Telugu karimnagar zilla telugu sahitya charitra - anilvaranasi/indianlanguages GitHub Wiki

టవ సను వ. కరీంనగర్‌ జిల్లా. యః

తి శ - . . తెలుగు సాహిత్య చరిత . నం న్నా (కీ శ 950 - 19850 "| / ॥ ॥ (1. - శా. మలయశ్రీ ల |. ఎం,ఏ., ఎ౦.ఓ.ఎల్‌., పిహెచ్‌.డి. | స ఎం న శ వ. | య 1 -.. కరీంనగర్‌ _ 008 001; ఆంధప్రదేశ్‌ /

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత (కీ. శ. 950 - 1950) డా. మలయశ్రీ

ఎం.ఏ., ఎం ఓ,ఎల్‌., పిహెచ్‌.డి

సత్యార్సి పల్లి కేషన్స్‌ ఠి లం

కఠింసగర్‌ - 808 001; ఆంధ్యవదేళ్‌

శేవిడ2100ర2ర్రట 1112 కొం! %92 5211492 రషతడటు2 00 |. 18188 5౧1. ౧1.4.. ౧1.0.౬.. ౯౧.౨. [5154 ౯౧1౧1 - ౮౮1 1997 0. 1000 ౧౦౧1౪9 య 1 గడ16 :; ౧౩. 100/- ణీ ఈం ల 4440?

ఈ (0.0.) పిహెబ్‌. డి. వరిశోధన [గంథం తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ వారి (1996-97) ఆర్థిక నహాయం రూ, 7800/-_ తో మ్యుదితం,

అట్‌”, మలయశ్రీ

? భంది ధాలం్య ఖా [౧1664 81- జాం” వ! ఖా శిగిలం8గడ 5౧168 + ఓ స 5120408020 గ౪/66|40రర-500.028. .గ. క. య క ర్ట ద్రషార్త/ శం

ము పైత తమా 0

507 60౧169 ;- అగ. 1812౪8 5%, 5-4-119, ఉగ ౦6రే5ి48 గ౮86, క౦0గగి?1ఓ4 - 505 326 915౬ సం/1%008047 - &ి.గి.

అ విషయ సూచిక మొదటి భాగం : పు. 1-180 (ప్రవేశిక : లాలన |! తెలుగు శాసన సొహిత్యం: శ్రీశ. క46.1825

  1. వేములవాడ చాసక్యుల కాలంనాటి కానన సాహిత్యం
  2. కల్యాణి చాటుక్యుల కాలం-నాటి శాసన సాహిత్యం ఫీ కాకతీయుల కాలం నాటి కానన సాహిత్యం (శానన) సాహిత్య నమాలోకనం _- 1 1, రాజుల కాలంలో వర్ధిల్లిన తెలుగు సొహిత్యం - 1416 శ తాబ్బులు
  3. మడికి సింగన, 1. కందనామాళ్యుడు, శ వెలిగందుల. నారన, శ. చరికొండ ధర్మన, అను;శుత కవులు _ ఆలబ సొహిత్యం ( బ్ద న్‌ 1, వేములవాడ ఖీమకవి, 2 శరభాంక కవి, శ, ఎడపాటి ఎజ్జయ, 4, చుండి కాళయ్యం సాహిత్య నమాలోకనం - 2
  4. అనంతరకాల తెలుగు సాహిత్యం: 17, 18 శతొబ్దులు
  5. శేషప్ప, 1. ముద్దు బాలం భట్టు, .
  6. కుందావజ్జిల గోపాలకృష్ణ కవి, 4 ప్రరాంకుళం గో పాలకృష్ణయ్య అను [శత కవులు _ అలబ్ది సాహిత్యం - 1 రాజలింగ కవి, 1. సోమనాథ కవి, $. కోడూరి వేంకటాచలపతి, శ. ఆలూరి పౌపకవి, సాహిత్య-నమాలోకనం - కీ

1౪. పందొమ్మిదవ శతాబ్ది సాహిత్యం : క, పాత పానయ్యశాస్త్రీ, ఏ. కాకుత్సం నరసింహదాసు, శ. కృష్ణగిరి వేంకట రమణయ్య, 4. ఖండేరావు మాధవరావు, ర్‌ం వరవసు మునినాథ కవి. యతగానాలు :

  1. చెరవలి కాశీనాథకాస్త్ర్ర, 2. నారంభట్ల రమణయ్య, అలా గు
  2. నారంభట నరహరి, (4. చతుర్వేదుల తులసీరాం, క. న్యాలకొండ కిషన్‌రావు, 6. రాజా రామానంద కవి, 7. రుద ఎజ్జయ్య. మధుర కవితలు ;
  3. సిరిశినహళ శీనయ్య, 1. సీతారామ యతీందులు, 8 జె శెటి రాజయ్య సెహిత్టో.సమాలోకనం _ 4 రెండవ భాగం : పు. 181267 అద ౪. ఇరువదవ శతాన్ది పూర్వార్థ సాహిత్యం : గోలకొండ కవుల నంచిక "కెక్కిన కరీంనగర్‌ జిల్లా కవులు క్ష పద్య కావ్యాలు, 1, యమషగానాలు,
  4. మధుర వేదాంత కవితలు, 4. వచన వాజ్మయం. గ! స శ ఆ౦కిత ౦ -_ (పొ ఫెనర్‌, అధికారభాషా సంఘాధ్యమరాలు, రచయి తతి డా. యళోదొ తిరుమలరెడ్డి గారికి అభిమాన౦తో =శార చయిత ఈ (గంథ రచనలో లోడ్చడిన వారికందరికీ కృతజ్ఞతలు

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర స్‌ మొదటి భాగము

తెలుగు శాసన సాహిత్యం: (క్రీశ. 946 నుండి 1325 వరకు)

కరీంనగర్‌ జిల్లాలో తెలుగు కావ్యసాహిత్యం కంటె ముందుగా శిలా శాసన సాహిత్యం కనిపించుతున్నది. అవి పద్య గద్యాత్మకాలుగా ఉన్నాయి.

రాతియుగ, లోహయుగ, ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల .... సంస్కృతుల అనంతరం, ఇక్కడి తొలి ప్రభువులు వేములవాడ చాళుక్యులు. ఆ తర్వాత కల్యాణి చాళుక్యులు - కాకతీయ చక్రవర్తులు, వారి ప్రతినిధులు - సామంతులు ఇక్కడ పరిపాలన సాగించారు. అందుకే ఈ ప్రాంత శాసన సాహిత్యం, పై మూడు రాచరిక కాలాల వారీగా విభజించి మూడు శీర్షికలలో చూపబడుతున్నది.

  1. వేములవాడ చాళుక్యుల కాలంనాటి శొసన సాహిత్యం.

  2. కల్యాణి చాళుక్యుల కాలం నాటి శాసన సాహిత్యం.

  3. కాకతీయుల కాలం నాటి శాసన సాహిత్యం.

ఆయా రాజుల కాలం నాటి శాసన సాహిత్య వివరాలివి.

  1. వేములవాడ చాళుక్యులకాలం నాటి శాసన సాహిత్యం:

వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ. 750-775) ఈ రాజవంశ మూల పురుషుడు. చివరి రాజు మూడవ అరికేసరి 966 వరకు పాలించాడు. ఈ వంశ రాజులు మొత్తం పదిమంది.' వీరు రాష్ట్ర కూటులకు సామంతులు. వేంగి చాళుక్యులకు ప్రత్యర్థులు. వీరి మొదటి రాజధాని బోధన్‌ - పోతన నగరం. ఇది నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. రెండవ అరికేసరి (క్రీ.శ. 930-955) బోధన్‌ నుండి తమ రాజధానిని కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకాలోని వేములవాడ - లేంబుల వాటికకు మార్చాడు

ఈ ప్రభువుల శాననాలు ఈ జిల్లాలో లభించిన అయిదూ సంస్కృత కర్ణాట భాషల్లోనే

.. ఉన్నాయి. వీరి పాలనా కాలంలో కేవలం ఒకే ఒక్క శాననంలో తెలుగు పద్యాలు కనిపించాయి.

ఈ శాసనం దాని వివరాలు ఈ (క్రింద చూపబడుతున్నవి. ఆ, జిన వల్లభుని కురిక్యాల శాసనం *

కన్నడ లిపిలో ఉన్న ఆ శాసనం ఇది.

“ఓం నమః సిద్ధేభ్య: (1) స్వస్తి సమస్త సకళ కళా కళాప ప్రవీణం భవ్యరత్నాకరం గుణపక్షసాతి బెంగినాడ సప్త గ్రామ గళొళ గణ వంగిపజ్ఞ కమ్మెబ్రాహ్మణం జమదన్నీ పంచార్జేయం శ్రీవత్స గోత్రం

__ గుణ్గికజ్జ నిడుం గొట్టె యభిమాన చన్దన మర్‌మ్మం భీమపయ్యన బెళ్వాల దణ్పిగెజెయ జోయిస

సింఘన మర్‌మ్మ ళబ్బ ఐబ్బెయ మగం కొణ్జకునైెయ దేసిగ గణ దపొళ్టగెయ బజీియ పణ్జరంగ వల్లియ జయణస్ది సిద్ధాన్త భటారర గుడ్డం జినవల్లభం సబ్బినాడ నట్ట నడువణ ధర్మపురదుత్తర దిగ్భాగద వృషభగిరి యెంబనాది సంసిద్ధ తీర్థద దక్షిణ దిశాభాగదీ సిద్ధ శిలె యొళ్ళమ్మ కుల దైవమాద్యన్త జిన బింబంగళుమం చశ్రేశ్వరియుమం సపెఅవుం జిన ప్రతి మెగళుమం త్రిభువన తిలకమెంబ బసదియుమం కవితా గుణార్జవమెంబ కెటి యుమం మదన విళాసమెంబ బనముమం మాడిసిదం.*

2 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగర్‌ జల్లా తెలుగు సాహిత్య చరిత్ర” ఇప్పుడు ఈ తెలుగు సాహిత్యం మన భారత దేశంలోని ఏ ఇతర భాషా సాహిత్యానికి కానీ, రాశిలోనూ వాసిలోనూ తీసిపోని సమున్నత స్థానాన్ని అధిష్టించింది. వెయ్యేండ్ల ఆంధ్ర సాహితీ మహాస్రవంతిలో ఈ కరీంనగర్‌ జిల్లా సబ్బి రాష్ట్రం తెలుగు సాహిత్యం ఒక ఉపనది. ఈ మండలం మొదటి నుండి కవి పండితులకు నిలయం. కన్నడ ఆది కావ్య సృష్టి పంప మహాకవి చేత ఇక్కడి వేములవాడలో జరిగింది. కథా సరిత్సాగరం రచించిన సోమదేవ (ప్రభు ఇక్కడి వాడు. సంస్కృతంలో నాడూ నేడూ ఈ ప్రాంతంలో ఉద్దండ పండితులు - మహాకవులున్నారు.

ఈ జల్లాలో వందల సంఖ్యలో తెలుగు కవులు అసంఖ్యాక కావ్యాలను రచించారు. నేటి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని నాటి సబ్బిసాయిర మండలంలో వేముల వాడ, రామగిరి, నగునూరు, పాలాస, వెలిగందుల, ధర్మపురి, శనిగరం, మొలంగూరు, మొదలైనవి సామంత రాజధానులు.

కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి ప్రముఖ యాత్రా స్థలాలు.

రాచరిక కాలాల్లో ఇక్కడి పాలకులు తెలుగు కవుల పోషించి చక్కని పద్య కావ్యాల విరచింప చేశారు. మాతృభాషాభిమానంతో ఈ ప్రాంతంలోపలువురు కవులు స్వతంత్రంగానూ గ్రంధ రచన కావించారు. కరీంనగర్‌ జిల్లా (సబ్బివాడు)లో తొలి తెలుగు పద్య కవిత వేముల వాడ జినవల్లభుని కంద పద్యాలతో క్రీ.4946 సం.లో ఆరంభమైంది. ఆ తర్వాత కాకతి యుగం వరకు దాదాపు రెండు పందలేండ్డు కన్నడ సంస్కృత భాషల్లో శాసన - కావ్య సాహిత్యం వచ్చింది తప్ప, తెలుగు కావ్యాలు రాలేదు. అ కాలంలో మితంగా తెలుగు వచనం శాసనాల్లో చోటు చేసుకున్నది. ఈ జిల్లాలో కాకతీయుల పరిపాలనా కాలమైన 12, 13వ, శతాబ్దాల్లోనూ సంస్కృతాంధ్ర పద్యగద్య శాసనాలు తప్ప ప్రత్యేకంగా కావ్య సృష్టి జరిగిన ఆధారాలు లేవు.

14వ, శతాచ్చిలో మడికి సింగన కవి, 15వ శతాబ్ది వెలిగందుల నారన, 16వ శతాబ్చివాడైన చరికొండ ధర్మన తెలుగు కావ్య నిర్మాతలు, వేముల వాడ భీమకవి ఇక్కడి వాడనే ప్రతీతి.

16 నుండి 19 వరకు, నాలుగు శతాబ్దాల్లో నరసింహ శతక కర్త శేషప్ప, వసుచరిత్ర ప్రబంధ వ్యాఖ్యాత సోమనాథుడు తప్ప ఇక్కడి మరే రచయిత పేరూ వ్యాప్తి పొందలేదు అయినా ఆ కాలంలో ఇక్కడ కొందరైనా కావ్య కర్తలు లేక పోలేదు. కృష్ణ శతక కర్త నరసింహదాసు కూడా ఈ జల్గావాడు. పద్య కావ్యాలతోపాటు యక్షగాన వాబ్మయం కూడా నాడు ఈ మండలంలో పుష్కలంగా వెలువడింది. ఇక్కడి కవులు 19వ శతాబ్దిలో కూడా గత సంప్రదాయ పద్ధతిలోనే రచనలు చేస్తూ వచ్చారు. 20వ, శతాబ్ది పూర్వార్ధం వరకూ అంతే.

ఈ ఇరువదవ శతాబ్దిలో ఈ కరీంనగరం జిల్లాలో అపారంగా సాహితీ సృష్టి జరిగింది - జరుగుతున్నది. అఖిలాంధ్ర - భారత ఖ్యాతిని ఆర్జించిన కవులు - రచయిత(త్రు)లు ఇక్కడి వారు అనేకులున్నారు.

ళఈ జిల్లాలో వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి - చేస్తూ రాణించిన వారిలో కొందరు ముఖ్యులు వీరు -

మొదటి భాగం, ర్రతేశి 3

సర్వశ్రీ మన దేశ ప్రధాని పి.వి. నరసింహారావు; జ్ఞాన పీఠ అవార్డు (గహీత ప్రొఫెసర్‌, పద్మశ్రీ

డాక్టర్‌ ॥సి. నారాయణ రెడ్డి, అధికార భాషా సంఘాధ్యక్షురాలు ప్రా. డా॥ పి. యశోదా తిరుమల్‌ంెడ్డి,

తెలుగు అకాడమి కులపతి డా॥ వి. కొండల్‌ రావు; కలెక్టర్‌ కవి డా॥ జె. బాపురెడ్డి; కీ.శే. మామిడి

= పల్లి సాంబశివ శర్మ; క్రిశే. శతావధాని సిరిశనహల్‌ కృష్ణమాచార్యులు, క్తీ/శే వానమామలై

జగనాధాచార్యులు, కీ.శే. వేంకట రాజన్న అవధాని; కీ.శే. సేనాపతి వం! కీశో. పింగళి

లింబాద్రి రెడ్డి: కీ శే. వెలిచాల కేశవరావు; జువ్వాడి గౌతమరావు; డా॥ కె. రాజన్న శాస్తి; ముద్దసాని

రాంరెడ్డి; కీ శే. గట్టెపల్లి సత్యనారాయణ రాజు;కె. మల్లికార్జున్‌; కనపర్తి: కీ.శే మహ్మదలీ కవి; తాడిగిరి

పోతరాజు; కీ.శే. జి సురమౌళి; డా! మలయశ్రీ; వడెపల్లి కృష్ణ; కీ.శే. దశరథ్‌; కీ.శే. ఆభివేంకటాచార్యులు;

డా; అందె వేంకటరాజము; నల్లాన్‌ చక్రవర్తుల వేదాంతాచార్యులు; పార్వేల గోపాలకృష్ణ; దూడం

నాంపల్లి; చాప్పకట్ల చంద్రమౌళి; శ్రీగాదె శంకరకవి; కవి గణపతి రామచంద్రరావు; డా॥ ముదుగంటి

. సుజాతా గోపాల్‌రెడ్డి; డా। తిరుమల శ్రీనివాసాచార్య; డా |! అనుమాన్ల భూమయ్య, డా॥ రావికంటి

వసునందన్‌; అల్లం రాజయ్య; కీ.శే అలి౫ట్టి ప్రభాకర్‌; కీ.శే. సాహు వెంకటేశ్వర్లు; బి.ఎన్‌, రాములు;

డా॥ కాలువ మల్లయ్య: కే.వి, నరేందర్‌ సుద్దాల అశోక్‌ మొదలగు వారు వివిధ సాహితీ రంగాల్లో పేరు పొందిన వారు.

ఇంకా చిక్కని పద్య కావ్య కవులు, చక్కని గేయకవులు వందల్లో ఉన్నారు. యక్షగాన కవులు పదుల సంఖ్యలో ఉన్నారు. వచన రచయితలు, నవలా - కథా రచయితలు గణనీయంగా ఉన్నారు. రచయిత్రులు మాత్రం తక్కువ.

ఈ శతాబ్దిలోనే కొన్ని వందల మంది కవులు సంప్రదాయ అభ్యుదయ మార్గాల్లో రచనలు క్షావించినా అందులో పలువురి రచనలు పుస్తకాల రూపంలో రాలేదు. ప్రచురిత గ్రంథాల్లో అనేకం ఈ జిల్లాను దాటి వ్యాప్తి పొందలేదు. అది ప్రావేశిక కవులకు రచయితలకు మాత్రమే పరిమితం కాక, పండిత కవుల విషయంలోనూ జరిగింది. వుస్తక ప్రచురణ విక్రయ సంస్థలు తెలంగాణాలో, అదీ ముఖ్యంగా ఈ కరీంనగర్‌ జిల్లాలో తక్కువ, దానితో ఈ ప్రాంతపు మంచి కవులు కూడా ఇతర ప్రాంతాలకు తెలియకుండా మరుగున పడిపోయారు. ॥

శ్రీశ 942 నుండి 1995 వరకు, ఇంచుమించుగా కరీంనగర్‌ జిల్లాలో వర్ధిల్లిన, వెయ్యేండ్ల కాలపు తెలుగు సాహిత్యం ఈ పరిశోధన వ్యాసంలో నంగ్రహంలోవనే సమగ్రంగా పరిచయం. పరామర్శ కావించబడుతున్నది, "|

ఇంతవరకు సాహిత్య చరిత్రకారులు ప్రముఖ కవుల "పేర, రాజుల పేర, శతాబ్దాల కాలం "పేర, సాహితీ ప్రక్రియల పేర, రకరకాలుగా తమ గ్రంథాలలో శీర్షికా విభాగం కావించుకున్నారు.

ఈ గ్రంథంలో ఈ జిల్లాలో వెలువడిన సాహిత్యాన్ని బట్టి, విషయ వివరణకు అనుకూలంగా అధ్యాయాల విభజన జరిగింది. గ్రంథం మూడు భాగాలు, వానిలోని శీర్షికలు ఇవి.

శ డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” మొదటి భాగం = శ్రీశ. 942 - 1900 అధ్యాయాలు నాలుగు

  1. తెలుగు శాసన సాహిత్యం, 7 రాజుల కాలంలో వర్టిల్లిన తెలుగు సాహిత్యం,
  2. అనంతర కాల సాహిత్యం, 1” పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యం, రెండవ భాగం :- 1901 - 1950, అధ్యాయం ఒకటి
  3. 20వ శతాబ్ది పూర్వార్ధ తెలుగు సాహిత్యం, మూడవ భాగం :- 195] - 1995 అధ్యాయాలు రెండు. 1/1 20 వ శతాబ్ది ఉత్తరార్ధ సాహిత్యం, 11 జానపద సాహిత్యం - పత్రికలు - అభినందన సంచికలు. విషయ విన్శృతిని బట్టి ఈ శతాబ్ది సాహిత్యాన్ని వివిధ సాహితీ ప్రక్రియల వారిగా ఆయా శీర్చికల క్రింద నివరించడం జరిగింది. ఈ కాలపు విప్లవ సాహిత్యానికి ఒక ప్రత్యేక శీర్షిక కెటాయించాలని అనుకున్నా వీలు కాలేదు. అది ఆయా సాహిత్య ప్రక్రియా విభాగాలలోనే ప్రచురణ కాలక్రమాన్ని బట్టి చేర్చి వివరించబడింది. ఇరువదవ శతొబ్దిపూర్వార్ధ సాహిత్యం పద్య, గద్య యక్షగానాది ప్రముఖమైన మూడు నాలుగు విభాగాల్లో చూపబడింది. 1934 నాటి 'గోలకొండ కవుల సంచికిలోని ఈ జిల్లా కవులను ఒక (ప్రత్యేక శీర్షికలో చూపడం జరిగింది. ఇరువదవ శతాబ్లి ఉత్తరార్ధ సాహిత్యం నేడు వ్యాప్తిలో ఉన్న సాహితీ ప్రక్రియలను బట్టి దశాధిక శీర్షికలలో పరిచయం చేయడమైంది. ఒక్కొక్క ప(క్రియలో ఉపశిర్చికలు సైతమున్నవి. ఈ కాలవు ఒక కవి - రచయిత రచనల పూర్తి పరిచయంకోసం వివిధ శీర్షికలను చూడవలసిన అవసరం ఉంది. ఇది పాఠకులకు కొంత అసౌకర్యంగా ఉన్నా, ఈ (గ్రంథాన్ని 'కవుల చరిత్ర'గా కాక 'సాహిత్య చరిత్రగా వ్రాయడం వలన, ఈ ప్రక్రియా విభాగం అనివార్యమైంది. అయినా ఒక రచయితను మొదటిసారిగా పరిచయం చేసినప్పుడు ఆ రచయిత ఏయే ప్రక్రియలలో రచనలు చేసింది వివరించబడింది. తర్వాతి రచనలు పరిచయం చేసే సందర్భంలో మొదట పరిచయం చేసిన విషయం సూచించబడింది. కొందరు కవులు - రచయితల పై వారి రచనలపై ఎంతగా అభిమానమున్నా గ్రంథ ప్రణాళిక పర్యవేక్షణ నిబంధనలు విధించిన హద్దుల పరిధిలోనే ఎంతో మనో నిగ్రహంతో ఈ కరీంనగర్‌ జిల్లా సొహిత్య పరిశీలన వ్యాసరచన కావించబడింది. వీలైనంత వరకు కలం పట్టినవారిని అందరినీ సంతృప్తి పరచే ప్రయత్నం చేశాను. ఇది బృహత్కార్యం. ఏక హస్త కృతం కనుక ఏవైనా అనాలోచితంగా పారపొట్లు జరిగినా క్షంతవ్యాలు. విద్వానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమం! అవాశా శ్రర గ్రైర్సు గమనము.

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర ప్రవేశిక : వెయ్యేండ్డది తెలుగు సాహిత్యం, ఇంచుమించు రెండు వేలేండ్లది తెలుగు భాష.

భారతదేశంలో జనసంఖ్య శీత్యా తెలుగు వారిది రెండవ స్థానం. భాషా సాహిత్యాల విషయంలోనూ అంతే.

సంస్కృత ప్రాకృత భాషా సాహిత్యాలు క్రీస్తుకు పూర్వ కాలపువి. వాటి ప్రభావం ఇతర భారతీయ భాషలపై వలెనేతెలుగు పై కూడా ప్రసరించింది. తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. అయినా మనవాళ్ళు మత సంస్కృతుల - రాజకీయాల కారణంగా సంస్కృత "ప్రాకృతాలను అమితంగా ఆదరించారు. వాటిని తమ మాతృభాషగా అభిమానించి, అధ్యయనం చేసి, పాండిత్యం సముపార్షించారు. ఆ భాషల్లో ఉఊధద్గంథ రచనలు చేశారు. అయినా -

మన పూర్వులు తమ మాతృభాష అయిన ఆంధ్రాన్ని నిరాదరణపాలు చేయలేదు. దీనిని శ్రుమిస్తూ పెంపొందించుతూనే ఉన్నారు. సంస్కృత ్రాకృతాలతో దీనికి పుష్టిని చేకూర్చారు. తెలుగు సాహిత్యాన్ని వెలయించారు.

శ్రీశ 5, 6 శతాబ్దాల నుండే తెలుగు కవిత వ్యాప్తి పొంద సాగిందనడానికి నిదర్శనం 9వ శతాబ్దిలోని అద్దంకి బెజవాడల తెలుగు పద్యశాసనాలు.

క్రీ.శ. 1050 సుమారుగా నన్నయభట్టు తీరాంధ్ర దేశంలో భారతాంధ్రీకరణం కావించి, ఆదికవి బిరుదుకు పొత్రుడైనాడు. తదాదిగా ఎన్నో సంస్కృత పురాణ కావ్య నాటకేతిహాసాలు తెలుగు సేయబడ్డాయి. స్వతంత్ర కథా కావ్యాలు, వర్ణనా ప్రబంధాలు కూడా వచ్చాయి. ఆ కాలంలో పద్యానిదే పై చేయిగా ఉండేది. అయినా అప్పుడు ఆ మార్గ కవితకు సమాంతరంగా, దేశి కవితా ప్రక్రియలైన యక్షగాన, గేయ, వచన రచనలు, కొంత ఆలస్యంగానైనా గణనీయంగా వెలువడ్డాయి.

జానపద గేయకథా వాబ్మయానిదొక ప్రత్యేక శాఖ. మానవులకు మాటతోపాటే పాట వుట్టింది. అది నాడు నాగరికుల ప్రశంసలకు నోచుకోకున్నా జానపదుల, స్రీల, బాల బాలికల హృదయాలను దోచుకొని, నొటి నుంచి నేటి వరకు అవిచ్చిన్నంగా సాగి వస్తున్నది. ఈనాడు పండిత పామరుల అందరినీ రంజింపజేస్తున్నది.

ఆధునిక యుగంలో ఆంగ్ల సాహిత్య పరిచయం వలన కథ, నవల, నాటిక, వ్యాసం, అత్మకథ వంటి వివిధ నూతన ప్రక్రియలతో తెలుగు సాహిత్యం బహుముఖమై విలసిల్లింది. ఉర్దూ అరబ్బీ సాహిత్యాల వలన ఎంతో కొంత మన భాష మారిందే తప్ప సాహిత్యం మారలేదు. అప్పుడు నూతన సాహితీ ప్రక్రియలు అవతరించలేదు.

6 డా॥ మలయత్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిల్వ చరిత్ర” వృత్తం॥5 భ్రాతర్ధర్మ పురం ప్రయామ కిమతో జైనాభిషేకోత్సవ క్షీర ప్లావిత తుంగ శృంగ వృషభక్షోణీద్ధ మిక్షామహే యాత్రా యాత సమస్త భవ్యజనతా సన్మానదానోద్యతం పంపార్యానుజ మత్రభీమ తనుజం సమ్యుక్ష్వృ రత్నాకరం (1) గీతంగాతు మనేక భేద సుభగం కావ్యాని సోచ్చావచం వాచా వాచయితుం ప్రియాణి వదితుం సాధూపకర్తుం సతాం భోగాన్సేవితు మంగనా రమయితుం పూజాంవిధాతుంజినే జానీతే జిన వల్లభ జృరమిదం పంపాభిధానానుజః (2) 6 అజస్రజిన వన్దనాగత మునీశ్వర శ్రావక ప్రజాస్తవరవ ప్రతిధ్వనిత శబ్ద కోలాహతై () అధిష్టిత దిగంబరోవృషభైల ఏష స్వయంపరాం వదతి వాచకాభరణ కీర్తి మాకళ్చ్ళతః (3)

7 బగియలళుంబమో బగెయ నార్చగి వొబ్బగి గాసె యల్తు దె ట్టగె పొలనల్తు నీళ్లసజియోళ్లిన బింబమ నీత నీ గళ న్తగజిసి దప్పానెన్లు బగె వన్నెవరం జినబింబ మల్లి తొ ట్రగె నెగజ్జి ల్టువేం చరిత మచ్చరియో జినవల్లభేన్లనం. (4)

ఇదు కవితా గుణార్ణవన కీర్తియ మూర్తి వాలాగి దక్షిణా ర్థద వృషభాద్రియక్కె వృషభేశ్వర బింబ సనాధ 'మెంబలం పాడవె నిజ ద్విజావ సధ పర్వతమం జినచైత్యమాగె మా డీద జినవల్లభంగె జినవల్లభు నప్పుదు మొన్దు చోద్యమో. (5) చదుర మయ్మెయ సత్కవిత్వద సన్ష పంపన తమ్మనో -ర్వదె పాగత్లైయె బాజి సల్బరెయల్కవిత్వద తత్వదొ బ్పుదిదునే ర్వడే పేఅలుర్విగ పూర్వమాగిరె బల్గొన ప్పుదజి నార్వనె వాగ్యధూవర వల్లభం జినవల్లభం. (6) క వనుత చళుక్య వంశపతి మిక్కరి కేసరి సన్హ విక్రమా ర్జున విజయక్కె ధర్మపురం మెన్టు మదేయ మిదెన్ను కీర్తి శా సన మెనెకొట్ట శాసనద పంపన నంబిదు దొన్దు జైన శా సనద నెగత్తెయం వృషభపర్వత మన్తదు తానె పేజదే (7)_ ఎసగెల్గాళి పు గల్చ తంగ కిరణం సారల్మిగం పాజలా గసదొళ్చక్కిగళల్లి సల్ల వెనిసి (న్యోదయం ధర్మదాొ శ్లసమం పొంపుతి మాడె మెచ్చి హరిగం పంపంగి గొట్టా ద్విజా వ సధ గ్రామ మదేన్నెగత్తైెయ కళాప గ్రామ మంపాల్తుదో (8) బరదుదే తాంబ్రశాసన మదేయమె ధర్మపురం నెగట్లెవె త్తరిగన కొట్టుదే నెగజ్జ పంపన పెత్తుదె పేటి మెన్టునీ

మొదటి భాగం, ॥ అధ్యాయం: శానన్‌ నారొర్టం 7 మ్మరుఃకె పలర్మె యుంపలబరం బెసగొళ్ళదె పోగినోడసు న్హర వృషభాచళోన్నత శిళాతళ దొళ్చరె దక్కరంగళం (9) కన్దం॥జన భవనంబు లెత్తించుట జిన పూజల్సేయు చున్మ్కి జినమునులకు న త్తినయన్నదానంబీవుట _ జిన వల్లభు బోలంగలరె జిన ధమ్మ్పరుల్‌ (1) దిన కరు సరి వెల్లుదు మని జినవల్ల భు నొట్ట నెత్తు జితకవి నననుం మను జుల్గ్లలకే ధాత్రిం విని తిచ్చిదు ననియ వృత్త విబుధ కవీన్లుల్‌ (2) ఒక్కొక్కొ గుణంబ కల్గుదు రొక్కొబ్జిగా కొక్కలక్కలేవెవ్వరికిం లెక్కింప నొక్కొ లక్కకు మిక్కిలి గుణ పక్షపాతి గుణమణి గణంబుల్‌ (3) (1.23 నం. కల ఈ మూడు తెలుగు కంద పద్యాలు.) ఎను లోక మెల్లం పాగటెనె గట్టి జినవల్లభన సుధర్మ నంతతి యొళ్తొట్ట గుణావళియ నీ వృషభ గిరియ సిద్ధ శిలెయొళెబియమ్మం టంక్కోత్కీర్ణం మాడిదం॥ (కన్నడవచనం) చివరి తెలుగు పద్యాన్ని ఇప్పటి విధానంలో వ్రాస్తే ఇట్టుంటుంది. ఒక్కొక్క గుణమ గల్గుదు, రొక్కొడుగా నాక్క లెక్క లేవెవ్వరికిన్‌ లెక్కింప నొక్క లెక్కకు, మిక్కిలి గుణ పక్షపాతి గుణ మణి గుణముల్‌. శాసన విశేషాంశాలు:

శాసనకాలం- అరికేనరి - 2(933-955) ఈ శాసనం క్రీశ, 946 అని అంచనా. తేది వేసి లేదు.

శాసనకర్త- జిన వల్లభుడు; శాసనకవి - జిన వల్లభుడు, పంపకవి సోదరుడు.

నాడు ళ వృషభాద్రి (కురిక్యాల దగ్గరి కొండన్నపల్లి బామ్మలమ్మ గుట్ట) సుప్రసిద్ధ జైన క్షేత్రం (1) సదా జినవంద నాగత మునీశ్వరుల శ్రావకుల జనుల రవాల, ప్రతిధ్వనులతో మహాకోలాహలంగా ఉండేది. ఇది దిగంబర సంప్రదాయ జైన మఠం (3)

“సబ్బినాడు నట్ట నడుమ, ధర్మపురికి ఉత్తర భాగాన వృషభగిరి అను సంసిద్ధ తీర్థమునకు దక్షిణ దిశా భాగమందున్న ఈ సిద్ధ శిలపై తమ కులదైవములైన మొదటి చివరి తీర్థంకరుల ప్రతిబింబాలను, చక్రేశ్వరి అను "సేరిటి జివదేవతా విగ్రహమును, త్రిభువన తిలకమనే మఠం (వసతి), కవితా గుణార్జవ మనే కొలను, మదన విలానమను వనాన్ని ఏర్పరిచాడు”8 జిన వల్లభుడు.

ధర్మపురికి ఉత్తరాన 'జైన' అనే గ్రామ ముంది. దానికి ఈ శానన విషయానికి ఏమైనా సంబంధ ముండవచ్చు. అదే పంపకవి దానము పాందిన అగ్రహార వసతి కాబోలు, జిన వల్లభుని గుణ గణాలు: అతడు సంగీత పరుడు, ప్రియభాషణుడు, సాధువులకు ఉపకరించువాడు... మొదలైన సుగుణాలు కలవాడని 2వ శ్లోకంలో ఉంది. జిన వల్లభుడు జిన

8 డా॥ మలయతశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సొపొత్య చరిత్ర” చైత్య - మఠ స్థాపకుడు - మత గురువు. కన్నడ మహాకవి పంపనకు తమ్ముడైన జినవల్లభుడు “వాగ్వధూవర వల్లభుడు “చతుర కవిత్వ విశారదుడు' అని 6వ కన్నడ పద్యంలో వర్ణింపబడ్డాడు. ఈ శాసనమండలి 1, 7, 9 పద్యాలలోని పంపకవి వివరాలు కన్నడ సాహిత్య చరిత్ర రచయితలకు చాల ఉపకరించాయి. తెలుగులో నన్నయవలె కన్నడంలో పంపన ఆదికవి. ఆయనకు రెండవ అరికేసరి రాజు ధర్మపురి అగ్రహారాన్ని ఇచ్చిన విషయం ఈ శాసన కన్నడ వచనంలోను ఏడవ పద్యంలోనూ వివరింపబడింది. ఆయన విశక్రమార్దున విజయం రచించిన విషయంకూడా ఈ ఏడవ పద్యంలోనే ఉంది. రాజును పేర్కొన్నా రాజాస్థాన కవిని పేర్కొన్నా రాజధాని నగరం పేరు మాత్రం ఈ శాసనంలో ఉల్లేఖింపబడలేదు! వంశ వినరాలు:- వంగి పజ్ఞి కమ్మె బ్రాహ్మణులు పంచార్నేయ శ్రీవత్స గోత్రులైన ళబ్బణచ్చె భీమపయ్య జినవల్లభుని జననీజనకులు. ఈ జైన బ్రాహ్మణ కవి సోదరులు 'లేంబుల వాటిక” రాజాశ్రయం పొంది సన్మానాలందుకొన్నారు. ఇక్కడే జీవించారు. సాహిత్యవిశేషాలు:- ఈ శాసనంలో కన్నడ సంస్కృత భాషల్లో వృత్త పద్యాలున్నవి. తెలుగు భాషలో కేవలం మూడే మూడు కందపద్యాలు శాసనం చివరగా ఉన్నవి. అప్పటికి కందం తెలుగులో కొత్త. కాని, కన్నడంలో జిన వల్లభుని అన్న పంపన “విక్రమార్డున విజయరిలో వాటిని వ్రాశాడు. ఆ కావ్యంలోని 4 కంద పద్యాలు ! ఉత్పలం రెండవ అరికేసరి వేములవాడ శాసనం మొదట ఉన్నాయి." అంతకు పూర్వం తెలుగులో గద్య పద్య శాసనాలున్నాయి. 6వ, శతొబ్టి నుండి రేనాటి చోళుల తెలుగు గద్య శాసనాలు 30కి పైగా లభించాయి. 9వ శతాబ్దీ గుణగ విజయాదిత్యుని శాసనాలలో తరువోజ (అద్దంకి) సీసం (ధర్మవరం, కందుకూరు) మధ్యాక్కర (బెజవాడ) తెలుగు పద్యాలు కనిపించాయి* కందం పుట్టుక కరీంనగర్‌ జిల్లాలోనే. అదీ నన్నయ గారి మహాభారత రచనకు వందేండ్లు ముందుగా అనేది విశేషాంశకం! నన్నయభట్టు భారతాంధ్రీకరణం శ్రీ.శ. 1051 తర్వాత.” సంపకవి కన్నడ భారత రచన కీ.శ, 941లో." రెండవ యుద్ధమల్లుని కుమారుడైన బాదప రాజు, '“ఆరుంబాక' శాసనంలో తెలుగు కంద పద్య లక్షణాలు కలిగిన సంస్కృత కందం కనిపించినా దాని రచనా కాలం క్రీ.శ. 980వ సంవత్సరం.15 “కన్నడ మందు ప్రచారముందున్నా ఆ కందము యొక్క ప్రభావము వలన ఈ పద్యము వ్రాయబడిన దనుటకు వీలు లేదు. కన్నడమందలి కందమునకు (ప్రాసనియతి యున్నను యతి నియమము, సరూపాక్షర యతి నియమము లేదు. ఆ నియమము తెలుగు నందేయున్నది. ఈ కారణములచే తెలుగునందు ప్రసిద్ధమైన కంద ప్రభావమే పై సంస్కృత కందమునకు కారణమని చెప్పవలెను.” అని ౩. సంపత్కుమార గారు 'తెలుగు ఛందో వికాసంలో తమ అభిప్రాయం వెలిబుచ్చారు. కాని, సంస్కృతానువాదంలో మూల శ్లోకాల్లో లేని యతి 'ప్రొనలు కూర్చుకున్న నున కవులు, కన్నడ పద్యాలకు కేవలం యతి కూర్చుకోలేరా? యతి ప్రాసలు మన భాషా సాహితికి సహజాలంకారాలు! కన్నడ కవులు ప్రాకృతం మండి రగడ, కందం; తెలుగు నుండి ద్విపద, సీసం, గీతం ఛందస్సులను తీసుకున్నారని పండితుల అభిప్రాయం. కందం కన్నడం నుండి తెలుగులోనికి వచ్చింది. అదీ కన్నడ ఆది కావ్యం పుట్టిన కరీంనగర్‌ జిల్లాలో జినవల్లభుని ద్వారా, కందొనికి మూలం ప్రాళ్ళత గాథా ఛభందంలోని ఏడు రూపాలలో ఒక్షటైన “ఖండ ఆ' అనట౦ సత్యదూరం కాదు. సంన్మృతంలోని ఆర్యావృత్తం ప్రాకృత గాధా (ప్రభావంతో రూపాందినదనే లాక్షణికులు అంటారు. శాసన తెలుగు పద్యాల భావం: జిన భవనాలు (మఠాలు) కట్టించుట, జిన సాధువుల పూజలు చేయుట, జిన మునులకు నచ్చిన భోజనములు వెట్టటలో ఇతర జైనులెవ్వరూ జిన వల్లభునిత్తో సరిపోలజాలరు, (1)

మొదటి భాగం, | అధ్యాయం. శొననీ సాహొస్ఫ్యం రి

సూర్యునితో సమానముగా వెలుగు వారును, జినవల్లభునితో సరి తూగు మరే కవులునూ లేరు, (2)

ఒక్కొక్కరు ఒక్కొక సుగుణం కలవారుగా ఉంటారు. ఆలోచించి చూడగా జినవల్లభుడు గుణమణి, పైగా అతడు గుణపక్ష పాతి. (3) భాషా ఛందో విషయాలు:- ఈ శాసన పద్యాల్లోని తెలుగు భాష పరిణతి చెందినదిగా. లేదు.

నత్తిన - అత్తిన = నచ్చిన, ఈవుట = ఇచ్చుట (1)

నొట్టనెత్తు = నోట నెత్తు, వినుతిచ్చి = వినుతించి (2)

ఒక్కొండిగా = ఒక్కండుగా, లక్క = లెక్క, గణన (3)

ఇట్లా ఇందలి పదాలు పాత రూపాలలో ఉన్నాయి.

శాసనాలలోనే కాక తాళపత్ర ప్రతుల్గోనూ సర్వ సాధారణంగా కనిపించే లేఖనా విశేషాలు కొన్ని ఈ శాసనంలో ఉన్నాయి. వానిలో మొదటిది, అర్భానుస్వారం వాడవలసిన చోట పూర్ణానుస్వారం (నును) వాడటం. పందామ్మిదవ శతాబ్దికి పూర్వం అర్భానుస్వార వ్యాప్తి లేదుకదా! బిందువును అర్జ్భాను స్వారంగా, బిందువుకు పై అక్షరం ద్విత్వంగా ఉంటే అది పూర్ణానుస్వారంగా గుర్తించేవారు.

శెండవది, క్రావడి ఇప్పటి వలె కాక నాడు అక్షరానికి కుడివైపున 'న్‌' వంటి పొల్గుగా వ్రాసేవారు. వర్షము, వష ఇన వలె ఉండేది. ఈ రకారానికి పై అక్తరం ద్విత్వంగా ఉండడం కూడా జరిగేది. దీనికి ఉదాహరణం ఈ శాసనంలోని తెలుగు పద్యాల్లో లేకున్నా కన్నడ పద్యాల్లో చూడవచ్చు.

మూడవది, ప్రథమా విభక్తి 'ము' ప్రత్యయాంత తెలుగు పదాలు మొదట ౦బు, బులు కలిగి ఉండేవనడానికి నిదర్శనంగా ఈ పద్యాల్లో పదాలు ఉన్నాయి. ఉ॥ భవనంబు, దానంబు, గుణంబ, గణంబుల్‌ 'ము' ప్రత్యయాంతంగా ఏ ఒక్క శబ్దమూ వాడబడలేదు. ఈ పదరూపం ఇంతకు చాలా ప్రాచీనమైనదనడానికి నిదర్శనం “అమరావతి' స్తూప ఫలకం మిది 'నాగబు' అనే వ్రాత* ఆంధ్ర వాబ్మయ చరిత్రములో డా॥ దివాకర్ల వేంకటావధాని గారు కూడా ఈ విషయచర్చ కావించారు.” ఛందస్సు విషయంలో ఇప్పటి కంద పద్య లక్షణాలకు పై శాసనంలోని మూడు తెలుగు పద్యాలకు ఎటువంటి తేడా లేదు. సంస్కృతంలో లేని ప్రాస నిబంధనను కర్ణాటాంధ్ర భాషలు ప్రాటించాయి. కన్నడ పద్యాల్లో లేని యతీ నియమాన్ని - అక్షర మైత్రిని తెలుగు కవులు సమకూర్చుకున్నారు. జిన వల్లభుడు కన్నడ కవి. తెలుగులో రచన కొత్త, అందుకే నేమో మూడవ పద్యం రెండు పాదాల్గోనూ యతులు తప్పినవి. గణయతి (పాన లక్షణాలు మిగితా రెండు పద్యాల్లో చక్కగా ఉన్నాయి. మూడన పద్యంలోనూ కేవలం యతిభంగం తప్ప మరే ఛందో దోషమూ కానరాదు. భాష అప్పటిది. అది కావ్య రచనా స్థాయికి ఎదుగుతున్న దశ.

“కెైలుగు కంద పద్యానికి తెలుగు నాట ఇంత ప్రాచీన సంప్రదాయమున్నా ఏ తెలుగు శాసనంలోనూ ఇప్పటి దాకా ఇది కనబడదు” అని ఆరుద్ర 'నమగ్రాంధ్ర సాహిత్యం' నం. 1 పుట 3, 6 అనటం సరికాదు. వారి దృష్టికి ఈ కురిక్యాల శాసనం రానట్టుంది.

జన్మస్థానం, మాతృభాష, మతం ఏది ఏమయినా జిననల్లభుడు కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజ నన్మానిత కవి. అతడు తన అగ్రజుడైన పంపమహాకవి వలె ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు. జన మఠాధిపతిగా 'సాధు జీవితం' గఢిషాడు. శాంతిధర్మ ప్రబోధంతోపాటు త్రిభాషా సాహిత్యాన్ని వెలయించాడు. ఈ జిల్లా ప్రథమాంధ్ర కవిగానే కాక, అఖిలాంధ్ర దేశంలోనే మొట్టమొదట తెలుగులో కందపద్య రచన కావించిన ప్రయోగశిలిగా జినవల్లభుడు సంస్మరణీయుడు!

ఆ) అడవి సోమవపల్లి శాసనాలు” (ఏ.నం. 345; 1968)

మంథని తాలూకొ మానేరునది ఒడ్డున సోమనపల్లి గుహలయాలున్నవి. అక్కడ రామేశ్వర

గుహాలయం చెంత ఈక్రింది శాసన మున్నది. ఇది గద్యం. కేవలం మూడే పంక్తులు.

10 డా॥ మలయశ్రీ- “కరంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కోతి ఎక్క(టె)(వి) మున ప్రతిళ్బ శేసినది () గజు కొడుకు కెంపెన (వడి పని శెసెటె (ధ ద) బగవతి. (రామో (శ్వర) వడి. శాసనకాలం - 10వ శతాబ్ది"

శాసన భావం - ఈ రామేశ్వర దేవుని ప్రతిష్టించిన వ్యక్తి పేరు ఎక్కటె విమున. వడ్ణెపని చేసిన శిల్చి లేదా శాసన శిలవై అక్షరాలు గండరించినది (రా) గజు కొడుకు ౩౦పెన అని తెలుస్తున్నది.

అదే స్థలంలోని రెండవ శాసనం - నం,41 (ఏ.నం. 28; 1969) శొసన మూలం:;-

“స్వస్తి శ్రీమతు (13) నుగంటి ముచ్చిరడ్డి యీ రామాశ్వర దేవరకు నెవేద్యానకూ దీపానకూ ముగ్గున కూ విడిచిన (పన్నస) దీనికెవ్వరు దప్పినాను గంగ కటుత కవిల (పా) డిచినంత్త (దో) సము (యింత వట్టు) ఏమి ద (ప్పి) నాను అ దోసానత (పోవు) వాడు

శాసన కాలం;- 11వ శతాబ్ది. శాసన కర్తు- వెనుగంటి ముచ్చిరెడ్డి.

భావం: పెనుగంటి ముచ్చిరెడ్డి ఈ రామేశ్వర దేవరకు, దీప (ధూప) నైవేద్యానికి ముగ్గుల అలంకారానికీ విడిచిన పన్నస (ఇచ్చిన దానం). దీనిని ఎవరు తప్పినా (భంగ పరచినా) గంగలో కపిల గోవును చంపినంతటి దోషము. దీనికి తప్పినవారు ఆ దోషాన (నశించి) పోతారు. శాసనాల భాషా విశేషాలు :- ఈ రెండు శాసనాలు ప్రత్యేకంగా కవులో పండితులో వ్రాసినవి కావు. అప్పటి వ్యవహారంలోని తెలుగు భాష వాడబడింది.

మొదటి శాసనంలోని ఎక్కటె విమున, కెంపెన వ్యక్తుల పేర్లు. ఎక్కటీలు వీరులు, ఆ పదం ఇదే సంపుటంలోని రుద్రమదేవి కాలపు హుస్నాబాదు శాసనంలో వాడబడింది, ప్రతిష్ట, చేసినది, ఇెంపన, ఒడ్గెపని, భగవతి అనునని సరియైన పద రూపాలు. రామ+ళఈశ్వర = రామేశ్వర అని గుణ సంధి. అది రామాళ్వర అని వాడబడడం, అప్పటి జన వ్యవహారంలోని వినికిడి పదరూపం అనుకోవాలి.

రెండవ శాసనం భాష కొంత మారింది. రట్టగుడి, రడ్డి, రెడ్డి అని ఆ పదం పరివర్తనా క్రమం, దీపానకూ (కున్ను అని వ్యావహారికం, కూడా అని భావం) తప్పినాను (తప్పినట్టయితే అని) వ్యావహారిక పద రూపాలు. దోసాస అంటే చాలు. అదనంగా 'త' వాడటం మరో విశేష పదరూపం. థోషముతో అని దాని భావం. నాడు ఆలయాలలో ఇటువంటి దాన శాసనాలు సర్వసామాన్యం. వాటిని భంగపరచకుండా రాజులు శాసనాలు చేస్తూనే, గోహత్యాది పాప భయాలు చూపేవారు.

రాజులు, రాజబంధువులు, వివిధ హోదాల ప్రభుత్వాధికారులు, ధనిక వదాన్యులు భక్తిభావంతో ఆలయ నిర్మాణం కావించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించి, పూజా వైవేద్యాదులకు కట్టడి నేర్చాటు కావించి. ఇట్ట దానాలు కావించి శాసనాలు వేసే వారు. అవే నేటి జిజ్ఞాసువులకు నాటి చరిత్రను తెలిపే శిలాక్టరాలు! పాద పీఠికలు =

  1. యుద్ధమల్ల, మొదటి అరికేసరి, నరసింహ, రేండవయుద్ధమల్ల, బద్దెగ, మూడవ యుద్దమల్ల,

శెండవ నరసింహ, రెండవ అరికేసరి, వాగరాజ, మూడవ అరికేసరి.

  1. (౧60/10410%09 04౧64014 ౧16690, గడగగా౧౭౦౭ 015. గ6612016, ౧6౦1190606

తగ ౧౧2699 6ం౪6[00060% 4004601000 200 గ౮56౮౧౦౩, 1974,

  1. కరీంనగర్‌ జిల్లా శాసనములు. శా. సం 3; పుటలు 10,11,

  2. ఇంతవరకు శాసనం శన్నడభాష, వచనం. తర్వాత వరుసగా సంస్కృత కన్నడ తెలుగు ఫద్యాలున్నవి.

  3. 12, ఇవి సంస్కృత శ్చోకాలు శార్దూల విక్రీడిత వృత్తాలు; 6. వచనమో శ్లోకమో తెలియలేదు

  4. 4, 5,7,8, నం. కల కన్నడ పద్యాలు చంపక మాలలు. 6 నం. పద్యం తరలం. 8వది మత్తేభం

  5. కన్నడ శాసన భాగ వచనానువాదం - 3వ, పేరా; 9. శాసనంలోని వచనం మొదటి పేరా

మొదటి భాగం. ! అధ్యాయం: శాసన సాహిత్యం ]1 10. వేములవాడ, కఠ్యాణి చాళుక్య చక్రవర్తుల కాలశాననాల్లో 12వ శతాబ్ది వరకు లేంబులవాడ

  • వాటి (క) అనే ఉంది. 11 విక్షమార్డున విజయం (కన్నడం) ఆశ్వానం-1, పద్యాలు 15, 31, 4% 42, 50.
  1. నిడుదవోలు వెంకటరావు గారి 'ఆం(ధ్ర. వచన వాజ్మయం' లోని వివరాలు. ఆరుద్ర సమగ్రాంధ సాహిత్యం నం. 1. పుటలు 62-66, 78-64. 13... తెలుగు భాషా సమితి వారి “విజ్ఞాన సర్వస్వము - 3వ సంపుటి' వుట - 165
  2. డా; పల్గాదుర్ణయ్య గారి “(ప్రబంధ వాబ్మయ వికాసము' మొ - సంప్పటి, వుట 145
  3. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం - నం.1, పుట - 82.
  4. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' సంపుటాల ముఖ చిత్రం : వివరణ 6వ పుట. ఆంధ్ర వాజ్మయ చరిత్రము - పుట 9, తొలి ముద్రణ - 1958, పన్ఫెంతవ ముద్రణ - 1988,
  5. కరీంనగర్‌ జిల్టా శాసనములు, నం. 40.41: 18. కరీంనగర్‌ జిల్లా శాసనములు; పుట 112.
  6. ఈ శాసనాల్డో చెదరిన అక్షరాలను పురావస్తుశాఖ వారు పూరించినవి కుండలీకరణాలలో చూపబడినవి. వాటికి క్రీగీతలు కలలి - ఈ గ్రంథ దచయిత పూరించినవి.
  7. కల్యాణి చాళుక్యులు కాలపు తెలుగు శాసనాలు బాదామి పశ్చిమ చాళుక్యుల అనంతరం కర్ణాటాంధ్ర సామ్రాట్టులయిన రాష్ట్ర కూటులను ఓడించి కళ్యాణి కటకం రాజధానిగా ఈ (ప్రాంతాలను పరిపాలించిన కర్ణాటక చొళుక్యులను సైతం చరిత్రకారులు పశ్చిమ చాళుక్యులుగానే వ్యవహరించారు. రాష్ట్రకూటుల వతనంతో వారి బంధువులు సామంతులు అయిన వేములవాడ చాళుక్యరాజులు కూడా పదవీచ్యుతి పొందారు. కల్యాణ్‌ చొళుక్యరాజు ప్రతినిధులు మహామండలాదిపతులుగా కరీంనగర్‌ జిల్లాలోని శనిగరం, పొలాస, వేములవాడ, నగునూరు, రామగుండం, మంథని కేంద్రాలుగా ఈ నేల నేలారు. కాకతీయులు మొదటి నాలుగు తరాల వరకు ఈ కల్యాణి చశ్రవర్తులకు సామంతులే. అప్పూడు చారు కరీంనగర్‌జిల్లా హైదరాబాద్‌ మార్గంలోని శనిగరం నుండి హన్మకొండ ప్రాంతం వరకు ఏలికలు, క్రీ.శ. 992 నుండి ఈ జిల్లాలో కల్యాణి చక్రవర్తుల కాలం నాటి 21 శాసనాలు లభించాయి, అవన్నీ కన్నడ భాషలోనే ఉన్నాయి. ప్రాంతమేదైనా పాలకుల బట్టి రాజ భాష కదా! ఆ కాలపు తెలుగు శాసనాలు గంగపురం నగునూరులలో కనిపించాయి. అవి ఇక్కడ అ. గంగపుర శాసనం - మంథిని తాలూకా. ఇది తెలుగు గద్య శాసనం. మొదటి ప్రక్క- “... మండళీక... చక్రతారాధీశ్వర (అ), రి బిరుద మండళిక, మదన మహేశ్వరం (చ), కూర కులహ వార్ది వ, ర్లన సుధాకరం శివ, పొద శేఖరం (చా) ళు క్య రాజ్య మూళ స్తంభం. శ్రీమర్భూలోక మల్ల , డేవపాద పంకజ ్రీ మరం శ్రీమళు గుండె, రాజులు 1 సురే శ్వర దేవర (కు) నిచ్చిన రెండవ ప్రక్క (౨) పంచమ థఠ స్థానముల వొ, రు నెటుంగ నిల్పి, న కంభము దీని, కి నెవ్వరేని దప్పి, న వారు చళ్ణేశ్వే, రుని నిర్మాల్యం, బు దిన్నవారు, నారణాశిలోని, వేవరు బ్రాహ్మ) (ణు) లకు వేవురు, తపోధనులు... మూడవ ప్రక్క:- సర్వానేతాన్స్ఫావి, నః పార్థివేంద్రా, న్ఫ్బూయో భూయో యాచ, జే రామ చంద్రః -

12 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” (శాసనంలోని కామాలు శిలపైగల పంక్తులకు సంకేతాలుగా ఉంచబడినవి.) శాసన భావం - మొదటి శ్లోకంలో చెదరిన పదాలు శాసనకర్త బిరుదాలకు సంబంధించినవి. (కల్యాణి) చాళుక్య రాజ్యానికి మూల స్తంభమైన భూలోక మల్లదేవుని పాద పద్మ భ్రమరమైన శ్రీ గుండరాజు సూరేశ్వర దేవరకు ఇచ్చిన దానము - పంచ మఠ స్థానముల వారు చూడగా నిల్పిన కుంబము. దీనికి తప్పిని వారికి శివుని నిర్మాల్యము (దొంగిలించి) తిన్నంత దోషము; కాశిలో వేయిమంది విప్రులను, వేయి మంది మునులను - (చంపినంతటి పాపము). శాసనకాలం - భూలోక మల్లదేవుని కాలం; క్రీ.శ. 1126-37. శాసనకర్త- మంథని కూరకుల గుండె రాజు శాసన రచయిత,'బేఖకుని పేర్లు తెలియవు. భాషా విశేషాలు - మండలి, మూల, కంబం, ఇప్పటి పదరూపాలు అప్పుడు మండళి, మూళ, కుంభం అని వాడబడినవి. ఇవి తెలుగు పదరూపాలు స్పష్టంగా ఏర్పడని, బేదా సరియైన రూపాలు తెలియని దశ తబ్బిబ్బులు. శాసన వాక్యాల్లోని వ్యావహారిక భాషా ప్రయోగాలు గమనార్హం. కూర కులహ వార్ధివర్ధన సుధాకరం, పాద పంకజ భ్రమరం చక్కని ఆర్భాలంకారాలు. దీనిని బట్టి శాసన కవులు సంస్కృత పండితులైనా తెలుగులో వ్యావహారిక పదప్రయోగాలు చేసినట్లు భావించవచ్చు. చారిత్రక విషయాలు - కాకతి రెండవ ప్రోల రాజుతో ఓడిన మంథిని గుండరాజు ఇతడే. ఈయన పాలాస రెండవ మేడ రాజునకు తమ్ముడు.

ఇంచుమించు ఇదే కాలానికి చెందినది రామగుండం ఏడె రాజు శాసనం. అది స్థానిక వంకేశ్వర

దేవునికి సమర్పించిన దాన శాసనం. అది తెలుగు వచనంలో ఉన్నా చాలా భాగం శిథిలం. ఈ. నగునూరు శాసనాలు - కరీంనగర్‌ తాలూకా. ఇవి మూడు వేర్వేరు వీరగల్లులపై గల వ్రాతలు.

1... శ్రీమతుమహాదొమె. 2. శ్రీమతు మహ దొమె 3. శ్రీమతు మహ దొమె రజు ముంధట పొడిచి రజు ముందట పొడిచి రజుముందట ర్మత్యోభ గెలిచె కెలన్‌. గెలిచె నారప్పతి. యల పాడిచి గెలిచె సంగమ.

'పై శాసనాల భావం =

శ్రీమతు దొమ్మె రాజు ముందర శత్రు నైనికులను పొడచి గెలచిన వాడు కెలన.

రెండవ వీరుడు నారస్పతి. మూడవ వాడు సంగమ మత్తేభాల పొడిచి గెలిచాడట.

కాలం - కల్యాణి కటక కలచూసి బిజ్జ్ఞలుని కాలం; క్రీ.శ.1159

శాసనకర్త - నగునూరి దొమ్మరాజు

శాసన భాషా విశేషాలు - వీనిలోనిది అప్పటి వ్యవహారంలోని తెలుగు భాష. అది రాజభాషగా

కన్నడం వ్యాప్తిలో ఉన్నకాలం. “కెలన, నారప్పతి, సంగమ”వీరుల పేర్లు. దొమ్మరాజు. మత్తేభముల (మత్తే భోభయుల కానోపు) గుణింతం గమనింపదగినవి. ఇవి పండిత (వ్రాతలు కావు. సామాన్య చదుపరులు కూర్చిన మాటలు.

చారిత్రకాంశములు - కల్యాణి చాళుక్యుల సొమంతులైన పొలవాస మేడరాజు, నగునూరి

దొమ్మరాజు, మంథిని గుండరాజు, రామగుండం ఏడెరాజు చక్రవర్తిపై తిరుగుబాటు కావించారు. అప్పుడు వారిని కల్యాణ్‌ రాజ 'ప్రతినిధియైన కాకతి రెండవ ్రోల రాజు ఓడించాడు. చాళుక్యుల తర్వాత కల్యాణికి చక్రవర్తియైన చిజ్జ్ఞలుని ప్రతినిధి మైలగి దేవుడు కాకతి రుద్రదేవునిపై దండెత్తి వచ్చాడు. సామంతులైన మేడరాజు. దొమ్మరాజు అతనికి సహాయంగా వచ్చారు. వారిని రుద్రదేవుడు కఠరంనగర్‌ జిల్లాలోని ఆకునూరు, నగునూరు, పాలాస ప్రాంతాల్లో

మొదటి భాగం, |! అధ్యాయం: శొననీ సాహిత్ళుం 13 చిత్తుగా ఓడించి 1159-60 లో స్వతంత్రించాడు.” ఆ యుద్ధ వీరులవి ఈ వీరగల్లులు. వీరగల్లులనగా మృతవీరుల స్కృతిగా నిలిపిన శిలా విగ్రహాలు - వ్రాతలు.

“కరీంనగర్‌ జిల్లా శాసనములు' పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌ పురావన్తుశాఖ వారు ప్రచురించిన ఆంగ్ల పుస్తకంలోని 74 నం.లోని పై మూడు శాసనాలు తర్వాతి 4వ, కన్నడ శాసనంలో “ప్రమాది సంవత్సర వైశాఖ బహుళ శుక్రవారము నాడు దొమ్మరాజు, జగదేవుడు (శత్రువుల పదివేలు) ఎనబైవేలు పొడచి గెలిచి' నట్టున్నది*+ ఆ శాసనం ఇది:-

“స్వస్తి సమస్త ప్రశస్తి సహితం/శ్రీమతు మహామండళేస్వరం/దొమ్మెరాజులు శ్రీ మచ్చాళుక్య విభ్రమ గొ(ల)ద/ ఉత్తమ విస్యనాక్కెనెయ/ ప్రమాది సంవత్సర దవై/సక ధంపళ భధివేలు/ వెలుతో పొడిచి గెలి/చె-”

ఈ వీరులు కన్నడ సామంతుల కేనలలోని వారు. కాకతీయాంధ్ర రుద్రదేవ మహారాజును ఎదిరించి వీర మరణం పొందినవారు. ఈ యుద్ధ విజయంతోనే ఈ భూభాగం పై కర్ణాట చక్రవర్తుల అధిపత్యం తుడిచి పెట్టబడి స్వతంత్ర కాకతీయాంధ్ర సామ్రాజ్యం ప్రప్రథమంగా ఆవిర్భవించింది. పొద వీరికలు :

  1. కరీంనగర్‌ జిల్లా శాసనములు - ఊపోద్ద్ధాతం - పుట - 14

  2. కరీంనగర్‌ జిల్లా శాసనములు - నం 23, పుటలు 58, 59, 60.

  3. ఈ మంతెన గుండరాజు పేరు కాకతీయుల కాలంనాటి పాలంపేట, హన్మకొండ వరంగల్‌ జిల్లా శాసనాల్లో కనిపిస్తున్నది.

  4. కరీంనగర్‌ జిల్హా శాసనములు నం 76: 5. కరీంనగర్‌ జిల్లా శాసనములు నం. 74

  5. కల్యాణి జగదేక మల్గుని కాలం క్రీ.శ. 1138. 7. పి.వి. పరబ్రహ్మశాస్త్రి కాకతీయుల చరిత్ర" 1977, పు. 25. 8. కరీంనగర్‌ జల్లా శాసనములు పుట 139

  6. కాకతీయుల కాలం నాటి తెలుగు శాసనాలు

ప్రప్రథమంగా మహాంధ్ర సామ్రాజ్య స్థాపన కావించి మహావైభవంగా రెండువందల సంవత్సరాలు తెలుగు నేల నేలిన తెలుగు సామ్రాట్టలు కాకతీయులు,

ఆ వంశంలోని మొదటి నలుగురైదుగురు గుండరాజు, ఎజ్జి భూపతి, బేతరాజు, పిడి గుండరాజు తూర్పు చాళుక్యుల నోడించిన రాష్ట్ర కూటులకు సామంతులై కొరవి (వరంగల్‌ జిల్లా) ముండలాధిపతులై స్థిరపడిన వారు.

తర్వాత ఆ వంశం వారు కల్యాణి చాళుక్య సామంతులైనారు. గరుడ బేతరాజు - 1 ప్రోలరాజు-1. బేతరాజు -2, ప్రోలరాజు -2, కాకతీయుల తొలితరంలో ప్రసిద్ధులైన ఈ నలుగురు కూడా కల్యాణి చాళుక్య చక్రవర్తులకు విశ్వాసపాత్రులైన 'సేనాపతులు, వారికి సామంత మండలాధిపతులుగా వీరు అనుమకొండ మండలాన్ని - సబ్బిరాష్ట్రాన్ని పరిపాలించారు. కరీంనగర్‌ జిల్లాలోని ప్రాగ్రక్షిణ భాగాలు అప్పుడు ఈ సబ్బిమండలంలోనివే.

ఆ కాలంలో ఈ జిల్లాలోని వేములవాడ, పొలాస, నగునూరు, రామగుండం, మంథని కేంద్రాలుగా కల్యాణి చాళుక్య మండలాధిపతులు వేర్వేరుగా ఉండేవారు.

కరీంనగర్‌ జిల్డా దక్షిణ భాగంలోని శనిగరం అప్పుడు కల్యాణి చక్రవర్తులకు తెలంగాణా సైనిక కేంద్రం. ఈ శనిగరంలో పై నలుగురు కాకతి ప్రభువులవి అయిదు శాసనాలు లభించాయి. కాని, అవన్నీ, చక్రవర్తుల మాతృభాష అయిన కన్నడంలోనే ఉన్నాయి. వేములవాడ చాళుక్యుల కాలంలోని 'సబ్బినాడు' కాకతీయులకాలంలో 'సబ్బి సహస్రం' అని పిలువబడింది.

14 డా॥ మలయశ్రీ- 'కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” రెండవ ప్రోలరాజు కల్యాణి చక్రవర్తికి తిరుగబడిన ఈ జిల్లాలోని వారి సామంత మండలాధిపతుల నోడించాడు. మంధని గుండరాజును సంహరించాడు.

కాకతి రుద్రమదేవుడు కల్యాణి బిజ్జ్ఞలుని దండనాధుడైన మైలగి దేవుని, నగునూరు దొమ్మరాజును. పాలాస రెండవ మేడరాజును ససైన్యంగా హతమార్చి ఈ జిల్లా ప్రాంతాన్ని కాకతి సామంత రాజ్యమైన అనుమకొండ విషయంలో కలుపుకుని స్వతంత్రించాడు. అది సుమారుగా క్రీ.శ. 1150 కాలం. ఆ తర్వాత దక్షిణ పశ్చిమ కోస్తాంధ్రలను జయించాడు, ఆయన రారాజు.

అదే మార్గంలో గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఏకచ్చత్రాధిపత్యంగా ఓరుగల్లు

  • ఏకశిలానగర రాజధానిగా ఈ కాకతీయ మహాంధ్ర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. క్రీ.శ. 1323లో ఈ కాకతీయ సామ్రాజ్య అంతరించింది. ఆంధ్ర దేశం ఢిల్లీ ముస్లిం పాలకుల వశమైంది.

కాకతి చక్రవర్తులు సమరాంగణ సార్వభౌములు, ప్రజానురంజక పరిపాలనాదక్తులు, కళా సాహిత్య పోషకులు, వీరి కాలంలో కన్నడ భాషా ప్రాబల్యం తగ్గి సంస్కృతాంధ్రాల ప్రాచుర్యం హెచ్చింది. ముఖ్యంగా తెలుగు విలువ పెరిగింది.

ఈ జిల్లాలో పై నలుగురు కాకతి చక్రవర్తుల శాసనాలున్నాయి. పైగా రుద్రదేవునికి తమ్ముడు గణపతి దేవునికి తండ్రి అయిన మహాదేవరాజు కాలపు ఏకైక శాసనం మంధని సమోపంలోని సుందిళ్ళలో లభించింది. (కరీంనగర్‌ జిల్లా శాసనములు - నం.27)

ఈ కాలపు శాసనాలు వివరాలు: కరీంనగర్‌ జిల్లాలోనివి.

రాజు పేరు కాలం సంస్కృతం తెలుగు శాసనాలు రుద్రమదేవుని కాలం క్రీశ, 1158-95 - 2 మహదేవునికాలం ” 1196-98 = 1] గణపతిదేవుని కాలం ” 1199-1262 ళ్‌ ౩ రుద్రమదేవి కాలం * 1262-1289 11 1 ప్రతాపరుద్రుని కాలం ” 1289-1323 ఆ 3

కాకతి చక్రవర్తుల కాలంలో ఈ జిల్లాలో లభించిన 10 తెలుగు శాసనాల్లో వచన రచన కలవి ఎక్కువ. పద్యశాసనాలు రెండే అయినా ప్రముఖమైనవి. అవి రుద్రమదేవుని కాలపు నగునూరు శాసనం, గణపతి దేవుని కాలపు ఉప్పరపల్లి శాసనం. ఈ రెండు పద్యశాసనాలతో పొటు ఆ కాలంనాటి మరికొన్ని గద్యశాసనాలు ఈ క్రింద చూపబడుతున్నవి.

అ. నగునూరు శాసనం = కఠీంనగర్‌ సమిప గ్రామం.

కాకతి రుద్రదేవుని మంత్రి, నగునూరు రాజధానిగా సబ్బిసహస్ర మండలం సామంతపాలకుడునైన వెల్లంకి గంగాధర మంత్రి వేయించిన 172 పంక్తుల 32 పద్యాల సంపూర్ణ ఆంధ్ర భాషా శాసనం. కాలం క్రీ.శ, 1171 జనవరి 13 (శా.శ. 1092 వికృతి మాఘ శు - 6)

శాసన భాగం-

శ్రీరామాధిపుడింద్ర నీల నిభ శారీరుండుదారుండు గౌ రీ రామాధిపుండుజ్వల సృటిక శారీరుండు ధీరుండు భా

షా రామాధిపుండబ్ద కేసర లసచ్చారీరుండు నుం గారుణ్యంబున మాకు నీవుత సదా కాలంబుంగామ్యార్థములు' (1)

(ఇది శార్దూల విశ్రీడితం. గణయతి ప్రాసలు చక్కగా కుదిరాయి. అర్ధ బిందువు ఉండవలసిన తొవుల కూడా పూర్ణబిందువులే వాడబడినవి. అవి మొదటి పద్యంలో క్రీగీతలు కలవి. సాధారణంగా

మొదటి భాగం, 1! అధ్యాయం: శనీ నేొత్ట్యం 15 పూర్వపు వ్రాతలో కనిపించే బిందు పూర్వాక్షర ద్విత్వం ఇందులో లేదు. పద్యాంత హల్లు అచ్చుగా వాడబడింది. పాదాంతంలోనే గాక పాద మధ్యంలోనూ పొల్లు న-కారం 'ను'గా తర్వాతి పద్యాల్లో ఉంది.) వెలయంగ వేంగి దేశంబులోన నాశత్రేయ గోత్ర పుంగవులు మహాత్ములు వెల్లకీ (వెల్లంకి) పురంబున బల వన్తులు పుట్టి పెరిగి పాలించి చనను॥2 (2) (ఇది వచనంగా వ్రాయబడినా నిజానికి కంద పద్యం.) వెలయంగ వేంగి దేశంబులోన నాశత్రేయ గోత్ర పుంగవులు మహా త్ములు వెల్లకీ పురంబున బలవంతులు పుట్టి పెరిగి పాలించి చనన్‌. మను చరితుం డఖిల జగ జ్ఞన పూజితుండైన యత్రి సంతానమునను (న్‌) జనియించి కొమ్మనార్యుండు, వినుత శ్రీ శుభ సమృద్ధి వెలయంగం బ్రభతోన్‌. (3) ఆయత యశుండతనికి నా, త్రేయాన్వయ భూషణుండతి స్థిరమతి నా రాయనుం డుదియించె వచ (ణబుండుదయించి) శ్రీ యుతుండై సుకవి బన్ను చిన్తామణియై (4) బ్రిత్త! అతుల శ్రీయుతుండై సమస్త జన చిత్తానంద సంజాత వి స్ఫిత నానా గుణియైన యాతనికి నీరేజాత పత్రి ప్రకా (స్ఫృ) ఇత లోలేక్షణి యయ్రృమాంబికకు లక్ష్మీనాథుండై పుట్టెను న్నతి గోవిందుడు నిర్మల ప్రథిత విజ్ఞానంబులో నిమ్మహిని। (5) (న్‌) కం॥ వితత యశుండైన యతనికిం, బతివ్రతా గుణ విభాసి భాగ్యవతి మహా సతియైన తురుక మాంబకు, నుత చరితుండ బంధుజన మనోముదీ కరుండను (6) (6వ, పద్యంలో గంగాధరుని తల్లి తురక మాంబ అని ఉంది. అప్పటికి దక్షిణ భారతదేశంలో తురుష్కుల వ్యాప్తి లేదు. అది తుక్కాంబ పద రూపం కాబోలు.) విత్త భూధర ధైర్యునత్యధిక పుణ్య చరితుండపార కీర్తి ల (త్రు) కీధర మూర్తి శిష్టజన మిత్రుండు గోత్ర పవిత్రుండచ్యుతా రాధన తత్పరుండు సురరాజ గురుండు మతి ప్రభాతిగం గాధరుండిద్ధరిత్రి ననంగా నుదియించి శుభోదయంబునన్‌॥ (7) (ద)

(7వ, పద్యంలోని విశేషణాలు చరితుడు, మిత్రుడు అని ప్రథమా విభక్తిలో వాడి మొదటిపదం ధైర్యున్‌ అని ద్వితీయలో వాడడం కంటె ధైర్యుడు అని ప్రథమలో ఉంటేనే అర్ధవంతంగా ఉండేది. భూధర ధైర్యునన్నధిక అన్నా సరిపోయేది. మూడవ పాదంలో 'మతి ప్రభాతి సురరాజ గురుండు అని అన్వయం.)

కం ॥ మాతా పిత్తు (తృ) వర్గము సం ప్రీతిం జదివించి మన్చి పెన్పి లసద్వి ద్యాతిశయ కుళలుం జేసి వి, భూతిం బరిణయము సేసి పోషింపం గాను ॥ (8) (న్‌) బ్రిత్త ॥ సకల కలా విధిజ్ఞుండనం జాలి సమస్త జనా (లి) సద్గుణ ప్రకరము నెప్పుడును బుధ సభం బ్రణుతింపంగ నున్న యట్టి ననుం బ్రకటిత కీర్తి వ్రోాల జనపాలుండు ఘోరతరాజి లోలుండ త్యకుటిల చిత్తుండీతండని యాదరికం బిల్పించి పంపంగాన్‌ ॥ (9) (9వ పద్యం చివరి పాదంలో అదరికం పదం ఆదరణంబున అనే భావంలో ప్రయుక్తం, తర్వాతి

16+ డొ॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపొత్య చరిత్ర” బిల్చించి పదం పిలిపించి అంటేనే చంపకమాల పద్యంలో గణం పొసగుతుంది. ఇది లేఖక దోషం కాకపోదు.) కం॥ చనవు మెయ్యి నగరిలోం దగు, పనులెల్లనుం బెంపు మెఅపి పరికించుచు నే ర్పున భక్తి యుక్తి నతి ముద, మునం జేయుచుం దత్సరోక్షమున మటియుం బ్రభను ॥ 10 (న్‌) (రెండవ ప్రక్క) శ్రీకాన్తా కాన్తుచే నాశ్రిత విబుధ జనాభి స్థిర ప్రాజ్య రాజ్య శ్రీకాన్తా కాస్తుచే విస్త్రిత నిజభుజ నిస్రింశ నీత్యాన్యరాజ శ్రీకాన్తా కాన్తుదే దిక్షితి గగన సమాళ్షిష్ట విస్పష్ట కీర్తి శ్రీకాన్తా కాన్తుచే నూర్జిత రిపు మిగరాజీ మిగారాతి చేతన్‌॥ (11) (1వ పద్యం స్రగ్ధర, మరభన యయయ గణాలు - 8, 16 అక్షరాలు యతులు) థి! పరనర పాల మౌలి మణి భాసుర దీప్తిలతా వితానవి (ళి) స్ఫురిత పదాబ్బుచే నహిత భూతల నాథ వరూధినీ సరో వర మథన ప్రభూత మదవ ద్విరదాధిపుచే విరోధి భూ ధర శిఖర ప్రభిన్న విదిత త్రిదశేంద్ర నిశాత హేతిచేన్‌ ॥ 12 (ఈ చంపకమాల సద్యంలో తృతీయా విభక్తి ప్రత్యయాలైన రెండు “చే'లు, ఒక 'చేన్‌' తప్ప మిగితాదంతా సంస్కృతమే.) కం॥ సుర కరిపరి (తి) మిగపతి హరి, సుర సతి దమల సరసీరుహ శుక్తిరుహ సదృకే (శుచే) సురు చిర విశద యశోభా, సుర నిధిచే సుకవి ధరణీ సుర నిధి చేతన్‌ ॥ (13) (ఈ పద్యంలో - సుర సరిదమల సరసిరుహ, సదృక్‌, ధరణి సుర అంటే గణభంగాలు కావు పైగా సరియైన రూపాలు) కం॥ సరనిధి పరీత ధాత్రీ, (శరనిధి) పరిపాలిత దక్షిఐ ప్రభాసి భుజవి (జా) స్తరు చేత నన్మకుండా (అనుమకొండ!) పురనాథుండైన రుద్ర భూపతి చేతను | (14) (శరనిధి = సముద్రం) విత్త। వెలయ నమాత్య సంపదయు విత్రుతమైన నియోగ వ్రిత్తులం దలము శితాత పత్రముల - తర్క్య విభూషణ లేపనాంబరం బులుం దగువ్రిత్తులుం బడసి భూసుర వర్గము ట్రోచి దేవతా నియలము లర్థిం బెక్కొనర నిల్చుచుం బూజలు ప్రీతిం జల్పుచున్‌ ॥ (15) కం॥ జననాథు కరుణం దిండోం, డనంగాం బరగిన మహాగ్రహారము విద్వ జ్ఞనములకు నిచ్చి. యజ్ఞము, లొనరంగ జేయించినా మహాోన్నతి వెలయను॥ 16 (దిండోడు గ్రామం ఎక్కడుందో తెలియదు) " విత్త ॥ అందుం ద్రికూట నిర్మిత శివాలయమును విలసత్తటాకమును సుందర పుఃప వాటికలుం జుట్టిన లుంగ లవంగ తాల మా (పుష్ప) కంద వనంబులును జనసుఖప్రద(మ్రై) వెలయంగం జేసి శ్రీ నందన మూర్తి రుద్ర జన నాథు దయను మజి యన్మకొండలోను ॥ (17) (మూడవ ప్రక్క)

మొదటి భాగం, 1! అధ్యాయం: శౌననీ సారొత్స్యం 17 కం॥ శ్రీ విభుం బ్రసన్న కేశవ, దేవుం బుర మధ్యమున నతి స్థిరముగ న ద్భావన నా రుద్రేశ్వర దేవు సమీపమున నిల్పితిం గడు భక్తిని! (18 పున్నేశ్వర దేవాలయ, సాన్నిధ్యము నందు కడు బ్రనన్నుతముగన ప్పన్నగ భూషణునకు న, త్యున్నతి గుడి నిల్పితిని మహోత్సవమునను (న్‌) (19) పుర్వనిధి వుర్వ రత్నము, వుర్వోత్తమ మూర్తి యన్చు బౌగడంగ జనులు ద్దర్నమతి వెలయంగా దై, పుర్చులం జేసితిం బ్రతిష్ట పూజార్హముగాను॥ (20)

(ఈ 20వ పద్యం, తర్వాతి కాలపు బమ్మెర పోతన భాగవత పద్యాలను తలపించేదిగా ఉంది. పురుష శబ్దం పుర్షఅని వాడుట వింత. పురుషగా మార్చినా పద్యం గణభంగం కాదు. ఇది లేఖక దోషం అనడానకి 22వ పద్యం చివరి పాదం సాక్ష్యం. అక్కడ “బురుషోత్తమున్‌' అంటేనే గణాలు సరిపోతాయి.)

గంగాచియ చెజువున యొ, ద్దం గేశవదేపు గుడియు ధర్మస్థితి త త్సంగతి విప్రలకుం సం, ధ్యాంగన గొలువంగ జనాశ్రయము సేసితినేన్‌. (21) (చెరువున యొద్దం ప్రాచీన రూపం, సంధ్యాంగన = గాయత్రి) విత్త ॥ అంబుధి వేష్టితావనికి నాభరణంబగు నాహిడంబ తీ ర్ధంబునం బా(0)డవోత్తములు దాత్త మతులు మును భిమ నాథగే హంబు మొదల్గం బెక్కు దివిజాలయములు సృజియించిరేను భ క్తిం బుర్దోత్తమును హరిబ్రతిష్టతుంజేసితి వాని సన్నిధిని ॥ (22) కం॥ పరమేశుండు హరి బుద్ధ, న్వరూపుండై యసుర వరుల వంచించుటనా హరి యనియ పట్టశాలం, జిరముగ బుద్ధ ప్రతిష్ట సేసితి భక్తిని! (23) వత్త! ధర నత్యుతమమైన తీర్థము శివస్థానంబు సంవర్తకే శ్వర మంచును శశిఖండ శేఖరుని విశ్వస్తుత్యుం బూజించిసు స్థిరమై యుండం దటాకమును గుడియు నర్ధిం జేసి చేయించి యీ శ్వరు సద్భక్తిం బ్రతిష్ట సేసితి జగద్వంద్యును భవానీ వతిని॥ (24) కం॥ ఎన్నంగం గోటి భవంబులం (ఎన్నగ గోటి భవంబుల) దన్నుం బ్రాపించు దు() క్రితము లెల్లం జెదున్‌ (దుష్క్పత) భిన్నా సంగమ మాడినం (పెన్నాసంగమం) బన్నగ భూషణునిం జూడ బడసిన మాత్రను॥ (25) కం॥ అనునాది మునుల వచనము, విని కాకతి రుద్రదేవ వీరుండు విద్వ, జ్ఞనముల యనుగ్ర.... =. ధర్మువు నిల్ప దలంచిద.... ॥ (26) బ్రిత్త॥ ఆ (క) లేశ్వర దే (వ) ....న్త తేజో (మ) యంబై కైలా... మగు దేవాగారముం నిల్సి......... డొప్పం బ్రతిష్ట సేసెం ...బరమేశును (త్తం- -) బు రుద్రేశ్వరును శ్రీ కంఠును దశకంఠ పూజిత నిజశ్రీ పాత వంకరుహును॥ (27) (క) (నాలుగవ ప్రక్క) కం॥ ఆ రుద్రేశ్వర దేవా. గార సమీపంబున (0) దు గమనియ్య సురా (కమనీయ) గారంబు సేసి నిల్పితి, గౌరీ వల్లభుం ద్రిణేత్రు గామాంగ హరున్‌॥ (29) (త్రినేత్రు)

18 డా॥ మలయశ్రీ- ' ఈరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర" కం॥ తత్సన్ని ధానమున శ్రీ వత్సాంకుం 'బ్రతిస్ట సేసి వజలంగ జెజటువం దుత్సవము తోడం బెట్టి జ, గత్సుందర కీర్తి వెలయంగాం బరగి మహిని 1 (29) (న్‌) కం॥ వర మన్హ్రకూట పురమున, వరదునకు జగజ్జనాభి వందిత చరణాం బురుహున కాచంద్రార్క, స్థిరముగ గుడి వత్తి నిల్చితిం త్రిబయునకును॥ (30) థ్రిత్తఃశంకిత భక్తి యుక్తి ననిష(శ)ంబు నిజాంఘ్రులు గొల్బు నబ్ద భూ (శంళిత) వంశము ఖాఖిల ప్రజన వాంఛిత పుణ్య ఫల ప్రదును సురా ర్యంశజ వంశ దర్చ హరు నచ్యుతు నీ నగరూరనం జతు ర్వింశతి మూర్తి యుక్తముగవిశ్వమయాళ్ళుం బ్రతిష్ట జేసితిని। (31) కం॥ తన పెంచిన సన్హానముం, దన సన్తానంబుం గ్రితియుం దన నల్లిల్లును వనముం జెటువును గుడియునుం, జనవినుతములైన సప్త సంతానంబులు!॥ (32) స్వస్తి శ్రీ శక వర్షములు 1092 విశ్రితి సంవత్సర మాఘశుద్ధ పంచమి బుధవారమున శ్రీమన్మహామండలేశ్వర కాకతియ రుద్రదేన రాజులు నగరూరెక్షించి నగరూరు (-) పలుగాను సబ్బినాండెల్లా (ను) సముద్ధ (రింపు మని గంగ) రాజున కిచ్చి మంగళ ... హో శ్రీశ్రీ.॥

(32వ పద్యంలో మన పూర్వులు పుణ్యంగా భావించిన సప్త సంతానములు పేర్కొనబడ్డాయి. 12వ, శతాబ్దిలో గంగాధర మంత్రి పేర్కొన్న అ పుణ్య కొార్యాలివి. 1 పెంచిన సంతానం 2. తన సంతానం 3, కావ్య నిర్మాణం 4. అల్లుని ఇల్లు 5. తోట పెట్టుట 65 చెరువు త్రవ్వించుట 7. అలయ నిర్మాణం. 16వ శతాబ్ది ధూర్జటి కవి “శ్రీకాళహస్తీశ్వరా' శతకంలో సప్త సంతానముల గూర్చి చెప్పిన పద్యం చూడండి, న

మ॥ తనయుంగాంచి, ధనంబు వాతి, దివిజ స్థానంబు గట్టించి, వి ఫ్రన కుద్వాహము జేసి, సత్కృతికి పొత్రుండై, తటాకంబునే ర్పున దద్రవ్వించి, వనంబుబెట్టి మననీ పోబేడు నీ సేవజే సిన పుణ్యాత్ముడు పోవులోకమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా. పుత్ర ప్రాప్తి, నిధి నిక్తేసము, దేవాలయం, బ్రాహ్మణునికి పెండ్లి, కృతి స్వీకృతి, వనము, చెరువు

  • నిర్మాణాలు; నాలుగు వందలేండ్డలో వచ్చిన భావాల మార్చును గమనించవచ్చు.) శాసనకోలం- శ్రీశ 1171, కాకతి రుద్రదేవుని కాలం. శాసనకర్త - వెల్లంకి గంగాధర మంత్రి. శాసన భావం: ఇందులో నగునూరు కేంద్రంగా పబ్చినీమను పరిపాలించిన వెల్లంకి గంగాధర మంత్రి బాల్య, వంశ విశేషాలు వర్ణించబడినవి. ఆయన విద్వాంసుడు, వీరుడు, రాజనీతి నిపుణుడు. జళడు రెండవ ప్రోలరాజు కాలంలో కాకతీయ చక్రవర్తుల కొలువులో చేరాడు. మొదట హన్మక్రొండ నగరామాత్యుడు. అ కాలంలో తటాకాలు తవ్వించాడు, ఆలయాలు నిర్మించాడు. కాకతి రుద్రదేవునిచే సబ్బిరాష్ట్ర (కరీంనగర్‌ మండలం) పాలకుడై నగునూరు (నగరూరు అని శాసన నామం) లో నివసించాడు. నగునూరులో కేశవాలయాన్ని ఇరువది నాల్గుమూర్తులతో సహా నిర్మింపజేసి, ఈ శాసనం స్వయంగా వ్రాసి వేయించాడు. రుద్రదేవ చక్రవర్తి స్వయంగా నగునూరుకు వచ్చి వెళ్ళాడట. ఆఆలయ ఉత్సవ సందర్శనానికి కాబోలు. చారిత్రక విశేషాలు: గంగాధర మంత్రి రుద్రదేవునికి, కల్యాణి బిజ్జలుని దండనాథుడైన మైలగి దేవునితో జరిగిన యుద్ధంలో అమితంగా సాయపడ్డొడు. మైలగి దేవునితో రుద్రదేవుడు కరీంనగర్‌ జిల్లాలోని ఆకునూరు వద్ద తలపడి ఓడించగా, గంగాధర మంత్రి మరో వైపున వెళ్ళి నగునూరు దొమ్మరాజును ఓడించాడు. చక్రవర్తితో కలిసి వెళ్ళి పొలాస మేడరాజును ఓడించి పట్టణాన్ని

మొదటి భాగం, | అధ్యాయం: శొననీ సారొర్ఫీం 19 నిర్భ్ధూుమధామం చేశాడు. వారు కల్యాణి చక్రవర్తికి సామంతులు కాకతీయులకు ప్రత్యర్థులు. ఆ తర్వాతనే అతడు సబ్బినాటికి పాలకుడయ్యింది.

రాజ సన్మానితుడైన ఈ గంగధరామాత్యుడు సామంత రాజుల కాచి,విద్వాంసుల బోచినవాడు (15-16). విద్వజ్ఞనానికి దిండోడు అగ్రహారంగా ఇచ్చి, అచ్చట యజ్ఞం చేయించి, త్రికూటాలయం నిర్మించి, చెఅవును తవ్వించి, ఫల పుష్ప వనాలను వెలయించాడు (16-17) హన్మకొండలో రుద్రేశ్వర దేవుని సమీపంలో ప్రసన్న కేశవుని నిలిపాడు. అది వేయిస్తంభాల గుడిలో కానోపును.

పున్నేశ్వర దేవాలయ సాన్నిధ్యంలో గొప్ప శివాలయం నిర్మించాడు. (19) గంగాచియ చెరువు వద్ద వివ్వాలయం నిర్మింపజేసి ఆ చెరువును బ్రాహ్మణులు స్నాన సంధ్యలు చేసుకోవడానికి ధారాదత్తం చేశాడు. (21) ఇది హన్మకొండ లోనిదే ఏదో ఓ తటాకం (మంథనిలోని తమ్మి చెరువు కూడా ఇలాగే విప్రులకు కేటాయించబడింది. నాడు అన్యజాతులవారు దాని నీరు ముట్టరాదని నియమం.) హిడింబ తీర్థంలో పాండవుల గుళ్లున్నాయి. అక్కడ గంగాధరుడు కేళశవాలయం నిర్మింపజేశాడు. (22) అది మడికొండ గ్రామం కొండ. పట్టశాలలో (పట్టిసం)లో బుద్ధ విగ్రహ ప్రతిష్ట కొవించాడు. కాని, అది శాక్య గౌతమ బుద్దుని పై గల భక్తితో కాదు. హరిని బుద్ధమూర్తిగా (త్రిపురాసుర సంహార సందర్భంలో శివునకు సహకరించిన వాడని) భావించి హిందూపురాణ భక్తి తోనే. (23). ఇంకా సంవర్తకేశ్వరంలో ఒక తటాకం, శివాలయం, కాళేశ్వరంలో శివలింగ వప్రతిస్టతోపాటు శివకేశవాలయాలను, మంథనిలో ఒక శివాలయం... నిర్మించాడు. (24-30)

ఈ నగునూరులో చతుర్వింశతి మూర్తి యుక్తంగా అచ్యుతాలయం నిర్మింపజేశాడు.31 నగునూరులో ఆలయాలెక్కువ. అక్కడి కీర్తి శిలాస్తంభాలు ఆంధ్రుల శిల్పకళా చరిత్రకే తలమాణికాలు, అక్కడ త్రికూటాలయం కాకతి కాలాని దున్నది. అదో దాని ప్రక్కనున్న ఆలయమో గంగాధర మంత్రి నిర్మాణం కావాలి. ఆ అలయాలు గోధుమరంగు నునుపురాలతో శిల్పాలంకృతమై అర్థశిథిలావస్థలో ఉన్ననూ ఇప్పటికీ కళాప్రియుల హృదయాలను ఆకట్టుకొంటున్నాయి.

భాష;అర్ధ బిందువుకు, పూర్ణబిందువు, వలవల గిలకవంటి క్రావడి, బుత్వం ఇకార ధ్వనిగా వాడబడినవి. తత్సమ పదప్రయోగం రమణీయం. ళ, ణల ప్రయోగం ఇప్పటి పదాలలో వలె లేదు.

ఆదరికం, ప్రసన్నుతముగ, ఉద్దర్నమతి, చెరుపున యొద్దం వంటి కొన్ని వద ప్రయోగాలు మింగుడుపడవు. వుర్ణు పుఃప, దుఃక్రితము, ప్రాపించు - బేఖక దోషాలు అనొచ్చు.

సాహిత్యం : ఇందలి 32 పద్యాలలో 20 కందాలు, మిగితా 12 సంస్కృత వృత్తాలు 4 ఉత్పల మాలలు, 3౩ చంపకమాలలు, 2 మత్తేభాలు, 2 శార్జూలాలు, 1 ప్రగ్ధర. పద్యాలు ఛందోబద్దాలు. శైలి రమ్యం. ్రగర్థ (11) శ్లేషబే ఒప్పారి కవి ప్రతిభకు పట్టం కట్టింది. శ్రీరామాధిపుడు (1)వరనరపొల (12) తత్సమ పద సమాస బాహుళ్య, సహజరూపక అలంకార భూయిష్ట పద్యాలు. కవి పాండిత్యం కవన నైపుణ్యం అపారం.

గంగాధర మంత్రి తిక్కనకు పూర్వుడు. ఇవి తిక్కనకు పూర్వ శాసనాల పద్యాలనేకాక నన్నయ వాడిన గీతం, ఆటవెలది వ్రాయకపోవడం గమనార్హం. ఇది ఈ జిల్లాలో లభించిన మొట్టమొదటి శిలా శాసన రూప తెలుగు పద్యకావ్యం!

ఆ) మేడారం శాసనం * - పెద్దపల్లి తాలూకా

ఈ (గ్రామాన్ని ఇప్పుడు నందిమేడారం అని పిలుస్తున్నారు. గ్రామ మధ్యంలో శిథిలాలయ వేదికపై కాకతీయ శిల్పంతో ఒక అందమైన నంది విగ్రహమున్నది. అదే ఈ ఊరుపేరుకు జతపడింది. అక్కడిదే ఈ శిలాశాసనం. శాసన మూలం ఇది.

“(విక్రమ) కేశవ దేవరకు/ వెలి (చేను) ఖ (-)

20 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సొహిత్య చరిత్ర” స్వస్తి శ్రీముతు బండి బ్రమ్మె నాయకు (డు)/ ..ముతూ” (అసంపూర్ణం) “త్రి శక వర్షములు 10 (98) (అ) గు దుర్ముఖి సంవత్సర (ము) (నా)డు మేడరా (జు) ప్రతిష్ట సేస్‌ 'త్రికూటము.. (శ్రీమే.)...” (ఆసంపూర్ణం)/ (సుక - మూ) “ స్వస్తి సమస్త ప్రశస్తి సహితం శ్రీమన్మహా/ మణ్ఞలేశ్వరం కాకెత రుద్రదేవ రాజులు ధర్మ ప్రతి పాలితుండై అనాది... /ప్రోలేశ్వర దేవరకు మతు /లక్ష్మీశ్వర దేవ...” శాసనకాలం- శా.శ, 1098, క్రీ.శ. 1175; శాసన కర్త - బండి బ్రహ్మనాయకుడు,. శాసన విశేషాంశాలు; శాసనం మొదటి భాగంలో బండి బ్రహ్మనాయకుడు కేశవ దేవుని పూజకోసం వెలిచేను దానం చేయడమున్నది. రెండవ భాగంలో మేడరాజు త్రికూటాలయం నిర్మించిన లేదా సముద్ధరించిన విషయమున్నది. మూడవ భాగం కాకతి రుద్రదేవుడు ప్రోలేశ్వర లక్ష్మీశ్వర దేవరలకు దొనం కావించినది. రుద్ర దేవుని చేత పరాజతుడైన పొలాస మేడరాజు ఈ శాసనంలోని మేడరాజు ఒకే వ్యక్తి కారు. క్రీశ. 1156 నుండి ఈ ప్రాంతం రుద్రదేవుని పోలనలోనికి వెళ్ళింది. శాసన కాలం 1175. కావున ఈ మేడరాజు వేరే వ్యక్తి కాకతీయుల సామంతుడు. పైగా తికూటాలయాలు కాకతీయుల కాలంలోనే నిర్మింపబడ్డాయి. బండి బ్రహ్మనాయుడు పేర్కొన్న కేశవ దేవుడే రుద్రదేవుడు పేర్కొన్న లక్ష్మీశ్వరుడు అయి ఉంటాడు. ఇక్కడి శివుడు ్రోలేశ్వరుడు. ఈ జిల్లా మొదటి విజేత ప్రోలరాజు. మంథని గుండరాజును యుద్ధంలో చంపినది ఈ రెండవ ్రోలుడే. తండ్రి మీది గౌరవంతో రుద్రుడు మేడారం శివలింగమూర్తిని ప్రోలేశ్వర నామాంకితం చేసి ఉంటాడు. శాసనంలో అధిక భాగం ఖీలమై దాన వివరాలు సరిగా తెలియటం లేదు. బ్రహ్మనాయుడు స్థానిక పాలకుడు. ఇ) గొదిశాల శాసనం * - హుజూరాబాద్‌ తాలూకా. " కొకతి గణపతి దేవుని దండనాయకుడు కాటయ వేయించిన దాన శాసనం. ఇది చక్కటి తెలుగు గద్య పద్యాలతోనూ, చివర భూదాన వివరాల విలువైన సమాచారంతోనూ చారిత్రక (ప్రాధాన్యత గలది. శిలా శాసన హృద్య పద్య సాహిత్య చక్కని చంపూ కావ్యం. కౌసనం - “శ్రీమదనూన - జలసేవకుం బాయక మోయు షట్పద స్తామ నినాదమున్వినుచు సూరెలనెప్పుడుం బ్రస్తుతించు సి ద్ధామర కోటికి న్వరదుండైన గభేశుండు సుస్థిర స్థితిం గామ సమానమూర్తి యగు కాటయ కీపుత5 మిష్ట సంపదల్‌ చరణ సరోరుహ రాగ, స్పురణ న్మహిషుని శిరంబు వొలుపుగ సంధ్యా భ్రరుచి నెనయ మెట్టిన స, తృరుణాన్విత దుర్గి వరము కొటయకొసంగున్‌. (దుర్గ) ఉరగేంద్ర దిగ్గజముల కుం, బరమోత్సాహముగ నాత పత్రము వోలె చ్ధర యొత్తిన కిరివరుండగు (కిటి), హరి గాటయ శ్రీవుతము, దయామతి శుభముల్‌, దేవాథి దేవుం డమిత, స్థావర జంగమ మయుండు సర్వేశుండు (న్‌) గౌరీశుండనవర తంబును6, నీవుతం గాటయకు దయనభీష్ట ఫలంబుల్‌. హరి దళ్వుం డజాచ్యుత శం, కర మూర్తి దయా మయుండు గమలాప్తండు భా స్కరుండు దయంగాచు చుండెడుం, గరుణా రస పూర్ణ హ్రుదయు 0గాటయ బ్రీతింని। (హృ,న్‌)

మొదటి భాగం, | అధ్యాయం: శొనన్‌ నహొర్ప్యం 21 స్వస్తి శ్రీమదపార. పారావార పరివ్రత మహీతలంబున సకల జనవినుతంబగు నంధ్ర దేశంబునకు విభూషణంబైన యనుమకొండ యను పుర వరంబు నిజరాజధానిగా నొప్పుచుంన కాకతె భూపాల శక్రమంబున జన వినుత యశో విలానుండును విజయలక్ష్మీ నివానుండును నైన రుద్ర నరేంద్ర సుపుత్రుండును నదారాధిత డ్రినేత్రుండును విబుధ జనవన వసంతుండును రమణియ్య సీమంతినీ జయంతుండును సకల జనమనోరంజనుండును. నరాతి రాజమద భంజనుండును శరణాగత రాజ శరణ్యుండును వినుతాఖిల రాజ వరేణ్యుండును ధైర్యామర సానుమంతుండునుం తురగరేవంతుండును సత్యహరిశ్చంద్రుండును విభవామ రేంద్రుండును నైన గణపతి దేవ మహీనాథునకు బ్రధానియై, (ఇది గణపతిదేవ చక్రవర్తి వర్ణన). కం॥ కనకాచల ధీరుండు జన, వినుత చరిత్రుండు గార్యవిదుండిన తేజుం డన ఘుండు గుణనిధి బెజ్జమ, తఈనయుండు బుధ దీన భాను తనయుండనగాంన్‌ ॥ థి॥ ప్రతి పక్ష క్షితిపాల కుంజర మద ప్రారంభ సంరంభ ము ద్దత బాహా నిహిత ప్రచండ నిశితోద్యత్థడ్ల ధారా నఖా హతి భేదించి యఖర్వ గర్వ బల శౌర్య స్పూర్తిం గంఠీరవా కృతియై నన్నుత వ్రిత్తి దాల్చి వెలసెను రేచెర్ల రుద్రుండిలన్‌॥ సకల జన వినుత యశుండును గుణగణాలంకారుండును నైన కాట్రెడ్డికి సాభాగ్య సౌందర్య చాతుర్యంబులం గలిగి పరగిన పతివ్రత యైన బెజ్జమాంబకుం బ్రియ నందనుండును ననవరత ధర్మ సమేతుండును పతి హితా చరణుండును గాకెత రాజ్యభార ధౌరేయుండును సద్గుణ ప్రఖ్యాతుండును నతుల బల పరాక్రమ సమన్వితుండును నైన రేచెర్ల రుద్రునకుం బ్రధాని! (ఈ వచనం పై రెండు పద్యాలు రేచెర్ల రుద్రుని వర్ణన) కం॥ కుల తిలకుండు వసుధామర, జలధి సుధాకరుం డశేష జన నుత చరిత్రుం (తు) డలఘుండు రిపు తరు దావా, నలుండనంగొం బరగె రాజె నాయకుండుర్విని॥ (న). బొక్కెరలోని వీరభటావలి వధించి గో (ధు) మఠాతిం తలదెంచి. ఉదగిరి సాధించి పడిరాయనిందోలి దాక్షా రామ భీమేశ్వర దేవర కక్షయ దీపంబులు నిలిపి ధర్మ నమేతుండైన రాజెనాయంకునికి ధర్మ వత్సియు సుచారిత్రయు వనితా లలామయునైన రవ్యమాంబకు నుపుతుండు॥ (ఈ వచనం దీనిపై పద్యంలోనూ రాజనాయకుని వర్ణించాడు కవి. ఈతడు రేచెర్ల రుద్రుని మంత్రి. ఈ శాసన కర్త కాటయనాయకునికి తండ్రి - బ్రాహ్మణుడు) సరనిధి గంభీరుండు సు (శరనిధి), స్థిర తర తేజుండు వంశ కేఖరుండు దయా కరుండు బుధాంబుజ దశ శత, కరుండని వర్షింప నొప్పుం గాటయ ధాత్రిని॥ (ఈ కందంలోనిది కాటయ వర్ణన) విశద యశుండైన గణపతి దేవ భూపాలునకుం బరమ భక్తుండై తన్మహీనాథు కారుణ్యంబున నతుల విభవ నమేతుండై వనంబులొప్పం బెట్టె తటాకంబులు శివాలయంబులు నిలిపి వినయ వివేక సత్యశాచ త్యాగ భోగ బల పరాక్రమంబుల జన వినుతుండై యఖిష్టార్ధ ప్రదుండగు చుంనత్రిలోకారాధ్యుండైన పరమేశ్వరునకంగ భోగార్థంబు దనయిచ్చిన వ్రిత్తులు శాశ్వతంబై ప్రవర్తిల్లు చుండని నిల్చిన సంవత్సర సంఖ్య శకవర్షములు 1157 మన్మథ సంవత్సర శుద్ద 15 గురువారము నందు పంచలింగాలకూను పించఅపల్లిని దేవ బ్రాహ్మణ ్రిత్తులు గాక సర్వ సమస్యముగా నిచ్చె "పెంజెజ్య్వున మీంది కాల్వను కొంతపు గాల్వ దక్షిణమూను ఆవాంక అడ్జాను చింతన మిట్టలూను రవ్వసాని అనకిందూను యింత వట్టు గూడనుర్‌ 131 (ప్రోలకంమ కాల్వనుర్‌1 ర ౬,67౦

22 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సౌహిత్య చరిత” చోలు బాడె కాల్వను చుట్సుర్‌ 1 కాట్న్యాయుని చెలున (బ్రాహ్మణ వ్రిత్తులు గౌక సర్వమూంను రవ్వసాని చెల్వూను రవ్వసాని మామిడి తోంట పడమటి ఆనాను రాజెనాయంకుని చెల్వునర్‌ 7 వెలిపాలము యేరువోక గుబ్బలి జగదేవ త్రోవ దక్షిణమునర్‌ 20 దీని దక్షిణమున పెద్దరేగటి లోనర్‌ 40 బొమ్మకంటి తెర్వు పడుమట నుండి పూరివెనె తీగవెనె నడ్ముర్‌ 60 యేటి మడ మామిడి వనమూను ఆ వనములోని చింతవనమూను ఊరి దక్తిణము తాటి వనమూను అంగడి నుంకమూను ఇంతపట్టు కాటాయుండు దేవడ్డకు అంగభోగ రంగభోగధూప దీపనైవేద్య తాంబూలాలకు సూర్యచంద్రులు కలంత గాలము ఇచ్చిన ఈవి కాదంన్న వారు గంగ కజ్తం గవిలం బొడిచిన దోషానం బోదురు॥ కింది కాల్వనుర్‌ 10 (పది = ఇచ్చితిమి యింతవట్టు గణపతి దేవ మహారాజు విడిచిన దత్తి” (సర్వసమర్చణంబుగా. పోలకమ్మ పోలేరమ్మ పోచమ్మ ఒక్కటే.) శాసనకర్త- కాటయ నాయకుడు, శాసన కాలం - క్రీశ, 1236, కాకతి గణపతిదేవ చక్రవర్తి పాలనా కాలం 1199-1260 (62 సం;) భావం: కాటయ తండ్రి రాజనాయకుడు, తల్లి రవ్వమాంబ. ఇది వారి పేరుగా గొడిశాల (ఉప్పరపల్లి) దేవాలయాల అంగరంగ భోగార్థం ఇచ్చిన భూముల వివరాలు తెలిపే దాన శాసనం. గణపతి దేవ చక్రవర్తి పేరుగానే దానమిచ్చినట్లు శాసనం చివర పేర్కొనబడింది. రాజనాయకుడు శేచెర్ల రుద్రునకు ప్రధాని రేచెర్ల రుద్రుని తల్లి దండ్రీ బెజ్జిమాంబ కాట్రెడ్డి అని ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ రుద్రుడే గణపతి దేవ చక్రవర్తి దేవగిరి రాజులకు బందీగా ఉన్న కాలంలో ఓరుగల్లు రాజ్యాన్ని కాపాడినవాడు. రామప్ప దేవాలయ నిర్మాణం కావించినదీ ఇతడే. చారిత్రక విశేషాలు : ఇందులో శాసనకర్త తండ్రి రాజనాయకుని, అతని అధికారి రేచెర్ల రుద్రుని యుద్ధ విజయాలు వర్ణించబడినవి. గణ పతిదేవున్ని కాకతి రుద్రదేవుని పుత్రునిగా చెప్పటం విశేషం. ఏకామ్రనాథుని “ప్రతాపరుద్ర చరిత్రలోనూ ఇలాగే చెప్పబడింది. నిజానికి గణపతి దేవుడు రుద్రదేవుని తమ్ముడైన మహాదేవరాజు పుత్రుడు. రుద్రునకు పుత్రులు లేరు. గణపతి దేవుడు రుద్రదేవునకు దత్తపుత్రుడు అనుకోవచ్చు. భాషా సాహిత్యాలు : సంస్కృత పదప్రయోగ బాహుళ్యం చిక్కని సమాసాల కూర్చు, చక్కని ఛందోబద్ధ కవిత్వం, నాడు వ్యాప్తిలో ఉంది అని ఈ శాసనం వలన భావించవచ్చు. శ్రీమదనూన బలసేవకుం, చరణ సరోరుహ రాగ స్ఫురణ, దేవాధి దేవుడమిత స్థావర జంగమ మయుండు, హరిదశ్వుడ జాద్భుత శంకర మూర్తి, బుధాంబుజదళ శత కరుండు. మొగవి. తెలుగు పద ప్రయోగంలో తడబాటు దశ దాటి పోలేదు. ఈవుతము, రాజెనాయకుడు, కాట్న్యాయుడు, త్తి, వర్షింప, హృదయుం, కాకెత, ఏరువోక, కాదంన్న, దేవుడ్డకు, పడమటి అన, పూరివెనె, కొంతపు కాల్వ మొవి. కొన్ని పదాలకు అర్భాలు సరిగా తెలువవు. గణపతి దేవుని వర్ధన సందర్భవచనం తత్సమ పదములతో శయ్యా సౌభాగ్యం కలిగి ఉంది. దాన వివరాల భాగంలో తెలుగు పదాలెక్కువ. వనమూను, మిట్టలూను అని వ్యావహారికాంధ్ర భాషా పదాలు ప్రయోగించబడటం విశేషం. ఆలయ నిర్మాణాలు, దేవుళ్ళకు అంగరంగ భోగాలు, పూజా నిర్వహణకు భూవన దానాలు నాటి రాచవారి ధర్మకార్యాలు. అంగడిలో వస్తువుల క్రయ విక్రయ సుంకాలుండేవనే విషయం కూడా ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది. పద్యాల లి రమణీయంగా ఉంది. ఛందోభంగం లేదు. ఇందలి తొమ్మిది పద్యాల్లో కేవలం రెండే రెండు వృత్త పద్యాలు. మొదటిది చంపకమాల, మధ్య ఒక మత్తేభం. మిగితా ఏడు పద్యాలు కందాలు. కందానికి కరీంనగర్‌ ప్రాంతంలో కల ప్రాచుర్యానికి ఇది మరో సాక్ష్యం అది తిక్కన కవి కాలం.

మొదటి భాగం, | అధ్యాయం: శొనన సాహిత్యం 23

శాసనకవి పేరు లేదు. ఆయన చక్కని ప్రతిభావ్యుత్పత్తులు కలవాడనడానికి ఇందలి వర్ణనలు సాక్ష్యమిస్తాయి. మొదటి అయిదు పద్యాలలో వరుసగా నుతింపబడిన దేవతలు గణపతి, దుర్శ వరాహమూర్తి, శివుడు, సూర్యుడు.

శ్రీకారంతో పద్యారంభం కావించి ఉత్పలమాలతో గణపతిని మొదటపూజించడం కవి సాంప్రదాయక ట్రీతిని తెల్పుతుంది. దుర్గ కాకటీయుల కుల దైవం ఏకవీరాదేవి. వారు ఆదివరాహ లాంఛనులు. శివభక్తులు. సూర్యుడు నాటి త్రికూటాలయాలలో శివకేశవులతో పొటు స్థానం పొందిన ప్రధాన దైవం.

ఇందళి వర్ణనలు హృదయరంజకంగా ఉన్నాయి. సూర్యవర్ణన కందంలో “హరి దళ్వుడ జాచ్యుత శంకరమూర్తి ద్రయామయుండు కమలాస్తుడు భాస్కరుండు' అన్నాడు. అంటే “పచ్చని గుజ్జాలవాడు, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల స్వరూపుడు, వేద రూపుడు, తామరల చుట్టం, సూర్యుడు అని భావం.

ప్రతిపక్ష క్షితిపాల కుంజరాల మద (ప్రారంభ సంరంభాలను ఉఊద్ధత బాహా నిహిత ప్రచండ నిశితోద్యతృ్భడ్ల ధారా నఖాహతి భేదించిన అఖర్వ గర్వబలశౌార్య స్ఫూర్తిగల కంఠీరవం అని రేచెర్ల రుద్రుని వర్ణించిన పద్యం భాషా ప్రాథిమభావ గాంభీర్యం కలది. వీరరసం మత్తేభ విశ్రీడితమై పరుగుదీసింది.

బుధ దీన భానుతనయుడు (దాన కర్ణుడు) వనుధామర జలధి సుధాకరుడు - మొదలగునవి రనవదలాంకారాలు. మొదటి పద్యంలోని షట్పద (తుమ్మెద - శివ మంత్రం) సిద్ధామరకోటి శబ్దాలు శ్లేషలో ప్రయోగించి ఉండవచ్చు. కాకతీయుల కాలంలోని ఒక ప్రతిభావంతుడైన కవి కావ్యం ఈ కరీంనగర్‌ జిల్టా గొడిశాల (ఉప్పరపల్లి) శాసనం. ఈఖ కఠీంనగర్‌ రాగి రేకుల శాసనం” క్రీ శ 1246 ది 15 శనివారం.

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ పురావస్తు శాఖ వస్తు ప్రదర్శనశాల విభాగంఅధికారులు శ్రీ సంజీవరావు, లెక్సరర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కరీంనగర్‌ గారి నుండి సేకరించినది. ఇది రెండు రాగి రేకులపై నాలుగు ప్రక్కల దేవనాగరి లిపిలో వ్రాయబడిన శాసనం. రెండు రేకుల ఎడమ చివర నడుమ రంధ్రాలున్నవి కాని వాటిని కలిపి ఉంచినరింగ్‌ ఏదీ లేదు. శాననం 35 వంక్తుల్లోని మొదటి 22 పంక్తులు సంస్కృత గద్యం చివరి 13 వరుసలు తెలుగు వచనం దేవనాగరి లిపిలో ఉంది..ఇది చామన పల్లిలోని 'గొనుగు కాలువ' నీటి పంపకం తగాదా విషయంలోని తీర్పు పత్రం. కాకతి గణపతి దేవ చక్రవర్తి కాలం. చామన్‌పల్లి కరీంనగర్‌ జిల్లాలోని నగునూరు చొప్పదండి గ్రామాలకు మధ్య ఉంది.

శాసనంలోని తెలుగు భాగం ఇది -

॥క॥ చామనపల్లి గొనుగు కాలవ వివాదనిర్ణయార్థమై అక్షయ చండని వారు చామెన పల్లి మహాజనాలును అధివాన గ్రామాలవారి సాక్షి గోరినను కుమ్మరి కుంటలను మడికారకెర్రెడ్డిన్ని దావని నామి నాయుడును రవపకసివి గెడ్డిన్ని వాము జీయ కొడుకు మల్లజీయాను మంగడ మల్లాడు దేవనపల్లిని సోవకుల అన్నపరెడ్డిన్ని (మిట్టపల్లి మదిరెడ్డిని గట్టవెళ్లి నామినాయెడును వేరమ కేసి రెడ్డిన్ని (మంగ --) చిసెటిన్ని మాసకమ్మ మైలి పెద్దిన్ని పడకంటి మైలార పెద్దిగారును తెత్రమ్మ వెన్నగారును కట్యకాలపల్లిని సోమప్పయ నాగదేవ కూచిగారును తమ్మడి పోన రాశిని దోవతుల గుండ్రెడిని మద్దిరెడ్డి ప్రోలిరెడ్డిని విండుల మాదనాను మేడపురము గట్టుమల్లి నాయుడున్ను ఇంతవట్టి వారి పలికిన పదకమేమన కాలు(వ) మహాజనాలదే నీండ్ల పంచి పెట్టలేక లోలి రెడ్డి మల్లి రడ్డి నాండు కాలువ వివాదమున్ను ఎంనడు లేదు ఈ కాలువను పదు నొకం (డ) మడి పోలయ పదికొం(డ) ఉత్తరాన గల్ల వల్లముందాంకా (మా(డి(కుం) ట తూరుపెల్లా మహాజనాలదే అనిరి “మంగల మహాశ్రీః.

ఇది దేవనాగరి లిపిలో ఉన్న తెలుగు శాసనం. అనువాదం కాదు. కేవలం మూలం తెలుగు లిపిలో చూపడమైంది. దీని పద దోషాలు సవరించుకొని వాక్య విరమణ చిహ్నాలు పెట్టుకుంటేనే

24 డౌ॥ మలయశ్ర్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కాని పూర్తి భావం అర్ధం కాదు. నాటి వ్యవహారంలోని తెలుగు భాషా స్వరూపం మాత్రం ఇట్లా ఉండేదని తెలిసింది. నాటి వ్యక్తుల పేర్పు, నేటి కొన్ని గ్రామాల ఆనాటి ఉనికికి, ఈ శాసనం సజీవ సాక్ష్యం, శాసన సంస్కృత భాగ సారాంశం - కాకతీయ గణపతి దేవుని పాలనాకాలంలో నేఢపురం (గ్రామంలో రవిదత్త, వాఘదేవి హింగదేవ స్థానిక పాలకులుగా ఉన్నకాలంలో, జాయపనాయకుని* మంత్రి మంచిరాజు" చక్రవర్తి అజ్జలో చామనపల్లి గొనుగు కాలువ వివాద పరిష్కార విషయ "సేకరణకు విశ్రమశక 1303 సం॥ పరాభవ కార్తీకంలో చామనపల్లికి వచ్చాడు. కుమ్మరి కుంట, దేవనవల్లి, కట్యకోలపల్లి గ్రామాల పెద్దల కాలువ చెంత సమావేశపరిచాడు. వారి అభిప్రాయాలు సేకరించి చామనపల్లి బ్రాహ్మణులతో పాటు ఓరుగల్లుకు వెళ్లి చక్రవర్తికి నివేదించాడు. అప్పుడు రాజాజ్ఞతో శ్రీ పాఠకుని అన్న కుమారులైన అకయ చంద్రదేవ నారాయణలు మరియు మహరూక ఆధికారులు చామనపల్లికి వచ్చి చక్రవర్తి నిర్ణయాన్ని స్థానికాధికారులకు తెలిపారు. దామయ అబ్బయ్య, పోచిరాజు, వొల్లమరాజ, కారపాక రుద్ర మొ॥ పెద్దల మరియు చామనపల్లి బ్రాహ్మణుల సమక్షంలో తిరిగి విచారణ జరిపి గొనుగు కాలువ పై హక్కు విప్రులదే అని నిర్ణయించారు. ఆ తీర్చు శాసనమే ఈ తామ్ర పత్రాలపై లిఖించబడింది. ఇది నాటి ప్రజా జీవిత రీతిని రాజుల పరిపాలనా నీతిని తెలిపే శాసనాధారం. ఉ) హుస్నాబాద్‌ శాసనం - చెరువుకట్ట చెంతకలది, ఇది తెలుగు వచనంలో ఉన్న చిన్న దాన శాసనం. అది ఇది - “స్వస్తి శ్రీమతు మహామండలేశ్వర రుద్రదేవని ముజు సం(టి) ఎక్కటీలు రుద్రేన్వర పత్ర భోగానకు విడిచిన దత్తి తాడ్డ పయిడి గుడ్డలి చిన్నాలు రా(ట్ట) చేను, నాలుగు పుట్టు వడ్లు దేవర ఆయము” కాలం: పేర్కొనబడలేదు. రుద్రమదేవి పాలన నాటిది. క్రీ.శ. 1260-96 దానకర్తలు - ముగ్గురు ఎక్కటీలు (వీరులు) శాసన భావం - కాకతి రుద్రమాంబ పరిపాలనా కాలంలో ముగ్గురు వీరులు రుద్రేశ్వరుని పత్రభోగానికి (పూజకు పూలు పత్రి) సమర్పించే వారికి ధారాదత్తం చేసినది. తాళ్ల పయిని గుడ్డాలు (చేలు) ఇంకా రాట్టం చేను పాలం. అంతా నాలుగు పుట్టు వడ్లు ఏటా దేవుని పేర వచ్చే ఆదాయం. భాష - ఇందలి భాష సామాన్య జన వ్యావహారికం. శాసనం మొత్తం ఒకే ఒక వాక్యం. మండలేస్వర, రుద్రదేవని, ముజు, రుద్రేస్వర, తాడ్డు, గుడ్డలి, రాట్లచేను.. అప్పటి పలుకుబడులు. ఇప్పుడా పదాలు మండలేశ్వర, రుద్రదేవుని, మూడు, రుద్రేశ్వర, తాళ్ళు, గుడ్డాలు, రాట్లం చేను అని పలుక బఢుతున్నాయి. శివుని రుద్రేశ్వరుడనడం ఆ రాణి పేరనో ఆమె తాత గారి పేరనో నెలకొల్పిన లింగమూర్తి కాబోలు. పూజ పూలు అనక పత్ర భోగానికి అనటం శంకరునికి మారేడు దళములతో పూజ చేయటం ఆచారం. పంట బేనుతో పాటు నీటిపారుదలకు (చెరువు వాగు కాలువ లేనప్పుడు) రాట్టం (బొక్కనల గొలుసు మోట) దానం చేయడం కల్యాణి చాళుక్యుల కన్నడ శాసనాల్లోను ఉంది. ఆయం = రాబడి, చెరువు కట్ట చెంత శివాలయ (ప్రాంగణంలో ఉన్నది. శాసన భాగం; క! “స్వస్తి శ్రీమన్మహామండలేశ్వర కాక్క తియ్యప్రతాపరు, ద్ర దేవ మహా రా, జులు సుఖ సం, కథా వినోదం, బులం బ్రిథ్వీ రాజ్య, ౦బు సేయుచు ౦గాను ప్లవన , ంవత్సర ఆషా(ధ), శు॥ 15 గు. ప్రతా, పరుద్రదేవ మ(హా), రాజుల దేవులు, లక్మాదేవంమంగా, రు తమ తండ్రి,

మొదటి భాగం, | ఆధ్యాయం: శౌనన సాహ్‌తాం 25

  1. (ప్రొట్దేవ నా ఇనింగారికిం, బుణ్యము, గాను శ్రీర్శ మ నాథదే, వరకు బ్రిత్తి కి (వెంను), పంను కాని, కి కట్టం క (ణీ), రా (ల్చు) ఆత, (నాప)ురుల,

3... (ండ్డ) వీడుం బ, ట్టు నూ(డుండు), పాడి పసులకు, (బు)లెరి లేదు ఇం,త వట్టూ చంద్రసూ, ర్యులు గలంత, గాలము చె (ల్లేది), దీ (న్కి) ఎవ్వరు లేద,

4 _ ౦నాను గం, గి (మొదవు), ను సురియ, ౦బొడిచిన, దోషా (న)బో, దురు (తప్పి), అడ్గిన వా, రినోరు, తొంక ఫ్ర, వులు తొలు, చుమంగ, ళ మహా, శ్రీ శ్రీశ్రీ” 14 ఈ శాసనాన్ని ఇప్పటి భాషలో వ్రాస్తే ఇట్లుంటుంది.

“స్వస్తి శ్రీమన్మహా మండలేశ్వర కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజులు సుఖ సంకథా వినోదంబులం బృథ్వీరాజ్యంబు నేయుచుండగాను, ప్లవ సంవత్సర ఆషాఢ శు॥ 15 గు... ప్రతాపే, రుద్రమహారాజుల దేవేరి లకుమా దేవమ్మ గారు తమ తండ్రి పాబ్దేవ నాయునిం గారికిం బుణ్యమునకు గాను శ్రీ రామ నాథ దేవరకు వృత్తికి వెన్ను పన్ను, కానికి కట్నం కణీ రాల్చు అతనా పరుల .. వీడుంబట్టు సూడుడు. పాడి పశువులకు పుల్లరి లేదు. ఇంతవట్టు చంద్ర సూర్యులు గలంత కాలము చెల్టేది. దీనికి ఎవ్వరు లేదన్నను గంగి మొదవు (గోవు)ను సురియం (కత్తితో) బొడిచిన దోషాన బోదురు. (దీనికి తప్పి పలికిన వారి నోరును తోక పురుగులు తొలుచును - మంగళ మవా శ్రీశ్రీశ్రీ”

శాసన కాలం - కాకతి ప్రతాపరుద్రదేవుని కాలం "క్రీశ. 1296 - 1323

శాసన కర్రి - ప్రతాపరుద్ర చక్రవర్తి భార్యలకుమాదేవి.

శాసన విశేషాలు: ఇందలి భాష నాటి వ్యావహారిక వచనం. రచన సామాన్యం. పండిత విరచిత శాసనం కాదు. శాసన రచయిత పేరు కానీ, శిల్పి పేరు కానీ బేవు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని భార్య లకుమాదేవికి ఈ ఎలిగేడు ప్రాంతంతో గల సంబంధ మేమిటో తెలియదు. ఆమె తండ్రి పాల్టేవ నాయుడు ఈ ప్రాంతం వాడు కాబోలు.

ఆ రామనాథేశ్వరాలయం చిన్నది అందమైనది ఇప్పటికీ అది పూజా పురస్కారాలతో ఊరి ముందు చెరువు కట్ట చివర చెక్కు చెదరకుండా ఉంది.

ఇది దాన శాసనం. మధ్యలో కొంత భాగం ఖిలం. కొన్ని పదాలకు ఇప్పుడు అర్జాలు తెలియవు. తెలిసినంతలో బండి కాని (కాడి) పన్ను దేవర భోగానికి నిర్ణయించబడింది. పొడీ పసులకు వుల్లరి (ఆడవిలో గడ్డి మేపుకుంటే ప్రభుత్వం వారికి చెల్లించే పన్ను) ఉదారంగా తాలగించబడింది.

ఇది నొటి ప్రభువుల రాజ బంధువుల దైవ భక్తికి పాడిపంటల అభివృద్ధికి, ఉదారంగా వ్యవహరించిన, దొన ధర్మాలు కావించిన తీరుకు నిదర్శనం. పాదపీఠికలు : 1 పి, వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి గారి కాకతీయుల చరిత్ర) 1977 పు. 256 -2. కరీంనగర్‌ జిల్లా శాసనములు నం. 26 3. ఈ శాసనాల్లోని తెలుగు అంకెల ఈ అరబిక్‌ అంకెలుగా మార్చి చూపబడుతున్నవి. 4. కరీంనగర్‌ జిల్లా శాసనములు నం. 30 క. ఈవుత పదం ధ్రుతాంతం కావచ్చు. కొని కవి 'ము" ప్రత్యయంతో ఈ మొదటి పద్యంలోనేకాక మూడన సద్యంలోనూ వాడినాడు. నాల్గవ పద్యంతో ఈవుతన్‌ అనే ఉంది. 6. నొల్గవ కందపద్యం రెండవ పాదం చివరి గణం, మూడవ పాదం ప్రాస లేఖకుని పారపాటున కాబోలు తప్పీనవి. ఆ పాదాన్ని “సర్వేశుడుగౌ. రీవరు డనవరతంబును"” అంటే సరిపోతుంది. 7. కరీంనగర్‌ జిల్లా శాసనాలు - అనుబంధం -1, పుట. 146. 8. ఈ గ్రామం ఎక్కడ వుందో తెలియడు.

26 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాపొత్వ చరిత్ర” 9. శాసనంలో 'వానుదేవ అని ఊన్న పేరును ఎందుకో కానిఆంగ్లభాషలో శాసన వివరాలు తెలుపుతూ పుస్తక సంపాదకులు 'నాథదేవ' అని వ్రాశారు. 10. గణపతి దేవ చక్రవర్తి బావమరిది. ఈజాయపనేనాని నృత్త రత్నాకర కర్త. 11. కాకతీయ సామంతుడుగా చెన్నూరు మండలాన్ని పాలించిన అల్లం ప్రోలరాజు చేత 1199లో భూదానంపొందిన మంచి భట్టోపాధ్యాయుడు గణపతిదేవ చక్రవర్తి పురోహితుడు. ఈ మంచి రాజు వేరే వ్యక్తి, 12. కఠీంనగర్‌ జిల్లా శాసనములు - నం. 36; పుటలు 103, 104. 13. కరీంనగర్‌ జిల్లా శాసనములు - నం 37. 14 ఈ శాసనంలోని కామాలు శాసన పంక్తులను చూపుటకు ఉద్దేశింపబడినవి. ఇది స్తంభశాసనం. పై అంకెలు శాసన శిలనాలుగు ప్రక్కలు. (శాసన) సాహిత్య సమాలోకనం - | చరిత్ర: కరీంనగర్‌ జిల్లాగోదావరీ నదీ తీరంలో రాతియుగపు ఆదిమ మానవ నివాస స్థావరాలు, వారు వాడిన రాతి పనిముట్లు లభించాయి. కదంబాపూర్స్‌ సింగాపూర్స్‌బిజిగిరి షరీఫ్‌, తాగజ్టాయి, కనగర్తి, నాంపల్లి, బొడిగపల్లి మొ॥ ప్రదేశాలలో బృహచ్చిలా యుగ సమాధులు ఉన్నాయి.' ఈ కైరన్సును గ్రామీణులురాకాసిగుళ్ళు అని వ్యవహరిస్తున్నారు. ఇవి క్రీ.పూ 600 నుండి 200 సంవత్సరాల కాలానివి. రామాయణంతో దండకారణ్యంలోని ఈ ప్రాంతం బౌద్ధ సాహిత్యంలో అంధా పథంగా పేర్కొనబడింది. ఇది అశ్మక రాజ్యం లోనిది. నాగులు, ఆంధ్రులు, శాతవాహనులు ఇక్కడి పూర్వపాలకులు. కెలింగులు ముదిబాలు స్థానికులు. క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల పాలన ఈ ప్రాంతంలోనూ సాగింది. క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి, శ్రీశ. 2వ, శతాబ్ది వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ మండలం కూడా ఉంది. శాతవాహనులకు పూర్వం ఆంధ్రరాజులు పరిపాలించారు. పెద్ద బొంకూరు, కోటిలింగాల, ధూళికట్ట, వేంనూరు, శాతవాహన - పూర్వశాతవాహనాంధ్ర నగరాలు. చివరి మూడు బలమైన కోటలు. మొదటి మూడుప్రాంతాలలో ఆంధ్రుల కాలపు (క్రీపూ 400-200) పంచ్‌మార్క్‌ సొామగోపనాణాలు లభించాయి. ఆంధ్రులకు బలమైన 30 కోటలు కలవని మెగస్తనీస్‌ వ్రాసిన వానిలో మూడు ఈ జిల్లాలోనివే. శాతవాహనులు ఈ ప్రాంతం నుండే పశ్చిమ కోస్తాకు వెళ్ళి. అటు నుండి తూర్పు కోస్తా మీదుగా ఉత్తర భారతానికి విస్తరించారని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడి ధూళికట్ట - వడ్కాపూర్‌ సమీపాన ఒక బౌద్ధస్తూపం వెలువడింది. ఇది అమరావతి స్తూపం శాలానిది. దీని నాగముచికుంద తదితర శిల్చ శిలా ఫలకాలు కరీంనగరం పురావస్తు పరిశోధన శాలలో ఉన్నాయి. ఈ స్తూప ఫలకాలమీది దాతల పేర్లు, కదంబాపూర్‌ సమాధి పేటిక ముద్ర, కోటిలింగాల నాఖేల రాజుల నామాలు ఇక్కడి తొలివ్రాతలు. అవి అన్నీ బ్రహ్మీలిపిలో ఉన్న ప్రాకృత పదాలు. శాతవాహనులు మగధను కూడా జయించి పాలించారు. శాతవాహనుల తర్వాత 3, 6 శతాబ్దాల మధ్యకాలంలో ఆంధ్ర దేశంలో చిన్నరాజ్యాలు అనేకం పుట్టుకు వచ్చాయి, వాటిలో వేంగి సాలంకాయనుల, కీసర గుట్ట విష్ణుకుండినుల ఏలుబడిలో కరీంనగర్‌ మండలం కూడా ఉంది. 7, 8 శతాబ్బుల్లో బాదామి చాళుక్యుల, 9, 10 శతాబ్బుల్లో మాన్యళేట రాష్ట్రకూటుల సామంతులైన బోధన్‌ వేములవాడ చాళుక్యుల పరిపాలన ఈ ప్రాంతంపై సాగందొ 10వ, శతాబ్ది చివరి నుండి కల్యాణి చాళుక్యుల సామంతులు, 12వ శతాబ్ది మధ్య కాలం నుండి కాకతీయాంధ్ర చక్రవర్తులు ఈ నేల నేలారు.

మొదటి భాగం, | అధ్యాయం: శొసనీ సాహిత్యం లై7 సాహిత్యం ; 10వ, శతాబ్ది వేముల వాడ చాళుక్య రాజుల శాసనాలు, 11వ, శతాబ్దిలోని కల్యాణి చాళుక్యుల సామంతుల శాసనాలు, 12, 13 శతాబ్దులలోని ఓరుగంటి కాకతీయ చక్రవర్తుల కాలం నాటి శాసనాలు సంస్కృత కన్నడ తెలుగు భాషల్లో ఈ జిల్లాలో లభించాయి. ఆ నాలుగు శతాబ్దాల తెలుగు శాసనాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి.

తర్వాతి కాలంలో 17, 18 శతాబ్దాల వరకు ఇక్కడి ఆలయాల - కోటల చెంత అనేక శాసనాలున్నాయి. వానిలో వచనాలవి ఎక్కువ. అప్పటికి ఈ జిల్లాలో కావ్య సాహిత్యం వ్యాప్తికి వచ్చింది కనుక, ఆ శాననాల ప్రస్తావనకు పోలేదు. ఈ 'తెలుగు శానన సాహిత్యం” సమీక్ష, ఒక విధంగా ఆంధ్ర సాహిత్య చరిత్రలో ప్రాబ్బన్న్మయ యుగ వాజ్మయం వలె కరీంనగర్‌ జిల్లాలో ఆంధ్ర కావ్య ప్రొదుర్భావానికి పూర్వకాల సాహిత్య పరామర్శ అనుకోవచ్చు.

10, 11 శతాబ్దాల తెలుగు శాసనాలు పూర్తిగా, 12, 13 శతాబ్దాల కాకతీయుల కాలం నాటి తెలుగు శాసనాలలో కొన్ని ప్రముఖమైనవి మాత్రమే ఈ శీర్చికలో చూపబడినవి. శాసన సాహిత్య సమీక్ష : పదవ శతాబ్ది మధ్య వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ కరీంనగర్‌ జిల్లాలో పద్యకవిత ఆరంభమైంది. అది ఆది కవి నన్నయ భట్టారకునికి వందేండ్లు పూర్వం. కందం తప్ప మరే తెలుగు పద్యం కానీ అప్పుడు ఈ జిల్హాలో కనిపించలేదు. ఆ కాలంలో కందపద్యం ఈ జిల్లాలో తప్ప మరే ప్రాంతపు తెలుగు శాసనంలోనూ లేదు.

ఆంధ్ర ప్రదేశంలో మొట్ట మొదట కందం కనిపించింది కరీంనగర్‌ జిల్లాలోనే అనటం నిర్వివాదాంశం.

ఇదే శతాబ్దిలో రెండవ అరికేసరి కాలంలో కురిక్యాల శాసనానికి కొంచెం ముందుగా జినవల్లభుని అన్న పంపమహాకవి కన్నడ భాషలో విశ్రమార్దున విజయం. అదిపురాణం ఇక్కడి వేములవాడలో రచించాడు. కన్నడ (941) సాహిత్యంలో పంపన ఆదికవి. ఆదిపురాణం తేలుగులో రచించినరన్న కవి (953) ఈ మండలంవాడు కాడు. పంపకవికి కొంత తర్వాతి వాడైన కాశ్మీరకవి సోమదేవ సూరి (959) మూడవ అరికేసరి కాలంలో ఇదే వేముల వాడలో యశస్తిలక చంవువు, కథా నరిత్సాగరం, నీతి సూక్తి ముక్తావళి, అనే గ్రంథాలు నంస్కృతంలో రచించాడు. పంప సోమదేవ కవులిద్దరూ జైనులు. కల్యాణి చాళుక్యులు కర్ణాటక భాషనే ఆదరించారు. శిలాశాసనాలు తప్ప, ఆ కాలంలో తెలుగు కన్నడ నంస్కృత భాషల్లో ఏ ఒక్క కావ్య రచన కానీ ఇక్కడ జరిగిన ఆధారాలు లేవు.

కాకతీయుల కాలంలో మంథని కాళేశ్వర ప్రాంతాల్లో ఉద్దండ సంస్కృత పండితులుండేవారు. వారు చథక్రవర్తుల ప్రాపునందారు; సన్మానాలు అగ్రహారాలు పొందారు. కాని, వారు ఏ భాషలోనూ కావ్యాలు రచించిన ఆధారాలు లేవు. కాకతి రాజన్యుల పేర ఈ జిల్లాలో పోలవరం, రుద్రారం, మహాదేవ వురం మొ॥ అనేక గ్రామాలున్నాయి. గణపతి రుద్రమ ప్రతాపరుద్రుల మంత్రి శివదేవయ్య గారు మంథని ప్రాంత చంద్రవల్లిలో శైవ మఠం స్థాపించాడు.

కాకతీయుల పాలనాకాలంలో 14వ, శతాబ్ది ప్రథమపాదం వరకు ఈ జిల్లాలో శిల్ప శోభాలం కృతాలైన అనేక దేవాలయాల నిర్మాణం సాగిందే తప్ప, ఏ ఒక్క కావ్య సృష్టి కానీ ఈ ప్రాంతంలో జరుగకపోవడం చిత్రం. సాహితీలోకంలో స్థలకాల రచనల విషయాల్లో బవాస్పదుడైన వేములవాడ భీమకవి మాత్రంఈ కాలంవాడు.

కావ్యాలు కాకున్నా కావ్యాలనదగిన రెండు పద్యశాసనాలు ఈ మండలంలో కాకతియుగంలో లభించాయి. గద్య శాసనాలు కేవలం భాషా స్వరూప చారిత్రక విషయాల అవగాహనకు ఉపకరించేవి. పద్య శాననాలలో వెల్లంకి గంగాధర మంత్రి నగునూరు శాసనం, మహాకవి తిక్కన సోమయాజికి 60, 70 ఏండ్లు పూర్వపుది. గొడిశాల చంపూ శాసనం ఇంచుమించు తిక్కన కవి కాలపుది. కటుకూరు, మంథని, కాళేశ్వర శాసనాలు చక్కని సాహితీ మూల్యాలు కలవైనా అవి సంస్కృతంలో ఉన్నాయి.

28 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర”

మన తెలుగు కవులు సంస్కృత భాషా సాహిత్యాలలో సముచిత వైదుష్యం, ప్రతిభావ్యుత్పత్తులు కలవారనడానికి పై శాసనాల సాహిత్యాన్ని నిదర్శనంగా చూపవచ్చు. నాడే కాదు ఈనాడు కూడా సంస్కృతాంధ్రోభయ భాషల్లో నమాన పాండిత్యం - కవిత్వం ఈ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి విద్యావంతులకు నంస్కృతమందే గౌరవం, ఆంధ్రమంటే (పేమ!

"భాషా ఛందో విశేషాలు: ఈ శాసన యుగంలో తెలుగు లిపి స్థిర రూపాన్ని సంతరించుకున్నా తెలుగు పదాలు మాత్రం స్థిరత పొందలేదు. నన్నయకు పూర్వకాలంలోనే కాదు, తర్వాతి కాకతీయుల కాలంలోనూ ఒకే పదం పలు రూపొలలో పలుకబడింది. ఉదాహరణకు 'కాకతీయి వంశ నామాన్నే తీసుకోవచ్చు. కాకతీయ, కొకెత, కాకిత అని ఆది అనేక విధాలుగా ఈ శాసనాలో ఉంది. హనుమకొండపురం పేరు కూడా అంతే. తత్సమ పదాలు కూడా (ఉదియించు, రమణియ్య- అని) కొన్ని స్థిర రూపం పొందలేదు,

అర సున్న ఉండవలసిన చోట పూర్ణ బిందువునే (వ్రాసేవారు. చిందు పూర్వాక్షర ద్విత్వం చాళుక్యుల కాల శాసనాల్లో ఉన్నా, కాకతీయుల శాసనాల్లో అదీ లేదు. ఛందస్సు పరిచయం లేని వాళ్లు ఈ పద్యాలను సరిగా చదవడం కష్టం.

క్రొవడి వలసల గిలక్కృపాల్లునకారం వలె చూపారు ధమ్మము ఇట్లా రేఫ సంయుక్తాక్షరం తప్పక ద్విత్వంగా ఉంది. ఈ శాసనాలన్పింటిలో ఇటువంటి వ్రాతే ఉన్నా ముద్రణా సౌకర్యం లేక వానిని 'ధర్మము' అని ఇప్పటి రూపాలలోనే ఈ వ్యాసంలో వ్రాయుట జరిగింది.

అ, క్ల ' ' అనే మూల ద్రవిడ అక్షరం వాభైపఅమ్‌ వంటి పదాల్లో తమిళ భాషలో ఇప్పటికి సజీవంగా ఉంది. ఈ శాసనాలలోని కన్నడ పద్యాల్లో కొన్ని పదాల్లో ఉన్నా అది తెలుగులో మాత్రం పదవ శతాబ్లి వరకే అంతరించిపోయింది. అ అక్షరం ళ, డ, అ లుగా మన భాషలో మారింది.

న్‌, ల్‌ ర్‌ లుగా ఉండవలసిన హలంత పదాలు, నులు రు అని అజంతాలుగా వ్రాశారు. పద్యాల్లో వానిని పాల్గులుగా చదివితేనే గణభంగం తప్పుతుంది. కాకతీయుల కాలంలో నకారం హలంతంగానూ కొన్ని పద్య పాదాంతాల్లో కన్పిస్తున్నది.

అ కాలం నాటి వ్రాతలో బుత్వాన్ని 4) రేఫ ఇకారాల సంయుక్తంగా వ్రాశారు. ఊ॥ వృత్తం - విత్తం, కృతి - క్రితి, మృగం - మ్రిగం. అది వ్యవహారంలోని ధ్వనికి అనుకరణ మాత్రమే. బుత్వం ఆ అక్షర ధ్వని విశేషతను తెలుపుతుంది.

ఈ జిల్లా శాసనాల తెలుగు సాహిత్యంలో అయిదారురకాల నృత్త పద్యాలు కందాలు చక్కని శైలీ రామణీయకతతో చిక్కని బావవిన్యాసంతో ఛందోబద్ధంగా కనిపిస్తున్నాయి.

పాబ్బన్నయ కాలపు కోస్తాంధ్ర శాసనాలలోని మధ్యాక్కర, తరువోజ, సీస పద్యాలు ఇక్కడ్శి శాసనాల్లో లేవు. నన్నయక్తు తర్వాతి కాలంలో కూడా ఇక్కడి కాకతి యుగ శాసనాల్లో పై పద్యాతే కాక తేటగీతి, ఆటవెలది పద్యాలు వాడబడలేదు. ఇక్కడ కందపద్యం వాడకం అధికం.

ఇది కఠీంనగర్‌ ప్రాంతపు నాటి కవుల ప్రత్యేకతను చాటించే అంశం. పొదనీరికలు:

  1. ఇలాంటి దొక్షసి గుళ్లు నాగపూర్‌ నుండి కేరళ వరకు ఉన్నాయని ఠొకూర్‌ రాజారాం సింగ్‌

“కరింనగర్‌ మండల చరిత్ర' పుట - 17లో పేర్కొన్నారు. 2 డా.కృష్ణళాస్త్రి ఆంధ్ర ప్రదేశ్‌ వురావస్తు పరిశోధన శాఖ డిప్యూటి డైరెక్టర్‌ గారి అభిప్రాయం. 3. ఈ మండల పూర్వ చరిత్ర వ్రాయుటకు తోడ్పడిన గ్రంథాలు.

మొదటి భాగం, 1 అధ్యాయం: శొనన్‌ నహొత్చ్యం 23

  1. ఠ్తాకూర్‌ రాజారాం సింగ్‌ గారి వ్యాసం “కరీంనగర్‌ మండల చరిత్ర" 1981

  2. ఎం. సంజీవరావు గారి వ్యాసం “మానేరొ ఉరూ మాసవత్రిక సె. అక్టో. 1968.

  3. ఏ. బాపురావు గారి రామగిరి చరిత్ర” 1382.

  4. డా॥ జె. రమణయ్య గారి “దక్షిణ భారతదేశ అలయాలు' ఆంగ్ల గ్రంథం.

  5. కీ.శే, జి.సి. కొండయ్య గారి 'ఆంధ్రుల ప్రాచీన చరిత్ర' 1992.

  6. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి “సంస్కృత వాజయ చరిత్ర 2వ, భాగం.

  7. రాజుల కాలంలో వర్జిల్లిన తెలుగు సాహిత్యం (4-5 శతాబ్దులు)

ఏ చక్రవర్తుల రాజధాని నగరం కానీ ఈ కరీంనగర్‌ జిల్లాలో లేదు. ఇక్కడ కాకతీయ, రాచకొండ పద్మనాయక, రాజమహేంద్రవర రెడ్డి రాజన్యుల కాలాల్లో సామంతరాజుల పరిపొలన సాగింది. అనేకగిరి స్థల దుర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రామగిరి, వెలిగందుల, ధర్మపురి మొదలైన దుర్గాల నేలిన సామంత ప్రభువులు - రాజ ప్రతినిధులు తెలుగు కవులను పోషించి కావ్య సృష్టికి దోహదం చేశారు.

14వ శతాబ్ది నుండి 16వ, శతాబ్ది వరకు ఈ మూడు వందలేండ్ల కాలంలో ఈ జిల్లాలో 'పధానంగా కనిపించిన తెలుగు కవులు వీరు.

  1. మడికి సింగన ఎం రామగిరి

  2. కందనామాత్యుడు అం వెలిగందుల

  3. వెలిగందుల నారయ ల వెలిగందుల

  4. చరికొండ ధర్మన లం ధర్మపురి అనుతశ్రుత కవులు - అలబ్ధ సాహిత్యం

  5. వేములవాడ భీమకవి ల వేములవాడ 2, శరభాంక కవి ఉం వేములవాడ ౩, ఎడపాటి ఎల్బయ లం రామగిరి

4, చుండి కాళయ్య లం సుందిల్ల

. మడికి సింగన - రామగిరి 4వ, శతాబ్ధి

మడికి సింగన కవి1 కరీంనగర్‌ జిల్లా రామగిరి నివాసి. కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లికిఅనతి దూరంలో గోదావరినదికి దక్షిణంగా ఉన్న గిరిదుర్ల పట్టణం రామగిరి.2 పౌరాణిక గాధల నుండి చారిత్రక కాలం వరకు దీనికి చాల ప్రశస్తి ఉంది.3

14వ, శతాబ్దిలో రామగిరిని పాలించిన గురిజాల ముప్ప భూపతి ఆస్థాన కవి సింగన. శేషాద్రి రమణ కవులు తమ “నైజాము రాష్ట్ర ప్రశంస” గ్రంథంలో ఇట్లా పేర్కొన్నారు.”ఈ కవి ఏలూరు చెంతనున్న పెద్దమడికి నివసియయ్యు గోదావరి తీరమున గరీంనగరమునకు జేరువన నున్న నబ్చివాటి రాష్ట్రములోని రామగిరిని బరిపాలించు ముష్పనాయకుని వద్ద కందమంత్రి వద్ద నాస్టాన కవిగ నుండి గౌరవములనంది యచటనే వృత్తుల నంపాదించుకొని నిలిచిపోయెను.ల

ఈ కవి రచనలు నాలుగు పద్య కావ్యాలు. అవి ఇవి.5

1 పద్మపురాబోత్తర ఖండము, 2. భాగవత దశమ స్కంధము

  1. వాసిస్ట్థామాయణము, 4. సకల నీతి సమ్మతము కవివంశవివరాలు ; సింగనకవి తాత అల్లాడ మంత్రి. ఆయన తిక్కన సోమయాజి మనుమరాలైన చిట్టాంబికను పెళ్లాడినాడు. అల్లాడ మంత్రి కృష్ణానది దక్తిణ తీరాన గల కోట భూమిలోని రావెల అనుగ్రామాన్ని అగ్రహారంగా పాంది గుడి గోపురాలు నిర్మింపజేసి వైభవంగా జీవించాడు.6

అ అల్లాడ మంత్రి పుత్రుడు అయ్యల మంత్రి. ఇతని భార్య సింగాంబ. అయ్యల మంత్రి రామహేంద్రవర పాలకుడైన తొయ్యేటి అనపోత భూపతికి అమాత్యుడు. ఈ అయ్యన గౌతమీ నదికి ఉత్తర తీరానగల పెద్దమడికిలో స్థిరచరాస్తులు గలిగి సుఖంగా జీవించాడు. (వా.రా : 1-33)

మొదటి భాగం, ॥ అధ్యాయం: రాణిం కాంంనాటే తంయిగు నారొర్ళుం 31 సింగాంబ అయ్యలార్యుల పుత్రుడు మడికి సింగన. కవి తమ కుటుంబాన్ని వాసిష్ట్రామాయణ అవతారికలో వర్ణించిన పద్యం ఇది. | చం. ఒనరగ నవ్వధూ వరులహోబలదేవుని గొల్చి తద్వరం - బున నొగి సింగనార్యుని నమోఘ గుణాఢ్యు ననంతుని న్మహీ జననుతు గోపయాంబ బుధ నన్నుతి పొత్రుని నారయాహ్వయుం గని నరసింహ నామములు గారవమారగబెట్టిరందరున్‌. అయ్యల మంత్రికి భార్యలిద్దరు. అందులో సింగాంబికకు సింగన, అనంతుడు, గోపయాంబకు నారయ కుమారులు. అహోబల నరసింహుడు వారి కుల దైవం కాబట్టీ అయ్యలామాత్యుడు ముగ్గురు పుత్రులకూ నరసింహ నామాలనుంచాడు. కం. వారలలో నగ్రజుడను, వారిజదళ నయన చరణ వారిజ సేవా - శ్రీ రచనా చతురమతిని సింగాహ్వయుడన్‌, అని సింగన తన హరిభక్తిని కవన శక్తిని చాటుకున్నాడు. వంశ గోత్రాదులు : మడికి సింగన పూర్వీకుల గృహనామమేమై ఉండునో కాని, ఆయన మాత్రంజన్మగ్రామమైన “మడికి' పేరనే వ్యాప్తి పొందాడు. సింగనది భారద్వాజ గోత్రం. కం. నరస కవితా విలాసుడ, గురు భారద్వాజ రమ్య గోత్రాబ్టి సుధా కిరణయ్యలార్య తనయుడ, హరి దాసుడ మడికి సింగయాఖ్యుడధాత్రిన్‌. (న. నీ. సమ్మతం, 1-3). సింగన తన గురువుగా తిరుమలయ్యను పేర్కొన్నాడు. ఇహపరాలకు నహకరించేవి గురు చరణాలే కాబట్టి, పరవాదులైన మదపుటేనుగులకు సింహం వంటి వాడైన తిరుమలయ్య గారిని సేవించానన్నాడు. (పద్మపురాణోత్తర ఖండం, 1-11) ఇంకా, వేంకటేశ్వరుని పాద పద్మాల భ్రమరం, అన్ని మతాల సారం తెలిసినవాడు, మంత్ర రహస్యాల నెరిగినవాడు, పాప విధ్వంనకుడు తన గురువని సంస్తుతించాడు. (వాసిష్ట రామాయణం, 18). సింగన నియోగి బ్రాహ్మణుడు. హరి భక్తి సంయుతుడు. కవికాలం: సింగన కవి కాల నిర్ణయానికి అతనికి ఆశ్రయమిచ్చిన ముప్ప భూవతి కాల నిర్ణయం దోహదకారి. కాకతీయుల చక్రవర్తులలో చివరి వాడైన ప్రతాపరుద్రుని పతనానంతరం (క్రీ.శ. 1325) ఓరుగల్లు ఆంధ్ర సామ్రాజ్యం కొన్నేండ్లు ఢిల్లీ ముస్లిం పాలకుల వశమైంది. కాపషయనాయకుడు అను ఆంధ్రవీరుడు కాకతి కాల 'సేనానులను సమీకరించి ముస్లిం సేనల నెదిరించి ఓడించి పారద్రోలి, ఏకాశిలానగరం రాజధానిగా తిరిగి మహాంధ్ర సామ్రాజ్యాన్ని నెల కొల్పాడు.? అతని పాలనా కాలం క్రీశ. 1345-69 అని చరిత్ర కారుల నిర్ణయం8. కాపయ నాయకునిచే రామగిరి యందు సామంతరాజుగా నియుక్తుడైన గురిజాల ముప్ప భూపతి కాలం కూడా అదే అని భావించవచ్చు. . మరో కోణంలో కవి తండ్రి అయ్యల మంత్రి కాలాన్ని బట్టి కూడా సింగనకవి కాల నిర్ణయం చేయడానికి నీలున్నది. తొయ్యేటి అనపోత నాయుని ఆశ్రితుడు అయ్యల మంత్రి. అతడు కాపషయనాయకుని పినతల్లి కుమారుడు. ఏకశిలానగర సామ్రాజ్యంలోని రాజమహేంద్రవర సామంతపాలకుడు అనపోతనాయకుడు. అనపోతనాయుని ద్రాక్షారామ శాసనం క్రీ.శ. 1347 సంవత్సరపుది ఉంది. అతనిని చోడభక్తిరాజు 1355లో వధించినట్లుగా మద్రాసు మ్యూజియం శాసనాలు తెల్పుతున్నవి.

32 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సావాత్య చరిత్ర” అనపోతనాయుని మరణం తర్వాత తండ్రి నిరాశ్రయుడు కాగా సింగన రామగిరిని చేరి ఉంటాడు. అది 1355 తర్వాతనే. 1369 వరకే రామగిరిలో ముప్పభూపాలుని పాలన కాబట్టి క్రీ.శ. 1355 -69 మధ్య ఇంచుమించు ఓ పదిహేనేండ్ల కాలం సింగన రామగిరి రాజాశ్రయంలో ఉన్నాడు. ఆ కాలంలోనే సింగన తన నాలుగు కావ్యాలను రచించాడు. రామగిరిని చేరిన కాలంలో సింగన 25, 30 ఏండ్ల వాడనుకుంటే అతని జననం 1325 ప్రాంతం. 70, 75 ఏండ్లు ఆతని జీవిత కాలమనుకుంటే 1400 వరకు జీవించి ఉంటాడు. కాని, 1369 తర్వాత సింగన ఎక్కడ ఉన్నది, ఏం చేసిందీ తెలువదు. తాను ముప్పభూపతి చేత దానంపొందిన (గ్రామాల్లో కాలక్షేపం చేసి ఉంటాడు. రామగిరికి ఉత్తరాన మడికి గ్రామం ఉంది. సింగన కాలం శ్రీ.శ. 1325 - 1390 లేదా 1400. సెంగనకృతులు -కృతిపతులు: 1. పద్మపురాణోత్తర ఖండము - కందన మంత్రికి అంకితం 2. భాగవత దశమస్కంధము - కందన (వెలిగందలామాత్యుడు) ౩. వాసిష్ట్థ్టామాయణము - అహోబల నరసింహస్వామి 4. సకల నీతి సమ్మతము - రామగిరి కేశవ స్వామి. పై నాలుగు కావ్యాలు ముద్రితమైనవి. వాటి అవతారికలను బట్టి కృతిపతుల గురిరచిస్పష్టంగా తఆలుస్తున్నది. సింగన తన మొదటి రెండు కావ్యాలను ముప్పభూపతికి మంత్రియు, వెలిగందుల దుర్గ పాలకుడును, తనకు మిత్రుడును అయిన కందనామాత్యునికి కృతి ఇచ్చాడు. మూడవది తన ఇష్ట దైవానికి, నాలుగవది స్థానిక దేవునికి అంకితం కావించాడు. సింగన కాలనిర్ణయ విషయంలో సాహిత్య చరిత్రకారులు కాస్త ముందుకు (1420) లాగే ప్రయత్నాలు చేశారు కాన, అతని నివాస స్థల విషయంలో రచనల విషయంలో మాత్రం విభేదించలేదు. ప్రతిభా వంతుడైన సింగన కవికి ఆశ్రయ మిచ్చి ముప్ప నరపతి, అతని మంత్రులు కేసన కందనలు (వీరిద్దరు సోదరులు) ఆంధ్ర సాహితీలోకంలో శాశ్వత యశము నార్దించారు. ముప్ప భూపాలుని పర క్రమౌదార్యాది గుణ సంపత్తినే కాక, అతని సౌందర్యాన్ని, సైతం చక్కగా వర్ణించాడు సింగనకవి. ఆ పద్యం ఇది, సీ; సంపెంగ విరులతో జాజులుం గురువేరు, కొమరారు నునుసేస కొప్పు పెట్టి మృగమద కర్పూర మిళితమౌ పన్నీరు, తను పార మేన జందన మలంది యుదయ భాను ప్రభనుల్లసం బాడెడు, మణి భూషణ స్ఫూర్తి మాణుమలసి పరపైన వెన్నెల నురువుల పోలిక దనరారు ధవళ వస్త్రములు గట్టి, తే.గీ మానినీ కర చామర మరుత చలిత, కుంతలుండయి తగినిండు కొలువునందు దనువు గీర్తియు గల పుష్ప ధన్వుడనగ, జూడ నొప్పారు ముప్పయ క్లోణి విభుడు. వారా, 1-38. ముప్ప భూపతి తమ్ముడైన ముత్తయ నేనానిని కూడ సింగన తన కావ్యంలో ఒక సీసపద్యంలో వర్ణించాడు. (వా.రా, 1-19) కందన మంత్రి వర్ణన విస్తారంగా ఉంది సింగన కావ్యాల నిశేషాలు 6) పద్మపురాడోత్తర ఖండము; అష్టాదశ పురాణాలలో సాత్త్విక భక్తి పురాణ షట్కము లోనిది పద్మ ఖరాణం. పద్దెనిమిది పురాణాలు" సంస్కృతంలో వ్యాస విరచితాలుగానే చెప్పబడుతున్నవి. సింగనకు పూర్వం తిక్కనకవి శిష్యుడైన మారనచే మార్కండేయ పురాణం అనువదింపబడింది. సింగనకు సమకాలికుడో, ఇంచుక పూర్వుడో అయిన ఎజ్టినచే నృసింహ పురొణం ఆంధ్రీకరింపబడింది. ఇదే పద్మ పురాణాన్ని శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు అనువదించాడట.*” కాని, అది

మొదటి భాగం, 1! అధ్యాయం: రాజోం వాంంనాటి తెలలగు ప్రాహొత్సం 33 లభించలేదు. నాచన సోముడు ఉత్తర హరివంశం వ్రాసినట్లుగా, తిక్కన ఉత్తర రామాయణం రచించినట్లుగా కమల నాభామాత్యుడు పద్మపురాణం పూర్వార్థాన్నే ఆంధ్రీకరించిన కారణంగానేమో సింగన పద్మపురాణోత్తర ఖండాన్ని మాత్రమే విరచించాడు.

సృష్టి, భూమి, న్వర్గ, పాతాళ ఉత్తర ఖండాలు అనేవి పద్మపురాణంలోని అయిదు భాగాలు. అందులో ఉత్తర ఖండం ఉత్తమమైందని ఖ్యాతి గడించింది.

గీ. అవని పద్మంబు ఖండత్రయంబునందు”*, సర్వసారాంశమై పుణ్య జనక మగుచు మండితంబైన యుత్తర ఖండమీవు, తెలుగు గావింపు నాపేర ననఘ చరిత, (పద్మ 1-60) అని కృతిపతి కందనామాత్యుడు కోరడంతో సింగన ఈ (గ్రంథ రచన కావించాడు. పద్మపురాణం ఉత్తర ఖండం మూలంలో 2445 శ్లోకాలుండగొ సింగన కవి ఆంధ్రానువాదం 11 ఆశ్వాసాలు, 2534 వద్యాలు కలది, బ్రహ్మ ఆదేశించగా వశిష్ణుడు. స్వాయంభువ మనువునకు, లోకపాలన, ధర్మరక్షణ కావించు సామర్ధ్యం కలుగుటకై వినిపించినది ఈ పద్మ వురాణం. తిరిగి దానిని వైవస్వత మన్వంతరమున దిలీప మహారాజునకు ఆ మహర్షి వినిపించినదట. విష్ణు నాభికమల మహాత్మ ప్రతిపాదకం. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, రాజర్షి వంశక్తీర్తనం, భూవిస్తారం, నకల వర్ణాశ్రమ దీక్షా నియమాలు, సకల దేవతా స్వరూప భేదాలు, సకల మంత్ర రహస్యాలు... ఇట్టా అనేక వేదాంత విషయాలు, ఉఊపాఖ్యానాలు పద్మపురాణంలో ఉన్నాయి. ఈ పురాణ ఉత్తర ఖండంలో మాఘమాహాత్మం తెలిపే ఇతివృత్తాన్ని, దాన్ని విపులీకరించే సన్నివేశాలను, కథలను మాత్రమే సింగన తన రచనకు ఎన్నుకున్నాడు. అందుకే ఆయన పునరుక్తిగా భావించిన కొన్ని కథలను, అనవసరం అనుకొన్న

వర్ణనలను వదలి బెచిత్యాన్ని పోషించి రచన కావించాడు.

పద్య రచనలో సింగన సిద్ధహస్తుడు. తర్వాతి తరం మహాకవులైన భక్త పోతన, అల్లసాని పెద్దన

వంటి వారు సైతం ఈ కవి భావాలను పద్యాలను అనునరించారు. అ.వె. సత్యనిరతుడైన సాత్యవతేయుండు, చెప్పినట్టిదెల్ల తప్పకుండ తెలుగు సేయరాదు నలువ కైనను భక్తి కారణంబుగాగ గథరచింతు (1-64)

“భాగవతము తెలిసి పలుకుట కష్టంబు” అని పోతన పద్యం ఉంది.

చ॥ చని చని కాంచెనంత ముని నత్తముడున్నత శృంగజాలమున్‌ (1-137) కనియె శృతి సతి వ్రకర గాఢతరార్థ వరిష్టు, దివ్యబో ధన పదవీ మహత్త్వ సముదగ్ర గరిష్ట, దపో విశేషసం జనిత నితాంత పుణ్యగణ సంచయ సువ్రత నిష్ట, నయ్యెడన్‌ (1-128)

“అట చని కాంచె భూమి సురు డంబర చుంబిశిర” అని పెద్దన మను చరిత్రలోని పద్యం. ఇటువంటి అలంకార సహితమైన, మహా కవులకే మార్గ దర్శకమైన కవిత సింగనది. భృగు విద్యాధర సమాగమం, పురూరవ వృత్తాంతం, బుక్షక చరిత్రం, వామనావతారం మొదలగునవి సింగన పద్మపురాణంలోని రమ్య కథలు. పురూరవ కథలోని ఊర్వశి ప్రణయ ఘట్టం, బుక్టక చరిత్రలోని సుందోపసుందుల పోరాటం, వామనావతార గాథలో బలిచక్రవర్తిని విష్ణువు ప్రశంసించటం మొదలైన ఘట్టాలను ఆదనంగా పెంచి రసోచితంగా వర్ణించి సింగన తన కవితా ప్రతిభను చాటుకున్నాడు.

వేదాంత విషయాలను సూటిగా స్పష్టంగా క్లుప్తంగా వివరిస్తూ కథా గమనంపై ధ్యాసనుంచి సింగన “నైమిషారణ్యము వంటి పద్మపురాణమును నందన వనము వలె" తీర్చిదిద్దాడు. అతను క్లిష్ట వేదాంతాన్ని సులభ సాధ్యం చేశాడు. స్త్రీల వర్ణనలో సింగన బె చిత్యాన్ని తెలుగు తనాన్ని ప్రదర్శించాడు.

