Telugu eruka - anilvaranasi/indianlanguages GitHub Wiki

|| గ్ల ంం. ఇ

  • య గ గలనా వర ై న ; (1 బహుజన మహోద్యను శ్రీ ఇ దీర్హకావ్యం . స్‌. (నట్ట? య.

| శ. రణే సో ట్‌ి శః. ణో ( వ. నః హా గర్తు! న స్‌ టి. షం స సర | జ “| | ః . గలసి గ్‌, | + జ =. టు టా సం. ఓల గ్‌ గతీ న్‌ ॥ ః పని. “గ సంంబజన 6౩.

గుదెప డెప ల్లి నిరంజన్‌ వెలువరి ౦చిన పుస్తకా గుకాలు ( ము." 2! టో చా పరత పషత నరా స (4 ఒడిఉత తెలుగు దదియం (హ్హ = స్టే ష్‌! హ్‌ ళా వ ౯. ఈ ఇమ బ చ న్‌ శస ల ఆ వా ఒం వ తస? సమస్య స్స కన యన న ల నే స మట్‌ లట చం స వ ను. శ సమయాన ము % న జం ళో | స్వర్గోత్సవస ల కుమ్మెర ౫ ము. య్‌ ఇ / గేత్సవ సంచిక 2015 |. మ. చమట లా ఖే కం మ న. శ్ర శక" నే 1 1. నజ కానా తా లా టల న? య. య స కం... వ క్‌. క్ష స. టం | (చైను క్ష స సైసకవిత్వం) (ల ॥ ్స న ట్ట. శ పేర్దరాన్యం ం య నం. గ . రకం! ర భ్‌ న. స్స శ్‌ ॥

గుడిపల్లి నిరంజన్‌ (4%) తెలంగాణ వికొస సమితి ఆ: జో నెన్నెల సాహిత్య అకాడమి "హ్హ లీ పూలే-అంబేడ్కర్‌ అధ్యయన వేదిక నాగర్‌కర్నూల్‌ జిల్లా

6/42

82006413౧2 [4206౪73౧02 0౭6౭౯8౧౭ క౭౪/3౧౫

65/

46102111 ౫|౧౯౩౧)౧

[115 ౧౮౪౦115066: ౮417 2017

రి షరయం! లో కలే, తాక. న్స 00016: 1000 య గో ర క్‌,

, మ. 4

౧5. 100/- / ళల ( ౧0౪7౯౭౯ 5ట/9౧: | ణ్‌ న్‌ లో

  1. ౮6202౧04 [. (] ల కండ జై లం 66/802361 మ ను. కా

రగ& ౯౧౧౧౪౮౧౬ లే 141 1023122 630116 ల , రి టో 812386/20౧28&8/ ౧౦౧౫౧16౫

గ6 ౫% గింజరే5, ౧/06/2086. ద్ర ల్‌ ల 01; 65552357 ల్‌ ర 800/0 ౧౪౮౧//06/6 0 ర్ట

||| 16201౧8 800% 51215 1౧ ఛి 1612308202 & గీకి ర

"టే ౮4610210 ౧1౧2౧12౧ (+ క గ

11.110. 15-162/4,

6౫ 620౧6౧5 0010౧౪

(౧౦ & 0:5౬) ౧282764౧00! - 509 209.

౧1౦౧16: 94933 19878

౧౫౭11: ౧1౧౭౧౩౧౬౪6 6|021/8801411.6000)

అంకితం అన్నీ తానై సాదిన అన్న కొడిదల బాలస్వామికీ... నొ అత్మీయ పెద్దబావ కల్ఫూరి నిరంజన్‌లకు వినయంగా... భక్తితో అంకితం

మూలాలను పట్టించిన “ఎరుక

ఊహా జనిత సాహిత్యానికి కొంత సృజన ఉంటే చాలు. దానికి భాష్క శైలి, నుడికారం తోడైతే రాణిస్తారు. ఈ సృజనకారులు డిటెక్టివ్‌ రచనల నుంచి శృంగార సాహిత్యం వరకు ఏమి రాసిన దానికి పాఠకులుంటారు. ఎంజాయ్‌ చేస్తారు. ఇట్లాంటి 'టైంపాస్‌ రచనలను పెద్దగా గణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే సమాజంలో మేలైన మార్పులకు శ్రీకారం చుట్టే, ముఖ్యంగా అణచివేతకు గురైన వర్దాల వారి పొతం కోరే సాహిత్యానికి సృజన, భాష శైలీ మాత్రమే సరిపోదు. వీరికి సమాజాన్ని మార్చాలనే తపనతో పాటు, అన్ని రంగాల్లో లోతైన అవగాహన ఉండాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై తమదంటూ ఒక అంచనా ఉండాలి. అది నిరంతర అధ్యయనం, చర్వోపచర్చల ద్వారా ఏర్పడుతుంది. ఆధునిక కాలంలో అట్లాంటి అవగాహనతో రచనలు చేసినవారిలో పూలే ఆద్యుడు. “గులాంగిరి వద్దంటూ సకల ఆధిపత్యాలను కలాన్ని కరవాలంగా మార్చి దునుమాడిందు. రచనా రంగంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాలకు ఊపిరి పోసిండు. అందుకే తొలి “'మహాత్ముడయ్యిండు. ఆ పరంపరను కొనసాగించి బ్రాహ్మణీయ భావజాలాన్ని తుత్తునియలు చేసింది అంబేద్కర్‌. ఆయన రాసింది కూడా సొహిత్యమే! అది విమర్శ కూడా! తమ రచనల ద్వారా సమాజాన్ని విశ్లేషించి మార్గ నిర్దేశనం చేసిండు. వీరి దిశా నిర్దేశనలోనే ఇండియాలో బహుజనోద్యమాలకు బాటలు పడ్డాయి. తెలుగు. నాట పోతులూరి వీరబ్రహ్మం, మాదిగ కక్కడు, నాసరయ్యలు కూడా కొంత బోధనలు చేసిండ్రు. అధ్యాత్మిక రంగంలో తమదైన ముద్రను వేసింద్రు. నల్లగొండ, పాలమూరుల్లో తన తత్త్వాలు, బోధనలతో చైతన్యం తీసుకొచ్చిన దున్న ఇద్దాసు కూడా ఈ కోవలోని వాదే! హైదరాబాద్‌ కేంద్రంగా భాగ్యరెడ్డి వర్మ అరిగె రామస్వామి, శ్యామ్‌సుందర్‌, బి ఆర్‌.వెంకటస్వామి, ఎస్‌.ఆర్‌. బాబయ్య, ముదిగొండ లక్ష్మయ్య, టి. ఎన్‌.సదాలక్ష్మి ఈశ్వరీబాయి తదితరులు కొంత దళిత చైతన్యాన్ని ప్రోది చేసిండ్రు. ఈ చైతన్యాన్ని తర్వాతి కాలంలో పుట్టపాగ మహేంద్రనాథ్‌ 'ఎరుక బహుజన మహోద్యమ టిర్ధకావ్యం క్‌

పాలమూరులో ముఖ్యంగా నాగర్‌కర్నూలు కేంద్రంగా కొనసాగించిండు.

కారంచేడు సంఘటన తర్వాత ఈ చైతన్యం తెలుగు నేలంతటా పాకింది. కారంచేడు ఉద్యమ స్ఫూర్తితో “చుండూరు ఘటనను నిలదీయగలిగిండ్రు. చలపతి, విష్ణువర్ధన్‌ల 'ఉరిని రద్దుచేయించ గలిగిండ్రు. పరోక్షంగా కె.ఆర్‌.నారాయణన్‌ రాష్ట్రపతి కావడానికీ, బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ కావడానికీ ఇదే కారణం. ఇదే కాలంలో అటు మండల్‌ కమీషన్‌ అమల్లోకి రావడం, దాన్ని వ్యతిరేకించిన వర్గాలు 'రథయాత్ర చేపట్టడం, బాబ్రీిమసీదు షహీద్‌ కావడం, అలాగే పూలే 150వ వర్ధంతి, అంబేద్మర్‌ శతజయంతి కూడా 1990వ దశకంలో తెలుగునాట దళిత, బహుజన చైతన్యానికి పునాదులు వేసినాయి. శివసాగర్‌, కలేకూరి ప్రసాద్‌లు తమ రచనల ద్వారా టీకాల మాదిరిగా సాహిత్యాన్ని చదువుకున్న అణగారిన వర్ణాలకు ఇంజెక్ట్‌ చేసిండ్రు. మారోజు వీరన్న వామపక్ష భావజాలానికి బహుజన వాదాన్ని జోడించిండు. జమిలి పోరాటం చేసిండు. ఇండియాలో ఏం చేయాలో చెప్పిండు. ఈ అవగాహనల్లోంచే (ప్రత్యేక తెలంగాణకు పావులు కదిపిందు. వీటన్నింటిని ప్రాతిపదికన ఏర్పడిన పునాదుల్లోంచి లేచి నిలిచిన సాహితీ సౌధం గుడిపల్లి నిరంజన్‌.

