Telugu guthonkai kura manava sambandalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

లే | వ క్‌ న శచమాోయమొ లాం ॥ (ఈ ్‌

త ష్ట్ర. ఓ
/ .
జే స
గ/ .
న్‌ ె ర్త
1 క్ట గ
గడ
మ చో క రు
స్త ॥3) 5 ఈనన

గుర్తొంకాయ్‌ కూర - కూనీ5్‌ నం+౮ంధాొలళొ (వోస్య వ్యంగ్య వ్వాన నంపుటా శ్రీరమణ మోనికా బుక్స్‌ ప్లాట్‌ నెం. 103, రోడ్‌ నెం. 71 నవనిర్మాణ్‌ నగర్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌-500 083.

ఆ౪44081023100022 - గెకడ82ఏ72 న్‌షమపీ2కిమ 682101 పౌహైకో 261601 ఏ పం+లుంల 2005 560006 961408 : ౧6060 0ల* 2006 6౦౪౯ : 3204 లీ రీ లీ ంజగం౦025 : వటుడు (బ్ర ఖీ గ గ / ణి అ ||0011062 0013 (్ర ర 0 ళ్‌ వై1ం6 : 3. 75/- ( అటైైరం6ే 206 రుం166ే 24 లో హో [1 క్షీ 5172 541 6౫90105 న యో న్న . 6-2-985, 00501 921608 ప ఈటల /ళ్‌ |! కే 21202రీ క్వఠల2024- 500004” శ” తల్లీ క ; 23308772 ॥ ( ల షే మీ లో వషంసంమం4 07 400102 30013 వ10టాం. 103, 64. 10. 71, జము జు 2820 ౮801106 54115, శగరలజ016 - 500 033. ₹ం? 600165 : శ221420164022 9001 20456 206 211 ౦4ల 16264102 3001 5005

నమస్కారం పుస్తకం కొని చదువుతున్న అక్షర ప్రియులకు నమస్కారం. పత్రిక - మన మాస పత్రికను ప్రారంభిస్తూ మీరు గౌరవ సంపాదకులుగా వుండాలని మాన్య మిత్రులు ఐ. వెంకట్రావు అడిగితే, నేను కాదనలేదు. సున్నితంగా తిరస్మరించనూ లేదు. అట్లాగని తొట్రుపాటుతో, తొందరపాటుతో సరే... సరే... సరే అన్లేదు. లౌక్యంగా వూరుకున్నాను. ఐవిఆర్‌ పత్రికా రంగంలో ఆరితేరిన వారు. అయిదారు సంచికలు వచ్చాక ఒక శుభోదయాన “గౌరవ సంపాదకులుగా పేరున్నప్పుడు మీరు రెండు పేజీలైనా ఏదో వొకటి రాయకపోతే, అది పాఠకులకు అసంతృప్తిగా వుంటుంది. పద్ధతి కూడా కాదు” అన్నారు. ఇలాంటి ధర్మసూక్ష్మం గురించి నేను గతంలో విని వుండలేదు. సరే, పెద్దవారు నా+హిజాఖిలాషి పైగా ధర్మాధర్మ వివేచన గలవారు. పైపెచ్చు పత్రిక ప్రచురణకత్ర ఫేకోకప్పుకోలేక దిగిపోయాను. గనిలాగా ఎప్పటికీ తరగని ఒక అంశాస్మిక్రాళీపీక చేసుకున్నాను. ఇందులో ఎప్పుడో ఎక్కడో ఎందరో మహానుజ్హొక్ష్రట చమత్మరించినవి వినియోగించుకుంటున్నాను. అలాగే వీటిని యధేచ్భగా*చాల్లామంది వాడుకుంటున్నారు. దానికీ దీనికీ చెల్లు! పుస్తకం తీసుకువస్తుస్తాచెనేక్ష్‌ బుక్స్‌ సంస్థకి, అనుకోగానే పుస్తకం సిద్ధం చేసిన శివసాయి గ్రాఫిక్స్‌ రఘు, వేణు గార్లకు కృతజ్ఞతలు. తన రేఖా చిత్రాలతో వ్యాసాలకు వెలుగు తెచ్చిన మా శంకర్‌కి శుభాశీస్సులు.

-శ్రీరమణ పార్ధివ దీపావళి 2005 హైదరాబాద్‌

ఫేట్లూ - పేజీలు తి

  1. గుత్తొాంకాయ కూర.............. 5 21. చలికాలం... 68 2, సెల్‌ఫోను ....................... 8 22. ఫిబ్రవరి...................ఎ 70 త. పుస్తకాలు ............ఎ మే. 23. నీళ్లు... కడ శ దేవుడు .................... 15 24 సౌందర్య చిట్కాలు............... 78
  2. రైలు... 28 26. ఎంట్రెన్సులు ............. .... 85
  3. పుష్మరాలు...........ఎం 26 27. కవిత్వం ...........400 88
  4. వినాయకుడు..................... 29 28. చదువు ................౨ 91 9, నవరసాలు ....................... 82 29. మామిడిపళ్లు .................. కశ
  5. వన భోజనాలు .................. 85 _ 80. రామయ్యకు చేయిస్తి ........... 97 మేమే రాళ్లు... తిరి 81. పబ్లిక్‌ ఇష్యూ ................... 100
  6. లిప్టు ...................... 4ఉ8 32, ప్రాయోజకులూ-అప్రాయోజకులూ 102
  7. ఉప్పు... ఉర్‌ 88, ఓయె! ఓయె! .................. 104
  8. ఓట్లు ....................2....2-. 50 85. సెలవలోచ్‌...! సెలవలు! ...... 109
  9. వాన .........................--. 8 86. వార్తల్లో వీథికుక్కలు ............ 111
  10. పుచ్చకాయ .......... 57 _ 87. గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ ౨.౨౨౨౨౨౨ 114
  11. స్వతంత్రం ........................ 59 _ 88. కూడు పెట్టే చదువు ............ 117 19, గురువు ................... 62 39, కలయో? వైష్ట్ట మాయయో..? 120

నురొంాయ్‌ కూర - కూనీ5్‌ నం(ంధాలరొ అట్లీ

అసలు మానవ సంబంధాలంటే ఏంటి?

అంటే మూనవ సంబంధాలన్నమాట. శంకరాచార్య, సోక్రటీస్‌, అబ్రహాం లింకన్‌, జిడ్డు కృష్ణమూర్తి... వీళ్లంతా చూనవ సంబంధాల మీద అనేక భాషల్లో చూట్లాడారు. వ్యాపార సంబంధాలు, ఆధ్యాత్మిక సాంఘిక, రాజకీయ, మత, వృత్తి, ఉద్యోగ సంబంధాలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో సంబంధాలున్నా వాటన్నీంటికీ మూలధాతువు మానవ సంబంధాలే! ఆటో దిగుతాం గమ్యంలో. ఇరవై ఎనిమిది రూపాయలు మీటరు తిరుగుతుంది. మనం ముప్ఫై ఇస్తాం. ఆటో డైవర్‌ ముప్ఫై తీసుకుని చిల్లర ఇవ్వకుండా వెళ్లిపోతాడు. మనం కూడా ఇదేమని డిమాండ్‌ చెయ్యం. మూనవ సంబంధాలు అడ్డు వస్తాయి. హోటల్‌లో టిప్‌ ఇవ్వడం సాంఘికపరమైన మానవ సంబంధమైతే; గుళ్లో హుండీలో, ముష్టివాడి చేతిలో చిల్లర వేయడం

ఇమా వనననన్నా కా తడై శ్రీరమణ ర్‌

తాత్వికపరమైన మానవ సంబంధాలు. సినిమా, టీవీ చూసేప్పుడు కొందరు ఆయా పాత్రల్లో లీనమై కంటతడి పెడతారు. కొందరికి పూనకాలు వస్తాయి. వీటిని సానుభూతి ప్రకంపనాలు అంటారు. ఇవి కూడా మానవ సంబింధాలే. మన బోరు ఎండిపోయి, మన కుళాయిలో నీళ్లు రాక అవస్త పడుతుంటాం. పక్కింటివారి పరిస్థితి ఇంతకంటే దారుణంగా వుందనీ, పైపెచ్చు బంధువులు కూడా వారింట దిగారనీ తెలిసినపుడు మన మనసు తేలికపడి దూది పావురంలా విహరిస్తుంది. అలా తేలికపడడంలో చవూనవ సంబంధాల వైజం ప్రస్ఫుటం అవుతుంది. ఆసుపత్రిలో మానవ సంబింధాలు అంతగా వుండవు. పేషెంట్‌-డాక్టర్‌ రిలేషన్‌షిప్‌ మాత్రమే ఉంటుంది. కొన్హిబోట్ల ద్యజ్ఞర్‌-వర్స్‌ రిలేషన్‌ షిల్స్‌ ఉంటాయి. నిటీ బస్‌లో ప్యానింజర్‌ కందక్టర్‌ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు ఉండవు. పైగా బోలెడు చిల్లర సంబంధాలు ఉంటాయి. “ంసారంలో మానవ సంబంధాలు” అనేది సముద్రమంత పెద్ద విషయం. ఎన్నో అలలు, లోపల ఒక పెద్ద ప్రపంచం, ఎడతెగని ఘోష అందువల్ల ఆ టాపిక్‌ మీద సమగ్రంగా చర్చించాలంటే బృహత్‌ (గ్రంథం అవుతుంది. అందుకని “గుత్తివంకాయ కూర” వరకు తీసుకుని, మానవ సంబంధాలతో ఎలా ముడిపడిందో స్టాళీపులాక న్యాయంగా చర్చించి వదిలేస్తాను. “ఎక్షడైనా చుట్టరికం కలుపుగానీ వంగతోటలో కలపకు” అని అతి (ప్రాచీన సామెత. వర నారు పోసేది ఒకరు. నీరు పోసేది ఇంకొకరు తోట వేసేది మరొకరు. ఎరువు వేసేది, కాపలా కాసేది మరింకొకరు. కాయలు కాశాక కోసేవారు, కోశాక అమ్మేవారు వేరు వేరు, వండి వడ్డించేవారు ఒకరైతే, తిని తృప్తిపదేవారు వేరొకరు. “గుత్తివంకాయ్‌ కూరోయ్‌ బావా కోరి వండినానోయ్‌, నా వలపంతా అందులో కూరి వండినానోయ్‌ బావా మరదలు మనసులో మాట చెప్పడానికి వంకాయని వాహికగా వాడుతుంది. అంటే మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఒక ప్రత్యేకమైన దినుసు గుత్తివంకాయ కూరలో వున్నమాట నిజం. “వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భామయు గలదె” అని చాటుపద్యం చాలా పాపులర్‌. కడప నాటుబాంబుకి, వంకాయకీ చాలా దగ్గర పోలికలు వుంటాయి. మానవ సంబంధాలను వేరు చేయడంలో కడప వంకాయ బాంబులు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మూ ఊళ్లో ఒక వయసు మళ్లిన జంట ఉండేది. ఆయన దుర్వాసుడు. ప్రతిదానికీ కోపమే. కోపం వచ్చినప్పుడల్లా మూడు నాలుగు రోజులు మాటా మంచీ లేకుండా బిగదీసుకు పోయేవాడు. అవిడ ఏమీ చలించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేది. నాలుగో రోజున ఒక వీశెడు గ్రేష్టమైన వంకాయలు తెప్పించి, ఏ ధనియాల ఖారమో దిట్టంగా, దట్టంగా కూరి, వాటికి దివ్యత్వం వచ్చేదాకా స్వరూప స్వభావాలు చిమడకుందా వేయించి, వేడి అన్నంలో వడ్డించేది. ఆ పెద్దాయన ఇక రేపన్న రోజు లేదు అన్నట్టుగా ఆఖరి పెచ్చుదాకా తిని, అందాకా నిలవున్న కోపాన్ని మర్చిపోయి మామూలు మనిషి అయిపోయేవాడు. మానవ సంబంధాలపై గుత్తివంకాయ (ప్రభావం అపారమైందని (గ్రహించాను. (స్టైయిన్ల్‌ రిలేషన్స్‌ని టంకం వేసి కలుపుతుంది గుత్తివంకాయ. ముషారఫ్‌కీ, వాజ్‌పేయికీ, బుష్‌కీ, బిన్‌ లాడెన్‌కీ, చంద్రబాబుకీ, వై.ఎస్‌.కీ ఈ గుత్తివంకాయ థెరపీ చేసి చూడండి. నాలుగైదు వడ్డింపులలో గుణం కనిపించకపోతే నా ధీసిస్‌ చింపి తుంగలో తొక్కుతా. 6 మానవ సంబంధాలు

గాయి. వా ఖ్యాతి(ఇంటర్నేషనల్‌ స్టేటస్‌) కలిగిన శాక విశేషాలు రెండే రెండు ఉన్నాయి. దుంపల్లో బంగాళాదుంప, కూరగాయలో వంకాయ. వంగ దేశం అంత కల్చరల్‌ సాలిటికల్‌ సెంటర్‌ అయిపోవడానికి వంగ శబమ కారణం. ఆఖరికి జాతీయ గీతంలో కూడా 'వంగకి సముచిత స్థానం ఇచ్చి భారతమాత తనను తాను గౌరవించుకున్నది. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు కదా! (అష్టకష్టాలు అనేమాట అందులోంచే, వచ్చిందని ఒక ప్రతీతి) దానివల్ల సుఖం ఎంత వుందో కష్టం కూడా అంతే వది కృష్ణుడిని తీన ఇంటికి ఆకర్షించడానికి సత్యభామ కందిపచ్చడి. వంకాయ పులుసు సేదని దేవులపల్లి కృష్ణశాస్రి ఎక్కడో రాస్తే చదివాను. జిహ్వ చాపల్యం మరి! శబరి కూడా రాములవారికి ఎంగిలి పళ్లు తినిపించాక, “రామచంద్రా! రాకరాక వచ్చావు, ఈ పూటకి వుండు. పెరట్లో నవనవలాడే వంకాయలు నీకోసమై నిరీక్తిస్తున్నాయి. నాలుగు వంకాయ గుత్తులు వండి వడ్డించుకుంటాను. అనుగ్రహించు స్వామీ!” అని ప్రాధేయపడింది. కానీ రాములవారు అప్పుడు వున్న తొందరలో ఆమె కోరికను 'సున్నితంగా తిరస్కరించారు. ఇవన్నీ చూనవ సంబంధాలతో ముడిపడి వున్నవేనని పాఠకులు గమనించాలి. అర్థరాత్రి పేదరాశి పెద్దమ్మ తలుపు తట్టారు ఎవరో. పెద్దమ్మ తలుపుతీసి చూసింది. మామూలు దుస్తుల్లోనే వున్నాడు గానీ మనిషిలో రీవి, దర్దుం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. “మూకు భోజనం కావలె అన్నాడు. పేదరాశి పెద్దమ్మ లోపలికి రమ్మని, స్నానం చేసిరా నాయనా. బాగా అలసిపోయినట్టున్నావు. ఇంతలో వంట సిద్ధం చేస్తాను అంది. అలాగే గుత్తివంకాయ కూడా. వేడివేడి అన్నం వడ్డించింది. తృప్తిగా భోంచేశాడు అనుకోని అతిధి. మర్చాడు సవినయంగా కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు. మూడోరోజు మూడు పల్లకీలు, ఆరు ఏనుగులు పెద్దమ్మ గుడిసె ముందు ఆగాయి. ఆరోజు రాజు గారికి మంచి భోజనం పెట్టావట. తీసుకో కానుకలు అని దందనాయకుడు గద్దించి మరీ యిచ్చి వెళ్లాడు. కూడా రాజ ప్రాసొదంలో వంటచేసే చెఫ్‌ని కూడా తెచ్చారు. “ఆరోజు నువ్వు వండిన పొక విశేషం గురించి చెప్పు. రాసుకుంటా' అని తాళపత్రం, ఘంటం తీశొడు. శాఖాగారు పేదరాశి పెద్దమ్మకి ఒక మాన్యం ఇచ్చారు. దానిని “వంకాయ మాన్యం అంటారు. ఇప్పుడు అది సిటీలో కలిసిపోయింది. అక్కడ శిల్చారామమో, హైటెక్‌ సిటీనో వచ్చి వుంటుంది. (౮ నా శ్రీరమణ 7

సెళథోనూ - రూనీ5్‌ నం+ంధాలూ

యొహంజదారొ, హరప్పాలలో సన్నటి రాగితీగెలు బయల్పడినాయనీ, సింధు నాగరికత నాటికే టెలిఫోను లాంటి వార్తా సౌకర్యాలు వుండేవని ఒక వాదన. మరొకచోట తవ్వకాలలో తీగెలేవీ దొరకలేదు కాబట్టి అప్పటికే వైర్‌లెస్‌ (నిస్తంత్రీ) వాడుకలో వుందని పురావస్తు ప్రవీణులు వాదిస్తున్నారు. తామరతూడుల సాయంతో రాజకుమార్రెలు జలకాలాడుతూ ఎక్కడో మరోచోట ఈతలు కొడుతున్న రాజకుమారుడితో మాట్లాడేవారని ప్రాచీన కావ్యాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఇక విశ్వనాధవారు “కాళ్ళీర దేశమున యొక జాతి చెట్లు గలవు. అవి పుష్మరమునకు యొక తూరి ఆకురాల్చి మరల చిగురు తొడుగును. ఆ చెట్టు ఆకులు శంఖాకృతిలో నుండును. ఆకులకు శబ్దమును దూర తీరములకు పంపెడు శక్తి గలదు. అది యెట్లు? ఇపుడు మనవారు సిలికాన్‌ చిప్స్‌ అనుచున్నారు కదా. అట్టివి ఈ ఆకులో నిక్షిప్రమైయున్నవి. ఇవి సూర్యకాంతి ద్వారా కొన్ని వేల మైళ్ల దూరము మన మాటలను యధాతథముగా పంపగలవు. కాంతిపుంజము నుండి శబ్దము ('ప్రవహించునా? ప్రవహించును. సూర్య కిరణములో ఏడు రంగుల పోగులున్నవి. అవి తెల్లని దారమువలె కనిపించును. ఆ ఏడు వరములు ఏదు వాహికలు. సష్తాశ్వములు ప్రతీకలు. వాటి ద్వారా శబ్దములు, ఆకృతులు, రంగులు పంపవచ్చును. మన వారికి జిజ్ఞాస తక్కువ...” అంటూ, సెల్‌ఫోన్‌లు రామాయణ కాలంలోనే వున్నాయని నిరూపిస్తారు.

కోతిలోంచి మనిషి వచ్చినట్లు, పేజర్‌లోంచి సెల్‌ఫోన్‌ వచ్చింది. ఇరవై పాతికేళ్ల క్రితం విదేశాలలో డాక్టర్ల దగ్గర కప్పల్లాంటి బిసలు వుంటాయనీ, పేషెంట్లు పిలవగానే కప్ప ఎగిరెగిరి వడి, ఫలానావారు మీ కోసం (టై చేస్తున్నారని చెబుతుందనీ చెప్పుకునేవారు. తర్వాత ఆ కప్పలు మనకూ వచ్చాయి. ఆ తర్వాత సెల్‌ఫోన్‌లు స్టేటస్‌ సింబల్స్‌గా చేతుల్లోకి జేబుల్లోకి వచ్చాయి. సమాచార రంగంలో విప్లవం అన్నారు అందరూ. మునుపు చూమూలు ఫోన్లు వున్నప్పుడు ఫోన్లో అవసరమైన వ్యక్తి సాక్షాత్తూ భగవంతుడిలా అందినట్లే అందీ అందకుండా పోయేవాడు. దోబూచు లాడుతూ వినోదించేవాడు. పొద్దున్నే రింగ్‌ చేస్తే బాత్రూమ్‌లో వున్నారనీ, కాసేపాగి చేస్తే పూజలో వున్నారనీ, ఇంకాసేపు తర్వాత బయటకు వెళ్లారనీ జవాబులు వచ్చేవి. సాయంత్రం దొరకడం దుర్లభం. దీపాలు పెట్టాక చీకట్లో వున్న దయ్యాలు మనిషిలో ప్రవేశిస్తాయి. అందుకని బాగా చీకటి ముదిరాక ఎవరికిపడితే వాళ్లకి డయల్‌ చేయకూడదు. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

నీలం సంజీవరెడ్డి- ఆతడనేక యుద్ధముల ఆరియుతేరిన అనుభవశాలి. గ్రామ పంచాయతీ నుంచి దేశ పంచాయతీ దాకా ఎదిగిన రాజకీయవేత్త. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు కొంతకాలం ఇంటిపట్టున రికామీగా వున్నారు. ఆయన పదవులలో వుండగా అనేక సహాయాలు పొందిన ఒక పెద్దమనిషికి తరచూ నీలం ఫోను చేస్తుండేవారు. చేసిన (ప్రతిసారీ బాత్రూంలో తా. మానవ సంబంధాలు

|. టిలో నుట ర (౮ ్ష్యు నా? పా

వున్నారన్నదే జవాబు. తర్వాత మళ్లీ దశ తిరిగి దేశాధిపతి అయిపోయారు. ఆ సంగతి తెలియగానే ఆ పెద్దమనిషి ఢిల్లీ ఎగిరి, ఇద్దరి మనుషుల సాయంతో ఒక గజమాల తీసుకుని విశాలమైన నవ్వుతో సహా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంజీవెడ్డి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ- “రండి... రండి... మీరు బాత్రూంలోంచి బయటకు ఎప్పుడు వచ్చారు' అని ఆసక్తిగా అడిగారట. ఆ పెద్దమనిషి కాజా తిన్నాడు. మరి హనుమంతుడి ముందా కుప్పిగంతులు! మానవ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం మీద చిక్కపడతాయి గాని బాత్‌రూం ద్రొచూల వల్ల ఇలాంటి బొప్పెలు తప్పవు.

మునుపు డైరెక్ట్‌ డయలింగ్‌ రాకముందు మధ్యలో టెలిఫోన్‌ ఆపరేటర్లు సంధానకర్తలుగా వ్యవహరించేవారు. వినిపించని విషయాలన్నిటినీ వారు మధ్యన వుండి వినిపించేవారు. ఓ తండ్రికి కాలేజీలో చదువుతున్న కొడుకు ఫోను చేసి రెండు వందలు అర్జంటుగా కావాలని అడుగుతున్నాడు. తండ్రి- 'ఏమిట్రా ఒక్క ముక్క వినిపించడం లేదురా అని అరుస్తున్నాడు. చివరికి ఆపరేటర్‌ అమ్మాయి కలుగజేనుకుని “మీ వాడికి రెండు వందలు కావాలిటండీ” అని వినిపించింది. 'నీకు వినిపిస్తే నువ్వే పంపెంద్‌” అన్నాట్ట తండ్రి. ఆయనకి వినిపించక కాదు, వినిపించుకోవడం ఇష్టం లేక. సెల్‌ వచ్చాక కూడా సిగ్నల్‌ క్లియర్‌గా లేదనీ, మళ్లీ నేనే చేస్తాననీ తప్పుకోవడం గమనిస్తూనే వున్నాం రైళ్లలో మనకు సెల్‌ ఆయుధులు కనిపిస్తూ వుంటారు. సామాను కూడా సర్దకుండా ఇంటికి ఫోన్‌ చేసేసి- 'టామీకి నీళ్లు పోశారా... టాంకు నిండితే మోటారు ఆపెయ్‌...” లాంటి సంభాషణలు సాగిస్తూ వుంటారు. ప్రతి స్టేషన్‌ నుంచీ ఫోన్‌ చేయడం, అక్కడ సందడి ఇంటికి వినిపించడం ఇదొక వేడుక సొంత వూరు చేరేవారైతే చేయదం, అక్కద సందడి అలా శ్రీరమణ స్ట

“జెటర్‌లో వున్నాం, నాలుగులోకి తీసుకుంటాడనుకుంటా, అయిదులో చెన్నై ఎక్స్‌థ్రైస్‌ వుంది...” ఇలా రైల్వే పరిభాషలో మాట్లాడుతుంటారు. అసలు సెల్‌ఫోన్ల వల్ల మానవ సంబంధాలు మెరుగుపడ్డాయా, క్షీణించాయా అనేది చర్చనీయాంశం. దీనిమీద జాతీయ స్థాయిలో ఒక చర్చావేదికను నిర్వహించాల్సిన అవసరం వుంది. ఇవి వచ్చాక మనుషుల మీద నమ్మకం, విశ్వాసం సన్నగిల్లాయి. 'పూర్వం ఇంట్లో లేను, ఫోన్‌ డెడ్‌ అయింది” ఇలా చెబితే నమ్మేవారు. ఇప్పుడు “అవుటాఫ్‌ రీచ్‌ అని రికార్డెడ్‌ మెసేజ్‌ వెళితే నమ్మడం లేదు. ఏమో దానికో బటన్‌ వుందేమో!

ఒక ఫోన్‌ కంపెనీకి అడక్కుండానే నేనొక సలహా ఇచ్చాను. ఇవతల ఎవరు మాట్లాడినా

అవతల వైపు కోరిన వాయిస్‌లో వినిపించేలా పర్పాటు చేయమని చెప్పాను. స్తీ బాల, వృద్ధుల గొంతులు, వాటికి బటన్లూ వుంటాయి. మన గొంతే ఆ విధంగా అటువైపు వినిపిస్తుంది. ఇప్పుడు ఫోన్‌ రకరకాల పాటలతో, మ్యూజిక్కులతో రింగ్‌ అవుతున్నాయి కదా! కావాలంటే ఇంకో మెట్టు పైకి ఎక్కి ప్రముఖుల వాయిస్‌లు కూడా (ప్రవేశపెట్టొచ్చు. ఎన్‌టీఆర్‌, ఎఎన్‌ఆర్‌, అమితాబ్‌, చంద్రబాబు, వైయస్‌... ఇలా ప్రముఖ పాపులర్‌ గొంతులన్నీ పెట్టొచ్చు. కీబోర్డులో వందన్నర వాయిద్యాల సంగీతం రావడం లేదా మీట నొక్కితే. ఇది ప్రవేశపెడితే ఫోను కంపెనీలు పోటీలుపడి యాఖై గొంతులని ఒకరు, వందని ఒకరు రెచ్చిపోతారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌లో నానా రకాల సేవలూ అందిస్తున్నారు. వార్తలు, వ్యాఖ్యలు, క్రికెట్‌ స్మోరు, షేర్‌ మార్కెట్టూ, కరిన పదాలకు అర్థాలు, రైలు-విమాన-బస్సు వివరాలు, జనాభా లెక్కలు, ఎక్కాలు... ఒకటేమిటి సమస్తం. ఇవేవీ నూనవ సంబంధాలను మెరుగుపరచలేవు. రికార్డెడ్‌ మెసేజిల వల్ల హ్యూమన్‌ టచ్‌ మిస్‌ అవుతున్నామని ఒక నడివయస్కుడు బాధపడ్డాడు. ఇపుడు రేడియోల్లో, టీవీ ఛానెల్స్‌లో కొన్ని కార్యక్రమాలుంటాయి. ఎస్‌టిడి అయినా తాపీగా మాట్లాడతారు. బోలెడు విషయాలు చర్చించి బోరుకొట్టే వేళకి కోరిన పాట వినిపిస్తారు. మరీ ఈమధ్య ఇంట్లో ఇంట్లో కూడా సెల్‌మీద మాట్లాడేసుకుంటున్నారు. సెల్‌-టు-సెల్‌ ఫ్రీ అనగానే కొందరు రోజుల తరబడి యజ్ఞం చేసినట్లు ముచ్చట్లాడుకుంటున్నారు. గాజువాకలో వున్న తల్లి జూబ్లీహిల్స్‌లో వున్న కూతురుతో సెల్‌ఫోన్‌ మీద ఆమవ్లట్‌ వేయిస్తుంది. తల్లీకూతుళ్లని సెల్‌ఫోన్‌లు అనుసంధానిస్తున్నాయి. తార, తల్లి సెట్లో చెరో మూలా కూచుని సెల్‌లో మాట్లాడుకుంటూ వుంటారు రాకింగ్‌ చైర్‌లో వూగుతూ. సెల్‌ఫోన్‌ మనది కాకపోతే కాశీమజిలీ కథలన్నీ చెప్పుకోవచ్చు!

“మొగుణ్ణి కొంగున ముడేసుకు తిరుగుతోంది” అనే పాత సామెతకి అర్థం చూరిపోయింది. అంటే ఆవిడ సెల్‌ఫోన్‌తో తిరుగుతోందని అర్ధం. అలా సెల్‌ ఇల్లాలితో ఈ సంగతి ప్రస్తావిస్తే- “వూనవ సంబంధాలూ లేవు నా మొహం లేదు. ఈ సెల్‌ఫోన్లు వచ్చాక అయోమయంగా వుంది. ఇదివరకు ఆఫీసుకు ఫోను చేస్తే ఆయన తీసి మాట్లాడేవారు. సీట్లో వున్నారు కదా అని మనసు కుదుటపడేది. ఇప్పుడు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో... లోకలో, నాన్‌ లోకలో... ఆఫీసో, ఇల్లో... నిజమో, అబద్ధమో... అంతా దేవుడి మీద భారం వేయడంగా వుంది నా పరిస్థితి వాపోయింది గద్గద స్వరంతో. టే యం ఎ మానవ సంబంధాలు

లోక ల ల్లో శ్రస్తాలో - రూస్‌5్‌ సం+ంధాలో ణ్‌ వ్‌వాటకామాటే చెప్పుకోవాలి- ఈ కాలం కుర్రాళ్లు చాలా తెలివైనవాళ్లు. గ్రంథాలకు, పుస్తకాలకు లేడా ఏమిటి?” అని అడిగితే- “తాటి ఆకుల మీద ఘంటంతో రాసిన వాటిని (గ్రంథాలు అంటారు. కాగితం మీద కలంతో రాస్తే పుస్తకాలు అంటారు' అని స్పష్టంగా జవాబు చెప్పాడు ఒక ఇంటర్‌ చదివే అబ్బాయి. అతని ఊహకి నేను ఎంతో ముచ్చటపడ్డాను. మరి రేపు ఇలాంటి వాళ్లకే ఎంసెట్‌ ర్యాంకులు వచ్చేది. చూస్తుండగా అమెరికా వెళ్లిపోయేదీ వాళ్లే! మానవ సంబంధాలను సముద్రాలు దాటించేది వారే! ఒక ఇల్లాలిని- “మీవారు పుస్తకాల పురుగు అని విన్నాం, నిజమేనా' అని నిగ్గతీస్తే- 'అం

ఉత్తదే' అందావిడ పెదవి విరుస్తూ క్లుప్తసరిగా. అంటీ 'ఉత్త పురుగు అని ఆవిడ ఉద్దేశమా, ఆ చూట ఉత్తదని అంటోందే? ఆ శ్లేషలో ఏముందో ఆమెకే తెలియాలి. భార్యాభర్తల మధ్య మూనవ సంబంధాలు క్షణక్షణం మారుతూ, నిత్య నూతనంగా, సెలయేటి నదకలా గలగలలాడుతూ వుంటాయని అనుభవజ్ఞులు చెబుతూ వుంటారు. పుస్తకాలు రండు అరువు ఇచ్చాక ఎన్నాల్టికీ ఆ పుస్తకం గూడు చేరకపోతే మనసు వికలమైపోతుంద్‌. క్‌ కం రకం ఎప్పటికీ తిరిగిరాక అనందపెడతాయి. ఆరుద్ర గారిని భయపడుతూన ఒక అ

లో

[ గం.

వ్‌

ర్త ద

(ప్తె ్రా

వైకాపా జ డో వాయవి22వజాడా డి

జా 1

చదివిస్తానని అడిగా. ఆయన కొంచెంసేపు తటపటాయించి నా మీద వాత్సల్యంకొద్దీ ఆ పుస్తజాన్ని తీసి ఇచ్చారు. నా ముఖం కృతజ్ఞతాభావంతో నిండిపోయి మూటల కోసం వెతుక్కుంటూ వుండగా- ఆయన గెడ్డం సవరించుకుంటూ 'అయితే ఒక్క షరతు మీద ఇస్తున్నా అన్నారు. “చెప్పంది. తమ అజ్ఞ అన్నట్లు చూశాను. 'మరి ఈ పుస్తకం ఎప్పటికీ తిరిగి ఇవ్వనని మాట ఇస్తేనే తీసుకెళ్లు అన్నాదు. ఆరుద్రకి నాపట్ల గల అభిచూనమూ, పుస్తకంపై ఆయన అభిప్రాయమూ ఒక్క దెబ్బలో అర్ధమ్రైనాయి. మానవ సంబంధాల మీద పుస్తకాల ప్రభావం, పుస్తకాల మీద మానవ సంబంధాల ప్రభావం "పెక్కు విధాలు అనడానికి ఇదొక శాంపిల్‌. “పుస్తకం కన్యావిత్తం పరహస్తం గతం గతళో అని పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు విత్తం మినహా మిగతా రెండింటినీ ఎక్కువ కాలం 'ఉంచుకోడానికి ఎవరూ అంత సరదా పడడం లేదు. ఇక్కడ ఒక పాయింటు అర్ధం చేసుకోవాలి. పురుషార్థాలు అనగా ధర్మార్ధ కామమోక్లాబు కదా! మోక్షం తర్వాత కలిపారనీ, అసలు మూడేననీ, నాలుగోది మోక్షం అనే దినుసు లేకపోతే జనం పట్టించుకోరని అలా చేర్చారని ఒక నాదన. పుస్తకం ధర్మానికి, కన్య కామానికి, సరే అర్ధం విత్తానికి ప్రతీకలు. ఇవి ఎవరికివారు సంపాయించుకుని అనుభవించవలెనే గాని అరువుకి పాల్చడరాదని దీని గూఢార్థం. ఈమధ్య భూనవ సంబంధాలు లాంటి గహనమైన విషయాలపై శ్రమిస్తున్నపుడు నా మనసు జాతీయ క్రీడలప్పుడు స్టేడియంబా అయిపోతోంది- మొత్తం జ్ఞాన దీపాలతో వెలిగిపోతూ. ఈ జ్ఞునాన్ని పదిమందికీ వందమందికీ వేలాదిమందికీ (పత్రిక సర్మ్యులేషన్‌ని బట్టి) పంచి బరువు దించుకోవాలని నా ప్రయత్నం. అయితే ఇదొక చిత్రం! నా జ్ఞానసంపద ఎట్టిదోగాని పంచినకొద్దీ బరువు ఎక్కువైపోతోంది. ఈ భారాన్ని భరించలేక అతి జ్ఞానం కన్నా అజ్ఞానమే సుఖం అనిపిస్తోంది మానవ సంబంధాలు కూడా అజ్ఞానం వల్ల మెరుగుపడతాయి. అతి జ్ఞానం మామూలు మనుషులను దూరం చేస్తుంది తస్మాత్‌ జాగ్రత్త ఒకాయన ఎండనపడి వచ్చి 'ష అని ఒగురుస్తూ- “నాన్నగారి బుక్స్‌ ఏం చెయ్యాలో తెలియడం లేదు. అయిదు గదులు, ఆరు అటకలూ అక్రమించాయి.. ” అంటూ నాన్నగారి రకరకాల అభిరుచులూ, అపురూపమైన పుస్తకాల వివరాలూ చెప్పి, చెప్పి, చెప్పాడు. విని, వీని, విన్నాక 'ఓ పని చెయ్యండి. ఎవరి పుస్తకాలు వారు వచ్చి తీసుకువెళ్లమని పత్రికాముఖంగా విజ్ఞప్తి చెయ్యండి. నాన్నగారి కలెక్షను మూడు వంతులు శ్షయర్‌ అవుతుంది అన్నాను. ఇంకా మిగిలిన 'స్టాక్‌ గురించి సలహా ఇద్ద్ధామనుకునేలోగా ఆ వచ్చినాయన మాయం అయాడు పుస్తకాల అరువుల మీద అనేక కధలు ఉన్నాయి అవన్నీ మీరు విన్నవే. మళ్లీ చెబితే మన మధ్య గల చూనవ సంబంధాలు ఛిన్నాభిన్నం కాగల ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఒక్క విజ్ఞానగుళిక అందించక తప్పదు. గ్రంథచౌర్యం అంటే గ్రంధాలను దొంగిలించడం అనుకుంటారు చాలామంది. కానీ కాదు. గ్రంధములోని విషయమును సంగ్రహించి, సొంతం చేసుకోవడాన్ని (గ్రంధచౌర్యం అంటారు.

“మైగాడ్‌! పుస్తకాలు కొనడమా? బార్చేరియస్‌... బుక్సె ఆర్‌ ది బెస్ట్‌ కండక్టర్స' అన్నాడు విద్యుచ్చ్భాస్త్రకారుడు. వాటి ద్వారా లవ్‌ లెటర్స్‌ గట్రా అద్భుతంగా బట్బాడా అవుతాయి. ఎవరి పుస్తకం వారు కొనుక్కుని ఎరువడగడం చూనేస్తే ఇంక (ప్రేమకలాపావెలా సాగేట్టూ? అవి 12 మానన సంబంధాలు

ఆగితే సృష్టి స్తంభించిపోతుంది' అని ముళ్లపూడి వారి గిరీశం పుస్తకాల మీద పెద్ద లెక్చరిచ్చాడు. బుక్స్‌ లేకపోతే, అరువు సౌలభ్యం కొరవడితే సృష్టి ఆగిపోతుందన్నాడు అంటే పుస్తకాలకు మానవ సంబంధాలకు వున్న విడదీయలేని టంకాన్ని మనం గ్రహించాలి. “అంకితం” అనే మాట *గ్రంథిర్వలోకంలో పుట్టి ఇప్పుడు రాజకీయాలకు అంకితమైపోయింది. అంకితం, అంకితభావం, పునరంకితం లాంటి భావజాలం రాజకీయరంగం వంటపట్టించుకుంది. పూర్వం రాజులు, సామంతులు, అవచి తిప్పయ్యశెట్టి లాంటి వణిక్‌ ప్రముఖులు (గ్రంథాలను అంకితం తీసుకునేవారు. పోతన లాంటివారు ఇమ్మనుజేశ్వరాధముల కివ్వను గాక ఇవ్వను అని దేవుళ్ల మీద రాసి దేవుళ్లకే అంకితం ఇచ్చారు. కృతికర్త కావ్యకన్యను ఓ అయ్య చేతిలో పెట్టడం; ఆ అయ్య కృతి భర్తగా వ్యవహరించడం ఇవన్నీ వేడుకలు కాదు కవి సామాన్యుడు. రాజు అసామాన్యుడు. ఒక కృతి ద్వారా వారిద్దరూ వియ్యం అందడం ఇందులోని అంతరార్థం. చూనవ సంబంధాలు బంధుత్వాలుగా మారిపోవడమున్నూ వుంది. ఈమధ్య పబ్లిక్‌ రిలేషన్స్‌ (మూ.సం.) వత్తిడి ఎక్కువ అవడం వల్ల కవితా సంపుటిలో తలొక పజ్యం తలొకరికీ ఇచ్చి, పుస్తకం మొత్తాన్ని టోకున మరొకరికి అంకితం ఇస్తున్నారు దీనివల్ల ఇరవై, పాతిక మందిని ఏకకాలంలో తృప్తిపరబిన అదృష్టం రచయితకి దక్కుతోంది. వీళ్ల సంగతి ఇట్లా వుంటే, ప్రభుత్వాలు ప్రాజెళ్టులనీ, నీళ్లు లేని కాలవలనీ, కరెంటు లేని బైనులనీ, కరువు కాటకాలని, రోడ్డు ప్రమాదాలని జాతికి అంకితం చేస్తున్నాయి.

తెలుగుజాతి చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఒకటుంది. (ప్రాచీనులు తాళపత్రాలపై రాసిన గ్రంధాలను చాలావరకు ప్రజలు నిత్యకృత్యంలో వాడుకున్నారు. రాగి రేకులపై చెక్కిన వాటినీ కరిగించి పాత్రలుగా పోయించుకుని సంసారంలో ప్రధాన పాత్రగా వినియోగించుకున్నారు

ఈ నిశిత బుద్ధి సంస్కృతి సాహిత్యాలపై ఇంతటి మక్కువ మనవారికి ఉండబట్టే అనేక కావ్యాలు చదివే శ్రమ మనకు తప్పింది. దీనివల్ల లిటరేచర్‌ విద్యార్థులకు పెద్ద వెసులుబాటు కలిగింది. రీసెర్చి వారికి బోలెడు ఊహాగానాలకు తావు ఏర్పడింది. వీటి ద్వారా ఆ తరాల వారికి ఈ తరం వారిపై గల అభిమానాలు చక్కగా అవగతం అవుతున్నాయి. పుస్తకాల మూట రాగానే ప్రతివారికీ ఏవో కొన్ని మధుర స్మృతులు ఈగల్లా ముసురుకుంటాయి. ఆస్తి పంపకాలలో అనేకానేక స్థిర చరాస్తులతోబాటు కొన్ని బుక్కులు కూడా మూ వాటాకు వచ్చాయి. అందులో నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. కుశలాయకం, లక్ష్మణస్వామి మూర్చ, గంగా-గౌరి సంవాదం, ఊర్మిళాదేవి నిద్ర, భద్రాచల పడవ ప్రమాదం, సినిమా స్టయిలు మంగళహారతులు అనే టైటిల్స్‌ ఇప్పటికీ నా కళ్లముందు మెదుల్తున్నాయి. మంగళహారతుల పుస్తకం కొన్ని పాటలు కూడా జ్ఞాపకం. 'తేనె చక్కెరలు ఆరగింపు స్వామీ అని ఒక పాట ఉండేది. పైన “టౌను పక్శకెళ్లొద్దురా డింగరీ' అనే ఫణితిలో సాడుకోవలెను అని సూచన ఉండేది. ఇహాన్ని పరాన్ని ఒక మంగళహారతి ద్వారా ముడివేయడం ఆ పాటలకే చెల్లింది! దేవుడు దేవుడే, భక్తి భక్తే స్టయిలు స్టయిలే! మానవ సంబంధాలలో ముక్తి రక్తి కలయికలను దర్శించాల్సింది ఇలాంటి సందర్భాలలోనే!

'కొఫిన్‌ రవాసి' రాసిన 'ది శాండ్‌ లైటొ చదివావా? పోనీ 'సయిన్‌ ఫిటి, 'డైమండ్స్‌ అండ్‌ పీనట్స్‌' ఇది కూడా చదవలేదా, పోనీ వెస్ట్‌ హార్టీనియా పోస్ట్‌ మోడరన్‌ పొయెట్‌ కాంగిపోలోని న నన న

చదివావా? అరె- నువ్‌ చదవాలి. కౌండ ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. మైండ్‌ బాగ్లింగ్‌ ఐసే- చలిగాలికి వెన్నెల కరడుకట్టుకుపోయి, వెన్నెల పెచ్చులను మోసుకు వెళుతున్న వాగు కెరటాలు, వొక పిట్ట వెన్నెలలో కూరుకుపోయింది, దాని కూతలోంచి పరిమళం. ఒక శిల్పి వెన్నెల ముద్దని ఉలితో చెక్కుకున్నాడు. నేను మాత్రం చిన్న వెన్నెల ముక్కని బలపంలా పట్టుకుని చీకటి పలక మీద నాలుగు అక్షరాలు రాశానో లేదో భళ్లున తెల్లవారింది... అంటే అప్రయత్నంగా, నా ప్రమేయం అంగీకారం లేకుండానే నాచేత ఓ కవితను వినిపింప చేశాడు. ఇలాంటి సందర్భాలలో మూత్రం మూనవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అసలాయన చెప్పిన కవులూ పుస్తకాలూ వున్నాయో లేదో తెలియదు. ఉన్నా నేనెందుకు చదవాలో తెలియదు. కవి నిరంకుశుడు అనేది పాక్షిక సత్యమే గాని ఇలాంటి ప్రబుద్ధులు మాత్రం నిలువెల్లా నిరంకుశులు. పుస్తకాలలో అచ్చుతప్పులు ఉంటాయి. “అచ్చు తప్పు అనేది ఐన్‌ప్టీన్‌ ధియరీలాగా ఒకందాన అంతుపట్టనిది. ఏది అచ్చు తప్పు? ఏది కాదు అనేది పెద్ద మీమాంస. పెద్దమ్మ గుడి, పెద్ద గుమ్మడి రెండూ తప్పులు కావు. కానీ పెద్దమ్మగుడి కూర, పెద్ద గుమ్మడిలో పూజలు అంటే తప్పు. అసలా మాటకొస్తే ఈ సృష్టిలో అచ్చు తప్పులు పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. పొజిషన్‌లో వున్న వాళ్లకి అపోజిషన్‌ వాళ్లు ఆచ్చుతప్పుల్లా కనుపిస్తారు. పోలీసులకు దొంగలు వైస్‌వెర్సా అచ్చుతప్పుల్లాగే కనిపిస్తారు. వక్తకి శ్రోతలు జారిపడిన అక్షరాల్లా కనిపిస్తే, శోతలకి వక్త అక్షరాలతో చేసిన ముద్దలా ద్యోతకం అవుతాడు. పిల్లలు ఒక దశలో పెద్దలకు ప్రింటింగ్‌ డెవిల్స్‌లా కనుపిస్తారు. అందుకే సర్మారువారు ఒకటి రెండు మించి వద్దని ఆంక్ష పెడుతున్నారు. “పిల్లలు చీకట్లోంచి పుట్టుకొస్తారు కాబట్టి మిస్టేక్స్‌లా ఉండడం సహజం' అన్నాడొక అనుభవశాలి. ఈ పారబాట్లు లేదా అప్పుతచ్చులు- వీటి నేపథ్యంలో మానవ సంబంధాలు" దృఢంగా ఉన్నాయి. విశ్వనాథ వారు పొందికగా గుండెల మీద పడుకున్న పసిపాపడిని పుస్తకంతో పోల్చారు. కృష్ణుడు పసితనం నుంచి అల్లరి చిల్లరివాడే. బలరాముడు “పుస్తకమువోలో పడుకున్నాడు చూడమని తల్లి చెబుతుంది. అయితే బలరాముడు పుస్తకములాంటి వాడే కానీ కృష్ణుడు సాక్షాత్తూ భగవద్గీత! ఆమధ్య ఒక సైకాలజీ తెలిసిన మిత్రుడు క్యాసెట్లు తయారుచేసి, నిద్రపట్టని వారి కోసం మార్కెట్‌లో విడుదల చేశాడు. అది ఎలా వినాలో, సుఖనిద్రకి చిట్కాలు అన్నీ ఒక పుస్తకంగా ప్రచురించాడు. నిజం చెప్పద్దూ- నాకు ఆ క్యాసెట్‌ పెట్టగానే అప్పటిదాకా వున్న కాస్త మగతా వదిలి, పొడికళ్లు పడేవి. సుఖనిద్రకి ఆయన రాసిన పుస్తకం తీయగానే ఆవలింతలూ, వాటివెంట కనురెప్పలు మూతపడడమున్నూ ఖాయం. అందుకే నాకు పుస్తకాలంటే నిద్రంత ఇష్టం! (] 114 మానవ సంబంధాలు

దేర్రదూ - రూనీ5్‌ సంశంధాలో

“ద్య్వేడు చేసిన మనుషల్లారా మనుషులు చేసిన దేవుళ్లారా' అని సంబోధించాడు యుగకర్త గురజాడ. కాసేపు ఈ భూమ్మీద మనిషి అన్నవాడు లేడనుకుందాం. అప్పుడు దేముడి ప్రసక్తే లేదు. ఎక్కడో ఒక సాలెపురుగో, పామో, ఏనుగో చేస్తే శివలింగానికి పూజ చెయ్యొచ్చు. కానీ ఇలా సుప్రభాత సేవతో మొదలుపెట్టి పవళింపు సేవ దాకా ఎవరూ చెయ్యరు. మామూలు పీళాధిపత్యానికే బోలెడు అనుచరగణం కావాలి. అందుకే “పీఠాధిపతి” అంటే మీరు పీరాలకు అధిపతికే వర్తిస్తుందని అనుకోకండి. సాహిత్య రంగంలో, సేవా రంగంలో, రాజకీయంలో, అరాచకీయంలో ఎక్కడైనాసరే “పీరాధిపతి ఉంటాడు మహిమల గురించి మాట్లాదేవాళ్లు లేకపోతే దేవుడు కూడా మరుగున పడిపోతాడు. అందుకే దేముడు ఎప్పుడూ మనుషుల సంఖ్య పెంచుతూ వుంటాడు. డైనోసిరాస్‌ని ఎందుకు నిశ్ళేషం చేశాడు? మొదటి పాయింటు అది చాలా చోటు ఆక్రమిస్తోంది. రెండోది చాలా మందబుద్ధి. ఒక్క భజన గీతం కూడా రాదు దానికి. ఎందుకు అలాంటి వాటితో అనుకున్నాడు. మనిషి బుద్ధిజీవి కదా. అందుకని దేవుడు మనిషిని నమ్ముకున్నాడు. నమ్ముకున్నందుకు ఏమి చేదు మేశాదు? హాయిగా చిత్రాతి చిత్రమైన చి(త్రాన్నాలు, హో భ్‌ కూ భో 0, చోష్యాలు, ట్‌ జ రమ మధ పానీడూలు ! ల్లో యగ పాలు, ఛలాలు నమన్తం (1 వో నైవేద్యాలుగా అందుకుంటున్నాడు. య్‌ 9 తన ప్రసాదంగా తిరిగి భక్తులకే కలలా గ వదిలేస్తున్నాడు. చూనవ సంబం ఆ గ / ధాలు ఈ ప్రసాదాలలోనే నిక్షిప్తమై (| ఆ: వున్నాయి. ఆీ స్‌

ఒక చలికాలము వేకువ | జామున రాజమండ్రి కోటిలింగాల శేవులో ఇద్దరు వటువులు ముక్కు మూసుకుని బుడుంగు, బుడుంగు మని మునిగి తేలుతున్నారు. శ్రీరమణ 15

మసక వెలుతురులో గుండ్లు పిలకలు మాత్రం మబ్బుచాటు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. మధ్య మధ్య చలికి వణికిపోతూ వేదపనసలు వల్లిస్తున్నారు. కాని యిద్దరికీ శ్రుతి, గొంతు కలవడం లేదు. ఒకతను అడుగుతున్నాడు- “వారే వేదాలను కాజేసుకుని పారిపోయింది ఎవరూ” అని దీర్హం తీస్తూ- 'సోమ కాసురుడు అన్నాడు” రెండో విద్యార్ధి వాణికే కంఠంతో. “ఎత్తుకుపోయి సముద్రం లోపలకు వెళ్లిపోయాడు కదురా” అన్నాడు. 'జెను' అంటూ బుడుంగున మునిగాడు సహాధ్యాయి. “అప్పుడు వీష్ణుమూర్తిగారు చేపావతారం ఎత్తి...” అనగానే 'తప్పు... మత్స్యావతారం అనాలి. మొన్న గురువుగారు చెప్పలే' అంటూ రెండో వటువు తప్పుదిద్దాడు. 'మరైతే అప్పుడు ఆ వేదం బుక్కులు నీళ్లలో తడిసి పాడైపోలేదా' అని ఎంతో ఆసక్తిగా అడిగాడు. “ఎక్కడైనా వేదాలు తడుస్తాయా? బుక్కులు కాదు రుక్కులు. అవన్నీ బ్రహ్మదేముడు బంగారు రేకుల మీద రాశారు, తెలుసా? అని కళ్లు యింతవి చేశాడు. “మరి అసలు వేదాలు నోటితో చెప్పుకోవడమే గాని, రాత లేదని చెప్పారుగా గురువుగారు అన్నాడు మొదటి శిష్యుడు. 'ఆంటే వాకటే కాపీ వుంది. అదేమో (బ్రహ్మలోకంలో వుంటుంది. దానిని బయటకు యివ్వరు' అన్నాడు రెండో శిష్యుడు. మొదటి శిష్యుడు గాఢంగా నిట్టూర్చి, “ఇప్పటికి ఏడేళ్లు అయింది. ఇంకా ఎప్పటికి తెములుతుందో తెలీదు. అయినా యీ విష్ణుమూర్తిగారు ప్రతి దాంట్లో దిగుతాడు...” అని చాలా చిరాకుపడ్డాడు. అతనికి సోమకాసురుడు హీరోలాగా, మత్స్వావతారుడు విలన్‌లాగా కనిపిస్తున్నారు. అందుకే అన్నారు “సమస్త జీవులకు సూర్యుండు తానొక్కొక్ళడై...” అని. నిజమే, పాపం భట్టీయం వేసే వాడికి తెలుస్తుంది బాధ. అందుకే అతను విష్ణుమూర్తి గారి పట్ల వొక రకమైన భేదభావం పెంచుకున్నాడు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతంలో చెప్పినట్లు, వేదోదరణ జాతికి గొప్ప విషయం కావచ్చు గాని ఆ స్టూడెంటు కుర్రాడికి మాత్రం కాదు. 'సుల్చి పెళ్లి వెంకి చావుకి అని యిట్లాంటప్పుడే అంటారు. అసలు ధియకి ఆఫ్‌ రిలెటివిటీని మనవాళ్లు పై సామెతలో నిక్షిప్తం చేసేశారు. దేముళ్లలో రెండు రకాల దేముళ్లున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర యిలా నిజంగా దేవుళ్లలాగా అనిపించేవాళ్లు, కనిపించేవాళ్లు వొక రకం. కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు, వీళ్లు మరొక రకం. వాళ్లతో చొరవతో, చనువుగా వ్యవహారం నడపలేం గాని వీళ్లతో కొంచెం మనసు విప్పి మాట్లాడవచ్చు. వెంకటేశ్వరస్వామితో అయితే డైరెక్ట్‌గా బేరం కుదుర్చుకుంటాం కదా. కొందరు పనిని బట్టి వొక ఫిగర్‌ అనుకుంటారు. మరికొందరు పర్సంటేజి మాట్లాడుకుంటారు. అసలు ఆయన స్టయిలే వేరు. 'గోవిందా' అన్నా డబ్బు చెల్లించాల్సిందే. లేకపోతే నా పేరు స్మరించే హక్కు వుత్తినే నీకెవడిచ్చాదని నిలదీస్తాడు పూర్తి కాపిటలిస్టు, ఏ తప్పుడు పని చేసినా 'అపరాధ కానుకొ చెల్లిస్తే చాలు, కడిగిన ముత్యాల్లా కొండ దిగి రావచ్చు. ఎవరికైనా అట్లా సాయలాపాయలాగా, సంసారపక్షంగా వుంటే బావుంటుంది. మరీ పాత పురాణాల్లో దేముళ్లని నిజంగా దేముళ్లలా వర్ణించేస్తారు. దానితో మనకు భయం వేస్తుంది. సూర్యగోళం ఆయన కనుగుడ్డు, చంద్రగోళం ఆయన చిటికెనవేలు... యిట్లా చెప్పేసరికి అంత పెద్దవాడితో మనకెందుకులే అనిపిస్తుంది. రాముడూ వాళ్లూ వున్నారంటే జంటిల్మన్‌ టైపు. శబరి ఎంగిలి తిన్నాడు, గుహుడితో బాగా మాట్లాడాడు, హనుమంతుణ్ణి బంటుగా చేతికింద వేసుకున్నాడు,

యుట్టాంటితి విన్టమ్తుడు మనకు వాక ధైర్యం వస్తుంది. దేవుళ్లకి మడి వస్త్రాలు కట్టి దూరంగా మెరుగుపడతాయి. మరీ మం కలిపెయ్యాలి. అప్పుడే దేవుడితో మానవ సంబంధాలు రాం | నుపోను ఆర్జిత సేవలకు వ్యవధి పెంచేసి, ధర్మదర్భనాన్ని కుదిస్తే ధాలు దెబ్బతింటాయి. ఈ సూత్రం దేవుళ్లకే కాదు, పవర్‌లో వున్న ఎవరికైనా

వర్తిస్తుంది. 5

దేవుడంటే మనకు చనువు. మీదు మిక్కిలి స్వతంత్రం. ఏదో దగ్గరవాడు అనే భావం. అందుకే మన వూళ్లలో గుళ్లో కూచుని రెందు మూడు మురాలు పేకాట ఆడుతూ వుంటారు సాయంత్రం గుళ్లో దీపం పెట్టే వేళ పేకదస్త్రం కట్టేస్తారు. కొని వ్యవహారాలు చాలా గుడి నీడనే జరుగుతాయి. ఎందుకంటే బొత్తిగా భయపడాల్సిన పన్లేదు. 'తల్లివి నీవే తండ్రివి నీవే. సఖుడవు నీవే, గురుడవు నీవే అని కదా మన నినాదం. దేవుడంతటి వాడిని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి బోల్తా కొట్టించడం మనిషికే తెలుసు. మనిషీ వర్ధిల్ల

మాటకొస్తే మనుషులకే కాదు దేముళ్లకీ బోలెడు కావీనం వుంటుంది. అంతా నేనే, అన్నీ నాకే అనే 'తత్త్వం' దేవుడికే ఎక్కువ. ఒక చక్రవర్తి కుచూరుడు, ఇంకో చక్రవర్తికి అల్లుడూ కదా రాముడు ఏదో వొకానొక వీక్‌ మూమెంట్‌లో కంచర్ల గోపన్న నగానట్రా, గోపురాలు (ప్రాకారాలూ ఏర్పాటు చేశాదే అనుకుందాం. తన సొమ్ము కాదు తానీషా గారిది. సర్కారు సొమ్ముతో కులుకుతూ తిరిగితే చూసీ చూడనట్టు పోడానికి అదేమన్నా ప్రజాస్వామ్యమా? జైల్లో పెడితే రామదాసు అనే గోపన్న శ్రుతీమతీతో సహా నానా తిట్లు క్రీర్తనలు కట్టి పాడాడు స్వామికి, సీతమ్మకి, సోదరులకీ మొత్తం ఫ్యామిలీకి ఏమేమి నగలు చేయించిందీ, ఎంతెంత ఖర్చు అయిందీ వీసమెత్తు తేడా రాకుండా చెప్పి, దెప్పి వదిలిపెట్టాడు. పోనీ, అప్పుడైనా అంతంత ఎత్తిపొడుపులతో పెట్టిన యీ అలంకారాలు మనకెందుకు అనుకున్నాడా? ఊహూ: లేదు. చివరకి అమ్మవారే వినలేక, ఎంలైనా రాజర్సి కూతురు కదా- 'పోనీ స్కూరు సొమ్ము చెల్లించి రారాదా' అని సూచించి వుంటుంది. లేకపోతే మరిది గారిని మందలించి వుంటుంది. అందుకే రామోజీ లక్ష్యోజీ అంటూ వెళ్లి ఆ చూడలు ముట్టజెప్పి రామదాసుని చెర విడిపించారు. ఎంత దేముడైనా సొమ్ము దగ్గరకు వచ్చేసరికి చెయ్యి వెనక్కు లాగుతుంది. ఈ మానవ సంబంధాలలో, ముఖ్యంగా దేముడి వ్యవహారంలో కరేఖండిగా మాట్లాడి సొమ్ము వసూలు చేసినవాడు రామదాసు వొక్కడే! త్యాగరాజస్వామి నిధి చాల సుఖమా...” అని ప్రళ్నించేసరికి మనమెందుకు అనవసరంగా అటుకులు తినడం నేర్పడమని మౌనంగా వుండిపోయాడు రాముడు. ఆ పిచ్చిమారాజు కాబోలనుకుని అలాగే మిగిలిపోయాడు.

