Telugu kameshwari - anilvaranasi/indianlanguages GitHub Wiki
గా | కన / | ః ఇ . * 6 గ ల జ ఈ 4 2 నా | క్ట జ ఇ. హి న. గ్. ” ళా ళీ శే. న | లాం యన మ
- దల ళా ఉమా డట స్స ॥ బా గా సం న ి!! 1 , నే స లు వస ॥
- హ్. జు ॥_ సహజకవి మల్లెమాల శ "
- (జ! క మనసుపడి మక్కువతో సేకరించిన , 1 0" ( ఈపుస్తకాన్నిసాహిత్యాభిమానుల కోసం ం న న ర! . సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి , 1 స 1. |. ఆనందంతో బహూకరిస్తున్నాం. కా - మల్లెమాల కుటుంబం (ం ట్ర +] ష్" రగ కాయా వూ న్యూ బ్ర | ఖై. నీ త . జ! వ. దుస్గీరాల రొనూరాన్టు ॥ స. గ్
శ్రీరస్తు కామేశ్వరి దుగ్గిరాల రామారావు దుగ్గిరాల పబ్లికేషన్స్ హైదరాబాదు
కామేశ్వరి వ 1 దుగ్గిరాల రామారావు ద్డోల్ల 51 = డ్దో2 ౯౭ ల ు యూ.
ప్రచురణ రామా -్ దుగ్గిరాల పబ్లికేషన్స్ హక్కులన్నియు
కృతికర్తవి
ప్రథమ ముద్రణ
తారణ-కార్తికం
2004-నవంబర్ ఉం ప్రతులు : 1000 ళం
త్
వెల: రూ. 40/-లు. ( ం
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని బ్రాంచీలు) వ.
మం మా వు యం మున మ వ ళ్ న. 6-3-668/10/46 గ్లో ఖ్ గ్ర కడు? న. దుర్గానగర్ కాలనీ, పంజగుట్ట ళ్ టా యాల. = హైదరాబాద్ - 500 082 ర న ల ఫోన్ : 23402277. న్ రా.
డిటిపి
మను గ్రాఫిక్స్, 1-8-185/2
చిక్కడపల్లి, హైదరాబాదు-20
ఫోన్ : 27633574.
ముద్రణ
కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్
40-ఎపిహెచ్‌బి, విద్యానగర్
హైదరాబాదు - 500 044
ఫోన్ : 27618261 27653348.
నంంట 52172 సంములురు? సశతు. 4, 92... 0౫. 1 (6లాఖు కొంణుల 90195301 & 1.0... అలుక ౦0261080, $1696ల0/ 0011686 "౦లఅం2! - 600 005 ఆమోదము
శ్రీ దుగ్గిరాల రామారావుగారు కేంద్ర ప్రభుత్వం వారి టెలి కమ్యూనికేషన్స్ డిపార్టుమెంటులో సూపరింటెండింగ్ ఇంజనీరు (సివిల్)గా పనిచేసి విశ్రాంతి పుచ్చుకొన్న కవి తల్లజులు. చిన్ననాడే “నివాళి' అనే వేంకటేశ్వర శతకము, “త్రివేణి” అనే మరొక కావ్యము రచించి - తమ పెద్ద అన్నగారు వేంకట కృష్ణమూర్తి గారితో కలిసి జంటకవులైన పిమ్మట దుగ్గిరాల కవుల పేరుతో - వరుసగా 1954లోను, 1956లోను ప్రచురించారు. 2000 సంవత్సరమునుండి ఇంతవరకు రామారావుగారు “అమృత కలశము”, “పన్నీటి చినుకులు”, “శారద చంద్రికలు” అను ఖండ కావ్యములను “ఆంధ్ర రసమంజరి” (భానుమిశ్రుని సంస్కృత రసమంజరికి తెనుగుసేత)ని వెలువరించినారు.
ఇప్పటి ఈ “కామేశ్వరి” శతక సదృశమైన లఘుకృతి. కామేశ్వరి వీరి ఇలువేల్పు. ఈ కావ్యము ఆత్మోద్దారము. వ్యక్తి జీవితంలోని రెండు స్టూల విభాగాలు : కుటుంబ జీవితము; వృత్తి ఉద్యోగాలు. ఈ కావ్యం అక్కడక్కడ కుటుంబ జీవితంలోని ఖ్లేశాలను నూచించినా ప్రధానంగా ఉద్యోగ జీవితంలో తామనుభవించిన వరితాపాన్ని ఆవిష్కరిస్తున్నది. దీనివలన పాఠకులకేమి ప్రయోజనము? అంటే తద్భావ భావనము ద్వారా సమకాలీన స్థితినెబుగుట, పరదుఃఖ దుఃభితత్వము, పరసుఖ సుఖిత్వము అలవరచుకొనటమే.
“కామేశ్వరి” కర్శరహిత, స్వయంభువు అయిన పరతత్వము. కామన అంటే కోరిక. అది విశ్వసృష్టికే ఆదికారణము. శ్రీవిద్యలోని సమయాచారంలో సంచవిధ సామ్యాలు చెప్తారు. (1) నామ (2) రూప (3) అధిష్టాన (4) అవసాన (5) అనుష్టాన
1
సామ్యాలంటారు వీనిని. కామేశ్వరీ కామేశ్వరులకు ఈ సామ్యాలు. నామసామ్యం స్పష్టమే. రూపసామ్యంలో అర్ధం పురుషుడు, అర్దం స్రీ గా ఉన్న సదాశివతత్త్వం. ఒకే సింహాసనం మీద కూర్చొనటం మూడవది. శివ భాగం కుడికాలు వ్రేలాడవైచితే శివాభాగం ఎడమకాలు వ్రేలాడవెయ్యటం అవన్థానసామ్యం. కామేశ్వరుడు చేయగలదెల్ల కామేశ్వరిచేయగలగటం- అనుష్టాన సామ్యం. 'కామకలా విలాసా ది- శ్రీవిద్యాగ్రంథాల్లో ఇది చెప్పబడింది. ధర్మబద్ధంగా ఉన్నంతవరకు కోరిక తప్పుకాదు. “అథో అన్నం వై మధు। సర్వం వై మధు! సర్వే వై కామా మధుః తద్యన్మాధుచ్చందసం శంసతి సర్వేషాం కామానామవరుహై। సర్వాన్ కామానవరున్దే! య ఏవంవేద' అంటున్నది ఐతరేయారణ్యకము. ఛందస్ అంటేనే కోరిక. కోరికల సాఫల్యానికి మధుచ్చందసుడు బుషిగా ఉన్న సూక్తాన్ని చెప్పుమంటున్నది ఆరణ్యకము. కోరికలు తేనెవలె మధురాలు. కామేశ్వరీ వ్రతంలోకూడా చలిమిడితోపాటు పానకము, చెజకు ముక్కలు, అరటిపండ్లు, కొబ్బరి వగైరాలే నైవేద్యాలు. ఇష్టకామేశ్వరీ మహాలక్ష్మీవతమని దీనికి పేరు.
ఆత్మదఘ్నముగా ఆలోచించేవాడే శతకం న్రాస్తాడు. మనసు వెంట పరుగెత్తే వాడు ప్రణయ గీతాలు నవ్రాసుకుంటాడు. కవితా రచనలో కవిత్వమనేది క్రాంతి దర్శిత్వం-త్రికాలజ్జత. రచన అనేది విచ్చిత్తి విశేషంతో కూడిన, సౌందర్య విస్ఫురణం కల, కూర్చు. రామారావుగారు పద్య రచనలో సిద్ధహస్తులు. గొప్ప ధారాశుద్ది కలవారు. ప్రతి పద్యంలోను ఏదో ఒక మెఅపు ఉంటుంది. తెనుగులు వాడీనా దిట్టతనం ఉంటుంది. 'దాయల్ కూయుచు' (23వ పద్యం), అంటే ఎత్తిపొడుపు మాటలు అని, దాయాదులు (27వ పద్యం) అంటే శత్రవులు అని, దేవయ్యలు (70వ పద్యం) అంటే దేవానాం ప్రియులు-మూర్చులు అని అర్దం. ఇవి ఈనాటి పాఠకులకు సుపరిచితాలు కావేమో అనుకుంటాను. చల్చాది. అప్రాశ్యులు అనే పదాలు కూడా ఇలాంటివే.
వీరికి భారతము మీద మక్కువ ఎక్కువ. కవిత్రయమువారే కాదు, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామకృష్ణుడు వంటి మహాకవుల కైవాటం వీరి పద్యాల్లో కనబడుతుంది. అయినా ఆధునికతకు కొజత లేదు. తిరుపతి వేంకట కవుల అభిమాని. అద్యతనాంధ్ర
£]
కవిప్రపంచ నిర్మాతలైన శతావధాని చెళ్లపెళ్ల వేంకటశాస్రిగారి పరోక్ష శిష్యులు. నేడు వ్యవహారంలో ఉన్న పదాలెన్నో నిశ్ళంకగా వాడినారు. “నిల్చు నాకల్పాంత స్టిరమై భవద్విజయ మీ కావ్యమ్ము కామేశ్వరీ!” అని కవిగారు వ్రాసినారంటే వారి భక్తి ప్రపత్తులెలాంటివో గ్రహించవచ్చు.
జననం బన్నది యున్నచో మరల,నా జన్మంబునందున్-గవి
త్వనియంతృత్వము, పాండితీ గరిమయునన్, ద్వత్పాద సంసేవనం
బును-నాకిచ్చి అనుగ్రహింపుము: ప్రభుత్యోద్యోగపున్ బాట్లు చా
లును తల్లీ! తలబొప్పికట్టె, గరముల్ జోడింతు.; గామేశ్వరీ! (ప.5)
అనే పద్యం కవిజీవితంపై కవిగారికి గల అభిమానానికి, ఉద్యోగ
జీవితంలో ఆయన అనుభవించిన ఆవేదనకు అద్దం పడుతుంది.
అంతశ్సైత్యము లింతచేసినవి; లేదా! మూడు సంవత్సరా
లెంతో (పేముడి తోడంజూచిన యతం డీవేళ కావేశపుం
గంతుల్ వేయంగ నేమి హేతువు? త్వదుగ్ర క్రూర రూక్తేక్షణల్
గంతుల్ మాన్చును, గొంతునొక్కు, నిది నిక్కమ్మమ్మ! కామేశ్వరీ! (ప.8)
విన్నావా? జననీ! “అపీలు”నంట! సుప్రీంకోర్టలోనంట! మా
యన్నల్ దాఖలు చేసిరంట! మళీ నాకచ్చోట వాదింప నే
రున్నారంచును వారి సాహసము, నీవున్నావుగా తల్లి! ఆ
పన్నున్ నన్ గరుణించి నా తరపునన్ వాదింపం గామేశ్వరీ! (ప. 42)
-వంటి పద్యాలు రామారాయ కవిగారి వాక్ళుద్దికి, చిత్తశుద్ధికి నిదర్శనాలు.
