Telugu hamsageeti - anilvaranasi/indianlanguages GitHub Wiki
] . హింస్గీతి కాలుత్యంపై కచన కఐతలు వ ము (ఎక ౯ జ వన్న శ నే న్ ఫారుటి.. కాల మో న న్ా శ ౬ శకస మ్.ర్రాగ్రావ్్
ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు: 1948లో జననం. (ప్రైమరీ నుంచి మల్టీపర్పస్ దాకా నల్లగొండలో విద్యాభ్యాసం. తరువాత హైద్రాబాదులో అధ్యాపకవృత్తి. ఉస్మానియా యూనివర్సిటి నుంచి, బి.ఎ., ఎమ్.ఎ. (౯౧౮.,[140 డిగ్రీలు. 2001లో ఆంగ్లోపన్యాసకుడిగా పదవీ విరమణ. బాల్యం నుంచే పుస్తకాలు చదవడంలో ఆసక్తి.
ఆర్ట్ లవర్స్‌తో అనుబంధం జీవితంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. పీడిత ప్రజల బతుకులను, బాధలను ఒక నిర్దిష్ట కోణంలో పరిశీలించే ఒరవడిని సానపెట్టింది. ఆర్ట్ లవర్స్లోంచే జన నాట్యమండలి ఆవిర్భవించింది. “చెలిమి కథలు' (పిల్లల కథలు), నీలిపాప (పర్యావరణం మీద తొలి తెలుగు నవల), డ్రీంబాయి (పిల్లల నవల), వెన్నెలలో కోనేరు (కవిత), నీలాంబరి, సిరులయ్య, అందం, కొమరం భీం (నవలలు), తుఫానుల కెదురు నడవరా (వచన కవిత్వం) ప్రచురించబడ్డాయి. సిరులయ్య' కి ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ప్రత్యేక బహుమతి, “తుఫానుల కెదురు నడవరా'కి సత్య-మూర్తి ఛారిటబుల్ ట్రస్ట్ (విశాఖ పట్టణం) 2010 ఉత్తమ కవితా సంపుటిగా పురస్కారం లభించాయి. రచనా వ్యాసంగానికి ముందే సినిమా రంగంతో పరిచయం వుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, బహుమతులు పొందిన 'మా భూమి”, “రంగుల కలి, 'మట్టిమనుషులు' చిత్రాలకి సహ రచయిత, 'కొమరం భఖీం' చిత్రానికి రచన, సంభాషణలు. *'మా భూమి” చిత్రానికి ఉత్తమ ప్రీన్ప్లే రచయితగా “నంది” అవార్డు.
ఆల అ ఆ హంసరగీతి (కాలుష్యంపై వచన కవితలు, ఎస్.ఎమ్. ప్రాణ్‌రావ్ -బో౭లపీట్ట హైదరాబాద్ బి
స్ లా లు వ య న్ న ( 10, సంవతెవ్చైల్ల న త 144546౬౯71 సువ న్యార్ధహాన్యో 5/ చంచ వకూ లాంండాాతా వో 5.1%. ౫౧24౫ ౧4౦ ౭జి క 06; 80089 50101 రాష ల గా ౮౦౪6 0651 2 ౧౧0౦02 54602%27 1౧౩ ౬61100 వ అి2గిం౭గం 2011 ళు 0 1 చ౦034 ౧0? ౦౦౧1౪9 2 £8120112 800% ఆ 16-11-20/6/1/1 403, ౪/12/2521 [ం51రఆఅ౧౦/ 5321660 11293౧ 1412126061 [17/66/2020 - 500 036 01201120003్రింగ౭|.00౧౫ ఏ. 6: 9848787284 జ్ ౧౦౧౫౧౦51౧౮ ట్ వ [50౧61౧6 6200103 మ 620౧11౧92౧౧౭||౫/ 1/6910206-44 ళీ ౧ : 27660000 న౧౧(66 ఇ 2 ౪102 ౦౦౧౧౪16? 56౧/1065 "| (06510065 & 1141000106? 0361 ౧౧౧౪౧౩) ౭82500, 0/6ఆ2026 - 500 044 ౧|| : 040-276770078, 27676910 [౧/0౪ వ; ₹20 $2
పర్యావరణ చైతన్యం
(ప్రకృతిని అనుసరించడంలో మనిషి జీవితానికి సార్థకత లభిస్తుందని జపనీస్ తత్త్వవేత్త మసనోబు ఫుకుఓకా చెబుతారు. ఎరువులు, రసాయనాలు, క్రిమి సంహారక మందుల్లేని వ్యవసాయ విధానాల్ని లోకానికి పరిచయం చేశారు. మనిషి కోసం ఆహారంగానీ, ఆహారం కోసం మనుషులు పుట్టలేదని గుర్తు చేశారాయన. ప్రాకృతికమైన జీవనంలోని గాఢతను పృదయం హత్తుకునేలా చెప్పారు. (ప్రాణ్‌రావ్ గారి కవిత్వాన్ని చదివినప్పుడు ఫుకుఓకా తాత్విక చింతన స్ఫురణకొచ్చింది. పర్యావరణం మీద 'నీలిపాపి శీర్షికన తాలి నవల రాసిన ్రాణ్రావ్ గారు పర్యావరణ విధ్వంసం మీద కవితాత్మకంగా స్పందించారు. చాలా మంది పట్టించుకోని పర్యావరణాన్ని ప్రకృతిని కవితావస్తువులుగా ప్రాణ్రావ్గారు స్వీకరించడం విశేషం. ఇతివృత్తానికి అనువైన కవితాశైలిని అనుసరించారు. (ప్రకృతిని జయించే పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్చదుతున్న మానవాళి తీరుని దుయ్య బట్టారు. ప్రాణప్రదంగా చూసుకోవాల్సిన చెట్లనీ, పక్షులనీ, జంతువులనీ హతమొనర్చే ధూర్తత్వంపై వారి అంతరంగంలోని అలజడిని ఈ కవిత్వం ప్రస్ఫుటించింది. స్వచ్భమైన గాలి, శుభ్రమైన నీళ్ళు, పచ్చదనంతో అలరారే పర్యావరణం అరుదయ్యే పరిస్థితులు దాపురించడం మహావిషాదం. ఈ విషాదం కవి అంతరంగాన్ని కల్లోలపరిచింది. అందులోంచే “'మహానిర్వాణం' అనే దీర్హకవిత వచ్చింది. కూచున్న కొమ్మను నరుక్కుంటున్న మనుషుల తీరు చూసి తల్లడిల్లే మహావృక్షాల స్వగతమే ఈ కవిత. అవేశం, ఆక్రోశం కన్నా ఆవేదన కవి కంఠ స్వరంలో ప్రతిఫలించడం గమనార్దం. “చెట్లు కూలుతున్న దృశ్యం" ఈ కవితలో రూపు గట్టింది. భూముల్ని అరణ్యాల్ని, నదుల్ని సముడ్రాల్ని చెరువుల్ని, వాగుల్ని వాణిజ్యపు సరుకులుగా మార్చివేసిన వైనంలోని దుర్మార్గం బోధపడుతుంది ఈ కవిత్వం చదివితే. పర్యావరణ కాలుష్యం ఎంతటి ప్రమాదకరమో తెలియజేప్పే ఈ కవితలు పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉండటం ఎంతో ఉపయుక్తం. పర్యావరణ కాలుష్యం పట్ల ఉపేక్ష తగదని విిన్నవర్గాల వారికి గుర్తు చేస్తుంది ఈ కవిత్వం. ఇవాళ్టి పాఠకులకు పర్యావరణ స్పృహ కలిగించే ఈ కవిత్వాన్ని పుస్తకరూపంలో అందిస్తుంది మా సంస్థ. మా ఇతర ప్రచురణల మాదిరిగానే ఈ పుస్తకాన్ని పాఠకలోకం సమాదరిస్తుందని ఆశిస్తున్నాం.