ఒక రాజుగారు పరమ దైవభక్తుడు, రుజు వర్తనుడు. గుర్రం మీద వెళ్తుంటే డొంక దారిలో కుదుపుకి అదుపుతప్పి కింద పడిపోయాడు. మోకాలు లోతు బురద. పైగా కిరీటం, కత్తులు డాళ్లు యివన్నీ వొకటి. పాపం లేనలేకపోయాడు. చివరికి 'నేనే కనక ఫలానా ఫలానా అయితే, ముక్కోటి దేవతొలారా నన్నుతిరిగి గుర్రం ఎక్కించండి” అని సవాలాత్మకమైన ప్రార్ధన చేశాడు రాజు బురదలోంచి పెళ్లిగిలి, గాలిలో లేచి, ఎగిరి గుర్రం అవతల పడ్డాడు- మ బురదలో. జరిగిందేమిటంటే- ఇంతటి ఉత్తముడు అడగక అడగక చిన్న ఫేవర్‌ అడిగాడని ముక్కోటి శ్రీరమణ 17

దేవతలూ ఎాక్కటై వొక పట్టు పట్టారు. దాంతో కధ హద్దు మీరింది. ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులకు అందరినీ వేడుకోకూడదనిపిస్తుంది. రాయిలో దేవుడు వుండడం ఏమిటని రాయిష్టులు కొట్టిపారేస్తారు- రాయిని కాదు ఆ ప్రతిపాదనని. అయితే దేవుడు అనేది వొక 'కాన్సెఫ్ట్‌. అదియొక అనుభూతి. ఆంగ్లంలో వొక మహానుభావుడు చమత్కారంగా వొక మాట అన్నాదు. “తల్లి సత్యం తండ్రి నమ్మకం” అని. దేవుడు కూడా తండ్రిలాంటి వాడే. బెనుయనగా బెను. లేదుయనగా లేడు. మూ నాయనమ్మ మయా అందరితో మాట్లాడినంత కలుపుగోలుగా దేవుడితో మాట్లాడేది. దాదాపు ముఖ్యమంత్రితో ముఖాముఖిలాగా వుండేది. తెలియనివాళ్లు, ఆ ఎరుక లేనివాళ్లు కొట్టిపారేస్తారు గాని ఎవరి అనుభూతి వారిది. ఇట్లా ఉగాది లాంటి పెద్దపెద్ద పండగలూ అవీ వస్తే వంటలూ, పిండివంటలూ చెయ్యాలంటే దేముడు స్వయంగా దిగి వచ్చి ఆవిడకి సాయం చేసేవాడట. “బాబా పులిహోర కలిపి పెట్టాదురా పాపం, ఎందుకు నాయనా నీకు శ్రమ అంటే వినడు. అన్నం వార్చి అక్కడ పెట్టానంతే. చింతపండు పులుసు తీశాడు, యింత పసుపు కలిపాడు. ఘుమఘుమలాడే తాళింపు వేశాడు. వస్తూ వస్తూ కర్వేప రెమ్మలు ఆయనే చేతపట్టుకు వచ్చాడు. పోనీ, వొక్క ముద్ద తిని వెళ్లు బాబా అంటే నవ్వుకుంటూ వెళ్లిపోయాడు...' అంటూ కళ్లొత్తుకుంది. పులిహోర తలోకాస్తా రుచి చూసి “ఆహా... బావుంది బావుంది. కానీ తీపి తగుల్తోందేంటి బాచ్ళూ అంటే “హిందీ వాళ్లంతేరా. ప్రతి దాంట్లో వాళ్లకు తీపి పడాలి" అని వాక్మసారి ఏదో గుర్తొచ్చి “వారేయ్‌ జీడిపప్పులు నేతిలో వేయించి పెట్టినవి యిక్కడ వుండాలి ఏవిరా అంటూ దేవుళ్లాట మొదలుపెడితే మా తమ్ముడు 'బాబా నవుల్తూ వెళ్తుంటే నే చూశానన్నాదు. మూ బామ్మ 'దాంగ గాడిదా అని మొదలుపెట్టి తిట్టతగిన తిట్లన్నీ మా తమ్ముణ్జి తిట్టింది. ఎప్పుడో వొకసారి అగరువత్తులు కొనుక్కు వచ్చినవి బాగాలేవని మేము అనుకుంటుంటే- 'పారెయ్యకండి నాయనా, నాకు యివ్వండి. దేవుడి దగ్గర వెలిగించుకుంటా' అని తీసేసుకునేది. చెప్పా కదా దేవుడంటే చనువు. అదే కదా మానవ సంబంధాలలో (ప్రధానమైన దినుసు. మా బడి దగ్గర వినాయకుడి గుడి ఉండేది. ఏటా పరీక్షల ముందు వొక కొబ్బరికాయ కొట్టే మొక్కు వుండేది. నేను ఎప్పుడూ మధ్యాహ్నం వేళ పూజారిగారు లేని టైము గమనించి వెళ్లేవాణ్జి. రెండు కొబ్బరి చిప్పలూ సంచీలో వేసుకు వచ్చేవాడిని. మొక్కూ చెల్లేది ఇంట్లో సమృద్ధిగా కొబ్బరి పచ్చడీ వచ్చేది. దేవుడితో చిన్నప్పటి నుంచీ అనుబంధం మొదలవుతుంది. కాలేజీ రోజుల్లో గుడికి వెళ్లడం, ఇంత బొట్టు పెట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకుని, అక్కడికి వచ్చే ఆడపిల్లలని బట్టి ప్రదక్షిణాలూ అవీ చేయడం చాలామందికి అనుభవంలో విషయమే. ఒక్కసారి దేవుడి సాక్షిగా గుర్తుచేసుకోండి. ఆ రోజుల్లో గుడికీ దేవుడికీ భక్తికీ మనకీ వున్న సంబంధం ఏపాటిది? ఎన్నో డ్రేమ యజ్ఞాలకు సంకల్పం గుళ్లోనే చెప్పుకుంటారు. పెద్దలు కాదన్న పెళ్లిళ్లు గుళ్లోనే జరుగుతాయి. సమయానికి దేముడిలా వచ్చి కాపాడావు బాబూ' అనేది చాలా కీలక మరియు పాపులర్‌ డైలాగ్‌. 'దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. పెద్దలే అంటే పెళ్లి పెద్దలనుకోకండి. చందాలు వసూలు చేసేవారు, పెళ్లి పెత్తనం చెలాయించేవారు అని అర్ధం. అసలు వినాయకచవితి త ఎ... మానవ సంబంధాలు

చందా, రామనవమి చండాల లోంచే దాదాగిరి మొలకెత్తుతుంది. పురుషులలో పు పురుషులలాగే దేముళ్లలో 'సత్యం గల దేముళ్లు” వేరు. కాని దేముడు మహా చమత్సారి. విశ్చారీ సత్య నారాయణ లాంటి సనాతనిస్టు చేత కల్పవృక్షాలు, స్తోత పద్యాలు రాయించడం విశేషం కాదు. ఆరుద్ర లాంటి కమ్యూనిస్టు చేత “రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని...” అనీ, “అందాల రాముడూ ఇందీవర శ్యాముడు, ఎందువలన దేవుడు?” అనీ అద్భుతమైన పాటలు రాయించుకున్నాడు. చూ గురువు గారికి దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు గాని తిరుపతి భద్రాచలం శ్రీశైలం తరచు కుటుంబంతో వెళ్లి ఆ యొక్క శిల్ప వైభవాన్ని తిలకించి, ఆ యొక్క శిల్పాలకు నమస్కరించి వస్తుంటారు. కొందరికి దేవుడిలో శిల్పం కనిపిస్తుంది. కొందరికి శిల్చంలో దేవుడు కనిపిస్తాడు. ఎవరి 'స్టోను” వాళ్లది. ఇంకా బోలెడు చెప్పాలి యీ మూనవ సంబంధాల చర్చ సమగ్రంగా వుండాలంటే. కృష్ణ తులాభారం కధ చెప్పి, నారదుడు కృష్ణుణ్ణి వేలం చేయడం గురించి చెప్పాలి. వుద్యోగ విజయాలు నాటకంలో “పదకసీను'లో దేవుడికీ మనిషికీ వున అవినా'బావి సంబంధం మీద మాట్లాడాలి. కురుక్షేత్రంలో విజయసారధి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి యొక్క వైభవమూూ ఆ క్షణంలో భీష్ముడి ఆనందమూ వర్ణించవలె. మసీద్‌ యా మందిర్‌ రాజకీయాల గురించి విపులీకరించాలి. ఎరకృనోయి యిందులోకి దిగాను. ఇది పుస్తకంగా రాయాల్సిన విషయం. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోంచి పద్యాలకు పద్యాలు వుటంకించి “మానవ సంబంధాలూ దేముడూ” అంశంలో నిగ్గు తీయాలంటే బోలెడు టైము పదుతుంది. ..నేను కర్షకుడ స్వామీ! నిన్ను వండించెదనొ అని విశ్వనాథ వారన్నట్టు కాస్త కృషి చేస్తే దేవుణ్ణి పండించి, నేనూ పండిపోగలను. ఆఖరుగా దేవుడూ మూనవ సంబంధాలూ ముగించే ముందు దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ప్రార్ధనలో జ్ఞాపకం వున్న నాలుగు ముక్కలు జ్ఞాపకం చేస్తాను. “దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి లక్షలాది దేవుళ్ల నుండి వారి పూజారుల నుండి వారివారి ప్రతినిధుల నుండి సిద్ధాంత కేసరుల నుండి సిద్ధుల నుండి శ్రీమన్మద్దురు పరంపర నుండి .. దేవుడా మమ్మల్ని కనికరించు చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని ఆదమరచి కాసేపు విశమించడానికి అనుమతించు తండ్రీ! [౧ నా శ్రీరమణ 19

ఆారికుకల౮ - రూనీ5 నంణంధాలూ

కుక్కలన్నీ సమానమే కాని కొన్ని కుక్కలు మరీ అధిక సమానం. పుణ్యం చేసుకున్న వారికి మహత్తరమైన మానవ జన్మ లభిస్తుందని వేదాలు, వుపనిషత్తులు ఘోషిస్తున్నాయి. మరీ ఎక్కువ పుణ్యం చేసుకుంటే కలవారి ఇంట బొచ్చుకుక్క్మగా పుడతారని ఒక ఆర్యోక్తి ప్రచారంలో వుంది. పిల్లలను ముద్దు చేసిన దానికంటే కుక్కపిల్లలను ఎక్కువ ముద్దు చేస్తుంటారు. ఇదొక ముద్దు. అమెరికా (ప్రెసిడెంటు మనదేశం వచ్చినపుడు, కూడా ఆయన కుక్క కూడా వస్తే ఈ వాతావరణానికి ఇబ్బంది పదుతుందని మనమంతా విలవిల్లాడి పోయాం. గొప్పవాడి కుక్క పేదవాడి ఏనుగు కంటీ బలమైంది. (గ్రహచారం బాగా లేనపుడు తాడు పామ్లై కరుస్తుందంటారు నిజంగా మొన్నామధ్య అదే జరిగింది చూ పై ఫ్లోర్‌లో వుందే వారింటికి వెళితే అక్కడ “బివేర్‌ అఫ్‌ డాగ్‌” అని బోర్డు చూసి భయపడ్డాను. డోర్‌ బెల్‌ కొట్టీ ఎందుకైనా మంచిదని తలుపుకు దూరంగా నిలబడ్డాను. ఇంటావిడ తలుపు తీసింది. లోపలికి ఆహ్వానించింది. “కుక్కని కట్టేశారా' అన్నాను సందేహంగా. ఆవిడ వౌకృసారి సీరియస్‌ అయిపోయి “అదేం చెయ్యదులెండి. రండి' అన్నది. “నాకు కుక్కలంటే చచ్చేంత భయమండీ" అన్నాను తటపటాయిస్తూ లోపలకు అడుగులు వేస్తూ. ఆవిడ “మీరు మాటమాటకీ కుక్క కుక్క అనడం ఏమీ బాగా లేదండీ. దానికి సూపర్‌ అని నిక్షేపంలాంటి పేరుంది" అన్నదావిడ. 'అంటే కుక్కగదా అని కుక్క అన్నానన్న మాటండి. లేకపోతే అనను కదండీ అని సమర్ధించుకోపోయాను. ఆ మాటతో ఆవిడ బెలూన్‌కి సూది గుచ్చినట్టు వొక్కసారి పేలింది.

“'కుక్క అయినంత మాత్రాన కుక్క అని పిలవాలా? కుక్క అనేది దాని జాతి పేరు. మిమ్మల్ని మనిషీ అని పిలిస్తే మీకు ఎట్లా వుంటుంది? చదువు కంటే సంస్కారం ముఖ్యం మీకు వాక కులస్తుడిని కులం పేరుతో పిలిచే దమ్ములు లేవు వొక మతస్థుడిని ఆ మతం పేరుతో పిలిచే కలేజా లేదు. చూ సూపర్‌ మీకు తేరగా దొరికిందా కుక్క అని నోటినిండా పిలవడానికి? కుక్కకి కూడా వొకరోజు వస్తుందని గుర్తుంచుకోండి (ఇంగ్లీషులో) అనేసి ఆవిడ విసురుగా లోపలకు వెళ్లిపోయింది. అది మొదలు వొట్టేసుకున్నాను కుక్కనే కాదు ఏ జంతువునూ ఆ జాతి పేరుతో పిలవకూడదని. పనిలోపని పక్షులను కూడా పేర్లు తెలుసుకుని పిలవాలని నిర్ణయించుకున్నాను నాకో అనుమానం వచ్చింది. 'పోనీ శునకము అని పిలవచ్చా, ఆవిడను అడుగుదామని అనిపించింది. ఎందుకంటె కొన్ని కొన్ని తెలుగులో అనడానికి బాగుందనివి సంస్కృతంలో, ఇంగ్లీషులో పలుకుతాం కదా. అట్లాగే కుక్కని ఆంగ్లీకరించి డాగ్‌ అంటే... ఎందుకు వచ్చిన గొడవ... మానవ సంబంధాలు యిప్పటికే ధ్వంసం అయినాయి, మరింత ధ్వంసం అవుతాయని నోరు మూసుకు కూచున్నాను. నేను వాళ్లింటికి వెళ్లింది మా అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ చందా అడగడానికి ఇంక యిలాంటి స్థితిలో ఏమి అడుగుతాం? అడిగినా 20 మానవ సంబంధాలు

  1. శ ష్‌ € “ల త్‌ గ నలో ళు ని ఇ ీ గ ఒంట డా న.
  • అతల ళా - కక. జ్యా పని సానుకూలం అయ్యేనా? సరే ముందు సూపర్‌ని మచ్చిక చేసుకుని, దాని గుణగణాలను కీర్తిస్తూ, ఆవైపు నుంచి మరొక మంచి సమయం చూసి నరుక్కురావాలని నిర్ణయించుకున్నాను కుక్కలు కూడా గుణపారాలు నేర్పుతాయని అర్ధమైంది.

బాదరాయణ సంబంధం అంటాం. అంటే మన దొడ్లో రేగి చెట్టు వుంది. వాళ్ల బండి చక్రం రేగి కలపతో చేశారు. ఆ సంబంధం అడ్డుపెట్టుకుని ఆరు నెలలు ఆతిధిగా వుండిపోయాడట వొక లౌక్క్యుడు. శునక సంబంధం కూడా అలాంటిదే. మీ యింట్లో ఆల్సేషియన్‌ వుందా? చూ యింట్లో కూడా అదే. డాబర్‌మాన్‌, స్పానియల్‌ యిలా కుక్కల 'బ్రీడ్‌ని బట్టి యజమానులు సన్నిహితులైపోతారు. విదేశాలలో అయితే వీళ్లకి ప్రత్యేకించి క్లబ్‌లు కూడా వుంటాయి. వాళ్లు తరచూ తమ కుక్కలతో సహా వచ్చి, వాటి గొప్పతనాల గురించి, వాటి సమస్యల గురించి, వాటివల్ల తమ సమస్యల గురించి, యిలొ అనేకానేక విషయాలపై మనసువిప్పి మాట్లాడుకుంటారు. ఏవైనా పరస్పరం మార్పిడీ చేసుకోవలసిన చిట్కాలు కిటుకులు, కొత్త విషయాలు వుంటే మార్పిడీ చేసుకుంటారు. మరణించిన కుక్కల ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తారు. దాని జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మానవ సంబంధాలు గట్టీవడడానికి యింతకంటె ఏమి కావాలి?

“కుక్క మనిషిని కరిస్తే అది వార్త కొదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త యిదివొక పాపులర్‌ సూక్తి. 'కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి... ఎంత చేసినా దాని బుద్ది పోనిచ్చుకోదు' అంటారు. నదిలో ఎన్ని నీళ్లు వున్నా గతుగగ చూచుకుక్క అంటారు. గతకడం దాని జీవలక్షణం. శ్రీరమణ 21

అపార్ట్‌మెంట్‌లో వున్నావిడకు వాళ్ల 'జింటా ముచ్చట్లు మొదలుపెట్టిందంటే యిక ఆపడం తెలియదు. మా జింటా పేపరు తెస్తుంది. దానికి చిరంజీవి పిక్చర్‌లో సాంగ్స్‌ అంటే యిష్టం. ఇళయరాజా కంపోజ్‌ చేసిన పాటలంటే చెవి కోసుకుంటుంది. ఈమధ్య ఆర్‌.పి.ని బాగా లైక్‌ చేస్తోంది. పిల్లలతో వద్దంటున్నా వినకుండా క్రికెట్‌ ఆదుతుంది. క్షణంలో బంతి నోటికి కరుచుకు తెచ్చి అందిస్తూ వుంటుంది. వౌలింగ్‌ అంతగా రాదు. మా జింటాకి క్రికెట్‌ ఆట పూర్తిగా తెలుసు. ఆఖరికి మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో సహా. ఆమధ్య ఎవరో బిస్కెట్‌ వేస్తే చూ వాళ్ల టీమ్‌కు వెన్నుపోటు పొడిచింది. తర్వాత అందరూ నోరు చేసుకుంటే 'నేను కుక్కని కాబట్టే కదా శంకిస్తున్నారు' అని బావురుమంది. చచ్చాం డానిని వోదార్చేసరికి. అఫ్‌కోర్స్‌... తర్వాత తప్పు తెలుసుకుని బోలెడు పశ్చాత్తాపపడింది. కుక్కకి మనిషితో వున్నంత సాన్నిహిత్యం మరి ఎవరితోనూ వుండదు. హిజ్‌ మాస్టర్‌ వాయిస్‌ వాళ్ల గుర్తు చూసే వుంటారు, యజమాని పాడుతుంటే చెవులు రిక్కించి వినేదట- అందుకే హిజ్‌ చూస్టర్‌ వాయిస్‌కి ఎంబ్లమ్‌ చేసేశారు. కొన్ని బ్యాంకులవాళ్లు మేము మీ డబ్బుకి కాపలా కుక్కలం అని కుక్క బొమ్మతో సవా ప్రదర్శిస్తుంటారు. విశ్వాసానికి మారుపేరు కుక్క కుక్క విశ్వాసం మీద ఎన్ని కధలు వచ్చాయో లెకృలేదు. మా చిన్నప్పుడు సినిచూలలో గుర్రం, కుక్క తప్పకుండా వుండేవి. అవి భలే నటించేవి. ఏనుగులు, పొములు కూడా నటించాయి గాని కుక్కలు పాత్రలో జీవించినంతగా యివేమీ జీవించలేవు. భారతంలో స్వర్గారోహణ పర్వమంతా కుక్క మీదుగా నడుస్తుంది. ప్రపంచ సాహిత్యంలో 'టిన్‌ టిన్‌ లాంటి అతి గొప్ప కుక్క పాత్రలు వచ్చి ఎందరి అభిమానాన్నో చూరగొంటున్నాయి.

“కుక్కలందు బొచ్చుకుక్కలు వేరయా అన్నారు. ఎవడి కుక్క వాడికి ముద్దు. కాని వాళ్లు ఎదుటి వాళ్లకి రుద్దేస్తూ వుంటారు. ఇది భరించడం చాలా కష్టం. “మా ట్రౌనీకి వాపెల్‌ ఆ్ట్రా అలవాటు. మారుతి అంటీ పాపం యిబ్బంది. అబ్బ! యీ ఎండలకు ఎ.సి.లో వున్నా తట్టుకోలేకపోతోంది మా (బ్రౌసో- కొన్ని శాంపిల్స్‌ యిచ్చాను. మిగిలినవి మీరందరూ వినే వుంటారు. దయచేసి అవన్నీ యిక్కడ మీరు గుర్తుచేసుకోండి.

చెన్నైలో కుక్కల వేలుసామి చాలా ఫేమస్‌. అతను కుక్కల వ్యాపారం చేస్తాడు. మీరు కూరగాయలు కొనదానికని ఆ వీధికి వెళితే కుక్కసిల్లని అంటగట్టగల సమర్ధుడు. కుకృపిల్లలకు రంగులు వేసి అమ్ముతాడనీ, నాలుగుసార్లు దానిని కడిగితే అసలు రంగు బయటపడుతుందనీ కొందరు చెప్పారు. మనం నేలుసామి దగ్గరకు వెళ్లగానే (అతన్ని నాయిసామి అనేవారు) సిటీలో తను ఎవరెవరికి కుక్కలు యిచ్చిందీ వొక లిస్టు చెబుతాడు. ఆ జాబితాలో ఎమ్‌జిఆర్‌, కరుణానిధితో మొదలుపెట్టి రజనీకాంత్‌ దగ్గర ఆగుతాడు. మనం గుక్క తిప్పుకునే లోపున “మీకు జెంట్స్‌ కావాలా, లేడీస్‌ కావాలా" అంటాడు. మీ జవాబుల కోసం అతను ఎదురుచూడడు. చిన్న బోనులాంటి పెట్టెలోంచి పిల్లలను బయటకు తీయడం మొదలుపెడతాడు. రన్నింగ్‌ కామెంట్రీ సాగుతూ వుంటుంది. “యిది రొంబ నల్ల బ్రీడ్‌ సార్‌. రజనీవాండ్ల దాగ్‌దా క్రాస్‌, మదర్‌ డాగ్‌ వాడు కూడా పెద్ద వణతికార్‌ (డబ్బున్నవాడు). యిది చూడండి, హోం మినిస్టరు వాడికీ, ఫైనాన్స్‌ వాడికీ క్రాస్‌దా, రకరకాల బ్రీడ్స్‌ ఎవైళబుళ్‌ సార్‌.

సినిమా ్రీడ్స్‌ కావాల్నా రైటర్స్‌ కావాల్సా, సింగర్స్‌ కావాల్నా సోనీ సినిమా ఫైట్‌మాస్టర్‌ కుక్కకీ, టాప్‌ రౌడీషీటర్‌ డాగ్‌కీ పుట్టిన నాయికుట్టి. యిదిగో దీని మదర్‌ కమల్‌హాసన్‌తో యాక్ట్‌ చేసి వుందాది ” యింకా ఎన్నో కాంబినేషన్లు గడగడా వల్లిస్తాడు. అతనిని వినడమే వొక ఎడ్యుకేషన్‌. ఇప్పుడు వచ్చిన జీన్‌ టెక్నాలజీ ఆధారంగా, కుక్కలో విశ్వాసొనికి సంబంధించిన జీన్‌ని దొరకపుచ్చుకుని మూనవ జాతికి టీకాలు వేయడం తక్షణ కర్తవ్యం. అప్పుడే మానవ సంబంధాలు బాగుపడతాయి.. 22 మానవ సంబంధాలు

రైల౮ - రూస5్‌ నంశంధాలో యౌనవ జీవితంలోకి రైలు దూసుకు వచ్చినంతగా మరే ప్రయాణ సాధనమూ రాలేదు. ఒకటో తరగతి వాచకంలోనే రైలు అనే మాట వచ్చేస్తుంది. ఇంగ్లీషు వాళ్లు 'ఉక్కు గుర్రం) అని రైలు అంటే సరదా వదతారు. వానలో తడవనివారు, రైలు ఎక్కనివారు వుండరు గాక వుండరు. రైలుకు మానవ సంబంధాలకు ఏమిటి సంబంధం అంటే, దానిని వివరించాలంటే గూడ్సు రైలంత సొడుగు అవుతుంది.

'నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు” అన్నారు ఆరుద్ర. చిన్నప్పుడు అర్థం కాలేదు. కుర్రతనంలోనూ అర్థం కాలేదు. కొంచెం బట్టతల వచ్చాక బోధవడుతోంది. దేనికైనా అన్వయించుకోవచ్చు. సొంత యిల్లు వుండాలనేది కొందరి జీవితాశయం. అది తీరకుందానే జీవితం 'లేటు' అవుతుంది. విఫలమైన (ప్రేమలు, సఫలమైన లవ్‌స్తోరీలు కూడా యీ కొటేషన్‌లో యిముడుతాయి. ఇంగ్లీషులో 'లేటో అనే మాటను తెలుగులో జేర్తశేషులు'కు సమానార్థకంగా వాడతారు. లేటు అంటే ఆలస్యం అని కూదా. అయితే “ఐయామ్‌ లేటొ అనేది మంచి ప్రయోగం కాదు. మా పొస్టరీ మేష్టారు ఎవ్చుడూ వొకమాట చెప్పేవారు. “చూస్తే జి.టి.ఎక్స్‌పెస్‌ (గ్రాండ్‌ ట్రంక్‌) చూడాలిరా. అందులో కొళ్ళీర్‌ నుంచి కన్యాకుమారి దాకా... రకరకాల వాళ్లు, భాషలూ, ద్రెస్‌లూ, వాళ్ల తిళ్లూ నమస్తం కనిపిస్తాయి. ఏ బెజవాడ ప్లాట్‌ఫారమ్‌ మీదనో ఆగినప్పుడు చూడాలి- దాని తస్పదియ్యా కనులపండుగ్గా వుంటుంది. పైగా దానిని చూడడమే వో ఎడ్యుకేషన్‌ అంటూ జి.టి. మీద అరగంటసేపు తన్మయులై మరీ ఉవన్యసించేవారు.

రైల్లో కిటికీ పక్క సీట్లో కూచుని, హాయిగా చెట్లవంకా చేమల వంకా చూస్తూ, చందమామ చదువుతూ ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభవం. కుటుంబంతో ప్రయాణం చేసే వేళ

ఎంత శవతీ క / న్‌ రటటష/ ౯౪౮1౯ 'శగానననానా నాననా ననిన నినినానానకాననాతనినననాననాలునినాన నానా నానా శ్రీరమణ 23

కైలుపెట్లె మన యిల్లే చక్రాలు తగిలించుకుని వెళ్తున్నట్లు అనిపిస్తుంది. పైగా రైళ్లల్లో క్షణక్షణం రకరకాల తినుబండారాలు అమ్మకానికి వస్తాయి. శెనగపప్పు ముద్దలూ, వేరుశెనక్కాయలూ, తేగలూ, నువ్వు జీడీలు, జామకాయలూ, మసాలా గుగ్గిళ్లు, కాలక్షేపం బరాణీలు యిలా యింకా ఎన్నో నోరూరించేవి అమ్ముతూ వుంటారు. అవి కొనుక్కోవడం, వాటి తాలూకు తొక్కులూ, అవశేషాలూ భద్రంగా రైలు పెట్టెలోనే పదెయ్యడం మన సంప్రదాయం. మా ఊరు బ్రాంచి లైనులో అయితే ఎన్నో విశేషాలు అమ్మేవారు. సినిమా న్యూ సాంగ్స్‌, అజీర్ణం మాత్రలు, పిన్నీసులు, మొలతాళ్లు, ఎలుకల మందు, కలరా ఉండలు యిలాంటి చిన్న చిన్న అత్యవసర అయిటబ్స్‌ అమ్మడం ఆనవాయితీ. మెయిన్‌ లైన్‌ మీద భీకరమైన కూతతో ధనధనా కెనడియన్‌ యింజన్‌తో వెళ్లే రైలు నిజంగా ఉక్కు గుర్రమే. (బ్రాంచి లైను మీద అప్పట్లో “ఉక్కు గాడిదలా” యీసురోమని వొడ్డూ పొడుగూ లేని ఇంజన్లతో నడిచే రైళ్లు తిరిగేవి. పాపం వోర్పు సహనాలకు పెట్టింది పేరు. మూనవ సంబంధాలను గట్టిపరిచినవి నిజానికి యివే. పొద్దుటే తెల్లవారకుండానే వచ్చే మొదటి రైలు కోసం, స్టేషను చుట్టుపక్కల వాళ్లు బిందెలతో ఎదురుచూస్తూ వుండేవారు స్టేషన్‌లో ఆగగానే వాల్వు తిప్పి ఇంజనులోంచి సలసల కాగే వేడినీళ్లు వదిలితే అందరూ పట్టుకునేవారు. ఈలోగా ఫైర్‌మాన్‌ "కోల్‌ పిటొలోంచి రాక్షస బొగ్గు పెళ్లలను కింద పడేస్తే, తలొకటి తీసుకుపోయే వాళ్లు. ఇంజనులో వుండే గైవరు, ఫైర్‌మాన్‌ తలకు గట్టిగా వస్త్రం బిగించి కట్టి, చూడగానే వాక స్టయిల్‌ కనిపించేది వాళ్లలో. స్టేషన్‌ వస్తూందనగానే (డైవర్‌ ఇంజన్‌ ద్వారంలో నిలబడి పెద్ద సైజు టెన్నిస్‌ రాకెట్‌ని అందుకుని, తన చేతిలోది గిరాటు వేసేవాడు. అది 'లైను క్లియర్‌ ఫ్రేము. దానిలో చిన్న యినపబిళ్ల వుంటుంది. అవతల స్టేషన్‌ మేష్టరు క్లియర్‌ అంటే గాని, ఇక్కడ ఆ బిళ్ల వూడిపదదు. రెండు రకాల సిగ్నల్సు బెటర్‌ సిగ్నల్‌లో పదేస్తే కూతలు వేసుకుంటూ కూచునేది రైలు. అప్పట్లో (గ్రామాలలో పొలం పనులు చేసే కూలీలకు రైళ్ల రాకపోకలే గడియారాలు. అందుకే మానవ సంబంధాల విషయంలో రైలుకు వున్న స్టానం సైకిలు క్కూడా లేదు. ప్రతి రైలు పెట్టెలోనూ అలారం గొలుసు వుంటుంది. దానిని లాగితే, బుస్సున గాలిపోయి రైలు ఆగిపోయేది. ఒక్క (ప్రయాణీకుడు తలుచుకుని చైను లాగితే అంత పొడుగు రైలూ దేవుడా అంటూ నిలిచిపోయేది. డెమో్రసీకి యింతకు మించిన పొడుగాటి వుదాహరణ నాకు కనిపించలేదు. విచూనాన్ని గాని, ఆర్టీసీ బస్సుని గాని ఆఖరికి ఆటోని గాని మీరు ఈ విధంగా ఆపగలరా? ఛాలెంజి చేస్తాను- మీరు ఆపలేరు. చిన్నప్పటి రోజులలోకి వెళితే- రైలు జ్ఞుపకాలు స్లీపర్‌ కొయ్యలలాగా లెక్కలేనన్ని. కలం క్యాప్‌ తీసి వెళ్లే వెళ్లే రైలు దైవర్‌కు చూపిస్తే ఇంత '“గ్రీజ్‌ ముద్ద విసిరేసేవాడు. చిన్న కాజీ రైలు కింద పెడితే రూపాయి బిళ్లంత అయేది కాని, కాణీ కూడా చెయ్యకుండా పోయేది. దబ్బనాన్ని రైలు పట్టా మీద పెడితే చాకులా మారేది. రైలు వెళ్తుంటే లైనుకు అటూ యిటూ వున్న అత్తిపత్తి(టచ్‌మి నాట్‌) మొక్కలు చెవులు మూసుకునేవి. రైలు పట్టా మీద చెవి పెట్టి, పక్క స్టేషన్‌లో రైలు బయలుదేరిందో లేదో చెప్పేసే వాళ్లం. బెటర్‌ సిగ్నల్‌ స్తంభం యినవ మెట్ల మీంచి ఎక్కడం, గ్యాంగ్‌మన్‌ చేతిలో దొరకడం, దెబ్బలు తినడం అవన్నీ ఆనందాల మధ్య చిన్న చిన్న విషాదాలు.

ఎర్రజెండా, పచ్చజెండా చేతిలో పట్టుకుని, మెడలో విజిలు, తెల్ల టోపీతో రైలు మీద పుల్‌ కంట్రోల్‌తో ఆఖరి పెట్టెలో వుండే గార్డు గారిని చూస్తే మహా ఈర్ష్యగా వుండేది. ఎప్పటికైనా మా బ్రాంచి లైను మీద గార్జునై, మూ వూరి దగ్గర రైలు ఆపి మా వాళ్లందరూ చూశాక పచ్చజెండా చూపించాలని మహా కోరికగా వుందేది. దేశంలో యిప్పుడు లక్ష కిలోమీటర్ల రైలు లైను, ఏడు వేల స్టేషన్సు పదకొందు లక్షల మంది వుద్యోగులు వున్నారు. అయినా నేను గార్డును కాలేకపోయాను. దేనికైనా ప్రాప్తం వుండాలి. రైలు పట్టాలు దూరంగా కలిసినట్టు వుంటాయి కాని కలవవు వుత్త (భ్రమ ఈ అంతరార్థాన్ని కధావస్తువుగా ఎందరో వందల సంఖ్యలో కథలు అల్లారు. ఈ కధల 24 మానవ సంబంధాలు

వల్ల చమూనవ సంబంధాలు మెరుగుపడ్డాయో లేదో నాకు తెలియదుగాని, చిన్నప్పటి నుంచి రైలుతో అనుబంధం కొనసాగే మాట వాస్తవం. బడి గంట ఎక్కడైనా రైలు పట్టా ముక్క వుంటుంది. దానిని కొట్టే ఇనుప సుత్తి కూడా రైలు వాళ్లదే. లావుపాటి మర మేకు గంటతోపొటే వుంటుంది మూ స్కూల్లో ప్యూను సెలవు పెట్టినపుడు, సిపిఎల్‌ అయినందువల్ల గంట కొట్టే అవకాశం నాకు లభించింది కదిలే రైలులో, బరానీలు, శెనక్కాయలు అమ్మేవాళ్లు తోకబుట్టలో సహా పెట్టెలోంచి పెట్టెలోకి మారిపోతూ వుంటారు. నాకు చచ్చే భయంగానూ, సర్మస్‌ చూస్తున్నంత వింతగానూ వుండేది. నా అర టిక్కెట్‌ వ్యవహారంలో పదిహేనేళ్లు వచ్చేదాకా మా ఫ్యామిలీ అంతా వొకే మూట మీద వున్నాం. మూ నాయనమ్మ ట్కెట్‌ మేష్టరు ఎవ్వుడు అడిగినా- 'పిల్లగాడికి అయిదు వెళ్లింది గాని అరు రాలేదు నాయనా' అనేది. నన్ను వొళ్లో కూచోపెట్టుకుని యీ ముక్క చెప్పేది. అర టిక్కెట్‌ కొన్న నేరానికి ముసలమ్మకు యీ శిక్ష చాలన్నట్లు నా వంక వోసారి చూసి, ఆవతలకు వెళ్లిపోయేవాడు.

'పడుచుతనం రైలుబండి పోతున్నదీ, పడుచువాళ్లకందులో చోటున్నదీ...” అనే మంచి పాట ఆరుద్రే రాశారు. “చికుబుకు చికుబుకు శైలే, అదిరెను దీని స్టయిలే ..' అంటే స్టయిలు రైలుది కాదు, సాహిత్యంలో రైలు అనేది వేరే అంశం. మరోసారి చూట్లాడుకుందాం. రైలు స్టేషన్‌ వొక ప్రత్యేక ప్రపంచం అదొక లోకం. సెందాఫ్‌లు యివ్వడం, కదిలే రైలు ఎక్కడం యివన్నీ నిత్యం కనిపించే దృశ్యాలు. ఇక్కడ చూ రైలు మావయ్య గుర్తుకు వస్తాడు కొత్తగా పెళ్లయింది వాళ్లిద్దరూ అత్తారింటికి బయలుదేరారు. మామగారు చీరాలలో లాయరు. ఒంగోలు స్టేషన్లో మావయ్య దిగాడు. అప్పటికీ అత్తయ్యా సిగ్గుపడుతూనే “వద్దండీ అంటూనే వుంది, వింటేనా? పైగా కొత్త పెళ్లికూతురు మావయ్య 'కాఫీ తెస్తా శళీ అని దిగాడు నిజానికి క్రాసింగ్‌ ఏదో వుంది, చాలాసేపు అగుతుందన్నారు. తీరా క్రాసింగ్‌ చినగంజాంలో అన్నారేవరో. గంట, విజిలు, జెందా, కూత. . రైలు బయలుదేరింది. మావయ్య ప్లాట్‌ఫారమ్‌ మీద మిగిలిపోయాడు. అత్తయ్య కిటికీలోంచి దిగాలుగా చూస్తూ కళ్లనీళ్ల పర్యంతం అయింది. అప్పటికి రైలు కిటికీలకు చువ్వలు లేవు అత్తయ్య చీరాల వొంటరిగా చేరింది బండి సాయంత్రం ఆరింటికి వెళ్లింది. వాళ్ల నాన్న స్టేషన్‌కు వస్తే, రైలు దిగాక జరిగిందంతా చెప్పి అత్తయ్య బావురుమంది. మామూలుగా అయితే యిదేమీ పెద్ధ ఇష్యూ కాదు. లీ రోజు మావయ్య శోభనం జరగాల్సి వుంది- వత్రికల భాషలో చెప్పాలంటే యీ నేపధ్యంల్‌ యిలా జరగడం ్రత్యేకతను సంతరించుకుంది. ఇక, ఒంగోలు వెళితే మావయ్య అక్కడ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు అనుకోకుండా వొక యాత్రా స్పెషల్‌ రైలు దైవస్మరణ చేసుకుంటూ వచ్చి ఆగింది. ఆ రైలు ఎక్కడానికి వీలు లేదు ఆఖరికి మావయ్య కధంతా చెప్పి నమ్మించగా, కొందరు భక్తులు జాలిపడి చీరాల దాకా లిఫ్ట్‌ యివ్వడానికి అంగీకరించారు. యాళథొ రైలు చీరాల అర్లరాత్రి అయింది. 'అయినదేమో అయినది...” అని సరాసరి అత్తవారింటికి వచ్చి తలుపు తేట్లాడు అప్పటికే అందరూ గాధనిద్రలో వున్నారు. మళ్లీ తలుపు తట్టగా వాళ్లింట్లో వంటావిడ లేచి, కిటికీలోంచి చొపచుట్ల బయటకు విసిరి, అవలించి వెళ్లి పడుకుంది. మామగారు వృత్తిరీత్యా లాయరు అవడం వల్ల వాళింటో యిది అలవాటు. ఆలస్యంగా వచ్చే క్లయింట్స్‌కి చాపచుట్టి పడేస్తారు. అల్లుడు టా అరరాత్రి రావదం వల్ల అ చాపగతే అనుకున్నారు తెల్లారి మామగారు సారీ చెప్పి, హూదాాంట్‌ సందర్భాలలో రైలు వదిలి సాము చేయకూడదని హితబోధ చేశారు అప్పటి నుంచీ రైలు మావయ్య'గా స్థిరవడిపోయాడు. కాని పాపం కరైలులాగానే చాలా మంచివాడు. [2 ల నా. శ్రీరమణ 25

వుష్మరొలూ - కూన నం1ఎంధాలళ

చూనవ సంబంధాలలో మునకలు వేసేముందు- అసలు పుష్మరం గురించి మఠీ వీడియో కాన్ఫరెన్సు అంత పొడుగ్గా కాకపోయినా కాస్తయినా తెలుసుకోవడం అవసరం. వైద్యం, సంగీతం, వేదాంతం యివి ఎంతో కొంత (ప్రతివారికీ తెలిసే వుంటాయి. వేదాంతం సందర్భోచితంగా తగు పాళంలో వాడితే మేథావిగా త్వరగా గుర్తింపు వస్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్లి, యింకో అదుగు పాంకోళ్లతో సహా వేస్తే తత్వం తలకు ఎక్కుతుంది. మౌత్‌ పబ్లిసిటీ త్వరగానే వస్తుంది. కొడ్డిగా యింగ్లీషు, పది పన్నెండు శ్లోకాలు సొంతం చేసుకుంటే “పీఠాధిపతి ముద్రపడడం పెద్ద కష్టం కాదు. 'మానవ సంబంధాలూ - పాంకోళ్లూ” అనే వ్యాసంలో యీ పీరాధిపత్యం మీద సమగ్రంగా చర్చిస్తాను. ఇది పుష్కర సమయం కాబట్టి యిందులో వేరే విషయాలు వుండకూడదు.

అయితే చూనవులలోకి వెళ్లేముందు (గ్రహ, రాశి వివరణ కొంత అవసరం. మనం భూగోళం మీద వున్నాం. మనతో సంబంధ బాంధవ్యాలు కలిగి మరో తొమ్మిది [గ్రహాలు వున్నాయి. సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శుక్ర బుధ, కేతు, శని యివి నవగ్రహాలు. దశమ (గ్రహం కూడా వుందని అంటారు గాని యింకా పెద్దలు యీ విషయమై ఏకాభిప్రాయానికి రాలేదు. వున్నా ఆ [గ్రహం భూమి మీదనే వుంటుందని కొందరి వాదన. [గ్రహాలు కాకుండా అశ్వని మొదలు రేవతి దాకా యిరవై ఏడు నక్షత్రాలు. మేషము, మిధునము, కన్య, తుల యీ విధంగా పన్నెండు రాశులు. యివన్నీ మనిషి జీవితాన్ని శాసిస్తాయని నమ్మేవారు వున్నారు. నమ్మనివారూ వున్నారు. 'పుష్మరాలు” యివన్నీ నమ్మినవారికే గాని నమ్మనివారికి కాదు. పుష్మరుడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే పుష్కరాలలో మూనవ సంబంధాలు ఎట్టివో దృగ్గోచరము కాగలవు.

పుష్కరుడు అనే భక్తుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే- నా స్పర్శతో ఎవైనా పావనత్వాన్ని, పుణ్యత్వాన్ని పొందేలాగా వరం అనుగ్రహించమన్నాడు. “తథాస్తు” అన్నాడు శివుడు. 'అయితే నువ్వు యిట్లా ఘనంగా వుంటే కుదరదు. ద్రవరూపంలో వుంటే సుఖం అన్నాడు వరం యిచ్చిన శివుడు. “అలాగే శివా అన్నాడు భక్తుడు. తక్షణం నీటి మడుగై యింకిపోతుంటే శివుడు ఆ భక్తుడిని కాచి రక్షించాడు. తర్వాత శివపార్వతుల పెళ్లి బ్రహ్మ స్వయంగా పౌరోహిత్యం వహించి జరిపించాడు. పెళ్లిలో పార్వతిని చూసి (బ్రహ్మ చలించాడు. శివుడు మూడో నేత్రంతో బ్రహ్మ చపల బుద్ధిని గమనించి, ఏదో మన్మథ లీలగా చూసీచూడనట్టు వదిలేశాడు. ఈ సందర్భంలోనే “బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అనే సౌమెత పుట్టింది. చాలామంది మూనవులు దీనిని ఆసరాగా తీసుకుని అవకాశం చిక్కినపుడు మన్మథ లీలల్ని 26 మానవ సంబంధాలు

ఉరసి 1 , ్రాగ గగ

భరిస్తూ వుంటారు. శివుడు క్షమించి, మూడో కన్ను తెరవకపోయినా బ్రహ్మను పాపథీతి వదల్లేదు. శివుడు తన పెళ్లి చేయించినందుకు దక్షిణగా బ్రహ్మకు పుష్కరుడిని యిచ్చాడు. జల రూపంలో వున్న పుష్కరుణ్ణి తన కమండలంలో పోసుకుని (బ్రహ్మా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పువ్నరుడు (బ్రహ్మ కమండలంలో 'సెటిలైపోయాడు. గ్రహ మండలంలో ఏవో యిగో టప్రాబ్నబ్స్‌ వచ్చి బృహస్పతికి శనికి తేడాలు వచ్చాయి. శనిని చూస్తే శివుడికే చచ్చే భయం. చెట్టు తొర్రలో కూచోపెట్టిన వాడు కదా. బృహస్పతి అనగా ఎంత? పైగా బృహస్పతికి 'ఉజంటిల్మన్‌' అనే శీరుంది ఆయన (బ్రహ్మ దగ్గరకు వెళ్లి కొంచెం పుష్కరుణ్జి వదిలితే శని ప్రభావం నుంచి బయటపడతానన్నాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే- 'యిట్లా అస్తమానం విడివిడిగా వచ్చి నన్ను డిస్టర్స్‌ చెయ్యద్దు. వొక్కొక్క రాశిలో పుష్కరుడిని వాకొక్క నదిలో వదులుతొ. పన్నెండు చాశులు వున్నాయి. పన్నెండు జీవనదులు వున్నాయి. పన్నెండు రోజులు అయా నదులను ఆవహించి, ఆవరించి పుష్కరుడు వుంటాడు. అందులో మునిగితే "క్లీన్‌ అండ్‌ (గ్రీనొ అని నిర్ణయించాడు. ఇహ అప్పటినుంచి పుష్కరుడు నదీ సంచారం మొదలుపెట్టాడు. ఇప్పుడు గోదావరి, వచ్చే సంవత్సరం కృష్ణ తర్వాత కావేరి, మేషరాశిలో గంగ, కర్కాటకంలో యమున... యిలా తిరుగుతూ వుంటాడు. మనకు గోదావరి, కృష్ణ వరసగా వస్తాయి. అందుకని మనం గోదావరిలో పాపాలు చాలావరకు వదిలించేసుకుని, మిగులూ తగులూ వుంటే కృష్ణలో క్లీన్‌ చేసుకోవచ్చు.

రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు అయిదేళ్లకొకసారి వస్తాయి. ఎవరైనా వొక పట్టు పడితే మధ్యంతరంగా వచ్చి పడతాయి. యిది పూర్త మూనవ సంబంభాలకు సంబంధించిన అంశం. అయితే, పుష్యరాలు మూత్రం అటు సూర్యుడు లేదా చంద్రుడు యిటు పొడిచినా పన్నెందేళ్లకు మాత్రమే వస్తాయి. అదీ జీవనదులకే పరిమితం. ఆలిండియా స్థాయిలో పన్నెండు నదులకే పుష్యరాలు పరిమితం. చాలా చిన్నప్పుడు గ్రామ్‌ఫోను మట్టి రికార్డు వొకటి వుండేది. అందులో “దొడ్డమ్మా పుష్కరాల వింతలూ... అహవి వింతలూ" అని వొక పాట వుండేది. ఆ పాట నిండా బోలిడు వీంతలూ విశేషాలూ, మోసాల జాబితా వుండేది. అది వింటే పుష్కరాలలో మానవ శ్రీరమణ 27

సంబంధాలు ఎట్లా వుంటాయో స్పష్టంగా తెలుస్తుంది. గోదావరి వొడ్డున పుష్కరతీర్ధ (ప్రజకు ఎన్నెన్ని రకాల వస్తువులు, మందులూ తైలాలూ అమ్ముతారో ఆ భగవంతుడికే ఎరుక, 'కాశీపట్నం చూడర బాబూ అని చుక్కాని పెట్టెలు చూపించి పాడుతూ వుంటారు కొందరు. ఇప్పుడు కాలం మారింది. ఎవరి 'స్టాల్స్‌' వాళ్లు పెడతారు. జనం దొరికారు కాబట్టి ఎయిడ్స్‌ మీద కూడా అవేర్‌నెస్‌ కలిగించడానికి ప్రత్యేక స్టాల్‌ పెడతారు. పుష్యరాలు అనేవి మైలురాళ్లు లాగా, వొక మలుపుల లాగా మనలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. కిందటి పుష్కరాలకు మా పెద్దవాడికి ఎనిమిదేళ్లు. అంతకుముందు పుష్కరాలలో మా పెద్దపిల్ల కడుపున పడింది. కృష్ణా పుష్కరాలలో అత్తగారు పోయారు. ఫలానా సినిమా కిందటి పుష్కరాలలో విడుదలైంది. పైగా రోజంతా ఆటలు వేస్తూనే వున్నారు. ఈ అద్దం మూడు పుష్కరాల క్రితం పుష్యరాలలో రామపాదాల రేవులో కొన్నాం- బేడా యిచ్చి యిప్పటికీ నిక్షేపంలా వుంది. ఎటొచ్చీ కొన్న కౌత్తల్లో మొహం తీరుగా కనిపించేది. దానికీ వయసై యిప్పుడు ముడతలు పడ్డట్లు కనిపిస్తోంది- యిలా సాగే లాండ్‌ మార్క్‌ యిజానికి అంతే వుండదు. కలకత్తాలో గంగ, రాజమండ్రిలో గోదావరి- వాటిమీద ఎంత ప్రోజు ఎంత పొయిట్రీ వచ్చిందో చెప్పలేను. గోదావరి పాత వంతెన గురించి గాని, కాటన్‌ ఆనకట్ట గురించి గాని పెద్దవాళ్లని కదిలించారంటే- పారిజాత వృక్షాన్ని కదిలించినట్టే. పూలు రాలినట్లు వారి జ్ఞాపకాలు రాలుతూనే వుంటాయి- దోసిళ్లకొద్దీ. ఇప్పుడంటే హోటళ్లూ అవీ గాని మూడు నాలుగు పుష్కరాల క్రితం సత్రాలూ, యిళ్లూ మాత్రమే భక్తులకు ఆతిధ్యం యిచ్చేవి. మూ తాతగారు పుష్మర స్నానానికి వెళ్లి గోదావరి కోటిలింగాల రేవు దగ్గర్లో వొక యింట్లో దిగారు. వాళ్లింట్లో గోంగూర పచ్చడి అద్భుతంగా వుందని, ఆ యింటి పిల్లని కోడలుగా చేసుకున్నారు. వొక మహాద్భుతమైన ఆ గోంగూర ఫార్ములాని గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం దాకా గుబాళింప చేశారు. పుష్కరమే లేకపోతే ఈ గోంగూర ఫార్ములా మాకు దక్కేదా? ఇక్కదే మానవ సంబంధాలను మనం పట్టుకోవాలి. “సరిగ్గా పన్నెందేళ్ల క్రితం... గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం వెళ్లాం. అప్పుడు రాధ అయిదేళ్ల పిల్ల, మాటలు వచ్చీ రాకుండా వున్నాయి. స్నానం చేసి దానధర్మాలు యిచ్చి చూద్దుం కదా రాధ లేదు. పుష్కరాల రేవులో తప్పిపోయింది. మొత్తం వెతికాం. పత్రికలలో వేయించాం. రేడియోలో చెప్పించాం. జాడ లేదు. ఆ గోదావరిలో జారిపడిపోయి వుంటుందని ఆశ వదులుకున్నాం. ఆ దిగులుతోనే వాళ్ల అమ్మ మంచం పట్టింది. బాబూ! మళ్లీ యిన్నాళ్లకు నా రాధ నా యింటికి వచ్చింది...” యిలా దండ వేసిన భార్య ఫొటోవైపు చూస్తూ ఫ్లాష్‌బ్యాక్‌ చెబుతారు గుమ్మడో, ఎస్పీఆరో? కళ్లజోడు మొదటే తీసి ఈ సంఘటన వివరిస్తారు. వుత్తరీయంతో కళ్లొత్తుకుంటారు. అమ్మాయి హీరోయిన్‌, అతడు హీరో. పుట్టుమచ్చ చూసి రాధని గుర్తుపడతారు. యిలాంటి దృశ్యాన్ని మనం కనీసం వంద తెలుగు సినివూలలో చూసి వుంటాం. పుష్మరాలూ చూనవ సంబంధాలూ జస్టిఫై చేయడానికి యింతకు మించిన వెండితెర సాక్ష్యం మీకేం కావాలి? 28 మానవ సంబంధాలు

లో్‌ఆోో లో రినాయకుడూ - రూసీ5్‌ నం1౮ంధాలూ అసలు యీ శీర్షిక వినాయకుడితో 'ప్రారంభించాల్సిన మూట. కాని సందర్భం రాలేదు. మనం ఏ పని తలపెట్టినా అవాంతరాలు కాపాడేది విఘ్నరాజే. అందుకని మనుషులతో ఆయనకు వున్నంత అనుబంధం మరే దేవుడికీ ఉండదు. సాక్షాత్తూ పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుణ్ణి తయారుచేసి, ప్రాణం పోసి గుమ్మంలో కాపలా పెట్టింది. తర్వాత గజాసురుడి పొట్టలోంచి బయటపడి శివుడు రావడం, తొందరపాటుతో బాలకుని శిరసు ఛేదించడం- యీ కథ అందరికీ తెలిసిందే. అందుకే యా యుగంలో కూడా ఏదో నిమిత్తమాత్రులం అని చెప్పడానికి “అమ్మ చేసిన పిండి బొమ్మని' అంటూ వుంటారు కొందరు. కొన్నాళ్ల తర్వాత వాక సమస్య, దాని వెంట రాజకీయం వచ్చాయి. విఘ్నాలకు వొక నాయకుడు అంటే కల్పించడానికి కాదు తొలగించడానికి అవసరం ఎంతైనా వుందని దేవతలూ మానవులూ రుషులూ మొత్తం అఖిలపక్షం కోరింది. యిది నామినేటెడ్‌ పోస్టు. చుంచి పవర్‌ఫుల్‌ పోస్టు. అప్పటికే పవరక్‌కీ వారసత్వాలకూ అవినాభావ సంబంధం వుంది. శివుడుకి కుమారస్వామి, వినాయకుడూ యిద్దరూ శెండు కళ్లు. మూడో కన్ను పూర్తిగా ఆయన సొంతం. ఎవరంటే ఎవరు వీల్లిద్దరిలో అనే మీమాంస వచ్చింది. సరే, అప్పుడు చిన్న లేస్‌' లాంటిది పెట్టడం, కుచూరస్వామి నెమిలి మీద రివ్వున బయలుదేరడం, వినాయకుడు 'శండ్రీ! నా అశక్తత తమరెరింగియు యిట్లు ఆనతీయ లే షో న 414/6 (న నో ల్‌! సమ వ్‌ గ! న ర్త వ్‌ న. క రా /1 వ. తతతతతతైతై22త2ైడ2డడతతడడడడ్డడ్డడడ శ్రీరమణ 29

తగునే అని బాధపడ్డాడు. దానికి చిన్న కిటుకు చెప్పి కుమారస్వామిపై నెగ్గించారు. మొత్తంమీద గణాధిపతిని చేసి కూచోపెట్టారు వినాయకుణ్ణి. అసలు సంకల్పించిన పనులు సక్రమంగా నెరవేరకపోవడమూ, దానిలోంచి వొక శక్తివంత మైన పదవిని క్రియేట్‌ చెయ్యడమూ ఫ్ర్రోక్‌ ఆఫ్‌ జీనియస్‌! అంటీ ఆయన అనుగ్రహించకపోతే ఏ పనైనా డమాల్‌! అప్పుడంటే ఆయన వొక్కడే. ఇప్పుడు ఆఫీసుకి అరవై మంది పని కాకుండా ముడి వేయడానికి. పైగా ఆయనకు కుడుము యిస్తే పండగ. ఇప్పుడు వీళ్లంతా వేరు. గుడిని, గుళ్లో లింగాన్ని మింగేసినా యింకా ఆకలి తీరడం లేదు. అందుకే “గుడిని మింగేవాడికి తలుపులు అప్పడాలు అంటారు. రధాన్ని యితర వాహనా లను వడియాలను ఆరగించినట్లు ఆరగిస్తాడు. నిన్న రోడ్డు పక్కగా స్కూటర్‌ మీద వెళ్తుంటే ట్రాఫిక్‌ పోలీసు ఆపాడు. నేను కొద్దిగా దారితప్పిన మాట వాస్తవం. కాని ఎంతమంది తప్పడం లేదు. ట్రా.పో. బాగా ఆకలి మీద వున్నట్టున్నాడు. చరచరా చలానా రాయడం మొదలుపెట్టాడు. నేను నీళ్లు నముల్లూ, ఏదో మానవ సంబంధాలకు అనుగుణంగా సర్జుకుపోదామని సూచన చేశాను. నేను అంటున్నక్షొద్దీ రెచ్చిపోయి “ఎడ్యుకేటెడ్‌ కూడా... నో.. ఐ యామ్‌ సారీ... అంటూ “మీ పేరు...' అన్నాడు. “విఘ్నేశ్వర ప్రసాదొ అన్నాను. కాసేపు ఆలోచించాడు. చుట్టూ వోసారి చూశాడు. వాకసారి అధికార దర్చంతో నా వంక చూసి- 'సరే వెళ్లండి... యిక నుంచి జాగ్రత్త, దిసీజ్‌ ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌... నేను అప్పటికే వినిపించనంత దూరం వెళ్లిపోయాను. ఇలాగ సాక్షాత్తూ విఘ్నేశ్వరుదే నన్ను కాపాడాడు. ఆపిన పెద్దమనిషికి తెలుగులో గాని యింగ్లీషులో గాని ఆ పేరు రాయడం కడుంగడు దుర్లభమని నాకు తెలుసు. ఎందుకంటే నేనే కరెక్టుగా రాయలేను. యిలాంటిచోటే వినాయకుడితో మూనవ సంబంధాలు బయట పడుతుంటాయి. చిన్నప్పుడు తెలుగు మేష్టారు డిక్టేషను రాయండ్రా అనగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ మాటలు చెబుతారో తెలుసు. మొదటిది స్వాతంత్ర్యము, రెండు విఘ్నేశ్వరుడు, మూడు విష్వక్సేనుడు, నాలుగు దుర్యోధనుడు... యిలా వుండేది వరస. తెలుగు మేష్టారికి యింగ్లీషు మీద చాపల్యం. స్వాతంత్ర్యయులో యావత్తు, మిగిలిన వాటిలో దీర్జాలు, వత్తులు తప్పనిసరిగా పోయేవి. 'రైట్‌ యీచ్‌ వన్‌ టొంటీ టైమ్స్‌” అని యింపోజిషన్‌ యిచ్చేసిి యీలోగా పొడుగైన కునుకు వొకటి లాగించేవారు. వినాయకుడు విషయంలో బోలెడు తిరకాసులున్నాయి. దేవుళ్లలో మూనవ సంబంధాలు చిత్రంగా వుంటాయి. 'దేముడు వొక్కడే కాని ఎవరి దేవుడు వారే' అనేది సత్యం. విఘ్నేశ్వరుడి పప్పులు అన్నిచోట్లా వుడకవు. శైవ సంప్రదాయంలోనే యాయన ఆడింది ఆట, పాడింది పాట. వైష్ణవ పక్షంలో విష్టక్సేనుడు అనే దేముడు తొలి పూజ అందుకుంటాడు. కాని వినాయకుడు రూపం, రుచులూ, అభిరుచులూ, ఎలుక వాహనం అన్నీ చిత్రంగా వుంటాయి. పిల్లలు ఆయనంటే భలే ముచ్చటపడతారు. అసలు కైలాసంలో సహజీవనం అనివార్యం. శివుడు మెడలో పాము ఆవురావురుమని ఎలుక వైపు చూస్తూ వుంటుంది. కుచూరస్వామి తన నెమలి వాహనాన్ని పార్క్‌ చేసినప్పుడల్లా అది పాయు వంక ఆశగా చూసి లొట్టలు వేస్తూ వుంటుంది. ఈ ట్రయాంగిల్‌ రొమాన్స్‌ విషాదాంతం కాకుండా నిరంతరం సాగుతూనే వుంటుంది. మనం వినాయకుణ్ణి దగ్గరకు తీసుకున్నంత ఆత్మీయంగా మరే దేవుజ్జీ తీసుకోం. మన 30 మానవ సంబంధాలు

పిల్లల్లో పిల్లాడిలా భావిస్తాం. వినాయక చవితి వస్తే క్రికెట్‌ ఆడుతున్నట్టు, వినాయకుడు కంప్యూటర్‌తో అదుకుంటున్నట్లు, కారు నడుపుతున్నట్లు రకరకాల బొమ్మలు చేసి పూజిస్తాం. మధుర భక్తిలాగే యిదో రకం సరస భక్తి. వినాయకుడు హాస్యప్రియుడని అంటారు. కాని ఆయన రూపమే భలే హాస్యాస్పదంగా వుంటుంది. తొండము, దంతము, బొజ్జ, పొట్టి చేతులు, గుజ్జురూపము, మంచి తిండిపుష్టి వీటన్నిటితో మనం ఐడెంటిఫై అవుతాం. ఆ మధ్య వొక పెద్దాయన స్వారస్యం వొకటి చెప్పారు. పార్వతీదేవి వినాయకుని బొమ్మను చేసి రక్షకభటునిగా నిలబెట్టిందిట అప్పటి నుంచీ ఆమె పుణ్యాన రక్షకభటులందరికీ చిరుబొజ్జ నుంచి పెనుబొజ్జ రావడం సృష్టి ధర్మం అయిందిట. ఏ పని ప్రారంభిస్తున్నా గణనాధుని ప్రార్టిస్తాం. యిది చున ఆచారం. ఆ మధ్య మా బస్తీలో తన మనవడిని మొదటిసారి వృత్తిలోకి దింపుతూ వినాయకచవితి చందాతో జీవితాన్ని ఆవిష్మరింప చేశాడు. వాళ్లు మూడు తరాలుగా బస్తీలో దాదాగిరి చేస్తూ జీవిస్తున్నారు వసూళ్ల బరిలో దిగేవాళ్లు గణేష్‌ చందాతోనే (శ్రీకారం చుడతారు. అట్లాంటి వాళ్లే తర్వాత వృద్ధిలోకి వస్తారు. యిలాంటి ఆర్ధిక సంబంధాలతో ముడిపడి వుండడం వల్ల యీాయనకు మానవ సంబంధాల గాఢత ఎక్కువ.