పాములకు దుర్దనులకు పోలిక చెపుతూ వ్రాసిన ఈ పద్యం
చూడండి-
వినినన్ జూడరు, చూచినన్ వినరు, బల్ విడ్డూరమౌ, నోరు వి
ప్పినచో నాల్కలు రెండు, రెచ్చిన రుషావేశమ్ముతో( దోంకపై
ననె నిల్చుందురు కస్సుబుస్సు మనుచున్ రవ్వంత కవ్వింప, వ
ర్తనమా! వక్రము, పాపజాతి భటసంతానమ్ము; కామేశ్వరీ! (ప.69)
[1
వింటే చూడకపోవుట, చూస్తే వినకపోవుట, నాలుకలు రెండు, కస్క్సుబుస్సుమని తోకమీద నిలుచుండుట, వక్రవర్తనము - సమాన ధర్మాలు చక్కగా కుదిరాయి. ఈ కృతిలో నిందాస్తుతికి ఉదాహరణలు- అచలేంద్రాత్మజ వీవు, స్థాబుండు త్వదీయాత్మేశు., డాత్మోద్భవుల్ శుచి సంభూతుండొకండు నింకొకరుండో చూడంగ విఘ్నేశుండే! వచియింపన్ బనిలేదటంచెజి/గియున్ బాధల్ నివారింప మైొ క్కుచునుంటిన్; గరుణింపవేని భవదం[ఘ్రుల్ వీడ; గామేశ్వరీ! (ప.94) ఒడ లర్ధం బిడి కట్టుకొన్న మగండెంతో పేముడిన్ జూడ, నె క్కుడు భక్తిన్ బచరించుచున్ గొడుకులున్ గోడండ్రు సేవింప, నె న్నండుం గష్టమ్ము నెబుంగ వించుకయినన్, నా యేడ్పు నీ వీనులన్ బడునే? యింతకు గొంతుచించుకొని లాభంబేమి? కామేశ్వరీ! (102) సందర్భోచితంగాను, అర్ధవంతంగాను వాడిన- మేకమెడ చన్నుల్ పిండినన్ పాలు వచ్చునె, కదళీపత్రము కంటకమ్ము (అరటాకు-ముల్లు), రెక్కాడకుండిన డొక్కాడదు, అన్యథా శరణం నాస్తి, చెక్కభజనలు, దెబ్బకు దయ్యము జంకును, చంకదుడ్డు శరణార్థులు, కాకదంత పరీక్షలు, నోరున్ నెత్తియు మొత్తుకోవలయుననే, కంచెయె చేనుమేసిన-మున్నగు నానుడులతో పద్యాలు హృద్యంగా, రసవత్తరంగా సాగాయి. ధారా శుద్ధికి ఈ కృతిలోని పద్యాలన్నీ ఉదాహరణ ప్రాయాలే. శయ్యా సౌకుమర్యానికి భావ సౌందర్యానికి రామరాయ కవిగారి కవిత్వం పెట్టింది పేరు. శ్రీ రామారావుగారు ఇతోధికంగా గొప్ప రచనలు చేసి ఆంధ్ర కవితా రసికులకు ఆమెళలు పెట్టగలరని ఆశిస్తున్నాను. “ధీనామవిత్ర్యవతు!' -సొళ్వ కృష్ణమూర్తి ౪1.10. ౬-77 100 ౪/6910/059 5661 62800282] 12౬| ₹010640౧0౧0/4౧ 0౧6౧౧౭౧600 041 న : 24928000 [/
శ్రీరస్తు అటి నైపథ్యము నేను విద్యార్ధి దశలో కష్టపడి చదువుకొని, ఉద్యోగ జీవితంలో వడిదుడుకులు తట్టుకొని నిలబడి, సంసార బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి, కేంద్ర ప్రభుత్వం టెలికం డిపార్టుమెంటులో సూపరింటెండింగు ఇంజనీరుగా పదవీ విరమణ చేసి, ఒక ఇల్లు వాకిలి అమర్చుకొని, ఇప్పుడు- ప్రభవించినాను విద్వద్వరేణ్యులం గాంచి వన్నె కెక్కిన కుటుంబమ్ము నందు( జవిచూచినాను కష్టసుఖమ్ములను భేద మోదమ్ము లను భేద బుద్ధిలేక, రచియించి యుంటి నాంధ్రమ్మందు మందార మకరందమును చిందు మధుర కవిత, జరుపుకొంటిని యథాశక్తి నర్థులు వచ్చి యడుగ లేదనకుండ( ద్యాగ నిరతి, హితులు ప్రాణమ్ము నిచ్చు స్నేహితులు కలరు, కావలసినంత గల దాత్మ గౌరవమ్ము కలదు తగినంతగా అంగబలము, వేయి మాట లేటికి నా కెందు లోటు లేదు. అని చెప్పుకొనే స్థితిలో ఉన్నానంటే అది నా ఘనతకాదు. దానికి మూల బలం మా తల్లిదండ్రుల తపఃఫలంతోబాటు మా కుల - స్థల దేవతల కరుణా కటాక్షాలు, మా యూరి వెలమ దొరల అండదండలూను. ఇ
ఈ విషయాన్నే నా ఆంధ్ర రసమంజరి అవతారికలో - కుల దైవము కామేశ్వరి - స్థల దైవము వేంకటపతి-సరసులు గ్రామ సులు వెలమదొఠలు-పేర్మిన్ విలసిల్లిరి మాకు పెరటివేలుపు చెట్లె. అని సూత్రప్రాయంగా వ్రాసాను. 'త్రివేణ్' కావ్యం మా నాన్నగారికి, 'అమృతకలళశం' కావ్యం మా అమ్మగారికి అంకితం ఇచ్చాను, నేను పుట్టి పెరిగిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం- నిడదవోలు మధ్య ఏలూరు కాలువ గట్టున ఉన్న నందమూరు. ఆ ఊళ్లో వెలసిన దైవం శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆలయ ధర్మకర్తలు స్థానికులైన వెలమ దొరలు. అర్చకులు శ్రీ శ్రీనివాసుల పురుషోత్తమాచార్యులు గారు, వారి పుత్రుడు రాఘవాచార్యులు గారూను. రాఘనాచార్యులుగారు మా నాన్నగ వద్ద కావ్యాలు చదువుకొన్నారు. ఇప్పుడూ ఉన్నారు. అంగరంగ వైభవంగా స్వామికీ ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆలయానికి వాయవ్యంలో ప్రాథమిక పాఠశాల, అక్కడ నా చదువు. తరచు గుడిలోకి వెళ్లి స్వామి దర్శనం చేసికొని తీర ప్రసాదాలు తీసికొంటూ ఉండేవాణ్ణి. ఊరిబడి చదువు ముగించుకొని నిడదవోలు హైస్కూలులో ఎస్,ఎస్.ఎల్.సి. వరకు చదివాను. అప్పటికే ధారాళంగా కవిత్వం చెప్పేవాణ్ణి. హైస్కూలు ఆంధ్రోపాధ్యాయులు శ్రీ తంగిరాల మంగన్న శాస్త్రిగారు, శ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్రిగారు నన్ను ఎంతో ప్రేమతో ప్రోత్సహించేవారు. ఆ రోజుల్లోనే మా నందమూరు వేంకటేశ్వర స్వామిపై శతకం వ్రాసాను. అది - మా పెద్దన్నగారు వేంకట కృష్ణమూర్తి నాతో జంటకవిగా కలిసిన తరువాత - 1954లో ఉభయ కర్శకంగా (దుగ్గిరాల కవులు) 'నివాళి" పేరుతో ప్రకటింపబడింది, కొినాడలో ఇంజనీరింగు చదువు వూర్తయిన వెంటనే 1950 నవంబరులో నాకు విశాఖపట్పం టెలిగ్రాఫ్స్ డివిజనల్ ఇంజనీరు ఆఫీసులో బిల్డింగ్ సూపర్‌వైజర్‌గా ఉద్యోగం దొరకడం వలన నేను నందమూరు నదలి పెట్టవలసి వచ్చింది. అయినా, వేంకటేశ్వర స్వామి దయ నన్ను వదలిపెట్టలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి శ
- 50 ఏళ్ళ తరువాత - తన సన్నిధిలో నివసించి కన్ను సేవించుకొనే భాగ్యం ఆ స్వామి నా కీ వార్టక్యంలో కరుణించాడు. హైదరాబాదులో పంజగుట్ట దుర్గానగర్ కాలనీ లోని నా గృహానికి కూతవేటు దూరంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి అలయం. స్వామి కటాక్షించకపోతే-కేవలం మానవ ప్రయత్నంతో- “దొరకునా ఇటువంటి సేవ”.
నా చిన్నతనంలో మా యూళ్ళో అర్చకులతో కలిపి ఐదు బ్రాహ్మణ కుటుంబాలు. శ్రీనివాసుల వారు వైష్ణవులు, దుగ్గిరాల (మేము) వారు, దేనర కొండ (బడిలో మాష్టారు)వారు వైదికులు. దినవహి వారు, చామర్తి (ఊరి కరణం) వారు నియోగులు. అయినా, శాఖాభేదాలు లేక అందరం ఒక కుటుంబ సభ్యులుగా కలసి మెలసి ఉండేవాళ్ళం. మాకు అప్పుడే కాదు, ఇప్పుడూ ఆ పట్టింపులు లేవు. దినవహి వీర్రాజుగారిని అన్న్మయ్య అని పిలిచేవాళ్ళం. చామర్తి సుబ్బారావుగారిని మావయ్య అనేవాళ్ళం. ఇప్పుడు ఆ యూళ్ళో ఉన్న చామర్తి వేంకటరత్సం బావ (సుబ్బారావు మావయ్య గారి పెద్దబ్బాయి) తండ్రి తరువాత గ్రామకరణీకం నిర్వహించాడు.
చాతుర్వర్హ్యం అప్పటి కట్టుబాట్లను బట్టీ ఎవరి పరిధిలో వారున్నా పరస్పర సహకారాలకి-అన్యోన్య గౌరవాభిమానాలకి లోటుండేది కాదు. ఏ వ్యవహారం వచ్చినా, ఊరంతా ఒక మాటమీద ఉండేది - ఒక శాటిమీద నడిచేది.
మా యూరు వెలమవారు పద్మనాయక వెలముదారలు. ఎంత సంపన్నులో అంత నిరాడంబరులు-నిగర్వులూను. సాహిత్యాభిమానులు-కవి పోషకులు. దయామతులు-పరోపకారులు.
శత్రువులైనంగాని సరసజ్ఞుల మెచ్చుదు, రట్టు కానిచో
మిత్రుల నైన మే లనుచు మెచ్చరు, బంధువులైన( బాత్రతా
పాత్రత నెన్న. జాలని యపాత్రులః జేరంగ నీరు, చెల్మికిన్
బాత్రులు, నందమూరున నివాస మొనర్చెడి పద్మనాయకుల్
వారు మొఖాసాదారు, లు
దారులు, ధీరులు వదాన్యతాది సుగుణ సం
భారు, లధర్మాలోచన
దూరులు, సంస్కారు, లట్టి దార లందణిలోన్,
(దేవులపల్లి కల్చవల్లి) .
కోటగిరి రామయ్యగారు, శెట్టుపల్లి సీతారామయ్యగారు వంటివారు నా చిన్ననాటికే బాగా వృద్ధులు. దేవులపల్లి వేంకటరావుగారు, ఠాణేదారు (దేవులపల్సివారే) వేంకటరావుగారు, జలగం వేంకటరావుగారు (ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం. వెంగళరావుగారి తండ్రి), జలగం నరసింహంగారు, కోటగిరి సత్తెన్న గారు, లంక (కోటగిరి వారే) సత్తెన్నగారు మున్నగువారు ఇంచుమించు మా నాన్నగారి ఈడువారు. ఆ సౌమ్య గంభీర మూర్తులను చూసినప్పుడు-హరిశ్చంద్రుడు, అంబరీషుడు, జనకుడు, భీష్ముడు వంటి -పురాణ పురుషులు ఇలా ఉండేవారేమో అనిపించేది. దేవులపల్లి వేంకటరావుగారు, వారి తండ్రి కొండయ్యగారు, మా తాత (మా అమ్మ మేనమామ) గారైన గుంటూరు వీరభద్ర శాస్త్రిగారి వద్ద సంస్కృతాంధ్రాల నభ్యసించారు. వీరభద్రశాస్తిగారు మహాపండితులు, గొప్ప కవి, భరతశాస్తంలో కూడా దేశికు. డానవెట్టుట( గృతిన్ రచియింపంగ లేదు, నిళ్చితో ద్దేశవిరుద్ధ మంచు. బది దేశములన్ విహరించి పండితా ధీశుల గెల్వ6 గోరం డవియే యొనరించిన నాండు మేట్ సూ రీశుండు వీరభద్రు సరియే మజీ యే కవి సార్వభౌముండున్. అసమానభాసమానానూన శేముష్షీ బలతృణీకృత శచీపతిగురుండు ఆంధ్ర సంస్కృత వాజ్మయాంబోధి యుగళమ్ము చుళికించిన నవీన కలశజుండు శ్రుతిపేయ తతచవముత్కృతిలసత్రతిపదా ద్భుత సత్పసంగమ్ము పుట్టినిల్లు పరిపూతచరితసంభరిత గుంటురివంశ కలశవారాళి రాకావిధుండు పండిత కవీంద్రుండగు వీరభద్రశాస్త్రి, ననఘు, దేవులపల్లి కొండయ్యగారు పొలము నిచ్చి సమ్మానించి వెలమ దొరల పరువు పెంచిరి గడచిన తరమునందు. (నా రాష్ట్ర శ్రీ కావ్యం-అముద్రితం) ౪111
కొండయ్యగారు సస్యశ్యామలమైన రెండెకరాల పాలము నిచ్చి, మా తాతగార్ని సత్కరించారు. వేంకటరావుగారు మా పెద్దన్నయ్య (వేంకట కృష్ణమూర్తి) వ్రాసిన “భారత స్త్రీ” నాటకాన్ని అంకితం పుచ్చుకున్నారు. మా “నివాళి” అచ్చు వేయించారు.