- పాలపిట్ట బుక్స్
కనితా(క్రమం న. క్ష ఎవడీ అర్భకుడు.........౨౨౨౨౨౨౨౨౨౨౭౭౨౦౭౦౦౦౦ం౭లం లంట రీ రహస్యం .......౨౨౨౨౨౨౦౦౦౨౦౨౬౨వవలరరలదలవల దల వలలదద నంట లలలం 111 అరణ్యరోదన...........లంంంలటంంటంలంంంంంంలంలలంలలంలట లైల అమ్మ ఆక్రోశన ...............౨4౨44242400260004422222 = 22ర్ మహానిర్వాణం..........44౦౦౦44 2620226262 ల2 లర వరద దం వల లం 40042 80
ఏవీ నా బాల్యం కొండ ఎక్కలేదు బండ మీంచి జారలేదు కొమ్మ పట్టుకుని ఉయ్యాలలూగ లేదు వాన నీళ్లు అరచేతిలో పట్టి ఆడలేదు పడవలు చేసి పారే నీటిలో వదల లేదు ఎండకి కాగుతూ చెట్టు నీడకై ఉరుక లేదు కంచెలు దూకి కాయలు తెంప లేదు కాపలా దారు కరకు అందకుండా నవ్వుతూ ఉరుకలేదు బోర్లాపడి, చిట్టినవేళ్లకు ఉమ్మి మందు పెట్టలేదు
హంస లీ 4 |
గిల్లిదండు ఆడలేదు కబిడ్డి కబడ్డి అనలేదు తుడుం ఆట ఊసే తెలీదు అవా చెమ్మలు పచ్చీసు పందాలు బొమ్మల పెళ్లి పాటలు ఆడపిల్లలతో ఆటలు తాత చెప్పిన కథలు అవ్వ చేసిన అప్పచ్చులు అన్నీ నాకు మరుగే నా బాల్యానికి తరగని తరుగే. మార్షింగ్ బ్రష్ చేసుకుని టాయిలెట్లో దూరి అన్నీ కానిచ్చుకుని (బెడ్ జామ్ నోట్లో కూరుకుని 'టైెమయిందని అమ్మ టెన్షన్‌తో అరుస్తుంటే బాగ్ సద్దుకున్నావా అని నాన్న హెచ్చరిస్తుంటే తలూపుతూ దైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి మర బొమ్మలా లేస్తాను నాకంటే బరువుగావున్న పుస్తకాల మూటను మోస్తూ బాల్యంలోనే (బ్రతుకు భారంతో
2 క ఎస్ట్ఎమ్. ప్రాక్రావ్
వంగిపోయి నడుస్తూ
స్కూల్ బస్సు ఎక్కుతాను.
స్కూల్లో చదువు
ఇంట్లో
ఎసైన్‌మెంట్ల బరువు.
అవి వదిలించుకోవటానికి
ఇంట్లోకి వచ్చీరాగానే
ట్యూషన్ సార్ ఇంటికి పరుగు.
వర్మ్శంతా అయ్యాక
ఉసూరుమంటూ వస్తాను
వ్లాస్ములో అమ్మ వుంచిన
హార్లిక్స్ తాగుతాను.
ఎవరున్నారు అడగడానికి
ఎలా వుంది
హార్లిక్స్ అని.
అమ్మ వచ్చేది ఆరు తరువాత
ట్రాఫిక్ జామ్ చుట్టుముడితే
ఎడో, ఎనిమిదో ఎవరికీ తెలీదు
నాన్న వచ్చేది పది దొటకే
సాప్ట్వేర్ ఉద్యోగికి
ఎప్పుడూ పని ఒత్తిదే.
టి.విలో కార్టూన్ షోలు
లైవ్ షోలు, ఇదే కాలక్షేపం.
లేటుగా వస్తే, అమ్మ వంట చెయ్యదు
ఫోన్ చేసి ఏ పిజ్ఞాయో తెప్పిస్తుంది. జంగ గీతి కే 3
అటూ ఇటూ అమ్మా నాన్నా పడుకుంటే మధ్యలో దూరి మాట్లాడాలని నా ఫ్రెండ్స్ సంగతి చెప్పాలని స్కూల్లో నాకు తగిలిన దెబ్బచూపించాలని వుంటుంది. అది తీరని అశ నా గది నాకు వుంది తొమ్మిది కాగానే అమ్మ టి.వి. -ఆఫ్ చేస్తుంది నా పక్క సద్ది పడుకో మంటుంది ఎ.సి. ఆన్ చేసి వేళ్లతో నా జుట్టు నిమిరి నా చెంపలను ముద్దాడి గుడ్‌నైట్ చెబుతుంది తలుపు వేసి వెళ్లిపోతుంది. నాన్న మటుకు మై స్వీట్సన్ గుడ్ మార్నింగ్ మేలుకొలుపు పొద్దున్నే వల్లిస్తాడు అమ్మ వెళ్లి పోయాక అంతా నిశబ్దం ఎవరూ లేరు, నేను తప్ప, నేనున్నాగా అంటుంది నా వంటరి తనం 4 క ఎఫ్.ఎమ్, ప్రాకూవ్
నా మీదికి దెయ్యంలా
దూకుతుంది.
నాకు భయం వేస్తుంది
దుప్పటి మొహం నిండా
కప్పుకుని నాలోకి నేనే
ముడుచుకుంటాను.
మైదానంలో గాలిపటాలు
ఎగరేస్తున్నట్లుగా
కలలు కంటాను.
పేంచి వేసి
కసిగా లాగి
కటీప్ చేసాను
వాటి గుండెల్లో దూరిన
తుమ్మముల్లును చూసి
వికటంగా నవ్వుతూ
భోరున ఏడుస్తాను
మాన్సూన్ మబ్బులు
నిండిన కళ్లను
చెంపల చెరువులను
కలలో నేనే
తుడుచుకుంటాను. హస్రలీం & 5
ఎతడీ అర్హకుడు షం
- చిన్ని చిన్ని ఆశ చిగురు పూసిన ఆశ చిరగని కాయితాల కట్ట చేతికి చిక్కుతుందేమోనన్న పేద మనసు పేరాశ. చిట్టచివరి పత్రికనుంచీ చిరునామా మరిచిపోకుండా నేరుగా తిరిగి వచ్చిన తన నవలారాజాన్ని ఏ రచయిత అయినా చెత్తకుండీకి అంకిత మిచ్చాడేమోనన్న అమాయకపు అశ. చెత్తకుండీలో దూరి చెత్తలో చెత్తగా మారి ఈ శ ఎస్ట్.ఎమ్. స్రభ్రావ్
రెండు చేతులతో నవీన నాగరికతను నవ్వుల పాలు చేస్తున్న కాలుష్యాన్ని కెలుకుతున్న కండలేక, ఎండిపోయిన చిరుచేతుల ఆశ. పేగుల అరుపులను అదిలించే దేదైనా దొరుకుతుందేమోనన్న కాలుతున్న కడుపు ఆశ. ఎండిన పాలబుగ్గలు ఎదగక ముందే ముదిమిని మూట కట్టుకుని, ఎడతెగకుండా ఎలుకలు కదిలే కడుపు ఒక్కటే ప్రధాన అయవంగా గల రాగ్ పిక్కర్ మదిలో- చాయి కొనుక్కునేందుకు సరిపడే కార్టనో ఖాళీ బీరుసీసాయో దొరుకుతుందన్న దరి చేరని ఆశ.