నాగర్‌ కర్నూలు దగ్గరలోని 'గుడిపల్లికి చెందిన నిరంజన్‌పై ఆ ప్రాంత ప్రభావం గాఢంగానే ఉన్నది. అది ప్రత్యక్షమా? పరోక్షమా అనేది సమస్య కాదు. 1950వ దశకంలో నాగర్‌ కర్నూలులో “*జాతీయ పాఠశాలిను పర్సా పాపయ్య, పుట్టపాగ మహేంద్రనాథ్‌ తదితరులు ఏర్పాటు చేసిండ్రు. ఆ నాటికే నాగర్‌కర్నూలులో దళితులకు హాస్టల్‌ నడిపిన ఘనత మహేంద్రనాథ్‌ కున్నది. ఈ ప్రాంతం నుంచి తాలి దళిత అడ్వకేటుగా, ప్రజల తరపున వాదించే న్యాయవాదిగా, ఆ తర్వాత ప్రజా నాయకుడుగా ఆయన ఎదిగి వచ్చిండు. ఎమ్మెల్యే, మంత్రిగా సేవలందించిండు. నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడమూ ఇందుకు ఉపయోగ పడింది. మహేంద్రనాథ్‌ ఊరూరు తిరిగి చదువు ప్రాముఖ్యతను (ప్రచారం చేసిందు. ముఖ్యంగా దళితుల విద్యాభివృద్దిపై దృష్టిని కేంద్రీకరించిండు. రాజకీయాల్లో 6. గుడిపల్లి నిరంజన్‌

తనదంటూ ముద్ర వేసిండు. మచ్చలేని, నిష్కల్మషమైన రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థుల చేత సైతం గౌరవించబడ్డాడు. ఆయన రాజకీయాలు ముగింపుకు వస్తున్న దశలోనే మారోజు వీరన్న రంగం మీదికి వచ్చిండు. వీరన్న భావజాలాన్ని ఉస్మానియా నుంచి అటు బహుజనవాదులు, మరోవైవు కడిఎస్‌యూ విద్యార్థులు (ప్రచారంలో పెట్టింద్రు. ఇదే కాలంలో ఉస్మానియాలో క్రాంతి సంగ్రామ పరిషత్‌ అనే సంఘం పూర్తిగా బహుజన దృక్కోణంతో పనిచేసింది. అగ్రకులాల వారిని ధైర్యంగా ఎదిరించింది. ఈ కాలంలోనే మారోజు వీరన్న కుల సంఘాలను సమీకరించి ఉద్యమాలను తీర్చి దిద్దిండ్రు. వారిని పోరుబాట పట్టించిండు. ఇట్లాంటి దశలో డిగ్రీ కాలేజి లెక్చరర్‌ కాంకల వెంకటనారాయణ అనే గురువు ప్రోత్సాహం, మార్గదర్శనలో మారోజు వీరన్నను, ఆయన భావజాలాన్ని నిరంజన్‌ ఆవాహన చేసుకున్నడు. దానికి తమ ప్రాంతీయుడు గోరటి వెంకన్న తాత్వికత, వనపట్ల సుబ్బయ్యతో కలిసి చేసిన అధ్యయనం, విస్త్రుత పర్యటనలు సమాజంపై అవగాహనను పెంచాయి. దీంతో ఈ ప్రాంతీయులు ఆత్మన్యూనతా భావంలో గాకుండా 'మనమూ చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే” అనే సోయితో మెలిగిండ్రు. ఇక్కడికి దగ్గరలోని శాల్లాపురం' సంస్థానం సృష్టించిన సాహిత్య వాతావరణం ఇండిపెండెన్స్‌ తర్వాత కనుమరుగైనప్పటికీ ఆ సంస్థాన పండితులు సృజించిన సాహిత్యం ఒక రకంగా గర్వకారణంగా నిలిచింది. అంతేగాకుండా నిరంజన్‌ స్వయం కృషితో విద్యాభ్యాసం చేసి అర్థశాస్త్రంలో ఎం.ఎ చేసిండు. బియిడి చేసి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నడు. అంటే విద్యార్దుల రూపంలో రోజూ అణగారిన సమాజాన్ని అతి దగ్గరగా చూస్తున్నడు.

అట్లాంటి విద్యావంతుడు, నిరంతర అధ్యయనశీలి గుడిపల్లి నిరంజన్‌ బహుజన సోయితోటి ఇప్పుడీ ఉద్యమ కావ్యాన్ని మీముందుకు తెస్తుండు. అభినందనలు. కారంచేడు మొదలు ఇవ్వాళటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రంలోని అనేక చోట్ల కులోన్మాదంతో చెలరేగిపోతున్న మూకల ఆగడాలు విని, చదివి, చూసి, అనుభవించి, చలించి రాసిన కావ్యమిది. తత్త్వం, జ్ఞానం, కాలం కలయికగా సామాజిక విప్లవకారుల్చి తాతిక బోధనల్ని "ఎరుక బహుజన మహాోద్బనమ దీర్ధకావ్యం 7

మనముందు అక్షరాల్లో సాక్షాత్కరింప జేసిండు. ఆధిపత్య కులాల ఆగడాలను నిరసించిండు. బహుజనులు హృదిలో ప్రతిష్టించుకోవాల్సిన తమ (ప్రతీకలను చిత్రికగట్టిందు. సామాజిక చైతన్యాన్ని చరిత్రను, ఉద్యమ కర్తవ్యాలను ఈ కావ్యంలో నిక్షిప్తం చేసిండు. సంక్షిస్తంగానైనా ఈ సమాజం నడిచొచ్చిన దారిని ఇందులో పరిచయం చేసిండు. నిరంజన్‌ ఆర్థిక శాస్త్రాన్ని చదువుకున్నాడు కాబట్టే సమస్యలను లోతుగా భిన్న దృక్కోణంలో దర్శించ గలిగిండు. అందుకే బహుజన రాజ్యాధికార సాధనలో భాగంగా మెజారిటీ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిండు. అయితే ఈ “వాయిస్‌ నిర్దేశిత పాఠకుడి దగ్గరికి స్పీడ్‌గా వెళ్ళడానికి ఇంకా కొన్ని అడ్డంకులున్నాయి. వాటిని అధిగమించాలి. కొత్త దారులు వేయాలి. _క్షే-

ఇండియాలో ఇంకా 'సివిల్‌ సొసైటి ఏర్పడలేదు. ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోలేదు. అనాదిగా ఆంగ్లంలోని నాలుగు 'పిలు ఈ దేశంలో రాజ్యమేలుతున్నాయి. జన జీవనాన్ని శాసిస్తున్నాయి. అణగారిన వర్గాలను హింసిస్తున్నాయి. 1. పొలిటీషియన్‌, 2. పోలీస్‌, 3. ప్లీడర్‌ (న్యాయవ్యవస్థ, 4 (ప్రెస్‌. ఈ నాలుగు ఒకదాని పై ఒకటి ఆధారపడుతూ ఆధిపత్య కులాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. పొలిటీషియన్‌కు రక్షణ పోలీసులు. కేవలం రక్షణే కాదు ప్రత్యర్థులను బెదిరించడానికి ఆయుధం. తమ చేతుల్లోకి ఆయుధం తీనుకోకుండానే న్వవయోజనాలను పోలీను వ్యవన్ఫ ద్వారా నెరవేర్చుకుంటున్నరు. పోలీసులకు అండ రాజకీయ నాయకులు. వీరిద్దరూ న్యాయవ్యవస్థకు లోబడి పనిజేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో ఆ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారు. తమ వ్యాపార, వర్గ, వర్ద ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈ మూడు వ్యవస్థలకు లోపాయకారి మద్ధతుగా “థైస్‌ నిలుస్తుంది. నయీమ్‌ లాంటి గ్యాంగ్‌స్టర్‌ వేల ఎకరాలను కబ్బా చేయగలిగిండు. రాజకీయ నాయకుల్ని పోలీసు అధికారుల్ని మీడియాను కొనుగోలు చేయగలిగిండు. ఏకు మేకుగా మారిండు. మేకు బాకుగా మారుతుందని అర్ధమయిన మరుక్షణమే నయీమ్‌ని మరుభూమికి పంపించింద్రు. 8 గుడిపల్లి నిరంజన్‌

ఇదంతా రాజకీయ నాయకులు ఆడిన, ఆడించిన (డ్రామా! రాజకీయ నాయకులకు అవసరం వచ్చినప్పుడు సెలెక్టివ్‌ లీకేజిల ద్వారా దళిత, బహుజన రాజకీయ నాయకుల “వ్యక్తిత్వ హననా'లకు ఒడిగడతారు. 'బడుగుల్ని బాడుగ నేతలు” అని రాయడం ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే! బంగారు లక్ష్మణ్‌ని లక్ష రూపాయల కాడ స్టింగ్‌ ఆపరేషన్‌ జేసి కుట్రపూరితంగా తొలగిస్తరు. అదే ఆధిపత్య కులాల వాండ్లు వేల కోట్లు మాయం జేసినా పళ్ళెత్తు మాట అనరు. ఎందుకంటే అవన్నీ ఒకే తాను ముక్కలు.

