంగా వారిద్దరి కరాలను స్పృశించి అన్నాడు. 'ఈ ప్రపంచమొక నాటక రంగం. మనుషులు పాత్రధారులు. ఎవరెవరి పాత్రలను వారు వారు నిర్వహించిన తరువాత వారు యవనిక వెనుకకు వెళ్ళవలసిందే. అప్పుడు మరో పాత్రధారి తెరముందుకు వస్తాడు. నా జీవిత కాలమంతా ఏ బంధ విముక్తి కోసం నేను పరితపిస్తున్నానో, ఆ సమయం ఆసన్నమైనపుడు ఇక ప్రతిఘటన ప్రసక్తి ఏముంది? మేఘవాహనుడికి నా సందేశం పంపండి. కళ్మీరకైలాసాన్ని పాలించేందుకు రమ్మనండి' అన్నాడు సంధిమతి. అందరూ మహారాజుకు నమస్కరించి వెనుతిరిగారు. శశీ .మరుసటి రోజు కళ్ళీరం పరమాద్భుతమైన సంఘటనకు సాక్షి అయే భాగ్యం పొందింది.

ఏ భోగాలను అనుభవించాలని జనులు తహతహ లాడతారో, పడరాని పాట్లు పడుతారో, చేయరాని పనులన్నీ చేస్తారో, ఆ భోగాలను తృణ ప్రాయంగా త్యజించి, ఈ (ప్రపంచం, ఇందులోని భౌతిక సుఖాలన్నీ పరిత్యాగం చేయ వలసిందనే ఉన్నత లక్ష్యానికి ఉత్తమ ఆదర్శానికీ, ప్రతీకగా. మహారాజు, మరో వ్యక్తికి రాజ్యాన్ని సంతోషంగా అప్పజెప్పే మహోతృష్ట సంఘటన అది.

'ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన అది. రాజ్యంకోసం స్వంత అన్నదమ్ములు ఒకరినొకరు మోసం చేసి చంపుకోవటం తెలుసు. రాజ్యం కోరి సేవకులు స్వామిని హత్య చేయటం తెలుసు. రాజ్యం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నటం తెలుసు.

కానీ 47 ఏళ్ళు రాజ్య భారం వహించి కూడా రాజ్య భోగ కాంక్ష అంటని మహా వ్యక్తి, పాముకుబుసాన్ని ఎంత స్వాభావికంగా విడుస్తుందో, అంతఏ స్వాభావికంగా, రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవటమనే, అత్యద్భుతమైన దృశ్యానికి సాక్షి అయిన ఆ భూమి ఎంత పవిత్రమో! ఆ (ప్రజలు ఎంత ధన్యులో! ఈ ధర్మం ఎంత ఉన్నతమూ!

ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా తనను ఆవ్వోనిస్తున్న కశ్మీర ప్రజలను చూసిన మేఘవాహనుడి హృదయం ఉప్పొంగింది. 47 ఏళ్ళుగా పాలిస్తున్న రాజు పక్కనే ఉండగా తనపై ఇంతగా అభిమానం చూపిస్తున్న ప్రజలపై అనురాగం, వారందరి ముందు కాలినడకన తనని ఆహ్వానించేందుకు వస్తున్న మహారాజుపై తృణీకారభావం కలిగాయి మేఘవాహనుడి మనసులో. అతనికి సంధిమతి ఒక చేతకాని మహారాజులా అనిపించాడు.

2౯2 90 2522244442 కస్తూరి మురళీకృష్ణ యడల

ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతుండగా, రధం దిగి కళ్ళీర భూమి మీద పాదం మోపుతుంటే మేఘవాహనుడి వాళ్ళు జలదరించింది. దారి పొడుగునా అతను అణువణువునా శివలింగాలు చూస్తు వస్తున్నాడు. అందుకే కశ్మీర భూమి మీద పాదం మోవుతుంటే పఠ.బశివుడి పవిత్ర భూమిపై పాదం మోవుతున్న భావన కలిగింది మేఘవాహానుడికి.

పాదం భూమిని తాకిన మరుక్షణం, ఏదో విద్యుత్తరంగం శరీరమంతటా ఒక్కసారిగా పాదాల నుండి పైకి ఎగసిన భావన కలిగింది. అడుగు తీసి అడుగు వేస్తూంటే తన శరీరం సర్వం పవిత్ర మౌతున్న విచిత్ర భావన కలిగింది.

సంధిమతి మహారాజు ఎదురువచ్చి తనను పలకరించగానే, అతడిని స్పృశించి వచ్చిన వాయుకెరటం తనను తాకగానే మేఘవాహనుడికి ఆ పవిత్ర భావన తన హృది తలుపులు తడుతున్న భావన కలిగింది. అప్రయత్నంగా, అసంకల్పితంగా మేఘవాహనుడు, సంధిమతి పాదాలకు నమస్కరించాడు.

సంధిమతి ఒక అడుగు వెనకకు వేసి 'పరమేశ్వరార్చణం' అన్నాడు.

ఆ క్షణంలో మేఘవాహనుడి అహంకారం నశించింది. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని మానవజాతి చరిత్రలో ఇటువంటి రాజు గతంలో లేదు, ఇక భవిష్యత్తులో రాదని అతని మదికి స్పురించింది.

దారి పొడుగునా మేఘవాహనుడికి ప్రజల జయజయ నినాదాలు వినిపించటం లేదు. సంధిమతి సరసన ఉండటం వల్ల జయజయ నాదాలన్నీ పరమశివుని పవిత్ర నామస్మరణలా అతని చెవులకు వినిపిస్తున్నాయి.

తాను కళ్ళీరాన్ని పాలించేందుకు వస్తున్నానన్న భావన అతనిలో నశించింది. అతను దైవం చేతిలో ఒకపావు మాత్రమే. ఒక తోలు బొమ్మ మాత్రమే. తానేదో గొప్ప వని చేస్తున్నాననుకుని అహంకరించటం కేవలం తన అజ్ఞానం మాత్రమే.

ఇప్పుడర్ధమయింది మేఘవాహనుడికి తాను కళ్ళీర భూభాగంపై పాదం మోపుతున్నప్పుడు తన వాళ్ళిందుకు జలదరించిందో! ఎందుకంటే సంధిమతి అణువణువూనా శివలింగాలు (ప్రతిష్టించి కశ్మీరాన్ని శివమయం చేశాడు. దాంతో తాను పాదం మోపుతున్నది భూమిపైకాదు. వరమశివునిపై అన్న భావన మదిలో కలిగింది. అయితే జగత్తు నర్వం ఈశ్వరమయమయినప్పుడు, మనిషీ ఈశ్వరుడే అయినప్పుడు, ఇక ఎవరిమీద పాదం మోపుతున్నట్టు? ఈ ఆలోచన రాగానే మేఘవాహనుడికి దివ్వజ్ఞానం తెలిసిన భావన కలిగింది.

తన పక్కనే ఉన్న రాణి అమృత(ప్రభ వరిసితికూడా ఇందుకు ఖిన్నంగాలేదని ఆమెవదనంలో ్రతిఫలిస్తున్న అలౌకికానందం చూసి గ్రహించాడు మేఘ వాహనుడు. హెఊ= కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు ఉడక 91 జి

సకల రాజ చిహ్నాలు సంధిమతి మేఘవాహనుడికి ప్రజల సమక్షంలో అర్పించాడు. మేఘవాహనుడు సంధిమతి పాదాలు స్పృశించి అన్నాడు “మీరు రాజ్యం పరిత్యజించి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ జీవిత కాలం పూర్తయ్యే వరకూ కళశ్శీరానికి మీరే రాజుగా ఉండండి. అలా కాకపోయినా మీరు మీ కుటీరంలోనే ఉండవచ్చు”. సంధిమతి మేఘవాహనుడివైపు చూసి నవ్వి 'మేఘవాహనా కుబుసం విడిచిన పాము మళ్లీ కుబుసాన్ని ధరించగలదా? అలాగే నేనూ మళ్ళీ ఈ సామ్రాజ్యాన్ని స్వీకరించలేను. ఇక రాజు ఎన్నడూ అహంకారానికి తన మనస్సులో స్థానం ఇవ్వద్దు. తన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో ప్రజలకు మేలు చేసే బాధ్యత లభించిందని, దైవాన్ని ధ్యానిస్తూ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. రాజ భోగాలను ఆశించి రాజ్యం చేపట్టవద్దు. అధికార మదంతో అంధుడివి కాకూడదు. ఇది విధాత నీపై ఉంచిన గురుతర బాధ్యయత. రాజు ప్రజల సౌభాగ్య సంరక్షక్షుడే కానీ ప్రజల సౌభాగ్య విధాతకాడు. ఎలాగయితే తోటమాలి తోటలో పూలసంరక్షకుడే కానీ పూల యజమాని కాలేడో, రాజూ అంతే. రాజ్యం ప్రజలసొత్తు. ప్రజల సౌభాగ్యంకోసం నీవు కానీ నీ భోగం కోసం ప్రజలు కారు” అని మేఘవాహనుడిని ఆశీర్వదించి రాజ్యం విడిచి వెళ్ళిపోసాగాడు సంధిమతి. అప్పుడర్ధమయింది ప్రజలకు సంధిమతి గొప్పతనం. సృష్టిలో ఏదైనా ఇంతే, ఆ వ్యక్తిని ద్వేషించి, అతడికి దూరం కావాలని తపిస్తాము. కానీ నిజంగా ఆ వ్యక్తికి దూరమయ్యే సమయంలో ఆ వ్యక్తితో మనకున్న అనుబంధం అర్ధమవుతుంది. అతను దూరమవటం ఎంత తీరని లోటో అర్ధమవుతుంది. ప్రజలు విలపిస్తూ చాలా దూరం సంధిమతి వెంటే వెళ్ళారు. మళ్ళీ ఇంకా ఎన్ని కల్పాలకో కానీ ఇటువంటి మహోన్నత వ్యక్తిని చూసే భాగ్యం మానవులకు కలగదని వారికి తెలుసు. తమకు మాత్రమే కలిగిన ఈ భాగ్యాన్ని మరికాస్సేపు అనుభవించాలని వారి తపన. అలా రాజ్యం వదలిన సంధిమతి నందిక్షేత్రాన త్రిజగన్నాధుని చేరి, శివమంత్రోపాసన మనే పవిత్ర ధర్మాన్ని నెరపుతూ, పరమవైరాగ్య చింతనతో, మునిపత్సులు ఇచ్చే భిక్షను కూడా స్వీకరించక, శివమంత్రమనే పవిత్ర ఫలాన్ని మాత్రమే సేవిస్తూ, పరమళివునిలో లీనమైపోయాదు. సనాతన ధర్మంలో రాజ్యపాలకుడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలన్నీ ప్రతిబింబించిన ఉన్నతమైన రాజు, పాలకులందరికీ ఆదర్శప్రాయుడు, సంధిమతి! శస ఈ దా రి2 కజెజకడకకకడకకకకకకకనకకకకకడునడడనకడడడడనడడడడడడ:2:2 కస్తూరి మురళీకృష్ణ క2డజడ2ఊ

ప భై ళు ఇచ్‌ స రాత. ౧ = ను లం తాని (| ఆాతనరాల ధర్మదండం “సర్వం ఖల్విదం బ్రహ్మా తజ్జలానితి శాంతి ఉసాసీత్‌! అధ ఖలు క్రతుమయః పురుషో యధా (క్రతురస్మిల్లోకె పురుషో భవితి తధేతః ప్రీత్య భవతి సక్రతుం కుర్వీతజ ఈ విశ్వమంతా (బ్రహ్మమే. బ్రహ్మము నుంచే సకల విశ్వం, జన్మించింది. (బ్రహ్మంలోనే సకల విశ్వం లయిస్తుంది. బ్రహ్మమే సకల విశ్వాన్ని నడిపిస్తోంది. బ్రహ్మముపైనే ప్రశాంత చిత్తంతో ధ్యానం నీలపాలి. వ్యక్తి నిశ్చయాన్ని బట్టి వ్యక్తిత్వం. వ్యక్తి ఏం కావాలనుకుంటాడో అదే అవుతాడు కాబట్టి దృఢ నిశ్చయంతో బ్రమ్మాన్నే ధ్యానించాలి ఇట్టిల మహర్షి స్వరంలో ప్రతి అక్షరం అత్యంత ప్రభావపూరితంగా వెలువడి అతని శిష్యుల మనోఫలకాలపై స్థిరంగా ముద్రింపబడుతున్నాయి. “గురువర్యా! నాదొక సందేహం సందేహిస్తూ అడిగాడు ఇట్టిలుడి ప్రియశిష్యుడు శుక్రదంతుడు. ణ్‌ కల్పణ కశ్మీర రాజతరంగిణి కథలు 2233232222 83. ===

ఇట్టిలుడు వాత్సల్యంతో శిష్యుడి వైపు చూశాడు.

“గురువర్వా! విశ్వమంతా (బ్రహ్మమే అయితే, ఆ బ్రహ్మాన్ని ధ్యానించేవారు బ్రాహ్మణులయితే మహారాజు జయాపీడుడికి ఈ బ్రాహ్మణ ద్వేషమేమిటి? బ్రాహ్మణులను సర్వనాశనం చేయటమే తన లక్ష్యమన్నట్టున్న అతని దుష్ప్రవర్తనకు అర్ధమేమిటి?” అని అడిగాడు శుక్రదంతుడు.

ఇట్టిల మహర్షి చిరునవ్వుతో శిష్యుడి వైపు చూశాడు 'నిజంగా జయాపేడుడి ద్వేషం ('బ్రాహ్మణులపైనే అంటావా?” అనడిగాడు.

శుక్రదంతుడు అయోమయంగా గురువువైపు చూశాడు. 'గురువర్వా! ఒకే దినాన తొంఖై తొమ్మండుగురు విప్రలు ఎప్పుడు మరణిస్తారో అప్పుడే బ్రాహ్మణులపై తాను అత్యాచారాలు మానివేస్తానని ప్రకటించాడు కదండీ మహారాజు. బ్రాహ్మణులకు దానమిచ్చిన అనేక అ(గ్రహారాలను స్వాధీనం చేసుకుంటున్నాడు. ఇదంతా బ్రాహ్మణ ద్వేషం కాకపోతే మరేమిటి?”

ఇట్టిలుడు నవ్వాడు. “బ్రాహ్మణులు ఈ దేశ సంస్కృతికి, ధర్మానికి స్వరాలు. ఆ స్వరాన్ని నొక్కి వేయాలన్న ప్రయత్నమిది. ద్వేషం సంస్యతి మీద, ధర్మం మీద కానీ బ్రాహ్మణుల మీద కాదు. అయినా జన్మచేత బ్రాహ్మణులు అనే దురభిప్రాయం వల్ల పుట్టిన ద్వేషభావం ఇది” అన్నాడు.

'జన్నచేత బ్రాహ్మణులు కారా గురువర్యా?” అడిగాడు శుక్రదంతుడు.

నవ్వాడు ఇట్టిలుడు. 'శుక్రదంతా నీ తల్లిదండ్రులెవరు?”

శుక్రదంతుడు తలవంచుకున్నాడు. లోగొంతుకలో చెప్పాడు 'తలియదు*.

“మరి నీకు నేను ఎలా బోధిస్తున్నాను?”

శుక్రదంతుడు మౌనంగా ఉన్నాడు.

'నీకు సత్యకామ జాబాలి కథ తెలుసు కదా? అడిగాడు ఇట్టిలుడు.

శుక్రదంతుడు మౌనంగా తల ఊపాడు.

“సత్యకాముడు విద్యాభ్యాసం నిమిత్తం బ్రహ్మచర్యం అవలంబించి గురుకులవాసం చేయాలనుకుంటాడు. “గురువు గోత్రం అడిగితే ఏం చెప్పాలి?” అని తల్లిని అడుగుతాడు. తల్లి “నీ గోత్రం నాకు తెలియదు. నేను యౌవనంలో పరిచారికగా అతిధి సేవలు చేసే సమయంలో నీవు నాకు లభించావు. నీ తండ్రి ఎవరో, నీ గోత్రమేదో నాకు తెలియదు నా పేరు జాబాల. నీ పేరు సత్యకాముడు. కాబట్టి నీ పేరు సత్యకామజాబాల అని చెప్పు'అని చెప్పి పంపుతుంది.

సత్యకాముడు గౌతను మహర్షి దగ్గరకు వెళ్ళి విద్యార్ధిగా స్వీకరించమని అడుగుతాడు. గౌతముడు గోత్రం అడుగుతాడు. దానికి సత్యకాముడు తల్లి చెప్పమని చెప్పిందే చెపుతాడు. “ఇలా ఉన్నదుననట్టు చెప్పేవాడు బ్రాహ్మణుడే” అని గౌతముడు జాబాలిని శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఈ కధలవల్ల తెలిసేదేమిటి? ప్రశ్నించాడు ఇట్టిలుడు.

న త వ

'వ్యక్తి బ్రాహ్మణుడవటం పుట్టుక వల్ల కాదు, సత్యసంధత వల్ల, గుణం వల్లనే' అన్నాడు శుక్రదంతుడు.

“అలాగే నువ్వూ బ్రాహ్మణుడవే. నేను బ్రాహ్మణుడనే. ఏ పిల్లవాదయినా పుట్టినప్పుడు మామూలుగా బాలుడే. కానీ ఎదుగుతున్న కొద్దీ అతని లక్షణాలు (ప్రస్పుటమవుతాయి. లక్షణాలను బట్టి వ్యక్తిత్వ నిర్ణయం. అంతే. ఇది తెలియని వారు వెదజల్లే ద్వేషం అర్ధరహితమే కాదు అనర్ధదాయకం కూడా” అన్నాడు ఇట్టిలుడు.

ఇంతలో ఒక శిష్యుడు పరుగుపరుగున వచ్చాడు.

'గురువర్యా దేశం నలుమూలల నుంచి అనేకమంది పెద్దలు, పండితులు తమరిని కలవాలని వస్తున్నారు అన్నాడు ఆయాసంతో రొప్పుతూ.

“రమ్మను” అన్నాడు ఇట్టిలుడు.

ఒకరాకరుగా వివిధ నగరాల, (గ్రామాల పెద్దలు లోపలకు వచ్చి ఇట్టిలునికి నమస్కరించి కూచున్నారు.

ఇట్టిలుడు అందరికీ నమస్కరించాడు. “ఇంతమందికి నా మీద ఇంత దయ కలిగినందుకు నా జన్మ ధన్యమయింది” అనానడు.

వారిలో విష్ణుశర్మ అనే పండితుడు “ఇట్టిల మహర్షీ తమరికి తెలియని విషయం కాదు. జయాపీడుడి ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఇక మనం ఉపేక్షించి లాభం లేదు. ఆరంభంలో కళ్మీరం నుంచి మ్లేచ్చులను తరిమి సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించిన జయాపీడుడు ఈ జయాపీడుడు ఒకరేనంటే నమ్మశక్యంగా లేదు అన్నాడు.

మల్తణపురానికి చెందిన కేశవుడు 'మహర్నీ రాజు ధనలోభం మితిమీరి పోయింది. ఎప్పుడయితే ద్రావిడ మాంత్రికుని బారి నుండి మహాపద్మనాగుని రక్షించి తామ్రధాతు పర్వతాన్ని కనుగొన్నాదో "అప్పటి నుంచీ జయాపీడుడి గర్వం విశ్చంఖలమైపోయింది. తొంబై తొమ్మిది కోటి తామ్ర దీనారాలపై తన ముద్రవేయించి నూరుకోట్లను ఎవరైనా వేయిస్తే గెలిచినట్లేనని భూవలయమంతా చాటింపు వేయించాడు. అప్పటి నుంచీ రాజుచుట్టూ చేరిన కాయస్టులు రాజు ధనాశాగ్నికి అజ్యంపోసి పెంచుతున్నారు. వారు “ధనం కోసం పరరాజుల మీద దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు. మన రాజ్యంలోనే పన్నుల ద్వారా మన కోశాగారాన్ని నింపుకోవచ్చ'ని మహారాజు మనసులో నాటారు. అప్పటి నుంచీ ప్రజలకు రాజుకు మధ్య ప్రచ్చన్న యుద్దం ఆరంభ మయింది” అన్నాడు.

కళ్యాణ పురానికి చెందిన మిత్ర శర్మ వేదనగా చెప్పాడు. “మహర్షీ ఈ రాజ్యంలో విఫ్రులే ఎటువంటి పనిచేయక, ప్రజలను మభ్యపెట్టి ధనధాన్యాలు సమకూర్చుకుంటున్నారన్న భావన మహారాజు మదిలో నాటారు. దాంతో రాజు లోభవశీభూతుడై విప్రులను సైతం బాధిస్తున్నాడు' వజ కల్డణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు =2323232323232323232323232ఊ2ఊ2ఊ2ఊడఊడడడడడఊఊఊజ=జ కిర్‌. =

చక్రపురానికి చెందిన చక్రధరుడు అన్నాడు 'మహర్షీ రాజు దుషత్యాల వల్ల రైతులు ఆదాయన్నంతా రాజ్య వ్యవస్థలో నష్టపోయారు. వైశ్యులు వాణిజ్యం వదిలేస్తున్నారు. వారికి వచ్చే లాభాల కన్నా రాజాస్థానంలో వన్నులు చెల్లించేనరికి లాభం గూబల్లో తీస్తోందంటున్నారు. పన్నుల భారం మోయలేక వారు రాజ్యం వదలి పారిపోతున్నారు.

కత్తిని రుళిపించి క్రౌర్యం చూపించే సేనకు మనమే ఎదురు నిలవాలి. ఇలా జనుల నుంచి దోచుకొంటున్న ధనంలో స్వల్పభాగమే రాజకోశంలో చేరుతోంది. ఎక్కువ భాగం అధికారుల చేతబడుతోంది. మహారాజుకీ విషయం చెప్పింది చక్రధరశర్మ. దాంతో విప్రులు రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నారని, తాము రాజుకన్నా బలవంతులమని, రాజు తమని ఏమీ చేయలేడని విర్రవీగుతున్నారని మహారాజు మదిని విషపూరితం చేశారు. దాంతో గతంలో మహారాజుల మందిరాలలో పూజలు నిరాఘాటంగా జరిగేందుకు దానమిచ్చిన ఆగ్రహారాలను స్వాధీనం చేసుకుంటున్నాడు. అంతేకాదు 'రాతిబొమ్మలకు రవ్వలెందుకు? పూజారులు కులికేందుకా?' అని దైవాభరణాలను సైతం వదలి పెట్టడం లేదు!'

చరద్రకాంత పురానికి చెందిన కంకుణుడు అందరిలోకీ వృద్దుడు, మహా పండితుడు. ఈయన లలితాదిత్యుని మంత్రి చింకుణుడి తమ్ముడు. ప్రసిద్ద రసాగమవేత్త. ఇట్టిలుడి గురువు. 'ఇట్టీలా నీకీ విషయాలన్నీ ఎందుకు చెప్తన్నా మంటే రాజు తన ధనలోభంతో, అధికార గర్వంతో, ఈ దేశ సామాజిక భవంతినే కూలద్రోయాలని ప్రయత్నిస్తున్నాడు. తన స్వార్ధానికి అగ్రవర్ణాల దౌష్ట్రం, సామాజిక సమానత్వం అనే రంగు పులుముతున్నాడు. నిజానికి మహారాజుకీ ప్రజల బాధతో పనిలేదు. తన బొక్కసం నింపుకునేందుకు ద్వేషభావనలు రెచ్చ గొడుతున్నాడు. ఎన్నడూలేదు ఇటీవలే నా శిష్యుల మధ్య స్పర్ధలు, వర్ణభేదాల వల్ల వస్తున్నాయి. గతంలో విద్యాభ్యాసంలో ఆరోగ్యకరమైన స్పర్ధ ఉండేది. ఎవరిదే వర్ణమో ఎవరికీ తెలిసేదికాదు. అసలా పట్టింపేలేదు. కానీ రాజు విచక్షణా రాహిత్యంవల్ల, లోభంవల్ల ఈనాడు వర్ణభేదాలు సమాజంలోని సమతుల్యతలను ఛిన్నాభిన్నం చేసి జాతిని నిర్వీర్యం

అందుకే మనమంతా మనలో వర్ణభేదాలు లేవని, వ్యక్తి ఏ వర్ణమైనా మన ధర్మం సనాతన ధర్మమేనని మన మధ్య లేని భేదాలను కల్సించవద్దని, విచక్షణా రహిత దుష్కత్యాలను ఆపమని మహారాజుకు విన్నవించాలి. నువ్వూ మాతో రాజధానికి రావాలి. ఇది మన స్వంత కార్యం కాదు. ఇది ధర్మకార్యం' అన్నాడు కంకుణుడు.

ఇట్టిలుడు, కంకుణిడికి నమస్కరించాడు. “గురువర్యా పాండిత్యానికి, పండితుడికి విలువలేని రోజు దేశం అధోగతి పాలవుతుంది. అది తెలిసిచూస్తూ ఉపేక్షించటం ఘోరమైన నేరం. నేను మీతో వచ్చేందుకు సిద్దమే. అయినా మీరంతా వచ్చి నన్ను పిలవాలా? కాకితో కబురు పంపితే రెక్కలు 'కట్టుకుని వాలేవాడిని కదా?” అన్నాడు. వడా పట్ర. ముడడ: కస్తూరి మురళీకృష్ణ 2

కంకుణుడు నవ్వాడు. “నీవిలా అంటావని నాకు తెలుసు. కానీ మేము మామూలు

పండితులము. నీవు మహర్షిని. పైగా ఇది శ్రీనగరానికి దారే కదా! అన్నాడు. శే న ఈ

మరుసటి రోజు ఉదయమే తూలమూల గ్రామాన్నుంచి' (న్రజలు శ్రీనగరానికి బయలుదేరారు. దారిలో వారితో మిగతా గగ్రామాలవారు అనేకులు వచ్చి చేరసాగారు.

చినుకు చినుకు కలిసి వర్షమై, గాలివానయై, తుఫానులా మారినట్టు ఒకరొకరు కలసి పెద్ద జన ప్రవాహమై కళ్ళీర రాజధానివైపు పయనించసాగారు. దారిలో వితస్తానదిలో స్నానం చేశారు వారందరూ.

“ఈ వితస్తా సోయగాన్ని వర్ణించటం మానవతరం కాదు. పార్వతీదేవి జలరూపం ధరించి పరమశివుని పాదాలు కడిగేందుకు పరుగిడుతున్నట్టు ప్రవహిస్తోంది జలరాశి అన్నాడు ఇట్టిలుడు పరవశంతో.

నదిలో కనిపించే రాళ్ళన్నీ పవిత్ర శివలింగాలుగా తోచాయి. పరవళ్ళు తొక్కుతూ, గుడుసుల్లు తిరుగుతూ, ఆ రాళ్ళ చుట్టూ తిరిగే జలం పరమశివ అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. అడుగడుగునా కనిపిస్తున్న ఆ శివలింగ (ప్రతిరూపమైన గులకరాళ్ళను చూస్తూ తన్మయులైపోతున్నారు. వారు.

కాస్త దూరం పోగానే వారందరి ఊపిరి స్థంభించిపోయింది. ప్రకృతి విరాట్స్వరూపం వారి ఎదుట పర్వత పంక్తుల రూపంలో నిలిచింది.

ఎత్తయిన ఆ కొండలు ఆకాశాన్ని చీల్చుకుని పైకెదికి పరమశివుని పాద స్పర్శ కోసం తహతహలాడుతూ కైలాసాన్ని తాకుతున్నట్టున్నాయి.

వితస్తానది చుట్టూ ఉన్న ఆ పర్వతాలు గంభీరంగా తపస్సు చేసుకుంటున్న మునుల్లా ఉన్నాయి. వాటిని చూడగానే మనసులో భక్తి భావంతో కూడిన భీతిభావం జనిస్తోంది. ఆ పర్వతాలచుట్టూ (వ్రేలాడే మేఘాలు మల్లెల్లా ఉన్నాయి. వాటి తెలుపు ఆ బుషుల యశస్సులా స్వచ్చంగా ఉంది. ఆ మేఘాలు బుషుల తపస్సుకు మెచ్చి దేవతలు వారి మెడలో వేసిన పూలమాలల్లా ఉన్నాయి. అ పర్వతాలను చూస్తూంటే వారందరికీ విధాత బెన్నత్యం, తమ అల్బత్వం గుర్తుకు వచ్చింది.

ఎదురుగా ఇంత అద్బుతమైన విధాత సృజనాత్మక కళాకౌశలాన్నుంచుకుని కూడా మనిషి నీచుడిలా ఎలా ్రవర్తిస్తాడో?

తమ అల్పత్వాన్న్సి నైచ్యాన్ని చూసి ఈ సృష్టి బెన్నత్యం ఎంతగా సిగ్గుపడుతుందో అనిపించింది. ఇట్టిలుడికి. === కల్దణ కళ్ళ్మీర రాజతరంగిణి కథలు :23232323232దడడడకడడ32త2కడ2జడడడడడ222222డ22--ఊజ 97. 2జ=

ఆ ఉన్నత పర్వతశ్రేణుల వెనుక నుంచి మరింత ఎతైన పర్వతాలు తొంగిచూస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఇట్టిలుడి మనసులో 'ఓం” కార శబ్దం (ప్రతిధ్వనిస్తోంది. ఓంకారం ఊపిరై విశ్వమంతటికీ జీవాన్నిస్తున్నట్టు తోస్తోంది. పర్వత (శ్రేణులు మునులై 'ఓం”కార జపం చేస్తున్నట్టుంది. సృష్టి నలుమూలల నుండి ఓంకార నాదం ్రతిధ్వనిస్తోంది.

ఇట్టిలుడు కళ్ళు మూసుకున్నాడు. అతని హృదయంలో కూడా ఓంకారం ధ్వనిస్తోంది. “ఓమితి బ్రహ్మ! ఓమితీ దగ్‌ం సర్వం! (ఓంకారమ్‌ సర్వం. దృశ్యాదృశ్య జగత్తతంతయు ఓంకారమే) ప్రవహించే నీటి గలగలలోకూడా ఓంకారం వినిపించసాగింది ఇట్టిలుడికి. నీరు శివలింగాల వంటి శిలలపై నుండి జాలువారుతూన్నప్పుడు వచ్చే నురుగులో నుండి ఓంకారం వినిపిస్తోంది.

ఇట్టిలుడు సర్వం మరచిపోయాడు.

ఒళ్ళు మరచి నిలబడిపోయిన ఇట్టిలుడి చుట్టూ మిగతా వారంతా చేరారు. ఇట్టిలుడి స్వరం నుంచి వెలువదే ఓంకార నాదం వింటుంటే వారి వొళ్ళు పులకరించింది. అందరూ ఓంకార జపం చేయసాగారు. సర్వప్రకృతి వారితో ఓంకార జపం చేస్తున్నట్టు తోచింది.

ఇంతలో గుర్గపు దెక్కల చప్పుడు వారి ధ్యానానికి భంగం కలిగించింది. కొందరు రాజభటులు వారిని చుట్టుముట్టారు. 'మర్యాదగా మీ వద్ద ఉన్న ధనం ఇవ్వండి. లేకపోతే మా కొరడాలు మీ వీపులపై నృత్యం చేస్తాయి" అని బెదిరించారు.

“మీరు దారిదోపిడీగాళ్ళా? రాజభటులా? మా వద్ద ధనమేముంది? భిక్షాటన చేసి 'బ్రతికేవారం. మా ధర్మమేమా ఆస్తి. దోచుకోగలిగితో దోచుకోండి" అన్నాడు వృద్ద కంకుణుడు.

భటులు వెకిలిగా నవ్వి “మీరు బ్రతికిపోయారులే. మహారాజు తూలమూల గ్రామాన్ని అపహరించాలని వెళ్తూంటే సగం దూరంలోనే తొంఖైతొమ్మిది మంది విప్రులు వితస్తాలో దూకి ప్రాణ త్యాగం చేశారని తెలిసింది. రాజు తన ప్రతిజ్ఞ ప్రకారం ఇక విష్పలను వధించనని అన్నాడు. అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాం అని విచక్షణా రహితంగా వారిపై కొరడా దెబ్బల వర్షం కురిపించి వెళ్ళిపోయారు.

భటులు కొట్టిన దెబ్బల కన్నా భటులు చెప్పిన వార్త వారిని కదిలించివేసింది. “ఇంత అద్భుతమైన ప్రకృతిని చూస్తూ కూడా మనుషులు పశుప్రాయంగా ఎలా ప్రవర్తిస్తారో? విధాత సృష్టి ఎంత విచిత్రం?” అనుకున్నారందరూ.

అలా వ్యాకుల చిత్తులై నడుస్తూవారు రాజ భవనం చేరారు. భటులు వారిని లోపలకు రానివ్వలేదు.

ఇలా [గ్రామ పెద్దలు, పండితులు విజ్ఞప్తి చేసేందుకు తన వద్దకు వస్తున్నారని జయాపీడుడికి ముందుగానే తెలుసు. అయినా వారిని కాస్త ఏడిపించాలని, ఎవరినీ లోనికి రానివ్వద్దని ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఒక రోజంతా వారిని బయటే నిలబెట్టాడు జయాపీడుడు. మ 98 :డకడ్డడ్డడడడకడడడడడడడడడడడుడడడడడడడడుడుడడడడడడడడడడడనడడడడడడడడనడడ కస్తూరి మురళీకృష్ణ నా

మరుసటి రోజు అందరినీ లోపలకు రానిచ్చాడు. కూచోమనలేదు. పరామర్శించలేదు. “ఎందుకు వచ్చారు ఏం కావాలి? అని అడగలేదు.

రాజ సేవకులను పిలిచి 'రాజు పిలవకుండా, రాజుకు గౌరవ సూచకంగా బహుమతులేవీ లేకుండా వచ్చిన వీళ్ళందరినీ చెంప దెబ్బలతో సత్మరించండి అని ఆజ్ఞాపించాడు.

వెంటనే 'సేవకులు వెకిలి నవ్వులు నవ్వుతూ, నిందా పూర్వకమైన పరుష పదజాలాన్ని ప్రయోగిస్తూ అక్కడున్న వారందరినీ చెంప దెబ్బలు కొట్టారు.

వారికి జరుగుతున్న ఈ అవమానాన్ని చూస్తూ రాజసభ సర్వం పకపకా నవ్వింది. దండనాధులు, మంత్రులు పడీపడీ నవ్వారు.

అవమాన భారంతో, క్రోధంతో కంకుణుడు ముందుకు వచ్చి “రాజా! మనువు, మాంధాత, శ్రీరాముడు మొదలైన పలువురు రాజులు ఈ పృధివిని పాలించారు. వారి పాలనలో ఎన్నడూ పండితులు, విప్రులు ఇలా అవమానానికి గురికాలేదు. విప్రుల ఆవేశానికి దేవతలే భయపడతారు. పండితులు క్రుద్దులైతే ఇంధ్రసహితమైన స్వర్గం, పర్వత సమేతమైన భూమి, శేషునితో కూడా పాతాళాన్ని భస్మికరించగలరు అన్నాడు.

ఆవేశంతో ఎర్రబడిన అతని వదనం, విస్ఫులింగాలు వెదజల్లుతున్న అతని కళ్ళు చూసి సామంతులు భయకంపితులై సభ నుంచి పారిపోయారు.

రాజు జయాపీడుడు వికృతభృటియై వికటంగా నవ్వాడు నేనెవరో తెలుసా మీకు?” అనడిగాడు.

విష్ణుశర్మ ముందుకు వచ్చి 'ప్రభూ కల్యాది నుంచి 3890 సంవత్సరంలో (క్రీ.శ. 288) యాఖై ఏళ్ల పాలన తరువాత దుర్లభవర్ధనుడు మరణించాడు. రాణి అనంగలేఖ తన తండ్రి అయిన బాలాదిత్యునకు దౌహిత్రుడయిన కారణాన ప్రతాపొదిత్యుడనే పేరుగల దుర్లభకుడిని

న్‌,

రాజు చేసింది. దుర్లభకుడు నరేంద్ర ప్రభ అనే వైశ్యుని భార్యను చూసి (సేమించాడు. ఆ వైశ్యుడు రాజభావనలోని నిజాయితీని గ్రహించి తన భార్యను దేవదాసిగా దానమిచ్చాడు. రాజు ఆ దానాన్ని స్వీకరించాడు. వారిద్దరికీ జన్మించిన చంద్రాపీడుడు యాభైతొమ్మిదేళ్ళు రాజ్యం చేశాడు. చంద్రాపీడుడు త్రిభువనస్వామి మందిరాన్ని నిర్మించదలచిన స్టం చర్మకారుడిదయితే రాజు వినయపూర్వకంగా అతడిని అభ్యర్థించాడు. అంతటి వినయవంతుడు, ధర్మదీక్షాపరుడు మీ పూర్వీకుడు చంద్రాపీడుడు.

ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల రాజ్యపాలన తరువాత తన తమ్ముడు తారాపీడుడి కుటిల మంత్ర శక్తికి లోబడి ,చంద్రాపీడుడు మరణించాడు. అతని పాలన నాలుగునెలల గా. కలగ కశ్మీర రాజతరంగిణి కధలు :33తడడడడడకడడడకడకడడకడకతడడతడతడ2డడ22డడ2డ2222ఊ కిరి ==

ఇరవై దినాలే. ఆ తరువాత అతని కనిష్ట సోదరుడు లలితాదిత్యుడు కళ్ళీర రాజయ్యాడు" అన్నాడు. అంతలో కంకుణుడు ముందుకు వచ్చాడు. రాజా, నీ పితామహుడు లలితాదిత్యుడు మవాద్భుత వ్యక్తి. సచ్చీలుడు, సచ్చరితుడు, గంగా కాళిందుల మధ్య గల ప్రదేశాన్ని తన ప్రతాపానల కీలల ద్ధం చేశాడు. గాధిపురాన్ని జయించాడు. కన్యాకుబ్దాధీశ్వరుడు లలితాదిత్యుడి ప్రతాపానికి భయపడి సంధి చేసుకున్నాడు. దాంతో యమునా తరంగిణులకు ఉత్తర ప్రాంతాలు మొదల్మొని కాళికాతటం వరకూ గల యావత్మన్యాకుబ్ద దేశం లలితాదిత్యుని గృహ ప్రాంగణమయింది. కళింగాన్ని గొడసేనలను వింధ్యాత్రికి దక్షిణాన ఉన్న కన్నడ రాణిని జయించి విజయోత్సాహంతో లలితాదిత్యుడు సముద్రాంతరమున ఉన్న తీరాలన్నీ జయించాడు. పశ్చిమవైపున ద్వారకను, అవంతిని గెలిచి ఉత్తరాన కాంభోజ భూపాలుని కిరీటాన్ని తొలగించాడు. దరద దేశంలోని దుష్టులను శిక్షించాడు. ప్రాగ్జోతిష్పురాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. ఉత్తర కురు దేశపు రాజు లలితాదిత్యుని ప్రతాపాన్ని చూసి, గరుడికి భయపడి బిలాల్లో దూరే పాముల్లాగా అడవుల్లోకి పారిపోయాడు. ఏనుగు సమూహాలను చీల్చి చెండాడి సింహం తన స్వస్థానాన్ని చేరినట్టు అన్య రాజుల ్రతాపాలను చీల్చి చెండాడి లలితాదిత్యుడు కళ్శీరాన్ని చేరాడు అన్నాడు కంకుణుడు.

వెంటనే మిత్రశర్మ ముందుకు వచ్చాడు.

'ముష్పయి ఆరు సంవత్సరాల ఏడు నెలల పదకొండు రోజుల లలితాదిత్యుడి పాలన తరువాత ఆయన ఆదేశానుసారం అతని పుత్రుడు కువలయాపీడుడు రాజై ఒక సంవత్సరం, పదిహేను రోజుల తరువాత అత్యంత వైరాగ్యంతో రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు. అతని సవతి సోదరుడు వజ్రాపీడుడు రాజయ్యాడు. వజ్రాపీడుడు భోగలంపటుడు. మ్లేచ్చ సానుభూతిపరుడు. ప్రజలను బంధించి మ్లేచ్చులకు బలవంతంగా అప్పగించాడు వజ్రాపీడుడు. అలా ఏడు సంవత్సరాలు పాలించి క్షయ రోగంతో మరణించాడు వజ్రాపీడుడు.

అతని తరువాత మంజరికాదేవి పుత్రుడు పృధ్వ్యాపీడుడు రాజయ్యాడు. అతని నాలుగు సంవత్సరాల ఒక నెల పాలన మహా భయంకరమైనది. అతని తరువాత తమరి అన్నగారు సంగ్రామసింహుడు రాజై ఏడు రోజులే పాలించి మ్లేచ్చుల కుతంత్రాలకు బలి అయిపోయాడు.

కళ్మీరం మ్లేచ్చుల వశమయ్యే క్లిష్చపరిన్టితిలో రాజ్యానికి వచ్చిన తమరు ఎంతోసమయస్సూర్తితో కళ్ళీరు నుంచి మ్లేచ్చులను నిర్ణించారు” అన్నాడుమిత్రశర్మ.

చక్రధరుడు ముందుకువచ్చాడు. 'తమరు తమ పితామహునివలె దిగ్విజయ యాత్రకు బయలుదేరిన సమయంలో జజ్ఞుడు (దోహంతో రాజ్యాన్ని ఆక్రమించు కున్నాడు. తమరి సైన్యం తమను వదలి కళశ్ళ్శీరానికి తిరిగి వచ్చింది. అయినా చలించక తమరు తమ దగ్గరఉన్న ఒక్కటి తక్కువగా లక్ష అశ్వాలను దక్షిణా సహితంగా విప్రలకు దానం ఇచ్చారు. కళింగ న న మురళీకృష్ణ ను

దేశంలో మారువేషంతో ప్రవేశించి నర్తకి కమలాదేవి ఇంట ఉన్నారు. ప్రజలను పీడిస్తున్న సింహాన్ని చంపటంతో కళింగ రాజు మిమ్మల్ని గుర్తించి తన పుత్రిక కళ్యాణదేవిని తమరికి కన్యాదానం చేశాడు.

ప్రతిగా మీరు ఏవురు నృపాలురను నిర్జించి తెచ్చి మామగారి అధీనం చేశారు. మీరు కళింగలో ఉన్నారని తెలిసి, నాయక విహీనమైన కళ్ళీర సైన్యాన్ని తన అధీనంలో ఉంచుకున్న దేవశర్మ తమరిని రమ్మని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి తమరు కళ్యాణదేవితోపాటు, కమలానర్తకిని తీసుకుని కళ్ళీరం చేరి జజ్ఞుని వధించారు. ఆ స్థలంలో తమరి రాణి కళ్యాణపురాన్ని నర్తకి కమలా నగరాన్ని నిర్మించారు. తమరు మల్దణపురం నిర్మించి, విపుల కేశవస్వామి ఆలయాన్ని కట్టించారు” అన్నాడు చక్రధరుదు.

కేశవుడు ముందుకువచ్చి “ప్రభూ తమరి ఆస్థానంలో రాజపదం కంటే పండితపదానికే ఎక్కువగౌరవం ఉండేది. విద్వాంసులతో, పండితులతో, సామంత నృపులతో రాజసభ కిటకిటలాదుతూండేది. ఇతర దేశాలనుంచి అనేక పండితులు పొట్ట పట్టుకుని తమరి రాజ్యం చేరి సుఖంగా జీవించనారంభించారు. నేనూ పొట్టచేత పట్టుకుని మహష్మతిపురం నుంచి కళ్ళ్మీరం వచ్చినవాడనే ప్రభూ” అన్నాడు.

మిత్రశర్మ ముందుకు వచ్చి 'నేపాల రాజైన ఆరముడి దర్పమణిచిన ధీరులు మీరు. ఇంత మహాద్భుతమైన చరిత్రకు వారసులు మీరు. మీ పూర్వీకుల అద్భుత కృత్యాలనే ఆస్తిని ద్విగుణీకృతం చేయటంలో కృృతకృతలయ్యారు మీరు. ఆ మీరెవరో మాకుతెలుసు. కానీ గత మూడు సంవత్సరాలుగా మారిపోయిన మీరెవరో మాకు తెలియదు.

పండితులు రాజ్యం వదలి పారిపోయారు. ప్రజలు విద్యుక్త కర్మాచరణను మానివేశారు. విప్రులు భీతకావహులై పరరాజ్యాలకు పారిపోయారు. ప్రభూ! మీరి దుష్టమార్గం వదలి మీ పితామహుదైన లలితాదిత్యుడి బాటలోనే నడవండి. అదే మీకు క్షేమకరం. రాజు ఎంత గొప్పవాడైనా, ధర్మోల్లంఘన చేసిన మరుక్షణం ఆ రాజు నామ రూపల్లేకుండా నాశనమైపోతాడు. ఇకనైనా తమరు నిజం (గ్రహించి సమాజాన్ని విచ్చిన్నం చేసే బదులు సమాజ అభ్యున్నతికి తోద్చడండి" అన్నాడు.

ఇంతలో కంకుణుడు 'రాజా భగవంతుడేర్చరచిన ధర్మాన్ని బ్రష్టు పట్టించవద్దు. వర్జాల మధ్య సౌభ్రాతృత్వ భావనను పెంచాలి కానీ ద్వేష భావనలు పెంచకూడదు. పక్షి గాలిలో ఎగురుతుంది. చేప నీటిలో ఈదుతుంది. ఎవరి స్వాభావికమైన పనిని వారిని చేయనివ్వాలి. పక్షిని ఈదమనటం, చేపను గాలిలో ఎగరమనటం మూర్ధత్వం' అన్నాడు.

జయాపీడుడు వికటాట్టహాసం చేశాడు. “చాలు చాలు, చరిత్ర బోధన అయిపోయింది. మీరంతా గతంలో రాజులు మూర్చులై ఇచ్చిన దానాలతో పనీ పాటా లేకుండా ఈ నీతి బోధలు మాత్రం నేర్చారు” అన్నాడు. హెతఆఉ కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :23ై3ై22జడడడ2డడడడకడడడడడడ2డడడడడడడడడడడ2డడ2 101. ౩౭

“రాజా, ఏమీతెలియని మూర్చులు మాట్లాడాల్సిన మాటలివి. మీలాంటి విజ్ఞులు, పండితులు మాట్లాడాల్సిన మాటలుకావు” అన్నాడు కంకుణుడు గంభీరంగా.

రాజు భయంకరంగా నవ్వాడు. 'మీ సంగతి నాకు తెలుసు. (బ్రహ్మ నోట్లోంచి ఊడిపడ్డారనా మీ అహంకారం?” అన్నాడు ఎగతాళిగా.

కంకుణుడు చిరునవ్వుతో 'తరంగము, నురుగు, సుడిగుండము బుడగలు ఎలా స్వరూప

దృష్టితో వేరైనా, తరచి చూస్తే జలము కానిదేదిలేదో అలాగే ప్రపంచమంతా (బ్రహ్మ మయమేయై, బ్రహ్మము కానిదేదీ లేనప్పుడు నోట్లోంచి ఊడిపదటము, కాళ్ళవటమూ ఏమిటి మహారాజా? అనడిగాడు.

ఒక్క క్షణం రాజుకేమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. అంతలో పెద్దగానవ్వి “అతితెలివి ప్రదర్శన అనర్ధదాయకం. అంతా బ్రహ్మమయమే అయితే నేను రాజెలాఅయ్యాను. మీరు సేవకులెలాఅయ్యారు?” అనడిగాడు వేళాకోళంగా.

ఆ ప్రశ్నకు చక్రధరుడు సమాధానం ఇచ్చాడు. 'నేను నేనని అనుకోవటం అంతా మన అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి పుట్టిన అహంకారం లోంచే విశ్వం జనించింది. ఈ అహంకారమే మిమ్మల్ని మీరు రాజనుకునేట్టు, మేము మీ సేవకులమనుకునేట్టు చేస్తోంది. ఆ 'నేనుని చంసి చూడండి మీకు నాకూ తేడా ఉండదు

క్రోధంతో లేచాడు జయాపీడుడు 'అంటే నేను రాజును కాదా?” అని అరిచాడు. అతని చేయి ఒరలోనున్న కత్తిపై పడింది.

చక్రధరుడు నిర్మలంగా నవ్వాడు 'మనుషులంతా భగవంతుని (ప్రతిరూపాలు. తేడాలు మన అజ్ఞానంతో మనం భావించుకుంటున్నాం. సమాజాన్ని విరాట్పురుషుడిగా ఊహిస్తే ఈ నాలుగు వర్ధాలు ఆ విరాట్పురుషుడి నాలుగు భాగాలు. తెల్లనైన మేఘాలు మీ కీర్తి వంటివి. మీ దుశ్చర్యలతో అవి నల్లగా మారేయి అంటే 'నా కీర్తి మేఘాలూ' అని మీరు

అనుకుంటే అది మీ మూర్ధత్వానికి నిదర్శనమెలాగో నోట్లోంచి ఊడిపడటం, కాళ్ళు చేతులవటం సామాన్యాద్ధం తీసుకోవటం అంతే మూర్ధత్వమవుతుంది. మహారాజా, మీ శరీరంలో ప్రతి భాగానికీ నిర్దిష్ట కర్తవ్యం ఉంది. అందులో ఏ భాగం లేకున్నాలోటు లోటే. మరి ఏ భాగం తక్కువ? ఏ భాగం ఎక్కువ? చేతులెక్కువా? కాళ్ళెక్కువా? కళ్ళెక్కువా? ఈ భాగాల్లో ఎక్కువ తక్కువలు మీ కళ్ళకు కమ్మిన స్వార్ధం చూపిస్తోంది. మీ ద్వేషం నేర్పిస్తోంది. మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయి నంచ మహేశ్వరమ్‌! తస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్‌! వడ డే02 కనడం. కస్తూరి మురళీకృష్ణ వడు

ప్రకృతియే మాయ అని, అ మహేశ్వరుడే మాయకు ప్రభువని తెలుసుకో. ఈ యావత్ర్రపంచమూ అతని అవయవ మాత్రులైన జీవులతో నిండి ఉన్నది. జయాపీడా ఇక్కడ జీవులన్నీ అవయవాలు. అంటే నువ్వూ నేనే కాదు, సమస్త జీవరాశి జంతువులు, క్రిమికీటకాదులు కూడా అన్నీ భగవంతునిలో భాగాలే. ఇప్పుడు చెప్పండి ముఖంలోంచి పుట్టిన వారి గొప్ప ఏమిటి? చేతులయిన వారి తక్కువమేమటి? కాళ్ళయినంత మాత్రాన అవమానమేమిటి?”

మిత్రశర్మ ముందుకువచ్చాడు. “జయపీడా, రాజు సమాజ రక్షకుడు. (ప్రజల సేవకుడు. రాజు ప్రజల కోసం కానీ ప్రజలు రాజు కోసం కాదు. రాజు రాజ్యాన్ని పాలించేది ప్రజా సంక్షేమం కోరి కానీ తన బొక్కసాన్ని పన్నులతో నింపుకొనేందుకు కాదు. అలా చేసేవాడు రాజు కాదు. వాడికి రాజ్యార్దత లేదు” అన్నాడు.

రాజు కళ్ళెర్రబడ్డాయి. ఒరలోంచి కత్తిని తీశాడు.

మిత్రశర్మ చెదరలేదు. 'జయాపీడా గుణాలను బట్టి కర్మలను బట్టి వర్ణం కానీ జన్మ చేత కాదు. కాబట్టి నీ అవగాహనారాహిత్యానికి, సంకుచితదృష్టికి సమాజోద్ధరణ అనే ముసుగు వేసి సమాజాన్ని భ్రష్టుపట్టించకు. సామరస్యంతో కలసిమెలసి (బ్రతుకుతున్న సమాజంపై విద్వేషాల విషాన్ని చల్లకు" అన్నాడు.

జయాపీడుడు మిత్రశర్మ ఎదురుగా నిలబడి “ఏదీ జన్మతో కాదు గుణంతోనే 'బ్రాహ్మణుడని ఈ క్షణంలో నిరూపించు. లేకపోతే నీ తలకాయకు చీ శరీరంతో ఇప్పు బుణం తీరిపోతుంది” అన్నాడు కత్తిని మిత్రశర్మ మెడపై ఆనిస్తూ.

నిశ్శబ్దంగా ఇట్టిలుడు వచ్చి మహారాజు ఎదురుగా నిలబడ్డాడు.

'జయాపీడా సత్యం చెప్పినవాదే బ్రాహ్మణుడు. మిత్రశర్మ సత్యం చెప్పాడు. గుణం చేత వర్ణం కానీ జన్మవల్ల కాదు” అన్నాడు నెమ్మదిగా.

జయాపీడుడు కత్తిని మిత్రశర్మ మెడమీద నుంచి తీసి ఇట్టిలుడి మెడమీద పెట్టాడు. “నాకు మాటలు వద్దు. బుజువులు కావాలి అన్నాడు కర్మశంగా.

“బుజువు ఎదురుగానే ఉంది. చూడగలిగే వాడికి మనసుంది. చూడలేని వాడికి నాలిక ఉండనే ఉంది" అన్నాదు

జయాపీడుడు కత్తిని ఇట్టిలుడి మెడపై నొక్కుతూ 'మాటల చమత్కారంతో మోసగించకు. బుజువేది?” అన్నాడు.

ఇట్టిలుడు నవ్వాడు. 'జయాపీడా నీకు బుజువు నేనే. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను మ్లేచ్చుల ఇంట పెరిగాను. నా గురువు కంకుణుడు, నాలోని విజ్ఞాన ాాా! కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు :ఊఊజడైైైడడడడతతతడడడకతడడడడడడడ2చా 103 222

తృవ్టను చూని నాకు వేదవేదాంగాలు బోధించాడు. నేను పండితుడనయ్యాను. (బ్రాహ్మణుడయ్యాను. మహర్షినయ్యాను. బ్రాహ్మణుడి బలం జన్మ కాదు. నియమం, ప్రవర్తన, తపస్సే బ్రాహ్మణుడి బలం. అవి లేనివాడు జన్మచేత ఎవరైనా కర్మచేత బ్రాహ్మణుడు కాడు. (బ్రాహ్మణులు భిక్షా జీవులు. ధన ధాన్యాల మీద భౌతిక సుఖాల మీద ఆశలుండవు' అన్నాడు.

వెంటనే జయావీడుడు భిక్షాజీవులైన మీకు గర్వమెందుకు? నువ్వే మహర్షివైనట్టు మాట్లాడుతున్నావు ఏదీ నీ తపోధనం?” అన్నాడు కళ్లెర్ర చేసి.

ఇట్టిలుడు నవ్వి 'యుగధర్మాన్ని బట్టి నీలాంటి సాధారణ మానవుడు కూదా రాజెలౌ అవుళున్నాడో, నేను అలాగే మహర్షినయ్యాను' అన్నాడు. "

ఆ మాటలు విని ఆవేశంతో రాజు 'ఆ? ఏమి? నీవు తపోనిధులైన విశ్వామిత్రుడు వళిష్టుడు, అగస్త్యుడు వంటివాడివని అనుకొంటున్నావా? నేను కత్తి కదిపితే చచ్చి ఊరుకుంటావు. అన్నాడు కత్తిని రక్తం చిందేలా ఇట్టిలుడి మెడపై ఒత్తుతూ.

ఇట్టిలుడు కోపంగా మహారాజు కత్తిని చేయితో తోసి 'నీవు హరిశ్చంద్రుడు, నహుషుడవు, త్రిశంకుడవు అయితే నేనూ ఆ బుషులలో ఒకడినౌతాను' అన్నాడు.

జయావీడుడు వికటంగా నవ్వి “విశ్వామిత్రుడి కోపం వల్ల వహరిశ్చం(దుడు దుర్దశపాలయ్యాడు. అగస్త్యుని కోపం వల్ల నహుషుడు సర్పమయ్యాడు. వశిష్టుని కోపం వల్ల త్రిశంకుడు స్వర్గభ్రష్థుడయ్యాడు. కానీ నీ కోపం వల్ల ఇప్పుడు నన్నేమీ చేయగలవు? నా కోపం నిన్ను శవంగా మార్చగలదు” అన్నాడు,

రాజు మాటలకు ఇట్టిలుడు కుపిత నేక్రుద్దై, ముఖము అగ్నిజ్వాలాసమంగా తేజో దీప్త్రమవగా, బుసకొట్టిన పాములా, వేడి నిట్టూర్పు విడిచి, చేతితో నేలపై చరచి అన్నాడు. 'నా కోపం వల్ల నీ శిరస్సు పై క్షణకాలంలో ధర్మదండము (బ్రహ్మదండమై పడదా?”

అప్పుడు రాజు కోపంతో, ఎగతాళిగా “అయితే ఇంకా ఆలస్యమెందుకు ధర్మోల్లంఘన చేసిన ఈ నీచుడిపై బ్రహ్మదండం పడి ధర్మాన్ని రక్షించటం లేదే?” అన్నాడు.

ఇట్టిలుడు 'దుష్పుడా! ఇదిగో చూడు అధర్మం నశిస్తుంది అని అంటూండ గొనే ఫెళపెళారావాలతో, రాముడు తాటకిపై ఎక్కు పెట్టిన బాణంలా, ఇంద్రుడు రాక్షసులపై విసిరిన వజ్రాయుధంలా, పెద్ద శబ్దంతో రాజభవనం పైకప్పు నుంచి సర్వదండం ఒకటి రాజు శిరస్సుపై పడింది.

క్షణంలో సభ వోవోకారాలతో నిండింది. ఎక్కడివారక్కడ భయథ్రాంతులై పరుగిడసాగారు. రాజభవనం కేకలతో మార్మోగిపోయింది.

సర్వదందాఘాతంతో రాజు శిరస్సున లోతైన గాయమయింది. క్షణంలో ఆ గాయం కుళ్ళిన పురుగులు పడింది. వైద్యులు కుళ్ళిన భాగాన్ని శస్తాలతో తీసివేశారు. తరువాత నా మురళీకృష్ణ చా

కొన్నాళ్లు రాజు భావి యందు రానున్న నరకాన్ని అనుభవిస్తూ కాలం గడిపాడు. చివరికి ఒకరోజు అసువులు వీడాడు. ప్రతాపవంతుడు, చంచలచిత్తుడైన జయాపీడుడు ముప్పయి ఒక్క సంవత్సరాలు పాలించి కలియుగారంభం నుండి 3722 సంవత్సరాన (క్రీ.శ. 621) మరణించాడు.

అతని మరణానంతరం రాజు ఆత్మశాంతికై అతని పేరు మీద కళ్ళ్మీరంలో అమృతప్రభా కేశవాలయాన్ని నిర్మించారు.

ఈ విధంగా రాజు ధనాన్ని చేపలు మలిన జలాల్ని కాంక్షించి హద్దు మీరి ధర్మానికి గ్లాని కలిగిస్తూ కుమార్జాను వర్తులయితే, రాజులు యమదూతలకు చిక్కి నరకంలో, చేపలు బేస్తవాళ్ళకు చిక్కి వలలో బంధింప బడతాయని చరిత్ర నిరూపిస్తుంది. ఇది కేవలం భూతకాలానికే కాదు వర్తమానానికి, భవిష్యత్తుకు కూడా వర్తిస్తుంది.

క నా కల్పణ కళ్ళ్నీర రాజతరంగిణి కథలు 2323233323 105 జడా

  • " అజం న. 6 చె ల 4 శ గ గ చ మ ల + కా య గహనా చుళే. వలి | తయా స | డ్ర యాయ ఆల్‌ టే లి జ్‌ వో ఈర సంభవామి యుల యుల సూర్యకిరణాలు కళ్ళీర రాజధానిలోని రాజుకోట ముంగిట వజ్రాల తోరణాలను మాణిక్య తోరణాలుగా మారుస్తున్నవేళ అది. సూర్యకిరణ కాంతిలోస్నానమాడి జగతి, తమస్సును వదిలించుకుని శుభ్ర మైన వెలుతురు వస్త్రాలను ధరించి రోజువారీ కార్యక్రమాలకు సిద్దమవుతున్న సమయమది ఆ రోజు కూడా సూర్యోదయం అవటంతోనే జయదేవ పండితుడు కోట తలుపులు తెరిచే సమయానికి కోటగుమ్మం వద్దకు వచ్చి కూచున్నాడు. జయ దేవుడిలా కోటగుమ్మం ముందు రాజదర్శనం కోసం పడిగాపులు కాయటం ఆరంభించి వారం రోజులవుతోంది. ఇన్ని రోజులుగా అతడిని పట్టించుకున్న వారు లేరు ఇక్కడెందుకున్నావు? అని అడిగినవారు లేరు. జయదేవుడిలా, జయదేవుడికన్నా ముందునుంచీ పడిగాపులుకాస్తున్నవారూ ఉన్నారు. తమ అనేక సమస్యలను రాజుకు వినిపించాలని వచ్చినవారు వారంతా. చివరికి జయదేవుడే రక్షకభటులను అడిగాడు. 'రాజదర్శనం కోసం త్రిభువనపురం నుంచి వచ్చాను. జయదేవ పండితుడను. నన్ను లోనికి పోనీయండి”' అన్నాడు. న లన కస్తూరి మురళీకృష్ణ లే

కానీ రాజభటులు “నువ్వు త్రిభువనపుర నివాసి జయదేవ పండితుడివే అని మాకు ఎలా తెలుస్తుంది? నువ్వు త్రిభువనపురి నివాసివేనని మీ పురాధికారితో ధృవీకరణ పత్రం తీసుకునిరా. అప్పుడు నువ్వు రాజదర్శనం చేయవచ్చు” అని జయదేవుడిని పక్కకు నెట్టేశారు.

“నేను వారం రోజులు ప్రయాణంచేసి రాజధాని చేరాను. మళ్ళీ త్రిభువన పురం వెళ్ళాలంటే వారం ప్రయాణం చేయాలి. అయినా, ఎవరో, నేను నేనేనని చెప్పేదాకా నేను నేను కాకుండా పోవటం ఏమిటి?” విస్మయంగా అడిగాడు జయదేవుడు.

“అవన్నీ మాకు తెలియవు. ఇక్కడి వద్దతి అది. ధృవీకరణ వ(త్రం లేనివారికి రాజదర్శనార్హత లేదు అన్నాడు భటుడు విసురుగా.

జయదేవుడికేమీ తోచలేదు. “అయ్యా, నా గొడవ త్రిభువనపురాధీశుడితోనే. నేను మీ దుశ్చర్యలు వివరించేందుకు రాజదర్శనానికి వెళ్తున్నాను. నాకు ధృవీకరణపత్రం ఇవ్వండి అంటే ఇస్తాడా? నా గొంతుకోసి చంద్రభాగ నదిలో పడేస్తాడు. దయయుంచి నన్ను లోపలకు పంపించండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని (బ్రతిమిలాడాడు జయదేవుడు.

“నువ్వు చేతులెత్తి నమస్మరిస్తున్నావు. బావుంది. కానీ ముమ్మడి ఆజ్ఞ ధిక్కరించి ధృవీకరణ పత్రం లేకుండా నిన్ను లోపలకు పంపితే రేపటి నుంచీ చేతులుసాచి అడుక్కునేందుకు కూడా మాకు చేతులుందడవు” అన్నాడా భటుడు.

జయదేవుడికి ఏమీ పాలుపోలేదు. ఇప్పుడు మళ్లీ త్రిభువనపురం వెళ్తే తాను తిరిగి రాలేడు. కానీ ధృవీకరణ పత్రం లేనిదే తన పని ఇక్కడ పూర్తి కాదు? ఏం చేయాలి?

త్రిభువనపురం వెళ్ళి రావటం దండుగ. ఇక్కడే పడిగాపులు కాస్తే వదో ఒకనాడు రాజు కోట దాటి బయటక రాకుండా ఉండడు అప్పుడు తానే రాజు ఎదుటపడి తన సమస్యను నివేదిస్తాడు ఎదురుపడి అర్జించిన పౌరుడిని ఏ రాజూ కాదనడు” అనుకున్నాడు జయదేవుడు.

ఇలా ఆలోచించి జయదేవుడు రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కోటగుమ్మం ముందు మండుటెండలో పడిగాపులు కాస్తున్నాడు. అతనితోపాటూ పడిగాపులు కాసే వాళ్ళు పరిచయమైనా జయదేవుడు ఎవ్వరితోనూ మితృత్వం నెరిపే స్థితిలో లేడు.

వారం రోజుల నుంచీ రాజు బయటకు రావటం లేదు. భటులకు కనికరింపు లేదు. ధనవంతులు ధృవీకరణపత్రం అవసరం లేకుందా తిన్నగా లోనికి వెళ్ళిపోతున్నారు. భటులు వారికి వొంగి మరీ దండాలు పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? రాజు సహాయం వీదవారికి ధనవంతులకన్నా ఎక్కువ అవసరం. కానీ రాజు దృష్టికి బీదవారు కనిపిస్తున్నట్టే లేదు. ఇదేమి రాజు? ఇదేమి రాజ్యం? మరికొందరు భటులకు ధనం ఇచ్చి, ధృవీకరణ పత్రం లేకుండానే లోనికి వెళ్ళిపోతున్నారు. కానీ తనకు తినటానికే లేదు. ఇక లంచం ఇచ్చేందుకు ఏముంటుంది! అందుకే జయదేవుడు అక్కడే కూర్చుండిపోయాడు. క==ఊజజా= కల్లణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2౭22222222 10? ==

ఆ రోజు జయదేవుడికి మరీ నీరసంగా ఉంది. ప్రయాణం ఆరంభించి నప్పటి నుంచీ భోజనం సరిగా లేదు. రాజధానిలో తన పాండిత్యానికి ఆశ్రయం దొరుకుతుందనుకున్నాడు. గతంలో ధనంతో సంబంధం లేకుండా భోజనమైనా కనీసం పెట్టేవారు. కానీ ఇప్పుడిక్కడ ధనం తప్పించి ఈ మనుషులకు మరొకటి కనిపిస్తున్నట్టు లేదు. తన పాండిత్యం ఇక్కడ ఎందుకూ పనికివచ్చేట్టు లేదు.

అందుకే జయదేవుడు ఉదయం పూట పళ్లుకొని తింటున్నాడు. రాత్రిళ్ళు నీళ్ళతో కడుపు నింపుకుంటున్నాడు. ఇంకో రెండ్రోజులయితే పళ్ళు కొనేందుకు కూడా ధనం మిగిలేట్టు లేదు.

నీరసంగా ఉంది జయదేవుడికి. పైగా పైన మండుటెండ. రెండు మూడు రోజుల క్రితం ఒక వర్తకుడి దగ్గరకు వెళ్లి తనని పరిచయం చేసుకుని కాస్త ధనం ఇమ్మని అడిగాడు. రాజుని కలువగానే అతని ధనం తిరిగి ఇచ్చేస్తానన్నాడు.

ఆ వర్తకుడు నవ్వి 'పద్యాలు చెప్తే పరమానందపడి పసిడినాణేలు వెదజల్లే రోజులు పోయాయి. “అయినా నోరు తెరచి అడిగారు కాబట్టి కాదనలేను అని ఒక నాణెం విసిరేశాడు.

రాజు గురించి అలా మాట్లాడినందుకు బాధ అనిపించింది జయదేవుడికి. నేలమీద పడిన నాణేన్ని తీసుకునేందుకు మనసు ఒప్పుకోలేదు. భిక్షాటన తమ వృత్తి అయినా భిక్షం స్వచ్చందంగా, మనస్ఫూర్తితో, దైవార్చణం అనుకుని గౌరవంగా వేస్తేనే తీసుకోవటం అలవాటు.

ఇప్పుడనుకుంటున్నాడు. ఆ నాణెం తీసుకుని ఉంటే బావుండేదని. కనీసం మరోరోజు పళ్ళు కొనేందుకయినా సరిపోయేది.

కాస్త ఓపిక చేసుకుని రాజభటుల ముందుకు వెళ్ళి నిలబడ్డాడు.

“ఏమయ్యా, ఇంకా ఆశ చావలేదా? ఫోఫో' అన్నాడొక భటుడు.

మళ్ళీ వెనక్కువచ్చి కూచున్నాడు జయదేవుడు. ఇలా అయిపోయిందేమిటి రాజ్యం?

జయదేవుడి పక్కన ఉన్న ఒక ముదుసలి వ్యక్తి పెద్దగా నవ్వి “ఇక్కడ ధనానికి తప్పించి దేనికీ విలువ లేదు పండితయ్యా. నేను చూడు నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నాను. (గ్రామాధికారి కూతురు పెళ్ళికి ధనం అవసరమైందని భటులను పంపించి మా ఇళ్ళు వాకిళ్ళు దోచుకున్నారు. న్యాయం అడిగిన నా కొడుకుని చంపేశారు. రాజుకు విన్నివించుకుందామని వస్తే ఆయన వైకుంఠం వదలిరాడు. వైకుంఠంలోకి వెళ్ళే పుణ్యం మనకు లేదు" అని వెలికిగా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు వెనుక విషాదం గూడుకట్టుకుని ఉంది.

“రాజు ఉట్టి రాజు మాత్రమే. ఆయన చేతిలో అధికారాలేమీ లేవు. రాజుకు మన బాధలు చెప్పి కూడా లాభం లేదు. కానీ చేసేదేమీ లేక ఏమైనా జరుగుతుందేమోనని ఆశతో కూచున్నాము” ఇంకో వ్యక్తి చెప్పాడు.

222 106 522కు కస్తూరి మురళీకృష్ణ నా!

ఇది కళ్ళ్శీరమేనా? తనకు న్యాయం చేయమని అడిగిన వృద్ధ బ్రాహ్మణునికి న్యాయం చేసేంతవరకూ తాను నిరాహారంగా ఉన్న చంద్రాపీడుడు ఏలిన రాజ్యమేనా ఇది? నీరసంగా వెనక్కువాలాడు జయదేవుడు. అతనికి ఆలోచించే ఓపిక కూడా లేదు.

ఇంతలో ఒక భటుడు జయదేవుడి దగ్గరకు వొచ్చి రహస్యంగా 'పదినాణేలుంటే ఇవ్వు లోపలకు పంపుతాను" అన్నాడు.

జయదేవుడు నీరసంగా నవ్వాడు. “లేవుబాబూ” అన్నాడు.

“పోనీ అయిదు నాణేలయినా ఫరవాలేదు అన్నాడా భటుడు.

'నా దగ్గర తినటానికి తిండిక్కూడా లేవు నాయనా” అన్నాడు.

ఆ భటుడుచిరాకుతో, “అంత దరిద్రుడివి రాజును కలవాలని ఎలా అనుకున్నావు? అన్నాడు.

“అయ్యా ప్రజలు దరిద్రులయ్యేరంటే ఆ దోషం రాజుదే. పూర్వంలో రాజులు సామాన్యుల కష్టాలు వినేందుకు రోజుకోమారు కొలువు తీరేవారు. రాజసభలో ఎవరి అనుజ్ఞలేకుందా సామాన్యులు కూడా నిర్భయంగా ్రవేశించగలిగే వారు.” రుసుం చెల్లిస్తే కానీ దర్శనం కాదు చెప్తే అర్ధంకాదు. ధృవీకరణ పత్రం లేదు.పోనీ ధనం ఇవ్వవు. ఫో నీగతి ఇంతే” అని విసవిసా వెళ్ళిపోయాదాభటుడు

జయదేవుడు నీరసంగా కూచుండిపోయాడు.

జయదేవుడి పక్కన ఉన్న ముసలాయన నవ్వి “మీకు రాజధానిలో పరిస్థితులు తెలిసినట్టు లేవు అన్నాడు.

జయదేవుడు 'పండితులకు గౌరవం దొరకనిప్రదేశం ఈ దేశంలో లేదని అనుకున్నాను అన్నాడు. అయినా మనదేశంలో పండితులు విద్యాదాతలు అందరూ మావద్దకు వచ్చి చదువుకుంటారు. విద్యార్థులకు చదువుచెప్పి అన్నం పెట్టేవాళ్లం మాకు రాజధానిలో అన్నం కరువు అవుతుందని అనుకోలేదు. ఈ దేశంలో ఒక పురాతనమైన నిర్దిష్ట సంఘ వ్యవస్థ ఏర్పడి ఉంది. దానికి రాజుతో పనిలేదు. అందుకే రాజధాని రాజకీయాలతో నాకు పనిలేదు అన్నాడు జయ దేవుడు. మళ్లీ దానికా వృద్ధుడు నవ్వి 'ఇట్టీలుడి శాపంతో (బ్రహ్మదండ దండనము అనుభవించి జయపీడుడు మరణించాడు. అతని తరువాత దుర్గాదేవి అను రాణికికలిగిన జయాపీడుని కుమారుడు లలితాపీదుడు రాజయ్యాడు. లలితా పీడుడు పరమ నీచుడు. రతికేశీ విషయాలన్నీ గ్రహించాలని వేశ్యలను చేరదీసి ఒక్కొక్క శాస్తాభ్యాసంలో రాత్రింబవళ్లు మునిగి తేలుతూండేవాడు అన్నాడు.

'తెలుసు. ఆయన నీచ వాోస్యాన్ని నిరసించి మా తండ్రిగారు రాజదండనకు గురై మరణించారు చెప్పాడు జయదేవుడు. === కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2333ఊకడకక2ఊఊకడడడడ2ఊఊఊడణాఐ 109 ==

ఇద్దరి మధ్య కాసేపు మౌనం తాండవించింది. చివరికి ఆ వృదృడు మళ్లీ చెప్పటం అరంభించాడు.