హంస భశ 2 7
నేల పర్రైలు
వలస వచ్చి చేరిన పాదాలతో,
కాలుష్యం అంటించిన దురదలతో విలవిలలాడుతున్న తనకి మలాము ఏదన్నా దొరుకుతుందేమోనన్న వెర్రి ఆశ.
కడుపేకాక
తాజాగా తన హక్షుని గుర్తించిన
మరో అవయవం కూడా వేధించే వయసులో వున్న తన సీనియరు
చీకట్లో, పేవ్మెంట్ చివర్లో, తనకో
చాక్లెట్ నోట్లోపెట్టి చకచక తనపై కదిలి తన వంటికి, కంటికి తడి మిగిల్చిన బాధ మళ్లీ మళ్లీ కలగకూడదన్న మసిబారిన బాల్యపు ఆశ.
8 & ఎఫ్ఎమ్. ప్తాల్రాన్
ఎవడీ అర్భకుడు సమానత్వానికి సామాజిక న్యాయానికి అద్దం పడుతున్న ఆకలి పేగుల రూపం ఎవడీ వంచితుడు. అభివృద్ధి పథంలో ఆకాశాన్ని కుమ్మేసిందన్న అలుపెరుగని బాకాలతో దద్దరిల్లుతున్న ఈ పుణ్యగడ్డ వారసుడు. ఓట్లు కొన్నడబ్బును మూట కట్టుకోవడానికి ఈ ఇన్ప్లేషన్లో రెక్కలు వచ్చే ఓటు ధరను మళ్లీ మళ్లీ అందుకోవడానికి పదవి వుండగానే పదితరాలకి సరిపడా కూదేసుకోవడానికి తమ పదవులను పరపతిని తాకట్టుపెట్టి
హంప్ర లికి £ 9
రాజకీయాల్లోకి "రాకముందే చంపుకున్న ఆత్మకి దహన సంస్కారాలు చేసిన రాజకీయ నాయకులు, వారి కనుసన్నలలో మెలిగే తాబేదార్లు అవినీతి కన్యతో నిరంతరం జరిపిన వికృత రతికి ఈ భూమి మీద పడ్డ కంకాళపు బొమ్మ మన చరిత్రలో సదా నిలిచి పోయే నల్లటి కమ్మ.
16 క ఎన్ట్.ఎమ్. ్రా[రాన్
రళాస్త్వ్వం
నా చుట్టూ అన్నీ సముద్రాలే
పుక్కిలి కూడా పట్టలేని
ఉప్పు కషాయాలే.
పుళ్లు పడిన నా వేళ్ల
కళ్లని పొడిచే,
సూది మొన కంటకాలే
రక్తం రుచి మరిగిన
జాగిలాల సమూహాలే.
మూడు అంతస్తులన్నా
లేని విల్లా, ఆ వీధిలో లేదు
విల్లా చుట్టూ విరియని
పువ్వ లేదు. అక్కడ
మొరగని కుక్కలేదు.
స్పిట్ ఎ.సి.ల రొదతో
రమించని గోడ లేదు.
ఆ గోడల గర్భంలో
దాగిన గదుల్లో ఏముందో. హంస్టచీతి. 11
వలువలు వలిచేసిన
భార్య సరసన, దిస మొలతో
కూచున్న ఆఫీసర్
వున్నాడేమో.
నీలి బొమ్మను చూస్తూ
స్మాచ్ చప్పరిస్తూ
తను ఆ రోజు దండుకున్న
లంచాల చిట్టాను
_విప్పుతున్నాడేమో.
ఆ నగ్న చిట్టాల మత్తులో
సహజ నగ్నత్వాన్ని
సృష్టికి ఇరుసులాంటి
దేహాల కలయికని
స్పీడ్ లాకర్లో దాచేసి
లాకర్ నెంబర్
మర్చిపోయాడేమో,
అప్పుడే విడిచిన
-తెల్లటి పాము కుబుసం
లాంటి బట్టల్లో,
భుజాల మీంచి
ఛాతీమీదికి
రెండు తలల పాములా
కిందికి దిగిన కండువాతో 12 $ ఎస్టఎమ్. ప్రాల్రాన్
కష్ట సుఖాల కడలిని
కాకిలా విడదీసి
తనకి, తన వారసులకు సుఖాలను,
ప్రజలకు కష్టాలను సామాజిక స్పృహతో పంచుతూ, ప్రజాసేవ చేసే వటవృక్షం లాంటి నాయకుడున్నాదేమో. కోట్ల టెండర్లు
తన ఖాతాలో వేసుకున్న వాడి పెళ్లాం తమ్ముడున్నాదేమో. నల్లబజారు వ్యాపారంలో కల్తీల మేళవింపులో ఎవరికీ అందనంత ఎన్నటికీ దొరకనంత ఎత్తుకి ఎదిగి వేల వేల కోట్లు ఎక్కెడెక్కడో దాచిన వ్యాపార సామ్రాజ్యపు చక్రవర్తి వున్నాడేమో.
హంప్రీ౭ & 13
కాషాయ బట్టల్ని కమండలంలో కుక్కేసి జానీవాకర్ సీసా బోర్తించేసి సైడ్ డిష్‌లన్నీ కడుపులోకి హాం ఫట్ చేసి ఎదురుగా యవ్వనం కారుతున్న మెయిన్ డిష్ మీదికి ఎగబాకిన స్వామీజీ వున్నాడేమో. కొవ్వెక్కిన తన మదానికి మదన తాపానికి ఊరట నిచ్చే జిగటను తన క్రింద నలుగుతున్న తన మోక్షద్వారంలో జార విడిచాడేమో... ఆ (ప్రక్రియలోనే ఆత్మ సాక్షాత్మారం పొందాదేమో. ఏమో, ఎవరికి తెలుసు కెమేరాలు దూరని గోడలు, కళ్లులేని కబోదులు నోరు లేని మూగలు అందుకే రహస్యాలు చెప్పవు ఎవరి గుట్టూ ఎన్నడూ విప్పవు, 16. £ ఎస్ట్ఎమ్. హ్రక్రావ్
నేను
నేను మరీ పొడగరిని కాను
అయితే నిటారుగా నిలబడతాను.
నా పళ్లతో దేన్నీ చీల్చలేను
నా గోళ్లతో మెడ మీద కొట్టి
చెవుల పిల్లినన్నా చంపలేను.
చివరికి కుక్కతో కూడా
పరుగు పందెంలో గెలవలేను.
చలికి గజగజ వణుకుతాను
వర్షంలో తడవడానికి వెరుస్తాను
ఎండకి తాళలేక
ఎ.సి. గదుల్లో దూరుతాను.
