Telugu kavya pramithi - anilvaranasi/indianlanguages GitHub Wiki

దు! (| కావ్యప్రమితి ం లి చే ( ర్‌ జ? ,( న్‌ రూ ర తం.! 1 చా య్‌ కన. 7 అడ టం. ళాల. 7 షోకే దడ? / చర శనగ దాచే. ప కం ఆట్‌ సరన జీ! ప్‌ టా లమ ాారాలాబబలకాాాడా |... నే సకలం ల న నం. వస్‌ అపి బదిలి అ కోవెల సుప్రసన్నా ల సుప్రసన్నాచార్య

4 లోలో 2 పళ్సాజయంలం లత ణి జ ఈండంద్రాదా డా అన్‌ కావ్యప్రమితి (సాహిత్య వ్యాసాలు) గ! ర ౧0%. 60910411 [1018 [80 0 దడికతీ0, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య శ్రీ వాణీ ప్రచురణలు వరంగలళ్న్‌ - 506 002

కంట్‌ దిగక! (ఓ16౧%౧/ 655592)/5) ౦ 5౧01. గం౪౬౬| 50౧441114064గ ఏ. ౮442006 భస్నోన్టాక యళ భల ఆ 40! ) న్‌, 1116: 08౧01౧0 52౧2926 (1218506660) ళ్‌ లిం గింగ౮౦౧౦|౪5 : /్‌ _ తిరాణ౦గ 9-1-190, 1౧411061 2౧2౧0641 - 506 002 0౮6|॥ : 9840929830 నగ06 : ౧9. 100-00 స్సందశీ యష్వగంధాల గి ల్‌ ఖ | త ౯ లే స లీ 6 0..€ రట (7 స " లో స్‌ స్తూల ద్‌ ల శ; గ ఉ౧గ౧|[03 04” ౧౮౧144 ౧౦౭19, 2౧2౧941 - 506 002 061! : 9866566549

స్నేహానికి అసంర్తు 0

ఫుతఖా శ్యచ్పత్తుం ఉమిలి ర్నీర్తుం స్వస్థితికి శరీదృతులు

సంయోజినిల ల్యుటు హేమింత్‌ యుతులి డా॥ లంకా శివరామ ప్రసాద్‌ స టపదీగా

నివేదన ...

సద్ధురువులు శ్రీ శివానందమూర్తిగారికి, ఇతర సాహిత్య మార్గదర్శకులకు నమస్మారాలు.

1954 మేలో నా వ్యాసం ఉదాహరణ వాబజ్బ్యయం గురించి గోల్కొండ పత్రికలో అచ్చయింది. అంతకు పూర్వం హైస్కూలు పద్రికలో 'యుగకర్త శ్రీనాథుడు కాదు పోతన్న! అనే భావంతో వ్యాసమూ వచ్చింది. అలా నా సాహిత్య వ్యాసరచన సాగుతూ వచ్చింది. 1954 మేలోనే నా వచనపద్యాలు తెలుగు స్వతంత్రలో అచ్చయినాయి. నేనూ శ్రీ సంపత్మువూర కలిసి రచించిన హృద్గీత (పద్యకావ్యం) అప్పుడే పుస్తకంగా వెలువడింది. ఆ సంవత్సరం మేలోనే నా పెళ్ళి కూడా అయింది.

అప్పటినుంచీ ప్రవహిస్తున్న సాహిత్యవ్యాసాలు, ఇతర తాత్త్విక వ్యాసాలూ, సమీక్షలూ, సూక్తిగ్రంథాలూ, వ్యాఖ్యానాలు ఒకవైపు, కావ్యసంపుటాల (ప్రకాశనం మరోవైపు సాగివచ్చింది.

ఈ నా సరన్వతి ఐహువిస్తర, సామరస్య పరాయణ, భావుక, రసమయి, అంతర్ముఖ బహిర్ముఖ జీవనాల సంభావనం గలది.

నా సాహిత్య ప్రయాణంలో ఏదెనిమిదేళ్ళనుంచీ తోడుగా నడచివస్తున్న కవీ, బహువిషయ పరిజ్ఞాత, భావుకుడు డా॥ లంకా శివరామప్రసాద్‌. ఈయన ప్రఖ్యాత వాస్క్యులర్‌ సర్జన్‌, హృదయరోగ నిపుణుడు కూడా.

ఆయనకు ఈ 'కావ్యప్రమితిని ప్రీతిసమర్పణంగా ఈయగలుగటం నాకు సంతోషంగా ఉన్నది,

ఈ నడుమ అనేక సాహిత్య సంగోష్టులలో నమర్చింపబడిన, పత్రికలలో ప్రకటింపబడినవి ఈ వ్యాసాలు. వీటిని సమర్పింపజేసిన, ప్రచురించిన నిర్వాహకులకు, ఈ మొత్తం చదివి తమ స్పందన, సంస్పందన తెలియజేసిన శ్రీ త్రివురారి, శ్రీమతి కాత్యాయనీ విద్మహే లకు శుభాశీస్సులు.

ఈ వ్యాసాలు ఏర్చి ఈ క్రమంలో అమర్చి దీన్ని ఇలా తీర్చిదిద్దినవారు దా వసుమతి - డా వజ్ఞల రంగాచార్య దంపతులు. చక్కగా ఈ సంకలనాన్ని అచ్చువేసింది చిరంజీవి శ్రీకాంత్‌. వీరికి నా శుభాభినందనలు.

27-6-2008 = కోవెల సుప్రసన్నాచార్య

విషయసూచిక...

  1. శ్రీమద్రామాయణారంభం - కావ్యతత్త్వ ప్రకాశనం వ. క్ష
  2. రాయఫ్రోలువారి విమర్శరీతి వటం 6422006 7
  3. కవిత్వం మారిపోయిందా? పారిపోయిందా? ఎంం000444.. కేరి 4 కవిత్వం - నిరంతర పరిణామ చక్ర భ్రమణం 4000066406 బైత్రి 5.. తెలుగులో కావ్యశిల్ప విమర్శ ల. తిష
  4. విశ్వనాథ - చలం నవలలలో స్త్రీ పాత్రలు 00004 ర2 "7. అధునిక సాహిత్యం ఎదిగిన సంస్కృతి శిఖరం - విశ్వనాథ ........... 68
  5. గిరి కుమారుని (ప్రేమగీతాలు 2040000002... ౯5
  6. స్నేహ పులకితమైన మధురమైన అర్ధ శతాబ్దం వ...
  7. కస్తూరి నింపుకున్న చందన పేటిక - మన గడియారం ఉం. 1092
  8. కవిత్వ శిశిరంలోకి వసంతమై ప్రవహించిన శేషేంద్ర “44004000... 105 12, ఎడారిలో నీటి చెలమ రామ్‌నారాయణ్‌ కవిత్వపుఊట ........... 111 18, గురజాడ ఒక సాధారణ కవి అం. క్షేకేగ్ర 14 తాళ్ళపాక అన్నమాచార్యులు ౨.
  9. తెలుగు భాష సౌందర్యాన్ని గుండెలలో నిలుపుకుందాం.. ......... 140
    • మహాభారత పరమార్థం - తర్మ సంగతి - తత్త్యసారము. ౨ 144 నందన - త్రిపురారి లం... 161 నంన్పందన - కాత్సాయనీ విధ్యహే అంు.. 166

శ్రీమద్రామాయణారంభం - కావ్యతత్త ప్రకాశనం

అది కావ్యమైన వాల్మీకి రామాయణం ఆరంభంలో బాలకాండలోని నాల్లు సర్గలు కావ్యప్రాదుర్భావాన్ని వివరంగా తెలియజేసేఏ. ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనులు కవిత్వ మూలాలను అన్వేషించుతూ ఈ రామాయణారంభాన్ని విశ్లేషించారు. అయితే నాబ్లు సర్గలు మొత్తంగొా-సమ(గ్రంగా కావ్యతత్త్వాన్ని అలంకారశాస్త్ర రహస్యాలను కావ్యరూపతపస్సును, దాని ద్వారా చేరదగిన పరమ ప్రొష్పమును విశదంగా వెల్లడించాయి.

కావ్యారంభం “= 'తపస్స్వాధ్యాయనిరతం' అని అవుతుంది. అయితే ఇది వాల్మీకికి రామగాథా వ్యాఖ్యానం చేసిన గురుస్థానీయుడైన నారదునీ గురించింది. వాల్మీకికి మాత్రమే కాక వ్యాసునికీ భాగవత రచనకు ప్రేరణ నిచ్చిన గురువు నారదుడే. నారదుడు అనే మాటకు నారం - బ్రహ్మజ్ఞునం దదాతి ఇచ్చువాడని వ్యాఖ్యాతలు అర్ధం చెప్పారు. ఈ నారదుడు డ్రిలోక సంచారి. వాల్ళీకి వ్యాసులకే అంఈ ప్రజ్ఞను మేల్మొల్చినవాడు.

నారదుడు తపస్సులోను, స్వాధ్యాయంలోను నిరంతరం నిమగ్నమైనవాడు. తపస్సు అంతర్ముఖంగా అత్మదర్శనం చేసే మార్గం. ఒక్క వ్యక్తి క్రమంగా బహిర్వాసనల నుండి విముక్తుడై అంతస్సులో ఆత్మజ్యోతిని దర్భంచటం ఇక్కడి లక్షణం. వ్యక్తి విశ్వజనీన పొంది సూజ్రాత్మగా పరిణమించుతాడు. స్వాధ్యాయము తపస్సమాథిలో దర్శింపబడిన వాక్కు ఆ విషయంలో తన్మయుడై నిత్యము ఊర్జ్వ్య్వముఖ చైతన్యంతో సంనదించుళూ ఉందేవాడు. అందువల్లనే నారదుడు త్రిలోక సంచారి. అవిద్యా సంపర్మం వల్ల కలిగిన అంధకారాన్ని తమస్సును తొలగించేవాడు. నిత్య ('ప్రకాశమానుడు.

యోగమార్గంలో శ్రిలోక సంచారం అంటీ త్రిఖందాత్మకమైన షట్బక్రములతో సంపుటిల్రైన సుషుమ్నుయందు కుండలినీ రూపంలో సంచరించుట అని అర్ధం. ఈ సుషున్ను మూడు స్థాయిలలో మూడులోకాలుగా మూడు (గ్రంథులతో కూడి ఉంటుంది. అన్ని లోకాలకు అనునంధానభూళతమైంది. అందువల్లనే నారదుణ్మీ వాల్మీకి “వాగ్నిదాంవరు'దన్నాడు. సాభారణంగా లోకంలో వైఖదీ వాక్కు మాత్రమే తెలియవస్తుంది. అది ఎదిగిన శబ్దశొస్త్ర రహస్య మెరిగినవారు వాగ్విదులు. వారిలో శ్రేష్టుడు. వైఖరికన్న పూర్వపూర్వాలైన పరా పశ్యంతి మధ్యమల తత్వం ఎరిగినవాడు

“చత్వారి వాక్సరిమితా వదాని

తాని విదుర్చావాణా యే మనీషిణః

గువోత్రీణి నిపాతా నేజ్ఞయంతి

తురీయం వాచో మనుష్వా నదంతి” (బి. 1-164-45) పరాది వాక్కులను తెలుసుకోవటం కేవలం యోగులకే సాధ్యం. నాదమూలాల రహస్యం ఎరిగినతనం అది. అందుకే (ప్రతీకగా నారదుని చేతిలో “మహతి అనే వీణ ఉంటుంది. అది తండ్రీ వాద్యం. “వాగ్విదాం వరూడన్న ప్రశంస ఈ సుషుమ్నాస్థానీయుదైన నారదుని ఉద్దేశించిందే. మహతి-శతంచైకానాడ్యః అని కంఠంలో వర్ణింపబడిన శరీరానికి ప్రతీక,

వాల్మీకి ఈయన మనన శీలాన్ని వివరిస్తూ మునిపుంగవుడన్నాడు ముని(శ్రేష్టుడు. నిరంతరం ప్రణవోపాసన చేస్తూ ఆ నాదమూలంలో రమిస్తూ వుంటాడు. పుంగవం అంటే వృషభం. వేదంలో “చత్వారి శృంగాః త్రయో అస్యపాదాఃశ అన్నీ మంత్రంలో ప్రణవం వృషభమని చెప్పబడింది: నారదుణ్ణి త్రిలోకజ్ఞుడని కూడా వాల్నీకి వర్ణించాడు. మూడు (గ్రంథులు గల అంశర్గోకాలను ఎరిగిన వాడు మాత్రమే కాక వాక్కును మంత్రంగా మార్చగలిగినవాడు. మంత్రమయ చిత్తకాంతితో ప్రకాశించేవాడు.

కావ్యాభివ్యక్తి దివ్య స్పృష్టికలిగి వుండి మంత్రంగా మారటానికి మూడు గాధతలు కావాలని శ్రీ అరవిందులు పేర్మొన్నారు. 1. లయాత్మకమైన ఉన్నతోన్నత గతి, 2. శద్దిరూపము, భావ విసృృతుల తో కూడిన శైలియొక్క ఉన్నతోన్నత సమన్వయము, 8. ఉచ్ళతమమైన పరమ సత్యమును గురించిన ఆత్మ దర్శనము ఈ మూడు గాఢతలు సమన్వయం పొందిన చోట శబ్దం ఎన్నో అవర స్తరాలను అతిక్రమించి మంత్ర స్థితికి చేరుతుంది. (7౧6 న|(06 క6(౧/ ౧16 17) అందువల్లనే నారదుని (త్రిలోకజ్ఞుడని వర్ణించటం జరిగింది. రామాయణం మహామాలామంత్ర మయింది.

ఇటువంటి గురూపదేశంతో వాల్మీకి రామాయణ రచనకు ఉపక్రమించాడు. వాల్మీకి భృగు వంశానికి చెందినవాడు. ప్రచేతుసుని కుమారుడు. ఇతని పేరు బుక్షుడు. తపోవేళ ఈయన చుట్టూ పుట్ట పెరుగటం వలన ఈయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. ఉపనిషత్తులలో భృగుమహర్షి ప్రసక్తి వస్తుంది. ఈ వంశంలోనివాడే విష్ణు అవతారమైన పరశురాముడు. మహాలక్ష్మికి భార్గవి అని పేరు. ఈ వైదిక వంశంలో మంత్రవేత్తల వరునలోని వాడు వాల్మీకి మహర్షి ఈయన తండ్రి పేరు విచిత్రమైంది-ప్రచేతుడని. ప్రచేతశ్ళబ్దానికి చేతస్సు కంటే ఉన్నతమైన మనోభూమిక అన్న ఆర్థం స్ఫురిస్తుంది. 2 సువుసన్నీ

రంద్రరాస్త మార్గంలో ఉనని అన్నభావన (60౧౦౭00) ఉన్నది. ఈ ఉన్మనీదళ మనోమయ స్థితికీ అధి మనస్సునకూ (సూపర్‌ మైంద్‌కు) నడిమి నాల్గు అంతస్థులను సూచిస్తుంది.

శ్రీ అరవింద దర్శనంలో ఈ స్థితులు ఎరిగినంతలో నాల్గు. ఉన్నత మనస్సు, ప్రదీప్త మనస్సు, సంబుద్ధమనస్సు, అతీత మనస్సు వీటన్నింటికీ అతీతంగా మానవజాతి ఆంత్యంతికంగా చేరదగిన అధిమనస్సు నెలకొని ఉన్నది. ఉదాత్తజీవనంలో ఈ ఉన్ననీ మనోభూమికల కాంతులు ప్రసరిస్తూ వుంటాయి. అదీ అంతర్ముఖమైనప్పుడు, ఒకానొక సమాధివంటి స్థితిని పొందినపుడు. వాల్మీకి ప్రచేతసుని పుత్రుడు. ప్రాచేతసుదని అంటే ఈ ఉన్నత మనస్సోపానపు వెలుగులను '్రోది చేసుకున్న కవి అని అర్థం.

వాల్మీకి తపస్వియే కాదు. వాక్య విశారదుడు. వేదములలోని మహావాక్యాలు _ త్త్వమసీ'త్యాదులు బ్రహ్మతత్త్వాన్ని వెల్లడించేవి. వాటి తాత్సర్యం ఆయన చిత్తంలో విశదంగా నిలచి ఉన్నది. శబ్దం అనేక స్తరాలలో అనేక భావనలను నిక్షేపించుకొని ఉంటుంది. అందుకే అది కాలాంతరాలలో నూత్తార్థాలను ప్రసరిస్తూవుంటుంది. ఈ రహస్యం ఎరిగినవాడు వాక్య విశారదుడు. ఈయన మహాముని. మననశీలం గురువునకు వలె ఈయనకు సహజ స్వభావం.

ఒకనాదు ఉషు కాలంలో వాల్మీకి స్నానం చేయటానికి తమసానదీ తీరం వెళ్ళాడు శిష్యుడైన భరద్వాజునితో. ఆ ఉషోవేళ ఆ నది స్వచ్చంగా అకర్ణమంగా ఉన్నది. దాన్ని చూడమన్నాడు తన శిష్యుని. అది గంగకు సమీపంలోనే ఉన్నది. ఈ సంబంధం శమసకు గంగకు గల పావిత్రాన్ని ఆపాదిస్తున్నది. గంగానదికి అవిదూరంగా ఉన్నదని పేర్కొని ఆ సాన్నిధ్య లక్షణం వల్ల గంగానదికీ తమసకు నడిమి సామాన్య లక్షణం కనిపిస్తుంది. ఇది బ్రహ్మనందానికీ కావ్యానందానికీ గల సహోదర సంబంధంగా చెప్పవచ్చు.

ఆయన మనస్సు ఈ సన్నివేశంలో అకర్ణనుంగా మాలిన్యరహితంగా ఉండగా _ క్రౌంచ ద్వంద్వంలోని ఒకానొక పక్షిని కిరాతుగొకడు క్రూరంగా సంహరించటం, ఆడపక్షి దుఃఖించటం, మగపక్షి రక్తపు మడుగులో పడి మృత్యువేదన పొందటం మహర్షి చూచినప్పుడు విశ్వవేదన సంచలించింది. కావ్యశాస్త్రం చెప్పిన 'విశదీభూతే మనో ముకురే' అన్నప్పటి స్థితి అది. సహృదయుని స్థితి. విశ్వవేదనను స్వాయత్తం చేసుకోగల స్థితి అది. అందువల్లనే మహార్ని వ్యక్తిత్వ పరిమితులను దాటిన - జగద్వేదనను అనుభవింపగల స్థితికి చేరుకున్నాడు. అప్పుడు చిత్తాన్ని స్థితిని కరుణ ఆవరించింది. కవి కరుణ వేదియైనాడు. అందుకే తమసా నదిని వర్ణిస్తూ - అది రమణీయము, ప్రసన్నాంబువని విశదం చేసి, అది సన్మనుష్యమనో యథా అని ఉపమించాడు. ననన స లా కార్యఫురుర 3

తమస అస్వాద్యమైన కావ్యమే. లోకగత వాసనల నుంచి విముక్తమయింది. అకర్ణమం. మనస్సుకు ప్రీతి కలిగిస్తున్నది. రమణీయమై రసొనుభవం కలిగిస్తున్నది. (వ్రనన్నాంబువే అయినా కావ్యం లోకచరిత్ర పరిమితులు దాటింది. దేశకాలాల పరిమితులను అతీతమైంది. అందువల్లనే సర్వచేతస్సుగా మారిపోతుంది. అదే సహృదయ చిత్తము ప్రతిఫలించే స్థితి. తమస వాస్తవ జగత్తుకు కావ్య జగత్తుకు నడిమితెర. నదీ వర్ణనం కావ్యతత్ర్త వివేచనయే.

క్రాంచవధ చూచేప్పటికి కవి మనస్సు ఉన్న స్థితి అది. అది కరుణవేదిత్వము. లోకంలోని ఆత్యంతికమైన దుఃఖం, జరారోగభయ మృత్యువుల వల్ల కలిగేది, అనుభవం లోనికి వచ్చింది. “కారుణ్యం సమపద్యత. అందువల్ల శోకార్తుడైనాడు. మవాత్ముడైన బుద్ధునికి కలిగింది ఇలాంటి శోకమే. విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన “జీవుని వేదన ఇలాంటి స్టితియే.

ఆ విశ్వవైతన్య దశ నుండి అవిదితంగా వాల్మీకి నోట కావ్యవాక్కు వెలువడింది.

బూనిషాద (వ్రతిష్పాం త్వమగమః శాశ్వతీః నమాః

యతశ్రాంచ మిధునాదేక మవధీః కామోపాతమ్‌”

మామూలుగా అది క్రోధ వాక్కు అయితే పక్షి పొందిన మృత్యువేదనలో, ఆడపక్షి పొందిన వియోగ దుఃఖంతో మాత్రమే అది తాదాత్యం పొందటం సాధ్యం కాదు. ఈ వియోగము పరమేశ్వరుని నుండి జీవుడు పొందింది. ఈ మృత్యువు ఆనందమయస్థితి నుండి అవిద్యామయస్థితికి దిగజారటం. ఈ రెండూ క్రౌంచవధ (ప్రేరణతో జాగృతాలైనవి, ఈ వాగ్దేవతా స్వయంసిద్ధి సాక్షాత్కారం అప్పటి విలక్షణమైన స్థితిలో నుండి నిర్గమించింది. వాల్మీకి ధ్యానమగ్భుడైనాడు. తను వెలువరించిన శ్లోకాన్ని మరల మరల మననం చేసినాడు.

అప్పుడు ఆ (కేరణ ద్రవ్యమంతా మవాబుద్ధి అహంకారచిత్తరూపమైన అంతరంగంలోనికి దిగి వచ్చింది. *చతుర్ముఖో ఆజగామ”, ఆ (బ్రవ్మదేవుడన్నాడు నా ఆదేశం వల్లనే నీ ముఖం నుండి సరస్వతి బయలు వెడలింది అని. వేదమంత్రావిర్భావం వంటి స్థితి అది. అప్పటికి వస్తువు. రచనా (ప్రణాళికా, కావ్యాభివ్యక్తి విశేషాలు అన్నీ ముందుకు త్రోసుకువస్తున్నవి. నారదుడు పూర్వమే చెప్పిన రామకథను భావిస్తూ మరల మరల ధ్యానంలోకి వెళ్లి దాని లోలోతులను దర్శించే (ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికవి.

రవి గాంచనిచో కవి గాంచునన్న మాటను యిక్కడ స్మరించుకోవాలి. వస్తువు కేవలం ముడిసరుకే. అది దాని మీది పొరలను తొలగిస్తే దేశకాల పరిమితులను

దాదుతంది. బపారంగముఖం దాటి అంతరంగముఖిం ముందుకు వన్తుంది. జగజ్జివన రహస్యాలను వెల్లడిస్తుంది. అందువల్లనే 'అవిదితం సర్వం విదితం భవిష్యతి" కవి చిత్త సమాధిలోని వెళ్ళినప్పుడు చరాచర జగత్తు, మూడు కాలాలు అతనిలో జుగ్భృతమౌతాయి. కావ్యం అనేక స్తరాలలో సాక్షాత్కరిస్తుంది. ఒక స్థితిలో మానవ జీవన పక్షం. రెండవ స్థితిలో శాస్త్ర వ్యాఖ్యాన పక్షం లేదా సౌందర్యశాస్త్ర పక్షం. మూడవదశలో ఆధ్యాత్మ సాధన పక్షం. ఇలా ఎన్నో స్తరాలు గర్భితం చేసుకొని ఉంటుంది కావ్యవాక్కు ఈ రహస్యం కావ్య 'ప్రకాశపక్షానికి ఆవలిది. అందువల్ల కావ్యంలో ఈ స్థాయిలో పలికే కవి వాక్కులో అసత్యం - అన్ఫతం ఉండదు. 'అన్ఫతం తవకావ్యే న భవిష్యతి". అందువల్లనే (ప్రభుస్థానీయులైన మహర్షి కల్పులైన మహాకవుల కావ్యాలలో ఎప్పటికప్పుడు నూతనార్థాలు, వ్యాఖ్యానాలు సాధ్యమవుతున్నాయి. విశ్వచేతనలో ఉన్న కవి వాక్కులో, లౌకిక స్థితిలో ఉన్నప్పటి వలె కవి అన్ఫతం పలుకదు. బుతం అంటే విశ్వమును ప్రసరింపజేసే దివ్యభావ సూత్రం. విశ్వపురోగతికి, వికాసానికి భంగం కలిగించేది అనృతం. అందువల్ల కావ్యం విశ్వశ్రేయస్సుకు ఆధారమవుతున్నది. అనువ్యాహరణం వల్ల - మరల మరల చెప్పుట, చదువుట వల్ల అది ప్రశస్తిని పొందుతున్నది. “శోకఃశ్లోకత్వమాగత'- ఇలాంటి కావ్యం మన చిత్తంలో ఉత్తమ నంస్కారాలను కలిగించి వుణ్యహేతువవుతుంది. వరిమితులను దాటినందువల్ల మనోరమము అవుతుంది. అపౌరుషేయమైన ఇదీ అవిదితంగా వెలువడటం వల్ల, మనః పరిమితులను దాటటం వల్ల వేదమైన అపొరుషేయమే అవుతుంది. అందువల్లనే ఇది వేదోపబ్బంహణం కొరకు వచ్చింది. “వేదః (ప్రాచేతసాదాసీత్‌ సాక్షా ద్రామాయజణాత్మనా'- 'పలికెడిది భాగవతమట. పలికించెడవాడు రామభద్రుండట అన్న పోతన ఈ చిత్త స్థితిని పొందినవాదే. కావ్యం చదివినా పాడినా మనోహరంగా ఉండాలని వాల్మీకి భావించాడు. పాడినప్పుడు కావ్యం నాదమార్గంలో చిత్తపులోలోతుల్లోనికి చొచ్చుకుని పోతుంది. చదివిన వేళ బుద్ధిలోకి ప్రసరిస్తుంది. భావుకుల కొలది కావ్యం నూతనార్థానునంధానం చేస్తుంది. అందువల్ల విచిక్రార్థయుక్తం అని చెప్పబడింది. “వ్లోదయత్సర్వగొవొబీ మనాంనీ పృదయానిచ అోతాతయనుఖం గేయం తద్పథౌ జనసంనది” నాలా శ్య్యర్తుకకి 5

గొప్ప కావ్యం విన్నప్పుడు మనోహృదయాలే కాదు శరీరమూ సంతోషాన్ని పొందుతున్నది. ఈ ఆనుభవం విలక్షణమైంది. ఇది శోత్రాశయమైన సుఖమే అయినా శరీరం అంతా తేలిపోతుంది. ఒక సౌకుమార్యం వస్తుంది. ఇంత సమగ్రమైన అనుభవం పొందేందుకు మనం భావితాత్ములం కావాలి, కావ్య నాయకుడు లోకాఖిరాముదైనాడు - '“అభిరామస్య రామస్య ఇతివృత్తంలో, ఉదాత్తత తాదాత్య్వానికి కారణం అవుతుంది. తెలిసినా తెలియకపోయినా అందరి మనస్సులలోనూ ధర్మాభిముఖంగా ఒక మూలవస్తువు వుంటుంది - వికృత చిత్తులైతే తప్ప. ఇతివృత్తము వల్ల కావ్యం కూడా లోకాభఖిరామమవుతుంది. కావ్యంలో ఒక సమత్వం ఉండాలి. శబ్ద సంయోజన దగ్గర నుంచి కావ్య నిర్వహణం దాకా ఈ లక్షణం వ్యాప్తమై ఉంటుంది. దీన్నే సామరస్యం అంటారు. దీని మరొక పేరు బెచిత్యం. కవి ముఖవాక్కు పొదబద్ధమైంది. మనస్సులోని ఒక లయతో సంగమిస్తుంది. అపలయ అప(్రుతి చెదరిస్తుంది. తంత్రీలయ ఏ కావ్యశబ్దిమైనా దాని వెనుక దాగి వుంటుంది. కుశలవులు రామాయణ గానం చేస్తుండగా (శ్రోతలు నాగర జానపదులు, బుషులు సామాన్యులు. వీరు పొందిన అనుభవం విచిత్రమైంది. సర్వజన సామాన్యమైంది. సౌందర్యశాస్త్ర రహస్యాన్ని వెల్లడించింది. “అవో గీతస్య మాధుర్వం శ్లోకానాంచ విశేషతః చిర నిర్భత్త మప్వేతత్‌ వ్రత్వక్షమివ దర్శితమా వస్తువు ఎప్పుడో కాలానిదో అయినా గీతమాధుర్యం మనస్సులను ఆహరిస్తున్నది. కావ్యం వింటూన్నప్పుడు అది ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉన్నది. మనోముకురంలో ప్రత్యక్షంగా దర్శనం కాగల్డటం ఆ కావ్యానికి సార్థకత చేకూరుస్తుంది. కావ్య సన్నివేశాలలో శ్రోతలు లీనం అవుతారు. దానిలోని సుఖదుఃఖాలను ట్రీతితో అనుభవిస్తారు. ఆదే రసం. ఇది శ్రీమద్రామాయణారంభంలో కాన్యతత్త్వ '్రకాశన లక్షణానికి సంక్షిప్త వ్యాఖ్యానం. శ్రీరామా జయకు. (భద్రాచలం వ్రభుత్వ డిగ్రీ ఉ వీజి. కళాశాల తెలుగుశాఖ 1814,25 నవంబర్‌ 07లలో నిర్వపొంచిన శ్రీరామాయణ నదస్సులోని ఉవన్యానం) (కానల్వా నున్రజారామరి దాః కోడూరి (గ్రఖాకరరెడ్డి అభినందన నంచిక, 2008) శాలల ధన

రాయప్రోలువారి విమర్శరీతి

రాయప్రోలు సుబ్బారావు అభినవ కవితా (ప్రవర్తకుడే కాక గొప్ప భావుకుడు. కవిత్వం ఆయన జీవనంలో ఒక ప్రధానాంశం. నేనెరిగినప్పటినుంచి - అప్పటికే దెబ్బ యేళ్ళు దాటినా నిరంతర భావాంబర వీధి విశ్రుత విహారం తరిగిపోలేదు.. 1964 ప్రాంతాలలో వరంగల్లులో ఒకానొక సమావేశంలో ఆయన అమలిన శృంగారభావన గురించి ఆయన సమక్షంలో మాట్లాడాను. అప్పటినుంచి ఆయనకు ఒక విధమైన తరిగిపోని వాత్సల్యం నా మీద ఉన్నది.

రాయప్రోలు కవిత్వజగత్తులో ఖండకావ్యాన్ని ప్రవర్తింపజేయటం, నూతన వస్తువును గ్రహించటం, కావ్యస్వరూపాన్ని మార్చివేయటం, నూతన పదబంధ నిర్మాణంతో తెలుగు కవిత్వశక్తిని కొత్తమార్గాలలో ప్రవహింపజేసినా, ఆయన సృజనశీలం ప్రవర్తించిన నాళ్లలో జాతీయోద్యమ చేతన ప్రజ్వలంతంగా ఉండటంవలన ప్రాచీన భారతీయ జీవనం లోని, తాత్తికతలోని, కావ్యశాస్త్రంలోని సజీవాంశాలను నూతనమైన ఒడుపులో నిలబెట్టుకూ వచ్చారు. ఆయనలో ఉపనిషద్యుగంలోని ఒకానొక చిత్త ప్రసాదం అవరించి ఉండేది.

నేను నా గృవోవరణములో మామిడిచెట్టును పెంచాను. 18 యేండ్లు ఆవును కొనుక్కొని పెంచాను. రెండింటి వరివృత్తమునూ కండ్లార చూచి, మనసార (ప్రేమించి అవి ప్రసాదించిన రనసారమునూ ఇష్టముతీర అనుభవించాను. ఈ ఫలితము నా కావ్యరచనలో నా భావవ్రదీవనంలో (ప్రనరించిందని నమ్ముతాను" (పే.8).

కావ్యము నాకు మవోవృక్షముగా భాసించలేదు. కామధేనువుగా దర్శనమిచ్చింది" (8.

'కవితాశాఖ అంటే కవితా రసాల శాఖ అని వూర్తి చేసుకుంటే ఎంతో ఇష్టమయిన భావము ఖానిన్తుంది. ఎందుకంటే కోకిల అన్ని చెట్ల కొమ్ముల మీదికీ రాదు. వచ్చినా రమ్యంగా కూజితాలుగా రాగాలు తీయదు. ఇంకా అన్ని బుతువులలో పాడదు. చెట్లన్నీ చిగిర్చి కళకళలాదుతున్నవ్హుడే కంఠమెత్తి గానం చేస్తుంది" (1,2 పే.) (నవ్యకవిత - రాయప్రోలు వారి అముద్రిత వ్యాసం ముష్టై పేజీలు నా దగ్గర ఉన్నది). కారీ ్తుతురి - ఇ

ఆయన భావన ఎక్కువగా ఆత్మాశయమయింది, అంతుర్ముఖీనమయింది. “మామిడి కొమ్మపైన గల మంత్రపరాయణుడైన కోకిల స్వామికి మొక్కి ఈ అభినవ స్వరకల్పన కుద్యమించితినొ మొదలైన రమ్యాలోకారంభం జీవితంలో నుంచే ఉద్బుద్ధ మయింది. ఆయనకు వాల్మీకి కాళిదాస భవభూతులు ఇష్టం.

జీవితాన్ని ఆయన ఇహపరాలుగా ద్వంద్వములుగా విభాగించారు. 'అవబుద్ధమైన

చైతన్యాన్ని వ్యవకలనం చేస్తే ఇష్టానిష్టముగ బంధము సిద్ధిస్తుంది... ఈ బంధములోని ఇష్టార్థములనే సంవదించి సాధించింది సాహిత్యం. మొదటిది ధర్శజిజ్ఞాసావధానం, రెండవది ఇష్టార్ధప్రతిపాదనం” (నవరస గంగాధరం - ్రస్తావిక 1942). అందువల్లనే పరమార్థమైన అనందాన్ని ఇష్టార్ధప్రాయంగా భావించటం జరిగింది. కర్మయోగాదుల స్థానంలో కాంతా సమ్మితోపదేశం చేరింది. కనుక దమన నిగ్రహపూర్వకమైన జీనితనిస్టను ఆస్వాదచర్వణముఖంగా అనుష్టించేట్లు చేసింది కావ్యమార్గం. పరమార్శాన్నీ రసార్భాన్నీ సమస్థాయిలో రాయ'్రోలువారు భావించారు. 'వాబ్బయస్తప ఉచ్యతే అనే గీతావాక్యాన్ని ఈ జిజ్ఞాసకు ఆధారసూత్రంగా ఆయన (గ్రహించారు.

కలదెందొ నితృనుందర లలితాలందిన మనంత లావణ్య నము

జ్ఞ్రుల హస్తమొకటి తన్మంగళాభినయ రూపణంలె కావ్యకళ నుధీ"

వాగర్ధ విశ్వముఖమున భోగింవగనగు ననంతభూత వ్వూదంత

ర్యాగ వావిర్‌ మధురాన్న నుధాగంధము నవ్యుదయ వృాదయతర్పణము నుథీ"

'జగమంతయు సౌందర్యస్థగితము శివమయము తత్ర్రృసాధన రేఖా

నిగరణ రచనా (ప్రాచురి నగు నానందంబు శాంతియగు నవల నుధీ”

“మాధరీ దర్శనం'లోని పై మూడు పద్యాలూ రాయహ్రోలువారి సాహిత్యదర్భనాన్ని సమగ్రంగానే అందిస్తున్నవి. మిగిలిన గ్రంథమంతా దీనికి నివరణ పప్రాయమైందే. రమ్యాలోకము దీనిలో అంతర్భవించేదే.

“కలదు” అనే నిశ్చయవాక్యం “నదేవ' సోమ్య ఇదమ(గ్ర అసీత్‌ అన్న ఉపనిషద్వాక్యాన్ని స్పృశిస్తుంది. 'ఎందొ అంటే ఉన్నత మనోలోకాలో కావచ్చు, ఇదొవరకూ ఉన్న అధో మనోలోకాలో కావచ్చు. మరొక స్థాయిలో దహరాకాశము కావచ్చు - బ్రహ్మాండముల అవల కావచ్చు. ఈ లలితమైన ఆలంబనము యోగాదులు, తపస్సులు మొదలైనవాటితో పనిలేని లలితమైనదీ ఆలంబనం. జీవనం దీనివల్ల సుకుమారమైన ప్రీతిని పొందవచ్చు. ఆర్తితో సంసారి 'మమ దేహి కరావలంబం” అని కోరినట్లుగా - గక నన

ఇక్కడ ఈ హస్తము అనంత సౌందర్యముతో ప్రకాశించేది. అది ప్రీతి కలిగిస్తుంది. దాని ప్రవృత్తి అంతా మంగళమయము. అభినయశబ్దము బాగుగా నడిపించేది అని చెప్పుకోవచ్చు లేదా ఆడించే ఒక రూపకంగా భావించవచ్చు.

అనిర్దేశ్యమూలమైన సుకుమార లక్షణం గల అపారమైన కావ్య సంసారాన్ని దివ్య మూలంగా భావించటం రాయ'్రోలువారి లక్షణం. లలిత శబ్దం - క్రీడించేదీ, క్రీడింపజేసేదీ అన్న రెండు అర్థాలను తనలో ఇముడుచ్చుకున్నది. దీన్నే మరింత స్పష్టంగా చెప్పుతూ “అవ్యక్తము, నిత్యోత్సవ నవ్యము” అనీ, “లలితావలోకన స్నేహజ లీలా వ్యతికలితము అని వ్యాఖ్యానిస్తారు. నిత్యోత్సవ నవ్యము ఎల్లప్పుడూ నవ్యాతినవ్యంగా భాసించేది అయినా మానవ జీవనంలో అనాదిగా ముడిపడి ఉన్నది. అంతేకాదు, నిత్యజీవితంలోని సుఖ దుఃఖాలను అతీతంగా ఒక పండుగలాగా ఉండేదనీ వ్యాఖ్యానిస్తారు. ముందు చెప్పిన లావణ్య సముజ్వల హస్తము - ఇక్కడ 'లలితావలోకన స్నేహజలీల' వల్ల సమ్మిళితమైందని విశదం చేస్తారు. అందువలన అది దివ్యాంశ.

ఈ దివ్యాంశ అన్న భావం కుదురులో ఉండటంవల్లనే జగత్తులో నిత్యము కనిపించే పరిణామం, శైథిల్యం, వికారం, మృత్యువు, వేదన, దుఃఖం ఇవి ఆయనకు ప్రధానం కాలేకపోయినవి. విశ్వనాథ వలె లోకముఖంలో ఉన్న కవికి లోకం వీడి రసం ఉండదు. కావ్యమూలంలో దుఃఖం, వేదన ఉంటాయి. ఈశ్వర విరహం ఉంటుంది. తాను ఆషాఢ మేఘం వలె లోకదుఃభాన్ని విడువకుండా, పాడుతూ ఉంటాడు. కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖ దూషిత వాంఛావిదూత మతి' యౌతాడు.

రాయప్రోలు ఆధ్యాత్మికతలో ఎంత ప్రాచీన సంప్రదాయం ఉందనిపించినా ఆయన రవీంద్రుని భావప్రపంచంలోనుండి వచ్చారు. రవీంద్రులు ఆనందమూలంగా సృష్టిని భావించారు. ఆధునిక భారతీయ చింతన జగత్తునంతా బ్రహ్మమయంగా భావించే తీరులోనుంచి సాగిపోయింది. మిథ్యాభావనకు స్థానం లేదు.

జగత్తును గూర్చి ఆయన ఇలా అంటారు 'యావత్సంపన్నంబగు నీ విశ్వ మనంత వస్తు భృతమయ్యును నానావిధ గుణగణ ధర్మ సమావిష్మరణ ప్రయోజనాశ్రయము' అని అంతా సర్వసంపన్నము, అనంత వస్తుసంకలితమే కాదు, అనంత గుణగణ ధర్మములను ఆవిష్మరించటమే ప్రయోజనము. వైవిధ్యము, వైరుధ్యము రెండూ ప్రాతిభాసికాలే కావచ్చు. పారమార్ధికం కావనిపిస్తుంది. కార్యపుతుతి రి

భౌతిక జగత్తు సత్యమని భావించిన శ్రీశ్రీ జగత్తులోని దుఃఖానికి ప్రతిస్పందించు తాడు. జగత్తు అనిత్యమని భావించినా మాయావరణం నుంచి విముక్తి కోసం - అంతదాకా నిలచివుండే దుఖం - వ్యావహారికంగా సత్యం కావటంవల్ల దానికి విశ్వనాథ ప్రతిస్పందించుతాడు. రాయప్రోలు ఈ ఇద్దరికీ భిన్నంగా భావించటంవలన ఆయన కావ్యప్రపంచమూ భావప్రపంచమూ భిన్నభిన్నంగా ఉండటం మనం గమనించవచ్చు. కావ్యజగత్తు మూలాంశాలు ఆయనకు దివ్యాంశాలుగానే గోచరిస్తున్నాయి. 'జగమంత్తయు సౌందర్యస్థగితము, శివమయముూ' అన్నప్పుడు ఆయన అంతయు ఏదీ సౌందర్య స్థగితము కానిది లేదనే తాత్పర్యం స్పష్టంగా ఉంటుంది. అంతా శివమయము, రవీంద్రులు తెచ్చిన 'సత్య శివ సుందరము'లన్న ్రిపుటిలోనుంచి ఈ ఆలోచన ప్రకటమయింది. ఈ త్రిపుటి చివర ఆయన - రవీంద్రుడు శాంతం అద్వైతం? అని కూడా చేర్చినాడు.

రాయప్రోలు దృష్టిలో జగత్తును అలంకరిస్తే (ప్రసాధన రేఖానిగరణము) అది ఆనందాన్ని శాంతినీ కలిగిస్తుంది. అదే కావ్యజగత్తు. ఈ అలంకరించటం అంటే దాన్ని తరచి తరచి దానిలోనుండే ఆనంద స్ఫురణను (క్రవ్వి వెలికితీయాలి. ఈ తత్త చర్చ అంతా రాయ్రోలువారు రమ్యాలోకంలోనైనా మాధురీ దర్శనంలోనైనా స్పష్టం చేసిందే. ఆయన ఇంకా ఇలా అన్నారు -

“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నట్లు అభిధా లక్షణా తాత్చర్య గోచరం కాని మాధురీ దర్శన పరమార్ధము అయిన సర్వమంగళ మనోహర రమ్యా లోకమును గోచరింపజేయటానికి, వైరాగ్యబంధచ్చేదం చేసి క్రివర్ద సంబంధ సామరస్యాలు సంపాదించి వ్యంజనాశక్తిద్వారా ఒక దివ్య సముజ్జ్వ్వల సముద్యోతనం అవసరమయింది. ఈ లలిత కోమల మార్గాన ఆనందవర్ధనము చేయడానికే ఆనందవర్ధనుడు అవతరించి భరృహరి వాక్యపదీయ సిద్ధాంతభంగం రాకుండా “ధ్వన్యాలోక గ్రంథమును రచించాడు. ధ్వన్యాలోకం వలన కావ్యజగత్తులోని అంధకారం పోయింది. మధుర మంజుల పదార్థములు అవభాసించినై. పామరాపొమర జగదనుగ్రహం ఆపాదించగల కవి బుషి మామిడి కొమ్మపై కల మంత్ర పారాయణం చేస్తూ కోకిల స్వామిగా అవభాసించాడు. కావ్యాలాపములు కమనీయములై కవులందరిని కమ్రభావులను చేసినవి. విశ్వ పరమార్థము భవ్యలోకానికి దివ్యముగా కవ్యానుగతమై వచ్చింది. అందరకూ అనందకఖిక్ష కలిగింది” (వేదాల తిరువేంగళాచార్యులవారి ధ్వన్యాలోకంలో “నివేదన 1950). పొడవైనా ఇంత ఎత్తిచూపటం ఆయన సమగ్రదృష్టిని చూపించటానికే, శం ననా సుర్సిస్లి

జగత్తునంతా ఆయన ఏకాకారంగానే చూస్తున్నారు - 'తారలన్నను మణులన్న తనయులన్న పులుగులన్న గితములన్న పూవులన్న నామనాచక భఖేదముల్‌ నాకు మాత్రమన్నియు పూవులే యగు నాత్మదృష్టి (రమ్యాలోకం). కనబడే వైవిధ్యం వెనుక ఉండే వకత్వాన్ని ఆయన చూస్తున్నారు.

ఈ ఆత్మదృష్టివల్లనే ఆయన సృష్టిని బ్రహ్మమయంగా ఆనందస్వరూపంగా దర్శించ గలిగినారు. ఆనందవర్ధనుని దృష్టికంటే ఇది భిన్నమైంది. సంసారము, కావ్యసంసారము ధ్వన్యాలోకకర్తకు భిన్నభిన్నాలు. సమాంతరాలు కావచ్చు. రాయప్రోలు దృష్టిలో ఇవి అభిన్నాలు. 'సృష్టియందె ఈశ్వరుని అర్చింత్రుకవులు, అనుమాన (ప్రమాణానికి అంది అందని పరతత్త్వాన్ని ప్రక్కకుపెట్టి ప్రకృతిలో భాసించే భవ్యకళయే ఈనాటి (ప్రేమయోగ మొక్కండు భావించెనిపుడు. ఈ భావన రాయహ్రోలువారిదే.

ఈ దృష్టితోనే ఆయన కళాపూర్ణోదయ కావ్యాన్ని కావ్యశాస్తపరంగా అన్వ యించారు... “చతుర్ముఖుడు సరసచతురుడూ అయిన బ్రహ్మ. సృష్టికర్త. రమ్యసృష్టిని మనోహరంగా ఆవిష్కరించే మధురకవి. ఆత్మసరస్వతికి కోమల శయ్యాసౌభాగ్య సౌందర్యాలు సమకూర్చి రసమయ సరఃప్రతిసరత్వం పొంది పరిసర ప్రతిబింబ బంధురత్వం అందించుతూ కల భాషలు అనుసంధానించి పలికే ప్రాణికి విమోచన స్వాతంత్ర్యం ఆధానించేవాడై రసాస్వాదం చేసే విధానం సరస్వతీచతుర్ముఖుల రహణేళీ రమ్యరీతిలో గోచరింవజేసికోవచ్చు. రసాఖినివేశుడయిన కవి రసాస్వాద మధురితుడైతే మణితమంజులములయిన లలిత మధురవాక్కులు వెలువడుతవి. అదే సరస్వతీ కంఠంలోని మణితము (వేదాల తిరువేంగళాచార్యులవారి ధ్వన్యాలోకమునను (వ్రాసిన “నివేదన” 1950).

సృష్టికర్తయే మధురకవి. సృష్టి అంతా ఆయన రచించిన మధురకావ్యమే. ఈ తత్త్వసారం వునాదులపైననే రాయ'్రోలువారి కావ్యతత్తమును విశదంగా పరిశీలించవలసి ఉన్నది.

ల

గురజాడ అప్పారావు పొశ్చాత్య నాగరకత తెచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్య భౌతికవాద దృక్పథంతో ఆధునిక సాహిత్యానికి కొత్తదర్శనం కలిగించగా, రాయప్రోలు సుబ్బారావు భారత జాతీయోద్యమ (ప్రచేతనతో ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక భావ శ్రేణులలో మాతృభూమిని దర్శించిన బంకించంద్రుని వందేమాతరం గీత భూమిక మీద క్య్యరుముం 11

భారతదేశాన్ని దర్శించాడు. అందువల్లనే భారతదేశం, మాతృభూమి అంటే ఆయనకు ఉద్విగ్నత వస్తుంది. “ఏ ప్రపుల్ల సుమంబుల ఈశ్వరునకు పూజచేసితినో యిందు పుట్టినాడ'. ఈ దేశంలో జన్మించడమే ఒక మహా తపఃఫలం. “తల్లిగా, ధాత్రిగా దేవతామళతల్లిగా సమస్త పరాపర కామ్యములకు పృథ్వినె సమాశ్రయింత్రు కవులు” మాతృదేశారాధన పరాపర కావ్యములను అందిస్తుంది. “ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమొ జన్మించినాడ నీ స్వర్ణఖండముని - ఇదీ ఆయన దృష్టి “సారే జహాంసే అచ్చా హిందూస్థాన్‌ హమారా” అన్న ఇక్బాల్‌ భావన ఇదే మూలంలోనుంచి వచ్చింది. శ్రీ ఆరవిందుల భవానీమందిర్‌ కరపత్రం, దుర్గాస్తోత్రం ఈ దివ్యభావనలోనుంచి ప్రాదుర్భవించినవే.

మాతృదేశారాధన మాతృభాషారాధనగా మారింది. 'భాషకంటె నవ్యులకు తపస్సు లేదు, కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురంబయిన తెల్గు మాతృభాష. తెలుగుదేశం, తెలుగుదేశపు ప్రకృతి, నదులు, పర్వతాలు, పక్షులు, మొక్కలు, పూలు, ఆచార వేషభాషాభూషలు అన్నీ ప్రీతి కలిగించాయి. తెలుగుతోట కావ్యం ఈ పునాదుల మీదనుంచి వచ్చిందే. ప్రాచీనాంధ్ర సారస్వతంలో మృగ్యమైన స్వస్థాన వేషభాషాభిమత త్వము వేయిరేకులుగా, వేయిపాయలవాగుగా రాయస్రోలువారి కవితలో వ్యక్తమయింది. ఈ తత్పదృష్టి కవిని నేలమీదనే సర్వమును దర్శించటానికి, సాధించటానికి ప్రేరేపించింది.

ఇంత పవిత్రంగా లోకాన్ని చూడగలిగిన కవి యెక్కడా మనసు నొచ్చుకునే అళ్లీలాన్ని అనౌచిత్యాన్నీ సహించలేకపోయారు. ప్రాచీన కావ్యాల్లో ప్రసక్తమయిన సంయోగ శృంగారం అంగాంగ వర్ణనలు మనస్సును గాయపరచాయి. దానితో ఆయన దృష్టి (ప్రేమభావం యొక్క విస్శృతికీ, విశ్వతోముఖీనతకు దారి ఏర్పరచింది.

“నేను సంప్రదాయాన్ని బ్రేక్‌ చేశాను. ఎవరినీ అనుసరించలేదు. స్వప్నవాసవ దత్తంలో ఇద్దరూ ఏకశయ్యాగతులై కూడా వికారం పొందలేదు" రాయ(్రోలువారితో ప్రత్యక్ష భాషా (సమర్చణ-సుప్రసన్న-షే 65-2004). ఈ దృష్టితో ఆయనకు శృంగారంలో వాళ్సల్యభావం పొంగివచ్చి దర్శనమిచ్చింది. “అపత్యసంస్మరణేన ఉచ్చాసిత ప్రస్నుతస్తనీ, క్షూమాత్ర సంసారిణీ సంవృతాస్మి అన్న భవభూతి సీతావాక్యం స్ఫురణకు వచ్చింది. రమ్యాలోకంలో అంటాడు- “'కులశుభాంగ్‌ వయోధీర కుసుమమందు మోహమధులె గవేషించె మున్ను సుకవి, సాత్త్విక ప్రేమకోశపేశలములయిన వత్సలామృత రుచులనె వలచు నేడు. ఈ దృష్టిలోని మార్చు దర్శనంలో ఉదాత్తీకరణం ఆయనను అమలిన శృంగారదర్శనంవైపుగా నడిపించింది. అమలిన శృంగారానికి చెందిన భావాలన్నీ 12 డాన్‌

ఆయనకు శాంతినికేతన్‌లో చేరిన తరవాత బలపడ్డవని అన్నారు. అక్కడ వాత్స్యాయన్‌ అనే బౌద్ధవిద్వాంసుడు బౌద్ధతంత్రలో సంభోగాన్ని 'శవాసన స్థలనయోగం” అంటారని అన్నమాట ఆయనమీద ముద్రవేసింది. ఇది ఒకవిధంగా యోగభంగమేనన్నమాట.

ఒక అమెరికన్‌ ప్రీతో ముఖాముఖిలో ఆయన తాను లిరిక్‌లో చేసిన మార్పును గురించి ఇలా చెప్పారు - '&ిగ౧ 62౧౪91 ఇ[9౧౧0[(449 గొడరం 10 876/1 116 [0౪91 [1/10 (0౧ 16 96% ౦0౪౭గ౦గ౧6౯౩ 10 116 56010169 90౧౦06 01 ౧౮౧౭౩9, 18045౧10 2౧6 116 ౧౪49 |0/ ౦01౪6 61/06 8206 ౧ ౧4౧౫౭౧ [౧౪౬గ|. రవీంద్రులు గురుదేవులు సొందర్యశాస్రానికి కామప్రవృత్తి ఆధారం కాదని చెప్పేవారట.

అమలిన శృంగారం అన్న భావం విషయంలో రాయప్రోలు దృష్టిలో ఒక ఆదర్శం ప్రధానమైంది.

(సురత నంన్సర్భ లేని ఈ శుచిమదమల జీవితానురాగాదులన్‌ చిలుకరించు

కానరాని శృంగార మాకర్షణ వ్రభావ విమలోపచార నుఖావహముగి తాను భావించే శృంగారం సురతసంస్పర్శ లేనిది. అది శుచి, అమలము. సంభోగస్థితిలో అది మూఢమై, వియోగంలో ఉవ్విళ్లూరిస్తుంది. పార్వతీపరమేశ్వరులు, భారతీ బ్రహ్మదేవులు వీరి బాంధవ్యంలో సురత ప్రసక్తి ఉంటుందా అని ఆయన ప్రశ్నిస్తారు. అక్కడ పరమార్ధతః శక్తి శక్రిమద్భావమే కాని లౌకిక దాంపత్యము ఉద్దిష్టము కాదు. పద్మినీ సూర్యులకు, యామినీ చంద్రులకు దాంపత్యం చెప్పితే అది ఆలంకారికమే కాని వాస్తవం కాదు కదా. జీవితంలోని అనేక సుందర సన్నివేశాలను గుర్తించి ఇక్కడ సురత సంస్పర్భ లేదు కదా అంటారు కవి రమ్యాలోకం చివరి భాగంలో.

విషయమయమైనా 'సుప్రజాతంతునిర్వాహసూత్రం” కావటంవల్ల సంభోగ విధిని అంగీకరిస్తారు. *“పరమధర్మార్థమయిన దాంపత్యభక్తి, స్తస్యమోహనమైన వాత్సల్యరక్తి సాక్షిమాత్ర సుందరమగు నఖ్యరక్తి అని శృంగారాన్ని మూడువిధాలుగా విభాజించారు. మరొక సందర్భంలో జనని, భగిని, సహచరి, కుమారి అన్న నాల్గు స్థాయిలలో దీన్ని నిరూపించారు. జనని-సహచరిలో లీనమవుతుంది. భగిని కుమారిలో లీనమవుతుంది. మొదటి జంట కారణభూమి, రెండవ జంట కార్యభూమి.

రాయఫ్రోలువారు ప్రతిపాదించిన అమలిన శృంగార సిద్ధాంతం క్రమంగా దాంపత్యభానంలో సమాజకేంద్రంగా నిలచిపోక తప్పలేదు. అమలిన శృంగార నిర్వహణం సాధ్యం కాక 'శ్రూపనవనీతం') కుప్పకూలింది. నవని కాన్యురుతి 13

ముఖ్యంగా రసమును గురించి ఆయన అనేక విషయాలను స్పష్టం చేశారు. రసము లంతఃకరణ యోగరంజనములు. రసమంటే సుఖదుఃఖాలలోను భిన్నభిన్న దశలలో వశంవదమయి తన్మయమయి తన్మయమొనర్చుచు, సహృదయాంతఃకరణ ముఖోపభోగ్యమే రసమని వ్యక్తం చేశారు. తన్మయీభావన యోగ్యత ఆనందవర్ధనుని మాట. అంతఃకరణ ముఖోపభోగ్యమని చెప్పటంచేత సాధారణీకరణం కూడా చెప్పినట్లయింది. రసాస్వాదవేళలో 'మధుపాన పరవశమయిన మధుకర స్థితిని చెప్పినారు. ఆ మహత్తర కైవల్యస్థితి - ఆత్మసంగతి ఆనందమని నిర్వచించారు ఆయన, రసము వాద్యం కాదు. గూఢోదయ స్థితి కలది. రతిని చిత్సదార్థమని నిర్వచనం చేసినారు. భోజుని శృంగారప్రకాశంలోని అహంతలో సోల్చే వీలున్నది. దీనిని హేమచంద్రుడు చెప్పినట్లు విస్పృతార్థంలో 'స్నేహో భక్తిః వాత్సల్యమితి రతివిశేషః అని వెల్లడి చేస్తాయి.

ఈ విసృత శృంగారభావాన్ని - రూపనవనీతంలో ఆత్మప్రసాదన యోగంగా చెప్పారు. '“ఆత్మచైతన్యమయిన ప్రేమను స్వచ్చంగా, స్వేచ్చగా అవికృతము, అవికలము అయిన (ప్రసార సంపాదనం చేయటమే ఈ యోగం”. దీన్నే మాధుర్యవాదమనీ, మాధుర్యోపాసమనీ పేర్కొనవచ్చు. ఆయన మరొకచోట అంటారు - రతి మానుషదివ్య వృత్తులలో రెండు రకాలు. భోగరతి, యోగరతి అనీ. దివ్యశృ్ళంగారం భాగవతంలో ప్రధానం. శేషేంద్ర దీన్ని ప్రేమయోగాభ్యాసం అన్నాడు.

పినతల్లికి తాను అనసూయ చరిత్ర వినిపిస్తూ వుండగా ఆమె అన్నది 'మాతృ(థ్రేమ ముందు త్రిమూర్తులు కూడా శిశువులైనారని. వాత్సల్యంలోకి పరిణమించింది వారి వాంఛ. రూపనవనీతంలో వకుళపాత్ర వెనుక అహల్య 'ప్రాగ్రూపం కనిపిస్తుంది. ఆయన భావుకత ఎంత దొడ్డదీ అంటే ఆర్ధ తులసీదళలీమాల అన్నప్పుడు దళమునకూ స్రీలింగ ప్రయోగం చేసి సౌకుమార్యాన్ని వ్యజింపజేశారు.

ఈ మొత్తం అమలిన శృంగార దర్శనం అనౌచిత్య దూషితమయినప్పుడు సమాజం వికలమవుతుంది. 'స్నేహపూరంబుచే ప్రకాశించి మించె మానవులు పెట్టుకొన్న సమాజ దీపమది చెదరి చింది పంకిలమయిన సకల హీనమగుగాదె యిండ్ల వాకిండ్ల వరుని అన్న రూవనవనీతంలోని హెచ్చరిక న్రీవుంనయోగవైశిష్ట్యాన్ని ఆయన అంగీకరించినట్లు తెలియవస్తుంది.

రసచర్చలో ఆయన కరుణ శృంగారములు రెండే ప్రకృతి రసాలని అంగీ కరించారు. శృంగారం సహజపూర్ణ చిన్మయ రసాస్వాదనం కలుగజేస్తుంది. కరుణం 114 సుఫన్స

శోకమధిత మనోదోషములను శుద్ధి చేస్తుంది. కరుణరసఫలం (గ్రీకులు చెప్పిన కెథార్సిస్‌ భావానికి దగ్గరగా ఉన్నది. మిగిలిన రసములన్నీ దీనిలోనే సంగమిస్తవి. ఈ పద్యం వెంట మరొక పద్యం ఉన్నది.

నృష్టికొక నుసాయి అభీష్టమేని శాంతమగునది విషయ విశ్రాంతి వదము

నంయమించిన యింధద్రియస్థాయి వదము సాపొతీరన వర్వవసాయి అదియె” కరుణ శృంగారములు రెండే అన్నచోట ఉన్న 'ఏవికారార్థము మూడవ రసము యొక్క స్థితికి అవకాశమీయదు. నిజరసము అని విభజించి అది శాంతిరసమని చేసే వ్యాఖ్యానము కవి ఇష్టాన్ని తెలుపదు. అన్ని సాహితీరసములకు సంగమ స్థానమైన ఇంద్రియవిశ్రాంతి పరమైంది శాంతస్థితి. ఇక్కడ మనస్సు ఇంద్రియాలు సుప్తస్థితిలో ఉంటవి. అందువలన అది రసాతీతమైన స్థితి కాని రసము కాదు. ఇక్కడ భోక్త భోగము రెండు విడిగా ఉండే స్థితి కాదు. ఇంద్రియ సంయమాదులు విషయ విశ్రాంతి ఇది ఒక యోగభూమికి సంబంధించిన అంశమే కాని రసభూమికి సంబంధించిన అంశము కాదు.

మిశ్రమంజరిలో ఈ ద్విరససిద్ధాంతం మళ్ళీ చెప్పబడింది.

“కరుణ శృంగారములు రెందే బుతరన(్రతివత్తి నందెడి

ఒకటి కలుషము కడుగు మరొకటి కాల్చు కాయము శుద్ధికి

1977లో నాతో మాట్లాడినప్పుడు ఈ విషయం స్పష్టంగానే ఆయన పేర్కొన్నారు. శృంగార కరుణములే నేను రసాలుగా పేర్కొన్నాను. వీరము అంటే వైరము యొక్క భావము. అది రసము కాదు. అట్లాగే హాస్యమూ వికారచేష్టాదికము వల్ల వచ్చేది. అవేవీ ఉదాత్తీకరించలేవు. శాంతము అంటే రసానుభవము తరువాత కలిగే శాంతస్థితి పరిణతి - అంటే చెరువుల్లో బావిలో నీరు ఉంటుంది, అది స్థాయిగా ఉండటమే పరిణతి. (సమర్చణ-పే.67). శాంతమేమో త్రిగుణాలు సమస్థితిలో ఉందే నిర్వికల్పమైన మనోలక్షణం కావడంచేత ఆయన దాన్ని రసంగా అంగీకరించలేదు.

ఆయన అంగీకరించిన శృంగార కరుణములు జీవనంలో జన్మ మృత్యువులను, ఆద్యంతములను, సుఖదుఃఖములను రాగదైన్యాలను ఇలా ఎన్నో ద్వంద్వాలను వ్యక్తం చేసే రెండు జీవనదీతీరాలు. భోజ భవభూతుల రసచింతనకు ఇది సమన్వయం. ఈ రెండంచుల నడుమ వీరాద్భుత విస్యాలు, రౌద్రభీభత్స భయానకాలు (ప్రవర్తించే రసభావాలు. కార్యీఫ్రుడుంి 15

తి

రాయప్రోలు సాహిత్యదర్భనంలో కావ్యప్రపంచపు ద్వారం సుకుమారమైంది. కావ్య సుకుమార ద్వారమీక్షించెదన్‌' అణువులోనూ (బ్రహ్మాండంలోనూ ఒకేవిధంగా వ్యాపించి ఉన్నది 'మనోహరపు వాగర్ధ ప్రణయము” దీన్ని ఎప్పుడూ కీర్తించేవారు మృదు గుణులగు భాషాకుమారులు. శ్రవణ దారుణములు, శిరీషప్రసన్న భావబాధకములు రసభంజకములు నైన విషమశబ్ద స్నేహమనుఘటిల్ల దమృతమయమైన సుకవి సూక్తమున నెవుడు. ఇదీ శబ్బరీతికి సంబంధించిన రాయప్రోలు భావన. కాల్పనిక కవిత్వం రోజులలో దాదాపు అందరు కవులలోనూ ఈ విధమైన భావసందోహం వ్యాపించి ఉండేది.

అలంకారశాస్తం ఈ విషయాన్ని విపులంగానే చర్చించింది. బెదిత్యవిచార చర్చలో ఇది సుసూక్ష్మవిచారణకు లోనయింది. శబ్బాక్షర సమ్మేళనం దగ్గరనించి పదసంయోజన సమాసఘటన, వాక్యనిర్మాణం మొదలయినవన్నీ ఈ విచారణలోకి వస్తాయి. రసభావాలు రీతినీ, శబ్దసమ్మేళనాన్ని నిర్దేశిస్తాయి. నన్నయ్యభట్టు ప్రతిపాదించిన అక్షరరమ్యత ఈ అంశాలన్నింటినీ తనలో సమ్మిళితం చేసుకున్నది.

తరువాత రాయప్రోలువారు ఈ పరిమీతులను దాటినట్లు కనిపిస్తుంది. రసవదిష్టార్థమే పరిగ్రాహ్యమని, దానికి కవి వచోవైఖరియు, రసజ్ఞ ప్రసాద నవనవ స్ఫురణయు ప్రమాణములని పేర్కొంటాడు. అయితే వస్తువిషయంలోనూ ఆయన తన చుట్టూ గిరులు గీసుకున్నట్లుగా కనిపిస్తుంది. “భావసంపన్నమయిన కావ్యమున భగ్న భాగ్య బీభత్స పిండన పర్వమేల, కాయగూరల క్షుత్చీడ మాయగలడదు, చిత్తశోభాపిపాస నే శీధువార్చు. ఇలాంటి సన్నివేశాలలో కవి పరిమితులలో ఇరికిపోతున్నాడు. కావ్యం యొక్క విశ్వజనీనతలో సంకోచం కలుగుతున్నది. రామాయణ మహాభారతాదులలో ఉన్న బీభత్సప్రధానమైన వర్ణనలు, యుద్దాదులు కావ్యలోకం నుంచి బహిష్మరింపబడ వలెనని భావించాలా అన్న (ప్రశ్న ఉదయిస్తుంది. *కటు కఠోర కరాళ కంకాళ కచ్చ కళ్ళలాదులు తీర్చునే కొామ్యములను అనటం ఆనాటికే ఎదిగివస్తున్న ప్రగతివాద వస్తు సంవరణాన్ని ఆక్షేపించటంగా గోచరిస్తుంది,

“ఖూతమునకే మొలక ప్రకృతము, వర్తమానపు మొలక భావియు, పూచి కాచి ఫలించి సృష్టి రసీభవించి కృతార్థమౌ” (మిశ్రమంజరి) అని అఖండ కాలభావాన్ని దాని ల్టమ్టైన క్రనందతీరమైన రసీభవనాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకా (ప్రకృతిలో సరిణానూన్నీ, ప్రగతిశీలాన్నీ విశదంగా పేర్కొంటున్నారు. ఇళ సుపుసన్న

కావ్యతత్త్వ వివేచనలో 1) శృంగార రస పరిమితులను విస్తరించటం, 2) ప్రకృతి రసాలుగా కరుణ శృంగారాలనే పేర్కొనటం, 8) సాహిత్య పరమార్థాన్ని దివ్య భావంతో దివ్యజీవనంతో ముడిపెట్టడం, 4) నూతన కావ్యభాషానుసంధానం చేయటం, 5) అక్షరరమ్యతకు అత్యధిక ప్రాధాన్యమీయటం, 6) (బ్రహ్మానంద రసానందములను ఒకే స్థాయిలో నిలిపి ఉంచటం, 7) పరాపర జీవన సాధనకు మాతృభూమినే ఆధారంగా చెప్పటం, 8) దేశభక్తిని మాతృభాషారాధనకు నిర్దిష్ట లక్ష్యంగా భావించటం - ఆయన తెలుగు కావ్య విమర్శరీతిలో సంపాదించిపెట్టిన విలక్షణాంశాలుగా భావించవచ్చు.

కావ్యపరమార్థాన్ని ఆయన విచారించిన తీరులో కవికి గల ఆర్షలక్షణం స్పష్టం అవుతున్నది. '“విశ్వమెల్ల మాంగల్యమయ ప్రతిమారూపకముగ సాహితీ కుశీలవుల భినయించెదరు”. కావ్యం మంగళమయం కావాలి, మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని అన్న భావం వ్యక్తమవుతుంది. మనం ముందే పేర్కొన్న వస్తుపరిమితి దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ శబ్దార్ధ ప్రపంచమే ఒక విశ్వం. దీని ఆధారంగా హృదంతరంలో ఒక అంతర్యాగం జరుగుతుంది. అనంత భూత హృదయము దీనిలో ప్రతిఫలిస్తుంది. ఈ యాగఫలంగా హవిర్‌ మధురాన్న సుధాగంధము సహృదయసేవనం అవుతుంది. తిక్కన కర్ణపర్వాంతంలో భారత యుద్దాన్ని ఒక యజ్ఞంగా పేర్కొంటాడు. ఇక్కద సాహిత్యమును ఒక యజ్ఞముగా సహృదయులు యజ్ఞఫలభోక్తలుగా పేర్శొని దీని పావిత్ర్యాన్ని మరింత ఉన్నతంగా వ్యాఖ్యానించారు రాయహప్రోలువారు.

ఇాగర్ట విశ్చ్వముఖమున భోగింవగనగు ననంత భూత వృాదంత

ర్యాగ వావిర్‌ మధురాన్న నుధాగంధము నవ్యుదయ వృాదయతర్పణము నుధీ”

అంతర్యాగభావన 'భావనోపనిషక్తు ప్రతిపాదించింది. కవిత్వాన్ని అంతర్యాగంగా పేర్కొని దానికొక దివ్యజీవన (వ్రతంగా తీర్చిదిద్దే దిశలో రాయహ్రోలువారి సాధన కొనసాగింది.

(27 డినెంబర్‌ 0౬ హైదరాబాదు ఆంధ్ర విద్యాలయ స్నాతకోత్తర కళాశాలలో చేసీన వ్రనంగపాఠం)) వతు లలా?

కవిత్వం మారిపోయిందా* పారిపోయిందా?

కవిత్వం ఈనాడు మారిపోయిందని కొందరూ, పొరిపోయిందని కొందరూ వాదించుకుంటున్నారు. కవిత్వమనేది ఒక మౌలికమైన పదార్ధమై నీరులాగా, గాలిలాగా, ఎపుడూ (ప్రసరించేది అయితే ఒక పారం, వసంతంలా బుతువు బుతువునకొక రూపుదాల్చి పరిక్రమించే కాలమే ఐతే అదొక పారం. ఎప్పడూ వర్షాలవల్ల, ఉపనదుల వల్ల కొత్త సీరు చేరుతూ పాతఠసీరు కడలిలోకి పోతూ - ఎపుడూ ఒకే నదిగా కనిపించే ప్రవాహం అయితే ఒక పార్వం. ఇవన్నీ కాదని దివారాత్రులు కలిసిన దినంలాగా శిశిర వసంతాలు సంగమించిన బుతువుల్లా మూరుళూ మారకుండా, మారకుండా మారుతూ ఆవిష్టృతమయ్యే అనుభవం ఒక పార్యం. ఇలా కవిత్వం అనే ఒక పర్వతాన్ని వివిధ స్థలాలనుండి చూచినపుడు మునకు కలిగే అనుభవంలో వైరుధ్యం, వైవిధ్యం, వైతథ్యం, వైశాల్యం అన్నీ ఒక్కొక్క భూమికనుండి సత్యాలే.

కవిత్సమంతా శబ్బవికాసం. శబ్దం తన పరిమితులను విస్తరిస్తూ విస్తరిస్తూ వ్యశ్తావ్యక్త జగత్తును నంపూర్ణంగా ఆవరించినపుడు అపుడది కవిత్వమౌతుంది. వినఐడి వినబడని శబ్దం, వినబఐడని అనుభవ తరంగాలను క్రమంగా ప్రసరింపజేస్తుంది. ఒక్కో తరంగం మృదువుగా సహృదయుని చేతస్సును స్పృశిస్తుంది. బుగ్వేదంలో శబ్దం తన భావలోకాన్ని వికసించి సంపూర్ణంగా ఆనిష్కనించుకునే సన్నినేశాన్ని ఇలా వర్ణించింది.