70 ఏండ్ల ప్రజాస్వామిక పాలనలో లెక్కకు మించిన స్మామ్‌లు జరిగినయి. కాని ఎక్కడ కూడా ఆధిపత్య కులాల నాయకులు దోషులుగా తేలరు. తేలినా శిక్షలు స్వల్పంగానో, లేదా అసలే లేకుండానో పోతాయి. అదే లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మాయావతి, బంగారు లక్ష్మణ్‌ లాంటి వారిని హమేషా నిర్ధారిత నేరస్టులుగా ఈ మీడియా చిత్రీకరిస్తుంది. వాళ్ళు నిందితులు మాత్రమే అయినప్పటికీ నేరస్థులుగా పేర్కొంటారు. మీడియానే వాదోపవాదాలు చేసి దోషిగా నిర్జారిస్తుంది. దానికి కండ్లముందటి సాక్ష్యం సత్వంబాబు. ఎందుకంటే వాళ్ళందరూ దళిత, బహుజనులు కావడమే కారణం. కృష్ణమీనన్‌, నెహ్రూ దగ్గరి నుంచి పి. వి.నరసింహారావు, మురళీమనోహర్‌ జోషి, అద్వానీ వరకు ఎన్నో కేసుల్లో వందలు వేల మంది ఆధిపత్య రాజకీయులు నిందితులుగా ఉన్నారు. అయితే వారికుండే గౌరవం ప్రత్యేకం. వారిపై వచ్చే ఆరోపణలను దైవాంశ సంభూతులకు బురద బూసే ప్రయత్నంగా మెజారిటీ మీడియా విషయాల్ని వక్రీకరిస్తది.

ప్రజాస్వామ్యానికి పైన చెప్పిన నాలుగు వ్యవస్థలు పట్టుగొమ్మలు. ఇప్పుడీ వ్యవస్థలన్నీ 'వ్యక్తుల పూజలో తరిస్తున్నాయి. ఇది ఇవ్వాళ హఠాత్తుగా జరిగిన సంఘటన కాదు. వేల యేండ్ల నుంచి సాగుతున్న పరంపర. ఈ పరంపర గురించి నిరంజన్‌ నిషితంగానే విమర్శించిండు. నిజానికి బుద్ధుడి బోధనలు ఇండియాలో ఆచరణలో ఉన్న రోజుల్లో జ్ఞానం రాజ్యమేలింది. 'జ్ఞాన సమాజం” ఏర్పడింది. అయితే బుద్ధిజాన్ని ఇండియా నుంచి పొరదోలిన తర్వాత బ్రాహ్మణీయ 'పండిత', 'సనాతని, 'భాందసా వర్గం మొత్తంగా సమాజానికి “ఎరుక బహుజన మహోద్యమ టిర్ధకాన్సం త్ర

అన్యాయం చేసింది. చేయకూడని పనులు చేసి కొన్నిసార్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండి మరికొన్ని సార్లు అన్యాయం చేసిండ్రు. అందుకే ఇండియాలో “జ్ఞానం” బుద్దుడితోనే ఆగిపోయింది. అది మళ్ళీ పూలేతో చిగురించింది. ఎపిప్టెమాలజీ అంటే “జ్ఞాన మీమాంసిను బోధించిన మొట్ట మొదటి వాడు బుద్దుడు. అందుకే బుద్దుడి రాజ్యం మళ్ళీ రావాలని నిరంజన్‌ కవిత్వమల్లిండు. అంతకుముందు చార్వాకులు, లోకాయతులు కొంత ప్రశ్నించే సమాజాన్ని స్థాపించినా అది క్రమేణా రద్దయింది. బుద్ధిజం తర్వాత వచ్చిన రాచరిక పాలనలో 'బ్రాహ్మణీయి సమాజం “చాణక్య నీతిని “గొప్పది'గా బోధించింది. అన్యాయం, అధిపత్యం కలగలిసి అడుగు వర్జాలవారిని “బలి చేశాయి. ఈ కాలంలో హితవు చెప్పినా అది ఎవ్వరూ చెవికెక్కించుకోలేదు. “జ్ఞాన మీమాంసా, తర్మానికి, హేతువుకు నిలబడే విషయాలకు విలువ లేకుండా పోయింది. గుడి, హిందూత్వ పేరిట గుడ్డి నమ్మకాలను, మూడ బోధనలను అందల మెక్కించిండ్రు. ఇప్పటి దాకా అదే రాజ్యమేలుతోంది. దాన్ని ఇప్పుడు మరింత బలంగా సైన్స్‌ పేరిట ప్రచారంలో పెట్టే ప్రయత్నాని పాలక వర్గాలు చేస్తున్నాయి.

బుద్ధుడు నుంచి బవసవేశ్వరుడి వరకూ రక్తపాతమే రాజ్యం చేసింది. బసవేశ్వరుడి బోధనలు కొత్త మతానికి ప్రాణం పోసింది. ఈ మతం కొంతమేరకు కింది కులాల వారికి 'అనుభవ మంటపొలనేర్పాటు చేసింది. క్రమేణా ఈ అనుభవ మంటపాలను మంటగలిపిండ్రు. పోతులూరి, వేమన, నాసరయ్య, ఇద్దాసులను ఎలుకలో లేకుండా జేసిండ్రు. అయితే ఇప్పుడు చదువుకున్న తరం సబాల్దర్న్‌ చరిత్రను వెలుగులోకి తెస్తోంది. తమ మూలాలను వెతుక్కుంటోంది. ఇప్పుడు “ఓట్లు మావి సీట్లు మీవా? “ఇంకానా ఇకపై సాగదు అనే తెగేసి చెబుతున్నరు. మా రాజ్యం మేమేలుకుంటం అని నినదిస్తున్నరు. దానికి అక్షర రూపమే ఈ “ఎరుకి బహుజన మహోద్యమ కావ్యం.

వార్డుల

నిజానికి బహుజనోద్యమానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. అయితే ఇది మార్కిస్టు అవగాహనకు భిన్నమైనది. మార్కిస్టు అవగాహనలో అన్ని _]0. గుడిపల్లి నిరంజన్‌

(భ్రష్టత్వాలకు మూలం రాజ్యం. ఆ రాజ్యాన్ని తొలగించి తాము అధికారంలోకి వచ్చినట్లయితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేది వారి భావన. మార్మిస్టు అవగాహనలో ఆధిపత్యం కేంద్రీకృతంగా ఉంటుంది. అయితే దీన్ని తప్పని నిరూపిస్తూ (గ్రామ్‌స్కీ తన “ప్రిజన్‌ నోట్సులో' కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. ఆధిపత్యం అనేది వికేం(దీకరణగా ఉంటుంది. డబ్బున్న వాడు లేనివాడు అనేదే గాకుండా (వర్గ దృక్పథమే గాకుండ) సమాజంలో మనిషి మీద మనిషికి, బ్లాక్స్‌ మీద వైట్స్‌కు, అందులో మళ్ళీ ఆడ వారి మీద మగవారికి ఆధిపత్యముంటుంది. ఇండియాలో ఒక కులం మీద ఇంకో కులం ఆధిపత్యం కొనసాగుతుంది. సమాజంలోని 15 శాతం మంది దగ్గర 85 శాతం సంపద పోగుపడి ఉన్నది. మొత్తం 85 శాతం సమాజం దగ్గర కేవలం 15శాతం సంపద మాత్రమే ఉన్నది. రాజ్యాధికారం కూడా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నది. నిజానికి రాజ్యాధికారం ఉన్నది కాబట్టే సంపద ఉన్నది. కొన్ని వేల యేండ్ల నుంచి సమాజంపైన అధిపత్యం కారణంగానే సంపద పోగుబడింది. సంపద ఉన్నది కాబట్టి అధికారాన్ని స్థిరకరించుకో గలిగారు. సబ్బండ వర్జాల వారికి, సకల జనులకు మేలు చేసేది రాజ్యాధికారం. జనాభా బ్రామాషాలో ఎవరెంత ఉన్నారో, రాజ్యాధికారంలో వారికంత వాటా దక్కాలి. రాజ్యాధికారంతో పాటు సమస్త రంగాల్లోనూ న్యాయమైన వాటా దక్సాలి. అంటే అంతిమంగా నేటి పాలితులు దేపు పాలకులుగా మారాలి. అందుకు ప్రాతిపదికలు ఈ “ఎరుకలో ఉన్నవి. బహుజనులు రాజ్యాధికార సాధన దిశలో సాహిత్యాన్ని వాహికగ ఉపయోగించుకోవాలి. ఇందుకు గాను అన్ని రంగాలను ఆధిపత్య కులా౬ “'మేధావులు' నిర్దేశించిన మూసి పద్ధతిలో గాకుండా 'మన అనుభవాలు “మానవీయ కోణాలు? బహుజన దృక్కోణంలో చూడాలి. విశ్లేషించాలి. విశేవ ప్రచారం కల్పించాలి. అందులో ప్రధానమైన ప్రాతిపదిక పేదరికం. దీన్ని కూదా బహుజన ఐడియాలజీతో చూడాలి. ఇప్పటికీ బహుజనులు ఏండ్లుగ వేళ్ళూనుకున్న మార్చిస్టు అవగాహనతోనే పేదరికాన్ని సమాజాన్ని చూస్తున్నారు అడే అవగాహనతో సాహిత్య సృజన చేస్తున్నరు. మార్కిస్టు అవగాహనలి “ఎలుక బహుజన మహోద్యమ దీరకొవ్సం 1