అయినా ఈ భూమిని
నా కనుసన్నల్లో నిలుపుతాను
ఆకాశానికి బొక్కలు పెడతాను
ఎన్నిటినో అంతం చేశాను హంస్రశితి శీ 15
మిగిలినవీ మరుగయ్యేలా చూస్తాను. ఇవన్నీ ఎలా చేశానని ప్రకృతి విస్తుపోతోంది. అర్థంకాక ఆకాశం నోరు తెరిచింది దిక్కులు ముక్కున వేలేసుకున్నాయి. అక్కడక్కడ నా కంట పడకుండా మిగిలిన సింహాలు బుగర్రగోక్కున్నాయి. వాటి గోళ్లు ఎరుపు రంగు అద్దుకున్నాయి నా ప్రజ్ఞ వాటి బుద్ధికి అందలేదు. వాటికి బుర్రవుంటేగా బుద్ధి వుండటానికి తెలివి వుంటేగా నా బలం తెలుసుకోవడానికి. అవి రెండూ నా సొంతం నా బుద్ధి పాదరసం నా బు(ర్రలో వున్న మెదడు తెలివితేటల నెగడు. ఆ నెగడు మంటలలో మారణాయుధాల్ని 16 శ్లో ఎఫ్ఎమ్, ్రాలరావ్
మలిచాను.
ప్రకృతిని,
ప్రకృతి సంపదని
సంతతిని
మీట ద్వారా
మటుమాయం చెయ్యడం నేర్పాను.
ఎవడో ఉన్నాది అన్నాడు నేను అజ్ఞానినని అన్నిటిని అంతం చేసిన నేను ఆలంబన లేకుండా అంతరించి పోతానని. నేను నవ్వుకున్నాను చెవులు మూసుకున్నాను మూసుకుపోయిన కళ్లు తెరవకుండా మృత్యుకోరల్లోకే నడిచాను.
“హంస్రశీతి క్వ 17
కాటు కఠిశోయి
నక్షత్రాల మిణుకులను నియోన్ దీపాలు నమలేశాయి. బుతు పవనాల కదిలికలను సునామీలు స్తంభింప చేశాయి. వసంతాన్ని ఒలుచుకు తిన్న (గ్రీష్మపు వడగాల్పులలో
చెట్టూ చేమా, బీదా బిక్కీ అంతా సోలిపోయారు.
ఆ ఉడుకులకు ఓపలేక
ఒరిగి పోయారు.
వారం రోజుల పాటు మురిపించే ముసుర్లు
మాటా మంతీ లేకుండా మొహం చాటు వేశాయి అనగా, అనగా కథలో
ఒదిగి పోయాయి,
18 & ఎస్ట్.ఎమ్. స్రాక్రావ్
కళ్ల ఉనికిని సార్ధకం చేస్తూ
ఎటు చూసినా కనిపించే
పూల పాగాల చెట్లేవి
పూదోట జాడలేవి
ఆకాశ పందిరిలో
ఆరవిచ్చిన మొగ్గల్లా
ఇంద్రధనస్సు రంగుల్లా కదిలే
పక్షుల బారులు ఎటుపోయాయి
మళ్లీరావా, పాటల పండుగ తేవా.
కిచకిచలాడే
చిన్ని పిచ్చుకమ్మ
నా బుర్ర మీద
వాలడం మరిచిపోయింది.
ఎలా వాలుతుంది
బుగ్రే తప్ప మనసులేని
నా యాంత్రిక ఎదుగుదల
దాని రెక్కలు విరిచింది.
చూరులు లేని నా కాంక్రీటు సమాధి
దానికి ఉరికొయ్య అయి నిలిచింది.
అనాడు నేను ఈదులాడిన
వాగులేవి, వంకలేవి
చిరు౭రటాల
చెరువులేవి
లొట్టలు కట్టుకున్న నన్ను హంస్రశీం 4 19
నాలుగు గోడలూ చాపి
పిలిచిన మోటబావులేవీ
అన్నీ కనుమరుగయ్యాయి
కాలుష్య కూపాలయ్యాయి
కాంక్రీటు నివాసాలయ్యాయి.
నిటారుగా నిలిచి,
తన వంటి నిండా
రక రకాల నగలుగా
మొలిచిన చెట్లు
సూర్యతాపాన్ని సవాలు చేస్తుంటే
జంతువుల, పక్షుల అరుపులు
తమకి తపోభంగం చేస్తుంటే
ఆ చిలిపి అల్లరికి ముచ్చటపడి
మురుసుకొనే కొండమునులేరీ.
కొండలు, పర్వతాలు
అన్నీ అవధూతలయ్యాయి.
నగ్నంగా నిలిచాయి.
తమ గుండెల్లో బాంబులు నింపి
బ్లాస్ట్‌లు చేస్తున్న
ఈ యాంత్రిక మనిషికి
కనువిప్పు కలగదేమోనని
కల్లోల పడుతున్నాయి.
గట్టు చేను మేసినట్లుగా
నదులు చేపలను మింగేశాయి. 26 $£ ఎస్టఎమ్. ప్రాల్రావ్
అవి మటుకు ఏం చేస్తాయి
అన్ని ప్రాణులను అంతమొందించే
కాలుష్యాన్ని చేర్చిన మనిషిని
తిట్టుకున్నాయి. ఎండిపోయిన గుండెలో
కన్పీళ్లైలా ఊరుతాయి, ఏడవడానికి.
అందుకే మరో దారిలేక
తమ బిడ్డలను
తామే చంపుకున్నాయి.
రేపో మాపో
అవీ హరీమంటాయి.
ఇసుక పురుగులు పట్టిన
అస్థిపంజరాలలాగ నిలిచి పోతాయి.
ఎన్నాళ్లిలా
ఎన్నేళిలా
ప్రతి ఆరంభానికి
వుంటుంది ముగింపు.
మనిషి పోతూ, పోతూ
తన వారసుడిని, ఎంచుకుంటాడు
అయితే ఈ కాలుష్యం
అందరిని హత్యచేసి
ఏకెక వారసుడిగా నిలుస్తుంది
జీవ జూలం లేని భూమిని శతాహాలొరాన్న్యా
తన దుర్గంధ చట్టాల్లో | గ తా న! మ
ఎదగనంతగా బిగిస్తుంది. | జం గంగ లిం!
మ. లో
క నా 21
ఆరణ్య రోదన అకుపచ్చని చీర కట్టి రంగు రంగుల పువ్వులు కొప్పున పెట్టి పచ్చగడ్డి చెప్పులు తొడిగి చిరుగాలుల నవ్వులు చిందిస్తూ చిన్న పిట్టలను పెద్ద పశువులను అక్కున చేర్చుకుని ఆదరిస్తూ పళ్లు కాయలు కురిపిస్తూ ' అందరికీ తలలో నాలుకగా మెలిగాను నన్నే నమ్ముకున్న అడవి బిడ్డల 22 4 ఎఫ్ఎమ్. ప్రలరావ్
ఆలన పాలన చూస్తూ ఆహారం అందిస్తూ మూలికలతో వైద్యం చేస్తూ వాళ్ల దేవతల్లో దేవతనై పూజలో పూజనై మురిసాను వాళ్ల బ్రతుకుల్లో
ఆనందమై కురిసాను.