“క్రూచినా చూచినట్లు కాదు

విన్నా విన్నట్లు కాదు

ఐనా ఎవరికో కాని -

వతీ ముందర సుందరి అంబభరాల్ని త్యజించినట్లు,

ఆంతర్యాన్ని వివ్లి చెన్పుతుంది వాక్కు” (బుగ్వేదము 10.71.4)

ఈ వాక్కు రహస్యాన్ని విప్పి చెప్పేందుకు కావ్య పాఠకునికి విశ్వాన్నంతా తనలో ఇముడ్చుకోగల చైతన్యం ఉండాలి. చరాచర ప్రకృతి సంవేదనలను తనలో ప్రతిఫలింప జేసుకోగలగాలి. కవిత్వం అనే ఖద్ద్ధానికి శబ్దం ఒర మాత్రమే. ఒరలోంచి వెలువడ్డ రర రూతమే అయధం అవుతుంది. కావ్యశబ్దం కవి ప్రయోగించిన శబ్దద్వార

గలిగినపుడు అనుభవరూపం శాలుస్తున్నది. న సుప్రసన్న

“క చెప్పు తెగి ఎక్సుడో వడిపోతే

రెండో చెవ్దు వనికిరాదు

దీనినీ తవ్పుకుందా పారేయాల్సిందే” (ఎటు? రామా చంద్రమౌళి)

జీవితం కదలడానికి కావలసిన ప్రధానమైన ఉపకరణం సమాజం యొక్క ప్రాథమికమైన యూనిట్‌ దాంపత్యం. అందువల్ల మొత్తం జీవితం ఈ దంపతుల ఆధారంగా సంచరిస్తుంది. ఈ తత్త్వాన్ని చెప్పడం కోసం దంపతులను పాదరక్షక్షులుగా రూపించడం! వీరిలో ఎవరు లేకపోయినా జీవితం అసంపూర్ణం, అసమ(గ్రం, అసంతుష్టం. ఈ స్థితిని వ్యంజింపచేయడానికి కవి రెండో చెప్పు పనికిరాదని చెప్తున్నాడు. జీవితంలోని విధురత ఎంత భయానకమో ఒక నంవపూర్ణవ్యక్తిని ఎంతగా అసంపూర్ణంగా శూన్యంగా మార్చివేస్తుందో ఈ రూపకం వ్యాఖ్యానిస్తూ ఉన్నది. “దీన్ని తప్పకుండా పారేయవలసిందే' అనడంలో స్తీ పురుషులలో ఏ ఒకరి జీవితమైనా ఎంత వ్యర్ధమైపోతున్నదో చెప్తున్నాడు. కావ్యం వాచ్యార్థాన్ని దాటి పరంపరగా అనేకానేక అర్ధాలను వ్యక్తీకరించగలగడం. ఈ అర్థపరంపర అనంతంగా తరంగాలు తరంగాలుగా సాగిపోవడం ఈ వాక్యాలను సూచిస్తు న్నాయి. ధ్వని సిద్ధాంతం అంతా దీన్నే చెప్తుంది.

“వండు వెన్నెల

చీకటంతా చేరింది

చెలికళ్ళల్లో" (బితుభ్రమణం - వృథ్వీరాజు.టి.)

వెన్నెల రావడంతో చీకటి పారిపోయింది. ఆ చీకటి చెలికళ్ళల్లోకి చేరిపోయింది. చెలికళ్ళల్లోనుంచి (ప్రసరించే ఆ నీలకాంతులు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నవి. చుట్టూ వెన్నెలలు ఆవరించి ఉన్నవి. వ్యక్తి ఒకవైపు చీకటినీ, మరోవైపు వెన్నెలనూ, రెండూ రెండు సౌందర్య సముద్రాలుగా అంతస్సులో బయటా మునకలు వేస్తున్నాడు. ఆలంబన ఉద్దీపన విభావాలకు విభాజన రేఖ తొలగిపోతున్నది. చెలి చిరునవ్వు వెన్నెలయింది. వెన్నెలవల్ల పారిపోయిన చీకటి అనంత అంబరపు నీలి నీడలను వ్యక్తం చేస్తూ ప్రణజయము యొక్క ఆనంత్యాన్ని స్థాపిస్తున్నది.

మరో కవి తన బిడ్డ తప్పిపోయినపుడు తల్లి పడే బాధను ఇట్లా వ్యక్తీకరిస్తున్నాడు-

“త్రన ర్తక్తమే మరెక్టడో గుక్క వట్టినట్లు

తన ఊవీరే మరెక్కడో తలకిందులవుతున్నట్లు

ఆమెలో ఎన్ని తుపానులో కార్యీప్తుముర 19

విడిపోయిన తన వృాదయ శకలానికై అద్బ్భశ్వమైన తన వాస్తవ స్వష్నానికై ఆదుర్దాగా ... ఆందోళనగా ... జన నమ్మర్ధంలో రొదలో ...” (ప్రవాహం-దర్భశయనం) మనిషి జీవితంలో అత్యంత ఆత్మీయమైన పార్వ్వం ఉంది. తల్లీబిడ్డల అనుబంధం అదృశ్యమైన తన 'వాస్తవస్వప్పం” అన్నపుడు బిడ్డకోసం తను కన్న కలలు వాస్తవంగా రూపుదిద్దుకోవడం అన్న సాఫల్య లక్షణం స్ఫురిస్తుంది. బిడ్డను గూర్చి ఆపత్‌ శంక బలమయి జీవితాన్ని తలకిందులు చేస్తున్నది. తన ఊపిరే మరెక్కడో తలకిందులవుతున్నట్లు అన్నపుడు ఇద్దరిమధ్య ఉండే అభిన్నభావము వ్యక్తమవుతున్నది. సంతానం ద్వారా కవి పొందదలచిన పునరుత్ధానం అనుభవంలోకి వస్తుంది. అందుకే ఈ కవి 'నా జీవన మైదానంలో దూరం పేరు పోయెమ్‌” అంటాడు. మరొకచోట కవిత్వంలో బొమ్మలు సవ్వడి చేస్తాయి. అవ్యక్తం రూపుదాలుస్తుంది. ప్రాణం రెక్కలు కట్టుకొని ఆకాశంలో పరిక్రమిస్తుంది. “నేను మాత్రం నవ్వడి చేనే ఇంద్రధనున్సునై కొమ్మ కొమ్మకు గోపురం కొమ్ముకు తిరుగుతుంటాను” (సుపర్జ-ఇంద్రగంటి శ్రీకాంతశర్భ) ఇంద్రధనుస్సు బహువర్ణ వైచిత్రితో జగత్తులోని అనేకత్వాన్ని సమన్వయాన్ని సూచిస్తుంది. ఆ ధనుస్సు చేసే సవ్వడి మానవచైతన్యంలోని ఏకత్వాన్న్సీ అనేకత్వాన్నీ ఏకకాలంలో స్ఫురింపజేస్తుంది. అందువల్ల తాను అంటే జగచ్టైతన్యం, సృజనాత్మకమైన సత్య ప్రవృత్తిశీలమైన కొమ్మకొమ్మకూ, దైవభావ స్పందన ్రతీకయైన గోపుర శిఖరానికీ, నడుమ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే కాలము, అనంతము - ఈ రెంటికీ నడుమ కవి ఒక సేతువు కడుతూ ఉన్నాడన్నమాట. జగత్‌ పరిణామంలో కాబోయే దివ్యచైతన్యస్పర్భ ఎలాంటి కొత్త లోకాలను సృష్టిస్తుందో కవి భావిస్తున్నాడు. అపుడు సంకోచాలు లేవు. చీకట్లు లేవు. ప్రలోభాలు లేవు. కామక్రోధాలు లేవు. ఈ లోకానికి దివ్యలోకానికి నడుమ వర్తమానానికి భవిష్యత్తుకు నడుమ తెరలు తొలగిపోయాయి. దీన్ని వర్ణిస్తూ కవి ఇలా చి్రిస్తున్నాడు. “భలివ్యత్తు మంచుమునుగు వదిలింది జీవితం వృత్యురహాస్వం వీడింది ననా

మనస్సు నృత్యం చేస్తోంది వెలుగై

ఊవా కదలుతోంది అగురు భూపమై

ఎక్కడా ఏ ఒక్క బిందువులోనూ చీకటి లేదు

దివ్యరాగన్పర్థుతో జీవితం మపొతమైనట్లుంది”

(స్వేచ్భాకవిత్వం- మాదిరాజు రంగారావు)

బిందువులో చీకటి లేదన్నప్పుడు బిందువు ఆత్మకు ప్రతీక అవుతున్నది. ఊహలో పరిమళాన్ని చూడటం వాస్తవం. ఊహ ఉజ్వల వాస్తవంగా పరిణమించటాన్ని సూచిస్తున్నది. భవిష్యత్తు మంచుముసుగు వదలడం అన్నపుడు, ఇంతకాలం అభివ్యక్తం కాని నూతన లోకం ఆవిష్ఫతమౌతుందన్న, అవబోతుందన్న తాత్పర్యం తెలియపరుస్తుంది. మనస్సు వెలుగై నృత్యం చేయడం అన్నప్పుడు రెండు అమూర్త పదార్థాలను రూపకీక రించడంగా తెలియవస్తుంది.

పూర్వం ఎవరో అజ్ఞాతకవి చెప్పిన పద్యం ఇది -

“అతడు సముద్రజలాన్ని దాటాదు

జనకరాజు బిడ్ద శోకాగ్నిని

నంపాదించి దానితోనే లంకను దహనం చేశాదుోో

ఇక్కడ ప్రసిద్ధమైన లంకాదహన వృత్తాంతాన్ని రెందు విరోధాంశాల నడుమ నిబంధిస్తున్నాడు కవి. సముద్రజలాన్ని దాటడం ఒకటి - ఇది భౌతికాంశం. సీతాదేవి శోకాగ్సిని సంపాదించడం అనేది అమూర్తసాధన. ఈ అమూర్త సాధనం లంకా దహనానికి హేతువుగా చెప్పడం ద్వారా ఒక స్రీ దుఃఖం జగత్తును ఎంత క్షోభపెట్టగలదో ఎన్ని యుగాలను తల్లడింపజేయగలదో, ఎందరు భావుకులను వశీకరించగలదో వ్యక్తమౌతుంది.

జీవితంయొక్క వ్యర్థమైన సన్నివేశాలను వర్ణిస్తూ నిత్యమూ మృత్యుముఖంగా ప్రయాణిస్తున్న తాను లౌకికమైన వాసనలకు దూరదూరంగా తొలగిపోలేని లక్షణాన్ని స్ఫురింపజేస్తాడు కవి - ఈ క్రింది పాదాల్లో -

“కోరి కబేలాకు మందగా లాగుకొని పోవుచుంద

దారి ప్రక్సనయున్న వచ్చి గడ్జిపై తారాడు వనుల

తీరుగా నున్నది జనుల భఖోగాళో...” (విశ్వనాథ మధ్యాక్కజలు) శ్రే ఉల్లంఘ్యు నీంధో నృలిలం నలీలం యః శోకవహ్లీందజనకొళ్ళస్టారపాను

మ లేనైన దవా లంకాం నమా; చస భయటనువషకంు ను

/ ఘా లా ి ఖ్‌ కార్యుప్తురురి య [తి 6. సం. ల స్స.) నా ' షో శీ

కబేలా, గడ్డ, పశువు - ఇక్కడ మృత్యుగ్రస్తమైన అనిత్యభోగమయమైన జీవుల ద్రనృస్థితిని వ్యక్తం చేస్తున్నది. మృత్యువును కటేలాగా చెప్పడంవల్ల అది ఎంతగా అపరిహార్య మైందో లౌకిక జీవనానికి లక్ష్యమైందో జీవితాన్ని క్రూరంగా హననం చేయగలదో స్పష్టీకరిస్తుంది.

ఇలా చూస్తూ పోతే కవిత్వానికి ఏ కాలంలోనైనా భావుకసీమళ్లో అనంతంగా విస్తరిస్తూ పోవడమే (ప్రధాన లక్షణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మనం ఎన్ని చర్చలు చేసుకున్నా కానీ, అది వస్తుమాత్రం కాదు. అలంకార సంయోజితమే కానీ అలంకారం మాత్రం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధి ఏదీ కాదు, అన్నీ అవును అనిపిస్తుంది. 'నా కన్నవి విన్నని విస్నవింపగా మాటలకై వెదుకాడగబోతే' అని నిఘంటువులను, ఛందస్సులను, వ్యాకరణాంశాలను దాటిపోవడం గమనించితే అతదు వీటన్నిటికీ అతీతమైన క్షణికమై శాశ్వతమైన” ఏదో ఒక మూర్తామూర్త పదార్థాన్ని అందుకోబోతున్నట్లుగా తెలియవస్తుంది. అంతకుపూర్యమే మరొకకవి ఈ అన్వేషణను గుర్తించే ప్రయశ్నం చేస్తూ-

“నా కవితన్‌ విశాలజఘన్నా ఒక బెబితి లేదు భాషలో

దాక్టుతి లేద ఊరక రసాొక్టతి నే బ్రవపొంచిపోదు నీ

వాళ్ళతి అందమాచిన రసాత్మవ, నీకును నాకభిన్నతా

శ్రీకతకల్లినా వులకరించెను పొమ్ము రన్య్వవపంచములో (స్నానసుందరి-విశ్వనాథ)

ఈ రసము అనాదిర్లైంది. విశ్యవైతన్యంలోని జీవుని ప్రతిఫలనం అది, ఇన్ని యుగాలుగా శబ్దం దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఈ రెంటికీ అభిన్నత అద్వైతం సిద్ధించడం: కవిత్వం ఎక్కగలిగిన శిఖరం.

వర్తమానం ఎపుడూ సంకుచితమే. ఒక వస్తువునో అభివ్యక్తినో భానజాలాన్నో ఆశ్రయించి ఉంటుంది. ఆకాలం గడిచేస్పటికే ఇనిమారిసోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. మూలపగార్థం అలాగే నిలిచి ఉంటుంది. అంటే మారేది పైపై వరివేషము, మారనిది అంతశ్చైతన్యము. ఉపనిషత్తు చెప్పినట్లుగా 'తదేజత్రి తన్నెజతి' అది కదులుతుండీ, కదలదూ. అంటే మారుతుందీ, మారదు. -

మానవ జ లో కా కవిత్వం ఎక ప ( సుభపం లోతులు శబ్దం ద్వారా అవిష్నరింపబడినంచకాలం

(ఆంధ్రజ్యోతి దినవశ్రిక 82-1-2006)

కవిత్వం - నిరంతర పరిణామ చక్రభ్రమణం

వైనా భారతదేశంపైన దండయాత్ర చేసిన సందర్భంలో ఒక ప్రసిద్ధ తెలుగు కవి “మనం పద్యాలు రాస్తే చైనావాళ్లు యుద్ధం మానేస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వెనుకాల కొన్ని అంశాలు మన ఆలోచనకు గురిచేస్తాయి. 1. కవిత్వం తాత్సాలి కంగా సమస్యలకు పరిష్కారాలను తేగలదా? 2. కవిత్వం భౌతిక జీవనస్థాయిలో పరిణా మానికి, పరిష్కారానికి దోహదం చేయగలదా? 8. కవిత్వం ఏ స్థాయి పాఠకులలో ఏ స్థాయి సంస్కారానికి దోహదం చేస్తుంది? ఈ మూడు ప్రశ్నలూ ఒక ప్రశ్నలో అంతర్భాగాలే కావటానికి వీలున్నది.

ప్రాచీన కాలంలో కావ్యం పురుషార్ధ (ప్రతిపాదకంగా పేర్కొనబడ్డది. ఇంకా శివేతర క్షతి' అని కూడా చెప్పబడ్డది. కాళిదాసు - 'రమ్యములైన దృశ్యాలను చూచినా

  • మధురములైన శబ్దాలను విన్నా మనస్సు తెలియని ఒక ఆవేదన పొందుళుంది. మనస్సులో అర్థంకాని పూర్వపూర్వజన్మల అనుభవాలను చిత్తం స్మరించుతుంది' అన్నాడు. తెలియబడని ఆవేదనను పొందటం, పూర్వపూర్వజన్మల అనుభవాలను స్మరించటం ఈ రెండంశాలు భౌతికస్తరం మీద ఏ ప్రయోజనాలను ఉద్దేశించటం లేదు. మనిషి మనోలోకంలో విసృత తమోలోకాలను బహిర్గతపరచటమే - సబ్‌కాన్నస్‌, అన్‌కాన్నస్‌, కలెక్టివ్‌ అన్‌కాన్నస్‌ ప్రపంచాలను వెలికి తీయటంగా చెప్పుతున్నది.

“అన్నీ ఛన్నాభిన్నాల మర

న్వవ్నశిథిలాల మధ్య, తెగివద్ద తలల మధ్య

పగిలిపోయిన మాటలమధ్య మంటల మనుషుల మధ్య

విరిగిపోయిన తలువుల మధ్య, తలెత్తుకోలేని అవమానాల మధ్య

బంద బరువుల మధ్య నీళ్లెండిపోయి

ఒడ్డుల బుగిలిపోతున్న పడవల మధ్య

రాత్రి నుంచి రాత్రికి ప్రయాణాల మధ్య శ రాజమంట్రైలో అఖిల భారత తెలుగు రచయితల సభల్లో విశ్వనాథ సత్యనారాయణ ప్రనంగాంశం అణాభ ననన కళ్యతతిరి 23

దవాన సంస్కారాలు లేక కుళ్లిపోతున్న శవాల మధ్య

రెండుగా చీలుతున్న వేళ్ల మధ్య, వేకువనే

కావిదేసుకుని నీళ్లు మోన్తూ, ఎదురుదెబ్బ తగిలి

నెత్తురోడుతున్న కాలిబొటనవేలి మధ్య

వద్యం మొదలుపెట్టరా! దరిద్రుదా!

వద్వాన్ని గారాబం చేయకురా

చెడిపోతుంది, చేతగానిదౌతుంది” (శివారెడ్డి - అంతర్జనం)

ముమ్మటుడు చెప్పాడు, కవిత్వానికి ఏ నియమమూ వర్తించదని. 'నియతికృత నియమరహిత అని. శివారెడ్డి అంటున్నాడు పద్యాన్ని గారాబం చేయొద్దని. కవిత్వం విశ్వవ్యాప్తమైన అనుభవ సముద్రం. తల్లిదండ్రుల్లేని రైల్లోంచి రైల్లోకి ప్రయాణం చేసే అనాధ శిశువు పద్యం. కవిత్వానికి వస్తువు రూపం తల్లిదండ్రులనుకొంటున్నారేమో, వాళ్లిద్దరూ నియతంగా ఎప్పుడూ ఉండరు. “పుష్పం పుష్పంలానే, మాట మాటలానే, నేత్రం నేత్రంలానే తాను తనలాగానే ఉంటారు. కాదు ఏదీ దానిలా ఉండదు. ఇదీ కవిత్వ రహస్యం. కవిత్వంలో అనుభవము (పుష్పం), భాష (మాట), దర్శనం (నేత్రం), కవి (నేను) సంపూర్ణంగా పరివర్తన చెందుతాయి. ఏదీ దానిలా ఉండదు. ఈ పరిణామం పొందకపోతే - వాచ్యస్థాయిని దాటకపోతే - అప్పుడే నేశత్రాంధకారం, పుష్పాంధకారం, పదొంధకారం.

అయితే, కవి కవిత్వంలోకి ప్రవేశించగానే - అయితే (భష్టయోగి లేదా అఖండ యుద్ధయోగి. (్రస్టయోగి అంతర్జగత్తులోనుంచి శబ్దాన్ని ఎన్నుకుని పద్యమై బయటకు వ్రవహించినవాడు. అంతర్జగత్తులో వైశ్వానరుడై జగదనుభవ కల్లోలాల తాకిడితో కొట్టుకుపోతూనే, పైకి తేలివచ్చే అఖండ యుద్ధయోగి,

“ళగనమును చుంభించ దలబిన అలలకూ లేదాయె నిద్దుర

జాబిలిని బంధించదలచిన వలలకూ లేదాయె నిద్దుర

చంగ్రికను తాగేసి తదఐడు రాత్రికీ లేదాయె నిద్దుర

నన్ను రేవటి రేవు చేర్చెడు మధువుకూ లేదాయె నిద్దురో

(పెన్నా శివరామకృష్ణ - సల్లాపం)

తొలి రెండు వాక్యాలలో ప్రపంచంలో నూతనావిష్శారాలకోసం, సాఫల్యాలకోసం, విశిష్టస్థితికోసం చేసే నిరంతర నిర్జిద్ర ప్రయత్నాలు స్ఫురిస్తున్నాయి. మూడవ పాదంలో ఇథి ననన మన్ను

రాత్రి తొందరపడి, కనిపింపజేసే వెన్నెలనే తాగేసింది. అందువల్ల తడబడుతున్నది. జగద్యాత్రలో అప్పుడప్పుడూ సంభవించే దుష్ట సన్నివేశాలను తిరోగమన సన్నివేశాలను ఇది స్ఫురింపజేస్తున్నది. మహాత్మాగాంధీ హత్య తరువాత దేశం పొందిన సంక్షోభస్థితి ఈ రాత్రిది. నాల్గవపాదంలో మధువు ఒక అసాధారణ ఉపకరణం తన చైతన్యాన్ని సంపూర్ణంగా పరివర్తన చేసేది. భవిష్యత్తును సాక్షాత్మరింపజేసేది. కవిత్వమో లేక దానికి పర్యాయమైన దివ్యత్వారోహణమో.

కవి వైశ్వానరుడై (విశ్వమానవుడై) పొందుతున్న వేదన ఇది. ఈ వేదనయొక్క విశ్వరూపం వెలికి తేవటానికి శబ్దముఖం ధరిస్తాడు కవి. ఈ శబ్దం అనేక విధాల రూపాలెత్తుతుంది కవివల్ల, *నీ సాంఘీకరించే శాస్త్రం మీదొట్టు. తన టీచర్‌ చెప్పే సాంఘికశాస్తాన్ని గూర్చి చెప్పుతున్నాడు కవి. ఈ శాస్త్రం ఘీకరించింది 'చమదగజంలా”. విద్యార్థి బెదరిపోయాడు. ఇక్కడ సాంఘికశాస్త్రం, ఘీంకారం రెడూ కలసిపోయాయి. “మేఘాలు ఏడుస్తాయి కాటుకకళ్లతో - కుచ్చిళ్లు సరిగా పోసుకోకుండా నీరు ప్రవహిస్తుంది ముడతలు ముడతలుగా నీరు ముడుతలైంది చీర కుచ్చిళ్లు సరిగా పోసులేదు:. ఇది మరొక శబ్దం తాల్చిన నదీవనితాద్విరూపం.

“కే మనిషి

వీలిచిన వీలువుల

అరచిన అరువుల పెట్టిన ఖభోషల

వెనుక

వెనుదిరిగి కూడిన మనిషీ

కన్నీరై రాలిన మనిషి

ఎమ్హుదూ ఒంటరై

కంటతడిపెట్టి కనివీంచే

విలవించి

క్షమతో కదలిపోయే

ఒకే ఒక్టు మనిషి? (సీతారాం - 5/0 మాజిక్యం)

ఈ “ఒకేఒక్క మనిషి కవి వస్తువు. జగత్తంతా తనలో లీనం చేసుకున్నవాడు. 'పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు? అన్న మాటకు గాఢమైన వ్యాఖ్య, ఈ అంశమేదీ దేశకాలాల పరిమితులకు లొంగివుండేది కాదు. కాత నా నా 25

నాగరికరణం వల్ల గ్రామాలు శిథిలాలై వ్యవసాయం మందగించటం, ప్రాధాన్యం కోల్పోవటం వర్తమానం తెచ్చిన విషాదం, “కట్టె, వీడక్రె వం్ర వంద మంద్ర, మాక్రై వండుగలకు తోరణమై దేవని సిగలో వవ్వై వత్తిరె నీడిచ్చి నీళ్లిచ్చి పాలిచ్చిన నేల నల్ల నిద్రలో ఆకుపచ్చ కలల్రైన నేల నిద్ర వాలుచుకున్న బతుకు నిండా వెలుగు బ్రత్సుకైన నేల -మట్టివానన నిచ్చిన నేల ఐతుకుతనాన్నిచ్చిన నేల చూవుల్నే అందగించిన నేల ఇప్పుడు ఆందరి చూవులకూ ఆద్ధమైంది వట్నం ముంచుకొన్తున్నది* (సింగిడి - రామగిరి శివకుమారశర్శ) నేలకూ మానవుడికీ ఉన్న అవిరాము సంబంధాన్ని స్పష్టంగా వ్యాఖ్యానిస్తున్న సందర్భం ఇది. (ప్రకృతి సౌభాగ్యాన్ని మానవజీవన వికాసాన్ని జమిలిగా భావనచేస్తూ ఈ కవి ఇంకా చెప్పుతున్నాడు అ “క జల్లు వెన్న తదిలే వేళ్ల కాళ్లకు నీళ్ల వదను అంటితే మోళ్లవక్కల నుండే చివుళ్లు పైకి పరిగెత్తదానికి వదునెక్కుతాయి” (సింగిడి). వానజల్లు మనిషి నేస్తమై వెన్నుతడుతుంది. మన బతుకంతా ఈ వానజల్లు మీద ఆధారపడి వుంది. చివుళ్లు చూపే ఉత్సాహం సృజనాత్మకతను తెలుపుతున్నది. ఎంత భవిష్యద్భావ సుందరమైనవీ పంక్తులు!

“వర్షంలో తదుస్తూ ఎవరో వచ్చారు నా లోవలికి వర్షాన్ని మోనుకుని - రాత్రంతా జల్లు వడుతూనే వుంది నామీద మాట తడున్తూనే వుంది నాతోపాటు” (యాకూబ్‌ - ప్రవహించే జ్ఞాపకం) లోపలికి వచ్చింది అనుభవం. అది శబ్బరూపమై వచ్చింది. ఈ అనుభవం రాత్రంతా - జీవితం అంతా అనుభవాన్ని తనపైన కురుస్తూనే వుంది. అనుభవాన్ని మోసే శబ్దమూ దాని సాంద్రతను కోలుపోకుండా ్రకాళిస్తూనే ఉన్నది. అనుభవం సాంద్రం కావటంవల్ల దాన్ని వర్షంగా అభివర్ణించారు కవి. కావ్యం విశ్వజనీనం, దేశకాలాతీతం కావటంవల్ల అది నిరంతరం కురుస్తూనే వుందంటున్నాడు మరొక కవి. “నాకు మాటలపై అధికారం లేదు. వృత్తాల పోకడ తెలియదు. రసభావ బెచిత్యములూ, శయ్య అర్థము, అర్ధము, లక్షణము, గుణము, ఆలంకారమూ - ఇవేవీ నా కవిత్వంలో లేవు. నా కవిత్వం 'నగ్నోద్విగ్తుమైంది' అంటున్నాడు కవి. నగ్నత్వం ఏ నియమాల బరువూ, అదుపూ లేకపోవటం, ఉద్విగ్నత ప్రత్యగ్రంగా, సహ్బదయుని వెంటపడి అతని చిత్తాన్ని ఆక్రమించగలగటాన్ని నూచిస్తున్నది. లోకంలోని దంభమును, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్నీ కవి చిత్రంగా ఆక్షేపిస్తు న్నాడు - “మనను గదిలో ఒక రవాన్య జ్ఞాపకాన్ని అతి జాగ్రత్తగా వదిలపరచిన అరని పొరపాటున కూడా తెరవకూదదు” అంటూ మనుష్యులు అంతర్జగత్తులోనుంచి బయట పడ్డప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. “తవుదే అయిన దుఃఖనిధినుంచి ఆ(తువులు జారివదకుండా వదేవదే కన్నలొత్తుకుంటారు” అంటాడు. కవిత్వం రహోవీధిని ప్రతిఫలింపజేయాలి, అలా చేయలేక కేవల బౌద్ధికమైన, జెపదేశికమైన సరళరేఖల్లాంటి పంక్తులు కవిత్వం ఎప్పుడూ కాలేవు. “ఏ వ్రతిభిందమూ చూవించలేని లోతైన ఒక నూతిలోనికి తొంగిచూడకపోవటమే నుంచిది” (విన్నకోట రవిశంకర్‌ - వేసవివాన) వలా బె

వైషమ్యాలను చవిచూస్తూ సాగిపోవటమే జీవన రహస్యం. చివరకు జయించేది నృుత్యువే. ఈ అసహాయతను చిత్రిస్తూ - “జీవజలాన్ని భద్రపరచుకుందామనే దోనిలి అనవోయతను నేను చూశాను” (వి.ఆర్‌. విద్యార్ధి-ఘర్మసముద్రం) అందుకే ఈ కవి జీవితాన్ని - నవ్వుల వెన్నెలా కాదు, బాధల చీకటీ కాదు, అంచనాలకు అతీతమైన అనుభవం అని నిర్వచిస్తాడు. నేటి జీవనంలోని ఇంధన కాలుష్యం, వాహన కాలుష్యం ఎలా మానవుణ్ణి తరిమి తరిమి చంపుతున్నదీ ఇంతకు పూర్వం సృష్టిలోనే కలుగని అపూర్వమైన సంక్షోభం. అజగరంలాగా ఇదీ మానవజాతిని క్రమ్ముకొంటూ, మృత్యుపరిష్పంగంలోకి నెట్టివేస్తున్నది. “రోడ్డుమీద ఏడడుగుల ఎత్తులో నీలిరంగు మేఘనర్చం నిన్ననునరిస్తున్నప్పుడు మారుమూల మలుపవుల్లో వృత్యుగవ్వారాలు రారమ్మని విలుస్తున్నవ్పుడు నిన్ను నీవే కాస్తకాస్త నంజుకు తిన్నట్లు మనిషీ! నీకు అనిపించదా? (ట్రవంచ యుద్దాలన్నింటినీ మించిన జననష్టం ప్రమాదాల్లో ప్రవపొంచదం కన్ఫించదా?” (లంకా శివరామప్రసాద్‌ - మూడుస్వష్నాలు-ఒక మెలకువ) “ఏడడుగుల ఎత్తు నీలిరంగు మేఘసర్చం' మనిషికన్నా ఈ కాలుష్యం ఎంతో ఎత్తనీ, మేఘసర్చం అన్ననూటవల్ల జీవనాన్నిచ్చే మేఘం, సర్పంగా మృత్యువుగా మారిపోవటం స్ఫురింపజేస్తున్నది. అయితే మనిషిని నిలబెట్టేది ఆశ, స్వప్పం, సంకల్పం, ఉద్యమం. “బతకాలన్న తెగింపే చావాలన్న ముగింపుకన్నా గొప్పది నాకిమ్హుడు చచ్చిన మనిషి (ప్రాణం కావాలి నమాధులమీద అమృతం కురిపించే నీద్ధులు కావాలి సంచరించే అత్సలకు రక్తమాంసాలడ్డే (ప్రవక్రలు కావాలి (పొట్లపల్లి శ్రీనివాసరావు) 28 సుప్తుసన్ని

ఇది వాచ్యాతిశాయి భావుకత. చచ్చిన మనిషి ప్రాణం కొవాలి. “ఆతి మృత్యుమేతి అన్న ఉపనిషద్భావంలోనికి ఇది సంగమిస్తున్నది.

తెలుగు కవితాజగత్తులో కొంతకాలం క్రితందాకా నినాదాలు, పతాకాలు, వచన ప్రాయమైన ఖండఖండ వాక్యాల గుంపులు కవిత్వంగా (్రవర్తించాయి. దశాబ్దం పైగా కవిత్వం మళ్లీ తన స్వస్థితికి చేరుకుంటున్నది. అప్పుడు రాజకీయ పార్టీలు కవిత్వానికి “'మంటత్రసానితనాన్ని అభినయించినాయి.

కొన్నిచోట్ల కవిత్వం - వాచ్యమేమోనన్నట్లుగా ఉంటుంది. దీన్ని 'వాచ్యాభాసి మని అనవచ్చును. సామాన్నోక్తి జీవనతత్తాన్ని వ్యాఖ్యానిస్తుంది. ఎక్కడైనా చెడ్డ కుమారుడు పుట్టవచ్చును కాని ఎక్కడా చెడు తల్లి ఉండదు అన్న ప్రాచీన స్తోత్రంలోని వాక్యం సామాన్యవాచ్యస్థాయిలో ఉన్నట్లు కనిపించినా మాతృస్థానము, వాత్సల్యము పెంచే సందర్భంలోని త్యాగ మధురిమ అన్నీ ఓతప్రోతంగా వెలికివస్తాయి.

“వుట్టుక నీది

చావు నీది

(బ్రతుకంతా దేశానిది” అన్న కాళోజీ వాక్యం ఇలాంటిదే. ఈ వాక్యంలో లోకనాయకుదైన జయప్రకాశ్‌ సమస్త జీవితమును దేశమాతృపదాలపైన పూజాసుమంగా అర్చించిన అంశం ఉజ్జ్వలంగా ప్రకాశించింది. ఆయన చేపట్టిన ఉద్యమాలన్నీ తరంగాలుగా తాకుతున్నవి. ఆయన చేతిలో లేనివి జననమరణాలే. అవి పరవశమై మార్చరానివి. జన్మమృత్యువుల పారవశ్యం నడుమ (బ్రతుకును త్యాగమయం చేసికోవలసిన ఉదాత్తభావం ఎన్నో తాత్తిక మజి కాంతులను ప్రకాశింపజేస్తున్నది.

కనిపించేదానికన్నా - వాస్తవం భిన్నంగా ఉంటుంది. మనుష్యుల స్వభావాన్నీ జగద్వ్యవహారాన్నీ ఈ సూత్రంతోనే కొలవాల్సి వుంటుంది. ఇంద్రియాల పరిమితి (గ్రహించగలిగి వుండాలి,

“నమ్ముద్రం మవోగడును

చూట్టానికి ముదురు నీలంగా కన్పట్టి

చేతిలోకి తీనుకుంటే వేళ్ళమధ్యగా

రంగు జారిపోతుంది” (దీవి సుబ్బారావు - వైశాఖ సముద్రం) కార్యఫుతురి 29

వదైనా అనుభవ వేళలోనే ఆతృస్థితి దర్శనం కలుగుతుంది. పైపై చూపులు అభాసలే. అందుకే 'రవిగాంచనిచో కవి గాంచుననే మాట పుట్టింది.

(ప్రతిక్షణమూ కొత్తగా రూపుగట్టించటం కవిత్వం లక్షణం. యుగయుగాలుగా చూస్తూ వున్నా కవిత్వంగా మారిన వస్తువు, చివరకు ఎప్పటికీ క్రొత్తగా అనుభవసీమల్లో సాక్షాత్కరిస్తుంది. ఆరువందల ఏండ్లక్రితం లల్లాదేవి ఇలా అన్నది -

“వెలువ చిత్తము క్రొత్త శళిరేఖయును క్రొత్త

చెలువ నెమ్మెయి క్రొత్త, జగమెల్ల నరి్రొత్త

శివక్ళపానలిలముల జలకమాడెనుగాన

తడినీ, 'లల్లాబేవి తనకు తానో క్రొత్త (లల్లాదేవి వాక్కులు - మల్లంపల్లి శరభయ్య అనువాదం) శివకృపా సలిలాలలో తడిసిపోయిన లల్లాదేవి తనను తాను గుర్తింపలేనంతగా దివ్యచైతన్యంగా మారిపోయింది. అందుకే కవిత్వం నిరంతరం సాగిపోయే పరిణామ చక్రభ్రమణం, అభినవలోచనం, భావుకులకు అమృతాభిషేకం. (8-5-2006 - ఆంధ్రజ్యోతి దినవటిక) ఇం సున్న

తెలుగులో కావ్యశిల్స్ప విమర్శ మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలలో తెలుగు విమర్శ సాహిత్య వికాసంలో రెండు ప్రధాన సన్నివేశాలు జరిగినాయి. మొదటిది విశ్వనాథ సత్యనారాయణ నన్నయగారి ప్రసన్న కథాకవితార్థయుక్తి భారతిలో ఒక సంవత్సరం పాటు 1949లో ప్రచురింపబడటం, రెండు చెళ్లపిళ్లవారి ఆస్థానకవి సన్మానసభలో అదే సంవత్సరం రాయప్రోలు సుబ్బారావు మాధురీ దర్శనం ్రకటింపబడటం. ఒకటి కావ్యాన్ని శిల్చభూమిగా చూచింది, రెండవది కావ్యాన్ని సౌందర్య దీప్తిగా భావించింది. 'జగమంతయు సౌందర్య స్థగితము శివమయము తత్ర్రసాధన రేఖా నిగరణ రచనా వ్యంజన నగు ఆనందంబు, శాంతి యగు నవల నుధీ 'అనవద్య మనుక్షణ నూతన నుందర నుద్రనన్న దైవీ తంత్రా వనమగు నృష్టిని జీవియు అనువిద్దానంత కాంక్ష నవతరిలు నుధీ” ఇది రాయస్రోలువారి సౌందర్య భావం. ఆయన ఉపనిషత్తుల నుండి, రవీంధ్రుని నుండి, భారతీయ రససిద్ధాంత పరంపరనుండి ఢేరణ పొందినవారు. ఈ జగద్వలయంలో పరిధిలో, పరిమితిలో సౌందర్యమును ధారణ చేసే క్రమంలో అనుక్షణము ఆనందము చిందుకుంది. ఈ లోకం అంతా న్యక్తావ్యక్త జగత్తుల నడిమి సంధిదశలో ఆనందోర్థ్వ కల్లోల విజ్బంభణం. అందువల్ల సౌందర్యస్థగితము. ఈ జగత్తును '(ప్రసాధనరి చేస్తే అది రచనలో ఆనందంగా వ్యంజింపబడుతున్నది. ఈ ప్రసాధనం రూపాంతరికరణం, లోకవ్యక్తి, రసవ్యక్తి అవుతుంది. జగత్తు తన పరిణామశీలాన్నీ మర్శత్వాన్ని దుఃఖ మయత్వాన్నీ పరిత్యజించి ఆనందదేహళిని స్పృశిస్తుంది. ఆనందం చివరకు జీవుని పరమగమ్యమైన శాంతిలోనికి ప్రవేశింపజేస్తుంది. రాయప్రోలు వాడిన “ప్రసాధనరేఖా నిగగణమూ' కవి ప్రతిభచేత సాధ్యమవుతుంది. వస్తువు దేశకాల పరిమితుల నతిక్రమించి విశ్వజనీనతను పొందటం, సర్వజీవుల అనుభవ పరిమితులలోనికి స్వతంత్రంగా, ఆత్మీయంగా ప్రవేశింపగలుగటం, కవి వక్తవ్యమైన కావ్యరూపమైన వస్తువు తన పరిధులను త్రెంచుకొని సర్వజీవుల అనుభవంగా పరిణామం పొందటం. చివరకు కవి కావ్యంలో, కావ్యం నహృదయుని భావుక చైతన్యంలో సంలీనతను పొందటం. ఈ ప్రక్రమమంతా కాష్యరురురి 31

ప్రనాధనరెఖా నిగరణమన్న మాటలొ స్పష్టంగా రూపొందుతున్నది. నిరుపాధికమైన కావ్యానందం ఈ వ్యాఖ్యానంలో విశదమవుతున్నది.

రాయహ్రోలువారి 'మాధురీదర్భనం' తత్పూర్వకృతి రమ్యాలోకానికి అనుబంధమైన కృతి అనే భావం లోకంలో ఉన్నది. ఐతే వాస్తవానికి రమ్యాలోకంలో ఆయన సూత్రీక రించిన సౌందర్యతత్తము కాల్చనిక కవిత్వపు సరిహద్దులలోనే నిలిచింది. మాధురీ దర్శనం వచ్చేప్పటికి కవి అనుభవ ప్రపంచంలో పరిణతి పొంది కావ్యశా'స్తాన్ని రసోపనిషత్తుగా భావించటం కనిపిస్తుంది. 'సురుచిర శబ్దములన్‌ సుందరరూపంబులను ప్రాజి తనియుటయె కళా పరమరహస్యమిని సౌందర్యశాస్త్ర సాధన సాధ్యములను పేర్మాన్నారు. శబ్దరూపాలను మాత్రం పేర్కొన్నా సంగీకాది కళాసాధనలు దీనిలో అధ్యాహారంగా తీసుకోవలసి ఉంటుంది.

అమలిన శృంగారం పేర కేవలం నరనారీ సంబంధము స్నేహ వాత్సల్య రూపంగా రమ్యాలోకం చెప్పితే మాధుర్యదర్శనం దాని విసృతమైన ప్రీపురుష సంబంధం లోని మాధుర్య ధోరణులను వివేచించింది. జననీ, భగినీ, సహచరి, కుమారీ క్రమము అది. ఈ చతురమైన వివేచన సార్వకాలికంగా ప్రీ పురుష సంబంధాలను విశ్లేషించింది.

'రమణీయార్థ తరంగిత కమనీయంబయిన కాన్యకంఠథ్వనిలో

నుమమున మకరందమువలె (భ్రమించురసము వృదయానురక్తముగ నుధీ”

భరతుని నుంచి జగన్నాథ పండితుని వరకు సాగిన అలంకారశాస్త్ర విచారము దీనిలో సుసూక్ష్మంగా నిక్షిప్తముయింది. రసము వస్తువులో అంతర్లీనంగా ఉంటుంది. కవి ఒక్కరికే అది సాధించటం సాధ్యమవుతుంది. 'రసమది యథాతథమ్ముగ ప్రసరించును కవుల పాటవముకొలది యనెన్‌ (గ్రసితాఖిల శబ్దబ్రహ్మ సమాజ్ఞాపరుడు నన్నప్రార్యుండాదిన్‌. ఇక్కడ ఆంధ్రశబ్దచింతామణి సూత్రాన్ని స్మరిస్తున్నాడు కవి. గూధము రసోదయస్థితి అని రసవ్యంజనను విశదీకరించారు రాయప్రోలువారు.

కావ్యనిర్మాణ మూలనూ(త్రం - సొందర్యస్పురణ, మహాకావ్యమైనా, ఇతివాసమైనా, రూపకమైనా, ఏదైనా నిర్మాణం దాన్ని ఆద్యంతములు బెచిత్యపూర్ణంగా తీర్చిదిద్దటంలో ఉన్నది. “అంగాంగ విలక్షణరుచి సంగత తను సౌస్టవంబు సౌందర్యమగున్‌ అని సౌందర్యాన్ని నిర్వచించారు కవి. ఒక తాజ్‌మహల్‌, మీనాక్షి దేవాలయం, ఒక విగ్రహ నిర్మాణం, ఒక ఐహువర్జ శబలమైన చిత్రరచన, మనోమోహకమైన స్వరమేళ ఏదైనా కావచ్చు. దాని నిర్మాణంలో మూలసూత్రం అంగాంగముల విలక్షణ రుచి లారా

సంగతత్వము, మొత్తం కావ్య ఫలమైన రసాస్వాదనకు ఈ సుష్టు నిర్మాణం ప్రధానాంశం. ఈ సుష్టు, ఉచిత, సమనునివిష్ట చైతన్యస్ఫురణమే సౌందర్య ప్రకృష్ణస్ఫురణకు ప్రధానాధారం.

ఈ ఆకృతి నిర్మించుటకు చేసే ప్రయత్నమే ప్రసాధన ప్రయత్నం. ఈ ప్రయత్నం కవి కౌశలం మీద ఆధారపడి ఉంటుంది. రాయప్రోలువారు చేసిన ఈ సౌందర్యవర్జనం నాట్యశాస్త్ర కాలంనుంచీ మనకు నిర్వచింపబడుతూ వచ్చిందే.

ఆధునిక కాలంలో కావ్యవస్తువు, ప్రధానంగా శృంగారం పునఃవినూత్నంగా నిర్వచింపబడింది. ఇక్కడ బెచిత్యపు కుదుళ్లు చైతన్యం పొందాయి. రాయప్రోలు వారంటారు - “నా భావనలో కామ(్రేమలు రెండూ శృంగార సంబంధములుగా భాసించినవి. ్రేమ దైవికంగానూ, కామం మానుషంగానూ సంకేతించుకొన్నాను. అందుకని నా అమలిన శృంగార విషయములో శబ్దాచిత్యమును పాటిస్తాను. చక్రస్తనీ, రంభోర్హూ లలనా ఇత్యాదులు కేవలం ్రీవాచకములుగా వాడక జాగ్రత్తపడ్డాను. ఇది అనుభవమే కదా. కూతుర్చ్సీ సోదరినీ లలనా అని సంబోధిస్తారా? అందుకని రమ్యాలోకములో ఈ ప్రసక్తి తవ్పనిసరియైనప్పుడు సురత సంభోగాదులను వాడలేదు. దీని విషయం పూర్తిగా తెలియనివారు ఆక్షేసించారు. నేడు దీని ఆదిపాదులు ఉపనిషత్తులలో ఉన్నవని బయటపెట్టారు సుప్రసన్నాచారి” (సాహితీ వైజయంతి పే. 87-88 - 2008)

ఇక్కడ వస్తువు అదే. వర్ణ్యమైన జీవితమే చూచే చూపులో మారిపోయింది. బ్రతుకులోకి ప్యూరిటనిస్టు దృక్సథం ప్రవేశించింది. కామక్రీడా పరవశమయిన మార్దం నుంచి శృంగారం ఎదిగివచ్చి జీవితాన్నంతా ఆవరించిన (ప్రేమ, వాత్సల్యము, స్నేహము, సౌదర్యము, భక్తి విశ్చ్వజీవనంలో ఏకాత్మభావంలో తాదాత్యము - ఇలా అనేకాంశాలలోకి వ్యాపించింది. శృంగారరస సామగ్రి విశ్వతోవ్యాప్తమై సహ(స్రముఖంగా (ప్రవ్యక్తమయింది. ఆత్యంతికంగా శృంగారం వ్యక్తిత్వ పరిమితులను, ఇంద్రియాల వలయాన్ని కాంక్షల ఇంద్రజాలాన్ని దాటటానికి ఉద్దేశింపబడింది.

ఈ అనుభవ విశేషం సంగితంలో ఎలాంటి అనుభవం కలిగించగలదో రాళ్ళపల్లివారు చెప్పుతున్నారు - కనుకనే త్యాగయ్య నాదరచన భాషారచనకు చాలా దూరం మీరిపోయింది. ఆయన నాద జీవనానికి భాష శరీరంగానూ, ఎన్నోవోట్ల వట్టీ పరివేషంగానూ పరిణమించి ఒదిగి నిలిచింది. ఇంతేకాదు పరదేవతగా శ్రీరామమూర్తిని ఉపాసించే సాధనంగా త్యాగయ్య ఉపయోగించుకొన్న ఈ నాదకళ తుదకు శ్రీరాముడే అయిపోయింది. అధవా రాముడే నాదకళారూపముగా మారిపోయినాడు. అంటే లాన్‌

రామమూర్తియం దారోపించిన_ధ్యానించిన అఖండత, ఆమేయత, అనిర్వచనీయత - ఈ నాదప్రపంచమంటే త్యాగయ్యకు అనుభవానికి వచ్చింది. ఇంకొక విధంగా చెప్పితే పాట భక్తి ఎల్లలను కూడా దాటిందన్నమాటి (సాహితీ వైజయంతి-పు. 117). సౌందర్యానుభవం సంగీతంలో ఎలా కలుగుతున్నదీ రాళ్లపల్లివారి నిర్వచనాన్ని బట్టి వ్యాఖ్యానించుకోవచ్చును. 1 భాషారచనను నాదకళ దాటిపోవటం. 2. లక్ష్యమైన పరమానుభవంగా ఈ నాదకళ పరిణమించటం. భాషకేవలం పరివేషమై తొలగిపోవటం. 8. లక్ష్యమునకు సాధనకు నాదమునకు పరదేవతానుభవమునకూ అభేదము సిద్ధించటము. 4 _ఆత్యంతికంగా ఈ అనుభవము అఖందము, అమేయము, అనిర్వచనీయ ముగా పరిణమించటం. 5. అది వస్తుపరిమితియైన భక్తిభావాన్ని, దాన్ని సరిహద్దులను దాటిపోవటం. ఈ అంశాలను పరిశీలించికే క్రమంగా త్యాగయ్యక్తీర్తన భాషను, భక్తిని, ఇతర సరిహద్దులను దాటి చివరకు పరమమైన అనిర్వచనీయమైన ఏకాకారమైన రసానుభూతిగా పరిణమించిందని తెలియవస్తున్నది. ఈ సౌందర్యం ఆస్వాద్యదశలో (శ్రోతకు ఆ అఖండత్వ సిద్ధిని కలిగిస్తున్నది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా పాశ్చాత్యుల సౌందర్వశాన్త ప్రాబల్యం రాయప్రోలువారిమీద ఉన్నది. రూపనవనీతంలో ఒక పరిణామాన్ని వ్యాఖ్యానించారు వారు. దాని ప్రకారం శృంగారానుభవం తృప్తిగా అనుభవించిన తరువాత దానిమీద రాగం సడలుతుంది. పాము తన కుబుసాన్ని విడిచిన విధంగా భావుకుడు దానిని విసర్జిస్తాడు. ఖై ఇంచుమించు ఇదేకాలంలో కావ్యానుభవ దర్భనం విశదంగా విశ్లేషించి దానికొక స్థితినీ, గతినీ కలిపించారు విశ్వనాథ సత్యనారాయణ. నన్నయ్యగారి ప్రసన్న కథా కవితార్థయుక్తిలో ప్రధానంగా ప్రతిపాదించిన అంశాలు మొత్తంగా చూస్తే కావ్యతత్త్రము సమగ్రంగా అవగాహనకు దోహదం చేస్తుంది. కావ్యాన్ని ఉపక్రమ ఉపసంపహారాల ఆధారంగా దాని తత్త్వాన్ని గ్రహించవలసి ఉంటుంది,

“భారతమంతా కర్మప్రాధాన్యాన్ని బోధించే (గ్రంథం. కర్మ అంటే నిత్య నైమిత్తికం కాదు. ఆగామి సంచిత ప్రారబ్టాలు. సృష్టాది నుంచి తనయందు ్రతిఫలించిన బ్రహ్మ పదార్థం కలిగిన మూలప్రకృతి యెట్లా పరిణమిస్తుందో అందులో బహుజీవుల కర్మసూత్రం ఎల్లా నడుపుతుందో కర్మకు మొదలూ చివరా ఎక్కడో - ఈ విషయాలన్నీ ధ్వనితాలయే సర్పయాగకథను ఈ మహావిషయాలనే బోధించే భారత (గ్రంథాదియందు నిక్షేపించారు” (కృళ్యాద్యవస్థ (వ్యాసం) ప్రతిభ, 1986). ఇది ఇతిహాస ప్రాధాన్యాన్ని, దాని ప్రాణస్థానాన్ని చెప్పే ప్రయత్నం. ఈ మార్గం భారతం వంటి మహాగ్రంథం సృష్టి తత్త్వాన్ని జీవుల పరిణామాన్ని జన్మజన్మల పరంపరను ఎలా వ్యాఖ్యానిస్తున్నదో తెలియజేస్తుంది. భారతం అట్టడుగున నిక్షిప్తమైందీ లక్షణం. ఇది తెలిస్తే తప్ప కావ్యపరమార్థం అవగాహనలోకి రాదు. పాండవులు చివరకు స్వర్ధారోహణంలోను ఎవరి కర్మను వారే అనుభవించారు. ఆశ్రమవాస సందర్భంలోనూ దృతరాష్తుడు మృతపుత్రులను మళ్లీ చూడాలని కోరుకున్నాడు. యుద్ధం మొత్తం ప్రత్యక్షప్రాయంగా సంజయునివల్ల వింటూ వచ్చిన ధృతరాఘ్లుడు ఎక్కడా ధర్మానుకూలమైన స్థితిని పొంది యుద్ధవిరమణను శాసించలేకపోయినాడు.._ భీష్మ (ద్రోణాదులు తమ కళ్లఎదుట జరుగుతున్న ప్రీ అవమానాన్ని ఎదిరించలేకపోయినారు. అభిమన్యు వధయైనా, కర్ణవధయైనా కర్మననుసరించి జరిగినాయి. అంతా ఒక మహావలయం, కర్మసూత్ర గ్రథితమైంది. ఈ వలయంలో జీవులందరూ పరిభ్రమించటం తప్పనిసరైంది. ఈ కావ్యపరమార్ధ నిర్దేశం చేసింది తెలుగు విమర్శ సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ.

నన్నయ్య సాహిత్యసూత్రాన్ని అందుకొని విశ్వనాథ రెండంశాలను ముందుకు తెచ్చినారు. తిక్కన మార్గంలో మరొక అంశాన్ని విశదీకరించారు. తానుగా కావ్య హేతువుగా మరొక భావనను కొత్తగా ప్రవేశపెట్టారు. ఆయన నన్నయ్య ననుసరించి ప్రతిపాదించిన నూతనాంశాలు : 1. అక్షరరమ్యత, కావ్యశరీర సౌందర్యము, నాదము, అక్షరముల కూర్చు, ఛందస్సు నిర్వహణ, వర్ణ సమ్మేళనాప్రిచేత స్ఫురించే అనుభవ విస్తారము ఇవన్నీ ఇందులో అంతర్భవిస్తవి. 2. కథాకథన శిల్పము. ఇది వస్తువిన్యాస సొందర్యమునకు సంబంధించింది. కథాంశాల నిర్వహణలో ఒక పద్ధతి ఉంటుంది. కవి వ్యక్తిచైతన్యాన్ని బట్టి ప్రాధాన్యతల క్రమం మారిపోతుంది. వస్తువులో పాత్రలు, సన్నివేశాలు, వారి ఉద్వేగాలు, ఆంగికములైన వికారాలు అంతర్గతములైన ప్రధాన అంగకథల భేదాలు వీటన్నింటి అల్లిక ఈ కలయికవల్ల అల్లికవల్ల కలిగే ఫలరూపమైన సౌందర్యస్ఫురణ ఇవన్నీ ఈ కథాకథన శిల్పంలో ప్రధానాంశాలు. అందుకే నన్నయ దీనిని 'లోనారసి” చూడవలసిన అంశంగా విశదం చేశారు. కథాకథనాన్ని విశ్లేషిస్తూ విశ్వనాథ ఇలా అన్నారు- కార్యర్తుముర 35

1 నన్నయగారు కథయొక్క ప్రాణమును బట్టికొని నొక్కును కాని కథలోని

వివిధాంశములను బెంచడు.

  1. కథలను వ్యాఖ్యానము చేయుట. ఆ కథలలోని రహస్యములను బట్టి

నిరూపించుట, ఆ కథలట్లెందుకున్నవో వానిలోని మర్శ్మమును చెప్పుట.

త. .ప్రతి చిన్నకథయు పెంచి యొక స్వతంత్ర కావ్యముగా చేసినచో ప్రధాన

కథ దెబ్బతినును.

  1. భారతము శాంతరస (ప్రధానము. ఆ రసమును దృష్టియందుంచుకొని

_తిక్క్మన రసములను సంయోజన పరుపవలయును. ఇతర రసము లీ రసమునకు లొంగి యుండును. రౌద్రాది రసములను పెంచి వ్రాసినచో భారతముయొక్క ప్రధాన రసమైన శాంతము వీగిపోవును. ఇతిహాస స్థితి పోయి కావ్యస్థితి వచ్చును.

అందువల్ల భారతం వంటి కావ్యాన్ని “రసదృష్టితో' కథారహస్య వినిమీలన దృష్టతో చదువుకోవలసి ఉంటుంది. ఈ చదువుకొనే స్థితి నన్నయ ప్రతిపాదించిన “లోనారయు లక్షణం. అందుకే మహాభారత బద్ధనిరూపితార్థమేర్చడ భారత రచన ప్రారంభం అయింది.

ఇతిహాసము ఒక విధముగా సంక్షిష్టమైన ప్రపంచము యొక్క సూక్ష్మరూపమే భూత భవిష్యద్వర్తమానములలో దాగియున్న దాని ఆంతర్యమును తెలిసికోవటం ఎంతవాడికైనా కష్టసాధ్యమైన అంశమే. “ఈ (ప్రపంచకము గిజిగాని గూడు. ఆ గూటి లక్షణము తెలిసికొని విరచించుట మవోకవి శక్తి (శాకుంతలముయెొక్క అభిజ్ఞానత-పు. 62). ఈ తత్వదర్భనము లేకుండ ఇతిహాసమునుగాని, ఇతిహాసప్రాయమైన మహాోకావ్యమును గాని నిర్మించటం సామాన్యకవికి సాధ్యం కాదు.

ఈ ప్రపంచ పరమార్ధమే రసానుభవరూపంలో కావ్యంలో ప్రతిఫలిస్తుంది. సహృదయుడు తాను ఎదిగిపోయి ఈ ప్రతిఫలించిన పరమార్థాన్ని మనస్సులోనికి తెచ్చుకో గలుగుతాడు. '“రమణశీలమైన మానవుని బుద్ధి తత్మథాశ్రయమై యుండుచున్నది. ఈ రమణము యొక్క ప్రవృద్ధ స్వరూపము రసము' (శా,అ.పు. 46% ఈ రమణశీలము క్రమముగా రమణము పొందుతూవున్న అస్మితలో లీనం కాగా మనకు కలిగే స్థితి- అనుభవానికీ, అనుభవితకు నడుమ భేదం లేకపోవటం జీవుడు నిరుపాధికమైన ఆనందస్థితిని పొందటం.

కథాకథనాన్ని విళ్లేషించుతూ విశ్వనాథ ప్రతిపాదించిన నాల్గు అంశాలు ఈ మహాకావ్య పరమార్థాన్ని వెల్లడిచేస్తున్నవి. ఈ విషయాన్నే ఇంకా స్పష్టంగా అల్లసాని

వాని అల్లిక జిగిబిగిలో వెల్లడిచేస్తున్నారు. “ఒక కావ్యమునకు పరమమైన విషయము ఏకవాక్యత .... ఈ అంగాంగిభావము సంబాళించుకొనుటలో మహాకవి యొక నేర్పు కలిగి యుండును.... పద్యరచన మొదలు తావత్పర్యంతము మహాసామర్థ్ధ్యము కల్గి ఈ (ప్రధాన రసము చక్కగా దీర్చి అంగరసములను (ప్రధాన రసమునకు పోషకముగా జేసి అనౌచిత్యము లను పరిహరించి ప్రతిభాసమున్మేషమున నెవ్వడు తన కావ్యము నాద్యంతము తీర్చి దిద్దుకొనునో అతడే మహాకవి శబ్బవాచ్యుడు (పు. 15,16).

నన్నయ సాహిత్యసూథ్రం ద్వారా కావ్య బహిరంతర సౌందర్య వ్యంజకత్వాన్ని స్థాపించి తిక్కన సోమయాజి ప్రకటించిన శిల్పతత్వాన్ని విపులంగా వ్యాఖ్యానించారు.

  1. ఒక కథ ఒక పద్ధతిగా జరుగుటకు హేతు నిరూపణము శిల్పములోని భాగము.

2, శిల్పమనగా నొకమాటలో చెప్పినచో బహ్వర్థము లేకత్ర సమావేశపరచి పఠిత మనస్సును భావనామయము చేసి, ఉత్పథమునందు సంచరింప జేయుట.

  1. తాను స్వీకరించిన వస్తువునకు పరమోచితములైన తత్తన్మవా విషయముల యందలి సామగ్రీ సంపాదనముచేసి తన కావ్యము పరమశిల్పఖందముగా చేయుట,

4 ఏ కథను, ఏ భావమునకు నేశయ్య కెట్టి శబ్ద మెట్టి రచన అనుకూలమో నిసర్ణపరచితి దక్షమై వెలార్చు శక్తిమత్త్వము.

ఈ నాల్గు అంశాలూ కాన్యశిల్చదృష్టితో చూస్తే కీలకాంశాలుగా గోచరిస్తవి. ఈ అంశాలలో బెచిత్యము, అనుస్యూతి, హేతుబద్ధత, బహ్వార్థ వ్యంజకత్వము, ఉచిత శబ్ద, ఛందోరచనల సమావేశము అన్నీ చెప్పబడ్డాయి. ఇవి ఏ కాలంలోనైనా అంగీకరించ దగిన పరమాంశాలు,.

పూర్వ లాక్షణికులచేత ప్రపంచితం కాని కథాకథన శిల్పాన్ని నన్నయ్య అవతారిక నుంచి గ్రహించి విశ్వనాథ ఒక కొత్త దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు 147210100/ అంటున్నారు. అట్లాగే శిల్పధోరణి తిక్కననుంచి గ్రహించి కావ్యశిల్ప మార్గాన్ని అక్షరం నుంచి కావ్య పరమార్ధం ద్వారా వ్యాపించి ఉన్న అంశాన్ని వివరించారు.

విశ్వనాథ తననుగూర్చి గ్రంథంలో “'వ్యాఖ్యాత్యాజాం శిరోమజిః అని పేర్ళొన్నారు. కావ్య గర్భంలోనికి ప్రవేశించి దాని రహస్యములను వివరించటం, అంగాంగ సమన్వయం అన్నీ స్వవ్యాఖ్యానంలో భాగమే. ఒక విధంగా తనది నూతన వ్యాఖ్యాన పద్ధతి అని చెవ్చటం ఉద్దేశ్యం కావచ్చు. కార్య ఫ్తుతురి 37

కావ్యశిల్పరీతిలో అక్షరరమ్యత గురించి తరువాత తరువాత చర్చింపబడింది చాలా తక్కువ. “అ శబ్బములయొక్క సమీచీనత, సాన్నిపిత్యము, సంగీతము కాని సంగీతము సరిపోయినాయా అని చూచుకొనవలయును. యథార్థమైన కవి ........ అప్పుడు శ్రైలియో రీతియో యేర్చడును. వానికి మించిన యిదమిత్ధమని చెప్పరాని యొక సంగీతమేర్చడును. మనకున్న శబ్బములయొక్క దారిద్యముచేత దానిని సంగీత మనుచున్నాము గాని అది సంగీతము కాదు. సంగీతమువంటిది' అని ఈ పూర్వాంధ్ర సాహిత్యము విలక్షణమైన యొక సంగీత ప్రపంచకము (విశ్వనాథ).

కవిత్వములో అంతర్లీనంగా ఉండే ఒక లయ ఉన్నది. ఇది అక్షరరమ్యత వల్ల సాధింపబడుతున్నది. పాడినప్పుడు దానిలోకి రాగానుసంధానము జరుగుతున్నది. వాల్మీకి తంత్రీలయ సమన్వితమని చెప్పిన దీ విషయమునే. సహృదయుడు అంతరంగంలో దీన్ని అనుభవించేందుకు తన్ను తాను సమర్ప్చించుకుంటున్నాడు. ఆ లయ ప్రవాహంలో సంలీనమై కరగిపోతున్నాడు.

శిల్చమంటే కౌశలమని, నిర్మాణ కౌశలమని తాత్పర్యం. శిల్పంవల్ల ముక్కు మొగం లేని రాయి సుందరవి[గ్రహంగా రూపొందుతున్నది. ఈ రూపొందు క్రమంలో శిల్పి ప్రయోగించే ప్రక్రియా సర్వస్వమంతా శిల్పశబ్దవాచ్యమే. వడ్రాన్ని గ్రహించి ఒరిపిడిపెట్టి బహుముభాలలో (ప్రకాశింపజేయటం శిల్పమే. వాచ్యమై సంకేతితార్ధ వ్యంజకమైన శబ్దం కావ్యగతమై అనంతభావ వైవిధ్యాన్ని పొందటం కవి శిల్ప నైపుణ్యం.

1958లో సింహబలి కావ్యానికి వ్రాసిన ముందుమాటలో శిల్చమును గురించి విశ్వనాథ కొన్ని విలక్షణాంశాలను ప్రతిపాదించారు. 1) వస్తువులనేకములు, శిల్చమార్షము అనేకములు ; 2) చాలామంది కవులను తాము అభ్యసించిన సులువైన శిల్పమార్గములో ప్రవర్తించుతారు ; 8) వస్తువు ననుసరించిన శిల్చమార్గము ఆ వస్తువును ప్రకాశింపజేస్తుంది; ఖు) కొన్నిచోట్ల వస్తువు సమాకర్షకమై శిల్ప చాతుర్యముందదు. ఇక్కడి వస్తువు సహృదయుని అకర్షించవచ్చును. అది రసానుభూతి కాదు ; 5) ఎక్కడనో ఒకచోట శిల్పి వస్తు స్వభావోచిత శిల్పమార్గమును స్వీకరిస్తాడు ; 6) ఒక్కొకచోట వస్తు నిర్వహణముగానీ, శిల్చసంయోజనముకాని ఉండదు. కేవలం (ప్రతిభ ఉంటుంది.

ఇంత వివేచన చేసి కవి వస్తూచిత శిల్పసహిత కావ్యమునే ముఖ్యమైందిగా స్వీకరించాడు. ఏ కావ్యంలోనైనా శిల్చరహితంగా వస్తువు విన్యసింపబడటం సాధ్యమే. అట్లాగే వస్తువు ప్రదీపింపక కేవలం కవి కౌశలం (ప్రకాశింపజేసే పద్ధతీ కనిపిస్తుంది. మహాశిల్సి వస్తు కౌశలముల ఉచిత సంయోజన చేయవలసి ఉంటుంది. 38 సుపుసన్ని

“అల్లసానివాని అల్లిక జిగిబిగిలో శిల్పమును గూర్చి తొలుత విచారించి అంతిమంగా ఇలా నిర్వచించారు - శిల్చ్పమనగా ఒక్కమాటలో చెప్పినచో బహ్వర్థము లేకత్ర సమావేశపరచి పఠితయొక్క మనస్సును భావనామయము చేసి ఉత్పథమునందు సంచరింపజేయుటి.

ఈ ప్రతిభచేత శిల్చవిభ్రమం ఆవరించుకున్న కావ్యం అనంతార్థ ద్యోతకమవు తుందని ఆనందవర్థనుడంటున్నాడు - “న కావ్యార్థ విరామోస్తి యదిస్యాత్తృతిభాగుణా'. నిరంతరం కావ్యం కాలావధులను దాటి సజీవంగా ఉండటానికి ఈ అనవధికమైన అర్భ్థానుసంధాన శక్తి కారణం.

స్వాతండత్ర్యానంతరం సాహిత్యరంగాన్ని ఆవరించిన ఈ ఇద్దరు ప్రధాన విమర్శకుల - రాయప్రోలు, విశ్వనాథల కళా సృజన వివేచన రీతులు పొశ్చాత్య సౌందర్య విమర్శశాస్త్ర పరిచితినీ, సంభారాన్నీ అవసరమైన దిశగా సంతరించుకున్నవి. తరువాతి విమర్శకులందరూ అంతో ఇంతో ఈ అడుగుజాడలలో నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించినవారే.

త్రి

శ్రీత్రీ ప్రధానంగా మార్చీయ సాహిత్య విమర్శకుడుగా - వస్తునిర్దేశం విషయంలో పరిగణింపబడుతూ వచ్చినా, కావ్యశిల్ప సంబంధమైన దృష్టి కూడా ప్రధానమని భావించినవాడే.

“కవి తనలో అంతర్లీనమైన రసాన్ని పాఠకునిలో బహిర్గతము చేయగలుగుళున్న కార్యమే సంవిధానము. దీనికి ఆఘాతం కలిగితే రసానికే విప్రతిపత్తి కలిగినట్లు. కావున తుట్టతుదకు రీతి నదాలు రససముద్రంలోనే చేరుకుంటాయి" అన్న శ్రీశ్రీ ఉత్తమ కవిత్వాన్ని సంవిధానం సమావేశం పొందిన కవిత్వమేనని తేల్చారు. ఈ సంవిధానం - కావ్యశిల్బము

  • కవి సజాగ్రత్తుగానో, అజాగ్రద్ధశలోనో నిర్వహించేదని తాత్పర్యం. అందుకే శ్రీశ్రీ వస్తువే కవిత్వం కాదనీ, శిల్పమే కవిత్వం కాదనీ స్పష్టంగా పేర్కొంటూ - మహత్తరమైన భావాలను మహత్తర విధంగా (ప్రతిపొదించినదే ఉత్తమ కవిత్వం అన్నారు.

అందుకే శ్రీశ్రీ కవిత్వం “ఛందస్సుకీ, వ్యాకరణానికీ, అలంకారాలకీ - అన్నింటికీ అవతల స్వచ్ళందమూ, నీరవమూ, నీరూపమూ అయిన కవిత్వ పదార్ధం ఒకటి ఉన్నది" అంటున్నాడు. కవిత్వం అన్నింటిని కలిగివుండీ అతీతంగా ప్రవర్తించేది ప్రకాశించేది. విశ్వనాథ మరొక సందర్భంలో - నా కవితన్‌ విశాల జఘనా, ఒక బెచితి లేదు, భాష కాన్యీస్తురుతి 39

లే దాకృతిలేద ఊరక రసాత్మతనే ప్రవహించి పోదు, నీవాకృతి అందమాచిన రసాత్మపు నీకును నా కభిన్నతాశ్రీకత కల్ళెనా పులకరించెను పొమ్ము రసప్రపంచములొ అన్నాడు. ఈ సంవాదం కవికీ కవిత్వానికీ నడుమ. కవిత రూపాద్యలంకారాదులను తనలో పొదువు కుంటుంది. వాటికి అతీతంగా రసమై (ప్రకాశిస్తుంది. కవి కవిత్వమై రూపొందినప్పుడు రసప్రపంచాదులన్నీ పులకరిస్తున్నవి. శ్రీశ్రీ నిర్వచించిన స్వచ్చందమైన కవిత్వం, రస సముద్రంలో అన్నీ లీనం కావటం ఇదే అంశం.

ఈ కారణంవల్లనే శ్రీశ్రీ శుద్ధకవిత్వం, ఉపయోగ్య కవిత్వం అని రెండు విభాగాలు చేసి వస్తుప్రాధాన్యం గల కవిత్వాన్ని రెండవ తరగతిలోకి చేర్చటం జరిగింది. శ్రీశ్రీ (ప్రసిద్ధమైన 'కవితా ఓ కవితా' గేయంలో ఈ కవిత్వం స్వరూపం విస్పష్టంగా ఆవిష్కృతం అయింది. ఈ కావ్యశిల్పద్భష్టి ఇంత గాఢంగా శ్రీశ్రీ భావించినా - ప్రగతివాదోద్యమంలోని తరువాతి కవి విమర్శకులు, వస్తువుకే పట్టంగట్టి కావ్యశిల్పాన్ని వెనక్కి నెట్టి అ'ప్రధానమూ, అపరి[గ్రాహ్యమూ అన్నట్లుగా దారి తీర్చారు.

స్పష్టమైన దృష్టిలో కావ్యశిల్పరీతిని నిర్దిష్టంగా భావించిన విమర్శకులలో వడలి మందేశ్వరరావు ముఖ్యులు. “సాహిత్యం మనస్సును స్పందింపజేస్తుంది. దానికి తూర్పు పడమరలు లేవు. ఆ స్పందనలను కొలిచే సాధనమే కాదు. ఆ స్పందనలు కల్గటానికి కారణమేమిటని ఆలోచిస్తుంది సాహిత్యవిమర్శ” అని విమర్శ మూలాల్లోకి వెళ్ళి ఆలోచించారు మందేశ్వరరావు.