“ద్వాదశ వత్సరాల పాలన తరువాత లలితాపీడుడు మరణించాడు లలితాపీడుని అనంతరం కళ్యాణ దేవికి జన్మించిన జయాపీడుని కుమారుడు సంగ్రామాపీడుడు కళ్ళీరానికి రాజయ్యాడు. ఏడు సంవత్సరాల సంగ్రామాపీడుని పాలన తరువాత ఈడిగ జాతికి చెందిన జయాదేవి అనే వేశ్యకు లలితాపీడుని వలన జన్మించిన 'చఛిప్పటజయాపీడుడు' కశ్మీరానికి రాజయ్యాడు. ఈ జయాదేవి 'ఆఖూబ్‌ో [గ్రామ వాస్తవ్యుడయిన 'ఉప్ప” అనే వాని కూతురు చిప్పట జయాపీడుడు శైశవావస్థలో రాజయ్యాడు. దాంతో జయాదేవి సోదరులు పద్ముడు, ఉత్పలుడు, కళ్యాణుడు, ముమ్మడు, ధర్ముడు అనే అయిదుగురు రాజ్యాన్ని చిప్పట జయాపీడుడి పేర పాలించసాగారు. రాజ్య సర్వాధికారాలు ఈ అయిదుగురు తమ చేతిలో పెట్టుకున్నారు. అయితే జయాదేవి ఆజ్ఞలకు వీరు లోబడి నడచినంత కాలం రాజ్యం ఏ బాధా లేకుందా నడచింది.

కానీ ఆమె తరువాత ఈ అయిదుగురు అన్నదమ్ముల మధ్య మాత్సర్యం పెరిగింది. ఎవరికి వారు తామే అందరి కన్నా బలవంతులని నిరూపించు కోవాలని ప్రయత్నించసాగారు. ఎక్కువ అధికారం తమ చేతిలోనే ఉండాలని,అధికారులుగా తమ అనుయాయులే కావాలని పోటీపడసాగారు. జయాదేవి బ్రతికి ఉన్నంత కాలం అధికారాలు అధికాంశం ఉత్పలుని చేతిలో ఉండేవి. జయాదేవి మరణం తరువాత ఉత్పలుడి ప్రాబల్యం తగ్గింది. అయిదుగురిలో పోటీ తీవ్రతరమయింది. ఎవరికి వారు తమ తమ అనుయాయులను ఏర్పరచుకుని రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించసాగారు. ఉత్పలుడు తమ మాట వినకపోతే వీరి అనుయాయులు ఊరి మీద పడి భీభత్సం సృష్టించేవారు. ప్రజలను హింసించేవారు. దాంతో ఉత్పలుడు అన్ని అధికారాలు వదులుకున్నాడు. అధికారాలను అయిదుగురూ సంచుకున్నారు.

ఈ అయిదుగురు నీచులు. వారి వ్యవహార జ్ఞానము నీచతాపూర్వంగా, నిరంకుశంగా ఉండేది. ఎవరికి వారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. ఆ భవనాలలో పూదో టలలో బంగారు ఉయ్యాలలు కట్టించుకున్నారు. గొప్ప గొప్ప విందులు, నృత్యాలు మొదలైన భోగాలతో మునిగి తేలుతున్నారు. ధనం అవసరమైతే అధికారిని పిలిచి 'తెల్లవారేలోగొ ఇంత ధనం కావాలి” అంటారు అది ఎలా వస్తుందో వీరికి అనవసరం.

రాక్రికి రాత్రి సైన్యం ఊళ్లమీదపడి ప్రజలను పీక్కుని తింటుంది. ఈ అసలు రాజులు అడిగినంత వారికి ఇచ్చి మిగతా సైనికులు పంచుకుంటారు. రాజాధికారులు ఎంత జంతువులో సైనికులు అంత జంతువులయ్యారు.

“ఇంత దారుణ స్థితి నెలకొని ఉందా కళ్ళీరంలో?” ఆశ్చర్యంగా అడిగాడు జయదేవుడు. నిజం చెప్పాలంటే ఇపన్నీ జయదేవుడికి తెలియవు. తన జ్ఞాన సంపాదన, విజ్ఞాన బోధన తప్ప మరొక విషయం జయదేవుడికి తెలియదు. దయా 120 డడ కస్తూరి మురళీకృష్ణ దత

జయదేవుడి ఆశ్చర్యం చూసి ఆ వృద్దుడు నవ్వాడు 'ఆ అయుదుగురు అన్నదమ్ముల నీచత్వానికి పరాకాష్ట చిప్పట జయాపీడుడి హత్య. చిప్పట జయాపీడుడు ఎదిగి పెద్దవాడైతే ఎక్కడ అధికారం తమ నుంచి లాక్కుంటాడో అని ఈ అయిదుగురు జయాపీడుడిని చంపించారు. అధికారం కోసం స్వంత మేనల్లుడిని చంపించారు” అన్నాడు.

జయదేవుడు చెవులు మూసుకున్నాడు. 'హే భగవాన్‌ వీరికి ఈ లోకంలో భయం లేకపోతే పరలోకభీతి అయినా లేదా?” అన్నాడు.

వృద్దుడీసారి పెద్దగా నవ్వాడు.'తమరు అరణ్యంలో ఒంటరిగా ఉంటున్నట్టున్నారు. ప్రస్తుతం కళ్మీరమంతా మ్లేచ్చ భావమయమయిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి మ్లేచ్చులు భారతావనిపై విరుచుకుపడుతున్నారు. ఒకో మ్లేచ్చ మూకతో ఏదో ఒక కొత్త నీచపుటాలోచన శరీరంలో రక్తనాళాల్లో విషం ్రవేశించినట్టు ప్రవేశిస్తోంది. రక్తనాళంలో ప్రవేశించిన విషం శరీరమంతా పాకినట్టు అది దేశమంతా పాకుతోంది.

ఈ మ్లేచ్చులు తీవ్రవాదులు వారు ఇంద్రియాలను అదుపులో పెట్టటం అనే మాటను ఒప్పుకోరు. వారికి పరలోకాలపై విశ్వాసాలు లేవు. ఇప్పటి (బ్రతుకు తప్ప వారికింకో విషయంపై ధ్యాసలేదు. వారికి పూర్వజన్మలు లేవు. పరజన్మలు లేవు. పుట్టినప్పుడు పుట్టటం. చచ్చినప్పుడు చావటం అన్నమాట.

“ఇంత ఘోరమా ఆ మ్లేచ్చ మతం?” ఆశ్చర్యంగా అడిగాడు జయదేవుడు.

“అసలు ఘోరం విను. జన్మ మొత్తం ఎన్ని పాపాలైనా చెయ్యి. చనిపోయే ముందు ఎవరినైనా పిలిచి ఇలా గిలాగ చేశాను అని చెప్తేచాలు నర్వపాపాల నుంచి విముక్తులయిపోతారట' అని చెప్పి పెద్దగా నవ్వసాగాడా వృద్దుడు"

జయదేవుడు కూడా నీరసంగా నవ్వాడు. “అదేమి మతం? పాపభీతి లేని వారు దుష్కైయాచరణకు వెనుకంజ వేయరు. మరణవేళ వరునితో చెప్తే చాలు పాపాలు పరిహారమౌతాయని నమ్మిన జాతి మహాఘోరాలు చేయటానికైనా వెనుకాడదు. ఛీఛీ మతాన్ని బట్టి మానవ శీలము. శీలం లేని మతాన్ని అనుసరించే ఆ జాతి ఏం జాతి. ఛీఛి చీదరించుకున్నాడు జయదేవుడు.

“అంతగా చీదరించుకోకండి. ఈ అయిదుగురు అన్నదమ్ముల్లో ఉత్పలుడు తక్క తక్కినవారంతా ఈ మ్లేచ్చ భావ పరంపరకు దాసానుదాసులు. వారు మ్లేచ్చులమై పుట్టలేదే మరిన్ని నీచపు కార్యాలు భయం లేకుండా చేసేవారము కదా అని బాధపడుతుంటారు అన్నాడా వృద్దుడు.

జయదేవుడు “భగవంతుడా! ఉన్నతమైన ఆలోచనాపరంపర ఉన్న జాతి ఇలా పశుతుల్యమైన భావనలకు ఆశపడటమా? సింహం చచ్చిన జంతువు కోసం ఆశపడుతుందా ఎక్కడైనా? కలికాలమంటే ఇదే కాబోలు అన్నాడు. హె కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 22222 న కే 3

“ఇంకా ఇప్పుడేముంది. ముందువినండి. చిప్పట జయాపీడుడి మరణం తరువాత రాజునెవరిని చేయాలి?అన్న విషయంలో సయోధ్య కుదరలేదు. ఎవరికి వారికి తనమాట వినేవాడే రొజుకావాలని పట్టుదల. ప్రతివాడికీ పరోక్షంగా రాజ్యం ఏలాలని దురాశ. వారికి సింహాసనం మీదకూచుని తమమాటకు తలాడించే వాదెవరైనా దొరికితే చాలు. వాడే రాజు. రాజుకుండవలసిన అర్హతలు, లక్షణాలు అన్నీ అవసరంలేదు. వాళ్లకి కావలసిందల్లా గంగిరెద్దులా తలాడించాలి: గొగర్రెలా చెప్పినట్టు వినాలి.”

“అయ్యో జలౌకుడు, మిహిరకులుడు, సంధిమతి, మేఘవాహనుడు, లలితాదిత్యుడు వంటి మహాద్భుత వ్యక్తులు పాలించిన కళ్ళీరానికి, భారతావనికి తలమానికమైన నా కళ్ళీరానికి గంగిరెద్దులూ, గొగర్రెలూ రాజులా? శివాంజుడైన రాజు నేడు పశుతుల్యుడయ్యాడా? పార్వతీ సమానమైన నా కళ్ళ్శీరం మ్లేచ్చమూకల వికృత చర్యల క్రీడారంగమయిందా? అయ్యో! ఎందుకు నా పాండిత్యం, నా జ్ఞానం, నా విజ్ఞానం? ఎందుకు నా జీవితం? నా కళశ్ళ్శీరానికి, ఈ దుస్థితి తొలగించలేని నా బ్రతుకూ ఒక (బ్రతుకేనా?' జయదేవుడి హృదయం ఆక్రోశించింది. ఇన్నాళ్లూ తాను తనదైన స్వప్న ప్రపంచంలో నూతిలో కప్పలాగా ఉన్నాడు. ఆ వృద్దుడు జయదేవుడి మనసులో జరుగుతున్న సంఘర్షణను గమనించకుండా చెప్తూ పోసాగాడు. 'ఈ అయిదుగురూ అనేక తర్జనభర్జనల తరువాత మేఘావళికి పుట్టిన బప్పియ వజ్రాదిత్యుని జ్యేష్టప్తుత్రుడు క్రిభువనాపీదుడిని సింహాసనంపై కూచోబెట్టాలని నిశ్చయించారు. త్రిభువనా పీడుడు విరాగి. అతనికీ ప్రపంచంలోని సంగతులే పట్టవు. ఎంతసేపూ భగవధ్యానం తప్ప మరో విషయం పట్టలేదు. దాంతో అతడిని సింహాసనం మీద కూచోబెట్టి వీళ్లు తమ ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చని అనుకున్నారు.

'త్రిభువనాపీడుడు రాజు కాలేదనుకుంటానీ అనుమానంగా అడిగాడు జయదేవుడు.

'త్రిభువనా పీడుడు తెలివైన వాడు. వీళ్లు తనని రాజుకమ్మన్నది తన మీద (్రేమతో కాదని, తానేద్‌ పట్టించుకోకుండా ఉంటే తన పేరు మీద రాజ్యం చేద్దామనీ అని అతను (గ్రహించాడు. అంతేకాదు ఎప్పుడయితే తాను రాజకార్యాలపై శ్రద్ద తీసుకోవటం ఆరంభిస్తాడో, అప్పుడీ అయిదుగురు తన అడ్డు తొలగించేందుకు జంకరని కూడా (గ్రహించాడు. దాంతో అతడు తనకు రాజ్యం వద్దని తిరస్కరించాడు.

అప్పుడు సుఖవర్మ అజితాపీడుడిని రాజుగా చేశాడు. కళ్ళీరానికి వచ్చిన అతి నిస్సహాయ రాజు అజితా పీడుడు. “నేనేం చేయలేను. నా చేతిలో ఏమీ లేదు అంటూ (ప్రతి విషయానికీ తన అయిదుగురు మొగుళ్లవైపు చూస్తూ ఉంటాడు. స్వంతంగా నిర్ణయం తీసుకోలేదు. పైగా అయిదుగురిలో ఏ ఒక్కరి వైపు మాట్లాడినా మిగతా నలుగురు కలిసి చంపుతారని భయం. ఎక్కడ ఎవరికీ కోపం తెప్పిస్తే తన పదవి ఊడుతుందో అని అనుక్షణం హడలి ఛస్తూంటాడు రాజు. పైత [నేం విడనని కస్తూరి మురళీకృష్ణ 222

రోజూ ప్రొద్దున్నే లేచినప్పటి నుంచీ వంతుల వారీగా ఈ అయిదుగురి పాదసేవ చేస్తాడు రాజు. ఈ అయిదుగురు కలసి రాజుకి ఎంత ధనము అవసరమో నిర్ణయించి అంత ధనం రాజుకి ఇస్తారు. అంటే రాజు నెల జీతగాడు అన్నమాటి అని పెద్దగా నవ్వాడా వృద్దుడు.

జయదేవుడు నవ్వలేకపోయాడు. ఒక మంత్రి తన మాట వినలేదని వైరాగ్యంతో రాజ్యం త్యజించి వెళ్లిపోయిన అభిమానధనుడు కువలయాపీడుడు ఏలిన కళ్ళీరానికి రాజు ఇప్పుడు తన పదవి నిలుపుకొనేందుకు అయిదుగురు నీచుల ముందు కుక్కలా తోక ఊపుతూ ఉండటమా?

“ఈ అయిదుగురు నిండు సభలో రాజును అవమానపరుస్తూంటారు. అజితాపీడుడు అది నవ్వుతూ భరిస్తాడు చెప్పాడా వృద్దుడు.

జయదేవుడి నిస్సత్తువ ఎక్కువయింది. హృదయంలో సన్నని మంట మొదలయింది.

“ఈ అయిదుగురు అన్నదమ్ములు కళ్ళీరాన్ని అయిదు భాగాలు చేసుకుని ఎవరి భాగాన్ని వారు దోచుకు తింటున్నారు. ఈ అయిదుగురిలో సుఖవర్మ తక్కువ నీచుడు. అందుకే మీరు ప్రశాంతంగా విద్యాబోధన చేసుకుంటున్నారు” అన్నాడా వృద్దుడు.

'మరి రాజ్యం బాగోగులెవరు చూస్తారు? అడిగాడు జయదేవుడు.

'రాజ్యం బాగోగులు ఎవరికి కావాలి? చచ్చిన ఎనుబోతుపై పడి పీక్కుతినే తోదేళ్లుగా ఈ అయిదుగురు అన్నదమ్ములు కశ్మీర రాజ్య సంపదను కొల్లగొడుతున్నారు. ఉత్పలుడు ఉత్పల స్వామి గుడి కట్టించాడు. పద్ముడు పద్మ మందిరం కట్టించాడు. ధర్ముడు ధర్మ కోవెల కట్టించాడు. మమ్ముడు మమ్ము స్వామి మందిరం కట్టించాడు. ఆ మందిర కలశ స్థాపన సమయంలో మమ్ముడు విప్రులకు ఏఖై వేల గోవులను దానం చేశాడు. గోదాన ప్రతి (గ్రహీతలకొక్కరికి అయిదువేల నాణాలను ఇచ్చాడు. ఈ దానం చేసిన ధనమంతా కళ్ళీర ధనం.

ఈ అపాత్రదానాల వల్ల బొక్కసం నిండుకుంది. అది భర్తీ చేసేందుకు ప్రజలపై పన్నుల భారం. దౌర్జన్యాలు, దోపిడీలు. ఇలా దోపిడీ చేసిన ధనంలో అయిదుగురి వాటాల విషయంలో గొడవ వచ్చింది. ఈ అయిదుగురిలో మమ్ముడు మహా క్రూరుడు తనకు కేటాయించిన ప్రాంతంలోనే కాక, ఇతరుల ప్రాంతాలను కూదా కొల్లగొట్టటం ఆరంభించాడు. ఈ దోచుకున్న ధనాన్ని పంచుకోవటం విషయంలోనే మమ్ముడికి సుఖవర్మకి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మృతులైన వీరుల శవాలతో వితస్తానదీ ప్రవాహానికి అవరోధం ఏర్పడింది ”

“అవును విన్నాను. ఈ యుద్దం గురించి కావ్యాలు కూడా అల్లుతున్నారని విన్నాను అన్నాడు జయదేవుడు. కహెైజజా కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 222222 11తి 2జా

“'మమ్ముడి కుమారుడు యశోవర్మ ఆ యుద్దంలో చూపిన పరాక్రమం వల్ల మమ్ముడు గెలిచి అజితాపీడుని సింహాసనం నుండి దింపి రెండవ సంగ్రామా పీడుని కుమారుడు అనంగాపీడుని రాజు చేశాడు. ఈ అనంగాపీడుడు అజితాపీడుని కన్నా నిస్సహాయుడు. ఇతడు ముమ్మడి చేతిలో తోలుబొమ్మ ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. అయితే ఈ (ఉత్పలుడి కొడుకు) సుఖవర్మ 'అనంగాపీడుడిని సింహాసనం మీద నుంచి దింపుతాననని ప్రతిజ్ఞ పట్టాడు. కానీ ఉత్చలుడికి ముమ్మడికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఉత్పలుడు బ్రతికి ఉన్నన్ని రోజులు యుద్దం జరగదు. అంతవరకూ మనం కోటగుమ్మం ముందు ఇలా పడిగాపులు కాస్తూ ఉండక తప్పదు. ఆ తరువాత మన అదృష్టం ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఉత్పలుడు మరణించి మూడేళ్ళవుతోంది' అని నవ్వాడా వృద్దుడు.

జయదేవుడేమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు.

రాజకీయం సరే తమరే న్యాయం కోరి రాజదర్భనం వాంఛిస్తున్నారు?' చాలాసేపటి మౌనం తరువాత అడిగాడా వృద్దుడు.

జయదేవుడు నీరసంగా నవ్వాడు. అతని కళ్లు తిరుగుతున్నాయి. శరీరం పట్ట తప్పుతుందనిపిస్తోంది. ఏదో ఒకటి మాట్లాడుతుంటే దృష్టి మరలుతుందని మాట్లాడటం ఆరంభించాడు.

“మా పూర్వీకులు జయాపీడుడి పితామహుడైన లలితాదిళ్యుడి ఆస్టాన విద్వాంసులు. నా పితామహుడు జయాపీడుడి ఆస్థాన విద్వాంసుడు. జయాపీడుని దుష్ప్రవర్తన సంహించక రాజాన్థానం వదలిన పండితులలో ప్రధముడు నా పితామహుడు నా తండ్రి ధర్మదేవుడు లలితాపీడుని ఆస్థాన పండితుడు. కానీ లలితాపీడుని దృష్టిలో లైంగిక పాండిత్యం తప్ప మరో పాండిత్యం పాండిత్యమే కాదు. వారకాంతా ప్రసంగ విశారదులు. మద్యపాన విలోలురు తప్ప ఆయనకు మరేదీ ప్రీత్యార్హం కాదు.

ఒకరోజు రాజు సభలో అందరినీ కులటల అడుగు ముద్రలున్న శాలువాలతో సత్మరిస్తూంటే మా తండ్రి ఆ సత్సాధ్గాన్ని స్వీకరించేందుకు తిరస్కరించారు. కానీ రాజభటులు తండ్రిగారిని బలవంతంగా పట్టుకుని ఆయన శరీరంపై శాలువా కప్పారు. దాంతో తండ్రిగారు వొళ్లు మరచిన ఆవేశంతో “విజ్ఞానానికి విలువ ఇవ్వని రాజ్యం అజ్ఞానాంధకారంలో మునిగిపోతుంది. కశ్మీరాన్ని అంధకారంలో ముంచి పార్వతీదేవికి అవమానం చేస్తున్న నిన్ను శివుడు క్షమించడు. నువ్వే కాదు. నీ వంశం సర్వనాశనమైపోతుంది పండితులను గౌరవించని వాడికి పుట్టగతులుందవు అని శపించారు.

కోపోద్రిక్తుడైన రాజు “నాకన్నా ముందు నువ్వే నాశనమవు' అని నిండు సభలో తండ్రిగారిని చంపేశాడు. ఆ రాత్రే మేము రాజధాని విడిచి త్రిభువనపురంలో తాతయ్యగారి వద్దకు పారిపోయాం. తడ గక వకడడకడకడతడడడడడడడడడడడడడడడడడడడదడనడనడడడడ=*ఊఊ4ఊ4ఊ222డ కస్తూర్తి మురళీకృష్ణ నానా!

నా విద్యాభ్యాసం తాతయ్యగారి వద్దనే జరిగింది. నేను బుగ్యజుర్‌ సామ అధర్వణ వేదాల్లో నిష్టాతుడనయ్యాను. ఇతిహాస పురాణాలు, వ్యాకరణ తర్మశాస్తాలు, పూర్వీకుల పూజావిధానాలు, గణితశాస్త్రం, రసాయన శాస్త్రం, రాజకీయ న్యాయ శాస్త్రాలు, దేవవిద్య (భాషా శాస్తం), భూతవిద్య (భౌతికశాస్త్రం), నక్షత్ర విద్య (ఖగోళ శాస్తం) సర్ప దేవజన విద్య (సర్ప శాస్త్రం, లలిత కళలులలో ప్రావీణ్యం సంపాదించాను.

నా జీవితం సుఖంగా గడచిపోతోంది. లలితాదిత్యుడు మా పూర్వీకులకు దానం చేసిన భూమిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడే విద్యాబోధన చేస్తూ ఉన్నాను. త్రిభువన పురాధీశుడి ఉంపుడుగత్తె ఒకామె వివిధ పుష్పాలతో అలరారుతున్న నా పర్ణశాలను చూసి ఆ స్థలంలో తనకు భవనం నిర్మించమని అతడిని కోరింది.

“త్రిభువన పురాధీశుడెవరు?” అడిగాడా వృద్దుడు.

'మళ్తేభుడని....” మాట పూర్తి కాక ముందే అడ్జొచ్చాడు వృద్దుడు.

“వాడా! వాడు మదించిన ఏనుగు వంటి వాడు” అన్నాడు చీదరింపుతో.

“నిజమే, వాడు తన ఉంపుడుగత్తె కోరిక తీర్చటం కోసం నా (బ్రతుకు దుర్భరం చేశాడు. నన్ను ఆ స్టలం విడిచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. నేను వినకపోతే నా విద్యార్థులను భటులతో కొట్టించి, బెదిరించి తరిమేశాడు. నాకు త్రిభువనపురంలో మంచి నీళ్లు పుట్టకుండా చేశాడు. నాకు సహాయం చేసిన వారిని చెజసాలలో వేసి హింసించాడు అయినా నేను మొండిగా ఉన్నాను కానీ ఈ మధ్య ఒక రోజు ఆ వేశ్య తన ఇతర వేశ్య సహచరిణులతో, విటులతో వచ్చినా తోటలో స్వేచ్భావిహారం మొదలుపెట్టింది. జుగుప్సాకరమైన చర్యలన్నీ బహిరంగంగా ప్రదర్శించడం ఆరంభించారు వారు.

చివరికి ఒక రోజు ఆ వేశ్య, దాని విటులు ఇంట్లోనే చొరబడ్డారు. నేను ఎవరిని న్యాయం కోరను? నా భార్యా పిల్లలను, నా భార్య పుట్టింట్లో విడచి నేను రాజధాని మార్గం పట్టాను. కానీ తీరా చూస్తూంటే నా ప్రయాస వ్యర్థప్రయాస అనిపిస్తోంది నిరాశగా అన్నాడు జయదేవుడు.

దానికా వృద్దుడు పెద్దగా నవ్వి ఆరంభంలో నేనూ నిరాశపడ్డాను. ఇప్పుడు ఒకే ఆశతో ఇక్కడ కూర్చుంటున్నాను. రాజ్యంలో ప్రజల ఓర్పు నశించి, వారీ అయిదు వైపులా పట్టిలాగే అయిదు పిచ్చి గుజ్టాల రాజ్యాన్ని అంతమొందించేందుకు ఈ దారిలో పరుగులెత్తుతూ వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూచున్నాను. ఆ రోజు ఆ గుంపులో అందరికన్నా ముందు నేనే ఉండాలి. రాజభవనంపై మొదటి దెబ్బ నాదే పడాలి అన్నాడా వృద్దుడు కళ్ళల్లో అగ్ని ప్రజ్వరిల్లుతుండగా.

ఇంతలో కోట లోపల నుంచి కోలాహలం వినిపించింది.

“రాజుగారు వస్తున్నారు అన్న వార్త క్షణంలో అక్కడున్న వారందరిలో కార్చిచ్చుగా వ్యాపించింది == కల్టణ కశ్మీర రాజతరంగిణి కధలు :3ైైై22222222జ222222222ఉ2ఊ2 11క్‌ ===

కోటలో నుండి గుర్రాలు వేగంగా బయటకు రాసాగాయి. ధూళి ఆకాశానికి ఎగయసాగింది.

జయదేవుడు ఆత్భతగా లేచి నిలబడ్డాడు. అతని కళ్లు తిరుగుతున్నాయి. ఒళ్లు స్వాధీనం తప్పుతోంది. కళ్ల ముందు చీకట్లు క్రమ్ముతున్నాయి. కానీ ఎదురు చూసిన ఘడియ వచ్చిన క్షణం ఇది. చేయి జారనివ్వకూడదు. సర్వశక్తులను కూడదీసుకున్నాడు.

దూరంగా మహారాజు రధం కనిపించింది. దారి నిండా జనం మూగి పోయారు. జయదేవుడు కూడా ఆ వైపు పరుగెత్తాడు. కాళ్లు గాలిలో తేలుతున్నట్లున్నాయి. ఒళ్లు స్వాధీనంలో ఉండటం లేదు.

మహారాజు రధం కోటగుమ్మం సమీపించింది.

జయదేవుడికి వెర్రి ఆవేశం వచ్చింది. కశ్మీర రాజు నిస్పహాయుడా? అసంభవం. ఎదురుగా ఉన్న సమూహాన్ని చీల్చుకుని రధం వైపు పరుగెత్తాడు. జయదేవుడు రధం తనను సమీపించగానే 'మహారాజా' అని ఏదో చెప్పబోయాడు. ఇంతలో రధం పక్కనే ఉన్న అశ్వికుడు మెరుపులా వచ్చి జయదేవుడిని శూలంతో చరిచి పక్కకు నెట్టేశాడు.

పక్కనే ఉన్న భటులు వెర్రి ఆవేశంతో జయదేవుడిపై విరుచుకపడ్డారు. స్పృహ తప్పే ముందు ఎవరో రాజభటులతో పోరాడుతున్నట్టు తనను ఎత్తుకుపోతున్నట్టు తోచింది జయదేవుడికి.

శర 3

జయదేవుడు కళ్లు తెరిచాడు. |

ఎదురుగా రాజరీవి ఉట్టిపడుతూన్న యువకుడు, అతని పక్కనే మహామంత్రి లక్షణాలు స్పష్టంగా గోచరిస్తున్న మరో యువకుడు కనిపించారు.

జయదేవుడికి పట్టరాని ఆనందం కలిగింది. దెబ్బలు తగిలితే తగిలాయి. కానీ మహారాజ దర్శనం కలిగింది. ఇంత రాజరీవి ఉట్టిపడుతున్న వాడిని పట్టుకుని నిస్సహాయుడంటారేమిటి?

“మహారాజా అంటూ ఉత్సాహంగా లేవబోయాడు జయదేవుడు. కానీ అంతలోనే కళ్లు చీకట్లు కమ్మాయి. పరుపుపై పడిపోయాడు జయదేవుడు.

మళ్లీ కాస్సేపటికి మెలకువ వచ్చింది. ఇప్పుడు తెలుస్తోంది. తాను రాజభవనంలో లేడు. '“ఎవరు మీరు?” అడిగాడు జయదేవుడు.

“నా పేరు అవంతి వర్మ' చెప్పాడా రాజరీవి యువకుడు. తన పక్కనే ఉన్న యువకుడిని చూపిస్తూ “ఇతను శూరుడు. నా ప్రాణమిత్రుడు. ఇతనే రాజభటుల అఘాయిత్యానికి గురయిన మిమ్మల్ని రక్షించి తెచ్చింది" చెప్పాడు అవంతి వర్మ హెత౭ రట 3డడడడకడనడకడడడడక2త2డడడడడడడడడననడడడడడడడడడడడడతడ2తడ2ఊ కస్తూరి మురళీకృష్ణ ఊడి

క్షమించాలి. కళ్ళీర రాజధానిలో మీకు కలిగిన అవమానానికి మేమెంతగానో బాధ పడుతున్నాము. మీరేకార్యం మీద రాజదర్భనం కోరుతున్నారు? గౌరవంగా అడిగాడు శూరుడు.

జయదేవుడి కళ్లల్లోంచి నీళ్లు రాలాయి "రాజధాని వచ్చినప్పటి నుంచీ ఈ మాత్రం గౌరవం కూడా ఈ పండితుడికి దక్కలేదు' అని తన కధనంతా చెప్పాడు జయదేవుడు.

శూరుడు నవ్వి 'అనంగాపీడ మహారాజును కలిసి మీరు సాధించేదేమీ లేదు. అతదు మమ్ముడి చేతిలో కీలుబొమ్మ. పైగా అనంగాపీడుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికీ అయిదుగురి ఆమోద ముద్ర కావాలి. అలా కాని పక్షంలో రాజుని మెప్పించి లాభం లేదు.

ఇటీవలే గాంధారం నుంచి ఓ పండితుడు వచ్చి తన గ్రంథం రాజుకు వినిపించాడు. రాజు మెచ్చుకుని “బాగుంది” అంటాడు కానీ ఒక్క నాణెం కూడా బహుమతిగా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ పండితుడిని సుఖవర్మ గాంధారం నుంచి ఆహ్వానించాడు. సుఖవర్శకు మమ్మడికి పడదు. కాబట్టి ఆ పండితుడికి సత్కారం చేస్తే రాజుఉత్పలుడి మాట మన్నించినట్లు అవుతుంది. అది మమ్ముడికి నచ్చదు. ఇదీ పరిస్థితి. అందుకే మీరు సుఖవర్శని వదలి మిగతా అయిదుగురిలో ఎవరినైనా మెప్పించి వారి ద్వారా రాజును చేరాలి. అప్పుడా పని అయ్యే అవకాశం ఉంది అన్నాడు శూరుడు.

“అంటే నాకు న్యాయం కావాలంటే దాని వెనుక ఇన్ని రాజకీయాలు నడపాలా? అలా కాకుంటే నాది న్యాయం కాకుండా పోతుందా?” వేదనగా అడిగాడు జయదేవుడు.

“స్వామీ ఎవరికి వారు తమ పని పూర్తయితే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నడిచిపోతోంది నడవనీండి. ప్రతి దానికీ సమాప్తి ఎప్పుడోకప్పుడు తప్పదు కదా' అన్నాడు శూరుడు. జయదేవుడు అవంతివర్మ శూరుల వైపు ఆలోచనగా చూస్తూ ఉండిపోయాడు.

న

మరునాటి ఉదయం శూరుడు, జయదేవుడు ధర్ముడి వద్దకు వెళ్ళారు. ధర్ముడు అంత ఉదయమే సురాపానం చేస్తున్నాడు.

జయదేవుడిని చూసి 'కామకేళీ విలాస వర్జనల కావ్యాలయితేనే వినిపించండి. లేకపోతే వెళ్లిపొండి' అన్నాడు మత్తుగా.

జయదేవుడికి అసహ్యం అనిపించింది. కానీ అవసరం తనది. తన కధంతా వినిపించాడు.

అంతా విని ధర్ముడు '“నీ భూమి నీకిప్పిస్తే నాకేమిస్తావు? అందులో సగం ఇస్తావా? అనడిగాడు ఆశగా.

జయదేవుడు ఆశ్చర్యపోయాడు. 'స్వామీ ఆ భూమే మా ఆధారం. నేను విద్యార్ధుల వద్ద ధనం అడుగను. నేనే వారికి భోజనం పెడుతూ ఉచిత విద్యాబోధన చేస్తాను. ఆ సగం మీకిస్తే నా పరిస్థితి క్లిష్రరమౌతుంది' అన్నాడు. === కల్పణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు 223కు కమ? ==

“ఇప్పుడేమీ లేకున్నా బ్రతికే ఉన్నావు కదా! అలాగే సగంతో బ్రతుకు. ఆశకు అంతుండాలి. ఇంతకీమీ పురాధీశుడెవరు.?”

“మత్తేభుడు”.

మత్తేభుడి పేరు వినటంతో ధర్ముడి మత్తు ఎగిరిపోయింది. '“అయ్యబాబాయ్‌. మత్తేభుడు మమ్ముడి అల్లుడు వెళ్లిపోండి. మమ్ముడికీ సంగతి తెలిస్తే నా పని అయిపోతుంది. వెళ్లిపోండి అని తరిమేశాడు.

అక్కడి నుండి కళ్యాణుడి వద్దకు వెళ్లారు.

“అయ్యో పండితులకెటువంటి దుర్దశ కలిగింది. కానీ మత్తేభుడికి వ్యతిరేకంగా మేమేమీ చేయలేము. మీరు అతడినే వేడుకోండి అన్నాడు జయదేవుడి కధ విని,

“వేనును మేస్తున్న కంచెను చేను ఏమని బ్రతిమిలాడుతుంది?'” ప్రశ్నించాడు జయదేవుడు.

“ఇదిగో నాకు తోచింది చెప్పాను. నీ భూమి నీకిప్పిస్తే నువ్వు హాయిగా ఉంటావు. నాకేం లాభం? నేను చెప్పింది నచ్చితే చేయండి. లేకపోతే పొండి" అన్నాడు.

అక్కడి నుండి వారిద్దరూ పద్ముడి దగ్గరకు వెళ్లారు.

“మీ పండితులు దురాశాపరులు. అన్నీ సవ్యంగా జరుగుతున్నంత కాలం మీ కంటికి ఎవరూ కనబడరు. మీకు అవసరమైనప్పుడు నేల మీద పొర్లుకుంటూ వస్తారు. అయినా మత్తేభుడు నాకు తెలుసు. ఏదో ఆశపడ్డాడు కదా! ఇచ్చేస్తే ఏం పోయింది?

అయినా మీకు ఆస్తులు, అంతస్తులు వంటి తుచ్చ భౌతిక సుఖాల మీద ఆశ లేదు కదా! ఏ గుళ్లేనో పారాలు చెప్తూ, ప్రసాదం తింటూ, జ్ఞానం సంపాయిస్తూ బ్రతకండి. ఈ గోలంతా ఎందుకు? అన్నాడు పద్ముడు.

జయదేవుడు మౌనంగా వెను తిరిగాడు. ఆ రాత్రంతా జయదేవుడు ఆలోచనలో గడిపాడు.

తెల్లవారుతూనే శూరుడిని పిలిచి అన్నాడు. *'మనం సుఖవర్మను కలుద్దాం. ఎలాగో వీరెవ్వరితో పని కాలేదు కదా. సుఖవర్మనికలపటం వల్ల మనకొచ్చే నష్టం లేదు. సుఖవర్మ దగ్గరకు వెళదాం?,

శూరుడు, జయదేవుడు కలసి సుఖవర్మ దగ్గరకు వెళ్లారు.

సుఖవర్మ వీరిద్దరినీ సాదరంగా ఆహ్వానించాడు. జయదేవుడు నోరు మెదిపే లోపలే “అవంతి వర్మ మీ గురించి చెప్పాడు. నేను వెంటనే చారులను త్రిభువనపురం పంపించి విషయం తెలుసుకున్నాను. మీ పర్లశాల ఎప్పుడో పీకేశారు. ఆ స్టలంలో భవన నిర్మాణం జరుగుతోంది” చెప్పా సుఖవర్మ.. ఖి గ్‌ భ్‌ త

జయదేవుడు పిడుగుపడ్డ వారిలా వెర్రిగా చూశాడు. హె నదీ డడ కస్తూరి మురళీకృష్ణ నాం

“మీకు రాజు న్యాయం చేయలేడు. మీరు రాజుని కలసి లాభం లేదు. ఎందుకంటే మీరు రాజధాని వస్తున్నారని తెలిసి మత్తేభుడు ముందుగానే ఈ విషయాన్ని మమ్ముడికి చేరవేశాడు. ఎట్టి పరిస్థితులలో మీ మాట వినవద్దని మమ్ముడు రాజుని ఆజ్ఞాపించాడు" చెప్పాడు సుఖవర్మ.

జయదేవుడు లేచాడు. “ఒక్కసారి రాజదర్శనం చేయించగలరా?”

సుఖవర్మ నవ్వాడు “లాభం ఉండదు. కానీ మీరు తప్పదంటే చేయిస్తాను. కానీ మీకు అవమానం జరుగుతుంది. భరించగలరా?” అన్నాడు.

“ఇప్పుడు నేనేమైనా భరించగలను'” మెల్లిగా అన్నాడు జయదేవుడు.

“నా మనుమడు అవంతి వర్మ మీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు స్వామీ. మీరు వాడిని ప్రయోజకుడిని చేయండి” అన్నాడు సుఖవర్మ.

జయదేవుడు ఏమీ మాట్లాడలేదు.

సుఖవర్మ రధం సిద్దం చేసి జయదేవుడిని రమ్మన్నాడు. ఇద్దరూ కలసి రాజభవనం చేరారు.

జయదేవుడిని నభలో వదలి నుఖవర్మ తన స్టానానికి వెళ్లిపోయాడు. నభ ఆరంభమయింది.

ఒకరొకరుగా ఏవో సమస్యలు వినిపిస్తున్నారు. ఏవో తీర్పులు వస్తున్నాయి. కానీ అవన్నీ ముందే నిర్ణయించిన తీర్చుల్లా కృతకంగా ఉన్నాయి. జయదేవుడు తన వంతు రాగానే లేచి నిలుచున్నాడు.

“ప్రభూ! త్రిభువనపురం నుంచి వచ్చాను...” అని చెప్పటం ఆరంభించాడు. మాట పూర్తి కాక మునుపే మమ్ముడు అడ్డువచ్చాడు. “మహారాజా రాజుద్రోహి, దేశద్రోహి మీ ముందుకు వచ్చాడు. రాజవంశం నాశనం కమ్మని కదా మీ తండ్రి శపించింది. అయినా ఇంకా నీకు కళ్ళీరంలో స్థానం లభించిందంటే అది మా కరుణ వల్ల తెలుసుకో. అయినా మా మీదే అభియోగం తెస్తావా? ప్రభూ రాజద్రోహనేరం క్రింద మత్తేభుడు ఇతని భూములను రాజుపరం చేశాడు. అదీ ఇతని సమస్య అన్నాడు.

జయదేవుడి తెరచిన నోరు మూత పడలేదు రాజు వైపు చూశాడు.

అక్కడ ఉన్నది రాజు కాదు రాయి అనిపించింది. కాదు గొరైనా? గంగిరెద్దా? అని ఆలోచించాడు.

గొర్రె తలాడించింది. 'ఇతని ఆస్తులన్నీ రాజోపరం చేయండి ఇతడిని రాజధాని వెలుపలకు గెంటేయండి. మళ్లీ రాజధానిలో అడుగుపెట్టటం ఇతనికి నిషిద్ధం” అంది గంగిరెద్దు === కల్పణ కళ్నీర రాజతరంగిణి కధలు 22౭2222222 సమక ==

“ప్రభూ ఇది మీకు న్యాయంకాదు. అన్యాయం చేసిన వారు సుఖంగా ఉండలేరు అన్నాడు. మమ్ముడు లేచి “ఏమిటీ నీ ధైర్యం? మీ తండ్రిగారు మా వంశాన్ని నాశనం కమ్మని శపిస్తారు. నువ్వు నీ ఆస్తి కావాలని మమ్మల్ని అర్దిస్తావా?' అని భటులకు సౌంజ్ఞ చేశారు. భటులు జయదేవుడిని ఎత్తి పట్టుకొని కోటగుమ్మం అవతల మట్టిలో విసిరేశారు. జయదేవుడి ఒళ్లంతా దుమ్ము దుమ్ము అయింది. నోట్లోకి మట్టి వెళ్లింది పన్ను కదిలి రక్తం కారుతోంది. రక్తంతో తడిసిన మట్టిని పిడికిలిలో బిగించాడు జయదేవుడు. , జయదేవుడు క్రింద పడగానే శూరుడు, అవంతి వర్మ పరుగెత్తుకు వచ్చారు. జయదేవుడు అవంతి వర్మవైపు చూసి 'నేను మిమ్మల్ని మహారాజా అని పిలిచాను కదా" అనడిగాడు. ఇతనికి పిచ్చి పట్టలేదు కదా! అనుకున్నాడు అవంతి వర్మ అయినా తలాడించాడు. 'నేను బుగ్వజుర్‌ సామ ఆధర్వణ వేదపండిత్తుడను సత్యవ్రత నిష్టుడను. నామాట వ్యర్థంకాదు. ఈనాటినుండీ కళ్శీరానికి రాజు మీరే. మిమ్మల్ని నేనురాజు చేస్తాను అంటూ చేతిలోనిమట్టిని అవంతివర్మ నుదుటిమీద బొట్టులా పెట్టాడు. అవంతి వర్మ వొళ్లు జలదరించింది. అప్రయత్నంగా అతను చేతులు జోడించాడు. “జయదేవుడు లేచాడు” మిమ్మల్ని కళ్ళ్మీర సింహాసనంపై కూర్చుండబెట్టిన తరువాతే నేనీ రాజధానిలో అడుగుపెడతాను. నాతో రండి” అని శూరుడిని చూసి “రేపు ఉదయం వీరి తండ్రి గారిని తీసుకురండి. ఆదిత్య మందిరంలో ఉంటాం మేము” అన్నాడు. శశ సూర్యోదయమవుతోంది. అంతవరకూ కళ్లు పొడుచుకున్నా ఏమీ కనబడదనిది ఒకటొకటిగా సుందర ప్రకృతి దృశ్యాలు కళ్ల ఎదుట ప్రత్యక్షం కాసాగాయి. అదిచూసి జయదేవుడు “తరణి ర్విశ్వ దర్శతో జ్యోతిష్యదసి సూర్య! విశ్వముఖాసి రోచనమ్‌” అన్నాదు. (ఓ సూర్యదేవా! జగతికి వెలుతురు ప్రసాదించేది నీవే. నీ వెలుగు కిరణాల వళ్ల విశ్వం సర్వం విదితమవుతున్నది. విశ్వాంతరాళలలో ప్రయాణించే నీరోచిస్సుల వల్లనే నిన్ను కూడా దర్శించగలుగుతున్నాను) అవంతి వర్మ జయదేవుడికి నమస్కరించాడు. అంతలో జయదేవుడి దృష్టి ఉషారాణిని సహ(్రబాహమువుల్లో ఆహ్వానిస్తున్నట్టున్న వెలుతురు కిరణాలపై వడింది. జయదేవుడు అత్యుత్సాహంతో అవంతి వర్మకు ఆ వైవు చూసి 'అటు చూడు, సూర్య భగవానుడు ఒక చేత్తో శతసహస్ర కిరణాల కుంచెలు ధరించి ఆకాశంపై వివిధ వర్జాల చిత్రాలు గీస్తున్నాడు. మరో చేతిలోని శతసహ(న కిరణాల కుంచెలలతో భువిపైన అద్భుత విన్యాసాలు చేస్తున్నాడు. అంత వరకూ లేని పచ్చని చెట్టు, తజ 20 క33తతడడడడడడడడడడడడడడడడడడడడడడడడడ2= కస్తూరి మురళీకృష్ణ మాడా

గల గల పారే నదులు, ఆకాశాన్నంటే కొండలు, సూర్యదేవుని కిరణాల కొసల నుండి జాలువారి (ప్రాణం సంతరించుకుని ఎలా దర్శనమిస్తున్నాయో చూడు అన్నాడు.

అవంతి వర్మ ముగ్గుడయిపోయాడు. చేతులు జోడించి సూర్య దేవునికి నమస్కరించాడు.

అంతవరకూ ఎక్కడ దాగున్నాయో, సూర్యకిరణాలు ప్రసరించటంతోటే పక్షులు కిలకిలమంటూ సూర్యనికి స్వాగత గీతాలు గానంచేస్తూ ఆకాశ వేదికపై నర్తించసాగాయి. చెట్ల కొమ్మల్లోంచి వినిపించే పక్షుల గానం వృక్షతతులు సూర్య భగవానుడికి ఘటిస్తున్న అంజలిలా అనిపిస్తోంది.

పారే నదుల గలగలల్త్లో, ఆదిత్య స్తోత్రం వినిపిస్తోంది. కలకలు గలగలలు కొండల గుండెల్లో ప్రతిధ్వనిస్తూ పర్వతాలు కూడా ఆదిత్య స్తోత్రం గానం చేస్తున్న భావన కలుగుతోంది.

“ఆదిత్య ఇతిహోవాచ సర్వాణి హవా ఇమాని భూతాన్యాదిత్య ముబ్బైః సంతం గాయనస్తి (సూర్యోదయం కావటంతోటే సకల చరాచర సృష్టి ఆదిత్య భగవానుని స్తోత్రం చేస్తోంది) అన్నాడు జయదేవుడు.

అవతంతి వర్మ కన్నులు మూసుకుని చేతులు జోడించాడు.

“ఈ సకల చరాచర సృష్టితో పాటుగా నీ హృదయ స్పందనకు మీ పూర్వీకుల హృదయ స్పందనను జోడించి దినకరుని మయూఖ తండ్రుల నుండి వెలువడుతున్న అనాది జీవన నాదం వేదంతో లయించు అన్నాడు జయదేవుడు.

అవంతి వర్మ తనని తాను మరచిపోయాడు. అలా కళ్లు మూసుకుని చేతులు జోడించి ఎంత సేపున్నాడో అతనికే తెలియదు. చివరికి జయదేవుడి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చాడు.

“ప్రకృతి నిర్జీవ పదార్ధం కాదు. జీవంతో తొణికిసలాడుతూ, విజ్ఞానం మూర్తీభవించిన గురువుకే గురువు ప్రకృతి. ప్రకృతి ఆదిగురువు. ప్రకృతిని మించి వేరే గురువు లేదు. శాస్త్రాల ద్వారా గ్రహించిన అనేక విషయాలు ప్రకృతి దర్శన మాత్రంతోనే అనుభవానికి వస్తాయి. రాజు అయి ప్రజలను పాలించాలనుకునే ప్రతి వ్యక్తి ముందుగా ప్రకృతిలో ప్రతిపాదితమై ఉన్న భగవదంశను (గ్రహించాలి' అన్నాడు జయదేవుడు.

ఇద్దరూ ఆదిత్య మందిరం వైపు నడవసాగారు. దారి పొడుగునా అద్భుతమైన (ప్రకృతి దృశ్యాలు కన్నుల పండుగగా ఉన్నాయి.

“భూమిపై మొలచి ఆకాశాన్నంటేట్టు ఎదిగిన ఈ చెట్లు మనిషి సాధన ద్వారా మనీషిగా ఎదగవచ్చన్న నిజాన్ని మౌనంగా ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు ఒక రాజు ఎంత ఎదిగినా అతని (వేళ్లు భూమి మీదనే ఉండాలని సామాన్యులను కూడా అతను గౌరవించాలనీ సూచిస్తున్నాయీ చెట్లు. ఎందుకంటే సామాన్యుల రాజభక్తే రాజు శక్తి అన్నాడు జయదేవుడు.

అవంతివర్మ ఏకాగ్రతతో జయదేవుడి ప్రతి మాటా వింటున్నాడు. సహా కల్తణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2222322222 మ2ైడే 22222

ఇద్దరూ రెండు వైపులా బారులు తీరి ఉన్న ఆ వృక్షమానులను చూస్తూ నడవసాగారు.

జయదేవుడు హఠాత్తుగా ఆగి అవంతి వర్మ చేయి పట్టుకుని ఉద్వేగంగా చెప్పాడు “వెట్ల ఆకులపై సూర్యకాంతికి మణుల్లా మెరుస్తున్న మంచు బిందువులను చూస్తుంటే, (ప్రతి ఆకూ ఒక పాము పడగ అయి, ఆ వేయి తలల పాములు తమ పడగలపై సూర్యకాంతికి ధగధగలాదుతున్న వేయి మణులు ధరించినట్టు లేదూ? అనడిగాడు.

అవంతి వర్మ ఆ వృక్షాలవైపు, ఆ ఆకుల వైపు అలాగే చూస్తుండిపోయాడు. అతని ఎదలో విచిత్రమైన సంచలనం కలుగుతోంది.

“సన్నగా ఉండుండి బలంగా వీస్తున్న గాలికి ఒక్కసారిగా కదలుతున్న చెట్ల ఆకులు విధాత చల్లని స్పర్శకు ఆనందంతో సహ(స్రఫణులు ఒకేసారి తమ శిరస్సులను ఆనందంగా ఊపుకున్నట్టుంది' అన్నాడు అవంతివర్మ ఆనందంగా.

“ఒకో ఆకు వేయితలల అనంత శేషునిలా ఉంది. అలాంటి అనంత శేషుల అనంతమైన పడగల నీడలలో నడుస్తున్న మన జన్మధన్యం కాదా! ఆకుల కదలిక వల్ల మనపై జాలువారుతున్న మంచు బిందువులు, విధాత మనపై కురిపిస్తున్న కరుణార్ద వృష్టిలా లేదూ?” అన్నాడు జయదేవుడు.

“అడుగడుగునా విధాత విశ్వరూపమిలా దర్శనమిస్తుంటే అడుగు ముందుకేసేదెలా? అడుగు ముందుకు పదేదెలా?* అని ముఖం చేతుల్లో దాచుకుని ఒక వృక్షం క్రింద కూచుండిపోయాడు అవంతివర్మ.

అతని మదిలో అవ్యక్త భావాలు వ్యక్తరూపం ధరించాలని ఆరాటపడుతున్నాయి. తెలియని ఆవేశమేదో ఎదలోతుల్లోంచి ఉబికి ఉబికి వస్తోంది. ఆ ఆవేశం అక్షర రూపం ధరించాలని ఆతృతపడుతోంది.

అంతేకాదు తన ఎదురుగా ఇంత స్పష్టంగా కనిపిస్తున్న సృష్టికారుడికి సాష్టాంగ ప్రణామం చేయాలని ఉంది. కానీ ఏ వైపుకు చేయాలి? ఎటు చూసినా విధాత విశ్వరూప దర్శనమే. ఆనంద రస ప్రవాహమే. అవంతి వర్మ కళ్లు మూసుకుని తన మదిలో తానంతవరకూ దర్శించిన ప్రకృతిని స్మరిస్తూ సాష్టాంగ ప్రణామం చేశాడు.

అవంతి వర్మ కళ్లు తెరిచేవరకూ జయదేవుడు పక్కనే కూచున్నాడు. అవంతి వర్మ కళ్లు తెరచి “క్షమించండి అన్నాడు.

జయదేవుడు నవ్వి “ఈ ప్రకృతిని చూసి బండరాయి కూడా విధాతను స్మరిస్తుంది. మానవ హృదయం స్పందించకపోటమేమిటి? నీలో కలిగిన ఈ స్పందనను భద్రంగా దాచుకో నీకు ఏ వ్యక్తి పైన కోపంగానీ, ద్వేషంగానీ కలిగినప్పుడు ఈ అనుభవాన్ని స్మరించు అన్నాడు.

అవంతి వర్మ నమస్కరించాడు. ఇరువురూ మళ్లీ ప్రయాణం ఆరంభించారు. ఊఊ 22 డడ కస్తూరి మురళీకృష్ణ నా!

ఇద్దరూ ఆదిత్య భగవానుడి మందిరం చేరారు ఆదిత్య భగవానుడి దర్శనం చేసుకుని మందిర ప్రాంగణంలో కూచున్నారు.

'అలితాదిత్య మహారాజు దండయాత్రలో ఉన్న సమయంలో అతని మంత్రులు రాజు పేరున లలితాదిత్యపురం నిర్మించారు. దండయాత్ర నుండి తిరిగి వచ్చిన రాజు విషయం తెలిసి మండిపడ్డాడు. 'నశళ్ళిరశరీర పేరిట నగరం నిర్మించటం తగని పని. మీరేం చేసినా భగవంతునికి అంకితం చేసి భగవంతుని పేరనే చేయాలి” అని ఆజ్ఞాపించాడు. అంతేకాదు, ఇక్కడ ఆదిత్య మందిరం నిర్మించాడు. అప్పుడు లలితాదిత్యపురం “అనే పేరు సరిగ్గా సరిపోయింది. అటువంటి నిస్వార్ధ, కీర్తి కాంక్షరహిత రాజు లేలిన రాజ్యం మనది. నీవు వారికి వారసుడవు. ఇది ఎన్నడూ మరవద్దు అన్నాడు జయదేవుడు.

అవంతి వర్మ హృదయంలో మౌనంగా లలితాదిత్యుడి నమ్రతకు, వినయానికి అంజలి ఘటించాడు.

ఇంతలో శూరుడు, అవంతి వర్మ తండ్రి సుఖవర్మ అక్కడ వచ్చి జయదేవుడికి నమస్కరించి కూచున్నారు.

జయదేవుడు సుఖవర్మ వైపు చూసి 'నీవు రాజును గద్దెపై నుండి దింపుతానని ప్రతిజ్ఞ చేశావు కదా?” అనడిగాడు.

సుఖవర్మ “అవును, నేను సైన్యాన్ని కూడా సమీకరిస్తున్నాను” అన్నాడు.

నీ ప్రయత్నం ఫలప్రదమవుతుంది. రాజ్యంలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. పైన బూడిద తొలగిస్తే చాలు లోపల ప్రజ్వరిల్లే అగ్నికుండం ఉంది" అన్నాడు.

“అవును అనేకులు నా సైన్యంలో స్వచ్చందంగా చేరుతున్నారు అన్నాడు.

“ఇవాల్టికి సరిగ్గా పది రోజుల తరువాత విష్తవం లేవదీయి. నిన్ను విజయలక్ష్మి వరిస్తుంది. రాజనీతిని అనుసరించి అజితాపీడుని కుమారుడు ఉత్పలాపీడుని రాజుగా చెయ్యి. అతడిని అశ్వీజ పూర్ణిమ నాడు రాజుగా అభిషిక్తుడిని చేయాలి. అనాడు అభిషిక్తుడైన రాజులు గద్దెపై స్థాయిగా నిలవలేరు. ఈలోగా అవంతి వర్మ ప్రాణమిత్రుడు శూరునికి రాజ్య వ్యవహారాల్లో అనుభవం వచ్చేట్టు చేయాలి.

ఉత్పలాపీడుని రాజ్యం త్వరలో అంతరిస్తుంది. అతని తరువాత అవంతివర్మను రాజుగా చెయ్యి. శూరుడు మంత్రి అవుతాడు. ఇక శూరుడు, అవంతి వర్మ ఇద్దరు కలిసి కళ్ళ్శీరానికి పునర్వైభవాన్ని సంతరిస్తారు. కర్కాటక వంశం కళ్ళీరం నుండి అంతరిస్తోంది. ఇకపై కళ్ళ్మీరంలో ఉత్పల వంశ పాలన ఆరంభమవుతోంది" అన్నాడు జయదేవుడు.

సుఖవర్మ జయదేవుడికి నమన్మరించి “ప్రభూ, నీచకుల సంజాతులం రాజ్యం ఏలగలమంటారా?”' అనడిగాడు. ==జ= కల్టణ కశ్మీర రాజతరంగిణి కధలు :౭త౭త3తఊ3ఊ3ఊ32323ఊ3ఊఉఊఉఊఉ22==2=2డ 120 ===

జయదేవుడు సుఖవర్మను స్పృశించి చెప్పాడు. 'సర్వసృష్టి విధాత స్వరూపం. దాన్లో ఉచ్చనీచాలు, హెచ్చుతగ్గులు ఉండవు. ఎవరైనా ఉన్నాయంటే అది వారి అజ్ఞానానికి నిదర్శనం. ఈ తేడాలన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవే. మానసిక ప్రపంచంలో అడుగిడిన మరుక్షణం మనుషుల్లో తేడాలుండవు. అంతా ఈశ్వరమయమే” అన్నాడు జయదేవుడు.

సుఖవర్మ, శూరుడు, అవంతి వర్మలు జయదేవుడికి నమస్కరించారు.

“సరిగ్గా ఇవాళ్టి నుంచి పదవరోజు సూర్యోదయంతో పాటే విప్లవం ఆరంభమవాలి. ఆ సమయానికి అవంతి వర్మను తీసుకుని నేను ఇక్కడికే వస్తాను. విజయాన్ని వరించి మీరు ఇక్కడికి రావాలి" అని చెప్పాడు జయదేవుడు.

“చిత్తం” అని శూరుడు, సుఖవర్శ్మ వెళ్లిపోయారు. వారికి జయదేవుడి మాటలు వేదవాక్కుల్లా ఉన్నాయి. సందేహించే పనే లేదు. అసలా ఆలోచనా రావటం లేదు. జయదేవుడు అవంతి వర్మను తనతో రమ్మని సౌంజ్ఞ చేసి “నాతోరా, నీకు కళ్ళీర పుటాత్మను చూపిస్తాను. నీకు నీ సజీవ ధర్మాన్ని చూపిస్తాను అన్నాడు.

న

ఆనాటి నుండి జయదేవుడు తనకు తెలిసిన సర్వ విజ్ఞానాన్ని అవంతివర్మకు బోధించసాగాడు. సకల శాస్తాలు, వాటి సారం అవంతి వర్మకు వివరించసాగాడు. రాత్రింబవళ్లు వారికిదే పని.

అవంతి వర్మకు ఒక విచిత్ర లోకంలో (ప్రవేశించినట్టయింది. అంతవరకూ అతడు నేర్చుకున్నది వేరు. ఈ పది రోజులుగా అతడు నేర్చుకుంటున్నది వేరు. అతనికి తనకు తాను అర్ధమవుతున్నట్టుంది. తన పూర్వీకుల బెన్నత్యం అర్ధమవుతోంది. సనాతన ధర్మం తేటతెల్లమవుతోంది.

ఆ రోజు పదవరోజు వారిద్దరూ పరిహాసపురం చేరారు.

పరిహాసపురంలో కేశవస్వామి పేర లలితాదిత్యుడు రజత విగ్రహాన్ని ప్రతిష్టించాడు. విగ్రహం ముక్తాఫల నికురంబ కాంతి శోభితుడై, క్షీరసాగర శాయి అయిన విష్ణుదేవునిలా తళతళ మెరుస్తోంది. మందిరానికి అలతి దూరంలో స్వర్ణమయ విష్ణు విగ్రహం ముక్తాదేవుని పేర ఉంది. ఆ మందిరంలో ఒక వైపు వేదపరనం జరుగుతోంది. మరోవైపు సాహిత్య చర్చలు జరుగుతున్నాయి.

మరికాస్త దూరంలో స్వర్ణ కవచ సహిత వరాహ న్వామి విగ్రహం తన కాంతి పుంజాలతో పాతళంలోని అంధకారాలను కూడా రూపుమాపే సూర్య భగవానునిలా తేజోవంశమై ఉంది. ఆ మందిర ప్రాంగణంలో నృత్యాఖ్యాసం జరుగుతోంది. మడ 124 డడ కస్తూరి మురళీకృష్ణ తడి

అటునుండి మరి రెండడుగులు ముందుకేసి ఇద్దరూ ఆగిపోయారు. అక్కడ యాఖై నాలుగు చేతుల ఎత్తు గల శిలాస్థంభంపై నుండి దూకేందుకు సిద్ధంగా ఉన్న గరుత్మంతుడు దర్శనమిచ్చాడు.

ఆ మందిర ప్రాంగణంలో న్యాయస్థానం నడుస్తోంది.

మరికాస్త దూరం పోగానే బుద్ధ భగవానుడి విగ్రహం దర్శనమిచ్చింది. అప్పటికి కళశ్మీరంలో బౌద్దం అంతరించింది. కానీ ఆ విగ్రహానికి పూజలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం బుద్దుడికి పూజలు జరిగేట్టు చూస్తోంది.

మరికాస్త దూరం పోగానే గంగా జలాలను తలపుకు తెచ్చే జలాశయం కనిపించింది. “అమృత సదృశాలయిన జలాలతో కూడుకున్న ఈ జలాశయాన్ని ముక్తాపీడుడి రెండవ రాణి ఈశానదేవి నిర్మించింది. ఈ జలాల్లో స్నానాదికాలు చేసిన రోగుల రుగ్మతలు నశిస్తాయి' చెప్పాడు జయదేవుడు.

ఇరువురూ ఆ పవిత్ర జలాల్లో స్నానం చేసి పునీతులయ్యారు. ఇరువురూ అటు నుంచి ఆదిత్య మందిరం చేరుకున్నారు.

వీరు అక్కడకు చేరుకున్న కాస్సేపటికి అవంతి వర్మ, శూరుడు, ఉత్పలాపీడుడు, కశ్మీర సైన్యం అక్కడకు చేరుకుంది.

“స్వామీ విజయం మాదే. సుఖాలకు అలవాటు పడిన వారు యుద్ద రంగంలో నిలవలేకపోయారు. మీరన్న ముహూర్తానికి రేవు ఉత్పలాపీడుడి పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు సుఖవర్మ.

ఉత్పలాపీడుడు జయదేవుడికి నమస్కరించాడు. జయదేవుడు ఆశీర్వదించాడు. 'స్వామీ త్రిభువన పురంలో మీకన్యాయం జరిగిందని తెలిసింది. అందుకు ప్రతిఫలంగా కళ్ళ్మీర రాజధాని పురాధ్యక్షులుగా మిమ్మల్ని నియమిస్తున్నాను” అన్నాడు ఉత్పలాపీడుడు.

జయదేవుడు నవ్వి 'ప్రభూ నాకు లీపి శర్మర కావాలంటే పుట్టలేనే ఇస్తానంటే ఎలాగ? నాకేమీ అవసరం లేదు. త్రిభువనపురంలో నా భూమి నాకిప్పించండి. అంతకన్నా నేను కోరేదేమీ లేదో అన్నాడు జయదేవుడు వినయంగా.

అలాగే స్వామీ అని రాజు ససైన్యంగా వెళ్లిపోయాడు.

అక్కడ శూరుడు, అవంతివర్మ, సుఖవర్శ, జయదేవుడు మిగిలారు

(నేను త్రిభువనపురం వెళ్లిపోతున్నాను. ఉత్పలాపీడుడు రాజుగా ఎక్కువ రోజులు ఉండడు. అవంతి వర్మ నా కళ్మీరాన్ని నీ చేతిలో పెదుతున్నాను. ధర్మభంగం కాకుండా నీ పూర్వరాజులు గర్వపడేట్టు రాజ్యం చెయ్యి” అని శూరుడి వైపు తిరిగి “అవంతి వర్మను నీచేతిలో పెడుతున్నాను. లలితాదిత్యునికి మిత్ర శర్మ జయాప్‌డుడికి దేవశర్మలు ఎలాగో ఊఊ కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :=232323232=2=23డ3డ222=ఊఊఊఊఊఊఊఊ=22=====2==222 125 ===

అవంతి వర్మకు నీవలాగ. అవంతివర్మను నీకప్పగిస్తున్నాను. మీరిద్దరూ కళ్ళ్మీరానికి పూర్వ వైభవాన్ని సంతరించండి. సనాతనధర్నాన్ని మ్లేచ్చ అవగుణాల నుంచి ప్రక్షాళనం చేయండి” అన్నాడు.

అవంతి వర్మ ఏడుస్తూ జయదేవుడి కాళ్ల మీద పడ్డాడు. 'స్వామీ! మీరునా మీద గురుతర బాధ్యత నుంచారు. తమరు ఒక్కమాట చెప్పకుందానే నాకు సజీవ ధర్మాన్ని వివరించారు. మన మందిరాలు ధర్మాలయాలు. అక్కడ మన సంస్కృతి పరిరక్షణ జరుగుతోంది. మందిరంలో ఒక వంక వేదపరనం జరుగుతూంటే మరో వంక సాహితీ చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు నృత్యాభ్యాసం జరుగుతూంటే మరో వైపు న్యాయస్థానం నడుస్తోంది. ఇలా మందిరం నలు మూలలా ఎవరి ప్రమేయం లేకుండానే జనజీవనం సాగిపోయే సువ్యవస్టితమైన సమాజం నిలబడేందుకు కారణమైన ఆ మందిర గర్భంలో నిలచిన భగవంతుని ప్రతిమ, ఆ ధర్మం సజీవ ధర్మం.

పైగా సనాతన ధర్మాన్ని తిరస్కరించిన బుద్దునికి కూడా, బౌద్దులు వదలినా, పూజలు చేస్తూ దేవునిలా కొలుస్తున్న మన ధర్మంలోని బెన్నత్యం నాకు గ్రహింపుకు వచ్చింది. ఇక్కడ జలం పవిత్రం, ధరణి పవిత్రం, వాయువు పవిత్రం, శిలలు పవిత్రం. స్వామీ ఇక్కడి అణువణువూ పవిత్రం. అటువంటి ఈ పవిత్ర దేశాన్ని నేను పాలించటం ఏమిటి ప్రభూ” ఆవేశంగా కన్నీళ్లు కారుస్తూ జయదేవుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు అవంతి వర్మ

జయదేవుడు అతడిని లేవనెత్తి “నేను నీకు నేర్పిన అంశాలు స్మరిస్తూ ఉండు. రాజ్యపాలనలో నీకవి మార్గదర్భ్శనాలు. నువ్విక్కడ ఏ ధర్మాన్ని చూశావో, ఇదే సనాతన ధర్మం భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. మన గ్రామాలకు దేవాలయాలు రాజభవనాలు. దైవం రాజు. అందుకే దేవాలయాలు ఆధారంగా (గ్రామాలు ఎదిగాయి. దైవం ఆధారంగా రాజ్యాలు నిలిచాయి. ధర్మం ఆధారంగా ఈ దేశం ఎదిగింది. సనాతన ధర్మం ఈ దేశానికి ఆత్మ అందుకే ధర్మ విచ్చిత్తి కానివ్వదు భగవంతుడు. ఈ దేశంలో ఒక రాజు ధర్మచ్యుతి జరుపుతూంటే అదే సమయానికి ధర్మరక్షకుడు జన్మించి ఎదుగుతుంటాడు. అవంతి వర్మ, ఇదీ దేశ చరిత్ర. ఇక్కడ రాజుతో సంబంధం లేని వ్యవస్థ ఏర్పడింది. రాజు కేవలం ఆ వ్యవస్థ విచ్చిన్నం కాకుండా చూసే కాపలాదారు మాత్రమే.

అందుకే మనకు ఏ రాజు వచ్చి ఏం చేసిపోయాడనే దానికన్నా ఏ వ్యక్తి మనిషిగా ఎంత ఎదిగాడు? పరమసత్య సాధనాపధంలో ఎంత దూరం పయనించాడు. అన్నవే మనకు ప్రధానాంశాలు. ఇదే మన చరిత్ర. మనకు అశాశ్వతాలపై వ్యామోహం లేదు. మన దృష్టి శాశ్వతాల పైనే.

మనకు పరలోకాలున్నాయి. పాపపుణ్యాలున్నాయి. మనంచేసిన కర్మ అనుభవించక తప్పదు. అందుకే పాపపుకర్మలు చేయకూడదు. సత్మర్మలు చేయాలి. దుష్మర్మల ఫలితంగో 222. 100 :=2323232322ఊ2ఊ20:2ఊ24ఊ242422222్తై22:22222222=--22= కస్తూరి మురళీకృష్ణ ===

అనుభవించే నరకాలన్నిటిలోకీ తల్లికడుపులో మలమూత్ర భూయిష్టమైన స్థలమున కొన్నినెలలు కాళ్లుచేతులు లేకుండా జీవుడనుభవించే బాధనుమించి వేరే నరకబాధ లేదు. గర్భనరకాన్ని తప్పించు కోవాలంటే సత్మర్మలు చేయాలి.

అవంతి వర్మ ఇది మరిచిపోకు. నీకెటువంటి బాధ కలగదు.

అని చెప్పాడు జయదేవుడు.

వాళ్లు జయదేవుడికి నమస్కరించారు. జయదేవుడు మౌనంగా కాలి నడకన వెనుదిరిగాడు. సకలభోగాలను, ఐశ్వర్యాలను తృణప్రాయంగా తిరస్కరించిన జయదేవుడికి నమస్కరిస్తూ, ఆయన కనుమరుగు అయ్యేంతవరకూ చూస్తూ నిలబడ్డారు ముగ్గురూ.

“ధర్మచ్యుతి అయినప్పుడు ధర్మాన్ని నిలిపేందుకు భగవంతుడు మళ్లీ జన్మనెత్తుత్తూ ఉంటాడు. అది నిజం. భగవంతుడే రూపంలో ఎలా వస్తాడో, ధర్మాన్ని ఎలా నిలబెడతా అంతా అతని లీల” అన్నాడు సుఖవర్మ.

ముగ్గురూ ఆదిత్య భగవానుడిని అర్చించి రాజధాని వైపు పయనం సాగించారు.

శశ 3 వర్మ, అనంతరం అనతి కాలంలోనే అవంతి వర్మ కళ్ళీరానికి రాజయ్యాడు. అం శూరుడు, జయదేవుడు నేర్చిన విషయాలను మరువక రాజ్యాన్ని పొలించా న ధర్మకార్యాలు చేస్తూ అవంతివర్మ సత్యయుగంలోని మాంధాతతో సమానంగా ర చేశాడు శూరుడు శైవుడు. అవంతివర్మ వైష్ణవుడు. వారిద్దరూకలిసి క రల నడి పూర్వవైభవాన్ని నిలిపారు. లౌకికాబ్బం 3959వ సంవత్సరం. అమె న లో అవంతివర్మ మహారాజు భగవద్గీతా పరనంచేస్తూ, వైకుంఠ ధామ ధ్యానంతో ఆ ష్ట్ర లీనమైపోయాదు. (అంటే క్రీ.శ.883వ సంవత్సరము). శశ 2 కడు కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు 23233332 క ట్రై? ఊఊ

ల స ఢ్‌్‌ కోరాను కా ( ళ్‌ న జన (6 సలు హ్‌ న్‌. (డం టా “5 ర్వ పం చా రాణి సురంధాదేవి “ాజమాతా, మహారాజు గోపాలవర్మ తమరి దర్శనార్దం వేంచేస్తున్నారు”. వ్‌ తలుపు చాటు నుంచి తల వంచుకుని చెప్పింది పరిచారిక త్రాచుపాము తన పైకి వస్తున్నట్టుగా ఉలిక్కిపడింది సుగంధాదేవి. (ప్రభాకర దేవుని పరిష్వంగం నుంచి తప్పించుకుని తత్తరపాటులో లేచింది. “ఏమైంది? మత్తుగా అడిగాడు ప్రభాకర దేవుడు. “మహారాజు వస్తున్నాడటి చెప్పింది సుగంధాదేవి. “మహారాజా? ఇక్కడికా? ఇది నిజమా?” కంగారుగా అడిగాడు. సుగంధాదేవి ఇది నిజమేనన్నట్టుగా తల ఊపింది. కంగారు కంగారుగా దుస్తులు ధరించసాగింది. సుగంధాదేవి కశ్మీర రాజు శంకరవర్శ్మ సతీమణి. గోపాలవర్మ ఆమె తనయుడు. అది క్రీ.శ 904వ సంవత్సరం. మా 12 2న కస్తూరి మురళీకృష్ణ ఊఊఊ

లౌక్షికాబ్బ్టం 3959 (క్రీ.శ883)వ సంవత్సరంలో అవంతి వర్మ మరణించాడు. అతను మరణించిన మరుక్షణం కశ్మీర రాజ్యంలో రాజ వదవి కోనం నంకుల నమరం ఆరంభమయింది. ఐశ్వర్య మదోన్మత్తులయిన ఉత్పల వంశీయులు రాజ్య టప్రావ్తికై ప్రయత్నించసాగారు.

రత్నవర్ధనుడనే ప్రతీహారి అవంతి వర్మ కుమారుడైన శంకర వర్మను రాజుగా అభిషిక్తుడిని చేశాడు. కానీ విన్నప మంత్రి కుమారుడు కర్ణపుడు శూరవర్మ తనయుడు సుఖవర్మను యువరాజుగా చేశాడు.

రాజ, యువరాజుల అధికారాలు నిర్దిష్టంగా నిర్ణయం కాకపోవటంతో వారిరువురి మధ్య వైరం పెరిగింది. ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయింది. యువరాజు పక్షం వారు ధనాశ చూపించి రాజు పక్షానికి చెందిన వారిని తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ శివశక్తి వంటి స్వాభిమానం కల వీరులు కేవలం ఉదర పోషణ నిమిత్తం తోక ఆడించే శునకాల్లా కాక సత్యవ్రియత్వాన్ని వీడక రాజుకు అండగా నిలిచారు. యువరాజు పరాజితుడయ్యాడు.