34 డా మలయశ్రీ- “కరీంనగర్‌ జల్లా తెలుగు సాపొత్య చరిత్ర” కం. వెన్నెల నీనెడి నవ్వును, గన్నుల జెలువంబు జన్నుగవ యొప్పిదయున్‌ నెన్నడుము బడుపు దనమును బున్నమి నెల దెగడు మోము పాలుపును మెజయన్‌ - 1-159. భావాలను సూటిగా నరసంగా సరళంగా చెప్పడమే తప్ప వర్ణనా జటిలత సింగన కవితలో బేదు. దనుజుల దౌవ్చ్యాల వర్ణన చూడండి. కం. సుందోప సుంద దైత్యుల, మంద పరాశ్రములు పుట్టి మదమున సేనా బృందముల గూడి జగముల, వందురగా జేసె కడు నవారణ శక్తిన్‌. 2-3 అమంద పరాక్రములు మదమున జగముల వనందురగా జేసిరని మిత పద ప్రయోగంతోనే చెప్పవలసిన దంతయు చెప్పినాడు. తర్వాతి ప్రబంధ కవులకు నడకలు నేర్చిన సింగన కవి సూర్యోదయ వర్ణనమిట్లున్నది. సీ. క్రమలినీ ముఖ పద్మ కాంతి నివాళింప, నేపార నెత్తిన దీపమనగ, బూర్వ పర్వత శిరో భూషా విశేషమై, చెలువారు గైరిక శిలయనంగ , ప్రాచీ దిశావధూ ఫాలదేశంబున లలినొప్పు సిందూర తిలక మనగ జంభారి వారణ కుంభ మధ్యంబున, భాసిల్లు జెంగల్వ బంతి యనగ "గీ. మెజసి చీకటి విరియించి మిన్ను ముట్టి, చక్రవాకాళి తాపము సంహరించి యళుల మేల్కొల్పి కొలకుల దెలువు లొసగి, తరణి యుదయాద్రి బొడదెంచె దక్షణంబ. (పద్మ 1-117) పోతనామాత్యుడు, లలితస్కంధము కృష్ణమూలము అని కావ్యాన్ని కల్పతరువుగా చెప్పిన ప్రఖ్యాత భాగవత పద్యానికి మూలమనదగిన సింగన పద్మపురాణం పద్యమిది. సీ, ధర్మబోధై శ్వర్య తతి మూల నికరంబు, విమలాది శక్తులు వెలయస్కంధ మామ్నాయ శాస్త్రంబు లనుసమశాఖలు, బహుకథా సూక్తులు పల్లవంబు లుపనిషద్వాక్యంబులురు వుష్ప సంఘంబు, పాలుపారు హరిభక్తి పుష్ప రసము వరయోగి వైష్ణవ వరులు భృంగంబులు, పరమ సౌఖ్యాసక్తి పరిమళంబు గ. బాదరాయణ వాక్సుధా '్రొఢి బెరిగి, నిఖిల ధర్మములకు నిల్వ నీడయగుచు విష్ణురూపంబు దానయై వెలసి సొమ్య, రసికమై యొప్పు బద్మపురాణ తరువు. (పద్మ 1-67) ధర్మబోధ వేళ్ళుగా, పవిత్రత బోదెగా, వేదశాస్త్రాలు కొమ్మలుగా, కథలు చిగుళ్లుగా, ఉపనిషత్తుల సూక్తులు పూలుగా, హరిభక్తి తేనెగా, మునులు విష్ణు భక్తులు తుమ్మెదలుగా, మోక్నా సక్తి సరిమళంబుగా కలది పద్మ పురాణం అనే వృక్తం. అది వ్యాసుని వాక్కులు అనే అమృత ప్రవాహంతో పెరిగి, సకల ధర్మాలకు నిలయమై, తానే విష్ణురూపంగా వెలసి, సొమ్య రసికమై, భాసించినధని భావం. ఈ హరిరూప పురాణ తరువు కవి అనకున్నా కల్పవృక్షమే! అ భాగవత దశమస్యంధము:; ఇది ద్విపద కావ్యం. పోతన భాగవతం కంటే ముందే విరచితమైంది. సింగనభాగవతాన్ని మొదటి నుండి ఆరంభించక ఒక్క దశమ స్కంధాన్ని ఎన్నుకోవటానికి కారణం, ఈతని విష్ణుభక్తికి ఆ స్కంధంలోని శ్రీకృష్ణ కథ ఆకట్టుకోవడం అనుకోవచ్చు. సింగన మొదటి కృతి పద్య కావ్యం. ఈ రెండవది ద్విపద. అంతవరకు ద్విపద కావ్యాలైన పాల్కురికి సొమవాథుని బనవవురాణం, పండితా రాధ్య చరిత్రము మరియు గోనబుద్గారిడ్డి రంగనాథ రామాయణము సామాన్య జనాదరణ పొంది యుండుట చూసి, సింగన ఈ ద్విపద కావ్య రచనకు వూనుకొని ఉంటాడు. సింగనకు పూర్వం భారతం, భాస్కర రంగనాథ రామాయణాలు విరచితాలైనవి.

మొదటి భాగం, 1] అధ్యాయం: రాజం కాంయా!న తెలుగు నాహొత్చం 35 సింగన తన భాగవత దశమస్కంధ ద్విపద కావ్యాన్ని రామాయణం వలె కొన్ని కాండములుగా విభజించుకున్నాడు. అవి 1. కల్యాణ కాండ, 2. మధుర కాండ, 3. జగదభి రక్షకాండ.

ఈ మూడు కాండములలోని కథ అక్రూరుడు శ్రీకృష్ణుని మధురకు తీసికొని పోవుట నుండి శిశుపాలవధ వరకున్నది.* కథ అసంపూర్ణం కనుక ఈ మూడు కొండలకు ముందుగా ఒకటి (బాలకాండ) చివరగా ఒకటి (?) మరి రెండు కాండలు సింగన ఈ కావ్యంలో రచించి ఉండవచ్చునవి సాహితీ విమర్శకుల అభిప్రాయం"

సంస్కృతాంధ్రోభయ భాషల పాండిత్యం, ప్రసన్నమైన శైలి, సింగన కవిత్వానికి వన్నె తెచ్చాయి. తెలుగు పదాల పోహళింపు, అవసరమైనంత వర్ణన, సముచిత రసపోషణ అతని సుగుణాలు. మూలాన్ని యథాతథంగా కాక, నచ్చిన భాగాల నెంచుకొని కుదించి, కొన్నిచోట్ల మితంగా పెంచి, స్వతంత్ర కావ్య ఫక్కీలో కవి ఈ గ్రంథరచన కావించాడు.

సింగన కవితా శైలికి, వర్ణనా వైదగ్గికి ఒక ఉదాహరణ.

మేలైన కృష్ణుని మేచాయ బోలె, నెజినొప్పు గాళింది నీరంబు వోలె తఅచైన తేటుల దాటుల వోలె, పెనుపైన నీలాల పేరులవోలె

లలినాప్పు నీలోత్పలంబులు వోలె, దొలుకారు కాంతుల తుణబుముల వోలె దల మీరి చీకటి దట్టమై పేర్చె - (జగదభిరక్తకాండ)

ఎజ్జన భారతంలో సరన్వతిని తెల్లని వస్తువులతో పోల్చినట్టు, ఈ కవి నల్లని రూపాలతో చీకటిని ఉపమించాడు. ఇందలి తెలుగు పదాల ప్రయోగం రమణీయం.

కథా కథన విధానానికి ఒక ఉదాహరణ.

నరకాహ్వయుండు దానవ కులేశ్వరుడు, వరశక్తి మహిమ దుర్వార సత్త్వమున ధరణీపై గల రాజ తతినెల్ల నోర్చి, తన శాసనంబుల దగ నిల్చి, యంత

దని వోక యతిబలోదగ్రుడై నడచి, యమరాధిపుంగెల్చి, యగ్గి నోడించి, శమనుని గెల్చి, రాక్షను బారద్రోలి.... (కల్యాణ కాండ )

నుద్‌ర్హ వర్ణనలు లేక సూటిగా కథ నడుపుట సింగన ప్రత్యేకత. దీర్ధసమాసాలు లేక పాదాంతమున పదములు ముగిసి అర్థగ్రహణకు కష్టం లేకుండ గాన యోగ్యంగా ఈ రచన సాగింది. గోపికల వేదన ఇట్టుంది -

కట కటా! మమ్మేల కమలాక్షు డడుగు, అడిగెడి వాడైన నరుదేడె, యిట్లు విడుచునే మమ్ము నీ విరహాగ్ని నడమ? (మధురకాండ)

ఇట్లా రసోచిత వర్ణన, బెచిత్య పోషణ, భావమాధుర్యం సింగన కవన ప్రత్యేకతలు.

పద్మపురాణంలో కానీ, ఈ భాగవత దశమస్కంధంలో కానీ, నరకాసుర వధ సందర్భంలో సత్యభామ యుద్ధం చేసినట్టు సింగన చెప్పలేదు... ఈ ద్విపద భాగవతంలో, పోతన భాగవతంలో వలెనే రుక్మిణీ కల్యాణ ఘట్టంలో విప్రరాయబారమున్నది. పోతన చంపూ భాగవత కావ్య వ్యాప్తి కారణంగా నేమో, సింగన ద్విపద కావ్యం బహుళ ప్రచారం పొందలేదు. అయినా సింగన “భాగవత దశమస్కంధం' రసవత్కావ్యం.

ఇ) వాసిష్ట రామాయణము £ సంస్కృత యోగవాసిస్టం (జ్ఞానవాసిష్టం) సింగన వాసిస్ట రామాయణ కొవ్యానికీ మాతృక. ఇందలి ఇతి వృత్తం రఘువంశ రాజగురువైన వసిష్టుడు శ్రీరాము చంద్రునకు కావించిన ధర్మబోధ. ఇందులో వేదాంత ధర్మబోధకములైన అనేక ఉపకథలున్నవి.

36 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర”

విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను గొంపోవుటకు అయోధ్యకు వచ్చిన సందర్భంలోనే,శ్రీరాముడు తీర్థయాత్ర కావించికొని అప్పుడే తిరిగి వచ్చాడు. అతడు లోకంలోని దుఃఖాన్ని చూసి ఖిన్నుడై వైరాగ్య భావానికి లోనుకాగా, కులగురువు వసిష్టుడు ఈ జ్ఞానబోధ కావించినాడట. ఇది బుద్ధుని కథను పోలిన సన్నివేశం.

“జగమ్మిథ్య ఆత్మసత్యం” అని ధర్మదీక్షా కర్తవ్యంతో కార్యోన్ముఖుని చేయుతలంపుతో రాజసభలో రామునికి వసిష్టుడు ఈ జ్ఞానబోధ ఇరువదినాలుగు దినాలు చేశాడు. ధర్మజిజ్ఞాసువులైన రాజులతో మునులతో ఖేచరులతో నభక్రిక్కిరిసి పోయినదట.

ఉ. చిత్త సమాకులికరణ శీల మనోరమ దైన్య సాధ్య ని స్పత్త మహాభుజంగ కుల సంశ్రయగర్త సమృద్ధవల్లి దు ర్వృత్త గృహాంత వాసిని నవీన విలాసిని లక్ష్మి యిట్టి సం పత్తి సమస్త దోష భవ భావ భయప్రద గొక సౌఖ్యమే! (వా. రా. 1-55) అని మొదట సకల దుఃఖములకు కారణమైన సంపదలను, సంసార సౌఖ్యాన్ని నిరసించిన శ్రీరాముడు వసిష్ణుబోధ శ్రవణానంతరం అన్నాడిలా. నష్టోమోహ; పదం (ప్రాప్తః త్వత్రృసాదాన్మునీశ్వర సంపన్నోహ మహం సత్యమత్యన్న మవదా తధీః' స్థితో స్మీ గత సందేహః స్వభావే బ్రహ్మ రూపిణి నిరావరణ విజ్ఞానః కరిష్యే వచనం తవ॥ (యో.వా. ౪| శో 14, 15)

నాకు అజ్ఞానం తొలగింది, విజ్ఞానం కలిగింది, మీ ఆదేశాన్ని ఆచరిస్తాను, అని భావం. ఈ శ్లోకాలు భగవద్గీతలోని చివరి అర్జున వాక్యాలను పోలి ఉండుట గమనార్హం. పైగా భావికాలంలో మహాభారత రణరంగంలో ఇదేవిధంగా ఖిన్నుడైన అర్హునునకు శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఉపదేశించిధైర్యాన్ని ప్రసాదిస్తాడని భగవద్గీత సారాన్ని సైతం వసిష్టుడు ఈ గ్రంథంలో వివరించాడు. నిజానికి రామాయణం, మహాభారతం కంటె మొదటి దైనా, ఈ యోగవాసిష్టగ్రంథ రచన మాత్రం భగవద్గీతకు తర్వాతి కాలంలోనే జరిగి ఉండవచ్చు. ఈ కావ్యం రాముని ఉద్దేశించి వసిష్టుబోధగ్గా నృష్టింప బడినదైనా, సమస్త జన సంతరబోడ్దిష్టమైనది. అందుకు నిదర్శనంగా మూలగ్రంథంలోని ప్రతిసర్గ చివర “ఇతి శ్రీ వాసిష్ట మహారామాయణే వాల్మీకీయే మోక్షోపాయే..” అని గద్యాలున్నవి.

భగవద్గీత వలె ఉపనిషత్సార సంభూతమైన యోగ వాసిష్టం ఉద్దంధం, 14వ, శతాబ్దిలో “యోగవాసిష్ట సారసంగ్రహం' అనే గ్రంథాన్ని విద్యానారాయణ కవి రచించాడు. కొన్ని ఉపనిష, శ్తుల్చు, పంచదశి,జీవన్ముక్షి వివేకం, రామగీత మొదలైన వేదాంత గ్రంథాలు యోగ వాసిష్టంలోని శ్ఞాళ్య్బ్యై ఉదహరించడం ఈ కావ్య విశిష్టతకు నిదర్శనం.

యోగ వాసిష్టం 32వేల శ్లోకాల కావ్యం. దానిని కేవలం 12 వందల గద్య పద్యాలతో స్వి గన 'వాసీష్ట రామాయణము” పేర వేదాంత సార సంగ్రహ అనువాద కావ్యంగా రూపొందించాడ్ష. మూల గ్రంథంలో వలెనే సింగన కావ్యంలోనూ వైరాగ్య, ముముక్ష, ఉత్పత్తి, స్థితి, ఉపశమన, నిర్మాణములు అనే ఆరు ప్రకరణాలున్నాయి. ఇందులో అనేక శాస్త్ర విషయాల ప్రస్తావనమున్నా ప్రధాన కథకు భంగకరములని సింగన వానిని అనువదింపక వదిలివేశాడు. మూలంలో కథలు ఎక్కువ. సందర్భోచితంగా ఒకటి రెండు కథలను మాత్రమే సింగన స్వీకరించాడు.

గురజాడ “ముత్యాల సరాలు లోని '“లవణరాజుకల'కు మూలమనదగిన కథ ఇందులో ఉంది. అందలి బోయకుటుంబ వర్ణన నాటి శ్రామిక జన స్టితిగతికి సజీవ చిత్రణ.

మొదటి భాగం, 1 అధ్యాయం: రాణోం కాంందాని తెయగు నారొత్యం 37 చ. కడవలు కావడందునిడి గ్రక్కున మూపున మోచి, బిడ్డనిన్‌ దడయక వీపు నందునిచి, తక్కిన మువ్వుర దోడుకొంచు, నా పడతియు గంపమోచికొని పల్మరు దిట్టుచు వెంట గూడిరా నడవికి నేగి పెక్కిడుములందితి నయ్యెడ నేమి చెప్పదున్‌, (వా.రా. 2-234) ఆనాతి తిట్టింది పతినో, తన దుర్గతినో కాని, ఇది శ్రామిక ప్రీజన సహజ చిత్తవృత్తి ప్రదర్శన. సింగన కావ్యంలోని మరో రసవత్తర గాథ “చూడకెల శిఖి ధ్వజోపాఖ్యానము". ఇందలి నాయకుని స్థిత ప్రజ్ఞత్వం ప్రశంసనీయంగా వర్ణితం. వేదాంత గ్రంథమైనా అద్భుత కథాగుచ్భం యోగవాసిష్టం. సింగన అనువాదం దానికి న్యాయం చేకూర్చింది. సింగన అనువాద వైఖరి నైపుణికి ఒక మూలళ్లోకం, దాని అనువాద పద్యం ఇట ఉదహరింపబడుత్తువి. శ్లో॥ కోహం కథమిదం జాతం, కథం శామ్యతి చేతి భోః రాజన్నావేక్షసే కస్మాత్కిమజ్ఞ ఇవ తిస్టసి. (యో.వా. ప్ర6.స. 87. శ్లో 30) శం. ఏ నెవ్వడ? నెట్టీ సు, జ్ఞానంబగు? నెట్లు చిత్తశమమగు? ననియ జ్ఞానత నేల నలందుర?, భూనుత! యన, నతడు విప్ర పుత్రుని తోడన్‌, (వారా. 5-13) ఈ జ్ఞాన వాసిష్ట రాయాయణ కావ్యాన్ని పఠించడానికి అజుడు కానీ, విజ్ఞుడు కానీ కాక, భవపాళశ బద్భుడు మోక్షార్ధియైన ఆఅర్హుడే అధికారి! (వారా. 1-58) ఈ) సకల నీతి సమ్మతము: సకల నీతి నమ్మతము సింగన చివరి కృతి. ఇది అయిదు ఆశ్వాసాల పద్య సంకలన గ్రంథం2] కాని, లభించినవి మూడు ఆశ్వాసాలు. వానిలో 988 పద్యాలున్నవి. పూర్వకవుల (గ్రంథాల నుండి సేకరించినవి 948 పద్యాలు. ఈ కవివి కేవలం 40 పద్యాలు. తన పద్మపురాణోత్తర ఖండం నుండి తీసుకున్న ఒక పద్యం పోగా సింగన ఈ కావ్యం కూర్చు సందర్భంలో రచించినవి కేవలం 39 పద్యాలు. దుర్గ రక్తణ,వేట, రాజనీతి, దండన మొదలైన 43 వర్గు (శీర్షికులలో కవి తాను సేకరించిన పద్యాలను వింగడించి పొాందుపరచాడు. మరి రెండు అలబ్ధ అశ్వాసాలలో లోకోక్తి, నంగీత నాట్య విషయాలను, పూజా ప్రతిష్టాదుల ప్రశంసలను కూర్చియుండవచ్చునని కవి రచనా ప్రణాళిక ననుసరించి సాహితీ సమీక్షకుల తలంపు.22 సకలనీతి నమ్మతంలోని మూడు ఆశ్వాసాలలోని దాదాపు వేయి పద్యాలు రాజనీతికి సంబంధించినవే. కాకతీయాంధ్రయుగంలో రాజనీతి కావ్యాలు చాలా వెలువడ్డాయి. సింగన రాజాస్టానకవి. అతని తండ్రి తాతలు కూడా సామంత రాజులకు సచివులు. అందుకేనేమో రాజనీతి ప్రబంధాన్ని కూర్చాడు. ఈ అపూర్వ మహత్తర ప్రయోజనాత్మక నవ్య కావ్య సృష్టి కాకతి యుగాంతంలో, రాచకొండ కొండవీడు విజయనగరాంధ్ర సామ్రూజ్యాలకు ముందుకాలంలో కరీంనగర్‌ జిల్లాలోని రామగిరి పట్టణంలో జరిగింది! సకల నితి నమ్మతంలో సింగన సేర్కొన్న కవులు, వారి కావ్యాలు, వాటి నుండి గ్రహించిన నన్నయ భట్టు - భారతం నుండి 23 పద్యాలు నన్నెచోడకవి - కుమార సంభవం నుండి 02 పద్యాలు తిక్కన సోమయాజి - భారతంనుండి 37 పద్యాలు " = కామందకం నుండి 308 పద్యాలు

  • పంచతంత్రం నుండి 176 పద్యాలు

38 డా॥ మలయశ్రీ- “'కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” అజ్ఞాత రచయితలవి 47 పద్యాలు చాటువులు 17 పద్యాలు అప్పన - చారుచర్య నుండి 01 పద్యం మారన - మార్కండేయ పురాణం నుండి 03 పద్యాలు మంచన - కేయూర బాహుచరిత్ర నుండి 02 పద్యాలు కందన - నీతి తారావళి నుండి 12 పద్యాలు ఆంధ్రభోజుడు - నీతి భూషణం నుండి 25 పద్యాలు . శివదేవయ్య - పురుషార్థసారం నుండి 92 పద్యాలు బద్దెన నీతి నుండి 37 పద్యాలు క్షేమంద్రుడు (లక్కాభట్టు) ముద్రామాత్యం నుండి 39 పద్యాలు

  • శాలిహోత్రము నుండి 01 పద్యం = శ్రీగిరి శతకము నుండి 02 పద్యాలు
  • శ్రీరామాయణము నుండి 01 పద్యం ఈ విధంగా కాకతికాల ఏతత్పూర్వయుగ ఆంధ్ర కావ్యాల నీతి పద్యాలను సంకలనం చేశాడు సింగన. ఆ కాలపు ఎందరో అజ్ఞాతకవులను ఈ కృతి ద్వారా సింగన సొహితీలోకంలో అమరజీవులన్సు చేశాడు. సకల నీతి సమ్మతం ఆ కాలానికి ఒక వినూత్న ప్రయోజనాత్మక ప్రయోగం, కొన్ని కావ్యాలు కేవలం ఇందలి పద్యాల మూలంగానే తెలిసి వచ్చాయి - గుర్తింపు పొందాయి. ఈ కావ్యంలో శ్రీ రామాయణంలోనిదని చెప్పిన పద్యం ఎవ్వరిదో తెలువదు. ఆ పద్యం ఇది. కం. బలియునకు దనకు నడుమై, నిలిచియు సామంతు జెర్తుప్లనేర్సి న్రర్షున్స పులిబోను తలుపు తెరచిన, బొలియింపీదె మీద నుజికి బురుష నిధానా (స.నీ.స, ౩3-806) తెలుగులో ఇదే మొదటి ఆకరగ్రంథం. సంస్కృత భాషలోనూ11వ శతాబ్ది వరకు ఇట్టి రచనలు రాలేదు. సింగన ఈ సకలనీతి సమ్మత గ్రంథ నిర్మాణ ప్రయోజనాన్ని గురించి ఇట్లా వివరించాడు. కే.గ॥ కృతులు మును 'సెప్పినట్టి సతృతులు ద్రవ్వి, కాంచు కంటెను నొకచోట గొన బడంగ సకల నయశాన్త మతములు సంగ్రహించి, గ్రంథ మొనరింతు లోకోప కారముగను. (స.నీ.స. 1-14) విమర్శకుల ఆక్షేపణలను సైతం ముందుగానే ఊహించి జవాబిచ్చాడు. చ. మునుకవు లెల్ల జెప్పినది మున్కొని చర్విత చర్వణంబుగా బని వడి వ్రాయనేల కవి ప్రాజ్ఞులు చిత్తములందు జూడు డా ఘనుడగు ప్రాఢ మాలకరి కమ్మని పువ్వులు గూర్చి దండగ ట్టిన క్రియ నీతి ధామము ఘటింపుదు మీరలు మెచ్చునట్టుగన్‌ (స.నీ., 114 అని తన యీ కృతి నిర్మాణం నేర్పరియైన మాలకరి కృత్యమని చెప్పుకున్నాడు. పూర్వకవి స్తుతులతో సింగన కేవలం నన్నయ తిక్కనలను మాత్రం పేర్కొన్నాడు.24 తొలిరం డు కృతులలో కుకవుల ప్రస్తావన లేదు. మూడన కావ్యమైన వానీస్ట రామాయణంలో కుకవుల నిట్లా నిందించాడు. చ. కదిసిన నోరవోయి, యొరుకబ్బపు దొంతుల సత్సదార్థముల్‌ గదుకుచు, నెట్టివారి బొడగన్నను గుళ్ఞని, స్నేహ సౌఖ్యముల్‌ మదికి నసహ్యమై, శునక మార్గమునం జరియించుచున్న దు ప్పద కవులెల్ల మత్కవిత దప్పులు పట్టక విండ్రుగావుతన్‌ (1-7)

మొదటి భాగం, 1 అధ్యాయం: రాజాం కాంంనా(ి తెలధగు నాహొత్టం 39 పూర్వ కవుల కవిత్వ సారంబెరిగి, అనంతర కాల మహాకవులకు సైతం మార్గదర్శియై, ఒకటి రెండు కాదు, కమనీయ కావ్య చతుష్కయాన్ని రచించిన మహాకవి మడికి సింగన.

ఈ మండలంలోని మడక గ్రామం మడికి సింగన కవి దానం పొందినది కాబోలు. ఆ కవికి ఆశ్రయమిచ్చిన ముప్ప భూపతి ఆతని బంధువుల పేర్లతో వెలసిన ముప్పారం, ముత్తారం, కూనారం మొ గ్రామాలు పెద్దపల్లి తాలూకాలో ఉన్నవి. మడికి సింగన సాహిత్యం కారణంగా సబ్బి రాష్ట్రంలోని కరీంనగర్‌ మండలం - రామగిరి సీమ ధన్యమైనవి! పొద పీఠికలు:

ఓ “మడికి సింగన కవిపేరుతో డా॥ కె. కుసుమాబాయి గారి పిహెచ్‌.డి. పరిశోధన

గ్రంథం1988లో ప్రచురింపబడింది.

  1. ఆ పట్టణ ఆవశేషాలపై ఇప్పుడు బేగం పేట (పెద్దపల్లి తాలూకా) అనే గ్రామం ఉంది.

3౩. చూడుడు, ఎరబాటి బాపురావు గారి “రామగిరిచరిత్రి ముద్రణ - 1978.

4, వైజాము రాష్ట్ర ప్రశంస, పుట - 102, ముద్రణ - 1926 -

  1. డా॥ దివాకర్ల వెంకటావధాని గారి “అంధ్ర వాబ్బయ చరిత్రము” ముద్రణ - 1958.

  2. వాసిష్ట రామాయణము. 1-29.

  3. తేరాల సత్యనారాయణ శర్మ “ఓరుగంటి చరిత్రము” పుట 5-6

  4. 'ఆంధ్రకవి తరంగిణి' 4వ సంపుటిలో 1345-67 అని, చాగంటి శేయ్యగారన్నారు. కాని,

1369 వరకు కాషయపాలన మున్నట్టు అయ్యన'ప్రోలు శాసనాధారమున్నది.

  1. డొ. కె. కుసుమాబాయి గారి 'మడికి సంగనకవి' పుట. 27.

  2. పద్మపురాణ అవతారిక, భాగవత దశమస్కంధ కాండాంత ద్విపదలు,

  3. బ్రహ్మం పాద్మం వైష్ణవంచ శైవం లైంగం స గారుడమ్‌

నారదీయం భాగవత మాన్నేయం స్కాంద సంజ్ఞితమ్‌! భవిష్యం (బ్రహ్మవైవర్తంమార్కండేయం నవామనమ్‌ వరాహం మాత్స్యం కౌర్మంచ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్‌॥

  • సంస్కృత భాగవతమ్‌, స్కం.12, అధ్యా. 7, శ్లో23, 24.
  1. శ్రీనొథకవి “భీమేశ్వర పురాణం' 1-10; 13. పద్మప్రరాణం, నృష్టిభండం: అధ్యా 1, ల్లో - 54,55.

  2. పద్మపురాణం అయిదు ఖండాలు కలది. ఈ వద్యంలో ఖండత్రయం ఆనటం

ములోకములందు అనే భావంతో కాబోలు.

  1. డౌ! న్య కునుమాబాయి “మడికి సింగన కవి” పుట - 66

  2. పద్మపురాణాన్ని క్రీశ. 1953లో పిసుపొటి చిదంబర శాస్త్రిగారు సంపూర్ణంగా ఆంధ్రీకరించారు.

  3. పోతన కవికాలం 15వ శతాబ్ది.

  4. తంజావూరి నరస్వతీమహల్‌ గ్రంథాలయ ఏకైక తాళపత్ర ప్రతి. నం, 157 తొలిముద్రణ - 1950

  5. డౌః కె. కుసుమాబాయి “మడికి సింగన కవి' పుట - 68

  6. యోగవాసిష్టమ్‌ నిర్మాణ 'ప్రకరణములో అర్జునోపాఖ్యానమున్నది.

  7. దీనిని శ్రీశ. 1923 లో మానపల్లి రామకృష్ణ కవిగారు, 1970లో 'ఆంధ్ర సాహిత్యఅకాడమీ

హైదరాబాదు" వారు ప్రచురించారు.

  1. డౌ॥ కె. కుసుమాబాయి “మడికి సింగన కవి' పుట - 145.

  2. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' నం, 4 లోని పట్టిక.

  3. పద్మపురాణం, 1-9 వాసిష్ట్రామాయణ 1-5

40 డా॥ మలయ శ్రీ- “కరంనగల్‌ జిల్లా తెలుగు సావాత్య చరిత్ర” 2, కందనామాత్యుడు - వెలిగందల 14వ, శతాబ్ది

కందనకు వెలిగందలామాత్యుడు అని వ్యవహారనామం. ఆది అతని హోదాను బట్టి వచ్చిన పేరు.

పదునాలుగవ శతాబ్ది ఉత్తర భాగంలో రామగిరి నేలిన గురిజాల ముప్ప భూపాలునికి ఈ కందన, ఆతని అన్నకేసన మంత్రులు. కందన మంత్రి కృతి కర్త - కృతి భర్త. కందన వ్రాసిన కృతి “నీతి తారావళి”. మడికి సింగన కవి రచించిన తొలి రెండు కావ్యాలైన పద్మపురాణోత్తర ఖండము, భాగవత దశమ స్కంధములను వెలిగందుల కందనామాత్యుడు అంకితం పొందాడు." వంశచరిత్ర: సింగన పద్మపురాణంలో కందన మంత్రి వంశ వివరాలున్నవి. వీరిది వాణస వంశం. “పాయక పాక శాసనికి భారత ఘోర రణంబులోన నారాయబణునట్లు' నన్నయ భట్టారకునికి మహాభారత రచనలో తోడ్పడిన నారాయణ భట్టుది కూడా వాణస వంశమే.* నారాయణ భట్టుకు వీరికి బంధుత్వం ఉందో లేదో కెలియదు. కందన మంతద్రిది కాశ్యపగోత్రం.* నియోగిబ్రాహ్మబుడు- భట్టు శబ్దం నేటివలె కులవాచకం కాక, నాడు బ్రాహ్మణ పండితులకు సైతం వాడబడింది.

కందన తాత ముత్తాతలు నాలుగైదు తరాల నుండి కరీంనగర్‌ జిల్లా - సబ్బిసాయిర మండంలోని మొలంగూరు (మూలంగూరు, మొలగూరు అని శాసన నామాలు) పాలకులు. కాకతీయ చళ్రవర్తులకు విధేయ సామంత మండలాధీశులు.

ఈ వంశ మూల పురుషుడు రుద్రమంత్రి మొలంగూరు పాలకుడు.* రుద్రమంత్రి కుమారుడు గన్నయ మంత్రి గణపతి దేవుని మన్ననలందినవాడు. గన్న్మయ కొడకు మల్లన, అతని కొడుకు గణపతి. గణపతి మంత్రి కుమారుడైన అబ్బయ (ఓబలయ్య;]) పుత్రులు కేసన కందనా మాత్యులు, కందనామాత్యుడు : కందనమంత్రి ముప్ప భూపతిచే సన్మానితుడై వెలిగందలా మాత్యుడైనాడు. "పేరుకు సామంత మండలాధిపతి అయినా ఆయన న్వతంత్ర రాజువలె సకల వైభవోపేతంగా జీవించాడు; జనరంజకంగా రాజ్య పాలన కావించాడు. సింగన కవి కందనామాత్య్యుని 21 విశేషణాలతో పొగిడాడు. కందన మంత్రికి మడికి సింగన కవి మిత్రుడు.

“నీ సహవాసం కారణంగా విద్యాసుఖకేళి బేర్చి శిష్ట జనులలో బంధువర్గంలో భాసురమెన కీర్తిని పొందగలిగాను” అని కందన మంత్రి సింగనను అభినందించాడు - ఆనందించాడు. (పద్మ 1-56) ఇంకా “కృతి పతుల కీర్తి సదా లోకంలో వ్యాపించి ఉంటుంది. కావున నన్ను కృతిపతినిజేస్ప కీర్తి వెలయింపజేయు” మని కోరినాడు (పద్మ - 1-58)

సింగన కవి కందనామాత్యుని గుణగణాలను ఈ విధంగా వర్ణించాడు.

సీ ఈ ధర్మ చారిత్రునే ధాత్రి పతి యేలు, నా ధాత్రి పతియేలు నథిల జగము నీ కామినీ కాము నేకామినిలుచూతు, రా కొమినులు చూడరన్య పురుషు నీ యర్యసుత తుల్యునేయర్థి గొనియాడు, నా మంత్రి విముఖాత్ము డభిలమునక్రుు ఆ.వె. నన బ్రగల్భరూప ఘనదాన నయ మార్గ, ముల నుతింప నొప్పు ముజ్జగముల దారహార హీర ధవళాంశు నమకీర్తి కళితు డౌ బళార్య కంద విభుడు (పద్మ 1-46) అంతే కాక కందన “అపూర్వ వచన రచనా బంధుర కావ్య రసాభిజ్ఞుడు” అని సింగన పేర్కొన్నా నీతి తారావళ : కందనామాత్యుడు 'నీతితారావఠి" అనే పద్యకృతి వ్రాసినట్టుసింగన రచీం్చ్యి 'సకలనీతి నమ్మతం' అనే పద్య సంకలన గ్రంధం వల్లనే తెలిసింది. సాహిత్య చరిత్రకారుల్పు కొందరు నీతి తారావళిని మడికి సింగన, కందన మంత్రి పేర చెప్పినట్లు భ్రమించారు. కాని, సింగన శన కావ్యంలో కందనామాత్యుని నీతితారావళిలోని వని స్పష్టంగా పేర్కొని 12 కంద పద్యాలను క్రోడీకరించాడ్రు. నీతి తారావళి కృతి లభించలేదు. లభించిన పై పద్యాలను బట్టి కందన పద్యకవిత్వ శైలినిభ్వా సౌందర్యాన్ని కొంతవరకైనా గమనించవచ్చు.

మొదటి భాగం, 11 అధ్యాయం: రాణోం కాలంద్రాని తెలంగు ప్రాహొర్టీం త] కం. అమరగ వేల్చులచే గ, బృము చెప్పియు కాదె వరము వడసిరి మునుబా ణఇమయూ రాదులు సత్కా, వ్యము చెప్పిన బడయరాని వస్తువు గలదే.”

ఈ పద్యం కందనకు గల పూర్వ కవుల పరిచయాన్ని సంప్రదాయ ప్రీతిని తెలుపుతున్నది. మరో "పద్యంలో సప్త సంతానములలో శాశ్వతమై నిలిచేది, కీర్తిని కలిగించేది, నత్కావ్యమే అని అన్నాడు. (స.నీ.స. పద్యం 23) ప్రతిభ చాలని కవుల నీ విధంగా అభిశంసించాడు.

తెలుగని చెప్పి సంస్కృతపు తీపును నారడి బుచ్చి శబ్బముల్‌ తెలుగును గాక యేసభల దెల్పగరాని యప ప్రయోగముల్‌ పలుమరు గ్రుచ్చివాదడున బాడుచు గబ్బపు దబ్బముండ్డచే బెలుచన కర్ణముల్‌ పొడుచు బేలకవిం గవిగా దలంతురే. (27వ, పద్యం)

కుకవులకు ఏ కాలంలోనూ కొరత లేదు కదా. అందులో వారు పదముల చెరచు పాడుకవులు! సాహితి ప్రతిభ లేకున్నా ఏదో వ్రాసి సంగీత పరిచయంతో రాగాలు తీస్తూ రాణించే కవిభ్రువులు నాడూ ఉండిరేమో! కుకవుల నింద నన్నె చోడుని తోనే ఆరంభమైంది.

కందన ఇట్ల అన్నాడు.

చ. పలుకులు కొన్ని పేర్చి వడి బ్రాసము నందుల దోపనేర్చుభం గుల నెటువంటి పద్యములు గూర్చిన గూర్చగ వచ్చుకాక, తద్‌ జ్ఞులు పొగడం బ్రబంధములు చోద్యము పుట్టి రచింప వచ్చునే? చెలిమలు ద్రవ్వినట్లగునె చెర్వులు గట్టుట భూతలంబునన్‌!

కవి అనుభవాలను బట్టి ఉపమానములు రూపొందుతాయి, అనడానికి పై పద్యంలోని చివరి పొదం దృష్టాంతం. ఈ వానస వంశీయులు ఆలయతటాకాదులు నిర్మించినవారు.

“అంతా కవులము కామా? అంతింతో పద్య సమితి నల్లగ లేమా?” అన్నట్లుగా “నాలుక గుల తీర్చుకొనడం కోసం కాక” కవిత్వం ఈ ప్రకారంగా “చెలువపు ప్రియురాలి తీపి పలుకుల సరసం" వతె ఉండాలన్నాడు.

కం॥ పలుకుల తీవును సరసము, చెలువము నడబెడగు బంధ చిత్రము వెంవున్‌ గల కలన జూపవలదే, కలకంఠియు బోలె కవిత కందనమంత్రీ. (28వ పద్యం)

ప్రజా కవి వేమన పద్యాలలోవలె ఇది అత్మ సంబోధన.

శో॥ కావ్యం యనసే అర్థకృతే వ్యవహారవిదేశివేతర క్ష్రతయే సద్య: పర నివృతయే కాంతా నమ్మిత తయోపదేశయుజే.

అని పూర్వ ఆలంకారికులు చెప్పిన కవితా ప్రయోజనాలలో కందన కేవలం కవితా రూపభావ సౌందర్యాలకే విలువిచ్చాడు. కవితను కలకంఠితో పోల్చడమే కాక, ఈ కందం పూర్వార్ధంలోని పలుకుల తీపి, సరసము, చెలువము, నడబెడగు, బంధ చిత్రము పెంపు పదాలలో, యువతికి కవిత్వానికీ భావం సరిపోయే విధంగా శ్లేషను సమకూర్చడం గమనార్హం!

సకల నీతి నమ్మతంలోని కందన కందాలు మరికొన్ని.

అమలమగు సప్త సంతా, నములందనిశంబు యశమునకు గుదురైనా

శము లేక నెగడు నత్కా, వ్యము ధారుణిలోన నౌబళార్యుని కందా.

ధరనొప్పు నీతి మార్గము, పరికింపక దిరుగుమంత్రి పని మంత్రములే

కురు విష భుజిగము పట్టిన, కరణి సుమో యౌబలార్యు కందన మంళల్రీ.

42 డా మలయశ్రీ- ''కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపాత్య చరిత్ర”

బలవంతుడు మన్నించిన, బలహీనుడు బలియు డన(గ బడుధారుణిలో

వలరాయడు చేపట్టిన, యలరులు బాణములుగావె యౌబళ కందా.

తన్నని నమ్మిన బ్రోవక, పాన్నాకుల మీద కేనె బూసిన భంగిన్‌

నున్నని మాటల యన్నల, మన్నన లేమందు మబ్బ మంత్రియ కందా.

వీనిలో రెండవ నాలుగవ వపద్యాలలోని ఉపమాలంకారాలు మూడవ పద్యంలోని అర్భాంతరన్యాసం, కవి భావుకతకు నిదర్శనాలు, మరి రెండు హృద్యాలైన కందనామాత్య్యుని కందపద్యాల భావాలివి. “కళాకోవిదత్వము, వినయము, దానగుణము, యుద్ధవిజయము లేని రాజును స్ర్రీయు క్రీర్తియును పాందనేరవు.” “చెడ్డవాని సంగతిచే మంచి వాడును చెడ్డవాడగును; కర్పూరము కలిసిన నూనె విషమగును కదా.”

కందన తన 'నీతితారావళి' పద్యాలలో చక్కని నీతులు చెప్పి, వానిని సరియైన దృష్పాంతములతో బలపరిచాడు. ఈ పద్ధతి తర్వాతి కాలపు భాస్కర వేమన శతక పద్యాల్లోనూ ప్రముఖంగా కనిపిస్తున్నది. మంచి వారి స్నేహంతో మంచి వాడైన మాన్యుడు కందన. మడికి సింగనమహా కవి సాంగత్యంతో ఆయన చిరయశస్కుడైనాడు.

వాణన కందన - వెలిగందలామాత్యుడు రాజనీతి విశారదుడు, భోగి-త్యాగి. కందనమంత్రి సాహిత్యారాధకుడు. కవిపోషకుడు మాత్రమే కాక, కృతి స్వీకర్త - కృతి కర్త!

“విద్యానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమం.” పాద పీఠికలు;

1+ మడికి సింగన కవి కావ్యావతారికలు, 2. నన్షయభారతఅవతారిక పద్య భావం, 1-25.

  1. డా, కె కుసుమాబాయి “మడికి సింగన కవి” ప్రుట.8.

తీ పద్మపురాణోత్తర ఖండము - 1-24, 5. పద్మపురాణోత్తర ఖండము - 1-43

  1. వాసిస్ట రామాయణము 1-10, 7. సకలనీతి సమ్మతము 24వ, పద్యం

  2. వడిబ్రాసము = యతిప్రానలు; వళి, విరతి, విరామము, విశ్రాంతి, యతికి పేర్లు.

  3. ఇటీవలి చాటువు: 10. జిహ్వాకండువు పొంటె కవిరాట్ఫిల్పంబులల్పంబుతే. అని కందన

ప్రయోగం. సకలనీతి సమ్మతం - ప.25. 3. వెలిగందుల నారయ - వెలిగందుల, 15వ, శతాబ్ది

రామాయణ మహాభారతాలవలె ఆంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైనది శ్రీ మదాంధ్ర మహాభాగవతం, మొదటి రెండు ఇతిహాసాలు; భాగవతం పురాణం!

భాగవత పురాణ' ఫలరసాస్వాదన పదవి గనుడు రసిక భావ విదులు - అన్నాడు పోతన.

భారతం కవిత్రయం చేతను, భాస్కర రామాయణం కవి చతుష్టయంి చేతను ఆంధ్రీకృతమైనట్లే = భాగవతం కూడా ఏకకవి విరచితంకాక నైక కవులచేత తెలుగుసేయబడింది.

శ్రీమదాంధ్ర మహాభాగవత కర్త బమ్మెర పోతనామాత్యుడు. ఆ మహాకవి అనుమతితోనే గంగన సింగన నారనలు అందలి 12 స్కంధాలలో నాలుగు స్కంధాలను అనువదించారు. భాగవతం తెలుగులో నలువురు కవుల రచన. పోతన భాగవతాంధ్రీకరణమునకు పూనుకొని, అందలి 1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10 మొత్తం ఎనిమిది స్కంధాలను ఆమోఘంగా అనితర సాధ్యంగా రచించాడు. మిగతా నాలుగు స్కంధాల అనువాదకులు వీరు -

1 బొప్పరాజు గంగన - పంచమ స్కంధం, 2. ఏర్పూరి సింగన - షష్టస్కంధం,

  1. వెలిగందల నారయ - ఏకదశ ద్వాదశ స్కంధాలు.

మొదటి భాగం, ॥॥ అధ్యాయం: రాజం కాంంనానే తెంగు నాహొర్భ్భ్యం త వెవిగందల నారయ; ఈ నారయ కవిని నారన అని కూడా వ్యవహరిస్తున్నారు. నారాయణ అనే తత్సమ పదానికి వికృతినామం నారన, భాగవత ఏకాదశ ద్వాదళ స్కంధాంత గద్యలలో మాత్రం నారయ అనే ఉంది

వెలిగందల అనేది నారయ గృహనామమా! న్వగ్రామమా? వెలిగందుల నారన న్వగ్రామమే. ఆయన ఇంటి పేరు తెలియదు. ఎందుకంటే నారయకు గురువైన బమ్మెర పోతన, అంతకు పూర్వుడైన శివకవి పాల్కురికి సోమనలవలె ఇతడు కూడా స్వగ్రామనామంతోనే వ్యవహరింపబడి ఉంటాడు. భాగవత స్కంధాంత గద్యలిట్ట్లున్నవి.

“ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేననమంత్రి వుత్ర, నహజపొండిత్య, పోతనా మాత్య ప్రయ శిష్య వెలిగందల నారయ ప్రణీతంబైన శ్రీమహా భాగవతమునందు... ఏకాదశ స్కంధము.” ద్వొాదళ స్కంధ గద్య కూడా ఇదే విధంగా ఉంది. స్వస్థలం ; వెలిగందల కాకతీయుల కాలం నుండి చారిత్రక పట్టణం. వెలిగందుల అని వ్యవహారనామం. ముస్లింల పాలనలో ఎల్‌గందల్‌ అని పిలువబడింది. క్రీ. శ. 1905 వరకు ఇదే కరీంనగర్‌ జిల్లాకు కేంద్రం. ఈ ప్రాంతాన్ని పూర్వం వెలిగందల మండలం అని వ్యవహరించేవారు." రామగిరి సామంత రాజ్యంలో ఈ వెలిగందల ఒక మండలం. నేటి జిల్లా కేంద్రమైన కరీంనగరుకు వేములవాడ రహదారిలో 7,8 మైళ్ళ దూరంలో ఉన్న గిరి దుర్గ పట్టణం వెలిగందల, ఇప్పుడిదొక పెద్ద గ్రామం.

కరీంనగర్‌ జిల్లాలోని ఈ గ్రామం తప్ప ఆంధ్ర దేశంలో మరెచ్చట కానీ మరో వెలిగందల లేదు. అందుచేత నారయ కవి కరీంనగర్‌ మండలంలోని వెలిగందుల వాడనటం నిశ్చయాంశం.

నారయకవికి ఇంచుమించు వందేండ్ల పూర్వం కందనమంత్రి, రామగిరి ముప్ప భూపతికి సామంతుడుగా ఇదే వెలిగందల పాలకుడై వెలిగందలామాత్యుడని పిలువబడ్డాడు. ఆనాటి మట్టికోట శిథిలమైనా రాతికోట, కోటలో శిథిలాలయాలు, రాతికట్టు దిగుడుబావులు, ఇప్పటికీ ఉన్నాయి. కాలం: పోతన కాలం క్రీ.శ. 1400 - 1450. పోతన కంటె పదిరువదేండ్లు నారన పిన్స్నవయన్కుడు కావచ్చును. కావున నారన పదునైదవ శతాబ్ది వాడనుట స్పష్టం. వంశవివరాలు : భాగవత రచనలో నారయ తల్లిదండ్రుల పేర్లు కాని, వంశ-పూర్వీకుల వివరాలు కానీ తెలుపలేదు. ఆయన ఆడంబరాలనెరుగని భాగవతుడు. నారయరచనలు : 1. భాగవత ఏకాదళ ద్వాదశ స్కంధములు. 2. భాగవతభిల భాగ పూరణము. ౩. నారాయణ శతకము ౬ ఏకాదశ ద్వాదశస్మంధాలు : ఆంధ్రమహాభాగవతంలో ఏకాదశ ద్వాదశస్కంధాలు చాలా చిన్నవి. సింగన గంగనలు ఒక్కొక్క స్కంధానువాదం కావించినా, అవి ఒక్కొక్కటి ఈ రెండు స్కంధాల మొత్తము కంటె పెద్యవి. ఏకాదశ స్కంధం - 127 గద్య పద్యాలు; ద్వాదశ స్కంధం - 54 గద్య పద్యాలు. అందులో మొదటి పద్యం, చివరి గద్యం, అశ్వాసాంత పద్యాలు రెండేసి వదలితే రెండు న్కంథాల్లోని మొత్తం కథా భాగం 123+50 = 173 గద్య పద్యాలు మాత్రమే.” సంస్కృత మూల భాగవతంలోని కథా పరిమాణమిట్లున్నది." ఏకాదశస్కంధం ఆ 31 అధ్యాయములు 1347 శ్లోకాలు ద్వాదశస్కంధం - 13 అధ్యాయాలు 5568 శ్లోకాలు మొత్తం _ 44 అధ్యాయాలు 1905 శ్లోకాలు పోతనా మాళ్యుడు భాగవతాన్ని మూలంకంటె పెంచి వ్రాశాడు. దశమస్కంధం రెట్టింపు పెరిగింది. సింగన గంగనలు కూడా కథను పెంచి వ్రాశారు. నారన మాత్రం కుదించి వ్రాశాడు,

న. డా॥ మలయశ్ష్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపాత్య చరిత్ర” నారన భాగవత మూలాన్ని తన గురువు వలె పెంచక కుదించి వ్రాయడానికి కారణవేమిటి? అందుకు అరుద్రగారి సమాలోకనం అంగీకార యోగ్య సమాధానం. అది ఇది

వెలిగందల నారయ ఆశ్రయించిన కాలం నాటికి పోతన వృద్ధుడు. గంగన సింగనలు అప్పటికే ఏ కారణం చేతనో పోతనను వదలి వెళ్లిపోయి వుండాలి. పోతన మహాకవికి భాగవత గ్రంథానువాదం పూర్తి చేయాలని ఉత్కంఠగా ఉంది. అప్పుడాయన దశమస్కంధ రచనలో మునిగిపోయి ఉన్నాడు. మిగితా రెండు స్కంధాల అనువాదం పూర్తి చేయటం తనచేత కానిపని అని గుర్తించాడు. అటువంటి సమయములో తన భాగ్యంగా చేరవచ్చిన నారయకు మిగిలిన చివరి రెండు స్కంధాల అనువాద కార్యం ఒప్పగించాడు. అదీ సంగతి.

మొదటే గ్రంథ ప్రణాళిక నేర్చరచుకొని, స్కంధాలను పంచుకొని, ఆ నలుగురు కవులు ఈ భాగవత గ్రంథానువాదం కావించి యుండవచ్చును కదా - అనే సందేహం కొందరికి కలుగకపోదు. ఆ విధంగానూ జరగడానికి ఆస్కారమున్నది; కాని - భాగవత రచన మాత్రం అట్టా జరుగలేదనడానికి ఈ క్రింది అంశాలు బలంగా నిలుస్తాయి.

  1. మొదటనే నలుగురు కవులు కలిసి వ్రాస్తే, పోతన గారు సింగన గంగనలకు చెరి ఒక స్కంధం ఇచ్చిన మాదిరిగానే నారనకు కూడా ఒక స్కంధం మొదటనే ఇచ్చేవారు.

2 ఆ వరునలో చతుర్థం లేదా సప్తమస్కంధం నారనకు వచ్చి ఉండేది,

  1. నారన వెళ్లే సరికి సింగన గంగనలు లేరనడానికి నిదర్శనం, పోతన ఎనిమిది స్కంధాలు రచించినా వారు మరో స్కంధానువాదానికి పూనుకోకపోవడం.

  2. పోతన అప్పటికి అళక్తుడై ఉన్నాడనడానికి సాక్ష్యం, అన్ని వేల పద్యాలు వ్రాసిన మహాకవి ఈ రెండు చిన్న స్కంధాలు కేవలం 2, ౩ వందల పద్యాల భాగాన్ని వదలుకోవడం. పైగా ఏకాదశ ద్వాదశ స్కంధాలు భక్తి వేదాంత భావాలు కలవి. పోతనకు భక్తి అంటే ప్రాణం. ఎంతో బలమైన కారణం లేనిదే ఆయన వాటిని వదులుకోలేడు గదా!

భాగవత దశమస్కంధంలోని బాఆకృష్ణుని లీలలు గోపికల బృందావన క్రీడలు వృద్శని వర్ణనలుగా లేవు - అనే ఆక్షేపణ కొందరికి రావచ్చు. సమర్థుడైన కవి శృంగారాన్నే కాదు ఏ రసాన్నైనా ఏ వయస్సులోనైనా చక్కగా పోషించగలడు. విజ్ఞుడు రసజ్ఞుడైనపోతన కలానికి వయస్సు ప్రతిబంధకం అనుకోలేం.

క్‌ నారయ కవిత్వం పోతన మెచ్చదగినంత గొప్పగా లేదు. అయినా భాగవత స్కంధద్వయ అనువాద కార్యాన్ని ఒప్పించాడంటే, ఆయనకు సంపూర్ణ భాగవతాం(ధ్రీకరణం చూడాలనే తపనవలననే.

  1. నారయ తన అనువాదం మూలానికంటె కుదించి వ్రాయడం త్వరగా [గ్రంధ రచన పూర్తిచేయటానికే.

  2. నారయ ఈ రెండు స్కంధాలలో పద్యాలకంటె గద్యాలను ఎక్కువగా వాడటం అనువాదం త్వరగా పూర్తి చేయటానికే.

  3. పోతన తర్వాత నారయ ఈ శేషస్కంధాలను రచించి ఉండకూడదా? అంబే - ఆయన పోతనను తన గురువుగా చెప్పుకున్నాడు. అది ఏకలవ్యశిష్యరికం కాదనడానికి నిదర్శనం. భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాల గద్యలలో “పోతనా మాత్య ప్రియశిష్య వెలిగందల నారయ ప్రణీతంటైన” అని చెప్పుకొన్నాడు. ప్రత్యక్ష సంబంధం లేనిదే ఆ పదం వాడుట జరుగదు. 'పైగా గురువుగారిపై ఎంతో అభిమానం ఉంది కనుగనే నారన తాను అనువదించిన గ్రంథ భాగ స్కంధాంత గద్యలలో పోతనగారి జనకుని, కవితా ప్రశస్తిని పేర్కొని తనను గురించి ఏమీ చెప్పుకోక పోవడం. పోతన గారికి తాను శిష్యుడు కావడమే అన్నిటికంటె గొప్పగా భావించి ఆయన ఆ ఒక్క అంశాన్నే తెలుపుకున్నాడు.

మొదటి భాగం, 11 అధ్యాయం: రాణోం కొంంనాటనే తెలంగు సాహొళ్చం షీర్‌ ఇన్ని హేతువుల వలన ఆరుద్రగారి ఊహ సరియైనదే అనక తప్పదు. ఇళ నారన అనువాదం భాగవత భాగకథా వివరాలు చూద్దాం. ఏకాదత స్కంధంలోని అంశాలు: విశ్వామిత్ర వసిష్ట నారదాది మహర్షులు శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చుట, వసుదేవునికి నారదుడు పురాతనమైన విదేహర్హభ సంవాదం తెలుపుట, బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువ వచ్చుట, కృష్ణుడు దుర్శిమిత్తములగని యాదవుల నెల్ల వ్రభాన తర్ధమునకు బంపుట, కృష్ణుడు ఉద్ధపునకు పరమోపదేశము చేయుట, అవధూత యదుసంవాదము, శ్రీకృష్ణబలరాములు వైకుంఠమునకేగుట. చ్వాదశ స్కంధంలోని అంశాలు ; శుకయోగి పరీక్తిత్తునకు భావి కాలగతులు సెప్పుట) యుగధర్మ ప్రాక్కతాది ప్రళయ చతుష్టయ నివేదన, పరీక్షిత్తు తక్షకునిచేత దష్పుడై మృతినొందగా, అతని కొడుకు జనమేజయుడు నర్పయాగము చేయుట, వేద వ్యాసుడు వేదములను పురాణములను భూలోకమున బ్రవర్తింపచేయుట. మార్కండేయో పాఖ్యానము. చైత్రాది మాసంబుల సంచరించెడు ద్వాదశాదిత్యుల క్రమము తెలుపుట, పురాణముల గ్రంథసంఖ్య, భాగవత వురాణు ప్రశస్తి. అనువాద విశేషాలు ; నారయ అనువదించిన భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాలు సంస్కృత మూలం కంటె చాలా కుదించబడ్డాయి. కథను వర్షనలను అతడు సంక్షేసించిన విధానాన్ని తెలుసుకోవడానికి ఒకటిరెండు ఉదాహరణలు. సంస్కృత భాగవతంలోని” 11వ స్కంధ - 2వ, అధ్యాయంలో శ్లో॥ సర్వ భూతేషుయః పశ్యేదృగవద్భావమాత్మన: భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః .(45) దీనికి నారయ అనువాదం ఇది. తే.గీ. నర్వభూతమయుండైన సరసిజాక్తు, డతడె తనయాత్మ యందుండు ననెడు వాడు శంఖు చక్రధరుండంచు జనెడు వాడు, భక్తి భావాభిరతుడునో భాగవతుడు. (11-46) తర్వాతి శ్లోకాలు ఈశ్వరే దదధే, అర్భ్బాయామేవతు, గృహీత్యా, దేహేంద్రియ ప్రాణ, సకామ కర్మబీజానాం - ఈ అయిదు (46-60) శ్లోకాలను వదిలి 51వ, శ్లోకాన్ని అనువదించాడు. అది ఇది. నయన్య జన్మ కర్మాభ్యాం న వర్ణాశ్రమ జాతిభిః నజ్జ్ఞతే న్నిన్నహం భావో దేహేవైన హరేః ప్రియః (51) కం. వర్దాశ్రమ ధర్మంబుల, నిర్ణయ కర్మముల జెడక నిఖిల జగత్సం పూర్ణుడు హరియను నాతడె, వర్ణింపగ భాగవతుడు వసుధా ధీశా. (11-47) ఇది నారన భాగవతానువాదాన్ని సంక్షేపించిన వైఖరికి ఒక ఉదాహరణ. సంస్కృత మూలంలోని ఏకాదశ స్కంధంలో 6వ, అధ్యాయం చివర ఆరంభమైన శ్రీకృష్ణ ఉద్ధవుల సంభాషణ 31వ, స్కంధం వరకు సాగింది. ఈ 22 స్కంధాలను నారన అతి సంగ్రహంగా శ్రవలం 32 గద్య పద్యాల్లో చెప్పాడు. గద్యాలు పెద్దవి. ద్వాదశ స్కంధంలోని శుకమహర్షి ప్రసంగం కూడా అనువాదంలో సంక్షేపించబడింది. ఇంకా మూలంలోని సూతునికి శానకాదిమునులకు మధ్య నడిచిన సంభాషణ నారన వదిలాడు. చివర స్కంధాంతంలో వివరంగా వర్షించబడిన భాగవత ప్రశస్తిని" తగ్గించి విష్ణువర్ణన సద్యం”తో కథా పరిసమాప్తి కావించాడు. మూలాన్ని ఎంత కుదించినా నారయ కొన్ని చోట్ల కథను పెంచాడు కూడా. ఏకాదశ స్కంధారంభంలో భారత మౌసల పర్వం కథ ఉంది. భాగవత మూలంలో విశ్వామిత్ర

జీర డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కణ్వనారద వసిష్టాదిమునులు ద్వారకకు రాగా, యదుకుమారులు సాంబుని గర్భిణి స్రీ వేషంలో వారికి చూపీ సంతాన విషయం ప్రల్నించి శాపగ్రస్తులైనారు. (11.113, 14 శ్లో నారయ అనువాదంలో మునులు మొదట శ్రీకృష్ణుని సందర్శించి, నపర్యలు పొంది (11-13) సుఖాసీనుటై శ్రీహరిని సంస్తుతించారు. జనములు నిను సేవింపని, తరణంబులు భవజలధికి, ఒక్కవేళను సూక్ష్మరూపము, శ్రీనాయక నీనామము ఈ నాలుగు పద్యాలు (14-17) నారయ కల్పన. ఈ భక్తి తాదాత్మ స్వతంత్ర వర్దనలు పోతనకు అనుసరణ. ఇంకా మూలంలో “అంతరిక్ష ఉవాచ” అను ఏకాదశస్కంధ తృతీయాధ్యాయ వాక్యాన్ని, నారన అనువాదంలో “అనిన అంతరిక్తుండను . బుషి శ్రేషుడిట్లనియె (11-50) అని, పాఠకులకు అంతరిక్ష పద ప్రయోగాన్ని సందర్భోచితంగా సృష్టంగా విపులీకరించాడు. నారన మూల విధేయతతోపాటు అనుసరించిన స్వతంత్ర వైఖరికి మరొక ఉదాహరణ, శ్లో ॥ యోవా అనంతస్య గుణానంతా నను క్రమిష్యన్సతు బాల బుద్ధిః రజాంసి భూమేర్గణ యే తృథంచిత్కాలే నైవాఖిల శక్తి ధామ్నః॥ (11-4-2) దీనికి అనువాదం పద్యం చూడండి. కం॥ తారల నెన్నగ వచ్చును, భూరేణుల లెక్క పెట్ట బోలును ధాత్రిన్‌ నారాయణ గుణ కథనము, లారయ వర్ణింపలేరు హరిబ్రహ్మాదుల్‌ (1-6) భూరేణువుల లెక్కించడం మూలంలోనిదే. కాని, తారల లెక్కించటం మూలంలో లేనిది. అది కవి స్వయం కల్పన. ఇందుకు “అమలిన తారకా సముదయంబుల నెన్నగవచ్చు”*ో అను నన్నయ భారత పద్యభావం కవి స్మృతిలో మెదలి ఉంటుందనుకోవడం అసంగతం కాదు. యాదవులకు మృత్యుకాలం సమీపించగా ప్రకృతి ఉత్పాతాలు కలిగినాయని ఒకే ఒక పదంతో ఆ అరిష్టాన్ని మూలంలో సూచించగా, దానిని పెంచి నారన ఒక సిసపద్యం (11-87)లో దుళ్ళకునాల వర్చించాడు. ఇంకా - ఈ రీతి శ్రీకృష్ణుడేపార బూతనా, శకట తృణావర్త సాళ్వ వత్స చాణూర ముష్టిక ధేను ప్రలంబక, దైత్యాఘ శిశుపొల దంతవక్ర, కంస పౌండ్రాదిక ఖండనంబొనరించి... (11-3) ఇందలి సేర్గు మూలంలో లేనివి. నారన వీనిని సందర్భోచితంగా చేర్చి విషయ వివరణ కావించాడు. అదీ అతని కవన ప్రత్యేకత. కవితాసమీక్ష; వ్యక్తుల వృక్షాల పేర్లు నారయకు ఛందస్సులో చక్కగా ఒదిగిపోతాయి. వచనాల్డైలి రమ్యం. గహన వేదాంత విషయాలను "సైతం గద్యాల్లో పద్యాల్లో నిరాయాసంగా వర్ణించాడు. నారన కవిత్వంలో ప్రబంధాలలో వలె అలంకార పుష్టిలేదు. ఆయనది పురాణాల రచనా ధోరణి! అర్థ దృష్టి! అలంకారాలు తక్కువైనా ఉన్నవి కవి నేర్పరి తనానికి నిదర్శనంగా నిలిచాయి. కం. శ్రీనాయక నీ నామము, నానా భవరోగ కర్మనాశమునకు వి ఇ్ఞానంబగు నౌషధమిది, కానరు దుష్పాత్ములకట కంజదళాక్షా! (11-17) నానా భవ రోగ కర్మ- అనేక జన్మలెత్తే రుగ్మత. విజ్ఞానంబగు నౌషధము - విజ్ఞానమనేమందు, ఇందరి రూసకాలంకారాలు స్పష్టం, శబ్దాలంకార శోభితమైన ఈ క్రింది చతుష్టాస కందం అందం కందాం. తరణంబులు భవ జలధికి, హరణంబులు దురితలతల, కాగమములకా భరణంబు, లార్త జనులకు, శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్‌ (11-15)

మొదటి భాగం, 1 అధ్యాయం: రాణిం కాంంాటే తెలంగు సారొర్టం న మత్తకోకిల (11-16) మాలిని (11-126, 12-33) విశేషవృత్తాలతోపాటు నర్వలఘుసీసము (11- 72) వంటి కవితా చమత్కృతులు కూడా చూపాడు ఈ కవి. ఇందులో కొన్ని రమ్యమైన పద్యాలు లేకపోలేదు. చ. నరవర తొంటి భూపతుల నామగుణంబులు వృత్త చిహ్నముల్‌ సిరియును రూపనసంపదలు జెన్నగు రాజ్యములాత్మ విత్తముల్‌ వరుననడంగె గాని యట వారల కీర్తులు నిర్మలంబులై యురవడి భూమిలో నిలిచియున్నవి నేడును రాజశేఖరా (12 - 14) ఇది పోతనగారి 'వామనావతార కథ' లోని “లేరే రాజులు రాజ్యముల్‌ కలుగవే' అను పద్యాన్ని తలపించే భావం. మరో శైలీ ప్రసన్న భక్తి భావ రమ్య పద్యం చూడండి. మ. బలభిన్ముఖ్య దిశాధినోథ వరులున్‌ ఫౌలాక్ష బ్రహ్మాదులున్‌ జలజాతాక్ష పురందరాది సురులుం జర్చించి నీమాయలం దెలియన్‌లేరట నా వశంబె తెలియన్‌ దీనార్తి నిర్మూలయు " జ్వల పంకేరుహ పత్రలోచన గదా చక్రాంబు జాద్యంకితా! (12-36) అయితే నారన భాగవత భాగంలోని శైలీ భావరమ్య పద్యాలు హరిభట్టువని ఆరుద్రగారి వాదం.” హరిభట్టు (1530) మత్స్య వరాహ నరసింహ వురాణాలనే కాక భాగవతంలోని 6,11,12 స్కంధాలను అనువదించాడు" కాని, నారన రచనలో పద్యాలకంటె గద్యాలెక్కున. ఆ పద్యాలైనా కథాగమనానికి సరిపడి ఉన్నవి. ఎరవు తెచ్చు కొన్నవిగా కనిపించవు. తర్వాతి కాలవు లేఖకులు హరిభట్పకవనానికి మురిసి ఆయన పద్యాలను నారయ భాగవతంలో చేర్చుకొని ఉండవచ్చునని కొందరి తలంపు. కాని అది అనంగత మనడానికి ఒక సాక్ష్యం. ఏ పద్యాన్ని అనుమానించినా ఆశ్వాసాంత (స్కంధాంత) పద్యాలను మాత్రం గ్రంధకర్తవి కొవని అనలేం కదా. నారన ఏకాదళ స్కృంధాంత వద్యం (11-124) ఇది. చ... నగుమొగమున్‌ నుమధ్యమును నల్లని మేనును లచ్చికాట వ ట్టగు నురమున్‌ మహాభుజములంచిత కుండల కర్ణముల్‌ మదే భగతియు, నీలవేణియు గృపారన దృష్టియు గల్లువెన్ను డి మ్ముగబొడ సూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్‌. నొారయ పద్యాల్లో అక్కడక్కడ పొదపూరణ (వ్యర్థ) పదాలుంటాయి. అవి సాధారణంగా యతి ప్రానల స్థానాల్లో చోటు చేసుకుంటాయి. తరచుగా చివరి పాదం వాస స్థానంలో కనిపిస్తాయి. పె పద్యంలో ఇమ్ముగ వలెనే, ఇందులో అంతకు మొదట చూపిన రెండు పద్యాల చతుర్ధ చరణాల్లో ఉరవడి, ఉజ్వల పదాలున్నాయి. ఇది నారయ పద్యాల గుర్తించడానికి ఒక పద్దతిగా భావించవచ్చు. “వతంలో పోతన తరువాత సింగన కవిత్వమే బాగుందని కవి చరిత్రకారుల అభిప్రాయం16. కాని ఎక్కిలొల కృష్ణమాచార్య గారి అభిప్రాయం ఇట్ట్లున్నది “గ్రంధమెక్కువ భాగం పోతన రచనయే. మిగిలిన వారి రచనలు పోతన రచనల యంత బాగుండవని కొందరి పండితుల యూహ, ఈ యూహలో అభిమానముతో బాటు అసత్యము గూడా నున్నట్బ కనిపించును.” ఆ మాట కొంతైనా సత్యమే. నారన సంస్కృతాంధ్ర భాషల వైదుష్యం కలవాడు. ఏకాదశ స్కంధ 'ప్రారంభపద్యం. కం. శ్రీ సీతాపతి లంకే, శాసుర సంహార చతుర శాశ్వత నుత వా ణీసత్యధి భూధవవ్మ్శ, త్రాసుర రిపు దేవజాల రామ నృపాలా! వచనాలు శైలీ భావ రమ్యాలు.

క్రి డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపొత్య చరిత్ర” “ఇవ్విధంబున భూమి వలన సైరణయు, గంధవహంని వలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబు వలన గాల సృష్టిగుణ సాంగత్యంబు లేమియు, నుదకంబు వలన నిత్య శుచిత్వంబును, నసితపథుని వలన నిర్మలత్వంబును..” 11-99. భాషా ఛందో దోషాలు కవివే అనలేం. సీ సంతతంబును గృష్ట సంకీర్తనంబును, వీనులకింపుగా వినగవలయు హర్షంబుతోడుత హరినామ కథనంబు, పాటల నాటలం బరగ వలయు నారాయణుని దివ్య నామాక్షరంబులు, హృద్వీధి సతతంబు నిలుపవలయు. 11-44,

ఇంత సరళంగా సాగిన పద్యంలో మూడవ చరణంలోని యతి భంగం కవి కలానిదికాదు. నెమ్మది (నెజ+మది) అని కవిప్రయోగం అయ్యుంటుంది. ఛందః పరిజ్ఞానం లేని అనంతరకాల లేఖకుడు అందమైన పదమని హృద్వీధిని చేర్చి ఉంటాడు.

'సైన్యమున్నడచె = 'సైన్యమున్‌ + అడచె (11-3) వంటి ఒప్పని సంధులు నారన వాడినా, అన్నిష్టసఖి ఆని అవి పోతన కవితలోనూ ఉన్నాయి. సంస్కృత తమిళ భాషల్లో ఉన్న ఈ సంధులను 'ప్రొఢ వ్యాకరణకర్త బహుజనవల్లి వారు గుర్తించి అంగీకరించారు.

నారయ రచన మూలానికి భిన్నంగా పోతన కవిత్వంలో పొత్తు కుదురక పోవుటచేతనే ఏకాదశ ద్వాదశ స్కంధాలను పలువురు కవులు అనువదించారని నిడుదవోలు గారి అభిప్రాయం”

భక్తిలోనూ కవిత్వంలోనూ గురుమార్గాన్ని అనుసరించాడు నారన. కవితా లాలిత్య భావ పటుత్వాలతో ఆయన పోతనకు సమ ఉజ్జేకాకపోయినా శిష్యస్థాన సంభావ్యుడు. పోతన అద్వైతి; నారన విశిష్టాద్వైతి.న

ఏది ఏమైనా భాగవత కవులలో పోతన శిష్యునిగా వెలిగందుల నారయది గౌరవస్థానం.

భాగవత ఖిలభాగ పూరణం

పోతన భాగవతంలో కొన్ని భాగాలు క్రిమిదష్టమై భిలమైపోగా వానిని ఇతర కవులు పూరించినట్లు ఆంధ్రసాహితీలోకంలో ప్రచారంలో ఉన్న అంశం. ఖిల భాగ పూరణంలో వెలిగందల నారయ పేరు ప్రముఖంగా చెప్పబడుతున్నది. డా॥ దివాకర్ల వేంకటావధాని గారి అభిప్రాయం “తృతీయ చతుర్ధ దశమ స్కంధోత్తర భాగములందు గూడా నచ్చటచ్చట నారయ రచనమున్నదని చెప్పుదురు.” పింగళి లక్ష్మికాంతంగారు తమ “ఆంధ్రసాహిత్య చరిత్ర లోనూ అదే మాట అన్నారు” దశమ స్కంధోత్తర భాగంలో చివరి 1100 పద్యాలు నారయ రచించినట్టుగా శేషాద్రి రమణ కవులు భావించారు కాని, భాగవతం అచ్చు పుస్తకాలలో మాత్రం ఆ విషయం పేర్కొనబడలేదు. ఒక ద్వితీయస్కంధం మధ్యనే నారయ పేరు కనిపించుతున్నదిలో

పోతరాజు రచించిన (గ్రంథమున కొంత భాగము శిధిలమై పోవుటచే నా శిథిలభాగముల నితరులు పూరించిరి - అన్నారు డా॥ దివాకర్ల, పోతన పూర్తి భాగవతమును అంధ్రీకరింపగా ఖిల భాగపూరణమును మాత్రమే ఇతర కవులు కావించినారని, వారు స్వయంగా పూర్తి స్కంధాలను రచింపలేదని కొందరు అభిప్రాయపడ్డారు. కాని, ఆ వాదన సరికాదని, ఆంధ్ర భాగవతంలోని 5, 6, 11 12 నాలుగు స్కంధాలను గంగన సింగన నారనలు సంపూర్ణంగా తామే రచించినారని చాగంటి శేషయ్య ఆరుద్ర గారలు నిర్వంద్వంగా తేల్చి చెప్పారు.

భాగవతం అచ్చు ప్రతులలో ద్వితీయ స్కంధం నందలి 93వ, పద్యానికి ముందు “ఇక్కడి నుండి నారయ కవిత్వం' అని ఉంది. ఈ ద్వితీయ నృంధంలో మొత్తం 289 గద్య పద్యాలున్నాయి. వానిలో మొదటి 92 పోతన రచన. మిగిలిన 197 గద్యపద్యాలు నారయ రచన. స్కంధాంత గద్యమాత్రం పోతనామాత్యుని పేరనే ఉంది. నారయ (ప్రసక్తి లేదు. ఇది ఖిలభాగ పూరణమే తప్ప నాఠరయ న్వంత రచన కాదు, కనుక గురుభక్తి కారణంగా గద్యలో తనపేరు చేర్చుకానలేదంటారు

మొదటి భాగం, ॥ అధ్యాయం: రాణిలా కాంందాని తెలటగు సారొత్వ్యం తరి సాహితీసమీక్షకులు. ద్వితీయ స్కంధంలోని నారయ కవిత్వం మాత్రం పటుత్వంగా ఉంది. అందులో గురువుగారి రచనమెంతో శిష్యుని భాగ స్వామ్యుమెంతో తేల్చి చెప్పటం కష్టం. కాబట్టి ఆ భాగ సాహిత్య సమీక్ష వదలివేయబడుతున్నది.

నారాయణ శతకము - కర్భత్వ పరిశీలన: తెలుగు సాహిత్యంలో కవిపేరు లేని 'నారాయణ శతకము" ఒకటి వ్యాప్తిలో ఉన్నది. అది పోతనామాత్యుని రచనగానే చలామణి అవుతున్నది.

సాహిత్య అకాడెమీ వారి శతక సంపుటము ద్వితీయ భాగములో “నారాయణ శతకము" నకు ముందు వివరణలో స్వామీ శివశంకర స్వామి గారి అభిప్రాయం ఇట్ట్లున్నది.

“నారాయణ శతకమును బమ్మెర పోతన రచించెనని ప్రతీతి. చిన్నతనమున గురుని అనురోధమున వీరభద్ర విజయ కావ్యమును రచించెనట. ఆవల సింగను నాయని పేర భోగిని దండకము రచించినారట. తుదకు భాగవతము నాంధ్రీకరించి జగత్రసిద్దుడయ్యెను. నారాయణ శతకము, దండక రచనానంతరము చెప్పెనని కొందరి యభిప్రాయము”.

భాగవతానికి బీజప్రాయాలైన భావాలు ఈ శతకంలో ఉన్నందున పోతన కృతమని అనజాలమని, భాగవతం చదివిన మరే కవి కానీ అందలి భావాల సంక్షేపించి ఇట్లా వ్రాయవచ్చునన్నారు, చాగంటి శేషయ్య గారు. ఇంకా ధర్మపురి పొంత కవి మరియెవరో దీనిని రచించి యుండవచ్చును. కర్శృత్వము నిర్ణయమగు వరకు “ఈ శతకమును కవి "పేరు తెలియని శతకములలో జేర్పుట మంచిదని నా యభిప్రాయము” అన్నారు*

ఈ శతకం పోతన విరచితం కాదని చాగంటి శేషయ్య గారు 'ఆంధ్ర కవితరంగిణి'లో చర్చించి తీర్మానించిన అంశాన్ని ప్రస్తావించి ఆరుద్ర గారు కూడా అదే నిర్ణయాన్ని ఆమోదించారు. అందుకు వారు చూపిన కారణాలివిో

అపరాధమ్ములు నిన్ను నమ్మి వినుమే నాజన్మ పర్యంతమున్‌

వివరీతంబుగ జేసినాడ నిక నీవే దిక్కు నాలోనికిన్‌

గవటంబింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపుమీ

కృపకున్‌ బాత్రుడనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా”

విను, అనేది పోతనకు ఊత పదమే కొని, అపరాధంబులు పెక్కు చేసితి అనటం ఆ మహాకవి స్వభావానికి విరుద్ధం. మరో వద్యం,

నీ మూర్తుల్‌గన నీ కథల్‌ విన దుదిన్‌, నీ పాద నిర్మాల్యని ష్టామోదంబు నెరుంగ నీ చరణ తోయంబాడ నైవేద్యముల్‌ శమంబొప్ప భ(భు) జింప నీజపము వర్డింపన్‌ గృపం చేయవే శ్రీమించన్‌ బహు జన్మజన్మములకున్‌ శ్రీ యాది నారాయణా! - 05

ఇది పోతన భాగవతంలోని 'నీ పద్యావళులాలకించు చెవులున్‌' అనే పద్యం శైలిలోనే ఉంది. కాని, 'శ్రీవైవలక్‌ పదంబు జేరుటకునై... పునర్ణన్మంబు లేకుండగన్‌' చింతించు, పోతన కవి నోటికి బహు జన్మల ప్రనక్తి వస్తుందా? ఇది ఆ భక్త కవి స్వభావానికి, మోక్షాసక్తికి విరుద్ధం. అపరాధాలు చీసితిననటం, బహుజన్మల ప్రసక్తి - ఉండటంతో ఈ నారాయణ శతకం పోతనకవి రచనకాదని, ధర్మపురిని 'పేర్కొనుట వలన కరీంనగర మండలంలోని మరో కవి ఎవరో రచించి ఉంటాడని ఆరుద్ర గొరు అభిప్రాయపడ్డారు.

స్వామీ శివశంకర స్వామి గారు కూడా తమ పీఠికలో “ఈ శతకమున కవి నారాయణ పారమ్యమును ప్రతిపాదింప దలచిన వాడగుటచే వైష్ణపు డయినను, కాక పోయినను, విష్ణుభక్తుడు

50 డా॥ మలయతశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సావాత్య చం(త్ర” మాత్రమగును. కొన్ని కొన్ని ఉపపత్తులు స్థూలముగా కానవచ్చుచున్నను ఈ కవి పోతనా మాత్యుడు కాడనిపించును”' అని అన్నారు.

అవును, ఆ మాట నిజం. నారాయణ శతకం పోతన కృతి కాదు. ఎందుకంటే -

పోతన ధర్మపురికి సమీపం వాడు కాడు. బమ్మెర కరీంనగర్‌కు దక్షిణంగా వరంగల్‌ జిల్లా జనగాం తాలూకాలో ఉంటే, ధర్మపురి కరీంనగర్‌కు ఉత్తరంగా గోదావరి తీరంలో ఆదిలాబాద్‌ జిల్లాకు సమీపంలో ఉంది. నారాయణ శతక పద్యాల స్థాయి సామాన్యంగా ఉంది. ఈ శతకంలో పోతనకు ఇష్టమైన వృత్త్యను (ప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, యమకాది శబ్దాలంకారాలు లేవు, మరో విషయం. ఈ శతకం పోతన రచన అయితే తప్పక తనపేరు చెప్పుకునేవాడే. ఎందుకంటే ఆయన యువ వయస్సులో వ్రాసిన మామూలు భోగినీ దండకానికి కూడా తన పేరు చేర్చుకున్నాడు కదా. ఏ విధంగా ఆలోచించినా ఇది పోతన మహాకవి రచించినది కాదు.

ఆరుద్ర గారు ఆశంకించినట్టుగా నారాయణ శతకాన్ని కరీంనగర్‌ మండలంలోని ఎవరో ఓ అజ్ఞాతకవి రచించి ఉంటాడు. ఎవరా "కవి? నారాయణ శతక పద్యాలు వెల్లంకితాతం భట్టు, (1480-1520) కస్తూరి రంగకవి (17560) తమ లక్షణ (గ్రంథాలలో ఉదహరించారు. కనుక ఈ కవి వారిద్దరికి పూర్వుడై ఉండాలి.

అది 15వ శతాబ్ది ఉత్తరార్ధం. ఆ కాలంలో కరీంనగర్‌ జిల్లాలో ఈ శతక కవి ఎవరు?

ఈ నారాయణ శతకం విష్ణుభక్తి కలది. కవిత ప్రారంభ దశలోనిది. ప్రాఢ రచన కాదు. ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! అనే పదబంధం కూడా ప్రతి పద్యంలో లేదు. కేవలం రెండు పర్యాయాలే వాడాడు కవి, 'నారాయణా” అనేది శతక పద్యమకుటం. అది ప్రతి పద్యం చివర ఉంది. కృతి ముందుకాని, చివరకాని, మధ్యకాని, ఎక్కడా కవి పేరు ఉటంకించబడిలేదు.

దీనిని బట్టి చూడ నారాయణ నామధేయుడైన కవి యెవరో తనపేరు తన యిష్టదైవం పేరు కలిసి వచ్చేరీతిగా ఈ మకుటాన్ని ఎంచుకొని శతక రచన కావించినట్లు భావించవచ్చు. అదే నిజం! ఎందుకంటే ధర్మపురిలో వెలసిన దైవం నరసింహుడు. అది ఆది నారాయణమూర్తి అవతారమే. తన పేరు నారాయణ కాబట్టి నరసింహునికి కూడా ఆ పదం సరిపోతుంది కదా! అని ఆలోచించి కవి ఈ శతకమకుటాన్ని ఎన్నుకొనటం జరిగి ఉంటుంది.

ఇక నారాయణ శబ్ద వాచ్యకవులు ప్రసిద్సులో అప్రసిద్దులో ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేరు. పోతనకు కొంతముందు కాలం వాడైన రామగిరి మడికి సింగన కవికి నారాయణ పేర ఒక సవతి తమ్ముడున్నాడు. కాని, అతడు కవి అని కానీ, అన్నతోపాటు రామగిరిలో ఉన్నాడని అనడానికి కానీ ఎటువంటి ఆధారం లేదు.

కావున, ఈ నారాయణ శతకం వెలిగందల నారాయణ రచనే అయి ఉంటుంది. నారాయణ అను తత్సమ పదానికి తద్భవ రూపం నారన.

ఈ కవి పేరు లేని శతకం నారయది కావడమేమిటి? అది పోతన కవిదిగా ప్రచారానికి రావడమేమిటి? అనే ప్రశ్తలకు సమాధానంగా ఈక్రింది సంఘటనలు జరిగి ఉండవచ్చు.

పోతన భాగవతం32 చదివిన భక్తి ఊపులో కవితా ప్రీతితో వెలిగందుల నారన, నారాయణ శతకం వ్రాసి ఉంటాడు. అప్పటికే ఈ జిల్లాలో వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం సుప్రసిద్ధ దైవ క్షేత్రాలు. ఆ తదుపరి మహాకవి పోతన సందర్శనార్థం నారయ బమ్మెరకుపోయి ఉంటాడు. గరువు మెచ్చకో తనకే నచ్చకో నారన తన నారాయణ శతకాన్ని అక్కడే వదలి ఉంటాడు. ఏ పూర్వ కవితా పరిశ్రమను చూడనిదే పోతన గారు నారనకు భాగవత అనువాద కార్యం ఒప్పగించలేడు కదా! భాగవత మహాకావ్య రచనలో భాగస్వామి అయిన నారనకు తన మొదటి కృతి అయిన ఈ నారాయణ శతకంపై ధ్యాన - ప్రేమ ఉండకపోవడం ఈ ఉపేక్షకు కారణం అనుకోవచ్చు.

మొదటి భాగం, 11 అధ్యాయం: రాజిం వాంంగొటే తెలుగు సాహసం 51 అటు గురువు ఇటు శిష్యుడు గతించిన తర్వాత చాలా కాలానికి పోతన గృహంలో నారాయణ శతక తాళపత్ర ప్రతి లభించడంతో నాటి వారు అది పోతన రచనగానే భావించి ఉంటారు. అది పోతన కృతం మాత్రం కాదు. పోతన వంశీయులలో మరెవరూ ఈ శతకం తమదని చెప్పుకోలేదు. నారాయణ శతకం నారన కవి విరచితమే.నారన “పేరు కూడా ఆ శతకంలో లేదు కదా, అంటే _ శతక మకుటంలోనే కవి పేరు ఇమిడి ఉంది. అది “విశ్వదాభిరామ వినురవేమ' అనే మార్గం. ఏ విధంగా చూసినా నారాయణ శతకం వెలిగందల నారన కృతం అనుట ఆమోదయోగ్యం. పాద పీఠికలు; 1 బ్రహ్మం పాద్మం వైష్ణవంచ శైవం లైంగం సగారుడమ్‌ నారదీయం భాగవతమాగ్నేయం స్కాంద సంజ్జితమ్‌॥ అని, వ్యాస విరచిత మనబడుతున్న అప్టాదళ పురాణాలలో భాగవతం ఎనిమిదవది. 2. భాస్కర రామాయణ కవులు - హంళక్కిభాస్కరుడు, మల్లికార్డునభట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు. కవిత్రయం- నన్నయభట్టు, తిక్కన సోమయాజి, ఎ(ర్రాపెగ్గడ. 3. వావిళ్లవారి ప్రతి, ముద్రణ సంవత్సరం లేదు; 4. కరీంనగరం మండల చరిత్ర, 1981; వుట-22. 5. మడికి సింగన కవి - “పద్మపురాణోత్తరఖండం” భాగవత దశమస్కంధం” పీఠికలు. 6. ఈ శతక కర్శృత్యచర్చ ఇదే శీర్షిక చివర ఉంది. 7. శ్రీమదాంధ్ర మహాభాగవతము. వావిళ్లవారి ప్రతి. 8. గోరఖపూర్‌ వారి ప్రతి (దేవనాగరి లిపి) 9. అరుద్ర “సమగ్రాంధ సాహిత్యం” 5వ నంపుటి. 10. నారాయణభట్ల కృష్ణమూర్తిగారిచే పరిష్కృత ప్రచురణ (తలుగు లిపి వ్రతి), హైదరాబాదు _ 1974 ముద్రణ. 11. ద్వాదశ స్కంధం - ద్వాదళశత్రయోదశాధ్యాయాలు. 12. నకల గుణాతీతు సర్వేశు లొకేశు... సీనం. భాగవతం - 12-50. 13, మహాభారతము - అవతారిక, 19వ పద్యం. 14. చాగంటి శేషయ్య గారు నారన భాగవతంలోని హరిభట్టు పద్యాల లిస్టు ఇచ్చారు - అంధ్రకవితరంగిణి, నం; పు.208., 15. దివాకర్ల గొరి “ఆంధ్రవాబ్మయ చరిత్రము," పుట-58. 16. పింగళి లక్ష్మికాంతంగారి “ఆంధ్ర సాహిత్యచరిత్ర”, డా. దివాకర్ల *“అంధ్రవాబ్మయ చరిత్ర" పుట-31; శేషాద్రి రమణకవులు, వావిళ్లవారి 'భాగవతం' పీఠిక. 17. ఎక్కిరాల భాగవతము' రహన్యవ్రకాశం' వుట-10; దివరల్డుటీచర్స్‌ ట్రన్సు ప్రచురణ, ద్వి.ము. 1978. 18. నిడుదవోలు వేంకటరావు గారి 'పోతన' వుట - 185, నేషనల్‌ బుక్‌ ట్రస్సు వారి ప్రచురణ. 19. నిడుదవోలు వేంకటరావు గారి “పోతన పుట-185 నేషనల్‌ బుకట్రస్టు వారి ప్రచురణ. 20. ఆరుద్రగారి 'సమగ్రాంధ్రం సాహిత్యం' సం.6, వుట-39. 21. అంధ్రవాబ్మయ చరిత్రము - పుట - 30. 22 ఆంధ్ర సాహిత్య చరిత్ర - వుట - 55. 23. వావిళ్ల ప్రతి పీఠిక. 24. వావిళ్ల ప్రతి; ఎక్కరాల వారి ప్రతి. 256. ఆంధ్రకవితరంగిణి; సమగ్రాంధ్ర సాహిత్యం, 26. శతక సంపుటము (ద్వితియ భాగము) - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ-1968. 27. శతక సంపుటము (ద్వితీయ భాగము) -ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ - 1968; పుట.1, 28. ఆంధకవి తరంగిణీ, 6వ, సంపుటి, పుట 217, ద్వి. ముద్రణ 1961.

52 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” 29. సమగ్రాంధ్ర సాహిత్యం, 5వ, నం, పు- 240, 30. నారాయణ శతకము - 97వ, పద్యం. 31. శతక సంపుటము, రెండవ భాగము. ప్రస్తావన. పుట-11.

  1. అంధ్రకృతమైన స్కంధాల మారు ప్రతులు వ్యాప్తి పొంది ఉంటాయి.
  2. చరికొండ ధర్మన - ధర్మపురి, 16వ శతాబ్ది

చరికొండ ధర్మన కవి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి వాడు. ధర్మన 'చిత్రభారతము” అను కావ్యాన్ని రచించాడు. ఏకశిలానగరాంధ్ర రాజయిన సీతాపతికి సామంత మండలాధిపతిగా ధర్మపురి పాలకుడైన ఎనుములపల్లి పెద్దనామాత్యునికి ధర్మన తన చిత్రభారత కావ్యాన్ని అంకితమిచ్చాడు. స్వస్థలం: ధర్మన చిత్రభారతంలో తన ఊరు పేరుకానీ, తల్లిదండ్రుల పేర్లు కానీ, వంశ వివరాలు కానీ చెప్పుకోలేదు. ఆ కవి పేరుకు ముందు గృహనామంగా ఉన్న చరికొండ పదాన్ని అతని గ్రామనామంగా కవి చరిత్రకారులు ఊహించారు. చరికొండ గ్రామం మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లాలో ఉంది.'

ళు కరీంనగర్‌ జిల్లాలో రెండు సిరికొండలు, రెండు నల్లగొండలు ఇంకా తడగాండ, వాలుగొండ, వరిశకొండ, రేకొండ, దీకొండ, నెమిలికొండ, కొత్తకొండ మొ॥ కొండ పదాంత గ్రామాలున్నవి, గట్టు, గిరి చివరగల ఊళ్లు కూడా ఉన్నవి. చరికొండ మాద్రం లేదు.

ధర్మన పేరును బట్టి చూడ అతడు ధర్మపురి వాడే అనవచ్చు. అతని పూర్వీకులు చరికొండ సీమ నుండి వచ్చి ధర్మపురిలో స్థిరపడి ఉండవచ్చు. చరికొండ అనేది ఈ కవి గృహనామం. ధర్మన నివసించింది తన కావ్యాన్ని రచించినది ఈ ధర్మపురిలోనే,

కాలం; ధర్మన కాలం శ్రీ.శ.1560-1620 అని '“ఆంధ్రకవుల చరిత్ర'లో కందుకూరి వీరేశలింగం

పంతులుగారు, 1480-1530 అని 'ఆంధ్రకవి తరంగిణి'లో చాగంటి శేషయ్యగారు పేర్కొన్నారు.

ఆరుద్ర చేసిన కాలనిర్ణయం క్రీ.శ.1510 ప్రాంతం.

చరికొండ ధర్మన కవికి ఆశ్రయమిచ్చిన ఎనుములపల్లి పెద్దనామాత్యుడు. ఓరుగంటి పాలకుడైన సీతాపతికి (చిత్తాపుఖాను బిరుదనామం) సొామంత మండలాధ్‌శుడు. సీతాపతి రాజు మొదట ఖమ్మం మెట్ట పాలకుడై (1450-85) తన వీరత్వంతో ముస్లిం సేనలను ఓడించి 1903లో ఓరుగల్లును కూడా జయించాడు. గజవతులకు సాయంగా నిలిచిఒక పర్యాయం విజయనగరాంధ్ర చక్రవర్తియెన శ్రీకృష్ణదేవరాయల సైన్యాలను సైతం ఎదిరించాడు. 1512లో గోలకొండ కుతుబ్‌షాకు ఓడ్తి పదవీచ్యుతుడైనాడు. సీతాపతి ఓరుగల్లు పాలన 1503-12 కాబట్టి ఎనుములపల్లి పెద్దనామాత్యుని థర్మపురి పాలన కాలం కూడా అదే. పెద్దన రాజాస్థాన కవియైన చరికొండ ధర్మన కాలం కూడా అదే."

ధర్మన 15వ శతాబ్ది ఉత్తరార్థంలో జన్మించి, 16 వ శతాబ్ది ప్రథమ దశకంలో చిత్రభారత రచన కావించి ఉంటాడు. ధర్మన జీవితకాలం నుమారుగా క్రీశ. 1470-1520 అనుకోవచ్చు.

చిత్ర భారతం 1510లో విరచింపబడి ఉంటుంది.

కావ్య విశేషాలు; చిత్ర భారతం శ్రీకృష్ణార్ణున యుద్ధకథా ప్రబంధం. ఇందులో 8 అశ్వాసాల్లో 1304

గద్య పద్యాలున్నాయి. తర్వాతి ప్రబంధాలలో వలె అష్టాదశ వర్ణనలున్నాయి. కవి 'అలంకార

సరణిమీర, రసములు చిప్పిల, మెచ్చులొలుక ఈ కావ్యాన్ని రచింప సంకల్పించినట్లు తన కావ్య పీఠికలో చెప్పుకున్నాడు. చెప్పిన విధంగా రసవత్తరంగా కావ్య రచన కావించాడు. ధర్మన పూర్వకవి నుతి ఇట్లా సాగింది. “ఘను నన్నపార్యు, దిక్కన సోమయాజుల, వర్ణించి వేముల వాడ భీము గీ. నాచనా మాత్యు, సోము, శ్రీనాధు, చిమ్మపూడి యమరేశు, బమ్మెర పోతరాజు, శంభుదాసు, హుళక్కి భాస్కరుడు నాదిలైన సుకవుల నెల్ల నెయ్యమున నెరగి.”5

మొదటి భాగం, 1 అధ్యాయం: లొజిం కాంంనాటీ తెలుగు సారొత్ప్యం 53 సుకవుల స్తుతించాడే తప్ప కుకవుల నిందించలేదు. ఈ -చిత్రభారత కావ్య మూల కథ “బహ్మాండపురాణం' లోనిదట. కథా సంగ్రహం : తుల్యుడనే మునికి తపోభంగం కావించడెానికి ఇంద్రుడు రంభను పంపిస్తాడు. ఆమె ఇతర అచ్చరలతోపాటు ముని ఉన్నవనానికి చేరుకుంటుంది. అప్పుడు వసంత బుతువర్ణన, పుష్పాపచయం, జలకేళి మొ వారి విలాసాల సందర్భోచిత వర్ణనలతో కథ సాగింది. నీవీ మోక్షము కోరి నేనురాగా, నీవీ మోక్షము కోరి ఏల తపంబొనరించెదవు? అంది యమకాలంకార సహితంగా ప్రణయ తమకంతో ముని సమక్షాన రంభ. ఇంకా అందరాని ఆ అమృతాన్ని గూర్చి ఎందుకు ఆలోచిస్తావు? నా మోవివై ఉన్న ఈ అమృతం చాలదా! అని ఊరించింది. ఆ విచ్చలవిడి శృంగార ప్రసంగానికి కినిసి ముని, రంభను గుజ్టానివి కమ్మని శపించాడు. ఆమె వేడికోలుకు కరిగి చతుర్ధనుడనే రాజుచేత శాపనివృత్తి కలిగేలా అనుగ్రహించాడు ముని. ఆ రాజు అశ్వరూపంలో ఉన్న ఈ అప్పరోభామినిని గ్రహించడం, కారణాంతరములచే అతడు శ్రీకృష్ణుని కోపానికి గురికావడం, అతడు అర్జునుని శరణువేడుకోవడం, కృష్ణార్ణునులకు యుద్ధం, విధ్వంసం లేకుండా ముగింపు, ఈ విధంగా రమణీయంగా నడిచింది కథ.. మహాభారతంలో కృష్ణార్ణునులు మంచి మిత్రులు, ఈ కావ్యంలో వారిద్దరికి శత్రుత్వం సంఘటిల్లింది కనుక, ఇది చిత్రభారతం! తర్వాతి కాలంలో ఇటువంటి ఓ కథ “డాంగేయో పాఖ్యానం' పేరుతో యక్షగాన నాటకంగా బహుళ ప్రచారం పొందింది. గయోపాఖ్యానల కృష్ణార్ణునుల యుద్ధమే అయినా రంభ పాత్రలేదు; కలహకొరణం వేరు. శ్రీరామాంజనేయుద్ధం” కూడా అంతే, వీటి అన్నింటికి మూలం ధర్మన చిత్ర భారతం! కవితావిశేషాలు : ధర్మన ప్రాథకవి అనడానికి చిత్రభారతంలోని పలుపద్యాలు భావాలు నిదర్శనంగా నిలుస్తాయి. ముని శాపకారణంగా రంభ అశ్వంగా మారినదని ఎట్లా వర్ణించాడో కవి చూడండి. కం. పదముల చొప్పును వడి యొ, ప్పిదము నలంకార లక్ష్మి పేర్మియు ధారా న్పద భావము గల్లి శభ ప్రదమై హయమమరె సత్ర్రబంధము రతిన్‌. చి.భా. ౩3-160 ఈ పద్యంలో మంచి ఆశ్వానికి మంచి కావ్యానికి, సరిపోయే విధంగా పదాలన్నీ శ్లేషలో కూర్చబడ్డాయి. పదాలు, వడి-వళిాయతి, అలంకారాలు, శైలి, భావం అన్ని చక్కగా అమరిన సత్కావ్యం వలె; పాదాలు, వడి-బలం లేదా సుడి, అలంకారాలు, ధారాస్పదభావం (అశ్వగతి భేదం) - వేగం, మొ॥ మంచి లక్షణాలతో ఆ హయం ఉందని భావం. ం నన్నెచోడుని కుమార సంభవంలో వలె ధర్మన యుద్దాన్ని విపులంగా వర్ణించాడు. అల్లసాని పెద్దన మనుచరిత్ర కంటె ముందే చిత్రభారతంలో వేటను 32 పద్యాల్లో వర్ణించాడు. విజయనగరాంధ్ర ప్రబింధాలు ధర్మన చిత్ర భారతానికి - 1510, ఇంచుక తర్వాతి కాలపువి. శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలం 1509-29. విజయ నగర ప్రబంధ కవులు ధర్మన కావ్యాన్ని చూసి ఉంటారనడానికి నిదర్శనంగా ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలోని ఈ క్రింది వద్యం చూపవచ్చు. ఈనున బుట్టి జెందమున హెచ్చిన శోక దవానలంబుచే గాసిలి యేడ్చె బ్రాణవిభు కట్టెదుటన్లలితాంగి పంకజ శ్రీ సఖమైన మోమువయి జేల చెజంగిడి బాలపల్లవ గ్రాన కషాయకంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనిన్‌ (పారి; 1-133) దీనికి మొదటి చిత్రభారతంలోని ధర్మన పద్యమిది. ఈసును కోపమున్‌ మది వహించి పులోమజ వేడిమాటకై గాసిలి మేని సామ్ముడిపి కన్నుల గ్రమ్మెడు నీట జందనం బోసరిలంగ జేసి శిరమొయ్యన వంచి కపోల పాళిపై జేసయ(?) కొల్చి యొక్కయెడ జింతిలు చుండెడు నంతలోపలన్‌ (చిత్రభా - 1- 81)

వ్‌4ీ డాః మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” ఈ రెండూ సత్యభామ దుఃఖాన్ని వర్షించేవే. సన్నివేశాలు వేరైనా పారిజాతాపహరణ కథా ఘట్టంలోనివే. నారదుడిచ్చిన పారిజాత ప్రమానాన్ని పతి తనకీయక సవతికిస్తే అసూయతో తిమ్మనగారి సత్యభామ అట్లా యేడ్చింది. అమరావతి నందనవనంలో పారిజాతాపహరణ సందర్భంలో శచీదేవి చేసిన హేళనకు అవమానభారంతో ధర్మన గారి సత్య ఇట్లా వాపోయింది. అంతే తేడా! ఈ రెండూ ఉత్పలమాల పద్యాలే. సకార ప్రాస మాత్రమే కాక ఈసు, గాసిలి పదాలు రెంటిలోనూ ఉన్నాయి. పైగా ధర్మన పద్యభావాన్ని నంది తిమ్మన ఒకే పద్యంలో వ్రాసి తృప్తిపడక, అదే కావ్యంలో అదే సందర్భంలో అదే సకార ప్రాసతో మరో ఉత్పలమాల పద్యాన్ని 'వాసెన కట్టు గట్టి నిడువాలిన కస్తురి బొట్టు పెట్టి..' అని కావ్యనాయికను 'చీకటింటిలోని కంకటిపైకో పంపించాడు - రామాయణ కైకలా! ఇట్టా మహా ప్రబంధ కవులకే మార్గదర్శకుడై నడకలు నేర్పిన ధర్మన చిత్రభారతంలోని పద్యాలు ఓ నాలుగు కాకునూరి అప్పకవి తన లక్షణ గ్రంథంలో ఉదహరించాడు.8 చరికొండ ధర్మనకు పది ఇరవై యేండ్లు తర్వాతి వాడైన నాదెండ్ల గోపన ఈ చిత్ర భారత కథను “గయోపాఖ్యానము" సేర ద్విపద కావ్యంగా రచించాడు.9 ఆ గోప మంత్రి తిమ్మరుసుకు మేనల్లుడు, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కొండవీటి దుర్గ పాలకుడు. భువన విజయ కవి దిగ్గజాలు ధర్మన కావ్యాన్ని చదివి అనుసరించింది ఎంత వరకు సత్యమో ఖచ్చితంగా నిర్ణయించజాలము కాని, వారికి ఓ పదేండ్లు ముందుగనే ఈ కవి ప్రబంధ వర్ణనలతో కమనీయాం(ధ్ర కావ్యంగా చిత్ర భారతాన్ని రచించిన ప్రతిభాశాలి అనటం మాత్రం నిజం. ధర్మనకు ఆశ్రయమిచ్చి “చిత్రభారత' కృతిని అంకితం పొందిన ఎనుముల పల్లి పెద్దన మంత్రి కవిని ఇట్లా ప్రశంసించాడు. చిత్ర భారత కావ్య పీఠికలోని 18వ పద్యం - శత లేఖి నస్యవధాన పద్యరచనా నంధా సురత్రాణ చి హ్నిత నామా! చరికొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబులా శితికంలోజ్బ్రల జూటకోటర కుటీ శీతాంశు రేఖాసుధా న్విత గంగా కనకాబ్ద నిర్భర రసా విర్భూత మాధుర్యముల్‌ ధర్మన మాటలు శివుని జడల ముడిలో ఒదిగిన చంద్రుని అమృతంకలిసిన మందాకినిలోని -_ బంగారు తామరల మకరందం వంటి మాధుర్యం కలవట! మరి పద్యాలో, వాని శైలీ శిల్చ్ప భావ సౌందర్యాలు అనుభవైక వేద్యాలు; అవి రస హృదయులకు షడ్రసో పేత నైవేద్యాలు. హృద్య పద్య మహా కావ్యకవి నిరవద్య శేముషీ విభూషితుడు చరికొండ - ధర్మపురి ధర్మన! పాదపీరికలు : 1 చరికొండ పొన్నయ్య, నృసింహకవి మహబూబ్‌నగర్‌ మండలం వారే. 2. వి. కేశవరావుగారు ' కరీంనగర్‌ మండల చరిత్ర' 1981 చివర ఈ జిల్లా (గ్రామనామాల పట్టిక ఇచ్చారు. 3. పల్గాదుర్గ్ణయ్యగారి * ప్రబంధవాబ్మయ వికాసం' నం.3, పుట-284. 4. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' నం.7. 5. చిత్రభారతము. పీఠిక - 8వ పద్యం. 6. ఈ శతాబ్ది పూర్వార్థంలోని చిలకమర్తి గయోపాఖ్యానం” కథ చిత్రభారతం లోనిదే. 7. దీనిని పలువురు కవులు స్టేజనాటకంగా వ్రాశారు. 8. “చిత్రభారతం'లోని 0-16, 1-12, 2-80, 8-94 పద్యాలు వరుసగా “అప్పకవీయం'లో 2- 276, 2-170, 2-228, 3-65 గా ఉన్నాయి. 9. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' న.7, పుట = 175. అనుత్రుత కవులు - అలబ్ధ సాహిత్యం ఈ మండల కవులుగా చెప్పబడుతున్నాకొందరు కవుల జన్మస్థల కాల విషయాల్లో అనుమానాలు

మొదటి భాగం, 1 అధ్యాయం: రాజం కాలం! తెలగు సారొత్య్యం ్‌5్‌ విభిన్నాభిప్రాయాలున్నవి. వీరిలో కొందరి రచనల పేర్లు వినటమే తప్ప ఆకావ్యాల ప్రతులు లభించలేదు. అటువంటి కవుల కావ్యాల వివరాలు అందినంతమేరకు ఈ విభాగంలో వరుసగా చూపబడుతున్నవి. 1 వేములవాడ భీమకవి - వేముల వాడ, 12వ శతాణ్ణి ఉధ్గంథ రచనా ధురీణుడుగా, ఉద్దండ కవితా సంపన్నుడుగా భీమకవి పేరు విశేష వ్యాప్తిలో ఉంది. ఇతడు శాపానుగ్రహ సమర్శుడని ప్రతీతి. కాని, భీమన జన్మస్థలం, కాలం, రచనలు అన్నీ ఇప్పటికీ వివాదగ్రస్తంగానే ఉన్నాయి. భీమకవి రచనలుగా చెప్పబడుతున్న గ్రంథాలుఇవి' -

  1. కవి జనాశ్రయము (ఛందోగ్రంథము), 2. రాఘవ పొండవీయము (ద్వ్యర్థి కావ్యము)
  2. హరవిలాసము (?), 4. నృసింహ పురాణము, 5. శతకంఠ (కంధర) రామాయణము'. 6. జ్యోతి శ్ఞాస్త్రము, 7. బసవ పురాణము (కన్నడము), 8 చాటు పద్యములు, ఇందులో “కవి జనాశ్రయము' మాత్రం లభ్యం. అది రేచన రచనగావిమర్శకుల అభిప్రాయం “కవి జనాశ్రయము దప్ప నీతని యితర గ్రంథము లేవియు నింత వరకు లభింపలేదు. అదియు మల్లియ రేచడు రచించి నటులున్నది” అని శేషాద్రిరమణ కవులన్నారు. చాటు పద్యములు, లక్షణ కర్తలు చూపిన కొన్ని పద్యాల కారణంగా భిమనపై కావ్యాలు రచించినట్టుగా వానిపేర్లు మాత్రం తెలుస్తున్నవి. ఈ కవి నంపూర్ణ కృతులేవీ లభించలేదు. కన్నడ బసవ పురాణం ఉన్నా అది ఈ భీమకవి రచన కాదు. ఆ వివరాలు తర్వాత చూపబడుతాయి. భీమనను పాగడిన పూర్వకవులు వీరుగ శ్రీనాథ మహాకవి 1380-1450) సీ, వచియింతు వేములవాడ భీమన భంగి, ఉద్దండ లీల నొక్కొక్క మాటు, కారవి గోపరాజు (1430-1430) కం. వేముల వాడక సుఖియై, వేములవాడం జరించి వేములవాడన్‌ చామెరిసిన భీముని నుత, భీముని బల భీము విమత భీముదలంతున్‌. అంధ్రకవి రామయ్య (450) ॥ సి, ఛందోనిబంధన చాతురీ ధౌరేయు, వాగ్గాము వేములవాడ భీము. వెల్లంకి తాతం భట్టు 1480-1520) శ “భీమన అఖండంబు మొదలైన కొన్ని వళులకు లక్షణ లక్ష్యంబులు చెప్పడు = లేవు “ప్రజ్ఞాలవ దుర్విదగ్భులసంగతంబుగా బెనచి తగిలించినా; రతని యంకితంబులు గావున వానినిం బ్రమాణింప దగదు.” - కవి చింతామణి. | మొల్ల (1500-1550) రామాయణము “స్తుత గుణోద్ధాము నాచన సోము భీము చరికొండ ధర్మన (1510) “ఘను నన్న పార్యు దిక్కన సోమయాజుల, వర్ణించి వేములవాడ భీము నాచనా మాత్యు సోము శ్రీనాథు...” పింగళి సూరన (1550) ఊ॥ భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని, యందునుం. డేమియు నేయెడన్నిలు చుటెవ్వరు గానరు -” (రాఘవ పాండవీయము) పెదపాటి సోమనాథుడు (500): “వాత్ర్రదోషిత, దక్సవాటీ మహాస్థాన భీము.” చిత్ర కవి పెద్దన (1550) : “త్ర్యక్షవర ప్రసాదకవితాఢ్యుని వేములవాడ భీమునిన్‌”

5్‌5 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సొవాత్య. చరిత్ర” లింగమ గుంటి తిమ్మకవి (560) సులక్షణసారము గీ॥ భీమనయు ననంతనయును బెద్దనయును, తాతనయు జెప్పినట్టి ఛభందములు గూర్చి ప్రకరణములొప్ప జేనెను బ్రహ్మ సంఖ్య, నొనర లింగమగుంట తిమ్మన యను కవి. కాకునూరి అవ్వకవి (650) అప్పకవీయము ఆ.వెకవికట కవులు కొని వింతలు గల్ప్చించి, కవి జనాశ్రయమున కలిపి నారు వాని గైకొనంగ వలదప్రయుక్తంబు, లేల సెప్పు భీముడెరిగి యెరిగి? పట్టపు సరస్వతి సోమయాజి 6670) కం. ఛీమేశ్వరు తీతడు మా, నామము వాడనుచు వాసె నాలుకతుద వా గ్భామిని బీజాక్షర మా, భీమన దలచినను గలవభీష్టఫలంబుల్‌ (పృథు చరిత్రము) ఓరుగంటి రామయకవి (1710) “వ॥ భీమేశ్వర లబ్ధి కవితా వాచా సిద్దిగల వేములవాడ భీమనార్యుడొనరించిన. కవిజనాశ్రయంబను ఛందంబు...” (కవితా లక్షణ సారం) కూచినుంచితిమ్మకవి (715): భీమనదని (కవిజనాశ్రయంలోని) పది యతుల పద్యం వ్రాసుకొన్నాడు. కస్తూరి రంగ కవి (750 “వ॥ ఆదిమ కవి భీమన రేచన మీద నంకితంబుగా జెప్పినాడు” కట్టమూరి కామేశ్వర కవి (9) “రమణీయ పాకాభిరాము భీము”

భీమనను మొట్టమొదట పేర్కొన్నది కాశీఖండము (పీఠికలోని 13వ పద్యం)లో శ్రీనాథకవి. ఆ తర్వాళనే పలువురు కవులు, లక్షణ కర్తలు, తమ కావ్యాల పూర్వకవి న్తుతుల్లో భీమనను చేర్చడం జరిగింది. పై కవులు భీమనను భీము, వేములవాడ భీము అని పేర్కొనగా ఒక్క సోమనాథుడు మాత్రం 'దక్షవాట్‌ మహాస్థాన భీము'డన్నాడు. కొరవి గోపరాజు భిమనకు చాల విశేషణాలు వాడినాడు. అదే కాలపు అనంతుడు “కవిజనాశ్రయం' లోని సూత్రాలు వాడుకొన్నా భీమన పేరెత్త లేదు. వెల్లంకి తాతంభట్టు భీమనను మొట్టమొదట లక్షణకర్తగా "పేర్కొన్నాడు. పింగళి సూరన వరకే భీమన రచనల గురించి పెద్దల వలన వినటమే తప్ప అవి లేవు.

శ్రీనాథుడు భీమన వలె గొప్పగా కవిత్వం చెప్పుతానని మాత్రమే అన్నాడు. కాని, ఆయన కావ్యాల ఊనుబేదు. నిజానికి ఖీమకవి ప్రనక్తి శ్రీనాథునితో అల్లయ వేమ భూపతి తెచ్చాడు కాశీఖండంలో.

రాను రాను కవులు భీమన మహిమలనూ వర్ణించారు. కాకు నూరి అప్పకవి (1650) నన్నయ (1050)కు భీమనను సమకాలికునిచేసి వారి మధ్య వైరాన్ని పెంచి కథ అల్లాడు. అప్పకవికి తర్వాతి వాడయిన కస్తూరి రంగకవి (1750) భీమన కవిజనాశ్రయాన్ని రేచనకు అంకితంగా చెప్పాడన్నాడు. ఈ పూర్వకవి స్తుతుల వలన భీమకవి శ్రీనాథునికి పూర్వుడు, ఆయన వములవాడ దక్షవాటివాడు, అని మాత్రం తెలుస్తున్నది. భీమకవి కాలం ; ఖీమన రచనలను పట్టి చూస్తే, “రాఘవ పాండవీయము' అనే ద్వర్థి కావ్యం రావటానికి ముందే తెలుగులో కావ్యరచన పరిపుష్టినొంది ఉండాలి.” కావున భీమన రాఘవ పాండవీయ ద్వ్యర్థి కావ్య రచన చేసి వుంటే నన్నయకు పూర్వుడు కాజాలడు.

భీమన భారతాన్ని నన్నయ్య, నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణిని భీమన గోదావరిలో కలిపారని “అప్పకవి” చెప్పిన అప్పకవీయ అవతారికలోని కథను పండితులు అంగీకరించరు. ఆ యిద్దరు మహాకవులు అసూయాగ్రస్తులనటం తగనిది.

“నృసింహ పురాణం” భీమన కృతి అంబే జయన తిక్కన శిష్యుడైన మారనకు కొంత వెనుకోముందో ఉండాలి. మారన మార్కండేయ పురాణమే జంధ్రీకృత ప్రథమ పురాణంగా పండితులు పరిగణించారు. అది 13వ, శతాబ్ది రచన.

శతకంఠ రామాయణం' భీమనదైతే అంతకు పూర్వం దశకంఠ రామాయణం వచ్చి ఉండాలి.

మొదటి భాగం, ॥ అధ్యాయం: రాజి కాంంయాన్‌ తెలంను సాహొర్ఫాం 57 ఎందుకంటే రామాయణ యుద్ధకాండలోని మైరావణ కల్పిత కథే శతకంఠ రామాయణము, తాత భాస్కరుడు పూర్వ రామాయణం వ్రాసిన తర్వాతనే తిక్కన ఉత్తర రామాయణం రచించాడు. అట్లే రామాయణం రానిదే మైరావణ కథ రాదు కదా. తెలుగులో భాస్కర మంత్రి, గోనబుద్దారెడ్డి, హుళళ్క భాస్కరుడు వరుసగా 12, 13,14 శతాబ్దులలో రామాయణ కర్తలు. మొల్ల రామాయణం 16వ శతాబ్బానిది. కన్నడ భాషలో “బసవ పురాణము భీమన రచిస్తే ఆయన సోమనాథునికి తర్వాతి వాడు కావాలి. కన్నడ బసవపురాణము పాల్కురికి సోమన కృతికి అనువాదము. సోమనది కాకతి రుద్రదేవుని కాలం 12వ, శతాబ్ది, కన్నడ బ.పు. కర్త, భీమన కాలం 13639 గా నికరంగా తెలుస్తున్నది." ఆ కావ్యంలో కవి స్వయంగా శా.శ. 1291లో రచన కావించానన్నాడు. రచనల ఆధారంగా భీమకవి కాల నిర్ణయం చేయడం కష్టం. సాహిత్య చరిత్రకారుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. అప్పకవి భీమనను నన్న్మయ కాలం 1950 వాడంటే, కందుకూరి వీరేశలింగం వంతులుగారు “కవుల చరిత్రలో భఖిమనను 1340- 50 ప్రాంత కవిగా పేర్కొన్నారు. ఉభయుల సిద్ధాంతాల మధ్య తేడా 300 సంవత్సరాలు. భీమన చెప్పిన చాటు పద్యములలోని వ్యక్తులు వీరు.* తెలుగు రాయడు, కళింగ గంగు, చొాక్కనాథుడు, మైలను భీముడు, సాహిభిమారడు. వీరందరూ 11, 12 శతాబ్దాల మధ్య కొలంవారు. భీమన చెప్పినదని వ్యాప్తిలో ఉన్న 'ఘడియలోపల' సీస పద్యంలోని తిట్టుకవులైన మేధావి భట్టు, కవి మల్లు, కవి భానుడు, బడబానల భట్టు 14వ, శతాబ్ది తర్వాతి వారు. భీమకవి అంతటి అర్వాచీనుడు కాజాలడు. ఆ పద్యం ప్రక్షిప్త మనుకోవాలి. రాజ కళింగ గంగును శపించిన, శాపాన్ని ఉపసంహరించిన పద్యాలు ఇవి - “వేములవాడ భీమకవి, వేగమ చూచి కళింగగంగుతా సామముమాని కోపమున సందడి దీరిన రమ్ముపామ్మనెన్‌ మోమును జూడ దోషమిక ముప్పది రెండు దినంబులావలన్‌ జామున కర్థమందతని నంపద శత్రుల జేరు గౌవుతన్‌.” “వేయి గజంబులుండ పదివేల తురంగములుండ నాజిలో రాయల గెల్చి సజ్జ నగరంబున బట్టముకట్టకోవడిన్‌ రాయ కళింగ గంగ! కవి రాజు భయంకర మూర్తి తిట్టు దా బోయిన మీన మాసమున బున్నమ పోయిన షష్టినాటికిన్‌” చొక్కనాథుని పందిరి కంబాన్ని చెట్టుగా మార్చిన పద్యాలు, “అఆనీతాభ్యుపదాన శృంఖల పదాభ్యాలంబిత స్తంభమా నేనే వేములవాడ భీమకవి నేనిం జిత్ర కూటంబులో భూన వ్యాపిత పల్లవోత్భవ మహా పుష్పోప గుచ్చంబులన్‌ నానా పక్వఫల ప్రదాయివగుమా యాకల్చ వృక్షాకృతిన్‌” “శంభువర ప్రసాద కవి నంఘవరేణ్యుడనైన నా వచో గుంభన చేయనెంతొ యను కూలత నొందితనూన భావనన్‌ గుంభిని జొక్కనామ నృపకుంజరు పందిటి మల్లె సాలకున్‌ స్తంభము రీతి నీతనువు దాలిచి యెప్పటి యట్ల యుండుమా!” సాహిణి మారని తిట్టిన పద్యం-

క్‌రి డా; మలయశ్ర్రీ- “'కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహీత్వ చరిత్ర” “చక్కదనంబు దీవి యగు సాహిణి మారడు మారుకైవడిన్‌ జొక్కి పడంగలండు చలమున్‌ బలమున్‌ గలయీ చళుక్యపుం జొక్క నృపాలు డుగ్రుడయి చూడ్కుల మంటలు రాలజూచినన్‌ మిక్కిలి రాజశేఖరుని మీదికి వచ్చిన రిత్తబోవునే.”

ఈ మాయలు గారడీల అద్భుతాలు నిజమని విశ్వసించలేం. ఇక మిగిలినవి తెలుగురాయలు,

మైలమ భీమునిపై చెప్పిన పద్యాలు. “ఘనుడన్‌ వేముల వాడ వంశజుడ; ద్రా(ద)క్షారామ భీమేశ నం దనుడన్‌; దివ్యవిషామృత ప్రకట నానా కావ్య ధుర్యుండ; భీ మన నాపేరు; వినంగ జెప్పితి, దెలుంగాధీశ! కస్తూరికా ఘన సారాది సుగంధ వస్తువులు వేగం దెచ్చి లాలింపురా!”

ఈ పద్యమందలి అభిమానంతోనే కాబోలు శ్రీనాథుడు ఇట్టాంటిదే మరో చాటువు చెప్పాడు అది ఇది.

“అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా భిక్షాదానము చేయురా సుకవి రాడ్చృందారక శ్రేణికిన్‌; ద్రా(ద)క్షారామ పురి విహార వర గంధర్వాప్పరో భామినీ వక్షోజద్వయకుంభి కుంభములపై వాసించు దద్వాసనల్‌ొ.

తెలుంగురాయ, దాక్షారామ, కస్తూరికా పదాలు రెండు పద్యాల్లోనూ ఉండడం, ఆ ఇద్దరు కవులూ మడులో మాన్యములోకాక సుగంధ ద్రవ్యాల దాన మడుగుతూ రాజులనే “రా' కొట్టడం గమనార్హం. పైగా మత్తేభ శార్టూల పద్యాల నడక ఒక్కటి. కాని, ఈ పద్యాల్లోని తెలుగు రాజులు ఎవరో చెప్పలేం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. ఆంధ్ర దేశంలో తెలుగు రాయళ్లు అనేకులు. భీమన రచనగా ఏ పద్యాన్ని అనుమానించినా మైలమ భీముని 'ఖడ్గ సృష్టిని గూర్చిన పద్యాన్ని మాత్రం అనుమానించలేం, అది ఇది.

“గరళపు ముద్దలోహ, మవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్‌,

హరునయనాన్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్డు, ది

క్కరటి శిరంబు దాయ, లయకారుడు కమ్మరి, వైరి వీరసం

హరణ గుణాభిరాముడగు మైలమ భీమన ఖడ్గ సృష్టికి.” (అప్పకవీయం 3-77) “రామునమోఘ బాణమును, రాజ శిఖామణి కంటిమంటయున్‌,

దామర చూలి వ్రాతయును, దారకవిద్విషు ఘోర శక్తియున్‌,

భీమగదా విజృంభణ, ముపేంద్రుని చక్రము, వజ్రివజ్రమున్‌,

వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్త పోవునే””

పైగా అదే మైలమ భీముని మృతికి విచారిస్తూ భీమకవి చెప్పిన * వృత్త పద్యాలు 14 శైలీ భావన్ఫూర్తిని బట్టి భీమకవివని అంగీకరించక తప్పదు.

ఈ మైలమ భీముని ఏరువ భీముడని భావించి భీమకవి కాలం (1100-1180) అని, నిడుదవోలు వేంకటరావుగారు నిర్ణయం చేశారు” కాని, మైలమ భీముని కాలం శ్రీశ. 1121 గా ఆరుద్రగారు సహేతుక నిర్ణయం కావించారు.ో

ఏవిధంగా చూసినా భీమకవి నన్నయ తిక్కనలకు నడిమి కాలంవాడు. అది క్రీ.4. 1100-1160 కి నడిమి కాలం. అప్పుడు కొకతి రుద్రదేవుడు ఆంధ్రదేశ చక్రవర్తి.

మొదటి భాగం, 1 అధ్యాయం: ౮ాజిం కాంంధాటే తెలుగు పాసొర్ట్యం 59 జన్మస్థల సమాలోచన : భీమకవి కాలంకంటె జన్మస్థల విషయంలోనే పెద్ద వివాదం ఉంది.

భీమన వేములవాడ భీమకవి పేరుతో ప్రసిద్ధుడు. వేములవాడ అనే పదం కవి ఇంటిపేరు గ్రామనామం ఏదైనా కావచ్చు. వేములవాడలు ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలో ఒకటి. కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లా తాలూకాలో ఒకటి. కోస్తాది సామాన్యగ్రామం - తెలంగాణాలోనిది సుప్రసిద్ధ జైన.ైవ యాత్రా స్థలం.

కందుకూరి వీరేశలింగం పంతులు-గారు భిమకవిది గోదావరి మండలంలోని వేములవాడ అంటే, జయంతి రామయ్య పంతులుగారు కరీంనగర్‌లోని వేములవాడ అన్నారు.” విజ్ఞానాంధ్ర కోళంలో పి.వి. కుటుంబరావు గారు కందుకూరిని బలపరిస్తే, నిజాం రాష్ట్ర ప్రశంనలో శేషాద్రి రనుణకవులు జయంతి వారి వాదాన్ని ఆమోదించారు.” డా॥ దివాకర్ల వేంకటావధాని గారు అటో ఇటో తేల్చ లేదు.” ఆరుద్ర 'నమగ్రాంధ్ర సాహిత్యం” లో కవి కాలచర్చ, సాహితీ సమీక్ష సాగించారే తప్పస్థలనిర్ణయానికి పూనుకోలేదు.” డా॥ సంగనభట్ల నరసయ్య ధర్మపురి గారు “విజ్ఞానసర్వస్వము" ౩వ, సంపుటిలో భీమన “జీవిత సత్యాంశములు భావికాల పరిశోధనలో తేలగలవేమో” అన్నారు.

“కరీంనగర్‌ మండల చరిత్ర 1981లో ఈ జిల్లావారైన గత్జెపల్లి సత్యనారాయణ రాజు, కవిగణపతి రామచంద్రరావు, బోయినపల్లి వేంకట రామారావు గారలు భీమకవిది కరీంనగర్‌ జిల్లాగా పేర్కొన్నారు. కాని వారు మరే వివరాలు ఇవ్వలేదు.

“వేములవాడ చరిత్ర” పుస్తక రచయిత చొప్పకట్ల చంద్రమౌళి గారు భీమకవిది కరీంనగర్‌ వేములవాడని 'వేములవాడను వెలసిన..." అనే కవిజనాశ్రయ పద్యం. 'వేములవాడక శుచియై...” అను కొరవి గోపన పద్యాన్ని, ఇంకా వేములవాడ భీమ భళిరే కవిశేఖర, అనుచాటువును తమ వాదానికి ఆధారాలుగా చూపించారు.

భీమకవి శాపం కథ 'అప్పాలు కప్పలైన పాటకు నిదర్శనంగా ఈ వేములవాడలో అప్పాల వారున్నారంటారు. ఈ ప్రాంతంలో అప్పాల వారేకాదు రొట్టెవారు, పవ్వువారు అని కూడా గృహనామాలుగల విప్రులున్నారు. అతీంద్రియశక్తుల బలపరచు కథలు కల్పనలు, పైగా భీమన ప్రాఢ పద్యకవి; గేయకవి కాదు. ఎరబాటి బాపురావు గారు తమ “రామగిరి చరిత్రలో 'హయమది సీత పోత వనుధాధిపుడారయ రానణుండు అను చాటువులోని ప్రదేశాలను వ్యక్తులను రామగిరి ప్రాంతానికి అన్వయించి భీమనది ఇదే ప్రాంతమన్నారు.ో

కరీంనగర్‌ జిల్లా రచయితలందరూ శేషాద్రిరమణ కవుల నిర్ణయం పై ఆధారపడినవారు. వారు “లేములవాడను వెలసిన భీమేశ్వర కరుణగల్లు భీమ కవిని" అనుపద్యము వలన, నీకవి భీమేశ్వరాలయము గల లేములవాడ నివాసియని నిర్ణయింపవీలు గలిగినది” అన్నారు.” కాని, వారే అదే పుటలో “కవిజనాశ్రయము దప్ప నీతని యితర గ్రంధములేవియు నింతవరకు లభించలేదు. అదియు మల్లియరేచడు రచించి నట్ట్లున్నది” అని అన్నారు.

కవి జనాశ్రయం భీమన రచన కానప్పుడు భీమన స్థల నిర్ణయానికి శేషాద్రిరమణకవులు ఆధారపడిన పై పద్యం నిలువదు కదా. ఎందుకంటే కవిజనాశ్రయ కర్త భీమన అని నిరూపించుటకు పుట్టిన పద్యాల లోనిది ఆ పద్యం - చూడండి.

వేముల వాడను వెలసిన, భీమేశ్వర కరుణ గల్లు భీమ సుకవినే కోమటి రేచన మీదను, నీ మహి కవులెన్న ఛంద మెలిమి రచింతున్‌. నిను నీవె పొగడు వైఖరి, నొనరించెద దెలుగు బాస నొప్పుగ ఛందం బును గనక కవిత చెప్పిన వినవే లచ్చనము వాడు వెంగలి రేచా! ఆంధ్ర సాహిత్య పరిషత్ర్రచురణ కవిజనాశ్రయప్రతిలో ఈ పద్యాలు అవతారికలో ఉన్నాయి.

60 డా॥ మలయత్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాపాత్య చరిత్ర” కవిగా భీమన పేరు వేశారు. కాని, వావిళ్ళ ప్రతిలో పై పద్యాలు లేవు. రేచన కృత పద్యాలైదు మాత్రమే దీని అవతారికలో ఉన్నాయి.

--.పరహిత చరితుడు జినేంద్రపద భక్తి మెయిన్‌ (2వ, పద్యం)

పరగిన విమల యశోభా, సుర చరితుడు భీమనాగ్ర సుతు డభిల కళా

పరిఐతుడును సద్భూనుర, వర ప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుడై (3)

అసమాన దాన రవి తన్మయ నమమనోన్నతుడు వాచకాభరణుడు ప్రా

సమాన మిత్రుడీ కృతికి సహాయుడుగా సుదాత్త కీర్తి ప్రీతిన్‌ (4)

అనవద్య కావ్యలక్షణ, మొనరంగా గవి జనాశ్రయుడు మల్లియరే

చన సుకవి జనాశ్రయ, మను ఛందము తెలుగు బాస నరుదుగ జెప్పెన్‌ (5)

అని రేచన రచనగా స్పష్టంగా ఉంది. కావ్యం చివర రేచన తన కవి జనాశ్రయమును జయదేవఛందం ఆధారంగా వ్రాశానని చెప్పాడు.

ఈ కావ్యంలోని దళ పరిచ్చేదాల చివరి గద్యల్లోనూ “ఇది శ్రీవాదీంద్ర చూడామణ్‌ చరణ సరసీరుహ మధుకరాయమాన కవి జనాశ్రయ శ్రావకాభరణ విరచితంబైన కవి జనాశ్రయంబను ఛందంబునందు” అనే ఉంది. భీమన ఛందోగ్రంధం పేర ఏదైనా ఉండేదో తెలియదు. పై పద్యాలలో భీమన అగ్రసుతుడైన వాచకాభరణుడు మల్లియరేచనకు కవిజనాశ్రయ రచనలో సహకరించాడని తెలుస్తున్నది. భీమన సుతుడు అనే పదం మారి భీమన పేరు వ్యాప్తిలోనికి వచ్చిందేమో!

జైనుడు వైశ్యుడు అయిన రేచనను లక్షణ గ్రంథకర్తగా అంగీకరింపనాల్డక నాటి పండితులు, వైదికుడు బ్రాహ్మణుడు అయిన భీమకవికి కవిజనాశ్రయ కర్శత్వాన్ని అంటగట్టారని ఆరుద్ర భావం. గ్రంధస్థ సమాచారం మాత్రం రేచన కర్శత్వాన్ని బలపరుస్తున్నది.

అయినప్పుడు “వేముల వాడను' “నినునీవెపాగడు' పద్యాలు '్రక్షిప్తాలనక తప్పదు. దానితో శేషాద్రి రమణ కవుల వాదం నిలువదు. వేములవాడ భీమ భళిరే కవి శేఖర - పద్యంలో లేములవాడ అని ఆరంభిస్తేనే యతి పాసగుతుందని మరోవాదం. కాని ర - ల, అభేదయతిని అప్పకవి అంగీకరించడు. పైగా ఈ పద్యం ఏకాలానిదో. =

భీమకవి పేర్కొన్నతెలుగు రాజు రామగిరివాడని మరో వాదం. మడికి సింగనకు ఆశ్రయమిచ్చిన ముష్ప భూపతి తండ్రి తెలుగు రాజు. కాని అతడు రామగిరిని పాలించినట్లు అధారంలేదు. ఈ తెలుగు నృపతి శాసనం ఒకటి 1335 త్రిపురాంతకంలో లభించింది. అతని తండ్రి ముప్పభూపతి ప్రతాపరుద్రుని సేనా నాయకుడని నెల్లూరు శాసనం 1314 తెల్పుతున్నది. తెలుగు రాజు అన్న రుద్రదేవుని శాసనం ద్రాక్షారామంలో లభించింది. వారు కోస్తా పాలకులుే కాపయ నాయకుని కాలంలోనే ముప్పయ రామగిరి పాలకుడుగా వచ్చాడు. ఈ తెలుగు రాజు కాలం కూడా భిమనకవి కాలానికి సరిపోదు. అంతరం వందేండ్లు,

_ఈ జిల్లా మంథని తాలూకా ప్రతాపగిరి కోట కట్టించిన ముచ్చనాయకునికి కూడా తెలుగు రాయల బిరుదమున్నది.*” కాని అది ఇంకా తర్వాతి కాలపుది.

కొరవి గోపన “సింహాసనద్వాత్రింశికిలో పొగడినది, భీమన అను బిరుదనామం కల తన తాత కొరవి నత్యనారననే కాని ఈ భిమకవిని కాదని ఆరుద్ర అభిప్రాయం.

భీమకవి స్థల నిర్ణయానికి ప్రధానాధారం “'ఘనుడన్‌' అనే కవి చాటువు.

“ఘనుడన్‌ వేములవాడ వంశజుడ దక్షారామ భీమేశనందనుడన్‌” అని కవి చెప్పుకున్నాడు.

అతని వంశనామం వేములవాడ. అదే స్వగ్రామం కూడానేమో. అతడు మాత్రం దాళ్షారామ

మొదటి భాగం, 1 అధ్యాయం: రాజిం కాంంానే చెంగు సాహసం 51 భీమేశ్వరుని వర ప్రసాది. వేములవాడ భిమేశనందనుడు కాదు! వేములవాడ (్రధానదైవం రాజేశ్వరుడు. దాక్షారామ ప్రధాన దైవం భీమేశ్వరుడు. ఈ వేములవాడ రాజేశ్వరాలయం కల్యాణి చాళుక్యుల కాలపు నిర్మాణం. దాక్షారామ భీమేశ్వరాలయం అంతకు పూర్వపు వేంగి చాళుక్యులది.

'పై పద్యంలోనిది దక్షారామం, గోదావరి జిల్లాది దాక్షారామం అనీ వాదించే పండితులు 'సైతమున్నారు. దక్షవాటి కరీంనగర్‌ వేములవాడకే మారు పేరని భవిష్యోత్తర పురాణంలోని “రాజేశ్వర మహాత్మ్యం'లోని “రాజేశ్వర సమాళశ్షిష్య దక్షవాట్యాం ప్రవర్తతే” అను వాక్యం ఉపపత్తిగా కొందరిచే చూపబడుతున్నది. కాని, దక్షవాటి, దక్షపురి, దక్షారామం, దొక్షారామం, ద్రాక్షారామం, మొ॥[పలురూపాలను శ్రీనాథుడు “భీమేశ్వర పురాణ' 'కాశీఖండ' కావ్యాల్లో అభేదంగా ప్రయోగించాడు.

పై పద్యంలో దక్షారామ లేదా దాక్షారామ పద ప్రయోగం కవి ప్రధానోద్దేశ్యం కాబట్టి, దాన్ని యతి స్థానంలో నిలిపి, ఘనుడన్‌ అని ఆరంభించాడు. అది అతని రాజసానికి తగిన విశేషణమే. దాక్షారామ శబ్దం ఒక్క కందంలో, విరిచి వాడితే సీసంలో తప్ప, మరే ప్రసిద్ధ తెలుగు పద్యంలోనూ ఇముడదు. దక్షవాటి పదాన్ని ఏ పద్యంలోనైనా సులభంగా ప్రయోగింపవచ్చు.

అయినా పై పురాణం వేములవాడనే దక్షవాటిక అన్నది. జన ప్రచారంలో ఉన్న భీమకవి జన్మకథ ప్రకారం వేములవాడ దక్షారామం వేరు గ్రామాలు. ఈ వేములవాడ నమీపంలో దక్షనాటి నగరం ఉండేదని డా॥ నంగనభట్ల నరనయ్యగారు విజ్ఞాన నర్వన్వంలో అనటం అసంగతం.

ఇక్కడి వేములవాడ వ్యక్తి అక్కడి దాక్షారామ వర ప్రసాది కాగూడదా? ఇక్కడి వ్యక్తి ఆ ప్రాంతానికి పోగూడదా? అనే ప్రశ్చలూ వస్తాయి. కాని మరో ముఖ్య విషయమేనుంటే -

కరీంనగర్‌ వేములవాడ పూర్వనామం బేములవాడ. కాకతీయుల శాననొలు ఈ క్షేత్రంలో లేవు కాని, వారికి పూర్వపు స్టానిక - కల్యాణి చాళుక్య సంస్కృత కన్నడ శాననాలన్నింటిలో లేంబుల వాటిక, లేంబుక్టవాడ, లేంబ్లవాడ అనే పదాలే ఉన్నాయి”

వేములవాడ పదం శ్రీనాథునికి - 14వ, శతాబ్దికి పూర్వం ఇక్కడి ఏ శాననంలోనూ కావ్యంలోనూ లేదు. వను చరిత్ర వ్యాఖ్యాత సోమనాథుడు శ్రీ.శ. 1650లో ఈ పట్టణాన్ని లేములవాడ అనే వ్యవహరించాడు. ఈ శతాబ్ది మామిడిపల్లి సాంబశివ శర్మగారు తమ రాజేశ్వర సుప్రభాతంలో “లేంబాళవాటిక విభో అనే ప్రయోగించారు. వేములవాడ నాగరికజన ప్రయోగంలోనే ఉంది. జానపదులు ఎములాడ లేంలాడ అంటున్నారు. ఈ లేములవాడకు వేములవాడ అనే పేరు ఎప్పటి నుండి రూఢిలోనికి వచ్చిందో తెలువదు. ఇన్ని విధాల పరికిలించి చూస్తే భీమకవి గోదావరి జిల్లా ప్రాంతమందలి వేములవాడ వాడే కావచ్చుననే వాదానికి బలమున్నది. స్వభావాన్ని కవిత్వపటుత్వాన్ని చూసే కాక, నమీవ గ్రామవాసి ఆనే భావం కూడా భీమన పై శ్రీనాథునికి అంత అభిమానం ఏర్పడడానికి హేతువు అనవచ్చు.

ఆ కవి ఆశ్రయించిన చాటువులలోని వ్యక్తులు కూడా కోస్తా వారే. కళింగ గంగుది బస్తరు జయపురం ప్రాంతం. చొక్కనాథ కులోత్తుంగ చోళుడు వేంగి - కంచి పాలకుడు. అతడు మొదటి కులోత్తుంగుడని చాగంటి - మూడవ రాజన్యుడని ఆరుద్ర అభిప్రాయ వడ్డారు. సాహిణి మారడు (ప్రతాపరుద్రుని కాలవువాడు కాక అంతకు పూర్వపు మరో వ్యక్తి అయి ఉండాలి. “'వాండిమి నల్ల సిద్ధి' రాజుది నెల్లూరి సీమ. భిమన అతిగా అభిమానించిన మైలమ భీమునిది కృష్ణా మండలం.

రెండు ప్రాంతాల సాహిత్యాభిమానులు భీమకవిని తమ ప్రాంతపు వ్యక్తిగా అభిమానిస్తూ వాదిస్తున్నారు. బి.ఏ. తెలుగు స్పెషల్‌ పాఠ్యగంథం తెలుగు సాహిత్య చరిత్ర'లో భీమకవిది గోదావరి వేములవాడగనే కేర్కొన్నారు. “అంధ్రప్రదేశ్‌” ఆగష్టు 1991. పుట 63లో భీమకవిది కరీంనగర్‌ వేములవాడ అన్నారు. ఈ రెండు వాదాలలో దేనినీ నిరాక్షేేణీయంగా తృణీకరించలేం. స్ధ్‌ర నిర్ణయానికి ఇంకా పరిశోధన కావాలి.

62 డా॥ మలయశ్రీ- “ కరీంనగల్‌ జిల్లా తెలుగు సావాత్య చరిత్ర” “భీమకవి లేములవాడ నివాసియను పక్షమే బలవత్తరము. ఈ వాదముతో జ. రామయ్య. మా. రామకృష్ణకవి, వే.ప్రభాకర శాస్తి, శేషాద్రి రమణ కవులు సిద్ధాంతములు గావించిరి. కాన విశ్వసనీయము”ో శేషాద్రిరమణ కవులు. శేషాద్రి రమణకవుల నిర్ణయం ఎంతబలహీనమైనదో ఇంత వరకు చూపబడింది. భీమనది కరీంనగర్‌ జిల్లా వేములవాడ - లేముల వాడ కాదనే వాదమేబలమైనదని ఈ చర్చవల్ల తెలుస్తున్నది. భీమన రచనల వివరాలు: కవిజనాశ్రయము - ఇది మల్లియ రేచన కృతమనుటే సత్యాంశం. 15వ శతాబ్ది వారైన ఆంధ్రకవి రామయ్య, వెల్లంకి తాతంభట్టు, భీమనను ఛందో గ్రంథరచయితగా పేర్కొన్నారు. వారిద్దరికి కొంత ముందు కాలపు వాడైన అనంతుని లక్షణగ్రంథంలో భీమన పేరు లేనే లేదు. 1650 అప్పకవికి నూరేండ్లు తర్వాతి వాడైన కస్తూరి రంగకవి “భీమన రేచనపేర' ఆ కావ్యం చెప్పినాడన్నాడు. ఇది కేవలం ప్రమాదం ప్రవాదం. కావ్యంలోని అంశాలు రేచన కర్శృత్వాన్నే బలఫరుస్తున్నవి,

  1. రాఘవ పాండవీయము- భీమన పై కృతి వ్రాసినాడని పెద్దల వలన పింగళిసూరన విన్నాడు. ఆకృతిని చూడలేదు. ఎట్టుంటుంది? అప్పకవి కథను బట్టి దాన్ని నన్నయ భట్టు గోదావరిలో కలిపేశాడులో అది అలభ్య ప్రతి-అబద్ధకృతి.

  2. హరవిలానము-కస్తూరి రంగకవి 'ఆనందరంగరాట్ఫందము'లో హరవిలాసము భీమనకవి కృతంగా పేర్కొని ఆకృతిలోనివని రెండు పద్యాలు ఉదహరించాడు. “ఈభీమన వేములవాడ భీమనో కాదో స్పష్టంగా తెలియదు"

  3. నృసింహ పురాణము-ఈకృతి వేములవాడ భీమకవి కృతంగా ఆంధ్రప్రయోగ రత్నాకరంలోనూ, ఆనందరంగరాట్ఫందంలోనూ 'పేర్కొనబడంది. ఈ కావ్యం లోనివిగా ప్రస్తుతానికి లభ్యమైన పద్యాలు తొమ్మది. (తె.అ.వా-పు.55)

నృసింహ పురాణం లోనిదిగా కస్తూరి రంగకవి పేర్కొన్న పద్యం ఇది -

కం. మానవనాథుడు గంగా, స్నానానంతరము నకల దానములు మహా దీనులగు విప్రకోటికి, సేనాదయతోడ నిచ్చె శివు సేవింపన్‌.

ఆరుద్ర “సేనాదయ' ను ఎందుకో తప్పుపట్టారు. కాని, అది శిష్ట్టమాసం. ఇంకా వారు రెండవ చరణంలో స్నద లకు యతి చెల్లదని తమిళంలోని 'సగరం-తగరం' సూత్రంతో సరిపెట్టారు. కాని అది తద్భవ వ్యాజ విశ్రామం - ఒప్పు. స్నానం=తానం.

  1. శతకంఠ రామాయణము - ఆంధ్రకౌముది అనే వ్యాకరణ గ్రంథంలో 'భీమకవి కృతే శతకంఠ రామాయటే ' అని ఉంది. మూడు పద్యాలు మాత్రం లభ్యం (తె.అ.వా.పు.109)

  2. జ్యోతిళ్శాస్తము - “వేములవాడ భీమకవి కృతలకోటా ప్రశ్న శాస్త్రము ” పేరుతో పండిత ఏలూరి శివరాం గారు గ్రంథకర్తగా ఒక చిరుపొత్తం ఉంది. 36 అదే ఇది అనుకోవచ్చు. మూలం సంస్కృతం; వ్యాఖ్యానం శివరాం గారిది.

  3. బసవ పురాణము - ఈకన్నడ కావ్యం పాల్కురికి సోమనాథుని ఆంధ్రకృతికి అనువాదం. కన్నడ బసవ పురాణం భామినీషట్పది ఛందస్సులో వ్రాయబడిన పద్దెనిమిది ఆశ్వాసాల మహాకావ్యం. దీనికర్త శివదేవ పుత్రుడైన భీమన' అనే అరాధ్య బ్రాహ్మణుడని “కర్ణాటక కవీ చరిత్రలో ఉంది. కవి గృహనామం వేములవాడ అని లేదు. ఆయన మన భీమకవి కాఢు. కన్నడ బసవ వురాణ రచన శా.శ. 1291 (+78 శ్రీ.శ1369) అని ఆ కావ్యంలో ఉంది. వేములవాడ భీమకవిది 14వ శతాబ్లి కాదు. అతడు 12వ, శతాబ్దిలో జీవించినవాడు.

మొదటి భాగం, | అధ్యాయం: రాజోం కాంంగ్రాటి చెంగు ప్రారొత్ష్యం 63 ఇంకా 'కబ. పురాణం' లోని “....సమయ వార్డి వివర్ధ నోళ్వజ హిమగు శివకవి దేవనాత్మజ సుమతి భీమ నుభయ కవిత్వ సమర్థను నురువడెోఅను మాటను పట్టి కాబోలు; కూచి మంచి తిమ్మకవి “సర్వలక్షణ సారసంగ్రహం'లో “ఏరకుమీ కసుగాయలు” అను సుమతి శతక పద్యం భీమకవి కృతమన్నాడు. కన్నడ భీమకవికి ముందు సుమతి విశేషణం ఉండటం గమనార్హం. 8. చాటువులు-జనవ్యాప్రిలో ఉన్నవి, పరిశోధకులు "సేకరించి ప్రచురించినవి, లక్షణకర్తలు ఉదహరించినవి భీమకవి పేరుతో ఉన్న చాటువులలో అన్ని కాక పోయినా, కొన్నయినా తప్పక వేములవాడ భీమకవి చెప్పినవని ఒప్పుకోక తప్పదు.” మైలమ భీముని మరణనసందర్భంలో వేములవాడ భీమకవి చెప్పిన పద్యాల్లో 3 కందాలు 11 వృత్తాలు ఉన్నాయి. అ కవి కవన ప్రతిభా నిదర్శనకు వానిలో నుండి కేవలం మూడు పద్యాలు ఇచట చూపబడుచున్నవి* యాచక శేఖరుండు నుగుణాంబుధి మైలమ భీముడీల్లినన్‌ జూచి వరించె రంభ యెడ జొచ్చె దిలోత్తమ, వారి నిద్దరిన్‌ బ్రోచె ఘృతాచి, ముగ్గురకు దొద్దడి కయ్యుము వుట, నంతలో నాచుకు పోయె ముక్తి సతి, నవ్విరి యద్దశ జూచి నిర్ణరుల్‌ (2) నేరువు బ్రహ్మజేం, నిజ నిర్మల తేజము సూర్వుజేరె, నా కారము కాము జేరె, నధికంబగు లక్ష్మియనంతుజేరె, గం, భీరత వార్ధి జేర, గల పెంపు కులాద్రుల జేర, గీర్తి దా నూజట లేక త్రిమ్మరుచు నున్నది మైలమ భీము డీల్లినన్‌ (6) భండన భీమ! నీ యెదుర బారక నిల్చిన శాత్రపుల్‌ బృహ న్మండల పుండరీక పురనాక నివానులు, నోర్చినన్‌ బృహ న్మండల పుండరీక పురనాక నివానులుు, చచ్చినన్‌ బృహ న్మండల పుండరీక పురనాక నివాసులు; చిత్రమిద్ధరన్‌! (1 శాపానుగ్రహ పుటువు, రాపాడెడి కవులనెత్తి రంపం, భూపాల సభల పూజ్యుడు వేములవాడ భీమకవి! పాదపీరికలు 1 దివాకర్ల గారి “ఆంధ్రవాబ్మయ చరిత్రము” పుట. 25; శేషాద్రి రమణ కవుల “నైజాము రాష్ట్ర ప్రశంన' పు.101. 2. శత ఘంట రామాయణము, అని శేషాద్రి రమణకవులు “నైజాము రాష్ట్ర ప్రశంస”లో అన్నారు. 3. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం” సం.1. 4, నైజాము రాష్త్ర ప్రశంస, పుట-101 5. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం” సం.1, పు - 210, 11, 12. 6. ప్రబంధ రత్నావళి, పుట-124, పద్యం-422. 7... శ్రీనాథుని నుండి శేషధర్మం లక్ష్మణకవి వరకు (1380-1850) దాదాపు 5 వందలేండ్లలోని 19 గురు కవుల భిమనను పేర్కొన్న వారిని గూర్చి చెప్పినా ఆరుద్రగారు ఈ ధర్మన పేరు చెప్పలేదు. 8. అప్పకవీయము - అవతారికలోని కథ. పద్యాలు, 3-42, 43. 9. తెలుగులో భట్టుమూర్తి “హరిశ్చంద్ర నలోపాఖ్యానము పింగళి సూరన “రాఘవ పాొండవీయము' తొలి ద్వ్యర్థి కావ్యాలు, అవి 16వ శతాబ్ది రచనలు. 10. ఎల్జన “నృసింహ పురాణము" 14వ శతాబ్ది, 11. డా! జి.ఎస్‌. మోహన్‌ 'తెలుగు కన్నడ బసవ, పురాణములు - పరిశీలన' వ్యాసం 'ెలుగు తె. అకాడెమీ హైద్రాబాద్‌ వారి మాసపత్రిక, జనవరి- 1993 పుట. 110.

64 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జల్లా తెలుగు సావాత్య చత” 12. భీమనచాటు పద్యాలు అప్పకవీయము, సమగ్రాంధ్ర సాహిత్యం, సం.1, నుండి తీసుకోబడినవి. 13. పాఠాంతర పద్యం - అప్పకవీయము - 3-89

బినరుహగర్భు వ్రాతయును విష్ణుని చక్రము వజ్రి పజ్రమున్‌ దెసలను రామబాణము యుధిష్టిరు కోపము మౌనిశాపమున్‌ మసకపు పాముకాటును కుమారుని శక్తియు గాలు దండమున్‌ బళుపతి కంటి మంటలును బండిత వాక్యము రిత్తవోవునే?

  1. చాటు పద్యమణి మంజరి. పుటలు; 178-180.

  2. తెలుగు కవుల చరిత్ర, మద్రాసు వి.వి. ప్రచురణ; భారతి సం.26, సంచిక-3.

  3. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' సం.1 పుట. 209.

  4. “కఠరంనగర్‌ జిల్లా రచయితల చరిత్ర పుట.1 ముద్రణ 1981.

  5. “నైజాము రాష్ట్ర ప్రశంస' పుట. 101. 19. ఆంధ్ర వొబ్మయ చరిత్రము - పు.25,

  6. సమగ్రాంధ్ర సాహిత్యం, సం.1, శీర్షిక.6. 21. వి.స. 1988 ముద్రణ; పుట . 426.

  7. చేములవాడ చరిత్ర - ము.1981, పు. 18, 19.

'23. ఈ చాటువు నెల్లూరు తిరుమలయ్యదని అప్పకవి చెప్పినా, భీమన్నది అయి ఉండాలని ఆరుద్ర అన్నారు. స.ఆ.సా.సం.1, పుట- 1938.

  1. రామగిరి చరిత్ర: ము. 1988, పుట. 19. 26. నైజాము రాష్త్ర ప్రశంస. వు. 101

  2. డా! క. కునుమాబాయి “మడికి సింగన కవి' పుట. 28.

  3. కరీంనగర్‌ జిల్లా శాసనాలు, నం. 69. పుట. 135.

  4. చొ. చంద్రమౌళి “వేములవాడ చరిత్ర' పుట. 19.

  5. వేములవాడ విప్రుడైన సోమన కూతురు బాల వితంతువు. ఆమె తండ్రి పోషణలో ఉండేది. ఒకసారి యాత్రికులతో కలిసి ద్రాక్షారామం వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి గర్భిణి, ఆమె పుత్రుడే భీమకవి.భిమేశ్వరవర ప్రసొది. ఆ అమాయకురాలు ఇతర ప్రీలవలె తనక్షు సంతానం కావాలని దేవుని వేడుకోవడం వలన ఇంత జరిగిందని ఐతిహ్యం. సోమన భార్య వితంతువు. ఆమె సంతానం భీమన, అని పై కథ మార్చి 'వే.భీ.కవి కృతల కోటా ప్రశ్న శాస్త్రము పీఠకలో ఏలూరి శివరాం గారు వ్రాశారు.

  6. [160/1010౧3 0.౧. 40/గ౧౧౦౦౦? 01౯. 1974, ౧. 1-60.

  7. తెలుగు అకాడమీ హైదరాబాదు ప్రచురణ - 1986 పుట. 36.

  8. 04019066 0/19 ౦0౧౧౫౩౦౧9౦ 1౧1౦గార|ంగి ౦౧౮ ౧౮౦|0 [681610౧0. 11/6.].

  9. గోలకొండ కవుల సంచిక - పుట - 404. 34. అప్పకవీయం; 1-90.

  10. డా! రవ్వా శ్రీహరి 'తెలుగులో ఆలబ్బవాబ్మయం” 1993, పు. 129.

  11. లక్ష్మినారాయణ బుక్‌ డిపో. రాజమండ్రి ప్రచురణ - 1968.

  12. ఈ వ్యాసంలో ఉదహరించిన చాటువులు, అప్పకవీయం, ఆంధ్రకవి తరంగణి. సం. 3, సమగ్రాంధ్ర సాహిత్యం నం.1. లోనివి.

  13. చాటుపద్యమణి మంజరి. పు. 178-186. 39. భీమకవి చాటువు భావం.

  14. శరభాంక కవి - వేములవాడ; 14వ, శతాబ్ది శరభాంకుని రచనలు రెండుగా చెప్పబడుతున్నాయి. కాని, ఒక్క శతకమే అతని కృతి.

  15. శరభాంక లింగ శతకము' 2, చెన్న బసవ పురాణము

మొదటి భాగం, 11 అధ్యాయం: రాజం వాంందోటీ తెలిగు సారొత్టం 65 తన తల్లిదండ్రుల పేర్లు కానీ, కులగోత్రాదులను కానీ ఈ కవి చెప్పలేదు. కాని, ఆతని వంశపు మరోకవి 'లింగధారణ చంద్రిక' అశ్వాసాంత గద్యలో తనను గూర్చి ఇట్లా చెప్పుకున్నాడు.

“క్రీమద్యజుశ్ళాఖాపస్తంభ సూత్ర కౌశిక గోత్ర పవిత్రవాది వీరైవ భక్త త్రయాంత ర్ఫూతాయ ప్రశాపరుద్ర పృథివీశ్వర సంస్థాన మంత్రి శేఖర శరభాంక వంశ సంభూతాయ” దీనిని బట్టి ఈ కవి ఆరాధ్య బ్రాహ్మణుడు అని మాత్రం తెలున్తున్నది. స్థల విరయం: శరభాంకృకవిది వరంగల్లు అని గోలకొండ కవుల సంచికలోని నం.16 పూర్వ కవుల పరిచయాల్లో ఉంది. ఇంకా “ఈయన ప్రతాపరుద్రుని మంత్రి యని లింగధారణ చం(ద్రికలో గలదు. వేములవాడ నుండి ఒకొనాకరు మాకు ఈ కని తమ వంశమునకు మూల పురుషుడని ధ్రాసిరి" అని శేషాద్రి రమణ కవులు తెలిపారు.

వేములవాడ శివలింగమూర్తికి రాబేశ్వరుడనే తప్ప శరభాంకుడనే పేరు లేదు. ఓరుగల్లు శివుడు - శంభుడు! శరభ పదం వీరైవుల -శైవుల (జంగం, బలిజ, పెరిక, బుక్క, వైశ్యుల) పెళ్లి సందర్భాలలో ఖడ్లాలు అనబడే వీరకొలువుల్లో వినిపించుతుంది.. శరభాంకుడని ఏ ప్రదేశంలోని శివుని పిలుస్తున్నారో తెలువడు. ఇక్కడ కవి తన పేరుతో చేర్చి శివుని “శరభాంకలింగమా' అని సంబోధించాడనుకోవాలి. శరభాంక నామం కూడా కవి మారుపేరు కావచ్చు. ఈ కవి ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నవాడని ప్రతీతి. -

శిన దేవయ్య, శరభాంకుడు, మల్లికార్జున భట్టు, రంగనాథుండును మొదలగువారు ఇన్నూరును ప్రతాపరుద్ర చక్రవర్తి సమ్ముఖమునకు వచ్చుట “ప్రతాప చరిత్రలో వర్ణింపబడినట్లు “సిద్ధేశ్వర చరిత్ర' పీఠికలో ఖండవల్లి లక్ష్మిరంజనంగారు పేర్కొన్నారు. దీనికి మూల గ్రంథమైన ఏకామ్రనాథుని “* ప్రతాపరుద్ర చరిత్రము”లో శరభాంకుని పేరు రెండు పర్యాయాలు వచ్చింది.

  • కాకతి ప్రతాపరుద్రుని కొలువు కూటాన్ని వర్ణించే సందర్భాన “వవదేనయ్యయు శరభాంకుండును మల్లికొార్డునుండును పాలకుర్తి నూరప్ప మొదలుగా గల ద్రధాని వర్ణంబులతో " ముచ్చుటలాడు -* విషయాల వరించాడు.

2 ఢిల్లీ సుల్తానునకు యుద్ధమునందోడి పట్టుబడి రామగిరి నమీషాన గోదావరీ తీరంలో సేనలతోపొటు విడిసి యున్న ప్రతాపరుద్రుని, ఏకశిలా నగర ప్రముఖులు వ్రభుత్యోద్యోగులు చూడ వెళ్ళారని, వారిలో “శివదేవయ్యయు శరభాంకుండును మల్లికార్డునుండును రంగనాభుండును మొదలుగా గలవారు” ఉన్నట్లు వర్ణితం.”

వావిళ్ళవారి శతక నంవుటి సకికలో “శరభాంకుడు, శివదేవయ్య, విశ్వేశ్వర దేశికుల సోదరులనియు నీ మువ్వురు ప్రతాపరుద్రుని మంత్రులనియు జెప్పుచున్నారు. కాని, కాకతీయ సాఘమ్రాజ్యమునకు సంబంధించిన చరిత్ర గ్రంధములందు మా చూచినంతలో శరభాంకుని పేరు కానరాదు” అని పరిష్కర్తబన్నారు. బింగధారణ చరిత్రను పట్టి శరభాంకునిది కౌశిక గోతం, విశ్వేశ్వర దేశికులది శ్రీవత్స గోత్రం. కాబట్టి వారు సోదరులు కారని శేషాద్రి రమణ కవులన్నారు. నిజానికి శివదేవయ్య, విశ్వేశ్వర శివదేశికులు ఇద్దరు కోరు. ఒకే వ్యక్తి రెండు పేర్లు!

శరభాంకుడు కాకతి ప్రతాపరుద్రుని అస్థానంలో ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పలేం. కాని, ఆ చక్రవర్తి ఢిల్లీ పాదుషాతు బందీ అయిన సందర్భంలో ఆరింట హకారాన్ని ఉంచి శరభాంకుడు ఒక పద్యం చెప్పాడని లింగమగుంట తిన్ముకవి 'సులక్షణ సారము' లో చూసాడు. అచాటు పద్యమిది.

ఉ. చాపముగా నహార్యమును జక్రిని బాణము గాగ నారిగం బాపదొరం బొనర్చి తలపం ద్రివురంబుల గాల్పవేమహో ద్దీపతతీవ్రకోసమున దేవత లెల్ల నుతింప నాటి - త్భాపపు డిల్లి మీద నెగబాన్నగదే శరభాంక లింగమా.

66 డొ॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చంత్ర” ఈ కవిది ఓరుగల్లు 'ప్రాంతమో కరీంనగర్‌ మండలమో అయి ఉంటుంది ఈ జిల్హాలోని 16వ, శతాబ్లీ కవులైన ఎడపాటి ఎబ్జియ, రామగిరి(?) కూర్మపురాణ కర్త రాజలింగకవి కోరుట్ల గారలు శరభాంకుని తమ కావ్యాల్లో స్తుతించడం వలన కూడా ఈ కవి కరీంనగర్‌ జిల్లా వాడనుకోవచ్చు. అందుకు గోలకొండ కవుల సంచిక సాక్ష్యం కూడా కొంత ఉంది. కవికాలం:శరభాంక లింగ శతకములో “కూడలి సంగమేశ్వర' ప్రసక్తి ఉంది.” కూడలి బసవేశ్వరుడు 12వ, శతాబ్దివాడు. ఈ కవిది 13వ, శతాబ్ది అని గోలకొండ కవుల సంచికలో ఉంది. పుట. 412. ఇతన్ని ప్రతొపరుద్రుని మంత్రిగా అనంతర కాల కవులు కొందరు పేర్కొన్నా అది నిజమనడానికి ఆధారంలేదు. ఈ శతక పద్యాల భావాలను చూసినా వానిలో రాజమంత్రి రాజసం లేదు, చాపముగా - అనే చాటువు ప్రతాపరుద్రుని కాలపు విషయమైనా దానిని ఉదహరించిన తిమ్మకవి 1560 కాలంవాడు. శరభాంకుడు ప్రతాపరుద్రునికి 1323, లింగమగుంట తిమ్మకవికి 1560 మధ్యకాలంవాడు కావాలి. శరభాంకుని నుతించిన ఎడపాటి ఎజ్టాయైగడది కూడా తిమ్మకవి కాలమే. కాబట్టి శరభాంకుడు 15వ, శతాబ్ది వాడు కావాలి. కాని, కవి వాడిన భాషను బట్టి 14వ, శతాబ్ది కవిగా చాగంటి శేషయ్య గారు భావించారు.

శరభాంకుని 14వ, శతాబ్ది ఉత్తరార్థకవిగా పేర్కొనడం సముచితం. రచనా విశేషాలు : శరభాంక లింగశతకము లోనివి అయిదు పద్యాలు మొట్ట మొదట వేటూరి (ప్రభాకర శాస్త్రిగారు “చాటు పద్యమణి మంజరి'లో ప్రచురించారు."

ఆ తర్వాత “వావిళ్ల రామస్వామి అండ్‌ సన్స్‌ - మద్రాను' వారు, శేషాద్రి రమణకవుల పీఠికతో 1928 “నీతి శతక సంపుటము'లో ఈ శతకాన్ని ముద్రించారు. విద్వాన్‌ చిన్ని కృష్ణశర్మ గారి శతక వాజ్మయ సర్వస్వము"'లో ఈ శతకం లేదు.

ఇది శతకమే అయినా వంద పద్యాలు లేవు. లభించినవి 89 మాత్రమే. మరో విశేషం ఏమంటే ఈ పద్యాలకు మకుట నియమం విధిగా పాటించినా పొాదనియమం పాటించబడలేదు. అయిదారు చరణాల పద్యాలు 60 మొదటి భాగం, నాలుగు పాదాల పద్యాలు 29 రెండవ భాగం. కవిత్వం కూడా పూర్వభాగం కంటె ఉత్తర భాగమే ఉత్కృష్టంగా ఉందని పరిశీలకుల తలంపు.

వ్యావహారిక పదాలను నాటి శతక కవులు స్వేచ్భగా వాడేవారు. వ్యాకరణవేత్తలకు అవి తప్పులుగా కనిపించడం సహజం. నిజానికి ఈ కవి రచన బాగుంది. భావాలు సమకాలీనాలు. భక్తి శైవం. భావ ప్రకటనలో పదాల కూర్పులో కొంత సంయమనం పాటించి ఉంటే శిల్పరత్యా ఈ కవిపద్యాలు మరీ రాణించేని.

వేమన, కవి చౌడప్పల పద్యాల భావాలను" తలపించే ఈ దానగుణ ప్రస్తుతి పద్యం చూడండి.

వగచెడి దేహిక్రైన పరవానికి నైనను నర్థికైననుం

దగిన ధనంబువైన నది దప్పిన నించుక నన్నమైన నుం దెగువను దశ్రమైన మజీదీనత గల్గిన నంబలైనని

మ్మగు దయనివ్వలేని నరమాత్రులు చచ్చిన నున్న నాక్కటే తగ నిహతాంగ జాత భవదండన యోశరభాంక లింగమా - 41

తక్రం = చల్ల మజ్జిగ, అంగజాతుడైన మన్మథుని నిహతం కావించినవాడు శివుడని ప్రొఢ ప్రయోగం. భవుల లేదా భవాన్ని దండించేవాడు శివుడని కవి భావం.

అంధవిశ్వాసాలైన శకునాలనిట్లా ఖండించాడు.