కావ్యరహస్యమంతా జాతి, పర్యావరణం, కావ్యోత్పన్న క్షణంమీద ఆధారపడు తుదని 72109 ప్రతిపాదింపగా వడలి మందేశ్వరరావు మరొక అంశాన్ని ప్రతిపాదించారు, అది కావ్యం పఠింపబడుతూ వున్న క్షణం అని. కావ్యం పఠింపబడుతూవున్న క్షణం కావ్యానుశీలనకు కొత్త పరిమితులను నిర్ణయిస్తుంది. ఆనాటికి పెంపొందిన మానవుని కొత్త విజ్ఞానం అవగాహనలు ఈ నూతన పార్వ్వాన్ని ఆవిష్కరించేందుకు కారణం అవుతాయి,

మందేశ్వరరావు ప్రతిపాదించిన మరొక అంశం - కావ్యం ధ్వని ప్రతిధ్వనుల సంపుటి. ఉదాహరణగా - “కల్పవృక్షంలో శూర్భణఖ కథకు ప్రతిధ్వని అయోముఖి సంఘటన. రామునితో ఖరుని యుద్దానికి (ప్రతిధ్వని మకరాక్షుని యుద్ధం. భారతంలో లాక్షాగృహదహనం నుంచి ద్రౌపదీ స్వయంవరం వరకూ జరిగిన కథ అజ్ఞాతవాస కథకు ప్రతిధ్వని. ద్రౌపదిని సైంధవుడు అపహరించడం కీచకుని కథకు (ప్రతిధ్వని. అసలు ష౦ సువుస్సు

కీచకకథే ఊరుభంగ కథకు ప్రతిధ్వని” అని వివరించి ఈ ప్రతిధ్వనిని పంచసంధులలోని “పతాక” కావచ్చునని సూచించారు. ఈ ప్రతిధ్వని భావం సృష్టియొక్క అఖందత్వాన్ని అనంతత్వాన్ని ప్రకటిస్తున్నది. ఇంకా మందేశ్వరరావు రెండు పాయలుగా కథను నడుపుతూ, వానినన్నింటికీ ఏకోన్ముఖం చేస్తూ సాంద్రతరమొనరించడం కూడా శిల్చమేనన్నారు. ఇంకా ఏకకాలికంగా ఇిన్నస్థలాలలో జరిగిన సంఘటనలను సినిమాటోగ్రాఫిక్‌గా ప్రదర్శించటమూ, కావ్యం చదువుతున్నప్పుడు క్రమక్రమంగా శిల్చం కవిత్వాన్ని రాపిడి పెట్టి కవిత్వానికి అస్తిత్వాన్ని కలిగిస్తుందనీ ప్రతిపాదించారు. మందేశ్వరరావు మరొక వివేచన క్లాసిక్‌ రొమాంటిక్‌ భావనల గురించింది. ఏ మహాకవిలైనా తొలుదొలుత రొమాంటిక్‌. ఆ అద్భుత దర్శనం కావ్యరూపాన వెలువడి కాలాంతరంలో దాని స్వరూపస్వభావాలు అంగీకృతమై అది క్లాసిక్‌ అవుతుంది. వాల్మీకి కాళిదాసుల విషయంలో ఈ విషయం ఆయన నిశ్చయించారు. “తొలిసారిగా సృష్టింపబడిన మంచి కావ్యం రొమాంటిక్‌ సృష్ట అనాటికది నవ్యమైనది. నాటి సౌందర్యసీమల నది విసృృతపరచేది ; ఆ సౌందర్యానికొక వింతను కూర్చేది. కాని కావ్యం మాగగా, మాగగా అదే తరువాతి యుగాలకు క్లాసిక్‌ అవుతుంది. వాల్ళీకి ఆనాడు రొమాంటిక్‌ కవే. కాళిదాసు కూడా అట్టీవాడే. కాని నేడు క్లాసిక్‌లు అవుతున్నారు. మనకు పెద్దన క్లాసిక్‌. ఆనాడు ఆయన రొమాంటిక్‌. క్లానిక్‌లో సర్వేసర్వత్రా అంగీకరింపబడే ఒక లక్షణమేమంటే బాహ్యస్వరూపంలో ఒక క్రమబద్ధమైన విన్యాసం గోచరించడం ... అప్పుడు .... ఆ కావ్యం క్లాసిక్‌ అవుతుంది. (సాహిత్య ప్రస్థానంలో కొన్ని మజిలీలు - మందేశ్వరరావు 2002). ఈ విచారణ సాహిత్య పరిశీలనలోని ఆధారభూమికలను స్పృశిస్తున్నది. సాహిత్యవిమర్శన రంగంలో అవిరతంగా కృషిచేస్తూ సృజనాత్మకంగా నూతనాంశ ప్రతిపాదనలు చేస్తూ సాగిపోతున్నవారు జి.వి. సుబ్రహ్మణ్యం (జీ.వియస్‌.. “ఆంధ్ర సాహిత్యంలో వీరరసపోషణం' అన్న (గ్రంథంలో రసవిమర్శకు అన్వయపరంగా ఒక వ్యవస్థను ఏర్పరచారు. రసానికి నిత్యలక్షణం ధర్మమౌతుందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కావ్య ప్రపంచానికీ పురుషార్థ ప్రపంచానికీ ఒక సేతువు లాంటిది. ధర్మ విరుద్ధమైన కావ్యం విశ్వజనీనమైన ప్రీతిని కలిగించలేదు. ్రతిభావం మూలంలో 'సర్వేభద్రాణి పశ్యంతు మా కళ్చి ద్దుఖభా గృవేత్‌ అన్న అంశం ఉంటుంది కనుక. వాలా

తననాటి సాహిత్యవిమర్శలో రసవిమర్శ కొన్ని ప్రక్రియలకు వర్తించదనీ, కొన్నింటికే తగునన్న భావం ఉండేది. జీవియస్‌ రసవిమర్శ అన్ని ప్రక్రియలకూ అన్వయిస్తుందని స్పష్టంగానే పేర్కొన్నారు. స్వాతంత్ర్యవీరం, యశోవీరం, మతవీరం వంటి నూతన (ప్రతిపాదనలు నేటి స్వాతంత్రోద్యమానికీ, జాతీయోద్యమానికీ, విప్లవోద్య మానికీ, ఆధ్యాత్మిక ప్రస్థానానికి అన్వ్నయించటం ఆయన ప్రతిభకు నిదర్శనాలు. బసవపురాణం మీద జైనపురాణ ప్రభావాన్ని అంతర్నిర్మాణపరంగా విశ్లేషించి నిరూపించారు. మహాపురాణ స్వరూప వివేచనం క్రమ పరిణామం ఆయన విచారణ చేశారు. బసవపురాణంవల్ల ఒక దేశి పురాణం రూపొందిన అంశం వెల్లడైంది. నన్నయ రచనలోని నాటకీయతను (ప్రకటించడం అభినవ ప్రతిపాదనమే. సంభాషణలే కాక నిర్మాణ మర్మాలను ఈ అంశం విపలీకరించింది. జీవియన్‌ ప్రతిపాదించిన నూత్నాంశాలలో ఒకటి వంశకథాకావ్యం. హరివంశానికి ఈ ప్రతిపాదన అన్వయించింది. కళాపూర్ణోదయంలోని కధామూలాల్లోకి (ప్రవేశించి గూఢకథానిర్మాణశిల్పాన్ని ప్రకటించారు. శ్రీశ్రీ ప్రతీకల ప్రయోగాన్ని విశ్లేషించి జీవియస్‌ “ప్రాచీన ప్రతీకల సంప్రదాయార్థాలను ప్రక్షాళనం చేసి, మార్చిస్టు తొడుగులు వాటికి అలవరచాడనీ, ఉద్యమారంభంలో ఆ కవితాపద్ధతి బలంగా పనిచేసిందనీ, ఆ పద్ధతిలో ఆయన్ను మించిన మహాకవి లేడని ఆయన నిరూపించారు. ప్రతీకల వివేచనం- కావ్య పరమార్ధయుగం మీది తాత్చర్యంతో జరుగవలసిన అవసరం ఉందని ఆయన నిర్ధారణ చేసినారు. కావ్యవివేచనకు ప్రక్రియాస్వరూప విజ్ఞానం ప్రధానాధారం. సాహిత్యవికాసం రచయితల సాహితీ దర్భనాలలో ఏర్పడే అంతస్సూత్రం మీద ఆధారపడి ఉన్నది అని ఆయన ప్రతిపాదన. తెలుగు రచయితలు ప్రయోగించిన ప్రతి ప్రక్రియ కూడా మౌలికమైన మాదిరి (౧౫౦౮61) నుండి విభేదించేది. ఇతర (ప్రక్రియా లక్షణాలను తనలో అంతర్భవించు కునేది. ఈ విచారణనుంచి ఆయన అనేక ప్రక్రియా భేదాలను ప్రతిపాదించారు. ఇంతకు పూర్వం చెప్పిన దేశి పురాణం, వంశకథాకావ్యం, వస్తుకావ్యం, ఆధునిక కావ్యేతిహాసం ఇలా ఎన్నో ప్రక్రియలు గుర్తించి లక్షణచర్చ చేశారు. జీవియస్‌ విమర్శప్రస్థానంలో - మౌలికమైన రసచర్చ - (ప్రక్రియాపరంగా సాహిత్య పరిజామాన్ని నిర్దేశించటం, ప్రబంధాలలో ప్రతీకాత్మకరితిని పరిశీలించటం ప్రధానాంశాలు.

మాదిరాజు రంగారావు విమర్శలో - కావ్యశిల్పదృష్టితో చేసిన విశ్లేషణలో ఆంతరిక సంభాషణాత్మకతశైలిని ప్రస్తావించారు. 1) అధివాస్తవిక ధోరణిని గుర్తింప జేయటం ; 2) మనస్సులోని తమఃప్రదేశాలపై వెలుగులు ప్రసరింపజేసి అక్కడ నుప్తంగా ఉన్న ఆలోచనా రూపాలను ఆవిష్కరింపజేయటం ; 3) మనస్సును లౌకికమైన అదుపుల నుండి విముక్తం చేసి స్వేచ్చగా సంచరింపజేసి బహిర్‌ వాస్తవికతను అంతర్‌ వాస్తవికతను సమైక్యపరచిన అనుభవదశను చిత్రించటం. ఇది కవి మనస్సులోని చిత్రార్ప్చితమైన కవిత్వలక్షణం. సృజన మూలాలను స్పృశింపజేసే అంశం ఇది. ముదిగొండ వీరభద్రయ్య సౌందర్యశాస్తాన్నా అలంకారశాస్త్ర ప్రమాణాలని తులనాత్మకంగా పరిశీలించి సమన్వయం చేయటమే కాకుండా ఆధునిక కవిత్వానికీ నవలలకూ అన్వయించి విశ్లేషించారు. 'వస్తురూపాలని రెండుగా విభజించటం పొరపాటు సిద్ధాంతాలకు దారితీస్తుంది. కవిత్వంలో లోకవస్తువన్నది లేనేలేదు. వస్తువు కవితా రూపంగా ఎలా మారి సిద్ధమయిందో అదే కవి కావ్యంలో ఉన్నది. అభివ్యక్తి సంతరించు కొనని వస్తువుకు సాహిత్యవిలువగానీ, గౌరవంగానీ లేనట్లే. అలాంటివాటికి గౌరవం ఇవ్వడమన్న అసాహితీపరుల పనివల్లనే తెలుగు సాహిత్యలోకంలో ఇన్నాళ్లు ఈ చేటు (వస్తువునే ప్రధానం చేయటం) దాపురించింది”. (ఆధునిక సొహిత్యం - వస్తురూప వివేచన-పు.18)% ఈ పరిశీలన కవిత్వకరణంయొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసింది. కవిత్వంలో భాష సంపూర్ణంగా పరివర్తనం చెందుతుంది. కావ్యభాష సాంకేతికార్థ పరిమితులను అతిక్రమించి బహ్వర్థసుందరమై ఇంద్రధనుస్సువలె రమణీయార్థ ప్రతిపాదక మవుతుంది. “అభివ్యక్తులన్నీ వాచ్యాభివ్యక్తియొక్క నగ్నతను పోగొట్టి ప్రకృతిగతమైన సహజసొందర్యాన్ని స్వభావోక్తులలో కాక కవితోక్తులతో వర్ణించి రాయప్రోలు నవ్యకవితా భాషకు ఈ శకాబ్దాన (20ఈ.) అంకురార్పణ చేశారు.... మృదుకావ్యభాషకు ఆయన వేసిన మార్గం దారితప్పిన తెలుగు కవిత్వాన్ని సరియైన దారిలోకి తెచ్చింది. (పైదే-పు. 24). భావచిత్రాలను విశ్లేషించి మూడువిధాలుగా వింగడించారు. ఆలంకారిక భావచిత్రం. ఇది ప్రాచీన అలంకారాల చిత్రణల పరిమితులలోనిది. రెండవది రూపకాత్మక భావచిత్రం. మూడవది ప్రతీకాత్మక భావచిత్రం. రూపకాలంకార విశేషమే రెండవది. శెండు భావచిత్రాలను ఒకచోట చేర్చి లక్షణాశక్తిచేత రూపకాన్ని సిద్ధం చేయడం అన్న ఒక శిల్పరీతికి వీరు ప్రాణంపోశారు. అంటే కవిత మొత్తము (ఆసాంతమూ) మరొక వస్తువుతో జోడింపబడుతుంది' (పైదే-పు.61) అని నిర్వచించి ఉపమానోపమేయాలను కార్య్యఫ్తుమురి !

వ్యత్యస్తం చేస్తూ, కీలకాన్ని ఇమిడించి రూపకభావచిత్ర నిర్మాణం జరుగుతుందని సుసూక్ష్మంగా వివేచించారు ముదొగొండ వీరభద్రయ్య.

“మట్టీ - మనిషి - అకాశం - వస్తుసంవిధానంి అన్న గ్రంథంలో - “కళాత్మకత పొందిన వస్తువు పాఠకుజ్జి ఒప్పించడం, లొంగదీసుకోవడం, అతణ్ణి తనలో లీనం చేసికొని అతని వ్యక్తిత్వంలో తానొక ముఖ్యాంశం కావడం - ఇవన్నీ కావ్యపరమార్థం, కావ్య సందేశం (లక్ష్యం) పఠిత జీవధాతువుగా మారిన స్థితే కావ్యపరమార్ధ సిద్ధి (పే.19) అని కావ్య పరమార్ధాన్ని చేరుకునే ప్రక్రియను సోపానపరంపరా పద్ధతిలో వ్యాఖ్యానించారు. పాఠకుణ్ణి తనకు అభిముఖుడుగా చేసికోవటం, తన కళాసిద్ధిచేత తనకు వివశుణ్ణి చేసుకోవడం, కావ్యచైతన్య సముద్రంలో అతడు లీనమై తాదాత్య్వాన్ని పొందటం అనే విలక్షణమైన నిర్వచనం చేశారు. మహాకావ్యాల వైతన్యంలో మనం లీనమవుతున్నాం. ఇది కొత్త ప్రతిపాదన. కళాశిల్పం సాధించే మహాకార్యం.

'కావ్యకళాసౌందర్య దృష్టితో విమర్శను కొనసాగించినవారిలో శేషేంద్రశర్మ (ప్రముఖులే. రామాయణ రహస్యాలను, శ్రీహర్చుని నైషథీయ చరిత్ర తాత్సర్యాన్ని వివేచించిన సందర్భంలో శేషేంద్రశర్మలోని అపూర్వ కావ్యరహస్యవేది మనకు దర్శనమిస్తారు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దానిలో నిహితములైన అద్భుతాంశాలను వెల్లడించారు. రామాయణం - ముఖ్యంగా సుందరకాండలో శ్రీవిద్యా సంప్రదాయం గర్భితమైన వృత్తాంతం- క్రిజుటాస్వపష్పంలో గాయత్రీ మంత్రం గర్భితమైన ఉన్న అంశం వెల్లడించటం ద్వారా దానిలోని రహస్యమార్థాలను విశదం చేశారు. మంత్రశాస్తపరంగా, యోగశాస్త్ర పరంగా కావ్యాన్ని అధ్యయనం చేసే ధోరణిని ఆయన విసృృతం చేశారు. నైషధీయ చరితంలో హంస అజపా మంత్రసూచకంగా ఎలా విస్తరించిందీ సవ్యాఖ్యగా నిరూపించారు. నన్నయ కవిత్వ విచారణలో విశ్వనాథ నలోపాఖ్యానంలో శివపురాణ రహస్యాన్ని వెల్లడించినట్లు, శేషేంద్రశర్మ వాల్మీకి శ్రీహర్నుల విషయంలో చేసిన విచారణ మన సాంస్కృతిక మూలాలను కావ్యంలో నిర్ణయించేందుకు దారిచూపింది.

శేషేంద్ర చేసిన మరొక కృషి సమకాలీన పరిస్థితుల దృష్ట్వా అతి విశిష్టమైంది. ఆధునిక కవిత్వాన్ని రాజకీయ నియంతృత్వ పరిధులనుంచి విముక్తం చేసి కళాశిల్ప మార్గాల వైశిష్టాన్ని నిరూపించిన మహాయోద్ధ. కావ్యాన్ని సాహిత్యస్పృహతో చూడటం, ఇతరేతరాంశాలన్నీ ఆప్రధానాలని నిర్ణయించటం ఈ కాలంలో ఆయన చేసిన గొప్ప ఉపకారం. డెబ్బెల చివర కవిసేన మానిఫెస్టో సాహిత్యరంగంలో గొప్ప అలజడి రేపింది. నన. టట సుప

కవిసేన మానిఫెస్టో ప్రధానంగా - వస్తువే కవిత్వమనీ, కళాసౌందర్యశిల్పాలు ముఖ్యం కానేకాదనీ, కవిత్వంవల్ల కలిగే మెటమార్భసిస్‌ను అంగీకరించని సిద్ధాంత కారులను తిరస్కరించింది. సాహిత్యం ఆత్మకళాభ్యాసమనీ, వాల్మీకి నుంచి వచ్చిన కవి పరంపర, భామహునివద్దనుంచి వచ్చిన ఆలంకారిక పరంపర శిరోధార్యమనీ ఆధునిక ప్రతీక బింబవాదాలు కూడా మన కవితను పరిగ్రహించి సంపన్నం చేసుకోవలసి ఉంటుందని విశ్లేషించి చెప్పింది. దీన్ని గురించి మందేశ్వరరావు అన్న మాట గమనార్హ్హ మైంది - 'కవిసేన తిరుగుబాటు అంతా అకవిత్వం మీదనే. ఆయన (శేషేంద్ర) మార్కిజానికి నిబద్ధుడనని చెప్పుకున్న రొమాంటిక్‌ తిరుగుబాటుదారు'.

కవిసేన మానిఫెస్ట్రోలో - పూర్వకాలంలోనూ, ఆధునిక కాలంలోనూ కావ్య

శాస్త్రంలో అధికార పురుషులైన పెద్దల సిద్ధాంతాలే ఆధారం చేసుకుని కవిత్వం తత్వ వివరణ చేయబడింది. శాస్త్రంలో అధికార గ్రంథాలలో లేనిది ఇందులో లేదు (ఢు. 161) అని రచయితయే దాని ప్రామాణ్యాన్ని శాస్త్రబద్ధతను వివరించారు.

కోవెల సంపత్కుమారాచార్య ప్రాచ్యవిద్యాలవాలం నుంచి ఎదిగివచ్చిన ఆధునిక

విమర్శకులు. సాహిత్యచరిత్రను, వికాసాన్ని పరిశీలించి అన్వయించడంలో జాతీయవాద మార్గం వీరిది. జాతీయోద్యమచైతన్యానికి (ప్రతిద్వంద్విగా వచ్చిన (ప్రగతివాదోద్యమం పరిసమాప్తిని గురించి వీరు ఆలోచించారు. సరిగ్గా అప్పుడే మొలకెత్తిన నవ్యసంప్రదాయ సాహిత్యమును విశదంగా వ్యాఖ్యానించారు. వారు కొత్తగా ప్రతిపాదించింది “దేశీయతా లక్షణం. ఇది ఒకవిధంగా జాతీయతా లక్షణం, సర్వస్థానవేష భాషాఖిమతము, భావుకత్వ ముల సమావేశం. ఆధునిక కవిత్వాన్ని ఈ నేపథ్యంలో పరిశీలించి ఒక నూతన పార్వాన్ని ఆవిష్కరించారు. వారు (ప్రతిపాదించిన నూతనాంశాలు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

  1. సహజశక్తి గల దేశీయత స్వపయత్నంగానే ఉబికి వస్తుంది. ఏ ఇనుపచేయి ఆ ఉబుకును ఆపజాలదు. కారణం - నిజమయిన కవి దేశీయ చైతన్యపు మొన (కావ్యం-కవిస్వామ్యం-పే. 34).

  2. రసముల ఉదాత్తత్వానుదాత్తత్వములకు ప్రధానమైన విభఖేదక లక్షణము ఉదాత్తభావోన్మీలనము కలిగించుట కలిగించకపోవుట యన్నది. వస్తువు జీవన ధర్మమూలకమయినప్పుడే ఉదాత్తస్థితి కలుగుతుంది, ధర్మేతర వస్తువు రసొనుభావానికి దూరం చేస్తుంది.

సంపత్ముమార తన సిద్ధాంతగ్రంథంలో ప్రతిపాదించిన అంశాలు పూర్వ పూర్వ విమర్శకుల కృషినీ, పరిశీలనలనూ 'ప్రకాశింపజేసినవి. రాళ్ళపల్లి అనంత రసభావన, ల కార్య ఫుడురి జల్‌

భరతుడినీ, జగన్నాథునీ కలిపి ముడివేసిన దువ్వూరివారి రసరామణీయకత, ఉమాకాంతం గారి ఉదాత్తరసభావన, బంగారయ్యగారి స్ఫుట అస్ఫుట రస వివేచన, రాయప్రోలువారి రసత్రయ మౌలికతా ప్రతిపాదన, విశ్వనాథవారి కావ్య పరమార్ధ దర్శనంగా ఒక స్థాయిలో రసాన్ని, రెండవస్థాయిలో వస్తువును దర్శించటం, శ్రీశ్రీ సంవిధాన వివేచనలో రస ప్రాధాన్యం - ఇవన్నీ ఆయన వెతికి వెలుగులోనికి తెచ్చిన అంశాలు.

పూర్వకవుల కావ్య దృక్పథాలను పరిశీలించినప్పుడు నన్నయాదుల నుండి ప్రతిపాదింపబడిన కథాకథన శిల్చం, అక్షరరమ్యత, వస్తుకవిత, ఉభయకావ్యశిల్పము మొదలైనవి భారతీయాలంకార శాస్త్రానికి తెలుగువారి అనుదానంగా ఆయన నిరూపించారు.

చలం “పురూరవిను గురించిన వ్యాసంలో ఆధ్యాత్మిక సౌందర్య అనుభూతుల సమన్వయాన్ని, విశ్వనాథ యుద్ధకాండను అనుశీలించిన వ్యాసంలో కావ్యం ఆకృతి నుండి ఛందోరూపం వరకు ఉన్న వివిధాంశాల సందర్భంలో వాటివాటీని విశ్లేషించి వ్యాఖ్యా నించటం కావ్యకళాళిల్ప దృష్టికి నూతన ద్వారాలు తెరిచాయి.

డ్తే

మరొక భావుక విమర్శకుడు తుమ్మపూడి కోటీశ్వరరావు తన చైతన్యంలో భారతీయ అలంకారశాస్తాన్నీ పాశ్చాత్య సౌందర్యశాస్త్ర దర్శనాన్నీ ఇమిడించుకొన్నవారు. వేదాంతము, యోగశాస్త్రము, శిల్పచిత్రకళలు వాటి మూలాలనెరిగిననారు. సాహిత్య విశ్లేషణకు మానవ విజ్ఞానమంతా ఉపకరణమేననీ, ఆయాశాస్తాదుల ఒరిపిడినల్ల సాహిత్యం కామధేనువై నూతనాంశాలను వెలికితీస్తుందనీ విశ్వసించినవారు. నిర్మాణ మార్శికతనెరిగిన మేటి. ఆయన విమర్శలో ఇతఈపూర్వం స్పృష్టంగాని నూతన ప్రమాణాలు దర్శనమిస్తాయి. అనేక శాస్త్రాల జమిలి కలయికతో నూతనమూల్యాల ఆవిష్కరణ జరుగుతుంది. సర్వ జీవనానుభవమూ కళాపరిమితులలోనికి, ఆస్వాదసీమలలోనికి ఒదిగిపోయింది.

తుమ్మపూడి వ్యాఖ్యానాలు అన్నీ విలక్షణంగా ఉంటాయి. మన అలంకారశాస్త్రం కాళ్ళీర శివాద్వైత దర్శనం మీద అధారపడిందనీ, అందుకే ఉన్నేష ఉద్యోతశబ్దాలు అధ్యాయాలుగా ఈ శాస్త్రం ప్రవర్తించిందనీ ఆయన అంటారు. విమర్శ అంటే తీర్పు కాదు. కావ్యానుభవ వ్యాఖ్యానం - ఆది చైతన్యం విస్తరిస్తూ పోవటం. మన అంతః కరణంలోని లోతులలో శబ్దార్ధ ద్వంద్వం చేసే (ప్రయాణమే రసయానమని ఆయన తక మసన

పేర్మాన్నారు. ఈ రసచక్రమొక పద్మం, అష్టదళాలూ అష్టరసాలు. కర్ణిక పేరు శాంతరసం. ఈ నిరూపణ శాంతరసమును రసమూలముగా అనుభవాలకు కేంద్రంగా నిరూపిస్తుంది.

తుమ్మపూడి కోటీశ్వరరావు దృష్టిలో ఆత్మవిద్యోపాసనం, రసవిద్యోపాసనం రెండూ సమన్వయం పొందవలసినవి. అధ్యాత్మిక భౌతిక జీవనాలు రెండూ రసవిద్యలో సంగమిస్తవి. రసవిద్య మన జీవన సౌందర్యరహస్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నది. సోమన్న ఉత్తర హరివంశంలో ఇతిహాసవిద్యను కావ్యవిద్యవైపుగా మళ్ళించినవాడు. వేదము శబ్ద ('ప్రధానమనీ, పురాణం అర్థ ప్రధానమనీ, కావ్యం రెంటినీ తనలో సమన్వయించుకొని రస ప్రపంచాన్ని సృష్టించిందనీ ఆయన వివరించారు.

కోటీశ్వరరావు పురాణవిద్యా రహస్యాలను మనస్తత్వ శాస్త్ర ప్రకారం, పాశ్చాత్యుల ఆధునిక శిల్పాలు పురాణ(ప్రతిమలు విశ్వాంతరాళంలో భావాలుగా ఉండి కళాకారుల చైతన్యప్రపంచంలోకి ప్రవేశించి మూర్తులు కట్టుకొంటున్నాయని మనోజగత్తుయొక్క అనేక స్తరాల సంవిత్తు వీటిలో మూలమై ప్రకాశిస్తున్నదని వెల్లడించారు. ఉత్తర హరివంశంలో హరి వంశమంటే పాంచరాత్రం చెప్పిన వ్యూహమని వ్యాఖ్యానించారు.

ఆథునిక జీవనంలో లుష్తమైన సమతౌల్యం - ప్రాచీన జీవనంలో మూలసూత్రం. “వేయిపడగలిలో (ప్రకృతి పాత్రలు వనరిక, వృషన్నిధి, ఆదివటము నంకేతాలే. వ్యావసాయికమైన దేశంలోని (ప్రకృతిలోని భద్రత, సామరస్యం యంత్ర నాగరికతలో నశించిపోవటాన్ని ఎలా సూచించినదీ పాత్రలు వెల్లడించాయి. తుమ్మపూడి తన విమర్శ సారమంతా ఒకచోట ఇలా చెప్పారు - 'గతిస్థితులకు ఒక కేంద్రబిందువున్నది. దానిచుట్టూ విశ్వచక్రం పరిభ్రమిస్తున్నది. ఈ స్థిరకేంద్రంలోనే నిత్యమున్నది. అక్కడే భూత భవిష్యత్తులు లీనమౌతున్నాయి'. భారతీయ తాత్త్విక చింతనలోనున్న విశ్వదైవ మానవసమన్వయమే వారి విమర్శకంతటికీ మూలసూత్రం.

చేకూరి రామారావు మార్చిస్ప. అయినా అచ్చమైన కవితా స్పృహ కలవారు. కవిత్వం ఉంటే అది ఏ వస్తువైనా, రూపమైనా పరవశించిపోతాడు. శబ్బార్ధాల సమతౌల్యం

_..... గురించి ఇలా వ్యాఖ్యానిస్తాడు - తిలక్‌ గోరువంక అనే కవితలో “అందవు లేతసెగ్గు”

అన్న పద్యాన్ని విశ్లేషిస్తూ - “సంధ్యాకాలవు ఆకాశం (ప్రేయసి కపోలాల కుంకుమ కాంతులవలె కనిపిస్తున్నది. తడియారని అనే పదంలో ఆర్టత స్ఫురిస్తున్నది. వంవుల ఆకసం అనే ప్రయోగం ప్రేయసి కపోలాల వంపులను వ్యంజిస్తున్నది - ఇలా సాగిన వివరణ కావ్యవివేచనలో వ్యంజకత్వం అన్న లక్షణం ప్రధానంగా కొనసాగింది. తిలక్‌ను భభమ లా

గూర్చే ఇంకా వివరిస్తూ - 1961 నుంచి రాసిన తిలక్‌ పద్యాలలో శబ్బలౌల్యం తగ్గి భావ గాంభీర్యం పెరిగినట్టు కనిపిస్తుంది (కవిత్వానుభవం-పే. 86-37).

మరొకచోట పారదర్శకత అనే కవితాగుణాన్ని కొత్తగా ప్రయోగిస్తున్నాడు. “పాఠకుల హృదయాలను సున్నితంగా స్పృశించే పారదర్శక కవిత్వం గోపీది. పారదర్శకత అంటే సాంద్రత లేకపోవటం కాదు, కవితాస్వాదనకు ఆటంకం కలిగించే ఒపేసిటీ లేకపోవటం. అందరికీ అర్ధమయ్యే భాషలో చెపితే - అస్పష్టతను కలిగించే భాషాప్రయోగ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాప్రయత్న పూర్వకాంశాలు లేకపోవటం) (అదే. పే. 89). ఇంకో సందర్భంలో ధ్వనిని సాగకుండా వాచ్యం చేసే కవి బలహీనతను ఆక్షేపిస్తారు. “కవి ధ్వనిని ధ్వనిగా ఎక్కువసేపు నిలువనీయకుండా అనతికాలంలోనే వాచ్యం చేసి ధ్వంసం చేస్తాడు. ధ్వని సిద్ధాంతం మీద చేరాకు ఉన్న ప్రత్యయం అది.

కవిత్వంలో ఉండవలసిన సామగ్రిని గురించి చెపుతూ - “ఇతని కవిత్వంలో వివేకం ఉంది, విషాదం ఉంది, ఆలోచన ఉంది, ఆవేదన ఉంది. అంతకంటే ఎక్కువగా అంతరంగస్పర్భ ఉంది. అయితే అన్నీ సున్నితంగా ఉంటాయి. మౌనంగా చేసే చిరు దరవాసమంత సున్నితంగా ఉంటాయి' (అదే. పే.146). పైన చెప్పిన అంశాలు మెట్లుగా పేర్చుకొంటూ పోతే కవిత్వానుభవ సోపాన పరంపర మనకు కానవస్తుంది. అది సహృదయానుభవమును వివరించే మంచి (ప్రయత్నం.

కావ్య శిల్చ్బధోరణిలో ఉన్నతీకరణ, న్యూనీకరణ వ్యూహాలని కొత్త పరిభాషను ఆయన ప్రయోగించారు. కావాలని శబ్దం ప్రయోగం ద్వారా ఒక అంశాన్ని గొప్పగా చెప్పడం, మరొకదాన్ని అల్బంగా చెప్పడం ఈ వ్యూహలక్షణాలు (స్పృతికిణాంకం- పే.109). ఈ సందర్భంలో సుప్రసన్న కవిత్వంలో ఆర్భాన్నాశ్రయించిన చమత్కుతి తరచు కనిపిస్తుంది. ఇది భాషను సాధారణస్థితినుంచి కవిత్వస్థితికి చేరుస్తుంది అని అదే సందర్భంలో అంటారు. మరొక సందర్భంలో “సందర్భోచిత శైలీ భేదాలు వాడటం ఆయన కవితా విజయరహస్యం) అని రామబ్రహ్మంగారి కవితను ఉగ్గడిస్తారు. మొత్తం మీద లోతుగా - పైపై పరివేషాలు తీసి పరిశీలించే ఆలంకారిక మార్గాన్ని ఈనాటి కవిత్వానికి అన్వయించిన ఉత్తమ విమర్శకుణ్ణి చేరాలో మనం చూడవచ్చు.

భాషావిషయకంగా చలం, విశ్వనాథ శైలులను విశ్లేషించడం, 'అంధఖభిక్షువు వంటి ఖండికలను వ్యాఖ్యానించడం, ఖండకావ్యంకంటే మహాకావ్యం సమగ్ర అనుభవానికి వేదిక కాగలదని వెల్లడించడం, ఖండకావ్యాలను విశ్లేషించే ధోరణిని ప్రవేశపెట్టడం వంటివి చేరా ప్రవేశపెట్టిన నూతనాంశాలు. ననా

వినయ లక్షణాన్ని ప్రక్కనబెడితే ప్రస్తుత వ్యాసకర్త - సుప్రసన్న కూడా విమర్శన రంగంలో తన విశిష్టకృృషి కొనసాగించినవాదే.

సుప్రసన్న సాహిత్యవివేచన ప్రధానంగా కాత్పికభూమికమీద నిలచి కొనసాగింది. సంస్కృతి మూలాలను, మనస్తత్వశాస్తాన్నీ ప్రాగ్రూప పరంపరనూ, శ్రీ అరవిందుల తత్వదర్శనాన్నీ తన సాహిత్య విచారణకు మూలాంశాలుగా (గ్రహించటం జరిగింది. “సాహిత్యానికి ఒక అంచు కవీ - వేరొక అంచు సహృదయుడూ. ఈ రెండు బిందువులు ఒకచోటికి వచ్చినప్పుడు సహృదయ చక్రమేర్చడుతుంది” (సహృదయ చక్రము 1988). ఈ సమన్వయం వల్ల కవి సహృదయుల నడిమి సామరస్యమే అన్వేషింపదగిందిగా తోచింది. “భావయిత్రీశక్తి యిరువురిలోనూ సమానమై కారయిత్రివల్ల రచయిత కవి రూపొందుతున్నాడు. అనుభవం కవిలో మథనం జరిగి శబ్బరూపం గ్రహించితే ఆ శబ్దం సహృదయునిలో అనుభవంగా రూపాంతరం చెందుతున్నది. ఇరువురు అనుసంధించేది శబ్దమే అవుతున్నది” (భావుకసీమ-పే. 25).

ఈ విధంగా విచారణ సాగించి కవిత్వ సృజన మూలాల గురించి అవి ఎలా పాఠకులకు ఆస్వాద్యమయ్య్యే రీతీ విపులంగా చర్చించటం జరిగింది. సృజన మూలాలను ఇట్లా తరుముకుంటూ పోగా ప్రతీకల ప్రపంచం, బింబాల జగత్తు, ప్రాగ్రూపాల లోకం ఇత్యాదులన్నీ సాక్షాత్మరించాయి. సుప్రసన్న విమర్శలో ప్రాగ్రూపాల వివేచన అత్యంతము కొత్తది. ్రతీకల వ్యాఖ్యానము నూతనమైంది.

ప్రతీకల వ్యాఖ్యాన సందర్భంగా వేదార్థ విచారణ చేసిన నిరుక్తం చెప్పిన మూడంచుల విచారణ మార్గం చూపింది, వసుచరిత్రను పరిశీలింపగా క్రింది పొరలో బుగ్వేదం చెప్పిన వృత్రగాథ, దాని క్రిందిపారలో మబ్బులలో దాగివున్న వర్షజలం భూమి మీదకు ప్రసరించటం, ప్రకటంగా ఉన్న ఉపరిచర వృత్తాంతం సరేసరి. ఇందుకోసమే రామరాజభూషణుడు కావ్యనిర్మాణానికి బహ్వర్థసంధాయకమైన రచనాశైలిని ఎన్నుకొన్నాడని కావ్యపక్షంలో వ్యాఖ్యానించటం జరిగింది.

తరువాత ఈ ్రతీకాధ్యయనం కొనసాగి మహాభారతంలోని గరుడోపాఖ్యానము, ఆంధ్రమహాభాగవతంలోని రుక్కిణీకల్యాణంలోని రహస్యతంత్రయోగశా'స్తాలను వెలికి తీయటం జరిగింది. ఈ కావ్యగర్భంలోనికి ప్రవేశించే వ్యవహారం వలన అనేక కావ్యాలు తమ ఆంతర్యాన్ని వెలికి తెచ్చినవి. కుందుర్తి “నగరంలో వానిలో “అముద్రిత కావ్యం” అన్న వచన కవితలోనూ, గురజాడ పూర్ణ్వమ్మకథలోనూ ఇలా అంతరార్థాన్ని వ్యాఖ్యానించటం జరిగింది. ఇదంతా రహస్యకథన సంప్రదాయంగా విమర్శకులు భావించారు. కార్యల్పుతుతి నా ననా కం

సుప్రసన్న ప్రతిపొదించిన మరొక అంశం 'విశ్వలయి. ఇది తన చైతన్య పరిధులతో సామరస్యం కలిగించుకోవటం, చుట్టూ ఉన్న సమాజములో సామరస్యం కలిగించుకోవటము, ప్రకృతిలోని సామరస్యము, జగత్తులోని ఏకాత్మభావంతో సమన్వయం పొందటం - ఈ సమన్వయం ఉన్నచోట ఆ కావ్యానికి, మహా(గ్రంథానికి విశ్వలయ సిద్ధిస్తుంది.

సాహిత్యజగత్తులో కాలం గడిచేకొద్దీ రచనలు మహాగ్రంథాలుగా రూపొందుతవి. వీటికి ప్రధాన లక్షణాలు - కవి ప్రతిభా వ్యత్చత్తులు - శిల్చనైపుణి, సమకాలీన వైతన్యముతో సంబంధము, సార్వకాలీన లక్షణసిద్ధి, ఈ సంసిద్ధి కోసం ఆ మహాగ్రంథం తనలో నిక్షిప్తం చేసుకోవలసిన మూడంశాలు - మానవుని మౌలిక ఇం(ద్రియానుభవాలు, మానసిక భౌతిక సంఘర్షణలు, సృష్టిలోని వైరుధ్యాన్ని వైచిత్రినీ మానవశక్తికి అతీతంగా నిలచివున్న ప్రకృతి దైవీశక్తులు. వీటి సమావేశం వల్ల ఇతివృత్తం యొక్క సర్వ అనుభవ సముధ్రాన్నీ ఆవరించ గలుగుతుంది.

సాహిత్య పరిజామంలోని విశిష్టాంశాలను వెల్లడించే సందర్భంలో సుప్రసన్న ప్రతిపాదించింది ఆధునిక తెలుగు సాహిత్యంలో నవ్యసంప్రదాయము అనేది. దీనిని పసిగట్టి తొలుత ప్రతిపాదించిన విమర్శకుడు సుప్రసన్నయే. 'నేటి కవిత అభివ్యక్తి అన్న వ్యాసంలో ఈ విమర్శకుడు ఆధునిక కవులు ప్రయోగిస్తున్న అభివ్యక్తి వ్యూహాలను చర్చించాడు.

ఇటీవల వెలుగులోనికి వచ్చిన విమర్శకులలో బహువిధములైన అంశములను రూప ప్రక్రియలను లక్ష్యంగా చేసికొని కావ్యభూమికలను పరిశీలస్తున్న మరొక విమర్శకుడు యు.ఏ, నరసింహమూర్తి. కవిత్వాధ్యయనంలో మార్చును గురించి ఆయన ఇలా అంటారు

  • “నేటి కాలపు కవిత్వంలో రెండు మార్పులు కనిపిస్తాయి. కవితార్మిక సంబంధాన్ని వదలి తక్షణానుభూతిని అందినదానిని అందినట్లుగా వ్యక్తం చేయటం ఒకటి. కవి మనస్తత్వాన్ని అధ్యయనం చేయటంలో వచ్చిన మార్చు మరొకటి. ఇందువల్ల కవిత్వాధ్యయనంలో మార్పు వచ్చింది. ఒక పద్యంలోని పరమార్థాన్ని విస్తారమైన వివరణ చేయగలదని. ఊహించవలసిన పనిలేదు. మనలోని అజ్ఞాతము, నిబిడము అయిన అనుభూతి ఒకానొక స్వవ్నలిపిని వెలుగుతో నింపగలదు. ఒకప్పుడు అది పద్యంలో ఉండదు. మనలో ఉంటుంది. మనం కలగనకపోతే ఆ కవిత్వాన్ని మనం కనుక్కోలేము. ఈ దశలోనే అభినవగుస్తడు రసాన్ని 'కలలోపలి కలి అన్నాడు (కవిత్వదర్శనము-పే, 194). కం నా నుర్సినన్సి

కలలోపలి కల అని కొత్త పరిభాషతో అభినవగుప్తుని ఆనునంధించటం నరసింహమూర్తి వైశిష్ట్రం. కావ్యార్థం మనలో ఉన్న అంశం - దానిలో ప్రతిఫలిస్తుందనే విషయం చాలామందికి అనుభవంలోనికి వచ్చే స్థితి.

“కవియొక్క భావనకు కవితాసృష్టికి మధ్య ఇతరులకు కెలియని వ్యవధానం - ఎంపిక కొంత వుంటుంది. మనస్సులో సజాతీయ విజాతీయ భావాలెన్నో పుడ్తూ వుంటాయి" అని చెప్పి ఈ సందర్భంలో ఆత్మసంయమనాన్ని కోరని లేదా లోపించిన కవి తన భావధారను నిర్విరోధంగా విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ ఆసక్తి ఎక్కడో ఒకచోటనైనా వ్యక్తియొక్క మననశీలాన్ని వెనక్కునెట్టి, బుద్ధియొక్క ధారాపూర్వక (ప్రవృత్తిని పరిపూర్ణ స్పృహతో ఫ్వీకరించేలా ఒత్తిడి చేస్తుంది" (అదే. పే.120-121). ఈ వివేచన వల్ల కావ్యంలో కవి తాత్విక దృష్టికి భిన్నమైన అంశాలు ఎలా చోటు చేసుకుంటాయో వివరించారీ విమర్శకులు. పెద్దన మనుచరిత్రలో సాయంకాల వర్ణనలో 'మహీసురాధము' దన్న ప్రవర విషయక భావం గురించిన విశ్లేషణ ఇది.

నరసింహమూర్తి మరొక విశ్లేషణ మరీ ముఖ్యమైంది. 'నేటి కవిత్వానికి ప్రాచీన ప్రమాణాలకు అసలు పొత్తు కుదరదనడం పూర్తిగా నిజం కాదు .... ఆధునిక కవిత్వాని కంతకూ ప్రాబీన ప్రమాజాలే చాలునని ప్రాచీనులు సైతం అనరు. ఎందుకంటే అపూర్వత కవితకు ప్రాణమని వారికి తెలుసు కనుక (అదే. పే.1568). ఆధునిక విమర్శకులలో కౌందరి 'తీవ్ర' లక్షణాన్ని ఆయన సమర్థంగా విపులంగా ఆక్షేపించారు. అందుకే వీరు ప్రాచీన ప్రమాణాలకు జోడింపుగా ఆధునిక ప్రమాజూలలో కొత్త విలువలను రూపొందించు కోవాలని ప్రతిపాదించారు.

ఇలా ఎంతోమంది విమర్వకులను పేర్కొనవలసి ఉన్నది. రాయప్రోలు విశ్వ నాథల నుంచి ఈనాటి వరకూ ఈ కళాసొందర్య శిల్పభూమికల పునరన్వయం, వ్యాఖ్యానం, సమన్వయం కొనసాగుతున్నాయి. రాయప్రోలు, విశ్వనాథ, వడలి మందేశ్వర రావులను వదిలేస్తే, పేర్కొన్న మిగతా విమర్శకులందరూ ఇంచుమించుగా ఒకేతరానికి చెందినవాళ్లు. అందరిలోనూ సమదృష్టి - సామరస్యమూ స్పష్టంగా గోచరిస్తున్నాయి.

(9910 అక్టోబర్‌ ౨004లలో మచిలీనట్నంలో కేంద్ర సాపొత్య అకాదమీ నిర్సపొంచిన

'స్వాతం్రోత్తర కాలాన కావ్యళిల్స విమర్శ" నంగోష్టిలో నమర్సించబడిన వత్రం) షో . ట౨ధాలల్య హ్‌ ల్‌ న్‌ ఏ. కి. కార్ట్యర్ప 0 గంలో , యా ( ళ్‌. క. యో ం

విశ్వనాథ - చలం నవలలలో స్త్రీ పాత్రలు

తెలుగు సాహిత్యంలో వీరేశలింగం గారితో ప్రారంభమైన సంస్కరణ వాదం- వర్ణభేద నిరాసము, అస్పృశ్యతా నివారణ, బాల్య వృద్ధ వివాహ నిరోధము, వితంతు వివాహము, స్రీ విద్య మొదలైన అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. సంస్కరణ వాదంతోనూ జతగా రూపుకట్టిన స్వాతంత్రోద్యమం పప్రబలమైంది. క్రమంగా సంస్కరణలు అంగీకృతా లౌళూనచ్చాయి. మార్పు పొందిన జీవనశైలి సాహిత్యంలో రూపుకట్టుతూ వచ్చి ఆధునిక సాహిత్యంగా నూతన వైఖరికి కారణమయింది.

సంస్మరణ వాదం (క్రమంగా త్రోవ తీసిన జాతీయోద్యమంలో విద్యావతులైన స్త్రీల భాగస్వామ్యం పెరిగింది. బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టి యువతీయువకుల వివాహాల వల్ల వివాహ వ్యవస్థలో ప్రేమ వివాహాలు, గాంధర్వ వివాహాలు ఎక్కువయ్యాయి. నూతన వ్యక్తిత్వం ఏర్పరచుకొన్న స్రీ పురుషులు వివాహంలో తమ ఇష్టానిష్టాలకు అభిరుచులకు (ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అప్పటిదాకా వచ్చిన కుటుంబం నిర్ణయించే వివాహధోరణికీ, స్వయం నిర్ణయంతో ఏర్పరచుకున్న వైవాహిక స్థితికీ, ఘర్షణ ప్రారంభం అయింది0 అధికారం, పరంవర, విశ్వాసం ఇవన్నీ నూతన స్థితిని, స్వేచ్భా భావాన్నీ ప్రశ్చించటంతో, విరోధించటంతో వైమనస్యాలు పెరిగిపోయాయి.

ఈ స్థితిలో సమాజ వ్యవస్థ యొక్క క్షేమానికీ, దాని ప్రాథమిక రూపమైన “'దంపతి' భావానికీ క్షి కలుగకుండా వివాహ వ్యవస్థలో వరన్పర విశ్వాసానికీ, అనురాగానికీ, సమర్పణకూ, ఆరాధనకూ అవకాశమిచ్చే రీతిలో దాని పరిమితులను విస్తరించి మౌలికమైన కట్టబాటులకూ మౌధ్యానికీ ఆలవాలమై రాజ్యవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ సమాజము ఆ వ్యవస్థలో ఏ మార్పునూ అంగీకరించని ఒకానొక విపరీత మనోలక్షణంలో మొత్తం వివాహాన్నే కాదనేంత తీవ్ర చిత్తంతో ప్రవర్తించటం మరోవైపుగా ఉన్న స్థితి.

అప్పటికీ స్రీ వురుష సంబంధాలను విశ్లేషణ చేస్తూ కాల్పనికోద్యమం -- కవిత్వంలో (ప్రేమ ప్రాధాన్యాన్ని, ప్రాథమ్యాన్నీ నొక్కిచెప్పుతూ పవిత్ర ప్రణయ సాధనకు

ఒక ఆదర్శాన్ని - ఊహా (ప్రేయసిగా నిలబెట్టుకూ వచ్చింది. ప్రీ పురుషుల మధ్య వివాహ వివాహేతరంగా స్నేహరూపంగా అమలినంగా (ప్రేమ ఉండవలెననీ, అది అమలినమనీ రాయప్రోలు తమ కావ్యాలలో ప్రతిపాదించారు. ఈ అమలిన ('ప్రేమభావం రాధాకృష్ణ తత్వంగా, గోపికా సాధనగా కూడా (ప్రతిఫలించింది. అప్పటికే ప్రీ పురుషుల జీవితాన్ని నీతి నియమాలో, ధర్మమో కాకుండా ధనము శాసించటం వలన కన్యాశుల్మము, వరశుల్మము వంటి దురాచారాలు ఉన్నాయి. కన్యాశుల్మము తగ్గిపోయి వరశుల్మము ప్రాధాన్యము వహించింది. రాయఫ్రోలువారి స్నేహలతాదేవి లేఖ ఈ అంశాన్నే ముందుకు తెచ్చింది. మధ్యయుగాలలో ప్రబలిన ప్రీ నీచభావనను తిరస్కరించే ధోరణి 20 శతాబ్దపు ఆరంభానికే ప్రకటితమవుతున్నది. కొమట్టాజు అచ్చమాంబ 1908లోనే - శ్రీ వివేకానందులు దేవాన్ని పరిత్యజించిన సంవత్సరం - తమ కథలలో ఇలా వ్రాసినారు. “నేను పెండ్లాడిన భార్యను కాని దాసిని కాదు. వివాహమాడుటవలన భర్తకు దాసినగుదునా ఏమి? గృహయజమానురాలిగా ఎంచి మన్నించి (ప్రేమించవలయును... మా వంటి పళ్ళులు పురుషుల అహంభావము నెంత మాత్రమును సహింపజాలరు. ఈ భావన క్రమంగా అభివృద్ధి పొంది ప్రకటితం కావటానికి దాదాపు ఇరవై యేళ్ళు పట్టింది. గుడిపాటి వేంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ ఇంచుమించుగా రెండు సంవత్సరాల వ్యవధిలో జన్మించి ఆంధ్ర సాహిత్యాన్ని ఆవరించిన మహారచయితలు. విశ్వనాథ సత్యనారాయణ విద్యాభ్యాసమునకు ఎదుగుదలకు మచిలీపట్టణం స్థానం. జాతీయోద్యమానికీ, జాతీయ విద్యావ్యాప్తికీ, కృష్ణా పత్రికకూ, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, హరి నాగభూషణం, కానుకొలను (క్రివిక్రమరామారావు గారలకు మచిలీపట్టణం స్థానం. గుడిపొటి వేంకటాచలం పుట్టి పెరిగింది తెనాలిలో అయినా, మానసికంగా ఎదిగింది కాకినాడలో. రఘుపతి వేంకటరత్నం నాయుడు - బ్రహ్మసమాజము, సంస్మరణ వాదము ప్రధానంగా ఆయనను ప్రభావితం చేసిన అంశాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన సహపాఠి. బందరులో వెలువడిన కృష్టాపత్రికలో నాదెళ్ల వురుషోత్తమకవి రచించిన 'స్రీల మీటింగు నాటి హరికథా నాటకము” అనే గ్రంథాన్ని గురించి 1908లో తుచ్చగ్రంథము అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది. ఈ (గ్రంథం స్త్రీలను కించపరచే విధంగా రాయడం వలన దీనిని నిర్మూలించి (గ్రంథకర్తకు ధర్మశాస్త్ర రీత్యా తగు ప్రాయశ్చిత్తము కార్యీర్తముర 53

విధించాలని ఆ జిల్లా కలెక్టర్‌గారికి, చెన్నపురి దొరతనము వారికి, ప్రధాన కార్యదర్శికి, బందరు పురప్రముఖులు శ్రీయుతులు వల్లూరు సూర్యనారాయణరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోవల్లె హనుమంతరావు, ముట్టూరి కృష్ణారావు, చెళ్లపిళ్ల వేంకట (శాస్త్రి) శతావధాని ......... తదితరులు ఒక తీర్మానం చేశారు. (జండర్‌ స్పృహ - ఆధునిక తెలుగు సాహిత్యంలో 'ప్రతిఫలనాలు - సంపా. కాత్యాయనీ విద్మహే (1905) పే. 148) ఇక్కడ గమనించవలసిన విషయం స్త్రీలను కించపరచే విధంగా రాసిన రచనలను తిరస్కరించి నిషేధించమని కోరిక వాళ్లలో చెళ్లపిళ్లవారితో పాటు బందరు పురప్రముఖు లందరూ ఉన్నారు. చెళ్లపిళ్లవారు విశ్వనాథకు గురువులు. మచిలీపట్నం జాతీయ పునరుజ్జీవనోద్యమ స్థానం. కాకినాడ సంస్కరజోద్యమ కేంద్రం.

ఏ రచయిత చైతన్యాన్నైనా మూర్తి కట్టించే ఆంశాలలో అతని విద్య, సంస్కారాలు, వైయక్తిక పారివారిక సామాజిక అనుభవాలు, దేశకాలాలు, చుట్టూ పరిక్రమించే పరిభ్రమించే వ్యక్తులు వారి వారి భావనా సంపుటి ముఖ్యమైనవి. (ప్రతి రచయితకూ అతని వికాసానికీ, విశ్వజనీన చైతన్యం పొందటానికీ ఇవన్నీ కారణాలే అవుతవి. కొంతలో కొంత పరిమితులు విధిస్తవి. ఏ వ్యక్తీ పైన పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా స్వయంభువుగా ఏర్పడడు. ఈ సూత్రాన్ని విస్మరించి'తమ ఇష్టానిష్టాల ఆధారం మీద నిర్ణయాలు చేసే విమర్శకుల ధోరణి అపసవ్య ధోరణికి చెందింది. సత్యస్పృహ లేకుండా రాగద్వేషాల పరిమితిలో సాగిపోయేది.

సాహిత్య నిర్మాణంలో ప్రతిభావంతులైన రచయితంలదరిలోనూ జాగ్రద్దశ ఎంత (ప్రాథమ్యం వహిస్తుందో, అంతకు మించి అతని అవచేతన, సుప్తచేతన, సమష్టి అవచేతనలు (ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఎంతటివాడిలోనూ తను భావించి నిర్మించుకొన్న విధం కథా నిర్మాణంలో, సన్నివేశాల కల్పనలో పాత్రలను రూపొందించటంలో (ప్రతిఫలించదు. అవచేతనాదులు ఎక్కడో సందు చేనుకొని తమ స్పందనలను ఆవిష్మరించుతాయి. విశ్వనాథ సత్యనారాయణ రచనావేళ తన మనోలక్షణాన్ని గురించి ఇలా వివరించాడు -

“నేను రచన చేసేప్పుడు ప్రయోగించవలసిన కథాక్రమం గురించి కానీ, శైలిని గురించి కానీ, కళను గురించి కానీ ఆలోచించను. ఇతివృత్తం ఉన్నది. ప్రారంభం చేస్తాను. భాష, కథాక్రమం, అభివ్యక్తి, కవిత్వాంశ ఇవన్నీ వాటంతట అవే చేరుకుంటాయి. దాంతో ఇక్కడ ఒక రచన ఏర్పడి ఉంటుంది. సామాన్యంగా నేను (వచనమైతే) కశ నానా సును

రాయించటంగానీ, పద్యమైతే అల్లటం కానీ భిన్నభిన్న కాలాలలో చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా రచన గురించి ఏం రాయాలో అని ఆలోచిస్తాను. ఏదో ఒక భావం వస్తుంది. రచనావేళలో అది అలా రానే రాదు. నేను రచనను చెప్పేప్పుడు - ఆ సమయం భాషను, కథాక్రమాన్నీ కళనూ, శిల్పాన్నీ తను ఎన్నుకొంటుంది. నా రచనా ప్రపంచంలో కానవచ్చే శిల్పాదికం అంతా ముందు నేను ఆలోచించి పెట్టుకున్నది కాదు. నా రచనలో 'ప్రతి అక్షరమూ సహజోద్దమం. పెల్లుబికి వచ్చే మనస్సు ఉద్విగ్నస్థితిలోంచి వచ్చిందే. నన్ను ఆ స్థితిలోకి అది ప్రవేశింపజేస్తుంది. ఈ మనళ్ళిలిని విశ్లేషించటానికి ప్రయత్నిస్తే నాకు అది సాధ్యం కాదు. నాకు నాకే ఆ స్థితి ఆశ్చర్యంగా ఉంటుంది (విశ్వనాథ అసంకలిత సాహిత్యం - ఉపన్యాసాలు ఇంటర్వ్యూలు - ౨వ భాగం - పు.207).

ఒక విధంగా 20వ శతాబ్దపు మొదటి పాతిక సంవత్సరాలు భారతీయ వివాహ వ్యవస్థను పరీక్షకు పెట్టిన కాలం రచయితలందరూ అంతో ఇంతో ఈ దిశలో స్పందించక తప్పలేదు. గుడిపాటి వేంకటాచలం (చలం) ప్రకటించిన ప్రజయ పారమ్యం విశ్వనాథ ప్రకటించిన కులపాలికా ప్రజయం రెండూ భిన్నభిన్న దిశల నుంచి వచ్చిన ప్రతిక్రియా రూపాలు. ఒకటి సహజోద్వేగాలకు సంబంధించింది - రెండవది సామాజిక సుస్టితికీ, పురోగతికీ సంబంధించింది.

విశ్వనాథ, చలం ఇద్దరిదీ ఉద్విగ్న స్వభావం. ఒకటి ఎన్ని మార్పులకు లోనైనా వరంపరను రక్షించుకోవాలన్న భావం గలది. రెండవది ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎదురుదెబ్బలు తగిలినా పరంపరను విచ్ళేదం చేసినా వ్యక్తిస్వేచ్ళను రక్షించాలనేది. ఒకరిది వాస్తవ ప్రపంచం, వేరొకరిది భావుక సౌందర్య ప్రపంచం. ఒకటి బాధ్యత, వేరొకటి అనుభవం. ఒకరు మహోత్తుంగ తరంగాలతో ఉద్విగ్నంగా పొంగులెత్తే మహా సముద్రం. రెండవవారు ఉన్నత శిఖరాల నుంచి అతి వేగంగా దూకిపడే జలపాతం. సముద్రం చెలియలికట్ట దాటదు. జలపాతం నేలమీద నెమ్మదిగా సాగిపోక తప్పదు. ఒకరు సర్వకవితా (సాహిత్య) సంభారాన్ని శ్రీరామచంద్రునికి సమర్చింపగా, మరొకరు తమ సర్వచైతన్యాన్నీ భగవాన్‌ రమణమహర్షి పాదాలయందు సంలీనం చేశారు.

చలం సాహిత్యం ముఖ్యంగా నవలలు - శశిరేఖ, దైవమిచ్చిన భార్య, మైదానం, అరుణ, జీవితాదర్శం, కథలు, నాటకాలు ఇంకా ఇతర సాహిత్యం అంతా స్రీ అనే భావం చుట్టూ అల్లుకొన్నది. శశిరేఖలో అంటాడు - 'స్త్రీ వురుషుని తన శక్తిచే యాజ్ఞయందుంచుకొనవలయును. లేదా పురుషుడామెను నీచముగా లోబరచుకొనును. క్యరుతుతి క్‌5్‌

అందువలన స్త్రీ పురుషులు ప్రతి విషయమున సమానులైన గానీ శ్రేమయుండదు. ఒకరిపై నొక రాధారపడిరా ఆ (ప్రేమ నళశించునదే. (శశిరేఖ-పే.71). ఇందులోనే చలం పెళ్లి స్రీ పురుషులను ఆజన్మాంతం కట్టిపడేసేదిగా వుండే యాంత్రిక వ్యవస్థ కాగూడదనీ, ఎవరి అధికారం కిందా ఉండకుండా ప్రీ స్వతంత్రంగా ఉండవచ్చును అని అభిప్రాయపడుతారు.. ప్రస్తుత సామాజిక సంబంధాలలో స్వేచ్చాయుత (ప్రేమపూరిత స్రీ పురుష సంబంధాలకు స్థానం ఉండదు. అది సముద్రంలో చేపను ఎంతగా ప్రేమించినా నేలమీద సుఖపెట్టలేము అని తేలుస్తారు చలం.

శశిరేఖలో శశిరేఖయైనా, మైదానంలో రాజేశ్వరియైనా, మరొక పాత్రయైనా చలం కథాక్రమం వివాహవ్యవస్థను విచ్చేదించటంతో ప్రారంభం అవుతుంది. తరువాత ప్రేమించి స్వీకరించిన పురుషుని వద్దనైనా ఆగిపోదు. ఆమె (ప్రమ చంచలమే. అక్కడనుంచి మరో పురుషుడు, మరో పురుషుడుగా సాగుతుంది. చివరకు ఆత్మహత్య దాకా కొనసాగి నవల పూర్తవుతుంది. వ్యవస్థ భేదించినప్పుడు ఏర్పరచవలసిన మరొక ప్రత్యామ్నాయ వ్యవస్థను గురించి చలం ఆలోచించలేదు. శశిరేఖలో కృష్ణుడు, తరువాత సుందరరావు, రామారావులు ఎక్కడా తాను కోరుకున్న స్వేచ్చ లభించక ఆత్మహత్య చేసుకుంటుంది. మైదానంలో రాజేశ్వరి కూడా అమీర్‌తో లేచివచ్చినా, అక్కడ నిలుకడలేదు. మనస్సు మీరా మీదకు పోతుంది. చివరకు ఆత్మహత్యకు దారితీస్తుంది. ఈ నిలుకడ లేనితనాన్ని చలం ఇలా సమర్థిస్తాడు. (ప్రేమకు జీవలక్షణం ఉంటుంది. కనుక అది ఎప్పుడూ పెరుగుతూ వుంటుంది, అందువల్లనే చంచలంగా కనబడుతుంది. స్వేచ్చ లేకపోతే ప్రేమ చచ్చిపోతుంది అని భావిస్తాడు.

అయితే చలం నవలలోని, కథలలోని భావనలు సమాజం అంగీకారం పొందలేదు. కాకపోతే స్త్రీ పురుష సంబంధాలలో సాంప్రదాయిక నిర్బంధాలలో పట్టణీకరణ, విద్యావ్యాప్తి, ఆధునిక అవసరాల దృష్ట్యా మార్పులు వచ్చాయి. అవి చలం నవలల ప్రభావంగా భ్రాంతి పొంది ఆనందించేవాళ్ళు అలాగే భావించవచ్చు. అయితే పి. సంజీవమ్మ వంటి మారియ విమర్శకులు ఇలా అన్నారు - వివాహవ్యవస్థకి, సెక్సు జీవితానికి సంబంధించి చలం సృజనాత్మక రచనలు ఆత్మాశ్రయ ధోరణిలో కొట్టుకుపోయి, నైతికత (ప్రధానమైన సామాజిక ఉద్యమాల నుండి దూరమై ఒక నైతికేతర వ్యవస్థ కావాలనేంతవరకు పోయాయి. కందుకూరి, గురజాడ, ఉన్నవ వంటివారి సాహిత్యానికున్న ప్రయోజనం చలం సాహిత్యానికి లేదు. అయితే సంఘం కదలి స్త్రీల బ్రతుకుల్ని గూర్చి

కూడ ఆలోచించేట్లు చేశాయి చలం ననలలు. (ఆధునిక తెలుగు సాహిత్యంలో పునరుజ్జీవన సంస్కరణ స్వాతంక్ర్రోద్యమ (ప్రతిఫలన రూపాలు - నవలా సొహిత్యం (1985) కాకతీయ విశ్వవిద్యాలయం సంగోష్టి ప్రసంగపొఠం).

కాని క్రమక్రమంగా చలంలోనూ మార్చు వచ్చింది. నేను వాంఛించే మార్చు ఈ వివాహవ్యవస్థలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు పోవాలని, ఈ దుర్మార్గాలు వాదిలించినంతమాత్రాన అసలు చచ్చేటంత దుర్చలం కాదు వివాహం. అంతేకాకుండా వొద్దన్నవాళ్లకి బలవంతంగా కట్టగూడదనీ, వివాహం అయినంతమాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ కానంతమాథ్రాన అవినీతి అనడమూ మూర్ధమని నా వాదని (మ్యూజింగ్స్‌- 1, పే.43) ఈ నిశ్చయం ఆయన అంతరంగంలో నిహితమైన భావనను వెలికితీస్తుంది.

అందువల్లనే జీవితాదర్శం నాటికి చలం పాత్రలు ప్రతీకాత్మకతను పొందాయి. దానిలో నాయిక 'లాలసి. ఈమె చలం భావనాలోకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వివాహమైన లక్ష్మణసింగ్‌తో దూరమై, మాల్వంకర్‌ గానంచేత ఆకర్షితురాలై అతనితో కొంతకాలం జీవిస్తుంది. కళాకారుల కళలో ఎంత సౌందర్యం ముంచెత్తినా, నిజజీవితంలో అంత ఆనందం ఉండదు. కళాపరిమితులనుంచి దిగినంతనే వారంతా సామాన్య మానవులే అవుతారు. అక్కడ నించి భీమునిపట్నం సముద్రతీర ప్రాంతాలలో ప్రశాంతంగా సహాజీవనం చేస్తుంది. అక్కడ ఒకవిధంగా భావుక జీవనం ఉన్నది. మళ్లీ లక్ష్మణసింగ్‌తో రానంటుంది. భావుక జీవనానికి ఆస్కారమిచ్చింది ఆమెలో ఉన్న సౌందర్యబోధ. అదే బయట దేశికాచారి (దేశిక-ఉపదేశమిచ్చేవాడు) గా కానరావటం జరిగింది.

చలంలో ఉన్న నిరంతరాన్వేషణ, ఒక కాల్చనిక జీవనంకోసం, భావుకత్వ సౌందర్య లోక సాక్షాత్మారం కోసం చేసిన తపస్సు శ్రీరమణుల దర్శనంతో లక్ష్యాన్ని చేరుకున్నది. అతిలోక సౌందర్యం ఆయనకు అనుభవంలోనికి వచ్చింది.

విశ్వనాథ సాహిత్యం అంతా స్త్రీపురుషుల జీవనంలోని సామరస్య సాధనకు సంబంధించినది. మనుస్కృతిలో ప్రజాపతి తన దేహాన్ని రెండు సగములుగాజేసి ఒకటి స్రీగా, మరొకటి పురుషుడుగా ఏర్పరచినాడని ఉన్నది (1-85). రెండు భాగములు సమానమైనవే ననీ, పరస్పర పోషకములనీ, పరిపూరకములనీ ఆయన భావించినాడు. ఆయన సంప్రదాయ వివాహవ్యవస్థను యథాతథంగా ఆమోదించాడన్న వాదం సత్యదూరమైంది. విమర్శకుల వివేచనలేమిలో నుండి వచ్చిన మాట. కిన్నెరసాని పాటలలో వివాహవ్యవస్థ కాఠిన్యం ఆమె అత్త వ్యక్తిత్వం ద్వారా (ప్రతిఫలించింది. ఆమె ఇల్లువిడిచి కురుత ర్‌

వచ్చింది. భర్త ఆ వ్యవస్థ లోని జదత్వానికి ప్రతీకయై రారై పోయినాడు. అహల్య కథకిది ప్రతికూల ప్రాగ్రూపం కొంతవరకు. ఆమెను అంతటి తీవ్రదుఖంలోనూ సమాజం సుఖంగా ఉండనీయలేదు. సృష్టిలోని ఆదివృద్ధుడైన కడలిరాజు ఆమెను కామించాడు. అయితే గోదావరీదేవి ఆమెను ఆపదనుంచి రక్షించింది. ఆమె చివరకు తెలుగుదైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య దర్శనముచేసే త్రోవలో నిలచి వారికి సేవచేస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకొన్నది. ఆమె ధీరురాలై తన జీవనమార్దాన్ని తానే స్వతంత్రంగా నిర్దేశించుకొన్నది. ఆత్మహత్య చేసుకోలేదు.

ఇదే పరిస్థితి నర్తనశాలలో ధీరవనితగా (ద్రౌపదిని చిత్రించి కీచకవధను భీమునిచేత నిర్వర్తింపజేశాడు విశ్వనాథ. రాచరికపు కట్టుబాట్లలో వివాహము ఆసాధ్యమై అక్చరుచక్రవర్తి అనార్భలిని జీవసమాధి చేయటం రాజు క్రూరత్వానికి, వివాహవ్యవస్థ రాచరికపు ఉక్కుకోరల్లో చిక్కుకొని గిలగిల తన్నుకులాడటాన్ని చిత్రించింది. వేనరాజులో వివాహవ్యవస్థను నిషేధించి, స్వలింగ వివాహభావాన్ని (ప్రచారం చేసిన రాజు అధర్మం చివరకు తిరస్కతమైంది.

విశ్వనాథ భావించిన వివాహవ్యవస్థ పురుషాధిక్య భావన ప్రధానమైంది కాదు. అడుగడుగునా ఆయన నాయికలు పురుషాధిక్యతను ప్రశ్నించారు. కల్పవృక్షంలో సీతాదేవి “అంతయు నేన చేసితినో వనవాస గమనం నుంచి, రావణవధ దాకా తానే సర్వము నిర్వర్తించినట్లు చెప్పుకొంటుంది. గిరికుమారుని (ప్రేమగీతాలలో పరస్పర ప్రేమానుబద్ధమైన శృంగారాన్ని దంపతీనిష్టంగా (ప్రతిపాదించి కాల్పనిక కవిత్వంలో ఒక కొత్త శిఖరాన్ని ఆవిర్భవింపజేశాడు. వారి దాంపత్యభానం భార్యను దేవీమయంగా భావించేదాకా సాగిపోయింది. వరలక్ష్మీత్రిశతిలో - '(శ్రేయోరూపము దాల్చి వచ్చినది గౌరీదేవి నా యింటికినొ అని ఈ భావాన్నే వ్యక్తీకరించాడు. దాంపత్యధర్మ పరిపాలనలో దివ్యభావ స్ఫురణ ఉన్నవాడవటంవల్లనే ఆ వ్యవస్థను నిలబెట్టే కృషి తన సర్వసాహిత్యంలోనూ నిర్వర్తించాడు.

మనస్సులో పుట్టే మోహమనే నదీప్రవావోన్ని కొనసాగించే రెండు కులాలు భార్యాభర్తలు. గార్హస్ట్రం మిగిలిన సర్వసమాజాన్నీ రక్షించే బాధ్యతను నెత్తికెత్తుకొన్నది. 'ేతో మోహకుల్యానదీ మర్యాదాకృతి తీర్చుయోగమిది' (కల్పవృక్షం) సర్వసృష్టి నిర్వహణము లోని భౌతిక, దైవిక, ఆత్మిక స్తరాలలో సాధనను సాగించే సాధనం వివాహం. పూర్వం యజ్ఞయాగాదుల నిర్వహణలో ఉపయుక్తమైన అగ్ని - ప్రణయంగా, పరివార పోషణగా,

సమాజ ధర్మసేవనంగా రూపాంతరం పొందింది. అందువల్లనే - (ప్రేమగీకాలలో “నా ఆకర్మిప్టిత క్షమించినారు దేవి' అని అంటాడు. ఆర్షమైన ఆచార వ్యవహారాలు కాలక్రమంగా రూపాంతరం పొందాయి. రూపాంతరం పొందిన నేటి లక్షణాలనే విశ్వనాథ ఆదరిస్తున్నాడు.

అరుంధతీ ధర్మారావుల దాంపత్యమును వర్ణించుతూ వేయిపడగలలో “ప్రతి నిమేషము వారి ఆత్మలలో దేవతలు తాండవించిరి, వేదబుక్కులు వారి క్రీడలలో నర్థవంతములయ్యెను, కులదేవతలు వారి లీలాపాంగములయందు భావ్యాశలు ్రవ్వు కొనిరి, పితృదేవతలకు వారి శృంగార లీలలందు తర్పణములందినపొ (ే.157). అయితే వారి నడుమ సమభావమే కాని పురుషాధిక్యభావన లేదు. “ఈ ధర్మము పరస్పరమైనది. కాని పురుషుని యందధికత కలది కాదు (గు. 799)

వేయిపడగలలో కిరీటి శశిరేఖల ప్రణయము ఒక తపస్సుగా పరిణమిస్తుంది. వివాహముగా ఫలిస్తుంది. గిరిక ప్రణయం సఫలమై ఆమె ఒక ఆండాళవలె, ఒక మీరావలె దైవ సాన్నిధ్యాన్ని సంపాదించుకొంటుంది. జేబుదొంగలులో సీత భారతీయ చాంపత్యభావ గవేషణా ఫలం. 'సీతయా సీత! ఆమె సనాతని ఈ, దేశములోని ఆత్మ, ఆమెకు పుట్టుకలేదు, చావులేదు, ఆమె ఎవనిచెంత చేరునో అతడు నిత్యజీవి. అతనికి నాలుగు పురుషార్థములు కలవు' (పే.1256). వీరిద్దరికి గాంధర్వవివాహం జరుగుతుంది. సంప్రదాయ వివాహవ్యవస్థ సరిహద్దులు విశ్వనాథ నవలలో ఎన్నోచోట్ల చెదరి విసృతంగా పెరిగిపోతాయి. వేయిపడగలులో కుమారస్వామి-శ్యామలల వివాహం వర్జాంతర సంబంధాన్ని అంగీకరిస్తుంది.