కోటగిరి సూర్యారావుగారు, దామెర రామారావుగారు, వారి తమ్ముడు కొండలరావుగారు, శెట్టుపల్లి కొండలరావుగారు, జలగం వెంగళరావుగారు (ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి), దేవులపల్లి వేంకట నరసింహ అప్పారావుగారు (ఠాణేదారు వేంకటరావుగారి కొడుకు) మున్నగువారు మా పెద్దన్నయ్య తరంవారు. నాకంటే పది, పదిహేను సంవత్సరాలు పద్దవారు. వీరిలో కొందరు మా నాన్నగారి వద్ద చదువుకొన్నారు.
ఇంక నా తరంవారంటారా-దేవుపల్లి రామారావుగారు, వారి తమ్ముడు వేంకట నరసింహ అప్పారావుగారు (దేవులపల్లి వేంకటరావుగారి పుత్రులు), దేవులపల్లి ధర్మలింగస్వామిగారు, కోటగిరి సత్యనారాయణ మూర్తిగారు, జలగం కొండలరావు గారు, జలగం రామారావుగారు (జలగం వెంగళరావుగారి తమ్ములు) ప్రభృతులు ఆణిముత్యాలు. వారిలో దేవులపల్లి రామారావుగారు నాయకమణి. ఆయన ఏఖైఏండ్లు నిండకుండానే 1978లో దివంగతులైనారు. తక్కినవా రిప్పటికీ ఆయురారోగ్యాలతో అలరారుచున్నారు.
దేవులపల్లి రామారావుగారు జీవితాంతం వరకు పంచాయతీబోర్డు ప్రసిడెంటుగా ఉండి, గ్రామాభివృద్ధికి, దేవాలయాఖివృద్ధికి చేసిన సేవ ఇంతా అంతా కాదు. ఆయన కలియుగంలో పుట్టవలసిన వ్యక్తికాదు. కారణ జన్ముడు.
ఇచ్చకముల్ వచించు నరు నెన్నండు నెన్నండు, మాటిమాటికిన్
మచ్చికలాడు స్వార్థపరు మాయ కజేయుండు, నచ్చెనేని లో
మెచ్చునుగాని పైకి మెరమెచ్చులు మెచ్చండు, కోరువారి కే
మిచ్చిన లెక్కలేదు, దొర యేదార? మా దొర రామరావుకున్.
(దేవులపల్లి కల్పవల్లి) వారి వంశ చరిత్రను “దేవులపల్లి కల్పవల్లి” అను పేరుతో పద్యకావ్యంగా వ్రాసాను. అది ఇంకా అముద్రితం. ప
ఇంతకీ చెప్పవచ్చే దేమిటంటే ఆ తరం నుండి ఈ తరం వరకు అందరూ మా కుటుంబంపై అపారమైన ఆదరాభిమానాలు కలవారే. అవసరాలకు అయాచితంగా ఆదుకొన్నవారే.
ఇక “కామేశ్వరి” గురించి - ఈ అమ్మవారు మా ఇలువేలువు. అప్పుడప్పుడు కుటుంబ జీవితంలోగాని, ఉద్యోగ జీవితంలోగాని చికాకులు కలిగితే కామేశ్వరిమీద పద్యాలు చెప్పటం, తద్ద్వారా కొంత మనశ్శాంతి పొందటం, గత ముప్పై సంవత్సరాలుగా నా కలవాటు.
అదిగో! ఆ పద్యాలే ఈ “కామేశ్వరి” కృతి. ఇందులో చాలా భాగం నా ఉద్యోగ జీవితానికి సంబంధించిన పద్యాలే. 1985-1989 మధ్య నా మనస్తాపాన్ని అమ్మవారికి నివేదిస్తూ వ్రాసినవి. ఆ బాధాకరమైన పరిస్థితులు, వాటి పూర్వాపరాలు కొంచెం వివరిస్తాను.
మొదట్లో చెప్పినట్లు 1950లో నేను పోన్స అండ్ టెలిగ్రావ్స్ డిపార్టుమెంటులో బిళ్ళింగు సూపర్‌వైజర్‌గా చేరాను. 1963లో ఆ డిపార్టు మెంటులో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పరిచారు. అంతకుముందే అందులో బిల్టింగు సూపర్‌వైజర్‌లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. నేను అప్పటికే అసిస్టెంటు ఇంజనీర్‌ని. కాలక్రమేణ ఆ విభాగంలో సూపర్‌వైజర్లను, అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించటం, ప్రమోషన్లు ఇవ్వటం జరుగుతుండేది. ఆ క్రమంలో 1978 సంవత్సరంలో నా జూనియర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోట్ చేసి, నన్ను అసిస్టెంట్ ఇంజనీర్‌గానే ఉంచేసారు. నన్ను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోనికి తీసుకొనేందుకు క్రొత్తగా నియమితులైనవారు చాలామంది వ్యతిరేకులు. ఎందుచేతనంటే సీనియారిటీలో నేను వారి పైనుంటాను. చివరకు 1981లో - ఈ దురన్యాయ వ్యవహారమంతా పూర్తిగా తెలిసిన ఒక మహానుభావుడు తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నన్ను సివిల్ ఇంజనీరింగ్ శాఖలో ప్రవేశపెట్టాడు. నేను ఆ పదవిలో చేరకుండా అడ్డుకోవాలని కొందరు ప్రతిపక్షులు ఢిల్లీ హైకోర్టులో ప్రయత్నించి విఫలులైనారు. నేను, నాకు జరిగిన అన్యాయాన్ని విన్నవిస్తూ, న్యాయాన్ని అర్జిస్తూ మద్రాసు హైకోర్టులో దావా వేసాను. నెగ్గాను. ప్రభుత్వంవారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడకూడా నాకు
గ
అనుకూలంగానే తీర్చు వచ్చింది. కానీ ఏంలాభం? తీర్చు పూర్తిగా అమలుచేయడం లేదు. సుమారు 17-18 సంవత్సరాల వెనుకనుండి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవీ, సీనియారిటీ ఇస్తూ ఉత్తర్వు జారీచేసికూడా దాని ప్రకారం రావలసిన ప్రమోషన్లు, జీతభత్యాలు ఏమీ ఇవ్వక కాలయాపన చేస్తున్నారు. ప్రత్యర్జులు పరోక్షంగాను, ప్రత్యక్షంగానూ కూడా అడ్డంకులు కల్లిస్తున్నారు. కాలం గడిచిపోతోంది. నా పదవీ విరమణ సమయం దగ్గరపడుతోంది. వ్యవహార పరిష్కారం నా శక్తికి సాధ్యం కానిదయింది. వేరే దిక్కుతోచలేదు. “అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అని మా ఇలువేల్పు కొళ్ళపై పడి పద్యాలతో ప్రార్థించి, వేధించాను. కామేశ్వరి కలగజేసుకొంది. అమ్మ దయవలన రావలసినవన్నీ వచ్చాయి.
కల్పాంత స్థిరమై భవద్విజయ మీ కొవ్యంబు, కామేశ్వరీ!” అన్న పద్యంతో ఆ అధ్యాయం ముగిసింది. “వరం విరోధోపి సమం మహాత్మభిః” అని భారవి చెప్పినట్టు, వృత్తి సంబంధమైన ఈ పోరాటం కూడా నాకొక వరంగానే పరిణమించింది. లేకపోతే మా అమ్మవారిమీద ఇన్ని పద్యాలు వెలువడేవి కాదేమో!
జీవితంలో నన్ను నిలబెట్టిన వువహోత్ములను కొందరినైనా ఈ ముదిప్రాయంలో స్మరించుకొని కృతార్ణుడనవుదామనే కోరికతోనూ, ఈ కామేశ్వరిలోని ముఖ్య ఘట్టానికి సంబంధించిన పద్యాల నేపథ్యం పాఠకులకు సూత్రప్రాయంగా తెలియజేయాలన్న ఉద్దేశంతోనూ ఇదంతా వ్రాసాను. పాఠకులకు విసుగు కలిగిస్తే క్షంతవ్యుణ్ణి.
ఉద్యోగరీత్యా సుమారు మూడు దశాబ్దాలు మద్రాసులో నా మకాం, అక్కడ నాకు స్నేహితులు, అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే వా రందరిలోనూ -
“మహేశ్వరే వా జగతామధీశ్వరే,
జనార్దనే వా జగ దంతరాత్మని,
న వస్తుభేద ప్రతిపత్తి రస్తి మే;
తథాపి భక్తి స్తరుణేందు శేఖరే”. అని నేను చెప్పుకోదగినవారిలో ఆచార్య సాళ్వ కృష్ణమూర్తిగారొకరు. ఆయన
]1
స్థానికరాజధాని కళాశాలలో తెలుగు శాఖలో ఆచార్యులుగాను, అధ్యక్షులుగానూ పనిచేసి అనేకమంది విద్యార్థులను తీర్చిదిద్దిన దేశికోత్తముడు. బహుభాషా కోవిదుడు. మంత్ర శాస్త్రవేత్త, మృదుభాషి. నా యీ “కామేశ్వరి” కృతిని ఆమూలాగ్రం పరిశీలించి “ఆమోదం” పేరుతో తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించిన సుహృన్మణి. ఆమనీషికి -
మంత్రశాస్తమ్ము నందు, మీమాంస యందు,
సంస్కృతాంధ్రాంగ్గముల, జ్యోతిషమున, తమిళ
మందున, విశారదుండైన యట్టి సాళ్వ
కృష్ణమూర్తి పండితునకు. గేలుమోడ్డు. అని కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను.
ఆయురారోగ్య భాగ్యాలతోను, వంశాభివృద్దితోను వర్ధిల్లాలని దీవిస్తూ నా కుటుంబ సభ్యులందరికి ఈ “కామేశ్వరి”ని అంకిత మిస్తున్నాను. ఈ వయస్సులో వారు నాయందు చూపిస్తున్న ఆదరాభిమానాలకి నేను వారికి చేయగలిగిందల్లా ఇదొక్కటే.
ఈ కావ్య ముద్రణ కార్యాన్ని నిర్వహించిన శ్రీ కుడుపూడి భాస్కరరావు (మను గ్రాఫిక్స్) గారికి, శ్రీ ఎ. జగన్మోహన్ రెడ్డి (కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్) గారికి నా కృతజ్ఞతలు.
-దుగ్గిరాల రామారావు 11
ఇ శ్రీరస్తు అంకితము ఈ వార్ధక్యంలో కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ క్రింది నా కుటుంబ సభ్యులు - కొదుకులు/కూతుళ్లు కోడళ్ళు/అల్లుళ్లు మనవలు/మనవరాండ్రు కామేశ్వరరావు సీతామహాలక్ష్మి సాయి లక్ష్మి సాయిరామ్ బాలకృష్ణ రాజేశ్వరి దుర్గా రామప్రసాద్ 'హైమవగి వేంకటసత్యనారాయణ మూర్తి నాగమణి శారద శ్రీనివాస్ పుష్పావతి సీతారామ్ సాయి కృష్ణ రామకృష్ణ సీతామహాలక్ష్మి రామకృష్ణ దుర్గ కృష్ణయ్య సరస్వతి సత్యప్రభాకర్ మహేష్ అనూరాధ సతీష్ సత్యవతి వేంకటశ్రీనివాస్ నికీత లక్ష్మి గిరిధర్ స్వాతి (ప్రేమకుమార్ అందరికీ - కరుణావారిధి, భక్తవత్సల, జగత్కళ్యాణ సంధాత్రి, శాం కరి, కామేశ్వరి, మధ్స్శహాంగణ సురాగం, బాయురారోగ్య సు స్టిద భాగ్యమ్ములు శోభనమ్ములు యశశ్షీలిచ్చుచున్ దా నిరం తరమున్ బాయక తోడునీడ యం 9 మత్సంతానమున్ బ్రోచుతన్. అని దీవిస్తూ ఈ “కామేశ్వరి కృతి అంకితము.