భూమి పంచితే పేదరికం నిర్మూలన అయితుందని భావించారు. దున్నేవానికి భూమి అన్నారు. ఇవ్వాళ “'దున్నేవానికి భూమి” అనేది ఆచరణ సాధ్యం కాని అంశం. అలాగే భూపంపకం వల్ల మాత్రమే పేదరికం నిర్మూలన జరగడం అసాధ్యం. ఏండ్ల నుంచి భూమి పంపకం జరుగుతూనే ఉన్నది అసైన్డ్‌ లాండ్స్‌ అన్యాక్రాంతం అవుతూనే ఉన్నయి. పేదరిక నిర్మూలనలో ఇది ఒకానొక అంశం మాత్రమే గానీ, ఇదే వోల్‌ అండ్‌ సోల్‌ కాదు. నిజానికి ప్రభుత్వం పేదరికాన్ని ఎట్లా చూస్తున్నది, బహుజనులు ఎట్లా చూడాలి అనే అవగాహనకూడా బహుజన రచయితలకుండాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరాల్లో 32 రూపాయలు, (గ్రామీణ ప్రాంతాల్లో 27 రూపాయలు సంపాదించినట్లయితే అతను పేదవాడు కాదు. అంతకు ముందు పేదరికాన్ని క్యాలరీల్లో కొలిచిండ్రు. దాని ప్రకారం ఐదు రూపాయల మూంగ్‌ దాల్‌ ష్యాకెట్‌, ఒక కోడి గుద్దు కలిస్తే 2200 క్యాలరీలైతుంది. ఇవి తినగలిగిన వాడు పేదవాడు కాదు అనేది ప్రణాళిక కర్తల భావన. దీన్ని బట్టి ఇది ఎంత హాస్యాస్పద నిర్ణయమో అర్ధం చేసుకోవచ్చు. అవి మాత్రమే తిని మనిషి బతకలేడు అనేది మన అవగాహన. నిజానికి జీవించి ఉండదమనేది హక్కు చట్టంలోని ఈ హక్కుని రక్షించడంలో భాగంగానే “ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింద్రు. దీని మూలంగా మాకు కూలోళ్ళు దొరుకుతలేరు. కాబట్టి దాన్ని రద్దు చేయాలి. లేదంటే అందులో మొత్తం అవినీతి మాత్రమే ఉన్నదని కొందరు వాదిస్తున్నరు. దీంట్లో జరిగే అవినీతి మొత్తం ఆధిపత్య కులాలు చేసే అవినీతితో పోలిస్తే సముద్రంలో కాకి రెట్ట. ఒక్క విజయ మాల్యా తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిందు. అలాగే ఒక్క స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనే రాని బాకీలు మార్చి 2016లోనే 98,178 కోట్లుగా ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు రాజకీయ, సామాజిక విషయాలను కూడా ఈ దృక్కోణంతోనే చూడాలి. పేదరికాన్ని భూమికి లంకె పెట్టి చూడడం మార్కిస్టు అవగాహనలోంచి వచ్చింది. దాన్ని డి-లింక్‌ చేసి చూసినట్లయితే అర్బన్‌ - రూరల్‌ పేదరికం తెలిసి వస్తుంది. “అంత్యోదయ, ఆహార భద్రత, ప్రభుత్వ పథకాలు, భూపంపిణీ, సంక్షేమ పథకాలు అన్నీ కూడా లోతుగా విశ్లేషించాలి.

2 గుడిపల్లి నిరంజన్‌

ఇంజనీరింగ్‌ కాలేజిల్లో చదివే విద్యార్థుల కోసం (ప్రభుత్వం 80 వేల రూపాయలను ఫీజురిఎంబర్స్‌ కింద ఆ యా కళాశాలలకు చెల్లించింది. ఇది కొంత మేరకు సమాజంలోని కింది కులాల వారు చదువుకోవడానికి తోద్బడింది. అయితే ఈ పథకం ్రధానోద్దేశ్వం ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటైన ప్రయివేటు ఇంజనీరింగ్‌ యాజమాన్యాలకు మేలు చేయడం. అనివార్యంగా వీటి యాజమాన్యమంతా ఆధిపత్య కులాలదే! అయితే మొదట్లో కొన్నేంద్లు కొంత మందికి ఈ కళాశాలల్లో చదివిన వారికి ఉద్యోగాలొచ్చాయి. కానీ గత పది, పదిహేనేంద్లుగా ఈ కళాశాలల్లో చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేరు. వారు చదువు చెప్పిందీ లేదు. నామ్‌కే వాస్తే విద్యార్థులను చేర్చుకొని 'ఫీజు రిఎంబర్స్‌'తో బతికిండ్రు. అయితే ఈ కళాశాలల్లో చదివిన వారికి ఎవ్వరికి కూడా ప్లేస్‌మెంట్స్‌ దొరకడం లేదు. ఇట్లా ప్లేసమెంట్స్‌ లేకుండా ఇబ్బంది పడుతున్న వారిలో మెజారిటీగా కింది కులాల వాండ్లే ఉన్నారనే విషయాన్ని గణనలోకి తీసుకోవాలి. అంటే ఇదంతా యాజమాన్యాల బాధ్యతా రాహిత్యంగా గుర్తించాలి.

ఈ అధ్యయనాల ద్వారా కలిగిన చైతన్యాన్ని బహుజనులందరికీ చేరడానికి సాహిత్యం ఒక వాహిక. ఆ వాహికను కచ్చితంగా బహుజనులకు రాజ్యాధికారం దక్కించేందుకు పనిముట్టుగా వాడుకోవాలి. ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో పేదరికానికి సంబంధించిన లోతైన అంశాలను సృజిస్తూ రచనలు రాలేదంటే మన స్టాయి తెలుస్తది. దీంట్లో సమూలమైన మార్పు రావాలి. రాజ్యధికారం ద్వారానే అసమానతలు లేని సమాజమేర్ప్చడుతుంది. అయితే ఈ రాజ్యాధికారాని కన్నా ముందు బహుజనులు కొన్నింటిపై దృష్టిని కేంద్రీకరించాలి. వీటి ద్వారా భవిష్యత్‌లో ఏర్పాటు కాబోయే సమసమాజానికి బలమైన పునాదులేర్చడుతాయి. విద్య భూసంస్కరణలు, సంపద పునఃపంపిణీ జరగాలి. సంపద వీకేంద్రీకరణ జరగాలి. అప్పుడు రాజ్యాధికారాన్ని దళిత, బహుజనులు స్థిరీకరించుకోవడం ఈజీ.

బహుజనులకు ఇవ్వాళ ఆయుధం కాదు అక్షరం కావాలి. పుస్తకం బహుజనుల దేహంలో భాగం కావాలి. చదువుతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉన్నది. చదువుతో చైతన్యవంతులైన “ఎరుక బహుజన మహోద్యమ టీరకావ్యం శం

వారు మాత్రమే మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషిస్తారు. పూలే, సావిత్రిబాయి, అంబేద్మర్‌లు చదువుకున్నారు కాబట్టే జ్ఞానాన్ని పంచివ్వగలిగారు. 1970లకు ముందు ఇండియాలో భూస్వాముల దగ్గర భూములు, బంగారం, భవంతులు, గడీల లాంటి స్టిరాస్టులు మాత్రమే ఉండేది. మొదటి పంచవర్ష ప్రణాళిక తర్వాత 'హరితవిప్లవం” కొంత సంపదను పోగేసింది. అయితే ఈ సంపదను ఇంకా ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేకుండేది. ఈ దశలో బడా భూస్వాములకు మేలు చేకూర్చేందుకు గాను ఇందిరాగాంధి 1969లో బ్యాంకుల జాతీయీకరణ చేసింది. దీంతో ఇందిరా గాంధిని కలకత్తా కాళలీమాతగా పోల్చిండ్రు. అయితే జాతీయీకరణ వల్ల బడా భూస్వాములకు బ్యాంకులు రుజాలిచ్చింది. కొన్ని రోజుల తర్వాత మాఫీ చేసింది. బ్యాంకులను మాయజేసి బడా పెట్టుబడిదారులే వాటిని మోసం జేసిండ్రు. ఇట్లా మోసం చేసి బెనిఫిట్‌ పొందిన వారిలో మెజారిటీగా ఆధిపత్య కులాల వాంద్లే ఉన్నారు. జాతీయీకరణ చేయగలిగారు కాబట్టే ప్రభుత్వ సొమ్మును ఆ రూపంలో ఆధిపత్య కులాల వారికి అందజేయగలిగిండ్రు. ఇప్పటికీ మనదేశంలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం 7.5 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులున్నాయి. నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఆస్తులు. ఇవన్నీ పెట్టుబడిదారి వర్గం మోస పూరితంగా ఆర్జించినదే! ఆ సంపదను సృష్టించింది. దేశంలోని 85 శాతం పేదలు. సంపదంతా బ్యాంకులు జాతీయం చేయడం వల్ల పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళింది. అప్పులు ఎగ్గాట్టడానికి అవకాశం కల్పిం చింది. ఇది కచ్చితంగా రాజ్యం అండతోటి జరిగిన మోసం. కుట్రలో భాగం. ఇది ప్రయివేటు రంగాన్ని సమర్ధించడం కాదు. కానీ జరిగిన పరిణామ క్రమాన్ని తెలియ జేయడం కోసం చెప్పిన విషయంగా గుర్తించాలి. ఇట్లాంటి విషయాన్ని సాహిత్యంలోకి తీసుకు రావాలి. నిజానికి మన దేశంలో పెట్టుబడిదారులు దేన్నైనా అలవోకగా సాధించుకోగలరు. చట్టం వారికి చుట్టంగా వ్యవహరిస్తది. రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ని కావాలని వెలికి తీయడం లేదని (రిలయన్స్‌ కంపెనీ కావాలని గ్యాస్‌ క్‌ గుడిపల్లి నిరంజన్‌