సత్యనారాయణస్వామి వ్రత కధ విధిగా వింటాం అది బావుంటుంది. కొంచెం ఫాంటసీ అది. వ్రతం చెయ్యగానే యింట్లో వున్న వస్తువులన్నీ బంగారు వస్తువులు అయిపోతాయి. కాని నీలాపనిందలు బాపుకొనుటకు వినాయకుడి కధలు కూడా వింటాం. వీటిలో హ్యూమన్‌ ద్రామా ఎక్కువ. థ్రీకృష్ణుడు అంతటివాడు శమంతకమణిని దేబిరించడం వుంది. అగ్నిదేవుడు రుషిపత్సులపై కన్ను వేయడం కూడా చిత్రమే. ఆ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదు గాని ఆ రోజు పెద్దవాళ్ల చేత తిట్లు తింటే దీవెనలు అవుతాయనే వారు. అందుకని యిళ్ల మీద రాళ్లు, దారిలో పల్లేరుకాయలు తేలుగొండి కాయలు వేసి పెద్దవాళ్లు తిరగబడి తిడుతుంటే ఆశీస్సులుగా హాయిగా వడగళ్ల వానలో తడిసినంత ఆనందపడే వాళ్లం. యిదో రకం మూనవ సంబంధాలు. రాళ్లు వేసి తిట్లు తినడం ఏమిటో?

అసలు వినాయకుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడని కదా నీలాపనిందలూ, కధా కచూమిషూ వచ్చింది. చంద్రుడు శాపగ్రస్తుదైనాడు. అయినా నవ్వుతూనే వున్నాడు, యిప్పటికీ. మనిషి తన మీద పాదముద్రలు వేశాడని చెప్పి ప్రపంచాన్ని నమ్మించాడని, ముక్కు మీద వేలు వేసుకుని చిదానందంగా చంద్రుడు నవ్వుతూనే వున్నాడు. [] న శ్రీరమణ ఏ]

నీవరీపాలూ - కూనీ5 సం'ంధాలూ కన్యాచల్కం నాటకం హాస్యరస ప్రధానమని చాలామంది అపోహ పడుతుంటారు గాని అందులో వున్నది బీభక్సరసం-అంటారు శ్రీశ్రీ. కన్యాశుల్కంలో కనిపించని మానవుడు వుండడు. మానవ సంబంధాల విషయంలో ఎంత చారవా, ఎంత చనువూ లేకపోతే “మన వాళ్ళుత్త వెధవాయలోయ్‌” అనిపిస్తారు గురజాడ. నేనిప్పుడు కన్యాశుల్మంలోకి వెళ్లడం లేదు. అందులోకి వెళ్లినవాడు తిరిగి బయటకు రాడు. గ్రీన్‌ రూమ్‌లో పాత్రలో పాత్రగా సెటిలైపోయే ప్రమాదం వుంది. మానవ సంబంధాలతో నవరసాలు ఎట్లా ముడిపడి వున్నాయో విశ్లేషించాలన్నది నా తపన, అప్పారావు అప్పులు చేస్తాడు. నిజానికి అందరం చేస్తాం అతనికి ఆ బ్రాండ్‌ పడింది. అదీగాక అతనికి అప్పులు చేయడం అనేది అవసరం కంటే సహజ లక్షణం. అప్పు చేయడం కొందరికి బాధ. కొందరికి హాబీ, ఇప్పుడు స్టేటస్‌ సింబల్‌. మనందరం ఎంతోకొంత అప్పారావు అంశ కలిగిన వాళ్లమే. అప్పారావు అప్పు లాగడంలో నవరసాలు ఎలా పలికిస్తాడో, విజయవంతంగా పండిస్తాడో గమనిస్తే- మానవ సంబంధాలలో నవరసాలు ఎలా ్రతిఫలిస్తాయో అర్ధం అవుతుంది. చూడ్డానికి హాస్యంగా వుంటాడు. మనిషి శాంత స్వభావుడు. అప్పు అడగడంలో కరుణ రసం చిప్పిల్లుతుంది. భయ, బీభత్స వాతావరణం రుణరంగంలో వుండనే వుంటుంది. అప్పారావు ఎదురవడమే వొక గొప్ప రొమాన్సు. సందర్భాన్ని బట్టి రౌద్ర రసాన్ని “అర్జన్సీ”లోకి తర్చుమూ చేసి ఆఖరికి అప్పు పుట్టిస్తాడు. అది అద్భుతం! అందుకని అప్పారావు నవరస పోషకుడై మానవ సంబంధాలను అప్పులతో ముడివేసి కాపాడుతున్నాడు. మనలను నిత్యం పది మంది పలకరించాలంటే ఏదో వొక రుణానుబంధం వుండాలి. అది లేకపోతే ఎవడూ మనల్ని పట్టించుకోడు. మనకు రోజూ నవరసాలూ పోషించే నటరత్నాలే కాకుండా 'నసరత్నాలు' కూడా తారసపడుతుంటారు. వాళ్లతో సంభాషిస్తే నీరసం వుద్భవించి, కాసేపటికి గుండె మోకాల్లో చప్పుడు చేస్తుంది. త్యాగరాజస్వామి “శాంతము లేక సౌఖ్యము లేదు” అన్నారు. ఇప్పుడు హాస్యం లేకపోతే ఆరోగ్యం లేదంటున్నారు. నవరసాలలో భక్తిరసం లేదు. కాని అన్నిటికీ భక్తిని మేళవించవచ్చు. దేవుణ్సి చతురోక్తులతో అర్చించి హాస్యరసాన్ని పిండవచ్చు. శృంగారభక్తి వుండనే వుంది. భయభక్తి సరేసరి. యీ రసాలూ యివీ బోలెడు పర్మిటేషన్‌ కాంబినేషన్స్‌లో వుంటాయి ప్రాధమిక వర్ధాలు ఏడు మాత్రమే. వాటిని అటు కలిపి యిటు కలిపి చిత్రకారుడు కొన్ని వందల వేల షేడ్స్‌ పుట్టిస్తాడు. అసెంబ్లీ సమావేశాలలో మానవ సంబంధాలు బీభత్సంగా 32 మానవ సంబంధాలు

కనిపించినా నవరసాలు వినిపిస్తాయి. సభలో వున్న వారికి నవరసభరితమే కావచ్చు గాని చూసేవారికి సర్వం హాస్యరసమే. సామాన్య ప్రజానీకాన్ని నవ్వులలో ముంచెత్తి, వారికి ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం మాత్రం ప్రజాసేవ కాదా- అని (ప్రశ్చిస్తున్నాను. వున్నట్టుండి వొక వర్ధమాన సినిమా తారకు “నవరసాలు అంటే ఎన్ని అని సందేహం వచ్చింది. మొదట వాళ్లమ్మని అడిగింది. ఏపిల్‌ రసం, ఐత్తాయ రసం, నారింజ, నిమ్మ యిలా ఆరేడు రసాల పేర్లు చెప్పింది. “అవికాదు యాక్టింగు చేసేవే” అంది. “ఆటి సంగతి నాకేం తెలుస్తది. డైరెక్టర్‌ గారిని అడుగు” అని సలహా చెప్పింది. డైరెక్ట్‌ గారు మంచి మూడ్‌లో వున్నపుడు సందేహ నివృత్తి చేసుకోవాలని అడిగింది. “వాటితో నీకేం పని” అని దాటేశాడు. అఖరికి నిర్మాత “నవ్రదసాలంటే ఆరు. అది కూడా తెలియకుండా ఫీల్టుకి ఎలా వచ్చావో అని మందలించాడు. యిందులో వున్నది హాస్యం కాదు మానవ సంబంధాలే. సచివాలయానికి వెళితే నవరసాలను డామినేట్‌ చేస్తూ “నీరసం” కనిపిస్తుంది. మీరు పొద్దున్నే వెళితే మధ్యాహ్నం రమ్మంటారు. మధ్యాహ్నం వెళితే రేపటికి వాయిదా వేస్తారు. గురువారం వెళితే- “మీరు వొకపని చెయ్యండి మండే రండి” అంటారు. సోమవారం వెళితే “యివ్వాళ మండే కదండీ, మీరు ధర్స్‌డే వస్తారా” అంటారు. అక్కడ మానవ సంబంధాలన్నీ క్యాంటిన్‌లోనే సెటిల్‌ అవుతాయి. ఇక్కడ తరచుగా మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలలోకి రూపాయాంతరం చెందుతుంటాయి. యిక్కడ కరుణ రసం వచ్చిన పార్టీలలోనూ, మిగతా రసాలు అధికారులలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. సాయంకాలం సభకు వెళితే, అక్కడ తొమ్మిదేం కర్మ పదహారు రసాలు కనిపిస్తాయి. “అయ్యో మీరొచ్చారా” ($్ర్ర అని జాలిరనంతో కొందరు పలకరిస్తారు. సభలో హావభావాలూ, (జ్జ 1 రసపోషణ అమోఘంగా జరిగిపోతూ 0 6 వుంటుంది. పొగడ్త కూడా వొక స్వా స్ట రసమే. కాని దినుసుగా ఎక్కువ న ణో బ్‌ ప్రాచుర్యం పొందింది. నిజానికి క రో భక్తిరసం యావత్తూ పొగడ్తరసమే య్‌. “ఏమని పొగడుదురా” అని వొకరు, జాగ “ష్రాగడ మాటలు లేవు రామా అని న్‌ యింకొకరు, “పొగడబోదామంటే పొగడవే నీవైతివే” అని మరొకరు చముత్మారాలు వెలిగిస్తూ దేవుడికి క్‌! కితకితలు పెడతారు. క 7 నల్‌, ఒక యింటాయన కరెంటు యి ఖీ బిల్లులో నవరసాలు వున్నాయన్నాడు. శ్రీరమణ 33

బిల్లు చూడగానే భయం కలుగుతుందిట. తర్వాత వ్యవస్థ మీద కోపం వచ్చి రౌద్రం పుదుకుందిట. వీరరసాన్ని ప్రదర్శించబోయి సామాన్యుడు అవడం వల్ల అది శాంతంలోకి చూరుతుందిట. చివరకు తన మీద తనకే జాలి కలిగి కరుణరసం బిల్లుమీద రెండు చుక్కలై పడుతుందిట. వాక వెర్రి నవ్వుతో హాస్య రసం, లైటు తీసేసి శృంగారం ప్రదర్శిస్తాం అన్నాడు. యిందులో మూనవ సంబంధాలు ఎక్కడున్నాయన్నాను. “బిల్లు కట్టేది మానవుడే కదా” అన్నాడాయన. ఆర్‌టిసి బస్సు వల్ల నవరసపోషణ జరుగుతూ తద్వారా మనిషికీ చునిషికీ మధ్య దూరం తగ్గుతోంది. ఎప్పుడూ నష్టాల ఊబిలో కూరుకుపోయి నిత్యం శోక రసంలో ఆరు టైర్లూ కూరుకుపోయి వుంటుంది. నగరాలను పల్లెలతో కలుపుతూ, అర్బన్‌ చూనవులకు రూరల్‌ మానవులకు మధ్య సంబంధాలను మెరుగుపరుస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో నవరసాలు ఎట్లా వున్నాయో వివరించనక్కరలేదు. ఏ గురువు గారిని అడిగినా చెబుతారు. అక్కడ అసలు రసం అంటే నిజం రసం భోజనంలో భాగంగా వుంటుంది. వార్తాపత్రికలు, టీవి సెట్లు టన్నుల కొద్దీ రసోత్పత్తి కావిస్తూ జన సంబంధాలను వెల్డింగ్‌ చేసి మరీ వదులుతున్నాయి. సుదీర్హ పాదయాత్రలలో పది నుంచి పన్నెండు దాకా రసాలు వుంటాయని యిటీవలే నిరూపితమైంది. మూనవ సంబంధాల మాట చెప్పనే అక్కరలేదు.

ప్రపంచ బ్యాంకు (ప్రతినిధి బృందం వస్తే మనం ఎన్ని రసాలు పోషించి ప్రదర్శించి ఆయాసపడతామో' మనకే తెలియదు. ఇటీవల కాలంలో (ప్రపంచ బ్యాంకు వొక సంస్థలా కాకుండా సున్నితమైన మనసుగల వొక వ్యక్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ సందర్భం వచ్చినా వాళ్లని బరిలోకి దింపగల నేత మనకి వున్నారు. నవరసాలను ఆయన పోషించినంత గొప్పగా మరెవరూ పోషించలేరు. అసలా మాటకొస్తే ఆయన సాక్షాత్తూ పదోరసం = పాదరసం! న్‌ తతా మానవ సంబంధాలు

ల ల రన్‌ భోజనాలూ - రూనీరీ నంంధాలో దీపావళి వెళితే కార్తీక మాసం వస్తుంది. అంటే శరదృతువు ద్వితీయార్ధంలో వుంటాం. కార్తీకంలో వెన్నెల బావుంటుంది. వెన్నెల మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. “పేదవాడీ దీపమా! వెన్నెలా!” అంటూ రావిశాస్త్రి గారు క్రుతిలో పొడేప్పుడు వినడం వొక అనుభవం. దీపావళితో మొదలైన దీపాల సందడి కార్తీకంలో మరింత ప్రోజ్వలం అవుతుంది. తెల్లవారు జాయున న్‌ళ్ల మీద అరటి దొన్నెలలో దీపాలను వదిలిపెట్టడం, అవి నీళ్ల మీద ప్రతిబింబిస్తూ వెలుగుదారులు వేసుకుంటూ, అలలమీద నాట్యం చేస్తూ వెళుతుంటే- కులుకులు వొలకబోస్తూ పడుచుపిల్ల వొయ్యారంగా మిట్టపల్లాల డొంకదారిన నడిచి వెళ్తున్నట్టు వుంటుంది. ప్రతి వాకిలికీ రెండుపక్కలా న ' | | భళ్త౮! | /! "న | | (న్‌, |” ట్‌ గ్రా ఫి క్ర కాలో శ్రీరమణ 35

వెలిగే గూట్లో దీపాలు చిగురంత ఆశలుగా కనిపిస్తాయి. కార్తీకంలో పండువెన్నెల, చిరుచలి కలిసి వస్తాయి. సాయంత్రం దీపదీపాల వేళ శివాలయపు ధ్వజస్తంభం ఆకాశ దీపాలతో కొత్త పలుగులు సంతరించుకుంటాయి. సన్నగా వీచే తూరుపు గాలికి ధ్వజస్తంభపు చిరుగంటలు కదులుతాయి. గంటల సవ్వడికి వులిక్కిపడినట్టు శివుడి ముందు తిష్ట వేసిన నంది మరింత అప్రమత్తం అవుతాడు. ఆ గంటల చప్పుడుకి లయబద్ధంగా ఆకాశదీపాల శిఖలు కదుల్తాయి. దీపశిఖల చుట్టూ చేరే పురుగులూ, వాటికోసం వచ్చే చినిపిట్టలూ గంటలను కదిలించి మరింత సందడి చేస్తాయి. జెండాని లాగినట్టు దీపాలను అందమైన భరిణెలో వుంచి ధ్వజస్తంభంపైకి లాగడం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. దీపం చుట్టూ వుంటే అక్కడ మనిషి వున్నట్టు. అది మన వునికికి సంకేతం. అందుకని మూనవ సంబంధాలు పుష్కలంగా వుంటాయి “గోరంత దీపమ్ము కొండలకు వెలుగు” అన్నాడు ఏ మహానుభావుడో? కార్తీకం రాగానే వనభోజనాలు చేయాలని అందరం రెపరెపలాడతాం ఎవరికైనా కార్తీక భోజనాలు వొక కల. అందరూ కుటుంబాలతో వెళ్లడం, వంటలూ పిండివంటలూ చెట్ల కింద వందుకుని తినడం వొక అనుభవం. వనభోజనాలూ మూనవ సంబంధాలూ అనే అంశంలో వుపాఖ్యానాలు అనేకం. తిరిగి వాటిలో మానవ సంబంధాలు బోలెడు. వన భోజనాలు చూతభ్రమే కాదు మనం ఏది తలపెట్టినా ముందుగా అది చందాలతో శ్రీకారం చుట్టుకుంటుంది. ఎన్నికల దగ్గర్నించి వినాయక చవితి దాకా, సన్మానం నుంచి చావు దాకా, యుద్ధం వచ్చినా, వీడ్యోలు సభ జరిగినా జరగకపోయినా చందా తప్పదు. “చందాదారులు” అనేకం. చందాలు వసూలు చేయడం వొక కళ, అప్పు వసూలుకే అష్టకష్టాలు పడుతున్న యీ రోజులలో చందా లాగడం అంత తేలిక కాదు. ప్రతి ఆఫీసులోనూ, ప్రతి వూళ్లోనూ, కాలనీలోనూ “చందామామలు" వుంటారు. వారివి యీ విద్యలో అందెవేసిన చేతులు. చందాలకి చూనవ సంబంధాలకి అనేక ముళ్లు వున్నాయి. వాళ్లు తడబడుతూ చందాలు అడగరు. చనువుగా, కాదనలేని విధంగా కమిట్‌ చేయిస్తారు. అసలు యిన్నిరకాల చదువులు వస్తున్నాయి గాని చందా వసూళ్ల మీద నాలుగేళ్ల కోర్సు పెట్టచ్చు. అదేమీ చిన్న విద్య కాదు. బోలెడు చౌరవ, వాడుపు కావాలి. పబ్లిక్‌ రిలేషన్స్‌ అనగా మానవ సంబంధాలు బాగా నిర్వహించుకోవాలి. వాళ్లేం చేస్తారంటే మీరు, మీరు, మీరు అంటూ వొక పది యంది చందాలు వాళ్లే జమ చేస్తారు. “మీరు తర్వాత యివ్వండి. మీ దగ్గర ఎక్కడికి పోతాయ్‌” అని వొక మాట వాదతాడు. చాలా హాయిగా వినిపిస్తుంది ఆమాట. దాంతో ఎమోషనల్‌ అయిపోయి, మీ ఇంటిళ్లపాదీ వొక్క మాట మీద నిలబడి ఆయన చెల్లించానన్న చందా రొఖ్బం పూలల్లో పెట్టి అప్పటికప్పుడు యిచ్చేస్తారు. అదేమురి మానవ సంబంధాలంటే! డబ్బు వ్యవహారంలో “అవాల్తా” అని వొక మాట వుంది. చాలా గొప్ప మాట. మాట కాదు అది వరహాల మూట. మొండి బాకీలు అవాల్తాగా తర్జుమా అవుతాయి. “నేను శివకి బాకీపద్దాను. నాకు యివ్వాల్సినవి నువ్వు శివకి యిచ్చెయ్‌” అంటే అవతలి వాడు తలతాకట్టు పెట్టయినా శివ బాక్రీ తీర్చేస్తాడు. ఎందుకంటే అది నైకిల్‌ చైను వ్యవహారం. క్రమేపీ యిది వొక వృత్తి అయి “లోన్‌ షార్క్‌” రంగంలోకి వచ్చారు వాళ్లు ఎలాంటి వసూళ్లనైనా టేకప్‌ చేస్తారు. పర్సంటేజి తీసుకుంటారు. అక్కడ కూడా మూనవ సంబంధాలు వుంటాయి గాని వాటి వైఖరి, శైలి వేరు. 36 మానవ సంబంధాలు

చందాలు వసూలు చేసే వారు ముంచి అర్గనైజర్స్‌ కూడా అయి వుంటారు. మనం కూదా టాక్‌ రికార్డ్‌ చూస్తాం కదా. గత మూడేళ్లుగా కార్తీక వన సమారాధనలు ఫలానా వారు ఎంత చక్కగా నడిపిందీ తెలుసుకుని వుంటాం కొన్నిచోట్ల పోటీ పిక్చిక్‌లు కూడా వుంటాయి. యిదిగాక ఆఫీసు ఖాతాలో వొక వనభోజనం, అపార్ట్‌మెంట్‌ అకౌంట్‌లో మరొకటి, ఫెండ్స్‌ సర్కిల్‌లో వొకటి యిలా యిదొక పెద్ద ఖర్చు అయిపోతుంది అన్నీ మానవ సంబంధాలకు సంబంధించిన మొహమాటాలే! ఎవర్ని కాదన్నా రిలేషన్స్‌ గీతలు వడతాయి. గీతలు మరీ ఎక్కువపడి, (గ్రామఫోను రికార్డులా అయిపోవాలని ఎవరికి వుంటుంది.

మా ఆఫీసు వాళ్లు పర్‌ హెడ్‌ వంద రూపాయలు అనగానే మా ఆవిడ అనుమానంగా నా వంక చూసి, తలకాయల లెక్క దేనికిలెండి, మనిషికి యింత అనుకుంటే బావుంటుంది కదా అంది. అంటే హెడ్‌ మీద చిన్న ధ్వని. ఆ మాటతో విరక్తి కలిగి, అసలు మేం రాం అని తలతడిమి చూసుకుందాం అనిపించింది అక్కడే ప్రాఫెషనలిజమ్‌ తెలుస్తుంది. ఆర్గనైజర్‌ ఏ ఐటట్స్‌ చేయించదలచిందీ, హైలైట్స్‌ చెబుతాడు. జిహ్వ లాగుతుంది ఆర్గనైజర్లు అంటే మీరు తక్కువ అంచనా వెయ్యద్దు కుటుంబాలతో వూరికి దూరంగా చెట్టూ చేమా వున్న చోటికి తీసుకువెళ్తారు. యిష్టుడంటే యీ సెల్‌ ఫోన్లతో పిట్టల అరుపులు వినిపించడం లేదు గాని, మునుపు వన భోజనాలకు పళ్లితే రకరకాల కూతలు వినిపించేవి

సరే, యా సంవత్సరం కూదా కార్తీక పిక్నిక్‌ బాధ్యత సుందర్రావు మీదే పడింది. ఎవరు పదేశారో తెలియదు గాని అతను వుత్సాహంగా రంగ ప్రవేశం చేశాడు. మనిషికి యాబై రూపాయలు అన్నాడు. అయిదేళ్లలోపు పిల్లలకు ్రీ అన్నాడు. పదివరకూ అరటిక్కెట్‌ అన్నాడు. పది మందిని కలిపిన వారికి వొక విస్తరి వుచితం అన్నాడు. సిటీకి యిరవై కిలోమీటర్ల దూరం. (ప్రశాంతమైన వాతావరణం. నిజం ఉసిరి చెట్లు వున్నాయన్నాడు. కొండ, కొండమీంచి సెలయేరు, కొండకింద వాగు వున్నాయన్నాడు. నాలుగు టీవి సెట్లు, కేబుల్‌తో సహా పికిక్‌లో ఏర్పాటు చేస్తానన్నాదు. ఇందులోనే ట్రాన్స్‌పోర్ట్‌ కూడా. అవసరాన్ని బట్టి అరడజను డీలక్స్‌ బస్సులు దింపుతానన్నాడు. సేష్టీకి అక్కడ షామియానాలు వేయిస్తానన్నాడు. డాన్స్‌ బేబీ డాన్స్‌ టైపులో లైవ్‌ షో కావాలంటే ఏర్పాటు చేస్తానన్నాడు “యివన్నీ ఎగస్ర్రానా” అని అడిగాను. సుందర్రావు నవ్వి “అన్నీ అందులోనే” అన్నాడు గర్వంగా. “మొత్తం విడియో తీస్తాం. కాపీ కావాలంటే ఎగస్త్రా అన్నాడు. మొత్తం వ్యూర్‌ మినరల్‌ వాటర్‌ మాత్రమే! నీళ్లు అవసరం లేని వారికి కార్క్‌ సోడాలు లభిస్తాయి. ద్రవాలు, వుపద్రవాలు వేరౌ సుందర్రావ్‌ ధోరణికి చూ అవిడ తన చెవులను తనే నమ్మలేక పోయింది. అతని వంక జాలిగా చూసింది. అరటిక్కెట్లని అనుకుంటున్నాడు గాని నిజానికి వాళ్లే ఎక్కువ లాగిస్తారు. ఎక్కడ బుక్‌ చేసుకోడో అని కంగారు పడిపోయింది ఆవిడ. మొత్తం లెక్కేసి, మా పని పిల్లని అరగా లెక్కించి, క్యాష్‌ దౌన్‌ కూడా చేసేసింది. సుందర్రావు దాదాపు యూడు బస్సుల జనాన్ని మోపు చేశాడు. నిజానికి నాలుగు బస్సుల జనం, కాస్త సర్ది, ఎక్కించాడు. పిక్నిక్‌ స్పాట్‌ బావుంది అంతా బావుంది. బావుండనిదల్లా అక్కడ మా అందరినీ రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు వేధించడం. అక్కడ కొంటే వుండే లాభాలు మా చెవుల్లో యిళ్లు కట్టుకు చెప్పడం. వెయ్యి రూపాయలు కట్టి ప్లాట్‌ బుక్‌ చేసుకోమని, సంతకాలు పెట్టమని స్టాంపు పేపర్లతో (నకిలీవేమో) సవా తిరగడం, ఏ యిద్దరినీ హాయిగా మాట్లాడుకోకుండా వాళ్లే సర్వత్రా వినిపించడం, బొబ్బట్లలా మమ్మల్ని కాల్చుకు తినడం...

మరి వన భోజనాలూ మూనవ సంబంధాలూ అంటే యిదే. సుందర్రావు వసూళ్తన్నీ జేబులో వేసుకున్నాడు. నిజానికి స్పాన్సర్‌ చేసింది “కొండవాగు రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు! (ల శ్రీరమణ ౩7

రాళ్లూ - రూనీ5 సంశంధాలూ తి

కొన్ని యుగాలు వెనక్కు వెళితే గాని రాళ్లలో మానవ సంబంధాలు వొక కొలిక్మిరావు. పురాణ యుగంలో మంధరగిరి కవ్వమై క్షీరసాగర మధనానికి దోహదపడింది. అంటే రాళ్లతో మానవులకే కాదు దేవతలకూ, రాక్షసులకూ కూడా సంబంధం వుంది. శ్రేతాయుగంలోకి వస్తే- రాయిగా పడి వున్న అహల్య రాముని పాద స్పర్భతో తిరిగి ప్రీ అయింది. అవతార పరంపరలో రామావతారం సంపూర్ణ మానవుడుగా అవతరించిన సందర్భం. వెంటనే రాళ్లతో మానవ సంబంధాలు మొదలైనాయని మనం గుర్తించాలి. రాముడు సముద్రం మీద వారధి కట్టినపుడు నీళ్లమీద రాళ్లు తేలాయి. లేకపోతే అంత వారధి పూర్తి అయ్యేనా? నీలుడు అని వాక కపిశ్రేష్టుడు రాకిపనిలో దిట్ట, ఆయన పర్యవేక్షణలో సేతువు నిర్మాణం జరిగింది. రామనామం జపిస్తూ వానరులంతా తమ శకికొద్దీ బండరాళ్లను, కొండరాళ్లను తెచ్చి పడేస్తుంటే వారధి పని శరవేగంగా సాగింది. తర్వాత ఎప్పుడో కొంతకాలం తర్వాత రాముడు సముద్రం వొడ్డున కూచుని, ఏదో ఆలోచిస్తూ చిన్నచిన్న రాళ్లను సముద్రంలోకి విసురుతున్నాడట. అన్నీ బుడుంగు బుడుంగున మునుగుతున్నాయట. రాముడు కొంచెం షాక్‌ తిన్నాడు. యీ దృశ్యం ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ కలయచూస్తే, వెనకాలే హనుముంతుల వారు వున్నారట. “హనుమా! వచ్చి ఎంత సేపైంది” అనగా “స్వామీ! మీరు రాళ్లు వేయడం ్రారంభించినపుడే యిక్కడున్నాను” అన్నాట్ట. ఆయన మరీ చిన్నబుచ్చుకున్నారట. అప్పుడు హనుమంతుడు “ఆర్యా! మీకంటె మీ నామం గొప్పది” అంటూ రామరామ అని చాలాసేపు భజన చేసి, రాముల వారికి వుపశమనం కలిగించాడట! అందుకని మూనవ సంబంధాలలో భక్తిపాత్ర కూడా వుంది.

ద్వాపర యుగంలో వొకానొక తరుణంలో ఇంద్రుడు కోపించి రాళ్లవాన కురిపిస్తే- బాలకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద నిలిపి మొత్తం గోకులాన్ని రక్షించాడు. “బాలుండీతడు కొండదొద్దది...” అని కొండ కింద చేరిన వారంతా భయపడితే *..నా కేలల్లాడదు నిలుడీ బంధులార” అని ధైర్యం చెప్పాడు. కొండని గొడుగుని చేసి నిలబెట్టాడు. ఇంద్రుడు తర్వాత దాసోహం అన్నాడు. చునుషులంతా రాళ్లవానకి కొండకింద తలదాచుకుని క్షేమంగా బయటపడ్డారు.

రాముడికి రాళ్లతో సత్సంబంధాలు వున్నాయి మొదటి నుంచీ. భద్రుడు వనవాసం నుంచి తిరిగి వస్తున్న సీతారామలక్ష్మణులను నిలిపేశాడు. ఆ భక్తుని మాటను శిరసావహించి భద్రగిరిపై కొలువుతీరి, భద్రాచల రాముడై, తెలుగువారి దేయుడై వుండిపోయాడు. తర్వాత భక్తరామదాసు చేతికి చిక్కిన సొమ్ముతో రాళ్లతో గుళ్లూ గోపురాలూ కట్టించాడు. విలువైన రాళ్లతో పచ్చల పతకాలు రత్నాలహారాలు చేయించాడు. తిరుపతి వేంకటేశ్వరుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఎక్కడ చూసినా రాళ్లే! ఏ రాయిని కదిలించినా “గోవిందా 38 నా డా మానవ సంబంధాలు

న. ఉల్‌ క టన యహూ [నంట యావ లర (గే. టం శా (న్వ్‌ ద్ర గ్గ గు చత గోవిందా” అంటున్నట్టు వినిపిస్తుంది నమ్మినవారికి ఆమధ్య పేరుమోసిన నాస్తికుడు వాకాయన ఎగువ కొండమీద తగిలాడు. “ఏమిటి గోవిందా అన్నట్టు భక్తిగా ఆయన వంక చూశాను. ఆయన కాసేపు తడబడి, గుటక మింగి *..అదే జస్ట్‌ యిక్కడ శిల్చ సంపద చూద్దామని. . జస్ట్‌. . అదే శిలాతోరణం చాలా ప్రాచీనమైంది కోటిన్నర సంవత్సరాల నాటిది. ప్రపంచంలో యిలాంటివి యూడే వున్నాయి... జస్ట్‌ అని దాటుకున్నాడు- తీర్థం నముల్తూ, భద్రాచలంలో, తిరుములలో కోతులు వుంటాయి ఎందుకు వుంటాయో వొకాయన చెప్పాడు. రామావతారంలో కిష్కంధలో కోతులన్నీ రాముడికి సేవ చేశాయి. రాముడెవరో వారికి తెలియదు. వాళ్ల రాజు సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. వెళ్లి యుద్ధంలో పోరాడాయి. వీరమరణం చెందినవి చెందగా మిగిలినవి కిష్కంధకు వచ్చాయి. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకున్న వారు లేరు. రాముడు తన దారిన తాను వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుదైనాడు. సుగ్రీవుడు తార తమ దారిన తాము సుఖభోగాలు అనుభవిస్తున్నారు. సాధారణ కోతులను పట్టించుకున్న వారు లేరు. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రతినిధిగా అయోధ్యకు వెళ్లి “కోతులకు మీరేమైనా చెయ్యాలి కనీసం తాఘ్రపటత్రాలు అయినా యిచ్చారు కాదు. పతకాలు లేవు. పింఛన్లు లేవు. .” అని భక్తిగానే డిమాండ్‌ చేశాడు. అప్పటికే పాదుకల పాలనలో అయోధ్య ఆర్థిక పరిస్టితి కొంచెం డల్‌గా వుంది రాముడు అప్పుడు అభయం యిచ్చాడు. కలియుగంలో నేను పలుచోట్ల పూజలు అందుకుంటాను. నా ఆలయం వున్న ప్రతిచోటా కపివరులకు అది ఆలోవాలం” అవుతుంది అక్కడ అరటిపంద్దు, కొబ్బరిచిప్పలు వారికి లభించే అవకాశం వుంటుంది. యీ విధంగా నా శ్రీరమణ 39

రుణం తీర్చుకుంటానని ఇనకుల తిలకుడు మాట యిచ్చాడు. రామావతారం చాలించి వేల సంవత్సరాలైనా రాళ్లతో ఆయనకు గల సంబంధాలు యింకా కొనసాగుతూనే వున్నాయి. రామజన్నభూమికి వూరువాడల నుంచి రాళ్లు మోసుకువె్లూరు భక్తులు. ఒక దేశ ప్రభుత్వం శిలాన్యాసం మీద ఆధారపడి వుందంటే రాళ్లతో మానవ సంబంధాలు ఎట్టివో గమనించండి. స్థలాభోగం, శిలాభోగం అంటారు. ఒక్కొక్మరాయి పూజలు అందుకుంటుంది. మరికొన్ని రాళ్లు గుండ్రాళ్లుగానో, గానుగ రాళ్లుగానో అరిగిపోతాయి. జీవనదుల్లో మంచి మంచి రాళ్లు దొరుకుతాయి. అవి ఎప్పుడో ఎక్కడో బయలుదేరి, నీళ్ల వురవడిలో దొర్లిదొర్లి వస్తాయి ప్రవాహం లేనప్పుడు ఆగిపోతాయి. వరద వస్తే పరుగులెత్తుతాయి. టన్ను బరువున్న రాయి చివరకు కొద్ది గ్రాయుల రాయిగా అరిగిపోతుంది. దానికే నోరుంటీ ఎన్ని అనుభవాలు చెబుతుందో! ఎండకీ వానకీ రాళ్లు స్పందిస్తాయి. చలికి వణుకుతాయి. కొన్ని రాళ్లు తపస్సులో మునిగిన రుషుల్లా వుంటాయి. కొన్ని నిశ్చలంగా నిలబడ్డ చెట్టులా వుంటాయి. మొహరించిన యదపుటేనుగులా కొన్ని కూర్మావతారాలు కొన్ని, రాళ్లకూ వొక పరిచుళం వుంటుంది. రాతిలో చెమ్మ వుంటుంది. రాతి కడుపున కప్పలు వుంటాయి. మనుషుల్లో లాగే వాటిలో కూడా “క్రాకొలు వుంటాయి. రోజువారీగా గీటురాయి, మైలురాయి, తూకపురాయి, స్టెపింగ్‌ స్టోన్‌ అనే మాటల్ని పదేపదే వాడతాం. రాళ్లు వేసి దాహం తీర్చుకున్న కాకి కథ చెప్పుకుంటాం. మంచి పనికి అడ్డం పడితే “సత్రంలో రాళ్లు వెయ్యద్దు” అంటాం. రాజకీయాలకు, రాళ్లకు అనాదిగా సంబంధం వుంది. పునాదిరాళ్లు రాజకీయాలకు పునాదిరాళ్లు. యిక రాళ్లమీద వచ్చిన సామతలు కావల్సినన్ని. రాగులరాయి తిరుగుతూ వుంటే రాజ్యమంతా చుట్టాలే, కాసిన చెట్టుకే రాళ్లు, రాజుల సొమ్ము రాళ్లపాలు, రాయితో కొట్టిన వాడిని వెన్నతో కొట్టాలి, రాయి వంటి కొడుకు లక్క వంటి తల్లి, పది రాళ్లు వేస్తే వొకటైనా తగుల్తుంది... యిలా కోకొల్లలు. పాతి రాతియుగం, కొత్త రాతియుగం అనేవి మానవ నాగరికతకు సంబంధించిన మైలురాళ్లు. రాళ్లని డబ్బుతో సమానంగా చూస్తాం. “వదో నాలుగురాళ్లు సంపాయించాడు” అంటాం. అంటే రాళ్లతో మానవ సంబంధాలు ఎంత విలువైనవో ఆలోచించాలి రంగురాళ్లక్రి విలువ కట్టడం కష్టం. బలపపురాయి అక్షరమై అరిగిపోతుంది. నిరక్షరాశ్యుణ్ణి అక్షరాశ్యుని చేసి ధన్యమైపోతుంది. కోణార్క రామప్ప శిల్ప సంపద మనిషి పనితనానికి గీటురాళ్లు పాలరాతి భవనాలు మనిషి (ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలు పునాదిరాయి సైకి కనిపించదు. అయినా భవంతిని అదే భరిస్తుంది. సమస్త వేదమంత్రాలూ వంటపట్టించుకున్న హోమగుండపు శిలలు ఎంత పుణ్యం చేశాయో అనిపిస్తుంది. రాళ్లను వులితో చెక్కేటప్పుడు వచ్చే శబ్దంలో వొక సంగీతం వుంది. ఒక గొప్ప శిల్పం ఆవిర్భవించబోయే ముందు వినిపించే సంగీతంలో ఎన్నో నొక్కులు వుంటాయి. అదే మందులు పెట్టి కొండంత రాళ్లను పేలుస్తున్నప్పుడు కపాలమోక్షాలు అవుతున్న చప్పుడు. ఆ పొగలోంచి వొక దిగులు వాసన. “రాళ్లని పరిరక్షిద్దాం” అనే నిర్మాణాత్మక ఆలోచనతో ముందుకు వచ్చిన పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. టల 4౦ మానవ సంబంధాలు

రిళ్లూ - రూనీ5్‌ నం+ంధాల౦

లిష్టకి అధికార భాషా సంఘం వారిని తెలుగు పేరు పెట్టమంటే “తిరుగాడు మందసము" అని కొందరు, “ఉచ్చ నీచ చలనపేటిక” అని తెన్టించారు. నిజానికి లిఫ్ట్‌కి భాషతో పనిలేదు. మీట నొక్కితే మన ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎక్కిన తర్వాత మళ్లీ ఎన్నో అంతస్తులోకి వెళ్లాలో ఆదేశిస్తే వెళ్లిపోతుంది. ఇది పాక్షిక సత్యం, చాలాసార్లు మనం పైకి వెళ్లాలనుకుంటే వొకసారి కిందకు వెళ్లి అక్కడ వాళ్లని కలుపుకుని మరీ పైకి వెళ్తుంది. అట్లాంటప్పుడు దానిమీద మనకు పూర్తి కంట్రోల్‌ లేదనే భావన బలపడుతుంది. లిఫ్ట్‌ లోపల, నిరీక్షిస్తూ లిఫ్ట్‌ బయట మానవ సంబంధాలు మెరుగుపడతాయి. వదహారు చదరపు అడుగులలో పది యంది నిలబడతారు. దీనివల్ల మనుషులు దగ్గర అవుతారు. ఇక్కడ రాజుకి బంటుకి తేడా లేదు.

లిఫ్ట్‌ మనిషి అంతస్తుని క్షణంలో చూరుస్తుంది. ఆరో అంతస్తు నుంచి రెండుకీ, గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి ఎనిమిదో ఫ్లోర్‌లోకి క్షణాలలో తీసుకువెళుతుంది, సరిగ్గా తలుపులు మూయకపోతే యూదు భాషలలోనూ కేకలు వేస్తుంది. లిఫ్ట్‌లో రకరకాల అనుభవాలు. కొందరివి చెప్పుకోగలవి, కొందరివి చెప్పుకోలేనివి. ఒక లిప్ట్‌లో * "క్రరిత్యం నిషేధం”, “పొయిట్రీ స్టిక్ట్‌లీ బయాఐనా ప్రాహిబిటెడొ” అని “కవిత్వ్‌ మనా ప్ల 4 చా అని యూడు భాషలలో హెచ్చరిక ఈ రగా చూసినపుడు మాత్రం బాధపడ్డాను. మ. “ఎవరో ఎవరినో హింసించి వుంటారు. టం లేకపోతే ఆ వ్రస్తావనన ఎందుకు | €్రై)ఏ న. వన్తుంది” అనినా మిశ్రుడు ఆ అక! / హెచ్చరికను సమర్ధించాడు. నై

ఆ ఏరియాకి నేను కొత్త. చూ తల | మేనల్లుడు అక్కడ వొక ఐబవుళ అంతస్తుల భవనంలో వొక గూట్లో వుంటాడు. లిష్ట్‌ ఎక్కబోతూ వుండగా వాక కొద్దిపాటి విగ్రహం వున్న మనిషి వాడావిడిగా దాదావు వరుగుతో ౪ వచ్చాడు. అతని వేషం సాధారణంగా తై శ్రీరమణ శ1

వుంది. మెడలో చింతపిక్క రంగు మప్లర్‌ చుట్టుకుని కొంత వేలాడుతోంది. మాటిమాటికీ నడిమి వేలుతో ముక్కుమీదకు జారుతున్న కళ్ళద్దాలను పైకి నెడుతున్నాడు. లిస్ట్‌ (గ్రిల్‌ దోర్‌ను మూశాడు లిస్ట్‌ కుర్రాడు. “సార్‌! సార్‌! హండ్రెడ్‌ ఛేంజ్‌ వుందా” అన్నాడు కొద్దిపాటి మనిషి ఆత్రుతగా. దూరంగా ఆటో ఆగినట్టు, దాసి నుంచి తను దిగినట్టు, ఆటో మీటర్‌ సెటిల్‌ చెయ్యడానికి వంద చిల్లర లేనట్టూ అతని ముఖంలో చూపించాడు. సరే, వంద చిల్లర జేబులు తడుముకున్నారు గాని ఎవరి దగ్గరా లేనట్టుంది. అతనిలో వున్న ఆదుర్దాని ఎంతో కొంత లిఫ్ట్‌లో వున్న వారందరికీ విజయవంతంగా పులమగలిగాడు. “ఇప్పుడు మీకెంత కావాలి” అన్నాను నేను అప్రయత్నంగా. “థర్టీ” అన్నాడు శ్రమ యిస్తున్నాననే భావం ధ్వనించేలాగా. నా జేబులో యిరవై వున్నాయి. పక్కాయనను పది అడిగా. క్షణంలో ధర్జీ పూలప్‌ చేసి యిచ్చా. ఆ కొద్దిపాటి విగ్రహం అంతే వొడుపుగా లిస్ట్‌ గ్రైలలోంచి అందుకుని, చేతి వేళ్లతో ధాంక్స్‌ పలికించి, చెంగున అంగలు వేస్తూ కదిలాడు. లిఫ్ట్‌ పైకి లేచింది. మూడో ఫ్లోర్‌లోకి వెళ్లేసరికి నాకు మెదడులో క్రమంగా తెరలేవడం మొదలైంది. ఆపద్ధర్మంగా పది రూపాయలు యిచ్చినాయన నా చూటకోసం వెయిట్‌ చేస్తున్నాడు. మావాడి ఫ్లాట్‌ నెంబరు చెప్పి, ఆయన నెంబరు తెలుసుకుని యిప్పుడే పంపుతానని చెప్పాక ధన్‌మని గ్రిల్‌ డోర్‌ యూశాడు ఆయన. ఇంకాసేపటికి నేను గమ్యం చేరాను. “ఇంతకీ అతనెవరు, నేనెవరు? ఎక్కడుంటాడు, పేరేంటి?” వివరాలేవీ నాకు తెలియదు. కాని చూస్తే గుర్తు పట్టగలను. అయితే, అతన్ని గాని, అతను పుచ్చుకున్న డబ్బుని కాని మళ్లీ చూస్తానని నాకు నమ్మకం కుదరలేదు. లిస్ట్‌ కుర్రాడిని అడిగాను. “నాకు తెలీదు. మీ బందుగులేమో అనుకున్నాను” అన్నాడు. నేను కిక్కురుమున్లేదు. పైగా “బంధువే అనుకో...” అని గొణిగాను. నన్నెక్షడ తక్కువగా అంచనా వేస్తాడో అని. ఇన్నేళ్ల తర్వాత యిదిగో యిప్పుడు మీకు చెప్పడమే, యింకెక్కడా అన్లేదు. అందుకని అప్పారావ్‌లు తగిలేందుకు లిఫ్ట్‌ అనువైన చోటు. దీనివల్ల మానవ సంబంధాల మూట ఎలా వున్నా వొక గొప్ప అనుభవం సరసమైన వెలకు లభించిందన్న సంతృప్తి మాత్రం మిగిలింది. లిఫ్ట్‌ దాని పుట్టు పూర్వోత్తరాల గురించి మా అగ్రహారం అరుగుల మీద చర్చ సాగుతూ వుంటుంది. “ఒక నిలువు పెట్టెలో నుంచీ పెట్టి, గిలకమీంచి సుతారంగా లాగేశాడోయ్‌” అని వొకాయన వర్ణించి చెప్పాడు. ఏముందీ మన బాల్చీ-బావి-గిలక-లాగానే. అదేం పెద్ద అద్భుతం కాదు. పైగా ఆ జర్మనీ వాడు ప్రపంచ యుద్ధం సందట్లో మన వేదం వొకటి లాగేశాడు. అది యావత్తూ యంత్ర సంబంధం. మహానిజమ్‌ మొత్తం అందులో నిక్షిప్తమై వుంది. “మహానిజమ్‌” కాదండీ మెకానిజమ్‌ అన్నాడొక కుర్రాయ్‌. “అదేలేరా రెండూ వొకటీ అది తేలుగు, యిది హూణం” అన్నాడు గాని వూట మార్చుకున్నాడు కాదు. మార్చుకుంటే మానవ సంబంధాలు యిట్లా ఎందుకు వుంటాయి. పదవిలో మీరు వుండాలంటే మీరు అలంకరించాలని జొట్టుకు చావకపోయారా? అప్పుడే అమెరికా వెళ్లొచ్చినాయన తన లిస్ట్‌ అనుభవాలు సవాలక్ష చెప్పాడు. ఒక భవనంపై అంతస్తుకి వెళ్లడానికి ఆరు గంటలు పట్టిందిట. అందుకే దారిలో తినడానికి పులిహోర, పెరుగన్నం కూడా తీసుకెళ్లాట్ట. మరోచోట ఆఫీసు తాలూకు బిగ్‌ బాస్‌ గారి గది ఏ ఫ్లోర్‌కి వెళ్ళాలంటే ఆ తై లాలా మానవ సంబంధాలు

ఫ్లోర్‌కి వెళ్లి అటాచ్‌ అయిపోతుందిట. ఇది సాధ్యమే కావచ్చు.

మధ్య వయస్కుడు వొకాయన డాక్టర్‌ దగ్గరకు వెళ్లి “లిఫ్ట్‌లో ఎయిడ్స్‌ రావడానికి అవకాశం వుందంటారా” అని భయం భయంగా అడిగాదు డాక్టరు ఎగాదిగా చూసి, తలపంకించి “అవకాశం అయితే వుంది గాని చాలా (మతో కూడిన వ్యవహారం” అని జవాబు యిచ్చాడు. ఎయిడ్స్‌ అంటే జ్ఞాపకం వచ్చింది. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం పధకంలో భాగంగా “పులిరాజూ- మానవ సంబంధాలూ” అని టాపిక్‌ మీద రాయమని కొందరు సూచించారు. అలాంటి సంబంధాల జోలికి వెళ్లనని యనవి చేస్తున్నాను.

మళ్లీ లిఫ్ట్‌లోకి వస్తే- లిఫ్ట్‌ అనేది సాహిత్యంలో, వ్యవసాయంలో కూడా వుంది లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అంటే ఎత్తిపోతల పధకం అందరికీ తెలుసు. సాహిత్యంలో కూడా వ భాషలో ఎక్కడ మంచి అక్షరం, వాక్యం కనిపించినా లిఫ్ట్‌ చేయడం వొక సంస్కృతి. దీన్ని కూడా “లిష్లిటరేచర్‌” అంటారు. “జీవితంలోనూ వుద్యోగంలోనూ ఎన్నడూ లిఫ్ట్‌ కోరలేదు” అని వొక సామాన్యుడి గురించి చెబుతూ అన్నాడు కవి తిలక్‌. కాపీ రచనలను పసికడితే “ఎక్కడ నుంచో ఏతం వేశాడోచ్‌” అంటారు లిఫ్ట్‌ ఎరగని వియర్శకులు.

భీమారం నుంచి వీర్రాజు గారు వచ్చారు. నాలుగో అంతస్తులో వున్న మా ఆఫీసుకి వచ్చారు. రొప్పుతూ రోస్తూ మాట్లాడుతున్నారు. “మెట్లెక్కి వచ్చారా” అన్నాను. బెనని తలూపొడు మాట్లాడలేక, “లిఫ్ట్‌ వుంది కదా, అందులో రావచ్చు కదా అన్నాను.

మో అడు కదతాడో లేదో, ఎందుకొచ్చిన- అని మెట్లెకేశా” అన్నాడాయన. వీర్రాజు గారిది అంతా లాంచీల రేవుల భాష. అక్కడ రిక్షాలు, లాంచీలు, పడవలు కట్టడం కట్టకపోవడం కామన్‌. లిస్ట్‌ అనేది మనతో శారీరకంగానే కాక, భాషాపరంగా కూడా ఎట్లా ముడిపడి వుందో నాకు ఆయన మాటతో అర్ధమైంది. ఇలాగే వొక పల్లెటూరి ఆసామీ పట్నం వెళ్తాడు అక్కడ పెద్దాసుపత్రిలో వొక పెద్దావిడ లిస్ట్‌లో వెళ్లడం, మరికాసేపటికి బీన్స్‌ టీ షర్డ్‌తో సినిమా స్త్‌ లాంటి పిలదిగదం చూశాడు. ఆసామీ నివ్వారపోయాడు. “బామ్మర్దీ! మీ అక్కని కూడా తీసుకురావాలి రా. తెల్లోడి విస అంతా యింతా కాదూ అని ముచ్చటపడ్డాట్టి. వీటన్నిటిలో మానవ సంబంధాలున్నాయి. లిఫ్ట్‌లో కళ్లూ కళ్లూ కలవడం, కట్‌ చేస్తే యుగళగీతం! కొందరు లిఫ్ట్‌ కోసం రోడ్డుకు అడ్డంగా నిలబడి, బొటనవేలు చూపించి పిక్కు తింటూ వుంటా . యిస్త పరోపకారం కావచ్చు లేదా అపకారం జరగొచ్చు. ఎందుకంటే మానవ సంబంధాలు యా మధ్య ప్రమాదకరంగా తయారైనాయి. అందుకే అనుభవజ్ఞులు “లిఫ్ట్‌ అడగకు, లిబ్ర యివ్వా అంటారు. కాని తప్పదు. జీవిత చరమాంకంలో అయినా నలుగురు ల యివ్వక తప్పదు అందుకే లిఫ్ట్‌తో మానవ సంబంధాలు అంత తేలిగ్గా తేగేవి కావు. (౮ ల శ్రీరమణ త్వ

దిర్చూ - రూనీ5్‌ సంశంంధాలూ

ళన ఉప్పు తిని నీకు అన్యాయం చేస్తానా” అనేది చాలా పాప్యులర్‌ సామెత. “వాడి ఉప్పు తిని వాడికే అన్యాయం చేశాడు” అని రోజూ వినిపిస్తూ వుండే సత్యం. అందుకని ఉప్పుతో ముడిపడి బోలెడు మానవ సంబంధాలు వున్నాయి. మరీ పిచ్చి కోపం వస్తే “ఉప్పుపాతర వేస్తా, నా సంగతి సాంతం నీకు తెలియదు” అనడమూ కద్దు. మనిషి జీవనానికి “ఉప్పుతో పదహారు" తప్పని అవసరాలుగా అప్పటి మనిషి గుర్తించాడు. ఇందులో మళ్లీ ఉప్పు ప్రాధాన్యతను మనం గమనించాలి. మనిషి నేల, నింగి, సముద్రం, కొండ, కోన అన్నిటినీ శోధించి తనకు కావల్సినవి నిర్మాహమాటంగా లాగేసుకోవడం అనాది నుంచీ అవలంబిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఉప్పు కషాయాలుగా వున్నాయని తెలిసి, ఉప్పు కూడా వొక రుచే అని గ్రహించాడు. అక్కడ నుంచి సముద్రాన్ని వతంవేసి ఉప్పును పండించడం మొదలుపెట్టాడు. ఇంకా దేనినీ అంటే ఖనిజాన్ని అనరు గాని ఉప్పును మాత్రం పండించడం అంటారు. దీనిని పంటగా భావించారు. మానవ సంబంధాలు చాలా గట్టీవని దీనినిఐట్టే అర్ధం అవుతోంది. “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుంచి...” అన్నాడు సుమతీ శతకకారుదు. “ఏట్రికేతామెత్తి ఎన్ని పుట్లు పండించినా గంజిలా ఉప్పెరుగమన్నా...” అని శ్రమజీవులు గుండెలు పిండేలాగా పాడారు. “ఉప్పు మెప్పు కోరేటోల్లం తప్ప వొప్పు చేసేటోల్లం” అని మనిషి సహజ లక్షణాన్ని చెబుతూ, అందులో ఉప్పు పాత్రని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉప్పు కారం తినేవాళ్లకు రోషం భాషం వుంటుందని వొక నమ్మకం. ఉప్పు లేని పప్పు చప్పగా చస్తుంది అన్న నిజాన్ని “కట్టుకున్న పెళ్లాంలా” అని పొడిగించాడు.

ఏ వంటకంలో ఎంత ఉప్పు వెయ్యాలో నలుడికి తెలుసు భీముడికి తెలుసు. అసలు పాకశాస్త్రం పురుష కళ. క్రమేపీ పురుషుల నుంచి ఆ కమ్మటి కళ చేజారి స్త్రీల హస్తగతం అయింది. అక్కడ నుంచి వారి చేతులు వడ్డించేవి అయినాయి. పైచేయి కూడా అయింది ఆటోమేటిక్‌గా. వంటకాల తయారీ గురించి రాసేటప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చేసరికి “తగినంతగా వొక మాట వాడతారు. అక్కడే వుంది తిరకాసు. మిగిలినవన్నీ కొలతలు, తూకాలు చెప్పి, ఉప్పు విషయంలో తేల్చకుండా తగినంత అనడంలో ఫార్ములా ముడి విప్పకుండా దాటివేయడమే! ఇలాంటి చోట మానవ సంబంధాలు సఫర్‌ అవుతాయి తప్పదు. శ్రీశ్రీ “ఇతరేతర” శబ్దం లాంటిదే ఇక్కడ “తగినంత” అన్నమాట. ఇంతటితో యీ ప్రస్తావన ముగించకపోతే “ఉప్పు పట్రి కాకుండా” నన్ను తిట్టే ప్రమాదం వుంది. ఉప్పు దిగతుడిస్తే జనదిష్టి పోతుందిట.

పూర్వం ఉప్పు కల్లు, కల్గుప్పు అని వ్యవహరించేవారు. కల్లు అంటే రాయి అని అర్ధం. “తిరగలి కల్లు” అంటే తిరిగే రాయి అని అర్ధం. ఈ శబ్ద చర్చని మరీ తిప్పితే మానవ తా మానవ సంబంధాలు

లని (ళా /4 ఫ్‌ గ/// చ హా సంబంధాలు పిండి పిండి అయిపోయే అవకాశం వుంది. రాత్రి పూట “ఉప్పు అనకూడద ట! “క్రిపాలు ఆరిపోతాంస్‌” అని చెప్పేది చమూ నాయనమ్మ. ఆందుకని చవి, రుచి, లవణం, బుట్టలోది అని దీపాలు ఆరకుండా ఛాందసులు జాగ్రత్త ప్రడ్తేవారు. ఉప్పు చేతిలో వెయ్యకు గొడవలు వస్తాయని పెద్దవాళ్లు చెప్పేవారు. అంటే మానవ సంబంధాలు చెడిపోతాయనే. దానివెనుక శాస్త్రీయ లక్ష్యం గురించి 'పీతువాదులు తర్మించుకుని ఏకాభిప్రాయానికి రావాలి. వారి శాస్త్రీయ పరిశోధనలను సామాన్య మూఢులకు అందించి పుణ్యం కట్టుకోవాలి. హేతువాదులు పుణ్యాన్ని, అదృష్టాన్ని నమ్మరు, కాని అనుభవిస్తారు. అసలు కరెంటు దీపాలు వచ్చాక ఉప్పు అన్నా ఉఫ్‌ అన్నా కొందెక్కే అవకాశం లేదని వాళ్లు వాదిస్తారు ఉప్పు మీద బోలేడు సామెతలున్నాయి. చెమట కన్నీళ్లు ఉప్పగా వుంటాయి. శ్రమ, దుఃఖం యీ రెండూ మానవ సంబంధాలకు సంబంధించిన వస్తు సామగ్రిలో ప్రధానమైనవి. “అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు- కలిస్తే ఊరగాయ” అంటుంటారు. దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా యిమిడి వుంది. భార్యాభర్తల సంబంధం వుందనుకోండి. అమ్మాయి అమలాపురంలో పుట్టి పెరుగుతుంది. అబ్బాయి అట్లాంటాలో గ్రీన్‌కార్డ్‌ హోల్డరు. వాళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. జాడీలో పడతారు. యిలాగ వివాహ వ్యవస్థకు ఆపాదించుకోవచ్చు. అలాగే పి.వి. ఆంధ్రాలో పుట్టి, పెరిగి శాంటెక్‌లో నిలిచి గెలిచి ప్రధాని కొవడం వుందనుకోండి. ఇక్కడ పి.వి. వుసిరికాయ. రాంటెక్‌ వోటర్లు ఉప్పురాళ్లు. ప్రధాని పదవి ఊరగాయ- మిగిలిన యీక్షేషన్లు, కొటేషన్లు మీరు పూరించుకోండి. నిజం. ఒక పెళ్ళిలో వియ్యంకుడికి వడ్డించిన వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద గొడవ అయింది. ఆడపెళ్లి వారు క్షమాపణ వెబితే గాని లాభం లేదనీ, పీటల మీద పెళ్లి ఆగిపోతుందనే దాకా వచ్చింది. చివరకు పెద్ద మనుషులు కల్పించుకుని, మళ్లీ యిన్ని వంకాయ ముక్కలు వుడికించి కూరలో కలిపి, ఉప్పు కనతననవ హు వ లా శ్రీరమణ 45

సరిపోయిందనిపించారు. అప్పుడు గాని పెళ్లికొడుకు తండ్రి కుదుట పడలేదు. మన (ప్రాచీన వేదాలు జాగ్రత్తగా చదివినట్లయితే “ఉప్పు”కి వొక అధిష్టాన దేవత వున్నట్లు స్పష్టం అవుతుంది ఆవిడ నివాసం సముద్రం. దేవతలు రాక్షసులు మంధరగిరితో క్షీరసాగరాన్ని మధించినపుడు ఆమెకు కోపం వచ్చింది. అంతటి చరిత్రాత్మక సన్నివేశం తన వద్ద కాకుండా క్షీరసాగరంలో చేశారని ఖిన్నురాలైంది. “నేనే కనుక పతివ్రతని అయితే నా వొక్క కల్లుతో కడివెడు క్షీరము విరిగిపోవు గాక” అని శపించింది. ఆవిడ నిజంగానే పతివ్రత అవడం వల్ల యిప్పటికీ ఆ శాపం అమలులో వుంది. ముఖ్యంగా భారతీయులకు, ఉప్పుతో వున్న సంబంధం యింకెవరికీ వుండదు. దండి సత్యాగ్రహం, అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుమీద తెల్లదొరలు పన్ను వేశారని ఆగ్రహించాం. ప్రస్తుతం అదే ఉప్పు నల్లదొరల పాలనలో పెట్టుబడిదారులకు రహదారి అయింది. కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇప్పుడు ఉప్పు రైతులు లేరు సాల్ట్‌ కింగ్స్‌ తప్ప వీటన్నిటి వెనుక వున్న మానవ సంబంధాలను మీరు గుర్తించాలి. రక్తపోటు వున్న వాళ్లు ఉప్పు తగ్గించాలంటారు. ఏదైనా లోగుట్టు చెబితే ఉప్పు అందించాడంటారు. కొన్ని పేపర్లూ ఉప్పు అందించమని పాఠకులను కోరుతూ వుంటాయి. కొందరు అందిస్తూనే వుంటారు. బయట పడిందంటే మానవ సంబంధాలు బాగా చెడిపోతాయి. బాల్యంలో ఉప్పు అద్దుకుని మామిడి పిందెలు తిన్నాం. పెద్దయ్యాక ఖరీదైన బార్‌కి వెళితే చేతిమీద గంధం రాసినట్టు తడి ఉప్పు రాసి, “యిది తాగుతూ మధ్య మధ్య నాలికతో దానిని రుచి చూడండి” అన్నాడు. ఏమిటిది అంటే “చకిటా” అంటే యిదే అన్నాడు బార్‌వాడు. కస్తూరిబాకి బి.పి. వుంటే వైద్యుడు ఉప్పు వాడద్దని చెప్పాడట. ఆమె మాత్రం మానెయ్యలేక మామూలుగానే తింటోంది. ఆ సంగతి తెలిసి గాంధీజీ వుప్పు మానేశారు. చప్పిడి తినడం మొదలుపెట్టారు. ఆవిడ లబోదిబోమని వెంఠనే ఉప్పుకి స్వస్తి చెప్పిందిట. ఇవన్నీ ఉప్పుతో వూనవ సంబంధాలు కాదూ! విశ్వనాధ సత్యనారాయణవి విచిత్రమైన అలవాట్లు సాయంత్రం నలుగురు మిక్రులనో శిష్యులనో వెంట వేసుకుని కూరల మార్కెట్‌కి వెళ్లడం వొక ఆటవిడుపు. అక్కడ మసాలా దినుసుకి నిలువుగా కోసిన వొక కొబ్బరి ముక్క, రెండు పచ్చి మిరపకాయలు, ఇంటి దగ్గర్నించే గుర్తుగా తెచ్చుకున్న చిటికెడు ఉప్పు నోట్లో వేసి రుబ్బేవారుట. ఆయనకు కొబ్బరి పచ్చడి తిన్నట్లు వుండేది. మరి జిహ్వ అంటే అదీ జిహ్వా! (ఎ డి ౯ ననననననననననననననన..==-మానవ సంబంధాలు

దాది - [కూనీ5 నం(ంధాల౮

భద్రాద్రి అని కొందరు, భద్రాచలం అని కొందరు వ్యవహరింతురు. భద్రాద్రి రాముడన్నా భద్రాచల రాముడన్నా వొక్కటే. అయోధ్య రాముడే గాని యిప్పుడు అయోధ్య రాముడు బిజెపి రాముడు. నిజానికి రామాయణంలో ప్రతి సంఘటనా మానవ సంబంధాల పుట్ట. వాల్ళీకియే పుట్ట కదా! రాముడు లక్ష్మణ సహితుడై దండకారణ్యం ప్రవేశించి, పంచవటి ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకున్నాడు. రామాయణం కొత్త మలుపులు తిరిగింది యిక్కడే. బంగారు లేడి, దానికి ముందు భరతుడు రామపాదుకలు సంగ్రహించుకు వెళ్లడం, సీతాపహరణం యిత్యాది ఘట్టాలు యిక్కడే జరిగాయి. కొండగా వున్న రామభక్తుడు భద్రుడు, శిరసు వంచి ఒక వరం కోరాడు. సీతాలక్ష్మణ సమేతంగా తన వద్ద వుంటే, నెత్తిన పెట్టుకు పూజించుకుంటానన్నాదు. రాముడు భక్తుని మాటను ఆదరించి “త్రధ్రాస్త” అన్నాడు. “భద్రా! యీసారికి యిలా పోనీ, తిరుగు ప్రయాణంలో నీకిచ్చిన మాట మీద నిలబదతాను” అన్నాడు ఇక్ష్వాకుల తిలకుడు.

