Telugu geetharama(lalitha geyalu) - anilvaranasi/indianlanguages GitHub Wiki
కే న రా | వ. లహిర్యటు.. డమ ప " న్ లి నాం ప్న వ లన జ 'గతొరాఖు౦ 4 , కా టా 1 య , . ఉం అ, శ. గా న! ్ష ” ॥ జొ ల 5 “శ్ న ఫ్ర త / వీ: ్గ్ శ్ గ్ ర మ కీ _ డం. " 1 నం అట సలా హ్ కాగ. నన నండి క. న శళ ( మం. వట | రకల! ల ఛసో ల. నో చ వ్య సల గ్ ౯ గ. న్ సు న్ య ళ్ బన స్రీ సర కు, - న ో షు న్యా ళ్ళ క [ అమ్మని బని $ న " . = బం ల" శా* షే నో మ ్లూ గా బల్ల టి గని న. = ల ర్డ శ మ (పొహాటే స్వే! - శర ఫ్ మ . ' సడి 2. గ ప్ సం నిల్ న థో రర వ్ | అ హె శ యాత్ స లా సట లోయ. ఓ. షె ఇ య అ... శా భా జు! కది ల స = టి లళి ల. వల... కం భన పన ॥ “న పు కర సా... లకర త రన రాల ా అ తా సో | . ఫలాల యర టం కహా ల లల తీర టా పరమయా! యన డుం య లీ శ రే తయా ఈ వ్ శ తద లం, | య న నుండగా యయా ఉక క ల్ చతు. రట ల క. పా ఉట కళ వి గ్ మప శష జ రా నా. ల ఆ చతర గే డట దాం అంటా న. హె ర ”ా క హర ౨ డాం గై? న. ఎ ౯ క్ భా ల . ఖీ జ స డా. న. క్ ॥ ధం చా యళ జ యు - పలచ రో ఎ గరలు “2 న. యింతే స ఇర యడ. రి ్గ కటు లు! శ గక క ర లశ టా! లని తా శత హి స. గ్ క్ స్ ఛా చో కే శక ల 2 యన యో హనీ య టం. త చే వ స ల గ శ్ ౯. లాల్ సట జ న అ కే ళా పీ మమతా రల గ భి లో టు న్ వ్ న క టంట. ల ల్ు + న్. న “శ. టె జ శో | షన) గ. సళ న ను ఆలూ గర శ సోధొలళ క, '. “శరం జ + నో లో ల య. సట ల గట్టీ | పగ్తే యు గ్ళిీక న. వ పి సఖ ంలగా [నరో అ్కపన్భ్యా | రల ? శి ఇఇ! ్ ౯ లౌ ణ్ శ్ కా న. న ॥ కోల శా క ఎ స సట ౬ ఖో స్ ౨ క్ల 0ల్లి యు య స సీ న ల్ ఆం చను. ము. 60 మిల (1 అన్న ఇక ళీ సాం ఎ మ ” టే స శి టీ శీల అంట గ య శ “ ణా. . శ అ ల ఇగ. ₹ స్త ఆల ఛ్ యే! తటే న ల క ట్ టట న్ . ం | న జ ఉ క 1 శా న. వ ఇ (గ్ - సం క , ్టై స ము లం లై ల అ. 4 , వే. అజ్? | శ
గతారామం పుట్టపర్తి నాగపద్మిని
మం విం గీతారా (414 బాన కవితాసంపుటి వ గలా నాగర రచన : పుట్టపర్తి నాగపదిని కాపీరైట్ : కవయిత్రి ప్రథమ ముద్రణ : గ అక్టోబర్, 2004 (7 “బ్ర! ర్ కవర్ డిజైన్ : అంకుప్ గ్రాఫిక్స్ ముద్రణ ; అకృతి ఆఫ్సెట్ ప్రింటర్స్ చిక్కడపల్లి, హైదరాబాద్ - 20. ప్రతులకు : పుట్టపర్తి నాగపద్మిని 6-3-1142/106, నిత్యసాయి అపార్ట్మెంట్స్... బి.ఎస్.మక్తా బేగంపేట " అద ఉంచా లయమై స న. ఫి స హైద్రాబాద్ - 500016 ఈగో య. నవోదయ బుక్ హౌస్ సా. -ా సహ ఒన్ బో నా క. క టో విశాలాంధ్ర పళ్లికేషన్స్ వారి అన్ని బ్రాంచి చవ వెల ; 40/-
_ | న 1. న ” ॥ రం. గ న. నెక గ భ్; లు హు న "| న మ సం వ నం. లు ] సస. సన మము శ్ థి ల నన్ను' నన్నుగా చూసు డా! ల మా శ్రీవారికి
బాళలాంజలి
'గీత్రారామం' - పాటల తోట. తోటలో అనేకానేక పుష్పాలు ఉంటాయి. వివిధ వర్ణకాంతులతో మన మనస్సులను అలరిస్తాయి. పరిమళాలు వేరైనా వేటి ప్రత్యేకత వాటిదే! ఈ 'పాటల తోటిలోనూ వివిధ అంశాలపట్ల నా స్పందన ఉంది. వివిధ సందర్భాలలో, నా భావోద్యానంలో ఉంచిన సుమాలను ఇలా మీముందుంచేందుకు ప్రోత్సహించిన నా జీవిత భాగస్వామి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల హర్షవర్ధన్ గారికి బహుకరించడం నా విద్యుక్త ధర్మం. పెళ్లైన తరువాత సైతం నా ఉన్నత విద్యనూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగించగలుగు తున్నానంటే అది కేవలం వారి సహృదయ సహకారం వల్లనే కదా! అందుకే ఈ 'గీతారామాన్ని వారికి అప్పజెప్పటం ఆనందదాయకంగా ఉంది. అందంగా ముద్రెంచిన 'అంకుళ్ గ్రాఫిక్స్' అకృతి ప్రింటర్స్ అధీనేతలకు కృతజ్ఞాంజలులు.
ఈ గీతాలలో కొన్ని ఇప్పటికే క్యాసెట్లలో రికార్డ్ చేయబడ్డాయి. ఆకాశవాణిలో ప్రసారం చేయబడ్డాయి. వాటిని స్వరపరచిన సంగీత నిర్వాహకులకూ, గాయనీ గాయకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
పుస్తకరూపంలో వెలువడుతున్న నా ఈ 'గీతారామం' లోకి సహృదయ పాఠక, గాయక లోకానికి నా ప్రేమ స్వాగతం.
వీటికి రాగాలనద్ది అలరించాలని అభిలషించే మిత్రులకు అభిమాన పూర్వక స్వాగతం.
ఇంకేం! ఆరామంలోకి అడుగిదండి! నా గీతోద్వేగాన్ని ఆదరించండి!