వెలికి తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు వెలికి తీస్తే తక్కువ రేటు, భవిష్యత్‌లో వెలికి తీస్తే ఎక్కువ రేటు వస్తుంది. దాంతో ఎక్కువ లాభం వస్తుందనేది ఉద్దేశ్యం.) దీని వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని భావించి అప్పటి కేంద్ర సహజవాయువుల మంత్రి జైపాల్‌ రెడ్డి ఆ కంపెనీ మీద వత్తిడి తీసుకొచ్చిండు. చర్యకు శ్రీకారం చుట్టిండు. దీంతో చివరికి అంబాని తన పరపతితో జైపాల్‌ రెడ్డిని ఆ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించిండు. అలాగే ఇప్పటి ప్రధాని మోడినీ బహిరంగంగా వీపు మీద చెయ్యేసి తనింట్లోకి తీసుకెళ్ళి విందు ఇచ్చిండు. అంటే ఈ దేశ రాజకీయాల్ని పెట్టబడిదారులే నడిపిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. వేదాంత, అదానీ, అంబానీలు ప్రజల వనరులను కొల్లగొడుతున్నరు. అట్లనే ఇంకా వందల కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులకు బకాయి పడిండ్రు. అయినా వాళ్ళ మీద ఈగ కూడా వాలదు. ఈగ వాలక పోవడమే గొకుండా పన్ను ఎగవేసే విధానాలు కూడా అధికారులే వాళ్ళకు నేర్చుతరు. విజయ్‌ మాల్యా విషయంలో ఇదే రుజువయింది. ఆయన్ని అరెస్టు చేయాలి. దేశం విడిచి వెళ్ళకుండా చూడాలి. అని చట్టం చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడుతను లండన్‌లో దర్జాగా తిరుగుతున్నడు. అందుకే రాజ్యాన్ని కంట్రోల్‌ చేయగలిగే వారి దగ్గర సంపద పోగయింది. అవ్వాలని ర చట్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశంలోని ప్రతి పేదోడి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం నోట్ల రదు పేరిట అసలుకే మోసం తెచ్చింది. ఇయ్యాళ బ్యాంకుల్లో నోట్లు లేక ెతులు తమ ఖాతాల్లోంచి డబ్బులు తీసుకోలేని దుస్థితి. తద్వారా విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడిలేని స్ధితి ఏర్పడింది. ఈ విషయాలన్నింటిని బహుజనోద్యమకారులు, సాహితీవేత్తలు విసృతంగా ప్రచారంలో పెట్టాలి. అంబేద్యర్‌ ఆర్థిక రంగ నిపుణులు కాబట్టే సమాజాన్ని సీరియస్‌గా విశ్లేషించిండు. ఈ విశేషణను కూడా సాహిత్యంలో భాగంగానే చూడాలి. సమాజ హితం కోసం =ంగే ప్రతి చర్యను క్షుణ్ణంగా పరిశీలించాలి. చర్చించాలి. ప్రశ్నించాలి. ఈ దేశంలో సంపదంతా కేంద్రీక్సృతమయి వున్నది. డబ్బుని- డబ్బు “ఎరుక బహుజన మహోధ్యమ బీర్జకావ్యం 5

సంపాదిస్తుంది. అది లేని నిరుపేదలు పన్తులుంటున్నారు. లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్రీకృతంగా ఉన్న సంపద వీకేంద్రీకరణ చెందాలి. అంటే సమాజంలో అన్ని వర్గాల వారికి అందాలి. “జన్‌ధన్‌ యోజన పేరిట సబ్సిడీల ఎత్తివేయకుండా అందరికీ సంపద అందుబాటులోకి తేవాలి. ఈ విషయాలన్ని సాహిత్యంలో భాగమైనప్పుడే బహుజన సమాజం వైతన్యవంతమైతుంది. ఈ కావ్యంలో గుడిపల్లి నిరంజన్‌ కొంత మేరకు కొత్త విషయాలను సాహిత్యంలోకి తెచ్చిండు. నిరంజన్‌ కూడా ఆర్ధిక శాస్త్రాన్ని చదువుకున్నాడు. దాంతో విషయాలను లోతుగా అధ్యయనం చేయగలిగిండు. రాయగలిగిండు. ఈ ప్రశ్నించే, రాసే పని ఆధిపత్య కులాల వాండ్లు చేయనట్లయితే పెద్దగా నష్టం లేదు. కాని బహుజనులు పట్టించుకోనట్లయితే తీవ్ర నష్టం జరుగుతుంది. మన సంపదంతా కొల్లగొట్టబడుతుంది. అందుకే ఈ విషయాలు సాహిత్యంలోకి రావాలి. అందుకు సాద్యమయినంత మేరకు వివిధ రంగాలపై, విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

చట్టం ఆధిపత్య కులాల చేతిలో ఉన్నది కాబట్టే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా హైకోర్టు జడ్జివరకు ఎదిగిన దళితుడు కర్షన్‌పై “మతిలేని” కేసులు పెట్టిండ్రు. అరెస్టు వారెంటు జారీ చేసిండ్రు. అంతకు ముందు చీఫ్‌ జస్టిస్‌ బాలకృష్ణన్‌ విషయంలోనూ అట్లాగే వ్యవహరించిండ్రు. కోర్టులు, బ్యూరోక్రసీ, రాజకీయాలు, ప్రెస్‌ అంతా ఆధిపత్య కులాల ఆజమాయిషీలో ఉండడంతో “ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నారు. రాజ్యాన్ని నడిపించే డ్రయివింగ్‌ సీటులో వాళ్ళే ఉన్నరు.

కొన్ని చోట్ల ప్రత్యక్షంగా, వీలుకాని చోట్ల పరోక్షంగా (బ్రాహ్మణీయ భావజాలుర ఆధిపత్యమే కొనసాగుతున్నది. అది మోడీ కానివ్వండీ, బాబు, కెసిఆర్‌ ప్రభుత్వాలు కానివ్వండీ వారిదే ఆజమాయిషీ అధిపత్యం. మోడీ సలహాదారుల్లో, బ్యూరోక్రాట్లలో అందరూ ఈ సామాజిక వర్గం వారే ఉండడం పథకం ప్రకారమే జరిగింది. అట్లాగే రెండు తెలుగు రాష్ర్రాల్లోనూ అదే పద్ధతి కొనసాగుతున్నది.

రాజరికం రాజ్యవేలినప్పుడు వీళ్ళు న్వయంగా పాలకులు 16. గుడిపల్లి నిరంజన్‌

కాకపోయినప్పటికీ మంత్రాంగం నడిపిండ్రు. “వంది మాగధులు'గా మారి వంత పాడింధడ్రు. మరికొన్ని సార్లు శివాజీ అంతటి వాడికి ఎడమ కాలితో తిలకం దిద్ది అవమానించిండ్రు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకున్నరు. ముడ్డికి చీపుర్లు కట్టించిండ్రు. ఆ తర్వాత “ప్రజాస్వామ్యం” అమల్లోకి వచ్చిన తర్వాత అంగ్ల విద్యను ఆదిలోనే చదివి బ్యూరోక్రసీని తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నరు. వీళ్ళే ఇవ్వాళ “తెలుగుభాష “పరిరక్షణ” పేరిట కింది కులాల వారికి “ఇంగ్లీషు విద్యను దూరం చేసే పొచికలు రచిస్తున్నారు. అందుకే పాలకులెవ్వరైనా పాలన మాత్రం తమదే సాగించీండ్రు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఏ కమిటీ వేసినా దానికి ఈ సామాజిక వర్గం వారే నేతృత్వం వహిస్తారు. అంటే ప్రభుత్వాల దృష్టిలో బ్రాహ్మణీయ సామాజిక వర్గం వారికి మాత్రమే తెలివి ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు, అధికారులూ, (ప్రభుత్వ వ్యవస్థలకు నేతృత్వం

వహిస్తున్నవారూ అందరూ కింది కులాల వారి పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారు.