ధర్మానుబద్ధం అంటే లోకానికి సమాజానికి అహితం కలిగించనంతవరకు స్రీ పురుష సంబంధం వర్ణాంతరమైనా, గాంధర్వమైనా, మరొకైనా విశ్వనాథకు సమ్మతమే. లేనప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. ప్రణయము, వివాహముల నడిమి సంఘర్షణయే ఏకవీర నవల. అయితే దానిలో పరిస్థితులు ఎవరికీ అనుకూలం కాలేదు. ఏకవీర మనస్సులో దాగివున్న అవచేతన యొక్క ప్రాగ్రూపం గుజ్జపువాళ్ళ పిల్ల 'అమృతం' చెప్పే అరుంజేవిరుంబు అన్న వాక్యం నవలను పరిపాలిస్తుంది. ధర్మం వ్యక్తికి సమాజానికి మధ్య ఒక సమన్వయాన్ని సంపాదించే ఒక సూత్రం. అయితే ఏకవీరలో అంతఃకరణ ప్రవృత్తికీ అత్యంత ప్రాధాన్యం ఈయబడింది. కార్యపురురి 59

చెలియలికట్టలో రత్నావళి, వేయిపడగలులో మంగమ్మ ఇద్దరూ కామానిక్తీ, అర్భానికీ లోభించి వివాహవ్యవస్థ నుండి దూరదూరంగా సాగిపోయినవాళ్ళు. ఇద్దరూ క్రమంగా ఆ ప్రస్థానంలో సౌఖ్యం లేదన్న సంగతిని గ్రహించినారు. రత్నావళి వివేకవతియె తన జీవితాన్ని ముగించుకొంటుంది. మంగమ్మ ధర్మస్వరూపం (గ్రహించి గిరిక పొందిన దివ్య సాఫల్యానికి ముగ్ధ బెకుంది. ఆ కల్యాణోత్సవాలలో తనను మానసికంగా స్వామికి అర్పణ చేస్తుంది.

విశ్వనాథ చిత్రించిన స్త్రీ పాత్రలలో కామ విపరీత ప్రవృత్తిగల వాళ్లల్లో బాదమ్మ బద్దన్నలు, సోఫియా, వామదేవుడు ఇలా ఎందరో కనిపిస్తారు. దాంభిక లక్షణం వసుంధరలో కనిపిస్తుంది. ఇంకా వింత లక్షణాలతో ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉన్నదో విశ్వనాథ రచనా ప్రపంచంలోనూ అంత వైవిధ్యం ఉంటుంది.

విశ్వనాథ రచనా ప్రపంచంలో సమకాలీనాంశాలయెడ కొన్ని విపరీత వ్యాఖ్యలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల ఆయన సంస్కరణ రూపంలో లోకంలో వస్తూ వున్న మార్పుకు వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకమైన వ్యాఖ్య చేయటమూ కనిపిస్తుంది. వర్జభేదాలను సమర్థిస్తున్నట్లు ఉంటుంది. అయితే అవన్నీ ఆయన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే దేశకాలాల పరిమితులవల్ల సంభవించినవిగా భావించవలసి ఉంటుంది.

అయితే విశ్వనాథ సృజనాత్మక ప్రతిభ ఈ పరిమితులలో ఎప్పుడూ నిఐద్ధం కాలేదు. ఆయన రచనలన్నీ ఒక విశ్వజనీన లక్షణాన్ని ఆశ్రయించి ప్రవర్తించాయి. ఒక నవల వాస్తవికంగా రచింపబడటానికీ, రూపకాత్మకంగా (మెటఫారికల్స్‌గా రచింపబడ టానికీ ఖేదం ఉన్నది. మొదటిది కాలంతోపాటు అదృశ్యమైపోతుంది. రెండవ పద్ధతి రచన కాలాన్ని మీరి ఉంటుంది. కాలాంతరంలో భిన్న వ్యాఖ్యానాలకు, భావస్ఫురణలకు అవకాశ మిస్తుంది. సమకాలికాంశాలు తమంత తాము జారిపోతాయి. విశ్వజనీనమైంది నిలుస్తుంది.

విశ్వనాథ రచనా జగత్తులోని ప్రధాన లక్షణం ఆయన వ్యక్తికీ తనలోని వ్యక్తికీ, బాహ్యమైన సమాజానికీ, వ్యక్తికీ సమస్త జగత్తుకూ ఒక సమన్వయం కోసం ప్రయత్నించారు. ఈ సమన్వయం భంగం అయినప్పుడు ఆయన విపరీతంగా వ్యధపడ్డారు. పసరిక మరణించినప్పుడు జగత్తు ఎంతగా దుఃఖించిందో, గిరిక పాల్గొన్న కల్యాణోత్సవాలకు ప్రకృతి పరవశించి దివ్యచైతన్య స్ఫురణతో ప్రకాశించింది. బుతువులు, సూర్యోదయ చంద్రోదయాలు, వర్ణము, మేఘము, వృక్షము ఇలా ప్రకృతి అంతా రచనలో వస్తువుగా మారిపోయింది. 60 సొన

వివాహమూ (ప్రేమ ఏదీ ఒకదాన్నొకటి అతిక్రమించరాదు. రెండూ ఒకదానిలో ఒకటి అంతర్భాగం కావాలి. ప్రీ పురుషుల విషయంలో పరస్పర సంభావనం ప్రధానం. చలం నవలలలో వలెనే విశ్వనాథ నవలలలోనూ వివాహం ధర్మం తప్పినప్పుడు ఆ (స్రీలు హత్య పాలో, ఆత్మహత్య పాలో అయ్యారు. చలం పాత్రలు ఆత్మహత్య చేసుకున్నాయనీ, విశ్వనాథ పాత్రలు రచయిత చేతిలో హత్యకు గురయినట్లు ఇటీవల ఒక విమర్శకురాలు ప్రసంగించారు. అయితే ఇద్దరూ అవచేతనాదుల (ప్రాబల్యంలో రచన చేసినవాళ్లవటం వల్ల ఇద్దరి పాత్రలూ తమంత తాము హత్యకో ఆత్మహత్యకో పాల్పడ్డాయనటంలో న్యాయమున్నది. ఏకవీర అంటే రేణుకాదేవి. దశమహావిద్యలలో ఛిన్నమస్త. పాతివ్రత్య భంగదోషం ఆరోపింపబడి పుత్రునిచేత వధకు గురయింది. పుత్రుడంటే తన భావచేతన (ప్రపంచం. దానివల్ల హతమయింది ఈ ఇర్వురు రచయితల పాత్రల సమూహం.

విశ్వనాథ వివాహవ్యవస్థను రక్షించేందుకు తన సర్వశక్తులూ వినియోగించారు. అయినా అది నిర్భంధం కాకూడదనే ఆయన విశ్వసించారు. కృత్రిమమైన వివాహాన్ని ఆయన తిరస్కరించారు. పూర్వజన్మ, పూర్వకర్మలను విశ్వసించే వ్యక్తి కావటంవలన అది ఒక విధి నిర్ణయంగా భావించటం కూడా జరిగింది. ఆయన దృష్టిలో (ప్రేమ చంచలమైంది కాదు. మోహోల్బణమూ కాదు. జీవితం అనే వలయం - అదే సమాజం. వ్యక్తి దానిలో బిందువు చుట్టూ వ్యాపించి స్థలమంతా పురుషార్థసాధన వేదిక. వ్యక్తి పురుషార్థాలను ఎంత సమగ్రంగా సాధించితే అంత పరిపూర్ణ వ్యక్తిగా, సమాజం తానుగా రూపొందుకాడు.

ఉపనిషత్తులలో - భాందోగ్యంలో - మైథునక్రియ ఒక యజ్ఞంగా పేర్మానబడింది. ఈ యజ్ఞసాధనలో ప్రీ పురుషులిద్దరూ సమాన సాధకులు. వారు సృష్టి అనుస్యూతికోసం, సమాజ విస్పృతిక్సీ అభ్యుదయానికీ చేసే మహాకార్యం. బాహ్యంగా అతిథిసేవా పూజనాదులు లక్ష్యమైతే, ధర్మనిర్వహణ ద్వారా (త్రివర్గసాధన ద్వారా ముక్తినీ, జీవన్ముక్తినీ సాధించటం, ఇరువురు జీవులు ఒక జీవితకాలం సహచరులై ఉంటూ (బ్రతుకులో, భావనలో సామరస్యం సాధించటం ద్వారా సృష్టిలో సామరస్యం సాధించటం.

ఇది విశ్వనాథ రచనలో సుసూక్ష్మస్థితిలో దర్థించితే స్ర్రీపుంస యోగస్టితి ఈ లక్ష్యంవైపుగా సాధించినట్లు చెప్పుకోవచ్చును. చలం ఈ లక్ష్యానికి సమీపంలో కూడా లేడు. న న

ఉపయుక్త సాహిత్యము :

  1. ఆధునిక తెలుగు సాహిత్యంలో పునరుజ్జీవన సంస్మరణ - జాతీయోద్యమ ప్రతిఫలన రూపాలు (ప్రసంగవ్యాసాలు), 1985 - కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ, వరంగల్‌

  2. విశ్వనాథ నవలలు - మానవ సంబంధాలు - డా॥ వారణాసి వేంకటేశ్వర్లు (1996).

  3. దర్పణం - ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, వరంగల్‌ - 2004

  4. జండర్‌ స్పృహ - ఆధునిక తెలుగు సాహిత్యంలో 'ప్రతిఫలనాలు - (సంపా.

కాత్యాయనీ విద్మహే) - 2005. 5. విశ్వనాథ అసంకలిత నాహిత్యం - 2 - విశ్వనాథభారతి, వరంగల్‌. అ సున్న

ఆధునిక సాహిత్యం ఎదిగిన సంస్కృతి శిఖరం

విశ్వనాథ సత్యనారాయణ

సంస్కృతి అంటే సామరస్యం తోడి జీవనం, ఒక సమానమైన చరిత్రలో, ఉత్థాన పతనాలలో, ఎదురుదాడులతో మారిన కాలాన్ని అనుసరించిన నూతన సమావేశంలో అన్వయంతో కొన్ని విశ్వాసాలతో, కొన్ని విలక్షణలతో సాగివచ్చే జాతి చేతనలో ముద్రింపబడి ఉన్న సంస్కార సంపుటి సంస్కృతి అనబడుతుంది. ఆ జాతి సంగతిలో, గమనంలో ఆధ్యాత్మిక, సారస్వత, కళాత్మక, శోధనాత్మక, జీవన తత్త్వ భావన ప్రాధాన్యం వహిస్తుంది.

అనేక భావనలు, ధోరణులు అనేక స్వరాల సమ్మేళనం వలె ఒక విశిష్టమైన సమన్వయం సాధించగలుగుతవి. దానివల్ల దానికి ఒక అపూర్వమైన ఆస్వాదనీయత సిద్ధిస్తుంది. ఒక బహుప్రజ్ఞను సృజనల సమన్విత రూపం అది "142౧౫ 01/111244009 1061 ౪2౧15066 0602459 416 00416 ౧౦1 నింగంగ౧ (౧61 604165. 801 1౧౮14౧ 61/11124%0౧ [౧48 00౧౪౧౮96 10 అ|51&౧6 1$ 8816 10 06 11/6 10694౧6 ౪6౬/5 016అని మన పూర్వ ప్రధాని పి.వి, నరసింహరావు అన్నారు. (56180486 90680169 92-93).

ఏ వర్తమానమైనా గతకాలపు ప్రవహణ శీలాన్ని పరీక్షిస్తుంది. వర్తమానంలో దిగివచ్చేవి స్మృతులు, భావనలు. గతంలోని వ్యక్తులు నశిస్తారు. వ్యక్తిత్వం మిగులుతుంది. సంఘటనలు తొలగిపోతాయి. సంస్కారాలు నిలచి ఉంటాయి. భావుకులు నిలచిపోరు అయితే ఆ భావనలు ్రకాశిస్తూనే ఉంటాయి. ఈ భావనలు, సంస్కారాలు, వ్యక్తిత్వాలు వీటన్నింటి కలనేతయే నేటి మన వారసత్వం మన సంస్కృతి.

భారతీయ సంస్కృతి మూలాల్లో ప్రధానమైన అంశం వర్తమాన జీవితం ఒక నడిమీ బిందువు మాత్రమే. పూర్వజన్మలూ, కర్మలూ, పరజన్మకర్శ్మలూ ఉన్నాయి. మృత్యువు విశ్రాంతి స్థానం. దుస్తులు మార్చుకొనే నెలవు. జీవునిది అనంత యాత్ర. నిరంతర సాధన. లోపాలను, దోషాలను విడిచి పుచ్చుతూ, దిక్కాలాదుల కతీతంగా నిత్య ననన ననన ననగా

(ప్రయాణంలో అతడు కొనసాగుతున్నాడు. ఈ భావకేంద్రం చుట్టూ అల్లుకొని ఉన్నాయి- శ్రుతి స్పృతీతివాస పురాణాదులు, అనంతమైన వాజ్బయము దర్శనాలు, శాస్త్రాలు న్థాపత్యాది విద్యలు మిగిలిన జీవన ధోరణులు. జీవుని ప్రయాణంలో అతడు నిత్య కర్మశీలి. కర్మ అతనిదే - అనుభవము అతనిదే. ఆ ఆధారం మీదనే అతడు నిరంతరంగా సాగిపోతున్నాడు. ఎవరికీ దేనికీ పరతంధత్రుడు కాడు.

దివ్య జీవనాభిముఖంగా జీవనాన్ని తీర్చటం అంటే ఎక్కడికో పారిపోవటం కాదు. దైవం అంటే ఇహలోక దూరము, దాన్ని పరిత్యజించిందీ కాదు. దైవం బ్రతుకుపొరల్లో కేంద్రంలోని చైతన్యబిందువు. ఆంతరాత్మ, దివ్య జీవనం. సర్వచైతన్యముతో అనుసంధించుకొన్న వైయక్తిక మనోవృత్తులకు పరిమితులకు దూరమైన సర్వచైతన్య సృష్టిగల అనుభవ ప్రవాహం.

ఆహారపానీయాలు, వస్త భూషణాదులూ, ఆవాస ప్రవాసాలూ, రాజ్య వ్యవస్సా, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలూ, ఇవన్నింటికీ అతీతమైంది. సంస్కృతి భావనకు వీటిల్లో కొన్ని ఆలంబన చిహ్స్చాలు కావచ్చు. కొన్ని (ప్రతీకలు కావచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ ఆలంబన చిహ్నాలు, (ప్రతీకలు మారిపోవచ్చు. శిథిలం కావచ్చు. నూతన ప్రతీకలు ఆస్టానంలోకి ప్రవేశించవచ్చు. ఈ చిహ్నాలు, నాగరికతలు చిహ్నాల వెనుక నిలచి ఉన్న భావన సంస్కృతి.

భారతీయ సంస్కృతికి ప్రధానలక్షణం సర్వభావ సంగమలక్షణం, అన్నింటినీ ఆహ్వానించి తనలో నిలుపుకొని ఒక నూతన రూపం ఇవ్వటం. సంకుచితంగా, పిరికి పిరికిగా ఆలంబన చిహ్నాలకే పరిమితమై యథాస్థితికి కంచుకోటలుగా ఉండే నాగరికతలు అంతస్సంస్కారాన్ని కోల్పోతవి. జీవంలేని శిలా ప్రతిమల సదృశంగా నిలచిపోతవి.

ఏ వ్యవస్థ అయినా ఏర్పడ్డప్పుడు ఉండే శ్రద్ధ ఎంతదైనా కాలానుగతిలో, ఆచరణలో నూతన వ్యాఖ్యలతో మారిపోకతప్పదు. వ్యవస్థ అంటే దాని నిర్మాణం వెనుక ఉండే తాత్వికత స్థిరమైంది. మూలం వ్యక్తా వ్యక్తమైన బిందువే. సత్తో ఆసత్తో చెప్పటం కష్టమే. అది విస్తరించటం మొదలుపెట్టి అనంతంగా విస్తరించుతూ పోతుంది. శ్రీ అరవిందులు 'సావిత్రిలో ౪/112[9890066 1౧6 80606 &ఇ౧6 4౬5 & ౪166 8819... తీ 1851 02/6 51690 1౧10 618౧౧0.

భారతీయ సంస్కృతి ఇలా విస్తరించుకుంటూ సోయే లక్షణం కలది. విస్తరణ సహస్ర ముఖమైంది. సహస్రాక్షమైంది. బహుత్వంలోని ఏకబిందువు వైవిధ్యాల వైరుధ్యాల “నడిమి సమాధానం.

సంస్కృతి ప్రకటన జీవనంలోని ఉన్నతోన్నత స్తరాలలో ఉదాత్తతరంగా (ప్రకటితమవుతుంది. ట్రీతి ప్రకాశకమై కళాస్ఫజనలో - సంగీత, శిల్ప, చిత్రాలలో స్పుటమవుతుంది. వాబ్బయరూవంలో అది అతిన్ఫుటతరమవుతుంది. త్రివురా మహిమృస్తోత్రంలో 'మహాసౌందర్యార్షన మంథనోదృ్భవ సుధాప్రాచుర్య వర్జోజ్వులమైన త్రిలోకనిలయమైన, జ్యోతిర్మయమైన వాజ్బ్యయము నా చిత్తంలో న్ఫురించుగాకయని ('ప్రార్ధింపబడిందీ వాబ్బయం, సూర్యోదయవేళప్పటి జపాపుష్పకాంఠి ఆవాగ్దేవత శరీరమనీ వర్ణింపబడింది. ఉద్యద్భాను వర్ణం అయితే సూర్యజ్యోతి. సౌందర్యార్దవ మంథనోజ్జ్వ్వల సుధ చంద్రజ్యోతి. సూర్యచంద్రుల సమష్టి జ్యోతి ఆంతర రసజ్యోతి. ఇది సాహిత్యానికి ఆత్మవంటిది. రసము ప్రపంచంలోని మానవానుభవముల సుసంగతి. సర్వరస స్వరూపుడైన శ్రీకృష్ణుని సూర్యచం[ద్ర వదనుడుగా శ్రీగోదాదేవి వర్ణించింది. భారతీయ సంస్కృతి 'ప్రజ్బలంతమైన ముఖము వాజ్బయము. ల్ల శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 20వ శతాబ్దంలోని భారతీయ వాబ్బయంలోని ఉదాత్తసంస్కృతి శిఖరాలలో ఒకరు, శ్రీ విశ్వనాథ, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి ఒకే సంవత్సరంలో 1895లో జన్మించారు. విశ్వనాథ రచనా స్థితికి చేరుకునేప్పటికి జాతీయోద్యమం తీవ్రస్థాయిలో ఉన్నది. ఆయన పదేళ్లనాటికి వందేమాతరం ఉద్యమం, ఇరవైయేళ్ళ ('ప్రాయానికి గాంధీ రాజకీయ రంగంలోనికి రావటం, పాతికేళ్ళ వయస్సు నాటికి తిలక్‌ అస్తమించటం, దేశానికి గాంధీ నాయకత్వం వహించటం జరిగింది. జాతీయోద్యమ (ప్రేరణతో ఆంధ్రోద్యమం నూనూగు మీసాల నూత్న యౌవనం నాటికి పుంజుకున్నది. విలియం ఆర్చ్‌ అనే ఆంగ్లేయుడు “ఈజ్‌ ఇండియా సివిలైజ్జా అని భారతీయ సభ్యతను కించపరుస్తూ వ్రాసిన గ్రంథానికి శ్రీ అరవిందులు 1918-21లలో భారతదేశ సంస్కృతి మూలాలు అనే వ్యాసపరంసర దేశీయుల స్వాభిమానోద్దీపకంగా రచించటం జరిగింది. విశ్వనాథ విద్యాభ్యాసం, రచనా భ్యాసం ఆంధ్రసంస్కృతి వికాసకేంద్రమైన మచిలీపట్టణంలో జరుగటం వలన అక్కడి చైతన్యమంతా ఆయన చేతస్సును తీర్చిదిద్దింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముటూరి కృష్ణారావు, చెళ్ళపిళ్ళ కార్యీఫ్తుతురి 65

వెంకటశాస్త్రి హరినాగభూషణం, కానుకొలను ట్రివిక్రమరావు (తరువాత సన్యసించి కుర్తాలం ప్రథమ పీఠాధిపతి శ్రీ విమలానందభారతీ స్వామి అయినారు) మొదలైన మహామహుల భావ ప్రాబల్యం ఆవరించి ఉన్నది. చరిత్ర అంటే ప్రాణం, జాతీయత అంటే ప్రాణం, సంస్కృతి అంటే ప్రాణం - సర్వమూ ఉద్విగ్నమైన మనస్సు.

ఆ ఉద్విగ్న చిత్రంలో నుంచే పెల్లుబికాయి ఆంధ్రపౌరుషము, ఆఅఆంధ్రప్రశస్తి, అవతార పరివర్తనము మొదలైన రచనలు. ఆంధ్రులలో ఉన్న దివ్యదీక్షాస్సుర్తిని వెలికి (తోసిందీకావ్యం. ఆంధ్రప్రశస్తి పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషికా రత్నగాధా పద్యావళితో నిండింది. దీనిలో మహా ప్రబంధ రచనా సౌందర్యపున్‌ వాసనల్‌ తీపై 'క్రమ్మినవి.

కొండవీటి పాగ మబ్బులు కవికి ఆత్మీయతను సంక్రమింపజేస్తాయి. దేశంలో మట్టీ, నీరు, వాయువు అన్నీ ఉద్విగ్నపరచే వస్తువులే.

నా ప్రాణములకును నీ పొగమబ్బుల

కేమీ సంబంధమో ఏనుగూడ

పొగమబ్బునై కొండచిగురుకొనలపైన

బురుజులపైని, కొమ్ములకు పైని

వాలిపోనో మధ్య బ్రీలి పోనో నేల

రాలిపోనో గాలి తేలిపోనా

కవి ఎంత ఐలిదానం చేయదలచినాడో పై పద్యం నిరూపిస్తున్నది, పూర్వ రాజ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరము చలించి పోతున్నది. చిత్తవృత్తులు ఇర్ధమవు

'ఈ పొంగెత్తిన వంశధార మరి యిల్లే పొంగులై పొంగులై

నా ప్రాజమ్ములు దేహమున్‌ జలము లోనన్‌ ముంచుకోనిమ్ము"

అన్వకంత్రతా నియతమైన ఈ బ్రతుకు తనకకృరలేదు. అందుకే ఆ (గ్రంథాన్ని శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మకు అంకితం చేస్తూ - 'హృదయ గీరికనో ఈ విధంగా “ఆంధ్ర (ప్రశస్తి ఒక విషాద గీతిక బెతున్నది.

తిలక్‌ అస్తమించినప్పుడు గాంధీ ఆస్థానంలోకి ఆగమించినప్పుడు విశ్వనాథ, ఆయన జంటకవి కొడాలి ఆంజనేయులు ఇద్దరూ కలసి అవతార పరివర్తనమనే నాటకం

వ్రాసినారు. అయితే అది కొడాలి వారి రచనగానే ప్రదర్శింపబడేది. కొన్ని ప్రదర్శనల తరువాత దాన్ని (ప్రభుత్వం నిషేధించింది. ఆ ప్రతి మళ్ళీ యిప్పుడు లభించటం లేదు - ప్రభుత్వం స్వాధీన పరచుకొన్నది.

విశ్వనాథ పారివారిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అప్పుడు శిథిలమై ఉన్నాయి. ఒక సందర్భంలో శ్రీ కొడాలి ఆంజనేయులు అంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు లేకుంటే విశ్వనాథ - “మహాత్ముని అసిలేని సేనలో పడిపోయే వారో, అసిగల సేనలో సాగిపోయేవారో చెప్పజాలమూ అని.

ఈ స్వాతంత్ర్య అభిలాష విశ్వనాథకు రక్తనిష్టమైంది. జీవితంలో ఎక్కడా రాజీ పడలేదు. తలవంచలేదు. చేయిచాచలేదు. . ఇంకా కొంచెం లోతుగా ఆయన రచనా ప్రపంచంలోకి ప్రవేశిస్తే శైలి, రీతి పదబంధము పద్య విన్యాసము, కథా నిర్వహణము, ప్రతీక కల్పనము, జీవలక్షణనిరూపణము అంతా సర్వతంత్ర స్వతంత్రమైంది. ఆయన చేతిలో ఇతిహాసంగాని, స్మృతి కావ్యంగాని, సందేశకావ్యంగాని, ప్రజయకావ్యంగాని, ప్రబంధం కాని, దేశికావ్యరూపాలు కానీ, నవలలు, కథలు, నాటకాలుగానీ అన్నీ ఆయన స్పర్శలో పూర్వ నిర్దిష్ట నియతరూపాన్ని కోల్పోయాయి. కొత్తరూపాొన్ని సంతరించు కున్నాయి. పాశ్చాత్య ప్రక్రియలు చాలావరకు భారతీయ మూర్తిమత్తాన్ని పొందించుకొన్నాయి.

ఈ సర్వస్వతంత్ర దృష్టి మన స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం కాదనే తీర్పు నిచ్చేదాకా సాగింది.

ధృతి మన్నించి పరాయినాడు తన దారిన్‌ తాను పోగా - నము

న్నతి స్వాతంత్ర్రము వచ్చిపడ్డ దనుకొన్నన్‌ వానిదే విచ్చి -

స్వాతంత్రోత్తర కాలంలో కలిగిన నైరాశ్యం తొలుదొల్తనే ప్రకటించిన వాడు విశ్వనాథ. 'వల్లభమంత్రి నవలలో ఈ విషయం విశదంగా చెప్పారు -

స్వాతంత్ర్యము వచ్చిన తరువాత దేశములో మరల మార్పులు తేవలసిన వారు రాజ్యాంగ వేత్తలు. సంస్కర్తలునైన రాజ్యాంగదక్షులు. వారు కూడా ఆంగ్లరాజు పన్నిన నీతి వలలో చిక్కుకొన్న పిట్టలే. . . . అతడు తెచ్చిన మార్పులను తొలగించి మరల జాతీయము అయిన సంస్కారములు ప్రవేశపెట్టుటకు, నేటి రాజ్యాంగ దక్షులకు కావలసిన సాహసము లేదు. పరమ జాతీయాభిమానము లేదు. తొలుత సంప్రదాయముల యందే వారికి విశ్వాసము లేదు. (పే. 66) కర్తుం లా

విశ్వనాథకు మతం ముఖ్యం ఎప్పుడూ కాలేదు. దాన్ని పరమార్థంగా ఆయన ఎక్కడా ముందుకు తేలేదు. సంస్కృతి అంటే మతం కానే కాదని ఆయన భావించారు.

'మా మతమున దేవుడున్నాడని కాదు, ఆదేవుడుండనిమ్ము చావనిమ్ము

సర్వమయిన నృష్టి యందును ప్రాణము, జీవము, ఆత్మ కలకల

లాడుచున్నదని మా వూర్వబుషులు చూచిరి. నర్వవస్తుగత

(ప్రాణమును నమారాధించిరి. అంతకన్న భూతదయలేదు* (వేయిపడగలు) పైన చెప్పిన సంస్కృతి భావన దేశంలో దృఢంగా నెలకొనవలసి ఉన్నది. పాశ్చాత్యుల సాంస్కృతిక సామ్రాజ్యవాదం (కల్చరల్‌ ఇంపీరియలిజం) కు విరుద్ధంగా అవిశ్రాంతంగా పోరాడటం విశ్వనాథ సాహిత్య సృజనకు నిర్దేశించుకున్న లక్ష్యమైంది. ఎందుకంటే సంస్కృతి పునరుత్థానం చెందితేనే దేశం స్వచేతనను అవికలంగా నిలుపుకోగలుగుతుంది. దేశీయ ఏకతాభావన సంస్కృతి వల్ల నిలిచిందే గాని రాజకీయాధికారం వల్ల కానేకాదని మన చరిత్ర చెప్పుతున్నది.

అయికే విశ్వనాథ తనకాలం నాడు సంస్కృతి పునరుత్థానంలోని ఒకానొక ధోరణిలో ప్రాచీన సంప్రదాయాల్ని కొన్ని ఆచార వ్యవహారాలను కాలం చెల్లిన నాటిని సమర్థించి ఉండవచ్చు. అది ఆ కాలపు స్థితిమాత్రమే. వివేకానందులు, గాంధీజీ తిలక్‌ మొదలైనవారి భావమార్గంలోనూ ఇలాంటి అంశాలు గోచరించటం కద్దు.

సొమాజికంగా విచారించినప్పుడు దేశరూపానికి గ్రామం అతి చిన్న అంశమైనట్లు, కుటుంబవిషయంలో దాంపత్యం మౌలికమైన అంశం. ఈ రెందూ భద్రంగా ఉండటం సమాజస్టితికి హేతువవుతుందని విశ్వనాథ భావించటం జరిగింది. గ్రామం విషయంలో వేయిపడగలు, శార్వరినుండి శార్వరిదాక మొదలైన రచనలు చర్చించగా ఎక్కువ రచనలు దాంపత్యాన్నిగూర్చి- కిన్నెరసాని పాటల నుంచి ఏకవీర, అనార్శలి, నర్తనశాల, చెలియలికట్ట, గిరికుమారుని (ప్రేమగీతాలు, వేయి పడగలు, శ్రీమద్రామాయణ కల్చవక్షము యింకా ఎన్నో చర్చించాయి. 19వ శతాబ్దంలో ప్రారంభమయిన సంస్కరణలు (ప్రధానంగా ఈ వ్యవస్థను చకృదిద్దేందుకే వచ్చాయి. కాఠిన్యం వల్ల, దురాశవల్ల, ఆల్మీయతా రాహిత్యంనలన వివాహవ్యవస్థ నిర్జీవమై సమాజం యొక్క వివిధ ఆధిపత్యరూపాలకు లొంగి ప్రవర్తింపవలసి వచ్చింది. 68 నువుస్సు

త్రి

నాడు వివాహవ్యవస్థకు విరుద్ధంగా క్రొత్తగా వచ్చిన (పేమ సిద్ధాంతాలు స్వేచ్భాకామధోరణి దేహనిష్టమైనదే కాని భావనిష్టమైనది కాదు. జీవితం కేవలం వదో పార్వానికి పరిమితమై సాగలేదు. రెంటి సమన్వయం అవసరమే.

కల్పవృక్షంలో రావణుడు సీతాదేవితో, శూర్చణఖ రామునితో ప్రవచించిన స్త్రీ పురుష సంబంధం ఇలా ఉంది.

ఒక సెలయేరు వంటిది నితోత్స్చల లోచన, యౌవనంబుబో

రుకలుగ వచ్చి పోనికొను రాక్షతరంగ తురంగ వంక్తి, యా

గకయును సొమ్ము చేని కొనగావలె మన్మథ రాజ్యలక్ష్మీ"

ఏ నన్యాసియొ పెండ్లియాడు నిక వాదేయంచు కూర్చుందు రా

వో నంసార వయోధి భద్ర తరులౌ అంభోజనేతల్‌

భూతము గూర్చి అద్ది అనుభూతముకాదని దుఃఖమేటికిన్‌

టీతిగ వర్తమానము భవిప్పము చేతికి జారకుందగా

జూతము - మూదు లోకములుచొచ్చిన కాలువ యొద్దునన్‌ నమా

నీత మవోగ్నిభూత ధమని ప్రకటావఘనాభిలావలన్‌

లోపల దాచిపెట్టెిదరు లోకమునందున కోర్టులెల్ల తీ

లీ వరమంవు గోవన మొకించుక నింద్రియ ని[గ్రవాంబుకాదు

కదకున్‌ సర్వజనువ్ఫులాభిముఖ రేఖా వచ్చివానందమొ

తృుడె యీ తక్షిన నెల్ల కల్పనలవో, కామంబు తన్నార్గమూ

ఇలా స్వేచ్భా కామ సంచరణమే స్రీ పురుష సంబంధ పరమార్థంగా ప్రపంచింప బడే స్థితి కానవచ్చింది. సాహిత్యంలో దీన్ని ప్రతిపాదించే రచనా ప్రపంచం విసృతంగా ప్రసారంలోకి వచ్చింది. దీన్ని ప్రతిఘటించే ఒక సాంస్కుతిక భావ సిద్ధాంతాన్ని కులపాలికా ప్రజయంగా విశ్వనాథ ఆధునిక కవిత్వంలో ముందుకు తీసుకువచ్చారు. ఈ భావంలో స్థిరత పొందేందుకు ఆయన పొందిన వేదన యింతా అంతా కాదు.

“ఒక మవో నంన్ముతి ఫలంబు నొందువేళ

తలతు నామె నాకాలి నంకెల యటంచు

ఒక మవోానంస్క్యృతి ఫలంబు నొందువేళ

మచ్చిరస్థ వూజూ కుసుమంబుటంచు” _ (గిరికుమారుని (ప్రేమగీతాలు 64) కార్యర్తుమురి రం

సమకాలంలో త్రోసుకువచ్చిన సంస్కృతుల సంఘర్షణలు ఈ విధంగా సమాజాన్ని అతలాకుతలం చేశాయి. అయితే తన జాతీయ సంస్కృతిలోని మేలిమిలోనికి ప్రవహించి కవి తన భార్యను పరమస్థితిలో నిలిపి పూజార్షగా భావన చేస్తున్నారు.

(నవనవ సరస్వతీ యమునా భగీర

ధాత్ఫజావేణికా వూత యగు ప్రయాగ

వోలె సత్వరజన్తమో భూరి గుణ న

నాధ శాంకరి వోలె నందగిలె దీవు (గిరికుమారుని (ప్రేమగీతాలు 100) విశ్వనాథ ప్రపంచించిన ప్రణయం సామాజిక వ్యవస్థను నిలిపేది. దానిలోని నిర్బంధాలు తొలగించేది.

ఆయన రచనలనిండా సామాజిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వ్యవస్థను నిలబెట్టే స్త్రీ పుంసయోగమే ప్రపంచితమైంది. వ్యవస్థ కాఠిన్యానికి కిన్నెర బలియైతే - పురుషుడూ (్రేమ విహ్వలుడై రాయైనాడు. ఏకవీరలో (క్రేమకు వ్యవస్థకు సమన్వయం కుదరకపోతే జీవితాలు అసుఖభాజనాలైనవి. కిన్నెరసాని వ్యవస్థనించి బయటపడి వేరే రక్షణ లేక స్వతంత్రించి తన వ్యక్తిత్వాన్ని పెంచుకొని భద్రాచలరాముని వద్ద భక్తులకు సేవచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్నది. ఆత్మహత్య చేసుకోలేదు. నర్తనశాలలో (ద్రౌపది తనకు తాను రక్షించుకొన్నది. అనార్మలిలో రాచరికపు కట్టుబడులకు బలైంది. చెలియలి కట్ట దాటిన రత్నావళి తిరిగి తిరిగి జీవిత పరమార్థాన్ని గ్రహించింది. ఆమె మళ్ళీ సముద్రంలోకి చేరటంతో ఒక “సాహసి వలయం పూర్తయింది.

వేయిపడగలలో అరుంధతీ ధర్మారావులు, కిరీటి శశరేఖలు దాంపత్య జీవితపు రెండు ధన్యచిత్రాలు. గిరిక తపస్సుతో ఆండాళ్‌ మీరాలవలె ఈశ్వర సాన్నిధ్యం చేరగా, మంగమ్మ అధోగతియై పాఠాళాన్ని ముట్టింది - అర్ధకామ వాంఛలతో. అయినా చివరకు పశ్చాత్తాపం పొందింది.

“'భార్యాత్మము కేవల పురుష సంపర్కం మాత్రమే కాదు. స్రీ పురుషుల చిత్తాలలో కరిగి ప్రవహించే మోహవాపొనులకు దంపతులు చెరొక ఒద్దులై, ప్రవాహాన్ని ఒద్దికగా గట్టు తెగకుండా, ఇతరుల క్షేత్రాలను ముంచకుండా చూస్తారు. ఈ ప్రవాహము క్రమంగా నిర్మలమై, దేహవాంఛలను మోక్ష సాధనాలుగా పర్యవసింపజేస్తుంది?. ఇది దీని లక్ష్యం అని సీతాదేవి దాంపత్యాన్ని వ్యాఖ్యానిస్తుంది.

అకలుషమైన (ప్రకృతి అంటే విశ్వనాథకు (ప్రాణం. మానవ జీవితంలో అకలుషమైన వ్యవహారం దాంపత్యంగా, ధర్మమయ జీవనంగా సాక్షాత్మరిస్తే, ప్రకృతి కూడా అకలుషమై కోకిలమ్మ పెళ్ళిలో, కిన్నెరసాని పాటల్లో దర్శనమిస్తుంది.

ఇెదురులో ముత్వాలపేదులు, కదురులో దారాల బట్టలు

ఎదురుగా నెల పొడిచినట్లే వవు మీరేదోయ్‌

దొంగ నాగరికతలో దేశం కూలిపోలేదోయ్‌

ఉన్న వాళ్ళకు ఎంతనేలా దున్నుకుంటే చాలుతుందో

మించి ముట్టరు కూడ ఫైనా చిన్న చెక్కయినా

మిగిలిన ఆదవలు, కొందల కెగురుతూ, మభఖ్బులకన్నెల

తగులుతూ, తరిలోన వానలు కురున్తూంటాయోయ్‌

అందరికి కావలనినంతా వుంది ఎవ్వరితోడ నేవరికి

ఎన్నడూ చూడలేమన్నా చిన్ని తగవైనా”

ఇదీ ఆయన కోరుకున్న ప్రకృతి స్వరూపం. సమాజ స్వరూపం. వికృతి పొందని జీవనం అందుకే ఆయన నవలల్లో ప్రకృతి కథతో పాటు, పరవశిస్తూ, కన్నీరు కారుస్తూ తానే ఒక (ట్రేరకద్రవ్యంగా, మూలమైన పాత్రగా సాక్షాత్కరిస్తుంది.

వేయిపడగలలో పసరిక అభావానికి రూపు కట్టించిన పాత్ర. వేదం 'ద్యౌశ్ళాంతి రంతరిక్షగ్‌ం శాంతిః మొదలైన మంత్రంలో పంచభూత ప్రకృతి అంతా విళ్లధం కాకుండా, వైక్షబ్యం పొందకుండా ఉండాలని కోరుకోవటం జరిగింది. అవికలితంగా ప్రకృతి నిలబడితే మనుష్య జీవితం శాంతిమయంగా త్రివిధ తాపాలకు దూరంగా రూపొందుతుంది.

పసరిక మరణం ప్రతీకాత్మకంగా ప్రకృతి నించి చాలా దూరం పోయి నాగరికత పేర సంక్షోభం పొందుతున్న మానవుని జీవనాన్ని వ్యక్తం చేసింది. పరపీడన పరాయణుడైన సభ్యత అంతటినీ అస్తవ్యస్తం చేసింది.

నాగరికతలో అర్థకామవ్యవస్థ సహజస్థితిలో, సమతులదశలో ఉన్నప్పుడు రాజ్యవ్యవస్థ కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. ఇక్కడ వ్యవస్థ పతనమై పోయినంతలో - రాజ్యవ్యవస్థ, ప్రజలనైతిక వ్యవహారమూ పతనం అవుతూనే ఉంటాయి. 'రాజు అన్న కథలో ఈ విషయం విశ్వనాథ స్పష్టీకరించారు. బుషులు తపస్సు చేత ఊర్థ్యముఖ చైతన్యంతో - (బ్రహ్మ పదార్థంతో అనుసంధించుకోగా రాజులు భూమితో అనుసంధించు న.

కొంటూ వచ్చారు. ఈ ఇరువురినీ ధర్మం అన్న జ్యోతీరూప మనఃస్తంభం - అదే శివుడన్నా శ్రీ నారసింహుడన్నా పరమాత్మ అనుసంధించుకొన్నది. ఈ అనుబంధం లేనప్పుడు ధర్మం సార్వజనీనత, సార్వకాలీనత కోల్పోయి తాత్కాలిక, తత్తద్వక్తినిష్టమై సంకుచితమవుతున్నది. సమాజం దుఃఖాభిముఖమవుతున్నది. శకలితమవుతున్నది విభక్తమవుతున్నది. అందువల్ల ఆత్మహత్యాభిముఖమవుతున్నది. డ్తే

విశ్వనాథ సాహిత్యరంగంలోనికి వచ్చేప్పటికి సాహిత్య శాస్త్ర ప్రమాణాలు తొలిగిపోతూ పాశ్చాత్య సాహిత్య ప్రమాణాలు వాటిస్థానాన్ని ఆక్రమిస్తూ వున్నవి. వ్యస్తంగా కల్పనను, నూత్నత్వాన్ని మెచ్చుకోవటం, కావ్యం నుంచి విడదీసి పొత్రచిత్రణమనీ, స్వాభావిక చిత్రణమనీ, వైవిధ్యమనీ, అలంకార రాహిత్యమనీ ఇలా ఎన్నో నూతన సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. నూతన వస్తు నిర్మాణం (ప్రశంసాలక్షణమయింది.

అంతయొ యింతయో తెలినీనట్టి విమర్శకుడైన కావ్యనీ

ద్ధాంతుల యొత్రిడింబడి మవోకవి నాగటిచాలు తీర్చు, కా

లాంతర క్తీర్తి వృష్టిగతమై చను లాభము నెంచుచున్‌ లలా

టంత వరోక్ష చింతన నటన్నధుభారతి నన్వ ధారణీనొ

కావ్యం తాత్కాలిక ప్రయోజనం కలదికాదు. కాలాంతర కీర్తి వృష్టిగతమైందని లాభం కలది కావ్య సిద్ధాంతుల ఒత్తిడి దీన్ని తీర్చిదిద్దుతున్నది. తన కావ్యం అందుకే 'సర్వధర్శముల బీజము.

సద్యః ఫలదాయకం కాని కావ్యరచన ఒక తపస్సు వంటిది. తపస్సు ఉన్మనీ రోచిస్సులను లోకం మీదకు (ప్రవహింపజేస్తున్నది. కవిత్వంలోకి ప్రసరించేస్తున్నది. అందుకే కవికి ఏ పరిమితీ చాలలేదు. ముక్తకాల దగ్గరినుంచీ, ఇతిహాసాలదాకా నిర్మాణం చేశాడు. అన్ని ప్రకియలను అభ్యాసవశం చేసుకున్నాడు.

పాశ్చాత్య (ప్రక్రియల పరిమితులను మార్చి నూతన రూపాన్ని అందించాడు. స్మృతికావ్యం నిత్యమైన ఈశ్వర చింతనలో పరిసమాప్తమైంది. దూతకావ్యం భార్యాభర్తల పునస్సమాగమంతో పూర్తయింది. వేయిపడగలు చనిపోయినదనిపించిన భార్యాభర్భ వ్యవస్థను పునరుజ్జీవింపజేయటంతో పూర్తయింది. సంగీత రసానుభవాన్ని, దేవీ ఉపాసనను ఆత్మకథాత్మకంగా మోయు తుమ్మెద వ్యాఖ్యానించింది. (భ్రమర వాసిని శ్రీవిద్యానిగూఢ రహస్యాన్ని అతివిలక్షణంగా వ్యాఖ్యానించింది.

'అవిజ్ఞాతైః కైళ్చీత్సరవిషయ కావ్యబ్రియమతి

(వగత్ష్రాః వూర్వాలంకృతి కరణమార్ణే ప్వచరితైః

యశో నన్నార్య స్యాక్రియత కలుషీభూత మధునా

వున నృంజాతోవాం కృత కలుషనిష్టాననవటుః

అస్మిన్‌ కొలే బవుతర వరిభఖ్రాతి నంమగ్నవచేతాొః

లోకన్స్ఫమ్యజ్బునన చరణాపేత శీలే నివిష్టః

ఖావై రన్వైశ్చు చరమదిశాంధ్యోద్లతైః లుత్త దృష్టిః

కోవా తస్షిన్‌ ప్రభవతి వున సా శ్చాంజసాకల్పనాయ”

ఇది నన్నయ్యగారి ప్రసన్న కథాకలితార్థ్ధయుక్తి (1949) నాడు విశ్వనాథ ఆత్మ విశ్వాసంతో ప్రకటించిన అంశం.

రసదృష్టి పోయింది. భావ శబలతాదులు తొలగినాయి. అలంకారాలు బరువు సొమ్ములయినాయి. మిగిలింది వస్తువు వస్వైక దృష్టి - తాత్కాలిక జీవన సమస్యలు కావ్య వస్తువులుగా నియమింపబడుతూ వచ్చాయి. కావ్యం స్థానంలో కవికి ప్రాధాన్యం పెరిగింది.

శీలము (పాత్ర చిత్రణము) కవి జీవిత ఫలనము మొదలైన నూతనాంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఖండకావ్యాలు విజ్బంభించాయి. మహాకావ్యాలకు స్థానం పోయింది. ఇలాంటి స్థితిలో మళ్లీ “అతిదేవ గురుమతి ప్రతిభులైన అభినవ గుప్తాదుల మార్గాన్ని! విశ్వనాథ ఉద్ధరించవలసివచ్చింది.

విశ్వనాథ విమర్శనంలో వెలయించిన నూతనాంశాలు “రసము వేయి రెట్లు గొప్పది నవకథాదృతిని మించి" - “లోకమ్ము వీడి రసమ్ములేదు' - “అక్షరముల కూర్చు నుండి మవికావ్య నిర్వహణందాకా వ్యాపించి ఉన్నది శిల్పము'- అంగాంగ సంయోజనము

  • 'మహాకావ్య పరమార్థము' - 'అంతఈకరణ స్వరూప విచారము - “పద్యవిద్య' - “కథా కథనశిల్పము”. ఇలా ఎన్నో అంశాలు అవిదితంగానైనా తరువాతి విమర్శకులను రసమార్గం వైపు ప్రయాణించేటట్లు చేశాయి.

కావ్యమును, కావ్యనిర్మాణాన్ని, కావ్యానుభవాన్ని పరమార్ధంతో అనుసంధించటం విశ్వనాథ చేసిన మరొక విశిష్టమైన అంశం. అది కావ్య హేతువుగా 'జీవుని వేదనిను నిరూపించటం. పరమేశ్వర భావం నుండి నిర్ముక్తమైన జీవచైతన్యం మళ్లీ అనేక జన్మలతో, కర్మలతో ఆత్యంతికంగా ఆ స్థానాన్ని చేరేదాకా పొందే వేదన అది. చివరి ఘట్టం దాకా శాష్ళట్టతుత లాలన

అది అవిదితమైందీ. చివరి ఘట్టంలో అది విదితమవుతున్నది. అక్కడి నుండి జీవుని యాత్ర సులభమవుతున్నది. కావ్యశాస్త్రానికీ అలంకార శాస్త్రానికీ ఈ భావన ఒక బంగారు సేతువును కట్టింది. ఆధునిక సాహిత్యంలో 20వ శతాబ్దంలో మహామహితుడైన విశ్వనాథ కుండరీంద్రుండు తన్మహనీయస్థితి మూలమై నిలువి అన్నట్లు మొత్తం సాహిత్యానికే ఆధారమై నిలిచినాడు. 1982లో పోతన వంచశతి ఉత్సవాలలో నంగోక్సీ కార్యక్రమాలలో కీలకోపన్యాసం చేస్తూ శ్రీ పి,వి. నరసింహరావు మనం అందరం రాజకీయరంగంలో దేశస్వాతంత్ర్యం కోసం పోరాడుతూ వుండగా విశ్వనాథ సత్యనారాయణ గారు సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు అని అన్నారు. ఆయన సాగిస్తూ వచ్చిన పోరాటం యింకా కొనసాగుతూనే ఉన్నది - విజయాభిముఖంగా. (2005 మార్చి 24,25 లలో కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వపొంచిన “ఆధునిక తెలుగు కవిత్వం - భారతీయ నంస్ఫృతి' నంగోస్టిలోని బ్రనంగవతం) 74 సుఫుస్ను

గిరి కుమారుని ప్రేమగీతాలు కులపాభికా ప్రణయం

విశ్వనాథ సత్యనారాయణ రచించిన గిరికుమారుని ప్రేమగీతాలు - అత్యంత మధురమైన (శ్రేమగీతాల సంపుటి. 1920-28 మధ్యకాలంలో కాల్చనిక కవిత్వంలో 'ప్రణయకవితాశాఖ పుష్పించి ఫలిస్తున్న కాలంలో విశ్వనాథ సృజన శీలంలోనుంచి వెలువడిన (ఢమ కవితాగ్రంథం ఇది. ఆనాటి ఖందకావ్యాల్లో అనేక సందర్భాలలో ఢేమ - స్రీ పుంనయోగము ఇవి ఆయన వస్తువులు. వైరాగ్యము, నన్యాసము ఎప్పుడూ ఆయన కవితలో ప్రాధాన్యం వహించలేదు.

1920-80ల నదుమ ఆయన రచనా (ప్రపంచం వైవిధ్యభరితమైంది. ప్రక్రియా వస్తుపరంగా, ఆంధ్రప్రశస్తి, నర్తనశాల, అనార్మ్భలి, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి - నరే గిరికుమారుని (పేమగీతాలు కూడా. వీటిలో ఆంధ్రప్రశస్తి తెలుగు వారి చరిత్రకు మణిగోవురాలను సమకూర్చగా, కోకిలమ్మ పెళ్ళి సంస్కృతాంధ్ర భాషావరిజామాలను నినర్గ్షనుందరమైైన తెలుగు సౌందర్యాన్ని ప్రతీకాత్మకంగా వెల్లడించింది. నర్తనశాల అధర్మకామాన్ని తిరస్కరించిన నాటకమైంది. నిజమైన ప్రేమ

  • దాంవత్యం అధికార పరిమితులవల్ల ఎట్లా శిథిలమై నశించిందో అనార్శలిలో, కుటుంబవ్యవస్థలోని క్రార్యం దాంవత్యానికి ఎలా భంగం కలిగించగలదో కిన్నెరసాని పాటలలో వ్యక్తమైంది. అనార్మలిలో (ప్రేమ ఎంత అమలినమైనా, ఆధ్యాత్మిక చరమసీమలను న్పృశించినా అది అక్బరు రాజ్య అభిజాత్య గర్వం వల్ల, క్రూరంగా అణగద్రొక్కబడ్డది. కిన్నెరసాని పాటలలో వివాహము కూడా కుటుంబం పెట్టే బాధలవల్ల (వ్రతీకాత్మకంగా అత్త) - సుఖాన్ని అనుభవింవనీయలేదు. ్రేమ పారమ్యాన్ని ముట్టనీయలేదు నాయకుడు స్తబ్బుడై రాయైనాడు. నాయిక దుఃఖంలో కరిగి నీరై వారై వ్రవపొంచింది.

వివాహము - (పేమ - దాంపత్యము - వ్యవస్థ నిరంకుశలక్షణం వీటి మధ్య పరిష్కారం సాధించడం ఆనాటి కాల్పనిక సాహిత్యరచయితలకు, కవులకు కార్యఫుముతి 75

ముఖ్యంగా రాయప్రోలు, కృష్ణశాస్త్రి, చలం, విశ్వనాథ, బాపిరాజులకు పట్టింది. రాయహ్రోలు ప్రణయాన్ని భావుక ప్రపంచంలో నిలిపి అమలిన శృంగారం అన్న అనాచరణీయమైన సిద్ధాంతాన్ని ప్రపంచించగా, కృష్ణశాస్త్రి మానుష జీవనంతో అన్వయించకుండా స్వేచ్చా ప్రజయ సిద్ధాంతాన్ని ఆమోదించగా మిగిలిన ముగ్గురు రచయితలే సామాజిక చింతనలో నేల మీదకు దిగి ఈ సమస్యకు తమ తమ పరిమితులలో సమాధానాలు అన్వేషించారు. బాపిరాజు, విశ్వనాథ యించుమించు ఒకే భావనకు బలం కలిపించినా, చలం నవలల ద్వారా కథ ద్వారా వివాహాతీతమైన సామాజిక వ్యవహారాన్ని భావన చేసినాడు.

భారతీయ జీవన వ్యవహారంలో పారలౌకిక దృష్టియే ప్రధానమని, లౌకిక దృష్టిలేదనే ఇటీవల జరిగిన ప్రచారం సత్యం మీద ఆధారపడ్డ వ్యవహారం కాదు, “జీవేమ శరదశ్ళతం, నందామ శరదశ్శతమ్‌ ప్రబ్రువామ శరదశ్ళతమ్‌' అన్ని వేదభావన మొత్తం ఈ లోకంలోని శ్రేయన్సును (ప్రధానంగా చేసుకొన్నదే. విశ్వనాథ అనాటి ఖండ కావ్యాలను చూస్తే లౌకిక జీవనం మిద ఎంత రక్తి ఉన్నదో తెలియవస్తుంది. “సన్యాసి” అన్న ఖండికలో (భష్టయోగి) జూ

“మధుర దరవోన చంద్రికా నుధ తారంగు

కామినీ న్నిగ్ధగండ భాగమ్ములాను

కవ్వురవు కమ్మతావుల కావిమోవి

బీటు వడ నీకు వైరాగ్య వృత్తియేల?”

(ఢేమ జీవన సౌభాగ్యం నన్యాన జీవనం కంటే ఎంత ప్రియం కలిగిస్తుందో దీనిలో వెల్లడించటం జరిగింది. 'రంభి అన్న ఖండకావ్యం (వైతాళికులలో ఉన్నది) ఇదీ వైరాగ్యవృత్తికి వ్యతిరేకమైనదే.

మొత్తం మీద ఆనాటి కవుల రచనల్లో (ప్రేమ పారమ్యం, స్తీ పుంసయోగ జీవనం ఎలా ఆనందమయం చేయవలసి ఉన్నదో వివరించింది. 'తీయని త్రోవి అన్న ఖండకావ్యంలో-(భష్టయోగి)

'ంగరుతీవ విల్‌చెఐకు నంబి 'రస్మార్ధమనోజు ఖావనా

నంగతులైన మావ్రణయ దంవతులుండిన వూవుటీరవున్‌

చుంగుల నుత్తరీయమును సోకుగ గవ్పిన రీతి వేణికా

భంగము తీర్చె నొక్కు సెల పాయలు పాయలు గాగ తీర్చుచునో 76 న సుుస్ను

ఈ విధంగా వ్రణయోద్విగ్నమైన ఆనాటి కవిత్వంలో స్పష్టంగా కానవచ్చే మూడు పాయల లక్షణాలను న్పష్టంగా తెలునుకొందాము. అమలిన శృంగారము:

  1. వయస్సులో ఉన్న స్రీ పురుషులు కామ దూషితం కాకుండా (క్రేమానుబంధం

నిలువుకోవటం ఈ లక్షణం.

“స్నేవానురత వాత్సల్వముల్‌ జీవితమున

(మేమ కంగంబులగు అంగి(ప్రేమ యొకదె

(పేమ శిఖరావరోవాణాభిజ్ఞులైన

మృదు నవ్యాదయుల కివియెల్ల మెట్టులగును”

ఈ భావానికి మూలం రాయప్రోలు 1918లో రచించిన తృణ కంకణంలో ఉన్నది. చెలికాడు తన చెలిమికత్తె వేరొకరితో వివాహమై దూరమైతే పొందిన వ్యధను తొలగించటం కోనం ఆమె చేసిన (ప్రేమభావ విస్తారమే ఈ సిద్ధాంతానికి వునాది. కామ న్పృష్టి లేకుండా యువకులు స్నేహంతో జీవించవచ్చునన్నది ఈ సిద్ధాంతం తాత్పర్యం.

ల స్రీ వురుష నంబంధం తల్లి, భార్య, చెల్లెలు, బిడ్డ అన్న నాలుగు దశల్లో ఉండవచ్చును. అయితే మూడు అనుబంధాలలో కామ స్పర్శ ఉండదు. ఒక్క సహచరి సంబంధంలోనే అది ఉంటుంది. ఆయినా క్రమోన్మీలనంలో భార్యభర్తలు నడుమ కామభావం పలుచబడి, పాముకుబునం విడిచినట్లు దాన్ని విడిచి అమలినంగా జీవించవచ్చు. క్రమంగా సృష్టి ఆంతా ఈ అన్పృష్ట కామమైన (ప్రమమయ జీవనంలో మధుర మధురంగా వికసించాలి.

  1. 1949 ప్రాంతాలలో రాయహ్రోలు వారు రచించిన 'రూవ నవనీతం” నాటికి ఈ సిద్ధాంతం క్రమంగా శిథిలమైంది. కామం ఏకాంతంలో స్నేహధర్మాన్ని వాటి ఎలా విజ్బృంభించగలదో ఈ నాటకంలో 'ప్రసక్తమయింది. క్రమంగా అమలిన శృంగారం రాధాకృష్ణుల (ప్రేమభావంలోని ఆధ్యాత్మిక ప్రతీకాత్మక స్థితిలోకి సంలీనం అయింది. రాయప్రోలు వారు తరువాత '“రాసపంచాధ్యాయి అనువాదం చేయటం అమలిన శృంగారం గూర్చిన ఆయన పట్టుసడలి పోవటాన్ని సూచిస్తుంది.

కాళ్యత్తుతుతి 77

  1. భోజాదులు ప్రపంచించిన శృంగారంలో ఈ సిద్ధాంతం సంగమించింది. అహంతా రమణం మూలకేం[ద్రం అయింది. భక్తి, వాత్సల్యము, స్నేహము, సురతము అన్నీ ఇందులో సంగమించాయి. అందువల్ల శృంగార సిద్ధాంత పరిధి విన్తరించినా, అది ప్రపంచంలోని (ప్రీతి భావాన్నంతా ఆక్రమించి కొంత నిర్జిష్టతను కోల్పోయింది.

స్వేచ్భా ప్రణయము:;

  1. ఈ సిద్ధాంతం వెనుక (ప్రధానంగా కామము, దాని అభివ్యక్తి రూపమైన (ఢ్రేమ (ప్రాధాన్యం వహించాయి. వివాహ వ్యవస్థ క్రమంగా అనురాగానికి, పరస్పర సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వక సామాజిక స్థాయికి, ఆర్థిక సాంప్రదాయిక స్థితులకు ముఖ్యస్థానం ఇవ్వటం వలన స్త్రీ పురుషుల జీవితం క్రమంగా వ్యధా మయమై , అసవలత పొంది, యాంత్రికమైన ధోరణిలోకి సాగింది. పురుషాధిక్య ధోరణి పెంపొంది నమాన భావన తొలగిపోయి, స్రీ స్థానం క్రమంగా దైన్యస్థితికి చేరటం వల్ల వివాహవ్యవస్థ వట్ల ఒక వ్యతిరేకత వ్యక్తమైంది.

2 దీనివల్ల వివాహానికి అతీతంగా జీవనం స్త్రీ పురుషుల వరస్పర స్నేహం ఆధారంగా సాగవలెనని నూతన జీవనతత్త్వ ధోరణి పెరిగింది. ఈ (శ్రేమ వెనుక ఆకర్షణ ప్రధానమైైనప్పుడు అది స్థిరంగా ఉండదు. భౌతిక జీవన పరిస్థితులలో ఆర్థికమైన ఎగుడుదిగుడుల్లో అన్నీ ఈ (య్రేమలోని సాహచర్య స్థితికి చిరస్థాయిత ఈయలేదు. వైమనస్యం వైరుధ్యం పెరిగిన ఆ స్థితిలో దిక్కులేని నమాజంలో ఆత్మహత్యలు మాత్రమే వరిష్కారమైన స్థితిలో సామరన్యంతోడి జీవనం కోనం మరొక ప్రయత్నం చేయవలసి వచ్చింది.

  1. ఈ స్వేచ్చను పురుషునికి అనుకూలంగా, స్రీ భావచేతనకు వ్యతిరేకంగా కృష్ణశాస్త్రి 'తేటివలవు” అన్న ఖండికలో వ్రకటించాడు. స్వేచ్చా ప్రణయ నాయిక ఎలా జీవన శైథిల్యంలో పడిపోయిందో “మాలపల్లిలో కమలా మోహనుల వృత్తాంతంలో, మైదానంలో రాజేశ్వరి జీవితంలో, చెలియలి కట్టలో రత్నావళి జీవితంలో న్పష్టంగా చిత్రించబడింది. (అమలిన శృంగార సిద్ధాంత వైఫల్యం జ్యోతీ అప్పాదానుల కథలో ఉన్నవవారు బలంగానే ప్రకటించటం జరిగింది).

ాాాాాాాాాాాలాాాాాాాాాాహన్నా

ఈ రెండు మార్దాలకు అతీతంగా సామాజిక స్థాయిలో నుఖజీవన తాత్పర్యంతో బయటకు వచ్చింది. కులపాలికా ప్రణయ సిద్ధాంతము.

కులపాలికా శబ్దం తంత్ర శాస్త్ర సంబంధి. కులాంగనా, కులాంతస్టా, కౌలినీ, కులయోగినీ ఇత్యాదిగా లలితా సహస్ర నామం పేర్కొంటున్నది. కులం అన్నమాటకు తంత్ర శాస్త్రం షట్బక్ర సంపుటిని నిర్దేశిస్తున్నది. ఈ మొత్తం షట్పక్రాలలోనూ సంచరించే కుండలినీ శక్తికి ఈ కులాంగనాది నామాలు వర్తిస్తాయి. బెవచారికంగా ఈ నామతాత్సర్యం - ఆమె పురుషునికి సహచరియైన ఆదిశక్తికి ప్రతినిధిగా శరీరాంతర్వర్తి మైన మహాశక్తికి ప్రతీక. శక్తితో కూడినవ్పుడే శివుడు శక్తిమంతుడవుఠాడు. లేకుంటే అతడు గడ్డిపోచను కూడా కదల్బలేడు అని సౌందర్యలహరి ఆరంభంలో శ్రీ శంకరులు 'పేర్మొన్నాడు.

కులం అంటే కుటుంబము, పరివారము, సమూహము అని అర్ధం ఉంది. సమష్టి జీవనంలో ఉంటూ దానికి సమన్వయ శక్తిగా కేంద్రంగా వ్యవహరించుళుంది. కులపాలిక ఈ భావన లౌకిక జీవనంలోనికి వచ్చినప్పుడు పురుషునితో అభిన్న చైతన్యంగా అతని క్రియాచోదకశక్తిగా ఉండే స్త్రీ శక్తిని వెల్లడిన్తున్నది. త్రీ రామాయణంలో *నహధర్మ్శచరి' అన్నవ్వుడు ఈ తత్వాన్నీ వాల్మీకి నంభావించటం జరిగింది. నవహధర్మం అంటే సాహచర్యధర్మం. ఇది జీవితాంతం నమాన భాగ స్వామ్యంతో నిర్వహింవవలసింది. ఇక్కడ (పేమ వివాహము రెండూ సమంగా, సయోజ్యాలై సాగి పోవలసి ఉంటవి. ఒకరికోనం ఒకరు తవన్సు చేసిన లక్షణం ఇక్కడ ఉన్నది. “నిజ తపఃథలాభ్యాం' అని శివానందలహరి ఆరంభం.

భారతీయ సంన్యతి దృష్టిలో దాంవత్యం ఒక క్లిష్టమైన పరంపరాయాతమైన జీవనం. వూర్వజన్మలు, కర్మలు, సంస్కారము, నసంభావనలు ఇవన్నీ కలగలసి ఈ దాంపత్యం నంభవిన్తున్నది. ఇక్కడ వదో యాదృచ్చికమైన సంబంధంగా ఎప్పుడైనా కలసి ఉండటానికీ, ఉండకపోవటానికీ స్వేచ్చ ఉన్న అంశం కానేకాదు.

దాంపత్య జీవనంలో అనురాగము, అనుబంధము, అరాధనము, ఆర్బణము, అనన నాల్గు ధాతువులు అత్యంత ముఖ్య సన్నివేశాలు. క్రమంగా జీవన సాధనంగా వరస్పరం సంలీనమై ద్వైతాన్ని అద్వైతంలోనికి పరిఐమింపజేసికోవటం ఇక్కడ (వ్రయత్నసాధ్యమైన లక్ష్యం. ఒకరికొరకు ఒకరు ఒదిగిపోతూ, ఓర్చుకుంటూ, ఒవ్వుకుంటూ ఒరసికొంటూ సంగమంలో ఏకత్వాన్ని పొందటం ఈ స్తీ పుంసయోగ కార్యప్తురుని 79

స్వరూవం, అందుచేత కులపాలికా ప్రజయంలో ప్రణయ పారమ్యము, పరస్పర సామరస్యముతో కూడిన అనుబంధము (ప్రధానాంశాలు అవుతున్నాయి. 'అచ్చిన్న మేఖల మలి దృఢోవగూవాం ఆ(్రావ్త చుంబన మవీక్షిత వర్రకాంతిః కాంతా విమిళ్ర వవుషః కృత విన్రలంభో నంభోగ నఖ్యమివ పొతు వవుఃవురారే? అర్థనారీశ్వర మూర్తిలో ఏంత సాన్నిహిత్యమున్నదో అంత విరహమూ ఉన్నది. విప్రలంభ సంభోగములకు వారి యందు సఖ్యమేర్పడి ఏకకాలములో అనుభూతము లవుతున్నవి. ఇక్కడి వియోగము వియోగం కాదు. సంయోగము సంయోగం కాదు. ఒకరి మనస్సులో ఒకరు స్థిరంగా ఉండటం వలన వారి నిత్య సాన్నిహిత్యానికి భంగం కలుగదు అట్లాగే వారి అనుభవము శరీర సీమలను అతిక్రమించింది. 'ప్రాణజమయపరిమితులు దాటింది. మనోమయచేతనలో ప్రతిష్టితమై ఉన్నది. కులపాలిక స్థితిలో ఆమె కులమును (వంశమును) రక్షించేది. కుటుంబాన్ని సుఖమయంగా నిలిపేది. సంచతి ద్వారా భవిష్యత్తులోనికి ఆ కుటుంబాన్ని నడిపించేది. కులపాలికా వ్రజయం దాంపత్యం యొక్క రహస్యాన్ని స్పష్టంగా వ్యాఖ్యానించింది. “చేతో మోహ కుల్యానదీ మర్యాదాకృతి తీర్చు యోగమిది 'నిర్యత్‌ ప్రాణము వేళ జీవుడుచనన్‌ నిశ్రేయసొధ్వంబునన్‌. దాంపత్యం రెండు పార్వాలలోనూ ఫలాన్ని అందించే మహాసాధన. చిత్తం నిరోధింపబడటం. కామ'క్రోధాదులు వాటి పరిమితుల లోనే అవి నిలచి ఉండటం దీని ప్రత్యేక లక్షణం. కులపాలికా ప్రణయం కఠినమైన సామాజికవ్యవస్థ కాదు. ఒకరికోసం ఒకరు అన్వేషించుకుని, పొంది, అత్యంతికమైన సాధన మార్గంలో సాగిపోవలసిన లక్ష్యసిద్ధి. ఇక్కడ (వ్రణయము, వివావాము నునంగతములై ఏక (వ్రసారం పొందుశున్నవి. కులపొలికా ప్రణయము:

  1. విశ్వనాథ గిరికుమారుని (ేమగీతాలలో ప్రతిపాదించిన ఈ కులపాలికా ప్రణయాన్ని పైన వర్ణించిన భూమిక మాద అర్ధం చేసుకోవాలి. వివాహము ఒక దైవ నిర్ణీతమైన అంశం. ప్రణయం జీవన సమర్చణం ఇద్దరూ కలసి

నన

సాధించుకోవలసిన లక్ష్యాలు. ఇక్కడ ఎవరికి ఎవరూ లోబడిలేరు. పురుషునికి ధర్మపత్నీ విరహితంగా (శాతస్మార్త క్రియాచరణకు అధికారం లేదు. (సామాజిక అధ్యాత్మిక కార్యక్రమాలలో ఇద్దరూ కలని పాల్గొన వలసి ఉంటుంది). ఇద్దరి ఉనికి ఏ ఒకరి మోదనో ఆధారపడ్డదికాక పరస్పరం పరిపూరకం అయింది,

  1. పరన్చర సామరన్యంతో కూడిన దాంపత్యం సత్సంతానానికి కారణం అయింది. ఆ సంతతి వారిద్దరి అనురాగాలకు వ్యక్తీకరణమవుతుంది. కుటుంబంలో పెద్దలు, నమవయన్ములు, విన్నలు అందరూ ఒక భావవలయంలో సంస్కార బంధంలో పైకెదిగి వస్తారు. సామాజిక స్థితిలో సమష్టిగా తమ కర్తవ్యాన్ని భాగధేయతను బాధ్యతతో నిర్వహిస్తారు.

  2. ఇద్ధరి అనుబంధం సమాజంలో (వాథమికమైన అంశం (యూనిట్‌. ఇక్కడనుంచి పరివారం వికసిస్తుంది. భూత భవిష్యత్తులకు సేతువు వలె వృద్ధులకు, బాలురకు ఆశ్రయం పోషణ లభిస్తుంది. సమాజంలో ఉత్పత్తి కేంద్రంగా ఏర్పడ్డ గృహస్థవ్యవస్థ ఆర్థిక సుస్థితికి సంఘపురోగతికీ, ఆధ్యాత్మిక సాధనకు భూమికగా ఏర్పడుతుంది.

4 నియతమైన కామము, మోహము వాటి విజృంభణ వల్ల వ్యక్తం అయ్యే క్రోధాదులు శమించిన స్థితివల్ల ధర్మం సక్రమంగా ఆచరింపబడు తుంది. బలవంతులు, బలహీనుల అర్థకామాలను రక్షణ లేకుండా దోచుకునే స్థితి తొలగిపోతుంది.

  1. స్తీ కేవలం భోగోపకారణంగా కాక మాతగా, భగినిగా, సహచరిగా పుత్రికగా అత్యంత గౌరవస్థానాన్ని పొందుతుంది. “వాగార్థా వివసంవృక్తౌ అన్నట్లు వాగర్థములు ఒకదానిని ఒకటి బాగుగా కలసి పోయినట్లుగా సంయోజితము లవుతాయి. ఇది కులపాలికా ప్రణయ పారమ్యము.

గిరికుమారుని (పేమ గీతాలతో సమకాలికంగా రచన జరిగిన 'సౌభద్రుని ప్రజయయాత్ర'లోనూ ప్రణయం దాంపత్యంలో పరిణమించటం, కులపాలికా గౌరవం నాయిక పొందటం ఉన్నది. (ప్రణయ గీతాలు” అచ్చవటానికి ముందే 'ప్రణయ యాత్ర ననన కార్ళీఫ్తురురి 81

అచ్చయింది. అందువల్ల కులపాలికా ప్రణయమూలం (ప్రణయయాత్రలోనే నాయని వారు. ప్రవేశపెట్టినట్లుగా భావించే వాదధోరణీ ఉన్నది. అయితే గిరికుమారుని ఢేమగీతాలకే ఈ పట్టం కట్టడానికి కారణం ఈ రచనలో ఉన్న కులపాలికా ప్రణయ తత్త్వ గాధఢత్వం, స్పష్టత, సోపానక్రమంలో ఉన్న ఎదుగుదల. కులపాలికా శబ్దాన్ని ప్రణయగీతాలలో 81 గీతంలో స్పష్టంగా ప్రయోగించినారు విశ్వనాథ.

విశ్వనాథ సత్యనారాయణ, నాయని సుబ్బారావు ఇద్దరు అత్యంత సన్నిహిత మైన సొహార్దాన్ని అప్పటినుంచీ జీవితాంతం వరకూ అనుభవించినారు. విశ్వనాథ అన్న అయితే నాయనివారు అనుజుడు. కావ్యాలలో ఎంత సామ్యవైషమ్యాలు ఉన్నా ఒకరి రచనా పరిణామాన్ని ఎరిగిన వారు మరొకరు. నాయని వారి వివావా సందర్భంలో “శశిరేఖ అనే మరొక లిరికల్‌ రూపకాన్ని రచించి విశ్వనాథ నాయని వారికి అంకితం చేశారు. (విశ్వనాథ అసంకలిత సాహిత్యం నాల్లవ సంవుటంలో ఈ రచన తొలిసారిగా (ప్రకటింపబడింది) నాయని వారి ప్రణయవృత్తాంతం (శ్రేమ గీతాలలోనూ, వేయి వడగలలోనూ విస్తరింవబడింది. ఒక రకంగా శశిరేఖలోనూ నాయని వారి ప్రణయ వృత్తాంతమే వస్తువు.

ఈ కులపాలికా ప్రణయ భావనను తొలిసారి ప్రవేశపెట్టిన ఆచార్య సి. నారాయణ రెడ్డి తన (గ్రంథం 'ఆధునికాంద్ర కవిత్వము - సంప్రదాయము, (ప్రయోగాలు అచ్చయినప్పుడు ఇద్దరు కవులూ జీవించి ఉన్నారు. అయినా ఎలాంటి వివాదము ఈ సందర్భంలో తలఎత్తలేదు.

భారతీయ జీవన భూమిక మోద కామవురుషార్ధానికి ఉచితమైన స్థానమే ఉన్నది. కామము ధర్మార్థ పురుషార్థ్ధాల ఫల స్వరూపమని “'వలభూతశ్చ ధర్మార్ధయోః ' 1-2-47 వాత్స్యాయన కామ సూత్రం పేర్కొన్నది. బృహదారణ్యకం స్త్రీని అగ్నిగా స్రీవురుష సంయోగాన్ని ఒక యజ్ఞంగా వవిత్రకార్యంగా నిరూపించింది. మన జీవన మూల్యాల గణనంలో ఎప్పుడూ కామాన్ని హేయపదార్థంగా చూడలేదు.