సత్, అసత్లను
విద్య, అవిద్యలను శ్రేయస్సు, ప్రేయస్సులను నిర్వచించిన దార్భనికులను, పురాణాలు, ఇతిహాసాలు (ప్రవచించిన కవి పుంగవులను ఎందరినో ఆదరించాను
నా గుండెల్లో
గూళ్లు కట్టి ఇచ్చాను.
చిక్కి శల్యమయ్యాను ఎముకల పోగయ్యాను మబ్బులకు ముద్దులివ్వడం మరిచి పోయాను. మలయ మారుతాలని వీచడం మానేశాను.
హంస్రవీతి శ 23
మూగ వోయిన పిట్ట గూళ్లతో దిష్టి బొమ్మలా మారి దిక్కులు చూస్తున్నాను నేను ఎన్నడో ఆత్మను కోల్పోయాను ఎండుటాకు అన్నా మిగలకుండా ఎంది పోయాను ఈ నవీన మానవ ప్రగతికి మృతశాసనంలా మిగిలిపోయాను. 24 ఎస్ట్ఎమ్. ్రాల్రావ్
ఈ భూమి
పచ్చల పతకంలా
వున్న కాలంలో
అంతటా నేనే.
జనపదాల్లో
కొండ సానువుల్లో
జీవం నిండిన లోయల్లో
శిఖరాల ఎదలపై
ఎక్కడ చూసినా నేనే
అడవి తల్లి పచ్చని
నవ్వులా అంతటా నేనే.
నా నీడలో
సింహాలు సేదతీరేవి
పులుల ప్రణయ కలాపాలు
నాలో వసంతాలని రగిల్బేవి.
కోతుల చిలిపి దూకులు
నన్ను ఉయ్యాల లూగించేవి హంస్రశీ౭ ££ 25
పక్షుల పాటలు నెమిళ్ల ఆటలు చలనం లేని నా మనుగడ చింతను దూరం చేసేవి. తాలి సూర్యుని కిరణాలలో నా ఆకులు నవనవలాదేవి మధ్యాహ్నపు ఎండకు మాడినా క్రింద చేరిన జీవజాలానికి గొడుగులా నీడ పట్టేవి. నా ఆకులు, నులిరెమ్మలు నానా రుచులు అందించే నా పళ్లు తింటూ పెరిగిన మృగాలు నన్ను విశ్వమాతను చేశాయి. కడుపునిండిన వేల జీవులు నన్ను అన్నదాతను చేశాయి. కాదేదీ నాశనానికి అనర్హం ఇది నేటి మానవుని సూక్తి మంచీ చెడూ మరచిన మానవ మృగపు మనోవృత్తి వీడి బాల్యం నా ఒడిలోనే గడిచింది నాగోరు ముద్దలే తిన్నాడు భయమేస్తే నాపై ఎగబాకి నా గుండెల గుబురులోనే 26 8 ఎస్ట్ఎమ్. ప్రాఫ్రావ్
దాక్కున్నాడు.
నా నారలే చీరలుగా
కట్టాడు.
తరువాత మరి ఎందుకో
నేల మీదికి దిగాడు
నా గుందెలుకోసి,
అవయవాలు వేరు చేసి
గూడు కట్టుకున్నాడు.
నన్ను ఆయుధంగా
మలుచుకున్నాడు.
నన్ను మంటలకి అహుతిచేసి
యజ్ఞాలు, యాగాలు చేశాడు
నా కమ్మలపై తన
తాలి సంతకం చేశాడు
నన్ను నిలువునా మండించి
నా గుండెల మంటల్లో
నా బిడ్డలను కాల్చాడు
కరకరా నమిలి మింగాడు.
నన్ను నరుకుతూ, నరుకుతూ
కాన రాకుండా చేశాడు
జనారణ్యమే అంతటా
విస్తరించాడు.
నేను పురుడు పోసుకోవడానికి
జానెడు నేల లేకుండా చేశాడు. హంస్ర సీత శ 27
వీడి మీద నాకు అలుక లేదు జాలితప్ప. వీడు నా బిద్దే. దారి తప్పిన బిడ్డ పాలు తాగి రొమ్ముగుద్దిన నాగరికపు బిడ్డ రేపటి తన బిడ్డల కోసం ఏమీ దాచని స్వార్ధపు బిడ్డ. అర్జవాన్ని ఓ ముని అరచేతిలో ఇరికించాడన్న కథను, నా ముత్తాతలు మురిపెంగా చెబుతుంటే అబ్బురంగా నోరుతెరిచాను వీడు, భూమ్యాకాశాలని ఒక్క మీట నొక్కి చిటికెన వేలు చుట్టూ తిప్పుకుంటున్నాడని, మరుగుజ్జుగా మార్చబడి, వీడి డ్రాయింగ్ రూంలో యావజ్జీవ బందీ అయిన నా చిట్టి తమ్ముడు మ్రిబాబు చెబుతుంటే భయంతో పాలిపోయాను. వీడు ఎంతో చదివాడు ఎక్కడెక్కడికో ఎగిరాడు. గ్రహాల గుట్లు విప్పాడు నక్షత్రాలతో మాట్లాడాడు అన్నిటినీ జయించాడు 28 '&£ ఎస్టఎమ్. ప్రక్రావ్
ఏం లాభం! తనని తనే ఓడించుకున్నాడు. నా మీద పడిన వీడి భస్మాసుర హస్తం రేపు వీడి మీదా వాలుతుంది. వీడిని బూడిదగా మారుస్తుంది. వీడు నా బిడ్డలలో చివరగా వచ్చాడు మొదటే పోతాడేమో, వినాశకాలే విపరీతబుద్దిః వీడు నామరూపాలు లేకుండా నాశనమయినా భూమికి, ఆకాశానికి ఏడుపు రాదు. ఇంకా అక్కడక్కడ మినుకు మినుకు మంటున్న నా కళ్లలో జల ఊరదు. అయితే వీడు ఒంటరిగా పోడు అదే నా బాధ పోగా మిగిలిన నా బిడ్డలందరిని నాతో సహా చంపి మరీ చస్తాడు.
హంస్రకీ9 1 29
కఠకులో నిర్వాణం నేను తల్లి కడుపు చీల్చుకుని తల ఎత్తినపుడు, తొలికిరణాల పురిటి స్నానంలో పరవశిస్తునపుడు తెల్ల మీసాల ఓ తాతయ్య చూశాడు చింతచెట్టు, చింతలు దూరం గీతోపదేశం చేశాడు మనమడికి, చిన్న పంచె కట్టుకుని తలకి కుచ్చుపాగ చుట్టుకుని బాలకృష్ణుడిలా వున్న మనమడు చిరుపువ్వుల సొగసులు నిండిన కళ్లతో నన్ను చూశాడు నునులేత రెమ్మల్లాంటి వేళ్లతో నన్ను నిమిరాడు. నేను ఆనందంతో ఊగాను నా లేత ఆకుల కళ్లతో నవ్వాను. తాత నా చుట్టూ పాదు చేశాడు చిట్టి చిట్టి చేతులతో మనమడు 36 1 ఎఫ్ట.ఎమ్. ప్రరావ్
నా చుట్టూ కట్ట కట్టాడు. తాత మనమడిని ముద్దాడాడు. నా చుట్టూ కంప నాటాడు నాకు మలిస్నానం చేయించి మనమడి చెయ్యి పట్టుకుని నడిచి పోయాడు. మనష్యులు ఎంత మంచివాళ్లు తాతా మనమడి కంట నేపదకపోతే ఈ పాటికి, ఏ మేక కడుపునో పడేదాన్ని. మారాకు వెయ్యకముందే మట్టిలో కలిసి పోయేదాన్ని, ఆ ఊహకే వణికి పోయాను నా లేత కాండం నేలకానింది కదులుతున్న ఆ పండు పాదాలకు మొగ్గ పాదాలకు మనసారా మొక్కింది. కదులుతున్న కాలం వెనక్కి ఎన్నడూ తిరగదు. నాకు దూరంగా, పళ్లతో భారంగా వున్న మామిడి మామయ్య చెప్పాడు. అది నిజం కాలం చలనం ఆగిపోదు ఉరుకలు వేసే జీవనదిలా నేటిని, నిన్నటిలో ముంచేస్తూ
హంస్ర గీత శో 3!