పేదల సంక్షేమ పథకాలు ఎన్నున్నా ఆధిపత్య కులాల వాంబ్లే అభివృద్ది

చెందుతున్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. ప్రభుత్వం అమలు జేస్తున్న సంక్షేమ పథకాల వల్ల సేదలందరూ బాగుపడుతున్నట్లుగా ప్రచారం

జరుగుతోంది. అయినప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. నేత కార్మికులు,

స్వర్ణ కారుల అత్మహత్యలూ ఆగడం లేదు. ఇట్లా ఆత్మహత్యలు లేని, అందరూ

ఆత్మగౌరవంతో బతకాలంటే సబ్బండ వర్జాల ప్రభుత్వం అధికారంలోకి రావాలి.

దానికి ప్రొాతిపదికలను అణగారిన సమాజంలోని రచయితలు తయారు

చేయాలి. ప్రచారంలో పెట్టాలి.

ఈ అధికారం కోసం బహుజనులివ్వాళ తమ భావజాలం ఉన్న వారికి ఓటొస్తే సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఎందుకంటే పాలకులుగా బహుజనులు అధికారంలోకి వచ్చినా అనివార్యంగా పాలన (బ్రాహ్మణీయ బ్యూరోక్రసీ చేతిలో ఉంటుంది. ఏండ్లుగా విద్యను ఆశ్రయించి వాళ్ళు ఈ ఆధిపత్యాన్ని స్థిరీకరించుకున్నరు. ఇవ్వాళ టీనా డబీ, రోణంకి లాంటి వాండ్లు అరుదుగానే అయినా ఐఎఎస్‌లుగా ఎంపికవుతున్నరు. ఈ పరంపర “ఎరుక బహుజన మహోదృమ టీర్ధకావ్యం 17

కొనసాగాలి. బహుజనులు మెజారిటీగా ఈ ఉద్యోగాల్లో చేరేవరకూ పరంపర కొనసాగాలి.

నిజానికి రాజకీయాల్లో జనాభా దామాషాల్లో రిజర్వేషన్లు అమలు జరగాలి. విద్య, ఉద్యోగాల్లో హక్కుగా దక్కాల్సిన వాటాను గెలుచుకోవాలి. అవసరమైతే పోరుబాట పట్టాలి. అట్లా గాకుండా రాజ్యంపై వ్యతిరేకత పేరుతో మార్చిస్టులు దాన్ని కాపొడింద్రు. గ్రామాల్లో భూపోరాటం, పట్టణాల్లో కార్మికోద్యమం చేసిండ్రు. అయితే విద్య, వైద్యం, ఉద్యోగం గురించి వీళ్ళు నిజాయితీగా ఎన్నడూ మాట్లాడలేదు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి బుద్దుడు, పూలే, అంబేద్కర్‌ రచనల్లోంచి విమర్శ పనిముట్లను తయారు చేసుకోవాలె. వాటిని కొత్త చూపుతో సాహిత్య సృజనకు వినియోగించాలి.

ఎప్పుడైనా, ఎక్కడైనా సమాజంలో 95 శాతం మంది యథాతథ వాదులుంటారు. కేవలం ఐదు శాతం మంది మాత్రమే మార్పు కోసం కొట్లాడుతారు. మాట్లాడుతారు. వీరు కన్విన్సింగ్‌గా చెప్పినట్లయితే మెజారిటీ మద్ధతు దొరుకుతుంది. అట్లా దొరికిననాడు రూపాయికి కిలో బియ్యం, సంక్షేమ పథకాలు ఎన్ని ఎరగా చూపినా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు ముందడుగేస్తారు. చార్వాకులు, లోకాయతులు, బుద్దుడు, బసవేశ్వరుడు, పోతులూరి, పూలే, అంబేద్మర్‌ లాంటి మహనీయుల బోధనలు ఇవ్వాళ ఈ సమాజానికి అవసరమున్నది. వీరి ఆలోచనధార అందరికీ తెలియజెప్పాలె. ఈ అవసరం ఒక్క బహుజన సమాజానికే ఉన్నది. ఉత్తర (ప్రదేశ్‌లో మాయావతి బ్రాహ్మణులతో అంటకాగి రాజకీయంగా దెబ్బతిన్నది. అట్లా గాకుండా బహుజనులు బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి. ఫైనాన్సియల్‌ సమస్యలను, లౌల్యాలను, బలహీనతలను అధిగమించాలి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 99శాతం కుంభకోణాల్లో నిందితులు/దోషులు ఆధిపత్య కులాల వాండ్లే, కేవలం ఒక్కశాతం మాత్రమే మాయావతి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లున్నారు. అయితే మీడియా మాత్రం ఈ ఒక్క శాతం వారినే వంద శాతంగా ప్రచారం చేస్తోంది. కేరి గుడిపల్లి నిరంజన్‌

ఎట్రిల

ఇక “ఎరుక కవిత్వ విషయానికి వస్తే ఇంతకు ముందే చెప్పినట్లు జ్ఞానం, తత్త్వం, స్థలం, కాలం, సామాజిక స్పృహ దీనికి ఆయువు పట్టు. సాంస్కృతిక, చారిత్రిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంగతుల్ని కునుకుపట్లు పడే సమాజాన్ని చప్పున చరిచి నిద్రలేపే, ముందుకు నడిపే విధంగా నిరంజన్‌ రాసిండు. జాంబవంతుడి దగ్గరి నుంచి కాన్నిరామ్‌ వరకు ఇండియాలో వచ్చిన సామాజిక మార్పులను ఆవేశం, ఆర్ధతను మేళవించి చెప్పిండు.

“మూల వాసుల” పొదాల స్పర్శతో పర్సిన బాటలో నిరంజన్‌ కవిత్వం నడిచొచ్చింది. గొంతూ, శబ్దం, చిర్ర, చిటికె, డప్పు, జమిడిక మోతలై లేల వేల ఏండ్ల నుండి/ చరిత్రలో జరిగిన అన్యాయాన్ని/ ఆలపించిందు.”? పరాయి పల్లవి లేకుండానే తన సొంత గొంతుని సరాయించుకొని పాటెత్తుకుందు. నిప్పు రాజేసిండు. దప్పుల్ని కాపుకొమ్మన్నడు. ఇప్పుడు కాలిమంటుకున్నది.

కొత్త బాటల నడిచేవారికి ఇబ్బందులెదురైతాయి. ఇబ్బందులెదురైనా, ముండ్లను ఏరేసుకుంటూ ముందుకు బోయినట్లయితే ఎనుక వచ్చే వారికి తొవ్వ సాఫ్‌గుంటది. ఈ తొవ్వలో హిందూత్వ వాదులు పెట్టిన ఇబ్బందులను ఒక్కటొక్కటిగా రికార్డు చేసిండు. సోయితో నడవాల్సిన దారిని చూపించిండు.

'సొప్ప వామిలో

నిప్పు దాసి పెట్టినోన్ని

పట్టి పదిమందిల లందల ముందుకీడ్సింది!

బాటలో ఒక్కొక్కరు...

బాటకై సాగిం డ్రొక్కొక్కరు

బాటలో గణరాజ్య వనాలు

రెపరెపలాడుతున్న బహుజన జందాలు

అంటూ చరిత్రలో చేసిన ద్రోహాలను, వాటిని అధిగమించి ముందుకు సాగిన బహుజన చైతన్నాన్ని పదిలపర్చిండు.

“ఎరుక బహుజన మహోధ్యమ దీర్ధకావ్నం 19.

బుద్దుడి గురించి రాస్తూ “చెట్టే అతనికి ఆధారం చెట్టు అతడు వేరు కాదు చెట్టే మెదడులోకి జొరబడి శాఖోపశాఖలై మనిషికి ఆలింగనమైంది!” అంటూ ప్రకృతికి, బుద్భడికి, సమాజానికి గల సంబంధాన్ని చెప్పిండు. బుద్ధుడిని దశావతారాల్లో ఒకటిగా చూపించే ప్రయత్నం జేసిన హిందూత్వ వాదుల్ని అసమ సమాజని నిర్మిస్తున్న కులాల వాండ్లని నిరసించిండు “ాజభవన గోడలు పగిలాయి / వనాల వైపు దారులు తెరుచుకుంటున్నాయి” అంటూ బుద్ధుని బాటని చూపిండు. “ఎందుకు మనిషిపై / నిర్లక్ష్యపు గాలులు వీస్తున్నాయ్‌ / ఎందుకు / దృశ్యమే అదృశ్యమౌతుంది / ఆ దృశ్యమే మళ్ళీ పుడుతుంది / నిజానికి దృశ్యమే జ్ఞానోదయం / మానవ నొసటిపై ఉదయించే భానోదయం” అనే మాటను చెప్పిండు “అతదు బహుజన బాటకు అది అంటూ ఈ దేశంలో సామాజికోద్యమాలకు పునాదులను నిరంజన్‌ కవిత్వంలో దర్శించిండు “గుహ నుంచి గయకు సాగుతుంది బాట గుహ హృదయ గుహలను తెరిచింది అలారకముని అతనిని ఆహ్వానించిండు ధ్యాన రసగుళికలను మింగించిండు మనస్సు తపస్సుతో తెల్లకొంగై ఎగురుతుంది" అని బుద్దుడి జ్ఞాన బాటను అక్షరీకరించిండు “బోధనలో ప్రయాణం ప్రయాణంలో బోధన అలసటే లేదు మాటకు అగుటే లేదు బోధనకు ఒక్కో ప్రయాణంలో 20. గుడిపల్లి నిరంజన్‌

ఒక్కోసంఘటన' అంటూ నిరంతర జ్ఞాన ప్రవాహాంలోంచి కొంత చేదుకొని, కొంత దోసిళ్లతో మనకందించే ప్రయత్నమిది.