కలలకు జింతయేల, తనకడ్డము వచ్చిన పిల్లి కోసమై యలమట యేల, శుమ్మెనని యాపద యేల, యనేక కీడులే

మొదటి భాగం, 1 అధ్యాయం: రొజుల కాంంయాటీ తెలుగు ప్రాహొత్యం 67 దొలగక కంటి మంచు మది దోచక నిల్చి కృళింపనేలపో, తెలియగలేరు మానవులు, తిక్కకు వేరొక మందు కల్గునొ, వెలయగ వ్రాయు బ్రహ్మ లిపి మిథ్యయె, యో శరభాంక లింగమా - 21 కందుకూరి వీరేశలింగం పంతులు గారు ముహూర్త జాతక ఫలాలను, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు శకున పరిగణనమునూ ఇట్లే నిరసించారు. పామరులను ఈ విధంగా వెక్కిరించాడు కవి. ఈనె కపీశుడంట, యిక నింతకు బత్తుడు పుట్టడంటనో, స్నానము జేయునంట, మరి సందె జపంబులు వార్చునంటరో, గానము] జెప్పునంట, మన గాలియు పారగ గూడదంటరో, మానవుడీడు కాడ, మన మాతని2 కంటెను తక్కువైతిమా, కాని యటండ్రు మూర్జజన గణ్యులయా - శ, 68

  1. జ్ఞానమునకు గ్రామ్యపదం, 2. ఆఖండవళి - మా - ఆ, వ్యావహారిక భాషను వాడినందుకు రామలింగేశ్వర కుక్కుటేశ్వర శతక కర్తలకు అ తర్వాతి కాలంలో భాషావిషయంగా మంచి పేరు వచ్చింది. మధుర తంజావూరి యక్షగాన కవులు భాషను యధేచ్చగా వాడినా, కొన్ని వచన కావ్యాలో.... పదకృతుల్లో తప్ప, మన పండితకవులు పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థం వరకు గాంధికానికే పట్టంకట్టారు. 14వ శతాబ్దిలో శరభాంకుడు తన కవిత్వంలో క్వాచిత్కంగా నిందకైనా గ్రామ్యం వాడటం విశేషమే. పద్యాల్లో ఇప్పటికీ గ్రాంధికమే ప్రయోగింపబడుతున్నది కదా! గ్రాంధికాంధ్ర భాషావాది అయిన అప్పకని కూడా నిందా సందర్భాల్లో గ్రామ్యుం వాడవచ్చునని మినహాయింపునిచ్చాడు. “ నిజానికి శరభాంకుని వంటి పూర్వకవుల ప్రయోగాలు లక్ష్యాలు. వానిని చూసే అప్పకవి లక్షణం - సూత్రం పుట్టింది. తర్వాతి కాలపు "పెమ్మయ సింగధీమణీ “పద్యాల బోలిన ఈ కవి పద్యం ఇది. పెట్టక కీర్తిలేదు, వలపించక యింతికి నింపులేదు, తా దిట్టక వాదులేదు, మరి ధీరత వైరుల సంగరంబులో గొట్టక పేరు లేదు, కొడుకొక్కడులేక పరంబు లేదు,ునా పట్టపు రాజుకైన నిది పద్ధతి; శ్రీ శరభాంక - 60 ఈ శివకవి భక్తి యోగాన్ని ఇట్లా అభివర్ణించాడు. “వాలిన యింద్రియమ్ముల కవాటములన్నియు మూసి నెమ్మదిన్‌ ద్లాళము బెట్టిలోని పరతత్త్యమహత్త్య త్రికోణ మందిరా లాలిత నాగకన్యను పలాలన జేసిన యోగిగొక వై మాళపు నేషముల్‌ యముని మార్కొనునా శరభాంకలింగమా - 82 ఈ కవి పండితుడు; సదాచారి; యోగసాధకుడు. చెన్నబసవ పురాణం శరభాంకుడు రచించినట్టుగా కవి చరిత్రకారులెవరూ చెప్పలేదు. ఆ "పేరుతో గోపతి లింగకవి, పామనాథుడుో మొ॥ కవులు మాత్రం పద్యకావ్యాలు వ్రాశారు. శరభాంకుడు 'చె.బ.పు' రచించినట్లుగా పేర్కొన్నా వారు 'కరంనగరం మండల చరిత్రలో ఈ జిల్దా కవి గజ్జెపల్లి సత్యనారాయణ గారు మాత్రమే. వీరు గోలకొండ కవుల సంచిక' లోని శేషాద్రి రమణ కవుల పూర్వ కవి పరిచయ వివరాల చూసి పొరపడినట్టున్నారు. అందిట్టున్నది. ఆత్తలూరు విశ్వనాథ కవి పరిచయంలో “వ్పీరి వంఛమూల పురుషుడు. శరభాంకుడు ఆత్తలూరి పాపకవి మొ॥ కవులు శరభాంకలింగశతకము చెన్నబసవ పురాణము కర్త అనుపై సంచికలోని అస్పష్టవాళ్యార్థము

68 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జుల్లా తెలుగు సావాత్య చరిత్ర”

  • శరభాంకుడు శ.లిం. శతకము, పాపకవి చెన్న్షబసవపురాణం వ్రాశారని. కాని, గ.స. రాజు గారు శరభాంకుడే కావ్యద్వయకర్త అనటం పారపాటు.

శరభాంకుడు శరభాంకలింగ శతకొన్ని మాత్రమే రచించాడు. చెన్నబసవ పురాణానికి శరభాంకునికి సంబంధంలేదు. “అరిది విలుకాడ వౌదువు శరభలింగ' అను మకుటంతో మరో తేటగీతి శతకం ఉఊంది కాని, అది శరభాంకుని రచన కాదు. ఎవరిదో తెలియదు.

శరభాంకుని శతకం భక్తులకే కాక సాహితీ పిపాసులకు కూడా పరనయోగ్య కావ్యం. పాద పీఠికలు

  1. వావిళ్ళవారి 'నీతిశతక సంపుటము” 1928, పు-175

  2. గజ్జెపల్లి సత్యనారాయణ రాజు 'కరీంనగర మండల చరిత్ర" 1981, పు-14.

  3. చాగంటివారి 'ఆధ్రకవి తరంగిణి' సం.3, పు.197.

  4. గోలకొండ కవుల సంచిక, 1934, పుట.412.

  5. సిద్ధేశ్వర చరిత్రము పీఠిక, పుట-169. ఇది కాసె సర్వప్ప రచన.

  6. ప్రతాపరుద్రుని చరిత్రము. సాహిత్య అకాడమీ ప్రచురణ. 1984. పు.4

  7. ప్రతాపరుద్రుని చరిత్రము పుట.64 8. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం సం.3

  8. వావిళ్ళవారి “నీతి శతక సంపుటము ' పీఠిక ము.1928

  9. కూడలి సంగమేశ్వరుని గొల్పిన భక్తుని బంటు బంటులో - అని శ, లిం, శతకంలోని 59వ, పద్యపాదం. 11. చాటు పద్య మణి మంజరి, మొదటి భాగం - పు. 208, 209

  10. పెట్టి పోయలేని - వేమన; దేవుడు దేవుండనగా - కవిచౌడప్ప.

  11. శివకవులు శైవులు కాని అన్యుల భవులనేవారు. భవము అనగా జన్మ భవదండనుడు జన్మరాహిత్యం చేసేవాడు.

  12. చులకగా గ్రామ జనములు పలుకు నట్టి, తెనుగు మాటలు గ్రామ్యంబులనగ బడియె వర్ణలోపంబు నాంది కావ్యముల జొరవు, పరుల దెగడెడుచో నొప్పు బాలదొంగ. - అప్పకవీయుము, 1-123, వావిళ్ళప్రతి; ము. 1970.

  13. డా॥ రవ్యాశ్రీహరి “తెలుగులో అలబ్ధవొబ్మయం' పుట - 38

16 గోక. సంచిక - 1934, పు. 355.

  1. ఎడపాటి ఎట్టియ - 16, 7 శతాబ్దాలు. రామగిరి.
  2. చుండి కాశయమంత్రి - దుండి (నుందిల్ల)

ఎడపాటి ఎజ్జ్బయ కవి రచనలు రెండు శృంగార ప్రబంధాలు.

1 మలహణ చరిత్ర (ముద్రితం) 2. కుమార నైషుధము (ఆలభ్యం)

మల్హణ చరిత్రమును శృంగార కావ్య మండలి మచిలీ పట్టణము వారు 1940లో ముద్రిస్తూ దీనిని 1937లో గంటి సూర్యనారాయణ శాస్త్రి గారు గ్రంథ సాతములతో ప్రచురించినట్లు తమ పీశికలో తెలిపారు. ఫు. 4. న

కుమార నైషధము, ఎజ్జ్టయ రచనగా ప్రబంధ రత్నావళి (పెదపాటి జగన్నాథకవి సంకలనం) లో ఉంది. మల్హణ చరిత్ర, కుమార నైషధం వీరి రచనలుగా డా. పల్లా దుర్గయ్య గారు “(ప్రబంధ వాబ్మయ వికాసము'లో పేర్కొన్నారు. (సంపుటి - 1 వుట - 284)

మలహణ చరిత్ర పీఠికలో పరిష్కర్త చోడవరపు జానకి రామయ్య బందరు గారు ఈ రెండు రచనలను "పేర్కొన్నారు. మల్హణ చరిత్రలో కుమార నైషధం ప్రసక్తి లేకపోవడానికి కారణం అది

మొదటి భాగం, ॥॥ అధ్యాయం: రొజిం వాంంాట్‌ తెంగు పారొర్టం 69 కవి గారి మలికృతి కావడమే అని భావించారు. మల్హణ చరిత్ర కంటే కుమార నైషధ కావ్య రచన ప్రొాఢంగా ఉండటం వారి వాదాన్ని బలపరుస్తున్నది. స్థలకాల నిర్ణయాలు : ఎడపాటి ఎజ్జయ్య గారి మల్హణ కావ్యాన్ని అంకితం పొందిన దుండి కాళయమంత్రి ఇట్లా సంబోధించాడు.

పాటిగలట్టి మేటి యెడపాటి పురాధిష, యెజ్ఞనార్యనీ సాటిగ జెప్పినట్టి కృతి సాటువయై విలసిల్లు గాకిటన్‌ ... మ.చ. పు. 5 .

ప్రబంధరత్నావళిలో పెదపాటి జగన్నాథ కవి ఈ కవికి ఎఅపాటి ఎజ్జనగా పేర్కొన్నాడు. ఇంటి పేరు తప్పినదని “తెలుగు అలబ్ధ సాహిత్యం' పుస్తకంలో డా. రవ్వా శ్రీహరి గారు “ఎడపాటి' అనే అన్నారు. కానీ, చుండి కాళయ “ఎడపాటి పురాధిప! అన్నాడే తప్ప ఎడపాటి ఎజ్జియ అని అనలేదు.

పెద పాటి నివాసి ప్రబంధ రత్నావళి సంకలన కర్త జగ్గకవి నత్యాన్ని తెలిని వచించి ఉండవచ్చునని జానకి రామయ్య గారు అభిప్రాయపడ్డారు. 'పెదపాటిఎజ్జయ ఎడపాటి గ్రామకరణంగా ఉండవచ్చుననే భావం సహేతుకంగా ఉంది. పెదపాడు ఏలూరు సమీప గ్రామం. కాళయమంత్రి అధికారం నెరపిన “చుండి యనునది నెల్లూరు మండలముక నందలి యొక చిన్న సంస్థానము” (మల్హణ చరిత్ర పీఠిక - వు. 13).

కవి కాలాన్ని నిర్ణయం చేయటానికి అతని పూర్వ కవి సుతిలోని తెలుగు కవులను ఆధారంగా తీసుకోవచ్చు.

వినుతులొనర్తు నాంధ్ర సుకవి ప్రభు నన్నయ భట్టు దిక్కయ, జ్వను శివదేవు భాస్కరుని జక్కన నాచన సోము సర్వదేవుని శరభాంకు వీరకవిధూర్ణటి గేతన భట్ట భానునిన్‌...

వీరిలో కాలాన్ని బట్టి కృష్ణదేవరాయల ప్రబంధ యుగంలోని ధూర్జటి కవి చివరి వాడు. వేమకవి “విశ్వదాభి రామ” శతక కర్త అవునోకాదో. వీరకవి ఎవరో తెలువదు. ॥

ధూర్జటి కవి 16వ, శతాబ్దివాడు. కవి కాల నిర్ణయానికి మరో ముఖ్యాధారం 'మలహణ చరిత్ర ప్రబంధంలోనే ఉంది. కాళయమంత్రి కావ్యాన్ని తనకంకితమిమ్మని కోరగా కవి ఈ విధంగా అన్బాడు.

ఇట్టి మహా ప్రధాన పరమేశ్వర మూర్తివి గాన నీవుచే

పట్టితి మేలు చుండి పురపాలక కాళన మంత్రి చంద్రమున్‌

గట్టిగ గృష్టరాయ జనకాంతున కీయకదాచినట్టి యా

గట్టిడి యైన యెజ్జకవి రాజిత మల్హణ కావ్య కన్యకన్‌ పు. 5

కృష్ణర్ణాయలకీయక దాచి ఉంచుకొన్న తన కావ్యాన్ని ఇతనికి అంకితమిస్తానన్నాడు కవి. ఈ కృష్ణరాయలు విజయనగర చక్రవర్తి కావచ్చునా? రము

“ఇందలి కృష్ణ్ణాయ జనకాంతుడన నంద్యాల కృష్ణ విభుడని చెప్పవచ్చునేమో విచార్య క ఎట్లైనను ఇందలి చుండి కాళుడు పడునారవ శతాబ్దమునకు చెందినవాడు మాత్రము కాదు. 17 శతాబ్బమున నుండి యుండవచ్చును.” (మ.చ, పీఠిక. పు. 13) కవి ఈ

పదహారవ శతాబ్ది చివరి పాదంలోనో పదిహేడవ శతాబ్ది పూర్వాపాదంలోనో ఎజ్జయ కాన్యరచన చేసి ఉంటాడు. పై సమాచారమును బట్టి ఎజ్బ్జయకవి కోస్తామండల సంబంధం కలవాడుగా నిర్ణయం కలుగకమానదు. కాని - యరబాటి బాబురావు మంగపేట గారు తమ “రామగిరి చరిత్రలో ఈ క్రింది విషయాలు పేర్కొన్నారు.

క్రీ.శ. 1652 ప్రాంతంలో గోలకొండ ఇబ్రాహీం కుతుబ్‌షా పాలనలో ఎడపాటి నారాయణరావ్‌ గోలకొండలో ముఖ్యోద్యోగిగా ఉండి జగదేకరావు మొ మహరాషఘ్ర్రుల తిరుగుబాటును అణచివేసినందున పాదుషాచే రామగిరిదుర్ల సామంత పాలనాధికారాన్ని పొందాడు. పు. 32.

70 డా॥ మలయత్రీ- “కరంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర”

“ఈ యడపాటి వంశీయుడైన ఎజ్బాప్రగడ రామగిరి ప్రాంతోద్యోగి కవి కూడా. వీరికి ఎడపాడను గ్రామనామమే వంశ నామముగా మారి నిలిచినది. ఈ మండలోద్యోగిగా పనిచేస్తూ వీరికి బంధువైన కాళయమంత్రి ఢిల్లీ ప్రాంతము నుండి వచ్చిన వారగుట ఆతనికి ఢిల్లీవారను వాడుక నామమే గృహనామమై వంశనామమై నిలిచినది. యీ కాళయమంత్రి రామగిరి కారు శ్రోసులలోనే చుండి యను గ్రామములో నివాస మేర్చరచుకొని యుండెను. చుండి గ్రామము మహ్మదీయుల యుచ్చారణలో చుండిల్‌ యని యను చుండినారు. ఇప్పటికి కూడా మహ్మదీయులటులనే యందురు. నేటికిన్‌ యట్టి చుండి “చుండిల్ల'లో వారి వంశీయులే కావచ్చు ఢిల్లీ వారనువారు యలరారుచున్నారు” అని ఎజ్జమంత్రి కాళయకు వ్రాసిన జాబుగా మల్హణ చరిత్ర ప్రధమాశ్వాసంలో కృతిపతి కావ్యాంకితం కోరిన శివభక్తి నిధిని, పాటి గలట్టి మలహరు భక్తులలోపల - అను మూడు పద్యాలను 'ఆంధ్ర కవి ఈరంగిణి' 9వ, నంపుటిలోనివిగా పేర్కొన్నారు. (రామగిరి చరిత్ర - 1982; పు. 33, 34.)

దిన్ని బట్టి ఎబ్బ్టయ కాళయమంత్రులు తెలంగాణా కరీంనగర్‌ మండల రామగిరి ప్రాంత నివాసులనే భావించవలసి ఉంది. కాని అంతకుముందుగా బాబురావు గారి వాదనలొోని జౌచిత్యాన్ని పరిశీలించడం అవసరం.

  1. ఈ కీ.శే. బాబురావు మంగపేట గారిది ఎరపాటి గృహనామం. ఎడపాటి ఎరపాటి అభేదాలు. వీరిది రామగిరి పాలకుడైన నారాయణరావు గారి వంశం. వీరి జ్ఞాతులు కవులు ఎరబాటి ఉమాపతిరావు వెన్నెంవల్లి మరో కవి ఎరపాటి బాబురావు గంగారం గారలు ఎజ్జయకవి తమకు తెలియదన్నారు.

  2. రామగిరి చరిత్ర రచయిత బాబురావు గారు “అంధ్ర కవి తరంగిణి'ని చూశారు. తప్ప 'మల్హణ చరెత్ర' కావ్యాన్ని చూడలేదు. మచిలీ పట్టంప్రతిలో కవి నామం పెద్దపాటి ఎజ్బయామాత్యుడ్ద అనే ఉన్నది.

  3. కొాళయ మంత్రిని నెల్లూరు జిల్లా 'చుండి'గా సాహిత్యకారులు అభిప్రాయపడ్డారు. రామగిరి మంథని ప్రాంతంలో సుందిల్ల ఉంది. దానీ పాలకుడుగా కాళయ్య ఉందీ లేంద్‌ చెప్పలేం. ఉంటే ఏ కాలమనే చరిత్రక ఆధారాలు లేవు.

  4. సుందిల్ల ఉర్దూ ఉచ్చారణలో చుండిల్‌ కావచ్చు కాని చుండి కాదు. ఉర్జూలో “ద” కారం వ్రాయడానికి 'చోయ్‌” అనే ఆక్షరం ఉంది. హైదరాబాద్‌, సికిందరాబాద్‌ మొ॥ పదాలోద, డగా మారింది. ఆంగ్ల భాషా ప్రభావంగానే, హైదరాబాద్‌ అనే కదా ఇంగ్లీషులో వాయడం

  5. సుందిల్లలోని నియోగులు ఢిల్లివారు అయితే, కాళయ్యమంత్రి “చుండి” పాలకుడే తప్ప ఢిల్లీ గృహనామంగా మల్హణ చరిత్రలో లేదు.

ఇట్టా చూస్తే ఎడబాటి ఎజ్జయకవి రామగిరి వాడు అనలేం. ఖచ్చితంగా కాదనలేం. కావ్యవిశేషాలు: 'మలహణ చరిత్ర' - పాల్కూరికి సోముని “పండితారాధ్య చరిత్ర'లో శివభక్త కవి మలహబుని కథ. ఈ మల్తణ చరిత్ర మూడు ఆశ్వాసాల ప్రబంధం.

మలణుడు సంస్కృతకవి. వేశ్యాలోలుడు. అయినా శివభక్తి కారణంగా మోక్షాన్ని పొందిన కథ. ఇది శ్రీనాథుని 'గుణనిథి'కథను పోలి ఉంటుంది. ఈ మల్చణ కథను అనుకరించే వైష్ణవ భక్తితో విప్రనారాయణ కథ వచ్చి ఉంటుంది.

మలణుని అటువంటి మరో వ్యక్తి శ్వేతుని కథ, పండితారాధ్య చరిత్ర నుండి గ్రహించి ఎజ్జయ తన కావ్య రచన కావించాడు. పేరుకే భక్తి కావ్యం కాని, ఇది అచ్చగా శృంగార ప్రబంధం. కవి సంగీత, నాట్య, కామాది శాస్త్ర వైదుష్యం కలవాడు. కవితా శైలి చక్కగా ఉంది. సంస్కృత భాషా పరీజ్ఞానం అపారం. విమర్శకులకు కొన్ని వ్యాకరణ సూత్ర విధేయాలు కానీ పదప్రయోగాలు

కనిపించినా అవి తెలుగు నంధులకు సంబంధించినవి - గణనీయాలు కావు. జన వ్యవహారంలో ఉన్న భాషలో రూప భేదాలు సహజం.

మొదటి భాగం, ॥ అధ్యాయం: రొణోం వాంంనొ(నీ తెలుగు సాహిత్యం 71 ఎజ్జియ మంత్రి కవనవైఖరికి ఒకటి రెండు ఉదాహరణలు -కృత్యాది పద్యం - శ్రీలలితంబు అనునయ శిత గుణంబును జారుపాద రే ఖా లనసంబు జన్నుగవ గట్టితనంబు నితంబ శోభయున్‌ బోలును గౌరి తండ్రి బడి బుట్టిన దంచు హసించు శంభుడే వేళను జుండి కాళునకుక వేడుక నీవుత గామితార్థముల్‌. ఈ పద్యం మొదటి రెండు పాదాలు హిమవంతుఇకి పార్వతికి సరిపడే విధంగా శ్లేష సమకూర్చబడింది. ఆ తార్వత, “శ్రరమణీ మనోహరు డ శేష నురస్తవ నీయమూర్తి శృం గార రసాధి నాయకుడు కామినులం బదియాటు వేలని చ్భారతి నేలు కృష్ణు”చే కృతి స్వీకర్త రామయకాళనకు కవి శుభాలిప్పించాడు! ఈ కవి పోతన భక్తి వర్గను 'కమలాక్తు నర్చించు' ప్రహ్లాదపద్యాల్బ అనుసరిస్తూ ఎలా మార్చారో చూడండి. సీ. పటు మోహన స్ఫూర్తి పాలిండ్లు పాలిండ్లు - నుడురాజ వైభవ మోము మోము పంకజంబుల తుది పదములు పదములు - కొదమ తేటులకును గురులు గురులు - రసం స్పష్టం, పాదాంత యమకాలు మనోహరం. పెద్దన గారి మను చరిత్ర కెలకులనున్న తంగెటి జున్ను' - ఇది. ముక్కంటి భక్తుల ముక్కంటి వెన్నిధి - చిత్తజువైరి నంజీవి కరణి పురదైత్యలోక సంహరుడు సిద్ధరసంబు, బాల చంద్ర ధరుండు పరుసవేది .. కథ ఏమైనా, వర్ణనలు ఎట్లున్నా, ఇందలి భాషాభావాలు నాటి సాంఘిక చరిత్రకు దర్పణాలు. శయ్యా గృహ వర్ణన ఒక పద్యం చూడండి. సీ పగడంపు గంబాల పచ్చటోవరియును, అపరంజి కాళంజియలరు బాన్ను బంగారు సకినెల పట్టెమంచంబును, వజ్రాల నును జాల వల్లికలును కుంకుమ తలగడ గొజ్జంగి పూదెజిల్‌, తరమైన చంద్రకాంతపుగిండి చౌశీతి రతముల నవరణి మేల్కట్టు, దీపించు మాణిక్య దీప కళిక గ. వోనగ కస్తురి చేది కప్పురపు సురటి, నిలువుటద్దంపు రత్పంపు నెత్తుపలక తళుకు దంతపు బావలు కలికి చిలుక, గలిగి యొపష్పారు చవిక లోపలికినపుడు ఈ కవి “కుమార నైషధం'2 శ్రీనాథుని శృంగారనైషధాన్ని అనుసరించింది. పెద్దన శ్రీనాథుల పద్యాలను అనుసరించినా ఎజ్జియ వారిని స్మరించకపోవడం గమనార్హం.3 ఒక మాట - “నవరన భావ బంధురంబుగా నాక్క ప్రబంధంబు రచియింపదలంచి యున్న సమయంబుని ఓ దినం కొలువు కూటంలో కాళయ “మలహణు కథ నా పేరిట జెలువుగ నంకితము జేసి చెప్పగవలయున్‌” అన్నాడు. అప్పుడు రాయభూపతి కీయక దాచిన ఈ కావ్యం కొనుమన్నాడు. మొద్దటి ఇద్దరి సంభాషణల్లో రచనారంభమే కాలేదు. చివరి మాటలో ఇది అంతకు ముందే విరచితమైందని తెలుస్తున్నది. ఇది ఎట్లా పాసగుతుంది? ఏది ఏమైనా ఎజ్జయామాత్యుడు. “శంభు జటాటవీ తట విశంకట సింధుతల ప్రఘుమంఘుమా రంభ విజృంభిత ధ్వని ధురంధర భూరి తర ప్రబంధ వా గ్గుంభుల నాత్మలో2 - తలచు శృంగార కవి,

72 డౌ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సొవాత్య చరిత” పాదపీఠికలు : 1 కల్హణ, బిల్హన, జల్హనల పేర్లు తప్ప మల్హణకవి పేరు నేను చూసిన సంస్కృత సాహిత్య చరిత్రలలో లేదు. 2. లభించిన పద్యాలు 3. ఈ కవి మల్ల కాళిదాస మయూర మాఘ దండి - సంస్కృత కవుల స్మరించిన పద్యం. సాహితీ సమాలోకనం - 2

ఈ కరీంనగర్‌ జిల్లా వేయేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే ప్రముఖ కాలం. ఈ కాలంలోనే ప్రతిభ గల కవులు విలసిల్లి మహాకావ్యాలను వ్రాయగలిగారు. తిరిగి ఇరువదవ శతాబ్దంలోనే ఇక్కడ అంధ్ర సాహిత్యం అందలమెక్కింది. అదీ పూర్వార్ధ్ణంలో-ఉభయభాషా విశారదులైన పలువురు కవులున్నా అంతగా కావ్యాలు రచించలేదు. ఉత్తరార్థంలోనే వివిధ ప్రక్రియలలో అసంఖ్యాకంగా సత్తాగల పుస్తకాలు వచ్చాయి. ఈ మధ్య కాలం 17-19 శతాబ్దాల్లో యక్షగానాలు శతకాలు వచ్చాయి కాని, కావ్యాలు చెప్పుకోదగినంతగా రాలేదు.

కాకతీయ చక్రవర్తుల కాలం (రుద్రదేవుడు, క్రీ.శ. 1150) నుండి ఈ జిల్లాలో తెలుగు వారి పరిపాలన ఆరంభమైంది. వారి కాలంలో ఈ ప్రాంతంలో అసంఖ్యాకంగా శిల్ప కళాలంకృతాలైన ఆలయాలు నిర్మింపబడ్డాయి. కాని ఎందుకో తెలుగు సాహిత్యం వృద్ది పొందలేదు. ఇక్కడి పండితులు ఈ చక్రవర్తుల వారి సామంతుల సన్మానాలు - అగ్రహారాలు అందుకొన్నట్లు శాసనాల వల్ల తెలుస్తున్నది కాని, ఒక్క తెలుగు కవి కానీ చరిత్ర కెక్కలేదు. ఆ కాలంలోని ఈ ప్రాంతపు ఏ ఒక్క కావ్యం కానీ లభించలేదు - లేదు.

కాకతీయుల అనంతరం - 1325 తర్వాతనే 14వ, శతాబ్ది ఉత్తరార్థంలో మడికి సింగనకవి రామగిరిలో నాలుగు మహా గ్రంథాల రచన కావించాడు. 15వశతాబ్దిలో వెలిగందుల నారన పోతన భాగవతంలోని చివరి రెండు స్కంధాలను అనువదించాడు. 16వ శతాబ్బారంభంలో చరికొండ ధర్మన ధర్మపురిలో చిత్రభారత కావ్య ప్రబంధాన్ని రచించాడు. రాశికి పదులసంఖ్యలో లేకున్నా

*పదికాలాలపొటు నిలువగల విలువగల కావ్యాలు కరీంనగర్‌ జిల్లా ప్రాంతంలో ఈ కాలంలోనే వచ్చాయి.

భీమ కవి, ఎజ్జియ కవి జన్మస్థలాదికాల గురించి ఇదువరకే చర్చించబడింది. వారిని గురించి

పరిశోధనలు జరుగవల్సి ఉంది. వేములవాడ భీమకవి, ఎడపొటి ఎజ్జియ్య కరీంనగర్‌ జిల్లావారు కారనే నా అభిప్రాయం. సత్యనిరూపణకోసమే పై సమీక్ష సాగింది.

ఈ కాలంలోని భాష స్ధ్‌ర రూపాన్ని సంతరించుకుంది. తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహా భారత కవిత్రయం మడికి సింగనకు పూర్వులే అయినా, భాగవతం సింగనకు తర్వాతి కాలంలోనే రూపొందినది. శ్రీనాథుని కంటె పూర్వుడు సింగన.

దూపాట్‌ వేంకట రమణా చార్యుల 'నైజాం రాష్ట్ర ప్రశంస' 1923, సురవరం ప్రతాపరెడ్డి గారి “గోలకొండ కవుల సంచిక - 19334, వచ్చేంత వరకు ఇక్కడికవుల పేర్ల వ్యాప్తి లేదు.

ఇదే వ్యాసంలో తర్వాతి ప్రకరణంలో చూపబడిన పరాంకుశం గోపాలకృష్ణ కవి గారి శ్రీరంగ మహాత్మ్యం కావ్యాన్ని వ్రాసుకొన్న గట్టెపల్లి గ్రామ వాస్తవ్యులైన కందాడై ఆచార్యులు, ఆ ప్రతి చివర వానుకొని ఉంచుకున్న భాగవత ఏకాదళ స్కంధం చివర “పోతన కృతి మనే వ్రాసుకున్నారు. ద్‌న్ని బట్టి వెలిగందుల నారయ మన జిల్లా వాడు అనే స్వస్థలాభిమానంతో కాకున్నా కనీసం సత్య దృష్టి తోనైనా, నారనను చేర్చక పోవడం - విస్మరించడం, నాటి ఈనాటి పండితుల ఉదాసీనవైఖరికి ఒక ప్రబల నిదర్శనం.

మొదట్‌ భాగం, 1 అధ్యాయం. రాజోం కాంంనాీ తల౮గు స్రాహార్యీం 73

కాకతీయుల కాషయనాయకుని అనంతరం 15వ, శతాబ్దిలో కొన్నేండ్లు రాచకొండ పద్మనాయకుల పాలన ఈ ప్రాంతంలో సాగినా కావ్య సృష్టి జరుగలేదు. ఆ తర్వాత ముస్లింల పాలనలో స్వస్థాన వేషభాషామత సంస్కృతులను సంరక్షించు కోవడంలోనే సతమతమై పోయిన ఆనాటి పండితులు ఆంధ్ర భాషా కావ్య రచనకు అంతగా వూనుకోలేదు. జనం ఆదరించలేదు.

కవులు, తరుణులు, లతలు ఆశ్రయం లేనిదే పెంపొంద జాలవనే పూర్వోక్తిని ఈ మధ్య కాలం నిజమని నిరూపించింది.

ఈ మండలంలో తెలుగు సాహిత్యం వికాసానికి 14-16 శతాబ్దాల మధ్య కాలం స్వర్ణయుగం!

  1. అనంతర కాల తెలుగు సాహిత్యం (17,18 శతాబ్బులు)

పదిహేడు పద్దెనిమిది శతాబ్బులలో కరీంనగర్‌ జిల్లాలో వెలువడిన సాహిత్య పరిచయం ఈ అధ్యాయంలో చేయబడుతుంది.

పదహారో శతాబ్దంలోనే తెలంగాణా పూర్తిగా ముస్లింల పాలనలోకి వెళ్ళింది. గోలకొండ కుతుబ్‌షాహీ నవాబులచే నియుక్తులైన మండలాధిపతులు - ప్రభుత్వాధికారులు ఈ ప్రాంతంలో పరిపాలన సాగించేవారు. ఆ కాలంలో ఈ ప్రాంతంలో రాజులు కవులను పోషించుట పోయింది, రాజులే లేరు. కొందరు కవులు స్వేచ్చగా గ్రంథాలు రచించారు. కొందరు వలసవెళ్ళి సాహిత్య పోషణ కలచోట గ్రంథరచన కావించి రాణించారు. కొందరు స్థానిక హిందూ ప్రభుత్వాధికారుల ఆదరం వల్ల రచనలు చేశారు.

ఈరెండు వందలేండ్ల కాలంలో పట్టమని పది మంది కవులైనా ఇక్కడ లేరు. లెక్కకు చిక్కిన వారి సాహిత్యం కూడా అధిక భాగం లభించలేదు. అది విదేశీయుల పరిపాలనా కాలం. నూతన మత, పరభాషా ప్రభావాల అఆ అంధకార యుగంలో చిరు దివ్వెలుగావైనా కరీంనగర మండలంలో తెలుగు వెలుగులు విరజిమ్మిన కవులు వీరు.

  1. శేషప్ప - ధర్మపురి; 2. ముద్దుబాలం భట్టు - మంథని,

౩. కుందావజ్ఞల గోపాలకృష్ణకవి - ముల్కనూరు; 4. పరాంకుశం గోపాలకృష్ణయ్య

అనుత్రతకవులు - ఆలబ్ధ సాహిత్యం

1రాజలింగ కవి - కొరుట్ట్ల, 2. సోమనాథుడు - వేముల వాడ, 3 కోడూరి వేంకటాచలపతి - కొరుట్ట 4. ఆత్తలూరి పాపయ్య శాస్త్రి - వేములవాడ, 5 సముద్రాల రామానుజాచార్యులు - కోరుట్ల.

శేషప్ప - ధర్మపురి, 760

శేషప్ప అని వ్యవహారనామం కల శేషాచలదాసు కవి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి వాస్తవ్యుడు. పద్దెనిమిదవ శతాబ్ది పూర్వార్ధంలో జీవించినవాడు. ఇతని నరసింహ శతకం యావదాంధ్రదేశ వ్యాప్తి పొందినది. ఈ కవి పేరు కవుల చరిత్రకెక్కింది.

ఈ కవి మూడు శతకాలు ఒక్క యక్షగానం రచించాడు.' శేషప్ప రచనలు ఇవి. 1 నరసింహ శతకము, 2 నరహరి శతకము, 3. నృకేసరి శతకము, 4. ధర్మపురి రామాయణము (యక్షగానము) స్థలము: కరింనగర్‌ జిల్లాలోని ధర్మపురి, అనంతపురంలోని ధర్మవరం, తమిళదేశంలోని ధర్మపురి మూడు ప్రాంతాలను పరిశీలించి శేషప్ప 'కరీంనగర్‌ జిల్లా ధర్మపురి వాస్తవ్యుడే అని విద్వాన్‌ చిన్నికృష్ణ శర్మగారు తమ 'శతక వాబ్మయ సర్వస్వము'లో (పుట - 240) అభిప్రాయపడ్డారు. శేషాద్రి రమణ కవులు కూడా మడికి సింగన పద్మపురాణంలోని

అతులిత లీల గేశ నచివాగ్రణి ధర్మపురంబునందు నం చితముగ, నన్నసత్రమిడి శ్రీనరసింహున కుత్సవంబులన్‌ సతత మహోపహారములు సల్పుచు రామగిరీంద్ర మందుసు స్థితి గుడి కట్టి విస్ణుని బ్రతిష్ట యొనర్చె నుదాత్త సంపదన్‌.

అనే పద్యాన్ని బట్టి “ఇందు పేర్కొనబడిన రామగిరియు నిజాము దేశములోని ధర్మపురి చెంతనే గలదు. ధర్మపురి నృసింహ క్షేత్రము ప్రసిద్ధమైనదని ద్యోతక మగుచున్నది - ఇతర

మొదటి భాగం, 11 అధ్యాయం: అినీంతత కాంవు తెంలగు సారొత్యం 75 స్థానములలో గల ధర్మపురికీ ప్రశస్తి కానరాదు” అని అంగీకరించారు, అని విద్వాన్‌ చిన్ని కృష్ణశర్మగారు వ్రాశారు (పుట - 204)

శేషాద్రి రమణ కవులలోని దూపాటి వేంకటరమణాచార్యులు 1940-50 ప్రాంతంలో కరీంనగరంలో ఉపాధ్యాయులుగా పనిచేసిన సందర్భంలో స్వయంగా ధర్మపురిని దర్శించినారు. ఈ కాలంలో రచించిన తమ వ్యాసంలో శేషప్ప ఈ ధర్మప్పురివారని పేర్కొన్నారు.

దూర ప్రాంతీయులకు శేషప్ప జన్మస్థల విషయంలో సమాలోచన అవనరం కావచ్చును. కాని, ఈ జిల్లా వారికి ఈ చర్చ 'ముంజేతి కంకణమును అద్దములో చూచుట” వంటిది. శేషప్ప బంధువులు ఇప్పటికి ఈ ధర్మపురిలో ఉన్నారు. ఈ విషయాలన్నీ, ధర్మపురి వారు ముద్రించిన శేషప్ప 'త్రిశతి' పుస్తక పీఠికల్లో ఉన్నాయి. కుల నిర్ణయం : విద్వాన్‌ దండేపల్లి వేంకట సుబ్బాశాస్తి గారిచే టీకా తాత్సర్యాలు వ్రాయబడిన నరసింహ శతక ముద్రిత ప్రతిలో కవి జీవిత విశేషాలను ఇట్లా (వ్రాశారు.

“ఈ నరసింహ శతకము వ్రాసిన కవి నైజాం ప్రాంతములో ఉన్న ధర్మపురి నివాసి నందకులంవాడు. ఇతని పేరు శేషవ్ప కవి. ఇతడు శ్రీ.ళ. 1800 నం.కు వూర్వుడని, కొందరు చరిత్ర కారులూహించుచున్నారు. కవిత్వము ఎంతయు మధురమైనది. భాషాదోషములగు పడుచున్నవి. బాలురకు నీతి 'కొఅకు, పెద్దలకు భక్తికి నిది యవశ్య పఠనీయము”.

వారు ఏ ఆధారంతో కవిని యాదవ కులజునిగా భావించినారో తెలువదు. కలియుగ మందు వివ్రడను గాను, నృపాలుడ గాను, మేటి వై శ్యుల జత వాడగాను బలు శూద్రుడ గాను5్‌ సమస్తమైన జా తుల నాకరుండగాను భువి, దుర్దనుజాంతక! నీ పదాబ్బముల్‌ దలచెడి వారి దాసులకు దాసుడ ధర్మపురీ నృకేసరీ॥

అను శేషప్ప గారి 'నృకేసరి' శతక పద్యాన్ని ఉదహరించి విద్వాన్‌ చిన్నికృష్ణ శర్మ గారు “(నృసింహుని) పదాబ్బముల్‌ దలచెడి వారి దాసులకు దానుడ” నని కవి హృదయము కావున నిస్సందేహముగా నతడు నాల్గవ వర్ణజుడే యని నిర్ణయ మగుచున్నది. ఆగ్రవర్ణము వాడయిన, గోత్ర నామాదికములతో బాహాటముగా నేయమాత్య పదమునో, కవీంద్ర పదమునో తన పేరుతో గూడ చేర్చి, వ్రాసి కొనియుండువాడు. సాండిత్యము, కవిత్వము తమ సొమ్మని భావించి, “శూద్ర మక్షర సంయుక్తం దూరతః పరివర్ణయే”త్తని మిడిసి పడుచున్న యగ్రజాతి వారి 'హిళనకు జడిసి, కవి యిట్లు చెప్పుకొని యుండుననుట సహేతుకముగా దోచుచున్నది. లేదా - ప్రకటించుకొనదగని కులములో వాడుగనైన నుండవచ్చును.” అని వ్రాశారు” ఇవి కేవలం ఊహలు మాత్రమే.

శేషప్ప కవి చాత్తాద వైష్ణవుడని ధర్మపురి వాస్తవ్యులైన శ్యామసుందర శాప్రిగారు “ధర్మపురి - నాడు - నేడు' అనే గ్రంథంలో స్పష్టంగా తెలిపారు.” శేష్పది కాకుత్సవంశం భారద్వాజన గోఠ్రం, అని బంధువులు చెప్పారు క కాల చర్చ: ఈ కవి 17,18 శతాబ్దాలలో జీవించిన వ్యక్తిగా కవి చరిత్రకారులు పలురకాలుగా భావించారు. ధర్మపురి వారు మాత్రం దాదాపు రెండు వందలేండ్లకు పూర్వుడన్నారు. శేషప్ప పూజించిన సీతారామలక్ష్మణ విగ్రహాలు కూడా ఆ కవి వంశీయుల వద్ద ఉన్నవట* కాలం వ్రాసిలేదు.

శేషప్ప శతకాలలోని ఆంతరంగిక సాక్ష్యాలను బట్టి చూడగా,ఈ కవి బమ్మెర పోతన భాగవత పద్యాలను నరసింహ శతకంలో, భక్త రామదాను దాశరథి శతక పద్యాలను నృకేసరి శతకంలో అనుసరించాడు. పోతరాజుకంటి రామదాను ఆర్వాచీనుడు కాబట్టి శేషప్ప కవి రామ దాసుకంటె

76 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా వ్రైలుగు సాహిత్య చరిత్ర” ఇంచుక తర్వాతి కాలం వాడనటమే సమంజసం, కవితా స్థాయిని - శతక వ్యాప్తిని పట్టి చూసినా, శేషప్ప రామదాసును అనుసరించాడే తప్ప, రామదాను శేషప్పను అనుకరించినట్లు తోపదు. ఇంకా

  • నరసింహ శతకంలో శేషప్ప అని చెప్పుకున్న తన పేరును ఈ కవి నృకేసరి శతకంలో శేషాచలదాసు అని చెప్పుకోవడం, రామదాసు నామవ్యాప్తి ప్రభావంతోనే అనుకోవచ్చు. మొదటి రెండు సీసపద్యశతకాలకు భిన్నంగా మూడవది వృత్త పద్యశతకం (వ్రాయడం “ధర్మపుర్‌ నృకేసరీ" అనే మకుటం ఈ విషయాలన్ని బలపరచేవిగా ఉన్నాయి.

చాగంటి శేషయ్య గారు కూడా రామదాసుకంటె శేషప్ప కొంత తరువాతి వాడనే అన్నారు.

తొనాషా పరిపాలనా కొలమే రామదాసు కాలం. 1687లో మొగల్‌ పాదుషా బెరంగాజేబు గోలకొండను జయించాడు. రామదాసు 17వ, శతాబ్ది ఉత్తరార్థంవాడు.

శేషప్ప 18వ, శతాబ్ది పూర్వార్ధం వాడు కావాలి. కాని, ఈ నృసింహ శతకంపై వేమన శతకం, కానుల పురుషోత్తమకవి ఆంధ్రనాయక శతకం, అడిదం నూరకవి రామలింగేశ్వర శతకం, లింగమగుంట తిమ్మకవి కుక్కటేశ్వర శతకం పద్యాల ప్రభావం ఉందని పరిశీలకుల అభిప్రాయం. 'పై శతకాలలోని భావాలు కొన్ని నరసింహ శతకంలో ఉన్నమాట నిజం. అయితే ఆంధ్రనాయక శతకంలోని తురుష్కుల నింద కానీ, కుక్కుటేశ్వర శతకంలోవలె పామరుల హేళన కానీ, శేషప్ప కృతిలో లేవు. 'జలతారు కుల్లాయి' అనే ఒక్కమాట తప్ప ఉర్జుపదాలు లేవు. శేషప్ప ఒక వేళ వారిని నిజంగా అనుసరించినాడన్నా ఈ శతక రచన పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్థపుది అవుతుంది తప్ప అంతకు దిగిరాదు. కృతుల పరిచయం : తెలుగులో మొట్టమొదట “శతక కవుల చరిత్రము" వ్రాసిన వంగూరి సుబ్బారావు గారు ఒక్క “నరసింహ” శతకమునే శేషప్ప పేర తెలిపారు. వావిళ్ళవారి భక్తి శతక సంపుటి మూడవ భాగంలో నృకేసరి శతకం కూడా పేర్కొనబడింది.” దానిని శేషాద్రిరమణకవులు సంపాదించారన్నారు. విద్వాన్‌ చిన్ని కృష్ణ శర్మ గారు కూడా “శతక వాబ్మ్బయ సర్వసము'లో నరసింహ నృకేసరి రెండు శతకాలనే సమీక్షించారు." వారికి నరహరి శతకం ఉన్నట్టు తెలియదేమో!

ధర్మపురి వారే తొలిసారిగా శేషప్పగారి మూడు శతకాలను ఒకే సంపుటముగా ముద్రించారు.” నరసింహ శతకముః ఇది ఈ కవి కృతులలో మొదటిది. సీస పద్య శతకం. అఖిలాంధ్ర వ్యాప్తి పొందింది: అచ్చు ప్రతులలో 100 పద్యాలుంటున్నాయి. ముద్రిత ప్రతులలోలేని 16 పద్యాలు ఎం. శ్యామసుందర శాస్రిగారు, శేషప్ప కవి కుటుంబీకుల వ్రాత ప్రతిలో కనుగొన్నారు. అందులో ఒకటి కవి పరిచయ పద్యం శేషాచలదాసు పేరుతో ఉంది. ముద్రిత ప్రతి శతకాంత పద్యం శేషప్ప పేరుతో ఉంది. అది పోను 15 కొత్త పద్యాలతో ఈ నరసింహ శతకం 115 పద్యాలది అవుతుంది.

“భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరగొ అని దీని మకుటం. “నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగముల్‌ బాపవచ్చు"” వంటి ఇందలి పద్యాలు భక్తులకు విద్యార్థులకు కంఠస్థం. (నరసింహ నీ దివ్య నామ మహిమ చేత, అని పాఠాంతరం.) శేషప్ప విష్ణు భక్తితోపాటు సామాజిక నీతులు ఈ పద్యాల్లో కుప్పలు పోశాడు. ఎడనెడ తన స్వభావాన్ని కూడా తెలుపుకున్నాడు. ఆయన సొత్వికుడు.

“గణయతి ప్రాస లక్షణము జూడగ లేదు, పంచ కావ్యశ్లోక పఠనలేదు,

అమరకాండ త్రయంబరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్‌ చదువ లేదు,

నీ కటాక్షంబున నేరచించెద గాని, ప్రజ్ఞనాయది గాదు ప్రస్తుతింవ” (నరసింహ శతకం: ప. 2)

అని వినయంగా మనవి చేసుకున్నాడు, తనకు పాండిత్యం లేదంటూనే సంస్కృత గ్రంథాల పరిచయాన్ని తెలుపుకున్నాడు. యతి ప్రాసలు తెలియవంటూనే సలక్షణంగా ఛందోబద్ధపద్య శతక

మొదటి భాగం, 11 అధ్యాయం: అనీంయర కొంరు తెలగు నారొత్టం 77 రచన కావించాడు. ఆయన ఈ జిల్హా వ్యావహారిక మాండలిక పదాలను స్వేచ్చగా ప్రయోగించాడు. అవి వ్యాకర్తలకు తప్పులుగా కనిపించి ఉండవచ్చు. పరిష్కర్తలు చేయిపెట్టకముందు పరకవుల“* కవితలో వలె అతని కొన్ని పద్యాల్లో ఛందోభంగాలు ఉంటే ఉండవచ్చు.

కవి విద్యావంతుడనడానికి మరో నిదర్శనం ఇదేశతకంలోని భావాలు.

“నిన్ను బొగడ విద్య నేర్చితినే గాని. కుక్షి నింపెడు కూటి కాఅకు కాదు”. తనకు ఐశ్వర్యము, సొమ్ములు, బలములు వలదట, “చయ్యన మోక్ష మిచ్చిన చాలు” నన్నాడు (5వ పద్యం). “ధరణిలో వారెంత దండి వారైనను నిన్ను గానని వారినే స్మరింప” (4) ఇట్లా హరిభక్తిని చాటుకున్నాడు. ఇంకా భాగవతులతో స్నేహాన్ని కోరుకున్నాడు.

“పసరంబు వంజైన పనుల కాపలి తప్పూ, ప్రజలు దుర్గనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాతైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రీ తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, దంతి దుష్టయిన మావంతు తప్పు, (మావటి) - ఇట్టి తప్పు లెబుంగక యిచ్చవచ్చి, నటుల మెలగుదు రిప్పుడీ యవనిజనులు భూషణ వికాస శ్రీధర్మపురి నివాన, దుష్ట సంహార నరసింహ దురిత దూర.(12) ఇందులోని సైన్య బలాలలో కాల్బలము, అశ్వాలు, ఏనుగులు మాత్రమే పేర్కొనబడ్డాయి. కవి తన కాలపరిస్థితులను తన కావ్యంలో ప్రతిబింబింప జేస్తాడు కాబట్టి పురాణకాలం నాట్‌ రథాలను వదలి వేశాడు. ఈ కాలం నాటి ట్రక్కులు, స్టీమర్లు, విమానాలు నాటి కవుల ఊహకు కూడా రానివి. భర్శహరి నీతి శ్ఞోకానికి అనువాదమైన “దానము భోగము నాళము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్‌” అను ఏనుగు లక్ష్మణకవి నీతి పద్యానికి వన్నెలు దిద్దిన శేషప్ప పద్యం ఇది. సీ, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్నమె కాని, మెటుగు బంగొరంబు (మింగబోడు, విత్తమార్దన చేసి విజ్ఞవీగుటె కాని, కూడ బెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి, దాన ధర్మములేక దాచి దాచి, గీ. తుదకు దొంగలకిత్తురో దొరలకేనా, తేనె జుంటీగ లీయవా తెరవరులకు ॥భూ॥ (15) ఇందులో కవి ధన దాన నాశాలను వర్ణిస్తూ ధన భోగాలను నిరసించడ౦ గమనార్హం, వేమన ఆశను ఈగతో పోలిస్తే, ఈ కవి లోభత్వాన్ని తేనెటీగతో ఉపమించాడు. జున్నుటీగ = జుంటీగ. ఈ శతకంలో పూర్వకవుల భావాలను తలపించే పద్యాలు కూడా ఉన్నాయి. _ “బ్రతికి నన్నాళ్లు నీ భజన తప్పదు కాని, మరణ కాలమునందు మరతు నేము” (19) ఇది దాశరథి శతకంలోని భావం. ఇంకా (ప్రాణ ప్రయాణ సమయే' అని ముకుందమాలలోనూ ఈ భావంతో ఓ శ్లోకముంది.” ఇదే భావం '“ఉత్తతోలుతిత్తి' అనే, పద్యంగా వేమన శతకంలో “పచ్చిచర్మపు తిత్తి పసలేదు దేహంబు,” అని నరసింహ శతకం (50) పద్యం లోనూ ఉంది. సఉయాల్‌ రెంటికొ మూటికో గడియకో కాదేని నేడెల్లియో” అనే ధూర్జటి కాళహస్తీశ్వర శతక పద్యభావం ఈ నరసింహశతకంలోని 20వ పద్యంలో ఉంది ఇలా. ॥ “పాంచ భౌతికము దుర్చలమైన కాయంబి, దెప్పుడు విడుచుటో యెజుక లేదు.

పై సీన పాదంలోని చివరి పదాన్ని 'ఏ క్షణంబొ' అనీ కొందరు చదువుతున్నారు కాని, అది అర్థవంతం కాదు. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుని “శ్రీవేంకటేశ్వర వచనములు లోని భావానికి సన్నిహితమైన మరో పద్యం చూడండి.

“ఇభరాజ వరద నిన్నెంత పిల్చినగాని, మాజుపల్కవిదేమి మౌని తనమొ?” (22) పోతన భాగవత పద్యాల అనుసరణ అధికం,

78 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” “ఇభకుంభముల మీది కెగిరెడి సింగంబు, ముట్టునే కురుచైన మూషకమును నవచూత పత్రముల్‌ నమలుచున్న పికంబు, గొరుకునే జిల్లేడు కొనలు నోట” (76) ఇది “ప్రహ్లాద చరిత్ర” లోని ధ్రసిద్ధి పద్యం “మందార మకరంద” సీసానికి అనుసరణం. ఇంకా - “భువన రక్షక నిన్ను బొగడ నేరని నోరు, ప్రజ కగోచరమైన పాడు బొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్‌, జలము లోపలి నెల్లిసరపు గుండ్లు” (3) వెల్లినరపు గుండ్లు ఆంటే నీటి బుడగలు కావచ్చు నన్నాడు - రొజమండ్రి ప్రతి టీకా కారుడు. అది ముద్రారాక్షసం వల్ల నూరిన పదం కావాలి. నల్దసరపు గుండ్లు సరియైన రూపం, నల్లటి గుండ్రటి గట్టి రాళ్ళు అని ఆ పద భావం. “భుజబలంబున బెద్ద పులుల జంపగవచ్చు, పాము కంఠము చేత బట్టవచ్చు.... పుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిప, సజ్జనుల చేయడెంతటి చతురుడైన”. 27, "పైది “మకర ముఖాంతరస్థమగు మానికమున్‌ బెకిలింప వచ్చు - “నీతిపద్య భావ (ప్రభావంగా రూపొందినది. “కేయూరా న విభూషయంతి” - భూషలు కావు మర్త్యులకు, అనుపద్యానికి అనుసరణ పద్యం కూడా ఈ నరసింహ శతకంలో ఉంది. 'కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్టు”(29) షేక్స్‌పియర్‌ 'టెర్డ్‌ విత్‌ అల్‌ దీజో సానెట్‌లో వలె శేషప్ప కూడా ఇలా వాపోయాడు. “అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణ శుంఠలు సభాపూజ్యులైం, ఆ నత్యవంతుల మాట జనవిరోధంబాయె, వదరు బోతుల మాట వాసిళక్కె” (26) దేశములు దూరమైనా భాషలువేరైనా కవుల భావాలు కలుస్తూనే ఉంటాయి కదా! “ఇటువంటి దుర్చుద్ధులెన్నానాకున్నవి” అని ఒప్పుకున్నాడు (3), అది వినయం, సుమతి వేమన శతకాల వలె నరసింహ కృష్ణ శతకాలు రెండూ ఈ ప్రాంతంలోని వీధి బళ్ళలో నిన్న మొన్నటి వరకు అవశ్యపఠనీయాలుగా ఉండేవి. ఈ శతక రచనకు కారణమైనదని ఓ కథ ప్రచారంలో ఉంది. అది ఇది. శేషప్ప ధర్మపురి నివాసి, విష్ణు భక్తుడు, అక్షయపాత్రను నమ్మిజీవించువాడు. అయినా ఆయన మృదంగ వొద్య నివుణుడు. ఆవురితో ఒకసారి ఒకసాని నృత్యమొనరించుటకు రాగా మృదంగవాద్యగాడు లేక శేషప్పను సిలిచారట. హరిభక్తి ప్రియుడైన శేషప్ప భోగం మేళానికి వాద్యసహకారం అందివ్వడానికి ఒప్పుకోలేదు. దానికి ఆ ఊరి నాట్యకళారాధక రసిక యువకులు ఆయనను తూలనాడారు. దానికి బాధ దుఃఖం కలుగగా శేషప్ప గోదావరి నదీ స్నానమాచరించి వచ్చి నృసింహాలయంలో నిష్టగా కూర్చుని ఈ నరసింహశతకం చెప్పినాడట. తురుష్కుల దండయాత్రలో ఈ శతకం వ్రాసినట్లు మరో కథ.” మొదటి కథే సరియైనది. ఎందుకంటే రెండవది నిజమైతే ఆ కాలపు కోస్తామండల శతకాల్లో నలె తురుష్కనింద ఈ పద్యాల్లో ఉండేది. “దుష్ట సంహార” అనటం కవి కోపానికి నిదర్శనం. పై సన్నివేశం కారణంగానే కాబోలు ఇందులో భక్తి రహితుల నింద అధికంగానే ఉంది. నరసింహ నీవంటి దొరను సంపాదించి కుమతి మానవులనే గొల్వజాల (69) సాధుజనుల తోడ జగడమాడిన కీడు కవులతో వైరంబు గాంచకీడు, పరమ దీనుల జిక్క బట్టి గొట్టిన గీడు బిచ్చగాండ్రను దుఃఖపెట్టగీడు (53) హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గంథమ్ములు చదివినట్టు, భిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు నింపుగా బహుమాన మిచ్చినట్టు (79).

మొదటి భాగం, [1 అధ్యాయం: అినీంర వాంవు శెంంగు వ్‌సొత్యం 79 నిందతోపాటు హితబోధ కూడా చేశాడు. నూరవ పద్యంలో తన పరిచయం చన శతక ప్రశస్తిని, ఫల శ్రుతిని వివరించాడు.

ఈ శతకంలో లోక విమర్శ హరిభక్తి సామాజిక నీతి ఉన్నాయే తప్ప “సింహాద్రి నారసింహ” శతకంలోవలె ముస్లింపాలకుల ఉద్యోగుల దుండగాల వర్ణన లేక పోవడం విశేషం! దైవాన్ని నిలదీసి ప్రశ్నించక దాసుడుగానే మనవి చేసుకున్నాడు. శేషప్ప ఈ శతక రచన కావించేనరికి ధర్మపురిలో మారి చెలరేగిందట. దానితో కవిని నిందించిన వారు పశ్చాత్తాప పడి వచ్చి క్షమించుమని వేడుకున్నారట.

అప్పుడు శేషప్ప 'నరహరి' పేర మరో సీన పద్య శతకం చెప్పగా రోగం తగ్గుముఖం పట్టిందంటారు. నరహరి శతకం; ఈ శతకాన్ని ఏ కవి చరిత్రకారుడు పేర్కొనలేదు. శేషాద్రి రమణకవులు మాత్రం గో.క.సం. పుట. 413 లో నరసింహ నరహరి శతకాలను "పేర్కొన్నారు. నరహరి శతక మకుటం ఇట్టుంది, “చక్రధర ధర్మ పుర ధామ సార్వభౌమ; నరహరీ! భక్తజన కల్చ! నాగతల్ప!”

మొదటి నరసింహ శతకంలోని దుష్టసంహార నరసింహుడు ఈ రెండవ శతకంలో భక్త జన కల్ప తరువైనాడు! నరహరి శతక పద్యాల నడక భావాలు నరసింహ శతకాన్నే అనుసరించాయి. అచ్చుపాందినా ఆ శతకానికి వచ్చినంత ప్రచారం దీనికి రాలేదు. ధర్మపురి వారికి కవి కుటుంబీకుల వద్ద ఈ శతకం ఒకే ఒక వ్రాత ప్రతి లభించింది. అచ్చు వ్రతిలోని 75 పద్యాలకు తోడుగా వారికి వ్రాత ప్రతిలో మరి 20 పద్యాలు దొరికాయట. వానితో నరహరి శతక పద్యాలు 95 అవుతాయి కాని వానిలో కవి పరిచయం పద్యం లేదు. వ్రాత ప్రతి చివర కొన్ని పద్యాలు శిథిలమైనాయన్సారు.18 నృకేసరి శతకం : ఇది శేషప్ప రచించిన మూడవ శతకం.

వావిళ్ళ వారి భక్తి శతక సంపుటి - 1926, విద్వాన్‌ వేదం చిన్ని కృష్ణశర్మగారు10 డా ॥ దివాకర్ల వంకటావభాని గారు20 నరసింహ శతకంతో పాటు నృకేనరి శతకాన్నికూడా పేర్కొన్నారు.

నృకేసరి వృత్త పద్య శతకం. శేషాద్రి రమణ కవుల పీఠికలో 1926లో వావిళ్ళ వారి ప్రతి మద్రాసునుండి వెలువడింది. ఇందళి పద్యాలు చఛంపకోత్పలాలు. 'నృకేనరీ' అని మకుటం. ఇది భావాల్లో కవి పూర్వ సీస పద్య శతకాల మార్గంలోనే సాగినా భక్తి ప్రపత్తులు అధికం.

మచ్చునకు ఒక పద్యం - శ్రీకములాలయా రమణ! శీఘ్రముగా దయజూచి నామనో వ్యాకుల మెల్ల దీర్చుమిక, వారిజలోచన! నమ్మినాడ, నే లోకుల గొల్వజేర భువిలో నను వంచన జేయబోకుమీ నీకు నమన్కరించెదను నేర్పుగ, ధర్మపురీ నృకేనరీ! ఇటువంటి సొదా సీదా రచన న్నకేనరి శతకం. ఏనుగు బోవ జూచి ధ్వను లెత్తుచు కుక్కలు కూయసాగు (72) తల్లి విషంబు పెట్టినను, తండ్రి ధనాఢ్యున కమ్ముకొన్న భూ వల్లభుడిల్లు దోచినను వద్దని పల్కెడి వారలుందురా? (80)

ఇట్లా చక్కని సామెతలతో సజీవ సాంఘిక నీతులతో పౌరాణిక దృష్పాంతాలతో నృకేసరి శతక పద్యాలున్నాయి. ఈ నృకేసరి శతకంలో కేవలం రెండు పర్యాయములు మాత్రమే అన్యమత ప్రస్తావన వచ్చింది. గోవధ చేయు మ్లేచ్చులకు గొబ్బున లేచి సలాము చేతురున్‌ (నృశ.93)

ఏసు మంత్రముపదేశములిత్తురు (నృశ.94)

ధర్మపురి పాత నృసింహాయం మ్రసీదుగా మారి నేటికీ కనిసించుతున్నది. అది బెరంగజేబు కాలం చర్య అంటారు. కవిది సామరస్య ధోరణి.

80 డా॥ మలయతశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” ఈ శతకంలో శేషాచల దాసు, భద్రాచల రామదాసు గారి దాశరథీ శతకాన్ని అడుగడుగన అనుసరించాడు. అందుకు కొన్ని ఉదాహరణలు ఈ దిగువ చూపబడుతున్నవి. దైవము తల్లిదండ్రి తగు దాత గురుండు సఖుండు నిన్నెకా - దాశరథీ శతకం; తల్లివి దండ్రి వాస్తడవు దాతవు భ్రాతవు నీవె - నృకేసరి శతకం, కంటి నదీతలంబు పాడగంటిని భద్రనగాధి వాసమున్‌ - దాశరథి; చూచితి నీ కిరీటమును, జూచితి కుండలముల్‌ ముఖంబునే - నృకేసరి చక్కర లప్పముల్‌ మిగుల జవ్వని కెంజిగురాకు మోవులున్‌ - దాశరథీ మామిడి పండ్ల పానకము మంచి మధూదక మిశ్రభక్షముల్‌ - నృకేసరి ముష్పున కాల కింకరులు ముంగిట వచ్చినవేళ - దాశరథి; బాందిని బ్రాణముల్‌ వెడలి పోయెడు నాటికి వాసుదేవగో విందముకుంద యంచు నిను వింతగ నెంతునా యెంచలేనా - నృకేసరి ఈ భావానికి మూలం 'ముకుందమాల' శ్లోకం - కఫవాత పిత్తైః కంఠావరోధన విధాన్మరణం కుతస్తే - అనవచ్చు. భక్త పోతన భాగవతంలోని “బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్‌' అనే ప్రసిద్ధ పద్యాన్నిఈ యిద్దరు కవులు అనుకరించిన వైనం చూడండి. మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్వెల బోసి నట్లు దు ర్వ్యసనము జెంది కావ్యము దురాత్ముల కిచ్చితి మోసమయ్యెనా రసనకు బూత వృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా రసముల జల్క బద్యముఖ రంగమునందు నటింపవయ్య21 - దాశరథీ రవికుల! రేగు కాయలకు రత్సములన్‌ వెలబోసినట్లు దు ష్కవి జనులంత బుద్ధిచెడి కానులకోసము తుచ్చమైన మా నవులను బ్రన్తు తించుచు ఘనంబుగ బద్యములమ్ము కొంద్రు మా ధవ నిను గాన జాలరు మదంబున ధర్మపురీ నృకేసరీ - దాశరథి శతకకర్త తప్పుచేసి పశ్చాత్తాపపడినట్టుంది.కాని, నృకేసరి శతక కవి ముందే జాగ్రత్తపడడం విశేషం! మరో పద్యం చూడండి! ఉః భండన భీముడార్తజన బాంధవుడుజ్వ్వల బాణతూణకో దండకళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్‌ రెండవ సాటి దైవమిక లేడనుచున్‌ గడకట్టి భేరికా దాండ దదాండ దాండ నినదంబులజాండము నిండ మత్తవే దండము నెక్కిచాటెదను దాశరథీ కరుణాపయోనిధీ” (34) అని రామదాసు అనగా శేషాచలదాను ఇట్లన్నాడు. ఉ. కంటిని నీ కృపారసము కష్టములాందుచు నిన్ను వేడగా వెంటనె మేలు జేసితివి వేల్పులు భూమినినెందరైన నీ దంటకు సాటిరారనుచు దండిగ బొబ్బలుపెట్టి చేత జే గంటను కొట్టి సాటెదను గట్టిగ, ధర్మపురీ నృకేసరీ (18)

మొదట్‌ భాగం, ॥॥ అధ్యాయం. అనీంశీత్‌ కొం తెలుగు సాహిత్యం త] భావాలు ఒక్కటి, పద్యాల ఛందం శైలి ఒక్కటి. అతడు గడకట్టి ఏనుగు నెక్కి చెప్పుతానంటే,

ఇతడు గంటకొట్టి బొబ్బలు పెట్టి చెప్పుతానన్నాడు. రామదాసు తహసీల్‌దారు శేషపప్ప హరిదాసు.

అంత పొటిదే ఇద్దరి కంతరంబు!

యక్షగానము (లు);

శేషప్ప ధర్మపురి రామాయణము, అవనిజా చరిత్రము అనే యక్షగానాలు రచించాడని తెలుస్తున్నది. అతని రామకథ “ధర్మపురి రామాయణం” పేర చాల కాలం క్రితమే ముద్రణ పొందింది. కవి తన రామాయణ యక్షగాన కావ్యానికి అవనిజా చరిత్రము (సీతా చరిత్ర) అని పేరు పెట్టి ఉండవచ్చు.” ఒకే రామకథను రెండు పేర్లతో వ్రాయవలసిన అవసరం కవికి ఏమొచ్చింది? ఒక వేళసీతాదేవి (పూర్వ) జన్మవృత్తాంతంతో రచించినా కవి అవనిజొ చరిత్రం మాత్రం దొరుకలేదు.

యక్షగానం దేశీయ సాహితీ ప్రక్రియా దృశ్యరూపకం.

“యక్షగానము నందలి వృత్త మెట్టిదైన గౌవచ్చును. రచనా ప్రక్రియ శ్రవ్యముగానీ దృశ్యము గాని కావచ్చును. ఏ ప్రక్రియ యందైనను గీతి ధర్మము విహితము” అని డా॥ ఎస్వీ జోగారావు గారు “ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర”పు. 215 లో అన్నారు.

తెలుగులో తొలి యక్షగానమైన కందుకూరి రుద్రకవి 'సుగ్రీవ విజయము” ఇంకా, అంతకు పూర్వపు వినుకొండ వల్లభరాయుని "క్రీడాభిరామము" వీధి రూపకం వలెనే శేషప్ప “ధర్మపురి రామాయణము” శ్రవ్య రూపకం. నిత్యదాసర్లు వకుళాభరణం అనబడు చిట్టి నీఐపై శేషప్ప రామాయణాన్ని పొడుతూకథాకాలక్షేపం కావించేవారట.త భాగ్యనగరంలోని ప్రముఖ వుస్తక ప్రచురణ సంస్థలు ముద్రించిన శ పుస్తకాన్ని పుట్‌పాత్‌ షాపుల వారు పాతిక ముప్పది సంవత్సరాల క్రితం వరకు అమ్మేవారమన్నారు. వున్తకం కోనం ఎంత ప్రయత్నించినా దొరుకలేదు. ఇక్కడి చిందుభాగోతవు ప్రదర్శకులను విచారించగా వారు ఆడేది కూచికొండ రామాయణం అని తిల్సింది. అది మెదకు జిల్లా ఎల్లదానకవి విరచితంో

ఈ ప్రాంతంలో విశేష వ్యాప్తి కల యక్షగాన రామాయణాలలో కూచికొండ మోక్షగుండ రామాయణాలు ఇక్కడివి కావు. ఈ మండలపువైన ధర్మపురి రామాయణంతోపాటు ఇల్లంతకుంట రామాయణం కూడా కనుమరుగైపోయింది.

(పైన వ్రాసిన విషయాలు ఈ థీసిస్‌ రచనా కాలానివి 1990-95. 95 అక్టోబర్‌లో నాకు డౌక్టర్‌ డిగ్రీ వచ్చింది. అయినా అలబ్ధ గ్రంథాల వేట మానలేదు. కీ, శే. అనంతవరం సిద్ధప్ప వరకవి గౌర విగ్రహావిష్కరణ సందర్భసాహిత్య నభకు అధ్యక్షునిగా 20 నవంబర 1996 నాడు గుండారెడ్డి వలు వెళ్ళడం జరిగింది. ఆ సభకు వక్తగా వచ్చిన డా॥ దాశరథుల బాలయ్య, లెక్చరర్‌ - సిద్ధి ఘట గా “రామాయణ యక్షగానాలు' అను అంశంపై పిహెచ్‌డి. చేశారని తెలిసింది. మాటల సందర్భంలో శేషప్ప రామాయణం తమకు లభించిందన్నారు. కాని, కృష్ణశతకకర్త ధర్మపురి నరసింహదాను మైరావణ చరిత్ర లభించలేదన్నారు. ఇది సా వద్ద ఉంది. వారికి ఇస్తానన్నాను. వెళ్ళి శేషప్ప రామాయణం తెచ్చుకున్నాను. డా. డి. బాలయ్య గారిచ్చిన అపురూప ప్రతిలోనివే ఈ క్రింది వివరాలు - రచయిత, ఫిబ్రవరి 97)

శేషప్ప రామాయణం సంపూర్ణ యక్షగానం. ఇది వాల్మీకి రామాయణం వలెనే (బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ) ఆరు కొండముల్లో ఉంది.

ఏలూరు నుండి, కుప్పుస్వామి మొదలారి వారిచే 1942లో 'ప్రకటితమైన ఈ కృతి మొదటి ముద్రణ 1889 అని తెలిసింది. (కవర్‌ లేదు. ఇన్నర్‌ టైటిల్‌ కూడా నగం చినిగింది. ఉన్నంతలో) శేషాచలదాసు గారిచే రచియింపబడిన' - “శ్రీమద్ధర్మపురిరామాయణము' షట్కాండములు - యక్షగానము” అని ముద్రితమై ఉంది.

82 డౌ మలయశ్ర్రీ- “'కరఠీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కవి మొదటి పాటలో ధర్మపురి రామాంకితము రామాయణము అన్నాడు. బాలకాండము చివర గీత పద్యంలో కవి పేరు ఇలా వుంది. గీ. లోక ప్రకటరామాయణమున బాలకాండ లాలితముగ శేషమాచలయ్య జెప్పె బ్రాసిన పఠియించిన విన్న వారికెల్ల మోక్ష పదవిచ్చు శ్రీరామ మూర్తి మెచ్చి! మొదటి రెండు పాొదాల్లోని గణ భంగాలు గమనించ వచ్చు. పైగా ఇది పండితులచే పరిష్కృతం' అనీ ముద్రణలో ఉంది. ఈ రామాయణంలో పొత్రల ప్రవేశ నిష్కమణాదులు లేవు. తెరచాటు దర్వులు కూడా లేవు. సంస్కృత నాటకాలకు వలె నాంది ప్రస్తావన విష్కంభాదులు లేవు. పాటలు పద్యాలు కొన్ని వచనాలు కూడా వ్రాసి కవి కధ నడిపించాడు. మధ్య మధ్య వర్ణనాంశాలు సైతం పాటలుగానో పద్యాలుగానో ఉన్నాయి. కథలో వేగం ఎక్కువ. కవిత్వ రమ్యత తక్కువ. యతులు ప్రాసలు కూడా కొన్ని చోట్ల తప్పాయి. భాషాపాండిత్యం కథనం మాత్రం సహజ సుందరంగా ఉంది. ఇందలి పాటలు మొత్తం - 252, పద్యాలు 503. యేలలు ద్విపదలు కూడాపై వానిలోనే జమ. (ఈ లెక్క డా. డి. బాలయ్య గారిది) పుస్తకం చిన్న అచ్చులో 1/8 డెమ్మీ 126 పుటలు పద్యాలకు పేర్ల గుర్తులున్నాయి. కాని, పాటలను కీర్తన - దర్వు అని ఏ పేరుతోనూ పేర్కొనలేదు. ప్రతి పాటకు ముందు రాగతాళాల మాత్రం సూచించారు. నారాయణగౌళ, హుసేన్‌ రాగం అనీ ఉన్నవి. వాటిలో సీత పెండ్డి ఒప్పగింతల పాట “జనకుండు నప్పుడు తన సతితోడ గూడి...” అనేది, ఇంకా - సీతను తల్లి సాగనంపుతూ నుద్దులు చెప్పేపాట - “అత్త వారింటికీ...” అనేది బహువ్యాప్తి పొందాయి. ఈ రెండూ కించిత్‌ పాఠభేదాలతో ఇప్పటికీ “స్త్రీల పాటలు” పెండ్లి పద్యములు” అనే పుస్తకాల్లో చేర్చబడి అభిలాంధ్ర వ్యాప్తిలో ఉన్నాయి. శేషాచలదాసు “ధర్మపురి రామాయణము' కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం వంటి తాలితరం శ్రవ్య రూపకం. అందుకు నిదర్శనంగా కవి చెప్పిన ఫల్రుతిని చూడవచ్చు. ఈ గ్రంథము వ్రాసినా పఠన చేసినా (నుందర కాండ) పుణ్యం ఫలంకలుగుతుందని చెప్పాడే తప్ప, ఈ ప్రదర్శన చేస్తే ఆని చెప్పలేదు. శేషప్ప ధర్మపురి రామాయణం శ్రవ్యనాటకం - దేశిరూపకం - యక్షగానం! అధిక జనాదరణ పొందిన కృతి శేషాచలదాసు గారి ధర్మపురి రామాయణ యక్షగానం. ఈ నాలుగు కృతులనేకాక శేషాచలదాను కొన్ని భజనకీర్తనలు కూడా రచించాడు. “నరహరి భజన నోటనురా! నోటనురా! నోటనురా! నోటనకున్నవినురా” మొ॥ శేషప్ప కీర్తనలు భక్తలోకంలో బహుళ ప్రచారంలో ఉన్నవి; రామదాసు భజనల వలెనే. నృసింహ శతక త్రయాన్ని, రామాయణ యక్షగానాన్ని రచించి శేషప్పకవి విష్ణుభక్తినే కాక, తన నామాన్ని - జన్మగ్రామాన్ని సాహితి క్షేత్రంలో శాశ్వతం చేసుకున్నాడు! పాద పీఠికలు

  1. “ధర్మపురి నాడు -నేడు' - 1970; అధ్యాయం - 3; పుట - 56
  2. 'సారన్వతీ జ్యోతి సాహిత్య త్రైమాసిక పత్రిక - సం.2; 1954.
  3. ఇందవరపు నర్సింగరావు గారి పీఠిక 4, బాల నరస్వతి బుక్‌ డిపో మద్రాసు 8వ ముద్రణ - 1977; మొ.ము. 1947.
  4. శూరుడగాను - అని పాఠాంతరం. 6. శతక వాబ్మయ సర్వస్వము - పు. 239, 240. 7... పుట, 43, ముద్రణ - 1970. 8. కాకుత్సం అనంతయ్య గొరు 1991లో నాతో అన్నారు.
  5. ధర్మపురి వారి “త్రిశతి” *క్ర79లో ఇందవరం నర్సింగరావుగారి వ్యాసం “ధర్మపురి నాడు - నేడు' 1970; పుట - 56 నుండి; 8-9 అధ్యాయాలు.

మొదటి భాగం, 11 అధ్యాయం: అనం కాం తెలను సాొళ్ళుం 83 10. మద్రాసు ప్రచురణ - 1926; 11 జయ సం - మద్రాసు ప్రచురణ. 12. త్రిశతి - 1979; 13. ధర్మపురి నాడు - నేడు - 1970; పుటలు - 50 - 52. 14. పెద్దగా చదువు లేకున్నా పూర్వకావ్యాల శ్రత పఠన అభ్యాసాలవల్ల స్వేచ్భగా కవిత్వం చెప్పేవారు వరకవులు. 15. 7వ, పద్యం. ఈ చరణ భావానికి ఈ శతక ఆవిర్భావగాధకూ సంబంధం ఉంది. 16. ఈ విషయాన్ని డా. కె. రాజన్న శాస్రిగారు తెలిపారు. 17. మృదంగ వాద్య కథ చెప్పినది కవివంశ వైష్ణవుడు, రెండవది దండయాత్ర కథ చెప్పినది ధర్మస్పురి మిత్రుడు - విప్రుడు. 18. ఎం. శ్యామసుందర శాస్త్రిగారి వ్యాసం - “ధర్మపురి నాడు - నేడు 1970; పు. 51 19. శతక వాబ్బ్మయ సర్వస్వము - పు. 238; 20. ఆంధ్ర వాజ్మయ చరిత్రము - 1966; వు, 118. 21. ఈ పద్యం 5 పొదాలది. రామదాసు తనకవితను నరాంకితం చేసిందెక్కడ? ఈ పద్యం ప్రక్షిప్తం కావాలి. లేదా కరృత్వంలో అనుమానం రావాలి. 22. కాళిదాసు - మేఘదూతమ్‌; పెద్దన - స్వారోచిష మను సంభవము... కవులు పెట్టిన పేర్లు మారి ప్రచారమైనట్లే ఇదీ కావచ్చును. 23. రంగస్థల నటులు గోధూరి నుందరా చార్యులు 1992 ఏప్రిల్‌లో చెప్పారు. 24. దేవీ ప్రసాద్‌ గారి 'మెదకు మండల సాహిత్య చరిత్ర'ము. 1969, పు. 54. వి ముద్దుబాలంభట్టు - మంథని, 18వ, శతాబ్ది ఉత్తరార్థం మంథని వాస్తవ్యులైన ముద్దు బాలంభట్టు విరచించిన కృతులు రెండు యక్షగానాలు.

  1. శివపురాణము (యక్షగానం) 2. మంథెన రామాయణము (యక్షగానం) కవి పంశాదులు : రామాయణ బాలకాండము 1978లో ముద్రణ పొందింది. దీని ద్వితీయ శ్లోకంలోని" కవి వివరణను బట్టి ఆయన గౌతమీ సమీప మంత్రాఖ్యనగర వాని. హరితస గోత్ర ద్విజుడు. ముద్దు రాజేశ్వర సుతుడు. ముద్దు అనేది గృహనామం. ఆశ్వాసాంత గద్యలు ఇట్లున్నవి. “ఇతి శ్రీ సీతారామ సరస్వతీ శష్యేణ ముద్దు రాజేశ్వర సూనునా బాలంబబ్టేన విరచితాయాం శ్రీమదుమామహేశ్వర సంవాదే రామాయణ యక్తగాయనే రామాయణ కథాయాం సుందరాకాం సమాప్తి” ము 1988. కాలం: “అయోధ్యాకాందము”2 పీఠికలలో బాలంభట్టు కవి సుమారు మూడువందల సంవత్సరముల శ్రీతం వారని ప్రకాశకులు తెలిపారు 'సుందరకాండ' పీఠికలలో. కవిరచన 200 సంవత్సరములకు పూర్వపుదని గంగా రాజేశ్వరరావు గారు, సుమారు 300 క్రితపుదని రేవెళ్ళ మురళీధర శర్మగారు పేర్కొన్నారు. వారందరు మంథని వాస్తవ్యులు. ముద్దు బాలంభట్టు వంశంవారు ఆదిలాబాద్‌లోని అచ్చలాపురం అగ్రహారానికి వెళ్ళినారు. అందులో అయిదవ తరం ముద్దు నరహరి గారు ఆస్తిలో తొమ్మిదవ పాలు అనుభవిస్తున్నారట. (సుందరకాండ పీఠిక) దాదాపు రెండు వందలేండ్లకు పూర్వుడు కవి. (1980-200) 1780 ప్రాంతంలో కవి జీవించి ఉండాలి. ఈ రచనలు 18వ, శతాబ్ది ఉత్తరార్థకాలవువి అనుకోవచ్చు. కవి జీవితం - కావ్యరచనా విశేషాలు : బాలంభట్టు గారి వ్యవహార నామం ముద్దు బాయన్న, ఆయనకు ముద్దయ్య అని ఒక సోదరుడున్నాడు. బాలంభట్టు నిష్టాగరిష్టుడైన వైదికుడు. నిత్యం ఉషోదయానికి పూర్వమే లేచి గోదావరి నదికి వెళ్ళి (మంథని పట్టణానికి నది మూడుమైళ్ళ దూరం) స్నానమాచరించి, నదీ తీరస్థ గౌతమేశ్వరాలయం (కాకతి గణపతి దేవుని కాలపు నిర్మాణం) లో పూజచేసి ఇంటికి వచ్చే వారు. ఓ దినం ఒక యతి వారిని ఈ కావ్యరచన చేయవలిసిందిగా

84 డా॥ః మలయతశ్రీ- “ళరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” ఆదేశించారట. కవితా సాధనలేని తనచేత ఈ కావ్యరచన కాగలదా? అని మొదట వెనుకాడినా ఆ సాధువు ఆజ్ఞను కాదనలేక సకుటుంబంగా వెళ్ళి గ్రామసమీప ఓంకారేశ్వరాలయంలో నివసిస్తూ బాయన్న ఆ రెండు యక్షగానాలు రచించారని స్థానికుల కథనం.

బాలంభట్టు వరకవి. ఛందోగ్రంథాలు చూసికాక అభ్యాస పాటవంచేత భక్త్యావేశం వలన కవిత

చెప్పేవారు వరకవులు. ఛందోభంగాలను శబ్దసాధుత్వాలను గురించి వారు అంతగా పట్టించుకోరు. పలికెడిదంతా భగవంతుడు పళికించేదే అనే భావం. చెరకునకు వంక బోతేమి తీపి చెడునె, అనే రీజిలో వారి రచనలు సైతం జనాదరణ చూరగొంటూనే ఉన్నాయి!

కావ్యపరిచయం : మంథని రామాయణ యక్షగానం ఆ ప్రాంతంలో చాలా వ్యాప్తి పొందింది. మంథనిలోని సంప్రదాయ కుటుంబాల స్రీలు, పురుషులు ఇందలి కీర్తనలు పాడుకుంటున్నారు. అవి స్రీలకు జోల పొటలు, పురుషులకు భజన కీర్తనలు!

బాలం భట్టు గౌరు తమ రామాయణాన్ని వాల్మీకి రామాయణం వలెనే ఆరుకాండలుగొ రచించినారు. అందులో బాల, అయోధ్య, సుందరకాండలు మాత్రమే ముద్రితమైనవి. అరణ్యకిష్కింద యుద్ధకాండలు ఆముద్రితాలు.

బాలకాండ పీఠికలో డా॥ దివాకర్లగారు ఇట్లా అన్నారు. తేది 23-3-78,

“ఈ రామాయణము యక్షగానముగా వ్రాయబడినది. కాండాంత గద్యములలో 'శ్రీమదుమా మహేశ్వర సంవాదే శ్రీమద్రామాయణ యక్షగాయనే” అని వ్రాయబడినది. ఇందు శ్రోకములు, వచనములు, మత్తేభ, శార్జూలాది వృత్తములు, రాగతొాళ సూచనలతో గూడిన కీర్తనలు గీతములు, ద్విపదలు, దరువులు కలవు. చూర్చికలు సమాన భూయిష్టములైయున్నవి.౩ అధ్యాత్మరామూాయణము ననుసరించి, కథను చక్కగా నడిపి యున్నాడు. కవి పండితుడు వలె కనిపించుచున్నాడు. వీర శృంగార కరుణారసములు చక్కగా పోషింపబడినవి. ఇది చాలా ప్రశస్తమైన గగ్రంధవాసి....”

ఈ రామాయణ యక్షగాన రచన ప్రత్యేక పద్ధతిలో ఉంది. పాత్రల ప్రవేశ నిష్కమణాదులు, సంవాదములు లేవు. కవి కథనం మధ్య మధ్య సాగుతూ, పాటలు సద్యాలు వచనాలతో కథ నడిచింది. దీనిలో దృశ్యకావ్యం కంటే శ్రవ్యకావ్య లక్షణమే అధికం. అందుకేనేమో దీనిని యక్షగొన నాటకం - రూపకం అనక “యక్షగాయనం' అన్నాడు కవి. తెలుగు తొలి యక్షగానమైన సుళ్రీవ విజయం కూడా శ్రన్యకావ్యమే. బాలంభట్టు అదే పద్ధతిని అనుసరించాడు.4 ఈ కవి తన రామాయణాన్ని శివుడు పార్వతికి వినిపించినట్టుగా రచించాడుక్‌. కావ్యారంభ శ్లోకంలో త్రిమూర్తుల ధ్యానించి, రెండవ శ్లోకంలో స్వవిషయాలు తెలిసి మూడనదైన మొదటి తెలుగు పద్యంలో రామకథా ప్రభావాన్నిలా వివరించాడు. | ”

ఉ. ధర్మము యాగమున్‌ తపము దానము లింద్రియ నిగ్రహంబు న తృర్మయు నార్యసేవయును (గ్రంథ విచార వివేక శూన్యులై దుర్మతి చేత నీ కలిని దుషతములనొనరించు6 వారలన్‌ నిర్మలమంద జేయుచు బునీతము జేయును రామగీతముల్‌. బా.కాం. పుట - 1 ఇందలి మూడవ పాదంలో 'దుషృతముల్‌ పొనరించువారలన్‌' అంటే గణభంగం వచ్చేదికాదు. మొటటి కీర్తన ఇష్టదేవతల ఆరాధన. దాని నాలుగు చరణాలలో రెండు ఈ దిగువ చూపబడుతున్నవి. ధీర్తీ నొందిన సాంబా మూర్తీ యింటను బుట్టి, కీర్తీ వెలసిన దేవుడై ఆర్హూలై తమ భక్తులమతి కొల్వను గామ్య పూర్తీ సేయు నాది పూజ్యునకు నే, మొక్కెదా మొక్కెదా గణాధిపా ॥మొ౪”

మొదటి భాగం, 111 అధ్యాయం: అవంచతీ కాలవ తెలుగు వాహొత్యం తిక చందమామను బోలు - సకల విద్యల తల్లి, సత్యలోకము రాణికి నందారు మునిజాన - మందారు తరువూన, కందామైన శారదాంబాకునే [మొ ధీర్తి = ధృతి, జాన = జన ._... పదాలకు లేని దీర్చాలు రావటం జానపద యక్షగాన కవుల రచనల్లో సర్వసామాన్యం. అది రాగతాళాల కోనం. పండిత కవుల వలె కాదు, వరకవులు స్వేచ్చా విహంగాలు! గర్భిణులైన దశరథ పతుల వర్ణన - ద్విపదలు - కనకాంగులకు మేను కళలు దీపిల్ల, తనువున నీరెక్కి దొర్హ్యంబునంది కుచములు గొప్పలై కోర్కెలు మించ, సు చిరంబుగా నిద్ర సాక్కులింపాంద కొమర నాహారంబు కొద్దిగా నైన, క్రమముగా నుదరముల్‌ కడువృద్ధి కాగ వాట్‌ పాటల బొద్దులటు గడుపగాను...బా. కాం, పుట 5. శ్రీరామ జననం కేవలం రెండే రెండు చరణాలు. “నవమాసములు నిండి నారాయణుండు - నవతరించె నయోధ్యయందు రాముండు!” రాముని తన యాగ సంరక్షణకు పంవుమని విశ్వామిత్రుడు కోరడం శఈ శ్లోకంలో ఉంది. శో॥ యాచంళతం వై కౌశికం శాప భిత్యా, దృష్ట్యా రాజా సందిహానో బభూవ। తస్మిన్‌ కాలే తేన సంజ్ఞామవ్యాస్య, ప్రాహై కాంతే భూపతిం శ్రీవసిష్టః॥ తర్వాత ఓ పదం, కన్నడ గౌళ రాగం ఆది తాళంలో, దేవా శ్రీరోముల కనుగొని - నావాః మాధవుడని తెలియగ - లేవా దేవ జనక రఘుతిలకుని గనుసతి! ఆవిధమున కశ్యవుడవు నీవె సుమి॥ కోరీ - నర రూపము దాల్బె మురారి! సుతుడై మన గృహమును జేరి, మీరీ - బహు భాగ్యము వలన నీ సారిః ప్రభవించెను శ్రీ యవ తారి -క్షీరజలధి నుత - సిరి వరకన్యక। భోరున జనకుని - పురమున వెలసె వీరుడనంతుడు - వెలది నుమిత్రకు। గొరణమునల - క్షణుడనగలిగెను ఃదేవా! బాలపుట 8. ఇలా రామకథ సంక్షిప్తంగా నడిపినాడు. కవి వాల్మీకి మూలాన్నే అనుసరించాడు. నే యాగ నంరక్షణానంతరం విశ్వామిత్రుడు రాముని స్తుతించిన కీర్తన సంస్కృత భూయిస్టంగా కాక కవి పాండిత్యానికి, కమనీయ కవితా శిల్బానికి నిదర్శనంగా ఉంది. అందలి తొమ్మి! చరణాల్లో ఇవి రెండు. బా. కా. పు, 12,13 (ముఖారి - ఏకతాళం) 1 శ్రీమదనంతని - యామక, భవహర। నామ - సమర రివు-భీమ, మధుర గుణ వహి సీమ - పరాత్పర - ధామ, విబుధ జన । కామ నఫలపద - కోమల జయ జయ [రామ సాహా 2. కుంభజ పద పరి - రంభణ, జగదఖి । బృంభణ నురధుని - సంభవ పదృ, ల దంభ దమన, హత - జంభ నహోదర | కుంభిని పతివర - డింబక జయ జయ ॥రామపావా॥ ఇందులో కందార్థముల వలె కందమాలలు వృత్త పద్య మాలలు సీసమాలలు ఉన్నాయి. ఇవి పద్యాంత పదంతో గేయమారంభమై వినూతనంగా ఉంటాయి. కవి సందర్భోచితంగా ఏలలు, చూర్ణికలు కూడా రచించారు. ఒకయాల - (ఏల) బానొ. పుట, 33 మీరు మా చెంతకు రావడము మేలాయెనెంతో యీ వేళ కోరిన దానము నడుగవే - భార్గవరామా! కొదువలేకా నిచ్చేమో దేవా! ఆహల్యా దేవేంద్ర ఘట్టంలో మూడు పాటలున్నాయి (17-19) సీతారామా కళ్యాణం, పాటలోనే వర్ణితం. సీత ఒప్పగింతల పాట మనోహరంగా ఉంది.

86 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” శ్రీరామ భార్గవరాముల మధ్య ఏలల సంవాదం ఉన్నది. ఇట్లా సంగ్రహంగా బాలకాండ కథ ముగిసింది. అచ్చులో ఇది కేవలం 35 పుటలు. చూర్ణిక - (సంనృతం) అయోధ్యాకాండము, పుట = 18 లోనిది. | “అహో! మదీయ జననీ! భవ జనిత సర్వదుఃఖ ప్రశమనీ! ఇదానీం మజ్జనకో రాజా దశరథః శ్రీమాన్‌, వర ప్రదానవశాదనృత భయేన నవపంచ వర్షాణ్యరణ్య వాసం గచ్చేతి మామను శాసితవాన్‌, స్వధర్మ నిరతవాన్‌ అతో ౬ హమిహా గతో ౬ స్మికారుణఖ్యతయా క్షిప్రం బ్రూహి, మహాజ్ఞాందేహి.” వెంటనే ఆ మాటలు విని కౌసల్య రామపట్టాభిషేకానంద భగ్నమనోరథయై ఇట్లా విలపించింది. ఎన్ని తలతునో రామ - నిన్నెడ బాసి యేల తాళుదునో పున్నమి చందురుని - పాడను గేరు నీ మోము కన్నుల నిను జూడ గలిగే దెన్నటి కౌనో (అ.కా. పు : 19) వనవాస గమన సందర్భాన సీతారాముల మధ్య ఏలలతో సంవాదమున్నది. (అ.కా.25 పుట) రావణాంజనేయ సంవాదం ఏలలే. (సు.కా. 39,40) గంగాతరణ సందర్భంలో గుహని కనికరించి, చిత్రకూటంలో వాల్మీకిని సీతారామలక్ష్మణులు సందర్శించినట్టున్నది. (అ.కా. 30,31) సుందరకాండ కృతి ఈ కృతులలో పెద్దది 54 పుటలు. ఇందులో దర్వులు కీర్తనలు మిగతా ఈకవితా ప్రక్రియలెక్కువ. వచనాలు మరీ తక్కువ. రామదూత చెలరేగెను వాలాగ్నితోను! లంక గాలబెట్టసాగెను భూమియాకాశంబులదరగ ॥ పురహరుని చందంబు నార్చును భీమరూపము దాల్చి యసురులు; బెదరగా నపరాత్రి వేళను 1రామదూత॥ ను.కా. పుట - 46 రాముని కృతజ్ఞత వాక్యాలు ఈ తీరుగా ఉన్నవి. నను బోషించితి వాంజనేయా కీర్తి నెనసితి నీచేతానెంతో మేలాయా ॥నను॥ కలికీ చల్లని దానవాలు నేనీ! వలన జూచితినయ్యా వనజాక్షి మేలు నిలలోనెన్నటికి నన్నేలు గోరి; తలచెడి మా పాలిటి దైవముగాబోలు ॥నను; పు, 53 సుందరకాండలో సీతాదేవిని 'సీయా' అనటం, పార్వతికి శివుడు వినిపించినట్టుగా కథ నడపటం వలన, ఈ కవి తులసీ రామాయణాన్ని, విశ్వామిత్ర అధ్యాత్మరామాయణాన్ని, చదివాడనుకోవచ్చు. బాలంభట్టు గారి రామాయణ యక్షగానానికి మంథనిలో చాల ఆదరమున్నది. ధర్మపురి రామాయణం, మంథని రామాయణం, ఇల్లంతకుంట రామాయణం ఈ జిల్లాలో బహుళ వ్యాప్తి పొందిన యక్షగానాలని కీ.శే. గట్జెపల్లి సత్యనారాయణ రాజు గారు “కరీంనగర్‌ మండల చరిత్ర' లో “ప్రాచీన సాహిత్యము - కళలు” అనే వ్యాసంలో పేర్కొన్నారు. పు. 20 ఈ కావ్యంపై ఉన్న అభిమానంతో శీలప్ప గారి అనంతరాజం గారు స్వయంగా 46 ప్రతులు దాసి అభిమానులకు పంచారని అయోధ్య కాండ పీఠికలో ఉంది. ముద్దు బాలంభట్టు రావణ వధ వరకే ఈ యక్షగానం వ్రాసి ఏలనో విరమించగా, ఆయన తమ్ముడు ముద్గయ్య రామ పట్టాభిషేకాన్ని రచించాడు. బాలంభట్టు భక్తి కవితా శక్తిని గూర్చి భక్త పోతనకు వలెనే కొన్ని మహిమోపేతమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఓ పాటను కవి అసంపూర్ణంగా వదలి గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి, రామలక్ష్మణులు మారురూపాలతో వచ్చి పూరించి వెళ్ళారట ఇది పోతన గజేంద్రమోక్షంలోని, అల వైకుంఠ పురంబులో - పద్యం పూరణ గాధ వంటిది. లక్ష్మణ మూర్చ సందర్భంలో “హాముద్దు

మొదటి భాగం, [1 అధ్యాయం: అనంతర కాంచి తెంంగు ప్రారొర్యం 87 తమ్ముడా!' అని రాముని విలాపం వ్రాసే సందర్భంలో కవి పోదరుడు ముద్దయ్య మరణించి, తిరిగి ఆచరణం మార్చి దైవాన్ని నుతించగా మేలుకున్నాడట. ఇది పోతన రుక్ష్మిణీకల్యాణ ఘట్టంలోని 'బాలకమరె' కథకు ప్రతి బింబం. శ్రీనాథుని ఒడ్డెరాజులు భూమిళిస్తుకోనం హింసించినట్టుగా బాలంభట్టును కూడా నాటి గ్రామకరణం హింపిస్తే, వరదరాజ స్వామిని కవి వేడుకోగా శిన్తుమాఫీ అయి, ఆ కరణం ఉద్యోగం ఉఊడిపోయిందట, ఈ విషయాలు సుందర కాండ పీఠికలో గంగా రాజేశ్వరరావుగారు (వ్రాశారు. శీవలీలలు - యక్షగానం: బాలంభట్టు ఈ యక్షగానాన్ని మూడు భాగాలుగా రచించాడు, అవి 1. దక్షయాగం, 2 పార్వతీకల్యాణం, 3. కుమార నంభవము. వీనిలో మొదటి ెండు భాగాలు ఒక సంపుటిగా ముద్రించబడినా మూడవ భాగం వెలువడలేదు.” రామాయణ కృతి రీతిలోనే ఈ" యక్షగాన రచన సాగింది. ఇదే కవి మొదటి రచనమట. కావ్యారంభం : మహదేవ ఉవాచ - శ్రీవైరాజిత మంత్రకూట నగరే సౌందర్యవంశార్లవే శ్రీ రాజేశ్వర మౌని సూనురిద మాఖ్యానం కరోత్వద్భుతం సంక్షేపేణ సుయక్షగాయనతయా నత్రళ్ళతే నోదితే శ్రీ శంభో జన రక్షదక్ష నిరతాం రక్షానిశం సర్వశం. | ఈ శ్లోకానంతరం గణపతి ప్రార్థన చేసి కవి కథారంభం కావించాడు. బాలంభట్టు వరకవి. ఇది వరకవిత. ఇందలి కొన్ని పదాలు లాక్షణీకులకు మింగుడు పడవు. వ్యావహారిక పదరూపాలే కొక భాగోతపు బాణీలో పదాలకు లేని దీర్చాలు వచ్చాయి. ఇది ఒక విధంగా సమకాలీన సబీవభాషు ఇందులోనూ బాయన్న రామాయణంలో వటినే పద్యమాలికలు, కీర్తనలు, ఏలలు, ద్విపదలు, పద్యాలు, వచనాలు ఉన్నాయి. రామక్రియలు అని జంపెతాళంలో కొన్ని కొత్తరకం గేయాలున్నవి. ఉదా : కదిసి యగ్మిని మూటగట్ట చందముగాను యిది మహాత్ముల నింద యేమి మలొనె... (4౮ వుట) పనివాడు యితగాని బ్రతికించవే యనుచూ మునిపుంగవుని యొక్క మొండెమును జూపెను జల (వ్రతము గాను జాయు మీ క్రతువులు (చేయు) ఘనుడవు నీవుద్దరణ గావించు మనెనూ (41). యాలలు : (ఏలలు) యెక్కువైన బలవంతులై యింద్రాది దేవదేవతలు, మిక్కిలి వుల్లాసా మెందూచు - ఓ మౌనులారా - మేనులెల్ల వుణుకులాడిరీ॥ మక్కువాతో ముని కాంతలు నుంచి వస్తా భూషణములతో మెక్కుచు గంధ పుష్పములాను - ఓ మోనులారా - సొంపుగా నెగజల్లూ చుండీరీ! (06) అరుసుకో బోంగ్య యాషాని శాయవలె = ఏ వని చేయవలె, రబ్బుకొల్చు, రావగ, పామరాము=పావురము=(ప్రేమ, యాది - యాద్‌ ఉర్జూపదం, జ్ఞావకం, బోలి వంటి మాండలిక పదాలు నిన్సంకోచంగా కవి ప్రయోగించాడు. కావ్యాంత గద్యః “ ఇతి ్రీసీతారామ సరస్వతి శిష్య ముద్దు రాజేశ్వర నూనునా బాయన్న భట్టేన విరచితాయాం శ్రీమదుమా మహేశ్వర యక్షగాయన (దక్షయజ్ఞ) వీరభద్ర విజయోపాఖ్యాన నామ ప్రథభమాశ్వాసః”- “శ్రీ సాంబ శివార్చణమన్తు - శ్రీ సీతారామ చంద్రార్ప్చణమస్తు.”

88 డా మలయత్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కవి వీరైవ భావావేశికాక, స్మార్తుడు కనుక శివకేశవుల ఇరువురినీ స్మరించడం, దక్ష యజ్ఞధ్వంన సందర్భంతో సంయమనంతో కథ నడిపించడం జరిగింది. ఈ కృతిని 'శివలీలు' అని వ్యవహరిస్తున్నా కవి మాత్రం “ఉమామహేశ్వర యక్షగాయనం” అనే అన్నారు. బాయన్న శివపురాణ రామాయణ యక్షగానాలు రెంటిలోనూ ఇతివృత్తాన్న మూలవిధేయంగా సంగ్రహంగా రచించాడు. లేఖక దోషాలు ముద్రారాక్షసాలు సవరించి, కావ్యాల చక్కగా పరిష్కరించి, సంపూర్ణంగా ముద్రిస్తే, రెండు రసవత్తర పూర్వయక్షగాన గ్రంథాలు పారకులకు అంది అలరిస్తాయి. పాదసీఠికలు; 1 సమీపే గౌతమ్యాం ముని నిలయ మంత్రాఖ్యనగరే ద్విజః పుణ్యోధీమాన్‌ హరితస మునేర్లోత్ర జలధా కులే ముద్దేతద్వర జనిత రాజేశ్వర నుతః సమాసే నాంధ్రేతాం విరచయతి రామాయణ కథా॥ 2. ముద్రణ సంవత్సరం వేసి లేదు. 3. ఇందలి చూర్ణికలు సంస్కృత భాషలో ఉన్నవి. 4. యక్షగాన పాత్రలకువచనాలుండవు. కవి కథనముంటుంది. సందర్భాన్నిబట్టి నటులే పాటల మధ్య మాటలు చేర్చుకుంటారు. వచనాలు తర్వాతి స్వదేశ నాటకాల్లో ఉన్నాయి

  • అని 'కొండలరాయుడు' యక్షగాన రచయిత ఆడెపు గురువదాసు సిరిసిల్లగారు 19393 నవంబర్‌లో నాతో అన్నారు.
  1. శ్రుణుదేవి ద్రక్ష్యామి గుహ్యాత్‌ గుహ్యతరం మహత్‌ అధ్యాత్మ రామ రచితం రామేణోక్తం పురా మమ - అని కథారంభ శ్లోకం.
  2. '“గోలకొండకవుల చరిత్రలో బాలం భట్టు పేరు వదలి ముద్దయ్యనే ఈ యక్షగానకర్తగా పేర్కొనటం పొరపాటు. పు. 405.
  3. నాకు లభించిన అచ్చుప్రతిలో కావ్యభాగం తప్ప ముందు పుటలు లేనిది. మరో ప్రతి దొరుకలేదు. ముద్రణ సంవత్సరం తెలియదు. 3, కుందావజ్ఞల గోపాలకృష్ణకవి; ములకనూరు 18వ, శతాబ్ద కుందావజ్ఞల గోపాలకృష్ణ కవి హుజూరాబాద్‌ తాలూకా వంగర గ్రామ సమీపమందలళి ముల్కనూరు నివాసి. ఈ కవి సంస్కృతాంధ్రోభయ భాషలలో విద్వాంసులు. వీరి రచనలు రెండు.
  4. థ్రీకృష్ణ జన్మఖండము (అముద్రితం)
  5. సంవరణ చరిత్రము (ఏకాశ్వాసం మాత్రం లభ్యం) సంస్కృతాంధ్ర పండితుడైన గోపాలకృష్ణయ్య మహార్శాష్ట ప్రభువైన సర్వాజీ మాధవరావుగారి ఆస్థాన కవి. రాజా వారిచే వీరు ఏటా పన్నెండు వందల రూపాయలు కాశ్మీరు షాలువా సన్మానంగా పొందేవారట! ఈ కవి కరీంనగర్‌ జిల్లాలోని దేవకీపల్లి (డ్యాగపల్లి)ని అగ్రహారంగా పాందాడు. కాలంః గోలకొండ కవుల నంచిక, లోని పూర్వకవుల పరిచయాలలో గోపాలకృష్ణ కవిని గురించి వ్రాస్తూ ఈ కవి అప్పటికి 120 సంవత్సరాలకు పూర్వుడన్నారు.2 అంటే, గోపాలకృష్ణ కవి కాలం 1934 - 120=1814 అన్నమాట. కవి వంశవృక్షాన్ని బట్టి చూస్తే (ఇందుర్తి వేంకట నరసయ్య గారి కాగితం) నాగశొస్తి (కవి తాత గొరు), వెంకటళొస్రి (కవిగారి తండ్రి) గోపాల కృష్ణ కవి (కృష్ణ జన్మఖండ అనువాద కర్త) దుర్వాస శాస్త్రి కవి పుత్రుడు (మెదటి తరం), భోళానాథశాస్త్రి (రండవ తరం) రాజేశ్వర శాస్త్రి[మూ.త) నరహరి (నా.త) అయిదవ తరంలో 1. వెంకటనరసయ్య, 2. రామచంద్రయ్య. కవి గారికి అయిదవ తరం వారైన రాఘ చంద్రయ్య గారికి ఇప్పుడు 80 ఏండ్ల వయస్సు. అంటే వారి జననం 1993-80=1913. అట్టాగే తరానికి 30 ఏండ్లు తగ్గించుతూ పోతే 5౫30=150, 1913-

మొదటి భాగం, 11 అధ్యాయం: అనంతర కొందు తెలయగు న్‌నొర్యం 89 150=1763 గోపాల కృష్ణ కవి జననం అవ్నతుంది. కవి 1750 సుమారుగా జన్మించి ఉంటారు. 70 ఏండ్లు జీవితకాలమనుకున్నా1820 వరకు ఉంటారు. ఇది గోలకొండ కవల సంచిక చూపిన కాలానికి సరిపోతుంది,

డా॥ బి,.రొమారాజు గారు “వివేచన” డిసెంబర్‌ 1978 నంచికలో ఇట్లా వ్రాసినారు.

మడికొండ “ మోతుకూది వారింట నున్న శ్రీకృష్ణ జన్మ ఖండమును నేను రెండు దళాబ్దముబ క్రింద చూచితిని. మోతుకూరి కోదండ రామారావు గారి జ్యేష్ట పుత్రులు శ్రీ వేంకటేశ్వరరావుగారు (80 ఏండ్లు) తమ 'ప్రపితా మహులు పండరి నాథరావు గారు రచించిన పండరినాథ రామాయాణముతో పాటు కుందావజ్జ్ఞల గోపాలకృష్ణసూరి రచించిన శ్రీకృష్ణ జన్మఖండమును నాకు చూపించిరి. గోపాలసూరి, పండరి నాథరావు గారికి సమకాలీనులగుట (19వ శతాబ్ది ప్రారంభము) వారిరువురికి పరిచయముండి యుండును”

దీని ప్రకారము వేంకటేశ్వరావు గారికి 1958 లో 80 ఏండ్లు. వారి జననం 1878 - వారి తండ్రి జననం 1848, తాతగారి జననం 1818. అది పండరినాథరావు, గోపాలకృష్ణకవి జీవించి ఉన్నకాలం, ఈమూడు అంశాల బట్టి గోపాలకృష్ణ కవి కాలం శ్రీ.శ.1750 నుండి 1820 ని నిర్ణయించవచ్చు. వంశరః శ్రీకృష్ణ జన్మ ఖండములోని ఆశ్వాసాంత గద్యలిట్ట్లున్నవి.*

“శ్రీవేంకటేశ్వర ప్రసాద లజ్ఞోభయ భాషా కవితా విఖ్యాత చరిత్ర శ్రీమత్కుందోరులాన్వయాం భోజ పద్మమిత్ర శ్రీనాగశాస్త్రి పౌత్ర వేంకటళాస్రి పుత్ర విద్వజ్ఞన కృపానుషారి గోపాలనూరి ప్రణీతంటైన బ్రహ్మప్పరాబాంతర్గతంబగు. కృష్ణ జన్మ ఖండంబునందు తృతీయాశ్వాసము. సంపూర్ణము మిగితా కొవ్యగద్యలన్నీ ఇంతే. 'నంవరణ చరత్రము' అశ్వాసాంత గద్య ఇట్టుంది -

“ఇది శ్రీమద్వేంకటేశ్వర వర ప్రసాద లబ్భోభయ భాషా కవితా ధార కాండిన్య గోశ్రాలంకార శ్రీకుందోజ్ఞలాన్వయ పారొవార వైరవ మిత్ర సాగళాస్త్రి పొత్ర వెంకటశాస్త్రి వుత్ర నిఖిల విద్వజ్ఞన కృపానుసారి గోపాల నూరి ప్రభీతంటైన సంవరణ చరిత్రంచిను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము.

కవిది కాండిన్య గోత్రం. కుందావజ్ఞల గృహనామం. వైదిక బ్రాహ్మణులు. తా త నాగళొస్రీ తండ్రి వెంకటశాస్త్రి, కవి మెదటి కావ్యంలో 'ఆన్వయాంభోజ వద్మమిత్రుడు' - నూర్యుడు. రెందవ ప్రబంధంలో ' అన్వయ పారావారకైరవమిత్రుడు" - చంద్రుడు... రెండు కృతుల గద్యల్లోనూ కవినామం గోపాలనూరి అనే ఉంది. సూరి పండితవాచి, గోపాలళౌస్తి అని కవి చిజనామం, శ్రీకృష్ణజన్మఖండరచనతో 'గోపాలకృష్ణకవి' అనే ఫేరు వ్యాప్తికి వచ్చి ఉంటుంది. కావ్య విశేషాలు?

1 శ్రీకృష్ణ జవ్మఖందము. చంపూ కావ్యం. ఇది సంస్కృత పురాణానువాదరి.

నంస్కృతంబలోని అష్టాదళ పురాణంలో “(బ్రహ్మవైవర్త పుఠాణమ్‌' ఒకటి. అందులో నాలుగు ఖండాలు ఉన్నాయి. అవి - బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, గజేశఖండము, శ్రీకృష్ణ జన్మఖండము. మొదటి మూడు ఖండాలు వూర్వ భాగంగా, చివరి శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తద భాగంగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మపురాణోత్తర భాగ 'ఢ్రీకృష్ణ జన్మఖండన్‌” అనువాదమే కుందావజ్ఞల గోపాలకృష్ణ కవి గారి కావ్యం.

బ్రహ్మవైవర్త పురాణం సంస్కృతంలో 911 వుటలు. అందులో 432 పుటలు మొదటి మూడు ఖండాలు కొగా ఒక్క శ్రీకృష్ణ జన్మఖండం 479 వుటలు. ఏక ఖండొనువాదళ కొవించినా గోపాలకృష్ణకవి అ పురాణంలో నగభాగాన్నిమించి అంధ్రీకరించాడన్నమాట.

గోపాలకృష్ణ కవి 'ఢ్రీ కృష్ణజన్మఖండము' భ్రాత ప్రతి 496 పెద్ద పుటలు. పుటకు సగటున 13 చొప్పున చూసీనా ఈ కావ్యంలోని గద్యపద్యాలు 6200 (ఆరు వేలు) కు పై చిలుకు. వ్రాత ప్రతిలో పద్య సంఖ్యలు వేసిలేవు, ఆశ్వాసాలు పన్నెండు.

90 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తేలుగు సాహిత్య చరిత్ర” ఇతి వృత్తం భాగవత దశమస్కంధంలోనిది. రాధ ఈ కావ్యనాయిక. నాయకుడు శ్రీకృష్ణుడు. పురాణేతివృత్తం. అనువాద కావ్యమైనా రచన స్వతంత్ర కావ్యం వలె సాఫీగా సాగింది. కవి ఉభయ భాషావైదుష్యాలతో పాటు కవన నైపుణ్యం కలవాడు. ఈ కావ్యాన్ని కవి శ్రీరామచండద్రునకు అంకితం కావించాడు. ఆరు పద్యాల్లో ఇష్టదేవతానుతి కావించాడు. పూర్వకవుల్లో వ్యాస వాల్మిక కాళిదాస సంస్ఫృత కవులను, ఆంధ్రకవుల్లో “నన్నయ ప్రముఖసూరి కవీంద్రుల" అని మాత్రమే నన్నుతించాడు.(1-7) మన్నన లేక యున్న నవమానము జేయుచు చూడకున్న సంపన్నుల యిండ్లకున్‌ జనుచు పండితవర్యుల ధిక్కరించి నై జోన్నతికిన్‌ పరోపకృతి యుక్తులు దొంగిలి మత్కవిత్వమిట్లున్నది వింటిరే యనుచు నుబ్బెడు కాకవులెంత ధన్యులో (1-8) అని కుకవుల నర్మగర్భితంగా నిందించాడు. ఇక్కడ కవి వాక్యాలనే చూద్దాం - అవతారిక నుండి, వ॥ అని యివ్వధంబున నభీష్ట దేవతా ప్రణామంబును సుకవి స్తవంబును, దుష్ట విజనోపాలంబంబునుంగావించి, యేదేనియు నాక్క త్రిలింగ భాషా గ్రంధంబు నిర్మింపన్‌ దలంచి మనంబున నిట్లు వితర్కించితి - 9 ఉ. "అర్హ శరణ్యుడై వెలయు వ్యాస మునీంద్రుడు దుర్భటాటవీ వర్తనులైన మానవులవశ్యము సౌఖ్యము నొందగా త్రిశా వర్తిత షట్పురాణములు వచశ్సలుడై రచియించె, బహ్మవై వర్త పురాణమందు వినువారికి మేలు ఘటించునెంతయున్‌ - 10 చ. అమృత రసంబు పూర్ణ్వమయి యంతట నుండుట కృష్ణజన్మ ఖం డము వినుచుందరింపగ దృథంబగు భక్తి భజింపగా సమ గ్రములగు నైహికంబులు వరంబులు గల్గగ జేయు మెచ్చిని క్కము హరి బ్రోచు నెప్పుడది గావున దాని తెలుంగు జెప్పెదన్‌ - 11 గీ. ఆంధ్ర దేశ నివాసులై యమర భాష, పరిచయము లేక మోక్షంబు పథము దెలియ నభిలషించు మహా ప్రాజ్ఞులలర కృష్ణ జన్న్మఖండంబు తెనిగింతు సరస ఫణితి - 12 మోక్సార్థులైన విజ్ఞులకోసం కవి ఈ కావ్యం వ్రాశానన్నాడు. శా నా భాగ్యంబున మున్ను సత్కవులు నానా గ్రంథ నిర్మాణ స త్తాభా సద్యశులై వెలింగి రయినం2 తరద్దంధ మాంధ్రింపగా శ్రీభామా పతి కూర్మిచే ఒకనికిన్‌ జిత్తంబు రొదయ్యె దే వాభీష్టంబటులుండుటన్‌ కృతికి నేనారంభమున్‌ జేసెదన్‌. 13 (1సత్తాభాసస్పద్యశులై, 2. అయినంతం - వ్రాతప్రతిలో గణభంగాలుగా ఉన్న ఈ పదాలను సవరించడమైంది). ఇది పోతన భాగవత పద్యాన్ని తలపించేది.” కవి ఆశయం స్పష్టం. కథారంభం ఇది, కం. శ్రీవిలసిత సాకేత పు, రావాస నృపాల సోమ యభినుత రామా, కేవల పరత్వధామా, సేవక భృతి వితత కామ సీతా రామా. వ॥ దేవా యవధరింపుము. ఊ॥ శ్రీవిలసిల్లు వైమిష విశిష్ట వనంబున శౌనకాదులు ద్భావిత కీర్తివంతులు, తపః పరిణాహ వివృద్ధ తేజులా శావిదిత ప్రభావులు, నిశాచర వైరి పవిత్ర సత్కథా జీవనులైన మౌనులు వసింపగ సూతుడు జేర వచ్చినన్‌.

మొదటి భాగం, 111 అధ్యాయం: అిసంతరీ కాలవ తెంలగు సాహిత్యం 91 (ఆ మునులు సంతోషించి సూతునికి పర్యలు చేసి సుఖా సీనుంగావించి ఆస్తిక్యబుద్ధితో ఇట్టా అన్నారట.) ఉ। మాధవు సద్గుణంబులు సమంజన రీతి ననేకమున్‌ సుధా మాధురి మించ జెప్పితిరి, మా హృదయంబుల యందు సంతసం బేదితమై చెలంగ జగదీశ్వరుడైన సరోజ నేత్రుడా రాధికతో విహార మొనరన్‌ రచియించుట వింటిమెంతయున్‌. (మునులు తమ సంశయ నివృత్తి కోసం ఇట్లా ప్రశ్నించారు.) తే.గీ. రాధ యెవ్వరి కన్య యా రామ తోడ, కృష్ణుడేలోకమున గూడి కేళి సలిపె? లచ్చియే కాక మరివేరె మచ్చెకంటి, యొక్కొ సకలంబు వివరింపు ముచిత సరణి. సూతుడు వారి కోరికకు హర్షించి విష్ణుగాథా శ్రవణాసక్తిని ప్రశంసించి రాధామాధవ కధను వినిపించాడు. నారదుడొక దినమున నరనారాయణులున్న బదరీ కేదార తీర్థమునకు వెళ్లి నారాయణునితోనే యీ కథ విన్నాడట. వెళ్ళునప్పుడు ఆ దేవర్షి “జఉవుల పఫప్రళయంబులు శోకహర్ష్నముల్‌ నారకనాక వానములనారతమున్‌ బరికించి ఘోర సంసార విహారమెంతయు నసారమటంచు మదిన్‌ దలంచి” విచారమనస్కుడై ఉన్నాడు. ఇంతకు ముందు బ్రహ్మమాటగా వెళ్ళి నారాయణ మునిచేత బ్రహ్మఖండ పూర్వభాగం విన్నాడట. నారదుని ముఖంగా కవి బ్రహ్మ వైవర్త పురాణ ప్రశంస నీవిధంగా కావించాడు. గీ. “బ్రహ్మఖండంబు చిత్త హర్షప్రదంబు, అఖిల జగముల కది విన్మయ ప్రదంబు గీ. “అమృత ఖండంబుతో సాటియైన ప్రకృతి, ఖండమున ఖండ దుర్భర ఇఖండనంబు జేయు గణపతి ఖండంబు చిత్తమలర, తేట పడనీవు వినిపించితివి మహాత్మ అది గతం. (ప్రస్తుతం విననెంచింది కృష్ణజన్మఖండం. ఆ.వె. గోకులమ్మునందు గోపవేషము బూని, యాత వెట్టి వింత లాచరించె అలది యచట గొల్ల యలనాగలను గూడి, యెట్లు నలిపె కేళి నీశ్వరుండు? యాత = వ్యధకు వికృతి పదం, ఎలనాగ = యెలనాగ గ్రామ్యం, యలనా గ లేఖక దోషం. భాగవతంలో రాధ ప్రస్తావన తక్కువ. కృష్ణుని మేనత్తగా ఉంది. హరివంశంలోనూ ఆమె గాధ ఉన్నట్లు లేదు. ఈ కృష్ణ జన్మఖండంలోనే రాధా చరిత్ర వివరంగా ఉంది. శ తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడే మొట్టమొదటిసారిగా భీమఖండ కావ్యోవతారికలో రాధాకృష్ణుల ప్రణయవర్ణనతో ప్రన్తుతించాడు. పదహారవ శతాబ్ది శ్రికృష్ణదేవరాయల ప్రబంధయుగంలోని చింతలపూడి ఎల్లన రాధామాధవం, తర్వాతి దక్తిణాంధ్రయుగ రాధికాసొంత్వనాది కావ్యాలు - యక్షగానాలు రాధను కావ్యనాయికగా వర్ణించాయి. ఈ 20వ శతాబ్దిలో పా నుగంటి లక్ష్మీనరసింహరావు, “రాధాకృష్ణనాటకము" అమలిన శృంగార రూపకంగా బహుళ ప్రచారం పొందినది. సంస్కృత పురాణాలే కాక జయదేవుని 'గీతాగోవిందము' అష్టపదులు రాధాకృష్ణుల భక్తి శృంగారాల వ్యాప్తి కావించాయి. శ్రీకృష్ణ జన్మఖండం మూలంలో 173 శీర్షికలతో పూర్వోత్తర భాగాలుగా ఉంది. వూర్వభాగంలో 54 ఉత్తర భాగంలో 119 శీర్చికలున్నాయి. కథా వివరాలు - విష్ణుగుణ ద్రశంన గోలోకవర్ణనంతో కథారంభం. రాధాదేవి గోకులానికి, విష్ణు మధురానగరానికి వెళ్తారు. దేవకీ వసుదేవుల కల్యాణం ఈ పురాణంలో లేదు. కాని, భాగవత దశమస్కంధ పూర్వభాగం

92 డౌ॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాసాత్య చరిత్ర” శ్రీకృష్ణ చరితమే కృష్ణ జన్మఖండ పూర్వభాగం. కృష్ణుని బాల క్రీడలు భాగవతంలోనివే. పూతన తృణావర్త శకటాసురుల భంజనానంతరం ఇందులో రాధాకృష్ణుల వివాహం జరిగింది. బక ధేనుక ప్రలంబాసుర వధలు, కాళీయ మర్ధనం, ఇంద్రయాగ భంగం, గోపికావస్తాపహరణం, ఇవి రాధాకృష్ణుల వివాహం తర్వాత జరిగాయి. రాస క్రీడకు ఈ కావ్యంలో ప్రత్యేక స్థానమున్నది. జాహ్నవి జననం, పార్వతి కల్యాణం, ఇంద్ర, సూర్య, అగ్ని దుర్వాస,ధన్వంతరి మొ॥వారల గర్వభంగాలు ఈ కావ్య పూర్వ భాగంలోనే ఉన్నాయి. ఉత్తర భాగంలో శ్రీరామచరిత, కంసవధ, వృందోపాఖ్యాసం, రుక్మిణీ కల్యాణం, ప్రద్యుమ్న జననం, ఉషానిరుద్ధుల ప్రణయం, నారద సంసారం.... వ్రతాలు, స్తోత్రాలు, గృహస్థధర్మాలు.. ఇట్టా అనేక విషయాల వివరణలున్నాయి. ఇందులో రాధాదేవి యశోదకు, ఉద్ధవునికి జ్ఞానోపదేశం చేయటం ప్రధాన ఘట్టాలు. శంకర గణేశ జాహ్నవి, గౌరి, మోహిని మొ॥ స్తోత్రాలు పూజలు భక్తిభావ పూరిత సన్నివేశాలు. కవి మూలకథకు విధేయుడై ఆంధ్రానువాదం కావించాడు. ఇది బృహత్కావ్యం. రచన సాఫీగా ఉంది. కాని, లేఖక దోషాలు అనేకం చోటు చేసుకున్నాయి . రాసం నుండి రాధిక పుట్టినట్లు, ఆమె రోమకూపాల నుండి ఇతర గోపికలు జన్మించినట్లు, ఇంకా - ఇంద్రపత్ని శచీదేవి విష్ణుమూర్తిపై (ప్రేమనుచూపగా ఆ దేవదేవుడు ఆమెను రాధగా గోకులంలో పుట్టుమని చెప్పి తాను కృష్ణుడుగా అవతరించాడని 'పూర్వగాధాలహరి' లో ఉంది. అది ఏకావ్యంలోనిదో వారు తెలుపలేదు. శ్రీకృష్ణ జన్మఖండంలో రాధాకృష్ణుల కథ వివరంగా ఉంది. ఒక్క రుక్మిణీదేవి తప్ప కృష్ణుని ఇతర పత్స్షుల ప్రస్తావన దీనిలో లేదు. రాధ అతనికి మొదటి భార్య! కావ్యం చివరః అపుడు కృష్ణుండు రాధకు నాత్మ తత్వ, మెరుగ జెప్పుచు తన వృత్తమెల్ల దెలిపి ప్రకృతి రూపిణివంగనా వికృతి యెల్ల, నీదురూప మటంచు నన్నెలత బాగడె. అమ్మలగన్నయమ్మముగురమ్మల మూలపుటమ్మ- అని శివ భక్తులు దుర్గను ప్రస్తుతించినట్లే ఈ విష్ణుభక్తి కావ్యంలో రాధాదేవిది ప్రథమ స్థానం. ఉః అంత సరోరుహాక్ష్తుడు మృగాక్షిని గౌంగిట జేర్చి, రాధ! యా కాంత దయామతిన్‌ మదపరాధములెల్ల సహించు మంచున త్యంతము నూరడించిన యధా విధి రాధిక సంతసించెన య్యింతులు మించి మోదము వహించి రహిం బణ మిల్లిరంతయున్‌. రాధాదేవిదివ్య లోక గమన వర్ణనమిట్టున్నది. సీ. గోలోక వానులు కోరి వెంబడి రాగ, చెలువ గోలోకంబు జేరబోయి విరజానదీ తీర విభవంబు జూచుచు, శత శృంగ గిరి వనస్థలులు గనుచు మణిరమ్యమను రాస మండల మీక్షించి, బృందావన స్ఫూర్తి ప్రీతి గాంచి శత యోజనాయుత శ్రిత శాఖియై యొప్పు , నక్షయవట వృక్ష మధిగమించి గ. కోటి గోపీ సహస్రముల్‌ గొలువ బృంద, యెదురుగా వచ్చి సస్మితవదన యగుచు ప్రణుతి జేసిన సల్లాప పటిమ దనర, తన గృహంబున కేగి రాధా వధూటి।! గోపాలకృష్ణ కవి గారి శ్రీకృష్ణ జన్మఖండం యథామూలానువాదం. సరస రీతిలో చాసెదనని కావ్యాతారికలో తాను చెప్పిన మాటను కవి రచనలో నిలబెట్టుకున్నాడు.ో కవి - కావ్య నీతి ఇట్లాగున్నది. కృష్ణ జన్మఖండము - పుట 322.

మొదటి భాగం, [1 అధ్యాయం: అినీయర కాలు తెలుగు న్రారొళ్యం 93 బోధములేని బూరుషుడు బోడిమి దూలి స్వకర్మ బద్దుడై బాధల నొందుచుండు గత పాపము బోధము గల్లి సజ్జనుం డేధిత సర్వదోషముల నింధన జాలములగ్నిబోలి తే జోధికుడై దహించునత డార్తి వహించునె కర్మకోటిచేన్‌. కవికి తన కవనంపై ఎంత విశ్వాసమున్నా విమర్శక జనంప్తై భయం ఉండనే ఉంది. అది రెండవ కావ్యంలో వ్యక్తీకరించాడీవిధంగా. ఆవెః కడుపు నిండ కొన్సు గన్న వానికి నొకరి, కాన్పు మీద కరుణ కలిగినట్టు తాను కావ్యకర్త యైన వాడితరుల, కావ్యమరసి బ్రోచు గాదజగతి!” నహి వంధ్యా విజానాతి! నిజమే కదా! (సంవరణ చరిత్రము) 2. సంవరణ చరిత్రముః 'తపతీ నంవరణోపాఖ్యానం' హేర పురాణ ప్రసిద్ధమైన కథను కుందావజ్ఞుల గోపాలకృష్ణ కవి ప్రబంధంగా రచించారు. చాలా కాలం వరకు ఇది అలభ్యం. డా.బి.రామరాజుగారు 'వివేచన' డిసెంబర్‌ 1978లో మొట్టమొదట ఈ పబంధంలోని కేవలం ఒకే ఒక ప్రథమాశ్వాన్ని తాము మడికొండలో చూసినట్లు తెలిపారు. దానితో అలభ్యమనుకున్న ఈ కవి రెండవ కృతి ఈ మాత్రమైనా వెలుగులోనికి వచ్చి సాహితీపిపానువులను అలరించింది. 'సంవరణ చరిత్రము” శృంగార ప్రబంధం, ఇది శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం. లభించిన వ్రథమాశ్వాసంలో 233 గద్యపద్యాలున్నవి. వ్యాసకర్త కేవలం పది పద్యాలను మాత్రం ఉదహరించారు. ఈ శృంగార ప్రబంధాన్ని సైతం వైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు వినిపించినట్టుగానే విరచితం. ఈ ప్రబంధంలో ఇష్టదేవతానుతి షష్ట్యుంతముల అనంతరం హస్తినాపుర వర్ణన, చాతుర్వర్ణముల, చతురంగ బలాల, పుష్పలావికల వర్జనల తర్వాత కథానాయకుడైన నంవరణుని గుణరూప వర్ణన సాగింది. సూర్య పుత్రికయైన తవతిపై సంవరణుడు మోహం పెంచుకుంటాడు. స్వర్భామినులు సంవరణు ప్రశంసా గీతాలు పొడగా విని తపతి అతనిపై మరులు కొంటుంది. నారదుని వలన తపతి వివరాలు సంవరణుడు వింటాడు. సంవరణుని మృగయా వినోదం. (ప్రేయసి స్మరణ మోహావస్థలు చెలుల ద్వారా విని తపతి ప్రియునివై అనురాగం పెంచుకొని విరహతపనకు లోనవుతుంది. అంతటితో ఆశ్వాసాంతం, కవి దీనిని మహా ప్రబంధం అని పేర్కొన్నారు కనుక మరి నాలుగైదు ఆశ్వాసాల కథ ఉండి . ఉంటుంది. కవి రచన ఒక ఆశ్వాసంతోనే ఆగిందో, మిగితాభాగం వ్రాసినా లభించబేదోతెలియదు. ఆశ్వాసొది పద్యం - శా. శ్రీరంజిల్ల మనోజ్ఞ సౌధమున లక్ష్మీ భూవధూటుల్‌ ప్రియో దార స్వాను రతాను రాగ గరిమల్‌ తర్కింపగా గూఢ సం చారుండై చని భూమిదేవి నయనాబ్బాతంబులన్‌ మూసి శ్రీ నారిన్‌ చుంబన కేలి దేల్చు విభునిన్‌ భావింతు భావంబునన్‌. అది దక్షిణా నాయకుని శృంగార కేళి! బహు భార్యలున్న పురుషోత్తముని పాట్లు! శివ పార్వతుల నుతి ఇట్టుంది - | సీ. ఎక్కకోడెల మిన్న మెక్కగా విసమెన్న జడముడిపై పాల కడలి వెన్న, ఈ పద్య చరణాలన్నీ ఇలాగే అంత్యాను ప్రాన శోభితాలు. రాయల కాలపు ప్రబంధయుగ వర్జనలకు సమతూకం కలిగిన ఈ కవి వర్ణనలు మధుర భావగర్భితాలు, మనోహర పదబంధ ప్రసన్న శ్రైలీవిలసితాలు. నాయకుని వనవిహారంలో ఒక లతాకన్య ఇలా ప్రణయ ప్రియాపరిరంభణ భావాన్ని సూచించిందట!

వ! డా॥ మలయశ్చ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” చ. వికసిత పుష్పవక్రయయి విహ్వల భావగతాళి నేత్రయై యొకలతికా హిమాంశుముఖి యొక్క ధరారుహ యౌవనాథఢ్యున ల్ముకొని నృపాల మౌళి కటముంగటగా గల పద్మమిత్రపు త్రిక పరిరంభ కేళులను దెల్పె (ప్రమోద విధాన దక్షయై. విరబూసిన పూలమోముతో,కల్గోలంపాందిచలించేతుమ్మెదలకన్నులతో,ఓచంద్రవదయైనతీగె, ఒక బలమైన వృక్షాన్నికొగిలించుకొని,నాయకునికినాయికాపరిరంభనసూచననునేర్చుగా చేసినదట., ఇది కవి భావ ప్రౌఢథిమకు వర్ణనా దక్తతకు నిదర్శనం. వసు చరిత్రలోని భట్టుమూర్తి వర్ణనలకు సమ ఉజ్జీననిపించుకొనేదీ సరోవర వర్దన సీసం. సీ. హలా చరత్కీర బాలా గరుత్వాత, ఖేలా పతత్సూన కీలితంబు భారాళ సుమవారి పూరానుగ మిళింద, నారీ రితారావ చొరుతరము వేలా తటీ సంభవైలా లతోత్తాల, తాటాను చరకోకిలాలి యుతము కేళీ గృహీభూత నాళీక సంఘాత, పాళీ సమంచన్మరాళ యుగము గ. నిఖిల యువజన జన కలా నిరత సరసి, జాశుగా దీర్ణ సింహనాదాను కారి బర్జ్హినినదంబు తత్సరః పరిసరంబు, జగదధీశుండు సూచి యుత్సవము నొందె. భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుల పద్యాల తలపించే శైలీ పరిపాకం గోపాలకృష్ణకవి కలానిది. ఆయన సంస్కృతాంధ్రోభయ భాషల సముచిత పాండిత్యం కలవాడు. ప్రతిభకల కవి. కృష్ణ జన్మఖండం పురాణానువాదం, భావావేశవర్ణనలు కవితా చమత్కృతులు అంతగా లేనిది. అది మూల విధేయంగా సాగిన అనువాద పురాణం - భక్తి కావ్యం కాబట్టి, కవి రసిక పండిత పాఠకులను అనురంజింపజేయటానికి, తన కవిత్వపు సత్తాను చాటుకోవటానికి శృంగార ప్రబంధముగా సంవరణ చరిత్రమును రచించి ఉంటాడు. లభించినది ఏకాశ్వాసం. రచన రసవత్తరం. పూర్తి ప్రబంధం దొరికి ఉంటే కృష్ణ్ణాయల భువన విజయ నభాభవన ప్రముఖ కవుల ప్రబంధాల సరసన నిలువజాలిన ప్రొాఢ ప్రబంధాన్ని అందించిన ఖ్యాతి ఈ కరీంనగర్‌ జిల్ద్హాకు దక్కి ఉండేది. నాడు విదేశీయుల పాలన కాలంలో ఆంధ్రభారతి తమిళదేశ నాయక రాజుల ప్రొపులో పోషింపబడుతున్న అంధకార యుగంలో, తెలంగాణాలో వెండి వెన్నెల తెలుగు వెలుగు వెదజల్లిన పున్నమి చంద్రుడు గోపాలకృష్ణకవి, ేటికలోపలి రత్తాలు వారి కృతులు. ముద్రణా భాగం పొందితే కదా ప్రభా వ్యాప్తి! పొదవీఠికలు: క్‌ ఓ కు.గోపాలకృష్ణ కవి వంశంలో అయిదవ తరం వారైన కీ.శే.వెంకట నరసయ్య ఇందుర్తి గారు వ్రాసి ఉంచిన కాగితంపై ఈ విషయాలున్నవి. 2. గోలకొండ కవుల సంచిక - 1934; పు.398. 3. వవేచన - డిసెంబర్‌ 1978; పుట - 61 4. _గోపాలకృష్ణకవి వంశంలో అయిదవ తరం వెంకట నరసయ్య గారి తమ్ముడు రామచంద్రయ్య గారి అల్లుని తమ్ముడైన ప్రవీణ్‌ రావు (కొహెడ) గారి వద్ద కృజ.ఖం. వ్రాతప్రతి ఉంది. వారు ఈ గ్రంథంపై బెనారస్‌ యునివర్సిటీలో పీహెచ్‌.డి.చేస్తున్నారు. 5. డా.బిరాయరాజు గారు 'వివేచన' డి-75 సంచిక వ్యాసంలో చూపించింది.6. సంస్కృత ప్రతి ముద్రణ-1935, బ్ర.వైపు.ఉత్తర భాగం. 433-911 పుటలు. 7. యొనరన్‌ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్‌ బురాజూనళుల్‌ కెలుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో

మొదటి భాగం, 11 అధ్యాయం: లినింతర కొంర్ర తెంంగు నారొత్భ్యం 95 తెలుగుం జేయరు మున్ను భాగవతముం దీనిన్‌ దెఇంగించినా జననంబున్‌ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్‌. 8. డాఃపి.యశోదా రెడ్డి “తెలుగులో హరి వంశములు”-1973,లో (రానక్రీడ' విషయం తప్ప వేరే ప్రస్తావన లేదు. పు.66;515, 9. శ్రీనాథుడు 'భీవేశ్వర పురాణము” 1-3 ఊఉ. బాలిక మోము మత్తనవ బర్హి కిశోర కలాస్య లీల బై వాలిచిపచ్చ కప్పురపు వాసనతోడి ముఖారవిం దతాం బూలవు మోవిమోవిపయిమోపుచు రాధకు నిచ్చు ధూర్తగో పాలుడు ్రోచుగావుతమపార కృపామతి మంత్రియన్ననిన్‌. ఇందలి కావుతము పదం గమనార్హం “ 10. కె.ప్రవీణ్‌ రావు లెక్సరర్‌ గారు సైతం ఇదే మాట అన్నారు. 11. వివేచన - డిసెంబర్‌ - 1978 పు.63. 4. పరాంకుశం గోపాలకృష్ణయ్య ఈ కవి కాలం, జన్మ గ్రామం ఇదమిళ్సమని ఖచ్చితంగా నిర్ణయించగల ఆధారాలు లేవు. అయినా ఈ కవి కరీంనగర్‌ జిల్లా వారే అని విశ్వాసం, గోపాల కృష్ణ కవి కావ్యం ఒకే ఒక్కటి. అది “శ్రీరంగ మహాత్మ్యము” అముద్రితం. ఇది మూడాశ్వాసాల చంపూ కావ్యం. ఈ విష్ణుభక్తి ప్రబంధంలో దాదావు 500 గద్య పద్యాలున్నాయి. కవివంశంః ఇందులో కవి పరిచయ పద్యం ఏదీ లేదు. ఆశ్వాసాంత గద్యలు మాత్రం ఇట్టున్నవి. “ఇది శ్రీ వేణుగోపాల వర ప్రసాద లబ్ధ కవితా విలాన శ్రీమద్రామానుజ గోత్ర పరాంకుళ నూత్ర గోవిందార్య పౌత్ర, రామానుజార్య పుత్ర,పరాంకుశ సుధీవరానుజ, సజ్జన విధేయ గోపాలకృష్ణయ నామధేయ ప్రణీతంటబైన శ్రీరంగ మహాత్మ్యంబు నందు తృతీయాశ్వాసము” ప్రథమాశ్వాస గద్య ఇంతే. అందులో గ్రంథాన్ని మహాపుణ్యక్షేత్రమన్నాడు. అన్నగారికి సుధీ విశేషణం లేదు. ద్వితీయాశ్వాస గద్య చిన్నది. కవి పేరు తప్ప ఇతర వివరాలు లేవు. ఈ కావ్య గద్యలను బట్టి గోపాలకృష్ణ కవి వంశ వృక్షం ఇట్టుంటుంది. పరాంకుశం గోవిందయ్య (తాత) రామానుజయ్యే (తండ్రి) పరాంకుశయ్య - అన్న గోపాలకృష్ణయ్యే - తమ్ముడు (ఈ కావ్య కవి) కవికొలంః కాలాన్ని చూపే పద్యం ఈ కావ్యంలో లేదు. వ్రాత మాత్రం అచ్చు కాలానికి పూర్వపుది. క్రిష్ణ, అంత్తా, పద్య పాధాంతాల్లో లఘువు ఉండవలసిన చోట గురువు, ఇలా శాసనకాలాలను తలపిస్తుంది. కాని, జన సామాన్యంలో ఇటువంటి వ్రాతే ఈ శతాభ్దారంభం వరకున్నట్లు పెద్దలు అంటారు. వ్రాత ప్రతి చివర శ్రీగిరి లింబాద్రి, గర్రెపల్లి కందాళ రామయ్య గారి ప్రతి చూసి వంగలి రాజయ్య వ్రాసుకున్నాడు. తప్పులుంటే పెద్దలైన వారు తిట్టక దిద్దవలెను - అని ఉన్నది. కందాళ (డై) వారు శ్రీవైష్ణవులు. రామయ్య గారి పుత్రులు కూడా గతించారు. వంగళవారు వైశ్యులు. మానకొండూరులో ఉన్నారు. విచారించితే రామయ్య గారు కీర్తిశేషులు. వారి పుత్రులకీ విషయం తెలియదు. కాని, ఈ కావ్య ప్రతి లభించిన చిగురు మూమిడి వైశ్యులతో వీరికి బంధుత్వం ఉఊందని మాత్రం తెలిసింది. వీరందరూ ఈ శతాబ్లీవారే.

936 డా॥ మలయతశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కావ్యాంతంల్నోమ్రాత్రం “బహుధాన్య జ్యేష్ట బహుళ చతుర్దశి లక్ష్మీవారం* నాడు ఈ కావ్య రచన ముగించినట్టుంది. గత బహుధాన్య 1938లో పై తిథినాడు ఆదివారం. అది పై వ్రాత ప్రతి తిరుగద్రాసుకున్నవారి తేది అయి ఉండదు. 1878లోనో 1818,1758లోనో ఈ కావ్యరచన జరిగి ఉంటుంది. ఈకావ్యంలో శర్కర పదం ఒకే ఒకసారి వాడబడింది. శ్రీనాథుడు మొదట ఆ పదాన్ని వాడాడు. కవి కాలానికి ఆపదమేమైనా ఉపయోగిస్తుందా అంటే యజుర్వేదంలోనూ శర్కర పదం ఉందట. అది తీపికి పర్యాయ వాచి కాబోలు, ఈ కవి పూర్వ కవుల్లో “వాల్మీకి వ్యాస శుక సూతుల” పొగడి భగవద్భక్తిని చాటుకున్నాడే తప్ప మరే తెలుగు కవినీ పేర్కొనలేదు. కథా సంగ్రహం:- ప్రథమాళ్వాసంలో - కైలాన వర్ణన, శివుడు కొలువుదీరుట, నారదుడు బ్రహ్మలోకం నుండి కైలాసం వచ్చుట, మునుల సంస్తుతి, శివుని వలన నారదుడు శ్రీరంగ మహత్వం వినగోరుట, శ్రీరంగ క్తేత్రవర్ణనతో ఆశ్వాసాంతం. ద్వితీయాశ్వాసం - శ్రీరంగ విమానం బ్రహ్మవుష్కరిణి ఆవిర్భావం, ప్రళయజలధిలో వటపత్ర శాయి యోగనిద్ర, 'బ్రహ్మజననం, నలువ తపస్సు, హరి తన సుకునకు సృష్టి ఆధిపత్యము నాసంగుట, మధుకైటభులు వేదములను దొంగిలించుట, విష్ణుమూర్తి మత్స్యావతార మెత్తి రాక్షస సంహారం కావించుట, గరుడునిచే శ్రీరంగ విమానం తెప్పించి బ్రహ్మకు ఇవ్వగా అతడు దానిని మానస సరోవరమున ప్రతిష్టించుట. తృతీయాశ్వాసం - సూర్యవంశ వర్ణన. ఆ చక్రవర్తుల ఇలవేల్పు శ్రీరంగధాముడు. ఏక పద్యంలో రామాయణం. రాముడు విభీషణునకు రంగ విమానమును దయనేయుట, దానినాతడు కావేరి మధ్య తీరమున నిలుపుట, చోళరాజు ఉత్సవాలు నిర్వహించుట, క్షేత మహిమావర్దనతో కావ్య పరిసమాప్తి. కవితా విశేషాలు: కావ్యారంభ పద్యం శార్టూలం. శ్రీశేషాహి ఫణావళీ మణి ఘృణీ(న్‌) గేయ మానోరు తే జస్స్ఫూర్తి నివానునిన్‌ బుధ మనశ్శుద్ధాంతరంగోర్వివే లా సంవూర్ణ కృషాభిరాముని జగద్రక్షాను సంధానుల క్షీ సంభావుని నాత్మమూలుని హరిం జింతింతు నశ్రాంతమున్‌ ఈ కృతిలో లేఖక దోషాలున్నాయి. రెండవ పాదంలో యతి ప్రాస రెండూ తప్పాయి. ఈ పాదారంభ కవి ప్రయోగ పదమేదో తెలియదు. తర్వాత లక్ష్మీ (బ్రహ్మసరస్వతుల, గణనాయక కాళికాస్తుతులు కావించాడు. సరస్వతీ స్తోత్రం ఉత్పల మాలతో ఉంది. మానిత భక్తి యుక్తిని నమంచిత కార్యవిభూతికై బుధ తాణిని మంత్ర పూర్ణిని పురాణిని సంతత చారు వల్లకీ పాణిని భవ్యరూపిణిని పద్మజు రాణిని సేవ్యమాన గీ ర్వాణిని కీర సన్మధుర వాణిని వాణిని సన్నుతించెదన్‌. ఇందలి తత్సమాలు కొన్ని వ్యాకరణవేత్తలు ఒప్పరు. అవిచ్యుత సంస్కృత పద రూపాలు. పరాంకుశం గోపాలకృష్ణకవి గురువు శ్రీ మత్తిరుకోవెలూరి రామానుజులు. గురువు గారి గురువు ఆసూరి శ్రీనివాసాచార్యులు (శ్రీరంగంలో) ఈ కవిని పిలిచి ఈ కావ్యరచన చేయుమని ఆదేశించాడట. కం. నను జీరి దాసవాంఛను, జన కాత్మజ రమబణు పేర సదమల గతివే డృను రంగనాథ చరితము తెనిగించు మటంచు నాన తిచ్చిన నియతిన్‌.

మొదటి భాగం, 11 అధ్యాయం: అనీంతరీ కాం తెలంగు వ్రాహొత్యం 87 చివరి పాదంలో అఖండ యతి వాడబడింది. రంగనాథ చరితమును ఆంధ్రీకరించు మనటమే కాక శ్రీరామునికి అంకితం ఇమ్మని కూడా శ్రీనివాసయ్య గారే కోరినారు. మూలం సంస్కృతమే అయ్యుంటుంది. కాని, ఏ తత్కావ్య కవి నామాన్ని మాత్రం పేర్కొనలేదు. “నా రచియింపబూనిన శ్రీరంగ మహాత్మ్యంబను మహా పుణ్య చరిత్రమునకు కథాక్రమం బెట్టి దనిన” అని కవి వాకృచ్చాడు. ఇందలి శ్రీరంగ వర్ణన ఇట్టున్నది. సీ, శ్రీధరు నిజ పదా శ్రిత జనామర భూజ, కందంబు శ్రీరంగ మందిరంబు ఘన తత్వ మార్దెక సనకాది మునిజనా, నందంబు శ్రీరంగ మందిరంబు భాసమాన రమా నివాస సౌవర్ణార, విందంబు శ్రీరంగ మందిరంబు దివ్య సంచయ సదా సేవ్యమాన ముముక్రు, బృందంబు శ్రీరంగ మందిరంబు గీ. వుభయ కావేరి మధ్య మందొనర చంద్ర, పుష్కరిణి తీరమున మహాద్భుత విరాజ మాన సంపత్సమృద్ధి నమంద ధామ, సుందరంబగు శ్రీరంగ మందిరంబు. ఈ సీసంపై శ్రీనాథ పోతనల ముద్ర చక్కగా పడింది. ఈ పద్యమందలి ఛారాస్పద పద పాద్దైలీ ప్రసన్నత, అంత్యానుప్రాస కవి కవన శక్తికి నిదర్శనాలు - మనోహరాలు. శివుని వాక్యం - గీ. _దేవతలలోన శ్రీవిష్ణు దేవు కరణి, వేదములోన ప్రణవంబు వెలశినట్లు వైష్ణవ్లులలోన నావలె వసుధ దివ్య, మందిరములలో శ్రీరంగ మందిరంబు!

శివుడే విష్ణుభక్తుడైన ఇక శైవ విభేదమెక్కడిది? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నట్లు, ఇది సర్వం జగన్నాథం అనే హరిభక్తి సిద్ధాంత ప్రతిపాదనం.

దేవతల పూజా మహిమలు, ఆచారాల వివరణ, వాటి వలన కలిగే ఫలితాల ప్రకటన, ఈ కావ్యంలో ఉన్నాయి. కథ తక్కువ; వర్ణన లెక్కువ. నాయకీ నాయకులు, అష్టాదశ వర్ణనలు లేవు, కనుక ఈ గ్రంథాన్ని ప్రబంధం అనలేం - ఇది భక్తి కావ్యం! ఈ కావ్యం నాటి అనేక వ్యావహారిక ఆంధ్ర పద రూపాలను తెలియజేస్తుంది. లేఖక దోషాలు లేకుంటే బాగుండేది. ఉ॥ జెయము, చెంద్రుడు వంటి పదరూపాలున్నా, వాటికి యతి అత్త హల్గులతోనే విధించబడింది. జ్జను ర్దఅని వ్రాశారు. కొన్ని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు సైతమున్నాయి. 'యజ్జేశు డెజ్జ మయుడును భాగవతంలోని నడక గల ఈ కంద పద్యం అందమైన దైనా యజ్ఞ, శబ్దాన్ని ఎజ్జ అని నంధి కూర్చడం పొసగనిది. ఇలాగే మరికొన్ని భాగవత దశమ స్కంధోత్తర భాగంలోనూ ఎశోద వంటి కొన్ని ఒప్పని పదాలు ఉన్నాయి.

కవి ఒకసారి వెంకటనాథుని పేర్కొనడాన్ని బట్టి ఇడి విజయనగర కాలానంతర రచన అని చెప్పవచ్చు. కాకతి యుగంలో తిరుపతి వ్యాప్తి లేదు. ఇందులో భద్రాచల ప్రసక్తి కూడ లేదు కనుక మూల కావ్యం పెద్దనకు రామదాసుకు 16-17 శతాబ్దాలకు మధ్య కాలపుది అయి ఉండవచ్చు.

ఈ కావ్యంలోని 'మరిరెండు విశేషాలు, ఉరు పదం ఏ ఒక్కటి ఇందులో లేదు. ఇంకా ఇది ద్రవిడ దేశంలోని శ్రీరంగంలో విరచితమైనా, పైగా తమిళ భాషాప్రియుల వైష్ణవ గాధ అయినా తమిళ శబ్దం ఒక్కటి కూడా కన్మిప్రయోగించలేదు.

ఈ జిల్లాలో వలు గ్రామాల్లో పరాంకుశ గృహనామ సంకేత చాత్తాద వైష్ణవులున్నారు. ఎవరిని అడిగినా ఈ కవిని గూర్చి వారికి తెలియదు. ఈ కావ్యాన్ని వ్రాసుకున్న గల్టెపల్లి శ్రీ వైష్ణవులు భాగవత ఏకాదశ స్కంధంతో పాటుగా దీన్ని కలిపి వ్రాసుకున్నారు. ఇది వైష్ణవ భక్తికి ఈ జిల్లా కవులపై కల ఆసక్తికి నిదర్శనం అనుకోవచ్చు.

స్వస్థలం, కాలం న్పష్టంగా తెలువకున్నా పరాంకుశం గోపాలకృష్ణకవి ఈ జిల్లా వాడే అనటం అసంగతం కాదు. శ్రీరంగ మహాత్యంభక్తులనలరించే కావ్యం - అముద్రితం.

98 డా॥ మలయశ్రీ- ''కరీంనగల్‌ జిల్లా తెలుగు సొహిత్య చరిత్ర” పాదపీరికలు: 1 ఎం.సత్తియ్య, బి.ఓ.ఎల్‌. 'గోలి వెంకన్న పల్లి గారి వద్ద ఈ కృతి వ్రాతప్రతి ఉంది. 2. వ్రాత ప్రతి 49 డెమ్మీ1/8 పుటలు, మందాపు కాగితంపై నల్ల సిరా పలక కలం వ్రాత. పుటకు సగటున 10 పద్యాలు లెక్కిస్తే 490 ఉంటాయి. 450 కంటె తగ్గవు. 3. కరీంనగర్‌ ప్రాంతంలో శుక్రవారం లక్ష్మీవారం. ఖమ్మం నుంది కోస్తాంధ్రలో లక్ష్మీకారం అంటే గురువారం. 4. ఈ జిల్లాలో పరాంకుశం, తిరుక్కోవెలూరి, పరవస్తు, గృమనామాలతో చాత్తాద వైష్ణవులున్నారు. ఆసూరి మరిగంటి వారు శ్రీవైష్ణవులు. 5. రేకొండ, కొడిమ్యాల, రాయికల్‌, కొరుట్ల మొ!వి. అనుక్రుత - అలబ్ధ సాహిత్యం ఈ 17, 18 శతాబ్దాల రెండువందలేండ్ల కాలంలో కరీంనగర్‌ జిల్లాలో కావ్య కర్తలైనవారి (గ్రంథాలు లభించని కవులు అయిదుగురు. వారిలో ముగ్గురు గోలకొండ కవుల సంచికలో కనిపించారు. ఇద్దరు చాగంటివారి ఆంధ్రకవి తరంగణికెక్కారు. నలుగురి పరిచయాలు కరీంనగర్‌ మండల చరిత్రలో ఉన్నాయి. ఒక కవి పరిచయం కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్రలోనిది. ఈ కవుల పేర్లు ఇవి.

  1. రాజలింగ కవి, 2. సోమనాథ కవి, 3. కోడూరు వెంకటాచలపతి, 4. ఆత్తలూరు పొపకవి,
  2. సముద్రాల రామానుజా చార్యులు. ఈ కవులవారి రచనల వివరాలు వరుసగా చూపబడుతున్నాయి.
  3. రాజలింగ కవి - కోరుట్ల, 800 రాజలింగ కవిది కోరుట్ల. ఆరాధ్య (బ్రాహ్మణుడు. చెజకు లక్ష్మణ మంత్రి ఢ్రేరణచే 'కూర్మపురాణము"ను అనువదించి శ్రీశైలమల్లికార్డునునికి అంకితం కావించాడు. కాలం: చెజకు లక్ష్మణ మంత్రి కాలమేదో తెలియదు. కోరుట్ల్టలో రాజలింగకవిని గురించి తెలిసిన వారులేరు కాని, చెజుకు వారి ఇంటి స్థలాన్ని మాత్రం గడికోటకు పడమర వీధిలో చూపించారు. రాజలింగకవి కూర్మ పురాణకావ్య పూర్వ కవి స్తుతి పద్యంలోని కవుల కాలాలు ఈ కవి కాల నిర్ణయానికి కొంత వరకు ఉపయుక్తాలు, ఆ పద్యం ఇది: సీ. నన్నయ భట్టు దిక్కన్నను నెజ్బ్ఞయ, కవిని భీమనను భాస్కరుని బోత రాజును శ్రీనాథరామలింగయ్య ను, రంగనాథుని రామలింగకవిని సూరప రాజును గౌరపాహ్వయు ప్రౌఢ, కవి మల్లును కవి ఖైరవిని బెద్ద నార్యుని ముక్కు తిమ్మన్నను జిన్నన్న యాదిగా రసికులౌ యాంధ్ర కవుల- వీరిలో కవిత్రం 11-14 శతాబ్దాల మధ్య వారు. భాస్కర రంగనాథులది కాకతీయ యుగం 12- 13 శతాబ్దాల మధ్య కాలం. శ్రీనాథ పోతన గౌరనలు 15వ శతాబ్ది కవులు. ముక్కు తిమ్మన, తాళ్ళపాక చిన్నన్న తెనాలి రామలింగయ్య, పింగళి సూరన 16వ శతాబ్దివారు. కవి మల్లు భైరవి కవుల కాలాలు స్పష్టంగా చెప్పలేం. ఈ పద్యంలో రామలింగ కవులిద్దరున్నారు. మొదటి కవి, రాయల కాలపు తెనాలి రామకృష్ణుడు. రెండవ వ్యక్తి ధీర జన మనోభిరామం' రచించిన గోలకొండ విశ్వబ్రాహ్మణ రామలింగ కవి, 1784 కాలం వాడని గోలకొండ కవుల చరిత్రలో ఉంది.! బ్రాహ్మణ నిందతో (శప్పు విజయం అనే ఇతని కృతి ఆనందం బ్రహ్మానందం అనే పేరుతో గుజిలీ ప్రతుల్లో లభిస్తున్నది) పద్య కావ్యం వ్రాసిన ఆ రామలింగన్ని ఈ భక్త కవి రాజలింగశాస్త్రి స్మరిస్తాడా? ఒకవేళ అతనినే పేర్కొన్నట్టయితే ఆ రామలింగ కవి మరో వందేండ్లు పూర్వుడు కావాలి. ఎందుకంటే అప్ప

మొదటి భాగం, [1 అధ్యాయం: అవీంయత కాంవు తెలంగు ప్రాహొత్భం 99 కవి తన కావ్యంలో కూర్మపురాణ పద్యాన్ని ఉదాహరించాడు. అప్పకవి కావ్య రచనారంభం 1656 అని ఆ కావ్య అవతారికలో ఉంది అప్పకవి ఉదాహరించిన కృతి కర్త రామ లింగ కవి అతనికి యేబదేండ్దయనా పూర్వుడు కావాలి. కవులిద్దరు తెలంగాణావారు.” దీనిని బట్టి రాజలింగ కవి కావ్యం (క్రీ.శ. 1600 సుమారుగా పుట్టి ఉంటుంది. కవి 16వ శతాబ్ది ఉత్తరార్థంలో జన్మించి 17వ, శతాబ్ది పూర్వార్థంలోనూ జీవించి ఉంటాడు. కూర్మ పురాణం వ్రాసిన రాజలింగ కవి న్తుతించిన సూరపరాజు ప్రబంధకవి నూరననా? లేక, మరో పురాణానువాదకర్తయైన వెన్నెలగంటి సూరన్ననా? వెన్నెల గంటి సూరన పింగళి సూరన కంటె మరో నూరేండ్లు పూర్వుడు కాబట్టి రాజలింగ కవి స్మరించినది ఏ నూరననైనా అతని కాల.నిర్ణయంలో భేదం రాదు. స్వస్థలం:-“కోరువుట్ల పట్టణమాంధ్ర మండలములో గన్పట్టలేదు. నిజాము రాష్ట్రములో నుండెనేమో కవియు నచ్చటి వాడైయుండును” అని చాగంటి శేషయ్య గారు కావ్య పీ8కలోని పద్యాన్ని బట్టి పేర్కొన్నారు. అప్పటి నైజాం - హైద్రాబాద్‌ సంస్థానంలోనిదే ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా. కరీంనగర్‌ జిల్లా నుంచి నిజామాబాద్‌ వెళ్ళు బస్సు మార్గంలో జగిత్యాల - మెట్టుపల్లి పట్టణాలకు మధ్య కోరుట్ల పట్టణం ఉంది. వేములవాడ చాళుక్యుల కాలం నాటి దీని శాసన నామం కొరువుట్ల. ఆ చారిత్రక గ్రామమే జనవ్యవహారంలో కొరుట్లగా మారింది. రాజలింగకవి కరీంనగర్‌ జిల్లా కొరుట్ల వాడు. కవివంశవివరాలు:- కూర్మ పురాణ కావ్య గద్య ఇది. “ఇది శ్రీగిరీశ్వర వర ప్రసాద లబ్ధ కవితా విలాస అశ్వలాయన సూత్ర వసిష్టస దోత్ర పవిత్ర నరేశ్వర పుత్ర సకల విద్యా వ్రసంగాను షంగ రాజలింగ ప్రణీతంబైన శ్రీ కూర్మ పురాణంబను మహా ప్రబంధంబు నందు నర్వంబును షష్టాశ్వానము.” కవి బ్రాహ్మణుడు. అతనిది వసిష్ట గోత్రం - అశ్వలాయన సూత్రం. కవి తండ్రి వేరు నరేంద్రుడు. ఇప్పుడు కోరుట్లలో నాలుగైదు బ్రాహ్మణ కుటుంబాలున్నా, వారిలో పాలెం వారిది కాశ్యవ గోత్రం, వజ్జల వారిది హరితన గోత్రం. వసిష్ట గోత్రీకులు మాత్రం లేరు. ఆరాధ్య బ్రాహ్మణులున్నా వారు శేవలం ఒక తరానికి ముందు ఈ పట్టణానికి వచ్చినవారు. కవి ఆరాధ్య బ్రాహ్మణుడనడానికి నిదర్శనం అతడు వీరశైవ కవుల ప్రతేకంగా ఒక పద్యంలో స్తుతించడం. గీ. పండితారాధ్య దేశికు బాలకురికి, సోమనాయకు బిడుపర్తి సోము బసవ దేవు శరభాంకు ఘటిక సిద్ధేకు నాత్మ, లోన సన్నుతి సేయు దనూన భక్తి, ఇంకా స్వీయ పరిచయ వద్యంలో “వీర శైవశాస్త్రాగమ మార్గ నిర్ణయ రిరంనుడ”ననీ పేర్కొన్నాడు. కావ్యవివరాలు: వ్యాస ప్రోక్త కూర్మ వురాణానికి అనువాద చంపూ కొవ్యం రాజలింగకవి విరచిత శ్రీ కూర్మ పురాణం. కవి దీని ఆశ్వాసొంత గద్యలలో మహా ప్రబంధమని పేర్కొన్నాడు. ఇందలి ఆశ్వాసాలు ఆరు. చాగంటివారు కూర్మపురాణ ప్రతి తమకు ఎక్కడ లభించిందో తెలుపలేదు. “ఇతని కవిత్వము నరళమై ధారాశుద్ధిగలిగి మనోహరముగా నున్నది” అని మాత్రం ఒప్పుకున్నారు.” ఆంధ్రకవి తరంగిణిలో ఉదాహృతాలైన కూర్మపురాణ అవతారిక పద్యాలను బట్టి కవి కవన ప్రశస్తిని గమనించవచ్చు. కృతి వతి వర్ణన - శ్రీ పరమేశ పాద నరసీరుహ చింతను డగ్రజన్మ సం స్థాపనుడ ప్రమత్తు డరి సంచయ భంజను డుత్తముండు ధా త్రీపరిపాలన ప్రియ వితీర్ణుడు చెర్కు కులావతంనుడే భూపతి మించె గీర్తి పరిపూరిత సర్వదిగంత రాళుడై. కృతి పతి లక్ష్మణ మంత్రి తల్లి గాజుబాయి, తండ్రి నంగన మంత్రి+ వీరు మహారాష్ట్ర లాహ్మణులు. మహారాష్ట్ర విప్రులకు గృహనామాలుండవు. చెరుకు అనే ఇంటిపేరు ఈ వంశం వారికి తెలంగాణాలో సంక్రమించి ఉంటుంది. చెరుకు వారు ప్రస్తుతం జగిత్యాలలో ఉన్నారు.

100 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” కవి తనను గురించి చెప్పుకున్న వివరాలు, అతనికి మేలు వాడనయి యాస్తడనై సచివుండనై మహా హితవరినై సఖుండనయి యెల్లెడలన్‌ బెడబాయకుండియున్‌ తతము మృదూక్తులన్‌ శివ కథా కథనంబుల బొద్దు పుచ్చుచున్‌ కుతుకముతో వసించెదనకుంఠితవృత్తి గవుల్ను తింపగన్‌. శ్రీగిరి నాథ పాద సరసీరుహ చింతన వీరైైవ శా స్తాగమ మార్గ నిర్ణయ రిరంసు నిరంతర భీజనౌాెఘ సం యోగ మనస్కునుత్తమ గుబోచిత సంగ్రహ ధర్మవర్తనా భోగుని రాజలింగకవి పుంగవు మంజుల భాషు నన్నొగిన్‌.

అటువంటి మంత్రి ఇటువంటి కవిని సన్మానించి కావ్య రచనమునకాదేశించాడు. కోరుట్ల పుర వర్ణన -

గీ. హయ మద ద్విరద స్యందనా న్వితంబు - సాధు పుణ్యాంగనా జన సంశ్రయంబు

మహిత ధన ధాన్య రత్న సమంచితంబు - భూరి నికరంబు కారువుట్ల పురవరంబుి అప్పకవి అభేద ప్రాసకు నిదర్శనముగా చూపిన కూర్మపురాణ పద్యం: తోటకము: తాలిమి దూలిన తాపస పత్సుల్‌ - వ్రీడ మనంబున వీడ్కొని బాన్‌

లోల మదాలస లోచన పజ్కిన్‌ (పంక్తిన్‌) - జాల దలిర్చిరి శంకరు లీలన్‌, (అప్ప కవీయం; 3-37)

అప్పకవి ఈ పద్యాన్ని కూర్మో పురాణంలోనిదన్నాడే తప్ప రాజలింగకవిని పేర్కొనలేదు. మరో కూర్మవురాణ కవి పోటీకి లేనప్పుడు ఇది రాజలింగకవి కృత మనకతప్పదు. వ్రాత ప్రతిలోనూ ఈ పద్యం ఉండి ఉంటుంది.

“ఇతని పుస్తక మిష్పుడు తంజావూరి సరస్వతీ మహలు పుస్తక భాండాగారములో నున్నట్లు సాహిత్య చరిత్రకారులు నవ్రాసియున్నారు” అని కవిగణపతి రామచంద్రారావు ఇబ్రహీంపట్నం _ కరీంనగర్‌ జిల్లా వారన్నారు. ఆరుద్ర సమగ్రాంధ సాహిత్యంలో, నురవరం పప్రతాపరెడ్డిగారు కూర్చిన “గోలకొండ కవుల సంచిక' లోని శేషాద్రి రమణ కవుల సాహిత్య వ్యాసంలో ఈ కవి విస్కృతుడు.

అప్పకవి ఈ కవి కూర్మపురాణ కావ్యాన్ని ఉదహరించినమాట నిజం. కాని, రాజలింగకవిని పూర్వకవుల్లో స్తుతించాడని అనడం” అసంగతం. అప్పకవి రాజయోగ కవిని పేర్కొన్నాడు కాని రాజలింగ కవిని పేర్కొనలేదు.” ఆ రాజయోగి ఎవరనేది అప్పకవికే తెలియాలి.

శ్రీశైలనోథుని భక్తుడు, వీరైవ శాస్త్రాగమ వేది, ధీజనౌఘ స్నేహ మనస్కుడు, ఉత్తమ గుణోచిత సంగ్రహ(ణ) ధర్మవర్తనుడు, మంజుల భాషణుడు అయిన శివకవి రాజలింగ యోగి రచించిన (విష్ణుభక్తి కావ్యం శ్రీ కూర్మపురాణం. - పొదవీరికలు ;

  1. గోలకొండ కవుల సంచిక పూర్వ కవుల పరిచయంలో ఈ కవి 250 సం.ల పూర్వుడని ఉది.

అట్లా ఈతని కాలం 1934 - 250 = 1784 క్రీ.శ. అవుతుంది. 2. అప్పకవీయం : ౩3-371. 3. అప్పకవీయం - అవతారిక 33వ, పద్యం (1౫33) శాలివాహన నామాంక శకమున గజ, శైల, శర, సుధాకిరణుల సంఖ్య అ.క, పద్య పాదం. అష్టగజములు, సప్తకుల పర్వతములు, మన్మథుని పంచబాణములు, చంద్రుడు - అని ఆ సంఖ్య 8751 అవుతుంది. దాని తలకిందులు చేయాలి - 1578. శాలివాహన శకానికి 78 చేరిస్తే క్రీస్తుశకం. అంటే అది 1578+76 = 1656.

4, _రాజలింగకవిది కోరుట్ల కరీంనగర్‌ జిల్లా, అప్పకవిది మహబూబ్‌నగర్‌,

  1. _వెన్నెలగంటి సూరన ఆంధ్ర విష్ణు పురాణకర్త - దివాకర్ల 'ఆంధ్ర వాజయచరిత్ర' పు. 36.

  2. ఆంధ్రకవి తరంగణి - 1954; సంపుటి-11; పుట - 253.