- దుగ్గిరాల రామారావు ౫111
శ్రీరస్తు శ్రీలిచ్చున్, జదువిచ్చు, మాయని యశ ల్షీలిచ్చు, నారోగ్యభా గ్యాలిచ్చున్, సుఖమిచ్చు, హెచ్చయిన యోగంబిచ్చు, నాయుర్వపు ఖ్రీలిచ్చున్, శుభమిచ్చు, నీ చరణ రాజీవాలు నా కెప్పుడున్ గేలూై జయమిచ్చు(గాత! కరుణన్ గీలించి; కామేశ్వరీ ! 1 నిను మెచ్చన్ వలె, నీ చరిత్రమును వర్ణింపన్ వలెన్, నిన్ను. గీ ర్తనమున్ జేయవలెన్, ద్వదన్యులను సంప్రార్థించి యర్ధించి నం దున లాభంబది సున్న మేక మెడ చన్నుల్ పిండినన్ బాలు వ చ్చునె? పైపెచ్చు తలంచి చూడ శ్రమ హెచ్చున్ గాదె ! కామేశ్వర! 2 దుగ్గిరాల రామారొవులాలాలాలాలాతతతడా కే ఆ
కామేశ్వరి
కులదైవమ్మయి తోడు నీడ వయి మాకున్ గూర్చు తల్లీ! నినున్ దలకున్‌మించిన దానింగోరను, కొజంతల్ దీర్చి మా తాతతం
డ్రులపైం బాజిన నీ కృషపామృతరస స్రోతఃప్రవాహమ్ములో
జలకమ్మాడి కృతార్థతన్ గను నదృష్ట మ్మిమ్ము; కామేశ్వరీ! ర్ ఏ జన్మమ్మునంజేసికొన్న తపమో? ఈ కైత చేపట్టె న
న్నీ జన్మమ్మున శైశవంబుననె, నే నీకైతచేం బద్యనీ
రేజమ్ముల్ సమకూర్చి నా హృదయ నీరేజమ్ముతోంగూర్చి నిన్
బూజింతున్, దరియింతు సంసృతి మహాంభోరాశి.; గామేశ్వరీ! 4 జననం బన్నది యున్నచో మరల, నా జన్మంబునందున్-గవి త్వనియంతృత్వము, పాండితీ గరిమయున్, ద్వత్సాద సంసేవనం
బును- నా కిచ్చి అనుగ్రహింపుము; ప్రభుత్వోద్యోగపున్ బాట్లు చా
లును తల్లీ! తలబొప్పికట్టె గరముల్ జోడింతుం గామేశ్వరీ! 85 అరగంటైనను కాలయాపనము గర్హ్యంబౌను మాబోంట; కె
వ్వరు జాప్యమ్మొనరింపకుండిరని నిల్వందీసినన్ దాని కు త్తరమొండుండునె? యైననున్ దగదు; పెత్తందారు మాటన్నచో6 బరుషంబైనను నోరు మూసికొనుటే భద్రమ్ము కామేశ్వర్! 6 ఆ 2 దుగ్గిరాల రామారివాా
కామేశ్వరి
అధికారమ్మున నున్న వారుగద! యేమన్ననన్ సరే చెల్లు, మే
మది కాదన్న మహాపరాధమగు, నన్యాయ్యమొ్మ న్యాయ్యమొ్మ యొ ప్పుదలన్ జూపక యున్నచో మొదటికే మోసంబు; ఆలింపవో
కదళీపత్రము కంటకమ్ము కథ నో కళ్యాణి! కామేశ్వరీ! 7 అంత్హ్యైత్యము లింతచేసినవి; లేదా! మూడు సంవత్సరా
లెంతో (ప్రేముడి తోడంజూచిన యతం డీవేళ కావేశపుం
గంతుల్ వేయంగ నేమి హేతువు? త్వదుగ్ర క్రూర రూక్తేక్షణల్
గంతుల్ మాన్సును, గొంతునొక్కు, నిది నిక్కమ్మమ్మ। కామేశ్వరీ! 8 గఖికన్ జూచిన యట్లు చూచుటకు సంకల్పించుకొన్నప్టు చు
ట్టజీకమ్ముల్ కనిపించునే? యను6గుదోడంబుట్టు వారైన, మే
నజికమ్ముల్ కొనసాగునే? వయసు కన్యల్ నచ్చరే కాని, పె
ద్దజీకమ్ముల్ పనిచేయునే? మదికి రోంతల్ గాక, కామేశ్వరీ! 9 తెగు దాంకన్ బిగ లాగినారు, తలయెత్తెన్ దత్రయత్నములో
'సెగలన్ గ్రక్కుచు6 గాలకూట విషముల్ క్షీరాబ్ధి నాప్తప్రజా
జగతీక్షేమము సంతరింపంగ ననున్ సర్వజ్ఞ. గావింతువో!
తగునమ్మా! పొగడంగం దావక దయాధర్మమ్ము(; గామేశ్వరీ! 10 దుగ్గిరాల రామారావు ర
కామేశ్వరి జరిపించెన్ దన చేతిమీంద చదువుల్ సంధ్యల్ వివాహమ్ములున్ బురుడుల్ పున్నెము లాదిగాగ సకలమ్మున్ దల్లి నాయింట; నా మురిపెమ్ముల్ మజి ముచ్చటల్ జరుపుచో ముద్దెతి నారోజునన్; గొజగాకుండంగంబోయి యీదినమునన్ మొద్దెతిం గామేశ్వరీ! 11 సంపాదించితి, ఖర్చుపెట్టితిని, నా సామర్థ్యమున్ బట్టి; ప్రే మింపన్ జొచ్చిరి నాడు, నే డవసరంబేలేదు కాంబట్ట్ గ ర్హింపన్ జొచ్చిరి, నోరుమూసుకొని పోనిమ్మంచు సైరించితిన్; దుంపల్ త్రెంపెడి తంపు లేటికి? దిసంతుల్ గొట్టి; కామేశ్వరీ! 12 సతతమ్మున్ సుతనిర్విశేషముగ వాత్సల్యముతో జూచి పెం చితి నీ చేతులతోడం గొమ్ము లరుదెంచెన్, జిమ్మినన్ గ్రుమ్మినన్ బ్రతిచేయన్ మనసాప్పదమ్మ! సయిరింపన్ జెల్లు. చీత్ క్షేమమే మతిం గాంక్షింప6గం జెల్టు, నయ్యదియ ధర్మంబమ్మ! కామేశ్వరీ! 13 జనకుండేగిన దాది దాది పగిదిన్ సంసారమున్ సాంకి చే సిన కార్యమ్ముల నన్నింటన్ విజయమే సిద్ధించెంబో! తండ్రికి చ్చిన మాటన్ నిలంబెట్టుకొంటిననుచున్ జిత్తమ్మునన్ దృష్తి నా కెనసెన్ నీ దయవల్ల, నీ బ్రతుకు కింతేచాలు. గామేశ్వరీ! [4 లా జీ దుగ్గిరాల రామారివాా
కామేశ్వరి
కడిగెన్ బాదములన్, గొమార్తె నొసంగెన్, గప్ట్పాలలో వీథిలో6
బడకుండన్ దన యింట. బెట్టుకొనె, వ్యాపారమ్ము చేయంగ6 దో
డ్పడె ద్రవ్యంబిడి మామ; సుంతమృును విశ్వాసమ్ము లేకుండ ము
క్కడి యల్లుం డొనరించె మామకు 'దిరుక్షౌారమ్ము' ; కామేశ్వరీ! 15 దక్కెన్ జిక్కెను చేతి కంచును - పరద్రవ్యమ్ముసవ్యమ్ముగా లెక్కల్‌వ్రాయక, లెక్కచెప్పుమనినన్ లెక్కించి వ్రాక్రుచ్చకే-
బొక్కన్ జొచ్చిరి, బొక్కపూడ్చుకొనంగాం బ్రోనోటు దిక్కయ్యె; న
మ్మక్కా! తండ్రియుం బుత్రులున్ గలసి కుమక్కైరి; కామేశ్వరీ! 16 కత్తుల్ దూయుట, కాలు. ద్రవ్వుట, చమత్కారంబుగా నెత్తుపై
యెత్తుల్ వేయుట, చిత్తుంజేయుట, నగిం చేడ్పించి యేవేవా గ
మ్మత్తుల్ సేయుట, మత్తుంబూయు టను దుర్మార్గంపు దుర్నీతితో(
బొత్తున్ గల్బంగ లేను, నీదు చరణమ్ముల్ దిక్కు; కామేశ్వరీ! 17 “అత్తా కొంగు తొలంగె” నన్న దొసంగౌ; “అబ్బబ్బె! లేదమ్మ ! కిం
చిత్తున్ గూడ దొలంగ లే” దనిననున్ జేడ్చాటె; యిట్టుండె మా పెత్తందారుల తీరు; చెప్పవలెనా? భృత్యాళి వృత్తాంతమున్;
విత్తొక్కండును వృక్షమొక్కండగునే? విశ్వేశి! కామేశ్వరీ! 18 దుగ్గిరాల రామారావులాలాలాలాలాలాలాలాలాలాాాాా క టా
కామేశ్వరి
వినిపింపన్ వినిపించుకోరు, చెవుడా! వీసంబునున్ లేదు; పం
పిన “అర్జీ” పరికింప, రంధు లన౦.గా వీలింతయున్ లేద; యే
మనినన్ పల్కరు, మూంగవా రనుట కేయాస్కారమున్ లేదు; పే
ర్కొన(గాం జిత్రవిచిత్రముల్ దొరల తీరుల్ తల్లి! కామేశ్వర్! 19 విదితమ్మాగతి విన్నవింతు విను మో విశ్వేశ! యేనాడొ ము
ప్పది యైదేండులు దాంటె వృత్తిని ప్రభుత్వంబందు. జేపట్టి; రెం
డు దశాబ్దమ్ముల వెన్క పైపదవి నొండున్ నాకు(గ్రైసేసియుం
బిదపన్ దారులు మూసినారు పయిపై మెట్లెక్కం; గామేశ్వరీ! 20 పదవుల్ వచ్చిన వెల్ల వేజొకరికిన్ బ్రాప్తించుచున్ బోయె, నా
దు దొసంగేదియు. గానరాదు, దరఖాస్తుల్ పంపితిన్, బెద్దవా
రెదురైనప్పుడు విన్నవించితిని, ఎన్నేండ్జైన( బైవారు వి
న్నది లేదాయె, నరణ్యరోదనములే నాగోల; కొమేశ్వరీ! 21 ముం దేతెంచెనులే చెవుల్, వెనుక కొమ్ముల్, వాండి గాంబట్టి ము
న్ముం దాకొమ్ముల కగ్రపీఠములునున్ బూజాపురస్కారముల్
సందర్భించెను; మాయపాచికల లీలల్ గ్రుడ్డి దర్బారులో
చిందుల్ ద్రొక్కెను, ధర్మమూర్తి తలవంచెన్ దేవి! కామేశ్వరీ! 22 పా ర లాాాాాదుగ్జిరాల రామారావు
కామేశ్వరి శ్రేయఃకాములు -జ్ఞానవృద్ధులు-వయోవృద్భల్-వచింపన్ దృణ ప్రాయంబైనవి వారి బోధన; లధర్మారంభ సంరంభక ధ్యేయంబైనది సాధు పీడనము; మాదే రాజ్యమంచున్ ఖలుల్ దాయల్ కూయుచు. జూపసాగిరి కడున్ దౌష్ట్రమ్ము, కామేశ్వరీ! 23 అవధుల్ మీజిన వంతకంత కనివార్యంబౌచు దుశ్శాసన వ్యవహారమ్ములు; వాన్లి నాపంగల్భవార్తా! కానర్ధారయ్యె, వై న! లాలా నర్తనం లా ప్ణవతేటోస్తర త్య ధన్యోస్మి! నే టి విశేషం బొకొ! పంచవర్షములు దాంటెన్ గాదె! కామేశ్వర్! 24 ధట్టుండాతండు గట్టివాండును మహోదారుండు, భల్లూకపున్ బట్టున్ బట్టి, విరోధిమండలము పైపై నొత్తిడిన్ దెచ్చినన్ బట్టున్ వీడక, గుట్టుగా జరుపుచున్ బైమెట్టు నెక్కించె న న్నెట్టొ, మానవరూపదైవత మతండేనమ్మ! కామేశ్వర! 25 పదవిన్ వీడె నతం డనంతరము, మా వారేమొ బొంబాయికిన్ బదిలీ చేసిరి నన్ను పై పదవిలో, వైరుల్ నిరోధించి రు న్మదులై నేనట జేరకుండగ, ప్రయశత్నమ్ముల్ వృథా యయ్యె, నీ దు దయన్ ధర్మపరుం డొకానొకం డటన్ దోడయ్యె(; గామేశ్వర్! 26 దుగ్గిరాల రామారౌవులతతతతతతతతతతతతతతతతతలలా 7 జా