రాజధాని దాటి రాజాజ్ఞ చెల్లని కాలమది. అటువంటి సమయంలో శంకర వర రాజ్యాధికారాలన్నీ తన చేతిలో ఉంచుకున్నాడు. శివశక్తి సహాయంతో చెదురు మదురైన శతృవులను ఏరిపారేశాడు. రాజ్యంలో తన అధికారాన్ని స్థిరంచేసుకుని వెనుకటి నృపాలుర దిగ్విజయ సాంప్రదాయాన్ని నిలబెట్టేందుకు పొరుగు శతృ రాజ్యాల వ దుండయా( ప్రారంభించాడు.

వ,

పర్వతాల నుండి దూకే జలరాశి ప్రవాహ వేగానికి కరిన శిలలు సైతం విరిగి ప్ర పిండి అయినట్టు గొప్ప పేరెన్నికగన్న మహారాజులు, మహావీరులు సైతం శంకరవర్మ పాదాక్రాంతులయ్యారు.

శంకరవర్మ సైన్య పద వుట్టనలకు రాజ్యం వదలి కొండలలో తలదాచుకున్న దార్వాఖిసార రాజు గుండెలే కాదు, కొండల గుండెలూ గజగజ వణికాయి.

ప్రాణం బదులు వేలు మాత్రం గగ్రపొంచి ప్రాణాన్ని వదలినట్టు ఘూర్జర రాజు అలఖానుడిని జయించి టక్క దేశ భూమిని స్వాధీనం చేసుకుని తక్కిన రాజ్యాన్ని అలఖానుడికి వదలిపెట్టాడు శంకరవర్శ్మ.

భోజరాజు జయించి ఆక్రమించిన ధక్కేయ వంశపు రాజు రాజ్యాన్ని గెలుచుకుని మళ్లీ రాజ్యాన్ని ధక్కేయులకే అప్పగించాడు. ప్రళయ కాలంలో ధరణిని ముంచెత్తేందుకు ప్రచండ వేగంతో ఎగసిపడే సముద్రంలా శంకర వర్మ సైన్యం త్రిగర్త మీద విరుచుకుపడటంతో త్రిగర్త వల్లభుడు పృధివీ చంద్రుడు త్రిగర్త వదలి పారిపోయాడు. జజ కల్దణ కళ్ళ్మీర రాజతరంగిణి కధటు :2ైైడతజడత22త22+ఊ2ఊఊ4ఊఊఊ4ఊ2ఊ222 120 =

ఇంద్రునికి భయపడి పర్వతాలు సముద్రంలో దాక్కున్నట్టు, శత్రురాజులు శంకరవర్మ శౌర్యానికి జడిసి దరద, తురుష్క రాజ్యాల నడుమ ఉన్న ఉద్బాండపురంలో లన్లియషాహి రాజు నీడన తల దాచుకున్నారు. అయితే శంకర వర్మ ప్రతాపానికి చెదరిన లనల్లియ షాహి కూడా కళ్ళ్శీర రాజు శరణు వేడాదు. కానీ లల్లియషాహీ రాజ్యాన్ని ఆక్రమించాలని నిశ్చయించుకున్న శంకర వర్మ అతనికి శరణునివ్వలేదు. దరద, ఉత్తర బాహ్లీక, కిరాత, కతియ, ఉరగ, సింహపుర, కాంభోజ, త్రిగర్హ కోకనవ రాజ్యాలను జయించి దిగ్విజయంగా కళ్ళ్మీరం చేరుకున్న శంకర వర్మ పంచపత్రమనే (ప్రదేశంలో శంకరపురమనే నగరాన్ని నిర్మించాడు.

ఉత్తర పధాన్ని పాలిస్తున్న స్వామి రాజు శంకర వర్మ శౌర్యప్రతాపాలకు మురిసి తన కూతురు సుగంధాదేవిని శంకర వర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు. శంకర వర్మ సుగంధాదేవిల జంటను శివపార్వతుల్లా కళ్ళీర (ప్రజలు భావించసాగారు. ప్రజల అభీష్టం మేరకు శంకర వర్మ ఒక గొప్ప మందిరాన్ని నిర్మించి, తన పేర శంకర గౌరీశ విగ్రహాన్ని సుగంధాదేవి పేర సుగంధేశ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

మనిషిని దైవంలా కొలవటం వల్ల ఆ మనిషికి అహంకారం పెరుగుతుంది. మదం 'హెచ్చుతుంది. మనిషిని దైవంలా భావించటం వల్ల దేశానికి కలిగే చేటును భావితరాల వారి గ్రహింపుకు వచ్చేట్టుగా శంకర వర్మ నడవడి మారిపోయింది. ప్రజలు తనను దైవంలా కొలవటం శంకర వర్మ అహంకారాన్ని పెంచింది. తానేం చేసినా ప్రజలు దైవాజ్ఞలా భావిస్తారన్న ధైర్యం అతనికి కలిగింది. మనిషిని దైవంలా కొలవటం అన్న పొపానికి ఫలితం కళశ్ళ్మీరం అనుభవించసాగింది.

ఈ సమయంలో కళ్మీరంలో ఒక నూతన మతం ఆవిర్భవించింది. శంకర వర్శచే పండితుడయిన సుఖవర్మ ప్రోత్సాహంతో ఆ మతం కళ్ళ్మీరం నలుమూలలా వ్యాపించి విజ్బృంభించసాగింది.

నిజానికి ఆ మతం నూతనమైనది కాదు. ఒకప్పటి చార్వాక సిద్దాంతాలను, భారతదేశంలోకి వచ్చి పడుతున్న ప్రపంచంలోని పలు ప్రాంతాల వారి మత సిద్ధాంతాలను కలిపి ఏర్పరచిన నూతన మతం అది. ఆ మతంలో సర్వం భౌతికమే. కంటికి కనబడేది తప్ప మరొకదాన్ని నమ్మరు వారు. ప్రపంచంలోని ప్రజలంతా సమానమై పోవాలని వారి ఉద్దేశ్యం.

ఈ మత సిద్దాంతాలలో మనిషిలో పశుత్వాన్ని ప్రకోపింపచేసే అంశాలకు పెద్దపీట వేస్తారు. జీవితం సుఖాలను భవించటం కోసమేనని, బ్రతికినన్నాళ్లూ భౌతిక సుఖాలనుభవిస్తూ (బ్రతకాలని విసృత ప్రచారం సాగించారు. వీరి ముఖ్య లక్ష్యం సనాతన ధర్మంలోని నియంత్రణను నిర్ణించటం. దడ 180 డడ డడ కస్తూరి మురళీకృష్ణ నాల!

మనిషి మనిషిగా (బ్రతకటం కష్టం. పశువులా మిగిలిపోవటం సులభం. కాబట్టి సంస్కార హీనులు, ఇంద్రియ నిగ్రహ రహితులు తమ అల్పత్వానికి పెద్దపీట వేసే ఈ నూతన మతం పట్ల విపరీతంగా ఆకర్షితులవసాగారు. అలా ఆకర్షితులయినా వారిలో రాజు శంకర వర్మ ఒకడు

ఆ మత సిద్దాంతాల వశంలో పడి రాజు ప్రజలను పీడించి ధనాన్ని సేకరించసాగాడు. “అంతా సమానమే. ప్రజలందరి ధనం నా వద్ద ఉంటే ప్రజలంతా శేదరికంలో సమానమైపోతారు' అని ప్రకటించి మరీ ప్రజలను దోచసాగాడు. రాజు బహువ్యసన లోలుడయ్యాడు. పైగా 'నేనే దైవాన్ని నేనేం చేస్తే అది దైవనిర్ణ్మయం అవుతుంది" అనేవాడు మత్తులో మునిగి.

“దేవుడినైన నేను ఉండగా ఇంకా ఇతర దేవుళ్ల పూజలెందుకు?” అవి ఆక్షేపించి క్రూరమైన ఉపాయాలతో దేవాలయాలను అపహరించాడు. (గ్రామ గృహాలపై పన్నులు విధించాడు. దేవాలయాలలో పూజల నిమిత్తం ధనం వసూలు చేసి ఆ ధనాన్ని న్వీయోపయోగం నిమిత్తం వాడుకొనేవాడు. అదేమని ఎవరైనా అడిగితే “మీరా ధనం దైవపూజ నిమిత్తం ఇచ్చారు. ఆ ధనాన్ని దైవమే వాడుకున్నాడు. మీకభ్యంతరం ఏమిటి?” అని అడిగేవాడు. అతదు అరవైనాలుగు దేవాలయాలను హస్తగతం చేసుకుని దైవ ధనాన్ని దోచుకున్నాడు.

దేవాలయాలు శిధిలం కావటంతో (గ్రామాలు శిధిలం కాసొగొయి. దాంతో రాజు న్‌ (గ్రామాలన్నీ తన వశం చేసుకుని (ప్రజలతో సేద్యం చేయించి, వారికిచ్చే వేతనం: తృతీయాంశాన్ని బిగబట్టి ఆ మేరకు అత్యధిక మూల్యంతో అన్న కంబళాదులు ఇచ్చి సరిపెట్టేవాడు. ఈ రకంగా ప్రజలందరినీ తనకు బానిసలుగా చేసుకుని వెట్టిచాకిరీ చేయిస్తూ “ప్రపంచంలోని భేదాలను రూపుమాపేశానూ అని గర్వంగా చెప్పుకునేవాడు.

ఒక గ్రామంలో ప్రజలు తనను గౌరవించలేదని రాజు 'భారవహనమూల్య'మనే పన్ను విధించి తనకు వెట్టిచాకిరీ చేయని గ్రామస్థుల నుంచి దానిని వసూలు చేయటం ఆరంభించాడు. దీనిని 'రూఢ బారోఢీ' పన్ను అనేవారు. ఇది కళ్ళీర ప్రజల పాలిటి దరిద్ర దేవత దూత లాంటి పన్ను.

గ్రామ స్మందక (మునసబు) గ్రామ కాయస్ట్సు (కరణం)ల మాసిక వేతనానికి వ్యయానికి ప్రజలపై అధిక పన్నులు విధించాడు శంకరవర్మ

ప్రజలపై అధిక పన్నులను విధించి పీడించటం వల్ల ప్రజలు అష్టకష్టాల పాలయ్యారు. పైగా శంకర వర్మ పరమత సిద్దాంత ప్రభావితుడై ఆ సిద్దాంతాల ప్రకారం వెలయించిన సాహిత్యమే సాహిత్యమని భావించి ఆదరించటంతో కళ్ళ్మీరంలో పండితులపై ఆనాదరం పెరిగింది. === కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు :=23232323232323232ఊ2ఊ2ఊజ22ఊఊజ 131 ===

అశ్లీలం, అసభ్యత, లైంగిక చర్యల విపుల వర్ణన, స్రీ పురుష సంబంధాల పట్ల నీచమైన అభిప్రాయం వెలిబుచ్చే సాహిత్యమే ఉత్తమ సాహిత్యం అన్న అభిప్రాయం ప్రజలలో బలపడసాగింది. ప్రాచీన సాహిత్యం పనికిరాదని, నీతిబోధలు పనికి మాలినవని (ప్రచారం జరిగింది. సాహిత్యంలో హితం హత్య చేయబడింది. దాంతో పండితులు కళ్ళీరం వీడి పారిపోసాగారు. 'కంచే చేను మేస్తే గతి ఏది?” అన్నట్టు ప్రజలు తమ గోడు వినేవారు లేక లోలోన కుమిలి పోసాగారు.

శంకర వర్మ, సుగంధా దేవిల పుత్రుడు గోపాలవర్మ దయా(ర్ద హృదయుడు. జనవత్సలుడు గోపాల వర్మ నిర్భయుడు. నిజం చెప్పేందుకు భయపడటం కన్నా నికృష్ణమైనది. మరొకటి లేదని నమ్మే వ్యక్తి.

బాలుదైనా గోపాలవర్మ ఒకనాడు నిండు సభలో తండ్రి శంకర వర్మను నిలదీశాడు. ఎవరూ చేయనటువంటి సాహసం చేశాడు.

అతడు రాజును సమీపించి, మొక్కి 'తండ్రీ! మీరు ప్రజల నుండి ధనం ఈ విధంగా సం[గ్రపొంచటం రానున్న నరకానుభవానికి సకల సామగ్రిని సమకూర్చుకోవటం లాంటిది. మీరు శ్వాసక్రియ మీద తప్ప జనుల సకల చర్యల మీద పన్నులు విధించారు. ఇట్టి ప్రజాపీడన అనర్ధదాయకం. మేఘం సూర్యకాంతిని అడ్డుకుని జగతిని కాంతి హీనం చేసినట్టు రాజు దౌష్ట్రం ధర్మహానికారకమై ప్రజలను కష్టాల పాలు చేస్తుంది.

తండ్రీ, రాజధర్మాన్ని విడిచి, ప్రజలను కష్టాల పాలు చేసి అధోగతి పొందిన రాజుల జీవిత గాధలను చరిత్ర మనకు చెప్తూనే ఉంది. పూర్వీకుల చరిత్ర నుంచి మంచిని గ్రహించి చెడును విడచి, తన వర్తమానాన్ని తీర్చిదిద్దుకొనేవాడే ఉత్తముడు తండ్రీ, మీరు పూర్వీకుల చరిత్రలు నేర్చుకున్న గుణపారాలను మరచి గుణవిహీనులై అధోగతి పాలు కాకండి. కళ్ళీరాన్ని అధోగతి పాలు చేయకండి. "

రాజా, కళ్శీరం భారతావనికే తలమానికం వంటిది. కళ్మీరంలో జన్మించినటువంటి గొప్ప రాజుల పరంపర ఈ దేశంలో ఇతర ఏ రాజ్య చరిత్ర లోనూ లేదు.

జలౌకుడు, దామోదరుడు, మూడవ గోనందుడు, నరుడు, సిద్దుడు, మిహిరకులుడు, గోపాదిత్యుడు, ప్రతాపాదిత్యుడు, తుంజీనుడు, సంధిమతి, మేఘవాహనుడు, విక్రమాదిత్యుడు, ముక్తాపీడ లలితాదిత్యుడు, అవంతి వర్మ వంటి మవారాజులు అధిష్టించిన సింహాసనాన్ని అధిష్టించిన మీరు ఇలా ప్రవర్తించటం పూర్వీకులకు అవమానం చేసినట్టు అవుతుంది. వారి సరసన పేర్కొనబడే అర్హతను మీరు కోల్పోతున్నారు.

తండ్రీ, రాజు కేవలం ప్రజల సంరక్షకుడు. ప్రపంచాన్ని నడిపించేది భగవంతుడు. కళ్ళ్మీరం పవిత్ర భూమి. ఈ పవిత్ర భూమి తమరు పాలిస్తున్నానని గర్వపడి విర్రవీగటం, తజ పట తతత? కస్తూరి మురళీకృష్ణ నా

తమరి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. తండ్రీ తమరు నిమిత్తమాత్రులు. తమరను సరిస్తున్న మతం అనర్ధదాయకం.

“స్వధన్మే నిధనం (శ్రేయః అన్న భగవానుడి నిర్దేశాన్ని పెడచెవిన పెట్టి, ఆద్యంతాలు లేక అనంతకాలం నుండి ఒక పరంపరగా వస్తూన్న ఈ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసి ఏదో నిన్న మొన్న పుట్టిన కుక్క గొడుగు లాంటి పాశవిక సిద్దాంతాల వెంట మీరు పరుగిడటం అహ్రాకృతికం.

మనిషి పుట్టింది ఇంద్రియాల వెంట పరుగిడి తన ప్రత్యేకతను కోల్పోయి పశుస్థాయికి దిగజారటం కోసం కాదు. మనిషి జన్మించినవుడు పశువే. కానీ నంస్కారం వల్ల, సంప్రదాయబద్దంగా నియమ నిష్టలతో క్రమబద్దమైన జీవితాన్ని గడపటం వల్ల ఆ పశువులాంటి మనిషి నిజమైన మనిషిలా ఎదగగలుగుతాడు.

తండ్రీ, మీరీ పశుప్రవర్తనకు ఇంతటితో స్వస్తిచెప్పి జనరంజకంగా పాలించండి. మిమ్మల్ని తప్పుత్రోవన పట్టిస్తున్న వారికి మీపట్ల ప్రేమలేదు. వారి చర్యల వెనుక పొంచి ఉన్న స్వార్ధాన్ని, అందువల్ల కలిగే ప్రమాదాన్ని గ్రహించండి. కళ్ళీరం భారతదేశ నుదిటిన తిలకం వంటిది. ఆ తిలకం సూర్యుడిలా జగతికి విజ్ఞానపు వెలుగులను పంచేట్టు చేయండి. తిలకం స్థానే మాయనిమచ్చను మిగల్బకండి' అని చేతులు జోడించి బ్రతిమిలాడొడు గోపాలవర్ము

గోపాలవర్మ మాట్లాడుతున్నంతసేపూ శంకర వర్మ పెదవులపై వ్యంగ్య పూరితమైన చిరునవ్వు కదలాడుతూనే ఉంది. గోపాలవర్మ నిశ్శబ్దంగా ఉండగానే శంకర శర్మ విపరీతంగా నవ్వాడు. అది చూసి మిగతా సభ్యులంతా హేళనగా, పరిహాస పూర్వకంగా నవ్వసాగారు.

ప్రపంచ చరిత్రలో తండ్రికి హితోపదేశం చేసి ధర్మం ముందు, నిజం ముందు రక్త సంబంధమైనా దిగదుడుపేనని నిరూపించిన ఏకైక వ్యక్తి గోపాలవర్శ్మ.

అయితే గోపాలవర్మ మాటలు శంకర వర్మపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అనాటి నుండి శంకర వర్మ ఆగడాలు మరింత మితి మీరిపోయాయి.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన దేవభాషా గురువు, భల్లట శతక రచయిత, పదమంజరి వంటి శబ్ద రత్నాకర నిర్మాత అయిన భల్లట కవి నికృష్ణ స్థితిలో జీవనం కొనసాగించాల్సి వచ్చింది. దేశం వదలి వెళ్లిపొమ్మన్న పొతుల మాటలకు అతని సమాధానం ఒకటే “కళ్శీరం పార్వతితో సమానం. ఆ పార్వతీ మాత ఒడిని వదలి వెళ్లి ఎక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండగలను? కళ్ళీరాన్ని పీడిస్తున్న రాజుకు దైవమే శిక్ష విధిస్తాడు. పార్వతీదేవినవమానించిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరు” అన్నాదు.

భల్లట కవి వాక్యం రాజులకే కాదు రాజు సంతానానికి కూడా వర్తిస్తుంది అన్నట్టు, వ్యాధులేమీ లేకుండానే శంకర వర్మ ముప్ఫయి మంది సుతులు మరణించారు. రాజు === కల్పణ కళ్ళీర రాజతరంగిణి కథలు 2223332222 1వ ==

నిర్మించిన శంకరపురం శిథిలమైపోయింది. (ఇది వర్తమాన పాలకులు గమనించవలసిన విషయం. రాజు దుశ్చర్యల ప్రభావం వారి సంతానంపై తప్పకుండా ఉంటుందన్నది చరిత్ర నిరూపించే సత్యం). ఇదే సమయంలో సుఖరాజ మంత్రి మేనల్లుడిని రాజు ద్వార దేశాధిపతిగా నియమించాడు. అతడు ద్వార దేశానికి వెళ్తుండగా, దారిలో నీరానకమనే స్థలంలో హత్యకు గురై మరణించాడు. ఈ వార్త విని కుపితుడైన శంకర వర్మ నీరానకంపై దందెత్తిపోయి ఆ ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేసి సింధుతట పార్య్వానకల అనేక రాజులను జయించి కళ్ళీరానికి తిరిగివస్తూ దారిలో విస్తకు ఎగువన ఉన్న ఉరశ పురంలో విశ్రయించాడు. ఉదరశపురంలో శంకరవర్మ సైనికులు విచ్చలవిడిగా (ప్రవర్తించసాగారు. దాంతో ఉరశపుర, వాస్తవ్యులకు సైనికులకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ విని క్రోధంతో, మద్యపాన మత్తుదైన శంకరవర్మ కత్తి పూని తాను ఘర్షణలో పాల్గొన్నాడు. కొండమీద నుండి ఒకశ్వాసకుడు వదిలినబాణం రాజుకంరంలో గుచ్చు కుంది. కొనప్రాణంతో ఉన్న రాజును తీసుకుని, మంత్రులను సైన్య సంరక్షణకు వదలి గోపాలవర్మ రహస్యంగా త్వరత్వరగా కళశ్ళీరం వైపు పయనమయ్యారు. మరణ స్థితిలో ఉన్న రాజుకు తన దుశ్చర్యల ఫలితం తెలిసి వచ్చింది. గోపాల వర్మను, సుగంధిని పిలిచాడు. గొంతులో గుచ్చుకున్న బాణం నరకయాతన పెడుతూంటే మనిషి తన దుష్మర్మల ఫలితం ఎక్కడో నరకంలో కాదు, ఇక్కడే భూమి మీదే పూర్తిగా అనుభవిస్తాడని, అందుకు తానే నిదర్శనమని శంకర వర్మ (గ్రహింపుకు వచ్చింది. గాయపడి కొనప్రాణంలో ఉన్న శంకర వర్మను కౌగిలించి బోరుమంది సుగంధాదేవి. గోపాల వర్మ చేతిని నుగంధాదేవి చేతిలో ఉంచి 'కళ్ళ్మీరాన్ని సంరక్షించవలసింది నీవే. తండ్రి ఆస్తి తనయులది. అలాగే తండ్రి దుష్కర్మల ఫలితం కూడా తనయులు అనుభవించాల్సి వస్తుంది. నా దుశ్చర్యల ఫలితాన్ని నిర్జించి, కశ్మీరంలో తిరిగి భగవాధ్వజం గర్వంగా రెపరెపలాడేట్టు చేయండి” అని చెప్పి లౌకికాబ్దం 3977 (క్రీ.శ. 902) ఫాల్గుణ కృష్ణ సప్తమి నాడు శంకర వర్మ దివంగతుడయ్యాడు. రాజు మరణవార్త బయటకు పొక్మనీయకుందా జాగ్రత్తగా రాజు శవాన్ని రాజధాని చేర్చాడు సుఖవర్మ. దాంతో రాజదర్శనం కోరిన ప్రజలకు రాజు చేయికి తాడు కట్టి ఊపుతూ, అదే రాజు చేస్తున్న ప్రతి నమస్కారం అన్న భ్రమ కల్గించాడు. అలా ఆరు రోజులు ప్రయాణం చేసి కశ్మీర సరిహద్దు చేరారు. వరాహమూల (బారాముల్ల) లోని బోల్యాశక వద్ద రాజు అంతిమ సంస్మారాలు , జరిపించారు. ౬222. 1 0డీ =23ైతైతైడ2డడడడడడడడడపపపపపపపడెడోోోోోోడడడడడడోోే కస్తూరి మురళీకృష్ణ తడ

సురేంద్రవతితో సహా ముగ్గురు రాణులు రాజుతో పాటుగా తామూ ప్రాణాలు విడిచారు. జయసింహుడనే సేనాపతి, లాదుడు, వజసారుడు కూదా చితిలో రాజుతో పాటు ప్రాణాలను అర్పించారు.

రాజు శంకర వర్మ ఖననంతో పాటు నుఖవర్మ ఆశలు చిగురించాయి. రాణి సుగంధాదేవి అడ్డు తొలగితే గోపాల వర్మను అంతం చేయటం అంత కష్టంకాదు. అందుకని సుగంధాదేవి అడ్డు తొలగించేందుకు ఒక పధకం వేశాడు.

శంకరవర్మ రాణులంతా సహగమనం చేయగా సుగంధాదేవి పతి చితిలో పడకపోవటం సంప్రదాయాలకు వ్యతిరేకమని వాదించాడు. ఇది సనాతన భారతీయ సిద్దాంతాలను కూలద్రోయటమని వాదించాడు. ప్రజలను రెచ్చగొట్టాడు.

“రాణి సురేంద్రపతి సతీసహగమనం చేసి తన (్రేమను నిరూపించుకున్నప్పుడు సుగంధాదేవి ఎందుకు పతి చితిలో పడకూడదు? పతి పోయినా ఎందుకు బ్రతికి ఉండాలి?” అని సమస్త ప్రజల సమక్షంలో సుగంధాదేవిని, గోపాల వర్మను ప్రశ్నించాడు సుఖవర్మ,

“ఒక వ్యక్తిపై శ్రేమ అతనితోపాటూ బలవంతంగా మరణించటంలో కనబడదు. అది మూర్ధత్వం. తాను ప్రేమించిన వ్యక్తి జ్ఞాపకాలలో బ్రతుకుతూ, అతని కోరికను నెరవేరుస్తూ, ధర్మపాలన చేయటం మించి వ్యక్తిపై (ప్రేమను వ్యక్తపరిచే మరో ఉత్తమ పద్దతి లేదు. నేను నా కర్తవ్య పాలన చేస్తున్నాను. అందువల్ల నాకు నా పతి మీద [్రేమ లేదని ఎవరైనా అనుకుంటే నాకభ్యంతరం లేదు అని నిష్కర్షగా చెప్పింది సుగంధాదేవి.

ఇంకా ఏదో వాదించబోతున్న సుఖవర్మ కెదురుగా వెళ్లి నిలబడ్డాడు గోపాలవర్మ. 'నా సంరక్షణ చేయమని తండ్రిగారు రాణి సుగంధాదేవిని కోరారు. రాజును నేనైనా రాజ్యం తల్లిగారే చేయాలని నాన్నగారి కోరిక. ఇది ఒకవైపు నుంచి పతి కోరిక, మరొక వైపు నుంచి రాజాజ్ఞ అన్నాడు గోపాల వర్మ

సుఖవర్మ పధకం తల్లక్రిందులయింది.

క్రీ.శ.902వ సంవత్సరంలో గోపాలవర్మ కశ్మీరానికి రాజయ్యాడు. ధీమంతుడు సత్యసంధుడు. భారతీయ ధర్మం పట్ల గౌరవం కలిగిన గోపాలవర్మ పూర్వ రాజులకు తలపుకు తెచ్చే రీతిలో రాజ్యం చేయసాగాడు.

కానీ సుఖవర్మ సుగంధాదేవి 'సతి' విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు”.

గోపాలవర్మ తన తండ్రికాలంలో చెల్లాచెదురయి ఆదరణ కోల్పోయి పండితులను సాహిత్యకారులను చేరదీయసాగాడు. భారతీయ పద్దతులను కళ్ళ్మీరంలో పునఃప్రవేశపెట్టటం ఆరంభించాడు. కానీ శంకర వర్మ సమయంలో కళశ్శ్మీరంలో (వేళ్లూనుకున్న నూతన మతావలంబులు అడుగడుగునా గోపాలవర్శ్మకు అడ్దుపడసాగారు. వారు సుఖవర్శ్మతో చేయి కలిపారు. ఆజా కల్పణ కళ్ళీర రాజతరంగిణి కథలు 23౩౭౩౭33 18క్‌ ==

ఒకరోజు గోపాలవర్మ పండిత సన్మానం చేస్తూ భారతీయ సంప్రదాయాల జెన్నత్యం వివరిస్తూంటే సుఖవర్మ అభ్యంతరం లేవనెత్తాడు. “అనాదిగా వస్తున్న సతి సంప్రదాయం గురించి మీకు మాట్లాడే అర్జత లేదు” అన్నాడు.

దానిని గోపాలవర్మ కోపం తెచ్చుకోలేదు. నవ్వి 'భారతీయ ధర్మం అనేక ఉపనదుల నీళ్లు తనలో కలుపుకునే మవానది వంటిది. దాన్లో సమయాన్ని బట్టి ఏదైనా కల్మషం కలిసినా, అవకాశం వచ్చినప్పుడు మనం శుభ్రపరుచుకోవాలి. మన ధర్మాన్ని మనమే సంస్క్మరించుకోవాలి. “సతి మన ధర్మం కాదు. ఏ ఇతర ప్రాంతాల వారి సంపర్మ్శ్మంతోటో మనకు వచ్చింది.

అయితే '“అథయదితే కర్మ విచికిత్సానా వృతాత విచికిత్సావాస్యాత్‌

యే తత్ర బ్రాహ్మాణాస్సమ్మర్భినః

యుక్తు ఆయుక్తుః

ఆవాక్షు ధర్మవామాస్స్యః

యథాతే తత్ర వర్తేరన్‌

తధా తత్ర వర్తేథాః !

(ఎప్పుడైనా శాస్త్రవిహితములైన కర్మలను గూర్చి ఆచారాలను గూర్చి సందేహం కలిగితే బుద్ధిమంతులు, విచారణా సమర్థులు, ఆచార, కర్మకుశలురు, స్వతంత్రులు, దయావంతులు, ధార్మికులు సందేహం కలిగిన ఆచార విషయాలను ఎలా ఆచరిస్తారో అలా వారిని అనుసరించాలి. కొన్ని సందర్భాలలో అన్ని విషయాలనూ శాస్త్రం స్పష్ట చేయదు. అప్పుడు స్థానీయ ్రేష్టులు, ధార్మికులు ఎలా చేస్తారో అదే అనుసరణీయం) అంటుంది శాస్త్రం.

ప్రస్తుతం ఎన సభలోనే ఉద్దండ పండితులు, సకల శాస్త్ర పారంగతులు ఉన్నారు. ఈ విషయం మీద వారి అభిప్రాయం తెలుసుకుందాం. మన సంప్రదాయంలో ఏదో ఒక దోషం ఉందని సంప్రదాయం పట్ల ద్వేషం పెంచుకోకూడదు. దోషమున్నా తల్లిదండ్రులు ఎలా మనవారే అవుతారో, అలాగే ఎన్ని దోషాలున్నా ధర్మం మనది. దాన్ని సంస్కరించుకోవటం మన కర్తవ్యం? అన్నాడు గోపాలవర్శ,

అప్పుడు సభలో ఉన్న వీరదేవనందన షండితుడు, భల్లాటుడు లేచి ముక్తకంఠంతో చెప్పారు.

సతీసహగమనం మన శాస్త్రాల్లో ఎక్కడా నిర్దేశించి లేదు. అంతేకాదు

'కుర్దన్నే నేహ కర్మాజి జిజీ విషే చృతగ్‌ సముః

ఏ వంత్వయి నాన్యధేతో స్తిన కర్మ లిప్యతే నరే

(నరులకు శాస్త్ర విహితములైన కర్మలను చేస్తూ నూరేళ్ళు (బ్రతకాలని కోరుకోవటం తప్ప వేరే మార్గం లేదు) అంటుంది శాస్త్రం. ఇంకా “ప్రాత్యాభిగచ్చన్తియేకే బాత్మహనో జనాః న మురళీకృష్ణ మడడ

(ఆత్మ హంతకులు మరణం తరువాత చీకటి జన్మలు పొందుతారు) అని హెచ్చరిస్తుంది కూడా.

సృష్టిలో మనుషుల చిత్తవృత్తులలో అనేక తారతమ్యాలున్నాయి. (ప్రేమ తీవ్రతను వ్యక్తపరచటంలో తేడాలున్నాయి. (క్రేమించిన వారు దూరం కాగానే అవేదన భరించలేక గుండె ఆగి మరణించేవారు కొందరయితే, ఆవేదనను భరించలేక ఆత్నార్చణం చేసేవారు కొందరు. అలా కాక అంత వేదననూ దిగమింగుకుని తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ధర్మ పాలన చేసేవారు కొందరు. ఎవరి ప్రవృత్తిని బట్టి వారి ప్రవర్తన. మాద్రి పాండురాజుతో మరణించింది. కానీ కుంతి పాండు రాజు జ్ఞాపకాలతో (బ్రతకుతూ తన సంతానాన్ని పెంచి పెద్ద చేసింది. రామాయణంలో దశరధుని నలుగురు భార్యలు సతి మాట తలపెట్టినట్టే లేదు.” అన్నారు వారు.

సుఖవర్మ వంచిన తల ఎత్తలేదు.

నూల్మ మతాచార పరాయణుడైన (ప్రభాకరుడు మరొక పధకం ఆలోచించాడు. సుగంధాదేవి అందగత్తె. ఆమె ఇంకా యవ్వనంలోనే ఉంది. ఆమె వయస్సు కొండల నుండి దూకే వాగు లాంటిది కాకపోయినా, అనుభవాలతో నిండి, మంద్రంగా ప్రవహించే నది వంటిదీ కాదు. ఆమెను తమ వైపు తిప్పుకుంటే గోపాలవర్మ ఆట కట్టించవచ్చని ఆలోచించారు.

ప్రభాకరుడు తెభివైన వాడు. అందగాడు. రాజ్యానికి కోశాధికారి. (ప్రతి చిన్న విషయానికీ సుగంధాదేవిని కలవటం, సంప్రతించటం ఆరంభించాడు. ఆరంభంలో సుగంధా దేవి ప్రభాకరుడిని పట్టించుకోలేదు. కానీ ప్రభాకరుడి చమత్కార పూరిత సంభాషణ ఆమెను అతని వైపు అకర్షితురాలని చేసింది. ఆమె రోజూ ప్రభాకరుడి రాక కోసం ఎదురు చూడసాగింది.

ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన ఆయుధం “మాట మాటతీరుతో రాక్షసులను కూడా దాసులను చేసుకోవచ్చు. పేదవాడిని ధనవంతుడిని చేయవచ్చు. గుడ్డివాడికి ప్రపంచం చూపించవచ్చు. మగువల మనసులను దోచుకోవటంలో మాటను మించిన ఆయుధం మరొకటి లేదు.

(ప్రభాకరుడు అనవసరంగా, అనౌచిత్యంగా ఏమీ మాట్టాడేవాడు కాదు. కానీ ఆమె పట్ల తన ఆరాధన, ఆమె సౌందర్యం పట్ల తన ఆకర్షణ స్పష్టంగా సుగంధాదేవికి తెలిసేట్టు ప్రవర్తించేవాడు. రానురాను ప్రభాకరుడు రాగానే పరిచారికలంతా వారిద్దరినీ ఒంటరిగా వొదిలి వెళ్లటం జరిగేది. గంటల తరబడి ఏకాంతంలో వారు అనేక విషయాలు చర్చిస్తూందేవారు. ప్రభాకరుడు నెమ్మదిగా తన సిద్దాంతాలను సుగంధాదేవికి పరిచయం చేయసాగాడు వా కళ్ళ్మీర రాజతరంగిణి కథలు హెెె౭తతతతత22ఒ2 [1 ట్ర? 3232

ఒకరోజు వ్యవహారాలు చర్చిస్తూ ప్రభాకరుడు “తమ వంటి అతిలోక సౌందర్యవతిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు” అనేశాడు. హరాత్తుగా అలా అని భయం నటించాడు.

రాణి చిరు మందహాసం చేసింది. దాంతో ధైర్యం కలిగి ప్రభాకరుడు ఒక అడుగు ముందుకేశాడు. 'మహారాణీ! తమ సనాతన ధర్మానుయాయులు మీ ధర్మం ఆద్యంతాలు లేనిది అంటారు. కానీ మీ ధర్మంలో సీకి జరుగుతున్నంత అన్యాయం మరే ధర్మంలో జరగటం లేదు” అన్నాడు.

“ఎలా?” అడిగింది రాణి కుతూహలంగా.

“ప్రీని తీగెతో పోలుస్తారు. ఆ తీగ పందిరి లేకుండా నిలవలేదు. దానికి పందిరి ఆధారం తప్పనిసరి. అలాగే ్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు ఈ రకంగా జీవితాంతం ఎవరో ఒకరి ఆసరా తప్పనిసరి అని 'స్రీని బందీ చేసేశారు.

రాజు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. కానీ రాణి పర పరుషుడిని కన్నెత్తి చూడకూడదు. శ్రీకృష్ణుడికి ఎనిమింది భార్యలు. కానీ ఆ ఎనిమిది మందికీ శ్రీకృష్ణుడే భర్త. ఇదెక్కడి న్యాయం?

రాముడు అడవులకు వెళ్తే సీత వెంట వెళ్లి పతివ్రత అయింది. మరి సీతను అడవులకు పంపి రాజ్యంలో రాముడెందుకు ఉండాలి?” అన్నాడు.

రాజి ప్రభాకరుడి మాటలు జాగ్రత్తగా వినసాగింది.

“క లోకమంతా అన్యాయంగా ఉంది. పురుషులు స్త్రీలను కేవలం పశుతుల్యులుగా ఆట బొమ్మలుగా చూస్తున్నారు. స్రీలు మనుషులు కారా? వారికి కోరికలుండవా? అసలీ వివాహమే ఒక దుష్ట సంస్థ. ఒక ప్రీకి ఒకే పురుషుడనటం ్రకృతి విరుద్దం. మనస్సు చంచంలమైనది. దాన్ని బంధించటం మూర్ధత్వం. గాలినెవరైనా బంధించగలరా?

లోకంలో పతివ్రతలనే ప్రీలు ఉండరు. దమయంతి, చంద్రమతి, అనసూయ, సీత, అరుంధతి, ఇవన్నీ తమ ప్రీలు పరాయి పురుషుల వైపు ఎక్కడ ఆకర్షితులవుతారో అని చేత కాని పురుషులు అసూయతో కల్పించిన ఆదర్శాలు.

సుఖమనేది ఎవరికైనా ఒకటే. స్త్రీకైనా, పురుషుడికైనా, అటువంటప్పుడు ప్రీ ఎవరు నచ్చితే వారితో సౌఖ్యం పొందవచ్చు.

అసలు వివాహం ఎందుకు? స్త్రీకి ఏ పురుషుడి మీద (యేమ ఉంటే అతడితో కలిసి ఉందాలి. ఇష్టం లేనప్పుడు విడిపోవాలి. సమాజం కోసం భార్యాభర్తలుగా నటిస్తూ ఉండేవాళ్లు పశుతుల్యులు.

అయినా స్త్రీ పురుషులు ఒకరినొకరు తాకకూడదన్న నిబంధన బూటకం. గురుల భార్యను శిష్యుడు కన్నెత్తి చూడకూడదట. ఆమె యవ్వనవతి అయితే పాదాలు తాకి వజఊ+ ఫది పడ కస్తూరి మురళీకృష్ణ న!

నమస్మరించకూడదట. దూరం నుండే నమస్మరించాలట. ఇది మనుస్కుతి. ఏం? స్త్రీలు పురుషులు స్పర్భతోనే అపవిత్రులైపోతారా? ఇపుడు నేను మిమ్మల్ని తాకుతున్నాను చూడండి. మీరు అపవిత్రమైపోతారా? అని ఆమె పొడవైన, మృదువైన చేతి వేళ్లను స్పృశించాడు (ప్రభాకరుడు.

“చూడండి. ప్రీ పురుషుల మధ్య తేడా లేదు” అన్నాడు. కానీ అతని కంరం వణికింది. అతని వృదయం ర్సుల్లుమంది ఇరువురి హృదయాలలో ఒక వికృత సంచలనం కలిగింది.

సుగంధాదేవికి పురుష స్పర్శ కొత్త కాదు. మహారాజు శంకర వర్మ సాంగత్యంలో ఆమె స్వర్గలోక సౌఖ్యాలు చవి చూసింది. కానీ శంకర వర్మ దుష్టపు పనులు ఆరంభింఛచినప్పటి నుంచీ సుగంధా దేవి మందిరం వైపురాలేదు. అందుకే ఆమె శరిరం వర్షపు చినుకుల కోసం తపిస్తున్న మోదైన వృక్షంలా ఉంది. ప్రభాకర వర్మ స్పర్శ ఆమె మనసును తాకలేదు. శరీరాన్ని స్పందింపచేసింది. ఆమె సౌఖ్యం పరమావధి కేవలం శరీరావధిగా కలది. దాంతో ఆమె మనసు కొత్త వికారం పొందింది.

ఆమె ముఖ కవళికలను గమనిస్తున్న ప్రభాకరుడు మరొక అదుగు ముందుకు వేశాడు.

“లైంగిక చర్య ప్రాకృతికం. మీకీ భావ పరంపరను విపులంగా తెలియజేసే సాహిత్యం ఇదిగో అంటూ తమ భావ పరంపరను వెదజల్లే సాహిత్యం ఆమెకు అందజేశాడు.

అవన్నీ మనిషిలోని పాశవికత్వాన్ని ప్రకోపింప చేసే గ్రంధాలే. వాటిలో ఉన్నతాదర్శం, ఉత్తమ ఆలోచన అన్నది లేదు. స్తీ బంధ విముక్తి అని గొప్పగా రాసుకునే ఆ (గ్రంధాల్లో ప్రి పట్ల కనీస గౌరవం కూడా కనబడదు. కేవలం పశుప్రాయమైన లైంగిక సుఖాలందించటం. అందుకోవటానికి తప్ప స్రీ మరొకందుకు పనికిరాదన్న భావన కలుగుతుంది ఆ గ్రంధాల పరనం వల్ల,

సుగంధా దేవి ఆ గ్రంధాలను చదివింది. ఆమె మనసులో వికారం మరింత పెరిగింది. అమెలోని విచక్షణా జ్ఞానాన్ని శారీరక సౌఖ్య వాంఛ తొక్కిపెట్టింది. ఆమె శరీరం ఎక్కుపెట్టిన ధనువులా ఉద్విగతణామయమయింది.

ఒక సమయంలో ఒక సిద్దాంతం ప్రాచుర్యాన్ని పొందిందంటే అర్ధం ఆ సమయంలో అనేకులు ఆయా సిద్దాంతాలను ఆమోదించగలిగేంత మానసిక స్థితిలో ఉన్నారని, ఎందుకంటే మనిషి హృదయ వాంఛలను తీర్చుకొనే సాధనం శరీరము. మనస్సు హృదయాన్ని తనువును ఒద్దికలో ఉంచగలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనస్సును శరీరం నియంత్రిస్తుందో, అప్పుడు శరీరం మనస్సును లక్ష్యపెట్టదు. హృదయం, శరీరం ఒకే దారిలో ప్రయాణిస్తాయి.

ప్రస్తుతం సుగంధాదేవి మనస్సు ఆమె అధీనంలో లేదు. జ౭==== కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :=2323=2323232323232ఊ2ఊ2ఊ2ఊ24ఊఊఊ2222222 13కి వ

కామం ప్రపంచంలోని అన్ని శక్తులలోను శక్తివంతమైనది. పరమ శివుడంతటి వాడికే కామ రాజు శరాఘాతాల వల్ల తపస్సు భగ్నం అయింది కానీ కామాన్ని భస్మం చేసేందుకు అందరూ పరమ శివులు కాలేరు.

సుగంధి మనస్సు, మనస్సులో నిద్రాణమై ఉన్న ప్రాచీన సంప్రదాయ స్మృతులు ఆమెను వెనక్కు లాగాయి. కానీ ప్రభాకరుని మాటలు, సిద్దాంతాలు, అతని స్పర్శ, శరీరం స్పందన ఆమె సంస్కారాన్ని కరిగించేశాయి.

ఆనాటినుండి సుగంధి భోగరాగ సంసక్తయై, మనసును అదుపులో పెట్టుకో లేక ప్రభాకరునితో సంప్రదాయపు చెలియలి కట్టను దాటింది. అతనిచే రతికేళి ప్రీతయై, ఆమె (ప్రేమను, ధనాన్ని అధికారాలను అన్నింటినీ అతనికి అర్పించింది.

దాంతో కళశ్శీరానికి ప్రభాకరుడు మకుటం లేని మహారాజయ్యాడు. అతడిని కాదనే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది.

రాజు చేసే ధార్మిక కార్యక్రమాలకు ప్రతిగా (ప్రభాకరుడు తన మత ప్రచారం సాగించసాగాడు. సుగంధాదేవి ప్రభాకరుని చేతిలో వెన్నముద్ద అయిపోయింది.

సుగంధాదేవి అనుమతితో ప్రభాకరుడు బొక్కసం నుండి తనకిష్టమైనంత ధనం తీసుకుని శ్యాహి రాజుపై దండెత్తి వెళ్లాడు. ఆ రాజును ఓడించి అతని పుత్రుడు తోరమాణుడి పేరును కమలకుడని మార్పు చేసి, రెట్టించిన గర్వంతో రాజధానికి తిరిగి వచ్చాడు.

రాజధానికి తిరిగి వచ్చినప్పటి నుంచీ అతనికి కన్ను మిన్ను కానరావటం లేదు. అతని దృష్టికి గౌరవించదగ్గవారు కనబడటం లేదు. రాణి సుగంధాదేవితో కూడా నీచ స్త్రీలతో వ్యవహరించినట్టు వ్యవహరించసాగాడు. కానీ సుగంధాదేవి తాను కాదంటే 'ప్రభాకరుడెక్కడ దూరమైపోతాడో అన్న భయంతో అతడు చెప్పినట్టు చేయసాగింది.

వ్రభాకరుడు అవాంకారపూరితుడై మంత్రులను, పండితులను లక్ష్యపెట్టక అవమానించసాగాడు. అతని మందిరం వేశ్యాలయంలా మారిపోయింది. నిరంతరం మద్యపానంతో, సమయం సందర్భం లేని సామూహిక రతిక్రీడలతో, విశ్చంఖలమైన వర్తనతో ప్రభాకరుడు తానే రాజన్నట్లు ప్రవర్తించసాగాడు.

అందుకని ప్రభాకరుడు రాజు వచ్చాడనగానే కంగారుపడ్డాడు. సుగంధాదేవి కంగారు పడేందుకు కారణం ఉంది. మరణించే ముందు రాజు శంకర వర్మ, గోపాల వర్మ చేతిని తన చేతిలో ఉంచిన తరువాత మళ్లీ ఇంతవరకూ రాజు సుగంధాదేవి దర్శనానికి రాలేదు. ఆమెకు కబురు పంపలేదు. గోపాల వర్మ నిజాయితీ, సంస్కారం, నిర్భయత్వం, నిక్కచ్చితనం సుగంధాదేవికి తెలుసు. === 140 == కస్తూరి మురళీకృష్ణ మమత

తన ్రసుత్త ప్రవర్తన పట్ల రాజ్యంలో రకరకాల వదంతులు వ్యాపించి ఉన్నాయని సుగంధాదేవికి తెలుసు. రాజు తనని మందలించేందుకు వచ్చాడా?

రాణిలో ఒక రమైన మొండితనం ప్రవేశించింది? ఏం మందలిస్తాడు?

తొను చేసింది తప్పెలా అవుతుంది? తన ఇష్టం కాదనేందుకు వాడెవరు? వాడింకా యవ్వనం పూర్తిగా దాటని వాడు తననేమంటాడు?

నెమ్మదిగా ద్వారం వైపు అడుగులేయసాగింది సుగంధాదేవి వెనకే ప్రభాకరుడు పిల్లిలా వచ్చాడు. “రాజు నా గురించేం చెప్పినా నమ్మవద్దు. దుష్టులు, నా శత్రువులు నా మీద ఏవో చెప్పి ఉంటారు రాజుకు అన్నాడు గుసగుసగా.

సుగంధాదేవి నవ్వి 'భయం లేదన్నట్లు అతని చేయి స్పృశించి రాజున్న గదిలోకి అడుగుపెట్టింది.

న న న

గోపాల వర్మ జుగుప్స్పతో చుట్టూ చూశాడు.

అది రాణివాసంలా లేదు. రతికేళీ మందిరంలా ఉంది. స్రీ పురుషులన్న విచక్షణ లేకుండా వివస్తలై ఒకరి మీద ఒకరు పడి ఉన్నారు.

“ఇది తన మాతృమందిరం!” ఆ ఆలోచన రాగానే అతనిలో క్రోధాగ్ని పెల్లుబికింది. కానీ వెంటనే దుఃఖాశ్చవులు ఆ అగ్నిని ఉపశమింపజేశాయి.

“ఎందుకిలా జరుగుతోంది? ఏ క్రూరదైవం ఇలా జరగాలని నిర్దేశిస్తుంది? మనిషి తన మానవ స్వభావానికి దూరంగా ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తాడు? ఉత్తమ ఆదర్శాన్ని ప్రజలకందించవలసిన రాజమాత ఇలాంటి తుచ్చమార్గాన్ని అనుసరిస్తోందేమిటి?”

సేవకులను పిలిచి అక్కడ పడి ఉన్న వారిని తొలగించమన్నాడు. ఎంతలేపినా వాళ్లు మత్తులో పడి దొర్లుతున్నారు తప్ప కదలటం లేదు. పైగా మత్తులోనే ఏదో వాగుతున్నార్తు, విసుక్కుంటున్నారు.

సేవకులు పశువులను లాగినట్టు కాళ్లు చేతులు పట్టి వారిని లాగి పడేస్తున్నారు. వీరు మనుషులా? పశువులా?

ముఖం తిప్పుకున్నాడు గోపాలవర్మ, అంతలో అతని దృష్టి గోడల మీద ఉన్న వివిధ లైంగిక భంగిమల చిత్రాలపై పడింది అటు నుండి చిందర వందరగా పడి ఉన్న గ్రంధాలపై పడింది. కొన్ని తీసి చూశాడు. అన్నీ పాశవికతను ప్రబోధించే గ్రంథాలే. అన్నీ కామోద్దీపనను కలిగించే (గ్రంధాలే. అన్నీ ప్రీ పురుషుల మధ్య అడ్డూ అదుపు లేని సంబంధాలను (ప్రోత్సహిస్తూ వైవాహిక వ్యవస్థను దూషించే గ్రంధాలే. భారతీయ ధర్మ శాస్త్రాలను విమర్శించే గ్రంధాలే. ఊడ కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 22వ చేతనే 2222

గోపాలవర్మ ఆ (గ్రంథాలను అలాగే పదేశాడు. అక్కడే ఆ గందరగోళం మధ్యనే కూచుని కళ్లు మూసుకుని మనసుకు తోచిన మంత్రాన్ని స్మరించసాగాడు.

ఛిద్యతే హృదయ (గ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిక దృష్టే పరావరే॥

(లోక వ్యవహారంలోని మంచి, చెడు, ఉత్కృష్టము, నికృష్ణములలో కూడా ఆత్మను సాక్షాత్మరించుకోవటం వలన అజ్ఞానపు ముడి విడిపోతుంది. అన్ని నంశయాలు సమసిపోతాయి. అన్ని కర్మలు క్షయించిపోతాయి).

అతని మనసు కుదుటపడింది. ఇవన్నీ తనవి కావు. ఇవి తనను తాకలేవు. హోరున పొర్లుతూ ప్రవహించే నదిలో స్థిరంగా నిలచిన శిల వంటివాడు తను. తన శక్తి తన ధర్మం.

మనుషులు అజ్ఞానులై తమ స్వీయ స్వభావాన్ని, తమలోని దైవత్వాన్ని మరచి పశుతుల్యులై ప్రవర్తిస్తుంటారు. దేహమే సర్వమనుకుని, దేహ సంబంధిత సౌఖ్యమే పరమ సౌఖ్యమనుకుని పశువులై తమ మానవత్వాన్ని మంటగలుపుకుంటారు. వారిని చూసి అసహ్యించుకోకూడదు. జాలి వడాలి. ఇంకా ఇటువంటి ఎన్ని జన్మలు, ఎన్ని బంధాలు పాందితే వారికి జ్ఞానోదయమౌతుందో?

కళ్లు తెరచి చూశాడు.

ఇంతవరకూ అసహ్యంగా కనిపించినవే ఇప్పుడు సహ్యంగా కనిపిస్తున్నాయి. తన చుట్టూ అధోపాతాళంలో పడి అదే సుఖమనుకుంటున్న మనుషులు కొన్ని తరాల తరువాత సీతాకోక చిలుకలుగా మారే గొంగళి పురుగుల్లా కనిపిస్తున్నారు. గొంగళి పురుగులోని ఏ అంశ సీతాకోక చిలుకగా మార్చు చెందుతుంది?

అక్కడ మృత'్రాయాల్లా పడిఉన్న వారి కళేబరాలను చూస్తుంటే అతని మనసులో జాలి ఉవ్వెత్తున పొంగివస్తోంది. ప్రతిమనిషిలో అట్టడుగునపడి అదృశ్యమై పోతూఉన్న దైవరూపం, మిణుకు మిణుకు మంటున్న జ్యోతిలా కనిపిస్తోంది.

(బ్రహోవే దమమృతం పురస్తాద్‌ బ్రహ్మ పశ్చాద్‌ బ్రహ్మ దకిణ తశ్చోత్తరేణ!

అథశ్చోర్వ్వం చ ప్రస్పతం బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం!

(నిజంగా ఇదంతా శాశ్వతమైన బ్రహ్మమే. క్రింద, మీద, ఈ పక్క ఆ పక్క ముందు, వెనుక సర్వత్రా ఆ బ్రహ్మం విరాజమానమై ఉంది. నిజంగా ఈ యావద్విశ్వమూ సర్వోతృష్టమైన ఆ బ్రహ్మమే).

విలా తెలుస్తుందీ సత్యం మనుషులకు? ఎలా తెలియచెప్పాలి? ఎలాచెప్తే అశాశ్వతాలే సర్వమని భ్రమసి అధోగతి పాలయ్యే ప్రజల భ్రమ తొలగి శాశ్వతాలైన సంస్కృతీ సంప్రదాయాల పాలనతో బ్రహ్మానందాన్ని పొదగలుగుతారు? మాడ పకల డన. కస్తూరి మురళీకృష్ణ ఉత

ప్రజలిలా పశువాంఛల సాధనే సర్వమని భావిస్తున్నారంటే దోషం ప్రజలకు తుచ్చ ఆదర్శం నిలిపిన పాలకులది. ప్రజలకు ఉత్తమాదర్శం ఇవ్వగలిగే సాపహితీకారులను ప్రోత్సహించని పాలకులదే దోషం.

ఏ రకంగా తానీ దోషాన్ని పరిహరించగలడు?

“యస్వ విజ్ఞానవాన్‌ భవత్య యుక్తేనే మనసా సదా।

తస్యేంద్రియాన్య వశ్యాని దుష్టాశ్వా ఇవ సారధేః।

(మనస్సును విచ్చిలవిడిగా వదిలేసి సరియైన జ్ఞానం లేకుండా ఎవరైనా ఎల్లప్పుడూ సంచరిస్తే అలాంటి వాని ఇంద్రియాలు దోషం ఉన్న గుర్రాలు సొరధి అదుపు తప్పిపో యినట్లే వశం తప్పిపోతాయి).

మనసులో అనుకుంటున్నట్టు పైకి అనేశాడు గోపాలవర్మ.

గదిలో అడుగుపెట్టబోతున్న రాణి సుగంధాదేవి పాదం అలాగే గాలిలోనే ఉండిపోయింది నేలను తాకలేదు.

గోపాలవర్శ్మ మాటలకర్ధం ఆమెకు తెలుసు.

ఇంతలో ఆమె అలికిడి విని గోపాలవర్మ తిరిగి చూశాడు. వెంటనే లేచి ఆమెకు నమస్కారం చేశాడు.

సుగంధాదేవి తత్తరపడింది.

ప్రభాకర వర్మ పరిశ్వంగపు దుర్గంధం ఆమె శరీరాన్నింకా వీడలేదు. తన స్పర్శతో గోపాలవర్మ అపవిత్రమౌతాడేమోనన్న భావన ఆమెలో కలిగింది. అంతలోనే 'స్పర్శ మాత్రంతోనే అపవిత్రమౌతారా? అన్న (ప్రభాకరుడి మాటలు గుర్తుకువచ్చాయి.

సుగంధాదేవి గోపాలవర్మ ముందు మౌనంగా కూచుంది. ఏదో తెలియని దోష భావన ఆమెని తల ఎత్తనివ్వటం లేదు.

అమ్మా! నీకన్నీ తెలుసు. నీకు నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు” అన్నాడు గోపాలవర్శ్మ

“ఏఏ విషయం?” అడిగింది సుగంధాదేవి.

“అమ్మా, నీ వ్యక్తిగత విషయాలపై నేను వ్యాఖ్యానించను. కానీ ప్రజలకు ఆదర్శం పాలకులు. ఒక రకంగా వారి బాగోగులు పాలకుల బాధ్యత. అటువంటి పాలకుల వ్యక్తిగత విషయాలు రాజ్యానికి సంబంధించిన విషయాలపై ప్రభావం చూపించకూడదు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వ్యక్తిగతంగానే ఉండాలి. పాలన ధర్మానికి సంబంధించిన విషయం' అన్నాడు.

సుగంధాదేవి నవ్వింది 'ఏ విషయం?” మళ్లీ అడిగింది. హాజజా కలట్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 223తత2323232322222డ22ండడ 11క3 క

“ప్రభాకరుడికి నీవు సర్వాధికారాలిచ్చావు. (ప్రభాకరుడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. తానే కళ్ళ్మీరానికి రాజయినట్టు ప్రవర్తిస్తున్నాడు. కోశాగారాన్ని స్వంత ఆస్తిగా వాడుకుంటున్నాడు. నేను నిన్న హరాత్తుగా రాజకోశాన్ని పరీక్షించాను. ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు. ఇదంతా అటుంచు. ధనం తరిగిపోతే మళ్లీ సంపాయించవచ్చు. కానీ ప్రభాకరుని లోకుల ధనమానా పహరణతో చెడ్డ పేరు రాజుగా నాకొస్తోంది. కళ్ళ్శీరానికీ వస్తోంది. ప్రభాకరుని అదుపులో పెట్టాలనుకుంటున్నాను. ముందుగా ఈ విషయం నీకు తెలిపినీ అనుమతి తీసుకోవటం కోసం వచ్చాను” అన్నాడు గోపాలవర్మ స్థిరంగా.

“ప్రభాకరుడు కోశాగారంలోని ధనమంతా ఏం చేశాడు?” ప్రశ్నించింది సుగంధాదేవి.

“అంతా శ్యాహిరాజుతో జరిగిన యుద్దంలో ఖర్చు చేశానని చెప్తున్నాడు. కానీ ఆ ధనాన్ని తన విలాసాలకు, వినోదాలకు వెచ్చించాడు. తన మత (ప్రచారానికి వినియోగించాడు చెప్పాడు గోపాలవర్శ,

“ఇంతకీ ప్రభాకరుని మీద నీ అభియోగం ఏమిటి? కశ్మీర ధనాన్ని పరమత ప్రచారానికి విసృతంగా వాడాడనా? ప్రజలను దోచుకుంటున్నాడనా?” అడిగింది సుగంధాదేవి.

“ఇవేవీ కావు. రాజద్రోహ నేరం” అన్నాడు గోపాలవర్మ

“రాజద్రోహమా?

“అవును. సుఖరాజుతో కలసి ప్రభాకరుడు కుట్ర పన్నుతున్నాడు. తమరితో ప్రభాకరుని సాన్నిహిత్యం ఆ కుట్రలో ఒక భాగం అన్నాడు గోపాలవర్మ.

సుగంధాదేవి పెద్దగా నవ్వింది.

“గోపాలా! నీ పసితనం తెలుస్తోంది. ప్రభాకరునికి నాపై ప్రేమ. వారి సిద్దాంతాల (ప్రకారం (స్త్రీ పురుషులు సుఖాన్ని పొందటంతో సమానమైన స్వేచ్చ కలిగి ఉంటారు. అంతేకానీ రాజ్యాన్ని హరించాలనే ఆలోచన వారికే మాత్రం లేదు” అంది.

“అమ్మా అత్యంత విచక్షణా జ్ఞానం కలవారు కూడా కొన్ని విషయాల్లో అమాయకుల్లా ప్రవర్తిస్తారని నిన్ను చూస్తే తెలుస్తోంది. వారినీ, వారి సిద్ధాంతాలనూ నువ్వు వెనకేసుకు రావటం చాలా బాధాకరమైన విషయం” అన్నాడు గోపాలవర్మ

“ఏమిటి బాధాకరం? సనాతన ధర్మం స్త్రీకి విధించిన సంకెళ్లు తెంపుకోవటం బాధాకరమా? ఆవేశంగా అడిగింది సుగంధాదేవి.

'అమ్మా మన ధర్మంలో ప్రీకి ఉన్నంత గౌరవం, స్వేచ్చ మరెవ్వరికీ లేవు. ప్రీని గౌరవించలేని సమాజం భ్రష్టు పట్టిపోతుందని మన నమ్మకం. స్త్రీని గౌరవించలేని నరమహారాజు దుర్గతి నీకు తెలుసు కదా?” అన్నాడు గోపాలవర్శ్మ, వజ [తత దకకకనకకకననడడ2:2:2=20:2=ఊ22ఊఊఊఊఊఊఊ2== కస్తూరి మురళీకృష్ణ ===

పెద్దగా నవ్వింది సుగంధాదేవి “అవన్నీ కట్టుకధలు. మనిషిని మాయలో పడేసి పబ్బం గడుపుకుంటాయి. మీధర్మాలు' అంది.

“అమ్మా, వేదార్ధ వివేచనం కలగాలంటే సంప్రదాయాను సరణం, షడంగ శిక్షణ, మీమాంసా శాస్తాధ్యయనము తప్పనిసరి. ఉపనిషత్తులు విధి రూపమున, నిషేధరూపాన ధర్మాన్ని విధించి, అధర్మాన్ని నిషేధిస్తాయి. 'సత్యం వద ధర్మం చర అని చెప్తాయి కానీ వాని వలన కలిగే మేలు కీడులను వివరించవు.

పురాణాలు అలా కాదు. ధర్మాధర్మాచరణం వల్ల ఆయా వ్యక్తులు గతంలో పొందిన మేలు కీడులను ఉదాహరణగా చెప్తూ ధర్మం నందు ప్రవృత్తిని, అధర్మం నుండి నివృత్తిని సులభంగా కలిగిస్తాయి.

“పురాణం' అంటే 'పురాభవం' (పూర్వమునందు జరిగినది) అని పురా అవినవం (ఎప్పుడో జరిగినా ఇప్పటికీ కొత్తదే) అనీ పురా అంటే ముందు జరగబోయేదీ అనీ అర్ధాలు. పురాణాలు సృష్టికి పూర్వం స్థితి నుంచి జరిగిన చరిత్ర ద్వారా రాబోయే విషయాలను కూడా తెలుపుతాయి. అందుకే మన పురాణాలు మన ఇతిహాసాలు ఇతి-హ-ఆస అంటే 'ఇట్లు జరిగెను అంటూ ప్రాచీన కాలపు వృత్తాంతాలను బోధించేవి అని అర్ధం.

అవి కల్పితాలు కావు. అవి నిజాలు. పురాణాలు సమస్త వేదాంతాగమసారభూతాలు. అవి కట్టుకధలు కావు. మన పురాణాలు మానవ సమాజానికి మార్గదర్శకాలు.

అవిద్యాయామంతరే వర్రమానాః

స్వయంధీరాః పండితం మన్యమానాః।

జంఘన్య మానాః పరియంతి మూఢా

అంధేనైవ నీయమానా యాధాంధాః॥

(అజ్ఞానంలో ఉంటూ తామే ప్రజ్ఞాశీలురము, విదిత వేదన్యలము అని ఆత్మస్తుతి చేసుకునే మూర్చలు జరామరణ దుఃఖ పరంపరల చేత మళ్ళీ మళ్ళీ పీడింపబడుతూ (గ్రుడ్డివాని నేతృత్వంలో నడిచే గ్రుడ్డివాళ్ళలాగా జన్మజన్మలకూ తిరుగాడుతుంటారు)

అమ్మా, ప్రభాకరుడు బోధించిన స్వేచ్చ సూత్రాలు, స్త్రీ విమోచన సిద్ధాంతాలు సర్వం ఈ సంస్కృతి సంప్రదాయం పట్ల అవాగొహన లేక ద్వేష భావన వల్ల జనించినవి,

సమాజాన్ని నంన్మరించాలన్నా నమాజం అవలంబించవలనిన సూత్రాలను నిర్దేశించాలన్నా వ్యక్తికి కనీస అర్హత ఉండాలి. ఆ వ్యక్తి మహర్షి అయి ఉండాలి. అలా కాకుండా కేవలం తమ స్వార్ధం కోర, తాత్కాలిక లాభాలు కోరి ఏవో కొన్ని సిద్ధాంతాలేర్పరచి అవే జగద్రక్షకాలని విర్రవీగే వాళ్ళు, వాళ్ళని అనుసరించేవారూ గుడ్డివాడు త్రోవ చూపిస్తుంటే అనుసరించే గుడ్దివాళ్ళలాంటివారే. ఊఊ కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2=23డ2232323క222ఊజడ:2జడడ22222222222డఐ 1శర్‌ ===

అమ్మా, ప్రపంచంలో ఏ ధర్మం సృష్టి పూర్ణానుస్వారమని ప్రీపురుషులు చెరి అర్ధభాగాలనీ, వారిద్దరి సమాన కలయికే సృష్టి పూర్ణాకృతి అని నిర్దేశించినది?

(ప్రపంచంలో ఏ ధర్మం స్త్రీ, పురుషులు వాక్కు నుండి అర్ధం విడదదీయరానట్టు కలిసి ఉండాలని, అదే అర్ధనారీశ్వర తత్వం అని స్పష్టంగా నిర్దేశించినది?

ప్రపంచంలో ఏ ధర్మంలో తాను చేసుకోబోయేవాడు సంవత్సరంలో మరణిస్తాడని, తెలిసి పెళ్ళి చేసుకోవడమే కాక, యమునితో పోరాడి అతనికి ఆయువిప్పిచ్చిన సావిత్రితో, సరితూగ కల స్రీ ఉంది? భారతీయ ధర్మంలో ప్రీ అబల అని నిరూపిస్తుంది సావిత్రి.

వైవాహికవ్యవస్థ స్రీ గౌరవాన్ని ఇనుమడింపచేసే వ్యవస్థ, ప్రీని బంధాల్లో అణగద్రొక్మేది కాదు. మీరు కేవలం ఊహామాత్ర బంధనాలను దర్శించి, అవే నిజమని భమపడుతున్నారు. గాలిలో శతృవులను ఊహించి ఆశతృవుతో కత్తి యుద్ధంచేస్తూ తన తలతానే నరికేసు కొనేటటువంటి వారిలాంటి వారీ 'స్తీస్వేచ్చా వాదులు.

ఈ వాదనలో స్ర్తీకి గౌరవం లేదు, విలువ లేదు. ఏ విలువ ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్తేకి లభించిందో, ఆ విలువ నేడు కళ్ళీరంలో ఊహా బంధనాలు తెంచుకోవాలని పోరాడుతున్న స్త్రీకి లేదు. స్రీ పందిరి వంటిది అనటం ఒక ఉపమానం మాత్రమే. స్రీ శక్తి అనటం నిజం, అది సత్యం.

ఇక సుఖం విషయం అంటావా, సుఖం వేరు సుఖానుభూతి వేరు, లౌకికములైన సుఖసాధనాలు వేరు. ఇంద్రియముల ద్వారా ముఖ్యంగా త్వగింద్రియము, జిహ్వేంద్రియం ద్వారా లభించే సుఖాలన్నీ పాశవిక సుఖాలే.

స్త్రీ గత వాంఛ సర్వమానవుల కుంటుంది. అందుకే మన మహర్షులు ఈ సహజ లక్షణాన్ని ఒక మహావృక్షంగా పెంపొందిచారు. ముందు కామ స్వరూపాన్ని నిర్ధారించారు.

ఆత్మ పదార్థమైన చైతన్యంలోని ఒక కదలిక కామం. అది స్రీ సన్నికర్షచేత కామమవుతుంది. విరోధి సన్నికర్ష చేత రౌద్రమవుతుంది. అన్ని భావాలూ ఈ కదలిక విభిన్న స్వరూపాలే. వీటికి మూలవస్తువొకటే, మూల చైతన్యం ఒకటే.

ఇది అర్ధం చేసుకుంటే కామమే సర్వమనీ, కామ భావ సాధనే జీవిత పరమావధి అని భావించే వారి ఆలోచనలలో అల్బత్వం అర్ధమవుతుంది.

అమ్మా, ఇవన్నీ నీకు తెలియనివి కావు. కానీ నీ జ్ఞానాన్ని సౌఖ్య భావన కప్పేసింది. అమ్మా ఉత్తపు కావ్యాలు చదివిన నీవు ఇలాంటి గ్రంధాలకు ఆకర్షితురాలవటం కాల మహిమ తప్ప మరొకటి కాదు.

అమ్మా సుఖం మనిషిని స్వర్ధానికి చేర్చాలి. అంటే సుఖం వల్ల వ్యక్తిలోని చైతన్యం వికసించాలి. ఈ సుఖం వల్ల కలిగే ఆనందం వల్ల వ్యక్తి మనిషిగా ఎదగాలి. భగవంతుని స్వరూపం అవగాహనకు రావాలి. అదే నిజమైన ఆనంద9. మిగతా పశువుల ఆనందాలకూ, మనుషుల అనంద స్వరూపాలకీ తేడా ఇజే, అన్ని సుఖాలు, ఆనందాలు మనిషిని పశువుగానే 32 1ఢద్ర :=223ఊఊ4ఊ4ఊ4ఊ4ఊ4ఊ2222 కస్తూరి మురళీకృష్ణ ===

మిగులుస్తాయి. కానీ ఏ సుఖంలోని ఆనందం మనిషిలోని బెన్నత్యాన్ని వెలికి తెలుస్తోందో ఆ సుఖం కోసం మనిషీ వాంఛించాలి.

వినిశ్చేతుం శకోయన సుఖమితివా దుఃఖమితివా

ప్రమోహే నిద్రావా కాము విషవిసర్పః కిముమదః

తవ స్పర్శే మమమి పరి మూఢేం దద్రియ గణః

వికారశ్సై తన్యం భ్రమయతి చ సమ్మీల యతిచ

సీతను స్పృశించిన రాముని సౌఖ్యానందానుభవం ఇది. నీ పునఃపునః స్పర్శ చేత నేను పరిమూఢేంద్రియ గణునడవుతున్నాను. ఇది సుఖమా?, దుఃఖమా?, ఇది ప్రమోహమా?, నిద్రయా?, విష సర్బమా?, మదమా? చైతన్యమును భ్రమింపచేస్తోంది కానీ ఈ వికారము చైతన్యమును వికసింప చేస్తోంది కూడా.

ఏదీ మీ సిద్దాంతంలో, మీ సాహిత్యంలో ప్రీ పురుషులిరువురికీ స్పర్శాజనితమైన వికారం వల్ల చైతన్యం వికసిస్తోందా? శుద్ధ చైతన్యం పశువాంఛ చేత మలినమై పశు భావోద్దీపన చేస్తోందా?

అమ్మా ఉత్తమ సాహిత్యం వ్యక్తికి ఉన్నతానుభవాలను పరిచయం చేస్తోంది. అ ఉన్నతానుభవాల సాధస ద్వారా వ్యక్తి ఉన్నతుడవుతాదు. ఉన్నతుడు కాడు ఉన్నతానుభవాల పరిచయం చేస్తోంది అటువంటి ఉత్తమ వ్యక్తుల ద్వారా సమాజం ఉన్నతమౌతుంది. ధర్మం నిలుస్తుంది.

సాహిత్యం ఇంద్రియాల ద్వారా మనస్సుకు రెక్కలిచ్చి చైతన్యపు పొలిమేరల వరకు మనిషిని తీసుకువెళ్ళి పరమానందానుభవం ఇస్తుంది. దాన్ని పశుభావనల ప్రచారానికి వాడటం అజ్ఞానానికి నిదర్శనం.

అమ్మా నీవు నమ్ముతున్న సిద్దాంతాలన్నీ సముద్రపు ఉపరితలాన్ని మాత్రం చూసి భ్రమపడి ఏర్పరచినవే. సముద్రపు లోతు వీరికి తెలియదు. ఆ లోతుకు వెళ్ళాలంటే సాధన కావాలి,

జీవితమంతా ఒక సాధన. నిగ్రహం సాధనవల్ల సాధ్యమవుతుంది. సిద్దాంతాలవల్లకాదు. నిగ్రహాన్ని సడలించటంలో స్పర్శ ప్రముఖపాత్ర వహిస్తుంది. అందుకే మన ధర్మంలో స్పర్మకంత ప్రాముఖ్యం ఈ స్పర్శను జయించాలనంటే వ్యక్తి గౌతమబుద్దుడయినా కావాలి, శంకరాచార్యుడయినా కావాలి.

అమ్మా రేపు ఉదయం లోగా (ప్రభాకరుడు నాకు లొంగిపోవాలి. లేకపోతే అతడిని పట్టి బంధిస్తాను. ప్రభాకరుడు నీ అంతర్మందిరం నుంచి మన మాటలు వింటున్నాదని నాకు తెలుసు. నీ మీద గౌరవంతో ముందుగా హెచ్చరిస్తున్నాను. సుఖవర్మ బందీ అయ్యాడు. ప్రభాకరుడి అసలు స్వరూపం తెలిసింది. == కట్టణ కశ్మీర రాజతరంగిణి కధలు 23౭౭322222 [త్త తజ

నిజంగా మీరే తప్పు చేయకపోతే, మీ మనస్సులలో దోషభావన లేకపోతే ప్రభాకరుడిలా దాక్కునే వాడు కాదు. నువ్విలా తలవంచుకుని నా మాటలు వినే దానివి కాదు.

ఆత్మానం రథానం విద్ది శరీరం రథమేవతు।

బుద్దింతు సారధిం విద్దిమనః ప్రగ్నహేమేవచ!

(ఆత్మ రథారూఢధుడైన యజమాని అని తెలుసుకో. అలాగే శరీరం రధమూ, బుద్దియే సారధీ మనస్సే కళ్ళమూ అని గ్రహించు).