- మా 'నానపన్నిని'
విషయసూచిక అదె చూడు తూరుపున ర గణపతి దేవుని పరిపరి విధముల 10 నా మొరలను విని శై నవవిధ పుష్పమ్ములతో 12 విజయవాడ వెలసిన 13 అమ్మ మనసు [శ లాలీ 15 మళ్లీ ఒకసారి 16 ఎంత అందమీ లోకంలో 18 అదిగదిగో 19 నీ రాకకై 20 ఎన్నాళ్ళీ వియోగాన 21 నా హృదయవీణ 22 కన్నుల దాగిన కలలెవ్వరివే 23 ఎక్కడిదీ తెలివెన్నెల ల ఈ గాయం నా (ేమంత లోతైనది బిగ్ వేదాలు నినదించిన భూమి యిదీ 26 తళుకు తళుకున మెరిసే తారలు 2 తెలుగు వెలుగుల ప్రాంగణంలో 26 మార్చవోయి. ఈ జగతిని 29 రోజులెలా గడిచాయో తం ఈ భూమికి వమని చెప్పాలి? 21
ఎటు చూసినా ప్రభు సౌందర్యమే 32 సహకారంలో సఫలతున్నది 83 నరుడే నారాయణుడిక 84 నారీమణులే నడుంకడితే తర్ మరచుట మా వశమా నీ నామము 236 నేటి నీ సుఖ జీవనానికి ౩7 తరం తరం నిరంతరం 38 రాత్రి బడికి పోదాము త్తే అల్లివీల్లిగ 43 (బ్రహ్మన్న ఏనాడో 45 వందనం త్తే కార్మిక సోదరులారా త్తే నీలాకాశపు అంచుల్లో త్తి నేలతల్లి అడుగుతోంది 50 నిను వర్ణింపగ 52 గళమెత్తి నీ గీతి 53 సాయినాధుని రశ శ్రీకరమౌ నీ సేవయె మాకూ ర్ర్ ఈ వింత ఒక్కింత 56 ద్వారక దర్శనమే ర్ నీవైన ్రోవవే! 58 అంతా సాయమయం 59 జయజగదీశ హరే 60
అదే చూడు
అదే చూడు తూరుపున తొలి తార పొడచినది
తొలి దేవునకు సేయ తోయజంబుల పూజ అదే! ఆకసము పైనదే విహగబ్బందము సాగె
వేదుకగ గణపతికి హారమై భాసిల్ల ॥అదే॥। భువి నుంచి దివి దాకా సాగినిలచినవ వవిగో
భువన మోహనములౌ వృక్షరాజమ్ములు
కైలాసమందున్న కరుణాసముద్రుడగు
గణనాధు లీలను వీక్షింపనెంచినవో అదే! గిరుల దారులవెంట పరువెత్తి పరువెత్తి
రురుల రూపమునెత్తి అవతరించిన హిమము
తన పట్టి పుత్రుడా గణపతిని జూచుటకు
తనువెల్ల తపముగా యిల నిరీక్షించెనూ ॥ అదే! మల్లెలూ మొల్లలూ మంచి సంపెగలవి
మా నేరమేమిటని మూగబోయెను చూడు
ఉమ్మెత్త బిల్వమ్ము గరిక మాచీపత్రి
మా స్వామి యీతడిని మురియుచుండెను నేడు ॥అదే॥ 9 ౩ గీతారామం
గణపతి దేవుని గణపతి దేవుని పరిపరివిధముల భజియింపవె మనసా గమ్యము నెరుగక అటుయిటు కానక భ్రమలో మునిగెదవేలా మనసా 1గణపతి॥ జగతిలోన యేపని మొదలిడినా అకళంకుడు మన గణనాథుని కడ సకల విఘ్నములు. బాపుమునీవని మోకరిల్లి వేడుకొనుగ, టబ్రోచునె గణపతి మోదమునొసగే స్వామికి ఇపుడే మోదకములనిడి ముదమునందవే ముగ్ధమనోహర విఘ్ననాధుడే బుద్ధిసిద్ధి గలిగించునె మనసా గణపతి! భాద్రపద శుద్ధ చవితియె స్వామికి ప్రియమగు వేళనె మనసా (ప్రేమతో కొలిచెడి భక్తుల నెల్లను భద్రత నొసగీ, కాచునె మనసా గణపతి! (క్యాసెట్లో ధ్వని ముద్రితం) శం శం ఉగ పుట్టపర్తి నాగపద్మిని ౯ 16
నా మొరలను
నా మొరలను విని బ్రోవవే జనని
నిను శరణంటిని కన్యక వాసవి
దారిజూపవే శర్వాణీ
నతజనపాలిని, ఈశానీ ॥నా॥
ఒక్కమారు నీ కరుణను జూపిన
సంకటములు తొలగు
ఒక్కమారు నీ కృప ప్రసరించిన
విఘ్నములవి మరలు
అగ్ని గుండమున జొచ్చితివీవు
దివ్యతేజమున మరలితివీ
తాపసహారిణి తల్లీ భగీరథి
నా పరితాపము బాన్సవె నుతమతి ॥నా॥ 8 9 (8
చచిగీతారామం లాలా
నవ విధ పుష్పమ్ములతో నవ విధ పుష్పమ్ములతో నిన్ను గొల్లు శార్వరీ అభయము నిమ్ము తల్లీ గైకొనుమమ్మా హారతీ 1నవ॥। వినెదను నే నీ మహిమల నన్ను కావగా కీర్రించెద నీ గుణముల దిగంతములు వెలుగగా స్మరియించెద నీ నామము అఘములెల్ల తొలుగగా నీదు పాదసేవలోనె ధన్యభాగ్యమందగా ॥నవ॥ అర్చింతును నీదు దివ్యరూపమునే సతతము వందింతును నీదు వరద తేజమునే నిరతము దాస్యభక్తి తోడ నీదు పద కమలమ్ముల కొలుతును సఖ్యతతో నీ భక్తుల హృదయమ్ముల గెలుతును ॥నవ॥ నవవిధమౌ భక్తి మార్గములలో తలమానికము ఆత్మ నివేదనములోనె యిహపరముల అభేదము తత్వసారమమ్మా నీ మంగళ ధామము ముక్తి నాసగుమమ్మా నీవశము నాదు జన్మము నవ! (మె /డ్ని కశ 63 6] ఆ౦౦౦ "అల౦౦౦ 6౨౦౮౦ పుట్టపర్తి నాగపద్మిని ఈ 12
విజయవాడ విజయవాడ వెలసిన శ్రీ కనకదుర్గా విజయ పరంపరలనిచ్చు దేవి దుర్దా ॥మి॥ నీ భక్తుల బ్రోచుమమ్మ కల్పవల్లీ నీ శక్తుల నొసగుమమ్మ అమృతవల్లి ॥వి॥ కోరిన కోర్కెల నొసగే తల్లివి నీవు ఓయంటే ఓయని బదులిచ్చు మాత దుర్గా నిను నమ్మిన వారికి యిల లేదు ఎట్టి భయమూ కలనైనా యిలనైనా యిలవేల్పు నీవే దుర్గా ॥వి॥ ఇంద్రకీల పర్వతాన యిందీవరాక్షివై యిచ్చాజ్ఞానక్రియా శక్తులకు ఆలవాలమై యిలనే ఒక స్వర్గసీమగా మార్చిన దేవీ యీ భక్తుల బ్రోవవమ్మ కనకదుర్గ తల్లీ ॥వి॥ నీ వీ మో ళం ళం ర్య 13 చా గీతారామం
అమ్మ మనసు
అమ్మ మనసు సాగరం
అమ్మ మనసు అమృతం
అమ్మ మనసులోనే ఉంది
అనంతవిశ్వం ॥అమ్మ॥ అమ్మ మాటలోనే పలుకు
వేదాలూ. నాదాలూ
అమ్మ ముందు సాటిరావు
ఏ సిరులూ సంపదలూ
అమ్మే సృష్టికి ఆదీ
అమ్మే సృష్టికి అంతం
అమ్మతోటి జీవితం ఆనందసాగరం ॥ అమ్మ! అమ్మ ప్రేమలోని రుచికి
సాటిరావు యే మధువులు
అమ్మ భావనే మదిలో