కామేశ్వరి దావా వేసిరి హస్తినాపురమునన్ దాయాదు, లాపిమ్మటన్ దావా వేసితింజెన్న పట్టణమునన్ నా హక్కులన్ గోరుచున్, దావా వారిది యోడిపోయినది, నా దావా జయంబందె, నా 'పై వృత్తాంతమె వింతయైనది సుమీ! వాక్రుత్తుం గామేశ్వరీ! 27 న్యాయస్థానము తీర్చునిచ్చెను గదా! నావైపు, యుష్మద్దయా పీయూష మ్మనుకొంటినయ్య ది, కృషాబ్టీ! కాని తత్తతృలం బీయన్ మాదొరవారికించుక తలంపేరాద యీ నాంటికిన్, మాయల్ పెక్కులు సేయుచుండి, రిది ధర్మంబౌనె? కామేశ్వరీ! 28 దశవర్షమ్ములు నొక్కి పెట్టిరి ననున్, దైన్యప్రదంటైన దు రశ సైరించితి, శ్రీనివాస కరుణా ప్రాప్తంబబ నాయీ మహా దశ, వ్యాజ్యమ్మును వేసి నెగ్గి జయపత్ర మ్మంపినన్ గూడం గ ర్కశతన్ మానరు, నిన్నుంగాక యెవరిన్ బ్రోర్థింతు? కామేశ్వరీ! 29 అరయన్ వారమొ పక్షమో నెలయొ కా దౌరౌర! సంవత్సర న్నర కావచ్చుచునుండె మద్రనగరీ న్యాయస్థల మ్మందు6 దీ ర్చరి తీర్పున్ ప్రకటించి; దాని నిపుడున్ బాటింప రా హస్తినా పురవాసుల్, కరుణింపంగా గలవా? లేవో? నీవు; కామేశ్వరీ! 30 ఆ రి లాాాాాాాాలాలాలాాదుగిరాల రామారావు-
కామేశ్వరి
పని6 గావింపరు సౌమ్యమార్గమున, దావా వేసి గెల్పందినన్
గని లక్షింపరు “జడ్జిమెంటు”, నభియోగం బేను గావించినన్
గినుకన్ బూనెదరేమొ? అట్టులయినన్ గేల్మోడ్చు, రెక్కాడ కుం
డిన డొక్కాడని యట్టి మాదృశులకుం దిక్కేది? కామేశ్వరీ! 31 సరివారున్ దొరవారు చేసెడి కుచేష్టల్ కోర్టుధిక్కార వై
ఖరి విస్పష్టముగా6 గనంబజిచె; ధిక్కారాభియోగమ్ము మె
చ్చరు పైవారని నేనెబుంగుదు6 బనిన్ సాధింపంగా “నన్యథా
శరణం నాస్తి మహాపరాధమయినన్ సైరింపు; కామేశ్వరీ! 32 సంతోషించితి సామరస్యముగనే సాఫల్యమున్ గాంతు నం
చెంతో స్వాంతమునందు(; బెద్దల మనం బెట్టెట్టా యన్యాయపున్
బుంతన్ దిప్పెడి భృత్య వర్గమది వమ్మున్ జేయ, దిక్కేంది యా
తంతున్ నే నడిపింపంగావలసె; క్షంతవ్యుండ౧ గామేశ్వరీ! 33 పరమాపాత్రు, లబద్ధ వాక్యరచనా వ్యాపార పారంగతుల్,
దురహంకారులు, దుర్మదాంధులు, దురుద్యోగానురక్తుల్, దురు
ద్ధరు లున్నారట భృత్యవర్గమున(; దద్దర్భమ్ము నార్పంగ నె
వ్వరికిన్ శక్యము, నీకు(గాక జననీ! వందింతు(; గామేశ్వరీ! 34 దుగ్గిరాల రామారావులాలాలాలాలాలాలాాాాాాా రి
కామేశ్వరి గుడికట్టించినంగాని యింకని మహాక్రూరాఘపంకంబులో. బడ నుంకించెడి మా ప్రబుద్ధులకు దైవం బన్నచో భీతి యె క్కడిదమ్మా! కబళింప6 జాలెదరు లింగంబున గుడిన్, దల్పు ల ప్పడముల్, నే నొకపంటి క్రిందికిని స్వల్పంబౌదు గామేశ్వరీ! 35 రూ మా గాంధారి సహోదరుల్ గన మహామాయ్యవు, లేవో దురు ద్యోగమ్ముల్ పొనరించుచుంద్రు, గురువృద్దుల్- పెద్దలున్నారు కా నీ గోరంతయు వారి. గాదనంగ లేనేలేదు ధైర్యమ్ము దు ర్యోగమ్మియ్యది సాగు టెంతవరకో యోజింపు; కామేశ్వరీ! 36 నవనీతాభమనస్కులంచు, సతత న్యాయాధ్వసంచారులం చు, విశేషించి ప్రశాంతులంచు, విబుధస్తోమంబు కీర్తించు మం త్రివరుల్ సత్యమసత్యమున్ దెలియలేరే? క్రిందివా ర్సేయు దు ర్వ్యవసాయమ్ముల నాపకుండు టది ప్రారబృమ్ము; కామేశ్వరీ! 37 తలపోయన్ గడు నబ్బురంబగు; నమాత్యశ్రేణి వాక్రుచ్చు నీ తులుం గావించెడి ధర్మరక్షణ కృతి స్తోమమ్మునున్, నేండు భృ త్యుల దుశ్చేష్టల యెండ కెండినవొ? యేమో? లేనిచో నింతదు రృలమౌనే! కొడిగట్టి యయ్యెడల ధర్మజ్యోతి; కామేశ్వరీ! 38 లా 10 లాాాాాాాలాలాాదుగ్గిరాల రామారావు --
కొమేశ్వరి
కలికాలమ్మిటు కాలెం జెక్కభజనల్ గావించు వారల్ సమ
ర్హులంటే! న్యాయపథానువర్తనము, నోర్చున్, నేర్చునున్, గార్య కౌ శలమున్, సాహసమున్, బరోపకృతి దీక్షాదక్షతల్ గల్గు మూ
ర్తులు పైగద్దియనెక్కి యేలుటకు నర్హుల్‌కారె? కామేశ్వరీ! 39 ఎదుటన్ మాటయొకండు వెన్కనొకండై యేలాగొ కాలమ్మునె
ట్టుద మన్నట్టి ప్రబుద్భులే చివర కెట్లో ప్రాకి పైపైకి బో
వుదు రుద్యోగమునందు నున్నత పదంబుల్ మెట్టి, నిష్కర్షగా
పదవీ నిర్వహణం బొనర్చ ఫలితంబా! సున్న; కామేశ్వరీ! 40 పరిపాలింతువుగా సమస్త జగముల్; భవ్యాత్ములన్-ధర్మత
త్పరులన్ నీ యధికారులట్టు నియమింపన్ దుష్ట సంశిక్షణన్
బరువా! తగ్గును నీకు, మాదృశులు నిన్ సాధించి వేధించున
క్కజణయా! యుండదు శిష్టరక్షణకునై; కామాక్షి! కామేశ్వరీ! 4] విన్నావా? జననీ! “అపీలు”నంట! సుప్రీంకోర్టులోనంట! మా
యన్నల్ దాఖలు చేసిరంట! మజి నా కచ్చోట వాదింప నే
రున్నారంచును వారి సాహసము, నీవున్నావుగా తల్లి! ఆ
పన్నున్ నన్ గరుణించి నా తరఫునన్ వాదింప6; గొమేశ్వరీ! 42 దుగ్గిరాల రామారావు టా
కామేశ్వరి
కడచెన్ దీర్పు నొసంగి యిప్పటికి లెక్కన్ జూడ నేజ్ఞార్ధమున్, గడువైపోయెను, వాదమందు బలమా! కన్పట్టదేమాత్ర, మె
క్కడి “అప్పీ”లని యక్కజంపడెదవో కళ్యాణి! యెట్లైన న
న్నిడుమల్ పెట్టదలంచి యీ మెలిక లింతేనమ్మ! కామేశ్వరీ! 43 ఇరుపక్షమ్ముల వాదముల్ విని నిజంబేదో నిరూపించి తీ
ర్పరి తీర్చిచ్చె, జితుండొనర్చిన “యపీల్” పైకోర్టులో కొట్టివే
సిరి, యైనన్ జితుండింకనున్ దనదె పైచేయంచు. దీర్చున్ నిరా
దరణన్ జేయునంటే! నశించినదంటే! ధర్మమ్ము; కామేశ్వరీ! 44 ఒకమెట్టున్ దిగివచ్చి, తొందరగ నేదో యొండు గావించి, దె
బృకు దయ్యమ్మును జంకునన్న నుడికిన్ బాత్రమ్ములై, పైకిం జి
క్కక్క తక్కుంగల విచ్చుచుంటిమని వాగ్జానమ్ములన్ జేసి, రెం
దుకులే చెప్పుట? చంకదుడ్డు శరణార్భుల్ వీరు; కామేశ్వరీ! 45 కలంగన్నట్టులు తోంచి, కన్‌దెజచి, వీ/కన్ నాకు నీవిచ్చు ని
శ్చల భాగ్యమ్మును జూచి, మాయనుజు-లీర్ట్యాసన్నిపాతజ్వరా నలసందగ్ధమనస్కులై - తెలివి ఛిన్నాభిన్నమై - చేయు చే
తలునున్ గూసెడు కూ6తలున్ మదికి రోంతన్‌గొల్పు/ గామేశ్వరీ! 46 ఆ 12 లాాాాాాాదుగ్ణిరాల రామారావాా
కామేశ్వరి
తగిలెన్ దెబ్బలు, బొప్పికట్టెను తలల్, ధర్మాత్ము వేజొక్కనిన్
వగలన్ బాలొనరించినందులకు; నైనన్ బుద్ధిరాలేదు మా పాగరుంబోతులకున్; త్వదీయ చరణమ్ముల్ నమ్ము నాపైనంటే! పగసాధింతురంటే! యిదెక్కడి మహాపాపమ్ము! కామశ్వరీ! 47 వారిన్ వీరిని. జేరందీసి యుసి కొల్పన్ బూనుకొన్నారు దు
ర్వారుల్ నాపయి, కేమి చెప్పుదు నరి వ్రాతమ్ము చేతమ్ము నౌ
రౌరా! పెద్ద మనుష్యులంట! దిగజాఅన్ జొచ్చినారంట! నీ చారంభమ్ములకున్; దలంపంగ మహాశ్చర్యమ్ము, కామేశ్వరీ! 48 దారన్ బుత్రుల వీడి మద్రపురిలోం దత్పోషణార్థమ్ము వే
జూరన్ వృత్తియొనర్చుచున్, సతము నిన్నూహించుకొంచున్, భవ త్కారుణ్య మ్మిడునట్టి సంపదకునై కైసాచు నాపైన నీ
వేర మ్మెందులకమ్మ! వీరలకు దేవీ! తెల్పు; కామేశ్వరీ! త్రి ఒక వ్యాజ్యమ్మది చెన్నపట్టణమునం, దొక్కండు ఢిల్లీపురిన్; సుకమేలాగునంగల్లు నీ సుతున కీసున్ బూని వైరి ప్రపం
చక మొక్కుమ్మడి వచ్చి క్రమ్ముకొన: నీ సాయంబు నర్ధింప నూ
రక వీక్షించుచు మిన్నకుండెదవు ధర్మంబౌనె? కామేశ్వరీ! 50 దుగ్గిరాల రామారావులాాలాలాలాాాాాాాాాాాాాా లా
కామేశ్వరి తమ దుర్మాయలు మానరిప్పటికి మాతా! నీవు రంగప్రవే శము6 గావించితి వంచెజింగియును; అజ్ఞానమ్ము దుస్సాహస క్రమమున్ గాక మజేమి యీపనులు; నీ కందోయి రోషానలం బుమియన్ గాలి పాకాలి పోయెదరొ? పోరో? వీరు; కామేశ్వరీ! 51 చండుల్ ముండులు రక్తబీజులును భస్మంబైరి నీముందు, నీ గండామొండి శిఖండి మూక లొక లెక్కా! “ఉప్ఫ”నన్ జీలుగుం బెండుల్ కైవడి తేలిపోయెదరు, దేవీ! నీ వుపేక్షించినన్ గుండుల్ తేలును బెండ్లు మును నింక మేల్కోవమ్మ! కామేశ్వరీ! 52 సకలమ్మున్ వినిపించియుంటిని కదా! సాంతమ్ము నాలించి నా వు కదా! ధర్మ మధర్మమున్ దెలియలేవో! నన్నుం గాపాడలే వొ? కటాక్షింప విదేమి? ప్రాణములు ఠావుల్ తప్పె, నంతంత కో పికయున్ సన్నగిలం దొడంగె, నింక నీవే దిక్కు; కామేశ్వరీ! 53 గ్రహచారమ్మిటువంటి కష్టదశలన్ గల్పించు6 జల్పాదియై, గ్రహరాజ్ఞిన్ నిను గొల్చి నీ కరుణ. జూజంగొన్నచో నా గ్రహా గ్రహముల్ చల్లంబడున్, దొలంగు నఘముల్, కాంబట్టి దేవీ! అను గ్రహమున్ జూపుము, నిగ్రహమ్మొసంగి నన్ రక్షింపు; కామేశ్వరీ! ర్4ీ ఎ 14 లాాాాలాలాలాాాదుగ్లిరాల రామారావాాా
కొమేళ్వరి
“సరిపోదింతటితోనె “ట్రిబ్యునలు” లో సాధింతు” నంచున్ రుషా భరితుండై శపథమ్ము సేయు నొకం డొపై నాపుకోలేని మ
త్సరతన్ నాదు “ప్రమోష” నాపంగ బ్రతిజ్ఞన్ జేయు నొక్కండు, ము
ష్కర దాయాదుల కూంతలన్ మనసు చీకాకయ్యె/ గామేశ్వర! 5్5్ అదినోరో? మణియొండా? నేనెటు(గ, నిత్యమ్మున్ బ్రలాపించు దు ర్మదదుర్మార్గదురంత దుర్విషయముల్, రాకాసులున్ మెచ్చ వా
మదిరాపాన సమాన మాన రహితోన్మాద ప్రసంగంబు, మె
చ్చుదురా! లోకులు, మెచ్చిరేని మెజమెచ్చుల్ కావె? కామేశ్వరీ! 56 త్రాగున్‌బోతుల తోడ నేమియని యోదార్పన్ బ్రయత్నింతువో!