అమ్మా కళ్లెం వదిలేస్తావో, కళ్ళెంపై పట్టుబిగిస్తావో నీఇష్టం “ఉత్తిష్టకజా(గ్రత ప్రాప్యవరాన్‌ నిబోధత' (లేవండి, మేలుకోండి డ్రేష్టమైన ధర్మాన్ని ఆశ్రయించి ఆత్మను సాక్షాత్కరించుకోండి) అని నమస్కరించి వెళ్ళిపోయాడు గోపాలవర్మ

రాణి సుగంధాదేవి అలాగే కూర్చుండి పోయింది. ఆమె చెవుల్లో ఉత్తిష్టత జాగ్రత్త, 'ప్రాష్యవరాన్‌ నిబోధత అన్న గోపాలవర్మ స్వరమే ప్రతిధ్వనిస్తోంది. ఆ శబ్దాల ప్రకంపనల వల్ల ఆమెలో నిద్రిస్తున్న సంస్మారమేదో జాగృతమయింది.

సుగంధాదేవి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

తన జీవితంలోని ఒక బలహీనమైన క్షణాన్ని తలుచుకొని కుములుతోంది ఆమె మనసు. ఒక్క క్షణం ఆమె సర్వజ్ఞానాన్ని, వివేచనను కప్పేసింది. తననొక తనకే పరిచయం లేని కొత్త మనిషిగా కాదు, వింత పశువుగా మార్చేసింది.

కాలాన్నె వెనక్కు తిప్పగలిగితే...?

తన జీవితం లోంచి ఆ ఒక్క క్షణం ఠొలగించగలిగితే....?

భవిష్యత్తులో తరాలవారు తన చరిత్ర తెసులుకుని తన గురించి ఏమనుకుంటారు? ఒక పురుషుడి మాయామాటలకు లొంగి స్రీ గౌరవానికి కళంకం తెచ్చాననుకుంటారా? సుగంధాదేవికి, భూమి చీలి తను భూ గర్భానికి వెళ్ళిపోతే ఎంత బాగుండునో అనుకుంది. కానీ తాను సీత కాదు కదా!

'సీత' పేరు వినగానే సుగంధాదేవి మది కుంచించుకుపోయింది.

తెలిసీకెలియని అజ్ఞానంతో సాంప్రదాయాన్ని ధిక్కరించటమే పురోభివృద్ది పధమని అనుకుని, లేని సంకెళ్ళని ఊహించుకుని సంప్రదాయాన్ని పాటించక పోవటమే, మ్లేచ్చ సంప్రదాయ అనుకరణే ఆ ఊహా సంకెళ్ళను ఛేదించటం అనుకుని ఎంత పొరపడింది తను? లైంగిక స్వేచ్చే సర్వమనుకుని ఎంత తప్పుచేసింది తను? లైంగిక స్వేచ్చ వల్ల గౌరవం కోల్పోయేది ప్రీ. భ్రష్పపట్టేది సమాజం. లాభపడేది పురుషుడు, బాధగా కళ్లు మూసుకుంది సుగంధాదేవి.

“ఉత్తిష్టక జాగ్రత్త ప్రాప్యవరాన్‌ నిబోధత'*

ఒక్క ఉదటున లేచింది సుగంధాదేవి. చైవ కేద్ర 2232323262 కస్తూరి మురళీకృష్ణ =2జ2జ=

వడివడిగా పదక గదిలోకి వెళ్ళింది. గది ఖాళీగా ఉంది!

అక్కడ ప్రభాకరుడు లేడు. రహస్య మార్గం గుండా పారిపోయాడు. గోపాలవర్మ మాటలలోని సత్యాన్ని ప్రభాకరుడి పరారీ స్పష్టం చేస్తోంది!

ఎంత తప్పు చేసింది తను!

తన పాపానికి నిషతి ఏది?

చేతుల్లో ముఖం దాచుకుని నేల మీద పడిపోయింది సుగంధాదేవి.

శా ఆ

“గోప్రాలవర్మ దాహరోగ పీడితుడయ్యాడు. తనకు రాజదండన తప్పదని తెలిసిన ప్రభాకరుడు 'ఖాఖోదం' పారిపోయి, తన బంధువు రామదేవుడి చేత రాజుపై అభిచార క్రియ జరిపించాడు.

ఈ వార్త కళ్ళ్మీరమంతా దావానంలా పాకిపోయింది. ప్రజలు రాత్రింబవళ్ళు రాజభవనం ముందే రాజు ఆరోగ్య విషయ వార్త కోసం కాచుకుని కూచున్నారు. దాహరోగ పీడితుడైన గోపాలవర్శ్మకు విషాదమూర్తియై రాత్రింబవళ్ళు సేవ చేస్తోంది సుగంధాదేవి.

ఆమెకు తన పాపాలు ఈ రూపంలో తన సంతానాన్ని బాధిస్తున్నాయని తోస్తోంది. తనని తాను నిందించుకుంటోంది. దైవాన్ని ్రార్ధిస్తుంది. ఆమె బాధకు కరగని రాయి లేదు, చెమరించని కన్ను లేదు.

గోపాలవర్మ కోరికపై సుగంధాదేవి అతడికి 'భగవద్గీత చదివి వినిపిస్తోంది. అతడికి బాధకు గీత ఉపశమనాన్నిస్తోంది.

ఆ రోజు సుగంధాదేవి ఐదవ అధ్యాయం చదువుతోంది.

యేహి సంస్పర్శజా భోగా, దుఖయో వయ వవతే

అ్యన్తవన్తః కౌన్తెయ! నలేషు రమతేబుదః

(అర్జునా! ఇంద్రియములకు విషయవస్తు సంయోగము వలన కలుగు బాహ్య సుఖములు క్షణికములు. వాటి తుది పరిణామము దుఃఖమయము, కావున బుద్దిమంతులు వాటియం దానందించరు)

అది చదివి నీళ్ళు నిండిన కళ్ళతో సుగంధాదేవి గోపాలవర్శ్మవైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఒకరి కళ్ళల్లో పశ్చాత్తాపం మరొకరి కళ్ళలో దైవత్వ భావం. మరు నిముషం గోపాలవర్మ కళ్ళు నిర్ణీవాలయ్యాయి. అతని ప్రాణం పంచభూతాల్లో కలసి పోయింది.

సుగంధాదేవి నిశ్చేష్టురాలై గోపాలవర్మ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది.

న 22== కల్టణ కశ్మీర రాజతరంగిణీ కథలు 3ైైతతతడతతడతడతతతతడడతతతతతతతడ2ఊఊడఊఊఊడఊఊ2 కేశీరి =

రాజ్య భారం సుగంధాదేవి భుజస్మంధాలపై పడింది. శోకాన్ని దిగమింగుకుని సుగంధాదేవి తన కర్తవ్య నిర్వహణ ఆరంభించింది. ముందుగా గోపాలవర్మ సోదరుడు సంకట వర్మను వెతికి పట్టుకుని రమ్మని చారులను పంపించింది. పెద్ద సైన్యం తీసుకుని 'ఖాభోదం' పైకి దండయాత్ర చేసింది. రాజ సైన్యం వస్తోందని తెలియగానే రామదేవుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రభాకరుడు తన తనయుడిని, భార్యను పొరుగు రాజ్యాలకు పంపి తాను మాత్రం కళ్ళీర సైన్యంతో యుద్దానికి సిద్దమయ్యాడు. కదన భూమిలో సుగంధాదేవి, ప్రభాకరదేవుడు ఒకరికొకరు ఎదురు పడ్డారు. వారిద్దరి కత్తులు ఢీ కొన్నాయి. ఒకరి కత్తి సనాతన ధర్మ శక్తి, మరొకరి కత్తి మ్లేచ్చ ధర్మ కుయుక్తి. సుగంధాదేవి సునాయాసంగా ప్రభాకర వర్మ కత్తిని ఛేదించి, అతని శిరస్సును ఖండించింది. దాంతో కళ్ళీర చరిత్రలో, ముఖ్యంగా సుగంధాదేవి జీవితంలోని ఒక కళంకం పశ్చాత్తాప అశృ్ళవుల ద్వారా ప్రక్షాళనమైంది. వీధిలో పోతున్న సంకటవర్మను కశ్మీర రాజుగా గద్దెపై కూర్చోబెట్టింది సుగంధాదేవి. కానీ పదిరోజులు మాత్రమే రాజ్యపాలన చేసి సంకటవర్మ మరణించాడు. గర్భస్థితి అయిఉన్న గోపాలవర్మ భార్య ప్రసవించింది. కానీ ప్రవాసానంతరం ఆసంతతి మరణించింది. తన దుశ్చర్యలు తనవంశాన్ని పట్టి పీడిస్తున్నాయన్న భావన సుగంధాదేవి పశ్చాత్తాపాన్ని మరింత తీవ్రతరం చేసింది. జనుల ్రార్ధననుసరించి క్రీ.శ 904వ సంవత్సరంలో రాజ కార్యనిర్వహణ బాధ్యతను స్వీకరించింది. భారతీయ ధర్మంలో అబలలా కనిపించే స్త్రీ అవసరమైకే కత్తిపట్టి కదనరంగంలో దూకగలదని, ధర్మదండం పట్టి రాజ్యపాలన చేయగల సబల అని నిరూపిస్తుంది ఆమె. సుగంధాదేవి ధర్మ సంస్థాపనపై దృష్టి కలదై విశేషధనం వ్యయం చేసి గోపాలపుర, గోపాల మర, గోపాల కేశవాలయాలను కట్టించింది. స్వనామాంకితంగా సుగంధాపురాన్ని నిర్మించింది. పండితులను విశేషంగా ఆదరించింది. ఉత్తమ సాహిత్య సృష్టికి ఉన్నత భావ ప్రచారానికి విశేషంగా తోద్బడింది. భారతీయ ధర్మంలో స్రీ స్వేచ్చ, సమానతలకు, ప్రీకున్న గౌరవానికి, స్త్రీ బెన్నత్యానికి నిదర్శనంగా రెండేళ్ళ ధర్మబద్దపాలన తరువాత సుగంధాదేవి దశవర్వప్రాయుదైన, నిర్ణితవర్మ కుమారుడు పార్యుని కళ్ళ్శ్మీర రాజ సింహాననంపై కూర్చుండబెట్టింది. రాజు బలహీనతలను వ్యక్తులు ఆసరాగా తీసుకుని ప్రజలను పీడించకుండా తంత్రుల, పదాతుల ఏకీకరణ సమితి ఒకటి ఏర్పరచింది. వారి సహాయంతో సుగంధాదేవి రాజ్యం చేసింది. వారి సలహాతోనే పార్భునికి రాజ్యం అప్పజెప్పి, పాలన బాధ్యత ఏకీకరణ సమితి చేతిలో ఉంచి క్రీ. శ 904వ సంవత్సరంలో, ప్రభాకరుడి వంచనకు గురై చేసిన దుశ్చర్యల ప్రాయళ్చితార్ధం పుష్ముపురంలోని కేశవాలయానికి తపస్సు చేసేందుకు వెళ్ళిపోయింది. ఆమెకు వీడ్మోలు చెప్తున్న ప్రజల అ(శ్రుబిందువులు ముత్యాల హారాల్లా భాసిల్లాయి. న 22322 100 23332 కస్తూరి మురళీకృష్ణ ===

క | కశ్మీర రాణి డెద్దాదేవి

'రాజ్జీ చాలకులందరూ తమరి రాక కోసం ఎదురుచూస్తున్నారు' వినయంగా చెప్పిందొక పరిచారిక.

మూతపడుతున్న కళ్లు బలవంతాన తెరిచింది డిద్దారాణి. ఆమెకేమీ అద్ధం కాలేదు. పరిచారిక మళ్ళీ చెప్పింది.

రాణి అతికష్టం మీద కళ్ళు తెరిచి పరిచారిక వైపు చూసింది.

'నరవాహన మంత్రి భోజనం చేశారా? అయితే నేనూ భోజనం చేస్తాను అస్పష్టంగా తనలో తాను గొణుక్కుంటున్నట్టు అంది రాణి.

పరిచారికలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

“మహారాణీ కశ్మీర యువరాజును అంటే భావి కశ్మీర సామ్రాజ్యాధిపతిని ఎన్నుకొనేందుకు తమరు తమరి సోదరుల తనయులను రమ్మన్నారు. అందరూ వచ్చారు" గట్టిగా చెప్పింది పరిచారిక. === కల్టణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :33ైడ2డతైత2త233డడడడనతడతడత2డ222ద2ఊఊ2ఊ22 1క్‌ 1 323232

“రాణి డిద్దాదేవి ఉలిక్కిపడింది. “ఫల్గుణుడు వచ్చాడా? డామరుల నుంచి నన్ను రక్షించేందుకు ఫల్గుణుడు వచ్చాడా? శస్రసన్యాసం చేసిన ఫల్లుణుడు మళ్ళీ అస్త్ర స్వీకారం చేస్తున్నాడా?” ఉత్సాహంగా లేచింది డిద్దాదేవి.

పరిచారికలు ఒక్క అడుగు వెనక్కు వేశారు.

అంతలో రాణికి స్పృహ వచ్చింది. తానెక్కడుందో అర్ధమయింది.

గతం తనను వీడటం లేదు. గతానికి వర్తమానానికి మధ్య ఎల్లలు చెరిగిపోతున్నాయి. ఒకటా, రెండా, యాఖై ఒక్క ఏళ్ళుగా కశ్మీర రాజకీయాలను, కుట్రలను, కుతంత్రాలను నడిపిస్తోంది తను. “తన మనస్సుని అదుపులో పెట్టుకోవాలి” అనుకుంది డిద్దాదేవి.

పరిచారికలు మళ్ళీ చెప్పారు.

'నేను వస్తున్నాను. నాలుగయిదు బుట్టల రేగుపళ్ళను తెచ్చి పెట్టండి" ఆజ్ఞాపించింది రాణి. ఇప్పుడామెలో క్షణం క్రితం ఉన్న అయోమయం, నిస్సహాయత్వం లేవు అధికారం స్పష్టంగా ధ్వనించింది ఆమె స్వరంలో.

పరిచారికల వెనకే వెళ్తూ డిద్దాదేవి తన ప్రతిమను అద్దంలో చూసుకుంది

రాణి ఒక కాలు సరిగ్గా లేదు. ఆవిడ నడవలేదు. “వల్లా ఆవిడను మోసుకు వెళ్ళేది. ఇప్పుడామె వయసు ఉడిగిపోయింది. చిన్న చిన్న దూరాలు కట్టె సహాయంతో నడవటం నేర్చుకుంది రాణి.

అద్దంలో తన ్రతిబింబం చూసి ఆగిపోయింది డిద్దారాణి.

ముడతలు పడ్డ శరీరం, తెల్లబడ్డ జుట్టు, లోతుకు పోయిన దవడలు, ఒక్క క్షణం అద్దంలో కనబడేది తనేనా అనుకుంది.

తనని చూసి, తన అందానికి దాసులు కానివారెవ్వరు? తన అధికారానికి తలవంచని వారెవ్వరు? తన ఈ అందానికేనా అందరూ దాసోహం అన్నది? ఆ అందం యొక్క అంతిమ రూపం ఇదేనా?

నవ్వుకుంది డిద్దారాణి. ఆ నవ్వులో ఆనందం లేదు. విషాదం ఉంది. యాఖై ఏళ్ళుగా కళ్ళీరంపై అధికారం చలాయిస్తోంది. తన అధికారాన్ని నిలుపుకొనేందుకు కుట్రలు కుతంత్రాలు చేసింది. తన స్వంత సంతానాన్ని మనమళ్ళను హత్యలు చేయించింది. తనకు అండగా నిలబడ్డవారి మరణానికి కారకురాలయింది.

దీపం పురుగులు దీపం వైపు ఆకర్షింపబడ్డట్టు ఎందరో వీరులు తన వైపు ఆకర్షింపబడి తన సౌందర్యజ్వాలల్లో మాడిపోయారు. మహె=ఊ 1652 కతత కస్తూరి మురళీకృష్ణ డడ

ఇప్పుడు తనకెంత అధికారం ఉందంటే తనెవరి వైపు వేలు చూపితే వాడు కళ్ళీరాధిపతి అవుతాడు తనెవరి వైపు తిరస్మ్కారంగా చూస్తే వాడు భస్మమై బూడిద అయిపోతాడు. సర్వ కళ్మీరం తన కనుసన్నలలో నడుస్తోంది. కానీ తానేం సాధించినట్టు?

అద్దంలో తన గురువు, పొతైషి, ప్రియుడు భుయ్యుడు ప్రత్యక్షమై తనని చూసి నవ్వుతున్నట్టు తోచింది డిద్దారాణికి.

కుకర్మీ కుసంగీ కుబుద్దిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః

కుహష్టిః కువాక్య (ప్రబద్దః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేవా భవాని॥

భుయ్యుడి కంఠం గంభీరంగా ఆమె చెవుల్లో ప్రతిధ్వనించింది.

ఆమె కళ్ళల్లో నీళ్లుబికాయి.

నిజం తను చేయని కుకర్మ లేదు. తాను కుబుద్ది. భుయ్యుడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ విషం తాగుతున్నాడు. అతని పెదవులపై చిరునవ్వు ఉంది. భుయ్యుడు తనని ద్వేషించటం లేదు, దూషించటం లేదు. తన వైపు ఢ్రేమగా చూస్తున్నాడు.

రాణి కళ్ళ నుంచి నీళ్ళు కారసాగాయి. నిజానికి తొను కళ్ళీర సామ్రాజ్షి అయినా అందరూ తన నుంచి ఏదో ఆశించి తనను వెన్నంటి ఉన్నవారే కానీ తన కోసం తనవారంటూ ఎవ్వరూ లేరు. నిజంగా తనని (ప్రేమించింది భుయ్యుడు. నిస్వార్థంగా తనని వెన్నంటి ఉన్నది నరవాహనుడు.

నరవాహనుడి మరణానికి తానే కారకురాలు.

ఏం సాధించింది తను, తనవారిని దూరం చేసుకుని?

నెమ్మదిగా అడుగులో అడుగువేస్తూ సభలో అడుగుపెట్టింది డిద్ధారాణి.

సభలో అమె తమ్మూళ్ళూ, వారి పిల్లలు ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. ఆమెను చుట్టుముట్టారు ఆతృతగా. ఇంతమంది ఉన్నా తొను ఒంటరే!

ఎందుకు వీరికీ ఆతృత? వీళ్ళెదురు చూస్తున్నది తన మీద (ప్రేమతో కాదు, తాను ఇవ్వబోయే సింహాసనం కోసం ఎదురుచూస్తున్నారు వీరంతా. ఆ సింహాసనం నిలుపుకొనేందుకు తానెంత కష్టపడింది? ఇంత కష్టపడింది ఈనాడు వీరికి అప్పగించేందుకేనా? ఇక్కడ ఏదీ ఎవరికీ శాశ్వతం కాదా? తనదేననుకున్న తాను ఎంత మూర్చురాలు?

రాణి సింహాసనంపై కూర్చుంది అందరూ కూర్చున్నారు.

సేవకులు రేగుపళ్ళ బుట్టలు పట్టుకొచ్చారు === కల్చణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2222323232323023232ఊ2ఊ2ఊ2ఊ2 గక్‌3 ==

“మందిరంలో రేగుపళ్ళు విరజిమ్మండి. ఎవరు ఎక్కువ ఏరుకుని వస్తే వారే యువరాజు ఆజ్ఞాపించింది రాణి. అందరి కళ్ళల్లో ఆశ. సేవకులు రేగుషళ్ళను విరజిమ్మారు. వెంటనే అందరరూ వేగువళ్ళ వేటలో వడ్డారు. వళ్ళకోసం వాళ్ళలో వారు పోరాడుకోసాగారు, తన్నుకోసాగారు. వారి దేహాలు రక్తసిక్తమవసాగాయి. అరుపులు కేకలతో రాజమందిరం దద్దరిల్లుతోంది. ఎందుకోసం ఇదంతా? రాజు అవటం కోసం. రాజు అయి ఏం సాధిస్తారు? రాజు అయ్యేంత వరకూ అధికారం కోసం ఆతృత. సింహాసనం అధిష్టించినప్పటి చీ తనపై ఎవరే కుట్రలు పన్నుక్రున్నారో అన్న ఆందోళన ప్రతివారూ అనుమానితులే. తల్లీ లేదు, తండ్రి లేడు, భర్త లేడు, పిల్లలు లేరు. అందరూ అధికారం విషయంలో అనుమానించదగ్గవారే, అధికారం వచ్చినప్పటి నుంచి నిలుపుకోవాలన్న ఆందోళన. కానీ ఎవరూ శాశ్వతంకాదు. మళ్ళీ అధికారం కోసం పోరాటం. మళ్ళీ రాజ్యాధికారం మళ్ళీ అనుమానం, ఆరాటం... పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జరరేశయనమ్‌। ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే భజగోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలె నహినహి రక్షతి డుకృఇ కరణే! భుయ్యుడి స్వరం ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూంటే డిద్దారాణి గతంలోకి జారుకుంది. శయం 2 డిద్దాదేవి లోవోర మవోరాజు సింహరాజు వుత్రిక. తన మామగారైన ఉద్దాండపురాధీశుడు భీమషాహి సలహా ప్రకారం సింహరాజు డిద్దాదేవిని కళ్ళ్మీరాధీశుడు క్షేమగుప్తుడికిచ్చి వివాహం జరిపించాడు. వివాహానంతరం కశ్మీర రాజధాని చేరేలోగా డిద్దాదేని పరిచారికల ద్వారా క్షేమగుప్తుడి గురించి అనేక చేదు నిజాలు తెలుసుకుంది. క్షేమగుప్తుడు కళ్ళీర రాజు సర్వగుప్తుడి తనయుడు. లౌకికాబ్బము 4026 (క్రీ.శ. 950) ఆషాడ శుక్ల త్రయోదశినాడు సర్వగుప్తడు మరణించటంతో క్షేమగుప్తుడు కళ్ళీర రాజయ్యాడు. క్షేమగుప్తుడు ద్యూత. మద్యపాన, స్రీ లోలుడు. అతడిని ఆశ్రయించిన అనేక ధూర్తజనులు. అతడిని తప్పుదారి పట్టిస్తున్నారు. వారి వల్లే రాజుకు అన్ని దుర్గుణాలు అలవడ్డాయి. ::=22 11స్‌కీ నడత. కస్తూరి మురళీకృష్ణ 222 డె

ముఖ్యంగా జిష్టుపుత్రులు రాజును తోలుబొమ్మనాడించినట్టు ఆడిస్తున్నారు. వారు రాజుకు 'కంకణ వర్ష అని బిరుదిచ్చి, కంకణాల వర్షం కురిపించు కుంటున్నారు. వారు ఎదుటివారిపై లేనిపోని నేరారోపణలు చేసి రాజు అభిమాన పాత్రులవుతున్నారు.

వారు రాజు ్రీలోలత్వాన్ని ఆయుధంలా వాడుకుంటున్నారు. రాజును తమ ఇళ్ళకు ఆహ్వానించి తమ భార్యల సౌందర్యాన్ని ప్రదర్శించి వారందించే ఆనందాలను అనుభవించమని వేడుకునేవారు. ఆ తరువాత ఎవరెవరెంతెంత ఆనందాన్ని అందిస్తే వారికంత పెద్ద బహుమానం ఇవ్వాలని రాజును పీడించేవారు. ఇటువంటి పరాన్న జీవుల వల్ల రాజు (భ్రష్టుడవుతున్నాడు, రాజ్యం ్రష్టమౌతుంది.

ఎదుటివారిపై ఆధారపడి (బ్రతకటం పరాన్నజీవి లక్షణం. తప్పు పరాన్నజీవిది కాదు. తప్పు తమపై ఆధారపడి బ్రతకనిచ్చే వారిది. పరాన్న జీవుల వల్ల వారికి, వారిని దగ్గర చేరనిచ్చిన పాలకునికి, వారున్న దేశానికి నిష్టుతి లేదు.

డిద్దాదేవి ఈ విషయాలన్నీ రాజధాని చేరేలోగా తెలుసుకుంది.

తన పల్లకి మోసే కుయ్యుడి కొడుకు భుయ్యుడు మహా పండితుడని తెలుసుకుంది. భుయ్యుడి అన్న సింధుడిని కోశాధికారిగా నియమింపజేసి భయ్యుడిని తన సమక్షాన పిలిపించుకుంది. ప్రధమ దర్శనంలోనే భుయ్యుడి మదిలో రాణి స్థిరనివాసం ఏర్పరచుకుంది.

భుయ్యుడికి తన పరిస్టితి వివరించి, తన కర్తవ్యం నిర్దేశించమంది.

భుయ్యుడు ఆలోచించాడు. 'మహారాణీ క్షేమగుప్తుడు పరాన్న జీవుల వశంలో ఉండటం దేశానికీ క్షేమం కాదు. కాబట్టి క్షేమగుప్తుడిని మీ వైవు ఆకర్షితుడిని చేసుకోవాలి. భర్తనాకర్షించేందుకు భార్య భర్ర అభీష్ట ప్రకారం వ్యవహరించటం నీతి విరుద్ధం కానంతవరకూ శాస్త్ర సమ్మతమే....” అన్నాదు.

“రాజ్యంలో వరాన్న జీవులు కాని ఉత్తమాధికారులెవరు?” రాణి భుయ్యుడిని ప్రశ్నించింది.

భుయ్యుడు వెంటనే 'నరవాహనుడు అన్నాడు. “నరవాహనుడు ఉత్తముడు. అతడి రాజభక్తి అపారము. అతనికి భారతీయ ధర్మం పట్ల ఉన్న విశ్వాసం రాజభక్తి రూపంలో ప్రతిఫలిస్తోంది. అతని బలం అతని ధర్మం.

ఇక యశస్మరుని అ(గ్ర ప్రధాని, శేముషీ ప్రతిభుడు భట్టు ఫల్గుణుడు. కానీ ఫల్గుణుడు రాజుభృత్యుడయింది కేవలం తన స్వార్ధం వల్ల, ఏనాటికయినా సింహాసనం సంపాయించాలన్న ఆశ ఉంది అతనికి చెప్పాడు భుయ్యుడు.

రాణి తల పంకించింది. నా! కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :222ఊ+ఒఉఊట 15న 3

క్షేమగుస్తుడికి రాజ్యపాలన బాధ్యతలు నిర్వహించటం పట్ల ఎటువంటి శ్రద్ధ లేదని డిద్దాదేవి గ్రహించింది. క్షేమగుప్తుడి ప్రీలోలత్వాన్ని తగ్గించాలంటే అతనికి వారందిన్తున్న ఆనందం కన్నా ఉత్తమమైన ఆనందం, ఉన్నతమైన అనుభవం అందించటమే మార్గం ఆని గ్రహించింది రాణి.

“ప్రీ లోలత్వం కేవలం క్షేమగుప్తుడి బలహీనతేకాదు. ప్రపంచంలోని పురుషులందరి ఐబలహీనతి చెప్పాడు భుయ్యుడు మాటల సందర్భంలో.

'మీ బలహీనత కూడానా? కొంటెగా అడిగింది రాణి భుయ్యుడిని ఓరగా చూస్తూ.

భుయ్యుడు కదలిపోయాడు. తనని తాను నియంత్రించుకుని చెప్పాడు. 'నియమం నాగరికత, ఊహలు ఆకాశానికి ఎగిరినా మనిషి కాళ్ళు భూమి మీదే ఉండాలి. మనసు ఎన్ని వెర్రివేషాలు వేసినా అది మన పట్టులోనే ఉండాలి. వాంఛ సహజం, వాంఛ వాద్దులు మీరకపోవటం మనిషిని పశువు నుంచి వేరుచేస్తుంది' అన్నాడు భుయ్యుడు.

నవ్వుకుంది రాణి.

ఆ రాత్రి క్షేమగుస్తడు డిద్దాదేవికి దాసుడయిపోయిడు.

తమ సమాగమ మందిర అలంకరణను రాణి స్వయంగా పర్యవేక్షించింది. జవ్వాది? పునుగు, కస్తూరి, అగురు, కందురుష్మము వంటి సుగంధ ద్రవ్యాల కలయికతో శోభనశాల పరిమళించింది. వినీల వర్ష పయోదర దర్శనంతోనే నెమలి కంరం నుండి వెలువడే నినాదాలతో గది ప్రతిధ్వనించింది. శోభన శాలకు కాస్త దూరంలో వైణికుడు వీణ వాయించే ఏర్పాటు చేసింది రాణి. వీణా నిస్వనాలు గాలి తరగలలో కలిగించిన స్పందనలతో గది ఒక రకమైన మత్తులో మునిగిపోయింది.

అటువంటి వాతావరణంలో డిద్దాదేవి జరీతోనేయబడి అంచులందు రత్నాలు కుట్టబడిం తళతళలాడుతున్న చీరను ధరించింది. ఆమె శరీరాన, నడుమున, పాదాలకు, కంఠాన ధరించిన భూషణాలు ప్రకృతికి పురుషుడు అమర్చిన ఆభరణాల్లా ఉన్నాయి. అవి ఆమె శరీర లావణ్యాన్ని! సౌందర్యాన్ని ప్రస్ఫుటింపచేస్తున్నాయి. ఆనాడు ఆమె సౌందర్యం మానవమాత్రుల ఊహికు అందనిది.

దేవతల మనసులనే చలింపచేసే ఆ మహాద్భుత, రమణీయ సౌందర్య జిలుగు వెలుగుల ముందు క్షేమగుప్పుడు నిలువలేకపోయాడు. ఇన్నాళ్లూ అతని ఆనందనుంతా నీచతొ పరిపూర్ణమైనదే. స్త్రీ పురుష సంగమం సున్నితమైనది, అద్భుతమైనది అన్న ఆలోచనే అతనికి లేదు. ఎంతసేపూ నీచ సంభాషణ, నీచ చర్యలు తప్పించి ప్రీ పురుషుల కలయికలో పురుషుడు తన సర్వాన్ని కోల్పోయి తన ఆత్మను పొందుతాడన్న నిజం ఆ రోజే అతని (గ్రహింపుకు వచ్చింది. === 150 కకకకడనకకనకకాననడాడనన==. కస్తూరి మురళీకృష్ణ ఊడ

డిద్దాదేవి చిరునవ్వు క్షేమ గుస్తుడికి పరాన్న జీవుల నుండి, వారి నీచపుటాలోచనల నుంచి విముక్తి నిచ్చింది.

ఆ రోజు డిద్దాదేవికి కూడా ఒక సత్యం తెలిసింది. ఆమెకు తనలో నిబిడీకృతమైన ఉన్న శక్తి తెలిసింది. పురుషులు మూర్చులు, ప్రపంచాన్ని జయించేందుకు వారు పశుబలాన్ని ప్రదర్శిస్తారు రక్తపాతానికి దిగుతారు. (ప్రాణాలు అర్పిస్తారు. వారింత కష్టపడి సాధించేది ఒక స్రీ తన కడగంటి చూపుతో, ఒక్క చిరునవ్వుతో సాధించగలుగుతుంది. డిద్దాదేవికి తన స్త్రీత్వంలో ఉన్న శక్తి అర్ధమయింది.

ప్రకృతికి పురుషుడు బానిస. ప్రకృతి ఏ రకంగా పురుషుడి కన్నా శక్తివంతమైనదో డిద్దాదేవికి అర్ధమయింది. తాత్కాలిక పశుబలంతో పురుషుడు (ప్రకృతిని లొంగదీసుకున్నట్టు కనిపించినా అది ప్రకృతి పురుషుడిపై చూసే జాలి, దయ వల్ల తప్ప తలుచుకుంటే ప్రకృతి పురుషుడిని నామరూపాల్లేకుండా చేయగలదని డిద్దారాణికి క్షేమగుప్తుడు నిర్వీర్యుడై, నిస్సత్తువతో అలసి జారిపోయిన క్షణాన అర్ధమయింది. ప్రకృతి మనోబలం ముందు పురుషుడి పశుబలం దిగదుడుపేనని గర్వంగా నవ్వుకుంది రాణీ డిద్దాదేవి.

అనాటి నుండి క్షేమగుప్తుడు డిద్దారాణి సేవకుడయ్యాడు. మందార మకరంద మాధుర్యాన్ని అనుభవించిన తేనెటీగ మదనముల వైపు దృష్టి సారించనట్టు డిద్దాదేవి దివ్య సంగమ సౌఖ్యాన్ని అనుభవించిన క్షేమగుప్తుడు నీచపుటానందాలను తిరస్కరించాడు. అతని సర్వ జగత్తు డిద్దమయమయింది. ఆమె కనురెప్పలెత్తితే అతనికి సూర్యోదయం, ఆమె కనురెప్పలు వాలితే అతనికి సూర్యాస్తమయం. ఆమె నీలికురులే మేఘమాలికలు, ఆమె లలాటమే అతని ఆకాశం. అందుకే ప్రజలతనిని డిద్దాక్షేముడు అని పిలవసాగారు.

ఆ రోజు నుంచి రాజ్యసర్వాధికారాలు డిద్దారాణి హస్తగతమయ్యాయి. కళ్ళ్మీర నాణేల ముద్రణలో రాజు పక్కనే రాణి బొమ్మ ముద్రించటం ఆరంభమయింది. అధికారం తన చేతికి రాగానే రాణి డిద్దాదేవి నరవాహనుడిని పిలిపించింది.

నరవాహనుడు ఆమెకు ప్రణామం చేసి నిలబడ్డాడు. అది చూసి సిగ్గుపడింది రాణి. 'మంట్రివర్యా నేను మీకంటే చిన్నదానను. నాకు మీరు ప్రణామం చేయాల్సిన అవసరం లేదు. ఆసనం స్వీకరించండి అంది.

నరవాహనుడు రాణిని ఆశీర్వదించి “మహారాణీ, ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు. రాజ కార్య నిర్వహణ భారం మీరు స్వీకరించారు. కశ్మీర రాజు శివాంశజుడయితే రాణి పార్వతితో సమానం. కళశ్ళ్మీరం పార్వతీ మాత. మీరు మాకు సర్వ కళ్ళీరానికి ప్రతీక. నేనుగౌరవం చూపుతున్నది డిద్దాదేవి అన్న వ్వక్తికి కాదు. డిద్దాదేవి ఏశక్తి ప్రతీకనో ఆశక్తికి నేను ప్రణామంచేస్తున్నాను” అన్నాదు. మె కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు :22ఊ2322జ2డడ3డ32323డ3డడడనడదదదడ22+2+2ఒ24222డ2డ2డ2డఊఊడఊజ2ఊ 167 =

రాణి సుగంధాదేవి చరిత్ర విని కదలిపోయింది డిద్దాదేవి.

మహారాణీ! స్రీని గౌరవించని దేశంలో శాంతి భద్రతలు కరువవుతాయని శాస్త్రాల్లో చెప్పింది సత్యమేనని సుగంధాదేవి మరణం తరువాత జరిగిన సంఘటనలు నిరూపించాయి.

“ఎలా? కుతూహలంగా అడిగింది డిద్దారాణి.

'సుగంధా దేవి పార్టుని గద్దెపై నిలిపి రాజధాని వదలి హుష్కపురానికి వెళ్ళిపోయింది. కానీ పదేళ్ళ పార్టుని పేరు మీద దుష్టుడు నిర్జితవర్మ రాజ్యపాలన చేయటంతో, ఏకాంగులు రాణిని మళ్ళీ కళ్ళీరానికి ఆహ్వానించారు. ధర్మరక్షణ కోసమై సుగంధాదేవి రుద్రాక్షమాల వదలి ఖద్దాన్ని ధరించింది.

కానీ కలి ప్రవేశించిన 2000 ఏళ్ళ తరువాత ధర్మం (భ్రష్టమవుతుందని పురాణాల్లో చెప్పినట్టే, లౌకికాబ్బ్దం 38990 సంవత్సరాన వైశాఖ మాసాన జరిగిన సంకుల సమరంలో సుగంధాదేవి బంధితురాలయింది. రాణిని నిష్పాలకమనే విహారంలో బంధించి చంపేశారు. ప్రీ హత్యకు స్థావరమైన దేశంలో ప్రజలకు నిష్కృతి లేదని నిరూపిస్తూ సుందర కళ్ళీర మండలమంతా ధనహానీ, జనహాని, పారంపరితంగా జరగటం ఆరంభమయింది.

కాళ్ళీరాబ్బము 3993 వర్ష బుతువులో సంభవించిన అతివృష్టి వలన శాలి సస్యమంతా వరదపాలై దేశంలో క్షామ మేర్చడి జనులు మృత్యువాత పడ్డారు. వితస్తానదిపై తేలి అడే శవాల వల్ల నదీ జలం కనబడలేదు.

కళ్ళీరాబ్బము 3997 (క్రీ.శ.921), పుష్యమాసాన పార్టుని పదవీచ్యుతుని చేసి నిర్జితవర్మ మాఘమాసాన తన శిశుపుత్రుడు చక్రవర్మను రాజు చేసి మరణించారు (క్రీ.శ.921)

అక్కడి నుంచి రాజ్యాధికారం కోనం చ(క్రవర్శ్మకూ, పార్యడికీ మధ్య పోరూ ఆరంభమయింది. బలవంతులైన తంత్రులు ఎవరు ఎక్కువ ధనమిస్తే వారిని రాజుగా చేసేవారు. అలా చక్రవర్మ తొమ్మిదేళ్ళ పాలన తరువాత శూరవర్మ రాజయ్యాడు. శూరవర్మను తొలగించి పార్థుడిని రాజుచేశారు. పార్టుడి కన్నా ఎక్కువ ధనమివ్వటం వల్ల లౌకికాబ్దం 4011 (క్రీ శ.935లో మళ్ళీ చక్రవర్మను రాజు చేశారు” చెప్పాడు పార్టుడు'.

“అంటే ధన బలంవల్ల వ్యక్తుల విశ్వాసాలను కొనవచ్చన్నమాటి అంది రాణి.

'కానీ ధనానికి విశ్వాసాన్ని అమ్ముకునే వాళ్ళు తుచ్చులు. వారి విశ్వాసం శాశ్వతం కాదు. చక్రవర్మ కన్నా ఎక్కువ ధనమిచ్చినందుకు తంత్రులు చతశ్రవర్మను తరిమేసి శంభువర్దనుడిని రాజు చేశారు. చక్రవర్మ డామరుల సహాయంతో మళ్ళీ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.

222౭160) ఉడక కస్తూరి మురళీకృష్ణ నా

చక్రవర్మ అత్యాచారాలను, నీచ ప్రవర్తన భరించలేక డామురులు చక్రవర్మను హత్య చేసి పార్టుడి పుత్రుడు ఉన్మత్తావంతుడిని రాజు చేశారు. ఉన్మత్తావంతుడి దుశ్చర్యలను స్మరించాలంటేనే భయంగా ఉంది. తన తండ్రి తన అధికారానికి ఎక్కడ అడ్డు తగులుతాడో అని తన తండ్రినే పశువులా చంపించాడు. అలా చంపిన వారికి ఉన్నత పదవులిచ్చాడు”.

“అధికారం ఆశ కూడా వ్యక్తుల విశ్వాసాన్ని మారుస్తుందన్న మాటి అంది రాణి.

“అవును. కానీ ప్రతి వ్యక్తికీ తన దుశ్చర్యల ఫలం అనుభవించక తప్పదు. భయంకరమైన వ్యాధి సోకి, నరకయాతన అనుభవించి ఉన్మత్తావంతుడు మరణించాడు. ఉన్నత్తుడి పుత్రుడు ఇంకా బాలుడే. దాంతో కమలవర్దనుడు రాజ్యంపై దండయాత్ర చేశాడు. కానీ సింహాసనం అధిష్టించకుండా తనను రాజుగా ఎన్నుకోమని బ్రాహ్మణ సమూహాన్ని అభ్యర్థించాడు. వారు కమలవర్దనుడిని గుళ్లతో కొట్టి తరిమేసి, నిర్ధనుడు, దేశాంతరం వెళ్ళివచ్చిన యశస్మురుడిని రాజు చేశారు.

రాజయిన మరుక్షణం యశస్మరుడు (బ్రాహ్మణులకు నమస్మరించి “మీవల్ల నాకు రాజ్యం ప్రాప్తించింది. మీరు నాకు దైవ సమానులు. కానీ నేను మిమ్మల్ని అలా పూజిస్తే మీరు మదాంధులై 'ప్రవర్తించవచ్చు. మీరు అవసరమైతే తప్ప నన్ను కలవవద్దు' అని ఆజ్ఞాపించాడు.

రాణి నవ్వింది. 'సహాయం చేసిన వారిని గౌరవించాలి. కానీ నెత్తినెక్సించుకుంటే వారి వల్ల నష్టం కలుగుతుంది" అంది రాణి.

“అలాగని అవసరం తీరగానే వ్యక్తిని తిరస్మరించకూడదు. యశస్కరుడు ఉత్తముడు ధర్మబద్దంగా రాజ్యపాలన చేశాడు. తాను సామాన్యుదైనా పూర్వజన్మసుకృతం వర్త రాజ్య ప్రాప్తించింది కాబట్టి ఈ జన్మలో సత్కార్యాల వల్ల వచ్చే జన్మలో కూడా శుభం కలుగుతుం అనేక సత్కార్యాలు చేశాడు.

తొమ్మిదేళ్ళ పాలన తరువాత లౌకికాబ్బము 4024 (క్రీ.శ.948) భాద్రపద కృష్ణ తృతీయ దినాన యశస్కురుడు స్వర్షస్థుడయ్యాడు.

పర్వగుప్తుడు, చాలకుడు సంగ్రామదేవుడిని రాజుగా చేసి సర్వాధికారాలను నెరపసాగాడు. లౌకికాబ్బము 4024 ఫాల్గుణ కృష్ణ దశమి నాడు సంగ్రామదేవుడిని తొలగించి పర్వగుప్తుడు రాజయ్యాడు.

రాజు కాగానే పర్వగుప్తడి దృష్టి యశస్మరుడి రాణిపై పడింది. ఆ సాధ్వి అనేక విధాల పర్వగుప్తుడిని తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ కుదర లేదు. చివరికి తన భర్త తలపెట్టిన దేవాలయ నిర్మాణం సగంలో ఆగిపోయిందని, ఆ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తే పర్వగుప్తుడికి లొంగుతానని వాగ్దానం చేసింది. ఆలయ నిర్మాణం పూర్తయి వి[గ్రహ ప్రతిష్టాపన === కల్పణ కళ్మీర రాజతరంగిణి కధలు :2333డ3డకడడడడతతతడడకతతతడ2జతడడతడడడడడడడడడడడడడ పేట. 22

నరవాహనుడి ఆ మాటలతో ఆమెకు నరవాహనుడిపై పూర్తి నమ్మకం ఏర్పడింది.

“'మంటత్రివర్యా రాజ బాధ్యతలు రాజు పూర్తిగా నాపై ఉంచారు. కానీ అది ఇన్నాళ్ళూ రాజుపై ఆధారపడి బ్రతికిన వారికి కంటగింపుగా అవుతుంది. వీరి నుండి రాజునే కాదు రాజ్యాన్ని రక్షించాలి. ఇందులో నాకు మీ సహాయ సహకారాలు కావాలి తన మనసులోని మాటను బయటపెట్టింది రాణి.

'మహారాణి వారందరికీ తమకు అధికారం లేదన్న ఆక్రోశం తప్పించి, అధికారం చేతికి వస్తే ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. వీరి వల్ల దేశానికి క్షేమం కలగదు. కానీ సమయ (ప్రభావం వల్ల వారే బలవంతులుగా ఉన్నారు. గడ్డి పోచలన్నీ కలిపి పేనితే బలమైన ఏనుగును కూడా బంధించవచ్చు. కానీ విడిగా గడ్డిపోచ అతి ఐలహీనమైనది. వారందరినీ ఒకేసారి ఎదుర్శొనే కన్నా ఒకరొకరుగా నిర్మూలించటం మంచిది" అన్నాడు నరవాహనుదు.

కానీ ప్రస్తుత పరిస్థితిలో కర్తవ్యం బోధపడటం లేదు అంది రాణి.

“మహారాణీ, తమరి మాతామహుడు భీమశాహి శతృభయంకరుడు. ఆయనను కళ్ళీరానికి ఆహ్వానించండి. భీమశాహి బలప్రయోగం చేయనవసరం లేదు. బలప్రదర్శన చేస్తే చాలు. ఈలోగా మనం మన బలాన్ని స్థిరం చేసుకొనే వీలు చిక్కుతుంది”.

డిద్దారాణికీ సలహ నచ్చింది. నరవహనుడి ఆలోచనలో ఎటువంటి కుతంత్రం లేదని (గ్రహించింది. పైగా మాతామహుడిని ఆహ్వానించడం వల్ల తనకు లోహర సమర్ధనే కాదు ఉద్దండపుర శక్తి కూడా ఉందని హెచ్చరించినట్టవుతుంది.

ల

'మహామంత్రీ, ఎట్టి పరిస్థితులలో మీరు నాకు అండగా ఉంటారు కదా?” నరవాహనుడు వీడ్కోలు తీసుకునే సమయంలో బేలగా అడిగింది డిద్దాదేవి.

నరవాహనుడు వాత్సల్య పూర్వకంగా నవ్వాడు. 'మహారాణీ నా భారతీయ ధర్మం నాకు “సత్యంవద, ధర్మం చరి అని నేర్చింది. స్వధర్మపాలన వ్యక్తికి ముక్తి మార్గం అన్న నమ్మకం నా ధర్మం వల్ల నాకు కలిగింది.

మహారాణీ, ప్రస్తుతం భారతదేశంలో భారతీయ ధర్మం అత్వంత క్షిష్ట పరిస్థితిలో ఉంది.

ఎడతెగకుండా వచ్చిపడుతున్న విదేశీ దండయాత్రలు భారతదేశాన్ని బలహినపరుస్తున్నాయి. మూడు వందల ఏళ్ళ క్రితం తురుష్క దేశాల్లో జన్మించిన ఒక మతం తుఫానులా మన దేశంలో ప్రవేశించింది. వారికి రెండే రెండు లక్ష్యాలు. ఒకటి రత్నగర్భ అయిన ఈ దేశసంపదను కొల్లగొట్టటం. రెండు ఇక్కడ ప్రజలను తమ మతంలోకి మార్చటం. కళ్ళీరం శంకరవర్మ పాలిస్తున్స సమయంలో మహమ్మద్‌బిన్‌ కాసిమ్‌ సిక్రీ అనే తురుష్క దోపిడీదారు సింధునది పరిసర ప్రాంతాలను గెలుచుకుని అక్కడి ప్రజలను బలవంతంగా = 1ర్‌5 =2222క22జ2జ2ఊకకడడకడకడలడుకకడడడనన=2222:222 కస్తూరి మురళీకృష్ణ డా

తమ మతంలోకి మార్చాడు. శంకరవర్మ తన దండయాత్రలో కొన్ని తురుష్షమయమైన ప్రాంతాలను గెలుచుకుని అక్కడి ప్రజలను భారతీయ ధర్మానికి తిరిగి మార్చాడు.

కానీ ప్రస్తుతం దేశంలో బలమైన రాజ్యం లేదు. అంతర్గత కలహాల్లో రాజ్యాలు శక్తిహీనమైపోతున్నాయి. కనీసం కళ్మీరంలోనైనా బలమైన రాజ్యం ఉందాలి. మనకు భగవంతుడు ప్రాకృతిక రక్షణనిచ్చాడు. మానవ ప్రయత్నం మనం చేయాలి.

మహారాణీ, అధికారం కోసం పొంచి ఉన్న ఈ నక్కలేవీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు పదిహేను నక్కలు కలిసినా ఒక సింవోనికి సరితూగలేవు. కళ్మీరానికి బలమైన ప్రభుత్వాన్నివ్వగల సామర్థ్యం తమరికే ఉంది. మహారాణీ, నా ధర్మాన్ని సంరక్షించగలిగే సామర్థ్యమున్న వారికి తోద్పటాన్ని మించి నాకు వేరే ధర్మం ఏముంటుంది?” అన్నాడు నరవాహనుడు.

రాణి అతనికి వినయపూర్వకంగా నమస్కరించింది.

క

భీమషాహి కశ్మీర రాక ఒక ఉత్సవంలా జరిగింది. భీమషాహి తన మనుమరాలి రాజ్యంపై కనకవర్షం కురిపించాడు. అతడి ధనబలం ముందు కళ్మీరం తలవంచింది. తన కశ్మీర యాత్ర జ్ఞాపక చిహ్నంగా భీమషాహి భీమ కేశవాలయాన్ని నిర్మించాడు. ఆ అలయం కుబేరుని కోశాగారాన్ని మించింది. ఆలయానికి పునాది రత్నాలతో, వజ్రాలతో వేశారు. ఆలయంలో అడుగడుగునా మణిమరకత మాణక్య రాశులే.

(ప్రస్తుతం ఈ ఆలయం ముస్లిం నన్యాసి బాబా బమాదిని సాహిబ్‌ మందిరంగా చలామణి అవుతోంది).

భీమషాహి కశ్మీరంలో ఉండగానే క్షేమగుప్తుడు, ఫల్డుణుడి కూతురిని వివాహమాడాడు. భీమషాహి కోపంతో క్షేమగుప్తుడిని నిలదీశాడు.

క్షేమగుప్తుడు డిద్దారాణి వైపు చూశాడు.

'ేనే ఆయనను ఆ వివాహం చేసుకోమన్నాను ఫల్గ్లుణుడు ప్రమాదకరమైన వ్యక్తి. ఆయనను బంధవుగా చేసుకోవటంవల్ల ఒకప్రమాదం తప్పినట్టే. రాజుఎంత మందిని వివాహం చేసుకున్నా ఆయన డిద్దాక్షేముదే' అంది డిద్దారాణి గర్వంగా.

క్షేమగుప్పడు తలాడించాడు. భీమషాహి శాంతించాడు.

క్షేమగుప్తుడు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఏనాడూ రెండవ రాణి మందిర ఛాయలకు కూడా పోలేదు. ఆయన డిద్దారాణి మందిరంలో లేని సమయం వేటలో గడిపేవాడు. రాజు వేటలో గడిపే సమయంలో రాణి భుయ్యుడి వద్ద కళ్ళీర చరిత్రను, భారతీయ ధర్మాన్ని అభ్యసించసాగింది. మడా కల్దణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు 2333332332 1క్‌9 22

రాణి సుగంధాదేవి చరిత్ర విని కదలిపోయింది డిద్దాదేవి.

“మహారాణీ! ప్రీని గౌరవించని దేశంలో శాంతి భద్రతలు కరువవుతాయని శాస్త్రాల్లో చెప్పింది సత్యమేనని సుగంధాదేవి మరణం తరువాత జరిగిన సంఘటనలు నిరూపించాయి.”

“ఎలా? కుతూహలంగా అడిగింది డిద్దారాణి.

'సుగంధా దేవి పార్భుని గద్దెపై నిలిపి రాజధాని వదలి హుష్మపురానికి వెళ్ళిపోయింది. కానీ పదేళ్ళ పార్భుని పేరు మీద దుష్టుడు నిర్జితవర్మ రాజ్యపాలన చేయటంతో, ఏకాంగులు రాణిని మళ్ళీ కళశ్ళ్శీరానికి ఆహ్వినించారు. ధర్మరక్షణ కోసమై సుగంధాదేవి రుద్రాక్షమాల వదలి ఖద్దాన్ని ధరించింది.

కానీ కలి ప్రవేశించిన 2000 ఏళ్ళ తరువాత ధర్మం (భ్రష్టమవుతుందని పురాణాల్లో చెప్పినట్టే, లౌకికాబ్బం 3990 సంవత్సరాన వైశాఖ మాసాన జరిగిన సంకుల సమరంలో సుగంధాదేవి బంధితురాలయింది. రాజిని నిష్పాలకమనే విహారంలో బంధించి చంపేశారు. స్త్రీ హత్యకు స్థావరమైన దేశంలో ప్రజలకు నిష్కృతి లేదని నిరూపిస్తూ సుందర కళ్ళీర మండలమంతా ధనహానీ, జనహాని, పారంపరితంగా జరగటం ఆరంభమయింది.

కాశ్మీరాబ్బము 3998 వర్ష బుతువులో సంభవించిన అతివృష్టి వలన శాలి సస్యమంతా వరదపాలై దేశంలో క్షామ మేర్చడి జనులు మృత్యువాత పడ్డారు. వితస్తానదిపై తేలి అడే

శవాల వల్ల నదీ జలం కనబడలేదు.

కళ్ళ్శీరాబ్బము 399/7 (క్రీ.శ.921), పుష్యమాసాన పార్టుని పదవీచ్యుతుని చేసి నిర్జితవర్శ్మ మాఘమాసాన తన శిశుపుత్రుడు చక్రవర్మను రాజు చేసి మరణించారు (క్రీ.శ.923)

అక్కడి నుంచి రాజ్యాధికారం కోనం చగ్రవర్మకూ, పార్యడికీ మధ్య పోరూ ఆరంభమయింది. బలవంతులైన తంత్రులు ఎవరు ఎక్కువ ధనమిస్తే వారిని రాజుగా చేసేవారు. అలా చక్రవర్మ తొమ్మిదేళ్ళ పాలన తరువాత శూరవర్మ రాజయ్యాడు. శూరవర్శ్మను తొలగించి పార్టుడిని రాజుచేశారు. పార్ధుడి కన్నా ఎక్కువ ధనమివ్వటం వల్ల లౌకికాబ్దిం 4012 (క్రీ.శ.985)లో మళ్ళీ చక్రవర్మను రాజు చేశారు” చెప్పాడు పార్టుడు'.

“అంటే ధన బలంవల్ల వ్యక్తుల విశ్వాసాలను కొనవచ్చన్నమాట' అంది రాణి.

కానీ ధనానికి విశ్వాసాన్ని అమ్ముకునే వాళ్ళు తుచ్చులు. వారి విశ్వాసం శాశ్వతం కాదు. చక్రవర్మ్శ కన్నా ఎక్కువ ధనమిచ్చినందుకు తంత్రులు చక్రవర్మను తరిమేసి శంభువర్దనుడిని రాజు చేశారు. చక్రవర్మ డామరుల సహాయంతో మళ్ళీ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. వజ |ేటి0 వక3కడకడతడడకడకకడడకకననడడడననననకడడనననఐవవాయి. కస్తూరి మురళీకృష్ణ ==

చక్రవర్మ అత్యాచారాలను, నీచ ప్రవర్తన భరించలేక డామురులు చక్రవర్మను హత్య చేసి పార్టుడి పుత్రుడు ఉన్మత్తావంతుడిని రాజు చేశారు. ఉన్మత్తావంతుడి దుశ్చర్యలను స్మరించాలంటేనే భయంగా ఉంది. తన తండ్రి తన అధికారానికి ఎక్కడ అడ్డు తగులుతాదో అని తన తండ్రినే పశువులా చంపించాడు. అలా చంపిన వారికి ఉన్నత పదవులిచ్చాడు”.

“అధికారం ఆశ కూడా వ్యక్తుల విశ్వాసాన్ని మారుస్తుందన్న మాటి అంది రాణి.

“అవును. కానీ ప్రతి వ్యక్తికీ తన దుశ్చర్యల ఫలం అనుభవించక తప్పదు భయంకరమైన వ్యాధి సోకి, నరకయాతన అనుభవించి ఉన్నత్తావంతుడు మరణించాడు. ఉన్నత్తుడి పుత్రుడు ఇంకా బాలుడే. దాంతో కమలవర్దనుడు రాజ్యంపై దండయాత్ర చేశాడు కానీ సింహాసనం అధిష్టించకుండా తనను రాజుగా ఎన్నుకోమని బ్రాహ్మణ సమూహాన్ని అభ్యర్థించాడు. వారు కమలవర్ధనుడిని గుళ్లతో కొట్టి తరిమేసి, నిర్ధనుడు, దేశాంతరం వెళ్ళివచ్చిన యశస్కురుడిని రాజు చేశారు.

రాజయిన మరుక్షణం యశస్మరుడు బ్రాహ్మణులకు నమస్కరించి “మీవల్ల నాకు రాజ్యం ప్రాప్తించింది. మీరు నాకు దైవ సమానులు. కానీ నేను మిమ్మల్ని అలా పూజిస్తే మీరు మదాంధులై ప్రవర్తించవచ్చు. మీరు అవసరమైతే తప్ప నన్ను కలవవద్దు' అని ఆజ్ఞాపించాడు.

రాణి నవ్వింది. 'సహాయం చేసిన వారిని గౌరవించాలి. కానీ నెత్తినెక్కించుకుంటే వారి వల్ల నష్టం కలుగుతుంది” అంది రాణి.

“అలాగని అవసరం తీరగానే వ్యక్తిని తిరస్మరించకూడదు. యశస్కరుడు ఉత్తముడు ధర్మబద్దంగా రాజ్యపాలన చేశాడు. తాను సామాన్యుడైనా పూర్వజన్మసుకృతం వల్ల రాజ్యం ప్రాప్తించింది కాబట్టి ఈ జన్మలో సత్మార్యాల వల్ల వచ్చే జన్మలో కూడా శుభం కలుగుతుందని అనేక సత్మ్యాద్యాలు చేశాడు.

తొమ్మిదేళ్ళ పాలన తరువాత లౌకికాబ్దము 4024 (క్రీ.ఈ.948) భాద్రపద కృష్ణ తృతీయ దినాన యశస్కురుడు స్వర్గస్థుడయ్యాడు.

పర్వగుప్తుడు, చాలకుడు సంగ్రామదేవుడిని రాజుగా చేసి సర్వాధికారాలను నెరపసాగాడు. లౌకికాబ్బము 4024 ఫాల్గుణ కృష్ణ దశమి నాడు సంగ్రామదేవుడిని తొలగించి పర్వగుప్తుడు రాజయ్యాడు.

రాజు కాగానే పర్వగుప్తుడి దృష్టి యశస్మరుడి రాణిపై పడింది. ఆ సాధ్వి అనేక విధాల పర్వగుప్తుడిని తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ కుదర లేదు. చివరికి తన భర్త తలపెట్టిన దేవాలయ నిర్మాణం సగంలో ఆగిపోయిందని, ఆ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తే పర్వగుప్తుడికి లొంగుతానని వాగ్దానం చేసింది. ఆలయ నిర్మాణం పూర్తయి విగ్రహ (ప్రతిష్టాపన మడడడ2ఊ కల్పణ కశ్శ్మీర రాజతరంగిణి కథలు =జడాజడడకడనునడడడనడలలడడడడ2ఊ4ఊ42222ఊ 161 =

జరిగే సమయంలో ఆ అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది.” భుయ్యుడి కళ్లలో నీళ్ళు తిరిగాయి.”

డిద్దారాణి చాలాసేపు మౌనంగా ఉంది. చివరికి మౌనాన్ని భంగం చేస్తూ అంది.

'ఆమె మూర్చురాలు. తన అందంతో పర్వగుప్పుడిని కొంగున ముడి వేసుకుని రాజ్యాధికారం చలాయించే బదులు నిండు జీవితాన్ని బూడిదపాలు చేసుకుంది" అంది నవ్వుతూ. భుయ్యుడు నిరుత్తరుడయ్యాడు. చివరికి తేరుకుని అన్నాడు “ఆవిడ అలా చేసి ఉంటే ఆమె గురించి ఇంత గౌరవంగా మాట్లాడుకునే వారమే కాదు”.

డిద్దాదేవి కళ్ళ కొసల నుంచి భుయ్యుడిని చూసి మందహాసం చేసింది భుయ్యుడు కొనసాగించాడు.

'పర్వగుప్తుడు స్వామిద్రోహంతో ఆర్జించిన రాజ్యసౌఖ్యాలు ఒక సంవత్సర కాలం అనుభవించి లౌకికాబ్దము 4026 (క్రీ. శం950) ఆషాడ శుక్ల త్రయోదశి నాడు మరణించాడు. అతని తరువాత అతని వుత్రుదు క్షేమగుప్తుల వారు రాజయ్యారు” భయ్యుడి మాట పూర్తికాకముందే ఒక పరిచారికి వగరుస్తూ పరుగెత్తుకు వచ్చి చెప్పింది.

“మహారాణీ! దామోదరారణ్యాన వేటాడుతున్న మహారాజు కృష్ణచతుర్దశి నాడు అరణ్యంలో భయంకర దృశ్యం దర్శించి లుతారోగగ్రస్తులయ్యారు'”.

ఆ వార్త విని రాణి కుప్పకూలిపోయింది

నే

“లైకికాబ్దం 4034 (క్రీ.శ.958)న క్షేమగుప్తుడు మరణించాడు. రాణి డిద్దాదేవి సహగమనం చేస్తోందన్న వార్త కళ్మీరమంతా కార్చిచ్చులా వ్యాపించింది 'నరవాహనా! ఇది ఫల్డుణుడి కుయుక్తి. డిద్దాదేవి చెప్పుడు మాటల ప్రభావానికి త్వరగా లోనవుతుంది. ఫల్గుణుడు తన చారుల ద్వారా ఈ వార్త ప్రచారం చేశాడు. ఇప్పుడు రాణికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేశాడు భుయ్యుడు ఆందోళనగా చెప్పాడు.

నరవాహనుడు ఆఘమేఘాల మీద పరుగెత్తాడు. చితిలో దూకేందుకు సిద్దంగా ఉన్న రాణిని వారించాడు. రాణి సుగంధాదేవిని ఆదర్శంగా తీసుకుని బాలుడు అభిమన్యుడిని రాజుగా చేసి రాణిని అతడికి సంరక్షకుడిగా ఉండమని బ్రతిమిలాదేడు.

రాణి డిద్దాదేవి ఒప్పుకుంది ఆమె ఫల్గుణుడి వైపు చూసి విజయగర్వంతో నవ్వింది. ఆమె ఆశించిందీ అదే. ప్రజల దృష్టిలో తాను సహగమనానికి సిద్దపడ్డ సాధ్విగా మిగలాలి. ధర్మ రక్షణార్ధం రాజ్యపాలన భారం స్వీకరించిన త్యాగికావాలి. హణ. 62 2333కు. కస్తూరి మురళీకృష్ణ నా!

తన పధకం విఫలమై బెడిసికొట్టటంతో ఫల్గుణుడు కోపోద్రిక్తుడయ్యాడు. రాజ్యంలో వివిధ శాఖాధికారులను రెచ్చగొట్టసాగాడు మంత్రులను, ఇతర ముఖ్య అధికారులను తన వైపుకు తిప్పుకోసాగాడు

ఇదే సమయంలో తుంగేశ్వర ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి పట్టణం దగృ్గమయిపోయింది. ఆ మంటలను చల్లార్చి, (ప్రజలకు సేవా కార్య (క్రమాలను పర్యవేక్షించేందుకు నరవాహనుడు స్వయంగా కుంగేశ్వరం వెళ్ళాడు.

నరవాహనుడు రాజధానిలో లేక పోవటం చూసి ఫల్గుణుడు తన రాజు వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేశాడు. రాజ్యధిక్కార చర్యలు ముమ్మరం కాసాగాయి. రాణికేమీ పాలుపోలేదు. రాణి భయ్యుడితో దీర్హంగా ఆలోచించింది. ప్రధమ సమాగమ సమయంలో క్షేమగుప్తడు తన భృత్యుడిగా మారిన వైనం ఆమెకు గుర్తుకు వచ్చింది. బిగ్గరగా నవ్వింది

భుయ్యుడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

రాణి ఫల్గుణుడి వైపున్న అధికారులందరికీ ఆహ్వాన పత్రికలు తయారు చేసింది. భుయ్యుడు అయోమయంగా చూశాడు

రాణి బిగ్గరగా నవ్వింది. 'మూర్చులు, బుద్ధిహీనులు కేవలం భుజబలం ఉండగానే గొప్ప వీరులమని కుట్రలు పన్నుతున్నారు" అంది.

భుయ్యుడికి అర్ధమయింది. రాణికి నమస్కరించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు భుయ్యుడు పుణ్యతీర్థాల సందర్శనార్థం వెళ్ళాడన్న వార్త రాణికి అందింది.

అనాటి నుండి రాజ్యంలోని అధికారుల రాకపోకలతో రాత్రిళ్ళు నిద్రకరువయింది. రాణి మందిరంలో (ప్రవేశించే ముందు ఆ అధికారులంతా వల్గుణుడి వైపు వారు. ప్రతాపవంతులు రాణి మందిరం వదలివెళ్ళే సమయానికి వారు నిర్వీర్యులు. డిద్దారాణికి దాసానుదాసులు. ఫల్గుణుడి బద్దశతృవులు. ఇలా ఒక్కరొకరిగా రాజ్యంలో అధికారులంతా రాణి సమర్ధకులుగా మారిపోసాగారు.

తనకు మద్దతునిచ్చేవారంతా క్రమంగా తనకు వ్యతిరేకమవటం వల్గుణుడు గమనించాడు. తన రాజ వ్యతిరేక చర్యలు రాణికి తేలిసిపోయాయని ఫల్గుణుడు గ్రహించాడు. అంతేకాదు రక్కుడి సహాయంతో రాణి తనను వధించే ప్రయత్నాలు చేస్తోందని ఫల్లుణుడికి తెలిసింది.

మరునాటి ఉదయం ఫల్గుణుడు మహారాణి మందిరానికి వెళ్ళాడు. రాణి ఫల్దుణుడుని సాదరంగా ఆహ్వానించింది. రాణి అందం ఫల్గుణుడి గుండెలో జ్వాలను రేపింది. ఆమె నవ్వు అతడి క్రోధాగ్నికి అజ్యం పోసింది. హె కల్టణ కళ్ళీర రాజతరంగిణీ కధలు 3333 1ట3ి జ

“మహారాణీ నా ఆరోగ్యానికి కశ్మీర వాతావరణం సరిషరటం లేదు. సన్నీ సర్యాదికార పదవి బాధ్యత నుంచి తప్పించండి. క్షేమగుప్తుడి అస్టికలను గంగాసంగమంలో మిళితం చేసేందుకు నా తనయుడు కర్తమరాజు వారణాసి ప్రయాణమై వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేవరకు నేను పర్గోత్సవద్ద విశ్రమిస్తాను అన్నాడు.

“అయ్యో తమరి ఆరోగ్యం బాగా లేకపోతే ఉద్దండులైన వైద్యులు రాజధానిలో ఉన్నారు. సర్షోత్సలో ఎవరున్నారు? పైగా మీరు నా కుడి భుజం వంటివారు. మీరు లేకపోతే రాజధానిలో వివిధ శాఖాధికారుల మధ్య నమన్వయుం సాధించేదెవరు? ఇదంతా నా వల్ల అవుతుందంటారా? ఆందోళన ఆమె మాటల్లోనే ఉంది. ఆమె కళ్లు సూటిగా ఫల్టుణుడి ఎదను చీల్చి చూస్తున్నాయి.

ఫల్గుణుడు మౌనంగా వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయమే తన సానుభతిపరులతో తన మద్దతునిచ్చే సైనికులతో రాజధాని వదలి వెళ్ళిపోయాడు ఫల్లుణుడు. పెద్ద సైన్యంలో వెళ్ళిపోతున్న ఫల్గుణుడిని దారిపొడుగునా రాణి పంపిన భృత్యులు రాజధానికి తిరిగి రమ్మని 'బ్రతిమిలాడుశున్నారు.

ఫల్లాణుడు సందిగ్ధంలో పడ్డాడు. రాణికి తన సంగతి తెలిసినట్టు లేదు. లేకపోతే ఎందుకింత బ్రతిమిలాడుతుంది. రాణి అభ్యద్ధనలో నిజాయితీకి లొంగి అతడు మళ్ళీ వెనుతిరిగాడు.

ఫల్గుణుడు రాజధానివైపు మరలిన మరుక్షణం నుంచీ వార్తాహరులు 'ఫల్లుణుడు రాజద్రోహి, రాజధానిపై దండెత్తుతున్నాడు. అబల, నిస్సహాయురాలు అయిన డిద్దాదేవి నుంచి రాజ్యాన్ని కబిళించాలని చూస్తున్నాడు” అన్న వార్త దారిపొడుగునా ప్రచారం చేయసాగారు.

దాంతో ఫల్లుణుడికి కన్నీళ్ళతో వీడ్మోలు చెప్పినవారే, ఫల్లుణుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫల్గుణుడు వరాహక్షేశ్రం చేరేసరికి నిరసన వెల్లువ పెల్లుబికింది. ఫల్గుణుడిని ప్రజలు వరాహస్వామి మందిరంలో అడుగుపెట్టనివ్వలేదు. “రాజద్రోహం వంటి పాపవు చింతనతో పవిత్ర మందిరంలో అడుగుపెట్టి మందిరాన్ని అపవిత్రం చేయకండి” అని పూజారులు ఫల్లుణుడికి అడ్డుపడ్డారు.

థల్గుణుడు బిత్తరపోయాడు. నిందాపూర్వక వాక్యాలను భరించలేకపోయాడు. “యుక్తాయుక్త విచక్షణం లేని వ్యక్తి యందు శాస్త్రమైనా, శస్తమైనా దురదృష్టకారకాలవుతాయి. వాటి ప్రయోగం వల్ల వ్యక్తి కుట్రల కొలవామవుతాడు. కాబట్టి శస్తాన్ని శాస్త్రాన్ని సరిగ్గా

ఉపయోగించుకోలేని వ్యక్తికి వాటి పరిత్యాగం తప్ప మరో మార్గం లేదు" అని ఫల్లుణుడు తన ఖడ్డాన్ని వరాహస్వామి పాదాల వద్ద ఉంచాడు. “ఈనాటి నుంచీ నేను ఆయుధాన్ని జాం 16ఢ =2ఊజ2డజనుకకనునననకడకడడడడడడజజజడజడజడఊఊఊఊఊడడఊఊఊఊ4 కస్తూరి మురళీకృష్ణ నా

స్పృశించను. నా రాజభక్తికి ఇదే నిదర్శనం" అని ఫల్గుణుడు నిజభటాళితో పర్షోత్సవానికి వెళ్ళిపోయాడు.

ఫల్గుణుడి శస్త్ర సన్యాస వార్త రాణిని ఆనందపరిచింది.

'ఈ విజయం ఎలా సాధించారు మహారాణీ?” ప్రశ్నించాడు నరవాహనుడు.

డిద్దారాణి అందుకు నవ్వింది. 'ఆడది అబల అని వురుషుడు తనని తాను నమ్మించుకుంటూ స్త్రీని నమ్మించే ప్రయత్నం. చేస్తాడు. కానీ తన శక్తిని గ్రహించిన ప్రీ ముందు పురుషుడు ఎప్పటికీ నిస్సహాయుడైన పసిపాపే' అంది రాణీ.

“మహారాణీ ప్రస్తుతం ఫల్గుణుడి బెడదవదిలింది కానీ మరోబెడద పొంచి ఉంది. పర్వగుప్తుని కూతురిసంతానం మహిముడు, పాటలుడు హిమ్మకుడితో కలిసి రాజ్యాధికారం కోసం పన్నాగాలు పన్నుతున్నారు. ముఖ్యంగా మహిముడి మామగారు శక్తిసేనుడి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లలితాదిత్యపురంలోని ప్రముఖ విష్ఫృలందరితో శక్తిసేనుడికి దగ్గర సంబంధాలున్నాయి. అంతేకాదు పొమ్మకుడు, ముకుళుడు, ఎరమంతకుడు, ఉదయగుప్తుడు, యశోధరుడు వంటి మహావీరులు శక్తిసేనుడు కనునన్నల ఆజ్ఞ ఉంటే చాలు నిప్పుల్లో దూకేందుకయినా సిద్దంగా ఉంటారు” అన్నాడు.

రాణి డిద్దాదేవి తలపరికించింది.'నాకు ఈవిషయం చారులవల్ల తెలిసింది. వెంటనే మహిముడిని, పాటలుడిని రాజభవనాల నుంచి బహిష్టరించండి. వారికి ఆశ్రయం ఇవ్వటం రాజద్రోహమని ప్రకటించండి" అంది రాణి.

“మహారాణీ శతృవు బలవంతుడు. అతని వ్యూహానికి ప్రతివ్యూహం ఏర్పరచు కోకుండా మనం ముందడుగు వేయటం ఆత్మహత్య సదృశ్యం” అన్నాడు నరవాహానడు.

'మహామంత్రీ ఎటువంటి పరిస్టితి ఎదురైనా మీరు నా వైపే ఉంటారన్న ధైర్యం నాకుంది. శతృవులకు పథకాలను పటిష్టం చేసుకునే సమయం ఇచ్చేకన్నా వారిపథకాలు బీజప్రాయంగా ఉన్నప్పుడే వాటిని భగ్నం చేయటం ఉత్తమం. పైగా భారతదేశ చరిత్రను విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ దేశంలో అధికారుల రాజుద్రోహ విప్లవాలు ఎన్నడూ విజయం సాధించలేదు. (ప్రజలు రాజద్రోహులకు ఏనాడూ మద్దతునివ్వలేదు. ఎందుకంటే రాజు ధర్మానికి ప్రతీక. రాజుపై విప్లవం అన్యాయంగా స్వార్థం కోరి లేవదీసేవారు అవినీతిపరులు. ఈ దేశ ప్రజలు ఎన్నడూ అవినీతిపరులను సమర్థించరూ అంది రాణి విశ్వాసంతో.

శ్‌ శే ఆ

రాజధాని శతృసేనల పదఘట్టనలతో అదిరిపోతోంది.

డిద్దాదేవి ఆందోళన క్షణక్షణం పెరిగిపోతోంది.

'నరవాహన మంత్రి ఇంకారాలేదా?” క్షణక్షణానికి అడుగుతూనేఉంది రాణి. వద కల్పణ కళ్ళ్శీర రాజతరంగిణి కధలు :23డ3ఊ3ఊ3డకడకడకడడకడకడఉడకడకడకడడుడడడనడడడడదఊడడఊడ=చఊ 265 ==

మహిముడిని, పాలుడిని రాజభవనం నుంచి బహిష్మరించటం వల్ల పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయనుకోలేదు రాణి.