కలిగించును పులకింతలు
అమ్మకు అమ్మే సాటీ
అమ్మకు లేదే పోటీ
అమ్మంటే అమ్మేరా
జగత్తుకూ బ్రహ్మేరా ॥అమ్మ॥
లాలీ
లాలీ లాలీ జోలాలీ
లాలీ లాలీ నా కన్నతల్లీ లాలీ! మందమందశీతలములు
మలయానిలచంచలములు
మధుమయ గాధను పాదే
కోయిలల బృందాలూ
వన్నెలు వన్నెలుగా విరిసిన పూవులూ
వినిపించ సాగేను కమ్మని జోలలూ లాలీ “మానిషాధ” ధార - రామ కథాగాధ
నీ కరుణారస దృష్టే - రామాయణ కవి సృష్టి
బాసర క్షేత్రమే - మాకిక సర్వమూ
భారతి మహతియే రాగసుధార్ద్ణవం ॥లాలీ॥ 15 "ఇ. గీతారామం
మళ్లీ ఒకసారి
మళ్లీ ఒకసారి నువ్వు ఎదురైతే బావుణ్ణు
మళ్లీ ఒకసారి ప్రేమ చివురిస్తే చావుణ్డు
మళ్లీ ఒకసారి మనం ఎదురై వెన్నెలవేళ
('ప్రేమతరంగాలలోన పయనిస్తే బావుణ్ణు మళ్లీ! మొట్టమొదటిసారి నీవు
నన్ను కలుసుకున్న క్షణం
కనురెప్పల కొసలనుండి
ప్రణయం వరించింది
మళ్లీ అనుభూతి సౌరగు
పౌొరలలోన తాకినప్పుడు
ఎదలోపల రాగమేదో
కమ్మగ వినిపించింది ॥ మళ్లీ। జీవితాన మైమరపును
నింపిన ఆ మధురక్షణం
మైమరపే ఊపిరిగా
మలచిన ఆ దివ్యక్షణం
యిప్పటికింకా గుర్తే
మరపురాని తొాలివలపే
జడివానల తడి ఊపిరి
సుగంధమై పరిమళించి మళ్లీ! వెన్నెలకై పరితపించు
చక్రవాక సీేమంతిని
ఎదలోపల ధ్వనియించే
వేదన రాగం నీదే
వేదనయే శోధనగా
బ్రతుకుతున్న నా మనసుకు
ఆమని మళ్లీ వస్తే
నీ రాకై నినదిస్తూ ॥మళ్లీ॥ శత గ్ళారామం ననన
ఎంత అందమీ
ఎంత అందమీ లోకంలో
ఎంత సందడీ లోకంలో
ఎన్ని వన్నెలూ ఎన్ని చిన్నెలూ
ఎన్ని సొగసులీ లోకంలో ఎంత
చిటారు కొమ్మన చిలుకలు కొన్ని
కులుకులొలుకుతూ వుగాయీ
అటూ ఇటూ తెగ హుషారుగానూ
పిచ్చుక గుంపులు యొగిరాయీ
రుుమ్మను తుమ్మెద 'కో అను కోయిల
సంగీతంలో సరిగమలూ
హంసల నడకల జింకల ఆటల
నాట్యభంగిమల తకరుణులూ ఎంత
ఈ సెలయేళ్ళూ ఈ తరులతలూ
ఈ సోయగాల సన్నిధులూ
యివే యివేగా మనకందరికీ
జీవనమిచ్చే పెన్నిధులూ ఎంత! (ఆకాశవాణి'లో ప్రసారితం)
అదిగదిగో
అదిగదిగో నవ వసంతోదయము
అసమశరుని శృంగార విహారము ॥అది॥
మామిడి తోపుల గండుకోయిలలు
పురివిప్పిన తలపుల మత్తిల్లినవే
మత్తిలి గుండెల దహియించెడు
విరహానల గీతము నాలపించినవె ॥అది॥
భ్రమర రాగమున చలియించినవటు
మధుభారముతో మురియు కుసుమములు
తెలితెమ్మర మైమరపు స్మర్శకే
పులకించినవిటు విరు నికుంజములు అది!
ప్రతి సుందర భావముతో మనసిజు
ఛాయలు ఉన్మీలితమవగా
మధువాకలపై తెమ్మెర జాడలు
పొలతుల ఎద రగిలింపజేసినవి ॥అది॥ (ఆకాశవాణిలో ప్రసారితం)
రతగతారమం నవనవ
నీ రాకకై నీ రాకకై వేచి నీ పిలుపుకై చూచి నీరవనిశీధిలో నామనసు వేగింది 1నీ॥ గలగలని ఆకులూ గాలికి కదలినా కలకలని సెలయేరు ఫక్ముమని నవ్వినా నీవె వచ్చేవనీ నన్ను పిలిచేవనీ లోలోన నా మనసు వుష్పొంగిపోయింది ॥నీ॥ నీలాల సోయగములీను ఆకాశాన పాలవెల్లులు తీర్చి చెలి చెంత చేరితే వలపులో తెరుగని రాకాసుధాకరుదు మబ్బుచాటున చేరి రవ్వ చేసెడి వేళ ॥నీ॥ | 7 న 7/1 మల్టీ” పుట్టపర్తి నాగపద్మిని .5 26
ఎన్నాళ్ళే
ఎన్నాళ్ళీ వియోగాన వేగేనో ప్రియా
ఏలాగీ మూగ బాధ మోసేనో ప్రియా ॥ఎన్నాళ్ళీ॥ కలువరేని చిలిపి చూపు
పలుకరించసాగె
కలలోపల నీరూపే
పులకింతలు రేపే
నీవు లేని నాదు మనసు
తావి లేని పూవు గదా | ఎన్నాళ్ళీ। చతక్రవాకమిధునకేళి
నాలో అనురాగ రవళి
కోకిలమ్మ కొత్త పిలుపు
నా మదిలో వలపు పిలుపు 1 ఎన్నాళ్ళీ! మనసులోని వలపంతా
కన్నెపూలు పంచాయి
ఓపలేని తీపి బరువు
మోయలేక విరిశాయి
జగమంతా నీ రూపే
తోచు నాకు ప్రియా ప్రియా 1 ఎన్నాళ్మీ। చం గతారామం
నా హృదయవీణ
నా పహృదయవీణ నవరాగాలు పలికేను
నా అంతరంగాన హరివిల్లు విరిసేను ॥నా॥
లోలోని పొరలలో తలఫ్తాకటి మెరిసెనే
సెలయేటి తరకలా, చిరునవ్వు విరిసేనే
ఎవరిదో ఒక నీడ చెంతనే నిలిచేనే
నును చెంపలను మీటి కెంపులొలికించెనే ॥నా॥
మును ముందులేని సపోయగమేదో తొణికింది
మధుర భావాలతో యెదయేమొ వణికింది
నేను నేనే కాదులే నాలోని
కొత్తరూపే తోచెనే 1నా॥
మ్గగ్ లు మణ
అం అనై జ్యా
వవ ావవవవవవఐ“పట్టపర్త్ నాగపద్మని ౯ 2౭
కన్నుల దాగిన
కన్నుల దాగిన కలలెవ్వరివే
వెన్నల గీతికలెవ్వరివే ॥కన్నుల॥
మదిలో విరిసిన వలపు తలపులే
సందడి చేయగా
తీయని వూహల ఊయలూగి
సడి చేయకనే
అరవిరిసిన నీ కన్నుల!
జడలో దాగిన బొండుమల్లియలు
నిండుగ నవ్వులు పూయగా
వడివడి నడకల అడుగుల సడిలో
హొయలు పండుగలు సేయగా
గలగల నవ్వుల జిగిబిగి సొగసుల
పరువపు గనులే తెలిసెగా
వెన్నెల రాయని వలపులలోన
వగలే చిలికీ అరవిరిసిన ॥ కన్నుల రా యా
2జి గతారామం లాలా
ఎక్కడిదీ
ఎక్కడిదీ తెలివెన్నెల
ఎన్నటిదీ తొలి కోయిల
ఎంతకు వీడని ఆశల
కాంతిమెరిసె నా కన్నుల |; ఎక్కడిదీ!
మమతల వెల్లువ నేనై
హృదిసీమల పరుగిడితే
సాగరమై పొదువుకొనే
పావన తేజము తానై
సంగమ సంగీత ధార
రురులై నినదించువేళ
తెగిపోయిన తంత్రులందు
జీవస్వరమును నింపే తెలివెన్నెల ఎక్కడిది!