ఆ గర్వోక్తులు లక్ష్యపెట్టకని నా కాదేశమే యిత్తువో!
వాంగన్ జాలిన కుక్క కజ్వదను నా పాఠంబె బోధింతువో!
వే(గన్ జాలను వీరితో, నభయమీవే! దేవి; కామేశ్వరీ! 5్/ కలనైనన్ లవమైన నే నపకృతిన్ గాంక్షింప నవ్వారికిన్,
కల వైరమ్మిది వృత్తి. బట్టి, గతమున్ ద్రవ్వన్ ఫలంబేమి? కో
ర్కుల కంతమ్మది యేది? ఈ “సవతి పోరున్” సైపంగాజాల, న
వ్వుల పాల్సేయక ప్రోవుమమ్మ! కయిమోడ్చుల్ నీకు(; గామేశ్వరీ! 58 దుగ్గిరాల రామారావు కా
కొమశ్వరి
కల(తన్ జెందిన నామనంబున భవత్కారుణ్యమారందధా రలు వర్షించితి హర్షవీజములు మొల్కల్‌దేణ, నేమమ్మ! ఆ మొలకల్ మొక్కలు తీవలై కుసుమముల పూయంగ నీ దీవనల్ వలదా! ఆపితివేమి? తావకదయావర్షస్ముం గామేశ్వరీ! 59 అమిళతమ్మైన ధనవ్యయమ్మును, శరీరాయాసమున్, రక్తమాం సము లంతంతకు నెండిపోవుట, నిరుత్సాహమ్ము, నైరాశ్య జా త మసఃణ్షేశము, నాపయిన్ జయము మిథ్యాతథ్యమధ్యస్థ, ము త్తము లీత్రోవలంబోరు; నిష్ఫలము లీ దావాలు: కామేశ్వరీ! 60 వ్యయమయ్యెన్ ధనమున్, శ్రమంపడితి. గాలాతీతమైనన్ దుదిన్
ఛ్ జయమున్ బొందితి(, గాని, తీరు పమలున్ సోమము గావించి, మా యయవారల్ తరువాత లాభముల నీయన్ బోక హింసించినన్, జయపత్రమ్మది నాల్కం గీసికొననా? శర్వాణి! కామేశ్వరీ! 6] సరిశిష్టమ్ములు నాకు రాందగిన లాభమ్ముల్ ప్రసాదించు వై ఖరి మా పెద్దలయందు మందుకయినస గన్పింప దోయమ్మ! వ తృరమున్ దాంటెను, వారి గుండియలు హొషాణమ్ముతోం జేసితే? కశరగంబో వరగంగంబోవు నవి నా కన్నీళ్ల: గామేశ్వరీ! 62 లా ర లాాాంంాాలాాాదుగ్గిరాల రామారావు --
కామేశ్వరి
దొరలా! తీర్పును లక్ష్య పెట్టరు కుయుక్తుల్ పన్నుటేకాని, తీ
ర్పరి పట్టించుకొనండు ధిక్కరణ నేరారోపణన్ జేసినన్,
మొరనాలింపవు నీవు నీదు చరణమ్ముల్ పట్టి వాపోయినన్,
బరువైపోతినె? నీకు, నేది తరణోపాయమ్ము? కామేశ్వరీ! 63 ఎపుడో యేదొ యొసంగి యా పిదపం దా మీందగ్గ వీకుండంగా సపమార్గమ్మునం గాలు వెట్టి, స్తన శల్యాన్వేషణల్ - కాకదం
త పరిక్షల్ పానరించుచున్ దినములన్ దాంటించుచున్నారు మా
కృపణుల్; నీ విటులూరకున్నయెడ నేదీ దిక్కు? కామేశ్వరీ! 64 అరయన్ దీరిక లేనివారు బహుకార్యాంతర్నిమగ్నుల్త్ నిరం
తరమున్ మా దొరవారు; సంగతులు సంధానించి ముందుంచు కిం కరులా! సంకరజాతి, తిన్ననగు మార్గమ్మున్ విసర్జించి వం
కరదారిన్ నడయాడు వారి కలముల్స్ కన్గొంటె! కామేశ్వరీ! 65 తమ తీర్పున్ జవదాంటకుండ6(గ సమస్తమ్మున్ సమగ్రమ్ముగా
నమలున్ జేసెద మంచు. గాగితముపై హామీలు హైకోర్టులో; సమయమ్మున్ దిగ౦ద్రావి యా పిదప శుష్కాలాపముల్ శూన్యహ స్తములున్ మా దొరవారి సేవకుల నైజంబయ్యె; గామేశ్వరీ! 66 దుగ్గిరాల రామారావు [7
కామేశ్వరి “హామీలన్నియు గంగలో. గలిసెనా? ఆ మాట అనాండు నేం డీ మాటా!” యని బుద్ది చెప్పంగలవాండెవ్వండు లేండాయె,నీ వా! మౌనంబును వీడవాయె, మటథి నేనా! కక్కుటా! మింగుటా! యేమిన్ దోచక మధ్యలో నలంగుటాయెన్ దల్లి! కామేశ్వరీ! 67 కడచెన్ బ్రాయము, సోయగమ్ము సురిగెన్, కళ్యాణమున్ జేసి ర ప్పుడు, కాంతామణి కేమొ ముట్టుడిగె; “నప్పూబోణి సంతానమున్ బడయంగావలె, లేనినాండు గృహిణీత్వ మొల్ల బో” మంచుం గ ట్టడియా! నాథుండు ధర్మమున్ దెలుప లేండా! నేండు6 గామేశ్వరీ! 68 వినినన్ జూడరు, చూచినన్ వినరు, బల్‌విడ్డూరమౌ, నోరు వి ప్పినచో నాల్కలు రెండు, రెచ్చిన రుషావేశమ్ముతో. దోంకపై ననె నిల్చుందురు కస్సుబుస్సు మనుచున్ రవ్వంత కవ్వింప, వ ర్తనమా! వక్రము, పాపజాతి భటసంతానమ్ము; కామేశ్వరీ! 69 త్రిప్పల్ వెట్టుదు రడ్డుపుల్ల లిడుచున్ దీండ్రించి, పేలాలకై కుప్పంటించెడి చుప్పనాతులు-మహాక్రూరుల్-నదిన్ దాంటి యా తెప్పన్ గొల్పు కృతఘ్నతాపరులు - మా దేవయ్య; లా తెల్వి నే6 జెప్పంగా వలెనే? యెజుంగదె? భవచ్చిత్తమ్ము, కామేశ్వరీ! 70 లా 18 లాాాాడదుగ్గిరాల రామారావు
కామేశ్వరి
అ్రామాణఖ్య వితండవాద రచనా హంకార సంభారు లీ
యప్రాశ్యుల్ తమమాట నిల్చుకొన న్యాయాన్యాయముల్ చూడ కే
వో (ప్రేలన్ విని తత్రృకారముగ నే యోచింత్రు పైవారుం ధ
ర్మప్రాచుర్య మెవండు గోరు. గలికాలంబందుం; గామేశ్వరీ! 71 పరదారన్ నడికొల్వులో నిలిపి, వల్వల్ డుల్చి, యా సాధ్వి ది
క్కజి 'మొళ్టో' యని నెత్తి మొత్తుకొని యాక్రందింపగా. జూచుచున్ బరమానందము నందు పాపుల పురప్రాంతమ్ము నం దేగతిన్
దొరకున్ ధర్మము? దానికై వెదకుటే దోసమ్ము; కామేశ్వరీ! 72 నుదటన్ వ్రాసిన వ్రాంత తప్పదని నన్నోదార్చగా. బోకు, మె
న్మిదియేం డ్లెట్టు లనంతమయ్యెను? భవన్నిర్వ్యాజకారుణ్య సం
పద చేం గాదొకొ? బ్రహ్మవ్రాంతలు మరల్చన్ లేవా? నీయాజ్ఞచే6
గద యాతండు సృజించు సర్వజగతీ కాండమ్ముం గామేశ్వరీ! 73 ఆరేండ్లాయెను వ్యాజ్యమున్ సలిపి న్యాయస్థానమందున్, దురా
చారమ్మున్ దొల6గించు తీర్చుంగొని వర్షద్వంద్వమున్ దాంటె, అ
య్యారే! లాభము. గొంత పొంది యొక యేండాదయ్యెం, బైదానికిన్
నోరున్ నెత్తియు మొత్తుకోవలయునే నూరేండ్లు; కామేశ్వరి! 7 దుగ్గిరాల రామారొవులాలాలాాలాాాలాలాలాాాాా 19 -
కొమేశ్వరి ఉపకారమ్మొనరింపలేదనుచు నేనొక్కింత దుఃఖింప, నా కపకార మ్మొనరింపకున్న నదె సాహాయమ్ముగా నెంతు, ని ష్కృపటాంతఃకరణమ్ముతో. జెలిమినే కాంక్షింతు, నైనన్ సరే త్రపలేకుండ6గ నీ యకారణ విరోధంబేల? కామేశ్వర్! 75 కలుగన్ జేసికొనం డితండనుచు ధిక్కారమ్ములున్ వెక్కిరిం పులు హీహీలును చాటుమాటుగడుసున్ బోకళ్లు. బొంగెత్తె వా కలుగా, లోకువచేసి; సర్వమును చక్కన్ దిద్ద నీ వుండగా! గలుగన్ జేసికొనంగ నేనెవండ నోకళ్యాణి! కామేశ్వరీ! 76 న్యాయస్థానము మాటటుంచుము. జగన్నాథుండె యేతెంచినన్ మా యయ్యల్ భయమందరమ్మ! యనృతామ్నాయ ప్రవక్తల్ - మహా మాయోపాయ విశారదుల్-శకును లమ్మా! వీరు; నేం జేసితిన్ జేయన్ గల్లినదెల్ల నీ పయిన నీ చిత్తమ్ము; కామేశ్వరీ! 77 బమ్మిన్ దిమ్మిని తిమ్మిబమ్మినొనరింపన్ జాలు బల్ చొకచ క్యమ్మున్ గల్గిన 'సేవకాధముల వ్యాఖ్యానాలు స్వార్ధప్రపూ ర్లమ్ముల్ గాని నిజంబుకాదని యధార్థమ్మున్ ప్రదర్శించి యో యమ్మా! పెద్దల బుద్ధి మార్చగదవమ్మా! తల్లి! కామేశ్వరీ! 78 ఎ 20 ాాాాాాాాాలాాదుగ్లిరాల రామారావు ---
కామేశ్వరి
సరసుల్, సర్వసమర్భులున్, బరుల కష్టమ్మున్ సుఖమ్మున్ సదా పరిశీలింపంగలారు, శాంతనిలయ స్వాంతుల్, స్వతంత్రుల్, కృపా కరమూర్తుల్ దొరవారు; వారి కెటులో కాసంత నాయీ మనః పరితాపమ్ము నెటుంగ6 జేయుమని నిన్ బ్రార్జింతుం గామేశ్వర్! 79 లేశమ్మైనను చీమకుట్టినటులున్ లేదయ్యె నీ కయ్యయో!