మనోరాణి బహిష్కారం విధించినప్పటి నుంచీ మహిముడిని, పాటలుడిని భటులు రాజభవనంలో నిలువనీయలేదు. దాంతో మహిముడు శక్తిసేనుడు ఇల్లు చేరారు. భటులు అక్కడకు వచ్చి శక్తసేనుడికి మహారాణి ఆజ్ఞ వినిపించారు.

శక్తిసేనుడి కోపం హద్దులు దాటింది. 'నా అల్లుడిని రాజభవనం నుంచి బహిష్మరించేంత ధైర్యం ఆ కుంటిరాణికి ఎలా వచ్చింది? వెళ్ళి మీ రాణితో చెప్పండి. భర్తపోయిన తరువాత అధికారం నిలుపుకునేందుకు అందాన్ని ఎర వేసిన నీతి బాహ్యమైన వ్యక్తి మాటలకు శక్తిసేనుడు విలువనివ్వడని చెప్పండి" అని భటులను రరిమివేసి మహిముడిని తన ఇంట్లోకి సాదరంగా స్ప్పనించాడు.

భటుల వల్ల విషయం తెలుసుకొని రాణి నరవాహనుడికి కబురుపెట్టింది.

“మహారాణీ ఇప్పుడు మనం వెనకఅడుగువేసి లాభం లేదు. అది రాజాజ్ఞ ధిక్కారానికి వ్యక్తులను (ప్రేరేపిస్తుంది. రాజధిక్కార నేరం క్షమార్దం కాదని ప్రజలకు తెలియాలి. శక్రిసేనుడు తన మితృల సహాయం కోరేలోగా అతడిని గృహనిర్బంధంలో ఉంచాలి” అన్నాడు నరవాహనుడు.

“అలాగే కానీండి. కానీ పరిస్థితి చేయిదాటి పోతున్నదని భయంగా ఉంది" బేలగా అంది డిద్దారాణి.

“మహారాణీ, నా శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ రాజుకెటువంటి ఆపద రానివ్వను అన్నాడు నరవాహనుడు.

అయితే రాజభటులు శక్తిసేనుడి భవనాన్ని చుట్టముట్టేలోగా శక్తిసేినుడు రహస్య మార్గం ద్వారా పరిహాసపురం చేరాడు. పరివాసపురం నుంచి శక్తిసేనుడు, ఎరమంతకుడు పెద్ద సైన్యంతో రాజధానికి బయలుదేరారు. లలితాదిత్యపురం నుంచి ఉదయగుప్తుడు, యశోధర్సుడ్తు, ససైన్యంగా కళశ్ళ్మీర రాజధానికి పయనమయ్యారు.

వారి సైన్య పదఘట్టనలతో కళ్ళీరం గడగడలాడిపోయింది. వారు కళ్ళ్మీర రాజధాని ద్వారం చేరేసరికి రాజధానిలో శక్తిసేనుడి మద్దతుదార్లు, ఇతర అధికారులు శక్తిసేనుడి వైపు చేరిపోయారు. దాంతో నరవాహనుడు తప్ప మహారాణి వైపు ఎవరూ మిగలలేదు.

'మహారాణి శతృసైన్యాలు పద్మనాభస్వామి మందిరం చేరాయి. మందిర సమీపాన భీకరయుద్దం జరుగుతోంది" చెప్పిందొక పరిచారిక.

“నరవాహనమంత్రి...” మహారాణి మాట పూర్తికాకముందే మరో పరిచారిక పరుగెత్తుకు వచ్చింది. దైవ 166 :ఇ232322222222222ఊఊఊఊఊ22ఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ= కస్తూరి మురళీకృష్ణ ===

“మహారాణీ, తమరిని అభిమన్య మహారాజు సహితంగా, రహన్యమార్గం ద్వారా శూరమరం చేరమన్నారు నరవాహన మంత్రి* వగరుస్తూ చెప్పింది పరిచారిక.

రాణి తలపంకించింది. ఆమెలో ఆందోళన అంతరించింది. ఆమె తనకు నమ్మకమైన అంగరక్షకులను పిలిచింది.

“అభిమన్యుడిని జాగ్రత్తగా శూరమరం చేర్చండి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మళ్లీ నేను కబురుపెడితేనే పంపండి. ఒకవేళ నేను మరణిస్తే అభిమన్య మహారాజును లోహారం చేర్చండి” ఆజ్ఞాపించింది రాణి.

వారు వెళ్ళగానే రాణి వార్తహరులను పిలిచి “లలితాధిత్యపురం విప్ర అధికారులకు మరోసారి నా ఆహ్వానాన్ని అందజేయండి. వారికీ ఆభరణాలు నా బహుమతిగా ఇవ్వండి అని ఆజ్ఞాపించింది.

వారు వెళ్ళిపోగానే సేవకులను పిలచి “పల్లకిసిద్దం చేయండి.” ఉదయ గుప్తుడుని, యశోధరుడిని వారి శిబిరాల్లో సూర్యాస్తమయం తరువాత కలుస్తానని కబురుపంపండి అంది.

రాణి తనమందిరం చేరి అలంకరించుకోసాగింది. భూదేవికి వచ్చనిచీర అందాన్నిచ్చినట్టు రాణి ఆనాడు ధరించిన ఆభరణాలతో వెలిగిపోసాగింది. రాణి అలంకరణ పూర్తయే సరికి లలితాదిత్యపు విప్రప్రముఖుడు ఈశ్వరభట్టు వచ్చాడు.

రాణి అతి మర్యాద చేస్తూ అతడిని తన మందిరంలోకి ఆహ్వానించింది. అతను మందిరంలోకి రాగానే “నేను నీకేం అన్యాయం చేశానని మీ బ్రాహ్మణులంతా నాపై కక్ష గట్టారు? బేలగా అడిగింది రాణి. ఆమె అందానికి అప్పటికే ముగ్దుడయిన ఈశ్వరభట్టు ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి కరిగిపోయాడు.

“మీరు ఐశ్వర్యం కోరి నామీద విప్లవం లేవదీస్తున్నట్టయితే రాజ కోశాగార మంతా మీదే దానికి విప్లవం ఎందుకు? మీరు అడిగితే ఇవ్వనా? అంత చిన్న విషయానికి నన్ను ఇంతగా హింసించాలా? గోముగా అడిగింది డిద్దాదేవి.

ఆమె ఇచ్చిన కానుకలు గ్రహించి ఆమె వశుడై వెళ్ళిపోయాడు ఈశ్వరభట్టు. ఈశ్వరభట్టు ఆ ద్వారం నుంచి వెళ్తూండగానే మరో ద్వారం నుంచి మరో విప్రప్రముఖుడు రాణి మందిరంలో అడుగుపెట్టాడు. సాయంత్రమయేసరికి లలితాదిత్యపుర విప్రలంతా డిద్దారాణి పక్షం అయిపోయారు. వారు వెళ్ళిపోయేసరికి రాణి పల్లకి సిద్దంగా ఉంది.

న వడ కల్పణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు 2232కి ర? ఊఊఊ

రాత్రికి రాశ్రే శూరసేనుడి విజయం పరాజయంలా మారిపోయింది. యువాముక్కు ఫస్‌ పెప్రులంతా అబలపై విప్లవానికి వ్యతిరేకతను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. వనాడూ ఏకాభిప్రాయం కుదరని ('బాహ్మణులంతా ఏకమవటంతో శూరసేనుడు ఆశ్చర్యపోయాడు. “మీరంతా డిద్దారాణిని కలిశారా? ఆమె మీ మీద ఏ మంత్రం ప్రయోగించింది? శరీరమా? బంగారమా?” కోపంగా అడిగాడు శూరసేనుడు. “లలితాదిత్యపుర ప్రముఖులకు జరిగిన ఈ అవమానాన్ని మేము సహించం” అంటూ యశోధరుడు, ఉదయగుప్తుడు కత్తిమీద చేయివేశారు. శూరసేనుడు “మీరు కూడా? అన్నట్టు వారి వైపు చూసి ఓటమిని ఒప్పుకున్నాడు. తప్పనిసరి పరిస్థితులలో మహిముడు రాణితో సంధి చేసుకున్నాడు. తమలో ఎవరికి రాణీ వల్ల ఆపద వాటిల్లినా యుద్ధం తప్పదని వారు ప్రకటించారు. అయితే రాజద్రోహం తల పెట్టనంత వరకూ వారికి ప్రమాదం లేదని రాణి హామీ ఇచ్చింది. ఆ రోజు సభానంతరం నరవాహనుడు రాణిని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు” ఈ అద్భుతం ఎలా సాధించారు? డిద్దారాణి తన చేతికున్న గాజుల్లో ఆడుకుంటూ చెప్పింది “లలితాదిత్యపుర బ్రాహ్మణులకు బంగారం దానం చేశాను, యశోధరుడిని ధక్కన్నపై యుద్దానికి వెళ్ళేందుకు అనుమతించాను. అతడికి సర్వసైన్యాధిపతి పదవి కావాలి. థక్కన్న రాజ్యంలో దోచుకున్న ధనమంతా యశోధరుడినే ఉంచుకోమన్నాను. ఉదయగుప్తుడికి రాజభవనంలో ఒక భవనం కావాలి. రాజ కుటుంబీకులలో అతనూ ఒకడు. అభ్యంతరం ఏముంది? ప్రతివారికీ ఎవరికి కావలసింది వారికి దొరికింది. ఇక విప్లవం ప్రసక్తి ఏముంది? అంది రాణి. “పాపం అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అనుకున్నాడు నరవాహనుడు. 'నరవాహనా మన శతృవులను అణచేందుకు ఇదే అనువయిన సమయం. అందరినీ కలసి గెలవలేము. విడివిడిగా గెలవాలి” అంది రాణి. నరవాహనుడు ఆలోచించాడు. “ప్రజల దృష్టిలో శూరసేనుడి పట్ల అసంతృప్తి ఉంది. ఈ సంధి ముందే చేసుకుంటే అమాయక [ప్రాణాలు మిగిలేవని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ నిరసన జ్వాలను పెంచితే శూరసేనుడి శౌర్యం అంతమవుతుంది” అన్నాడు నరవాహనుడు “నాకు కావలసిందీ అదే' అంది రాణి సంతోషంగా. ప్రజల అసంతృప్తి భరించలేక ఒక అర్ధరాత్రి శూరసేనుడు రాజధాని వదలి పారిపోయాడు. మహిముడు హరాత్తుగా వింతరోగ[గ్రస్తుడై మరణించాడు. ధక్కన్నపై విజయం సాధించిన విజయగర్వంతో రాజధానికి తిరిగి వస్తున్న యశోధరుడిపై ధక్కన్న వద్ద నుంచి ధనం

  • 160థది డడ కస్తూరి మురళీకృష్ణ లా

తీసుకుని మళ్ళీ అతడినే సింహాసనంపై ఉంచాడన్న నేరం మోపబడింది. ధక్కన్న వద్ద దోచుకున్న ధనం యశోధరుడు రాజకోశాధికారంలో జమచేయక పోవటం ఈ నేరానికి బుజువుగా చూపబడింది.

యశోధరుడికి రాణి శిక్ష విధిస్తోందని తెలియగానే హిమ్మకుడు, ఎరమంతకుడు, శుభాధరుడు తమ ఒప్పందం ప్రకారం రాజధానిపై విరుచుకుపడ్డారు. ఈసారి రాణి ముందుగానే అభిమన్యుడిని భట్టారక మరానికి పంపింది.

శూరమఠ నమీపాన ఘోరమైన యుద్దం జరిగింది. యుద్ధంలో రాణిసేనలు చెల్లాచెదురయ్యే సమయంలో నరవాహనుడు సమయస్స్ఫూర్తిని ప్రదర్శించి సంగీత విద్వాంసుడు రాజకులభట్టుచే విజయాన్ని నూచించే వాద్యనాదాలు చేయించాడు. అది విని ద్విగుణీకృతోత్సాహంతో కళ్శీరసేనలు విప్లవ సేనలపై విరుచుకుపడ్డాయి. ఏం జరుగుళుందో తెలిసేలోగా విప్లవసేనలు చెల్లాచెదురయి పోయాయి. పొమ్మకుడు నరవాహానుడి కత్తికి ఎర అయ్యాడు. ఎరమంతకుడు గుర్రం మీద నుంచి పడి నిరాయుధుడై కశ్మీర సేనలకు చిక్కాడు. యుద్ధరంగం నుంచి పారిపోతున్న యశోధరుడిని కళ్ళీర సేనలు వట్టుకున్నాయి. ఉదయగుప్ప్తుడు దేశం వదలి పారిపోయాడు.

మరుసటి రోజు రాజసభలో రాజద్రోహుల విచారణ జరిగింది. యశోధరుడు, శుభాధరుడు, ముకులుడు వారి వారి బంధువులతో సహా సమూలంగా నాశనం చేయబడ్డారు. ఎరమంతకుడి మెడకు పెద్దరాతి బండకట్టి వితస్తాలో విసిరేశారు.

లౌకికాబ్బ్దం 3977 (క్రీ.శ. 901) నుంచి అంటే గోపాలవర్మ కాలం నుంచి అభిమన్యుడి కాలం వరకూ కళ్ళీరాన్ని పట్టి పీడిస్తున్న చీడపురుగుల్లాంటి రాజు ద్రోహులను, మంత్రులను, వారి వంశీయులను, ఆస్తులను, సేవకులను ఉగ్రస్వరూపిణి అయిన డిద్దాదేవి దుర్గాభవాని అసురులను సంహరించినట్టు సంహరించింది.

నాడు సభలో రాణి నరవావానుడిని సన్మానించి అతడికి పాదాభివందనం చేసింది. సర్వ కళ్ళ్శీరం రాణికి పాదాభివందనం చేస్తే రాణి నరవాహనుడికి పాదాభివందనం చేసింది. నరవాహనుడిని సర్వకళశ్శీర ప్రధానమంత్రిగా నియమించింది.

నరవాహనుడు నిద్రించాడని తెలిసిన తరువాతే రాణి నిద్రించేది. నరవాహనుడు భోజనం చేశాడని తెలిసిన తరువాత భోజనం చేసేది. రాజ్యపాలన వ్యవహారాల్లో నరవాహనుడి మాటకు తిరుగులేదు

ఇది డిద్దారాణి పాలనలో ఉత్తమ సమయం. రాజ్యంలో శతృవులను నిర్దించి రాజ్యాన్ని సుస్థిరం చేసుకునేంతవరకూ డిద్దారాణి నరవాహనుడు, భుయ్యుడు వంటి ఉత్తమ వ్యక్తుల మార్గదర్శనంలో రాజ్యం చేసింది. కానీ ఎప్పుడయితే రాణికి సర్వాధికారాలు వచ్చాయో, మాడ కల్చణ కళ్ళీర రాజతరంగిణి కధలు :2=ై3వ2త2త2త2222:2ఊ2ఊజ32=4ఊడ2=2=1డ్రం జజ

తన అధికారానికి తిరుగులేదని నమ్మకం కలిగిందో ఆనాటి నుంచీ కళ్ళీరానికి దుర్దశ (ప్రారంభమయింది.

భుయ్యుడి అన్న సింధుడికి నరవాహనుడిని చూస్తే కన్నార్రగా ఉండేది. ఇద్దరూ ఒకప్పుడు సహాధ్యాయులు. కానీ ఇప్పుడు నరవాహనుడు సర్వ కళ్శీరాధ్యక్షుడు. మహారాణి అతని మాటలు జవదాటదు.

అయితే సింధుడు రాణిలో ఇంకా తనపై కుట్రలు ఆగిపోలేదన్న అభద్రతా భావం కనిపెట్టాడు. ఒకరోజు రాణి నరవాహనుడిని మర్యాద చేసి పంపిన తరువాత సింధుడు రాణిని సమీపించి చెప్పాడు. 'మహారాణి గొర్రై ఎప్పుడూ కసాయివాడిని నమ్ముతుందంటారు. నరవాహనుడు మీకు ఎంతో సహాయం చేశాడని మీరతడికి సర్వాధికారాలు అప్పగించారు. ఈ విషయంలో మీరు మహారాజు యశస్మరుడిని ఆదర్శంగా తీసుకోవాలి. సర్వాధికారాలు తనవేనని, రాణి తన మాట జవదాటదని నరవాహనుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. తానే త్వరలో కశ్మీర రాజవుతాడని అంటున్నాడు” అన్నాడు.

ఒకరోజు నరవాహనుడు రాణిని తన ఇంటికి ఆహ్వానించాడు. రాణి బయలు దేరే సమయానికి సింధుడు “మహారాణీ! తమరు సర్వ కళ్ళీరానికి రాణి. మీ కనుసన్నలలో మెలగవలసిన వ్యక్తి ఇంటికి మీరు భోజనానికి వెళ్ళటమా? పైగా అక్కడ భోజనంలో అతడు ఏ విషం కలుపుతాడో ఎవరికి తెలుసు” అన్నాడు.

ఆ రోజు రాణి నరవాహనుడి ఇంటికి వెళ్ళటం మానుకుంది. అవసరం ఉన్నంతవరకూ వ్యక్తిలో సద్గుణాలుగా కనిపించినవి. అవసరం తీరగానే అవమానాలుగా తోచటం మానవ సహజం. రాజ్యాధికారి ఎప్పుడయితే ఉత్తములను దూరం చేసుకుని తన చుట్టూ అధములను చేరదీస్తాడో అప్పుడు వ్యక్తిగా పతనం ఆరంభమయినట్లే!

రాణి తను రాజద్రోహానికి పాల్పదుతున్నట్టు అనుమానిన్తున్నట్టు, అందుకే తనతో ముభావంగా ఉంటోందని నరవాహనుడి వరకూ వార్త చేరింది. నరవాహనుడు రాణిని నిలదీశాడు.

ఆ సమయంలో సం(గ్రామ అనే డామరుడిని చంపాలని రాణి (ప్రయత్నిస్తున్నట్టు నరవాహనుడికి తెలిసింది. “సంగ్రాముడు మనకు ఎంతో సహాయం చేశాడు. మీరు నన్ను అనుమానిస్తే అనుమానించారు కానీ సంగ్రాముడిని అనుమానించవద్దు. అతను ఉత్తముడు” అని నరవాహనుడు అంటూండగానే వార్తాహరుడు పరుగున వచ్చి “మహారాణి సంగ్రాముడిపై వాత్యాప్రయత్నం వివలమయింది. సంగ్రాముడు ద్వారాధికారి కయ్యకుడిని చంపి

ఘోశదేశానికి పారిపోయాడు” అని చెప్పాడు. తై 170 :23232323232323232ఊ2ఊ2ఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ= కస్తూరి మురళీకృష్ణ ==

'ఘోశదేశంలో ప్రవేశించి సంగ్రాముడిని సంహరించండి” అని ఆజ్ఞాపించి రాణి నరవాహనుడి వైపు తిరిగి నవ్వింది.

నరవాహనుడికి వెర్రి ఆవేశం వచ్చింది. జీవితం మీద విరక్తి కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారేసరికి నరవాహనుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తతో కశ్ళ్శ్మీరం ఉడికిపోయింది. ఆనాటి నుంచి వ్యక్తిగా డిద్దాదేవి పతనం ఆరంభమయింది.

ఇంతలో మరోవార్త. డామరులంతా స్టానేశ్వరంలో సమావేశమై రాణికి వ్యతిరేకంగా విష్లవం లేపదీస్తున్నారన్న వార్త రాణికి తెలిసింది. వెంటనే రాణి పరిచారికలవైపు తిరిగి “నరవాహనుడిని పిలవండి" అంది అని వెంటనే తన పొరపాటు (గ్రహించింది. తానెంత ఘోరమైన తప్పు చేసిందో (గ్రహించింది. కానీ చేతులు కాలిన తరువాత అకులు పట్టుకుని లాభం లేదు. ఈ పరిస్థితిలో తనని రక్షించేవారెవరు?

ఆమె మదిలో ఫల్గుణుడు మెదిలాడు. కానీ ఫల్గుణుడు ఆస్తసన్వాసం చేశాడు. రాణి అద్దంలో తన ప్రతిబింబం చూసి నవ్వుకుంది.

'పల్లకీ సిద్దం చేయండి” ఆజ్ఞాపించింది.

న.

'మహారాజీ నేను అస్త్రసన్యాసం చేశాను. నేను అన్నమాట జవదాటను' అన్నాడు ఫల్గుణుడు మొండిగా.

“ఇది దేశానికి క్లిష్టమైన సమయం' అంది రాణి.

ఫల్గుణుడు కదలలేదు.

“మీరు రాజధానికి వస్తే మీకు ధనధాన్యాదులు లభిస్తాయి. బంగా రు భవనం మీది. మీరే కళ్ళీరానికి సర్వాధ్యక్షులు' అంది రాణి.

'ఫల్లుణుడు రాణి వైపు చూసి నవ్వాడు. “అందులో నేను అనుభవించనివి, విరక్తితో త్యజించనివీ ఏవీ లేవు” అన్నాడు.

రాణి ఆలోచించింది. లేచి నిలబడింది. రాజధానికి వచ్చి, నాకు సహాయం చేస్తే మీరు అనుభవించనిదీ, మీరు ఊహించని ఆనందాల గని మీకు లభ్యమౌతుంది” అంది.

ఫల్గుణుడు నవ్వాడు. 'నన్నేవీ కదల్బలేవు. నా నిశ్చయం నిశ్చలం' అన్నాడు.

'డిద్దారాణి మీ కోసం ఎదురు చూస్తూంటుంది' అని వెళ్ళిపోయింది రాణి.

మరునాడు ఫల్గుణుడు రాజధానికి పయనమయ్యాడన్న వార్త తెలిసి గర్వంగా నవ్వుకుంది రాణి. మనసుకెంత వైరాగ్యాన్ని బోధించినా అది స్వచ్చమైన వైరాగ్యం కాకపోతే వైరాగ్యమనే నడి కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు ::3ైడ2తడడడకకడకడడడడనకడడడడడకడడడడడనడడడడవడడడడడడ వ త? న ఊఊ

భావమే. అపహాస్యం పాలవుతుంది. కానీ ఫల్గుణుడికి రాణి అందం తప్పించి మరొకటి కనబడటం లేదు. రాజధాని చేరిన ఫల్గుణుడు జయగుప్పుడి సహకారంతో కళ్శీరాన్ని కొల్లగొట్టిసాగాడు. వీరి దుశ్చర్యలను గ్రహించిన రాజు అభిమన్యుడిని కపటంతో వధించాడు. లౌకికాబ్బము. 4048 (క్రీ.ళ.972) కార్తీక శుక్ష తృతీయనాడు అభిమన్యుడు మరణించటంతోరాణి అభిమన్యుడి పుత్రుడు అల్బ వయస్ముడయిన నందిగుప్తుడిని రాజుగా చేసింది.

కానీ పుత్రశోకము ఆమెని కృంగదీసింది. ఆమెకు జీవితంలోని అశాశ్వతత్వం గ్రహింపుకు వచ్చింది. ఈ సమయంలోనే భుయ్యుడు కళశ్ళ్శీరం తిరిగి వచ్చాడు. రాణి పరిస్థితి తెలిసి భుయ్యుడు ఆమెని కలిశాడు. భుయ్యుడు రాణికి సత్కార్యాలు చేయమని ప్రోత్సహించాడు. ప్రజలపై ఆమెకు (ప్రేమను కలిగించి ఆమె పాపాలను ప్రక్షాళనం చేశాడు.

ఆమెకు వేదాంతం బోధించాడు. “బ్రహ్మసత్యం జగన్మిధ్యా ఇత్యేవం రూపో వినిశ్చయ

సోయం నిత్యానిత్య వస్తు వివేకస్సముదాహృతః”

(బ్రహ్మ సత్యమయినది. జగత్తు అనిత్యమైనది అంటే తాటి పైన కల్పించబడిన సత్యము వంటిది. దీన్నే నిత్య-అనిత్య వస్తు వివేకమంటారు.

ఈ జీవితంలో ప్రతి సంతోషం వెనుక వెయ్యి దుఃఖాలు పొంచి ఉన్నాయి. ఒక్క ఆనందం కోసం మనిషి వెయ్యి దుఃఖాలను ఆహ్వానించి దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు.

ఆపాతా వైరాగ్యవతో ముముక్షూక భవాబ్దిపారం 'ప్రతియాతు ముద్యతాన్‌ ఆశాగ్రహో మజ్ఞయతేం తరాళే నిగృహ్య కంఠే విని వర్త వేగాల్‌.

ముముక్షువులను దుఃఖాది తాత్కాలికములతో పుట్టిన పై పై వైరాగ్యము కల వారిని సంసార జలధి దాటుటకు ప్రయత్నించు వారిని, ఆశ అనే మొసలి కంరం గట్టిగా పట్టి వేగంగా వారిని ఆ సంసార సముద్రంలో ముంచేస్తుంది.

ప్రపంచమంతా ఒక అభాస. మనం చేస్తున్నామనుకుంటాం. మనం సాధిస్తున్నా మనుకుంటాం. కానీ సర్వం ఈశ్వర కృప వల్లే సాగుతోంది. ఈ జగత్తంతా మన మనస్సు కల్పించుకున్న ఒక మాయ. చనిపోవటం అంటూ ఉండదు. మనిషి తన జన్మకర్మ అయిపోగానే ఒక వస్త్రం వదలి మరొక వస్త్రం ధరించినట్టు ఒక దేహం వదలి మరొక దేహం ధరిస్తాడు. ఇదంతా భగవంతుని లీల.

ఈ లీలను ఛేదించాలంటే మనిషి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తన దృష్టిని ఆ పరమేశ్వరుడిపై నిలిపి సత్మర్మలు చేయాలి. సత్మర్మలే సంసార జలధిని దాటేందుకు ఉపయోగపడినవి. వడా 172 డడడాలడకడకతడతడకడనడకకడకడడడడనననకడడకడడనడడడడడడడడడ222222ఊ కస్తూరి మురళీకృష్ణ నా

కున్తా కస్తే పుత్రస్సంసారో యమతీవ విచిత్ర॥

క స్సత్వం కః కృత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భభ్రాతః।।

ఎవరు నీ భార్య? ఎవరు నీ సంతానం? ఈ మానవ ప్రపంచమే విచిత్రమైనది. ఎవరు నీవు? నీదన్నడేదీ ప్రపంచంలో? నీ వీ ప్రపంచంలోకి ఎక్కడ నుండి వచ్చావు? ఈ విషయాలు విశ్లేషించు సర్వం విదితమౌతుంది

భుయ్యుడి (ప్రభావంతో రాణి నత్మర్మలు ఆరంభించింది. తన కొడుకు పేర అభిమన్యుపురం కట్టించి అభిమన్యస్వామి మందిరం నిర్మించింది. దిద్దపురం నిర్మించి దిద్దస్వామిని ప్రతిష్టించింది. తన భర్త బిరుదు కంకణవర్న పేరిట కంకణపురాన్ని నిర్మించింది. విద్యా విజ్ఞానార్జన కోసం విదేశాల నుంచి కళ్ళీరు చేరేవారి కోసం విహారం నిర్మించింది. మధ్య దేశం, లాట, సౌత్‌ (మాల్వా గూర్చుల మధ్య ప్రాంతం) ఉద్ర (ఒరిస్సా) దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ఒక మరం నిర్మించింది.

తన తండ్రి సింహరాజు పేరిట సింహస్వామి మందిరాన్ని నిర్మించింది. ఈ రకంగా కళ్ళీరంలో 64 మందిరాలను నిర్మించటమే కాదు జీర్ణ్షమయిన దేవాలయాలను పునరుద్ధరించింది. అయితే ఒక సంవత్సర కాలం తరువాత ఆశ అనే మొసలి రాణి కంఠాన్ని పట్టుకుని సంసా సాగరంలోకి ఈద్చింది. ఫల్లుణుడి మరణంతో రాణి బంధనాలు వీడిన పక్షిలా స్వేచ్చగా ఎగిరింది.ఈ సమయంలో ఆమె బాణుడి కొడుకు తుంగుడిని చూసి అతనిపై మరులుకొంది. సుఖాశ అనే మొసలి దం(ష్టలు రాణిని బలంగా పట్టుకున్నాయి.

“తుంగుడు అయితే భుయ్యుడు రాణి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ుంగు అభిమన్యుడి వయసు వాడు. రాణీ అతనిపై తమరు మరలుకొనటం భావ్యం కాదు. అనిత్య ప్రపంచంలో క్షణిక సౌఖ్యలాలసలో పడి శాశ్వత అపకీర్తిని సంపాదించకండి. భావితరం మిమ్మల్ని ఉత్తమ రాణిగా పరిగణించదు. మీ దుశ్చర్యలను గుర్తుంచుకుంటుంది. కానీ మీ మంచిని (గ్రహించదు”. అన్నాడు భుయ్యుడు బాధగా.

డిద్దాదేవి పెద్దగా నవ్వింది.

“'భుయ్యుడు తలవంచుకుని చెప్పాడు. “రాణీ శారీరక సౌఖ్యమే (ఢ్రేమ పరమోద్దేశ్యం కాదు. శరీరం మలమూత్ర భూయిస్టం. అది లోని ఎముకలకు.తొడుగు మాత్రమే. నాకు మీ శరీరం మీద మనసు లేదు. నాకు మీ శరీరంలో నివసిస్తున్న ఆత్మ మీద మనస్సుంది అన్నాడు.

రాణికి భుయ్యుడి మాటలు అర్ధం కాలేదు. లా. కల్దణ కశ్మీర రాజతరంగిణి కధలు ౩3222222. 1118 ఊఊ

“అర్ధం కాని మాటలతో కాలయాపన చేయకు. నీకు నేను తుంగుడితో అనుభవిస్తున్న సౌఖ్యాలు తలచుకుని అసూయగా ఉంది. ఆ అసూయను, నీ చేతకానితనాన్ని వేదాంతంతో కప్పిపుచ్చుతున్నావు” అంది రాణి.

భుయ్యుడు నవ్వాడు. “మహారాణీ! నాకు వేటి మీద వ్యామోహం లేదు. నేను కేవలం నా ధర్మం నెరవేర్చేందుకు బ్రతికి ఉన్నాను. మీరు సత్మర్మలు చేస్తే నాకు సంతోషం. ఏనాడో ఒకనాడు చనిపోవాలని తెలిసిన నాకు కర్తవ్యపాలన తప్ప మరో ధ్యాస లేదు. కర్తవ్యం కోసమే నేనీ జీవన విషాన్ని తాగి బ్రతుకుతున్నాను” అన్నాడు.

రాణి నవ్వింది. “రాణిగా నా ఆజ్జ పాలన నీ కర్తవ్యం కదా?' అడిగింది.

భుయ్యుడు “అవును” అన్నాడు.

“అయికే ఈ విషం తాగు అని విషాన్ని భుయ్యుడి ముందుకు తోసింది.

భుయ్యుడు రాణి కళ్ళల్లోకి చూశాడు. “మహారాణీ! మనిషికి తోడు వృద్దాప్యంలోనే అవసరం అవుతుంది. అప్పుడే మనిషి తోడు లేకపోతే భగవధ్యానమే తోడుగా మిగులుతుంది. భగవధ్యానం అలవర్చుకోండి' అని చెప్పి విషం తీసుకుని రాణి కళ్లల్లోకి చూస్తూ

సమృత్యుర్న శంకానమే జాతిఖేదః

పితానైవ మే నైవ మాతానజన్న।

నబంధుర్న మిత్రం గురునైవ శిష్యశ్చిదానందరూపః శివోహం శివోహం॥

అని విషాన్ని తాగేశాడు. (మరణమంటే భయంలేదు, జాతి ఖేదం నాకు లేదు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, నాకు జన్మ లేదు, మరణం లేదు, శతృవు లేడు, మిత్రుడు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు, చిదానంద స్వరూపుడను నేను శివుడను నేను శివుడను) భుయ్యుడు రాణి కళ్ళల్లోకి చూస్తూ నిర్మలంగా ్రాణాలువిడిచాడు.

రాణి భుయ్యుడి శవాన్ని వితస్తలో పారేయించింది. ఆమెకు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే భరించే సహనం నశిస్తోంది. అందరూ తను చెప్పినట్టు వినాలి. తనకు భృత్యుల్లా మెలగాలి.

భీమగుప్తరాజు కాస్త ఎదిగి మంచి చెడ్డ గ్రహించే విచక్షణ జ్ఞానం వచ్చేసరికి రాణి నీతిబాహ్యమైన చర్యలను నిరసించసాగాడు. ఒక రోజు నిండుసభలో 'శీలంలేని వాళ్లతో దేశం నిండిపోయిందని అన్నాడు. ఆ రోజే రాణి అతడిని చెరసాలలో బంధించి హింసించి చంపేసింది. రాణి ఇతరులనెవరినీ రాజుగా చేయదలచలేదు.

లౌకికాబ్దం 4056 (క్రీ.శ. 980) 5వ సంవత్సరంలో రాణి తానే రాజై కళ్ళ్శీరాన్ని పాలించసాగింది. రాణి ప్రియుడు తుంగుడు మకుటం లేని మహారాజయ్యాడు. రాణి రాజ్యానికి కడ 174 కడుకుని === కస్తూరి మురళీకృష్ణ తై

వచ్చి 28 ఏళ్ళు దాటుతోంది. తుంగుడు తన వయసు వారితో తిరిగేందుకు ఇష్టపడుతున్నాడు. సర్వసైన్యాధిపతి అయినప్పటి నుంచీ తుంగుడు శతృదండయా(లలో రాజధానికవతల ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అక్కడ అనేక సౌందర్యవతుల సాంగత్యంలో సమయం గడుపుతున్నాడని డిద్దారాణికి తెలిపింది.

ఇప్పుడామెకు ఏమీ చేసేందుకు మనస్మరించటం లేదు. వయసుడిగిపోయింది. తాను వేటి వెంట పడిందో అవన్నీ క్షణికమనీ, క్షణభంగుర మైనవనీ బుడగవంటివనీ అర్ధమయింది. ప్రపంచంలో సర్వం అర్ధరహితంగా కనిపిస్తున్నాయి. మానవ కోరికలు, వాటి వెంట తాపత్రయాలు, సుఖాలు, దుఃఖాలు, ఆరాటాలు, పోరాటాలు సర్వం అర్ధవిహీనంగా, ఒక పరిహాసపూర్వకమైన ఆటలాగా తోస్తున్నాయి. భగవంతుడు మాయలన్నీ కల్పించి, ఆకర్షణ పూర్వకమైన ఆనందాల వెంటనే దుఃఖాలు కల్పించి మనిషికి విచక్షణ జ్ఞానాన్నిచ్చి, తనకేం కావాలో ఎంచుకునే శక్తిని మనిషికే వదిలిపెట్టాడు. మనిషి తన అజ్ఞానంతో అహంకారంతో అశాశ్వతాలే శాశ్వతాలని, దుఃఖాలనే సుఖాలని బ్రమపడి తనలోని భగవంతుడిని నాశనం చేసుకుంటాడు. తీరా నిజం (గ్రహించేసరికి మొసలి మనిషిని సంసార గర్భంలోకి తెచ్చి వదలి పెడుతుంది. మళ్ళీ పునరపిజననం, పునరపి మరణం, పునరపి జననీ జరరే శయనం హే భగవాన్‌!

ఉన *

పిలలందరూగోలగా తనచుట్టూచేరటంతో ఉలిక్కిపడి కళ్ళుతెరిచింది రాణి.

“'మహారాణి నేను అధిక రేగుపళ్ళను సంపాయించాను' సంగ్రామ సింహుడు తన రేగుపళ్ల బుట్టను రాణి ముందుంచాడు.

మిగతా అందరూరక్తాలు ఓడుతూ, గాయాలతో ఉన్నారు. కానీ సంగ్రామ సింహుడి శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు.

“ఇన్ని పళ్ళు ఎలా సంపాయించావు? అడిగింది రాణి.

“మహారాణీ! వీరంతా పోరాడి సంపాయించిన పళ్ళన్నీ వారి మధ్య పోరాటం పెట్టి నేను సం(గ్రహించాను. వారు పోరాదుకుని అలసిపోయారు. వారి పళ్ళన్ని నావే అయ్యాయి” అన్నాడు సంగ్రామ సింహుడు గర్వంగా.

రాణి పెద్దగా నవ్వింది. “నీవే సామ్రాజ్యాధిపతివి. ఎదుటివారి అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని పైకి ఎగబ్రాకగలిగేవాడే కలియుగంలో నాయకుడవుతాడు. వాడే ప్రజల మధ్య చిచ్చుపెట్టి, వారు కొట్టుకు ఛస్తూంటే తాను పబ్బం గడుపుకుంటాడు. ధర్మం, నీతి పేరెత్తే వారు కలియుగంలో రాజులు కాలేరు అని సంగ్రామసింహుడిని యువరాజుగా అఖిషిక్తుడిని చేసింది డిద్దారాణి. మె=== కల్టణ కశ్మీర రాజతరంగిణి కథలు 2323222222 వర్‌. 32

కానీ డిద్దారాణి మనసులో ఓ మూల తనుచేసింది తప్పని తెలుస్తూనే ఉంది. తను కళ్ళ్శీరానికి కాదు సకల భారతదేశానికి ఘోరమైన అన్యాయం చేసింది. నాయకుడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలను ్రష్టుపట్టించే నీచుడిని రాజు చేసింది. ఇక రాజులంతా ఈ నీచుడిని ఆదర్శంగా తీసుకుంటారు. ఉత్తమ రాజుల పరంపరను తాను కళ్ళ్మీరం నుంచి శాశ్వతంగా నిర్మూలించింది. మాటలతో మభ్య పెట్టేవాడే మహారాజు.

తానెలా ఒంటరో అలా ధర్మదేవతను ఒంటరిగా చేసింది తను. భుయ్యుడు నిజం చెప్పాడు. తాను చేసిన మంచి పనులు జనులు గుర్తించరు. తాను చేసిన అన్యాయం వారిని బాధిస్తుంటే తన మంచిని వారెలా గుర్తిస్తారు?

వార్ధక్యే చేంద్రియాణాం విగతగతి మాతాశ్చాధిదైవాది తాపైః

పొపై రోగై వియోగైస్వవసితవపుః సొధిహనం చడీనమ్‌।

మిధ్య మోహమి లైషై భ్రమతి మమ మనోధూర్దటే ధ్యాని శూన్యం

క్షన్తల్యో అపరాదః శివ శివ శంభో (శ్రీమహాదేవ శంభో॥

(ఇప్పుడు వార్ధక్యంలో నా ఇంద్రియాలు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాయి. సరైన నిర్ణయం శక్తి ఉడిగిపోయింది. నా శరీరంలో జీవం ఉంది కానీ అవే రోగాలతో దుఃఖాలతో పాపపు చర్యలతో నా జవసత్వాలుడిగిపోయాయి. కానీ ఇంకా నా మనస్సు శివుడిపై నిలవకుండా సంసార లంపటాల వైపు, క్షణిక సుఖాలవైపే పరుగెడుతోంది. శివ, మహాదేవ, శంభో, నన్ను క్షమించు).

భుయ్యుడు అంటూంటే భుయ్యుడితో పాటూ రాణి తానూ అంది. హరాత్తుగా కళ్ళు తరచి చూసింది రాణి. భుయ్యుడెలా వచ్చాడు? ఆమె ఎదురుగా భుయ్యుడు నవ్వుతూ నిలబడ్డాడు.

రాణి డిద్దాదేవి కళ్ళు మూయలేదు. ఆమె ప్రాణం కళ్ళల్లోంచి పోయి పంచభూతాల్లో కలిసిపోయింది. అది లౌకికాబ్బ్దం 4079 (క్రీ.శ. 1003)వ సంవత్సరం భాద్రపద శుద్ద అష్టమి తిధి.

ఈనాటికీ కశ్మీరంలో ఆడపిల్లలకు డిద్దారాణి పేరు పెట్టే ఆనవాయితీ ఉంది.

న మడత ధ్‌ డడ కస్తూరి మురళీకృష్ణ నా

శ్‌ నె శే | ల ఘమ) భువ ఆటా న! వై క మాక (లో లో చ [1 కా చ వ క్‌ ధ్‌ చర్‌ గోదకున్న చిన్న రంధ్రంలోంచి లోనికి జాలువారుతున్న సూర్యకిరణాన్ని చూస్తూ కూచున్నాడు హర్షదేవుడు. ఎంత విచిత్రం? ఒక్క చిన్న కిరణం ఎంత కాంతినిస్తోంది? చీకటి కొట్టంలాంటి గదిని సర్వం వెలుతురుతో నింపేస్తోంది. మంచి మనిషి కూడా కిరణంలాంటివాడేనేమో ఒక్క మంచి మనిషి తనచుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుతురు నింపుతాడు. ఆ మంచి మనిషి రాజే అయితే, దేశం సర్వం అత్యుత్తమమౌతుంది. హర్షదేవుడి మనసు బాధతో మూల్లింది. అందరికీ రాదు అటువంటి అవకాశం. అయాచితంగా వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వినియోగించని బ్రతుకూ ఒక బతుకేనా? హర్షదేవుడు ఆ కిరణం వైపే చూస్తూ కూచున్నాడు. నా! కల్దణ కళ్శీర రాజతరంగిణి కధటు ౭తడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడడ2 క ఊం

ఎలా ఆరంభమయింది తన జీవితం? ఎన్ని మలుపులు తిరుగుతోంది? చివరికి ఏమౌతోంది? అంతా విచిత్రంగా ఉంది.

ఒకనాడు ఈ (ప్రజలే తనకు నీరాజనాలు పలుకుతూ తనను రాజును చేశారు. ఈనాడు ఈ ప్రజలే తనని తరిమి తరిమి కొడుతున్నారు. తనకు నిలువనీడలేకుండా అయిపోయింది.

ఒకనాడు ఈ రాజ్యంలో ప్రతి వ్యక్తీ తన కనుసన్నలలో ఆశగా మెలిగేవాడు. తన చిరునవ్వు తమపై ప్రసరించాలని తపించేవారు.

ఈనాడు తాను ఆశయం కోరతాడేమోనని ప్రజలు తనని చూసి తలువులు బిగించుకుంటున్నారు. చిరు సవ్వడి వినిప్తే చాలు- తన మృత్యువే వస్తోందని తాను భయపడుతున్నాడు. తన స్థితిని తలచుకొని నవ్వుకున్నాడు హర్షదేవుడు. భగవంతుడు లేడనుకున్నాడు తను.

తన పూర్వీకులు తన కోనం ఏర్చరచిన బాట విడచి, స్వధర్మం వదలి, పరాయిధర్శ్మపు మోసపు మాటలకు లొంగి చేయకూడని ఘోరకృత్యాలన్నీ చేశాడు. అన్నీ తనకు అనుకూలంగా జరిగినన్ని రోజులు భగవంతుడు లేడు. ఈనాడు తనకన్నీ వ్యతిరేకంగా జరగుతూంటే, తన ప్రమేయం లేకుండానే జీవితం తన చేతిలోంచి జారిపోతూంటే ఇప్పుడు గ్రహింపుకు వస్తోంది. అసలు జీవితం తన పిడికిలిలో ఉన్నదెప్పుడు? ఉన్నదని తాను అనుకున్నాడు కానీ, మొదటి నుంచీ దేనిలోనూ తన ప్రమేయం లేదు. అహంతో అంధుడై తాను విర్రవీగాడు.

కళ్ళను క్రమ్మిన పొర తొలగింది. నిజం నిశీధిలా ఎదుట నిలిచినప్పుడు అసలు నిజం తెలిసింది.

హర్షదేవుడు తన చుట్టూ చూశాడు.

అది పశువులపాక, అంతా గడ్డితో, పశువుల విసర్జనలతో, ఒకరకమైన వాసనతో నిండి ఉంది. ఆ గడ్డిమీదే ఉన్నాడు హర్షదేవుడు.

అతనికి తన గతం గర్హుకు వచ్చింది.

ఇలా ఎలుకలా (బతకటం తనకు కొత్తకాదు.

ఇటువంటి పరిస్థితి నుంచే తాను సింహాసనం అధిష్టించాడు. మళ్ళీ అటువంటి స్థితికే చేరుకున్నాడు.

కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది.

గతంలో తానిటువంటి దయనీయస్థితిలో ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏనాడో ఒకనాడు తాన్‌ అంధకారం నుండి బయటపడి రాజ సింహాసనం అధిరోహిస్తానన్న ఆశ ఉండేది. కానీ న ననన మురళీకృష్ణ నా

ఈనాడు ఈ అంధకారం నుంచి విముక్తి మరో అంధకారం లాంటి మరణం తప్ప మరొకటి లేదు.

గోడకావలి నుంచి ఒక ఎలుక బిరబిరా పరుగెడుతూ వచ్చింది.

హర్షదేవుడి వైపోసారి చూసి, ముఖం తిప్పుకుని ముందుకు సాగింది.

హర్షదేవుడు నవ్వుకున్నాడు.

చివరికీ ఎలుకకు తాను లోకువైపోయాడు.

దానిమీదకు విసిరేందుకు గడ్డి ఎత్తాడు.

అంతలో అతని దృష్టికి దూరంగా నిశ్శబ్దంగా, అడుగులేస్తూ ఎలుకను సమీపిస్తున్న పిల్లి కనిపించింది. చేయినలాగే ఉంచి ఊపిరి విగపట్టాడు.

ప్రపంచమంతా ఇంతేనా?

ఒకరిది గెలుపు. మరొకరిది ఓటమి. ఒకరికి చెలగాటం, మరొకరికి ప్రాణ సంకటం!

శ యర 2

అది లౌకికాబ్దం 4100వ సంవత్సరం (క్రీ.శ,1101) భాద్రపద శుక్లపక్షం. అవి కళ్ళీర రాజు హర్షదేవుడిని రాజధాని నుండి పారద్రోలి ఉచ్ళలుడు పిల్లి ఎలుకను వేటాడినట్టు హర్షదేవుడిని వేటాడుతున్న రోజులు.

కళ్మీరమంతా ఒక ఉత్సాహంతో ఉద్రేకంతో ఊగిపోతున్న రోజులవి.

లౌకికాబ్దం 4079 (క్రీ.శ.1008)వ సంవత్సరంలో డిద్దాదేవి మరణం తరువాత, ఎక్కువ రేగుపళ్ళు ఏరి యువరాజయిన సంగ్రామరాజు కళ్ళీరానికి రాజయ్యాడు.

డిద్దాదేవి, మరణ సమయంలో తుంగుడు, సంగ్రామరాజు ఒకరికొకరు ఎట్టిపరిస్టితులలో హాని కలిగించుకోకూడదని శాశించటంతో సంగ్రామరాజు తుంగుడినేమీ చేయలేకపోయాడు. భూతికళశుడితో జరిగిన సంగ్రామంలో విజితుడయిన తరువాత రాజు కూడా తుంగుడంటే భయపడసాగాడు. దాంతో తుంగుడికి అడ్డూ అదుపులేకుండా అయింది.

అవి భారతదేశంలో తరుష్కులు కాళ్ళూనుకుంటున్న రోజులు.

మూడవ ఖలీఫా ఉమర్‌ (క్రీ.శ.638-44) కాలం నుంచీ అరబ్బులకు భారతదేశ సంపదలపై కన్సుపడింది. క్రీ.శ. 664లో అబ్బుర్‌ రహూమాన్‌ గాంధారంపై దాడి చేసి దాదాపుగా వెయ్యిమంది భారతీయులను ఇస్తాం మతంలోకి మార్చాడు. గ కలు కళ్ళీర రాజతరంగిణి కధలు :232ద222తతడకడకకకతతతనతతతతడడడ2డనతడడడడడ2డడ2 70 ఊడ

క్రీ.ఈ.712 ప్రాంతంలో 17 ఏళ్ళ మహమ్మద్‌ బీన్‌ భాసిం సింధురాజు దాహిర్‌ను ఓడించటంతో భారతదేశ పవిత్రభూమిపై, తురుష్కుల పాదాలు పడ్డాయి. ఆ పాదాలు పడ్డ చోటల్లా రక్తపుటేరులు పొర్లాయి. అమానుష కాండలు కరాళనృత్యం చేశాయి. ఖాసిం సింధు పరిసర ప్రాంతంలోని ప్రజలను అతి క్రూరమైన పద్దతులలో ఇస్లాం మతంలోకి మార్చాడు.

ఇస్తామీయులు విగ్రహారాధనకు వ్యతిరెకులు “ఎవరి ధర్మం వారు అనుసరించు కోవచ్చు'ననే సిద్దాంతం వారికి పడదు.

“అందరూ తమ ధర్మం అనుసరించాలి” అంతే! అందుకే వారు భారతీయుల విగ్రహారాధనను అక్షేపించి వారి పవిత్ర మందిరాలను అనేకం ధ్వంసం చేశారు. విగ్రహాలను ముక్కలు ముక్కలు చేశారు మందిరాల నుండి విరగ్గొట్టిన రాళ్ళ ముక్కలతో మసీదులు నిర్మించుకున్నారు. విగ్రహాల ముక్కలతో మసీదు ముందరి మెట్లను నిర్మించుకున్నారు.

క్రీశు717లో ఖలీఫా ఉమర్‌ భారతదేశంలోని రాజులందరూ ఇస్లాం మతం తీసుకోవాలని వర్తమానాలు పంపాడు. అనేక భారతరాజులు ఖలీఫాకు భయపడి ఇన్లాం మతం స్వీకరించారు.

భారతదేశాన్ని పూర్తిగా కాల్లగొబ్టేంతవరకూ ప్రతి సంవత్సరం భారతదేశంపై దండెత్తుతానని శపథం చేసి మహమ్మద్‌ గజనీ క్రీ.శ. 1000 నుండి క్రీ.శ. 1027 వరకు 17మార్లు భారతదేశంపై దండెత్తాడు.

క్రీ.శ.1018లో గజనీ తన దృష్టిని పవిత్ర కళ్మీరంవైపు సారించాడు.

కళ్శీరంలోని మందిరాల్లో ధనం సోమనాధ దేవాలయ మందిరంలోని ధనాన్ని మించిందని తెలుసుకుని కళ్ళీరాన్ని కొల్లగొట్టాలని తహతహలాడాడు. “చరిత్రలో విగ్రహ విధ్వంసకుడిగా ప్రసిద్ధిచెందాలని' తపించిన గజనీ కళ్ళ్మీర విగ్రహాలను ధ్వంసం చేయాలని ఉవ్విళ్ళూరాడు.

గజనీకి కళ్మీరానికి మధ్య హిమాలయంలా శ్యాహి రాజు బ్రిలోచనపాలుడు నిలిచాడు.

సంగ్రామ రాజు గజనీ దండయాత్రలోని ప్రమాదం గమనించాడు. త్రిలోచనపాలుడు ఓడిపోతే గజనీ వెల్లువ కళ్ళీరాన్ని ముంచెత్తకుండా అడ్డుకునే వారెవ్వరూ లేరని గ్రహించాడు. అందుకే ్రిలోచనపాలుడికి సహాయంగా పెద్ద సేననిచ్చి తుంగుడిని పంపించాడు.

ఈ సందర్భంగా సంగ్రామరాజు భారతదేశంలోని ఇతర రాజులకన్నా ఎంతో దూరదృష్టితో వ్యవహరించాడు. కానీ మహమ్మదీయ సేనలను ఎదుర్శొనేందుకు తుంగుడిని పంపటం అతడు చేసిన పొరపాటు.

మదిరపాన మత్తుడు, మదాంధుడు అయిన తుంగుడు శ్యాహిరాజు చేసే అతిధి మర్యాదలు అందుకుంటూ కాలం గడిపాడు. కాసీ తురుష్ములను ఎదుక్కొనేందుకు ఎటువంటి చర్యలను తీసుకోలేదు. త్రిలోచన పాలుడు ఎన్నిమార్లు కర్తవ్యాన్ని గుర్తు చేసినా తుంగుడు నవ్వుతూ మాట తప్పించేవాడు. జం 180 డడ కస్తూరి మురళీకృష్ణ కా!

చివరికి తురుష్కులను ఎదుర్శొనే రోజు రానే వచ్చింది. సముద్రంలా దిగంతం వరకూ వ్యాపించి ఉన్న తురుష్మసేనను చూడగానే తుంగుడు యుద్ధరంగం వదిల పారిపోయాడు అతడితో పాటు అతడి సేన పారిపోయింది.

సహాయానికి వచ్చిన కళ్శీరసేన పారిపోవటంతో, శ్యాహిరాజు సేన కూడా యుద్దభూమి వదలి పారిపోసాగింది.

కానీ జయసింహుడు, శ్రీవర్దనుడు, సంగ్రామ డామర వంశజుడైన విభ్రమార్శుడు మహాపరాక్రమంతో తురుష్కసేనపై విరుచుకుపడ్డారు. తురంగ యుద్దంలో ముగ్గురూ పటు పరాక్రమంతో శతృవులను చీల్చి చెండాదటంతో నిజదేశ గౌరవం నిలచింది. ఇటువంటి వీరులు మరో ముగ్గురు త్రిలోచన పాలుడికి అండగా ఉండి ఉంటే ఈ దేశ చరిత్ర మరో రకంగా ఉందేది,

శ్యాహిామహారాజు త్రిలోచనపాలుడి దర్జాంత పరాక్రమం ముందు తురుష్కసేన తుఫాను గాలికి వణికే చిగురుటాకులూ వణికిపోయింది. నీటిని బంధించిన వృత్రాసురుడిని సంహరించి ఇంద్రుడు నీటి కాల్వలు కట్టించినట్టు త్రిలోచనపాలుడు తురుష్కుల గుండియ చీల్చి మ్లేచ్చరక్తాన్ని వరదలు కట్టించాడు. కల్పాంతంలో పరమశివుని ప్రళయతాందవాన్ని స్ఫురింపజేసింది అనాడు యుద్దరంగంలో త్రిలోచనపాలుడి విజృంభణ. ఆ రకంగా త్రిలోచన పాలుడు కవచధారులైన కోటిమంది యోధులతో పోరాడుతూ శాత్రవ వ్యూహాన్ని భగ్నపరిచాడు. కానీ ఒంటరివాడు ఎంతకాలం ఎగసిపడుతున్న ప్రవాహాన్ని అడ్దుకోగలడు?

యుద్దరంగంలో వృధాగా ప్రాణాలు కోల్పోవటం కంటే బ్రతికి ఉంటే వనాటికైనా శతృవుల నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవచ్చన్న ఆలోచనతో త్రిలోచనపాలుడు కదనరంగం నుండి తప్పుకున్నాడు.

ఆ రకంగా తౌశీనది తీరాన విజయలక్ష్మి తనను వరించినా, మహమ్మద్‌ గజనీ త్రిలోచనుడి అతి మానుష పరాక్రమాన్ని స్మరించి అడుగు ముందుకు వేయలేదు. కశ్మీర ప్రాంగణంలోనే ఇంతటి వీరులుంటే, పెట్టని కోటల వంటి పర్వత పంక్తుల నడుమ ఇంకెంత గొప్ప వీరులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడి, తాను గెల్పుకున్న చుట్టుప్రక్కల ప్రాంతాలలోని సనాతన ధర్మానుయాయులను ఇస్లాం మతంలోకి మార్చి వెనుతిరిగాడు.

మళ్ళీ రెండేళ్ళ తరువాత ఇంకా ఆశవీడని గజనీ కళ్ళీరాన్ని ఆక్రమించాలని ప్రయత్నించాడు. కానీ లోహార రాజు అతని దూకుడుకు కళ్ళెం వేశాడు. దాంతో కళ్ళ్శీరాన్ని గెలుచుకోవాలన్న గజనీ కోరిక తీరలేదు.

అయితే అడుగుపెట్టిన చోటల్లా మనుషులను తన మతానికి మార్చే మహమ్మద్‌ గజనీ భారతదేశంలో తన ప్రతినిధులను వదలివెళ్లాడు. వీరి ప్రధాన ఉద్దేశ్యం ఏరకంగానైనా కళ్ళ్మీరంలో ప్రవేశించి అక్కడ వారిని తమ మతంలోకి మార్చుకోవటం, కళ్ళ్మీర దేవాలయాలను కౌల్లగొట్టటం === కల్టణ కళ్ళీర రాజతరంగిణి కథలు 23౭22 1కే 22322

శతృవుకు వెన్నిచ్చి పారిపోయి కళ్శ్మీరం చేరిన తుంగుడిని సంగ్రామ రాజు ఏమీ అనలేదు. లౌకికాబ్బం 4100 (క్రీ.శ. 1028) ఆషాడమాస ప్రధమ దినాన సంగ్రామ రాజు మరణించాడు. అతని తరువాత అతని తనయుడు హరిరాజు రాజయ్యాడు. అయితే 22 రోజుల పాలన తరువాత హరిరాజు మరణించటంతో, హరిరాజు తమ్ముడు సాగరుడు బాలుడు అనంతుడిని రాజుగా అఖభిషిక్తుడిని చేశాడు.

సింహాసనంపైనే ఎదగటంతో అనంతుడికి చిన్నప్పటి నుంచే దుష్టపుటలవాట్లయ్యాయి. అహంకారం అతడిని నడిపించసాగింది.

అనంతుడి భార్య సూర్యమతి ఉత్తమురాలు. ఆమె గౌరీశ్వర మందిరాన్ని నిర్మించింది. వితస్త ఒద్దున సుభటమరాన్ని నిర్మించింది. ఆమె విజయేశ, అమరేశ మరాలను నిర్మించింది. (అంబుర్వేర్‌లోని సరుక్షాత్‌ సాహిబ్‌ జియురాత్‌ ఈ మరాల శకలాలతో నిర్మించినదే).

రాజు తన చెడు అలవాట్ల కోసం ముందు వెనుక చూడకుందా చేసిన అప్పులతో కళ్ళీరానికి సంభవించిన విపత్తు నుండి రాణి సూర్యమతి తన నగలమ్మి కశ్మీర గౌరవాన్ని కాపాడటంతో రాజు ఆమెకు దాసుడయ్యాడు. ఆమె చెప్పినట్టు చేయసాగాడు. రాణి అధికార బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ కశ్మీరంలో తిరిగి వెన్నెలలు విరియసాగాయి. అయితే తన కుమారుడు కలశుడిపై రాణికున్న గుడ్డిప్రేమ కళ్శీరానికి విపత్తులా సంభవించింది. దేశ వ్యవహారాల నుండి పుత్ర [్రేమను వేరు చేయకపోతే సంభవించే దుష్పరిణామాలు ఈ రాణికి తన పుక్రునిపై ఉన్న గుడ్డి ప్రేమ ఫలితాలను గమనిస్తే స్పష్టమౌతాయి.

రాణి ప్రోద్బలంతో రాజు లౌకికాబ్బ్దం 4039 (క్రీ.శ. 1063) కృత్తిక మాసంలో సింహాసనాన్ని యువకుడైన కలశుడికి అప్పగించాడు.

అయితే కలశుడు దుష్టసాంగత్యానికి మరిగాడు. బిజ్జ, పరరాజు, పాజవంటి ధూర్తులు కలశుడికి ప్రియాతి ప్రియమైన మితృలయ్యారు. జయానందుడి కొడుకు నాగుడు కలశుడిని దుష్టకార్యాలు చేసేందుకు ప్రోత్సహించాడు. వీరి సాంగత్యంలో పడి కలశుడు బూతులు మాట్లాడటమే హాస్యమని, (ప్రజలను హింసించటమే సత్యపధమని లైంగిక చర్యయే గొప్ప యోగమని నమ్మాడు.

వారు వీరు అని లేకుండా కనబడ్డ ప్రతి ప్రీని వాంఛించి వేధించటం ఆరంభించాడు. అర్ధరాత్రిళ్ళు దొంగతనంగా ఇళ్లలో దూరి స్త్రీలను బలాత్మరించటం ఆరంభించాడు. ఇలాగే ఒకరోజు ఒకరింట్లో దూరంగా కుక్కలు మొరిగాయి.వాటికి భయపడి పరుగెత్తుతూంటే ప్రజలు పట్టుకుని దొంగ అనుకుని దేహశుద్ది చేశారు.

ఆ వార్త తెలిసిన అనంతుడు కలశుడికి కబురు పెట్టాడు. వడం 1ది2ై ఇకకడ కస్తూరి మురళీకృష్ణ 232222

'రాజువై ఉండి అర్ధరాత్రిళ్ళు నీ ప్రజల ఇళ్ళల్లోనే దుష్టపుటాలోచనలతో దొంగలా (ప్రవేశిస్తావా? అని తిట్టి అతడిని బంధించిబోయాడు.

కానీ బిజ్జుడు అద్దుపడ్డాడు. “రాజా, నేను కలశుడి ఉప్పుతిని (బ్రతుకుతున్నాను. నా ముందు నా రాజును అవమానపరిస్తే నేను సహించలేను” అని కలశుడిని తీసుకువెళ్ళిపోయాడు.

ఇది తెలిసి సూర్యమతి అనంతుడిని దూషించి కలశుడి మందిరానికి పరుగెత్తింది. వెంట వెళ్ళిన రాజును బిజ్జు లోపలకురానివ్వలేదు.

రాజు అవమాన భారంతో గిరుక్కున వెనక్కు తిరిగాడు. ఇక కళ్ళీర రాజధానిలో ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. రాణిని కూడా తనతో వచ్చేయమన్నాడు. దారంతా రాణి అనంతుడిని సాధిస్తూనే ఉంది.

'కలశుడు మీ సంతానమే కావచ్చు. కానీ అతడీ రాజ్యానికి అధిపతి. రాజు ఎటువంటి వాడైనా కనీసం వ్యక్తిగతంగా కాకపోయినా అతను పాలిస్తున్న దేశానికైనా గౌరవం ఇవ్వాలి. మీరు మీ తనయుడి ఆత్మగౌరవానికి భంగకరంగా ప్రవర్తించారు" అని దూషించింది.

చివరికి సహనం నశించి అనంతుడు 'వాడు చేసిన పనేమిటో తెలుసా? వాడి ప్రవర్తన ఒక దేశాధినేతకు తగ్గ ప్రవర్తనలా ఉందా? అర్ధరాత్రి జిందురాజు కోడలి సంగమానికై ఉవ్విళ్ళూరుతూ జిండు రాజభవనంలో దొంగలా ప్రవేశిస్తే, కుక్కలు వెంటపడగా పరుగెత్తుతూంటే దొంగ అనుకుని ఛండాలురు దేహశుద్ది చేశారు. ఇతడేనా పవిత్ర కళ్మీరానికి రాజు? ఈ రాజుకు గౌరవం ఇవ్వకపోతే కళ్శీరాన్ని అగౌరవ పరచినట్టా? రాజు అనే మాట గౌరవాన్నే చెడగొట్టిన ఈ ధూర్తుడిని గౌరవిస్తే కశ్మీరాన్నే కాదు సర్వ భారతదేశంలో మన పూర్వీకులు ఏర్పరచిన పరంపరనే అవమానించినట్టు అవుతుంది. పుత్ర ప్రేమ వల్ల అంధురాలివై నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీవే సామాన్యురాలివై, నీ ఇంట్లో నీ కూతురుని మోహించి, రాజు దూరితే ఏం చేస్తావు? గౌరవించి పూజిస్తావా?” అని అడిగాడు కోపంగా. తన భార్య పై నిరసన ప్రదర్శించి రాజధాని వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సూర్యమతి భర్తను అనుసరించింది.

రాజధాని వదలివెళ్తున్న తాత వెంట చాలా దూరం వెళ్లాడు. కలశుడి పుత్రుడు హర్గదేవుడు. రాజకీయాల్లో బంధుత్వం ప్రసక్తిలేదన్న భావం హర్షద్రేవుడిలో ఆనాడే జనించింది. అనంతుడు నగరం వదలి వెళ్తున్నాడని తెలియగానే రాజపరివారం, ఇతర ప్రజలు తమ ధనధాన్యాలతో సహా రాజధాని వదలి అనంతుడిని అనుసరించారు.

లౌకికాబ్దం 4155 (క్రీ.శ. 1079) జ్యేష్రమూాసంలో అనంతుడు విజయేశ్వర క్షేత్రం చేరాడు.

సంపదకు కాపలాకాస్తున్న సర్పం వెళ్ళిపోగానే సంపద ఎలా నిలవదో అలాగే అనంతుడితో పాటు కళ్ళీర రాజధాని సంపత్తి సర్వం తరలివెళ్ళి పోయిందని గ్రహించేందుకు కలశుడికి ఎంతో సేపు పట్టలేదు.

22-2-22 కల్ప్దణ కశ్మీర రాజతరంగిణి కధలు 3గై2త౭ఉ౭ఉతతతతజ2222డ222జ22ఊఊఊఊజజాన 1ేకిత ==

కలశుడు అప్పులు చేసి సైన్యాన్ని సమకూర్చుకుని తండ్రిపై యుద్దానికి బయలుదేరాడు. హర్షదేవుడీ విచిత్రాన్ని చూస్తుండిపోయాడు.

తన కొడుకు తనపై దండెత్తి వస్తున్నాడన్న వార్తవిని ఉగ్రుడయ్యాడు అనంతుడు. సూర్యమతి వణికిపోయింది. బ్రాహ్మణులను పిలిచి కలశుడికి వర్తమానం పంపింది. 'ఎవరు నీకు తండ్రిపై దండెత్తే దుష్టపటాలోచనలు కల్పించింది? మహారాజు పరాక్రమానికి నీ సేన ఏ పాటికీ సరిపోదు. సీ మీద దయతో రాజు పదలిపెట్టిన సామ్రాజ్యాన్ని సక్రమంగా పాలించుకో. నేను జీవించి ఉన్నంతవరకూ రాజు నుంచి నీ కెటువంటి ప్రమాదం రాదు”.

రాణి సందేశం విన్న కలశుడు ఆలోచనలో పడ్డాడు. అతనికి తెలుసు. తన తల్లికి తన మీద అమితమైన (ప్రేమ. తెల్లవారే లోగా కలశుడు రాజధాని తిరిగి వెళ్ళిపోయాడు.

తాత్మాలికంగా ఇద్దరి మధ్య యుద్దం ఆగిపోయింది.

కానీ కలశుడు రాజధానిలో తన తండ్రి సన్నిపొతులు, సానుభూతిపరులు అందరి రాజభవనాలు కూలగొట్టించాడు. వారి ఆస్తులను కబళించి, వారిని చెజసాలపాలు చేశాడు.

ఈ సమాచారాలు తెలిసి ఆగ్రహంతో అనంతుడు రాజ్యాన్ని తన్వంగుడికి అప్పగించాలని నిశ్చయించాడు.

ఒకరోజు హర్ష దేవుడికి రాణి సూర్వమతి నుంచి విజయక్షేత్రం రమ్మని కబురు వచ్చింది. విజయక్షేత్రం వెళ్ళేందుకు రాజు ఆమోదం (1హించాలని వెళ్తున్న హర్షదేవుడికి రాజుకు, రాజు ఆంతరంగిక సలహాదార్లకు మధ్య సంభాషణ వినబడింది.

“రాజ్యం నాకు కాకుండా చేయాలన్న నా తండ్రి ప్రయత్నంలో ఇదొక భాగం) అన్నాడు కలశదు. 'కానీ నా తనయుడిని నేనే గృహనిర్బంధంలో ఉంచటం ప్రజలు హర్షిస్తారా? అని అడిగాడు వెంటనే.

రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు ప్రభూ. రాజ్యాధికారం నిలబెట్టుకోవటమే ప్రధమ కర్తవ్యం” అన్నాడు బిజ్జుడు.

“అయితే నా ఆజ్ఞగా చెప్పండి. హర్షదేవుడు ఎట్టి పరిస్టితులలో రాజభవనం దాటరాదు"

తన తండ్రి ఆజ్ఞ వినగానే హర్షదేవుడు శరవేగంతో రాజభవనం దాటి పరుగెత్తాడు. కన్నుతెరచి మూసేలోగా గుల్జం ఎక్కి విజయక్షేత్రం చేరాడు.

హర్షుడు విజయక్షేత్రం చేరాడని తెలియగానే కలశుడు భయంతో వణికాడు. తన తల్లి చెప్పినట్టు తండ్రితో వైరం మాని స్నేహం నటించటం ఆరంభించాడు.

ఊఊ 18డీ జఉపైతడైతతతతడడడడకతడతడడడడడడడడడడడడడ2డఊ కస్తూరి మురళీకృష్ణ నడ

ఇదే సమయంలో కళ్ళ్శీరంలోని (బ్రాహ్మణులంతా తండ్రి కొడుకులు తమ మధ్య విభేదాలు విస్మరించాలని నిరాహారదీక్ష చేయటంతో తాత్కాలికంగా అనంతుడు భార్యాసమేతంగా రాజధాని చేరాడు.

అయితే తండ్రి కొడుకుల మధ్య త్వరలోనే విభేదాలు పొడచూపాయి. అనంతుడు శాశ్వతంగా రాజధాని వదలి విజయక్షేత్రం చేరాడు. కారణం జయానందుడి సలహాననుసరించి కలశుడు తనని చంపించాలని ప్రయత్నిస్తున్నట్టు అనంతుడికి తెలియటమే. అనంతుడు రహస్యంగా రాజధాని వదలి వెళ్ళిన రాత్రే అతని భవనం బూడిదపాలయింది. అతని సేవకులు విషాహారం భుజించటం వల్ల మరణించారు.

ఇది తెలిసి అనంతుడు క్రోధితుడవటం చూసి "కొడుకు దుష్పుడవటం తల్లిదండ్రుల లోపం” అని ఎత్తి పొడిచింది సూర్యమతి.

అయితే కలశుడి దౌష్ట్రం అంతటితో ఆగలేదు. ఒకరాట్రి విజయక్షేత్రం సర్వం బూడిదమయింది. ఒంటిమీద బట్టలు తప్ప విజయక్షేత్రంలో ఎవ్వరికీ ఏమీ మిగలలేదు.

విజయక్షేత్రంలో ఎగసిన నిప్పు రవ్వలను శ్రీనగరంలో తన కోటపై నుండి చూసి కలశుడు ఆనందంతో చిందులు వేశాడు.

మనిషిని బంధువులు త్యజించవచ్చు. దేశం వదలి వేయవచ్చు. కానీ అతని 'పుణ్యపాపాలు మాత్రం అతడి వెంటనే వస్తాయి.

విజయక్షేత్రం బూడిదలో మెరుస్తున్న బంగారు లింగం, బంగారు ఆభరణాలు దొరికాయి రాజుకు. వాటితో రాజు విజయక్షేత్ర పునర్నిర్మాణం ఆరంభించాడు.

కలశుడు అనంతుడిని చీకాకుపరచటం మానలేదు. కశ్మీరం వదలి పర్గోత్సం వెళ్ళమని సేవకుల ద్వారా అనంతుడికి సందేశాలు పంపటం ఆరంభించాడు కలశుడు.

'కశ్మీరం వదలి వెళ్ళిపోదాం. వాడికి కంటక ప్రాయంగా ఉండేకన్నా వాడి దారికి అద్దుతొటగటమే మంచిది. కొడుకు అభివృద్ధి కోసం తల్లిదం(ద్రులు ఏమైనా చేయాలి” అంది రాణి అనంతుడిని దూషిస్తూ,

అంతవరకూ సర్వం సూర్యమతి చెప్పినట్టు చేసిన అనంతుడి మనసు విరిగిపోయింది. సహనం నశించింది. 'నా గర్వం, నా మానం, అభిమానం, రాచరికం, తెలివి, సర్వం నీ మాటలు విని నేను పరిత్యజించాను. పొంగిపొర్లే నదులు ఎలా ఊళ్ళను నాశనం చేస్తాయో, అలాగే కొడుకుపై పొంగి పాళ్లే నీ ప్రేమ కళ్ళ్మీరాన్ని నాశనం చేస్తోంది.

పత్రప్రేమ సహజం. నువ్వు రాణివైనందుకు నీ సంతానం రాజ్యమేలాలన్న ఆశ నీకుండటం సహజం. కానీ వాడికి రాజ్యం ఏలే అర్హత ఉందా? లేదా? అన్న కనీస విచక్షణ జ్ఞానం === కల్టణ కశ్మీర రాజతరంగిణి కధలు వ33ై23డ232డ22002202ఊ0024ఊడ22ఊజ 1ే8ిర్‌ త

లేకుండా కేవలం నీ కొడుకైనందుకు, వాడెటువంటి వాడైనా, ధూర్తుడైనా, వాదేరాజు అనటం ఘోరమైన అన్యాయం. స్వంత తండ్రిని గౌరవించలేని వాడు దేశ గౌరవాన్ని పరంపరను, సంప్రదాయాన్ని ఏం గౌరవిస్తాడు?

నాకిప్పుడు అనుమానం వస్తోంది. పరలోకంలో నాకు శాద్ధ కర్మల ద్వారా ఆహారం అందించేవాడు, ఈ లోకంలో నా బాగోగులు చూడాల్సిన వాడు అయిన వాడునా శేష జీవితాన్ని పుణ్యక్షేత్రమైన విజయక్షేత్రంలో గడపనీయకుండా నన్ను ఇక్కడ నుంచి తరమాలని (ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ వాడు నా కొడుకేనా? లేక మన సంతానం పుడుతూనే మరణిస్తే నువ్వు ప్రశస్తుడి కొడుకుని మన సంతానమని ప్రచారం చేశావని లోకులు అనుకుంటుంటే విన్నాను. అది నిజమా?” కోపంగా అరిచాడు అనంతుడు.