కాలం కదిలిపోతుంది. నేను పెరిగాను నా తల్లి ఆత్మలోకి లోతుగా చొచ్చుకు పోయాను. వావి వరుసలు మరిచిన అదుపులేని మనిషి కామం నా తల్లితో విషయించలేదు రాచపుండు లాంటి కాలుష్యం ఇంకా నా తల్లి కడుపున పడలేదు. అందుకే నలువైపులా కొమ్మల చేతులు చాపాను వసంతాలని కౌగలించాను. లేగ కుమ్మిన కొద్దీ ఆవు చేపినట్టు నేను లోపలికి దిగిసకొద్దీ నా తల్లి నాలో శక్తి నింపింది అందుకే పైకి అంతగా ఎదిగాను. పట్టులాంటి రెమ్మలతో తొలి వెలుగులో మెరిసాను ఎడతెగని ముసల ధారలలో నిలువునా తడిసి పులకించాను రెమ్మలు కొమ్మలుగా మారుతుంటే ఏపుగా ఎదుగుతున్న బిడ్డలను చూసి 32 కో ఎస్ట్.ఎమ్. ్రల్రావ్
ఎదనిండా మమత నింపుకుని గర్వంతో ఉప్పాంగుతున్న తల్లిలా సంబరపడ్డాను. సంతోషంతో నాట్యం చేశాను. నా మూలాలు పంపిన తిండిని నా ఆకుల వంటగదుల్లో వండి మరోముద్ద, మరో ముద్ద అంటూ నా బడ్డలకి మురిపెంగా పెట్టాను. నా చుట్టూ నీడపరిచాను పశువుల మనుషుల యాత్రికుల, రోగుల సేద తీర్చాను. తెల్ల మీసాల తాతయ్య మనమడు ముత్తాత అయ్యాడు. నా కళ్ల ముందే రాలి పోయాడు. ఆయన మనుమలూ తాతలయ్యారు. తరాల అంతరాలని చూపారు. కాలం పాతనీరు పోయింది కొత్తనీరు వచ్చి చేరింది ఎడ్ల బండ్లు ఎరుక లేకుండా పోయాయి గుర్రాల సవారి గతంలోకి జారిపోయింది మేనాలు మూలన పడ్డాయి అంబారీలు అటకెక్కాయి. హంస్రఫీతి & 33
పట్టాల మీద పొడుగు బంద్‌లు కూస్తూ బరువుగా కదిలాయి. గాల్లో లోహపు పక్షులు పల్టీలు కొట్టాయి. చిన్న ఊళ్లు చకచక ఎదిగాయి పెద్ద పట్టణాలుగా పరిణమించాయి నాకు కూతవేటు దూరంలో వున్న అడవి అందాలు అందకుండా పోయాయి నా చుట్టాలు, పక్కాలు నిలువునా కూలి పోయారు సా మిల్లులో డిసెక్షన్ పాలయ్యారు టింబర్ డిపోలకి వేలం వెయ్యబడ్డారు మోడయిన మూడు నాలుగు ముసలి మానులు మటుకు మూలుగుతూ నిలిచాయి. ఏమిటో ఈ అంతు తేలని అబ్బురం చూస్తుండగానే ఈ మనుషులు చుక్కల్లా పెరిగిపోయారు. అడవులను, చెరువులను వాగులను, వంకలను వామనుడిలా ఆక్రమించారు. ఆ రోజుల్లో అప్పుడో ఇప్పుడో కనిపించే వీళ్లు ఎప్పుడూ కనిపిస్తూనే వున్నారు 34 1 ఎస్ట్ఎమ్. ్రాఫ్రావ్
ఎక్కడ చూసినా వీళ్లే
పుట్టలోని చీమల్లా
కట్టెలోని చెదల్లా
అంతటా వీళ్లే,
ఒకప్పుడు వీళ్లు అసలే లేరని
మేమే ఈ భూమికి పాలకులమని
పచ్చని కిరీటాలతో కులుకుతూ
పువ్వులు, కాయలు పంచుతూ
ఎంతో ఆనందంగా వున్నామని -
మనుషుల గండ్రగొడ్డళ్లకి
తన ఒళ్లు అప్పగించి
ముక్కలు ముక్కలుగా మారిన
మామిడి మామయ్య చెప్పాడు
మనుషులంతా మంచివాళ్లు
కారని మరీ మరీ చెప్పాడు.
ఏళ్లపాటు తన పళ్లు తిని
పండుగలకు, పబ్బాలకు
వ్రతాలకు, పెళ్ళిళ్లకి
తన ఆకులకు పురికొస ఉరివేసి
తనని అన్నిరకాలుగా వాడుకుని
చివరకి నాలుగు కాసుల కోసం
తనను నిలువునా చీలుస్తున్నారని
వాపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు హంస్రగీతి శ 35
తనకే కదిలే శక్తి వుంటే పారిపోయే వాడినని నిట్టూర్చాడు. నిజమే. మాకు కదిలేశక్తి లేదు. కానీ ఆహారం ఇచ్చి మనుషులను, జంతువులను కదిలించే శక్తి వుంది. ఏం లాభం. వీళ్లకి ఎంత చేసినా ఏం ఫలం. మా నుంచి పొందిన శక్తితో మమ్మల్నే కూలుస్తున్నారు పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు. రేపు నా గతి ఏమవుతుందో నిన్నా మొన్నా మూడు వందల ఏళ్ల నుంచీ వున్నాను ఎందరికో బ్రతుకు తెరువయ్యాను ఇన్నేళ్లుగా నా ఫలసాయం తిని నన్ను కూలుస్తారా. భయంతో నా ఆకులు అల్లల్లాడాయి. భూమిలో లోతుగా దిగిన నా వేర్లు ఒణికాయి నలువైపులా దూసుకుపోయిన 36 $ః ఎస్ట్.ఎమ్. ప్రఫరావ్
నా కొమ్మలు పాలిపోయాయి
లేత రెమ్మలు గుక్కపట్టాయి.
అనుకున్నంతా అయింది
అవసరం తీరాక అల్లుడు, లంజకొడుకు.
నేనున్న తావు చుట్టూ
ఎక్కడా చెట్లు మొలకెత్తటం లేదు
ఇళ్లు మటుకు ఆకాశంలోకి లేచాయి
బిల విల లాడుతూ దూరిన
మనుషుల గోలతో
ప్రతిధ్వనించాయి.