ఈశానీ! భవదీయ పాదయుగళం బేవేళ సేవించున
న్నీ శుంఠల్ నయవంచకుల్ సతతమున్ హింసించుచుండన్; మనః
క్లేశ మ్మియ్యది మాపి ప్రోవంగదవే! కేల్మోడ్తుం గామేశ్వరీ! 80 ఒక బిల్వార్చనకే హృదంతరమునం దుష్పాంగి యవ్వానికిన్
సకలైశ్వర్యము లిచ్చు శంకరునకున్ సామేనివై, మంచుంగొం
డకు గారాబు కొమార్తెవై, కటికడెందంబూనెదే! యిట్టి పో
లిక నీ కెక్కడ వచ్చెనో? యిటునటున్ లేదమ్మ! కామేశ్వరీ! 81 చాలున్ జాలును నవ్విపోయెద రుపేక్షా భావ మీవింతతో( జాలింపంగదవమ్మ! తావకశరచ్చంద్రాతపాలోకన
శ్రీ లీలామధురామృతమ్మునకునై చేయొగ్గితిన్, నాపయిన్
జాలిం జూపగదమ్మ! నీకిదె నమస్కారమ్ము, కామేశ్వరీ! 82 దుగ్గిరాల రామారావుాలాలాలాలాలాాలాాలాలాాాాాా 21
కామేశ్వరి
కలిగెన్ మా కధికారమంచును మదిన్ గర్వించి, మత్తెక్కి, క
న్నులు నెత్తెక్కగం జుట్టుప్రక్కలను గ్రిందున్ జూడ, కన్యాయచ
ర్యలు గావించుచు. బొంగిపోదు; రధికారాంతమ్ము వీక్షింపంగా
వలె మా బాబుల డాబులన్, వలనొకో! వర్ణింప; గామేశ్వర్! 83 చాలున్ దెబ్బ యొకండు జంతువునకున్; చర్చింప, మాటొక్కటే
చాలున్ మానికి; సేవకావళికి శిక్షల్ చాల వీరీతి; ల
జ్ఞాలేశమ్మును గూడ లేని, దది కొజ్జాజాతి, నా శక్తియా!
చాలీచాలనిదయ్యె. గావలయు. నీ సాయంబు; కామేశ్వరీ! 84 వ్రీడాహీనులు, స్వార్ధపూరితులు, గర్విష్టుల్, సుహృత్పీడన
క్రీడాలోలురు, ధార్తరాష్టశత వర్గీయుల్, జగత్కంటకుల్,
క్రోడాకార వికారు, లార్జిత కళంకుల్, కింకర వ్రాత, మీ
చాడీకోరుల నోరు మూయుటకు నా శక్యంబె? కామేశ్వరీ! 85 మదమత్తుల్, చలచిత్తులున్ బరిగణింపన్ రోమఖండానకున్ దుదియేదో మొదలేదొ నేరని ప్రబుద్ధుల్, ధర్మసూక్ష్మంబులన్ బదిలంబౌగతి సంగ్రహింపరు సరే, పాండిత్యమున్నట్లు చె ప్పుదు రేవేవియొ వక్రభాష్యములు తీర్చున్ మార్చం; గామేశ్వరీ! 86 ఆ 22 లాాాాాాాాాదుగ్లిరాల రామరావు
కామేశ్వరి
పలుగాకుల్ చెలగాట మంచనుకొనన్ బ్రాణాంతకమ్మాను సా
ధుల కాయాటలు, సాధుసంతతి మదిన్ దుఃఖింప దుర్భిక్షమై
కల(గన్ బాజును దేశ, మేలెడిదొరల్ కల్పించుకోరెందుకో?
కలికాలంపు మహత్వమో! తలంప మా కర్మమ్మొ! కామేశ్వరీ! 87 ధర్మమ్మున్ గని, చట్టమున్ దెలిసియున్, ధర్మస్థలంబందునన్
ధర్మాధీశు లొసంగు తీర్పులను సాంతమ్మున్ విలోకించియున్,
ధర్మమ్మున్ నిలంబెట్టంగాంగలుగు నేతల్ తామె కావింప దు
ష్కర్మల్, కంచెయె చేనుమేసినయటుల్ గన్పట్టుం గామేశ్వరీ! 88 భటసందోహము ద్రోహకార్యముల నాపన్ లేనిచో, నేల్చడిన్
జటిలమ్మైన సమస్య లుప్పతిలి, యస్తవ్యస్తమై యేమొన
ర్చుటకున్ దా మసమర్శు లౌదు రధికారుల్; దానం బేట్రేగుంబో కుటిలవ్యూహము పట్టంబగ్గములు లేకుండంగం గామేశ్వరీ! 89 క్షమ యత్యుత్తమమైన దొప్పుకొనెదన్ జాముండి! కానీ యతి
క్షమ దైన్యమ్మును తెచ్చి పెట్టనని వక్కాణించి బోధించె పం
చమ వేదమ్ము భవత్‌క్షమాగుణ మి€కన్ జాలించి యీాషద్రుషా సముపేతేక్షణపాళి దుండగులపై సారింపు; కామేశ్వరీ! 90 చాదుగ్గిరాల రామారావులాలాలాలాలాాాలాాా 23
కామేశ్వరి తనదారిన్ బడి తాం జనంగం దన హోదా చూడంగా లేక, వె న్కను కుక్కల్ తెవాగుచుండినను లెక్కా! దిక్కరీంద్రమ్ము టె క్కునకున్; నిక్కమెగాని; మౌనముగనే కూర్చున్నచో6 దోంక ప్ప కును మత్తేభము మందబుద్ధియని వా6ంగున్ గుక్క; కామేశ్వరీ! 91 గుట్టున్ బట్టుక నెట్టుచుంటి దినముల్ కొండంత ధైర్యమ్ముతో నెట్టో యమ్మ యనుగ్రహంచునని, కానీ నాపయిన్ నీకు లే నట్టే కన్పడు. గూర్మి యున్నయెడ జాప్యంబింత గావింతువే గట్టెక్కింపక, యెంతకాలమని యీ కష్టాలు; కామేశ్వరీ! 92 “ఆలస్యాదమృతం విష”మ్మనెడి పల్కాలింపవో? “యెప్పుడో వీలున్నప్పుడు వచ్చి చూచెద” ననన్ వీలౌనెా యందాక యీ కాలమ్మాంగునే? అమ్మ వచ్చువర కాగంబో దమావాస్య; యా కైలాసమ్మును వీడి రమ్ము త్వరగా6 గావంగం గామేశ్వరీ! 93 అచలేంద్రాత్మజ వీవు, స్థాబుండు త్వదీయాత్మేశుం, డాత్మోద్భవుల్ శుభి సంభూతు(డొకండు నింకొకరుండో చూడంగ విఘ్నేశుండే! వచియింపన్ బనిలేదటంచెజిం/గియున్ బాధల్ నివారింప మొ క్కుచునుంటిన్; గరుణింపవేని భవదంఘ్రుల్ వీడ; గామేశ్వరీ! 94 ఆ 2ద్చు ాదుగ్లిరాల రామారావు-ా
కామెళ్వరి
నీవా! చేయవు చేయంగల్గియును, పోనీ! సాయమున్ జేయు స
ద్భావున్ గద్దియపైన నిల్పుటకు యత్నంబైనంగావింతువా!
ఆవంతేనియు; “అమ్మపెట్ట”దను న్యాయమ్మున్ స్మరింపింతువో?
దేవీ! నీ విటులైన మాదృశులకున్ దిక్కేది? కామేశ్వరీ! 85 వెనకయ్యో కొమరయ్యయో వెతలతో వేసారి వేడన్ వినీ
విన నట్లీగతి మిన్నకుంటకు లవంబేనిన్ మనం బొప్పునే?
జననీ! నీకు; జగత్కుంటుంబిని వనున్ శాస్త్రంబు; లాయిర్వురిన్ గనినట్టుల్ గనలేదె నన్ను వలపక్షంబేల? కామేశ్వరీ! 96 “పరమేశీ! పసివానితో. దగునంటే పంతాలుంబట్టింపులున్
గరుణింపన్ దొరకోవటంచు భవదేకాంతంబునందున్ నినున్ బరిహాసంబొనరింప శంకరుండు నీ ప్రత్యుత్తరంబేమిటో?”
శరణంటిన్ గరుణించి నాకు జయమున్ సాధింపు కామేశ్వరీ! 97 నీకున్ నాకును దప్పదెట్టులయినన్, నిన్నేను వందించినన్
లేకున్నన్ ననుగాచు భార మరయన్ నీమూపు పైనున్న ద
మ్మా! కాత్యాయని! జాజణుకోందలంచినన్ వ్యర్థప్రయత్నంబగున్,
నీ కాళ్లన్ వదలంగంబోను, జగమొండిన్ నేను; కామేశ్వరీ! 98 దుగ్గిరాల రామారావులాలాలాలాలాాాాలాాా 25 టా
కామశ్వరి అకళంకాత్ముండొకండు నాదయిన కార్యంబెల్ల సాధించి మా మకహృద్వీథి మహాంధకారపటలిన్ మాయింపంగా గట్టి పూ నికతోనుండె నహర్షిశల్ ఘనుండు; తన్నిర్వ్యాజయత్నమ్ము సి ద్ధికి నీ సత్సప తోడు కావలయు గాదే! తల్లి! కామేశ్వరీ! 99 విసిగెన్ ప్రాణము, ద్రాణయున్ సురిగె, నీ వేరమ్ము ప్రారబ్దక ర్మసముద్భూతము, గెల్చినానని సుఖంబా! లేశమున్ లేదు మా నసిక క్షోభ భరమ్ముతప్ప; యింకనైనన్ దీనిం జల్హార్చి శాం తి సుఖమ్ముల్ సమకూర్ప్చుమమ్మ! కరుణాబ్టీ! దేవి! కామేశ్వరీ! 100 నా కష్టాలెటుతీజు; నీవు-మగండున్ గైలాసమున్ దప్ప నీ లోకమ్మున్నదటుంచు నెంచ; వింక నాలోకింతువే? నన్ దయన్: నీ కాళ్లే గతిగాని వేజొకటి లేనేలేదు నా కయ్యయో! నా కర్మమ్మిది; నవ్విపోదు రెవరైనన్ విన్నం; గామేశ్వరీ! 101 ఒడ లర్ధం బిడి కట్టుకొన్న మగండెంతో ప్రేముడిన్ జూడ, నె క్కుడు భక్తిన్ బచరించుచున్ గొడుకులున్ గోడండ్రు సేవింప, నె న్నండు గష్టమ్ము నెజుంగ వించుకయినన్, నా యేడ్చు నీ వీనులన్ బడునే? యింతకు గొంతుచించుకొని లాభంబేమి? కామేశ్వరీ! 102 ఆ 26 లాాాాాాాాాాాాాాాదుగ్లిరాల రామారావు
కామేశ్వరి
ననలెత్తెన్ హృదయాంతరమ్మది మహానందంబుతోనిండి, మి
త్రుని - పాత్రున్ - సుచరిత్రునిన్ - గనక గాత్రున్ - గీర్తి కాంతాకళ
త్రుని - నన్యాయలతాలవిత్రు - గుణవంతున్ - శాంతు బైగద్దెపై ననువొప్పన్ నిలంబెట్టినందులకు, జోహార్లమ్మ!; కామేశ్వరీ! 103 అపుడా రాము6 డనుగ్రహింపంబడెం దా నాదిత్యమంత్రమ్ముతో
రిపు సంహారమొనర్చంగా; సుకవితా ప్రీతాత్ము నాదిత్యు స
తృపతో నండగ నుండంజేసియు, జయశ్రీ పూర్తిగా నీయ వీ
విపుడీ రామున; కీ విలంబునము మేలే? నీకుం గామేశ్వరీ! 104 దరికిన్ వచ్చును. పట్టుకోందలంచినన్ దౌదవ్యులన్ బాలు, ను
ద్ధురతన్ దోబుచి దొంగబూచియును నాతోనాడు, మాయావి బం
గరులేడిన్ బలె నాయదృష్టఫలయోగం, బెప్ట చేంజిక్కునో?