హిందూత్వ వాదులు చెవిలో సీసం పోసీన విషయాన్ని నాలుకలు కోసిన దుర్మార్గాన్ని, ముడ్దికి పొరుక కట్టిన హేళనను నిరసించాడు. పాదముద్రలు చెరిపేయడాన్ని అక్షరాన్ని అంటరానిదిగా చేయడాన్ని కవిత్వీకరించిండు జ్ఞానం బోధి వృక్షం వద్దకు సమీపిస్తుందంటూ

“జ్ఞానం నొసటిన జలై

ఊటజలై ఊరింది!

మనో నేత్రంలో

కోటాను కోట్ల బతుకులను దర్శించిండు” అంటూ బుద్దుడి జ్ఞాన మార్గాన్ని అక్షరాల్లోకి ఒంపిండు.

“చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మించిన

గోడలన్నీ పునాదులతో సహా

పెకిలించి వేస్తున్నారు

గోడలను కూల్చి

జ్ఞాన గూడులను నిర్మిస్తున్నారు" అంటూ బుద్ధిజం గురించి వివరించిండు

“ఎన్నో మోసపు ప్రయత్నాలను

ఎన్నో కుట్రల వ్యూహాలను

జ్ఞానంతో...

చర్చలతో...

సంభాషణలతో... ఓడించిండు!

కోపాన్ని విచ్చుకున్న

మంటల్లో మసి చేసిండు చ

పగను ధర్మ ప్రభావంతో పూడ్చిండు' అని బుద్దుడి ఫిలాసఫిని చెప్పిండు ఇవన్నీ అధ్యయనం ద్వారా అబ్బిన విషయాలను అందరికీ విడమర్చి చెప్పిండు. “పండితులు” అబ్‌స్కూంటిజమ్‌ ద్వారా జ్ఞాన నిరోధకులుగా మారుతున్న వేళ 'ఎరుకి బహుజన మహోద్యను బీర్టకావ్వం 21.

“ఓపెన్‌ టు ఆల్‌ అని జ్ఞానాన్ని నిరంజన్‌ పంచిండు పంచిజేనే పెరుగుతుందని తెలుసుకున్నడు కాబట్టే ఆపనిని ఆర్తితో చేస్తున్నడు “ప్రశ్నలు ధైర్వాన్నిస్తాయి, ప్రశ్నలు నడక నేర్పుతాయి" అంటూ ప్రశ్నించే తత్త్వాన్ని బోధించిండు బుద్ధుడి తర్వాత అశోకుడి గురించి చెబుతూ *“పాత పునాదులపై కొత్త దేశాన్ని నిర్మించిండు / ఒక్క సూర్యుణ్ణి అడ్డగిస్తే / వేల సూర్యులు పుడతారని నిరూపించిందు" అన్నడు. వారణాసిలో పుట్టి ఉత్తరభారతం ముఖ్యంగా పంజాబ్‌లో బహుళ (ప్రాచుర్యంలోకి వచ్చిన గురుబోధకుడు సంత్‌ రవిదాస్‌ ఒక మోచీగా పుట్టిన రవిదాస్‌ తన బోధనల ద్వారా మీరాబాయి లాంటి వారికి ఆరాధ్యుడయ్యిండు. తర్వాతి 'పంతొలకు పాణం బోసిండు. అట్లాంటి రవిదాస్‌ని 1బ్రాహ్మణవాదంపై బహుజన సింహ నాదరగా పేర్కొన్నడు. 'సంతు రవిదాసు బుద్ధునికి నిజమైన వారసుడు సత్యసమాజ నిర్మాణంలోకి రాజులను రప్పించి మెప్పించిండు” అని కీర్రించిండు రవిదాసు వారసత్వాన్ని అందే వారణాసిలో పుణికి పుచ్చుకున్న సంత్‌ కబీర్‌ “దోహాలు” '“లహరొల ద్వారా చైతన్యాన్ని చాటిండు ఆధ్యాత్మిక ఫాసిజంపై ప్రశ్చల దోహాలై/ / పొడిచిన లందపొద్దుగా కబీర్‌ని పేర్కొన్నాడు ఫూలే గురించి రాసిన కవితలో తను తన్మయత్వంలో తడిసి పోవడమే గాకుండా, అందులోని తాధాత్య్యాన్ని పారకుంలదరికీ అందించిండు. గౌరవంతో కూడిన ఆరాధన భావం, మార్గదర్శి, విజనరీ బోధనలను, మాటలను, ఉద్యమాలను బాధ్యతగా బహుజనులకు విముక్తి భావజాలంగా అందించిండు. ఇప్పటికీ వందశాతం అమలు జేయడానికి సాహసించని అంశాలను 150 ఏండ్ల క్రితమే అనేక అవరోధాలు, ఆంక్షల మధ్య అమల్లోకి తెచ్చిన పూలే గురించి ఆరాధనా భావంతో వల్లించిండు. అణగారిన సబ్బండ కులాల తరపున కలం పట్టిన పూలేని “ఫాదర్‌ అఫ్‌ ఇండియాగా ప్రశంసించిండు. ఈ దేశ అక్షరాలను / వాడల్లోకి మొలక జల్లావు' అంటూ దార్భనికుడిగా దర్శించిండు 22. గుడిపల్లి నిరంజన్‌

శత్యశోధక సమాజమై

కొత్త జ్ఞానాన్ని సేదుకోవడానికి

మోట గిలకబాయిగా మారిండు

సత్యం ప్రచారం చేయలేనిదని

సత్యం కనుగొనలేనిదని

సత్యం స్వత అనుభవమని తేల్ప్చిండు” అంటూ ఫూలే తత్వాన్ని ఎరుక పరిచిండు హంటర్‌, ధామస్‌ పెయిన్‌ లాంటి ఆంగ్లేయులతో కలిసి మెరుగైన సమాజం కోసం నిరంతరం కొట్లాడిన పూలేను 'హక్కులు మొలిపించిన బుద్ధుడుగా పేర్ళొన్నడు అలాగే “అప్పటిక్రైన / ఎప్పటికైన / ఇంకెప్పటికైనా / ఫూలేనే మన మహాత్ముడి అంటూ బహుజన తీర్పునిచ్చిండు

పూలే బోధనలతో, ప్రోత్సాహంతో ఆయన అడుగు జాడల్లో నడిచిన సావిత్రిబాయ్‌ గురించి కొద్దిగానే రాసినా ఆమెను “అడుగు కులాల వాకిట్లో / అక్షర వనాల గాలై వీసింది అని స్మరించిండు

అంబేద్కర్‌ని అవపోసన బట్టి దళిత డిక్షన్‌తో రికార్డు చేసిందు. విద్య, పోరాటం, హక్కులు, రాజ్యాంగ రచన, కుల నిర్మూలన గురించి కుతితీరా రాసిండు ఆయన జీవిత సారాన్ని కవిత్వీకరిస్తూ కవిత్వమంటే తీరని దాహం కాదు /కవిత్వమంటే ప్రతీకారం కాదు / కవిత్వమంటే బహుజన రాజ్యాధికారం అని సబాల్డర్న్‌ దృక్కోణంలో అంబేద్మర్‌ని అక్షరీకరించిండు

“విజ్ఞానం ఇచ్చాను

ఓటు నీకాయుధంగా ఇచ్చాను

నిన్ను నీవు నిర్మించుకోవాలి

నిన్ను నీవు పేర్చుకోవాలి

నీకు నీవుగా ప్రభుత్వమవ్వాలో అని అంబేద్కర్‌ బోధనల సారాన్ని బహుజనులకందిస్తూ దిశా నిర్దేశం చేసిండు

ఇన్నేంధ్లు హొందుత్వవాదుల మూలంగా బహుజనులకు తీరని అన్యాయం జరిగింది కుట్ర పూరితంగా మాసం జరిగింది అందుకే “ఎరుక బహుజన మహోద్యమ టిర్టకావ్యం 23