తర్వాత అనేక కాండల రామాయణం జరిగింది. దశావతారాలలో పరిపూర్ణ మానవుడుగా రూపుదిద్దుకున్నది రామావతారమే! అందుకని రాముడు “మన రాముడు” అనిపిస్తాడు. అదే వరాహావతారంతోనో, నరసింహావతారంతోనో మూనవ సంబంధాలు కలుపుకోలేం. రాముడు అందంగా వుంటాడు. కాకపోతే ఒక చాయ తక్కువ. అయితేనేం? పెద్దల మాట జవదాటడు. గొప్ప వీరుడు. సరే, యిప్పుడు మనం మాట్లాడుకోవల్సింది / య భద్రాచలం గురించి. రాముడు య ఆడిన మాట తప్పడు కాబట్టి, జ్‌ శ భద్రుడు రాముడి వాగ్గానాన్ని | [1 న్‌, | కా 4 స్మరించుకుంటూ సంతృప్తిగా డో ల్తో గా జీవితం వెళ్లదీస్తున్నాడు. ళ్గ జ్జ

తర్వాత రాముడికి అనేక (లీ || సమస్యలు ఎదురు చూడనివి స్‌ త వచ్చాయి. పక్షులు, కోతులు, స. టే . క్ష చివరకు ఉడత కూడాసాయం | క టీ అందించింది. మనుషులకంటె | 2 న((౮) న్న వొక ఆవృతం తక్కువైనా హూం శ్రయమణ 7

కిష్కింధవాసులంతా రాముడికి అండగా నిలిచారు. సీతమ్మ జాడ కనిపెట్టింది వారే. వారధి కట్టారు. దావణాసురుడితో యుద్దానికి తలపడ్డారు. పంచవటిలో హాయిగా, సీతారాములు పచ్చగా కాపురం చేస్తూ వుండగా ససైన్యంగా వొకరోజు భరతుడు వచ్చాడు మొదట లక్ష్మణుడు శంకించాడు. “అన్నా! భరతుడు మనల్ని హతమార్చడానికి వస్తున్నాడు” అన్నాడు. రాముడు దేముడు కాబట్టీ, సర్వ సమర్శడు కాబట్టి కంగారు పడలేదు. తీరా చూస్తే ముగ్గురు తల్లులు, భరతుడు వచ్చారు. భరతుడు అన్న కాళ్లమీద పడ్డాడు. వంగి నమస్కరిస్తూ వుండగా, కళ్లబడిన పాదుకలు భరళునికి “స్ఫూర్తొనిచ్చాయి. “నువ్వు సింహాసనంపై కూచున్నా అడవిలో వున్నా అయోధ్య రాసురాజ్యమే” అని స్పష్టంగా చెప్పాడు భరతుడు. రాముడు (భాతృభక్తికి మురిసిపోయాడు “పాదుకలు యివ్వండి. వాటిని సింహాసనంలో వుంచి గౌరవించుకుంటాను" అన్నాడు. రాముడు పాదుకలు తొలిచి యిచ్చాడు వాటిని శిరసున ధరించి భరతుడు తిరుగు (ప్రయాణానికి సిద్ధమైనాడు. వెళ్లే ముందు వొక్క మాట ప్రమాణపూర్తిగా చెప్పాడు. “రామన్నా! నువ్వు సరిగ్గా పద్నాలుగేళ్లు పూర్తికాగానే అయోధ్యకు రాకపోతే యీ భరతుడు అగ్నిప్రవేశం చేస్తాడు. నీకు ఆఖరిచూపు కూడా దక్కదు" అని 'పతిజ్ఞ చేశాడు. రాముడు చిరునవ్వుతో అభయం యిచ్చాడు. పాదుకలలో మూనవ సంబంధాలు వున్నాయి అయోధ్య చాలా పెద్దరాజ్యం. దశరధుడు మరణించాడు రామలక్ష్మణులు అడవిలో వున్నారు. శతృఘ్నుడు చిన్నవాడు. భరతుడు వొంటరిగా అంతటి స్వామాజ్యాన్ని పాలించి, కాపాడడం చిన్న విషయం కాదు. అందుకని నిరంతరం యిటు ప్రజలలోనూ, అటు యిరుగు పారుగు రాజులలోనూ రాముడు మరుపు రాకుండా వుండడం కోసం రామపాదుకలను సింహాసనంలో వుంచాడు దాముడు అవతారమూర్తి కనుక దేశానికి రాజు కాకుండానే 'ప్రజలలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాయించుకున్నాడు. వైమాయ్యాలో రాముడు రాజారాముడు అయిన తర్వాత 'ప్రజాభీష్టాన్ని గౌరవించిన సంఘటన తని అడవులకు పంపడం. అది కూదా రాముడి గొప్పతనాన్ని చాటిచెప్పింది గాని ప్రజలలో నెగెటీన్‌ రానే లేదు,

పట్ర అరి వ్తే- సీర లక్ష్మణదేఖ దాటడం, లంకేశ్వరుడు అపహరించడం, సీతాన్వేషణ, స జరిగిన సన్నివేశాలు అక్కడ విభీషణుడికి పట్టం కట్టీ సీతని అగ్నిప్రవేశం యించిన రాముడు పుష్పకంలో అయోధ్యకు బయలుదేరాడు. సీతారామ లక్ష్మణులు, నమ్మిన బంటు హనుమంతుడు, యితర కపిశ్రేష్టులు అందులో వున్నారు. తాము యిన్నాళ్లూ తిరిగిన అడవులు, కొండలు, మునివాటికలు అన్నింటినీ ఆకాశమార్గం నుంచి చూసూ పాలీ జ్ఞాపదాలను

  • నకు దక్కడు" అని జరిగిన డు కంగారువర్ధాదు. వసరం శ్రాయోర్యకు ఆకాశంలో గురుత రడ అది కొత్త వారుదా ఏమిటో అని భయపద్దారు. హనుమంళుడు వార భయపడవద్దని చెప్పాలని (ప్రయత్నించాడు. ఆయనని చూసి మరింత భయసద్గారు. పుష్షకం నే 'దగతూ

వుంది అక్కడ దృశ్యం చూసి రాముడు ఆందోళనవ భదత ఎం నకు రెండు ప్రదక్షిణాలు పూర్తి చేశాడు. మూడోది హుర్తబత ్నల మ అ హల తత లాట్‌ అమో లలా మానవ సంబంధాలు

అప్పుడంటే లక్ష్మణస్వామి మూర్చపోతే హనుమంతుడు సంజీవి తెచ్చి, బతికించాడు. ఇప్పుడు మళ్లీ వెళ్లగలడా? రాముడు పెద్ద కేకతో భరతుని ఆపొడు. పుష్పకం దిగి పరుగున వచ్చి తమ్ముని కౌగిలించుకున్నాడు. అక్కడ నుంచి రాముడికి రాచకార్యాలు మొదలైనాయి ఎంతమంది పలకరింపులు వినాలి? ఎందరి ఓదార్పులు? ఎందరి ప్రశంసలు? ఎన్ని సంగతులు? ఈ హడావిడిలో రాముడు తలమునకలై వుండగా “రామభద్రా” అని పిలుపు వినిపించింది. అది భద్రుని పిలుపు అనాడు తిరుగు ప్రయాణంలో వస్తానని మాట యిచ్చాడు “నువ్వు మాట తప్పావు ఇనకుల తిలకా” అని భద్రుడు మారాం చేయడం మొదలుపెట్టాడు మానవ సంబంధాలు యిట్లాగే పెనవేసుకుపోయేది. ఒకవైపు సొంత తమ్ముడు, మరోవైపు ఆథ్రితుడు ఇక క్షణం జాగు చేస్తే మాట దక్కదని రాముడు పరుగెత్తాడు భద్రచాలం వైపు. తన వెంటనే సిరి. అన్నట్లుగా, ఆయన వెంట సీత, వారి వెంట లక్ష్మణుడు నడిచారు భద్రాచలం చేరారు. రాముడు అలిసిపోయాడు. ఆ హడావిడిలో శంఖం పట్టాల్సిన చేత చక్రం, ఆచేత శంఖం ధరించాడు. భద్రుడు ఆయనను యధాతధంగా శిరసున ధరించాడు. సీతామాత డస్సిపోగా, అయ్యవారు ఆమెను చేరదీసి అంకము మీద కూచో పెట్టుకున్నారు. లక్ష్మణుడు తన పద్ధతిలో తను నిలబడ్డాడు. భద్రుడు అనేక రకములుగా స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. తర్వాత పోకల దమ్మక్క చిన్న నీడ కల్పించింది ఇవన్నీ మానవ సంబంధాలే. ఇప్పుడైతే యీ బొమ్మలేవో బావున్నాయని ఏదో దేశానికి బేరం పెడతారు. తర్వాత కాలంలో కంచర్ల గోపన్న అలియాస్‌ రామదాసు భద్రగిరిపై కొలువు తీరిన రాములవారికి ఆలయ శిఖరాలు, ప్రాకారాలు, నగా నట్రా చేయించాడు అదొక పెద్ద కహానీ తానీషా దగ్గర తహసీల్టారుగా వున్న గోపన్న సర్కారు సామ్ముతో మిక్కిలి వుదారంగా రాముడికి వైభవాలన్నీ సమకూర్చాడు. తానీషా నాటి ప్రభువు ఎంతైనా రామదాసు అంత స్వేచ్చ తీసుకోవడం అన్యాయం కదా జైలులో పెట్టాడు. పెడితే, రామదాసు అనేక కీర్తనలతో రాముడికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏమేమి నగలు చేయించిందీ, ఎంతెంత ఖర్చు అయిందీ జమా ఖర్చులతో సహా పాడి వినిపించాడు అప్పుడు రాముడు యీ సూటిపోటి పాటలు వినలేక, వొక రాత్రివేళ తానీషా కలలోకి తమ్ముడితో సహా వెళ్లి, ఆ సొమ్ము చెల్లించి చెర విడిపించాడు పూర్తిగా మానవుడుగా అవతరించిన వాడు కనుక యిలా చేశాడు అదే వేరే అయితే యింకోలాగా జరి గేది ఇలా దేముడికీ మానవుడికీ వున్న సంబంధాల మీద చూట్లాడితే హేతువాదులు అస్సలు వొప్పుకోరు. అక్కన్న మాదన్న మారు వేషాలలో అంటే కిరిటాలు పూసలకోట్లు ధరించి, తానీషాకి దబ్బు చెల్లించి వుంటారని వాదిస్తారు. కానివ్వండి, అందులో అయినా మానవ సంబంధాలు వున్నాయి కదా.

రేపు భద్రాచలంలో రామకల్యాణం అద్భుతంగా జరుగుతుంది పూర్వం తలంబ్రాలకు మంచి ముత్యాలు నైజాం పాలకులు పంపే ఆనవాయితీ వుండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. తెలుగువారి పెళ్లి శుభలేఖలలో, కళ్యాణ రాముని వర్ణించే శ్లోకం ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లని ముత్యాలు కెంపులై, నీలాలై- ఆకాశంలో ఇంద్రధనువై శోఖిల్లిందని వర్జన. అలాంటి నవ వధూవరులైన సీతారాములు మిమ్ములను కాపాడు గాక! నా ననా. శ్రీరమణ గా

భట్లూ - రూనీరి సంబంధాలూ

మన దేశంలో వోటుకి ఆట్టే వయస్సు లేదు. కాని పుట్టీ పుట్టగానే, కమండలంలో చేపపిల్లలా సముద్రం స్థాయికి విస్తరించింది. పవర్‌ఫుల్‌గా తయారైంది. కొన్ని దేశాలలో “ఓట్లు” అనే తృణధాన్యం పండిస్తారు. మనకి మామూలు ఓట్లే గాని ధాన్యం లేదు. ఇప్పుడంటే అందరికీ అంటే పధెనిమిది ఏళ్లు నిండిన వాళ్లకి ఓట్లుగాని ఒకప్పుడు ఓటు వుండడం ఒక అర్హత, ప్రజల కొరకు ప్రజల వలన (ప్రజల చేత వచ్చేదే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్‌ అన్నాడు ఇంగ్లీషులో. ఇక దానిని మన వాళ్లు పట్టుకుని పీకి పాకం పడుతున్నారు. అందులో వున్న చేత, తోడ లాంటి విభక్తులు, ముందున్న (ప్రజలు అంతా మిధ్య. ఆ కొటేషన్లు చూసి ఓట్లలో మూనవ సంబంధాలు బలంగా వున్నాయని (భ్రమిస్తాం గాని ఒక్కోసారి హుళక్కి అనిపిస్తుంది.

కడిమిచెట్టు పన్నెందేళ్లకో పదమూడేళ్లకో ఒకసారి పూస్తుంది. కురుంజి అని కూడా అంటారు దీన్ని మనిషికి అయిదేళ్లకొకసారి ఓటు కాస్తుంది. అప్పుడప్పుడు “ముందస్తు”గా మధ్యంతరంగా కూడా పిందె తొడిగి కాపుకు వస్తుంది. ఆ తరుణంలో మానవ సంబంధాలు పెచ్చరేగిపోతాయి. బంధుత్వాలు గుర్తుకు వస్తాయి. కులాలు గోత్రాలు సరేసరి. ప్రాంతాల చూట చెప్పనే అక్కరలేదు. ఓటు కూడా నీళ్ల చినుకు లాగానే అది పదే చోటును బట్టి ప్రాముఖ్యతను సంతరించుకొంటుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. సముద్రంలో పడితే అడ్రస్‌ వుండదు. ఇసకలో పడితే యింకిపోతుంది. నిప్పులో పడితే యిగిరిపోతుంది. నాలిక మీద పడితే దప్పిక తీర్చి ప్రయోజనకారి అవుతుంది అందుకే “వోటున్న వారికి కోటి దందాలు” అన్నారు. ఒక కొత్త ఎక్కం వుంది.

కొన్ని ఓట్లు కలిస్తే ఒక నాయకుడు.

కొందరు నాయకులు కలిస్తే ఒక (గ్రూపు.

కొన్ని గ్రూపులు కలిస్తే ఒక పార్టీ

కొన్ని పార్టీలు కలిస్తే ఒక (ప్రభుత్వం.

పూర్వం ఒక పార్టీ చాలు ప్రభుత్వపు పగ్గాలు పట్టుకోడానికి. ఇప్పుడు అట్లా లాభం లేదు. ఇక్కడ కూడా అంటే (గ్రూప్‌, పార్టీ స్థాయిలో మూనవ సంబంధాలు సక్రమంగా వుంటే తప్ప గవర్నమెంటుని స్థాపించలేరు. స్టాపించినా ఆట్టే కాలం నిలబెట్టలేరు. అందుకని టీయ్‌ స్పిరిట్‌తో సాధిస్తున్నారు పవర్‌ని. దీనివల్ల మొత్తంమీద మానవ సంబంధాలు వ్యూహాత్మకంగా మెరుగుపడ్డాయి.

ఒక చిన్న సూక్ష్మం వుంది. ప్రజలంతా ఓటర్లు కారు. అలాగే ఓటర్లంతా ప్రజలు కారు. రేప్పొద్దున నూజికి యాఖై అయిదు మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. క్‌0 - మానవ సంబంధాలు

మగ ల్‌ రా డర లా నైక క%గ 1 లగన్నా స్టో లా ఇ శ జక వై // =, ల్‌డొ షీ బే నాడ అందులో ఇరవై ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన వాళ్లు గద్దె ఎక్కుతారు. అంటే యీ ఇరవై ఎనిమిది శాతం మంది ఎన్నుకున్న వారు, నూరు మందినీ శాసిస్తూ పాలిస్తూ వుంటారు. దీనిని మనం డెమోక్రసీ అంటున్నాం మూనవ సంబంధాల నిష్పత్తి యిలా వుంది. ఇంకో ఓపెన్‌ సీక్రెట్స్‌ ఇందులో పదిశాతం వోట్లు ఓటర్ల ప్రమేయం లేకుండానే పోల్‌ అవుతాయి అదెలా సాధ్యం అంటే సాధ్యమే. మన దేశంలో మేధావులు వోటు హక్కుని వినియోగించుకోరు. కాని ప్రజాస్వామ్యం మీద సుదీర్హ ప్రసంగాలు చేస్తారు. కొందరు పుస్తకాలు కూడా రాస్తారు. మునుపు చేతులు ఎత్తి తమ ఆమోదాన్ని ప్రకటించే వారు. పబ్లిగ్గా యిష్టాయిష్టాలను

బయటపెడితే మానవ సంబంధాలు చెడిపోతున్నాయని సీక్రెట్‌ బ్యాలెట్‌కి శ్రీకారం చుట్టారు. అప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కో పెట్టి వుండేది. మన ఓటు చీటీ ఎందులో వేస్తే ఆ ఓటు ఆ పార్టీకి వెళ్తుంది. తర్వాత యిదంతా దేనికని పెట్టిని దేముడి హుండీలా వొకటే చేసి, బ్యాలెట్‌ పత్రం మీద ముద్రవేసి అందులో వేయడం వచ్చింది. ఇప్పుడు నూతన సహస్రాబ్దిలో మీట నొక్కితే చాలు. ఫినిష్‌ ఇంకా కొన్నాళ్లకు మనతో ప్రమేయం వుండదు. పోలింగ్‌ బూక్‌కి వెళ్లగానే (ట్రెయిన్‌ డిటెక్టర్‌ తలమీద టోవీలా పెడతారు. మీ మెదడులో ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారి ఖాతాలో ఆ వోటు జమ పడుకుంది. కొందరు ఇప్పుడు మాత్రం రాజకీయమంటే టోవీ కాదా అంటారు గాని అది పూర్తి టెక్నికల్‌ టోపీ! దీనివల్ల మానవ సంబంధాల స్థాయి పెరుగుతుంది ఓట్లకి సంబంధించి బోలెడు పారిభాషిక పదాలు వాడుకలోకి వచ్చాయి ఓటు సాహిత్యాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓటు బ్యాంక్‌ అంటారు పతి ఓటు, సింపతీ ఓటు అని అంటుంటారు. “చీల్చడం” అనే మాట ఓట్లకి వాడతారు, వెదురుకి వాడతారు. అంటే మనుషులను చీల్చ్బడం కాదు, ఒక (గ్రూప్‌ని చీల్చడం అని అర్ధం చేసుకోవాలి. ఐన్‌స్టెయిన్‌ ధియరీ ఆఫ్‌ రిలెటివిటీ వుంది వీటిలో. అంటే చుట్టరికం కాదు. సాపేక్ష సిద్ధాంతం పని చేస్తుంది. పార్లమెంటు సీటుకి ఓటు విలువ అంతగ్గా సజదదలొమ్‌ప్లాఆ క్షొరచెం నయం. శ్రీరమణ న్‌్‌? జు వెన్న

డ్‌ ॥| ళ్‌ చ ర్‌]

= (2 ,

మండల్‌కి, కార్పొరేటర్లకి మరింత నయం. పంచాయతీ స్థాయిలో మంచి ధర పలుకుతుంది. అది కూడా సందర్భం కలిసి రావాలి. ఒకసారి మా వూళ్లో ఒక వార్డు మెంబర్‌ ఓటుని ఎకరాకు కొనడం నాకు తెలుసు. అంటే అది డిసైడింగ్‌ వోటు పైగా ప్రిస్టేజి పాయింటు. మరొక సందర్భంలో మెంబర్‌కి తన కూతురునిచ్చి పెళ్లి చేసేశాడు (పైసిడెంటు అయిపోవడానికి. అందుకని ఓటుతో మూనవ సంబంధాలు పూర్తిగా పెనవేసుకు వున్నాయి. “మనోడు” అనే ఫ్యాక్టరు ఓటు మీద పని చేసినట్టు మరెక్కడా పని చెయ్యదు. అడవిలో అయినా, వూళ్లో అయినా రెండే వర్గాలు వుంటాయి. పాలించేవారు, పాభింపబదే వారు. అడవిలో కుందేళ్లకి, ఉడతలకి, ఆవులకి కూడా ఓట్లు వుంటాయి. కాని చచ్చినట్లు అవన్నీ (ప్రజాస్వామ్య పద్ధతిలో సింహాన్నే తమ నాయకుడుగా ఎన్నుకుంటాయి. ఇక్కడ ఒక సంగతీ మనం గమనించాలి ఎప్పుడూ సింహమూ, పులి యివేనా అని ఏ లేడినో దుప్పినో అడవికి రాజును చేస్తే వమవుతుంది అంతా అరాచకం అయిపోతుంది. భయం భక్తీ నశిస్తాయి. ప్రతివాడు “పోరా బచ్చా” అనేస్తారు అందుకని కొంచెం జూలు, గాంభీర్యం, దుర్మార్గమైన పేరు వున్న వాళ్లు పవర్‌లో వుంటేనే బెటరు. ఒక గంగిగోవు సింహాన్ని ఏమని మందలించగలదు ఏ శిక్ష చేయగలదు? ఈమధ్య డబ్బున్న వాళ్లు రాజకీయాలలోకి వస్తున్నారని వొక వదంతి ప్రచారంలోకి వచ్చింది ఆమధ్య పంచాయతీ ఎన్నికలలో ఒక (బ్రోకరు ద్వారా వంద ఓట్లు కొన్నాడు అభ్యర్ధి. తీరా డబ్బులిచ్చేటప్పుడు అయిదు ఓట్లు ట్రీగా వేయించాలన్నాడు. అభ్యర్థి మామిడిపళ్ల వ్యాపారం చేస్తాడు. అదేమన్నా అంటే వందకి చెయ్యి మేం వెయ్యడం లేదా అని లాజిక్‌కి దిగాడు ఆఖరికి ఓట్ల పరిస్థితి అలా తయారైందని బాధపడ్డా, ఆయన చెప్పిందాంట్లో పాయింటు వుంది. తర్వాత ప్రజాసేవ ప్రస్తావన వస్తే “మీకు నాకు ఏమి మొహమాటం మిగిలింది డబ్బు తీసుకుని ఓటు వేశారు. దానికీ దానికీ చెల్లు. ఇంకా నేను సేవ చేసే కొచ్చనే లేదొన్నాదు. ప్రజలు అనగా ఓటర్లు మాట్లాడక వూరుకున్నారు. ఇలా కొన్ని సందర్భాలలో మూనవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఎన్నికల తరుణం వచ్చే సరికి నాయకులు ఏవేవో ఎరలు చూపి గాలం వేస్తారు. ఈమధ్య చేపలు ఎరని మింగేసి వెళ్లిపోతున్నాయి. ఎర లేనిదే మనిషి జీవితమే లేదు. మొక్కుల పేరిట దేవుడికే ఎర వేస్తాం, యిక మనిషి వొక లెక్కా పువ్వులు సీతాకోక చిలకల కోసం రంగుల వల, పానకం ఎర వేయడం లేదా? ఆదే లేకపోతే సృష్టి ఆగిపోతుంది. పిట్టలకి పళ్లు ఎరవేసి చెట్లు వ్యాప్తి చెందడం లేదా? ఇలా చెప్పుకుంటూ పోజతే చేట భారతం అవుతుంది. మా వూళ్లో వీర నాయుడు ఎన్నికలలో గెలిచి హైదరాబాద్‌ వెళ్లాడు వెళ్లేటప్పుడు స్టేషన్‌లో దింపినందుకు రిక్షాకి రెండు రూపాయలు యిచ్చాడు. తర్వాత వస్తున్నపుడు అదే రిక్షా, అదే దూరం కదా అని అంతే యిచ్చాడు. రిక్షా మనిషి అయిదు రూపాయలు యివ్వాలని పట్టుపట్టాడు. “వెళ్లేటప్పుడు నువ్వే కదా వచ్చావ్‌, రెంద్రూపాయలిచ్చా” అన్నాడు నాయుడు. “నిజమే సామీ! కాని మీరెళ్తొచ్చిన యీ అయిదేళ్లలో రేట్లు ఎంతగా పెరిగాయో తమరు యోచన చెయ్యండి” అన్నాడు రిక్షా కార్మికుడు [] కచ నా డా మానవ సంబంధాలు

ల తాన్‌ - కూనసీల్‌ నం1ంధాలు కళ అప్పు చేయని వారు జీవితంలో వానకి తడవని వారు వుండరు” అని సామెత. “దున్నపోతు మీద వాన కురిసినట్టే' అంటారు కాని నిజానికి అది మనిషికి సంబంధించినదే. ఎంత చెప్పినా వినని వాళ్లని, ఎంత తిట్టినా ఖాతరు చెయ్యని వాళ్ళని పై సామెతతో పోలుస్తారు. దున్నపోతు వానని పట్టించుకోదు. “దరిద్రుడి పెళ్లికి వదగళ్లవాన” అంటారు. వాన శుభకార్యాలను కొంచెం కంగాళీ చేస్తుంది. అందుకే అంటారు “ఆ నాలుగు అక్షింతలూ వడితే-బిత్తడి లేకుండా” అని. అసలు చూనవ సంబంధాలలోకి వెళ్లడానికి ముందు వాన గురించి ఒక మూట | | ( / | | 1 |; | ఇ (1 | (1౫ శ్రీరమణ 53

మాట్లాడుకోవాలి. (ప్రాణాధారమైన నీళ్లు ఆకాశంలోంచి బిందువులుగా రాలిపడడం ఎంత చిత్రం? నిలువుగా, వాలుగా ఎడాపెడా కురిసే వానని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే ఒక పెద్దాయన అన్నాదు- “పై లోకంలో వుందే ఇంద్రుడికి లేదు యీ వాన వైభవం. అది మనిషికే పరిమితం” అన్నాడు. వాన చినుకు పడితే సమస్త భూతలం పులకించిపోతుంది. చెట్టుపుట్ట పిట్ట గట్టు ఒకటేమిటి అన్నీ. బాల్యంలో వాన వల్లప్పలు ఆడతాం. అమ్మ వద్దంటున్నా వానలో తడిసి దెబ్బలు తింటాం. చూరు నీళ్లు పడే కాలవలలో జాగ్రత్తగా ఇంటి అరుగుమీంచి కాగితం పడవలు వదులుతాం. అవి ప్రవాహంలో వెళ్లిపోతుంటే గర్వపడతాం. చూరులో వొదిగిపోయిన పావురాలు వానని, మనల్ని చిక్కుచిక్కునుని చూస్తుంటాయి.

ఒకాయన రోడ్డున వెళ్తుంటే ఉరుమూ కబురూ లేకుండా వాన మొదలైంది. పక్కన గొప్పింటివాళ్ల ఆరుగుమీద తలదాచుకున్నాడు. పైన తల తడవకుండా అరుగుకి 'షేడు వుంది. కాసేపటికి వాన తగ్గింది. సాంతం తగ్గిందో లేదోనని చెయ్యి రోడ్డువైపుకి జాపి చూశాడాయన. దారినపోతున్న ఓ పుణ్యశాలి చేతిలో పది పైసలు వేసి చక్కా వెళ్తాడు- పూర్తిగా అపార్ధం చేసుకుని. పది పైసలు చేతపద్దాయన కొంచెం షాక్‌ తిన్నా నిబ్బరించుకుని యిదేదో బానే వుందనుకున్నాడు. మరి జాపిన చేతిని ముడవలేదు. సాయంత్రానికి గుప్పెట రెండుసార్లు నిండింది. అలాగే అక్కదే సెటిలైనాడు. చివరకు కొంత కాలానికి ఆయాచితంగా తనకొక దారి చూపించిన ఆ యింటిని సరసమైన ధరకు అతను కొనుక్కోగలిగాడు. ఆ సందర్భంగా పత్రికలవారికి యిచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్లాష్‌బ్యాక్‌ వివరిస్తూ పై సంఘటన వివరించాడు. వానలో మానవ సంబంధాలు లేవని ఎట్లా అనగలం?

వాన జడిగా పడుతూ వుంటుంది. రోడ్డుమీద రంగు రంగుల గొడుగులు కదులుతూ వుంటాయి. వాటిమీద చినుకులు పడే శబ్దాలు లయాత్మకంగా. ఒక్కొక్క గొడుగులో జంటలు వెళ్తుంటాయి. ముఖాలు కనిపించవు గాని పాదాలు కనిపిస్తాయి. బురద చుక్కలతో డిజైను మార్చుకున్న చీరకుచ్చెళ్లు, తడిసిన ప్యాంటు సహజీవనం చేస్తూ సాగిపోతుంటాయి. ఈమధ్య నాలుగు కాళ్లూ జీన్సే ధరించి వెళ్లడం కనిపిస్తోంది. ఇది మరీ ముచ్చట. చిటపట చినుకులలో, జంటగా, జనం మధ్యలో గొడుగు చాటున వెళ్లడం ఒక గొప్ప అనుభవం. ఎవరి సందట్లో వాళ్లుంటారు. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటారు గాని, దాని వాళ్లు దానికి వుంటూనే వుంటారు. ఏ చెట్టు కిందో తాపీగా నిలబడి కాస్తంత ఈర్య్యగా చూసే కళ్లూ వుండనే వుంటాయి. గొడుగులో మూనవ సంబంధాలు గొడుగులోవైతే, చూసే వారి వుత్మంర చూసే వారిది. అందమైన ఆడపిల్ల కుచ్చెళ్లు కొద్దిగా పైకి పట్టుకుని అలాఅలా మునివేళ్ల మీద వాన నీళ్లలో, చినుకుల మధ్య నుదురు అదోలాపెట్టి నడిచి వెళ్లడం చాలా గొప్పగా వుంటుందంటాడు రసికత లెరిగిన వాడు.

ఒక స్టార్‌ హోటల్‌లో దిగాడు ముంబై వచ్చిన అరబ్‌ షేక్‌. వున్నట్టుండి మేఘాలు నడిచి వచ్చి దబాటు వాన అందుకుంది. పుట్టి బుద్ధెరిగాక ఎడారి జీవితం తప్ప వేరేమీ ఎరగని షేక్‌ ఒక్కసారి అంత వానని చూసేసరికి ఆనందం పట్టలేకపోయాడు. నల్లగౌనుతో నాట్యం చేశాడు. గెంతులు వేశాడు. తనివి తీరలేదు. గదికి అవైపు బిగించిన నిలువెత్తు అద్దం వుంటే దానిని రా మానవ సంబంధాలు

పగలగొట్టాడు. వాన గదిలోకి వచ్చి పడుతుంటే పిచ్చికలా తడిశాడు. ఈ హడావిడి అంతా చూసి హోటల్‌ మేనేజరు పరుగున వచ్చాడు. అంత పెద్ద ఏకాండి అద్దం తునాతునకలైపోయింది. గది నిండా నీళ్లు. షేక్‌ వంక చూశాడు మేనేజరు ప్రశ్నార్ధకంగా. అతను మేనేజరు బాడీ లాంగ్వేజిని అర్ధం చేసుకున్నాడు. వెంటనే బ్రీఫ్‌కేసు తీసి అందులోంచి ఆయిదొందల నోట్ల కట్టలు రెందు చేతులూ మేనేజరు ముఖాన కొట్టాడు. మేనేజరు భద్రంగా నీళ్లలో పదకుండా పట్టుకున్నాడు. షుక్రియా అన్నట్టు సైగ చేసి నాలుగడుగులు వేసి మళ్లీ వెనక్కు వచ్చాడు మేనేజరు. మళ్లీ ఏమిటన్నట్లు చూశాడు అరబ్‌ షేక్‌. “తమరు అనుగ్రహిస్తే పై అంతస్తులో మరో అద్దం వుంది” అన్నాడు మేనేజరు. పూరబ్‌ అయినా పశ్చియ్‌ అయినా అరబ్‌ అయినా మానవ సంబంధాలు డబ్బు కట్టలతో యిట్లాగే వుంటాయి. ఇదంతా వానవల్ల కదా వచ్చింది. మబ్బులు రాగానే నెమళ్లు పింఛాలు విప్పి ఆడతాయి. గల్ఫ్‌ దేశాలలో నెమళ్లు వుండవు. వున్నా అదే ఛాన్సు రాదు. కాని యిటీవల కృత్రిమంగా మబ్బులు తెప్పించి నెమళ్లను ఆడిస్తున్నారట. అనక విందు చేసుకుంటున్నారట! నెమళ్లదేముంది గాని వానంటే కవులు రెచ్చిపోతారు. వానమీద ఎంత సాహిత్యం కురిసింది? కాళిదాసు మేఘ సందేశం చూట అట్లా వుంచండి. వర్షరుతువు వర్ణన చేయని కవి ఎవడున్నాడు? విశ్వనాధ తెలుగు రుతువులను విడగొట్టి లఘు కావ్యం రాశారు. శ్రీత్రీ, తిలక్‌ అందరూ తమ కళ్లతో వానని చూసి తమ మాటల్లో వర్ణించిన వాళ్లే. కుందుర్తి “నగరంలో వాన” చాలా ఫేమస్‌. అప్పటిదాకా రకరకాల పక్షి రెట్టలతో చికాకు పడుతున్న ప్రముఖుల విగ్రహాలు వాన రాకతో తేలికపడతాయి. ఇక సినిచూ వాళ్లకి వర్షానికి వున్న అవినాభావ సంబంధం అంతా యింతా కాదు. నాయికా నాయకులకు యుగళగీతం, అందులో వాన- కళ్లకి విందు, ఎందుకంటే అసలే చాలీచాలని దుస్తులతో వున్న నాయిక యీ వానదెబ్బతో మరింత పారదర్భకం అవుతుంది. (ప్రేక్షకులు అప్పటిదాకా వూహించుకుంటూ వుంటారు. వాన తదుపుతో (ప్రేక్షకుల చూపు మెరుగు అవుతుంది. ఆ పిదప నేశ్రానందము! తర్వాత వాళ్లు తడిదుస్తులు విండుకోవడం, నె వేసుకుని ఆ సెగలో- యిక్కడ నుంచి సెన్సార్‌. శ్రీరమణ ర్‌5్‌

చ్రీచ్చీకాయీి - రూనీవ సంశంంధాలు పుచ్చకాయ తర్వాత చూట. అసలు పుచ్చపువ్వుతోనే మానవ సంబంధాలు మొదలవుతాయి. లేకపోతే పండు వెన్నెలని “పుచ్చపున్వులాంటి వెన్నెల” అని అనుకుంటామా? చూసిన వాళ్లూ చూడని వాళ్లూ కూడా యీ పోలిక వాడేస్తూ వుంటారు. అవతలి వాళ్లు అర్ధం చేసేసుకుంటూ వుంటారు. మనిషి “తలకాయ” కాయ ఎలా కాదో అట్లాగే పుచ్చకాయ కూడా కాయ కాదు, పండు. పైకి పచ్చగా వుండి, కత్తివేస్తే పచ్చిమాంసం లాంటి కండ కనిపిస్తుంది పుచ్చపాదు మనలాగే చొరవగా విస్తరిస్తుంది. కాస్త చోటు దొరికితే చిడ్తవత్తుగా అల్లుకుపోతుంది. కాపు కూడా అంతే. వెర్రికాపు కాస్తుంది మన దేశంలో మనుషులు కూడా అంతే కదా వద్దన్నా కాసేస్తూ వుంటారు. అందుకే పుచ్చకాయ-మానవ సంబంధాలూ అన్నది. కేసు ఓడిపోయాడు. గట్టి పాయింట్లు వున్నాయి కదా అట్లా ఎందుకు జరిగిందన్నాను.

ఓడిపోయినాయన “పాయింట్లు వున్నాయి. మనకు దొరికిన ప్లీడరు తల పుచ్చకాయంత వుంది. మరి లోపల అంతా నీళ్లే కాని గుజ్జు లేదు, మన ఖర్మ అన్నాడు. “అప్పీలులో అయినా కొంచెం గుజ్జున్న వాడిని చూసుకోవాలి” అనుకుంటూ వెళ్ళిపోయాడు. వేసం కాలం పుచ్చకాయలకి మంచి సీజను. బండి నిండా పుచ్చకాయలు అమర్చుకు వెళ్తున్నతన్ని అడిగాను “గిరాకీ వుందా” అని. వుంది గాని జనం తెలివిమీరి పోయారండీ ఒక పుచ్చకాయ కొని యింకో కాయ కొసరు యిమ్మంటున్నారు. అవతల మన అపోజిషనోడు రెండు కొంటీ ఒకటి థ్రీ అని రేటు దింపేసి కూచున్నాడు. మరి నువ్వు కూడా దింసకూడదా అంటే “గిట్టదండీ. అడు మనల్ని దెబ్బతియ్యాలని ట్రిక్కులేస్తున్నాడు. మనవేం తక్కువ తిన్నామా? ఆళ్లచేత యీళ్లదేత కొనిపించేసి, వాడు బండి ఖాళీ చేసుకున్నాక, నాలూపాయలు పెంచి అమ్ముతున్నాం” అన్నాడు. దొల్లు పుచ్చకాయలలో కూడా ఎంత వ్యాపార మర్శం వుందో చూడండి. విరగకాసిన పుచ్చపాదులలో ఆకు అకుకీ కాయ వుంటుంది. వుచ్చతోటని చూస్తే కాయలు చారలు చారలుగొ ఆకుల మధ్య దొర్లుతూ వుంటాయి. అమెరికాలో వెయ్యి ఎకరాలు ఏకాండిగా వేసేసి, భయంకరమైన సైజులో పుచ్చకాయలు కాయిస్తారు. వాటర్‌ మెలన్‌ అని వాళ్లంటారు పుచ్చకాయ అని మనం అంటాం. ఈమధ్య ప్యాకింగ్‌కి సుఖంగా వుంటుందని పుచ్చకాయ నలుచదరంగా కోణాలు తేలి వుండేట్టు కాయిస్తున్నారు. అదేస్రైజు అట్టపెట్టెలో పెట్టేస్తారు. ఏమిటో అంతా మాయ! ఏదైనా పుచ్చకాయ వుండే తీరుగా వృంటేనే అందం. మామిడి పండుకి ఒక చిత్రమైన ఆకారం వుంది చూడగానే నోరూరుతుంది. దాన్ని ఏదో మ్యాజిక్‌ చేసి నలుచదరంగా దిమ్మెలా కాయిస్తే మూమిడి పండుతో మానవుడికి వున్న సంబంధాలు చెడిపోతాయి ననన

తూ (౮౮ టృ అ వ్‌ టం. అతల. రాష క డో

ఆకారం చూట వదిలేద్దాం, రుచుల్లో ఎటూ తేడా వుండదు పుచ్చకాయలు ఒక లక్ష తెప్పించి, వాటిని తొనలుగా కోసి ఆ ఎరుపు మెరుపులో సినిమా పాట చిత్రీకరిస్తుంటారు మన తెలుగు వాళ్లు. మానవ సంబంధాలు, వాటిలో వున్న కీలకమైన పట్లు మన తెలుగువాళ్లకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇంతచేసి పుచ్చకాయ దేవుడి నైవేద్యానికి పనికిరాదు. ఎందుకో తెలియదు అంటే దాన్ని కోసుకోవాలి. తినాలి పైగా ఒక్కడూ తినడం కష్టం, ఎంత దేముడైనా.

పుచ్చకాయ ఏదో నీళ్లమూటలా కనిపిస్తుంది గాని దానికి బోలెడు చరిత్ర వుంది కళా పూర్గోదయం లాంటి ప్రబంధంలో దీని ప్రసక్తి వుందంటే దాని స్థాయిని గమనించండి “ఒజ్ఞల

ం టీ పుచ్చకాయ” అని నానుడి. అంటే గురువుగారి పుచ్చకాయ అని, దీని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే బోలెడంత కధ చెప్పాలి. మరి చూనన సంబంధాలకి ముడి వెయ్యాలంటే చెప్పక తప్పదు కళా పూర్జోదయంలో పింగళి సూరన్న పురవర్ణన చేస్తూ తన పనితనం యావత్తూ అందులో చొప్పించాడు ఆ వర్దనలో కవి చమత్కారంగా ఒకచోట సాక్షాత్తూ దేముడే పూర్తిగా నిషిద్ధమైన దివాసంభోగంలో మునిగి తేలుతున్నట్లు వర్షించి, అయినా దానిని మనం విమర్శించకూడదు. అట్లాగని దేముణ్జి మనం అనుసరించకూడదు- అని స్పష్టం చేశాడు పింగళి సూరన్న ఇక్ళడే “ఒజ్ఞల పుచ్చకాయ” అని దేవుడు పనిని పోల్చాడు.

వివరాల్లోకి వస్తే- యిపస్పుడేమో గాని కొంతకాలం క్రితం రాయలసీమ ప్రాంతంలో కనన క. శ్రీరమణ వ్‌

శాకాహారులకు పుచ్చకాయ పూర్తిగా నిషిద్ధ వస్తువు. వుల్లిపాయ కంటె ఒక వీసం ఎక్కువ. దానికి కారణం ఏమి చెబుతారంటే పుచ్చజాతి మన గడ్డమీద పుట్టింది కాదని, ఖురాసాని దేశాన్నుంచి దిగుమతి అయిందనీ అందువల్ల (శ్రోత్రీయులు దినిని ముట్టరాదనీ వచ్చింది. కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో ఒక పద్యంలో “ఖురాసాని పుచ్చలు వోదున్ని. ” అని పుచ్చకాయ చరిత్ర వివరించాడు. మొత్తంమీద పుచ్చకాయకి దాదాపు మాంసం స్టేటస్‌ వుండేది కాని (శ్రోత్రీయుడికైనా జిహ్వ లాగుతుంది కదా. అదేమి పీడో గాని నిషేధించిన వాటి మీదే మనసు ఎక్కువ పీకుతుంది ఒక గురువు గారు గుట్టుచప్పుడుగా ఒక పుచ్చకాయను తెచ్చుకుని, గోప్యంగా తినాలనుకుని దాచిపెట్టమన్నారు. ఆ సంగత్తి శిష్యులు పసికట్టారు. దానిని బయటకు తీసి పబ్లిక్‌లో పెట్టారు. అప్పుడు సీనియర్‌ శిష్యులు, పెద్దలు కుర్ర శిష్యులను మందలించారు- “తప్పు. మీరు చేసింది తప్పు. అది ఒజ్జల పుచ్చకాయ. అది నిషిద్ధ వస్తువే అయినా స్వయంగా గురువులే కోరి తెచ్చుకున్నందున దానిని గౌరవించాలి. కాపాడాలి. ఆక్షేపించకూడదు. అధిక ప్రసంగాలు కూడదు. అట్లాగని వారితో పాటు మనం తినకూడదు” అని బుద్ధి చెప్పారు. అక్కడ నుంచి “ఒజ్ఞల పుచ్చకాయ” అనే వూట నానుడిలాగా మిగిలింది కాని యీ ఏడు అక్షరాలలో అంతరార్థంగా ఎంత కథ వుందో గమనించాలి. కొందరికి కొన్ని వర్తించవు. అందుకని మనం జనరలైజ్‌ చేసుకుని ఆవిధంగా ముందుకు వెళ్ల కూడదు. సున్నితమైన మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నిజానికి దేముడు గురించి మరొక్క మాట గాని అంటే పింగళి సూరన్న పిక్చర్‌లో వుంటాడా? శంకరాచార్యుల వారు సీసం తాగారంటే ఆయనకు చెల్లిపోయింది. అది చూసి శిష్యులు కూదా తాగితే గురువుగారి నొసట బూడిద అయిపోదురు. అందుకని గొప్పగొప్ప వాళ్లు చేసేవి వంక గాంగపైద్‌లో వెళ్లినా, రెండుమూడు కాపరాలు నడిపినా, టాక్సులు ఎగ్గొట్టినొ ఇనోకుంది. మనకు చెల్లదు. అదే మరి ఒజ్జల పుచ్చకాయంటే! నక కత లా మానవ సంబంధాలు

స్వతంత్రం - కూన సం౧ంధాలు “స్వాళంత్ర్యం నా జన్మహక్కు” అని నినాదనం యిచ్చాడు బాల గంగాధర తిలక్‌. మనం స్వాతంత్ర్యం అంటే దొరల పాలన, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఆగష్టు 15, 1947లో దేశానికి స్వాతంత్ర్యం రావడం యివే జ్ఞప్తికి వస్తాయి. చూకు చిన్నప్పుడు మేష్టారు డిక్టేషను చెప్పేటప్పుడు రెండు పదాలు తప్పకుండా వుండేవి. అందులో ఒకటి విష్వక్సేనుడు, రెండోది స్వాతంత్ర్యము. పిలకాయలు స్వాతంత్ర్యంలో 'యావళ్తు వదిలేసి తప్పులో కాలేసేవారు. తప్పులు ఎంత ఎక్కువ మంది రాస్తే మేష్టారికి అంత ఆనందం. “రాయ్‌. రాస్మెల్‌ రాయ్‌... వందసార్లు ఇంపోజిషన్‌ రాయ్‌” అని అదేశించేవారు. చచ్చినట్టు యావత్తుతో సహా ఆ మూట వందసార్లూ రాయాల్సిందే. "మా క్లాస్‌మేటు సీతాపతి ఒకసారి తొంబై రెండుసార్లే రాశాడు. మేష్టారికి అనుమూనం వచ్చి లెక్కపెట్టారు. ఎనిమిది తక్కువ! ఏరా! అసలు లెక్కపెట్టనని కదూ నీ భరోసా, నేను యుగంధర్‌ని హ్హహ్హ్హ అని నవ్వారు మేష్టారు. “నేను లెక్కలో క కొంచెం పూర్‌ అండీ” అన్నాడు సీతాపతి ధూర్త లక్షణపు వినయాన్ని ౧) ప్రదర్శిస్తూ. తెలుగు మేష్టారు మళ్లీ క్‌ వికటాట్టహాసం చేసి “ఒరేయ్‌ తెలుగు సప మేష్టారికి లెక్కలు రావని మీ వుద్దేశం. 4 (క్రై ఐ కెన్‌ నో తెలుగు, మేధమాటిక్స్‌ ర్వ) ఆలొసో బట్‌ ఇంగ్లీష్‌” అంటూ 1 చింతబెత్తం రుళివించారు. ఆ ౮ న్‌ క్షణంలో ఆయన కురుక్షేత్ర మహా | 00 సంగ్రామంలో చెర్నాకోల చేతబట్టి, అర్జనుడి రధం తోలుతున్న పార్థసారద్గీలా వీల్‌ అయ్యారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్యన గల పవూనవ నంబందాలు యూ సంఘటనలో వున్నాయి కనుక కొంచెం ల | వివరంగా చెప్పాల్సి వచ్చింది. (0 శ్రీరమణ ననా

ఏదో అనుకోవడమే గాని స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అని, ఏడ్చి ఎవడికీ అది పూర్తిగా వుండదు. నా వరకూ నేను మూ యింట్లో అనేక సంగతులు మూట్లాదాలనుకుంటా కాని స్వాతంత్ర్యం ఎక్కడిది. వెలిగించిన అగ్గిపుల్లలు నల్లటి కొసలతో నేలమీద కనిపిస్తే నాకు మహా ఎలర్జీ. తలుపు మీద తువ్వాళ్లు, లంగాలు, లుంగీలు ఆరేస్తే మహాచిరాకు. కోడిగుద్దు పెంకులు సింకులో కనిపిస్తే తట్టుకోలేను. గోడ గడియారం బ్యాటరీ అయిపోయి తప్పుడు లెక్కతో గంటలు కొడుతుంటే సహించలేను. ఎప్పుడైనా నూటికి కోటికి ధైర్యం కూడతీసుకుని నోరు చేసుకుంటే- “బ్యాటరీ అయిపోతే ఎవరికైనా లెక్కలు తప్పుతాయ్‌. ఎల్లకాలం ఠాంగ్‌ రాంగ్‌న టంచన్‌గా కొడతాయా” అని వంట గుహలోంచి కొన్నేళ్లుగా పరిచయమైన కంఠం ప్రతిధ్వనిస్తుంది. . లేనిపోనిది అనవసరంగా తేనె తుట్టెని కదిలించామని పశ్చాత్తాపంతో పేపరులో తలపెట్టి చదివిన వార్తలే మళ్లీ చదవాల్సి వస్తుంది. ప్రతిధ్వనికి మళ్లీ ప్రతిధ్వనిస్తే మానవ సంబంధాలకు టాపు లేచిపోతుంది.

గాంధీ మహాత్ముడు దేశంలో ఎంత వస్త్రం తయారవుతుందో కొలిచి, దేశ జనాభాని లెక్కించి, భాగించి తన వంతుగా ఎంత వస్త్రం వస్తుందో దానిని మూత్రమే ధరించే వారని పెద్దలెవరో చెప్పగా విన్నాను. ఎండావానా చలీ అన్నిటినీ ఆ కొల్లాయిని ధరించి భరించాడాయన. అందుకే మహాత్ముడు. ఆయన ఇంట్లో జీన్స్‌ ప్యాంట్లు, స్వెట్టర్లు వేసుకుని బయటకు వచ్చేప్పుడు కొల్లాయి తొడుక్కోడం కాదు. ఎప్పుడూ అదే ఆయన డైస్‌ కోడ్‌ ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే యిదో రకం జనాకర్షణ పధకం అంటున్నారు. ఆమాటకొస్తే రమణ మహర్షి మరీ పొదుపరి కదా. మరి ఆపాదమస్తకం ఏకాండిగా ఒకే నిలువుచాక్కా ధరించేవారు జాతీయ సంపదను వృధా చేయడం లేదా? మరందుకే స్వాతంత్ర్యం అనుకుంటాం గాని నిజానికి వుండదండీ, గాంధీకి, తాతాకి, బిర్లాకి, బిల్‌ గేట్స్‌కి, సద్దాం హుస్సేన్‌కి, బిన్‌ లాదెన్‌కీ ఎవ్వరికీ వుండదు. ఆఖరికి గద్దర్‌కి కూడా వుండదు. స్వాతంత్ర్యం మానవ సంబంధాలు అనేది చాలా జటిలమైన అంశం. ఇలా ఒంటి చేత్తో బాలొపెన్‌తో దీన్ని మధించాలనుకోవడం దుస్సాహసం. అయినా తప్పదు. ఒప్పుకున్నాక కాదనే స్వాతంత్ర్యం ఎక్కడిది.

మళ్లీ ఒకసారి బ్రిటిష్‌ పాలన రోజుల్లోకి వెళితే- మా వూళ్లో సింగడని ఒక ఎణుకలబ్బాయి వుండే వాడు ఆరోజుల్లో, నిలువుకి నిలువెత్తు మనిషి. కిరాతార్జునీయంలో శివుడల్లే వుందేవాదు. జైలు తాళాలు పగలగొట్టి ఆరుగురు ఖైదీలను విడిపించాడని సింగడి మీద కేసు నమోదు అయింది. తెల్ల పోలీసు ఆఫీసరు నలుగురు నల్ల పోలీసులను వెంటపెట్టుకు వచ్చాడు. ఆచూకీ తెలిసింది. సింగడు తన గుడిసె ముందు నులక మంచం మీద పడుకుని చుట్ట కాలుస్తున్నాడు. లారీతో మంచం మీద కొట్టాడు ఆఫీసరు. నువ్వేనా ఫలానా అన్నాడు అధికార స్వరంతో. “చిత్తం దొరా” అన్నాడు సింగడు. “నేరం ఒప్పుకుంటున్నావా” అన్నాడు ఆఫీసరు. “నేరం అనకండి బాబయా. చేసింది నేనే అన్నాడు. “యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌” అన్నాడు ఆఫీసరు. సింగడు సిగ్గుపడుతూ “ఎందుకులేండి బాబూ అన్నాదు. మళ్లీ అదే అరిచాడు దొర. తర్వాత మన స్థానిక కనీస్టీబేళ్లు తెలుగులో చెప్పారు. సింగడు నవ్వుతూ, మీసాలు దువ్వుకుంటూ “మళ్లీ మనువాదతావా” అని అదుగుతున్నారనుకున్నాను అన్నాడు దాంతోతెల్లదొర మరింత రెచ్చిపోయి 60 మానవ సంబంధాలు

అదే ముక్క అరిచాడు. అప్పుడు సింగడు ఒక్కసారి తుళ్లిపడి “నాకిప్పుడు సెంకెల్లేసి ఎత్తుకుపోతే ఎట్టాగండీ” అన్నాడు దీనంగా. “ఏమవుతుంది” అన్నారు పోలీసులు. బ్రిటిష్‌ దార బుసలు కొదుతున్నాడు. “సింగి నిన్ననే నీలాడిందండీ, నేను ఇంగువ మింగానండీ, ఎట్లా రాగలనండీ” అన్నాడు. దొరకి అర్ధంకాలేదు. “అతని వైఫ్‌కి దెలివరీ అయింది. ఇంగువ దిస్‌మాన్‌ స్వాలోడ్‌...” అంటూ ఆయనకు బోధచేశారు. “ఈజిట్‌ డేంజరస్‌” అన్నాడు దొర. వెరీవెరీ అన్నాడు సింగడు.

“లెటజ్‌ గో. రేపు వద్దాం” అని బలగంతో సహా వెనుతిరిగాడు అధికారి. అప్పటినించి “సింగి నీలాడితే సింగడు ఇంగువ మింగినట్టు” అనేది సామెతగా మిగిలిపోయింది. దీని నేపథ్యం స్వాతంత్ర్య పోరాటం. నిజానికి భార్యాభర్తల మధ్య యిలాంటి అనుబంధం వుంటే ఎంత

బాగుండుననిపిస్తుంది. ఆవిడ కనలేకపోతే ఆయనకు సిజేరియన్‌ చేయడం, ఆయన ఆఫీసుకు

వెళ్ళలేకపోతే ఆవిడ వెళ్లడం, ఆవిడను పిప్పిపన్ను బాధిస్తుంటే ఆయనకు బదిలీచేసే అవకాశం

వుండడం వుంటే మూనవ సంబంధాలు మరింత మెరుగుపడతాయి.

“న స్రీ స్వాతంత్ర్యమర్హతి అని సంస్కృతంలో అన్నాడు తన సృతిలో మనువు. దాంతో నాటి నించి నేటిదాకా మనువు జనం నోళ్లలో మిగిలిపోయాడు. కాళిదాసుకి, పొట్లర్‌కి, కొలంబస్‌కి లేని పాప్యులారిటీ మనువుకి వుంది. మానవ సంబంధాలు యిలాంటిచోటే ప్రస్ఫుటం అవుతాయి. భాస్వరం లాంటి మాట అనేసరికి మనువు బాగా పేలాడు. పైగా థ్రీ స్వాతంత్ర్యం మీద నెగెటివ్‌ ధింకింగ్‌! స్వాతంత్ర్యం మానవ సంబంధాలూ మీద మాట్లాడేటప్పుడు అద్వైతవాదుల చూట అట్లా వుంచి, జిడ్డు కృష్ణమూర్తి థియోసఫీ గుర్తొస్తుంది. ఆయన స్వేచ్చా చింతన చేశాడు. “క్రీ థింకర్‌” అన్నారు ఇంగ్లీషులో. స్వతంత్రంగా బతుకు, బతకనివ్వు, స్వతంత్రంగా ఆలోచించు, అనేది ఆయన మూలసూత్రం. ఇవన్నీ నేను చెప్పానని ఆచరణకు దిగద్దు. స్వతంత్రంగా ఆలోచించుకో అని కొసమెరుపుతో కన్‌ఫ్యూజ్‌ చేస్తాడు.

నేను ఎప్పుడైనా సెలవు రోజు చలం లేచిపోయిన కధలు చదువుకుందామని దీక్షగా నీరెండలో కూచుంటానా? సరిగ్గా అప్పుడే యిన్ని ఎండు మిరపకాయలో, ఆవాలో తెచ్చి ఎండలో ఆరబెట్టి “కాస్త చూస్తుండండి... కాకులు రాకుండా” అని. ఆవిడ పురమాయించి వెళ్లిపోతుంది. నాకు అగ్గెత్తుకు వస్తుంది. పురుషుడై పుట్టిన వాడికి ఆమాత్రం సెలవ రోజున చలం కథలు ఏకాగ్రతతో చదువుకునే ్రీడం లేదా? లేదు. అందుకే స్వాతంత్ర్యం యావత్తూ వొట్టి మిథ్య. లంగరు వేసినా పదవ నీళ్లలో వున్నంత వరకూ దానికి అలల తాకిడి తప్పదు. రైలు ట్రాక్‌ మీద వున్నంత వరకు దానికి స్వేచ్చ లేదు. పట్టాలు వదిలిపోలేదు. మనమూ, మానవ సంబంధాలు కూడా అంతే. స్వాతంత్ర్యం అనేది మిధ్య. అందులో మానవ సంబంధాలు మరీ మిథ్య. క్‌ న్‌ా

గురుక్చూ - రూనీ5 నంశంధాలు

గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర... అంటే గురువును మించిన దైవం లేదని తెలుగులో దీని భావం. ఇంతకీ గురువు అంటే ఎవరు? ఎఖుకపరిచినవాడు గురువు. అప్పుడప్పుడు భార్య భర్తకి గురువు అవచ్చు. అప్పుడప్పుడేమిటి దాదాపు యిది నిత్యం. స్లాట్‌ కొనడం దగ్గర నుంచి బనీను కొనే దాకా “ఆవిడ” గురుపీరంలో వుంటుంది. మార్గదర్శక సూత్రాలను ఆవిడే నిర్ణయించి, తు.చ. తప్పక అమలు చేస్తుంది. ఇటు పిల్లలకు, అటు భర్తకు, 'ఆయనిను కన్న తల్లిదండ్రులకు, అందరికీ సందర్భం వచ్చినా, రాకపోయినా, డేట్స్‌ వున్నా లేకున్నా ఆమె క్లాసు తీసుకుంటుంది. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతినవా అంటే తినవు. బైండింగ్‌ ఫోర్స్‌ చచ్చినట్టు కట్టిపడేస్తుంది.