మొదటి భాగం, 11 అధ్యాయం: అనంశ్రర్‌ కంర తెలుగు సారొత్య్యం 101 7. ఆంధ్రకవి తరంగణి. సం-11; పుట - 254. 8. ఆంధ్ర కవితరంగణి - నసం-11; పుట - 253 9. కూర్మపురాణము - అవతారిక; ఆం.క. తరంగణి - సం.11; పు. 253. 10. కరీంనగరం మండల చరిత్ర -1981; పు.25. 11 తే.గ. స్మార్తకర్మంబు లెరిగించి సభల బూజ్యు, జేయునల కొలిచలమల్ల సింగనార్యు నాగమములుపదేశించి నట్టి రాజ, యోగివర్యుని దలతు విద్యా గురులను - అ.క.1-31. 2. సోమనాథ కవి - లేములవాడ; 1650 వసుచరిత్ర వ్యాఖ్యాతగా లబ్ధ ప్రతిష్ణుడైన విద్యత్థని సోమనాథుని కృతులు అయిదు.

  1. చతుర్భుజాభిషేకము, 2. ధధ్రువచరిత్ర, 3. మరుత్సందేశము, 4. ముద్రాలాభము, 5. గంగాగౌరి సంవాదము, 6. వసు చరిత్ర 'విద్వన్మనో రంజనీవ్యాఖ్య'. కాలము: ఆ కవి కాలం క్రీ, శ. 1750 ప్రాంతమని బ్రౌను నిర్ణయం. ఇది సరికాదని ఈ సోమనాథుడు 1650 వాడని శేషాద్రిరమణ కవులు 'గోలకొండ కవుల సంచికలో "పేర్కొన్నారు. ' 17వ శతాబ్ది అనుటే ఆమోదయోగ్యం. బ్రౌను కోస్తారాయలసీమ ప్రాంతాల్లో సంచరించారు. లేములవాడకు వెళ్ళినవారు కారు. ముఖ్యంగా రమణకవి - ధూపాటి వేంకటరమణాచార్యులు కొన్నాళ్ళు కరీంనగర్‌లో ప్రభుత్వో పాధ్యాయులుగా పనిచేశారు. వారు వేములవాడను సందర్శించారు. ఓరుగల్లు ఆయన స్థిరనివాసం. స్థలము; కవి తనది లేములవాడ అని స్పష్టంగా చెప్పినాడు. ఊఉ. శ్రీ మెలయన్‌ సమస్తముని సేవితమై విలసిల్లుచున్న యా లేములవాడలో వివిధ లీలలు చూపి జగంబు బ్రోచునా సామికి రాజలింగమను చక్కని నామము గల్లు వానికిన్‌ శ గామిత దాయికర్పితముగా నొనరించెద నీ నిబంధమున్‌. వంశ వివరాలు: సోమనాధ కవి నియోగి బ్రాహ్మణుడు. ఆత్రేయ గోత్రము. కవి తాతగారు సోమ మంత్రి; తండ్రి సిద్ధేశ్వర మంత్రి; అన్న హేమాద్రి. ఈ విషయాలన్నీ వను చరిత్ర వ్యాఖ్యాన గ్రంథ గద్యలోనివి. ఇది తెలుగు గ్రంథమైనా ఆశ్వాసాంత గద్యలు సంస్కృతంలో ఉన్నాయి. ఉదాహరణకు ఒక గద్య చూడండి. గద్య॥ శ్రీమదాత్రేయకుల కలశాంభోనిధి సంపూర్ణ సోమ,సోమ కులాభి ధాన మంత్రివర పౌత్రేణ, సోమనుత సిద్ధేశ్వరమంత్రీశ్వరన్య పుత్రేణ, శ్రీ మత్సార్వతీ రాజేశ్వర ప్రసాద సమాసాదిత హృద్యానవద్య నిఖిల విద్యా విశారదేన, సోమనాథ నామ్నా విరిచితాయాం వసుచరిత్ర వ్యాఖ్యాయాం విద్వజ్ఞన రంజనీ సమాఖ్యాయాం ప్రథమా శ్వాస న్సంపూర్ణవే రచనలవివరాలు: “సోమన (గ్రంథాలలో విద్వజ్ఞన రంజని తప్ప తక్కినవన్నీ అలబ్బమే” అన్నాడు డా॥ రవ్వా శ్రీహరిగారు తమ “తెలుగులో అలబ్ధ సాహిత్యం” గ్రంథంలో." ల ం రామరాజ భూషణునికి “మోప కొలము వాడైన వసుచరిత్ర వ్యాఖ్యాత సోమకవి” 'కారణజన్ముడై యన్న పద్యమున వసుచరిత్రకారుడు భట్టుమూర్తి యని సేర్కొనెను-” చెతైల్పుగు భాషలో వసుచరిత్రమునకు ఎన్నియో వ్యాజ్యలున్నవి. వీనిలో సోమకవి వ్యాఖ్య సుప్రసిద్ధమైనది. ఈతడు కరీంనగరము మండలములోని లేములనాడ వాస్తవ్యుడు'' అన్నారు డా. కె సుప్రసన్నాచార్యులు “వసుచరిత్ర పీఠికలో శేషాద్రి రమణ కవులు వసుచరిత్ర వావిళ్ళవారి ప్రతిలో సోమనాథుని వ్యాఖ్యను ప్రశంసించారు. సోమనాథుడు “దానియందు వ్యాఖ్యానించని వానిని మేము వ్రాసినా మని వసుచరిత్ర వాఖ్యానమునందు శేషాద్రి రమణ కవులు పేర్కానిరి” అని జి. రాంరెడ్డి “కరీంనగర్‌ జిల్లా కవులు' అనే వ్యాసంలో పేర్కొన్నారు"

102 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాపాత్య చరిత్ర” సోమనాథకవి తన రచనల గూర్చి వసుచరిత్ర వ్యాఖ్యలో వ్రాసుకొన్న అవతారికా పద్యాల బట్టి ఆయన వ్రాసిన కావ్యాల పేర్లు తెలుస్తున్నవి. ఉ. సాంబశివాంఘి పద్మములు సన్మతి మొక్కి చతుర్భుజాభిషే కంబను సత్ర్రబంధము జగద్విదితంబుగ జెప్పితిన్‌, మురా రింబస గొల్చి యా ధ్రువచరిత్ర రచించితి నీప్రబంధముల్‌ సాంబ మురారి హృద్య బహుళార్థ చమత్కృతి శబ్దచిత్రముల్‌. ఇందలి కృతులు 1. చతుర్భుజాభిషేకము; 2. ధ్రువ చరిత్రము. క. పేళశల గంభీర సదా, వేశ మనోహరము గాగ వెలసె మరుత్సం దేశము ముద్రాలాభం, బీ శార్చణ బుద్ధిచే మదీరిత మగుచున్‌. 3. మరుత్చందేశము, 4. ముద్రాలాభము ఉ. గంగయు గౌరి యిద్ధరన = యొప్పగ 'సేయువాదముల్‌ రంగులు మోజి సెప్పితి నిలా తలవాసి కలా కలాపులె "| ల్లంగడు మెచ్చ నీశ్వర వరంబున నన్ను భజించునట్టివి ద్యాంగన హావ భావములుదార గతింగను పట్టుచూడగన్‌. 5. గంగా గౌరి సంవాదము శా ఈ రీతిన్‌ గవితా వితాన వృత గౌరీశాన మౌళి సో దారోద్దేశుడ నైన నాకు వెస విద్యావంతులెల్లన్మనో హారి ప్రక్రియ మూర్తి చే విరచితంబై విశ్రుతంబీవసు క్నారాట్బిత్ర చరిత్ర టీక కటు యుత్సాహంబు పుట్టించినన్‌. 6. వసుచరిత్రటీక లేములవాడ రాజేశ్వరున కంకితముగా తానీ వ్యాఖ్యానం రచించానని చెప్పుకున్నాడు. వసుచరిత్ర వ్యాఖ్యాన గ్రంథాలలో సోమనాథుని వ్యాఖ్య మొదటిది. శేషాద్రి రమణ కవులు గో.క,సం.లో సోమనాథునివిగా పేర్కొన్న నాలుగు గ్రంథాలలో యావన చరిత్రము మూడవది. వసుచరిత్ర వ్యాఖ్యనుండి కవి రచనల పేర్లు ఉధృతములన్నా (ధ్రువచరిత్ర మరుత్పందేశ ముద్రాలాభాల వారు చెప్పనేలేదు (పుట. 415). గజ్జెపల్లి సత్యనారాయణ రాజు గారు కూడా కమం,.చ.లో వసుచరిత్ర వ్యాఖ్య చతుర్భజాభిషేకం, యావనచరిత్ర, గంగాగౌరి సంవాదములనే పేర్కొన్నారు (పు. 14) యావన చరిత్ర ఎక్కడిదో తెలియదు. సోమనాథుడు ఆ పేరుతో తాను కృతి నిర్మించినట్లు చెప్పుకోలేదు. వసుచరిత్ర ప్రబంధాన్ని, ఆ కావ్యకర్తయైన భట్టు మూర్తిని సోమనాథకవి ఘనంగా సంస్తుతించాడు. ఆ పద్యాలివి. ఉ. కారణ జన్ముడై కవినికాయము మెచ్చగ గావ్య కర్తయై భూరికళా కలాపుడయి పొల్పు వహించెడు భట్టుమూర్తిచే నీరితమై ఘనార్ధ పదహీన పదాస్పదమైన యా వసు క్ష్మారమణ ప్రవృత్తము సుసాధ్యముగాదు తలంచి చూడగన్‌. శా నానా సూన రసాళి నేగు తలమై నానార్థ సౌరభ్య (ము) న్నానా మ్లాన పద ప్రసూనములకున్నా కేశ్వరావాసమై నానా శాస్త్ర రహస్య రత్నములకున్‌ రత్నాద్రియై యొప్పునా _నానాలిరకళక' పేటి. టీకకయి పూనన్‌ శక్యమే యేరికిన్‌.

మొదటి భాగం, 11 అధ్యాయం: అనంతర కాంవు తెలగు సారొత్యం 103 అసాధ్యమైన కార్యమంటూనే దాన్ని సుసాధ్యంచేసి చూపిన విద్యచ్చ్భిఖామణి సోమనాథుడు. ఈ పండితుని వసుచరిత్ర వ్యాఖ్య అముద్రితం. ఈ విద్యత్కవి విరిచితపంచపద్య కావ్యాలలో ఏ ఒక్కటీ లభించకపోవడం బాధాకరం. పాదపీఠికలు ;

  1. గోలకొండకవుల సంచిక - 1934; వు. 415. 2.వసుచరిత్ర వాఖ్యాన గంథావతారికనుండి. _
  2. చాగంటి శేషయ్య - “కవి తరంగణి' - సం. 12; పు, 96.
  3. డా॥ రవ్వా శ్రీహరి “తెలుగులో అలబ్ధ వాబ్మయము' - 1993; పు. 29.
  4. కె. సుప్రసన్నాచార్యులు - 'వసుచరిత్ర' - తెలుగు విజ్ఞాన పీఠ ప్రచురణ, హైదరాబాద్‌; పీఠిక; పు. 4, 33. 6. 'ఆంధ్రభూమి' దినపత్రిక - ఆదివారము. తేది. 9.5.1976. ౩. కోడూరి వెంకటాచలపతి - కోరుట్ల 7౦౦ వేంకటాచలపతి కోరుట్ల ములగనాగ ప్రభుని అస్థాన కవి. ఆ రాజు కోరికవై ఈ కవి “సార్కదపురాణము'ను అనువదించాడు. అని ఇక్కడి సాహిత్య కారులన్నారు. కాలం; కోడూరి వెంకటాచలపతి రచించిన “శివరహస్యఖండము" లేనిదిగా డొ! రవ్వా శ్రీహరిగారు ఈ క్రింది పద్యాన్ని చూపారు. అతని నభిరామ వాసుదేవాది కా - వ్యముల రచియించి ప్రఖ్యాతినంది నట్టి ఘనునినెడవల్లి వేంకట కవి వరేణ్యు - నస్మదీయ విద్యా గురు నభినుతింతు. ఇది కవిగారి గురు ప్రసక్తి. అంతే కాని వెంకటాచలపతి స్థల కాల సూచనలేవీ శ్రీహరి గారు “తెలుగులో అలబ్ధ వాబ్మయం'లో చూపలేదు. శివ రహన్యఖండము ప్రతి మదరాను ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో నం.డి.322 గా ఉందని మాత్రం తెలిపారు. శివరహస్యఖండం స్కాంద పురాణంలోని భాగం కావాలి. కోడూరి వెంకటాచలపతి మేనమామ గునుగుటూరి వేంకటకృష్ణకవి శ్లేషకవితా పితామహుడట. ఆయన 'నలయాదవ రాఘవ పాండవీయము' అనే పేర నాలుగర్థాల శ్లేష కొవ్యాన్ని రచించినాడు... వేంకటకృష్ణకవి స్వస్థలం ఈ మండలం అగునో కాదో కాని, ఆయన కాలం క్రీ. శ. 15850. కాబట్టి మామకంటె అల్లుడు ఓ ఇరవై, ముప్పై యేండ్లు పిన్నవాడై ఉంటాడు. అందుచేత వెంకటాచల కవి 17వ శతాబ్ది ఉత్తరార్థం వాడు. వేంకట నామాలు కాకతీయుగంలో కానరావు. విజయనగర చక్రవర్తుల కాలంలోనే తిరుపతి ఖ్యాతి. రాయల యుగానికి తర్వాతి వాడు ఈ కవి. కవి వంశవివరాలు తెలియలేదు. వెంకటాచలం వైష్ణవ నామం. శివకుమార చరిత స్కాందం. కవి స్మార్తుడో - నియోగి బ్రాహ్మణుడో అయి ఉండవచ్చు. కావ్యవివరాలు;:స్కాంద పురాణం పద్యకావ్యం. అందులో కొంత భాగం మాత్రమే ముద్రితమైందని మిగితా భాగం నష్టమై పోయిందని, కవిత మనోహరంగా ఉందని శేషాద్రి రమణ కవులు “సారస్వత జ్యోతి'లో “కరీంనగర్‌ మండలము" అనే వ్యాసంలో చారిత్రక సాహిత్య విశేషాలు తెలుపుతూ (వ్రాశారు నిజానికి 'శివరహస్య ఖండము" ముద్రిత గ్రంథాలు 2 సంపుటాలు కరీంనగర్‌ జిల్లా కథలాపురం (మండల కేంద్రంలో యక్షగాన రచయిత కీర్తి శేషులు పులికాంత గంగాధరయ్య గారి అనుజుడు చిన్నరాజయ్య గారి కుమారుడు) అధ్యాపకులు పి.విద్యాసాగర్‌ కవి గారింట లభించాయి 1996.) స్కాందపురాణాంతర్గత “శివరహన్య ఖండం' మొత్తము ఏడు కాండలు. అందులో 1సంభవ 2. అసుర, కాండద్వయం (ప్రథమ సంపుటి)
  5. వీరమహేంద్ర 4. యుద్ద, 5.దేవ.(రెం.సం.) 6.దక్ష (3వ, సం.) 7. ఉపదేశ(4వ, సం)

104 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపాత్య చరిత్ర” మొదటి 2 సంపుటాలు కనిపించాయి. శ్రీశుకశ్యామలా రామలింగేశ్వర గ్రంధమాల ప్రకటితముగా వీర భద్రేశ్వరారాధ్యులచే (నందిగామ-కృష్ణా జిల్లా) ప్రచురింపబడింది. బెజవాడలో ముద్రితం,

ప్రథమ సంపుటి - 19333 - 3రూ॥ ద్వితీయ సంపుటి - 1931 - 3రూ॥ గ్రంథప్రకాశకులు ఇట్టా తెలిపారు.

“ఏ తత్కృతి ప్రభేత కోడూరి వేంకటాచల కవీంద్రుడు. "ఇతడు బాలసరస్వతీ బిరుదాంకితుడు. ఆరువేలని యోగి బాహ్మణుడు. కాశ్యపగోక్రుడు, ఆపస్తంభసూత్రుడు, శివ భక్తుడు, యల్లనామాత్య పౌత్రుడు, లక్ష్యంబికా శంకరామాత్యుల యాత్మజుడు, యడవల్లి వేంకట కవివరేణ్యుని శిష్యుడు. ఇతడు 17వ, శతాబ్ది తుదిని ఉండెనని చరిత్రాన్వేషకులు, తలంచుచున్నారు.

ఈ కవయిత అఖండ పాండితీ ధురంధరుండు. నిరర్గళ కవితాధారా పరిపాటి పరితోషితో భయభాషాకవి ప్రకాందుండు పురాణోచిత రసవన్కదుల పద భూయిష్ట రచనా ధురంధరుండని విద్వత్క వీంద్రాశ్రయమునెల్లెడ నాకర్షించుచున్నాము.

ఏ తత్కృతి పతి ముళువాగళు ప్రభుండు ఈతడు వీరశైవుడు, బళ్ళారి ప్రాంతవాసి, జమీందారుడునై యుండునని శోధకులనుచున్నారు. కృతి పతి-కృతి ప్రణేతల విశేషము లెరుంగ గోరుచున్నారము. కృతి ప్రతి-కృతి ప్రభేతల విశేషము అటెరుంగ గోరువారు కందుకూరి వీరేశలింగము గారి ఆంధ్ర కవుల చరిత్రము తృతీయ భాగము 52వ, పుటలో 19 కవి యను శీర్షిక క్రింద జదువనగునని వేడికోలు.12 నందిగామ-9-6-33

ఆశ్వాశాంత కావ్యగద్య ఇట్టుంది-

“ఇది శ్రీమదిందు ధర సుందర పాదార విందార్సిత హృచ్చత పత్ర సకల సుకవి జనాను గ్రహ పాత్ర సుగుణ స్తోత్ర పవిత్ర చరిత్ర కాశ్యప గోత్ర కోడూరి యెల్లనామార్య పౌత్ర శంకరామాత్య లక్ష్యంబికా తనయ వినయ విధేయ బాలసరస్వతీ నామాంక వేంకటాచల కవి ప్రణీతంబైన స్కాంద వురాణాంతర్గత శ్రీశంకర సంహిత యందలి శివరహన్య ఖండంబున సంభవ కాండంబునందు బ్రథమాశ్వాసము సంపూర్ణము”-

కృతికర్త స్వీయపరిచయపద్యం-

13 నను జంద్రార్హ కిరీట సేవనరతున్‌ నానా కళాభిజ్ఞు స ద్వినయున్హాశ్యప గోత్రు గోడురి పురాధిష్రాను నెల్హార్య నం _ _ దనుడౌ శంకర మంత్రి పుత్రు గవితా ధారా గరిష్టుం బియం బున రావించి సభా స్థలిం బళికె విస్ఫూర్ణద్వచో మాధురిన్‌, ఈకవి ఇంటి పేరే సొంతూరి పేరు. అది కోడూరి అని పై పద్యం తెల్పుతున్నది. కవిది బళ్ళారి

(ప్రాంతమని గ్రంథ ప్రకాశకులు తెలిపారు. కృతి స్వీకర్త ములువాగలు ప్రభువు. పేఠేమో గాని! మళువాగలూరి కోట కట్టించినాడని అవతారిక 25వ, కంద పద్యంలో ఉంది. ఇంకా కృతి పతి వంశ పూర్వులు మధుర (35వ, మత్తేభం) కంచి (23వ, వచనం) జయించినారని ఉంది. ఇక ఈ వేంకటాచల కవికి అతని కృతి ప్రతికి కొరుట్లకు సంబంధమేముందో తెలియదు. కొరుట్లలో కోడూరి వారున్నారు. కొని వారు పద్మశాలీలు. ఈ కవిని గూర్చి చెప్పుకోరు. మళువాగళు ముచ్చటైనా ఇక్కడి వారికి తెలియదు. కోడూరి వేంకటాచల కవి కొరుట్ల వారుగా కనుపట్టుట లేదని (ఇక్కడి వాడని ప్రచారం చేసిన వారి వాదం అసంగతం అని ) తెలుపుటకే ఇంత కావ్య- చరిత్ర సమాలోచనం చేయడమైనది.

మొదటి భాగం, 1 అధ్యాయం: అనీంతర్‌ కాంపు తెలగు పాహ్‌ష్టాం 105

అలభ్యమనుకున్న కావ్యం ముద్రితం లభ్యం అనే సమాచారం తెలిసింది. పైగా ఈ స్కాంద పురాణాంతర్గత 'శివరహస్య ఖండము'ను కోడూరు వేంకటాచలకవి మాత్రమే కాక, వంకాయల పాటి వీర భద్ర కవి, రేవూరి అనుంతయజ్వ సైతం అనువదించారని కోడూరి వేంకటాచల కవి కావ్య ప్రథమ సంపుటిలో ప్రకాశకులు తెలిపారు. పొదపీఠికలు :

  1. డా! రవ్వా శ్రీహరి - “తెలుగులో అలబ్బ వాజ్మయం” - 1993; పు - 6.

  2. గట్టెపల్లి - 'కరీంనగరం మండల చరిత్ర' పు. 14.

  3. సారస్వత జ్యోతి - (కైమాసిక పత్రిక) కరీంనగరం; ఫిబ్రవరి - 1954.

సం. బోయినపల్లి వేంకటరామారావు. 4. అత్తలూరి పాపకవి - వేములవాడ, [6550-1700

అత్తలూరి పాపయ్య కవి ఆరాధ్య బ్రాహ్మణుడు. చెన్న బసవ పురాణం ఈతని కృతి.

కవి స్వస్థలం వేములవాడ. ఆ పట్టణంలో ఇప్పటికీ అత్తలూరి వారున్నారు. ఇదే వంశములో అత్తలూరి విశ్వనాథ శాస్త్రికి ఈ ఇరువదవ శతాబ్ది పూర్వార్థంలో ఉండేవారు.' గో.క. సంచిక 1934 నాటికి వారు 26 ఏండ్ల వయస్సువారు.

ఈ పాపయ్య కవి గారిని ఏ కవి చరిత్రకారుడూ పేర్కానలేదు. ఒక్క “కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్రలోనే వీరి పరిచయం చేయబడింది. విశ్వనాథశాస్త్రి వంశ పూర్వీకులుగా శరభాంకుని పాపకవిని గో.క.సం. కవి పరిచయంతో పేర్కొన్నారు.

ఏ సాహిత్య గ్రంథంలోనూ చెప్పని చెన్నబసవ పురాణం శరభాంకకవి రెండవ రచనగా ఒక్క గజ్జెపల్లి సత్యనారాయణ గారు మాత్రమే చెప్పటం జరిగింది. అది వ్యానకర్త పారపాటువల్ల జరిగి ఉంటుంది. ఎందుకంటే చెన్న్షబసవ పురాణం ఈ పాపయ్య శాస్త్రిగారి కావ్యంగా వినికిడి. శరభాంకుడు వ్రాసినట్లు వ్యాప్తి లేదు. పైగా పాపయ్య శాస్త్రి పేర మరోకవి ఈ జిల్లాలో విక్రమార్కీయం రచించాడు. అతనిది కొరుట్ల. ఈ ఇద్దరు పాపయ్య కవుల మధ్య ఒకరి పేరు ఎగిరిపోయ ఆ రచన శరభాంకుని బేరి ఉంటుందని అనుమానం, ఇది నిజమే. గో.క.నం. లోని ఈ వాక్యం చూడండి.

“నూ వంశముల పురుషుడు (లు) శరభాంకుడు ఆత్తలూరి పాపకవి మొ! కవులు శరభాంకలింగ (శతక) ము చెన్నబసవ పురాణ(ము) కర్త(లు)' పై గజిబిజి వాక్యం గజ్జెపల్లి వారిని తప్పాదారి పట్టించి ఉంటుంది. కవులిద్దరు. కావ్యాలు రెండు క్రమాలంకారంతో చూస్తే ఏ పేచీరాదు.

అత్తలూరి పాపయ్య గారి 'చెన్నబనవ పురాణం' అలబ్ధకృతి. పాదపీఠికలు :

1 గోలకొండ కవుల సంచిక - 1934; నం.26. 2. మలయశ్రి "కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్ర - 1981; పు, 6. 3. గో.క. సం. పు - 355. 5. సముద్రాల రామానుజాచార్యులు - కోరుట్ల, 784 రామానుజాచార్యులు రచించిన ఆముద్రిత కొవ్యం “న్సశీలోపాఖ్యానము”.

కాలం:- గోలకొండ కవుల సంచిక, పుట. 407లో ఈ కవి 150 సం. పూర్వుడన్నారు. 1934-

150=1784. కవి 18వ శతాబ్ది ఉత్తరార్థంవారు.

106 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చర్విత”

వంశళం:- వంశ వివరాలు గో.క.నం.లో ఇవ్వలేదు. కాని ఈ కవి “కోరుట్ల ప్రాంతమున గల నముద్రాలవారను వైష్ణవ కుటుంబమునకు చెందినవాడు” అని వ్రాశారు. కోరుట్లలోని శ్రీ వైష్టవ్రులలో సముద్రాల గృహనామంవారున్నారు.

గోలకొండ కవుల సంచికలోని నం. 59. కవి, మరో నముద్రాల రామానుజాచార్యులు కోరుట్ల

వారే. ఆ కవి తమ పరిచయం “వాధులాన్వయజాతేన శ్రీరామానుజ ధీమతా” అని గో.క,సం. 54వ పుట శ్లోకంలో, “గోత్రమా విమల చారిత్ర శ్రీవైష్ణవ నన్నుత వాధూలసాన్వయంబు' అని 358వ పుట పద్యంలో పేర్కొన్నారు.

సుశీలోపాఖ్యాన కర్తది సైతం వాధూల వంశం - గోత్రం; విశిష్టాద్వైత మతం. కావ్యపరిచయం - సుశీలోపాఖ్యానం ఆలభ్యకృతి.

“ఈకవి కృత గ్రంథము కొరుట్లలో లక్ష్మణరాయ గ్రంథాలయములో గలదు” అని గో.క.సం.లో వ్రాశారు. కాని, ఇప్పుడా (గ్రంథాలయంలేదు. కవి కృతి వ్రాత ప్రతి సైతం లభించలేదు. ఆ పేరుతో ఏ [గ్రంథాలయం కోరుట్లలో ఉన్నట్టు వినరాలేదు.

'పై రెండవ స.రామానుజాచార్యుల భాతృపుత్రుబైన సముద్రాల వేంకటనరసింహాచార్యుల వారిని (80 పం. వయస్సు) సంప్రదించికే సుశీలో పాఖ్యానకర్త రామానుజాచార్యుల గూర్చి తాము వినలేదన్నారు. ఉభయులు ఏక వంశీయులే. కాని, రెండవ రామానుజాచార్యుల పుత్రులు రఘునాథాచార్యులు సుశిలో పాఖ్యాన కర్తను గురించి తమ తండ్రి చెప్పేవారన్నారు.

పద్దెనిమిదవ శతాబ్ది సముద్రాల రామానుజాచార్యుల 'సుశీలోపాఖ్యానం' అలబ్బకృతి.

సాహిత్య సమాలోకనం - 3

చరిత్ర: ఈ రెండు వందలేండ్ల (1600-1800) కాలంలో కరీంనగర్‌ జిల్లా ప్రాంతం అచ్చంగా గోలకొండ ముస్లింల పాలనలో ఉంది. 17వ శతాబ్దిలో కుతుబ్‌షాహీల పాలన సాగింది. 1687లో ఢిల్లీ చక్రవర్తి బౌరంగజేబు తానీషానోడించి గోల్కొండను జయించడంతో కుతుబ్‌షాహీల పాలన అంతరించి తెలంగాణా ప్రాంతం ఢిల్లీ మొఘలు పాలనలోకి వెళ్లింది. తానీషా మాము అబ్బుల్లా 1626-72 తన మరో కూతురును బెరంగజేబు కుమారునికిచ్చి పెళ్లి చేసినా గోలకొండ పతనం తప్పులేదు.

తానీషా సేనాని మహా మంత్రి, అక్కన్న మాదన్నలు. వారి మేనల్లుడు భద్రాచలరామదాసు. అది మరాఠా ఛత్రపతి శివాజీ కాలం. 1707లో బెరంగజేబు మరణంతో గోల్కొండ సుబేదారుగా ఉన్న నిజాం ఉల్‌ ముల్క్‌ ఆసఫ్‌జా 1713-48 స్వతంత్రించాడు. అప్పటి నుండి భారత స్వాతంత్ర్య లబ్బి- తెలంగాణా విముక్తి 1947-8 వరకు కరీంనగర్‌ ప్రాంతం హైదరాబాద్‌ అసఫ్టాహీల పాలనలో ఉంది.

ఈ జిల్లా వెలిగందుల కేంద్రంగా హైద్రాబాద్‌ ముస్లిం పాదుషాల బంధువుల సర్హారుల పరిపాలన ఇక్కడ సాగింది. వారిలో “ధంసా' 1747 "పేరు చాలా వ్యాప్తిలో ఉండేది. అతడే జాక్‌- టేల్‌ అనే ఫ్రెంచి ఇంజనీర్లతో జగిత్యాల కోట కట్టించాడు. ఈ కాలంలో అనేక ముస్లిం జాగీర్లు వచ్చాయి. 1

హిందూ సంస్టానాధి పతులు వేషభాషా నాగరికతల్లో ముస్లిం ప్రభువులను అనుసరించేవారు. అయినా తమ కుల, మత సంస్కృతీ సంప్రదాయాలను నిష్టగా కాపాడుకున్నారు. నయాన్నో భయాన్నో మతాంతరీకరణ పొందినవారి విషయం వేరు.

కుతుబ్‌ షాహీల కాలంలోని రాజభాష అరబ్బీ. ఆ స్థానాన్ని ఆసప్టాహీల కాలంలో ఉర్దూ ఆక్రమించింది, అది ఒక రీతిగా తెలుగు వారికి కష్టకాలం; తెలుగుభాషా సాహిత్యాలకు చీకటి కాలం. సాహిత్యం: ఈ రెండు శతాబ్దాలలో తొమ్మండుగు కవులు మాత్రం లెక్కకు వచ్చినా వారిలో ఒక్కరు

మొదటి భాగం, 1 అధ్యాయం: అనంతర కొలు తెలగు సహితం 107 ఇక్కడి వారేనా అనేది అనుమానం, ఆరుగురు కవులు కావ్య కర్తలైనా వారి గ్రంథాలు లభించలేదు

  • ముద్రింపబడలేదు.

ఈ కాలపు విద్యత్కవి సోమనాథుని వసుచరిత్ర వ్యాఖ్య ఈ జిల్లాలోని తొాలివచన గ్రంథం. అది అభ్యమై చక్కనిదని పండిత ప్రశంసలు పొందినా ఇతర వ్యాఖ్యానాలవలె వ్యాప్తి లేకపోవడం విచార్యం. వరకవి బాలభట్టు మంథని రామాయణం శివలీలలు యక్షగానాలు ఈ మధ్యనే ప్రచురింప బడినవి.

అప్పటికి ఇప్పటికి వ్యాప్తిలో ఉండి ఈ జిల్లాకు గర్వకారణంగా ఉన్న నరసింహశతకర్త శేషాచలదాసు - శేషప్ప ధర్మపురి వారు. ఆయన మూడు శతకాల ధర్మపురి రామాయణం "పేరుతో ఒక యక్షగానం రచించాడు. శతకాలు ఒకటి రెండు శేషప్పకు ముందు కాలంలో ఇక్కడ వచ్చినా వ్యాప్తి పొందినది మాత్రం ఈతని నరసింహ శతకమే. అలాగే యక్షగాన రచనకు "సైతం జిల్లాలో వీరే ఆద్యులు.

బాత ప్రతులు లభించిన ఇద్దరు కావ్య కవుల్లో పరాంకుశం గోపాలకృష్ణయ్య గారు సరనకవి. కాని, స్థలం నిర్ణయం చేయలేం.

కుందావజ్ఞల గోపాలకృష్ణ కవిగారు మాత్రం 'కృష్ణజన్మ ఖండ' కావ్యం, నసంవరణ చరిత్ర ప్రబంధ రచనలతో మహాకవిగా నిలిచారు.

ఈ మధ్య యుగం తెలుగు కట్టు బొట్టు ఆచార వ్యవహార సంస్కృతీ నంప్రదాయాలకు కష్టకాలం. అయినా ఈ యుగంలో హిందూమత సంరక్షణతోపాటు తేలుగు భాషా సాహిత్యాల పోషణ. కావించిన. వారు. ఉదారులైన సంస్థానాధీశులు - ఉదాత్తాశయాలుకల మన తెలుగుకవులు.

/ పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యం పందొమ్మిదవ శతాబ్దిలో కరీంనగర్‌ జిల్లాలో గణనీయమైన కావ్యసృష్టి జరగలేదు.

అది హైదరాబాద్‌ ఆసఫ్‌జాహీ నిజాం ప్రభువుల పరిపాలన కాలం. అరబ్బీ పార్సీ ఉర్జూ భాషలు ప్రాముఖ్యానికి వచ్చాయి. ఇక్కడి హిందువులు కూడ రాజకీయ ప్రభావం వలన ఆ నూతన భాషలను నేర్చుకొని వానిలో పాండిత్యం సంపాదించి కవులుగా సైతం రాణించసాగారు.

వెలిగందుల ఆనాటి ఈ మండల కేంద్రం. నేటి జిల్లా కేంద్రమైన కరీంనగరం నాడు ఓ సామాన్య గ్రామం.

హిందువుల జాత్యభిమాన మతాభినివేశాలు బలమైనవి. అందుకే విదేశీ భాషలను అభిమానించినా, వారి నాగరికతను అనుసరించినా, పర మతాలను మాత్రం ద్వేషించారు. నయాన్నో భయాన్నో కొందరు మతాంతరీకరణ పొందడం జరిగినా, అధిక సంఖ్యాకులు ఎన్ని ఒత్తిడి లెదురైనా తమ జూతి-యత-సంస్కృతి-సాహిత్యాలను థటేమిస్తూనే వచ్చారు. అట్లా స్వదేశీయుల జాత్యభిమానం కారణంగానే పూర్వసాహిత్యం ఈ మాత్రంగానైనా భద్రపరుచబడి లభ్యమైంది. ఎంతో కొంత నూతన కావ్య రచన సైతం మాతృభాషలో జరిగింది.

ఈ కాలంలో ఇంచుమించు ఇరువది మంది కవుల పేర్లు ఈ జిల్లాల్లో లెక్కకు చిక్కాయి. వారిలో అయిదుగురు సంస్కృత కవులే. పది మంది వరకు యక్షగాన మధుర కవితలు వెలయించిన వారు. పద్యకవులు కేవలం అయిదుగురు. అందులో ముగ్గురు శతక కవులు. కావ్యనిర్మాతలు ఇద్దరే. ఈ యిరువురి కావ్యాలు అలభ్యాలు. పేర్డు మాత్రమే వినవస్తున్నవి.

ఈ క్రింది వారు సంస్కృత కవులు:-

  1. వాసుదేవ శాస్త్రి; 2. గోవిందుల నింబగిరి; 3. గోవర్ధనం యామునాచార్వ్యులు; 4. కృష్ణగిరి కవి కృష్ణరాయలు; 5. తేరాల వేంకటాద్రిశాస్రి,

ఓ తెలుగు పద్య సాహిత్యం

  • పాత పాపయ్యశాస్త్రి; 2. కాకుత్సం నరసింహదాసు; 3. కృష్ణగిరి వేంకటరమణయ్య;
  1. ఖండేరావు రామారావు; 5. పరవస్తుముని నాథకవి.

  2. యక్షగానాలు

  3. చెర్లపల్లి కాశీనాథ శాస్త్రి; 2. నారంభట్ల రమణయ్య; 3. నారంభట్ల నరహరి; 4. చతుర్వేదుల తులసీరాం; 5, న్యాలకొండ కిషన్‌రావు; 6. రాజారానూనంద కవి; 7. రుద్ర ఎజ్జియ్య

  4. నుధుర కవితలు |

1 సిరిశివహళ్‌ శీనయ్య; 2. సీతారామయతీంద్రులు ౩. జైశెట్టి రాజయ్య.

ఈ జిల్లాలో వెయ్యేండ్లకు పూర్వం నుండే సంస్కృత భాషాపండితులు కవులు ఉన్నారు. తెలుగుతోపాటుగా సంస్కృత కావ్యాలు కూడా ఈ ప్రాంతంలో రచింపబడ్డాయి. వేములవాడ చాళుక్యుల కాలంలో జైన కవులు కన్నడ సంస్కృత కావ్యాలు రచించారు. కల్యాణీ చాళుక్యుల, కాకతీయుల కాలంలో వైదిక, శైవ మతాభిమానులైన సంస్కృత విద్వాంసుల పేర్లు నాటి శాసనాల్లో కన్పిస్తున్నాయి.

మధ్య కాలంలో ఆంధ్ర కవితకు ఆదరం హెచ్చి సంస్కృత కావ్య రచన ఉపేక్షింపబడి నట్ట్లున్నది. తిరిగి పందొమ్మిదవ శతాబ్ధిలో సంస్కృత కవులు కన్పిస్తున్నారు. ఇరువదవ శతాబ్దిలోనైతే సంస్కృతాంధ్ర సాహిత్యాలు ఈ కరీంనగర్‌ జిల్లాలో ఉన్నతస్థాయిలో ఉన్నాయి.

ఈ అధ్యాయంలో పేర్కొన్న సంస్కృత కవుల పేర్లు తెలుగు కవులతో కలిపి మా వ్యాసకర్తలు

మొదటి భాగం, 1౪ అధ్యాయం: రందొమ్మిటీవ శతొట్టి తెలుగు ఫాహస్యం 109 వ్రాస్తున్నారు. వీరు తెలుగు కవులు కారని సూచించుటకే వారి పరిచయం మితంగా ఇప్పుడు ఇందులో చేయబడుతున్నది. వాసుదేవశాస్త్రి - ధర్మపురి, 1830

వాసుదేవశాస్త్రి గారు దైవస్తుత్యాత్మకాలైన అనేక శ్లోకాలను, మరాఠీ భాషలో భజనకీర్తనలను

వ్రాశారు. కవి గారి అముద్రిత రచనలు వారి వంశపు రొట్టె విశ్వనాథశాస్త్రి ధర్మపురి గారివద్ద ఉన్నట్లు తెలిపారు. 2. గోవిందుల నింబగిరి శాస్త్రి - కోరుట్ల (మోర్తాడు): 18వ శతాద్ద.

నింబగిరి గారు సంస్కృతంలో ఒక ప్రహసనం రచించారని అది సేనాపతి రామానుజాచార్యుల వద్ద ఉందని, గో.క.సం. పుట. 402లో వ్రాశారు. వారి కాలం 1750 అన్నారు. కాని, నింబగిరి శాస్త్రిగారు 1850 తర్వాతివారు.

శాస్త్రిగారు వ్రాసిన సంస్కృత రూపకం “నింబగిరి ప్రహసనం”. అది లింబాద్రి నరసింహ క్షేతయాత్రా వర్దన; కోరుట్లలో సేనాపతి వంశంలో రామానుజాచార్యులు ఎవరూ లేదు. అది సేనాపతి నరసింహాచార్యులు (గో.క.నం.కవి నం, 308) లేదా సముద్రాల రామానుజాచార్యులు (గోకసం.నం, 59) అని ఉండాలి.

నింబగిరి శాస్త్రి శ్రీవైష్ణవ ఆచార్యులు. వారి న్వగ్రామం మోర్తాడు నిజామాబాదు జిల్లా లోనిది. పై సంచిక వెలువడిన కాలంలో ఆయన కోరుట్లలో సోదరి ఇంట ఉండి ఉంటారు. ఈ ప్రహననం చక్కని హస్య రచనమని, దాని ప్రతి వ్రాసి ఉఊంచుకొన్నామని, కీ.శే. సిరిశెనహళ్‌ కృష్ణమాచార్య శతావధాని, కోరుట్ల గారు (గో.క.సం.నం. 171) అన్నారు. వారి “స్వీయ కవితాను జీవనము” ఆత్మకధ పుట - 11లో 'నింబగిరి ప్రహసనము" వ్రాత ప్రతి కలదు అని ఉంది. కాన్ని వారి ఇంటిలో వెదకితే వ్రాతప్రతి ఇంకా లభించలేదు. శాస్త్రిగారి బంధువులైన కలకుంట్ల వారింటిలోనూ లేదు. ముఖ్యంగా నింబగిరికవి ఈ జిల్లావారు కారు. గో.కం.సం.లో కోరుట్ల అని వ్రాసిన కారణాన ఈ వివరాలు వ్రాయవలసి వచ్చింది.

  1. గోవర్ధనం యామునాచార్యులు - కోరుట్ల

యామునాచార్యులు గీర్వాణభాషా కవి. విరి రచన 'నగర చంపూ' అను సంస్కృత కొవ్యం. వీరు హైద్రాబాద్‌ నిజాం గారికి ప్రధానామాత్యులైన చందూలాల్‌ గారి ఆస్థాన పండితులు, ఆ మంత్రిచే 'వురాణళాస్త్ర బహద్దూర్‌ జంగ్‌ అనే బిరుదాన్ని (గ్రహించడమే కాక ఆచార్యులు కోరుట్ల సమోప గ్రామమైన రొమోజిపేటను అగ్రహారంగా పాందారట. ఇరువదవ శతాబ్దీ ఉస్మాన్‌ పాదుషా గారి నచివులైన కిషన్‌ ప్రసాద్‌ గారి పితామహుడు చందూలాల్‌. కాబట్టి గోవర్ధనం యామునాచార్యులు 19వ, శతాబ్ది మధ్య కాలంవారు అనుకోవచ్చు.

  1. కృష్ణగిరి కవి కృష్ణరాయులు - ధక్మపురి, 1875

కర్ణాటాంధ్ర కవి కృష్ణగిరి వేంకటరమణయ్య గారికి ఈతడు తమ్ముడు. పేరు తెలియదు. సంస్కృతంలో గొప్ప విద్వాంసుడు. కృష్ణరాయలు అనేది బిరుదనామం. కాళ్ళీర పండితుడు వ్రాసిన జ్ఞాన వాసిష్ట రామాయణ కృతికి 'సారసముచ్చయమ్‌' అను వ్యాఖ్యను ఈ కృష్ణగిరి కవి సంస్కృతంలో రచించాడు.1 శృంగేరి పీఠాధిపతి శ్రీనృసింహభారతి చే 'కలియుగ జనకుడు' అను బిరుదమును సైతం ఈ కవి పొందినాడు.

110 డాః మలయశ్రీ- "కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” పాదసీఠికలు: 1 సారస్వత జ్యోతి - కరీంనగర్‌; ఫిబ్రవరి - 1954. 2. గట్టెపల్లి సత్యనారాయణరాజు - “కరీంనగర్‌ మండల చరిత్ర' - పు. 14. 5, తేరాల వేంకటాద్రి శాస్తే- మహాదేపపురం;

వేంకటాద్రి గొరు సంస్కృతంలో ఆశుకవి. వారు ఏ కావ్యాన్ని రచించలేదు. కాని భక్తిప్రదమైన అనేక శ్లోకాలు కీర్తనలు చెప్పారు. వెంకట్రాది గారు లోకసంచారి. పురాణాలు చెప్పేవారట. నారి కవితలు వారు భద్రపరచలేదు కాని, భక్తులు వ్రాసుకొని దాచుకున్నారు. నిజానికి అభిమానుల కోరికగానే ఆయన ఆశువుగా చెప్పిన కవితలే ఎక్కువట.

ఈ విషయాలు 1981లో “కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్ర' రచనా సందర్భంలో కాళేశ్వరం వేంకటేశ్వర రావు గారు చెప్పారు. విశ్వామిత్ర మురారిగారు కరీంనగర్‌ “గౌతమి” 1969లో విస్మృత కవి వేంకట్రాది' అనే పేర ఈ కవి జీవన కవన విశేషాలను వివరించారు.

1 గనరాజు - సంపాదకులుగా కరీంనగర్‌ నుండి వెలువడిన జైమాసిక సాహిత్య పత్రిక 'గౌతమి”. తెలుగు పద్య సాహిత్యం-

  1. పాత పాపయ్య శొస్ర్రి- కోరుట్ల, 820

పాపయ్య శాస్త్రిని గూర్చి ఈ క్రింది పరిచయం గోలకొండ కవుల సంచికలో చేయబడింది.

“రచన - విశ్రమార్కీయము. నివాసము - కోరుట్ల; కాలము క్రీ.శ 1820. గ్రంథము దొరుకలేదనియు ప్రయత్నింతుమనియు కోరుట్ల నుండి సే.రామానుజాచార్యులు తెలిపిరి”.2 ఇది 1934 నాటి వివరాలు, అంతకు మించిన సమాచారం ఈ కవిని గురించి తెలియరాలేదు.

శతావధాని సిరిశెనహళ్‌ కృష్ణమాచార్యులు కొరుట్ల గారు తమ “కళాశాలాభ్యుదయము' 24వ పుటలో “కారువుట్ల పుఠంబల దక్షిభేతర, శ్రీనగరంబనంగను బ్రసిద్దిని గాంచెను లోకమంధునన్‌ో అని ఆవురం

“విక్రమోర్వశియను బిరుద కావ్య విధాన - చతుర పాపయశాస్త్రి చరిత భూమి”3 అన్నారు. పీఠ తమ 'స్వీయ కవితాను జీవనం" తొలిపలుకులో “పాత పాపయ్యశాస్త్రి విక్రమోర్వశీయ కావ్య నిర్మాతలు. వారి కావ్యములదృశ్యమైనవి” అన్నారు. పండిత లోకంలో ప్రచారమందున్న విక్రమోర్వశీయం చక్కని చిక్కని పద్య ప్రబంధకావ్యం. పొదవీఠికలు :

1 గోలకొండ కవుల సంచిక. పూర్వకవి పరిచయం. నం.73; 1పు. 402,

  1. సేనాపతి నరసింహాచార్యులు లేదా సముద్రాల రామానుజాచార్యులు అని ఉండాలి.
  2. కళాశాలాభ్యుదయము - 1929, పద్యం 2-9-; 2-10. 4, ఎన్‌. కృష్ణమాచార్య - “స్వీయకవితాను జీవనం” - 1986; వు. 11,

2, కాకుత్ధృం నరసింహదాసు - ధర్మవురి, కాలం: 1820-1880 సుమారు.

అత్యధిక జనవ్యాప్తిలో ఉన్న శ్రీకృష్ణ శతక కవి నరసింహదాసు. అతని ఊరుపేరు, ఇంటిపేరు ముద్రిత కృష్ణళతక ప్రతులలో లేదు. కవి చరిత్ర కారులు కూడా కవి కాలం, వంశ వివరాలు చూపలేకపోయారు.

నరసింహదాసుది కరీంనగర్‌ జిల్లాలోని ధర్మవురి. చాత్తాద వైష్ణవుడు. కాకుళ్సం గృహవామం. 1857-60 మధ్య ఈ శతక రచన కావించాడు. ఈ విషయాలు తర్వాత సహేతుకంగా వివరించబడుతాయి.

మొదటి భాగం, [/ అధ్యాయం: శందొమ్మిదీ5 శతొట్టి తెయగు సారొర్యం 111 ఈకవిరచనలు: 1. శ్రీకృష్ణళతకము - ముద్రితం; 2. మైరావణచరిత్ర - యక్షగానం, అముద్రితం; 3. గంగపాట; 4. పిండారీల దండు దోపిడిపాట; 5. మిశ్రిత రామాయణము - అలభ్యాలు. కవి వంశం:'కృష్ణ శతక ముద్రిత ప్రతిలో ' నూటా ఒక్క పద్యాలున్నాయి. అందలి చివరి పద్యంలో కవి పరిచయమిట్లున్నది.

భారధ్వాజస గోత్రుడ, గారవముని గంగమాంబ కరుణాసుతుడన్‌

"పేరు నృసింహా హ్వయుడను, శ్రీరమయుత నన్నుగావు సృష్టిని కృష్ణా!

ఈ పద్యంలో కవి పేరు తల్లిపేరు గోత్రనామం తప్ప మరే వివరాలు లేవు.

తల్లిపేరు సైతం సరిగాదు. కవి వేరు నృసింహదాసు. రచన కృష్ణశతకం. ఈవైష్టవ కవి జనని నామం శివపరమైన గంగ కాజాలదు. స్మార్తులకు శివకేశవ భేదంలేదు కాని, వైష్ణవులకు ఆ పట్టింపు ఉంది. విద్వాన్‌ చిన్ని కృష్ణశర్మగారు ఈ శతక కర్తను గోలకొండ వ్యాపారి-నియోగి బ్రాహ్మణునిగా ఊహించారు. ఈ కవి వంశ జన్మగ్రామాదిక వివరాలను తెలుసుకోవడానికి కాకుత్సం అనంతయ్య జగిత్యాల, గారి “వేణుగోపాల కృతి కదంబము'4లోని ఈ క్రింది పద్యాలు సజీవ సాక్ష్యాలు. కృష్ణశతక కర్త నరసింహదాను తమవంశ పూర్వీకులని అనంతయ్యగారు ఈ వివరాలు ఇచ్చారు.

శ్రీరమేశ! యవథరింపు మా వంశపు పెద్దలెల్లరు నుడివిన విధంబు వెలువరింతునాత్మ విశ్వాన యుతుడవై, కల్పితంబు గాదు కనుక కృష్ణ రంగమాంబ సుతుని గంగమాంబ సుతుగ, జెలగ తారు మారు జేసి కృష్ణ శతకకర్త నన్య సంతుగా జిత్రింప న్యాయ్య మగున? తీర్చవయ్య, కృష్ణ! తరతరాల వరుస నరయ మాతండ్రికి, పెద్ద తాత యతడు; పేర్మి భక్తి గృష్ట శతకమున్‌ లిఖించెను; కాకుళ్సు, వంశజుండు, మతము వైష్టవంబు!

“రీ అక్షరం 'గ'గా మారటం చాల తేలిక. అయితే ఈ శతకం అష్టోత్తరశతమని, దానిలో ఏడు పద్యాలను ఏలనో వదలి ఏకోత్తర శతిగానే ముద్రిస్తున్నారని, ఆ వదిలివేయబడిన పద్యాల్లో కవి తండ్రి పేరు, ఊరిపేరు మొఃవి తప్పక ఉండి ఉంటాయన్నారు అనంతయ్యగారు. తమకు స్వయంగా తెలిసిన నృసింహకవి విషయాలను ఇంకా వారు తమ కావ్యంలో ఇట్టా చెప్పినారు.

రంగమాంబ జనని రామయ్య జనకుండు, వారికేకైక కుమారుడతడు పుణ్యభాగుడు ధర్మపురియందు జన్మించె, అనఘాత్మ లింబమ్మక యతని గృహిణి. నారసింహాహ్వయుండై హరికథకుడై నరసింహదాసుగా వరలియుండిె....

ఇదిబహిరంగ వర్తమాన సాక్ష్యం. కృష్ణ శతక అంతరంగాన్ని పరిశిలిస్తే ఒక్క కృష్ణుని మినహాయిస్తే నరసింహుని మాత్రమే ఈ కవి ఎక్కువ పద్యాల్లో అభివర్ణించాడు. అందుకు ఉదాహరణలు,

  1. శెరలియరచేత గంబము.... నరహరి రూపావతార - 40వ, పద్యం; 2. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు 53; 3. స్తంభమున వెడలి - 57; 4. శరణన ్రహ్ధాదకుండు - 68; 5. ఎటువలె బ్రహ్లాదు కభయ మిచ్చితి - 70) 6. ఏ తండ్రి కనక కళ్యపు, ఘాతుకుడై యతని సుతుని గాచె - 73.

ధర్మ పురి ప్రసిద్ధి నందిన నృసింహ క్షేత్రం.

నరసింహకవి జన్మస్థలం ధర్మపురి అనడానికి మరో బలమైన నిదర్శనం మైరావణ చరిత్ర వ్రాత ప్రతి.” అందులో కవి స్వయంగా తన వంశ సమాచారాన్ని ఈ విధంగా వివరించుకున్నాడు.

శ్రీకరంబైనట్టి శ్రీధర్మపురి యందు - వెలసిన నరహరి వేడ్కృదలచి, హరినామ కథలోన ఆనందముననుమై - రావణ చారిత్ర రమ్యముగను. నరసింహదానుడ నయముగా నీయక్షగానము జేసితి ఘనులు మెచ్చ

112 డా॥ మలయక్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సావహాత్య చరిత్ర” మైరావణ చరిత్రలోని పద్యరచన శ్రీకృష్ణశతకంలోని పద్యాలకు సన్నిహితంగా ఉండటం విశేషం. మై.చ. యక్షగానంలోని మొదటి పద్యం ఇది - కం, శ్రీరమ వల్లభ కేశవ, వారిజదళ నయన దేవ వాసవ వినుతా ధారుణి ధర్మపురీ వర, శూరా నరసింహకోటి సూర్య ప్రకాశా. శ్రీకృష్ణ శతకారంభ పద్యాన్ని చూడండి, కం. శ్రీరుక్మిబీశ కేశవ, నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన, కారుణ్యము తోడ మమ్ముగావుము కృష్ణా! ఈ రెండు పద్యాలు కందాలే. రెంటి నడక ఒక్కటి. ఇవి ఏక కవి విరచితాలు అనక తప్పదు. పై నిదర్శనాలను బట్టి కృష్ణ శతక కర్తయైన నరసింహ దాసు కవిగారిది ధర్మపురి అనడం నిర్వివాదాంశం. కవికాల నిర్ణయం : కవి చరిత్రకారుల అంఛనాలను బట్టి కాక, ఈ కవి కాల నిర్ణయానికి ప్రత్యక్ష సాక్ష్యమున్నది. కాకుత్సం అనంతయ్య జగిత్యాల గారి తండ్రికి పెద్ద తాతగారు నరసింహాదాను. ఆనంతయ్య గారి జననం 1920లో 1920-30 వీరి తండ్రి జననం 1890. తాతగారి జననం 1860లో తాత తండ్రి 1830. అతనికి అన్న నరసింహదాసు మరో అయిదు పదేండ్లు పెద్దవాడై ఉంటాడు. మైరావణ చరిత్రను నరసింహదాసు పింగళ సంవత్సరంలో పూర్తి చేసినట్లు వ్రాసుకున్నారు. అది 1857, అప్పటికి దాదాపు 40 ఏండ్ల వాడనుకుంటే నరసింహదాసు జననం క్రీ.శ, 1820లో. మై.చ.లో కృష్ణళతక ప్రసక్తి లేదు. కాబట్టి అది మొదటి రచన అనుకోవాలి. కృష్ణశతక రచనాకాలం 1858-60 మధ్య అయి ఉంటుంది, కృతుల పరిచయం; ఈ శతకంలో విష్ణుభక్తి అధికం. అన్యమత నిందకానీ, లోక విమర్శకానీ లేవు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము, నీవే నా పతివి గతివి నిజముగ కృష్ణా...2 పోతన వలె నరసింహదాసుది మధుర భక్తి. పై పద్యం “త్వమేవ మాతాచ పితా త్వమేవ" శ్చోకభావ సంజనితం. భగవద్గీత భావం కల ఈ పద్యం చూడండి, గిరులందు మేరు వౌదువు, సురు(6) అందున నింద్రువౌదు, చుక్కలలోనన్‌ బరమాత్మ చంద్రువాదువు, నరులందున నృపతి వౌదు నయముగ కృష్ణా..22 మరో ప్రసిద్ధ హరిభక్తి పద్యం. హరి యను రెండక్తరములు, హరియించును పాతకంబు నంబుజనాభా, హరినీ నామ మహత్కము, హరి హరి!ీ పాగడంగ వశమె హరి శ్రీకృష్ణా..5 భారత భాగవత రామాయణ విష్ణుగాధలను కవి ఈ శతకంలో సందర్భోచితంగా భక్తితో స్మరించాడు. ఉదా ; శక్ర సుతుగాచు కొరకై చక్రము చేపట్టి భీష్ముజంవగ జనునీ విక్రమ మేమని పాగడుదు - (29) అని భారత కథను, అంగన పనుపున దోవతి, కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిననీ (కుచేలుని) సంగతి విని దయనాసగితి (వి) రంగుగ సంపదలు (24) అని భాగవత కథను వర్ణించాడు. బాలకృష్ణ లీలలు (12-23) భారత యుద్ధ గాధలు (26-30), ద్రౌపదీ మాన సంరక్షణ (25), పరీక్షిత్తు ప్రాణ రక్షణ (31), దశావతారాల వర్ణన (36-46) ఇట్టా కృష్ణ శతక పద్యాలు భక్తి గాధాతోరణాలు - మనోహరాలు! కవి భాన చమత్కృతికి నిదర్శనంగా ఉంది ఈ క్రింది 30వ, పద్యం.

మొదటి భాగం, )7 అధ్యాయం: తందోమ్మిదీలి శతొట్టి తెలంగు నొహొర్భాం 1139 దివిజేంద్ర నుతుని జంపియు, రవి సుతు రక్షించినావు రఘు రాముడై, దివిజేంద్ర సుతుని గాచియు, రవి సుతు బరిమార్చితౌర రణమున కృష్ణా! రామావతారంలో ఇంద్రనందనుడైన వాలిని చంపి నూర్య నుతుడైన నుగ్రీవుని కాపాడీనవాడే, కృష్ణావతారాన సూర్యపుత్రుడైన కర్ణుని పరిమార్చి ఇంద్రనందనుడైన అర్జునుని కాచినాడని భావం. ఈ శతకంలో కొండిక పని, వావిరిగా, పటపటలు, వంటి అరుదైన పదాలు, కంటికి రెప్ప విధంబున, పరునసము సోకిన యినుము బంగారమైనట్టు, వంటి, నూక్తులు వాడబడ్డాయి. ఆంధ్ర దేశంలో ఆతి ప్రసిద్ధి కల శతకాలలో నరసింహదాసు శ్రీకృష్ణళతకం ఒకటి. 2. మైరావణ చరిత్ర (యక్షగానం అముద్రితం.” రామాయణం భారత దేశంలో ఆబాల గోపాలం వ్యాప్తిలో ఉన్న కథ. రామాయణం సీతారాముల కథ. రావణవధ రామ పట్టాభిషేకం వరకు పూర్వరామాయణం. లవకుళుల కథరామాశ్వమేధం సీతాదేవి భూ ప్రవేశం వరకు కలది ఉత్తర రామాయణం. మైరావణ కథ పూర్వ రామాయణం లోనిదే. రావణుడు దశకంరుడు. ఆ ఊవులో శతకంఠ సహనస్రకంఠ మహిరావణ అహిరావణ కథలు జానపదుల అద్భుత నృష్టి. వారు రావణ బాంధవులు వైరం రామునితోనే. ఇవి అవాల్మీకీయ గాథలు. మహిరావణుడు - మ్రైరావణుడు. ఇతడు రావణుని మేనమామ. రామరావణ యుద్ధ సందర్భంలో రాక్షస "సేనలు విధ్వంసం కావడంతో పూర్వ వైరాన్ని మరచి రావణాసురుడు పాతాళ లంకకు వెళ్ళి మేనమామ నహాయాన్ని అర్ధించాడు. మైరావణుడు రామలక్ష్మణులను మాయోపాయంతో ఎత్తుకొనిపోయి కాళికాదేవికి బలి ఇవ్వనెంచాడు. ఆంజనేయుని శక్తి యుక్తుల వలన శత్రువు మృతి చెంది రామలక్ష్మణులు విముక్తులౌతారు. ఇది క్లుష్తంగా కథ. ఇందులో హనుమంతుని తోక కోట వర్ణన, మైరావణ సోదరి దోర్లండి కరుణ కథ, హనుమని మానస పుత్రుడైన మత్స్యవల్లభుని పరాశ్రమం అద్భుత కల్పనలు, అతి మనోహర ఘట్టాలు. యక్షగానాలుగా, హరికథలుగా ఈ కథ చాలా వ్యాప్తి పొందింది. నూడయ్య అనేకవి దీన్ని పద్యకావ్యంగా మలిచాడు.” తోలు బొమ్మలాటలవాళ్లు తప్పక ప్రదర్శించే కథ మైరావణ చరిత్ర. ఇది తెలుగు చలనచిత్రంగానూ రూపొందింది. తమ వంశ పూర్వీకుడైన శేషాచలదాసు గారి పూర్వ రామాయణ యక్షగానం, ఈ నరసింహకవి మెరావణ చరిత్ర రచనలకు (ప్రేరణ కలిగించి ఉంటుంది. ఈ యక్షగానం కూడ శేషప్ప ధర్మపురి రామాయణం వలె పాత్రల ప్రవేశ నిష్కమణాదులు లేనిది. గాన యోగ్యం. ప్రదర్శన సౌలభ్యం తక్కువ. ఈ మెరావణ చరిత్రలో కథను చూస్తే పాతాళ హోమం భంగమైన తర్వాత రావణుని విచారం ఇట్లా వర్ణించబడింది (వ్రాతప్రతిక్‌ యథాతథం). ఉ. మాననమందు చింత్తలును మానక చెంచెల మొంద్ది కుంద్దుచున్‌ దీనత నొంద్దియున్‌ వగలు దీరెను పెక్కు విచార మంతుడై నేనెటు గెల్తునంచ్చు మది నిద్దుర కంట్టికి రాక శయ్యపై పూనుచు లేచుచున్‌ మగుడ బొర్జ్లుచు నత్తరి నవ్వి యేడ్చుచున్‌. పుట - 2 ఇందు కవి వర్ణనలు పొత్ర పోషణ నహజ సుందంరంగా ఉన్నాయి. లంకేశ్వరుడు తన దర్చ ప్రదర్శనకు మేనమామ మహిరావణుని పట్టి వెయ్యేండ్లు చెరసాలలో బంధించి వదలినాథు. ఇప్పుడు పాత వైరాన్ని తన అభిమానాన్ని వదలి పాతాళలంకకు వెళ్ళిసహాయాన్ని అర్థించాడు.

114 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జిల్లా తెలుగు సావాత్య చరిత్ర” ఆక్రోశపడక ఆపదలో ఉన్న మేనల్గుని ఆదరించి తన పెత్తనం నిలుపుకొన్నాడు మైరావణుడు. రావణుని వినతి ఈ కీర్తన రూపంగా ఉంది. రామూ మహిమా మామ వినుమా! సామాన్య ప్లవగూలా దీమూచే1 చనుదెంచి - రామాలక్ష్మణులాచే రంజాన2 చెడెలంక ॥రా॥ వారాధి గిరులాచే కేరూచూ బందించి --వారూ సువేలాద్రి జేర హెచ్చిరి వేగా ॥రా॥ వశముగాను నగరి విశదంబుగను జుట్టి - అసహాయశూరుల హతమొనరించిరి ॥రా॥ ఘట కర్ణ మొదలైన కుటిలేంద్ర జిత్తూల నూ । హట మూన3 దనుజుల అటు ద్రుంచి వైచిరి ॥ర॥ శంకారు వరములబింకాము సాగావు4 - లంకాకు బాధాయక్‌ యింకేముపాయము ॥రా॥ 1సహాయం 2. రంజన 3. హటము-పంతం 4. బింకముసాగి అవు 5. బాధ ఆయె రామాయణంలోని రావణ, మండోదరి, విభీషణ, లంకిణి పాత్రలకు, మైరావణ చరిత్రలోని మైరావణ, మాతంగి, దోర్టండి, మత్స్యవల్లభ పాత్రలు స్వభావాల్లో ప్రతిబింబాలు. శబ్ద సాధుత్వ విషయానికి పోకపోతే నృసింహదాసు యక్షగానం శేషప్ప, ముద్దుబాలంభట్టు యక్షగానాల వంటి రసవద్రచన. కవి హరిదాసు కావడం కావ్యానికి మరింత మేలు చేకూర్చింది. కృష్ణ శతకకర్త నరసింహదాసు పఠితులకు తెలిసినా స్థల కాల నిర్ణయం ఇంత వరకు సరిగా కావించబడలేదు. ఈ కవిని కాకుళ్స గృహనామునిగా ధర్మపురి నివాసిగా, 19వ శతాబ్ది మధ్యకాలపు వ్యక్తిగా ఇందు సోపపత్తికంగా నిరూపించబడింది. గంగవరద (గోదావరి పొంగు) పాట, పిండారీల దోపిడి పాట, వ్రాత ప్రతులు లేవు. మిశ్రిత రామాయణ వివరాలు కూడా తెలియవు. నరసింహదాసు పేరు ఇప్పటికీ ధర్మపురిలో వ్యాప్తిలో ఉంది. ఆ కవి కృష్ణ శతకం అఖిలాంధ్ర వ్వాప్తిలో ఉంది. పాదపీఠరికలు;

  1. గొల్లపూడి వీరాసామి అండ్‌ సన్స్‌, రాజమండ్రి ముద్రణ, దీనిలో 102 పద్యాలున్నాయి. పరీవీలిస్తే 58 నం.తప్పింది. మొత్తం 101 పద్యాలే.

  2. గౌరన కును అని పాఠాంతరం. 3. శతక వాబ్మయ సర్వస్వము - పు.247 4& రచన 1986 - 89, ముద్రణ - 1990; పుటలు - 94,951.

  3. అనంతయ్యగారు తమ కావ్యంలోవ్రాయడమే కాక, నాకు కలిసి స్వయంగా ఈ విషయాలన్నీ ముచ్చట్‌ంచారు - -1989లో.

  4. లింబగిరి (నింబాద్రి)ి నిజామాబాద్‌ జిల్లాలో భీంగల్లు సమీపంలోని నృసింహక్షేత్రం. కరీంనగర్‌ జిల్లా మెట్టుపల్లి, జగిత్యాల తాలూకాలలో అనేకులకు “లింబాద్రి స్వామి" ఇలవేల్పు.

  5. మైరావణ చరిత్ర వ్రాతప్రతిని జిరాక్స్‌ కాప్‌ చేయించి కా.అనంతయ్యగారు నాకు పంపించారు.

  6. హరిహరులకు బొగడవశమె - అని పాఠాంతరం. ఇంద్రశంకరులని భావం.

  7. వ్రాతప్రతి 68 పుటలు. పేజీకి సగటున 20 పంక్తులు. మెత్తం గ్రంథం 1360 పంక్తుల రచన. అది అచ్చులో 100 పు.కావచ్చు.

  8. నరసింహదాసు పింగళ 1857 లో రచించాడు. దానికి మారు ప్రతి 19815 రాక్టసలో వచ్చింది. ఈ రెండవ ప్రతిని చూసి నృసింహ కవి తమ్ముని పౌత్రుడు కాకుత్సం నారాయణ అక్షయ 1926లో ప్రతి రాసుకున్నారు. ఈ 1926 ప్రతి జిరాక్స్‌ చేయించి అనంతయ్యగారు నాకు పంపించారు.

  9. సయాం, కాంబోడియా మొ విదేశాల్లో సైతం రామకథ కొద్ది మార్పులతో ఉందని ఆరుద్ర “రాముడుకి సీతేమౌతుంది?” అనే తమ పుస్తకంలో తెలిపారు.

  10. మాడయ్య కవిది గుడివాడ. 3 ఆశ్వాసాల ప్రబంధం, తులువ వీరనరసింహ రాయలకాలం: 1485 - 1506.

మొదటి భాగం, [౪ అధ్యాయం: వందొమ్మిదీవ్‌ శరొట్టి తెలంగు నారొర్టుం 115 3. కృష్ణగిరి వేంకటరమణయ్య - ధక్మవురి, 1870.

కృష్ణగిరి వేంకటరమణయ్య గారు ధర్మపురి వాస్తవ్యులు. గత శతాబ్లి ఉత్తరార్థం వారు. సంస్కృతాంధ్ర కర్ణాటక భాషలలో విద్వాంసులు, ఈ కవి కృత గ్రంథములు నాలుగు.

  1. వాసిషస్ట రామాయణము (ముద్రితం) 2. అధ్యాత్మ రామాయణము (అలభ్యము) 3.గయోపాఖ్యానము (కన్నడము) 4 వాసిష్ట రామాయణ వ్యాఖ్య. సై వివరాలన్నీ గో.క నం.పుట. 411 లోనివి. ఇంకా వేంకటరమణ కవి రచనల వివరాలు ఆ సంచికలో ఇట్లు తెలిపారు,

“మొదటిది (నాసిస్టామాయణము) మదరాసు పూర్వ ముద్రిత ప్రతులలో లభించినది. రెండవది అలభ్యము. మూడవది ఓరియంటలు లైబ్రరీ క్యాటలాగు నుండి ఉధృతము.”

నాలుగవ గ్రంథ విషయం తెలుపలేదు. ఇప్పటికి అద్‌ అలబ్ధమే. కృవే, రమణయ్య గారి సోదరుడు కృష్ణరాయలు వాసిష్టరామాయణానికి సంస్కృత వ్యాఖ్య వ్రాసినవారు. కావున ఈ రమణకవి వ్యాఖ్య తెలుగు గ్రంథం అయి ఉంటుంది. ధర్మపురిలో విచారిస్తే ఈ కవిని గూర్చి తెలునునన్న వారే లేరు. ఇంక అతని కావ్యాల ప్రసక్తి ఎక్కడ? ఇంతగా విన్నతిలో వపడినాడంటే ఈ కవి ఇంకా ప్రాచీనుడై ఉండాలి.

  1. ఖందేరావు రామారావు - కరీంనగరంః జననం - 1844, మరణం 1935 సుమారు. ఖండేరావు వారు మహారాష్ట్ర కరణాలు. నైజాం నవాబుల కాలంలో వారి పూర్వీకులు సర్కారీ ఉద్యోగులుగా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడి ఉంటారు. గో.క. నం. నాటికి రామారావు గారు 90 సం, వారని ఉంది. “వీరి తండ్రి (కూడ) కవులు. చాలా గ్రంథములు రచించినారు. అన్నియు అముద్రితములు” అని పరిచయం చేశారు. పు. 360. , కరీంనగర్‌ పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో ఖండేరావు వంశం వారి గృహాలున్నవి, వృద్ధులను నంవ్రదిస్తే కవిని గూర్చి వినలేదన్నారు (కవి పొత్రులో ప్రపౌత్రులో అయిన శ్రీనివాస రావు గారి కోసం ఎన్ని పర్యాయాలు వెళ్లినా కలువ లేదు. వారు ప్రభుత్వోద్యోగి. దూర 'ప్రాంతమందున్నారట). గోలకొండ కవుల నంచిక నం. 78 వుట 71, ల్లో రామారావు గారి కవిత ఉంది. శిర్షిక - చూడీకుడుత్త దేవి, , మ. దనుజారిప్రియ దివ్య వుష్పతులసీ దామార్చనై కాంత దా న్యనిరూఢాశయ భట్టనాయక సుధీ నంవర్థితాత్యంత పొ వన భాన్వత్తులనీ వనాంతరమునన్‌ వైదేహి రీతిన్‌ జనిం చిన మా తల్లిని విష్ణు చిత్తతనయన్‌ సేవింతు నశ్రాంతమున్‌. కలితాత్మీయ వచస్సుధా రస ర్ఫురీ కల్లోల మగ్నాత్మయై ఫలమందన్‌ హరిమోదమొందగ తిరుప్పావై ప్రబంధంబు భూ స్థలిలో నానతి యిచ్చి దాస జనతా దౌర్గత్యముంబాపి భా సిలు మా ళల్లిని విష్ణు చిత్తతనయన్‌ సేవింతు నశ్రాంతమున్‌ ఘన నీలాళ్ళ సమాత్మ కమ్రకబరీ గంధాంకితోత్కష్ట మా ల్య నవీనోజ్వ్వల సౌరభానుభవ లౌల్యంబాప్ప ధన్యోహమం చును దన్మాలిక గృష్టుడందుకొనుటన్‌ చూడిక్కుడుత్తాఖ్యగాం

116 డా॥ మలయశ్రీ- “కరీంనగర్‌ జుల్లా తెలుగు సాహిత్య చరిత్ర” తనయందే దురితక్రియా చరణుడై దౌర్గత్యమున్‌ బొంది వ చ్చిన కాకాసురునాత్మ నాథు పదరాజీవంబులన్‌ జేర్చి ప్రో చిన కారుణ్య సతీమ తల్లిని జగత్‌క్షే మావహాపాంగ రా నిని మాతల్లిని...... మూడవ పద్య పదబంధం - భావం రమ్యాతి రమ్యం. రామారావు గారు సంస్కృత భాషావైదుష్యం కల (ప్రౌఢ కవి అనడానికి పై పద్యాలు నిదర్శనం. ఆయన విష్ణు భక్తుడు. ఈ పద్యాలు నాలుగూ మత్తేభాలే. ఏకవృత్తం గోదా చరితం చూడ “మా తల్లిని... ఆశ్రాంతమున్‌' అనే మకుటంతో ఈ కవి “ఆండాళ్‌ శతకం' వ్రాసిరేమో అని అనుమానం. చివరి పద్యంలోని కాకాసుర వృత్తాంతం రామాయణం లోనిది. సీతాదేవియే గోదాదేవి అని కవి భావం. ఖండేరావు రామారావు గారి కృతులు లభించి ప్రచురింపబడితే దిట్టకవిగా వారి ప్రతిభ వ్యాప్తమయ్యేది. రామారావు గౌరి తండ్రి కూడా కవితా విభూషితులట! చూడికుడుత్త దేవి తమిళ పదం. దాని అర్ధం - ఆముక్తమాల్యద. 5. పరవస్తు మునినాథ కవి - కేశవ పట్టణం, 1896.

పరవస్తు మునినాథస్వామి శతక కవి. వీరి రచనల పేర్లివి.

క లక్ష్మీశతకము, 2. లలితా శతకము 3. పరవస్తు శతకము

కవి స్వగ్రామమైన కేశవ పట్టణం కరీంనగర్‌ నుండి హన్మకొండ మార్గలో హుజూరాబాద్‌ తాలూకాలో ఉన్నది. ఇప్పుడది మండల కేంద్రం. ఈ మధ్యనే తీవవాదులచే హతుడైన మండలాధ్యక్షుడు శంకరయ్య గారి నృతిగా ఇప్పుడది శంకరపట్టం పేర వ్యవహరించబడుతున్నది.

కేశవ పట్టణంలో 1531లో స్టాపితమైన పరవస్తు జియ్యరు స్వామి మఠమున్నది. ఇప్పటికీ దీపధూప వైవేద్యాదులతో నిత్యారాధన, వైశాఖ శు తదియనాడు రథోత్సవంతో అది అలరారుతున్నది.

దక్షిణ దేశం నుండి వచ్చి విశ్రాంతిగా పుర బాహ్యగిరి చెంత కూర్చున్న జియ్యరు స్వామి పొదాన్ని కబళించే కొండ చిలువ, స్వామి చూపుతో శాప విమోచనమై కందాళై తోడప్పర్‌గా మారిందట. ఆ జియ్యరు స్వామి ఈ అజగర సర్పం సమాధులు ఒకే చోట ఉన్నాయి. అదే ఆలయం. శఠాధిదేశికుల వారే ఈ శేషమఠం పూజారులు.'

ఆ పరవస్తు వంశానికి చెందినవారే మన మునినాథ కవి. మునినాథకవి లక్ష్మీలలితా శతక ద్వయం ముద్రితమైనవి. గో.క. సం.పుట 406 పూర్వకవి పరిచయం నం.98లో “కవిత్వము 'ప్రాఢథము ముద్రితములగు నీ శతకములు మదరాసు వావిళ్ళ వారికడ లభించును. శేషమఠ పీఠాధీశులకు జియ్యరు శిష్యుడగు నిక్కవి వృత్తాంతము స్పష్టముగ దెలియదు.” అని శేషాద్రి రమణ కవులు వ్రాసినారు.

స్థానికులకు కూడ మునినాథ కవిని గురించి తెలియదు. శతక ప్రతులు లభించలేదు.

శతక వాబ్బయ సర్వస్వములో ఈ కవి "పేరు లేదు.

డా॥ దివాకర్ల వేంకటావధాని గారు 'ఆంధ్ర వాజ్మయ చరిత్రము" లో ఇట్లా అన్నారు.*

“లక్ష్మీ శతకము కందపద్యమయమైన శతకము. దీనిని రచించిన వాడు పరవస్తుముని నాథ కవి యను సాతానివైష్టవుడు. అతడు లలితా శతకమును గూడా రచించి యుండెను. ఇతని కవిత శబ్బాలంకార మయమై నిర్జుష్టమై ద్రాక్షాపాకముగ నున్నది. లక్ష్మీస్తుతిపరమైన శతక మాంధ్రమున నిది యొకటే.” - పు. 118

ఈ 20వ, శతాబ్దిలో మంథని వేంకటరాజన్న అవధాని గారు కూడ మరో 'లక్ష్మీశతకము" రచించారు. అది కూడా కందపద్యాలదే. అముద్రితం.

మొదటి భాగం, 1౪ అధ్యాయం: రందోమ్మిచీవ్‌ శతొట్టి తెలంగు నాహొత్భం 117 ముని నాధకవి లక్ష్మీశతకం కంద పద్యాలది. లలికాశతకం వృత్త పద్యాలదో? 1960 సుమారుగా ఒకానొక లలితా శతకం కనిపించింది. “లలితారమ్మిక కాలయాపనము లేలా రాజబింబాననా!” అని దాని మకుటం. ఏకాక్షర 'ల' ప్రాసతో మత్తేభ విశ్రీడిత వృత్త పద్యాలతో విరచితమైన ఆ శతకం ఈ కవిది అవునో కాదో తెలియదు. ఆ పుస్తకం కోనం ఎంత ప్రయత్నించినా తిరిగి దొరుకలేదు. పరవస్తు శతకం వ్రాత ప్రతి కేశవ పట్టణంలో శేషమఠ ఆర్బకులింట 1993లో కనిపించింది. దానిలో కవిపేరు లేదు. అది 'పరవస్తునాయకా' అను మకుటంతో చంపకోత్పల పద్యపుష్పాలగురు పూజా శతకం. స్థానిక భక్తకవిచే విరచితమైన ఆ శతకానికి కర్తయెవ్వరో తెలియదని శఠగోపాచార్యులన్నారు. అది పరవస్తుముని నాథ కవి విరచితం కానోపునని ఈ గ్రంథకర్త (నా) అనుమానం. లక్ష్మీ లలితల స్తుతికి పూర్వమే మునినాథ కవి గురు న్తుతి రూపంగా పరవస్తు శతకం వ్రాసి ఉంటాడనుకోవడం అసంగతం కాదు. పరవస్తు గురునామం. పైగా అదే ఈకవి గృహనామం. ఈ అష్టోత్తర శత పద్యశతక రచన, ఖర నామ సంవత్సర కార్తీక శు.7 భానువారం అని వ్రాసి ఉంది. మచ్చునకు “పరవస్తు శతకం' లోని ఒక పద్యం. శ్రీరమణీశ పాద సరసీరుహ హంస, పరాంకుశాంఘ్రి నీ రేరుహ భృంగ సంయమి వరేణ్య పద ద్వయ దాస్యతత్సుధా వారిధి పూర్ణ చంద్ర మణవాళ మహాముని సంప్రదాయ మం దారక భృత్య మోక్ష ఫలదాయక శ్రీ పరవస్తునాయకా = 1 ఓ పరవస్తు గురూత్తమా? నీవు శ్రీపతి పాద పద్మాల నాశ్రయించిన హంసవు. పరాంకుళ గురు చరణ కమలముల విహరించే తుమ్మెదవు, యోగీశ్వరుల పాదాలకు దాసుడవు. ఆ సుధా సముద్ర సంపూర్ణ చంద్రు (డవు-లేదా) డైన మణవాళ యతి సంప్రదాయ కల్ప వృక్షానివి. దాసులకు మోక్ష ప్రదాతవు. మునినాథ కవి కవిత్వం ముగ్ధ మోహనం! పాదవీఠికలు : 1 ఈ ఐతిహ్యం కేశవ పట్టణ శేషమఠ పరవస్తు పీఠం పూజారి పరవస్తు శఠగోపాచార్యులు 3- 9-93 నాడు వారింటిలో నాకు తెలిపారు. 2. డాః దివాకర్ల “ఆంధ్రవాబ్బయ చరిత్రము” 12వ, ముద్రణ - 1985 యక్షగానాలు

  1. చెర్లపల్లి కాశీనాథశాస్ర - దుంపెట, 19వ, శతాబ్దిపూర్వార్ధం. 2,3 ఇతర యక్షగాన కవులు. చెర్లపల్లి కాశీనాథ శాస్త్‌' విద్వత్కవి, రంగస్థల నటుడు. ఆయన రచించి ప్రదర్శించిన యక్షగాన నాటకాలు నాలుగు. అవి అముద్రితాలు. శాస్రిగారి రచనల పేర్లివి. 1 వామన చరిత్రము - యక్షగానం, 2. గయోపాఖ్యానము, 3. లక్ష్మణా పరిణయము టే రుక్కిణీ కల్యాణము. కవి కాలం - జన్మస్థలం : నాటి జగిత్యాల - మెట్‌పల్లి తాలూకా, నేటి కథలాపుర మండలంలోని 'దుంపెటి2 గ్రామంసమీపాన కొండపై నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ విష్వాలయ పూజారులు వైదిక బ్రాహ్మణులు. ఆ కోవెల తొలి పూజారి నారంభట్ట (నాదంభట్ల!) మహాదేవు గారు ఆయన వంశంలోని వ్యక్తి ఈ కాశీనాథకవి. ఆ పూజారులు వ్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ (ఆలయరథోత్సవ) దినాల్లో నాటకాలు ప్రదర్శించడం ఎన్నో యేండ్లుగా ఆనవాయితిగా వస్తున్నది ఆ ప్రదర్శనల కోసం రచించినవే కాశీనాథశాస్రి గారి యక్షగానాలు, ఈ కవి ఆరీడు తరాలకు పూర్వుడన్నారే కొని, ఆ కుటుంబం వారు ఖచ్చితంగా కవి కాలం ఫలానా అని చెప్పలేకపోయారు.

118 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సావాత్య చరిత్ర” దుంపెట నృసింహాలయార్చకుల వంశవృక్షం ఇది. 1 నారంభట్ల మహదేవు - కోవెల తొలి పూజారి 2. రాజంభట్టు 3, నీలకంఠం 4. లక్ష్మయ్య 5. నరసింహులు కవి 4. రమణయ్య కవి 5. నరసింహులు 6. నరహరి 7. లక్ష్మినరసయ్య, వ. 45 నం, 5. నరహరి కవి 5 మోనయ్య 6. దుంపెటాద్రి 7. లక్ష్మినారాయణ శాస్త్రి కవి. (గుండయ్య]) వ. 55 నం. వీరిలో నాలుగవ తరం రమణయ్య గారి సమకాలికుడుచెర్లపల్లి కాశీనాథ శాస్తి. వీరు మూడవ తరం నీలకంఠం గారి సోదరి పుత్రులై ఉంటారు. రమణయ్య గారు యువదశలో మొదట కొన్నాళ్ళు సన్యాసిగా ఇల్లు విడిచి వెళ్ళారట. ఆ కాలంలో నీలకంఠం బావగారి కుటుంబాన్ని పిలుచుకొని ఉంటారు. లక్ష్మయ్య గారి వివరాలు తెలియవు. లక్ష్మయ్య రమణయ్యలు సోదరులు. వారికి కాశీనాథం మేనబావ. చెర్లపల్లి వారు ఇప్పుడు మల్యాల చెందుర్తిలో ఉన్నారు. నారంభట్ల గుండయ్య గారి తండ్రి దుంపెటాద్రి గారి జననం శ్రీ.4 1900 సంవత్సరం. వారి తండ్రి మోనయ్య 1870, తాత రమణయ్య 1840లో జన్మించి ఉంటారు. రమణయ్యకంటె కాశీనాథ శాస్త్రి ఓ పది సంవత్సరాలైనా పెద్దకావాలి. ఎందుకంటే కాశీనాధ కవి ప్రభావం వలననే రమణయ్య యక్షగాన రచన కావించాడు. కాబట్టి చెర్లపల్లి కాశీనాథ శాస్త్రి కాలం సుమారుగా 1830- 90. వారి రచనాకాలం 1856 -60. రచనలవిశేషాలు; కాశీనాథశాస్తి యక్షగానాలు నాలుగూ ప్రదర్శనల్లో చాల రక్తి కట్టేవట. అయినా వామన చరిత్రం అద్భుతమైన రచనా విన్యాసంతో కవికి కీర్తిని తెచ్చిపెట్టిందని వినికిడి. ఎంత ప్రయత్నించినా నాలుగైదు పర్యాయాలు కవివంశీయులున్న దుంపెట, సిరికొండ, కట్టకుంట గ్రామాలకు వెళ్ళినా ఈ నాటకాల వ్రాతప్రతులు లభించలేదు. సిరికొండ లక్ష్మీనరసయ్య పట్వారీ కొరుట్ల గారు* కవిని గూర్చిన కొన్ని విశేషాలు తెలిపారు. వీరు పూజారి వంశంలో ఏడవ తరం వారు. వారి తాత నం. | నరసింహులు వ్రాసుకొన్న దొడ్డు కాగితముల ప్రాతప్రతిలో పైన చూచిన వంశ వృక్షం వ్రాసి ఉంది. ఈ నరసింహులు గారి తమ్ముని మనుమడు నారంభట్ట లక్ష్మినారాయణ శాస్తి (గుండయ్య) దుంపెట గారుక్‌ రచించిన “దుంపెట క్షేత్ర చరిత్ర " వ్రాతప్రతి కట్టకుంటలో లభించింది. లక్ష్మినారాయణ గారు కవి నటులు; గాయకులు. వారు కాశీనాథ శాస్త్రి గారి యక్షగానాలలో వేషాలు వేసినవారు. అ నాటకాల కీర్తనలు పాడి వినిపించడమే కాక ఆ పూర్వకవుల రచనల వివరాలు తెలిసినంతలో వివరంగా తెలియజేశారు. అవి తమ అముద్రిత 'దుంపెట క్షేత్ర చరిత్ర'లో పొందుపరిచారు కూడా. అవే ఈ వివరాలు వ్రాయడానికి సహకరించాయి. కాశీనాథ శాస్త్రి గారి వామనచరిత్రకు మూలకథ భాగవతంలోనిదే. అయినా వీరు వేదాంత విషయాలను ఈ రూపకంలో చాల చక్కగా పొందుపరిచారట. ఈ యక్షగానంలోని విష్ణుమూర్తి పాత్ర ప్రవేశ కీర్తన ఇట్టున్నది. “అట్టీ నారాయణ మూర్తిని నేను నృష్టిలో జనుల పట్టీ బ్రోచుటకై వచ్చినాను”. నిష్టతోడ సురనివహము గొలువగ | గట్టిగ అదితికి పుట్టితి వినరా ॥అ॥ భాసూర మగు శ్రీ దుంపెటగిరిని। వాసూడనయ్యి పోషింతు భువిలో జనులందరిని దోసిలొగ్గి బహంయాచన జేసెటి । కాశినాథ దాసుని రక్షించిన ॥అ॥” ఇట్లా గేయాలను కవులు తమ నామాంకితం చేయడం జయదేవ, సూరదాసు, మీరాబాయి, త్యాగరాజు మొ॥ వాగ్గేయకారుల్లో కానవస్తుంది. కాశీనాధ శాస్తి గారు వారి యక్షగాన రూపకాలలో

మొదటి భాగం, 1/ అధ్యాయం: రందొమ్మిదీన్‌ తరొజ్ది తెలంగు సాహొత్భం 119 ఒక్క వామన చరిత్రలోని కీర్తనలను మాత్రమే స్వీయ నామ ముద్రతో రచించారు. మిగితా నాటకాల కీర్తనలలో కవి తన పేరు చేర్చలేదట. రాను రాను యక్షగాన కవులు ఈ పద్దతిని విధిగా అనుసరించారు. వారు కృతిభర్త గ్రామాన్ని, ఆ గ్రామ దైవాన్ని, కృతి నామాన్ని పాట చివరి చరణంలో తప్పనినరిగా పొందుపరిచారు. ముద్దు బాలంభట్ను- మంథని, నరసింహదాసు - ధర్మపురి6 గారల యక్షగానాలకు దుంపెట శాస్త్రుల యక్షగానాలకు ఒక ప్రధాన భేదం కానవస్తుంది. అది పాత్రలు మొట్టమొదట రంగ ప్రవేశం చేస్తున్నప్పుడు స్వీయ పరిచయ దర్వులు పాడడం. ఇది భాగోతం పద్ధతి. దీన్ని ఈ ప్రాంతంలో దుంపెట వారే ఆరంభించారు. నిత్యదాసర్ల రాత్రి నాటకాలలోను, చిందు బాగోతుల పగటి వీధి నాటకొాల్లోనూ ఈ పద్ధతి ఇప్పటికీ సజీవంగా ఉంది. కూచిపూడి వారిలో, తెలంగాణా చిందు భాగవతులలో, అది తెరచాటు పొటగానూ వుంది. నాటి శ్రీడాభి రామ వీధి రూపకంలో పద్యాలే తప్ప పాటలు లేవు. అది సంస్కృత రూపకానువాదం. సుగ్రీవ విజయం పద్యాలతోపాటు పాటలు కలది. సుగ్రీవ విజయం, మంథని రామాయణం మున్నగు ప్రాచీన యక్షగానాలలో పాత్రల సృష్టత లేదు. దుంపెట కవుల? రూపక రచనలు పాత్రలకు ప్రవేశ నిష్కమణాది సూచనలు, వచన సంభాషణలు కలిగి ప్రదర్శన సౌలభ్యాన్ని చేకూర్చిన ఈ ప్రాంతపు తాలి యక్షగానాలు, అంతకు పూర్వ యక్షగానాలలో సంధి వాక్యాలు కవి కథనంగానే ఉండేవి. ఈ భాగాన్ని నాడు మంత్రి వేషధారి నిర్వహించే వాడునుకోవచ్చు. వీధి భాగవతాల్లో ఇప్పటికీ అదే విధానముంది. నృత్య ప్రధానాలైన కూచిపూడి యక్షగానాలలో ఆ పాత్ర సూత్రధారుడు నిర్వహిస్తున్నాడు. తంజావూరి విజయరాఘవుడుకి యక్షగాన నాటకాలలో కొత్తగా రగడలకు మారుగా దర్వు పదాలను, పాత్రల సంభాషణలను వ్రవేశపెట్టినాడని డా॥ దివాకర్ల వేంకటావధాని గారు తెలిపారు.9 నాంది ప్రస్తావనలు కావ్యంలో వలె కవిచేకాక నటులచే నిర్వహింపదేయటం కూడా విజయరాఘవుడే ఆరంభించాడట. అవి సంస్కృత నాటకాల విధానం. కాశీనాథ శాప్రిగారి వామన చరిత్రలో వామనుని రంగప్రవేశ కీర్తన చూడండి. “*“వినరోరి ద్వార పాలకా - నన్నడిగిన మాట । మనసూలో నుంచి వేడుకా, మునుగాని దనుజుల దునుముట కొరకై | వన జానను (డు) నను ఘనముగ బిలిచెను వి! ఉక్కు స్తంభములో బుట్టితి - రక్కనూని బట్టి । వొక్క క్షణములో దుంచితీ, పెక్కు విధంబుల దిక్కులు బెదరగ మక్కువ బాలుని చక్కగ నేలితి వి?” కాశీనాథశాస్రి అన్నగారు చెర్లపల్లి నరసింహులు కూడా కవి. ఆయన నాటకాలేవీ వ్రాయలేదు. కాని - సోదరుని యక్షగానాలకు కొన్ని పాటలు మాత్రం వ్రాసి సహకరించారు. నరసింహులు క్రీర్తనలు పదజటిలత కలవి. ేక్షకులను అవి బాగా అకట్టుకునేవట. నరసింహులు గారికి సంస్కృత భాషా సాహిత్యాల పాండిత్యం అధికం అని వారి కీర్తనలు తెలియజేస్తాయి. చెర్లపల్లి నరసింహులు గారు కాశీనాథశాస్త్రి గయో పాఖ్యానం యక్షగానం కోసం రచించిన ఒక గేయ భాగం ఈ దిగువ చూపబడుతున్నది. శ్రీ కృష్ణపొత్ర రంగస్థల ప్రవేశ స్వీయ పరిచయ గానం ;- “*యదువంశాంబుధీ పూర్ణచంద్రుడా నే। ముదితా రాధికా హృదయ సాం(ద్రూడా * ఉదధిసదనబల్‌ మధుకైటభ వధ | సదళన ॥ పదవిధి హృది భరితుడ - నే (యదు॥ 1 శుండాల తుండ దోర్దండూడ - వైరీ । పాండిత్య తిమిర శత మార్తాండుడా.12 చండ ప్రచండ విఖండన బండనో | ద్దండ తుండయని గండ యుగాంచిత ॥ అండ పిండ బ్రహ్మాండ భాండ వే । దండ రక్ష అఖండ (ల) వినుతుడను ॥యదు॥

120 డా॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత” 2. జంబారి మణిహారా13 విజృంభూడా - సురా! శంబార వైరి రివు హత్‌ స్తంభుడా. కుంభ సంభవ నిశుంభ శుంభది 1 క్కుంభి కుంభ సంరంభ దంభదో స్తంభ జృంభిత హిడంబిడింబ వర ; శంభు పుత్ర హేరంభ వినుతుడను [యదుఃి పద జటిలత కలిగినా శబ్బాలంకార శోభితాలు. అఖండలుడు ఇంద్రుడు, హేరంభుడు వినాయకుడు. వారిద్దరిచేత పొాగడబడిన వాడనని పై పాట రెండు చరణాల భావం. కాన్ని పదాలు నటుల పళనలో మారినట్టున్నాయి. అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ శబ్బాలంకార లయమాధురికి శ్రోతలు ఆనంద తన్మయులయ్యేవారనుకోవచ్చు. నరసింహకవిదే గయోపాఖ్యానంలోని మరో పాట. ఇది భజన కీర్తన. “భజ లక్ష్మీపతి నరసింహం - అను। భజ దుంపెట భూధర సోమం సజల జలజ నీరజ భవ సన్నుత । భుజగాధిప జయ విజయాశ్రిత స ద్విజ వర పూజిత గజరక్షక - (గూ) సుజనా భరణా! సుందర చరణా!....” మొదటి వీరరసన కీర్తనలోని శబ్బ్దాడంబరానికి, ఈ రెండవ భక్తి గేయంలోని ప్రసన్న శైలి - పదసారళ్యానికి మధ్య గల అంతరాన్ని గ్రహించవచ్చు. చెర్లపల్లి నరసింహులు గారు రసోచితంగా కవనం చెప్పగల నైపుణ్యం కలవారు. కాశీనాథ శాస్రి భక్తుడు, కవి, గాయకుడు, నటుడు, నాటక ప్రయోక్త. వారి కాలంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ వారి వంశీకులు చెప్పుకుంటారు. అది వారి వామనచరిత్ర యక్షగాన ప్రదర్శనకు సంబంధించిన విషయం. ఒక పర్యాయం శంకరాచార్య గారు (కంచి - శృంగేరి) తమ సంచారంలో శోరుట్టకు వేంచేశారుో ఈ వైదిక బ్రాహ్మణులు నట గాయక కళారాధకులు అని, వారు విని, కవిని, దుంపెట పూజారి కుటుంబం వారిని జాతి నుండి వెలివేశారు. అది తెలిసి కాశీనాథ శాస్త్రీ వెళ్ళి, శంకరాచార్యులను కలుసుకొని, తమ నాటక ప్రదర్శనను చూసిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకొండని అభ్యర్థించి ఆహ్వానించాడు. శంకర పీఠాధిపతి “అంగీకరించి దుంపెటకు వెళ్ళి పూజారి వారి వామనచరిత్ర యక్షగాన ప్రదర్శనను తిలకించారు. ఆ రచనా పాండిత్యానికి, భక్తి ఈత్వానికి, నటనా 'ప్రావీణ్యానికి, గాన మాధుర్యానికి ముగ్గులై వెలిమాట వదలి ఆశీర్వదించి వెళ్ళారట! కాశీవాథ శాస్త్రి యక్షగానాలు స్థానిక దేవాలయ వార్షికోత్సవ ప్రదర్శనల కోసం వ్రాసినవే. అభిమానులు కోరినా ఇతర గ్రామాల్లో ప్రదర్శించేవారు కారట. కోరుట్లలో నాటక ప్రదర్శనను శంకరాదార్యకోరినా, వారు ఒప్పుకోకపోతే ఆచార్యులు దుంపెటకే వెళ్ళి చూశారట. ఇతర పర్వాల్లో నాటకొలు వేసినా న్వగ్రామంలో అ దేవాలయ ప్రాంగణంలోనే. అటువంటిది వారి కళా తృష్ణ భక్తినిష్ట. శాస్త్రి గొరి నాలుగు నాటకాలు చక్కని రచనలే. గయో పాఖ్యాన యక్షగాన రచన మాత్రం మరో కవి పొత్తుతో సాగింది.* కాశీనాథ శాస్తి గయోపాఖ్యాన సహరచయిత నారంభట్ల రాజన్న శాస్త్రి సిరికొండ గారు. ఆయన ఇటికాలకు మారారు. ఇటికాల రాయికల్‌ మండలంలో ఉంది. రాజయ్య శాస్త్రిగారు కాశీనాథ శాస్త్రి గారికి బంధువులు, నట మిత్రుడు కూడానేమో! ఆయన మరే రచన చేసినట్లు చేదు. దుంపెట నృసింహాలయ పూజారి మహదేవు గారి వంశంలో యక్షగాన రచన 4వ తరంలో కాశీనాథ శాస్తితోనే ఆరంభమైనా అది అతనితో ఆగిపోలేదు. పారంపర్యంగా ఆ వంశంలో పలువురు కవులు యక్షగానాలు రచించారు ప్రదర్శించారు. తెలియ వచ్చినంతలో దుంపెట గ్రామ యక్షగానకర్తల వివరాలివి. నారంభట్ల రమణయ్య గారి రచన16 (4వ, తరం) 1. శ్రీవేంకటేశ్వర మహాత్మ్యము.

మొదటి భాగం, 17 అధ్యాయం: రందొమ్మిదీరి శతొట్థి తెలుగు సారొర్ర్యం 121 నారంభట్ల నరహరి గారు17 (5వ తరం) 1. పట్టాభిరామాయణము నారంభట్ల లక్ష్మీనరసింహులు - 1. ఉత్తూరు లచ్చయ్య భాగోతం. తత్త్వాది రామయ్య (ఇటికాల)18- 19వ, శతాబ్ది, 1. సీతా కల్యాణము. రామయ్య గారు దుంపెట వారికి బంధువో నాటక మిత్రుడో అయ్యుంటారు. నారంభట్ల దుంపెటాద్రి]19 (6వ తరం) 20వ శతాబ్లీ ఆరంభం. 1. పరకాల చరిత్ర, 2. చెంచులక్ష్మి దుంపెటాద్రి గారివి 20 వ శతాబ్ది రచనలు. చెర్లపల్లి - నారంభట్ల వారి యక్షగానాల కథలన్నీ పౌరాణికాలు. వీటిలో “ఉత్తూరి లచ్చయ్య భాగోతం” మాత్రం విలక్షణమైనది. అది సమకాలీన సాంఘికేతివృత్తం. దుంపెటపూజారి మహదేవు వంశంలోని నాలుగవ తరం రమణయ్య సోదరుడు లక్ష్యయ్యగారి కుమారుడైన నా. నరసింహులు ఇతర నటబంధు మిత్రులతో కలిసి ఈ భాగోతంరచించి ప్రదర్శించారు. ఇది 19వశతాబ్లి చివర లేదా 20వ శతాబ్ది ఆరంభంలో జరిగిన కథగా వ్యాప్తి. ఆ కథ ఇది. దుంపెట బ్రాహ్మణులు ఓ సారి భూమిశిస్తు డబ్బు సకాలంలో చెల్లించలేదని ముస్లిం అధికారులు శిక్షించారట. అందుకు వారిని డ్రేరేపించింది కోరుట్ల శెట్టి అని తెల్సి ఆ ఉత్తూరు లచ్చయ్య గారిని తూలనాడుతూ ఈ యక్షగానం రచించి కోరుట్లలోనే ప్రదర్శించారు. ఆ రూపకంలోని కొన్ని పాటలు చూడండి, తాండ్ర భద్రయ్య ఫర్మానా - యింత! గాండ్ర తన మిది గుదిరె శానా ఊండ్రాలు నీ మనను గుండ్రాయి వలె నిన్ను; తండ్రాలు బెంచేరా మొండ్రాయి చెట్టువలె॥ వారు నాటి గామ్య పదరూపాలను ఈ బాగోతంలో యధేచ్చగా వాడారు. మరో గేయ చరణం ఇది - శాస్తుర్లను నేను శాన్తుర్లను॥ వెల్లుల్ల సీమలో మల్లగౌణి యింట। నల్లకల్లూ తాగే శాన్తుర్లను.... ఆ భద్రయ్య, ఈ శాస్త్రులు దుంపెట వారిపై విరోధంతో ఉత్తూరి లచ్చయ్యకు సహకరించినవారు. ఈ వైశ్యుడు స్టానిక సర్కార్‌ పాలనతో ఎలాంటి సంబంధం కలవాడో కాని ఆయన సలహావలన దుంపెట అయ్యవార్లకు శిక్ష గట్టిగా పడినట్టుంది. కోపం నసాళానికి ఎక్కింది. కలం సిరాను కక్కింది. కవిత కదం తాక్కిందె. “ఉత్తూరు లచ్చా భళిరా - బ్రాహ్మ, బోత్తముల మొత్తించితివిరా!” ఈ తగాదా భూమిపన్ను విషయంగా ఆరంభమైనా అంతటితో ఆగలేదనడానికి నిదర్శనం ఈ క్రింది పద్య పాదం - “కం. నీ పాప లగ్న మనుచును, బావనయల్‌ రాగ నీవు బాదెద వటరా” అందుకే గేయాలిట్టున్నవి! “ఇట్లేల జేసితిని లచ్చా - నీ । నొట్లె పెద్ద గాడిద ఉచ్చా!” ఇది నిందా రూపక భాగోతం. ముఖాముఖి ప్రదర్శన తిట్టు ఘాటుగా ఉన్నా బూతు లేకపోవడం విశేషం. ఇందులోని పాత్రలు లచ్చయ్యగారి బంధుమిత్రులు, నర్కారీ ఉద్యోగులు పరాయి ముష్కర పాలనలో స్వదేశీకర్కశ ధనిక వర్గాన్ని ఎదిరించి ఇటువంటి యక్షగానం వ్రాయుటం పైగా అధికారుల సమక్షంలోనే ప్రదర్శించడం అతి సాహసం. కవులు అక్షర ధనులు-- అభిమాన గుణులు. ఈ భాగోత ప్రదర్శన వలన కథానాయకునికి గుణపాఠం కలిగి మరునాడు వచ్చి కళాకారుల క్షమాపణ కోరుకున్నాడట.” దుంపెట వారి యక్షగానాలు పౌరాణికాలు, అముద్రితాలు, భాషాజటిలత కారణంగా ప్రతులు కూడా వ్యాప్తి పొందలేదు. నామ వ్యాప్తి అధికంగా కాకున్నా చెర్లపల్లి కాశీనాథ శాస్త్రి ఈ జిల్లా తొలి తరం సలక్షణ యక్షగాన రచయిత. నారంభట్ల కవులు వారి అడుగు జాడలను అనుసరించారు. దుంపెట పూజారి వంశం వారు ఉద్యోగాల కారణంగా స్వగ్రామాన్ని వదిలారు. దుంపెటాద్రి గారితో ఈ 20వ శతాబ్ది పూర్వార్ధంలో యక్షగాన రచన ఆగింది. ఉత్తరార్థంలో ఓ పదేండ్లుగా వారి

122 డా॥ మలయశ్రీ- “'కరీంనగల్‌ జిల్లా తెలుగు సొహిత్య చరిత్ర” యక్షగాన (ప్రదర్శనలు కూడా ఆగిపోయినవి. కాలం తెచ్చిన మార్చు! పాదపీరికలు:;

1 కరీంనగర్‌ మండల చరిత్ర- 1981లోని “ప్రాచీన సాహిత్యం - కళలు” లను వ్యాసంలో గట్టెపల్లి సత్యనారాయణ గారు వీరిని కవిగా పేర్కొన్నారు.

  1. ఇది 'దుమ్ముపేట' మారిన పదం కావాలి. అ గ్రామానికి దగ్గరలోనే ధూళూరు (దూళి ఊరు దూలూరు) కూడ ఉంది.

  2. కాలం మారి ప్రదర్శనలు ఆగి, కవి కుటుంబీకులు ప్రభుత్వోద్యోగాలలో చేరి వేరు వేరు ప్రదేశాలలో ఉంటున్నారు. నాటి నాటక సామాను పెట్టెలు వ్రాత ప్రతులు ఎక్కడ చిక్కుపడి ఉన్నాయో వారికే తెలువకుండా ఉంది. "

4 లక్ష్మినరసయ్యగారు కొరుట్లలో ఉంటూ మెట్బపల్లి రెవిన్యూ కార్యాలయంలో స్టాంప్‌ వెండర్‌గా కాలం గడుపుతున్నారు.

  1. లక్ష్మీనారాయణ శాస్త్రి గారు జిల్లా ప్రజాపరిషత్‌ కట్టకుంట, మేడిపల్లి మండలంలో ప్రథమత్రేణి తెలుగు పండితులు.

  2. ఈ గ్రంథంలోని మూడవ (ప్రకణంలో బాలంభట్టు, ఇదే ప్రకరణంలో నరసింహదాసు ధర్మపురి గారి రచనలు చూపబడినవి.

7 కాశీనాథశాస్త్రి మరియు ఆ కుటుంబపు ఇతర యక్షగాన కర్తలు.

  1. రఘునాథ భూపాలుని పుత్రుడు, 17వ శతాబ్ది. 9. ఆంధ్రవాజ్బయ చరిత్రము. పుట.66

  2. నారంభట్ల ల.నా.శాస్త్రి గౌరు పొడి వినిపించారు. 11. సుదర్శన - కాబోలు

  3. ఇక్కడ కవి కథా విషయంతో సరిపెట్టుకోక, పోట్‌ కవులను గెలిచే ప్రతిభగల వాడనని తెల్పుతున్న ధ్వని ఉందనిసించుతున్నది. 13. ఇంద్రనీల మణిహారం

  4. ఈ కథ సిరికొండ లక్ష్మినరసయ్యగారు, నారంభట్ల లక్ష్మినారాయణగారు ఇద్దరూ వినిపించారు.

  5. వారంభట్లవారి 'దుంపెట క్షేత్ర చరిత్ర అముద్రితం

  6. లక్ష్యయ్యగారికి ఎన్నవ తరమో తెలియదు. 17. రమణయ్యగారి దెండవ కుమారుడు.

  7. ఇప్పటకి నూరేండ్ల పూర్వులు,

  8. నా.ల.నారాయణ 'దుంపెట క్షేత్ర చరిత్ర' రచయిత గారికి తండ్రి ఈ దుంపెటాద్రి గారు.

  9. నా.ల.నారాయణ గారి 'దుంపెట క్షేత్ర చరిత్ర' నుండి -

4 చతుర్వేదుల తులసీరాం - బొమ్మెనపల్లి తులసీరాం గారు వైదిక విప్రులు. పందొమ్మిదవ శతాబ్దికి చెందినవారు. చతుర్వేదుల తులసీరాం “శుకరంభాసంవాదముూ' అను యక్షగానం రచించినట్టు “కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్ర 1981 ముద్రణ, పుట 8లో ఉంది. ఇప్పుడు బొమ్మెనపల్లిలో రామక వారున్నారు గాని చతుర్వేదుల వారు లేరు. కవి వివరాలు తెలియలేదు. 'పై రచన అముద్రితం, అలభ్యం, 5. న్యాలకొండ కిషన్‌రావు - రాఘంపేట న్యాలకొండ కిషన్‌రావు గౌరు రాఘంపేట వాస్తవ్యులు. రాఘంపేట ప్రస్తుతం చొప్పదండి మండంలోని గ్రామం. కిషన్‌రావు గారు 'భ్రమరవేణి” అనే పేరుతో ఒక యక్షగానం రచించినారు. శవి 193వ, శతాస్టివారు. ఇతర వివరాలు తెలియవు న్యాలకొండ వారు రెడ్లు గంగాధర, నెమిలికొండలో ఉన్నారు. రెడ్లు అయినా 'రావు' అని వారి పేర్గుండడం అది నిజాం రాణుల కాలంనాటి బిరుదు. వారు దేశాయ్‌లు.

మొదటి భాగం, 17 అధ్యాయం: శందోమ్మిదీన్‌ శతాబ్ది తెలగు నాపొర్టాం 123 “అనసూయ'మరి కొన్ని నాటకాలు రావుగారు రచించినవి అగ్రామంలో ప్రదర్శ్భించేవారని కరీంనగర్‌ జైలు పోలీసు (రాఘంపేట వ్యక్తి) తెలిపారు 1996లో. అవి అముద్రితాలు. వారి కుటుంబీకుల వద్ద ఉండి ఉంటాయి. కవి 20వ, శతాబ్ది పూర్వార్ధంలో కీర్తి శేషులు. 6. రాజారామానందకవి - పెద్దపల్లి [850-520 ఈ కవి పూర్తిపేరు ఠాకూర్‌ రాజారాం సింగ్‌. ప్రఖ్యాత పురాచరిత్రవస్తు పరిశోధకులు. అడ్వొకేట్‌, రచయిత అయిన 'అమరభారతి' ఠాకూర్‌ రాజారాం సింగ్‌ వీరికి పొత్రులు. రామానంద కవి రచనలు - 1. సుభద్రా పరిణయము - యక్షగానము, 2. మంగళ హారతులు. కాలస్థలాదులు:19వ, శతాబ్ది మధ్యకాలంలో పుట్టి ఈ శతాబ్టిఇరవైలో కీర్తి శేషులైనట్టు అమరభారతి గారు చెప్పారు.1 కవి పూర్వీకులు పెద్దపల్లిలో స్థిరపడిన బెత్తరాహులు. బొందిలీ వర్ణస్థులు. రచనా విశేషాలు: రాజారామానంద కవి మాతృభాష హిందీ అయినా ఆంధ్రభాషా కవితాభినివేశం కల వ్యక్తి. పాటలు, మంగళహారతులు వ్రాశారు. ఆయన 'సుభద్రా పరిణయము' అనే యక్షగానం రచించి స్థానిక వణీక్రముఖునికి అంకితం కావించారు. ఆ శ్రేష్టి ప్రతియేటా ఈ నాటకాన్ని ప్రదర్శింపజేసి, నాయికా పొత్రధారికి చీరెసారెలిచ్చి సన్మానించేవారట. సుభద్రాదేవి తమయింటి అడకూతురని సంతసించేవారట.* ఇప్పుడు ఆ కృతి కర్త కృతి భర్త, నటులు, ఎవరూ లేరు. ఆ కావ్యమూ లేదు. ఆ విషయాలు తెలిసినవారు కథగా కాలక్షేపానికి చెప్పుకుంటారు. రాజారామానంద కవి భద్రంగా దాచుకున్న పింగళి సూరన కళాపూర్ణోదయము తొలిముద్రణ అచ్చు ప్రతి వారింట దొరికింది. దాని ఒక పుటపై పెన్సిల్‌తో పెద్దన మనుచరిత్ర పద్యం వ్రాసి ఉంది. కవి పండితుడనడానికి ఇది నిదర్శనం. రామానంద కవి కృత హారతిలోని కొంత భాగం ఇది. హరి ప్రియా జయమంగళం | శ్రీహరి ప్రియా జయమంగళం హరి ప్రియా శ్రీహరి ప్రియా; సుర వర ప్రియా బుధ జనార్చిత 1హరి॥ కవి పూర్వ ప్రబంధ పఠనమును బట్టి అతని “సుభద్రాపరిణయం' చేమకూర వేంకటకవి విజయ, విలాసమును అనుకరించి ఉంటుందని భావించవచ్చు. రామానంద కవి సుభద్రా ౯౨ పాదపీఠికలు; యక్షగానం అముద్రితం - అలభ్యం.

  1. తాతగారి వివరాలు చెప్పుతూ అమరభారతిగారు ఎంత వెదకినా కవి గౌరి రచనలు - ట్రాతవ్రతులు లభించలేదు. 2. ఈ విషయాలు మల్లా వజ్ఞల రామచంద్ర శర్మ పెద్దపల్లి గారు తెలిపారు. | క ర్పుద్ర ఎఖ్జయ్య = కోరుట్ల జననం 1860 సుమారు, మరణం 1937 కక్రీళ. రుద్ర ఎజ్జయ్య గారు కోరుట్ల వాస్తవ్యులు పద్మశాలి కులజులు. ఆయన ఆయుర్వేద వైద్యం, చేనేత, కవిత్వం చేపట్టిన రాజయోగి. హఠయోగ సాధన చేశారు. మంత్రవేత్తగా వురోహితులుగా వారు రాణించారు. మెట్టుపల్లి తాలూకాలోని రంగారావుపేట గ్రామవాసి రాజయోగి అగు దత్తాద్రి అప్పయ్య అను ముస్లిం ఎజ్జయ గారికి వేదాంత గురువు. వైద్య వరుడు కవి గాయకుడైన ఈ ఎజ్జయ గారు యక్షగానాలు రచించారు. బెత్సాహికులకు వాటిని నేర్చి ప్రదర్శింపజేసినారు. పలు పాటలు రాశారు. ఎజ్జయ కవి రచనలుః మూడు యక్షగానాలు.
  2. చిరుతొాండ మహరాజు, 2. మణి భద్ర విలాసము 3. శివకుమారుడు ఈ 3వ నాటకం ఒక్కటి మాత్రం కోరుట్ల ఆళ్వారయ్య గారితో కలిసి రచించారు.

124 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” 4. పాటలు - తత్త్వక్షీర్త్సలు - 150 వరకున్నవి. 5. బసవ రాజీయము - పద్యానువాదం పద్యాలు వెయ్యికి పైగా. స్ఫురద్రూపి, హుందాతనం, వాళ్చమత్కృతి కల కవి ఎజ్జియ్య. కోరుట్ల ఆ పరిసర గ్రామాలలో వీరంటే చాల గౌరవం ఉండేది. మిట్టపల్లి రాజయ్య, ఎక్కల దేవి లక్ష్మణ, శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్న్ష్మయ రాజయోగి, డా॥ అందె వేంకటరాజం మొదలైన కొరుట్ల కవులకు మొదటి సాహిత్య కవిత్వ 'పేరణ రుద్ర ఎజ్బయ గారి కవితలే అనటం నిజం. రచనల వివరాలు : నాటి యక్షగాన నాటకాలు పాటలు పద్యాలు ఎజ్జయ్య సునాయాసంగా వ్రాశారు. వారికి పెద్ద చదువులు లేవు. శ్రుత పాండిత్యం. వరకవి. స్వయంకృషితో విద్యావంతుడై కవిగా వేదాంతిగా కళాకోవిదుడుగా రాణించారు. విచారించదగిన విషయమేమంటే వారి రచనలు ఏవీ ముద్రణ పొందలేదు. లభించలేదు. డా॥ అందె వేంకట రాజం గారు అతి శ్రమకోర్చి ఎల్టియ గారివి 42 పాటలు సేకరించ గలిగారు. ఎజ్జ్టయ్య గారి బంధువులయిన డా॥ వి. ప్రభాకర్‌ గారల సాయంతో వాటిని ముద్రించే తలంపులో ఉన్నారు. వ్రాత ప్రతిలోని కొన్ని పాటలు - చరణాలు, ఎజ్జయ గారి కవితా మాధుర్యాన్ని భావ తత్త్వాన్ని స్థాలీపులాకంగా తెలుసుకోవడానికి ఉపకరిస్తాయని ఈ దిగువ చూపుతున్నాను. ఏల(లు) -

  1. యాల దిరిగెదవే ఓ మనసా। ఇలా పింగల మీద మేలున్నది చూడు మనసా॥ యాల. దిరిగిెదవు బోలు బొంగరమ (బోలు = లోన ఖాళీ స్థలం కలది) కీలు దెలిసి జపమాలను దింపియు (తింపి = త్రిప్పి) ఫాల భాగమున చాలగ శ్రీగురు (శ్రీగురుడు) బాల రూపమై వెలుగుచు నున్నడు.
  2. పాంచ భౌతిక దేహము - చూచుక మురిసి! పెంచ నివ్వకు మోహము పంచ బూతములణచి పట్టి - ఎంచరాని పదవి దెలిసి కొంచెపు దుర్గుణములన్ని - కొట్టి వేసి గుట్టు దెలిసి 1పొంచ॥
  3. కాళి కెందుకు బోతరే - చేసిన బొమ్మల - చూసి మురిసేటందుకే, కాశికి బోకాను నీలో కాశి ఈశుని నమ్ముకోని దాసివయ్యి శ్వాసనడిపి శేషులోదెలుసుకొని॥ అండబాయక సాదుల- సేవల జేసి - నిండుకోని మదిల రెండు కొండల మీద నిలిచి - బండ మీది తోవ దెలిసి పండు వెన్నెల లోపల ఆ - ఖండ జ్యోతిని గలిసి నీవు ॥ .... 4... చిత్ర గుప్తలున్నరు - నీ చేష్టలైతే - నిత్యముగని పెడుతున్నరు. చిత్రగుప్పల జాడ తెలసి మాత్రమైన హవా నింపి (హవా = గ్లాలి) సూత్రమైన నెగుర జిమ్మి - సత్యమైన పదవి దెలిసి ॥ ఆద్యంత్య ప్రాసలు ఈ గేయాలకు అలంకారాలు. వరకవులు పద ప్రయోగంలో స్వేచ్చా ప్రియులు. వారి నేదాంతం ఆత్మవాదం. అది అనుభవైక వేద్యం. విద్యావంతులు మార్గకవిత్వాన్ని అదరిస్తే జానపదులు ఈ దేశి కవిత్వాన్ని అభిమానించి ఆరాధించి పోషించారు. సామాజిక విషయాలను కూడా ఎజ్జయ కవి వదలలేదు. రంకుల భార్య శంఖిని రా - బొంకు వంకలతొటి లతెంకు కయ్యమురా - లెంకిన భార్య దయ్యమురా దయ్యమురా, దయ్యమురా, దయ్యమురా॥ వాడ వాడల దిరుగుచుండు - కోడెగాండ్ల నెప్పుడు - యెడ తెగక కూడుండు మొగడత్తె మరి బూతు బండు - దుడుకు - మాటలాడి కింద బడి పార్లు చుండు అత్తమామల గొట్ట లేచు - పుస్తె గట్టిన మొగని నెత్తికి ముందురాచు...

మొదటి భాగం, 1/ అధ్యాయం: రందొమ్మిదీల ఉతొట్టి తెలుగు సాహొర్ట్యం 125

ఇల్లు దోచడం, ముల్లె తల్లింటికి జేర్చడం, పల్లెను వదలి పట్టంలో ఉండే మోజు మొ॥ విషయాలున్నవిందులో. సంతానం కోసం తల్లడిల్లే మరో గేయం కరుణ రన స్ఫోరకంగా ఉంది. గురుభక్తి ప్రధానమైనవి వీరి పాటలు. బసనవరాజీయం పద్యానువాదడం. వ్రాతప్రతి ఉందట కాని నాకు లభించలేదు.

19వ, శతాబ్లీ చివర పదేండ్డ నుండి 20వ శతాబ్ది తొలి పాతిక సంవత్సరాలు వీరి కలం సాగింది, గళం మోగింది, జనాన్ని అలరించింది. నాటి వరకవుల కవితలు నేటి తిరుగుబాటు రచయితల కవితలు - కథలే, తెలంగాణా కరీంనగర్‌ మాండలిక తెలుగు భాషను (ప్రచారం చేయగలిగాయి. మధుర కవితలు : -

  1. సిరిశెనహళ్‌ శీనయ్య పెద్దపల్ని నివ శతాబ్ది వూర్వార్థం,

శీనయ్య గారు శ్రీవైష్ణవులు. వారిది కౌండిన్య గోత్రం. శీనయ్య గారి తండ్రి వరదమయ్య మంథని వాస్తవ్యులు. శీనయ్య గారు పెద్దపల్లి రాజావారి ఆస్థానకవి పండితులై మంథని నుండి పెద్దపల్లికి మకాం మార్చారు. శీనయ్య గారు కవి - పౌరాణికులు, ఆయన కొన్ని యక్షగానాలు జావళీలు రచించారు. కాలం: శతావధాని కొరుట్ట్ల కృష్ణమాచార్యులకు తాత గారి తాత శీనయ్య గారు. కృష్ణమాచార్యుల జననం క్రీ.శ 1905లో. నాలుగు తరాలకు 4౫30=120 సం.లు 1906 నుండి తీసివేస్తే వచ్చేది 1785 శీనయ్య గారి జన్మవత్సరం. కీనయ్య రచనలు 19వ శతాబ్ది పూర్వార్థానివి.

ట్రల్సు! స్ట్‌ ధ' వంశవివరాలు : ఈ కవి పూర్వీకులు మంథని వారు. శీనయ్య గారు సెద్ద పల్లికి చేరుకున్నారు. తర్వాత వారి కుటుంబాలు ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ వెళ్లి అక్కడి నుండి నిజామాబాద్‌ జిల్లాలోని మోర్తాడుకు మారినారు. మోర్తాడు నుండే కృష్ణమాచార్యులు కొరుట్లకు వచ్చారు. మొదట వీరి గృహనామం సిరిశెనగండ్ల వారు. మెతుకు సీమ కావ్యం రచించిన సిరుసనగండ్ల శ్రీనివాసాచార్యులు, గుమ్లాపూర్‌్‌ మండలం చొప్పదండి గారు వీరికి జ్ఞాతులే. కృష్ణమాచార్యుల అన్న వరదాచార్యులు మోర్తాడు వారు తమ ఇంటి పేరును సిరిశెనహళ్‌ అని తమిళ పదంగా మార్చారు. అదే ఈ తరంలో వారి సోదరులు అనుసరించారు. రచనల వివరాలు = “వారు కవులు. ఆ కాలమునాటి యక్షగానములు, జావళీలు థ్రాసేవారు. కృష్ణవకి స్పంగారపరమైన ఆ జావళిలను పెద్దపల్లి భోగస్రీలు పాడుచు నాట్టమారేనారు ఇ ను న కనక శృంగారపరమైన వారి జావళీలు మరింగంటివారి తిరునామములు పా్తినవ అని వ్‌ గా కవిత్వా గూరి శ గ తెలిపారు. (స్వ తావధాని కృష్ణమాచార్యులు జీవనము - 1986; యై న్స్‌ శతావధాని కృష్ణ వాదా గ్య జిల్లాలో మొట్టమొదటి శృంగార గేయాలు. వ్రాస్‌న కవి. "కౌండిన్య గోత్రుల కవిత నరస అనే వాడుక ఈ ప్రాంతంలో శీనయ్య గారితోనే ఆరంభమైంది. 2.సీతారామయతీంద్రులు; వేములవాడ: 1820-1890 సుమారు :

వీరి రచన - శ్రీసీతారామ యోగీంద్రుల వారి ఆధ్యాత్మిక “భజన కీర్తనలు” - 1968. శ్రీసీతొారొమ యోగి జన్మస్థలం గోకర్లక్షేత్రం. బాల్యముననే వీరికి పితృవియోగం సంభవించింది - విద్యావిహినుడు. అన్నగారి పోషణయందుండి పని పొటులు లేక బాధ్యతారహితంగా తిరగేవాడు.వదిన చులకన చేసి మాట్టాడితే స్వాభిమానంతో ఇల్లు వదిలాడు. నాసిక్‌, వారణాశి తీర్థ ప్రదేశాల్లో కొన్నాళ్ళుండి వేములవాడ చేరుకున్నాడు. అక్కడే యతి నియతితో జీవిస్తూ, ఆధ్యాత్మిక భజన కీర్తనలు రచిస్తూ, భక్తిభావ ప్రచారం కొవిస్తూ జీవతశేషం గడిపారు. వీరి సమాధి కేశవులుగారి రామయ్య వీధిలో ఉంది. ప్రతియేటా అక్కడ భక్త సమారాధనలు, కేశవుల వారింట బ్రాహ్మణ

126 డా॥ మలయశ్రీ- “'కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” సంతర్పణలు జరుగుతున్నాయి. కేశవులుగారి భూమయ్యగారు స్వాముల వారి కీర్తనలను సేకరించి, వజ్జ్ఞల చంద్రమౌళిగారి పీఠికతో పై పుస్తకాన్ని ప్రచురించారు.

140 పుటల ఈ పుస్తకంలో యోగీంద్రుల జీవిత చరిత్ర సంగ్రహంతోపాటు 74 కీర్తనలున్నాయి. చివర ఉత్తర కాండతో సహా మూడు పుటల్లో ఏడు కాండలుగా సంక్షిప్త రామాయణ గేయం అ తర్వాత ఒక మంగళహారతితో గ్రంథ పరినమాప్తి అయింది.

శివ-శ్రీరాజరాజేశ్వర, శ్రీరామ, గురు భక్తితో కూడిన ఈ భజన పాటలకు చాల వరకు రాగ తాళ సూచన ఉంది. మొదటిది రామ మానస పూజావిధి. రెండవది 'ద్విపద' అని చూపిన చరణాలిట్టున్నవి.

భూషణములు మన మలంకరింతాము। దాశరథి రాములకు ॥

మణి మాణిక్యహేమ; నవరత్నసుహిత కిరీటమును కోరి - (ఇదిపాటే) 74వ కీర్తన - ముఖారిరాగం - ఆటతాళం

హరిహారి యెంతానర్థపు జీవులంత । నిన్నెరుగాక చెడిరీ గదా వోరామా

పరమా పూరుషవారీ నరహరినెన్నాడు | కరుణాతో దరి చేర్చేవూ చోరామా (ఇది 49 పంక్తుల గేయం) 69వ, కీర్తన-బిళహరి; అటతాళం (ఇదే 16వ, కీర్తన కూడా)

వొత్తూదమ హరి పాదామూలు। అతిమెత్తాని శ్రీదివ్యాపాదొమూలు

మిథ్యాసంసార సాగరము దాటించియు । ముక్తి మార్గము దెలిపే పాదములు 50వ, కీర్తన-ఆనందభఖైరవి; ఆదితాళం - అతడె బ్రహ్మవేత్తాః సద్గురుడే పరమ పవిత్రా-

దేవసేవ, రాజయోగ మానస బోధ భక్తి పాటలివి. కొన్నింటిలో భద్రాచల రామదాసు ఆరి ఉంది. సీతారామయోగీంద్రుల వారి భక్తిని ఎవరూ శంకించపనిలేదు. వారు సంగీత సాధకులూ కావచ్చు. నిరంతర భక్తి కవిత్వారాధకులైనా వారిది జానపద ధోరణి వర కవిత్వమే. మాతృభాష మరాఠీ, తెలుగును పట్టుపట్టి నేర్చినట్లు లేదు. మాట్లాడ్డం మాత్రం నేర్చి ఉంటారు. వ్యావహారిక- గ్రామ్య తెలుగు పదాలతో పాటు విలక్షణ తత్సమ పదాలు వారి పాటల్లో ఉన్నాయి. వీరి జీవిత

చరిత్ర పరిచయంలో “నాసిక నుండి మార్గం బట్టి కాశికాపురిని చేరెను”; “పూర్వము వాల్మీకి సప్తరుషుల యుపదేశమునాంది నిరంతరము రామమంత్రము నుచ్చరింపుచు దుర్యోధనుని సంకటము దొలంగి” వ్యాఖ్యల భావాలు ఆలోచనీయాలు!

సాధారణంగా దైవ భక్తుల జీవిత కథల్లోని దైవ సొక్షాత్కారాలు, మునుల వరాలు, భక్త కవుల జీవిత

కథలతోనూ ముడిపడి ఉన్నాయి. ఏది ఏమైనా బ్రహ్మచారి, భక్షకవి, వాగ్గేయకారుడు శ్రీసీతారామ యతీంద్రులు! 3. జైశెట్టి రాజయ్య - జగిత్యాల; 1848-1922

జైశెట్టి రాజయ్య గారిది జగిత్యాల. వారు వైశ్యులు. శైవ మతాభిమానం కలవారు. వరకవి

రాజయ్య గారి రచనలు రెండు గ్రంథాలుగా అచ్చులో వచ్చాయి.

1 శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము 2. మనన్పంబోధ కీర్తనలు

ఈ రెండు రచనలు 1933లో కవి గారి కుమారునిచే తొలిముద్రణ పొందినవి. మనుమనిచే

1992లో ఒకే పుస్తకంగా మలిముద్రణ పొందాయి]

ఆయన “1888 - 1921వరకు 33 సంవత్సరములు అనర్ధళముగా తన గళము విప్పి ఆశువుగా జెప్పిన రచనలు కోకొల్లలు. అనాటి ప్రజలను మంత్ర ముగ్గులను గావించెను. వారి వద్ద ఒక లేఖకుడు ఇరువురు గాయకులుండిరి” అన్నారు డా!జె.వి, రమణయ్య కవి గారి పౌొత్రులు, రాజయ్యగారి రచనల రెండవ ముద్రణ పుస్తకం ముందు మాటలో.

రాజయ్య గారు వ్యాపారవృత్తితో జీవించారు. వాస్తు జ్యోతిష్య యోగ హస్త సాముద్రికాది శాస్రాలు కెలిసినవారు, పురాణ కావ్య శ్రవణ పరన పాండిత్యంతో తమ ఏబదవయేటి నుండి (1892) ఆశుకవిగా విజృంభించారు. వీరి పాటలు పద్యాలు జగిత్యాల మెట్టుపల్లి ప్రాంతాల్లో బహుళ జనవ్యాప్తి పొందాయి.

మొదటి భాగం, 1౪ అధ్యాయం: వందొమ్మిదీన్‌ శతాట్లి తెయగు సాహిత్యం 127 గ్రంధ సమీక్ష: 1. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము ఈ కవి శైవ మతాభిమాని. లేముల వాడలోని ఆత్తలూరి లింగమూర్తి వీరి ఆరాధ్యగురువు. శివభక్తితో ఈ శతక రచన చేశారు. వేములవాడకు కాకతీయుల కంటె పూర్వపు నామం లేంబులవాడ. అదే జన వ్యవహారంలో లేములవాడ లేంలాడ అయింది. ఇది 125 సీస పద్యాల శతకం. “వ్యాస వందిత వేములవాడ వాస, పాప సంహార పరమేశ పార్వతీశ ” శతక మకుటం. ఇది శేషప్ప “నరసింహశతకం' మకుటాన్ని పోలి ఉండటం గమనార్హం. ఈ రాజేశ్వర శతకంలో శివభక్తి ఉన్నా వీరైైవ కవుల పద్యాలలో వలె అన్యమత నిందలేదు. భక్తి కంటె ఇందులో సామాజిక నీతులే ఎక్కువ. ఈ శతకంలోని కవి భావాలిట్లున్నాయి- శంకరా నేను నీ కొడుకును నన్ను రక్షించు 1వ, పద్యం; తీర్థయాత్రలకు తిరుగలేను. నిన్నే నమ్మియుంటి - 2, నీవే గొప్ప దారవు నీ భక్తులకే నేను సమన్కరిస్తాను. నిను గనుగొన్న వారికి నిఖిల సుఖములు -5 కవుల నడుగక నిన్ను నమ్మికవన మిట్లు చెప్పితి - 6, కాసుల నాశించి కృతి నీయను. నీకిది నమర్పించినందుకు నన్ను కాపాడు - 8 .. శివభక్తి మహిమ, లోకనీతి రీతులు ఇందులో చక్కగా వర్షించబడినవి. వర్ణవ్యవస్థను అద్వైత భావనతో చెప్పాడిలా - “ఒక్క జన్మంబునకు నాల్గు నిక్కమయ్యె, నిక్కమైనట్టి జన్మంబు నాక్కటయ్యె (122) కవి కవన శైలికి గూఢ వేదాంత వివరణకు నిదర్శనమీక్రింది పద్యం. మూటిని గూడియు మూటిని విడనాడి, మాటలో మురియదా మనమునందు నాల్గిటి గూడుక నాల్సింటి విడనాడి, నాల్గు ధర్మంబుల నడక తెలిసి ఐదునైదును గూడి యైదునైదును విడ్చి, ఐదిటి గూడుట అనువుదెలిసి ఆరిటి గూడుక ఆరిట విడనాడి, ఆరిటి మీదను హరుని గలిసి గురుడు పరమాత్ముడితనిని గుర్తెరింగి, ముక్తి బొందు మహాత్ముల మూలమిదియె. వ్యాస వందిత వేముల వాడ యీశ; పాప సంహార పరమేశ పార్వతీశ - 113. 2 మనస్పంబోధ కీర్తనలు - ఇవి నూటా అయిదు. ఇవి మనస్సు మీద చెప్పినవి కావు. వివిధ బేవీ దేవతల నంస్టతి గేయాలు. రామదాసు భజన కీర్తనల వంటివి మతమే వఎంచిదిరా (57) కులమే దండిదిరా (58) దేవుడు ఒకడేరా (59), ఎరుకే దండిదిరా (60), ఇటువంటివి ఇందలి కీర్తనల శీర్షికలు - పాటల పల్లవులు. జైళెట్టి రాజయ్య కవి గారి కీర్తనల శైలీ భావ విన్యాన దర్శనానికి నిదర్శనంగా మొదటి కీర్తన గణపతి ప్రార్ధనను చూడవచ్చు. పుట 67. గణపతి నీ 8దిగా వందానం - నిత్య ఘనముగ టబ్రోవవె సుందరం! . పనిబూని సర్వంబు దినమానమే ప్రొద్దు - ఘన విద్యాది మొదలు గుణశ్రేష్ట జరిపెదవు!! చంద్రార్క నేత్రుని పుత్రా - దేవ - సాంద కర్ముని బొజ్జగాత్రాః ఇంద్ర న లలో నెవ్వరికైన - అంధ్ర గీర్వాణములన్ని కృప జేసితివి!! ఏకదంతుడు యెంతో నీవూ - విద్య - ప్రకటించి పలికించె దావూ నిఖిల బల స సకల విద్యల గురువు - ఇక నన్ను రక్షించు నకల జన పూదిత ఇందలి పదాలకు లేని దీర్వాలు రావడం సంగీతం కోనం. ఈ గేయ భాగంలో మానస సంబోధన కీరనలు అయిదారున్నాయి.. అందులో జానపదబాణీలవి కొన్ని. జాజిరి పాట - కళికోత్కళికలవలె చాల బాగుంది. అది ఇది - పుట 140. జాజిరి జాజరి జాజిరి బాజా - బెదిరించేటి బెరుగులు బేజా ఎచ్చుగదేవుని కెప్పుడు పూజా - మచ్చరి తనముకు మందులు బేజా ॥ పరమాత్ముండనె పద్దతి పట్టి - కవటత్వంబనె కాలుని గొట్టి మర్వాదెరిగిన మార్గం బట్టి - దుర్మదాంధులను దూరం గొట్టి ॥జా॥

128 డౌజ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాపొత్య చరిత్ర” గురుమంత్రంబనె గొడ్డలి బట్టి - అజ్ఞానంబనె అడవిని గొట్టి సుజ్ఞానంబనె సురియనుబట్టి - దోషంబనియెడి దొంగల గొట్టి జా! వరజైశెట్టి మరి రాజన్నా - శ్రీ గురుమూర్తికి సేవకుడన్నా సారవిచారుల సంగతిగన్న - చేసిన పాపము మొదటికి సున్నా ॥జా॥

ఈ పాటలో యతి నియతి కాక అంత్యప్రాస కూర్చబడింది. ఇటువంటి పాటలను ఖడ్గాలు అనే "'పేఠ వీర శైవుల వివాహాలలో పాడేవారు. వరకవులు భావావేశపరులు. శబ్ద సొధుత్వాన్ని పట్టించుకోరు, వారు భాషా పండితులు కారు భావాలకు ్రాధాన్యతనిచ్చేవారు.

అల్లోనేరడల్లో (142 పుట) పాట -

ఆల్లోనేరడల్లో - అల్లదు గో చూడండి ఆనంద గురుని॥ అల్లి బిల్లి మాటలల్గుకోకండి - ఆల్లోనేరడల్లో కల్లలాడేమాట కడకు జిమ్మండి. అల్టోనేరడల్లో ముల్లె కన్నముక్తి మంచి దనుకొండి అల్లోనేరడల్లో ఎల్లకాలము ముక్తి కెదిరి చూడండి అల్గోనేరడల్లో తల్లిదండ్రి మాట తప్పబోకండి అల్లోనేరడల్లో భరత ఖండానికి జంబూద్వీపం అని పూర్వ వైదిక నామం. జాంబూనదం అంటే బంగారం. జంబూ వృక్షం నేరెడి చెట్టు. అదే అల్లనేరడి పదం జానపద గీతాలకెక్కింది. వీరివి జానపద కీర్తనలు, తత్త్వాలు. ఇందులో నగానికి మించి ఈ క్రింది పాట బాణీలోనే ఉన్నాయి. నిలువదురా దేహం - ఎన్నడో నిమిషములో మాయం నిలిచి నిలిచి (ఆది) నిమిషంబు లోపల గాలము (మింగి (న) మీనము గతి సుమి॥ నిలువదు నిలువదు కాయం, ఇది, నిముషము లోపల మాయం _- వంటి పూర్వతత్త్వాల నితడు అనుసరిస్తే - నిన్నేమంటినో జ్వరమా! వంటి ఈ కవి పాటలను ఇతరులు అనుసరించారు. నిన్నేమంటినో చలిజ్వరమా, అనే పాట ఇదే జిల్లాలోని మరో వరకవి దురిశేటి ఈశ్వరయ్య గారిది. అది ఇదే సంపుటిలో మరో చోట చూపబడుతుంది. నమ్మదగని కాలం (105 పుట) మనదే తప్పు కదా (126) మొ॥ వి సామాజిక సమీక్షాగేయాలు, ఈ సంపుటిలో చివరగా మరికొన్ని సామాజిక చారిత్రక విశేషాల వివరణ గేయాలు, పద్యాలూ ఉన్నాయి. కీలక (1908)లో ముచికుంద (మూసీనది) వరదల గురించి 132 పంక్తుల ఉయ్యాల పాట ఉంది. దుర్ముఖి (1886) హేవలంచి (1897) అనానృష్టికరువులలో పెరిగిన దినుసుల ధరలు జనం పడిన పాట్లు వర్ణింపబడ్డవి. హేవలంబిలోని మారి రోగ వ్యాప్తి, నందన (18693) అతివృష్టి నష్టాలు, 1921 కాటకం ... ఇవన్నీ సీసమాలికలు. 1897 కు 19218 ధాన్యం ధర రెట్టింపు అయిందట. కవి ఈమ వైశ్యకుల గోత్రాలను రాశికూటాల వివరాలను 223 -30, ఎనిమిది పుటలో తెలిపారు. వికృతి (1890) భాద్రపద శుద్ధ సప్తమి భానువారం నాడు రాజన్నకవి గారి కవిత్వపర్‌క్తే గావించి పెద్దలు విని మెచ్చారట. కొందరు గిట్టనివారు కవియింటి పైకి ముస్లిం ఉద్యోగుల ఉసికొలిపి హింసించారని వారిని పేరు పేరున గాడు పద ప్రయోగంతో తిట్టాడు. ఈ సీసమాలిక (231-36 పుటలు) కులాల పేర్లు తెలుసుకోవడానికి చక్కగా పనికి వస్తుంది. జగిత్యాల తాలూకొలోని గ్రామనామాల సీసమాలిక (60 పంక్తులు రచన తేది 23 సెప్టెంబర్‌ 1903) ఈ ప్రాంత వృద్ధులకు పలువురికి కంఠస్థం 1905కు పూర్వం కరీంనగర్‌ జిల్లాకు వెలిగందుల కేంద్ర పట్టణం. జగిత్యాల యును మోతె జాప్తాపురంబును, తిప్పన్న ప్యాట తిప్పాయ వల్లి (236) సంగె మెకిలి పురము సారంగ పురమును సూరడాపేట సర్వాపురంబు (237)2

మొదటి భాగం, 17 అధ్యాయం: రందొమ్మిదీన శరొట్టి తెలుగు సాహసం 129 యతి గణ ప్రాస భంగాలు ఈ కవి పద్యాల్లో కనిపిస్తున్నవి. వరకవులు అక్షర గణనతో కాక మాత్రానిబద్ధ గణాలు వాడినట్లు తోస్తుంది. వారు ఛందస్సు నేర్చుకోక పదాల లయను బట్టి భావావేశంతో పద్యాలు వ్రాసిన భక్తకవులు. జైశెట్టి రాజయ్య గారి పద్య గేయకృతులు గత శతాబ్లి చతుర్ధపాదపు ఈ జిల్లా సాంఘిక చరిత్ర సర్వస్వాలు. పాదపీరికలు ;

  1. శ పుస్తకం రెండవ ముద్రణ అవిష్కరణ సభ జగిత్యాల్లో తేది 12-5-92 నాడు ఘనంగా జరిగింది.
  2. ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు, పాదపాదమునను బరగుచుండు, ఆటవెలది గాని తేటగీతముగాని, చెప్పవలయు మీద సీనమునకు - అని సీసపద్య లక్షణం. సాహిత్య సమాలోకనం - 4 చరిత్ర: మొదటి అసప్పా 1713 -48 స్వతంత్ర పాలనలోనికి వెళ్ళిన తెలంగాణా, 1948 స్వతంత్ర భారత పోలీసు ఆక్షన్‌ వరకు దాదావు 250 సంవత్సరాల కాలం "హైదరాబాద్‌ ముస్లిం నవాబుల పాలనలో ఉంది. (15, ఆగస్టు 1947 నాడు ఇండియాకు బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి స్వాతంత్ర్యం అభించాయి. అప్పుడు హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణా ప్రాంతం నిజాం పాలనలోనే ఉంది. ముస్లిం రజాకార్ల అల్లరులు అప్పటివే. స్వతంత్ర భారతప్రభుత్వ పోలీసు చర్యతో 17 'సెష్టెంబర్‌ 1948 రోజున నైజాం తెలంగాణా స్వేచ్చ పొంది భారత దేశంలో విలీనమైంది.)

ఆ కాలంలో ఉర్పూ విద్యావ్యాప్తి పెరిగింది. తెలుగు వాళ్లు కూడా పరభాషా సంస్కృతుల ప్రభావాలకు లోను కాక తప్పలేదు వారిలో కొందరు ఉర్వూ సాహిత్యకారులుగానూ రాణించారు. ఆలయాల నిర్మాణం ఇంచుమించు ఆగిపోయింది. మజ్జిదుల నిర్మాణం పెరిగింది. అంధ్రుల హిందూ మతాభిమానం - భాషాభిమానం గొప్పవి. కాబట్టి ఆ ముస్లిం పాలనలోనూ తమ జాతి వర్ణాచార ధర్మాలను నిలబెట్టుకొని ఎంతో కొంత మాతృభాషా సాహిత్యాలను అభిమానించి సృజించుకోగలిగారు. ల

పరభాషా సంస్కృతుల ప్రభావం అనునరణం ఎప్పుడైనా విద్యావంతులలోనే అధికం. అప్పటి చదువరుల శాతం తక్కువ. అందుకే అవిద్యావంతులైన జానపదులనలరించే యక్షగాన మధుర కవితల రచన వ్యాప్తి పైతం ఈ కాలంలో గణనీయంగా పెరిగింది. కాని, విరచితమైన సాహిత్యమంతా భద్రపరుచబడక చాల వరకు నష్టమైపోయి లభించలేదు. సాహిత్యం: ఈ శతాబ్దిలో కరీంనగర్‌ జిల్లాలో చెప్పుకోదగిన అంధ్ర పద్యగద్యకావ్యాలు ఏవీ రాలేదు. కొందరు సంస్కృతంలో పండితులై రాణించారు. వారు కొవ్యరచన కూడ కావించారు. కొని (గ్రంధాలేవీ లభించలేదు.

తెలుగులో పద్యకావ్యాలు రచించిన ఒకరిద్దరి పేర్లు వినవచ్చినా అది అలబ్ధ సాహిత్యమే. ఈ కాలంలో ఇద్దరు శతక కర్తలు మాత్రం ప్రముఖంగా కనిపిస్తున్నారు. వారిలో శ్రీకృష్ణళతకం చాల వ్యాప్తిని పొందినా, ఆ కృతికర్త నరసింహదాసు కరీంనగర్‌ జిల్లా వారని కవి చరిత్రకారులకు తెలియదు. ఈ కవిది కరంనగర్‌ జిల్లాలోని ధర్మపురి అని ఈ వ్యాసంలో సోపత్తికంగా నిరూపించబడింది. రెండవ వ్యక్తి పరవస్తు మునినాథ కవి. వీరి లక్ష్మీలలితా శతకాలు ముద్రితమై సాహిత్య చరిత్రకారుల దృష్టికి వచ్చినా, అవి సామాన్య జనాదరాన్సి నోచుకోని కారణంగా పుస్తకాలు ప్రస్తుతం వ్యాప్తిలో లేవు. ఈ కవిది కరింనగర్‌ జిల్లాలోని కేశవ పట్టణం. ఈ శతాబ్దిలోనే ఈ జిల్లాలో అయిదారుగురు కవులు యక్షగానాలు రచించారు. వాటిలో కొన్ని ప్రదర్శింపబడినా జనాదరం పొందినా ఏ ఒక్కటీ ముద్రణ పాందలేదు.

130 డొ॥ మలయశ్రీ- “కరీంనగల్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” మధుర కవితలు వ్రాసిన శిష్ట వరకవులు కూడ ఈ కాలంలో రాణించారు. గత శతాబ్ది రచనా ప్రశ్రియలనే కుడి యెడమలుగా రచించారే తప్ప ఈ కాలంలో (19వ, శతాబ్ది) కోస్తాంధ్రలో వలె నూతన సాహిత్య ప్రక్రియలేవీ ఈ జిల్హాలో ఆరంభం కాలేదు. వచన రచనలు రానేలేదు. కోస్తాలో వలె ఆంగ్ల విద్యావ్యాప్తి ఈ ప్రాంతంలో లేకపోవడమే అందుకు కారణం అనవచ్చు. ఉర్పూ రాజభాషగా రాణిస్తున్న స్రైదరాబాద్‌ ముస్లిం నవాబుల ఆ పాలనలో ఈ మాత్రమైనా ఇక్కడ ఈ కరీంనగర్‌ జల్గాలో మాతృభాషాభిమానం తెలుగు సాహిత్య సృజన జరిగినందుకు ఆనందించాలి. ఇక ఈ జిల్లా ఇరువదవ శతాబ్ది సాహిత్యాన్నీ చూద్దాం.

కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర రెండవ భాగము జి ళల

౪. ఇరువదవ శతాబ్ది ప్రథమార్ధ సాహిత్యం : 190! - 1850

కరీంనగర్‌ జిల్లా నైజాం రాష్ట్రంలోనిది. మూడు, నాలుగు వందలేండ్లుగా ముస్లిం పాలనలో ఉన్నది. ఈ శతాబ్ది పూర్వార్ధంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడడం, అచ్చుపుస్తకాలు వ్యాప్తిలోనికి రావటం, పత్రికలు ఆరంభంకావటం మూలాన కొంతవరకు సాహితీ వ్యాసంగం ఎక్కువయింది. అయినా పాఠశాలల్లో విద్యామాధ్యమం ఉర్దూ. అచ్చు యంత్రాలు విరళం. అవి పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్నా కొంతవరకు రచయితలకు ఉపకరించాయి. ధనిక కవులు, లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ పుత్రులు కొందరు వదొన్యుల సహకారంతోనూ తమ పుస్తకాలను అచ్చులో చూసుకోగలిగారు.

ఈ శతాబ్ది ప్రథమ పాదంలోని రచనలు అంతగా వెలుగు చూడకున్నా కవులు మాత్రమున్నారు. ద్వితీయ పాదం (1926-50)లో చెప్పుకోదగిన పుస్తకాలు వచ్చాయి. 1922లో వా. లక్ష్మణాచార్యుల “తత్త్వం” పద్యకావ్యం వెలువడింది. ఈ కావ్యం 'ఇనుగుర్తి' ప్రచురణ. కవిది కుందనపల్లి.

శ్రీమాన్‌ శతావధాని సిరిశినహళ్‌ కృష్ణమాచార్యుల, 'కళాశాలాభ్యుదయము' పద్యకావ్యము 1929 లో రాజమండ్రిలో అచ్చయింది. వీరిది కొరుట్ల.

రాజవైద్య డా॥ పింగళి లింబాద్రి రెడ్డి గారు వారి స్వగ్రామమైన నెమిలికొండలో ముద్రజాయంత్రం నెలకొల్పి “విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల' అనే పేరుతో ఓ ప్రచురణ సంస్థను 1922-44 స్థాపించి ఆ మధ్య కాలంలో 21 పుస్తకాలను వెలువరించారు.

కమాన్‌పూర్‌ వాస్తవ్యులయిన మాధవరావు బలరామదాసు గారి “రామగిరి మహాత్మ్యం' ప్రబంధం 1928లోనే ప్రచురింపబడింది.

“... వరకవులు బహుగ్రంథకర్తలు అయిన ఘటబ్రహ్మ అనంతవరపు సిద్దప్ప (గుండారెడ్డి పల్లి), పరమారాధ్యుల రాజయ్యకవి (చెలుపూరు), రామసింహకవి (రాఘవ పట్టణం), పద్యపుస్తకొలు కొన్ని ఓరుగల్లు సికిందరాబాదు వంటి నగరాల్లో ముద్రణ పొందాయి,

_ ఆ కాలంలో ప్రదర్శన వ్యాప్తిని పొందిన ఈ ప్రాంత యక్షగానాలు కొన్ని సికిందరాబాద్‌, హెదరాబాద్‌ పాపులర్‌ పబ్లిషర్స్‌ చేత ముద్రింపబడినా ముద్రణ నంబరు కాలం పేర్కొనక అవి ఎప్పటివో గుర్తించుట కష్టంగా ఉంది. ॥

ఈ్రాంతపు ఏకైక కవయిత్రి, ఆనందమాంబ (కొడిమ్యాల) 1934లో 12 ఏండ్ల బాల్యప్రాయంలోనే 'నతీలలామ' అనే కావ్యం వ్రాశారు - ప్రచురించారు.

వి, కేశవరావు, వానమామలై జగన్నాథాచార్యులు, వేంకటరాజన్న అవధాని, మునుగోటి లక్ష్మణాచార్యులు, గంగారాజేశ్వరరావు, మామిడిపల్లి సాంబశివశర్మ మొ॥ పండితకవులు పలువురు అప్పటికే కవితా వ్యవసాయం సాగిస్తున్నవారు. కవిత్వమంటే అప్పుడు పద్యరచన అనేభావం, గేయ రచనలకు ఇప్పుడున్నంత ప్రాచుర్యం లేదు. గేయకవులకు ఇంతటి గౌరవం కూడా ఆ దినోలలో లేదు. వచన రచనలు మరీ తక్కువ.

132 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య బరిత్ర”

అప్పటి కవులలో ఇప్పుడు ఏ కొందరో తప్ప మిగితావారందరూ కీర్తిశేషులైనారు. అప్పటి రచనల వివరాలు తర్వాతి శీర్షికలలో ప్రక్రియల వారిగా వివరంగా చూపబడుతాయి.

ఇందలి శీర్షికలు?- 1. వద్యకావ్యాలు 2. యక్షగానాలు 3. వరకవులు - మధుర కవితలు 4. వచన వాజ్మయం. ముందుగా తెలంగాణాకు గర్వకారణంగా నిలిచిన “గోల్కొండ కవుల సంచిక'లోని ఈ జిల్లా కవుల వివరాలు అవశ్యపఠనీయం.

గోలకొండ కవుల సంచికః- కోస్తా ఆంధ్ర పండితులు ఏదో సాహితీప్రసంగ సందర్భంలో “నైజాం రాష్ట్రంలో ఉర్పూ భాషా ప్రభావం తప్ప తెలుగునకు విలువలేదు -- తెలుగు కవులు లేరు” - అన్నారట.

ఆ మాట “గోలకొండ పత్రికా సంపాదకులు' ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, మన పండుగలు ఇత్యాతి బహంవిశేషగ్రంధాల రచయిత అయిన సురవరం ప్రతాపరెడ్డి గారి చెవిన పడింది. ఆయన దేశాభిమాని-మాతృభాషాభిమాని. అందుకు ఏకాస్త ఆత్మగౌరవ భంగం కలిగినా సహించలేకపోయేవారు. అలాగా - ఇదుగో చూడండి మా తెలంగాణా కవులం ఎందరం ఉన్నామో ! అని ఈ ప్రాంత రచయితల వివరాలు సేకరించి, ఒక్కొక్క కవిత చొప్పున కవుల పరిచయాలతో సహా ఒక ఉద్గంథాన్ని ప్రచురించారు. అదే “గోలకొండ కవుల సంచికి. 19334 సం. దీపావళి ప్రచురణ. అందలి కవుల సంఖ్య. 364. అందులో ఇంచుమించు 40 మంది ఈ కరీంనగర్‌ జిల్లా వారున్నారు. వీరు అప్పటి వర్తమాన కవులు. పూర్వకవి పరిచయాలలో సైతం ఈ జిల్లా కవులు 14రు ఆ గ్రంధంలో చోటు చేసుకున్నారు. గోలకొండ కవుల సంచికలోని కరీంనగర్‌ జిల్లా కవుల సాహిత్య విశేషాలు ఓ ఆచి రాఘవాచార్య శాస్త్రులు గారు - ఆవునూరు, ఈ సిరిసిల్ల, గో.క,సం.నం.5. బహుధాన్యలో జననం. వయస్సు 56 సంవత్సరాలు, 1934లో. బిరుదు - ఆంధ్రగీర్వాణ వాణీప్రవీఐ. అముద్రిత రచనలు 1. శ్రీనివాస ప్రసాదము, 2. ప్రపత్తి పారిజాతము, 3. ఆధ్యాత్మ తారావళి. సంచికలోని కవిత “శ్రీమచ్భేషాచల వేంకటేశస్తుతి' సంస్కృతం. ఇందలి అయిదు శ్లోకాలలో మొదటిదిది.

శ్రీశేషాచల శృంగదేశ విలసద్ధాంగేయ హర్మ్యాంగణో

దివ్యోద్యాన విరాజమాన సరసీమాలాభి రా శోభిత

శ్యృంగారాంచిత వీధికా యుత మహా శృంగాటకైర్భాసిత

థ్రీశ్రీనివాస నివాసపత్తనవరో జేజేయతే సర్వదా,

వీరి రచనలు మరేవీ లభించలేదు. ఇదే సంచికలోని నం. 96. ఆచి వేంకటనృసింహాచార్యకవి వీరి పుత్రులు. 2. అత్తలూరి విశ్వనాథ శాస్తి - వేములవాడ. తా॥ సిరినిల్ల, గో.క,సం.నం, 26. వ.26 నం. శరభాంకుడు, ఆత్తలూరి పాపకవి మొ వారు వీరి వంశపు పూర్వకవులు,

సంచికలోని వీరి 'పార్వతీస్తవం' లోని శ్లోకత్రయంలో మొదటి రెండు శ్లోకాలు ఇవి.

దుర్గే త్వదీయ మహిమా నర్గల తొం సంతతం నివేదయతి

స్వర్గేవ సదమర స్త్రీవర్గ కృతానంత పుష్పతతి పూజా ॥

చింతా కులితం స్వాంతం, సంతత సంసార సాగరేమగ్నం |

భ్రాంతిం హరమే పార్వతి, చింతిత చింతామణి ప్రపంచేస్మిన్‌

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్ది ప్రూర్వాస్ధ సాహిత్యం” గోలకొండ కవుల సంచిక 133 ప. ధప్పూరి సత్యనారాయణాచార్యులు - బిజవెంకి - ఎల్గందుల- టప్పా. నం. 38 అష్టావధాని, విద్వాన్‌, వయస్సు సూచించలేదు. అప్పుడు వీరు బెజ్జంకి నృసింహాలయార్చకులుగా ఉండేవారు. స్థిర నివాసం 'కోట్ల' గ్రామం గంగాధర మండలంలో ఉంది. వీరు బహంగ్రంథకర్త. వివరాలు తర్వాత చూపబడుతాయి. గో.క.సం.లోని “భద్ర సంధాయకా' విరి కవిత. శ్రీనాయకాయ భాసిత శుభాకారాయ, పద్మనాభాయ తుభ్యం నమోస్తు ! వీరి ఈ తెలుగు సీస పద్యం పూర్తిగా సంస్కృతభాషలో ఉంది. రెండవది ఈ క్రింది మత్తేభ పద్యం. సకలాధారుడు, వేదవంద్యుడు. మహాశాంతుండు, మౌనీంద్ర ర క్షకు, డజ్ఞాన మహాంధకార పటలీ సప్తాళ్వు, డబ్బాక్షు, డ త్యకళంకస్తవనీయ నామకుడు, నిత్యానందక్రైవల్యదా యక్సు, డా శ్రీరమణీ మనోహర మహత్ష్వంబెన్నగన్‌ సాధ్యమే. పద్యం చివరి పాదం యతి స్టానంలోని పదం"మహాత్మ్యం” కావాలి. అయితేనే యతి కుదురుతుంది. - న! శ్రీ ముదడుంబ రామానుజాచార్యులు - అంబాల, త। హుజూరాబాద్‌. గోక,సం.నం. 45, కవి వయస్సు - 40 సం.లు. ఆముద్రిత రచనలు నాలుగు.

  1. వేంకటేశ్వర శతకము, 2. కదంబిని, 3. (పేమ చాంచల్యము, 4. రమానంద న్న్మతి పద్యములు. (కా) కదంబిని, ్రేమ చాంచల్యము నవలలు. వీరి రచనలేవీ లభించలేదు. నంచికలోని “వేంకటేశ్వర స్తుతి” లోని మూడు పద్యాలు ఈ దిగువ చూపబడుతున్నవి. శ్రీ దుగ్భాంబుధి కన్యకా హృదయ నీరేజాబ్దమిత్రా, ముకుం దా | దేవాహిత వారకా వన కుఠారా ! భీష్మబీభత్స ప్ర హ్లాద వ్యాస పరాశరాది సుజనాహ్లాద ప్రదా | పూజితో మాదామోదర దేవ దేవ యలమేల్‌మంగా మనోనాయకా |! వరదా సర్వజగన్నియామక సదొ వాత్సల్య సింధూ పరా త్పర దీనా వన యో విపన్న జన సదృంధూ ముకుందా చరా చర లోక ప్రతి పాలనైక చతురా సర్వజ్ఞ లోక్రైకసు స్మరణీయానుగుణ ప్రభావ యలమ్హేల్‌ మంగా మనోనాయకొా,. చతురత్వంబు పద ప్రయోగ రచనా సామర్థ్యమున్‌ లేమిచే యతికిన్‌ బ్రాసకు నెన్నాపొట్లుపడి మాయయ్యా నినున్‌ గూర్చి నే నతుకుల్‌ వెట్టితి మూడు పద్దెముల నందందున్న లోపమ్ములన్‌ మతిలోనెంచకను గగ్రహింపుమలమేల్‌ మంగా మనోనాయకా. కవి అప్పడికి ఈ మూడు పద్యాలు రచించినట్లు చెప్పుకున్నా ప్రజ్ఞచాలని వాడనన్నా, ఇవి ఆయన “వేంకటేశ్వర శతకం' లోని వనుట స్పష్టం. కవి చతురుడు!
  2. ఐల్మేని గోపాలరాయుడు - మూడేపల్సి తా। సిరిసిల్ల. గో.క.సం.నం. 54. వయస్సు 64.మరణం - దుర్మతిలో. జాతి - వెలమవారు. _ ముద్రిత రచనలు 1. శ్రీరామశతకము, 2. రఘువీరశతకము. ఇవి రెండూ వృత్త పద్య శతకాలు. గో.క.సం.లో 'మనసా' అను శీర్షిక క్రింద వీరి రెండు శతకాల రెండు పద్యాలున్నవి. వీరి పద్యాల భావాలు, అంత్యప్రాసలు రమణీయం.

134 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” దురితాళుల్‌ దెగి దూరు గొందుల, విపత్తుల్‌ దూరమున్‌ బారు, దు

ర్భృర సంసార దవాగ్నులారు, విషయ వ్యాపారముల్‌ మీరు, నీ

స్మరణన్‌ సంపదలెల్ల మీరు, మదినీ సాన్నిధ్యమున్‌ గోరు, ని

ర్జర సంస్తుత్య పదారవింద యుగళా |! రామాకృపన్‌ బ్రోవరా 1

కలశ పయోధిబుట్టి, హరి గోత్రమునన్‌ బసగట్టి, లోకమిం

పలరగ బ్రోచినట్టి సిరి యంఘుల నెన్నుదురంట బెట్టి, స తృలములొసంగు మంటి, నిను బాయక యుండగ మొక్కుచుంటి, నో జలజ దళాక్ష |! యంచు, మనసా ! రఘువీరు మరుంగు జేరుమా.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి శతావధాని గారి పరిష్కరణమును పాంది వీరి శతకాలు 1930 సుమారుగా ముద్రణ నొందినవి. ద్వితీయ ముద్రణ కోసం కవి దౌహిత్రులు కీ.శే, వెలిచాల శ్రీధరరావు

  • షా నగర్‌ గారు వ్రాత ప్రతి 1977లో నెమిలికొండకు తెచ్చి చూపారు. లేఖక దోషాలున్నా చక్కని కవిత. శతకాలు తిరిగి అచ్చుకాలేదు. మొదటి అచ్చుప్రతులు వ్యాప్తిలో లేవు - లభించలేదు.
  1. సముద్రాల రామానుజాచార్యులు - కోరుట్ల, గో.క.సం.నం 59, వయస్సు 50 సం.లు సుమారు. కవి తమ పరిచయాన్ని స్‌స పద్యంలో (గో.నం. 368 పుట) వ్రాసుకున్నారు.

('ప్రాయమా శ్రీచిత్రభాను వర్షా దిగా భవవర్షమునకు నేబదయ్యె - అని ఉంది. ఆరవ గణం, రెండవ యతి తప్పినవి. 'భవవర్షమునకు నేబదియు నయ్యె' అని ఆ కవి భావం కాబోలు. భవ- భావవత్సరం. ముద్రా రాక్షసం | సంచికలోని 'శ్రీకృష్ణసంస్తుతి సంస్కృత కవిత, వీరి తెలుగు కవిత తర్వాత. 7. నెమిలికొండ శ్రీరంగాచార్య శాస్తి - జాగీరు నారాయణ పురం, తా|| సిరిసిల్ల. గో.క.సం.నం. 65. అష్టావధాని. కృతులు లేవు. కవి స్వపరిచయ పద్యం గో.క.సం.పుట-359 లోనిది ఇది.

సీ. వాసమా - రాడ్భగవాన్‌ దాసు జాగీరు- నారాయణ పురంబు నయ యుతంబు,

పాండిళ్యమా-బుధ వర్య సన్మాన్యమౌ- నాటకాలంకార పాటవంబు, కవనమా - పద్యములవలీలగా గూర్చు- నష్టావధాన విశిష్టతంబు, వాక్టయమా-సభా భవనములందు ప-న్యాసోక్తి వైభవ భాసురంబు,

గీ. గోత్రమా-భరద్వాజ పవిత్రతంబు, ప్రాయమా- యిరువది యొక్క వత్సరంబు,

ఆఖ్యయా - శ్రీరంగాచార్యులండ్రు భువిని, బర్జిగిరి గృహనామమో (ప్రాజ్ఞులార,

గీత పద్యం మూడవ పాదం గణభంగం, లేఖకుల అజాగ్రత్త కాబోలు. కవి ప్రయోగమేదో తెలియదు. నెమిలికొండ అను తను ఇంటిపేరును సంస్కృతికరించి బర్హిగిరి అన్నారు కవి!

సంచికలోని “భక్తి ప్రభావము' రెండు శ్లోకాల తర్వాతి, రెండు పద్యాలివి.

సీతారామ పదారవింద ధృత సచ్చిత్తుండు సౌమిత్రి సం

జాతానందముతో జనెన్‌ విపిన సంచారంబుకై ప్రేమళో

బ్రాతః కాలమునందు యోగ్యఫల సంపాద్యంబు గావించి సా

కేతేశున్‌ ముద మొందజేసె గురుభక్తిన్‌ దాసుడై నిత్యమున్‌.