ఎక్కడ చూసినా మనుషులే
వీళ్లలో ఎవరికీ,
ఆహారం చేసుకోవడం రాదు
అన్నిటికీ మామీదే ఆధారపడతారు.
అయినా మమ్మల్ని చంపి
తాము పెరుగుతామంటారు
కూచున్న కొమ్మను నరుక్కుంటామంటారు.
చదువురాని ఆ తెల్ల మీసాల
తాతయ్య ఎంతో నయం.
నన్ను ఆదరించాడు. లాలించాడు
ఆయన తరువాత కూడా ఫరవాలేదు
నా కొమ్మలు కొట్టుకుని
ద్వార బంధాలు చేసుకున్నా
కిటికీలకు చౌకట్లుగా అమర్చుకున్నా హంస ఏ౭ ఓ 37
ఇంటి దూలాలుగా వాడుకున్నా నా కర్రలు పొయిలో కాల్ళి కమ్మని వంటలు వండుకున్నా శవ సంస్మ్కారలకి నన్ను కాష్ట్రాలలో కాల్చినా ఏటేటా నా ఫలసాయం వాఠరసులందరూ పంచుకున్నా నా కాండం జోలికి రాలేదు నా గుండెలపై గొడ్డలి ఎత్తలేదు. అందుకే కొట్టిన కొమ్మలను మళ్లీ ఇచ్చాను. మళ్లీ మళ్లీ కొట్టినా, పాపం వాళ్ల అవసరమని మళ్లీ మళ్లీ పెరిగాను. ఇవాళ మరి ఎందుకో ఎదనిండా చీకటి నిన్న వచ్చిన అతనే నా కళ్ల ముందు కదిలాడు. గోతాంలో దింపిన పీపాలా మెడలు తిరగకుండా అడ్డంగా బలిసిన మనిషి నాలుగడుగులు నడిచి నా దగ్గరకి వచ్చినందుకే ఆయసపడ్డాడు ఆపసోపాలు పడ్డాడు. 38 1 ఎస్ట్.ఎమ్. ప్రాల్రావ్
నా అకులే, వీవెనలుగా గా మలిచాను వాడి గుండెల్లో జీవవాయువు ఊదాను కడతేరిన వాడు కుదుటపడ్డాడు. వాదే ఇవాళ మళ్లీ వచ్చాడు సంచీ లోంచి పట్టీ తీసి నా కైవారం చుట్టూ తిప్పాడు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు నా పెద్ద కొమ్మలు లెక్కవేశాడు కాలిక్యులేటర్ మీటలు నొక్కాడు పదివేలకి బేరం ఖరారు చేశాడు. నాకేదో పిచ్చి నమ్మకం పది తరాలుగా ఆ వంశానికి వంట చెరుకు ఇస్తున్న నన్ను ఇంటి దూలాలు ఇస్తున్న నన్ను దర్వాజాలు, నాగళ్లు ఇస్తున్న నన్ను బండి చక్రాలు ఇస్తున్న నన్ను కూరలకి, పచ్చళ్లకి, పులుసులకి జీవం పోసి, రుచులు ఇస్తున్న నన్ను వారి ఇత్తడి పాత్రల రూపాలకి ధగ ధగలు దిద్దుతున్న నన్ను ఆర్థికంగా ఆదుకుంటున్న నన్ను పదివేలకి అమ్మేస్తారా
హంస్రశీత 1 39
పది తరాలుగా తమ పిల్లలు నా కొమ్మల్లో దూరి ఆడుకున్న ఆటలు పరవశించి పాడుకున్న పాటలు నా కొమ్మలు పట్టుకుని ఊగిన ఉయ్యాలలూ అన్నీ మరిచి పోతారా. నా వేర్ల నుంచి దూసుకువచ్చిన కన్నీళ్లు నా ఆకులను తడిపాయి నా కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న పిట్టలు విస్తుపోయాయి. చింత తాతా, చింత తాతా, ఎందుకు ఏడుపు, అడిగాయి. ఎగిరి పొండి, పారి పొండి పిల్లలను ముక్కున కరుచుకుని వలస పొండి, మన అనుబంధం కూలిపోతోంది మన బుణానుబంధం తీరిపోతోంది అన్నాను నేను ఆవేదనగా. మామిడి మామయ్య మాట వేదమయింది 4౦ ££ ఎస్ట్ఎమ్. ప్రాలిరాన్
లారీలలో వచ్చారు నన్ను చిత్రవధ చేశారు నా పేగుల కొమ్మలు విరిచారు ఒక్కొక్క కొమ్మా ఒరిగిపోతూ కన్నీళ్లతో నాకు కడసారి దండం పెడుతూ మళ్లీ జన్మంటూ వుంటే నీ వేర్లకే కళ్లయి మెరుస్తామని నీ పళ్లలో గింజలై నిలుస్తామని నీ కాండానికే కొమ్మలై మొలుస్తామని నాకు వీడ్మోలు చెబుతూ తమని కౌగలించుకుని సొమ్మసిల్లిన ఆకులను ఊరడిస్తూ లారీలలో ఎక్కి పోతుంటే ఎక్కడో మూలాల్లో దాగివున్న నా గుండె చెరువయింది నా కాందం బాధతో మెలికలు తిరిగింది. నా కొమ్మలను ముక్కలు, ముక్కలుగా నరికి లారీలలో కుదిస్తూ ఆ జనం పాడిన పాటలు ఆడిన ముచ్చట్లు
హంసగీతి 1 4|
వారి మధ్య పేలిన
బూతు జోకులు
నా గుండెను మండించాయి.
ఒక జీవిని, కరుణ లేకుండా కడతేర్చిన వీళ్లు
మనసు చంపుకుని
మర మనుషులుగా
మారిన వీళ్లు...... లారీలలో అడ్డ దిడ్డంగా అనాధ (్రేతాలుగా అలమటిస్తున్న
నా బిడ్డల అరుపులు
నా ఆలోచనలను నరికాయి. నా కొమ్మలతో నిండిన లారీలు మానవత్వపు కళ్లలో దుమ్ము నింపుతూ ముందుకు కదిలాయి. ఇంత పెద్ద చెట్టు ఇంత వయసు చెట్టు రాయిలాంటి ఇంత గట్టి చెట్టు ఎన్ని వూళ్లు వెతికినా ఎంతకీ పట్టలేము
42 1 ఎస్ట్ఎమ్. ప్రరావ్
అని జన నీరాజనాలు అందుకున్న నేను లారీలలో బందీ అయ్యాను రాజ్యం కోల్పోయి, కిరీటం లేని రాజులా మిగిలాను. కొరత వేయబడ్డ నేరస్తుడిలా నిలిచాను. చీకటి చింతగా చితికిన నా మనసు గతంలోకి జారింది నా వంశవృక్షాన్ని నా ముందు నిలిపింది నేను ఏనాటి నుంచో వున్నాను నా ఆకుల కడుపులో భస్మాసురుడిని దాచాను శివుడి మూడో కన్ను మంటకి _ముక్క్మలయిన చిన్న అకుల చెట్టుగా మిగిలాను. లక్ష్మణుడి బాణాలకి విలవిలలాడాను పెద్ద ఆకులను ముక్కలు చేసుకుని రాముడికి వనవాసం వంతలు నేర్పాను.