గురుశబ్దం రానురాను అపభ్రంశం అయిపోతోందని పెద్దలు వాపోతుంటారు. ముక్కూ మొహం తెలియని వాడొకడు “ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది గురూ” అని అడుగుతాడు. ఇంకోడు “గురూ! టైమెంతైంది” అంటాడు. రైతు బజారులో ఒకాయనని పనిమాలా పిలిచి “వంకాయలు కిలో అయిదే తీసుకో గురూ బావున్నాయ్‌” అని. మరొకాయన సలహా యిచ్చాడు. బార్‌లో “ఇంకో స్మాల్‌ విత్‌ సోడా గురూ అనే ముక్క సాధారణంగా వినిపించేదే. గుళ్లో కూడా “అష్టోత్తరం నా పేరు మీద లాగించు గురూ” లాంటి మూటలు వినిపిస్తే మనస్సు చురుక్కుమనిపిస్తుంది. ఆటోవాలాని వస్తావా గురూ అంటే రాను గురూ అంటాడు. టీవిలో యాంకర్‌ పిల్ల యీలవేసి “కొత్త సినిమా గురూ” అంటే ప్రేక్షక గురువులకు వొళ్లు పులకరిస్తుంది. చివరకు “గురు” శబ్దం యిలా అయిపోయింది గురూ అని మిత్రుడు గురుమూర్తి బాధపడ్డాడు. వెనకటికి జార్జి చక్రవర్తి ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చదివే స్కూలుకి వస్తానని, యువరాజు తరగతిలో వుండగా చూసి ఆనందించాలని వుందని బడికి కబురంపాడట. వెంటనే ఆ స్కూలు హెద్మాస్టరు “మహాప్రభో తమరు రావద్దూ” అని తిరిగి కబురు చేశారట. “ఏమి, ఎందుకు” అన్నాడు చక్రవర్తి. ప్రభువుల వారు వస్తే నేను నా తలపాగా తీయడం మర్యాద. కనుక తీసితీరాలి. నేను టర్బన్‌ తియ్యడం ఇస్కూలు పిలకాయలంతా చూస్తారు. ఇప్పటిదాకా నేనో మహానుభావుణ్ఞని వాళ్లు భావిస్తున్నారు. నా ఆజ్జకు తిరుగులేదని భావించి, నా అదుపు ఆజ్ఞలలో వుంటున్నారు. ఇప్పుడు వాళ్లకి నాకంటె పైన మీలాంటి మరొకరున్నారని తెలుస్తుంది. దానివల్ల నాకు చిన్నతనం సంక్రమిస్తుంది వారి మనసుల్లో. ఆ తర్వాత నన్ను మునుపటిలాగా వాళ్ళు ఖాతరు చెయ్యకపోవచ్చు. తర్వాత ఏలిన వారి చిత్తం...” అని క్లాసు పీకాడు గురువుగారు. జార్జి ప్రభువు ఆ గురువుకి శిష్యుడై “టీచర్‌! యు ఆర్‌ రైట్‌” అనడమే కాకుండా ఆ స్కూలు వైపుకి 2 మానవ సంబంధాలు

వెళ్లలేదుట. అది ఆనాటి గురు స్థానం. ఇప్పుడైతే “ఎవడ్రా 7 అక్కడ పంతులు చెప్పింది వినక పోతే వనిష్‌మెంట్‌ సెంటర్‌కి (చ కొడతా. చచ్చినట్లు రోజూ బడికి // వెళ్లి, పిల్లలు లేని తరగతికి ళ్‌ పారాలు చెప్పాల్సి వస్తుంది” అని షా 'హెచ్చెరుకలు జారీ అవుతాయి. కీన్‌, / అప్పుడు గురువంటే గురువే, ఆ చవూన సంబంధాలు వేరు. ఇప్పుడు గురువును మించిన లఘువు డో మరొకటి లేదు. (ఎ గ్‌

వశిష్టుల వారు కోసల య గురువు. దశరధుడికి గురువు, స (04 గ పురోహితుడు అంటే పురానికి / శే శీ న్‌ యా పొతము కోరేవాడు. రాజు 19 త్‌ో టా జే అయినా స్ప, గురువు గీసిన గీత దాటకూడదు. యుద్ధాలకు, | *€1 వట్టాభిషేకాలకు శుబి డే ముహూర్తాలు వారే నిర్ణయించేవారు. ఆదుర్దాలో రాముడి పట్టాభిషేక ముహూర్తం దశరథు ఖాయం చేశాడు. అది చివరకు ఆయన చావుకు ముహూర్తం అయింది. దశరధరాజు సంతానానికి కూడా వశిష్ణుడే గురువు. విద్యలు నేర్చించాడు. మంచీ చెడూ చెప్పాడు. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయాక వశిష్టుల వారి ఆశ్రమం తలుపు చప్పుడు అయిందిట. లోపల్నించి ఆయన “ఎవరూ. .” అని కేక వేశారట. తలుపు తట్టిన రాముడు “నేనే” అన్నాడట. మళ్లీ ఆయన లోపల్నించి “నేనంటే. .” అన్నారట. “అది తెలుసుకోడానికే వచ్చాను గురువరా” అన్నాడట రాముడు. “నేనూ అన్న ముక్కను పొరలు వాలుచుకుంటూ వెళితే బ్రహ్మతత్వం యావత్తూ బయటపడుతుంది. (బ్రహ్మపదార్థమూ గోచరిస్తుంది. తర్వాత బ్రహ్మర్షి ఆశ్రమం తలుపులీసి, రాముని సాదరంగా జింక చర్మంపై కూచోపెట్టి, వాళ్ల వంశ మూల పురుషుడైన సూర్యుడు స్పష్టంగా కనిపించేదాకా క్లాసు స్వీకరించి వుంటారని వేరే చెప్పకృళ్లేదు. చివరకు రాముడు నేను, నేను నేనైన నేను, నేను గాని నేను అని తనలో తాను గొణుక్కుంటూ వెళ్లి వుంటారు, అందుకే గురువులతో పనిమాలా కౌన్సిలింగ్‌కి దిగకూడదు. పధ్నాలుగేళ్లు వనవాసం చేస్తే గాని గురువు చెప్పిన నేను థియరీ సొంతం దిగలేదు రాముడికి గురువులలో ప్రసిద్ధ గురువులు వున్నారు. చాణక్యుడిది చరిత్రలో పెద్దపేరు. అరిస్టాటిల్‌ది అగ్రస్థానం. అలెగ్జాందర్‌ని విశ్వ విజేతని చేశాడు. బోలెడు వేదాంతం చెప్పాడు. పేరుకి మం్రేగాని కృష్ణదేవరాయలుకి తిమ్మరుసు శ్రీరమణ 6

గురువే. కొందరు మేధావులు ఆమధ్య నిజ నిర్ధారణ చేశారు. అదేమిటంటే రాయలవారిని కవిత్వం వైపు మళ్లించి, అప్పాజీ డిఫాక్టో రాజుగా పరిపాలన సాగించాడని. పొయిట్రీలో వాళ్లు తెలియని నిషా వున్న మాట నిజం. అష్టదిగ్గజాలు, దానికితోడు రాజు స్వయంగా కవి. ఇక చెప్పేదేముంది? ఇప్పట్లోలాగా సాగునీరు తాగునీరు సమస్యలు లేవు. హాయిగా మంటపంలో తివాచీలు బాలీసుల మీద కూచుని సమస్యాపూరణాలూ, ఆశు కవిత్వాలూ అస్వాదిస్తూ, కవనపు ధారలో మునిగి తేలుతూ వుండేవారు. అప్పుడప్పుడు రాజుగారు వల్లకీ మోయడం, మదగజేంద్రముడిగ్గి కవిగారికి చేయూతనిచ్చి అంబారీలో చోటివ్వడం లాంటి చమత్మార్యాలు చేస్తుండేవారు. వాటిని కధలు కథలుగా జనం చెప్పుకునేవారు. ఇవన్నీ పాత సంగతులు. అప్పుడు గురువులు వేరు. ఇప్పటికి వస్తే- ఇప్పుడు గురువులు లేరు. ఇప్పుడున్నది గురుశిష్య సంబంధం కాదు. ఈ విద్యా వ్యాపార శకంలో విద్యార్థి కస్టమర్‌. టీచర్స్‌కి విద్యార్థులు దేముళ్లతో సమానం. డబ్బులిచ్చి పోషించే మహారాజ పోషకులు. వాళ్లు బోలెడు బోలెడు డబ్బుపోసి చదువుకౌంటున్నారు. ఒక్క స్టూడెంటు బయటకెళ్లి “ఫలానా కోచింగ్‌ సెంటర్‌ ఫలానా సబ్లెక్ట్‌ బాగా చెప్పరు” అన్నాడా కలెక్షన్లు గోవింద! పూర్వం గురుకులాల్లో గురువులు అన్నంపెట్టి చదువులు చెప్పేవారు. అయితే ఆమేరకు శిష్యులు చాలా చాకిరీ చేసేవారు. కట్టెలు శేవడం, ధాన్యం దంచడం, ఆవుల్ని మేపుకు రావడం, గురువుగారి కొల్లాయి వుతికి ఆరేయడం లాంటి పనులన్నీ భక్తిభావంతో చేసేవారు.

ఈ గురు సాంప్రదాయం ఒక్కొక్క విద్యలో ఒకలాగా వుంటుంది. ఆధ్యాత్మిక రంగంలో గురుశిష్య సంబంధం ఒకలాగా వుంటుంది. సంగీతంలో మరోలా వుంటుంది. ఫలానా గురుపరంపర అని గర్వంగా చెప్పుకుని మరీ గళం ఎత్తుతారు. ఫలానా వారి స్కూల్‌ అంటాం కదా! ఇక రాజకీయాలకు వస్తే ప్రతి నాయకుడి వెనకా ఒక గురువు వుండి తీరతాడు. రాజకీయాలలో ఒక మాట ప్రచారంలో వుంది. గురువుకి నామం పెట్టినవాడే నాయకుడు కాగలడని. పాపం పుణ్యం మనకు తెలియదు. పెట్టిన వారికి, ఆ అలంకారం అందుకున్న వారికీ తెలియాలి. రాజకీయ రంగంలో మాత్రం యిలాంటివి జరిగినపుడు మానవ సంబంధాలు అస్తవ్యస్తం అవుతాయి. కొత్త పార్టీలు వెలుస్తాయి. రాజకీయంగా పరస్పరం సమాధి చేసుకున్న సందర్భాలు వున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా (ప్రస్తుతం వ్యాపారకళగా చూరడమే కాక్క గ్లోబలైజేషన్‌ దినుసుగా కూడా మారుతోంది. ఈ పరిస్థితులలో ఆధ్యాత్మిక గురువులు, వారి శిష్యుల మధ్య తరచు విభేదాలు తలెత్తుతున్నాయి. ఆ విభేదాలు తత్వానికి సంబంధించినవి కావు. పరానికి చెందినవి కావు పూర్తిగా ఇహానికి చెందినవి. శిష్యులలో వర్గభేదాలు రావడం దానితో మానవ సంబంధాలు గీతలు పడడం సర్వసాధారణం అయిపోయింది. గురువుల్లో స్థాయి భేదాలు వున్నాయి. శ్రీకృష్ణుణ్జి జగద్గురువు అంటారు. శంకరాచార్యుల వారిని కూడా అంటారు. ఈమధ్య మంచి అదును చూసి తమకి తామే యీ బిరుదు తగిలించుకుంటున్నారు. ఇక్కడ ఆపకుండా మరీ సమగ్రంగా గురువిధి విధానాల మీద రాసుకుంటూ పోతే... నాక్కూడా జగద్గురువు పేరు ముందు తగిలించుకోవాలనిపిస్తుందని భయంగా వుంది. (ఎ 64 మానవ సంబంధాలు

ల త్త ఉనరా - కూవీరి నంబంధాలు

పండగలు దేవుళ్ల కధలతో ముడిపడి వుంటాయి గాని నిజానికి వాటితో మానవ సంబంధాలే ఎక్కున. దసరా వుందంటే ఆయుధ పూజలు, నవరాత్రులు జరుపుతారు. కాని యిది అమ్మవార్ల పండగ కాదు, ఆయ్యవార్ల పండగ. మా చిన్నప్పుడు తలంటి పోసుకుని కొత్త దుస్తులు ధరించి అయ్య వారింటికి వెళ్లేవాళ్లం. అసలు అంతకు ఒక నెల ముందు నుంచీ మేష్టారు బడిలో సాయంత్రం పూట దసరా పాటలు, పద్యాలు మా నోటికి పట్టించేవారు. “ధర సింహాసన, నభంగు గొడుగై, తద్దేవతత్‌ భృత్యులై... శ్రీగంగ సత్‌పుత్రియై... నీ ఘన రాజసంబు వర్ధిల్లు నారాయణా!” అని వుండేది. అక్కడక్కడ నట్లునట్లుగా జ్ఞాపకం వుంది దాని తర్వాత “పెల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు, అయ్యవారికి చాలు అయిదు వరహాలు” అని పిల్లల చేత బృందగానం (ప్రాక్టీస్‌ చేయించేవారు. మగపిల్లలు విల్లమ్ములు, ఆడపిల్లలు హనుమంతుడి బొమ్మలు పట్టుకుని, అయ్యవారు బెత్తంతో సహా ముందు నడవగా ఊళ్లోకి బయలుదేరేవాళ్లు. ఎవరింటికి ముందు వెళ్లాలి అనేదానికి ఒక ఆనువాయితీ వుండేది. ఆ ఫలానా వాళ్లింటికే ముందు వెళ్లాలి. వాళ్ల

(/

షా ్రో / య శ లోట హక స

శ్రీతమణ న ళ5

వసారాలో పిల్లలంతా చేరి దసరా పాటలు, పద్యాలు హోరెత్తించేవారు. ఇప్పటి పిల్లలకి అప్పటి విల్లమ్ములు ఎట్లా వుండేవో తెలియవు. బాణం, దానికి రంగు కాగితాల అలంకరణ వుండేది. వంగిన బాణం బద్దకు ఒక రంధ్రం వుండేది. బాణాన్ని వంచి కట్టిన తాడు, తాడుతో గురిపెట్టాల్సిన బాణం పుల్ల వుండేవి. చివర చిన్న కాగితం గరాటు వుండేది. అందులో గులాము, పూలు దట్టించి, ఎక్కుపెట్టి కొడితే... ఆ రంగుల పూలు పిల్లల మీద పడి వాళ్ల రూపురేఖలు మూర్ప్చేసేవి. అప్పుడు ఆడపిల్లలు కోతి బొమ్మల్ని ఆడించి, వెక్కిరించి ఆనందించేవారు. తమ పిల్లలు బడిలో చదువుతున్నా చదువుకోకపోయినా అయ్యవారు అందరి యిళ్లకు వెళ్లేవారు. రాకపోతే ఆ యింటి వారికి కోపం వచ్చేది. మరమరాలు, శెనగపప్పు, అందులో బెల్లం కలిపి పిల్లలకు దోసిళ్లతో పెట్టేవారు. అయ్యవారికి తాంబూలం పళ్లు అందులో రూపాయలు పెట్టి, యిచ్చి దణ్ఞం పెట్టేవారు. అప్పుడు మళ్లీ పిల్లలు దశావతారాల పాట పాడి, దీవెనలు యిచ్చేవారు. “బాలకుల దీవెనలు (్రహ్మదీవెనలు” యిందులోదే! పీల్లలు పెరిగి పెద్దవారైనా, పిల్లలు లేకపోయినా యీ పిల్లల వేడుక ఆయా లోగిళ్లకు దసరా వేడుకలను తీసుకువచ్చేది. కొందరు మేష్టారిని నూతన వస్త్రాలతో సన్మ్నానించేవారు. అప్పట్లో అయ్యవారికి యిదే (గ్రాసం. ప్రభుత్వ గ్రాంట్లు, కార్పొరేట్‌ స్కూళ్లు లేని రోజులవి. బతకలేక బడిపంతులని అరుగుల మీద వీధి బడులు నడుపుకునే రోజులు. అయ్యవారిని అందరూ “ఏమండీ” అని గౌరవంగా పిలిచే రోజులు. మానవ సంబంధాలు గట్టిగా ముడిపడి, అయ్యవారంటే పిలకాయలకే కాదు ఊరంళతటికీ అయ్యవారే అనుకొనే కాలం అది. క్రమేపీ ఆ సంబంధాలు సడలిపోయాయి. ఇప్పుడు పిల్లలు కష్టమర్స్‌లాగా కనిపిస్తున్నారు. అయ్యవారు సరుకు సరఫరా చేసే అమ్మకందారుడైతే, స్కూలు యాజమాన్యాలు దళాకిలుగా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా మానవ సంబంధాలు వున్నాయి కాని పూర్తి రూపాయల భాషలో. ఆనాడు అయిదు వరహాలంటే యిరవై రూపాయలు. వరహా అంటే నాలుగు రూపాయలు. ఇరవై అంటే అయ్యవారికి ఒక విద్యా సంవత్సరానికి చదువు చెప్పినందుకు యిచ్చే పారితోషికం. ఇది కూడా నిర్బంధం కాదు. పాటలో ప్రాస కోసం అన్నమాటే. కొందరు ఒక్క వరహాయే యిచ్చేవారు. అలాగని ఆ యింటి పిల్లాడికి తక్కువ చదువు చెప్పేవారు కాదు. ఏమీ యివ్వలేని వాళ్లుండేవారు. మేష్టారి దృష్టిలో అంతా సమానమే. పిల్లల చదువులే కాదు మొత్తం వారి జీవితాలకు హామీపడేవారు అయ్యవారు. ఆనాటి మానవ సంబంధాలు అలాంటివి. దసరా పండుగలో మరో వేడుక ఉత్సవాలు, ఊరేగింపులు, పులివేషాలు! (ప్రతి వూళ్ళోనూ పులివేషం కట్టే మొనగాడు వుందేవాడు. “పులిరాజాకి ఎయిడ్స్‌ వస్తుందా” అన్నది యిప్పటి స్లోగన్‌ కాని అప్పుడు యివన్నీ లేవు. అన్నీ సత్సంబంధాలే! శంకరమంచి సత్యం అమరావతి కథలలో “ఏడాదికోరోజు పులొ అని అద్భుతమైన పీస్‌ రాశారు. అందులో అన్నీ మాస్టర్‌ పీస్‌లే! అమరావతిలో నబీసాయెబు పులివేషం అమోఘంగా కడతాడు. డప్పులు, ఈలలు, చప్పట్లు... వూరంతా దద్దరిల్లిపోతుంది. పెద్దలు పన్లాదిలి వీధిలోకి వస్తే, పిల్లలు భయపడి భోషాణాల కింద దాక్ళునేవారు. భార్య అమీనాబీని చూస్తే నదీ సాయెబుకి మా చెడ్డ వొణుకు. పులివేషం వేయగా వచ్చిన చిల్లరంతా అమీనావీ దోసెట్లో పోయాల్సిందే. “దొద్గోకెళ్లి కిరసనాయిలు 66 మానవ సంబంధాలు

పెట్టి వాళ్లు కడుక్కో” అని ఆదేశించేది బూబమ్మ. అతను దసరా కోసం ఏదాది పొడుగునా ఎదురు చూసేవాడు. జనం కూదా పులివేషం కోసం ఎదురు చూసేవారు. దసరా అయిపోయేది. అతను గంజితాగి, కుక్కి మంచంలో పడుకుని దసరా కోసం కలలు కంటుండేవాదు. నవీ సాయెబు వయసుడిగి పోయింది. దసరా వచ్చింది. డప్పుల చప్పుడికి మంచంలోంచే వూగుతున్నాడు. మంచంలోనే పులైపోతున్నాడు. కళ్ల వెంట ధారలుగా కన్నీళ్లు. అమీనాబీకి దుఃఖం వచ్చింది. అతన్ని ఓదార్చింది. నబీసాయెబు ఆమె కన్నీళ్లు తుడుస్తూ “ఇంత సుకమైన మాటలు యెనకనుంటే జల్మంతా పులై పోయేవాడ్ని గదే” అన్నాడు. మానవ సంబంధాలకు పరాకాష్ట యీ సన్నివేశం.

మా వూళ్లో మంచి పులి వేషగాడు వుండేవాడు. యాక్షన్‌ కింగ్‌ అనే వారందరూ. చాలా సన్మానాలు జరిగాయి అతనికి. ఊళ్లో కొందరు శాలువాలు స్పాట్‌లోనే కప్పారు. అతను పులి వేషంలోనే వినయంగా నమస్కరించి, మళ్లీ ఆటకి దిగేవాడు. కాని, అతనెప్పుడూ ఓ చిరిగిన గొంగళి కప్పుకు తిరుగుతుండే వాడు. ఒకాయన అడిగాడు “నీకు అన్ని శాలువాలు కప్పారు కదా, అవన్నీ ఏమైనాయ్‌” అని. అందుకా పులిధారి అదంతా ఓ కధ అని చెప్పాడు. పొరుగూళ్లో తిరునాళ్లలో ఆడుతుండగా, వున్నట్టుండి ఒక రాయి వచ్చి మీద పడింది. కోపం వచ్చింది పిచ్చి కోపం. కాని నేనప్పుడు పులిని కదా. తత్తరపడి చూడకూడదు. రాయి మీద పడితే పులి ఎట్లా వీరంగం వేస్తుందో అట్లాగే వేశా. కాళ్ల గజ్జెలు అదిరినాయి. డప్పులవాళ్లు బెదిరినారు. ఆవేశం, కావేశం, రోషం అన్నీ వచ్చాయి. నా వొళ్లు నాకు తెలియదు. రెచ్చిపోయినా. ఆవేశం తగ్గింది. ఆట ముగిసింది. అందరూ చప్పట్లు కొట్టారు. జనంలోంచి ఒక గొధెల తొపరి తోసుకుంటూ రింగులోకి వచ్చాడు. బుజం మీదున్న కంబళి నా మీద కప్పాడు. నొ నా తాకాడు. నా బుజాలు నిమిరాడు. “నన్నాగ్గెయ్‌... రాయి వేసింది నేనే, పులి మీద రాయి పడి ఎట్టా ఎగురుద్దో, నువ్వింత పేరు మోసినోడివి ఎట్లా చేస్తావో చూద్దామనుకున్నా. పులి తల్లోంచి వూడిపడ్డావ్‌... నా సామిరంగా అదిరిపోయింది” అన్నాడు. అన్ని సన్మానాల కంటె యిది ఘనమైందిగా అనిపించింది నాకు. నాలోని కళాకారుణ్ణి పరీక్ష చేసి మరీ చేసిన సన్మానం. చిరుగుల గొంగళీయే కావచ్చు. ఇందులో అసలైన మెచ్చుకోలు వుంది. అని వివరించాడు మా వూరి పులిధారి. వీటన్నిటి వెనకాల వున్నవి మానవ సంబంధాలే. చాలా సున్నితమైన అంశాలే మనిషిలో వున్న కళాకారుణ్ణి కదిలిస్తాయి ఒకప్పుడు “దసరా మామూళ్ళు” ఒక పెద్ద సబ్జెక్టు. కాని యిప్పుడు ఆ సంబంధాలు తెగిపోయాయి. క్‌ శ్రీరమణ 57

చలికాలం - రూన5 నంణంధాలు

వేసవి కాలం మనుషుల్ని దూరం చేస్తుంది. వానాకాలం నీరుకారుస్తుంది. కాని చలికాలం మనుషుల్ని దగ్గర చేస్తుంది. అంతమాత్రం చేత చలి ప్రాంతాలలో, చలి దేశాలలో మానవ సంబంధాలు మెరుగ్గా వుంటాయని చెప్పలేం. ఎప్పుడూ చలిగా వుండే వాళ్లకి వేడికి అద్ధం తెలియదు. అరేబియా నివాసులకు వాన చూస్తే వింతగా వుంటుంది. అలాగే మనకు చలికాలం కొన్ని సమస్యలని, సౌకర్యాలని కల్పిస్తుంది. ఈ కాలంలో పగళ్లు పొట్టిగానూ, రాత్రిళ్లు ఎంతకీ తరగక పొడుగ్గానూ వుంటాయి. సాయం ఐదు గంటలకే సూర్యుడు మాయం అవుతాడు. ఈ సీజన్‌లో కరెంటు బిల్లులు అధికంగా వస్తాయి. ఏసిలు ఫాన్‌లు తరగకపోవచ్చు గాని, హీటర్లు గీజర్లు కరెంటు తెగ లాగుతాయి.

హైదరాబాద్‌ సిటీ బస్‌ రూట్‌లో జేబులుకొట్టే వృత్తిని నమ్ముకుని బతుకుతున్న నడి వయస్ముడు-*చలికాలం మాకు అన్‌సీజనండీ. అందరూ జేబులో చేతులు పెట్టుకు నిలబడతారు” అని వాపోయాడు. సిక్కిం నుంచి నేపాల్‌ నుంచి ఉన్ని దుస్తులు తెచ్చి రోడ్డువార పందిళ్లు వేసి అమ్ముతూ వుంటారు. వాళ్లు స్వెట్టర్‌ వంద రూపాయలు చెబితే మన వాళ్లు ముప్పైకి జేరమాడతారు. అసలు యీ బేరాలు అడడం చిత్రంగా వుంటుంది. దేనిని కొలబద్ధగా తీసుకుంటారో తెలియదు. అమ్మేవాళ్లు వంద అంటే కొనేవాళ్లు యాభై అంటారు. ఎటూ బేరం చేస్తారని రెట్టింపు రేటు చెబుతారో, ఎటూ ఎక్కువ చెబుతారని వీళ్లు సగానికి అడుగుతారో అర్ధం కాదు. సరే, బీరాల మాట ఎట్లా వున్నా దూరప్రాంతాల వారితో యీ సీజన్‌లో మానవ సంబంధాలు ఏర్భడతాయి. వాళ్లు హిందీ మాట్లాడతారు. మనం తెలుగు మూట్లాడతాం. మనం వూరికే తెలుగు మాటల చివర హై చేరిస్తే హిందీ అవుతుందనే భ్రమలో వుంటాం. చివర దీర్చాలు తీస్తే తెలుగు అవుతుందని వాళ్లు భావిస్తారు. డబ్బుకి భాషా భేదం లేదు కాబట్టి యీజీగా మన మాట వాళ్లకి, వాళ్లన్నది మనకి అరటి పండు వాలిచినట్టు అర్ధమైపోతుంది.

ఈ చలికాలంలోనే, అంటే కార్తీకంలో వన భోజనాలు నడుస్తాయి. అందరూ ఓ తోటలో వంటలు వండుకు తినడం, సహబంతి భోజనాలూ అవీ వుంటాయి. ఎవరో ఒక మహానుభావుడు “అందరూ సమానులే గాని యీ సృష్టిలో కొందరు మరి సమానులు” అన్నది అక్షరాలా నిజం. సహబంతి అనేది ఒక అతిశయోక్తి. అక్కడ కూడా పడవ కార్ల వాళ్లంతా ఒక లైన్లో కూచుంటే, లాంచి కార్గు, బోటు కారు, డింగీ కారు వాళ్లంతా వారివారి కార్డకని బట్టి బంతిలో కూచుంటారు. ఎవరి స్థాయికి తగిన మానవ సంబంధాలు వాళ్లకి వుంటాయి

పల్లెటూళ్లలో యీ చలినెలలు మరోవిధంగా వుంటాయి. కార్తీక మాసంలో నెలపొడుగునా 68 మానవ సంబందాలు

లా ఉ/165 ళగో మైల చ్‌ నా క మడా కో (నష క్ట జూ కో మా | నో శివాలయంలో, ధ్వజ స్తంభానికి అకాశదీవం వేలాడుతూ నంటి. ప్రమిద వెలిగింగ అది గాలికి కొండెక్కకుండా ఒక ఇత్తడి భరిణెలో పెట్టి, దొనిని తాడుతో గిలకమీదుగా ధ్వజస్తంభం పైకి లాగి కడతారు. దీపమే జెండాలా ధ్వజస్తంభంపైన రెపరెపలాడుతూ వుంటుంది. గువ్వ పిట్టలు పొద్దుపోగానే ధ్వజస్తంభం మీద వాల్తాయి. అవి కొత్తల్లో బిత్తరపోతాయి. కాని, తర్వాత దీపం కోసం వచ్చే పురుగుల్ని తింటూ, ధ్వజస్తంభపు చిరుగంటలను కదిలిస్తూ అక్కడే కాలక్షేపం పచ్చగా పండిన వరిచేలు, వరి కంకులు పొగమంచు పరదాల మాటున చిత్రంగా కనిపిస్తూ వుంటాయి. పసుపు పచ్చటి జనపచేను పూతలపై నిలిచిన మంచు బిందువులు మంచి ముత్యాలుగా మెరుస్తూ వుంటాయి. సన్నటి గట్టుమీద, అటూ యిటూ ఎదిగిన కందిచేను మధ్యగా చలిచలిగా వడివడిగా నదిచేటప్పుడు, ఎదురుగా అచ్చం అలాగే నడిచివస్తున్న పడుచుపిల్ల ఢీకొదితే...! దట్టంగా మంచు పడితే రెండడుగులు అవతల వున్న శాల్తీ కనిపించదు. అందుకని ఢీకొడితే ఎవరిని ఎవరూ అపార్ధం చేసుకోరు ఆ మంచు చురక మాత్రం వెచ్చవెచ్చగా జీవితాంతం శ్రీరమణ ననన ద

గుర్తుండిపోతుంది. అందుకే చలికాలంలో తటస్తపడే యిలాంటి అనుకోని సంఘటనలు మానవ " సంబంధాలను మధురానుభూతులుగా మిగులుస్తాయి.

సంక్రాంతి నెల పడతారు పుష్య మాసంలో. అంటే డిసెంబర్‌ 18న ప్రారంభమై మకర సంక్రమణంతో పండగ నెల పూర్తి అవుతుంది. ఇది ముగ్గుల నెల. ఆడపిల్లలు తెల్లవారకుండానే, వాకిళ్లు తుడిచి కల్లాపిజల్లి ముంగిట ముగ్గులు పెడతారు. అదొక గొప్ప కళ. దానికి చాలా మంచి పనితనం కావాలి. చుక్కల ముగ్గులు, తీగెల ముగ్గులు ఎన్నోరకాల ముగ్గులు. ఇలా ముగ్గులు వేసివేసి, కన్ని పిల్లలు ఒక శుభ ముహూర్తంలో ముగ్గులోకి దిగుతారు! అక్కడ నుంచి రకరకాల మానవ సంబంధాలు మొదలవుతాయి. ఒకవైపు ముగ్గుల మూటలు విప్పుతుంటే, మరోవైపు చలిమంటలు చిటపటలాడుతూ వుంటాయి. పొద్దుటే లేచి, మసక మంచులో చలి కాగడం, కబుర్లు చెప్పుకుంటూ పరాచకాలాడుకుంటూ వెచ్చవెచ్చగా కాలం గడపడం ఒక వెచ్చని అనుభూతి. పంట చేల గట్ల మీద, దిబ్బల మీద గుమ్మడి పాదులు అల్లుకునే తరుణం యిది. గొబ్బెమ్మలకు బంతిపూలు, గుమ్మడిపూలు అలంకరించడం మన ఆచారం. తెలుగు రుతువులను విశ్వనాథ వారు దర్శించినంత కమనీయంగా మరెవ్వరూ దర్శించలేదు. గుమ్మడి పువ్వులో రాలిన మంచు బిందువు తట్టలో కూచున్న నవ వధువులాగా వుందన్నారాయన. మధుపర్మాలలో పచ్చపచ్చగా వుండే నవవధువుని, గుమ్మడి పూల సౌకుమార్యాన్ని క్షుణంగా పరిశీలించిన వారు విశ్వనాథ. పెళ్లి కూతురుని అలంకరించిన తట్టలో కూచోపెట్టి, పెళ్లి మండపానికి పిల్ల మేనమామలు తీసుకు రావడం ఆచారం. ఆచార వ్యవహారాలను, (ప్రకృతి శోభను కలగలిపి చెప్పడంలో మానవ సంబంధాలు లేవా?

శ్రీనాధుడు శృంగార పురుషుడు. సరసత ఎక్కువ. ఒక చాటువు చెబుతూ- కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక రైతు బిడ్డ తన దుప్పటి అమ్మేసి ఎద్దుని కొన్నాడట! యవ్వనవతి పయోధరాలను పొగలేని కుంపట్లతో సోల్చాడు. బెనో, కాదో- ఒకవేళ నిజం అయితే అవుగాక కాని అలాగ నిండు సభలో ఒక యవ్వనవతిపై పద్యం చెప్పడం ఏం బావుంటుంది? అనుభవేకవేద్యాలను పద్యాల్లోకి తేవడం మానవ సంబంధాలకు పెద్ద దెబ్బ. నిజానికి హాలుడు గాధా సప్తశతిలో రెండు పంక్తులలో ప్రాకృతంలో చెప్పిన సంగతి యిది. ఏదో అప్పుడంటే చెల్లిపోయింది గాని యిష్పుడైతేనా... []

ల ఫీ+్రురరి - రూనీ5 నం1౮ంధాలు చిన్నప్పుడు మేష్టారు ఒక కొండ గుర్తు చెప్పారు. ఏ నెలకి ఎన్ని రోజులో గుర్తుపెట్టుకోవడం సమస్యగా ఉందేది. మేష్టారు అరచెయ్యి ముడిచి, వేళ్ళదగ్గర వచ్చే ఎత్తు పల్లాలను బట్టి లెక్కచెప్పేవారు. గుప్పెట ముడుస్తాం. చూపుడు వేలు పుట్టినచోట ఒక ఎముక ఎత్తుగా బుడిపె లాగా లేస్తుంది. అంటే అది జనవరి. దానికి 31 రోజులు. దాని పక్కనే పల్లంగా కండ వుంటుంది. అది ఫిబ్రవరి. దీనికి 31రోజులు రావు. తర్వాత మార్చి. మళ్ళీ మధ్యవేలు తాలూకు బుడిపె. అంటే ౩1 అన్నమాట. ఏప్రిల్‌ 30, మే 81, జూన్‌ 30, జులై 381, అయిందా తర్వా ద న్‌ శ నయము శ చది 'గ బా ళు చై అయే! ఇ యస నస్లాం:

మళ్ళీ మొదటికి వస్తాం. అంటే చూపుడు వేలు మీదికి మళ్లీ 81 అంటే జులై, ఆగస్టు నెలలు వరుసగా 31 రోజులున్న పెద్ద నెలలు. ఇట్లా చెప్పారు ఆయన పాపం పోయి ఎక్కడ వున్నారో? అయితే మనం ఇప్పుడు ఫిబ్రవరిలో వున్నాం కాబట్టి, ఫిబ్రవరిలో మానవ సంబంధాల గురించి మాట్లాడుకుంటే సందర్భశుద్ధి వుంటుంది. మొత్తం మీద అతి తక్కువ రోజులున్న నెల ఫిబ్రవరి. కేవలం 28 రోజులు. ఇలా తక్కువ రోజులు వుండడంవల్ల దీని ప్రభావం మానవ సంబంధాలపై ఎలా పడుతుందో అధ్యయనం చేయతగ్గ అంశం.

ఇంటి యజమానులు మూడు రోజులు ముందే నెల అద్దె పిందేశామని సంతోషపడతారు. వ్యాపార సంస్థలు 28 రోజులకే నెల జీతం పువ్వుల్లో పెట్టి యిచ్చామని నసుక్కుంటారు. ఒక్కోసారి వాళ్ల అదృష్టం బాగోలేకపోతే ఆ 28 రోజుల్లో అయిదు ఆదివారాలు వస్తాయి. ఫిబ్రవరి మొదటి తారీఖు ఆదివారం వచ్చిందంటే బెట్‌! ఫిబ్రవరి 28 కూడా ఆదివారం కాకపోయినా హాలిడే మూడ్‌ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మానవసంబంధాలు కొంచెం గీతలు పడతాయి. వుద్యోగులు “మరి అదే ఒక్క నెలలో 31 రోజులు వచ్చి నాలుగే ఆదివారాలు వచ్చినప్పుడో...” అని ఎన్‌-కౌంటర్‌ చేస్తారు.

పన్నెండేళ్ళకోసారి పుష్మరం వచ్చినట్టు, నాలుగేళ్ళకోసారి లీపు సంవత్సరం వస్తుంది. అప్పుడు ఫిబ్రవరి నెల ఒక రోజు సాగుతుంది. 28 నుంచి 29 రోజులకు వెళుతుంది. కొందరు మహానుభావులు ఫిబ్రవరి 29న పుడతారు. వాళ్ల పుట్టినరోజు నాలుగేళ్ళకోసారి వస్తుంది. మొరార్టీదేశాయ్‌ యీ బాపతే! అందుకే ఆయన తన వయసుని నాలుగుతో భాగించి చెప్పే వారు సరదాకి. ఇది యిరవయ్యో పుట్టిన రోజు అని. లీవు ఇయర్‌ ఫిబ్రవరి చివరిరోజు పుట్టిన వాళ్ళంటే, వాళ్ల వయసు ఎనఖైగా అర్ధం చేసుకోవాలి. తెలుగు నెలల ప్రకారం మాఘ-ఫాల్లుణ మాసాల మధ్య వంతెన లాగా వుంటుంది ఫిబ్రవరి నెల. అంటే ఇంగ్లీషు కొత్త సంవత్సరానికి, తెలుగు నూతన సంవత్సరానికి మధ్య కొత్త పాతల మధ్య వుంటుంది. చలికాలపు గిలిగింతలు తగ్గుతూ, వేసవి చిరు చెమటలను గుర్తుచేస్తూ నడిచే నెల. అందుకని యీ నెలలో మానవసంబంధాలు కూడా అంటీ ముట్టనట్టు, పట్టీపట్టనట్టు వుంటాయి. దీపావళి, సంక్రాంతి లాంటి పెద్ద పండగలేమి యీ నెలలో తగలవు. అందుకని ఖర్చుల తాకిడీ పెద్దగా వుండదు.

స్పూడెంటు కుర్రాళ్ల మీద తల్లిదండ్రుల వత్తిడి అధికం అవుతుంది. “ఇంకా గట్టిగా నెలోజులు కూడా లేవు పరీక్షలు. ఆ టీవి కూడు పెట్టదు...” అని ఇంటింటా ఒక దండకం వినిపిస్తుంది. ఇప్పుడు లోకంలో ఎంత కాంపిటీషన్‌ వుందో, ఫలానా వాళ్లబ్బాయి ఎంత కష్టపడి చదివాడో, భలానా వాళ్ళ అమ్మాయి అమెరికా ఎంత తేలిగ్గా ఎగిరిపోయిందో, ఫలానా వాళ్ళ మనవడు ఎప్పుడూ రుషిలా ఎలా పారాలు వల్లిస్తూ వుంటాడో, ఫలానా వాళ్ల మేనల్లుడు... యిలా “ఫలానా దాకా చెప్పి దండకం ముగిస్తారు. ఈ దందకం చదివిన వారికి విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని ఫల(శ్రుతి కూడా చెబుతారు. ఇలాంటి వాటికి నెలవు ఫిబ్రవరి నెల, అప్పులు తీసుకునే వారికి, తీసుకున్నవారికి, తీర్చాల్సిన వారికి దీనిని గద్డునెలగా చెబుతారు. అప్పడిగితే- “ఎటూకాకుండా అడిగావోయ్‌, మార్చి నెలాఖరు గడిస్తేగాని లాభం లేదు. చాలా టెట్‌” అంటాడు రుణదొాత ఏమాత్రం తడుముకోకుండా. “ఎక్కడండీ, మా డబ్బు మీకు యిచ్చేసి 72 మానవ సంబంధాలు

రుణవిముక్తుణ్ణీ అవుదామంటే బ్యాంకు వాళ్లు మార్చి థర్చీఫస్టు కాగానే కన్పించండి అప్పారావుగారూ” అన్నారని పచ్చి. అబద్ధం చెబుతాడు. “ఏప్రిల్‌ ఫస్టు ఫూల్స్‌డే! అందుకని రెండు తారీఖుల్లో...” అనేసి, ఏకబిగిని నెల్రోజులు వాయిదా పడేసి చక్కా వెళ్తాడు. ఇలాంటప్పుడు మానవ సంబంధాలకు తేడా రాక వమవుతుంది? అసలు ప్రపంచంలో ఒక ధియకీ వుంది. సమస్త అబడద్ధాలకూ డబ్బే కారణమనీ, ద్రవ్యం అనేది లేపోతే భూమ్మాద అబద్ధమే పుట్టి వుందేది కాదనీ పెద్దలు అంటారు.

అన్నిటికంటె ఫిబ్రవరి ప్రత్యేకత ఏమంటే- అది బడ్జెట్‌ ప్రతిపాదించే నెల. అసెంబ్లీలో, పార్ల మెంట్‌లో సామాన్యుడి జాతకాలను తిరగరాసే నెల. పూర్వం బడ్జెట్‌ వస్తోందంటే అగ్గిపెట్టెలు, కిరసనాయిలు స్టాకు పెట్టుకునేవారు గృహస్తులు. ఇప్పుడు ఏద్రెతే అది అయిందని, తెగించి వూరికే చూస్తూ కూచుంటున్నారు. బడ్జెట్‌ బావుందని ఎన్నదూ ఏ ఒక్కడూ అనగా వినలేదు. రైలు టిక్కెట్లు పెరుగుతాయి. కొత్త పన్నులు మొలుస్తాయి. ఆర్థిక మంత్రి గారిని ఇదేమని అడిగితే “ఓ గుంటపూద్చాలంటే మరో గుంట తవ్వక తప్పదు కదా” అంటారు. బడ్జెట్‌ గురించి ఓ వారం రోజులు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటూ వుంటారు. తర్వాత అలవాటుపడి క్రమేపీ వేరే విషయాల్లోకి వెళ్లిపోతారు సర్దుకుపోయే విషయంలో మనంతటి వాళ్ళు ఎవ్వరూ వుండరు. అందుకని భారతదేశంలో మానవ సంబంధాలు పటిష్టంగా వుంటాయి ఫిబ్రవరి పొట్టినెలే గాని చాలా గట్టి నెల. వెలను

మా పక్క అపార్ట్‌మెంట్‌లోంచి పెద్దపెద్దగా అరుపులు కేకలు వినిపిస్తుంటే బయటకు షం గు అన్నా తమ్ములు ఘర్షణ పడుతున్నారు "పెళ్లాం కొంగుపట్టుకు తిరిగే చవటవి” అని ఒ ఉన్సీక్సు అదికూడా అందదులే” అని ఇంకోడు రాంబాణాలు విసురుకుంటున్నారు- లోపల వాళ్ల అమ్మానాన్నలు పెద్ద తనంతో కొంత, యీ దృశ్యంతో మరికొంత వొణికిపోతూ కనిపించారు. కాస్త వాళ్లు చల్లబడ్డాక గొడవకు మూలకారణం ఏమిటని వాకబు చేశాను. పె న న తల్లిదండ్రుల్ని ముగ్గురు కొడుకులూ వాటాలు వేసుకున్నారు. తలో నాలుగు నెలలు మవ స్ట వుంచుకునేట్టు. అయితే పెద్దకొడుకు మొదటి నాలుగు నెలలు, రెండోవాడు లా నాలుగ నెలలూ - యిలా చూస్తున్నారు. అయితే పెద్దవాడి మోసం రెండేళ్ళకి మిగిలిన యిం

తం మీద 120 రోజులు మాత్రమే

అర్ధమైంది. ఫిబ్రవరి తన వాటాలోకి రావడం వల్ల మొత్త మార పెద్దాడికి వస్తున్నాయి. రెండోవాడు అమ్మని నాన్నని 128 రోజులు భరించాల్సి రం ॥ ఇది చాలా దారుణం అని గొడవ సారాంశం. అందుకని నెలల వంతున కాకుందా ర జుల లెక్కన పంచుకోవాలని ఘర్షణ పడుతున్నారు ఆ ఇంట్లో, యీ గొడివంతా చెవులారా వింటూ భయం భయంగా చూస్తున్న వృద్ధ దంపతులను చూళశాక- మానవ సంబంధాల మా యంగా రాద్దామంటే కలం కదలడం లేదు. లాలా శ్రీరమణ 73

నీళ్లూ - రూనీ5 సం1ఎంధాలూ తి

కలవారి కోదలు కలికి కామాక్షి

కదుగుచున్నది వవ్దు కడవలో పోనీ

ఇంతలో వచ్చెను ఆమె పెద్దన్న

కాళ్లకూ నీల్లిచ్చె కన్నీళ్లు నింవె...

అంటూ నడుస్తుంది కామాక్షి పుట్టింటికి బయలుదేరే ఘట్టం. అసలు ఆ జానపదం ఏనాటిదో గాని ప్రతి పదంలో, పాదంలో నీళ్లు, మానవ సబంధాలూ పుష్కలంగా వున్నాయి. పప్పు కడగడానికి నీళ్లు కావాలి. అన్న గారికి మర్యాదగా కాళ్లకు నీళ్లు యిచ్చింది. పుట్టింటివారు వచ్చారనే ఆనందంతో కళ్లు చెమర్చాయి. అనాటి ఉమ్మడి కుటుంబాల తీరుతెన్నులను ఈ పాట కళ్లకు కదుతుంది. నీళ్లతో మానవసంబంధాలు ఎలా ముడిపడి వున్నాయో చెబుతుంది. అసలు యీ సృష్టి-చీకటి, శబ్దం, వెలుగు తర్వాత నీరు, నీళ్లలోంచి వకకణజీవి పుట్టడం

అలా ప్రారంభమైంది. అందుకని నీళ్లు మానవసంబంధాలూ అనే అంశం మీద మేధావులు సాకల్యంగా చర్చించాల్సిన అవనరం ఎంతైనా వుంది. నాస్తికులు సైతం అలవాటుగా “నారుపోసినవాడు నీరు పోయడా” అంటుంటారు. నారు పోసిన వాడంటే నారాయణుదని మా ఫ్యామిలీ స్వాములారు యీ మధ్యనే చెప్పారు. దానం చేసేటప్పుడు దాత ఎంతటివాడైనా (గ్రహీత కాళ్లు కడుగుతాడు. పూర్వపు రోజులలో సన్నటి ధార పదేందుకు అనువుగా కమండలాలు వాడుకలో వుండేవి. ఇప్పుడు దండ కమండలాలు సన్యాసులు మాత్రమే వాడుతున్నారు. మీరు శ్రద్ధగా చూశారో లేదో గాని కమండలం ఆకారం ఎంతో గంభీరంగానూ, ఆసక్తికరంగానూ వుంటుంది. ఒక స్వాములారు “ఇది కమండలం కాదు నాయనా పోతపోసిన ఓంకారం” అన్నారు. నమస్మరించాను = ఆయనకు, కమందడలానికి కలిపి. జనక రాజర్ని జానకిని కన్యాదానం చేసే ముందు రాములవారి కాళ్లు కడిగాడు. “కాళ్లు కడిగి కన్యాదానం...” అంటారు మామూలుగా. రామావతారం మీద, యిలాంటి సనాతన సంప్రదాయాల మీద నమ్మకంలేని వాళ్లు - రాముడు విశ్వామిత్రుడి యాగరక్షణలో వుండి బోలెడుమంది రాక్షసులను చంపి, అక్కడనుంచి సీతాస్వయంవరానికి మునివెంట వచ్చాడు కదా. కాళ్లెనా కడగకుండా ఎలాగని జనకుడు రాముడి కాళ్లు కడిగి కన్యాదానం చేశాడని మ్యూమన్‌ యాంగిల్‌లో చెబుతారు కొందరు. సాక్షాత్తూ విష్ణుమూర్తి వామనావతారంలో, ముద్దులొలికే చిన్న వటువులా బలిచక్రవర్తి యాగశాలకు వచ్చాడు. రాక్షస గురువు శుక్రాచార్యుల వారు వటువుని సాక్షాళ్తూ అవతార మూర్తిగా గ్రహించాడు. బలిచక్రవర్తి “ఏమి కావాలో కోరుకో” అన్నాడు. “మూడు అదుగులు యిస్తే చాలు అన్నాడు వసివాడు. * ఇస్తాను తీసుకో” అని బలి వటువు పాదాలు నీళ్లతో కడగబోతుంటే, సూక్ష్మరూపుదై కమండలం పంపు గొట్టానికి అడ్డుపడ్డాడు శుక్రాచార్యులవారు. కమండలం నిండా నీళ్లు వున్నా వొక్క చుక్క కూడా పడడంలేదు. వచ్చినవాడు సామాన్యుడు కాదు కదా. దర్భ పుల్ల లేసి కమండలాన్ని సరిచేశాడు. శుక్రాచార్యులవారు లోపల ననన నా "మానవ సంబంధాలు

గాం తయో

ఏకాక్షి అయినారు ఆ నీళ్ల ధార వటువు పాదాలను క్షాళన చేయబోయి ప్రక్షాళన అయింది. ఆ పాదమే బలిని పాతాళానికి తొక్కేసింది ఆ నీళ్లే ఆగిపోయి వుంటే పొవం బలిచక్రవర్తి బతికిపోయేవాదు. దశావతారాలలో మూడు నాలుగు అవతారాలు నీళ్లమీద ఆధారపడినవే. అవతారాలన్నీ దుష్ట శిక్షణ చేసి మనుషులను రక్షించడానికే కదా.

మనకు తెలుసు కల్పాంతంలో జలప్రళయం రావడం, రావి ఆకుమీద వనిదేవుడు తేలిపోతూ వుండడం, ఒక పెద్ద చేపకు నావను కట్టి, నావలో సమస్త ప్రాణికోటిలోంచి వాక్కక్క శాంపిల్‌ని అందులోకి ఎక్కించడం, మళ్లీ సృష్టి ప్రారంభం అవడం అందరకూ తెలిసిన కధే. సృష్టి ఎప్పుడూ నీళ్లమీదే మళ్లీ మొదలవుతుంది ఈ శాంపిల్స్‌ తీసుకువెళ్లే కధ చెబుతూ * ఒక మేకను, సైలిని సింవోన్ని గాడిదని, పిల్లిని ఎలుకను, దేగను, పామును .. నావలోకి ఎక్కించారు” అన్నానో లేదో వాక కుర్రాడు “మరైతే మేకను పులి, ఎలుకను పిల్లి, పామును డేగ తినెయ లేదా” అని ఎంతో ఆదుర్దాగా అడిగాడు. ఈ కాలపు పిల్లలు అతి తెలివి గాడిదలు. చచ్చేట్టే తిట్టి తర్వాత జరిగిన కథ కప్పదాట్లతో ముగించాను. మరి ఇట్లాంటప్పుదే మానవ సంబంధాలు కొంచెం డిస్టర్చ్‌ అవుతాయి. లోతైన విషయాలు ్రవచించేటప్పుడు లాజిక్కులోకి వెళ్లడం దైవదూషణ అవుతుంది. “ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా అని అంటే యిదివరకు ఎవరైనా భయపడేవారు గాని ఇప్పుదెవరూ భయపడరు. అసలు మూడు చెరువుల నీళ్లు ఎక్కడ తెస్తారు “వారి మాట వొట్టి నీట మూట” అనేది పూర్వమైతే కొట్టిపారేసే మాట. ఇప్పుడు నీటిమాట అంటే గొప్ప నిధి. డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతాడు అనే మాట కూడా ఇప్పుడు చెల్లుబాటు కాదు నీళ్లచుక్క ఇసుకలో పడితే యింకిపోతుంది. పెనం మీద పడితే యిగిరిపోతుంది. ముత్యపు చిప్పలో వడికే మంచి ముత్యం అవుతుంది. ఈ నీటి చుక్కని జీవితంలో ఎన్నిటికో అన్వయించుకోవచ్చు. కొన్ని మంచి మాటలు కొన్ని సందర్భాలలో వృధా అయిపోతుంటాయి కొన్నిసార్లు పాళ్లు కుదిరిన తాంబూలమై పండుతాయి. “తామరాకు మీద నీటిబొట్టుని ముత్యమని గర్వించకుమా* అని కవి హెచ్చరిస్తాడు. ఇవన్నీ మిడిసిపడే మనుషులకు పరోక్షంగా చేసిన సూచనలే.

భగీరధుడు గంగను నేలకు తీసుకురావడం పెద్ద కధ. తర్వాత గంగని శివుడు తన జటా జూటంలో బంధించి మవోనదికి తొలిసారిగా డామ్‌ కట్టిన ఖ్యాతి గడించాడు. గలగలా గోదారి పరుగులిడుతుంటే, బిర బిరా కృష్ణమ్మ కదలిపోతుంటే బంగారు పంటలు పండవని సర్‌ ఆర్ధర్‌ శ్రీరమణ 75

కాటన్‌ గ్రహించాడు. ఆనకట్టలు కట్టి అపర భగీరధుడుగా వాసికెక్కాడు. వంద సంవత్సరాల నాడు గోదావరి పరీవాహక (ప్రాంతంలో శ్రోతీయులు అర్ధ్యం వదిలే వేళ “అపరభగీరధాయ నమః ” కాటన్‌ మహాశయ నమః” అని స్మరించే వారట. కాటన్‌ నిర్మించిన ఆనకట్టలు లక్షలాది కుటుంబాలకు మహర్దశను ్రసాదించాయి. కృష్ణా గోదావరి మండలాలు సశ్యశ్యామలమైన, సుసంపన్నమై వర్ధిల్లుతున్నాయంటే ఆయన చలువే. అందుకే మానవ సంబంధాలకు దేశం, మతం, వర్గం యివేమీ అద్దురావు. ఆ రోజుల్లో కాటన్‌ యిలాంటి ప్రజాహిత పధకాలు చేపట్టినందుకు బ్రైటిష్‌ రాచరికం ఆయన మీద తీవ్ర అభియోగం మోపింది. అవన్నీ నిలవవుగాని యిప్పటికీ మన హృదయాలలో నిలిచి వున్నది కాటన్‌ మాత్రమే. రామావతారానికి మూలం నీళ్లే కదా. వృద్ధుల, అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోపెట్టుకుని శ్రావణకుమారుడు సపర్యలు చేస్తున్నాడు. నది వొడ్డున కావడి దింపి, నీళ్లకోసం వెళ్లిన శ్రావణుడిని, బుడబుడమనే శబ్దం వల్ల మృగమని భ్రమించాడు దూరాన వున్న దశరధుడు. శబ్ద భేదితో గురిపెట్టి కొట్టాడు. అతడు కన్నుమూశాడు. దశరధుడు తను చేసిన తప్పు గ్రహించాడు. పక్కనే వున్న వృద్ధులను చూశాడు. కంట తడిపెట్టి, జరిగింది వారికి చెప్పాడు. వారు పుత్రవియోగ దుఃఖంతో విలవిలలాడుతూ, “నువ్వూ మాలాగే మరణించెదవుగాక” అని శవించి, కువ్చకూలిపోయారు. పిల్లలే లేని నాకు వియోగమేమిటని దశరధుడు రకరకాలుగా వూహించుకున్నాడు తర్వాత పూర్ణపురుషుదై, ఆజానుబాహుదై, అరవింద దళాయతాక్షుడై అయోధ్యలో రాముడు ఆవిర్భవించాడు. ఇక జరిగిన రామాయణమంతా పెద్ద భాగవతం. దానినిందా మానవసంబంధాలే. చివర్లో నీళ్లు అడ్డుగా నిలుస్తాయి. అప్పుడు ఇనకుల తిలకుడు సముద్రుడి మీద కోపించి, బాణం ఎక్కుపెట్టబోతుంటే “పర్యావరణ పరిరక్షణ నీ కర్తవ్యం, నేనిప్పుడు చీలిపోయి దారిస్తే వుషద్రవం ఏర్పడుతుంది” అని సముద్రుడు సమస్య వివరించాడు. అప్పుడు వారధి నిర్మించారు. చుట్టూ నీళ్లు పెట్టుకుని లంకలో వుండడం వల్ల మానవ సంబంధాలు సక్రమంగా వుండవు. అందుకే వొంటికాయ శొంరికొమ్ములా వుండే వారిని “వాడొక ఐలెండ్‌” అనడం కద్దు. జానపద రామాయణంలోంచి రెందు ముక్కలు చెప్పి రామాయణానికి స్వస్తివలుకుతాను. లక్ష్మణస్వామి సీతమ్మ వారి మందిరానికి వచ్చాడట. అప్పుడు ఆ తల్లి “పాలు కలవని నీళ్లు పాదాలకిచ్చె, నీళ్లు కలవని పాలు పానానికిచ్చ అంటాడు జానపదుడు. ఏంత ఆప్యాయత? అద్దాలు లేని రోజులలో నిశ్చలమైన సీళ్లే అద్దాలు. విష్ణుచిత్తుడు తోటలో పూలతో శ్రీరంగేశుడికి అతి భక్తితో దండ కూర్చితే, గోదాదేవి తండ్రి కంటపడకుండా ఆ పూమాలను అలంకరించుకుని తోటబావిలో తొంగిచూస్తూ తన సౌందర్యానికి మురిసి పోయేదట తర్వాత దేవరవారే మురిసి పోవడం అదొక పెద్ద కథ. తెలుగు వారి ఆడపడుచు ఎంకి తర్వాతి కాలంలో ఏటి అద్దంలో ముఖం చూసుకు మురిసిపోయేది. “బ్లడ్‌ యీజ్‌ ధిక్కర్‌ దేన్‌ వాటర్‌” అన్నాడు మహాకవి ఆంగ్లంలో. “పోవన్‌ బోవ నీటికిన్‌ బల్బనై...” అన్నాడు తెలుగు కవి. “గుండె మంటలారిపే చన్నీళ్లు కన్నీక్సు వుందవన్న వుందవమ్మ శాన్నాళ్లు” అన్నారు ఆత్రేయ. ఈ నీటి నేపధ్యంలో మానవసంబంధాలు పుష్కలంగా వున్నాయి. కావాలంటే సందర్భాలు నెమరు వేసుకోండి. ఏదో పేరు పెట్టి చివరకు “సాహిత్యంలో నీళ్లూ అనే అంశంమీద రాస్తున్నాననే అపవాదులో మన సంబంధాలు దెబ్బతినడం నాకు యిష్టంలేదు కుంతీదేవి కర్టుడిని నీళ్లలోనే ఎందుకు వదిలిపెట్టింది? కొండ మీదే, దేముడి గుళ్లోనో వదిలిపెట్టచ్చు కదా. నీళ్లకి ప్రవాహగుణం వుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అంటారు. విష్ణు పాదాల దగ్గర పుట్టిన గంగ శివుడి 76 మానవ సంబంధాలు

తలమీదకు ఎక్కింది. తగినంత శక్తి వుండి, నెత్తిన పెట్టుకునేవాడు వుంటే పల్లానికే కాదు ప్రైకైనా (ప్రవహించగలదు.

రేణుకాదేవి నీళ్లకోసం నదికి వెళ్లినపుడు కార్తవీర్యార్డునుదు తన భార్యలతో జలకాలాడుతున్నాడు. ఆయనకి వెయ్యి చేతులు. వాటిని అడ్డుపెట్టి నీళ్లని నిలిపేశాడు. దేణుకాదేవి ఆలస్యానికి కారణం తెలిసి జమదగ్ని అగ్గిరాముడై, వరుశురాముణ్జి పిలిచి తల్లి తల నరికెయ్యమన్నాడు. దశరధరాముడిలాగే భార్ధ్ణవ రాముడు కూడా పిత్ళవాక్య పరిపాలకుడైనాడు మిగిలిన కొడుకులను జమదగ్ని వెలివేశాడు. మొత్తం నీళ్ల సమస్య వల్లనే యిదంతా జరిగిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇప్పుడు మాత్రం మనకు ఎన్నో జలవివాదాలు నడుస్తున్నాయి అయితే మనం పెద్ద మనుషులం కాబట్టి మానవ సంబంధాలను చెడగొట్టుకోం.