రాణి తనకు అలవాటయిన ధోరణిలో చులకనగా సమాధానం ఇచ్చింది. 'ఈనాడిలా నీతులు వల్లిస్తున్నావుగానీ, నిన్ను నేను పెళ్ళి చేసుకోకముందు నీ గతం గుర్తుతెచ్చుకో. నేను కదూ నీకు సంస్కారాన్ని ఇచ్చింది? నేను కదూ నీ రాజ్యాన్ని నిలబెట్టింది? నా వల్ల కాదూ నువ్వు ప్రజల అభిమానాన్ని చూరగొన్నావు. నేను నిన్నెందుకు వదలి కలశుడి వద్దకు పోవటం లేదో తెలుసా? నువ్వు ముసలివాడివి అయిపోయావని, పనికిరానివాడివని కొడుకు రాజ్యం నుండి తరిమేశాడు. భార్య కూడా వదిలేసింది అని అందరూ నిన్ను చులకన పరుస్తారని నీతో ఉన్నాను" కోపంలో రాణి విచక్షణను కోల్పోయింది. రాణి ఏకవచన ప్రయోగం అనంతుడి హృదయాన్ని నిలువునా చీల్చింది.

అనంతుడు నిశ్చేష్టుడయ్యాడు.

స్తీ హృదయం సముద్రంకన్నా లోతయినది. తనకొడుకు మీద (ప్రేమతో భర్తను నాశనం చేస్తోంది ఈమె. ఇన్నాళ్ళూ తాను ఈమె తన జీవనసహచరి అనుకున్నాడు.

కానీ ఈనాడు తన జీవితం సర్వం తాను చీకటిలో, ఒక భ్రమలో (బ్రతికానన్న (గ్రహింపు అనంతుకికి వచ్చింది. తనకొడుకు తనవాడు కాడు తనభార్య తనది కాదు. తనసేవకులు తనవారు కారు. రాజ్యం తనదికాదు. ఇందులో తనవారెవరు? అసలు తానెవరు? ఎవరూ తనవారుకారని భ్రమతొలగి ఒంటరిగా నిలబడ్డ తానెవరు?

అసలు తాను ఒంటరివాడు అని ఇప్పుడు బాధ పడటం తన మూర్ధత్వం. తానెప్పుడూ ఒంటరి వాడే. ఒంటరివాడు కాడనుకోవటం తన భ్రమ.

అయినా తానొంటరి వాడు ఎలా అయ్యాడు? తనతో తన సంస్మారా లున్నాయి. తన పుణ్యపాపాలున్నాయి. మదాంధుడై తాను చేసిన పాపాలు తన భార్య రూపంలో, తన కొడుకు రూపంలో తనను బాధిస్తున్నాయి. ౭ 1రీ0 కైక కస్తూరి మురళీకృష్ణ మమతతఊడ2

రాజు వడివడిగా తన ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళాడు. హఠాత్తుగా లోనికి వెళ్తున్న భర్తను చూసి సూర్యమతి కూడా వెనకే వెళ్ళింది. కానీ అప్పటికే ఆలస్యమయింది.

రాజు శూలారోషణం చేశాడు. శూలం శరీరంలోనికి ప్రవేశించి, (ప్రేగులను చీల్చుకుని గుందెను తాకగానే రాజు కేక వేశాడు. “నా పాపాల ఫలితం ఇక్కదే అనుభవించనీ. కనీసం వచ్చే జన్మలోనైనా మంచి మనిషిగా జన్మించనీ" అని అరచి ప్రాణాలు విడిచాడు.

అది లౌకికాబ్దం 4157వ సంవత్సరం (క్రీ.శ. 1081) కృత్తిక మాసం, పౌర్ణమిరోజు.

రాజు మరణంతో రాణి కృంగిపోయింది. ధనాన్ని అందరికీ పంచి ఇచ్చింది. తన సేవకులంతా తన మనుమడు హర్షదేవుడికి అండగా నిలబడాలని ఆజ్ఞాపించింది. హర్షదేవుడిని పిలిచి చెప్పింది. 'నీ తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు. ఈ రాజ్యం నీది. నీకు కాకుండా చేసే వేరెవరినీ క్షమించకు” అని చెప్పింది.

అనంతుడితోపాటు తాను అదే చితిలో మరణిస్తామని ప్రకటించింది రాణి.

కలశుడు రావాలనుకున్నాడు కానీ అతని సలహాదార్లు అతడిని రానివ్వటం లేదు.

చివరిక్షణంలో రాణికి అసలు నిజం తెలిసింది. తాను ఇన్నాళ్ళూ రక్షిస్తున్నది కలశుడిని కాదు. కలశుడి చుట్టూ చేరి అతడిని పతనం చేస్తున్న ధూర్తులను తాను తక్షిస్తోంది. ఆ ధూర్తుల కోసం తాను తన భర్తను సైతం దూరం చేసుకుంది.

రాణికంటి నుండి నీటి బదులు విస్ఫులింగాలు వెలువడ్డాయి. నా కొడుకుకు తండ్రికీ మధ్య చిచ్చుపెట్టిన వారంతా సమూలంగా నాశనమైపోతారు. నాలో ఏ మాత్రం పారిథ్టత్యం ఉన్నానా దుఃఖంలో ఏ మాత్రం తీవ్రత ఉన్నా ఇది నిజమై తీరుతుంది అని రాజి చితిలో పడి మరణించింది.

ప్రజలంతా స్తబ్బులైపోయారు.

ఏమిటది? నీతికీ, నిజాయితీకి, నైతిక విలువలకు, కుటుంబ సంబంధాలకు ఆలవాల మైన భారతదేశంలో ఎన్నడూలేని విధంగా తండ్రి కొడుకులు, భార్యా భర్తలమధ్య ఈ వైరం ఏమిటి? అదీ రాచకుటుంబంలో! కాబోయే పతనానికి ఇది ప్రతీత్మకమా?

ఓ శ 1

తన తండ్రి మరణం తరువాత కలశుడు మారిపోయాడు. ధర్మకార్యాలు ఆరంభించాడు. తాను బూడిదచేసిన విజయక్షేత్రాన్ని పునర్చిర్మించాడు. త్రిపురేశ్వరంలో శివమందిరం నిర్మించాడు.

అనేక భాషల్లో ప్రావీణ్యుడయిన హర్షుడు కళ్ళీర పొండిత్యానికి ప్రతీకగా నిలిచాడు. భారతదేశంలోని ఇతర రాజ్యాల్లోనే కాక, విదేశాల్లో కూడా పండితుడిలా హర్షద్రేవుడి పేరు వానడడ౭ఊ కబ్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2233333322 1 ట్ర? ఊచ

మాగ్షోగసాగింది. కలశుడు నిరాదరించిన పండితులందరినీ హర్షుడు ఆదరించసాగాడు. దేశ విదేశాల నుండి వచ్చిన పండితులు రాజుని కలిసే కన్నా హర్షుడిని కలవాలని తహతహలాడేవారు.

ఆ రోజు హర్షుడు సర్వం మరచి గానం చేస్తున్నాడు. పాట మధ్యలో కలశుడు లేచి వెళ్ళిపోయాడు. ఈ మధ్య మంత్రులు ప్రజలలో హర్షదేవుడి పట్ల పెరుగుతున్న అనురాగం గురించి కలశుడిని హెచ్చరిస్తూనే ఉన్నారు.

కలశుడు తురుష్క ప్రీల వ్యామోహంలో పడి వారి పాదసేవ చేస్తున్నాడు. హర్షదేవుడికిది నచ్చటం లేదు. కానీ పైకి ఏమీ అనలేకపోతున్నాడు. కానీ ఈ రోజు తన పాట రసపట్టులో ఉండగా, రాజు అలా రసభంగం చేసి లేచి వెళ్ళిపోవటం హర్షుడు భరించలేకపోయాడు.

హర్చుడి బాధ చూసి విషవత్తుడనే సేవకుడు “నీ తండ్రి రాజు కావలసినవాడు కాదు. నీ తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్టించు. రాజుకుందవలసిన అర్జతలు నీకున్నాయి' అన్నాడు నవ్వుతూ. హర్షుడు మనసులో సంతోషించినా పైకి కత్తిమీద చేయివేసి 'అనరాని మాటలనరాదు" అన్నాడు. అది చూసి ధమ్ముడు నవ్వుతూ హర్షుని చేయికత్తిమీద నుంచి తీసివేస్తూ 'అతడన్న మాటలో తప్పు ఏమీ లేదు. తురుష్క ప్రీ సాంగత్యాన్ని మరిగిన కలశుడు రాజుగా ఉండదగ్గవాడు కాదూ అన్నాడు. అసలెవరీ తురుష్క స్త్రీలు! అని హర్పుడు రహస్యంగా ఒక రోజు వారిని గమనించాడు. వారి అందం హర్షుడి మతిని చెడగొట్టింది. తాను తన తండ్రి రాజ్యాన్ని ఆక్రమిస్తే? ఈ సర్వం తనవే! ఒక వైపు నుంచి విశవత్తుడు, ధమ్ముడు రోజూ హర్షుడిని 'రాజువుకమ్మని పోరసాగారు. మరోవైపు నుంచి హర్షుడికి తన తండ్రి దుష్కుత్యాలు చూస్తుంటే తండ్రిపై ఏవగింపు కలగసాగింది.

హర్చుడి మదిలో విశవత్తుడు, ధమ్ముడునాటినబీజం ఎదుగుతోందని తెలిసి పురప్రముఖులు అనేకులు “రాజ్యభారాన్ని చేపట్టమని హర్షుడిపై ఒత్తిడి తేసాగారు.

“తండ్రిపై విష్లవం లేవదీయటం తప్పుకాదు. ఇది మాకు సర్వసాధారణమే తురుష్మదేశం నుంచి వచ్చి కలశుడి ఆస్థానంలో స్థిరపడ్డ మహమ్మదీయుడు అన్నాడు. అతడు హర్షుడిని భావి సామ్రాజ్యాధిపతిగా భావించి, హర్షుడి ప్రాపు సంపాయించాలని తాపత్రయపడుతున్నాడు.

హర్షుడు గొప్ప పండితుడు. కళాకారుడు. అనేక విద్యలలో ప్రావీణ్య మున్నవాడు. తన సత్ర్రవర్తనతో ప్రజల మనస్సులను దోచుకున్నవాడు. అయితే హర్షుడిలో ఒక లోపముంది. అతడికి ఆత్మస్థైర్యం లేదు. స్థిర చిత్తంకాదతనిది. ఎవరేం చెప్తే అది నమ్ముతాడు. “ఏది మంచి ఏది చెడు అన్నది స్వయంగా నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం లేదతనికి.

దాంతో అందరూ ప్రతి నిమిషం 'నీవే రాజువు' అనటంతో “నిజంగా తాను రాజ్యం ఆక్రమించుకోక తప్పు చేస్తున్నానేమో!” అన్న భావన అతని మదిలో కలిగింది. “తండ్రిపై

నా 1650 క2డకడకకడకడడకకత2తడడడడ2డడడడడడడడననడడడం2డడడ22నడడ22డ2ఊఊఊ2:2-22 కస్తూరి మురళీకృష్ణ బడడ2ఊజం

కత్తిదూస్తే నరకం తప్పదు అన్న ఆలోచనకు తురుష్కుడు అద్దుకట్టవేశాడు. 'మీ నరకం మాకు లేదు మా మతంలోకి వచ్చెయ్యి. నీ తండ్రిని చంపినా నీకు నరకం రాదు అన్నాడు.

హర్షుడు ఊగిసలాడసాగాదు.

ఇంతలో హర్షుడు తనను పదవీచ్యుతుడిని చేయాలని ప్రయత్నిస్తున్నాడన్న నిజం కలశుడికి తెలిసింది. కలశుడు బాధ పడ్డాడు. తన పాపం తన కొడుకు రూపం దాల్చి వచ్చిందా? తాను తండ్రిని వేధించాడు. తన కొడుకు తనను కాల్చుకుతింటాడా?

రాజు హర్షుడికి కబురు పెట్టాడు.

ఎదురుగా వచ్చిన హర్షుడిని చూసి ఆప్యాయంగా నవ్వి “సాధారణంగా తండ్రి పేరుతో తనయుడిని గుర్తిస్తారు. కానీ దేశ విదేశాల్లో నన్ను హర్చ్షుడి తండ్రిగా గుర్తుపడతారు. ఇంత ఉత్తముడవు, నీకు రాజ్యం కోసం ఆరాటం ఎందుకు? ఆ దుర్చుద్ధి నీకు శోభనివ్వదు. నా తరువాత రాజ్యం నీదే కదా! జయవాన (ప్రస్తుతం జీవన్‌) ప్రాంతంలో కలశపుర నిర్మాణం పూర్తి కాగానే రాజ్య భారం నీకే అప్పగిస్తాను. ఆ తరువాత వారణాసిలోనో, నందిక్షేత్రంలోనో నాశేష జీవితాన్ని భగవధ్యానంలో గడపుతాను.

నీ గురించి ఏవేవో చెప్పారు. కానీ అవన్నీ నేను నమ్మటం లేదు. నాకూ నా తండ్రికీ మధ్య వైరం సృష్టించినట్టే నీకూ, నాకూ మధ్య చిచ్చుపెట్టాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. నిజంచెప్పు నాకు సాక్ష్యాధారాలు అవసరం లేదు. నీ మనసులో ఏ దురూహలేదని ఒక్కమాట చెప్పు నాకు చాలు అన్నాడు అనునయంగా.

హర్షుడు తలవంచుకున్నాడు. 'మహారాజా మీ ముందు నేనేమీ చెప్పలేను. మీకు కబురు పంపుతాను” అని వెళ్ళిపోయాడు. హర్షుడు రాజు పంపిన దూతతో నిజం చెప్పాడు. “ముందు నాకు ఎటువంటి దురాలోచన లేదు. కానీ అందరూ నన్ను ప్రోత్సహించటంతో నాలో రాజద్రోహపుటాలోచనలు ప్రవేశించాయి' నిజం తెలిసి కలశుడు కుప్పకూలిపోయాడు. తన తల్లి శాపం ఇంత (ప్రభావం చూపిస్తుందనుకోలేదు మహారాజా “'నర్చం కోరల్లో విషముందని తెలిసిన మరుక్షణం సర్దాన్ని చంపెయ్యాలి' అన్నాడు మంత్రి నోవకుడు. “వొద్దు అవేదనగా అన్నాడు కలశుడు. ఇప్పుడతనికి తన తండ్రిని తాను ఎంత బాధపెట్టాడో అనుభవానికి వస్తోంది. కర్మఫలం అనుభవించక తప్పదంటారు. ఇదేనా కర్మఫలానుభవం? “అయితే కనీసం సర్పం కోరలన్నా పీకాలి. హర్షుడిని చంపకపోతే కనీసం అతని కళ్ళు పీకి అతడిని గుడ్డివాడిని చేయాలి. అప్పుడు మనకే ప్రమాదం ఉండదు అన్నాడు నోవకుడు.

“వొద్దు ఎట్టి పరిస్థితులలో హర్షుడికే హానీ కలగకూడదు. హర్షుడిని చెలసాలలో పెట్టండి” ఆజ్ఞాపించాడు కలశుడు. === కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు == 189 ===

సైన్యం హర్షుడి మందిరం వైపు వస్తోందని తెలియగానే, హర్షుడి చుట్టూ చేరిన వారంతా కత్తులు దూశారు.

“హర్షదేవా, ఇదే సమయం మన ్రతాపాలు ప్రదర్శించి విజయలక్ష్మిని వరిద్దాం' అన్నారు వారంతా. అప్పటికే సిగ్గుతో కుమిలిపోతున్న హర్షుడు బేలగా “నాకు యుద్ధం ఇష్టం లేదు.నా తం'డిపై నేను కత్తి దూయటమా? అన్నాడు.

“హర్ష్నా నీ తండ్రి కాబట్టి నిన్ను ఏమీ అనడు. కానీ నిన్ను నమ్మినందుకు మేము నష్టపోతాము. మా కోసం అయినా నువ్వు యుద్దం చేయకతప్పదు' అన్నాడు ధమ్ముడు.

రాజ సైన్యం భవనం బయట నిలబడింది. దాడి చేయాలంటే దుష్టుల మధ్య హర్షుడున్నాడు. హర్షడికి ప్రాణహాని జరగవచ్చునని సందేహిస్తూ భవనం బయటే ఆగిపోయింది సైన్యం.

రాజ సైన్యంలో దండకుడనేవాడు నిరాయుధుడై భవనంలోకి ప్రవేశించాడు. హర్షుడి దగ్గరకు వెళ్ళి 'హర్షదేవా నీవు క్షత్రియుడివి. ప్రపంచంలో ధర్మపాలనను మించి ఉత్తమమైన కార్యం మరొకటి లేదు. నీ కర్తవ్యం నీవు నిర్వహించు. కత్తిపట్టి కదనరంగంలోకి దూకు. దేశ ప్రజలందరికీ నీవు ప్రీతిపాత్రుడవు. నీపై కత్తినెవరూ దూయరు. విజయం నీదే అవుతుంది అనీ హర్షదేవుడిని యుద్దోన్ముఖుడిని చేశాడు. అందరూ సంతోషించారు.

“మహారాజా హర్షదేవా, మీరు స్నానంచేసి, కవచం ధరించి విజయలక్ష్మిని వరించేందుకు సిద్దంకండి అంటూ మహారాజును మందిరంలోని ఒక గదిలోకి తీసుకువెళ్ళి, బయట నుండి గొళ్ళెం పెట్టాడు దండకుడు. వెంటనే గవాక్షం లోంచి బయటకు అరిచాడు. 'హర్షుడిని సురక్షితం చేశాను. రాజద్రోహులను హతమార్చండి.

మరుక్షణం సైన్యం హర్షదేవుడి భవనంపై విరుచుకుపడింది. ఆ భవనం కత్తుల ఘర్షణ నాదాలతో, వీరుల ఆర్తరావాలతోనిండిపోయింది. ఆ భవనంలో, భవన ప్రాంగణంలో కట్టిన రక్తపుటేరువు చూస్తూంటే, 'ఆకాశం రక్తాన్ని వర్షించిందా' అన్న భ్రాంతి కలుగుతుంది.

హఠ్షదేవుడి భవనఇమై సైన్యం దాడి చేస్తోందని తెలియగానే హర్షుడి అభిమానులు చేతికి అందిన ఆయుధాలు ధరించి రాజ సైన్యంపై విరుచుకుపడ్డారు. లౌకికాబ్బం 1164 (క్రీ. శం. 1088) పువ్యమాసంలో ఆరవ రోజున తం(డ్రికొడుకుల మధ్య యుద్ధం అంతమయింది. హర్షదేవుడిని బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు

సంకెళ్ళలో ఉన్న హర్షుడిని చూసి కళ్మీరం కన్నీళ్ళు కార్చింది. కలశుడి కళ్ళు చెమ్మగిల్లాయి. హర్షుడు సంకెళ్ళలో ఉన్న విజ్ఞాన సర్వస్వంలా తోచాడు. ఈ విజ్ఞాన సర్వస్వాన్ని చంపటమా? ఆ విజ్ఞానం తొణికిసలాడే కళ్ళను పీకేయటమా?

“హర్షదేవుడిని చెజసాలలో పెట్టండి. ప్రయాగా హర్షుడు చెజలో ఉన్నంత కాలం నీవే అతడి సేవకుడవి. జీవితాంతం హర్చుడి వెన్నంటి ఉండు" అని ఆజ్ఞాపించాడు కలశుడు.

దడ 100 డడ కస్తూరి మురళీకృష్ణ 2322ల

హర్షుడు చెజసాలపాలయ్యాదు. చెజసాలలోకి రాజు భోజనద్రవ్యాలందే ఏర్పాటుచేసినా స్వేచ్చా విహంగాన్ని నాలుగు గోడల మధ్య బంధిస్తే సుఖంగా ఉండగలదా?

హర్షుడు తనకవసరమైన [గ్రంధాలను తెప్పించుకుని పరించసాగాడు. చెజసాల గవాక్షం నుంచి వినీలాకాశాన్ని చూస్తూ తన ఊహలకు రెక్కలనిచ్చేవాడు.

ఒకరోజు హర్చుడు భోజనం చేయబోతూండగా, ప్రయాగుడు వచ్చి ఆపాడు.

“యువరాజా ఇది విషపూరితమైన భోజనం. తమరు చెజిసాల పాలయిన తరువాత వావివరుసలు మరచి తురుష్క ్రేరేపితుడై మహారాజు తమరి భార్య సుగలాదేవితో సుఖిస్తున్నాడు. సుగలాదేవి, నోనకుడు కలసి రాజుకు మీ అడ్డు తొలగించాలని చేసిన ప్రయత్నం ఇది చెప్పాడు ప్రయాగుడు.

హర్షదేవుడు తలవంచుకున్నాడు.

అతని మదిలో అనేక ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి.

తప్పేముంది? తాను తండ్రిపై కత్తి దూయాలనుకున్నాడు. తన భార్య తేసనీ చంపాలనుకుంటోంది. తన పాపానికి తాను శిక్షననుభవిస్తున్నాడు. తన పాపానికి సుగలాదెవి కూడా శిక్షననుభవిస్తుంది.

ఏమిటీ మానవసంబంధాలు? ఏమిటీ జీవితం?

ఈ చంపుకోవటాలు, చావటాలు ఎందుకోసం?

ఏం సాధించాలనీ కుట్రలు, కుతంత్రాలు?

అనాటి నుండి హర్షదేవుడు బోజనం మానేశాడు. ప్రయాగుడు తెచ్చిన పదార్ధాలు తప్ప మరేమీ ముట్టటం లేదు.

సమయమంతా ఆధ్యాత్మిక చింతనలో గడపసాగాడు. రానురాను హర్ష దేవుడికి మానవ సంబంధాలు సర్వం మాయలా తోచసాగాయి.

తన తాత మరణం కారణం హర్షదేవుడికి తెలుసు. తన తండ్రి గురించి తెలుసు. తన జీవితం చూస్తున్నాడు. ఎలా నైతిక విలువలు పతనమౌతున్నాయో అర్ధమవుతోంది ఏ రకంగా తాము ఉత్తమ ఆదర్శానికి దూరమయ్యామో తెలుస్తోంది.

నిజం, ఎవరు తల్లి? ఎవరు తండ్రి? ఎవరు రాజు? ఎవరు ప్రజలు?

ఇదంతా మనిషి తన సంతృప్తి కోసం కల్పించుకున్నది కాదా?

“యువరాజా! మహారాజు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తురుష్క సంపర్మం పట్ల మహారాజు మోజు తీవ్రతరమయింది. తురుష్క స్త్రీల ప్రోద్భలంతో రాజు తామ్రస్వామి మడడను కల్ప కశ్మీర రాజతరంగిణి కధలు 3333222222 గటి 1] డడఊ

సూర్య విగ్రహాన్ని కరగించాడు. విహారాల్లోని కంచువిగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నాడు చెప్పాడు (ప్రయాగుడు. హర్చుడు నవ్వాడు. “మనిషిని మించిన మూర్చుడు, తెలివి తక్కువ జీవి ఈ సృష్టిలోనే లేదు. తన చేత్తో తన నరక సామగ్రిని తయారు చేసుకుంటాడు. అనుభవించి తీరతాడు. మనిషి తను చేసిన కర్మఫలితం అనుభవించ తీరతాడు. ప్రయాగా, ఈ జగతిసర్వం కార్యకారణ సంబంధం మీద నడుస్తోంది. అంతా మనమే సాధిస్తున్నాం అనుకుంటాం. కానీ మనకేం తెలుసు? రాజు ఏ పూర్వ జన్మ పాపమో తురుష్క స్రీల సాంగత్యంలా పరిణమించింది. సూర్యదేవ విగ్రహాన్ని కరగించిన పాపం ఊరికేపోదు' అన్నాడు.

హర్షద్రేవుడి మాటలు సత్యమని నిరూపిస్తూ కలశుడు విచిత్ర వ్యాధికి గురయ్యాడు.

ఉత్తముడైన అనంతుడిని బంధించిన పాపం ఊరికే పోతుందా? అని కొందరంటే “రాజ్యం కోసం హర్చ్షుడిని చెజసాలలో పెట్టించాడు. శిక్ష తప్పదు కనబడనంత మాత్రాన దేవుడు లేనట్టేనా?” అని మరికొందరన్నారు.

“జీవంలేని రాతి విగ్రహాలే కావచ్చు. ఆ రాతి విగ్రహాల శక్తి అంధులకెలా తెలుస్తుంది? ఇలాగే తెలుస్తుంది. (గ్రహించి తప్పుదిద్దుకున్నవారు మరుజన్మలోనైనా మంచివారవుతారు. లేనివారికిండేగతి” అనుకున్నారు విజ్ఞులు.

“మహారాజా విగ్రహాలను అపవిత్రం చేసినందువల్లే తమరికీ వ్యాధి వచ్చింది. శివవి[గ్రవాన్ని ప్రతిష్టించండి” సలహానిచ్చారు రాజవైద్యులు.

వారి మాట ప్రకారం రాజు శివవిగ్రహ (ప్రతిష్టాపనకు సిద్దమయ్యాడు.

“మహారాజా మా తురుష్కులు అనేక విగ్రహాలు ధ్వంసం చేశారు. మాకు రాని పాపం మీకెలా వస్తుంది?” అని కలశుడి తురుష్మమిత్రులు కలశుడిని ఎగతాళి చేశారు.-దాంతో కలశుడికి వైద్యుల మాటలపై అపనమ్మకం కలిగింది.

ఇది తెలిసి నవ్వాడు హర్షుడు. 'దైవ విగ్రహాలను కరిగించి తన ప్రేయసికి ఆభరణాలు చేయించినవాడిని తన వి[గ్రహాన్ని తాకనిస్తాడా పరమశివుడు?” అన్నాడు ప్రయాగుడితో.

అది విని 'ప్రయాగుడు వెంటనే 'మరి తురుష్కులకేంకాదెందుకు?' అనడిగాడు.

“ఏమీ కాదని ఎలా అనుకుంటావు? వారి దేశానికెళ్ళి వారెలా కుక్కచావులు ఛస్తున్నారో మనకు తెలుసా? కొడుకుతో ఒకడు చంపబడితే, భార్య మోసంతో చచ్చినవాడొకడు, ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది. ఇది సర్వసృష్టికి వర్తించే సూత్రం దానికి మతంతో ప్రాంతంతో సంబంధం లేదు” అన్నాడు హర్షుడు.

మహాకాలుడి విగ్రహ ప్రతిష్ట రోజు రానే వచ్చింది. అఆ రోజుతో తన పాపాలన్నీ నశిస్తాయన్న నమ్మకం కలశుడికి కలిగింది. రోజూ కన్నా శరీరం తేలికగా ఉంది ఆ రోజు. నా! కస్తూరి మురళీకృష్ణ నానా

మందిర (ప్రాంగణంలో అడుగు పెడుతూంటే అతడి వాళ్ళు జలదరించింది. చుట్టు చూశాడు. ఎవరూ తన జలదరింపు గమనించలేదు.

విగ్రహం ముందు నిలుచున్నాడు. పరమశివుడు తనవైపే చూస్తున్నట్టుంది.

అంతలో నవ్వుకున్నాడు కలశుడు. తన పిచ్చిగానీ రాతి విగ్రహాలను విరగ్గొడితే ఆ పాపం తనని పట్టిపీడిస్తుందా? అనుకున్నాడు.

బ్రాహ్మాణుడు రాజు చేతికి కలశాన్నిచ్చాడు. 'మహారాజా కోనేటి పవిత్రజలాన్ని కలశంలో నింపుకురండి అభిషేకం చేయాలి” అన్నాడు.

రాజు వారివైపు తిరస్మారంగా చూశాడు. 'ఈ రాతి విగ్రహం పరమళివుడా? ఈ విగ్రహం సర్వసృష్టికి కారణమా? ఈ రాతి బొమ్మపై నీళ్ళు పోస్తే అది విశ్వవిధాతకు అభిషేకమవుతుందా?”

నవ్వుకుంటూ వెళ్ళి కలశపాత్రను జలంతో నింపేందుకు ముందుకు వంగాడు.

కెవ్వన కేకేశాడు కలశుడు. కలశపాత్ర కలశుడి ముక్కు నుండి కారుతున్న రక్తంతో నిండుతోంది.

అది తన రక్తమా? తన లోని పశుత్వమా?

రాజవైద్యుడు కలశుడి చికిత్స ప్రారంభించాడు.

కానీ రక్త ప్రవాహం ఆగటం లేదు. కలశుడు దిగ్భాంతితో నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

ఏముందీ శరీరంలో.

రక్తమాంసాలు, ఎముకలు, బీమూ, చర్మము తప్పించి?

మరి దేన్ని చూసి తానింత గర్వపడుతున్నాడు? దేని కోసం తన వాంఛ?

రాజును పరామర్శించేందుకు రాజులు వచ్చారు.

కలశుడికి అందమైన స్తీ శరీరాలు కనబడటం లేదు. వారి అస్తిపంజరాలు కనిపిస్తున్నాయి. వారి పయోధరాలు కనబడటంలేదు. మాంసాన్ని కప్పిన చర్మం కనిపిస్తోంది. ఈ పై పై తొడుగును చూసి తాను మోసపోయాడా? ఏదీ అందం?

అతని కడుపులో తిప్పసాగింది. ఈ మాంస ఖండాల సంగమం కోసమా తాను తన సంస్మారాల్ని ధర్మాన్ని త్రోసిరాజన్నది?

“హర్చుడిని రాజును చేయండి. నేను ఏదో పుణ్య తీర్ధంలో ప్రాణం విడుస్తాను కనీసం వొచ్చే జన్మలోనయినా మనిషిలా (బ్రతుకుతాను' అన్నాడు కలశుడు అస్పష్టంగా.

రాణి సుగల, నోనకుడు మహారాజు మాటను ఖాతరు చేయలేదు. లోహారం నుంచి ఉత్కర్నుడిని పిలిపించారు ఉత్మర్నుడు కలశుడి రెండవ భార్య కొడుకు. ద కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 3333332222 క్రితి జ=2=

అది తెలిసి 'హర్చుడిని చెజసాల నుంచి విడిచి దేశాన్నుండి పంపేయండి. ఉత్మర్నుడి పాలవాడిని పడనీయకండి” అని బ్రతిమలాడు. '“అలాగేనన్నాడు నోనకుదు. కలశుడు విజయక్షేత్రానికి బయలుదేరగానే హర్షుడిని ఉత్కర్నుడికి అప్పగించాడు నోనకుడు. హర్షుడిని చతుస్తంభ మందిరమనే పశువుల కొట్టం లాంటి చెజసాలలో బంధించాడు ఉత్మర్పుడు. కలశుడి మదిలో సూర్య వి([గ్రవాన్ని తాను భగ్నంచేసిన విషయమే తిరుగుతున్నంది. అందుకే విజయక్షేత్రంలో ఉండలేక మార్తాండ మందిరానికి తీసుకువెళ్ళమన్నాడు.

మార్గశిర మాసంలో లౌకికాబ్బ్దం 4165 (క్రీ.శ. 1089)లో మార్తాండ మందిర ప్రాంగణంలో తాను చేసిన పాపాలకు చింతిస్తూ కలశుడు ప్రాణం వదిలాడు. రాజు మరణంతో ఉత్మర్నుడు రాజయ్యాడు. రాజు అవుతూనే ఉత్కర్పుడు కలశుడి ఇతర కుమారులతో ఒప్పందం చేసుకున్నాడు.

ప్రయాగుడి ద్వారా కలశుదు మరణించినట్టు, ఉత్కర్నుడు రాజయినట్టు తెలుసుకున్నాడు హర్షుడు.

హర్షుడు భోజనం చేయటం మానేశాడు.

భోజనం చేయమని అతని తమ్ముళ్ళు హర్షుడికి సందేశాలు పంపించారు.

“నన్ను చెల నుండి విడిపించిండి, దేశ బహిష్కారం విధించండి" అన్నాడు హర్షుడు.

ఉత్మర్నుడు 'సరే ననటంతో హర్షుడు భోజనం చేశాడు.

కానీ ఉత్కర్పుడు, హర్షుడిని చెలినుంచి విడవలేదు. హర్చుడైప్పుడు కబురు పెట్టినా “రేపు అంటూ అసలు విషయాన్ని దాటేయనారంభించాడు.

ఉత్కర్పుడిని అర్ధం చేసుకున్న హర్పుడు తన తమ్ముడు విజయమల్లుకు సందేశం పంపించాడు.

'నీ అన్న చెజసాలలో (మ్రగ్గుతూ ఉంటే నువ్వు రాజుతో ఒప్పందం చేసుకుని భోగాలు అనుభవిస్తావా? ఎవరికీ కాకపోయినా కనీసం దైవానికి భయపడు” ఇదీ హర్షుడు పంపిన సందేశం. అది చూసి విజయమల్లు రాజధానివైపు ససైన్యంగా బయలుదేరాడు.

ఉత్మర్నుడు సింహాసనం అయితే అధిరోహించాడు కానీ అతనికి “రాజ్యం తనది' అన్న భావన కలగలేదు. ప్రజలకు కూడా ఉతృర్నుడి పట్ల నిరసన భావం ఉంది అందరికీ చెజసాలలో ఉన్న హర్షుడి పైనే దృష్టి ఉంది. ప్రజలు, పుర ప్రముఖులు 'రాజ్యం హర్షుడికి అప్పగించమని" ఉత్మర్చుడికి విన్నపాలు చేయసాగారు. “మేఘం వర్షించినట్టు ప్రజలపట్ల కరుణను కురిపించే హర్షదేవుదే కళ్ళీరాజు అన్న నినాదం మిన్నంట సాగింది.

ద డ్రేర్రిటే 22323232డ2323232డ2డ232డ32323232323232323232323్డ3262626262===== కస్తూరి మురళీకృష్ణ ==

ప్రజలు బహిరంగంగా రాజు పట్ల వ్యతిరేకత, తన పట్ల అనురాగం ప్రదర్శిస్తున్నారని తెలుసుకున్న హర్షుడు తనకు మంచి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించాడు. విజయమల్లుకు మరో వర్తమానం పంపాడు, రాజధానిలో తన అభిమానులందరికీ సందేశాలు పంపాడు

తనకు కాపలా ఉన్న సైనికులను పిలిచాడు. '“ఉత్మర్నుడి పట్ల ప్రజలలో నిరసన పెరుగుతోంది. ఈ నిరసన వెల్లువలా ఉత్మర్నుడిని ముంచెత్తేందుకు ఎక్కువ కాలం పట్టదు. ప్రజలు అభిమానించేవాడు రాజుగా కొనసాగగలడు. ప్రజలు వ్యతిరేకించే రాజు రోజులు లెక్కపెట్టుకోవలసిందే. త్వరలో ఉత్కర్నుడిని తొలగించి నేనే రాజునవుతాను. నాకు కాపలా ఉండటం మీ తప్పుకాదు. కానీ ఇప్పుడు నా మాట వినకపోతే దోషం మీదే అవుతుంది. నా సంకెళ్ళు తొలగించండి. రాజు నన్ను చంపే ప్రయత్నాలు చేస్తాడు. నాకు మీరే అండగా నిలబడాలి. మీకు తగిన బహుమానం ఇవ్వటం నా బాధ్యత" అన్నారు.

వారు హర్షుడి మాటల్లో సత్యం గ్రహించారు.

ఇంతలో బయట కోలాహలం వినిపించింది.

హర్షుడిని చంపమని ఉత్కర్నుడిని పంపిన సైనికులు వస్తున్నారు.

హర్షదేవుడు బ్రతికి ఉన్నంతకాలం ప్రజలు ఉత్మర్నుడిని రాజుగా ఒప్పుకోరని నో నకుడ ఉత్మర్నుడికి బోధించాడు. ఫలితంగా ఉత్మర్నుడు హర్షుడిని చంపమని సైన్యాన్ని పంపాడు. కా విజయమల్లు సైన్యంతో రాజధాని చేరాడన్న వార్త తెలిసి, సైనికులకు రెండు రకాల రాజముద్రలు చూపిచెప్పాడు.

“హర్షదేవుడిని మీ అదుపులో తీసుకోండి. ఈ రాజముద్ర పట్టుకున్న వ్యక్తి వస్తే హర్మన్‌ చంపండి.ఈ రాజముద్ర వట్టుకున్న వ్యక్తివస్తే హర్చుడిని విముక్తుడిని చేయండి వో ఆజ్ఞాపించాడు. అందుకే సైనికులు హర్షుడిని చుట్టు ముట్టారు. వారిద్వారా నిజం తెలుగు న హర్షుడు నవ్వాడు. 'దైవ సంకల్పాన్ని, విధిరాతను ఎవరూమార్చలేరు. మీరు తొందరపడకండి. నేను కశ్మీర రాజునయి తీరతాను అన్నాడు.

తనను చుట్టుముట్టిన సైనికులంతా హార్చుడికి తెలుసు.

లోపల భయంగా ఉన్నా పైకి ధైర్యంగా వారితో సంభాషణ ప్రారంభించాడు హర్షుడు.

“లలితా అంతా క్షేమమేనా? మనిద్దరం వితస్త తీరంలోచేసిన అల్లరి గుర్తుందా? వెన్నెల్లో వితస్తపై పదవలోపోతూ మనం పాడుకున్న (ఢ్రేమగీతాలు గుర్తున్నాయా? విజయా, అమోఖా, చంద్రా, భుయ్యా నన్నలా చూస్తారేమిటి? నిజంగా ఉత్మర్నుడికి నా మీద ఎంతో (డ్రేమ , ఉన్నట్టుంది. నా చివరి దశలో నాకు తోడుగా నా ప్రాణ మిత్రులను పంపాడు. ('ప్రాణమిత్రుల సన్నిధిలో, వారి చేతిలో మరణించటం కన్నా ఆనందం ఇంకేముంది?” అంటూ వారందరినీ === కల్టణ కళ్శీర రాజతరంగిణి కధలు =33డైై33డడడకడదకతతతతతతతతడ2222ఊ2ఊడ2డ2ఊకాు 195 డె

'సేరు పేరునా పలకరించసాగాడు హర్షుడు. అంతేకాదు తన పరిస్థితితో సామ్యం ఉన్న అనేక పౌరాణిక కధలు చెప్తూ వారిలో తన పట్ల సానుభూతి కలిగేట్టు చేసుకున్నాడు.

ఈలోగా ఉత్కర్నుడు అనేకమార్లు హర్షుడిని చంపమని సందేశాలు పంపించాడు. కానీ వారెవరూ రాజముద్ర చూపకపోవటంతో హర్షుడు (బ్రతికిపోయాడు. ఈ రకంగా ప్రతిక్షణం చచ్చిబ్రతకటం వల్ల హర్పుడి మనస్సలో ఒకరకమైన భీతి స్థానం సంపాయించుకుంది. రాజాజ్ఞ అమలు కాలేదని తెలుసుకున్న ఉత్కర్నుడికి తమ ఒప్పందం గుర్తుకు వచ్చి వణుకుతున్న చేతులతో ఒక రాజముద్రికను ఇచ్చి 'హర్చుడిని చంపండి" అని చెప్పాడు సూరుడితో.

హర్షుడిని చంపేందుకు ఉత్కర్పుడు సైన్యాన్ని పంపాడని తెలియగానే ప్రజలలో నిరసన పెల్లుబికింది. (ప్రజలు ఆవేశంతో రాజభవనాన్ని చుట్టుముట్టారు. విజయమల్లు సైన్యంగా రాజభవనంపై విరుచుకుపడ్డాడు.

రాజధాని రణరంగంలా మారింది.

ఆయాసపడుతూ వస్తున్న సూరుడిని చూడగానే హర్చుడి చుట్టూ ఉన్న సైనికులు ఆయుధాలు ఎత్తారు.

“వీడు హర్షుడిని చంపమన్న ఆజ్ఞ తెస్తే వీడినే చంపేస్తాం” అన్నారు.

సూరుడి చేతిలో రాజముద్రం చూడగానే వారి ముభాలు వికసించాయి.

వారు ఆయుధాలు పారేసే హర్షుడి ముందు మోకరిల్తారు. తొదరలో, కంగారులో ఉతృర్నుడు తప్పుడు రాజముద్ర చూపాడు.

విధివిలాసం ఇదే! దైవశక్తి అంటే ఇదే!

తనకు ప్రణామాలాచరిస్తున్న సైనికులను అపనమ్మకంగా చూశాడు హర్షుడు. ఇదీ ఉతృర్నుడి పధకం కాదు కదా!

అంతలో అతని ముఖం వికసించింది. హృదయం ఉప్పొంగింది

తాను స్వేచ్చా జీవి ఇప్పుడు! తనకు కారాగారం నుంచి విముక్తి లభించింది!

రాజ రీవి ఉట్టిపడుతూంటే హర్షుడు చతుస్తంభ మందిరం దాటి బయటకు వచ్చాడు.

హర్చుడిని సజీవంగా చూసిన ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.

కళ్ళ్మీరం ఆనందంతో ఉత్సవాలు చేసుకుంది.

రాజభవనాన్ని బూడిదపాలు చేసే ప్రయత్నంలో ఉన్న విజయమల్లు హర్షుడు సజీవుడన్న వార్త తెలియటంతో, ఆ ప్రయత్నాల నుండి విరమించాడు. విజజ 196 2222కి నననడడడడడ2224222 కస్తూరి మురళీకృష్ణ న.

దారి పొడుగునా ప్రజలు హర్షుడిపై పూల వర్షం కురిపించారు. ఆ పూలు కురిపిస్తున్నది ప్రజలు కాదు ఆకాశం అనిపించేట్టు ఆకాశంలో హరివిల్లు మెరిసింది.

హర్షదేవుడిని చూసిన విజయమల్లు అన్నకు సాష్టాంగ నమస్కారం చేశాడు.

హర్షుడు తిన్నగా వెళ్ళి ఉత్కర్పుడు వదిలి పారిపోయిన సింహాసనంపై కూర్చున్నాడు.

ఈ వార్త తెలియటంతోటే హర్షుడి సన్నిహితులు, హితోభిలాషులు అందరూ రాజభవనం చేరారు. హర్షుడికి విజయమల్లు తనను చంపి రాజ్యం కాజేస్తాడేమోనని అనుమానం వచ్చింది. దారిలో చెజసాలలో తనకు కాపలాగా ఉన్న సైనికులను అంగరక్షకులుగా నియమించుకున్నాడు. హర్షదేవుడు కారాగారంలోని ముకికి బట్టలతో సింహాసనంపై కూర్చున్నా మేఘాలూ సూర్యకాంతిని అద్దుకోలేనట్టు, హర్షుడి తేజస్సు ప్రస్ఫుటం కాసాగింది.

ఉత్కర్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

దాంతో రాజ్యం హర్షుడి పరమయింది.

క.

ప్రజల సానుభూతితో రాజైన హర్షుడు ఆరంభంలో కళ్ళీరాన్ని అద్భుతంగా పాలించాడు.

సముద్రంలోని నీరు తాగి మేఘాలు భువిపై వర్షించినట్టు హర్షుడి చేత సన్మానం పొందిన అనేక యాచకులు దాతలై కళ్మీరంలో బీదవాడన్న మాట వినబడకుండా చేశారు.

హర్షుడి సభలో గాయకులు, కళాకారులు తమతమ కళా ప్రదర్శన నైపుణ్యానికి తగ్గ బహుమతులు పొంది మరింత ఉత్తమ కళాసృష్టికి ప్రయత్నించసాగారు. పండితులు ఛత్ర చామర ్రస్ఫుటకాంతులతో బళ్ళలో ప్రయాణం చేస్తూ ధనవంతులుగా కులికేవారు. కలశుడి కాలంలో కళ్ళ్మీరంలో జీవితం దుర్భరమని భావించి కర్దాటక దేశానికి పారిపోయిన కవి తిలకుడు బిల్లణుడు కళ్ళీరంలో హర్షర్రాజు కవుల పెన్నిధి అని విని కళ్ళ్మీరంలో మళ్ళీ పాండిత్యం వెలుగొందుతున్నదని సంతోషించాడు. హర్షదేవుడి కాలంలో కళ్మీరంలోని ఆకాశ హర్య్యాలు పిమాలయాలతో పోటీ పడేవి. హర్షుడి నందనోద్యాన వనంలో కల్పతరువు తప్ప తక్కిన వృక్షాలన్నీ ఉండేవి. కశ్శీరంలోని పంపా సరోవరాన్ని పక్షులతో, జంతు జాలాలతో అతి సుందరంగా తయారు చేయించాడు హర్షుడు. ఆ సరోవర తీరంలో హర్షుడు గళమెత్తి పాడుతూంటే ప్రకృతి సర్వం స్థంభించిపోయేడి. బృహస్పతికి కూడా హర్ప్షుడికి తెలిసినన్ని విద్యలు తెలియవని అనుకుంటారు.

హర్షదేవుడి కాలంలో అన్నీ బంగారు నాణేలే చలామణిలో ఉండేవి. తన నాణేలను హర్షుడు కర్ణాటక రాజ్య ఫక్కీలో అచ్చువేయించాడు. ఇటువంటి నాణేలు ఉత్తరభారతంలో కేవలం హర్షుడి సమయంలోనే చలామణీ అయ్యేవి. హె కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు :223222క2డడడడానడడడ22222ఐజ 197. జజ

హర్షుడు ఉదయం పడుకునే వాడు. రాత్రిళ్ళంతా పండితులతో, కళాకారులతో, కవులతో గడిపేవాడు. అతని సభలో యువతులందరూ అప్సరసలు. మంత్రులు నక్షత్రాలు, పండితులు, బుషులు, గాయకులు గంధర్వులు. కుబేరుడు ప్రతిరోజూ హర్షుడి సభను తిలకించేవాడు. “ఎవరివద్దనైనా ఏదైనా లేదు" అన్న మాట వినిపిస్తే హర్షుడు విలవిలలాడిపోయేవాడు. వారి అవసరం తీర్చిన తరువాతనే హర్షుడు స్టితిమితంగా ఉండగలిగేవాడు.

హర్షుడి భార్య వనంతలేఖ నగరంలో మరాలు, అ(గ్రవోరాలు నిర్మించింది. త్రిపురేశ్వరంలో శివాలయం నిర్మించింది.

హర్షుడి మంత్రి చంపకుడు ఉత్తముడు. తాను సంపాదించిన ధనమంతా పుణ్యకార్యాలకై వెచ్చించాడు. దాన ధర్మాలు చేశాడు అతని పుత్రుడు కల్పణుడు.

విజయమల్లు మనసులో రాజ్యం చేపట్టాలన్న దుర్చుద్ది లేకున్నా హర్షుడు విజయమల్లు వాక్యాలను వేద వాక్యాలుగా పాటించటం చూసిన మంట్రులు కొందరు హర్షుకికి, విజయమల్లుకు మధ్య వైరం పెంచారు. విజయమల్లు రాజధాని వదలి పారిపోయాడు.

మంత్రులు, ఇతర అధికారులు సర్వం హర్షుడి అధీనంలో ఉన్నన్ని రోజులు రాజ్యపాలన చక్కగా సాగింది. ఈ సమయంలో ఓ తురుష్కుడు, కళ్ళీర ప్రజల దురదృష్టంలా హర్చుడి అన్థానంలో ప్రవేశించాడు.

నిజంగా విధి లీలలు విచిత్రమైనవి. కాళ్ళకు కుష్టు వ్యాధి వచ్చిన నెమలి పామును పట్టుకుని దాని చుట్టూ తిరిగినట్టు లోకంలో అతి బలవంతులు నికృష్ణుల మాటలతో తప్పుదారి పడతారు. శక్తి గలవారు శక్తిలేనివారిని నమ్మి మోసపోతారు.

మంత్రులు తమ తమ అధికారాలు స్థిరం చేసుకున్న తరువాత నెమ్మదిగా రాజు మనసును తమవైపు మళ్ళించుకుని రాజులోని పశుత్వాన్ని (పేరేపించసాగారు.

హర్షుడికి తన తండ్రిపై ఉన్న ద్వేషాన్ని ఎగసన తోసి వారు హర్పుడిచే, కలశుడు నిర్మించిన రాజధాని మఠాన్ని కొల్లగొట్టించారు.

తురుష్ముడి మాయమాటలకు లొంగి హర్షుడు 360 మ్లేచ్చ ప్రీలకు తన రాణివాసంలో న్థానమిచ్చాడు. అనాటి నుండీ హర్షుడి పతనం ఆరంభమయింది.

తన పూర్వీకుల చరిత్ర (గ్రహించి వారి దోషాలను తాను తిరిగి చేయకుండా జా(గ్రత్తపదేవాడు ఉత్తముడు, హర్షుడు తనతాత, తండ్రుల నడవడిని గమనించాడు. వారుచేసిన పాపాల ఫలితం వారు అనుభవించటం కళ్ళారా చూశాడు. ఎవరో పట్టి బలవంతంగా లాక్కెళ్ళినట్టు తనూ వారిదారిలో నడవసాగాడు. వణ 190 ఇ22జ22డడుడనుననడకడడనననకనడడడడడడడకడడడడనడడకడననదనజడ. కస్తూరి మురళీకృష్ణ డను

ధన్ముత, జయరాజుల కుట్రను ఛేదించి తన సింహాసనాన్ని రక్షించుకోవటంలో హర్షుడికి తురుష్ముడు ఎంతో సహాయపడ్డాడు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా హర్షుడు తురుష్కులను తన సామ్రాజ్యంలోకి రెండు చేతులతో ఆహ్వానించాడు.

తమ సైన్యాన్ని విభజించిప్రతివంద సైనికులకు తురుష్ములను అధికారులుగా ఉంచాడు.

అంతేకాదు రాజ్యంలోని కీలకపదవులన్నీ తురుష్మ్కులకు అప్పజెప్పసాగాడు.

చంపకుడు, ప్రయాగకుడు హర్షుడి తురుష్క అభిమానాన్ని వ్యతిరేకించారు.

“మహారాజా మీరు పండితులు. రాజనీతిశాస్త్ర పారంగతులు. మీకు సలహానిచ్చేవారము కాము, కానీ మీరు పాముకు పాలుపోసి పెంచుతున్నారు. అది నిలువెల్ల విషం కల తురుష్కపాము" అన్నాడు చంపకుడు.

“మహారాజా తురుష్కులు ఎవరికీ విధేయులు కారు. వారు వారి ధర్మానికే విధేయులు. ఇస్లాం అంటే పూర్తిగా తననితాను సమర్పించుకోవటం. వారి జీవితాలను వారు మతప్రచారానికి, అంకితం చేశారు. వారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా తూర్పుకు తిరిగి వారి పవిత్ర మందిరానికే నమస్కరిస్తారు. అంటే వారిది దేశమేదైనా, జాతివదైనా అనుక్షణం ఇది మాది కాదు, మేము ఇక్కడి వారము కాదని గుర్తు చేసుకుంటూ ఉంటారన్న మాట.అటువంటివారు తమకేది లాభమో అదిచేస్తారు. కానీ ప్రభువు కోసం, కళ్ళ్మీరం కోసం, భారతదేశం కోసం, భారతీయ ధర్మంకోసం వారేమీ చేయరు ప్రభు బ్రతిమిలాడుతూ అన్నాడు ప్రయాగకుడు.

“ప్రభూ, తురుష్కులకు నైచ్యం వారి నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రపంచంలో ప్రతివారూ అల్లానే దేవుడిగా నమ్మాలని వారి పట్టుదల. అల్లాని నమ్మని వారంతా దుష్టులు ప్రభూ. “నన్ను నమ్మని వారిని, నా మాట వినని వారిని పిడుగులు కురిపించి నాశనంచేస్తా, సుడిగాలుల్లో ఊపేస్తా సముద్రాలు పొంగించి ముంచేస్తా' ఇటువంటి బెదిరింపులతో నిండి ఉంది ప్రభూ వారి పవిత్ర గ్రంధం. నేను చదిహనా గ్రంధాన్ని. ప్రభూ అదే దైవ స్వరం అయితే పాపం శమించు గాక నేను దయ్యాన్ని నమ్ముతాను కానీ అటువంటి దైవాన్ని నమ్మను” అన్నాడు చంపకుడు నిర్ఫీతితో.

హర్షుడు నవ్వాడు. 'చంపకమంత్రీ పరమత దూషణ కూడదు. సత్యమొకటే, పండితులు దాన్ని పలు విధాలుగా చెప్తారంటారు కదా. సత్యాన్ని అలా చెప్పాడేమో వాళ్ళ దేవుడు" అన్నాడు హర్షుడు.

చంపకుడు ప్రభువుకు నమస్కరించాడు. “ప్రభూ ప్రపంచంలో ఏ సత్యమైనా సాపేక్ష సత్యం తప్ప సమగ్రమైన, సంపూర్ణమైన, స్వచ్చమైన సత్యం ఈ భౌతిక (ప్రపంచంలో అనుభవానికి రాదు. ఆ సత్యాన్ని అనుభవించేందుకు మనిషి తన భౌతిక శరీర పరిధిని దాటి ఎదగాలి. నా కల్దణ కళ్శ్మీర రాజతరంగిణి కధలు 2౭2222 106 ఊడ

అందుకు సాధన అవసరం. తపన అవసరం. తపస్సు, యోగం, యాగం అన్నీ భౌతిక శరీర పరిధిని దాటాలనే (ప్రయత్నంలో భాగాలు. అవేవీ లేక “నన్ను నమ్మనివారంతా దుష్టులు వారిని ఉరుముల్లో చంపుతా" నన్నదాన్ని నమ్మినంత మాత్రాన సంపూర్ణ సత్యం అవగతమౌతుందా (ప్రభూ? అంత తేలికగా అర్ధమయ్యేదా ఈ ప్రపంచం?” ఆవేశంగా అడిగాడు చంపకుడు.

“మహామంటత్రీ మీ ఆవేశం నాకు బోధపడటం లేదు. నేనేం చేశాను. వారికి కొన్ని ప్రముఖ పదవులిచ్చాను. సైన్యంలో అధికార స్టానాలు వారికిచ్చాను. వారు మన అతిధులు, మన సోదరులు అన్నాడు హర్షుడు.

చంపకుడు విచిత్రంగా నవ్వాడు 'ప్రభూ వారు అతిధులు కారు, దోపిడీదార్లు. విదేశీయులు. ఈ దేశానికి వారు అతిధులుగా రాలేదు. విజేతలుగా వచ్చారు. దోచుకునేందుకు వచ్చారు. ఆశ్రయమిచ్చి కీలకమైన పదవుల్లో వారిని నియమించటం వల్ల మీరు మీకు, కళ్ళీరానికే కాదు, సకల భారతావనికి, భారతీయ ధర్మానికి ఘోరమైన అన్యాయం చేస్తున్నారు. ప్రభూ ఈ దేశం మిమ్మల్ని క్షమించదు. ఈ ప్రజలు మిమ్మల్ని మరచిపోలేరు. ఈనాడు మీరు పాలుపోసి పెంచుతున్న ఈ విషసర్పం మహాసర్బమై కోటితలలతో విషం చిమ్ముతూ ఈ ప్రజల జీవితాన్ని హాలాహల సముద్ర తుఫానులో ముంచెత్తినప్పుడు, (ప్రజలు మిమ్మల్ని శపిస్తారు. ప్రభూ మీ ఈ పాపానికి నిష్పుతి లేదు. నాదొక విన్నపం. నన్నీ పదవీ బాద్యతల నుంచి తప్పించండి. నేను నందిక్షేత్రం వెళ్ళి వస్తాను. నేనీ ఘోరాన్ని చూస్తూ మౌనంగా ఉండలేను అని వెళ్తూ వెనుతిరిగి అన్నాడు. “ప్రభూ రక్తంపంచుకుని పుట్టిన సోదరులే కలసి ఉండలేని కాలమిది. రక్తసంబంధాల్లోనే

నమ్మకం పోయే కాలమిది. అటువంటిది విదేశీయులను సోదరులని భావించటం మూర్ధత్వం. ఏనాడో ఆ సోదరుడే వెన్నుపోటు పొడిచిన నాడు చిందిన రక్తం చెబుతుంది సోదరులెవరో? శతృ్భవులెవరో? పైగా మీరు సోదరుడనటంతో ఈ భూమిలో నా వాటా కావాలని గోలచేసే అవకాశం ఉంది. తరువాత రోజే చంపకుడు నందిక్షేశ్రానికి వెళ్ళిపోయాడు.

('ప్రయాగకుడే రాజుని వీడలేక రాజు చేసే దుష్కుతాలకు మౌన (ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు. దుష్టుల మాటలు విని రాజు తన్వంగుడి మనుమళ్ళు తుల్ల, విజయరాజ, బుల్ల, గుల్లలను చంపించాడు. తన స్వంత కుటుంబంలోని వారినీ వదలలేదు హర్షుడు. విజయమల్లుడి పుత్రుడు జయమల్లుని అతి ఘోరంగా చంపాడు. ఉత్మర్నుడి ఇద్దరు కొడుకులను చంపించాడు.

రాజు ఇలా తనహితోభిలాషులను, బంధువులను ఒకరొకరినే చంపుకుంటూ తన దారిలోని ఆటంకాలను తొలగించుకుంటున్నానని భ్రమపడ్డాడు. కానీ తాను మరొకరు రాజు అయేందుకు దారి శుభ్ర పరుస్తున్నానని తలచనే లేదు. చడ 200 :22కకనకకక2నడకకతడకననన2తతత2222డడడడడడడడ2డ2=డ=. కస్తూరి మురళీకృష్ణ తై

తురుష్కుడి ప్రబోధంలోపడి వామనుడి కొడుకు క్షేముడు,కలశుడు నిర్మించిన కలశమందిరంలోని బంగారాన్ని కొల్గొగొట్టమని హర్షుడిని ప్రోత్సపొంచాడు.

అయితే ప్రయాగకుడు హర్షుడు చెలిసాలలో ఉన్నప్పడు విషాహారం తినకుండా ఎలా కాపాదేడో, ఈనాడు హర్షుడు మందిరాన్ని కొల్లగొట్టకుండా కాపాడాడు.

కానీ పతన దిశగా పయనించే వర్షప్రచుక్కను ఎవరూ ఆపలేనట్టే హర్షుడి కెవరూ విచక్షణను బోధించలేకపోయారు.

లోస్తధరుడు, తురుష్కుడు కలసి ప్రభువు మనసులో విషబీజాలు నాటారు.

“ప్రభూ మందిరాల్లో అంత బంగారం, మణులు, మాణిక్యాలు వృధాగా ఉండటం ఎందుకు? రాతిబొమ్మ వాటినేంచేసుకుంటుంది? అదే బంగారం మనం ప్రజూసంక్షేమంకోసం వాడవచ్చు. భీమకేశవ మందిరంలో అనంతమైన ధనంవృధాగా పడిఉందని మాటిమాటికీ వంతులవారీగా హార్పుడికి బోధించ సాగారు.

హర్షుడు ఎవరేం చెప్తే అది నమ్మే మనిషి దాంతో ఒకరోజు భీమకేశవ మందిర తాళాలు పగులగొట్టి లోపల ప్రవేశించాడు. అక్కడ ఉన్న ధనరాశులు చూపేసరికి అతని మతిపోయింది.

మందిరాలను అపవిత్రం చేసి అనుభవించిన వారి చరిత్రలన్నీ మరచి పోయాడు. ధనలాలస అతని విజ్ఞానచక్షులను కప్పేసింది.

“ప్రభూ తమరి తండ్రిగారికి పట్టినగతి గుర్తుకు తెచ్చుకోండి అని గతాన్ని గుర్తు చేయబోయిన ప్రయాగకుడిని పక్కకు నెట్టేశాడు హర్షుడు.

శేపేదో అవుతుందని నేటిని వదిలేవాడు మూర్చుడు' అన్నాడు.

ఆనాటినుండీ ఏ భారతీయరాజు కలలోకూడా ఊహించని విధంగాహర్నుడు పవిత్ర మందిరాలను ధ్వంసం చేయనారంభించాడు. మందిరాలనుండి దోచుకున్న ధనాన్ని దేవతల విగ్రహాలను లెక్కకట్టేందుకు 'దేవోత్చతన నాయకి అనేపదవిని సృష్టించి దొన్ని ఉదయరాజుకు కట్టబెట్టాడు.

పూలతో పూజించవలసిన విగ్రహాలను ఉచ్చిష్టాలతో, విసర్జితాలతో నింపేశాడు. ప్రజలు దేవతలను పూజించకుండా నిషేధించాడు. పెద్ద విగ్రహాలను తాళ్ళతో కట్టిలాగేసేవాడు. కశ్మీరంలో దారులనిండా విరిగినవిగ్రహాల ముక్కలు పడి ఉండేవి.

రాజు ఈ మందిరాలను అపవిత్రం చేసేందుకు తురుష్క సైనీకులను నియమించాడు. రాజు ఎక్కడకు వెళ్లినా రాజువెంటే రాజు అంతరంగిక తురుష్కుడు ఉండేవాడు. అందుకే (ప్రజలు హర్షుడిని తురుష్క హర్షుడని పిలవసాగారు. === కల్దణ కశ్ళీర రాజతరంగిణి కధలు 2223333332 201 ==

ఒకనాడు హర్షుని రెండు చేతులతో ఆహ్వానించిన (ప్రజలే ఈనాడు హర్షుడిని తూలనాడసాగారు. ఇతని పాపం పండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. ఇంతవరకూ కళ్ళీరాన్ని పాలించిన దుష్ట రాజులందరి దౌప్పాన్ని మించి పోయాడు హర్షుడు.

చంపకుడి తమ్ముడు కనకుడు తన గాన మాధుర్యంతో హర్షుడిని మెప్పించాడు. హర్షుడు ధనం బహుమతిగా ఇయ్యబోతే ధనాన్ని తిరస్కరించాడు. “ప్రభూ, మీకు నా గానం నచ్చితే మీరు పరిహాసపురంలోని మందిరాలను తాకవద్దు. ముఖ్యంగా నిలువెత్తు బుద్ద విగ్రహాన్ని ఏమీ చేయవద్దు అని కోరాడు.

హర్షుడు నవ్వాడు. నీవు సనాతన ధర్మానుయాయివి. నీకు బౌద్ధ విగ్రహంపై ప్రేమ ఎందుకయ్యా? అనడిగాడు.

“ప్రభూ, ఈ దేశంలో పుట్టి ఈ ధర్మంలో పెరిగిన వారే తమ ధర్మాన్ని నాశనం చేసుకుంటూ దానికి గొప్పగా పరమత సహనమని పేరు పెట్టుకుంటున్నారు. ఈ ధర్మంలో పెరిగి ఈ ధర్మాన్ని సజీవంగా చేయాలని ప్రయత్నించిన బుద్దుడిని మించిన సనాతన ధర్మానుయాయి ఇంకెవరు ప్రభూ? అనడిగాడు కనకుడు.

అందుకే హర్షుడు రణస్వామి మందిరాన్ని మార్తాండమందిరాన్ని పరిహాసపురంలోని ఇతర మందిరాలను తాకలేదు.

హర్షుడు ఇలా మందిరాలను విధ్వంసం చేస్తూ తురుష్క హర్షుడిగా పిలవబడుతున్న రోజుల్లోనే హర్షుడి పినతండ్రి మల్గుడి కుమారులు ఉచ్చల, సుస్సలలు రాజసింహాసనం అధిష్టించే ప్రయత్నాలు ఆరంభించారు. ముఖ్యంగా ఉచ్చలుడికి ఒక జ్యోతిష్యుడు “నువ్వు కళ్ళీరాధిపతి అవుతావు” అని చెప్పినప్పటి నుంచీ ఉచ్చలుడు రాత్రింబవళ్ళు రాజ్యాధికారం చేపట్టే పద్దతులు ఆలోచిస్తూండేవాడు.

దుగ్ద్ధఘట యుద్ధంలో ఉచ్చలుడు, సుస్సలుడు చూపిన ధైర్య సాహసాలకు, మురిసి ప్రజలు వారే భావి కశ్మీరాధిపతులని కొనియాడసాగారు.

హర్షుడిది గమనించాడు. అతనికి మనసులో భయం వేసింది.

ఉచ్చలుడు తనని సంహరించి రాజవుతాడా?

అప్పుడు హరాత్తుగా అతనికి తన కారాగార వాసం గుర్తుకు నచ్చింది. చేసిన కార్యం, ఫలితాన్నివ్వక మానదు. తెలిసి తెలిసి తాను దుష్కార్యాలు చేశాడు. వాటి ఫలితం ఉచ్చలుడా? మహారాజులో ్రాణభీతి పెరిగిపోయింది.

మహారాజు దుష్కుత్యాలకు నిరసనగా కళ్శ్మీరంలో దొంగబెడద పెరిగిపోయింది. పట్టపగలే రాజప్రాసాదం నుండి బంగారం వస్తువులు మాయమవసాగాయి. ఆ దొంగలు వణ 202,:డకకడడకడడడడడుడకడడననడకనడడడడడడడడకనడడడడడడడడడడన న... కస్తూరి మురళీకృష్ణ లా!

తురుష్ములే అని అందరికీ అనుమానంగా ఉన్నా రాజుకు జడిసి ఎవ్వరూ ఆ మాట పైకి అనలేదు.

ఇంతలో దేవతల రక్షణలేని కళ్మీరంపై ఆకలిగొన్న పులుల్లా అనేక వ్యాధులు దాడి చేశాయి. కళ్మీరంలో నదులు శవాలతో నిండిపోయాయి. కళ్మీరం (ఢేతభూమిలా మారిపోసాగింది.

లౌకికాబ్దం &175 (క్రీ.శ. 1099-1100) ప్రాంతాల్లో కళ్ళీరం సర్వం వరదలతో అల్లల్లాడి పోయింది. రాజు నగరంలో ఉన్న చెట్లను కొట్టేయటంతో వరద నీరు రాజభవనాన్ని తాకింది.

అయినా హర్షుడు ప్రజలపై పన్నులు విధిస్తూనే ఉన్నాడు. ప్రజలు ప్రకృతి భీభత్సం కంటే రాజు దౌప్టానికి భయపడసాగారు.

ఈ హర్షుడి కోసమా తాము తపించింది?

ఈ హర్షుడి రాజ్యమా తాము కలలుగన్న రాజ్యం?

పదవిలోకి రాగానే వ్యక్తులు ఇలా మారిపోతారెందుకు? ఏముంది అంధకారంలో, అది వ్యక్తులను అంధులను చేస్తుంది? దేవతలకు దూరమైన కళ్శీరాన్ని కబళించేందుకు ఏ రాక్షసుడయినా హర్షుడి రూపం ధరించి వచ్చాడా? రాత్రిళ్ళు మేల్మొని, పగలు నిదురించి, సుఖలాలసత, భోగలాలసలలో సర్వం మరిచే ఈ రాజు ఏ భూతమో, పిశాచామో లబ్బ మానవుడు కాడు అనుకో సాగారు ప్రజలు.

॥ ది. హర్షుడు ప్రజలలో నిరసనను గమనించాడు. దాంతో అతనికి కంగారెక్కువయింది గ౨రు. భయం పెరిగిపోయింది. ఎవరినిచూసినా వారు ఉచ్చలుడి మద్దతుదార్లలాగే కనిపిం ఈ సమయంలో కేవలం తురుష్కులే తనవారుగా అనిపించసాగారు హర్చుడికి.

ఒకవైవు నుంచి ఉచ్చలుడు, మరోవైవు నుంచి నున్సలుడు రాజధాని వైపు దూసుకురాసాగారు.

హర్షుడిలో కంగారు పెరిగిపోయింది.

ఒకటొకటిగా తన దుష్ప్రత్యాలన్నీ అతడికి గ్రహింపుకు రాసాగాయి.

“అయ్యో ఆ రోజు శివమూర్తిని నేను అపవిత్రపరిచాను. శివా నన్ను క్షమించు. అయ్యో నేను కేశవస్వామిపై ఉచ్చిష్టాన్ని వేశాను. స్వామి నా తప్పు క్షమించు" అని అనుక్షణం కన్నీళ్ళు కార్చేవాడు.

మరుక్షణం 'రాజా విగ్రహాలు ధ్వంసం చేసిన నీకు జన్నత్‌ తప్పదు. అల్లా నిన్ను దీవిస్తాడు అని తనని ఓదార్చే తురుష్కుల మాటలు విని సంతోషించేవాడు. కానీ అంతలో === కల్టణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :33ైై2006్డ32ఊ32ఊ2ఊఊడడడ2ఊ2ఊడడ222ఊఊ22డడ22ఊ22 ౨౦3 ===

భయం ముసురుకునేది. ఉచ్చలుడు, సుస్సలుడు యమకింకరుల్లా తనపైకి వస్తున్నారు. అల్లా తనని కాపాడడేమి? ఉరుములతో మెరుపులతో వారిద్దరినీ నాశనం చేయడేమి? హర్షదేవుడిలో పేరుకుపోయిన భయాన్ని మోసగాళ్ళు వాడుకోసాగారు.

ప్రియదర్శి అనే సాధు ఒక 'బానిసిను చూపించి “ప్రభూ మీతల్లిని స్వర్ణం నుంచి తీసుకువచ్చాను.ఆవిడ దీవనలు పొందండి. పదహారేళ్ళు రాజ్యం చేస్తారు" అన్నాడు.

హర్షుడు ఆవిడకాళ్ళు మొక్కి అనేక ధనధాన్యాలిచ్చి దీవనలందుకున్నాడు.

ఇతరులు ఇలాగే రకరకాల చిత్ర విచిత్ర అలంకరణలతో ్రీలను రాజు ముందు ప్రవేశపెట్టి “ప్రభూ ఈమె దేవదూత' అనగానే రాజు సాష్టాంగ ప్రణామం చేసి శతృవుల నుంచి నన్ను కాపాడ'మని వేదుకొనేవాడు. అనేక మణిమాణిక్యా లిచ్చిన తరువాత ఆ దేవతలు రాజును దీవించేవారు.

మరికొందరు సాధువుల వేషాలు వేసుకుని ఎవరికీ అర్ధంకాని భాషలో మాట్లాడి రాజును మెప్పించి ధనం కాజేసేవారు.

రాజుకు వందేళ్ళు రాజ్యం చేయాలన్న దురాశ ఉందని కనిబెట్టినవారు ఇలా వేషాలు వేసుకుని రాజు మభ్యపెట్టి పబ్బం గడుపుకోసాగారు.

అయితే ఎంతమంది దేవతాప్తీలు దీవించినా, ఎంతమంది సాధువులను పూజించినా రాజు అదృష్టం మారటం లేదు. రోజూ ఉచ్చలుడి విజయ వార్తలు హర్షుడిని చేరుతున్నాయి.

“ప్రభూ ఉచ్చలుడు వరాహమూల చేరుకున్నాడు

“ప్రభూ ఉచ్చలుడు కాక సైనికులతో పోరాడక దారిమళ్ళి ఆర్మిపురం గెలుచుకుని కామ రాజ్యంవైపు పయనిస్తున్నాడు.

“ప్రభూ తారామూలక వద్ద ఉచ్చలుడితో డామరులు చేతులు కలిపారు”.

“ప్రభూ ఉచ్చలుడు మామ ఆనందుడు మాధవ రాజ్యంలో విప్లవం లేవదీశాడు

“ప్రభూ ఉచ్చలుడి మాధవ రాజ్యాన్ని గెలుచుకుని పరిహాసపురం చేరుకున్నాడు”.

హర్షుడు భరించలేకపోయాడు. చంపకుడికి కబురుపెట్టాడు.

“నీకు నిజంగా స్వామి భక్తే ఉంటే ఈ కష్ట సమయంలో నాకు తోడుగా ఉండాలి అన్నాడు చంపకుడు రాజధాని వస్తూనే విషయాలన్నీ గ్రహించాడు.

“ప్రభూ ఉచ్చలుడిని పరిహాసపురందాటి ముందుకుపోనివ్వకపోవటమే క్షేమకరం. ససైన్యంగా మీరు పరిహాసపురంవద్ద ఉచ్చలుడిని ఎదుర్కోండి” పరిహాస పురంలోకి వెళ్ళటం సులభం కాని బయటకు రావటం కష్టం. ఉచ్చలుడినిపరిహాస పురంలోనే సంహరించాలి. ద2ఊఉ432ఊ 2004 2333444222 కస్తూరి మురళీకృష్ణ ాాాా!

అయితే మీకుసహాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా మీరుపడగొట్టిన దేవాలయాలను పునరుద్దరించాలి* అని కోరాడు చంపకుడు.

రాజు సరేనన్నాడు. చంపకుడి రాకతో హర్షుడిలో ఉత్సాహం పుంజుకుంది.

పరిహాసపురంలో జరిగిన భీకర సంగ్రామంలో ఉచ్చలుడి సేన పరాజయం పొందింది. రాజ సైనికులు ఉచ్చలుడి కోసం తీవ్రంగా వెంటాడారు. త్రిల్లసేనుడు విహారంలోకి పారిపోతూంటే చూసి అది ఉచ్భలుడే అనుకుని ఆ విహారానికి నిప్పంటించారు రాజ సైనికులు.

ఉచ్చలుడి మిత్రులు అతి కష్టం మీద ఉచ్భలుడిని యుద్ద రంగం నుంచి కాపాడి వితస్తానది దాటించారు.

ఓటమితో ఉచ్చలుడు క్రుంగిపోలేదు. తెలివైనవారు ఓటమిని మెట్లుగా వాడుకుని విజయానికి ఎగబ్రాకుతారు.

ఉచ్చలుడు గౌరిక బాల గ్రామంలో డామరులతో కలసి రెట్టించిన ఉత్సాహంతో - శారామూలకపై విరుచుకుపడ్డాడు. కానీ తారామూల వద్ద ఆగిపోయాడు.