భరతుడు రాజ్య భారమునుపాయముగా బదునాలుగేండ్లు శ్రీ కరమగు రామపాదుకలకై నెజిగించి మనంబునందు దా (యె) శరధి పదారవిందయుగ సన్నుతి జేసి తదాగమంబుకై (ఆ గమనం) మురిసెను గానలోకమున బూజ్యము భక్తియె సౌఖ్యదంబగున్‌,

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతొల్బ ట్రార్వాస్థ సాహత్యం” గోలకొండ కవుల సంచిక 135 8. పదిరెలక్షణ శాస్తి-పదిరె, తా! సిరిసిల్ల, గోక.సం.నం. 68, వీరి రచిత గ్రంథములు వీరి కుమారులగు టి. కృష్ణశాస్త్రి వారి వద్ద నున్నవి - అన్నారే కొని వాటి "పేర్లు లేవు. పదిర ఊరిపేరు, కవి ఇంటి పేరు తిగుళ్లవారు. దుర్మతిలో మృతిచెందారు. “రామచంద్ర శతకము” వీరి ఆముద్రితకృతి. సంచికలోని నాలుగు సీన పద్యాలలో రెండు ఇక్కడ చూపబడుతున్నది. శీర్షిక 'రామచంద్ర'. సీ, శేషుని శిరముల భూషించు నీ పంట, పంటవెలంది నీ పాన్చుదంట, దంట గౌతమునాలు తరియించి కాలంట, కాలంట బోరు నీ కరుణ వెంట, వెంట రాదిహ భోగ వేష మెన్నగ పెంట, నగ పెంట రాచూలి మగని దంట, దంటారు మేనుల దయ్యమా వలకంట, వలకంట మోనైతి వార్ధి గుంట, గ. గుంట చిక్కుల బెట్టకు కుజనుడంట, నంట నానోట నీపేరు హరి వికుంఠ ! పదిరె పుర సద్మ పావన పాద పద్మ, పద్మ జాధిప రామ సద్భావ సీమ. పంట, దంట, కాలంట, వెంట, నగపెంట, దంట, వలకంట, గుంట, అంట - పదాల ముక్తపద (గ్రస్తాలంకారాలు మనోహరం, మరో పద్యం పై దానివలెనే ముక్తపదగ్రస్తంతోపాటుగా అంత్యప్రాసాలంకార శోభితంగా ఎలా ఉందో చూడండి. సీ, బ్రహ్మహత్యాది పాపము బాపు పద ధూళి, దూలించు చక్రంబు దుర్గనాళి, నళిపంక్షి నదరించు నసిత కుంతల పాళి, పాలించురదము మొల్లలను వ్రాలి, వాలిక చూపులు వాలుగలను బోలి, బోలు శంఖము మెడ బొంద జాలి, జాలి చప్పని దొండ చవుకు “పెదవుల గూలి, కూలి ముక్కుకు నువఇ గోలి. న. గోలి భవరోగ వనికి-గోపాల కీలి, కీలెరిగి నిన్ను గను శూలి కీర్తిశాలి పదిరె! రదము = దంతము, వాలుగ = ఒక రకం చేప. 2వ, పాదంలో ప్రొనీ, 4లో యతి తప్పినై. మిగతా రెండు పద్యాలు కూడా ఇదేవిధంగా ఉన్నవి. శతక పద్యాలన్నీ ఆద్యంతాలంకార శోభితాలయి ఉండవచ్చు. ప్రతిభ కలిగిన కవి పదిరె లక్ష్మణశాస్తి గారు. 9, _చక్రహరి అచ్యుత రాజు - సిరిసిల్ల, నం. 76. వయన్సు - 60, మరణం దుందుభిసంవత్సరములో, ముద్రిత పుస్తకము - శిరిశాల శతకము. ఇందలి చివరి పద్యంలో కవి వంశ వివరాలున్నవి. కవిది భట్రాజకులం. చక్రహరి వంశం. అచ్యుతరాజు నామం. తండ్రి మూర్తి రాజు, తాత వేంకటరామ రాజు, 'వేంకటేశ్వరా' శీర్షికతో సంచిక నలంకరించినవి లీరివి మూడు పద్యాలు. ఉ. శ్రీపతి | వాసుదేవ, సరసీరుహలోచన, చక్రపాణి, స ద్రూప, విరించి శంకర శిరోమణి మండిత పొద వద్మ! తౌ రాపతి భాను నేత్రయుగ రాజిత ! చెన్నమనేని వేంకట క్మాపతి నేలునట్టి శిరిశాల పురీశ్వర వేంకటేశ్వరా. ఉ. కొంకక యుష్మదంకితము గూర్చి రచించితి, జక్కజేయు నా వంకలు, భట్టు చక్రహరి వంశ్యుడ, నచ్యుత రాట్కవీంద్రుడన్‌, వేంకటరామపొత్రుడ, వివేక సులక్షణ మూర్తి పుత్రుడన్‌. (లక్ష్మణ?) సంకట దైత్యనాళ ! శిరిశాల పురీశ్వర ... చ. లలియతి కర్మకర్మక్రియలన్‌ భువినీకృతి సంస్కృతాంధ్ర సం ధుల గల తప్పులన్ని విడద్రోచి సలక్షణమయ్యె గాదె, భూ జలమది గంగలో గలసి నన్నుత మౌక్రియ నీ సమాఖ్యచే, జలధర నీల దేహ ! శిరిశాలపురీశ్వర ...

136 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” సలక్షఐ సరస కవిత. వీరి శతకం పేరు 'సిరిశాల వేంకటేశ్వర శతకం' అనుకోవచ్చు. పై మూడు పద్యాలు దానిలోనివే. ఈ శతకం తర్వాతి కాలంలో ముద్రితమైనా ప్రస్తుతం అలభ్యం. 10. ఇఖండేరావురామారావు-కఠరీంనగరం, వీరి నం. 78. వయస్సు 90 సం.లు. 'బహుగ్రంధకర్త' అన్నారు. అవి అముద్రితాలు - అలభ్యాలు. సంచికలోని కవిత “చూడికుడుత్త దేవి" లోనివి అయిదు మత్తేభ విశ్రీడిత వృత్త పద్యాలు. 19వ, శతాబ్టి కవులలో ఈ కవి పరిచయం చేయబడింది. 1 భట్టుఅచ్యుతరాజు - బండలింగాపురం, గో.క.సం.నం. 84. వయస్సు - 40 సం, బిరుదు

  • చిత్ర బంధాంత పద్య కవి కేసరి. ముద్రిత రచనలు - 1. బంధగర్భపద్య శతకము, 2, జగన్మోహినీ నాటకము 3. అనంత శతకము. గో.క,సం.లోని 'శ్రీవేంకటేశ్వరా' పద్యాలు ఇవి. అటమదియేను భిక్షమునకై చరియించుటకున్‌ బ్రయాణమె చ్చటికి దలంచుకొన్న గొన సాగగ నీయవు నిన్ను గూర్చియే మిట నపరాధినైతినొ క్ష్రమించగ బూని ఫణీశ్వరాద్రి వేం కట రమణ ప్రభోయికను గావుము లింగపురాచ్యుతాఖ్యునిన్‌. తటుకున సత్బ్సృపారసము దాలిచి నీ హృదయంబునందునే కుటిలము లేక యెప్పుడును గోరికలన్‌ ఘనభోగ భాగ్యముల్‌ ఘటనము గాగ జేసి కలకాలము మానక గారుడాద్రి వేం కట రమణప్రభో యికను గావుము .... పై మూడు పుస్తకాలు ముద్రితమైనా ఏ ఒక్క పుస్తక ప్రతికాని లభ్యం కాలేదు. 12 ఆచివేంకట నృసింహాచార్యులు - అవునూరు, తా॥ సిరిసిల్ల; నం. 96. జననం - కీలక ఆశ్వీజ శుద్ధనవమి. బిరుదులు - కవి కేసరి కిశోర, అవధాన కుశల, అష్టావధాని. సంస్కృతాంధ్ర భాషల పాండిత్యంతో పాటు కవి తన పరిచయ సీస పద్యం ఎత్తుగీతిలో ఇట్టా "పేర్కొన్నారు. గోక. సం.పు 362. గీ యవనభాషా విశేష మభ్యస్తమేను, ఆంగ్ల మవసర పూర్తి మాదాపునూరు, ఆఖ్యయా వేంకటనరసింహార్యుడండ్రు, ఆచి మాగృహనామమో యార్వ్యులార. నరసింహాచార్యులు విద్వత్కవి. అయినా గ్రంథాలేవీ రచించలేదు. వీరి కవన విశేషాలు తర్వాత చూపబడుతాయి. గో.క,సంచికలో 'శ్రీకర్మదంద్రోదయము' అను పేర గూర్చిన నాలుగు పద్యాలున్నవి. పు. 86, 87. వానిలో రెండు చూడండి. సీ. న్యాయవాదాన్త విద్యాభ్యాస మొనరించి - కృతకృత్యుడౌ రాజ కీయవేత్త, కఠినోపవాస దీక్షలచేత నాత్మీయ - యౌవనంబును గన్న యౌగికుండు, హరిజనాభ్యుదయ పుణ్యాంభోజ పుంజ వి - కాసంబు సేసిన కర్మసాక్షి పతీ సుతాలయ పశుధనాదికమును - దాసీనతగ జూచు త్యాగ యుతుడు గీ. భూరి భూమి మాత్యాణ విముక్తి కొటీకు, బంధనాలయావాసియౌ భాగ్యశాలి, ధన్యమోహన దాస చైతన్యమూర్తి, కర్మచంద్రుడు బొడిచె లోకము సుఖింప, సీ, తల్లి దండ్రులకు వితంతు ప్పత్రీ పరి, తాపంబు గాంచుటే ధర్మ సరళి, జాతి మళాధి వైషమ్యు వివాదముల్‌, వృద్ధిగావించుటే విద్య మహిమ, దీన జనాళి విహిన పరిస్థితుల గనుచుండుటే యధికార విధియు నంగనా మణులు విద్యావ్యాప్తి, ప్రతిబంధ, కోపాయ చింతయే యుక్తి ఫలమ

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతాబ్ద ప్రూర్వాస్థ సాహిత్యం" గోలకొండ కవుల సంచిక 137 గ. టంచు జనులను వంచించి వాయిగాను, వాసి గాంచితి విందాక నో సనాత నాంధకారమా |! యిపుడె నీ యంత్య కర్మ చంద్రుడుదయించె దిన్నగా జూచికొనుము. 2 తర్వాత బాపూజీ కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు విశిష్టతాంతర్యాలు రెండు పద్యాల్లో ప్రతిభావంతంగా వర్ణింపబడినవి. ఈ జిల్లాలో భారత జాతీయ భావాలకు స్పందించి కవిత్వం చెప్పిన మొదటి కవిగా అభి వేంకటనృసింహాచార్యులను సంభావించవచ్చు. 13. గోవర్ధనం నారాయణా చార్యులు - బందలింగాపురం, గోక.సం,నం. 100. వయస్సు 51 సం. ఆముద్రిత కృతి - రామానుజాశ్వధాటీ కావ్యము. సంచికలోని కవిత “రామానుజ ప్రశంస” అయిదు శ్లోకాలు, శ్లో; తవపాదాంబుజం తత్వ దర్శనం, భవ మహాంబుధేర్భద్ర తారకం భువన సుందరం భూరి దానదం, భవతునోయతేర్భావుక ప్రదం. శ్లో॥ కనక కుండలం కాయ వాసనం, జనక కేశవం జైన శాసనం ఘన కమండలుం ఘాత సౌగతం, వన రుూహేక్షణం వచ్మహం యతిం ॥ 3 భాష సంస్కృతమైనా తెలుగు పద్యాల్లొని యతి ప్రాసలు పాటించి “వ్రాయడం విశేషం, కవి ఆంధ్రకృతులు ఏవి రచించినట్లు తెలియరాలేదు. 14. _ సిద్దప్పరాజయోగి - గుండారెడ్డిపల్లి. నం. 105, కులము కుమ్మరి, వయస్సు 25 సం. ముద్రితరచన - సిద్దప వరకవి విజ్ఞాన బోధిని. “ఈ వరకవి మహాయోగి. చదువు సంధ్యలెరిగిన వాడు కాడు. ఆశువుగా చెప్పనేర్చినవాడు. మంచి భావములు కావున శైలిదోషములున్నను అట్లే ప్రకటించినాము” అని గో.క.సం. 364 పుటలో అన్నారు. సిద్ధప్పృవరకవి అనే మాట నిజం. కవిత్వంలో భాషా ఛందోలంకార దోషాలున్నా ఆయన పద్యాలు చాలా వ్యాప్తి పొందాయి. ఈ కవి విద్యావంతుడు. ఉపాధ్యాయుడు. కవిత మాత్రం స్వేచ్చగా ప్రవహించింది. సిద్దప్ప గారు బహుగ్రంధకర్త. 1980 వరకు (వ్రాశారు. వివరాలు తర్వాత. వ్రన్తుతం గోక సంచిక 'ఘటబ్రహ్మ' శీర్షికలోని రెండు పద్యాల్లో ఒకటి చూడండి, సీ, వేమనార్యుని బోలు విజ్ఞానియును లేడు, కాళిదానును బోలు కవియు లేడు పోతులూరయ్యంత బోధకుండును లేడు, సిద్ధప్ప యంత శిష్యుడును లేడు (యతి?) ఘన కబీరునుబోలు కనిన దాసుడు లేడు, సుమతితో సరిబోలు సుమతి లేడు రామదాసును బోలు రాజయోగియులేడు, తల్లి దండ్రుల బోలు ధనము లేదు. గ. ఘటము కంటెను వేజైన మఠము లేదు, అత్మకంటెను వేజైన హరియు లేడు వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. బ్రహ్మం గారి కుమారుడు పోతులూరయ్య. ఈ కవి ఆ "పేరు వీర బ్రహ్మం గారికే ఉద్దేశించినట్టున్నారు. సుమతి పేరు సుమతి శతక కర్త అని కవిగారి భావం. 16. _ నేరెళ్లవేంకటాచార్యులు - బందలింగాపురం గో.కం.సం.నం. 110. శతావధాని, ఆముద్రితరచనలు - అవధానములు. కవి పేరు వేంకట రంగాచార్యులు సంచికలో పేరు తప్పింది. వారు కవి అయినొ కవిత్వంలో కాక నంగీతంలో అందులో విశేషించి వాద్య సంగీతంలో అవధాన కుళలురు. వీణ, మురళి, మృదంగం, హార్మోనియం జండత్రవాద్యాల్లో నిపుణులని వినికిడి. వారు కవి కూడా అనడానికి గో.క.సం.లోని “ఆచార్య

138 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” ప్రశంస' పద్యాలు నిదర్శనం. అవి ఇవి, క కారి మహనీయునకు సుకు, మారుండై చింతతొరిటి మధ్యంబందున్‌ గూరిమితో తిరువాయమొడి, సొరంబును దెలిషినట్టి శఠరిపు* దలతున్‌. సీ. పూర్వము నందు సంపూర్ణ ఫజీంద్రులై, శ్రీహరి శయ్యగా జెలగినారు, శ్రేతాయుగంబున ఖ్యాతిగా రామ సోదరులయి వైరుల దరిమినారు, ద్యాపరమున హలధరులయి శ్రీకృష్ణ పూర్వజులన కీర్తి బోందినారు, కలియుగంబున మహాత్కాషాయ వసనత్రి దండ యతీంద్రుతై దనరి నారు. గీ. సకల పొషండులను దద్రోయ జాలినారు, నియతి వైష్ణవ మతముల నిళిపినారు, శ్రుతి తతులకు సదర్భముల్‌ సూపినార్డు స్వామి రామానుజా నీకు ప్రణతి శతము.

  1. ఆదిశేషుడు, 2. లక్ష్మణుడు, 3. బలరాముడు, 4. రామానుజుడు - ఒక్కరే అని శ్రీవైష్ణవమత సిద్ధాంతం, 166 యం, వై. జీవరత్నం; రెవరెండు - కొడిమ్యూల, గోక,సం.నం. 11, జన్మస్థలం - తిరుమలగిరి, నల్గొండ జిల్లా. వీరు జైస్తవ మత బోధకులుగా కరీంనగర్‌ జిల్లా జగిత్యాల తాలుకాలోని కొడిమ్యాలలో స్థిరనివానమున్నారు. జన్మ సం. 1898. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు జీవరత్నం గారి కవితా గురువు. ముద్రిత రచన - 1. (యోహోవా) యోనా చరిత్ర. రెండవ పుస్తకం జైన్తవ భక్తిగీతాలు కూడా అచ్చుపాందినట్టు కవిగారి కుమారుడు తెలిపారు. కవి. పూర్తిపేరు నుకా యేసు జీవరత్నం. సలక్షణాంధ్రకవితలో జీవరత్నకవి 'ఏసుకీస్తు' నిట్టా స్తుతించారు. గో.క.సం.పుట. 103. కు శ్రీమన్సామా సుగుణ స్తోమా యేసూ ! సవిత్ర శోభిత నామా | భూమీ జన రక్షక సన్నామా విస్క్ఫురిత భూషణస్థిత ధ్రేమా 1 క భువి గగనంబులు శశిమజి, రవి తారలు నూరుతంబు రాత్రింబవళుల్‌ అవిరతముగ నడిపించునదెవడా త్రయ్యాత్మక మగు దేవున్‌ గొలుతున్‌.. 2 ఉత్సాహ. మంగళంబు దేవదేవ మహిత ధర్మపోషణా,... 3 కు నిరతము నీదయ బడయుచు, బరను కృషాలబ్ధ విభవ భాగ్యాత్ముడ గాన్‌ శరణంటిని భవ భయహర, కరుణించవె యేసుదేవ కలుషాత్ముడనన్‌. 4. అయిదవ పద్యం కూడా కందం. రెండవ పద్యం చినరి పాదంలో అఖండ యతి పడింది. సలక్షణాంధ్ర కని యేసురత్నం గారు.
  2. _ చిలుకమళజ్టీ వేంకట నృసింహాచార్యులు - మఖ్లా నారాయణపురం. గో.క,సం.నం.116, జన్మతిథి - రుధిరోద్గారి కార్తీక బహుళాష్టమి. అముద్రిత రచన - వేణుగోపాల శతకము, అది అచ్చతెలుగు పద్య శతకమట. ఈ సంచికలోని కవిత 'శ్రీమద్రామానుజ ప్రళంన' పద్యాలు ఇవి. వు, 105. ఒకనాడైన భవత్పదాబ్దరజము న్కొక్కింత గ్రోలించి మీ యకళంకోజ్వల దివ్యదేహరుచి భుక్తిసక్తు గావించి దా శఠకోపయతడి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్ద ప్రూర్వాస్థ సాతిశ్వం” గోలకొండ కవుల సంచిక 139 స కదంబాఖిల దాస దాస పద దాస్యంబైన నేమించి ధా రకము న్నోషక భోగ్యసిద్ధికి గృపన్‌ రానిమ్ము రామానుజా. ప్రకటంబైన భవద్దుణానుభవము (న్చాజ్ఞుల్‌ వినందెల్బ మా మక చిత్తంబున జేరదింత యయినన్‌ మాంద్య న్వభావంబుచే నకటా కర్మవిపాక మీ విధము భాగ్యచ్భ్ళత్ర సంపన్నుగా (బ్రకటించెన్గద త్వత్కపారసము నాపై నుంచు రామానుజా. మొదటి చరణంలో రజమున్‌ + ఒక్కింత = అన్నిష్టసఖి వంటి సంధి. భక్తిరస పూరితం నృసింహాచార్య కవనం, 168. అమరవాది వేంకట నృసింహాచార్యులు - ముస్తాబాదు, శా. సిరిసిల్ల, గోక.సం,నం. 130, జన్మదినం - శుభకృత్‌ మాఘశుద్ధ పంచమి. మరణం £ 1924 (గో.క.సం. 1934 నాటికి 10 ఏండ్ల క్రితం) “మదన” - (గో.సం. వుట 121 వీరి కవిత. మలయ పవన యుక్తం మాధవీ కుంజ సక్తం । మిథున జన విలాసం మీనకేతోర్డివాసం | సురభి సుమ విభక్తం సుందరాంగోప భుక్తం । వనమిద మతి భాసం వల్లరీ భిర్వికాసం ॥ ధనురతి మృదు పుష్పం ధీర హృద్భేద బాణం | పటుమధుకర పంక్షిర్జ్యా ముహుళ్ళోక కారీ | సుమశర ఇతి సంజ్ఞా ధీర వీర ప్రతిజ్ఞా; మదన తవ సమస్తం మానినాం మాన విఘ్నం ॥ మొదటి శ్లోకంలో ప్రాస లేకున్నాతెలుగు పద్యాల్లో వలె నాలుగు పాదాల్లో యతి పొటించబడింది. ఆంగ్ల కవితలో వలె రైం కుదిరింది. వీరి తెలుగు కవితలు తెలియరాలేదు. 19. _ పండిత భావి కృష్ణశాస్త్రి - నారాయణపురం, తాః సిరిసిల్ల, నం.నం. 139, వయను - సప్తవింశతి, 27 ఏండ్లు. భావిపదం కవి గృహనామం. కవి పరిచయ పద్యం - గో.క.సం.పుట. 367. సీ రాడ్భగవాన్‌ దాస రక్షిత నారాయణపురంబు మన్నివాస పురవరము సరస విద్వన్నుత సద్భావి వంశ సాగరము మజ్జన్మకాకరము వరము అంధ్రగీర్వాణ ప్రబంధ కారక పరిచయము మద్వాక్సుధాచయము నయము నవరసాలంకృత నాటక కావ్యాది పరిశీలనోక్తి మత్పఠిత శక్తి గీ, సప్త వింశతి వత్సర నమము వయము, సలలితంబైన మద్విప్ర కులమమలము మాధవాం(ఘ్ర్యర్చితంబు మన్మనము ఘనము, సరసమౌ కృష్ణ నామమో నరనులార, కృష్ణశాస్రిగారు నం. 96 ఆఛి వే. నృసింహాచార్యులతో కలిసి జంట కవిత్వం చెప్పేవారని ఆచి నృసింహాచార్యుల స్మారక సంచికి 1985లో ఉంది. నం. 286. అఛి వేంకటాచార్యుల కవిత్వ వ్యాసంగానికి శ్రేరకులు కృష్ణశాస్త్రి గారని వేంకటాచార్యుల, రాగమాల ఖండకావ్య పీరికలొ వేదాంతాచార్యులు గ్రాశారు. శాస్త్రిగారి కావ్యాలేవీ లేవు. నం. 279 - కవయిత్రి ఆనందమాంబగారి 'సతీలలామ' 1934 కావ్యంలో వీరి అభినందన పద్యమొకటి కనిపించింది. ఆ పద్యమిది. చ, అతివల మిన్న వయ్యిబుధులందరిలన్‌ దలలూపజాలు నీ చతుర కవిత్వమాధురికి సంతసమొంది ప్రియంబుచే భవ న్మతి నెపుడుందలంచగను మంజుల నద్యము నొక్కదాని నం దిత హృదయుండనై యొసగితిన్‌ గయికొమ్మిది బాలికామబీ. గో.క. సంచికలోని 'సత్యము' శీర్షికలోని అయిదు పద్యాలలో ఒకటిది. ధరలో శాశ్వత కీర్తి నొందుటకుపాదానంబు గోవింద స

140 డా. మలయశ్రీ "కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” త్కరుణా పూరము నట్టి సర్వవిధ సౌఖ్య ప్రాప్తికిన్‌ గల్ప భూ తరువత్యంత విపత్తరంగ మిష వాతక్షుభ్య దుగ్రారి సా గరమున్‌ దాటగ నావయన్నిటికి ముఖ్యత్వంబు సత్యత్వమే. తర్వాతి నాలుగు మత్తేభ వృత్తాల్లో మున్నుపలికి బొంకని పురాణ పురుషులైన దశరథ, బలిచక్రవర్తి, విశ్వామిత్ర, ధర్మరాజుల సత్యసంధతను తద్వారా వారు పొందిన క్రీర్తిసంపదను ప్రశంసించారు. 20. అఆర్తికిష్టయ్య-కరీంనగరం, నం. 140. వివరాలేవీ లేవు. గో.క.సం.లో ఇందలి “విశ్వరూప' శీర్షికనుబట్టి విశ్వబ్రాహ్మణకవి అనుకోవచ్చు. పద్యాల భావాలూ అదే ధోరణిలో ఉన్నాయి. సంచికలోనివి రెండే సీసాలు. కాని, గో,కసంచిక నం.90 ఆర్తినమ్మాళ్వారు కవి, జీడికల్లుగారిది చాత్తాదవైష్ణవ కులం. కిష్టయ్యగారు అదే జాతివారు కావచ్చునేమో. పాడుమంత్రాలచే ప్రజలను బోధించబట్టి పండ్లూడగా గొట్టవచ్చు బాటి వంపులజేరి పసుల భక్షించెడి, పులినైన గూల్చియు గెలువవచ్చు వసుధ పాలన సేయవచ్చు మానవులను, దిట్టసాగిన వాని మొట్టవచ్చు బొక్కలోపల నిల్చి నిక్కిజనుల గర్చు, సర్బంబునైనను జంపవచ్చు కవి వరుని నోటి తిట్టును గడుపరాదు, ధర కళింగాధిపతి ముష్టి కరుగకున్నె సత్యగుణసీమ హితసోమ సార్వభౌమ, వీర గిరివాస రఘువీర విశ్వరూప ఏనుగు లక్ష్మణకవి 'మకరముఖాంతరస్థమగు మానికమున్‌ బెకలింపవచ్చు' అను పద్యాన్ని భావంలో అనుసరించినా పద్యం చివర కవి వాక్కు ప్రభావాన్ని చాటించాడు కవి. గీత పద్య పూర్వార్ధంలో శాపానుగ్రహ సమర్శుడనబడు వేములవాడ భీమకవి ప్రస్తావన తెచ్చాడు. కళింగ గంగు భిక్తుకుడైంది భీమకవి శాపం వల్లనే అని చాటు పద్య వ్యాప్తి ఉంది కదా. గీత పద్య ఉత్తరార్థంలోని “వీరగిరి' ఏదో తెలియరాలేదు. కరీంనగర్‌లో వీరభద్రుడన్న కొత్తకొండ క్షేత్రమున్నది కాని, ఇందులో కవి రాముని స్మరిస్తున్నాడు. వీరగిరి రఘువీర శతకం వీరి కృతి కాబోలు. రెండవ పద్యంలోనూ ఇదే విధంగా రెండు చరణాలు పద్యమకుటం. ఏ వర్షికుండైన నిల ధర్మపద్ధతి, బాలింపుచుండెనా ప్రభువతండె, సత్యమందుననిల్చి సంసారులను బ్రోచి, పరమేలు మెచ్చిన ప్రభువతండె పూర్వులిచ్చిన వృత్తి బోనీక మన్నించి, బాధింపకుండెనా ప్రభువతండె సంగీతసాహిత్య సకలవిద్యలయందు భ్రాంతుడైయుండెనా ప్రభువతండె యేమి యెరుగక తిని క్రొవ్వి కాముకతను బరగు నాకొంటె కొడుకెట్లు ప్రభువటయ్య ॥ పరమేలు - దుష్ట సమానం. కవి భావాలు కొంత తీవ్రంగా కనిపించినా సాంప్రదాయక వాది. తానయితే సాంఘిక విమర్శకుడు. 2౬ _ శిరిసినహళీ కృష్ణమాచార్యులు - కోరుట్ల, గో,కసంశం. 171. వయస్సు 30. బిరుదులు

  • అష్టావధాని, దైవజ్ఞశిభామణి, జన్మస్థానం - మోర్తాడు, నిజామాబాద్‌ జిల్లా. ॥ ముద్రిత రచనలు: 1. కళాశాలాభ్యుదయము 2. కొరువుట్ల జగతాల అవధానములు 3. పద్మావతీ పరిణయము 4. రుక్మిణీ కల్యాణము 5. మనోజ విజయ బాణము 6. గీతాతత్వమీమాంసా గ్రంధము పుట 370. వీరు ఉభయ భాషా కవి. బహు గ్రంధకర్త, వివరాలు తర్వాత చూపబడతాయి. ప్రస్తుత సంచిక “దీపావళి పుష్పము'లో వీరివి రెండు శ్చోకాలు మూడు తెలుగు పద్యాలున్నాయి. మచ్చునకు అందుండి ఒక శ్లోకం ఒక పద్యం ఇక్కడ ఉదహరించబడుతున్నవి,

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ది పూర్వాస్థ సాకొశ్యం” గోలకొండ కవుల సంచిక 141 శ్లో ॥కతి చిన్నధు మాధురీ దురీణా ః కతిచానర్ధ తరార్థభావ బంధా : నిజదేశ కవీంద్ర సాంద్ర వాదః ప్రకటంయాంత్యనిశం భవత భావాత్‌ ॥ మ. అలగీతాదుల జూపుచున్‌ మృదుపదన్యాసంబు గావించిని ర్మల భావోదయ మబ్బజేనెడు నిజాం రాష్ర్రాంధ్ర విద్వత్కవీం 'ద్రుల హృద్యత్కవితామతల్లి నిపుడుం దూరస్థులౌ వారికిం దిలకింపంగను జేయుచుంటివి గదా దీపావళీ పుష్పమా | ఆ దీపావళి పుష్పం ఈనాటికీ వసివాడని 1934 నాటి గోలకొండ కవుల నంచిక ! 22. టి. కృష్ణశాస్తే - పదిరి, త! సిరిసిల్ల, గో,సం.నం. 173, జన్మదినం - శుభకృత్‌. ఆషాఢశు.5, బిరుదు - అష్టావధాని. వీరు ఈ సంచికలోని కవి, నం. 68, లక్ష్మణశాస్రి గారి పుత్రులు. తిగుళ్ళ ఇంటి పేరు. ఈ కృష్ణశాస్త్రిగారు భవభూతి “ఉత్తర రామచరితం"' అనువదించారని న.చ, వేదాంతాచార్యులు ముస్తాబాద్‌ గారు “రాగమాలి కొవ్య పీఠికలో తెలిపారు. గో.క, సంచికలో వీరి కవితా శీర్షిక “దీపావళి పుష్పాభినందనము' అయిదు పద్యాలు. “ఆంధ్ర గీర్వాణ పాండితి నాదరించు కాలమెపుడేగుదెంచని గాంచుచుండ”, ఈ సంచిక వచ్చింది కాబట్టి - గీ. “తమ నిజాంలోన కవులు పూజ్యమను ప్రొజ్జులంత నతి శ్రద్ధ నూని 'సేవింతురమ్మ అఖిల భారతీయాంధ్ర భాగ్యాలకొమ్మ మహిత దీపావళీ కుసుమాభిధమ్మ” 3 అన్నారు. - కవి ఆనందం ఇట్టా ఉప్పాంగింది. సీ, నేడుగా సుకవీంద్రనిబిడ యశశ్చంద్రి కావళి దశదిశలాగ్రమించె నేడుగా పండిత నివహంబునకగణ్య ఘన మానితోల్డాస గరిమ కలిగె నేడుగా సద్విద్య నేర్చినందుకు ఫల మిదియే యటంచు నూహింపనయ్యె నేడుగా విబుధాళి నిజవంశ నామముల్‌ సకలోర్వినతి చిరస్థాయి గాంచె గీ, నేడుగా మహా ఘనత నిర్షిద్ర కీర్తి బ్రభువరేణ్యుల సత్క్సపా పరవశమున నలరి గోల్కొండ కవి సంచికాఖ్యతోడ నిలను దీపావళీ పుష్పమేగు దెంచె. కొలిదాసునకు వలె అక్షర లక్షలులేవు, శ్రీనాథునకువలె కనకాభిషేకాలు లేవు. తమ కవితల ప్రచురిస్తామని అడిగినందుకే ఇంతటి ఆనందాభినందనలు | ఎంతటి ఆల్బసంతోషులు - పసిహృదయులు ఈనాటి ఆనాటి తెలుగుకవులు | 23. నేరెళ్ళవేంకటాచార్యులు- బండలింగాపురము, నం. 174, వయస్సు 23 సం. ఆముద్రిత కావ్యం - అతిసుందర విలాసము. నం. 110. కవి నేరెళ్ళ రంగాచార్యులు వీరికి జనకులు. గో.కం.సం.లో “దీపావళి పుష్పము' వీరి కవిత. మొదటిది సీసపద్యం. రెండవది ఈ క్రింది ఉత్పలము,. తావక సద్వచస్తతి సుధారస బిందువు లుప్పతిల్ల దీ ప్రావళి పుష్పమా తమకమార యశోమణిహార వాసివై పావన సజ్జన భ్రమర పంక్తులు నీదరి నాశ్రయించగా నీవు జగత్రసిద్ధి బడుదేయను వారి కొకింత వింతయే. 24. పరవస్తు నెంబెరుమాళ్ళు గూడెం. త సిరిసిల్ల, సం. 175 వయసు - 40 సం.లు. ఆముద్రిత రచనలు - 1 యోగభూషణ చరిత్ర 2. నరహరిదాసు చరిత్ర 3, తిరుప్పావు. వీరి రచనలు అలభ్యాలు. గో.క.సం.లోని వీరి కవిత “దీపావళీ ప్రసవము” ప్పట - 165 చంపకమాలిక.

142 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” “ఇదరు గదా నిజాం కవుల జెందిన దుర్యశమింతలోన గాం చెదరు గదా యశోరమనశేషకృపన్‌ గవిరాజులిందు మిం చెదరు గదా విదేశ కవి సింహుల వాక్సటిమంబుకంటెబు చ్చెదరు గదా స్వకీయముగ జెప్పిన పద్యము లెల్ల మీరుగూ 'రెదరు గదా సుమోపమ సువృత్త సరంబులు దేశమాతకి చ్చెదరు గదా ధరింప బర సీమల వారు భ్రమింపగా లిఖిం చెదరు గదా స్వదేశ కవిశేఖరులిందరటంచు నప్టు మె చ్చెదరు గదా నిజామున విశేష కవీశ్వరులుంటచే నుతిం చెదరు గదా నవీనముగ జేరి పఠింప గడంగుచుండ దీ ర్చెదరు గదా తదీప్పితము రేబవలున్‌ గడు థ్రిద్ధతో గణ్‌ం చెదరు గదా యశోధనము శ్రేయము పండిత నామమున్‌ నుతిం చెదరు గదా విదేశ నిజససీమల వారలు మీ సహాయ మెం చెదరు గదా నిరంతర మశేష భవత్కరుణా రసత్వమున్‌” మెచ్చెదరు గదా రసజ్ఞులు వశీకృత సత్కవితా విలాసులన్‌ |! 25. అవునూరు వేణుగోపొలరావు - ఆవునూరు. నం. 177 జననం = కీలక సంవత్సరం, పుష్యమాసం. అముద్రిత రచన - జొహరాబాయి, (నవల) కవి పరిచయం - సం.వు. 371, గోలకొండ కవుల సంచికలో 'గోలకొండ' శీర్షికలోని వీరి రెండు పద్యాలలో రెండవదిది. శ్రీరాజిల్లు నిజాము రాష్ట్రమున సంశ్రేయంబుగా నాంధ్ర భా షా రామామణి వృద్ధి చెంద నిజదేశంబందు వార్తావళిన్‌ ధారాళంబున దెల్పగా వెలసె, నీ దక్కన్‌ యదృష్టంబె యా కారాంచై యలవార పత్రిక యనంగా 'గోలకొండా' ఖ్యతోన్‌. 26. గోవర్థన సింగరాచార్యులు - బందలింగాపురం, నం. 184, వయస్సు - 60 సం. మృతి - 1940 సుమారు. జన్మస్థలం - బెముగల్లు (ని,బాద్‌) నివానం - బండలింగాపురం, వీరు కావ్యరచన కావించినట్లు లేదు. రాజాస్థాన కవి. గో.క,సం, లోని 'శ్రీభాష్యరీ పంచ శ్లోకాలలో ఒకటిది. . శ్రీరామానుజ సూక్తి సార సరణిర్విష్టో : పదస్యానఘా సంసారాగ్ని విదీపన ప్రశమనీ శ్రీవిష్ట ద్‌ పోజ్వలా శ్రీనాథస్య పరస్యచాంధ తమసో దుర్వాదిగర్వాపహా సర్వాఘౌఘ విఘట్టనీ సుసరణిర్షి వ్యార్చిరాదిర్పణాం. 27. రామసింహము - రాఘవ పట్టణం, తా జగిత్యాల నం. 204. సిక్కు మతస్ణుడు. ఆళుకవి. వీరి పద్యగేయవచన గ్రంధాలు అనేకం ముద్రితం. ఈ సంచిక నాటికి ముద్రితైక కృతి విశ్వకర్మ శతీకము. విశ్వకర్మ శీర్షికతో అందులోనివే రెండు పద్యాలు గో.క.సం.పుట. 196లో చూపబడినవి. వానిలో మొదటి పద్యమిది. గో.క.సం.లో కవిది రాఘవనగరం, నల్లగొండజిల్లా అనడం పొరపాటు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “203 శతాజ్చ ర్రూర్వాస్థ సావాత్యం” గోలకొండ కవుల సంచిక 143 సీ. ఆదరించిన వారి కపకార మొనరించి ప్రజ్ఞదెల్పుట మహా పాతకంబు ఆపద దొలగించి యాప్తులౌ వారితో బగ బూనుటయు మహా పాతకంబు నిజమేదొ తెలియక నిర్నిమిత్తంబుగా బరనింద జేయుట పాతకంబు నావంటి పరిపూర్ణుడేవంక లేడని భావించుకొనుటయు బాతకంబు గ. తగని పాపిష్టి గురుని పాదమును బట్టి భక్తులై మైొక్కుటయు మహా పాతకంబు భక్త జననిందనము మహా పొతకంబు, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ

  • ఈ కవి కావ్యాల వివరాలు తర్వాత చూపబడుతాయి.
  1. జిరాధాకిషన్‌ రావు - బుట్టారెడ్డి గూడెం, త॥ హుజురాబాద్‌. నం, 222, జననం - తేదీ లేదు. అముద్రిత రచన - బుతుసంహారము తెలుగు నేత. గో.క.సం.లోని వీరి తెలుగు కవిత అయిదు గీతాలు. పు. 210 “వసంత బుతువు” కాళిదాసు బుతుసంహారము అనువాద పద్యం ఒకటి చూడండి. గీ. కొదమ తుమ్మెద గమి ధనుర్గుణము చేసి, పృల్ల చూతాంకురముల నమ్ములుగ జేసి కాముకుల దెందముల జీల్చగా దలంచి, చాన 1! చనుదెంచె యోజ వసంచుడదిగొ |! జి. రాధాకృష్ణారావు గారు ప్రభుత్వోపాధ్యాయులుగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో పని చేశారు. వీరి ముద్రిత రచనలు ః 1. రంగనాయక శతకము 2, శ్రీతైల మళల్లేశ్వర తారావళి, 3. బుతుసంహారము (కాళిదాసు కావ్యానికి అనువాదం), 4.సంపన్ను గృహస్ముడు (భండకావ్యం) ఈ వివరాలు 'క.జి, రచయితల చరిత్ర" లోనివి - పుట 237 - వివరాలు తర్వాత. 29, గంగా లక్ష్మన్న- మంథని, కాలం 1900 - 1919, నం. 230. ఇతర వివరాలు గో.క. సంచికలో లేవు. ఈ సంకలనం 1934లో ప్రచురితమైైనా లక్ష్మణకవి అంతకు ముందు వారి 20వ ఏటనే కీర్తేషులు. పూర్తిపేరు గంగా లక్ష్మణరావు. ఓవర్సీర్‌ ఉద్యోగం. సుప్రసిద్ధ కవి గంగా రాజేశ్వరరావు గారికి ఈ కవి తండ్రి. ఈ కవి వివరాలు తర్వాత. గంగా లక్ష్మణరావుగారి గో.క.నం.లో 'మాతృభాష' పద్యాలు ఇవి. మనమీరీతిగ మాతృభాషలను నన్మానింపుచున్‌ వేడ్కమై మనుపం జాలక మూల ద్రోసిన ఘనంబా యంచు జాత్యేతరుల్‌ మనమందక్కటికంబు దక్కి కడు పెల్చన్‌వారలెగ్లా డనే మన జాలంగలనయ్య మానములు పోనై యుండగా నీయెడన్‌. ఆంధ్రులే తప్ప నితరులేరైన గాని, మాతృభాషను గాదని మారు భాష నభ్యసించిరే భూలోకమందు నెందు? మానధనులార భాషాభిమానులార! కరుణాసార పరంపరల్‌ చిలుకుచున్‌ గౌతూహలంబొప్ప శ్రీ కరులారా ! మతి మీరు నాదరమునన్‌ గన్గొంచు సొంపారగొ గరమున్మాతృక యైన యాంధ్ర సుకలా కాంతామణిం బ్రోవగా నరుదా మాతృక కీర్తకై బరగదే యాచంద్ర తారార్కమున్‌. మానసమునందు కడునభిమానముంచి, మనుపుడీ మీరు దయతోడ నాంధ్రభాష (యతి?) దాన మీ గౌరవములేమి తగ్గిపోవు, కులము వెలిగాదు కీర్తియు గోలు పోదు. *. ఇన్చునువుడీ మోారు దయతోడ మాతృభాష” అని కవి అని ఉండవచ్చు; ఎలాగో మారింది.

1ఉీక డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 30. తిరువరంగం పాపయ్య నశాస్రే- మంథని, నం. 238. వయస్సు 51సం!లు. బిరుదు

  • అష్టావధాని. శ్రీ వైష్ణవులు. వీరు వానమామలై జగన్నాథ వరదాచార్యుల సోదరి భర్త. మంథని ప్రాంతంలో జ్యోతిష్యపండితుల సిద్దాంతి అని, పురాణ ప్రవచనం కావించేవారిని శాస్త్రులు అనీ అంటారు. అందుకే ఆచార్యులని కాక ఈ కవి పేరు చివర శాస్తి పదం జత చేరింది. “మంథెన ద్విజులు” వీరి శీర్షిక. సీ, నేపాల దేశావనీపాల సభలలో, నగ్రతాంబూలంబులందినారు ఆదరంబొంది బరోడాధిపుని చేత, వర్షాశన భృతుల బడసినారు పూనా నగర రాజధాని రారాజుచే, నగ్రహారాదుల నందినారు గద్వాల సంస్థాన విద్వత్పరీక్షలో, మనవారలదియె "పెట్టినది భిక్ష గ. అరయ నిట్లు స్వదేశ దేశాంతరముల, స్థిర తరంబైన కీర్తినార్జించి రట్టి వారలొకరిష్ట లేకున్కివలన కనుల, నీరు రాదొకో మంథెన్న వాసులార. (యతి?) మంథెన తమ్మి చెరువు, గోదావరీతీర గౌతమేశ్వరాలయాదుల వర్ణించిన వీరి మరొక సీసపద్యం బహుళ వ్యాప్తి పొందింది. కవిత్వం చాల తక్కువ ద్రాశారు. కావ్యరచన కావించలేదు. వారు ప్రధానంగా పౌరాణికులు. “పాపయ్యశాస్త్రి పూనా, నేపాల్‌, కాశ్మీరములలో సత్కారములు వడసెనని చెప్పుదురు” అని గ.స.రాజు “కఠీంనగర్‌ మండల చరిత్ర పుట. 18లో తెలిపారు. - 3, చక్రహరి నారాయణ భట్టుమూర్తి - లింగంపేట, తా॥ జగిత్యాల , నం. 246. వయస్సు 20 సం.లు. భట్రాజు, సంచికలోని వీరి కవితా శీర్షిక “విద్య. ఒకే ఒక సీస పద్యం. సీ. రారాజ చంద్రుడై రంజిల్లినను గాని విద్యాధికునె గారవించు చుంద్రు నీచుడైనను గాని నిరుపమ పాండిత్యమునగదా సభలోన ముఖ్యుడగును వికటరూపుండైన విద్వాంసుడగుటచే, పలువిధంబుల శ్రీల గులుకు చుండు ధనవంతుడైలోక ధన్యుడైనను గాని, శాస్త్రజ్ఞులను చాల సన్నుతించు గ. లౌకికంబెల్ల విద్యచే లభ్యమగును దుదకు మోక్షంబునకు నిదే తోడు పడును విద్యయే మానవాళికి వినయమిచ్చు గాన దీనికి సాటియే గాన మెచట. అవును కదా-విద్య చేతనే జనులకు విలువ హెచ్చు, ధనములన్ని విద్యాధనమునకు తచ్చు ! 32, వానమామలై జగన్నాథధ్రాచార్యులు - పోతురెడ్డిపేట, త హుజూరాబాద్‌ ; నం. 247. జన్మస్థలం మడికొండ. ఆముద్రిత కావ్యం - కార్పాసలక్ష్మి నాటకము. సీ. తలదాచుకొనుటకై తగు నీడయును లేక, యొక చిన్న గుడిసె వారుండు వసతి యాదాయమది జోళ్ళ యడుగున బడియున్న నొక కొన్ని గింజల నూడ్చి కొనుటె భార్యయా తానొక పరమ సాధ్వమణి, యిలు దాటి పొరుగిల్లు నెలుగ దెపుడు మానమ్ము గాపాడు మాత్రపు జినుగుడు, పేలికే వారికి చాల కరువు గీ. ఇట్టి కష్ట జీవనమున నేని నాథు ననదు పల్గెత్తుమాటయునైన నెపుడు పతి పదార విందములె శ్రీపతి పదారవిందములటంచు లక్ష్మినా వెలసెభువిని వరద గురు గృహలక్ష్మికార్పాస లక్ష్మి . వీరు 'రైతు రామాయణ' మహా కావ్యకర్త. కార్పాసలక్ష్మి - ఆముద్రితం, అలభ్యం. వీరి కావ్య పరిచయం తర్వాత చేయబడుతుంది. (సంచికలో 'వానమామలి అన్నారు.) -

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతాల్బ త్రర్వాస్థ సాపాశ్యం" గోలకొండ కవుల సంచిక 145 33. రాజవైద్య డాక్షరు పింగళి లింబాద్రి రెడ్డి - నెమలికొంద ; నం. 260, విజ్ఞాన ప్రచారణీ గ్రంధమాల సంపాదకులు. గోలకొండ కవుల సంచికలోని వీరి కవిత 'ఉషః కాలము' గేయం. పరభృతావళి నదిగొ చూడుము, నిరతమును గొంతెత్తి పాడగ తరతరంబుల రవము నొలుక, బరగుచుండె సికముల్‌. _ మెకములప్పుడు బయలు వెడలెను, మెరక చాటున డాగుకొనుచును మెదవుగను దమయడుగు లిడుచు, మేత జాడ బట్టి. తెమ్మెరలు తమ నేర్చు జూపగ, నెమ్మితోడుత సాగదొడగెను - కమ్మగాడ్పుల కలువదప్ప, తమ్మి గొనదుగా. వేడి వేలుపు జాడ కొజకై , వేడగా నా తోయరుహము వెడలెనో యనునట్లు దోపగ, వేగుచుక్క పొడచెన్‌. తెలియవచ్చినంతలో ఇది ఈ జిల్లాలోని తొలి తెలుగు గేయం, గురజొడ ముత్యాల సరాలు ప్రభావం ఈ కవితపై పడింది. సంచికలోని మొత్తము 354 కవులలో గేయకవులిద్దరే. వారిలో వీరొక్కరు. శెడ్డి గారు కృతికర్త - కృిభర్త - పుస్తక ప్రచురణ కర్త, వైద్య వ్యవసాయ సంబంధమైన వీరి గ్రంధాల పరిచయం ఈ అధ్యాయంలోని వచన రచయితల విభాగంలో చేయబడుతుంది. 34. వేంకటరాజన్న అవధాని - మంథని, నం. 271. బిరుదు - వైద్యవర. వయస్సు | 28 సం. గో.కసం,లోని వీరి శీర్షిక 'నేటి ద్విజులు' రెండు పద్యాలు. సీ. స్వాధ్యాయ నిరతులైవరల గాంచినవార, లక్షర శత్రువులైరి భువిని, నిత్యాగ్ని హోత్ర సన్నిధి నుండువారలు, ధూమపానాగ్ని సంతుష్టులైరి శైలోక్య గురువులై రాణ మించెడివారు, గురుమంత్రమును దామె మరపుగొనిరి అఖిల వేదార్థ విద్యావిభూషితులివ్లు, వేద నామమునకవేద్యులైరి ॥ గీ. పరహితార్థ సంపాదనా పరులు నేడు స్వార్థ సిద్ధ్యేక కార్య తత్పరులునైరి 'ఆత్మవత్సర్వ భూతాని' యనెడి వారు జనుల బీడింప నమకట్టి రనుదినంబు. తర్వాతి సీసం వీర ప్రశస్తి, బీరనింద. వీరు బహుభాషావేత్త. సంస్కృతాంధ్రోభయ భాషల కవి. ఆంగ్ల హిందూసానీ భాషలరచయిత అయిన అవధాని గారి రచనల పరిచయం తర్వాత ఉంది. 35. పులిగోటి ఆనందమాంబ - కొడిమ్యాల - తా ॥ జగిత్యాల, నం. 279. వయస్సు 12 సం, అష్టావధాని. జాతి వెలను. గోక.నం,లో “స్తీ విద్య” వీరి కవిత. గీ. విద్యయన్నను స్రీలకు వెగటుగల్ల, వనితలజ్ఞానులనుచును వాడుకొనుట యబ్బురంబేమి దీపంబు నవల ద్రోయ, నున్న యింటిలో జీకటి యుండ కున్నె, ఊఉ. కాంతలు మాతృభాష పయి గౌరవ ముంచక నన్యభాషన _ శ్రాంతము నేర్చినంతటను సారము లేదిక, గొప్పయైన శ్రీ మంతము గల్గియున్నదని మంగళ సూత్రము బారవైచి య త్యంత సుభూషణంబులను దొల్చిన రీతిని యెంచి చూడగన్‌. ప్రీ విద్యా వ్యాప్తి ఆవశ్యకతను నాటి ఘరానా స్త్రీల అన్యభాషా సంస్కృతుల వ్యామోహాన్ని ఈ బాలిక చక్కగా నిరసించారు. ఈ రెండు పద్యాలలోని అలంకారాలు కవయిత్రి భావసంపత్తికి

146 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” దృష్టాంతాలు. అదే సంవత్సరం 1934లో ఆనందమాంబ గారి 'సతీలలామ' పద్యకావ్యం ప్రచురింపబడింది. తర్వాత మరే రచనలూ రాలేదు. వరకట్న దురాచారం గురించి ఒక కావ్యం వ్రాయాలని ఉందని 92లో తెలిపారు. కావ్య సమిక్ష తర్వాత ఉంది. 36. అభి వేంకటాచార్యులు - ఆవునూరు, నం. 286 జననం ఆనంద ఆషోఢశుద్ధ దశమి. 1985 నుమారుగా కవి మృతి చెందారు. ఈ కవి గారి “నిజాం రాష్ట్ర విజయం” పద్యద్వయంలో మొదటిది (గో.క.సం. 297 పుట.). శా, శ్రీరంజిల్లెడు నాంధ్ర రాజ్యముల వీక్షింపంగ స్వాతంత్ర్య వి స్తారంబందున వైక మత్యమున విద్యాభాషలందున్మహా సారంచై యిల నన్ని రాజ్యముల మించన్‌ జాలు సత్సీమ యౌ నీరాజ్యంబె యటంచు బేరుగొనె నెంతేనిం బ్రభాశాలియై. తర్వాతి పద్యంలో నిజాము రాష్ట్ర ప్రజల ప్రభుభక్తిని ఐకమత్య బంధుభావాన్ని కవి ప్రశంసించారు. రాగమాల్క, మా ఊరు - వీరి ముద్రిత పద్యకొవ్యాలు. కవి వివరాలు తర్వాత చూపబడుతున్నవి. 37. గిరిధరరావు - హుజూరాబాదు. గో.క.స.నం. 299. ఆ సంచికలో వీరి ఇతర వివరాలు లేవు. కవి స్వగ్రామం గుండేడు. విష్ణుదాసు గిరిధర కవి పేరుతో “వీర భద్రస్తవము' అను పద్యకావ్యం వీరిది 1931లో ముద్రణ పొందింది. అందలి ఒక పద్యం ఇది. చ. సుజన మనోంబుజా భువన సుందర విగ్రహవీర భద్ర! నీ రజదళ లోచన ద్వయ నిరంజన పండిత రంజనా , వృష ధ్వజ, పరిపూర్ణ శక్తి మహితాయ హితా విహితా విశారదా ! నిజముగ నిన్ను నమ్మితిని నిర్మల భక్తిని నన్నుబ్రోవరా |! ఈ కవి “రాష్టమాత” పద్యాలు, గో.క.సం,పుట - 310 , నుండి, తే.గీ.రాజితంబగు మానిజాం రాష్ట్రమందు, నక్కడక్కడ దేశ భాషాభివృద్ధి గాంచ గల్లెడి దివసముల్‌ గాననయ్యె, సొంధ్య గృహ దీపికలు వెల్లుచందమునను. గ జీర్ణ వస్తంబుతోడ సజీవ మగుచు బుత్ర గర్హితవై చాల బొక్కుచకట ఈ నిజాం రాష్ట్రమందతి హీనమగుచు, దిరుగకుమురోత నీవింక దేశమాత, శా. నీ పుక్రుల్‌ ఖలవంతులాఢ్యులు మహానీతిజ్ఞులైనార లే లోపంబున్నను దీర్చునేర్చరులు బొల్పున్‌ దు;ఖమున్‌ జెందినా పాపంబంచు దలంపబోకు జననీ భద్రంబు చేకూరు నీ 'ప్రాపేమాకని నమ్మియుంటిమిక నీ భాగ్యంబు సామాన్యమే. 38. గోవిందుల కృష్ణమాచార్యులు - బండలింగాపురం, నం. 307. వయస్సు 18 సంవత్సరాలు. వారి పుత్రులు కూడా నలుబదేండ్ల క్రితమే కీర్తిశేషులైనారని కవి పొత్రిభర్త చిలుకమళ్ళి లక్ష్మణాచార్యులు (కొరుట్ల) తక్కళ్ళ పెల్లి వ.60, చెప్పారు. కవి రచనలేవీ లభించలేదు. కృష్ణమాచార్యులు 1970 సుమారుగా క్రీర్తిశేషులైనారు. గోక,సం. కవిత “కవిత” రెండే శ్లోకాలు. అవి ఇవి. శో సుదతీవ రతి (ప్రవర్ధనే కమలేవార్థదయ ప్రదాయినీ విమలా సురనిమ్నగా యథా భవతీయం కవితామ తల్లికా, శ్లో సుకవితా వశగాయది సర్వదా వితమతే తను సౌఖ్యమివాబలా నవళశగా యదిమారభవాందశాం దిశతి జాగర తాకృశతాదికాం.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద డ్రార్వాష్థ సావాత్యం” గోలకొండ కవుల సంచిక 147 39. సేనాపతినరసింవాచార్యులు-కొరుట్ల. నం. 308. జననం - చిత్రభాను. విశిష్టాద్యైతమతం. "సేనాపతి నరసింహాచార్యులు రామాజుల జన్మస్థానమైన శ్రీ వెరుంబుదూరులో తర్కవ్యాకరణ వేదాంతములు చదువుకున్నారు. అక్కడి ప్ర.ఉ. కుండలం వేంకట నరసింహాచార్యులు గారి ఆనతిచే కొరుట్లలో 1923 రుధిరోద్గారి సం॥ వైశాఖమున వేదాంతద్వయవర్ధినీ సంస్కృత పాఠశాలను స్థాపించి వేణుగోపాలాలయమును నిర్మించి బడిని గుడిని ఉత్సవాదులతో వైభవంగా నడిపారు. పిఠావురం రాజాస్థాన పండిత సన్మానము పొందారు. వీరు సంస్కృత పండితులు - కవి ; రాజయోగి. కీర్తిశేషులు. వారి 'ఆంధ్రము' (గో.క. సంచిక) శీర్షిక మూడు పద్యాల్లో రెండు పద్యాలు చూడండి. ప్రకృతి జగంబునందభిల భాషలకిల్లను సంస్కృతంబు త ద్వికృఠియు నాంధ్రభాష కడువీనుల విందగు దాని కన్నని ర్వికృతిక నున్న పైడి జన విశ్రులత కీర్తి దిగంత మొందినన్‌ సుకృత సుభూషణావళుల జూచిన సంతస మొందరే జనుల్‌. 1 సదయ హృదబ్ద సంస్కృతమ సర్వ కళాంచితురాలవుండ ద్వ తద యుగళాశ్రితాంధ్రకృతి పండిత పామర రంజనీయమౌ నది హితమయ్యె బార్వణ సుధాకరునిన్‌ నుతియింప రెవ్పుడున్‌ విదియన బుట్టు చంద్రికకు వేయి జనంబులు మొైొక్కుకుందురే. 3 సంస్కృతం ప్రకృతి ఆంధ్రము దానికి వికృతి అని కవిభావం. శ్రీ వైష్ణవులకు తమిళభాష ప్రియమైనా తెలుగు ద్రవిడ భాషాజన్యమనువాదం ఈ కవి గారు వినలేదో విన్నా ఒప్పుకొనలేదో. చివరి పద్యంలో సంస్కృతం పూర్ణిమా చంద్రుడు, తెలుగు విదియ చంద్రరేఖ అన్నారు. పున్నమి రేవెలుగు కంటే కొత్త నెలవంక ఆరాధనీయమైన దనడం కవిగారికి మాతృభాషపై కల అభిమానానికి నిదర్శనం. వీరు సంస్కృత గ్రంధత్రయ కర్తలు. 40. కొండపాక నారాయణచార్యులు - దేశాయిపేట, తా॥ హుజురాబాద్‌. నం. 322. మరణం - 1336 ఫసలీ, విశ్వబ్రాహ్మణులు. వీరి కృతి “బ్రహ్మానంద లీలాకరము” వివిధ దేవీ దేవతల స్తుతి కీర్తనల సంపుటి. ముద్రితం. ఈ సంచికలోని 'నుతి" పద్యములివి. శా. ఓంకొారాలయునిన్‌ జగజ్జఠరునిన్‌ వ్యోమాది భూతాంగునిన్‌ సంకాశస్థితి లీన రూపుని సదా సచ్చిత్కళా భాసునిన్‌ సంకల్పాది వికార శూన్యుని విలక్ష్యబ్రహ్మము న్నిర్లతా హంకారాళ్ముడనై స్మరించెదను సోహం సోహమంచక్షరుల్‌. ఉ. భావమునందునీదు పద భక్తి వహించిన ధన్యులెల్ల స త్పావనులైరటంచు మును బ్రాజ్ఞులు దెల్బ గ్రహించి నిత్య సం జీవుడవంచునమ్మి, నుతి జేయుచునుంటి ననంత వేదనన్‌ సేవిత నిశ్చలాత్మ దయజేసి ననున్షరి జేర్చరాగదే. 41. వటవురి వేంకటాచార్యులు - కంది కట్కూరు, తా సిరిసిల్ల నం. 329, మరే వివరాలు లేవు. ఈ దిగువ పద్యాలు 'గో.క.సం. “శ్రీరామ చంద్రప్రభో' లోనివి. పుట. 335. భూనాథోత్తమ వార్థిబంధన లసద్భోగీశ పర్యంక య జ్ఞానాంభోనిధి హవ్యవాహన విభాస్వత్మ్కీర్తి ధౌరేయ వి జ్ఞానోపేత దశాస్యభంజన సదా శాంతాత్మ కంజాక్ష బ్ర హ్మానందాబ్టి విహార కంబుగళదేవా రామచంద్రప్రభో,

148 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” పతి శాపంబున నాతి రాతిగతి దుర్వారోగ్ర కాంతార మం

దతి శోసిల్లుచు వేల వర్షములు దుఃఖాక్రాంత చిత్తంబుతో

గతి లేకన్‌ బడియుండ జూచి మదిలో గారుణఖ్యతన్‌ బూనుటన్‌

మతి నూహింపగ జోద్యమున్‌ గలిగె దేవారామచంద్ర ప్రభో. వీరి ముద్రితా ముద్రిత పుస్తకాల పరిచయం తర్వాత చేయబడుతుంది.

  1. వానమామలై లక్ష్మణాచార్యులు - కుందనపల్లి, తా; పెద్దపల్లి. నం. 349, జన్మస్థలం - మడికొండ. ముద్రిత రచన - ప్రణయాభిజ్ఞానము. గో.క.సం.కవిత 'చెలీ' రెండు పద్యాల్లో మొదటిది చూడండి.

కొమ్మను వంచెదేలనె నికుంజము నందలి ముండ్లు (గ్రుచ్చగా

గొమ్మరొ పూవు దేనియల గ్రోలెడు తుమ్మెద యుమ్ము రఖుమ్మనన్‌

గమ్మని వాసనల్కొనగ గాంక్ష యొకించుక గల్గుగాకదా

నిమ్మఫలంబు జీల్చు శుకనిస్టను గాంచరుచించునే చెలీ !

లక్ష్మణాచార్యులు సంస్కృతాంధ్ర కవి. వీరి కృతుల వివరాలు తర్వాత చూపబడుతాయి. గోలకొండ సంచికలోని కవులను సంపాదకులు జిల్గాలవారీగొ, కులాల-మతాలవారీగా లెక్కించి చూపారు. అది సామాజిక విద్యాస్థాయి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం. అది ప్రస్తుతం అత్యవసరమనిపించదు. కాని, నాటి ఈ మండల విద్యాసాహిత్య వ్యాప్తి ఏయే వర్గాల్లో ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది కనుక, ఆ సంచికలోని ఈ జిల్లా కవుల కులమత వివరోలు ఇక్కడ చూసబడుతున్నవి.

గో.క.సం.లోని కరీంనగర్‌ జిల్లా కవుల మొత్తము - 42. వారి జాతి మత వివరాలివి. శ్రీ వైష్ణవ కవులు - 21 నియోగులు - 3 బ్రాహ్మణులు - 5 ఆరాధ్యవిప్రులు - 1 సాతానులు - 1 భట్రాజులు - 3 వెలమలు - 2 రెడ్లు - 1 విశ్వబ్రాహ్మణులు - 1 కుమ్మరి - 1 సిఖ్బు - 1 జైస్తవ - 1 కులం? - 1

శ్రీ వైష్ణవులు, సాతానులు, భట్రాజులు, రెడ్డు, రావులు థ్రీ వైష్ణు మతాభిమానులే కాబట్టీ అప్పుడు విష్ణుభక్తి ఉచ్చదశలో ఉందని భావించవచ్చు. ఒకే ఒక ఆరాధ్య విప్ర కవి ఉండడం శైవం తగ్గుముఖంలో ఉందనడానికి నిదర్శనం. బ్రాహ్మణులు శివకేశవ భేదం పాటించని స్మార్తులైనా వారిని శివభక్తులుగానే పరిగణించవచ్చు.

(బ్రాహ్మణులో భట్టులో పురోహిత జాతి - వర్గం వారు, ఇంకా పెత్తందార్లు నాడు విద్యా వైదుష్యాలు సంపాదించి కవిత్వ రచన కావించారనుకోవాలి. ముస్లింలు తెలుగు భాషాసాహిత్యాల ఆదరించలేదు. కైస్తవ కవి మతాంతరీకరణ పాందిన హిందువు. అదీ ఇతర జిల్లానుండి మతప్రచారకునిగా వచ్చిన వ్యక్తి. సిఖ్ము కవిది క్షత్రియజాతి. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విశ్వబ్రాహ్మణకవి, ఒక శాలివాహనకవి. కేవలం ముగ్గురు మాత్రమే శ్రామికవర్గం కవులు. వారు సైతం పండితులు కారు. వర కవులు.

గో.కసం.లో ఉన్నా లేకున్నా ముందు సూచించినట్లుగా ఈ అర్ధ శతాబ్ది రచయితలు పద్య - యక్ష గాన - మధుర వేదాంత - వచన వాజ్మయ విభాగాలలో చూపబడుతున్నారు.

పద్య సాహిత్యం సృజించిన కవులు ఈ క్రింది వారు. ఈ గ్రంథ రచనారంభ కాలంలో (1990)

  • గుర్తుగల 5 గురు సజీవులు. ముద్రణ కాలం (1997)లో అందరూ శీర్తిశేషులే.

రెండవ భాగం - ౪ అధ్యాయం ; “20క శతాల్బ పూర్వార్థ సావాత్యం” పద్య సాహిత్యం 149 పద్య సాహిత్యం : 1 గంగా లక్ష్మణరావు, 2. వానమామలై లక్ష్మణాచార్యులు, 3. రామసింహకవి, 4. పరమారాధ్యుల రాజయ్య, 5. ఘటబ్రహ్మసిద్ధప్ప వరకవి, 6. మాధవరావు బలరామదాసు, 7. సిరిశనహళ్‌ కృష్ణమాచార్య శతావధాని * 8. దివిలె భట్టు నరసింహరాజు, 9. విష్ణుదాస గిరిధర కవి, 10. ఎదులాపురం నరసింహాచార్యులు, 11. ఆనందమాంబ * 12. కమరం వేంకట రామానుజం, 13. ఆనందయ్య, 14. సముద్రాల రామానుజాచార్యులు, 15. గడియారం విశ్వనాథశర్మ, 16. వానమామలై వేంకటాచార్యులు 17. వేంకట రాజన్న అవధాని *, 18. వానమామలై జగన్నాథాచార్యులు, 19. ధప్పూరి సత్యనారాయణాచార్యులు , 20. గొట్టుముక్కుల రాధాకృష్ణరావు, 21 అభి వేంకటాచార్యులు, 22, వటపురి వేంకట నృసింహాచార్యులు, 23. వెలిచాల కేశవరావు, 24. వి. రాం గోపాలరావు, 25. అభి వేంకట నరసింహాచార్య, 26. మామిడిపల్లి సాంబశివశర్మ 27. గాలిపల్లి సుబ్బయాచారి, 28. మాదాపురం రామమూర్తి, 29. జంగిడి నారాయణ *, 30. రావుల దశరథం, 31. తిరునగరి వేంకటేశ్వర్లు, 32. పురుషోత్తమ దాసు, 33. చె. జగన్నాథ రావు [లి గంగా లక్ష్మణరావు' - మంథని, 1900 - 1919.

గంగా లక్ష్మన్న ఆని గోలకొండ కవుల సంచికలో (నం, 230) పేర్కొనబడిన విద్వత్కవి మంథని వాస్తవ్యులైన గంగా లక్ష్మణరావు గారు. వీరి వుత్రుడే గంగా రాజేశ్వర కవి. లక్ష్మణరావు గౌరు జీవించింది కేవలం ఇరువదేండ్లు. చదివింది ఆంగ్లమాధ్యమంలో మిడిల్‌క్లాసు. చేపట్టింది ఓవర్సీర్‌ ప్రభుత్యోద్యోగం. అత్యల్ప జీవిత కాలంలోనే సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యాన్ని సముపార్షించుకున్నారు. గద్య పద్య నాటక రచనలతో విశేష ఖ్యాతిని గడించారు లక్ష్మణరాయ కని,

వీరి రచనలు : 1. రత్నకాంత నాటకము (ముద్రితం), 2. కుచేలు చరిత్రము - హరికథ (ముద్రితం) 3. దండకారణ్య చరిత్ర - కావ్యము 4. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర నాటకము (అలభ్యాలు). కవి పరిచయం : గంగా రాజేశ్వరరావు గారు రత్నకాంత నాటకం మున్నుడిలో తమ తండ్రి గొరిని గూర్చి ఇటా (వ్రాశారు. * “వారు నాటకములు రచించుటయే గాక కంపెనీ నాటకములలో స్రీ పాత్రలు ధరించేవారు. “ఇంపు మీరగను హిందూ థియేటర్‌ కంపనికిని శుభకరమైతివి" అని కుచేలు చరిత్ర హరికథలో సరస్వతీ ప్రార్ధనా కీర్తనలోని వాక్యము. వారు హరి కథా రచనతో పొటు కథా కథనము గూడా బేసెడివారు. సాహిత్య సంగీతములందేగాక చిత్ర కళాది హస్త కళలలో సిద్ధహస్తులు. వీరి వ్రాత యింప్తలు సొంపులు గులుకుచు ముత్యాలు గూర్చినట్టు పాంకముగా నుండును”.

ఈ కొడుకు పుట్టిన సంవత్సరమే కవి కన్ను మూశారు. ఇవి కర్ణాకర్ణిగా విని, వ్రాత ప్రతులు కనీ, రాసిన అంశములు. ఇరువదేండ్ల ప్రాయములోనే వారు ఇంతటి కళాసాహిత్య వైదుష్యాలు సాధించడం విశేషం. లక్ష్మణరావు గారి ప్రాథమిక విద్యాభ్యాసం మంథనిలో మాధ్యమిక విద్య కరింనగర్‌లో జరిగింది. ఓవర్సియరల్‌ కోర్సు భాగ్యనగరంలో చదివారు. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయాందధ్ర భాషానిలయ గ్రంధాలయ కార్యక్రమాల్లో వీరు చురుకుగా పాల్గొనేవారు. అక్కడ సురవరం, మాడపాటి మొ! పెద్దల సాంగత్యంలో ఆయన సాహిత్యం ప్రవర్ధమానమైంది. నా భాగా కాను

  1. ఈకవి వివరాలన్నీవారి పుత్రులు గంగారాబేశ్వరరావుగారు రత్హకాంత నాటక పీరికలో పొందుపరిచారు.

సెప్టెంబర్‌ 92లో వారు మంథనిలో నాతో స్వయంగా ముచ్చటించారు. 2, రత్నాకాంత నాటకము - 1988, పీఠిక-పుట-19.

150 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” రచనల విశేషాలు ః; రత్నకాంత నాటకం. ఇది పూర్తి ఆలంకారికుల నాటక లక్షణాల ననుసరించి రచింపబడిన నాటక రాజం. అంకములు ఆరు. ప్రతి అంకం నాలుగైదు రంగాలుగా పునర్విభక్తమైంది. భాష గ్రాంధికం. ఇతివృత్తం కాల్బనికం. రాజుల కధ. సంస్కృత రూపకాలలో వలె ఇది పద్య గద్య సంకలితం,. ఇందులో కేవలం నాలుగు అంకములే లక్ష్మణరాయ కవిచే విరచితం. మిగతా రెండు అంకాలను కవి కుమారుడైన రాజేశ్వరరావు గారు పూరించి 1988లో దానిని పుస్తకంగా ప్రచురించారు. పుటలు 208. ప్రతులు 500 మాత్రమే. నాటక నాంది పద్యం : చ. ఒకట గవీంద్రులున్‌ రసికులాక్కట గానకళా ధురీణులొం డోకట మనీషు లొక్కట మరొక్కట నీశ్వర భక్తియుక్తులిం కొకట వణిక్కులొక్కట సమార్దిత విక్రమ చక్రవర్తులు త్చుకత గృపా రసాంచితపు చూపులు నాపయి జూపు చుండగన్‌. మచ్చునకు గద్యం : “నవలా +! ఈ నవరస రసిక శిఖామణులు సుఖాసీనులై వినోదార్థంబు మనోహరంబుగా మదికి ముదము గదుర జేయ మహనీయ శృంగార రసరంగద్రంగ సంగ పాటవంబగు నొక నవీన నాటకంబు నుద్యమించి, హృద్యానవద్యంబు నొందింపుమని, రెండుమాటలన్న నోటాడి యెరుంగని నన్నిందులో నొక మేటిగా భావించి యానతిచ్చినారు...” ఈ నాటకం ప్రదర్శింపబడలేదు. ఇందలి భాషా సాహిత్య కథానిర్వహణములు ఆసక్తిగా చదివించేవిగా ఉన్నాయి. కుబేలు చరిత్రము ః కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యసఖుడు. సంసార జీవితంలో ధనదరిద్రుడు క్రన్సుక్హ కుచేలుడు. కృష్ణకరుణ పొందిన పిదప సుధాముడైన వాడు 1! హరికథల ప్రాదుర్భాన వికొసాల్పు పందొమ్మిదవ శతాబ్దిలోనే. లక్ష్మణరావు గారి కుచేలు చరిత్ర ఇరువదవ శతాబ్ది మొదటి పాదం లోనిది. 1915 సుమారుగా కవి దీనిని రచించి ఉంటారు. ఈ కవి పన్నెండేండ్ల వయసులోనే పద్య రచన కావించినారనడానికి ధర్మవరం వారికి సమర్పించిన ప్రశంసాపద్యాలు సాక్ష్యం. అవి తర్వాత చూపబడతా యి. ఈ కుచేలు చరిత్ర పూర్వ హరికథల వలె గద్య పద్యాలు దర్వులు తొహరలు కలిగిఉంది. వచనాలు పెద్దవి. పుటలు - 21 ఇది రత్నకాంత నాటకంతో చేర్చి 1988లో ముద్రింపబడింది. మిగతా రెండు కృతులు లభించలేదు. ఈ రచనల గూర్చి మంథని వాస్తవ్యులు ప్రముఖ రచయిత వేంకట రాజన్న అవధాని గారు ఇట్లా అన్నారు. “...కీశే. లక్ష్మణకవి గారు రచించిన (శ్రీకృష్ణదేవరాయల నాటకము, దండకారణ్య చరిత్ర వ్రాత ప్రతులు శ్రీ మాడపాటి హనుమంతరావుగారికి ముద్రణ కొరకు సమర్చింపగా అవి ముద్రణకు నోచుకోకపోగా, అసలు లభ్యమే కాకుండా పోవడం. .” జరిగింది. రచనా విశేషాలు అడిగితే అవధాని గారు స్మృతిలో లేవన్నారు. ఆ వ్రాత ప్రతులు ఇచ్చిన తిరువరంగం పాపయ్య శాస్తి కీర్తిశేషులు. గంగా రాజేశ్వర కవి వాటిని చూడనైనా లేదట. అవి అలభ్యములైనా రచనల పేర్లయినా లభించినందుకు సంతృప్తిపడాలి, లక్ష్మణరాయ విరచితాలైన మరి రెండు పద్య ఖండికలు రత్సకాంత నాటకాంతమున అనుబంధములో కనిపించుతున్నవి. ఒకటి - “శీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం - భాగ్యనగరం" వారి వార్షికోత్సవ సభలో ధర్మవరం కృష్ణమాచార్యుల సన్మాన సందర్భంలో చదివిన “స్వాగత పంచరత్నములు"

  • రెండు - గోలకొండ కవుల సంచికలో “మాతృభాష శీర్షికతో ప్రచురించబడిన నాలుగు పద్యాలు. అని
  1. రత్పకాంత నాటకము - పేఠికప్పట-15,16

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద పూర్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 151 ముందే చూపబడినవి. కవి నం. 29. 'ఆంధ్ర నాటక పితామహ' ధర్మవరం రామకృష్ణమాచార్యులకు సమర్పించిన పంచరత్నాలలో రెండు పద్యాలివి" మ. సరసీజాత సుగంధవాయువులు (ప్రాంచన్మల్లి కానేకపు ప్పరజో జృంభిత మారుతంబులు లసత్‌ సత్యాది చంద్రాననా కర చామీకర చామరాకరము లేకంబై తనుం గారవిం పరహిన్‌ బత్తుల తోడ గూడి యమునా ప్రాంతోబ్బలారామమం దిర సంచారములం బొనర్చు హరి శ్రీదేవుండు మిమ్మేలుతన్‌ నిరవద్యప్రతిభాప్త చారుతర వాణీ రామకృష్ణాగ్రణీ, ఉ. ఆర్యుడు సత్కవిత్వ మహిమాంచితుడిద్ధ యళో విశాలుడా చార్య సమేతు డాఢ్యుడల ధర్మవరాన్వయ రామకృష్ణమా చార్యుడనంగ గర్జముల జల్లగ వింటిమి చూడ మెప్డ ధీ వర్య ! మిముం గనం గలుగు భాగ్యమునున్‌ లభియించె నిత్తరిన్‌. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపన 1901లో * అప్పటికి లక్ష్మణరావు గారికి ఒక్క ఏడాది వయను. ధర్మవరం రామకృష్ణమాచార్యుల జీవిత కాలం 1853 - 1912 కవి విద్యార్ధి దశ 11, 12 సం. వయన్సులో రచించినవీ పద్యాలు. అల్పవయస్కులు కాకపోతే తమ అనల్పకవితా శక్తితో మరెన్ని మంచి కావ్యాలు వెలయించే వారో లక్ష్మణరాయ కవి గారు ! 2, వానమామలై లక్ష్మణాచార్యులు - కుందనపల్లి, తా పెద్దపల్లి; 1902 - 1964 సుమారు. వానమామలై కవి సోదరులలో లక్ష్మణాచార్యులు ద్వితీయులు. సంస్కృతాంధ్ర తమిళ విద్యా వైదుష్యాలలో అద్వితీయులు. ఆయన తండ్రి బక్కయ్య శాస్తి. తల్లి సీతమ్మ తమ్ములు జగన్నాథ వరదాచార్య కవులు. అన్న వేంకటాచార్యులు. జన్మస్థానం మడికొండ. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి తాలూకాలో వైష్ణవాగ్రహార గ్రామమైన కుందనపల్లిలో స్థిరపడ్డారు. మహారాష్ట్ర సిరివంచ ప్రాంతపు ఆహిరి రాజాస్థాన పండితులుగా లక్ష్మణాచార్యులు సన్మానాలందారు. కోయభాషకు లిపి సాహిత్యాల రూపొందించారు. సంస్కృత కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన పెద్దపల్లి విద్యాలయంలో అధ్యాపకులుగా 1960 సుమారుగా పని చేశారు. ఆ గురువుగారిని శిష్యులు ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. తర్కవ్యాకరణ పండితులైన ఈ కవి అష్టావధాని శ్రీపాద కృష్ణమూర్తి గారితో కలిసి కొంతకాలం దేశ నంచారం కావించారు. కవి వంశ వంశాదులు ః నారాయణప్ప, సింగారార్యుడు, లక్ష్మణాచార్యుడు, వెంకయ్యశాస్రి, బక్కయ్య శాస్రి వరుసగా వీరి వంశపూర్వులు. బక్కయ గారి నంతానం. 1. వేంకటాచార్యులు 2. కృష్ణమ్మ 3. లక్ష్మణాచార్యులు 4. అండమ్మ 5. జగన్నాథాచార్యులు 6, వరదాచార్యులు.” వీరిది కవి పండిత వంశం. కవి గారి తండ్రి బక్కయ్య శాస్తి పేరుమోసిన పౌరాణికులు, తాత తర్కవ్యాకరణ పండితులు. వీరు మొదట వైదిక బ్రాహ్మణులు. అప్పటి గృహనామం వాసాలమళ్ఞి వారు. నారాయణప్ప గారు శ్రీ వైష్ణవ మతం స్వీకరించి వానమామలై వారైనారు. వీరిది భరద్వాజ గోత్రం, 4. రత్నకాంత నాటకము - అనుబంధము-పుట-22. 5. రేపాల నరసింహరాయలుగారి “సజీవ కిరణాలు'-1993-పుట-15. 6. శ్రీనివాస చగ్రవర్తిగారి 'తెలుగు నాటక కవులు'-1966-శీర్షిక-4. 7. వానమామలై వరదాచార్యులు “పోతన చరిత్రము' 1966, పీఠిక-77 వ పద్యం.

152 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర గా ఆపస్తంభసూత్రం. వీరి పూర్వులు ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు వారు. అప్పుడది కరీంనగరం మండలంలోనిదే. బక్కయ్యశాస్తి వరంగల్‌ జిల్లాలోని మడికొండకు వెళ్ళారు. ఆ తర్వాత వారి పెద్ద కొడుకులు ముగ్గురు కరీంనగర్‌ జిల్లాలోనే స్థిరపడినారు. లక్ష్మణాచార్యుల వయస్సు ఎవరూ సరిగా చెప్పలేకపోయారు. వారు 1964 - 65 సం.లో కీర్తిశేషులు. 1920 సుమారుగా రచనలు కావించిన, వెలువరించిన ఆధారాలున్నవి. వారి జననం వారి సోదరుల జన్మజేదీని బట్టి ఆంచనా వేయబడింది. లక్ష్మణాచార్యుల కనిష్ట సోదరులైన వరదాచార్యుల జన్మసంవళ్సరం 1912. వారికీ వీరికీ నడుమ ఒక సోదరి ఒక సోదరుడున్నారు.' కావున లక్ష్మణాచార్యులు వరదాచార్యులకంటే ఓ పదేండ్లు పెద్దవారై ఉంటారు. అందుచేత కవి జన్మ సంవత్సరం దాదాపు 1902 అనుకోవచ్చు. ఉభయ భాషా కనితా విశారదులైన లక్ష్మణాచార్యుల రచనలివి. తెలుగులో ః 1. భక్తితత్వము (ఖండకావ్యం), 2. విరహ గ్రేమ (ఖండకావ్యం), 3. ప్రకృతి రాగం (ఖండకావ్యం), 4. ప్రణయాభిజ్ఞానం (ఖండకావ్యం),5. సతీ అనసూయ (పద్యకావ్యం), 6. తిక్కన చరిత్ర (పద్యకావ్యం) 7 ఆత్మసౌఖ్యం (1921) సంస్కృతంలో ౩ 1. స్తుశిత్రయీ, 2. సంస్కృతి (నవల), 3. పతిసంజీవని (నాటకం) ళీ రామాశ్వమేధం (నాటకం), 6. ఆముక్తమాల్యద (నాటకం), 7. లౌకిక శిక్ష (వ్యాకరణ సూత్ర గ్రంధం) హిందీలో $ 1. రామాయణ్‌కే భక్తి (ఖండ కావ్యం) పై పుస్తకాలలో లిస్టు 'తెలుగు ఆకాడమీ' హైదరాబాద్‌ వారు ప్రచురించిన 'తెలుగు సాహిత్యకోశం' లోనివి. కవి గారి శిష్యులు చెప్పిన వానిలో విరహ ప్రేమ, ఆత్మసౌఖ్యం, సూత్రత్రయీ, రామాళ్వమేధ ఆముక్తమాల్యద నాటకాల పేర్లు లేవు కవి సోదరులు జగన్నాథాచొర్యులు ఇందులో సగం పేర్లే చెప్పగలిగారు. గో.కసం. కవి సం. 349 వీరి పరిచయంలో కేవలం “ప్రణయాభిజ్ఞానం' ఒక్క కృతినే ముద్రిత రచనగా పేర్కొన్నారు. పు. 386. రచనలవివరాలు:ః తెలుగు పుస్తకాలలో ఖండకావ్యాలు ముద్రితమ్రైనాయని కవి శిష్యులున్నారు.* కాని ఏ ఒక్క కృతినీ వొరు దాటి ఉంచలేదు. గురువు గారి కవిత్వాన్ని ప్రశంసించినా కనీసం ఒక పద్యమైనా పూర్తిగా వినిపించలేకపోయారు. కవి వివరాలు అభిరుచులు మాత్రం భక్తిగా ఆసక్తిగా తెలియజేశారు. లక్ష్మణాచార్యులకు చిరుకావ్యాలంటే ఇష్టమట. వారివన్నీ లఘుకృతులే. మానవ ప్రకృతి సంబంధమైనవి. అనసూయ ఒక్కటే పురాణ కథ. 'తిక్కనకవి' 1500 పద్యాల మహాకావ్యం. ఇది ఒక్కటే అముద్రితనున్నారు. దాని వ్రాత ప్రతి లభించలేదు. అయిదారు ఆంధ్ర కావ్యాలు ముద్రించినా లభించినది కేవలం ఒకే ఒక్క లఘుపద్య కృతి “తత్వం. దీనిని 1922లో ఇనుగుర్తి వారు ప్రచురించారు. క్రౌను 1/32 సైజులో 32 పుటలు. అందులో 1 డా! అందె వేంకటరాజము “వానమామలై వరదాచార్యులవారి కృతులు-అనుశీలనము' -1986, పు.-3. 2. తెలుగు సాహిత్య కోళం. 1986 ముద్రణ, పుట-825. ౩ చెప్యాల రామకృష్ణారావు, మేడిపల్లి; మల్గ్లావజ్జల రామచంద్రశర్మ మ.బాలకృష్ణారావు- పెద్దపల్లి. 4. సుప్రసిద్ధ పురాచరిత్ర పరిశోధకులు రచయిత ఠాకూరు రాజారాంసింగ్‌ పెద్దపల్లిగారు వారి తండ్రి కీశే.నారాయణసింగ్‌గారు భద్రపరచిన ఈ పృస్తకాన్నిచ్చారు. ॥ 5. కందుకూరి వారి 'బ్రహ్మసమాజ 'ప్రభావమా అనిపించుతుంది - కాని, కాదు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద పూద్వాష్థ సాహిత్యం” పద్య సాహిత్యం 153 11 పుటలు కృతిపతి వర్ణన. మిగిలిన 21 పుటల్లో 72 గీత పద్యపాదాలలో 'తత్వం' కావ్యేతి వృత్తం నిబద్ధింపబడింది. ఇదే కవి రచనల పట్టికలోని భక్తితత్వ ఖండ కావ్యం కాబోలు. ఇది కథ కాదు. కవి భావ స్రవంతి. మత సమైక్యతావాదం. ఈ ప్రాంత రచనలలో ఇది వినూతన మార్గం. ప్రయోజనకర కార్యం - కావ్యం. ఈ జిల్లా ముద్రిత పుస్తకాలలో వానమామలై లక్ష్మణాచార్యుల తత్వం మొట్టమొదటిది. ఇది 1922 ప్రచురణ. 1921లో ముద్రించబడినదని పైన చూపబడిన అత్మసొఖ్యం కూడా ఈ కవి

విరచితము. కాని దాని ప్రతి లభించలేదు. 'తత్వం' కృతిని కవి ఏ ఆశయంతో రచించారో అనేది దాని

“మున్సుడి' లోని కవి అభిప్రాయాలు తెలియచేస్తాయి.

“అధునాతన ప్రాపంచిక మత వైషమ్యుం వలన నరులొండొరులకు సహాయము చేసికొనకున్నను సరియే కాని వృధా శాత్రవంబు బూసికొని సొంఘిక న కడుంగడు విస్మయావహంబు. కాన బ్రహ్మారాధనంబున విశ్వరూప బ్రహ్మారాధన్తంబనియు * భవభూతి' కవి “లోకస్యారాధన వ్రతం, తత్పూజితం హితా తేన మాంచ ప్రాణముంచతా అని రామునిచేత చెప్పించినట్ట్లు 7 మహాపురుషుల కెల్లరకును నిది పవిత్ర కరంబును నీశ్వర ప్రీతికరంబును నగు వ్రతము. ఈ వ్రతంబు సర్వంబును అనగా ప్రాణముల గూడా విడిచి యాచరించదగిన దగును. కార్య ఘాతుకంబులు, ద్వేషము పరమదోషము. కొన వీనిని విడువవలయును. పరగశ్రేయోభిలాషులై మనుచు పరమ పదంబును గాంచుటయే ననవచ్చును. “ఇది కవి ఆకాంక్ష. ఇక్కడ గ్రంధ కర్త అనుటకు బదులుగా గ్రంధప్రమాత అను నూతన పదాన్ని ప్రయోగించారు రచయిత, ఈ కృతి ముఖపత్రనామం 1౭౧420౧౧ అని లోపలి పుటలలో [౧|8206, ౦06010440౧ అని ఆంగ్ల పదాలుండడం విశేషం,

వివిధ ఛందోభావ విన్యాసంతో సాగిన గుండవరం నర్శ్సింగారావు కావ్య స్వీకర్త వర్ణనం ఉన్నతంగా ఉంది. కావ్య భాగవంతా తేటగీతాలు. తత్త్వం కావ్య కవితారసా స్వాదనమునకు అందలి కొన్ని పంక్తులు చూపబడుతున్నవి.

“తర్కమను భవ సిద్ధమో ? తర్క సిద్ధ, మనుభవమొ ? యుభయాధారమైన దేదొ ?

శబ్దమునకు ప్రవృత్తి పంచ విషయములు, నట్టుగాని నద్దాని నేమన వలయునా ?

సతృదార్థమునకు భావ నరణి కలదా ? యెన్నడు నసత్తునకు భావమున్నె ? కాని,

కాల గతి నామ, రూప, గుణాలు మాటి, తత్వ నిశ్చయంబెవ్వరి తరముగాదు ... .”

కవి శాస్త్రవైదుష్యానికి నిదర్శనంగా ఇట్లా వేదాంత విషయ వివరణ సాగింది.

“అస్తి యెన్నాళ్ళనుండి * యంచడుగ వలదు, ” అని కవి వాక్కు.

“త్రుతి విడిచియు ప్రత్యక్ష శూన్యమైన - బ్రహ్మ లేదని నాస్తిక వాది పలుక”

“లేని దానికి నామమే లీల గలుగు?” ఆని అస్తికవాది ప్రశ్న.

నాస్తిక వాది ఖండన, ఆస్తిక వాది సమర్థన, ఇట్టా వైదిక, అద్వైత, విశిష్టాద్వైత, హరిహర, శాక్తేయ, సారస్వతేయ, వాదాల చర్చలు నడిచాయి. ఇది గహన వేదాంత విషయ విశ్లేషణ. లోతుగా ఆలోచిస్తే కాని అర్థం కాదు. కవి ప్రతిభ పదసారళ్యం, కవన చాతురి పఠితులకు మేలు చేశాయి.

ఈ కావ్యంలో యజ్ఞకర్మలను ప్రశంసించే బ్రాహ్మణులకు, ఆ జీవహింసను నిరసించే బౌద్ధుల మధ్య వాదం ఉంది. అందులో నాస్తిక భావ ప్రవేశం. అంతటితో ఆగక డైస్తవ సిఖ్బు ముస్లిం పాత్రల (ప్రవేశం జరిగింది. వారి పరస్పర విజిగీష వితండ వాదాలు ఒక తీరాన్ని చేరక ముందే కవి రంగప్రవేశం కావించి ఇట్టా సందేశాన్ని అందించారు.

154 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య బరిత్ర" “ప్రకృతి నొనా ప్రకారమై పరగు చుంట, యరయ నొకడు గమ్యుస్థాన మగుట వేష భాషలును నట్టులే మత భావములును, భిన్నములయిన నొక్కటే భావమగును. (యతి ?) పర సమృద్ధియు మజి పరోపకృతి యటులె, భూత తృప్తి శాంతి యహింస బుద్ధి యోగ మే రుచింపని దరయనేదేని వృథయ, సమత దేశ భక్తి యు లేని జనుని యట్లు. ” కవి విశాల భావం స్పష్టం. ఇంకా వారు తమ ఆకాంక్షనిట్లా వాకృచ్చారు.

“స్వార్థపరతా పరిత్యాగి సంఘ శక్తి ననుసరించి జాతీయ శాసన సభలను నాయకుల ధర్మములను ఉపన్యాసములను, విశ్వసించి కార్యములు నెరవేర్చవలయు. ” అది 1920 గాంధీజీ సహాయ నిరాకరణోద్యమ కాలం. అప్పుడు కేంద్రంలో ఆంగ్లేయుల ప్రభుత్వం. నైజాం రాష్ట్రంలో ముస్లిం పాలన. కవిపై నాటి జాతీయ నాయకుల స్వాతంత్ర్య పోరాట ప్రభావం పడింది. మత సామరస్యం నాడే కాదు నేడు కూడా అవశ్యాచరణీయ ధర్మమార్గం కదా. ఈ చిన్న కృతినే ఇంత మిన్నగా మలచిన ఆచార్యుల వారి ఇతర కావ్యాలు లభిస్తే వారి ఉదాత్త భావ సంపదకు ముంతగా ఆనందించేవారమో. గోలకొండ కవుల సంచికలోని వీరి కవిత నం. 349 “చెలీ' లోని రెండు పద్యాల్లో ఒకటి చూపబడింది. రెండవదిది. గొలిం దూలుచు లేగొమల్‌ గదలి మూకల్‌ మూకలై జారుచున్‌ వ్రాలన్‌ బూవులగుత్తులల్లవె యటన్‌ న్రాలెన్‌ దలల్‌ క్రిందుగాన్‌ జాలింబొందదె నీ యెడంద కనుచున్‌ సంతోషముం జెందెదో పూలంగోయగ నుద్యమించి తివె యబ్బో ! యెంతయున్‌ ధీరవే ! కరుణశ్రీ 'పుష్పవిలాసము'నకు మొదటిదీ కవి భావం. వీరి 'అనసూయ' కావ్యంలోని ఒకే ఒక పద్యం సేనాపతి రామాచార్య గారి 'అక్కడక్కడ' ఖండ కావ్య పీఠికలో కనిపించింది - చూడండి. “కవి పరబ్రహ్మ కావ్యలోకాల దమిని, బత్యణువున వ్యాపించి లోబయట గూడ ధర్మ జ్ఞాన రస సృష్టి దనర లీల, దాన సర్వమై యక్షర త్వాన మెరయు. ” తాను నిర్వచించిన కవి బ్రహ్మ లక్షణాలకు లక్ష్యమైన సలక్షణకవి వానమామలై లక్ష్మణాచార్యులు | ప) రాసుసింహ కవి - రాఘవ పట్టణం, క॥ జగిత్యాల 1857-1962 వీరు కరీంనగర్‌ జిల్లా జగిత్యాల తాలూకాలోని రాఘవపట్టం నివాసులు.' రామ సింహ కవి సిఖ మతస్థులు. వారి మాతృభాష పంజాబీలో ఆయన పేరు రాంసింగ్‌. కాని వారు ఊరిపేరుతో కలిపి రాఘవపట్టం రామసింహకవి పేరుతో వ్యవహృతులు. తెలుగులో పండితులు కారు. అయినా అసాధారణ కవితాధార పట్టుపడింది. వారి కవితలో సంస్కృత పదాలు, ఉర్జూ వాక్యాలు అధికం. మాండలిక పదాలు కొల్లలు. వ్యాకరణ సూత్రాలకు లొంగని పదాలను కవి యధేచ్చగా ప్రయోగించారు. కోన్ని పద్యాల్లో ఛందోభంగాలు సైతమున్నది. ఆయన వరకవినని స్వయంగా చెప్పుకున్నారు. రామ సింహం పద్యం, పాట, వచనం మూడు రకాలైన రచనలు చేశారు. దైవభక్తి, సామాజిక విమర్శ ఆయన కావ్య వస్తువులు. రామసింహము నిజంగ్లా కవి సింహమే. ఆయనంటే కుహనా సంస్కారులకు హడలు,' లోభులపై అనాచారులపై దురాచారులపై ఆయనకలం కొరడాను రుళిపించాడు - జడిపించాడు. 1 “గోలకొండ కవుల సంచికి నం.204. రామసింహము కవి పరిచయంలో కులం బొందిలిగా, గ్రామం నల్గొండ జిల్లాలోని రాఘవనగరంగా పేర్కొనడం సంపాదకుల పారపాటు. పుట-373.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాల్ద పూర్వార్థ సావాత్యం” పద్య సాహిత్యం 155 నైజాం పాలకులకు ఆయన బెదరలేదు. ఏ కారణంగానో ఒక వ్యక్తిని హత్యకావించి కొన్నాళ్ళు జైలు శిక్ష ననుభవించాడు రామసింహం, కారాగారంలో ఒక సంస్కృతపండితుని సాహచర్యం లభించి శ్రుతపాండిత్య సముపేతుడైనాడు. శిక్షా నివృత్తి కాగానే కవితలు వెలయించాడు. జైలులోనూ పద్యాలు వ్రాశారట. వీరి జననం శ్రీ. శ. 1857, పింగళ చైత్ర శు। నవమి; శా.శ. 1779. మరణం - 1982, శుభకృత్‌ శ్రావణ శు॥ చతుర్దశి - 1884. తెలుగు పంచాంగ కాలగణనం (ప్రకారం రామసింహ కవి 105 సం. 5 మాసాల 5 రోజులు జీవించారు. నలుబదేండ్డ తర్వాతనే వారు కవిగా మారింది. ఆరువదేండ్గ కాలం కవితావీరవిహారం కావించారు. సాహితీలోకంలో ఇది అదుదైన విషయం. గోలకొండ కవుల సంచికలో వీరి “విశ్వకర్మ శతక' కృతి మాత్రమే పేర్కొనబడింది. వరకవి రామసింహం గౌరి రచనలు ఇవి - పద్య కావ్యాలు : 1. విశ్వకర్మ శతకము, 2. విశ్వకర్మ ప్రకాశ మండనము, 3. శ్రీరామ లక్ష్మణ ప్రబోధము - 1965 గేయ కృతులు : 1. కలియుగ వర్ణాశ్రమ ధర్మములు, 2. దుష్ట ప్రపంచ వర్ణనము, 3. భజన కీర్తనలు

  • 5 భాగాలు, 4. నారాయణమాల. వచన గ్రంథాలు : 1. యథార్థ రామాయణము, 2. యథార్థ భారతము, 3. యథార్థ భాగవతము - దశమస్కంధము. పద్యరచనల పరిచయం ట్ర విళేకర్మ శతకం - ఇది కవి సకల కర్మ సాక్షియైన సర్వేశ్వరుని న్తుతిస్తూ వ్రాసినది. ఆయన సహజ స్వభావమైన సామాజిక విమర్శ సైతం దీనిలో చోటుచేనుకున్నది. ఇది సీస పద్య శతకం. గీత పద్యం చివరి పాదం మకుటం. మచ్చునకు ఒక పద్యం. సీ. హూద్రుడై పుట్టిన శిశును బ్రాహ్మణుడనన్‌, సిద్ధాంతమెవరైన చేయలేరు కర్మార్ధమయి ద్విజాఖ్యను జెల్లు గాని బ్రాహ్మణ నామధేయ మర్చంబు గాదు వేద పారగుడైన విప్రనామము జెల్లు, బ్రాహ్మణుండనిన నబద్ధమౌను అచల బ్రహ్మజ్ఞాని యైన బ్రాహ్మణుడౌను, ద్విజ విప్రనామము బ్లీరు నంత గీ! ఇట్టి పదవికి సజ్జను లెల్లవార, లర్హులేకద; గాకున్న నాది బుషులు కులము తక్కువ వారెట్టు గొప్పనయిరి ? విశ్వపాలక ధర్మ శ్రీ విశ్వకర్మ ! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః, అను శ్లోక భావాను సరణమైనా కవి ధోరణి దానికి కొంత భిన్నం. ఈ శతక రచనకు (పేరణకలిగించిన అంశాన్ని కవిగారే యీ విధంగా తెలిపినారు. “కుమతులగు కొందరు సత్యదూరంబులగు విషయంబులెల్ల టోగు చేసి, కుకవిశాసనమను పేర నొక పత్రికను వ్రాసి నాపేర టపా ద్వారా పంపియుండిరి. నేనద్దానినెల్ల బరికించి సత్యసమన్వితమును శాస్త్ర నిశ్చితములునగు విషయంబుల నెల్ల సమకూర్చి విశ్వకర్మశబ్దముచే నేనా భగవానుని సంబోధించుట భావ్యమని నిశ్చయించి విశ్వకర్మ శతకమును వ్రాసియుంటిని.”*
  1. రామసింహకవి కుమారుడైన నారాయణసింగ్‌గారి ద్వారా ఈ తేదీలు జగిత్యాలకవి కాకుత్సం ఆనంతయ్యగారు సేకరించి 15.9.90న, తేఖలో నాకు తెలిపారు. ”
  2. వీరి పుస్తకాల తొలిముద్రణ ప్రతులు లభ్యంకాలేదు. అనంతర ముద్రణ కాలాలువేసినా అవి ఎన్నవ ముద్రణలో తెలుపలేదు. తొలిముద్రణ కాలం వేయలేదు,
  3. రామసింహకవి 'విశ్వప్రకాశమండనము" పీఠిక నుండి.

156 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జుల్లా సాహిత్య చరిత్ర” ఓ విశ్వ కర్మ ప్రకాశమండనము : ఇది విశ్వకర్మ శతక ఖండన కావ్య ఖండనం, స్వీయ శతక భావ మండనం. ఇందు నలబై సీస పద్యాలున్నవి. ఇది పై విశ్వకర్మ శతక ఖండన కృతికి ప్రతి ఖండనము. ఈ కృతి పీఠికలో రామసింహకవి స్వయంగా ఇట్లు చెప్పుకున్నారు. “ఇట్టుండ కొంత కాలమునకు జగిత్యాల యందలి కొందరు విప్రులు తాము ఆంధ్రవైదిక నసంఘమను పేరిడుకొని విశ్వకర్మ శతక ఖండన మండలమును వ్రాయించి యుండినందున నేనీ విశ్వప్రకాశ మండనమును అనగా విశ్వకర్మశతక ఖండన ఖండన మండలమును, దురుత్తర వాద ఖండన మండలమును రచించితిని. ' మండనము = అలంకారము, మండలము = నలుబది, జిల్లాకూడా. ఇందలి పద్యాలలో విమర్శ అధికం. “శాశ్యతపదాఖిలేశ విశ్వప్రకాశ” అని మకుటం. కవి విమర్శన రీతిని తెలిపే కొన్ని పద్య పంక్తులు ఈ దిగువ చూపబడుతున్నవి. శ్రీ విశ్వకర్మ నీ సృష్టిని వర్ణించి మొక్కని వారెంత మూర్ధమతులు. 1వ, పద్యం అంతటి శత్రుండునౌ వ్యాసుడైనను, పంచములని మమ్ము తిట్టలేదు. 3వ, ప. స్వర్ణ తస్కరులని వదరు దురాత్ములే, వర్ణ తస్కరులైరి నిర్ణ్భయముగ - 5 విశ్వంబునందు మా వృత్తులక్కర లేని, వారు లేరు సమస్త కారణముల - 11 యావద్విధముల మాయా వాదులేవారు, తమకంటె దొంగలితరులు గారు - 15 సభకు రాలేడు వాగ్విభవుండు గాడు బ్రత్యక్ష దృష్పాంత సామ్యము లెరుగడు .... తప్పొప్పుల నరసి మెప్పింపగా లేడు, పేరు జెప్పిన వెరచు పిరికివాడు - 27 విశ్వకర్మయు మేము వేరు వేరే నష్క మాదుగుల్‌ తన మేన మామలస్న పంచ వృత్తులు మావి బానిస పనులపష, దండి భిక్షపు వృత్తి తమరి దుష్ట దాసి యూర్వశి తమ తొల్లి తల్లి యష్ట వీడు లౌకిక మెరగని వె - వయస - 32 ఇందులో విశ్వబ్రాహ్మల కర్మకారుల ప్రశస్తి బ్రాహ్మణ నింద ఖచ్చితంగా ఉంది. దానికి కారణం కవినోటి నుండే వినవచ్చు. నోరు కొవ్వియు మమ్ముల నొవ్వబలికి, ప్రతిభ గాంతురె తగు ప్రతి ఫలమె గాని తిట్టునకు తిట్టు కొట్టకు కొట్టు గలదు, శాశ్వత పదాఖిలేశ విశ్వప్రకాశ - 3వ, పద్యగీతం. రామసింహ కవి విశ్వ కర్మ శతక ఖండన పద్యాలను వాస్‌ ప్రచురించి యింతటి కోపమునకు కారణమైనవారెవ్వరో ? జగిత్యాలలో ఈ కవి కాలంలో విప్రలున్నా వారిలో కవులు లేరు. సమీప గ్రామాలైన పొలాన, ధర్మపురి కవులీ కృతి రచించినట్లు కనిపించలేదు. అన్వేషించగా ఆ కృతి రచయిత" పేరు 'స్వీయ కవితాను జీవనం' లో కనిపించింది. అందలి ఈ గ్రంథ సంబంధ వాక్యాలివి. “జగిత్యాల సమీపమున, రాఘవ పట్టణమను గ్రామమున సిఖల కులస్ఫుడు రామసింహమను కవి యుండెను. అతడు పాటలను, పద్యాలను వ్రాసి చదువుచు ద్రవ్యార్ధన మొనరించువాడు. రామసింహమన్న మహాకవి యని(ప్రాంతీయులకందరికభిమానము. విశ్వకర్మలు, జగిత్యాలలో బ్రాహ్మణి సంఘము వారికి విశ్వకర్మలకు వివాదము కలిగి విశ్వకర్మ శతకమును నవ్రాయించిరి . దానిలో నాకవి బ్రాహ్మణులను బుష్యాదులను నిందించి వ్రాసెను. దాని సహింపక బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి, దొని ఖండన వ్రాయుడని కోరిరి. అప్పుడు నేను “విశ్వకర్మశతక ఖండన మండలమ'” ని నలుబది సీస పద్యముల వ్రాసి యిచ్చితిని, దాని వారు వరంగల్లులో ముద్రించి ప్రకటించిరి, దాని తోటి విశ్వకర్మల విజృంభణము తగ్గినది.” 1928 సం. పుటలు - 32, 33. ఈ ఖండన మండల కృతితో విశ్వకర్మల విజ్బంభనము తగ్గెనేమో కాని విశ్వకర్మ శతక కర్త కవిత మాత్రం ప్రభంజనమై 'విశ్వప్రకొాశ మండన' పుస్తకరూపంలో వచ్చింది. 5. కృష్ణమాచార్య శతావధాని 'స్వీయకవితాను జీవనం' 1986.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20ప శతాబ్ద డూర్వాన్ట సాంశ్యం” పద్య సాహిత్యం 157 రామసింహకవి విశ్వకర్మ శతకం ముద్రణ పాందక ముందే వ్రాత ప్రతుల రూపేణా వ్యాప్తి నొంద సాగిందట. నిర్మల వాస్తవ్యులైన మారుకొండ నరసింహులుగారు ఈ శతకాన్ని కవికి చెప్పకుండా ముద్రించడమే కాక దానిని విశ్వకర్మజుల కోరికగా వ్రాసినట్లు ఉటంకించినారట.* అందుకు కవి విచారించినా దాని కారణంగా ఇంత కథ నడిచింది. రామ సింహకవి గుణ పక్షపాతి, కుల దురభిమానం అతనికి లేదు. ఆయన అస్తికుడు. హిందూ మతమంటే గౌరవం. సిఖ్ధమతం వి గ్రహారాధనలను ఒప్పనిది. గురువునే దైవంగా భావించే ఆస్తిక మతం, ఈ కవి ప్రతి కులంలో ఉన్న దురాచారాలను దుయ్యబట్టాడు. వారికి విశ్వకర్మ కులాభిమానం లేదనడానికి నిదర్శనం వారి “కలియుగ వర్షాశ్రమ ధర్మములు' లోని ఈ క్రింది కవితా పంక్తులు. 19. పంచానన సంభవులట విశ్వ - బ్రాహ్మణోత్తములటా పంచదాయ విశ్వకర్మలట - ప్రఖ్యాతార్యులటా మంచి శీలములు మానిరి కేవల - పంచములవలె బరగిరి కోళ్ళను బెంచిరి కల్లును ప్రియముజేసి మత - వంచనులై మండ్వలలో తాగిరి.” వర్ణాశ్రమ ధర్మాలను జాతి విహిత ఆచారాలను వారు ఆమోదించారు. తదితరాలను ఖండించారు. 3. శ్రీరామ ప్రబోధము లక్ష్మణ నీతి శాస్త్రము - 1985 ముద్రణ. ఇది “లక్ష్మణా అను శబ్ద మకుట వృత్త పద్య శతకం. కవి ఏలనో కాని దీనిని శతక మనలేదు. శ శ్రీకృష్ణుడు అర్జునునకు కావించిన ప్రబోధం భగవద్గీత. శ్రీరాముడు లక్ష్మణునికి కావించిన ప్రబోధమీ నీతిశాస్త శతకం. రాముడెప్పుడు లక్ష్మణునికి హితోప దేశం కావించాడనే సందేహం అక్కరలేదు. ఇది రామాయణ కథ కాదు. ఈ రామలక్ష్మణులు రొమాయజేతిహాన పొత్రలు కారు. కవి కొమసింహము తమకు శిష్యుడును తెలుకుంట గ్రామ నివాసియునైన కత్తెర్ణ లక్క్యయ్య యాదవ గారి కోరికగా ఈ నీతిశాస్త్ర రచన కావించారు. ఈ వంద పద్యాలలో సామాజిక నీతులతోపాటు పారమార్థిక ధర్మవ్రబోధమున్నది. ఆరంభ పద్యం - కవి ఆశీర్వాదం. శ్రీయును సౌఖ్య జీవనము జీవదయానిజ దేశ సేవయున్‌ ధీయుత విద్యయున్‌ బుధ విధేయ మనంబున దాన ధర్మ ధౌ రేయుడవైలసద్గుణ గరిషుడవై గురుభక్తి వల్ప (చేత) దీ ర్నాయువు గాను వర్థిలు మనంత యశఃస్థితి గల్లి లక్ష్మణా. ప్రబోధ పద్యాలలో ఒకటి చూడండి. బంధ విమోచనంబనుట బభ్రాంతియె కాని మరేమీలేదు దు రృంధములన్ని మానవుల పాపములే యలవాటు కట్టులే (గ్రంధములన్నియున్‌ జదివి జ్ఞాన విహీనులెరుంగ లేరుయే బంధము లెట్టబాయు అలవాటులుదప్పరు తామె లక్ష్మణా - 63 పమ సింహకవి 105 సంవత్సరములు బ్రతికిన పూర్ణాయుష్కుడు. చివరి దశలోనూ సాహిత్యారాధన మానలేదు. 1959లో కవిగారు తమ 103వ, ఏట శ్రీ విశ్వానంద స్వామి, మొగుల్టుపాలెం గారి 'శ్రీవీర భోగ వసంత రాయ శతకము'ను పరిష్కరించి పీఠిక నమకూర్చటం అందుకు నిదర్శనం, లలల 6. విశ్వప్రకాశ మండనము - పీఠిక నుండి. 7. రామసింహకవి "కలియుగ వర్జాశ్రమ ధర్మములు' పుట-4. గేయం-19. 8, ఈ పుస్తకంలోని యాంసాని వేంకటయ్యగారి పీఠిక నుండి

158 డా. మలయశ్రీ "కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

కేలుకుంట వొస్తవ్యులు జానపద కవి యాంసాని వేంకటయ్య గారు గురుభక్తితో రామసింహం గారి కృతులను పునర్ముద్రణ కావిస్తూ ప్రచారంచేస్తున్నారు. రామసింహం గారి వచన రచనలు తప్ప పద్యగేయ కృతులన్నీ చిన్నవి. కాని, వాటి ప్రభావం మిన్నది. అతి సాహసికుడు సామాజిక విమర్శకుడు రామసింహకవి. ఆయన కలం కత్తికంటె పదునైనది. గళం కాహళం. రామసింహ కవిది వేమన మార్గం. ఆట వెలదిని ముట్టలేదు? అంతే భేదం 1

“తెలుగు సాహిత్య కోశం *లో ఈ జిల్లా కవులు (1851 - 1950) ఏడుగురిలో వీరొక్కరు. అందు రామసింహ కవి రచనలు రామాయణ భారత విశ్వకర్మ మూడు మాత్రమే పేర్కొనబడినవి. వారు కవి పరిచయంలో వ్రాసినట్లు “సాంప్రదాయ వాదులకూ, లౌకిక కవులకూ పట్టుబడని ప్రత్యేక ధోరణి వీరిది'

  • రామసింహకవి వచన రచనల గేయకృతుల పరిచయం తర్వాతి ప్రకరణంలో చేయబడుతుంది.
  1. పరమారాధ్యుల రాజయ్య - చెలుపూరు : 1895 - 1980 సుమారు.

రాజయ్య గారు వీరైవ జంగమ కవి. హుజూరాబాద్‌ తాలూకాలోని చెలుపూరు గ్రామస్టులు. కవి తమ గ్రామాన్ని చెరుకూరు అని వ్యవహరించారు. ఈ శతాబ్ది ప్రథమార్ధంలో దేశగురువుగా హరిదాసుగా కవిగా వీరు పేరుపొందారు. కరింనగరం వరంగల్‌ మెదకు జిల్లాలలో వీరు శిష్య సంచారం చేశారు. వీరి కాలికి వెండి అందె ఉండేది. అది బిరుద ప్రదానమట. కాళీ ఉపాసకులుగా మంత్రవేత్తగా వారికి ప్రచారం గౌరవం ఉండేవి, ఆయన వరకవి.(వారిని 1953లో మావూరిలో చూశాను).

రాజయ్య గారు పద్యాలు పాటలు వ్రాశారు. వారి రచనల పేర్లు ఇవి:-

1 చంద్రశేఖర స్వామి శతకము - 1926, 2. శ్రీమహంకాళి శతకము - 1926 3. మల్లికార్జున జన్మ చరితము - హరికథ, 4. వీరభద్ర విజయ నాటకము (ముద్రితములు) 5. గౌరమ్మ పాటలు (ముద్రితము), 6. పరశురామ విజయము. (ఆముద్రితం) 7. చంద్రశేఖర భజన కీర్తనలు - 1926. వంళ వివరాలు : చంద్రశేఖర శతక గద్యంలో కవి గారి తల్లిదండ్రుల పేర్గు, కుల మతాల వివరాలున్నవి. ఆ గద్య ఇది. “శ్రీ వీర శ్రైవలింగీ బ్రాహ్మణ మళతోద్భవ శ్రీమత్సరమారాధ్య వంశపయః పాఠావార రాకా సుధాకర మల్లికార్జున పత్ని నాగమాంబిక గర్భశుక్తి ముక్తాఫల వినయ విధేయ రాజయాఖ్య నామధేయ ప్రజీతంటైన చంద్రశేఖర శతకము -” - కావ్య పరిచయం : వీరి రచనలు రెండు శతకాలు, భజన కీర్తనలు ఈ మూడు పుస్తకాలు 1926లో ప్రచురణ పొందాయి. మిగతావి తర్వాతి కాలపువి, ముద్రణ తేదీలు లభించలేదు. కాళీ శతకంలోని ఒక పద్యం -

సీ నిన్ను గొల్వని మహా నీచాత్ములనుబట్టి, బహువిధ కష్టముల్‌ బడగ జేసి మాటలాడింతువె బాట లెరిగింతువే, దమ్ములేపింతువె దగ్గుజేసి గుండె బట్టింతువె కొండలెక్కింతువె, దమ్ములేషింతువె దుమ్ము జేసి డొక్కలు జీల్తువే వెక్కిళ్ళు బట్టించి, వేకి బుట్టింతువె ప్రాకటముగ గీ. కాళ్ళు చేతులు తీపులు గలుగ దేసి, బాధలెప్పుడు జేతువె పాపిజనుల భువన సంచారి చరుకూరు పురవిహారి, పరమహంకాళి శత్రు సంగర సుకేళి, ఈ సీస పద్యశతకంలో గీత పద్యపాద ద్వయం మకుటం. మహంకాళి - మహాన్‌కాళి - మహాకాళి! చంద్రశేఖర స్వామి శతకంలోని ఒక పద్యం చూడండి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాల్బ పూర్వార్ధ సాహాశ్యం” పద్య సాహిత్యం 159

శ్రీరజితాద్రివాస మునిసేవిత భక్త్రదయా సముద్ర శృం

గార శరీర సత్ర్రమథకాండ సమర్చిత పాద పద్మకే

యూర భుజంగ నాథ మహిమోజ్వల చంద్రకిరీటి నాథునిన్‌

కోరితినయ్య నిన్ను చరుకూరు పురీశ్వర చంద్రశేఖరా- [

చరుకూరు పురీశ్వర చంద్రశేఖరా - అని ఈ శతక పద్యాల మకుటం. పై పద్యం చివరి పాదంలో అఖండవళి వాడబడింది. ఈ శతకంలో 116 పద్యాలున్నవి. ఈ పుస్తకంలో చంద్రేఖర షోడశోత్తర పద్యాలతో పొటు ఇతర దేవుళ్ళ స్తుతి పద్యాలు సైతమున్నాయి. అవి - శ్రీ చరుకూరు నర్సింహస్వామి పంచరత్నములు, లేములవాడ రాజేశ్వర పంచరత్నములు, కొరవి వీరభద్ర పంచరత్నములు మొదలైనవి. కవి వీరైవ మతస్టుడైనా, కేశవ పరమైన స్తుతి పద్యాలువ్రాయడం ఆయన మతసామరస్య వెఖరికి ఉదాహరణం. నరసింహ స్తుతి పంచరత్నాలలో ఒకటిది.

మ. కరి రాజేంద్ర సుపోషణుండు మురళీ గాన వినోదుండు శ్రీ (గణం రా

ధరుడున్‌ గోపిక మానసాబ్ద మకరందా స్వాద భృంగుండు తా

స్థిరతన్‌ శ్రీ చరకూరు మందిరుడు లక్ష్మీనారశింహుండు శ్రీ

కర సత్పాడి అనంతరెడ్డి ధరణీ కాంతున్‌ సదాబ్రోవుతన్‌.

లేములవాడ రాజేశ్వర స్తుతి సీస పద్యాలు అయిదూ ఏకమకుటంతో ఉన్నాయి. ఆ మకుటం ఇది. “వర మనోల్లాస లేముల వాడ వాస, రమ్య గోరాట్తురంగ శ్రీరాజలింగ”. ఇంకా శివ స్తుతి ద్విపదలో కావించాడిట్లా _

థీ పార్వతీలోల శ్రితజనపాల, తాపస గణపోష దానవ శోష

బాలచంద్ర కిరీట బ్రహ్మకరోట, కాలాహి భూష శ్రీ కంఠ మహేశ -

మల్లికార్జున విజయం బృహత్కావ్యం. చంద్రశేఖర భజన కీర్తనలు, గౌరమ్మ పాటలు తర్వాతి ప్రకరణంలో చూపబడుతాయి. వీర భద్ర విజయనాటక కథ దక్షయజ్ఞ ధ్వంసం. ఇది యక్షగానాలకు తర్వాతికాలంలో వచ్చిన స్వదేశీనాటకాల రూపానికి చెందిన రూపకం. ప్రదర్శన పొందెనో లేదో కాని పఠనయోగ్య శ్రవ్య దృశ్య కావ్యం. వ్రాత ప్రతులు చెలుపూరులో వారి యింటిలోనే అజ్ఞాతవాసం చేస్తున్నవి. పరిశోధకులకు కూడా అవి అందుబాటులో లేవు. రాజయ్య కవి కవితలో అక్కడక్కడ ఛందోభంగాలు వ్యాకరణానికి లొంగని పదరూపాలు ఉన్నాయి. ఆయన వరకవి. 5. 'ఘటబ్రహ్మ 'సెద్దప్ప వరకవి' - గుండారెడ్డిపల్లె, మ॥ కొహెడ : 1903-1984

. సిద్దప్ప వరకవి; కులం కుమ్మరి. వృత్తి అంటే అభిమానం. కాని. ల. స ఆయన వేదాంతపరంగా కుండలసేతను అభివర్ణించారే తప్ప కులవృత్తి చేసి . ఖ్‌ యెరుగరు. ప్రైవేటు ఉపాధ్యాయులుగా కాలం గడిపారు. వేదాంత బోధకులుగొ మం వరకవిగా రాణించారు. వీరికి ఇద్దరు భార్యలు, రాజయోగి. వీరేశలింగం నో "ష్య మాణిక్యలింగం పుత్రులు. ఇంటిపేరు అనంతవరం. పేరు సిద్దప్ప. ప్రసిద్ధి |... గ! , . ; రామప్ప అనే కవి తనను చెప్పుకున్నారు. సిద్ధరామయ్య మొదటి పేరు కాబోలు. క -. సిద్దప్ప ఆశుకవి. బహంగ్రంధకర్త. ఈ ప్రాంతపు మరే విద్వత్కవికి గానీ సాధ్యంకాని రీతిలో వీరి

వున్తకాలు రాజధానిలోని వ్రఖ్యాత పన్తక ప్రచురణకర్తలు బహు ముద్రణలు కావించి విక్రయించుకుంటున్నారు. వీరి పద్యాలు 'గోకసం.' నం. 105లో ఉన్నాయి. కాని, తెలుగు

160 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సొహిత్య చరిత్ర”

అకాడమీవారి “తెలుగు సాహిత్య కోశం' 1851- 19560, ముద్రణ 1986లో ఈ జిల్లా కవులలో ఈ కవి పేరు బేదు. సిద్దప్ప గారి ముద్రిత రచనలు' :

1-4. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని 2 క - భాగాలు, 5. సువర్జమాల శివస్తుతి, 6. సువర్ణమాల విష్ణుస్తుతి, 7. సింగరాయ నృసింహస్వామి వర్ణమాల, 8. షోడశ కందార్ధములు, 9 భగవన్‌ స్తుతి, 10 హంసోహం _ జగదీశ్వర శతకం, 11. ఆత్మ ప్రపంచ విలక్షణము, 12 శ్రీరాజరాజేశ్వర సువర్ణమాలిక, 13. శ్రీభరతాంజనేయ వర్ణమాల, 14. శ్రీరామ భజనమాల, 15. అశోక సామ్రాజ్యము - యక్షగానము, 16. కాకి హంపోపాఖ్యానము - డ్రామా, 17. జీవ నరేంద్ర - డ్రామా, 18, శ్రీ వర్ణమాల

కందార్థములు - భగవన్నుతి 3. 1981ద్వి.ము. 19. నక్షత్ర ఫలప్రబోధిని - మొ.ము. 1854. ద్విము. 1995

పద్యాలు, కందార్భాలనబడే విలక్షణ పద్యగేయాలు, తత్వాలు వీరు వ్రాశారు, సిద్దప్పగారి సీస పద్యాలకే వ్యాప్తి ఎక్కువ. ఇవి శేషప్ప పద్యాలవలె నీతిపద్యాలు, వేదాంత భావ ప్రబోధకాలు. "మకు టం

_ “వినుడి మాయప్ప సిద్దప్ప విహాతుడప్ప - కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప!ొ అని ఇంది

కని జన్మస్థాన వంశ నివరాలు : “సిద్దప్ప వరకని జ్ఞాన బోధిని'లో వారే తమ వివరవ్వ్పు చెప్పుకున్నారు. నైజాం రాష్ట్రం, వరంగల్‌ సుభా, కరీంనగర్‌ జిల్లా, శనిగరం పరగణాలోని గుండ్రెడ్డి పల్తె కవి జన్మస్థలం. తండ్రి రాజయ్య. తల్లి లక్ష్మమ్మ“ ఇతర వివరాలు ఈ క్రింది పద్యంలో ఉన్నాయి సీ శ్రీకరంబుగ వినుడు చిన్నబాలురకు నే, విద్యనేర్పుచునుంటి వివిధముగను | పిదప జ్యోతిష్యంబు (బ్రియమంద జెప్పితి, హస్త సాముద్రికం బమరగంటి సంగీత విద్యలు నంగీకరించితి, మంత్రయంత్రంబులు మదినిగంటి వైద్యంబు జేసితి వసుధలోనే పెక్కు, కవనంబు చేసితి ఘనులు పొగడ గ. ఇనిటిని బట్టి తుదకన్ని విడిచి పెట్టి యోగములు నభ్య సించితి నూహ చేత నంతటను గంటి నచలమై నాత్మ గురుని, జేసి సంసార యోగినై జెయము గంటి కావ్య పరిచయము * సిద్దప్ప వరకవి కాబట్టి వారి కవితా భావాలను (ప్రశంసించవలసినదే కాని వారి పద్యాలలోని ఛందోభంగాన్ని వ్యాకరణ విరుద్ధ పదప్రయోగాల్ని ప్రల్షించవీలులేదు' వానిని ప్ర రిశలించి ప్రయోజనంలేదు.

/| సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని - 5 భాగాలు మొదటి భాగం 1918లో వచ్చింది.” పుటలు 50

కవి తను 15వ ఏట దీనిని రచించినట్లు చెప్పుకున్నారు. ఇందలి సామాజిక నీతులు జనాన్ని

ఓ ఈ కవి 17 పుస్తకాల పట్టికవారి 'జగదీశ్వర శతకము' శ్రీవాబీ బుక్‌డిపో సిరిసిల్లవారి ప్రచురన స్తదా నుండి గ్రహించబడినవి.

2 వీనిలో 2 భాగముల వేర్వేరు ప్రతులు, దాచేపల్లి కిష్టయ్యు అండ్‌ సన్స్‌ హైదరాబాద్‌వారు 1988లో ముద్రించిన పుస్తకాలు మాత్రం లభించినవి ఎన్నవ ముద్రణో తెలుపలేదు.

  1. ఈ పుస్తకాన్ని సిద్ధప్పకవి కుమారుడు మాణిక్యలింగం-1981లో ఇచ్చారు. మిగితా వానిలో ఒకటి రెండు పుస్తకాలు బాల్యంలో చదివాను; కొని ఈ మధ్య లభించలేదు, 19వది, 96లో దొరికింది

  2. రెండవ భాగము-1988 ముద్రణ, పు.7, సీసపద్య భావం

  3. శిద్దప్ప వరకవి జ్ఞానబోధిని-2వ భాగము, 1975 ముద్రణ, పుం.

6 సిద్ధప్ప అనువారిపేరునే శిద్దస్ప అనివ్రాసుకున్నారు కవి సాధారణంగా వరకవుల పద్యాల్గోని గణాలు మాత్రా నిబద్ధాలు ఇంద్రగణాలు అరింటిలో నగ,సల,రృత అయిదేసి మాత్రల గణాలు. నల, భ నాలుగేసి మాత్రలవి కదా. వరకవులు, జానపద గేయకవులు సాధారణంగా అన్నీ అయిదేసి మాత్రల గణాలుగా వాడుతారు నల, భ వాడినా నలల, భల అనే రూపంలోనే. అది లయ కోసం.

  1. “ఈనాడు” కరీంనగర్‌ జిల్లా ప్రత్యేక అనుబంధం-డిసెంబర్‌ 1993, పుట-20.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాజ్బ పూర్వాష్ణ సాహిత్యం” పద్య సాహిత్యం 161 ఆకట్టుకున్నాయి. నాటి వీధిబళ్ళలో సిద్దప్ప శతకాన్ని తప్పక బోధించేవారు. పెద్దలు కూడా వేమన సుమతి నరసింహ కృష్ణ శతకాల వలె సిద్దప్ప వరకవి పద్యాలు కంఠస్థంచేసి తమ సంభాషణల మధ్య ఉదహరించేవారు. వీటికప్పుడు అంత వ్యాప్తి ఉండేది. లోకరీతి, రాజయోగ ప్రశంస, వేద పురాణాల విమర్శ జాతి విభేద నిరసన, నీతిబోధ మొదలైన విషయాలు సిద్దప్పగారి జ్ఞానబోధ పద్యాల్లో ప్రధానంగా ఉన్నాయి లోకరీతి - సీ విత్తంబు గల వారి కిత్తురే కుర్చీలు, పేదవారల కివరు పీట చెక్క కాలంబు నొకరీతి గడవ దెల్లప్పుడు, యేనుగు దోమచే యెత్తబడద నేనె బలియుడ నని నిక్కుచు నుంటేమి, చలి జీమలును ఫణుల జంపలేద నిడివి పొడవు దొడ్డు నెల్టగ నుంటేమి, గొడ్డలిచే మ్రాకు కోలు పోద గీ. బుద్ధిమంతులు పుణ్యపురుషార్థులైన, వారు పదిమందిలో ప్రజ్ఞ పలుకబోరు వినుడి మాయవ్ప శిద్దప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనక మప్ప యోగ ప్రసక్తి - కాళ్ళు దగ్గర నుంచి కనురెప్పలను మూసి, లో జూపు జూచిలోకేశు నెరిగి - మొ.భా; పు. 16 పాదముల్‌ తొడలపై పరగంగ వేసికొని, నాసికా రంధ్రమ్ము నణగ బట్టి - రెంభా; వు 32 నరులార వినరయ్య నాసికాగ్రమునందు, నడుచుచున్నవి మూడు నాగ ఫణులు-మొ భా.33. వేద పురాణ విమర్శ - జొతి గొప్పది యంచు జనులతో జెప్పియు, వేదంబు జదివినా బోధ నున్న -మొ.భాాపు 9 శిరమందు విప్రుడు జన్మించగా లేదు,భుజమందు క్షత్రియుల్‌ బుట్టలేదు - రెం.భా; పు 22 తాలి జన్మము లేదు మళ్ళి జన్మమురాదు, ఇపుడు జన్మము నెత్తి యిచటలేను - మొ భా; పు, 47 జాతిభేద నిరసన - కులము మాయకులంబు కులము యేమనియందు,అనువుగా నొకులం బను కులంబు - ఈ కులం పంచభూతాల్లో లేదని - చివరికి ఇట్టా అన్నాడు మూర్చులకు దెలియదీ కులము మొనసి ధరలో, గురు కటాక్షముచే కులము గుర్తుదెలియు,

  • రెంభా, పు, 35 నీతిబోధ : ఇది సామాజిక నీతి, వేదాంత రీతి ప్రబోధంతో రెండు విధాలా సాగింది. నీతి ప్రబోధంలో పురాణేతిహాసాల ఉదహరించాడు. కవి మెచ్చిన వేదాంతం అచలాద్వైత రాజయోగం. సత్యము జయమిచ్చు, కోపంబుచే నధిక పాపంబులు, ” -రెంభా పు 31 కైకేయ, చిత్రాంగి, శూర్చణఖ, కుంతిని బట్టి గాంధారి, యేమి ఘనతకెక్కినారని ప్రల్నిస్తూ సత్ర్రవర్తనను ప్రబోధించాడు - మొ.భా. 36 జంధ్యంబు లేకున్న జరుగదా శివపూజ, పుట్టు జంధ్యము లేదు పూజ్యులార - కడుపు మాడ్చుక నుండ కడునొక్క పొద్దులు, బట్టు మనుచు చెప్పు పాపి నరులు - భా1; వు 12 నమ్మరాదీ ఘటము నవరంధ్రముల కొంప, బతుకమ్మనలె నీళ్ళ బడును మెపుడౌ - భా.1; పు. 22 విష్ణుబ్రహ్మలు సున్న విశ్వేశ్వరుడు సున్న, నేను నీవును సున్న నిహము సున్న - భా.1; పు. 10 ఇంటిలోనను మాయ యింటి ప్రక్కను మాయ,యింటి వెనుకను మాయ నడిమింటి మాయ = భా. 1, పు.35

162 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” పంచాక్షరీ నిజము పంచబ్రహ్మలు నిజము, పంచేంద్రియాల్నిజము పలుకు నిజము - భా.1 పు. 37 కాశిలో గనరాడు గంగ యొడ్డున లేడు, హృదయ మందున నిలిచి యుండలేడు - భా.1, పు. 8 కలడు లేడయ్య పృధ్విలో గానరాడు, నాద బిందును గళలన్ని నాత్మ యొకడె - భా. పు. 8 పూర్వాచార పరాయణులకు హిత బోధ ఇట్టుంది - బూటకులు వీరు అచల పరిపూర్ణులైతె వారికే కర్మలును లేవు వసుధలోన బా[పు 10 కట్నాల కాశించి ఉపదేశాలిచ్చే బోధ గురువులను, వ్యభిచరించుదొంగగురువులను నిందించి, ఆశారహితంగా ఆత్మజ్ఞానము తెలియజేసి శిష్యుల కడతేర్చే సద్గురువుల ప్రస్తుతించాడు. సిద్దప్ప కవనంపై పాల్కురికి సోమన, వేమన, బ్రహ్మం, శేషప్ప రచనల ప్రభావముంది. విమర్శ సోమువేములది. వేదాంతం వేమన బ్రహంలది. సీసాల నడక శేషప్పది. విషయాలు స్వంతం సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని రెండవ భాగంలోని చివరి 18 పుటలోనే జాన వరకున్నా క వట 2 పుటలు సరస్వతీ స్తుతి పద్యాలు - కందార్థాలున్నవి. నమ నాలు 40 “థీ సరస్వతి వాసర స్థిరభవాని, దాస హృదయేశ్వరీ నిన్ను దలతుజనని.” - ఒక వృత్త పద్యం చూడండి. ఇది ఏ ఛందమో చెప్పలేం. చంపకమాల అనుసరణ, జనని భవాని వాణి ఘనవాణి శుభాన ప్రతాప గాత్రి హ్రీం ప్రణవ వినోది కింకిణి భవాని కృపాణ్‌ ప్రమోదివమ్మ హాం జ్ఞాననరాది హృత్కమల శ్యామలవాణి స్వరూపి రావె వే శ్రీహము సోహగాత్రి వాసర పురవాణి సరస్వతీ నమో - పు. 9 సిద్దప్ప అమరకోశం, కాళిదాసు పేర్లు పేర్కొన్నాడు. నీతి శాస్త్ర శోకాల అనుసరించాడు. క్రాన్సి వీరి కవితలో తెలుగు భాషలో మరే భాషలోనూ లేని వింత పదాలు చోటు చేసుకున్నాయి 2. హంసోహం - వేదాంత రహస్యము, జగదీశ్వర శతకము - పుటలు 24 ము. 85 పై పదాలన్నీ ఒకే పుస్తక నామం. ఇందులో కొన్ని పాటలు, దండకం, సోహం - ఆత్మరామాయణ వ చనం ఉన్నాయి. ఈ కృతి శుక్ల నామ సంవత్సరంలో రచింపబడినట్టు కవి శతకాంత గద్యలో చెప్పుకున్నారు శుక్లకు మరో శుక్ల దాటింది ఈ క్రీశ. 19393 భవ సంవత్సరానికి 65 యేండ్ల పూర్వపు దీరచన. అంటే 1993 - 65 = 1928లో కవి దీనిని రచించారు అయినా గోలకొండ కవుల సంచిక 1 నం. 105, లోశళు శతకం పేర్కొనబడలేదు జ్ఞానబోధ ఒక్కటే సిద్దప్ప కృతిగా చెప్పారు పు 363 అందులో 26 ఏండని వయన్సు తప్పింది. బ్రహంగారి శిష్యుడు సిద్దప్ప వేరు - ఈ సిద్దప్ప వేరు ణా సీ. వేమరెడ్డిని బోలు యోగనాధుడులేదు - కాళిదాసునుబోలు కవియులేడు పోతులూరయ్యంత బోధకుండును లేడు - సిద్దప్పయంత శిష్యుడును లేడు అన్న పద్యం ఈ కఠరీంనగరం సిద్దప్ప చెప్పిందే - జ్ఞానబోధ - 1, పు. 46 వరకవులు హిందూ వైదిక సాంప్రదాయ వాదులకు, గ్రామ దేవతారాధకులైన జానపదులకు మధ్య మార్గం వారు. కర్మకాండల విగ్రహారాధనల నీరసించి వారు ఆత్మజ్ఞానం ముఖ్యమని ప్రబోధించారు ఆదిశంకరాచార్య అద్వైతానికి ఇది గ్రామీణ రూపం. అచలాద్వైతం ఇంకాస్త ముందుకెళ్ళింది సిద్దప్ప వంటి వరకవుల కవితల్లో ఛందో భంగాల చూసి పండితులు మెచ్చుకోక పోవచ్చు కవి అటువంటి వారికి ముందే జవాబు చెప్పాడు. పైగా తానే నిందించాడీ విధంగా - జ్ఞాబో2, పు 36 వంట చెరకు మీద కవనము జెప్పి (యు) చెరువు క్రిందను క్లేత్రమడిగినట్లు ” భ్రష్ట లోకుల మీద భట్రాజు జెప్పియు, కట్నంబు అడిగెను కడుప్పు కొరకు పరుల సొమ్ముల కాశపడి లాంగి కృతి జెప్పి, బ్రతుకు చుండిన నేమి ఫలము గాదు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : '20వ శతాబ్ద ర్రూర్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 163 సిద్దప్ప సద్బోధ శుద్ధంగా లేదని హేయపరచే బహ్రవేత్తలారా! చాటు కూతలు కాదు ఎదుటికి వచ్చి తప్పులేవో చెప్పండి. వర కవీంద్రుల బోధ తెలియ మీ వశము కాదు. ప్రాస గణములు తెలిసిన పండితుడనని భక్తవరులకు అవి చెరుప (తెలుప?) భావ్యం కాదు అన్నాడు - రెం.భా. -పు. 39, ఇంకా తానే ఇట్లన్నాడు. ఆంధ్ర పండితులంత ఆశ్చర్యులే గాని, భక్తి కందరు వట్టి భ్రమల కృతులె.... పండిత వాక్యముల్‌ బహు మంచివే గాని, నడుప జాలరు దుష్ట నరులు భువిలొ యెందుకీ ఆంధ్ర కావ్యముల్వెదకి చూడ, పక్షివలె పల్కుచుందురు ఫలము లేదు -పు 29. తాను మెచ్చే కవితను కూడా వివరించాడు. “పదవి జేర్చిన మంచి పద్యమొక్కటి చాలు” ఆ పదవి సద్ద్గురుని సేవించి ఆత్మను గుర్తించి సోహమయ్యేది. వ్యాకరణ దోషాల విషయం సామాన్యజనానికి పట్టదు. వారు వరకవుల భావాలకు మెచ్చి అభిమానించారు. విద్యా గంధంలేని వారికి గహన వేదాంతం గుర్తెరుగని వారికి, ఎంతో కొంత నీతిబోధ చిత్తశాంతి కలుగజేశాయి - వరకవితలు. సిద్దప్ప శిష్య బలగం పేరు ప్రఖ్యాతులు కల వరకవి. 6. మాధవరావు బలరామదాసు - కమాన్‌పూర్‌, 1880 - 1950 సుమారు. బలరామదాసుగారు విద్వత్కవి ఈ శతాబ్ది పూర్వార్థంలో జీవించారు. దాసుగారి ఏకైక పద్య ప్రబంధం “రామగిరి మహాత్మం'. ఇది 1928లో తొలి ముద్రణ 1985లో మలి ముద్రణ పొందింది. గడియారం విశ్వనాధ శర్మ బలరామదాసు ఏక గ్రామవాసులు - సమకాలీనులు, అయినా ఒకరి పుస్తకంలో మరొకరి ప్రస్తావనలేదు. శర్మగారి కావ్యమే మొదటిదని పెద్దపల్లి బాలకిషన్‌రావుగారన్నారు.' బలరామదాసును 1940 - 45 మధ్య తమ బాల్యంలో చూసినట్లు కల్వచెర్ల పట్వారి కుసుంబ రంగారావు గారన్నారు.* రామగిరి మహాత్మ్యం కావ్యానికి చక్కని వ్యాఖ్యానం వ్రాసిన మల్లావజ్ఞల రామచందద్రశర్మగారు తాము బలరామదాసు గారిని చూడలేదన్నారు. కవి ఈ 20వ, శతాబ్ది పూర్వార్థంలో జీవించినవారు. కవి వంశ పరిచయం : “ఇది శ్రీరామ చంద్రాపరావతారాయమాన శ్రీమత్తిరుమల కృష్ణ దేశిక పాద సరోజ 'సేవనా ప్రాప్త కవితా చాతురీ - చిత్ర మాధవరావు వంశ పవిత్ర రామనామాఖ్య పౌత్ర రామయపుత్ర బలరామ దాస ప్రణీతంబైన రామగిరి మహాత్మ్య్యంబు నందు తృతీయాశ్వాసము సమాప్తము". కవిగారి తాత తండ్రి ఇద్దరూ రామనాములే కవి పేరు బలరాం అయితే పూర్వ కవులవలె దాన శబ్దం చేర్చుకొని ఉంటాడు. మాధవరావు వీరి వంశంలోని ప్రఖ్యాత వ్యక్తి కావాలి, అతని పేరే వారి వంశ - గృహనామమై ఉంటుంది. కవి నియోగి బ్రాహ్మణుడు కొన్య విశేషాలు : రామగిరి మహాత్మ్యం చంపూ ప్రబంధం. మూడు ఆశ్వాసాలు. 133 పుటలు (రెండవ ముద్రణ) ఈ అచ్చు పుస్తకంలో దాదాపు 400 గద్య పద్యాలున్నాయి. ఇది చక్కని కవిత. కవి ప్రతిభాశాలి. “అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనరింపబూనిన శ్రీ ప్రతాప రుద్రీయంబును మహా ప్రబంధాంతర్గత శ్రీరామగిరి మహాత్మ్యంబునకు కధా శక్రమంబెట్టి దనిన” అని కావ్యారంభం కావించాడు, ప్రతాపరుద్రీయంి 1 ఎం,బాలకిషన్‌రావు, మ.రామచంద్రశర్మగారలను పెద్దపల్లిలో 1991లో కలిశాను. వారిద్దరూ తెలుగు పండితులు-కవులు, దాదాపు 60 ఏండ్డ వయసువారు. 2 రంగారావుగారు 1992లో కొరుట్లకు వచ్చినప్పుడు నాతో ముచ్చటించారు. అప్పటివారి వయస్సు 59 సంవత్సరములు. ౩. విద్యానాథుని “ప్రతాపరుద్రీయం' అలంకార శాస్త్ర గ్రంథం-13వ శతాబ్దిలో ఓరుగల్లులో వెలసింది అది వేరు ఇది వేరు

164 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” "పేర కవి ఒక మహాకావ్యరచన చేయనెంచాడు. రచించినది మాత్రం ఈ మూడాశ్వాసాల ప్రబంధం. రామగిరి మహాత్మం కావ్యాన్ని ఒక ప్రబంధం - చరిత్ర కావ్యం - స్థల మహాత్మ్యం అని చెప్పవచ్చు. ఈ కథను సైతం బదరికావనంలో శౌనకాది మునులకు వ్యాసశిష్యుడైన సూతుడు వినిపించినట్లుగానే ఉంది. రామగిరి మడికి సింగన కవి నివసించనదే. బలరామదాసుగారు పూర్వ కవుల్లో వ్యాస వాల్మీకి భారవి కాళిదాస మల్హణ బిల్హణాది సంస్కృత కవుల, తిక్కన, పెద్దన, నన్నయ్య ఎజ్జయ, ముక్కుతిమ్మన, రామకృష్ణుడు మున్నగు తెలుగు కవుల ఇదే వరుసలో స్తుతించాడు. కాని, స్టానికుడైన మడికి సింగనను 'పేర్కొనకపోవడం ఆ కవి కావ్య పరిచయం లేక కాబోలు. ఇంకా తాను వారిని అనుసరించినా శ్రీనాధ పోతనల, మొల్ల, భట్టమూర్తి, చేమకూర వేంకట కవుల కూడా ఈ కవి స్మరించలేదు 'కావ్యావతారికలో, ఈ కావ్యంలో కవి రామగిరి వర్ణన పలుసార్లు చేశాడు. మొదటి మూడు పద్యాల్లో ఒకటి (ఇందులో పద్యాలకు నంబర్లు లేవు కాబట్టి పుటల నంబర్జు చూపబడుతున్నవి). ధరణి మహా మహీధ్ర సముదాయ వతంసమునై జెలంగి సుం దర తర కుంజ పుంజ ప్రమదావన పూరితమై సురాసురా ప్పరసల నూత్నలీలలకు పౌధమునై విలసిల్లువాడు రామ భూ ధర మది గౌతమీ నదికి దక్షిణ దికృల పంచకంబనన్‌ (రామ పుట 6) పుర వర్ణనలోని ఒక పద్యం - గోపురపు నవ్వజాలెడు గోపురములు చంద్రశాలలు చుంబిత శశ ధరములు దేవ కాంతల బోలు సతీ జనములు, మార శృంగారు లచటి కుమారవరులు (పుట.6) దానిని 'మించు అలకాపురంబని యెంచవచ్చు'నట! అష్టాదశ ప్రబంధ వర్ణన లీకావ్యంలో చళ్తుగా చోటుచేసుకున్నాయి. గరి పుర వర్ణనల తర్వాత పుష్పలావికల శృంగార చేష్టల వివరించి చాకుర్వర్షల విశేషంగా వర్ణించాడు కవి. స్ట స్నానము సంధ్యయున్‌ జపము సత్యము శ్రీనివాస పద పూజలు గలిగి బ్రహ్మతత్త్యమసి యను రహస్యముల శోధించువారు అచటి బ్రాహ్మణులట శివునే కాక శ్రీనివాసుని, బ్రాహ్మలతో పాటుగా స్వాములను పేర్కొనడం కవి వైష్ణవ మత ప్రీతికి నిదర్శనం. క్షత్రియ వర్ణన ఇది : చ. తపన సమాన తేజులు నుదారులు ధీరులు యుద్ధరంగమం దపరిమిత ప్రతాప సుబలాథ్యులు యోగ్యులు భోగ్యులుత్తముల్‌ నిపుణులు సుందరాంగులును నేతలు భూతల మేలుచున్న యా నృపకుల నాధులుందు రల నీటగు పట్టణమందు నెప్పుడున్‌, పు కోటికి లెక్కచే పడిగె కొంకక నెత్తెడు కుబేరులచటి వైశ్యులు, శూద్రుల వర్ణన చూడండి చ. ద్విజులకు సేవ చేసి ధర వింతగు పంటలు బండజేయుచున్‌ ప్రజలకు నన్న వస్త్రములు బాల్బడనిచ్చి నిజోరు భక్తి గో వ్రజముల నేలు వారి గుణవర్యుల శూద్రుల నెంచ శక్యమే భుజబల శాలురై హలిని బోలి వసించెద రప్పురంబునన్‌. పు 9 హలి = హలధరుడు , బలరాముడు. ఆ తర్వాత కవి నియోగుల - కరణాల ప్రత్యేకంగా వర్ణించి స్వజాత్యభిమానం చూపించుకున్నాడు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతాబ్ద ప్రూర్వాద్థ సాఫాత్యం” పద్య సాహిత్యం 165 ఊఉ. శూరులు సత్యవాక్య పరిశుద్భులుదారులు శత్రు సంఘసం హారులు తప్త హేమ మణిధారులు చిత్రవిచిత్ర లేఖ కా ధారులు ధీరు లానన సుధాకర వైఖరి నొప్పుచున్న వ్యా పారులు' నుందురప్పురిని బాయక కొయజ సుందరాంగులై. పు. 9

సుమతీ శతక పద్యంతో కరణాల నింద జన వ్యాప్తిలోనికి వచ్చినా మన పూర్వ కవుల్లో కవిత్రయం శ్రీనాధ పోతనాది అనేకురు నియోగి కులాలంకారులే. ఇంకావారు అమాత్యదండనాధాది రాజకీయ ప్రముఖ పదవుల్లో రాణించినవారు.

ఈ రామగిరి నగరం ప్రతాపరుద్ర చక్రవర్తిచే ఏకారాత్ర వినిర్మితమట! (14వ, పుట పద్యం.) రామగిరి నగర విశేషాలు కల వచనంలో కొంతభాగం ఇది. “అతి విశాలంబైన శ్రైలంబున యున్నతోన్నత శిఖరంబులును కుసుమ విలసిత తరు విశేషంబులును, సకల ముని నికర పరివృత సరోవర విలసితంబును గంధర్వాది శేచర విమాన పటలీ పరివేస్టిత సానుతటీ శోభితంబును శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర నిత్యనివాస మంది రాయమానకందర కలితమును కర్మబంధ నిర్మోచన కూర్మ గుండంబును బ్రహ్మనివాస విశేషంబగు బ్రహ్మగుండంబును గౌరీ విలాసా స్పదంబగు గౌరీ గుండంబును మొదలుగాగల యఖిల చిత్రంబులున్‌ గలిగియుండె-” 15వ, పుట. ఖేచర విమానాల వంటి పురాణ వర్ణనల వదలితే మిగతా విశేష ప్రదేశాలన్నీ ఇప్పటికీ రామగిరిపై కనిపించేవే.

ఆ తరువాత ప్రాకార వర్ణన (16, 17 పుటలు) అద్భుతంగా సాగింది ఈ కావ్యంలో సూర్యాస్తమయ (24) చంద్రోదయ (25) చంద్ర దూషణ (27) మారసింద (28 - 32) నూర్యోదయ (33

    1. వర్ణనలు వివరంగా నడీపి నాయికకు నాయకుని చూపించాడు. విజయ విలాసాన్ని తలిపించేది నాయక వర్ణన పద్యం -

సీ ఘన దీరబాహుని ననవిల్తు సమరూపు, సమరూపు విలసిత స్వస్వరూపు

గమన చాతుర్యాన ఘననాగ విజగీషు, విజగీషు దేవేంద్ర విభవమునను మందహాసము మోమునందు జిల్కెడు వాని, నందు జిల్కెడు మాటలందు సుధయు మోమందమేమందు నా యిందుని హసించు, నా యిందు నిరసించి యలరు వాని - పు, 35 ఇందలి అందమైన పదాల పొందిక ముక్తపద గ్రస్థాలంకారం గమనార్హం. అప్పటి నాయిక స్థితి ఇట్టున్నదట. ఆమె పేరు హేమ కం, హేమ తనుద్యుతి విజిత సు, హేమ, ముఖాప హసితాగ్య హిమధామ, లన త్యామ శరజాల పీడిత, నేమ, మహామోహభార నిశ్చలమతియె.

భావం - హేమ శరీర కాంతి చొక్కపు బంగారాన్ని జయించేది. ముఖం చంద్రుని అపహసించగలది. మన్మధ బాణాలతో పీడింపబడుతున్నది. అప్పుడు ఆమె మహా మోహావస్థతో నిశ్చలంగా నిలిచింది నాయకుడు హేమాంగుడు గంధర్వుడు. స్వజాతి సుందరి "హేమను చూచిన పద్యం మనుచరిత్రలో పెద్దన హిమాలయాన్ని, భాగవతంలో పోతన సరోవరాన్ని వర్ణించిన విధంగా రమ్యంగా ఉంది. విశేషణ పదాంత్యాను ప్రాస మనోహరంగా కూర్చబడింది. ఆ పద్యం చూడండి 4, వ్యాపారులు బేపారులు కాని, ఈ పద్యంలోని వారు గోలకొండ వ్యాపారులనబడే నియోగులు -

కరణబ్రాహ్మణులు.

166 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” అట గంధర్వుడు గాంచె కాంచన శరీరాభన్‌ ద్విరేఫాలకన్‌ నట దిందీవర పత్రనేత్ర యుగ నానా దిక్సమాలోకినిన్‌ పటు హేమాంచిత నాసికన్‌ వికచ సత్పద్మాస్య సౌందర్య సు సృటిక క్లుప్త వితర్ణి వాసిని శుకీ సంభాషిణిన్‌ తోషిణిన్‌. పు 37 ఇందలి సంస్కృత పద భూయిష్ట సమాస విన్యాసం అంత్యాను ప్రాస పఠితులనాకట్టుకుంటాయి దృశ్య వర్ణన సైతం రమ్యం. నాయకుని మనస్ఫితి వర్ణన - సీ, మించి నా దృష్టికి మిరిమిట్లు గొలిపెడు, తొలు కరి మెరుపని తోచు మదికి తాలుకరి మెరుపవుకీ తోరంపు కళలున్స్నె కళలొప్పు వెన్నెల కాంతి యేమొ వెన్నెల కాంతికీ చిన్నెలు గల్గునె, రంగైన మరుని తురంగ మేమొ.. ఈ పద్యం శిల్పంలో భావంలో తిక్కన విరాట పర్వంలోని సైరంధ్రి వర్ణనను తలపించుతుంది. నన్నయ భారతంలోని శంతనుడు గంగను వలె - ఎవ్వరిదానవే రమణి యెయ్యది పేరు వచింపు మింపుగన్‌, అని ప్రల్నించాడు. మాటలు మనసులు కలిసి గాంధర్వ వివాహమై సంభోగా నందాల తిసి చతురుడనే కొడుకును కన్నారు (పు 43-44). ఈ ద్వితీయాశ్వాస కధ ఓ ప్రత్యేక శృంగార ప్రబంధం అనొచ్చు. తృతీయాశ్వాసంలో శ్రీరామ కధ మూలవిధేయంగా క్లుప్తంగా నడిచింది సీతాదేవి ఆంజనేయుని చేత రామ ముద్రికనందుకొని ఈ విధంగా అనుకొన్నది మ, జల జాక్షుండు త్రిలోకవంద్యుడు లసచ్చారిత్రుడత్యంత కో మల నీలాంగుడు దీర్ధబాహుడతుల - కానందకం దలి తాంతః కరణుండునై వెలయునాదైత్యారి శ్రీహస్త మం దల చెన్నాందెడు ముద్రికా కుశలమా యర్కాన్వయాధీశుకున్‌ పు 121 చారిత్రక విషయాలు : “శ్రమించు నవరత్న సింహాసనంబున ప్రతాపరుద్రుడు వివిధాసనంబుల వేళ్వేరు మంత్రులుండగా, భట్టు గాయకులూగి ప్రస్తుతుల్‌ సేయగా, భటులు ఆజ్ఞాకృత కార్యాలానర్చే వారలు, మొకద్దంలు కరణాలు వారివారి పనులు చేసేవారు” - ద్వితీయాశ్వాసం. విషయం పన్నెండవ శతాబ్ది కాకతీయ కాలపుదైనా, వర్దనలు పదహారవ శతాబ్ది ప్రబంధ యుగానివి. ఈ రాజకీయ పరిపాలనా వివరాలు 18, 19 శతాబ్దుల నాటి నైజాం నవాబుల కాలానివి, గ్‌. రామగిరి నేలె తాను విరాజ మెందు, చుండ జగతి ప్రతాప రుద్రుండనంగ శరధి వసువేద చంద్రుల సంఖ్య నగర, సంఘములు ముప్పది[యు)మూడు సముతులలర-54 పు శరధి - 4, వసు - 8, వేద - 4, చంద్ర - తలక్రిందులుగా 1484 ఇది శక హూణ ఏ సంవత్సరానికీ సరిపోదు. కాకతి సామ్రాజ్యం శ్రీశ. 1325కు ముగిసింది రామగిరి సామ్రాజ్యం 1484 గ్రామ సంఘాలు 33 నముతులుగా పరిపాలన సౌలభ్యంకోసం విభజింపబడింది అని భావం. రామగిరి తక్తా - సింహాసనం పరిధిలో 31 టప్పాలు, 1119 గ్రామలు ఉండేవి - 56 పుట. రామగిరి క్రింద రామగిరి ఖస్పా - పట్టణం ఉంది. దానికి అయిదు సముతులు. వివరాలు - పెద్దపల్లి సమితి 42 గ్రామాలు, ఓదెల = 67, కలువచెర్ల - 52, పారుపెల్లి - 2% వడ్కాపురం - 19 ఇవి మొత్తము 201 గ్రామాలు. కవి వీనిని 202 అన్నాడు ఇంకా 56వ, పుట సీసంలో పేర్కొన్న గ్రామాలు ఇవి - చల్తూరు - 7, కొండ గూడూరు - 38; మొర్శూరు - 25, మంథని - 43, ఆరెండ - 26కొపవరం

  • 45, రాపల్లె - 14, కాళేశ్వరం - 28, ఎగర్రనేని కాపవరం - 45, సువర్ణ (వైడి) పాక - 13, ప్రతాపగిరి - 33, జాజిపూలవరం - 13, తిప్పనపల్లె - ఎక్కెల - 26, ముక్కలగిరి - 38, ఇప్పగిరి - 14; 57వ, పుటలోనివి
  • మరుమడుగు - 43, అభిలాస్‌పురం - 12, ఇంద్రగూడెం - 27, నంనూరు - 20, నన్పూరు - 27,

రెండవ భాగం - ౪ అధ్యాయం * “205 శతాబ్ద ప్రూర్వార్ధ సాధొశ్వం” పద్య సాహిత్యం 167 లేమూరు - 20, చన్నూరు - 99, తూర్చుపల్లె - 28, నూగూరు - 66, నెంచచెర్ల - 23, కల త్రయోద్రక నలబాక - 40, జాఫరాబాద - 41, ఇదీ సముతుల గ్రామాల లెక్క పై సమితి కేంద్ర గ్రామాలు 32, వాటి పరిధిలోని మొత్తం గ్రామాలు 1044 ఉన్నవి ఒక సమితి 440 గ్రామాలు ఎట్లాగో కవి లెక్క నుండి జారుకున్నాయి

“ఇట్లు కాకతీంద్ర యశోభూషణాయ మానచండ మార్తాండ కోటి విలసిత పప్రతాపరుద్రుండగు ప్రతాపరుద్రుండు తత్తద్విచిత్ర దివ్య ప్రదేశంబులందు హరిశివాలయంబులు నిర్మింపజేసి యఖండ మహీ మండల మండనాయత రామగిరి దుర్గ సమాశ్రయలబ్ధ యశోవిరాజితుండగుచు రామగిరి యను సర్కారులో నుండి కొనిన పూర్వోక్త సమ్తులు చతురళీత్యుత్తర చతుర్దశ శత (1484) గ్రామ మండలంబునేకచ్ళత్రంబుగ పరిపాలించుటయే గాక నేకశిలానగర రాజధానీ శ్వరుండగుచు సర్కారు వొరంగల్లను పేరుగల మహీమండలంబునుంగూడ పరిపాలనంబుజేసె”. - పుట. 58

కరీంనగర్‌ జిల్లాలో రామగిరి, వెలిగందల దుర్గాల వ్యాప్తి కాకతీయులకు తర్వాత 14వ, శతాబ్ది నుండి ఆరంభమైంది. మొలంగూరు కాకతీయుల కాలపుది. శనిగరం, నగునూరు, పాలాన, వేములవాడ అంతకు పూర్వపువి. ఈ పేర్లేవీ పై లెక్కలో రాకపోవడానికి కారణం అవి రామగిరి రాజ్యపరిధిలోనివి కాకపోవచ్చు. కవి చూపిన సముతుల గ్రామలన్నీ నేటి కరీంనగర్‌ పట్టణానికి ఉత్తరం వైపువే కావడం గమనార్హం

ఈ గ్రామ నామాలు కొన్ని మారినవి. ఉర్పూ పేర్ల ఊర్లు కాకతి కాలంలో లేవు. వర్ణన గోలకొండ

  • హైదరాబాద్‌ ముస్లిం పాలకుల కాలపునాటిదైనా రామగిరి దుర్గసీమ పరిధిలోని గ్రామాల వివరాలు బలరామదాసు వలన తెలుస్తున్నాయి. ఆయన భారత స్వాతంత్ర్యానికి పూర్వం నైజాం నవాబుకాలంలో గ్రామకరణంగా పనిచేశారు. తన కాలంనాటి విషయాలను పూర్వకాలానికి జత చేశారు.

ఈ కావ్యంలో వివిధ దర్శనీయ ప్రదేశాల వివరణ చక్కగా ఉంది. జైన హిందూ ముస్లిం నిర్మాణాల వివరాలున్నవి అరణ్యవాస కాలంలో పాండవులు కొంతకాలం రామగిరిపై ఉన్నారన్నారు (87వ, పుట). రావణ సంహారానికి - సీతాపహరణానికి ముందు సీతారామ లక్ష్మణులు ఈ గిరిపై పదిహేడు దినాలు ఉన్నారన్నారు కవి (58వ, పుట). ఇంకా పాండవుల దగ్గరికి నారదుడు రావడం, సుమతుడనే బ్రాహ్మణ భక్తుని కథ ద్వితీయాశ్వాసంలోనే ఉన్నోయి.

సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండిత్యం, చిక్కని కవన నైపుణ్యం కల కవి బలరామదాసు గారు. కాని, కధా కల్పనాశక్తి కొంత తక్కువ మూడు ఆశ్వాసాల్లో వర్ణించిన విషయాలకు పరస్పర సంబంధంలేదు. ఆయా సంఘటనల కన్నింటికీ పీటముడి - కేంద్రం రామగిరి!

గిరిస్టల నగర వర్ణనలో కవి పురాణ కవుల మార్గాన్ని అనుసరించారు. కొన్ని వ్యావహారిక పదాలు, మితంగానైనా తిలగుమ్ములు వంటి కూడని నమాసాలున్నాయి.. అలతి లోపాల నస పెట్టుకోకపోతే మంచి పసగల పద్య కావ్యం ఈ రామగిరి మహాత్మ్యం. ఇది రసవత్కవిత్వంతో ఒక శృంగార కధ, సంక్షిప్త రామాయణంతో పాటు చరిత్రను వర్ణించిన స్థల పురాణం

మ రామచంద్ర శర్మగారి వ్యాఖ్య మూల విధేయంగా సాగింది రెండు తరాల క్రితపు ఈ కృతి ప్రతిని భద్రంగా కాపాడి మలి ముద్రణకందిచ్చిన వారు కలువచెర్ల పట్వారీ కుసుంబ రంగారావుగారు. సేకరించి ముద్రించిన వారు రాయబాల ప్రసాద్‌గారు.

  1. ఇంతకు ముందు చూసిన “రామగిరి నేలె' అనుపద్యంలోని శరధి పదానికి (సప్త సముద్రాలను కాక) చతుస్సాగరాలని కవి అభిప్రాయమని ఈ గ్రామాల సంఖ్య వలన తెలుస్తున్నది కాలగణనంలో సప్త సంఖ్యకు కులపర్వతాలను సూచిస్తారు

168 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” రాయల ప్రబంధ యుగానంతర కాలంలో కరీంనగర మండలంలో కుందావజ్ఞల గోపాల కృష్ణకవి గారి ఏకాశ్వాసమాత్ర లభ్య “సంవరణ చరిత్రము'ను మినహాయిస్తే మాధవరావు బలరాందాసుగారి “రామగిరి మహాత్యం” ఏకైక పద్య (ప్రబంధం! 7. సిరిశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని' - కోరుట్ల 1905 - 1992. శతావధాని కృష్ణమాచార్యులు సంస్కృతాంధ్ర తమిళ భాషలలో మ న ౧ పండితులు. వారు ఉభయ భాషాకని సంస్కృతంలో గద్య పద్య గ్రంధాలు | |. రచించారు. సంస్కృతొనువాదాలు, స్వతంత్ర కావ్యాలు మొత్తం ఇరువదికి ౧ గ్‌ “క్త భక్‌ ఛం మించి తెలుగులో వెలయించారు.. కాళిదాసు కొవ్యత్రయానికి మారుగా “ఫో సంస్కృతంలో గురువంశ సంపత్కుమార సంభవ మనస్పందేశ కావ్యాలను ప ల” రచించి అభినవ కాళిదాస బిరుదాంకితుబైనారు అవ్చావధాన శతావధానాలు చేశారు నైజాం రాష్ట్రాద్య శతావధాని బిరుదాన్ని గ్రహించారు. వారు శ్రీవైష్ణవ మతాభిమానం కలిగిన వారైనా అన్యమత ద్వేషం లేదు. కొరుట్ల సంస్కృత పాఠశాలలో ప్రధానాచార్యులుగా ఉద్యోగం చేశారు కృష్ణమాచార్యులది గంభీర స్ఫురద్రూపం. శాంత ప్రసన్న వదనం. శతావధానిగారు ప్రంభావ సరస్వతి వంశ చరిత్ర : గో.క.సం నం 171లో కృష్ణమాచార్యుల జన్మస్థలం మోర్తాడుగా ఉంది. అది నిజమే. కృష్ణసూచార్యులు నవ యువ వయస్సులో ఉపాధ్యాయులుగా వచ్చి కొరుట్లలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. కాని, వీరి పూర్వులలో మొదటి తరంవారైన వరదమయ్య్యగారిది కరీంనగర్‌ జిల్లాలోని మంధని. ఆ వంశంవారు కవి పండితులుగా హరిదాసులుగా ఆదిలాబాద్‌ వెళ్లారు మూడవ తరం సింగరాచార్యులు మోర్తాడుకు మారినారు. ఈ సింగరయ్యగారి కుమారులైన వెంకటాచార్యుల ద్వితీయ పుత్రులే కృష్ణమాచార్య శతావధానిగారు కృష్ణమూచార్యుల నలుగురు సోదరులలో చిన్నన్న వరదాచార్యులు, తమ్ములు పెరుమాళ్ళాచార్యులు దేశికాచార్యులు కవులు. కొని వారు ఈ జిల్లాలో లేరు. కృష్ణమాచార్యుల ఇంటిపేరు మొదట సిరిసెనగండ్లవారు. వీరి అన్నగారైన వరదాచార్యులే తమిళ శబ్దధ్వనిలో దానిని సిరిశెనహళ్‌గా మార్చినారు. వీరిది శ్రీవైష్ణవ మతం; కౌండిన్యగోత్రం; ఆపస్తంభ సూత్రం. కృష్ణమాచార్యుల జననం 13-8-1906; మృతి దినం 15-4-1992. ఎనభై రెండుసంవత్సరాలు జీవించారు" ఆరపై.యేండ్లకు మించిన కాలం సంస్కృతాంధ్ర సాహిత్యారాధనలో గడిపారు కృష్ణమాచార్యుల సంస్కృత రచనలు : కావ్యాలు : 1. మనస్సందేశ కొవ్యం, 2. సంపత్కునూర సంభవమ్‌, 3. గురువంశ మహాకావ్యం, 4. మనోజ విజయ భాణమ్‌, 5. ధర్మపురి .. సుప్రభాతాని 6. జియ్యరు స్వామి చరిత్రం. గద్య కావ్యాలు : 1 తత్వార్ధ ప్రకాశికా, 2. అర్బరాది మార్గం, 3. శ్రీవచన భూషణం, 4 రహస్యత్రయం, 5. వేదాంత దీపం, 6 పూర్వపక్ష సిద్ధాంత సంయోజనం తెలుగు రచనలు - ముద్రిత పద్యకావ్యాలు : 1 కాళాశాలాభ్యుదయము - 1929, 2. మనస్సందేశకావ్యం

  • 1952, 3. ఆంధ్ర మహానాటకము - 1973, 4. రామానుజ చరిత్ర - 1981. స్తుతి ప్రబంధములు - ఇవధానములు - అనువాదములు , ఇఅచ్చయినవి. క్రీర్తిశేషులైనప్పుడు నేను వారి గృహమందే ఉన్నాను మాది ఎనిమిదేండ్లుగా ఏకగ్రామ ఏకగ్భహవాస సాంగత్యం

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ్రార్వా్ట సావాత్యం” పద్య సాహిత్యం 169 1 జయతాల, కోరువుట్ల శతావధానములు - 19330, 2. మనోజ విజయ భాణము - 1961,

3-5 స్తుతి గీతములు, 3. భాగములు (2వ భా. ముద్రణ - 1967), 6. గాంధీ తొత నీతి శతకము - 1975, 7. నంబులాద్రి, ధర్మపురి, చేగుర్తి, రేకుర్తి, మెట్టుపల్లి, కొరుట్ల సుప్రభాతములు.