పెద్ద పెద్ద వుద్యమాలలోంచి, ప్రకృతి వైపరీత్యాల లోంచి కొన్ని సంఘటనలు పుట్టుకురావడం సహజం. వాగులు పొంగినపుడు, వరదలు వచ్చినపుడు మానవ సంబంధాలు మెరుగుపడడం, వొక్కోసారి దెబ్బతినడం మామూలే. నీళ్ల కరువులోంచి అనేకం పుట్టుకు వస్తాయి. అనగనగా వొక కాలనీ అన్ని (ప్రాంతాలలో లాగే అక్కడా నీళ్ల ఎద్దడి తీవ్రంగా వుంది. రోజూ టాంకర్‌ వచ్చి నీళ్ళు సప్లై చేసి వెళ్తోంది. ఆ రోజు సాంతం తెల్లవారకుండానే టాంకర్‌ వచ్చిన అలజడి వినిపించింది. సాయికృష్ణ తెగ హడావిడి పదిపోతూ “అమ్మా బిందెలు, గంగాకాలు ఎక్కడే” అని చిందులు మొదలు' పెట్టాడు. సాయికృష్ణ తండ్రి చంద్రమోహన్‌ కొడుకు నీళ్లకోసం పడుతున్న ఆత్రుతకి ముచ్చట పడకపోగా అనుమానపడ్డాదు.

తల్లి జయసుధ మాత్రం కొదుకు బాధ్యత (గ్రహించినందుకు వీరమాతలొ గర్వపదుతోంది. టాంకర్‌ నాలుగు యిళ్ల అవతల ఆగింది. చంద్రమోహన్‌ కొడుకుని వద్దని వారించి తనే రెండు ఖాళీ బాల్చీలతో బయలుదేరాడు “ఎందుకు దాడీ మికీ మ, నేను వుండగా అన్నాడు సాయికృష్ణ జయసుధ కూడా కొడుకు పక్షానే నిలబడింది. కాసేపు తల్లీ కొడుకులు వ్త్‌వంగ్ట్‌ వాళ నిష్టూరంగా మాట్లాడారు. అన్నీ విని చంద్రమోవాన్‌ నొకసారి కళ్లజోడు ని స్తా ప్రారంభిస్తున్నట్లు సూచించాడు. “మీరిప్పుడు యిలాగే మీనమేషాలు లెక్కపెడుతూ ర కొస్తా వెళ్లిపోతుంది” అని కల్లి అనగానే “ఇన్నాళ కూడా స్నానం డుమ్మా” అన్నాదు యిషృష్ణ చంద్రమోహన్‌ ఏమాత్రం తొణకకుందా నిండు కుండలా కొడుకుని దీక్షగొ చూస్తు టక సాయీ! సరిగ్గా యిరవై నాలుగేళ్ల క్రీతం మా అమ్మ నాన్న వొ జ్నన్న కాలనీకి వ్‌ సుపుత్రుడు వచ్చేది” అని చంద్రమావాన్‌ మొదలు పెట్టాడు. “ఆం వస్తే. * అన్నాడు ఇరవై మాక్‌ సుసకుదం “ఆ టాంకర్‌ దగ్గరకి బీర కుచ్చెళ్ళు ఎగ్గట్సి వొక పిల యింట్లో వన్న గిన్ని గట న గరిటిలతో నవా 'టచ్చేదా అనగానే జయసుధకి రోషం వచ్చింది. “మీరు మార్త తక్కువా పి శ కగా అరం అవుతోంది. వాళ్లిద్దరూ సంచీలు కూడా తెచ్చేవారుగా” సాయికృష్ణకి కధ మనక మసకగా అర్ధ చెరొక అయిదు డైలాగులు వాదించుకునే నరికి ఫ్లాష్‌ బ్యాక్‌ క్లియర్‌ అయిపోయింది. జయసుధ చంద్రమోహన్‌ అప్పట్లో ఒకే కాలనీలో వుందేవారు. సీళ్ల టాంకర్‌ దగ్గరే లవ్‌స్టోరీ మొదలైంది అక్కడే అడ్వాన్స్‌ అయింది. ఇద్దరూ (ప్రేమలో నీళ్లలో అక్కడే తడిశారు. తర్వాత దంపతులుగా తేలారు. సాపన్టష్ణకి బెన్సన్‌ పెరిగిపోతోంది. ఎందుకంటే యిప్పటికే 'రాధాసాయి అక్కడ వెయ్యికళ్లతో టాంకర్‌కి ప్రదక్షిణాలు చేస్తూ వుంటుంది 6 లా శ్రీరమణ 77

లౌందర్ళు +నోన్కొలు - కూనీవ్‌సం(ఎంధాలూ సువర్చలకు పెక్షైంది. సన్నగా, పొడుగ్గా చామన ఛాయలో వుంటుంది. కనుముక్కుతీరు బాగానే వుంటుంది. మరీ మోకాళ్ళు దాటక పోయినా పొడుగైన జుట్టు అనే చెప్పవచ్చు. నవ్వినప్పుడు బుగ్గన సొట్ట పడుతుంది. పెళ్ళి చూపులప్పుడు పెళ్ళికొడుకు పవన్‌ మనసు ఆ సొట్టలో కూరుకుపోయి, మరింక బైటకు రాలేదు. ఇద్దరికీ పెళ్ళి పోయింది! పెళ్ళికొాచ్చిన వారంతా ఆంజనేయస్వామి భార్య సువర్చల. ఇక్కడ పవన్‌-సువర్చల పేర్లతోబాటు జోడీ కూడా బాగా కుదిరిందన్నారు. పవన్‌ సాఫ్ట్‌వేర్‌లో కొంచెం పై మెట్టుమీద వున్నాడు. సువర్చల మామూలు గ్రాడ్యుయేట్‌. పవన్‌ పాతపద్ధతిలో సంపాయించే భార్య అక్లేదు, సంసారం నదిపిస్తే చాలన్నాడు. సువర్చల నవ్వినప్పుడల్లా కొత్త సాస్ట్‌వేర్‌కి శ్రీకారం చుట్టినంతగా పొంగిపోయేవాడు పవన్‌. బుగ్గమీద సొట్ట వాళ్ళిద్దరిమధ్యా సంబంధాలను ముడి వేస్తోంది.

సువర్చల కాలక్షేపానికి పెయింటింగ్స్‌ చేసేది. తమ పోష్‌ అపార్ట్‌మెంట్‌లో ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌ పెంచేది. ఇంటీరియర్స్‌ చేసేది. తలుపు దగ్గరకు ఒక కుక్క సోఫాలోకి ఒక బొచ్చుకుక్క వుండేవి. ఇంట్లో అన్నిటికీ పనివాళ్ళుందే వారు. సువర్చలకి ఖాళీ సమయాల్లో ఇంగ్లీషు మేగజైన్లు చదవడం సరదా. పవన్‌ రోజులో పద్నాలుగు గంటలు ఆఫీసులో వుంటాడు. ఇంటి కొచ్చినా, సువర్చల ముఖాన్నికూడా కంప్యూటర్‌ మానిటర్‌ని చూసినట్టే చూస్తాడు అలవాటు చొప్పున. ఎక్కడో ఒకచోట భార్య జాగర్తగా ఫిగర్‌ మెయివైన్‌ చెయ్యకపోతే, భర్త దృష్టిలో వెలిసిపోయే అవకాశం వుందని చదివింది. దానిని అధిగమించడానికి చిట్కాలు కూడా చదివింది. దాని క్రమం యిలా వుంది.

ఉదయం ఐదుగంటలకి లేవాలి. లేస్తూనే గ్లాసెడు అంటే మూడువందల మిల్లీలీటర్ల మంచినీళ్ళు తాగాలి. పక్కన చూపిన బొమ్మల్లోలాగా వొళ్ళు విరుచుకోవాలి. మోది పొడి చర్మమైతే నాలుగు చుక్కలు ఆల్మండ్‌ నూనెను, రెండు వేళ్ళతో ముఖానికి మర్దనా చేసుకోవాలి. అయిదారు నిమిషాల తర్వాత బ్రష్‌ చేసుకోండి. మీ పళ్ళ నిర్మాణాన్నిబట్టి, దంత వైద్యుని సలహామేరకు ఏ దిశలో బ్రష్‌ చేసుకోవాలో తేల్చుకోండి. పేస్ట్‌తో (బ్రషింగ్‌ అయ్యాక, వేరే బ్రష్‌తో మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో, అంటే 30 లేదా 40 డిగ్రీల వేడి మించని నీళ్లతో మూడుసార్లు పుక్కిలించాలి. ప్రతీసారీ 25 మిల్లీ మీటర్ల నీళ్లని నోట్లో పోసుకోవాలి. దీనికి ఫిల్టర్‌ చేసిన నీళ్లనే వాడాలి. తర్వాత పల్చని వస్త్రంతో ముఖాన్ని అద్దుకోవాలి. ముఖాన్ని వస్త్రంతో రుద్దకూడదు. తుడుచుకునే ముందు రెండుచుక్కలు ఉడికొలోన్‌ వేయడం మర్చిపోవద్దు. ఒక శుభ్రమైన చిన్న పింగాణీ కప్పులో తాజా నిమ్మరసం రెండు టీస్పూనులు (గింజలు లేకుండా) 78 మానవ సంబంధాలు

లకీ య గ్ర గూ శమం

ఒక టీస్పూను తేనె, రెండు బెన్సులు గోరు వెచ్చని నీరు కలిపి సేవించాలి. దీని తర్వాత ఏడు నుంచి పది నిమిషాలదాక యింకేమి సేవించరాదు.

ఇక్కడ సూచించిన విధంగా రెండు బ్రీతింగ్‌ ఎక్సరొసైజులు చెయ్యాలి. అప్పుడు ఒక కప్పు వేడి పాలలో చెంచాడు పటిక బెల్లంపొడి వేసుకుని చిన్న గుటకలలో తాగాలి. పది నిముషాలు విశ్రాంతిగా, బాగా గాలి తగిలేచోట కూర్చోవాలి. అప్పటికి సూర్యోదయం అవుతుంది. నైట్‌ (డ్రైస్‌మార్చి, వాకింగ్‌కి అనువైన దుస్తులు సీజన్‌బట్టి ధరించాలి. మార్షింగ్‌వాక్‌కి మదమవైపు కొంచెం ఎత్తుగావున్న పాదరక్షలు ధరిస్తే మేలు. రక్తప్రసరణ పాదంలో బాగా జరుగుతుంది. వొకింగ్‌లో తాజా ఎండ, గాలిలోపాటు తాజా మానవ సంబంధాలు ఏర్పడతాయి.

మొదట పట్టించుకోకుండా వెళ్ళినవారే, నాలుగో రోజు నవ్వుతారు. ఆరో రోజు హలో అంటారు. మో వారు సాఫ్ట్‌వేర్‌ అన్నాక మరింత ఆత్మీయులౌతారు. వాళ్లవారుకూడా అదే వేర్‌ గాని వేరు కానందువల్ల. వాకింగ్‌కి వెళ్ళబోయే ముందు రెండు టీ స్పూన్న అవుపాలలో చిటికెడు పసుపు, కొద్దిగా అరగదీసిన గంధం కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించడం మర్చిపోకూడదు

కనీసం అరగంట నుంచి ముప్పావుగంట నడవాలి. మధ్య మధ్య వేగంగా నడవాలి. అక్కడక్కడ జాగింగ్‌ చెయ్యాలి. స్కిప్పింగ్‌ చేస్తే యింకా మంచిది వాకింగ్‌లో చేతులు ఊపడం, వేళ్లు కదపడం మరువద్దు. మెడ ఎగరేయడం కూడా మంచిదే. ఇంటికి రాగానే, అయిదు నిముషాలు మిమ్మల్ని చుట్టుకున్న కుక్కని ఆప్యాయంగా నిమరండి. (తర్వాత బోరుకొట్టి అదే శ్రీరమణ 7

గోరు వెచ్చని నీళ్లలో ఉంచండి. మధ్య మధ్య కాలి వేళ్ళను కదుపుతూ మీరు రిలాక్స్‌ అవండి. కావాలంటే డైలీ పేపర్‌ పైపైన చదవండి. ఎందుకంటే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ముఖ్యం. తర్వాత సెనగపిండి పాలమీగడ, ఒక చెక్క నిమ్మరసం (గింజలు తీసేసి) చిన్న గాజు గిన్నెలో కలిపి, పేస్టులాగా చేసుకోవాలి. ఆ పేస్టుని అప్పటికే ఆలివ్‌ ఆయిల్‌ పట్టించిన వొంటికి రాసుకోవాలి (బాత్రూంలో). ఈ పేస్టు పూర్తిగా ఆరిపోయి బెరడుకట్టేదాకా చిన్న చిన్న ఎక్సర్‌ సైజులు చెయ్యాలి అంటే చేతులు గుండ్రంగా తిప్పడం, గుంజీలు తీయడం లాంటివి. మీ చర్మలక్షణాన్ని బట్టి సబ్బుని ఎంపిక చేసుకోవాలి. వంద లీటర్ల నీళ్లు తగ్గకుండా స్నానం చెయ్యాలి. తర్వాత మెత్తని వస్త్రంతో శరీరాన్ని వత్తు కోండి. స్నానం కాగానే చెమట పడుతుంది. కనుక ఏడు నుంచి తొమ్మిది నిముషాలు ఫ్యానుకింద నిలబడాలి. అప్పుడే (డ్రెస్‌ చేసుకోవాలి. తొమ్మిదన్నరలోపు బ్రేక్‌ఫాస్ట్‌ ముగించాలి. తక్కువ నూనె వాడిన వంటకాలు, సహజమైన పీచు పదార్థాలు విధిగా తీసుకోవాలి. బొప్పాయి ముక్కలు 50 గ్రాములు తక్కువ కాకుండానూ, సపోటా దానిమ్మ చక్కరకేళి తీసుకోవాలి. నాలుగు బాదంపప్పులు, జీడిపప్పులు రెండు, ఒక టీస్పూను ఎండుద్రాక్ష బాగా నమిలి మింగాలి. ఒక గ్లాసు తాజా పళ్లరసం తీసుకోండి. ద్రాక్ష బత్తాయి (శ్రేష్టం. లేదంటే యాపిల్‌ అయినా ఫర్వాలేదు. పచ్చిదోసకాయ లేదా టమోటా సన్నని చక్రాలుగా కోసి సిద్ధంగా పెట్టుకోండి. వాటిని కళ్ళమీద వుంచుకుని పదిహేను నిముషాల పాటు విశ్రాంతిగా పడుకోండి. వాకింగ్‌, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత చిన్న కునుకు తీస్తే, శరీరం పూర్తి శక్తిని పుంజుకుంటుంది. పది గంటలు కాగానే మీ కురుల సంరక్షణపై మనసు పెట్టండి. కొబ్బరి నూనెలో గోరింటాకు వేసి రోజూ గంట చొప్పున, అయిదు రోజులు కాచాలి. ఆ నూనెను జుట్టుకు పట్టించి, చిక్కుపదకుండా సుతారంగా రాయాలి. కుదుళ్ళ నుంచి కొసదాకా మర్ధనా చేయాలి. అడుగు లేదా అడుగున్నర ఎత్తు పీటమీద కూచుంటే అనువుగా వుంటుంది. ఈ సమయంలో కావాలంటే టివీ చూడవచ్చు. నూనె రాయడం పూర్తయ్యాక అతి పల్చటి తడి వస్త్రంతో కలిపి కురులను మెలిపెట్టాలి. దీనివల్ల ఎగస్తా నూనెను వస్త్రం పీల్చేస్తుంది. ఇప్పుడు మూడు రకాల దువ్వెనలతో వెంట్రుకలను వైనంగా దువ్వుకోవాలి. లూజుగా జడ అల్లి వదిలెయ్యాలి. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన మూడున్నర గంటల వ్యవధి తర్వాత పగటి భోజనం చెయ్యాలి. తగినన్ని కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు, విటమిన్లు కలిగిన సమతులాహారాన్ని మితంగా తినాలి. తాజా ఆకు కూరలు, ఉడికించిన చేపలు ముఖ్యం. దుంపకూరలు తగ్గించడం మేలు. లంచ్‌ టైములో ఫోన్లు పక్కన పెట్టాలి. మంచి ఆలోచనలతో, బాగా నమిలి తినాలి. కనీసం లీటరు నీళ్లు తాగాలి. భోజనంలో పండు చాలా ముఖ్యం. అరగంట సేపు అటూ ఇటూ నడవాలి. తర్వాత గట్టి నేలమీద, లేదా బల్లమీద శరీరమంతా రెస్ట్‌ అయ్యేలా పడుకోవాలి. పదుకునే ముందు కనురెప్పలకి కొంచెం గ్లిజరిన్‌ రాసుకుంటే మంచిది. కళ్ళమీద ఐస్‌లో వుంచిన గులాబీలు పెట్టుకుంటే చలువ చేస్తుంది. అరటి పండు తొక్కు అయినా పర్వాలేదు. మధ్యాహ్నం గంటకు మించి నిద్రపోకూడదు. పొట్టవచ్చే అవకాశం వుంది. నిద్రలేవగానే కూచుని చేసే నాలుగు 80 మానవ సంబంధాలు

ఎక్సర్‌సైజులు చేసేసి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇది మీకు జిమ్‌ టైము. పులప్స్‌, సైక్తింగ్‌ లాంటి వాటితో మొదలు పెట్టాలి. ట్రెడ్‌మిల్‌పై పావుగంట పరుగెత్తాలి. మీరు తీసుకున్న కాలరీలను దృష్టిలో వుంచుకొని జిమ్‌ ఎక్సర్‌సైజులు చెయ్యాలి. స్విమ్మింగ్‌ కూడా మంచిదే సాయంత్రంపూట షటిల్క్‌ బ్యాడ్‌మింటన్‌ ఆడడం మంచిది. మెదదుకి శరీరానికి కూడా మంచి వ్యాయామం. మెదదు యిచ్చే సంకేతాలను వేగంగా శరీరం అమలు చేయడానికి యీ ఆటలు పనికొస్తాయి. ఆ తర్వాత మీరు హెయిర్‌ ద్రెస్సర్‌ దగ్గరకు వెళ్లేసంగతి మరువద్దు.

కేసు ఇంతవరకు విన్నాక, జడ్జిగారు అందుకుని- సాయంత్రం ఇంటికి వెళ్ళి, గోరువెచ్చని నీళ్ళలో టీస్పూను ఎర్రమట్టివేసి అందులో పావుగంట సేపు పాదాలు నానబెడతావు. మరో జిద్దు రాసుకుని, దాన్ని షవర్‌తో వదిలించుకుంటావు. తక్కువ కాలరీలు కలిగిన రాత్రి భోజనం ముగిస్తావు. నల్లద్రాక్ష చెర్రీపళ్లు, ఎనిమిది వేరు శెనగపప్పులు తింటావు. పెందరాళే లేవాలి కాబట్టి పెందరాళే నిద్రపోతావు. నిద్రకు ముందు ఎనిమిది బెన్సుల పాలు కుంకుమ పువ్వుతో తాగుకావు” అన్నారు. సువర్చల అవాక్కయి “మా కెలా తెలుసు యువరానర్‌" అన్నది ఆశ్చర్యంగా. “ఈ క్వార్టర్‌లో యిది ఎనిమిదో విడాకుల కేసు. మరీ అంత సౌందర్య దృష్టి పనికిరాదు. మానవసంబంధాలు కూడా ముఖ్యం” అన్నారు జడ్జిగారు. వంటనే పవన్‌ అందుకుని “యువరానర్‌ నేనామె దిన చర్య గురించి అడ్డుచెప్పను. కాని నాలుగు టీస్పూన్ల అవుపాం ఆం అయిదో అంతస్తులో వున్న అపార్ట్‌మెంట్‌లో ఆవును మెయిన్‌టెన్‌ చెయ్యడం ఖ్‌ న యువరానర్‌, నావల్ల కాదు" అన్నాడు దీనంగా. జడ్జిగారు గబగబా తీర్పు రాసే పనిలో పడ్డారు. ఆయన ముఖకవళికలను బట్టి ఏమని తీర్పు యిచ్చివుంటారో గ్రహించనమ దం తప కోర్టులో మూనవ సంబంధాలకు తావుండదు, చట్టం తన పని తాను చేసుకువెళ్ళ ౧ లా శ్రీరమణ 81

రొరందు - రూనీ5 నంశంధాలు మన పురాణాలని 'సైన్సుతో ముడిపెట్టి, సక్రమంగా అర్థం చేసుకోకలిగితే- ఉలవచారుని మీగడతో అస్వాదించినంత సుఖంగా వుంటుందని అనుభవజ్ఞులు అంటారు. డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం దశావతారాలకు సరిగ్గా సరిపోయింది కదా. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ వామన, పరశురామ అవతారం దాకా మనం అంటీ ముట్టనట్లు వుంటాం. రామావతారం రాగానే “నా రాముడు” అని కాళ్ల మీద సదతాం. రామావతారం పరిపూర్ణ మానవ దశ. మానవ సంబంధాలు యిక్కడ వున్నాయి! ఇక్కడ మీకో చిన్న పిట్ట కధ చెప్పాలి. దేవుళ్లు కూడా మనం అనుకునేంత పెద్ద మనుషులేం కాదు. వాడెవడో రాక్షసుడు భూమిని చంకన పెట్టుకు పారిపోతుంటే విష్ణుమూర్తి వరహావతారమెత్తి, కోరలతో ఆ రాక్షసుజ్జి చీల్చి చెందాడు. తర్వాత మీసాల మీద నిమ్మకాయలు నిలిపినంత అలవోకగా, కోరమీద భూగోళాన్ని నిలిపాడు. భూమిని తిరిగి దాని కక్ష్యలో దాన్ని పడేసి, ఆ వరాహ రూపం వదిలి మామూలు రూపం ధరించాడు. అడివిలో చెంచులక్ష్మి కనిపించగానే మైకం కమ్మింది. “చెట్టులెక్కగలనే చెంచిత పుట్టలెక్కగలనే..” అని అంతటి దేవుడూ ఆ పిల్ల వెనకాల పడ్డాడు. “ఏమిటి నా దేవుడు యిదిగో వస్తానని వెళ్లి యింకా రాలేదని...” వైకుంఠంలో శ్రీదేవి ఆందోళన పడింది. ఆయన గారికి ఆపదలు వస్తాయని భయం లేదు, ఏమి అఘాయిత్యాలకు దిగుతాదోనని కంగారు! దివ్య దృష్టితో చూసింది. ఏముంది, యీ మహారాజు ఒకటే గెంతులు, పాటలు, ఊడలు పట్టుకుని ఉయ్యాలలూగడం. అసలే కొంచెం సరదాస్వామి, దానికితోడు చెంచులక్ష్మి, ఒళ్లు మర్చిపోయి కోననక కొమ్మనక ఆ పిల్లని వెంటేసుకు తిరుగుతుంటే ఎంత దేవుడు భార్య అయితే మాత్రం సహిస్తుందా? అక్కణ్ణించి ఒకే ఒక్క కేకే అంతే రక్కున వైకుంఠ ద్వారంలో ఏమీ ఎరగనట్టు కూనిరాగాలు తీస్తూ నిలబడ్డాడు. “ఎవరా పిల్ల, ఏమిటా సరసాలు హాయ్‌ అమ్మా” అని అరిచింది. ఆయన ఒక్కసారి ముఖం దీనంగా పెట్టి “శ్రీ... నా ముద్దుల శ్రీ” అని సంబోధించేసరికి ఆవిడ కోపం కాస్తా హరీమని ఎగిరిపోయింది. అయినా కోపం నటిస్తూనే వుంది. “అసలు ఏమైందంటే శ్రీ! పని కాగానే వద్దామనుకున్నాను శ్రీ. కాని శ్రీ, వరహావతారంలో తిరిగి తిరిగి, రెండు మూడుసార్లు నీళ్లలో నా రూపం కూడా చూసుకున్నాను శ్రీ...” అని తల వంచుకున్నాడా దేవుడు. “చెప్పండి... ఆతర్వాత” అని గసిరింది వుత్తుత్తినే. “అబ్బే శ్రీ, నా మీద నాకే అసహ్యం వేసింది శ్రీ మొగదేవుడు ప్రతిసారీ అట్లా గౌరవంగా శ్రీ అనడంతో శ్రీదేవి మంచు ముద్దలా అయిపోయింది. చూస్తూ చూస్తూ వరహావతారం ధరించాక, నీలాంటి కోమలాంగికి, నీలాంటి రూపవతికి నా మొహం ఎట్లా చూపాలో అర్ధం కాలేదు. అందుకని 862 మానవ సంబంధాలు

ఈ మూవ! కాసె, కక్‌ | స డీ యానా న్న

అక్కడే చెట్ల వెంట పుట్ల వెంటి కాలక్షేపం చేస్తూ... త్రీ నిన్నే తల్చుకుంటూ శ్రీ.” పూర్తి కాకుండానే ఆమె కళ్ల వెంట నీళ్లు రాలాయి. అవి ఆనంద బాష్పాలో దుఃఖ బాష్టాలో చెప్పలేం. ఇదే అదును అనుకుని విష్ణుమూర్తుల వారు శ్రీని దగ్గరగా తీసుకున్నారు. స్వస్తి! ఎందుకు చెప్పానంటే దేవుడైనా మొగుడి లక్షణం ఎక్కడికీ పోదు. దేవేరి అయినంత మాత్రాన బేలతనమూ పోదు, భార్యాభర్తల మధ్య మానవ సంబంధాలు యిలానే వుంటాయి. దేవుళ్లైనా దానవులైనా. అది మనం గమనించాలి.

రాముడితో మనకున్న అనుబంధం యింకో జేవుడితో వుండదు. రాముడు కష్టజీవి. అడవులకు వెళానంటే ఆవిడ వస్తానని వెంటపడడం దేనికి చెప్పండి. దానివల్ల ఎంత గొడవ? పోనీ, వెళ్లినావిడ వెళ్లినట్టు వుందా? బంగారు లేడి కావాలంది. పోనీ, యాయన వినీ విననట్టు వూరుకున్నాడా? ఉహు. అక్కడ క్షతియం దానికితోడు పురుషాహంకారం. ధనుర్భాణాలు తీసుకుని ధన్‌ మని బయలుదేరాడు. అక్కడ అరుపు, ఇక్కడ లక్ష్మణరేఖ అంతొ గందరగోళం. లక్ష్మణుడ్ని పట్టుకుని దులిపి పారేసింది. ఏదో మంచివాడు కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే అన్ని మాటలు అన్నాక అన్నయినాః వదినైనా ఎవద్రైనా సహిస్తాడా? మానవ సంబంధాలు ఏం మిగుల్తాయి. అయోధ్య వెళ్లాకైనా “రామన్నా నీకూ నాకూ కుదర్దు. సీతమ్మ నీకు నెత్తిమీద దేవత అయితే అవచ్చు. నాక్కాదు. నేను వెళ్లి నా బతుకు నే బతుకుతాను" అని చక్కా పోయే వాడే. మరి, ఆ మట్టి మహత్యం అలాంటిది. కట్టి పడేసింది. మూనవ సంబంధాలకు మట్టికి చాలా సంబంధం వుంది. శ్రీరమణ జె

తెలిసినవాడు. నర వానర రాక్షసులను ఆకట్టుకున్నవాడు. వాలి సుగ్రీవులు సోదరులు. కపివరులు- రావణ విభీషణులు సోదరులు. రాక్షసులు. ఇద్దరికీ సింహాసనాలు ఆశపెట్టి తనవైపు లాకున్నాడు. ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చాడు విఖీషణుడు. రామ సుగ్రీవ బంధానికి వాలి బలి అయినాడు. బంటుగా హనుమంతుడు మిగిలాడు. హనుమంతుడిది ఒక చిత్రమైన పాత్ర. ఒక బంటుకి గుళ్లూ గోపురాలు, పూజలు పునస్యారాలు దక్కడం ఎక్కడా లేదు ఒక్క హనుమంతుడికి తప్ప. రాముడిలో అనేకమంది రాములున్నారు. చిన్నప్పుడు కౌసల్యా రాముడు. బాల రాముడు. కొన్నాల్టికి దశరధరాముడు. మిధిలా నగరంలో కల్యాణ రాముడు. ఆనక సీతారాముడు. మునివెంట అడవికి వెళ్లే వేళ కోదండ రాముడు. వనవాసంలో శృంగార రాముడు. తిరిగి వచ్చాక పట్టాభిరాముడు. పాలనలో రాజా రాముడు. అవతారమంతా సకల గుణాభిరాముడు. ఇన్నిరకాల రాములు అన్నిరకాల మానవ సంబంధాలను నడిపించారు. సీతని అనుమూనించి అడవికి పంపినవేళ, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. పంపింది నువ్వే కదా అంటే- పంపిన వాడు రాజారాముడు, దుఃఖిస్తున్నవాడు సీతారాముడు అంటాడు. దశరధుడు రాముడు, నా రాముడు అని మురిసిపోయాడు. తర్వాత కలియుగంలో ఎందరో రాముణ్ణి సొంత మనిషిగా భావించిన వారున్నారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా రాముడు రాముడే! ఆయన దేవుళ్లలో మనిషి. మనుషుల్లో దేవుడు. మనకు తెలుగు రాముడున్నాడు. భద్రాద్రి రాముడు! తానీషా సొమ్ముతో ఆలయం కట్టించుకుని, నగా నట్రా చేయించుకుని కులుకుతున్నాడు. నవాబు గారికి ఎన్ని జన్మల సంబంధమో ఆ రాముడితో. ఇప్పటికీ ఆయన పేరిట ముత్యాల తలంబ్రాలు కల్యాణ రాముడికి క్రమం తప్పక వెళ్తూనే వున్నాయి. అదుగో భద్రాద్రి రాముడు! భాగ్యనగరం వైపు చూస్తున్నాడు మంచి ముత్యాల కోసం. సీతమ్మ తల్లి పెళ్లి కూతురై తలవంచినా, రీవిగానే కూచుని వుంది. ఏటేటా హిందూ ముస్లిమ్‌ సంబంధాలను ముడివేసే భద్రాచల సీతారాములు యీ కల్యాణ శుభవేళ అందరినీ కాపాడుదురు గాక! (3 84 మానవ సంబంధాలు

గా ణో ఎం(న్రెన్సులు - రూనీర్‌ సంశంధాలు అమ్మాయి ఐఐటి రాస్తోంది. అబ్బాయి బిట్స్‌ రాస్తున్నాడు. పాప మెడికల్‌ ఎంట్రెన్సు, బాబు ఎఐ త్రిబుల్‌ ౪- ఎక్కడ విన్నా యివే మాటలు. ఇంకా టిసెట్‌, ఎంసెట్‌, కెసెట్‌, లొసెట్‌ యీ విధంగా పెక్కు సెట్లు! ఇవిగాక జిఆర్‌ఇ టాఫెల్‌ గేట్‌ బీట్‌ హీట్‌ వగైరాలు ఎన్నో? ఇవన్నీ విదేశీ ఛానెల్సు. ఈ ఎంటెన్సులన్నీ పెద్ద ప్రిస్టేజి పాయింటు అయిపోయాయి. పార్లీలోనో పెళ్లిలోనో కలిస్తే ఐఐటి వొటైన్స్‌ పం కలిదందు ర జనర ట్‌ ఫ్య క్‌ , కోట లాంటి పెద్ద విషయాలపై చర్చ చేరతారు. చుక్కా రామయ్య, కృష్ణమూర్తి నారాయణి నడుస్తుంది. ఏ ఆధర్‌ పుస్తకాలు మంచివో, వ బిట్‌ బ్యాంక్‌ మీద ఆధారపడాలో బిట్స్‌ పేరెంట్స్‌ శ్రా ” రో శ! ళా! క చా జ్‌

మాట్లాడుకుంటారు. ఎంసెట్‌ వాళ్లు కొంచెం దూరంగా కూచుంటారు. ఇక సాదాసీదా గ్రాడ్యుయేట్‌ బాపతు వాళ్లయితే చెట్ల కింద నిలబడి మాట్లాడుకోవలసిందే! ఈ విధంగా యీ ఎంట్రెన్స్‌ చదువులు మానవ సంబంధాలను నిర్ధారిస్తున్నాయి.

ఒకప్పుడు లాయరంటే గొప్పగా వుండేది. ఇప్పుడు “పాపం! ఆఖరికి లా చదివిస్తున్నారట” అని నిట్టూర్చే పరిస్థితి. కాని లాయర్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మనిషి వున్నన్నాళ్లు మాట తేడా వుంటుంది. తద్వారా లిటిగేషన్‌ పుడుతుంది. లిటిగేషన్‌ ద్వారా జనించే డబ్బు లాయర్లకు చెందుతుంది. అందు కని లాయర్‌గిరీ పాలకుంద లాంటిది మానవ సంబంధాలు యీ వృత్తిలో వున్నంత విశేషంగా మరే వృత్తిలోనూ వుండవు. ఇక వకాల్తా పడిందంటే, లాయరు ఆయన గుమస్తాలు, జడ్డీగారు, బెంచి గుమస్తా డవాలా బంట్రోతు, సాక్షులు, యిలా బోలెడు మంది రంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. వీరి మధ్య రకరకాల మానవ సంబంధాలు పిలకలు తొడిగి, ఎప్పటికీ తేలని కేసుల వల్ల పిలకలు మానులై చేవతేల్తాయి. సగటున ఇరవై పాతిక ఏళ్లు నడిచే వ్యాజ్యాల వల్ల తండ్రులు తాతలు అయిపోతుంటారు క్షయింట్లూ లాయర్లూ కూడా. ఇది లాయర్లూ- మానవ సంబంధాలూ అనే అంశంలో వివరంగా చర్చించుకోవాల్సిన సంగతి.

మళ్లీ ఎంట్రెన్స్‌ల్లోకి వస్తే- అనుబంధంగా ఎన్ని పరిభ్రమలు వచ్చాయో చూడండి. కోచింగ్‌ సెంటర్లు, పూర్తిస్థాయి చైన్‌ కాలేజీలు, సింగిల్‌ సబ్బెక్ట్‌ కోచ్‌లు, పోస్టల్‌ ట్యూషన్లు, నెట్‌ కోచింగ్‌ యిలా వచ్చేశాయి. వీటికి అనుబంధంగా టైం మేనేజ్‌మెంట్‌ మీద మీ పిల్లలను సానపడతామని కొందరు అకురాళ్లతో తిరుగుతున్నారు. “ఎంట్రన్స్‌లో నెగ్గాలంటే చదువు మాత్రమే చాలదు” అని మరికొందరు బయలుదేరారు. పిల్లలకు (స్టెస్‌ వుండకూడదు, మానసిక వత్తిడిని లాగేస్తాం మా రాపిడ్‌ కోర్స్‌లో చేర్చండి” అని ప్రకటనలు యిస్తున్నారు యింకొందరు. ఇందులోనే చిన్న మార్పులతో “భయం వద్దు”, “కంగారు పడద్దు, “రాంక్‌ మీదే!” యిలాంటి నినాదాలతో మానసిక తత్త్వవేత్తలమని చెప్పుకుంటూ వలలు పన్నేవారూ వున్నారు. “పేరెంట్స్‌కి ప్రత్యేకం” అని, అసలు (స్టెస్‌ వాళ్లకే ఎక్కువ వుంటోందని దీనివల్ల అల్సర్స్‌ రావడానికి అవకాశం వుందని కొందరు హెచ్చరించి, తర్వాత ఓసారి కన్చించమని అంటు న్నారు. ఇదంతా ఒక మాయాజాలంలా మారింది మానవ సంబంధాల మాట ఎట్లా వున్నా, దబ్బు వేగంగా చేతులు మారుతోంది.

ఇది యిట్లా వుండగా “సరికొత్త బూస్ట్‌- ఇది తాగితే రాంక్‌ గ్యారెంటీ! ట్రింగ్‌ ట్రింగ్‌” అంటూ కమర్షియల్స్‌. “చిలక మార్క్‌ ష్లాన్క్‌లో హార్లిక్స్‌ తాగాను. అదే నా విజయ రహస్యం” అంటాడా కుర్రాడు. “సాధన బల్బులు! మీ బాబుకి ఫస్ట్‌ రాంక్‌ రావాలనుకుంటున్నారా. (శ్రమ తెలియని కాంతినిచ్చే సాధన బల్ఫులనే వాడండి!”

“థాంక్యూ ర్యాంకీ” అంటుంది ఒక పిల్ల, మీ తలను ఎల్లప్పుడూ చల్లగా వుంచుతుంది. నేను ఫస్ట్‌ రావడానికి ర్యాంకీ షాంపూనే కారణం” అని నవ్వుతూ చెబుతుంది ఆ పిల్ల. తువ్వాళ్లు, చెప్పులు, కలాలు అన్నిటికీ యీ ఎంట్రెన్స్‌లు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా మారాయి.

పూర్వం రోజుల్లో చిలక జోస్యం చెప్పించుకొనే వాళ్లు. పూజలు, మొక్కులు అనాదిగా 66 మానవ సంబంధాలు

వస్తున్న ఆచారం. ఎటొచ్చీ యీ ఎంట్రెన్సులూ అవీ పాత దేవుళ్లకి తెలియదు. చిలుకూరు వెంకటేశ్వరస్వామికి వీసాస్వామీ అని సార్ధక నామధేయం వచ్చింది. మా కా లనీ సాయిబాబాకి ఎంట్రెన్స్‌ల మీద పట్టు వుందని వాడుక. ఎందుకో స్టూడెంట్లు శివుడు జోలికీ వెళ్లరు. వినాయకుణ్ణి నమ్ముతారు. ఈ మధ్య ఓ కుగ్రాడు “అంకుల్‌ బిట్స్‌ ఎంట్రెన్స్‌కె వినాయకుడు బెస్ట్‌” అని చెప్పాడు. ఏమిటో దేవుడంటే మనిషికి చనువు. ఇక్కడ మానవ సంబంధాల కంటే దైన సంబంధాల పవరు ఎక్కువ.

పక్కింటి పిన్నిగారు కాఫీ పొడి అరువు అడిగినట్టు, కార్పొరేట్‌ కాలేజీలు ర్యాంకులు అరువు తీసుకుంటారట! విడిగా పొసైన పిల్లల్ని, వాళ్ల వాల్‌ టిక్కెట్ల నెంబర్లనీ తీసుకుని వాళ్ల ఖాతాలో జమ వేసుకుంటారు మా న్మూలు నుంచీ నాలుగు వందల మంది హాజరైతే నాలుగు వందల తొమ్మది రాంకులు వచ్చాయని పేపర్లో ప్రకటన వస్తుంది. ఇలా పిల్లల్ని కాసేపు అరువు తీసుకోడంలో మానవ సంబంధాలు వున్నాయి. న

ఆమధ్య ఒక పెద్ద మనిషి తగిలాడు. ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి బాగ్గ చదువుతున్నారు. ఆ పెద్ద మనిషి పెద్ద కంట్రాక్టరు. ఎక్కడైనా ఐఐటి ఎంటెన్స్‌ల్‌ వందల 1) ర్యాంకు వచ్చిన కుర్రాడు మీ ఎరుకలో వుంటే చెప్పందన్నాడు. “ఎందుకు, చదివిస్తారా న్నాను. “చదివించడమే కాదు, నేనా పిల్లాణ్ణి దత్తత చేసుకుంటా” అన్నాదాయన. శ ఆ వ్‌ గా చూసి మీకు యిద్దరు పిల్లలు కదా, ఇంకెందుకు అన్నాను. వీళ్లిద్దర్లోనూ మ గ కన్పించడం లేదు. “ఆ కుర్రాడు వెళ్లాడనుకో! ఫలానా వాళ్లబ్బాయ్‌ స్టేట్స్‌ వం ని నద్యోసం లేస్తున్నాడంటే మనకి అదో డిగ్నిటీ కదా” అన్నాడు! మానవ సంబంధాల న్‌ విస్తుపోవడం యీసారి నా వంతు అయింది. ల శ్రీరమణ 87

కరిత్త్యం - రోనీ5 నం'ంధొలు

“బొధకు పర్యాయ పదం” అన్నాడు శ్రీశ్రీ కవిత్వాన్ని నిర్వచిస్తూ,

“కవిత్వం అబద్దానికి పుట్టిన ఆడపిల్ల” అన్నాదొక ఆంగ్లకవి.

“బంగారు పూతపూసిన కుద్యాలు, పాలరాతి సౌధాలు రెండు గొప్ప వాక్యాల కంటె ఎక్కువ కాలం మనజాలవు” అన్నాడు షేక్స్‌పియర్‌.

“కవిత్వం ఒక మెరుపు” అన్నాడు ఖలీల్‌ జిబ్రాన్‌.

“కాదండీ, అది మెదడును హరించిన పిడుగు” అన్నాడొక శ్రోత- కవి సమ్మేళనం నుంచి బయటకు వస్తూ-

కొందరేమంటారంటే ఊహా సుందరి మీద, అడ్డమైన దేవుళ్ల మీద ఛందోవృత్తాలు రాస్తూ, రాచ కొలువులో కొన్ని వేల సంవత్సరాల పాటు కవిత్వం మగ్గిపోయిందంటారు. కొందరేమో “అదే నయం, జనంలోకి వచ్చాక కవిహింస పెరిగిపోయింది” అంటున్నారు.

మనిషి మేథస్సు చేసుకునే వాంతిలా వుండకూడదు కవిత్వం. అందం, ఆనందం దాని పరమావధి కావాలని పొయిట్రీ బాధితులు అంటుంటారు. కవిత్వపు దెబ్బలు కూడా పోలీసు దెబ్బల్లా, లోలోపల కుళ్లపొడుస్తాయని పడనివాళ్లు అంటుంటారు. కవిత్వంతో మానవ సంబంధాలు విపరీతంగా దెబ్బతింటాయి. ఒక్కోసారి మనుషుల్ని కవిత్వం దగ్గర చేస్తుంది.

శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను మెయిన్‌ టెయిన్‌ చేశాడు. ఆయన అనేక దండయాత్రలు చేసి, రాజ్యాన్ని విస్తరించాడు. యుద్దానికి ముందు కొలువు తీరి కవిత్వం వినేవాడట. వినగా వినగా జీవితం మీద విరక్తి పుట్టేదిట అప్పుడు “అందుకోండి కత్తి అంటూ విజ్బంభించేవాదని కొందరి ఊహ. విజయమో, వీర మరణమో అనేది శౌర్యవంతుని లక్ష్యం. కవిత్వం వినీ వినీ, బుర్ర బద్దలవడం కంటె యుద్ధంలో తనమునకలవడం మేలు కదా! మనకు స్పష్టమైన చరిత్ర లేనందు వల్ల, యిలా రకరకాలుగా చెబుతుంటారు. కొన్ని నమ్మాల్సి వస్తుంది.

కంటి చూపుతో చంపేస్తానన్నట్టు, కవిత్వంతో చంపేస్తాననడం పరిపాటి అయింది. ఇంట్లో ఒక మంచి వాటా పది రూపాయలు చౌకగా యిస్తానని యింటి యజమాని అంటే- మీ యింట్లో పొయిట్రీ రాసే వాళ్లున్నారా అని సందేహంగా అడిగే రోజులివి సైన్సు సిద్ధాంతాలకు శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి. సంగీతానికి సాధన కావాలి. సైకిలు లొక్కడానికి ప్రాక్టీసు ముఖ్యం. కుమ్మరం, కమ్మరం, వడ్రంగం, చేనేత లాంటి వృత్తివిద్యలకు నైపుణ్యం కావాలి. కాని, కవిత్వానికి ఏమీ అవసరం లేదు. ఆశు కవితకైతే కాగితం కలంతో కూడా పనిలేదు. (శ్రోత దొరికితే వ్రతానికి ఫలం దక్కుతుంది. కష్టాల్స్‌ నష్టాల్‌ శోతలకే గాని కవి ఎప్పుడూ సురక్షితం. పోతే 88 మానవ సంబంధాలు

త్య షస లగ (ళా ఈ) నటం 1 న యా

మానవ సంబంధాలు పోతొయి. బతికి వుంటే మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు

మా చందు మావయ్య ముప్పై ఏళ్ల క్రితం పైసా కట్నం లేకుండా సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. వెనకాల యిల్లు వాకిలీ వుంది. పొలం పుట్రా వుంది. మంచి కుటుంబం. అన్నిటినీ మించి టీచర్‌ వుద్యోగం. ఆ రోజుల్లో ఏడాదికి సగం రోజులు సెలవులు. ఇలాంటి గొప్ప నేపధ్యం వున్న చంద్రశేఖరరావు అల్లుడుగా దొరకడం, ఏనాడో చేసుకున్న పుణ్యంగా వైఫ్‌ వైపు వాళ్లు భావించారు. పైగా వక్కపొడి కూదా వేసుకునే అలవాటు లేదు. నోట్లో వేలు పెడితేనవ్వేవాడు గాని, కారికేవాడు కాదు. సావిత్రి కాపరానికీ వచ్చన వారం, పది రోజులకే మావయ్య ధోరణిలో మార్చు కనిపించింది. అత్తయ్యని అంత్వప్రాసలతో ముంచెత్తడం మొదలుపెట్టాడు ఏదో కొత్త పెళ్లికొడుకు, పైగా వుడుకునెత్తురని సద్దుకున్నారు. నాలుగైదు నెలలు గడిచేసరికి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాయి కవిత్వం రాస్తాడట, పాపం! సావిత్రి. అని అయిన వాళ్లలో గుసగుసలు వినిపించాయి. అందుకే కట్నం వద్దని, ఆదర్శంగా చేసుకున్నారు పెళ్లి అమ్మాయి గొంతుకోశారు- అని సానుభూతి ప్రకటించారు. “తలరాతని ఎవరూ తప్పించలేరు” అని నిట్టూర్చారు మరికొందరు. రోజూ అయిదారు కవితలు, ఒక్కోటి మూరన్నర తక్కువ లేకుండా వుందే కవితలు సమయం సందర్భం లేకుండా వినిపించే వాడట ఒక్కోసారి అర్థరాత్రి, మరోసారి మిట్ట మధ్యాన్నం పూట అత్తయ్య మీద స్వీయ కవితలతో విరుచుకుపడేవాడు. కాపరం మాట దేవుడెరుగు, ఎప్పుడో చిఠెతి కత్తిపీటతోనో పేక తెగేస్తుందని దగ్గరివాళ్లు అత్తయ్య గురించి భయపడేవాళ్లు. అందరూ వూహించినట్టు మానవ సంబంధాలు ఏమాత్రం చెదరలేదు.ఇంత హన వన శ్రీరమణ ో

కష్టంలోనూ అత్తయ్య యిద్దరు పిల్లల్ని కన్నది. క్రమేపీ చందు మావయ్య కవిత్వానికి దూరమయ్యాడు. కారణం మామూలే! అత్తయ్య కూడా కవితలు అల్లడం మొదలుపెట్టింది. మొదట్లో సరికిసరి అని ఒప్పందం. తర్వాత ఒకటికి రెండు అన్నది. దాంతో మావయ్య బతికుంటే బలుసాకు తినచ్చని కవత్వాన్ని కాశీ వెళ్లకుండానే పూర్తిగా విసర్జించాడు. అప్పట్నించీ సావిత్రి అత్తయ్యని అందరూ సతీసావిత్రి అని పిలిచేవారు.

కవిత్వం రాసే వాళ్లకు భగవంతుడు ఆకాశమంత జ్ఞాపకశక్తి యిస్తాడు. రైల్లో, బస్సులో పక్కసీట్లోంచి వున్నట్టుండి అసంబంధమైన పదాలు నాలుగు వినిపిస్తాయి. మనం ఏమిటీ అని చెవులు రిక్కిస్తాం! అప్పటికే మనం కవిత్వంలో వున్నాం. గమ్యం చేరేదాకా మీరిక శ్లేష్మంలో ఈగే! అయితే, పెద్దలు అనుభవజ్ఞులు వీటికి అనేక విరుగుడులు కనిపెట్టారు. మహానుభావుడు మల్లాది రామకృష్ణశాస్త్రికి కవుల తాకిడి విపరీతంగా వుండేది. గురువుగారు వింటే చాలని ఆరోజుల్లో చెన్నపట్నం యువ కవులంతా వుబలాటపడే వారు. కాని ఆయన మనోస్థితి గమనించాలి కదా. ఒక కవి యిలాగే కవితా చుట్టలతో వచ్చి తిష్టవేశాడట. మల్లాది వారు వొళ్లంతా చెవులు చేసుకుని “ఏది.. కానియ” అన్నారట. అన్నదే తడవుగా కవి రెచ్చిపోయాడు. ఒకటిన్నర లైను కాగానే, చిరునవ్వుతో చేతి సైగతో అతన్ని ఆపారట. కవి విస్తుపోయి ఆగాడట. “ఆహా... ఆహా... నాయనా చెవిలో అమృతం పోశావోయ్‌, యీ ముక్కలు విన్నాక మరింక ఏమీ వినాలని లేదు, వినలేను” అని చిదానందంగా, తన్మయులై తనలో తనే నవ్వుకోవడం మొదలుపెట్టారట. ఈసారి బిత్తరపోవడం కవి వంతు అయింది. గురువుగారి ప్రశంసకు పొంగిపోవాలో, పంక్తిన్నరతో ఆగిన కవితా పరనానికి కుంగిపోవాలో అర్ధం కాలేదు. ఈ లౌక్యం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినకుండా కవిత్వపు సుడిలోంచి అలవోకగా వొడ్డున పడగలిగారు. అందరికీ యీపాటి సమయస్ఫూర్తి వుందడ్దూ.

బార్‌లో కవిత్వం వినిపిస్తూ వుంటుంది పాపం శ్రోతలు చచ్చినట్టు వింటుంటారు. ఎలా భరిస్తున్నారని అడిగితే “బిల్లు యిచ్చేది అతనే, పాలకోసం నల్లరాయి మోయక తప్పదు” అన్నారు బార్‌ మిత్రులు. కవిత్వం మీద వచ్చినన్ని పిచ్చి రచనలు దేనిమీదా వచ్చి వుండవు. అయినా రాసేవాళ్ల ఆగడాలు ఆగడం లేదు.

కవిత్వం దైవ స్వరూపం. యుగ యుగాలుగా దేవుడు లేడని వాదించే వాళ్లు అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో వున్నారు. అయినా దేవుడు చెక్కుచెదరలేదు. కవిత్వం కూడా అంతే. ఎవరెన్ని అన్నా, అదొక మహా ప్రవాహం. భూగర్భ జలాలు యింకినా, సముద్రాలే యింకినా కవిత్వం యింకదు. “అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక” అన్నారు కాళోజి. ఆమధ్య ఒక స్థానిక కవి సమ్మేళనానికి వెళితే, ఎవరికి వారే గుమ్మం పక్కన కూచోడాని కుమ్ములాడుకున్నారు. మూడో కవి వచ్చేసరికి శ్రోతలు జారుకోవడం తీవ్రమైంది. ఒకాయన “అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్కవంద కాళ్లకు కదలిక” అనుకుంటూ బయటకు నడిచాడు. సరిగ్గా ఆప్పుడే ప్రపంచీకరణ- మానవ సంబంధాల మీద ధాటిగా తన కవితను వినిపిస్తున్నాడు కవి. (0 90 మానవ సంబంధాలు

ల చదువు - రూసీ5్‌ నంశ౮ంధొలళొ నలజై ఏళ్లు దాటినా వీరబాబు అక్షరాభ్యాస మహోత్సవం నా కళ్ల ముందు యింకా యిప్పటికీ కదలాడుతూ వుంటుంది. వీరబాబు సిల్కు దుస్తులు, తలమీద తురాయి టోపీ, మెడలో ముత్యాలపేరు ఛోటా నవాబ్‌లా తయారు చేశారు. మంగళవాద్యాలు వెంట రాగా, పూసల పల్లకీలో వూరేగింపుగా స్కూలుకి వచ్చాడు ఊరి పెద్దలు, వాళ్ల బంధువులు, మా హెద్మాస్టారు, టీచర్లు, పిల్లలు కూడా నడిచాం. రెండు కావిళ్లతో పలకలు, అరటి పళ్ల గెలలు, పప్పు బెల్లాలు కూడా వెంట నడిచాయి. వీరబాబు వాళ్ల నాన్న మా వూళ్లో పెద్ద భూస్వామి. ఒక రైసుమిల్లు నాలుగు గోడౌన్లు కూదా వున్నాయి. అక్షరూఖ్యాసం అయ్యాక మా అందరికీ పలకలు పంచిపెట్టారు. అరటి పళ్లు, బిస్కెట్లు కూడా యిచ్చారు. హెడ్మాస్టారు వీరబాబుని తన వొళ్లో కూచోపెట్టుకుని ఓనమః అక్షరాలు దిద్దించారు. పలక వాడివల్లనే వచ్చిందనే విశ్వాసంతో, వీరబాబు అంటే కొంచెం మర్యాదగా వుందేవాళ్లం. మా టీచర్లు మమ్మల్ని ఏరా అనే వాళ్లు గాని వీరబాబుని ఏమోయ్‌ అనేవాళ్లు. వ్రతాలు ఘనంగా చేసినంత మాత్రాన ఫలితాలు ఘనంగా దక్కాలని లేదు. వీరబాబు మూడో తరగతి దాటి మరి పైకి వెళ్లలేదు. ఎట్లాగైనా ఎంట్రెన్స్‌ రాయించి ఫస స్‌ / 0 జీళ 0 న్‌ స, 1 ఈ శ్రీరమణ హ్‌!

ఫారమ్‌లో వేసేద్దామని చూశారు. అయితే వీరబాబు ససేమిరా అని కాడికింద పదేశాడు. ఇదుగో యిలాంటప్పుడే మానవ సంబంధాలు కొంచెం యిబ్బంది. పెడతాయి. వీరబాబు పలకలతో మేమంతా నాలుగో తరగతిలో పడిపోవడం, అతను మూడుతో డ్రాప్‌ అవుట్‌ అపడం మా అందరికీ యిబ్బందికరంగా మారింది. వీరబాబు ఎప్పుదేనా ఇంటర్వెల్‌టో బడికి వచ్చి మాతో కాసేపు గోళీలు, బచ్చాలు ఆడుకుని వెళుతుంటేవాదు. అతని స్వేచ్చా జీవితం చూస్తే మాకెంతో యీర్యగా వుండేది. మేము రైసు మిల్లుకి వెళితే వీరబాబు అక్కడ అజమాయిషీ చేస్తూ కనిపించేవాడు. ఒకసారి మేము కబర్జీ కోర్టులో పోయడానికి ఊక కావాలంటే, కావల్సినంత తీసికెళ్లండని సాయం చేశాడు. అదే మరి, గొప్పవాడు క్లాస్‌మేట్‌ అయితే లాభం పలకల నించి ఊక దాకా ఏదైనా దక్కచ్చు.

పదో తరగతి అయిపోయాక మేమంతా తలోదారి అయిపోయాం. స్కూలు వార్చికోత్సవం రోజు “ ఏమి చదివి చేప పిల్ల యీదకలిగెను .. పక్షులు పైగెర కలిగెనూ” పాటని పదేపదే మైకులో వేస్తుంటే హెద్మా స్టరు మా ఎస్‌పిఎల్‌ని చావగొట్టి చెవులు మూశారు. అంతకుముందు కాళహస్తీశ్వర శతకంలో “ఏ వేదంబు పరించె లూత, చెంచే మంత్రమూహించే... చదువులయ్యాకావు” అని చదువుకున్నాను ప్రతిపదార్థం కూడా నేర్చుకున్నాం శ్రీకాళహస్తీశ్వరో అయినా, మరి యీ చదువులేంటో, గోడ్ర కుర్చీలేంటో అరం కాదు. ఎప్పుడూ చదివేదానికీ, చేసేదానికీ పొంతన వుండదు జయనెవరో మహానుభావుడు “చదువులయ్యా కావు” అని పద్యంలో చెప్పినపుడు లాంగ్‌ బెల్‌ కొట్టి పిలకాయల్ని యింటికి పంపాలి కదా. పంపరు. ఇదిగో యిట్లాంటప్పుడే పిల్లలకి పెద్దవాళ్ల మీద గౌరవాలు నమ్మకాలు పోతాయి. బాల్యంలోనే మాసవ సంబంధాలు దెబ్బతినేసి చక్కాపోతాయి. నాగరాజు అని మా కాసుమేటు. వాళ్ల నాన్న ఎక్కడెక్కడికో వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడి పేకాట ఆడి డబ్బు సంపాయించేవాడు ఆయన ఆటలో కూచుంటే రావడమే తప్ప, పోవడం వృండదుట. నాగరాజుని మీ నాన్న ఏం చేస్తాద్రొ జని అడిగితే బిజినెస్‌ అని చెప్పేవాడు. వాళ్లకి మా వూళ్లో పదెకరాల నిమ్మతోట డాబా యిల్లు వుండేవి, వాళ్ల నాన్న బిజినెస్‌లో సంషాయించినవే అవన్నీ అంచేత డబ్బు సంపాయించాలంటే చదువే అక్కళ్లేదు. చాలా దారులు వున్నాయని మేం తీరికవేళల్లో ముచ్చటించుకునే వాళ్లం. ఓరోజు మా మాట విని, మా సోషల్‌ మేష్టారు అగ్గమీద గుగల అయారు. చదువుకోవడం చదువు కోసమే, నాట్‌ ఫర్‌ మనీ బ్రని అరిచారు. ఆయనకి కోపం వస్తే ఇంగ్లీషు వచ్చేస్తుంది. మామూలుగా అయితే చచ్చినా రాదు *మ్సర్రి మా నాయనమ్మ బాగా చదువుకుంటే బాగో దబ్బులు వస్తాయని చెప్పిందేమండీ” అన్నాడొకడు “డబ్బులు కూడా వస్తాయి అందుకని మీరు చదువు మీద శ్రద్ధపెట్టాలి. సబ్జెక్ట్‌ ఫింగర్‌ టిప్స్‌ మీద వుండాలా అంటూ స పేర్లన్నీ

ల్‌ అంటూ సముద్రాల వరసగా చెప్పి ఆయనని చూసి ఆయనే గర్వపడి వెళ్లిప్రోయాద్రు

ఇంటర్‌ ఫస్ట్‌ యియర్‌, ఎంసెట్‌ కోచింగు అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అని నన్ను హాస్టల్‌లో పడేశారు తెల్లవారు జామున నాలుగు కాకుండానే బూటు కాళ చహుడు వినిపించేది హాస్టల్‌లో. అక్కడనించి యింక బిట్లు వల్లించుకుంటూ ఫ్ర్వోడ్షమే. రెండు వేం బీట్‌ కొశ్చన్స్‌కీ నిద్రలో లేపినా, వులికిపాటు లేకుండా జవాబులు చెప్పేసే వాళ్లం, కోచింగ్‌ వంటో మానన నన యన ల స ర 92 మానవ సంబంధాలో

సంబంధాలకు అస్కారం వుండదు. అక్కడ పిల్లలకు చదువు రావడమే కాదు ముఖ్యం, కాలేజికి ర్యాంకులు రావడం ముఖ్యం. తర్వాత సంవత్సరం పబ్లిసిటీకి యీ ర్యాంక్ల వాళ్లే (బ్రాండ్‌ అంబాసిడర్లు ఇంటి దగ్గర తల్లిదండ్రులు తమ పిల్లలు సానపెట్టిన వజ్రాలుగా తయారవుతున్నారని మరిసిపోతూ వుంటారు. ఎంత ఎక్కువ ర్యాంకు వస్తే అంత గౌరవం- పేరెంట్స్‌కి. తర్వాత పిల్లల యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పెద్ద బళ్లో వేసేస్తారు. ఫలానా (బ్రాంచి, ఫలానా, ఫలానా అని ముందే నిర్ణయాలు అయి పోతాయి కౌన్సిలింగ్‌లో కంప్యూటర్‌ సంబంధాలే గాని మానవ సంబంధాలు వుండవు అంతా షేర్‌ మార్మెట్‌లా వుంటుంది అక్కడ అమెరికాలో దేనికి డిమాండ్‌ వుందో క్షణక్షణం అక్కడి కజిన్స్‌ ఫోన్లు చేస్తుంటారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మానవ సంబంధాలు చెలరేగుతూ వుంటాయి

“ఇప్పుదేముందోయ్‌ బి.టెక్‌ అంటే జస్ట్‌ డిగ్రీ లాంటిది పి.జి చేసుకో” అని పెద్దాయన సలహా మొత్తంమీద యీ హడావిడి అంతా సాగింది నేనూ, చిన్నప్పటి నుంచీ కలిసి నడుస్తున్న మరో నలుగురు బాల్యమిక్రులం ఒకే పడవలో వున్నాం దృశ్యాన్ని కట్‌ చేస్తే- వీరమాబు క్లోజప్‌లో కనిపిస్తున్నాడు. రైసు మిల్లు అంత లాభసాటిగా లేదని, దాన్ని దాని తాలూకు గోడౌన్స్‌ని చూపించి ఇక ఇంజనీరింగ్‌ కాలేజి స్థాపించాడు. వీరబాబు విద్యాభివృద్ధికి యితోధికంగా కృషి చేస్తున్నాడని పేపర్లు రాసేశాయి. అప్పటికే వీరబాబు రాజకీయంగా ఓ స్థాయికి ఎదిగాడు చేతిలో ఇన్‌ఫ్రా స్టక్సర్‌ వుందని కాలేజి పెట్టేశాడు వీరబాబు పలకలతో అక్షరాలు దిద్దినవాళ్లం అయిదారుగురం కలిసి వెళ్లాం. వీరబాబుని మేం అసలు గుర్తుపట్టలేకపోయాం. న్యూస్‌లో వుంటున్నాడు కాబట్టీ, తరచు పేపర్లలో ఫోటోలు పదుతూనే వున్నాయి. పాపం, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి మమ్మల్ని బాగానే రిసీవ్‌ చేసు కున్నాడు. యోగక్షేమాలు అయినాయి. కాసేపు వీర బాబు విద్యకి చేస్తున్న సేవ గురించి పొగిదాం. మేము వచ్చిన పని వీరబాబుకి అర్ధమైంది. “వదువులయ్యా కావు” అన్నారు కదా పెద్దలు సాధారణ తెలివిగలవాడైతే మాలాగే తయారయ్యేవాడు. జ్ఞాని కాబట్టే మూడు దగ్గర అగి, రైస్‌ మిల్‌ వైపు నడిచాడు.