తాత్మాలిక విజయంతో హర్షుడు పొంగిపోయాడు. చంపకుడికి ఇచ్చిన మాటమరచి మళ్ళీ ఆనందోత్సవాల్లో మునిగిపోయాడు

“ప్రభూ శతృవు పారిపోతున్నప్పుడు వెన్నంటి తరమాలి. శతృవు జీవించి ఉన్నంత కాలం గెలుపు సంపూర్ణంకాదు. శతృవు పారిపోగానే సంబరాలు జరుపు కొనేవాడు త్వర విచారిస్తాడు' అన్నాడు చంపకుడు.

కానీ హర్షుడు పకపక నవ్వాడు. 'చంపకా నన్నెవరూ పంచేయలేరు' అన్నాడు.

అంతేకాదు ఉచ్చలుడు పూజించిన పరివోస కేశవ విగ్రహాన్ని పెకిలించి వేశాడు. ఆనందంతో ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసాడు.

పరిహాస కేశవుడి మందిరం కూల్చి, విగ్రహాన్ని ముక్కలుగా చేసినపుడు ఎగసిన ధూళి ఆకాశాన్ని కప్పేసింది. హర్షుడి మరణం వరకూ దివినీ భువినీ ఆ ధూళికప్పి ఉంచింది.

“ప్రభూ పరిహాస పురంలో ఆ విగ్రహం ప్రతిష్టించక ముందు ఎల్లప్పుడూ చీకటిగా ఉండేది. మీరిప్పుడా విగ్రహాన్ని కూలగొట్టటంతో మళ్ళీ పరిహాసపురంలో చీకటి వ్యాపించింది. ప్రభూ ఈసారి చీకటి పరిహాసపురంలోనే కాదు సర్వ కళ్ళీరంలో వ్యాపించింది. ఆ చీకటి మీ మరణంతోకానీ తొలగదు” అని రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు చంపకుడు.

ఇంతలో రాజుకు “మరోవార్తే వచ్చింది. రాజు ఇన్నాళ్ళు దృష్టిని ఉత్మర్పుడి పైనే కేంద్రీకరించాడు. సున్సలుడిని విస్మరించాడు. సుస్సలుడు సూర్యపురం చేరాడన్న వార్త తెలియగానే “హర్షుడు భయంతో కంపించాడు. === కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు :=2232323డ23డడ23ఊడజ2జ2డ2ఊ2222ఊఊఊ2ఊఊఊ2డ 205 డై

దాంతో హర్షుడు ఉచ్చలుడిని వదలి సున్సలుడి దూకుడుని ఆపమని '“పట్టి అనే మంత్రిని పంపాడు.

సూరపురంలో సుస్సలుడు రాజ సైన్యాన్ని ఊచకోత కోశాడు.

అటు సుస్సలుడు, ఇటు ఉచ్చలుడు హర్షదేవుడి పని అడకత్తెరలో పోకలాగా అయింది. ఈ రెండు ఉపద్రవాలను మించి కళ్మీరంలో ఎటూ చూసిన ధూళి, పగలుకు రాత్రికీ తేడా తెలియటం లేదు. రాజు చేసిన పాపాలన్నీ కళ్ళ్శీరాన్ని కప్పివేశాయా అనిపించేట్టు ధూళి.

ఉచ్చలుడి జైత్రయాత్ర మళ్ళీ ఆరంభమయింది.

ఉచ్చలుడు హిరణ్యపురాన్ని చేరుకోగానే ఆ గ్రామంలోని (బ్రాహ్మణులంతా అతడిని సత్కరించాడు. “నీవు రాజ్లై మన ధర్మాన్ని కాపాడాలి" అని వాగ్దానం తీసుకుని అతడిని దీవించారు.

ఉచ్చలుడు శ్రీనగరం దరిదాపుల లోకి రాగానే, అంతకాలం హర్చుడిని తప్పుత్రోవ పట్టించి అతడిని పీడించిన మంత్రులందరూ ఒకరొకరే అదృశ్యం కాసాగారు. వారు హర్షుడిని వదలి ఉచ్చలుడి వైపుకు మారిపోసాగారు.

“ప్రభూ ఉత్మర్నుడిలా ఆత్మహత్య చేసుకోవటం ఉత్తమం” అన్నారు.

“హర్షుడు వణికాదు. 'నన్ను నేను చంపుకోలేకపోతున్నాను. నాకు అవమానం జరిగే సమయంలో మీలో ఎవరైనా నన్ను చంపండి” అని వేడుకున్నాడు.

“ప్రభూ మిమ్మల్ని చంపేందుకు మాకు చేతులు ముందుకు రావటం లేదు అని వారు తప్పుకున్నారు.

ఒకవైపు నుంచి ఉచ్చలుడు, మరో వైపు నుంచి సుస్సలుడు శ్రీనగరాన్ని చుట్టుముట్టారు.

మళ్ళీ హర్షుడు చంపకుడి కోసం వర్తమానం పంపించాడు.

“చంపక మంత్రీ వినాశన కాలం వచ్చినప్పుడు మంచి మాటలు పెడచెవిన పెడతారు మనుషులు. నేను అంతే చేశాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఒకవైపు ఉచ్చలుడు, మరోవైపు సుస్సలుడు యమకింకరుల్లా నన్ను చుట్టుముట్టారు అని కన్నీరు కార్చాడు.

చంపకుడు విషాదంగా నవ్వాడు 'ప్రభూ మనిషి సాటి మనిషిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీర భయపడాల్సింది కళ్మీరంలో వెలుతురు సోకనీయని ధూళికి. ఆ ధూళి దైవాగ్రహానికి ప్రతిరూపం' అన్నాడు.

“చంపక మంత్రీ ఇప్పుడు నేనేం చేయాలి?” బేలగా అడిగాడు హర్పుడు.

“మహారాజా, కనీసం ఈ పాపఫలం మీ తనయుడిని తాకకుండా చూడండి. భోజుడిని లోహారానికి పంపండి. ప్రభూ మీ పాపఫలం ఇప్పటికే మీ తనయుడిని తాకకుంటే అతను లోహారం సజీవంగా చేరతాడు” అన్నాడు. = 206 ాకడకడ22డననడడునణడనడడజడుననానన=2222222222=22= కస్తూరి మురళీకృష్ణ వా

మహారాజు వెంటనే భోజుడిని లోహారానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.

చంపకుదు వెళ్ళగానే మహారాజులో దౌష్ట్రం ప్రవేశించింది. తన సేవకులను పిలిచాడు.

“పెద్ద సైన్యం తీసుకుని ఉచృలుడి తండ్రి మల్లుడి ఇంటిపై దాడి చేయండి... వారిని నరికి పోగులు పెట్టండి' అని ఆజ్ఞాపించాడు.

తన సంతానం మహారాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్నా మల్లుడు రాజధానిలోనే ఉన్నాడు. మల్లు మునిలాంటివాడు. ఉత్తమ రీతిలో జీవితం గడుపుతున్నవాడు. మల్లు దైవ మందిరంలో పూజచేస్తుండగా రాజభటులు అతడిని సంహరించారు. ఆ రోజు ఇంట్లో ఉన్న ప్రతివారినీ నరికి పోగులు పెట్టారు మల్లు ఇంటికి నిప్పంటించారు. ఆ నిప్పులో మాడిపోతూ ఉచ్చలుడి తల్లి రాజవంశం సమూలంగా నాశనమగుగాక? అని శాపం ఇచ్చింది.

ల

ఉచ్చలుడు తుఫానులా శ్రీనగరంలో ప్రవేశించాడు. సుస్సలుడు పెనుగాలిలా శ్రీనగరంలోకి చొరబడ్డాడు. రాజ సైన్యంలోని తురుష్కులంతా ఉచ్చలుడి పక్షం వహించసాగారు. మిగిలిన రాజ సైన్యం కకావికలైపోయింది.

భోజుడు సురక్షితంగా శ్రీనగరం దాటి వెళ్ళటం చూశాడు హర్షదేవుడు. అతడి కళ్ళవెంట ధారాపాతంగా నీళ్ళు కారుతున్నాయి.

రాజుకు యజ్ఞవల్వస్కృతిలో తాను పరించిన శ్లోకార్ధం జ్ఞాపకానికి వచ్చింది. 'ప్రజల హృదయాల్లో చెలరేగిన అగ్నికణాలు రాజ వంశాన్ని అదృష్టాన్ని జీవితాన్ని కబళించేంత వరకూ అణగారిపోవు”

నిశ్చేష్టుడై విలపిస్తున్న రాజును ప్రయాగకుడు, చంపకుడు సమీపించాడు.

“ప్రభూ మీకిప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి వీరస్వర్గం అలంకరించటం, రెండు లోహారం పారిపోవటం” అన్నాడు చంపకుడు.

“ప్రభూ బ్రతికి ఉంటే రాజ్యం మళ్ళీ సంపాయించవచ్చు” అన్నాడు ప్రయాగకుడు.

చావంటే భయపడే రాజుకు ప్రయాగకుడి మాటలు నచ్చాయి. చంపకుడి వైపు తిరిగి “భోజుడు లోహారం వైపు వెళ్ళటం చూశాను. అతని క్షేమ సమాచారం నాకు తెలుసుకొని చెప్పండి చంపకమంత్రీ' అన్నాడు హర్షుడు దీనంగా.

“ప్రభూ ఈ సమయంలో నేను కూడా మిమ్మల్ని వదిలవెళ్తే మీతోపాటు ప్రయాగకుడు తప్ప మరెవరూ మిగలరు అన్నాదు చంపకుడు జాలిగా.

“దంపకా ఇది నీకు నేను చివరిసారిగా ఇచ్చే ఆజ్ఞ నా కొడుకు నా ఊపిరి అన్నాడు హర్షదేవుడు. === కల్టణ కశ్మీర రాజతరంగిణి కధలు :=2=2222త3తతడకడకకడడడడడడడడదడద22ఊఊడ2 207 2222

“నీ కొడుకు నీ ఊపిరి, మిగతావారు మనుషులు కారు" మనస్సులో అనుకున్నాడు

చంపకుడు. రాజుకు మొక్కి భోజరాజు వెళ్ళిన దారిలో పయన మయ్యాడు చంపకుడు. శర 2

చీకటిపడుతోంది. శ్రీనగరం సర్వం ఉచ్చలుడి, సుస్సలుడి సేనల విజయోత్సాహాలతో కేకలతో చిందులాడుతోంది.

తన భవనానికి వెళ్ళటం క్షేమకరం కాదని హర్షదేవుడికి తెలుసు. అందుకే తన మంత్రుల ఇళ్ళకు, పురప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి, రాత్రికి ఆశ్రయమియ్యమని అడుగసాగాడు. ఆ రోజు కళ్ళ్మీర రాజుకు ఆశ్రయమిచ్చే ఇల్లొక్కటీ కళ్ళ్మీరంలో దొరకలేదు.

శ్రీనగర వీధుల్లో రాజు నిరాశ్రయుడిగా, కట్టుబట్టలతో 'ప్రయాగకుడొక్కడే తోడుగా బికారీలకన్నా హీనంగా మిగిలిపోయాడు.

ఆ రోజు రాత్రి రాజు, ప్రయాగకుడు వితస్తదాటారు. వర్షం కుండపోతగా కురవనారంభించింది.

హర్షదేవుడి పాపాలతో మలినమైన కళ్శీరాన్ని ఆకాశం వర్షంతో ప్రక్షాళనం చేస్తోందా అనిపించేటటువంటి వర్షం అది.

ఆ రోజు ఆ వర్షంలో రాజుకు ముక్తుడు అనే సన్యాసి పశువుల పాకలో ఆశ్రయం దొరికింది. గడ్డిలో, దోమలు తోడుగా ఆ రాత్రి రాజు విథమించాడు.

తెల్లవారే సరికి ఆకలి బాధ.

"నేను బిచ్చగాడిని నా వద్ద ఏముంటుంది?” అన్నాడు ముక్తుడు.

రాజు వద్ద పీలికలైన కట్టుబట్టలు తప్పించి మరేమీ లేవు.

'ప్రయాగకుడు తన ధోవతీ తీసి బిక్షగాడికిచ్చి అది అమ్మి ఆహారం తెమ్మన్నాడు.

“ప్రభూ నేనెక్కడైనా ఏదైనా వస్త్రం దొరుకుతుందో చూస్తాను' అనీ వెళ్ళాడు ప్రయాగకుడు.

ఒంటరిగా మిగిలిన రాజు కళ్ళముందు తన జీవితం సర్వం కనబడసాగింది.

'నా తెలివి, నా పాండిత్యం, నా విజ్ఞానం సర్వం ఏమై పోయాయి? నేనెటువంటి వాడిని ఇలా అయిపోయాను? చివరికి తిండీ, బట్టలేకుండా మిగిలి పోయాను. రాజుకు బిచ్చగాడి మాటలు గుర్తుకువచ్చాయి.. “ఇదంతా తన కర్మఫలితమేనా? కర్మఫలం ఇంత భయంకరంగా ఉంటుందా? కనీసం తన జీవితం గురించి తలుచుకుని మిగతా రాజులైనా బాగుపడతారా?” అంతలో నవ్వొచ్చింది హర్షద్రేవుడికి. 'తన తండ్రి జీవితం నుంచి తానెన్ని గుణపారాలు నేర్చుకున్నాడు?' తన తండ్రిని మించి దుష్కార్యాలు చేశాడు. తన తండ్రి కన్నా ఘోరమైన మరణం పొందుతున్నాడు. తన తండ్రి కనీసం దైవమందిరంలో మరణించాడు. తాను పశువుల పాకలో.

శం శం ఈ కడ 2065 కడవ కస్తూరి మురళీకృష్ణ న్‌ా

బయట అలికిడి వినపడటంతో హర్షదేవుడు ఉలిక్కిపడ్డాడు. పిల్లి ఎలుక మీదకు దూకేందుకు సిద్ధంగా ఉంది.

సరిగ్గా పిల్లి ఎలుకమీదకు దూకే సమయానికి హర్షుడు కదిలాడు దాంతో ఎలుక చివరి క్షణంలో ప్రమాదాన్ని (గ్రహించి తప్పించుకోబోయింది. కానీ పిల్లి ఎలుకపై దూకి దాన్ని నోటకరచుకుని హర్షుడివైపు తీక్షణంగాచూసి పారిపోయింది.

హర్షుడి మనసు అదోలా అయిపోయింది.

ఎలుక మనసులో ఏమేం ఊహలు తిరుగుతూంటాయి? ఇప్పుడుఉచ్చలుడు వచ్చి నన్ను సంహరిస్తే నేనేమనుకుంటాను?

బయట అడుగులు చప్పుడు వినబడింది.

ప్రయాగకుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

ఎవరో స్రీ చెప్తోంది 'భోజుడిని నసంహరించారటండీ, ఇక హర్షదేవుడి కోసమే వెతుకుతున్నారు”.

భోజుడు మరణించాడన్న వార్త వినగానే హర్షుడు కుప్పకూలిపోయాడు అతనిలో జీవితేచ్చ నశించింది. తాను బ్రతికి ఏంలాభం? అనుకున్నాడు. 'అయ్యో! పాపఫలితం నా తనయుడిని తాకిందా? మల్లుడి భార్య శాపంవల్ల నా వంశం సర్వం నాశనమౌ తోందా? భగవంతుడా' అని కన్నీరు మున్నీరుగా ఏడ్వ సాగాడు హర్షదేవుడు.

ఇంతలో బయట హాహాకారాలు వినిపించాయి.

ఆహారం తెస్తానని వెళ్ళిన భిక్షగాడు గొప్ప బహుమానం సంపాయించి సైన్యాన్ని తెచ్చాడు.

రాజులో మొండి థైర్యం ప్రవేశించింది.

అతని కళ్ళముందు పిల్లి నోట్లోంచి వ్రేలాడుతున్న ఎలుక కనిపించింది. బొద్గోంచి బాకుతీసి సిద్దంగా నిలబడ్డాడు హర్షుడు.

అయితే అతని మరణం వీరోచితమైనది కాదు. ఒక దొంగ చచ్చినట్టు చచ్చిపోయాడు రాజు, డామరులు కొందరు నిశ్శబ్దంగా గుడిసె పై కప్పు తొలగించారు. కొందరు నిశ్శబ్దంగా వెనుక తలుపు తీసుకుని గుడిసెలోకి ప్రవేశించాడు.

చివరి క్షణంలో రాజు వారిని గమనించి వెనుతిరగబోయాడు. కానీ డామరులు తమ కత్తులతో రాజు వక్షాన్ని చీల్చారు. మరో డామరుడు ప్రయాగకుడి తలను నరికాడు.

రాజు నిశ్శబ్దంగా నేలకొరిగాడు. మరణించేముందు రాజు పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. విడత కల్పణ కశ్మీర రాజతరంగిణి కధలు ె౭తతడతతతతతతడడడతడడతతడడడడడడడడడడడడడడడడడడ222ఊఊ్చ 209 ఊం

'ఓ మహేశ్వరా అని శ్వాసవిడిచాడు రాజు. రాజు మరణించిన మరుక్షణం కళ్మీరాన్ని కప్పిన ధూళి మాయమయింది. మళ్ళీ కళ్మీరంపై సూర్యుడు వేడి నవ్వులు చిందించసాగాడు. పరిహాసపురంలో సూర్యోదయమయింది. ఈ శతాబ్దంలో హర్షుడంతటి శక్తివంతుడైన రాజు లేడు. హర్షుడంతటి నీచాతినిచమైన అంతిమ సంస్కారాన్ని అందుకున్న రాజు లేడు. ఉచ్చలుడొచ్చి ఆజ్ఞాపించేవరకూ హర్షదేవుడి శవం వీధిలో అనాధ శవంలా అలాగే పడి ఉంది. ఒక తురుష్ముడు హర్షుడి తలను నరికి రాజ్యంలో ఊరేగించాడు. హర్షుడి తల నరికిన మరుక్షణం ఆకాశం మేఘావృతమై జోరున వాన కురియటం ఆరంభించింది. కళ్ళీర చరిత్రలో రాజు తల నరకటమనే నూతన పద్ధతి ఆరంభమయింది. విగ్రహాలను విరగ్గొట్టే పద్ధణి ఆరంభించిన హర్షుడి తల నరకటంతో ఈ పద్ధతి ఆరంభమవటం పరిహాసకేశవస్వామి పరిహాసమేమో! హర్షుడి తలను మోసుకుని ప్రజలు ఉచ్చ్భలుడిని చేరారు. ఉచ్చలుడు ఆ తలవైపు కూడా చూడలేదు. తలతిప్పుకుని కన్నీరు కార్చాదు.అతని ఆదేశం ప్రకారం హర్షుడి శరీరానికి గౌరకుడనే కట్టెలు కొట్టేవాడు అంతిమ సంస్కారాలు చేశాడు. కాబోయే పాలకులకు హర్షదేవుడి చరిత్ర చక్కని గుణపాఠాలు నేర్పుతుంది. విధి అనే మేఘాల్లో మెరిసే మెరుపు “అదృష్టం. మెరుపు ఎంత అద్భుతమో అంత త్వరగా అదృశ్యమౌతుంది. చూసిన వారిని గుడ్జివారిని చేస్తుంది. ఆరంభంలో ఏమీ కానీ, అంతంలో ఏమీ లేని ఒకవ్యక్తి మధ్యలో వచ్చిన అదృష్టాన్ని చూసి విర్రవీగుతాడు. కానీ అదృష్టం వెనకే దురదృష్టం పొంచిఉందని గ్రహించడు. ఇదే జీవితం. ఆత్మజ్ఞానం, విచక్షణ లేని జీవితాలు తల, కాళ్లు లేని నటుడివంటివి. సంసారమనే తెరపడగానే ఈ నటుడేమైపోతాడో ఎవరికీ తెలియదు. తెలిసిన భగవంతుడికి ఈ (ప్రపంచం ఒక పరిహాసం! శశ 3 = 210 =నణడకానుడడడడడడ2డడడ2డడడనలనడనడనడనడ:2=22====22= కస్తూరి మురళీకృష్ణ కతి

ర్రైహాళ్రంత్షామక్తాుు. లి "ఈ షా టాటో క న గ్రాం శ ళో చల ర్‌ు గ ఖి భ్‌ స్తా ఢ తరాల తరంగాలు అవినయమపనయ విష్ణోదమయమనః శమయ విషయ మృగతృష్టామ్‌! భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః (ఓ భగవాన్‌! నాలోని అవాన్ని నశింపచేయి. నా మనస్సు చంచలత్వాన్ని హరించు. జీవన మృతృష్ణ జలాల దాహాన్ని దహియింపుము.. నన్నీ ప్రపంచ సంసార సాగరాన్నుంచి రక్షించు) కళ్యాణుడి స్వరం నుంచి వెలువడుతున్న పదాల వల్ల జనించిన తరంగాలు (ప్రతివ్యక్తి హృదయంలో ్రకంపిస్తున్నాయి. కళ్ళ్మీర పర్వత పంక్తులు ఆ స్వర మాధుర్యానికి, భక్తిభావానికి వశమై కదలికను సైతం మరచి శిలల్లా నిలుచున్న మునుల్లా ఉన్నాయి. =తఊ=== కల్టణ కృళ్ళీర రాజతరంగిణి కధలు కైక 2కే జజ

“మహా గాయకుడు కనకుడి స్వరం కళ్యాణుడికి వచ్చింది. ఎంతైనా బంధువులేకదా. అంత పోలికలు రాకుండా ఉంటాయా?” అనుకున్నారు శ్రోతలు తమ మనస్సులలో. కళ్యాణుడు తన గానంలో లీనమయ్యాడు. భావంతో మమేకం చెందాడు. మాతా మే పార్వతీ పితా దేవో మహేశ్వరః! బాంధవాః శివభక్తాశ్చ్ళ స్వదేశో భువనత్రయమ్‌!! (పార్వతీ మాత నా తల్లి, శివుడు నా తండ్రి, శివభక్తులు నా బంధువులు, ముల్లోకాలు నా స్వదేశాలు) కళ్యాణుడి కంటిలోంచి నీళ్ళు కారుతున్నాయి. ఎంత అద్భుతమయిన భావం! ఈ శ్లోకార్ధం అనుభవించిన వారికి అంతా అనుభవానికి వస్తుంది. ఎంత అనుభవం ఉంటే ఒక వ్యక్తికి అద్వైతాన్ని ఇంత సరళంగా, ఇంత స్పష్టంగా వ్యక్తపరచటం సాధ్యమవుతుంది! కళ్యాణుడి మనస్సు శంకరాచార్యుల వారి మనస్సు పొందిన అనుభవాలను ఊహా మాత్రంగానైనా అనుభవించాలని తపన పడుతోంది. “స్వామీ కళ్ళ్మీరం శైవులది. మీరు విష్ణువును స్తుతిస్తున్నారు. ఇదెలా సమంజసం? శ్రోత ఒకరడిగారు.

కళ్యాణుడు ఆ వైపు చూసి నవ్వాడు.

“మీ దృష్టిలో అత్యున్నత శివభక్తుడెవరు?” అడిగాడు.

“అది శంకరాచార్యుల వారు వచ్చింది సమాధానం.

ఈ రెండు శ్లోకాలు ఆయన రాసినవే. అంత శివభక్తుడు విష్ణువునెలా స్తుతించాడు?” అడిగాడు కళ్యాణుడు.

ఆ వ్యక్తి తలవంచుకున్నాడు.

“కళ్యాణా” లోపల నుంచి పిలుపు వచ్చింది.

కళ్యాణుడు అందరికీ నమస్కరించి లోపలకు వెళ్లాడు.

కళ్యాణుడి పినతండ్రి నోనకుడు కళ్యాణుడిని దగ్గరకు పిలిచాడు.

నాయనా మీ తండ్రిగారు నిన్ను సత్వరం రమ్మన్నారట. భూతేశ్వర మరంలో ఉన్నారు అన్నాడు.

కళ్యాణుడు పినతండ్రికి నమస్కరించి “మరి ప్రయాణం ఎప్పుడారంభించ మంటారు?" అని అడిగాడు.

“నాయనా ఇవి ప్రయాణానికి మంచి రోజులు కావు. మీ నాయనగారు ఎందుకింత త్వరగా రమ్మనాడో అర్ధం కావటం లేదు” అన్నాడు కనకుడు. కతత 210 క23త3త3త3తతతతతతత22222222ఊఊఊఊఊఊఊఊఊఊజఊఊఊఊఊఊ2= కస్తూరి మురళీకృష్ణ ===

కళ్వాణుడు నవ్వాడు శవ భక్తి భావంతో, మీ స్వర మాధుర్యంతో కరిన శిలవంటి హర్షుడిని సైతం కరగించి దేవాలయ పవిత్రతను కాపాడేరు మీరు. నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకోబట్టే ఈ వంశంలో జన్మించాను. ఇక మామూలు ప్రమాదాలకు నేనెందుకు భయపడతాను?” అన్నాడు.

కనకుడు 'కళ్యాణా రాజకీయ అస్థిరత కళ్ళీరాన్ని కుదిపేస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు జన జీవితాన్ని భంగపరుస్తున్నాయి. పల్లెలు నాశనమవుతున్నాయి.. వ్యక్తులు (ప్రశాంతంగా తమ వృత్తులు నిర్వర్తించలేకపోతున్నారు. నా కళ్ళీరం ఏమైపోతుందోనని భయంగా ఉంది" అన్నాడు విచారంగా.

కళ్యాణుడు చిరునవ్వు నవ్వాడు. రాత్రి వెనుకనే పగలున్నట్టు ఈనాటి అస్థిరత్వం నుంచే రేపటి స్థిరత్వం వస్తుంది" అన్నాడు.

కనకుడు ఆశీర్వదించాడు. "క్షేమంగా వెళ్ళు. అయినా నా పిచ్చిగానీ భగవంతుడు నిన్నే కార్యం కోసం నియమించాడో కార్యం పూర్తయేంతవరకూ నీకెటువంటి ప్రమాదం రాదు అన్నాడు.

కళ్యాణుడు నవ్వి సెలవు తీసుకున్నాడు. తనకత్యంత ప్రియమైన గ్రంధాలు కొన్ని తీసుకుని వారణాసి నుంచి కళ్ళీర రాజధాని వైపు పయనమయ్యాడు.

శరం

అది లౌకికాబ్బ్దం 4023వ సంవత్సరం, ఫాల్గుణ మాసం. కళ్ళ్శీరాన్ని సుస్సలుడు రాజ్యం చేస్తున్న కాలం.

అవి కళ్ళీరానికి దుద్దినాలు. ఎటు చూసినా అందోళనలు, అరాచకత్వం. ప్రజలకు భద్రత లేదు. జీవితంలో ప్రశాంతత లేదు.

హర్షదేవుడు అవలంబించిన విధాన ఫలితాలకు కళ్మీరం మూల్యం చెల్లిస్తోంది. హర్షుడు రాజుగా ఉన్నప్పుడు తురుష్కులకు కళ్ళ్శ్మీరంలో ఆశ్రయం ఇవ్వటమే కాదు అనేక కీలకమైన పదవులను వారికి కట్టబెట్టాడు. “పరమత సహనం” అనే ముసుగులో హర్పుడు వారిని ప్రముఖ పదవుల్లో ఉంచటం వల్ల తన పదవికి భంగం కలగదని అనుకున్నాడు... కానీ ఉచృలుడు రాజధానిలో అడుగుపెట్టిన మరుక్షణం తురుష్ములంతా ఉచ్చలుడి వైపు చేరిపోయారు.

ఉచ్చలుడు తెలివైనవాడు. చరిత్రసారం గ్రహించినవాడు.. రెండు కోతుల పోరులో రొట్టెముక్క పిల్లి ఎత్తుకుపోతుందని గ్రహించినవాడు. అండుకే రాజ్యానికి రాగానే నెమ్మదిగా కీలకమైన పదవుల నుంచి తురుష్కలను తొలగించసాగాడు. ప్రత్యక్షంగా మర్యాదతో, పరోక్షంగా బెదిరించి వారిని కళ్మీరం నుంచి బహిష్మరించసాగాడు. వా! కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు డడ 21 ఊఊ

తనకు తనవారి నుంచి తప్ప తురుష్కుల నుంచి ప్రమాదం లేదని హర్షుడు భావించాడు. కానీ తన దేశానికి తురుష్కుల నుంచి ప్రమాదం ఉందని ఉచ్భలుడు అర్దం చేసుకున్నాడు. ఉచ్చలుడు ఉత్తముడు. కానీ ఆయన రాజ్యపాలనకు శక్తివంతమైన డామరులొకవైపు, శూరుడైన తమ్ముడు సుస్సలుడొకవైపు అద్దుగా నిలిచారు. ఉచ్చలుడు హర్షుడి మనుమడు భిక్షాచారుడిని తన స్వంత కొడుకులా చూసుకున్నాడు. దామర వీరులలో ఒకరికొకరికి మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారు పోరాడుకునేట్టు చేశాడు ఉచ్చలుడు అందువల్ల తాత్మాలికంగానైనా వారినుంచి ప్రమాదం తగ్గింది. రాజ్యం వూర్తిగా తన అధీనంలోకి రాగానే ఉచ్చలుడు రాజ్యం నుంచి దొంగలను పారద్రోలాడు. ప్రతిరోజు ఉదయమే ఉచ్చలుడు బహిరంగసభ తీర్చేవాడు. ప్రజల కష్ట సుఖాలను విని స్వయంగా వారికి సహాయంచేసేవాడు. అయితే ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడారని అని తెలిస్తేమాత్రం వారినిక్షమించి వదిలేవాడు కాదు. తన రాజ్యంలో ఏ వ్యక్తి అయినా ఆహార లోపంవల్ల మరణిస్తే తాను ప్రాయోపవేశం చేస్తానని ప్రకటించిన ఉత్తముడు ఉచ్చలుడు. ఏ అధికారి తప్పుడు పనుల వల్లనైనా ప్రజలకు కష్టం కలగితే ఉచృ్చలుడు వెంటనే ఆ అధికారిని శిక్షించేవాడు. దాంతో ఉచ్భలుడి రాజ్యంలో ప్రజలు బలవంతులు, అధికారులు బలహీనులు అయ్యారు. అధికారులు ప్రజలకు భయపడేవారు. ప్రజలకు కల్పతరువు వంటివాడు ఉచ్చలుడు. ప్రతి వ్యక్తితో (ప్రేమగా మాట్లాడేవాడు. అందుకని అతని అనుచరులంతా ఉచ్చలుడికి సేవచేసేందుకు పోటీ పడేవారు. అగ్నికి ఆహుతి అయిన నంది క్షేశ్రాన్ని పునర్చిర్మించాడు. చక్రధర, యోగేశ, స్వయంభు మందిరాలను పూర్వం కన్నా ఉత్తమంగా నిర్మించాడు. పరిహాసపురంలో పరిహాస కేశవ విగ్రవోన్ని ప్రతిష్టించి పరిహాస పురంలో వెలుగులు నింపాడు. హర్షుడు దోచుకున్న త్రిభువన న్వామి మందిర సంపదను రెట్టింపు చేశాడు. ఉచ్చలుడి సింహాసనంలో సగభాగం రాణి జయమతిది. వారిద్దరూ ఒకే సింహాసనంపై కూర్చునేవారు. ఉచ్చలుడు ఉత్తమ(గ్రంధ పరనానికి విలువనిచ్చాడు. అతని రాజ్యంలో పండితుల విలువ ద్విగుణీకృతమైంది.రోజూ మహాభారతం, రామాయణం ఇతర పురాణాలను వినేవాడు. తన సోదరుడు ఉచ్చలుడి పొగడ్తలు భరించలేని సుస్సలుడు కళ్ళీరంపై దందెత్తి వచ్చాడు. కానీ యుద్ధంలో ఓడి వెనుతిరిగి పోయాడు, అయితే ఇందువల్ల రాజ్యంలోని డామరులు సోదరుల మతా 21 నడకకు: కస్తూరి మురళీకృష్ణ తతడడఊ2

మధ్య ఉన్న విభేదాలు గ్రహించి వాటిని పెంచసాగారు. సుస్సలుడి సహాయం లేని ఉచ్చలుడు బలహీనుడని అతడిని గెలవటం సులభమని వారి అభిప్రాయం.

ఉచ్చలుడు అధికారుల్లో అవినీతిని సహించేవాడు కాడు. కొందరు అవినీతి అధికారులను ఉచ్చలుడు పదవీ భ్రష్టులను చేశాడు. వారు డామరులతో చేయి కలిపారు.

రాజు భోజనం తరువాత వి(శ్రాంతికై రాణివాసానికి వెళ్తున్నప్పుడు ఈ డామరులు, అధికారులు రాజుపై దాడి చేశారు. ఆ సమయంలో ఉచ్చలుడి వద్ద బాకు తప్ప మరేమీలేదు. అయినా అంతమందిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కానీ మంచి వారికి ఈ లోకంలో స్థానం లేదు. ఇది కలియుగం. ఉచ్చలుడి శవాన్ని నిశ్శబ్దంగా వితస్తనది ఒడ్డున ఖననం చేశారు.

లౌకికాబ్బం 4187 (క్రీ.శఈ.1113) పుష్యమాసం, శుక్లపక్షం, ఆరవ రోజున ఉచ్చలుడు హత్యకు గురై హంతకుడు రద్దశంఖరాజు రాజయ్యాడు. ఇతను ఒక్కరోజే రాజుగా ఉన్నాడు.

గర్గుడు సుస్సలుడికి అతని సోదరుని మరణ వర్తమానాన్ని పంపాడు.

ఇది తెలిసి శంఖరాజు రాజ్యం వదలి పారిపోయాడు. దాంతో సల్వణుడు కశ్మీర రాజయ్యాడు.

సుస్సలుడు సైన్యంతో కళ్ళీరంపై విరుచుకుపడ్డాడు. కానీ చావు తప్పి కన్నులొట్టబోయి ప్రాణాలతో లోహారం చేరుకున్నాడు.

సల్హణుడి రాజ్యంలో స్వర్గం వంటి కళ్ళీరం నరకప్రాయమయింది.. సల్తణుడు ప్రతి విషయానికీ గర్గుడిపై ఆధారపడేవాడు.. దాంతో గర్భుడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. రాజ్యంలో దొంగల బెడద పెరిగిపోయింది. అధికారులు ఒకరకమైన దాంగలయితే దారి దోపిడీ దొంగలు మరోరకం.

సుస్సలుడు సామదానభేద దండోపాయాలతో గర్జుడిని తనవైపుకు తిప్పుకున్నాడు. సమయం చూసి సుస్సలుడు కళ్శీరంపై దాడి చేశాడు.

సాయంత్రం వృక్షాల పైని పక్షుల కలకలం. రాయి విసరగానే పక్షులు ఎగిరి పోవటంతో ఎలా సద్దుమణుగుతాయో అలాగే సుస్సలుడు సశస్రధారుడై యుద్ధభూమిలో (ప్రవేశించగానే కళ్ళీర సేన పారిపోవటంతో యుద్ధభూమి నిశ్శబ్ధమైపోయింది.

కశ్శీరాన్ని మూడురోజులు తక్కువగా నాలుగునెలలు పాలించిన సల్పణుడు బందీ అయ్యాదు. లౌకికాబ్దిం 4189 (క్రీ.శ. 1112) సంవత్సరం, విశాఖ మాసాన సుస్సలుడు కళ్మీరానికి రాజయ్యాడు.

కరువు కాటకాలు సంభవించగానే ఉచ్భలుడు ప్రజల కష్టాలు తొలగించేందుకు వెంటనే సిద్దమయ్యేవాడు. సుస్సలుడి కాలంలో కలలో కూడా కరువు కాటకాల ప్రసక్తి వచ్చేది కాదు. ఇచా కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2222222222 21ర్‌. జజ

హర్షుడి మనుమడు ఖిక్షాచారుడు ఉచ్చలుడి కాలంలో కురుక్షేత్రానికి పారిపోయాడు. చంపరాజు, జసటుడు, బచ్చిపురరాజు వజధరుడు, వర్తులరాజు, సహజపాలుడు, త్రిగర్త, వల్లపుర యువరాజులు బల, ఆనందరాజులు కురుక్షేత్రంలో భిక్షాచారుడితో చేతులు కలిపారు.

హర్షుడి మనుమడు ఖిక్షాచారుడే కళ్ళీరానికి నిజమైన పాలకుడు అన్న నినాదంతో వీరు ప్రజలను ఆకట్టుకోసాగారు. తరుష్ములు బిక్షాచారుడికి సహాయం చేయసాగారు.

లౌకికాబ్దం 4196 (క్రీ.శ.1120) సంవత్సరంలో డామరులు పెద్ద ఎత్తున విప్లవం లేవదీశారు. సుస్సలుడికి వ్యతిరేకంగా దామరులు రాజ్యంలో పెద్ద ఎత్తున అరాచకం సృష్టించసాగారు. అమాయకులను ఊచకోత కోయసాగారు. రాజ్యం అల్లకల్లోలం అయింది.

ప్రజలకు రక్షణ కల్పించి, రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని రాజుకు విజ్ఞప్తి చేస్తూ కళశ్మీరంలో (బ్రాహ్మణులంతా ఉపవాస దీక్ష చేపట్టారు

విప్లవాన్ని అణచేందుకు వెళ్లిన సుస్సలుడి సైన్యం డామరుల చేతిలో పరాజయం పొందింది. దాంతో సుస్సలుడికి భయం పట్టుకుంది. రోషం పెరిగింది. సుస్సలుడు (క్రూరుడిగా మారాడు. విప్లవం లేవదీసిన డామరులపై కోపంతో కనబడిన డామరులందరినీ క్రూరంగా హింసించి చంపసాగారు.

సుస్సలుడి క్రౌర్యం ప్రజలను భిక్షాచారుడివైపు మొగ్గుచూపేట్టు చేసింది. డామరులు, తురుష్కులు రాజ్యంలో బిక్షాచారుడి గురించి అనేకమైన వార్తలు (ప్రచారం చేయసాగారు.

'భిక్షాచారుడు పండితుడు, విద్యావంతుడు, పది కొండలను ఒకే బాణంతో పిండి చేయగలడు. వంద యోజనాలు సులభంగా థమపడకుండా నడవగలడు' ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలలో కళ్ళీరానికి భిక్షాచారుడు రాజైపోతున్నాడన్న భావన కలిగింది. దాంతో వారు సుస్సలుడి అధికారాన్ని లెక్కపెట్టటం మానేశారు. ఇవాళ్లో రేపో భిక్షాచారుడు రాజయిపోతాడని భావించసాగారు.

భిక్షాచారుడు రాజధాని సమీపిస్తున్నాడన్న వార్త తెలిసి (ప్రజలు ఖిక్షాచారుడిని ఆహ్వానించేందుకు సిద్దమవసాగారు. బ్రాహ్మణులు ఉపవాసదీక్షను కరినతరం చేశారు. సున్సలుడు కశ్మీర రాజుగా తన రోజులు దగ్గరపడ్డాయని (గ్రహించాడు. ప్రజలంతా భిక్షాచారుడివైపే ఉన్నారని (గ్రహించాడు. భిక్షాబారుడు తనని యుద్ధరంగంలో కాదు ప్రచార రంగంలో ఓడించాడని గ్రహించాడు సుస్సలుడు.

తన రాణిని, తనయుడిని, ఇతర బంధువులను రహస్యంగా లోహారానికి పంపించాడు సుస్సలుడు.

ఖిక్షాచారుడి సేనలు శ్రీనగరంలో ప్రవేశించాయి.

శ్రీనగరం శతృబాణాల వర్షం తాకిడికి గురయింది. అనేక అమాయక ప్రజలు బాణాహతులయ్యారు. శత్రు సేనలు నగరంలోకి చొచ్చుకు వచ్చి ప్రజలను హింసించసాగాయి. ఇ .ట్రే :జతతతడతతతజతతడడడ2జ2జడిడులడా=== ===. కస్తూరి మురళీకృష్ణ ===

సుస్సలుడు రాజభవనం దాటి బయట అడుగుపెట్టలేని పరిస్టితి వచ్చింది. ప్రజలు సుస్సలుడిని నిందించసాగారు. సుస్సలుడి సైన్యం తిరుగుబాటు చేసింది. సుస్సలుడు తన ధనం సర్వం పంచి పెట్టసాగాడు. ఇలాగైనా ప్రజలు తన పక్షం చేరతారని ఆశించాడు. కానీ చివరికి ఇవేవీ లాభం లేదని గ్రహించి, సుస్సలుడు ఒంటరిగా కళ్ళీరం విడిచి లోహారం పారిపోయాడు.

రాజు కళ్ళ్మీరం విడిచి పారిపోయాదని తెలియగానే మంత్రులంతా సమావేశమై భిక్షాచారుడిని సింహాసనంపై అధిష్టించమని ఆహ్వానించాడు.

దొంగలు, తురుష్కులు, డామరల సహాయంతో రాజ్యం సంపాదించిన భిక్షాచారుడు తనకు సహాయం చేసిన వారందరి పట్ల కృతజ్ఞుడై ఉండాల్సి వచ్చింది. ఎట్టి పనులకైన దిగజారి రాజ్యం సంపాదించాలని తహతహలాడే వారు రాజ్యానికి రావటం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఎందుకంటే ఆ రాజు ప్రజలకన్నా తనకు సహాయం చేసిన వారి పట్లనే విధేయుడిగా ఉంటాడు కాబట్టి.

భిక్షాచారుడు పేరుకే రాజు.అధికారం సర్వం దొంగలు, తురుష్కుల చేతిలో ఉంది. వారిచేతిలో పార్వతివంటి కళ్ళ్మీరం గిజగిజలాడింది. అధికారులు “నువ్వెక్కువ దోచుకున్నావంటే నువ్వెక్కువ దోచుకున్నావు' అని అసూయతో కీచులాడుకునేవారు.

సుస్సలుడిని లోహరం నుంచి కూడా తరిమేస్తే కానీ తనకు భద్రత లేదని భిక్షాచారుడు తురుష్క సైన్యాన్ని, సోమపాలుర సైన్యంతో కలిపి సుస్సలుడిపైకి యుద్దానికి పంపాడు.

'నేనీ దారంతో సుస్సలుడిని కట్టి పశువును లాగినట్టు లాగుతాను' అని ఒక తురుష్క సైనికుడు వాగ్దానం చేశాడు 'నేనీ కత్తితో సుస్సలుడి మెడ నరుకుతాను' అని మరో సైనికుడు వాగ్దానం చేశాడు*.

కళ్ళ్మీర, ఖాసా, మ్లేచ్చ సేనలు సుస్సలుడిని పరాజితుడిని చేయగలవనే అందరూ అనుకున్నారు. విజయగీతాలు పాడుతూ వారు యుద్దానికి వెళ్ళారు.

సైన్యం అటు వెళ్ళగానే బిక్షాచారుడు తాను గెలిచినట్టే భావించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. రాజ్య భారమంతా వదిలి విలాసాల్లో మునిగి తేలసాగాడు. తురుష్క అధికారులు అగ్రహారాలను కొల్లగొట్టసొగారు. వారిని చూని ఇతర అధికారులూ అగ్రవారాలను, మందిరాలను కొల్లగొట్టసాగారు.

ఇది చూసి పరిస్టితిని ఇలాగే వదిలేస్తే మళ్ళీ హర్షుడి కాలంలోలాంటి పరిస్టితి వస్తుందని గ్రహించి పురోహితులు (ప్రజలు సామూహికంగా పెద్ద ఎత్తున నిరసన ఉపవాసదీక్షలు తీసుకున్నారు. వారంతా తమతమ ఇష్టదైవాల విగ్రహాలను తమ ముందు ఉంచుకుని భజనలతో, భక్తిగితాలతో తమ నిరసనను వ్యక్తం చేయసాగారు. == కట్దణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :2=2323=3=3=3=3=3=3ఊ3ఊ3ఊ3ఊ2ఊ2ఊఊజ ల? జ

“తురుష్కులకు సర్వాధికారాలు కట్టపెట్టిన భిక్షాచారుడికి రాజ్యార్దత లేదు. సుస్సలుడే కళ్ళీర రాజూ అని వారు ప్రకటించారు. సుస్సలుడు రాజయి, కశ్మీరంలో మళ్లీ తమ దేవాలయాలకు, తమకు భద్రత నెలకొన్ననాడే తమ ఉపవాసదీక్ష విరమణ అని వారు నిర్వంద్వంగా రాజుకు చెప్పారు.

వైశాఖ మాసంలో శుక్లపక్షం పదమూడవ రోజున పర్గోత్స వద్ద సుస్సలుడి సేన మ్లేచ్చ సేనను ఎదుర్కొంది.

'సుస్సలుడిని బంధిస్తాం, తల నరుకుతాం' అని (ప్రగల్భాలు పలికిన తురుష్కులు సుస్పలుడి ప్రతాపానికి బలైపోయారు. సుస్సలుడిని బంధించాలని వాళ్ళు తెచ్చిన తాళ్ళతోనే వాళ్ళని బంధించి యమసదనానికి తీసుకుపోయారు యమదూతలు. బ్రతికి ఉన్న తురుష్కులు తమకలవాటయిన రీతిలో సుస్సలుడివైపు చేరిపోయారు. స్వామిభక్తి లేని తుచ్చులు తమ మానరక్షణ కన్నా పప్రాణరక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

ఈరకంగా జ్యేష్టమాసం శుక్లపక్షం మూడవరోజున లౌకికాబ్బ్దం 4197 సంవత్సరంలో (క్రీ.శ1121) సుస్సలుడు మళ్ళీ కళ్ళ్మీర రాజయ్యాడు. భిక్షాచారుడు రాజ్యం వదలి పారిపోయాడు.

తురుష్క మిత్రుడు ఖిక్షాచారుడి స్పర్శతో అపవిత్రమైన కళ్ళీర సింహాసనాన్ని ముక్కలు చేసి, మరొక సింహాసనాన్ని తయారు చేసుకున్నాడు సుస్సలుడు.

సోమపాలుడి రాజ్యానికి పారిపోయిన ఖభిక్షాచారుడు మళ్ళీ సైన్యాన్ని కూడగట్టుకుని కళ్మీరంపైకి దండయాత్ర చేశాడు.

భిక్షాచారుడి తురుష్క సేన విజయక్షేతంపై విరుచుకుపడింది. ప్రజలు భయంతో చక్రధర మందిరంలో తలదాచుకున్నారు.

ప్రజలు వదిలి పారిపోయిన జనశూన్య గృహాలను కొల్లగొట్టారు భిక్షాచారుడి సైనికులు. వారు చక్రధర స్వామి మందిరంలో దాగున్న (ప్రజలను వెలికి తెచ్చేందుకు చక్రధర మందిరానికి నిప్పు పెట్టారు.

చక్రధర మందిరాన్ని జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ అపవిత్ర కళ్ళీరంలో ఉండేందుకు ఇష్టం లేక భగవంతుడు తనను తాను అగ్నితో పరిశుద్ధం చేసుకుంటున్నట్టు, జ్వాలలు ఆకాశానీకి ఎగసాయి. లలలో లీనమై 'పవిత్రతి భూమిని వదలి స్వరానికి ఎగసిన తోచింది. చవ మై పవిత్రత భూ వ శి

పవిత్రత వదలి వెళ్ళగానే అపవిత్రం చుట్టుముట్టినట్లు నల్లటి పొగ ఆకాశాన్ని కప్పేసింది. నల్లటి దయ్యాలు ఎర్రటి గడ్డంతో విరుచుకుపడ్డట్టు ఆ పాగలోని నిప్పుజ్వాలలు చక్రధర మందిరాన్ని బూడిద చేశాయి.

ఆకాశంలో అలల్లా ఎగసే జ్వాలలు కళ్మీరాన్ని వదలి వెళ్తున్న దేవతల కిరీటాల్లా తోచాయి. ఆకాశంలోకి ఎగసే నిప్పుకణికలు అగ్నికి ఆహుతై పంచభూతాల్లో కలసిపోతున్న ఇవు వద్‌ :23232323232323232323232323232323232ఊ2ఊ2ఊ2ఊఊఊఊ====2= కస్తూరి మురళీకృష్ణ ===

వ్యక్తుల ఆత్మల్లా తోచాయి. మందిరం నుండి వెలుపలకు పరుగెత్తి వచ్చిన ప్రజలను డామరులు, తురుష్కులు నిర్దాక్షిణ్యంగా సంహరించారు.

మందిరం నుండి వంద యోజనాల వరకూ రక్తం, కొవ్వు, కాలిన మాంసం కాలువలు కట్టాయి. ఆనాడు నరమహారాజు కాలంలో సుశ్రవ నాగు ఆక్రోశానికి బలైన చక్రధర మందిరం ఈనాడు మళ్ళీ రాజుల దౌప్ట్యానికి గురయి బూడిద అయిపోయింది. ఒకరొకరుగా బిక్షాదారుడికి అండగా ఉన్న వీరులు మరణించటమో, భిక్షాచారుడిని వదలి వెళ్ళటమో సంభవించింది.

తన ప్రజలకు ఈ కష్టం కలిగించటంలో పరోక్షంగా తన పాత్ర కూడా ఉందని భావించిన సుస్సలుడు పెద్ద సైన్యంతో విజయక్షేత్రానికి పయనమయ్యాడు. విజయక్షేత్రం వద్ద భయంకరమైన యుద్దం జరిగింది. విజయక్షేత్రం నుండి తురుష్మ్కులను, డామరులను తరమివేశారు. కానీ భిక్షుకుడు తప్పించుకున్నాడు. సుస్సలుడు భిక్షుడిని వెంటాడుతూ వెళ్లాడు. కానీ భిక్షుకుడు సుస్సలుడికి చిక్కలేదు. ఆనాడి నుండీ భిక్షుకుడు సుస్సలుడిని చీకాకు పరుస్తూనే వచ్చాడు. కొండ గుహల్లో తలదాచుకోవటం, ఇద్దరు ముగ్గురు ('ప్రాంతీయాధికారులతో స్నేహం కుదరగానే సుస్సలుడిపై దాడీ చేయటం, ఇలా సున్సలుడితో దాగుడు మూతలాడుతూ వచ్చాడు భిక్షాచారుడు. సుస్సలుడిని ఏనాడూ స్థిరంగా రాజ్య నిర్మాణం చేయనీయలేదు.

లౌకికాబ్బ్దం 4198 (క్రీ.శ.1122) జ్యేష్ట మాసం కృష్ణపక్షం ఆరవ రోజున గంభీర వంతెన వద్ద భీకరమైన యుద్దం జరిగింది. సైనికుల పద మఘట్టనకు వంతెన కూలి అసంఖ్యాకులైన కళ్ళీర సైనికులు జలసమాధి అయ్యారు.

సుస్సలుడికి వెనుతిరగక తప్పలేదు. సైనికులు సుస్సలుడిని వదలి ఖిక్షాచార్యుడి వైపుకు మొగ్గసాగారు. కానీ సుస్సలుడి పరాక్రమం ముందు ఖిక్షాచారుడి సేన వెనుతిరగక తప్పలేదు. పారిపోతున్న భిక్షాచారుడి సేనలు గోపాద్రి (శక్త్‌-ఇ-సులేమాన్‌) పైకెళ్కాయి. సుస్సలుడి సేనలు గోపాద్రిని చుట్టుముట్టాయి. విజయం సుస్సలుడిదే అనుకునే సమయంలో రాజు తన సైన్యం నుంచి వేరయ్యాడు.

ఆరోజు భీక్షుకుడికి సుస్సలుడి శక్తి సుస్సలుడికి భిక్షుకుడి శక్తి అర్ధమయింది. అతి కష్టం మీద భిక్షుకుడు తప్పించుకున్నాడు. కానీ సుస్సలుడు అతడిని వెంటాడుతూ లోహారం చేరాడు.

కానీ నుస్సలుడి నమ్మకమైన మంత్రి యళోరాజు భిక్సుకుడితో మంతనాలు సాగించసాగాడు.. లౌకికాబ్దం 4199 (క్రీ.శ. 1128)లో మళ్ళీ భిక్షుకుడు శ్రీనగరాన్ని ముట్టడించాడు.

జ్యేష్టమాస శుక్లపక్షం 12వ దినాన డామరులు శ్రీనగరాన్ని దగ్ధం చేశారు. శ్రీనగరం సర్వం అగ్నిగోళంలా ్రజ్వరిల్లింది. వితస్తానదిలో ఆ మంటలు ప్రతిఫలించి, వితస్తా ఒక రెండు కొసల నుండి రక్తం జాలువారుతున్న మృత్యుఖడ్గంలా కనిపించింది. == కట్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు హకడైడ౭ఆడడ౭౭౭డ౭డడ౭డడ౭డఊ 219 ===

కన్నుమూసి తెరిచేలోగా శ్రీనగరం నర్వం మందిర రహితం, మఠరహితం, గృహరహితం, భవన రహితం అయిపోయింది.

శ్రీనగరం ముట్టడిలో ఉన్నందున్న వితస్తపైని వంతెనలన్నీ తొలగించటంతో ప్రజలు మంటల నుంచి తప్పించుకుని పారిపోలేకపోయారు.

శేరి

దూరం నుంచే చూస్తున్న కళ్వాణుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. తన సుందరమైన శ్రీనగరం ఇలా మారి పోయిందేమిటి? ఆకాశాన్నంటే భవనాల బదులు, ఆకాశాన్నంటే మేరు పర్వతంలా జ్వాలలు చెలరేగుతున్నాయి. మేరు పర్వతంపై వ్రేలాడే మేఘాల్లా ఆ మంటలపై నల్లటి పొగ వేలాడుతోంది.

కళ్యాణుడి వొళ్ళు జలదరించింది. గతంలో చక్రధర మందిరం దగ్ధ్గమవటం చూశాడు. ఈనాడు శ్రీనగరం దగ్గమవటం చూస్తున్నాడు. సుందర కళ్మీరలోయ సర్వం ఇలా బూడిదయిపోతోందేమిటి? అయిపోయిందా కశ్మీర వైభవం? తీరిపోయిందా కళ్ళీరానికి శ్రీ లక్ష్మితో బుణం? ఏమౌతోందీ దేశానికి? విదేశీయులు దాడీచేస్తూ ఈ దేశం గర్భాన్నిచీల్చి పీక్కుతింటున్నారు. ఈ దేశంలో, ఈ గడ్డనే పుట్టిన వాళ్ళు దేశం రొమ్మునే చీలుస్తున్నారు. వఏమౌతోంది నా భారతావనికి?

గాయంతి దేవాఃకలగీతకాని

ఛన్యాస్తుయే భారతభూమి భాగే!

స్వర్ణాపవర్ణాస్పద హేతుభూతే

భవంతి భూయః పురుషా మనుష్యాః!

(దేవతలు ఈ భారతభూమిని గూర్చి గానం చేన్తారు. స్వర్ణాపవర్జాలు ఒసగే భారతభూమిలో మనుష్యులయి, పురుషులయి పుట్టటం పుణ్యఫలం)

దేవతలు గానంచేసే నా భరత భూమి ఇదేనా? ఎందుకిలా అవుతోంది? ఏదుష్టశక్తి ఈ దేశవాసులనిలా ఆత్మహత్యకు పురికొల్పుతోంది? ఒకవంక దేశం లోని మిగతాభాగాల్లో తురుష్కులు చెలరేగి పోతున్నారు. మారణకాండ సాగిస్తున్నారు.

ఇక్కడ కళ్ళ్మీరంలో తురుష్ములింకా రాజ్యం గెలుచుకోలేదు. కానీ తమలో తాము కలహించుకుంటూ బలహీనమై పోతూంటే రేపు తురుష్ములను ఎదుర్శొనేదెవరు? కళ్యాణుడి పృాదయం శ్రీనగరాన్ని ప్రతిఫలిస్తోంది. అతని హృదయంలో ఆవేదనా జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

బాధతో కళ్యాణుడి అడుగు ముందు పడటం లేదు. అక్కడే కూలబడి పోయాడు, జ 220 :2జడుకడకడడడడడడునకడడుక2డకడనడకడడడడడడడడడడడడడడడడడడడఊఊడఊఊఊ్చ కస్తూరి మురళీకృష్ణ నా!

“దేవా నన్ను చంపు, నా దేశాన్ని రక్షించు! ఏ కుటిలశక్తి రచిస్తోందో ఈ దేశ సౌభాగ్యాన్ని దేశం సర్వం పరాయిపాలనకు లొంగేట్టే కనిపిస్తోంది. నా దేశ ఆత్మగౌరవాన్ని సంస్కృతిని రక్షించు ప్రభూ' ఆక్రోశిస్తోంది కళ్యాణుడి హృదయం.

ఇంతలో గుల్జిపు డెక్కల చప్పుడు వినిపించింది పొదల్లో కూలబడ్డ కళ్యాణుడు చెట్లు జరిపి తొంగి చూశాడు

ఎదురుగా ఒక అశ్వికుడు, అతని వెనకే మరికొందరు అశ్వికులు కనిపించారు. వారిలో ఒక అశ్వికుడు ఒంటరిగా ఉన్న అశ్వికుడితో అన్నాడు.

“పారిపోతున్నావా సుస్సల మహారాజా?”

కళ్యాణుడి గుండె ఆగిపోయింది. తన ఎదురుగా ఉన్నది సుస్సల మవాీరాజా? సుస్సలుడు ఓడిపోతే కళ్మీరం సర్వనాశనమౌతుంది. తురుష్కులు, డామరులు కశ్ళ్మీరంలో వీరవిహారం చేస్తారు.

చుట్టూ చూశాడు. ఆయుధం లేదు. తనకు పోరాదే శక్తి లేదు. తన వద్ద ఏ శక్తీ లేనప్పుడు వ్యక్తి భగవంతుని మీద ఆధారపడతాడు.. అన్ని శక్తులను మించిన శక్తి అది.

కళ్యాణుడు కళ్ళు మూసుకున్నాడు. 'భగవంతుడా, నాకేమాత్రం పుణ్యం ఉన్నా అది సర్వం సుస్సలుడిని కాపాడనీ. కళ్ళీరాన్ని కాపాడనీ' అని ధ్యానించసాగాడు.

సుస్సలుడు నవ్వాడు. 'కమాలియా హర్షుడితో జరిగిన యుద్దంలో నా ప్రతాపం చూశావు. శత్రువుకు వెన్నిచ్చి పారిపోయేవాడిని కానని తెలుసు. రాజుకేది గౌరవమో నీకు తెలుసు. నాకు తెలుసు. మహమ్మద్‌ గజనీని మూడు చెటువుల నీళ్ళు త్రాగించిన భిజ్జరాజు మనమడిని నీకు ఆ మాత్రం తెలియదా?” అన్నాడు సుస్సలుడు.

కమాలియ తలవంచుకున్నాడు.

“నీకు తెలుసు. మీ తాతగారు తురుష్కులతో పోరాడేరు. నీవు తురుష్ములకు కొమ్ముకాస్తున్న భిక్షాచారుడికి మద్దతునిస్తావా?' సూటిగా అడిగాడు సుస్సలుడు.

కమాలియా తల ఎత్తలేదు.

“మాతృదేశాన్ని రక్షించేకోవటం కోసం కత్తి పట్టటం, ప్రాణాలర్పించటం మన విధి. తాను రాజయ్యేందుకు భిక్షుకుడు విదేశీయులతో చేతులు కలుపుతున్నాడు. ఎలుకల పోరులో పిల్లి లాభపడుతుంది. అవరాజా, ఇదే నిర్ణయాత్మక సమయం. నాకు [ప్రాణాల మీద ఆశలేదు. యుద్ద భూమిలో మరణించటం కన్నా గొప్ప చావు ఏ రాజుకూ లభించదు. కానీ నా తరువాత నీ గతి, కళ్ళీరగతి, భారతదేశగతి ఏమౌతుందో ఆలోచించు. తురుష్క ముష్మరుల పద ఘట్టనల క్రింద మన సంస్కృతి, మన భారతీ నలిగిపోతుంది అంటూ సుస్పలుడు కత్తి దూశాడు. === కల్పణ కశ్ళీర రాజతరంగిణి కధలు కత౭ైవై2త2డ242222=== 22 22

'కమాలియా సుస్సలుడిని ఆపాడు. 'రాజా భిక్షుకుడికి సహాయం చేయాలన్న ఆలోచన నాకు ఎన్నడూ లేదు. అయినా సేవకులు బ్రతికి ఉన్నంత కాలం రాజు యుద్ద రంగంలో ప్రవేశించకూడదు. మీ ఈ సేవకుడు ఇంకా బతికే ఉన్నాడు అని కత్తిదూసి కమాలియా శత్రుసేనల వైపు వెళ్లాడు. సుస్సలుడు అతని వెంటే వెళ్లాడు.

వారటు వెళ్ళగానే పొదల నుంచి బయటకు వచ్చి చూశాడు. దగ్గరలోనే భయంకర సంగ్రామం జరుగుతోంది. తన సహచరులు కొందరే ఉన్న సుస్సలుడు ప్రళభయతాండవం చేసే శివుడిలా కదనరంగంలో కదలసాగాడు. సుస్సలుడి సేన సాయంకాలంలోగా శత్రువులను చెల్లాచెదురు చేసింది.

శృత్రుమమ. జయించి శ్రీనగరం వైపు వస్తున్న సుస్సలుడి కళ్లలో విజయగర్వం లేదు. కళ్ళలో నీళ్ళున్నాయి. పూర్తిగా కాలిబూడిదై పోయిన శ్రీనగరాన్ని చూస్తున్న కొద్దీ అతని

శ్రీనగరంలో ప్రవేశించిన కళ్యాణుడికి నగరం నుంచి శ్రీ పారిపోయిందని తెలుస్తోంది. ఎక్కడ చూసినా కాలి బూడిదైపోయిన భవనాలు, శిధిలాలు దర్శనమిస్తున్నాయి. తిండి సామగ్రి, ప్రజలు దాచుకున్న ధనం సర్వం పరుశురామ ప్రీతి అయిపోయాయి... నేలమీద ఎక్కడ చూసినా ఎముకలు, పుర్రెలు దొర్లుతూన్నాయి.

ఇంతలో మరోవార్త శ్రీనగరాన్ని కుదిపేసింది. సుస్సలుడి రాణి, అతని అభిమాన పాత్రురాలు మేఘమంజరి పుల్లపురం వద్ద మరణించిరిది. ఈ వార్త విన్న సుస్సలుడు ప్రజలందరి సమక్షంలో కుప్పకూలిపోయాడు.

కళ్యాణుడు నిశ్శృబ్దంగా శ్రీనగరం వదలి భూతేశ్వరంవైపు వెళ్ళిపోయాడు. విధి క్రూరమయింది. సుస్సలుడు భిక్షాచారుడిని తరిమేశాడు. కానీ రాణి మరణవార్త, శ్రీనగర దహనం అతనిలో జీవితేచ్చను చంపేసింది. ఇక అతను రాజ్యం చేయలేడు. సుస్సలుడిప్పుడు జీవచ్చవం. ఆకాశాన్నంటే చెట్లు, దూరంగా అకాశాన్నంటే పర్వతాలు అన్నీ ఇంత ఉన్నతంగా ఉంటే మనిషి మాత్రం ఎందుకు ' పతనమౌతున్నాడు?

దారిలో కనిపిస్తున్న ప్రకృతి దృశ్యాలను చూస్తూంటే కళ్యాణుడి మనస్సులో ఇదే ఆలోచన మెదులుతోంది.

మనిషికి భగవంతుడు సర్వం ఇచ్చాడు. ఇంత అందమైన ప్రకృతినిచ్చాడు అతని అవసరాలన్నీ ప్రకృతి తీరుస్తోంది. అయినా మనిషి ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాడు? క్షణికమైన ఆనందాల వెంట ఎందుకు పరుగెడతాడు? అశాశ్వతమైన శరీర సౌఖ్యాల కోసం ఎందుకు తాపత్రయ పడతాడు? కతత బైబిది కతైతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతత22 కస్తూరి మురళీకృష్ణ చడ

దారిపొడుగునా విలవిలలాడుతున్న ప్రజలు కళ్యాణుడికి కనిపిస్తున్నారు.

తమవారు చనిపోవటంతో శోకిస్తున్నవారు కొందరు. తమవారందరూ చనిపోగా అనాధలై భిక్షమెత్తుతున్నవారు కొందరు. తమ ఊళ్ళు శ్వతువుల చేతిలో ద్యాహావాణా ఆశతో రాజధానికి వస్తున్నారు కొందరు. రాజధాని బూడిద అయిందని తెలిని వంచేయాలో తెలియక దారిలో కూలబడి విలవిన్తున్నారు మరికొందరు. జన జీవితం ఎంతగా ధ్వంసమౌతోంది!

గతంలో యుద్దాలు జరిగినా, రాజులు మారినా ప్రజల రోజువారీ కార్యక్రమాలకు లోవం వచ్చేది కాదు. కానీ ఇటీవలే రాజులు తమ లక్ష్యసాధనకు (వ్రజలను పావుల్లావాడుకోవటం ఆరంభించారు. తమ పదవుల ముందు ప్రజలు నిచ్చెనమెట్లు. అంతే! (ప్రజల కష్టం తన కష్టంలా భావించే రాజలేరి? ప్రజలకు కష్టం కలిగితే అది తన దోషంలా భావించిన రాజులేర? ఏమైపోయారు? అసలు అటువంటి రాజులు ఉన్నారు, వారు ఈ దేశాన్ని సుభిక్షింగా పాలించారు అంటే ఎవరైనా నమ్ముతారా?

బాల్యం నుంచి బూడిదైపోయిన శ్రీనగరాన్ని చూస్తూ పెరిగిన వ్యక్తికి శ్రీనగరం ఒకప్పుడు స్వర్ణంతో తులతూగిందని ఎలా తెలుస్తుంది? చెప్తే నమ్ముతాడా? అసలెవరు చెప్తారతనికి ఈ విషయాలు. తమ పూర్వీకుల గొప్ప తనం, తమ సంస్కృతి, సాంప్రదాయాల బెన్నత్యం విదేశీ దురాక్రమణల వల్ల ధ్వంసం అవుతున్న సమాజం ఎలా గుర్తుంచుకుంటుంది? తానేం చేయ గలడు? ఏరకంగా రాబోయే తరాలకు తాను తమ వారసత్వాన్ని తెలుపగలడు? ఈ ఆలోచనలతో కళ్యాణుడు భూతేశ్వర మరంలో అడుగుపెట్టాడు. తండ్రికి ప్రణామాలు ఆచరించి ఎదురుగా కూచున్నాడు.

చన్చకుడు తనయుడివైపు వాత్సల్యంగా చూశాడు.

“నాన్నగారు కళ్ళ్శీరం నాశనమై పోతోంది. త్రీనగరం బూడిదైపోయింది. సుస్పలుడు జీవచ్చంలా ఉన్నాడు. కళ్ళీరానికి, సర్వ భారతావనికి వమౌతోంది నాన్నగారు? హర్షుడు ఎంత మంచివాడు? చివరికి అలా అయ్యాడు. ఉచ్చలుడు ఉత్తముడు. హత్యకు గురయ్యాడు. సుస్సలుడికి భిక్షాచారుడితో యుద్దం చేయటం లోనే సమయం గడుస్తోంది. ఇదంతా ఏమిటి నాన్నగారు?” ఆవేదనగా అడిగాడు కళ్యాణుడు.

చన్పకుడు చిరునవ్వు నవ్వాడు. ఇది “కలియుగారంభం. ఇప్పుడిప్పుడే” కలియుగ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక రాబోయే కాలంలో రాజులు ప్రజలను రక్షించటం మాని తమని తాము రక్షించుకొంటూంటారు.. వేద పండితులు వేదాన్ని నిరర్ధకంగా మోస్తారు. జనులు శిష్టాచారాలు లేక ధనమే ముఖ్యమని భావిస్తూ మద్యమాంసాలు, లైంగిక చర్యలపై ప్రీతితో వ్యవహరిస్తారు. నత్ర్రవర్తనకు ఆదరం కలగదు. జన పదములలో అన్నం అమ్మబడుతుంది”. === కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు దై2ైైై2డ2డ222222ఊఊ2= 223 =

“శివశివ అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానికి వెలకడతారా?” ఆశ్చర్య పోయాడు కళ్యాణుడు.

“ప్రీలు మానాన్ని అమ్ముకుంటారు.

కళ్యాణుడు రెండు చెవులు మూసుకున్నాడు.

చన్చకుడు కొనసాగించాడు 'బుతుధర్మాలు తారుమారవుతాయి. దొంగల వంశంలో పుట్టినవారు ప్రభువులవుతారు. స్త్రీలు సౌకుమార్యం కోల్పోతారు. పురుషుడు నిర్వీర్యుడై భార్యతో సుఖించటం పరమావధిగా భావిస్తాడు. శాంతము నిష్పులమై కోధము సఫలమౌతుంది. ఎవరికి వారు తామే పండితులమనుకొని శాస్త్ర ప్రమాణాన్ని విశ్వసించరు. ప్రతివాడూ కవే.కుమారులు తండ్రులకు, కోడళ్ళు అత్తలకు పనులు ఆజ్ఞాపిస్తారు. స్రీలు రోగులుగా, రూపహీనులుగా, ప్రయత్న పరులుగా ఉంటారు. శీలం నశిస్తుంది. ఆయు క్షీణమవుతుంది. వ్యాధుల బాధ పెరుగుతుంది.

“ఇక చాలు తండ్రీ. నాకు చెప్పకండి. వినాలని లేదు” అరిచాడు కళ్యాణుడు.

నవ్వాడు చన్పకుడు “కళ్యాణా ఏదీ మన చేతిలో లేదు. మన ప్రమేయం లేకుండానే కాలం గడిచిపోతుంది. మనం చేయవలసిందల్లా మన కర్తవ్యాన్ని నిర్వర్రించటమే” అన్నాడు చన్చకుడు.

కళ్యాణుడు తండ్రికి నమస్కరించి “నా కర్తవ్యమేమిటి తండ్రి?” అనడిగాడు.

“నిన్ను పిలిచింది అందుకే. నువ్వు నాకొక వాగ్దానం చేయాలి”

“ఏమిటది?”

“నువ్వే రాజాశ్రయం పొందకూడదు. నేను నీకొక గురుతర బాధ్యతను అప్పగిస్తున్నాను. అది నిష్పాక్షికంగా, నిజాయితీగా నెరవేర్చాలి”.

'ఆజ్ఞనివన్వండి అన్నాడు కళ్యాణుడు తలవంచి.

“కళ్యాణా గడ్డుకాలం వచ్చింది. కాలం రాను రాను మరింత కరినం అవుతుంది. ప్రజలలో విచక్షణ జ్ఞానం నశిస్తుంది. బెన్నత్యం నశిస్తుంది. కళ్ళెదుట కనబడుతున్న నిజాన్ని గ్రహించలేరు ప్రజలు. వాళ్ళేది నమ్మాలను కుంటున్నారో అదితప్ప మరొకటి గ్రహించలేని మౌధ్యం ప్రజలలో పెరుగుతుంది. అందుకని మనం, మనబాధ్యతగా, మనతరువాత, తరాలకోసం చేయవలసిన పని ఒకటుంది.”

“ఏమిటది తండ్రీ?"

'మన పూర్వీకుల చరిత్రను లభించటం.”

తలెత్తాడు కళ్యాణుడు.

౯౭ 226 =౭౭౭ై౭౭౭౭డడడడడడడడడడపపపపపపప-ఊఊఊజడి కస్తూరి మురళీకృష్ణ =త౭జ

“అవును. నేను హర్షుడి చివరి దినాలను చూసినప్పుడే నా మదిలో ఈ ఆలోచన కలిగింది. ఎన్నో ఏళ్ళుగా సమర్ధవంతంగా విదేశీయులను ఎదుర్కొంటూ ఈ దేశం శక్తి సన్నగిల్లింది. విదేశీయులిక ఈ దేశంలో విశ్చంఖలంగా విహరిస్తారు. మనమేంటో మనమే మరచిపోయే రోజులొస్తాయి. హర్షుడినే చూడు. హర్షుడి లాంటి రాజు పాలించాడంటే ఈకాలం వారు ఎవరైనా నమ్ముతారా? అంత ఉత్తముడు చివరికంత తుచ్చుడెలా అయ్యాడు? అని అడుగుతారు. కేశవస్వామి విగ్రహానికి కళ్మీరంలో సూర్యోదయానికి ఏం సంబంధం? అంతా మూఢనమ్మకం అంటారు. కానీ ఇవి నేను చూశాను. ప్రత్యక్షంగా అనుభవించిన వారిని చూశాను. కానీ నా మాటకన్నా వారికి వారి బుద్ధికి తోచిందే మిన్న రాబోయే కాలంలో విదేశీయుల ప్రభావంతో వ్యక్తి తనని తాను నమ్మటం మానేస్తాడు. తానెవరో ఏమిటో కూడా తెలుసుకోలేడు. అందుకే నువ్వీ కశ్మీర చరిత్ర రాయాలి. నేను నా శక్తివంచన లేకుండా. అనేక వివరాలు సేకరించాను.తాళపత్రాలు సేకరించాను. శిలాశాసనాలకు ప్రతులు రాయించాను. అన్ని నీకు ఇస్తున్నాను. నా వయసయిపోయింది. నేను సేకరించిన సమాచారాన్ని గ్రంధస్థం చేసే ఓపిక నాకు లేదు. తండ్రి కర్మఫలం తనయుడు అనుభవిస్తాడు. తండ్రి అసంపూర్తిగా విడిచిన పనులు తనయుడు పూర్తి చేయాలి. కళ్యాణా, కళ్శ్మీరం అణువణువూ గాలించి, ప్రతి వ్యక్తినీ పరీక్షించు. నమాచారం సేకరించు.. ఇంకా ఈ దేశంలో తన పూర్వీకుల ప్రవర చెప్పే అలవాటు పూర్తిగా నశించలేదు._ సృష్టారంభం నుంచి ఈనాటి వరకూ ప్రతి విషయం గుర్తుంచుకునే అలవాటు మనకు ఉంది. పురాణాలు అందుకు దృష్టాంతం.