(బ్రవ్మోనంద భావన చేయటంలో లౌకికమైన ఉపమానం కోసం వెదుకగా వేదపురుషునికి స్రీ వురుష సంయోగానందమే స్ఫురించింది. తద్యధా ప్రియయా ప్రియా సంపరిష్వక్తో నబావ్యాం కించన వేద నానంతరమ్‌ - ఏవమేవాయం పురుషః (ప్రజ్ఞానాత్మనా సంవరిష్యక్తో నబాహ్యం కించన వేదనాంతరమ్‌. (బృహదారణ్యకం - 4-8-21) ప్రియాప్రియుల సంయోగం సర్వేతర భావనా విరహితమై ఇరువురి 82 సరుసస్ప

మనస్సులు ఏకాత్మ సంలీనస్టితిలో ఉంచుతుంది. అలాంటి స్థితి బ్రవ్మానందవేళలో జీవుడు ప్రజ్ఞానాత్మ సంపరిష్వక్తుడై పొందుతున్నాడు. స్రీ పుంనంయోగనన్నివేశంలో 'సునిర్భత మాసనః నిధువన పరబ్రహ్మానందం నిరర్గల మన్వభూత్‌' అని శంకర విజయంలోని ఒక అజ్ఞాత కవి వచనం.

ఈ భావం తంత్ర శాస్త్రాదులలో వామాచారంగా ప్రవృత్తమయింది.

కులపాలికా ప్రణయ తత్త్వ రహస్యమును కేతవరపు రామకోటిశాస్త్రి ఇలా నిరూపించారు. 'ఈ ప్రణయభావ కావ్యమున ఆమె కులవధువు గనుక శాంభవీ విద్యకునువలె వరమగుప్త, ఆమె దేవత. ఆ విధముగా ఆమె సమాజమునందు సర్వత్ర వూజింవబడుటను కవి ప్రదర్శించినాడు. దేవతలు మాట్లాడరు అను (గ్రహింతురు. కులపాలికలు శ్రోత్రియత్వమును, అకామహతత్త్యమును పురుషుల యందు ప్రజ్వలింపింతురు. గృహమునందు భార్య పురుషునకు ప్రత్యక్షదేవత. ఆమె ఉపాస్య, కులమనగా గృహమని కూడా. గృహపాలికను గలవాడు గృహము కలవాడు. గృహస్ఫు ప్రాణము చేతను, మనస్సుచేతను, చక్షుస్సుచేతను, (శ్రోత్రము చేతను - అవి వరద్రివ్మము యొక్కచతుర్థ పాదకళా చతుష్టయముగా నెరిగి షోదశకళా (బ్రహ్మస్వరూపిణి నుపొసించినచో “ఆయతనవాన్‌ భవతి", అట్టివానిని వరమేశ్వరి వతివ్రతల చేత జన్నజన్మముల మిద ముక్తి త్రోవలలో నడిపించును. ఈ విధముగా కులపాలికా శబ్దమును ప్రయోగించి కులరూపిజణీ, కులసంకేతపాలిని కులాంగనా మొదలగు నామముల చేత శ్రీలలితావరమేశ్వరీ నామ నంకేతములను న్మరింవ జేయుచు ప్రత్నీవతమును పురుషున కుపాదేయముగా ప్రబోధించుచున్న దీ కావ్యము' (విశ్వనాథ వైఖరి (1994) పే, 171)

ఈ సందర్భంలో కృష్ణశాస్త్రి ప్రభృతులు భావించిన ఊహాప్రేయసి భూమి మీద నిలచి ఉన్నది కాదు. ఆ ప్రజయమునందు ఊవాలోకములో పుట్టి వచ్చింది. ఇది మనోమయ భూమికలోని వ్యక్తి, ఇక్కడ నిరంతర విరహమేకాని, నంయోగము లేదు. నిరంతర భావనమేకాని ఇంద్రియానుబంధము లేదు. నిరంతర పరిదేవనమేకాని సాక్షాత్మారములేదు, ఈ విధముగా ఇది అనుభవమునకు దూరమైంది కావటం వలన = కవి లేదా సామాజికుడు తన సామాన్య జీవనానికి, అమృత ప్రణయమయ జీవితానికి ముడి వేసికోలేక వైరుధ్యములో కొట్టుమిట్టాడుతూ బ్రతుకవలసి ఉంటుంది. కాళ్యత్తతుత నం ఆ

సామాజిక దృష్ట్వా పరోక్ష ప్రేయసిని గురించి ప్రకటించే వీలు ఉండదు. అందువల్ల కల్పించుకొన్న ఊహా (ప్రేయసి విషయంలో రచన అంతా అస్పష్టంగా, క్లిష్టంగా, ప్రతీకల చాటున దాగికొని ఉంటుంది. నాయిక స్వీయ కాదు పరకీయ అవుతుంది. అందువల్ల ధర్మవిరుద్ధమైన కామంలోనికి ఈ (పేమ కవిత్వం జారిపోతుంది.

ఈ క్లేశం తప్పటానికి గిరికుమారుని శ్రేమగీతాలలో డ్రేయసీ ప్రియులే భార్యాభర్తలై రసవిషయంలో పవిత్రమైన శృంగారానుభవానికి ఈ రచనను స్థానంగా చేసినారు. లేకపోతే ఏకతైవానురాగశ్చేత్‌ అన్న న్థాయిలో రసముకాక రసాభావమైనా కావలసి వస్తుంది.

ల ప్రణయ కవితాశిఖరం

ఆత్మాశ్రయ కావ్యమైన గిరికుమూరుని “డ్రేమగీకాలి రచన కాల్చనికోద్యమ కవితా రచన ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో కొనసాగింది. 1920-28ల నడుమ దాదాపుగా ప్రవహించిన ఈ రచన కృష్ణ పక్షము, హృదయేశ్చరి, ఎంకి పాటలు, సౌభద్రుని 'ప్రణయయాత్ర మొదలైన రచనలకు సమకాలంలో సాగింది. విశ్వనాధ వారి తండ్రి పేరు శోభనాద్రి. అందువల్ల తను అద్రిపుత్రుడననే భావంతో గిరికుమారుడనే కలం పేరును పెట్టుకొన్నాడు. దీనిలో కవి ప్రణయ కవిత్వాన్ని సాగిస్తూనే తనను తాను వెదుక్కుంటూ తన తత్త్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన వైయక్తిక పరిమితులను, అవి దాటిన తన చైతన్యాన్ని తన కవితా వ్యక్తిత్వాన్ని తన ప్రవృత్తిలోని వైరుధ్యాలను, తన “భ్రష్టమోగి'తను క్రమంగా అన్వేషిస్తూ నిరూపించుకుంటూ పోయాడు.

పన్నెండవ గీతం “ఈ కెలన శరత్పూర్జిమ వృత శశాంక లలిత రోచిర్వితానము” అన్న రచన విలక్షణమైంది. మనిషిలో తానెరుగని మనిషి ఉన్నాడు. ఆ పార్వం తనకు తనకే తెలియదు. ఒక వైపు స్వచ్చమైన శరత్మాలవు వెన్నెలల ఆవరణం. మరొక వైపు గాధమైన చీకట్లు ఆక్రమించుకొన్న మరొక (ప్రాంగణం. రెండు తనలో రెండు పార్యాలు. ఒక వైపు జ్ఞాన భావ విసారం- ఇక్కడ తాను విచ్చుకొన్న ఒక మెరుపు తీగవలె ఉన్నాడు. రెండవ వైపు చీకట్లోని భాగం సగం తనకు తనకే కనిపించదు “ఎరుగని తనలోని తాను” ఇది మనోలక్షణస్థాయిలో అవచేతనలోని భాగం కావచ్చు లేదా సుష్తచేతలోనిది కావచ్చు. 84 సుప

తొలుతటిది జాగ్రదవస్థాచేతన. మరొక పక్షంలో అవిద్యావృతమైన తన స్వస్థితియెన ఆనందాన్ని మరచిపోయి తనకు తాను గుర్తించలేని అంధకార భాగం ఒకటైతే, రెండు జ్ఞాన చంద్రకాంతిలో పరిష్లావితమై చిదానందరూపంగా లోలోతులో వెలిగే కొత్తమెరుపుతీగ. ఈ రెండూ అంతర్చహిర్దగత్తులు. రెంటిలోనూ ఏక కాలంలో ద్విధాభూతమైన చైతన్యంతో ప్రవర్తించటం ఈ జీవుని లక్షణం.

ఐతే ఇది సృజన ప్రపంచం కావచ్చు. సృజన మూలాలు అవచేతనలో, సుప్త చేతనలో, సమష్టి అవచేతనలో సంలీనం అయి ఉంటాయి. అవి అభివ్యక్తిదశలో కావ్య (ప్రపంచంగా అవిష్ఫతమైనప్పుడు దానికి విశ్వజనీనత సార్వకాలినత సిద్ధిస్తాయి. వాస్తవ ప్రపంచంకంటే భిన్నమై ప్రతిభాజ్యోత్సలో తడిసి నడుమ నిలిచి ఉన్న ఒకానొక అస్థిరమైన మెరుపుతీగలాగా కావ్యం నిలచి ఉంటుంది. అయితే కావ్యకర్తకు తనకు (ప్రేరణను కలిగించిన అవచేతనాదుల గురించిన ఎరుక అసలే ఉండదు.

“అందునగమిందు నగముంటి నౌరనేను”

ఈ నగము నాది నాకె కన్సింవబోదూ

“ఉ(గ్రరావముచంద్రార్థ బింఐ (గననము వోలె నున్నది నా స్థితి అన్న పద్యాంశాలు మొత్తంఖండం సూచించే తాత్పర్యానికి వాహికలుగా ఉన్నవి.

ఇరవై నాల్గవ గీతంలో కవి ఒక స్వస్నకథ చెప్పుతున్నాడు. రామాయణంలోని త్రిజటాస్వపష్నము వలె వాళిష్ట రామాయణంలోని స్వప్నాల వలె ఇదీ విలక్షణమైంది. దీనిలోని వృత్తాంతము ఇది. సముద్రాలు హఠాత్తుగా పొంగి భూమి మునిగిపోయింది. ఆయితే అంత జలప్రళభయంలోనూ నాల్డు దిబ్బలు మిగిలి ఉన్నాయట. వాటి మాద తాను, తన ప్రియురాలు, తన తండ్రి, తన సఖుడొకడు మిగిలి ఉన్నారట. క్రమంగా కొంతలో తాను తన (ప్రియురాలే మిగిలినారు. మరికొంత సేపటికి ఆమె కూడా లేదు తానొకడే మిగిలినాడట.

తాను తన ప్రియురాలు సంసారం యొక్క అనంతత్వానికి, అనుస్యూతికీ నిదర్శనాలు. తన తండ్రి గడచిపోయిన కాలానికి, తన సఖుడు వర్తమానానికి చిహ్నాలు. (క్రమంగా భూత భవిష్యత్తులు అనంతత్వంలో సంలీనమైనాయి. అయితే తన ప్రియురాలు కూడా తనలో లీనమయింది. ఆమెకు వేరుగా అస్తిత్వం లేదు. ఆమె తనలోని (శ్రేమ భావనాక్ళతి. విడిగా ఉండదు. తనలోనే సంలీనమై ఉంటుంది. ఇక్కడ వక్త పురుషుడు కావటంవల్ల స్త్రీ లీనమైంది. స్త్రీ వక్త అయితే పురుషుడు లీనమౌతాడు. తన యొక్క కొళ్యప్తతుతి నా నా 65

ప్రీతి కోసమే భార్య ఇష్టమైనదవుతున్నది. తన యొక్క ్రీతికోనమే సంతానము ఇష్టమైనదవుతున్నది. ఇత్యాదిగా చెప్పబడ్డ ఉపనిషత్రత్వము దీనిలో వ్యక్తమవుతున్నది. ఐహికమైన సుఖము (క్రేయస్సు) ఆత్యంతికంగా ఆముష్మికమైన శ్రేయస్సులోకి సంగమిస్తుంది. లేకుంటే దానికి ప్రత్యేకమైన స్థిరమైన ఉనికి ఉండదు. ఈనాడు సంపన్న దేశాలలో అసంతృప్తి దృష్టా ఇది చైతన్యం లోలోతుల్లోకి వెళ్లీ శాంతిని వెదుక్కోలేకపోవటం- ఇది అంతర్జగత్తులోని శాంతిని చేదుకోవనటం. ఇక్కడ “వేయి పడగలిలోని చివరి సన్నివేశాన్ని గుర్తుంచుకోవాలి. నవల పూర్తయ్యేసరికి చివరకు ఆరుంధతీ ధర్మారావులు మిగులుతారు. “చివరకు నీవు మిగిలితివి. నాజాతిశక్తి అని నవల పూర్తవుతుంది. పై గీతంలో ఆమె కూడా మిగులలేదు. అంతా తనలోనే సంగమించింది. వేయి పడగలులోనిది సామాజిక అంశము అయితే ఇక్కడ విశ్వమయతను సాధించుకునే తపస్సులో లీనమైన యోగి ప్రవృత్తి కనిపించుతుంది. మరాక అంతః (ప్రవృత్తిని కవికా లక్షణాన్ని దాని కేంద్ర స్థానంలో ఉన్న కరుణ భావాన్ని వ్యాఖ్యానించే లక్షణం యాఖభైయైదవ గీతంలో ఉంది. కవి ఆషాఢ మేఘునితో తాదాత్య్యాన్ని పొందుతున్నాడు. లోకంలో సుఖం అనుభవింపగలవాళ్లకు వసంతం మనోజ్ఞమైన బుతువు కాని కవికి ఆషాఢ మేఘమంటే ఒళ్లంతా జలదరింపు, “నా వాక్కులో నిలిపి శివుని అందెల చప్పుడును నీయందు కలిగించాను. మింటికి నీవు మంటికి నేను కవులమైనాము.” ఆషాఢమేఘం అనే సరికి కాళిదాసు మేఘసందేశం స్మరణకు వస్తుంది. ఆ మేఘం యక్షుని విరహాన్ని ప్రకటించింది. విరహం, వియోగదుఃఖం - లోకంలో ఒకానొకని వ్యధను మేఘం ప్రకటిస్తే ఈ కవి తాను లోకంలోని దుఃఖాన్ని అంతనూ ప్రకటిస్తున్నానని చెప్పుతున్నాడు. విశ్వనాథ రచనలన్నింటిలోనూ ఒకానొక విసృతమైన దుఃఖరేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు లోకం అంటే మిక్కిలి మమకారం. దానివల్ల ఇక్కడి వ్యధలను తాను భరించలేడు. “కవి దుఖము' అనే ఖండికలో “నిన్నెవరు మెచ్చుకొందు రీ నీలయందు వలుకు పెళునైన వట్టి నిర్భాగ్య కవిని కలిత లౌకిక సాంసారిక వ్రగాఢ దుఃఖ దూషిత వాంఛావిధూతమతిని” 86 సుర్తుసన్ని

కవి తన కావ్యతత్త్వాన్ని ఇంకా స్పష్టంగా చెప్పుతున్నాడు.

ఖాన్వ ద్వాగ్గత లోభులీజనులు పావం బూర్దితానంద భా

గ స్వాముల్‌్‌ నిను నమ్మినందులకు దుఃఖందిల్ల ఆనంద భా

గ స్వామిత్వము పేరపంచుదువు శోకంబున్‌ రసంబంచు" (కేదారగౌళు విశ్వనాథ ఇక్కడ భవభూతి చెప్పిన 'ఏకోరసః కరుణయేవ' అన్న సంభావనకు (కాంసెప్ట) దగ్గరగా వస్తున్నాడు. “శ్రీ మద్రామాయణ కల్పవృక్షం'నాటికి ఈ భావనకు విసృత రూపమిచ్చి 'జీవుని వేదన” అన్న సిద్దాంతాన్ని ప్రపంచించాడు. అచ్చమైన పరబ్రహ్మ స్థితి నుండి విడిపోయి పరిమితుల్లో జన్మలలో ఉపాధులలో పడిపోయిన జీవుడు ఎరుగకుండానే ఆవేదన పొందటం, పరితపించడం అంతా 'జీవుని వేదన'గా వ్యక్తమవుతున్నది. ఈ దుఃఖం తాను స్వస్థితి పొందేదాక ఉంటుంది. ఈ విధంగా కవికి లౌకిక పారలౌకిక దుఃఖాలు రెండూ తన కావ్యవస్తువులే అవుళున్నవి.

20వ శతాబ్దపు మూడవ దశాబ్ధంలోనే కవి తనకు తాను ఎంత విశ్వాసంతో భావ్యాంధ్ర సాహిత్యమంతా తన ్రాభవమేనన్న ప్రకటన చేస్తున్నాడు. (71వ గీతం)

ఇది వ్రతిన వూనితిని ప్రవపొంన జేతు

నీ అడుగు దమ్ములందు అనేకనాక

వాపొనులు వాని నీరముల్‌ ప్రాశనమ్ము

గాగ ఖభావ్వ్యాంధ్రదేశ నత్సవులకెల్ల”

తన ప్రియురాలు- ఆమెయే సరస్వతి. ఆమె బంగారు రెక్కలు గల, మోహింపజేసే అందెలచప్పుడు, మనోజ్ఞమైన క్రీంకారము గల హంస. ఈ హంస కావ్యసౌందర్య ప్రకటన శీలి. ఈ గీతం చివర అంటున్నాడు కవి - “నన్ను నా సృష్టినేమి యనంగ గలరొ మన శిశువులైన భావి సంపన్న కవులు”

వర్తమానం దాటితేనే కవిని గూర్చిన, కావ్యాలను గురించిన అంచనాలు స్పష్టమవుతవి. అంత ఆత్మ ప్రత్యయంలోనూ, భావిని గురించిన సంశయం ఉన్నదేమో అని కవికి అనిపిస్తుంది. అయికే అది తన కావ్యాసాధనలోని అసామాన్య లక్షణాన్ని గమనించినప్పుడు కలిగే ఆశ్చర్యమేనని తరువాత నిశ్చయం కలుగుతుంది. తన కవిత్వానికీ (ప్రేయసికి అభేదాన్ని కలిపిస్తున్నాడు. దాంతో తన కవితా స్వరూపాన్ని విశదీకరిస్తున్నాడు. శాష్యత్తతుత 7

'మధుర మధుర మంజువర్ణ గుంఫనము కల్లి ప్రకృతి దివ్యార్థ నూచ్యభావమ్ము కల్లి పరగు కల్యాణిపై పాడబడిన తెలుగు పాటయొక్షుటి నీదు రూపముగ మారె ఈ సుకవినైన నా జన్మమెల్ల దేవి అచ్చవు తెలుంగు వడతివైనట్టి నిన్ను మరల నాతకేనె పాటగా కరగిపోయ త్వత్పదార్స్చితమ్ముగ నేను ధారవోతు” (79వ గీతం) ఇది విలక్షణమైన పద్యం. కవిత్వం రెండస్తులలో ఉంటుంది. ఒకటి బాహ్యరూపం అది వర్ణగుంఫనము అక్షరరమ్యత కలది. లోనారసి చూడగలిగిన భావసొందర్యం. ఇక్కడ కవి తన భావ కావ్య రూపాన్ని యింకా సుందరంగా దివ్యార్థ సూచ్యంగా వర్ణిస్తున్నాడు. దివ్యార్థమంటే 'ప్రకాశించేది అని- ఈ ప్రకాశం అంతఃకరణంలోని మనస్సును బుద్ధిని, అహంకారాన్ని దాటి చిత్తస్థితిలో సాధారణీకరణం పొందిన వేళ కలిగించే విశ్వచైతన్య (ప్రకాశం. అలాంటి కావ్యం సంగీతమాధుర్యం జతగడితే కల్యాణి రాగ రంజితమైకే ఎంతమనోహరంగా ఉంటుంది? అలాంటి బాహ్యాభ్యంతర సౌందర్యం గల, సంగీత సొంతత్యం గల పాట - కావ్యం తన ప్రియురాలిగా రూపొందింది. ఇక్కడ ప్రియురాలి వర్షన సంగీత సాహిత్య సమష్టి మాధుర్య పరసీమగా భావింపబడింది. ఆమె మాధుర్యం ఎలాంటిదో మరొక సందర్భంలో 'మూడుభాషలలోని ముగ్ధభావము లేరుకొని, తెచ్చుకొని దాచికొనిన చోటు అని కవి వర్ణించాడు. మరొక చోట ఆమె ఒక పెద్ద వెలుగని, ఆమె జీవితంలో నుంచి అదృశ్యమైపోగా ఆమె నీడయే తన జీవితంలో కవిత్వంగా రూపు కట్టిందనీ అంటాడు. ఇక్కడ ఆమె ఒక పాటగా తానై ఒక అద్భుత స్రీ రూపం తాల్చింది. కవి భావనకు యోగ్యంగా ఆమె నిరూపితం అయింది. కాని కవి జీవితం అంతా ఒక సాధనగా మిగిలిపోయింది. ఒక తపస్సు అయింది. ఆమె 'అచ్చవు తెలుంగు పడంతి' ఆమెను మళ్ళీ తేనెపాటగా కరగిపోయటం తన ప్రయత్నం అంతా, ఈ పరిణామం అంతా ఈ విధంగా ఉంటుంది. పాట చా ప్రియురాలు -+ పాట 86 సుపుసన్ని

పాట ప్రియురాలిగా పరిణమించటం కవి ప్రయత్నంతో నిమిత్తంలేని సృష్టి రహస్యం. రసజగత్తులోని పరిణామం. అయితే ప్రియురాలిని మళ్లీ (తేనె) పాటగా రూపొందించుకోవటం కవి సాధన. అచ్చమైన పరబ్రహ్మము మాయావ్ఫతమై జగత్తుగా రూపొంది మళ్లీ అచ్చమైన (బ్రహ్మముగా పరిణమించటం వంటిది. ఇక్కడ విడిపోయిన జీవచైతన్యం మళ్లీ సచ్చిదానందమయంగా పరిణమించటం ఎంతో సాధన మీదగాని సాధ్యం కాదు.

అట్లాగే భౌతిక జగత్తులోని అనుభవాన్ని రసజగత్తులోనికి నడిపించి దానికి దివ్యస్ఫురణగల కావ్య సామగ్రిగా కళారూపంగా పరిణమింపజేయటం కవికే సాధ్యమయ్యే పని. 'కవిరేవ ప్రజాపతిః అని ఆనంద వర్థను డనటం ఈ తాత్పర్యం తోడనే. మానుషమైన స్థితి నుంచి పాంచభౌతిక పరిమితులను దాటి, షదూర్శులను ఆకలి, దాహము, శోకము, మోహము, ముసలితనము, మరణము ఈ ఆరు ఊర్ములు అతిక్రమించి దివ్యజీవనాంశను ఈ జగత్తులోనికి అవతరింపజేయటం బుషికంటె కవికే సాధ్యమయ్యే విశిష్ట ప్రయత్నం. గిరికుమారుని డ్రేమగీతాలు మొత్తం 102 ఖండాల సంపుటి. ఒక్కో ఖండంలో సాధారణంగా మూడు గీతపద్యాలు ఉంటవి. కొన్నిచోట్ల రెండు లేకుంటే ఏ ఒక్క చోటనో ఒకే పద్యమూ ఉన్నాయి. ఈ వద్యాలలో కొన్ని పూర్తిగా ఉండవు. భావం ఎక్కడ తెగిపోతే అక్కడే పాదాంతంలోనో పాదమధ్యంలోనో ఆగిపోతవి. మొత్తం కావ్యం సుమారు 300 పద్యాలు ఉంటవి. ఇవన్నీ ముక్తకాలే. అయినా అన్నింటికీ ఏకాకారం కలిగించిన ఏకసూత్రం ఉన్నది. ఈ సూత్రం కవి ప్రణయ భావం.

ఈ ఖండకావ్యం - కవి వికాసదశలో [ప్రారంభమై పరిణతి చెందిన స్థితిలో పూర్తి అగుటవలన ఈ కావ్యంలో ఆ దశాఖేదాలన్నీ అంతో ఇంతో స్ఫురిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణకు చిన్నతనంలోనే వివాహం అవటం వల్ల, ఈ కావ్యంలో ప్రియురాలి స్థానం తన ధర్నపత్ని వరలక్ష్మీ దేవికే లభించింది. తరువాతి కాలంలో (1982) ఈమె మరణించగా తరువాత కరుణార్ధమైన వియోగ కృతి - “వరలక్ష్మీ త్రిశతి వెలువడ్దది. “వేయి పడగలు ఈమెకే అంకితం చేయబడ్డది: తనను వరలక్ష్మీ దయితుడని కావ్యంలో 'పేర్మాన్నాడు.

భావకవుల కావ్య ప్రపంచంలో గీతపద్యానికి పట్టం కట్టబడింది. వృత్తాలలో ఉండే గణ నిర్బంధంలేకపోవటం, ఇంద్రసూర్యగణాల ఉనికితో కొంచెం వదులుగా, కవి భావనకు అనుగుణంగా ఒదిగిపోయేటట్లు రూపొందటం వలన ఈ ఛందస్సును వాళ్లు శనం

ఎక్కువగా ఆదరించారు. ఈ భావకవిత్వ ఉద్యమం చివరి అంచుల్లో దీనిలో ప్రవేశించిన శ్రీశ్రీ ఈ గీత పద్యాన్ని గురించి ఇలా అన్నాడు.

వద్యములు ముఖ్యముగ గీతపద్యములనవి

యొనగు నింతంతకాని సంతసము నాకు. ...

ఒక అనిర్వచనీయ మవోన్నతమగు

వోయి యున్నది గీత వద్యముల యందు. ..

అధునిక దివ్య ఖండకావ్వముల యందు

ప్రాజనన్నిభమై గీతి వరుగులాడు (శ్రీ త్రీ ప్రభవ) అయితే ఒక నిష్టగా కావ్యం నిండా గీత పద్యం మాత్రమే ఉపయోగించింది- గిరికుమారుని (ప్రేమ గీతాలలోనే. మిగతా కవులు చాలామంది అధికంగానే గీత పద్యాన్ని వాడినా నడుమ నడుమ ఇతర ఛందస్సుల ప్రయోగము చేసిన వారే.

ఈ కావ్యారంభం కవిత్వ ఆవిర్భావాన్ని గురించి స్పష్టంగా వ్యాఖ్యానించే రచన. కవి హృదయంలో నుంచి వ్యక్తనుయ్యే వేళ కవి పొందే వేదన. దానివల్ల పొందే వ్యధ దీనిలో వ్యక్తం అవుతవి. 'గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ, కూకుందనీదురా కూసంతసేపు' అన్న ఎంకి పాటల ఆరంభము ఇలాంటిదే.

'అన్మదీయ కంఠమునయం దాడుచుండె

ఒక ఎదో గీతి వెలువలి కుభికిరాదు

చొచ్చుకొని లోనికింబోదు, వ్రచ్చి పోయె

నా వృదయ మీ మవో వ్రయత్నమ్మునందు”

కవిత్వనిర్మాణంలో వస్తువు కవి సంకల్పంలో ఉంటుంది. భాష అభ్యస్తమై ఉంటుంది. ఛందస్సు నిరంతరాభ్యాస వశీకృతమై ఉంటుంది. అయినా అసలు కవిత్వ పదార్థం అందీ అందకుండా, తెలిసీ తెలియకుండా అవచేతనలో భద్రస్థితిలో ఉంటుంది. జాగ్రన్మనస్సులోని ఒత్తిడి వలన అది- అవ్యక్త భావం- శబ్దరూపాన్ని పొంది, అలంకృతమై, ఛందో విస్పృతమై బయటకు వస్తుంది. ఈ ఒత్తిడికి సంబంధించిన చి[త్రణమే పై పద్యం. ఒక ఎదోగీథి అది వెలువడే ప్రయత్నంలో ఉన్నది. అయితే తల్లిగర్భంలో నుంచి శిశువు వచ్చినట్లుగా ఎంతో బాధలోంచి బయటకు వస్తుంది. పద్యం 'వచ్చిపోయె నా హృదయమీ మహా ప్రయత్నమునందు' కవిత్వ శిశువును వెలువరించే ప్రయత్నంలో కవి హృదయం విశీర్ణ్షమయింది. కావ్యారంభంలోనే కవి సృజన రహస్యమూలాలలోకి ప్రవేశించాడు.

వెలుపలికిరాక లోనికి తిరిగి పోక ఈ పద్యం కవి ప్రయత్నాల్ని విఫలం చేసింది. ఆ ఒరిపిడిలో, రాపిడిలో వృదయంలో ఎట్టి సంజ ఉదయించింది. సంధ్యాకాలం రెండు కాలాలకు, దివారాత్రాలకు సంధిని సూచించేది, ఆంతర్భహిర్లోకాల సంధి, న్వప్న జాగ్రదవస్థల సంధి, చేతనావచేతనల సంధి. ఈ వ్యక్తావ్యక్త సంధి దశలో కవితా సాక్షాత్కారం, సరస్వతీ సాక్షాత్కారం అయింది.

ఈ (ప్రారంభగీతం మొత్తం వ్యక్తావ్యక్తాల నడిమి ఘర్షణను వ్యక్తం చేయటమే కాకుండా మరొక అంశాన్ని స్ఫుటం చేస్తున్నది. ఆ కవిత సరస్వతీ దేవి ఆడే నెమలి, పాదకంకిణుల కిణికిణిరావంతో నృత్యం చేస్తూ తల్లియైన సరస్వతీదేవి చేతిలోని కచ్ళపీ వీణ పలికించే మృదు గీతికలను అనుసరిస్తున్నది. తన కవిత వైయక్తికమైన వలయం అతిక్రమించి మనోజ్ఞ గీతీ నృత్యాలు - శబ్దార్థ సొందర్యములో - విశ్వచేతనకు ప్రతిస్పనించే కచ్చపీనాదాన్ని అనుసరిస్తున్నది.

కవి తన కవిత్వ నిర్మాణంలోని మూడుదశలను విస్పష్టంగా వెల్లడించాడు.

  1. కవిత్వావిర్భావంలో వ్యక్తావ్యక్త స్థితులకు సామరస్యం ఏర్పడేదాకా జరిగే సంఘర్షణ.

  2. పృదయ మథనంతో ఒక భావవేదిక నిర్మాణం కావటం.

  3. ఆ భావ వేదిక మీద కవిత్వం ప్రకటమై పరిమిత సీమలను ఆతిక్రమించి విశ్వచేతనను అందుకొనటం.

గిరి కుమారుని (ప్రేమ గీతాల నిర్మాణంలో కవి తన ధర్మపత్ని నాయికగా కావ్య నిర్మాణం చేసినా అది ఆ పరిమితులను దాటి విశ్వమయం అయి జగత్తులోని స్తీ పుంసయోగ సామరస్యాన్ని ప్రతిపాదిస్తున్నది. విశ్వనాథ (ప్రణయ గీతాలలోని ప్రణయం పరమ సుకుమారమైంది. ఆమె నవ్యహేమ మధుకలశము. అయినా తన అధరానికి ఆ అమృత స్పర్శ ఎరుకలేదు. తాను ఆమెను గూర్చి విరహవేదన పదుతున్నాడు. ఆమె మరిగి పోతున్నది ఎడబాటువల్ల. ఇక్కడ కవి ఇట్లా పరిష్ఫృతి చూపుతున్నాడు. 'అచ్చమౌ మహదానంద మనుభవింపజాల దీ శరీరము బాధ సమ్మిళితము కావలయుబోలె నున్నది” అని ఈ బాధ విలక్షణమైంది. తాము సన్నిహితంగా ఉన్నా సన్నిహితం కాలేనితనం వల్ల వచ్చేది. ఒకరికొరకు మరొకరు తపస్సు చేసుకోవలసిందే. వియోగం వల్ల మనస్సులో ఒక పరిపాకం వస్తుంది. ఒక భావ సేతువు నిర్మాణం అవుతుంది. ఒక శరీరావధులను దాటిన సంగమం సిద్ధిస్తుంది. (5వ గీతం) కాన్మీఫురురి ర

తానేమో ఒక పిల్లగాలి. ఆమె ఒక పూవు. ఆమె ఈతనికి సహభాగిని. ఇద్దరూ స్పర్శ మాత్రంలోనే బ్రహ్మానందానుభవం పొందుతున్నారు. ఇద్దరూ కలసిపోయినప్పుడు ఎంతదూరమో వాళ్లకు తెలియదు. సాయం సంధ్యారాగకాంతులలో విహారం. ఆ సాయంకాలం తూర్పుదిక్కున చంద్రోదయం అయింది. చం[ద్రబింబం మాద ఒక మబ్బుతునక. అది తమను తన దగ్గరకు రమ్మంటున్నది. మాటిమాటికీ తమ (ప్రయాణం అటు దిక్కే (19వ గీతం) ఇక్కడ ప్రియాఫ్రియుల సంయోగస్థితి వర్ణితమయింది. స్వభావాల భేదం వారిద్దరి సాహచర్యానికి అడ్డు రావటం లేదు. శశిదూతంలో ప్రారంభం “అమృతము గూడుకట్టిన దొరా ! అలదూరపు సీలికొండలో కొమరు మిగుల్‌ సితాంబుదపు కోసల మూసలుపోతు వెన్నెలలో అనే వర్జనకు ఇక్కడి మబ్బునకు పోలికలు ఉన్నవి. వెన్నెల మబ్బు అంచుల్లో మూసలు పోసి వెండి శలాకలను మేఘం అంచులలో అమర్చినట్లుగా ఉంటుంది. సాయంకాలం ఉదయించిన చంద్రబింబద మనటంలో పూర్ణిమనాటి సన్నివేశం గుర్తుకు వస్తుంది. సాయంకాలం, చంద్రబింబం, తరకలు కట్టిన మేఘం ఇవన్నీ దంపతుల 'ప్రణయయోగానికి ఉద్దీపన విభావాలవుతున్నవి. ప్రియా ప్రియులిద్దరూ పూవూ గాలీ అయి పూల పరిమళాన్ని భరించి వ్యాపింపజేసే ఒక పరవశస్థితిలో ఉండే భర్తగా కవి సొక్షాత్మరిస్తున్నాడు.

ఈ దాంపత్యం వెనుక సనాతన సంప్రదాయం ఉన్నది. ఆమె తేజో మయములైన చూపులను చూచి చూచి కాను ఎన్నో జన్మలకు ముందు ఆమె సంయోగంలో విశుద్ధమైన ప్రవృత్తి గల వానిలో పోల్చుకున్నాడు. ప్రణయ దివ్య శయ్యపైన తాను శ్రీరంగనాథుడై పవళించి ఊహకు రాని సుఖాలను భావన చేస్తూ నిశ్చలంగా ఆమెనే చూస్తున్నాడు. అమె సిగ్గుల వల్ల తన చూపుల్లోని నిశ్చలత తప్పి పోయింది. (18వ గీతం) శ్రీరంగనాథుని స్మరించటంలో ఆయనను వలచి, ఆయన చేత వలపించుకొన్న గోదాదేవి ప్రజయం గుర్తుకు వస్తుంది. ఆమె “నాచ్చియార్‌ తిరుమొళి అన్న ప్రబంధంలో ఈ ప్రణయ వేదనను పదింతలుగా వేయింతలుగా వర్ణించింది. ఆమె స్వప్నంలో వేయి ఏనుగుల ఊరేగింపు (వారణమాయిరమ్‌) కవిత్వ సౌందర్యమునకు పరాంకోటి. ఇక్కడ తాను శ్రీరంగనాథుడై ఆమె ప్రణయ వివశయైన గోదాదేవి అయింది.

అచ్చమైన దంపతులకు నిత్యసాహచర్యమే. వారినడుమ దూరాలు ఎడబాట్లూ ఉండవు. ఒకరిమనస్సులో వేరొకరు భద్రంగా ఉంటారు. ప్రేమగీళాలలో 86వ గీతం ఈ తాత్బర్యాన్ని స్పష్టీకరిస్తున్నది. ణా మసి

నీ వియోగమ్మటంచు నేనిక్కువముగ నెరుగనే యెరుంగను నాదు వృదయనీమ నీవక్ఫ(త్రిమ భావనా నిళ్చితాత్డు

వెల్లపుడు మూర్తి కట్టితివేయ టనుము”

వారికి నిత్యభావ సాక్షాత్మారస్థితి. అందువల్ల నిత్యభావన తొలగినప్పుడే వియోగము. అది వదిలంగా ఉన్నంతసేవూ నంయోగం - 'ఎవుడు నీ పాట నేనాలపించలేనా రగులుకొనును నాదు హృదంతరమున యందు నీ వియోగాగ్ని అపుడు"-

అందువల్ల కేవల కామజీవన వరిమితులు దాటలేని వారి వియోగం వ్యధాభరితం. బెదరిపోవటం, శిథిలం కావటం అస్థితిలో వారికి సహజమైన అంశం. భావసాన్పిహిత్యం గల వారికి వియోగం శరీర పరిమితులలో, ప్రాణకోశ పరిమితులలోనే మనస్సులో ఎప్పుడూ ఒకరిమూర్తి ఒకరికి నిశ్చలంగా ఉంటుంది.

ఈ తాదాత్మ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉదయించే చంద్రబింబాన్ని శివ లింగంగా దర్శించారు భక్తకవులు. వేశ్యావాటికలో శివరాత్రివేళ కాంతా వక్షస్థలంలో శివసాక్షాత్మారమయింది మరొక భక్తునికి,

ఇవ మవోవూజ తన్నయ భానమందు

నాపయిన నీకటాక్ష నంతాన లవారి

ఇంతి ! నీవు దోనిళ్ళతో నెత్తిపోయ

శివ శిరూ ప్రదేశ కృతాఖిషేక మయ్యె” (87 గీతం)

కార్తీక మాసంలో ఉపవసించి కృశించి ఉన్నాడు ప్రియుడు. కళ్లు ఎర్రపడ్డాయి. ఆమె కదకంటి చూపుల పూలు దోసిళ్ళతో ఎత్తి పోసింది. తనశిరస్సున ఆ పుష్పవృష్టి వల్ల శివాభిషేకం జరిగినట్లయింది. 'శివోభూత్వా శివమర్చయేత్‌ అన్న వాక్యం వల్ల సాధకుడు శివత్వాన్ని శివో. హంభావన ద్వారా లభించుకుంటున్నాడు. అందువల్ల ఆమె కటాక్షసుమవర్షం అభిషేకం అయింది- ప్రభువునకు. లౌకికమైన ఉపచారాలైనా మన దివ్యభావన వల్ల పవిత్రతను సంతరించుకుంటాయి. దంపతులు సత్వమయ చేతో భూమికలో నిలువగలిగినప్పుడు వారి రసానుభవరేఖలు (బ్రహ్మానంద పరిధిని స్పృశిస్తాయి. నాయికా నాయకులు దివ్య దంపతులవుతున్నారు.

తరువాతి గీతంలోను కార్తీక మాస శివార్చన ప్రసక్తి ఉన్నది. సంధ్యాకాలంలో శివాభిషేకం నిర్వర్తించారు. అభిషేకాంతంలో కర్పూరహారతి ఇచ్చారు. ఈ సన్నివేశం కార్యప్తుతురి 03

(విశ్వనాథ వారి తండ్రి శోభనాద్రి 1902లో ప్రతిష్టించిన) విశ్వేశ్వర స్వామి ముందర జరిగింది. ఆయన స్ఫటిక లింగమూర్తి. ఆ మహాఖండహారతి వలన శివలింగంలో దంపతులిద్దరూ (ప్రతిఫలించారు. అప్పుడు వారికి తాము అర్ధనారీశ్వరులేమోనన్న భ్రాంతి కలిగింది. తమ (్రతిఫలనంలో అర్థనారీశ్వర (భ్రాంతి పొందటం-- వారు అప్పటి దాకా సాగిస్తూవున్న నిత్య శివభావనయే కారణం, అర్థనారీశ్వర భావనలో ఎక్కువ తక్కువలు, అధికారము లొంగుబాట్లూ లేవు. ప్రణయ కవిత్వానికి దివ్యభావ స్పర్శను ఆంతో ఇంతో ఈ కవులు సంక్రమింపజేశారు. అయితే విశ్వనాథ ప్రణయ కవిత్వములో శ్రీ విద్యా సంప్రదాయ విశేషాలు అంతర్గర్భితంగా ఉన్నాయి. వీరి సాధనలో కులస్రీ పరాభట్టారికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పురుషుడు మహాఖైరవుడవుతున్నాడు. ఉపాసకుడవుతున్నాడు. ఇది శ్రీ సంప్రదాయంలో పరాకాష్టయైన స్థితి. అందువల్ల స్రీ ఆధిక్యం సిద్ధిస్తున్నది. ఈ భావన పరిపుష్టమై అక్కడక్కడా సోపానమార్గంలో సాగిపోయినట్లుగా కనిపిస్తుంది. అన్మదీయ వినీలదేహమ్ము గూడ మత్ములాంగనా బాహుహైమచ్చవి సువ రివృతమయి రమ్యమొహనాక్ళతి వపొంచు నన్ను నిక నిగ్గుపుచ్చుచున్నదియు గూడ” (గీతం 85) దేవీ హిరణ్మయకాంతి వృథ్వీలక్షణంలో చిక్కుకొని ఉన్న వినీలదేహుదైన సాధకునికి తన దేహం రమ్య మోహనాకృతియై కనిపిస్తున్నది. తపస్సాధన దేహకాంతి పరివర్తనం చెందటం శ్రీ అరవిందుల జీవనంలో మనం గమనించవచ్చు. పరదేవతానుగ్రహం పొందటానికి ఆమె ఎంచుకోవటం ముఖ్యం. ఎవరిని ఈశ్వరుడు ఎన్నుకొంటారో వారికే ఆతడు లభ్యమవుతాడు అన్న ఉపనిషద్వచనం ఇక్కడ (గ్రహింపదగింది. పరస్పరం వారు ఎలా సంభావించుకుంటున్నారో తరువాత వివరిస్తున్నాడు కవి. - “నాకు శంపాలకాంగి సౌందర్య రాశి / నన్నుజూచి యీ శంప సౌందర్యమూర్తి కనుచునగి పరిష్వంగించు” - శ్రీ శంకరులు చెప్పిన 'ఆనందస్సురదనుభవాభ్యాం అన్నమాటను యిక్కడ అన్వయించుకోవాలి. ఆనందానుభవానికి పరస్పర సౌందర్య స్పృహ ఆధారభూతమవుతున్నది. తన కులపాలికకు పార్వతీదేవి తోడ సామ్యము చెప్పటం (ప్రధానాంశంగా మరొక గీతంలో (81లో) కనిపిస్తుంది- న ననన ననన ననన ననననననియూా

“చరమ నంధృ్యయుబలె ఫాలచంద్రరేఖ

నీలజలదకేశ ప్రనూనజాలమధుర

మూర్తి మత్క్ళుల పొలిక ముగ్ధ వృదయః

ఈమె కొప్పుననున్న పుష్పములే చంద్రరేఖగా రూపొంది ఉన్నాయి. అయినా మానుషమైన దేహ పరిమితులలో ఎన్నో దోషాలు ఉన్నవి. మోహం '్రవాహమై క్రమ్ముకొంటున్నది. - 'గదుముకొన్న ముక్తి పొలాలు వదిలిపెట్టి /గెలుచుకొన్న మొహాల నేలలకు వంగి / ఆకట సాలోచనాక్షుడ నైతినిట్లు (50 గీతం) ఇది విచిత్రమైన ఓటమి. సామాన్య జనులకు ఈ వెనుకకు తగ్గటమే గుర్తుగా ఉంటుంది.

'కనుగొనిన వారు నను వనంతుని నుమాస్తు

గురిచి యజ్ఞ దక్షితుదనుకొనిరి గాని

గేస్తురాలవు నీవ అగ్ని నమకూర్చు

నగు నిజానికి కర్మిష్టినని ఎరుగరు”

ఇక్కడ గేస్తురాలు సమకూర్చిన అగ్ని సామాన్యమైన అగ్ని కాదు. ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన కామసాధనాగ్ని. 80వ గీతంలో తమ పెళ్లికి సాక్షిభూతుడైన అగ్ని మళ్లీ తన చేత అర్చితుడు కానేలేదని అందుకే రెట్టించి చెప్పినాడు. మరొక గీతంలో (87) ఇట్లా భావన చేసినాడు కవి.

నీవు నా గుందె కదలించినావు దేవి-

దేవి తత్రత్యులగు నర్వదేవతలును

అనభివుతములు వావ్యకవ్యములు పొంది

నా ఆకర్ణిష్టిత క్షమించినారు దేవి ప్రణయోపాసన (శ్రౌత విధియైన యజ్ఞాది కర్మలకు అగ్ని ఉపాసనకు ప్రత్యామ్నాయమైంది. ఈ అగ్ని గార్జసత్యము యొక్క వ్యవహారరూసం. ఈ అర్చన నృష్టి వికాసహేతువు. ఆనందసాధనకు, ప్రజాతంతు నిర్వహణకు హేతువవుతున్నది. అందువల్లనే కావ్యం అంతా నిశ్రేణిక నెక్కినట్లు భార్య, (ప్రేయసి, ధర్మసహచరి, దివ్యకాంత, సౌందర్యలోకాధిష్టాతి, సర్వచైతన్యపరిపాలిక, పరదేవత ఇలా ఎదుగుతూపోయింది. కవి భావప్రపంచంలో స్వర్గానికి మెట్లు కట్టాడు. ఈ ఒక్క పద్యంలోనే మూడుసార్లు దేవి శబ్దం వాడి ఆమె యందు తాను సాక్షాత్మరించుకునే ట్రిశక్తులను - శ్రీవాణీ గిరిజలను భావిస్తున్నాడు. కాషత్తతుత క్‌

'శ్రీదమై శాంతమై నమిబీనమైన అవ్వ్యయవదంబునందు నింవోననమున నీవధిష్టాత్రి వేలుచున్నావు కమల వవనములు వీచు నీవదాబ్బముల నుండి ” (49 గీతం) తత్త్వ సాక్షాత్మరానికి ఇది పునాదిగా కొనసాగింది. ఆమె అనంతభావాలయయెై విశాల భావసా[మ్రాజ్యాన్ని ఏలుతున్నది. అందువల్ల ప్రణయ కవిత్వం భావకవిత్వంగా పరిగజింపబడుతూ వచ్చింది. “గిరి కుమారుని (ప్రేమ గీతాలు" ప్రణయ కవిత్వంలోని ప్రతిషారాన్ని స్పృశించింది. కావ్యసౌందర్యానికి పట్టం కట్టింది. గాధమైన భావుకత్వం చేత దీనిలోని ప్రతిగితము విపులంగా వ్యాఖ్యానింపదగిందే. విసృతంగా అనుభవంలోనికి తెచ్చుకోవలసిందే. కవిలో ఈ రచన హఠాత్తుగా పొడుచుకువచ్చింది. (ప్రారంభగీతంలోనే ఇది స్పష్టం అయింది - 'ఇవి యధాకంఠ నిర్గతం బివి తధా విలిఖితములు (క్రేమగీతముల్‌ దేవి - ఈ గీతరచనలో కవి ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం రచన సహజోద్గతమైంది. అందువల్ల విలక్షణమైన అవచేతన ఏర్పరచిన క్రమానుబంధం దీనిలో రూపొందినట్లు కనిపిస్తున్నది. అయితే ఈ గీతాల పొందర్యం గురించిన కవి భావన విచిత్రంగా కానవస్తుంది. నీ వయిన పాడినట్టి నా నిభబృతగీతి పొడుటయె వరమార్థము - ఆ పైన దేవి అందు ్రత్యక్షరమ్ము నీ మందవోన జాలచంద్రాతపములలో ప్రజ్వలించు” ఈ భావ మణిభంగ దీప్తుల వల్ల ఈ కావ్యం ప్రణయ కవిత్వ శిఖరంగా (ప్రకాశిస్తున్నది. (కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంవారి ఆధునిక కవిత్వం" అన్న గ్రంధం కోసం వ్రాసిన రెండు వ్యాసాలు, 2007) గ్ర కనన మురన స

స్నేహ వులకితమైన మధురమైన అర్ధశతాబ్దం

నాకైతే జీవితం కల్పవృక్షమేకాని, సంవలిత గ్రీష్మమూ, పంక కలిత వర్షము, ఘనీభూతతుషారమూ, వికల చిత్తమైన శిశిరమూ కాదు. హితులూ, సంగళులూ, ప్రీతిదర్చణులూ, భావబంధువులూ ఎందరో ఆవరించిన నిత్యకుసుమిత వసంతము.

ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న, పరిశోధనచేసుకున్న రచనా రంగానికి రెక్కలు తొడిగికొన్న ఆకాలం అంతటా స్నేహ సరస్సుశీతల వాయు స్పర్శలే, హాస్టలు కూడా ఒక భువన విజయంవలె ఉందేది.

"హైదరాబాదు చేరుకునేప్పటికి 1955లో నాకు గొడుగులై నిలిచిన వాళ్ళు- దాశరథి, నారాయణరెడ్డి, రామరాజు, ఆళ్వార్‌స్వామి, వి.పి. రాఘవాచారి, మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, చేకూరి రామారావు ప్రభృతులు, మాన్య స్థానంలో ఉన్నవారు ఖండవల్లి, దివాకర్ల ప్రభృతులు.

ఒక సంవత్సరం గడిచేప్పటికి మా స్నేహవలయం విస్తరించింది. కేతవరపు రామకోటి శాస్త్రి, పి.యస్‌.ఆర్‌. అప్పారావులు పరిశోధకులుగా వచ్చారు. విద్యార్థులుగా వచ్చినవాళ్ళు వరంగల్లు నుంచి పేర్వారం జగన్నాథం, మిగతావాళ్లలో అక్కిరాజు రమాపతిరావు, మొదలి నాగభూషణశర్మ, అరిపిరాల విశ్వం. భువనగిరిలో ఉద్యోగం చేస్తూ, నడుమ నడుమ వచ్చిపోయే మా సంపత్కుమార ఇలా ఎందరినో చెప్పుకోవాలి. ప్రవంతి పత్రిక జయంతి పత్రికల కార్యాలయాలు ఎప్పుడూ పోయివచ్చే ప్రదేశాలు 1958లో 'జయంతి' ప్రారంభమయింది. జయంతి సాహిత్య చర్చలలో వివాదాలలో కొంత వేడినీ, వాడినీ తీసుకొని వచ్చింది.

ఎప్పుడూ అనవరతమూ కలుసుకుంటూ, చర్చించుకుంటూ సమానమైన కార్యోహలతో సాగిపోయే వాళ్ళలో రామకోటిశాస్తి, నాగభూషణ శర్మ, అక్కిరాజు రమాపతి రావు, నేనూ, మాదిరాజు రంగారావు ప్రభృతులం ఒక సమష్టి ముద్రలో కలసి పోయేవాళ్లం. ఇందరిలోనూ నాకు రమాపతిరావుకు అనుబంధం సౌందర్యం. లోకంలోని దుఃఖ సముద్రాన్నంతా త్రాగి బరువుగా ఆకాశంలో కదలిపోయే జలధరస్వామి రమాపతిరావు, కార్యవురిర 97

రమాపతిరావు అప్పటికి మంజుశ్రీ అన్న కలం పేరనే ప్రసిద్ధుడు. ఆయన నవలలు కొత్తబాట మొదలైనవి. అప్పుడే తెలుగు స్వతంత్రలో వస్తూ వుండేవి. క్రమంగా బెజవాడలోని ప్రచురణకర్తలు పుస్తకాలుగానూ తెచ్చేవారు.

రమాపతిరావు ఎందుకో బౌద్ధ సంప్రదాయంలోని ఒకానొక అర్హత్రుని పేరు తన కలం పేరుగా పెట్టుకొన్నాడు. అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో చెప్పలేము కాని అతని రచనలకు ప్రధాన వస్తువు సామరస్యం తొలగిపోయిన మామూలు జీవితాలలో, సామరస్యాన్ని అనుబంధించే ప్రయత్నం. (బ్రతుకు లోతులను తరచి అట్టడుగున ఉన్న వైకల్యానికి రూపుకట్టించే ప్రయత్నం ఆయన రచనలలో గట్టిగా కనిపించింది.

ఆయన ఆత్మీయ బంధువు-ఐహుశ అతని అన్న వరుసవాడు 1959 ప్రాంతాలలో చనిపోయాడు. అప్పుడు దుఃఖం అన్నిమేరలూ శ్రెంచుకొంది. నిముష నిముషమూ ఉలిక్కిపడి ఆ ప్రవాహంలో మునిగిపోనెంచే వాడు. అంతటి గాఢ సంవేదనలు ఉన్నవాడు.

నాడు భారతీయ భాషలన్నింటిలోకీ అనువదింపబడి ఆకాశవాణిలో ప్రసారింప ఐడిన అతని ఒక కథ “వానలో తడుస్తున్న మనిషి. దాని కథానాయకుడి దైన్యముఖం నాకిప్పటి వరకూ స్పష్టంగా సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. తెలుగు నవలల ధోరణిలో ఉత్తాలశిఖరాలుగా ఉన్న విశ్వనాథ, చలంల భావ ప్రభావవలయంలోనికి తాను స్వయంగా చేగకుండా నిరోధించుకున్నాడు. తాను తన సరళ శైలిలో జీవన వ్యాఖ్యానంలో గోపీచంద్‌, బుచ్చిబాబుల వైపుకూ పోలేదు. కుటుంబరావు దరిచేరనే లేదని చెప్పవలసిఉంది. అయితే మంజుశ్రీ నవలలలో, కథలలో మూలంలో శరత్‌బాబు ఉన్నాదేమో ఒక బీజభూతంగా అని అనిపించేది. అప్పుడు తన తరం రచయితలలో బలివాడ కాంతారావు, అవసరాల రామకృష్ణారావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మొదలైన వాళ్లమిద కన్నా తన మాద ఉన్న పాశ్చాత్య వాబ్బయ ప్రభావం 'అస్తినాస్తి విచికిత్సా హేతువే. ఎం.ఏ పూర్తి చేసి పరిశోధనలోకి ప్రవేశించిన తరువాత మంజుశ్రీ క్రమంగా మరుగున పడి రమాపతిరావు బయటకు వచ్చాడు. న్యూసైన్సు కాలేజీలో అధ్యాపకత్వం, తెలుగు అకాడమిలో పొఠ్యగ్రంథాల కీకారణ్యంలో చిక్కుకోవటం, పరిశోధన మార్గంలో ప్రధానంగా నిలద్రొక్కుకొన్న ఆయనను ఈనాటికీ తెలుగు సామాజిక సాంన్యతిక చరిత్రకు 1920 శతాబ్దాల విసృత పరిణామశీలమైన కాలానికి ఒక ప్రామాణిక నిర్దేశకుడుగా తీర్చిదిద్దింది.

వీరేశలింగం జీవిత చరిత్రను ప్రధాన శోధ వస్తువుగా గ్రహించిన ప్రయాణంలో నూటయాఖై సంవత్సరాల పైగా తెలుగుదేశాన్ని, సాహిత్య సంస్కృతులను, రాజకీయ

సామాజిక ఉద్యమాలనూ ప్రభావితం చేసిన మవా పురుషుల జీవిత వృత్తాంతాలను ఒక క్రమకీతిలో తీర్చుకోవటానికి, వ్యాఖ్యానించటానికీ వీలు చిక్కించింది. ఎంత మంది సమగ్ర, అసమగ్ర జీవిత చరిత్రలు, ఆత్మకథలు, డైరీలు, ఉత్తరాలు, వార్తాంశాలు ఎలా ఎలా సమకూర్చుతూ ఒక కొలిక్కి తెచ్చి అపూర్వ, విసృత కోణాలను ఆవిష్మరించటంలో గడచిన పాతిక ముప్పయి సంవత్సరాలలో రమాపతిరావుకు సాటిరాగల వారు లేరంటే ఆతిశయోక్తి కాదు. కె.వి. రమణారెడ్డి ఈ దిశలో కృషి సాగించినా అది ఒక పరిమితమైన ఉద్యమానికి, దానికి చెందిన వ్యక్తులకు ప్రధానంగా సంబంధించిందిగా వెలికివచ్చింది. జీవిత చరిత్ర వివాదాలలో దిగవల్లి వేంకట శివరావు వంటి పెద్దలతో ఘర్షించవలసి వచ్చినా, ఏ లిప్తలోనైనా వారియందు తనకు గౌరవం తగ్గలేదు. మర్యాదకూ మన్ననకూ లోటు రానీయలేదు. రమాపతిరావు జీవిత చరిత్రల అన్వేషణ క్రమంలో తనలోని ఆధ్యాత్మిక పార్షానికి కొత్త దీప్తిని సమకూర్చాడు. మేము ఎం.ఏ పూర్తయినప్పుడు 1959 మేలో ఇద్దరమూ కలసి తిరుపతికి వెళ్ళి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించి, సమాన దివ్యజీవన స్ఫూర్తిని పొందాము. ఆ యాత్రలో విశ్వనాథ సత్యనారాయణను బెజవాడలోనే కలుసుకుని వారితో మాట్లాడుకున్నాము. ఆయనలోని తాత్త్విక పిపానకు స్వామి జ్ఞానానంద ఆశ్రమం, వారి వాజ్మయం ఒక తుష్టిని, ఒక ప్రీతిని కలిగించింది. స్వామి రచనలను వెలువరించటంలో ఆశ్రమ మాసపత్రికను తీర్చిదిద్దటంలో ఆయన చేసిన కృషి నిరుపమానమైంది. స్వామి జ్ఞానానందుల పూర్ణయోగ సూత్రాలు ఇంకా అధ్యయనం చేయవలసి ఉన్నది.

మంజుశ్రీ కవిత్వం రాయకపోయినా (ఒకే ఒక సారి తెలుగు స్వతంత్రలో ఒక వచన పద్యం వ్రాసినట్లు గుర్తు) కవిత్వం అంటే అభిమానం. మంచి కవిత్వాన్ని ఎన్నుకోవటంలో అతని అభిరుచి విలక్షణమైందీ అకలుషమైందీ. తన వివాహం సందర్భం లో మధుర మధురమైన కవిత్వాన్ని ఎన్నుకొని 'శతదళం' అనే పేర ప్రచురించాడు. ఆ సంకలనంలో నా పద్యాలు 'సాహ్రమాన్మథరి కూడా చేర్చుకొని నారచనకు గౌరవం కలిగించాడు. ఆ రోజులలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో, ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఇంకా ఇతరచోట్ల జరిగే ఉత్సవాలకు సాహితీ సభలకు మేం ఇద్దరం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. కలసికొని అనుభూతులను కలబోసుకునే వాళ్ళం.

రమాపతిరావు అనాళ్ళలో అన్నావదినెలతో కలసి ఉండేవాడు. చాదర్‌ఘాట్‌ బిడ్డ దాటగానే వాళ్ళ యిల్లు ఉండేది. ఎం.ఏ పరీక్షల తరువాత సెలవుల్లో నాగభూషణ ల...

శర్మ నేనూ ఆయనతో కలసి కొన్ని వారాలు కలసి మెలసి ఉండటం వల్ల ఆంతర్యాలలో ఏ పొరలు లేకుండా జీవికాలను అర్థం చేసికొన్నాము. అక్కడి భోజన భాజనాల వర్చాటులో ఆయన ఆతిథ్య మాధుర్యం మరచిపోనీయనిది. ఇటీవల రమాపతిరావు తన (గ్రంథాలే కాక అరుదైన (ప్రాచీన గ్రంథాలను వెలుగులోనికి తెచ్చి సాహిత్య పోషకుడవుతున్నాడు. కొమజ్టాజువారి చరిత్ర సంపుటాలు, అక్కిరాజు వారి నైషధమిమాంస, గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ శతపత్రం ఆయన వెలువరించిన సంపుటాలు. ప్రాచీన సారస్వతం మిద ఆయన ట్రీతికి సాక్ష్యంగా బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలను సరళమైన వచనంలో ప్రకటిస్తున్నాడు. ఈ ప్రయత్నం వీరశైవాన్ని గురించిన అధికారము, (ప్రాచీనాంధ్ర భాషా పదబంధాల మిద (ప్రావీణ్యము ఉంటేగాని సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన పాండిత్యవు లోతులు ఈ విధంగా (వవ్యక్తమవుతున్నవి. ఉత్పల నత్యనారాయజణాచార్యుల వారి భాగవత వ్యాఖ్యాగ్రంథపరంపరలో వేణుగీతాన్ని అంకితంగా గ్రహించి తన భాగవత సరస్వతీ ప్రియత్వాన్ని చాటుకున్నాడు.

“అజో విభోవారి కార్యక్రమాలు తెలుగుదేశంలో అత్యంత వైభవంగా సాహిత్య పరిమళ సమ్మితంగా జరుగటానికి ప్రధాన ఆధారభూతమైన వ్యక్తులలో అక్కిరాజు రమాపతిరావును పేర్కొనటం అవసరం. ఇటీవలి దాకా వారి ప్రచురణలు, ప్రత్యేక సంచికలు అవన్నీ ఆయన అత్యంత సుందరంగా రూపు కట్టించినవే.

లోకజీవనంలో మేము కలుసుకున్న తాలినాళ్లకూ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. విలువలు మారిపోయినాయి.. (బతుకును గురించిన వరమార్ధం తొలగిపోయింది. మనిషినిండా వేగమూ, ఆ|ర్టతా రాహిత్యమూ, అభద్రతాభావమూ ఆవరించాయి. ఇలాంటి సన్నివేశంలో మనసునిండా ఒక మధుర జీవితాన్నీ, వివేకముతో కూడిన విచారణనూ, జగజ్జీవనతాదాత్యమూ గల జీవితాన్ని గురించి స్మరించుకోవటం మామూలు స్నేహపరిమితులను దాటీ, ఏకాత్మమానవతా భావ గాధఢతలోనుంచి.

రమావతిరావుకు ఆంధ్రభాగవతం షష్టస్మంధంలోని నారాయణకవచం చాలాయిష్టం. స్వామి జ్ఞానానందులకు నిత్యపారాయణ యోగ్యమైన ఘట్టం అది. దాన్ని అచ్చువేయించి బహుళ ప్రచారం చేయించాడు రమాపతిరావు. ఎక్కువగా కలుసుకోవటం ఈ దూరంలో, ఈ వయస్సులో సాధ్యం కాకపోయినా మామనస్సుల నడిమి సాన్నిహిత్యం శం లం సున

తగ్గి పోలేదనీ, పోదనీ భావిస్తున్నాను. ఒకటి రెండు నెలలు వయో ఖేదం ఉన్నా రమాపతిరావుకు నాకూ సద్దురువులు శ్రీ కందుకూరి శివానంద మూర్తి గారి అనుగ్రహం దారి చూపుతున్నది. జింబడి వెందిడించు నర వింద విలోచనుదన్నవార్త, నా దంబుల వెంటన్తో (కుతి వ దంబుల వెంటన్నొ పొరిజాత వు వృంబుల వెంటన్తో ఫలర నంబుల వెంటన, జీవనార్తి మా ర్లంబుల వెంటనో విరవా గానము వెంటనా నేరనింతయునో ఈ ఎరుగమి తొలగిపోయి స్వామి దర్శనం ఈ జీవితంలోని ఏ లిప్తలోనైనా మాకు కలుగుతుందని అందుకు కావలసినంత గురుదేవతానుగ్రహం మామోద వర్షించాలనీ కోరుకుంటున్నాను. గా ల (5! / గ్ర ఖా. క 1 గీ స రిట్‌. కాన్య్యపురురి కాల

కస్తూరి నింపుకున్నచందన పేటిక - మన రడియారం గడియారం రామకృష్ణ శర్మగారు కీర్తిశేషులైన వార్త మన నడుమనించి ఒక బహుముఖ వ్యక్తిత్వాన్ని తొలగించింది. శర్మగారి మూర్తిమత్వంలో అనేకాంశాలు ముడి పడి ఉన్నవి. వేదాధ్యయనపరుడు, బహుశాస్త్రవేది ఐనా సంఘ సంస్మర్త. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయోద్యమాలను నడిపించినవారు అయినా ఏ పదవులూ పొందలేదు. పురాతత్తవేత్త, ప్రాచీనమైన జాతీయ శిల్ప సంపదను రక్షించేందుకు విరామమెరుగని పోరాటాన్ని నిర్వహించిన మహావీరులు. తెలంగాణా సాంసృతిక సాహిత్య పునరుజ్జీవన సేనానులలో ఒకడైనా వెనుకవరుసలోనే ఉండిపోయినవారు. అరవైల ప్రారంభం రోజులలో తరచుగా నేను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఆయనను ఆంధ్ర సారస్వత్‌ పరిషత్‌ ఆవరణలో చూచేవాణ్ణి. సంకోచంవల్లనో, చనువు తీసుకోకపోవటం వల్లనో ఆయనలో (ప్రత్యక్ష పరిచయం సెంచుకోలేదు. సారస్వత పరిషత్‌ కార్యకలాపాలలో ముఖ్యంగా ఆలంపురం మహాసభల నిర్వహణలో ఆయన పాత్ర ఎంత ప్రధానమైందో నాకు అప్పటికే తెలుసు. ఆ మవాీసభల సంచిక 'సుజాత* చదువుకొని కనులకద్దుకున్ననాణ్ణే, తెలంగాణం నుంచి స్వయంగా వెళ్ళి సర్వతంత్ర స్వతంత్రులు, మహాపురుషులైన వేలూరి శివరామశాస్త్రి శ్రీ చరణుల సన్నిధిలో పాండిత్యాన్ని కూడగట్టుకున్న ప్రముఖులలో గడియారం వారొకరైతే, నల్లగొండ చండూరుకు చెందిన అంబటిపూడి వేంకటరత్నం గారు మరొకరు. ఇద్దరూ గురుకులక్షిష్టులు. గురుశుభ్రూష వల్ల వారి అనుగ్రహంవల్ల సాహిత్య వేదికను సులువగా చేజిక్కించుకున్నవాళ్ళు. గడియారం వారు ఇంట్లో ఇబ్బందుల వల్ల చదువును మధ్యలో మానుకున్నారు. మనుస్కృతిలో 'ప్రక్షిప్తాలను చూచినప్పుడు చదువుతూనే ఆగ్రహావేశం పొందిన వేలూరివారి పరివర్తనశీల చిత్తవృత్తిని కళ్ళకు కట్టేట్టు చూపించారు శర్మ ఈమ ఆత్మ కథలో. ఆ సన్నివేశం శూద్రులకు శాస్త్రములను నిషేధించేది. శివరామశాస్త్రి గారి ఆధ్యాత్మిక చిత్తవృత్తి ప్రాబల్యం లేకపోతే మనమెరిగిన రామకృష్ణ శర్మ మనకు లభించే వారు కాదేమోననిపిస్తుంది. 402 నా సుర్తున్ను

మధ్యయుగాలల్లో అన్యమతంవారి తాకిడికి పొాందూమతం ఎలా వడలి పోయిందో, నిజాం పరిపాలన పూర్తయ్యేప్పటిదాకా అ పరిస్థితులు ఎలా కొనసాగినవో ఆయన ఆత్మకథలో సత్యనిష్టతో వివరించారు. “పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం(రాయచూరు దుర్గం) తరువాత బహుమని సుల్తాన్‌ల వశమైంది. కోటలోని దేవాలయాలన్నీ మసీదులుగా మారినాయి. అలంపురం దేవాలయావరణలో 14వ శతాబ్దపు ఓడదొంగ షాహి పహిల్వాన్‌ దర్గా వుండడం అక్కడ మూడు రోజులు ఉర్చు సందర్భంలో హిందువులకు అవమానకరమైన దురాగతాలను ఈనాటికీ జరుగుకున్న సన్నివేశాన్ని ఆత్మకథలో వివరించి తాము ఎట్లా ఆ దుర్మార్థాలను నిరోధించగలిగిందీ వివరించారు.

సంఘ సంస్కరణోద్యమ విషయంలో ఆగ్రవర్ద హిందూమత విశ్వాసాలు ఎలా విపరీత ప్రవృత్తికి లోనైనవో స్పష్టంగా వివరించారు. తెలంగాణాలో నాడు నిజాం ప్రభుత్వానికి ఏరకమైన రాజకీయ స్పర్భ ఉన్నా సభ నిర్వహించినా ఎంతటి ఉలికిపాటు ఉండేదో అనేక సందర్భాలలో విపులంగా చిత్రించారు.

ఆంధ్ర సారస్వత్‌ పరిషత్‌ స్థాపన, దాని వికాసం ఆ క్రమంలో బూర్లులవారి సంబంధులు చేసిన విభేదకర కార్యకలాపాలను నిస్పక్షపాతంగా చెప్పారు. నాడు తెలంగాణా నాయకులు ఎక్కునమంది తెలుగులో కాకుండా ఉర్జూలో ప్రసంగించేవాళ్ళు.

నిజాం సంస్థాన విమాచనోద్యమంలో రామకృష్ణ శర్మగారి పాత్ర చాలా విశిష్టమైంది. రజాకారులను నిరోధించే క్రమంలో ఉద్యమంలో హింస కూడా చోటుచేసుకోగా శర్మగారు దానిని నిరోధించే ప్రయత్నం చేసినారు. ఆ నాళ్ళల్లో భాగ్యనగర్‌ రేడియో పేర కర్నూలు కేంద్రంగా రేడియో వార్తా ప్రసారాలు నిర్వహించడం అత్యంత సాహసపూర్ణమైన సన్నివేశం. ఆ రేడియో కేంద్రంలో వార్తలు చదీవినవాళ్ళల్లో మాజీ (ప్రధాని పి.వి. నరసింహారావు కూడా ఉన్నారని తెలియవస్తున్నది.

నిజాం ప్రభుత్వ పక్షాన రేడియోదక్కనులో కురుగంటి సీతారామయ్య వార్తలు చదివేవారట. వీటిల్లో స్వాతంత్రోద్యమాన్ని అవహేళన చేస్తూ జాతీయ నాయకులను విమర్శించేవారట. నైజాం ఘన కీర్తిని చాటేవారట. ఇవి నాటి ఉద్యమ చిత్రంలోని రెండు పొర్ష్వాలు. కురుగంటివారితో పాటు రాయ'్రోలువారు, మహమ్మద్‌ ఖాసింఖాన్‌లు నాడు నిజాం వందిమాగధులుగా (ప్రవర్తించిన తీరు ఏవిధంగానూ ప్రశంసనీయమైంది కాదు.

అట్లాగే అలంపూరులో ఇస్లాంలోకి మార్చబడ్డ లక్ష్మీదేవి అనే యువతిని మళ్లీ శుద్దిచేసి హిందువుగా మార్చిన సాహసం శర్మ వంటివారే చేయదగిన కార్యక్రమం. రామకృష్ణ శర్మ సత్యం చెప్పే విషయంలో ఎవరినీ వదిలిపెట్టలేదు. పోలీసు యాక్టన్ట ల.