హంస్రకీత శ 43
తాన్సేన్ సమాధికి గొడుగై అమరి నా ఆకులు నమలిన గాయకుల గళాలలో అద్భుత గాత్రం నింపాను. జ్ఞాపకాల గతంలో కొట్టుమిట్టాడాను. వర్తమానాన్ని చూసి వణికి పోయాను భవిష్యత్తు ఊహించుకొని బిక్కచచ్చి పోయాను. తొలి సంజ మొలిచింది అదినా సుదీర్ధ జీవన యానంలో మలి సంజెగా మిగిలిపోతుందా నా శవయాత్రకి నిప్పు పట్టుకున్న కొడుకులా ముందు నడుస్తుందా నా ఆలోచనలు నా వేర్ల నరాలను తెంపాయి నా కాండంలోని ధమనులను మెలిబెట్టి నలిపాయి. లారీలు వచ్చాయి ఎలక్ట్రిక్ రంపం యమదూతలా దిగింది దాని మృత్యు మోతకే ఈడ 11 ఎఫ్ఎమ్. ప్రలరాన్
నిలువులోతున వున్న నా గుండె, ఎండుటాకులా అల్లల్లాడింది. నన్ను కసిగా కోస్తుంటే నిలువెల్లా కన్నీరయ్యాను దేవుడా వీడికి ఈ అధికారం ఎందుకిచ్చావని నిలదీశాను. ఆయన గుడి కట్టడానికి నేను కావాలి. ఆయన కోసం చేసే యజ్ఞయాగాలకి నేను కావాలి. ఆయన ప్రసాదం వండటానికి నేను కావాలి. ఇన్ని సేవలు చేస్తున్న నాకు తను అద్దు పడతాడనుకున్నాను అభయమిస్తాడని ఆశ పడ్డాను మళ్లీ రెమ్మలు వేసి కొమ్మలు దూసి బతికి బట్ట కడతాననుకున్నాను ఆయనా ఏం చెయ్యలేదు నేను కేవలం సాక్షీభూతుడనని తప్పుకున్నాడు. ఎందరో లోక కంటకులకు వరాలిచ్చావు
హంస్రభి౭ శ 45
మంచి వాళ్లని ఎందుకు మరిచావు ఇన్నేళ్లుగా ఒంటికాలుమీద తపస్సు చేస్తున్నాను. నా తపస్సులో తామస గుణం లేదు నా తపో ఫలాలని పదిమందికీ పరవశంగా పంచుతున్నాను అందుకే మా జాతికి ఓ వరం ఇవ్వ మాకు కాళ్లు ఇవ్వు కదిలేశక్తి ఇవ్వు ఎగిరే రెక్కలు ఇవ్వు ఈ మనుషులకి దూరంగా పారిపోతాం. ఎగిరి పోతాం. దేవుడు నవ్వాడు ఆ నవ్వు నాకు అర్ధమయింది. మాయ లేడికి పరుగుల్లో మెలుకువలు నేర్చ గలిగిన లేళ్లను, దుష్పులను వీడు బాణాలతో మట్టు పెట్టాడు తుపాకీలతో కాల్చి చంపాడు. వెలుగు కిరణాలలా వేగంగా కదిలే గుర్రాల మెడకి ఉరి పోసి స్వారీ చేశాడు. తనకు అందకుండా ఉఆ క్లో ఎస్ట్.ఎమ్. ప్రల్రావ్
ఎగిరే విహంగాలను పై లోకాలకి ఎగిరించాడు. మృగరాజును మటుమాయం చేశాడు అడవి జంతువుల నిలువ నీడ కాజేశాడు వాటిని కనుమరుగు చేశాడు. భూగర్భాన్ని ఛేదించి విషజలాలు నింపాడు సముద్ర మథనం చేసి మృత్యువును కౌగిట పట్టాడు గాలిని ఉక్కిరి బిక్కిరి చేసి రోగాలను సృష్టించాడు అందాలు పొదిగిన ఆకాశం గుండెలను కాలుష్య గునపాలతో మరీ మరీ గుచ్చాడు ఎరవుల ఎరవేసి (క్రిమికీటకాలని చంపాడు పాటల పక్షుల స్వరపేటికలను చిదిమాడు. నీకు కదిలే కాళ్లు ఇచ్చినా ఎగిరే రెక్కలు ఇచ్చినా వీడికి ఎదురు నిలవలేవు. హంగ నీత క 47
నీ మీద వున్నాయనుకున్న దెయ్యాలనే తరిమేసిన వీడు నిన్ను బ్రతకనియ్యడు. వీడు తింటున్న అన్నంలో కాలకూటం కలుపుకుంటున్నాడు తాగుతున్న నీరులో రోగాలు నింపుకుంటున్నాడు పీలుస్తున్న గాలిని విషషయం చేసుకుంటున్నాడు వీడు ఈ భూమి మీద నిలవడు ఆకలితో, దాహంతో, రోగాలతో రోజూ చస్తూ, ఈ నిత్య నరకం నుంచి విముక్తి లేక విల విలలాడుతాడు. నాకు నోట మాట రాలేదు మనిషి మూర్ధత్వం చూసి జాలి వేసింది వాడి స్వార్ధం చూసి అసహ్యం వేసింది. రెండు నిలువెత్తు ముక్కలయిన నా కాండాన్ని క్రేన్స్‌తో ఎత్తారు లారీలలో కుదేశారు. లారీ కదులుతుంటే నాలో మెరిసిన ఆశ
48 శ్లో ఎస్.ఎమ్. ప్రాకరావ్
ఆకాశాన్ని తాకింది
నా వేరు ఇంకా భూమిలోనే వుంది
మళ్లీ మొలకేస్తుంది
నేను చచ్చి బ్రతుకుతాను.
లారీపోతుంటే తెలిసింది
నా ఆశ అడియాసని
భూమి ధరకి ఎంత పైకయినా
ఎగరే రెక్కలొచ్చాయని.
నా చుట్టూ వున్న
స్థలాన్ని అమ్ముకుంటే
వారసులందరికీ
లక్షలు, లక్షలు వచ్చి
వళ్లో పడతాయని.
నా తల్లి వేరుని తవ్వ తీసేసి
ఆ గోతిలో మమత ఎరుగని
నిర్దీవ లోహపు వేర్లు నాటి
వాటి చుట్టూ కాంక్రీటు దిమ్మెవేసి
అక్కడ కాంస్లెక్స్ కడతారని
అప్పటి దాకా బిగపట్టుకున్న
నా ప్రాణం ఎగిరి పోయింది
మనుషులంతా మంచివాళ్లు కాదన్న
మామిడి మామయ్య మాట బుజువయింది.
మం లా జ ఎవ "క అవ! భై హంస నీతి శ 49 వ ౮ గరం న్న న ॥ 'ఖ్న యోహా టే వమాంయాచనను ల
న. నందా. న వ పెటీ టో డక ల! (న ఖే వ సం / గాలి కగు (నో వ [న స? గా: లో న ర్ | “న 1 స క ర. (శ్నా . . ఏమిటో. ఈ అంతు తేలని అబ్బురం చూస్తుండగానే ఈ మనుషులు *. చుక్కల్లా పెఠిగిపోయారు: అడవులను చెరువులను వాగులను, వంకలను , వామనుడిలా. ఆక్రమించారు. [|||] |గ 8500॥గ5