తిరిగిరాని కలలలోని
చిత్రమైన వర్ణములను
ఓరిమితో ఏర్చి కూర్చి
ఒద్దికతో మేళవించి
లాలనతో సేదతీర్చి
బేలతనపు నిద్రకేర్చి
సలలిత రాగపు కాంతుల
వలపు వేదికగ మలచిన
తెలివెన్నెల ఎక్కడిదీ 1 ఎక్కడిది॥ (ఆకాశవాణిలో ప్రసారితం)
నా నా డా పట్టవర్త్ నాగపర్మిన్ భద
ఈఈ గాయం
ఈ గాయం నా ప్రేమంత లోతైనది
ఈ గేయం నా హృదయమంత విలువైనది
ఈ విరహం ఈ సహనం ఈ సమరం
యివి అన్నీ నా ప్రియురాలి పరమైనవి ॥ఈ॥ ఆమె కబరీభర మౌక్తికాల బెన్నత్యం
ఆమె చరణ కింకిణీ రవముల రుంకారం
ఆమె కోపారుణ కపోలాల అరుణిమలూ
అవి ప్రణయ శిఖర కాంతుల విరిపుంజములు ॥ఈ। ప్రేమ జ్వాల కీలలలో కాలిపోని హృదయమా
(ప్రేయసికై పలవరించి అలసిపోని కంఠమా
'ప్రేయసికై తల్లడిల్లు మానసమా!
ప్రేముడి మరచి మనుట నీవశమా!
(ప్రియబాంధవి వచ్చువేళ సుగంధమై విరియవే ప్రియరాగాలాపనలో అపశ్ళుతులను మరువవే ఈ 25 ౫ గీతారామం
వదాలు నినదించిన
వేదాలు నినదించిన భూమి ఇది ప్రణవ
నాదాలు కుసుమించిన ధరణి ఇదీ వేదాలు!
సుందర, నందనవనము
ఆనంద సదనయు
మందాకిని చరణ కమల
పావన సుందర తీరం వేదాలు!
ఈనేలను పరిమళించె ఆర్య సంస్కృతి
ఈ జాతిని రవళించెను శౌర్య రుంకృతి
ఇట్టినేల మనకంతా నిత్య వసంతం
ఇట్టి జాతి మనసంతా సత్యసంగతం 1॥వేదాలు!।
అహింసయే పరమధర్మమని చాటిన దేశమిది
పరమత సహనంలోన పరిఢవిల్లు దేశమిది
మతముకన్న. మిన్నమయైన "మానవతా సందేశం
ప్రతి మనసూ దేశమాత మందిర సంభావితం వేదాలు! (అఆకాశవాణి'లో ప్రసారితం)
లాలో ఫట్టా నాగపద్యన్ ౯౭
తళుకు తళుకున
తళుకు తళుకున మెరిసే తారలు
మిలమిలమంటూ వెలిగే తారలు
నీలినీలి ఆకాశంలోనా
నవ్వుల కాంతుల విరిసే తారలు తళుకు!
ఒకటిఐదు పదివందలు వేలూ
లెక్కకుమించిన తారల బాలలు
నిద్దురవీడీ అంకెలతోటీ
పోటీపడినా లొంగని తారలు తళుకు!
దీపం లాగా ఓసారి
మిణుగురులా మరోసారి
రాతిరి రాణీ నీలి చీరలో
తళుకుల్లా మరోసారీ ॥తళుకు॥
మబ్బులతోటీ దాగుడు మూతలు
ఆదే పిల్లలు తారలు
గుసగుసలాడే పికిలిపిట్టలా
పిల్లల దోస్తులు తారలు ॥1తళుకు॥
గాంధీ, నెహ్రూ, యిందిర, శాస్త్రీ
నింగిన మెరిసే తారలే
వాటిని చూసే నేర్వాలెంతో
రేపటిపొరులు బాలలు ॥తళుకు॥ (ఆకాశవాణిలో ప్రసారితం)
చ2ఆ గీతారామం ల్ల
తెలుగు వెలుగుల తెలుగు వెలుగుల ప్రాంగణంలో వెలసె వేమన్నా తెలుగు బాసకు జిలుగు నిచ్చిన తెగువ నీదన్నా తెలుగు! ఆటవెలదిని యీటెగా విసిరేసి నిలిచితి వీవయా తేటతెనుగున నీదు మాటలె పూలబాటలు మాకయా మూధవిశ్వాసాలకూ నీ మాట తీయని మందు గుళిక జాతి జాగ్భత పథమునడువగ నీదు రచనలె వేదికా తెలుగు! (టౌను నిను ఆంగ్లమున కనువాదమ్ముచేసి మురిసెనూ ఐక్యరాజ్యసమితి నీ అనువాదమును అట నిలెపెను పంచుకొన్నని ఇతర భాషలు అందుకొని నీ పాట సొబగులు అందువలెనే నిన్ను నిలిపెను జాతి మనసులలో తెలుగు! లా నా సూ పుట్టపర్తి నాగపద్మన్ ౯25
మార్చవోయి ఈ జగతిని మార్చవోయి. ఈ జగతిని అందమైన కావ్యంగా మార్చవోయి యీ జగతిని నందన ఉద్యానంగా ॥మార్చవోయి॥ వజ్రాన్ని వజంతో కోయవచ్చునేమొ గానీ వైరాన్ని వైరంతో మార్చలేవు స్నేహంగా కఠినమైన దారులలో సాగాలి నీ పయనం కోమల సుకుమారంగా మలచాలిక నీ గమనం _ ॥మార్చవోయి॥ మౌనం భూషణమైతే నీ శక్తే ఆయుధం ఆడటమే కాదోయ్ ఆడించాలి వసుధను అవసరాన్ని గమనించి అడుగు ముందుకేయాలీ వెనుకకు మరలేది లేదు మునుముందుకు సాగాలి ॥మార్చవోయి॥ కొత్తయుగం రానుందీ సంకేతం అందిందీ సమయానికి నీ అవసరమెంతెంతో ముందు ఉంది నీలోనే నీవుంటూ చేతులు ముడిచేయొద్దు చేయి చేయి కలిపి నీవు జగమంతా వ్యాపించు. ॥మార్చవోయి॥ కీ క బోటు ఆణి ఆల ఆలు 29 ౫ గీతారామం
రోజులెలా గడిచాయో రోజులెలా గడిచాయో బతుకు సంధ్య చేరింది వెనుక తిరిగి చూసుకుంటె మనసే వెత చెందింది రోజు! తీపి పిండి వంటలతో కడుపునింపి మురిశానే ఇతరులకై ఒక్క క్షణం జీవించుట మరచానే విలువలేని ప్రాణధనం అప్పుడే చేయి జారిందీ వెనుక తిరిగి చూసుకుంటే మనసే వెత చెందిందీ రోజు! రంగులలో మురిపించే కాగితాల పూలు తప్ప జీవన సుమ గంధాలకు చోటునీయలేదు నాదంతో యీ మేనును శృతి చేయనె లేదు మానస గీతని ఎదలో పల్లవింపజేయలేదు ॥1రోజు॥ స్వార్థమనే మాటొకటే జపమాలగ మారిందీ కనుల వెంట గంగ తాను ్రవహించుటె మానింది బుణ భారం మరీ తడిసి మోపెడంత బరువైనా అపుడు తెలియలేదులే ఇపుడు పిలుపు వచ్చెలే రోజు! గా గై న ట్ లాలా పుట్టపర్తి నాగపద్మిని ౨ 36
ఈ భూమికి
ఈ భూమికి ఏమని చెప్పాలి?
గగనానికి వమని చెప్పాలి?
నీ తల్లికి ఏం చేశావంటే
మరుమల్లికి ఏం చేశావంటే? ఈ సోమరివై కాలం గడపొద్దు
యీ దేశం నీదని మరవొద్దు
సమయానికి స్పందించనినాడు
ఉదయానికి ఏమని చెప్పాలి?
గగనానికి ఏమని చెప్పాలి? ॥1ఈ॥ ఎన్నెన్ని కమ్టాలు ఎదురైనా
ధైర్యంగా నిల్చుని పోరాడు
సాహసమే ఊపిరి కానపుడు
వేదనకు ఏమని చెప్పాలి?