7లఈ9౮ా

తరువాత అప్పటివరకూ రజాకారులకు సహకరించిన, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించిన దొరలు, భూస్వాములు కాంగ్రెసులో చేరి మళ్ళీ అధికార పీఠాన్ని చేరుకోవడాన్ని కటువుగానే విమర్శించారు. అట్లాగే మొదటి జనరల్‌ ఎన్నికలలో సురవరం ్రతాపరెడ్డిగారు శాసనసభ్యులుగా ఎన్నికైనా మంటత్రిపదవుల సందర్భంలో వారిని విస్మరించిన అంశం కూడా సానుభూతి సమావేశంలో, ప్రతాపరెడ్డి గారిని అర్హతను బట్టి గౌరవించని నాయకులు ఆయన మరణం పట్ల కన్నీరు కార్చడం విషయంలో అనౌచిత్యాన్ని వెల్లడిచేశారు. గడియారం రామకృష్ణ శర్మ జీవితాన్ని ఒకసారి అంచనావేస్తే ఆయన ఎప్పుడూ సమాజ సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, పురోగమనం కోసం మడమ తిప్పకుండా సాగిపోయిన వీరులని స్పష్టమౌతోంది. స్టెల్లా క్రామరిష్‌ వంటి పురాతత్త్వవేత్తలకు శర్మ మార్గదర్శనం చేసినవారంటే సామాన్య విషయం కాదు. (ప్రతిమాశాస్త్రం, విమానశాస్త్రం, దేవాలయ నిర్మాణం, శాసన పఠనం మొదలైనవన్నీ వారికి కరతలామలకాలు. భౌతిక ఉద్యమాలలో మునిగితేలేవారి లోలోపల ఆధ్యాత్మిక సాధనాంశాలు ఎక్కువగా తెలియరావు. శర్మ తిరువన్నామలై భగవాన్‌ రమణ మహర్షి దర్శనం చేసినప్పుడు పొందిన ప్రశాంతి ఆ మార్గంలో వారి అన్వేషణకు కలిగిన ఫలమే. శ్రీ శర్మ ఆత్మ విద్యామార్గంలో కథా సాగరం శేషశాస్రిగారిని గురువులుగా స్వీకరించారు. వారివల్ల తాను శివపంచాక్షరి ఉపదేశం పొందినారు. అట్లాగే మరొక చోట ఆయన ఇలా అన్నారు. “నా అనుష్టానము ఇతరత్రా కార్యక్రమాల వత్తిడి చేత ఎక్కువగా సాగకపోయినా జగన్మాత అను(గ్రవిన్ని పొందినాను. నా జన్మకు ఈ అనుభవం చాలని తృప్తిచెందినాను. శర్మగారి జీవితంలో కిరీటప్రాయమైన సన్నివేశాలు రెండు. అలంపురం ఆంధ్ర సారస్వత్‌ పరిషత్‌ మహాసభలు నిర్వహించటం, దానిలో శ్రీపాద, విశ్వనాథ, శ్రీశ్రీ, దాశరథి, కాళోజి ప్రభృతులు అందరూ భాగస్వాములయ్యేట్లు చేయడం. ఈ మహాసభలలో భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పాల్గొని ప్రసంగించడం. రెండవది అలంపురం శిథిలాలను రక్షించడం, అష్టాదశ హీకాలలో ప్రసిద్ధమైన శ్రీ జోగులాంబ దేవాలయాన్ని నిర్మింపజేయడం. తెలంగాణా పునరుజ్జీవనంలో మాడపాటి మొదలైన వాళ్ళు విజయవాడ సమీపంనుంచి ఉద్యమ (ప్రేరణలు గగ్రహించగా, గడియారం వారు రాయలసీమనుండి ఉద్యమ ప్రేరణలు గ్రహించారు. గడియారం రామకృష్ణ శర్మగారి స్టృతి కస్తూరి నింపుకున్న చందనపేటిక, ఆర్భాటాలు లేకుండా ఒక మూలలో దాచిపెట్టుకున్న పారిజాత సుమమాలిక. (జులై 31, 2006 - ఆంధ్రభూమి) 104 సుర్పుస్న్న

కవిత్వ శిశిరంలోకి వసంతమై ప్రవహించిన శేషేంద్ర 1965 (ప్రాంతాలలో ఆంధ్రప్రభ సాహిత్యానుబంధంలో రామాయణం సుందరకాండను గురించి, శ్రీహర్ష నైషధం గురించి రహస్య వివరణాత్మక వ్యాసాలు వస్తూ వుండేవి. అవి అద్భుతంగా నూతన విషయ ్రతిపాదకంగానూ ఉందేవి. ఆ వ్యాసాల రచయిత గుంటూరు శేషేంద్రశర్మ ఆయన అడ్రసు సంపాదించి ఉత్తరాలు వ్రాయటమూ, స్నేహపూర్వకమైన ఆయన సమాధానములూ నాకూ శ్రీ సంపత్కుమార గారికీ ఆయనను సన్నిహితుజ్జి చేశాయి. నెమ్మదిగా ఆయన 'బుతుఘోషు కావ్యమూ చదువటం జరిగింది. వరంగల్‌లో సంస్కృతభాషా 'ప్రచారానికై ఏర్పడ్డ సంస్కృతభారతి పక్షాన ఆయనను ఆహ్వానించాము. శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యులవారి అధ్యక్షతన సమావేశం. ఇక్కడి వాసవీ (గ్రంథాలయంలో జరిగింది. ఆ రోజు విస్ఫృతమైన శాస్త్రపొండిత్యము, తంత్రశాస్త్రము, శ్రీవిద్యల అవగాహన మాకు అచ్చెరువును కలిగించాయి. తరువాత చైతన్యభారతి సమావేశాల్లో, పోతన పంచశతి ఉత్సవాలలో మరెన్నోసార్లు ఆయన వరంగల్లుకు వచ్చారు. క్రమంగా శేషేంద్ర కవితా ప్రపంచంలోనికి క్రొత్త వసంతం వచ్చింది. క్రొత్త ప్రాణదేవతలు దానిలో విహరించసాగారు. వాల్మీకి నుంచి ఈనాటి దాకా ప్రపంచంలోని కవితారాశి అంతా నగ్నోద్విగ్నంగా ఆయన శబ్దజగత్తును 'మెటమార్భసిస్‌ చేసింది. నన్నయ్య తరువాత, రాయప్రోలు తెలుగు కవిత్వానికి క్రొత్త భాషానుబంధంతో నూతనరూపం ఇచ్చారు. అయితే మళ్ళీ యాఖైయేళ్లకే నూతన కావ్యభాష శేషేంద్రవల్ల ఆవిర్భవించింది. ఎన్నడూ లేని అలంకారసామగ్రి, కవి సమయాలు, '్రాగ్రూపాలు, భావచిత్రాలు సమృద్ధంగా ఊరేగింపుగా వచ్చి చేరాయి. ఈ గ్రథన కౌశలం అపూర్వమైంది. శ్రీశ్రీ భావప్రపంచం ఎంత కొత్తదైనా, నూతన భాషా గ్రథన కౌశలం వల్ల వినూత్న కవిత్వయుగాన్ని ప్రారంభించటం మాత్రం శేషేంద్రకే సాధ్యం అయింది. ప్రగతి కవితాయుగం ప్రాచీన కావ్యసంప్రదాయంతో అనుబంధం ట్రెంచుకొని మార్మ్చీయ భావజాలం ఆధారంగా సాగిపోయింది. వెన్నంటివచ్చిన ప్రయోగవాదం న న గ

పాశ్చాత్య కవిత్వ ప్రపంచంలోని శిథిలమైన నూతన వాదాలను ఆశ్రయించి “నిరర్ధక ప్రయోగ సంభావనం సాగించగా, కవిత్వం క్రమంగా వాచ్యప్రధానమై నినాద ప్రాయమైంది. నవ్యసంప్రదాయం విశ్వనాథ సత్యనారాయణ నేతృత్వంలో ్రాచీనాధునిక భావాను సంధానంతో జాతీయోద్యమ చైతన్యంతో మహాకావ్య నిర్మాణం సాగిస్తూ వచ్చింది. ఇది బోయి భీమన్నలో '“దీపసభు అయింది. నారాయణరెడ్డిలో 'కర్పూర వసంతరాయలు” మొదలైన కావ్యాలయింది. పుట్టపర్తివారి శివతాండవమైంది. విద్వాన్‌ విశ్వం "పెన్నేటి పాటి అయింది. కుందుర్రి కథాకావ్యం వచనకవితలో ఉండాలనే ధోరణి అయింది.

తరువాత ఏదో ప్రపంచం మునిగిపోయిందన్నట్లు ప్రగతివాదం వెనుకబడిందని దాన్ని మేలుకొల్చేందుకు దిగంబర కవిత్వోద్యమం వచ్చింది. అళ్లీల ప్రతీకలు నినాదాలు కలిసి ఇది కొంత కలవరపెట్టిన మాట నిజమే.

జాతీయ చేతన, (ప్రజాస్వామ్య భావన, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి, దివ్యజీవన స్థాపన అన్న లక్ష్యాలతో చేతనావర్తోద్యమం దీనివెంట వచ్చింది. వచనరూపమైన కవిత్వంలోకి జాతీయాధ్యాత్మిక భావనలు సంగమించాయి. ప్రగతివాదం వచ్చినప్పటినుండీ (ప్రధానమైన ఒత్తిడి అంతా వస్తువును గురించిందే. ప్రగతివాదం తాకిడికి చాలావరకు అకవిత్వమే వస్తువే కవిత్వంగా చెలామణి కావటం జరిగింది. కొన్ని కొన్ని అపవాదాలు ఉండవచ్చు దీనికి.

శేషేంద్ర తెచ్చిన కవిత్వం ప్రగతివాదంలోని మార్చియ లక్షణాని నవ్య సంప్రదాయంలోని భారతీయ సాహిత్య శాస్త పరంపరను, చేతనావర్తం తెచ్చిన జాతీయ చేతనను సంగమింపజేసుకౌని యైెంచికవుల నూతనాభివ్యక్తులకు, ఉరుదూ పారశీ కవుల కవిసమయాలను చేర్చుకుని ఒక మోహినివలె తెలుగు కవిత్వరంగంలోనికి ప్రవేశించింది. 1975 ప్రాంతాలలో సంభవించిన ఈ పరిణామం అప్పణ్జించీ ఒక పాతిక సంవత్సరాలు తెలుగు కవిత్వాన్ని తన 'ప్రాభవంతో వెలిగించింది.

పరస్పరారాధన భావంతో నెలకొన్న సౌందర్యమయ దాంపత్యం ఉదాత్తికరింప బడిన తీరు ఇలా ఉంటుంది. శేషేంద్ర కవిత్వంలో -

ఒక్సరోజే కావచ్చు కానీ

అది చరిత్ర పెదవుల్ని చుంబభించింది

రెండు కిరణాల్ని ముడివేసి అక్షర జగత్తు

మెడలో వేనింది లలల

చందమామై నా ఇంద్రియాల

నిండా వెన్నెల నింపింది (శేషజ్యోత్న-పే. 49)

ఆమె రాకుంటే జీవితం ఎంత శూన్యమో చెప్పుతూ “నీవు రాకుంటే కొమ్మల్లో తెమ్మెరలేదు, పక్షుల్లో పాటలు లేవు, తోటల్లో పూవులు లేవు, బాటల్లో వెలుగులు లేవు (శేషజ్యోత్న్న - పే.44.

నవతరం గురించి ఎంత విశ్వాసమో ఈ కవికి. వారే మన పిపాసిత పెదవులు. ఉపాసిత సూర్యలోకాల్నించి సముద్రాలు తెచ్చి అందిస్తారు. పిపాసిత పెదవులు ఆర్తమైన లోకాన్ని, ఉపాసిత సూర్యలోకాలు అసాధ్యాన్ని సాధించటాన్ని, దీక్షను వైదికంగా భావించితే అంతరాదిత్య విద్యాదులను సూచించుతాయి. సముద్రాలు సమృద్ధమైన భావిలోకాల్ని సూచిస్తున్నది.

అందుకే ఈ కవి జీవితం అంతా తపించి ఒక అపూర్వమైన ఇతిహాసాన్ని నిర్మించాడు. “ఒక ఇతిహాస నిర్మాణానికి బాధానుపూర్వకమైన బలి కావాలి అంటాడు కవి. రామాయణ రచన ప్రారంభానికి క్రాంచపక్షి నధ ఈ బలి. కవికి కలిగిన కోధం హింసకు వ్యతిలేకమైన ఆగ్రహం రామకథా నిర్మాణానికి దోహదం చేసింది. అయితే భారతం జనమేజయుని ప్రతీకారరూపమైన సర్పయాగంతో ఒక జాతి హత్యతో ప్రారంభం అయింది. అయితే దాన్ని ఉపసంహరించితే గాని ఆ గాథ ముందుకు సాగలేదు. అయితే అది పూర్వమే జరిగిన కురుక్షేత్ర యుద్దానికి ప్రతిఫలనం, ఇక్కడి సమష్టి బలి. అర్జునుని విషాదయోగం ఈ బలిని తప్పించలేకపోయింది. అందుకే ఇక్కడ ఐలి తానే, శేషేంద్ర ఆధునిక మహాభారత నిర్మాణానికి హేతువు తనలోని జగద్బాధానుబంధము - కోధము, ప్రతీకారబుద్ధి, నూశనయుగ నిర్మాణచేతన. దీనికి ఆయన ప్రతిభ పాండిత్యము అనుభవము ఈ అన్నింటినీ జీర్ణించుకున్న ఆయన ఆయుస్సు. దీని సారం కవి సారస్వత వ్యక్తిత్వము. ఇది సామాన్యమైన బాహిరమైన దేహాన్ని జీవితాన్ని మాత్రమే ఆశ్రయించినది కాదు. వాటన్నింటిని దొటిన భావుక చేతన, ఇది శతాబ్దాల గొంతులలో పోసిన సారమే ఆతని కవితాసృష్టి,

కవి తనను తాను దేశంతో పోల్చుకుని, తనలోనికి ఆవాహన చేసుకుంటున్నాడు. తాను దేశపు ఆత్మ. తాను రైతు. 'ఈ దేశానికి నాగలి ప్రతీక, ఈ దేశపు ఆకృతి నాగలి ఆకృతి. ఒకదాన్ని ఒకటి పోలి వుంటుంది'. తొనే దేశమూ, దేశమే తానూ అయి పోతున్నాడు. తనలోని విశ్వచేతన కుదించుకున్న దేశంలో కవి నేత్రం విచ్చుకుంటున్నది క్యోప్తుతిరి 107

“కవి నేత్రం చేసే ఇంద్రజాలం మూలంగా కవియొక్క దేశకాలాల్లో వ్యావహారిక క్రమం ఉండదు. ఎప్పుడో జరుగబోయే సంఘటనలు కవి కావ్యంలో ఇప్పుడే వచ్చి చేరుతాయి" ఇది ఇతిహాసం యొక్క ప్రత్యేక లక్షణం. దాని ముఖం సహస్రసహ(్రంగా దేశకాలాలలో విస్తరిస్తుంది. నన్నయ్య చెప్పినట్లు “విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ జేసె భారతంబూ అన్న స్థితికి కవి చేరుకుంటాడు.

అందుకనే ఆధునిక మహాభారతం పదిపర్వాల ఇతిహాసమై ఆవిర్భవించింది. కవి తాను అనుభవించి పలవరించే ప్రపంచమంతా తానై పోతున్నాడు.

“అడవుల్ని కప్పుకుని నదుల్ని తలపాగాలుగా చుట్టుకొని రస్తా ఉత్తరీయంగా వేసుకుని నడుస్తున్నా (ఆధు.మ.భా.పే. 15)

(ప్రాచీన సాహిత్యంలో శివుని వర్ణించే సందర్భంలో గంగను తలపాగాగా చుట్టుకున్నవాడని వర్ణించటం ఉన్నది. అడవులు, నదులు, దారులు ఈ విశ్వచేతనలో మగ్నమైన కవికి ఆభరణాలు అవుతున్నాయి. శివునితో సమభావం స్ఫురింపజేయటం వల్ల వర్తమానాన్ని మార్చివేసి నూతన జగత్తు నిర్మించబోయే లక్షణం స్ఫురిస్తుంది.

“పాముకాటుతో భస్మమవుతున్న & నా ప్రజలారా! రండి

మీకో క్రొత్త వద్యం ఇస్తా ఈ వద్యం మీకో క్రొత్త ప్రాణం పోస్తుంది

కొత్త వయాజణం ఇన్తుంది

నాగస్వరం ఊదే క్షుదవిద్య నేర్చుకోకండి.

పామును చంపే ఉన్నతవిద్యను నేర్చుకోండి” (ఆ.మ.భా. పే.80)

పీడనయే సర్బం. అదే భస్మీకరిస్తున్నది. పద్మం వాళ్ల చైతన్యాన్ని మార్చి నూతన లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నది. అందువల్ల ఆ క్షుద్రవ్యవస్థ - పీడకుల వ్యవస్థ బుజ్జ్ఞగింప దగింది కాదు. అది ఎంత ఓరిమి వహించినా స్వభావం మారదు, దాన్ని సమూలంగా నాశనం చేయవలసిందే. ఇది మార్చీయ వాదానికి ఆనుకూల్యమైన అతని చిత్తవృత్తిని వెల్లడిస్తున్నది.

ఆవేశంతో కూడి ఉన్నా ప్రగతివాద కవిత్వంలో ఇంతటి వ్యంగ్య మర్యాద మృగ్యమే. మరొకచోట ఇలా అంటాడు - “ఎత్తితే నా చేయి మండే అగ్నిజ్వాల, దించితే వేయి కిరణాలు (వ్రేలాడే సాయంసంధ్య (పే.75). ఉద్యమించినప్పుడు ఎంత తీవ్రత ఉన్నదో, ఉపసంహరింపవలసి వచ్చినప్పుడు సాయంసంధ్యయే అయితే రాత్రిలోనికి నిర్ణమింపవలసి ఉన్నా దానికి (వేలాడుతూ వున్నాయి వేయి - అనంతమైన కిరణాలు. 108 సుపుసన్మ

దించినప్పుడు కూడా ఆ విప్లవవీరునికోసం ఎదురుచూస్తూ ఇది ఆశ్రువుల తిరుగుబాటు

  • అవమానితుల భాషా సమితి (ఆ.మ.భా.పే, 162).

ప్రస్తుత సమాజం శిథిలమై మరణించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇది ఒకప్పుడు ఉజ్జ్వలంగా ్రకాశించిందే. అయినా కాలం ్రహారాలకు శిథిలమైంది. కవి ఎంత గొప్పగా అంటున్నాడో చూడవలసిందే. 'ఈ ముసలి దేవాలయం దగ్గుతోంది” (పే, 166) వ్యాధిగ్రస్తమైందని తాత్పర్యం.

శేషేంద్రశర్మ కవిత్వంలో ఉపమానాలు, రూపకాలు, ఉ్ర్రేక్షలు, శబ్దసమూహాలకు కొత్త ఉడుపులుగా ఏర్పడుతూ ఉంటవి. అనలంకృతమైన వాక్యంగానీ, గ్రథన కౌశలం లేని పదసమూహంగానీ మనకు ఈ ఇతిహాసంలో గోచరించవు. ఆతనికి విశ్వం ఒక సంకేతాల గుంవు, నేనొక జ్ఞాపకాల ఊరేగింపు. అందువల్ల గొంతెక్తితే చాలు కావ్య భాషా జగత్తు స్వయం(ప్రకాశమానమై ఆవిష్ఫ్టాతమవుతుంది.

నూర్యుదు నముద్రాలమీద వంగి నీరుత్రాగే గుజ్జం” (పే.2629) ఈ వాక్యం చదవగానే బృహదారణ్యకోపనిషత్‌ ప్రథమమంత్రం స్ఫురిస్తుంది. “ఉషావా అశ్వస్య మేధ్యన్య శిరః అని అశ్వమేధాశ్వం శిరస్సు ఉషస్సేనని. ఇక్కడ సూర్యుడు గుజ్జమైనాడు. సముద్రంలో నీళ్లు త్రాగుతున్నాడు.' వైదిక ప్రతీకలలో అశ్వము సూర్య ్రతీకయే. శేషేంద్రశర్మ కాల్పనిక కవుల నాటినుండీ క్రమంగా వేద సంస్కృతికి దూరమవుతూ (ప్రాచీనతను తిరస్మరించే దశకు చేరిన ప్రగతివాదోద్యమాలకు భిన్నంగా సాంస్కృతిక (ప్రతీకలను, సంప్రదాయాలను స్వీకరిస్తూ వచ్చాడు తన అభివ్యక్తి మార్గానికి అనుబంధంగా.

ఆధునిక కవిత్వంలో శేషేంద్ర సిద్ధం చేసింది - కవిత్వం దేశకాలాలకు అతీతంగా విశ్వసంస్కృతికి ప్రాతినిధ్యం వహించేదిగా రూపొందటం. శేషేంద్ర భావి దర్శనం ఎంత ఉజ్జ్వలంగా ఉందో చూడండి -

(యందే నూర్చుడు రెండు ముక్ళులుగా విరిగి

మనిషి కళ్ళుగా వమారుతాదు. అకాశం కూలిపోతుంది

నముద్రాలు పొంగుతాయ్‌. ఎందుకు జాగు చేస్తారు

రండి మా గుమ్మానికి తోరణాలు కట్టండి

మానవజీవితాన్నాక మవోత్సవం చేయండి' (ఆ.మ.భా.పే, 268)

జీవితాన్ని మహోత్సవం చేసే భావన ఎంత గొప్పదో అప్పుడు దివి ఇక్కడికే దిగి వస్తుంది. దివ్యజీననం సాక్షాత్కరిస్తుంది. కార్యర్తుకురి 105

ఇదంకా శేషేంద్ర కవితా ప్రపంచం. మరొకటి ఆయన వ్యాఖ్యోప్రపంచం. స్వర్దహంస, మోదశి, రామాయణ రహస్యాలు ఈ రెండూ దీనికి తలమానికాలు. ఇంకా చెప్పితే కాలరేఖలో కొన్ని వ్యాసాలు - వాటిలో శ్రీ అరవిందుల 'సొవిత్రి' గురించిన వ్యాసం. కావ్యగర్భంలోనికి ప్రవేశించి పొరలు పొరలు విష్పుకుంటూ దానిలో నిక్షిప్తమై యున్న రహస్యాలను వ్యాఖ్యానించటం. శ్రీహర్ష నైషధంలో వహాంసను అజపా గాయత్రి అన్నాా సుందరకాండలో (త్రిజటను గాయత్రి మంత్రరూపమేనన్నా ఆయన ఉజ్జులత్‌ అంతర్చోధకు తార్మాణం. నా షష్టిపూర్తి సంచిక 'ప్రసన్నశారదకోసం ఆయన “యమున, వేణువు, ధేనువు అనే వ్యాసం వ్రాశారు. దాని చివర మా చెలిమికి గుర్తుగా “బాలకృష్ణుని మోవిమీద మధుర స్వరాలొలికే ఆ మహాకాల స్వరూప వేణువు షష్ట్రబ్బపూర్తి చేసుకుంటున్న నా విద్వన్నిత్రులు విఖ్యాతకవులు అయిన సుప్రసన్నాచార్య గారిని సర్వదా రక్షించుగొక అని (ప్రార్ధిస్తున్నాను అని ఆశీస్సులందించారు. శేషేంద్ర తెలుగు సాహిత్యానికే కాదు, భారతీయ సాహిత్యానికే అలంకారం, ఆకవిత్వ శిశిరం నుండి కవిత్వ వసంతంలోకి కవిత్వాన్ని ప్రవహింపజేసినవాడు. ఆయన తోడి మైత్రి నా చిత్తానికి మరపురాని పొగడపూలతావి. ఆయన గతించలేదు.' శబ్దమై, అనుభవాల ఊటయై జీవించి ఉన్నాడు. ఉంటాడు కూడా ఎంత కాలమైనా. లై 2007 - నది లన గాగ

ఎడారిలో నీటి చెలమ రామ్‌నారాయణ్‌ కవిత్వపు ఊట

ఎంతకాలంగా ఈ కవిత్వ ప్రపంచంలో ఉన్నా ఎప్పుడూ కవిత్వం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఏ లక్షణం చెప్పినా అది ఎక్కడో కొన్ని పరిమితుల్లోకి ఒదిగిపోతుంది. అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలకు గురవుళూనే ఉంటుంది. 'చెప్పవలె కప్పురంబులు కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై గుప్పిన క్రియ కర్బూరం కుప్పపోస్తే దానిమీద సూర్యకిరణాలు ప్రతిఫలించితే అది కరిగిపోతూ క్రమంగా వాసనలను క్రమ్మివేస్తుంటే, కుంకుమపూవును పైన పైనే ఎవరో గుప్పిస్తూవుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి కవిత్వం అంటాడు రఘునాథ నాయకుడు తన వాల్మీకి చరిత్రలో, శ్రీరంగంలో కార్తీక శుద్ధ ఏకాదశిన కప్పురప్పడి సేవ జరుగుతుంది వైభవంగా. ఆ కస్తూరి రంగడు రాత్రంతా కొలువుతీర్చి, దివ్య ప్రబంధ గానం ఆరయర్లు సాభఖినయంగా చేయగా గుర్తించి, గౌరవించి, నూతన వస్త్రాలను స్వీకరించి కైశిక పురాణం విని, తెల్లవారి ఉదయం వైభవంతో గర్భాలయంలోనికి ప్రవేశించబోతూవుండగా భక్తులు కర్పూరం గుప్పిళ్ల నిండా స్వామిపై వెదజల్లుతూ ఉంటారు. ఆ సేవలో మైమరచిన అనుభవ తీర్థమైన మనస్సు ఒక కవిత్వోత్సవం.

మట్టి తిని మట్టికరిచి వెట్టిచాకిరి (వ్రేళ్లు అందిస్తున్నవి ఆకులు, పూలు, వళ్లు (నాదాలు-నా పదాలు 161)

ఇది శ్రమ జీవన వర్ణనం, వృక్షం యొక్క అధోలోకం వ్రేళ్లు, అవే ఆధారం, అవి బయటకు రావు. గౌరవం పొందవు. ఆయితే జీవసారం అందించి వృక్షాన్ని పత్ర పుష్ప ఫలభరితంగా చేసేవి ఇవే. వీటిది వెట్టిచాకిరి. భోగభాగ్య దూరమైన కార్మికలోకం ఇక్కడ ఆవిష్ఫుతం అయింది. ఈ వృక్ష ప్రతీక తల క్రిందులైకే ఊర్ప్యమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రామురవ్వ్యయం' అన్న గీతా వాక్యాన్ని తాకుతుంది. ఇక్కడ మూలం ఊర్థ్వమైనా అదీ సర్వకారణమైనా అవ్యక్తమే. అవ్యక్త గర్భమే. ఇక్కడ వ్యక్తమయ్యేది షత్ర పుష్పఫలాలే. ఇక్కడ బ్రహ్మతత్త్రం మాయారోపితమైన సంసార వృక్షాన్ని అభివ్యక్తం చేస్తున్నది.

గుత్తులు గుత్తులుగా ట్రేలాదదీసీన (ద్రాక్షలు వృక్షమాంనం (నాదాలు-నాపదాలు 83)

శ్యత్తతుత ననన

రాక్ష గుత్తులను చూచినప్పుడు కవి దాని అంతస్సులోకి ప్రయాణిస్తున్నాడు. కనిపించే ద్రాక్ష పళ్లు మధురాలై సత్వదాయకాలై మనకు ప్రీతిని కలిగిస్తున్నాయి. అయితే అవి 'తీగ అన్న శిబి చక్రవర్తి మన అనుభవం కోసం కోసి యిచ్చిన మాంసం మన అనుభవం కోసం. ప్రకృతి అంతా మానవుడి కోసం ఎంతగా త్యాగం చేస్తున్నది. దానితో సామరస్యం తైంచుకున్న అతడు అంతర్చహిర్దగత్తులలో సంతులనం కోల్పోయి ఎంత దుఃఖం పడుతున్నాడు. సంతులనమే సంభవించవలసిన అంశం. ఇక్కడ రూపించిన తీరు భావుకునికి ప్రాగ్రూపంగా శిబిగాధను, ప్రకృతిలోని మాతృ లక్షణాన్ని నిరూపిస్తున్నది. “మెట్లు ఎక్కదానికే కాదు దిగడానికి కూడా (నాదాలు - నా పదాలు) మానవుడు సృష్టి రెంటి సంబంధాన్ని అత్యంత సుకుమారంగా, అద్భుతంగా నిరూపిస్తున్నది పై కవితా పంక్తి ఈ సృష్టి అనంతమైన (ప్రకృతి విన్యాసంలో విసృతమైన ఆవిష్ఫృతితో మానవుడికి చరాచరజగత్తుకూ భోగంగా దివ్యచేతనను అధిరోహించే నిచ్చెనగా కూడా రూపొంది ఉన్నది. అయితే దైత్య చిత్తవృత్తితో దానిని హననం చేసే తీరులో, అంతరంగంలో కామక్రోధాదులతో, అత్యాశతో, లోభంతో దాన్ని స్వకీయం చేసుకుని ఇతరులకు అందనీయని రీతిలో ప్రవర్తించినప్పుడు అది పతనానికి వినాశానికి దారితీస్తున్నది. నిజాయితీపరుడు అనునిత్యం ఊరేగేది భగవంతుడి భుజన్ఫంధాలపైన” (నాదాలు - నా పదాలు) నిజాయితీపరుడు లోకంలో గౌరవాన్ని పొందవచ్చు, పొందకపోవచ్చు. అయినా అతన్ని మెచ్చేది ఈశ్వరుడు. ఆయన అతన్ని శిరసావహిస్తాడు. అంటే దివ్యజీవన సోపాన పంక్తులను నిర్మించేది ఈ నిజాయితీపరుదే. (గొంతులో వరమేళ్వరుడు సాక్షాక్ళంి స్తేన నంగీతం పొంగి పొరలేది గుండెలో ఆర్ధ్రత పొరలు కడితేనే కవిత్వం తొంగిచూచేది” సంగీతం పాడేప్పుడు అతని చైతన్యంలో ఈశ్వరుడు తాండవమాడుతున్నాడు. తనలో నుంచి వెలువడే నాదం తనకు ఆత్మరమమాణస్థితిని కలిగిస్తున్నది. (మైయు తుమ్మెద నవలలో విశ్వనాథ కథానాయకుడు నారాయణరావు సంగీతము వింటున్నప్పుడు తనకు సమాధి ప్రాయమైన స్థితి కలుగుతున్నదని చెప్పుతూ 'జపనేళ నా మనఃకమల మింత విచ్చియుండదు శివకృషపావిభవమేమొ' అంటారు.

కవి స్వయంగా భావుకుడు. అత్యల్ప శబ్దాలలో విస్ఫోటం కలిగించి అనంతార్థాన్ని సృష్టించగలవాడు. స్వయంగా గాయకుడు, సితార్‌ వాదకుడు.

న్వర్ల ద్వారాలు

మెల్లగా తెరుచుకుంటున్నట్లున్నాయి ...

ఎక్కడినించో కమ్మని కంఠం మరోచోట -

జేఖువు వెదురంటే ఎవ్వరు నమ్మరు

బీజాక్షరంలో అక్షరంగా” ఇంకోచోట -

వాడు ఎన్ని రాగాళైనా పాదగలడు

వాడి గుండె నిండా వగుళ్ళే మరి”

ఈ పంక్తులన్నీ నాదాలు నా పదాలు అన్న కవితా సంపుటిలోనివే. సంగీత రహస్యాన్ని అనుభూతి గాఢతను తెలియజేసేవి. కవిత్వ సౌందర్యం వీటివల్ల ఉద్దీప్తమవుతున్నది.

కవిత్వావిర్భావం గురించి విచారించితే వాల్మీకి నుంచి ఈనాటి కవి వరకు “శోక శ్లోకత్వమాగతక అన్న స్థితి. జీవుని వేదన. లోకం దుఃఖాన్ని తన దుఃఖం చేసుకుని ఆ ఒరిపిడిలోనుంచి వెలువడ్డ ఒక దుఃఖమయూర శిఖావిస్ఫోటం. ఇంతటి గాఢ చిత్ర స్థితిని కవి వెల్లడించాడు కొద్ది పదాలలో.

ఇంత కవిత్వం వ్రాసిన వ్యక్తి పి. రామ్‌ నారాయణ్‌, రామ్‌ నారాయణ్‌ కవిత్వమే (వ్రాస్తాడు మరేమీ వ్రాయడు. వస్తువు కాదు, ఛందస్సు కాదు, శబ్బసంయోజన కాదు, శిల్చ వైఖరి కాదు, రామ్‌ నారాయణ్‌ కవిత్వం వ్రాయపూనుకొన్నప్పుడు విశ్వచేతన సూళ్ష్మీకృతమై అనుభవం సాంద్రమై శబ్దం ఒదిగిపోయి వార్దేవీ పాదమంజీర నాదంగా అవిష్ఫతమవుతున్నది. వర్తమానాంధ్ర సాహిత్యంలోని రకరకాల కవుల సమూహంలో చేరడు. ఆయన ఆయనగానే మిగిలి ఉంటాడు.

“నాదాలు నా పదాలు అన్న కవితా సంపుటం కాక మరొక విలక్షణమైన కవితా సంపుటం తీర్ధం. మతం జోలికి పోని ఆధ్యాత్మిక అనుభవం రూపరహిత స్థితినుంచి రూపస్థితి నుంచి రూపాతీత స్థితిదాకా ప్రయాణించింది. కార్యర్తుముం 113

. “ఉన్న పళంగా నేలకొరిగిన మహావృక్షం తపోభంగం చెందిన మహార్షిలా శీలాన్ని పోగొట్టుకున్న వ్యక్తిత్వంలా” హఠాత్తుగా నేలకొరిగిన వృక్షం చూచిన కవి మనస్సులో స్ఫురించిన దృశ్యాలు రెండు, స్థిరంగా నిలిచి ఊర్వ్యముఖ గమనంలో వందల సంవత్సరాలుగా నిలిచిన వృక్షం ఒరిగింది. దాని పతనోన్మ్నుఖస్థితి తపోభంగం పొందిన మహర్షిది. సమాజంలో దాంపత్య ధర్మంలో నిలచి, దాంపత్యాన్ని ఒక యోగంగా పరమార్ధ సాధనగా తీర్చిదిద్దుకునే వ్యక్తి స్రేయైనా, పురుషుడైనా శీలం కేంద్రంగా సాగిన జీవనం. దాన్ని కోల్పోతే దాంపత్యం పతనమై సమాజ మూలకేంద్రం వ్యస్తమవుతున్నది. అధ్యాత్మిక ఆది భౌతిక స్తరాలలో ఒక (ప్రతీక వృక్షం వ్యంజింపచేసే తాత్వర్యం ఇది. భగవాన్‌ రమణుల చేతి కజ్దిను గురించి ఇలా వ్రాశారు రామ్‌ నారాయణ్‌ ఆ చేతి కజ్జ ఎంతటి అదృష్టానికి నోచుకున్నది భగవాన్‌ రమణులకు చేయూతనిస్తోంది రమణులు లోక కల్వాజానికి చేయూతనిన్తున్నారు తనకు ఆనరాగా వున్న ఆ కజ్జ ఒకవ్సుడు జగత్తును నంరక్షించిన వరావాదంధ్ర కాదు కదా/” (తీర్ధం 12) 'దంధ్రా మురరిపు వరాహస్థూ సౌందర్యలహరి. రమణుల తత్త్వ్వబోధ జగత్తును దుఃఖం నుంచి అవిద్యనించి, బాధనుంచి తప్పించి దుఃఖమూలమైన అహంతనుంచి మరలించి అహం మూలాన్వేషణకు దారిచూపుతున్నది. ఇంతకంటే భూమిని ఉద్ధరించే కార్యం ఏమీ ఉంటుంది? అంతరంగంలోనికి పొరలు పొరలు చీల్చుకుంటూ పోయి తుదకు చేరవలసిన బిందువు దాకా భగవాన్‌ బోధ 'ప్రయాణింపజేస్తున్నది. భగవాన్‌ సాక్షాత్తూ జ్ఞానావతారం. దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివులే. అందుకే భగవాన్‌ రమణుల నిర్యాణానంతరం కైలాసం చేరగానే మహానంది తొట్రుపాటుపడింది. ఈ ఆదిభిక్షులెవరా? అని (తీర్ధం 11) మహానంది శివుని వాహనంగా దర్భనమిచ్చినా చత్వారి శృంగాస్త్రయో అస్యపాదాః అన్న శ్రుతి చెప్పిన ప్రణవం. నిత్య శివసన్నిధిలో ఉంటుంది. ఆ మహానంది రమణులను కైలాసంలో మరొక ఆదిభిక్షువుని చూచి తొట్రుపాటుపడ్డారట. పరతత్త్వం శుద్ధమైన స్థితిలో, మానుష మూర్తిమత్త్వం నుంచి ఉపనంహరించుకున్నా మళ్ళీ శుద్ధమైన స్థితిలో సాక్షాత్కరించింది. భిక్ష సన్యాసి అనుభవం. ఆదిభిక్షువు సాక్షాత్తు అన్నీ ఉండి ఏమీ లేని పరమశివ తత్త్వానుభవం.

“ఈ అనంళతకాల వరిభమణంలో ఒక లివ్త కునుకు లేదు నీ ధ్యాసే నీ వూసే నీవేమో అనంతశయనమూర్తివి వ్యక్తమైన కాలము, దీనిలో పరిక్రమించే జగత్తు నిత్యము కర్మానుభవంతో సదా జాగ్రత్‌ స్థితిలో ఉంటున్నది, తాను కోల్పోయిన ఈశ్వర విభవాన్ని గురించి ఆలోచనే. తానేమో ఈశ్వరుడు. ఎల్లప్పుడు శయన స్థితిలో అనంతశయనమూర్తి. అనంతుడంటే ఆదిశేషుడు, కాలన్వరూవం, దానిమీద శయనించిన భగవంతుడు కాలాతీతుడు. అవస్థాత్రయానికి అతీతుడు. జాగ్రత్‌ స్వప్న సుషుస్తలు దాటిన తురీయస్థితి. అక్కడ ఈశ్వరుడు నిత్య తపోమూర్తి. రామ్‌నారాయణ్‌ సంగీతజ్ఞుడు. దానిలో కరిగిపోయే వాదు. ఆయన మోయు తుమ్మెద కథానాయకుడు. మహాగాయకుడు నాదోపొనకుడు శ్రీ నారాయణరావు కుమారుడు. అందుకే సంగీతాన్ని గురించి ఆయన చెప్పింది, “ఈ ఓంకార నాద గ్రశస్తి నన్ను ఏ జన్నకూ బ్రతుకనీదు నేనొక మధుర మందర వద్రమమునై నదా నీ ఆనంద నాద [వ్రశ్తిగా మిగిలిపోదునో అనీ (తీర్ధం 69) గుండెలో ఓంకారం ప్రతిధ్వనించటం కాదు జన్నజన్మాలకూ వెంటబడి వస్తున్నది, వేదనతో కలచివేస్తున్నది. భావనతో ఊపిరాడకుండా చేస్తున్నది. అంతర్మాలా సాధనం యొక్క దశ ఇది. తొను మంద్రమైన మధురమైన షడ్డంగా పరిజమించాలని కోరుకుంటున్నాడు-కవి. ఇది ఈశ్వరునితో కవి విన్నపం. ఈ గాన తన్మయానికి త్యాగరాజు సాపాసాలో మోక్షం మూట కట్టిన పాటగా సాక్షాత్మరించాడు. భౌతిక జీవనానుభవపు సీమిత మరుభూములలో చిక్కిన కవిత్వం అరుదుగానైనా తన అంతస్సులోకి తరచి చూచుకుంటున్నది. ఇది కవిత్వ పిపానువునకు అరుదైన ఒయాసిస్సు. (2006 ఆంధ్రభూమి) లను 5

గురజాడ ఒక సాధారణ కవి

గురజాడ అప్పారావు విషయంలో సాహిత్యరంగంలో జరిగే చర్చలలో ప్రధానంగా ముందుకు వచ్చే అంశాలు నాలుగు.

1 ఆనాడు ఉద్ధతంగా ఊపందుతూ వున్న జుతీయ ఉద్యమాన్ని స్వాతంత్ర్య సమరాన్ని నిస్సందేహంగా సమర్థించకపోవడమేగాక బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని వారి పరిపాలనను బలపరిచి, వారు చేస్తున్న దోపిడీ మాటెత్తకుండా, వారి సత్యనిష్టను ప్రశంసించటం.

  1. వీరేశలింగం ప్రభృతులు ముందుకు తీసుకువచ్చిన సంస్కరణోద్యమాన్ని సమర్థించకపోగా గిరీశం వంటి పొత్రద్వారా దాని వైఫల్యాన్ని ప్రకటించటం.

  2. కవిత్వంలో మార్గపద్ధతిలో సుభద్రాపరిణయం రచించినా అది పరిపుష్టస్థాయికి చెందకపోవటం దేశి పద్ధతిలో రచించిన గీతాలలో జానపద ప్రవృత్తికానీ నిర్మాణ రీతికానీ మృగ్యమైన అనేక సందర్భాలలో వచన స్థాయికి చేరుకోవడం.

  3. కన్యాశుల్కం రచన పునర్చిర్మించినా ఇటు ప్రదర్శనకు కాని అటు సాహిత్య రచనగాగాని ఉతృష్టస్థితికి చేరకపోవడం.

19వ శతాబ్దపు మధ్య భాగంలో కంపెనీ పరిపాలన నుంచి విక్టోరియా మహారాణి భారతదేశంపై అధికారాన్ని స్వీకరించి పరిపాలించిన కాలం గురజాడ అప్పారావు కొలువైవున్నది. బ్రిటీష్‌ సామ్రాజ్యానికి సామంత ప్రభువైన విజయనగర సంస్థానాధీశుడు ఆనంద గజపతిరాజు ఎంతో ఉదారుడైనా చక్రవర్తి అదుపొజ్ఞల్లో ఉండవలసినవాడే. ఆయన కొలువులోని వారు కూడా బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఆనుకూల్యాన్ని ప్రదర్శించడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. నాడు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయ భాషా సారస్వతాల్లో పాశ్చాత్య విద్యా విధాన ప్రేరణతో ఎదిగివచ్చిన నూతన సారస్వత నిర్మాతలు ఎక్కువమంది బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని అంతో ఇంతో సమర్థించినవారే. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. భారతీయ భాషా సాహిత్యాలలో 10వ శతాబ్ది చుట్టుపట్ల వచ్చిన వికాసం సంస్యత వాబ్బయ సంబంధి (ప్రేరణ కలది. కాగా 19వ శతాబ్దంలో వచ్చిన పునర్వికాసం ఆంగ్లేయ విద్యా సారస్వత విద్యా (్రేరణను ఆధార

భూమిక నుంచి పొడుచుకొచ్చింది. ఈ వునర్వికాస క్రమంలో ప్రతి భాషా సారస్వత ఉజ్జీవనంలోనూ ఒక పాశ్చాళ్యుడు నిర్మించిన (ప్రణాళిక పొంచివుండడం మనం గమనించవచ్చు. మెకాలే ఉద్దేశించిన పరాయీకరణం ధోరణికి వీరందరూ తమకు చేతనైన సహాయం చేసినవారే.

హైందవ ఆచార వ్యవహారాలను విమర్శించినట్లు ఉపరితలంలో స్పష్టమయ్యే వేమన పద్యాలను ముందుకు తెచ్చి దాన్ని మహా కవిత్వంగా నిరూపించి అంతకుముందు కవిత్వమనుకొన్న తిక్కన, పోతన, పెద్దనాదులది కవిత్వమే కాదన్నట్లు స్పష్టంగా ప్రకటించకపోయినా ఆ సంభాషణకు అంకురార్పణ ట్రౌను ద్వారా నిర్వహింపబడింది. 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కానీ ఆ తర్వాత అనేక మంది సమరయోధుల పోరాటాలు కానీ ఈ విద్యావంతుల దృష్టిలో రాజద్రోహ చర్యలే అయినవి. 1892 (ప్రాంకాల్లో బ్రిటీష్‌ వారి ఆర్థికమైన దోపిడీ గురించి వెలువడ్డ “ది పావర్టీ ఆఫ్‌ ఇండియా” వీరి దృష్టికి రాలేదు. అందువల్ల ఆ స్వాతంత్రోద్యమాన్ని తీవ్రత తాల్బకుండా వుండడానికి భారతీయ సమాజంలో కానవచ్చే క్వచిత్‌ క్వచిత్‌ దేశగత సమూహగత దురాచారాలను భూతద్దంలో చూపించి, భారతీయులను నాగరకులుగాను, బాధ్యతగల పౌరులుగాను తీర్చిదిద్దేందుకు సంస్క్మరణవాదం (బ్రిటిషువారి ప్రసాదంగానే ప్రారంభమైంది. సంస్మరణ ఉద్యమం లక్ష్యం ఆత్మన్యూనతా భావాన్ని పెంపొందించి జనంలో వుండే తిరుగుబాటును అణచివేయడం.

ఈ క్రమంలో భారతీయుల చరిత్రను, సంస్కృతిని (ఈ మొత్తాన్ని బ్రాహ్మణ వాదంగా భావించేవారి అవగాహనకు నమస్కారం. దీని వెనుక మైనారిటీ వాదం పేర పొడుచుకు వచ్చే మతాంతరీకరణ ప్రవీణులు ఉన్నారనుకోవటం సత్యమే) జీవన విధానాన్ని తక్కువ పరచి సామరస్యంతో జీవించే జాతిలో ఆర్య, ద్రావిడ భేదం మొదలుగా అనేక విభాజ్యాంశాలను సృష్టించడం జరిగింది. అయితే జాతి ఇంత అణచివేతలోనూ క్రాంత దర్భ్శులైన మహాపురుషుల సారధ్యంలో గతానుగతిక రీతికి థిన్నంగా విప్లవాన్ని సాయుధ సమరాన్ని సంస్కృతి పునరుజ్జీవన ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చింది. శ్రీరామకృష్ణ, దయానంద, నారాయణ గురు, వివేకానందాదులు ఈ మార్గాన్ని పరిపుష్టం చేసి పాశ్చాత్య వ్యామోహ నిబద్దులైన విద్యావంతుల వ్యూహాన్ని పరాస్తం చేసి స్వాతంత్ర్య సమరాన్ని అనేక మార్గాలలో (ప్రబలతరం చేస్తూ వచ్చారు. అప్పుడు సమాజంలో క్రాంతదర్భులైన మహాపురుషుల వర్గం ఒకటి. పాశ్చాత్య విద్యా వ్యామోహంలో పడి ఉక్కిరి బిక్కిరవుతున్న వర్గం మరొకటి. కార్యర్తుడిరి 117

తెలుగునాట స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా తన వ్యూహాన్ని నిర్మించుకున్న కమ్యూనిష్టులు సారస్వతరంగంలో బలాన్ని సంపాదించుకున్నకొద్దీ రెండవ వర్షానికి చెందిన వ్యక్తులను మహాపురుషులుగా భవ్య నూతన సాహిత్య నిర్మాతలుగా అభ్యుదయ మార్గగాములుగా చిత్రించారు. అందువల్ల సామాన్య కవి పదాన్ని అందుకోవడానికే సంశయాస్పదమైన స్థితిలో వున్నవారిని మహాకవులుగా ముందుకు తీసుకువచ్చే కుటిల ప్రయత్నం జరిగింది.

గురజాడ అప్పారావు కవితా రచనల్లో బ్రిటీష్‌ సామ్రాజాన్ని సమర్థించిన “ఆంగిలేయుల ధర్మరాజ్యం ఆచంద్రార్మం నిలబదవలెనన్న కాంక్ష కన్నుగానని వస్తుతత్తం కాంచనేర్చరు లింగిలీజులు అన్న వాక్యాలు ఆంగ్లేయుల పట్ల విధేయతను, వారు వలస దేశాన్ని ఆక్రమించుకోవడంలో ప్రయోగించిన కౌటిల్యం కాపట్యాన్ని ముసుగులో కప్పే ప్రయత్నం జరిగింది. అట్లాగే బ్రిటీషు రాణిని ప్రశంసించిన సందర్భం గణనలోకి తీసుకోవచ్చు. అనేకమంది కవులు బ్రిటీషు రాణిని, జార్జి ప్రభువును ప్రశంసించినా, పర పరిపాలకులను ప్రత్యేకంగా సత్య నీతి ధర్మ వర్తనులుగా ప్రశంసించలేదు. కానీ గురజాడ అందుకు భిన్నం,

అనేకమంది కమ్యూనిష్టు మహాకవుల, విమర్శకులచేత మొత్తం ప్రపంచానికి జాతీయ గీతంగా వుండటానికి అర్హమైనదిగా పొగడబడిన దేశభక్తిగీతం స్వచ్చందంగా బిటీషువారి సామ్రాజ్యం ఉనికిని నమర్థించింది. “దేశమును (ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నాా వట్టి మాటలు కట్టి పెట్టోయ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌' అన్నప్పుడు దేశాన్ని (ప్రేమించడమంటే వ్యక్తి తనను మంచి వైపుగా వృద్ధిపరచుకొని ఎదిగిపోవడమన్నమాట. దేశాభిమానం తనకున్నదని చెప్పుకోవడంకంటే ఒకమేలైన కార్యం చేయమని చెప్పడం తనకు తెలియకుండానే సంస్మరణవాదాన్ని సమర్ధించింది. సహస్రధా ఉటంకితమయ్యే దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్న మాట జాతికి ఆత్మ ప్రత్యయం కల్పించే గతాన్ని తిరస్కరించడం, వందేమాతరం వంటి మహా మంత్రాన్ని అవమానించడం, జనగణ వంటి జాతీయ భావనాభరితమైన రచనను కాదనడం, నదులూ, పర్వతాలూ, అడవులు, మైదానాలు, ప్రకృతి, చరాచర జీవజాలం దీన్నంతా కాదని కేవలం మనుషుల సమూవాన్నే దేశంగా నిర్వచించడం, అవగాహనా రాహిత్యం. సంస్కృతి నిందలకు ఊతమివ్వడం. దేవుడు మానవుని తన ప్రతిబింబంగా నిర్మించాడనీ, ఇతర జీవ విలక్షణంగా మానవుని గొప్పగా చెప్పే లక్షణం యూరోపు నుంచి వచ్చింది. అంతేకాక ం ాాాాాాాడాాాాాాాాసన్న

గతాన్ని తిరస్మరించే ధోరణి 'మంచి గతమున కొంచెమేనోయ్‌” అన్న వాక్యంలో స్పష్టంగానే వుంది. గతాన్ని ఆధారంగా (శేరణ పొంది సాగుతూ వున్న రామకృష్ణ పరమహంస మొదలైనవారు సాగించిన ఉద్యమాన్ని వ్యతిరేక ముఖం నుంచి చూపించడమే ఇది. గతంలో మంచి స్వల్బమని గురజాడ అంటే- తర్వాతి మనో కవి దాన్ని అందిపుచ్చుకుని “గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్ళులతో” అని మొత్తం గతాన్ని శ్రీకృష్ణార్వణం చేశాడు. అయితే గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలో అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయ్‌ దేశి సరకులనమ్మవలెనోయ్‌” అన్న మాటలలో దేశీ సరకులు ్రిటీషువారి ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసేవారికి లాభం సంపాదించేదిగా భావించవలసి వుంటుంది. గాంధీగారి స్వదేశీ భావనకు ఖద్దరు ఉద్యమ స్ఫూర్తికి దీనికి పోలిక లేదని తోస్తోంది. 'ుతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటీ నిలచి వెలుగును” అన్న మాటకు భారతదేశంలో సమన్వ్నయమే లేదు. ఇక్కడ పాశ్చాత్యుల అర్ధంలో మనిషిని నిర్బంధించే మతమన్నది లేనే లేదు. అయితే గురజాడ అప్పారావు దేశీయ సంస్కృతిని తిరన్కరిస్తున్నట్లు ఎంత ప్రగల్భంగా ప్రకటించుకున్నా అతని అంతఃశ్చేతనలో సంస్కృతి అనుబంధం కొంత నిలిచే వుంది. పూర్ణమ్మ కథలో ప్రతిపాదితమైన మహామాతృతత్త్వం, పూర్ణమదః పూర్ణమిదమ్‌ అన్న ఉపనిషత్‌ సారాన్ని ప్రకటించటంలో జ్ఞానవాశిష్టంలోని కథను లవణరాజు కలగా గ్రహించడంలోనూ ఇది సువ్యక్షమవుతూనే వుంది. కానీ ఆయన మొత్తం గేయాలలోని కవిత్వాంశ అతి సామాన్యమైన స్థాయికి చెందినది. కవిత్రయం, శ్రీనాథపోతనలు, పెద్దనాదులు, విశ్వనాథ కృష్ణశాస్త్రి, శ్రీశ్రీలు రచించింది కవిత్వమే అయితే ఆ ప్రమాణాలను పూర్తిగా విపరీతంగా మార్చలేకపోతే గురజాడను ఒక సాధారణ కవిగా కంటే మించి గుర్తించడం మనను మనం మోసం చేసుకోవడమో సౌందర్య శాస్త్ర దూరమైన కొత్త (ప్రమాణాలను అందుకోవడమో అయితేనే సాధ్యమవుతుంది. ముత్యాలసరాలలోని ఛందస్సు ఆయన నిర్మించింది కాదని వృషభగతిరగడ కొంచెం మార్పులతో దేశీ సాహిత్యంలో పూర్వమే వున్నదని విమర్శకులు ముందునుంచీ చెప్తున్నారు. శ్రీరంగం శ్రీనివాసరావు వీటిలోని ప్రయోగాలను అపరిణత స్థితిలోనివిగా పేర్కొనడం జరిగింది. ఇక కన్యాశుల్కం ప్రసక్తి వస్తే కన్యాశుల్మం పునారచన ఆధారంగా చర్చిస్తూ కూడా తొలి రచనను బిడ్డ గర్భంలో వుండగానే పుట్టినరోజు జరిపినట్లుగా, కన్యాశుల్మాన్ని సాటిలేని నాటకంగా కీర్తించడంలో అంత శిథిల నిర్మితిగల రచన మరొకటి లేకపోవడం వలన సత్య స్థితి వున్నదనే చెప్పాలి. దీనివెనకొల ఒక గాధమైన కుట్ర వున్నది. 1897లో

వేదంవారి' (ప్రతాపరుద్రీయం సర్వాంగసుందరంగా వెలువడింది. ఇది తెలంగాణా ప్రాంతానికి చెందిన కథ కావడం స్వాతంత్రోద్యమాన్ని ప్రతీకాత్మకంగా వ్యక్తం చేయడం అంటే ఢిల్లీ సుల్తాను పట్టుకుపోయిన ప్రతాపరుద్ర చక్రవర్తిని యుగంధరుడు రక్తపాతం లేకుండా ఆయన తల్లికి భారతమాతకు తిరిగి అప్పగించడం అంటే భారతమాతకు దాస్య విమోచన ఇతివృత్తం (ప్రధానంగా కలది. దాన్ని త్రోసిరాజనడానికి ఒకానొక ఆగ్రవర్షంలో పరిమితదేశంలో వ్యాప్తమైన దురాచారాన్ని ఖండించే ఈ నాటకాన్ని కీర్రిస్తూ వచ్చారు. ఆనందగజపతి మహారాజు టబ్రిటీషువారికి ఒకానొక యుద్ధంలో తన సేనలను వంపి సహాయం చేస్తానన్న లేఖ ప్రారూపం గురజాడ అప్పారావు రాసినట్లుగా వినబడుతున్నది. నిజాం ప్రభువును వేనోళ్లా కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు విషయంలో తెలంగాణాలో స్వాతంత్రోద్యమాన్ని నిర్వహించిన మాడపాటి, సురవరం, కాళోజీ, ఆళ్వార్‌ స్వామి ప్రభృతులు ఆదరించకపోవటాన్ని అర్థం చేసుకుంటే గురజుడ విషయంలో దేశభక్తి భావాలను అవగాహన చేసుకోవచ్చు. కాదనుకుంటే మనం ఏం చేస్తాం...వారికి మరొక నమస్కారం. (23 అక్టోర్స్‌ 2006 - ఆంధ్రభూమి)

తాళ్ళపాక అన్నమాచార్యులు

సహృదయులకు, విద్వాంసులకు, సంగీత సాహిత్య ప్రియులకు, అతిథులకు

వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠం, తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న అన్నమాచార్య జుతీయ సదస్సులో పాల్గొంటున్న మీకు వృాదయ పూర్వక స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాన్యులు ఏ.పి.వి.ఎన్‌. శర్మగారు, ప్రాజెక్టు డైరెక్టర్‌ డా. మేడసాని మోహన్‌గారు ఈ విషయంలో మాకు ఎంతో సహకరించారు. మాన్యమిత్రులు ఆచార్య కె. సర్వోత్తమరావుగారు ఎంతో చొరవ తీసుకున్నారు. వీరందరికీ మా కృతజ్ఞతలు.

అన్నమాచార్యుల భాషా సాహిత్యాలను, సంగీత పద్ధతులను అధ్యయనం చేయటానికి ముందు నాటి సామాజిక పరిస్థితులను, జీవన యాథార్థాలను, రాజకీయ కల్లోలాలను స్పష్టంగా విశదం చేసుకోవలసి ఉన్నది. మధ్యయుగాల చరిత్రలోని విశిష్టాంకాలను మనం తెలుసుకోవలసి ఉన్నది. వాసిలోను రాశిలోనూ అత్యంతము విలువైన ఈ తాళ్ళపాక వారి సాంస్కృతిక భాండాగారాన్ని సుమారు నాల్దువందల సంవత్సరాలు, మనం ఎందుకు దాదాపు విస్మరించామో వివరించాలి.

1424లో జన్మించి 1508 దాకా జీవించి ఉన్న తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంక్రీర్తనలు ముప్సెరెండు వేలని చెప్పబడింది కంఠోక్తిగా. అయితే వాటన్నింటినీ భద్రపరచి రాగిరేకుల మీద చెక్కించినా - మనకు ఈనాడు లభిస్తున్నవి సుమారు 15000 కీర్తనలు మాత్రమే. దాదాపు సగంపైగా విలువకట్టలేని సంకీర్తనలు మనం పోగొట్టు కున్నాము. మన అథ్రద్ధవల్ల, అల్బధనలోభం వల్ల ఈ నష్టం జరిగింది. ఇంకా ఈ నంకీర్తనల రాగిరేకులను ఆనాళ్లల్లో అహోబలం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో భద్రపరచటంవల్ల, అక్కడకూడా ఇవి సంరక్షితములు కాకుండా అభావస్థితిని పొందాయేమో.

దక్షిణాపథంలో ఇస్లాం దండయాత్రల ఫలాలు 14వ శతాబ్దానికి అనుభవంలోకి కాని రాలేదు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ దండయాత్రలు 1823లో కాకతీయ కాళ్య్రస్పురురి 121

రాజ్య పతనంతో వినాశకారకస్థితికి చేరుకున్నాయి. అప్పుడు జరిగిన మారణకాండ, దోపిడీలు, విధ్వంసం, క్రౌర్యం అంతకుముందు ్రజలెరిగింది కాదు. పూర్వం యుద్దాలు జరిగినా రాజులకు సైన్యానికి మాత్రమే అవి పరిమితమయ్యాయి. ప్రజల జీవనం ఆస్తవ్యస్తం కాలేదు. ఇప్పుడు విధర్మీయుల దండయాత్రలు ప్రజల అస్తిత్వాన్ని ఒక భయానకస్థితికి చేర్చాయి. ఓరుగల్లు నించి విజేతలు తొమ్మిదినందల ఒంటెలపైన అపార కనకధనరాసుల్ని తీసుకుని పోయినారని చరిత్ర చెప్పుతున్నది.

మధురా విజయంలో కవయిత్రి గంగాదేవి నాటి పరిస్థితులను వర్ణించిన విధం గమనించదగ్గది -

(శ్రుతి రన్తమితా నయః ప్రలీనో విరతా ధర్మకథా చ్యుతమ్‌ చరిత్రమ్‌

నుక్టుతంగత మాభిజాత్యమస్తం కి మివాన్యత్‌ కలిరేష ఏవ ధన్యః

నతతాధ్వర ధూమ సౌరఖైః ప్రాక్‌ నిగమోద్దోషణవద్భి రగ్రవైః

అధునాజని విప్రమాంన గంధ రధికక్షీఐ తురుప్పు నింహానాదైః

ఈ స్థితిని వర్జించే ఇతర వాబజ్బ్యయంలో సింహాద్రి నారసింహ శతకము, వేంకటాచల విహార శతకము ఆ కాలాన్ని ప్రత్యక్షీకరిస్తున్నాయి.

దాదాపు ఆరేడు వందల సంవత్సరాలు కొనసాగిన ఈ కల్లోలంలో, సంక్షోభంలో ప్రజలను బ్రతికించింది, ఆత్మవిశ్వాసాన్ని నిలువరించింది, భగవంతుని మీద ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసం తర్మానికీ పాండిత్యానికీ అతీతమైంది. అప్పటికీ వందలాది సంవత్సరాలుగా సాగివస్తున్న సమాజంలోని విభేదాలు, అంతరాలు ఒక్కసారిగా తొలగిపోనారంభించాయి.. ప్రజలను నియమిస్తున్న స్కృతులు, శాస్త్రాలు తొలగిపోయి నూతన సమాజ (ప్రాదుర్భావానికి దారియిచ్చాయి.

11, 12వ శతాబ్దాలకు రామానుజుడు, బసవేశ్వరుడు నిర్మించిన భక్తి ఉద్యమాలు, బౌద్భుల శూన్యవాదాన్ని అద్వైతుల మిథ్యావాదాన్ని త్రోసిరాజన్నాయి. భక్తి ఉద్యమానికి మూలస్థానం పరమ్రేమ. (ప్రేమ అంతరాలెరుగదు. ఈ ప్రపంచమంతా ఈశ్వరుని విశిష్టమైన అభివ్యక్తి. లీలా విభూతి. దీన్ని అసత్యమని హేయమని నిరసించకుండా, తన్ను తాను ఈశ్వరునికి యోగ్యమైన ఉపకరణంగా, భోగ్యవస్తువుగా పరతంత్రుడుగా మారిపోవటం ప్రధానాంశం. 'అహమన్న మహమన్నం, అన్నాదః' అని శ్రుతి అంటున్నది. "నేను ఈశ్వరుడు అనుభవించే అన్నాన్ని నేను ఈశ్వరానుభవం పొందుతున్నాను" ఇది జీవునిస్థితి. జాన

ఆత్మాన్వేషణ ఒక విశిష్టమైన అనుభనం. జీవుని వేదన దాని అభివ్యక్తి. ఇందువల్ల జీవుడు జాగ్రదవస్థలో స్వష్నిస్తాడు. తనను తాను కోల్పోయి విశ్వచేతనలో అనుసంధించుకుంటాడు. క్రమంగా ఒక అస్మిత యొక్క అభావంలోనికి చేరుకుంటాడు. మిగిలిన విశ్వమంకా అతనికి ఈశ్వరుని అభివ్యక్తియే అవుతున్నది. భగవదృ్భక్తులందరూ ఆయన స్వరూపమే. వారికి సేవ చేయటమే జీవన తాత్చర్యం. పరోక్షమైన ఈశ్వరస్ఫూర్తిని ప్రత్యక్షంగా చరాచరములో పొందటంవల్ల 'సర్వము న్నతని దివ్య కళామయ'మన్న భావం స్థిరమవుతున్నది. అందువల్ల తాను అందరికి 'సేవ చేయాలి. తదీయారాధనయే తదారాధనగా పరివర్రిస్తున్నది. ఈ దివ్య భావానుబంధం, విభక్తమైన సమాజంలో ఆత్మీయతను నెలకొల్పింది. ఇందువల్ల భక్తియొక్క అనుష్టాన పార్వ్వం ఈ జగత్తును సంస్మరించటంగా రూపొందింది. మధ్యయుగంలో పరిణామరహితంగా జడంగా నుండనీయక సమాజాన్ని చలనశీలంగా, ప్రాణోద్విగ్న ప్రసారంగా - అనుస్యూతంగా, అవిచ్చిన్నంగా తీర్చిదిద్దిన ఈ భక్తిభావ పరంపర నిశ్చబ్దంగానే ఒక వివ్లవానికి కారణం అయింది. అప్పటి సంక్షోభంవలన (గ్రామాలు (గ్రామాలు మూలాల నుంచి పెరికివేయబడి, జనపదాలు విచ్చిన్నమైన దశలో, సమాజంలో భక్తి ఉద్యమం తెచ్చిన నిస్సంగులైన సన్యాసుల నాయకత్వం నూతన సామ్రాజ్యస్థాపనకు హేతువయింది. శ్రీ విద్యారణ్యుల విజయనగర న్థాపనకు కారణం కాగా - సమర్థరామదాసు శివాజీచేత హిందూ సామ్రాజ్యం స్టాపింప జేయటం జరిగింది. భారతదేశం నిండా ఈ భక్తి ఉద్యమం అన్ని వర్గాలలో నుంచి నాయకత్వాన్ని సృష్టించింది. ప్రజలను ప్రబోధించటానికి ధర్మం భిక్షుకరూపంలో, సాధువులరూపంలో, అవధూతల రూపంలో, గొయకుల రూపంలో సాక్షాత్కరించింది. రామానందులు, సూరదాసు, విద్యావతి, చండీదాసు, కబీరు, తులసీదాసు, సరసీమెహతా, పురందరదాసు, కనకదాసు, జగన్నాథదాసు, వీరబ్రహ్మం, రామదాసు ఇలా అన్ని ప్రాంతాలలో భక్తభావుకుల పరంపర ఆవిర్భవించింది. అంతకు పూర్వం తమిళదేశంలో పన్నిద్దరాళ్వారులు, శివభక్తులైన నాయనారులు అవతరించారు. ఈశ్వర భక్తిభావన విశ్వరూపం ధరించింది. అన్నిరంగాలలో క్రియాకలాపం ఉద్ధతమయింది. రామానుజుల ఆస్థానంలోని అష్టదిగ్గజాలన్న ఆచార్యుల వ్యవస్థ, వల్లభాచార్యుల ఆస్థానంలో అష్టభాప్‌కవులుగా రూపొందింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్ణజముల భావనకు ఇదే మూలం. గవ ననన ననన

సమాజ జీవనానికి కేంద్రం రాజ్యం కాకుండా దేవాలయం అయింది. ఆసేతు శీతాచలం యాత్రా ప్రణాళిక, ప్రజలకు అద్భుతంగా సమాజంలో కలుగుతున్న ఉత్తాన పతనాలను, విధ్వంసాలను, పీడనలను విశదంగా తెలియజెప్పింది. దేవాలయం చుట్టూ మృద్దారు శిలా లోహ పరిశ్రమలు వృద్ధి పొందాయి. కుమ్మరులు, కమ్మరులు, శిల్పులు, వడ్రంగులు, వేలాది మంది జీవన పరిస్థితులకు ఒక మహదాశ్రయం లభించింది. ప్రాకారాల నిర్మాణంతో దేవాలయాలు ఒక చిన్న నగరవ్యవస్థను తలపింపజేశాయి. అనేక వృత్తులు, చిన్ని చిన్ని వ్యాపారాలు, సత్రాలు - అన్నదానాలు ఇలా ఒక విలక్షణమైన (క్రియాకలాపాన్ని నూతన రాజ్యాతీతమైన వ్యవస్థను అందించాయి. దీనిలో దేవాలయాలలోని ఉత్సవాలు, అలంకారాలు కూడా దోహదం చేశాయి. సమాంతర ఆర్థిక వ్యవహారం రాజ్యాన్ని నడిపించింది.

రాజాస్థానాల మీద మోహం తగ్గింది. 'వోలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాభికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై” అన్న స్థితి వచ్చింది. తాళ్లపాకవారు 'కాపులము మేము" అని చెప్పుకున్నారు. వేదవేదాంగవేత్తలన్న పరిమితి నుంచి దిగివచ్చి వ్యవసాయంలోకీ, చేతివృత్తులలోకీ చేరిపోయారు కవులు విద్వాంసులు. యాచకత్వం పోయింది. రాజులను పాగిడే పని, 'పదుపుకూడు భుజించే సన్నివేశం లేకుండా పోయింది.

ఈ ధోరణిలో రాజు ప్రాధాన్యం తగ్గిపోయింది. విధర్మీయులు (ప్రభువులు కావటం కూడా దీనికి ఒక కారణం. ఈశ్వరుడే ప్రభువు. నిర్గుణోపాసకునికైతే అంతరాత్మ తాంట్రిక హఠయోగులకైతే ఎవరితో పనిలేదు. వారికి అంతస్సులోని చైతన్యమే మార్గదర్శనం చేస్తుంది. అప్పటి రాజులందరూ మనుజేశ్వరాధములు. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు.

ఈ రోజుల్లో ప్రచురితమైన ఉద్యమాలు మూడు కనిపిస్తున్నాయి.

  1. _ వైష్ణవ శైవ సంప్రదాయాలలో - భాగవత సంప్రదాయం '్రాణధాతువుగా, శరణాగతి భక్త పారమ్యము. “సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్న మహావాక్య తాత్సర్యం (ప్రధానంగా వ్యక్తమయింది. దీనికి కేంద్రాలు దేవాలయాలు, శైవ వైష్ణవాలను నిర్వహిస్తున్న మఠాలు పీఠాలు.

  2. _ బౌద్ధం నుంచీ, తంత్రసాధనల నుంచీ ప్రేరణ పొందిన అంతర్ముఖులై అవధూతలైన వారి ద్వారా సాగిన ధోరణి, అష్టాంగయోగము, సహజయోగము, హఠయోగము,

ననన ననా

కుండలినీ ఉత్ధాపనము మొదలైనవన్నీ ఇక్కడ సాధనలు. విగ్రహారాధనను, పరంపరాగతములైన ఆచార వ్యవహారాలను తిరస్కరించి “ఆత్మ లోనెరుగుటి లక్ష్యంగా సాగిన పద్ధతి. గోరక్షుడు మొదలైన నాథుల మార్గము, అచల సం'్ర దాయము దీనిలో ఉన్నాయి. కబీరు, వేమనలు ఈ సంప్రదాయంలో (ప్రముఖులు. 8. పై రెండు ధోరణులలో కాన్ని కొన్నింటిని కలుపుకుంటూ, అద్వైతమును, జ్ఞాన మార్గమును కొనసాగించిన ధోరణి, నిర్గుణ బ్రవ్మోపాసనమే లక్ష్యం. ఈ మార్గంలో సూఫీ సంప్రదాయం గురు ప్రాధాన్యము, విలక్షణ ధ్యాన ధోరణులను (ప్రవేశపెట్టింది. కొన్ని మధురభక్తివాసనలు - కొన్ని శూన్యవాద వాసనలూ దీనిలో ఉన్నాయి. నానక్‌ మొదలైనవారు సమన్వయాన్ని బోధించినవారు నంకీర్తన ద్వారా భావనిమగ్నతను అంగీకరించారు. అయితే వీటిల్లో తొలిమార్గమే విసృతంగా ఆచరణలోకి వచ్చింది. భక్తి భావ ప్రసారానికి మౌలిక అధారాలు దీనిలో ఉన్నాయి. కీ! భగవంతుడు ఒకచోట చెప్పినాడట - నా భక్తులు ఎక్కడ గానం చేస్తూ వుంటారో అక్కడ నేనుంటాను అని తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తన భాండారం చూచినప్పుడు ఆ భాండారాన్ని చూచే వైకుంఠవాసుడు తిరుమలలో స్థిరంగా ఉండటానికి ఇదే కారణమని తోస్తుంది. అన్నమయ్య, అతడి కుమారుడు పెద తిరుమలాచార్యులు, అతని కుమారులు ఈ సారస్వతక్రతువును నిరంతరంగా కొనసాగించారు. దాదాపు 15వ శతాబ్దము అంతా అన్నమయ్య జీవితం పరచికొన్నది. ఆయనకు కొంచెం ముందుగా పోతన జీవించాడు. ఆయన తరువాత పెద్దనాదులు జీవించారు. ఆయన జీవన కాలంలోనే 1486లో చైతన్య మహాప్రభువు జన్మించారు. పురందరదాసు ఆయనకు వృద్ధాప్యంలో కలిసినట్లుగా జీవితచరిత్ర చెప్పుతున్నది. " జీవితం అంతా శ్రీవేంకటేశ్వరునికే అంకితం చేసినా, అన్నమయ్య సాధనలో శ్రీనృసింహోపాసకుడు. అతని సంకీర్తనలలో వేంకటేశ్వరుని తరువాత శ్రీనృసింహుని గురించినవే ఎక్కున. అనితరసాధ్యమైన కవితాశక్తి కారకు ఆయన శ్రీ హయగ్రీవుని కూడా ఉపాసించినట్లు గోచరిస్తున్నది. శ్రీన్ససింహోపాసన దహరాకారంలో అంతర్యామిని ఉపాసించుట కాగా, హయగ్రీవోపాసన శబ్ద బ్రహ్మోపాసనగా పరిణమించింది. కార్టీపురురి 125

సంస్కృతాంధ్ర సాహిత్యాలలో అసామాన్యమైన వైదుష్యము గలవాడు అన్నమయ్య, ఈయనకు హరికీర్తనాచార్యుడని, పదకవితాపితామహుడనీ, పంచమాగమ సార్వభౌము డనీ బిరుదులున్నాయి. పంచమాగమము అంటే ద్రవిడవేదమని అర్థం చేసుకోవాలి.