ఈ దేశానికి నువ్వు చేయగలిగిన సేవ ఇదే. కశ్మీర చరిత్రను నిష్పాక్షికంగా గ్రంధస్థం చేయి. భారతీయ ధర్మాలు, వాటి బెన్నత్యం, ఈ దేశ రాజుల బెదార్యం సర్వం గ్రంధస్థం చేయి. ఇది నువ్వు ఏ రాజు ఆశ్రయం పొందో, ఆ రాజును మెప్పించేందుకు రాయకూడదు. ఈ పని ధనార్జన కోసం, కీర్తి కండూతి కోసం కాదు. ఒక అంతరించి పోతున్న తరానికి ప్రతినిధిగా రాబోయే తరానికి వారి బెన్నత్యం తెలిపేందుకే ఈ (గ్రంధం. తీరాన్ని తాకి వెనక్కుమళ్ళిన అలను, వెనక నుండి వచ్చే అల ముందుకు తోస్తుంది. చెట్లు పళ్ళ ద్వారా విత్తనాలు వెదజల్లి మళ్ళీ చెట్లు పెరిగేట్టు చేస్తాయి. ఇది సృష్టి ధర్మం. మన తరువాత తరాల వారికి మన చరిత్ర తెలియాలి. మన చరిత్ర నుంచి వారు గుణపారాలు నేర్చుకుని తమ జీవితాన్ని ఈ దేశాన్ని చక్కదిద్దు కోవాలి. భరతభూమి తురుష్కుల, మ్లేచ్చుల కరాళనృత్యక్షే్రంలా కాక పరమశివుని దివ్య నృత్యకేళీ విలాసాల భూమి కావాలి. మళ్ళీ ఈ దేశం దేవతల నివాసయోగ్యం కావాలి. అందుకు ఇది మనం మనవంతుగా చేయగలిగేపని. చేస్తావా? హః కల్దణ కశ్మీర రాజతరంగిణి కధలు హై౭౭డై౭డడడడడడడడ౭డడడడడఊఊఊఊజ 225 ===

కళ్యాణుడు మాట్లాడలేదు. అతని మదిలో అస్పష్టదూపంలో ఉన్న ఆవేదన స్పష్టరూపం ధరిస్తోంది. ఈ పవిత్ర భూమిలో జన్మించిన బుణం తీర్చుకునే అవకాశం ఇచ్చిన తండ్రి దైవస్వరూపుడే. దైవం తనని ఈ పనికి (్రురేపిస్తోంది. అందుకేనేమో కళ్ళీర విధ్వంసాన్ని తాను చూదగలిగాడు.

“కానీ నాన్నగారూ నేను రాసే కళ్ళీర చరిత్ర వలన దేశం తన పునర్వైభవాన్ని గుర్తిస్తుందా?" సందేహంగా అడిగాడు కళ్యాణుడు.

'ఏ ఒక్కరి వల్లా ఏమీ కాదు. సర్వం భగవదేచ్చ. మన కర్తవ్యం మనం నిజాయితీగా నిర్వర్తించాలి ఫలితం భగవంతునికే వాదిలేయాలి. నీలో అహాన్ని చంపుకో. అద్వైతాన్ని నింపుకో” అన్నాడు చన్చకుడు వాత్సల్యంగా.

'నేను శక్తివంచన లేకుండా నా కర్తవ్యం నిర్వహిస్తాను అన్నాడు కళ్యాణుడు.

చన్చకుడు కళ్యాణుడిని ఆశీర్వదించాడు.

ఇంతలో బయట కలకలం వినిపించింది.

కళ్యాణుడు బయటకు వెళ్లాడు. ఏం జరిగింది?” అడిగాడు.

“సుస్సలుడిని ఉత్పలుడు హత్య చేశాడు. ఖిక్షాచారుడు కళ్ళ్మీరంపైకి దండయాత్రకు వస్తున్నాడు. “సుస్సలుడి తనయుడు జయసింహుడు రాజయ్యాడు కానీ జయసింహుడు బాలుడు” అన్నాడు ఆ తురుష్కుడు.

“ఇక సర్వనాశనమే” అనుకున్నాడు కళ్యాణుడు.

లోపలకు వెళ్ళబోతున్న కళ్యాణుడిని ఆపి 'తమరెవరు?” అడిగాడు వాదు.

నా పేరు కళ్యాణుడు” అన్నాడు.

“కళ్యాణ్‌, కల్పణ్‌, కల్పణ్‌ో అన్నాడు గొడ్డుమాంసం తినటంతో నోరు తిరగని తురుష్ముడు.

కల్పణుడు నవ్వి లోపలకు వెళ్లాడు.

లోపల చన్చకుడు తాళపత్రాలతో కళ్యాణుడి కోసం ఎదురు చూస్తున్నాడు.

కళ్యాణుడు భగవంతుడిని స్మరిస్తూ చేయిసాచాడు.

ఒక తరం, తరువాతి తరానికి తరంగంలా ఊపునిచ్చేందుకు సిద్దమౌతుంది.

శరం

నల్లటి ఆకాశంలో తారలు మిణుకు మిణుకుమంటున్నారు, కష్టాల కడలిలో ఆశా దివ్వెల్లాగా.

అడవిలోంచి అనేక మృగాల అరుపులు ఉండి ఉండి వినబడుతున్నాయి. దగ్గరలో నుండే ఏదో జరజరా పాకి వెళ్ళిన శబ్దం వినిపించింది. చెట్టుపై నుండి గుడ్లగూబ కూసింది.

క న న

అడవిలో నేలపై పడుకుని నిర్వికారంగా, నిశ్చలంగా ఆకాశంలోని తారలకేసి చూస్తున్నాడు కళ్యాణుడు.

అతని మదిలో అనేక భావాలు అక్షరాల ఆకృతి దాల్బాలని ఆత్భత పడుతున్నాయి. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఢీకొని రాబోయే నూతన అలకు ఊపునిచ్చినట్టు ఒక ఊహ మరో ఊహతో ఢీకొని ఇంకో నూత్న ఊహకు జన్మనిస్తోంది.

ఒక మనిషి మదిలో ఎన్ని ఊహలుంటాయి? ఒక సముద్రంలో చెలరేగే అలలెన్ని? ఈ విశ్వరచనలో అణువులెన్ని? సృష్టి ఎంత చిత్రమైనది?

అన్నీ జీవాలే! అన్నీ జంతువులే!

కానీ జంతువుకూ జంతువుకూ నడుమ ఎంత తేడా ఉంది!

మనిషీ జంతువే. కానీ మనిషికీ జంతువుకూ ఎంత వ్యత్యాసముంది?

మనిషే దైవం. దైవమే మనిషి

కానీ దైవానికీ మనిషికీ ఎంత వ్యత్యాసముంది?

ఈ తేడా నిజంగా ఉందా? లేక ఈ వ్యత్యాసం మనోకల్పితమా?

కళ్ళ్మీర రాజుల చరిత్ర రచిస్తానని తన తండ్రికి మాట ఇచ్చినప్పటి నుంచీ కళ్యాణుడి జీవితం అనూహ్యంగా రూపాంతరం చెందింది. ఒక లక్ష్యం లేకుండా పొర్లుతున్న ప్రవాహానికి ఒక దిశ దొరికినట్టయింది. ఎలాగయితే జలరాశిలో విద్యుచ్చక్తి నిబిడీకృతమై ఉందో అలాగే మనిషిలోనూ అనంత సృజనాత్మక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. జలాన్ని మధిస్తే శక్తి వెలువడుతుంది. మనిషి అంతరంగాన్ని శోధిస్తే సత్యం దర్శనమిస్తుంది.

తన తండ్రి తనకందించిన గ్రంథాల పరనం ఆరంభించినప్పటి నుంచీ కళ్యాణుడి అంతరంగ మధనం ఆరంభమయింది. అంతవరకూ తన ఊహలు తన పాండిత్యం పట్ల ఉన్న (వగాధఢ విశ్వానం పటాపంచలయింది. కళ్యాణుడిలో అహంకారం నశించనారంభించింది.

అహంకారం జగతిపై కప్పి ఉన్న బంగారు మాయాముసుగు, అది తొలగిన మరుక్షణం జగత్తు అసలు స్వరూపాన్ని వ్యక్తి దర్శించగలుగుతాడు._ జగత్తు అసలు రూపదర్శనం ఆరంభమయిన కొద్దీ మాయా జగత్తు పైని వ్యామోహం సడలటం ఆరంభమవుతుంది. వ్యక్తి తనలోకి తాను చూసుకోవటం ఆరంభిస్తాడు. తనలోనే పరమాత్మను దర్శిస్తాడు. ఆ తరువాత జగత్తు సర్వంలో పరమాత్మ స్వరూపాన్ని అనుభవిస్తాడు.

పరమాత్మ నిజస్వరూప దర్శనంతో వ్యక్తిని సాహిత్యం అంతర్ముఖుడిని చేయగల శక్తి ఉన్న కళ అని కళ్యాణుడి నమ్మకం. == కల్పణ కళ్ళీర రాజతరంగిణి కధలు :22222323డ32323డ023232డ223ఊ22ఊ2ం22-2=42ఊ2=2=22 2డ ==

కాళిదాస మహాకవి రచించిన రఘువంశం, మేఘదూతం చదువుతూంటే కళ్యాణుడు మైమరచిపోయేవాడు. ఆ కావ్యాల్లో చిప్పిల్లే రసాస్వాదనచే వ్యక్తి భగవత్స్వరూపాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు.. ఆ కావ్యాలు వింటున్నంత సేపూ కళ్యాణుడు తనశారీరక పరిధులు దాటి ఆధిభౌతిక సీమల్లో విహరించేవాడు.

రామాయణ భారతాలు దైవగాధలు. దైవం మానవ రూపంలో జన్మించి మనిషి జీవితానికి ఆదర్శాన్ని సాధించగల బెన్నత్యాన్ని అందుకోగల లక్ష్యాన్ని తెలిపిన కధలవి. అంతేకాదు ఆద్యంతాలు లేని అనంతమైన ఈ సంస్కృతి పరిణామ క్రమంలో మైలు రాళ్ళు ఆ ఇతిహాసాలు. ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి తన వారసత్వాన్ని గుర్తుచేసి, ఆత్మ విశ్వాసాన్ని కలిగించే అపురూపమైన చారిత్రక గాధలు రామాయణ భారత గాథలు. తండ్రి చన్సకుడు తనతో అన్న మాటలు ఈనాటికీ కళ్యాణుడి వీనుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

అంతవరకూ రామాయణ, భారతాలను నీతిబోధకాలుగా, పవిత్ర గ్రంథాలుగా మాత్రమే భావించిన కళ్యాణుడికి, తనతండ్రి మాటలు విన్న తరువాత, ఆ గాథలలో భావితరాలకు వారి చారిత్రికత తెలియాలన్న తపన కనబడసాగింది.

అందుకే రఘువంశం కళ్యాణుడికి మరింత ప్రీతిపొత్రమయింది. రామాయణంలో దృష్టి అంతా రాముడి మీద కేంద్రీకృతమవుతుంది. అందువల్ల రఘువంశం ఈ దేశ చరిత్రనర్ధం చేసుకునే విషయంలో మరింత ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

తండ్రికి వాగ్దానం చేయకముందు కళ్యాణుడు బిల్బణుడి “విక్రమాంక దేవచరిత్ర బాణుడి “హర్షచరిత్రిలను చదివాడు. కానీ ఇప్పుడు ఆ గ్రంథాలను నూతన చుక్షువులతో పరించాడు. మంఖుడి 'శ్రీ కంర చరిత్రను కూడా కళ్యాణుడు పఠించాడు.

సువ్రతుడు రాసిన 'కళ్శీర రాజ చరిత్రను కళ్యాణుడు చదివాడు. అందరికీ సులభంగా ఉండేందుకు రాయబడ్డ గ్రంధం కావటంతో అది మిక్కిలి సంగ్రహంగా ఉండటమేకాదు అంతగా పరిశోధించి రాసినట్టూలేదు. పైగా దాన్లో చరిత్రకన్నా కవితా నైపుణ్యం అధికం కావటంవల్ల కథ వాస్తవరూపం బహిర్గతం కాలేదు.

క్షేమేంద్రుడు రాసిన 'నృపావళి తోనూ ఇదే సమస్య, ఆయన కవిత్వ ప్రదర్శనకు (ప్రాధాన్యాన్నిచ్చాడు కానీ వాస్తవ చిత్రీకరణ పట్ల ఏకాగ్రత చూపక పోవటంతో, గ్రంథంలో యదార్ధమైన అంశం ఒక్కటీ కళ్యాణుడికి కనపడలేదు.

ఇంకా పూర్వకవులు రచించిన పదకొండు చారిత్రక గ్రంథాలు, నీలముని రచించిన నీలమత పురాణాలను కళ్యాణుడు పరిశీలించాడు. వరునగా కశ్మీర రాజుల పట్టిక తయారుచేయసాగాడు. అయితే ఆ పట్టికలో యాఖై ఇద్దరు రాజుల చరిత్రలేదు. వారున్నారని తెలుసుకానీ వారి గురించి ఏ వివరాలు ధొరకటంలేదు. వజ ఏ2రి క3ైతైతై333డడడతడతడడడజజఊఊఊడడడడకడదలలనుులడడడడడ222డడడడనజం. కస్తూరి మురళీకృష్ణ మడడ

ఎక్కడ పూర్వరాజుల ప్రశస్తి పట్టాలు, శాసనాలు ఉన్నాయని తెలిసినా పరుగు పరుగున అక్కడకు వెళ్ళేవాడు. నయానో, భయానో వారి ఒప్పించి లేక తన పాండిత్యంతో వారిని మెప్పించి ఆ శాసనాలకు, ప్రశస్తి పట్టాలకు నకళ్లు తయారుచేసుకునే వాడు. కశ్మీర చరిత్ర రచనలో కళ్యాణుడికి దైవం తప్ప మరెవరూ సహాయంగా లేరు.

రాజు ఆస్థానంలో ఉంటూ, రాజు ఇచ్చే ధనంతో చారిత్రక పరిశోధనలు చేసే వారున్నారు. వారికి రాజు ఇచ్చిన ధనాన్ని ఖర్చు చేసి, మరింత ధనం సంపాయించటం పట్ల తప్ప చారిత్రక సత్యాలను శోధించటం పట్ల దృష్టి లేదు.

వారి వద్ద నుండి హేలరాజు రచించిన పన్నెండు వేల శ్లోకాల గ్రంథాన్ని సంపాదించేందుకు కళ్యాణుడు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వారికి ఆ గ్రంథం కళ్యాణుడికి ఇవ్వాలని లేదు. అందుకని “ఇవాళ్ల, రేపు అని *నా దగ్గర లేదు, “వారి దగ్గర ఉంది” అని దాటవేయసాగారు.

కళ్యాణుడికి ఏమీ పాలుపోలేదు. 'నా పరిశోధన రాజు వరకూ చేరదు. ఇదినా సంతృప్తి కోసం నేను రాసుకుంటున్న (గ్రంథం. రాజు మెప్పుకోరి రాసేది కాదు" అని వారికి హామీ ఇచ్చిన తరువాతనే ఆ కావ్యం కళ్యాణుడిని చేరింది.

తాను రచించవలసిన చారిత్రక గ్రంధం కోసం కళ్యాణుడు తన కవితను త్యాగం చేశాడు. రచయితలోని కవిత్వ ధోరణి కావ్యంలోని సత్యాలను ఎలామరుగు పరుస్తుందో సవ్రతుడి, క్షేమేంద్రుడి గ్రంధాల పఠనంవల్ల గ్రహించిన కళ్యాణుడు, తనూ అదే పారపాటు చేయకూడదని తనలోని కవిని అణచిపెట్టాడు. నిజాన్ని తనకు తెలిసింది తెలిసినట్టుగా ఎటువంటి అతిశయోక్తులు లేకుండా రాయటం అలవాటు చేసుకున్నాడు.

ఆకాశంలోకి ఎలా ్రవేశించిందో తెల్లని కాంతి అదృశ్యంగా అడుగుపెట్టి చీకటిని తరిమివేయసాగింది. నక్షత్రాలు అదృశ్యమవసాగాయి.

అంతవరకూ అదృశ్యంగా ఉన్న ప్రకృతి తన విరాట్సరూవ (ప్రదర్శనకు సిద్దం కాసాగింది.సూర్యుని కిరణాలు ఉలులై జగతిపై పర్వతాకారాలను చెక్క సాగాయి.కిరణాలు తగిలిన చోటెల్లా పులకరించి మొలకలెత్తినట్టు వృక్షతతులు వొళ్ళు విరుచుకోసాగాయి.

విధాత అర్చనకు ఆలన్యం అయిందని కాబోలు వేగంగా వరుగెత్తాలని వితస్త ప్రయత్నిస్తోంది. కానీవంవులు తిరిగిన వయ్యారపు నడకకావటంతో వేగం కుదరక తడబడుతోంది. అందుకే వంపులవద్ద నీరువేగంగా తీరాన్ని కోస్తోంది.

అప్రయత్నంగా కళ్యాణుడి హృదయం నుండి ఒక శ్లోకం వెలువడింది.

“భూషా భోగి ఫణారత్న రోచిప్సిచయ చారవే!

నమః ప్రవీన ముక్తాయ హరకల్ప మహీరుహే! మై కల్పణ కశ్శ్మీర రాజతరంగిణి కథలు 23కి లైంగి 22222

(భుజగ భూషణముల పడగల కాంతి పుంజములు శదీరం కనబడకుండా వస్తంలా కప్పుతూండగా ముక్తాత్మలు (ముత్యాలు) పుష్పాల వలె ప్రకాశించే శివుడనెదు కల్పవృక్షమునకు నమస్కారము)

సూర్య తేజస్సు వల్ల నక్షత్రాలు కనబడనట్టు, శివుడు దిగంబరుడైనా రత్నం కాంతి పుంజం వస్త్రంలా పనిచేస్తోందన్న చమత్కారం శ్లోకంలో ఉంది. ఇది గమనించి కళ్యాణుడు ఆశ్చర్యపోయాడు.

ఎలా వచ్చిందీ శ్లోకం? ఎలా వచ్చిందీ భావం? ఈ భావం నా మదిలో మెదిలి, నా స్వరం ద్వారా రచింపబడింది. కానీ ఈ భావం నా మదిలో ఎలా జనించింది? ఈ భావాన్నినా మదిలో పంపిందెవరు? ఏ శక్తి వల్ల నాకీ (ప్రేరేపణ కలిగింది? ఏ శక్తివల్ల ఈ భావం అక్షర రూపం దాల్చింది? ఏ శిల్పి ఈ భావాన్ని అక్షర రూపంలో చెక్కాడు? తానిలా రాయాలనుకోలేదు. తనకీ ఆలోచనే లేదు. కానీ ఈ శ్లోకం తను రాసిందేనంటుంది ప్రపంచం. ఈ శ్లోకం నేనే రాశానని వి(ర్రవీగుతాడు తాను.

ప్రపంచమంతా ఇంతేనా? సృష్టికర్త తప్ప సృష్టి రహస్యం మరొకడికి తెలియదా? తెలియని మనిషి అంతా తానే చేశాననుకొంటాడు. తెలిసిన సృష్టికర్త చిద్విలాసంతో జగతిని దర్శిస్తూంటాడు.

దూరంగా సూర్యకాంతిలో మెరిసే పర్వత పంక్తులపై వ్రేలాడుతున్న వెండి మేఘ మాలలను చూస్తూంటే కళ్యాణుడి మనస్సు అద్వితీయమైన అనందంతో పరవళ్ళు తొక్కుతోంది.

కళ్ళ్మీర రాజచరిత్ర రచనా. కార్యానికి విధాత నన్ను ఎన్నుకున్నాడు నా ద్వారా ఈ సత్యాలను లోకానికి ప్రకటించాలని ఆ విశ్వకారుడు నిర్ణయించాడు.

కళ్యాణుడి కళ్ళముందే ఆకాశంలో ఒక మేఘం వేగంగా విచిత్రమైన విన్యాసం చేస్తూ అర్ధనారీశ్వరుడి రూపం ధరించింది.

కళ్యాణుడి మనస్సులో అప్రయత్నంగా మరో శ్లోకం రూపుదిద్దుకుంది.

“ఫాలం వహ్ని శిఖాంకితం దధ దధి

(శోత్రం వహన్‌ సంభృత

శ్రీడదత్‌ కుండలి జృంభితం జలధి

జచ్చాయాచ్చ కంరచ్చవిః!

వక్షోఖి భద్రహీన కంచుక చితం

బద్దాంగనార్థస్వవో

భాగఃపుంగవ లక్ష్మణో అస్తు యశసేసవామో అధనా దక్షిణః! మజా 2థ్ర0 222 కస్తూరి మురళీకృష్ణ ల!

అర్ధప్రీ శరీరముతో బద్దుడై నందికేశ్వరుడే ధ్వజచిహ్నముగా కలిగిన పరమేశ్వరుని ఎడమభాగమైనా, కుడి భాగమైనా మీకు యశస్మరమవుగాక.. ఆ రెండు భాగాలు నొసట వహిశిఖ ఉంటుంది. (శివుడి భాగంలో అగ్ని జ్వాల, పార్వతి నొసటన కుంకుమ, వహ్నిశిఖ అంటే కుంకుమ అని అర్ధం).

కళ్యాణుధు దిగ్గున లేచి నమస్కరించాడు.

హూ ప్రభూ, లౌకిక రాజుల చరిత్ర రాయటమనే దుర్గతి నాకెందుకు పట్టించావు? నీ కీర్తి నీ చరిత్ర, నీ దివ్యలీలా విశేషాల రచనతో నా జన్మ ధన్యం చేసుకోనీయకుండా క్షణిక శరీరాన్నే శాశ్వతమనుకుని, దైవదత్తమైన అధికారాన్ని స్వీయ పరాక్రమ ఫలితమనుకొని బురదలో పరుండి అదే స్వర్గమని భ్రమించే వరాహాల్లాంటి కలియుగ రాజుల చరిత్ర నాచే ఎందుకు రాయిస్తున్నావు తండ్రీ? ఇదేనా నేను చేయగల "దైవ కార్యం? అనుకున్నాడు కళ్యాణుడు మనస్సులో.

ఆకాశంలో అర్ధనారీశ్వరుడు అలవోకగా నవ్వినట్టనిపించింది.

కళ్యాణుడా రూపాన్ని నింపుకుని కళ్ళుమూసుకుని శిరసు వంచి నమస్కరించాడు. కళ్లు తెరిస్తే శివరూపం ఎక్కడ చెదిరిపోతుందో అన్నట్టు కళ్లు మూసుకునే ఉన్నాడు.

మూసుకున్న కళ్లముందు ఒక నూత్న ప్రపంచ ద్వారం తెరచుకుంది ఏవేవో దృశ్యాలు, చిత్ర విచిత్రమైనవి కదలసాగాయి. ఏవేవో భావనలు కళ్యాణుడి అనుభవానికి రాసొగాయి.

ఎందరో జన్మిన్తున్నారు. మరణిస్తున్నారు. ఎందరో రాజులు జన్మిస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు. _ ఛస్తున్నారు. ఏమిటిదంతా? ఒకరిని చూసి అయినా మరొకరు గుణపారాలు నేర్చుకోరేమిటి? ఇంత గుడ్డి వాడా మనిషి ఏ శక్తి కప్పి ఉంచుతోంది మనిషి జ్ఞాన చక్షువును?

కళ్యాణుడి మనసులో తాను తను కాదన్న భావన కలగసాగింది. ఎవరో తన ద్వారా ఈ దృశ్యాలు చూస్తున్నారు. ఎవరో తన ద్వారా ఈ అనుభవాలు పొందుతున్నారు.

గుజ్జపు దెక్కల శబ్దం వినబటంతో కళ్యాణుడు ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. వెంటనే

దగ్గరలో ఉన్న పొదలమాటున దాగాదు.. ఎండ తీవ్రత తెలుస్తోంది.

కొందరు డామరులు, తురుష్కులు, గుజ్టాలు దిగారు. చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఏదో గోలగోలగా మాట్లాడుకుంటున్నారు.

వారి గోల ప్రశాంత ప్రకృతిని పరిహాసిస్తున్నట్టుగా ఉంది.

“సుందర కశ్మీర లోయకీ గతి పట్టిందేమిటి?? అనుకున్నాడు కళ్యాణుడు. === కల్టణ కళ్ళీర రాజతరంగిణి కధలు 2కు 23 ==

నిజంగా కాలమే భగవంతుడుకాలాన్ని అనుసరించి ప్రపంచం నడుస్తోంది. కాలం ఎలా నిర్ణయిస్తే జగతి అలా నర్రిస్తుంది.

లేకపోతే పవిత్ర భూమి, పార్వతీ సమానమైన కళ్శ్మీరంలో ఈ అల్లకల్లోలాలేమిటి?”

ఈ అనర్జాలేమిటి?

డిద్దాదేవి తరువాత ఏ రాజు కూడా కళ్ళీరాన్ని స్థిరంగా పాలించలేక పోతున్నాడు. సంగ్రామ సింహుడికి తుంగుడు పక్కలో బల్లెంలా ఉన్నాడు. అనంతుడిని అతని తనయుడు కలశుడు (ప్రశాంతంగా నిలవనీయలేదు. కలశుడిని హర్షుడి నీడ వెన్నాడుతూనే ఉంది. హర్షుడిని ఒక వైవు నించి సుస్సలుడు, మరో వైపు నుంచి ఉచ్చలుడు ప్రశాంతంగా ఉండనీయలేదు. ఉచ్చలుడిని, సుస్సలుడిని భిక్షాచారుడు నిద్రపోనీయలేదు.

లౌకికాబ్దం 4103వ సంవత్సరం (క్రీ.శ. 1128), ఫాల్గుణ మాసంలో సుస్సలుడు హత్యకావటం వల్ల జయసింహుడు రాజయ్యాడు.

జయసింహుడు రాజయ్యే తరుణంలో భిక్షాచారుడు శ్రీనగర పొలిమేరల్లో ఉన్నాడు. కళ్ళీర సింహాసనం తనదేనని విజయగర్వంతో దూసుకువస్తున్నాడు. జయసింహుడు రాజు అయినప్పుడు అతని వైపు వంద మంది కూడా లేరు. అందుకే జయసింహుడు రాజవుతూనే తన వ్యతిరేకులందరికీ క్షమాభిక్ష ప్రకటించి వారందరికీ ఉన్నత పదవుల ఆశ చూపించాడు. ఫలితంగా అతని పరిస్థితి మెరుగయింది. కానీ దొంగలు, కపటులు, కుత్సితులు, చపలచిత్తులు, అవకాశవాదులు అంతా జయసింహుడి చుట్టూ చేరి కళ్శ్మీరంలోని ఉన్నత పదవులను ఆక్రమించుకున్నారు.

జయసింహుడి సమస్యలు అంతటితో అంతం కాలేదు. ిక్షాచారుడు, తురుష్కుల, మ్లేచ్చ్ళుల, డామరుల సహాయంతో కళ్ళ్శీరాన్ని అల్లకల్లోలం చేయసాగాడు. భిక్షాచారుడి బెడద నుండి తప్పించుకొనేందుకు జయసింహుడు ఎంతో ప్రయాస పడాల్సి వచ్చింది.

భిక్షాచారుడు జయసింహాడికి చిక్కినట్టే చిక్కి మాళవ దేశం పారిపోయాడు. అక్కడ మళ్లీ విదేశీయులను కూడగట్టుకుని కళ్ళీరం పైకి విరుచుకుపడ్డాడు. లౌకికాబ్దం 4106వ సంవత్సరం (క్రీ.శ. 1130) జ్యేషస్టమాసం కృష్ణపక్షం పదవ రోజున, జయసింహుడిప్రలోభాలకు లొంగి భిక్షాచారుని అనుచరులే అతడిని హత్య చేయటంతో జయసింహుడికి ఒక బెడద వదిలింది,

జయసింహుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకునేలోగా రాజ్యంలో డామరులు విప్లవం లేవదీశారు. ఆ విప్లవం అణగేలోగా జయసింహుడి నమ్మకస్టులు కుట్రలు పన్ని రాజ్యాన్ని అల్లకల్లోలం చేశారు. ఆ వెంటనే సుజ్జి, భోజుడు ఇలా జయసింహుడికి ఒకటి వెంట మరో అశాంతి వచ్చి పదుతూనే ఉంది. మ 202 3డైడడడడడడ2జ22జ222జ222ఓ2ఓ2ఓ2ఓ2ఒఓ2జ2జజజఊఒఊఒఊఒఊఒఊఓఊఓఒఓఊఓఒఓద2ఊ4ఊ4ఊ4ఊ4ఊఊ222222 కస్తూర్రి మురళీకృష్ణ ఊత

కొందరు వ్యక్తుల రాజ్యాధికార ఆశ వల్ల కలుగుతున్న నిరంతర అరాచకాలు కళ్ళీర జన జీవితాన్ని భగ్నం చేశాయి. ప్రజలు తన నిత్యవృత్తులను వదలి ఖడద్దాలు చేబూనారు. అంతవరకూ సమాజంలో ఉన్న కట్టుబాట్లు, ఏర్పాట్లు, సర్వం విచ్చిన్నమయి వాటి స్టానే నూతన కట్టుబాట్లు, ఏర్పాట్లు పరిస్థితుల కనుగుణంగా ఏర్పదసాగాయి.

ప్రజలెవరికి వారు అత్మరక్షణకై ఉద్యుక్తులయ్యారు. దేశంలో ప్రతి వ్యక్తి జీవితం బ్రతకటం కోసం జరిపే ఓ పోరాటంలా మారింది.

ఈ అల్లకల్లోలాలలో సుడిగుండాలలో కళ్యాణుడు దైవంపై భారం వేసి తన నిర్ధిష్ట కర్తవ్యాన్ని ఒక యోగిలా నిర్వహిస్తూ వస్తున్నాడు.

కళ్ళీర రాజుల చరిత్రలో యాభై ఇద్దరు రాజుల చరిత్ర దొరకలేదు కళ్యాణుడికి. అ రాజుల చరిత్ర వేటలోనే కళ్యాణుడు శారదా మందిరానికి బయలుదేరాడు.

నీలమత పురాణం నుండి కళ్ళీర ఆవిర్భావం నుంచి మొదటి గోనందుడు, దామోదరుడు, యశోవతి, రెండవ గోనందుల చరిత్రను గ్రహించాడు. ఆ తరువాత 85 రాజుల చరిత్ర దొరకటం లేదు.

'హేలరాజు (గ్రంధం నుండి లవ, కుశ ఖగేంద్ర, సురేంద్రుల చరిత్ర గోధర, సువర్ణ, జనక, శచబీంద్రుల చరిత్రలు గ్రహించాడు.

శ్రీచ్చవిల్లకారుడు అశోకుడాదిగా అయిదుగురు రాజుల చరిత్ర రాశాడు. కానీ తనకు కావలసిన రాజుల చరిత్ర ఏ గ్రంధాల్లో లభించటం లేదు. ఇంతలో కళ్యాణుడికి ఓ వార్త తెలిసింది. అనంత జ్ఞానముని కళ్ళీరానికి వస్తున్నాడని.

పూర్వం భారతదేశంలో ్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో చరిత్ర చెప్పేందుకు కొందరు మునులుండేవారు. చరిత్ర, సేకరించటం, చెప్పటం వీరి వృత్తి. సృష్టి ఆరంభం నుంచి ఈ ప్రపంచాన్ని ఏలిన రాజులందరి గురించి చెప్తూ, ఆయా (గ్రామాల్లోని వ్యక్తులందరి పుట్టు పూర్వోత్తరాలు వంశవృక్షాలు ఈ మునులు స్తేకరించేవారు. అందుకే ఆ కాలంలో వ్యక్తి తనను తాను పరిచయం చేసుకునేముందు తన తాత పేరు, తండ్రి పేరు, తన గోత్రం, ప్రవర చెప్పి తన పేరు చెప్పేవాడు. దాంతో ఆ వ్యక్తి గురించి సర్వం ఎందుటివారికి తెలిసిపోయేది.

ఈ మునులు దేశ సంచారం చేస్తూ, దేశంలోని ఇతర (ప్రాంతాల చరిత్ర తెలుసుకుంటూ, తమ చరిత్రను, వారి చరిత్రను సరిపోలుస్తూ ఉండేవారు. సంచార చరిత్ర గ్రంధాల్లాంటివారు వీరు. (పురాణాల్లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తారు. అందుకే పురాణాలు మన చరిత్ర చెప్పే (గ్రంథాలు) వీరు చరిత్రను అభ్యసించి, పఠించి అందించటం ద్వారా దేశంలోని ననా కల్పణ కశ్మీర రాజతరంగిణి కథలు 2233332222 283 =

వ్యక్తులకు తమ పూర్వీకుల పరంపరను తెలియజేసేవారు. (ఇప్పటికీ ఇంకా ఆధునిక నాగరికత సోకని ఆఫ్రికా దేశాల్లో ఇటువంటి వ్యక్తులున్నారు. వీరిని 'గ్రియోట్లం'టారు. ఈ '“గ్రియోట్‌ో ద్వారానే “రూట్స్‌ రచయిత అలెక్స్‌ హేలీ తన ఏడుతరాల క్రితం నాటి చరిత్రను తెలుసుకున్నాడు).

అయితే కాలక్రమేణా దేశంలో శాంతి అదృశ్యమై, అశాంతి నెలకొన్నప్పటి నుంచీ ఈ మునుల పరిస్థితి దుర్భలమవసాగింది. వీరికి ఆశ్రయమిచ్చే ప్రజలు ఆత్మరక్షణ కోసం పరుగిడుతుంటే ఈ మునులకు ఆశ్రయం ఇచ్చేదెవరు? పైగా శతృవు, మనిషి కనబడితే మతం మార్చేవాడు, హతం చేసేవాడు కావటంతో మరణించిన ఒకో వ్యక్తితో, మతం మారిన ఒకో మునితో ఈ దేశప్రజలు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రకు దూరమవసాగారు.

ఇంకా మిగిలి ఉన్న మునుల్లో అనంత జ్ఞానముని ఒకరు. ఈయన తరువాత ఇలా చరిత్ర చెప్పేవారు' లేరని దేశమంతా పాకిపోయింది. అందుకే ఆయన వస్తున్నారంటే ఆయా దేశాల్లో ప్రజలు పెద్దఎత్తున అతడిని ఆహ్వానించేవారు. సాధారణంగా మునులు అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లటం మానుకున్నారు. కానీ అనంత జ్ఞానముని ప్రతి యాత్రను శారవాపీరం- నుంచే (ప్రారంభిస్తాడు. ఈ సార్‌ ఇక్కడి నుంచే ఆరంభించాలని ఆయన సంకల్పం.

కళ్యాణుడు అందరికన్నా ముందే ఆయనను కలుసుకుని తన సందేహాలు నివృత్తి చేసుకోవాలని బయలుదేరాడు.

విశ్రాంతి తీసుకుని డామరులు గుజ్టాలెక్కి వెళ్లిపోయారు. వారటు వెళ్లగానే కళ్యాణుడు పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. నెమ్మదిగా (గ్రామం వైపు అడుగులు వేయసాగాడు.

(గ్రామం దగ్గర పడుతూండగ్గానే ఏవో అరుపులు, కేకలు వినిపించసాగాయి. గ్రామం నుండి పొగ కూడా వస్తోంది.

“గ్రామంపై తురుష్కుల దాడి జరుగుతోందా?” అని కంగారుపడ్డాడు కళ్యాణుడు, కాసీ ఆ అరుపులు, కేకలు ఆర్తనాదాలు కావు, ఆగ్రహనాదాలు.

వమౌతోందనని వడివడిగా ఆ వైపు అడుగులు వేయసాగాడు కళ్యాణుడు. ఎవరో దొంగ కాబోలు, గ్రామస్తులు వెంటబడి తరిమేస్తున్నారు. (గ్రామంలోకి అడుగుపెట్టనివ్వటం లేదు.

కానీ దగ్గరకు వెళుతూంటే విషయం తాననుకున్నది కాదని అర్ధమయింది కళ్యాణుడికి. కారణం. ఆ వ్యక్తి దొంగలా కనబడకపోవటమే.

అతని వేషం చూడగానే బ్రాహ్మణుడని తెలుస్తోంది. పిలక, విభూతి, అతని వస్త్రధారణ, భాష సర్వం అతడిని పట్టించేస్తున్నాయి. కా 23తీ వనాడడకకకకకడడడడజడజజడజడడడడకడడడఊఊఊదఊఊఊ2ఊఊ225 కస్తూరి మురళీకృష్ణ లా!

కళ్యాణుడు వేగంగా వెళ్లి అతనికి గ్రామప్రజలకు మధ్య అడ్డంగా నిలబడ్డాడు.

“ఏమిటీ మీరు చేస్తున్న పని? అసలే అన్ని వైపుల నుంచీ మన ధర్మం విదేశీయుల ముట్టడిలో ఉంది. ఇక మనలో మనకీ పోరేమిటి?” అడిగాడు.

కళ్యాణుడి గాంభీర్యం, వదనంలో ఉట్టిపడుతున్న వర్చస్సు చూసి.గ్రామస్టులు ఒక అడుగు వెనక్కు చేశారు.

వారిలో (గ్రామపెద్ద కాబోలు, ముందుకు వచ్చి అన్నాడు 'ఈయన గోవుమాంసం తిని తురుష్ముదైపోయాడు. అందుకే గ్రామం నుంచి తరిమేస్తున్నాం. ఇతడిని తాకితే నిన్ను కూడా (గ్రామంలో అడుగుపెట్టనివ్వం'.

కళ్యాణుడు కంపరంగా ఒక అడుగు పక్కకు వేశాడు. 'తమరు గో మాంసం భుజించారా?” అడిగాడు.

ఆ వ్యక్తి ఏదుస్తూ 'లేదండీ. నేను కోరి భుజించలేదు. నేను వేదవేదాంగాల్లో నిష్టాతుడను. నాపేరు అమరశర్మ తురుష్క తండాకు చిక్కుపడ్డాను. వాళ్లు నేను మతం మోరనందుకు నా భార్య, పిల్లలను నా కళ్లముందే నరికారు. నా తల్లిని వధించేందుకు సిద్ధమౌతూంటే గత్యంతరం లేక నేను ఒప్పుకున్నాను. నా నోట్లో బలవంతంగా మాంసం కుక్కారు. ఆది చూసి నా తల్లి అక్కదే మరణించింది. చావలేక నేను బ్రతికి ఉన్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నా నన్ను ఊళ్లో అడుగుపెట్టనివ్వటం లేదు. నా ఇల్లు కాల్చేశారు. నా ఇంట్లో శాస్త్రాలు, పవిత్ర గ్రంధాలు సర్వం బూడిద అయిపోయాయి.” విలవిల ఏడవసాగాడు అమరశర్మ,

కళ్యాణుడు ఒక అడుగు ముందుకువేసి, అతని తలపై చేయి ఉంచి,'నాలో ఏ మాత్రం (బ్రాహ్మణత్వం ఉన్నా నీ దోషం నాకురానీ. నువ్వు దోషరపితుడవు. ననాతన ధర్మానుయాయివే. వెళ్లి వితస్తలో స్నానంచేసి రా అన్నాడు కళ్యాణుడు.

అ వ్యక్తి వెళ్లగానే బిత్తరపోయి చూస్తున్న గ్రామస్థులతో అన్నాడు కళ్యాణుడు "మన ధర్మం అత్యుత్తమమైనది. బలవంతంగా ఆవుమాంసం నోట్లో కుక్క బడినంత మా త్రాన మన సోదరుడు మన సోదరుడు కాకుండాపోడు. విదేశీయులనే సోదరులుగా భావించేందుకు సిద్దపడుతున్న మనం స్వంత సోదరుడినే దూరం చేసుకుంటామా?

ఇది ఆపద సమయం. ఇంత వరకూ మనం ఇటువంటి రాక్షస శతృవులను ఎదుర్మోలేదు. మన ధర్మం కూడా పరిస్థితులకనువుగా మారాలి. ఛండాలునిలో పరమాత్మను దర్శించిన శంకరాచార్యుల వారిని స్మరించండి. గురువాజ్ఞను ధిక్కరించి మందిర శిఖరం నుండి (బ్రహ్మజ్ఞానాన్ని జనులకు బోధించిన రామానుజాచార్యులను తలపుకు తెచ్చుకోండి. శ్లోకాలు వల్లైెవేయటం ధర్మపాలన కాదు. వాటి అర్ధాలను ఆచరించటం ధర్మపాలన. సూత్రాలు,

మమత కల్దణ కళ్శీర రాజతరంగిణి కధలు :2222డడజ222222222222ఉ2ఉ2ఉ2ఉ2ఉఊఉఊఉఊఉఊఉఊఊఊ2 236 డూ

శాస్త్రాలనూ మనుషులను కలిపేందుకు, ద్వేషంతో విడదీసేందుకు కాదు' అని ఆ గ్రామంలో ఆగకుండా వెళ్లిపోయాడు కళ్యాణుడు. తాన

శారదాపీరం దగ్గరపడుతోంది. అంతవరకూ తాను చూసిన దృశ్యాలు, ఆ అనుభవాలు కళ్యాణుడిని బాధిస్తున్నాయి.

పచ్చగా కళకళలాడే (గ్రామాలు పీనుగు దిబ్బలయిపోతున్నాయి. అతిధి సత్మారానికి పెట్టింది పేరయిన గ్రామాలు అతిథులను దోచుకునే దొంగ ఊళ్లయిపోతున్నాయి. అన్నపూర్ణ వంటి దేశంలో అన్నం కరువయింది. (ప్రజలు [ప్రాణాలు అరచేత పట్టుకుని భయంతో జీవిస్తున్నారు.

నా కణ్మీరమేనా ఇది?

శారదాదేవి మందిరాన్ని సమీపిస్తున్నా కళ్యాణుడి మదిలో భక్తిభావాలు కలగటం లేదు. ఆవేదన తరంగాలు ఎగసి ఎగసి పడుతున్నాయి.

ఇంకా అనంత జ్ఞానముని శారదా మందిరం చేరలేదు. ఆ రాత్రి కళ్వాణుడు మందిర ప్రాంగణంలోనే విశమించాడు.

రాత్రంతా ఏవో పీడకలలు. పాడుకాలం దాపురించినప్పుడు పీడ కలలు రాక మంచి కలలెలా వస్తాయి? అనుకున్నాడు కళ్యాణుడు. తెల్లారింది కళ్యాణుడు గోమాంస పాసాన్ని స్వీకరించటంతో అతడిని గుడిలోకి రానివ్వలేదు.

“రామానుజాచార్యుల వారినే రానివ్వలేదు. నేనెంత?” అనుకున్నాడు కళ్యాణుడు.

“విజ్ఞానాన్ని ఒక్కడి గుప్పెట్లో దాచుకుని లాభంఏమిటి? (ప్రపంచానికి వెలుగులుపంచని సూర్యుడి ఉపయోగం ఏమిటి?” అన్న భావన కళ్యాణుడికి కలిగింది.

విశాల భావాలకు, ఉన్నత ఆదర్శాలకు,ఆలవాలమైన సనాతనధర్మం ఇలా పరివర్తనం చెందుతోందేమిటి? ఒకవంక విజ్ఞానాన్ని గుప్పెట్లో బంధిస్తున్నారు. మరో వంక విజ్ఞానులను చిన్న కారణాలకే ధర్మం నుంచి బహిష్కరిస్తున్నారు. ఇంకో వైపు పద్దతి ప్రకారం ఈ దేశ విజ్ఞాన భాండాగారాన్ని విదేశీయులు నాశనం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పమౌతుందీ జాతి చివరకు?

హఠాత్తుగా తనకు దగ్గరలో ఒక గంభీర స్వరం వినబడటంతోటే కళ్యాణుడు ఉలిక్కి పడి ఆ వైపు చూశాడు.

“అవ్యక్తం కారణం యత్తన్నిత్యం సదసదాత్మకం! (ప్రధానం పురుషస్త స్మాన్నిర్మమే విశ్వమీశ్వర!! తం బుధ్యధ్వం మునిశ్రేష్టా బ్రాహ్మణ మమితౌజనం! ్రష్టారం సర్వభూతానాం నారాయణ

పరాయణమ్‌!!! క 2906 కుక 22 కస్తూరి మురళీకృష్ణ నా

అహంకారస్తు మహత స్తష్మాద్భూతాని జజ్ఞరే! భూత భేదాశ్చ భేదాశ్చ భూతే భఖ్య ఇతి సర్గస్సనా తనః!॥!

విస్తారావయవం చైవ యథాప్రజ్ఞం యధా (శ్రుతి! కీర్తమానం శృణుధ్వం వః సర్వేషాం కీర్తివర్ధనమ్‌!!

కీర్తితం స్థిరకీర్తీనాం సర్వేషాం పుణ్యవర్థనమ్‌! తతః స్వయం - భూగర్భ గనాన్సిషక్షుర్వి విధాః ప్రజాః!

(తెలియరానిది, ఆవ్యక్తము, సర్వకారణము, నిత్యము ఉన్నదియు, లేనిదియు అయినది (ప్రధానమొక్కటి కలదు. దాని నుండి విశ్వమును సృజించెను. అదియి తత్వదబ్రహ్మ. సర్వభూత (స్ట. అతడు నారాయణ పరాయణుడు. అదియె మహత్తత్వము (బుద్ది) అందుండి అహంకారము అందు నుండి పంచభూతాలు జన్మించాయి. వారి స్థితి భేదాన్ని బట్టి భూత కోటి పుట్టింది. ఇది సనాతనమగు ధర్మము. సర్గము (సృష్టి. ఇదే సృష్టి విలాసము. నా విన్నంత, (శ్రుతుల వలన నాకు తెలిసినంత సవిస్తరముగ విన్నవిస్తాను. దీని వలన పుణ్యం లభిస్తుంది.)

కళ్యాణుడు ఆ వైపు పరుగెత్తాడు. హఠాత్తుగా ఆగిపోయాడు.

ఎదురుగా అనంత జ్ఞానమని!

హిమాలయ పర్వత పవిత్రత మానవ ఆకారానికి ఆపాదిస్తే అది అనంత జ్ఞానముని శరీరం అవుతుంది.

కళ్యాణుడు ఆయన కాళ్లమీద పడ్డాడు. తాను సేకరించిన కళ్మీర చరిత్రను ఆయన పాదాల ముందు పడవేశాడు. అతని స్పర్శమాత్రం తోటే కళ్యాణుడి శరీరం సర్వం పవిత్రమై, పులకాంకితమయింది. కళ్యాణుడు నోరు విప్పేలోగా అనంత జ్ఞానముని నవ్వి, కళ్యాణుడి తలపై చేయి ఉంచి వాత్సల్యంగా అన్నాడు.

నీకు తెలియనిది యాఖై ఇద్దరు రాజుల చరిత్ర కాదు. ముప్పయి అయిదుగురిదే. నీలమత పురాణంలో గోనందాదిగా ఉన్న రాజులు, హేలరాజు “'పార్టివావళిలో లవుడితో కలిపి ఎనిమిదిమంది రాజులు, అశోకుడి నుంచి అభిమన్యుడి వరకు ఉన్న రాజుల లెక్క కలిపి నీ లెక్క సరిచేసుకో.”

కళ్యాణుడు సంభ్రమంగా చూశాడు.

అనంత జ్ఞానముని నిశ్చలంగా ఉన్నాడు. హరాత్తుగా మంద్ర గంభీర స్వరంతో చెప్పసాగాడు.

“స్వయంభువు బ్రహ్మ ముందుగా ్రకాశోదకాన్ని సృష్టించాడు. అందు తానే ఐహు రూపాలుగా జనించాలనే సృష్టి సంకల్పాన్ని వీర్యాన్ని వదిలాడు. నరుల సృష్టికి మూలకాలైన మదా కల్దణ కళ్ళీర రాజతరంగిణి కధలు = 2087 జ

ఆ ప్రకాశోదకాన్ని నారములంటారు. వాటి మొదటి గమ్యస్థానము నారాయణుడు. ఆయన వదలిన వీర్యము నుండి బ్రహ్మ స్వయంభువు అను పేర జన్మించాడు. (బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. దిన, భువ ఆకాశాలను సృష్టించాడు. పది దిక్కులను సృజించాడు. కాలము, మనస్సు, వాక్కు కామము, క్రోధము, రతిలను సృష్టించాడు. సప్త బ్రహ్మలను సృష్టించాడు. రుద్రుని సృష్టించాడు

తన శరీరాన్ని రెండుగా విభజించి స్తీ పురుషులను సృష్టించాడు. మనువును సృష్టించాడు. డెబ్బయి ఒక్క మహాయుగాలు మనువు ఆయుర్దాయము. అదే మన్వంతరం.

ఇలా స్వాయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సావర్డి, రైచ్యుడు, మురుసావర్ణి ఇవీ మనువుల పేర్లు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరగుతోంది. ప్రతి మన్వంతరంలోని సప్తర్షులు, వుత్రపౌత్ర పరంపర దేవగణాలను నీకు తెలుపుతాను.”

కళ్యాణుడు అడ్డుపడ్డాడు “స్వామీ మాన జీవితం పరిమితమ్రైనది. జ్ఞాపకశక్తి పరిమితమైనది. ఇవన్నీ తమరు చెప్తే మేమెలా నమ్మాలి?” అనడిగాడు.

అనంత జ్ఞానముని నవ్వాడు.

“భారతదేశానికీ, ఇతర దేశాలకూ ఇదే తేదా. ఇతర దేశాలకు చరిత్ర లేదు. ఈ దేశంలో చరిత్ర అభ్యాసం, మననం ఒక శాస్త్రం. మనిషి ఆవిర్భవించిన నాటి నుండి 195 కోట్ల సంవత్సరాల చరిత్రను మనం కంఠస్థం చేశాం. ఒక తరం నుండి మరో తరానికి అందిస్తూ వస్తున్నాం. (ప్రస్తుతం (బ్రహ్మకల్పంలో ఏడవ మనువు కాలంలో అంటే 195,58,85,054వ నంవత్సరంలో ఉన్నాం మనం. (వ్రతి మనువు కాలం 30,67,24,000 సంవత్సరాలు. వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు. ఒకో యుగం 48,20,000 సంవత్సరాల చొప్పున గడచిపోయాయి కృత, శ్రేత, ద్వాపర యుగాలు కలసి 38,88,000 వేల సంవత్సరాలయ్యాయి. ద్వాపర యుగంలో కల్పారంభానికి 36 సంవత్సరాల ముందు మహాభారత యుద్దం జరిగింది. అది కల్వారంభం.

కళ్యాణుడు అనంత జ్ఞానముని వైపు చూస్తూండిపోయాడు.

“ఈ జ్ఞానం నీకు పురాణాలు ఇస్తాయి. అందుకే పురాణ ఛవణం ఈ జాతి సంస్కృతిలో ప్రముఖ భాగం. ఈ జాతి పరంపరను తెలిపేవి పురాణాలు.

“కానీ పురాణాలు చరిత్ర అని నమ్మటం ఎలా?” అడిగాడు కళ్యాణుడు.

“అయిదు లక్షణాలున్నవే పురాణాలు సర్గము, ప్రతిసర్దము, వంశము, మన్వంతరము, భూమ్యాది సంస్థానం ఈ అయిదు లక్షణాలు. అంటే భూతోత్చత్తి, మారీచ్యాది ప్రజాపతుల వలన జరిగిన చరాచర భూత సృష్టి, బుషుల రాజుల వంశ క్రమము. మనువులు, వారి ౭ 200 :=2232322ఊఊఊఊఊఊఊఊఊ4ఊ442222222 కస్తూరి మురళీకృష్ణ ===

పాలన విశేషాలు, భూగోళ విభాగము, ఆయా వర్షములందలి విభాగము కలిగినవే పురాణాలు, పురాణాలు-మోహరహితులు, నిష్కల్మషులు, నిరాపేక్షతో రాసిన శాస్త్రాలు వాటిని నమ్మలేనివాడు తనని తాను నమ్మలేడు' అన్నాడు జ్ఞానమని. కళ్యాణుడు నమస్మరించి "క్షమించండి అన్నాడు. అనంత జ్ఞానముని నవ్వి 'ఇది యుగలక్షణం' అన్నాడు. ఇంతలో ఎప్పుడొచ్చారో జనం వారి చుట్టూ చేరారు. అనంత జ్ఞానముని పురాణ ప్రజా పరంపరను వినిపించసాగాడు. కధ సాగుతూ కలియుగంలో ప్రవేశించింది. 'కలి యుగం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకు ప్రమధి నామ సంవత్సరంలో (క్రీపూ. 3102) ఆరంభమయింది. మహాభారత యుద్దం తరువాత భారతదేశానికి యుధిస్టిరుడు రాజయ్యాడు. సహదేవుడు మగధ రాజయ్యాడు. దాంతో బృహద్రధ వంశం ఆరంభమయింది. బృహద్రధ వంశానికి చెందిన 22 రాజులు మగధను 1006 సంవత్సరాలు పాలించారు. ఆ తరువాత ప్రద్యోత వంశానికి చెందిన అయిదుగురు రాజులు 138 సంవత్సరాలు, 10 శిశునాగు రాజులు 360 సంవత్సరాలు, తొమ్మిది నంద రాజులు 100 ఏళ్లు పాలించారు. అంటే కల్యారంభమయిన 1604 సంవత్సరాలకు మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజయ్యాడు. మౌర్య చంద్రగుప్తుని తరువాత బిందుసార, అశోకాదిగా పది రాజులు 187 ఏళ్ళు, ఆ తరువాత 10 సుంగ వంశరాజులు 112 ఏళ్లు. నలుగురు కణ్వ రాజులు కీర్‌ ఏళ్లు, త1 ఆంధ్ర రాజులు 456 ఏళ్లు మగధను పాలించారు. “ఈ సంవత్సరాలను ఇంత సరిగ్గా ఎలా చెప్పగలుగుతున్నారు?” అడిగాడు కళ్యాణుడు. 'సప్త్రరయో మఘాయుక్తాః కాలే పరిక్షితే శతం ఆంధ్రాంశేస చతుర్వింతే భవిష్యంతి మతే మము పరీక్షిత్తు జనన సమయంలో సప్తర్షి మండలం మఘ నక్షత్రంలో ఉండేది. ఆంధ్ర వంశారంభానికి అది 24వ నక్షత్రశతంలో ఉంటుంది. “ఇది వాయుపురాణం లోది. బ్రహ్మాండ పురాణం ఇదే చెప్తుంది. మత్స్యపురాణం ఇదే చెప్తుంది. పరీక్షిత్తు జనన సమయంలో మఘ నక్షతంలో ఉన్న సప్తర్షి మండలం ఒక చుట్టు తిరిగి మళ్లీ మాఘ నక్షత్రంలోకి వచ్చేసరికి మగధలో ఆంధ్ర రాజులు రాజ్యం చేస్తున్నారు. అంటే పరీక్షిత్తు జననం తరువాత 2705 సంవత్సరాలకు 8వ శాతకర్ణి రాజ్యానికి వచ్చాడన్నమాట. అంటే మహాభారత యుద్దం జరిగిన 2811 సంవత్సరాలకు అలెగ్జాండర్‌ అనే యవన వీరుడు భారతదేశం మీదకు దండెత్తాడు (క్రీ.పూ.327) ఆ తరువాత ఒక సంవత్సరానికి గుప్తుల రాజ్యం మగధలో నెలకొంది (క్రీ.వూ.326). గుప్తుల రాజ్యం కతఊఉఆ కల్సణ కశ్మీర రాజతరంగిణి కధలు :2=23ఊ3ై232323202323232323232323232ఊ2ఊ2ఊ2ఊ222డ222ఊ2ఊ2 236 22

ఆరంభమయిన 244 సంవత్సరాలకు ఉజ్జయినిలో విక్రమాదిత్యుడు రాజ్యం చేశాడు (క్రీ.పూ.82). అతని మనుమడు శాలివాహనుడు శకులను పారద్రోలాడు (క్రీ.శ?78). వీరిద్దరు రాజ్యానికి వచ్చినప్పటి నుంచే విక్రమార్క శకం (క్రీ.పూ. 57), శాలివాహన శకం (క్రీ.శ.78) ఆరంభమయ్యాయి.

కళ్యాణుడు జాగ్రత్తగా వింటున్నాడు. తను రాయబోయే చరిత్రలో వీలయినంత వరకూ సంవత్సరాలు, నెల, వీలైతే నక్షత్రంతో సహా రాజుల పట్టాభిషేక, మరణాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు.

యవనులు పరాయివారు కారు. వారు క్షత్రియులే. కానీ వేదవిధులను సరిగా నిర్వర్తించలేక భ్రష్టులై ఈ దేశాన్ని వదలి వెళ్లినవారు. అందుకే ఎంత దూరం వెళ్లినా వారు తమ మాతృభూమి పట్ల మమకారాన్ని వదలలేక తిరిగి తిరిగి ఇక్కడికే చేరుకుంటున్నారు. ఈ దేశ దర్శనమే భాగ్యంగా భావిస్తున్నారు. ప్రౌండ్రకులు, ఓఢ్రులు, ద్రవిడులు, కాంభోజులు, యవనులు, శకులు, పారదులు, పహ్లావులు, బీనీలు కిరాతులు, దరదులు, ఖాసులు వేద (భష్టులైన క్షత్రియులే.

“శనైకస్తు క్రియాలోపాదిమాః క్షత్రియ జాతయః

వృషలత్వం గతాలోకే బ్రాహ్మణా దర్శసేన చ

పౌండ్ర కౌశ్చాఢ్ర ద్రవిడాః కాంభోజా యవనాశ్ళకాః

పారదా పహ్ల్హవాశ్చీనాబె కిరాతాదరదాఖశాః”

అనంత జ్ఞానమని చెప్హూ పోతున్నాడు.

కళ్యాణుడు అనంత జ్ఞానముని కళ్ళ్మీర చరిత్ర ఎప్పుడు చెప్తాడా అని ఆలోచిస్తూ వింటున్నాడు. నిజంగా ఎంత చరిత్ర ఉందీ దేశంలో. ప్రతి కావ్యం, ప్రతి పదం, ఈ భూమిలోని ప్రతి అణువు ఎంత చరిత్రను తమలో దాచుకుని ఉన్నాయి. చూడగలిగే కళ్లకు దోసిళ్ల కొద్దీ చారిత్రక సత్యాలను తెలియచెస్తన్నాయి.

కళ్యాణుడు చుట్టూ చూశాడు.

ఎన్నేళ్లు నుంచి ఈ పర్వత పంక్తులు, ఈ నదీనదాలు, ఈ నిశ్చల వృక్షతతులు, ఈ ఆకాశం, ఈ నేల మౌనంగా ఎంత చరిత్రను దర్శిస్తూ ఆకళింపు చేసుకుంటున్నాయి.

“గౌతమ బుద్దుని జననం ఎప్పుడు జరిగింది మహాముని?” చుట్టూచేరిన జనంలోంచి ఎవరో పెద్దగా అడగటంతో కళ్యాణుడు ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు.

“పరీక్షిత్తు పట్టాభిషేకంతో కలి ఆరంభమయింది. ఆ తరువాత 26 ఏళ్లకు (క్రీపూ. 3076) కళశ్శ్మీరంలో లౌకికాబ్బం ఆరంభమయింది. కళ్యాణుడు తాను తన చరిత్రలో మజ 940 =డడడడడడడనడనడడడడనడడడడడడడనడడుకకడడడడడడడకడకడతడడడడడడడతడకడకడకడతతతతడతతడత2222ఊ కస్తూరి మురళీకృష్ణ నా!

లౌకికాబ్టాన్నే అవలంబించాలని నిశ్చయించుకున్నాడు. కల్యారంభమయిన అరవై సంవత్సరాలకు పరీక్షిత్తు మరణించాడు. అతని తరువాత జనమేజయుడు రాజయ్యాదు. కల్యారంభమయిన 3౩60 పళ్లను ఆర్యభట్టు గొవ్ప ఖగోళ శాస్రజ్డుడు జీవించాడు. కల్యారంభమ్తైన 468 ఏళ్లకు జైనుల యుధిష్టిర శకం ఆరంభమయింది. ఆ తరువాత (ప్రద్యోతులు, శిశునాగులు రాజ్యం చేశారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన 29వ రాజు శుద్దోధనుడి పుత్రుడి గౌతమ బుద్దుడు కల్యారంభమైన 1215 సంవత్సరాలకు (క్రీపూ. 1887) జన్మించాడు. శిశునాగు వంశాలలో నాల్గవ రాజు క్షేమజిత్తు, బింబిసారుడు, అజాత శత్రుబుద్దుని సమకాలీకులు కల్యారంభమైన 1295 సంవత్సరాలకు (క్రీ.పూ. 1807) బుద్దుడు నిర్యాణమందాదు.

మన చరిత్రలో మరో అద్భుతం ఒకే పేరున్న ఇద్దరు రాజులు అశోకులు, ఒకే సమయంలో రాజ్యం చేయటం, ఇద్దరూ బౌద్దులే కావటం మరీ విశేషం. ఇంతలో కళ్యాణుడు హరాత్తుగా అడిగాడు. “స్వామీ నాకు దొగికిన ఆధారాల ప్రకారం రణాదిత్య తుజీనుడు కళ్మీరాన్ని మూడు వందల సంవత్సరాలు పాలించాడు. ఇది నిజమంటారా స్వామీ?”

అనంత జ్ఞానముని ఉలిక్కిపడి కళ్యాణుడి వైపు చూశాడు. 'అందులో నమ్మశక్యం కానిదేముంది?* అనడిగాడు.

“ఒక వ్యక్తి వందేళ్లు జీవించటమే కష్టం. అటువంటిది మూడు వందల వళ్ళు...” వాక్యం పూర్తి చేయలేదు కళ్యాణుడు.

అనంత జ్ఞానముని పెద్దగా నవ్వాడు. 'నువ్వు మనచరిత్ర చూడు. కలియుగం ఆరంభమయిన 2500 ఏళ్ల వరకూ అద్భుతమైన వ్యక్తులు జన్నిస్తారు. ఆ తరువాత (ప్రభావం అన్నిటినీ ముంచెత్తుతుంది. అది సాధ్యమే. మన వురాణాల్లో అనత్యం, అతిశయోక్తులేవీ లేవు.అవి అలా అనిపించాయంటే అందుకు నీ అజ్ఞానమే కారణం. త బావిపరిధి దాటనికప్పకు బావి సోరీ ప్రపంచం'అన్నాడు.

కళ్యాణుడు తలవంచుకున్నాడు.

అనంత జ్ఞానముని కళ్ళీర చరిత్ర ఆరంభించాడు.

కళ్యాణుడు శ్రద్ధగా వింటున్నాడు.

కథ రెండవ గోనందుడి వరకూ వచ్చింది.

ఇక తనకు తెలియని ముష్ఫయి అయిదుగురు రాజుల చరిత్ర ఆరంభమవుతుంది. కళ్యాణుడు ఉత్కంఠతో ముందుకు వంగాడు.

ఇంతలో దూరంగా కలకలం వినిపించింది. హె=== కల్చ్దణ కళ్ళీర రాజతరంగిణి కథలు :=2జకననననకడనడడనకనడడడడడడడడడడ222222 బెక హె

“తురుష్కులు.... తురుష్కులు” అన్న కేకలు వినిపించాయి. వెంటనే గుట్టాల పద. ఘట్టనలతో ఎగసిన ధూళితో ఆ ప్రాంతం నిండిపోయింది. హహాకారాలు చెలరేగాయి.

ఎక్కడి వారక్కడ అరచేతుల్లో ప్రాణాలుంచుకుని పారిపోవాలని ప్రయత్నించసాగారు. కానీ తురుష్కులు ముందే పథకం వేసుకున్నట్టున్నారు. నలువైపుల నుండీ వారిని చట్టుముట్టారు.

కదలినవారి శరీరం క్షణంలో ఇక కదలలేక విగతప్రాణిఅయి పడిపోసాగింది.

“ఎవరు చరిత్ర చెప్పేది?” తురక వాడయినా స్వచ్చంగా అడిగాడు.

ఎవరైనా ఏదో అనేలోగా అనంత జ్ఞానముని ముందుకు వచ్చి అన్నాడు.

“ఎవరో చెప్పటం ఏమిటి? ఈ ధరిత్రిన అణువణువూ ఈ దేశచరిత్ర చెప్తుంది అన్నాడు.

ఆ తురుష్కుడు మరో మాట లేదు. వెంటనే ఖడ్గం తీసి అనంత జ్ఞానముని కంఠాన్ని ఉత్తరించాడు.

కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. హాహాకారాలు చేసే సమయం కూడా లేదు. అందరూ నిర్విణ్టులై ప్రతిమలై ఆ ఘోరాన్ని చూస్తూండిపోయారు.. ఎంతో జాగ్రత్తగా రూపొందించి, పెంచి పోషిస్తూ వస్తున్న పరంపర, కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఒక్క క్షణంలో నాశనం అయిపోయింది.

కళ్యాణుడి కళ్లనుంచి నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. ఆ రాజులు ఎంతటి తుచ్చులో, వారి చరిత్రను మననంచేయటం కూడా భగవంతుడికి ఇష్టం లేనట్టుంది. ఆ రాజుల చరిత్ర గానంచేసే కవులులేనప్పుడే వారెంతటి వారో అర్ధమయింది. ఈ దేశంలో కవులు రాజుల చరిత్ర గానం చేసేది పొగడ్తలు కోరికాదు. ఏంకోరి కాళిదాసు రఘువంశచరిత్ర రచించాడు? కేవలం రాజులను పొగడాలనే అనుకుంటే పతనమౌతున్న రాజ్య వంశంలోని చివరి రాజుల గురించి ఎందుకు రాశాడు? మీలో కశ్మీర చరిత్ర రాస్తున్న కళ్యాణుడెవరు? అతని రక్తంతో నా ఖడ్డదాహాన్ని తీరుస్తాను మళ్లీ అన్నాడా తురుష్ముడు.

కళ్యాణుడు ఆ తురుష్ముడివంక పరిశీలనగా చూశాడు. ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుంది. ఈ కాలంలో తనపేరును సరిగా ఎవరూ ఉచ్చరించే స్థితిలోలేరు. అటువంటిది ఈ తురుష్కుడు ఎలా ఉచ్చరించగలుగుతున్నాడు? అమర శర్మా పిలిచాడు కళ్యాణుదు.

ఆ తరుష్ముడు కళ్యాణుడివైపు తిరిగి “నేను అమర శర్మను కాదు అమీర్‌ ఖాన్‌ను” అన్నాడు.

కానీ కళ్యాణుడిని చూడగానే అతని మాట తడబడింది.

ఆ క్షణంలో కళ్యాణుడికి మరో విషయం అర్ధమయింది.

ఈ ధర్మం తనవారినే తనకు బద్ద శతృవులుగా మార్చుకుంటోంది. బలవంతంగా తప్పులు చేయాల్సివచ్చిన తమను క్షమించని ధర్మంపట్ల వ్యక్తి కసిపెంచుకుని కర్మోటకుడిగా జడా బ్రితీలై డడ2ఊడదడకడడడడడకడడడడడడడకడతడడడ2డడడడడ2త2డడడడడడ2ఊఊఊ కస్తూరి మురళీకృష్ణ తా.

మారటంలో ఆశ్చర్యమేముంది? అడిగినది ఇవ్వని తండ్రిపై తనయుడు కత్తి దూయటంలో అసహజం ఏముంది? ఇంటికి వెలుగునివ్వాల్సిన దీపం ఇంటినే కాలుస్తోంది!

“'కళ్యాణుడెందుకు నీకు? ఈ దేశచరిత్రను భూస్థాపితం చేయాలనా? ఈ దేశచరిత్ర నెవరూ రాయకూడదనా? ఈ దేశం తన వారసత్వాన్ని మరిచి పోవాలనా?” సూటిగా అడిగాడు కళ్యాణుడు.

ఒక తురుష్ముడు కళ్యాణుడి జుట్టు పట్టుకుని “నీ పేరేనా కల్లన్‌?” అనడిగాడు.

“కాదు.నా పేరు కల్పణుడూ అన్నాడు కళ్యాణుడు. తనపేరు అపభంశంగా పలుకుతూ.

అమీర్‌ఖాన్‌ కళ్లు కళ్యాణుడి కళ్లు కలుసుకున్నాయి.

అమీర్‌ఖాన్‌ తన అనుచరులతో చెప్పాడు 'కల్పణుడిని వదలి మిగతా అందరి మతం మార్చిండి” అని కల్తణుడివైపు తిరిగి 'ఇంకా నాలో పూర్వసంస్కారం పూర్తిగా ఛావలేదు. కాబట్టి మిమ్మల్ని వదలుతున్నాను. మళ్లీ నాకు చిక్కకండి. అప్పుడు మిమ్మల్నేం చేస్తానో చెప్పలేన అన్నాడు.

కళ్యాణుడు నవ్వి 'భగవదేచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. నెమ్మదిగ అ గుంపులోంచి బయటకు వచ్చాడు.

కళ్యాణుడు వచ్చేస్తూంటే వెనక నుంచి స్త్రీ పురుషుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కల్పణుడి రక్తం మరుగుతోంది. ఆవేశం జూద్దులు దాటుతోంది. కానీ తాను తన జీవితాన్ని ఇలా పారవేయకూడదు. తన జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఒక కర్తవ్యాన్నిచ్చాడు దేవుడు.

దూరంగా కైలాసాన్నంటిన పర్వతాలు కనిపించాయి.

కళ్యాణుడి కళ్లముందు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.

నేన్వమొన్ననే కళ్లు తెరచిన

“తండ్రీ, కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రకల ఈ జాతి నిన్నమొన్న అనాగరిక జాతుల కోరలలో చిక్కి ఈ చరిత్రను సర్వం మరచి పోతుందా. తానూ వారిలాగే నిన్ననే కళ్లుతెరచిన పసిపాపలా ఆలోచిస్తాడా? హే, భగవాన్‌. నాజాతిని రక్షించుకునేందుకు నేనేం చేయాలి?అని చేతులు జోడించాడు కల్పణుడు.

దూరంగా శారదా మందిరంలో ఎవరో గంట కొట్టారు.

చెట్లమీంచి పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరాయి.

ఒక పాము పాక్కుంటూ వచ్చి కల్పణుడి ఎదురుగా పడగ ఎత్తి నిలబడింది. ఒక అకు గాలికి ఎగురుకుంటూ వచ్చి ఆ పాము ముందు పడింది. ఆ పాము వెంటనే ఆ ఆకు మీద బుస కొట్టి కాటేసి వెళ్లిపోయింది. ఆ బుసకు ఎగిరిన ఆకు కల్పణుడిస, చేతిలో పడింది. =తఊ౭ఊ=జ కల్ప్దణ కళ్ళ్మీర రాజతరంగిణి కధలు :2౭ైతతతతతతతతతడడతడడఉడడడడడడడడడడడ22224ఊ2 బెరా

చిత్రంగా ఆ ఆకులో అక్షరాలు కన్పించాయి కల్తణుడికి. 'ాజ తరంగిణి, రాజ తరంగిణి, రాజ తరంగిణి” కల్హ్లణుడు ఆ ఆకుని మహాప్రసాదంలా స్వీకరించాడు. అక్కడే దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళాడు. తను సేకరించిన సమస్త ఆధారాలను ఎదురుగా పరచుకున్నాడు. భగవంతుని స్మరించాడు. వ్యాస భగవానుని స్మరించాడు. సరస్వతీ దేవిని స్తుతించాడు. పరమశివుని ప్రార్థించాడు. రాబోయే తరాల కోసం తరంగిణిలోని తరంగాలుగా వచ్చిపోయే రాజుల చరిత్రను రాసేందుకు ఉద్యుక్తుడయ్యాడు. కల్లణుడు రాజ తరంగిణి రాయటం ఆరంభించాడు. అది క్రీ.శు11468వ సంవత్సరం. శల ళా ల ఇ శ ట్లో పలయత; మావా హా మడా పకక దడదడా కస్తూరి మురళీకృష్ణ నా

న. ము స్‌ కల్ప ౧. . కశ్మీర రాజతరంగిణీ .

  • హమని ల. న పత్రికా రచయితగా, నవలాకథారచయితగా [సం .. సుప్రసిద్ధులైన శ్రీ కస్తూరి మురళీకృష్ణ 75కు పైగా స. కథలు, 17 నవలలు రచించారు. న. 1965లో జన్మించిన. శ్రీ మురళీకృష్ణ చ. జియాలజీ, ఫిలాసఫీలలో ఎమ్‌.ఏ. పట్టాపొందారు. ౧.౨౨౧. వీరి నవలలు 'అంతర్యాగం', “ఆపరేషన్‌ ప. భద్రలు పత్రికల నుండి బహుమతులు పొందాయి. . అసిధార, అంతర్మథనం, జీవితం - జాతకం, . , మర్మయోగం, మన ప్రధానమంత్రులు, మన ॥ . ముఖ్యమంక్రులు, భారతీయ తత్త్వచింతన వీరి య ముద్రీత రచనలు. వివిధ పత్రికల్లో వీరి శీర్షికలు . ఇప్పుడు ప్రచురితమవుతున్నాయి.