హృదయానికి ఏమని చెప్పాలి? ॥ఈ॥ స్వర్ణం యిక చాలోయ్ రా భువికి,
పనిచేద్దాం, చక్కగ యోచించి
హృదిలో జ్యోతే వెలుగొందనిదే
చీకటికి ఏమని చెప్పాలి?
కన్నీటికి ఏమని చెప్పాలి? ॥ఈ॥ ౩31 ౫. గీతారామం
ఎటు చూసినా
ఎటు చూసినా (ప్రభు సౌందర్యమే, నే
నెటు చూసినా ప్రభు ఆంతర్యమే ॥ఎటు॥ రాగరళశ్మిలో 'ప్రభవించే హాసానివి నీవేనయ్యా
నిర్దర నీరములో విభవించే కలగానము నీదయ్యా
జర్జర సైకత తీరములో వినిపించే గాడ్బువు నీవే
గర్జించే సాగర తీరములో కల్లోలపు తాపం నీవే ॥ఎటు!॥ రవి, శశి, గగనం చుక్కల లోకం అంతా నీరూపం
అణువు నుంచి బ్రహ్మాండమంతటా నిండెను నీరూపం రూపములేనీ నీవే కర్తవు రూపములన్నిటికీ
రూపు రూపులో రూపుకట్టితివి నిర్గుణ మేధావీ ఎటు! వేదనలోనూ, శోధనలోనూ, సాధనలోనూ నీవే నీవే అమృతమైనా, విషమైనా నీ రూపానికి ప్రతిరూపాలే
నీ దయ ఉంటే జీవితమంతా వికార రహితము కాదా
నీ కరుణీ మా వెంట నడిచితే విజ్ఞానమే వ్రతము కాదా॥ఎటు! ననన పుట్టపర్తి నాగపద్న్మిని ఈ 32
సహకారంలో సఫలతున్నదీ
సహకారంలో సఫలతున్నదీ
సబబే ఈ మాట
సహకారమే మన సంప్రదాయమూ
హితవే ఈ బాట ॥1సహ॥ విడివిడిగా పోరాడి గెలవటం
చరిత్ర ఎరుగని తర్మం
ఎరువూ, నీరూ కలిసి పెరిగితే
మహాకాయమౌ బీజం
వేయి దీపాలు ఒకటైపోతే
పారిపోవుగా అంధకారం ॥సహ॥ రాముడు, హనుమ కలిసి వెడలగా
లంకా విజయం జరిగింది
సమర్ధ రాముడు, వీర శివాజీ
కలయిక యుగమును మార్చింది
సంఘటితంగా అదుగులు వేస్తే
దాటెదవీవు జీవన జలధి ॥సహ॥ సాధననూ, శ్రమశక్తిని కలిపి
సమయపు విలువను తెలియంది
నవయుగమును స్టాపించటానికీ
సహకారపు బలిమిని వాడండీ
మీ చెలిమికి జీవం పోయండి ॥1సహ॥ కచ గతారమం
నరుడే నారాయణుడిగ
నరుడే నారాయణుడిగ మారే
వరమును మాకు ప్రసాదించు
నీ వరమును మాకు (ప్రసాదించు నరుడు! సోమరిగా కాలం గదుపక
గమ్యాన్నీ మరచి నడువక
జనహితాన్ని మా హితమనుకొని
సాగే వరమును మాకివ్వ
కొనసాగే వరమును మాకివ్వు నరుడు! బాధితుల కన్నీళ్ళు తుడవాలి
మరు భూమిని జలమై కురవాలి
దైవత్వాన్నే సాధించాలి
ఈ విశ్వం మన యిల్లవ్వాలి
మనసే తూరుపు సిందూరంగా
మారాలని మము దీవించు నరుడు! అందరికీ (ప్రేమను అందించి
పెంపొందిద్దాం సమభావాన్ని
మధువొలికే తీయని మాటలతో
వెలిగిద్దాం స్నేహపు దీపాన్ని
యిలపై స్వర్ణాలను సృష్టించే
సామర్థ్యం మాకివ్వ
నీలా మారే వరమివ్వు నరుడు చా పుట్టపర్తి నాగపద్మని 53
నారీమణులే నడుంకట్టితే
నారీమణులే నడుంకట్టితే
యుగం మారకుంటుందా
ఈ జగం మారకుంటుందా ॥నారీ॥ రమణులె జాగ్భతగీతం పాడితే
శృతులు కలువకుంటాయా
సంస్కృతులు వూరకుంటాయా? ॥నారీ॥ వీరమాతలకు కొదువేముందీ?
శౌర్య గాధలకు వెలితేముందీ?
థైర్యంగా ముందడుగు వేసితే
కార్యసాధనకు లోటేముందీ? ॥నారీ॥ సదాచారమే పురుషార్థం
నిర్మలత్వమే పరమార్ధం
నిర్భీకతయే వనితా చరితం
ధర్మప్రబోధమె అతివల లక్ష్యం ॥నారీ॥ మూఢాచారపు ముసుగుల వదిలీ
విజ్ఞత వర్తిలి దివ్యతనందితె
భువిక స్వర్ణం దిగిరాదా?
సమభావ సుధామం నెలకొనదా? నారీ 35 ౫ గీతారామం
మరచుట మావశమా
మరచుట మా వశమా నీ నామము
నీ చరితమె మా జీవాధారము
జగజీవన రామా, నీవేగా
జనహిత నేతవు, శాంతికి దూతవు ॥।మరచుట॥
దళితునిగా జన్మించినగానీ
యిడుములనెన్నో చూచినగానీ
చెదరక బెదరక, ముందుకు నడిచీ
నేతగ నిలిచిన నాయకవర్యా॥ ॥[మరచుట।।
గాంధీ నెహ్రూ అంబేద్మరుల
ఆశయాలతో ఆశీస్సులతో
స్వతంత్ర భారత దళితోద్యమమున
(ఛమియించిన ఓ సాహసవీరా ॥మరచుట॥
ప్రజాస్వామ్యమే తన ధ్యేయముగా
జన సమైక్యతే తన లక్ష్యముగా
కార్మిక కర్షక క్షేమముకొరకై
తపియించిన అమాత్య శేఖరా ॥మరచుట॥
మానవులందరి దొకటే కులమని
మానవతే. మన అందరి కులమని
నీ జీవితమే సందేశమ్మని
చాటిచెప్పిన సమతానేతా ॥మరచుట॥ ('దూరదర్శన్' లో ప్రసారితం)
లాలా నాగపద్మన్ ౩
నేటి నీ సుఖ జీవనానికి
నేటి నీ సుఖ జీవనానికి
మురిసిపోయే సోదరా
నాటి నేతల శ్రమకు ఫలితము
వర్తమానము నమ్మరా నేటి! గత చరిత్రను త్రవ్విచూడు
దళిత జాతుల దుఃఖగాధలు
తలచినంతనె గుండె బరువై
కన్నులమ్మట రుధిర ధారలు నేటి! చదువుకోసం దళితుడొక్కడు
బడికి వెళితే పెద్ద నేరం
యిల్లు అద్దెకు అడుగబోతే
గెంటివేసిరి ఎంత ఘోరం
ఆర్య సంస్కృతి వెలసి మురిసిన
పరమ పావన దేశమందున
అగ్రవర్ణపు అహంకారం
దళితజాతుల బతుకు భారం నేటి గడపదాటిన క్షణం నుంచి
అదుగు అడుగున ఎత్తిపొడుపులు
విశ్వవిద్యాలయ భవనమున
కులవిభేదపు అడ్డుగోడలు
అంతులేని చిత్తక్షోభను
యువకుడాతడు అద్దుకొనెను
తోటి దళితుల బాధలకు తగు
రీతి బదులిడ మదిని తలచెను
దేశ పౌరుల మధ్య తేడా
ఇ గతారామం నవవ
లెందుకని గర్జించెనాతడు 1నేటి॥
వ్యాసుడూ వాల్ళీకి శబరీ
శంభుకథలను కదిపెనాతదు
మనుషులందరి దొక్క కులమని
నొక్కినుడివెను ఒక్కసారిగా
దేశభక్తే తన మతమ్మని
చాటిచెప్పెను మారుమారుగ
దేశమే నా దేహమనెను
దిక్కులన్నియు పిక్కటిల్లగ
స్వీయ సుఖమును కాలదన్నీ
పగలు రేయిని మరచినడచీ
దేశస్వేచ్చకు పాటుపడెను
అన్న పానములన్ని వదలీ
కలలు వాస్తవమైన క్షణమున
కన్నులందున నీరు నిలిచెను
మంత్రివర్యుని పదవి నందెను
పుడమి తల్లిని తలచి మురిసెను ॥నేటి॥
ఎంత సుఖమును అందుకున్నా
దళితజనతను వదలలేదు _
మంత్రి పదవది ఎంతదైనా
నాటి వేదన మరువలేదు
వారి క్షేమమే అభిమతముగా
పాటుపడిన యోగి ఆతడు .