వచన రచనలు ;

  1. విశాష్ట్రాద్వైత మత సంగ్రహము - 1972, 2. స్వీయ కవితాను జీవనం - 1986. ముద్రితాలభ్య రచనలు : 1 విశ్వకర్మ శతక ఖండన మండలము 1928, 2 గీతాచార్య మత ప్రభావ శతకము - 1940 అలబ్ధ రచనలు - అముద్రిత హరికథలు ; (1930 - 40) 1 పద్మావతీ పరిణయము, 2. రుక్మిణీ కల్యాణము, 3. గరుడ గర్వాసహరణము, 4. కృష్ణ గారడి, 5. ఆధ్యాత్మ భారత హరికథ, 6. గొంధీ జీవిత చరిత్ర, 7. ప్రజాస్వామ్యము, 8. అభినవ కుచేలోపాఖ్యానము - పద్యకావ్యం. అముద్రితలభ్య రచనలు : 1. రత్షమాల (ఖండ కావ 0), 2. శతవిధబంధ పద్య శతకము, 3. శృంగార పంచ బాణ విజయ భాణం (వాధూల.రరగకవి వక రూపక కావ్యానువాదం)

ఉభయ వేదాంత విద్వాన్‌ ఉభయ భాషాకవి శతావధాని కృష్ణమాచార్యుల సంన్కృత గ్రంథాలు ఓ పది, ఆంధ్ర కావ్యాలు ఓ ఇరవై వరకు ముద్రితాలు. సంస్కృతాంధ్ర కవిత్వంలో వీరు దిట్టకవి. ఓ నలభై వరకు అష్టావధానాలు, నాలుగైదు శతావధానాలు దిగ్విజయంగా నిర్వహించి, శతవిధ బంధ కవిత్వం వ్రాసి, చిత్రకవితకు స్వస్తి చెప్పి, మత-హిత రసవత్కావ్యరచనతో జీవితం గడిపిన సార్థక జన్ములు కృష్ణమాచార్యులు. ఆచార్యులవారు పొందిన సన్మానాలు అనేకాలు - వాని వివరాలివి.

  1. సేనాపతి నరసింహాచార్యులచే విద్యాభూషణ బిరుద, స్వర్ణపతక ప్రదానం - హైదరాబాదులో - 1940 2 ఆం(ధ్రసారస్వత పరిషత నల్లగొండ మహాసభ కవి సమ్మేళానానికి అధ్యక్షస్థానం _ 1944

  2. హెబ్బార్‌ మైసూరు వైష్ణవ సభా సన్మానము - 1944

4 తిరుమల తిరుపతి దేవస్థాన కవి పండిత సన్మానం - 1955

5, తిరుపతిలో అఖిల భారత విద్వత్సభా సన్మానము - 1960

6 ఉభయ వేదాంత బిరుద ప్రదానం - విజయవాడ - 1865

  1. ఉభయ వేదాంతాచార్య బిరుదం - జియ్యరు స్వామి ఢిల్లీ పీరం వారిచే - 1973

  2. ప్రపంచ తెలుగు మహాసభల కవి సన్మానం, హైదరాబాద్‌ -1975

  3. కరీంనగర్‌ - 1981, 10. కోరుట్ల కవి పండిత పొర మహాసన్మానం - 1991

11 తెలుగు విశ్వవిద్యాలయ సన్మానం హైదరాబాద్‌ - 1992 మొదలగునవి.

కవిత్వ పరిచయం : భక్తి తాదాత్మ్యంలో వీరి గీర్వాణవాణి ఎట్లా వీణా నిక్వాణ గాన మొనరించుతుందో చూడండి.

సురవందిత నుందర పాదయుగం, వరదం మురదంభహరం హృదయే

దర దివ్య రధాంగ ధరం మధురం, వర ధర్మపురీ నరసింహమయే - సుప్రభాతం నుండి,

తెలుగు తనానికి మచ్చుగా ఒక పద్యం వీరి స్వీయ కవితాను జీవనం నుండి -

2 ఈ వివరాలన్ని కృష్ణమాచార్యుల 'స్వీయ కవితాను జీవనం' లోనివి చివరి సన్మానం వారు కీర్తిశేషులైన తర్వాత 5 డిసెంబర్‌ 1992న లభించింది. కవిగారి భార్య విజయమ్మగారు, కొడుకు కోడలు - మంగ నరసింహాచారి ఆ బహుమతులు తీసుకున్నారు భాగ్యనగరంలో.

170 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” ఇటుల యెందరో నిను జూడ నెంచిరంట, పుడమి కానుపు జంట యెక్కడను కంట నెందు కనరాని బంట యిల్లంత కుంట, యందు నీవుంటనా పున్నియముల పంట సమకాలీన భావ స్పందనకు కవితా నైపుణికి నిదర్శనం అముద్రిత “రత్నమాల బండకొవ్యంలోని పద్యాలు. వరుసగా “హోటలు, “నిరుద్యోగివేదన' నుండి రెండు సీస పద్యాలు, శతముఖోచ్చిష్ట సుస్వాదు వారాంగనాధర బింబమును బోలు త్రాగు పాత్ర లోన కల్మషమైన పైన తియ్యని మోసగాని మాటల వంటి కాఫి నీరు ప్రాచీన తరములై రగరగ యను గిలేట్‌, హారంబు పోల్చ్పలహార చయము వచ్చిపోయెడి వేళ పైకంబు లాగెడు, ప్లీడరు వంటి నిర్భీక విభుడు అంటువ్యాధుల కిదియ విహార భూమి భాగ్యవంతుల కొక ప్రక్క బందిపోటు బీదసాదల ప్రాణాలు పీల్చుతొవు హోటలునకింక వేరేమిలోటు గలదు. పనిచేసి స్వాతంత్యమున బ్రతుకుదమన్న, వెలయించినది వృత్తి విద్యకాదు, కవినయిలోక విఖ్యాతి చెందుదమన్న, సాహితీ గ్రంధముల్‌ చదువలేదు, వాణిజ్యమునను జీవనము పుచ్చుదమన్న, చేతిలోనొక కాసు చిక్కలేదు, సన్యాసినై జ్ఞాన సరణి దెల్చుదమన్న, వేద వేదాంత సద్విద్యకాదు, ఇంతవరకును చదివిన దంత గౌర్హ ! మెంటు కొలువచ్చి పుడమిలో మెలగ వలయు లేనిచో సొఖ్యమందాశ లేక యిల్లు వెడలి బలిమిని ప్రాణముల్‌ విడువలయు సంప్రదాయ కుటుంబాల్లోని మార్చుల వర్ణన “తాత మనువడు" శీర్షిక నుండి, ముందు పూజించిన సుందర ప్రతిమలు నవగృహ చిత్ర చిహ్నంబు లిపుడు లలతలింగములు సాలగ్రామ శిలలవి పేపర్ల బరువుకు మోపురాళ్లు అర్భ్యపాద్యాదుల కనువైన పాత్రలు కాఫి తొగుటకు నక్కరకు వచ్చు తాతలనాటి యా తాటాకు పాత్తముల్‌ తుక్కు మోసెటి బండి నెక్కి తరలు. జట్టు పెంటరై మోమున సాబగు లొలుకు బొట్టు శ్రీరంగ కాశిగోపురములెక్కి సంధ్య బదిరిలో తపమును సలుపు చుండి నాటి విప్రుడు హరిజన నాధుడిపుడు కొవ్యపరిచయము : కళాశాలాభ్యుదయము - ఈ జిల్లాలో అచ్చయిన తొలితరం కావ్యం. ఇది మూడాశ్వాలలో 234 పద్యాలతో సమకాలీన ఇతివృత్తం కల్పది. శ్రీవైష్ణవ మతాభినివేశంతో రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీ పెరుంబుదూరులో ఉభయ వేదాంత పారశాల స్థాపించి అచ్చటే నివసించిన కుండలం - మాకులూరి వేంకట నరసింహాచార్యులి జీవిత విశేషాలున్నూ వారి ఆదేశం చేత కొరుట్ల పట్టణంలో ఉ.వే, సంస్కృత పొరశాల, వేణుగోపాల మందిరం, విద్యార్థి వసతి గృహం, వాణీ విలాస గ్రంధాలయం, నాటి ఉదారుల సహకారాలతో స్థాపించి, భవనాలు నిర్మింపడేసి, వైభవంగా నడిపించిన సేనాపతి వేం. నరసింహాచార్యుల జీవిత విశేషాలు కలది, ఈ కళాశాలాభ్యుదయం ప్రబంధ వర్ణనల పొంత పోక కవిత సూటిగా కధా వివరణతో సాగిపోయింది కవి ధ్యాస విషయ వివరణ పైనే కేంద్రీకృతమైంది. ఇందులో ఉభయనాయకుల జనన బాల్య విద్యాభ్యాసాది వివరాలున్నవి. ఇంకా కొరుట్ల సంస్కృత విద్యాలయ - కృష్ణమందిర నిర్వహణోత్సవాది విశేషాలు రమణీయంగా వర్ణించారు 3. వే. నృసింహాచార్యుల స్వగ్రామము “మోర్తాడు' నిజామాబాద్‌ జిల్లా

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద పూర్వార్థ సాహిత్యం” పద్య సాహిత్యం 171 కృష్ణమాచార్యుల జన్మస్థలం మోర్తాడు. నివాస గ్రామం కొరుట్ల. శ్రీపెరుంబుదూరులో విద్యాభ్యాసం కావించినవారు. ఉ.వే. సంస్కృత పాఠశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఇంకేం ? ఇష్ట పదార్ధ మృష్టాన్న భోజనంవలె కావ్యం కమనీయమైంది. సంస్కృత కవి పండితులైన ఆచార్యుల వారి తెలుగు కవిత అలతి అలతి జాను తెలుగు మృదుమధుర పదాలతో రసభావ నాదశయ్యా శోభితమై ఉండటం విశేషం. ఈ కావ్యంలోని గోదావరి వర్ణన - 1- 41, ఉ. తుంగ తరంగ భంగముల దోరపు మీలు చలించు చుండ సా రంగ వహంగ రాజములు రంజిలు మంజుల మంజరీ సమా లింగిత భృంగరావ వికఠలీకృత పాంధ నిజాంత రంగము ప్పాంగ మతంగ యానల వపుస్కృతి జేయునదీ విచిత్రముల్‌, శిశువర్జన - 1-42, సీ ఈ చిన్న పాపని జూచితిరే తొల్డి దేవకి కొమరుని భావమడరు ఈ ముద్దు బాలుని మోమును గాంచరే పున్నమి రేవెల్లు సన్నగిల్లు .. పుర వర్ణన ఎంతటి భావ రంజక శబ్దాలంకొర మంజులమో! సీ తోటలా రతనంపు కోటలా వలినీటి యూటలాయీప్పురిన్‌ నీటు కొలువు పాయులా సాముల బారులా శ్రితసుమందారులాదారులా తనువు గొల్పు గోవులా చెంగల్వబావులా చిత్రంపు తావులా మావులా తాల్మిదాల్బు యేరులా యెనయకుబేరులా రాచకుమారులా మారులా మహిమకెక్క గీ. గోపురంబుకు సాటి యా గోపురంబు, ఆ పురంబెన్న యతిపతి కాపురంబు భూత పూర్వర మనగ నభూత పూర్వ, వైభవంబున దనరారి వసుధ మీఖె. 1- 63 ఆ సంస్కృత పారశాల కరీంనగర్‌కు తరలిపోయినా, వాణీవిలాస గ్రంథాలయ పుస్తకాలు చెల్లాచెదరయి దాగినా, కోవెల మాత్రం నిత్యపూజాధూపదీప నైవేద్యాదులతో శోభాయమానంగా ఉంది. గత వైభవాలకు ఈ కావ్యం భద్రపేటిక. మనస్సందేశ కావ్యం - కాళిదాసు మహాకవి 'మేఘ దూతమ్‌” కావ్యరీతిలో విరచితమైన స్వతంత్ర కావ్యమిది జీవుడు దేవుని చేరుకొను పరితపన - వేదాంత మార్గవర్ణన. దీని కావ్య వస్తువు ఆత్మపరమాత్మ సమైక్యం పొందటం సర్వధారి 1942 లో రచింపబడిన ఈ సంస్కృత కావ్యం జనప్రయోజనాన్ని అనుసరించి ముద్రణా కాలంలో ప్రతి శ్లోకానికొాక పద్యంగా ఆంధ్రానువాదం కావించారు సంస్కృతాంధ్ర కావ్యద్వయాన్ని ఒకే పుస్తకంగా ప్రచురించారు. ఈ కృతి పరిమాణంలో మేఘసందేశం వంటిదే. రెండు ఉచ్చ్వాసాలు కశ్చిక్కాంతా-వలె ఆరంభ శ్లోకమిది. కాచిత్కాన్లా ప్రకృతి విమలా జీవ భూతా ప్రియస్వ త్యక్త్వానాదేర్నిజ సహచరం కర్మయోగాదృమంతీ సంసారాఖ్యే మహతి విపినే కామితానామ్‌ ఫలానామ్‌ పాత్రం క్షేత్రం సకల సుమనళ్చిత్ర మేకం ప్రసేదే. రెండవళ్ళోకానువాదం చూడండి 4. ఆంధ్రీకరించ వలసినదిగా శతొవధానిగారికి తొమే సూచించినట్టు ఉత్పల సత్యనారాయణాచార్య మహాకవిగారు నాతో అన్నారు. 5. మనస్సందేశ కావ్యం 52 పుటలు. ఆందులో 130 పద్యాలు, 130 శ్లోకాలు, 52౫45=260,

172 డొ. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” ఆనారీ మజి సద్విజ ప్రవరుచే నచ్చోట హృన్నాయకున్‌ జ్ఞానానంద మయున్విదోషు బరమ స్థాన స్థితుం వించుత డ్ధ్యానోత్కంరితయై గనె నృదుల హృత్పంకేజ సంచారలీ లానైపుణ్యము మీరు సార హరణోల్లాసున్మనో హంసునిన్‌ ఇది క్లిష్ట వేదాంతానికి కమనీయ కావ్యరూపం ఆంధ్ర మహానాటకము - ఇది సంస్కృత హనుమన్నాటక చంపూకావ్యానువాదం ఇందులో మూలంలోవలెనే 14 అంకాలున్నాయి. గద్యపద్యాలు 1500 వరకున్నాయి కవి ఈ మహాకావ్యాన్ని మందమళ్ఞి మాధవరావు గారికి కృతియిచ్చారు నాటకమన్నా ఇది కావ్యం, అశ్వాసాలను అంకాలనడం, కొన్నిచోట్ల పాత్రల చేష్టలు స్వభావాలు ప్రవేశ నిష్క్రమణాదులు సూచించడం వలన ఇది సంస్కృత రూపకాలకు తొలిరూపమేమో అనిపించుతుంది. హనుమంతుడు ఈ రామాయణాన్ని (వ్రాసి వాల్మీకికి చూపగా అతడు అమృతబుద్ధిత్రో దాన్ని శిలానిబద్ధం కావించి సముద్రంలో పడవేయించాడట.* ఆ శిలాఫలకం ఒకటి భోజరాజుకు లభించగా దానిపై కల శ్లోకాలు చదివి మిగతా కావ్యశిలలను తీయించగా మిశ్ర దామోదర పండితుడు వాన్సిన్సి కావ్యంగా కూర్చాడట ॥ దీనిని కృష్ణమాచార్యులు యథామూలముగా తెనిగించినారు. “శతావధానులు గాం పలుకుబడి సులభము సుభోధకమునైనది. ఈ కావ్యరచనయంతయు సరళమైనరీతిలో సాగినది మూలమునందలి శ్లేషలను గూడా చక్కగా తెలుగులోనికి తెచ్చినారు” - వేముగంటి నరసింహచార్యులు, ఈ క్రవి “పద్దాల్సు సహజాంధ్ర రచన వలె తెలుగు దనముట్టిబడ చేయుచున్నవే గాని అనువాదముల వలె లేవు .=. వారదాచార్యులు అన్నారు పీరికలలో. ఆచార్యులవారి కావ్యావతారికారంభ పద్యమిది. " శ్రీరామున్షరి దశ్వ వంశతిలకున్‌ సీతాపతిన్‌ సుందరా కారున్‌ లక్ష్మణ సేవితాంఘియుగళున్‌ కారుణ్య రత్నాకరున్‌ శూరున్‌ వాలి హరున్‌ విరాధదమనున్‌ సుగ్రీవ సంసేవితున్‌ స్వైరావాప్త విభీషణున్షశముఖ ప్రధ్వంసకున్‌ గొల్పెదన్‌ దీనిలో ఒక పదం కూడా మార్చకుండా కేవలం ప్రత్యయాలు మాత్రం మార్చి. “శ్రీరామం హరిదశ్వ వంశ తిలకం సీతాపతిం సుందరా కారం వాలి హరం” అని కవి స్వయం శ్లోకంగా మార్చారు తత్సమ పద సరస విహారం కావించినా వీరి కవితలో తెలుగు పద విన్యాసం తక్కువగ్గాలేదు, గీ. బాటలో బాటసారుల వనిత లెల్ల, తరుణి కువలయ నీలు డీతండు నీకు నేమిగావలె నన సీత మోము వంచి, నోట జెప్పక లజ్జతో తేట పరచె - 3-40 “పథిపథిక వధూభిస్ఫాదరం పృచ్ళమానా' అను మూలశ్లోకంలోని భావాన్ని ఇంత సహజంగా తెలుగు చేసినా స్మిత వికసిత గండం ్రీడ విభ్రాంత నేత్రం' అను తృతీయ పాద భావాన్ని వదలివేశారు. కొన్ని తావుల కధా భాగాలను మితంగానైనా తగ్గించడం, కొన్న తాపుల ముఖ్యంగా వర్ణనలలో కొంత పెంచడం జరిగింది. స్వీయ కల్పిత పద్యాలను కవి పువ్వు గుర్తులతో సూచించారు. ఇందలి కధ సీతారామ కల్యాణం నుండి రావణ వధ, శ్రీరామ పట్టాభిషేకం వరకుంది. ఇందులో మొదటి పద్యంలో దశరథుని పరిచయం, రెండవ పద్యంలో అతని ముగ్గురు దేవేరులకు నలుగురు పుత్రులు జన్మించడం, మూడవ పద్యంలో విశ్వామిత్రయాగ సంరక్షణార్థం రామలక్ష్మణులు వెళ్ళడం - ఇదీ కధా వేగం. తర్వాతి కథా మధ్య వర్ణనలతో పాత్రల స్వభావ చిత్రణలతో కొంత నిదానంగా 6. ఎస్‌.కృష్ణమాచార్యుల 'ఆంధ్రమహానాటకము” 1973; 14-24, పుట-194.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాల్ల ప్రూర్వాస్ణ సాహాశ్యం” పద్య సాహిత్యం 173 సాగింది పూర్వకావ్యమే తిరిగి వ్రాయడానికి కారణంగా 'లోకంలో అపూర్వమైంది ఏదీలేదు. బ్రహ్మ “యధాపూర్వం'గా సృష్టి నిర్మాణం కావించినా నిత్యనూతనం కాదా' అన్నారు. ఇంకా 'రామకధ ఎందరు వ్రాసినా నవ్యమే - రామాయణం కొంతైనా వ్రాయని కవి కవికాడు కావ్యం కావ్యం కాదిన్నారు కావ్య పీఠికలో. చివరి పద్యంలో ఇలా వాకృచ్చారు కొందరు ప్రొాఢ కావ్యములు గ్రోలుచు సంతస మొందుచుండగా కొందరు భావ గేయముల గూర్చి ప్రశంసలు జేతురందు చే నందఠి మెప్పు లంబడుట యాశకు మించిన కార్యమిప్ణు నా యందనురాగముంచగల యార్యులనెంచి నమస్కరించెదన్‌ - 24 ఈ సరస కావ్యానువాదంలో సంభాషణలు సహజంగా ఉన్నాయి. మచ్చునకొక పద్యం - నేనాక వాయునందనుడ నీవొక రాక్షస కోటి రాజువ ఖ్లైనను నిన్‌ జయించి జనకాత్మజ దోడ్కొని పోసమర్భుడన్‌ గాని, కపీంద్ర రాజ్యమొసగన్‌ రఘురాముడు సత్యసంధుడై దానవ నాధ, నీవధను దానె ప్రతిజ్ఞను జేసె నప్పుడే 6-73 కవి స్వతంత్ర కల్పనల నుండి ఒక పద్యం కొత్త కోడలు గండాల కత్తి యేమొ, అత్తవారిల్లు సాచ్చిన యంతలోన బుడమి నంతటనుత్పాతములు చెలంగె, శాంతికై దీని నడవికి సాగనంపు 3-13 ఈ కవి కవనం మొల్ల రామాయణంవలె సరళం - సహజం - సుందరం. రామానుజ చరితము - అయిదాశ్వాసాల ఈ నిర్వచన పద్యకావ్యంలో 814 పద్యాలున్నాయి మొదటి పద్యంలో శ్రీరంగేశుని స్మరించిన కృష్ణమాచార్యులు నాలుగవ పద్యంలో వినతానందనుడౌ వినాయకుని నుతించారు! గరుత్మంతుడని కవిభావం, విహగనాధుడు వినాయకుడే మరి - శ్లేష ఇది వైష్ణవ యుక్తి కల్పన, గణపతి శివ పుత్రుడయ్యె! శతావధానాలు చేశాను. పెక్కు కావ్యాలు సంస్కృతాంధ్రాల్లో వ్రాశాను (21). అనువాద కావ్యాల గౌరనం మూల గ్రంధకర్తకు పోతుంది. కాబట్టి ఈ స్వతంత్ర కావ్యరచనకు పూనుకున్నాను -_ (28) అన్నారు కవి. ఈ కావ్యాన్ని కవితమ వృద్ధాప్యంలో నవనవ గజ శశి శకమున (5-173) రచించారు. అంటే నవ-9, నవ - 9, గజ - 8, శళి - 1, అంకానాం వామతో గతిః, అని ఈ 9981ని తలక్రిందులు చేస్తే. 1899 శాలివాహన శకం. దీనికి 78 చేరిస్తే క్రీస్తు శకం = 1977 ఈ గ్రంథ రచన కాలం; ముద్రణ - 1981లో. జగద్గురు రామానుజాచార్యులకు అంకితముగా ఈ కావ్యాన్ని వెదిర గ్రామస్సులు కృష్ణమాచార్యుల శిష్యులు చీటి రత్నమ్మ బాబురావుగారలు ప్రచురించారు త్రిమతాచార్యుల "పేర్లు హిందూమత పునరుజ్జీవకులుగా ప్రఖ్యాతం, రామానుజులు 12వ శతాబ్దివారు. వారి విశిష్టాద్వైత మత సిద్ధాంతం, శ్రీభాష్యాది రచనలు వ్యాప్తిలో ఉన్నా వారి జీవితచరిత్ర ప్రత్యేక గ్రంధంగా రాలేదు. ఆ లోటు పూరించడానికి కృష్ణమాచార్య కవి ద్రావిడ భాషలోని “గురుపరంపరా ప్రభావము”, సంస్కృతం ప్రపన్నామృతమ్‌, ఆంధ్రమందలి “ఆచార్య శ్రీ సూక్తి ముక్తావళి' గ్రంధాల్లో ఉన్న రామానుజ జీవితాంశాలను, రాజగోపాలనాయుడు గారి 'రామానుజుని ప్రతిజ్ఞ నవలలోని కంచీపుర చారిత్రక విశేషాలతో మేళవించి, ఈ కావ్యేతి వృత్తాన్ని స్వయంగా రూపాొందించుకున్నారు. ఇది రామానుజుని మత ప్రచారకుని గానే గాక, అతని బాల్యం, విద్యాభ్యాసం, సంసార జీవితం, సన్యాస స్వీకరణం, స్వీయ మతోద్ధరణం, దేశ సంచారం, పరమత ఖండనం, వైష్ణవాలయాల పునరుద్ధరణం,

174 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య బరిత్ర” గ్రంధరచనం మున్నగు అంశాలతో ఆసక్తిగా వినగల కథ వైష్ణవ భక్తులకు ఈ కావ్యం పవిత్ర గురుమూర్తి చరిత్ర ఆదిశేపుడే మొదట లక్ష్మణుడుగా, బలరాముడుగా తర్వాతి జన్మలో రామానుజస్వామిగా జన్మించాడని శ్రీవైష్టవుల విశ్వాసం రామానుజాచార్యులను ఈ కవి వర్ణించిన విధానం ఇది ,4 - 6 క్స్‌ ప్రాషండ తరుషండ పొవకా! చార్వాక పర్వత ఖండన వజ్రదండ! బౌద్భ్ధాంధకార నిపాటన భాస్కర! జైన మత్తేభ పంచాననేండద్ర! కాపీల తూల సంఘాత ్రభంజన ! 'ప్రచ్భన్న బౌద్దాహి వైనతేయ! కాణాద వాద సాగర కుంభసంభవ! నిగమాంత సిద్ధాంత నియమసరక్ష్మ గీ. అనుచు బిరుదాళి బాడుచుననుగు వైసష్ణ - వప్రకాండులు వెనువెంట వచ్చుచుండ భటులు మున్నాడి చని బరా బరులొనర్ప - వెడలె రామానుజార్యుండు విజయయాత్ర, ఆందులో రామానుజుడు ఖండించిన మతాలు పాషండం, చార్వాకం, బౌద్ధం, జైనం, కపిల సాంఖ్యం, ప్రచృన్న బౌద్ధనునబడే అద్వైతం, ఇంకా కణాదుని అణువాదం ప్రతిపాదించినది వేద ప్రతిపాదకమని శ్రీవైష్ణవ - విశిష్టాద్వైతం. పరమత ఖండనం స్వమత మండనం అన్ని మతాల్లో ఉన్నదే కాని, ముఖ్యంగా ఇందులో వాడిన రూపకాలంకార ఉపమానాలు కవి పాండిత్యానికి ఉదాహరణలు ఈ కావ్యంలో రామానుజుల తండ్రి కేశావాచార్యులు “భాగవతోత్తముల్‌ వచ్చినారని వి న్న నెదురేగి తోడ్కొని యేగుడెంచు 1-12. ఆ అతిధి సేవ, తృతీయాశ్వాసంలో యతిరాజు రామాన్సుజు డు శ్రీరంగంలో - వేకువతోడనే వెడలి కావేరిలో నఘ ఘర్షణ స్నానమాచరించి" (3 - 88) అను వర్ణనలు పె ద్దన మనుచరిత్ర ప్రధమాశ్వాసంలోని ప్రవరుని తలపించేవిగా ఉన్నాయి. వివిధ పుణ్యక్షేత్రాల్లో విష్ణుమూర్తిని స్తుతించు సందర్భాల్లో కవి కావ్యనాయకునికంటె ముందుగా పోతన భాగవతంలో వలెనే నిండు భక్తిత్ర పద్యరచన కావించారు. య నిరుపమ పాండితీ విభవనిర్దిత పండిత మండలుండు శ్రీ ధర కరుణా కటాక్ష పరిధావిత దుర్మత భూత సంఘుడా దరమున సంయమీంద్రుడు శ్రిత ప్రకరంబును గూడి మొక్కెదా నురుతర కాంతి విస్ఫుర దహోబలనాధుని శ్రీ సనాధునిన్‌ - 4-91 _ శైవ - వైష్ణవుల తగాదాల్లో విష్ణుమూర్తిగా మారిన తిరుమలేశుని రామానుజులు స్తుడించిన వైనమిది. యతిపతి వేంకటేశ్వరుని యద్భుత చర్యను గాంచి మొక్కి సం స్తుతి నానరించె కారిసుత సూక్తులచే నిగమాంత వేద్యునిన్‌ శ్రితజన కల్పకల్పుని సరీసృప భూషణ శోళితాంగునిన్‌ పతగ కులేశ కేతనుని పాపవిభంజను భక్త రంజనున్‌ - 4-99 వీరి రచనలు వైస్ణవభక్తి సంబంధమైనవి. స్తుతి గీతములు ఇవి పూర్వాచార్యుల సంస్కృత స్తుతి ప్రబంధాలకు తెలుగు పద్యానువాదాలు - తేటగీతొలు. మనోజ విజయ భాణము - సంఘ సంస్కరణాత్మక రూపకం ఆచార్యులు మొదట సంస్కృత గద్య పద్యాత్మకంగా వ్రాసిన ఈ దృశ్య ప్రబంధాన్ని తిరిగి తొమే తెలుగు చేశారు రెంటిని ఒకే పుస్తకంగా ముద్రించారు. భాణం సంస్కృత దశరూపకాల్లోని ఒకానొక దృళ్యకావ్య ప్రక్రియ శతకాలలో 'శతవిధ బంధపద్యశతకం' వీరి అపూర్వ అద్భుత చిత్ర కవిత పైభాణం ఈ బంధ పద్య శతకం కవితమ ఇష్టదైనమైన నిమ్మనపల్లి - నంబులాద్రి స్వామి ఉత్సవ బె న్నృత్యవర్ణనలతో

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్ద పూర్వాస్థ సాతశ్యం” పద్య సాహిత్యం _ 175 రచించారు తమ గురుతుల్యులైన కోరుట్ల సేనాపతి నరసింహాచార్యుల “యోగ భాస్కరమ్‌” సంస్కృత కావ్యానువాదమే కృష్ణమాచార్యుల 'గీతాచార్య మత ప్రభావ శతకము'.

గాంధీతాత నీతిశతకం - గాంధీజీ శతజయంతి; 1969లో దీనిని వ్రాసినా 1973లో ముద్రణ పొందినది. కందపద్య బాలనీతి శతకం. గాంధీజీ జీవితాంశాలు స్వభావాలతోపాటు ఇందులో నీతి వాక్యాలు కొల్లలుగా ఉన్నాయి. ఇందలి రెండు పద్యాలివి -

పరదేశీయుల పాలై - వరుసన్‌ పసజెడిన యట్టి భారతమాతన్‌

పరిపోషింపదలంచెను - సరిగన్‌ మన గాంధి తాత సద్గుణ జాతా!

పరుడొకడు పైన బడగా - పురుషుండయి తాను పారిపోవుట కంటెన్‌

మరలుచు కొట్టుట మేలనె - స్మరణీయుడు గాంధి తాత నద్గుణ జాతా!

ఇట్లా సంస్కృతాంధ్రాల్లో అనేక కావ్యాలను ఇహపరసాధనంగా రమణీయంగా రచించిన మహాకవి సిరిశనహళ్‌ కృష్ణమాచార్య శతావధాని

పదములు సంగతార్థములు భావ వికాన విలాస సంపదా

నృదములు, వాక్యముల్‌ నయవిచక్షణ దక్షతలజ్జజాల కం

పదములు, వేయు బల్కులను బల్కగ నేటికి తెల్పబూన నా

స్పదములుగావు దీనగల భక్తి విరక్తి సుమ్ముక్తి బోధముల్‌.

అని ఈ కవి 1977లో శ్రీరంగ శరగోపాచార్యుల “మానస శతకం”ను ప్రళంసిన్తూ చెప్పిన పద్య విశేషణాలలోని విశేషాలన్నీ శతావధాని కృష్ణమాచార్యుల కవిత్వానికి చక్కగా అన్వయిస్తాయి.

8, _ దివిలెభట్టు నరసింహరాజు - శనిగరం ; 20వ, శతాబ్ది పూర్వార్థం. ॥ నరసింహరాజు గారు హైదరాబాద్‌ మార్గంలోని కల్యాణి చాళుక్యుల ఏలుబడినాటి చారిత్రక పట్టణమైన శనిగరం గ్రామ వాస్తవ్యులు. భట్రాజు సలక్షణంగా తెలుగుపద్య కవిత చెప్పినవారు. వీరి ఏకైక పద్యకృతి పేరు “శ్రీవేంకటేశ్వర శతకము” 1929లో ముద్రితం ' జన్మతేది తెలియలేదు. 1950 సుమారుగా కీర్తిశేషులని వారి అన్నకుమారులు డి శ్రీహరి (ఆంగ్లకవి)కరీంనగర్‌ గారు తెలిపారు. * ఈ జిల్లాలో ముద్రణ పొందిన తొలి తరం పుస్తకాలలో నరసింహరాజు గారి శ్రీవేంకటేశ్వర శతకమొకటి. ఇది కంద పద్యశతకం. మకుటం 'సుందరాద్రి భవన విహారా !, ఇది కొన్ని పద్యాల్లో మారింది. హుస్నాబాద్‌ మార్గంలోని సుందరగిరి వేంకటేశ్వర క్షేత్రం. ఆ గ్రామం సమీపాన ఒకటి, అలతి దూరంలోని కొండపై ఒకటి వేంకటేశ్వరాలయాలున్నవి. సుందరగిరినే నుందరాద్రిగా పేర్కొని, అక్కడి దైవాన్ని నంబోధిస్తూ, కవి ఈ శతకాన్ని చెప్పారు. కవిత్వ పరిచయం - శ్రీలక్ష్మీ హృదయేశ్వర, నీలాంబుదవర్ణ స్వర్గనేతృస్తోత్రా (స్వర్గనేత = ఇంద్రుడు) కాలస్వరూప చిన్మయ, పొలింపుము సుందరాద్రి భవన విహారా ! 9.ప. క్షీరాబ్ధి శయన సంగర, శూరా విబుధప్రశస్త శోభిత గాత్రా వైరి కుల వినాశన సుమ, శర సుమశర సుందరాద్రి శరణ శరణ్యా |! త ర్రం 1 ఈ శతక వుస్తకం రేకొండ గ్రామంలో దేవత వేంకటరాజం కవిగారి పుత్రుడు డి శ్రీనివాస్‌ వద్ద లభించింది - 1991

  1. శ్రీహరిగారు రిటైర్డ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ - అనేక పర్యాయాలు కలిశారు

౩ చివరి చరణం మొదటి అక్షరం దీర్ధంగా ఉండాలి. కంద పద్యంలో నాలుగు పంక్తుల ఆద్యక్షరాలు లఘువులో, గురువులో అయి ఉండాలని ఛందోనియమం.

176 డొ. మలయశ్రీ “కరీంనగర్‌ జుల్లా సాహిత్య చరిత్ర” 'పై పద్యంలోని యమకాలంకారం గమనార్హం. సుమశర సుమశర - మన్మధ మన్మధుడని భావం. సాక్షాన్మన్మధ మన్మథ అని శ్రీమద్భాగవత ప్రయోగం. భక్తి భావ సంభరితమైన ఈ శతకంలోని మరో పద్యం ఇది - నీవు వినా తలిదండ్రులు, నీవు వినాబాంధవాళినిన్‌ నమ్మనునే భావమున నన్ను బ్రోవగ, భావించుము సుందరాద్రి భవన విహారా .- 8 ఈ కవి భాష - భావాలు సరళం. ఈ పద్యాలపై శ్రీకృష్ణ శతక ప్రభావముంది. దివిలె నరసింహరాజు గారు భక్త కవి. 9. _ విష్ణుదాస గిరిధర కవి - గుందేడు. తా. హుజూరాబాద్‌ మృతి - 1942. గిరిధర రావు పేరుతో గోలకొండ కవుల సంచికలో 'రాష్ట్రమాత' పద్యాలున్నాయి. ' అందులో కవి న్వగ్రామనామం తప్ప ఇతర వివరాలు లేవు. విష్ణుదాన గిరిధర కవి పేరుగా “వీరభద్ర విజయం" కావ్యం లభించింది. ' వీరిద్దరు ఒక్కరే. గిరిధర రావు గారి స్వగ్రామం గుండేడు. జన్మగ్రామం చల్లగరిగె. బద్రి పర్కాల తాలూకాలోనిది. ఇప్పాడు వరంగల్‌ జిల్దాలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు పూర్వం కరీంనగథ జిల్లాలోనిది. విష్ణుదాస గిరిధరరావు గారి అన్న గారు లక్ష్మీకాంతరావు ప్రముఖ కవి. బహ గ్రంధక్షర గారపా టి రాఘవరెడ్డి గారికి విద్యాగురువు. తర్వాత రెడ్డి గారితో కలిసి జంట కవిత్వం చెప్పి ఉభయులు రాణించినవారు. వీరి తండ్రి శ్రీధరుడు. గిరిధర రావు చల్లగరిగె నుండి గుండేడుకు దత్తు వచ్చారు. వ్లీర్చ నియోగులు - కరణ బ్రాహ్మలు. గిరిధర రావు గారి భార్య మధురాబాయమ్మ గొరు కూడ్రా భక్తిపాటల్సు ఛ్రాశారు. ఈమె 1969లో కన్నుమూశారు. గిరిధర రావు గారి రచనలు ఈ రెండు పుస్తకాలుగా వచ్చి నవి

  1. వీర భద్రస్తవము - 1931 ప్రచురణ, 2. శ్రీదుర్గేశ్వర భజనకీర్తనలు - ముద్రితం, బి వీరు పెక్కు రచనలు చేసినా, అవి అప్పుడు అముద్రితాలు; ఇప్పుడు అలభ్యాలు శ్రీ దుశ భజన కీర్తనలు హన్మకొండలోని కనకదుర్గ స్పుతిగా వ్రాసినవి శాస్త్రీయ సంగీతం జోడ్రింి వ్రాయబడ అక్కడి భక్తులు వీటిని పుస్తకంగా ముద్రించారు; భజనలకు పాడుకున్నారు. నవి వీరభద్రస్తవము - కవి గారి భార్యమధురాబాయి, గ్రహబాధాపీడితురాలెనప డు, ఆదుష ని క్‌ రూ చ , ఆ దుష్టగ్రహబాధ్ధా వారణార్థం ఈ వీరభద్ర కావ్యరచన కావించినట్టు పీరికలో తెలిపారు. ఈ స్తుతి ప్రబంధం ముప పుటలు. పద్యశైలి ప్రసన్నంగా ఉంది సలక్షణ కవిత, మకుటం పాటించి ఉంటే ఇది శతకం ఉండేది. కవి స్వంత తాలూకా హుజూరాబాదులో కొత్తకొండ అనే వీరభద్ర క్షేత్రమున్నది. పంద మకరసంక్రాంతి పర్వసందర్భాన మూడుదినాలు అక్కడ జాతర జరుగుతుంది వీరళర్రు గో గణముఖ్యుడైనా శివపుత్రుడుగానే జానపదుల విశ్వాసం. కరీంనగర్‌ జిల్లాలోని కొత్తకొండ్ర వీరభ। డ్‌ ఏద స్తుతి కావ్యం గిరిధర రావు గారి ఈ పద్యస్తవ కృతి. వీరభద్ర జన్మవృత్తాంతము, మహత్వమి సా న వర్ణనాంశాలుగా సాగిన ఈ కావ్యారంభ పద్యమిది (అరా శ్రీ దుర్గేశుని తత్సతీ మణిని నా చిత్తంబులో నెంచి యా మీదన్‌ దంతి ముఖున్నుతించి పిదపన్‌ మేధోబలోద్దామునిన్‌ ఆ దక్షాధ్వర నాళనార్థ జనితో ద్యద్బాహు సాహస్రునిన్‌ వేదాతీతుని వీరభద్రుని మహావీరున్‌ బ్రశంసించెదన్‌ 1 గోలకొండ కవుల సంచిక-1934 కవి నం.289, పు-310
  2. ఈ పుస్తకం కమలాపూర్‌ మండలంలోని గూడూరు వాస్తవ్యులు క్రీ.శే గంగురామకృష్ణయ్యగారి గృహ గ్రంధాలయంలో ఉంది - 1993. 3 ఈ కవి జీవితవిశేషాలు వీరి దత్తపుత్రులు వి.సాంబశివరావుకవిగారు, తేది 23.394 లేఖలో తెలిసినవి

రెండవ భాగం - ౪ అధ్యాయం . “206 శతాల్ల పూర్వాస్థ సాతాత్యంం పద్య సాహిత్యం 177 సుకవిస్తుత్యనంతరం కుకవులనిట్టా అభిశంసించారు. వ్రణము గని యీగ చప్పున వ్రాలునట్టు, వికృత వృత్తిని రంధ్రముల్‌ వెదకునట్టి కుకవి జనులను ప్రార్ధింతు కొమరు మీర, మంచి జూచియు మది సంతసించుడనుచు - 10 కవి తనను గూర్చి వినయంగా ఈ విధంగా మనవి చేసుకున్నారు లలిత పదార్థ గుంభన సలక్షణ వృత్తములన్‌ రచింప + క్తులగు కవీం[ద్ర బృందములతో దులదూగు కవిత్వసారము న్నల వడ నేరదైనను బుధాళి మనంబున నెంత్రుగాక నా పలుకులు పాలితాత్మ శుక వాక్యములంబలె నిండు (పేమతో - 4 ఇందులోని సారమున్నలవడ - అన్నిష్టసఖివంటి సంధి శుక వాక్యములోని శ్లేష గమనార్హం, శుక = చిలుక, శుకమహర్షి

వీరభద్రస్తవం సంపూర్ణ శివభక్తి కావ్యం. ఇందలి వీర భద్ర స్తుతి పద్యమెకటి “నుమన

మనోంబుజా' అనేది ఇదే ప్రకరణంలోని గో.క.సం కవుల వరుస నం, 3౩7లో చూపబడింది. పద్యం 102లో శరభ సాళ్వావతార ప్రసక్తి ఉంది. గో.కసం,లోని వీరి 'రాష్ట్రమాతి పద్యాలు కవి జన్మదేశ మాతృభాషాభిమానాలను చాటేవిగా ఉన్నాయి. గిరిధర రావు గారు పండిత కవి

  1. ఎదులాపురం బ్రహ్మానంద వేంకట నరసింహాచార్యులు ; మొగిలిపాలెం; మండలం, కేశవ (శంకర) పట్టణం.

నరసింహాచార్యులు విశ్వబ్రాహ్మణులు. మొగిలి పాలెం వాస్తవ్యులు. ఈ ఇరువదవ శతాబ్ది పూర్వార్థంలో జీవించినవారు. ఈ వరకవి రచించిన ఏకైక కృతి 'కంచి కామాక్షి శతకము' 1931లో ముద్రణ పొందింది. కవి పరిచయం శతకాంత గద్యలో ఇట్లా ఉంది.

“శ్రీమత్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మరాధ్యక్తులైన శ్రీమత్‌ నుమనుము (?) గోవిందస్వాముల ప్రియశిష్యుండగు మొగులుపాలెం పురవాస్తవ్యులు నగు శ్రీమ ద్రాజరాజేశ్వరి వరప్రసాద కుడగు బ్రహ్మశ్రీ యెదులాపురం బ్రహ్మానంద వేంకట నరసింహాచార్యులచే రచింపబడి .. = దీనిలో తల్సిదం(డ్రుల పేర్లు లేవు

న్‌ వీరి కవితలో గణభంగ పాదాలు, జెయము, బంగురు వంటి గ్రామ్య పదాలున్నవి. వరకవులలో ఇది సహజం. శతక మకుటంలోని “'ఘునముఖులి ఈ జిల్లాలోని ఘన ముక్కుల గ్రామ దేవతను " సంబోధించి ఈ శతకరచన కావించి ఉండవచ్చు. ఫఘనముఖ్‌ల అంటేగణభంగం కూడా కాదు కవి ఇంటిపేరు 'యెదులాపురం' అని అన్నారు. అది ఏదులపురం అనుకోవచ్చు. అది నేటి హుజూరాబాద్‌ ప శ్రీ పూర్వనామం. పట్టణాన్ని పా సోమారి శతకంలో 125 సీన పద్యాలున్నాయి. మకుటం గీత పద్యం చివరి రెండు చరణాలు. కవి కవన పరిచయానికి ఒక పద్యం ఇట చూపబడుతున్నది. సీ శ్రీ విరాడ్రహ్మయౌ చిద్రూపు రాణివి, భావంబు నను నేను ప్రణుతి జేతు శ్రీ న్వరాడ్ర్రహ్మ స్వచిళ్స దా నందు (ను), కేవలంబునయే (కే)ను కేల్మాగించు (కల్మాగిఛెద) శ్రీవిశ్వ బ్రహ్మ సంశ్రిత పంచముఖజు చే,మన్వాది బ్రహ్మల మదిదలంతు జీవేశ్వరుల గురుజననియౌ గాయిత్రి (య) దేవి నెమ్మదిని సదేన దలతు (సదైవ) గ్‌ పంచ వేద సమాతృకన్‌ బ్రస్తుతింతు, పంచ పంచీకరణము ప్రపంచ మెంతు కంచి కామాక్షి ఘనముఖుల కమల జాక్తి పంచ బ్రహ్మల పాలించు బ్రహ్మ సాక్ట్‌

178 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” కంచి కామాక్షి మధుర మీనాక్సి బెజవాడ కనకదుర్గ, చాందా - సికిందరాబాదు మహాంకాళి శక్తి మూర్తులను ఈ (ప్రాంతపు జానపదులు శలిచేవారు. హన్మకాండ పద్మాక్షిని పార్వతీ దేవిగానే చెప్పుతున్నా ఆపేరు ఆంచగా వ్యాప్తిలో లేదిక్కడ,. ఈ కవి కాలిని కమలాొక్షి అనీ సంబోధించారు. అంచే సద్యాక్షి అనే అర్థం. ఇది భక్తి శతకం 1 ఖు ఆనందమాంబ - కొడిన్యూల ; జననం - 1922. మృతి - 1394 ఆఅనందమాంబ చినవయసుళోవే సంస్కృతాంధ్ర భాషలలో పొండితంం స న ఏటనే తెలుగు కావ్యము లయం కవయిట్ర ఈమె అష్టావధాని. గట ముసి పస్హైందవ నలుగురు కవయిక్రులలో ఈమె ఒకరు. ' కరీంనగర్‌ జిల్లా వెయ్యేండ్ల తెలుగు సాప్టా త్య చరిత్రలో మొట్టమొదటి కవయిత్రి ఆనందమాంబ. ఈ ఈ కవయిత్రి రచనలు :

  1. వెలమ వీర 2. మాధవ పంచాశత్‌, 3. సతీలలామ - 1934లో ముద్రితం. మొదటి రెండు కృతులు అలభ్యాలు, వాటిని గూర్చి కవయిత్రి కూడా చెప్పలేదు శతావధాని సిరిశినహళ్‌ కృష్ణమాచార్యులు గారు తమ స్వీయ చరిత్రలో ' ఈరెండు పుస్తకముల ని. వ్రాసినట్లు చెప్పినారు = బ్రాని ఇప్పుడవి లేవు. 'సతీలలామి ఏకాశ్వాస పద్యకావ్యం మాత్రం మ్రు బక వంశ వివరాలు : ఆనందమాంబ అనందబాయి అని సతీలలామ కావ్యంలోని ఆ్ర్బ శ 0, నృసింహాచార్య శాస్త్రి గారి పీరిక వలన తెలుస్తున్నది. జగిత్యాల తాలుకాలోని కొడిమ్యాల స కట పునుగోటి బుచ్చమ్మ మంగారావు గొరలు కవయిత్రి జననీ జనకులు. స్త్రీ విద్యక్రు అడది. కాలంలో తండ్రి ప్రోత్సాహం లభించి ఆనందమాంబ విద్యాభ్యాసం జరిగింది. ఒక భట నిఆ ఆంధ్రభాషా సాహిత్యాలు నేర్చగా, శతావధాని కృష్ణమాచార్యుల వద్ద మూడేండ్లు సంస్కృత ఫై మూర్తి శాకుంతలం, ఉత్తరరామచరిత నాటకాలు చదివారు కావ్యాలు ఆమె మేనమామ బండలింగాపూర్‌ సంస్థానాధీశులైన అనంత కిషన్‌ రావ ఆధ్యక్షతలో ఆనందమాంబ గారిచే అష్టావధానం చేయించి సంతసించి “కవయిత్రి బాలసటు. తమ బిరుదొన్లి ఇచ్చారు ళ్‌ తర్వాత ఈ రాజా వారి మేనల్లుడైన భూమారావు బి.ఏ, గాలితో అన అను వివాహం జరిగింది. వారిది మెట్టుపల్లి తాలూకాలోని వేములకుర్తి, ఆనందమాంబ గారు హై ౦దమాంబ ఇటీవల కీర్తిశేషులైనారు. పౌదేరాబాద్‌లో కొవ్య విశేషాలు ; ఆనంధమాంబ గారి 'సతీలలామ' ముప్పది పుటల చిరుపొత్తం. ఇది ఏబది పదాల ఏ నిర్వచన పద్య కావ్యం. చివర నీతిశాస్త్ర శ్లోకాలను కొన్ని (9) ఆంధ్రీకరించారు స్తుతి | త కాశ్వాస “అఖిల గుణభూష యానందమాంబ పోష అనుమకుటంళతో విష్ణుప్రశంసగా బాలకృష్ణ లీలలను పేర భక్తి ప్రపత్తులతో పది తేటగీతి పద్యాలను వ్రాశారు (పు-25-27). కవయిత్రి కావ్యారంభం శే క్‌ ఇది - 1 గోలకొండ కవుల సంచిక - 1934, కవిత నం. 279 2 స్వీయ కవితాను జీవనమ్‌ - 1986, పుట-44 3 కవయిత్రి దగ్గర కూడా లేని ఈ కావ్యం అచ్చుప్రతి ఎక్కలదేని లక్ష్మణకవి కోరుటగారి వద్ద లభించింది. 4. సతీలలామ-1934, ఉపోద్దాతాము ప్ప-3 ( 5 ఏస్‌. కృష్ణమాచార్యగారి 'స్వీయ కవితాను జీవనం" పు 44.
  2. ఎస్‌. కృష్ణమాచార్య గారి 'స్వీయ కనితాను జీననం' పు, 45

రెండవ భాగం - ౪ అధ్యాయం * “206 శతాల్చ డ్రూర్వార్థ సావాశ్యం” పద్య సాహిత్యం 179 ఉ. శ్రీలలనా మనోహరుడు జెన్నుగ ముజ్జగ మేలుచుండగన్‌ లీలగ సూకరంబయిన నీరచరంబయి యున్న బాయకన్‌ స్త్రీ లకు లోకమందు పతి సేవయె ధర్మనుటంచు దెల్పు మా పాలిటి దైవ మైన సిరి పాలన జేయును గాత నిత్యమున్‌ పతి ఏ రూపంలో ఉన్నా అతని వెన్నంటియున్న లక్ష్మీ సతీలలామ తమను పాలించాలని కవయిత్రి వేడికోలు స్త్రీ రచించిన కావ్యం స్రీలకు సంబంధించిన విషయం కనుక ఆమె స్రీ దేవతనే కావ్యారంభ పద్యంలో స్మరించి బెచిత్యాన్ని పోషించారు. కావ్యేతివృత్తం కూడా ఈ పద్య భావంలో ధ్వనించడం విశేషం. ఈ బాల కవయిత్రి కావ్య ద్వితీయ పద్యంలో శారదాదేవిని ఇట్లా నుతించారు. సీ, వెలిదమ్మి పువ్వున విలసిల్లి యొక కేల, వీణ వాయించెడు వెలది యెవరు పొత్తంబు నొక చేత పొసగ ధరించియు, తొలిపల్కులను బాడు కలికి యెవరు రాయంచ పైనను రమ్యంబుగా నెక్కి, ముజ్జగంబుల దిర్లు ముదిత యెవరు తలచిన వారికి దయతా విద్య నాసంగు, నలుమొగంబుల 'ప్రోడ నాతి యెవరు. గ అట్టి నీవును నా మనంబందు నిలిచి, ప్రేమమును నిల్చి పుడమిలో పేరు మించు కబ్బముల గూర్చగా శక్తి గలుగ జేము, మమ్మ మాయమ్మ నినుదలతు నమ్మవాణి. వెళి దమ్మి కేలు, వెలది, పొత్తము, రాయంచ, ముదిత, కబ్బము అచ్చ తెలుగు పదాల ప్రయోగం కవయిత్రి తెలుగు భాషా ప్రీతికి, తొలి పల్కులు - వేదములు, నలుమొగంబుల ప్రోడ్‌ - బ్రహ్మ పదాల ప్రయోగం పాండిత్యానికి నిదర్శనం. ఇందలి దయత్తొ, చే చేతన్‌-తో తోడన్‌ తృతీయా విభక్తి ప్రత్యయాలు దీర్ధంగా ఉండవలసిన వానిని హ్రస్వంగా వాడడం బాల కవయిత్రి ప్రయోగంగా సరిపెట్టుకోవచ్చు. నినుదలతు - గణభంగం. నినుదల్తు పదం ముద్రారాక్షసం కారణంగా మారవచ్చు. శతావధాని కృష్ణమాచార్య గురువరులకు వందన మాచరించి, కం. కవులన్‌ మొక్కుచు మది దు, ష్కవులన్‌ విడనాడి యొక్క కబ్బంబును నే భువి గూర్చు చుంటి నందున, చవి గొని తప్పులను దిద్ద జాలుదురు బుధుల్‌ - 4 అని తర్వాతి పద్యంలో పతి భక్తి ప్రభావాన్ని వర్ణించి సతీలలామ కావ్య కథారంభం కావించారు కవయిత్రి. సీత, సావిత్రీ దమయంతి, చంద్రమతి (18), అనసూయ (19) ల పొతివ్రత్యమహిమల పొగిడారు పతివ్రత శాపం సాంది దాని నివృత్తికోసం ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళిన కౌశికుని కథ (23-30) ఎనిమిది పద్యాల్లో వివరింపబడింది. ఇంగ్లీషు చదువుల మిడిమేలపు చేష్టల ఆధునిక యువతులు, పతుల అగౌరవ పరుస్తూ ఏ విధంగా దిగ జారిపోతున్నారో వర్ణించారు (30-34). కులహీన విద్య, మాతృభాషాభిమానరాహిత్యం అందుకు కారణమంటూ ఇట్లా హితోపదేశం చేశారు. ఉ స్రీలకు నన్ని ధర్మములు చిన్నతనంబ్లున నేర్చి బుద్ధి సంచాలన మొందజేయగను సాధ్విని జేయగ మాతృభాషయే మూలము దానినే చదువ బూనిన వారలు లోకమందు సచ్చీలురు లేనిచో సుదతి జీవన మంతయు నిష్ఫలంబగున్‌ - 36 కవయిత్రి మాతృభాషాభిమానం ఆదర్శ ప్రాయమైనది ఇంకా బాల్యవివాహాల నిరసిస్తూ, స్రీ విద్యావ్యాప్తిని ప్రశంసిస్తూ దేశాభ్యుదయాన్ని ఆకాంక్షించారు (39-40) గ విద్య గల వారె జగతిలో నీర వరులు, విద్య లేనట్టి నారలు వెజ్టీవారు - 44 అని జనానికి హితాన్ని ప్రబోధించారు. ఈ కృతి చిన్నదైనా అశయంలో మిన్నది 12, కమఠం వేంకట రామానుజం - మన్నెంపల్లి : జీవితకాలం 1910-80 సుమారు. కమరం రామానుజంగారు చాత్తాద వైష్ణవులు కరీంనగర్‌ జిల్లాలోని నాటి మొలంగూరి పరగణా నేటి తిమ్మాపూర్‌ మండలంలో మన్నెంపల్లి వాస్తవ్యులు ఆయన వైద్యవృత్తిలో జీవించిన వైష్ణవభక్తుడు,

180 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” కవి. వేంకట రామానుజంగారి తల్లి రామాంబ, తండ్రి రామానుజంగారు. తన పేరు కావ్యగద్యలలో రామానుజ దాసుగా చెప్పుకున్నారు. కవి ధర్మపత్ని శేషాంబ. వేంకట రామానుజంగారు బహుగ్రంధకర్త." ఈ కవి ముద్రిత గ్రంథాలు : 1. శ్రీమనోహర శతకము -1942, 2. శ్రీకమలాక్షి పతివ్రత కధ - (పద్యకావ్యం) 1946; 1355 ఫసలీ, 3. సీతా కల్యాణము -బుజ్టకధ, 1959, 4 గజేంద్రమోక్షం బుజ్జికధ - 1961 5. శ్రీ సీతారామ చరిత్ర - పద్యకావ్యం - 1965.

అముద్రిత రచనలు : 1. శ్రీరామాయణ గీతలు, 2. తందనాన పరకాల బుజ్జికధ, 3. తిరుమంగయాళ్వారు బుజ్దికథ, 4. చంద్రహాస చరిత్ర, 5. ఉత్తర కాండము - ద్విపద, 6. శ్రీ భద్రాద్రి సీతారామస్తోత్రమ్‌, 7 తొండరప్పాడి యాళ్వారుల వైభవము బుజ్జకధ (విప్రనారాయణ కధ)

కవి 'గజేంద్ర మోక్ష బుజ్జకధ' కావ్య గద్య ఇట్టున్నది.

“ఇది శ్రీమాన్‌ తిరుమల ధర్మాచార్య పొదరాజీవ షట్బరణమాన శ్రీకమురం వంశ పయః పాఠావార రాకాసుధాకర రామానుజధర్మసత్ని రామాంబ గర్భశుక్తి ముక్తాఫల శ్రీ భాగవత విధేయ వేంకట రామానుజ దాస ప్రణీతంబైన గజేంద్రమోక్షణ కథ సమాప్తము” 1961

కావ్య పరిచయం : 1 శ్రీమనోహరశతకం. 1942 ముద్రణ ఇది విష్ణుభక్తి మయం. "'శ్రీమనోహరా' అను మకుటంతో చంపకాలు వ్రాసే వీలున్నా కవి కేవలం ఉఊత్పలమాలతోనే శ్రీపతిని అర్చించారు. శతాకారాంభ పద్యం. ఉ. శ్రీ రమణీ మణీ రమణ సింధు కృపాకర భక్తలోల వి స్తార దురంత పాతక వితాన విదార సమస్త దేవతో ద్ధార పరాశరాది ముని తత్వ విచార పదార్థ ఘోర సం సార విచారణా నిరత సౌఖ్య శుభప్రద శ్రీ మనోహరా

ఈ పద్యంలో ఒక్క తెలుగుపదం కూడా లేదు. అన్నీ సంస్కృత పదాలే.

చూడగలేదు శాస్త్ర గుణ సూక్తులు - తల్లియుదండ్రి నీవె - దీనుడ దుష్టమానువుడ - ఏరిని గొల్వ పోనెరుగ - ఇటువంటి ఎత్తుగడలతో హరిభక్తితో రచించిన ఈ శతక పద్యాలలో ఈ కవి దుష్టమానవ నింద తక్కువగా చేయలేదు. రామాయణ గాధను స్మరించారు.

  1. కమలాక్షి పతివ్రత కథ : ఈ చంపూ కావ్యం 1946లో ముద్రింపబడింది. ఈ కావ్యంలో నాటకం వలె కొన్నిచోట్ల పాత్రల ప్రవేశం సూచింపబడింది. పురాణ కావ్యగాధలలో వలె సన్నివేశ వివరణ వాక్యాలు కూడా ఉన్నాయి. తొహరలు, కీర్తనలు - దర్వులు, పద్యాలు, వచనాలు ఉన్నవి. ఈ కావ్యాన్ని హరికథగా చెప్పవచ్చు. కాని, కవి అట్లా కావ్యాన్ని నామాంకితం చేయలేదు. ఈ కావ్యంలోని వచన భాగాలు బాలకవి జి.లక్ష్మారెడ్డి వ్రాసినట్లు కవి చెప్పుకున్నారు.

ఇందలి కధ కల్పితం. దూర్వాసుడు నారదునితో పంతమాడి పోయి కాశీపురిలోని కమలాక్షి అను సొధ్విని ఆమె భర్త నారాయణ శాస్త్రీ రూపాన భంగపరుచ ప్రయత్నించడం ఉంది ఇది అహల్యను చెరచుటకు మాయా గౌతమ రూపుడైన సురేంద్రుని, తులసిని భంగపరచిన మాయా జలంధర రూపధారియైన విష్ణుమూర్తి గాధలను అనుసరించిన కధ. ఈ కావ్యనాయిక శీలమునకు ప్రమాదం వాటిల్లకపోవడం విశేషం. ముని ఆమె పాతివ్రత్యానికి వెరచి అత్మగతంగా వాపోయిన పద్యం ఇది.

సీ, నారదుచే నేను నాడిన శపధంబు, బూదిలో నాజ్యంబు బోసినట్లు

నాయె నికేమి యీ నాతి బతివ్రత, శెపియించెనా నాకు చేటు గల్లు 1 కవిగారి ముద్రిత పుస్తకాలను అముద్రిత రచనల (వ్రాత ప్రతులను వారి దౌహిత్రులు నరసయ్య తెలుగు పండిత్‌ గరిశెకుర్తిగారు అందించారు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద పూర్వాస్థ సాఫొశ్యం” పద్య సాహిత్యం 181 నని చాల చింతించి తానాననంబెత్తి, నురరాజు నభకిట్లు సాచ్చువాడ సొచ్చితి బో మౌని సూరి జనంబుల, ముందర నేనెట్లు ముచ్చటింతు గీ. కాన ప్రస్తుత మీమెను గారవించి, పాదముల కెరగి మన్ననల్‌ బడయమేల టంచు మదినెంచి దనరూపు దాల్చి ననియె, తల్లి నీబోటి సాధ్వినీ ధరణి గాన. ఇది కరుణళ్రీ కుంతీవిలాపొన్ని నూరన కళాపూర్ణోదయ రంభ పరాభవ వేదనను తలపించే భావం ఈ కవికి భావంపై ఉన్న దృష్టి శబ్దాల పొందిక అలంకారాల కూర్చుపై లేదు. యతిగణాలు కూడా కొన్నిచోట్ల తప్పడం గగ్రామ్యుపదాల ప్రయోగం కవి విద్వాంనులు కారనడానికి నిదర్శనం, 3. సీతారామ కల్యాణం - ఇది బుజ్జకధ 1959లో ముద్రితం. పూర్వ కావ్యద్వయంలో రామానుజ విరచితం అని పేర్కొన్న కవి స్వీయనామాన్ని ఈ కృతిలో రామానుజదాసుగా వ్రాసుకున్నారు. ఇందులో పాటలు పెద్దవి. వచనాలు తక్కువ కథకునికే కాక వంతకులకు కూడా గ్రాంధిక భాష ప్రయోగింపబడింది కోస్తాంధ్ర క్రియా పదాలతోపాటు పాలించినరు వంటి తెలంగాణా మాండలిక పదాలు సైతమున్నవి. తందాన, రామరామ, అరే-వంత పదాలు విషయం ప్రఖ్యాతమైనది - పొరా ఖికం 4. గదేంద్రమోక్షం బుజ్జకథ (కరి రక్ష - మకరి శిక్ష) - 19361 ఇది భాగవతంలోని కధ. కధారంభమిట్టుంది వినుండయ మీరు వినుండయ, గజరాజు చరితాము వినుండయ గజరాజు చరితాము కర్ణాన బడినంత, గజిబిజి వ్రయమౌను కమలాక్షు కరుణించు. పద సాధుత్వం తప్పినా పాట లయ మాత్రం తప్ప లేదు. మచ్చునకొక పద్యం - కం యిద్దరు తల్గుల శ్రీవతి ముద్దుల బిడ్గండవైన ముక్కంటి సుతా పెద్దోదర దేవర నా, పద్దెములను దిద్ద మిమ్ము ప్రార్థింతుమదిన్‌. ఈ పద్దెంలో యతిగణ ప్రాసలు చక్కగా అమరినా పద్యాదిసద అచ్చుకు యకారం పెద్దోదర దున్సంధి వ్యాకరణ భంగాలు. ఈనాటి వస్తూంది, వస్తోంది, వాజి దుష్టసంధులే, ఒక వచనం “వంతకుడు : గజిబిజి యేంటి గజరాజేంటి మేం వినేదేంటి? వింటే మాకు వచ్చేదేంటి? వూర్కే-వార్డుతావేంటి?” ఒర్రు - ఒర్లు = ఆరచు పదానికి ఇవి ఈ ప్రాంత మాండలికాలు వూర్కే, యడాగమం వల్కె వడాగమం మన వ్యావహారికంలో ఉందే ఏవూరు? రావమ్మ! లో. తమిళ కన్నడ భాషలలోనలె. కాని, మన తెలుగు వ్యాకరణవేత్తలు ఇంకా దీన్ని సరియనలేదు ఈ నాటి వస్తూంది, వస్తోంది, వాణ్ని దుష్టసంధులే సిరికింజెప్పడు, భాగవత పద్యాన్ని గేయంగానూ అలవైకుంరపురంబులో పద్యాన్ని యధా తథంగానూ కవి ఇందులో వాడుకున్నారు. పై నాలుగు పుస్తకాలు 20-30 పుటల చిరు కృతులు 5. థ్రీ సీతారామ చరిత్ర - ఇది రామాయణ గాధ - చంపూ కావ్యం అధ్యాయాలు లేవు కాని, రచన పెద్దది. పద్య సంఖ్య లేదు. దాదాపు వెయ్యి గద్యపద్యాలుంటాయి 1965లో ముద్రింపబడింది. ఈ కావ్యంలో కవికి రామునిపై గల భక్తి అపారం. శ్రీరాముని దయగలదో, నారాముని చరిత మమృత సార సముద్రం (యతి? పైగా నొా-యా,) బేరీతి గ్రోలగలనిక నేరీతియు శక్తి గలదికేమనువాడన్‌. 2. మాలా+ఐ = మాలావై (తమిళం) మాలను అని తెలుగు; మూరు+అరి = మూరు వరె (కన్నడం) మూడున్నర అని తెలుగు. 3. 107 పుటలు ౫ 9 సగటున గద్యపద్యాలు = 956 మొత్తం

182 డా మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాపొత్య చరిత్ర” 'పైది ఆరంభ పద్యం రెండవ పద్యంలోని వినయ ప్రదర్శనమిది పషోతననుగాను రాముని ప్రోత్సహించ, భాస్కరుడ గాను రాముని బ్రస్తుతించ ఆంధ్రవాల్మీకినా రాముననుభవింప, యెంతవాడను రామునే నెరుగుటకును ఇది 'పుట్టంబుట్ట శరంబునన్‌ మొలువ' - పోతన పద్యానికి అనుసరణం. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారు - 1937 మృతి కథాగమనం ఈ విధంగా ఉంది. ఆంజనేయుడు లంకాదహనం కావించిన తరవాత, | మరల సీతను గనుకొని మాటలాడి, సెలవు బొందియు రాముని జేర నరిగ కంటి సీతను మీ దేవి కరుణ వలన, మిమ్ము జేరితి' కుశలమా మీకురామ ॥ రామానుజంగారు వరకవి. వీరి పుస్తకాలు ఓరుగల్లులో ముద్రితమై, సికిందరాబాద్‌లోని ప్ర ము పుస్తక వ్యాపారులచే విక్రయింపబడ్డవి. 'ప్రతులు అయిదారు వందలే. వెల అణాల్లో - మింద్‌క ఖ రూపాయి. సీతా చరిత్ర కావ్యం (వ్రాసిన వటపురి వేంకటాచార్యులతో ఈ కవికి పరిచయనున్నద్రి ఒక కావ్యం 1961లో వెలువడింది. దాని ఒక ఆశ్వాస ముద్రణకు ద్రవ్యసహాయంచేసి మిగిలిన తి ఆశ్వాసాలకు దొతల చూపిన ఉదారుడు రామానుజకవి. వేంకటాచార్యుల సీత్రా చరిత్ర ప్రేర అడు రామానుజంగారు ఈ రామకథ వ్రాసినట్టున్నారు. వారి వ్రాత ప్రతులలో “క్రీరా మచరిభ్ర' ఆనె ఇతోనే అచ్చులోనే శ్రీ సీతా రామచరిత్రమని వెలువడింది ఉంది, ఆముద్రిత రచనలు :

ఓ. భ్రీరమాయణ గీతలు. ఇది తేటగీతి పద్యాలలో ఉంది. ఆరు కాండలలో 69+54+156+166+232+327. కృత్యాది 6. కాండాంత వృత్తాలు 7 సంక్షిప్త రామాయణం 229 మొత్తం 1045 పద్యాలున్నాయి. ఇది నిర్వచన పద్యకావం. వ్రాసిన కావ్యమే తిరిగి వ్రాయడం క్రవి రక నిదర్శనం. కవిత ముద్రిత కొవ్యాలకంటె దీనిలో కొంత మెరుగైంది మభక్తికి

  1. పరకాల బుర్రకథ - తమిళ వైష్ణన భక్తులైన పన్నిద్దరాళ్వారులలో ఒకరైన తిరుముంగయ్హా చరిత్ర. అతడు పరులకు కాలుని (యముడు) వంటి వాడు. విష్ణుభక్తులకు కొంగ బంగా ర “వు

  2. తొండేరప్పొడియాళ్వారు - విప్రనారాయణ చరిత్ర శైవుల మల్గణుని పలి విప్రనారాయణ. ఇద్దరూ వేశ్యాప్రియులు శివకేశవులచేత రక్తితులు. దీనిని కవి బులక్ర ధగా రచి వాడీ

  3. చంద్రహాస - చంపూ ప్రబంధం కమలాక్షి కధవలెనే ఉంది ఇందులో పాటలు ్‌ చాడు, చిన్నది. ఈ జైమినీ భారత మూల కథ యక్షగాన రూపాన బహుళజన ప్రచారం పొందింది వ్రు. కృతి

  4. ఉత్తర కాండము - ద్విపద కావ్యం గాన యోగ్యం ఈ దేశిచ్చందః కావం అసంపూర్త రచింపబడిన 82 పుటల్లో రావణ కధే అధికం. అప్పటికి కుశలవులు రంగప్రవేశం కావిం చలేదు క అయితే ఇది పెద్ద కావ్యమే. నై

  5. శ్రీ భద్రాద్రి సీకారొను స్తోత్రమ్‌ - ఈ చిరుకృతి ఉత్సాహ వృత్తాల్లో ఉంది

రామానుజదాసు గారు మిత విద్యా పరిజ్ఞానంతోనే నాటి మహాపండిత కవులకే సాధ్యంకాని రీతిలో దశాధిక గ్రంధాలు వివిధ ప్రక్రియలలో రచించిన భక్తకవి. శ్రుత పాండిత్యం హరిభక్తి ఈ కవిగారికి తోడు నీడలై సహకరించాయి. ధారణాశక్తి కవితాధార ఈ కవిగారికి అపారమని వినికిడి దానికితోడు వ్యాకరణ ఛందోలంకార గ్రంధాల పరించి ఉంటే కవి కావ్యాలు బంగారానికి తావి అబ్బినట్టుగా ఉండేవి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాల్బ ప్రూర్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 183 13, ఆనందయ్య - వడ్డూరి బేగంపేట, 1940 సుమారు. ఆనందయ్యగారు శివయోగి.

వీరి రచన - 1. నందుల మరానంద గురుబోధ; ముద్రితం. ఆనందయ్యగారి ఊరేదో 'పేరేదో కులమేదో వయస్సెంతో ఎవరికీ తెలియదు. బెజ్జంకి సమీపంలోని బేగంపేటలో 'నందులమరం' స్థాపించి అక్కడే నివసించేవారు. శిష్యబలగం బాగానే ఉండేది. దాదాపు ఏబదేండ్డ క్రీతం అక్కడే తనువుచాలించారు. వారి సమాధి ఇప్పటికి భక్తులకు ఆరాధనీయ స్థలంగా ఉంది.

ఆనందయ్యగారు వీర శైవ మతాభిమాని - వరకవి. వారు శివభక్తి ప్రబోధం కొవించేవారు. శిష్యులకు ఉపయుక్తంగా ఉండే విధంగా పాటలు పద్యాలు రచించారు. గురువుగారి రచనలను (అదే పుస్తకం మొదటి కమ్మలు చినిగిపోయి ముద్రణ తేది కనిపించలేదు. గురుబోధ గ్రంధం) బొంబాయిలోని శిష్యులు పుస్తకంగా ముద్రించారు.

ఇందులో పాటలు, తత్త్వాలు, పద్యాలు, సరళంగా ఉన్నాయి. ఈ వృత్తం చూడండి. సగుణ నిర్గుణ విచారా! సమరసానంద ధీరా! విమల లోకోపకారా! విషయ సంసార ధీరా, భరత పాప విభంగా! భక్తి యోగాను సంగా! శరణు శ్రీ బసవ లింగా! శమద మధ్యాంతరంగా! అందులోనిదే మరో పద్యం - కం ఈ మాలిక పరియించిన, యేమానవుడైన గాని యేర్చడ మదిలో భామామణి పరకాంతకు, (ప్రేమాతిశయంబు మీర పెనిమిటి యౌరా.

ఈ పరకాంత మోక్ష కాంతయే. ఇది ఫల శ్రుతి పద్యం. ఈ ఇరువదవ శతాబ్ది తొలిపొదంలో అనందయ్యగారి తత్వాలు - పద్యాలు కరీంనగర్‌ పరిసర (గ్రామాల భక్తజనంలో బాగా ప్రచారంలో ఉండేవి. 1948 సుమారుగా కవి తనువు చాలించారు. తిరిగి సజీవులౌతారని గురువు శవాన్ని మూడురోజులు ఉంచి విధిలేక సమాధి చేశారు. వారి శిష్యులు, శివకవి ఆనందయ్య.

  1. _ సముద్రాల రామానుజాచార్యులు - కోరుట్ల, 1982 - 1950.

సముద్రాల రామానుజాచార్యులు గోలకొండ కవుల సంచికలో చేరిన కవి. నం. 59, అప్పటికి వీరి వయస్సు 50 సంవత్సరాలు. ఇదే పేరుతో మరోకవి సుశీలోపాఖ్యాన కావ్యకర్త గో కసం. పూర్వకవులలో పేర్కొనబడ్డారు. పూర్వ కవి వివరాలు తెలువవు. ఈ రెండవ కవి రామానుజాచార్యుల నెరిగినవారు కోరుట్ల యందున్నారు. ఈ కవి భ్రాతృవుత్రులు వేంకట నరసింహాచార్యులు తమ చిశ్చాన్న విశేషాలు తెలిపారు. కవి 1950 సుమారుగా కీర్తిశేషులు.

స. రామానుజాచార్యుల ఏకైక ముద్రిత కృతి; “శ్రీరామానుజ కందార్థ కోశం"

పుస్తకం తెలుగుదైనా పేరు సంస్కృతంలో ఉంది. వేరు రచనలు వ్రాత ప్రతులేవీ లేవు ఈ చిరుపాత్తంపై ముద్రణ సంవత్సరంలేదు. కాని కవి తనకు 65 నం. వయస్పన్నారు కనుక, ఈ కావ్యం 1947లో ముద్రణ పాంది ఉంటుంది.

వంశ వివరాలు ః రామానుజా చార్యులది శ్రీవైష్టు మతము వాధూలన వంశము. కోరుట్లపురము. వీరి తండ్రి పరాంకుళ దేశికులు. తాత శ్రీనివాసయ్య. వీరి గురునామం నరసింహ సూరి.

కావ్య విశేషాలు ! సముద్రాల రామానుజాచార్యులు సంస్కృతాంధ్రోభయ భాషల కవి అనడానికి నిదర్శనంగా కావ్య ముఖ పత్రం పై శ్లోకాలున్నావి. ఇంకా గోక సంచిక నం.59, ఈ రామానుజ కవిగారి రచన 'శ్రీకృష్ణ సంస్తుతి" సంస్కృత శ్లోకాలే.

వీరి కందార్థ కోశంలోనివన్నీ కందార్థాలు. కృతి పతి వర్ణన పద్యాల్లో ఉంది. కవి అవతారిక పద్యాలలో కందార్థాలను కందమాలికలన్నారు. సాధారణంగా కందార్భాలు శివకవుల్లో కానవస్తాయి పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాల తర్వాత రంగనాథ రామాయణం, భగవద్గీతకు శంకర భాష్యానంతరమే శ్రీభాష్యం వచ్చినట్లు, వైవ తత్వాల ఒరవడిలో వైష్ణవ భక్తి తత్వాలూ వచ్చినవి. ఆట్లాగే రామానుజకవి ఈ కావ్యం రామానుజ భక్తితో వచ్చింది.

184 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” కందార్ధం ఓ విలక్షు ఛందః ప్రక్రియ. కంద పద్యం చళుర్ధ పాదం యతి స్థానం నుండి పాటగా మారి తత్త కీర్తనగా వ్రాయబడుతుంది. పద్యాన్ని వచనం వలె చదివి గేయభాగాన్ని రాగతాళాల్లో భక్తులు పాడుకొంటారు. ఈ కందార్థాలు జానపద వర కవుల సృష్టి. ఇవి దేశి కవితలు. శ్రీరమణీ పద ద్వయ, సారస విద్యామృతంబు చవి గొనుచు నత (గణం?) త్సూరి (2) జనంబులు బొగడగ, జేరియు శేషాంశమొకటి - శ్రీవరదు డనియు ఆజ్ఞ శిరసావహిం చీయు ధరలోనావి ర్భావ మొందియు కేవాల సకలాత్మో జ్ఞీవనార్ధము శ్రీ! కేశావ మతులై స్వీయ మతా సం స్థాపనం బొనరించు మనియు పుట - 13

మాయావాద దురభిప్రాయమును ఖండించిన భాష్యకారుల ప్రశంస (5 కం) శైవుల ముద్రాషట్కము వివరణంతోపాటు నింద (9) ఇట్టా విష్ణుభక్తి రామానుజ మత ్రపత్తిగల ఈ 24 కందార్థాల కావ్యంలో 7వది.ఇది - తత్త్వము గాదట నత్తున, సత్తునను గాదు గావు సదసత్తువులున్‌

సత్తాసత్వ విలక్షణ, తత్త్వంబా యనుచు నడుగ తదభావ మనెరు విధి నిషేధ! మదిదెల్యలేరు నల్గురునొక్క విధి జెందీ నారు వదరూ చుందురు తత్వ మిదియని దెలియాక

మదగజంబుల జూచికుక్కలు రొదలు జేసిన రీతి బౌద్భులు

త్రిమతాచార్యులలోని రామానుజుల కాలంలో కానీ, ఈ కవి రామానుజాచార్యుల కాలంలో కానీ, వైష్ణవులనెదిరించినవారు శైవులు ఇంకా అద్వైతులు జైన బౌద్భులు వీరినెదిరించిన వారు కారు. ఈ కవి కాలంలో వారు పోటీకి లేనే లేరు. ఈ బౌద్ధ పదం కేవలం నిందావాచకంగా ప్రయోగింపబడింది.

లక్ష్మీస్తోత్ర శ్లోకాల చివర కవి పరిశయ శ్లోకమున్నది. అది ఇది.

శ్లోః వాధూలాన్వయ జాతేన శ్రీరామానుజ ధీమతా

కృతైషా స్తుతి రార్యాస్తాం నంస్కృత్యక్ష్తంతు మర్హధ

కృత్యాదిలోని కృతిపతి వంశ వర్ణన అయిదు పద్యాలు అందులోని రెండవది.

గీ శోభితోభయ కుల దీప్తి సూనృతోక్తి, వైష్ణవాచార సద్భక్తి వాంఛితార్తి ధన్య సద్వత్రి రంగరాడ్ధర్మ ప్పి బుచ్చ మాంబకు సరిసతుల్‌ లక్ష కొక్టర్సు,

ఈ పద్యంలోని మొదటి మూడు పాదాల్లో సంస్కృత పదాలే. తెలుగు పదాలున్నది కేవలం చివర చరణంలోనే. దీనిలో యతి తప్పింది. సంస్కృత కవితా ప్రభావం కాబోలు! సంస్కృతంలో పద విరమణం తప్ప సజాత్యక్షర యతి లేదు కదా. స. రామానజాచార్యులు. ఈ కందార్థ కోశంలో గహనవేదాంత చర్చ కావిస్తూ జానపద కవులవలె వ్యావహారిక భాషాపదాలు ప్రయోగించారు. పండితుడనని చెప్పుకున్నా ఈ కవి వరకవుల సరస నిలిచేవారే.

  1. గడియారం విశ్వనాథ శర్మ - కమాన్‌పురం తాఃపెద్దపల్లి:; 1863

విశ్వనాధ శర్మగారు 'భారతరణకధా సంగ్రహము" అను చంపూ కావ్యాన్ని రచించారు ఈ గ్రంథం తారణ శుద్ధ 15 కలియుగాబ్దం - 5045న ముద్రింపబడినట్ట్లు అచ్చుప్రతిలో ఉంది. ఆది క్రీశ 1943 వ సంవత్సరం. 121 పుటల ఈ పుస్తకాన్ని కేవలం ఒక వంద ప్రతులు ముద్రించడం విశేషం, కావ్య ముద్రణజానంతరం కవి గొరు ఇరువదేండ్ల వరకు జీవించారు.

నంశవివరాలు ; విశ్వనాథ శర్మగారి భారత రణ కథా సంగ్రహంలో కేవలం పంచమాశ్వాసానికి 1 ఈ అపురూప పుస్తకాన్ని చూపటంతో పొటు కవిగారి వివరాలు తెల్పినది మల్లావజ్ఞల బాలకిషన్‌

రావు , పెద్దపల్లి గారు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతొచ్దు ప్రూర్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 185 మాత్రమే చివరి గద్య ఉంది. అది ఇది. “ఇతి శ్రీ వేణుగోపాల కరుణ కటాక్షపాత్ర కౌండిన్య సగోత్ర శ్రీ సీతారత్షమాంబ వుత్ర విశ్వనాధశర్మ ప్రణీతంబైన శ్రీ మహాభారత రణకథా సంగ్రహము పంచమా శ్వాసము సంపూర్ణము” కవి ఏలనోకాని తండ్రి పేరు తెలుపలేదు. వారు వైదిక విష్రలు. కావ్య విశేషాలు £ శర్మగారికి వ్యాకరణ ఛందోలంకార శాస్ర దృష్టి కవన పుష్టి తక్కువ. భారత కధ యందలి ప్రీతిచే ఈ కావ్యరచన కావించారు ఈ కావ్యారంభ కంద పద్యం చూడండి. కం శ్రీపతి దేవ సువిశ్రమ, భూప సుజన శిక్ష సకల భువనాధ్యక్తా గోపతి వందిత పదయుగ తాప హరణ ఘనశరీర తము భజియింతున్‌. చివరి సద్యం ; గీ. కాళి దాస మయూరాది కవులకైన, గలవ్వు తప్పులనంగ నన్యులకు లేవె దిద్దగల పట్ల దిద్దుడి దిద్ద రాని యెడల నానేరములు క్షమియించు టొప్పు. ఇందలి కధ కురుపాండవ సంగ్రామం. శ్రీకృష్ణ రాయబారం కేవలం పది పంక్తుల ఉత్పల మాలిక భగవద్గీత ప్రస్తావన ఇట్లుంది. “వ అందు ఉభయ సైన్యంబులు కురుక్షేతంబున సంగరంబు కొరకు సన్నిహితంబైన సమయంబునందు,

కం. ధర్మజుడు ననికి పూర్వము, నిర్మల మతి భీష్ము గురుని నిక కృపు ప్రణుతిన్‌

మర్శ్మమెరిగి ననుజ్జచరణ, కర్మమూనె కృష్ణు మహిమ కారుణ్యమునన్‌_

దుష్కర ప్రాసను సునాయసంగా ప్రయోగించినా రెండన పాదంలో అఖండ యతి, మూడవ నాలుగవ చరణాల్లో గణభంగాలు పండితుల బాధిస్తాయి. మరొక చిన్న వచనంతో ఈ ఘట్టం ముగిసింది భీష్ముని యుద్ధవర్ణన ఇది £

శ్రా భీష్ముండప్పుడు సంగరాంగణమునన్‌ భీమాదులన్‌ మోరుచున్‌

గ్రీష్మాదిత్యుని బోల సైన్య సమితిన్‌ గ్రీడొప్పగా గూల్బగన్‌ న్లేష్కంబాందె నరుండు దానిగని సంసేవ్యుండు గృష్పుండు తా భీషువ్మన్నిల్పగ చక్రమున్‌ గొని చనెన్‌ బీభత్సుడున్‌ జూడగన్‌

కవి ఈ కావ్యంలో ఛందో వైవిధ్యం కనబరిచారు. ద్వితీయాశ్వాసం చివరి మత్తకోకిల ఇది.

విద్యమాన నరేంద్ర సేవిత వేద వేద్య సువూజితొ సద్యశస్కర వంశపాలన శాస్తధర్మ నుభావితా చోద్యమయ్యె భవచ్చరిత్రము శుభ్రక్తీర్తి ప్రకాశితా

హృద్య శ్రీపతి సంస్థితాశ్రిత లోల ధార్మిక శ్రీపతీ (యతి?)

ఈ కావ్యస్థాయి ఎట్లున్నా మధ్యయుగం తర్వాత యక్షగాన రచనలతో కవన వ్యాసంగం కావించే ఈ జిల్లా కవులను తిరిగి కావ్యరచన వైపు దృష్టి మరల్చిన వారు శర్మగారు, రామాయణ భాగవతాది పురాణాలను తప్ప భారత కధను అప్పటికీ ఇక్కడి ఏ కవీ ముట్టుకోలేదు. ఆది విశ్వనాథ శర్మగారి భావ విశిష్టత 16) వానమామలై వేంకటాచార్యులు - గట్ల నర్సింగాపురం; తొ॥ హుజూరాబాద్‌.

ప్రఖ్యాత పౌరాణికులగు బక్కయ్య శాస్త్రి, సీతమ్మగారల విద్వత్కవులైన నలువురు పుత్రులలో వేంకటాచార్యులు మొదటివారు. లక్ష్మణాచార్యులు రెండవ వారు జగన్నాధ వరదాచార్యులు తర్వాత్రి

186 డొ. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాపొత్య చరిత్ర” వారు. వీరి జన్మగ్రామం వరంగల్‌ జిల్లాలోని మడికొండ. వరదాచార్యులు చెన్నూరుకు వెళ్ళగా మిగతా ముగ్గురు కరీంనగర్‌ జిల్లాలో స్థిరపడ్డారు. వేంకటాచార్యులు హుజూరాబాద్‌ తాలూకలోని వంగర గ్రామ సమిపమందున్న గట్లనర్సింగాపూర్‌ సంస్థాన పండితులుగా ఉండేవారు. వేంకటాచార్యుల తమ్ములు మువ్వురూ ప్రఖ్యాతకవులు. వారికి ఈ పెద్దన్నగారే తొలి విద్యా గురువు. వేంకటాచార్యులు సంస్కృతాంధ్ర విద్వాంసులు. తర్కవ్యాకరణ పండితులు - ప్రసిద్ధ సిద్ధాంతి. కవిగా వారి పేరు వ్యాప్తి కాలేదు. అయినా వారు కొన్ని గద్య పద్య రచనలు కావించారు. వేంకటాచార్యుల రచనలివి.* 1 జ్ఞానేశ్వర్‌ భగవద్గీత - వచనాను వాదం, 2. వ్యాస భగవద్గీత - శుద్ధాంధ్ర పద్యానువాదం 3. భండొర్కర్‌ సంస్కృత వ్యాకరణము - ఆంధ్రానువాదం. ఇవి ఆముద్రితాలు. వ్యాకరణం నాటి విద్యార్థులకు ఎంతగానో ఉపకరించేదట. 1985 సుమారుగా ఇంచుమించు 90 ఏళ్ళ వృద్ధాప్యంలో వీరు గతాయువులైనారు. వీరి రచనల వ్రాత ప్రతులు వారి పుత్రులు రిటైర్డ్‌ తెలుగు పండిత్‌, వి కృష్ణమాచార్యులు ముల్కనూరుగారి వద్ద కూడా లభించలేదు. 7) వేంకట రాజన్న అవధాని - మంధని; జననం - 1809 మృతి [895 అసాధారణ ప్రజ్ఞాధురంధరులు వేంకటరాజన్న అవధాని గారు. వీరు మంధని వాస్తవ్యులు, వైదిక బ్రాహ్మణులు. ఇంటిపేరు అవధానుల వారు వీరు 1909లో జన్మించారు * రాజన్న అవధాని వైద్యవరులు సాహిత్యంలో సవ్యసాచి, కవి - రచయిత; ఉభయ కవి మిత్రుడు. సంస్కృతాంధ్రాలతోపాటు ఇంగ్లీషు, ఉరూ భాషలేకాక పార్సీ, అరబ్బీ, మరారీ, హిందీ, కన్నడ భాషలలో పండితులు. ఏక సంధాగ్రాహి. స) అష్టావధానం చేశారు. సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి _ . స్ట మం శిష్యుడనని చెప్పుకున్నారు వృత్తిరీత్యా రాజన్న అవధాని అడ్వొకేట్‌ ప్రవృత్తి న. న. రీత్యా సంఘ సేవకుడు-నాయకుడు! వీరు స్వాతంత్ర్య సమరయోధులు 1 న్‌ తెలంగాణా గ్రంధాలయోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర జాతీయమహాసభను , సీజ్యల అభిమానించారు. కాంగ్రెసులో చేరి సత్యాగ్రహాలు చేశారు భారత | | స్వాతంత్రోద్యమ కాలంలో 10-1-1947 నుండి 6నెలల 2 దినాలు జైలు” --'-- - శిక్షననుభవించారు విడుదల పొందిన మాసం రోజులకు దేశానికి స్వాతంత్ర్యం లభించినా, నైజాంలో రజాకర్ల అలజడి కారణంగా నిజాం చేతులెత్తి స్వతంత్ర భారత దేశంలో విలీనం అయ్యేవరకు 17-9-1948 దేశ విముక్తి పోరాటంలోనే ఉన్నారు. ఆయన అస్పృశ్యతా నివారణ కొరకు, హిందూ ముస్లింల సామరస్యం కొరకు అమితంగా కృషి చేశారు సాహిత్యంలో పలురచనలు చేసినా ముద్రించుకున్నవి స్వల్పం గోలకొండ కవుల సంచికలో నం. 271 'నేటి ద్విజులు' వీరి కవిత గోలకొండ పత్రికకు సహాయసంపాదకులుగా పనిచేయడమే కాక ఆంధ్రభూమి సహాయ సంపాదకులుగా కొన్నాళ్ళున్నారు. కాళోజీ, వెల్దుర్తి మాణిక్యరావు, వేరా. ఆవధానిగారు ముగ్గురు కలిసి హైదరాబాద్‌లో 1950లో 'వైతాళిక సమితి'గా ఏర్పాడ్డారు అవధానిగారు

  • డ్రా ఆందె వేంకటరాజం గారి “ వానమామలై వరదాచార్యుల కృతులు - అనుశీలనము' ' 1982, పుటలు - 5,6 1 గోక.సం 19334 పుట 380 వీరి వయన్సు 28 సం. అని ఉంది అది 3 సం ఎక్కువ

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20థ శతాబ్ద ప్రూర్వాస్థ సాహిత్యం" పద్య సాహిత్యం 187 తొలి దినాల్లో 'ప్రబోధచంద్రిక' అను లిఖిత మాస పత్రికకు సంపాదకుడై మంథనిలో వెలువరించారు. వీరి 'ెద్దకుమారులు ప్రభాకర అవధానిగారు ఆదర్శోపాధ్యాయులుగా రాష్టబహుమతి నందుకున్నారు. పెద్దకూతురు ప్రతిభారాజి పట్టభద్రురాలు - రచయిత్రి. . వేంకట రాజన్నఅవధాని గారిరచనలు:- 1 అగ్నిశబ్బ మహాత్మ్యం (సంస్కృతం), 2, పతిపల్సి (తెలుగు నవల), 3. మంధెన చరిత్ర (సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలోని వ్యానం). అముద్రితరచనలు:ః 1. లక్ష్మీ శతకము, 2. కుంభకర్ణ నిద్ర, 3. దేశబంధు జన్మరహస్యం (వచనానువాదం), 4. భారత స్వాతంత్ర విజయం, 5. కామకళ. ఇంకా - వింత గీతాలు, జైలు గీతాలు మొ వి. రచనలవివరాలు:ః పతిపత్ని నవల 1930లో ముద్రణ పొందినదన్నారు. కాని దాని ప్రతి లభించలేదు అది ఆదర్శ దంపతుల జీవితం ఇతివృత్తంగా కలదట. మంధెన చరిత్ర వ్యాసం చారిత్రక ప్రాదేశిక ప్రాధాన్యత కలది. ఇది సమగ్రాంధ్ర విజ్ఞానకోశంలో ప్రచురించబడింది * ముద్రిత సాహిత్యం ఈ ఒక వ్యాసం తప్ప మరేదీ లభించలేదు. అవధానిగారి అముద్రిత పద్య సాహిత్యమే వారి కృషికి సాక్ష్యంగా మిగిలింది. “కలగూర గంప' పేరుతో తమ రచనలను కొన్నింటిని అవధాని గారు ఓ రిజిస్టరు నోటు బుక్కులో వ్రాసుకున్నారు అందులో వారి విడి కవితలున్నాయి* 1 లక్ష్మీశతకము - ఇది కంద పద్యాలది 74 పద్యాలే వ్రాశారు. ప్రతి పద్యం శ్లేషతో రచించారు. ఈ శతక పద్యాలకు ముగ్గులై కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారు 1968లో తాము వ్యాఖ్య బ్రాస్తామన్నారట. అందులోని ఒక పద్యం. ముగురమ్మలు ముగురయ్యలు, జగతిని పుట్టించి పెంచి చంపుదు రనుచున్‌ తెగ బలుకును ప్రాబలుకులు, జగతిని మూలమ్మ నీవె సత్యము లక్ష్మీ 2 కుంభకర్ణ నిద్ర - దేశ ప్రజలను జాగృత పరచే ఉద్దేశ్యంతో కావించిన రచన. ప్రతి అలభ్యం. 3. దేశబంధు జన్న రహస్యం - ఇది వినాయక సావర్కార్‌ గారి 'మోప్లాంచే బండ్‌' (మోపలా ఘాతుకాలు) అను మరారీ పుస్తకానికి తెలుగు సేత దీనిని వైదిక ధర్మ గ్రంధమండలి హైదరాబాద్‌. వారు ప్రచురిస్తామని తీసుకున్నారట. ప్రచురించలేదు - ప్రతిని తిరిగి ఇవ్వలేదు. 4 భారత స్వాతంత్ర్య విజయం - పద్యకావ్యం ఇది అసంపూర్ణం. దీని రచన 1953లో అరం భించారు. గీ. కన్నులున్నవి కాని నే కనుట లేదు, కండ్లు లేకయె స్వరమున్‌ గనెదు నీవు చెవులు గల్గియు వినము మానవుల మేము, చెవులు లేకయె వినెద(దీ)వు భవుల వాక్కు 5. కొామకళ - ఇది వాత్సాయన కామ సూత్రాలకు అనువాదం అవధానిగారు వారి యువదశలో దీన్ని రచించారు. నాలుగు వందల పద్యాల గ్రంధం. కాని, ముద్రించలేదు. 6 వింత గీతాలు - ఇవి కొన్నే ఛందోబద్ధ తేట గీతాలనే కవి వచన కవితలుగా పదాలు విరిచి వ్రాశారు. అందులో రెండు ఇవి. నిన్న కలవాడు లేడాయె ఆత్మ యొక్కటి స్థిరము నేటి కిచట ఉండు నెన్వ తదన్య మెల్ల జన్మమొంది గతించును డు పోకుండ నుండు నెద్ది జగతి యగుట గమన శీలియై జగము రాక వోకలు సహజ ధర్మములు గానె యోగంబనంగ పోయి వచ్చుట వచ్చి తొలగి జీవత్వ భావ పోవుటయు నిజము. మాత్మలయ మగుటె 2 సవి.కో. సంపుటి 7? సాహిత్య అకాడెమీ హైద్రాబాద్‌ వారి ప్రచురణ - 1970, పుట. 101 3. 9-8-92 నాడు మంథనిలో అవధాని గారిని కలుసుకొని మాట్లాడాను. వ్రాత ప్రతులు చూశాను.

188 డా మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

7, జైలు గీతాలు - 1947లో జైలులో వ్రాసినవి. ఇవి ఇరవైకి తక్కువే. చూడండి.

దొంగ తొత్తు కొడుకు(లు) లంగలు చాచుచ్చు, గడు పిశాచ వృత్తి బడి చెలంగ

ఇత్తెహాదు మంత్రులిది పంది యందురు, దీని భావమేమి తిరుమబేశ, - 10వ పద్యం,

వీరి “కలగూర గంపిలో అప్పుడుష్పుడు వ్రాసుకున్న కవితలున్నాయి. |

సాహితీమిత్రులు వెల్టుర్తి మాణీక్యరావుగారి కూతురు “ఆంధ్ర ప్రభ' శిశువుగానే మరణించినప్పుడు వ్రాసిన పద్యాల్లో ఒకటిది.

తెలుగులో నవ్వియితర భాషలకు నేడ్చు, తెలుగుకై యేడ్చి యితర భాషలకు నవ్వు

తెల్లు సీమను తెల్గు దీధితులముంచు, నట్టి సుఖదమాంధ్ర ప్రభ యస్తమించె.

ఆ అమ్మాయి పేరు ఆంధ్రప్రభ అటువంటిది నాటి మనవారి మాతృదేశ-భాషాభిమానం!

రాజన్న అవధానిగారికి తేటగీతి ప్రియాతి ప్రియం కందంలో శతకాన్ని రచించారు. ఇతర ఛందాలను విరళంగానైనా స్పృశించకపోలేదు. సరస్వతీ నుతి పద్యం ఈ ఉత్పలమాల చూడండి.

వాణి మదీయ పార్వ వశవర్తినివై నిరతాశ్రయంబునన్‌

రాణువ మించి నా హృదయ రమ్యమణి స్థగితాభ్ర పీరిపై

రాణిగ నన్ని నాళ్ళు స్మర రాజ్యము నేలిన నీకు నీ తెలం

గాణపు గాలి సోకినదె కాక మరెయ్యదొ తెల్చు తొయ్యలీ 4

శ్లేష యమకం అవధాని గారి సాహిత్యంలోనేకాదు, సంభాషణలోనూ అప్రయత్నంగా చోటు చేసుకుంటాయి. వారు అనుభవ జ్ఞాన వృద్ధులు. పక్షవాతంతో పదిరవై యేండ్లుగా మంచం మీదే కాలక్షేపం చేసి 1995లో కాలధర్మం చెందారు.

శారీరక మానసిక బలసంపన్నులు అవధాని గారు. క్రికెట్‌, పుట్‌బాల్‌ వంటి విదేశి క్రీడలలోనేకాక, కబడ్డీ, కజ్టసామువంటి స్వదేశ క్రీడలలోనూమేటి. అపారమైన పాండిత్యం, ఆమోఘమైన కవిత్వం, అంచంచలమైన కార్యదీక్ష - ప్రజాసేవ. చూసినవారికి వీరు కారణజన్ములు అని అనిపించక మానదు సాహిత్య ప్రేమికులు, సంఘ'సేవకులు, రాజకీయ నాయకులు, కళాకారులు ఎవరిలో కాని ఏ మాత్రం సుగుణం కనిపించినా హృదయపూర్వకంగా అభినందించే మెత్తని మనస్సు అవధాని వారిది విమర్శలో దక్షుడు. మనస్సులో మెదలితే పిన్నాపెద్ద తారతమ్యమెరుగడు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి గారి 'హిందువుల పండుగలు గ్రంథంపై “భారతి మాసపత్రికలో విమర్శనాత్మక సమిోక్షవ్రాసి రచయిత జవాబును తెప్పించుకున్నారు. ప్రముఖ సాహిత్యకారులలో వీరికి మొదటి నుండీ గౌరవం ఉంది.

కాళోజీ 'నాగొడవి నాలుగవ కవితా సంపుటిని పరాభవ శ్రావణంలో (19-7-1966) వె.రా. అవధాని గారు ఆవిష్కరించారు. నేను మొదటిసారి 1981లో చూసినప్పటివలెనే 1993లోనూ శయ్యాగ్రస్థులై మరింత వృదృలై చిరునవ్వే భూషణంగా కనిపించారే తప్ప వారి పుస్తకాలేవీ వెలుగు చూడలేదు. వేంకటరాజన్న కవిగారి అముద్రిత సాహిత్యంలో ముఖ్యమైన రచనలైనా ముద్రింపబడితే బాగుండేది. 18) వానమామలై జగన్నాథ్రా చార్యులు - పోతురెడ్దిపేట, తా హుజూరాబాద్‌, వయస్సు -90 సంలు 1993లో *' 1995లో మృతిచెందారు

జగన్నాధాచార్యులు గోలకొండ కవుల సంచిక కెక్కిన కవి* సంస్కృతాంధ్ర ద్రవిడ భాషలలో పండితులు జన్మగ్రామం వరంగల్‌ జిల్లాలోని మడికొండ కరీంనగర్‌ జిల్లాలోని పోతురెడ్డి పేటలో స్థిర నివాసులైనారు వానమామలై కవిసోదరులలో వీరు మూడవవారు ఈ గ్రంధమందలి వేంకటాచార్యులు, లక్ష్మణా చార్యులు వీరికి అగ్రజులు. అభినవ పోతన బిరుదాంకితులైన వరదాచార్యులు అనుజులు.

వీరు సంగీత సాహిత్యాలలో దిట్ట.హరికధకులుగొ రాణించారు. కొంతకాలం (ప్రైవేట్‌ ఉపా 4. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా రచయితల చరిత్ర' 1981, పుట-47. ఈ పద్యంనా “క జి.ర.చ.' రచనా

సందర్భంలో నేను వారింటికి వెళ్లినపుడు అవధాని గారు స్వయంగా వినిపించింది

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్ద త్రార్వాస్థ సాహిశ్సం” పద్య సాహిత్యం 189 ధ్యాయులుగా పనిచేశారు. పలు చిరుకావ్యాలే కాక రైతు రామాయణము' క్ల అను మహాకావ్యాన్ని రచిం చారు. చాల కాలంగా పోతురెడ్డి పేటలో వ్యవసాయం (౧. చూస్తూ కవితా వ్యవసాయం చేస్తూ కాలం గడిపారు. వీరి రైళురామాయణ (1 త. కావ్యానికి 1983లో రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది. 1992 టి. సంవత్సరంలో ఉత్తమ కావ్య నిర్మాతగా తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు హం... వారిచే విశిష్ట సన్మానం పొందారు. వీరి పుత్రులలో జనార్దన జగన్మోహన మ దామాదరాచార్యులు మువ్వురు అధ్యాపకులు కవులు. లేల జగన్నాథా చార్యులు రచనలు ; ముద్రితములు ః 1 అభ్యుదయ గేయాలు - 1951, 2. శ్రీవ్రత గీతి (తమిళానువాదం - గేయాలు), 3. రైతురామాయణము - 1981 (పద్యకావ్యం) అముద్రితములు ః 1. శ్రీనివాస అష్టోత్తర శతి, 2. అది వరాహ శతకము, 3. తెలుగుబాబు - గీత శతి.

గోలకొండ కవుల సంచికలో 'కార్పాస లక్ష్మినాటకము' ఒక్కటి మాత్రమే జగన్నాథాచార్యుల రచనగా పేర్కొనబడింది. ' తెలుగు సాహిత్య కోశం'లో రైతురామాయణ కావ్యం, కార్పాసలక్ష్మి నాటకంతో పాటు జనగణపతి శతకం, గోదాదేవి చరిత్రం పద్యకావ్యం, శ్రీ బాలాజీ శతకం మొత్తం అయిదు గ్రంథాల "పేర్లు ఈ కవి రచించినట్లుగా తెలిపారు. న ఒక్క రైతురామాయణము తప్ప ముద్రిత కృతులేవీ వారి వద్ద లేవు. కార్పాసలక్ష్మి మొదటి రచన ఆముద్రితం, వ్రాత ప్రతికూడ పోయింది. ఇది సాంఘికం; గ్రామాణేతివృత్తం కలనాటకం. *

శ్రీవ్రత గీతి ః తమిళానువాద గేయకావ్యం. గోదాదేవి అను నామాంతరం గల ఆండాళ్‌దేవి పాశురాలకిది ఆంధ్రానువాదం. మార్గశిర మాసంలో ముప్పది రోజులు తమిళ పాశురాలు శ్రీ వైష్ణవులిండ్లలో చదువుతారు. స్రీల సౌకర్యార్థం ఆచార్యులు వీటిని గేయకాన్యంగా తెనిగించి సోదరులైన వరదాచార్యుల సతీమణి వైదేహి గారికి ఆంకితం చేశారు. కృతి ముద్రితం కాని ప్రతి ఆలభ్యం. (శ్రీవ్రత గీతి - అచ్చుప్రతి 1971. పు.1/32 శ్రాన్‌-36. ఇది అనుకోకుండా శతావధాని కృష్ణమాచార్యగారి నేనున్న ఇంట్లోనే ఫిబ్రవరి 97న లభించింది). జగన్నాథాచార్యుల ఆంధ్రానువాదం సరళ గ్రాంధికంలో సాగింది. ఇవి తమిళ శిర్షికలతో ఉన్న 30 పాటలు. మొదట కొన్ని పద్యాలున్నవి. గేయాల నడక ఇది - 'ఓంగిపు5,

“ కొండెత్తున బెరిగి జగము గొలిచిన యుత్తముని బాడి,

కొండాడుచు వ్రతము చాటి కూడి మనము జలకమాడ

చెలుపులేక దేశమెల్ల వజుపులేక నెలకు మూడు

చఅచి కురియు జడివానలు పెరిగి యొరుగు వరి చేలును -”

ఇందులో గోప్తాల బాలకృష్ణునిపై కన్నెల ముగ్ధభక్తి, అంతకు మించి పల్లెపట్టుల చక్కదనాల వర్ణనలున్నాయి.

సోషలిస్టు గేయాలు, తెలంగాణా పోరాటం (1947-52) కాలంలో పుట్టిన తిరుగుబాటు పాటలు. రైతు రామాయణము ; ఇది 500 పుటల మహాకావ్యం. దాదాపు మూడువేల పద్యాలు కలది. ఆశ్వాసాలు ఆరు. 1981లో ముద్రితం. పి.వి.గారికి అంకితం, 1 'ఈనాడు' దినపత్రిక ప్రత్యేక సంచిక - డిసెంబర్‌-1993; 2. గోక.సం. 1934. కవి నం. 247; కవిపరిచయం - 377 పుట. 3. తె.సా. కోశం - తెలుగు అకాడెమీ హైద్రాబాద్‌ వారి ప్రచురణ, 1986, పుట - 331 4. 1990 లో ఆచార్యుల వారిని వారి కుమారులింట హుజూరాబాదులో కలుసుకొని మాట్టాడాను.

దీనిలోని ఒక సీసపద్యం గో.క, సంచిక, పుట 230 లో ఉంది.

190 డా మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” డా! డింగరి నరహరి ఆచార్యగారు ఈ కావ్యంపై పరిశోధనా వ్యాసం వ్రాసి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి డా డి. రామాచార్యగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇదే కావ్యం పై పరిశోధన గ్రంధం రచించి డాక్టర్‌ డిగ్రీలు పొందారు. రామాచార్యులు 1987లో జగన్నాధాచార్యుల రైతు రామాయణ కావ్య విశేషాలను వివరించే వ్యాస సంపుటిని సైతం రచించి ప్రచురించారు మలయశ్రీ కవి సంపాదకత్వంతో ఎస్సెలెన్‌ బాబు ప్రచురణకర్తగా వెలువబడిన కరీంనగర్‌ జిల్లా కవుల కవితల సంకలనం 'తరంగిణి' వానమామలై కవి సోదరులకు అంకితం కావించబడింది.* అందులో కృతిపతియైన జగన్నాధాచార్యులను సంపాదకులిట్లా (ప్రస్తుతించారు వచ్చియురాని భావముల వొరక సంస్కృతపున్‌ సమాసముల్‌ గుచ్చియు దర్భపాకముగ గూర్చు కవిత్వ విచిత్ర వేళలన్‌ అచ్చపు తెల్లుకైత యిదిరా యన తీయనరంటి పండులన్‌ విచ్చి కరాన బెట్టినటు వేడ్కరచించితి సత్రబంధమున్‌ (తరంగణి) 1373; వు.1 ఈ కావ్యముద్రణకు ముందుదీవిషయం. రైతు రామాయణం ముద్రణ పొందుటకు పూర్వవ్వే పలు సాహితీ సభల్లో కావ్యకర్త కవితాగానం చేయడంతో దానికి జనవ్యాప్తి కలిగింది డా దాశరధిగారు ఈ కావ్యాన్నీ విధంగా అభినందించారు ' ఈ మహాకావ్యంలో - శిశ్చు, శిక్ష, కల్యాణ, కృషి, నిర్బంధ, విజయ కొాండలున్నాయి ఈ ఆరు కాండలలో తెలంగాణా పల్లె జీవితం అద్భుతంగా చిత్రించడం జరిగింది. పల్లె అనగానే కవిగారి కలం విల్లువలె మారి పువుటమ్ముల జల్లు కురుస్తుంది. భారత మాత పల్లెలో ఉంటుందన్న మహాత్ముని మాటను కవితా రూపమున తెలిపిన కవీశ్వరుడు మా జగ్గన్న” ” ఈ కవికి గ్రామాణ జీవితాన్ని వర్ణించాలనే ఉత్కంర ఈ కావ్యనిర్మాణానిక్షి ప్రధాన హేతువు. తెలం గాణా రైతాంగపోరాటం కథకు ఉపాఖ్యానమై బలంచేకూర్చింది రామాయణ గాధ అంతస్పూత్రంగా ఉంది, కథా సంగ్రహం:ః ఈ కావ్యనాయకుని తండ్రి సాగరుడు. ఆతనికి ఇరువురు భార్యలు. వేయి దేవతల మైక్కుల ఫలితంగా వారికి ఇద్దరు పుత్రులు కలిగారు రామలక్ష్మణులు ఇరువురూ సమాన రూపశీల వయోబల సంపన్నులు, స్నేహశీలురు. యువకులై వివాహితులైనారు. రైతు రాముని భార్య లక్ష్మి- సీత. ఊరి కొమందు పాపారావు రావణుడు వాని విధవ సోదరి సుందరి శూర్చణక అమె లక్ష్మణుని కామించి తిరస్కరింపబడి కసిపూని అన్నకు పురెక్కించింది అతడు లక్ష్మిని బందీ కావించాడు ఇందులో ధర్మారావు అనే వ్యక్తి సుగ్రీవుడు. హనుమంతు రాయబారమున్నది నొడు స్వతంత్రభారత ప్రజారాజ్యంలో విలీనంకాక నైజాం స్వేచ్చగా ముస్లిం రాజ్యంగా ఉండాలని నిజాం అన్నాడు ఆగష్టు 1947 నుండి సెప్టెంబర్‌ 1948 వరకు రజాకార్లు చెలరేగి తెలంగాణాలో కావించిన అలజడికి పాపారావు సహకరించాడు. ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైంది పదూళ్ళ ప్రజలు ఏకమై పాపారావు పై దండెత్తారు ఇంతలో ఢిల్లీ సైనిక చర్యతో నిజాం గద్దె దిగిపోయాడు. నైజాం విముక్తమై హైదరాబాద్‌ రాష్ట్రమైంది రైతు రాముడు జయంపొందాడు సీత చెరతొలగింది. ఆ గొమ ప్రజలకు పాపారావు పీడ విరగడైంది ఇది జగన్నాధాచార్యుల రైతు రామాయణ కధా సారాంశం. కవి అచ్చ తెలుగని సంస్కృత పదాలను పరిహరించక, కృతక పదాలను సృజించక, జాను 5, వానమామలై జగన్నాధ వరదాచార్య మహాకవి ద్వయానికి అంకితం. 6. _ 'సారస్వతీజ్యోతి' శైమాసిక సాహిత్య పత్రిక, కరీంనగర్‌ - ప్రధమసంచిక ఫిబ్రవరి 1954లోనూ 'రైతురామాయణ' పద్యాలు (ద్రురింపబడినవి.

రెండవ భాగం - ౪ అధ్యాయం “20ఫ శతాబ్ద ప్రూర్వార్ధ సాహిత్యం” పద్య సాహిత్యం 191 తెలుగని జై కొట్టక, జనం భాషలోతేట తెలుగులో - పల్లెటూరివారి నుడి కారంతో వ్రాసిన కావ్యం రైతురామాయణం ఇందులో వస్తాడు, తెస్తాడు వంటి వ్యవహారిక పదాలను, (అప్పకవి దృష్టిలో ఇవి గ్రామ్యాలు) సుస్తీ, మస్తు, ముస్తాబు వంటి ఉరూ పదాలను మాత్రమే కాక, మాండలిక పదాలను కవి నిరభ్యంతరంగా ప్రయోగించారు. కధ రామాయణాన్ని అనుసరించినా కధా కాలం వర్తమాన యుగానిది; గ్రామోణుల జీవితాలది. అది భారత స్వాతంత్ర్యానికి ముందువెనుక సాగిన తెలంగాణా రైతాంగ పోరాటకాలానిది. " అంత్యానుప్రాసతో అంత్యంత మనోహరంగా సాగిన వీరి పల్లెటూళ్ళ వర్ణన చూడండి. గీ. పంట లక్ష్మికి తొలియాట పట్టు, బక్కఠాపు జనముల పాలి బంగారు గట్టు, కదుపు మొత్తాల పురికట్టు కాటకాలు కరువులరి కట్టు, పెరటి కల్పకవు చెట్టు, పట్టణముల యాయువు పట్టు పల్లెపట్ట, అదియె లేక నగర జీవి యాట కట్ట! ఇంకా - పాడి తప్పని యాలు, నేనాడు గూడయాడి తప్పని కాపురా, లాద మరచ్చి, గాడి తప్పని బండి చక్రాలు, కొండ్రసూటి తప్పని మేటి నాగేటి చాలు. స్త్రీలు - పచ్చ చేమంతి పూదోట పసిడి కోట, పడుచు పరువాల పాల మోగడల తేట, చిలిపి సిగ్గు సింగారాల జిలుగు మూట, పల్లె చెలియోర్లు జను వరి పంపువాట! వీరి వర్ణనలో పాలం-కాగితం, నీరు-సిరా, హలం-కలం, నాటు మొక్కలు -అక్షరాలు, రైతు-కవి, నాగటిచాళ్ళు - వ్రాతపంక్తులు, శ్రామికులు-పరిష్కర్తలు, పంటలు-కావ్యఫలాలుగా, అవతారికలోని ఓ పద్యంలో రూపుదాల్బాయి. ఈ రూపకాలంకారం కవి మహోన్నత భావుకతకు నిదర్శనం, పల్లె జీవితాలలో శ్రమజలాలు నులివెచ్చ స్నానాలు, జొన్నంబలి జల పానాలు, కావిజిడ్డు ముతకపంచెలు, గులకరాల పాన్పులు సర్వసామాన్య విషయాలను అసాధారణ పరిశీలనా ధిషణతో సహజ సుందర కవితలుగా మలిచారు కవి. వారి నివాసాలు - జీవితాలు ఇలాగట కాపు రాజుల చక్కని కాపురాలు, పచ్చ పాదలు, పూదోటలు, ఫలవనాలు, పాల కావడుల్‌, తరుగని పంట నిధులు, ఊట చెలమలు, కృషిలక్ష్మికాట వనులు! నాయకుని తండ్రి - ఎట్టి సమస్యయందును జలించని గుండె బలంబు, పూని చే వట్టిన యెట్టి యేపనియు బంతముతో సిగపుచ్చు దీక్త యే గుట్టలు గట్లు వచ్చి తలగూలిన నగ్గి తుపాను వెల్లువల్‌ నెట్టుక వచ్చినన్‌ దెనకి నేనెయటం చెదురించు దీక్షయున్‌, కధానాయకుడు రైతు రాముడు - గంగా సాగర శాంత వీర రస సంగస్రోత్ధ గంభీర స ర్వాంగీణ స్ఫురదాకృతిన్‌ మెఅపు దీపార్చిన్సుగా వెల్లు మేల్‌ బంగార్చిడ్డడు రాముడొప్పె గుణ లావణ్యామృత శ్రీ నిధుల్‌ పొంగన్‌ ధీర ప్రశాంత వీరరస దీప్తుల్‌ దిక్తటిన్‌ దూకిరాన్‌. ఆశ్వాసాంత పద్యాల్లో తప్ప సంస్కృత పదాల దీర్జసమాసొలను ఈకావ్యంలో కవి వాడలేదు. అవీ తనకు సంస్కృత భాషా ప్రావీణ్యంలేక తెలుగునకు జైకొడుతున్నాడని పండితమ్మన్యులు అపవాదు 7. రైతు రామాయణము - 1981, పీరిక కావ్యసుధ నుండి. 8. కవి దీనిని 1950-55 మధ్య రచించినా ముద్రణ పొందువరకు 1981 సవరిస్తూనే వచ్చారు

192 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జల్లా సాపొత్య చరిత్ర” వేస్తారనే భయంతో వ్రాశామన్నారు పై పద్యం కావ్యనాయక వర్ణన కాబట్టి పురాణ రాముని స్తుతి పద్యాలకు సమజజ్జీగా రచించినట్ట్లున్నారు. నాయిక సీత సౌందర్యం -

రతియో భారతియో పార్వతియొ సరస్వతియొ యిందిరయొ శ్రీలతయో

సతియో సీతా సతియొ ప్కాలతి పేరే ముత్తియముల రవ్వల పేరో (ల-ర, లకు యతి)

ఈ యమ్మాయి బలేచలాకి, పనిలోనే కాదు మేల్మాటలోన్‌

చాయల్‌ గాంచిన నించుమించుగను మా చాయల్‌ స్ఫురించున్‌ రస

స్థాయిం బెగ్గిన గొప్పయింటి చిటి దార్భానిన్‌ దలంపించు నీ

మాయా యక్షిణి పోఠలున్‌ మెదలికల్‌ మర్యాదలున్‌ జూపులున్‌.

ఈ జంట పరస్పర వీక్షణం, భాషణం, (ప్రేమాంకురం, విరహం, వివాహం మూడు వందల పద్యాల ముచ్చటైన ప్రబంధం. కాపు కన్చెనాయిక, యువ రైతు నాయకుడు, పల్లెపడుచులు చెలికత్తెలు, ఇది మనోహర సన్నివేశం. సందర్భోచితంగా సమకాలీన సమస్యలైన బాల్యవివాహాల వరకట్నాల ఖండన, తెలుగు ఆచారాల వర్ణన రమ్యాతి రమ్యం. కధా వర్ణనలో -

జల జలరాలె పూలు వికచన్నవ పుష్పలతాంగి పచ్చ క

మ్ముల యొడి నుండి శోభనపు ముత్తెపు సేసలనన్‌ హిమాంబువుల్‌

పల పల రాలె చల్లని యివమ్ములు జిమ్ముచు బిల్లగాడుపుల్‌

మెలమెల వీచెబో జయము మోకని దెల్చు క్రియన్‌ రణంబునన్‌

గ్రామ భూస్వామి రావణుడు. అతని బలగము రాక్షస సేన సీతమ్మ చెరు అంగద హనుమంతుల రాయబారాలు సైతమున్నవి. రైతు రామాయణ గాధ సరేసరి నాటి రజాకార్ల సౌజన్యం ఎటువంటిదో చూడండి!

గృహదహనాలు దోపిడిలు స్త్రీ శిశు హత్యలు గోవధల్‌ సతి

మహిళల మానభంగములమానుష ఘోర కిరాత కృత్యముల్‌

మహిగల హైందవ ప్రజల మారణ హోమము సేయు వ్యూహ ని

ర్వహణము లెన్నియంచు నుడువన్వశ మప్పటి యాదుంతముల్‌

ఇవన్నీ కవి కళ్ళార చూసి వ్రాసిన సత్యాంశాలు - నాటి నైజాం రొష్ట ముస్లింల మతదురభిమాన ఘూతుకాలు, వారికి సహకరించిన జమోందారులను నిరసిస్తూ రైతురామకధ రచించారు కవి.

సీ. కాపు కూలీల స్వకష్టార్షితం బెల్ల - దొరలు దొంగలు చుట్టి దోచుచుండ

ఆలు బిడ్డలు కూటి కంగలార్చుచు గంజి-నీళ్లపై పూటలు నెట్టు చుండ, అడుగడుగున ప్రమాదాలు, వృత్తి పనివారల వెట్టి చాకిరి... ఇవన్నీ చూస్తూ ఎట్లా ఊర్కుంటాడు, ప్రజల ప్రేమించే కవి - ధర్మాన్ని కోరుకునే కవి? అందుకే నాడు,

చ. కవుల కలాలు నాయక ప్రకొండుల గుండెబలాలు నేకమై

రగిలిచె విస్టవాగులను రైతులు కార్మికులొక్కపెట్టునన్‌ (రవిలిచె) మొవులు పవుల్‌ నినాదముల ముందుకు సాగిరి రౌద్రమూర్తులై దివి భువి యేకమైనదన దిక్కుల దట్టె ప్రజా ప్రవాహముల్‌,

దున్నిన వానిదే పాలము - అన్న నినాదము. ఏలికయౌమన రైతురాముడే యన్నిట భారత ప్రజల కన్నము ప్రాణము నిచ్చు తండ్రి, అను ఆకాంక్ష ఈ కవి కలానిది.

ఈ రైతు రామాయణం ఆధునికాంధ్ర మహాఇతిహాసం. ఇది జాతీయకావ్యం తెలంగాణా

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ప్రూర్వార్థ సాహిత్యం” పద్య సాహిత్యం 193 రైతాంగపోరాట సజీవ చిత్రణ. నిరంకుళ పాలకుల నిర్బంధాల నెదిరించి రైతుకూలీ శ్రామిక జనం విజయం పొందిన జాతి చరిత్ర, తెలుగులో తెలంగాణా రైతు జీవితాన్ని రైతాంగ పోరాటాన్ని ఇంత రసోచితంగా ప్రతిభోపేతంగా రచించిన పద్యకావ్యం కానీ, గద్య రచన కాని, అప్పటికీ-ఇప్పటికి రాలేదు. శివభారతం, రాణాప్రతాప చరిత్ర, గాంధీజీ ఆత్మకథ ఉత్తర భారత రాజకీయగాధలు. మాలపల్లి నవల శాంతికి పట్టం కట్టి నాయకున్ని చంపివేసింది గోదాన్‌లైతు జీవితమైనా అందులో బ్రతుకుకోనం ఆరాటం తప్ప పోరాటం లేదు పైగా దానితో కొంతకధ పట్టణంలో నడిచింది. ఇది రైతు జీవితం - తెలంగాణ రైతాంగ విముక్తి పోరాటం. విజయ నికేతనం. పల్లెలో పుట్టి ఢిల్లిలో నినదించి నిజాంను పదనీచ్యుతుని చేసి ఆంధ్రదేశాన్ని ప్రజారాజ్యంలో విలీనం కావించిన తెలుగు జనజీవన గాధ చెట్టు కాండాన్ని నరికితే కొమ్మలు అవే వాడి ఎండి పోయినట్లు నైజాం ప్రభుత్వ పతనంతో వారికి వత్తానుపలికిన గ్రామ రాజులు కోరలు తీసిన పాములయ్యారు. ప్రయోజనకరమైన ఇతివృత్తంతో ప్రతిభావంతమైన రైతురామాయణ కావ్యం రచించిన జగన్నాధాచార్యులు ప్రజల కవి - మహాకవి. అభ్యుదయ గేయాలు ' సిరిసిల్ల చతురాంధ్ర మహాసభ(1934)ఈ జిల్లాలో రాజకీయ చైతన్యాన్ని పెంచింది. నైజాం రాజ్యం విముక్తి పొంది భారతదేశంలో విలీనం పొందిన 17-9-1948 తర్వాత కూడా ఇక్కడ సెష్టెంబర్‌ 1951 వరకు రైతాంగ పోరాటాలు సాగాయి.” అప్పుడు రచించిన పాటల సంపుటి ఈ గేయాలు. జిల్లా సోషలిస్టు పార్టీ ప్రచురించింది. దాదాపు ముప్పె పాటలున్నాయి. ఆ ప్రతి అలభ్యం. ఒక జీర్ణపుస్తకం డా. డింగరి నరహరిగారికి లభించిందన్నారు ఆచార్యులవారి అభ్యుదయ గేయాల బాణిని,వాణిని, “సారస్వత జ్యోతి' * లోని ఈ క్రింది గేయం ద్వారా కొంతైనా తెలుసుకోవచ్చు “రాముడెవడో? రాకాసెవడో! ఏమని వ్రాయుదు నేమనిగీయుదు - భూమిని బుట్టెడు పుట్టెడు గాధలు రాముండెవడో రాకాసెవడో - భీముండెవడో బికారి యెవడో శ్యామల శాద్వల సీమలలోనె - స్వర్గము గట్టెటి సాధువులారా కూలిన (క్రుంగిన గుడిసెలలోనే - కుస్తీలాడెటి రుస్తుము లారా రాముడు మీకై రాడుసుమా - ఆ భీముడు మీ యెడ లేడు సుమా వారిని రమ్మని కోరెడిమేమే - వల్ల కాదనీ వదలు కొంటిమి అందని పొందని యాశలతోనే - మ్రందితిమయ్యా (మ్రగ్గితిమయ్యా యెందరి కొరకని యెక్కడికొరకని - అందుదురయ్యా ఆ దొరబిడ్డలు కోమలములు మోయాశాంకురములు - కొండయంచునన్‌ బడి మిడికెడివే మో మంజుల మధురాశయములలో - (ప్రేమామృతములు వెల్లివిరిసిన భీముని జామా రాముని ధీమా - మో ముని పోకడలకు వెలిసీమా లేమిని కోరకు సామిని దూరకు - లేత మనోనాడుల దెగద్రెంచకు. ..” “మారుచున్నదీ ప్రపంచం మారనున్నదింకా కొంచెం. .... ” 9. రావెల నరసింహరాములు కరీంనగర్‌ జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్ర' 1993, పుట. 172. 10. సారస్వతజ్యోతి థై.సం. కరీంనగరం 12 ఫిబ్రవరి 1954 పుట 84

194 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య బరిత్ర” అని వారు గళమెత్తి హరికథల్లో సాహిత్యోపన్యాసాల్లో మారుతున్న కాలాన్ని మోరుతున్న అవినీతిని తూర్పారబడుతూ గానం చేయడం అ తరంవారు ఈనాటికీ మరచిపోలేదు. పద్యంగేయ రచన వారికి నల్లేటిపై బండి నడక అచ్చమైన ప్రజాకవి మహాకవి వానమామలై జగన్నాధాచార్యులు! 19) గొట్టముక్కల రాధాకృష్ణరావు - బుట్టారెడ్డి గూడెం తా హూజురాబాద్‌, జననం 1920 సుమారుగా - మరణం 1980 లో. రాధాకృష్ణరావుగారు ఆంధ్రాంగ్ల భాషలలో పండితులు. ఉర్హూ ఆ కాలం నాటి విద్యామాధ్యమం ప్రభుత్వోపాధ్యాయులుగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో పనిచేసి వీరు ఉద్యోగ విరమణానంతరం హన్మకొండలో స్థిరపడ్డారు. రొవుగొరు లాక్షణిక పద్యకావ్య నిర్మాత. గోలకొండ కవుల సంచిక నం.222లో వీరి పద్యాలు ప్రచురితం. ఈ కవిగారి రచనలు ఇవి 1 రంగనాయక శతకము (ముద్రితం), 2. శ్రీశైల మల్లేశ్వర తారావళి (1950లో ముద్రితం), 3. బుతు సంహారము (కాళిదాసు కావ్యానికి ఆంధ్రానువాదం), 4 సంపన్న గృహస్థుడు (ఖండకావ్యం) చివరి రెండు కావ్యాలు అముద్రితాలు - అలభ్యాలు. కని వంశాదులు : శ్రీశైల మల్లికార్జున తారావళి చివరి 28వ, పద్యం ద్వారా కవి వివరాలు తెలుస్తున్నవి. ఆ పద్యమిది. వర కౌండిన్యస గోత్ర జాతుడను గుర్వయ్యాంబమా పుత్రుడన్‌ ధర నద్వైత మకావలంబుడను రాధాకృష్ణనాముండ, దు స్తర సంపార పయోధి తారకముగా తారావళిం గూర్చిసు స్థిరమౌభక్తి చెలంగ నీ కొసగితిన్‌ శ్రతైల మళల్లేశ్వరా కవి జననీ జనకులు అంబమ్మ గురువయ్య, అద్వైత విప్రుడు. కౌండిన్య గోత్రం. కావ్య విశేషాలు; కవి మొదటి కృతి బుతుసంహారాంధ్రానువాద కావ్యం. రెండవ కృతి రంగనాయక శతకం. దీనిపై ముద్రిత సంవత్సరం లేదు కవి దీనిని 1950కి ట్‌. “మల్లేశ్వరతారావళి' కృతిలో ఈ శతకాన్ని పేర్కొనడాన్ని బట్టి చెప్పవచ్చు ప్రొథకవిత్వం కలది రంగనాయకా - అని దీని మకుటం. శ్రీకర మంజు లేక్షఐ వశీకృత లోకచయా! సమస్త జీ వాకర;! సూర్యమండల నిరంతర కాంత విహార తత్పరా, భీకర పాప దృశ్భ్రవణ బృంద ఖగేశ్వర, చారుతప్త చా మోకర నూతనాంబర, తమిన్‌ గొలుతున్‌ నిను రంగనాయకా! భావం? ఓదేవా, శుభంకరమైన రమ్యవీక్షణములచేత సమస్త లోకాలను వశమొనరించుకొనిన వాడా. సకల జీవులకు నిలయమైనవాడా. సదా సూర్య మండల విహారం కావించు వాడా. భయంకర సర్పసమూహాల పాలిటి గరుత్మంతుడా, అందమైన నూతన కనకాంబరముల ధరించువాడా నిను ఆసక్తితో సేవింతును. దృక్సృవణము = చూపులతో వినునది - పాము; చామాకరము = స్వర్ణము. పాపదృక్సృవణము - రూపకాలంకారము, కవి ప్రతిభను ప్రదర్శించేవి ఇటువంటి పద్యాలే రెండవ పద్యంలో హరి మహిమ ఉగ్గడింపబడింది! ఇలా -

  • రాధాకృష్ణరావు గారి ముద్రిత పుస్తకాలతో పాటు, వీరిపేరుతో ఉన్న గో.కసం. గూడూరు గంగురామకృష్ణయ్య గారి వద్ద 1981లో చూశాను కవి వివరాలు సాహితీమిత్రులు కరీంనగర్‌ బి.వి. రామారావు, కె. మల్లికార్డున్‌ గారలు తెలిపారు

రెండవ భాగం - ౪ అధ్యాయం. “205 శతాల్బ పూర్వాస్థ సావాత్యం” పద్య సాహిత్యం 195

వాకొన లేవు నీ మహిమ వారిజ గర్భ ముఖాఖిలామరా

నీకము, నాల్గు వేదములు, నిర్గుణ బోధక నైగమోక్తులున్‌,

(ప్రాకటలోక వృత్తముల భంగి జెలంగు పురాణ పంక్తులున్‌

నాకగునే నుతింప నిను, నందక సాయక రంగనాయకా !

దైవం నిర్గుణమని ప్రబోధించేవి నిగమాలని, లోక వ్యవహార భావాల ననుసరించేవి పురాణాలని వాకొనడం కవి గారి వేదాంత శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. శ్రీశైల మల్లేశ్వర తారావళి: ఇది తారావళి 27 పద్యాల సంఘాతం. వరంగల్‌లోని శివభక్త నమాజం వారు, శ్రీశైల మళల్లేశ్వరా. అను మకుట పద్యాలతో ఒక శతకం ప్రచురించే నంకల్చంతో కవుల నుండి ఒక్కొక్క పద్యాన్ని పంపుమన్నారట. అప్పుడు రాధాకృష్ణకవి రెండు పద్యాలను పంపారు. ఆ శతకం రాకపోవడంతో ఈ కవి తమ పాత పద్యాలకు తోడు మరికొన్ని పద్యాలు అదే మకుటంతో బాసి తారావళిగా ప్రచురించారు. ఈ విషయం కవిగారే ఈ కృతి 'తొలినుడిలో 16-1-1948 నాడు వ్రానుకున్నారు. దీనికి ఉదయ రాజు శేషగిరి రావు కవిగారి పీరిక 25-5-1948 తేదితో ఉంది. వుస్తక ప్రచురణ నంవత్సరం మాత్రం 1950గా పేర్కొనబడింది. శ్రీశైల మల్లేశ్వర తారావళిలోని ఒక పద్యం చూడండి.

సుర సంఘాతము పారు పత్తెమిడ నస్తోక ప్రపత్తిం బరా

బరిగా మౌనులు నీదు సంస్తవము సల్పం బూజ్య పీళస్ణులై

హరియిన్‌ బ్రహ్మయు ముచ్చటింప బహులోకారాధ్యతంజెంది సు

స్థిరకైలాసమునన్‌ వసించెదవుగా శ్రీశైల మళల్లేశ్వరా - ప, 27. వే ఇతి

ధూర్దటి 'శ్రీకాళహస్తీశ్వరా' శతకాన్ని తలపించే పద్యాలు. మకుటం అంతే వృత్తాలు అ=. ని వృత్తం అదే - శివ భక్తి వర్ణన, “ఆ యీ కబ్బములు ప్రాచీన లాక్షణుకుల శాసనములకు లోగినవి = గా క యిప్పటి నవ్య కవిత్వమార్గములోనివి కావు” అని ఈ కృతిలో చెళ్ళపిల్ల వేంకటశాస్రిగారు వెలిబుబ అభిప్రాయం అక్షరాలా సత్యం. బుతు సంహారం: ఆంటనువాద కావ్యం. అముద్రితం. మృదు మధురమైన శైలితో రచించిన త గత పద్యాల కావ్యం పలువురు పండితుల ప్రశంనలు పొందింది. కవి క్వాచిత్కంగొవైనా ఆంధ్ర 0 స్వతంత్రత వహించారు. 'వసంత బుతువు' పేరుతో గో.క నంలో ప్రచురింపబడిన రాధాకృష్ణరావు డ్డ తెలుగు బుతుసంహారములోని అయిదు గీతాలలో మొదటిది చూపబడింది రెండవది ఇక్క చూపబడుతున్నది. గో.క సం. 210 పుట నుండి -

రమ్య దీర్ధికాంబువులకు రత్న కాంచి, కావితతికి విలాసినీ గణములకును

సోమ రుచులకు పుష్పిత-చూతములకు, నొనగు సొభాగ్యమావసంతోదయంబు. న

తర్వాతి మూడు పద్యాలు తరుజణీమణుల అలంకారాల వర్ణనతత్సమ పదాలే అధికమైనా ను సమాసాలు లేకపోవడం ఈ అనువాద కావ్య సుగుణం. సంపన్న గృహస్తు - స్వతంత్ర రచన. విద్య కృతి. ఖండకావ్యం. ఇది నవ్యభావాలతో అలరారుతున్నదని తొరావళిలో చెప్పబడింది. ఇది అలభ్యం

గొట్టముక్కుల రాధాకృష్ణరావుగారు విద్వత్కవితావతంసులు.. ప్రనన్ఫకైలి, పదమాధుర్యం, భావలాలిత్యం వీరి కవనానికి సహజాలంకారాలు. ఈ కవి పద్యాలు ఓ తరం కవితా ప్రతిభకు ఉదా హరణంగా నిలుస్తాయి. 20) దప్పురి సత్యనారాయణాచార్యులు - కోట్ల, మం.గంగాధర - 1910-1985 సుమారు.

గోలకొండ కవుల సంచికలో దప్పురి సత్యనారాణాచార్యులు అష్టావధాని - విద్యాన్‌, బిజవెంకి జన్మస్థలం, అని ఉంది. అది ఆచార్యులు గారు బెజ్జంకి గ్రామ నృసింహాలయార్చకులుగా ఉన్నకాలం అంతకు అయిదేండ్లు పూర్వమే ఈ కవి “రామాశ్వమేధ నాటకము' ముద్రితమైనా, చిత్రాంగద యక్షగానం

196 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” విరచితమైనా వీరి కృతుల పేర్లు ఆ సంచికలో లేవు. వీరు గంగాధర మండలంలోని కోట్ల - నరసింహులపల్లె నివాసులు. చారిత్రక పట్టణావశేషంగా మిగిలిన నందగిరి మట్టికోటకు ఈ గ్రామం సమిపంలో ఉంది. ఆచార్యులు స్థానిక నృసింహాలయ పూజారులు. వీరి పూర్వులది పోలాస (గ్రామం, సత్యనారాయణాచార్యులు హరిదాసు కవి. ఇంచుమించు ఎనుబదేండ్డ జీవితకాలంలో అరువదేండ్లు రచనావ్యాసంగంతో జీవించారు - రాణించారు సత్యనారాయణాచార్యులు శ్రీవైష్ణవులు, హరితన గోక్రులు వారి వంశమూల పురుషుడు మహావిద్వాంసులైన నరసింహాచార్యులు. వీరి తండ్రి కేశవనాధుడు, తల్లి చూడమ్మ సత్యనారాయణాచార్యులు బహు[గ్రంధకర్త* వీరి రచనల వివరాలు “శ్రీరామ ధర్మస్వరూప వైభవము” కావ్యంలో ఈ విధంగా తెలియజేశారు. రామ కృషపాకటాక్షమున వ్రాసితి రూపకముల్‌ త్రయంబురా ట్ఫ్సోముల సత్కథల్‌ మృదురసోచిత సర్వజనాదరంబు వెం పై మహి కీరితిన్‌ వడయుభంగి పదొక్కటి వీధినాటికల్‌ భూమిలొ మెప్పుపొందు గతి మెల్పగు నాలుగు యక్షగానముల్‌. రాముని దయచేత రాజచంద్రుల కధలు 3 రూపకములు (7), 11 వీధి నాటికలు, యక్షగానాలు రచించారట. అది వీధి భాగవతాలకు అత్యంతాదరం కల కాలం. తర్వాతి పద్యంలో 10 హరికథలు, 1 నవల, అనేక భక్తి కీర్సలు మంగళహారతులు రచించినట్లు తెలిపారు ఇవి మొత్తం 29 గ్రంధాలు. పాటలు అదనం. వీనిలో ముద్రితాముద్రిత లభ్యకృతుల వివరాలివి యక్షగానాలు - నాటకాలు 10. ఒక్కొక్క కావ్యం, నవల, హరికధ మొత్తము 13 రచనలు మాత్రమే. రూపక సాహిత్యాన్ని గూర్చి తర్వాత, ప్రస్తుతం వీరి ఇతర సాహిత్య ప్రక్రియా రచనల పరిచయం చేయబడుతుంది. 1 శ్రీరామ ధర్మ స్వరూప వైభవము - పద్యకావ్యం ముద్రితం 2, గజెంద్రమోక్ష్తము - హరికధ - ఆముద్రితం, 3౩ కర్మయోగి - నవల - ఆముద్రితం ఓ శ్రీరామధర్మ స్వరూప వైభవము; ఇది చంపూకావ్యం ఈ రామాయణ కధ కవి చివరి కృతి. 1975- 80 మధ్య ముద్రితం. ఆశ్వాసాలు రెండు. పుటలు 110. కవి ఉభయ భాషాపండితులు వీరిది సలక్షణ కవిత్వం. కవి శ్రీరామచంద్ర భక్తులు ముముక్షార్థులై జీవిత చరమాంకంలో ఈ భక్తి కావ్యరచనకు పూనుకున్నారు. ప్రధమాశ్వాసంలో కవి వంశవర్ణన తర్వాత ఆదికవి వాల్మీకి చరిత్ర ఉంది. ద్వితీయాశ్వానం విశ్వామిత్ర యాగ సంరక్షణ కోసం దశరథుడు శ్రీ రాముని పంపిం చనెంచటరతో ముగిసింది. దీనిని బట్టి కమి మరో రామాయణం వ్రాయనెంచారనుకోవచ్చు రచించినదింత మాత్రమే వీరి కధ మూల విధేయంగా సాగింది. సంస్కృతకవులకు వందనమాచరించి కవి సుతించిన పూర్వాంధ్రకవులు వీరు. సురుచిర మాంధ్ర భారతము శోభిల సతృతి జల్పినట్టి భా సుర బుధ నన్నయాదులను సూరన తిమ్మన పెద్దనార్యులన్‌ సరన కవీంద్ర ధూర్జటిని సారవచోకృతి రామ భూషణున్‌ హరి పద భక్తి యుక్తుని మహాత్ముని పోతన నాత్మగొల్బెచేదన్‌.

  • గోకసం. 1934 భవ దీపావళి ప్రచురణ. దప్పూరి వారి “రామాశ్వమేధం' శుక్షనామ సంవత్సరం 1929 పింగిలిరెడ్డి నెమిలికొండ తా. జగిత్యాల వారు ముద్రించారు.
  1. _ దప్పూరి వారి “శ్రీరామ ధర్మ స్వరూపము వైభవము” ఆశ్వాసాంతగద్య
  2. _ దప్పూరి వారి “శ్రీరామ ధర్మ స్వరూపము వైభవము” అవతారిక. 4 1975లో ఈ వ్రాత ప్రతిని చూశాను. ఇప్పుడు కనిపించిన ముద్రిత ప్రతిలో ముద్రణ సంవత్సరం లేదు. పద్యాల సంఖ్యలేదు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ప్రూర్వాస్థ సావొశ్సం” పద్య సాహిత్యం 197 ఆ తర్వాత వర్తమాన కవుల ప్రస్తుతించెద - నన్నారే తప్ప, కుకవి నింద చేయలేదు. అది కవి వినయం - సుగుణం! వీరి కవిత్వానిది పురాణాలధోరణి. కావ్యం భక్తి సంభరితం. ఒక పద్యం - ద్వితీయశ్వాసాంత మాలినీ వృత్తం చూడండి. సురుచిర శుభ దాతా - సూర్యవంశ ప్రభూతా । సరసిజ దళనేత్రా - సజ్జన వ్యూహ స్తోత్రా పరమ సుఖవిలాసా - పాప దైతేయ నాశా వర శివ గుణధామా - భక్త సంత్రాణ రామా! “పెద్దరికంబుతో కవిత పెంపాదించుట కో” సం కాక్క ఆత్మ పరిశుద్ధికి గుణవర్ణనంబు సేయ బూనుకున్నారు కవి. “రామా నీవు మనుష్య మాత్రుడవా భ్రాజిల్లు విష్ణుండవో” అని ప్రళ్షిస్తూనే పురుషోత్తముడైన విష్టావతారామూర్తిగా భావించి సేవించారు. ఈ క్రింది పద్యం కవి చిత్తవృత్తికి నిదర్శనం. ఒప్పులు తప్పులెన్ని గలవో యని సంశయమొంద, యీ కృతిన్‌ తప్పులు దిద్దుమంచు కవితల్లజులన్‌ బ్రతిమాలబోను, నే మెష్పు వహింపగోరి పుడమిన్‌ దిరుగాడ, మదీయ నేరముల్‌ యొప్పులు జేయుమంచు మది (నిను) నోర్చున వేడెద జానకీపతీ, 2. గజేంద్రమోక్షము: కవి పది హరికథలు రచించినా వానిలో ఏ ఒక్కటీ లభించలేదు. వారి పుస్తకాలు చూస్తుండగా ఒకానొక వ్రాత ప్రతిలో ఒక విడి కాగితం కనిపించింది. 80వ పుటలో 'గజేంద్ర మోక్షణం కధ' అని శీర్షిక ఉంది. 81వ పుటలో మాత్రమే న్రాత ఉంది. శ్రీ భాగవతము హరికథ అని పైన వ్రాసి కధారంభమైంది. అది ఈ విధంగా ఉంది. శుకమహర్షి - (కీర్తన - కల్యాణిరాగము, చతురన్రై గతి) త్రికూటమను పర్వతము నుధాబ్చిలో తేజరిల్లు కడు నిడువై ప్రకటితమగు బంగరు వెండియినుముల కొమ్ములు మూడు గలవై త్రికూటవిటపిలతా కుంజములు గంధర్వ విమానములు ధరియించు నటననేకమణి ధాతు చిత్రితములయ్యి శృంగారముగ వెలయున్‌ వ అప్పర్వత సమిపమున సాల లతాది లలిత పల్గవ మహీరుహంబులు శుకపికాది శారికా సముదయంబును నవరత్నాకరములును సిద్ధచారణ సంచారంబును నానొజంతు సంకులంబై విరాజిల్లు - శా అన్యాలోకన భీకరంబుడు జితాశానేకపానేకముల్‌ వన్యేభంబులు గొన్ని మత్తతనులై ప్రజ్యావిహారాశతో ధన్యత్వంబున భూరి భూధర దరీ ద్వారంబునందుండి సౌ జన్య క్రీడల నీరు గాలి (గ్రోలి?) - లభించిన దింత మాత్రమే - పది హరికథలు వారి కథాకాలక్షేప ప్రయోజనార్థం రచించిఉంటారు. అవి ఇతర హరిదాసులకు కూడా ఉపయోగపడి ఉంటాయి. కాని అవి అప్పుడు అముద్రితాలు. ఇపుడు అలభ్యాలు 3. కర్షయోగిః ఇది పౌరాణిక నవల, భాష వ్యావహారిక పదస్పర్ష గల గ్రాంధికం. కధ అంబరీశ చరిత్ర. కవి వైష్ణవ మతాభిమానంతో ఏకాదశీ మహాత్య్మవర్ణన గల ఈ భాగవత కధను వ్రాయనెంచుకొని యుంటారు. ఇది 200 పుటల వ్రాతప్రతి కృత్యాది నాలుగు పద్యాల్లో ఉంది. వీరి వచన శైలి ఇది. “ఓరీ విక్రమ నేనా! నీ స్వతంత్రమెంతకాలము నిలబెట్ట్బకుందువో చూచెదగాక. అని 5. కవిగారి అచ్చు పుస్తకాలు వ్రాత ప్రతులు వారి దత్తపుత్రులైన మధుసూదనాచార్యుల గారి నుండి వేణుశ్రీ కవి తెచ్చి ఇచ్చారు. 1991

198 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

“జింకలు దుప్పులు చమరీ మృగములు మొదలగు సాధు జంతువులు గ్రూరమృగముల అరపులకు బెదరుచుండును, చిలుకలు గోరువంకలు కోయిలలు. . జంటలు జంటలుగా చెట్ల కొమ్మ లపై... మృదుఫలాలు భక్షిస్తూ కమ్మని గీతారావాలు చేయుచుండును. పర్వతాగ్రాలపై క్రిందికి దూకుచున్న సెలయేరులు...” ఇందులో సుమంతుని పుత్రుడు మంత్రి సుబుద్ధి క్షత్రియుడని ఆ రాజసేనలు భారతసేనను మించి పృధ్వీవిజయం కావించినాయనడం వంటి విశేషాంశాలున్నవి.

కోట్ల సతెయ్యగారు అనే వ్యవహార నామవ్యాప్తిగల దప్పూరి సత్యనారాయణాచార్యులు కావ్యం, నవల, నాటకం, హరికథ, కీర్తన వంటి పంచ విధ ప్రక్రియల్లో ప్రసన్నతైలీ దాక్షాపాక రామణీయకంగా రచనలు చేసి సమకాలీనుల ప్రశంసలనందుకున్న పండిత కవి. 20 _ఆచివేంకటాచార్యులు - అవునూరు - తా సిరిసిల్లా.

జననం - ఆనంద, 1914 - మృతి 1985.

వైదిక వాజ్ఞ్ణయంలో చక్కని వైదుష్యం కలిగిన వేంకటాచార్యులు తెలుగులో రమణీయ భావాలతో కమనీయ కవితలు వెలయించిన కవిశిఖామణులు, అంతా కవులముకామా అంతింతో పద్య సమితి నల్లగలేమా, అన్నట్టు ఏదో ఉబుసుపోక కవిత్వంన్రాసే వారు కొల్లలు. కాని ఎక్కువ కృషిచేసి తక్కువగా రచించి, వ్రాసిన ప్రతిపద్యం ముగ్ధమనోహర సజీవశిబ్పంగా సృజించగల కొందరిలో వేంకటాచార్యులు ముందుంటారు. వీరిది అమృతలేఖిని. గోలకొండ కవులసంచికలో ఆఅచివేంకటాచార్యుల కవిత ప్రచురింపబడింది (కవి నం. 286; కవిత పుట - 297) వేంకటాచార్యుల రచనలు : 1 ఆండాళ్‌ బుజ్జకథ - అముద్రితం, అలభ్యం, 2. రాగమాల = ఖండకావ్యం, 1973లో ముద్రితం, 3. మా ఊరు - పద్యకావ్యం, 1975లో ముద్రితం. కవిపరిచయం: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లా తాలుకాలోని అవునూరులో వేంకటాచార్యులు ఆనందనామ సంవత్సరం క్రీ.శ. 1914లో జన్మించారు. వీరి తండ్రి ఆచి నరసింహాచార్యులు. ఆచి వారిది పండిత వంశం. గోలకొండ సంచిక కెక్కిన కవులు అయిదారుగురు సిరిసిల్ల ప్రాంతము వారే. ఆవునూరువారే నలుగురున్నారు. ఆ సంకలనంలో నం.5 ఈ పుస్తకంలోని నం 1. కవి ఆచి రాఘవాచార్యులు వీరి విద్యా గురువు. ఆ సంచికలోని మిగితా సిరిసిల్ల ప్రాంతకవులు విద్యా గురువులుగానో కవితా మిత్రులుగానో వీరికి సంబంధం కలవారు. కోరుట్ల శతావధాని కృష్ణమాచార్యులు గారి మేనకోడలి భర్త వేంకటాచార్యులు

వీరి వృత్తిని ప్రవృత్తిని కవితా శక్తిని గూర్చి నల్లాన్‌ చక్రవర్తుల వేదాంతాచార్య కవి *రాగమాల' కావ్యపీరికలో, వేషముచూడ ఛాందసము, చదివినది ద్రవిడాగమ శాస్త్రములు, ఈ రసవత్కవిత్వ పాట వము ఎట్లా పట్టపడిందా - అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ' కావ్యపరిచయం; తెలుగులో పాటలు హారతులు, పద్యాలు వ్రాయడం వేంకటాచ్రార్యులకు మొదటి నుండి అలవాటు. ఓ ఆండాళ్‌ బుజ్జకథ: వైష్ణవ్రాచార్యులలో హరిదాసులెక్కువ. కాని వీరు నూతన కధా కథన ప్రక్రియి అయిన బుజ్జకధగా “ఆండాళ్‌ చరిత్ర' రచించారు అది పేరునకు బుళ్టి కధ కాని, గేయాలు - పద్యాలు మృదుమధుర పదవిహితంగా లయబద్ధంగా ఉన్న రసవత్కావ్యమని దాన్ని చూసిన వారు చెప్పారు 2, రాగమాల;: 1973లో ముద్రింపబడినా ఈ కావ్యం ఇంకా విడుదల కాలేదు మిత్రులకు తప్ప 1 అచి వేంకటాచార్చులు గారి 'మాఊరు' 1975లోని న చ.వే గారి 'సుమనోంజలి' ప్రశంసా పద్యం. 2. పరిశోధకులు కాకతీయుల కాలంనాటి జంగముకధలు వీనికి మాతృకలంటారు. కాని, ఆధునిక

బుజ్జకథలు గత శతాబ్దిలో మరారీ ప్రాంతం నుండి దిగుమతి అయినట్లు చెప్పవచ్చు. 3 _ సిరొనహళ్‌ నంబులాద్రి హరిదాసు గారు ఏప్రిల్‌ 1992లో కోరుట్లలో నాతో అన్నారు. వీరు శతావధాని కృష్ణమాచార్యుల జ్యేష్ట పుత్రులు. వీరి మేన వదిన భర్త ఆచి వేంకటాచార్యులు.

రండవ భాగం - ౪ అధ్యాయం : “లంట శతొర్తా ప్రూర్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 199 వేంకటాచార్యుల కవితలు జనవ్యాప్తి కాలేదు. అందుకు కవి ప్రయత్నించలేదు. రాగమాలలో 20 పద్యకావ్యఖండికలు 50 పుటల్లో ఉన్నాయి. గాంధీజీ నిర్యాణం, 15వ ఆగష్టు శీరికలనుబట్టి ఈ కావ్యంలో కొన్ని భాగాలు ఈ శతాబ్ది పూర్వార్ధంలోనివి ఉన్నాయనవచ్చు “భావుకత పద గ్రధన పారీణత సప్రమాణంగా అలవరచుకున్న నరసాధ్వసంచారులు శ్రీ అచి వేంకటాచార్యులు . . . సురభిళాత్మతో వీరు రచించిన ఈ “రాగమాల్‌ సురుచిర భావహేళి' అని ప్రశంసించారు డా. సి. నారాయణరెడ్డి గారు కావ్యపీఠికలో. ధూపొటి. వేంకటరమణచార్యులు, వేంకటాచార్యుల పద్యాలు “అవి నిక్షేపాలు సిసాలలోవలి మాధ్వీ రసాలు' మొ.వి - విని మహదానందం చెంది అభినందించారని నల్లాన్‌ చక్రవర్తుల వేదొంతాచార్యులు వారి మున్నుడిలో తెలిపారు. తొలి శీర్షిక 'ప్రభు' లోని తొలి పద్యం ఇది - శ్రీకరముల్‌ మహాజన వశీకరముల్‌ మహనీయమోక్త ల క్షీ కరముల్‌ త్రయా శిఖర శేఖరముల్‌ బహుళార్తి దైన చా మీ కరముల్‌ మహోదయ నమోకరముల్‌ భవదీయ నిర్మల శ్రీ కరుణావలోక రస శీకరముల్‌ గురిపించుమా ప్రభూ ! అదీ అంత్యానుప్రాస రామణీయకం ; భక్తిరన పూరిత భావ ప్రవాహం ! అస్తి-నాస్తి విచికిళ్సలకు లోనైన ఈనాటి జనుల భావాల వ్రభావంగా కవి తన దైవాన్ని ఇట్లా వేడుకున్నారు. ఉన్నాడందురు లేవనందురు నదేమో యున్నచో రూపమే సున్నాయందురు సూక్ష్మమందు రిటు లీసున్‌ బెంచి నన్నెవ్వరే మన్నన్‌ నాకవి యన్ని యెందులకు, దేవాధీళ 1 నేనింక నీ బ్‌ వున్నావందును, ఉండుమయ్య యిదె నేనున్నంత పర్యంతమున్‌. 'రవీ' లో కవిత్వాన్ని గురించి. తాలి పూజార్థము నాంధ్ర సాహితికి నీ దోసిళ్ళతోచంపక మ్ముల నర్భ్యోదక మిచ్చి యుత్చలములన్‌ బూజించితే మత్త కో కిల గీతావళి నాలపించి యవి నిక్షేపాలు సీసాలలో పలిమాధ్వీక రసాలు భక్తి మెయి నాస్వాదింపగా బేసితే. చంపకం, మత్తకోకిల, గీతం, సీసం పద్య ఛందస్సులు అర్థశ్లేషతో వ్రయోగించిన కవి ప్రతిభకు భావసంపదకు రసజ్ఞులు తలలూపక తప్పదు. గాంధీ జయంతిలో - మూల కొదిగిన రాట్నాలు మూగ గొంతు, కలను సవరించి ఠూనరాగాలు దీసె వెట్టి హరిజన వాడలో రొట్టె విరిగి, నేతిలో బడె నే (నీ) దిన జ్యోతులందు. కూనరాగాలుదీయు జాతీయం, రొట్టి విరిగి వేతిలోబడు సామెత. పలుకు నుడికారాలు సామెతలు భాషకు సహజత్వాన్ని సౌందర్యాన్ని పెంచుతవి పస్పు పిట్టలు, పుండుచలి మొ అపూర్వసజీవ సుందర పదబంధాలను ఈ కావ్యంలో కవి సమయోచితంగా ప్రయోగించారు. వా 4. _ ఇక్కడ అందుకు పదం ధ్రుతాంతం కాదు. నదేమో అనిరాదు అదేమో అని కవి విసంధినే పాటించి యుండవచ్చు ననటానికి ఇదే పద్యచతుర్థపాదంలోని ఉండుమయ్య విసంధి సాక్ష్యం. పైగా మా ఊరు, జనవ్యవహారంలో “మావూరు అని ఉంది. వ్యాకరణ పండితులు దాని నొప్పరు. యడాగమంలో 'మా యూరు" అనే అంటున్నారు. ఈ సంధి జనవ్యవహారానికి సహజంకాక, కవికి నచ్చక ఉభయతారకంగా 'మా ఊరు అని తమ కావ్యనామాన్నే విసంధిలో ఉంచారేమో! అందురు'ను' - సముచ్చయార్థకం !

200 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సావొత్య చరిత్ర” “ధనుర్మాసం'లో “తెలవారంగనె పస్పులో మునిగి క్రొంగ్రాత్త చీరల లావణ్యము గంపలన్‌ గొలువ, పేరంటా లకై పస్సు పిట్టల వోలెన్‌ జను చంద్రు గుంపులుగ వ్రీడా సజ్జిత స్వాంత నిర్మలులై నైదువరాండ్రు -” “నిలువెల్లన్‌ వణుకెత్తు పుండు చలిలో నీరాడి పూజారి పాం గలి నైవేద్యము పెట్టె స్వామి గుడి గంటల్‌ కాహళుల్‌ మైోగిని ర్మల నీహార కణాలు జల్ల - ” ఇట్లా మనోహరంగా వర్ణించారు కవి. హేమంత హేల - ప్రకృతి సొందర్య లీలా చిత్రణ, “కాముని పున్నమి'లో కవి భావం మలయ సమీరంతో పోటీపడి విహాయస విహారం కావించి చక్కని చుక్కలకు నిండు చందురునితో చలువ పందిళ్ళు వేయించుకొన్నది 1 “వలపు గాజుల చేతి చప్పట్ల తోడ, సల్లె పాటల జాతీయ పరిమళాలు బంచి పెట్టుచు నింటింట వాడ వాడ,నాడుకొను పేద పడుచులయందములకు చలువ పందిళ్ళ వేసె మా చందమామ |” మా తెలుగు భాషకు మళ్లె పూదండ ! ఇంతటి మనోహర కవితలు వెలయెంచిన "కవితా వతంసునికి కలువపూదండ' వేయవలసిందే కదా 1! ఇందలి గోదావరిపాంగు, గాంధీనెహూజీల నిర్యాణాలు, అమ్మాయి శీర్షికలు కరుణ రసాగ్రాలు. 15వ, అగస్టు, కెప్టెన్‌ విజయరఘునందన్‌ సంస్కృతి, వీర రస ష్లావితాలు. కర్పూర వసంతరాయలు, పోతన చరిత్రము కృతికర్తలైన డా! సి,నా.ర. అభినవ పోతన వరదాచార్యుల ప్రస్తుతి కవి సౌమనస్యానికి సొహితీప్రియతకు నిదర్శనాలు. కవి ఈ కావ్యంలో రైఫిల్‌ మోతల - రైలుబండి కూతల వడ్డించారు. రైలుది '“అయోమయ' మార్గమని శ్లేషగర్భితంగా పలికిన ప్రతిభాశాలి ఈ కవి. వీరి కవిత మాత్రం ద్రాక్షాసవ పాత్రం. 3. మౌ ఊరు - 1975 ప్రచురణ. దీని ముద్రణకు పూనుకున్న పి.వి. చారి - ఆవునూరి వేంకటాచారి అనే పేరుతో 1947-48 తెలంగాణా విమోచనోద్యమంలో పాల్గొన్నవారు జననీ జన్మభూమిశ్చ - అన్నట్లు కవి స్వగ్రామాన్ని వర్ణించి వ్రాసిన కావ్యం “మా ఊరు”. ఇవ ఏకాశ్వాస ప్రబంధం. పద్యాలు 160. గో క.సం.లోని వీరి రెండు పద్యాలూ నైజాం రాష్ట్రప్రశంసలే వ్లీ మావూరు కావ్యంలో నాయికా నాయకులు లేరు, వ్యక్తుల పేర్లు రావు కాని చివరి 60 పద్యాల్లో ఆవూరికి మేలు చేసిన చాకలి వీరన్న వీర గాధ ఉంది. ఇష్టదైవ గురు బంధుజన వందనమాచరించి సలక్షణంగా కావ్యారంభం కావించి కవి చెప్పిన కధారంభ పద్యమిది. మాదొక పల్లెకాదు - పది మంది ధనాథ్యుల పెద్ద బస్తియున్‌ గాదు - బజారులో మురికి కాల్వలు - బాటలునొప్పు - మాట మ ర్యాద - అమాయికత్వము విరాజిలు మా ప్రతి యింట - పారిటీ సోదెలు పిచ్చివేషములు సోకులు మచ్చుకు లేనె లేవు పో |! ఆవునూరి పరిసరాల, గుట్టమెట్టల, నదీతటాకాల, పంట పైరుల, సుర జనాల, ఈ కావ్యంలో కవి మనోజ్ఞంగా సహజసుందరంగా వర్ణించారు ఆ పద్యాలు శిల్ప విన్యాసంలో కరుణశ్రీని, భావగాంభీర్యంలో జాషువాను తలపింపజేస్తాయి. వేంకటాచార్యులకు అభిమాన కవి భక్త పోతన భాగవతం ఈ కవి నిత్యపారాయణ గ్రంధం అనవచ్చు ! 5. _రేపాల నరసింహరాములు “కరీంనగర్‌ జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్ర' 1993, పుట - 123; ఫోటో పుట - 129.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ప్రర్వొస్థ సాపాత్యం- పద్య సాహిత్యం 201

ఆఅవునూరికి కొంత దూరములో కొత్తగా ఓ గ్రామం వెలసిందట, వారు గ్రామదేవతను నిల్చుకునే సందర్భాన మూడు రోజుల సంబరం మహాసంరంభంగా నిర్వహించారు. చివరి దినం బలి బోనవు ముద్ద ఎగుర వేయగా, దానిని ఆవునూరి చాకలి వీరుడు గాలిలోనే అందుకొని ఫరుగెత్తుకొచ్చాడు. అది నేల పడిన చోట శుభాలుంటాయని, లేకుంటే అరిష్టమని కొత్తవల్లె యువకులు కట్టిలు కత్తులతో వీరని వెంబడించారు. వారు సమిపించినది చూసి తమ ఊరి పాలిమేరలోనికి బలి అన్నంముద్ద విసరి శత్రువుల దెబ్బలకు వీరన్న మరణించాడు. ఇదీ సంగ్రహంగా ఆ కధ.

ఒకసారి పెనువర్షం కురిసే నమయంలో చెడ్డు నిండి తెగి ఊరికి ఏ ప్రమాదం వాటిల్లనున్నదో అని ఈ కవి భయపడగా, అట్లా జరుగదని పైకధను కవి గారి తండ్రి వినిపించినట్టుగా చెప్పబడింది.

ఈ కావ్యంలోని ఏ పద్యాన్ని చూసినా అది ఒక ఆణిముత్యం - సద్యోవికసిత ప్రనూనం. కవి కలం భావానాబలం అనిదంపూర్వం ఆఅ ఊరిలో,

కవులున్నారు రసాత్త కావ్య రచనా గౌణేయులున్‌ - సాహితీ -

ధవులున్నారలుదాత్త వాబ్మయ నియంతల్‌ - నవ్య సంగీత న్వ

రృవులున్నారట శ్రావ్యకంర కలనాపూర్ణుల్‌ - వచోలాస్యవై

భవులున్నారు సభాంగనార్హ వివిధోపన్యాన వాచస్పతుల్‌.- 22

వైళ్యుల ప్రశంస - ఏరిలాభాల నార్జించు వారలైన, జోరులో కొల్తలో పిచ్చిబ్లాకులేక, విజ్ఞులై పుణ్యజనతా వివేకులైన, బేరులున్నారు చిన్నకుబేరులట్లు- 26. ఆంతేనా మంచితోపొటు చెడును సైతం నర్మగర్భితంగానైనా చెప్పగల గుండె దిటవు ఈ కవికున్నది. అటువంటిదీ క్రింది పద్యం.

ఒక్కటి నచ్చ చెప్పి మరియొక్కటి జేయుచు నోటిలోని దౌ

బుక్కను లాగజూచెడి ప్రబుద్శలు వెంటను వెంట దిగ్గి పెం

పెక్కెడు ప్రక్కపాములటు లేమరు పాటున గాటువేయు నా

టక్కరులుండవచ్చును _ కడంకను జూచిన - నందుగొందులన్‌ - 80.