అహోబల నారనింహుడే గురురూపంలో శ్రీనారసింహ, సుదర్భనాది మంత్రోపదేశం చేసినాడట. హయగ్రీవస్వామి ప్రత్యక్షం కలిగించినాడట. వేదాంత దేశికులు హయగ్రీవోపాసకులే. శ్రుతుల, శాస్త్రములై, పురాణకథలై, సుజ్ఞానసారంబులై అన్న పద్యంలో అన్నమయ్య వచోనూత్న[క్రియలు ఎలా ప్రకాశిస్తున్నదీ తెలియజేయటం జరిగింది.

వీరశైవ కవులతో సామ్యము - అన్నమయ్య రచనలతో, అతని వంశస్థుల రచనలతో ఉండటం సహజమే. తాళ్లపొకవారి రచనలలో సంకీర్తనలు ప్రాధాన్యం వహిస్తే, వీరళైవకవుల్లో ద్విపదకావ్యాలు ప్రాధాన్యం వహించాయి. శతకం, ఉదాహరణం, రగడలు మొదలైన ప్రక్రియలు వారికీ వీరికీ సమానమే. వచనాలు బసవాదులలో ప్రసిద్ధమే అయినా తెలుగులో సింహగిరి వచనాలే ప్రథమాలు. ఈ మార్గంలో తాళ్లపాక వారి వేంకటేశ్వర వచనాలు వచ్చాయి. వచనాలు తాళబద్ధములు గానయోగ్యాలు. ఒకవిధంగా ఈనాటి వచన కవిత్వానికి దగ్గరగా ఉంటవని అనుకోవటంలో తప్పేమీ లేదు.

సాహిత్యాన్ని నిలువుగా చీల్చే ఒక సిద్ధాంతం చాలాకాలంగా అమలులో ఉన్నది. అది విచిత్రమైంది. “మార్గము మార్గము దేశియ” అన్న నన్నెచోడుని పద్యం ఆధారంగా తెలుగు సాహిత్యంలో దేశిమార్గభేదాలు ఆదినుంచీ ఉన్నాయి. ఈ విభాగం సంగీతంలో నుంచి సాహిత్యంలోకి వచ్చింది. ఒకటి ప్రజాసామాన్యానికి చెందిందనీ, రెండవది పండితులకు పరిమితమైందనీ, ఒకటి పామరులదనీ, రెండవది శిష్టసాహిత్యమనీ కూడా విభాజనం చేయటం జరిగింది. సమాజాన్ని సాంస్కృతికంగా విభజించే ఒక కుహనా తర్మం దీనివెనుక ఉన్నది.

వీటి రెంటి వెనుక ఉన్న పరస్పర పరిపూరక స్వభావాన్ని ఓతప్రోతలక్షణాన్ని ఎవరూ నొక్కిచెప్పటం లేదు. సమాజంలోని సాంస్కృతిక స్తరాలను బట్టి విద్యాప్రసార (ప్రభావాన్ని బట్టి సాహిత్యంలో ప్రక్రియాభేదాలు ఏర్పడతాయి. రూపకంలో ఉండే ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్త్విక, అభినయాదులు అన్నీ శబ్దం ద్వారానే మనస్సులో రూపుకట్టించు కోగల పాఠకులు ఉంటారు. ఆయా అంశాలను సూచనగానో విసృృతంగానో (ప్రకటించ వలసిన పాఠకులూ త్రోతలూ ఉంటారు. భాషలో ఆయా స్తరాలలోని భిన్నభిన్న వ్యవహారాలను ఆయా నిర్దిష్ట పాఠక శ్రోతృగణం దృష్ట్వా కవి నిశ్చయించుకుంటాడు.

ఒకానొక సందర్భంలో ఒకే కవి భిన్నభిన్న స్తరాలలోని పాఠక శ్రోతల నిమిత్తం భిన్నభిన్న ప్రక్రియలను అవలంబించవలసి వస్తుంది. భిన్నభిన్న ప్రక్రియల యథాయోగ్య సమ్మేళనము ఉంటుంది. పోతన్న 'కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు రెండున్‌, కొందరకు రెండు గుణములగు అందర మెప్పింతు నేను అయ్యె ఎడలన్‌' అన్న చోట ఈ భిన్నభిన్న సంప్రదాయాల స్వరూపాన్ని సూచించటం జరిగింది. 'జానుతెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట కూర్చెద ద్వివదలు కూర్మిదైవార” అన్న పాల్కురికి సోమనాథుడు తాను పండితుడే, శాస్తవేత్తయే అయినా సర్వసామాన్యుల కందుబాటులోనికి తేవటానికి ద్విపదలో జాను తెనుగులో రచించటం. ఇక్కడ పాఠక సమూహం భాషనూ, ఛందస్సును నిర్ణయించింది. వన్తువును నిర్ణయించుకునేది కవి మాత్రమే. దానికోసమే మిగతా రెండూ. అతని రచనల్లోని సారళ్యము, గేయలక్షణము, పామరుల పలుకుబడి వ్యాకరణానికి అతీతమైన ప్రయోగాలు ఇవన్నీ ఆయన ఎన్నుకొన్న శ్రోత్ససమూహం వల్ల వచ్చినవి.

అయితే ఈ దేశిరచనల్లోనూ పండితైకవేద్యాలైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే భారత భాగవతాది కావ్యాల్లో సామాన్య (శ్రోతలను చేరుకోగలిగిన ఘట్టాలూ ఉన్నాయి. పాండవోద్యోగ విజయాలలోని పద్యాలు సరళంగా జానపదుల దాకా ప్రాకటం ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది.

అన్నమయ్య రచనలలోని జునపదాంశాలు సమాజంలోని అన్ని స్తరాలలోనూ అతడు కలసి జీవించటం వలన అనేక సాంస్కృతికాంశాలను తనలో జీర్ణం చేసుకోవటం వలన సంగమించినాయి. తానై వాటిని తన రచనల్లోకి ఆహ్వానించి, దోహదం చేసి సజీవంగా నిలిపి ఉంచటం ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన గొప్ప ఉపకారం.

ఆయన రచనల్లో మేలుకొలుపు పాటలు, మంగళహారతులు, గొబ్బిపాటలు, తందానపాొటలు, సువ్విపాటలు, తుమ్మెదపదాలు, జాజరపాటలు, రోకటిపాటలు ఇలా ఎన్నో అంశాల విస్తృతి ఉన్నది. సామాన్యజనంలో వ్యాపించి ఉన్న ఈ ప్రక్రియలను స్వాయత్తీకరించుకొని శిష్యులు స్వీకరించే స్థితికి తెచ్చి వాబ్బయంలోని ఒక సమన్వయ మార్గాన్ని నిర్మించాడు. వీటిల్లో అత్యంత ప్రసిద్ధములైన పాటలు -

కొలని దోవరికి గొచ్బీళ్లో యదు /కులస్వామికిని గొబ్బిళ్ళో”

విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు / పెడమరలీ నవ్వీనె పెంద్లికూతురు”

నెయ్యము లల్లో నేరెళ్లో / ఒయ్యన వూరెది ఉవ్విల్లో కార్యీప్తుమతి 127

“ఉయ్యాలా బాలు నూచెదరు కడు / నొయ్య నాయ్య నొయ్యననుచు”

'ెరవునా తన విధము దాచుకొని / దారదాంగ వచ్చె దోబూచి”

చిత్తజగురుడ నీకు శ్రీమంగళం / చిత్తములో వారి నీకు శ్రీమంగళం”

ఇలా ఎన్టైనా ఉదాహరిస్తూ పోవచ్చు. అన్నింటినీ మించి ఆయన జోలపాట “జ్యో అచ్యుతానంద జోజో ముకుందా” అనే పాట తెలుగు సంస్కృతిని జీవనాన్ని 500 సంవత్సరాలు పాలించింది. తెలుగుతల్లుల నాలుకలపై తేనె చిందింది, వాత్సల్య సుధలను కురియించింది. ఇక్కడ గమనించవలసిన మరొక అంశం, జానపదాంశాలు ప్రత్యేకంగా సమాజంలో ఎక్కడో సీమితమై ఉండవు. అందరి ఇళ్లల్లోనూ ఆయా ఉత్సవాలలో ఆయా పాటలు పాడుకుంటారు. ఇక్కడ శిష్టాశిష్ట విభేదం ఉండదు. అర్ధశతాబ్దం పూర్వం మా ఇంట్లో రోకటిపాటలు, విసుర్రాయి పాటలు, జోలపాటలు వినేవాణ్ణి,

భాషా విషయంలో స్వేచ్చను వహించటానికి తన పాండిత్యం అద్దురాలేదు అన్నమయ్యకు.

అనేక పంతగాడవు (24-186), వొబ్బుద్ధి (24-529), నియ్యాన (నీయాన) (25-488), కలకంటి (కలకంఠి) (12-820), చేతలాడి (చేతలు సేయునది) (24- 104), అరజీడు (ఆరజము+ళఈడు) (38-101), మమకరించి (32-515), నెజతనీడు (నెజతనము+ఈడు) (26-515).

మరికొన్ని రూపాలు నిత్తెము (నిత్యము), ఆతుమ (ఆత్మ), దిడము (దృఢము), దిష్టము (దృష్టము), వచ్చీని, చేసీని, మోమోము (మోము+మోము), లాగవేగాలు (లాఘవ+వేగాలు), సంతము (శాంతము), నిజపట్టు (నిజము+పట్టు), చదువుతా (చదువను) నిత్యకొత్తలు, పూపసుఖము.

కొత్త పదబంధాలు - కొప్పెర గుబ్బల గొల్లెత, పచ్చిచూపులు, నిట్టూర్చుటెండలు, తమకపుకొటారులు, తీగసాగిన మోహము, మోహపుటాకలి, జవ్వనపు పొలము, రతిబువ్వ మారగించి, కొండవంటి కోపము.

ఒకవిధంగా విచారిస్తే అన్నమయ్యను నూతన భాషాస్రష్టగా భావించవచ్చు. 20వ శతాబ్దంలో రాయస్రోలువారు కావ్యభాషలో తెచ్చిపెట్టిన వరివర్తనములోని అనేకాంశాలు అన్నమయ్య రచనల్లోని పదబంధాలు నూతన రూపములో, ఉగ్ర్రేక్షలలో, ఉపమానాలలో గోచరిస్తున్నవి. భాషావిషయంలో అన్నమయ్య కైకొన్న స్వేచ్చ అసాధారణ మైందీ, అసామాన్యమైందీ.

అన్నమయ్య లక్ష్యం భక్తి పారమ్యభావం జనులందరికీ చేరటమే. సంకీర్తనల ద్వారా సారళ్యపు పరాంకోటికి చేరుకున్నాడు. ఈ సంకీర్తనలలో నురొక లక్షణము అభినేయార్హత, అన్నమయ్య రచనలు ఎన్నింటినో ఈ కాలంలో నాట్యమునకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు అనేకులైన నాట్యకళాకారులు.. వీటిలో సద్యః భావస్ఫోరకత, ముద్రాఖినయ నేత్రభంగీఫణితులకు అనువైన రీతిలో ఉండటమే దీనికి కారణం.

అన్నమయ్య సంక్షీర్రనలలోని ఛందోమర్యాదలను గురించి, అతని ్రజ్యేక నిర్మాణం అంశం గురించి గోపాలకృష్ణ అబ్బూరి (2002) తన (గ్రంథంలో విపులంగా చర్చించారు. వారే అన్నమయ్య కీర్తనల సంఖ్య విషయంలో నూతన ప్రతిపాదన చేసినారు. “పాదేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను” అన్న సంక్తీర్తనంలో ఆయన సంక్తీర్తనల సంఖ్య ముప్పదిరెండువేలు కాదనీ, అవి ముప్పదిరెండు వేళల పాడదగిన విధంగా రూపుకట్టాయనీ వారి ప్రతిపాదన.

అన్నమయ్య సంకీర్తనలకు సంగిత నిర్మాణం చేయటంలో చాలా వివాదాలు నడిచాయి. “మొత్తము మీద తాళ్లపాక వారి రచనలు అర్థభావ (ప్రధానములైనవి. త్యాగరాజు దీక్షితాదులవానివలె నాదరచనా ప్రధానములు కావు. గాయకులు ఆ దృష్టిలో సాధించి పాడిరేని తప్పక సభ్యుల నాకర్షింపగలవని నా నమ్మకం' - అని రాళ్లపల్లి వారి అభిప్రాయం.

ఈ భావం పరివ్యాప్తమై ఉన్నా రాళ్లపల్లివారూ, తరువాత అనేకులైన విద్వాంసులు స్వరపరుస్తూనే ఉన్నారు. నేదునూరి కృష్ణమూర్తి, మంచాళ జగన్నాథరావు ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. అయితే అన్నమయ్య పాడిన, ఆ కాలంలో పాడబఐడిన సంప్రదాయం ఇంకా మనకు లభ్యం కాలేదు. శృంగార సంక్షీర్తనలు - 15 పీఠికలో అర్భకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు తంజాపుర సరస్వతీ మహల్‌ లైబ్రరీలో 'పదములు కీర్తనలు అనే సంకలన (గ్రంథంలో 14 తాళపత్రాలలో తాళ్లపాకవారి కీర్తనలకు రాగతాళములు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

ఇటీవల వేటూరి అనందమూర్తి తాళ్లపాక వారి కీర్తనల స్వరపరచిన రూపంలో శిలాశాసనాలను పరిశోధించి ప్రత్యేక గ్రంథంగా ప్రచురించారు. కాళ్యత్తతుత నన్న 28

[1 ఒకానొక వాక్క్ళు అరిచింది - 'ఏవరూ వెళ్లని లోతుల్లోకి వెళ్లు అని ఇంకా ఇంకా లోతుల్లోకి లో లోతుల్లోకి ఆతి తీవ్రంగా - అట్టడుగు పునాది రాయి చేరేదాకా - తాళం చెవి లేని ద్వారాన్ని తట్టి వీలువు భగవంతుని శ్రమ (శ్రీ అరవిందులు) అన్నమాచార్యుల సంకీర్తనల సందోహాన్ని చూస్తే మనస్సులో కలిగే అనుభవ విశేషం ఇది. మానవ జీవనంలోని అంతర్చహిర్గోకాలను వెలుగు చీకట్లను ఇంతగా తరిమి తరిమి తెరచి చూచిన తాత్త్విక కవుల్లో ప్రపంచంలోనే అన్నమయ్య అరుదైన కవి. ఆయన గానం ఆకాశంలో నిరంతరంగా మోగుతూనే ఉన్నది. ఆయన గొంతులో జీవేశ్వరుల సంయోగ మాధుర్యం, వియోగ మాధుర్యమూ “వేంకటశైల వల్లభరతి క్రీడా రహస్యాలు వ్యాఖ్యానింపబడ్డాయి. నిగమాగమాలను తమలో గర్భీకరించుకున్నాయి. ఆయన సంకీర్తనల అనుభవం తాళం చెవి లేని ద్వారాన్ని - ఈశ్వరస్థానాన్ని తట్టి పిలుస్తున్నది. అందుకోసం భావుకుడు అఖిలాత్మల చైతన్య గుహలలోకి (తవ్వుకుంటూ వెళ్లాలి. వేదాత్మయైన మహాగరుడుని పక్షాంచలాలవలె ఆయన సాహిత్యం రెండు విధాలుగా ప్రవ్యక్తమయింది. శృంగార వైరాగ్య సంకీర్తనల రూపంలో ఇతర రచనలెన్ని ఉన్నా ఆయన రచనా పారమ్యము సంకీర్తనల్లోనే ప్రకటితమయింది. జోరొక్ళరు లేరు విశ్వమంతా నీ మపామ /యే రీతి నీవే కలవు ఇతరము లేదు తల్లివై రక్షీంతువు తం్రివై పోషింతువు / యిల్లాలవై మోవామిత్తువు నాకు వొళ్లయి పెరుగుదువు వొగి వురాక్టుతమౌదు / యిల్లు ముంగిలై వుండుదు వింతా నీ మపొమే” నృష్టికి ఉపాదాన నిమిత్త కారణములు రెండూ శ్రీమన్నారాయణుడే. ఇతరము లన్నీ తానే. సర్వమైన అభివ్యక్తి చరాచరము, చిదచిద్రూపము తొనే. తదితరమైనది ఏదీ లేదు. భోక్తా భోగ్యం (క్రేరితాం చ మత్వా నర్వం ప్రోక్తం త్రివిధం బ్ర్మమేతత్‌ - (శ్వేతాశ్వతర) ఈ విశిష్టమైన సమన్విత దృక్పథము లోకజీవనంలో అవిరోధానికి, సర్వాత్మభావనకు, జీవనతాత్పర్యానికి, శాంతిలల్టీకి కారణనువుతున్నది.

ఈ విశ్వగాయకుడు ప్రభువుతో చెప్పుకొంటున్న విన్నపంలో తన్నుతానే గాయనోప కరణంగా మార్చుకుంటున్నాడు. అయితే గాయకుడు ఎవరు? ఆ స్వామియే. “తనువే వొళవు తలయే దందెకాయ /ఘనమైన వూర్చులు రెండు కట్టెడితాళ్లు మనసే నీ బద్దితాడు మరి గుణాలె జీవాళి/మొనని వుట్టుకే మూలమైన కవది (39-467) ఇలా సాగిన ఈ సంక్తీర్తనల జీవునికి దండెవేసినవాడవు నీవు - వావాతి మాటలే నీపై వన్నె పదాలు - యీవి మాకు నిహపరాలనిచ్చితివి అంటాడు. ఈశ్వరు డిచ్చినవే ఇహపరాలు రెండూ సమచిత్తంతో ఈశ్వరాయత్తబుద్ధితో అనుభవింపవలసిందే. ఇహము మాయయనీ, హేయము అనీ చెప్పలేదు. ఈశావాస్యమిదగ్‌ం సర్వం అన్న తాత్పర్యం దీనిలో గోచరిస్తున్నది. జాతిభేదాలు, మతభేదాలు తిరస్కరించిన సంస్మరణ దృక్సథం అన్నమయ్యను ఒక తత్త్వవేత్తగా మనకు సాక్షాత్మరింపజేస్తున్నది. 'మతము మతమునకు మార్గము వేరే అతిసంశయములు అవి వేరే గతి నీ శరణము కలిగినదొకటే (అధ్యా 2-488), 'నీదాసుదైతే హీనుడైనా ఘనుడే' (3-479 ఈశ్వరాలందినం ఎందుకోసం అనే ప్రశ్న ఉన్నది. దానికి సమాధానంగా క్రింది సంక్తీర్తనను గమనించవచ్చు. “నకల శాంతికరము నర్వేళ నీపై భక్తి /వ్రకటమై మాకు నబ్బె ఐతికించునదియె మననులో పావబుద్ధి మరియెంత దలచినా /నిను దలంచినంతనే నీరౌను” (అధ్యా.8-877) సంసారంలో సకల సంక్షోభంలో ఉన్నా జీవుడికి శాంతి - చిత్తములో స్థిరమై ఉంటుంది ఈశ్వరభక్తి వలన. కారణం దానివల్ల సిద్ధించే ఏకాత్మభావన. సర్వమునందు భగవంతుని చూడగలిగిన వాడికి కలిగే అనుభవమునందు పరులను గూర్చిన పాపభావము కలుగదు. కలిగినా నిలువదు. ఎందుకంటే అన్నింటా ఈశ్వరుణ్ణే చూడగలుగుతున్నాడు కాబట్టి. ఇతనికి ప్రతి లేదు. బీవకోట్లకు ప్రాణబంధువితడు అంటున్నాడు అన్నమయ్య, సృష్టిలో అంతర్గర్భితంగా దివ్యజీవన పరిణామం ఉన్నది. సర్వము ఈశ్వర కళామయంగా రూపొందవలసి ఉన్నది. సృష్టిలో ఉండే అసమ(గ్రతలు, అపరిణతులు తొలగిపోయి అంకా దివ్యభావం నెలకొనవలసి ఉన్నది. సృష్టిలో ఈ పరిణామ సోపానం కార్యీర్హురురి 131

మీద జీవకోటి నిరంతరం కదలిపోతున్నది. ఉత్తరోత్తరం ఉన్నతోన్నత శిఖరాలను అధిస్టించవలసి ఉన్నది. అంతా ఈశ్వరుని దయ దిగివచ్చినప్పుడే సంభవిస్తుంది. అరోహణ అవరోహణాలు నిరంతరం సాగవలసిందే. అట్టడుగున ఉన్న తమస్సులోంచి దివ్యబీజం మొలకవేస్తుంది. 'కదనుండి రావు కానివినైనవి / మడుగని దయనీ దొకటే కలదు వారి నీ చక్రం బంటినయపుదే / పొరిది నసురులే నురలైరి నిరతము చీకటి నిండిన మింటను / వెరవున రవిచే వెలుగైనట్లు - కడ తల నీ నామమె తలచిన వారి / అతిపావమె వుణ్యం బాయ గతియై పరునము గడిసిన లోవామె / ప్రతిలేక ధరణి వసిడిడైైనట్లు - కడ కొంకక నినునిటుగొలిచిన మనుజులె / అంకెల శుకాదులయినారు యింకను శ్రీవేంకటేశ నీ జగము / నంకల్పమె మోక్షంబై నిలిచె - కడో (అధ్యా 8-307) ఈశ్వర స్ఫురణతో దేవతలైనారు రాక్షసులు. చీకటి తొలగి సూర్యకాంతి నెలకొన్నది. అతిపాపమె పుణ్యమయింది. స్పర్శవేదియైన నీవలన లోహమె పసిడియైంది. సామాన్యమానవుడు జీవన్ముక్తుడై శుకాదుల సరసను చేరినాడు. దివ్యజీవన పరిణామాన్ని ఇంత అద్భుతంగా వర్డించిన కవి ప్రాచీన వాజ్యయంలో మరొకడు లేడనే తోస్తున్నది. వర్ణధర్శ్మములను పరిత్యజించి ధర్మరాజు విదురునకు అంత్యక్రియలు చేయటం, శబరి ఎంగిలి శ్రీరామచంద్రునకు నైవేద్యం కావటం మొదలైనవి భక్తిపారమ్యాన్ని తెలియజేస్తున్నవి. గుజరాత్‌ సంతయోగి సరసీమోహతా సంకీర్తన “వైష్ణవ జనతో యేనే కహియే పీడపరాయీ జానిరే' అత్యంత ప్రసిద్ధమైంది. మహాత్మునికి మిక్కిలి ప్రీతి కలిగించిన రచన ఇది. “ఏ కులజుడైన యెవ్వడైన నేమి ఆకడ నాతడె హరినెరిగినవాడు' (1-292) అన్నమయ్య ఈ సంకీర్తన దీనితో తులతూగదగినది. సత్యశీలము, పరనిందా రాహిత్యము, భూతదయపరత, పరులయందాత్మభావన, నిర్మలమైన ఆత్మనియతి, ధర్మతత్చరత, కర్మములయందు అనాసక్తి, హరిభక్తిపరత, జగద్ధితబుద్ధి, అవైరబుద్ధి, ఆత్మజ్ఞునము, ఈశ్వరదాస్యము ఈ పన్నెండు లక్షణాలు అన్నమయ్య దృష్టిలో పరిపూర్ణ మానవుని లక్షణాలు.

  • ఇటువంటీ పరిపూర్ణ మానవులే ఈశ్వరభక్తులు. “నీకంటే మాకు జూడ నీదాసులే మేలు పైకొని వారున్నదోట బాయకుందువు' (2-161) నిన్ను వెదకి కనుగొన చేసుకొని నీ భక్తులున్నవోట నీవుందువుగాన వారే మాకు ఉపకారులు.

ఈ భక్తుల సంసర్దంలో సాధకుడు సర్వమందు హరినే దర్శిస్తున్నాడు.

ఖఇంతటా వారినే కాని యెందునకు గాన నన్న/కొంత నాకు తెలపరో గురువులాల

తనువూ వారితే తలవూ వారియే / వినికి మనికియును విమ్హుడే

కనుగొను చూవులు కమలనాభుదే / యెనని జీవుని శ్త్తి యెద యేదనున్నదో

లోకమెల్ల మాధవుదే లోనెల్ల కేళవుడే / నాకును కర్ణము శ్రీవైకుంరుడే

చేకొని ఈ చైతన్యమెల్ల శ్రీమన్నారాయణుడే / యా కడ నేనను వాడ

నేదనుందువాడనో వెనుకను కృష్ణుడే ముందచ్చుతుడే / కొన మొదలు నదుమ గోవిందుడే యెనయగ శ్రీవేంకటేడమయమింతాను/అనుగు నా స్వాతండత్ర్యమది యేడనున్నదో' (అధ్యా. 2-4638) సర్వం విష్ణమయం జగత్‌ అన్న వాక్యవిస్తారవ్యాఖ్య. ఆ పరమాత్మ నిండిపోయి జీవుడు తన్ను తాను గుర్తించలేకున్నాడు. ఒకానొక తన్మయస్థితి. సముద్రంలో ఒక నది కలిసినప్పుడు కలిగే స్వభావం తొలగిపోయిన స్థితి.

'నిత్యాళ్ముడైన నట్టి నిత్యుడైనట్టి ఇత్యాది సంకీర్తనలలో అన్నమయ్య వేదవేదాంత వేతృత, ఉభయవేదాంత పారంగతత్వము వెల్లడవుతున్నాయి. రామానుజ సంప్రదాయ సారము, దబ్రావిడాగమ తాత్పర్యము జమిలిగా అన్నమయ్య రచనలలో సాక్షాత్కరిస్తాయి.

తన సారస్వత సాధన అంతా ఈశ్వరారాధన విశేషంగా ఆయన భావించాడు. అందువల్ల ఇహపరాలకు సేతువుగా తన రచనా సర్వస్వాన్ని నిర్మించాడు. లోకంలోని అసామరస్యాన్ని పాపచింతనను మిక్కిలిగా ఏవగించుకొన్నాడు. ఒకచోట అంటాడు - జాలవిశేషమో, లోకముగతియో సన్మార్గము కీలువదలెనో, సౌజన్యము క్రిందయిపోయినది.

' ఇందెక్కడి, సంసారం బేదెసజూచిన ధర్మము కందయనది విజ్ఞానము కడకు తొలగినది ముందుకు వెదకిన గానము మంచితనపు పనులు (1-63) నాటి దుస్థితి కేవలం నాటిదే కాదు సార్వకాలీనమైంది. మనుజులలో నెలకొని ఉన్న రాజసం తామసపార్య్యము. ఇదే రాక్షసముగా పరిణమిస్తుంది. జగత్తునకు వినాశము తెస్తుంది. అందుకే అన్నమయ్య అంటాడు. లం కళప్తుమిరి 133

చునుజుడై ఫలమేమి మరి జ్ఞానియా దాకా /తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా / చదివియు వలమేది శాంతము కలుగుదాకా పెదవెత్తి ఫలమేది ప్రీయమాడు దాకను /మదిగళల్లి ఫలమేది మాధవుదలచుదాకా” (11-487) మనుజజన్మ ఫలవంతం కావటానికి ఉత్తమథ్రేణిని అధిరోహించటానికి కావలసిన . మార్చును సూచిస్తున్నాడు కవి. ఈ పరిణామం కోసమే మన నాగరికత, సభ్యత వృద్ధిపొందాయి. భక్తులు భాగవతుల మహిమ చెప్పే సంకీర్తనలు అన్నమయ్య రచనలలో అనేక స్థానాలలో లభించుతాయి.. “ఎందు వెదకనేల యే ('ప్రయాసాలు నేల ఇందే వున్నది బ్రతుకిహ పరములకు - “పరమ భాగవత భవ్యమతులు పరమబోధ సంభావకులు తిరువేంకటగిరి దేవసేవకులు కరుణానిధులు' - 'అయ్యో సదామత్తుడను హరి నీదాసులు నన్ను ఇయ్యెదనే దయచూచి ఈడేర్చిరి గాక - “నీ దాసులున్న చోట నిత్యవైకుంఠమిది'- ఇలా అనేకంగా ఉదాహరిస్తూ పోవచ్చు. గురువుల అనుగ్రహాన్ని ఒక యాగంగా భగవత్సాక్షాత్మారాన్ని యజ్ఞఫలంగా రూపించిన సంకీర్తన ఉన్నది. “జ్ఞాన యజ్ఞ మీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు అన్న (32-148) సంకీర్తనలో యజ్ఞమునకు ఆచార్యానుగ్రహాన్ని ఆరోపించే సంపూర్ణరూపకం ఉన్నది. దేహమే యాగశాల, అజ్ఞానము యాగపశువు, వైరాగ్యము కత్తి, జ్ఞానాగ్నిలో వేల్పుట, వైష్ణవ్రులదే మునిసభ, శ్రీపాదతీర్ధము సోమపొనము, నంకీర్తన సామగానము, తదీయ గురు ప్రసాదము పురోడాశము, ద్వయమను కుండలములు, యజ్ఞఫలము స్వామి సాక్షాత్కారము ఇలా మొత్తం యజ్ఞస్వరూపాన్ని రూపుకట్టించటం జరిగింది. అయితే యిక్కడ పరమార్ధము వైదికములైన యజ్ఞములకంటే ఈ జ్ఞానయజ్ఞం థ్రేష్టమని తాత్సర్యం. సంహరించవలసింది పశువును కాదు అజ్ఞానాన్ని ధరించవలసింది కుండలాలను కాదు ద్వయమంత్రాన్ని ఎప్పుడూ హృదయంలో. ఇలా చెప్పుతూనే సంకీర్తన తన వంటివారి రచనలకు సామవేదంతో సామ్యం భావింపజేయటం ఒక ధ్వని విశేషం. నమ్మాళ్వారుల తిరువాయమొళి ప్రబంధానికి సామవేద సామ్యం ఉండటం ఇక్కడ గమనించాలి.

క్ష”

'ప్రపన్నజనకూటస్థులైన శ్రీశఠకోపులకు (నమ్మాళ్వారులకు) అన్నమాచార్యులకు ఎన్సస్నీ సామ్యాలున్నాయి. వారివారి ప్రబంధాలలో ఈ సామ్యం స్ఫుటంగా గోచరిస్తుంది. వారివారి జన్మతిథులూ వైశాఖంలో విశాఖనక్షృతం కావటం కూడా ఒక విశేషమే. నమ్మాళ్వారుల ప్రబంధాలలో మధురభక్తి వైభవం ప్రకటించబడింది. భాగవతంలో గోపికలు శ్రీకృష్ణార్పిత చిత్తవృత్తులయి సాగించిన సర్వ సమర్పణ భావం, (ేయోభావం తిరువాయ్‌ మొళిలో (ప్రతిఫలించింది. అన్ననుయ్య గీకాలలో ఈ భక్తి విశ్వరూపాన్ని పొంది శృంగార సంకీర్తనలుగా వెల్లివిరిసింది.

భారతీయ జీవనవ్యవస్థలో పురుషార్ధ సాధనం ప్రధానమైన సోపానం. ధర్మార్ధ కామమోక్షాలలో ధర్మంతో కూడిన అర్థం ఎంత ముఖ్యమో, కామమూ ధర్మబద్ధం కావాలి. ధర్మావిరుద్ధమైన కామమే తానని గీతలో భగవంతుడు చెప్పుకున్నాడు. అయితే ఈ అర్థకామాలను మోక్షానికి అనుబంధించ్‌నప్పుడు అవి ఈశ్వరప్రాప్తికి హేతువులవుతాయి. ఇదం నమమ అనే భావంతో సర్వస్వమును ఈశ్వరునికి దానరూపంగా అర్ప్చణ చేయటం

ఒక అంశం - అట్లాగే కామభావాన్ని ఈశ్వరాంకితం చేయటం, అతడొక్కడే పురుషుడనీ, సర్వజగత్తు స్రీప్రాయమని భావ్లించటం ఈ మార్గానికి శీలకమైన అంశం. భాగవతం పేర్కొన్నట్లు 'కామోత్మంఠత గోప్లికలొ - అన్నప్పుడు తమ కానుభావమూలాన్ని ఈశ్వర నామరూప సౌందర్య విలాసాల నిత్యభావంతో సాక్షాత్మరించుకోవటం ఈ మధురభక్తి మార్గం. తమిళదేశంలోనే ఈ మార్గం వృద్ధి పొందినట్లుగా గోచరిస్తుంది. శ్రీశఠకోపులే కాక శైవభక్తులైన మాణిక్యవాచకర్‌ కూడా ఇదే త్రోవలో తమ సాధన సాగించారు. గోదాదేవి ఈ (త్రోవను కొనసాగించింది. ఉత్తరభారతంలో మీరాదేవి మొదలుగా అనేకమంది మధురభక్తి సంప్రదాయాన్ని సాధనకు ఉపయోగించుకున్నారు. అన్నమయ్య వాబ్బయంలో ఆధ్యాత్మిక కీర్తనలు ఆయన వాబ్బయమనే సుపర్జుడికి ఒక పక్షమైతే శృంగార సంకీర్తనలు మరొక పక్షం. ఇహపరములు రెండూ భగవంతుడే ఇచ్చినప్పుడు ఐహికమైన కామమూ తదర్పితము కావలసిందే. శృంగార సంకీర్తనలలో ఒక అద్భుతమైన కీర్తనమున్నది. అది ఈ జగత్తు సృష్టి _ శింశుమార చక్రము అంతా ఈశ్వరానుభవ యోగ్యమైందనే తాత్పర్యం. ఖఇగోళమంతా ద్వాదశరాసులుగా వ్యక్తమవుతున్నది. ఈ జగత్తు ఈశ్వర నిర్మితమైన పరమసుందరమైన భోగ్యమైన వస్తువు. చెలువపురాశి. అందువల్ల జగత్తు అనే కన్యకు నీకు రాశికూటమి కాన్యప్తుతుతి 135

కలుస్తున్నది. “ఇన్ని రాసులయునికి ఇంతి చెలువపు రాశి కన్నె నీరాశి కూటమి కలిగిన రాశి - అన్న పల్లవిలో మొత్తం తాత్చర్యం చెప్పి మిగతా చరణాలలో ఒక్కోరాశి సౌందర్య విభ్రమవర్జ్దనం ఉన్నది. ఆమె కనుబొమ్మలు ధనుస్సు, మీననేత్రాలకు మీనరాశి, కుచ కుంభములకు కుంభరాశి, పయ్యెద మకరరాశి, కన్యకు కన్యారాశి, పసిడివన్నె తులతూగే ఆమెకు తుల, వాడిగోళ్ల మగువకు వృశ్చికరాశి, ఆముకొనునొరపుల మెరయు నతివకు వృషభరాశి, గుట్టుమాటల సతికి కర్కటరాశి, కోమలపు చిగురు మోవి కోమలికి మేషరాశి, స్వామితో కలిసినప్పుడు మిధునరాశి. ఇలా ఈ క్తీర్సనలో కవితావైభవము అనంతంగా ప్రకాశిస్తున్నా దాన్ని మించిన తాత్విక సౌందర్యం స్ఫురిస్తుంది. వామనావతారంలో విష్ణువు శ్రివిక్రమత ఎట్టిదో ఈ కీర్తనలో భక్తుని విశ్వతాదాత్వభావన తత్సమర్చణ భావన అట్లాంటిదే. సృష్టి నిర్వహణ విషయంలో శ్రుతులు 'భీషాస్మాద్‌ వాతపవతే భీషోదేతి సూర్యః ఇత్యాదుల్లో చెప్పబడిన సృష్టి నిర్మాణ మూలాలకు ఈశ్వరునికీ ఉన్న అనుబంధం దీనిలో వ్యక్తమవుతున్నది.

ఖజరాహో కోణార్మశిల్పాలు, కాళిదాస కుమారసంభవం, శ్రీహర్నాదుల కావ్యాలు, గీతగోవిందం, తెలుగు ప్రబంధాలు వీటన్నింటిలో ఈనాడు మనం ఓర్వలేనంత రతివర్జనం, అంగాంగవర్ణనం కానవస్తున్నాయి. అన్నమయ్య శృంగార సంకీర్తనల్లోనూ ఈ అంశం అధికంగానే ఉన్నది. అయితే ఎప్పుడో నడుమ కొంతకాలం వచ్చిన వికారంగా కాక క్రీస్తు శకారంభం నుంచీ మన సమాజంలో కామభావ ప్రకటనం యెడల ఉన్న అంగీకారం ఒక సంప్రదాయంగా కానవస్తున్నది. జీవనంలోని సమృద్ధీ, వివృతకవాటలక్షణం, ఐహికాముప్మికాల సమన్వయం కోసం రెండు అంచులలోను స్పష్టంగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు. వాత్స్యాయన కామసూత్రాలు శాస్త్రంగా అంగీకృతం కోవటం దీనినే సూచిస్తున్నది. శృంగార సంకీర్తనలలో ఉన్న వర్ణనలను ఈ దృష్టిలో అర్ధం చేసుకోవాలి. కామపురుషార్థాన్ని ఈశ్వరార్చితం చేసే భక్తిసంప్రదాయాలు ఇందుకు హేతువులు కావచ్చు.

విప్రలంభం సంయోగ శృంగారానికి శోభనిచ్చేది అన్నమయ్య విరహ సంయోగాల వర్డ్దనం ఒకటి పరిశీలించవలసినది విలక్షణమైంది. రెంటినీ కలిపి వర్ణించటం దీని విశేషం.

'అంగనకు విరవామే నింగారమాయ /చెంగట నీవే యిది చిత్రగించితివయ్యా”

(27-415)

నాయకుని తలంచి లోలోన కరిగి జలజల చెమరించగా ఆమెకు స్నానమయింది. నీకోసం ఎదురువచ్చిన సంభ్రమంలో కొప్పు విడిపోయి నీలిచీరకట్టినట్లయింది. నిన్ను చూచిన సిగ్గులవలన చెక్కులను గంధము పూసినట్లయింది. నిన్ను కలసి కౌగిలించుకోగా చంద్రాభరణపు సొమ్ములు పెట్టినట్లయింది. సరసములచేత నాయిక తలంబ్రాలు పోసినట్లయింది.

ఇక్కడ నాయిక పొందిన సంయోగానుభవం బహిరుపకరణ రహితంగా

సర్వోపచారములు చేసినట్లయింది. ఏకాంతభక్తితో భక్తులు పొందే భావసంలగ్నత ఈ విలక్షణస్థితికి కారణమవుతున్నది. ఇద్దరి నడుమ వేరెవరూ లేని కైవల్యస్థితి. మరొక సంకీర్తనలో ఈశ్వరానుభవంలో జీవుడు పొందిన సరనసంయోగము పాలు నీరు కలిసినట్లుగా ఉన్నది.

“తనువు తనది గాని తలవు నీది / పెనగి మాకున దీగ బెననినయట్లు

మోమున కన్నులుకాని మోనావుచూవులు నీపై / కామిని భావము చెప్పు

కళలాయను

తామరలు కొలనిలో దరుల వరిమళము /వేమారు నిండుకొన్న విధమాయెను”

(93-117)

ఆమె నాయిక, తనదంటూ ఏమీ లేదు. సర్వము ఆయనదే. తలపున

ఆయన నిండుకొనటంతో తనువు ఆమెది కాకుండా పోయింది. చెలునిమీదనే

కనులుండటంతో కన్నులు ఆమెవి కాకుండా పోయినవి. ఇలా బ్రతుకంకా స్వామికి సమర్ప్చించుకొనటం వల్ల ఆయనలో ఆమె సాయుజ్యస్థితిని పొందింది.

'ఏమిసేతు నా వలపే యింతసేసె నన్నును” అన్న సంకీర్తనలో తన వలపుభారం వలన నాయకునికి చేసే సేవలను మరచింది. తిరుప్పావైలో తనలో తాను లీనమై, (వ్రతమునకు పిలువవచ్చిన వారికి బదులీయని నాయిక కనిపిస్తుంది. “అదియే కాదా సతత మాతనికి తనకిపుడు పదియవస్థలంబొంది ్రమసే గాకి - (30-176) ఈ కీర్తనలో స్వామికీ తనకు దశావస్థలు తప్పవని నాయిక అంటున్నది. నాయకుడైన శ్రీ వేంకటేశ్వరునికి పది యవస్థలు దశావతారములైతే - నాయకకు విరహంలోని దశావస్థలు. తరుణి తామర యిల్లు తపన మండల మనుచు అరమరచి కాకలనె అలసె నదివో - కమలాకరాన్ని కమల బంధుస్థానమైైన సూర్యమండలంగా భావించాలి. అందువల్ల తాపమును పొందింది, తాను తామర, ఆయన సూర్యుడు - మరికొంచెం ముందుకుపోతే శతు లా

తాను జీవుడు, ఆయన సూర్యమండలాంతర్జతుదైన నారాయణుడు, సాధకుడుగా తాను సాధించేది 'అంతరాదిత్య విద్య - ఛాందోగ్యం చెప్పిన మోక్షవిద్య- అందువల్ల ఆమెకు మట్టెలరవము 'కూడా మంత్రశాస్త్రమే అయింది. శృంగార నంకీర్తనములలో అన్నమాచార్యుల కవితాశక్తి అవధులను ముట్టింది. “లుకు తేనెల తల్లి పవళించెను' - 'అలరులు కురియగ నాడెనదౌ - “ఏమొకో చిగురుటధరమున నెడనెడ కస్తురి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా”- ఇలా ఎన్నో ప్రసిద్ధములైన సంకీర్తనలు సార్వకాలిక కవితా సౌందర్యానికి దర్శణం పట్టుతున్నాయి. అన్నమయ్య సంక్షీర్తన భాండారం భాషకు, పలుకుబడులకు, కవిత్వాంశ లకు తరగనిగని. తిక్కన్న పోతన్నలు జమిలిగా దేశిసొందర్యాన్ని కలుపుకొని వస్తే ఆయనకు సాటివస్తారని తోస్తున్నది. ళా అన్నమయ్య సాహిళ్యానికి అసదృ్భశమైన సేవచేసి ఇంత భాండాగారాన్ని మనదాకా రక్షించి అప్పగించిన ఘనత ఆయన కుమారుడు పెదతిరుమలయ్యదే. ఈయన స్వయంగా విద్వత్కవి, సంకీర్తనకారుడు. అనేక కృతుల నిర్మాణం చేసిన మహానుభావుడు, శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యుదనీ, శ్రీరామానుజ సిద్ధాంతస్థాపనాచార్యుడనీ, ఇంకా ఎన్టీ బిరుదులున్నాయి. తాను రచించిన సంకీర్తనలు ఇతర రచనలు అన్నీ రెండువందల అయిదు రాగిరేకులమీద లభిస్తున్నాయి. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించినవాడు. అన్నమయ్య సంకీర్తన లక్షణానికి వ్యాఖ్యానం రచించినట్లు కూడా తెలుస్తున్నది. అచ్యుతరాయాదులవల్ల తాను దానంగా స్వీకరించినా, ఎన్నో గ్రామాలను స్వామి కైంకర్యానికి తిరిగి దానంగా యిచ్చినాడు. పెదతిరుమలయ్య వేయించిన శాసనములు పదిహేను. 1517 నుంచి 1546 దాకా ఇవి కనిపిస్తున్నాయి. అన్నమయ్య సంక్తీర్తనలను రాగిరేకుల మీదకు ఎత్తి (వ్రాయించిన బృహ్రృణాళిక పెదతిరుమలయ్యదే. ఈయన సంపన్నుడు. “పుట్టు భోగములముమేమూ అని చెప్పుకున్నాడు. ఎన్నో ఉత్సవాలను ఏర్పరచటం, మంటపాలను పునరుద్ధరించటం ఈయన చేశాదు. మనకు లభిస్తున్న అన్నమయ్య సాహిత్యం రాగిరేకులు 2289. వీటిపై లిఖింపబడి లభించే సంకీర్తనలు 14858. అంటే సగంపైగా సంకీర్తనలు మనం కోల్పోయినామన్నమాట. శ్రీరంగం, అహోబలం ఇంకా ఇతర దక్షిణదేశ వైష్ణవక్షేక్రాలలో పోయినవి పోగా రాగిరేకులు కొన్నైనా లభించవచ్చునేమో మనం అన్వేషించనలసి ఉన్నది. రాగా

ఈ సంకీర్తన భాండాగారం తిరుమలలో బంగారువాకిలి సమీపంలో భాప్యకారుల సన్నిధి నానుకొని ఉన్నది. ఆ మండపాని కిరువైపులా అన్నమాచార్యులు, తిరుమలాచార్యుల శిలాప్రతిమలున్నాయి. ఈ భాండాగారానికీ నిత్యపూజలు జరుపబడేవి. శ్రీవేంకటేశ్వరుని ముందు తిరుమంజన సమయంలోనూ, పునుగుకాపు సమయంలోనూ, బ్రహ్మోత్సవ రథోత్సవాలలో సంకీర్తన గానానికి సందర్భం ఏర్పాటుచేసి తిరుమలాచార్యులు వీటికి ద్రావిడ వేదానికి రామానుజులు తెచ్చిన గౌరవాన్ని సంపాదించిపెట్టాడు. నాలాయిర దివ్యప్రబంధాన్ని శ్రీరంగాది క్షేత్రాలలో అభినయపూర్వకంగా గానంచేసే సంప్రదాయం రామానుజులకాలంనుంచీ ఉన్నది. ఈ నృత్యగాయకులను అరయర్లు అని వ్యవహరిస్తారు. నియతంగా ఆయా ఉత్సవాలలో బుగ్వేదాదుల అనుసంధించటంతో పాటు సంకీర్తనలు చేర్చి - సంకీర్తనల అరుళుస్పాడు ఏర్పరచాడు ఆయన. అరయర్లు ధరించే కొళ్లాయి టోపీని (శ్రీరంగంలో నేను చూచాను) తాళ్లపాక అన్నమయ్య శిల్పంలో చెక్కి ఉన్న కుళ్లాయి పోలి ఉన్నది. ఈ సామ్యం పరిశీలించినప్పుడు ఇది అరయర్ల వ్యవస్థకు మరొక రూపమని నిశ్చయించవచ్చు.

ఇంత విసృృతమైన తాళ్లపాక అన్నమయ్య సాహిత్యాన్ని అంచనా వేయటం సముద్రానికి ఏతం వేసినట్లవుతుంది.

ఈ సాహిత్యానికి సంక్తీరనములకు ఇతోధిక (ప్రచారం కలిగించేందుకు ఇంకా ఎంతో కృషి చేయవలసి ఉన్నది. ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కొన్ని వందల కీర్తనలు కాక వీలైనన్ని కీర్తనలను పాడించి కాసెట్లుగా విడుదల చేయవలసి ఉన్నది. శిలాశాసనాల వల్ల, రాగిరేకులవల్ల కొంచెంకొంచెంగా తెలియవస్తున్న అన్నమయ్య సంగీతసంప్రదాయాన్ని, గాయకధోరణిని పరిశోధించి ప్రచారంలోనికి తీసుకురావలసి ఉన్నది. అన్నమయ్య భాషకు ప్రయోగాలకు ప్రత్యేకమైన నిఘంటువును రూపొందించవలసీ ఉన్నది,

ఈ సదస్సు నిర్వహించటంలో పోతన విజ్ఞానపీఠం అధ్యక్షులు మహేశ్‌దత్‌ ఎక్కాగారు, కార్యదర్శి శ్రీ జి.యస్‌. మాధవరావుగారు, ఇతర కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు ఎంతో సహకరించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను అర్పిస్తున్నాను.

(2427 అక్టోబర్‌ 2006 - పోతన విజ్ఞానవీఠం, వరంగల్‌ సెమినార్‌లో కీలకోపన్యానం) కారపురురి 1309

తెలుగు భాష సౌందర్యాన్ని గుండెలలో నిలువుకుందాం తెలుగు సాహిత్యం వెయ్యేంద్ల వయసు కలది. తెలుగు పద్యం పన్నెండు వందలేండ్ల వయస్సుది. తెలుగు శబ్దం గాథాసప్తశతిలోకి తొంగిచూస్తే రెండువేల సంవత్సరాలనాటిది. తెలుగు శాసనం నాగార్జున కొండలో నాగబులో ఉన్నది. ఎందుకీ చర్చ, ఈ వెదుకులాట, ఈ త్రవ్వు కోవటాలు!

ఒకవైపు మన పలుకుబడినిండా తరుముకువచ్చే ఆంగ్ల పదజాలం ఉచ్చారణలో నైనా తెలుగుతనం నిలుపుకోని కొత్తతరం. తాలవ్య దంత్య చజల ఖేదం తొలగిపోయింది. బంధు సంబంధ శబ్దాలూ కరగిపోతున్నవి. వంటింట్లోనైనా తెలుగుమాటల ఉనికి ప్రశ్నార్థకమే అవుతున్నది.

భాషా ప్రయుక్తరాష్ర్రాల ఆందోళన 1913 నాటిది. రాష్ర్టాల నిర్మాణం వకభాషా ప్రాంతానికి పరిమితమవుకే అక్కడి పరిపాలన, వ్యవహారం అంతా ఆ ప్రజల వ్యవహారంలో భాషలో కొనసాగేనని ప్రాథమిక ఉద్దేశ్యం.

(ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు పారమ్య స్థానం. వాళ్ల నిశ్చయాలు, నిర్ణయాలు, ఆకాంక్షలు, ఆశయాలు పరిపాలనలో ప్రతిబింబించాలనే ఉద్దేశ్యం ఆ తాత్పర్యంతోనే ఎన్నికలు, పంచాయితీ వ్యవస్థలు, జిల్లా మండలులు, శాసనసభ ఇవన్నీ ఏర్పడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డది. జాతీయోద్యమనస్సూర్తి ప్రజలలోనుంచి వచ్చిన ఉద్విగ్న ఆకాంక్ష భాషాఖిమానం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణాలు. ప్రకాశం, పట్టాభి, రంగా, కొండా వెంకటప్పయ్య పంతులు, కల్లూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, మాదపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, అయ్యంకి వెంకట రమణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, పప్పూరి రామాచార్యులు, కాశీనాథుని నాగేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, దాశరథి, పి.వి. నరసింహారావు ఇలా ఎందరో మహానుభావులు, మహాపురుషులు, సాంస్కృతికోద్యమనాయకులు, రాజకీయ వేత్తలు, జీవన సారాన్ని అర్పించి సాధించిన మాతృభాషాపూజాపీఠం ఈ ఆంధ్రప్రదేశం,

ఆ నాయకత్వం తెరచాటయింది. రాజకీయ వాదులలో దేశీయతాముద్ర, స్వాతంత్రోద్యమస్స్ఫూర్తి, మాతృదేశాభఖిమానం సన్నగిల్లాయి. వ వ్రవల్ల నుమంబుల ఈశ్వరునకు వూజ చేసితినో ఇందు వుట్టినాడ కలదయేని వునర్హన్మ కలుగుగాత మధుర మధురంబయిన తెల్లు మాతృభాష ఖాషకంటె నవ్యలకు తపన్సు లేదు” నా మాతృభాష నానాదుష్ట భాషల బెద్ధత్వమును తల నవధరించి” ఇలాంటి స్వాఖిమాన వాక్యాలు, వరిదేవనాలు విన్మృతి గర్భాలలోకి చేరి పోయినాయి. తమిళులు మేల్కొల్పవలసి వచ్చింది - మన మాతృభాష చరిత్రను గురించిన ప్రాచినతాన్వేషణను. రాజధానిలో విపణిలోనైనా, వైద్యశాలలోనైనా, విద్యాశాలలోనైనా, శాసనసభలో నైనా, సచివాలయంలోనైనా తెలుగు ఎరుగకుండా, తెలుగువలుకకుండా తెలుగు చదవకుండా మన వ్యవహారాలను చక్కదిద్దుకోవచ్చు. మొదటి అధికార భాషకు దిక్కులేదుకాని, ఎన్నో ద్వితీయ అధికార భాషలు ఎన్నీ జిల్లాలలో తాలూకాలలో అధికారం మారిందిగాని స్వాతంత్ర్యప్రాప్తితో ప్రజల జీవనాడికి, ప్రభుతతో అనుబంధం ఏర్పడలేదు. మేం చదువుకునే రోజులలో డాక్టర్‌ రాముమనోహర్‌ లోహియా 'అంగ్రేజీ హఠావో ఉద్యమం నడువుతున్నప్పుడు ఎక్కువగా హైదరాబాదులోనే ఉండేవారు. ఆయన విశ్వవిద్యాలయం హాస్టలులో భోజనశాలల్లో వచ్చి (ప్రసంగించేవారు విద్యార్భలతో. భారతీయ భాషలంటే ఆయనకు ఎంతగౌరవమో. విశ్వనాథ సత్యనారాయణ ఒకసారి తమ శ్రీమద్రామాయణ కల్పవృక్షం చదివి వినిపిస్తున్నారు. శ్రీజువ్వాడి గౌతమరావుగారి (శ్రేరణతో లోహియా మొత్తం విన్నారు. చివరకు ఆయన ఇలా అన్నారు. “గౌతమ్‌ తుమ్‌ ఉన్‌ కో కవి కహ్‌తే హో మగర్‌ వహ భక్త్‌ హై భాషల అడ్డు తెరలను తొలగించుకొని ఆయన కావ్యసారాన్ని అందుకోగలిగారు. శషత్తతుత త

ఆ సహృదయత ఏదీ? ఏమైపోయింది? లోహియా అంగ్రేజీ హఠావో ఉద్యమం ఆనాడు మనం చాలా తేలికగా తీసుకున్నాం. అది బలపడి ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో తెలుగుభాష పరిస్థితి యింత బలహీనంగా, కొనప్రాణంతో మినుకుమినుకు మంటునట్లు ఉందేదికాదేమో. అమెరికాకు వెళ్ళవచ్చు, ఉద్యోగాలు పొందవచ్చు. డాలర్లు సంపాదించవచ్చు. అయితే మన అస్మిత (ఐడెంటిటీ) పోగొట్టుకోవాలా. జనాభాలో విదేశాలకు వెళ్ళేవాళ్ళో, తగినవిధంగా భాషా విషయంలో తమను సంసిద్ధం చేసుకోవచ్చు. కాని అందరూ ఈ విదేశీ భాషాక్షేషాన్ని ఎందుకు బలవంతంగా అనుభవించాలి. మనస్సులో పలికిన పలుకు నోట వెలువడే మధ్యలో అనువాదం ఎందుకు. బుద్దుని కాలానికి ఆంధ్రుల ప్రసక్తి ఉన్నది. ఐతరేయ (బ్రాహ్మణంలో ఉన్నది. రామాయణ, మహాభారతాలలో ఉన్నది. పురాణాలలో ఉన్నది. తెలివాహ నదీనామం గోదావరికి ఉన్నది. ఈ తెలివాహ శబ్దంలోనే తెలుగు వేరు ఉన్నది. మన మాతృభాష ప్రాచీనతను ఎవరో గుర్తించటం కాదు ఇప్పుడు కావలసింది. మనం దాని శక్తినీ, సంపత్తినీ, ఆధునికోపయోగాన్నీ గుర్తించాలి. పి.వి. నరసింహారావు (ప్రధానమంత్రియైనా మన ప్రాంతానికి వస్తే లేదా మనం ఎవరైనా ఢిల్లీకి వెళ్ళితే తెలంగాణా యాసతో తెలుగులోనే మాట్లాడేవారు. ఆయనే పరిపాలన తెలుగులో నిర్వహించేందుకు మార్గదర్భనం చేసింది. ఆయన రాష్ట్ర విద్యామంత్రిగా శాసనసభకు సమర్పించిన శ్వేతపత్రం. అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన పరిపాలన కోసం అవసరమైన శబ్ధకోశం సిద్ధమైంది. ఇంటర్‌ స్థాయినించి తెలుగులో విద్యాబోధ అసాధ్యమనుకున్న దశలో పి.వి, చొరవ తీసుకుని ఏర్పరచిన తెలుగు అకాడమి, తమిళ దేశంలో అక్కడ ప్రజలకు గల మాతృభాషాభిమానాన్ని గుర్తించి తెలుగుదేశంలోనూ ఆస్ఫితిని కలిగించేందుకు ముఖ్యమంత్రిత్వం స్వీకరించిన ఎన్‌.టి, రామారావు ఏర్పరచిన తెలుగు విశ్వవిద్యాలయం సర్వ జీవన రంగాలలో మాతృభాషకు పట్టంకట్టటానికీ, తెలుగు దేశ చరిత్ర, సంస్కృతి, కళలను వికసింప చేయటానికీ ఉద్దేశించినవే. గడచిన పాతికయేండ్లలో తెలుగు దిన పత్రికలు కూడా ఆంగ్రపదజాల వ్యామోహంలో పడిపోయినాయి. మాతృ భాషా వ్యవహారం సమాజాన్ని చైతన్య పరుస్తుంది. వివిధ సమస్యలపట్ల జాగృతం చేస్తుంది. సమాజ అభివ్యక్తిలో ఒక సూటిదనం గాఢత్వం వస్తాయి. సాహిత్య సృజనలో బహుముఖ విసృృతి, సర్వజీవనానుభవం వ్యాపిస్తాయి. లాలా

ప్రజలు ధైర్యంగా (ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యం బలపడుతున్నది. విద్యా సంపన్నమైన సమాజం విశ్వవ్యాప్తమైన జ్ఞానక్షేత్రాలను విస్తరింపజేస్తుంది.

అసలు తెలుగుభాషలో ఉన్న పద్యం, అవధానం ఎంత అరుదైన ఆాంచాణు ధ్వన్యనుకరణ సమ్రాట్‌ నేరెళ్ళ వేణుమాధవ్‌ ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన యిచ్చినప్పుడు మి సంస్కృతిలోని విశిష్టాంశాన్ని ప్రకటించమని కోరగా కురుక్షేత్రంలోని పద్యాలను చదివి వినిపించి మెప్పులను పొందినారు.

అవసరమైనప్పుడు తప్ప అన్యభాషావ్యవహారం జోలికి పోమని, ఒక దీక్షగా మనం జీవించాలి. అలాంటి వ్రతం సాగించగలిగితే మన భాష కొద్దికాలంలోనే ప్రపంచంలోని అతిసంపన్నమైన భాషలలో ఒకటిగా వెలుగొందుతుంది.

ఒక మహాకవి అన్నారు. 'తెలుగుభాష మాట్లాడుతుంటే ఒక యేదో సంగీతము పాడుచున్నట్లుగా ఉంటుంది అని అందుకే వాగ్గేయకారులు ఎక్కువగా దక్షిణాదిలో తమ రచనలు తెలుగులో చేశారు. ఈ నాద సౌందర్యాన్ని అక్షర రమ్యతను మన గుండెలలో పదిలంగా నిలుపుకుందాం.

(మూసీ - మానవత్రిక)

నాగా నా 143

మహాభారత పరమార్ధం - తర్మసంగతి - తత్వసారము

నారాయణం నమన్భుత్వ నరంచైవ నరోత్తమమ్‌ :

దేవీం నరన్వతీం వ్యానం తతో జయముదీరయేత్‌ ॥

భారతారంభంలోనే ఈ ఇతిహాసం అంతా నరనారాయణుల లీల అనీ, ఈ సరస్వతీ ప్రవాహం వేదవ్యాసునివల్ల ప్రకాశించిందనీ తెలియవచ్చింది. నారాయణతత్త్వమే ద్విధా విభక్తమై జీవేశ్వరులుగా తపోమయ భూమికలోనికి అవతరించటం ఈ ఇతివృత్తం. చతుర్ముఖబ్రవ్మ (సరస్వతి), వశిష్టుడు -శక్తి-పరాశరుడు-వేదవ్యాసుడు ఇదీ వ్యాసునిదాకా సాగివచ్చిన భారతీవంశం. అందుకే ఆయన భారతీ వంశ వివర్థనుడు అని తిక్కన పేర్మొన్నాడు. నారాయణుని నుంచి ఈ తపోమయ నిజ్షేణిక కొనసాగుతూ వచ్చింది.

భగవంతుడైన వ్యాసుడు మహాభారత నిర్మాణంలో సృష్టిరహస్యాన్ని సంసారంలోని దుఃఖాన్ని, జీవులు, దానినుంచి ఉద్దమించవలసిన లక్ష్యాన్ని, అనాసక్తకర్శయోగాన్ని, సృష్టిలో నిరంతరమైన విద్యావిద్యల, వ్యక్తావ్యక్తముల, దేవాసురుల సంఘర్షణను, ధర్మనిరూపణలో ఎదురయ్యే జీవన వైరుధ్యాలను ఇవన్నీ అతివిస్సృతమైన పటంమీద వివులంగా చిత్రీకరించాడు. ఇది ధర్మశాస్త్రమా వేదాంతమా అనే సందేహం అనాదినుంచీ ఉన్నది. ధర్మమువల్లనే అర్ధకామములు సంప్రాప్తిస్తవనీ, ఎందుకు నరులు ధర్మాన్ని సేవించరో అర్థం కావటంలేదని చేతులెత్తి రోదిస్తున్నానని వ్యాసుడు ఒకచోట చెప్పుకోవలసి వచ్చింది.

ఈ [గ్రంథం అంకా సంక్షిష్టనిర్మాణం. ఆఖ్యానాలు,ఉపాఖ్యానాలు, వైదిక, ప్రతీకాత్మక గాథలు, నీతిశాస్త్ర వేదాంతశాస్తాలు, యుద్ధవిస్తారము, సర్వలోకముల వర్ణనము, మంత్రమయ విస్తరాలు, రాజధర్మ, లోకధర్శ్మ, మోక్షధర్మాలు, పూర్వవంశ గాథలు, యజ్ఞకలాప విశేషాలు, ఇవన్నీ ఎన్నని చెప్పను, అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంతేకాదు, ఎక్కడ లేనివీ ఇక్కడ ఉన్నవి. ఇది వేదోపబ్బంహణము, ఇతిహాసం దీని ప్రధానలక్షణమైతే, దీనిలోనే ఉపనిషత్సారసం[గ్రహణమూ ఉన్నది. కణికుని కూటనీతి, విదురుని క్షేమనీతి రెండూ వస్తాయి. దిక్బాలకుల సభల వర్ణనతోపాటు, దేవ గంధర్వ యక్షరాక్షసులు కూడా కథలో అన్వ్నయించటం ఉన్నది. షత లాం సుస్ను

శోను..కగవాన్స్‌ వానుదేవళ్చు శీర్షం త్రవవాత్తనకణన్న్యిప్త ధాన్సాంతంగా. పీరికలో.. వ్యానుడు పేర్కొనటం ,.జరిగింది. . శ్రీకృష్ణదరిత్రమ్లు.ష్లాండవుల గాధ సమాంతరంగా, ఓతప్రోతంగా...దీనిలో స్తాగివస్తుంది. : ద్వాసుపర్జా అన్న క్రుకిల్లో.. ప్రజిషాదింపనడిన. జీవేశ్వరులు. దీనిలో నరనారాయణులు. ... నారాయణుడు -సాక్షిభూళుదే *.ముద్ధం.. = నిర్వహించినది. నరుడు,... నరోత్తముదైన. అర్జునుడే జీవుడు... నరనారాయణుల - సాన్నిహిత్యాన్నీ అభినృత్వాన్ని వనపర్వం 12వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే తెలియజేస్తాద్యు . ౧ మంత్రమయత్వం విషయం వస్తే దుర్గాస్తోత్రము, అగ్నిస్తోత్రము, విష్ణు శివ సహస్ర నామములు ఇవన్నీ ముఖ్యభాగాలే. నుహనీయజపిమనే ఒక మాలామంత్రం ఉన్నది. .:.. మన్యుమయ వృక్షం. దుర్యోధనుడనీ,. కర్టుడు స్మంధమనీ, శకుని శాఖలనీ, దుశ్శాసనుడు పూలుషండ్లనీ, మూలం ధృతరాఘ్ట్రుడనే. బుద్ధిహొనుధనీ (అమనీషి వర్షించి అట్లాగే ,ధర్మమయవృక్షం ,యుధిష్టిరుడన్నీ ; అర్జునుడు. స్కంధమనీ, భీముడు శాఖలనీ, కవల్లలు పుష్పఫలాలనీ, మూలం భగవంతుడేన్‌, శ్రీకృష్ణుడనీ ఆరంభంలో రెండు చెట్ల వర్దనం,తిన్నది....ఈ ప్రతీకాత్మక వర్దన మూలాలు వైదికమైనవి, ,భగవద్దీకలో సంసారాన్ని అశ్వత్థంగా పోల్చటం ఉన్నది. వృక్షం ఊర్ధ్యముఖచైతన్యానికి గుర్తు ఒకవైపు ప్రరమాత్మ మూలమైన వృక్షను, రండవది అవిద్యామూలమైన వృక్షము, రెంటిమధ్య కథాప్రవాహం ఓతప్రోతంగో సాగిపోయిందే. ' దుర్యోధనుడు కలిఅంశం. చేస్తున్నాడు... ఇతనికి మూలంలో హృదయంలో 'ఈశ్వరోనుగ్రహాం ఉన్నది = అవద గడవంబెట్టిగు నోవీ శుభంబైనదోని నొనగూర్చగ్‌ మాకీ వుట్టువునకు పొందుక్షాపాలుడు నిన్ను చూవిచనియె మనోత్యాగ . తోస్వేరరక్షణ గ్రర్మరోచు వివయహేతువైంది.. కలి | వస్తుర్లుద్రాదిత్యులలో వసువుల్లు భౌమచైతన్యపరిధిలోనివారు, వను అంశలో

  1. పుష్టి భీష్మడు,టంత దాన్‌, పూక్రమశాలి కూదా తన రాజ్యమే తకు కాకుందాపోయినా, |” వృథాప్రయాసమని తెలిసీ కారవరొజ్యమును నిలబెట్టే తలపుతో అన్నంపెట్టినవారన్న భావనతో కోరవపక్షంలోనే ఉరటీపోమునాటి. *తేంబకు సో్టషిం చేయలేక గుతువతో

పతితయైన బ్రాహ్మణ్యానికి ద్రోణుడు ప్రతీక ్రతీకారేచ్చ అంత తీవ్రంగా ఉండటం, తమోమయ లక్షణంచేత చేయించిన (ద్రుపద పరాభవం ఈ అంశాన్ని తెలియ జేస్తుంది కౌరవులు స్తోత్రం చేస్తే పాండవుల సేనను నుగ్గాడుతానని మాట ఇస్తాడు ధర్మం పక్షం అని నమ్మినా అటు చేరడు అహంతకు వశుడైనాడు ఇతని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ నిద్రితులైన ఉపపాండవులను క్రూరంగా సంహరిస్తాడు, వ్యర్థమని తెలిసినా - అప్పటికే దుర్యోధనుడు మరణించిన స్థితిలో ఉన్నాడు ఇంత తామసిక విజ్బంభణ ఇతనిలో ప్రకటం కావటం ఆ వర్ణధర్శం ఎంతగా పతనమైందీ నిరూపిస్తుంది ఇక కర్టుడి విషయానికి వస్తే - అతడి ప్రవృత్తిలో ఆత్మన్యూనతాభావం ఆవరించి ఉన్నది దానిలోంచే భార్గవరాముని వంచించి విద్య నేర్వటం, రాజును చేసిన దుర్యోధనుని యందు విచక్షణలేని విశ్వాసం, ఆధిక్యభావ ప్రకటనకోసం మహాదాతగా రూపొందటం గమనించవచ్చు ద్రౌపదీపరాభవ సన్నివేశంలో ఆ అధర్మకార్యానికి ప్రోత్సహించింది కర్టుడే ఆమెను బంధకి, వేశ్య అనీ వస్త్రాపహరణం దోషం కాదనీ దుర్యోధనాదులను ముందుకు త్రోసినాడు స్టే ధృతరాష్తునికి రాజ్యాధికారం లేకపోయినా, రాజ్యాభిషిక్తుడైన పాండురాజు అనేక దిగ్విజయాలు చేసి అతనిచేత అనేక అశ్వమేధాలు చేయించాడు అతడు శాప(గ్రస్తుడై మరణించటంవల్ల ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లభించింది రాజ్యాధికారం పొందిన గ్రుడ్డివాడు అతని ప్రవృత్తి అంతా అంతర్చ్భహిర్వైరుధ్యాలతో ఘర్షణలతో, పుత్రమమకారం వల్ల పాండవులయందు పెంచుకున్న అప్రీతివల్ల ఒక నాటకంగా గడచిపోయింది పుత్ర మమకారం ఇటు ధృతరాఘ్లునీ, అటు ద్రోణున్నీ పతనోన్ముఖంగా నడిపింది దుర్యోధనునికి క్రోధమే కాదు అసూయ కూడా ఆతని స్వభావము జన్మత; సంక్రమించని రాజ్యాధికారం సందర్భానుసారంగా ఆక్రమించి దాన్ని ఇతరులతో అధికారంగల పాండవులతో పంచుకోలేకపోయాడు ఆ కారణంవల్లనే నిజమైన అధికారం గల పాండవులను చిన్ననాటినుంచే చంపే కుటిలయత్నాలు చేస్తూ వచ్చాడు తొడలు విరిగి పడిపోయినప్పుడు కూడా అతని పగ చల్లారనే లేదు లాక్షాగ్సహదహనం, కవటద్యూతం, ఘోషయాటత్ర, ఉత్తరగోగ్రహణం ఇవన్నీ ఆతని క్రోధానూయాల శ్రమోన్మీలనానికి సోపానాలవంటివి ఒక కులస్రీకి చేసిన అవమానం ఇన్నింటికీ పరాకాష్ట దుర్యోధనుడి పతన లక్షణం ఒక విధంగా నాటీ క్షత్రియుల పతనానికి శిఖరం వంటీది తత్పూర్వం వంశపురుషులుగా చెప్పబడ్డవారి చరిత్రలలోనూ కొన్ని కొన్ని శతక మర్సిన్ని

దోషాలు కనిపిస్తున్నవి యయాతి యావనకాంక్ష నలుని ద్యూతవ్యసనం, దుష్యంతుడు లోకాపవాద భీతితో శకుంతల నెరుగనని అనత్యమాడటం, శంతనుడు సత్యవతిని వివాహమాడేందుకు ఈడొచ్చిన పుత్రుని కాదని ఆమె తండ్రి పట్టుదలకు లొంగిపోవటం, అరణ్యంలో తపస్సులో ఉన్నప్పుడు పాండురాజు శాసగ్రస్తుడై కూడా కామభావోద్వేగాన్ని పొందటం ఇవన్నీ క్షత్రియులు నాటికి అర్థకామ వశులై ధర్మానికి ఎంతగా దూరమైందీ తెలియజేస్తుంది. ైళవేః. భృస్తవిద్వానాం "ఇత్యాదిగా రఘువంశరాజుల వర్ణనం ఇక్కడ పోలికగా చూచుకోవచ్చు. ధర్మవ్యాధునిదగ్గర కౌశికుడు ఉపదేశం పొందిన గాథ శూద్రులు ఇంకా పతనం కాలేదనటానికి, స్వధర్మంలోనే నిలచి ఉన్నారనేందుకు సాక్ష్యం. మరొక ఘోరమైన వ్యక్తి జరాసంధుడు ఈయన రాజులందరినీ బంధించి శక్తికి ఐలి నివ్వదలచాడు ఇది మహాక్రౌర్యం నేటి హిట్టర్‌వంటి ప్రవృత్తి రెండు ముక్కలుగా పుట్టిన ఈతణ్ణి 'జర' అనే రాక్షసి అనుసంధించింది ఆందువల్ల జరాసంధుడైనాడు. *జరా” శబ్దం వ్యత్యస్తమైతే రాజశబ్దం అవుతుంది రాజలక్షణం ఈతనియందు విపఠీతత్తాన్ని పొందిందని తాత్పర్యం 1|| ఇలాంటి యుగనంధిలో (బ్రావ్మణ క్షత్రియజాతులు ధర్మవినృృతిలో పడ్డ సందర్భంలో మహాభారతం అవతరించింది. 'ధర్భన్య గ్లాని రృవతి” అన్న పరిస్థితి కలికి ఆత్యంత సన్నిహితమైన కాలం జగత్తు ఆంతా నాశనానికి, మృత్యువునకు అభిముఖంగా నడుస్తున్నది అనుశాసన పర్వం ఆదిలో గౌతమీ, లుబ్ధిక, సర్ప, మృత్యు కాల సంవాదం ఉన్నది మృత్యువునకు కారణం ఎనరు అని విచారిస్తే శిశువును కరచిన సర్పము తాను కారణం కాదని, మృత్యువు తాను కారణం కాదని, కాలం (యముడు) తాను కారణం కాదనీ, జీవుని కర్మయే కారణమనీ తేలుతుంది మహాభారతంలో మూడు యజ్ఞాలు కనిపిస్తవి ఒకటి సర్పయాగం, రెండు రాజసూయం, మూడు అశ్వమేధము. సర్పయాగానికి ముందే రురు ప్రమద్వరల వృత్తాంతం ఉన్నది ప్రమద్వర సర్పదష్టయై మృతిచెందింది. ఆ కారణంగా రురుడు సర్పజాతిని సంహరించేందుకు పూనుకున్నాడు ఉదంకుడు తాను తెచ్చిన కుండలాల్ని తక్షకుడు హరించటంవల్ల సర్పయాగం చేయమని జనమేజయుని ్రేరేపించాడు ఒక వ్యక్తి చేసిన కార్యానికి, నష్టానికి ఆ జాతినంకా సంహరించటం తీవ్రమైన ధర్మభంగం ఇది భారతారంభం _ ప్రతీకారబుద్ధినల్ల తమోగుణం ఆవరిస్తుంది మహావిష్ణు అంశతో కొన్య్తుతుతి 147

జనించిన భార్గవరాముడు .శ్రేశాయుగ్రంళో అదే పన్ని చేసినాడు. అందువల్లనే మళ్లీ క్షత్రియుడైన శ్రీరామునివేత న్షిగ్రహిరిపబద్వడు తమోమయమైన సర్పయాగం భారతానికి ప్రవేశముఖద్వారంఎ. రెండవ యాగంచాజసూయం ధర్మరాజు ఇంద్రప్రస్థంలో నెలకొల్పిన రాజ్యంలో మూర్దాభిపిక్తుజ్సి చేయటం దీని లక్ష్యం నలుగురు తమ్ములు దిగ్విజయాలు చేసి రాజులను జయించారు ఈ విజయయాత్రలలో జనహింసలేదని చెప్పలేము. భారతయుద్ద్ధానంతరం ధర్మజుడు నిర్వహించిన అశ్వమేధము - దీనిలోని సరస్వత్యాగరూపమైన లక్షణంచేత సత్ర్వగుణావృతమై ఉన్నదని చెప్పవచ్చు ద్రౌవది అగ్నిసంభూత ఆమె జన్మయందే ద్రువదుని ప్రతీకారవాంఛ గూడుకట్టుకుని ఉన్నది ఆమె శచీదేవి అంశ దుర్గాదేవికి అభిన్నయైన ఐంద్రీశక్తి దశమహా విద్యలలో ఈమె ఛిన్నమస్త అమే మూర్తిలో తెగిన తన శిరస్సును ధరించి తన రక్తాన్నే పానంచేస్తూ వుంటుంది ఈమె దుర్గాదేవియందు అంతర్భవిస్తుంది మహాభారతయుద్ధం అంతా ఈమె హేతువుగా సంభవించింది ఈమె సహ చరుడు ఇంట్రపుత్రురైన అర్జునుడు నరనారాయణులలో నరుడు - ఒకస్థాయిలో పరమశివుడు. మహాభారత నాయకుడు మృత్యువు సంతానం నాయిక ప్రళయోగ్రమూర్తి అగ్నిసంభూత ఛిన్నమస్త సర్పయాగం మహాభారతగాథకు సంక్షిస్త ప్రతీకారూవం అరణ్యవాసంలో అర్జునుని తపస్సంతా శస్తాస్తాల కోసమే. అతడు అభేద్యమైన పాశుపకాన్ని కూడా సంపాదించాడు యముడు ధర్మజుడై, అగ్ని ద్రౌపదియై, ఇంద్రుడు అర్జునుడై ఈ కురుపాండవ సమరాన్ని నిర్వహించారు పద్ధెనిమిదీ అక్షౌహిణుల సేన నశించింది భారతభూమిమ్‌ద క్షత్రియజాతీ నశించింది: ఇంచుమించుగా ఈ మొత్తం సమరక్రీడకు సాక్షిభూతుడై తాను అకర్శకృృత్‌గానే ఉంటూ మొత్తం సమరానికి సారధియై ఈ మవామృత్యుహేలకు సారధిర్రైనాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు కురుపాండవులే కాదు, దుర్వాసముని శాపగ్రస్తులై యాదవులు మొత్తం తమలో తాము కలహించి సంహరించుకోవటం కూడా ఈ మృత్యుహేలకు మరో సన్నివేశం. ఆభ్రమవాసం చేసినా ధృతరాష్ట్రుడు నిజంగా వైరాగ్యం పొందలేదు. అతడు మళ్ళీ పుత్రులను చూడాలనుకుని వ్యాసానుగ్రహంతో దాన్ని సాధ్యం చేసుకున్నాడు 146 సువుష్పు

వ్యాసుడు అంత సన్నిహితుడైనా, సనత్సుజాతునివల్ల ఉపదేశం పొందినా, శ్రీకృష్ణుని విశ్వరూపం చూచినా, అతనిలో అంతస్సులో పరిణామం సంభవించనే లేదు. అందువల్లనే తపోమయతలో కాకుండా అడవిలోని కార్చిచ్చులో దహనం అయ్యాడు గాంధారితో సహా.