దళిత జగతికి జీవమొసగిన
జగజ్జీవన రాముదాతడు నేటి! (దూరదర్శన్లో ప్రసారితం)
నా పుట్టపర్తి నాగపద్నిని ౯౩6
తరం తరం తరం తరం నిరంతరం తలవాలి మనసంతా మరువకుండ ఆ పేరును జపించాలి మన మంతా ॥తరం॥ నవభారత గగనాన వెలిగిందో ధృవతార దళిత ప్రజానీకానికి బతుకు పంచు జీవధార ॥తరం॥ మటిలోన మాణిక్యం ల్ పుడుతుంది ఇది సత్యం కమలం వికసించేది బురదలోనె అనునిత్యం ' అంటరాని కులంలోన వజమొకటి పుట్టెనండి సాటిలేని ఆ వజం జర్జీవన రామండీ ॥తరం॥ కులంపేర జరుగుతున్న 39 ౫ గీతారామం
అవహేళన తిప్పికొట్టి
మనిషి విలువ పెంచేది
గుణమేనని నొక్షిచెప్పి
సామాజిక న్యాయమన్న
వూహకు ఊపిరిపోసి
చీకటి నిండిన బతుకుల
కాంతులు నింపాడండి ॥తరం॥
మానవులందరిలోనా
తెలివితేటలతి సహజం
కులభేదం యిట లేదు
మతఖభేదం రాబోదు
శక్తియుక్తులున్ననాడు
కొండనైన పిండిచేసి
గమ్యాన్నే చేరాలని
చాటిన ధీశాలండీ ॥తరం॥ (దూరదర్శన్లో ప్రసారితం)
నా పట్టపర్తి నాగపద్నిని ల4౦0
రాత్రి బడికి
రాక్రి బడికి పోదాము రారండీ
తలరాత మార్చుకుందామూ రారండీ రాత్రి
చదువులేక సంధ్యలేక
చకృనైన బ్రతుకులేక
కష్టాలపాలు మీరు కాకండీ
మీ కలలు నిజం చేయు తీరు తెలియండీ రాథ్రి!
పగలంతా ఒళ్ళు వంచి పనిచేసిన వారమంటు
గూటిలోన దీపమెట్టి కడుపుకేమొ గంజిపట్టి
గుర్రుపెట్టి నిదరోతే ఎట్టాగురో! నీ
బతుకులోని వెతలు తీరు దారేదిరో రాత్రి!
రెక్కలు ముక్కలు చేసుకు పనిచేసే వారంతా
అక్షరాల విలువ తెలిసి లెక్కలు నేర్వకపోతే
చిక్కుల్లో పడతారు చింతలపాలౌతారు
చదువే మన తోడుంటే
జీవితాలు ఇక పదిలం
అంకెల సంకేతాలే
దారి చూపు అనునిత్యం రాత్రి! (దూరదర్శన్లో ప్రసారితం)
41 ౫ గీతారామం
చదువు విలువ
చదువు విలువ తెలియవోయి తమ్ముడూ
నీవు చదువు చదివి చల్లగుండు తమ్ముడూ॥
పేరు వూరు వ్రాయవచ్చు చెల్లెలా
మంచిపేరు తెచ్చుకోవమ్మ చెల్లెలా ॥చదువు॥
అఆలే అనాదిగా జ్ఞానానికి ద్వారాలు
అక్షరాలు అనంతమౌ భాగ్యానికి పునాదులు
అక్షయమౌ ఆ సంపద అందించును ఆనందం
అక్షరమౌ ఆనందం అందించును సౌభాగ్యం ॥1చదువు॥
అంకెలలో అందవోయి అంతులేని యీలోకం
కూడిక లెక్కల తోటీ కొలువవోయి సంతోషం
తీసివేత లెక్కలలో తగ్గించు వేదనలు
తూనిక కొలతల తోటీ నేర్చవోయి సమభావం చదువు! దూరదర్శన్'లో ప్రసారితం)
వవ పట్టపర్త్ నాగపద్మని ౨ 4
అనల్లిబిల్లిగ
అల్లిబిల్లిగ అల్లుకున్న మల్లెపందిరి నీడలోన
చల్లచల్లని మాటలెన్నో చెప్పుకుందామా
మనసులు తెలుసుకుందామా అల్లి మెల్లమెల్లన దరినిజేరి
అల్లనల్లన మదిని దోచి
అల్లరల్లరి చేసిపోకూ ఓయి, చినవాడా
ఓయి జతగాడా ॥అల్లి॥ మనసనేదే కోవెలైతే
కోవెలకు ఓ దేవుడుంటే
దేవుడే నీరూపుదాల్సీ
నన్ను కరుణించే
జీవితం ఓ కడలి పయనం
పయనమునకో (ప్రమ మంత్రం
(పేమ నీవై రూపమెత్తీ
నాదరిని జేరే దారితానయ్యే ॥ అల్లి। పూవు తావిని వీడనట్టూ
మనసు మమతను వీడనట్టూ
43 3 గీతారామం
తనువు మనువును ఒకటి చేసీ
మసలుకుందామా . ప్రణయ జీవన పథమునందున
పరిణయం ఒక మధుర భావన
మధుర బంధం మదిని నిలిపే
మాట చెబుతావా
సిరులు నిండిన ఇంటి ముంగిట
నన్ను నిలిపేవా అల్లి॥ మనసు దోచిన కన్నెలేడీ
మాట ఒకటే పువ్వుబోడీ
మధురబంధం మదిని నిలిపే
మాట విశ్వాసం
సిరులు నింపే ఆ రహస్యం
పరిమిత సంతానం అల్లి!
శో ల$ లః
నాలా పట్టపర్తి నాగపద్నిన్ ల 44
బ్రహ్మన్న
(బ్రహ్మన్న చెప్పాడు ఏనాడో వేదం
ఈనాడూ ఏనోటా ఒక్కటేనువాదం
పదిమందీ పిల్లలున్న దంపతులకు ఖేదం
ఒకరిద్దరు పిల్లలున్న వారిదేలెమోదం 1(బ్రహ్మన్న॥
నారుపోయు వారిదే
నీరుపోయి. బాధ్యతనీ
ఏటేటా సంతానం
ఎంతెంతో లాభమనీ
ఆశత్రపడే వారంతా
ఆలోచించాలండీ
తక్కువ సంతానంలో
సుఖమెంతో కలదండీ | బ్రహ్మన్న
పాలుపండ్లు పెట్టలేక
బడికేమో పంపలేక
బట్టలు కుట్టించలేక
సరదాలూ తీర్చలేక
పైసపైస లెక్కకడుతూ
బతుకుబండి యీద్చలేక
చతికిల బడువారంతా
కుచేలునికి బంధువులే
చిన్న కుటుంబాలలోని
సుఖమును చాటేవారే బ్రహ్మన్న॥ (దూరదర్శన్లో ప్రసారితం)
తరచి గతారామం
వందనం
వందనం వందనం
ప్రియదర్శినికీ వందనం
వందన చందనమలది ఇందిరకు
పతినబూనుదామందరం 1వందనం॥
'ప్రియహిత భాషిణి ఇందిర
ప్రియతమ నేత ఇందిర
ప్రియతర భారత సంస్కృతికంతా
పియవనితే మన ఇందిర వందనం!