కడంక వంటి జనవ్యవహారంలోలేని నిఘుంటువులలోని వదాలు క్వాచిత్యంగా కనిపించినా, సజీవ భాషనే కవి స్వీకరించారు. బుక్క = కబళం (కొస్తాలో బొక్క, అది తెలంగాణాలో బొమిక) వం మాండలిక పదాలు నిస్సంకోచంగా వీరు ప్రయోగించారు. ఎ

నిండు గంగాళాల్లాంటి చెరువులు, ఆ రెంటి మధ్య నౌక విధంగానిలిచిన రాతి వంతెన. పచ్చని పట్టు తివాచీలవంటి పైరులు, తలల వాల్చిన కంది బొన్న చేలు, నిపుణులైన వృత్తిపనివా రలు విద్వచ్భోభితులైన కవి పండితులు, న్యాయవేత్తలైన గ్రామాధికారులు, నుందరీమణులు ... మొ వర్ణనలీ కావ్యంలో ఉన్నవి. పురాణ సంప్రదాయ మార్గం నుండి పద్య కవితను నవీన సామాజికేతి వృత్తంతో రచించినధీశాలి వేంకటాచార్యులు ఈ స్థల చరిత్ర కావ్యంలోని అనుక్రుత కథానాయకుడైన వీరన్న వర్ణన చూడండి

భుజముల వ్రేలాడు బోలెడు జంపాలు, నెగదీసి చక్కగ బిగియగట్టి

పై గుడ్డ నడుమున పట్టగా బిగియించి, కమ్ముల దోవతి కాసె జెక్కి

పురి విచ్చి తలపాగనెరి బాగుగా జుట్టి, బ్రతుకుపై గల ప్రేమ వదిలివెట్టి

తన రక్తనాళాల తళతళ లాడెడి, సాహసౌదార్యాల సానబట్ట్‌

ధైర్యమును మగ తనము నుదార గుణము, బంటులై తోడుగా వెనువెంట రాగ

మల్ల జరచి యొకానొక మారు త్రోవ, విచ్చుకత్తుల వ్యూహానజొచ్చిపోయె - 131

202 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

ఇది ఏ పూర్వ ప్రముఖ ప్రబంధకవులకూ తీసిపోని పద్య శిల్బం - భావచిత్రం ! వ్రాసినవి చిరుత కావ్యాలైనా, మహాకావ్యకవుల సత్తా ఈ కవి గారిది. ఆచి వేంకటాచార్యుల కవనం వారి 'మా ఊరు సరోవర తామరస వర్ణనకు సరిపోజాలుతుంది. ఆ పద్యం చూడండి

అరయగ మొగ్గయో పిడికిడంతయు! విచ్చిన పూవా దోసెడా

పరిమళ పుష్పమధ్యమున బచ్చని కర్షిక - దాని చుట్టు కే

సరములు - వందలాది నును జాయల రేకులు - వాని లోననే

సురభి పరాగముల్‌ - మధురశోభి మరందములుద్భవించెడున్‌ - 57

కరీంనగర మండల సాహిత్యోద్యాన *కవి కోకిలి ఆచివేంకటాచార్యులు, వేముగంటి నరసింహాచార్యులు అచి వారి కవిత్వాన్ని ఈ కావ్య ప్రవేశికలో బహుధాకొనియాడినారు. ఇంతచక్కని కావ్యాన్నికేవలం 500 ప్రతులు ముద్రించి కవి కనులముందు కానీ, తర్వాత కానీ ఆవిష్కరించక పోవడం బాధాకరమైన విషయం.

  1. వటపురి వేంకట నృసింహాచార్యులు - కంది కటుకూరు - సిరిసిల్ల గో.క,సం - సం.329 జననం 1890 సుమారు, మృతి 1965

ఇంటిపేరైన మర్రిపల్లిని సంస్కృతీకరించుకుని నృసింహాచార్యులు 'వటప్పురి' వారైనారని వినికిడి వాతూల అహోబల పండితుని నిజనామం గాలి ఓబయ్య అని “అహోబల పండితీయి ప్రస్తావనలో ఉంది. అలాంటిదే ఇది విశ్వనాధ సత్యనారాయణగారి 'రామాయణ కల్పతరువు" కావ్యంచేత (్రేరితులైన ఈ కవి 24 వేల పద్యాల్లో “సీతా చరిత్రము” అని రామకథను వ్రాయనెంచి దాదాపు ఎనిమిది వేల పద్యాలు వ్రాశారట ' అందులో కేవలం మూడు ఆశ్వాసాలు 6, 7 వందల పద్యాలు మాత్రమే తొలి సంపుటిగా 1964లో 600 ప్రతులు ముద్రించగలిగారు అంతటితో మృత్యువు వారిని వరించింది. వటపురి వేంకట నరసింహాచార్యుల కృతులు ఇవి -

1 సీతా చరిత్రము, 2. అహల్యాశాపహరణము, ౩ కుశికాత్మజుని తపోభంగము, 4. భక్త కల్పద్రుమ పద్యములు, 5. భుజగ రాజీయము, 6. నామదేవుని పెండ్లి, 7 కీర్తనలు, 8 బలిచక్రవర్తి కధ, 9. సుధార్ణవము మొదలైనవి.

ఇన్నింటిలో ఒక్క “సీతా చరిత్రము" మూడు ఆశ్వాసాల గ్రంధం మాత్రం ముద్రితం. అందులో ఇతర రచనల వివరాలు లేవు కవి జన్మతేది కూడా లేదు. కావ్య పరిచయం : కావ్య పీరికలో శతావధాని కృష్ణమాచార్యులు అన్నారిలా “వీరు నాకు చిర పరిచితులైనను వీరి కవితా విలాస ప్రదర్శనము నూతనము... చిన్న చిన్న పాత్తములు వ్రాసి మహాకవులమని పెద్దపెద్ద బిరుదములంట గట్టుకొన తంటాలు బడు స్వభావులు కాదు” వీరు.

రామాయణము కాండములుగా విభజింపబడి ఉంది. వీరు కొవ్య ప్రబంధాల విధానంలో తమ ఇతిహాసాన్ని అశ్వాసాలుగానే విభజించారు. అచ్చయిన మూడు భాగాల్లో 172, 201 194=567 పద్యాలున్నాయి. వీరి కవనం ధారాశుద్ధి శోభితం.

శ్రీమన్మంగళ వైభవాస్పదము సంసేవ్యంబు విస్సార శో భామాన్యంబఖిలైక మోహనము శుంభ త్పూత పూర్ణాంబుది వ్యామోదాద్భుత భాగ్యమందిరము నిర్వ్యామోహ సంపత్తి ని స్సీమ ప్రాభవ సత్వపూరితములై చెన్నాందు వైకుంరమున్‌ (1-1)

ఈ విధంగా కథారంభమై,

  1. వాల్మీకి రామాయణంలో 24 వేల శ్లోకాలున్నాయంటారు. వ్యాస భారతం లక్షళ్లోక సీమితమట
  2. క.జిర చరిత్ర - 1981 పుట 228 లో చూపినవి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాల్ద ప్రూర్వొస్టీ సాహచ్యం” పద్య సాహిత్యం 203 అనవరతంబు భవ్యతమమై రసపూరితమై మనోజ్ఞమై ఘనతరమై చిరంతర సుఖాళిని గూర్చ నిదానమై సుధీ జననుత సామగాన సరస స్వన పూరితమై విశాలమై దినకర చంద్ర తారకల దీప్పలకున్‌ జొరరాకభేద్యమై (1-3)

ఇట్లా సాగింది వీరి కవితా మకరంద ప్రవాహం పద్య రచనలో ప్రసన్సశైలి, వర్ణనలలో ప్రబంధ నైపుణి, కధా గమనములో పురాణముల ధోరణి ఈ కవి కలానికున్న సుగుణాలు.

ఈ కావ్యమున ఒక సీస వద్యం 50వ పుట, చరణాలు ఆద్యక్షరాలు చదివితే 'సమన్త జననీ వందే " అవుతుంది. ఇది చిత్ర కవితా విన్యాసము. ఈ కృతి మూడు అశ్వాసాలు ముగ్గురు దొతల సహాయంవల్ల ముద్రణ పొందాయి కనుక ఆయా వదాన్యుల వంశ చరిత్రలు ఆయా కావ్యభాగాల ముందు ప్రత్యేకంగా కవి (20 - 30 పద్యాల్లో) రచించి కూర్చారు.

“ఈ ద్వితీయాశ్వాసము విను సందర్భమున తాల్లిటి మహర్నుల యాశ్రమములు నా కనుల యెదుట సాక్షాత్కరించినట్లు తోచి ముగ్శడనైతిని. ఈ కవి శ్రీ విశిష్టాద్వైత సంవ్రదాయ గ్రంథముల మత్సమీప గ్రామములందెన్నియో మారులు కాలక్షేపము చేయగా వింటిని...వాగ్విలసిళమై వినుటకు శ్రోతృపేయమై, శయ్య శబ్ద స్ఫురణ బంధురమై సలక్షణ లక్షితమై, యలరారుచున్సది అని వానమామలై లక్ష్మణాచార్యులు కావ్యపీరిక “పండితాభిప్రాయం'లో ప్రశంసించారు ఈ సీత్రాచరిత్ర కొవ్యాన్సి.

వైకుంర వర్ణనలోని ఒక పద్యం ఇది (1-41 పుట)

అలరున్‌ తత్పురి మధ్యభాగమున దివ్యప్రాభవోపేతమై విలసద్రత్న మణి ప్రకాశమయమై విస్తారమై నుందరో

జ్వలితంపై తపనీయ నిర్మిత చతుర్వారంబులున్‌ యమన్‌ ర్మల గంధాన్విత బంధురంబు హరినంబంధంబు సం

మున్యోశ్రమ వర్ష (2-87 పుట) లో యాగ ధూమాన్ని జూచి మేఘాలనుకొని ఎమి లయబద్ధంగా నాట్యం చేశాయట. మగనెమిళ్ళే వురివిప్పి ఆడాయనటం కవి సునిశిత ప్రకృతి ౨౦ ల నిదర్శనం. ఆడపిట్టలు అందుకు ఆనందించడం సహజం.

చ సతత జపోప వానముల సల్పి కృశించిన తాపసాళి కం చిత కుతుకంబు గూర్చగ విశేష నుగంధము బూనియున్‌ సదా గతుడు కిశోర రూపమును గైకొని మందముగా జరించు భా సిత సవనాలయంబుల వసించెడి వారల మైల నమ్రుడై

గాలి సదాగతుడు. కిశోర రూపుడై - అంటే, పిల్లగాలి, శపస్సులతో ఉపవాసాలతో కృశించిన మునులకు మలయ సమీరం చల్లగా మెల్లగా వీచి పరిచర్య చేసిందని నందల్భోవిళ సరస వర్ణన.

నాయిక వలపు తలపోత ఇలాగుంది (3 - 137)

శా. సారాసార విచార తత్పరుడు విస్తార ప్రమోదుండు శృం గారాకారుడు శౌరి నన్ను కృపతో కల్యాణి ప్రాణేశ్వరీ నీరేజాక్షి మనోహరీ ప్రియనఖీ నీలాలకా యంచు నిం పారన్‌ బిల్వగ నాలకింప గలనో మద్భాగ్యమెట్టున్నదో, కం. హరితోడ గూడి వేడ్కన్‌, గరుడునిపై నెక్కి తిరుగ గలనో లేనో హరి నర్మోక్తులు వినుచున్తు, కరమానందాత్మనగుచు గ్రాలం గలనో... ఇంతవరకు పోతనగారి రుక్మిణీ నృృతిలో మెదిలింది కదా ఇదుగో ఇక ప్రహ్లాద ప్రవేశం.

204 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” సీ. నారాయణుని పాద నళిన కైంకర్యంబు, సల్చగాలేని హస్తములవేల? కమలాక్షు మోహనాకారంబు నిరతంబు దర్శింపలేని నేత్రముల వేల? కవికి కవనాశక్తికి తోడు హరిభక్తి భాగవచానురక్తి అంత మిక్కుటంగా ఉంది. శృంగార వర్ణనల సందర్భంలోను కవి జౌచిత్యాన్ని పోషించడం ముదావహం. ద్వితీయాశ్వాసాంత మాలినీ వృత్తం ఇది - కుసుమశర సురూపా ఘోర సంతాప తాపా ! ఆసమ సుగుణ జాలా అప్రతీతా సుశీలా చిసరుహ సమనేత్రా విజ్ఞన స్తోత్ర పాత్రా । భసిత కలుషరాశీ బాలచంద్ర ప్రకాశి ఇందులో 8 పుటల ఇష్ట దేవతానుతులతోపాటు సుకవిస్తుతి, కుకవినిందా ఉంది. అంకితం సీతాదేవికి. సీతా జననము నుండి "భూగర్భ ప్రవేశము వరకు వ్రాయనెంచిన మహాకావ్యం ఈ మూడాళ్వాసాల పుస్తక ముద్రణతో కవికి ఆయువు తీరింది. అక్కడికే కొవ్యం అగింది. శ్రేయాం!ి బహువిఘ్నాని - అపితు, యత్సీకృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోషః? రసవన్మహాకావ్య నిర్మాణ సదాశయ (అసంపూర్ణ) సాధకులు వటపురి వేంకట నృసింహాచార్య కవి. 23. వెలిచాల కేశవరావు - గుండి. 198086 - 69 వేలిచాల కేశవరావుగారి జన్మస్థలం (తెలుగులో తొలిసారిగా ధ్యా త్‌ న కందపద్యాలు కనిపించిన పంపకవి తమ్ముడైన జినవల్లభుని శాసనం గల) మ. కురిక్యాల, తల్లిదండ్రులు రామక్క కృష్టారావుగారలు.. తాత కొండన్న, న. ప రావుగారు తమ పెత్తండ్రి కొండలరావు గుండి గోపాలరావుపేట గారింటికి . “సో బాల్యంలోనే దత్తు వెళ్లారు. గుండి గ్రామం రామడుగు మండలంలో ఉంది. , . * వీరి జాతి వెలమవారు. స్వర్దగిరి గోత్రీకులు. లక్ష్మీ సరస్వతులు కలిసి |) ఒకయింట ఉండవంటారు కాని, దానికి అపవాదం వీరి గృహం. వీరు ( 1 భూస్వాములు. విద్యావైదుష్యాలు కలవారు. కేశవరావుగారు కృతికర్త - కృతుల స్వీకర్త. వ్యాపారం వ్యవసాయం వీరికి ధనధాన్య సమృద్ధిని కలిగించాయి. శేశవరావుగారిది నిరంతర సాహితీ వ్యాసంగం; అభ్యుదయ మార్గం - భౌచికవాదం వీరి కలాన్ని కాలానికంటె ముందు నడిపించింది. వీరివి సంఘ సంస్కారభావాలు. రావుగారు ఆంధ్ర జాతీయ మహాసభను, ఆర్యసమాజ్‌ను అభిమానించారు. కొంగ్రేసులో చేరారు. సైజ్‌పూర్‌ సభల్లో గాంధీని చూశారు. తేలంగాణా విముక్తి పోరాటకాలంలో వీరు కాకున్నా వీరి కుమారులు అందులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం తరువాత గ్రామ సర్పంచ్‌గా గ్రామా భ్యు దయానికి పాటుపడ్డారు. రావుగారు యువకులలో యువకులు. అరవై వయస్సులో ఇరవైనాటి ఉత్సాహం. 1908-89 ఎనబై రెండేళ్ళ జీవితకాలంలో అరువదేండ్దకు మించిన కాలం సాహిత్యారాధనతో గడిపారు. బంధుమిత్రుల యిండ్లలో ప్రత్యక పర్వాలు జరిగిన సందర్భాలలో, ఇంకా సాహిత్యసభలలో వీరు స్వీయ కవితాగానం చేసేవారు. కేశవరావు గౌరంటే జిల్లాలో మంచి గౌరవం. కవులకు కళాకారులకు ఆర్థికసహాయం కావించారు. ఇతరుల రచనలు చదివి సవరించేవారు. పలు పుస్తకాలకు పీఠికలు వ్రాశారు. నాలుగైదు కృతులను అంకితం పుచ్చుకొన్నారు. అనేక రచనలు చేసినా ఈ శతాబ్ది ఉత్తరార్థంలోనే వీరి రచనలు పుస్తకాల రూపంలో వచ్చాయి. అందుకు వీరు ఆలస్యంగా పూనుకోవడం కారణం, ఆసక్తి చూఫితే1925- 30 ప్రాంతం నుండే నీరి రచనలు పుస్తకాలుగా వచ్చేవి. / రావుగారు 1827లో తమ వివాహాహ్వాన పత్రికపై శతావధాని పి.ఆర్‌.శాస్త్రిగారిచే కొత్తగా పద్యాలు వ్రాయించి ముద్రింపించుకున్నారు. 1934-35లో సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్రిగారిచే “ధర్మదేవత' కృష్ణార్జున సంవాదగీతారూపకమను పేర సంఘసంస్కరణాత్మక నాటకం వ్రాయించారు. తమ జాతిలోని అంధాచారాల నిరసించడం దీని (ప్రత్యేకత. పరదా నిరసన, స్త్రీ విద్యా ప్రబోధం దీని

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ప్రూర్వాద్థ సాహిత్వం” పద్య సాహిత్యం 205 విశేషతలు ఎనిమిదివేల రూ జిల్లా కలెక్టర్‌గారికి సమర్చించి “కరీంనగర్‌ మండల చరిత్ర జిల్లాలోని ప్రముఖ రచయితలతో వ్రాయించి 1981లో ప్రచురించారు. మలయశ్రీగారిచే “కరీంనగర్‌ జిల్లా రచయి తల చరిత్ర వ్రాయించి 320 పుటల గ్రంధాన్ని 1981లో స్వంత డబ్బుతో ముద్రించారు జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. పై రెండు పుస్తకాలు అమ్మగా వచ్చిన ధనాన్ని జిల్లా రచయితల సంఘభవన నిర్మాణానికి వెచ్చించాలనుకున్న వారి కోరిక నెరవేరలేదు. కేశవరావుగారి ముద్రిత పుస్తకాలు : 1. ఊహాలోకం - 64 - గేయాలు. 1972, 2. మిత్ర నీతి - కంద పద్య శతకం -1975, 3. నేను - నా జ్ఞాపకాలు; స్వీయ జీవితచరిత్ర - 1977 ఆముద్రితరచనలు ; 1 ఊహాలోకం - 2వ భాగం, 2. కుటుంబనీతి - 2 భాగొలు - పద్యకావ్యం, 3 గీతాతత్త్వ విచారం - వచనం, విమర్శ, _ 4. దైవ రహస్యాలు మొదలగునవి. వీరు అంకితం పొంది కృళులివి -

  1. కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గారి 'శేదారగాళి ఖండకావ్యం - 1975

  2. మలయశ్రీ గారి (నా) 'మంటల వర్షం' నవల - 19382

  3. కాలువ మల్లయ్య గారి “కట్నం కథలు' 1983.

4 కె రాఘునాధాచార్య గారి 'విజృంభణ' వచన కవితో సంపుటి - 86.

  • ఇవేకాక కేశవరావుగారికి వారి పెద్ద కుమారులైన డా. వి,కొండలరావుగారు కూడా ఒక పుస్తకాన్ని అంకితం కావించారు. రెండవ పుత్రులు పి.జగపతిరావుగారు కొంగ్రెసు నాయకులు వీరి సంతానం - బంధువులు విద్యావంతులు - పెద్ద ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు. కవి సుతులు :

పి.ఆర్‌:శాస్తిగారు కేశవరావుగారి వివాహపత్రిక 1927లో ్రాసిన నాలుగు పద్యాల్లో ఒకటి. బారథీవ పుత్ర మిత్ర పరివార యుతంబుగ నేగుదెంచి వే డ్కం దిలకించి పెండిలి విలాసము లందనివారదోగి యా నందము నొంది దంపతుల నవ్యతరమ్మగు నట్టి దీవన స్పందుల జేసి నేనిడు నపర్యలనంది ముదంబు గూర్పుడీ. కేశవరావుగారి పెద్ద కూతురు కల్యాణ సందర్భంలో ధూపాటి వేంకటరమణాచార్యులు సమర్పించిన 'ఆశీః కుసుమాంజలి" 1944, ఆరు పద్యాలతోపాటుగా, కన్యాదాత కేశవరావుగారికి సమర్పించిన పద్యం చవి చూసినాడవు సార సారన్వతీ సాహిత్య నంపూర్ణ సొష్టవంబు గమనించినాడవు కమనీయ సుకవితా పరిపక్వ విశ్రత పరిమళంబు తిలకించిరాయించితివి పద్మనాయక వెలమవీర విహార విక్రమంబు కనుల గాంచితి వాంధ్ర ఘనులు పాలించిన కోటలు గడులును కోవెలలును నిన్ను మెచ్చి వ్రాయుటకాదు నిక్కముగను, నకల సౌభాగ్యములు గల్లి సదయుడవగు నీకు నాయురారోగ్యముల్‌ నిత్యశుభము, లెలమి గల్లించుగాత స్వోశ్వరుండు విశ్వనాధ సత్యనారాయణగారు. కేదార గౌళ కావ్యాన్ని అంకితమిన్తూ చెప్పిన నాలుగు పద్యాల్లోనిది. ఒక కవి గొప్పవాడని పదూళ్లను నల్వురు చెప్పి కోగ, నీ తికి నిలబడ్గవాడనియు దేశము మొత్తము మీద పెద్ద మో త కలుగ, నంకితమ్ముగను సత్కృతి యొక్కడు గైకొనంగ కో రిక కలవాని, వాణి కబరీగత సూనముగా దలంబెదన్‌,

206 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాపొత్య చరిత్ర” ఇంకా కేశవరావు గారిని ప్రశంసించినవారు కటుకూరి వేంకటాచార్యులు, కోనేరుపల్లి నరసింహరాజు, ప్రజాకవి శిరోమణి చెన్నుపళ్లి సుబ్బారావు రాజాపేట గుంటూరు, గట్టెపల్లి సత్యనారాయణ రాజు, కోట్ల సత్యనారాయణాచారి, డొ బి లక్ష్మయ్య కేలుకుంట మొదలగువారు. కేశవరావుగారు పలు కావ్యాలకు పీరికలు వ్రాశారు. అంబటి నరసింహరాజు ఆత్మకూరు వరంగల్‌ జిల్లా గారి విజయ విజయము యక్షగొనమునకు వ్రాసిన పీరిక మొదటిది. ఆ ఒకే ఒక పద్యమిది. విజయ విజయ ప్రబంధంబు వీనులలర, వింటి కనుగొంటి రసశబ్ద విభవ పణితి వ్యర్ధ పద దూర గద్య పద్యార్థ పటిమ, చెలగు నీకృతి లక్ష్మీనృసింహరాజ ఇంకా - రావుగారు సుబ్బయాచారి కురిక్యాలగారి 'ఆంధ్రజ్యోతిష్యు సర్వస్వము'నకు, సి.డి. వేంకటరాజు పెద్దపల్లిగారి 'తెలుగుబిడ్డ' శతకానికి, ఎస్‌.వేంకటాద్రి ఎలిగేడుగారి “భక్తారామ సుమావళి" గేయ సంప్పటి మొదలగు పుస్తకాలకు పద్య, గద్య పీరికలు రచించారు. కావ్యపరిచయం ;

  1. ఊహాలోకం - 64; కవిగారి అరవై నాలుగవ ఏట 1972లో ప్రచురించిన 64 గేయాల సంపుటి ఇందలి భావాలనేకం 1360కి తర్వాతి కాలానివి. కావున దీన్ని తర్వాతి గేయ (ప్రకరణంలో సమీక్షించుట న్యాయం.
  2. మిత్ర నీతి శతకం - 1975 : ఇది వంద కంద పద్యాల నీతి శతకం. మిత్రా అని మకుటం మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. ఇది తోటి మానవుల మిత్రులుగా భావించిచెప్పిన నీతి పద్య శతకం. కాంగ్రెసు నాయకులు జె.చొక్కారావుగారికి అంకితం. ఇందలి పద్యరీతి నీతులివి. శ్రీకరమై జనహితమై ప్రాకటముగ నీతి ధర్మపథముల తీరుల్‌ లోకానుభవముతోడుత మీకున్‌ వినీపింతు వినిన మేలగు మిత్రా. 1 మన కన్న మిడెడు భూమికి |! మన మన్నంబిడగ వలయు మనుగడ దృష్టిన్‌ అనుదినము పేడ పేంటలు । తినిపించిన మనకు భుక్తి దీర్చును మిత్రా 2 ఘనులను కొన బడువారల । గుణముల్‌ నడవడులు గుర్తుకొని తూచినస ద్గుణ దుర్గుణముల వెల్లడి గనవౌ గురు లఘువుల పస గననౌ మిత్రా ఇది మిత్ర దైవ, మాతా పితృ, ప్రకృతి, నీతి, రాజకీయ పర్వములని అరు భాగాలుగా ఉంది. మొత్తం పద్యాలు 22 + 20+ 16+ 16+ 59 + 8 = 141
  3. నేను - నా జ్ఞాపకొలు - 1977. ఇది కేశవరొవుగారి స్వీయ చరిత్రం. కవి జీవితం, కుటుంబ చరిత్ర వారి మూడు తరాల వ్యక్తుల 'పేర్డు - వివరాలు మొదటిభాగం - వచనం. రావుగారి గ్రంధాల పరిచయంతోపాటు, వివిధ సందర్భాలలో వారు వ్రాసిన పద్య గేయ ఖండికలు రెండవ భాగంలోనే ఉన్నాయి. ఈ గ్రంధం రెండు వందల పుటలు తమ మిత్రులకు కుటుంబ సభ్యులకు మాత్రమే అందించే తలంపుతో కేవలం 200 ప్రతులే ముద్రించారు. కవి దీనిని 1977లో రచించారు ఇది కేశవరావుగారి కవితా జీవిత సమగ్ర సంగ్రహ పరిచయ పుస్తకం. అందులోనినే ఈ దిగువ చూప్పు పద్యాలు. 19508 పూర్వం కేశవరావుగారు వివిధ సందర్భాల్లో వ్రాసిన పద్యాలు అనేకం. వానిలో కొన్ని ఇక్కడ చూపబడుతున్నవి మాతృ సతి - ప్రమాది - 1938 | సీ తల్లికి కడగొట్టు తనయునిపై ప్రేమ యనునుడి నిజముగా ననుభవించి నోట మాటలు నేర్చు నాటగోలె త్వదీయ నామాక్షరమ్ముల (క్రేమనాడి ఆయి! ఆయి! యటంచు నానంద మొందించు హాయిచే నలరి సహాయ మొంది కలిమి లేములపైన గలిగెడు చింతకు వగవక మీ ధైర్య వాక్కులు విని

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతొద్దా ప్రూర్వాద్ధ సాధాత్షు" పద్య సాహిత్యం 207 గీ. బ్రతికిపెరిగితి మీ ప్రేమ బలముచేత, నిండె ముప్పది వత్సరాల్‌ నేటి తోడ, అన్ని సుఖముల కాస్పదమైన మీరు, పరమ పదమును జేర నా ప్రాపు పోయె. వు. 79 డా.బి, వెంకటరామారావు వెదిర గారికి, కరీంనగర్‌లో 'వైద్యశాల' ప్రారంభించిన సమయంలో సమర్పించిన రెండు సీస పద్యాల కొన్ని పాదాలు - వృష - 1940 సీ. సుశ్రుత శారీర సూత్రాదుల పఠించి రోగ నిధానంబు రూఢి పరచి ఓషధీ యనుపాన మూహచే చెప్పక యనుభవంబున బెట్టి యరసి యిచ్చి సామాన్య జనులకు సాధ్యమై నీకిచ్చు ధరలుంచు నీ యౌషధముల కెపుడు బీదల వ్యాధుల ప్రీతితో తిలకించు యుచితోషధుల వ్యాధులుడుపు చుండు గీ ఒకరి చులకన జూడక నొకరి చేత బోవ కుండను నెల్లర భూత ప్రేమ చూచి కీర్తి యార్జింపగ జూడ వలయు, ఇదియె నీ ముఖ్య ధర్మమ్ము హితము సుమ్ము - గీ వృష శుభాబ్బంబు నీకభివృద్ధి నానగ, కార్తికమ్ము నీ కీప్పిత కాంక్ష లిడగ కృష్ణ పక్షాష్టమియు భాగ్య తృష్ణ దీర్చ, సొమ్యవారంబు శాంతియు సౌఖ్యమీయ, రాణకెక్కుము వేంకట రామరాయ, పు. 82 కెవి. నర్సింగరావుగారికి - 1947 లో స్ప విద్యార్ధి దచళనాడె వివిధ దేశంబుల, నున్న రాజ్యాంగాల యునికి తెలిసి దేశకాలోచిత్త తీరులెరింగియు, పాలిత పీడిత ప్రజల జూచి స్వాతంత్ర్య సాధనా సదుపాయ వంతులౌ, సాహసయువకుల సమితి గూర్చి కాంగ్రేసు సంస్థ సంగ్రామ రంగంబున, ముఖ్యపాత్ర వహించి ముందు నడిచి . గీ. ఏకధాటిగ సమర మనేక గతుల, నడిపి నైజాము రాజు దుర్పడత లుడిప్‌ క్రూర ఖాసిము రజ్విని కోరలూడ్చి, యతని శిష్యుల పాగరుల నడచినావు పు. 83 శె.వి.గారిది గుండి నమీప గ్రామం - రామడుగు. వారు న్యాయవాది. (ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. మన ప్రధాని పి.వి నరసింహారావుగారికి బంధువు కరీంనగర్‌లో పద్మనాయక బాలికావసతి గృహ నిర్మాణ సందర్భంలో శంఖుస్థావన చేయటానికి వచ్చిన జటా ప్రోలురాజా సురభి జగన్నాథ రాయలను వికే.రొవుగారు పంచ పద్యరత్నాలతో సన్మానించారు. వాటిలో ఒకటి - 1949 - 50. శ్రీలొప్పారెడు రాజ్మమున్‌, బిరుదులుల్‌ చేకొన్న జట్‌ప్రోలు భూ పాలాగ్రేసర పద్మనాయక కుల ్రాధాన్యతన్‌ పెంచగా మేలే యెప్పుడు జేయువారు సురభీ మీ వంశవున్‌ మాన్యులే కాలానన్‌ గలరిప్పు మీరలటులే కొవించుడీ సాయమున్‌, పద్మనాయక పత్రికకు రావుగారు వ్రాసిన పద్యాలు వారి కులాభిమానాన్ని మాత్రమే కాక అమేయ చారిత్రక పరిజ్ఞానాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి గాంధీజీ మృతి, కస్తూరిబా సృృతి, భారత జెండా, నూత్నవళ్సరాది ఇట్లా అనేక సందర్భాల్లో విషయ విశ్లేషణ కావించే పద్య రచనలు చేశారు వైద్యం, క్రీడ, జ్యోతిష్యం, వాస్తు, రాజకీయం, సంఘ సేవ అది ఏదైనా కానీండి; సునాయాసంగా సవివరణాత్మక కవిత్వం వీరు వ్రాస్తారు. వీరి భాషా పాండిత్యం వివిధ పౌరాణిక - విజ్ఞానశాస్త్ర చారిత్రకాది విషయాల పరిజ్ఞానం అపారం - అపూర్వం వేదాంతంలో అమిత పరిశ్రమజేస్తి రావుగారు చివరికి హేతువాదాన్ని ఆశ్రయించి భౌతికవాదిగా కనిపించేవారు. శకున, ముహూర్త, జ్యోతిష్యు ఫలాలను నిరసించేవారు. కవితా ప్రారంభ దశలో 'గుండి

208 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య దరిత్ర" మందిర శ్రీ వేణుగోపబాల' అని పద్యాలు, “గుండి గోపాలరావ్‌పేట గుడిన నుండి, ప్రజల సుమతుల జేయు గోపాలకృష్ణ అనే మకుటంతో ఓ భక్తి శతకం రచించారు. ఆ తర్వాత నార్ల వారి దారిలో 'వీ కె.రావు హితోక్తులు వినిన మేలు' అని స్వీయనామాంకిత లోకనీతి శతకాన్ని ఆరంభించారు. వీరి హేతువాద పద్యాలు హృద్యశైలీ సమువేతాలు - ఆలోచనాత్మకాలు. నిత్య గీతాలు - నుండి. ఎందుకీ నాకు జన్మమెత్తించినావు, ఏమినాతోడ చేయించ నెంచి నావు నన్నాక నిమిత్త మాత్రుగా నామ రూప, ధారిగా జేయుటేలనో దాని దెలుపు! మరో శీర్షికలో - ఓ దేవ! సర్వజీవోత్పన్న నినువేడు వారికే కష్టాలు వచ్చుటేల? ఓ ముక్తి దాత! నిన్నోమెడు భక్తుల బాధలు మాన్నని వైఖరేల? ఓ యీశ! నీ ప్రతిమోత్సవ విగ్రహ తస్కర బాధలు తప్పవేల? ఓ స్వామి! నిన్‌ గొల్బ్చుచున్నట్టి స్తుతమతుల్‌ వ్యాధులచే బాధపడుటలేల? గుడులు గోపురముల్‌ కూలగొట్బవారు, నిత్య తస్కరుల్‌ హంతకుల్‌ నీతి దూరు లెపుడు శిష్టుల బాధించుటేల చెపుమ? వింత గొల్బెడు నీ న్యాయ విధమదేల? పు. 25 “సత్యాసత్య విచారము” పుట. 51 లో. సీ. ఈ విశ్వమునకొకే యీశ్వరుడైనచో వివిధ దేవధ్యాన విధమదేల? ఈ సృష్టి స్థితి గతులీశ్వర కృతమైన ఏకత్వ భిన్నత్వమిల నికేల? సర్వేశ్వరుడు దయా సహితుడే యైనచో సమతలేని ప్రపంచ జాతులేమి? దుష్టశిక్షణ భావ శిష్టరక్షకుడైన జీవి జీవుల హింస చేయుటేమి? గ. ఎవరి కర్మకు వారలే యిలను కర్త, లైన యేరీతి యీశ్వరు డవసరంబు? పూర్వ జన్మల వల్లనే పుట్టి చావ, పరమ పురుషుని గొల్బ్చెడు భావమేల? శేశవరావుగారు కందుకూరి, గురజాడల ్రేమించినవారు. వీరిది త్రిపురనేని రామస్వామి చౌదరి కవితా మార్గం. 'కుల విచారము'లో ఇట్లా తమ నిర్ణయాన్ని తెలిపారు. పు, 50 ఆఅవె. బుద్ధి మంతులైన పూజ్య భావుల కిల, కులములేదు స్వపరములును లేవు అజ్ఞ్జులైన వారలల్బ స్వభావులు, కులధనాధికారములనె యెంత్రు జ్ఞానపీర అవార్డులు పొందిన ఇద్దరు ప్రముఖాంధ్ర కవులను కేశవరావుగారు ప్రశంసించారు. విశ్వనాధ సత్యనారాయణగారి “కేదారగౌళ' కృతిలోని కేశవరావుగారి కృతజ్ఞతాపద్య ద్వయంలో ఒక్కటిది. (భష్టయోగి' వి కవి జన్మ బడసినావు, నిత్య కవితా తపస్వివై నెగడినావు నీ తపోరీతి సాగి యీ నిఖిల కావ్య, వీధి పూరితమైనది విశ్వనాథ - పు. 34 డౌ. సి. నారాయణరెడ్డి గారి కవితా శక్తినిట్లా కొనియాడారు. నోట వెల్వడునట్టి మాటలే పాటగా పొడి నుతులుగొన్న ప్రజ్ఞ కలదు. ప్రతిఘటించెడునట్టి పండిత కవులను ఒప్పించి మెప్పించు నోజ గలదు బహు విషయ జ్ఞాన పటిమచే బోధించు గురుతరాచార్యత్వ గుణముగలదు భాగ్యనగర ధీనిధుల చేప్రస్తుతిగొని యువ యువతి విద్యార్థుల యూహ లెరిగి వారి వారి భావనల కపార శక్తి నెమ్మి ప్రోత్సాహ పరచెడు నిష్టగలదు 34. కవిత్వాన్ని ప్రేమించి, కావ్యాలు నిరంతరం పరించి - రచించి, అన్యకవుల ప్రోత్సహించి, ప్రతిభగల కవుల ప్రశంసించిన ప్రశంసలందుకొన్న సంపూర్ణ సాహితీజీవనులు సార్థక జన్ములు వి కేశవరావుగారు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాల్చ ఉార్వాస్థ సాహిత్యం” పద్య సాహిత్యం 209 24. వెలమల రామగోపాలరావు - రేకొండ - కాలం [820 - 973

వెలమల రామగోపాలరావుగొరు అస్తి అంతన్తుగల ఎల్లావు కుటుంబంలో జన్మించారు. స్వగ్రామం రేకొండ. ఒకప్పుడున్‌ తరుగదింటన్‌ పొడియున్‌ పంటయున్‌ - అన్నట్టుగా వారి వ్యవసాయముండేది రావు గారికి కవితా వ్యాసంగం కవి మిత్రులతో సాహితీ కాలక్షేపంఇష్టంగా ఉండేది.

గోపాలరావుగారి వరకు ఈ జిల్లాలో వచ్చిన సాహిత్యమంతొ ఇంచుమించు నంప్రదాయబద్ధ కవిత్వము. వాళ్ళకు పూర్వ కావ్యకవులాదర్భం. వేంకట రాజన్న అవధాని, వెలిచాల కేశవరావుగారల వంటి ఒకరిద్దరు కవులు దీనిని అపవాదం. సమకాలీనాంధ్ర ప్రముఖ కవుల నభిమానించి వారి నవ్యాంధ్ర కవితా మార్గాలననుసరించిన వారు వి. రాం గోపాలరావుగారు.

వీరు నాటి పత్రికలకు కవితలు వ్యాసాలు పంపించేవారు. పాఠ వత్రికలో బ్రాత ప్రతులో వారు దాచుకొని ఉంటారు 'అటువంటివేవీ లేవు మేడపై వర్షంలో తడిసి చెడిపోయినా' యన్నారు రావుగారి కుటుంబ సభ్యులు.' రాంగోపాలరావుగారికి ప్రముఖ కవి పండితులతో స్నేహ సంబంధాలుండేవి. వారి డైరీలు నోటుబుక్కులు ఏవైనా దొరికి ఉంటే ఆ వివరాలు తెలిసేవి.

ప్రఖ్యత నవలా రచయిత గుడిపాటి వెంకటచలం (బెజవాడ) గారు కరీంనగర్‌లో ఉన్నకాలంలో రాంగోపాలరావుగారితో స్నేహం ఉండేదని కె.వి. రమణారెడ్డిగారు వ్రాసిన 'చలం' జీవితచరిత్రలో ఉంది.

కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి (1895-1947) నెల్లూరు, గారితో రాంగోపాలరొవుగారికి స్నేహం ఉండేదని రెడ్డిగారి 'లేఖలు - ఉత్తరాలు” పుస్తకంలోని లేఖల వలన తెలుస్తున్నది. అందలి 40 ఉత్తరాలలో 31 ఇతరులు రాంరెడ్డిగారికి వ్రాసినవి కాగా, కేవలం తొమ్మిది మాత్రం శెడ్డిగారు వ్రాసినవి. అందులో చివరి రెండు రేకొండ రాంగోపాలరావుగారికి వ్రాసినవే. మొదటి లేఖ నెం. 34, ఇదిన

వెమ్మారెడ్డిపాళెం, 10.7.1943

మహారాజత్రీ వి.రాంగోపాలరావుగారికి, నమస్కారములు. ఇచ్చట అందరు క్షేమం. అచ్చట మీ శ్లేమ సమాచారములు అప్పుడప్పుడు వ్రాయుచుండవలయును.. నేను వారము దినములనాడు మద్రాను నుండి గ్రామం చేరితిని, అప్పటికే మీ జాబు చేరి యుండినది. ఆకేసు మీకు కోర్టులో అనుకూలమ్రైనదని చదివి చాలా నంతోషించితిని.

భార్యా వియోగము అందులోను నిండు యోవనములో నహింపరానిది, కేవలము అనుభవైక వేద్యము... 'ఓదార్పులు వుంటివై నుప్పుగల్లు' అన్నట్లు నిష్రయోజనములు. ఒకవేళ దుఃఖము నశింపగలదు. నా రెండు సంవత్సరముల వరకు దుఃఖము తీవ్రముగ నుండినది. తర్వాత క్రమముగ సన్నగిల్నినది. రెండవ పెండ్లి చేసుకోవడం గూడా దుఃఖ శమానానికి ఒక హేతువు

మీరు సారస్వత వ్యాసంగం చేస్తూ ఉంటారని నా తలంపు. నేను జున్‌ నెల భారతి లో పానశాలలో చేర్చుటకు తగిన 14 పద్యములను వ్రకటించితిని. జూన్‌ నెల మొదలు 'కవి-రవి' అను కావ్యం ్రకటిస్తున్నాను. ఈ కావ్యం 'పలితకేళశము'నకు పది దినముల ముందు వ్రాయబడినది. వీలుంటే చదవండి, నేను మా గ్రామములో పది దినములుండు సమయము చూసుకొని మీకు వ్రాసెదను. మీరు కొన్ని దినములు కులాసాగా మా యింట కాలము గడుపవచ్చును. హైదరాబాద్‌లో మన మిత్రులందరు క్షేమముగా నున్నారని తలంచెదను. పరుడా

  • రేకొండలో అధ్యావక మిత్రులు నంజీవరావు గారు నాకు తమయింట ఆతిథ్యమిచ్చి కీశే.

రాంగోపాల్‌రావు గారింటికి తీసుకువెళ్లి వారి సతీపుత్రులు పరిచయం కావించారు. 2... సంకలనకర్త - కె.వి రమణారెడ్డి, నెల్లూరు; కవికోకిల గ్రంధమాల ప్రచురణ - 1361 ౩ మలయశ్రీ గారి 'తెలుగులో లేఖభాసాహిత్యం' 1992 తెలుగు అకాడెమీ హైదరాబాద్‌ వారి ప్రచురణ = పుటలు 85, 86.

210 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” తేది ౩ 11.946 నాడు రెడ్డిగారు వ్రాసిన రెండవ లేఖ నెం. 38లో తమ అనారోగ్యాన్ని వివరించారు. రావుగారి పునర్వివాహానికి అభినందనలు తెలిపారు. రాంగోపాలరావుగారు ద్వితీయ వివాహం కృష్ణా జిల్లాలోని కమ్ముకులపు మల్లెల వారింటి కన్యతో జరిగింది. రావుగారికి కోస్తా మండల కవి పండితులతో మైత్రి అంతకు పూర్వమునుండే ఉన్నట్లు పై లేఖల వలన తెలుస్తున్నది. రాంగోపాలరావు గారి ఏకైక కవితారచన “బాష్పాంజలి' “గౌతమి' తైమాసిక సాహిత్య పత్రైక 1969లో కనిపించింది.* ఇది వారి కవి మిత్రులు గార్ల పాటి రాఘవరెడ్డిగారి మృతికి వాసిన సంతాప పద్యాలు. రాఘవరెడ్డిగారిది వరంగల్లు. అదర్శపాధ్యాయులుగా ఆర్య సమాజాభిమానిగా కవిగా వారికి మంచి పేరుండేది. చివరి దళలో కరీంనగర్‌లో తమ కుమారులైన గార్లపాటి తిరుపతిరెడ్డి గారింటిలో గడిపారు. రాఘవరెడ్డిగారి సాహితీమైత్రిని బట్టి నెమిలికొండ పింగళి లింబాద్రిరెడ్డిగారు తమ కుమార్తెను తిరుపతొరెడ్డిగారికిచ్చి పెళ్ళి చేశారు. వీరిద్దరు గోలకొండ సంచికలోని కవులు. నాటి వారి సాహిత్య మైత్రి అంత బలంగా ఉండేది. అటువంటి కవి సోదరుని మరణానికి గోపాలరావు గారి సంతాప పద్య కవిత ఈ బాష్పాంజలి. = “హృదయ సంతాప మించుక వదలుటెట్టు, ప్రతి నిమేషంబు నీ స్కృతి బాధ పెట్టు అన్న రాఘనవనిన్‌ విడనాడి నేడు, బ్రతుకెటుల ఈడ్పు జీవచ్చవంబు రీతి! ఏనొడో ఒక పంచవింశతికి ముందే సుంత పూర్వాబ్దమం దీనాలో మధురానురాగరసమెట్లే నింపి మన్నించితో ఈ నాడున్‌ దత నిత్య నూతన కళా 'హేవాకమై వర్ధితా నూ నాన్యోన్య హృదంత పర్యవసిత వ్యూఢంబుగా నిల్బెవో! కూర్మి గోపన్న గోపయ్య గోపి యనుచు, పిలిచికొని నా హృదబ్దంబు నిలచి కొంటి వయ్యె! అప్పుడె ఏడాది యయ్యె నీవు, మము వదలిపోయి" శూన్యంబు మాకు జగతి.” ఇదీ వారి పద్య కవితా యురి-మాధురి. లభించిన సాహిత్యం తక్కువైనా రామగోపాలరావు గారిది సంపూర్ణ సాహితీ హృదయం సత్తాగల సాహిత్యరూపం అని స్పష్టంగా చెప్పవచ్చు 25. ఆభివేంకటనరసింహాచార్య - ఆవునూరు. కీలక - 808-1981 - దుర్మతి అభి వేంకట నరసింహాచార్యుల స్వగ్రామం సిరిసిల్లా తాలూకాలోని ఆవునూరు. వీరి తండ్రి సుప్రసిద్ధ సంస్కృత పండితులైన ఆచి రాఘవాచార్యులు, గో.క.సం నం. 5. తల్లి సిరిసిల్ల వేంకటేశ్వ రాలయార్చకులైన చిగురాల నరసింహాచార్యుల దౌహిత్రి రత్సమాంబగొరు. ఆచివారు శ్రీవైష్ణవులు. కౌండిన్య గోత్రీకులు.' బాల్యంలో నరసింహాచార్యులు సంస్కృతాంధ్ర కావ్యనాటకాలంకార శాస్త్ర గ్రంధాలను తమ తండ్రికడనే అభ్యసించారు. పదిర టి. కృష్ణశాస్త్రి కవి (గోక.సంనం. 173) గారి "స్నేహంతో ఆంధ్ర కవితా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. పద్దెనిమిదవ యేట అక్షయ - 1926లో కోరుట్ల ఉభయ వేదాంత ద్వయవర్దనీ సంస్కృత పాఠశా లలో అధ్యాపకులుగా చేరిన కాలంలో మొదటి అష్టావధానం చేశారు. అక్కడున్నది పది మాసాల కాలమే అయినా సహోపాధ్యాయులు బంధువు అయిన శతావధాని సిరిశినహళ్‌ కృష్ణమాచార్యుల దృష్టి తెలుగు కవిత్వంవైపు మళ్ళించారు * పందొమ్మిదవ యేట సిరిసిల్ల సర్కారీ స్కూలులో చేరి హిందీ, ఉర్చూ, ఇంగ్లీషు భాషల నభ్యసించి ఏడవ తరగతిలో ఉత్తీర్ణులైనారు. తరువాత నిర్మలలో శివశ్రీ అంబయ్య 4 “గౌతమి” 1369; సం. గట్టెపల్లి సత్యనారాయణ రాజు, కరీంనగర్‌

  • “ఆదర్శ జీవనము” అచి వేంకటాచార్య స్వామి వారి స్మారక సంచిక - 1985 నుండి కవి జీవిత విశేషాలు సాహిత్య వివరాలు గ్రహించబడినవి

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద ప్రూర్వాస్థ సావిత్యం” పద్య సాహిత్యం 211 సిద్ధాంతిగారింట సంస్కృతాధ్యాపకులుగా అయిదేండ్లు గడిపారు. కవిగా వక్తగా లబ్ధ ప్రతిష్థులైనప్పటికీ సంత'ప్పి చెందక హైదరాబాద్‌ సీతారాంబాగ్‌లోని శ్రీ శరగోపరామానుజాచార్య స్వామికి శిష్యులై సాంప్రదాయ [గగ్రంధాధ్యయనం కావించారు. తదనంతరం శ్రీశైష్ణవుల గురువుగా పలువురు శిష్యులకు తిరుమంత్రార్ధం బోధిస్తూ రామాయణ శ్రీభాష్యాది గ్రంధాల ప్రవచనం కావిన్తూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ వైభవంగా జీవించారు.

నీరి కవిత నం. 96 * శ్రీ కర్మచంద్రోదయము” గోక.సం.లోని 86, 87 పుటలలో ప్రచురిం చబడింది. సంస్కృతాంధ్ర భాషలలో విద్వత్కవిత్వరచనా నంవన్నులైనప్పటికి అచి వేంకట నరసింహాచార్యులు (వ్రాసిన కవితలు తక్కువ. వారికి వక్తగా పొరాణీకులుగా యాజ్జికులుగా కాలం గడిచింది. గోకసం. 1934లో ఆచి నరసింహాచార్యులుగారిని 'కవికేనరి కిశోర 'అవధాన కుళల అష్టావధాని అని పేర్కొన్నారు. కవి పరిచయం వుట 362. అక్షయ నుండి కేవలం పన్నెండు సంవత్సరాలు అంటే - 198 వరకు, శతానేకాప్తావధానాలు కావించి వదిలేశారట.

అ.వే. నృసింహాచార్యుల రచనలు - ఇవి వారి స్మారక సంచిక విషయసూచికలో పేర్కొన్నవి.

  • అవధానములు, 2. శ్రీ సీతారామచంద్రస్వామి సుప్రభాతమ్‌ (సంన్కృతం)
  1. ప్రపత్తి ః (సంస్కృతం) 4. శ్రీకర్మ చంద్రోదయము (పద్యాలు)

  2. గీతాధర్మము - (వచనము) వ్యాసం.

*.... ఇందు ఏవీ పుస్తకాలుగా రాలేదు. ఈ రచనల వివరాలివి. ఆచార్యులు చేసిన అవధానములెన్నో కాని 1926 అక్షయలో కోరుట్లలో నిర్వహించిన ప్రథమాష్తావధాన వద్యాలు మాత్రమే ఇందులో ప్రచురింపబడినవి. మిగతావి అలభ్యాలు. 2. అవునూరి సీతారామాలయ స్వామికి నిత్యసేవ కొరకు రచించిన 13 శ్లోకాల సుప్రభాత కావ్యం. 3. ప్రపత్తి శ్రీరామచంద్ర సుత్తి - పంచ ళ్లోకొాలు. 4. గోలకొండ కవుల సంచికలో ప్రకటితమైన నాలుగు సీన పద్యాలు. 5. శ్రీ నహజానంద గీతా సమాజము సిద్ధిపేట వారి మౌక్తికోత్సవ సంచికలో ముద్రింపబడిన మూడు పుటల వ్యానం.

పై విషయాలను బట్టి చూస్తే ఆచి నరసింహాచార్యులు కవితా వ్యవసాయము కావించినది తక్కువ. వారి రచనలలో భద్రపరచుకొన్నవి మరీ తక్కువ అనుట సృష్టం. లభించినంతలో “నిక్కమైన మంచీ నీల మొకటి చాలు' అను వేమన నుడి ప్రకారం ఆచార్యుల వారి కవితా శక్తిని భావ ప్రశస్తిని గమనింపవచ్చు. మచ్చునకు కొన్ని పద్యాలు చూడండి. ఇష్టదైవ నేతి కోరుట్ల అష్టావధానం నుండి, సిరియుర మున్వెవెలుంగ, తులసీ దళమాలికలోల లాడ, సుం దర తర చేలముంగదుల, తాండవ మాడగ కుండలంబులున్‌, కర కమలంబులం జెలగి కంబు సుదర్శనముల్‌ జ్వలింపగా మెరయ కపోలముల్‌్స్‌ యళుల మించలుకల్‌ నదలంగ (వ్రాలితో తిరుపతి వేంకటేశ్వర భవదీయ పదాబ్బములాశ్రయించెదన్‌. సిరియుర మందు వెల్ల అనవచ్చు. కాని నన్నయగారి నుఖముండువలె ప్రధమావిభక్తి రూపం. పండిత కవులు విలక్షణ ప్రయోగాలనభిలషిస్తారు కదా! అలాగే మించి అలుకల్‌_నదలంగ చివరి పాదంలోని 'తిరుపతి వేంకటేశ్వర'లోని గణభంగం లేఖక ప్రమాదం. కవి ప్రయోగం “తిరుపతి వేంకటేశ భవదీయ' అనే అయి ఉంటుంది. దత్తపది - యావ, గ్రీవ, జీవ, రావ (రో మాయణపరం) చూడండి. కం. యావన జాక్షుడు, మనను, ్రీవునితో లంకలో మృగేంద్రుని కరణీన్‌ జీవన హీనుని జేసెను, రావణునిన్‌ కదనరంగ రాజంబందున్‌. 2. కృష్ణమాచార్యుల 'స్వీయకవితానుజీవనం' 1986, పుట - 24,

212 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాపొత్య చరిత్ర” కం. దానవుడయ్యును, కైతవ, దానవ రిపు రూపమొంది - త్రాగి సుధాంబున్‌ హీనత జెందిన యా స్వ, ర్భానుని ప్రభ జూచి దివిని - భానుడు వణకెన్‌ లోకవార్త - పృచ్ళకనామంతో కలిపి ఇట్లా చెప్పారు. పాటవ మొందునట్టి కవివర్యులు లౌకిక వార్త లెప్పుడున్‌ మాటలలోన జెప్పకను మంజుల పద్యములన్‌ రచింతురా పాటి యొనర్చ ప్రప్రధమ భావము నందది సాధ్యమౌన? చొ ల్లేటి నృసింహశర్మ! యవలీలగ జెప్పెద ముందు ముందుగన్‌. ముగ్గురితో పేకాడుతూ చెప్పినదీ క్రింది ముద్దు పద్యం - జాకి మణేల యియ్యది, నిజంబగు శక్తిని జూపు చుంటకై ప్యాకనుబంచివేసితి, సభాసదులందరు సంతసిల్లగా “చౌకము' రంగు జెప్పితిని 'ఛా'! యిక యేటి జయంబు మీకు, నీ యాకును వేసితిన్‌ ద్వరగ నాడుడు ప్రస్తుత యుక్తి యుక్తులై. భాగ్యనగరంలోని రెడ్డి హాస్టలు అష్టావధానంలోని చివరి పద్యం - సౌభాగ్య నగర వాసాఢ్యుల మైోలన్నా అవధాన చాతురి యనెడి వారా ఎందరెందరొ చేరుచుందురీ పట్టణం, బందులో వీరొకరనెడి వారొ ఎనిమిది నియమము లేక కాలముమదిన్‌, నిలుచునా యని యాత్మదలచువారొ పల్లెటూరున నింత పాండితీవైభవం, బుండునా యని పల్కుచుండువారో యనెడి భీతిని మనమున గనగ నీక, పలు విధమ్ముల పల్కెడి ప్రజల మాన సాంబుజంబులు వికసింప నలరి సభలా, గెలుపు గొను శ్రీ నృకేసరి పలుకు సాని. దత్త పది కంద పద్య ద్వితీయపాదంలోని అఖండయతి, చివరి గీత తృతీయ పాదాంత తృతీయా విభక్తి 'లో' ప్రత్యయ హ్రస్వరూపం కవి విలక్షణ - స్వేచ్చా ప్రయోగాలు. అవధానిగారి ఇతర అవధాన పద్యాలు లేకున్నా వీరి అవధాన కవనాన్ని కని ప్రస్తుతించిన నాటి సాహితీవేత్తలు - రాజకీయ నాయకుల పద్యాలు భద్రపరచి 'పై సంచికలో ప్రచురించటం సంకలనకర్తలు కవికి చెల్లించుకొనిన అమూల్య బహుమావాలు. సురవరం ప్రతాపరెడ్డి ( “గోలకొండ పత్రిక సంపాదకులు) గారి అభినందన - లేత ప్రాయమునందె ఖ్యాతి గాంచు మటంచు, పాండితికై బ్రహ్మవ్రాయవచ్చు సంస్కృతాంధ్రము మాత చక్కని విజ్ఞాన, ముగ్గు పాలతొ(ను) బోసి యుండవచ్చు. నవ నవోన్మేషమౌ నవరసాలంకార, కవితా లతాంగి మిమ్‌ గలువ వచ్చు పొరాణగాధల (్రొఢిగ దెల్పెడు, ప్రాజ్జులేనని మిమ్ము బల్కవచ్చు నట్లు గొకున్న మీకిట్లు నమిత సుగుణ, సంపద గలుగనేటికి, సరస విద్య కవితయును నేర్చు జెందుట ఘనము గాదె, వేంకట నృసింహ దేశిక వినయ శీల.

  • ఆదర్శ జీవనం. పుట-5 హైదరాబాద్‌ గౌలీగూడ రామమందిరంలోని అవధానం చూసి బూర్లుల రామకృష్ణారావు ( ముఖ్యమంత్రి, హైదరాబాద్‌ స్టేట్‌) గారు చెప్పిన పద్యం - ఆజీవుట - 6. బాల్యమందే యాంధ్ర భారతీ తల్లజ, (పేమించె మిమురూప ప్రియులటంచు కౌమార దశయందె గైర్వాణ వాణీమ, తల్లిక మిమ్‌ (ము) సంతసిల్ల జేయ సాలంకృతాకార సాహితియనునామ, మరసికామించె నాట్యంబు తోడ

రెండవ భాగం - ౪ అధ్యాయం : “90వ శతాజ్ఞ ధ్రూర్వార్థ సాహిత్యం” పద్య సాహిత్యం 213 యౌవన ప్రారంభమందే సు కవితామ, చర్చిక సుఖములమర్చుచుండె వేంకటేశ్వరు కరుణ యీ విధము మిమ్ము వృద్ధి నొందించు చుండ వివేక మతులు, భవ్య కౌండిన్య గోత్ర సంభవులు మీరు 'వేంకట నృసింహ శాస్త్రి సువినయ ధుర్వ. థీకృష్ణ దేవరాయంధ్ర భాషా నిలయంలోని అష్టావధానంలో దుర్మార్గుల చారిత్రలు కూడా పరనీయములే అనుభావసమర్ధనతో ఆచి వేంకట నృసింహాచార్యవధాని చెప్పిన సీస పద్యగీతం చూడండి. నిజమునవి నీకి చరితల నేతలయ్యు, విష్ణు సంబంధ మహిమ సువిదిత మగుట వారి వైభవముల తోడు వారి పనులు, భారతాది చారిత్రల ప్రకటమయ్యె మరియు ముక్తియు కరతలామలకమయ్యె. ఆ.జీపుట 7 ఆచార్య విరచిత సుప్రభాతంలోని ఒక శ్లోకం - 6 ఇందింది దాశ్చ మకరంద రస ్రలుబ్ధాః రుంకుర్వకే వదన పద్మ నిషేవణాయ బాలాతపః ప్రవేశతే భవనాంగణేషు, శ్రీరామచంద్ర భగవన్‌ తవ సుప్రభాతం, వేదశాస్త్ర పండితులు సంస్కృత కవితా మండితులు అయిన ఆచి వేంకట నరసింహాచార్యుల ఆంధ్ర కవిత తత్సమ పద - దీర్ధసమాస భూయిష్టం కాక అలతి అలతి మృదు మధుర లలిత పదాలతో భూషితమై తెలుగు తనంతో విలసిల్లడం విశేషం! 26. మామిడిపల్లి సాంబశివశర్మ - వేములవాడ. 1920 - 1988 మామిడిపల్లి సాంబశివశర్మగారు వేములవాడ దేవస్థాన ఆస్థాన కవి. వీరు ఆటికవితాధార, అసాధారణ ధారణాశక్తిగల అష్టావధాని, సంస్కృతాంధ్రోభయ భాషల్లో సమానంగా కవిత్వం చెప్పిన విద్వత్కవి ఆయన ఆయిదు భాషలలో విద్వాంసులు సాహిత్యంతోపాటు సంగీతంలో దిట్ట. నాటక రచయిత; దర్శకుడు, రంగస్థల నటుడు. హరికధా రచయిత; హరిదాసు. అన్నిటికి పైగా స్వాతంత్ర్య సమరయోధుడు. ఇన్ని విశేషతలు ఒకే వ్యక్తిలో ఉండటం - ఆ అన్నింటిలో రాణించడం అపూర్వ వను శర్మగారి ముద్రిత రచనలు, య. [1 ముక్తాహారము - 1949, 2 మధుర రుంకారము - 1949, 3. చ ప జయశ్రీ - 1953, 4. లోభ సంహారము - 1964; 92, 5 భక్తి గీతములు | |

  • 1966, 6. శ్రీరాజరాజేశ్వర సుప్రభాతం, 7. ద్విపద రామాయణము - గ్‌ బాలకాండము, 8 ద్విపద రామాయణము - సుందరకాండము. ర అలభ్యముద్రితరచనలు: 1. శ్రీ ముక్తేశ్వర సుప్రభాతం, 2. ఆదిశంకరాచార్య ౯ 1, ఖః! సుప్రభాతం, 3 వాసర సరస్వతీ సుప్రభాతం, 4. గౌరీ శంకర సుప్రభాతం , క స
  • కరీంనగర౦ం, 5. కుంజ విహారము - పద్యకావ్యం, 6. దక్షయజ్ఞం - బుజ్జకథ. అముద్రిత అలభ్యరచనలు : 1. భద్రావతి నాటకము, 2. త్యాగయ్య నాటకము, 3. శ్రీరాజరాజేశ్వర క్షేత్ర మహాత్మ్యం - హరికథ, 4. తరిగొండ వేంగమాంబ - హరికథ, 5 యాదగిరి నృసింహశతకం, 6. దీపావళి, 7. ముగ్గురు మరాఠీలు - బుజ్జి కధ. ఇతర అముద్రిత రచనలు: 1. మల్లన్న సుప్రభాతం - కొమురవెల్లి, 2, శ్రీరామచంద్ర - బెల్లంపల్లి 3, శ్రీ నృసింహ - బెజ్జంకి, 4. మహాకాళి - సికిందరాబాద్‌, 5. గంగా సువ్రభాతం 6-9. ద్విపద రామాయణము - అయోధ్య, అరణ్య, కిష్కింద, యుద్ధకాండలు. 1 _సాంబళివ శర్మ గారి సాహిత్య వివరాలు - పుస్తకాలు వారి పుత్రులైన ఎం రాజన్న, ఎంఏ. గారు అందించారు.

214 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” సాంబశివ శర్మగారి ముద్రితాముద్రిత లభ్యాలభ్య సంస్కృతాంధ్ర కొవ్యాలు, ముద్దు ముద్దుగొ ముప్పది వరకున్నాయి. కావ్యం, ఖండకావ్యం, సుప్రభాతం, కీర్తన, నాటకం, బుజ్జకధ వారు చేపట్టిన కవితా ప్రక్రియలు. అపార పాండిత్యం కమనీయ కవిత్వం మాత్రమే కాదు, నిశిత పరిశీలన, కటు విమర్శ, ఈ కవి గుణాలు. నిర్భీతి - నిష్పక్షపాతం సాంబకవిగారికి సహజాతాలు. అధిక్షేప కవిత్వ సృజనలో శర్మగారిది అగ్రపీరం, కావ్యపరిచయం :

  1. ముక్తాహారము - ఖండకావ్యం 1949లో ముద్రితం. 50 పుటలు, ఇందలి కావ్య ఖండికలివి
  • అంకితం, ఇష్టదేవతాప్రార్థన, శారదా నక్షత్రమాలిక, రామ నవరత్నమాల, సీత, భరతమాత, బాపడౌ, నారాయణదాసు, రమణకవి, మా దేవర, బాపూజీ, గేయాలు, మంగళ గీతికలు - భక్తి భావ సంభరిత పౌరాణిక శీర్షికలతోపాటు, భరతమాత వీరి దేశభక్తికి, బాపూజీ రాజకీయాసక్తికి నిదర్శనాలు. నారాయణదాసు హరికథా పితామహ “ఆదిభట్ల వారు. రమణ కవి ధూపాటి వేంకటరమణాచార్యులు వారు కరీంనగర్‌ జిల్లా శాసనాల, పూర్వ కవుల, వెలుగునకు తెచ్చిన చారిత్రక పరిశోధకులు. కవిగారి సమకాలీన విషయ స్పందన దీనితో స్పష్టం. వీరి కవితా చందనం చందమిది, వాణినుతి : నానా క్లేశ సమన్వితంబయిన జన్మంబిచ్చి ప్రారబ్ధ సం ధానంబున్‌ దగిలించి దానికి నవిద్యా బంధమున్గట్టి నీ ధ్యానంబందున సంశయాత్మక మహాధ్వాంతచ్చ్భటల్‌ జుట్టి యే స్థానంబందున శాంతి నీయవు తటిద్దొమోజ్జ్వలా శారదా. పు.3. శివనుతి : భక్తి క్రీత, భవాబ్ధి పోత, యభవా! భద్రేభ చర్మాంబరా! ముక్తి ద్వార కవాట పాటవ కరా! ముగ్ధేందు చూడామణి! ముక్తా హారము లంచ మిచ్చెదను శంభోతస్కరాణాంపతీ! రుక్తాపంబులు బాపి మాకునిక నారోగ్యంబు చేకూర్చవే. మా దేవరా - లోని ఒక పద్యం, ఒజ్జలు లేని విద్దియ, నయోన్నతి లేని మహాధికారముల్‌, గజ్జెలు లేని తాండవము, కాటుక లేని వధూటి నేత్రముల్‌, మజ్జిగలేని భోజనము, మంజుల గంధములేని పూవు, నీ పజ్జన లేని జీవితము వ్యర్థము భేమలవాడ యీశ్వరా పెమ్మయ సింగధీమణీ, పద్యాల తలపించినా ఛందళ్శిల్పాను సరణ తప్ప భావానుకరణ లేకపోవడం గమనార్హం బాపడా! లో స్వజాతి పోదరులనిట్లా హెచ్చరించారు. నీవు స్వధర్మమున్వడళి నిందల పాలయి పోవుచుంటివా? దేవుడు గూడ నీ బ్రతుకు దిద్దగ లేడిక మేలు కొమ్ము, నిన్‌ బ్రోవగ జాలు వాడెవడు? పూర్వ మహర్షుల యంతరాత్మ లి స్టీవు జరించు దారిగని యేడ్చుచు నుండే గదోయి బాపడా! సాంబశివ శర్మగారిది సంప్రదాయ మార్గం. 2... మధుర రుంకారము - 1949. పుటలు. 36. ఇది భక్తి కవితా సంపుటి. తెలుగు కవితలు శ్రీరామ శ్రీకృష్ణపరములుగా, సంస్కృత కవితలు శిన త్రయీదేవతా స్తుతులుగా ఉన్నాయి. ఒక గేయం - 12వ పుట. కమలము కువలయ కాంతుల నీనున్‌ - కాళిందీ మహాస్రవంతీ కమలము కువలయ కాంతుల నీనున్‌

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాళ్ఞ పూర్వార్థ సాహిత్యం” పద్య సాహిత్యం 215 వేళయిదే స్నానమునకు మనకున్‌, వేళాకోళము చాలు చాలునిక, ప్రణయినీ ప్రియుల పరిరంభములన్‌, గనబఅచు లతా క్రాంత తట తరుల్‌ క పూదోటల కోయిల పాటలు నెమి, ళుల యాటలు చిలుకల మాటలు హం సల నీటులు యెత్తగు కోటలు చ, క్కని బాటలు గల మధురాపురమిదె క। 3. జయశ్రీ - ఖండ కావ్యం - 1953 - పుటలు. 50. ఇరవై పద్య శీర్షికలు, బొబ్బిలి పదము ద్విపద, చివర కొన్ని హారతులున్నవి శివ, రామ, మాదేవర వంటివి కాక సమకాలీనాలైన భారతమాత, పొట్టి శ్రీరాములు, మా ఊరి దివ్వెలా, కవన సంజీవని మొ శీర్షికలున్నాయి. ఇందలి కొన్ని పద్యాలివి - దురభిమాన పిశాచి నెత్తురులు బీల్వ, బుద్ధి చెడి యేడ్చుచున్నారు వృద్ధలిచట, పెద్దలను దిట్టుచున్నారు పిన్నవారు. వల్లకీపాణి నతకల్ప వల్లి వాణి. గాన కవిత్వముల్‌ స్వయముగా చిగురించిన బాగటంచు వి జ్ఞాన నిధుల్‌ వచింతురటు కాదని వాదములాడ జొచ్చినన్‌, మానస మీసునం బడును, మంచితనంబు జెడున్‌, రుచించునే పూనిక నేరుకొన్న పదపుంజము లేమల వాడ దేవరా! సంగీత సాహిత్య కళలు జన్మతః సంక్రమిస్తాయని కవి అభిప్రాయం పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగ ప్రస్తుతి - అదిగో మోగిన దాంధ్రవీణ కపట వ్యాపార పారీణతా భ్యుదయంబున్‌ నిజ తంతు నాళముల నుద్చోధించె నాంధ్రీయతా నదముప్పాంగె నశాంతి నిండె కలహోన్మాదంబు రేకెత్తి మి న్నదరెన్‌ లోకము కంట నీర్విడిచె నార్యావర్తమే బెగ్గిలెన్‌. ఇందలి అలంకార భావనరణి కవితా (ప్రొాఢథిమకు నిదర్శనం 4... లోభ సంహారము - 1964 తొలి ముద్రణ - 1992 మలి ముద్రణ. ఇది కేవలం 51 పద్యాల అధిక్షేప కావ్యం. నిజమైన కళారాధకునికి ధనసంచయేచ్చ్ళకు పాత్తు కుదరదు. సిరి తగినంత లేకపోతే 'గ్రాస వాసో దైన్యంబులు' వచ్చు కదా, సరస్వతి ఉన్నా దానిని చూసి (ప్రశంసించు వారేకాని, సాహ్‌ త్యారాధకుల ప్రోషించువారు అరుదు... దిన వెచ్చమేరాజు తీర్చగలడు? అని శ్రీనాథ మహాకవి కూడా నాడు వాపోయాడు. శఈనాడీ కవి కూడా తన దారిద్ర్యానికి విచారిస్తూ అందుకు కొరణం మనిషిలోని పిసినారితనంగా గుర్తించారు. సమాజాన్ని సరిదిద్ది సొజన్యవంతుల చేసే తలంపుతో ఈ లోభ సంహార కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం, జాషువాకు ఫిరదౌసి వలె, సొంబశివశర్మగొరికి కవిగా మంచి పేరు తెచ్చింది ఇందలి పద్యాలు, కవి హృదయవిదారక వ్యధతో, తన కలాన్ని కన్నీటిలో ముంచి వ్రాళాదేమో

  • ప్రతి పద్యం పాఠకుల యెదల హత్తుకొని రసార్టం చేస్తుంది. దేశము సుఖిక్త మయ్యె నట్టెనల యందు, కల్మిపాసనల్‌ గుప్పున గ్రమ్ము కొనియె చెరువు లాన కట్టలును ప్రాజెక్టలెన్నా, కామమును సీమ దాటించి సాగనంపె -2 అయితే ప్రయోజనమేముంది? గుడిలో కాసుల నంట గూడదనుచుం గూర్చుండు నుద్యోగి, యం గడిలో నుద్దెర బేరమాడరట, సర్కారున్‌ విచారింప లో గడ రూల్సుల్‌ కొరగావు పొమ్మనును, కుగ్రామంబు గొకుండియన్‌ చెడె, నీ రీతిగ నాడులేని గొడవల్‌ చేయెత్తుటన్‌ లోభమా, - 5 కనక వర్షమ్ము మా గుడి కడప లోన, నెల్ల వేళల గురియు నదేమొ కాని ఒక్క చినుకైన బడదు మా యొడలి మీద, కవుల కింతియ కాబోలు కలియుగాన. -37

216 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” నగరే లోకులు, దూరరే పరులు, నిందల్‌ మోపరే దుర్దనుల్‌, ఎగతాళిం బొనరింపరే విబుధు, లిస్సీలంబ్రసాదింపరే పగవారల, మగువల్‌ హసింపరె, సఖుల్‌ వంచింహే, (బంధువుల్‌) తగవుంబెట్టర, పత్నులల్లరె, ప్రభుల్‌ దండింపరే లేమిలో - 35 సిరులు దొచుక యెంగిలచేత కాకి నుళ్ళోయన లేని ధనికులు (13) చేతి మెతుకులెక్కడ రాలిపోతాయో అని భయం! ఓటులందు గెలిచి కవుల పండితుల గలి సేయు లీడరుల్‌ (13) వ్యవసాయమ్ము లేని వారి భూముల (మింగు రైతులు (14) చేసిన యఘమ్ము సనుటకై శివుని గొల్బు పిస్పిన్లి గొట్టులు (20) లంచము జేబు ఖర్చు నుపలాలన దావతు చిత్రయాత్ర యీ పంచవిధోపచారముల ప్రాపును గోరెడి భక్తకోటి (31) ధర్మమడుగంటి సత్యమ్ముదారి తప్పె, న్యాయమడవిలోబడియె నయమ్ము 'సెడియె, త్యాగము నశించె (17) లోభమా! లోకమెల్ల కల్గోల మాయె, పాపముల గాదెబోసి కాపాడనేల? (14) ఇట్టాంటివి ఈ కావ్యంలోని పద్యపాదాలు - కవి భావాలు. ఇంకా లోకాన్ని ఇట్లా వర్ణిస్తున్నాడు కవి. టక్కరి సీట్లు, వాని కడ డంబము జూపెడి సేట్టు, అంగడిన్‌ వెక్కస మైన రేట్లు, నిరుపేదలకే పలుపాట్లు, సేద్యము జక్కగ జేయువారికి మసాల కరెంటుల కోత లిట్ట్లు, కా ర్లెక్కి తిరుంగు పాలకుల ఇండ్ల కచేర్ల గెటౌట్లు - దైవమా! 8 కవి సంబోధన ఈ పద్యాల్లో బహుముఖాలుగా సాగింది. హక్కులు భారతీయులవి యంచు స్వతంత్రత వచ్చెనంచు మా ప్రక్కన బల్లెమైన పరదేశపు పాలన పోయెనంచు మా యక్కర లెల్ల దీర్చి మము హాయిగ నుంచు ప్రభుత్వమింక చే జక్కినటంచు నుబ్చితిమి, సీ! యవి స్వప్ప సమంబులాయెబో - 45 కవి తీర్చు ఇది - సంఘమునకు వివేకలోచనము లేదు, రిక్తుల నశక్తులను మను రేడు లేడు మారువడకున్న మనకు సేమంబు లేదు, ఖలులు నశియింపకున్న సొఖ్యయు లేదు -7 సమస్యా పరిష్కార సూచన ఏదైనా, సామాజిక విశ్లేషణ మాత్రం చక్కగా సూటిగా ఘాటుగా కావించారు సాంబశివ కవిగారు ఈ కావ్యంలో. ఇది ప్రతిభావంతుడైన కవికే సాధ్యం. అందుకే ఈ కావ్యానికి ఇంత వ్యాప్తి! ఈ కవి సంస్కృత కవితా పరిచయానికి ఇదే లోభ సంహార కొవ్య “ప్రస్తావన' లోని వాలుగు ళ్లోకాల్టో ఒకటి చూపడుతున్నది నైషా విషాద లహరీ నటరాగ గీతిః, నేదం విచిత్ర ఘటనం నటనం జనానాం నాసా కుకర్మ నిరతి ర్టుదు వాళ్య రీతిః, నాహం పవిర్షవ కవిర్షను యాపిలోభ. 5 భక్తి గీతములు - 1966 ముద్రణ. 40 పుటలు ఇవి భజన కీర్తనలు 6 హారతులు. శర్మగారి పాటలు కూడా పద్యాల వలె పద సౌందర్యం భావ సౌభాగ్యం కలిగి ఉన్నాయి. వారు వాగ్గేయకారులు. సంగీత కచేరీలు చేసి సన్మానాలందుకున్నవారు. ఈ సంపుటిలో స్వతంత్ర గేయాలతోపాటు కొన్ని సినిమాపాటల అనుసరణలున్నవి. 6. శ్రీరొజరాజేశ్వర సుప్రభాతం - ముద్రితం* వేములవాడ దేవస్థానం వారే కాక ఆకాళవాణి హైదరాబాద్‌ వారు కూడా దీనిని ప్రసారం చేస్తున్నారు. సాంబశివ శర్మగారి సంస్కృతాంధ్ర భాషల కవితాశక్తి - శివభక్తి, ఈ మేల్కొలుపు స్తుతి కొవ్యంలో ఒకదానికొకటి మించినవి. 'లేంబాళ వాటిక విభో తవ సుప్రభాతం" ఇందలి మకుటం.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శీతొచ్దు పూర్వాస్ధ సాహిత్యం" పద్య సాహిత్యం బల? 7. ద్విపద రామాయణం - ముద్రితం - 1965 తర్వాత. హిందీలోని రాధేశ్యాం గేయ రామాయణానికి "స్వేచ్చానువాదం సాంబశివ శర్మగారి ద్విపద రామాయణం. వాల్మీకి రామాయణం లోవలె ఇందులోను ఆరుకాండలున్నాయి.. శర్మగారి తెలుగు రామాయణం కవిగారు స్వయంగా పలు సాహితీ నభల్లో కొవ్యగానం చేయుట చేత చాల వ్యాప్తి పొందింది. ఇందులోని కొంత భాగం కరీంనగర్‌ ప్రతిధ్వని పత్రిక ప్రచురించింది. కవిగారి బహుళ ప్రయత్నంతో వదాన్యుల ఆర్థిక సహాయంతో బాల సుందర కాండలు మాత్రమే రెండు చిరు కావ్యాలుగా ప్రచురించబడ్డాయి. మిగతా భాగం ఇంకా వెలుగు చూడలేదు కవి తమ ద్విపద రామాయణ ముద్రిత ప్రతులలో అచ్చుకు సహకరించిన కృతి పతులను అభినందించారీ విధంగా. బాల కాండలో డా। యు.పి.ఎన్‌. రెడ్డిగారి ప్రశంస. కలరా యాంధ్రము నందునంబలె తెలంగాజణాంబు నందిట్టి శ్యా గులు దామై కవి జేరబిల్చి మది సంకోచమ్ము పోనాడ ని ర్మల భావంబున, నర్థమిత్తు మిటురమ్మా నీదు కావ్యంబు కొ వలె ముద్రింతు మటంఛు గట్టి నుడులన్‌ భాషించు వైద్యుల్‌ విభుల్‌ సుందరకాండలో : శ్రీరఘువంశ రత్నమును సీతయు పంచ వటిన్వసింవగా _ క్రూరుడు పంక్తికంరుడటకుం జని సీతను దొంగిలింపగా మారుతి లంకకేగి యట మైథిలి జాడను దీసి రామునిం జేరిన సత్కధన్‌ వినుము శృత్యమరంబు వాలాన కృష్ణుడా! ఈ కావ్యంలో వీరి ద్విపద కవిత, గేయ పొదాలవలె గొనయోగ్యంగా ఉంది. అనువాదం సహజసుందరం, ఉదాహరణకు కొన్చిపంక్తులు చూడండి. సుందరకాండ నుండి - 'సేమంబునకు నిక్క గ్రేమకు గీము ధర్మంబునకు పాదు కర్మకున్నెలవు పనిబూని యుపకారమును జేయువాడు భజనలో నానంద పడుచుండు వాడు - 11పు. ఒక యోజనంబంత యొడలిని బెంచె! ఆరి భయంకర వికటాస్యముం దెరిచె రణ ధీరుడొక్క పర్వత మంత బెరిగె | బల పతాకముమింట చలియింస దొగడె - 31 కలవాడ పదితలల్‌గలవాడ వినర ! కలవాడ శివభక్తి గలవాడ వినర - 53 నెమ్మేను లంకలో నిలుచునే గాని । ఆత్మ ప్రవేశించునతనిలో ననుమ మరలి వచ్చెడి వేళ మౌళి రత్నమును గురుతుగా నిచ్చె గైకొని దీనిగనుము -65 బాలకాండ : తరువుల గ్రాంగ్రాత్త దళములు విరిసె సరయూ తరంగముల్‌ జావళుల్‌ బాడె తోటలన్‌ మొగ్గ గుత్తులు నోళ్ళువిచ్చి 1 చిగురు పూబొదరిండ్ల చెలువముల్‌ హెచ్చె - 7 ఇది మంజరీ ద్విపద అయినా ఆది ప్రాసో, అంత్య(ప్రాసో, విధిగొ పొటించబడింది. వృత్యను ప్రాస ఈ కవికి ఇష్టం. అనేకలర్థాలంకారాలు ఎడనెడ యమకం (కలవాడ) శ్లేష (అనుమ) వాడి శర్మగారు తమ కవితకు శోభను కూర్చారు. చెప్పితే తన్న ఇది అనువాద కొవ్యమనిపించదు. కేవలం రెండు కాండములు ముద్రితమైన ఈ రామాయణం ఆరు కాండములు ఒకే ప్రతిగా ముద్రింపబడితే చక్కని గేయ కావ్యం జనానికి లభించేది. కవి తమ కవితానైపుణివిట్లా సాహసంగా సత్యంగా చాటుకున్నారు నొ కవన ప్రబుద్ధ నలిన ప్రసరన్మకరంద బిందువుల్‌ నాక వన ప్రబుద్ధ నలిన 'ప్రనరన్మకరంద బిందువుల్‌

218 డా. మలయశ్రీ “కరంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర" కాక మరే మగున్‌ విగత కల్మశ విజ్ఞమనోజ్జ భృంగముల్‌

మూకతలోన ముంచి రసమున్‌ గొనపేయవె, వేయునేటికిన్‌

అయితే మాత్రం ప్రయోజనం ? కావలసినదేమిటో సాంబశివ శర్మగారే చెప్పిన మరో అవధాన చాటువు తెలుపుతుంది ఈ విధంగా. ఇది - నిరాశ్రయానశోభంతే - అను నీతి శాస్త్ర శ్రోకానువాదమైనా కవి ఆమోదించిన విషయం,

పండితుల్‌ లతల్‌ వనితలు ప్రాపులేక, వన్నెకెక్కరు; మణిలేక వలయమునకు,

కాంతలేక పురుషునకు, కవులు లేక, రాజునకు రవంతయు కీర్తి రాదు నిజము

సాంబశివ శర్మగారు రచించిన పద్యాలన్నీ సంఖ్యకు వేయి కాకపోవచ్చు. అయినా సాహితీ మూల్యాన్ని బట్టి ఆయన మహాకవి.

  1. గాలిపెల్లి సుబ్బయాచారి ఆ కురిక్యాల, మం. గంగాధర 1910-1970 సుమారు

గాలిపల్లి సుబ్బయాచారి జన్మగ్రామం కురిక్యాల. వీరు విశ్వబ్రాహ్మణ కులస్టులు. తండ్రి నరసయ్య గారి రాజయ్య తల్లి ఈశ్వరాంబ వీరిది ప్రబోధక బుషిగోత్రం. విద్యాగురువు లక్ష్మీనరసయ్య పంతులు. వేదాంత గురువు దురిచేటి నరసింహాచార్యులు - హసనాబాద.” సుబ్బయాచారి రచనలు . 1. ఆంధ్ర జ్యోతిష సర్వస్వము - ముద్రితం, 2 శ్రీభక్త విరోబా నాటకము - ముద్రితం - 1948 కవి వరిచయం : సుబ్బయాచారి “భాషా కవిత్వ పరిజ్ఞానమెక్కువలేనందున నింకను గ్రంధములు శోధించుచున్నవారు” అని తమ నాటకంలో సూత్రధారిచే చెప్పించుకున్నారు. బాల కవినన్నారు. కాని ఆయన వరకవి. సర్వధారిలో ముద్రితమైన ఈ పుస్తకంలోని ఫోటోలో కవి ధ్యాస స్థితిలో కూర్చున్నారు. అప్పటికి నలుబదేండ్ల వయస్సువారు అనుకోవచ్చు అంతకు పూర్వమే జ్యోతిష గ్రంధాన్ని రచించినారు. గురువునాశ్రయించారు. వీరి జీవిత కొలం సుమారుగా 1910-1970 కావ్యపరిచయం: ఈ కవి విద్వాంసులు కారు. వాస్తు జ్యోతిష్యాలు తెలిసినవారు శాస్తపండితులు లేని గ్రామాలలో వీటియందు మిత పరిజ్ఞానం కలవారితోనే జానపదుల అవసరాలు తీరేవి. వీరికి ఆదరం ఆదాయం లభించేది. సుబ్బయ్యాగారి జ్యోతిష గ్రంధం ఎక్కలదేవి లక్షణ భాగవతార్‌ కోరుట్ల గారి వద్ద లభించింది. దీని పు, 160 దీనికి వెలిచాల కేశవరావు గుండి గారు రచించిన పీరిక ఇది.

“పాఠక మహాశయులారా! మణి దీసమును బోలు ఆంధ్రజ్యోతి(ష్య) సర్వస్వము అను గ్రంధము బ్ర శ్రీ సుబ్బయాఖ్యునిచే సర్వేశ్వరానుగ్రహంబున (సంస్కృతము నందు గల యీ జ్యోతిష శాస్త్రము) ఆంధ్రమునందు పద్యములుగా రచింపబడెను. దీనిలో అనేకములగు భాషాకవిత్వ లోప ములుండవచ్చును.అవి యన్నియుసైచి యొప్పులుగా గ్రహించి సవరించి యీ నూతన కవికి నుత్సాహము కల్గింతురని కోరుచున్నాను. కవి స్వీయ పరిచయ సీస పద్య గీతంలో ఇట్లన్నారు.

మాధవీయాది సద్గంధ మర్శమెరిగి, జూచి పెద్దలు జెప్పిన చొప్పుగాను

వ్రాయు చుంటిని మా తెన్గుభాషలోన, యాంధ్ర సోదరులకునిది యనుగటంచు - ప,5.

ఈ కృతి అనేక గ్రంధాల సార సంగ్రహం _పూర్వాంధ్ర గ్రంధాల పద్యాలను కూడా కవి కొన్నింటినిందులో చేర్చుకున్నారు * ఇది మొదటి భాగం. రెండవ భాగం రాలేదు."

  1. సుబ్బయాచారి గారి 'శ్రీభక్త విరోబా నాటక' చతుర్ధాంకాంత గద్యం 2 _సుబ్బయాచారి గారి 'శ్రీభక్త విరోబానాటక' అవతారికా పద్యం పు 3

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతొబ్బ పూర్వాస్థ సాతాశ్యం" పద్య సాహిత్యం 219 ఇందులో శకునాలు, గ్రహదోషాలు, వ్రతాలు, ముహూర్తాలు, జాతకాలు మొ। అంశాలు పద్యాల్లో వివరించబడ్డాయి. పద్యాలకు భావాలు కూడా వ్రాశారు. శ్లోకాలకు అనువాదం సరళంగా ఉంది. కొన్ని పద్యాలు శైలీ రమ్యాలు ఈ పుస్తకానికి మరో మున్నుడి వ్రాసిన శతావధాని కృష్ణమాచార్య కొరుట్లగారి అభిప్రాయమిది. “ఆవకాశము చిక్కనందున సాధ్యమైనంత వరకు చూడగలిగితిని, ఇంకను కొన్ని భాషాకవిత్వ భావమున జూచువారికి పొరపాట్లు కనబడినను జ్యోతిష్యశాస్త్ర సంప్రదాయమున జేయవలసిన యుపకారమునకు కొరతలేదు”. 28) రామమూర్తి- మాదాపురం, తాః సిరిసిల్ల; 20వ శతాబ్ది పూర్వార్థం. రామమూర్తిగారు వైదిక బ్రాహ్మణులు. వీరి స్వగ్రామం మాదాపురం, ఇది గన్నేరువరం గ్రామ సమివంలో ఉంది మాదాపురం గృహనామం గాగిళ్ళాపురం స్వగ్రామం అని, 'క జిర.చరిత్ర' పుట. 274లో ఉంది. మూర్తిగారు పండితులు, రామాయణ మందరం వ్రాసీన వావిలికొలను సుబ్బారావు (18. .. 947) గారితో వీరికి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవట. ప్రత్యేక కావ్యాలు ఏవి రచించలేదు కాని, వీరు అప్పుడప్పుడు రసవత్కవితా ఖండికలు వెలయించేవారు రామమూర్తి గారి ఈ పద్యం చూడండి. ఇది చిత్ర కవిత. ఈ తేటగీతి పద్యంలోని నాలుగు చరణాల మొదటి అక్షరాలు కలిపిచదివితే ఈ జిల్లా మాజీ ఎం.పి.గారి పేరు వస్తుంది - రస రుహరి చిన్ని నిసువనదగువాడు, మారుకన్న మధురిమమ్మువాడు పవి ధరించిన వాని పట్టి పోలినవాడు, తిరుమలన్న వెంట తిరుగువాడు. (రమాపతి) రమాపతి రావుగారి అన్న తిరుమలరావుగారు . పవి వజ్రాయుధం. దానిని ధరించినవాని పట్టి ఇంద్రనందనుడైన జయంతుడు ఇంతటి ప్రతిభా వ్యుత్చుత్తులు గల కవి రామమూర్తిగారు. 29) జందిడి నారాయణ - జమ్మికుంట. తా॥ హుజూరాబాద్‌ - జననం 1920 సు. జంగిడి నారాయణగారు హుజూరాబాద్‌ తాలూకాలోని జమ్మికుంట వాస్తవ్యులు కాపు కులజులు వీరు వరకవి. అచలాద్వైత మతానుయాయులు, వీరు తమగురువుగారైన అంకతి రాఘవయ్య “చిదానంద రాజయోగి' గూడూరు, మం కమలావురంగారిపై భక్తితో రెండు రచనలు చేశారు. _ నారాయణ కవి కృతుల పేర్లు?- 1 చిదానంద శతకము - 1949 ముద్రణ, 2 చిదానంత జ్ఞానబోధ - 1977 ముద్రణ మొదటిది సీసపద్య అష్టోత్తర శతకం. రెండవది ద్విపద కావ్యం. కవి స్వీయ వివరాలేవీ తమ పుస్తకాలలో తెలుపుకొనలేదు. 1969 శ్రావణ పూర్ణిమరోజు గురువుగారు శ్రీర్తిశేషులైనారు.. ప్రస్తుతం వ్యాపార వృత్తిలో జంగిడి నారాయణగారు హన్మకొండలో ఉంటున్నారు వయస్సు 70-80 నం. మధ్యగా ఉంటుంది (1992). కావ్యపరిచయం: చిదానంత శతకంలోని కవి స్వీయ పరిచయ పద్యం. సీ. పరగనూటెనిమిది పద్యముల్‌ జెప్పితి జూసి తప్పొప్పుగా జేసి వినుడి యతి ప్రాస లక్షణం మతినే నెరుగ మీ(దు) సుతునిగా జూడుడీ సుజనులారా మతి మంతులేదేని మర్మమెరిగెద రన్న (గణభంగం) అతిపామరులు దీనినందలేరు కారణంబగు జన్మ కడతేర జెప్పితిన్‌ నేరమెంచక దీని నేర్చు గనుడి 3. విశి. రావుగారి నేను-నా జ్ఞాపకాలు" 1377; 2వ భాగం వుట. 99; ఈ వచనం తర్వాత మరో పద్యమున్నది. 4. కవి గారు తమ కావ్య పీరికలో పేర్కొన్నారు. 1 అంకతి రాఘవయ్య “చిదానంద రాజయోగి" గారు ఈ గ్రంథకర్త మలయశ్రీకి కూతురునిచ్చిన మామ.

220 డొ. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

గీ. గొప్ప వాడను గాను మా యప్ప లార్క తప్పు లేకుండ జెప్పనాతరము గాదు

దేశి కేంద్రుడ రాఘవా! ఆశరహిత, దాస నారాయణుని బోచుధన్య చరిత - 3.

వేదాంత విషయాల వివరణ, సుగుణ సంపత్తి ప్రశంసతో కూడిన ఈ చిదానంద శతకంపై ఈ జిల్లా కవులైన శేషప్ప, సిద్దప్పల శతకాల ప్రభావం ఉంది.

చిదానంద జ్ఞాన బోధ :- ఇది కేవలం 30 పుటల “మంజరీ ద్విపద" కావ్యం విషయం ఆచలాద్వైత విషయ ధర్మవివరణ. మచ్చుకు కొన్ని పంక్తులు చూడండి

“ఎరుక సహజ వృత్తి యెరిగింతు నీకు, కనుపడి కనరాదు కావున నీవు

కనరాకనె పోని కనుగొన్నిబయలు, లేని దున్నట్టుండె లేకనే పోని

ఇంద్ర జాలము తీరుయచటనే వుండు, మరి మహేందుని జాల మాయమై పోవు

యింక తెలిపెద విను జంకును వదలి” - పు. 13, చివరి పద్యం -

తెల్ల కరి నెక్కితంతలో తెలియ వచ్చె, కల్ల యయ్యెను సర్వంబు కలికి మిన్న

దేశకేంద్రుడ రాఘవా" ఆశరహిత, దాస నారాయణుని బ్రోచు ధన్య చరిత |

ఈ కవి మరో శతకం రచించారని తెలియవచ్చింది. వీరు పండితులు కారు - వరకవి. కవి

ఆశించినట్లు “నేరమెంచకి భక్తజనం 'జన్మకడతేర' ఇటువంటి రచనలను ఆదరిస్తూనే ఉన్నారు. 3౦0) రావుల దశరథం - హుజూరాబాద్‌, 1920-64.

రావుల దశరధంగారు హూజూరాబాద్‌ వాస్తవ్యులు. విశ్వబ్రాహ్మణులు ప్రభుత్వ వ్యవసాయ నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేశారు. ఈ కవి ఫోటోగ్రాఫర్‌, సంగీత చిత్రలేఖనాది లలితకళల్లో ప్రావీణ్యం కలవారు స్వయంగా బుజ్జ కధలు రచించి స్టేజీపై చెప్పేవారు. తెలుగు సాహిత్యాభిమానం కల ధశరధంగారు వ్రాసిన ఏకైక పద్యకావ్యం - “బాష్పాంజలి". 1950 సుమారుగా రచింపబడిన ఈ లఘుకావ్యం అముద్రితం అల్ప వయస్సులో మృతి చెందిన తమ కుమారుని స్కృతితో కవి ఈ కృతిని శోకోపశమనంగా వ్రాసుకున్నారు. వీరి కవితపై పురాణకవుల పద్యాల ప్రభావముంది. బాష్పాంజలి చదివికే రామాయణ యుద్ధకాండలో లక్ష్మణుని మూర్చ సందర్భంలోని శ్రీరాముని దుఃఖం మదిలో మొదలుకుంది. ఒక పద్యం చూడండి -

బంధు సమూహంబు బరతెంచి నీతనూ భవుడేడనిన యేమి పలుకు వాడ

మిక్రులేతెంచి నీ పుత్రుడెచ్చటనని యడుగ నే నేమని నుడువువాడ

ఆగ్రజుడేడంచు అడలు చున్నట్టి నీ చిన్ని చెల్లెలికేమి చెప్పువాడ

నీ సహచరులు నన్‌ నీ జాడ లెరిగింప బ్రతిమాల నేనేమి పలుకువాడ

కంటి రెప్ప చందాన నిన్‌గాచి తుదకు, చేతులారంగ అడవి పాల్దేసుకొన్న

మంద భాగ్యుడు ఎట్లు నీ మరణవార్త, తెలుసుకొన జాలునో భువి తెలియనకట -3. =

ఈ కరుణరస పూరిత పద్యకావ్యం 16 పుటలు 60 పద్యాలు-దాదొపు కవి స్వయంగా భ్రాసిన నోటు బుక్కు ఆయన కుమారుడైన రావుల పూల్గాచారి హుజూరాబాద్‌గారి వద్ద ఉంది. దశరథంగారు బ్రాసిన బుజ్జకథల ప్రతులు లభించలేదు 3) తిరునగరి వేంకటేశ్వర్లు - నుస్తులాపురం, తాః కరీంనగర్‌ , 1915-70 సుమారు.

వేంకటేశ్వర్గుగారు అధ్యాపకులు. చాత్తాద వైష్ణవులు నుస్తులాపూర్‌ వాస్తవ్యులు. జర్నలిస్టు టి. ననుమాసస్వామిగారు వేంకటేశ్వర్దుగారి కుమారులు. స్వామిగారి 'వ్యాస సంపుటి" భాగ్యనగరంలో 1 1951లో మానకొండూరు మాధ్యమిక పాఠశాలలో వేంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయులుగా ఉండగా

చూశాను. నేను అప్పుడు అదే పాఠశాలలో 6వ, తరగతి విద్యార్థిని.

రెండవ భాగం - ౪ అధ్యాయం ; “20వ శతాజ్బ ట్రార్వాష్ట సాాశ్సం” పద్య సాహిత్యం 221 ఏడాది క్రితం ఆవిష్కరింపబడింది. ఆ సందర్భంలో రచయిత ప్రసంగిన్తూ వారి తండ్రి రచయిత అని, వారి రచనలు గోలకొండ పత్రికలో వస్తుండేవని, తండ్రీ ప్రేరణవలననే స్ఫూర్తి పొంది తాను రచయిత కాగలిగానని అన్నారు. ఆ వార్త దినపత్రికల్లో వచ్చింది. వేంకటేశ్వర్లు కీర్తిశేషులు. కాబట్టి వారి కనిష్ట సోదరులైన డి.శ్రీనివాసరావుగారిని కరీంనగర్‌ దగ్గర రాంపుఠంలో కలుసుకొని సంప్రదించగా అన్నగారు గద్యపద్య రచనలు చేసేవారని చెప్పారు కాని, వారి ఏ రచననూ అందించలేకపోయారు. అన్వేషించగా వారి పద్య కవిత ఒకటి మాత్రం లభించింది. సారస్వత జ్యోతి - త్రైమాసిక సాహిత్య నంచిక, కరీంనగర్‌

  • 12 ఫిబ్రవరి 1954లోని వీరి “విద్యార్థి ప్రబోధము” రెండు సీన వద్యాలు. అవి ఈ దిగువ చూపబడుతున్నవి. మోరెకా మున్ముందు మోసముల్లిప్పుడు, జాతీయతను నిల్చు జుణలౌట మోరెకా మున్ముందు మోమాంసకులునయి, గ్రంధ శోధనకయి గడగు చుంట మోరెకా మున్ముందు మిత్రత్వమును సల్పి, సంఘ సంస్కరణలు సల్పుచుంట మోరె కా మున్ముందు మేను చెమ్మటోడ్చి, భరత మాతకు సేవ నెరపుచుంట మోరె కద భావి సౌభాగ్య ధీరులగుట, మోరె కద దేశవృద్ధికాధారులగుట మోరె కద సత్యహింసల తీరుదెలిసి, సంతసంబును నొందుటో సదయులార రెండవ పద్యం నాలుగు పాదాల్లో వరునగా కవులయి, తత్వవేత్తలై, విద్వద్వరేణ్యులై, గణిత శాస్రజ్ఞులై రాణించాలని ఆశిస్తూ చివరి గీతంలో ఇట్లా ప్రబోధించారు. కరడుగట్టిన భారత క్రౌర్యములను, మెదపి కదలించు చతురులు మారె గౌదె భూత శోభను గలిగించి భూమి యందు, భేరి మైోగించు నేతలు మీరె గొదె. వీరు శేషాద్రి రమణకవుల “నైజాం రాష్ట్ర ప్రశంన1926 కావ్యాన్ని చదివినవారు. భారత స్వాతంత్ర్య పోరాట కాలాన్ని చూసినవారు. దేశం విముక్తి పొందిన ఆనందాన్ని అనుభవించినవారు. కవి ఆశించినట్లుగా 'కరడు గట్టిన భారత క్రార్యములు' విదేశీపాలకులవి అంతరించాయి. అన్ని రంగాల్లో భారతీయులు జాణలై రాణిస్తున్నారు.
  1. పురుషోత్తమదాసు (కైరం భూమగౌడు) - రాయికల్‌ 1875-1950 సుమారు. . పురుషోత్తమదాసు గౌడు విష్ణు భక్తుడు. పద్యకవి. మన వారికి కాళిదాను, కబీరుదాసు, రామదాసు సుపరిచితులు. ఆ దారిలోనే రామానుజ, నరసింహాది దొసోపనాములు వచ్చారు. భూమగౌడు పురుషోత్తమ దాను (సూరదాసు పరిచయం తక్కువ దేవదాసు కథ - సినిమా ఆ కాలం వరకు రాలేదు). 1997 జనవరిలో రాయికల్‌లో కవి - రాజకీయ నాయకులయిన వేముల పెరుమాళ్ళుగారింట ఈ కవి ప్రస్తావన వచ్చింది. పెరుమాళ్ళుగారి మాతా మహులు (తల్లి తండ్రి) పురుషోత్తమదాను కవి. ఒక అసంపూర్ణ సీసపద్య 'రావికంటి రామచంద్ర శతకము" మరికొన్ని చాటు పద్యాలు పురుషోత్తమ దాసు రచనలు, ఆయన గౌడ వృత్తివారైనా వైద్యం చేసి రాణించారు - విష్ణు భక్తిలో లీనమై కవిత్వం వెలయించారు. పైగా భాగవతనటులు, ఈ గ్రంథంలోని తిరునగరి నరసింహదాసుచే మాధవ చరితం. యక్షగానాన్ని రాయించిన వారిలో వీరు ముఖ్యులు. వీరి పద్యాలు భగవన్నుతి, ఆచార సామాజిక నీతి ప్రభోధకాలుగా ఉన్నాయి. ఇవి ఏక మకుట పద్యాలు (గత పద్యం చివరి రెండు చరణాలు) 44. ఒక పద్యం చూడండి - సీ పుణ్యాత్ములుండేటి పురమె వైకుంఠము, ప్రజల పోషించు భూవళియె విష్ణు, పెనిమిటిన్‌ సేవించు పెండ్లొమె శ్రీలక్ష్మి గురువాజ్ఞ మెదలిన నరుడె దాను, తల్లిదండ్రులగాచు తనయుడె విబుధుడు, ధర్మరాజుని వాని తలపవచ్చు, పక్షపాతములేక పంచాయకతులొనర్చి, సత్యంబు పల్కిన సజ్జనుండు.

222 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహ్‌త్య చరిత్ర” గీ ఎంత కాలంబు బ్రకికినయింతెగొదే, భజన చేసెడివారికి పరమ సుఖము, గజిమునకు మోక్షమిచ్చిన ఖగపతే (తీ) ౦ద్ర, రాజరొజేంద్ర రావికల్‌ రామచంద్ర ఊరి అధికారితో ఎందుకో వైరం వచ్చి ఊరు విడిచి పంతంళో 12 ఏండ్లు పారుగూళ్ళలో గడిషారట దాసు. ఆయన అభిమానించిన పూర్వ కవుల సద్యాలు - పాటలు, తిరునామాలు, నటించిన నాటకాల భాగాలు ్రాసీ ఉంచుకున్న వ్రాత 'ప్రతులనుండి అతి జాగ్రత్తగా ఈ కవి రచించిన పద్యాలు గుర్తించి వేరు చేయడమైంధి. లభించిన వీరి అయిదారు చాటువుల్లో రెండు పద్యాలివి. ఆ.వె ఆవులుద (9) పురములో ఆర్యవైశ్యవనిత, ఎలమిచుప్పనొతి ఎత్తుపండ్లు మందులన్నితాగి ముందిస్తననియు (ను), బాంకుటాడె నేడు రంకులాడి కం. అవనిన్‌ కీడుపాతకుడీ, భువినేలిన లక్ష్మ్యరెడ్డీ బూడిదయగునే కవిగా వాని శపించితి, కవితిట్టును పాముకాటు కదలను భూమా 33. చెన్నమనేని జగన్నాథరావు, మల్యాల, మం. చెందుర్తి, జననం - 1926 సుమారు, చదువు - సంస్కృత విశారద. జగన్నాథరావుగారు వెలమవారు. నిరాడంబరులు. సంస్కృతాంధ్ర భాషల పషొంఉిత్యం కలవాడు. వాటి కవిపండిశుల సంగతులు ఉత్సాహంగా వివరిస్తారు వినేవారుంటే. వీరు తెలుగులో మంచి కవి, 1396లో కలిసినప్పుడు వారివి రెండు పద్యాలు వినిపించారు. అందులో ఒకటి ఈ క్రింద చూపబడుతున్నది 1 నీచులవేడబోకు మపనిందకు పాత్రము గాకు మేదురా లోచన నసల్ఫబోకు కడులోభుల పంచన చేరబోకు పై శాచగుణంబు నీడు కడు శాస్త్రము పొందియు తామసంబుకా రాచి నశింప జేసియు నలక్షణ సౌఖ్యము పొందు మానసా. శ్రీరామమేలుకొలుప్పు, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్తవము, అను పేర్లతో వీరివి రెండు కృతులు ముద్రణ పొందినాయన్నారు. సంగెం (కారుట్ల్ట మండలం) రామచండద్రరావుగారు కూడా తెలుగులో కవిత్వం చెప్పేవారన్నారు వీరు, వారిని కానీ వీరి రచనలను కానీ చూడలేకపోయాను. 2 యక్షగాన - విధినాటక సాహిత్యం పండిత కవుల పద్యకొవ్యాటకన్నా ఈ జిల్లాలో ఈ అర్థ శతాబ్దిలో అధిక జనాదరణ పొందినవి యక్షగానాలు వీధినాటకాలు. వీనిని పరిమిత విద్యావంతులైన కవులే వ్రాశారు. వారిలో పలువురు వరకవులు. ఈ రచనల అవసరాన్ని వ్యాప్తిని చూసి విద్వాంసులు కూడా కొందరీ ప్రక్రియలో రచనలు కావించారు. కాని, ఆవి సంఖ్యలో చాల శక్కువ ఈ తరంలో ముఖ్యంగా భట్రాజులు యక్షగానరూపకాలను విరివిగా రచించారు. తర్వాతి కాలం లో వివిధ వర్దాలకు చెందిన నటులే ఈ నాటకాలను స్వయంగా వ్రాసుకున్నారు వీరిది శ్రుతపాండిత్యమైనా నటనానుభవంతో జనాసక్షిని బట్టి ప్రదర్శనానుకూలంగా యక్షగానాలు రచించి తద్వారా స్వప్రయోజనాన్ని ప్రజాదరాన్ని పొందగలిగారు. విశేషమేమంటే ఇక్కడి యక్షగానాలు శతాధికం ఇంచుమించు రచింపబడినవన్నీ ప్రదర్శింపబడినవి అంతేకాక వానిలో అధిక శాతం ముద్రణ పొందినవి అదీ సికిందరాబాద్‌లోని ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలచే ప్రచురించబడడం విశేషం. ఈ యక్షగాన నాటకాలు ఒక్కొక్కటి పలు ముద్రణలు పొందాయి. ఇప్పటికీ ముద్రింప-విక్రయింపబడుతున్నాయి. ఇది ఇక్కడి మరే విద్యత్కవి గ్రంధానికీ లభించని సత్కారం. మరో విషయం - పండిత కవుల కావ్యాల్లో ముద్రణ పొందినవెన్ని? వానిని చదివిన వారెందరు? ఏిన్నవారెందరు? అనే వివేచనకు సోతే - ఆ ప్రశ్చీలకన్నింటికీ 'చాల తక్కువి అనేదే జవాబు. కాని,

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద ప్రూర్వాస్థ సావాత్యం” యక్షగానాలు 223 దేశీయరూపకాలైన ఈ యక్షగాన వీధినాటకాలు మాత్రం అధిక జనాదరణను బహుళ వ్యాప్తిని పొందాయి, అవి అవిద్యావంతులు మితవిద్యావంతులైన జానపదులకు మాతృభాషను, పురాణ సాహిత్యాన్లి నాట్యసంగీతాది కళలను అందించి - అనురంజింపజేసి, అమోఘమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించాయి. ఈ కాలపు రూపక సాహిత్యం ముఖ్యంగా రెండురకాలు.

1 యక్షగానాలు - భాగోతాలు - వీధినాటకాలు: 2. స్టేజి నాటకాలు

మూడవ స్థాయిలో చిరుతల పాటల నాటకాలు వచ్చాయి. రచయితలను బట్టి ఇవి రెండు రకాలు. 1. కవులు వ్రాసినవి: 2. నటులుస్వయంగా రచించుకొని ప్రదర్శించినవి.

వీటిని రచించిన కవులు కూడా రెండు రకాలు. 1. పండిత కవులు 2. వర కవులు.

ఈ దృశ్యరూపక (గ్రంధాల రచనావ్యాష్తికి ముఖ్య కారణం పోషకుల ఉదార దృష్టి నాట్‌ వారు కృతిని నిర్మింపజేయడం లేదా అంకితం పొందడం, పురాణాలలో చెప్పబడిన విధంగా సప్తసంతానాలలో ఒకటిగా పుణ్యకార్యంగా భావించేవారు కాబట్టి పద్య కావ్యాలవలెనే ఈ యక్షగానొలను ధనవంతులు తము పేర అంక్షితంగా వ్రాయించుకొని తమ గ్రామనామాలను ఈ దేశి రూపక సాహిత్యంలో శాశ్వతం చేసుకున్నారు జయదేవ కవి అష్టపదులకు, త్యాగరాజు మొ వాగ్గేయకారుల కీర్తనలకు, పాట చివరి పాదంలో కవి నామ ముద్ర ఉన్నట్లుగానే, ఈ యక్షగాన కవులు తమ పేర్లతో పాటుగా కృతిపతుల గ్రామ నొమాల దైవాల పేర్లను ప్రతి గేయం చివర పేర్కొన్నారు

ఈ యక్షగాన ప్రదర్శనలకు నాడు ఇంత అధరం లభించడానికి మరో ప్రముఖ కారణం అ కాలం. ఇదే నాటి ప్రధాన వ్రజావినోద కాలక్షేపసాధనం. హరికథ, పురాణశ్రవణం, తోలుబొమ్మలాట, దొమ్మరాట, యక్షగానం ఇవే నాటి కాలక్షేప కళారూపాలు. వీనిలో మొదటి రెండు విద్యావంతుల ఆదరం పాందేవి. దొమ్మరాటలు చిన్నపాటి సర్కస్‌ విద్యలు. తోలు బొమ్మలాటలు కించిద్భేదంతో యక్షగానాలే. యక్షగానాలు నటులు ప్రదర్శిస్తే తోలుబొమ్మలాటలు గొయనీ గాయకులు తెరచాటున పాడుతూ తెరముందు బొమ్మల దారాలను చేతివేళ్ళ ద్వారా కదిలిస్తూ నటింపబేస్తారు.

ఈ జిల్లాలో సుమారు 1940 వరకు సినీహాళ్ళు చలనచిత్ర ప్రదర్శనలు జిల్లా కేంద్రంలోనే లేవు. తాలూకా ప్రాంతాలకు 1950 తర్వాతే వాని విస్తరణ, మారుమూల గ్రామాలకు అదీలేదు. ఈ జిల్లాకు శడియో వచ్చింది 1950 తర్వాతనే. టీ.వి 1970 తర్వాత కాబట్టి 1950 పూర్వం యక్షగానాలు గ్రామీణులకు ప్రధాన వినోద కాలక్షేప సాధనంగా ఉండేవి అనటం సత్యాంశం. అందుకే ఆ కాలంలో యక్షగానాల రచనలు ప్రదర్శనలు - గ్రంధప్రచురణలు అధికమైనాయి. ఈ జిల్లా యక్షగానాల కవుల రచనలను ముద్రిత సాహిత్యం ఒక భాగంగా, అముద్రిత - అలభ్య యక్షగాన సాహిత్యకవుల పరిచయం రెండవ భాగంగా ఇక్కడ చూపబడుతున్నవి.

ముద్రిత యక్షగాన - వీధి నాటక సాహిత్యం కవులు :

1 అయ్యవారు వేంకట నరసయ్య పంతులు - బూరుగుపల్లి

' 2. ధపూరి సత్యనారాయణాచార్యులు - కోట్ట నరసింహుల పల్లె

3 భట్టాంజనేయ కవి - మోరెపల్లి, 4 భట్టు లక్ష్మయ్య - నాచుపల్లి

  1. పులికాంత గంగాధరయ్య - కధలాపురం _ 6. ఎక్కలదేవి లక్ష్మణభాగవతార్‌ - కొరుట్ల

  2. గాలిపల్లి సుబ్బయ్యచారి - కురిక్యాల 8. తిరునగరి నరసింహస్వామి - రాయికల్‌.

అలబ్ధగ్రంధ యక్షగాన సాహిత్యం - కవులు :

1 నల్లగొండ రాజయ్య - కాళేశ్వరం 2. ఎజ్జమరాజు మూర్తిరాజు కవి - గజ్జెపల్లి

  1. సిద్ధప్ప వరకవి - గుండారెడ్డి పల్లి 4. నారంభట్ల దుంపెటాద్రి -దుంపెట

224 డా. మలయశ్రీ “"కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 5. కాసు సింగమరాజు - కోనేరుపల్లి 6. సాధనాపరులు లక్ష్మణస్వామి - వల్భాపురం 7. నీలకంరం లక్ష్మణరాజు - మల్యాల 8. దాసరి గంగారాం - కొరుట్ల. యక్షగాన వీధినాటక ముద్రిత సాహిత్యం :

  1. అయ్యవారు వేంకటనరసయ్య పంతులు - బూరుగుపల్లి. 20 శతాబ్ది పూర్వార్థం. వేంకట నరసయ్య గారు ఆయన తమ్ముడు వేంకటయ్యగారు ఇద్దరూ నటులు, కవులు. వీరి స్వగ్రామం గంగాధర - వేములవాడ మార్గంలోని బోయినపల్లికి సమిపంలోని బూరుగుపల్లి. వీరు చాత్తా ద వైష్ణవులు. పెరంబుదూరు వంశం వారు' కవి తండ్రి వేంకట నృసింహం. మతగురువు పరవస్తు శ్రీనివాసాచార్యులు. వీరికి ఒక నాటకం జట్టు ఉండేది. వివిధ గ్రామాలలో వీధి నాటక ప్రదర్శన లిస్తూండేవారు. నాటిక కళను ఒక వృత్తిగా చేపట్టి దానితో తామేకాక మరికొందరు నటులకు జీవనోపాధిని కల్పించారు. నటులుగా బె త్సాహికులైన అన్ని కులాల వారు చేరినారు. స్రీ పాత్రలను సైతం పురుషులే పోషించడం నాటి ప్రత్యేకత. ప్రతి నటునికి ఆటపాటలలో ప్రావీణ్యం ఉండేది. అలాంటి వారే రాణించేవారు, స్ఫురద్రూపంతో పాటు చక్కని గాత్రం ఉండడం నాటి నటులకు తప్పనిసరి. తొలితరం మన తెలుగు సినిమా నటీనటుల్లో ఎక్కువభాగం స్టేజీనటులు చక్కని గాయకులు అనేది గమనార్హం. అయ్యగారు వేంకటనర్స్భయ్య సోదరుల పుస్తకాలను కొన్నింటికి యక్షగానాలని ముద్రించినా ఇవన్నీ స్వదేశి నాటకాలే. వీరి రచనలు ఇరువది వరకున్నాయి. అవన్నీ సికింద్రాబాద్‌ కొండా శంకరయ్య అండ్‌ సన్స్‌, మల్లికార్జున పబ్లికేషన్స్‌ మొదలగు ప్రముఖ సంస్థలు అచ్చేశాయి. ఈ యేబదరువదేండ్లుగా అవి అమ్మబడుతున్నాయి. వీరి రచనలు ఇవి: 1 ద్రౌపదీ స్వయంవరం. 2. సుగుణావతి 3. శ్రీకృష్ణలీలలు 4 మార్కండేయో పాఖ్యానము 5, నుందరకాండ,. 6. రుక్మాంగద 7. కనకతార 8. సత్యహరిశ్చంద్ర ర బభృవాహన
  2. కుచేలోపొఖ్యానము 11. నలదమయంతి 12. సభాపర్వము 13. డాంగేయోపాఖ్యానము
  3. కిష్కింధకాండ 15. కుశలవ 16, భావనాబుషి చరిత్ర 17 శ్రీకృష్ణతులాభారము మొ నవి. వీరి నాటకాలలో కృష్ణలీలలు - శుక్ల 1928 సం.లో సుగుణావతి అంగీరస 1931లో మార్కండేయ
  • యువ - 1934లో విరచితమైనట్లు కవి వాటి చివరి పద్యాల్లో తెలుపుకున్నారు. చాలా నాటకాల్లో రచనా కాలం తెలుపలేదు. కృష్ణలీలలు నాటకంలో కవి స్వీయ పరిచయ సీస పద్యాన్ని వ్రాసుకున్నారు. తర్వాతి నాటకాల్లో తమ పేరు తప్ప ఇతర వివరాల జోలికి పోలేదు. వీరి నాటకాలకు అంక విభజన లేదు. నుగుణావతి - గోపాలరావుపేట , కృష్ణలీలలు - మర్లప్యాట, మార్కండేయ - గరిశెకుర్తి, కనకతార - చౌలమద్ది, శ్రీకృష్ణ తులాభారము - స్తంభంపల్లి, స్వదేశీ సుందరకాండ - తక్కళ్ళపల్లి, డాంగేయోపాఖ్యానము
  • మన్నాజిపురం నిజామాబాద్‌ జిల్లా, గ్రామపెద్దలు కళాప్రియులు తమ గ్రామాల పేర చెప్పించుకున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, ఆర్భూర్‌ ప్రాంతాల్లో వీరి నాటక ప్రదర్శనలు జరిగాయి అన వచ్చు. వీరి కవనశైలికి కొన్ని ఉదాహరణలు చూపబడుచున్నవి. సాహసమొప్ప దీనులను సాకుట మేలగు గాని ఇట్టు సం దేహము నొంది స్వాశ్రితు యుధిష్టర భూప విడంగ జెల్లునే బాహు బలాఢ్యులయ్యునిల పొండవులే యభయంబు నిచ్చియున్‌ ఓ స్వదేశీ సుగుజావతి నాటక గద్య 1989 - పుట 88, 2. కృష్ణలిలలు నాటకము - 1988 పుట 1
  1. సుందరాకాండ నాటకముద్రణ - 1977 పుట 40 4 కనకతార నాటకము - 1983 పుట 42 ర్‌ మార్కండేయో పాఖ్యానము - 1988, పుట 8

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ది ప్రర్వాస్థ సాహిత్యం యక్షగానాలు 225

శ్రీహరి భీతి వీడిరని ఛీ! యపకీర్తి దొలంగ శక్యమే. (డాంగేయ - 1988 పు. 60)

ఇది డాంగేయోపాఖ్యానంలో నారదుడు ధర్మరాజుకు చెప్పిన హితవ్యాకం.

శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ పతిని నిందించుట క్రింది పద్యం - గీ. గీచిన గీటు దాటనని కేవలమున్‌ భవదీయ ్రేమమున్‌

యాచన జేసితందు దగ నాధృతి జూపుచు పల్కినావు నీ

సూచన నమ్మి మోసగతి పోయితి నీగతి వాస్యపాత్రనై

దాచగ నేలనింక నిను తప్పు గదా ఇది విశ్వసించుటల్‌. (1983 వు 60)

పదాల వికృతి మాత్రమే కాక పాత్ర పోషణలోనూ బెచిత్యాన్ని మరచి రసపోషణ కావించుటకు ఉదాహరణగా సుందరకాండలో మండోదరి రావణుల సంభాషణ ఘట్టాన్ని చూడవచ్చు

“మత్తకోకిలః ఏమి యీ చెబుబుద్ధి నీకిపుడేల బుట్టెను రావణా

భూమిజా పతివ్రతంచును పూనితిల్వవె రావణా కామ మోహిత చిత్త నీకిది కాదు ధర్మము రావణా నీ మదిన్‌గల వాంఛ దీర్చగ నేను లేనటె రావణా .

(మండోదరి తనలో) “ఆవో ఏమి వీని దుర్యువసాయము. ఇట్టి దుర్మార్గునకు నా తండ్రి యగు మయుండు నన్నిచ్చినదే తప్పు. ఇచ్చినను వానితో సహవానంబు జేయుటకు నేను వచ్చిందే ముప్పు...”

వీరు సందర్భోచితంగా గ్రామ్య భాషను సైతం ప్రయోగించారు. కనకతొరలో దొంగ మాటలు చూడండి. “అమ్మారు దయవలన ఈ కన్నెపడుచు నాకు చిక్కింది. కానీ యియ్యాల్ల శుక్రవారముంది గాన మాయమ్మోరుకు దీన్ని బలిఇత్తం. అబ్బ ఇదేమేడుత్తది యేమేడుత్తది వూకోయె వూకోయె చెవులు లుడిగెలు బడుత్తు యీనొడేమో నిలబడితిని, *

వీరి కవితా సారళ్యానికి నిదర్శనంగా ఒక పద్యం - మార్కండేయలో వ్యాసుని మృకండుడు ఆహ్వానిందటం

కం. మీ రాకడ ముదమాయెను, మీరా కడ మాకు శుభము మేలౌనిపుడున్‌

కారుణ్యము నిటు వచ్చిన కారణమెట్టిదో వచింపగలుగు మహాత్మా గ

వీరి దర్వులు జన మనోరంజకాలు,

తాళ జాలమె యశోదా ! నీ! తనయునితో ధర మీదా

కేళికి నను రమ్మనెనే 1నీ | యేలికను యేననెనే ! వో గోల నిన్ను విడనననే |! యీ బాలున కిటుల దగునేశ

సభావర్ణన - దర్వు రూపకతాళం. ఎంతో చిత్రమూ - భళి యీ సభాంతరంగమూ ఎంతగ బ్రహ్మక్షత్రియ వీరులు వైశ్యులు శూద్రులు సంతోషంబున నిచ్చట - సభ గావించి యున్నారు 1ఎం పండితులును కవి గాయక భాగవతోత్తములు సుజన మండలి యుక్తము యీ సభ నుండిరి బలుమోదంబున ఎం

యతి ప్రాసలు ప్రాసయతులు వీరి గేయాలకు శోభను చేకూర్చాయి. ఓ నలుబదేండ్ల కాలం వీధి నాటక రచన, ప్రదర్శనలతో కాలం గడిపిన కళాసాహిత్యారాధకులు బూరుగుపల్లి కవి సోదరులు. వేంకటనర్సయ్య పంతులు 1950, చిన్న వేంళకటయ్య పంళులు 1960 సుమారుగా వృద్ధాప్యంలో శ్రీర్తి శేషులైనారని వీరి నాటకాల్లో నటించిన దండు రంగయ్య గారు అన్నారు.”

226 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 2. భట్టాంజనేయ కవి - మోరేపల్లి; తా॥ జగిత్యాల 20వ శతాబ్ది పూర్వార్ధం ఆంజనేయ కవి తండ్రి నరసింహరాజు. వారిది భోజరాజాన్వయ భట్టు కులం జగిత్యాల తాలూకాలోని మోరేపల్లి న్వగ్రామం* “ కవి శ్రీరామభక్తుడు, మహాపండితుడు, గుణవంతుడు అని స్వయంగా తమ నాటకంలో నట సూత్రధారుల ద్వారా చెప్పించుకున్నారు (బభృవాహన - 6వ పుట) ఆంజనేయకవి యక్షగానాలు రచించలేదు వీరివి వీధి నాటకాలు జటిల పద ప్రయోగం కావించే ప్రాఢ కవిగా ఆంజనేయులు గారి పేరు నాడు బహుళ ప్రచారంలో ఉండేది. ఈ కవి రచనలు ॥ 1. బభృవాహన నాటకము 2. ద్రౌపదీ స్వయంవరం 3. శ్రీరామ మహోదయము 4. ప్రభావతీ ప్రద్యుమ్నము 5. మయూరధ్వజ 6 రుక్మిణీ కల్యాణము 7. యయాతి చరిత్ర 8. రామదాసు 9. సైంధవ పరాభవము 10. ఉషాకన్య 11 రుక్మాంగద 12 శ్రీకృష్ణగారడి మొదలగు 17 నాటకాలు రచించారు. వీరి నాటకాలలో బభృవాహన చాలా పేరుపొందింది. ఇది జైమిని భారతంలోని ధర్మజ హయమేధ గాధ. యాగాశ్వ సంరక్షణకు సైన్యంగా వెళ్ళిన అర్జునుడు దానిని బంధించిన బభృ వాహనునితో యుధ్ధం చేస్తాడు. అతడు రాణి చిత్రాంగద కుమారుడు. అర్జును పుత్రుడే. ఇందులో బభృవాహనుని పితృభక్తి - వీరత్వంచక్కగా పోషింపబడినవి కర్ణపుత్రుడైన వృషకేతనుని వీర మరణానికి అర్జునుని విలాపం కరుణరస భరితం. అర్జునుడు తన సతీసుతుల కలుసుకోవటంతో కధ సుఖాంతం. కవి కవన శైలి చూడండి. కధానాయకుడగు అర్జునుని వర్ణన - 8వ పుట, హరుని జయించి పాశుపత మంది పురంధరు పీరమెక్కి దు ష్కరులగు కాలకేయముఖ కర్పరులం బరిమార్చి శూర భి ష్మ రవిజ ముఖ్యయోధులను సంగర మందు వధించి మించి ఈ భరత మహీఠతలంబు పరిపాలన జేయునుచున్న పార్గుడన్‌. ఇది మహాభారత యుద్ధానంతర వర్ణన. కవి కధా పరిజ్ఞానం స్పష్టం రవిజుడు - కర్టుడు. అంతమంది కురువీరులు భారత సంగ్రామమున మడియగా కేవలం భీష్మకర్ణ వీరద్వయాన్ని ప్రత్యేకంగా 'పేర్కానడటం వారు మహావీరులనే-కాక అర్జునుని చేత నిహతులైనవారు పారుడు మహీపాలకుడనటం, ధర్మరాజు పట్టాభిషిక్తుడైనా జానపద కవల దృష్టిలో పాండవురైదుగురు చక్రవర్తులే కవి ఎడనెడ కొన్ని విశేష వృత్తాలను కూడా రచించారు. 68వ పుట - కవిరాజ విరాజితం £ భరరల మంటలు భగ్గున వెల్లినభంబున కంటక త్వత్కర భీ కర నిశితంబులు గాలుచు కంరము గ్రక్కున ద్రుంచ మహోగ్రమునన్‌ సరసర నర్వదిశల్‌ బెగడొందగ చక్కగ వచ్చెను ప్రాద్భుత మ చ్చర వలమున్‌ సుర సన్నుత మిద్ది నిశాకర వంశజ కృష్ణ సఖా. దర్వు (పాట) ఆదితాళం - (రాగం చూపలేదు) పుట. 52 వందనముల్‌ జనకా 1! సంక్రందన నందన యిందుముఖా వం 6 శ్రీకృష్టలలలు -1969పుట62 రారా! 7 రంగయ్యగారు 1981లో బోయినపల్లి బస్టాండు దగ్గర వారి హోటల్లో కలిసి ముచ్చటించారు 1 _ బభ్రువాహన నాటకాంత గద్య పుట 28; శ్రీమల్లికార్డున పబ్లికేషన్స్‌ హైద్రాబాద్‌, 1976 ముద్రణ. 2. ఈ నాటకాన్ని “కరీంనగర్‌ మండల చరిత్ర' 1981 పుట. 16లో గ స. రాజు గారు పేర్కొన్నారు. 3౩ ఈ రెండు నాటకాలు, నం. 1, 2, “కరీంగనర్‌ జిల్లా రచయితల చరిత్ర' 81, పు లోనివి. 4. ఈ మూడవ నాటకంనుండి మిగతా 16 నాటకాల పేర్లు గోధూరు సుందరాచార్యులు 1992 ఏప్రిల్‌లో కోరుట్లలో తెలిపారు సుందరయ్యగారు నటులు. ఆంజనేయులుగారి నాటకాలను సొంత నాటక సమాజంలో ్రక్కజిల్హాల్లో కూడా ప్రదర్శనలిచ్చినారు.

రెండవ భాగం - ౪ అధ్యాయం * “206 శతాబ్ద ప్రూర్వాస్థ సాహిత్యం” యక్షగానాలు 227 యిందు మీరలేతెంచుటచే మా డెందంబులు నుల్లసిల్లె పరమా

నంద వార్ధి దేలు చున్నమో యర । విందవైరి వంశ ప్రదీపా వం।

శారదాబ్ద చంద్రికాంబురుహడిం. డీర కొష్య నగ సురఘోటక నీ ।

హార హీర హరి సన్నిభయశ్వత । చ్చారు పాద నీరేజములకు వం

పురకు 'పౌరి' అని, కృతి చేయుకు కృతి యిందు అని కొన్ని విలక్షణ పద ప్రయోగాలు తప్ప కవి తత్సమ పదాల నేర్చుగా బహుళంగా ప్రయోగించారు. కథ ఇతిహాస కొలానిదైనా “లాంగూర్‌ ఖాన్‌ అని ఒక హాస్య సైనిక పాత్రను ప్రవేశపెట్టడం సమకాలీన ఉర్జూ భాషా పాలకుల ప్రభావం,

ఇది యక్షగాన - వీధి భాగోతాలకు అనంతర కాలంలో వచ్చిన వీధి నాటకం. మోరేపళ్లి ఆంజనేయకవి విరచిత రూపకాలన్నే వీధినాటకాలే, 3. భట్టు లక్ష్మయ్య - నాచువల్లి ; మండలం - మల్యాల : కాలం- 1880 - 1940 సుమారుగా.

నీలకంరం లక్ష్మణరాజు కవి గారి స్వస్థలం నాచుపల్లి. ఇది జగిత్యాల తాలూకాలో కొండగట్టుకు సమీప గ్రామం. వీరు నిరోస్ట్య శతకం రచించారట, అది అలభ్యం. జ్యోతిష్య పంచాంగ శాస్త్రముల సాంగోపాంగముగా నెరిగినవారు.' వీరు 1940 సుమారుగా కీర్తిశేషులు.

“ద్రౌపదీ స్వయం వరము” వీరి ఏకైక వీధి నాటకం.

ఈ నాటకంలోని రెండవ పద్యంలోని వివరాల బట్టి కవి విష్ణుభక్తుడు. వీరి తండ్రి వెంకట నరసింహరాజు పరవస్తు శ్రీనివాసాచార్యులు దీక్షాగురువు* ఇంటి పేరు ఈ నాటకంలో ఎక్కడా 'ేర్కొనబడలేదు. నాటక రచనా సంవళ్సరం కూడా లేదు. కొడిమ్యాల సమీపంలోని పోతవరం గ్రామాధికారులైన జోగినపల్లి వెలమవారు కీర్తి కాంక్షతో “ఈ నాటకమును" నాచుపల్లి భట్టు లక్ష్మణరొజుచే రచింపజేసి బూరుగుపల్లి వేంకట నృసింహయ్య గారి ప్రియానుజుండగు వేంకటాయ్య గారిచే నిర్దోషంబుగ పరిశోధింపజేసినారుఅని పేర్కొన్నారు.*

భారత సభాపర్వంలోని మూలకథను అనుసరించే ఈ నాటక రచన సాగింది. ఎనభై పుటల ఈ నాటకంలో అంకవిభజన లేదు. పద్యాలు వచనాలు దర్వులు కీర్తనలు సంవాదాలు కందార్థాలు కల ఈ రూపకం పండిత కవి రచన కాక వరకవితగానే ఉంది.

కవి రచనా పరిచయానికి ఒక పద్యం - 69వ పుట నుంచి,

సీ శ్రీకర రాజ రాజేంద్రులందరికిని, ద్రుపదుండు జేయు విన్నపములివియె

మత్స్య యంత్రమును నిర్మాణించి యున్నాము, జలమున ్రతిరూపములను జూచి

పురుషార్థమున ధన్వు సరగున ధరి (యి) ంచి నొకపరి వేయు వేటునకు దాని

తెగవేయు నాతని మగళనంబుకు మెచ్చి । యిచ్చెద పుత్రు (త్రి) ని హెచ్చరికతో

ఠేగ్‌. పూర్ణ చంద్రుని సరియన బోలు మోము, చక్కదనమెన్న విధికైన శక్యమగునె

యిట్టి కన్యకనిచ్చి పెంపెక్కు మీరు, కోరినంత ధనంబిత్తు కూరిమినను

గేయాలకు రాగ తాళాలు సూచింపబడినవి. ఒక క్తీరన భాగం - పుట - 3

పాండురాజాత్మజులము ధర్మజ భీమార్టున నకుల సహదేవ పాండు!

నిండు ధర్మమార్గమె శ్రేష్టంబని నిక్కంబుగ నెంబీ । సుగుణోద్దండత మది గొంచీ

చండతరంబగు శత్రుడయిన మా । యండ జేరి శరణన్న బ్రోచెదము 1 "కరీంనగర్‌ జిల్లా రచయితం చరిత్ర' - పుట. 140.

  1. శ్రీమల్లికార్డున పబ్లికేషన్స్‌ - హైదరాబాద్‌ - 1988. ౩... “భట్టు లక్ష్మయ్యగారి ద్రౌపదీ స్వయంవర నాటకము' పుట. 5, 4. ఇన్నర్‌ టైటిల్‌.

228 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జల్లా సాహిత్య చరిత్ర”

శబ్ద సాధుత్వ విషయం వదలితే ఈ కవి పాటలు మాటలు శైలీ మనోరంజకంగా ఉన్నాయి.

  1. ధవూరి సత్యనారాయణాచార్య - కోట్ల నర్సింహలపల్లె

సత్యనారాయణాచార్యులు గోలకొండ సంచిక కెక్కినవి. (నం. 38) ఇంతకుముందు పద్య కావ్య కవులలో వీరి పరిచయం చేయబడింది. వీరు లాక్షణిక కవి. కావ్యం , హరికధ, యక్షగొనం, వీధినాటకం, ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. శ్రీరామధర్మ స్వరూప వైభవము - అను పద్యకావ్యము, నిష్కామయోగి నవల కాక వీరు రచించిన నాటకాలు 108 పైగా ఉన్నాయి. ఇవి యక్షగానాలు స్వదేశి నాటకాలు అని ర0డు విధాలు. వాటి వివరాలివి.

యక్షగానాలు ః 1. చిత్రాంగద (అముద్రితం) 2. కీర్తిమాలిని పరిణయము (అసంపూర్ణము)

వీధినొటకాలు ః 1. రామాశ్యమేధము - ముద్రితము, 2. అరిందమన భూపాలీయము (ఆముద్రితం), 3. భల్లాణ సత్యవ్రతము (ముద్రితము)_ 4. సంగీత పుత్రకామేష్టి (ముద్రితము), 56. ధాన్యమాలి (ముద్రితము), 6. శ్రీ వీరబ్రహ్మాభ్యుదయము (అసం), 7. శ్రీ సీతారామ జననము (ముద్రితం), 8 అంబరీషో పాఖ్యానము (ముద్రితం)

శ్రీరామ ధర్మ స్వరూప వైభవ కావ్యావతారికలో కవి తాను ౩ రూపకములు,11 వీధినాటకములు 4, యక్షగానాలు రచించామన్నారు. రూపకాలేవో తెలియదు కాని 2 వీధి భాగోతాలు 8 వీధి నాటకాలు పైవి. 2 యక్షగానాలు 3 నాటకాలు అలభ్యాలు - వాటి పేర్లు కూడా తెలియవు. 10 హరికథలు రచించామన్నారు కాని వానిలో ఏ ఒక్కటీ లభించలేదు.

వీధీ నాటకాల వివరాలు $ అభినవ రామాశ్వమేధ నాటక ముద్రణ శుక్ల - 1920లో పింగళి లింబాద్రిరెడ్డి నెమిలి కొండ కరీంనగర్‌ జిల్లా గారు ప్రచురించారు దాని 'విభవ సం 'లో పీరికలో రచయిత తొము అంతకుముందు చిత్రాంగదా పరిణయ యక్షగానం వ్రాసి 'ప్రదర్శించినట్లు తెలిపారు. అలభ్యంఅది ఆముద్రితం. రామాశ్వమేధ వీధి నాటకం రెండవ కృతి ఇది కవి ముద్రిత పుస్తకాలలో మొదటిది. నందగిరి సమీప గ్రామమైన బూరుగుపల్లి పై అంకితం కలది.

రెండవ యక్షగానం “కీర్తి మానీ పరిణయము” రాఘంపేట వైశ్యుల కోరికగా రచించబడింది. అసంపూర్ణ లిఖిత ప్రతి దొరికింది. ఇది కవి చిత్తు ప్రతో వ్రాసినదింతేనో తెలియదు. భక్త సిరియాళ, కన్యకాపరమేశ్వరి వేరు. ఈ కథ కల్పితం కావాలి. అందలి ఒక కీర్తన

యేమని నర్జింతు ఈ మహానగరము నేమని పొగడుదు హా

శ్రీ మహితమును విశేష వైభవము బే మందిరమును వీక్షించినను

ఆఅకాళశంబునంటు సౌధంబులు (ప్రాకటమగు మణిగోపురములు .

అరిందమ భూపాలీయము - 1930లో వ్రాసినా 67లో రావు రూపుల - సిద్ధిపేట గ్రామ పెరిక కాపు రైతు పటేండ్ల కోరికగా తిరిగి పెంచి రాశారట. ఇది పెరికవారి చరిత్ర వారు కొర్తవీర్యార్డునుని సంతతి, అని, “పేరుకల' పెరిక అని కవి అన్వయించారు.. (పరశురామ విజయంలో ఇదే పదాన్ని చెలుపూరు రాజయ్య కవి పరశురాముని భయానికి పీరికిన నగరాలు వదలి వెళ్ళి మారురూపొలతో వేరు వృత్తులతో జీవించిన క్షత్రియులే పెరికలన్నారు 1953లో పెజిక = గోనెసంచి. వీరు పెరిక శెట్లు, ఎడ్జ పై జనుప సంచుల్లో ఉప్పు మొ వస్తువులు తెచ్చి అమ్మేవారట పూర్వంలో. మొదట బేపారులుగా పశుపోషకులుగ్యా తర్వాత రైతులుగా స్థిరపడ్డారు. శూద్రజాతిలో పేర్కొనబడినా, వీరి వివాహాలలో మంగళ సూత్రం ఉంది కాని పుస్తె లేదు. ఐరేని కుండలు లేవు. శస్త్రపూజ ఉంది శైవులు గోత్రాలు శస్తశాల మల్లు, కటకం సిరిమల్లు, ఉండ్రు గొండమల్లు, అని వీరుల పరంగా ఉన్నాయి. ఇంటిషేళల్లో అరసు = లక్కరుసు, రాజు = పోతరాజు, నాయుడు = ముబ్బేని, శెట్టి = మేడిశెట్టి మొ.వి. ఉన్నాయి.)

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద పూర్వాస్థ సాహిశ్వం” యక్షగానాలు 229 పరశురాముని సోదరి కాత్యాయనిని వీరగౌరి - అని రాజయ్యగారు భోగవతీపురం సిద్ధభూపతి కుమారులు అయిదుగురు పెళ్ళి చేసుకోవటం ఇందలి కథ. వీరి కులాచారాలను కవి చక్కగా గుర్తించారు. వారి ఏ పుస్తకానికి లేని విధంగా అయిదు పుటల పీఠిక వ్రాశారు.. ఈ నాటకం అయిదు అంకాలు. నాటకం ఆముద్రితం. వీర బ్రహ్మేంద్రస్వామి - ఇది విశ్వబ్రాహ్మణ గురువు బ్రహ్మంగారి జీవిత చరిత్ర. రామడుగులో విశ్వబ్రాహ్మణ శిల్పులు ప్రతి ఏటా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు కవిగారి కళామిత్రులు బ్రహ్మంపాత్రధారి అయిన లక్ష్మీనర్సయ్య గారి కోరికగా దీనిని రచించారు. అసంపూర్ణం. నాందిలో రెండవ పద్యం - ధరణి నభంబు గాలి జల తత్వము వహ్షిరవీందు తారకల్‌ హరి పరమేష్టి శంకరులహర్షిశలున్‌ విబుధాదులున్‌ మహ త్తర సవనాది కర్మల విధానములన్నియు లేనివేళ సు స్థిరమయి నొప్పు బ్రహ్మము నుతింతు శుభోన్నతిక్రై మనంబునన్‌. భల్లాణ చరిత్ర - గౌడరాజు కధ. శివభక్తి పరీక్ష భక్తి సిరియాళలో శిశు హత్య వలె ఇందులో స్రీ శీల పరీక్ష ప్రధానంగా ఉంది ముద్రితం - తేదీ లేదు. కాని, 1975లో ముద్రణ. ' అయిదు అంకాలు తిరిగి రంగాలుగా విభజింపబడ్డాయి. సీతారామ జననము : 5 అంకాలు. గోపాలరావుపేట రెడ్డి వారికి అంకితం. కథ సీతారామకల్యాణం వరకున్నది. ముద్రితం. తేదీ లేదు. సంగీత పుత్రకామేష్టి : ఇదీ వీధి నాటకమే. అయిదంకాలు ఇది కుక్కల గూడూరు వారి పేర ప్రచురితం. కధ శ్రీరామ జననం. ధాన్యమాలి : సీతాదేవి పూర్వజన్మ వృతాంతం నామపల్లి రెడ్లు దీనిని కృతి పుచ్చుకున్నారు. - ముద్రితం. అంబరీషోపాఖ్యానము : మూలకధ భాగవతం అష్టమాశ్వాసంలోనిది ఇది కవి తమ తొమ్మిదవ నాటకమని భాగవత కధను విస్తరించి వ్రాసినట్లు పీరికలో చెప్పుకున్నారు. గుళ్ళకోట ఎల్లాపు గంధె వారి కోరికగా వ్రాశారు. కవితా పరిచయం = వీరి రామాశ్వమేధం భవభూతి ఉత్తర రామచరితను పోలి ఉంది. ఇది అయిదంకాల వీధి నాటకం సీతాపరిత్యాగానికి కొరణంగా అ వాల్మీకమైన రజకనింద, ఇందులో పేర్కొనబడింది. కాని ఆ విషయ ప్రస్తావన తప్ప పాత్రలు లేవు. రామాజ్ఞ చేత లక్ష్మణుడు సీతాదేవిని వనవాసంలో విడిచి కారణమును వినిపింప ఆయమ్మ విలొప పద్యమిది. ద్వితీయాంకము - పుట 23. సీ. బాహుబలంబుచే పశువతి చాపంబు ధరగూల్చె నా నిమిత్తంబుగా దె స్వర్ణ కురంగ వేషము దాల్బెనా దైత్యు దండించె నా నిమిత్తంబు గాదె వార్ధి శ్రైలములచే బంధించి కపి చమూ దాటించె నా నిమిత్తంబుగాదె సంగ్రామమున రాక్షసాధీశు పంక్తి కంధరు జంపె నా నిమిత్తంబు గౌదె గీ అట్టి శ్రీరామ భద్రుండు యమల సుగుణ, రాశి నాకొరకయ్యి ధరా తలమున భూరిశ్రమనొందె కారుణ్య పూరితమున ,అట్టి కరుణా రనంబేడ నరిగె నాక్కొ. యుద్ధ సంవాద కీర్తన - పద్యాలు. తృతీయ రంగం - పు. 62, 63. లక్ష్మణుడు : హయమును బట్టి తిరే దలియక మాయనుజుని గూల్చిన వారల్‌ హయంబు వీడుడు మీయపరాధంబులనిన క్షమించెదము కుశుడు ; మీ సహోదరుడు మడియుట గని మీరేల వచ్చినారు ఈ సమయంబున వాని రీతి మిము జేనెదమని దలచండి 1 రామడుగు గౌడులు ముద్రించారు. వారికి ఈ నాటకం బ్రహ్మం పాత్రధారి రామడుగు లక్ష్మినర్స్భయ్య పంతులు వ్రాతప్రతిలో నేర్చడం నేను చూశాను 1975లో

230 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య బరిత్ర” భరతుడు ః పారులమో వీరులమో, ధీరులమోసంగరమున దెలియు వృధా వా చారూఢత్వం బేలను, పోరాటంబునకు నిలుడు భూమీస్థలినన్‌.

ఈ నాటకం దర్వులు - కీర్తనలు చిన్నవి. పూర్వపద్య కావ్యాలలో వలె ఇందలి పద్యాలు హృద్యాలు. సీతాదేవి పూర్వజన్మ వృతాంతము వర్ణింపబడింది. రాముని పాత్ర స్వయం కృతాపరాధ పశ్చాత్తాప తప్త హృదయుడుగా తీర్చిదిద్దబడింది. సీతాదేవి పాత్ర పోషణ కడు రమణీయం, కరుణరన భరితం. సీతాదేవి భూ ప్రవేశం లేదు. శ్రీరాముడు భార్యాపుత్రులను తాడ్కోని అయోధ్యానగరానికి వెళ్ళుటతో కధ సుఖాంతం కోట్ల సత్యనారాయణ కవి గారి నాటకాలు సలక్షణ దృశ్యకావ్యాలు.

  1. పులికాంత గంగొధరయ్య - కథలాపురం తొ; మెటుపల్లి; జననం 1892 - మృతి 1977లో. పులికాంత గంగాధరయ్య వీరైవ మత జంగమకవి. నటుడు, హరికథకుడు, పండితకవి. అయిన గంగాధరయ్య గారి రచనలు అధిక జనాదరణ పొందాయి వీరిదో నాటక బృందం ఉండేది. గంగాధరయ్య నాయక పాత్రధారిగా పలుగ్రామాల్లో నాటకాలు ప్రదర్శించారు. కవి గారి తమ్ములు నడిపి రాజయ్య, చిన్నరాజయ్య అన్నగారి నాటకాల్లో నటించేవారు. పెద్దరాజయ్య కవి పలు శీర్తనలు, హారతులు, శ్రీరామానుజ శతకాది పద్యకవితలేకాక గంగాధరయ్య రచించి ప్రదర్శించిన స్వదేశీ నాటకాలు దశాధికం. అవి అన్నీ భాగ్యనగర ప్రముఖ ప్రచురణ సంస్థలచే ముద్రింపబడినాయి. * గంగాధరయ్య నాటకాలు ఇవి. శే గయోపాఖ్యానము, 2. భక్త అంబరీష, 3 కుశలవ, 4. భక్త రామదాసు, 5. లక్ష్మణా పరిణయము, 86. సీమంతినీ పరిణయము, 7. రుక్కిణీ కల్యాణము, 8. శివకుమార నాటకము, 9, కూకద మహారాజు చరత్ర, 10. హంసధ్వజ నాటకము, 11 విరాట్‌ విశ్వబ్రహ్మం చరిత్ర, 12 చిరుతొండ నాటకము, వీటిలో కుశలవ దూళూరు 'పేర, రామదాసు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు తాలూకాలోని మంథని గ్రామాంకితముగా చెప్పబడినవి. గయోపాఖ్యాన గద్య మిట్ట్లుంది శక్ర మత్కధలాప్పరి గంగాధరాఖ్య కవివరేణ్య 'ప్రజీతంబైన గయోపాఖ్యాన మందలి చతుర్ధాంకము” చిరుకొండ నాటకాంత గద్యలో కవి వంశ వివరాలు ఇట్లా ఉన్నాయి “... వ్యాఘ్ర కాంతాన్నయ సాగరా మృత కరుండును, వీర్ణైవ మతోదృవుండును, సిద్ధరామయ్య ప్రియశిష్యుడును, చెన్నవీరయ్య పౌత్రుండును, నాగయాఖ్యలింగ మాంబా(గ్ర తనూభవుండును నగు గంగాధరాఖ్య కవి వరునిచే రచింపబడిన ...” పుట 96. ఇంటి 'ఫేరు పులికాంతను సంస్కృతీకరించి వ్యాఘ్రకాంత అన్నారు. ఇల్లే బూరుగుపల్లి కవులు తమ గ్రామ నామాన్ని సంస్కృతంలో 'శాల్మలీపురి' అని మార్చి వ్రాసుకున్నారు. ఇది సర్వధారి సంవత్సర ఫాల్గుణ మాసంలో అంటే 1948 - 49లో రచించబడింది బూర్గుపల్లి నాటకాలకు తర్వాతవి గంగాధరయ్య నాటకాలు భక్త సిరియాళ తమిళ శివభక్తుని కధే ఈ చిరుతోండ నంబి కథ. శ్రీనాధుని హరవిలాసంలోనూ ఈ కధ ఉంది. కవి వీర శైవుడు కనుక పాల్కురికి సోమన ద్విపద కావ్యాలు చదివి ఉంటారు భక్త సిరియాళుని తండ్రి చిరుతొండ నంబి శివుడు మాయాజంగము వేషధారియై వచ్చి కోరగా అతడు తన తండ్రి వివరాలు తెలుపడంతోపాొటు వారి రచనలు చూపారు. నాడు నాటకాంకితానికి 116 రూ. నాటక ప్రదర్శనకు 25రు ఇచ్చేవారట పుస్తక ప్రచురణ కర్తలు రచయితకు 10 ఉచిత ప్రతులు తప్ప డచ్చేమి ఇవ్వలేదట

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద పూర్వాస్ణ సాహిత్యం" యక్షగానాలు 231 కొడుకును కోసి భార్యచే వండించి అతిథికి భోజనం పెట్టించి ముక్తిపాందిన కాంచీవుర వైశ్యుడు. ఆ శివభక్త శిఖామణి వేదాంత భావాన్ని కవి వర్ణించిన వైనమిది - పుట 10,

సీ, ధీమంత వినర యీ దేహంబిలను పంచ, భూతమయంబైన బుర్రకాయ

కడుగ్రేమతో దీని కాపాడుదామన్న, శతవత్సరంబులు మితియు గలదు తలిదండ్రి సభిసుతుల్‌ ధనధాన్యముల మీది, భ్రాంతిచే ఈ కాలమంత గడిపి అంత్యమందునను నేయడవినో గిరులందొ, నీరమందో లేక నిలయమందొ

గీ తనువులో నుండి ప్రాణముల్‌ తరలు వెనుక,కాటికేగాని గొరగాదు గవ్వకైన

గాన నికముక్తి ఫలితంబు గాంచగోరి,జంగ మార్చన జేయు హెచ్చరికబొడమె.

ఎదను కుదుపు భావాలే కాక 'కాపాడుదామన్న' వంటి వ్యావహారిక వదరూపాలతో పొటు అను మానమును యేల' భాండ నింపితి (77వ వుట) వంటి వ్యాకరణ దోషాలున్నాయి. అయినా కవి కథా కధనం (్రేక్షకుల నాకట్టుకునేలా ఉంది. సిరియాళుని ఆత్మబలిదాన నిర్ణయవాక్యాలివి 76వ వుట.

“తండ్రీ నీవిట్లారాట మొందక నిరాటంకముగ నన్నా శరణాగ్రణి కొనంగి నీ వుత్తమ పద్ధతి నిల్చు కొమ్ము. సుకీర్తి వంతుడవు గమ్ము నాకోసరమెంత మాత్రము ధావంతము నొందవలదు. నేనా హరునింజేర బోయెదను. ఇందుకేమి సందేహము లేదు” వ్యావహారిక పదాలు గమనార్హం.

కవి వీరైవుడైనా శివకేశవ భేదము గణింపక ఉభయమత గాధల రనవత్తర నాటకాలుగా రచించి జనరంజకంగా ప్రదర్శించి రాణించినారు 6. ఎక్కలేదేవి లక్షణ భాగవతార్‌ - కొరుట్ల జననం - 1914

లక్ష్మణ కవి గారిది సంగీత సాహిత్య నాట్యాది లలితకళలు, రాజకీయ యయ. సాంఘికసేవలు పెనవేసుకొనిన విశిష్ట జీవితం ఎనుబదేండ్ల వయస్సులో టి. ఇప్పటికీ పద్మశాలి కులం పెద్దగా సాహిత్యారాధకునిగా సత్కాలక్షేపం చేసే స. నిత్యోత్సాహి. వారి నాయనమ్మ తాతయ్య గారలు లక్ష్మమ్మ నరసింహులు, య. . జననీజనకులు లక్ష్మమ్మలింబయ్యగారలు. ఎక్కలదేవి గృహనామం. పృథ్వీబుషి 10 శ మ గోత్రం చేనేత కులవృత్తి. వారిది పెద్ద కుటుంబం. భార్యగంగమ్మ లక్షణ గారికి సంతానం కలుగలేదు. వీధి బడి తర్వాత శతావధాని కృష్ణమాచార్యుల శిష్యరికంలో సంస్కృతాంధ్రాల నభ్యసించారు. బట్టలు నేస్తూ పాటలు పాడేవారు. తమ ఇరువదవయేట స్థానిక యువకులతో ఒక నాటక సమాజాన్ని నెలళొల్చి అనేక పౌరాణిక

  • సాంఘిక నాటకాలు ప్రదర్శించారు. ఆయన నాయక పాత్ర ధారి. రూపం గాత్రం అభినయం నటుడుగా లక్ష్మణ గారికి మంచి పేరుతెచ్చాయి. అప్పుడు ప్రచారంలో ఉన్న మోరెపల్లి ఆంజనేయులు, బూర్గుపల్లి వేంకటనరసయ్య, కధలాపురం గంగాధరయ్య నాటకాలతో పాటు తాము స్వయంగా కొన్ని నాటకాలు రచించి ప్రదర్శించారు. నటన రచనలతో పాటు వాన్తు జ్యోతిష్యాల నేర్చారు. హరికథలు కూడా చెప్పి రాణించారు.'.

లక్ష్మణ గారి నాటకాలు *:

1 నవీన కొంతామతి, 2 సత్యవిరోధము, 3. భక్త మార్కండేయ, 4 హరిశ్చంద్ర, 5. సుభద్రా కల్యాణము, 6 ఉషాపరిణయము, 7. ప్రజారాజ్యము, 8. రామాయణము (బుజ్జకథ), 9. శ్రీ నింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి భజన కీర్తనలు - 24 పుటలు - 1965 ముద్రణ. వీటిలో మొదటి రెండు, చివరి జ వివరాలు శ్ర వందవ లక్షం గా చన నన్నా నంద ఇందనం

వేంకటరాజం గారి వ్యాసంలోనివి పు 12, 3.

232 దా. మలయశ్రీ, “కరీంనగల్‌ జిల్లా సాఫొాత్య చరిత్ర” మూడు పుస్తకాలు మాత్రం ముద్రితం. ఎక్కలదేవి లక్ష్మణగారి షష్టిపూర్తి సంచికలో డా అందె చేంకటరాజం గారు 'సాహిత్యసేవి వ్యాసంలో హరిశ్చంద్ర లేదు = గృహస్తి, దేవాంగోపాఖ్యానము అదనంగా ఉన్నవి. లక్ష్మణ కవి గారికి అవన్నీ ఇప్పుడు అర్ధ విసష్టతులు చివరి భజన కీర్తనలు ఎవరూ సేర్కాననిది అచ్చుప్రతి కవి ఇంటనే లభించింది. ఈ కవి సుభద్రా పరిణయం చేమకూర చేంకటకవి విజయవిలాస ప్రబంధాన్ని అనుసరించింది. వీరి దర్వులు - పాటలు అంత్యానుప్రానలతో లయబద్ధమైన పదాల విరుప్పులతో హొయలుగలుకుతున్నాయి. అర్జునుడు ఉలూచినిచూచి = ఎవరి దానవే - గుణ క$ీల1నా - యెదుట నిల్వబడు టేల? ఎవ ధవళ నేత్రి నీదు పేరు నూరును భవనము జనని జనకులెవ్వరో న న్నెవరు దెచ్చితిరిచటకి నాతో వచియించు వేగ యింతి బాగ ఎవ అదే అర్జునుడు మరోచోట చిత్రాంగదళో - సుదడి మిటారి - మదను కటారి - ఎదుటజేరు మొకసారి నీ - యధర సుధ నొసగు భూరి క్రోలెద నుత్కంగతో నార్‌ .. పదాన్వయలో కాస్త తికమక - వెనుకముందులు, వ్యావహారిక పద ప్రయోగం నాటి నాటక కనులకు సహజం నవీన కాంచామతి నాటకము - అంతకుముందు ఇతర కవులు రచించిన కాంతామతి నాటకాలు ఉన్నవి - కనుక, దీనికి నవీన కాంతామతి అని పేరు పెట్టారు. గుర్తింపు కోసం - న్యూ ఉడిపి హోటల్‌ అన్నట్టు ఇది జానపదగాధ, రాజుల కాలం నాటిది. ఇందలి నాయిక పడిన కష్టాలు చూపిన సాహసాలు పతిని వశీకరించుకున్న తీరు ప్రేక్షకుల నాకట్టుకుంటాయి. కథ కొంత వరకు నలదమయంతిని పోలి ఉంటుంది. 'సుగుణవతి' 'స్తీ సాహసం' అనే స్టేజి నాటకాలు కూడా ఇంచుమించు ఇలాంటి ఇతివ్నత్తం కలవే సాధారణంగా పూర్వ నాటకారంభాల్లో నటీ సూత్రధారుల సంభాషణలుంటాయి. ఈ నాటకంలో కవి నటిని మోహిని అనే పేరుతో ప్రవేశ ెట్టారు. మోహిని ప్రవేశదర్వు -పు 2 మార సమాన శరీరా జో ఫహారులిదిగొసువిచార

కోరికతో నను స్వామీ సభ జేర బిలచు పని యేమి

మీరారూఢీగ నా కది విన జేయుడి మార

సేవకుని మాటలు ఊర్జూ పదాల మిశ్రమ ఖాష - పు 30

“సునో కాంతాముతి అమ్మోడ్‌ బోత్‌ కష్టంలో వుంది. బౌతామే రోతీహై నీకీ పార్టించి జేప్పి నాకీ యిడిపించు అమ్మా నీకీ కాల్కి మొక్కుతా, అని యేడుస్తా వుంది.

మహరాజుకీ జజ్జ బోలోజీ పాపం”

ఈ నాటకంలో కథానాయకుడు ప్రతాపసింహుడు వేశ్యాలోలుడై పట్టపురాణి కాంతామతిని నిరాదరణపాలు చేసిన చూసి సహించక మంత్రి సుబుద్ధి కావించిన హితోపదేశం చూడండి. లలు 2 పై సంచికలోని కమరం శంకరయ్య కవి గారి క్రీ లక్ష్మణగారి కళారాధనము' వ్యాసములో

చూపినవి పుట 18 ౩... దేవాంగులు ఆర్మూరు తొ! నిజామాబాడ్‌ జిల్లాలో ఉన్న పద్మశాలీలలో ఒక తెగవారని, వారు చౌడేశ్వరి దేవతను ఆరాధిస్తారని కవీగారి కథనం.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద ప్రూర్వొష్థ సాఫొత్యం- యక్షగానాలు 2933

'పెక్కులేమల దస్కరించిన వీరుడౌ నరకాసురుం

డక్కజంబుగ కృష్ణుచేత యమాలయంబున కేగడే ;

అక్కటా యపకీర్తి ధారుణి యందు నిల్వదె, మీకునే

మైక్కెదన్‌బర యోషితావళి పొంతబోకుడి నాయకా. మత్త కోకిల - పు, 41

జనానికి తెలిసిన పూర్వగాధల దృష్టాంతాలతో ప్రస్తుత కథపై (ప్రేక్షకులకు అవగాహనను కలిగించి ఆసక్తిని పెంచి ఆదరాన్ని పొందడం నాటక కవులు అనుసరించిన ఉత్తమ విధానం. కావ్య కవుల్లోనూ ఈ పద్ధతి ఉంది. ఆరంభ పద్యం - శ్లోకం ః ఇది శార్జూలం. అయిన కెలుగు పద్యంవలె యతి ప్రాసలు కూర్చబడ్డాయి.

శ్రీ గౌరీ హృదయాబ్ద షట్బరణ రొజీవారి మౌలీశ్వరా

రాగద్వేష హరామరార్చితదయా రత్నాకరా శంకరా

భోగీభూషణ బాల భక్తవరదా పూర్ణేందు తుల్యాననా

యోగీ సన్నుత పాద పద్మయుగళా ఓంకారరూపా భవా !

ఇందులో కవి సందర్భోచితంగా ఇతర ప్రముఖ పూర్వ ప్రబంధాల పద్యాలు సైతం వాడుకున్నారు. కొని వాటి వివరాలు పేర్కొనలేదు. ఇది నైజాం రజాకార్ల అల్లర్లలో కవి బొంబాయి వెళ్ళిఫోగా అక్కడి ప్రవాసాంధ్రమిత్రులు ప్రచురించిన నాటకం.

సత్యవిరోధం నాటకం - ఇది సాంఘిక సంస్కార భావాలు కలది. ఇందలి ఓ దురభ్యాసపరుడు మద్యపానాన్ని మెచ్చుకోవడం ఇట్లాగుంది. (కల్గుముంత పాటలు అప్పటికి వ్యాప్తిలోనివే)

ఎంతో మధురమీ బ్రాండీ - దీని కొంతా రుచి చూచీన కోరేద రండీ ఎం

ఎంత వారైన దీన్నెంతో ట్రేమింతురు వింతగ ఇదిలేని దంతా వ్యర్ధమందురు

ఇందులో నుంది కైలాసం - దీన్ని కొందరు త్రాగవద్దని రెందుకోనం ?

ముందుగ చెప్టీలు' మూడేసుకున్న మన ముందర నే స్వర్గముండు నిక్కంబుగ ఎం

ఆ తర్వాత సురాపాన నిరసన సరేసరి ! మరో పాట -

లంచగొండ్డ్లను నమ్మరాదయ్యా - యో - చించ వీరికి కొంచెమైనను జ్ఞానమే దయ్యా

లంచముల కెగబడుచు దిరిగెడి లంగ గాడ్డుల లక్షణములు వ

చించెదను మనసుంచి వినుడిక అంచితముగ ప్రపంచమందున .

కులసంఘ ముబఖ్యునిగా చేనేత సంఘాధ్యక్షునిగా ఎన్నో యేండ్లు పనిచేసిన లక్ష్మణకవి చెప్పిన నైతిక సూక్తులివి. శృంగార వర్షనలో ఈ కవి ప్రబంధ కవుల బాటల్లో పయనించారు. వీరి ఉషాకన్య నాటకంలో నాయకుడు అనిరుద్ధుడు నాయిక అందాన్ని ఇట్లా మెచ్చుకున్నాడట !

ఈ మంద యాన మొగంబు సుందర మిందు సమమందు

చీని యంద మేమందు - పూర్ణేందు సమమందు

పాలిండ్లు బంగరు గుండ్లు సాగసగు మల్లె పూచెండ్లు

యిలాటి యిల్తాండ్లు లేరు వెదక వెయ్యేండ్లు .