మా బయోడేటాలు వాళ్ల సెక్రటరీకి యిమ్మన్నాదు. అలాగే యిచ్చాం ఎంతైనా ఒక వూరి వాళ్లం, ఒక స్కూలు వాళ్లం కాబట్టీ మాకు పోస్టింగ్స్‌ యిస్తాడని ఖాయం చేసుకున్నాం. పైగా మేమంతా మంచి మార్కులతో వి జి.లు పూర్తిచేసిన వాళ్లం. ఎంతైనా మానవ సంబంధాలకు వుండే శక్తిని కూదా తక్కువ అంచనా వెయ్యలేం కదా మేం వెళ్లిపోయాం. పిలుపు కోసం నిరీక్షించాం. మూడు నెలలు దాటినా మాటా మంచీ లేదు. కొంత నిరాశపడ్డాం. కొంచెం ఉక్రోషపడ్డాం. మాలో ఒకడు ఎంక్రైరీ చేశాడు. తెలిసిందే మంటే వీరబాబు మాకు మినహా మిగిలిన వాళ్లకి పోస్టింగ్స్‌ యిమ్మని గట్టిగా చెప్పాట్ట! వివరాల్లోకి వెళితే- “బాగా తెలిసిన వాళ్లని సిస్టమ్‌ లోపలికి రాసీకూడదు. వచ్చిందగ్గర నుంచీ చిన్నప్పటి కబుర్లు కధలు కధలుగా చెబుతుంటారు. ఈ ఫ్లాష్‌బ్యాక్‌గా వాళ్లని దూరంగా వుంచడం మంచిది” అన్నాట్ట వీరబాబు చేప పిల్లలు ఏమి నేర్చి యీదుతున్నాయో కొద్దిగా మాకు అర్ధమైంది- మానవ సంబంధాల మాట పక్కన పెడితే రై న. శ్రీరమణ నో

రూమిసిరళ్లూ - ూసీరీ సం1ంంధాలూ ద గ్గ

తివిరి యిసుముకన తైలంబు తీయవచ్చు (అరబ్‌ దేశాలలో తీస్తున్నారు కదా) జీన్‌ కల్చర్‌తో కుందేటి కొమ్ము సాధించవచ్చు. కాని సీజన్‌ కాని సీజన్‌లో బంగినపల్లి కోతకాయలు, నూజివీడు రసాలు తినడం అసాధ్యం. వేసం కాలం వస్తోందంటే - వడగాడ్పులు, ఉక్కపోతలు, కరెంటు కోతలు లాంటి యీతి బాధల మధ్య ఇంటిల్లిపాదికీ వూరట మామిడి పళ్లు. రాధాగోపాలాలకు మల్లెపూలు అదనపు అయస్కాంతాలు. మల్లెపూలు కాసేపు పక్కనపెట్టి, మామిడి పళ్లలోకి వద్దాం. ఈ భూమ్మీద ఎన్నిరకాల పళ్లు లేవు? అయినా గాని మామిడి పళ్లతో మనిషికి వున్న సంబంధం మరో పండుతో వుండదుగాక వుండదు.

బంధువుల యింటికి వెళ్తుంటే వొట్టి చేతులతో వెళ్లకూడదని ఒక రూలు వుండేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే పాలిథిన్‌ కవర్లు వచ్చాయిగాని అప్పట్లో తాటాకు బుట్టలు చిన్నదైతే బేదా, పెద్దది పావలా. అసలు డజను కొంటే బుట్ట ఫ్రీగా యివ్వాలని కొన్నవాళ్లు పీక్కుతినేసేవారు. బంగినపల్లి పళ్లు ఒక చేతికి అమిరేవి కావు. నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు, పెరుగు బుద్దు, నీలాలు, మాల్‌గోవా యిలాగ బోలెడు రకాలు. ఏవైనా నూజివీడు రసాలకు దిగతుడుపే. మామిడి పళ్లు, వేసవి సెలవలు ఒక్కసారి వచ్చేవి. ఫస్టుఫారం నుంచి ఫిఫ్త్‌ఫారం దాకా ఎవరి టీచర్లు వాళ్ల పేపర్లు దిద్దేవారు. ఏ సబ్జెక్టులో డౌటు వుంటే ఆ మేష్టారింటికి ఓ డజను పెద్దరసాలు బుట్టలో పెట్టుకువెళ్లడమే. పన్నెండు పళ్లకీ హీనపక్షం పన్నెండు మార్కులు పడేవి. కొన్ని మరీ సన్యాసి కేసులుండేవి. లెక్కల్లో సైన్సులో ఒక అంకె మార్కులు అంటే పదిలోప్తు వచ్చేవి. వాళ్లని పైకి లాగాలంటే కొంచెం పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చేది. ఒకసారి యిలాంటి కేసు గురించి వెళితే - మాష్టారు పేపరు తీసి “బొత్తిగా ఏడు మార్కులు వస్తే, ఏకంగా! ఇరవై ఎనిమిది కలపడమంటే... నా మనసు ఘోషిస్తోంది” అని బాధపడ్గారు. అప్పటికీ పాతిక రసాలు రెండు బుట్టల్లో తీసికెళ్లాం. మేష్టారూ, మీ ఘోష తగ్గడానికి మరో మాట చెప్పండని వెళ్లిన పెద్దమనుషులు అడిగారు. ఆయన ఆలోచించి “ముందసలు రెండు అడిషనల్‌ షీట్లు, తప్పులు లేకుండా నాలుగు పెద్ద లెక్కలు, ఆరు బిట్లు తిరగరాసి తగిలించాలి” అన్నారు. అలాగే, అబ్బాయి, యిక్షడే గుమ్మం బయట వున్నాడు. మీరు సరే అంటే అలాగే అవేవో చేస్తాదు. ఎటొచ్చీ మీరు అవేవో రాసివ్వాలి” అన్నారు పెద్దలు. మేష్టారు “అయితే ఓ పని చెయ్యండి. మీరు 'మూడ్రోజులు ఆగి మళ్లీ రండి. అంతా సిద్ధం చేస్తాను” అన్నారు. వాళ్లు నమస్కరించి, పళ్ల బుట్టలు అక్కడ వదిలేసి వెళ్తుంటే మేష్టారు “అయ్యా, యీసారి అబ్బాయిని తీసుకురండి. వొట్టి చేతులతో ఎటూ రారనుకోండి” అన్నారు. వీళ్లకి విషయం అర్ధమైంది. మరో పాతికకి టెండరు 94 మానవ సంబంధాలు

ప

లగే

త్త

డ్స్‌ ల

1 / 5 మ. ఇ ల్‌ 6 పెట్టాడన్నమాట. మొత్తంమీద ముప్పై అయిదు మారులు వేసి, లెక్కల్లో ప్యాస్‌ అనిపించడానికి నాలుగు తఫాలుగా వంద పళ్లు లాగించారు మేష్టారని విన్నాం. అయినా చౌకే. ఆ రోజుల్లో పండు అర్ధరూపాయి. డబ్బు సంగతి అట్లా వుంచండి. ఎంతటి కమ్మటి వాతావరణంలో పని పూర్తయింది. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు మంటత్రవేత్తలు. భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానమైనవి. గురువు గారికి పళ్లు యిచ్చిన పుణ్యమూ దక్కింది. ప్యాస్‌ అయిన ఫలితమూ దక్కింది. మానవ సంబంధాలు ఎగస్తా! మామిడి పండులో మాగ్నెటిక్‌ శక్తి వుంది. దాదాపు ముఫ్పై ఏళ్ల క్రితం నిజంగా జరిగింది

యీ సంఘటన. లోక్‌నాయక్‌ జయట్రకాష్‌ నారాయణ్‌ అస్వస్టులై రాయవేలూరు హాస్పిటల్‌లో వున్నారు. మా బంధువులు కూడా అదే సమయంలో ఆ ఆసుపత్రిలో వున్నారు. వొట్టి చేతులతో ఎలా వెళ్తాం, పైగా పేషెంటు కూడాను అందుకని విజయవాడలో కొంచెం అచ్చీపచ్చీగా వున్న నూజివీడు రసాలు బుట్టలో ప్యాక్‌ చేయించి తీసుకువెళ్లాను. నేను అలా వార్డులోంచి వెళ్తుంటే ప్రతివాళ్లూ ముక్కులు ఎగలేసి, ఆశగా కళ్లు మిటకరించిన వారే! నాకు అదొక గర్వం అనిపించింది. వెల్లూర్‌ హాస్పిటల్‌ స్పెషల్‌ వార్డ్‌ బయట, వరండాలో ఒక పెద్దాయన సిల్కు లాల్చీతో కుర్చీలో కూచుని వున్నాడు. నన్నూ నా బుట్టనీ చూసి ఆయన లేచి నిలబడ్డాడు. ఆ పెద్దాయనకు అప్రయత్నంగా దణ్ణం పెట్టాను “యంగ్‌ మాన్‌, ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌, కెన్‌ యు స్పేర్‌ టు మాంగోస్‌” అన్నాడు చాలా ప్రాధేయపూర్వకంగా. బుట్ట దింపి, పైన పేర్చిన గడ్డి తొలగించి, లోపల్నించి రెండు ఎంపికచేసి, ఆయన చేతిలో పెట్టాను చాలా అని కూడా అడిగాను. ఆయన ఆప్యాయంగా పళ్లు అందుకుని ధాంక్స్‌ చెప్పారు గద్గద స్వరంతో. నేను బయలుదేరుతుంటే “యంగ్‌ మాన్‌, యివి ఎవరికోసమో తెలుసా” అన్నారు. ఆయన పెదాల మీద చిన్న నవ్వు శ్రీరమణ 05

కానీ యీ స్థితిలో ఆయన తినకూడదు. కనీసం ఆయన చూసి ఆనందిస్తారు. మామిడి పళ్ల వాసన ఆయనకు ఆనందాన్ని యివ్వచ్చు” అంటూ లోపలికి కదిలారు. “నువ్వు కూడా రా, జయప్రకాష్‌జీని చూద్దువుగాని” అన్నారు. చాలా అదృష్టంగా భావించాను. డయాలిసిస్‌తో కాలం లాగుతున్న లోక్‌నాయక్‌ను దగ్గరగా చూశాను. ఇంతకీ నన్ను మామీడిపళ్లు అర్ధించిన పెద్దాయన రామనాధ్‌ గోయెంకా. ఎక్స్‌్రైస్‌ ఎస్టేట్స్‌ అధిపతి. దీన్నిబట్టి జయప్రకాష్‌ అంటే ఆయనకు ఎంతటి పూజ్యభావమో వేరే చెప్పకృర్తేదు ఎమర్జన్సీ టైంలో జయప్రకాష్‌ కోసం తన సర్వస్వం పణంగా పెట్టినవాడు గోయెంకా. మానవ సంబంధాల విషయంలో మామిడిపళ్ల పాత్రని నేను జన్మలో మర్చిపోలేను. దానికి కారణం యీ సంఘటన. నాకు యిప్పటికీ జయప్రకాష్‌ నారాయణ్‌ పేరు చెబితే ఉత్తమజాతి మామిడిపళ్ల పరిమళం స్ఫురిస్తుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయని, మామిడిపళ్ల విషయంలో వూరికే రెచ్చిపోకూడదు. ఆ మధ్య మా ఆఫీసులో ఆంజనేయులు పై అధికారి రామారావుని ప్రసన్నం చేసుకోవాలని తెగ తాపత్రయ పడ్డాడు. అందులో భాగంగా ఒక పాతిక కోతపళ్లు, సాతిక చెరుకు రసాలు ఆఫీసర్‌ గారికి ఇంటి దగ్గర అందించాడు. ఏమిటోయ్‌ ఆంజనేలూ, ఏమిటివి” అన్నారాయన. మా మామ గారికి మామిడితోట వుందండీ. నా వైఫ్‌ పుట్టింటి నుంచి వస్తూ తెచ్చింది సార్‌. అందులో తమరికి...” అన్నాడు మెలికలు తిరిగిపోతూ. ఆఫీసరు చాలా ముచ్చటపడ్డారు అంజనేలు స్వామిభక్తికి. సార్ధక నామధేయుడని కూడా అనుకున్నారు. తర్వాత ఇది ఆంజనేలుకి సమస్యగా మారింది. “మీ మాంగారికి ఫోన్‌ చేసి లారీలో ఓ హంద్రెడ్‌ అవీ, ఓ హండ్రెడ్‌ యివీ బుక్‌ చెయ్యమను. జస్ట్‌ ఐ వాంట్‌ డిస్టిబ్యూట్‌...” అన్నాడొక ఫైన్‌ మార్నింగు. “బుక్‌ చేయడం దేనికి, ఎవరో ఒకరు వస్తూనే వుంటార్లెండి” అన్లెప్పి ఆంజనేలు తెల్లారు జూమునే వెళ్లి సికింద్రాబాద్‌ హోలొసీల్‌ మార్కెట్‌లో కొని డైరెక్ట్‌గా బాస్‌ యింటికి చేర్చాడు. “వెరీ గుడ్‌, ఎంతో చెప్పాలి, లేకపోతే యింకోసారి అడగలేను. పైగా ఐ డోంట్‌ లైకిట్‌ యునో...” అన్నాడు బాస్‌ రామారావు, మామిడి పళ్ల సీజన్‌ వెళ్లేలోగా ఆంజనేలు నడ్డి విరిగింది. అందుకే ఓవర్‌ యాక్షన్‌కి పోయి దెబ్బతినకూడదు. మానవ సంబంధాల వరకూ చూసుకోవాలి. అంతేగాని చూసి రమ్మంటే కాల్చి రాకూడదు. దీనివల్ల మానవ సంబంధాలేంటి, రాక్షస సంబంధాలు సైతం దెబ్బతింటాయి. క్‌ 96 మానవ సంబంధాలు

ళ్‌ రారుయ్యుకు చేయిస్తి.. రౌమదాసు కీర్తన గ్రామ్‌ఫోన్‌ మీద వింటుంటే- రికార్డు బాగా అరిగిపోవడంతో ముల్లు గాడిలో పడి- రామయ్యకు చేయిస్తి... రామయ్యకు చేయిస్తి...” అంటూ పాడిందే పాడడం మొదలెట్టింది. ఏమిటీ విపరీతార్ధం అని గాడి తప్పించాను. శీశ్రమ్మకు చేయిస్తి... సీతమ్మకు చేయిస్తి...' అని మొదలెట్టింది “రామయ్యకు చేయిస్తి రతనాల హారమ్ము, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము' అనేది పూర్తి పాఠం.

బిజెపి సర్మార్‌ రామయ్యకు చేయిచ్చిన మాట నిజం. అదేవన్నా అంటే చెయ్యి కాంగ్రెస్‌ వారి ట్రేడ్‌ మార్కు అని వాదిస్తారు గానీ, నిజానికి ఎన్నికల ముందు రామమందిరం విషయం పరిష్కరిస్తామని భక్తులకి మాట ఇచ్చారు కదా. ఒకటికి రెండుసార్లు పవర్‌లోకి వచ్చినా మాట నిలుపుకున్నారు కాదు. అలనాడు సుగ్రీవుడు రాముడితో మైత్రి కుదుర్చుకుని, వాలిని

య

గే స్‌ న.

లి [॥ భ్‌ | యం ఆ యాడ్‌! మ బేపటాలాణు

తతైడడడడడడైడైడడైడాడెడడాడడాోాోాోాోోో లా శ్రీరమణ ౦07

వదిలించుకుని రాజ్యాఖభిషిక్తుడైనాడు. రామకార్యాన్ని పక్కనబెట్టి తారలతో కులకడం మొదలుపెట్టాడు. రాముడు పురుషోత్తముడు కనుక సుగ్రీవుడికి లాంగ్‌ రోప్‌ ఇచ్చాడు ఆ తర్వాత స్త్రాంగ్‌ వార్నింగ్‌ ఇప్పించాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడికి నిషా దిగిపోయింది. అప్పుడు కదా సీతాన్వేషణకై నలుదిశలకు కపిసేన కదిలింది! రాములవారు మాటంటే మాటే. ఆయన మాట తప్పడు. ఇంకోడు తప్పితే క్షమించడు. వనవాసంలో వుండగా ఏజెన్సీ వరియాలో భద్రుడు తగిలి 'ఇక్కడ వుండిపో అని కాళ్లావేళ్లా పడ్డాడు. ఇప్పుడు కాదు తిరుగు ప్రయాణంలో నీ చూట చెల్లిస్తానన్నాడు ఇనకుల తిలకుడు. రావణ సంహారం పూర్తయ్యాక- అయోధ్యలో భరతుడు చితి అంటించుకుని అన్నగారు సకాలంలో రాకపోతే ఆత్మాహుతి తప్పదని మంటల చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి, పుష్పకంలో వాయు వేగంతో బయలుదేరాడు రాముడు. ఆ టెన్షన్‌లో భద్రుడికి ఇచ్చిన మాట మరిచాడు. రామబాణం కంటే రామభక్తి గొప్పది కదా. భద్రుడు రామభక్తుడు. “ఇచ్చిన మాట మర్చిపోయావ్‌- నువ్వేం దేవుడివయ్యా” అని నిష్టూరాలు మొదలుపెట్టాడు. ఏది పోయినా వస్తుంది కానీ, ఒకసారి 'గుడ్‌విలొ పోతే రాదని రాముడు "హలో లక్ష్మణా" అంటూ భద్రుడి ముందు నిలబడ్డాడు. ఆ కంగారులో శంఖచక్రాలు చేతులు మారాయి. అలాగే భద్రగిరి మీద 'ససెటిలైపోయాడు. మరి రామతత్వం అంటే అది. ఢిల్లీ సర్మార్‌ వారు అయోధ్యలో రామమందిరం కడతాం అన్నారు. అద్భుతాలు చేస్తాం అన్నారు. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ మూట నిలబెట్టుకోవడం లేదు, చెక్కిన రామాలయ స్తంభాల్ని నిలబెట్టడం లేదు. నమ్మి గద్దె ఎక్కిస్తే సుగ్రీవుడికి వారసులైపోయారు. రాముడు కార్యశూరుడే గానీ వాక్సూరుడు కాదు. ఛామయ్యకు చేయిస్తి...” అని సంబరపడితే చూస్తూ ఊరుకుంటాడా? ఆయన మితభాషి, రాజ్యతంత్రం తెలిసినవాడు. రాజనీతి ఎరిగినవాడు. సంధి సూత్రాలు నేర్చినవాడు. చట్టం ఎవరికైనా చట్రమే అని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అందుకే కంచర్ల గోపన్న అలియాస్‌ రామదాసు సర్ఫార్‌ సొమ్ముతో తనకి ఆలయాలు, ప్రాకారాలు, అమ్మవారికి నగానట్రా చేయించినపుడు వెంటనే రంగప్రవేశం చేసి నాన్‌-బెయిలబుల్‌ వారెంటొ జారీ చేయించలేదు. 'లా విల్‌ టేకిట్స్‌ ఓన్‌ కోర్స్‌” అన్నట్టు ఉదాసీనంగా ఊరుకున్నాడు. రామదాసుకి చెరసాల తప్పలేదు. రామదాసు రెవిన్యూ ఉద్యోగి కనుక తన రెవిన్యూ బుద్ధి పోనిచ్చుకోకుండా జమా ఖర్చులన్నీ పాటల రూపంలో పాడాడు. అకౌంట్స్‌ అన్నీ కీర్తనల రూపంలో విన్నాక, మనసులోనే ఆడిట్‌ చేసుకుని- నిధుల దుర్వినియోగం లేదని ఖాయపరచుకున్నాడు సీతాపతి. కొన్ని కొరడా దెబ్బలూ, కొన్ని క్తీర్త్సులూ అయ్యాక రామదాసుని బంధ విముక్తుణ్ణి చేశాడు. ముందే ఏ యాంటిసిపేటరీ బెయిలో ఇప్పిస్తే లోకనిందకి గురై, అపోజిషన్‌ వారి వ్యాఖ్యలకు బలై, పత్రికల వారికీ పతాక శీర్చికలై నానా 'గలభా”' అయిపోతుందని రాముడికి తెలుసు. రాములవారి డిప్లమసీ సామాన్యమైంది కాదు. అడవిలో కూడా ఆచితూచి అదుగువేసేవాడు. భక్తురాలైన శబరి రాములవారి కోసం పళ్లు తెచ్చి, ప్రతి పండూ కొరికి రుచిచూసి ఆయనకు సమర్పించిందని చెబుతారు. దీనిలో అంతరార్ధం వేరే వుంది. కావాలంటే భౌతికవాదుల్ని అడగండి. ఇందులో నిగూఢమైన సత్యం ఏమిటంటే- అప్పటికే అడవిలో బోలెడుమంది రాక్షసుల్ని 98 మానవ సంబంధాలు

రాముడు చంపేశాడు. సీతాపహరణం జరిగింది. రావణాసురుడికి బోలెడంత నెట్‌వర్క్‌ ఉంది. రాముణ్జి విషాహారంతో మట్టుబెట్టే ప్రయత్నం చేయొచ్చు అందుకని దాముడు జడ్‌ లిస్ట్‌లో వున్నాడు కనుక, ఎక్కడ పడితే అక్కడ, ఏదంటే అది తినేవాడు కాదు. తన జాగ్రత్తలో తను వుండేవాడు. అందుకే శబరి (ప్రతి పండూ చెక్‌ చేసి పెట్టింది.

విభీషణుడి విషయంలో ఎంత డిప్లమాటిక్‌గా ప్రవర్తించాడు? లంక గుట్టు అతని ద్వారా రాబట్టాడు తర్వాత అయోధ్యలో బాగా గూఛచారి కార్యకలాపాలు నిర్వహించే వారికి “పద్మ విభీషణ” అని బిరుదుతో సత్మరించేవాడని ఆనోటా ఈనోటా అనుకోగా విన్నాను. మరి హనుమంతుడు నమ్మినబంటు కదా, నిజానికి ఎంత చాకిరీ చేశాడు! రామ పట్టాభిషేకం తర్వాత హనుమంతుడు అయోధ్యలో సెటిలైపోతానని మారాం చేశాడు. మరి పావం ఏ చెట్టు మీదనో వుండనీయొచ్చు కదా. అదేమరి రాములవారి స్హ్రోక్‌ ఆఫ్‌ జీనియస్‌, అప్పటికే ఆంజనేయ స్వామికి బోలెడు పేరు, సెపరేట్‌ పూజలు మొదలైపోయాయి. డొమినేటింగ్‌ రూపం. పైగా మంచి చూటకారి. సీతమ్మవారి జాడ తెలుసుకున్నవాడనీ, సముద్రం ఏకబిగిన దాటాడనీ, ఘోటక బ్రహ్మచారి అనీ జనం స్తుతించడం రాములవారికి నాటుకుంది. రాముడు ఏకపత్నీవ్రతుడే గానీ బ్రహ్మచారి కాదు. ఇంత ఇమేజ్‌ ఉన్నవాడు కాపీటల్‌లో వుంటే అంత మంచిది కాదని నాయనా! హనుమూ! నువ్వెళ్లి కిష్కింధలోనే వుండి సుగ్రీవుని కాచుకో మన పార్టీని పటిష్టం చెయ్‌ అని సాగనంపాడు.

మందిరం కట్టిస్తాం! అన్నప్పుడు రాములవారు కమలనాధుల మాట నమ్మారు. హనుమంతుల వారంతటి (బ్రహ్మచారి కాకపోయినా ఎంతో కొంత (బ్రహ్మచారి కదా అని నాయకత్వం కట్టపెట్టాడు. తీరా ఇప్పుడు “రామయ్యకు చేయిస్తి...' అని గాడిలో పడి హాత్‌ ఇస్తే రఘుపీరుడు చేతులు కట్టుకు కూచుంటాడా? రాముదెప్పుడూ మతాల మధ్య సేతువుగానే వున్నాడు. తానీషా గారి దబ్బుతో భద్రాచలంలో ఆలయాలూ అవీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏటా కళ్యాణానికి నవాబు గారే ముత్యాలు పంపే రివాజు పెట్టించుకున్న కళ్యాణరాముడు. వారధులు కట్టడంలో ఆయన దిటు నరులకు, వానరులకు మధ్య వారధి కట్టాడు. మనుషులకు, రాక్షసులకు మధ్య కపివరులతో సతువు కట్టించాడు. ఇప్పుడు కూడా ముతాలకీ, మతాలకీ మధ్య చక్కని వారధి కడతాడు మూ లాముడు సకలగుణాఖిలాముడు, లోక కళ్యాణరాముడు క ల న్‌ శ్రీరమణ వ!

లో లే రల్లివ్‌ ఇర

మనం అన్నిటికీ అప్పులమీదనే ఆధారపడు తున్నామని ప్రణాళికా సంఘం వర్రీ అవుతోంది. రుణభారం గత రెండేళ్లలో రెట్టింపు అయిందట. రాష్ట్ర రుణం 26 వేల కోట్లకు చేరుకున్న సంద ర్భంగా మనమంతా వాడవాడలా “అప్పోత్సవాలు చేసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు కొందరు. తిరోగమన వేగం తీవ్రంగా వుందని గణాంక వివరాలతో సహా కొందరు వాదిస్తున్నారు. కరెంటు, నీటిపారుదల పరిస్థితి ఘోరంగా వుంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు క్షీణించాయి. విద్య ఆరోగ్యం అంతంత మాత్రమే! ఆదరణ, దీపం లాంటి ఆకర్షణీయ పధకాలు తెల్ల ఏనుగులుగా మారాయి. ప్రజలకి ప్రయోజనాలు అందకపోగా పధకాల పబ్లిసిటీకి కోట్లాది రూపాయల ఖర్చు! (రోజుకి కోటి రూపాయలని అపోజిషన్‌ వారి అంచనా.)

ప్రభుత్వరంగ సంస్థలు చాలావరకు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. విశాఖ ఉక్కు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆర్టీసీ బస్సులు రెండు చక్రాల మీద నడుస్తున్నాయి. (పైవేట్‌ రంగంలో పట్టింది బంగారం అవుతోంది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, కాలేజీలు అన్నీ లాభసాటి గానే నడుస్తున్నాయి. 'సర్కారీవి' అనగానే శాపం పెట్టినట్లు కిందిచూపు చూస్తాయి. అదేమన్నా అంటే అవినీతి అంటారు. రాజకీయం అంటారు. అందుకే దీనికో మంచి పరిష్కారం వుంది.

తెల్లదొరలు వెళ్లాక దేశం మన చేతుల్లోకి వచ్చేసింది కదా. అప్పుడు చేసింది దేశసేవ. ఇప్పుడు "సేవా అనే మాట వాడడం అనవసరం. రాజకీయం ఇప్పుడు అన్నిటిలాగే ఒక వృత్తి. నిజానికి రాజకీయ నాయకులకి రోజుకి 24 గంటలు చాలవు. రెండు కళ్లు, రెందు చేతులూ చాలవు. ఓ కంట కేడర్శి మరో కంట లీడర్ని చూసుకోవాల. ఓటర్ని చూసుకోవడానికి మూడో కన్ను అవసరం. అందుకని నాయకుల సేవల్ని “ఆర్జిత సేవలు'గా గుర్తించడం మంచిది. అసలు నిజానికి రాజకీయాన్ని మించిన భారీ పరిశ్రమ ఇంకోటి లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది? పెద్ద, మధ్యతరహా, చిన్నతరహా, గ్రామస్థాయి పదవులు వుంటాయి కదా. కమిటీలు, కార్పోరేషన్లు, సలహా సంఘాలు యివి మళ్లీ ఎగస్త్టా. మైకులు, షామియానాలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, టాక్సీలు, హోటళ్లూ- వీటికి మహారాజ పోషకులు ఎవరు? ళొన్ని జిల్లాల్లో కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతున్న నాటుబాంబుల పరిశ్రమ రాజకీయం లేకపోతే ఆ ఇండస్ట్రీ డిప్యూజ్‌ అయిపోతుంది. టెలిఫోన్లు, సెల్‌ఫోన్లు నిద్రపోతాయి. ఇలా చెప్పుకుంటూపోతే సవాలక్ష అందుకని దీన్ని ఇండస్ట్రీగా గుర్తించి ఆర్థిక సంస్థలూ, బ్యాంకులూ పెట్టుబడులు యివ్వాలి. ఇందులో టర్నోవర్‌ గురించి సందే హించనకృళ్లేదు. మార్టిన్లు బావుంటాయి. కంపెనీని 100 మానవ సంబంధాలు

ముర్రా భా జారి న్‌ా ళ్శ్గ స్‌ (ోరిగంటి

ఫ్లోట్‌ చేసినట్లు పార్టీని ఫ్లోట్‌ చేయడం, పబ్లిక్‌ ఇష్టూకి వెళ్లడం- షేర్లు అమ్మడం- పెట్టుబడులు సమకూర్చుకోవడం- ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడం. పార్టీ ఆఫీసుని కార్పోరేట్‌ అఫీస్‌ అంటాం. ఆధినాయకుణ్ణి ఛైర్మన్‌ అంటాం. లేదంటే ఇప్పటిలాగే సిఇఓ అంటాం. మంత్రులంతా ఎగ్జిక్యూటివ్‌లు అవుతారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు వుంటారు. అందరికీ అర్హతని బట్టి జీతాలు, నాతాలు ఉంటాయి. సీజన్‌లో ఓవర్‌టైమ్‌ పనిచేస్తే దానికి ఎక్స్‌ట్రా పేమెంట్‌ వుంటుంది. ఏడాదికో సారి బ్యాలెన్స్‌ షీట్‌ సర్వసభ్య సమావేశంలో సమర్పిస్తారు. బాగా లాభాలు పంచితే మార్కెట్‌లో నిలబడతారు. లేదంటే కంపెనీ ఇంకోళ్ల చేతుల్లోకి వెళ్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే విడివిడిగా ఒక్కొక్క శాఖనీ (పైవేటైజ్‌ చేసే బదులు మొత్తం (ప్రభుత్వాన్నే చేసేస్తే మంచిది. అప్పుడు 'అవినీతొ అనే మాట బదులు “నికరాదాయం” అనే మాట వాడతారు. బంధుటప్రీతికి తావుండదు. సమర్ధులకే కీలక పదవులు లభిస్తాయి. ప్రజలు కూడా అనవసరపు ఆవేశకావేశాలకు గురికాకుండా పనితీరు నచ్చితే 'సర్వీస్‌ కాంట్రాక్ట్‌ రెన్యూ చేస్తారు. లేదంటే నిర్మొహమాటంగా కట్‌ చేసేస్తారు. అంతటితో సరి!

అప్పుడు ఇక 'దేశభక్తి అనే నేతి బీరకాయ పదం వినిపించదు. వ్యాపార దృష్టితో పనులు హాయిగా జరుగుతాయి. భక్తికి బదులు భయం రాజ్యం చేస్తుంది. అప్పుడంతా సుభిక్షంగా వుంటుంది. సర్కార్‌ ఇండస్ట్రీ లాభాల బాటలో నడుస్తుంది. ౧ లలల వావ 01 శ్రీరమణ 101

రంయాణకుంరొా-లిరఎయాణకులూ

“స్పాన్సర్లని తెలుగులో ప్రాయోజకులు అంటారు. స్పాన్సర్డ్‌ ప్రోగ్రామ్‌ని ప్రాయోజిత కార్యక్రమం అంటారు. టీవీలతో వచ్చిన పరిభాషలో ఇది విలువైంది. ఎందుకంటే రాబడి యావత్తూ స్పాన్సర్లతోనే ముడిపడి వుంది. కొన్ని ప్రోగ్రావ్స్‌కి కో-స్పాన్సర్లు, ఇంకో స్పాన్సర్లు కూడా వుంటారు. ఆ మధ్య ఓ టీవీ నిర్మాత తను నిర్మించిన 'వారాలబ్బాయి సీరియల్‌కి ఏడుగురు (ప్రాయోజకులు దొరికారని సంతోషంగా చెప్పాడు. దుఃఖ సీరియల్స్‌కీ, కష్ట సీరియల్స్‌కీ స్పాన్సర్లు రక్కున దొరుకుతారట. అందుకే ఆ రెండు రసాల్ని పట్టుకు వేలాడు తున్నాం అన్నాడొక సీరియలిస్టు.

మరి ఈ వ్యాపార యుగంలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ వ్యాపార (ప్రకటన వేసెయ్యడమే. దైలు టిక్కెట్లు, బస్సు టిక్కెట్లు, పోస్టుకార్డులు ఏవీ వీటికి మినహాయింపు కాదు. ఇప్పుడు చెట్టూ-చేచూ, పచ్చగడ్డీ కూడా ఫలానా వారి పెంపకంలో అని బోర్టు తగిలించుకుంటున్నాయి. అసలు ఆరుద్ర గారి లాంటి పరిశోధకుల్ని అడిగితే- అసలు మన ప్రాచీన సాహిత్యం మొత్తం స్పాన్సరొషిప్‌' మీదే నడిచిందంటారు. రాజరాజ నరేంద్రుడి ప్రాయోజకత్వం లేకపోతే భారతం తెలుగులో వచ్చేదే కాదు. కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలనే ఎనిమిది తెల్ల ఏనుగుల్ని ఆ రోజుల్లో పోషించి అనేక ప్రబంధాలకు 'ప్రాయోజకుదైనాడు. అసలు స్థూలంగా చెప్పాలంటే 'అంకితం” అనే మాటకి 'స్పాన్సర్డ్‌ అనే అర్ధం.

మన ప్రాచీన జానపద కళారూపాలన్నీ ప్రాయోజకుల బెదార్యం మీదే ఆధారపడి నడిచేవి, బుర్రకధలు, హరికథలు, తోలుబొమ్మలాటలూ ఇవన్నీ స్పాన్సర్డ్‌ ప్రోగ్రామ్సే! బొమ్మలాటకి చమురు, తెరకి వస్త్రాలు ఎవరిస్తే వారంతా (ప్రాయోజకులే. ఎవరూ ముందుకి రాకపోతే “చేతి చమురు బాగోతం' అనేవారు. ఏమీ ఇవ్వకుండా అ్రాయోజకులైన వారిని కేతిగాడు, బంగారక్క అనే రెండు పాత్రల చేత తిట్టించి, కసి తీర్చుకునేవారు. ఇప్పటికీ కల్చరల్‌ ప్రోగ్రాబ్బుని పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు స్పాన్సర్‌ చేయడం చూస్తూనే వున్నాం. ఆ మధ్య ఓ పౌరాణిక నాటకాన్ని సిగరెట్‌ కంపెనీ వారు స్పాన్సర్‌ చేశారు. “అదిగో ద్వారక...” పద్యం పాడుతుంటే ద్వారక బదులు వాళ్ల కంపెనీది నిలువెత్తు సిగరెట్‌ ప్యాకెట్‌ కనిపించింది. జనం ఘొల్లుమన్నా తప్పదు మరి. డబ్బు పెట్టిన వాడు పబ్లిసిటీ కోరతాడు కదా. నాటకాలేంటి ఆటల మాట సరేసరి. పూర్వం వుండే క్రికెట్‌ క్రేజ్‌ ఇప్పుడు సన్నగిల్లింది గానీ, అప్పట్లో కోట్ల మీద నడిచేది. పల్లెటూళ్లలో కోడిపందేలకు స్పాన్సర్లుంటారు. ఒకప్పుడు పల్నాటి సీమ రాజతంత్రమంతా కోడిపందేల మీదే నడిచింది కదా.

్ట య న ( ళో [| "జే ఆ /

ఆటపాటల మాట అలా వుంచండి. రాస్తారోకోలకీ, బంద్‌లకీ, అల్లర్లకీ స్పాన్సర్లుంటారు. ఎటొచ్చీ వాళ్లు పబ్లిసిటీని అనుమతించని గుప్త దాతలు కొందరు డబ్బున్నవాళ్లు తెలివైన పెళ్లికొాడుకుల్ని స్పాన్సర్‌ చేసి బాగా చదివించి, తర్వాత తమ అల్లుడుగా చేసుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అసలు ప్రభుత్వానికి ఆలోచన ఎందుకు రాలేదో గానీ ప్రాధమిక విద్యా స్థాయిలో పార్యగ్రంధాలకు 'స్పాన్సర్‌షిప్‌' సంపాదించవచ్చు. ఉదాహరణకి పుస్తకం అట్టల మ్లీద కండోమ్స్‌, ఎయిడ్స్‌ లాంటి వ్యాపార ప్రకటనలు పేరెంట్స్‌ కోసం వెయ్యొచ్చు. పారాలలో “పొద్దుటీ ఫలానా గడియారము ఆరు గంటలు కొట్టగానే నిద్రలేచి, ఫలానా టూత్‌బ్రష్‌తో పళ్లు తోముకుని, ఫలానా పొడి కలిపిన ఫలానా కంపెనీ పాలుతాగి, ఫలానా సబ్బుతో స్నానమాడి, ఫలానా వారి గైస్‌తో, ఫలానా హెయిర్‌ ఆయిల్‌ రాసుకుని, తల దువ్వుకుని, ఫలానా కంపెనీ బూట్లు వేసుకుని... ఇంకా ఫలానా ఫలానాతో ఫలానా స్మూలుకి ఫలానా సైకిల్‌ మీద వెళ్లేవారే మంచి బాలురు, మంచి బాలికలు అని రాశారనుకోండి. ఆ ఫలానా కంపెనీల వారంతా స్పాన్సర్‌ చేసి పార్యగ్రంథాలు అచ్చువేసిస్తారు. ప్రభుత్వం బోలెడు సొమ్ము చేసుకోవచ్చు. 'మన వాళ్లకి ఉపాధి కల్పించవచ్చు. అక్షరాలా ప్రాయోజకం అవుతుంది ఈ పథకం. ఇలా చెప్పుకుంటూపోతే ఇది అనంతం. ఇంతవరకూ చెప్పినవన్నీ చిన్నచిన్న విషయాలు. సామాన్యుడికి అంతుపట్టని పెద్దపెద్ద విషయాలు భూగోళమంత పరిమాణంలో వుంటాయి. కొన్ని దబ్బున్న దేశాలు యుద్దాల్ని స్పాన్సర్‌ చేస్తాయి! కొందరు ఆయుధాలు అమ్ముకోవడానికి, కొందరు ఊరికే సరదాకి (ప్రాయోజకులు అవుతూ వుంటారు. ఒక్కోసారి అమెరికాలాంటి అగ్రరాజ్యాల వారు స్పాన్సర్‌ చేసి చేసి, తామే రంగప్రవేశం చేయాల్సిన స్థితి తెచ్చుకుంటారు. అప్పుడు వాటిని ఇన్‌ హౌస్‌ ప్రొడక్షన్‌ అంటారు. నున లోకల్‌ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే *చేతి చమురు బాగోతం! (1

“య! య!

బొబ్బ్టియా ఎన్నికల తేదీ ఖరారు కాగానే కాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. అందునా ఇప్పుడు జంట నగరాలంటీ మూటలు కాదు. తెలంగాణా జిల్లాలు నాలుగు వచ్చి చేరిపోయాయి. అదీగాక (ప్రత్యేక తెలంగాణా పార్టీ కొత్త పోటీ, అందుకే మేయర్‌ ఎన్నికల్పి అన్ని పార్టీలు చాలా ప్రిస్టీజియస్‌గా తీసుకున్నాయ్‌. నాయకుడు తన సహచరుల్ని అనుచరుల్ని అప్రమత్తం చేస్తూ ప్రసంగించారు. మన ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసికెళ్ళి, వాళ్ళకి తెలియజెప్పాలన్నారు *... చేస్తుంటే ప్రచారం దేనికి? వాళ్ళకే తెలుస్తుంది కదా” అన్నదో గొంతు సమావేశంలోంచి. తీరా చూస్తే అంత మాట ధైర్యంగా అన్నది మంత్రివర్గ సహచరుడూ కాదు. అనుచరుడూ కాదు. ఓ పత్రికా ప్రతినిధి (ఈ పత్రికా ప్రతినిధి కాదు). అవతల నాయకుడు జాగా ధక్కా మక్కీలు తిన్నవాడు. ఏ మూత్రం తొణుకూ బెణుకూ పడకుండా- “మీరు మంచి (ప్రశ్నే వేశారు. కానీ మేం చేసే మంచి పనులను సైంధవులు అడ్డుకోకుండా చూడాలి. ఈ బాధ్యత మీ పత్రికల మీద కూడా వుందని తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వానికి, ప్రజలకీ మధ్య మీరు ప్లయ్‌ ఓవర్స్‌ లాంటివారు. మా కృషి సేవా ఫలితాలు జనానికి అందేలా చూడాల్సిన విధి మీపై కూడా వుందని తెలియజేసుకుంటున్నాను” అన్నారు ప్రసంగ ధోరణిలో. కొందరు చప్పట్లు కొట్టారు.

సిటీ జనుల్ని పెద్దగా ఎడ్యుకేట్‌ చేయాల్సిన పనిలేదు. పొలిమేరలు దాటివెళ్ళి అక్కడున్న వెనుకబడిన ప్రజలకి, ముఖ్యంగా మహిళా ఓటర్లకి తమ పార్టీని గెలిపిస్తే సమకూరే ప్రయోజనాల గురించి ఎలుగెత్తి చాటాలని ఓ మంత్రిగారు నిర్ణయించుకున్నారు. వారు తలపెట్టినదే తడవుగా ఎర్రదీపం కార్డు, ఎస్మార్జులూ, వాటి వెంట జీపులు, జీపుల పక్కన మోటార్‌ బైకులూ సిటీ రోడ్లు దాటి పరుగులు తీశాయి. పోగా పోగా చిట్టడవులూ, చింత తోపులూ దాటాక చిన్న చిన్న గూడేలు తగిలాయి. కాని వాళ్ళకి ఓట్లు కార్పొరేషన్‌ లిస్టులో వున్నాయి. అక్కడ జనం 80 శాతం నూలు వస్త్రం, మిగతా డెబ్బై శాతం పుట్టుకతో వచ్చిన సహజ చర్మం ధరించి వున్నారు. ఎలక్షన్‌ క్యాంపైన్‌కి అనువైన చోటు దొరికిందని మంత్రివర్యులు ముచ్చటపడ్డారు. మధ్య మధ్య సెల్‌ఫోన్లు మోగుతున్నాయి. గూడెం వాళ్ళే కాక్క ఇరుగు పొరుగు గూడేల వాళ్ళు కూడా చోద్యం చూడడానికి గుమిగూడారు. మంత్రిగారికి ఓటర్లని చూసే సరికి పూనకం వచ్చేసింది. జీపునే వేదికగా మార్చుకుని జంటనగరాలలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద నట్టుపడకుండా వివరించారు. హైటెక్‌ సిటీ గురించి, అంతర్జాతీయ విమానాశ్రయం గురించి, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూలు గురించి మాట్లాడారు. గూడేల (ప్రజలంతా మంత్రిగారి ముక్క ముక్కకీ ఓయె, ఓయె అని కేరింతలు కొడుతూ మరీ స్పందించారు. దాంతో ఆయన మరీ రెచ్చిపోయి ప్రతిస్పందించారు. “రోడ్డు, నీళ్ళు, ఆరోగ్యం, చదువు, తిండి, గూడు, గుడ్డ శం నా డా మానవ సంబంధాలు

స వి

మం రా జో య

నన్‌.

జడ్‌ 77

లో ౧ కాంగ్‌ మీకే కాదు మీ గేదెలకీ, గొర్రెలకీ కూదా...” అంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నారు. వినవచ్చిన వారంతా ఓయె! ఓయె! అని నవ్వుతూ, పొలికేకలతో ఉత్సాహంగా వింటున్నారు. సభ కొంతసేపటికి ముగిసింది. “మూ బువ్వతిని వెళ్ళండి సామీ” అని గూడెం వాసులు కోరారు గాని అలాంటి అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా చూంసాహారం ముట్టడం మంచిది కాదని వారి అభ్యర్థనని సున్నితంగా త్రోసిపుచ్చారు. (సున్నితంగా క్రోసిపుచ్చడం పత్రికల భాష. అందువల్ల అదెలా వుంటుందో మనకి తెలియదు). ఇక్కడ సభ సూపర్‌ హిట్‌ అయ్యేసరికి మంత్రిగారికి ఇంకొంచెం ముందుకెళ్ళి మరికొన్ని

గూడేలను సందర్శించాలని ఆవేశం వచ్చింది. కార్లు వురికాయి. అక్కడ గూడెంలో సీ పురుషులు కాకుండా వారి పశు సంపదని కూడా పలకరించి పోవాలనే మెరుపులాంటి ఆలోచన తట్టింది మంత్రిగారికి. మరీ లోపలికి వెళ్ళడం వల్ల మంత్రిగారికి పాదయాత్రకి కూడా అవకాశం లభించింది. అక్కడ ఆవులూ, గేదెలూ, మేకలూ, గొర్రెలూ చెట్ల నీడన మందకట్టి వున్నాయి. మంత్రిగారు చొరవగా వాటిని నిమిరారు. వాటిని ఒక్కొకదాన్నే పరామర్శిస్తూ మందలోకి చొచ్చుకుపోతుంటీ గూడెం పెద్ద మంత్రిగారిని చెయ్యిపట్టి ఆపి ఓయె, ఓయె అన్నాడు. మంత్రిగారికి ఏమీ అర్దం కావడంలేదు. కాబినెట్‌ మీటింగ్‌ నించి తనని ఫాలో అవుతున్న పథ్రికా ప్రతినిధిని పక్కకి పిలిచి - “అసలు వీళ్ళ భాషలో ఓయె అంటే ఏమిటో నీకు తెలుసా” అని అడిగారు మంత్రిగారు. “చిత్తం, యీ ప్రాంతంలో పేడని ఓయె అని పిలుస్తారండీ అన్నాడు వినయంగా ఆ ప్రతినిధి. మంత్రిగారికి కాసేపు మాట పడిపోయింది. కాసేపటికి తేరుకుని “ఇది బయటకి పొక్కితే చూత్రం మర్యాదగా వుండదు” అన్నారాయన జనాంతికంగా. మళ్ళీ “ఓయె ఓయె” అన్నారెవరో జనం మధ్యలోంచి - విచిత్రమైన గొంతుతో. ౧ శ్రీరమణ 105

జఆూనీయోగం ల్లో

జ్లానములన్నింటిలోకి లౌకిక జ్ఞానం గొప్పది. దానిని ఉపాసన ద్వారానే సాధించగలం. ఉపోసన పెక్కు విధములు. సంగీత సంబంధమైతే నాదోపాసన. సంసార పరమైంది నాధోపాసన. వృత్తి, వ్యాపారము, వ్యవహారము వగైరాలన్నీ ఉపాసనలే! (ప్రేమించడం కూడా ఈ కోవలోదే. అన్నింటిలోకి ఉన్నతమైంది రాజకీయ ఉపాసన. మన దేశంలో (ప్రతి మూడో వ్యక్తీ రాజకీయోపాసకుదే. మంత్రము, తంత్రము, బీజాక్షరము యీ ఉపొసనలో ముఖ్యమైనవి. రాజకీయానికి అన్వ్నయించినపుడు మంత్రమనగా మానిఫెస్టో తంత్రమనగా వ్యూహరచనలు, బీజుక్షరమనగా నినాదము. ఇందుకు గరీబీ హరావో, ఆత్మగౌరవం, జై జన్మభూమి ఇత్యాదులు ఉదాహరణములు. బీజాక్షరాన్ని పదేపదే వల్లించడం ద్వారా ఓటర్ని వశీకరణం చేసుకోవచ్చు. అందుకే బీజాక్షరంలో పట్టు, ఆకర్షణ వుండాలి. అదే మరి తంత్రంలో ఓ క్రమం, అవసరమైతే అక్రమం వుంటేగాని రాజకీయ ఉపాసన రక్తి కట్టదు. తంత్రం సాగించి, శక్తిని ఆవాహన చేసి ముగ్గులోకి రప్పిస్తారు.

తంత్రంలో వశీకరణం వుంటుంది. ఉచ్చాటనం అంటే స్థానభ్రంశం చేయడం (అవిశ్వాసం పెట్టి దింపెయ్యడం అన్నమాట), భేదనం అంటే డిఫరెన్సులు తేవడం, మూరణం అంటే డిక్కీలో తొంగోపెట్టడం లాంటివన్నీ వుంటాయి. సాధకుడు మంత్రం ద్వారా యంత్రం మీదికి పవర్‌ని (శక్తిని) తీసుకువస్తాడు. తర్వాత ఇష్టం వచ్చినట్లు వూరేగుతాడు. మరి అదే లౌక్యోపాసన వుంది. ఇది కూడా తక్కువదేమీ కాదు. దీనికి ఓర్చు సహనాలే మంత్ర తంత్రాలు. పొగడ్త బీజాక్షరాలుగా పనిచేస్తుంది. లౌక్యోపాసనలో వేషధారణ, హెయిర్‌ స్టయిలూ చాలా ముఖ్యం. శిధోకంపనం, చిరునవ్వు ముద్రలుగా చెయ్యి వూపుతూ జసాన్ని (ఉన్నా లేకున్నా) అభివాదపూర్వకంగా పలకరించడం తప్పనిసరిగా ఉపాసకుడు చెయ్యాలి.

అనవసరంగా గాని, అవసరంగా గాని ఉపాసకుడు రెచ్చిపోకూడదు. సంయమనం సహజ కవచంగా వుండాలి. ఎవదేనా ముఖంమీద “తమరుత్త శుంరలు” అంటే ఉపాసకుదైన వాడు రియాక్ట్‌ అవకూడదు. కోపాన్ని నవ్వుల్లోకి అనువదించుకుని “నా అభిప్రాయం కూడా అదే” అని సౌమ్యంగా అనగలగాలి. అప్పుడు అవతలవాడు గిలగిలా తన్నుకుంటాడు. సాధనని దెబ్బతీయాలని అవతలివాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ సాధకుడు చలించకూడదు. “మూడు మూళ్ళు పదహారు” అన్నాడనుకోండి = వెంటనే ఒప్పేసుకోవాలి. “భేష్‌ మా బాగా అన్నారు. తొమ్మిదికి సామాన్యుడి ఏడు(పు) కలిపావ్‌... పదహారన్నానవ్‌... భేష్‌” అనాలి. ఆ దెబ్బతో అవతలివాడు వీడితో డిఫర్‌ అవదం దుర్లభం అని తేల్చేసుకని, బేషరతుగా ఉపాసకుడికి లొంగిపోతాడు.

ఈ సాధన ద్వారా ఒక్కొక్క మెట్టే ఎక్కి వేదిక మీదున్న సింహాసనం లాంటి ఎర్ర కుర్చీలో ఇంతా నవా

శ [హరే

7”

గ (

డ్రె అ న్‌ ఉమ టా రఊకొరా కూర్చునేలోగా ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. గమ్యం చేరేదాకా దీక్ష విడవకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన పాయింటు - ఉపాసకుడు ఎవరినీ ఎప్పుడూ తృణీకారభావంతో చూడకూడదు. ఇవ్వాళ రాజు రేపు మంత్రి కావచ్చు. రేపటి మంత్రి ఎల్లుండి రాజు అవచ్చు ప్రతి జీవినీ లౌక్యోపాసకుడు ఎల్లవేళలా సమభావంతో చూడాలి. పద్మ అవార్డు వచ్చినా రాకపోయినా నిరాశ చెందకూడదు. ఎవరినీ నిందించకూడదు. ఈ జాతి నేడు కాకపోతే రేపు గుర్తిస్తుంది. రేపు కాకపోతే ఎల్లుండి. ఎల్లుండి కాకపోతే మళ్ళీ వచ్చే గణతంద్రదినోత్సవానికి గుర్తిస్తుంది. మన అగ్రనేత చెప్పినట్లు పాజిటివ్‌ థింకింగ్‌ లౌక్యోపాసకుడికి ప్రాథమిక లక్షణంగా వుండాలి. నలుగురు ఎక్కడ చేరినా వారిలో ఒకరిగా కలివిడిగా తిరుగుతూ జనం మధ్య కనిపించాలి.

సభల్లో చొరవ చేసుకుని వి.ఐ.పి.ని అంటిపెట్టుకు వుంటే మంచిది. పది ఫొటోల్లో ఆరింటిలోనైనా, మొత్తం కాకపోయినా పాక్షికంగానైనా పడతారు. అందులో రెండైనా పత్రికల్లో వస్తాయి కదా. అందుకే ఉపాసకుదికి వేషధారణ, హెయిర్‌ స్టయిల్‌ ముఖ్యమని ముందే చెప్పుకున్నాం. ఫొటోలో ఏ కాస్త పడ్డా జనం ఇట్టే పోల్చుకుంటారు. అందుకని యీ బాపతు వారికి ఓ కొండగుర్తు చాలా అవసరం కాషాయం కన్చించగానే సన్యాసి జ్ఞాపకం వచ్చినట్టు కట్టో బొట్టో కాస్త కనిపించినా జనం పట్టేసేట్టు వుండాలి. ఇది సాధనలో చాలా ముఖ్యమైన మెట్టు. ఆనాడు ఆంధ్రకేసరి తెల్లవాడి తుపాకికి ఎదురొడ్డి షూట్‌ చెయ్యండిరా అని గర్జించాడు నిర్భయంగా. లౌక్యోపాసకుడు కూడా అలాగే వీలైనంత ముందుకు చొచ్చుకువచ్చి షూట్‌ చెయ్యమని ఎదురొడ్డి నిలబడగలగాలి నిర్భయంగా వీడియో కెమేరాముందు! క శ్రీరమణ 0?

సెంతలోచ్‌...! సెంతలం! “సెలక్షా అనే మూడక్షరాల పదంలో ఎంత ఆటవిడుపు వుందో వర్ణించడానికి వీలుకాదు. స్కూళ్లకి సెలవలు ఇచ్చేశారు. అక్షరాలూ, అంకెలూ కొన్నాళ్లపాటు పుస్తకాలలో నిద్రపోతాయి. పిల్లల భుజాలకీ, వీపులకీ, అమ్మలకీ కొన్ని వారాలు విశ్రాంతి. స్కూలు పిల్లల్ని దూదిమూటల్లా కుక్కుకుని వెళ్లే రిక్షాలూ, ఆటోలూ కొన్ని రోజులు కనిపించవు. యూనిఫారాలలో సంచీ సరంజామాలతో బస్‌ స్టాపుల్లో బంగారు బాల్యాన్ని పారబోసుకుంటున్న పిల్లలు కొన్ని వారాలు కనిపించరు. మసష్టీ దుస్తుల్లో గడియారాన్ని వెక్కిరిస్తూ కనిపిస్తారు ఇంటిపట్టున.

“పిల్లలు బడికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంటికి పరుగుపెడతారు” ఇది ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న నిజం. ఎంత గొప్ప స్మూలైనా ఇంటికి సాటిరావు. అది మాత్రం నిజం. అందుకే సెలవలు ఇచ్చారంటే మొత్తం నాగార్జునసాగరం గేట్లు ఎత్తేసినంత సందడి. అప్పటిదాకా నాలుగ్గోడల మధ్యా బంధించి వున్న నీళ్లు పరవళ్లు తొక్కుతూ, సుడులు తిరుగుతూ వురవడిగా కాలవ గట్లని ఒరుసుకుంటూ నురుగులు కక్కుతూ పరుగులు పెడతాయి. నురగలు, నీళ్ల తుంపరలు, కదిలిపోయే బుడగలు... ఎక్కడ చూసినా సెలవలు. కళ్లెం వదిలిన చైతన్యం పసిముఖాల్లో.

వేసవి కాలం వచ్చేస్తోందంటే మనవళ్లు, మనవరాళ్లు సెలవలకి వస్తారని ఊళ్లో వుండే అమ్మమ్మలూ తాతయ్యలూ వొళ్లంతా కళ్లు చేసుకు ఎదురు చూస్తుంటారు. ఆ పెద్దవాళ్లకి ఈ పిల్ల అతిధుల రాక వేసవి తాపాన్ని మరిపిస్తుంది. అప్పటిదాకా గంతలు కట్టిన జట్కాగుర్రంలా బడి-ఇల్లు తప్ప వేరే లోకం చూడదానికి ఆస్కారం లేని పిల్లలకి ఒక్కసారి దృష్టి పెరుగుతుంది. (ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. వాళ్ల బుర్రల్లో ఎన్నాళ్లుగానో కునుకు తీస్తున్న ఐడియాలు ఒక్కసారి నిద్ర లేస్తాయి. ప్రతివాడూ ఓ సచిన్‌ టెండూల్కర్‌ అనుకుంటాడు. గ్రాండ్‌ మాస్టర్‌ ఆనంద్‌లా, కోనేరు హంపిలా, మాండొలిన్‌ శ్రీనివాస్‌లా ఫీల్‌ అవుతాడు.

పిల్లల ఐడియాలు పిల్లలకి వుంటే, కన్నవారి ఆలోచనలు కన్నవారికి ఉంటాయి. రానురాను కాంపిటీషన్‌ పెరిగిపోతోంది, అవకాశాలు తరిగిపోతున్నాయి” అనే అలజడి 'పెద్దవాళ్లలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ అలజడికి “హాలీడే లేదూ ఏడాది పొడుగునా వుంటుంది. హాయిగా స్వేచ్చగా ఎదగాల్సిన లేత మొక్కల మీద అలుకు గుడ్డని ఆరేసినట్లు పెద్దవాళ్ల ఆలోచనల్ని

ఆరేస్తారు లోగడ స్టార్‌ హోటల్స్‌ వుందేవి. తర్వాత స్టార్‌ ఆస్పత్రులు వచ్చాయి. తర్వాత స్టార్‌ విద్యాలయాలు వచ్చాయి. ఇందులో త్రీ-స్టార్‌, ఫైవ్‌-స్టార్‌ వున్నాయి. అక్కడ ఇన్‌స్టెంట్‌ విద్యని కేజీల లెబ్ఞన అమ్ముతారు. ర్యాంకుల్ని హార్మోన్స్‌లా ఇంజెక్ట్‌ చేస్తారు. తల్లిదండ్రులకి కంప్యూటర్‌ హ్‌ నక నతన

లా

రాడో! |

న్‌ా

[ [|| ళా ప్రీన్‌ మీద సిలికాన్‌ వ్యాలీ రంగురంగుల్లో కలలోకి వస్తూ వుంటుంది. అక్కద డాలర్లు కాసే చెట్టుంటాయి. అసలా చెట్లకి ఆకులు బదులు డాలర్లే రెమ్మలకి వేలాడుతూ వుంటాయి బుజ్జిగాడు ఎల్‌కెజి నుంచి త్వరత్వరగా ఎదగాలి. ఆ దాలర్లు కోసి తెచ్చుకోవాలి. నేటి పరమపద సోపాన పటంలో పంటగడి ఏంటంటే అమెరికాయే! కరెన్సీ అంటే డాలరే! రాజుని చూసినమ్మకి మొగుజ్జి చూస్తే మొట్ట బుద్ధి వేసిందట! డాలర్‌ని చూసిన కంటితో రూపాయిని చూస్తే తిట్టబుద్ధి వేస్తుంది. గురుకులాలు ఏనాడో పోయాయి. “గురు శబ్దం ఏ స్థాయికి దిగజారిందో రాస్తే అది వేరే

వ్యాసం అవుతుంది. బార్‌లో “ఇంకో పెగ్‌ తీసుకురా గురూ' అనడం దగ్గర్నించి టీవీలో లేడీ యాంకర్‌ టీవీ ముందు కూర్చున్న (పేక్షక శోతల్నందర్నీ 'గురూ' అని సంబోధించడం దాకా వచ్చేసింది. 'గురూ' శబ్దం ఎంత పాపులర్‌ అయిందంటే- ఇప్పుడున్న పరిస్థితిలో భక్తుడికి దేవుడు ప్రత్యక్షం అయితే 'గురూ! నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో గురూ అంటాడు. నిజానికి ఈ స్టార్‌ విద్యాలయాలు వచ్చాక గురువులు, శిష్యులూ లేరు. ఇప్పుడు విద్యార్థులంతా కస్టమర్హు, 'సరువులంతా సప్లయర్లు. అంతంత డబ్బులు పోసి స్కూళ్లలో చేరేటప్పుడు నిజానికి అక్కడ టీచర్స్‌కి విద్యార్థుల్ని 'ఏరా' అని పిలిచే హక్కు కూడా లేదు. తప్పు చేసినా దండించే అధికారమూ లేదు. ఎందుకంటే 'కస్టమర్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌” అన్నది వ్యాపారంలో ప్రాథమిక సూత్రం. శ్రీరమణ 109

పచ్చగా, గుబురుగా రూపుదిద్దుకోవడం లేదు. వరిచెట్లకి బియ్యం కాస్తాయనీ, ఫ్యాక్టరీల్లో పాలు తయారవుతాయనీ గట్టి నమ్మకంలో వుంటారు ఈ కాలపు స్టార్‌ కుర్రాళ్లు. ఎందుకంటే వాళ్లు గానుగెద్దులు. జట్కా గుర్రాలు.