రాజకీయ చతురతాధురీణ
సాంకేతిక విద్యాధిషణ
సౌమనస్యతా ఆవిష్మరణ
సుమపేశల హృదయాల వివేచన
ఇందిరగా యిట జన్మించె
మననందరినీ నడిపించె ॥వందనం॥
ఆమె జన్మదిన వేదుకలోన
ధన్యత నందితిమందరూ
ఆమెలాగ ధీదిషణును పొందీ
నవ్యతనందెదమందరూ ॥వందనం॥ పుట్టపర్తి నాగపద్నిని 2 465
కార్మిక సోదరులారా
కార్మిక సోదరులారా
కదలిరండు నేడు
కర్మవీరులందరికీ
పండగోయి నేడు 1కార్మిక॥ జగమంతా జరుపుతోంది
ఆనందపు సంబరం
మనమంతా కలిస్తేనే
జగతినిందు సంతసం 11కార్మిక॥ నేల నింగి నీరూ
ఎటుచూసిన కార్మికులే
సూర్యచంద్రులే కాదు
తారకలూ కార్మికులే
ప్రతి బుతువూ ప్రతి గ్రహము
కార్మిక బంధువులే 1॥కార్మిక॥ నియమబద్ధ జీవితమే
కావాలోయ్ ప్రగతికి
హక్షులెన్ని ఉన్నా
4/7 1 గీత్రారామం
బాధ్యతలు కూడా మరువకోయ్
ఏకాగ్రత నాణ్యతలె
మనకు వేదమంత్రాలూ
మానవతా నినాదాలే ఉపనిషత్తులూ కార్మిక!
విశ్వాసం పెంచే ఒకమాట మనకు వెలుగూ
సర్వస్వం ధారపోయ మనదే ముందడుగూ
భవితవ్యం బంగారం
కార్మిక బృందావనిలో
నిత్యవసంతం
కార్మిక జీవన రసధునిలో కార్మిక
(ఆకాశవాణి' ప్రసారితం)
వహ్వా బల్లా మోాడకంచాాారనాాడు
ననన పుట్టపర్తి నాగపద్మిని 5 ఉక్
నీలాకాశపు అంచుల్లో
నీలాకాశపు అంచుల్లో
విహరించే వారము మేము
కలకానే కాదిది నిజము
బందీలము కాము మేము ॥నీలా॥
బంగరు పంజరములలోన
కన్నీటి కథలిక లేవు
చుక్కల లోకమ్ముల దాకా
మా రెక్కల అంచులు సాగు 1॥1నీలా॥
సంకెలల ప్రపంచం తోటి
సంఘర్షణ మాకిక లక్ష్యం
సంక్షోభపు ప్రీ బ్రతుకులకే
సంరక్షణ మా కర్తవ్యం ॥నీలా॥
బరువెక్కిన హృదయంలోన
బదబానలమే చెలరేగి
కరుకెక్కిన జాతిని సైతం
ఎదిరించిన శక్తిగ నిలిచి నీలా!
వేరెవరో చేసిన చట్టం
మా కొద్దిక ఈ నేతృత్వం
మా నేతలు మేమే మేమే
మా బాటకు వెలుగులు మావే ॥1నీలా॥ (క్యాసెట్లో ధ్వని ముద్రితం)
ఉరమ్గ్ళారామల్ లాలా
నేలతల్లి
నేలతల్లి అడుగుతోంది
నది నింగిని అడుగుతోంది
ఎందుకు నారీవైభవ కాంతికి మసకేసిందని? ॥నేల॥ చెట్టును పుట్టను అమ్మగ
కొలిచెను ఆనాటి మనిషి
అడుగడుగున వనిత కరుణకై
తపించె నాటి మనిషి
ఆమెతోడె లోకమని
ఆమెవినా నరకమనీ
అలమటించు మనిప్పి నేటి
అభిమతమే మారిపోయె ॥నేల॥ సీతవంటి భూజాతను
కొలిచిన మన జాతి నేడు
ప్రతి వనితను అరణ్యాని
కప్పగింప పూనుకొనెను
సత్య వంటి ధీర వనిత
కీర్తించెను నాటి మనిషి
నరకాసుర జనవృద్ధికి
నేటి మనిషి సమకట్టెను
రతినీ, ఊర్వళినీ పా పట్టపర్త్ నాగపద్మిని 5 50
ధ్యానించు మనిషి ఊహలలో భారతి సైతం రతిగా కనిపించెను కలిఘోారం ఈ స్థితి మారేదెన్నడు జాగృతి కలిగేదెన్నడు స్రీ జాతిని గౌరవించి వులికించే ఘడియెప్పుడో? ॥నేల॥ మహిళను మాహి మాన్వితమగు కాంతికిరణ పుంజంగా వనితను ఒక మహాశక్తి అవతార స్వరూపంగా రమణిని ఒక రమణియ దృశ్యరూప కావ్యంగా లలనను అనురాగ రాగ మాధుర్య స్వరూపంగా గుర్తించిన నాదె జగతి వెల్లివిరియు ఉషోదయం నరజాతి చరిత్రలోన ఆనాడే మహోదయం 1నేల॥ (ఆకాశవాణిలో ప్రసారితం) తన్నా మో
నిను వర్లింపగ
నిను వర్ణింపగ నా తరమా? నీ
చరితము వినుటయె జన్మ తారకము
పరబ్రహ్మమౌ నీ లీలలు విని
నెమ్మది నాందితి ప్రసన్న గణపతి ॥నిను॥
దంతము, పరశువు, అక్షమాలలను
ధరియించిన దేవా! వినాయకా!
దండములివిగో! వీజ గణపతీ!
ధాన్యలక్ష్మినిడి దయజూడుమయా! ॥నిను॥
వరదహస్తముల వెలసిన దేవా
హేరంబా! అభయమునీయవయా!
వక్రతుండమున మోదకములనిడి
కూరుచుంటివా తల్లి అంకమున! ॥నిను॥
ఇక్షుఖండముల చేతులబూనీ
ఇష్టసిద్ధి నిడు తరుణ గణపతీ
నారికేళ రసాలములను గొని
నా మొరలను విను భక్త 'గణేశా ॥నిను॥ పుట్టపర్తి నాగపద్నిని .౯ 52
గళమెత్తి
గళమెత్తి నీగితి గానము చేయనా
నిలువెల్ల ఉప్పొంగి నొట్యముసల్బనా
ఒకసారి కరుణించి, కనిపించు సామీ
ఇకనైన నాయందు దయజూపవేమీ ॥ గళమెత్తి! అగణితమౌ నీ మహిమల దలచిన
జగములె మురియును, మదిరవళించును గళమెత్తి సాధురూపమున వెలసిన దేవా!
శోధన చేసెదవేలా?
వేదన బాపీ విభవము చూపీ
హృదినే గైకొని బ్రోవవ దేవా గళమెత్తి గంగ యమునలను పదముల యందే
పొరలించిన ఓ సాయీ
నీ భక్తుల మనసులలో వెలసీ
అజ్జానమునూ బాపవదేమీ గళమెత్తి!
దీపకోటి వెలిగించిన సాయీ
పాపకోటి తొలగించవదేమీ
మరుగ్రెిపోయిన మానవత్వమను
కాంతిదివ్వెను కాపాడవేమీ గళమెత్తి!