వీరి హారతులు తత్సమ పదాలతో పౌరాణిక భక్తి భావాలతో మనోహరాలు

నవీనకాంతామతి నాటకాంత హారతి - 81వ పుట 4... బెన్సు గ్లాసులవలె బొంబాయిలో 'చస్టిలను కొలమాన పాత్రలు నాడు వ్యవహారంలో ఉండేవని

లక్ష్మణకవి గారు చెప్పారు - 1994,

234 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” థీ సత్యదేవ మంగళంబిదొ, శ్రిత జనావనార్కృతుల్య మాధవ శ్రీ

  1. వాసుదేవ యోగి బృంద హృదయ ని । వాస వాసవాది దేవవందిత భాసురాంగ నీ సరియెవ్వరిల దయ - జేసి బ్రోవుమయ్య కేశవాచ్యుత
  2. ఇందిరేశ మందహాస శ్రీముచు । కుంద వరద కుందరదన గో వింద దందశూక తల్ప గిరిధర నంద నందనాసురేంద్ర భంజనా
  3. మీన రూప సామజేంద్ర రక్షణ । గానలోల గరళ కంర ప్రియసజ దీన కల్ప భూజ కాంచ నాంబరా 1 జ్ఞానమానసాఘకాననానల ఇందలి ప్రాసలు, ప్రాసయతులు రమ్యం ఛేకానుప్రాసలు యమకాలంకారాలు చివరి రూపకం గేయాన్ని శ్రవణోపేయం కావించాయి ఇరువదేండ్ల వయస్సు నుండి ఓ ఇరువదేండ్లు నాటక ప్రదర్శన రచనలలో లీనమైన లక్ష్మణ గారు తర్వాత నలుబదేండ్లుగా కళాసాహిత్య రంగాల నుండి విరమించుకుని సామాజిక రంగానికి సేవ చేస్తున్నారు. వారి కృషికి నిదర్శనంగా చేనేత సంఘం, మార్కండేయ మందిరం, పద్మశాలి కల్యాణమండపం కొరుట్ల పట్టణానికి శోభాయమానంగా నిలిచాయి ఎక్కలదేవి లక్ష్మణగారి సార్ధక జీవితానికి దర్చణంగా 1975లో వీరి షష్టిపూర్తి సన్మాన నంచిక ప్రచురింపబడింది. 1997లో వీరి “అమృతోత్సవ అభినందన సంచికి వెలునడుతున్నది. 7 గౌలిపల్లి నుబ్బయ్య చారి - కురిక్యాల వరశవి సుబ్బయ్యచారి గంగాధర మండలంలోని కురిక్యాల వాస్తవ్యులు. ఆంధ్ర జ్యోతిష సరస్వమను పద్యకావ్యము రచించిన వీరి నాటకం పేరు “భక్త విరోభా' ముద్రణ సర్వధారి - 1948. స్వగ్రామమందలి బెత్సాహిక నటబృందం ఈ నాటకాన్ని ప్రదర్శించడమే కాక ద్రవ్య సహాయమొనర్చి ముద్రింపకేశారు. కవి వంశ వివరాలు చూపబడినవి. ఇదే కవి మొదటి చివరి నాటకం “భాషాకవిత్వజ్ఞాన మెక్కువ లేనందున” అప్పటికి గ్రంధముల శోధించుచున్న “బాలకవి” నని ప్రస్తావన, పుట 3లో కవి చెప్పుకున్నారు. పుస్తకంలోని ఛాయాచిత్రమును బట్టి కవి అప్పటకి యువ వయస్కులుగా చెప్పవచ్చు. విరోభా పండరి నాధ భక్తుడు. ఇది మహారాష్ట్ర కథ ఆకాలంలో పద్మశాలీలు స్వర్ణకారులు బ్రతుకుదెరువు కోసం మరారా దేశం వెళ్ళేవారు. అట్లాగే కాక మహారాష్ట్ర జిల్లాలు కొన్ని నైజాం ప్రాంతంలో కలిసి ఉన్న కారణంగానూ ఈ కధలు కెలంగాణాలో వ్యాప్తి చెంది ఉంటాయి పైగా మరారా నటులు ఈ ప్రాంతంలో స్టేజీ నాటకా లాడేవారు సురభి నాటక సంస్ట మరారీ వారిదే. హరికథ, బుర్రకధగానూ విరోభా కథ వ్యాప్తి కలది. ఈ నాటకం నాలుగు అంకాలు కలది 76 పుటలు కవితా పరిచయం ఈ నాటకంలోని పాటలకు పూర్వ నాటక దర్వుల బాణీలు చూపటంతోపాటు రాగతాళాలు సూచింపబడ్డవి. ఒక పాట చూడండి యాడ నున్నావో సద్గురు దేవా యాడ నున్నావొనీ జాడదెలియాదాయె వేడుకతో మిము జూడ గోరియు । వీడితిని నా యాత్ములందరని యాడ నీ సేవకయ్యినే యాసించితిని విషయ యాశలన్నిటి రోసియును నే ధ్యాసతో జనుదెంచు చుంటిని యాడ ధ్యాసతో జనుదెంచు చుండ దొంగ లార్డురి బట్టి చెంగూన బడగొట్టి రంగు మీఠగ మీదు సేవచె లంగుగా జేయంగ గోరితి .. ఇది 'నేజూచినావే సద్గురు నాలో' అను (బ్రహ్మంగారి భజన కీర్తన బాణీగేయం, ఈ నాటకంలో భక్తి యోగ వేదొంత విషయాల వర్ణనలు చక్కగా చేయబడినవి. నాయక నాయికా వర్ణనలివి ॥

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20వ శతాబ్ద పూర్వాస్థ సాహిత్యం” యక్షగానాలు 235 ఉ. ఎన్నగ కాంచనా వురప్పు ఏలిక యౌ కరణంబు బిడ్డయున్‌ సన్నుత గొత్రమున్‌ మిగులు చక్కదనంబును సచ్చరిత్రమున్‌ పున్నమ చంద్ర బింబమును బోలిన మోమును భాసమానమౌ కన్నె పటంబు గాంచితిని గాంచుము నీవును వేయునేటికిన్‌ - పు, 15 సీ. చెలియబంగరు బొమ్మలలిత సంపగి కొమ్మ నిద్దంపు సాగసుల ముద్దు గుమ్మ చిలుకల కొలికి పూ విలుతు చేములికి లోకైక సౌందర్య మోహంపు కలికి ...2" ఒక గీతం - జనన మరణము లేనట్టి జపము యిదిగ్కోమంత్రముల యందు మేలైన మంత్రమిదిగో ఆశ పాశాల దెగగోయు అస్త్రమిదిగో,తారకంబును బోధింతు తనయ లేరా ! వు - 64. పూర్వాంధ్ర శాసనకవులు పద్యపాదాంత హలంత (న్‌, ల్‌) శబ్దాలను, అజంతాలుగా (ను, లు) వ్రాసినట్లే. యక్షగాన వీధి నాటక కవులు పద్యాంత హ్రస్వాక్షఠాలను దీర్చాలుగా బ్రాసినారు. అదిరాగం కోసం. కవిమిత విద్యావంతులైనా అపరిమిత భక్తిభావంతో రాసిన వీధి నాటకం భక్తవిరోభా 8. తిరునగరి నరసింహ స్వామి- రాయికల్‌ నరసింహదాసుగారు చాత్తాద వైష్ణవులు. రావికల్‌ నివాసి. స్థానిక వేంకటేశ్వర కోవెల అర్చక స్వామి ఆయన భక్త కవి. 'మాధవ చరితము" యక్షగానం నరసింహస్వామిగారి కైక అముద్రిత రచన. (దీని ప్రతి రాయికల్‌లో వేముల పెరుమాళ్ళుగారింట వారి తాత పురుషోత్తనదానుగారి రచనలతో పాటు లభించింది. దీని సాపు ప్రతి రాసి ఉంచుకున్నాను). మాధవ చరితం కల్పిత కథ వైష్ణవ భక్తి గ్రంథం. కాళహస్తి బ్రాహ్మడు మాధవ సోమయాజి యజ్ఞం చేయడం, అదే సమయంలో పరాంగనా వ్యామోహం పాలయి కొట్టుమిట్టాడటం, వ్రతభంగం కాకముందే విష్ణు భక్తుల కారణంగా కళ్ళు తెరచి నతీసమేతంగా తిరుపతికి వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని వేడుకొనడం ఇందలి కధ. కధ చిన్న వర్ణనలు మిన్న పుస్తకం చివరి వుటలు కొన్ని లేవు. ఇది యక్షగానం. దర్వులు పద్యాలు వచనాలు కూడా ఉన్నాయి. దర్వులకు తాళసూచన ఉంది కాని రాగాలు "పేర్కొనలేదు. చెలికత్తెవాచా, మాధవునివాచా - అని పాటలు మాటలు పాత్రల పరంగా ఉన్నాయి. అని యిట్లు వర్పించుటా - అని సంధి వచనాలు సైతమున్నవి. తెరచాటు దర్వు, పాత్ర స్వీయ పరిచయ దర్వులు కూడా ఉన్నాయి. ఒక పాత్ర ప్రవేశ దర్వు - శ్రీవేంకటేశుడ ద్వారకా - ఘన - చిత్ర చరిత్రుడ నేనికా దేవ దేవుడని దేవేంద్రాదులు - భావములో సంభావింపందగు కథా నాయిక చంద్రరేఖ తెర వెడలుట - భూసురాంగన మణినె కొమ్మ సంపూర్ణ చంద్ర హాసాను వినవె ముద్దుల గుమ్మ। బ్రాహ్మల వాచా - పద్యం, భాష ప్రత్యేకం. కం. యెల్లంభట్ల కుమారుడు, మల్లంభట్లకును వీరుడు మనుమడు వినరా పుల్లంభట్లష వీజికి, పిల్లను యిస్సానషంచు పిలిచితె వచ్చెను (న్‌). అటకు అష అనటం ఈ ప్రాంత మంధని, పొలాస బ్రాహ్మల్లో ఉంది గురజాడ (విజయనగరం) కన్యాశుల్కంలోనూ ఈ పలుకుబడి వాడబడింది. యెల్లంభట్టు, వీజికి వారి పలుకుబడులు. ఇందులో వంటలు, అలంకారాలు, పూజా విధులు వివరంగా వర్ణించబడ్డాయి. కొన్ని శబ్దరూపాలు సంధులు తప్పినా కవి ప్రజ్ఞ కలవారనడానికి ఆద్యంత యతి (ప్రాసలతో అమరిన ఇందలి పాటలు నిదర్శనంగా నిలుస్తాయి. తత్సమపదాల సరసన మాండలికాలను కవి నిస్సంకోచంగా ప్రయోగించారు. నాద ప్రధానంగా సాగిన ఈ భక్తి గేయం చూడండి -

236 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

శ్రీమద్వేంకట నాయకు పద సర - సీరుహములకును స్వాములికన్‌

(ప్రేమతో నర్చన జేయుచున్నరిక - ప్రియముతో గను మదు గగ గగ గగో

వారిజాక్లుని సొందర్యంబును - వర్ణించుదమిక వినరయ్య

భూరి రత్నముల నందెలు పాదం - బులకు దాల్బెనదు గగ గగ గగో

ఇందులో అంకాలు లేవు. తెరవేసి తీస్తే స్థలం - రంగం మార్చే ఇది ఈ ఇరువదవ శతాబ్ది తొలిపాదంలో వచ్చిన సలక్షణ యక్షగానం. నాటకానికి ముందు నాంది ప్రస్తావనలు లేవు నటీ సూత్రధారులకు మారుగా లాంగూర్‌ఖాన్‌ అని ఒక ముస్లిం జవాన్‌ హాస్యపాత్ర ఉంది అతని ఉర్జూ మాటలతోనే కృతి కర్త - తిరునగరి నరసింహస్వామిదాసు. కృతి నిర్మాతలు క్రైరం భూమగౌడు, పెరుమాళ్ళ బాలరాజు మరిద్దరు రావికంటి వారు అని తెలిసింది.

నన్నయ భారత “శకుంతలోపాఖ్యానం'లోని “నుతజల పూరితంబు” - పద్యాన్ని అనుసరించిన నరసింహదాసుగారి ఈ సీస పద్య భావం చూడండి. నూరు గోహత్యల సమం ఒక బ్రాహ్మణ హత్య, నూరుగురు బ్రాహ్మల హత్యతో సమానం ఒక స్రీ హత్య, నూర్గురు స్రీల హత్యలకు నమానం ఒక శిశు హత్య, నూరు శిశు హత్యలకు నరి ఒక అబద్గ్ధమట +

రావికల్‌లో టి. రాములు, బి.ఎస్పి. గారి తాత ఈ కవి కాబోలు అన్నారు. ఆయన తండ్రి గోవిందయ్య ఈ యేడు మృతులు. నరసింహదాసును గూర్చి తెలిసినవారు లేరు ఆయన మాత్రం రావికంటి గ్రామాన్ని వేంకటేశ్వరుని ఈ కృతి ద్వారా సాహిత్యంలో శాశ్వతం చేశారు. ఆముద్రిత - అలభ్య యక్షగాన వీధి నాటకాలు

కొందరు కవుల యక్షగాన భాగోతాలు వీధినాటకాలు ఆ కాలంలో ప్రదర్శింపబడి బహుళ జనాదరణ సాందినా అవి ఆముద్రితాలుగానే మిగిలి క్రమంగా అంతరించి పోతున్నవి. అటువంటి కవుల రచనల వివరాలు ఇక్కడ చూపబడుతున్నాయి శ నల్లగొండ రాజయ్య - కాళేశ్వరం 1931 మృతి.

రాజయ్యగారు సంస్కృతాంధ్ర పండితులు. వీరు రచించిన యక్షగానాలు రెండు. 1 రతీమన్మథ విలాసము 2 ఉషా పరిణయము, ఇవి ప్రదర్శింపబడినా ఇప్పుడు లేవు.'

ఈ కవి తాత గారిది కూడా ఇదే పేరు. వారు అనేక కీర్తనలు హారతులు రచించినవారు. అవి సంస్కృత పద భూయిష్టంగా ఉన్నవి, ఈ యక్షగానాల ప్రతులు లభించలేదు 2 ఎజ్జమరాజు మూర్తి కవి - గట్జెపల్లి 1956లో కీర్తిశేషులు

మూర్తికవి గారు భట్రాజు. గట్టెపల్లి వాస్తవ్యులు వారు చక్కని యక్షగానాలు రచించారు. మూర్తి కవి సోదరులైన లక్ష్మణ రాజు గారు కూడా కవి ఆయన అన్నగారికి యక్షగానాల రచనలో సహకరించేవారు - సహ రచయిత మూర్తి కవి పుత్రులు సుప్రసిద్ధ కవి గఖ్జెపల్లి సత్యనారాయణ గారు, స్వయంగా తమ తండ్రి రచనలు వివరాలు తెలిపారు.ే కరీంనగర్‌ మండల చరిత్రలో వ్రాశారు.

మూర్తి రాజు గారి యక్షగానాలు -

  1. గౌరీ శంకర విలాసము, 2. దేవేంద్ర విలాసము, 3 శీకృష్ణలీలలు, 4 మయూరధ్వజ చరిత్ర

వీరి నాటకాలు ఆ కాలంలో బహుళ జనాదరణ పొందినట్లు కవి పుత్రులు గస. రాజు గారు 1 కవి మిత్రులు మాడుగుల వేంకటేశ్వరశర్మ కాళేశ్వరం గారు ఈ కవి వివరాలు తెలిపారు. 2 మలయశ్రీ 'కరీంనగర్‌ జిల్లా రచయితం చరిత్ర 1981 పుట 3 నా “కరీంగనర్‌ జిల్లా రచయితల చరిత్ర 1981 రచనా సందర్భంలో; 4. కరీంనగర్‌ మండల చరిత్ర - 1981, పుట.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతాబ్ద ప్రార్వాస్థ సాహిత్యం” యక్షగానాలు 237 చెప్పారు. గజ్జెపల్లి సమీపంలో పెద్ద గట్టెపల్లిలో యక్షగాన ప్రదర్శనలు ఇప్పటికీ వున్నారు. వారి పూర్వుల కాలంలో మూర్తి రాజు కవి నాటకాలు ప్రదర్శించేవారట. ఇప్పుడు ఆ రచనల వ్రాత ప్రతులు కూడా లభించలేదు ౩ అనంతవరపు సిద్ధప్ప వరకవి - గుండారెడ్డి వల్లె

బహుగ్రంధకర్త అయిన సిద్ధప్ప గారు నాటక రచనలోనూ తమ కలాన్ని నడిపించారు. వారి “'హంసోహం - వేదాంత రహస్యము' గ్రంధం చివరి పుటలోని కవి రచనల వివరాలలో ఈ దృళ్యరూపకాల 'పేర్షున్నవి* 1 అశోక సామ్రాజ్యము - యక్షగానము, 2, జీవనరేంద్ర - నాటకం, 3. కొకి - హంసోపాఖ్యానం - నాటకం ఆ రచనల ఇతర వివరాలు తెలియలేదు. వీరి రచనల పరిచయం పద్య కవుల్లో చేయబడింది. తీ నారంభట్ల దుంపెటాద్రి - దుంపెట, కథలాపురం మండలం

జననం - 1900 ౩ మరణం - 1981

దుంపెటాద్రిగారు వైదిక బ్రాహ్మణులు పురోహితులు, నటులు ఈ గ్రంధ చతుర్ధ ప్రకరణంలోని యక్షగాన కవి చెర్లపల్లి కాశీనాధ శాస్త్రిగారి బంధుపరంపరలోని వారు. _దుంపెటాద్రి గారి తండ్రి మోనయ్య తాత రమణయ్య, వీరి రచనలు ఇవి - 1. పరకాల చరిత్ర - యక్షగానం, 2. చెంచులక్ష్మి

  • యక్షగానం, 3. జగన్మోహన చరిత్ర - హరికధ, 4 శతహారతీస్తవము. (ఇవిఅన్ని అముద్రితాలు).

పరకాలుడు పన్నిద్దరు వైష్ణవ భక్తులలో ఒకరైన తిరుమంగైయాళ్వారు. చెంచులక్ష్మి నరసింవావతార ప్రహ్లాదరక్షణోత్తర గాధ. కాశీమజిలీ కధలను ఆదర్శంగా తీసుకొని రచించిన కల్పిత గాధ జగన్మోహన చరిత్ర హారతులు దేవీదేవతల స్తుతి గీతాలు వంద, నాలుగవ పుస్తకం, ఇవి సినిమా పాటల బాణీలో ఉన్నాయని కొన్ని గేయాల పంక్తులను పాడి వినిపించారు కవి గారి పుత్రులు నా. లక్ష్మీనారాయణ కవి గారు 'కట్టకుంట'లో పై రచనల వ్రాతప్రతులు కూడా లభించలేదు. ర్‌. కాసు సింగమరాజు - కోనేరుపల్లి

సింగమరాజుగారు తెలుగు భాషా సాహిత్యాలంటే అభిమానం కల వ్యక్తి. ఆంధ్ర సారస్వత పరిషత్తు హైద్రాబాద్‌ వారి తెలుగు పరీక్షలు (1948-50) మారుమూల గ్రామమైన కోనేరు పల్లిలో నడిపించారు. వీరు పెక్కు భక్తి కీర్త్సలు యక్షగాన నాటకాలు రచించారు. యక్షగొనాలు మూడు. అవి ఆముద్రితం. వారి ప్రక్కూరి చిందు భాగవతులు ఆడేవారట. కవి స్వయంగా వారికి పాటలను రాగతాళాలతో నేర్పించేవారట. వీరి యక్షగానాలలో ఒకటి తులసీదాసు. వ్రాతప్రతులు వారి చిన్నకుమారునవి వద్ద ఉన్నాయని బంధువులు చెప్పారు! ఎంత ప్రయత్నించినా దొరకలేదు. 6. * సొధనానురుల లక్ష్మణ స్వామి - వల్భాపురం తాః హుజురాబాద్‌

లక్ష్మణస్వామి 1981లో 65 ఏండ్ల వారు. 1985 సుమారుగా కీర్తిశేషులైనారు. వారు జాతికీ సాధనాసురులు. అది పద్మశాలీలకు దగ్గర కులం, విప్రవినోదులు బ్రాహ్మణులకు వలె, సాధనా సురులు పద్మశాలీల యాచన చేసి జీవించేవారు. వారి గారడీ ఇంద్రజాల విద్య ప్రేక్షకులను అబ్బురపరచేదిగా ఉంటుది సాధనలో అసురులు సాధనాసురులు అని అన్వయం.

లక్ష్మణస్వామి ఆజానుబాహుడు మంచి గొాయకుడు చక్కని నటుడు, వీరికో భాగోతపు జట్టుఉండేది. అనేక గ్రామాల్లో యక్షగానాలు 'ప్రదర్శించి పేరు పొందారు - జీవించారు. జీవిత

  • _ వాణీబుక్‌ డిపో సిరిసిల్ల వారి ప్రచురణ - 1985 ద్వి. ము. 1 కవిగారి అన్నకుమారుడు కాసు సింగమరాజు, కరీంనగర్‌, దూరబంధువు డి హన్మంతరాజుగారలుపై

విషయాలు తెలిపారు 2... ఈ కని వివరాలు 1981లో తెల్పిన కవిమిత్రులు నర్సింంరామయ్యగారు, "హిందీ పండిట్‌ వెల్కళతుర్తి

238 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” చరమాంకంలో పక్షవాతంతో అశక్తులై పేదరికంలో ఆయన కన్ను మూశారు. లక్ష్మణ స్వామి గారి రచనలు - 1. సారంగధర 2. బాలనాగమ్మ పుస్తకాలు ముద్రితమైనవి. మొదటి నాటకంలో సారంగధరుడుగా రెండవదానిలో మాయలఫకీరుగా స్వామి గారు అద్భుతంగా నటించేవారట. వీరి పుస్తకాలు లభించలేదు * 7. నీలకంఠ లక్ష్మీ నృసింహరాజు - మల్యాల వీరు 1960 వరకు జీవించారు. లక్ష్మీనృసింహరాజు గారి వీధి నాటకాలు ఇవి. క! కిరాతార్జునీయం, 2 లవకుశ 3. విరాటపర్వం, 4 అభిమన్యు విజయమ్ము, 5. నలదమయంతి. వీరు నటులు, పండితులు, కవి, దర్శకులు. నాటక ప్రదర్శనలతో అనేక గ్రామాలు తిరిగినారు. పై నాటకాలు ప్రదర్శింపబడినవే అయినా ఆముద్రితాలు, ప్రస్తుతం అలభ్యాలు. 8. దొసరి గంగారాం - కోరుట్ల. జననం - 1890. కీర్తిశేషులు. దాసరి గంగారాంగారు కొంతకాలం బొంబాయిలో ఉండివచ్చినారు. ప్రస్తుతం వారి సంతానం కూడా అటే స్థిరపడ్డారు. ఆయన పద్మశాలి. చేనేత వృత్తి. మిత విద్యావంతుడే అయినా ఆయన నాటక 'ప్రదర్శనలపై ఆసక్తితో రెండు యక్షగానాలు రచించారు

1 గంగా కల్యాణము, 2, చిరుతొండనంబి కథ

గంగారాం రచనల విషయం విచిత్రంగా తెలిసింది. ఈ పరిశోధన - గ్రంధ రచన కావిస్తున్న కాలంలో ఒక రోజు 15-3-94 కోరుట్ల మండలంలోని మోహన్‌రావు పేటకు పెళ్ళికి వెళ్ళాను. కాలక్షేపం కోసం ఆ రాత్రి చిన్నమెట్టుపల్లి వాళ్ళు ప్రదర్శిస్తున్న “శశిరేఖా పరిణయము" యక్షగానం ఆ వూరిలో చూశాను. మరునాడు ఉదయం నటుల కలుసుకొని వాళ్ళు అదే నాటకాల గూర్చి ఆరాతీయగా ఈ గంగాకల్యాణం పేరు తెలిసింది. వచ్చి కోరుట్టలో ఎక్కలదేవి లక్ష్మణగారిని అడుగగా ఆ విషయం అవునని గంగారాంగారి ఈ రెండవ నాటకం శేరు కూడా తెలిపారు.

ఆ నటుల వద్ద ఈ యక్షగాన ప్రతిలెదు. వాళ్ళు పెద్దలు వ్రాసి ఉంచుకున్న పాత్రల పోర్షన్‌ నోటుబుక్కులను చూసి ఆడేవారట. అద్‌ వాళ్ళతండ్రుల కాలంలో ఇప్పుడు వీళ్ళు 40-45 ఏండ్ల వాళ్ళు అంబే పాతిక ముప్పై ఏండ్ల క్రితం ఈ నాటకం ఆడబడింది. రచన 1950కి పూర్వపుది. లక్ష్మణగారి కంటే ఓ పది ఇరవై ఏండ్లు గంగారాం పెద్దవారట. అంటే గంగారాంగారు 1890 సుమారుగా జన్మించి 1960- 65 మధ్య కీర్తిశేషులైనారు. వీరి యక్షగానాలు అముద్రితాలు- అలభ్యాలు 3. వరకవృలు - మధుర , వేదొంత గేయ సాహిత్యం

నాడే కాదు నేడు కూడా 'పండితులొక్క శ్రేవ మరి పామరు లింకొక త్రోవ' బోవు వారై అన్ని విషయాల్లోనూ భిన్నంగా కనిపిస్తున్నారు కదా. సాహిత్యరంగంలోనూ అంతే. మార్గ కవిత్వాన్ని విద్యావంతులు ఆదరిస్తారు. సరిమిత విద్యా పరిజ్ఞానం కలవాళ్ళు, అవిద్యావంతులు పద్యకవిత్వాన్ని చదువలేరు విని ఆనందించలేరు అందుకే మార్గ కవిత్వానికి ప్రత్యామ్నాయంగా వీరు దేశి కవిత్వాన్ని ఆదరించారు. జానపద సాహిత్యం చదువురాని వారితోనే పుట్టి పెరిగి మౌఖిక వ్యాప్తి చెంది జీవించింది. ఆ దినాల్లో దేశంలో అవిద్యావంతులైన గ్రామీణ శ్రామికులే అధికం కాబట్టి, దేశీయ - జానపద సాహిత్యాలు విరివిగా అభివృద్ధి చెందాయి.

జనం విద్యా వివేకాలలో ఎంతగా వ్యత్యాసాలున్నా అందరూ పరస్పర సహకారాలతో కలిసి జీవించవలసిన వాళ్ళు అందుకే విద్వత్కవులను ప్రభువులే కాక జానపదులు కూడా ఆదరించారు. పండిత కవులు కూడా మార్గ కవిత్వంతో పాటు మధుర కవితలను వెలయించారు. స్తుతి గీతాలు, హారళులు, భజన కీర్తనలు వంటివి మధుర కవితలు. విద్వాంసులు కాక సామాన్య చదువరులు కూడా తమ అనుభవ వేదాంత విషయాలను దేశి కవితలలో గ్రామీణ జనానికి అందించారు.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “204 శతాబ్ద పూర్వార్థీ సాహిత్యం” మధుర కవితలు 239 మత విశ్వాసాలలోని సత్యాసత్యాలు ఎట్లాగున్నా ఈ దేశి కవితల ద్వారా వరకవులు జనానికి నీతిని వేదాంత భావాలను సన్నిహితంగా అందించగలిగారు. పూర్వ కావ్యాలకంటే, తర్వాతి యక్షగాన వీధి నాటకాలకంటే, ఈ శతాబ్ది భక్తి తత్వాలే అధిక వ్యాప్తి - జనాదరం పొందాయి. వాటి స్వతంత్ర భావాలు "పైగా పరిమాణంలో అవి చిన్నవిగా ఉండటం అందుకు కారణాలనుకోవచ్చు. |

ఈ 20వ శతాబ్ది పూర్వార్ధ కాలపు మధుర - వేదాంత గేయముద్రిత సాహిత్య కవులు.

1 రామసింహకవి, 2 పరమారాధ్యుల రాజయ్య, 3. అనంతవరం సిద్ధప్ప, 4. శాలుపునూరి శంకరయ్య, 5. కొండపాక నారాయణాచార్యులు, 6. శివవురం విశ్వనాథయ్య, 7. మిట్టవళ్లి రాజయ్య

  • ఇతర కవులు, 8. ఎగర్రోజు బ్రహ్మయ్య, 9. పులికాంత గంగాధరయ్య, 10. మామిడిపల్లి సాంబశివశర్మ ఆముద్రిత సొహిత్య కవులు :

1 ఈలపంటి టక్కమరాజు, 2. దేవత వెంకటరాజము, 3 రాచూరి రాజన్న, మరికొందరు. ముద్రిత సాహిత్యం :

శ రామసింహకవి - రాఘవవట్టణం 1857 - 1962

వరకవి “రామ సింహరంి గారు సిఖ్ధు మతస్థులు బహుగ్రంధకర్త. వీరి పద్యకవితల పరిచయం ఇంతకు ముందు ఇదే గ్రంధంలో చేయబడింది. ఈ కవిగారి అచ్చయిన గేయ కృతుల వివరాలివి.

  • భజన కీర్తనలు - 6 భాగాలు, 2. ముకుందమాల - నారాయణమాల, 3. శ్రీమద్విరాట్‌ పోతులూరి బ్రహ్మం గారి మాలిక, 4. కలియుగ వర్జాశ్రమ ధర్మములు - 1922, 5. దుష్ట ప్రపంచ వర్ణనము, లంచగొండి ప్రపంచము - 1924 - 25 రచన.

ఈ కవి పద్యాలకంటే పాటలే బహుళ వ్యాప్తి పొందినవి. భజన కీర్తనలు - హారతులు భక్తి భావాలకు సంబంధించినవి. సామాజిక విమర్శ 'కలియుగ వర్జాశ్రమ ధర్మములు *లో నాటి నిజాం సర్కారి నౌకర్ణ లంచగొండి గుణ నింద “దుష్ట ప్రపంచవర్షనము'లో పరాకాష్టనందుకున్నవి. భజన కీర్తనలు కొన్ని సంపుటాలు కవి గారి మృత్యనంతరం కూడా వారి శిష్యులైన యాంసాని వెంకటయ్య యాదవ్‌ తెలుకుంటగారు ముద్రించారు." వీరి హారతులు ఒకటి రెండు కంరస్థం చేయని చదువరులు ఆ కాలంలో అరుదు. భజన కీర్తనలు సంపుటి నంబరు లేని 1982 ముద్రణ ప్రతి - 20 పుటలు, రాగతాళాలు పేర్కొనబడ్డ ఈ కీర్తనల బాణీలు భక్తి భావాలు ఇట్టున్నాయి.

“శ్రీ మహాగణ నాయకా - శ్రేయన్కర ఫలదాయకా

ఏ మాత్రము నన్నెడ బాయక - నీ ప్రేమ జూపుము ప్రణామము లివిగో”

“శివనామము భజన జేతామా సాంబ శివుని కన్నుల నాడ జూతామా |

భవ వార్థిలోనెంత పాపమగ్నుండైన । శివశివ యనగ మీ జివ్వ పావనమౌను

స్థిరమానసంబు వహింతమా మన దురిత జాలముల నడంతమా

పరతత్వజ్ఞానుల పరమార్ధమెరిగిన గురు కటాక్షంబున పరమపావనమైన”

“ఆత్మారామ ఆత్మారామ అఖండ పద పరమాత్మారామా

ఆత్మానాత్మ వ్యాపక హేవి । శ్వాత్మక పరమ దయాగుణధామా 1

ఇట్లా భక్తి భావాలతో పొటు కుహనా భక్తిని విమర్శించారీ విధంగా కవి.

“ఏక్రారలు మీటగనేమీ గురు | ప్రోక్తములు జదువగ నేమీ

యుక్తిమాటలను నేర్చిననేమి ! రక్తి వాక్యములు బలుకగనేమి రాల తను వలోడులా దన్నణరంల మంచన వళటయ్యుగాడ వచ్చ శామనయయాం

గారి ఒక భజన కీర్తనల సంపుటి వ్రాత ప్రతి సవరించుకొని వెళ్లారు.

240 డా. మలయశ్రీ “కరంనగల్‌ జల్లా సాహిత్య చరిత్ర" భక్తి మార్గమున మనసును నడిపే శక్తి లేని శరడంబాచారులు” అద్వైత మత ఖండన - “ధృవుడె బ్రహ్మైవాహమన్నాడా ! నారద మునీంద్రుడే శివోహం సోహమను మన్నాడా అవిరళ ప్రజ్ఞాన నిధి ప్రహ్హాదుడే ఈశ్వరుడననె నా ఎవరి వేదాంత మిది మూర్ధా ఎవరి యద్వైతమిది నీవలె” కవికి దాసోహమను భావమే సమ్మతం. మరో [భజన కీర్తనల' సంపుటి నం. లేని 1975 ముద్రణ ప్రతి 17వ కీర్తన అందుకు నిదర్శనం

  • చూడండి. ఆట - కల్యాణ్‌ జీవ భోగంబులకె మిడికెదవూ - నీకెంతమాత్రము-సిగ్గు కాదా శివుడననియెదవూ చౌవు పుటుకలు కర్మఫలములు జీన గుణదోషములు తీరక కావరమున శివోహమనగనె కావురా ఆధమాధమా చీ సోహమనగనె నిర్వికారుడవా - జీవుడవు బ్రహ్మైవాహమనగనె నిరాకారుడవా దేహబాధల కోర్వవాకలి దాహములకే తాళజాలవు మోహమగ్శక్రిమివి భగవ దద్రోహమున కొప్పితివి ఛీఛీ 1 (బ్రహ్మవా బ్రహ్మాండనాధుడవా - పరమేశ్వరుడవా-భక్తవరదుడవా సమర్భుడవా బ్రహ్మ జనకుడవా దలంప పరాత్పరుడవా హరుడవా పర బ్రహ్మవా సర్వస్వతంత్రుడవా విరొడ్‌ విశ్వంభరుడవా జీవన్మరణానంద పాత్రుడవూ - నీవెంత జ్ఞానివి-కవి వయిన నొక ప్రకృతి మాతృడవూ కవి యనగ పక్షియె నీకీ గర్వమెందుకు రామసింహము ప్రవిమాలాత్మ స్థితి వహించి ప్రసన్నత్వంబున భజింప్పుము పూర్వ కవుల్లో మల్లికార్జున పండితారాధ్యులు, యధావాక్కుల అన్నమయ్య, త్యాగరాజు అద్వైత నింద ఈ విధంగానే కావించినవారు. కాని, ఆదిశంకరాచార్య నుండి ఈ తరం అద్వైత గురువుల వరకు సోహం భక్తులే. ఈ గేయంలో కవి ఎవరినీ కాక తననే హెచ్చరించుకోవడం విశేషం “ఈ ప్రపంచ మెందులకు స్వామీ] మౌనముగ నుండిన నీవు జేసే ప్రయోజనమేమీ ? ఈ ప్రాణులను సృజియించి దుర్గుణములు ఘటించి మహాప్రయాసకు లోను జేసి వ్యర్థముగ క్షోభింపజేయుట” ఎందులకయ్యా? అని ఇట్లా ప్రశ్నిస్తూనే, తిరిగి దాస భావంతో తాను అపరాధినని కాపాడుమని కరుణామయుడని దైవాన్ని వేడుకున్నాడు ఇంకా జనాన్ని ఇట్లా మేల్కొలిపాడు “లేరా లేరా జీవా లేరా లేరా ఈరోత నిద్రేల పారాయణము వేళా లేవరా జీవా లేరా” మాయా నిద్రలో మగ్నమైతివి మదన క్రీడల కలలు గంటివి చేయ దగనివి చేసితివి పనుల్‌ చేయదగినవి చేయవైతివి హేయములే నీ కిష్టూయెను హిత విచారము లేకపోయెను శ్రేయమునుగొని జెందితివి భ్రమ చెడ్డ చెరుపుసుమా జీవా తెలివీ నాందుమా” ముకుందమాల; నారాయణమాల - 1979 మొదటి ముద్రణ - చిరుపుస్తకం. “ముకుంద గోవింద మురారే హే మురళీధర వినుత మురారే వైకుంర పద ద్వారకా నిలయ నిర్వికార సాకార కేశవా హరి

రెండవ భాగం - ౪ అధ్యాయం . “206 శతాబ్ద పూర్వాష్థ సాహార్యం- మధుర కవితలు 241. అని శ్రీకృష్ణ లీలలను ప్రస్తుతిస్తూ దాసునిగా ఆత్మ నివేదన కావించే ఈ ముకుందమాల నక్షత్ర (27) గేయ (చరణం-నాలుగు పాదాలు) మాల, ఇందలి వేదాంత భావాలు ఆలోచనీయాత్మకాలు. 17. నీరూపంబుల నెవడెరుగూ - అది - నిగమాగమములలో మరుగూ నారూపముగా - నేను నేనీ నానా - రూపములం-దేరూపము శ్రీ॥ 23. విత్తు ముందో వృక్షము ముందో - మరి-వెలది ముందో వురుషుడు ముందో ఉత్తబయలు విశ్వోత్తత్తికి నీ-సత్తగాక సం-శయమేమున్నది ॥ 24. రాళ్ళకు మొక్కిన భక్తి జెడున్‌ - తిరు-నాళ్ళకు దిరిగిన శక్తీ జెడున్‌ ఒళ్ళెక్కాలకై యోగసాధనలు - ఒళ్ళుజెడును మొద-లున్న తెలివి జెడు! 25 బయలే ఈ నీరూపంబనియూ - దగ - మిడుకుదు రోరులనగను వినియూ శ్రీయల కందనిది - కేవల నీవి-స్క్మయ స్వరూపమది - మాకు దెలియునొ॥ 26. సాధనాంతరంబులు కల్లా - నిను సాధించేదనుట బుడిల్లా బాధలుగల వ్రత-బోధలు మతముల - శోధలేల నీదయా ధనమెగతి నారాయణమాల * నారాయణ సుత్తి పల్లవితో సాగేది. ఇది 34 చరణాల 34౫34 = 136 పంక్తుల గేయం. తొహరాధాటి ఆది తాళం. సకల చరాచర విశ్వమయుడు నకల మునిదేవ సంస్తుతి నందిన సర్వోన్నతుడని దేవుని స్తుతికావించుతూ, కవి తోటి నరులకు భక్తి ప్రబోధం కావించొడు, 11నీ కృప గలిగిన వారలు ఘనులే - నిను వర్ణింప నమర్భుల్‌ నీ కృప గలుగని జనులు నిన్ను గననేర రభాగ్యులు వ్యర్థుల్‌! 28 యోగిని గాను తపస్వినిగాను విరాగిని గాను ముకుందా త్యాగిని గాను భజింప నేర నీదయా ధనమె గోవిందా 32. రామసింహ తవదాస దాన పారాయణ మా పదమూ పామరుడు భజించిన భక్తుడగున్‌-బ్రహ్మానంద ప్రదమూ __ _ (దీనిది “రామరామ రఘురాను పరాత్పర రావణసంహర రణధీరా" అను భజన పాట నడక) శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మాంగారి మాలిక భక్తిస్తుతిగేయ మాలిక : చిరుస్తుతి కృతి. కలియుగ వర్ణాశ్రమ ధర్మవములు : 1922 దుందుభి సం.లో వెలువడిన కవితా దుందులి ! 1 కలియుగ వర్ధాశ్రమ ధర్మములన్‌ - దెలిపెద నాకవింతా " కలజాతులు సంకరమైనవి పళు-వులవలె జగమంతా ఇలలో తమ తమ కుల మర్యాదలు-దెలియక కొందరు తెలిసికొందరును దొలగి చెడ్డనడకలలో వడీబడి-ఖలులై మతభ్రష్టులైరి హరి హరి ఇందులో కవి నిందించని కులం లేదు. మార్పు - విచ్చలవిడి ప్రవర్తనలను ఒప్పని సనాతన సంప్రదాయ వాది - ఈ కవి. ఆయనది అనాచారాలను దురాచారాలను ఒప్పని సంస్కార హృదయం. ఆంగ్ల నాగరికతను అనుసరించిన వారిని ఇట్లా వెక్కిరించాడు. 5. బూట్లే విడువరు కొదువ నేమమా - భుక్తపానములలో నోట్లో సిగరెటెప్పుడిడువరి - స్పేట్లాటలు కలలో కోట్లట కపులట గులూబందులట - పంట్లోన్చిర్జిన్‌ పాయజానులట బూట్లు లవండర్‌ పొడఠ్‌ డ్యాంపూల్‌ - తిట్లు ఘనతగల తెలివితేటలు నిందా రూపంగానైనా ఇందు వర్ణించిన వస్తువులు, వ్యక్తుల ప్రవర్తనలు - ఆచారాలు, నాటి నైజాందేశ సాంఘిక స్థితి గతులను స్పష్టంగా చూపగల సజీవ సాక్ష్యాలు. ఈ విమర్శ బహుజనులకు తలకంటకంగా ఉంటుందని కవికి తెల్సు. అందుకే ఇట్లా సమర్థించుకున్నారు.

బి42 డా. మలయత్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 74. లోళనింద గాదిది వినుడౌర్యులు - లోకహితార్థముగా ప్రాకటముగ తెలియంబలికి తీయుగ - ఫలము యధార్థముగా లోకులు హితమాలోచించిక యిది - లోక నిందయని లొల్లిబెట్టినను' (1 అల్లరి) నాకది (బ్రహ్మానందంబే పలు - గాకులందునా కాకులందునా. జగద్ధిత ధర్మ బోధకుడనై మో చెరుపులు తెలిపి మేల్కాలిపిన వాడను. మోకు శత్రువును కానునాపై క్రోధము వలదు (75) అనీ అన్నారు. మోరు నన్నేమన్నా మోకు వందనాలు - నిజం పలికితే నిష్ణూరమా? జారులు చోరులు చంద్రుని తిడితే నరకమే సం'ప్రాప్తి- అని తనను సమర్థించుకొన్నారు (76). రోయుడ నాచారములను బలముగ - వ్రాయుడు వ్యాసములా చేయుడు తమ తమ ధర్మరక్షణద్రోయుడు దోషములా (7). అని హితోపదేశం చేశాడు. “దుష్ట ప్రపంచ వర్ణనము” లంచకొండి తనాన్ని ఖండించింది. ఎంత దుష్ట ప్రపంచము - ఛీ యింత ఘనమా లంచము ? కొంత కాలము గోప్యముండెని - దెంత పాపమొ యిపుడు నిర్భయ మంతటను మామూళ్ళు లంచా లంతకంతకు మించి పోయెను ఎం అప్పుడే కాదు ఇప్పుడూ లంచాంది 'పైచేయే కదా అది విశ్వవ్యాప్తి ! కవి మాతృభాష పంజుబి

  • ఆకాలపు జిల్దా ప్రజల భాష తెలుగు అయినా నైజాం రాజభాష ఉర్జూ. అంధుకే విరి కవిత్వంలో హిందుస్తానీ పదాలు సైతం చోటు చేసుకున్నాయి. 6 అవోజీ బైరోయని -క్యాదేవాగీ బోలో యనీ క్యావొ తుందేతెసో బస్‌బస్‌ - దేవొతా దప్‌బీస్‌దేవో లావా జల్టీ నహీతో - జావో బాహెరురో బడో అట ఎంత రండి కూర్చోండి - ఏమిస్తారో చెప్పండి - ఏమిటి, మారిచ్చేది చాలు - ఇస్తే పదో ఇరవయో ఇవ్వండి. త్వరగా తెండి లేకపోతె పొండి. రండి బయటకు నడనండి - అంటారట 1 ఆ విదేశీ ముస్లిం రాజుల కాలంలోనే కాదు ఈ స్వదేశీ ప్రజాస్వామ్యపాలనలోనూ అంతే కద. మామూళ్లు పదుల నుండి వందలు వేలు అయినై - అంతే తేడా
  1. బాదుషా ఫర్మానలూ మర్యాదకే కానూనులూ వాదియైనను లంచమే ప్రతివాది యైనను లంచమే అది లేదనే బీదలకు న్యాయములేదనే సిద్ధాంతమైనది ప్రభుత్వ శాసనాలు పకడ్చందీగా ధర్మరక్షణ కోసమని చేయబడుతాయి ప్రజలు విద్యావంతులు ధనవంతులు స్వార్థ ప్రయోజనం కోసం చక్కగా వాటినుండి తప్పించుకోవడానికి అనేకమైన ప్రక్కదారులుండనే ఉంటాయి. అవి జనానికి తెలియకున్నా డబ్బు పుచ్చుకుని అబద్ధాలు చెప్పించి అధర్మాల గెలిపించే పెద్ద పెద్ద న్యాయవాదులుంటారు.. కోర్టు వ్యవహారాల్లో పేదలకు న్యాయం నేతిచీరకాయ చందం. ఇది కవి అనుభవంతో చెప్పిన సత్యం సాక్ష్యం సమాజాన్ని పరిశీలిస్తే, ఇప్పటికి సజీవంగా ప్రత్యక్షం ఈ 111గేయాల ప్యస్తక్షాన్ని కవి తేరాసా చౌంతీస్‌ ఫసిలీలో రచించారు. అంటే 1334 ఫసిలీ, అది 1925 ఇస్వీ-క్రీస్తుశకం.' రామసింహ కవి కలానికి వాడి ఎక్కువ. ఆయన ధర్మవీరుడు కలాన్ని నడిపించి, గళాన్ని వినిపించి ఆధర్మపరులపై ధర్మపోరాటం సాగించి జడిపించిన కవి సింహం రామసింహం. జీవితంలో దొదాపు సగభాగం కాలం అంధత్వంతో ఉన్నా ఆయన కలం - గళం అగిపోలేదు; మూగది కాలేదు. ఆయన ప్రతిభా పాండిత్యాలు చిత్తశుద్ధి ఉన్న వరకవి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్బ ట్రార్వాష్థ సాహిత్యం” మధుర కవితలు 243 2 పరమారాధ్యుల రాజయ్య - చెలువూరు, తా॥ హుజూరాబాద్‌

రాజయ్య గారు వీరైోవ మతస్థులు, జంగమ బ్రహ్మణులు*. ఈ వరకవి పద్య గేయ కావ్యాలు వ్రాశారు. హరిదాసు. వీరి పద్యకృతులు పరిచయం చేయబడినవి. రాజయ్య గారి గేయ పుస్తకాలు ఇవి :

1 శ్రీ చంద్రశేఖర భజన కీర్తనలు. అక్త్రయ 1926లో ముద్రితం, 2. గౌరమ్మ పాటలు - ముద్రితం. తేదీ లభించలేదు.

చంద్రశేఖర భజన కీర్తనలు : ఇవి శివపరమైన పాటలు. ఇందులోని నరస్వతీ స్తుతి కీర్తన నాడు, ఈ జిల్హాలోని హరిదాసులు తమ కథా కథనానికి ముందు విధిగా పాడేవారు రూపక తాళంలోని ఆ కృత్‌ ఇదిగో చదవండి.

“నీలవేణి లోక జనని నిర్మాలాంగి బ్రహ్మరాణి

పాలు మాలి మొక్రైద నాపాలి దైవ మావె తల్లి!

తల వాకిట మెలగెడి యో పాలతుక నన్నేలవె శ్రీ

కలుముల జవరాలికి కో డలివని నిను బలుకుదు రిల

పలుకుల వెలదిరో నీవునా పలుకులలో నిక జేరియు

పలికించవె మృదు వాక్కుల బలు మధురము లొలుకగనిక |

కలకాలంబును రాజయ । కవి హృదయంబున జేరియు

సలలితముగ శబ్దంబులు | సవరించవె భువనేశ్వరి ” ఇందలి 6వ,_కీర్తన మానస సంబోధనది చూడండి,

“వినవే వో మనసా నా మనవి గైకొనవే వో మనసా

తన మాన ధనమూలు తగను శాశ్వతమాని యనక శంకర పొద వనజాములేవేళ

అనయమును భజియింపుచును పావనము గలిగిన మోక్షపథ సా

ధనము జేయుట సౌఖ్యమును నీ వనుభవింతువు నిశ్చయంబుగ గ

గౌరమ్మ పాటలు - తెలంగాణాలో దసరాకు ముందు పితృ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులు స్త్రీలు ఆడుకునేవి బతుకమ్మపాటలు. ఇందులోనిదే ఒక లాలిపాట ఇది,

లాలి శ్రీ సాంబ లాలీ - పరమేశ । లాలి మాయయ్య లాలీ,

లాలి జగదీశ లాలీ - గౌరీశ లాలి సర్వేశ లాలీ

భల్లాణ రాయనింట - యిక నీవు చల్లమా, దేవమ్మరూ,

నెల్దాండ్ల బాలుడావై - జగముల నేలితివి యే వేళల |

“స్త్రీల పాటలు' పుస్తకంలో లాలిపొట “శ్రీరామ రామలాలీ' అని విష్ణుపరంగా ఉన్నది ప్రసిద్ధం ఇది శివపరం. రాజయ్య కవి గారికి వీరి కవితలకు ఈ శతాబ్ది పూర్వ భాగంలో అధిక జన గౌరవాదరాలుండేవి వారికి చివరి దశలో కొన్నేండ్లు చూపుమందగించినా కవితా వ్యాసంగం మాత్రం అగలేదు. శిష్య సంచారమూ చేసేవారు. 3. సిద్దప్ప వరకవి - గుండారెడ్డీపల్లి : వరకవి అనంతవరం సిద్దప్ప రాజయోగి గారి జ్ఞాన బోధ పద్యాలు, అద్వైత భక్తి తత్వాలు చాలా వ్యాప్తి పోందాయి. వీరి గేయ 'కృతులివి. 1. శ్రీవర్ణమాల కందార్థములు, 2 జగదీశ్వర శతకము. ఇవి 1930 కి పూర్వమే ముద్రితం తొలిముద్రణ ప్రతులు లభించలేదు. మరి ముద్రణలలో తొలి ముద్రణల కాలాన్ని పేర్కొనలేదు గ 1334 + 10-9-590 = 10-9-1924; 25, ఫసిలీకి 590 సం। 9 నె 10 దినాలు కలిపితే ఇస్వీ.

  • లింగ బ్రహ్మణుడ నని కవి కావ్యాంతగద్యలలో చెప్పుకున్నారు.

244 డా. మలయశ్రీ “కరీంనగట్‌ జిల్లా సాహిత్య చరిత్ర” శ్రీ వర్దమాల కందార్థములు - 1981 ద్వి.ము.ప్రతి తెలుగు అక్షరాల వరుస క్రమంలో శ్రీ ఓం నమళ్శివాయతో సహా అక్షరానికొక కందార్థం ఉంది. కందపద్యం చివరి పాదం తత్వగేయంగా మారేది కందార్థం. ఇది పద్యగేయం అనొచ్చు ఈ కావ్యరంభ కందార్థమిది. " శ్రీధర నీపద యుగములు, పొదుగ మది యందు నిలిపి ప్రార్థింతు మదిన్‌, బాధలు బాపియు దీనుల, కాధారము జూపి బ్రోవు - అంబుజా నేత్రా భజియింతు నిన్‌ ఆత్మా చరిత్రా । రాదూ నీ దరి జేర హితాత్ములకు జన్మ మోదా మలరగ నిన్నూ మురియూచూ సుతియింతు అం ప్రతి అక్షరానితో పద్యగేయం ఉన్నా ఈ క్రిందివి గమనార్హం. రు కుజంకు, జూకు - ఇది, ఢకు

  • మూఢ, రకు - కుటిలము, ణకు - జణ జణ, ళకు - తళ తళ, క్షకు - లక్షణము - పై పద్యాల ఆరంభ పదాలు అక్షరాలు కవి నియామానికి అపవాదాలే ఇందులో కొన్ని వాడుకలోలేని పదాలు, వ్యాకరణ విరుద్ధ పదరూపాలూ ఉన్నాయి. అవంతే - వారు వరకవులు. ఇదే పుస్తకంలో శ్రీ వర్ణమాల కందార్భాలకు అనుబంధముగా 'సువర్ణమాల భగవస్తుతి' గేయం అక్షరానుక్రమంలో ఉంది. శంకరాచార్య “భజగోవిందం' స్తోత్ర తైలిలో ఇది అరవై చరణాల గేయం. శ్రీహరి హరి ఓం జీవాక్షరముల ధ్యానము చేయర మూఢమతే శాశ్వితముగా నీ జన్మ ఫల ప్రతి సారము తెలియర మందమతే - ఇలా సాగింది. జగదీశ్వర శతకం - ద్వి ము, 1985. సిరిసిల్ల ప్రచురణ ప్రతి. 'హంసోహం - వేదాంతరహస్యము
  • జగదీశ్వర శతకము" అని ఈ కృతి నామం. సిద్ధప్పగారి జగదీశ్వర శతకం, జన ప్రచారంలో ఉన్న 'రామ రామనారాయణ” గేయ శతక్రాలవంటిది. దీనిని చక్కగా పాడుకొనవచ్చు. ఈ వందగేయాల్లో కొన్ని ఇవి.
  1. శ్రీ గణా నాధునకునూ ఆర్బూర్ల । జపమాచరించి మదిలో జోకతో హరి హరులను భజియింతు | జ్యోతి శ్రీజగదీశ్వరా 3 నీ దాస దాసులకునూ దాసుడను నీ వాడనంటి దేవా నీ దయా రసము గ్రోలి శతకంబు లిఖియించితిని ఈశ్వరా
  2. తల్లిదండ్రులు నెవ్వరూ | నతి సుతుల్‌ దార పుత్రులు నెవ్వరు కల్ల బంధువు లెల్లరు గలిగిరిల కలిమాయ జగదీశ్వరా
  3. కంటిలో నున్న పాప । రూపంబు గనలేని మానవుండు కొంటె కాయల గూడియు. వాదించ శూరుడవు జగదీశ్వరా
  4. మతమేమి నిన్ను వేడ । ఆత్మస మ్మతము కావలె నవనిలో స తశమేది నిన్ను వేడ కోరికల్‌ గతము కావలె ఈశ్వరా శిద్దస్ప వరకవి జ్ఞాన బోధిని 2వ, భాగము 8,9 పుటల్లో సరస్వతీదేవి దండకం ఉన్నా గణభంగాలున్నాయి, దాని శైలి వర్ణ్షమాల వంటిదే వేదాంత గురువుగా, రాజయోగిగా, నీతి బోధకుడుగా, ఆయుర్వేద వైద్యుడుగా సిద్దప్ప వరకవి పేరు - కృతులు ఆ కాలంలో అధిక జనాదరం పొందినవి. వీరి ఎస్తకాలు వీధి బడుల పాఠ్య గ్రంధాలుగా కూడా ఉపయోగించబడ్డాయి.1995 కార్తీక పూర్ణిమ రోజున (నవంబర్‌ 20) వీరి యింటి వెనుక జిల్లా నాయకులతో సిద్ధప్పగారి శిలావిగ్రహ ఆవిష్కరణ జరిగింది. 4... తొలుపునూరి శంకరయ్య -గూడూరు, మం. కమలాపూర్‌. శంకరయ్య గారు వైశ్యులు. స్వగ్రామం అంబాల దగ్గర గూడూరు. వ్యాపారం వ్యవసాయం జీవనోపాధిగా కలవీరు అచలాద్వైత మతాభిమాని స్థానిక చిదానంద రాజయోగి అంకతిరాఘవయ్యగారి శిష్యులు 1969 శ్రావణ పూర్ణిమ నాడు గురువు గారు కీర్తిశేషులైన తర్వాత శంకరయ్య గారు ఆ అచల గురు పీరాన్ని

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద పూర్వొష్థ సావాశ్వం" మధుర కవితలు 245 అధిష్టించారు. వీరు 1975 సుమారుగా గతించారు. శంకరయ్యగారు వరకవి వీరు అచలాద్వైత వేదాంత ప్రీతితో కొన్ని తత్వగేయాలు రచించి 1934లో ప్రచురించారు. దాని పేరు “శ్రీ అఖండ సరిపూర్ణ తత్వమాల'". ఈ పుస్తకంలో చివరి హారతులతో కలుపుకొని 95 పాటలున్నాయి. మచ్చుకు ఒక గేయం - మరువాక మది నుంచుడీ - గురువాక్యము । తరుచుగ సేవించుడీ మరువాక మదినుంచి తడవు సేయక మిరు । మురియుచు స్మరణాలో ముమ్మారు జేయుచు ॥ జ్ఞానా జ్ఞానము గాదండి - గురువాక్యము జ్ఞానులకే తెలుసండి జ్ఞాన జ్ఞానము గాక ఘనమైన పదవిలో జ్ఞాన తీతంబాని గనిరి మహాత్ములు మంత్రా తంభ్రము గాదండి - గురువాక్యము । యంత్రా జపములు గావండి మంత్రాతంత్రము గాక యంత్రాజపములుగాక । యింతింత యనరాక ఇమిడి యున్నాద౦డి ॥ .... ధరలో రంగా గురుడండి - భక్తుల బ్రోచ దలచి చేరెను వినండి అరయగ అంకతి రాఘావదాసుకు । మరుగును తెల్చ్బగ మమళాలు విడెనండి కరీంనగర్‌ జిల్లాలోని హంజూరాబాద్‌ పెద్దపల్లి తాలుకాలలో వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, పర్కాల ప్రాంతాల్లో వీరి పాటలు వ్యాప్తిపాందాయి. సౌమ్య న్వభావ సరళ కవిత్వ అచల భక్త కవ తొలుప్తునూరి శంకరయ్యగారు. . 5. _ కొండపాక నారాయణాచార్యులు - దేశాయిపేట, తా॥ హుజూరాబాద్‌ నారాయణాచార్యులు విశ్వబ్రాహ్మణ వరకవి. “గోలకొండ కవుల సంచిక నం.322లో ఈ కవి పద్యాలు ప్రకటిస్తూ (బ్రహ్మానంద లీలాకరము' అముద్రిత కృతిగా పేర్కొన్నారు కవి మృతి 1336 ఫసిలీగా "పేర్కొన్నారు అంటే క్రీ శ. 1926లో వారు కీర్తిశేషులు... 1934లో గోకుస ప్రచురితం. 1934 వరకే కవి దీనిని ముద్రించారు. ఈ భక్తి కీర్తనల అచ్చు పుస్తకం లభించలేదు. కాని, కవి స్వయంగా వ్రానుకున్న కావ్య ప్రతిలోని రెండు పత్రాలు అభించాయి.* ఈ కవి పాటలు నిత్యదాసర్లు కడీవాద్యంపై కమనీయంగొ గానంచేసే వారని మిత్రులు ఎన్‌. వెంకటరాజం, ఎం.ఏ.గారు చెప్పారు. లభించిన కవి వ్రాత కాగితాలలో దేవీ స్తోత్ర కీర్త్సలున్నాయి. పదాలే తప్ప పాదాలు చదువ వీలు కాలేదు. గో.క.సం,.లోని ఈ కవి పద్యాలు చక్కగా ఉన్నాయి కాని, ఈ పాటలు వరకవితగానే ఉన్నాయి. కవి చిత్తు ప్రతి కాబోలు అచ్చుప్రతి దొరికితే వీరగేయాల స్థాయి గ్రహింప వీలయ్యేది. ఇవి వీరి కవితా శకలాలు - 1 యిదిగో మంగళ మమ్మ శంకరు గుమ్మ యిదిగొ మంగళ మని ముదంబున, వదలకను మాయందు నీకృప, మెదలకుంచుమ వుదర మందున 2 కామాక్షి (యేకాంబ్ర నాథుని దేమీ మంగళం 3 బ్రంహ్మమ నిత్య భవతె మంగళం శృంగార మహిమాంతరంగ శోభిత భక్త, మంగళ ప్రద కారుణిక భవ బంధ విశ్వకాళాంగ 4 మంగొళ మనరే రామ (రమా) మణికి, రంగాణి (ని) (ర) మణికి రంగ తు (శు) బాంగ విహంగ తురంగుని, పొంగూచు గూడి .. 1 ఫసిలీకఠి10రో 9నె 590 సం.లు జమ చేస్తే క్రీస్తు శకం వస్తుంది 2. కవి గ్రామ సమీప గ్రామమైన ఘనముక్కుల వాస్తవ్యులు కోరుట్ల మండలంలోని ఐలాపూర్‌లో తెలుగు పండితులుగా ఉద్యోగం చేస్తున్న ఎన్‌. వెంకట్రాజం గారు సేకరించి ఇచ్చారు. 3. _ ఏకామ్రనాథుడు - కంచి కామాక్షి దేవాలయ దైవం.

246 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర”

మిత విద్య, శ్రుత పాండిత్యం, వేదాంత భక్తి భావాలు ఈ మధుర కవుల్లో అధికం, నాడు అవే జానపద జనంలో భక్తి భావాన్ని సాహిత్యాన్ని ప్రచారం చేశాయి. ఈ కవి కృతుల్లో లేఖక దోషాలున్నాయి. చక్కగా పరిష్కరించి ప్రచురిస్తే కవి భావాలేవో తెలిసి వచ్చేవి. 6. _ శివపురము విశ్వనాథము - కోరుట్ల సుమారు 80వ, ఏట 1972లో కీర్తిశేషులు.

శివపురం విశ్వనాధయ్యగారు 60,70 ఏండ్లకు పూర్వం “వరంగల్‌ నుండి వచ్చి కోరుట్లలో స్థిరపడ్డారు. వీరి తండ్రి లింగయారాధ్యులు. వారి పూర్వులు మూడు తరాలకు పూర్వం గోదానరి మండలంలోని శివపురం అగ్రహారంలో ఉండేవారట. వీరు ఆరాధ్య బ్రాహ్మణులు కెౌండిన్యస గోత్రులు, విశ్వనాధయ్య గారు మాత్రం అచలాద్వైత మత దీక్ష వహించి 'సదానంద స్వామి'గా వేదాంత గురువులైనారు. వీరి గురువు హైదరాబాద్‌లోని భూమానందంగారు.

విశ్వనాధం గారు పండిత కవి. పండిన తత్వబోధకులు నిండు సౌజన్యశాంతరూపం కలవారు. వీరికి శిష్యపరంపర అధికం. కరీంనగర్‌ జిల్లాలోని రుద్రంగి, పత్తిపాక, కొరుట్ల తదితర గ్రామాలందే కాక, మహారాష్టలోని పూనా, బొంబాయి పట్టణాల్లోనూ వీరి శిష్యప్రశిష్యులు కవులుగా అచలవేదాంత గురువులుగా పలువురు ఉన్నారు.

కొరుట్ల “పూర్ణానంద మిట్టపల్లి రాజయ్య కవి" శివనాధయ్య శిష్యరికంలో ఎదిగిన వ్యక్తి రాజయ్యగారి శిష్యులైన వేములవాడ శ్రీకరానంద పిన్నంశెట్టి చిన్నయ్య గారు విశ్వనాధ గురువుల దయా వీక్షణాలకు పాత్రులైన వారే, విశ్శనాధయ్య కేరుతో పుస్తకాలేవీ లేవు. కాని, వీరి శిష్యప్రశిష్యుల గ్రంధాల్లో మాత్రం వీరి క్రీర్తనలున్నవి. ఆ పుస్తకాలివి,

  1. శ్రీగురు భజన కీర్తనలు' - మిట్టపల్లి రాజయ్య - 1940 సు, 2. శ్రీ కందార్థమాల - అలభ్యం,
  2. శ్రీ గురుగీత - పీలుఖానా శంకర రావు - 1958, 4. పరిపూర్ణ బోధ మంజరి - పి చెన్నయ్య, 1965.

శివనాధయ్యగారు తాము రచించిన కీర్తనలకు స్వీయనామ ముద్ర ఉంచుకునేవారు కారట. దానిని బట్టీ పై సంపుటాలలోని కర్తపేరు లేని తత్వకీర్తనలు ఇంచుమించుగా వీరివే అనవచ్చు. శిష్యుల కీర్తనలు కూడా చాలవరకు విశ్వనాధం గారు సవరించేవారట *

తమ తండ్రి కందార్థాలు వ్రాయడం - పాడడం తొను స్వయంగా చూసినట్లు విశ్వనాధయ్యగారి కూతురు అన్నపూర్ణగారు తెలిపారు. ఈ పుస్తకాలలో 1,2,4 విశ్వనాధయ్యగారు. ప్రచురించినవే. మొదటిది మూడు ముద్రణలు పొందింది. విశ్వనాధయ్య కందార్థాలు ఎక్కువగా వ్రాసేవారని వారి కూతురు అన్నా, ఆ కవితల పుస్తకం లభించలేదు. పాటలు మాత్రం లభించినవి.

“శ్రీగురుగీత'లో శ్రీ గురు భజన కీర్తనలు - 128 పుట నుండి 140 పుట వరకు ఉన్నాయి. వానిలో మొదటి ఆరు విశ్వనాధం గారివి

“స్వామి చరణ కమలా జాయ్‌ గురు స్వామి చరణ కమలా

భూమానందం బుధజన బృందం బొందితో కైలాసం పరేశం - పు. 129”

“శరణు గురువర శరణు ప్రభువర శరణు శరణు

పరమ భక్తా పాలనా పతితా పావనా శ పు 130" | రాజగంగమ్మ కోరుట్ల గారు ఈ పుస్తకాన్ని ఇచ్చారు. 2. _ విశ్వనాథయ్యగారి జీవిత వివరాలు, కవిత విషయాలు, వారి భార్య రాజ్యలక్ష్మమ్మ గారు కోరుట్టలో

నాతో 1992-93లో న్వయంగా చెప్పారు. ౩ అన్నపూర్ణమ్మ గారు జిల్లా ప్రజా పరిషత్‌ బాలికల సెకండరీ పాఠశాల, కోరుట్ల జిల్లా కరీంనగర్‌లో హిందీ పండిత్‌గా ఉద్యోగం చేస్తున్నారు - 1994

రెండవ భాగం - ౪ అధ్యాయం : “206 శతాబ్ద ప్రూర్వాష్థ సాహిత్యం” మధుర కవితలు 247 “పరిపూర్ణ బోధమంజరి'లో 61పుట నుండి విశ్వనాథం గారి నాలుగు చక్కని క్రీర్తనలున్నాయి.

  1. పరిపూర్ణ భావం గురుడై పరికించెను దేహం | పరగ భూమి ఘన రధమై నెట్టగ | పరమాకాశము గొడుగై పట్టగ సూర్య చంద్రులటు గీరలు నుండగ ।;ఆర్యవేదములు అశ్వములమరగ ॥పరి॥
  2. ఆరు శాస్త్రములు పగ్గము వేసుక యెరుక మేరువను ధనస్సు ద్‌ీసుక _ కరుణా శేషుడు నారై చెలగగ । అరయ చుక్కలను పగ్గములమరగ |
  3. పరమ సాగరము తూజీరంబై భక్తి భావ సంకల్ప శూన్యరథ సారధియౌ విధి కృతము జూడ ఘన । సారా సార స్థ విచారము 1
  4. యిరుసు ప్రభుండై నీ తల మందున నీరజాల నంధకొర లేజుల బార ద్రోలి భూమేశుని కడ సం సార సార స్థిర సారవిచారము ... ఇందలి కవితా ప్రతిభ ఉన్నతంగా ఉన్నా, కొన్ని గ్రామ్య పదరూపాలు దున్సంధులు పండితుల ఇబ్బంది పాలు చేస్తాయి. 3వ, కీర్తన 62వ పుట. గురుని భజించవె మనసా నిన్ను దరి జేర్చు భారంబు వానిదె సరసా. 1 కరుణించి రక్షించువాడు వున్న కరతలామలక మోక్షము పైన వీడు ! పరిపూర్ణమును జూపరేడు వున్న! ఘోర కర్మములన్ని గూల్చు నీతోడు
  5. తిన్నాగ పూదోటలోన వున్న కన్నె పిల్ల మంచి.కనుపైగ గొన నొ వెన్నతీరున కరగ కన్న అను మన్న సత్యము దెలియా సత్యమె సున్నా.
  6. అంగ రహితమే కైలాసం ప్రాణ లింగము 'పైనుండు ప్రభునిదె వాసం. దొంగా గురువుల బడితె మోనం | యిష్ట లింగయని పిలువు యిదె చిద్విలానం. ఇది కవి బోధనా సారాంశం. “శ్రీమతే రామానుజాయ నమః” అను 4వ, గేయం లింగధారి అయిన ఈ కవి మతసామరస్య ధోరణికి నిదర్శనం, వేదాంత విషయాలు వర్ణిస్తూనే కవి ఇందులో చక్కని కవితా విన్యాసం చూపించారు. చ వేయి రేకుల కమల స్వస్థానం నద్గురు స్థానం కాయ మాయో పాయ పరి పూర్ణం సుగుణ నిధానం హాయిగా నాడులలో పెద్ద వాడి నట్ట నడుమ నాట్యము నాడు పూవుబోణితో ; సయ్యాటలాడు చున్నమేటివి.. శ్రీమతే చర _ పండు వెన్నెల బయలులో కళలూ | పరతత్వ పలుకులు | యెండమావ్సల జలములకు తడలూ 1నీ మేను చమటలు దండిగా భూమండలంబులు. నిండు థ్రేమను గదియ నీవా ఖండ ఖండమురాక వెలిగెడు పండితుండై నట్టి స్వామివి ! శ్రీమతే “శ్రీగురు భజన కీర్తనలు పుస్తకంలో విశ్వనాధ “సదానంద స్వామి" గొరివి పది పాటల వరకున్నాయి 36వ, పుటలో *'యాలరాగం - ఏకతాళం' ' పేర ఉన్న ఈ క్రింది పాట గూఢ వేదాంత చమత్కార భావ గర్భితం. ఒక విధంగా పొడుపు కథల వంటివి దీని చరణాలు. చిష్పండి చేతనైతే జవాబులు చెప్పండి | ” 1 యెక్కరాని మేడా మీదా చక్కనీ దొక పిల్గున్నాది | యెక్కిచూతా మంటూ పాయినోళ్లూ ఓ గురువారేణ్య యెక్కడా లేనోళ్లయి పోయినారే 1ఓ। 2 గొడ్డురాలి కడుపూనందు దొడ్డవాడు కొడుకు బుట్టి బిడ్డలాగని బిడ్డా నిచ్చునూ ఓ గురువ రేణ్య బిడ్డలాగని కొడుకే ముట్టేను

246 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 3. చిన్న నాడు చూ లేదు పెద్దనాడు పెండ్లి లేదు కొడుకు బుట్టి కోక గట్టేను ఓ గురువరేణ్య! కోక గట్టిన కొడుకే ముట్టేను 4 _బంఛులాడు బంతి పువ్వూ యెంతో మోదామై యున్నాది వింత ముత్యపు చిప్ప నిండేనూ ఓ గురువరేణ్య అంత చిప్ప నంటి యుండేను.! 5. పూరులేని పాటి మాద యేరు లేని గరిక మొలిచే (యేరు = వేరు) నోరులేని లేగ మేసేనూ - ఓ గురువరేణ్య నీరు నిండి నిబిడమాయెను 6. నిమ్మ కాయల కమ్మనయ్యి అమ్మకొాడుకుల తల్లీనయ్యి నిమ్మకాయల రెండూనడిగేనూ - ఓ గురువరేణ్య కొమ్మ కొడుకుల కిల్లాలయ్యేను. 7. చెందురూని యెత్తుకొని చీమ ముద్దాడినదాయె డెందమున భూమానందమును - ఓ గురువరేణ్య అందునా సానందామొందేను ఇందులో మొదటిది ముక్తి కాంత, మూడవది మేక చివరిది గురుశిష్య సంబంధం. ఇట్లే మిగతావాటికి అర్భలుండవచ్చు కవది ఘోరం! ఇవి బూతు భావం ధ్వనించే వేదాంత విషయ కవిశలు. దైవపరమైన శృంగారం మధుర భక్తి కదా! ఆత్మపరమాత్మల అంటే జీవుడు దేవునితో సంయోగం - సమైక్యం చెందడమే ముక్తి! అని ఆర్యోక్తి విశ్వనాధం కవి గౌరు తాము అచలాద్వైతి కావడమే కొక పలువురను ఆ మతమందు నడిపించి కవిశలు వ్రాయించిన వారు. 7. మిట్టపల్లి రొజయ్య - రాజయోగి - కోరుట్ల; 75వ, ఏట1986లో కీర్తిశేషులు మిట్టపల్లి రాజయ్య రాజయోగి సాత్త్విక జీవనం గడిపిన ఆచలాద్వైతి ఆయన శాఖాహారి - వేదాంత కవితా విహారి. సాధు జీవనం గడిపి నద్రాహ్మణుడుగా ప్రశస్తినందిన రాజయ్యగారు 1910 సుమారుగా సద్మశాలి కులంలో జన్మించారు. కులవృత్తి చేనేత - ప్రవృత్తి నీతి బోధ. ఆయన మాటకు క్రియ సాక్షి అన్నట్లు మెదలిన సంయమి. ఆచల వేదాంతాన్ని అభిమానించి స్థానిక ఆరాధ్య విప్రగురు సత్తములైన శివపురం విశ్వనాధం గారి శిష్యులై “పూర్ణానంద స్వామి”గా రూపొందారు వేదాంత నీతి ప్రబోధకాలైన తళ్వ కీర్తనలు, పద్యాలు పూర్ణానంద మిట్టపల్లి రాజయ్యగారు రచించారు. ఈ రాజయోగి శిష్యులు పలువురు కవులు వారిలో శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్న్మయ వేములవాడగారు ప్రముఖులు రాజయోగి రాజయ్య గారి కీర్తనలు పద్యాలతోపాటు శిష్యుల పొటలు కూడా చేర్చి 'శ్రీగురు భజన శీర్తనలు'గొ ప్రచురించారు ' ఇది సదానంద విశ్వనాధయ్య కొరుట్లగారి ప్రచురణమట.* ఈ పుస్తకం 3వ ముద్రణ 1970లో, తాలిముద్రణ 1940 సుమారుగా జరిగింది. 90 పుటల ఈ గ్రంధం మొదట 7 పుటలు పూజాధ్యాన శ్లోకాలు చివర 11 పుటలు చందాదారుల పట్టిక. 72 పుటలు కవితలు. ఇందులో సగ భాగానికి మించి రాజయ్యగారి కవితలున్నాయి కొన్ని వీరి గురువు విశ్వనాధయ్యగారివి. మరికొన్ని వారి - వీరి శిష్యులవి. పాటలకు రాగ తాళాలు సూచింపబడినవి. బిలహరి - ఆది, 15వ, పుట పాట. వున్నది పరిపూర్ణమురా । దాని గన్న జన్మ మోక్షమురా అన్న విన్న గురుడన్న మాటనే నన్న సున్న ప్రత్యేక్షము గనుగొన పరిపూర్ణంబొకటున్నది లోనిది యెరుకను మరగెరిగించి నా పూర్వ జన్మార్హిత విశేషంబునూ సర్వమునటు వదలించి దీవించ (హు) స్త మస్తకము నుంచి కరుణించి మనసుంచి మానరు (వు?) లటు వివరించి జెలియగన వున్నది పరిపూర్ణమురా గొవంళమునన ళం వనవద సయ భందం కాని, కవి ఇక్కడ రాగంగా పేర్కొన్నారు. ఏకళాళం పల్లెల్లో, భాగోతపు పాటల్లో సర్వసామాన్యం. (247 వుట)

రెండవ భాగం - ౪ అధ్యాయం “206 శతాబ్ద పూర్వార్ధీ సాహాత్యం” మధుర కవితలు 249 అయిదు చరణాలలో ఈ గేయం 4వది. వేదంబులు నాల్గారు శాస్త్రములు ఎదకి వినుకుటింతియె గాని (వెదకి విసుగు] చదివిన గర్వము విదళించక వాదింతురెంతా వింతది పూని పద్దులు గని యజమాని వద్దికి గా వద్దనుచూ మానవులటు వివరించి తెలియగన వున్నది పరిపూర్ణమురా - 18వ పుటలో ఉర్ప్జూ పాట ఉంది ఖాలీ కర్లేపరిపూరణమే తేరి హమారీ వజాతు క్యాహై - అని సాగింది వీరి హిందుస్తానీ కవిత సావేరి రాగం - ఆది తాళంలో 22వ పుటలో ఈ అచలాద్వైత వేదాంత తత్వ 'గేయముంది.

  1. వారీ పరిపూర్ణ బోధ సరి కోరి మరి జూచిన లేదిక దారీ మోరందరు గురునికి జేరీ సారె సారెకును నన్నుతించు మా సారము తెలిసిన వారికె మోక్షము 2 కాదూ సాంఖ్యము యిది యనుకొనరాదూ షణ్ముఖిశాంభవి యన రాదు యేది గాదు నిదానమైన యా | బోధ విన్న యమ బాధ తొలంగును 7 యేరా ధర కోరుట్ల మందిరమునరా శివపురము విశ్వనాధమురా మిటపల్లి రాజమున కిదెరా సార విచారము సంపూర్ణము యది పారగ తెల్పెను యిది నిజవస్తువు రాజయ్య కవి పద్యాలు కూడా రచించోరు కాని, అవి ఛందో విధేయాలు కావు. దేశిక మోరు మాకు వుపదేశము లిచ్చి తరింపజేయగా కాశికి బోవ నేల ఘన కరుణ కటాక్షము గలుగునంతదు రాశలు మాని గర్వము నశించెను మో యొక నామ మహత్యమున్నా వశమౌనె యెంచ నరనాయక శివపుర విశ్వనాధయా వున్నది లేదటంచు లేకున్నది యెప్పుడు వున్నదంచు మా రన్న విధంబు మాకు నిజమున్నది కాని మరేమి లేదునే నన్నది ఆత్మ యెచ్చటికి నరుగునా గాని యదొక్క సంగతి తిన్నగ దెల్పి బ్రోవు త్రిపురాంతక శివపుర విశ్వనాథయా ఈ భావాలు ఆ వేదాంతం నచ్చిన గురుశిష్యులూ మెచ్చినవి వానిలో విమర్శకుల జోక్యం అనవసరం కాని భాషా ఛందస్సుల గురించి ఆక్షేపణలు వస్తాయి కదా వారికి కవి నమాధానమిది యేది దెలిసితె జన్మ రొాదయ్యా జనులార మనకు యేది దెలిసితె జన్మ రాదయ్యా యేది దెలిసికె జన్మరాదొ యాదారి గనుగొని యున్న గురువుల పాద తీర్థ ప్రసాదములు గ్రోల ధరందున యెరుక లేదు యేది పు 54 తప్పులుండిన దిద్దవలెనయ్యా శబ్దార్థ చంద్రిక యర్థముల్‌ గని చెప్పలేదయ్యా అప్పకవి యాంధ్రములు సంస్కృత గొప్పశాన్త్ర పురాణవేదము లొప్పితంటై యున్నవాటి నొకప్పుడైనను దెల్యనైతిని 1 ముఖ పత్రంలేని ఈ అపురూప పుస్తకాన్ని కోరుట్ల భక్తురాలు రాజగంగమ్మ గారు ఇచ్చారు మరో ప్రతి లభించలేదు, మూడవ ముద్రణ పొందినా. 2 _ శివనాధయ్య గారి భార్య రాజ్యలక్ష్మమ్మ అన్నారు.

పాద తీర్థం, బీరకాయల (పీచు) చిక్కు, అంగడిబేరం పొచితీగె వతు, కట్టెబొమ్మలకు పూజ - మొ జనజీవితంలోని నానుడులనీ కవి ప్రయోగించారు

ఈ భజన కీర్తనల సంకలనంలో సిరిపురం విశ్వనాధం, మిట్టపల్లి రాజయ్య గార్లతోపాటు వారి శిష్యబక్త బృందవిరచిత, తత్త్వగీతాలు కూడా ఉన్నాయి. వారి పేర్లు ఇవి

లక్ష్మీపతి పుట 21 వజ్యల లింగయ్య - పత్తిపాక - పుట 27 కోటగిరి రాధకృష్ణుడు - 29; మంచె రాజయ్య - 41 మచ్చపెద్దులు ఒం కోరుట్ల 43, 64, యీగము మల్లయ్య - పత్తిపాక పు. 30, 76, గంగారాము - రుద్రంగి - పు 40 అల్లె హనుమయ్య - 46 కొత్త గంగాధర్‌ - 63 కటుకం రామయ్య

  • పెగడపల్లి - 70 మొదలైన వారు

మచ్చ పెద్దులు గారి కీర్తనలు చాల వ్యాప్తిలో ఉన్నవి

ఎంత చక్కని గురుడు దొరికేనే మిటపల్లి రాజయ్యార్య మద్ద్గురు

డెంత చక్కని గురుడు దొరికేనే

బాస గంగారాంగారి ఆచల తత్త్వం ఇది -

“అటలాడెంచెడి వాన్ని జూడు నీలోనిలిచి నాడు నాతోడు నీ తోడు

అతగాడు మనవాడు వృన్నడు యిక యెన్నడు మరి చిన్నయు గాకున్నడు మరి

అన్నోడు విన్నాడు తిన్నాడు వాడనయ్యా. ”

కోటగిరి రాధాకృష్ణుడు *“యేమిలేదోయీ "అని పరిపూర్ణ తత్త్వాన్ని 'ఆనందభైరవి, ఆది తాళంలో ఇట్లా విశదీకరించాడు

“సత్తూగాదోయీ - యీ చిత్తమందు చిత్తూలేదోయీ

సత్తు చిత్తుల సందు సమరాన మెలిగీన వుత్తాపరమే కాని దూత్తేరి నీతోడు

లక్ష్మీపతి గారి గేయం యదుకుల కాంభోజిరాగం ఆట తాళంలో ఈ విధంగా ఉంది

“తెలియాని దమ్మా - సద్గురు పదము వెల లేని దమ్మా

తెలియ జెప్పిన మతి తెలివికి వేరయ్యి తెలువుల సందున తేటబడక యుండు. ౨”

21వ పుటలోని ఈ తత్వ గేయాన్ని కందార్థాలని ముద్రించడం పొరపాటు కందార్థం రానురాను కందార్థంగా ఉచ్చరించబడుతున్నది మిట్టపల్లి రాజయ్య రాజయోగి సహవాసులు మిత్రులు ఇట్లా కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, బొంబాయి ప్రాంతాలలో ఆచల వేదాంతాన్ని దేశి కవితను బాగా వ్యాప్తి చేశారు & వరకవి ఎర్రోజు బ్రహ్మాయ్య - పెద్ద కలువల; మృతి - 1950 ; 65 ఏళ్ల వయస్సు.

ఎర్రోజు బ్రహ్మయ్యగారు పుట్టంధులు విశ్వబ్రాహ్మణులు పెద్దపల్లి తాలూకాలోని పెద్దకలువల (గ్రామ వాస్తవ్యులు వీరి ఏకైక ముద్రిత కృతి - “జీవ బహ్మైక్య సంధానము ”

మరో రెండు ఆముద్రిత కావ్యాలున్నాయట ఇది 1930 మొ ముద్రణ - 1985 రెం ముద్రణ '

పద్యాలు గేయాలు వ్రాసినా బ్రహ్మయ గారిది వరకవిత జీవ బ్రహ్మైక్య సంధానము భక్తి కీర్తనల సంపుటి అందులోనే ' శ్రీమహాలక్ష్మి శతకము' అనే పేరుతో వంద సీసపద్యాలున్నాయి.

దీనిని ఓరుగల్లులో రెండవ పర్యాయం 200 ప్రతులే ముద్రించారు. పెద్ద కలువల గ్రామానికి తాలూకా ఆసఫ్‌నగర్‌ అని అందులో ఉంది ముస్లిం పాలకుల కాలంలో పెద్దపల్లి ఆ పేరుతో పిలువ బడి యుండవచ్చు జీవ బ్రహ్మేక్య సంధానంలోని ఒక కీర్తన - 3వ, పుట

సత్యనారాయణ, బి ఓ ఎల్‌ అల్లునూరు.

రెండవ భాగం - ౪ అధ్యాయం * “20 శతాబ్ద త్రద్వార్ధ సాహిత్యం మధుర కవితలు 251 యాల మరచీ యూరకుంటి వయ్య మాపాలిదైవమా జగదీశ (ఏల)

బాల శశి మకుట జాలమేల మునిలోల బ్రోవుమో పరమేశ

దిక్కు నీవె యని మొైక్కగ మొరవిన వెక్కడి కరినమొ జగదీశ

నిక్కముగ నిను నమ్మినవారల చిక్కుల ద్రోయుము - పరమేశ

ప్రాసలు, యతులు, ప్రానయతులు, అంత్యప్రానలు చక్కగా అమిరాయి. అని కవి కవితలకు వన్నెతెచ్చాయి. ఈ పుస్తకంలో వివిధ దేవతల స్తుతులు నీరాజనాలు పది వరకున్నవి,

తెలంగాణాకు ప్రత్యేకమైన గౌరమ్మ (స్త్రీల) పాట ఒకటి ఇది పు. 62

శ్రీలక్ష్మి లోక జననీ గౌరమ్మ సిరులిచ్చి బ్రోవుపూని గౌరమ్మ

నీల నీరద వేణి - నీర జోదరు రాణి ,బాల చంద్రానన -.పద్మ సంభవుని సతి

కాల కందరుని రాణీ - గౌరమ్మకాత్యాయని గుణమజణీ - గౌరమ్మ...

ఒక హారతి -పు 64 మంగళ మిదె శార్వాణి - మద షట్పద నిభవేణి అంగ జాంతకుని రాజి - అంబా కీసలయ పాణీ దిక్కు నీవె కన్నతల్లి - దీన మానవ కల్పవల్లి గ్రక్కున దయారసముజల్లి - కావుము సాధ్విమాళల్లి గాసిల జేయకు సుమ్మ - దానుల పెన్నిధాన మమ్మ భాసుర పర శివుని కొమ్మ - పాలితొమయ పైడి బొమ్మ ( వేదమాత గాయత్రి - ఆదరించు గిరిపుత్రి నీదయగను వేద గాత్రి - నిఖిల మౌని జనస్తోత్రి ॥

వీరి పాటలు శైలీ ప్రసన్నత కలవి కనులున్న గ్రుడ్డి వారికంటె ఈ కవి అంధులైనా అక్షర సాక్షీ కవికి నయనాల కంటె ముఖ్యం జ్ఞాన చక్షువు అలతి భాషాదోషాలున్నా క్షంతవ్యాలు ఈ వరకవి సహజ కవిత భక్తజన మనోరంజని.

  1. వులికొంత గంగాధరయ్య - కథలాపురం.

ఈ ప్రకరణంలోని యక్షగాన కవులలో ఈ కవి పరిచయం చేయబడింది. బహుగ్రంధకర్తయైన గంగాధరయ్యగారు కొన్ని విడికీర్తనలు కూడా గ్రాశారు' తాము వీరైవ జంగమ మతస్ములైనా వైష్ణవే స్తుతులు సైతం వ్రాసి మత సామరస్యం పాటించారు. కీర్తన - ఏకతాళం ;

శివ కేశవ నామామృతమెంతో - స్థిరమై యున్నది గదె మనసా భవ రోగములకు పరమౌషధమిది - పానము సేయవె వో మనసా

శివుడే కేశవుడను కేశవుడే శివుడను వేద వాక్యము

శివస్య హృదయం విష్ణో విష్ణుస్య హృదయం శివయన ఘనమూ ఏక తాళంలోనే ఉన్న ఈ క్రింది వేదాంత - వైరాగ్య భావ ప్రబోధ గేయం చూడండి.

యెొందుకురా యీ సంసారం - మరు పొంద జేయునిది నిస్సారం

మంద బుద్ధులను మరి యజ్ఞానుల నెంద రెందరినొ క్రిందు పరచునది యె

కూట సాక్ష్యములు బల్కియునూ స త్కూటమి గోరక వెల్కియునూ

సూటిగ నేనే సూనృతోక్తి నని మాటి మాటికీలాటిగ వదరేవు యె

నీ యంతట నీ వుండిననూఉండ నీయదు నిన్నాక చోటుననూ

పాయకెన్నియొ యుపాయములల్లుచు జేయరాని పని జేయించును గద యె

(వాక్యాది పద యకారం తెలుగుపదానికి నాటి వ్యావహారిక ప్రయోగం చెల్లపిళ్ళ వేంకటశాస్తిగారు ఇలాగే రాసేవారు). కవి సంస్కృతాంధ్ర భాషల పొండిత్యం కలవారైనా సజీవ వ్యావహారిక భాషాపదాలు శ ఈ కవి పుత్రులైన నాగేంద్రయ్యగారు కధలాపురంలో తమ తండ్రిగారి అముద్రిత రచనలు

చూపడంతోపాటు కొన్ని కీర్తనలు వినిపించారు. తేది 22.7 1990

252 డా. మలయశ్రీ కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” నిన్సంకోచంగా ప్రయోగించారు. జంపెతాళంలో కవి ప్రతిభకు నిదర్శనంగా ఉన్నది ఈ క్రింద చూపిన హారతి. సరసిజ దళ నయన మంగళం కరుణామృత సా గర మునీశ ప్రణుత మంగళం సర విరి శర ధర గురు నర కేసరి తరిధర ధర ధర కరి వర వరద రఘువర మురాసుర హర సురవర నుతాంఘి స దితి సుతా సమూహ భంజనం సకలాత్మక సం తత నుత చరణ విద్వజ్ఞనం దితి క్షితి నుత సతి పతివిగత దురిత తపః ప్ర ణఖుత సతత సుమతి పతి సంస్తుత పద శత ధృతి పితడు పతి ధృతహిత స ఈ ప్రాంతపు రామసింహ కవి హారతులు సంస్కృత పద భూయిష్టంగా నాలుక తిరగకుండా ఉండేవి అవే ఈ కవి ఈ హారతి రచనకు ప్రేరణ అయి ఉంటాయి. అయినా వీరి భాష సరళం శైలి ప్రసన్నం. అలతి భాషా దోషాలు గణనీయాలు కావు అప్పుడు రాజ భాష పరభాష ఉన్నత విద్యాలయాలు లేని, శిష్ట కవుల ఆదరణకు నోచుకోని, ఈ వర-యక్షగాన - మధుర గేయకవుల సాహితీ కృష్‌ సంస్తుతి పాత్రం. 10. మామిడిపల్లి సాంబశిన శర్మ - వేములవాడ ఉభయ కవి మిత్రులు లాక్షణిక పద్య కవి అయిన సాంబశివ శర్మగారు సంగీత ప్రధానాలైన పలు భక్తి గేయాలను, సుప్రభాతాలను రచించారు వీరి పాటలు కొన్ని పద్యాల కంటె ప్రొాఢంగా ఉన్నాయి వీరిపద్య కవితా కావ్య పరిచయం చేయబడింది వీరి రచనలలో అనువాద ద్విపద రామాయణం, లోభ సంహారము మాత్రమే సంపూర్ణ ద్విపద పద్య కావ్యాలు మిగతా బండ కృతులన్నీ, పద్య గేయ సంపుటులు వీరి గేయాలు కల కావ్యాలివి 1 మువ్లి హారము - 1949 ముద్రణ 2. మధుర రుంకారము - 1949 ముద్రణము 3 జయశ్రీ - 1953 ముద్రణ 4. భక్తి గీతాలు - 1966 ముద్రణ ముక్షాహారములో 11 పద్య శీర్షికల తర్వత కొన్ని గేయాలు మంగళహారతులున్నాయి మధుర రుంకారము సంపూర్ణ గేయ కావ్యం ఇది 36 పుటలు కలది ఇందులో హారతులు క్షీర్తనలున్నాయి. ఇవి శివరామకృష్ణ భక్తీ గేయాలు శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతమ్‌ 1958 రచన భక్తి గీతాలు : 1966 సం ముద్రణ 40 పుటలు. ఇందులోని పాటలు భజన కీర్తనలు కొన్ని సినిమా పాటల జాణీలవి. కొన్ని స్వతంత్ర గేయాలు రాజేశ్వర సుప్రభాతం నుండి భూపాల రాగ గీత భాగం చూడండి మేలు కోవయ్య శ్రీరాజ రాజేశ్వరా మేలుకొమ్మా గిరిజా హృదయేశ్వరా మేలుకో కైలాస వాస కామేశ్వరా మేలుకో సంగీతలోల విశ్వేశ్వరా కలభ కుంభ స్తన ఘన జఘనములతో చలదు త్పలేక్త జోజ్బల కపోలములతో ధవళ శ్రవణ యుగ్మ తొటంక తతులతో ఫాల తలములందు వ్రాలు ముంగురులతో వీరి గీతాలు ఎక్కువగా సంస్కృత పద భూయిష్టంగా ఉన్నాయి దేది 12 ఫిబ్రవరి 1954 పు 11 (253 పుట పాదపీరిక)

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20 శతాబ్ద పూర్వాష్థ సాహిత్యం” మధుర కవితలు 253

అతసీ నీలోత్పల జంబూ ఫలహరీ నీల జలధర శ్యామహరీ

సిత కమల మరాళ మృణాళ సుధా సింధు సుధాంశు సదాంగ హరా .

వీరు తమ సంస్కృత కవితలను విడిగా కాక తెలుగు ఖండ కావ్యాలలోనే ప్రచురించారు

పద్యాన్ని కూడా పాటగా నడిపించే ప్రతిభ శర్మగారిది ఉదాహరణానికి “సారస్వత జ్యోతి' లోని

ఈ కవిత చూడవచ్చు' - మంజరీ ద్విపద.

వాయింపరా తెల్గు వజ్రాల వీణ (మైోాయింపరా తెల్గు ముత్యాల వీణ

మొరయింపరా తెల్లు వరహాల వీణ పలికింపరా తెల్గు బంగారు వీణ

మీటరా నీ తెల్గు మెబుగు తంతువుల మైళ్ళు చిగిర్బగా రాళ్ళు చెమర్చ

నీళ్ళు పుష్పించగా నింగి ఫలించ పొడరా నీ తెల్గు భావార్డ గీతి

చూడరా నీ తెల్లు సుకుమార మూర్తి సరిగమ పదనిస స్వరరాశి యందు

మెరిపింపరా కెల్లు మెరపు పసందు (1954)

సంగీత సాహిత్యాల్లో సంస్కృతాంధ్ర భాషల్లో మార్గదేశి కవిత్వంలో సవ్యసాచి సాంబశివ కవి! అముద్రిత మధుర సాహిత్య కవులు ;

  1. ఈలపంటి టక్కమరాజు - కాట్నెపల్లి (కొత్తపల్లి. జీవితకాలం సుమారుగా 1880 = 1980 టక్కమరాజు గారు భట్టురాజు మధుర గేయకవిగా వారి పేరు చాల వ్యాప్తిలో ఉంది ఇంచుమించు నూరేండ్లు జీవించిన వీరు గతించి పదేండ్లు దొటింది రాజుగౌరు ఎన్నో కీర్తనలు రచించినా అందులో ఏ ఒక్కటీ ముద్రింపబడలేదు. కవి అముద్రిత కవితలు వారి కూతురి కొడుకు వద్ద కలవట టక్కమరాజు గారి గేయాలు కూచిపూడి వారి తరంగాలవలె నాట్యానుకూలమైన బాణీలలో ఉన్నవి. భజన కీర్తనలుగా వీటికి ఆ కాలంలో చాల వ్యాప్తి ఉండేది రాజుగారి దశావతార కీర్తన ఆరంభమిట్టుంది. రారా - నిను నమ్మితిరా యదు వీరా - దేవకీ వసుదేవ కుమారా - భాసుర కౌన్తుభ మణి హారా - రారా - దేవర - వారి - దశాద్యవతారము లెన్నగ వాదా - జలనిధి లోపల జొరలేదా - సోముకుని ద్రుంచితివి కాదొ - స్మరణోల్లాన సదాత్మ వినోదా - వేదంబుల నలళినోద్భృవునకు ము న్నాదరించు మీనావతార యిటు రారా ॥ విద్యా వైదుష్య కవతా నైపుణ్యాలు సమస్థాయిలో ఉన్న టక్కమరాజుగారి కీర్తనలు ముద్రింపబడితే సరస సాహిత్య సంగీత ప్రియులైన భక్తజనానికి విందుగా ఉండేవి ' ఆ కాలంలో ఈ జిల్లాలో భట్రాజులు ఆశుకవితతో సాహితీ సంచార యాత్ర కొవించేవారు వారిలో కొందరు భక్తిగేయ కవులు వీరు నారాయణరాజు కృష్ణమరాజు, ఎజ్జిమరాజు నర్సింహరాజు - పెగడపల్లి పుల్లమరాజు - ఓదెల జొన్నల మల్యాల, గూడూరి నరసింహరాజు - ఉప్పర మల్యాల, దేవరాజు నరసింహరాజు - కష్పారావు పేట
  2. దేవత వెంకటరాజను - రేకొండే. మం చిగురు మామిడి దేవత వేంకటరాజంగారు పద్మశాలి కులస్తులు. వీరు అచ్చంగా మధుర గేయ కవితలు జ వనన న కన లా 1 కవి గారి దౌహిత్రులకు రెండు లేఖలు వ్రాసిన జవాబు లేదు ఈ వివరాలు చెప్పి పాట వినిపించిన కవి మిత్రులు ఎన్‌ హన్మంతరాజు - ధీకొండ - జిల్లా పరిషత్‌ సెకండరీ పారశాల, వెదిరలో తెలుగు పండితులు - 94

2 ఈ వివరాలు నా 'కజి. రచయితల చరిత్ర' రచనా కాలంలో 1981 సేకరించి ఇచ్చినవారు పి కేశవరావు గారు - గుండి

254 డా. మలయశ్రీ కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత” వెలయించిన వరకవి. వీరి కృతులేవీ ప్రచురింపబడలేదు ఈ వరకవి 50 వరకు మంగళ హారతులు రచించారు. 'సత్యనారాయణ వ్రత కల్పము" అనే పేరుతో హరికధను వ్రాశారు గజేంద్రమోక్షం పేరుతో మరో హరికధ వ్రాశారన్నారు వారి పుత్రులు చి శ్రీనివాస్‌ వీరి రచనలు అముద్రితాలు రేకొండ గ్రామంలోని కవిగారిగృహంలో దొరికిన చిత్తు కాగితాలలోనిది ఈ క్రింది హారతి" వీరి వ్రాత ప్రతులు ముద్రణకోసం వేరే జిల్లాకు వెళ్ళాయి 1 ఫారతిదిగో క్షీరా పారా వారా కన్యా చారు తర సుకుమారే మణిగారే సుగుణ విహారే నిరతమూ మేరు గిరిధర ధీరే శూరే పారావారా నిభగంభీకే జగదాధారే శూరే కుంద ముకుళ రదనే పూర్ణేందు సదృశవదనే బ్రహ్మానంద రూపా బృందా వందితే - 2 శుభనీరాజ యామి యదు - వీరా మురారి విరోధి మురహర గిరిధారీ అంతే వాసి సంతాప హరణా నిరంతాయ స్వాంతా యనంతా దురంతాఘ చింతా నికృంత రిపొఘ కృతాంత స్వరూప వేదాంత .] కవి సంస్కృతం నేర్చుకోలేదు. అంతా శ్రుత పాండిత్యం భాషా గుణ దోషాల ప్రసక్తికి పోక ఆ నాదానికి ముగ్గులై వీరి హారతులు ఆ కాలపు భక్తజనం ఆసక్తితో పాడుకునేవారు* కవి కుమారుడు శ్రీనివాస్‌ తండ్రిగారి రచనలను సేకరించి ముద్రించే ప్రయత్నంలో ఉన్నారు ప. దవమ్మయగాలి రాజన్న - గుండి, మం రామడుగు - 19865 రాజన్న కాపు కులస్థులు. ఇంటిపేరు రాచూరి వారు ఆయుర్వేద వైద్యులుగా జీవితం గడిపిన రాజన్నగారు సాత్విక ప్రవృత్తి కలవారు మిత మృదు భాషి వీరికి శ్రీరామునిపై అపరిమిత భక్తి, వీరికి ఆంధ్ర సాహిత్య పరిచయం అంతంత మాత్రమే హిందీ పరీక్షలు మాత్రం ఆగ్రాలో చదివి ఉత్తీర్డులైనారు. తులసీదాసు “రామచరితమానస్‌ చదివి ముగ్గలై దానిని “శ్రీరామ నామమహాత్మం' "పేరుతో అనువదించారు '. ఇది సంపూర్ణ గేయకావ్యం. అనువాదం మూలాన్ని అనుసరించినా సంగ్రహించబడింది ఈ కాన్యం అముద్రితం రాచూరి రాజన్నగారి హిందీ రామాయబాంధ్రానువాద 'గేయ కావ్యారంభం ఇట్లాగుంది. శ్రీరామ నామ మంతో మధురం రమణీయమైన చూధుర్యం రామనామముతో సమానమైనది రానే రాదిక లేనే లేదిల ఇంత తీపీ యనరాదు ఎంతెంతో ఏమనరాదు ఎంతో మంది భుజియించియు యీరుచి ఇంతని తెలిపినవారు లేరిక ' కవి 1985 సుమారుగా వృద్ధాప్యంలో కీర్తిశేషులైనారు 4. కెళ్ళెర్ల మల్లన్నగౌడు - మంథని, 1860-1960 సుమారు మల్లగౌడు ఇంచుమించు నూరేండ్లు బ్రతికిన పూర్ణాయుష్కులు. సొత్విక భక్తీభావంతో తత్త్వ గేయాలు రచించేవారు. వాటిలో కొన్ని ఇప్పటికీ ఆ పట్టణ వృద్ధులు పాడుకుంటారు. మహాకవి గంగారాజేశ్వరరావుగారి శిష్యుడు - కవి, తాటికొండ రాజుగౌడుగారు వినిపించిన పాట ఇది లా 1 రేకొండలో అతిధ్యమిచ్చి కవిపుత్రునితో పరిచయంకలిగించిన అధ్యాపక మిత్రులు సంజీవరావు గారు. 2 కవి అన్న కుమారులు, కవియు అయిన దేవతవేంకటరాములు సిరిసిల్ల గారు 1981లో గంభీర్‌ రావుపేటలో ఈ హారతి వినిపించారు - 1981. 3 1373లో ఎలిగేడులో మోతుకూరి సాంబయ్య కనుకుల సాన్నాయి కళాకారుడు పాడగా దేవే గారి ఒక హారతిని విన్నాను అందులో 'రేకొండ' గ్రామాన్ని కవి “రాత్రిగోత్ర' మన్నారు -1 ఈ కావ్యాన్ని నేను గుండిలో ఉన్న 1974-75 కాలంలో చదివాను

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్బ పూర్వాస్థ సాధాశ్యం” మధుర కవితలు 255. మానజాలనే కొల్లారపురాధమ్మ తల్లిని మరువజాలనే మాన జాలనెందుకన్న మా మోదనెంతో (ప్రేమ వాసిగాను లింగయాత్రలు సంగతిగను చూపించిన కల్లి తినక పెట్టునే తిన్నంక యెంతొ ధీర జెప్పునే కల్లగాదునాదు మాట కామధేనువు వంటిది తల్లి వీరు చాల భజన పాటలు వ్రాసినారట ఈతని తమ్ముడు కూడా సాధుజీవితం గడిపిన కవి అని తెలిసింది ఆయన రచించిన పాటలోని కొంత భాగం చూడండి కారణమనియెటి కాయముజూచి - కాముని పండుగ యనిమదిరోసి కారడవులలో ఆకులు మేసి - వేగమె పెద్దలు వెళ్ళిరి కాశికి |! జాజిరి జాజిరి జాజిరి జాజిరి - ఎక్కువ గుణములకెవ్వరు సాటి, మక్కువ గుణములకెవ్వరు సాటి మరుగని బజ్జైకు మందే సాటి, నీకులమొకటా నాకులమొకటా. ఇది పాల్కురికి సోమనాధుని వీర్హోవ భక్తి కాలం నాటి బాజీ మంతెనలో పాటల రామక్క, వెలిశేటి వీరమ్మ ఈ కవి సోదరుల పాటలు పాడుతారట సేకరిస్తే - ప్రచురిస్తే అదో అపూర్వ పూర్వ సాహితీ గంధం 5. గడ్డం మచ్చదాసు - మంగమ్మవల్లె, మం మానకొండూరు. 1980 వరకే కీర్తి శేషులు వీరు కొండగట్టు హనుమాన్‌ మంగళహారతులు" వ్రాసి ప్రచురించారు. ప్రతి లభించలేదు. కరీంనగర్‌ జిల్లా రచయిత చరిత్ర - పు. 280 ఈ. రాజమహ్మాద్‌ - వెంకటాయపల్లి, తా మల్యాల; మృతి - 1950లో రాజమహ్మద్‌గారు ఉర్జూ మాతృభాష అయినా తెలుగును చక్కగా నేర్చుకున్నారు. “తెలుగులో చాల పాటలు కీర్తనలు వ్రాశారు కరువులపై కాలాల పై, రోగాల పై కొత్త వత్సరాలపై వీరు వ్రాసిన పాటలు చాల వ్యాప్తి పొందినవి”. కజి.ర చరిత్ర - పు 22 ఈ కవితో ప్రత్యేక పరిచయం కలిగిన డా పింగళి లింబాద్రి రెడ్డి నెమిలికొండగారు1981లో వీర వివరాలు తెలిపారు. 7 ముకుందం - కోళ్ళమన్ది,తా సిరిసిల్ల, జననం - 1910 మరణం - 1981-85 మధ్య, ముకుందంగారు అనేక హారతులు భజన కీర్తనలు రచించారు. అవి అముద్రితాలు. కొని, అవి చక్కని శైలీ పద భావసంపద కలవని వినికిడి 'కజిర చ. - పుట. 147 ఈ జానపదకవి వివరాలు దేవత వేంకట రాములు కవిగారు తెలిపారు రచనలు సేకరించలేకపోయా(రు)ను. 8. తిరువేంగళం - వెలిచాల, మం కొత్తపల్లీ వీరు భక్తి పాటలు పద్యాలు రచించారు. క్షజిర.చ. - పుట 23 9. పెరుమాళ్ళయ్య - మానాకొందూరు. వీరు పద్య గేయ కవి కజిరచపు 23 10. గుడిపాటి పాపిరెడ్డి - జూలపల్లి. జననం - 1920, కీర్తిశేషులు కజిరచ - ప్త 149. పాసిరెడ్డిగారు మధుర గేయ కవితలు వ్రాశారు. వీరి దసరా గడలపాట బహుళ ప్రచారం పొందింది ఆ పాట అరంభమిది ఇది ద్విపద ీలిచ్చి పాలించు శ్రీలక్ష్మి ధవుడు వ్రాలిచ్చి కాపాడు వారిజోదృవుడు ఆలమందలు వాహనాలు మీకమర మేలైన నిలువుటద్దాలు మీ కలర. ఈ కవులందరూ ఇప్పుడు క్రీర్తిశేషులైనారు. పండిత కవులకంటె మిన్నగా ఇటువంటి జానపద

256 డా. మలయశ్రీ కరీంనగర్‌ జిల్లా సాపొత్య బరిత్రో'

  • వర, మధుర గేయ కవులే నాడు సామాన్య జనులకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సాహిత్యాన్ని అందించి ఆదర పొత్రులయ్యారు ఇంకా ఆ కాలంలో ఇటువంటి వారెందరో. .. 1 వచన వాజ్మయం : వెయ్యేండ్ల కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్రలో ఈ 20వ శతాబ్ది ఆరంభం వరకు పద్య కావ్యాలే తప్ప వచన రచనలు లేవు. మధ్యకాలంలో వేములవాడ సోమనాధసూరి వసుచరిత్ర వ్యాఖ్యానం ఒక్కటి మాత్రమే గణన కెక్కిన వచన గ్రంధం. అయినా జన వ్యవహారంలో గద్యం ఉంది శిలాశాసనాలు, చంపూ కావ్యాల్లోని వచనాలు యక్షగొన వీధి నాటకాల్లోని సంధి వచనాలు - సంభాషణలు ఆశ్వాసాంత గద్యలు ఇక్కడి ప్రాచీనాంధ్ర వచన రచనకు మచ్చు తునకలు ఈ అర్ధ శతాబ్ది (1901 - 1950) కాలంలోనూ పద్యకావ్యాలు, యక్షగానాలు, మధుర కవితలదే ఇక్కడ పై చేయిగా ఉంది. అప్పుడు నైజుం రాజభాష ఉరూ పారశాలల్లో ఉర్దూ మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతున్నా, అవి స్వదేశ - స్వభాషాభిమానాలు పునరుజ్జీవనం పొందుతున్న రోజులు, ఆ కాలపు వచన రచయితలు వీరు 1. వజ్జ్ఞల రాజారాంశర్మ ఘనాపారి, 2. రాజ వైద్య పింగళి లింబాద్రి రెడ్డి 3. చేనేత పితామహ గుంటుక నరసయ్య పంతులు 4 బహునూతుల సీతారామనాయుడు 5 వాసం వెంకట్రాజు. శ వజ్ఞల రాజారాంశర్మ్క ఘనాపాఠి, మంథని. రాజారాం శర్మగారు సంస్కృతాంధ్ర భాషల్లో పండితులు సంఘ సంస్కార దృక్పధం కలవారు. కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంతో కాబోలు 'పునర్వివాహ శాస్తం అను వచన పుస్తక రచనచేసి 1920లో ప్రచురించారు ఈవిషయం 0౭౧96301 ౧౮ ౧౧6౧2 ౧26651 - 1 971,లోని 70౪౧ 51460/01144004౧' విభాగంలో 165 పేజీలో ఉండి వీరిని గురించిన ఇతర వివరాలు తెలియలేదు, ఆ గ్రంధం లభించలేదు
  1. రాజవైద్యడాక్టర్‌ పింగళి లింబాద్రిరెడ్డి - నెమిలికొండ - 1900 - 1993 అలిత కళా సంగీత - సాహిత్య - వ్యవసాయ - వైద్య - రాజకీయాది లా అనేక రంగాల అపూర్వ సంగమం పింగళి లింబాద్రి రెడ్డిగారి జీవితం వీరికి ( ఖో 21... షస. సాహిత్యమందే అత్యంతాభిమానం కొన్ని పద్యాలు, గేయాలు రచించినా వచన _ ౧తఖాళ ప. రచనలో వీరిది గణనీయ స్థానం. నిరంతర పరిశోధన సత్యాన్వేషణ రచన వీరి న్న గ న్‌ య. ప్రత్యేకతలు వృద్ధుల నుండి పిల్లల వరకు వారి వారి స్థాయిని బట్టి న గ. కలుపుగోలుగా మెదిలేవారు. వారిచే గౌరవింప, ప్రేమింపబడేవారు. వందల్లో లం |. |. ఒక్కరుగా, చుక్కల్లో చంద్రుడుగా, స్ఫురద్రూపంతో హుందాతనంతో .____ ౨ న... కనిపించేవారు రెడ్డిగారు సజీవ విజ్ఞాన భాండాగారం దాదాపు తమ డెబ్బదేండ్ల జీవితకాలాన్ని కళా సాహిత్య వైద్య వ్యవసాయరంగాలకు అంకితం చేశారు. వైద్య పారిభాషిక పదకోశం రూరుస్తూ తమ తొంబది మూడవ యేట కేవలం నాలుగైదు రోజులు అస్వస్థతతో ఉండి కన్ను మూశారు. జననం - జీవితం : 1900 సం కార్తీక పూర్ణిమనాడు లింబాద్రిరెడ్డిగారు నెమిలికొండలోని ఓ సంపన్నరెడి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రి చంద్రమ్మ నర్సింహారెడ్డిగారలు ఏకైక పుత్రులు కావడంతో అల్లారు ముద్దుగా పెరుగుతూ కరీంనగర్‌లో మిడిల్‌ క్లాసు వరకు విద్యాభ్యాసం కావించారు తరవాత ఉత్తరప్రదేశ్‌ రాజవైద్య' డిగ్రీ గ్రహించారు. మొదటి నుండి కళాసాహిత్య, వైద్య, రాజకీయరంగాల నభిమానించారు కొన్నాళ్ళు ఓ నాటక సంస్థను నడిపించారు సినిమాల్లోనూ నటించారు పుస్తక

రెండవ భాగం - ౪ అధ్యాయం : “20ఏ శతాల్ల పూర్వాస్థ సాహిశ్యం- వచన వాబ్బయం 257 ప్రచురణ సంస్థను స్థాపించారు. మాడపాటి, సురవరం, డా॥ జయసూర్య, హయగ్రీవాచారి, దేవులపల్లి రామానుజరావు, ఒద్ది రాజు సోదరులు. పి.వి.నరసింహారావు మొదలగు ప్రముఖులతో సన్నిహితంగా మెదిలారు. ఆంధ్ర మహాసభ గగ్రంధాలయోద్యమాలతో పాల్గొన్నారు. కాంగ్రెసును అభిమానించి జాతీయోద్యమంలో చేరి, దేశ విముక్తికోసం పాటుపడ్డారు. స్వగ్రామంలో విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల స్థాపించి 21 పుస్తకాలు (1922 - 44) ప్రచురించారు. వానిలో కొన్ని ఇవి. మాడపాటి హన్మంతరావు - రుద్రమదేవి; ఒద్ది రాజు సోదరులు - భ్రమర, వీరావేశము, శౌర్యశక్తి దువ్వూరి - లవకుశ; పూతలపట్టు - కీరవాణి మాధవీయం; పొతూరి అంజయ్య - శకుంతల; కోట్ల సత్యనారాయణాచార్య - రామాశ్వమేధము మొదలగునవి. శెడ్డిగారి రచనలు - 1920 - 40 మధ్య : 1 విషములు - తచ్చికిత్సలు, 2. గృహ వైద్యం. 1975 - 92 మధ్య ఇవి -

  1. సేద్యం - వైద్యం ; మొదటి భాగం, 2. సేద్యం - వైద్యం; రెండవ భాగం
  2. ఆరోగ్యం - సౌభాగ్యం - తెలుగు అకాడమీ ప్రచురణ
  3. నిండా నూరేండ్లు జీవించాలంటే - బుక్‌లెట్‌ (పై పుస్తకాలు అచ్చయినవి) అముద్రితొలు : 1. మాయ (నవల), 2. స్వీయ చరిత్ర, 3. వైద్య పారిభాషిక పదకోశం, 4. వన్తు గుణదీపిక, 5. సప్తధాతులవణ చికిత్స. రెడ్డిగారు ఉర్పూ సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. ఆంగ్ల హిందీ భాషలు తెలుసు. గోలకొండ కవుల సంచికలో వీరి గేయ కవిత 'కోకిలాలాపం' ఉంది. తెలంగాణాలో అప్పటికి (1934) గేయరచన అపురూపం. కరీంనగర్‌ జిల్లాలో ఇదే మొట్టమొదటి ఆధునిక గేయం. రామసింహ కవి గేయాలున్నా అవి భక్తి కీర్తనల నుండి ఎదిగి వచ్చినవి - సామాజిక విమర్శలు. లింబారెడ్డిగారి కవిత ప్రకృతి వర్ణన. ముత్యాలసరాలు ఛందస్సులో ఉంది. సారస్వత జ్యోతి 54 సంచికలో వీరిదో కథ ఉంది. గోలకొండ, కాకతీయ, తెలుగు... అప్పటి వత్రికలు రెడ్డిగారి వైద్య రచనలు ప్రచురించాయి. పుస్తకాల వివరాలు : “విషములు తచ్చికీత్సలు' వైద్య గ్రంథం. విషజంతువుల నరీసృపాల కాట్టు విష పదార్థాల వలన ఏర్పడే ప్రమాదాల లక్షణాలు వానిని నివారించడానికి అనుసరించవలసిన పద్ధతులు, వాడవలసిన బెషధాలు ఈ గ్రంధంలో ఉన్నాయి.' తమ పుస్తక ప్రచురణ సంస్థ “విజ్ఞాన ద్రచారిణీ గ్రంధమాల' ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటికి విజ్ఞాన చంద్రికా గ్రంధమాల, అంధ్ర ప్రచారిణీ గ్రంధమాల తెలుగు పుస్తకాలను ప్రచురించేవి. ఆ రెండు పేర్ల సమైక్య రూపమే వీరి విజ్ఞాన ప్రచారిణీ గ్రంధమాల. గృహావైద్యం - పై శీర్తికతో చిట్కా వైద్య విషయాలు కొన్ని పత్రికలో ప్రచురితమైనా అవి పుస్తక రూపంలో వచ్చిరాకముందే వారి ప్రచురణ సంస్థ నిలిచిపోయింది. రజాకార్ల అల్లరి పోలీస్‌ యాక్షన్‌ల కాలం (1947 - 48) నుండి గ్రామ రాజకీయాల కారణంగా రెడ్డిగారి కలం మూగపోయింది. 1976 నుండి తిరిగి సాహిత్యరంగంలో విజృంభించారు. ఆ మధ్యకాలంలో వ్యవసాయం, ఉచిత వైద్య సేవతో కాలం గడిపారు. వారికి పంటచేలు, ఫల నృక్షాలు అఆ తరవాత కాలంలో వచ్చిన “సేద్యం వైద్యం' అపురూప గ్రంధం. వందల కూరగాయలు, ఆకుకూరలు మొదటి భాగంగా ప్రచురించారు. పువ్వు కూరలు - దుంపలు రెండవ భాగం వచ్చింది. పండ్లు రసాలు 1 ఈపుస్తకం అచ్చుప్రతిని కొన్నేండ్లక్రితం నేను చూసినా ఈ వ్యాసరచనా కాలంలో చూడలేకపోయాను.
  4. 1975-84 మధ్యకాలంలో 8 ఏండ్లు ఉద్యోగం కారణంగా నేను రెడ్డి గారి నెమిలికొండలో ఉండడం జరిగింది. నా స్నేహమే వారి రచనా పునరుజ్జీవనానికి కారణమని రెడ్డిగారనేవారు.

256 డా. మలయశ్రీ “కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” మూడవభాగం, పచ్చళ్ళు - ఊరగాయలు నాలుగవ భాగంగా కూర్చారు. అవి రచయితకు మంచిపేరు తేవడంతోపాటు ప్రజల్లో ఆయుర్వేదం పై అభిమానాన్ని పెంచాయి. మొక్కల ఫలపుష్పాదుల రూప గుణదోషములు, పోషక విలువలు, వాడవలసిన విధానాలతో పాటు వాటిని సాగు చేయు పద్దతులు చీడపీడల నివారణ మార్గాలు వివరించడం వీరి రచనలో వైశిష్ట్యం. వీరి ఈ పుస్తకాలు వైద్యులకు వ్యవసాయదారులకే కాక సామాన్య విద్యావంతులకు కూడా ఉపయుక్తాలు, ప్రతి శీర్షికా పదానికి సంస్కృత, హిందీ, ఉర్దూ అరబ్బీ, లాటిన్‌, ఇంగ్లీషు మొదలగు నామాలు సూచించారు. చరక సుశ్రుత సంహితల శ్లోకాలు ప్రమాణంగా ఉదహరించారు. ఆధునిక విజ్ఞానశాస్తకారుల అభిప్రాయాలను కూడా తెలిపారు. ఆయుర్వేద వైద్యాన్ని అల్లోపతి వైద్యంతోనేకాక హోమియో యునానీ బెషధ చికిత్సా విధానంతోనూ పోల్చి వివరించారు. ఈ మొదటి రెండు పుస్తకాలను కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గారు ప్రచురించారు. మూడవ పుస్తకం 'ఆరోగ్యం-సౌభాగ్యం' రోగ నిరోధక ఆహార విహారాలను వివరిస్తూ అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి సూచనలిస్తూ రచింపబడింది. ఇది 1992లో తెలుగు అకాడమీ 'హైదరాబాద్‌వారు జనరంజక గ్రంధమాలలో (ప్రచురించారు. నిండ మారేండ్లు బ్రతకాలంటే (ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌) అనే సూత్రంతో శారీరకారోగ్యానికి దార్జ్యతకు తీసుకోవల్సిన ముందు జాగ్రత్తలను సూచిస్తూ రచించారు. ఇదే రెడ్డిగారి చివరి రచన - బుక్‌లెట్‌. రెడ్డిగారి అముద్రిత 'స్వీయచరిత్ర* వారి సుదీర్హ జీవిత యాత్రలోని సాహిత్య రాజకీయ లలితకళల వైద్య వ్యవసాయాది విషయాలతో కూడి ఉంది. “వైద్య పొంభాషిక పద నిఘంటువు" తెలుగు సాంకేతిక పదాలకు సమానార్ధకాటైన నాలుగైదు భాషల పదాలు ఉన్నాయి. ఇది డాక్టర్లకు, వైద్య విద్యార్భలకు చాల ఉపకరించే గ్రంథం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన లింబాద్రి రెడ్డిగారు ఆంధ్రభాషాభిమానంతోపాటు, ఆంధ్రజాత్యభిమానం, కళాసాహిత్యాభిమానం కలవారు. మరో విచిత్ర విషయమేమంటే రెడ్డిగారు స్వర్ణకారక విద్యను సాధించాలనే సంకల్పంతో సాధుసన్యాసుల సొంగత్యంతో ఏండ్ల తరబడి కొండగుహలో గడిపారు. వనమూలికల సేకరణకు ఆటవికుల స్నేహంతో అడవుల్లో సంచరించారు. వాదభ్రష్టో రసశ్రేష్ట! అని ఆయుర్వేద వైద్యులుగా రూపాందారు. రెడ్డిగారిని గురించి ప్రముఖుల అభిప్రాయాలిట్టున్నవి. దాశరథిగారి అభిప్రాయం : “ఏక వేదిక నుండి డా. లింబాద్రిరెడ్డిగారి ఈ గ్రంధం మరియు నా కవితా సంపుటి “ధ్వజమెత్తిన ప్రజి ఆవిష్కరించబడ్డాయి, ఇది అదృష్టం. అలనాడు స్వాతంత్ర్య సమర పోరాటంలో కూడా కలిసిమెలసి సాహిత్యంగా శారీరకంగా పోరాడిన వారమే. “విజ్ఞాన ప్రచారిణీ” విజ్ఞాన భాండార మనదగిన వీరి గ్రంధాన్ని ప్రతి అక్షరాస్యుడు చదువుకొని దైనందిన జీవితంలో లాభపడవచ్చునుగ 1182, హైదరాబాద్‌. దేవులపల్లి రామానుజరావుగారి అభిప్రాయం : “ఈ (గ్రంథమాల సంపాదకులు డాక్టర్‌ లింబార్రిరెడ్డిగారు బహుముఖమైన ప్రతిభగల వయోవృద్ధులు. వ్యవసాయము, వైద్యములో వారు ప్రవీఖులే కాక తెలంగాణా సాహిత్య రంగములో సుప్రసిద్ధులు. తెలంగాణాలో వారు పాల్గొనని జాతీయోద్యమమే లేదనినచో అతిశయోక్తి కాజాలదు. సుమారొక అర్ధ శతాబ్దికి పైగా వారు దేశసేవ 3. కవి గారి మిత్రులైన మలయశ్రీ - చంజర్ల - 505 469 గారి వద్ద ఉంది. 4, కవిగారి ఏకైక పుత్రులైన పి. నర్సింహారెడ్డి, రిటైర్డ్‌ ఎస్‌.పి. నెమిలికొండ గారి వద్ద ఉంది. 5. డా॥ పి.ఎల్‌.రెడ్డి గారి "సేద్యం - వైద్యం' మొ.భా. ద్వితియ ముద్రణ పీఠిక నుండి.

రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతా డ్రూర్వొర్థ సాతాత్యం” వచన వాబ్బ్మయం 2569 భాషాసేవ చేస్తూ ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతున్నారు!

ఇంకా ప్రాఫెసర్‌ డా॥ సి. నారాయణరెడ్డి, ఆచార్య డా బి. రామారాజు, కవి జె.బాపురెడ్డి, వి. కేశవరావు, గీట్ల జనార్ధనరెడ్డి, అద్దూరు రామచంద్రారెడ్డి అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ - అంధ్రప్రదేశ్‌. ఇండియన్‌ మెడిసన్‌ విజయవాడ... ప్రశంసలు వీరి “సేద్యం - వైద్యం' గ్రంథం తొలి రెండు భాగాల మలి ముద్రణ (గ్రంథంలో ఉన్నాయి.

ప్రముఖ గేయకవి కాళోజి - హన్మకొండ, ప్రా.జ.ఎస్‌.రెడ్డి - తిరుపతి మొ॥ లగు ప్రముఖులు రెడ్డిగారికి మిత్రులు. పద్యకవి గార్ల పాటి రాఘవరెడ్డి వరంగల్లుగారితో ఏర్పడిన సాహిత్యమైత్రిని బట్టి వారితో వియ్యమందారు లింబాద్రిరెడ్డిగారు. సంపూర్ణ సాహిత్యమూర్తి వివిధ రంగాలలో సమాజ సేవ కావించి తరించిన సార్థక ధన్యజీవి మాన్య పురుషుడు డా॥ పి.ఎల్‌. రెడ్డి గారు. 3. 'చేనేత పితామహ' గుంటక నరసయ్య - గోపాల పురం; మ. బెజ్జంకి : 1303 - 1989

సామాన్యుడుగా పుట్టి స్వయంకృషితో సమాజ సేవతో అంచెలంచెలుగా జ్‌.

పైకెదిగి మాన్యుడైన విశిష్ట వ్యక్తి గుంటక నరసయ్య పంతులుగారు. వారు తా | లచ్చంగా గాంధేయవాది. వేషంలో దేశీయత, భావంలో జాతీయత, భాషలో గ్గ న - నమ్రత, మనస్సులో స్వచ్భత కలవారు. స్వకుల పద్మశాలి సంఘోద్ధరణ, |. మ. నాణ్యమైన చేనేత వస్రోత్పత్తి - వ్యాప్తి కావించడానికి తమ ఎనభై ఏడేండ్ల | హ్‌. జీవితంలో అరవై యేండ్లకాలం అహర్నిశలు కృషిచేశారు. న్‌ త్త .

సరళగ్రాంధిక భాషలో తెలుగు వచన రచనలు వెలయించారు. వీరి ౮ ట్రీ రచనల పేర్లివి, .

  1. విచిత్ర జగళి - 1936, 2. భృగ్వాదుల ప్రభావము - 1937, 3, భావలింగశతక వ్యాఖ్యానం 1975, 4. సంక్షిప్త పద్మశాలి వంశచరిత్ర - 1977, ఈ. భృగ్వాదులు - (స,ప.వ.చరిత్ర) - 1980,

“పద్మశాలి” పత్రికకు సహాయ సంపాదకులుగా, 'నేత' మాన పత్రికకు 1963 సంపాదకులుగా, “పద్మజ్యోతి మాసపత్రికకు 1981 ప్రోత్సాహకులుగా - పలు పత్రికలకు రచయితగా పనిచేశారు. జన్మవంళాదికాలు : నరసయ్యగారు పద్మశాలి కులజులు. కరీంనగర్‌ సమీపంలోని గోపాలపురం స్వస్థలం. హుస్నాబాద్‌ తాలూకాలోని అక్కన్నపేట భూస్వాముల కోరికగా వీరి తండ్రి. రాజయ్యగారు చేనేత వస్త్రాలు తయారుచేసి ఇవ్వడానికి సకుటుంబంగా మకాం మార్చారు. అక్కడే పంతులుగారు 1903లో జన్మించారు. తల్లి సాయమ్మ, నరసయ్యగారికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఆరుగురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు. సామాన్య ఆర్ధిక స్తోమతకల కుటుంబం. సంపాదనకంటే సంతానమే భాగ్యమని భావించే కాలం. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు తక్కువ. అక్కన్నపేటలో అక్షరాభ్యాసమేని లేక ఆటపాటలతో పనిపాటలతో నరసయ్యగారి బాల్య కౌమారాలు గడిచాయి. ఓ భూస్వామి పిల్లలకు చదువు చెప్పవచ్చిన పంతులు వద్ద పదమూడవ యేట అక్షరాలు దిద్దాడు. అదీ నాలుగైదు మాసాలే. అంతలో విషజ్వరాలు వ్యాపించి తాను జ్వరంపాలై చదువు నిలచిపోయింది. కరువు వ్యాపించింది. తండ్రి మరణించారు.

అన్నలతోపాటు బ్రతుకు తెరువుకోసం మేనమామల నివాస స్థలమైన మహారాష్ట్రలోని అహ్మవ్‌ నగర్‌ 1918లో వెళ్ళాడు. నేత పని చేస్తూనే స్వయంగా దొరికిన ప్రతి పుస్తకాన్ని చదువుకోసాగాడు. ఈ ప్రాంతం నుండి వెళ్ళిన కళాకారుల తెలుగు యక్షగాన నాటకాలు చూసేవాడు. అట్లా వీరి విద్యావికాసం 6. రెడ్డిగారు అంకితం పొందిన మలయశ్రీ “పల్లె సీమ' గేయకావ్యం పీఠిక నుండి - 1978.

260 డా మలయశ్రీ కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర " చెప్పసాగొడు, భారతం పురాణం కాలక్షేపం కావించి విద్యను పెంచుకుంటూ జనానికి పంచాడు. ఇదంతా మహారాష్ట్రలో ప్రవాసాంధ్రులకు కావించిన తెలుగు భాషా సేవ అప్పుడు నేత కార్మికులుగా పద్మశాలీలే మహారాష్ట్రలో ఉన్నారు కనుక ఆ ప్రయోజనం ఎక్కువగా వారికే దక్కింది జాతి సేన : పంతులుగారు 1920లో గాంధిగారి దేశభక్తి ఆదర్శాలకు కట్టుబడి ఖద్దరు ధరించారు. స్వజాత్యున్నతికి చేనేత పరిశ్రమాభివృద్ధికి కృషిచేయనారంభించారు. పూనా, బొంబాయి, షోలాపూర్‌. మొ్యునగరాల్లో హరికధా కాలక్షేపం చేస్తూ కులప్రశస్తిని చాటడమే కాక అంధ విశ్వాసాలను, కులపెద్దల కుచ్చితాలను ఖండిస్తూ ఉత్తమ గుణ ప్రబోధం కావించేవారు. తప్పిపోయిన సన్యాసం : భగవధ్గీత పంతులుగారికి 1926 నుండి నిత్యపారాయణ (గ్రంధం ఆయన హిమాలయాలకు వెళ్ళి తపశ్చర్యలో కాలం గడపాలనుకున్నారు. కాని కులపెద్దల కోరికగా ఆ ప్రయత్నాన్ని విరమించుకొని స్వజాతి - కులవృత్తి సేవాభివృద్ధలకే జీవితాన్ని అంకితం చేశారు “'మానవసేవయే మాధవసేవ అనే వివేకానందస్వామి సూక్తి పంతులుగారికి ఆదర్శం (త్రికరణశుద్ధిగా సత్యసంధతతో మెదలాలనే గాంధీజీ ప్రబోధం ప్రేరణ. మహారాష్టలో ఉన్న కాలంలోనే వీరి నాలుగు (గ్రంధాల్లోని మొదటి రెండు పుస్తకాలు రచించి వదాన్యుల సహకారంతో బెజవాడలో ముద్రించారు 1945 నుండి వీరి సేవాకార్యక్రమాలు నైజాం తెలంగాణా ప్రాంతానికి విస్తరించాయి. సభలు సంఘాలు నీతి ప్రబోధం జాతి సంస్కారం వీరి కార్యక్రమాలు పుస్తక పరిచయం 1 విచిత్ర జగతి - 19336 ముద్రణ ఇది స్వజాత్యుద్ధరణం కోసం రచించపబడిన పుస్తకం ప్రతి లభించలేదు. కాని దీని గురించిన ప్రకటన వీరి రెండవ పుస్తకమైన భృగ్యాదుల ప్రభావము" ముఖ పత్రం 4వ పుటపై ఇట్టుంది “ఇందు ఇప్పుడు ప్రపంచమందున్న విద్యాధికులు, విద్యావిహినులు చేయు విచిత్ర చర్యలు బహుచక్కగా వివరింపబడి హిందువుల శ్రేష్టభ్వము బుజువు చేయబడినది. ఎల్లరు చధువదగిన గ్రంధము' వెల- 2 అణాలు 2. భృగ్యాదుల ప్రభావము - 1937 ముద్రణ. 180 పుటలు 6 ప్రకరణాలు ఈ వచన పుస్తకంలోని తం పుటలు పద్మశాలి పత్రికా సంపొదకులైనతాడిపర్తి శ్రీరాములు మంగళగిరి గారు సవరించినట్టు పరికలో ఉంది. కాబట్టీ పంతులుగారి రచనా విన్యాసావలోశనానికి తర్వాతి భాగంలోని ఒక్ష ఘట్టం చూపబడుతున్నది స్ట “ప్రశ్న - మీరనున ట్లు పురాణములు సత్యగ్రంధములేయైన శ్రీ దయానంద సరస్వతులవారేల ఖండన జేసిరి? ఉత్తరువు - వారు పురాణముల ఖండన జేయలేదు పురాణములలో నిటీవల గలిసించిన దోషముల ఖండన చేసినారు కానలసిన విమర్శించి చూడుము ఇప్పుడు మనము కూడా అందులోని సత్య విషయములనే యొప్పుకొనుచున్నాము అదిగాక సృష్ట్యాదులు, వంశాదులు గోత్రము ్రవర, సూత్రము, శాఖ వీనిలో కల్చితము జేయుటకు గూడ నెవరికి సాధ్యముగాదు అవి వేదోక్తమగుటచే న 1 పంతులుగారు కరీంనగర్‌ వారని మొదట తెలియజేసి సంక్షిప్త వివరాలు అందిచ్చినవారు గోపాల్‌పూర్‌ వొస్తవ్యులైన వాసం శివనారాయణ, తెలుగు లెక్చరర్‌ కరీంనగర్‌ గారు. పంతులుగారి జీవితవిశేషాలు తెలుసటంతో పాటు వారి భృగువంశాదులు గ్రంధాన్ని, అమృతోత్సవ సంచికను ఇచ్చినవారు ఎక్కలడదేవి లక్ష్మణ కోరుట్ల గారు అమృతోత్సవ సంచికలోని ప్రముఖుల వ్యాసాలు, గుంటక వారి స్వీయపరిచయం వ్రాయడానికి అమితంగా తోడ్పడ్డాయి - రచయిత

రెండవ భాగం - ౪ అధ్యాయం 205 శతాబ్ద పూర్వాస్థ సాహిత్యం” వచన వాబ్బయం 261 మార్చుట కెవరికిని వీలుగాదు ఇప్పటికి మనము గూడ నా వేదాభిప్రాయము ననుసరించియే నడుపవలయును - భృప్ర పుట.45

భృగుమహర్షి తమ కుల మూల పురుషునిగా, మార్కండేయుని కులదైవంగా, అతని పుత్రుడైన భావనర్షి సంతానమే తామని పద్మశాలీయులు భావిస్తారు ఆ విషయాలన్నీ పురాణ గాధలతోనహా నరసయ్య పంతులుగారు ఆరు ప్రకరణాల్లో వివరించారు. ఆరవది “క్రర్తవ్యం' ప్రబోధం - 137 నుండి

ఇందులో బీద గురువులను 'దొాంబికుల మోసముల నీచ స్వార్ధ చర్యల ఖండిస్తూ (166) తమ జాతికి అభిమాన హీనత్వము, ప్రజ్ఞారాహిత్యము దుర్చలత్వము దురాచారము, దారిద్ర్యము, సోమరితనము, గతిహీనము పశుప్రాయము - మొదలగు చెరువులకు వీరి బోధలు పుట్టినిల్లు (168) అని అన్నారు వీరు మంత్ర తంత్రాల చిల్లర దేవతల పూజల ఖండించారు. కులపెద్దల కుటిల చేష్టలను ఖండించి ఎదిరించాలన్నాడు కూనపులి మొదలగు ఉపకులాల పెత్తనాలు నిరసించాడు విద్య విలువను (177) ప్రబోధించాడు

గుంటుక నరసయ్య పంతులుగారి ఈ గ్రంధం ముగింపు కందుకూరి వీరేశలింగం పంతులుగారి 'స్వీయచరిత్రలోని తుది విన్నప ప్రసంగాన్ని తలపించే సంఘహిత వాక్యాలు కొన్ని ఇవి

“కుల మహాశయులారా సోదర సోదరులారా నేమిమ్ము చాల వరకు నొప్పించితిని, చాల కష్టపెట్టితిని ఎంత కష్టమైన ఇక మనము కన్నులు మూయుట తగదని కడపటికొక సారి వేడుకొనెదను. ప్రపంచమందు బాగుపడ గూడదని యెవరు తలంతురు? ఎవరును తలంపరు. లేక బాగుపడుడు అనిన యెవరొప్పుకొనరు అందరొప్పుకొందురు మొదట మనము మేలుకోవలె మేలుకొని మనను బట్టుకొనిన దుష్టములఖండింపవలె తరవాత విద్యాబుద్ధులు సంపొదింపవలె. మన మంచి చెరుపులు మన ేతిలో నున్నవి ఇంతవరకు దుర్షశను తెచ్చిపెట్టుకొన్నది మనమే ఇక యుత్తమదళ బొందువారము మనమే. అంతకుగల సామర్థ్యము మనలోనే యున్నది పద్మశాలీయుల హృదయములందు నిండిపోయిన అజ్ఞానమును తొలగించి వారి యంతః కరణములందు సుజ్ఞానమను వెలుతురును గలిపింపు మనియు, వారి పూర్వ ఘనత ఇప్పటి హీనత గోచరమగునట్లు జేసి ఉద్ధరింపుమనియు అపదోద్ధారకుడగు భగశంతుని ప్రార్ధించెదను' 1937 ఆ దేవుడేమి చేసెనో తెలియదు కాని ఈ రచయిత మాత్రం మహారాష్ట్రలో ఉంటూనే నైజాం ప్రాంతంలో తెలంగాణాలో పలు సభలు ఏర్పాటుచేసి పద్మశొలి జాతిని మేలళ్కాలిపారు అంధ్ర-కోస్తా రాయలసీమల పద్మశాలీయుల ఏకవేదికకు తెచ్చారు అఖిలభారత పన్మశాలి సంఘ నభలకు అధ్యక్షత వహించారు హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైకో ఆప్కో చేనేత సంఘాల అభ్యున్నతికి కృషిచేశారు కొండా లక్ష్మణ్‌ బాపూజీని తమకు తోడు చేసుకున్నారు.

భావలింగ శతక వ్యాఖ్యః - దాదాపు 200 ఏండ్ల క్రితం పల్నాడు సీమలోని చెర్లగుడిపాడు గ్రామానికి చెందిన పద్మశాలి కవయిత్రి దార్గసుందరమ్మ గారు. “పాపభయ విభంగ భావలింగ అనే మకుటంతో ఆలవెలది పద్యశతకాన్ని రచించారు దాన్ని మొదట కొండవీటి వెంకటకవి ముద్రించారు, తర్వాత వరంగల్లు శ్రైవులు రచయిత్రి పేరు లేక ముద్రించారు దానికి పంతులుగారు విచారించి స్వయంగా ప్రతిపద్యానికి తాత్చర్యం వ్రాసి భావలింగ శతకాన్ని 75లో రచయిత్రి పేరుతో సహాముద్రించారు

అయన భాగ్యనగరంలోని రాజమహల్లాలో పద్మశాలి భవనం నిర్మించారు నల్లకుంట శంకర మరం వెనుకగా 200 గృహాల పద్మశాలినగర్‌ నిర్మాణానికి కారకులైనారు సికింద్రాబాద్‌ ఇతర జిల్లాలలోని అనేక పద్మశాలి - చేనేత సంఘ భవనాలు - సభా భవనాలు-కల్యాణమంటపాలు - అనేక మార్కండేయ మందిరాలు విద్యార్థి వసతి గృహాలు పంతులు గారి ప్రోత్సాహ సహకారాలతో రూపొందాయి

262 డొ మలయశ్రీ కరీంనగర్‌ జిల్లా సొహిత్య చరిత్ర” సాధుసంతుల కవి పండితుల సన్మానాలు కావించారు ఇట్లా పంతులుగారి సేవ ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలి జాతి అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడింది స్వగ్రామమైన గోపాలపురంలో స్వంత డబ్బు డిపాజిట్‌గా చెల్లించి జిల్లా పరిషత్‌ వారి గ్రాంటుతో పాఠశాల భవనాన్ని నిర్మింపజేశారు కరీంనగర్‌ జిల్లా పద్మశాలి భవన్‌ను - విద్యార్థి హాస్టల్‌ను ప్రత్యేక శ్రద్ధతో రూపొందింపజేశారు తము షష్టి పూర్తి సన్మాన నిధిని "పేద విద్యార్థుల సంక్షేమ నిధికి సమర్పించారు 1975లో సికిందరాబాద్‌ శ్రేమామతీ నాట్యకళా సమితి వారు పంతులుగారిని ఉత్తమ సంఘ సేవకునిగా ఘనంగా సన్మానించి ప్రత్యేక సంచిక వెలువరించారు. 1964లో పంతులు గారి షష్టిపూర్తి సన్మానోళ్సవ ప్రత్యేక సంచికను ముఖ్య అతిధిగా వచ్చిన ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ బూర్గుల రామకృష్ణ రావు గారు ఆవిష్కరించారు. 1986లో పంతులు గారి అమృతోత్సవ సంచికను (80 ఏండ్లు సహస్ర చంద్ర దర్శనం పూర్తిచేసిన సందర్భమున వెలువరించిన సన్మాన సంచిక) ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి గారు ఆవిష్కరించారు. బెజవాడ గోపాలరెడ్డి దామోదరం సంజీవయ్య మొ ప్రముఖులు వీరి సభలకు వచ్చారు. కాటూరి, సివి సుబ్బన్న అవధాని వీరి సాహిత్య-కవి సమ్మేళన నభలలో సన్మానితులు అనేకులు ప్రముఖ పీఠాధిపతులు ప్రత్యేకంగా వీరి ఆరాధనలందుకున్నారు ఇట్టా గుంటక నరసయ్య పంతులు గారి ప్రజాహిత కార్యక్రమాలు చూస్తే వారు వామవ రూపం నుండి క్రమంగా త్రివిక్రమావతారానికి ఎదిగిన వైనం తెలిసి వస్తుంది పంతులు గారి అమృతోత్సవ సంచికలోని అభినందనలతో కూడిన ప్రకటనలు ఆడిలాబాద్‌ నుండి నెల్లూరు వరకు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఉన్నాయి ఇంకా బెంగళూరు బొంబాయి ప్రాంతాల అభిమానులు అందించినవి ఉన్నాయి. ఇది పంతులు గారి ప్రత్యేక వ్యక్తిత్వానికి లోకప్రయతకు నిదర్శనం “ బేనేత పితామహి గుంటక నరసయ్య పంతులు గారి రచనలు కరీంనగర్‌ జిల్టా తొలితరం సంఘ సంస్కార వచన సాహిత్యం. ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలి వారికి అవి తలమానికాలు 4. బహూసూతుల సీతారామనాయుడు - హుజూరాబాద్‌. జననం - ప్లవంగ 1906 మృతి = 1967 సీతారామనాయుడు గారిది హుజూరాబాద్‌ వీరి పూర్వులు బొబ్బిలి ప్రాంతపు తెలగాలు యుద్ధ వీరులు కాబట్టి నాయుడు నామధారులు ఈ జిల్లాలో వీరికి ఎల్లాపులతో వివాహ బాంధవ్యాలున్నవి నాయుడు గారు ఆ కాలంలో ఫస్సుగ్రేడు ప్లీడర్‌గా పనిచేశారు న్యాయవాదిగా తాలుకా కేంద్రమైన హుజూరాబాద్‌కు చుట్టూ పది గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. వీరు భారక స్వాఠంత్ర్య - తెలంగాజూ విముక్తి జాతీయోద్యమాలలో క్రియాశీల పాత్ర నిర్వహించిన రాజకీయనాయకులు ఆ తర్వాత హుజూరాబాద్‌ మేజర్‌ గ్రామ పంచాయితీకి సర్పంచ్‌గా ఎన్నకోబడి పట్టణాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాభిమానం చూరగొన్నారు వీరు రాష్ట్ర స్థాయి కాంగ్రెసు పెద్దలతో గుర్తింపు పొందినారు నాయుడు గారికి సాహిత్యం అభిమాన విషయం వచన రచనలు, వచన కవితలు రచించారు వీరి వ్యాసాలు కవితలు నాటి ప్రముఖ దిన-వార పత్రికలలో ప్రచురింపబడినవి ' చమత్కార సంభాషణ 1 నాయుడుగారి కూతురు కనుల గారు ఆమె చిన్న తమ్ముడు తండ్రిగారి వివరాలు చెప్పి, పేపర్‌ కట్స్‌ చూపారు. కాని రచనలు మాత్రం లభించలేదు అధ్యాపక మిత్రులు శ్రీహరి బిఎస్సి బిఇడి, హుజూరాబాద్‌ గారు నాయుడుగారి కుటుంబ సభ్యులతో పరిచయం కావించారు ది వేంకటప్పయ్య నొయుడు గారిని నేను కలుసుకోలేకపోయాను.

రెండవ భాగం - ౪ అధ్యాయం “20వ శతాల్చ ప్రూర్వార్థ సాహాశ్యం” వచన వాబ్మయం 263

  • హాస్యం వీరి రచనలకు సహజాలంకారాలు రంగస్థలంపై తాను స్వయంగా రచించిన ఏక పాత్రలు నటిస్తూ, వ్యంగ్యభావ గర్భిత సునిశిత హాస్య భాషణంతో శ్రోతల- ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించడంతోపాటు కర్తవ్యాన్ని ఆలోచింప జేసేవారు ఉర్జూ భాషలో విద్యాభ్యాసం కావించినా ఆంగ్లభాష వేర్చినా తెలుగు సాహిత్యమంటే సీతారామా నాయుడు గారికి అత్యంతాభిమానం

నాయుడు గారి ముద్రిత రచనలు : 1 ఇల్లందు కుంట రామాయణము, 2 జాతీయ వాదం (గేయ కావ్యం), 3 కొత్త కొండ దేవస్థాన చరిత్ర (20 పుటలు - వచనం)

ఇప్పుడు ఈ కృతులు అలభ్యాలు మొదటిది అధిక జనవ్యాప్తి పొందిన “ఇల్లంతకుంట రామాయణ" యక్షగానమో వేరే రచనమో తెలియదు ఇది వచన రచన కొనోవు. ఎందుకంటే నాయుడు గారు యక్షగాన రచయిత అని, వారు కానీ వారిని తెలిసినవారు కానీ అనలేదు రెండవది గేయ కావ్యం. ముద్రణ తేది తెలియకున్నా పుస్తకం "పేరునుబట్టి భారత స్వాతంత్ర్యానికి పూర్వపు తెలంగాణా ఆంధ్రమహాసభల కాలపుదని (1921-50) చెప్పవచ్చు 1934 సిరిసిల్ల చతుర్థాంధ్ర మహాసభల నుండి ఈ జిల్లాలో రాజకీయ చైతన్యం ప్రసరించింది కావున వీరి జాతీయ వాద గేయ కొవ్యం 1935-45 మధ్యకాలంలో విరచితం ముద్రితం అనుకోవడం అసంగతం కాదు చివరిది స్థల దేవాలయ చరిత్ర కొత్తకొండ దేవస్థానం వారు ముద్రించారు

సీతారామ నాయుడు గారికి 'హాన్యకళా ప్రపూర్ణ అను బిరుదు ఇవ్వబడింది ధ్వన్యనుకరణ సామ్రాట్‌ నేరెళ్ళ వేణు మాధవ్‌ గారు నాయుడు గారి 'బుడబుక్కల పాత్ర' అభినయాన్ని విని ఆ మాటలు వ్రాసుకొని వెళ్ళారని నాయుడు గారి కూతురు రాజకీయనాయకురాలు సుంకరకమల చెప్పారు. ఈమ అన్న వెంకటప్పయ్య నాయుడు బి డి ఓ. స్టేషన్‌ ఘన్‌పూర్‌ గారికి నాన్నగారి వివరాలు తనకంటె ఎక్కువ తెలుసని నాయుడు గారి సోదరుని చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు తెలిపారు 2

సీతారామానాయుడు గారి జాతీయాభిమానం, దేశసేవ, సాహిత్య నృజన , నన మొ బహుముఖ ప్రజ్ఞలను 'ఆంధ్ర ప్రభ పత్రిక (తేది 16 111964) ప్రశంసించింది. సార్థక జీవనులైన సీతారామనాయుడు గారి మృతికి 1967 ప్రముఖ సాహితీవేత్తలతోపాటు అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రులైన జెవి నర్చింగారావ్స, మజ్జి చెన్నారెడ్డి వంటి ప్రముఖ కాంగ్రైను రాజకీయనాయకులు సానుభూతి సందేశాలు పంపించారు.

వీరి పాటలు శైలీ ప్రసన్నత కలవి. కనులున్న గుడ్డివారికంటెళ కవి అంధులైనా అక్షరసాక్షి కవికి కనులకంటే ముఖ్యం జ్జాన చక్తువు. అలతి భాషాదోషాలున్నా క్షంతవ్యాలు. ఈ వరకవి సహజకవిత భక్త జన మనోరంజని క్‌ు వాసం వెంకట్రాజు (వెంకట్రాజయ్య) - గోపాలపురం, మం. బెజ్జంకి, కాలం 1912-81

వెంకట్రాజంగారు పద్మశాలి చేనేత, వైద్యం కుల పౌరోహిత్యం వృత్తులుగా జీవించి చివరి దశలో కరీంనగర్‌ గణేశ్‌నగర్‌కు మకాం మార్చారు ఆయన తండ్రి కొండయ్య కొడుకు (శరభయ్య) కొడుకు శివనారాయణ ఎం ఏ కవిగారి వద్ద ఈ తాతగారు రచించిన ఒక వచన పుస్తకం వ్రాతప్రతి ఉంది ఈ పుస్తకం పేరు త్రిగుణాత్మక ప్రభావ లక్షణము రిజిస్టర్‌ సైజులో 24 పుటలు సోదర సోదరీ మణులారా అని ఆరంభమై, స్వకుల పురోహితుడు అను మాటతో సమాష్తమైన ఈ లేఖా రూప కృతి కవి తలంపులో గ్రంధమే అనడానికి ఇందలి 24 పుటలోని రచయిత మాటలను బట్టి తెలుసుకోవచ్చు

264 డా. మలయశ్రీ “కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర” “ఎందరో భక్తులు వ్రాసినవి మనము చదువుచున్నాము. కాని, ల అమరు లక్షణములను తనంతట తానే గ్రహించలేని వారు సామాన్య జనులు వీటిని (స్మ చిన్న పాత్తముల రూపమున నున్నచో సులభముగా గ్రహించెదరను భావముతో “౧” నిజానిజాలను, రహస్య విషయములను గూడ తెలియజేయు పద్యములలో శు ళ శబ్దార్థములతో సూచనలు పూర్వులే వ్రాసి యున్నారు. వాటిని సాధారణ జనుల వాడుక భాషలో వివరించి ప్రచార మొనర్చుటయే యీ గ్రంధ లక్ష్యము.” ఆర్యసమాజ ప్రభావంతో విరచితమైన ఈ ప్రసంగ వ్యాసలేఖా రూప పుస్తకంలో గుణలక్షణములు, గణములు, ప్రారబ్ధ కర్మఫలితాలు, నవగ్రహ సంచార ఫలితాలు, పాతివ్రత్యనుహత్వం, విద్య విలువ, నరజన్మవైశిష్ట్రం, ఆచారాల ప్రాశస్త్యం మొ॥ విషయాలు సోదాహరణ సహితంగా సంగ్రహంగా వివరించబడినవి. కవి తమ ప్రబోధ ప్రవచనానికి బలకరంగా వేమన... పద్యాలు, భగవద్గీత, నీతి శాస్తం శోకాలను ఉదహరించారు. కర్శత్వం తెలియని మకుటంతో ఒక సీస పద్యముంది. ఇదే మకుటంతో 'రామతారకదశరథరాజ తనయ మరో పద్యం రావికల్‌ పురుషోత్తమ దాసు వ్రాత ప్రతిలో కనిపించింది. కవి పేరు తెలియని నాలుగ్రిదు పద్యాల్గో రెండు చూడండి. 1 తప్పులేకుండ నుండిన దైవసముడు, దైవభక్తుల నిందించి తగవుదలప తర తరంబులకును ఘోరనరకమౌను, తానె గుడువంగ దెలియును దైవమహిమ. 2. ఒకరి మేలు గూర్చి యోర్వలేక నరుడు, వేయిజేయు తానె వెతలు గుడుచు కడకు చింతజేయ గలుగదు లాభంబు, వాడుకొనెడి జనుల చూడుడయ్య, వీరు కవి కాదు - అల్పుడెపుడు పల్కు పద్యం - మొదటి రెండు చరణాలు మార్చినవి “గంగానది పారు' అని గణభంగంతో రాసుకోవడం అందుకు సాక్ష్యం. వాసం వెంకటరాజంగారి ఈ వచన రచన ఇంచుమించు ఈ శతాబ్ది నడిమి కాలానిది. వీరు నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న సాహసి సంఘ సంస్కారభావ సౌజన్యశీలి. సాహితీ సమౌలోకనం చరిత్ర: భారత దేశ చరిత్రలో ఈ ఇరువదవ శతాబ్లీ పూర్వార్థం అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలం. 1911లో ఆంగ్ల పాలకుల భారత రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారింది. అంతకు ఆరేండ్లు ముందుగనే 1905లో బెంగాళ్‌ విభజన సంవత్సరంలోనే, కరీంనగర్‌ జిల్లా కేంద్రం వెలిగందుల నుండి కరీంనగర్‌కు మార్చబడింది. * అంతకుపూర్వం కరింనగర్‌ “అరిపిరాల' అనే చిన్న గ్రామం. 2 రెండవ అరికేసరి ధారపయ్యకు దానమిచ్చిన 'అరిపణపల్లి' ఇదేనేమో, *

  • ' కరీంనగరం మండల చరిత్ర - 1881; ఈనాడు ప్రత్యేక సంచిక - 1993.
  1. ధూపాొటి వేంకటరమణాచార్యుల వ్యాసం. సారస్వత జ్యోతి 1954 3 పీసీ. పరబ్రహ్మ శాస్త్రి 1౧90గ01009 0 గ౭గగ౧౧౭౦౬| 0196 1974 - ౧.1౫౦. 1,5.3
  2. డా. జెసి, రమణయ్య “76౧0166 ౦! 3041 1౧618
  3. మొదటి ఆంధ్ర మహాసభ ౩ మార్చి 1930 జోగిపేట, అధ్యక్షులు - సురవరం ప్రతాపరెడ్డి 'రెండవ ఆంధ్ర మహాసభ డిసెంబర్‌ 1931 దేవరకొండ, అధ్యక్షులు - బూర్గుల రామకృష్ణ రావు మూడవ అంధ్ర మహాసభ 1934 - ఖమ్మం - అ. పులిజాల హన్మంతరావు నాల్గవది సిరిసిల్ల, అయిదవది మహబూబ్‌నగర్‌, ఆరవది నిజామాబాద్‌లో జరిగాయి.

రెండవ భాగం - ౪ అధ్యాయం “205 శతాబ్బ పూర్వార్ణ సాహిత్యం వచన వాజ్మయం 265 1897లో కరీంనగర్‌ జిల్లాలో ఉన్న 9 తాలూకాల్గోని మూడు తాలూకాలు ఈ జిల్లా కేంద్రం మారిన 1905 సం లో పొరుగు జిల్లాలకు (అదిలాబాద్‌-మెదకు) మారాయి అవి చెన్నూరు, లకెట్టి పేట, సిద్దిపేట ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో ఉన్న పర్కాల 1905 నుండి 1953 వరకుకరీంనగర్‌ జిల్లాలోనే ఉండేది * తిలకు గాంధీ భగత్‌సింగ్‌, సుభాశ్చంద్రబోసు మొ ప్రముఖుల స్వాతంత్ర్య పోరాటాలు ఈ కాలానివే గాంధీజీ సహాయనిరాకరణ సత్యాగ్రహ ప్రభావాలు, జాతీయాభిమాన సంఘ సంస్కరణ భావాలు తెలంగాణాపై బాగా ప్రసరించాయి అల్లూరి సీతారామరాజు తీవ్రవాధ పోరాటం కోస్తా ప్రాంతానిది. కోస్తా రాయలసీయల్లో జరిగినటువంటి తిరుగుబాటు ఉద్యమాలు ఈ జిల్లాలో లేవు కొమరం భీం గిరిజన పోరాటం 1940 అదిలాబాద్‌ జిల్లాది బోసు ఆజాద్‌హిందూ పౌజ్‌లోనూ కోస్తాంధ్రవాళ్లు ఒకరిద్దరు చేరినారు కాని ఇటువాళ్లు లేరు గాంధీజీ సత్యాగ్రహ పోరాటంలో మాత్రం ఇక్కడివాళ్లు పాల్గొన్నారు. 1922లో హైద్రాబాద్‌ ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడి 1928లో ఆంధ్రమహాసభగా మారింది అది క్రమంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. 1935 సెప్టెంబర్‌ 6న, మాడపాటి హన్మంతరావు గారి అధ్యక్షతన సిరిసిల్లలో జరిగిన చతుర్ధాంధ్రమహాసభ ఈ జిల్లా రాజకీయచైతన్యానికి చాల దోహదం చేసింది* 1944 భువనగిరి ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు - కాంగ్రెసు రెండు భాగాలుగా విడిపోయింది కాంగ్రెసు విభాగం జాతీయాంధ్ర మహానభగా పేరు మార్చుకుంది అంతకు ముందే 1937లో స్టేట్‌కాంగ్రైసు ఏర్పడి ఉంది. కాంగైసు ఉభయనంస్థల్లో కరీంనగర్‌ ప్రముఖులనేకులు చెరారు కమ్యూనిస్టు సంస్థకు మూల నాయకులుగా కరీంనగర్‌ జిల్లా పోల్కంపల్లి నర్సింగారావు, బద్దం ఎల్లారెడ్డిగారలు నిలిచారు నైజాం జాతీయోద్యమం అటు ఢిల్లీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఇటు హైదరాబాద్‌ ముస్లిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచింది 1901లో హైట్రాబాద్‌లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ గ్రంధాలయ స్థాపన జరిగింది 1911లో విజయవాడ గ్రంధాలయం మొదలైంది. ఆ వరుసలో 1922 - హుజూరాబాద్‌, 1923 మంధని, కరీంనగర్‌, 1924-వేములవాడ, 1925-సిరిసిల్ల - పోలంపల్లి, 1926-కోరుట్ల మహదేవపురం, జమ్మికుంట, తోటపల్లి, నెమిలికొండ, శేకొండ, మానాకొండూరు పెద్దపల్లి, బెజ్జంకి, రుద్రంగి, కానిపర్తి . దాదాపు 20 గ్రంధాలయాలు స్థాపించబడి దేశభక్తిని, ఆంధ్రసాహిత్యానురక్తిని వ్యాప్తి చేశాయి* 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం రూపొందింది " హైద్రాబాద్‌లో మొదటిసారిగా 1922లో మోటారు వాహనాల సౌకర్యాలు, 1923లో విద్యుచ్చక్తి తంతి శాఖలు, (1928లో కాజీపేట, బెంగళూరులకు తంతి సంబంధాలు) 1935లో విమానసౌకర్యం ఏర్పడ్డాయి* 8 లేపాల నర్చింహరాములు 'సజీవ కిరణాలు 1993 పు 16-18 7 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా విశ్వవిద్యాలయలన్నీ 1960 తర్వాతనే 8 దేవులపల్లి రామానుజరావు - యాఖై సంవత్సరాల జ్ఞాపకాలు” 1929-79 ము 1961 పు 34 9 సజీవ కిరణాలు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు 10 జె గౌతమరావు ముల్కనూరు కిషన్‌రెడ్డి, వి కొండలరావు, కటంగూరి ప్రకాశరెడ్డి వందలమంది ఇందులో భాగస్వాములు

266 డా. మలయశ్రీ కరీంనగల్‌ జిల్లా సాహిత్య చరిత్ర” 1929లో కాజీపేట నుండి బలార్నా నాగపూర్‌లకు ఏర్పడిన రైలుమార్గం కరీంనగర్‌ జిల్లాలోని ఉప్పుల, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండంల మీదుగా వెళ్లింది 1929లోనె మెటుపల్లి, భాదీ సంఘం ఏర్పడింది తెలుగు, గోలకొండ శోభ మొ తెలంగాణా పత్రికలు ఈ కాలపువే 1922లో ఇనుగుర్తి పుస్తక ప్రచురణకు జోడీగా కరీంనగర్‌ నెమిలికొండలో డా పి లింబాద్రి రెడ్డి గారు విజ్ఞాన ప్రచారిణీ గ్రంధమాల స్థాపించి 1940 వరకు 21 గ్రంధాల ప్రచురించారు 1934 “గోలకొండ కవుల సంచికిలో నలుబదికి పైగా ఇక్కడి కవులు కవితలున్నవి 1943లో హైదరాబాద్‌లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది అది తెలంగాణా భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం చాల కృషి చేసింది * దాని ప్రభావం ఈ జిల్లాపై ప్రసరించి ఇక్కడ పరిషత్తు పరీక్షలు పలుచోట్ల నిర్వహించారు 15వ ఆగష్టు 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినా అప్పుడు తెలంగాణా మాత్రం నిజాం నిరంకుశ ఇస్లామీ మత సంస్థాన పాలనలోనే ఉంది రాజాకార్డు అనబడే ముస్లిం మత దురభిమానుల హిందూ ద్వేష విధ్వంసకాండ ఆ కాలంలో చెలరేగింది ఆ భయంతో అస్తి పరపతి కలవాళ్ళు ఇళ్లు వాకిళ్లు వదలి దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు ఉత్సాహం ఉద్రేకం కల తెలంగాణా వీరయువకులు నైజాం విముక్తికోసం సరిహద్దులు దాటి చాందా విజయవాడ ప్రాంతాల్లో సాయుధ పోరాట శిక్షణ పొంది నిజాం సైన్యాల నెదుర్కునే సన్నాహాలు కావించారు * కొన్ని పోలీస్‌ స్టేషన్‌లపై నిజాం ప్రభుత్యోద్యోగులపై గెరిల్లా పోరాటాలు సాగించారు 1948 మార్చి 14న మాందాప్పురం గుట్టలపై పోరాట దళ సభ్యులకు నిజాం సైనికులకు జరిగిన పోరాటంలో అనభేరి ప్రభాకర రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి దళనాయకులతో సహా మరో తొమ్మిది మంది మరణించారు " అప్పటి స్వతంత్ర భారత హోంమంత్రి వల్లభభాయి పటేల్‌ గారి సైనిక చర్య (13 "సెప్టెంబర్‌ 1948)తో 17 సెప్టెంబర్‌ 1948 నాడు హైదారాబాద్‌ నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి నైజాం రాష్ట్రం విముక్తి పొందింది రాష్ట్ర విముక్తి స్వచ్ళంద సేనలు కొన్ని 1951 వరకు (అమృతలాల్‌ శుర్షా-సిరిసిల్ల మురళి- గట్టెపలి, శ్యాంసుందర్‌సింగ్‌ - పెద్దపల్లి దొమోదర్‌రావు-గుండి జి మల్దేశం-అంతకపేట మొ నారు)కమ్యూనిస్క భావాలతో భూస్వామ్య వ్యతిరేకపోరాటం సాగించాయి 1952 జనరల్‌ ఎన్నికలతో హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొంది. అయినా అప్పుడు కోస్తా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో, తెలంగాణా హైద్రాబాద్‌ రాష్ట్రంలో కలిసి ఉండేవి అప్పుడు హైద్రరాబాద్‌ స్టేట్‌లో కర్ణాటక మహారాష్ట్ర (మైసూరు- బొంబాయి) జిల్లాలు కూడా కొన్ని ఉండేవి మూడు ముక్కలుగా విడిపోయి కొన్ని వందలేండ్లుగా వేర్వేరు పాలనల కింది ఉన్న తెలుగువాళ్లు-తెలుగునేల ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌గా ఎర్పడడానికి మరికొన్ని ఏండ్లు ఆగక-ఉద్యుమాలు సాగించక తప్పలేదు. (అక్టోబరు 1, 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం 11 శేపాల నరసింహరాములు సజీవ కరణాలు 1993 లా 12 ఆంధ్రరాష్ట్రం కోస్తా రాయలసీను కలయిక 1953లో ఏర్పడింది 1956 ఫస్టు నవంబర్‌న ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో తెలంగాణా ఆంధ్రరాష్ట్రంలో కలిసింది

రెండవ భాగం - ౪ అధ్యాయం 20 శతాబ్ద పూర్వాష్థ సాహిత్వం” వచన వాబ్మయం 267 ఏర్పడింది అనంతరం 1956 నవంబర్‌ 1న హైద్రరాబాద్‌ కేంద్రంగా ఇప్పటి మన ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది )*” జిల్లా సామాజిక చరిత్ర . 1918లో హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన జరిగినా 1950వరకు కరీంనగర్‌ పట్టణంలో ఉన్నవి కేవలం మూడే ఉన్నత పారశాలలు అవి ప్రభుత్వోన్నత బాలుర పారశాల, ప్ర ఉ బాలికల పారశాల, మిషన్‌ హైస్కూల్‌. ఒక్క కాలేజి కూడా లేదప్పుడు ఇప్పటి ఎస్‌ ఆర్‌ ఆర్‌ డిగ్రీ కళాశాల పియుసి క్లాసులతో 1956లో ఆరంభమైంది జిల్లా కేంద్రంలో 3 సినిమా టాకీసులు మాత్రం వచ్చాయి సర్కారీ ఉరూ పాఠశాలలు కూడా అధికభాగం ఈ అర్ధ శతాబ్ది కాలంలోనే ప్రారంభించబడ్డాయి బస్సు రైలు సౌకర్యాలతోపాటు ఇదే కాలంలో ముద్రణ యంత్రాలు వచ్చాయి. సాహిత్య చరిత్ర ఈ కాలంలో ఈ జిల్లా కవుల రచనలు అచ్చు పుస్తకాల రూపంలో 1922 నుండి వచ్చాయి. ఈ అర్ధ శతాబ్ది కాలంలో కరీంనగర్‌ జిల్లాలో మార్గ-దేశి కవితా రచనలు పోటిపడి వచ్చాయి. ఆంధ్ర ప్రాంతానికి సమ ఉజ్జీలనదగిన పద్యకావ్యాలు అప్పుడు ఇక్కడ రచింపబడినా ముద్రణ పొందినవి తక్కువ. ఈ కాల ప్రముఖ కవుల పుస్తకాలనేకాలు 1950 తర్వాతనే ముద్రణ పొంది వ్యాప్తి చెందాయి కానీ, యక్షగాన సాహిత్యం మాత్రం అదే కాలంలో హైదరాబాద్‌ ప్రముఖ సంస్థలచే ప్రచురింపబడింది. కోస్తాలోవలె నవల నాటకం భావకవిత అభ్యుదయ కవితల వికాసం మాత్రం ఆ కాలంలో ఈ జిల్హాలో అంతగా లేదు ఆంగ్లభాషా సంపర్కం లేకపోవడం, ఊర్జూ విద్యామాధ్యమం కావడం, నిజాం (ప్రభుత్వ దమన నీతి అందుకు కారణాలనవచ్చు అప్పటి కవులు కూడా తమ రచనలలో నిజాం ప్రభు భక్తిని చాటుకునేవారు. ఈ కాలంలో ఈ జిల్లా నుండి వెళ్లి బొంబాయి రాష్త్రంలో నేత కార్మికులుగా వున్నప్రవాసాంధ్రులు మాతృభాషాభిమానంతోపాటు సాహిత్యాచిమానం చూపడం విశేషం. పూర్వ యుగాలలో వలె బాహ్మణులో భట్టుమూర్తులో కాక ఈ కాలంలో నానా జాతుల వారు విద్యావంతులై తెలుగు గ్రంథాలు రచించడం ఒక గొప్ప మార్పు ఇది ఈ అర్ధ శతాబ్ది సాహిత్య సంక్షిప్త చరిత్ర ఇక బహుముఖాల ప్రతిభతో అనేక వ్రక్రియలలో పుంఖానుపుంఖంగొ తెలుగు రచనలు వెలువడిన ఈ ఇరువదవ శతాబ్ది ఉత్తరార్ధ సాహిత్యాన్ని చూద్దాం. దరరోశి అంధాలల్యు భి ఇ కం 5 జో “య ఇ శీ త్త ([' ఓలే 6ర్శి ॥ ల లో శ మై - యస మై తరి రీ

వ్‌ శ 1. ” న. మె...” న అ - = - న అ పం... , "మీ న చ్‌ నే 1 లగ సూ | క్ష , , క్ష! | - ని 1 . శ ॥ ళా ల (|. నం. ళ్‌ | ల ॥ ( | శోహల్లో

  1. 7 4 ౧ న 1,1 క్‌ ం. ఖీ | / టే | 7 గి ॥ గ. 11 ఎం 1 గె + న్‌ న ల్‌ గో క్ష " ను స క