పూర్వం ఒక రాజుగారు తన ఒక్కగానొక్క కుమారుడికి కోటలోనే రాజగురువులతో సమస్త విద్యలూ నేర్చించాడు. విద్యాభ్యాసం ఓ కొలిక్కి వచ్చింది. రాజుగారు కొడుకుని పరీక్షించదలచారు. నిండు సభలో పరీక్ష మొదలైంది. సాహిత్యంలో, సంగీతంలో, అస్త్ర శస్త్రాలలో అడిగిన ప్రశ్నలకు చకచకా జవాబులు చెప్పాడు. తర్వాత రాజుగారు తన గుప్పెట మూసి “కుమారా! నా గుప్పెట్లో ఏముందో నీవు నేర్చిన జ్యోతిష్య విద్య ఆధారంగా గుణించి చెప్పు' అన్నారు. సుపుత్రుడు కొద్దిసేపు గుణకారాలు చేసి “తండ్రీ మీ గుప్పెట్లో వున్నది బండి చక్రము” అన్నాడు. రాజుగారు గుప్పెట తెరిచారు. అందులో బంగారు ఉంగరం వుంది. అప్పుడు రాజుగారు అన్నారు కదా- “వత్సా! నీ గుణకారములో తప్పు లేదు. నీ జ్యోతిష శాస్త్ర లెబ్బల ప్రకారం గుండ్రని ఆకారం గలది, లోహపు అంచు గలది అని తేలింది. కానీనా గుప్పెట్లో వుండదగిన వస్తువు ఏదో ఊహించలేకపోయావు. దీనివల్ల తేలిందేమంటే (గ్రంథాలలో వున్న శాస్త్రం వరకూ నీకు అబ్బింది గానీ, సాధారణ జ్ఞానం నీకు అంటలేదు. నీకు ఇప్పుడు కావల్సింది లోకజ్ఞానం. అది సంపాదిస్తే గానీ నీ ఇతర విద్యలకి ఫలితం లేదు. లోకజ్ఞానం లోకం మీదనే దొరుకుతుంది గానీ కోటలో దొరకదు. కనుక దేశ సంచారానికి వెళ్లిరా నాయనా! అని పంపించారు. అందుచేత ఎంతటి ర్యాంకు వారికైనా లోకజ్ఞానం ప్రధానం. పెద్దలు సెలవల్లో అయినా వారికి బాహ్య ప్రపంచం చూసే ఛాన్స్‌ ఇస్తే ఫలితాలు బావుంటాయి. ఇన్సెంటివ్‌ల పేరిట పిల్లల బుర్రల్ని తల్లిదండ్రుల డబ్బుల్ని హరించడం భావ్యం కాదు. క్‌ లు 110 మానవ సంబంధాలు

చత శార్తల్లో లీఫికుక్కలం కు. కక కు క్కకి కూడా ఒక రోజు వస్తుంది” అనే ఇంగ్లీష్‌ సామెతని తరచుగా విజ్ఞులు వాడుతూ వుంటారు. గత కొద్ది రోజులుగా వత్రికల పతాక శీర్చికలకి వీథికుక్కలు ఎక్కినపుడు ఆ సామెత సత్యమే అనిపిస్తోంది. ఎందుకో తెలియదుగాని మనం గాడిదని తలుచుకున్నంతగా మరే జంతువుని తలుచుకోం, కుక్క విశ్వాసానికి పెట్టింది పేరైతే గాడిద ఓర్పు, సహనానికి చూరుపేరు. కుక్కకి “గ్రామ సింహం” అని పొరుషనామం వుంది గాని అది సిటీల్లో చెల్లదు. కుక్కలు, గాడిదలు బోలెడు జానపద కధల్లో నస్తాయి. వండిత రాయలు లాంటి మహాకవి గాడిద మీద అనేక చాటువులు సంస్కృతంలో చెప్పాడు. చెట్టు ఇస్మాయిల్‌ గారికి “గాడిద” అభిమాన కవితా వస్తువు. భాగవత కాలం నించీ తెలుగువారి జీవన (ప్రవంతిలో గాడిద కలిసినంతగా మరో జీవి ఏదీ కలవలేదు. వసుదేవుడంతటి వాడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్టు పురాణాలు సాక్ష్యం చెబుతున్నాయి. మనిషి కాళ్ళు పట్టుకోవడం తేలిక. మరి గాడిద కాళ్ళంటే నాలుగింటినీ వట్టుకోవాలి. అది ఎలా స్పందిస్తో కూడా తెలియదు. ఇఒ దాట లౌ హన. నె జ / ప గొ కా

నేను ఫస్ట్‌ఫారమ్‌ చదివే రోజుల్లో మా తెలుగు చూష్టారు గాడిద గురించి తరచు చెబుకుండేవారు. “అడ్డగాడిద” అనేది ఆయన అభిమాన తిట్టు ఓసారి ఆయన క్లాసులో వున్నట్టుండి “గాడిద వల్ల లాభాలేమిటో చెప్పండి” అని మొదలు పెట్టారు. బరువులు బాగా మోస్తుందండీ అన్నాడొక విద్యార్ధి. పాలు ఇస్తుంది అన్నాడు ఇంకోడు. “గాడిదకి పిల్లలు పుడతాయి కధా అప్పుడు పిల్లగాడిదలు వస్తాయి" అని చెప్పి మేష్టారితో శభాష్‌ అన్పించుకుంది ఓ అమ్మూయి “ఇంకా...?” అన్నారు మేష్టారు క్లాసువంక తేరబార చూస్తూ. మూడో బెంచీలోంచి ఒకడు లేచి “గాడిద అనే మాటని మంచి తిట్టగా వాడుకోవచ్చండీ” అన్నాడు మేష్టారు ఆ జవాబుకి మురిసిపోయి, ముచ్చటపడి, - ఒరే అడ్డగాడిదా ఎంత గొప్ప ప్రయోజనం చెప్పావురా. నిజంగా సీ బుర్ర చాకురా! వృద్ధిలోకి వస్తావురా గాడిదా” అని అభినందించి ఆశీర్వదించారు ఆ గొప్ప పాయింటు చెప్పిన కుర్రాడు, పెరిగి పెద్దవాడై బోలెడు చదువులు చదివి, చివరకి ఐఎఎస్‌ అయి, ఇప్పుడు గవర్నమెంట్‌లో పనిచేస్తూ ఎంతో హోదాగా వున్నాడు ఇప్పుడతనికి చాకుతో వన్లేదు ఎప్పుడైనా కలంతోనే కొద్దిగా పని, తూ మేష్టారు భాగవతం కధ వస్తే తప్పకుండా గాడిద ఎపీసోడ్‌ తన లాజిక్‌తో చెప్పేవారు. అదేంటంటే - సాక్షాక్తూ భగవంతుడిని తీసుకు వెళ్తుంటే అసలు గాడిద ఓంధ్ర పెట్టడమమిటి? దేవుణ్ణి చూసి సమస్త ప్రకృతీ పులకరించి పోతుంటే గాడిద కూడా పులకరించి స్తుతి గానం చేసింది. లేదా వసుదేవుడి మీద కోపం అయినా కొరణం కావచ్చు ఓండ్ర పెట్టడానికి. పుట్టిన బిడ్డని పురుట్లోనే కంసుడు చంపేస్తాడని తెలిసి కూడా అంతటి కార్యదీక్షతో ఏటేటా పిల్లల్ని కనకపోతేనేం? బహుశా ఇలాంటి భావం అ గాడిద మనసులో వుండి వుండచ్చు. అందుకే దేవుడు వసుదేవుడి తలమీద వున్నా గాడిద నిగ్రహించుకోలేకపోయింది వసుదేవుడు దేవుడి గాటకి కట్టేసి వీధికుక్మల సమస్యకు వద్దాం. ॥ “అరిచే కుక్క కరవదని” సామెత. అయితే ఆ సంగతి కుక్కకి తెలియాలి. అరిచినా, కరిచినొ ధి కుక్కల్ని ఏమీ చేయకూడదని జీవకారుణ్య సమాజం వారు కుక్కల తరపున వకాల్తా ప్రచ్చకు వాదిస్తున్నారు. మునిసిపాలిటీలకీ, కార్బారేషన్లకీ వీధికుక్కల ఏరివేత పెద్ద సమస్య రి రంది టు జనం, అటు జీన కారుణ్యం వదలమంటే పొముకి కోపం పట్టమంటే వ న వ్యాప్తిని అరికట్టాలని ప్రతిపాదన వుంది కాని ఆచరణలో ఎన్ని సమస్యలూ మనుప్తుల్నే కంట్రోల్‌ చేయలేకపోత్రంట్రే ఇక కుకృల్తో ఎక్కడ వేగుతారు? వం లన సీక్ళ వచ్చినా కుక్కకి గళుకునీళ్ళే? అంటారు. కుక్కకి అత్యాశ లేదు కుక్క పట్టడంలో ఎక్స్స్‌పర్స్‌, అందుకే వివిఐ ఓ నంతగో మనిషిని నమ్మరు. ఒకాయనతో ట్రూ పా వే ౦ .విఐ పి.లు కుక్కని నమ్మి అవిడ స్మెల్లింగ్‌లో క్రుక్మన్సి మించిందక్ష సనన నా వంఠ అదోలా మాని - న తిన్న స్నాక్స్‌, తాగిన బ్రాండుతో సప చ్‌ రం తర్వాత వాసన పట్టింది పైగ స లాన బ్రాండుతో సహా చెప్పింది డాగ్‌ ప్రామిస్‌ ప్రామిస్‌ అనబోయి. నేను ఆశ్చర్యపోయాను, శ్రరాత్ర /€ మిస్‌ అన్నాడాయన గాడ్‌ ( అఆమాటా యీమాటా చెప్పి మచ్చిక శప్కోో సందర్భంలో ఆవిడని కల్సినపుడు క౫ " “ఎలా పసికట్టారండీ” అని అడిగాను. “వొరీ 2 రం రని అగా మానవ సంబంధాొలో

జేబులో బారు బిల్లు దొరికింది” అని చెప్పి, సస్పెన్స్‌కి తెరతీసింది. “వాడు తినడు, తినేవాడిని తిననివ్వడు. అంతా గడ్డివామి దగ్గర కుక్క మనస్తత్వం” అనే ఆర్యోక్తి తరచు వింటూ వుంటాం. జర్నలిజమ్‌లో ఓ ప్రాథమిక సూత్రం చెబుతారు - “కుక్క మనిషిని కరవడం సాధారణం, కాని మనిషి కుక్కని కరవడం వార్తా కథనం” అని.

ఇప్పుడు నగరాన్ని కొరికేస్తున్న సమస్య “వీధి కుక్కల బెడద”. దీనికి ఒక మంచి పరిష్కారం వుంది అరిచే కుక్కలు కరవవు అనే పెద్దలమాట వుంది. అంచేత కుక్కల్ని ఆరిచేవిధంగా శిక్షణ యిస్తే అప్పుడవి అరిచే కుక్కలైపోతాయి. అవి ఎవర్నీ కరవవు సర్వేజనా సులినోభవంధు నన. శ్రీరమణ 113

ర్స లిం లె

ఇకానాక గవర్నమెంటాఫీసులో ఒకానొక గుమాస్తా బల్ల మీదకి ఓ కాయితం వచ్చింది వచ్చిందే తడవుగా బరబరా సంతకం గిలికేస పై టేబుల్‌కి దాన్ని తోలేశాదు. మరి ర వాయువేగంతో ఆ కాయితం తిరిగి యధా స్థానానికి తిరిగి వచ్చేసింది. వచ్చేప్పుడు ఓ డ్‌ తగిలించుకుని మరీ వచ్చింది. ఆ తోక సారాంశం ఏమిటంటే... 'సదరు యీ కాయితం నీ సంబంధించింది కాదు. కనుక, నీ సంతకం కొట్టేసి దాన్ని రద్దుపరిచినట్లు (అంటే సంతకాసు పూర్తి సంతకం పెట్టి తక్షణం పంపమని”. ఆ గుమాస్తా కలం కొరుక్కుని, అక్షరాలా అలాగే చేసి పంపాడు మధ్యాహ్నానికి ఇంకాస్త పెద్దాయన ఇనిషియల్‌తో ఆ కాయల పుట్టింటికి చేరింది. “ఈ సంతకం నీదేనని మేజిష్ట్రేటు, నోటరీ పబ్లిక్‌ లేదా తత్తుల్యమైన అధికారి (ధ్రువీకరణ సంతకం, సీల్‌తో సహా కొట్టించి పంపమని 'నోటొ మాటగా రాసి వుంది- పైగా ఆకుపచ్చ సిరాతో. ఆ రోజుకి ఆఫీసు టైము ముగిసింది.

గుమాస్తా మర్నాడు నోటరీ ప్ర్లిక్ష దగ్గరకు వెళ్లాడు అన్‌ద్యూటీగా ఆఫీసర్‌ వారు వరం యుచ్చినందున సెలవు సేవ్‌ అయింది. తీరా అక్కడికి వెళ్లాక 'ఇది సాదాసీదా కాయితం మీ చెల్లదు- నాన్‌ జుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌ మీద మాత్రమే చెల్లును అన్నారు. ఐదు రూపాయల స్టాంప్‌ పేపర్‌ని రివాజుగా వది రూపాయలకి కొని తన సంతకాన్ని ధృవీకరించే సంతకం నోటరీతో చేయించాడు. ఆయన యాఖై రూపాయలు తీసుకుని పదిహేను రూపాయలకి రేడు ఇచ్చాదు. అప్పటికి గుషూస్తా గార్రిక్రి అన్నీ కలిసి ఎనభై రూపాయలు అయింది. చారి మామిడిపళ్లు కనిపిస్తే పిల్ల సన్నాసులు తింటారని క్రాన్సి మొత్తం ఖర్చు వంద అయిందనిపించొడ, ఆ రోజుకి ఆఫీసుకి పోక్సుందా ఫలం పుష్టం తీసుకుని ఇల్లు చేరాడు. మర్షాడు ఎటూ 'ఆన్‌డ్యూ అనే వరం వుంది కదా అన్ని దాన్ని అడ్డు పెట్టుకుని- వంద అంటే పూర్దాంకం మరీ నమ్మబుల్‌గొ వుండదని నూటనాలుగు రూప్రాయ్లల డెబ్బై పైసలకి బిల్లు కట్టించాడు. దానికి మద్దతుగొ ఓచర్లు జోడించాడు. ఈ రెంటికీ తగినంత్ర వినయాన్ని జతపరచి ఆఫీసర్‌ గారి దివ్య సముఖానికీ వెళ్ళాడు. ఆయన కర్మోటకంగా వాట్రివంక చూసి 'నో. . నువ్వు చేసిన తప్పుకి ఆఫీసు దబ్బు... అదే పబ్లిక్‌ మనీ ఎందుకివ్వాలి? ఇక్మడ ప్ర పైసకీ ఆన్సరబిలిటీ వుండాలి ... అందర్‌స్తోంద్‌ అని అరిచారు. శ

గుమాస్తా వమాత్రం చలించకుండా, వినయాన్ని రెట్టించి- అయ్యా! తవరు “అన్‌ద్యూటీ అనుగ్రహించారు కదా మరి ఆధ్సీసు ప్పన్సి మీద వెళ్లినప్పుడు శ్రమకు బిల్లు నివేదించుకోవడం! తమరు కటాక్షించడం పరిపాటే క్రదా ఆ్రన్లి (గాంధికంలో ప్రాధేయపడ్డాడు. సామాన్యంగో న ల

౯ ళ్‌ ్రో

కా =
డ్డ (
ఆటా హాయి
వినయంతో అనగానే భాష బరువెక్కుతుంది. ఇక్కడ అదే జరిగింది.
ఆఫీసరు గారు ఓసారి కళ్లజోడు తీసి, తుడిచి మళ్లీ ధరించి 'అయితే ఓ పని చెయ్‌ దీనికి
“లీగల్‌ కన్సల్టేషన్‌ ఫీజ్‌ అని ఓ వంద కలుపు. మేకిట్‌ రెండొందల ఎనిమిది అండ్‌ ఫిఫ్టీ
పైసా...” అని బిల్లులూ, ఓచర్లూ గుమాస్తా వైపుకి నెట్టేసి, ఆయన సీరియస్‌ మూడ్‌లో వేరే
సైల్లోకి వెళ్లిపోయాడు. 'ధాంక్యూ సార్‌' అని అవి ఉత్సాహంగా తీసుకుని వెళ్లిపోతుంటే- 'ఎనీ
వే... ఓసారి ఎక్కౌంట్స్‌తో మాట్లాడి చెయ్‌...” మళ్లీ లేనిపోని కొగ్రీలొస్తాంవ్‌' అన్నారు. అందులోని
ధ్వని అలంకారం గుమాస్తాకి అర్ధమైంది.
మొత్తానికి మొత్తాన్ని సారు చెప్పినట్లు మేకప్‌ చేసి అక్కౌంట్స్‌ గారికి పుటప్‌ చేస్తే ఆయన
అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. 'నీకసలు కామన్‌సెన్స్‌ వుందా? రేపొద్దున ఆడిట్‌ వాళ్లు
తవ్వి మీ నెత్తికి ఎక్కుతారు. ఫలానా వాడికి కాగ్‌ అక్షింతలు అని పేపర్లో హెడ్డింగులు”.
గుమాస్తా బాడీ లాంగ్వేజ్‌ ద్వారా వినయాన్ని ఎలిఫెంట్‌ డోస్‌కి పెంచాడు. 'నో... ఐ కాంట్‌
హెల్చ్‌' అంది అక్కౌంట్స్‌. ఇలాంటి హెడ్స్‌ కింద శాంక్షన్స్‌కి ప్రొవిజన్‌ లేదు...' అంటూ ఏం
చెయ్యాలో తోచక టేబుల్‌ మీద సామానుని కొంచెం అటూ యిటూ సర్దాడు గుమాస్తా చొరవ
చేసి టేబుల్‌ మీద మిగతా ఫైల్సూ అవీ సరిచేస్తూ, ఆ బిల్లుల్ని మూత్రం బల్లమీద సెట్‌ చేశాడు
'మునిగిపోతాం అందరం .. ను కింద ఇంపాజిబుల్‌... ఆనక అసెంబ్లీలో ఏ జీరో
ప్ర ,.. యకం
లం స్ట్‌ హెడ్డు .. అని గొణిగాడు
గుమాస్తా
న
115

ప. . అయితే ఓ పనీ చెయ్‌...

.. చిత్తం...”

'మన ఆఫీసు కాంపౌండ్‌లో పురుగూ పుట్రా వస్తున్న కారణంగానూ, గ్రీన్‌ అండ్‌ క్షీన్‌లో భాగంగానూ, ఆవరణలో పెరిగిన గడ్డీగాదం, మొక్కొమోదూ శుభ్రం చేయించినందుకు అయిన ఖర్చుగా దాఖలు చెయ్‌. సపోర్టింగ్‌ ఓచర్స్‌ ముఖ్యం. బైదిబై మేకిట్‌ ప్రీ హంద్రెడ్‌ అండ్‌ సమ్‌ పైసే అని తల తిప్పేసుకుని, ఎవరికో అర్జంటుగా ఫోను చేసే పనిలో పడ్డాదాయన.

జరిగిందంతా విని ఆఫీసర్‌ గారన్నారు కదా- “ఎందుకొచ్చిన గొడవ. ఈ పని తీరుని బట్టి చూస్తే టెండర్లు పిలవాల్సిందే. లోయస్టు టెండరుదారుడితో చేయించినట్లు మేనేజ్‌ చెయ్యాలి చాలా తంతు వుంది. ఎనీ వే మేకిట్‌ ఫైవ్‌ హండ్రెడ్‌ ట్వంటీ టూ అండ్‌ సిక్స్‌టీ పైసొ...'

లాంఛనంగా నోటీస్‌ బోర్డులో టెండర్‌ విషయం వేలాడదీశారు. అప్పటికే దానికి సంబంధించి మూడు కొత్త ఫైల్సు పుట్టిపెరిగాయి. నోటీస్‌ బోర్డులో టెండరు సంగతి పడగానే స్థానిక ఎమ్మెల్యే గారికి శుభసూచకంగా కుడికన్ను అదిరింది. సీన్‌ కట్‌ చేస్తే ఎమ్మెల్యే గారు మందీ మార్చలంకో ఆఫీస్‌లో వున్నారు, 'సార్‌! చాలా మైనర్‌ వర్మండీ. ఇదు వందలు. ,' అని ఆఫీసు బాసు నీళ్లు నమిలాడు. “అయితే, ఓ పని చెయ్‌... దానికి రెండో మూడో సున్నాలు తగిలించు. మనోళ్లు చేసుకుంటారు ఆ వర్మేదో, .* అన్నారు ఎమ్మెల్యే గారు ప్రజాహితాన్ని కోరుకున్న గొంతుతో. ఆఫీసర్‌ గారు షాక్‌ తిన్నట్లు వణికిపోతున్నారు. “అవసరమైతే పెద్దాయవతో ఓ మాట చెప్పిస్తా. అంతకాపోతే పనికి ఆహారం పధకం కింద వ ర్‌ ముందా టెండర్‌ నోటీసు లాగేసి నే చెప్పినట్లు సున్నాలు కలిపించు. గ సుకుంటా.. * అంటూ విసవిసా లిఫ్ట్‌ వైపు నడిచారు ఎమ్మెల్యే గారు. ఆఫిసర్‌ గారికి బుర్రనిందా పత్రికలూ, వాటిలో “పచ్చగడ్డి కుంభకోణం, “లక్షలు స్వాహా' లాంటి పతాక శీర్చికలూ తిరుగుతున్నాయి ల్‌ న వష కహానీలు మనం రోజూ చదువుతూనే వంటాం వింటూనే వుంటాం. కానీ

మొక్కామోడూని మొలిపించగలమ! లని. ని కంగారల్లా ఆరో అంతస్థులో గడ్డీగొ 0

న పా

మానవ సంబండొలో

కూడు పెన చదుర ౪

వజో కరగతి చదివేటవ్వుడు వేష్టారు విల్లలందర్నీ “పెద్దయ్యాక ఎవరేమి అవాలనుకుంటున్నార్రా?” అని పేరుపేరునా అడిగారు. ఒకడు డాక్టర్‌ అవుతానండీ అన్నాడు ఒకడు వింజసీరు అవుతానన్నాడు. ఇంకోడు మిలట్రీ అయిపోతానన్నాడు. ఓ అమ్మాయి “సినేమా యాట్టరొ' అవుతానంది. తర్వాతనించి ఆ పిల్లని సావిత్రి అని పిలవడం మొదలుపెట్టారు ప్రశ్న నాదాకా వచ్చింది. "పెద్దయ్యాక నేను రౌడీని అవుతానండీ అన్నాను. నేను సత్యప్రచాణంగా అనుకున్నదే చెప్పాగానీ మేష్టారికి చాలా కోపం వచ్చింది. ఏరా ఎగతాళిగా వుందా రాస్మెల్‌ అని చెడామడా తిట్టి బెంచీ ఎక్కించారు.

ఎక్కిస్తే ఎక్కించాడు, వాడి పాపాన వాడే పోతాడనుకున్నాను రౌడీ అయిపోవాలన్నది నా కోరిక. దానికో కారణం వుంది. మూ వూళ్లో ఓ రౌడీ వుండేవాడు మరీ ఎత్తుగా, మరీ లావుగా ఏం వుండేవాడు కాదు. రౌడీలంతా ఆరడుగుల ఎత్తు, మద్ది మానంత లావు వుందకృక్షేదని అర్ధమైంది. దాంతో నా కోరిక మరీ బలపడింది. గళ్ల లుంగీ, నల్లటి చేతుల బనీను, మెడకో రుమాలు చుట్టుకుని, కాళ్లకి బూట్లు తొడుక్కుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా నిర్లక్ష్యంగా నడిచి వెళ్తుంటే నేను దూరం నించి రౌడీ గారిని చూసి ఎప్పటికి అంతవాణ్ణి అవుతానోనని బెంగపదేవాణ్ణి ఆయన ఎడం చేత్తో గుండు తడుముకుంటూ కిళ్లీ బడ్జీ ముందు ఆగి, షోడా తీసుకుని వేలితో కిసుక్కున నొక్కి ఒక్క గుక్కలో తాగేసేవాదు. కొట్టాయన ఓ చీడీకట్ట, అగ్గిపెట్టె

లో సా, నాం గ్‌ 1ళ్లో లాడ లా యాడ గె యో మా లం రూ లగ తయా. శ్రతమణ 117

వినయంగా అందించేవాడు. పెద్ద బజారు మూల మీదున్న టిక్కీ హోటల్‌లో కూడా ముగ్గురు కూచునే బల్ల మొత్తం రౌడీ గారికి ఖాళీ చేసి యిచ్చేవారు. ఎక్కడ ఏం తిన్నా ఏం తాగినా ఆయనకి డబ్బులు యిచ్చే పన్లేదు. రౌడీ గారి గొంతు బహు పీలగా వుండేది గానీ యమ ఫవర్‌ దానికి, ఇవన్నీ చూస్తున్నకొద్దీ నాకు త్వరత్వరగా పెద్దవాడినై రౌడీనైపోవాలనే ఆదుర్దా ఎక్కువైపోయింది.

ఒకటి రెండుసార్లు పోలీసులు స్వయంగా వచ్చి రౌడీ గారిని జీపు కారులో తీసికెళ్లారు. దాంతో నాకు మరీ ఆయన మీద గౌరవాఖిమానాలు పెరిగిపోయాయి. ఆయన ఊళ్లో లేనప్పుడు “నాంచారిగాడు” అనేవారు గానీ, ఎదరపడితే నాంచారయ్య అని మర్యాదగా వ్యవహరించేవారు. ఆయనకీ సంగతి చెప్పాలని ప్రయత్నించా గానీ కుదళ్లేదు. ఎదర ఒక మాట, చాటున ఓ మాట అనుకోడం తప్పు కదా- పైగా అట్లాంటి మనిషిని.

ఒకసారి మునసబు గారి పంటకుప్ప తగలడిపోయింది. ఊళ్లో వాళ్లంతా పరుగు పరుగున వెళ్లారు. అసలే చలికాలమేమో హాయిగా చలి కాచుకున్నారు. అబ్బో! ఎన్ని వరి పేలాలో? తర్వాత ఎప్పటికో ఫైరింజను గంటలు కొట్టుకుంటూ వచ్చింది. అదో పెద్ద కోలాహలం! బూడిద మీద నీళ్లు జల్లి, ఆ గంటలకారు వాళ్లు బేసిన్ల కొద్దీ ఇడ్లీలు, ఉప్మాలు తినేశారట. మునసబు గారు “పోయింది తగలడిపోయింది- మళ్లీ ఇదో చమురు” అని తిట్టుకున్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గానీ రౌడీ గారిని జట్కా బండి మీద ఆస్పత్రికి తీసికెళ్లారు. “రౌడీ గారికి జెరం తగిలిందేమో...” నమ్మలేకపోయాను. మొదటిసారి ఆయన మీద అభిమానం వీసమెత్తు సడిలింది. దానికితోడు మా ఇంట్లో వాళ్లంతా రౌడీ గారి ఊసు ఎత్తితే చావగొడతామని పదేపదే వారింగులిస్తున్నారు. ఇక నా మాట సాగేట్టు కన్పించలేదు. ఇక లాభం లేదని పానిపట్టు యుద్దాలు, సింధు నాగరికత, అక్షాంశ రేఖాంశాలు, జపాన్‌లో వరిసాగు, భారతదేశంలో ఖనిజాలు, తాడిచెట్టు ఉపయోగాలు, బాల వ్యాకరణం, వేణీ సంహారం నాటకం యివన్నీ చదివేసి ఒక స్టేజికి చేరుకున్నాను. అప్పటికే మా అన్నయ్య డిగ్రీ పూర్తిచేసి, టైపు హయ్యరు, షార్టుహాండ్‌ లోయరు చేసేసి గవర్నమెంటు ఉద్యోగి అయిపోయాడు. తర్వాత నన్ను కూడా హైదరాబాదు లాగేసి, వాడంతవాణ్ణి చేసేస్తాడని మా ఇంట్లో వాళ్ల కోరిక మా అన్నయ్యకి నమ్మిక.

నన్ను మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలూ, కోరికలూ వేధిస్తూనే వున్నాయి. ఎంసెట్‌ లాగే దా సెట్‌ లాంటి ఎంట్రెన్స్‌ పెట్టి, మంచి ర్యాంక్‌ వచ్చిన వాళ్లకి రౌడీజం, దాదాగిరి కోర్సులలో శిక్షణ యిస్తే ఎంత బావుండును? అందులో ఎన్నో బ్రాంచిలు పెట్టచ్చు. చక్కటి సిలబస్‌ తయారు చేయ్యిచ్చు. డిప్లమా, డిగ్రీ కోర్సులు విడివిడిగా ప్రారంభించవచ్చు. ఇప్పటిదాకా అనార్గనైజ్డ్‌గా వున్న సెక్టర్‌ని ఆర్గనైజ్డ్‌గా తీర్చిదిద్దచ్చు. (సైవేట్‌ కాలేజీలకు అనుమతి యివ్వచ్చు. అనుబంధంగా తాలింఖానాలు, జిమ్‌లూ పెట్టచ్చు. బాంబుల తయారీ లాంటివి స్పెషలైజేషన్స్‌గా పెట్టుకోవచ్చు. మనకేం మేధావులకి కొారతా? ఇదీ విషయం అంటే మొత్తం సిలబస్‌ దగ్గర్నించి ప్రాక్టికల్స్‌ దాకా మన అవసరాలకి తగిన విధంగా రూపొందించు కోలేమా? మరీ అవసరమైతే విజిటింగ్‌ లెక్బర్స్‌ యీ సబ్టెక్టులో నిష్ణాతులైన వారితో ఇప్పిస్తాం. వాళ్లకేం కొరవా మనకి? ఇక 18 నూ సౌ మానవ సంబంధాలు

ఉద్యోగ అవకాశాలంటారా- బోలెడు. లిక్కర్‌, మట్కా, దాదాగిరి నించి భూ కబ్దాల దాకా వీళ్లు కావల్సిందే. ఎలక్షన్లు వస్తే సరేసరి. ఈమధ్య జాతీయ, అజాతీయ బ్యాంకులు క్రెడిట్‌ కార్డుల మీద డబ్బులు వాదేసుకుని చెల్లించకపోతే- నాంచారయ్యలకే పంచెలాల్చీ తొడిగించి వసూళ్లకి పంపుతున్నారు. బార్లు, హోటళ్లు లాంటి పబ్లిక్‌ స్లేసెస్‌కి వీళ్ల సేవలు తప్పనిసరి. అందుకే ఆర్‌-సేవ, డయల్‌ యువర్‌ ఎం.పి. (మజిల్‌ పవర్‌) లాగా సుశిక్షితులైన వారితో సేవలు అందించవచ్చు. “పిలిస్తే పలుకుతా” లాంటి పేర్లతో సంస్థని నిర్వహించవచ్చు. ఎంట్రెన్స్‌లో వారి మిగతా అర్దతలతోబాటు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి వెయిటీజి యివ్వచ్చు. తప్పు లేదు. కొంచెం డెవలప్‌ అయ్యాక ఒక యూనివర్సిటీని ప్రత్యేకంగా పెట్టి, కాలేజీలని, దానికి ఎఫిలియేట్‌ చెయ్యచ్చు. ఇది ఇట్లా చెబుతూ పోతే తెమిలేది కొదు. గొప్ప స్పాను, రేంజి, ఉపాధి అవకాశాలు వున్న కోర్సు. ఇవన్నీ మా పెద్దవాళ్లకి పట్టలేదు. పోనిమ్మని వాళ్ల ఖర్మానికి వాళ్లని వదిలి నా దారిన నేను

కూడా గుమాస్తాగిరిలో చేరిపోయాను. మొత్తానికి తెలుగు సినిమాలో ఆఖరి రీల్లో అందరూ ఒకచోటికి చేరినట్లు- మా కుటుంబ సభ్యులం అందరం హైదరాబాద్‌ చేరుకున్నాం. ఇక తర్వాత కధ మామూలే! వూళ్లో వున్న కాస్త భూమి, మండువా ఇల్లు అమ్మేసి భాగ్యనగరంలో తలొక ఫ్లాటు ఏర్పాటు చేసుకోవడం మిగిలింది. కథ అడ్డం తిరిగి ఇంటీ బేరం, బొలం బేరం లిటికేషన్‌తో పడ్దాయి. కోర్టుకి వెళితే వాయిదాలకి తిరగడం తప్ప దారీదొిక దొరకలేదు. ఆఖరికి మూ వూళ్లో రౌడీ గారికి చెప్పాం. ఆయన ఐదు వేలు తీసుకుని మూదో రోజుకి సెటిల్‌ చేసేశాడు. ఇప్పుడు మా వాళ్లంతా- “వాడి యిష్ట ప్రకారం వదిలేస్తే మనవాడు మోసాటీక సీనియర్‌ రౌడీ అయి, కుటుంబానికి పలుకుబడి వుందేది. ఏ జూన్లీహిల్స్‌లో కూచునో

నాలుగు రాళ్లు సంపాయించుకునేవాడు (ఆ హిల్స్‌లో “రాయి” అంటే నాలుగొందల చదరపు గజాలు” - అని వాపోతూ వుంటారు. కానీ ఏం లాభం చేతులు కాలాక ఆకులు పట్టుకుని. నా ముందుచూపుని మొగ్గలోనే తుంపేసినందుకు అనుభవించాల్సిందే! చదువు ఏదైనా కానివ్వండి అది కూడు పెట్టేది అయివుండాలి- అని మొత్తుకుంటే యా వాళ్లు విన్నారా? ల. శయన 119

కంయో..? రైర్ణర కూయయో...?

కల కాదు. వైష్ణవ మాయకి అవకాశం లేదు. అవసరమూ లేదు. కానీ నిజం! సంఘటన తర్వాత సంఘటన- నమ్మలేనంత చోద్యంగా, పిచ్చేక్కేటంత చిత్రంగా!

అవతల వీధిలో వుండే అమ్మాయి, అల్లుడూ ఆటో దిగారు. పైగా ముఖాలు విలాసంగా వెలిగిపోతున్నాయి. ఆదుర్దా తట్టుకోలేక రకరకాల ప్రశ్నల ద్వారా ఎందుకు వచ్చారో అర నిముషంలో రాబట్టాను. చెబితే నమ్మరు కానీ నిజం. సంగతేమంటే- వాళ్ల అత్తగారు చచ్చేట్లు కేకలేసి- మొన్నామధ్య కట్నంగా ఇచ్చిన డబ్బు మాకు తిరిగి ఇచ్చేసి రమ్మన్నారట. నిక్షేపం లాంటి పిల్ల, పైగా చదువుకున్న అమ్మాయి. కట్నం తీసుకోవడం ఏమిటి? అర్జంటుగా ఇచ్చి రండని ఆటో ఇచ్చి పంపారట. ఆ సంగతి చెప్పేసి లక్షా ఇరవై వేల రూపాయలున్న ఓ ప్లాస్టిక్‌ కవరు నా చేతిలో పెట్టి ఇద్దరూ పాదాలకు నమస్మరించారు. సమయానికి చేతిలో అక్షింతలు లేనందువల్ల అరచేత్తోనే దీవించాను ప్లాస్టిక్‌ సంచీని గుండెలకి పొదువుకుని.

ఇంతలో గుడిలో గంట మోగినట్లు శుభసూచకంగా ఫోను మోగింది గత అయిదు రోజులుగా మౌన వ్రతంలో వుంది. ఎంత బుజ్జగించినా పలకనే లేదు. ఫోను అందుకున్నాను ఒక్క వుదుటన. అవతల్నించి టెలిఫోన్‌ వారి కంఠం. క్షచమూపణలతో సంభాషణ మొదలైంది. “మీరు ఐదు రోజుల్లో పదిసార్లు కంప్లెయింట్‌ ఇచ్చినా మా వాళ్లు పట్టించుకోలేదు. బెనాండీ” అని అడిగింది అవతలి కంఠం. 'జెనండీ. కానీ ఇట్సాల్‌రైట్‌... అని ఇంగ్లీషులో అనేక వ్యాకరణ దోషాలతో ఏమేమో మాట్లాడాను. (గ్రామర్‌ రాక కాదు ఆ వుద్వేగ క్షణాల్లో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీడం లేదు. ఇదిలా వుండగా మా ఆవిడ కూతుర్ని అల్లుడినీ సంబోధించి మాట్లాడేస్తోంది. ఆ మాటల్లో ఎక్కువ భాగం నా గురించిన మంచి మాటలు. చెవిలో అమృతం పోసినట్లు వినిపిస్తున్నాయి.

ఇంతలో వాకిట్లో పోలీస్‌ జీప్‌ ఆగడం, అరక్షణంలో జీపు దిగిన ఆఫీసరు- 'మూర్తి గారంటే తనురేనా” అడగడం జరిగిపోయాయి. ఆశ్చర్యం! గారు, తమరు... ఏమిటిది పోలీసుల భాషేనా ఇది? ఒరే, ఒసే, ముం..., లం... తప్ప వేరే విభక్తి ప్రత్యయాలు వాడని భాషావేత్తలు ఇదేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు? కిన్నెరులో, కింపురుషులో ఖాకీ డ్రెస్‌లో వచ్చి, సరదాకి నన్ను ఆటపట్టిస్తున్నారని అనుమూనం కలిగింది. నా మెదడు ఈ వరసగా తగిలిన దెబ్బలకి మొద్దుబారింది. అసలే అంతంత మాత్రం. మరో పిలుపుకి సృృహలోకి వచ్చాను. 'బెనండీ.. నేనే! అన్నాను. “మా దొరవారు అంటీ కలెక్టర్‌ గారు మీ దర్శనార్థం వస్తున్నారు. ముందుగా వారి రాకను తమకు తెలపమని పంపారు' అంటూ వుండగానే, మరో భారీ వాహనం వచ్చి ఆగింది. ఓ పెద్దమనిషి సఫారీ సూట్‌లో కారు దిగి, సరాసరి ఇంట్లోకి వచ్చారు. నా మతి చెడి అలాగే ప్రతిమలా నిలబడిపోయాను. నాకు లాంఛనప్రాయంగా దణ్ణంపెట్టి మూ ఆవిడని చూసి- 120 మానవ సంబంధాలు

క ఈ టి వా (॥ (క్ష లానే వ. /' త రల గగ గక వీ అమ్మా చెల్లెమ్మా! నేను మీ కలెక్టరనమ్మా. మీరు రేషన్‌ కార్డుకి, మంచినీక్లకి అర్జీ పెట్టుకుని చాలా రోజులు అయింది కదమ్మా అన్నారాయన.

“రోజులు కాదన్నయ్యా, సంవత్సరాలు అయిందన్నయ్యా. రేషన్‌ కార్డు పని తీరిపోయిం దిలే. అది నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు గానీ నీళ్ల సంగతి చూడన్నయ్యా' అంది చెల్లెమ్మ. నాకు ఏదో నాటకం చూస్తున్నట్టుంది కానీ నిజం.

'ఆరిస్యానికి ఈ అన్నయ్యని క్షమించు చెల్లెమ్మా! నీ ఇంటికీ నీళ్లు వచ్చాక ఆ సీట్ల లాగి గానీ ఈ అన్నయ్య ఇక్కజ్ణించి కదలడమ్మా... కదలడూ అన్నారు కలెక్టరు గారు పల వాళ్లంతా సెంటిమెంటలై దేబురుమాళ్లతో కళ్లొత్తుకున్నారు. నీకెందుకన్నయ్యా అంత | ఇ సైపులైనులూ అవీ వేరే వాళ్లు వచ్చి వేస్తారు కదా అని మా ఆవిడ నదణెప్పడానికి ప్రయత్నించింది. “ఇంత జాప్యం జరిగాక, ఇక నా పాపానికి నిష్కృతి లేదు... దు నిష్టా అని గొంతు పేంచి 'బావగారూ! పలుగూ పారా ఇటివ్వంది అన్నారు నావైపు చూస్తూ. ఇరుకున పడిపోయాను.

ఈ ఉక్కిరిబిక్కిరిలో వుండగానే ఇంటర్‌ ఫైనలియర్‌ చదువుతున్న పుత్రరత్నం, వాళ్ల లెక్చరర్‌ గారి మోటార్‌బైక్‌ వెనకాల కూచుని వాలాడు మళ్లీ ఇదొక ఖంగారు! లెక్చరర్‌ గారు నాకు నమస్మరించి- 'మా డైరెక్టర్‌ గారు స్వయంగా ఇంటింటికీ రాలేక నన్ను పంపారు. ఇంటర్‌ చదువుకి ముప్పై వేలు ఫీజా? సాక్షాతూ సరస్వరీ దేవిని తరగతి గదుల్లో అమ్మడమా? ఇంకా బోలెదన్ని డైలాగులతో మా డైరెక్టర్‌ గారు గుక్క తిప్పుకోలేక పోతున్నారు. నూర్లురు కొడుకుల్ని కోల్పోయిన ధృతరాహ్లుడిలా కుమిలి పోతున్నారు. ఇదిగో డబ్బు. మీ చిరంజీవిని రేపట్నించి మేమే తీసికళ్లి మేమే ద్రావ్‌ చేస్తాం. దబ్బు ముట్టిందనీ, క్షమించాననీ ఒక్క ఫోను చేసి మా ముదు తిసి టల దా? శ్రీరమణ 121

డైరెక్టర్‌ గారికి చెప్పండి. ఆయన ఎంగిలి పడతారు. ఇదిగో ఈ రూపాయి టెలిఫోనుకి... అని డబ్బు పొట్లం నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడాయన. హే భగవాన్‌! ఏమిటిది? ని సత్యనారాయణస్వామి వ్రతకధలో అధ్యాయాలు జరిగిపోతున్నట్లుంది గానీ నిజమేన ల్లో నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నిజం. బోర్డు తిప్పేసిన రెండు చిట్‌ఫండ్‌ కంపెనీల వాళ్లు ఒ పెద్ద ట్రక్కులో వచ్చి డబ్బు మూట గుమ్మంలో పదేసి 'లెబ్ఞలు తర్వాత చూసుకుందాం? అంటూ వెళ్లిపోయారు. ఇంకా ఏవేవో జరిగిపోతున్నాయి. టీవీలో అద్భుతమైన ప్రోగ్రాంలు వస్తున్నాయి. యాంకర్లు లేరు. నిజం, నమ్మండి నా మాట, ఒక భూ కబ్దా కేసు ఏదేళ్ల నుంచి కోర్టులో, పోలీస్‌స్టేషన్లో మధ్యవర్తులలో నలుగుతోంది గానీ తెమలడం లేదు. స్వయంగా కబ్బాకోరే వచ్చి- 'కారే రాజులు... వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే అని భాగవత పద్యం కోట్‌ చేసి, శేష వచ్చి మీ స్థలం మీరు స్వాధీనపరచుకుని నన్ను విముక్తుణ్ణి చేయండని 'ప్రాధేయపడ్డాడు నిజానికి మరి కాసేపట్లో టెస్టులకి ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లాల్సి వుంది. నాకు మెడనొప్పిగా వుందంటే నాకు పన్నెండు టెస్టులూ, ఎందుకేనా మంచిదని మా ఆవిడకి ఎనిమిది టెస్టులూ రాశారు. పదివేలు అడ్వాన్సు కూడొ కం. ఇంతలో అ దాక్టర్‌ గారు ఫోన్‌ చేసి, టెస్టలేప్రీ అక్యర్లేదనీ, మందులతో కూడా పని లేదనీ, చౌక్కాకి కాలర్‌ దగ్గర గుండీ టైట్‌గా' వుండం వల్ల మెడనొప్పి వస్తోందనీ చెప్పారు. ఇక ఈ వరస ఇలానే సాగితే మరికాసేపటికి నేను ఏమైపోతానో అని నాకే అనుమానం సింది. అయితే- దేవుడు రక్షించి మరి రెండు నిముషాలకి టెలిఫోన్‌ ఎప్పటిలాగే డెడ్‌ అయ్యింది. అమ్మాయి అల్లుడు ఇచ్చిన ప్లాస్టిక్‌ సంచీ నా చేతిల్పచి తీసుకుని రోడ్డెక్కారు. కార్లూ జీపులో మలుపు తిరిగాయి. ఇద్దరు వస్తాదుల్లాంటి వాళ్ళ్లొచ్చి చిట్‌ఫండ్‌ మూట ల్లాక్మెళ్లారు. లెక్చరరు, అబ్బాయి ఫీజు అంతా ఇంద్రజాలంలా మాయమైనాయి. మరికాసేపటికి మామూలు మనిషిని అయ్యాను. పక్క వీధిలో చూ గురువుగారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పడం మొదలెట్టాను. ఆయన మధ్యలోనే ఆవి నాయనా! జరిగిందంలొ నిజం. బ్రమ కాదు. ఇది గ్రహ సంచారంలో వచ్చిన మార్చు వల్ల ఏర్పడిన ఉపద్రవం. బృహస్పతి భూమికి అతి దగ్గరగా వచ్చిన కారణంగా, మనిషి మనిషిలా ప్రవరించడం జరిగింది కేవలం 16 నిముషాల పది సెకండ్లు మాత్రమే! తర్వాత బృహస్పతి మామూలుగా తన కక్షభీ వెళ్లిపోయాడు. ఇలాంటిది 22 వ్రేల నాలుగు వందల సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది అదీ కధి అని వివరించారు. “గురువు గారూ! మరి ఆ 16 నిముషాల్లో ఏవెనా సంతకాలూ, తీర్మానాలూ జరిగిపోత్తేనో, అన్నాను “అలా జరగదు శిష్యా! హస్పతి కక్ష్య మారగొనే భూమిని శని ఆవహించి, శాశ్వతంగా వ మంచీ జరగకుండా మూసాడు. అంచేత అలొ కలలాగే జరుగుతాయి గానీ నిజంగా జరగవ్‌. అమ్మె! నిజంగా మనిషి మనిషిలా ప్రవర్తించడం మొదలుపెడితే ఇకాలజీ సర్వనాశనం అయి పోదూ? అన్నారాయన భయంభయంగా. డె 122 మానవ సంబంధాలు

ర్రుణొ సేల్‌ ఉన్నట్టుండి వర్షం మొదలైంది. రోడ్డు రద్దీగా వున్న ఆఫీసులోకి తలదాచుకోవడానికి గబగబా నడిచాను ఒక్క సర్భారు ఆఫీసుల్లో తప్ప మరెక్కడైనా సరే ఓ కొత్త మనిషి లోపలికి వెళ్లాడంటే పట్టించుకుంటారు అందుకని తల తడిమి చూసుకోడానికి ఆ ఆఫీసు అనువైందిగా భావించాను. అక్కడ గోడలకి పట్టిన తేనె తుటెల్ని వెంటిలేటర్స్‌లో పెట్టిన పిచ్చిక గూళ్లనీ చూస్తూ వరండాలో పచార్లు చేస్తున్నా ఓ గదిముందు ఆగాలనిపించి ఆగాను. ఆఫీసరుగారు, ఆయనెదురుగా ఇద్దరు ప్రజలు కూర్చుని వున్నారు. నిజానికి “పొరులు” అనాలి. నాకెందుకో కొన్ని సందర్భాలలో “ప్రజలు” అనడమే బావుంటుంది. ఆఫీసర్‌ గారు పెద్ద గొంతుతో ఫోన్లో మాట్లాడుతున్నారు. బయట వానజల్లు చేస్తున్న చప్పుడు శృతి తప్పిన తంబురా మీటుతున్నట్లుంది. “ఏమిటీ? కంప్యూటర్‌ సెంటర్లో అబ్బాయికి ఫీజు కట్టాలా? ఇవ్వాళే చివరి రోజా? ఎంతా... పన్నెండు చేజ2 / ॥ ॥ (// (/ న తీ తై శ్రీరమణ 123

వేలా? అఘోరించమను బ్యాంకు టైం కూడా అయిపోయింది. చెక్కులు తీసుకోరా? క్యాషే కట్టాలా. . నేనిప్పుడేమీ చెయ్యలేను. పైగా వర్షం. ఛఛ.. పోతే పోనీ అని రక్కున విసుగ్గా ఫోన్‌ పెట్టేశారు ఆఫీసరు. అరక్షణంలో మళ్లీ మామూలు మూడ్‌లోకి వచ్చేసి, ఎదురుగా కూచున్న ప్రజల వైపు అధికారిలా చూశారు. “అయ్యా! తవరు మరోలా అనుకోకపోతే ఆ డబ్బు మేం ఇచ్చుకుంటాం” అన్నదొక ప్రజాకంరం, ఆ ముక్కకి అధికారి రెచ్చిపోయి- “ఏవండీ మీ కంటికి నేనెలా కన్పిస్తున్నాను? మీ పనేంటో చెప్పండి” అని కోపాన్ని కంట్రోల్‌ చేసుకున్నారు.

“రామ రామ .. ఏదో మనిషికి మనిషి సాయం మా వాడు మూట జారితే మన్నించండి” అన్నది రెండో ప్రజ.

“రామ్‌ రామ్‌... మీకీ మాకీ పైసల్‌ హిస్తాం, మీరూ మాకీ చెక్కూహివ్వండీ సాబొ అన్నాడు మొదటి వ్యక్తి, అప్పటిదాకా అచ్చ తెలుగులో మాట్లాడిన వాడల్లా సహజత్వం కోసం సినిమాల్లో సేర్‌లాగా శ్లాంగ్‌లో వాపోయాడు

“మీ అబ్బాయిగారు మా అబ్బాయిగారు కాదా” అన్నది రెండో ప్రజ ముద్దుగా ఆ ముక్కతో బయట వర్షంలాగే లోపల సెంటిమెంటు కురవడం (ప్రారంభమైంది. ఆఫీసర్‌ గారు అందులో తడిసి ముద్దయిపోయారు. బ్రీఫికేస్‌ తీసిన చప్పుడు విన్చించింది. శుభ్‌ లాభ్‌... తీన్‌. చార్‌.. అని నోట్లు ఎంచుకున్నాడు. ఆఫీసరు గారు చెక్కుబుక్కుతీసి బరబరా సంతకం పెట్టేసి “నాకసలు ఇలాంటి మొహమాటాలు నచ్చవ్‌ ఏదో ౩ పద్ధతిగా బతుకుతున్న వాణ్ణి అంటూ బగ్రీమన్న ధ్వనితో చెక్కు చింపి ఎదురుగా వున్న వ్యక్తి చేతిక్తి ఇచ్చారు.

“మీకీ సంగతీ మాకీ తెల్వదా సాబొ అంటూ లెఖ పూర్తిచేశాడు తెలుగు సేర్‌.

చెక్కు తీసుకుని కళ్లకి అద్దుకుని, ఆ పార్టీ క్యాష్‌ అధికారి చేతికి అందించింది ఆయన అందుకోకుండానే చిన్న చీటీ ఆయన చేతికిచ్చి “ఇదిగో మూ బడుద్దాయి పేరు, కట్టాల్సిన చోటు .. అహ మీరు గాని అటువైపు వెళ్తుంటే... వెళ్తుంటేనే..? అన్నాడొఫీసరు. “అయ్యయ్యో మేం ఆటే వెళ్తున్నాం సార” ఆఅన్సి వ్రీ్ర అందుకున్నారు. బ్రీఫ్‌కేస్‌ మూత వేసుకుని ఇద్దరూ సంతృప్తిగా బయటకు నడిచారు. అక్కడికి ఓ డీల్‌ సెటిలైంది.

నాలుగడుగులు ముందుకు వేశాను. కిటిక్రీ పక్షగా నిలబడాను. వాన కురుస్తూనే వుంది. ఓ పెద్దాయన ఎదురు కుర్చీలో కూచున్నాయనతో మాట్లాడుతున్నాడు “కంచిలో మీకెవరైనొ తెలుసా... అహ ఏం లేదు. చూ అమ్మాయి పెళ్లి ఖాయం అయింది. చీరెలు అక్కడైతే బాగుంటాయని మూ లేడీస్‌ ఒకటే నస్త,.౫ ఆయన మాట పూరికాకుండానే ఎదురుగా వను వ్యక్తి ఒక్కసారి చార్జ్‌ అయిపోయాడు. “అడడా. . ఆండవనే. మాది కంజీవరం దానే. - నళ తెరియుంో అని అనర్గళ్లంగో తమిళ తెలుగులో మాట్లాడ్డం మొదలుపెటాడు. బేరం కుదిరిపోయే వుంటుంది మరో నాలుగు మూటల తర్వాత, గా ట్‌

వరండా మరుపు త్రిరిగాక్ర రెండో గదిలో ఇదే నేవీధ్యంలో మరో ద శం. జెలాగులు వేరు.

“ఇంటికి రంగుల్లు వేసే వారెవరైనా పప తలలి ట్రం టో కారం

నా ఎరక ” అని రివాల్వింగ్‌ కుర్చీలో ఆ అడిగింది. విజిటర్స-కుర్చీలో కూరకు కదే" ఒక్కసారి ఎగిరి గంతేసి. “తెలియడమొ? భలేవారే... చూ పార్ట్‌నర్‌ పనే అది. క్లింటన్‌ వచ్చినపుడు రోడ్లకు తారు రంగు పూసింది

మావాడే” అని ఒకరూ, “ఎలాగైనా మీ ఇంటి రంగుల పని మాకే ఇప్పించాలి సార్‌” అని ఇంకోరూ మంకుపట్టు పట్టారు ఇహ లాభం లేదని రౌండ్‌ కుర్చీ ఆయన “మరి మూడు కోటింగులూ మీరే చూడాలి" అన్నారు. ఇవతల ఇద్దరూ కొద్దిగా నిదానించి “రెండు వరకూ సరే సార్‌, మూడంటే వర్మవుట్‌ కాదు సారొ” అన్నారు. “క్రాక్రప్రోతే ఏం చేస్తాం .. మిమ్మల్ని చేతులు కాల్చుకోమనలేను గదా. ఎవరి తిప్పలు వాళ్లవి" అని రివాల్వింగ్‌ ఛైర్‌ని కొంచెం ఎడమొహంగా తిప్పాడు. విజిటర్లు ఇద్దరూ ఒక్కసారి కళ్లతో చర్చించుకుని రంగుల పని ఒప్పేసుకున్నారు.

“ఫినిష్‌ బావుండాలి” అన్నాడు రివాల్వింగ్‌ ఛైర్‌లో ఉద్యోగి “మా మాట కూడా అదే” అన్నారు వినయంగా తెలివిగా విజిటర్లు. ఆఫీసుల్లో పనులు చురుకుగా పూర్తి అవుతున్నందుకు ఎంతో ముచ్చట వేసింది. వాన కొంచెం తగ్గింది. వేడిగా చాయ్‌ తాగుదామని ఆఫీస్‌ క్యాంటిన్‌కి నడిచాను. ఇందాకటి (ప్రజలు, విజిటర్లు క్యాంటిన్‌లో మాట్లాడుకుంటూ తగిలారు. సేర్‌ శ్లాంగ్‌లో మాట్లాడిన మనిషి ఆఫీసర్‌ గారిచ్చిన చెక్కుచింపేస్తూ “పన్నెండు వేలు పట్టేశాడు" అని పక్కవాడితో చెప్పి చిరాకు పడుతున్నాడు. “పని కరెళ్టుగా చేసేస్తే పెళ్లి చీరెలు పెద్ద ప్రాబ్లం కాదు" అంటున్నాడు మరో పార్టీ, “ఇదే నయం ఫైలు కదలికని బట్టీ కలర్‌ కోటింగులు వెయ్యచ్చు” అనుకుంటోంది మూడో మురా

క్యాంటిన్‌లో నేను కూచున్న టేబుల్‌ దగ్గర మరో ముగ్గురు ఆఫీసు స్టాఫ్‌ కాబోలు కూచున్నారు వాళ్లు ఇంక్రిమెంట్లూ, ట్రాన్స్‌ఫర్లూ అవీ యువీ మాట్లాడుకుంటూ అక్కడ పెట్టిన సమోసాలు తినేసి, టీలు తాగేసి వెళ్లిపోయారు. నేను టీ తాగడం పూర్తిచేసి ఇంకా సన్నగా పడుకున్న వాన పూర్తిగా తగ్గుతుందేమోనని కూచున్నాను. ఇంతలో ఇరవై నాలుగు రూపాయలకి బిల్లు తెచ్చి సాసర్‌లో పుట్టి వెళ్లాడు. గుండె గుభేల్‌మంది "సింగిల్‌ చాయ్‌ ఇరవై నాలుగొా అన్నాను. “మరి వాళ్ల ముగ్గురి బిల్లూ” అన్నాడు క్యాంటిన్‌ సవ్లయర్‌ "నాకేం తెలీదూ” అన్నాను బిక్మమొహంతో.

మ తెలుసు. ఆ టేబుల్‌లో వుంటే వాళ్ల తొ లూకూ పార్టీ అనుకున్నా అని నా దగ్గర పాతికా వసూలు చేశాడు. “పోన్లే మరి ఇంత అనుభవం గడించినందుకు దానికి మూల్యం చెల్లించాలి కదా” అని బిల్లు కట్టి బయటపడ్డాను. క్‌

తన్నా గ ౦

  • (| ్క న. ఫు స వాన సో ల శ్రీరమణ 26

.. ఆ౮౧)౧00గు/ గం౦దిగ - 1140కు 3401924110 064606 - 32104 [4మ్టితి నాలగో అట్టి - కూనీ5 సంఎంధాలో ఖో మనిషి బుద్దిజీవి కాబట్టి, యీ భూగోళం దానిపైని సమస్త జీవకోటి తన కోసమేనని అనుకుంటాడు. ఇతర ప్రకృతి వనరులు, భూగర్భ సంపదలతో సహా తనవేననే భ్రమలో వుంటాడు. అన్నిటితో పాటు తనూ వొక జీవినని ఎప్పుడూ అనుకోడు. అందుకని సృష్టిలోని సమస్త చరాచర వస్తుకోటితో మనకు సంబంధాలు వుండి తీరతాయి. అందుకే మానవ సంబంధాలను ఎంచుకున్నాను. వీటిని దేనితోనైనా ముడిపెట్టవచ్చు. ఈ గోళంలో జడచేతన పదార్థాలు అయిపోతే మరో గ్రహానికి వెళ్లి సంబంధాలను కొనసాగించవచ్చు. దీనివల్ల రచనా వస్తువుకి కరువు యిప్పట్లో + రాదని మీలాగే నేనూ నమ్మికతో వున్నాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ- “మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యీ కవిగారి రచనలలో అక్కడక్కడ కవిత్వం కూడా కనిపిస్తుంది” అని స్పష్టం చేశారు. అలాగే మీరు యీ | పుస్తకంలోని వ్యాస పరంపరను (శ్రద్ధగా చదివినట్లయితే, అక్కడక్కడ హాస్యం కూదా తగులుతుందని మనవి చేస్తున్నాను. -శ్రీరమణ [1 ట్ర " ( మోనికా బుక్స్‌ హైదరాబాద్‌ నా క |