శరసంధానము చేయకుండ జయమున్ సాధింపు; కామేశ్వరీ! 105 ఆలున్ బిడ్డలు చెన్నపట్టణమునం దావాస, మే నొంటిగా(
గాలక్షేపము సేత, వృత్తి కొజకై కష్టించి బొంబాయిలో,
నేలాగో గతియించి పోయినవిలే యేడేండు, లింకైన నే
నాలుంబిడ్డలంజేర మద్రనగరం బంపింవు; కామేశ్వరీ! 106 “దుగ్గిరాల రామారావులాలలాలాా 27
కామేశ్వరి నెనరున్నన్ గడతేర్పు మీ యిడుమలన్, నీ నామసంక్షీర్తనం బున నల్లల్లన శేషజీవితదినమ్ముల్ నెట్టెదన్, లేనిచో నను నీ సన్నిధింజేర్చుకొమ్ము త్వరగా, నా రక్తమున్ బీల్చి పి ప్పిని గావించెడి బాధలియ్యవి తరంబే! సైంపం; గామేశ్వరీ! 107 “అడుగుల్ వీడను నిన్నె నమ్మితి శరణ్యమొ్మొండు లేౌ"దంచు నిన్ గడుదీనమ్ముగ వేడినందులకు నీకారుణ్యముం జిల్కి నా యిడుమల్ తీర్చి ముదమ్ము గూర్చితివి, నీవే లేనిచో నాకు మ్రు క్కడి తండమ్ము నెదిర్చి గెల్చుటకు శక్యంబౌనె! కామేశ్వర్! 1068 తనకున్ లేదన నొక్కకన్ను, తన పొంతన్ గల్గువాండున్నతిన్ గనెనం చేడ్వ మజొక్క కన్ను, చెడు నన్ మాటల్ యధార్థమ్ములే! నను వేధించుచు నాకు రాందగిన యౌన్నత్యమ్ము రాకుండనే డ్చిన దేవయ్యల యేడువుల్ బెడిసికొట్టెంగాదె! కామేశ్వరీ! 109 స్వల్పంబంచును నల్పమంచును మదిన్ భావించి, ధర్మేతరా నల్పప్రక్రియలన్ బొనర్చ్బుచు, ననున్ సాధింప నుంకించు నా చల్చాదుల్ గడదేశిపోయెదరు నీ శాపాసి చే; నిల్చు నొ కల్పాంతస్థిరమై భవద్విజయ మీ కావ్యమ్ము; కామేశ్వరీ! 110 28 లాాాాాాాాాాాాదుగిరాల రామారావు
కామేశ్వరి సదయన్ నాకిడి నావు పై పదవులన్, సామర్థ్యమా! సాటిలే నిది, తన్నిర్వహణమ్మునందు. బ్రతిభా నిర్నిద్రుగాం జేసి సం పదయున్ శక్తియు నాయువిచ్చి నను6 బ్రోవన్ నిన్నుం గైమోడ్చి వే డెద, నీ యాశ్రితవత్సలత్వమును చాటింపించు; కామేశ్వరీ! 111 స్తవనీయమ్ము భవత్కృపామృత రసాసారమ్ము నా కిచ్చు నా యువు-నారోగ్యము-భాగ్యమున్-సుకవితాయోగమ్ము-భోగమ్ము-వై ద్య విదగ్రేసరబ్బందమొక్కటి నిమిత్తంబట్టు చూపించి, శాం భవి! మృత్యుంజయు నర్ధ దేహమవుకావా! తల్లి! కామేశ్వరీ! 112 తమి నా సేమము నారయన్ దలచి మద్రాస్ విశ్వవిద్యాలయాం ధ్రమహాపండిత మండలమ్ము ముదమారన్ జేరవచ్చెన్, దదు త్తమసందర్శన మిచ్చు నా కిక మహోత్సాహమ్ము, ధైర్యమ్ము భ వ్యమతుల్ దర్శనమీయః గష్టము లదృశ్యంబౌను; కామేశ్వరీ! 113 ఒకరో యిద్దజొ కారు పేరుకొనంగా, నున్నారు పెక్కండ్రు, వా రకళంకాత్ములు, నాకు మిత్రులు, మదీయ క్షేమమున్‌గోరి నా నికటక్షోణికి నేగుదెంచిరి ననున్ వీక్షింప౦ దత్పండిత ప్రకరోదంచిత సౌహృదమ్ము నెపుడున్ భావింతు( గామేశ్వరీ! 114 దుగ్గిరాల రామారావులాలాలాలాలాలాలాలాాాలాాాాా 20
కొమేశ్వరి
పాడమున్ జేసిన కర్మవల్లనె ముదమ్మున్ దుఃఖమున్, బౌత్రు వెం
బడి బర్వెత్తి పడంగ కాలు విరిగెన్, మంచంబె లోకంబుగం బడియుంటిన్ గత మాసషట్కము స్వవేశ్మంబందు, నిప్టిప్పుడే
నడువం జొచ్చితి నీ కృపాబలమునన్ నా తల్లి! కామేశ్వర్! 115 ఏనాడో పొనరించి యుండిన అఘంబీనాడు ఘోర ప్రమా
దానన్ నన్నిటు కూల ద్రోసినది వార్ధక్యమ్మునన్; బుణ్యమే
యమైనన్ బాపమెయైన నీ యిహమునం దా యా ఫలప్రాస్తియె
టైన్ జీవికి. దప్ప దన్న నుడి తథ్యంబమ్మ; కామేశ్వరీ! 116 కడచెన్ సప్తతిపైన నా వయస్సు, తగ్గన్ జొచ్చె మేధాబలం,
బుడివోయెన్ జవసత్వముల్, సుకవితోద్యోగమ్ము. జేయించుచున్ గడదాంకన్, మహనీయ పావన భవత్కారుణఖ్యమే యూంతమై నడిపించన్‌వలె శేష జీవిత, మదే నా కోర్కె; కామేశ్వర్! 117
స
ఆరోగ్యమ్మును, దేహదార్ధ్యమును, దీర్చాయుష్న నిత్యమ్ము ని
న్నారాధించెడి శక్తియున్, సుకవితా వ్యాసంగమున్, సాహితీ సౌరభ్యమ్ము వెలార్చు సూరి జనతా సల్గాపముల్, వేళకా హారమ్మున్ దయచేసి, కావు మని నిన్ బ్రార్థింతు( గామేళ్వరీ! 118 ఆ 30 లాాాాాాదుగ్గిరాల రామారావు-ా
కామేశ్వరి దారిన్ దెన్నును లేని నా బ్రతుకు యాత్రన్ మంచి మార్గమ్మునన్ 'బ్రారంభించంగం జేసి, చిన్నపుడె నాపైం బడ్డ సంసారపున్ భారమ్మంతయు మోయ శక్తి నిడి కాపాడంగ లేదా! భవ త్కారుణ్యార్ద కటాక్షముల్ మజువ శక్యంబౌనె; కామేశ్వరీ! 119 జననంబిచ్చితి మాననీయమగు వంశంబందు, సార్ధక్యమున్ గనంగా నీ పదభక్తి నిచ్చితివి, నిన్ గైవారమున్ జేయంజా లిన యీ సత్కృవనమ్ము నిచ్చితివి, తల్లీ! చాలు నింకన్; బున ర్హననమ్మున్ దొలంగించి నీ కడ నివాసంబిమ్ము కామేశ్వరీ! 120 -అళమయమె అకడిప్రైల- దుగ్గిరాల రామారొవులాలాలాలాలాలలా ప]
శ్రీరస్తు నాగురించి... పేరు దుగ్గిరాల రామారావు తండ్రి ; గౌరీపతిశాస్రి (వ్యవహార నామం గవరయ్య) తల్లి ఏ. సత్యవతి అభిజనము : _నందమూరు. తాడేపల్లిగూడెం-నిడదవోలు మధ్య. పశ్చిమగోదావరి జిలా. పుట్టిన తేది వ. 16-4-1932 తోబుట్టువులు 2 ఇద్దరు అన్నగార్డు ఒక అక్కగారు ముగ్గురు తమ్ముళ్ళు అర్జాంగి వ... శ్రీమతి కనకదుర్గ. తంగిరాలవారి ఆడపడుచు. సంతతి ఏ ఇద్దరు కొడుకులు ఆరుగురు కుమార్తెలు వృత్తి :. సివిల్ ఇంజనీరు. భారత ప్రభుత్వం టెలికాం డిపార్టుమెంటులో సూపరింటెండింగ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ. ప్రవృత్తి : _ కవితారచన, గ్రంథ పఠనము. విద్యాభ్యాసము : నందమూరు - నిడదవోలు - కాకినాడ పురములలో. గురువులు : సాహిత్యానికి : తండ్రి, పాఠశాలోపాధ్యాయులు, నందమూరు గ్రంథాలయం. కవిత్వానికి : శతావధాని బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్రిగారు (తిరుపతి వెంకట కవులు). బిరుదులు- ; మధుర కవితా సరస్వతి (1956): కలకత్తా ఆంధ్రసంఘం పురస్కారాలు | (అసోసియేషన్) వారిచే. మధురకవి (2000): శ్రీ శారదా సదస్సు మద్రాసువారి ప్రమాది నామ సంవత్సర సాహిత్య పురస్కారం. మహాకవి (2000) : 'వేదిక' సాహితీ సాంస్కృతిక సమాఖ్య మర్షియు ఆంధ్ర సోషల్ & కల్చరల్ అసోసియేషన్ మద్రాసు వారి పురష్కారము. రసధుని (2000) : “రచన' సాంస్కృతిక సంస్థ మద్రాసువారి పురస్కారం. తతత, ఏ3
శ్రీ తంగిరాల వెంకటకృష్ణ | శ్రీ నన్నయ భట్టారక పీఠం, తణుకు సోమయాజి పద్యగ్రంథ నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్యగ్రంథ పురస్కారము (2001) పోటీలలో '“అమృతకలశము'నకు పురస్కారం. రచనలు : ముదితములు
-
నివాళి (వేంకటేశ్వర శతకము)
-
త్రివేణి పై రెండు కృతులు పెద్ద అన్నగారు వేంకటకృష్ణమూర్తితో కలిసి “దుగ్గిరాల కవులు” పేరుతో 1954 (నివాళి)లోను, 1956 (త్రివేణి) లోను ప్రథమముద్రణ. 2000లో ద్వితీయ ముద్రణ.
-
అమర సందేశము - (ది డివైన్ మెసేజ్ అను ఆంగ్ల గ్రంథమునకు అనువాదము. సుమారు 50 యేండ్డ క్రితం విశాఖపట్నం శ్రీ శాంతి ఆశ్రమము వారిచే ముద్రితము)
-
అమృతకలశము - (ఖండకావ్యము)
-
ఆంధ్ర రసమంజరి - (లక్షణగ్రంథము. భానుమిశ్రుని సంస్కృత
రసమంజరికి తెనుగు సేత)
-
పన్నీటి చినుకులు - (ఖండకావ్యము)
-
శారద చంద్రికలు - (ఖండకావ్యము-ప్రణయకవిత్వము)
-
కామేశ్వరి'-- (ఇలువేలుపు కామేశ్వరీదేవిపై పద్యాలు)
అముదితములు
- సుమనోభిరామము - (ఖండకావ్యము)
-
మేలుకొలుపు - (వెంకటేశ్వర సుప్రభాతమునకు ఆంధ్రీకరణ)
-
సాయీ ప్రసన్నము - (షిర్డీ సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయి
బాబాలపై పద్యాలు)
- రాష్ట్రశ్రీ - (1954లో అప్పటి ఆంధ్ర రాష్ట్రాన్ని విహంగ వీక్షఐతో
వర్ణించే కావ్యము)
- దేవులపల్లి - 1 [నందమూరు వాస్తవ్యులు, దేవులపల్లి
కల్పవల్లి వెంకటరావు (ఇప్పుడున్న వెంకట నరసింహ అప్పారావు గారి తండ్రి) గారి వంశచరిత్ర]
- మధుర - (మధురా నగర చరిత్ర, శ్రీకృష్ణ జననం వరకు.
జంట కవుల రచన). ద 04గె6 న. .
|. .. న; గ. , ఈ | , శ ॥| ల నే గ ః శ /" ల ( ల్ల . గి | " శ . | " గీ క | కా /. న . జ | శ | , / . (& స ల . | న . వ. . న. " _ వ ఎం న. శ సో వ గా ॥ ల | / గ . 1 ( హాం స్ (లం. నన! స్ట ల |. ళ్ 1 " / సళ స త్ర