మహాభారతంలో మృత్యువు రెండు రూపాలలో ఉంటాడు. ఒకడు ధర్మరాజు, రెండవవాడు విదురుడు. విదురుడు ధర్మబోధకుడే గాని ఆచరింపజేయలేడు. ధర్మజుడు దానికోసం యుద్ధం చేస్తాడు. అందువల్లనే విదురుడు ఆశ్రమవాసంలో తపోమయస్థితిలో దేహత్యాగం చేస్తాడు. ధర్మజుడే ఆతనికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు.

మహాభారతంలో ఈ మృత్యుహేల ఎంతగా కానిపించినా అమృతత్వసాధన కూడా ముఖ్యమైందే. మృత్యుతత్తాన్ని చెప్పే గాథలు రురుచరిత్రము, సావిత్రి ఉపాఖ్యానము, గౌతమీ లుబ్ధక మృత్యుకాల సంవాదం ఇలా ఎన్నీ అంశాలు ఉన్నాయి. అట్లాగే అమృతత్వసాధనను గురించిన ప్రధానాంశం. ఆదిపర్వంలో గరుడోపాఖ్యానం, మృతసంజీవనీగాథలో (కచునిగాథ) మృత్యుజయం ఉన్నది కాని అమృతత్వసాధన లేదు. అనుశాసనపర్వంలో మళ్ళీ గరుదోపాఖ్యానం ఉన్నది. వ్యాసమైక్రేయ సంవాదంలో గరుడుడే విష్టువని చెప్పటం ఉన్నది. వైదికంగా గరుడుడు గాయటత్రిమం(త్రం, యజ్ఞం, ఊర్థ్వగామిచేతన, అమృతసిద్ధి, ధృతరాష్పునికి- వేదవ్యాసుడు మృతపుత్రులను దర్శింప జేయటం కూడా మృతసంజీవని వంటి గాథయే.

ఇంతకూ పాండవులు స్వర్గారోహజపర్వంలో మృతిని పొందారు. ధర్మజుడు తప్ప. ఆతడూ నరకదర్భనం చేసి శరీరం దివ్యంగా పరిణజమింపగా స్వర్గం చేరాడు. ఈ సందర్భంలో వీళ్ళు మోక్షమును, పరమపదాన్ని, నారాయణపదాన్ని పొందినట్లుగా భారతం చెప్పటంలేదు. అందువల్ల ఈ మహేతివాసం చివరకు ధర్మేతిహాసమే గాని మోక్షేతివోసం కాలేదా అనేది సందేహం.

ధృతరాష్ట్రుని సభలో శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపం భయంకరమైంది. రాజులంతా చూడలేక కళ్ళు మూసుకున్నారు. భీష్మద్రోణాదులు కొద్దిమందీ, శ్రీకృష్ణ అనుగ్రహం పొందిన ధృతరాహ్సుడు చూడగలిగారు. దేవతలు, యాదవవీరులు, అనిరుద్ధ (ప్రద్యుమ్నూదులు, బలరాముడు, అర్జునుడు మిగిలిన పాండవులందరూ అక్కడ దర్శనమిచ్చారు. సర్వాయుధములు ధరించిన ఆ మూర్తి సమర సన్నద్ధంగా ఉన్నది. సన్నిహితమైన యుద్దాన్ని, జననాశనాన్ని సూచించింది. వ

ఇంతటి ఘోరదర్శనము కౌరవులను, ధృతరాని భయపెట్టలేదు. అవిద్య మోహము ఎంత బలవత్తరమైనవో ఈ సన్నివేశం నిరూపిస్తుంది. భీష్మాదులు చూచీ అలాగే ఆ పక్షంలోనే ఉండిపోయారు. జీవితంలోనికి పరిణామం తేగలిగితే దివ్యమైన అనుభవానికి సార్ధకత. లేకుంటే సంసిద్ధం కాని సృష్టిలోనికి భగవంతుడు చారబడదే ప్రయత్నం చేయటం వంటిది. 1 181 ఇటువంటి అమేయమైన ఇతిహాసంలో తత్త్వనిర్ణయం చేయటం సాధ్యమేనా! విస్తారమైన ధర్మానుశాసకాలైన శాంతి అనుశాసన పర్వాలు, సర్వోపనిషత్సారమైన భగవద్గీత సాక్షాత్తు భగవంతుడైన సనత్కుమారుడు ఉపదేశించిన సనత్సుజాతీయము, భగవంతుని ఎదుట అతని గుణవర్జనగా సర్వతోముఖంగా వర్ణించిన విష్ణసహ(్రనామము, ఇంకా ఎన్నో ఎన్నో ఆఖ్యానోపాఖ్యానాలు ఉండిన ఈ వాజ్మ్యయరాశిలోని ఏకసూత్రాన్ని పట్టుకోవటం ఎలా? విష్ణుసహస్రనామం జిజ్ఞాసువైన ధర్మరాజు ప్రశ్నలకు సమాధానంగా వెలువడింది. కిం జనన్ముచ్చతే జంతుః జన్మనంసారబంధనాత్‌ ఇదీ చివరిప్రశ్న. ఈ “నామవిద్య" మోక్షదాయకమైనది. “న చ వునరావర్తతే' అన్న (బ్రహ్మసూత్రం ఈ విషయమే చెప్పింది. ఈ నామాలన్నీ భీష్ముడు రోజులకొద్దీ ఒక్కో నామాన్ని ఉచ్చరించి ధ్యానంలోకి వెళ్ళి అనుభవం పొంది భావసమాధినుంచి ప్రకటించినవని పెద్దలు చెప్పుతారు. అందువల్లనే ఈ నామాలన్నీ శ్రీకృష్ణుడు ఎదుట ఉండి పలికించినవి. (యాని నామాని గౌణాని విఖ్యాతాని, బుషీఖిః వరిగీతాని” ఇదీ ఆ నామాల లక్షణం. బుషుల దర్శనంలోనుంచి వెలువడ్డవి. తామెరిగినదంతా వీటిల్లో నిక్షిప్తమైంది. వేదదర్శనం ఎలాంటిదో ఈ నామదర్శనమూ అలాగే ఈ బుషిసరంపర పొందింది. వారి అనుగ్రహంవల్ల భీష్మునికి లభించింది. ఈ పరంపర విశ్వమయము, విశ్వాతీతము - నిర్గుణము, సగుణము - సరూపము, రూపాతీతము - ఇలా వేద తత్త్వసారము. తొలినామము 'ఐిశ్వం' సృష్టిలక్షణాన్ని వివరించగా, చివరినామం 'సర్వప్రవారజాయుధి అన్నది ప్రళయాన్ని చెప్పేది. ఈశ్వరుని షద్దుణాలు, పంచకృృత్యాలు, చతుర్వ్యూహాలు, దివ్యావతారాలు, అన్నీ దీనిలో సంలీనం అయి ఉన్నాయి. ఈ నామధ్యానమే యోగము, తపస్సు, సమాధి. (శ్రవణ మనన నిదిధ్యాసలకు ఆధారంగా సహ్రనామాన్ని స్వీకరించవచ్చు. ఈ అనుశాసనిక పర్వంలోనే శివసహహ్రనామావళి కూడా ఉన్నది,

అరణ్యపర్వంలో 298-299 అధ్యాయాలలో సావిత్రి ఉపాఖ్యానం వస్తుంది. అశ్వపతి తపఃఫలంగా సావిత్రీదేవి వరపుత్రిక అయింది. సవితృ తేజోరూపం ఆమె. సత్యవంతుడు మరణించే రోజునకు ముందు ఆమె ట్రిరాత్రోపవాసం చేసింది. కట్టెలాగా నిలబడి ఉన్నది (కాష్టసమాధి). అమె ధ్యానయోగ పరాయణ. సత్యవంతుని ప్రాణం తిరిగి తేవటానికి ఆమె యోగమార్దంలో తన శరీరంనుంచి హంసయై లేచి, యముని వెంబడించింది. తిరిగి తన భర్తను దక్కించుకొన్నది. ఇదంతా యోగప్రక్రియ. కఠోపనిషద్దాథకు దీనికీ ఎన్నో పోలికలున్నాయి. (్రిరాత్రోపవాసము, మూదువరాలు, మృత్యువుతో సంవాదము, ఇవన్నీ రెంటికీ సామాన్యాంశాలు.

సనత్సుజాతీయము మరొక మెట్టు. సనత్సుజాకుడు ఆదిమ కుమారులలో ఒకడు. సృష్టాది పురుషుడు. భారతంలో ఈయన బోధ విదురునివల్ల సంభవించింది. విదరుడు ఎంత నీతి బోధించినా ఆత్యంతికమై తత్వ్వజ్ఞానం ధృతరాష్ట్రునికి సనత్సుజాతుని వల్ల కలిగింది. విదురుడు అన్నాడు - సనత్సుజాతుడు మృత్యువు అనేది లేనే లేదంటాడు.

ఆ మహాత్ముడు విదురుని పిలుపు మేరకు స్మరణమాత్రాన అక్కడకు వచ్చాడు*

సనత్సుజుతుని ఉపదేశంలోని ప్రధానాంశం 'మోవోన్టుత్యుః నమ్మతోష. యం కవీనాం ప్రమాదం వై వృత్యురహాం బ్రవీమి - తథా£.(ప్రమాదాదమృతత్వం (బ్రవీమి! పండితులు కూడా మోహంవల్ల మృత్యువుందని అంటారు. నా అభిప్రాయం ప్రకారం మృత్యువు లేనేలేదు. అది ప్రమాదం (ప్రమత్తత). అ ఏమరుపాటు లేకుంటే అమృతత్వమే సిద్ధిస్తుంది. మోహంవల్లనే రాక్షసులకు పరాభవము, అది లేకపోవటంవలన దేవళలు

(బ్రహ్మభావం పొంది ఉంటారు. పులివలె మృత్యువు అందరినీ మింగుతున్నదనే మాట

సత్యం కాదు. దానికి రూపం లేనే లేదు.

“దేహాత్మభ్రాంతి ఉంటే వానికి యముడు మృత్యువుగా ఉన్నట్లే ఆత్మను ఎరుగనివానికి అజ్ఞానమే మృత్యువు"

సనత్సుజుతీయం మొత్తంమీద కలోపనిషత్సారమే చెప్పింది. ఈ రెండూ సావిత్రి కథతో కలసి ఒక త్రిపుటి. ఇది మృత్యుంజయవిద్య, నచికేతుడు, సావిత్రి సాధకులు, యోగులు, సావిత్రి పరమేశ్వరి రూపొంతరమే. 'నావేవ సింధుం దురితాత్యగ్ని” అన్న

(శ్రుతిని ఇక్కడ అనుసంధించుకోవాలి.

శ శ్రీవిద్యా సంప్రదాయంలో దక్షిణామూర్తి, నారాయణ, బ్రహ్మల అనంతరం గురుమండలంలో సనకాదులు నలుగురు ఉంటారు. వారి తరువాతనే వళిష్టాదులు. ఇది వారి ఆదిగురు లక్షణం. (శ్రీయాగసూత్రమ్‌ -కల్యాణహృదయము (2004) - నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి పే. 108),

వా

మృత్యువు లేకపోవటమన్న సనత్సుజాతీయ వాక్యం బోధపడటానికి తపస్సు, సాధన అవసరం. శరీరత్యాగం చేసేప్పుడు తాను ఎరిగి దానిలోనుంచి బయటకు రాగలిగితే అక్కడ విస్కృతి లేకుండాపోతే మృత్యు అనుభవం ఉండదు. అక్కడ మరపు కలిగితే కలిగేది మృత్యుభావం.

ఈ బోధ అంతా జ్ఞానరూపమైన సాధన, అద్వైతమునకు సన్నిహితమైన తత్త్వవిచారణ, ధృతరాష్ట్రునికి చెప్పబడినా, ఆత్యంతికంగా సాధకులకోసం ఉపదిష్టమైన అంశం. సనత్సుజైతీయం యజ్ఞాలను మూడు విధాలుగా పేర్కొన్నది. జ్యోతిష్టోమాదులు కర్మయజ్ఞాలు, జపాదులు వాక్‌యజ్ఞాలు, దేవధ్యానరూపం గలవి మానసయజ్ఞాలు. ఈ మూడు ఉత్తరోత్తరం ఉత్తమాలు. నాటికి కర్మరూపమైన యజ్ఞం తన ప్రాధాన్యాన్ని క్రమంగా కోల్పోతున్నది.

పరమాత్మ సొధనలో (ప్రధానంగా నిర్వహించవలసిన అంశాలు - సత్యము, ధర్మము, ఇంద్రియజయము, తపస్సు, అనసూయ, లజ్జ, సహనం, అమత్సరత, యజ్ఞం, ధైర్యం, వేదార్థజ్ఞానం. ఈ పన్నెండంశాలు తప్పకుండా బ్రతుకులో నెలకొల్పుకోవాలి.

దేహం ఒక రథం. దేహం ఎప్పుడో నశించుతుంది. దేహంచేత చేసిన కర్మమాత్రం నశించదు. ఆ కర్మవల్ల ఇంద్రియాలనే గుర్రాలు పరుగులు తీస్తాయి. జ్ఞానికి మాత్రం పహృదయాకాశంలో ఆ గుర్రాలే పరమాత్మవైపు ప్రసరించుతాయి. అక్కడ వారికి ఈశ్వరదర్శనం కలుగుతుంది.

ఇది హృదయోపాసనమే. స్వాధ్యాయవ్రవచనాలు ఒక స్థాయి తపస్పెతే, మౌనదీక్షలో అంతర్ముఖంలో చేసే సాధన మరొక తపస్సు. సనత్సుజాతుని బోధన అంతా సాంగోపాంగంగా (బ్రహ్మవిద్యను వెల్లడించటం. అయితే ధృతరాష్ష్రనిలో ఇది ఫలించలేదు. అతడు అమనీషిగానే మిగిలిపోయాడు, ఇది ఒక విరోధాభాస,

క”

యుద్ధరంగం మధ్యలో అర్జునుడు కార్చణ్యదోషోపహత స్వభావుడుగా మారిపోవటం, తీవ్రమైన సంక్షోభంలో పడిపోవటం, ధర్మసమ్మూధచేతసుడు కావటంవల్ల అక్కడ భగవంతుడు బోధించిన అంశం భగవద్గీత అయింది.

'సేనామధ్యంలో నిలచినప్పుడు పార్శడు పొందిన సంక్షోభం మానవులకెవరికైనా కలిగేదే. కర్తవ్యం సందేహంలో పడ్డప్పుడు రెండువైపులా అనుకూల ప్రతికూల వాదాలు క్రమ్ముకుంటాయి.. 1) ఆత్మీయులను సంహరించటంవల్ల ఏ శ్రీయస్సూ కలుగదు ; ననన 152 నురుసన్సి

  1. వారు లేనప్పుడు మన జీవితం శూన్యమవుతుంది ; 3) చంపటంవల్ల పాపం కలుగుతుంది. అందుకోసం ఆతడు వైరత్యాగం వైరాగ్యాన్ని అవలంబించాడు. నాకు రాజ్యము, విజయమూ వద్దు, దీనివల్ల కలిగే సుఖాలు వద్దు, నన్ను చంపినా ఫరవాలేదు, నేను వారితో యుద్ధం చేసి లోకక్షయం చేయను అని చెప్పి జననాశంవల్ల కలిగే బాధలు అన్నీ వివరించాడు కూడా అర్జునుడు. వైయక్తిక స్థితినుంచి, కుటుంబ పరిమితులనుంచి, సమాజందాకా విస్తరించింది అర్జున విషాదం. యుద్ధం ఎలాంటిదైనా అది ఎంతగా నాశనాన్ని దరికి తెస్తుందో అర్జునుని శోకం తెలియజేస్తుంది. సామాజిక స్థాయిలో అర్జునుని విషాదానికి నమాధానంగా శ్రీకృష్ణుని సమాధానాలు వేరే అంతస్తులోనికి తీసుకుపోతున్నవి. విషయం భూమిక మారిపోయింది. 'అళోచ్వానన్వశోచస్వ్రం (ప్రజ్ఞావాదాంశ్సభాషనే గతానూనగతాంనూంళశ్చు నానుళోచంతి పండితాః ॥ నత్వేవావాం జాతునానం నత్వం నేమే జనాధిపాః నదైవ నభవిష్యామః నర్వేవయమతఃవరమ్‌ /” శ్రీకృష్ణుడు పలికే భూమిక చైతన్యం యొక్కమౌలికస్థితి. జన్మచక్ర పరిభ్రమణము, ఇక్కడ కలిగే సుఖదుఃఖాలు, బాంధవ్యాలు ఇవేవీ ఇక్కడ పట్టవు. పండితులు, జ్ఞానులు వారి దృష్టిలో బ్రహ్మమొక్కటే సత్యము, మిగిలినదంతా ప్రాతిభాసికము. ఆత్మ నిత్యమైంది, (త్రికాలాలలో ఉండేది.

వ్యావహారిక సత్యత్వభూమిక నుంచి అర్జునుడు (ప్రశ్నించి ఆవేదన పొందగా, దాన్ని ఆ న్థాయినుంచి అతనిని ఎత్తి పారమార్థిక న్థాయినుంచి భగవంతుడు సమాధానం చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధవ్యతిరేకత, శాంతిప్రియత్వం కోరే మేధావులందరి ఆలోచనాసరళలికి అర్జునవిషాదం ఒక భావసూచిక. అర్జునుడు పొందింది కార్ప్చణ్యదోషం. పిరికితనం, ప్రాణలోభము, జీవనంమీద ఉన్న అత్యాసక్తి అని అర్ధం చెప్పుకోవచ్చు. బృహదారణ్యకంలో శాశ్వతమైన పరమాత్మ నెరుగకయే ఈ లోకాన్ని వీడినవాదు కృపణుదని (3/8/10) చెప్పబడింది.

ఈ భిన్నభూమికలలో కృష్ణార్జున సంవాదం ప్రారంభమైంది. క్రమంగా అర్జునుడే శ్రీకృష్ణుని భావభూమికలోనికి చేరుకున్నాడు. ద్వితీయోధ్యాయం పూర్తయేప్పటికి గీతాసారం దాదాపు చెప్పబడ్డది. తరువాతి భాగమంతా కేవలం ఈ సారాన్ని విస్తరించటమే. ననన? కార్యీఫుతురి 153

ఇంద్రియాలు, ఇంద్రియార్జాలు క్రమంగా సాగిపోయే రీతి ఒక పరంపరగా చెప్పబడ్డది. విషయాసక్తి శబ్దస్పర్భరూప రసగంధాదులయందు ధ్యాస ఉంటే అది అసక్తి అవుతుంది. ఆసక్తివల్ల కామము, కామంవల్ల క్రోధము, క్రోధంవల్ల మోహము, మోహంవల్ల సృతిభ్రమ, దానివల్ల బుద్ధినాశము, అందువల్ల వ్యక్తి పతనము సిద్ధించుతవి. ఈ పరంపర అంతా విషయాసక్తివల్ల కలిగింది.

జీవితం అంతా రాగద్వేష రహితంగా ఉన్న ఇంద్రియాలు విషయసేవనం చేస్తే తన వశమునందే తానున్నవాడు అంతఃకరణంలో ప్రసన్నతను పొందుతాడు. ఈ ప్రసన్నత వల్ల నర్వదుఃఖములు శమిస్తాయి. బుద్ధి ఈశ్వరాఖిముఖమవుతుంది. ఇక్కడ ద్వంద్వములయందు లగ్నముకాని మనుష్యుడు సుఖదుఃఖములయందు లాభాలాభముల యందు, శీతోష్టములయందు, జయాపజయములయందు సమస్థితిలో ఉంటాడు. ఇతన్ని సైతప్రజ్ఞూడని గీత పేర్మాన్నది.

ఈ స్థితప్రజ్డుని స్థితి - కోరికలకు అతీతమైంది, కోరికలు లేనిది, మమకారం లేనిది, అహంకారం లేనిది. ఇతడు శాంతిని పొందుతున్నాడు. ఈ శాంతిస్థితియే జీవన్ముక్తిస్థితి అని చెప్పవచ్చును. ఇది (బ్రాహ్మీస్టితి. బ్రహ్మభూతస్థితి. సనత్సుజాతీయం కూడా జ్రాహ్మీస్టితిని పేర్మాన్నది.

18వ అధ్యాయంలో బ్రహ్మభూతః ప్రనన్నాత్మా న శోచతి న కాంక్షతి నమః నర్వేషు భూతేషు (18-54) అన్నచోట్ల మళ్లీ ఈ సంగతి చెప్పటం అయింది. రెండవ అధ్యాయంలో ఆ ్రాహ్మీస్థితిలో అంత్యకాలంలో నిలిస్తే బ్రహ్మానందాన్ని ఆ స్థితిని పొందుతాడని చెప్పబడింది. 'నయోత్స్యే' అన్న అర్జునుడు యుద్ధంలో నియుక్తుడు కావటానికి తస్మాత్‌ యుద్ద్యన్వ” అని నిర్దేశించటానికి శ్రీకృష్ణుడు వ్యావహారిక జగత్తులోనికి రాక తప్పటం లేదు. ఎంతబాగా అనుష్టించినా పరధర్మానుష్థానంవల్ల ఫలం లేదు, స్వధర్మంలో ఆపద వచ్చినా అదే ఆచరింపదగింది అని (3/85) వర్ణిస్తున్నాడు. స్వధర్మ పరధర్మ భావనలు దేహాన్ని వర్దాదుల నాశ్రయించినవి కాని ఆత్మకు సంబంధించినవి కావు. ఈ వైరుధ్యాన్ని తొలగించటం కోసం 'తస్తాదస్తక్తః నతతం కార్వం కర్మ నమాచరి (3/19) అంటున్నాడు భగవానుడు. ఇది అసంసక్త కర్మ - అనాసక్త కర్మ - నిష్కామకర్మ. ఇది చేస్తున్నది ఇంద్రియాలతో, మనస్సుతో బుద్ధియందు అహంతయందు చిత్తమునందు అనాసక్తి. సతతం అని చెప్పటంచేత శరీరధారి నిత్యము కర్మప్రవృత్తుదే. ఈ కర్మ'ప్రవృత్తి అతని అంతఃకరణాన్ని పూర్తిగా ఆవరించకుండా ఉండాలి. 'అనక్తోవ్వోచరన్‌ కర్మ

వరమాప్తోతో - ఈ స్థితి ఫలసంగరాహిత్యంచేత ఫలం చెందకపోవటంవల్ల అతడు పుణ్యపాప విముక్తుడౌతాడు.

దేహచైతన్యం కర్మ నాచరిస్తుంది. అంతఃకరణ - చేతుపురుషుడు కర్మనంటడు. సమాంతరంగా రెండు చైతన్యప్రవావాలలో కర్మాచరణ, ఫలసంగరాహిత్యం కొనసాగుతుంది. అప్పుడే స్వధర్మకార్యాచరణం దేహచైతన్యంలోనే కాని చేతఃపురుషుని కర్మ కాదని తేల్చుకోవాల్సి ఉంటుంది. అందుకే, విశ్వరూప సందర్భన యోగంలో -

తస్మాత్‌ త్వ ముత్తిష్ణ యళోలభన్వ

జిత్వా శత్రూన్‌ భుంక్ష్వ రాజ్యం నవ్యద్ధమ్‌

మల్లైవేతే నివాతాః వూర్వమేవ

నిమిత్త్రమా[త్రం భవ నవ్వసాలిన్‌ /” 11/38

మొదటి ఆర్థ్లోకంలో సంబోధింపబడ్డ అర్జునుడు దేహచైతన్యంలో కర్మప్రవృత్తిలో నిలిచేవాడే. భీష్మద్రోణాదులందరూ ముందే నాచేత హతులైనారు, నీవు నిమిత్తమాశత్రుడవే. ఆత్యంతికమైన కరృత్వం వరమాత్మదే. వారందరి సంహారం వ్యాజమే, పూర్వమే నిర్ణయమైంది. ఇప్పుడు అర్జునుడు నిమిత్తమాక్రుడే.

(న కాంక్షే విజయం కృష్ణు అన్న లొలి అధ్యాయంలోని శ్లోకానికి ఇది సమాధానం. నీవు దేహచైతన్యంలో ప్రవర్తించినప్పుడు కర్చత్వభావాన్ని పరిత్యజించితే మిగిలేది అనాసక్ర యోగమే. అయితే ఉపకరణమైైన దేహం ఇంద్రియాలు ఈ కార్యనిర్వహణలో పాల్గొనటంవల్ల దానివల్ల కలిగే సుఖములు, భోగాలు, రాజ్యము నీవు అనుభవించవలసిందే.

రెండు స్థాయిలలో వ్యక్తి ప్రవర్తించి దేహీంద్రియ దశ మనోమయ దశ మొదట కర్త, రెండవచోట అకర్త, అందువల్ల జీవునికి కర్మఫలప్రాప్తి ఉండదు. రెండు వ్యక్తిత్వాల మధ్య అనాసక్తి అనేది సేతువు. అందువల్ల ఈ కర్మఫల ప్రవాహం మనోమయ చేతనలో ఉన్న జీవనికి చెందదు. ఇలాగ్రెడేనే ఇక్కడ సమన్వయం కుదురుళుంది.

సృష్టి ఆరంభాన్ని వివరిస్తూ యజ్ఞములు చరాచర జీవకోటి ఒకేసారి సృష్టిని పొందాయి. యజ్ఞములు జీవనవృత్తికి కారణాలైనాయి. అన్నంవలన సర్వభూతాలు పుట్టాయి. అన్నం వర్షంవలన పుట్టింది. వర్షం యజ్ఞంవల్ల కలిగింది. యజ్ఞం కర్మఫలం వల్ల కలిగింది. కర్మ వేదాలనుండి పుట్టింది. ఆ వేదం అక్షరపరబ్రహ్మనుండి కలిగింది. ఈ సర్వగతమైన బ్రహ్మ యజ్ఞంలో నిలచి ఉన్నది. ఈ రెండు శ్లోకాలలో (3-14,15) ఒక యజ్ఞచక్రం '్రవర్తిస్తున్నది. భలనత డన వానా 55

అక్షరబ్రహ్మము - వేదము - కర్మఫలము - యజ్ఞము - వర్షము - అన్నము- ఇదీ ఈ చక్రక్రమము. గీత ప్రకృతిని, ఈశ్వరుని, జీవకోటిని అంగీకరిస్తుంది. అయితే జీవకోటి అంతా 'మమైవాంళో జీవలోకే జీవభూతూ' (15-7), “'చయయ్యాధ్యక్షేణ ప్రకృతి న్ఫూయతే సచరాచరమ్‌” (9-10). అయితే జీవేశ్వరులకు అంగాంగి భావము చెప్పబడింది. గీతాశాస్త్రం కర్మ, జ్ఞాన, భక్తియోగాలను పరమార్ధ సాధనాలుగా గుర్తించింది. యోగస్పర్భ ఉన్నది కాని అది పాతంజలము కాదు. కర్మజ్ఞానాదులలో అంతర్భవించింది. 'నకాలేనేవా మవాతా యోగో నష్టః వరంతవి అప్పటికే ఆత్మయోగ సాధన విద్యలో ఎన్నో అంశాలు నశించిపోయాయి. కొంతవరకు ఇది జనకాది రాజర్నులలో నిలచి ఉన్నది. మూలాన్ని కాదని దీన్ని కర్మయోగమేనని చెప్పటం సరియ్రైంది కాకపోవచ్చును. నాల్నవ అధ్యాయం ఆరంభంలో ఈ ప్రస్తావన తెచ్చి ఈ నష్టమైన యోగాన్ని నీకు నేను చెప్పుతున్నాను. ఇది సనాతనమైంది, రహస్యమైంది అని చెప్పినాడు శ్రీకృష్ణుడు. ఈ నష్టమైన యోగం అంతర్ముఖసాధనకు సంబంధించినది కావచ్చు. ఈ సాధనలు ఉన్ననీ నసీమలను చేరటానికి లేదా అక్కడి వెలుగులను దించటానికి ఉపయోగించేవి. కలియుగారంభం నాటి నానాయోగ సంప్రదాయాలు నష్టమయ్యాయి... శ్రీకృష్ణుడు ఇంచుమించు ఈ కాలంలోనే అప్పటికి నష్టమైన సంప్రదాయాల గురించి వివరిస్తున్నాడు. గీతను మూడు షట్మ్కాలుగా విభజించే పద్ధతి ఉన్నది. కర్మషట్మమనీ, భక్తిషట్కమనీ, జ్ఞానషట్కమనీ మూడు విభాగాలు. అయితే వీటిని అంత సులభంగా విడదీసే వీలుండదు. కర్మషట్కంలో శతోత్రాదీ నింద్రియాజన్వే అన్న శ్లోకంలో జ్ఞానేంద్రియా లను సరయమమనే అగ్నిలోను, శబ్బాది విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేయాలని ఉన్నది. తరువాత ఇంద్రియకర్శలను ప్రాణకర్మలను (ప్రాజాయామాదులను) ఆత్మసంయమ యోగాగ్నిలో హోమం చేయవలసి ఉన్నది. తరువాత అనేక రకాల యజ్ఞాలను వివరించి అపానవాయువనే అగ్నిలో ప్రాణవాయువనే హవిస్సును వ్రేల్చ్బటం, దీనికి విపరీతంగా 'పాణవాయువునందే అపానవాయువును (వ్రేల్చుట, పంచప్రాణములను నియమించుట- ఇవీ యజ్ఞభేదాలు. ఇలా కర్మయోగాంతరమైన విషయం ఇక్కడ (ప్రస్తావించబడ్దది. కర్శషట్కంలోనే కర్మ, అకర్శ, వికర్శ్మల విషయం ప్రస్తావించబడింది. యోగారూఢు డైన పురుషుడు సంకల్పరహిత స్థితిని పొందవలెనని సూచింపబడింది. గీతకు సార భూతమైన అంశం ఆరవ అధ్యాయంలో వస్తుంది. శక లాలన

'సర్వభూతస్థమాత్తానం నర్వభూతాని చాల్ళని ” ఈక్షతే యోగయుక్రాత్సా నర్వత్ర నమదర్ధను 4” " 'యోమాం వళ్ళతి నర్వత్ర నర్వం చ మయి వళ్చతి / తస్యాహాం న వ్రణళ్యామి న చ మే న ధ్రజుళ్ళతి 4 (6-29 30) జీవితం దివ్యభావం చేనుకునే సాధనలో రెండు (ప్రధానాంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డవి. తనను సకలభూతములలో దర్శించాలి. అట్లాగే తనయందు సకల భూతాలను చూసుకోవాలి. అతనిది యోగయుక్తాత్మ లక్షణము. ఈ చరాచరజగత్తునందు తనకంటే భిన్నమైనదేమీ లేదు. అంతటా వ్యాపించియున్న తత్వము ఒకేచేతన, అదే అవికార లక్షణం గలది అనేది అభ్యాసంచేత కలుగవలనిన నిశ్చయము. అట్లాగే అన్ని ప్రదేశాలలో వస్తువులలో వ్యక్తులలో ఈశ్వరుని దర్శించాలి. అట్లాగే ఈశ్వరునియందు సర్వమును దర్శించగలగాలి. తరువాత వచ్చే జానుదేవన్ఫర్పమితి” అన్న భావం ఇక్కడ చెప్పబడింది. శ్రీ అరవిందులకు అలీపూర్‌ జైలులో సర్వమందు వాసుదేవ సాక్షాత్మారమైన విషయం గమనిస్తే ఈ విధానం సాధ్యమేనని తోస్తుంది. నర్వభూతములలో తనను చూడటంవల్ల న్వ-వర ఖేదం నళిన్తుంది. అనుభవంలోకి అద్వైతభావన వస్తుంది. తను ఎవరినైనా వైరిగా భావించవలసిన అంశం అంతర్థానం పొందుతుంది. కామ మోహాదులకు జగత్తులో న్థానమే ఉండదు. పుక్రునియందు తల్లిదండ్రులకున్న ఆత్మీయత అనురాగంగా, వాత్సల్యంగా పరిజమించినట్లు జగత్తు అంతా (ప్రేమస్థానం అవుతుంది. జగత్తులో ఉండే వేదనలన్నీ తన అనుభవంలోకి వస్తవి. ఈ భావం విస్తరించేందుకే విభూతియోగం వచ్చింది. 'యద్వద్వభూతి మత్సత్త్వం శ్రీమదూర్హితమేన వా ॥ తత్రదేవావగచ్చు త్వం మమ తేజోంశసంభవమ్‌ /7 (10-41) అని నృష్టిలోని అణునణువులోను తన విభూతి విశేషమున్నట్లుగా భగవంతుడు వ్యాఖ్యానించాడు. ఇట్లాగే భక్రిషట్కంలో మిగిలిన జ్ఞానకర్మల విషయం, జ్ఞానషట్కంలో కర్మభమ్తుల విషయం విశేషంగానే వ్యాఖ్యాతమయింది. ఇంకా ప్రధానమైన అధ్యాయాలలో ఒకటియైన భక్తియోగంలో వ్యక్త-సగుణ బ్రహ్మోపాసనము అవ్యక్త నిర్గుణ బ్రహ్మోపాసనము వింగడిస్తూ కార్యీరుతుతి 157

అవ్యక్తోపాసన క్లేశోధికతరమని చెప్పబడ్డది. ఈ ఉపాసకులందరికీ ఉద్ధర్త భగవంతుడే. అతడు మృత్యుసంసార బంధమునుండి విడిపిస్తాడు.

ఉపాసకుల సౌకర్యం నిమిత్తం భక్తియోగంలో 8 నుంచి 11 శ్లోకాలవరకు సులభ సులభతర మార్గాలను సూచిస్తూ పోవటం జరుగుతున్నది. చివరకు చెప్పిన మద్యోగమాథభితః నర్వకర్ణఫలత్యాగం కురు అని నిర్దేశించినాడు. సర్వకర్శ్మఫలత్యాగం అన్నమాట. చివరి అధ్యాయంలోని 'సర్వధర్భాన్‌ వరిత్యజ్య' అన్న చరమళ్లోకాన్ని గుర్తు చేస్తున్నది. ఈ అధ్యాయంలోని 'అద్వేష్టా నర్వభూతానాం” మొదలైన సాధకుని వర్ణన స్థితిప్రజ్ఞుని వర్షనమునకు (ప్రతిబింబప్రాయమైందే.

భగవద్గీతలో కొన్నికొన్నిచోట్ల వేదములను నిందించినట్లుగా గోచరిస్తున్నది, అనేక సందర్భాలలో వేదము తన స్వరూపమని, వేదార్థము పరమాత్మను ఎరుగుటయేనని (ప్రణవ మహిమను వెల్లడించటం జరిగింది. వేదవాదరతులు, డైగుజ్యవిషయ ('ప్రధానములైన క్రియాకలాపములను (ప్రతిపాదించే వేదమందు ఆసక్తిగలవారిని, ధర్మమీమాంసలో ఆగిపోయి (బ్రహ్మమీమాంసదాకా చేరనివారు జన్మసంసార చక్రములో పరిభ్రమింపగలరని ఆయన స్పష్టం చేశారు. అన్నయంలో సమన్వయం లేకపోవటంవలన ఈ అనిష్టార్ధప్రాప్తి కలుగుతున్నది. గీతలో (ప్రతిపాదితమైన సాంఖ్యయోగము కపిలసాంఖ్యంకంటె భిన్నమైంది. కపిలసాంఖ్యంలో ప్రకృతి అంటే మూడుగుజాల సామ్యస్థితి. గీతలో అది మూడు గుణములకు కారణమైంది. సాంఖ్యంలో పురుషు దొక్కడే. ఇక్కడ పురుషు లనేకులు. అక్కడ దుఃఖముల ఆత్యంతిక నివృత్తి ముక్తియెతే, (బ్రహ్మానందాను భవము, అమృతత్వసిద్ధి గీతాశాస్త్రం (ప్రతిపాదించే ముక్తిస్వరూపము.

పాతంజలయోగము చిత్తవృత్తి నిరోధమును ప్రతిపాదిస్తుంది. గీత యోగమును భగవత్రాప్తికి సాధనంగా అతనితోడి సంయోగంగా పేర్కొంటున్నది. కర్మ, ధ్యాన, భక్తి సమత్వయోగాలు మాత్రమే కాక దానికీ, దీనికీ ఆత్యంతికభేదం ఉన్నది. భక్తి స్పర్భ ఉన్నప్పుడు కర్మజ్ఞానాలు కూడా నిరంతర తైలధారావదవచ్చిన్న భావనతో ఈశ్వరుని నిలుపుకోవటంగా విస్తరించవచ్చు. చిత్తవృత్తి నిరోధం కాక చిత్తమునంతా తన్మయం చేసుకోవటం ఇక్కడ లక్షణం. 'జన్మజన్మలకూ హృదయంలో నిన్ను నిరంతరం ధ్యానించే స్థితిని కలిగించు. మోక్షమే వద్దు అన్న భక్తిభావన ఇక్కడ ప్రధానం. భక్తియోగం ఈ లోకంలోనే దివ్య జీవనాన్ని కలిపిస్తుంది. 'వానుదేవన్సర్వమితొ అన్న స్థితి అది. యోగసందర్భంలో ప్రాజాయామాదులు చెప్పబడినా ఇక్కడ ధ్యానతాదాత్యాదులకే పారమ్యం, శక ట్య

భగవద్గీత తత్పూర్వం ఉన్న యజ్ఞభావనను పూర్తిగా పరివర్తింపజేసింది. అగ్ని, పశువిసనము, హోమము, దేవతాహ్వానము మొదలైనవాటి స్థానంలోకి భగవద్భాననమే యజ్ఞమయింది. జపము యజ్ఞమే. వాబ్బయము యజ్ఞమే. “సతతం క్తీర్తయంతో మాం యే జనాః వర్యుపానతే తేషాం నిత్వాభియుక్తానాం యోగక్షేమం వవోన్యువామ్‌” నిత్యము శ్రీర్రించటం కూడా ఈ యజ్ఞమే. బాహ్యమైన ఆచారాల స్థానం. అది ఆంతరమైన నిత్యభావస్థితిగా రూపుమార్చుకున్నది యజ్ఞం భగవద్గీతలో. నిష్కామకర్మయోగాన్ని చెప్పి

= యజ్ఞము కూడా నిర్వహించినా అది భగవదర్పితంగా చేయటంతో దానిలోని కర్మజాటిల్యం తొలగిపోయింది. కర్శశ్చేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి వ్యక్తి చేసే కర్మ విశ్వచేతనలోనికి తన సర్వశక్తులతో సంగమించటం సాధ్యమయింది. ఇక్కడనుంచే ఆంతర్యాగభావం ఆవిష్కారం అయింది.

“నిర్వాణం అన్నమాట గీతలో కానవస్తుంది. ఈ మాట బౌద్ధులకు పూర్వం కొనసాగిన కాల పారమ్యాన్ని ప్రతిపాదించిన కాత్తికులది. దాన్ని బౌద్భుల తరువాతిదిగా భావించటం దోషయుక్తం. విశ్వరూపం చూపిన భగవంతుడు కాలో2._న్ఫీ లోకక్షయకుత్‌ థ్రవృద్ధూ అన్నచోట కూడా కాలమే సర్వకారణమనీ, అదే మృత్యుపర్యాయమని భావించటం మూలం కావచ్చు.

గీతలో చేసిన దేవాసుర సంపద్విభాగము సృష్టి ప్రక్రియలో మూలద్రవ్యమైన

సంఘర్షణను వ్యక్తం చేసింది. గుణత్రయవిభాగము వ్యక్తి చిత్త మూలాలను విశ్లేషించింది. ఇందువల్ల *చాతుర్వర్హం మయా నృష్టం) అన్నచోట కూడా వర్ణ మూలాలు, గుణకర్శలను ఆ(శ్రయించినవిగా గీతాకారుడు నిశ్చయించినట్లు స్పష్టమౌతుంది. వ్యతిరేక గుణాల విషయం వస్తే కామక్రోధ లోభములు నరకద్వారాలని విశదంగా చెప్పటం జరిగింది. మహాభారతంవల్ల లోకానికి జగద్దురువు లభించాడు. ఈశ్వరుడే నిజమైన

గురువు ఎవరికైనా. అయితే అతడు అంతర్యామిగా ఉన్నప్పుడు అతని ఆదేశాలను సామాన్యుడు గ్రహించలేడు. అందువల్లనే ద్వాపరాంతంలో తాను గురువై, కానే శిష్యుడై నరనారాయణులుగా రూపాంతరం పొంది శ్రీకృష్టార్ణునులుగా అవతరించాడు. రథి జీవుడు, సారథి గురువు. గీతోపదేశం ఈ ప్రతీక నాశ్రయించింది. ఇక్కడ గురువు చేసింది మాయాపరిమితులను బలవంతంగా ఛేదించటం.

మహాభారత తాత్బర్యనిర్ణయం చేయటం ఎంత క్లిష్టమైందో దాని పరిణామాన్ని వైరుధ్యాన్ని నానాత్వాన్ని చూస్తేనే తెలియవస్తుంది. తలా

ఈ సందర్భంలో భగవద్గీకాదులను గురించి విచారణ ఆధారభూమికగా గ్రహించ వచ్చు. మహాభారతం అంతా మృత్యుక్రీడగా భావించిన సందర్భంలో యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు 'తేషాం అవాం నముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్‌ అన్న అభయం థైర్యాన్నిస్తుంది.

కార్చణ్యదోషం వదలిన అర్జునుడు 'నప్పో మోవాః న్యృతిర్‌ లబ్బా' అని చెప్పటం ఈశ్వరుడు చెప్పినవిధంగా “తస్తాత్‌ యుద్ద్యన్వ” అన్న ఆదేశాన్ని పాలించటం, మాయా మోహితము, మృత్యుసంవలితము అయిన జగత్తులో జీవులు ఎప్పుడూ ప్రమాదం పొందకుందా కాను, క్రోధ, లోభాలనే తమోమయ మృత్యుద్వారాలకు చిక్కకుండా మృత్యుజయాన్ని సాధించవలసి ఉన్నది.

భీష్ముడు ధర్మజునికి బోధించిన 'మహనీయజపం' అనే మాలామంత్రం ఈశ్వరుని సర్వవిభవాన్నీ వర్ణించింది. అది ఒక విధంగా సర్వోపొసన రీతులకూ సారభూతమైంది,

౪ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః వురుషోత్తమాయ, నమన్సర్వలోక గురవే, నమన్సర్వలోకవిడ్రే, నమన్సర్వలోక వితామవోయ, నమన్సర్వలోక (్రపితామవోయ, నమన్సర్వలోక (వ్రధానాయ, నమన్సర్వలోకేశ్వరాయ, నమన్సర్వలోకవిళిష్టాయ, నమన్సర్వలోక నుఖవ్రదాయ, నమన్సర్వలోక కర్రే నమన్స్ఫర్వలోక భగ్రే, నమన్సర్వలోక వాగ్రే నమన్సర్వలోక నిధయే, నమన్సర్వలోక నిధానాయ, నమన్సర్వలోక పాతాయ, నమన్స్ఫర్వలోక పాతకరాయ, నమన్సర్వలోకోద్ధువాయ, నమన్సర్వలోకోద్ధువకరాయ, నమో విష్ణవే వ్రభవిస్టవే' - అని ఈ మంత్రం.

మహాభారతం మొత్తానికి దైవీమూలమైన వాసుదేవతత్తాన్ని సంగ్రహంగా, సర్వతోముఖంగా వివరించిందీ మంట్రం. నిత్వపఠనీయమైన ఈ మంత్రం ద్వాదశాక్షరితో ఆరంభమై, తద్వివరణగా విస్తరించింది.

ఈ వ్యాసం సముద్రాన్ని ఒక బిందువులో చూపించినట్లు, ఒక కొండను అద్దంలో -చూపినట్లు మాత్రమే. ఒక యుగం పూర్తయింది మహాభారతంవల్ల, ఒక సభ్యత తమోమయ తేజోమయ పార్చ్వాలతో ఏకకాలంలో దర్శనమిచ్చింది.

(త్రందికం యజామహే నుగంధిం వుష్టివర్ధనమ్‌ |

ఉర్వారుకమివ ఐంధనాత్‌ మృత్యో ర్ముక్షీయ మా£_మృతాత్‌

(ఢిల్లీలోని శ్రీ వేంకటేత్చర కళాశాలలో మవోఖారతంపై జరిగిన జాతీయ నంగోస్టిలో నమర్పింవబడిన వత్రము, 272829 జులై 2007)

'జ్రాప్మ' రెండు నంచికలలో - 2007-08

శతం లా స్తున్న

స్పందన

భారతీయ సంస్కృతి రెండు మహేతివాసాలపై నిర్మాణమై ఉన్నది. ఒకటి శ్రీమద్రామాయణము. రెండవది మహాభారతము. మానవ జీవిత పరమార్థమైన పురుషార్థాలను సాధించే క్రమాన్ని ఈ రెండు సుష్టుగా వర్ణించినవి. ఈ చైతన్యస్రవంతి భారతీయ భాషలన్నింటిలోనికి నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది. భారతీయాత్మను విశ్వచైతన్యంగా ్రదీప్తం చేస్తూనే ఉన్నది.

శ్రీ రామాయణం (క్రేతాయుగధర్మాన్నీ మహాభారతం ద్వాపరయుగాంత - కలియుగారంభ సంధి సన్నివేశాన్ని విశదీకరిస్తున్నవి.

శ్రీ సుప్రసన్నుల యాఖై సాహిత్య వసంతాల అనుభవసారం, కావ్యపరీమళం ఈ సంపుటి. 'హ్బాద్గీత నుండి ఆరంభమైన వివేచన భగవద్గీతా సార సంగ్రహం వరకు విస్తరించింది. బీజప్రాయంగా వృదయంలో నాటుకున్న వివిధ అంశాలు ఉత్తరోత్తర వికసించినవి. అర్థశతాబ్టీ అనుశీలనలో పరిపక్వమైనవి. ఈ రచన షోడశ కళలతో చాంద్రీరూపమైంది. పదహారు అంశాలతో కౌముది సాహిత్య వసంతోత్సవం చేస్తున్నది.

“సమర్చనిలో త్రీరామాయణము తపోమయ భూమికను విశదీకరించగా, కావ్యప్రమితిలో అది 'శ్రీమద్రామాయణం-కావ్యతత్త్వ 'ప్రకాశనం' బంది. కావ్యారంభ శ్లోకాలలోనే బీజప్రాయంగా నిక్షిప్తమైన కావ్యార్థం, మహాకావ్యం నిండా విస్తరించింది. ఈ తీరు తెన్నులను అనేక పార్య్వాలలో విశదీకరించింది ఈ వ్యాసం.

వ్యాస వాల్మీకులకు గురున్థానీయుడైన నారద తత్త్వ ప్రకాశనంతో వ్యాఖ్య వికసిస్తున్నది. 'బ్రిలోకసంచారి, త్రిలోకజ్జుడు, వాగ్విదాంవరుడు... మొదలగు నారదునికి చెందిన విశేషణాలు నవ్యభావనలో వివరింపబడ్డాయి. వైధికమార్గం, యోగదర్శనం, త్రీ అరవిందుల భావన అంతర్ముఖీనమైన విలక్షణ వ్యాఖ్య శ్రీ సుప్రసన్నుల ముఖంగా వెలువడినది.

వాల్మీకి తమసానదిని సందర్శించిన సందర్భం విలక్షణమైనది. ప్రకృతికి ఉషోదయ వేళ - వాల్మీకి శిష్యుడు భారద్వాజుడు అనుచరుడైన వేళ - ్రాచేతసుని హృదయం నిండా తమసానది 'అకర్దమంగా, రమణీయంగా, ప్రసన్నాంబువుగా దర్శనమైన కార్మి ర్తుతుతి 161

వేళ. గంగానది సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తున్నది. సన్నివేశంలోని సూక్ష్మాతి సూక్ష్మాంశాలు అన్నీ కలిసి వాల్మీకి హృదయాన్ని ఆనందానుభవంలోకి తెచ్చినాయి. 'సన్మనుష్యమనో యథా అన్న ఉపమానంతో భారద్వాజుడు శ్రోత కాగా కావ్యావిషారం చేశాడు. ఉత్తరోత్తర శ్రీరామాయణ మహాకావ్య నిర్మాణానికి యోగ్యమైన దార్శనిక హృదయం వాల్నీకులది అని సన్నివేశం ధ్వనిస్తున్నదె. అనేక వ్యాఖ్యలకు మూలమైంది ఈ సన్నివేశం. శ్రీ సుప్రసన్నులు కావ్యగర్భం లోకి (ప్రవేశించి “అవి దూరంగా ఉన్నా గంగా తమసానదుల నడిమి సొమ్యాన్ని బ్రహ్మానందానికి - కావ్యానందానికీ గల సహోదర రసబంధం'గా భావించటం “తమస ఆస్వాద్యమైన కావ్యమే'ననటం మననశీలురను మంత్రముగ్ధులను చేస్తుంది. ఒక సందర్భంలో - 'భావుకుల కొలది కావ్యం నూతనార్థానుసంధానం చేస్తుంది? అన్న సుప్రనన్నుల వాక్యం వారి రచనలన్నింటా అన్వయిస్తుంది. వారు అనేక సాహిత్యాంశాలను నవ్యభావనలో పరిశీలించటం, వ్యాఖ్యానించటం గమనించవచ్చు. “యోగమార్గంలో త్రిలోకసంచారం అంటే ్రిఖండాత్మకమైన షట్పక్రములతో సంపుటియైన సుషుమ్న్మయందు కుండలినీ రూపంలో సంచరించుట అని అర్థం” అన్నారు. నిఘంటువుకు అందని ఈ అర్థం అభినవమైనది. '“శ్రీనిరుక్తిశేని దర్శించిన హృదయమే పై వ్యాఖ్యను చేస్తున్నది. యాస్కుడు మహాముని, నిర్తుక్తకారుడు. వైదిక సాహిత్యానికి వివిధ స్థాయిలలో ఆర్భాన్ని వివరించినవాడు. అదే మార్గం సుప్రసన్నులను వివిధ భూమికలలో నడిపిస్తున్నది. రచయిత అనుభవ వైచితి నూతనతత్త్వాన్ని అభివ్యక్తం చేస్తున్నది. “గొప్ప కావ్యం విన్నప్పుడు మనోహృదయాలే కాదు - శరీరమూ సంతోషాన్ని పొందుకున్నది' అనటం అలాంటిది. కావ్యంలో ఒక సమత్వం ఉండాలి. శబ్దిసంయోజన దగ్గర నుంచి కావ్య నిర్వహణ దాకా ఈ లక్షణం వ్యాష్తమై ఉంటుంది. దీన్నే సామరస్యం అంటారు. దీని మరియొక పేరు జెచిత్యం' అంటారు శ్రీ సుప్రసన్న ఈ వాక్యార్ధమే వారి సర్వసాహిత్యానికీ అన్వయించుకోవచ్చుననుకుంటాను. నృజనశీలత, అన్వేషణ, వివేచన, సామరస్యముతో కూడిన సమన్వయ మార్గంలోనే రచయిత నడచినట్లు గ్రహించగలం,. ఆధునికాంధ్ర సాహిత్య సృజనలో, విమర్శలో శ్రీ విశ్వనాథను రచయిత కారణ జన్ముడుగా భావించినారు. జాతి సంస్కృతి మూలాలను విశ్వనాథ సాహిత్యం [గ్రహించిన

  • స్రీనిరుక్తి - మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలకు శ్రీ సుప్రసన్న రచించిన పద్యరూప వివరణ. శ న ముర్పస్న

తీరు తెన్నులను అనంతముఖాలుగా అన్వేషించినారు. ఫలితంగా “ఆధునిక సాహిత్యం ఎదిగిన సంస్కృతి శిఖరం” అన్న శీర్షిక అవతరించింది. విశ్వనాథ చూపిన 'కావ్యశిల్ప విమర్శ మార్గమే అనంతర విమర్శకు కారణమైన తీరు, తర్వాత విమర్శకులలోని నవ్యదృక్చథాలు వివరించడమైంది. అనుకూల విమర్శకిచ్చిన స్థానం ప్రతికూల విమర్శకు ఇందులో దక్కలేదు. దీనివల్ల శ్రీ సుప్రసన్నుల హృదయాన్ని అర్ధం చేసుకో వీలు కలుగుతుంది. నిర్మాణాత్మక విమర్శయే జాతి సంస్కృతిని నిలుపుతుందన్నది 'అంతరంగం'.

శ్రీ విశ్వనాథ సాహిత్య స్వభావం గురించి, సమకాలీన విమర్శకులు చేసిన అపప్రధను ఇందులో తొలగించే ప్రయత్నం చేశారు రచయిత. “విశ్వనాథ (ప్రపంచించిన ప్రణయం సామాజిక వ్యవస్థను నిలిపేది. దానిలోని నిర్బంధాలను తొలగించేది, 'విశ్వనాథకు మతం ముఖ్యం ఎప్పుడూ కాలేదు. సంస్కృతి అంటే మతం కానే కాదని ఆయన భావించారు వంటి వాక్యాలు రచయిత “నిజాయితీని, నిఐద్ధతనూ, నైపుణ్యాన్నీ' తెలియజేస్తాయి.

మొత్తం భారతీయ సాహిత్య నిర్మాణంలోని ప్రగతివాద దృక్పథాన్నీ సంప్రదాయ దృక్పథాన్నీ రచయిత రెండు వేరువేరు మార్దాలుగా గుర్తించినారు. వాటి మూలాలను, పరిమితులను (గ్రహించినారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని నిలిపే దిశను స్వీయమార్గంగా ఎంచుకున్నారు. ఆంగ్లేయ నాగరకతవల్ల సంక్రమించిన బానిస భావాలను తిరస్కరించినారు. ఈ క్రమంలోనే గురజాడ 'దేశభక్తిని శంకిస్తూనే 'పూర్ణ్వమ్మకథిను అంగీకరించటం - రాయప్రోలు జెన్నత్యాన్ని అంగీకరిస్తూనే నైజామును కొనియాడటాన్ని తిరస్మరించటం కొనసాగింది.

సాహిత్యం-సంస్కృతుల పరిమితి, ప్రయోజనం ఎరిగిన వివేచన వీరిది, అనేక సాహిత్యాంశాలను జాతీయ పునరుజ్జీవన దృక్పథంతో పునఃమూల్యాంకనం చేశారు. భావ కవిత్వశాఖలో (ప్రజయిభావన వివిధ రచయితలలో వివిధ దృక్పథాలుగా పొందిన విధము సమగ్రంగా సమీక్షించినారు. అమలిన శృంగారం, స్వేచ్భాప్రజయం ఏ విధంగా సఫలీకృతం కాలేకపోయింది, విశ్వనాథ ప్రతిపాదించిన “కులపాలికా ప్రణయం కుటుంబ వ్యవస్థ మూల ఖిత్తికగా ఏ విధంగా నిలిచిందీ, సంప్రదాయంలోని నవ్యదృక్పథాన్ని అనుసంధానం చేస్తూ శ్రీ సుప్రసన్న పరిశీలించినారు.

ఈ సంపుటికి తొలి పలుకుగా రామాయణార్థ (ప్రకాశనం, తుది పలుకుగా వ్యాస భారత పరమార్ధ వివరణ నిలిచింది. ఈ రెండు మహాకావ్యాల గురించి చేసిన వివేచన బింబప్రతిబింబమే. మధ్య నిలచిన వ్యాసపరంపర. 'సమర్చనిలోని పూర్వవ్యాసం నియా

మహాభారత పరమార్శాన్ని స్థూలంగా వివేచింపగా, ఈ సంపుటిలో 'తర్మసంగతిని- తత్త్వ సారాన్నీ అనుసంధానం చేసుకుంటూ పునర్చిర్మాణమైంది. దివ్యభావనతో ఆవిష్కృతమైంది.

శ్రీ నారాయణలీలామృతాన్న్సీ ధర్మం వల్లనే అర్ధకామాలు సంప్రాప్రిస్తవన్న వ్యాస భారత పరమార్థాన్ని విశదీకరించే రచన ఇది. భారత రచన నిర్మాణ సంక్షిష్టతను గుర్తించి, వైవిధ్యాలు, వైరుధ్యాలు, ఆభాసాలు, రహస్యకథనాలు, గూధార్థాలు, సామరస్యంతో సమన్వయపరచే ఒకానొక ఉత్తమ ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.

ద్వాపర కలియుగ ద్వయ సంధిలో ధర్మాధర్మ, విద్యావిద్యల సంఘర్షణ నుండి జాతి సంస్కృతి మూలాలను రక్షించే దిశగా 'వివిధార్థ స్ఫురణము, అమితాఖ్యానకమూ అయిన భారతాన్ని 'తర్మసంగతికొ లోబడి “తత్త్వసారాన్ని' పిండి 'పరమార్థాన్ని మన కందించిన విధము ఏకకాలంలో ఆశ్చర్యమూ ఆనందమూ కలిగిస్తుంది.

“ఒక యుగం పూర్తయింది మహాభారతం వల్ల, ఒక సభ్యత తమోమయ, తేజోమయ పార్య్వాలతో ఏకకాలంలో దర్శనమిచ్చింది" అన్న ముగింపు వాక్యాన్ని “భారతారంభంలోనే ఈ ఇతిహాసం అంతా నారాయణుల లీల - నారాయణ తత్త్వమే ద్విధా విభక్తమై జీవేశ్వరులుగా తపోమయ భూమికలోనికి అవతరించటం ఈ ఇతివృత్తం” అన్న తొలి వాక్యంతో సమన్వయం చేసుకోవాలి. క్రమంలో అనేకాంశాలు బెచిత్యంతో కూడి విజ్ఞాన భూమికలలో విస్తరించాయి. పద్మవ్యూహ రచన వంటి రచన. బహుళ అంతస్థులను పార్య్వాలను సమన్వయపరుస్తూ “వివిధార్థ్ధ గతి స్ఫురణంబూ కలిగినది వ్యాఖ్య,

శైలి విచిత్రమైనది. ఒక్కోవోట ప్రసన్న గంభీరము, ఒక్కోచోట సంశ్లిష్టము. అర్ధ్థసాంద్రత జారిపోకుండా శబ్బంలోకి మూర్త, అమూర్త భావాలు ఒదిగేట్లు నవీన శబ్ద (ప్రయోగం విస్తరించి ఉంటుంది. బిందువు, స్తరములు, అంతస్తులు, త్రిపుటి, పార్వములు, చేతన, విశ్వచేతన, అంతశ్చేతన, అవిదూరము .... వంటి విలక్షణ శబ్బాల్లో భావసాం[ద్రత పొదుగబడుతుంది. ఆయా సందర్భాలలో సన్నివేశ భావగాఢతను వ్యక్తీకరించే వైఖరీ వాక్కు సాధారణ స్థితిని దాటి కావ్య పరిభాషగా మారుతున్నది. అమూర్తమైన భావాన్ని అను భవంలోకి రావటానికి (ప్రతీకలు, 'ప్రాగ్రూపాలు ఆధారమౌతున్నాయి. అందుకునేందుకు తగిన ప్రయత్నం పాఠక ముఖంగా సాగవలసిందే.

తిక్కనగారిలో లాగ (చారుభీకరలీల వంటి (ప్రయోగాలు) శ్రీ సుప్రసన్నలోనూ విరోధాభాసంగా పదముల కూర్పు కనిపిస్తుంది. 'తమోమయ లేజోమయ పొర్ష్వాలు 'కావ్యతత్త్వ ప్రకాశన లక్షణానికి సంక్షిప్త వ్యాఖ్య అనటం, ననన ననా

నిర్వాణం అన్న మాట గీతలో కానవస్తుంది. అది బౌద్భులకు పూర్వం కొనసాగిన కాలపారమ్యాన్ని ప్రతిపాదించిన తాత్త్వికులది. దాన్ని బౌద్దుల తర్వాతదిగా భావించటం దోషయుక్తం. విశ్వరూపం చూపించిన భగవంతుడు .... కాలమే సర్వకారణమని అదే మృత్యు పర్యాయమని భావించటం మూలం కావచ్చు" అన్న వాక్యార్థంలో ఒక సత్యాన్వేషణ, ఒక చారిత్రక దృక్పథం, ఒక అధ్యాత్మిక దృక్పథం, ఒక సమన్వయ జిజ్ఞాసతో కూడిన పరిశోధన కనిపిస్తుంది. నేటి పరిశోధనలో కావలసిన చూపులను నిర్దేశిస్తుంది.

అన్నమయ్య సాహిత్యం శృంగార, ఆధ్యాత్మిక భూమికలపై నడిచింది. శ్రీమహావిష్ణు భావాన్ని ధరించి భరించింది. దీని అనంతత్వాన్ని బెచిత్యంతో ప్రకటించ టానికి రచయిత అన్నమయ్యను 'సుపర్డునిగా భావించినారు,

రచయిత దృష్టిలో కవిత్వానికి, విమర్శకు మధ్య పెద్ద తేడా లేదు. అంతశ్చేతనలో సృజనశీలత కావ్యనిర్మాణానికి, విశ్లేషణ చిత్తం విమర్శకు హేతువులుగా మూలతత్తాన్ని విశదం చేస్తారు.

“లోకంలోని దుఃఖ సముద్రాన్నంతా త్రాగి బరువుగా ఆకాశంలో కదలిపోయే జలధరస్వామి రమాపతిరావు “గడియారం రామకృష్ణశర్మగారి స్మృతి కస్తూరి నింపుకున్న చందన పేటిక, ఆర్భాటం లేకుండా ఒక మూల దాచిపెట్టుకున్న పారిజాత సుమమాలికి, “కవిత్వ శిశిరంలోకి వసంతమై ప్రవహించిన శేషేంద్ర, “ఆయన తోడి మైత్రి నా చిత్తానికి మరపురాని పొగడపూల తావి, “ఎడారిలో నీటిచెలమ రామ్‌నారాయణ్‌ కవిత్వపు ఊటి లాంటి వాక్యాలు సృజనాత్మకతమూ, ఆత్మీయమూ అవుతున్నాయి.

కావ్యగర్భంలోకి ప్రవేశించి రహస్యాలను కవితాత్మతో కూడిన విశ్లేణ చేయగల _ - నేర్పు ఓర్పు శ్రీ సుప్రసన్నగారిది. ఈ మార్గంలో అభినవ మల్లినాథులౌతున్నారు. గురుదేవులు శ్రీ నుప్రసన్నుల వాక్‌స్పర్శ్మ నా హృదయాన్ని మేల్మొల్పగా ఈ స్పందన. శిరసు వంచి ఆ మూర్తిలోని సరస్వతికి ప్రణామములు.

13-5-2008 (ివురారి ఇం.నెం. 3-10-98/8

గోఖలేనగర్‌ కాలనీ

నం ననన

సంస్పందన కావ్యాన్ని గురించిన యథార్థజ్ఞానాన్ని అందించటానికి కూర్చబడిన వ్యాససంకలనం కావ్యప్రమితి. ప్రధానంగా ఆధునిక కవిత్వం లోతులను, సౌందర్యాన్ని ఆవిష్కరించే వ్యాసాలతో, ఆద్యంతాలలో రామాయణ మహాభారత వ్యాసాలను చేర్చి కూర్చిన సంకలనం ఇది. 'క్రావ్యం అనేక స్తరాలలో సాక్షాత్కరిస్తుంది. ఒక స్థితిలో మానవజీవన పక్షం. రెండవస్థితిలో శాస్త్రవ్యాఖ్యాన పక్షం లేదా సౌందర్యశాస్త్రపక్షం, మూడవ దశలో అధ్యాత్మ సాధన పక్షం - మొదటి వ్యాసంలోని ఈ ప్రతిపాదన చాలా కీలకమైనది. మిగిలిన అన్ని వ్యాసాలకు కూడా అనువర్తించే సూత్రం ఇది, వర్తమానమైంది మానవ జీవనపక్షం. అది సంకుచితమైనదని, తాత్మాలికమైనదని సుప్రసన్నగ్లారి అభిప్రాయం. అందువల్లనే ఆయన కావ్యాన్ని ఆ తరువాతి రెండు స్తరాలలో చూస్తారు. అర్ధం చేసుకుంటారు. వ్యాసంగా పాఠక ప్రపంచంలోకి ఆవిష్కరిస్తారు.

విసృతమైన అధ్యయనం, లోతైన సంప్రదాయ తాత్త్విక దృక్చథం, వాజ్మయ ప్రపంచాన్నంతా అలా మనసులో తిప్పుకొంటూ సంబధ వైరుధ్యాలను పోల్చి చూస్తూ సిద్ధాంతీకరించే ఆలోచనా గాఢత సుప్రసన్నగ్గారిలోని విశేషం. అది ఈ వ్యాసాలలోనూ కనబడుతుంది.

ఈ వ్యాసాలలో నాకు చాలా నచ్చినది మహాభారత పరమార్థం - తర్మసంగతి- తత్త్వసారము. భారతం మొత్తాన్ని చిన్న చిన్న శకలాలుగా ఇతివృత్తపరంగా, నిర్మాణ పరంగా, తత్త్వనిరూపణపరంగా అద్భుతంగా వ్యాఖ్యానించారు. సంక్షిష్టంగా వున్న భారతాన్నీ చదవటానికి మరొక చూపును ఇస్తుం దీ వ్యాసం. తాళ్ళపాక అన్నమాచార్యులు వ్యాసం ఒక కవిని అధ్యయనం చేయవలసిన పద్ధతిని, కవిత్వ విశేషాలను అర్థం చేసుకో వలసిన రీతిని గురించిన సమగ్రమైన అవగాహన నియ్యగల వ్యాసం. శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసం సరళసుందరం.

రాయఫ్రోలువారి విమర్శరీతి, తెలుగులో కావ్యశిల్ప విమర్శ, తెలుగు భాష సౌందర్యాన్ని గుండెలలో నిలుపుకుందాం అన్న మూడు వ్యాసాలు లేకపోతే ఈ సంకలనం

గా 'కావ్య(ప్రమితి” అ దా నా యన. సంద దొరా కాత్వాయనీ విద్దుహే ల్‌ మ. ట్‌ తా ఆ 166 ప్త - గ0ల్యో! ం | సుర్తుసన్నీ న ో / మ మా వాసు ళ్‌

    1. గంళ౭12 500/2%20026020/

మానవజీవనపక్షమే కావ్యవిమర్శలో ప్రధాన ద్రవ్యం.

ఇది సంకుబితమైనథి కాదు. శ

తాత్కాలికంగా కానవచ్చినా సర్వమానవానుభవమై

నిరంతరమైంధి. ప్రవాహ లక్షణంతో శాశ్వతమైంది.

తాను దిక్కాలాదులను తొలగించుకుని

సొధారణీకరణం వొంధి రసమవుతుంది కావ్యం.

అనంతకోటి జీవల వేదన'లకు ప్రొతినిద్యం వపొంచి

నత్యపరిమితులను దాటి బుత పరిమితులను తాకినప్పుడు

ఆద్యాత్మిక పక్షమవుతుంది.

ఈ మూటీికి ప్రాతిభానిక భేదం తప్ప ఆత్యంతిక భిన్నత్వం లేదు.

అన్ని విమర్శలకు ఆధారం మానవ జీవనానుభవమే.

ఈ నైరంతర్యాన్నే నేను సంప్రదాయమంటున్నాను.

దానిలో సర్వదేశ దశాకాలములు నొమరస్యం కలిగివుంటని, వ. ఇధి గతకాలవు మృతపదార్థం కాదు. , ఎప్పటికప్పుడు వర్తమాన విజ్ఞానంతో, నంవేదనలతో ముడివేసుకుంటుంది. .

ల్‌ శక ్ర్రభక్కు రారా ధియేజర్‌ద్యక మంటే ౨60 టక! .