53 మె గీతారామం
నాయినాధుని
సాయినాధుని నామభజనలో
సుఖశాంతులనూ పొందండీ
సాయిదేవునీ భజనే మీకు
సర్వరక్షగా తలచండి ॥1సాయి॥ సారము లేనీ పారములేనీ
సంసారమ్మును వీడండీ
వారు వీరని ఎంచబోక యీ
సారికి సాయిని నమ్మండి సాయి! కలియుగమందలి కడు బాధలకూ
సాయి నామమే బెషధమూ
కడతేర్చును మిము కరిని హరినివలె
మరిమరి సాయిని తలవండీ ॥సాయి॥ పరతత్వమ్మును పరమకరుణతో
వివరించెను ఆ సాయీ
పరమత సహనము తిరమని నమ్ముటె
తిరుమంత్రమ్మనె సాయీ సాయి! మానవ జన్మము మూల్యము లేనిది
ఈ సత్యమ్మును నమ్మండీ
సత్యస్వరూపుడు సత్వస్వభావుడు
సాయిదేవునే కొాలవండీ
మీ జన్మను సార్ధకపరచండీ ॥సాయి॥। లాలా పుట్టపర్తి నాగపర్మని ౭ కశ
శ్రీకరమౌ నీ
శ్రీకరమౌ నీ సేవయె మాకూ
శుభముల నొసగును షిరిడి నివాసా ॥శ్రీకరః శరణాగతులను చల్లగటబోచెడి
కరుణాలోలామాయి. ప్రకాశా
మంగళ రూపా, మృదు దరహాసా
మరి మరి బ్రోచే, మాదైవరూపా 1 శ్రీకర॥ నితరము నిన్నే సేవించి కొలిచెడి
సర్వ జీవులను సంరక్షింతువు
సకల చరాచర జీవ జాలమును
సమముగ జూచిన సంతసించెదవు ॥శ్రీకర॥ కులమతభేదం వలదనినావు
పేదలు ధనికులు ఒకటన్నావు
(ప్రేమను మించిన పెన్నిధి లేదని
మా మనములనే దోచావు శ్రీకర! భవ బంధములకు చిక్కిన జీవుల
మోక్షము నీయగ రావయ్యా
నీ ధుని నొసగీ బాధల బాపగ
భక్తవత్సలా! రావయ్యా! 11 శ్రీకర॥ 55 ౫ గీతారామం
ఈ వింత ఈ వింత ఒక్కింత కనవేల మనసా నీవింక నామాట విననేలా ॥ఈ౫॥ ఆకాశమార్ధాన అలవోకగా సాగు ఆ నీలిమేఘమ్ము వర్షించుటేలా ఆ నింగినందుండి యీ నేలపై జారి మన సాయి చరణాల వాలేందుకే ॥ఈ॥॥ కమనీయ వర్దాల సుమబాలవ్యందాల యీ .లాగు కుసుమించునదియేలా మృదు సౌరభముతోను మన సాయిపాదాల తలవాల్చి తరియించదలచేందుకే ॥1 ఈ ఇ ళా 95 వళ దళ భశ పుట్టపర్తి నాగపద్మిని .5 కర్
ద్వారక దర్శనమే
ద్వారక దర్శనమే
నా జీవితాశయం
బాబా ధ్యానమే
నా జీవన సాధనం ద్వారక నా జీవిత ఆరాధన
నా జీవన ఆలాపన
షిరిడి దర్శనం
షిరిడి దర్శనం ద్వారక షిరిడి క్షేత్ర దర్శనమే
సకల పాపహరమట
షిరిడి వాసు స్మరణమే
సకల పుణ్య ఫలమట
షిరిదే కాబా, కాశీ
షిరిడే అల్లా వసూ
షిరిడిలోని అణువణువూ
ఆ దైవం ప్రతిరూపం ॥ ద్వారక॥ క గతారమం నా
నీవైన బ్రోవ
నీవైన బ్రోవవె ద్వారకమాయీ
సాయీశు దర్శనము దయచేసి కావవే నీవైన॥
మేమంతా నీవారం
నిను నమ్మిన పరివారం
మా తప్పుల మన్నించీ
మము టబ్రోవదేమిా ॥నీవైన॥
తెలిసి చేసినా, తెలియక చెసినా
తప్పులు తప్పులనీ, తెలియదు మాకూ
తప్పులె ఒప్పులనీ, మా మదులను ఒప్పించి
తిప్పల తెప్పలపై బ్రతుకంతా యీదామూ నీవైన॥
ధనమే బలమంటూ, బలమే జగమంటూ
మానవధర్మం మరచామే
ధన సంపదనూ మించిన బలమూ
సాయి భజనమని తెలిశామూ నీవైన!
పరుల సుఖమ్మేకోరిన వారిని
సాయి టబ్రోచునని నమ్మేమూ
నరులందరిలో నారాయణుని
కనుగొను సాయిని కొలిచేమూ
మము క్షమియింపగ వేడేమూ నీవైన॥ పుట్టపర్తి నాగపద్మిని .౮ 55
అంతా సాయి మయం
అంతా సాయి మయం -
యీ జగమంతా సాయి మయం ॥ అంతా! అంతరంగమున సాయి దేవుడే
అనంతమూర్తిగ విలసిల్లిన యిక ॥అంతా॥ అంత పిండ (బ్రవ్మాిడమంతటను
అంతర్యామిగ కొలువైనప్పుడు ॥అంతా॥ అష్టదిక్కులును అద్భుతముగ ఆ
అపరాజితునీ ప్రతిరూపములే ॥ అంతా॥ సమర్ధ సద్గురు సాయినాధుడే
కల్చవృక్షమై షిరిడిని వెలిసెను ॥అంతా॥ 59 ౫ గీతారామం
జయజగదీశ హరే
జయజగదీశ హరే
ప్రభు జయజగదీశ హరే
భక్తజనులనూ నిరతము బ్రోచెడి
సర్వేశ్వర సాయీ
ఓం జయజగదీశ హరే జయః
నిను ధ్యానించెడి భక్తుల మనముల
కొలువై యుండుమయా
దీనుల పాలిటి దైవమ!
అభయము నీయుమయా! ఓం
తల్లిదండ్రి గురుదైవము
సకలము నీవే గదా!
మము తరియింపుము దేవా
కరుణింపగ రావా ॥ఓం॥
నిను కొలిచే విధమేదో
తెలియని మూర్థలమూ
తనువు మనసు నీకొసగీ
సతతము వేదెదమూ ॥1ఓం॥
అగణిత మహిమోపితా
కుమతుల బాపుమయా జ టం,
శరణాగత సుఖదాయీ గట? ల
సిద్ధేశ్వర సాయీ | వూ రో 4 ॥1ఓం॥ " పుట్టపర్తి నాగపద్నిని ౬ 60
'ప్రతి పాటపూవుకూ స్ . కావాలి ఓ తీయటి పెదవికొమ్మ' పం ఇటీవలే వెలువడిన నాగపద్శిని 'హద్దులు" త కే 1. కవితా సంపుటిలోని ఏ ముక్తకం యిది. నా లానాానాలానాలైలనా ఇప్పుడు వెలువడుతున్న యీ 'గీతారామం' లో వివిధ సందర్భాలలో . విరచించిన మధుర గితాలన్షీ ఓ తీయని గళం కోసం ఎదురు చూస్తున్తవే! ఇంకా ముద్రిత రచనలు “సంగీత సాహిత్య స్రవంతి' 'సాహితీ మంజూపషా 'మదర్ థెరెసా' 'మహిళా నోబెల్ గ్రహీతలు' 'భారతీయ హరిణం' 'పన్నాదాది" . “ సద్దుల బతుకమ్మ- సంపతి గౌరమ్మ' ' తెలుగింటి సిరుల పంటి. ఎన్నో ఆకాశవాణి ప్రసంగాలు, వివిధ పత్రికలలో వ్యాసాలు వెలువరించిన శ్రీమతి నాగపద్శిని 'సరస్వతీ పుత్రి పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారల పుత్రిక. సంగీతం, సాహిత్యం, అనువాదం, గేయరచనల్లో అభిరుచి యీమె అభిమాన విషయాలు. చిరునామా ; ఎన్.సి. హర్షవర్ధన్ 6-3-1142, ప్లాట్ నెం 106, నిత్యసాయి అపార్ట్మెంట్స్, బి.ఎస్.మక్తా బేగంపేట, హైదరాబాద్-16 గ్