“దేశ చరిత్రను డోకా బాజితనంతో సిరాను కుంకుమ కాయల్లో అది గుద్ది తిలకం దిద్దిన తీరుల్లా రాసింద్రు మహారాజులను మాదిగలను జేసింద్రూ అంటూ ఈనాడు దిగజారిపోయిన మాదిగ జీవితాలను చిత్రీకరించిండు ఆధిపత్య కులాల వాండ్లు ఎట్లా బహుజనుల హక్కులను కాలరాస్తున్నారో కూడా నిరంజన్‌ రాసిండు నిజానికి అంబేద్కర్‌ బ్రాహ్మణుల విషయంలో చెప్పిన అంశాలని ఇసాబ్‌ కితాబ్‌ లెక్క గట్టిండు. “అబ్బా...! ఎంత తేనె పూసిన కత్తులు గొంతులు తెగేంత వరకూ శీపినే మీ మతం మా మతం ఒక్కటే నంటివి మీ సంస్కృతి మా సంస్కృతి ఒక్కటే నంటివి మీ జాతి మా జాతి ఒక్కటే నంటివి మరి మీకున్న సంపద మాకేది? మీకున్న హక్కులు మాకేవి?” అంటూ నీళ్ళు-పాలు వేరు జేసి చూపించిండు. అంబేద్కర్‌ ఆనాడే ఈ విషయాన్ని మరో రకంగా చెప్పిండు. ఆయన “౧౭ 82000109 4/9 26440౧4! 1౧16960441 01296 ఇ౧6 ఓ0అ/ ౧6౪౭| 6566 1161 1౧19160610 19 10౧౩ 06౧61 01 16 1౧౮12౧ 500161%/ 1౧6/ ౧౧౭)/ 06 ౧161160021 061 6 ౧౦1 ౧౦౧౭౩౯ అన్నడు. “కులం రాజ్యాధికారానికి అద్దు కాదు తేనె తెట్టె పుట్టకు వందల గదులు ఏ గది నుండి వెళ్లినా మకరందమనే “రాజ్యం” దొరుకుతుంది వేల గదులున్నాయని 24 గుడిపల్లి నిరంజన్‌

తీపి పుట్ట లేదా

వేల కులాలు ఏకమైతే రాజ్యం రాదా?” అంటూ ఐక్య గీతం ఆలాపించాలని కవిత్వమయిందడు.

“ాజ్యాంగమంటే...

బుద్దుదేసిన రాజబాట!

పూలే మొగ్గ తొడిగిన

బలి రాజ్య కాంక్ష

అశోకుడేసిన

శిలాశాసనాల బొట

రవిదాస్‌ రచించిన రాజనాల కోటి” అంటూ దళిత చైతన్యంతో రాజ్యంగాన్ని ఆచరిస్తూనే రాజ్యాధికారంలోకి రావాలని నిరంజన్‌ పిలుపు నిచ్చిండు ఇందుకు పెరియార్‌, నారాయణగురు, సాహు మహరాజ్‌, కాన్నిరామ్‌లు వేసిన తొవ్వే సరైనదని నిరంజన్‌ నిర్వ్వందంగా చెప్పిండు ఒప్పించిండు

నిరంజన్‌ చేసిన కృషి కచ్చితంగా అభినందనీయమైనది. “ఎరుకిలో సామాజికంగా ఇండియా రెండున్నర వేల యేండ్ల నుంచి నడిచొచ్చిన తీరుని చెప్పిండు అయితే ఈ చెప్పేటప్పుడు ఇంగ్రీషుని ఎంచుకున్నడు ఆధునిక కాలంలో వ్యక్తీకరణకు ఇంగ్లీషు అతికినట్టుగౌ ఉన్నది. కానీ ప్రాచీన, మధ్య యుగాల నాటి విషయాలను వివరిస్తున్నప్పుడు భాష ఇబ్బందిగా ఉన్నది పాత విషయాలు చెప్పేప్పుడు భాష ఇబ్బందిగొ ఉన్నప్పటికీ అందులో భాగంగా రాసిన తెలంగాణ తీపి పదాలు కడుపుని నింపుతాయి ఇంటిముంగట యాపచెట్టు కింద కూసోని ముచ్చట వెట్టినట్లు చెప్పిండు. అభినందనలు 17-06-2017 - సంగిశెట్టి శ్రీనివాస్‌ "ఎరుక బహుజన మహోద్యమ టిర్ధకావ్యం 25

కైభీం కృతజ్ఞతలు అడగగానే ముందుమాట రాసిచ్చిన అన్న సంగిశెట్టి శ్రీనివాస్‌గార్మి పుస్తక ముద్రణకు సహకరించిన మా వెన్నెల సాహిత్య అకాడమి అధ్యక్షులు ముచ్చర్ల దినకర్‌గార్మి ముందుగా కృతజ్ఞతలు నా సాహిత్య శ్రేయోభిలాషులు నందిని సిధారెడ్డిగార్మి ప్రా. కొలకలూరి ఇనాక్‌, ఆచార్య ఎన్‌ గోపి, జి లక్ష్మీనరసయ్య సర్‌, గోరంటి వెంకన్నగార్మి దేశపతి శ్రీనివాస్‌గార్కి కత్తి పద్మారావు, ప్రా. ఎస్‌.వి సత్యనారాయణ, ఎస్‌. జగన్‌రెడ్డి, బి.ఎస్‌, రాములు, ప్రా. సి. ఖాసిం, ఉ.సా. ప్రసాదమూర్తి మామిడి హరికృష్ణగార్మి ఎండ్లూరి సుధాకర్‌గారు, కొంకల వెంకట నారాయణ, డి ఉదయభాను, పాపని నాగరాజు, చింతం ప్రవీజ్‌ కుమార్‌, రాపోలు సుదర్శన్‌, శిఖామణిగారు, పసునూరి రవీందర్‌, డా॥ జిలకర శ్రీనివాస్‌, కొల్లాపురం విమల, డా॥ నాళేశ్వరం శంకర్‌, అమ్మంగి వేణుగోపాల్‌, స్కైబాబా, పెంటమరాజు నర్సింగరావు, డప్పోళ్ల రమేష్‌ వనపట్ల సుబ్బయ్య, రాఘవాచారి, సంబరాజు రవిప్రకాశ్‌, నాగవరం బాల్‌రాం, సి. భాస్కర్‌రావు, హెచ్‌ రమేష్‌బాబు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, చందు తులసి, కందుకూరి రమేష్‌బాబు, వంకేశ్వరం నిరంజన్‌, జెట్టి ధర్మరాజుగారు, వాసిరెడ్డి నవీన్‌, ఎజ్రా శాస్త్రి, డా॥ పరిమళ్‌, వల్లభాపురం జనార్ధన్‌, తైదల అంజయ్య, సదెంకి యాదగిరి, పొన్నాల బాలయ్య, దామెర రాములు, పిల్లలమర్రి రాములు, ప్రొ దార్ల వెంకటేశ్వరరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, యాకుబ్స్‌ పగడాల నాగేందర్‌, వేణు సంకోజు, వేముల ఎల్లయ్య, గోగు శ్యామల, జూపాక సుభద్ర, జాజుల గౌరి, షాజహాన, జనజ్వాల, బుద్దారం అమర్‌నాధ్‌, సి కిరణ్‌కుమార్‌, గుడిపల్లి రవి, డా॥ కదిరె కృష్ణ కందికొండ మోహన్‌, సంజీవ్‌, వెంకట్‌ పవార్‌, కృష్ణ గుగులోత్‌, సోమశిల సురేష్‌బాబు, వహీద్‌ఖాన్‌, కొంగరి జానయ్య, డి ప్రభాకర్‌, ప్రతాప్‌ కౌటిల్య, కె లక్ష్మణ్‌ నాయక్‌, కె.పి లక్ష్మీనరసింహ, బోల యాదయ్య, భీంపల్లి శ్రీకాంత్‌, సి. బచ్చన్న ఎం జయశంకర్‌, మంగి విజయ్‌, గూట విజయ్‌, గడ్డం విజయ్‌, పి. పాండు, మడిగెల పాండు, కాశిదాసు,

విజయకుమార్‌, శివనాగులు, బాటసారి, కపిలవాయి ఆనంద్‌, టి. మద్దిలేటి, వి. బాలస్వామి, ఎం సైదులు, ఎం శివప్రసాద్‌, ఎం. బంగారయ్య, కారుకొండ కృష్ణు నాగభూషణ్‌లకు జై భీంలు

నాపిజి దోస్తులు - ఎ. సురేందర్‌, వి. గంగరాజు, జార్డ్‌ రవి, వరంగల్‌ మల్లయ్య, తిరుపతి,

నా జిగ్రీ దోస్తులు - ఓ సహదేవుడు, జెట్టి సుంరేందర్‌, ఎ చంద్ర సిద్ధార్ధ, ఖాజా, కెపి చంద్రయ్య, ఆర్‌ శివప్రసాద్‌, వనపర్తి మిత్రులు ఈశ్వర్‌, స్వామి,

మా అల్లుడు చరణ్‌, మా బామ్ముద్ది జిలకర రాము, ఎం శరత్‌ నా భార్య సోని, నా కుమారులు కె ప్రజిత్‌ సాహు, ప్రణీత్‌ చంద్ర సాహులకు జై ఖీంలు.

క్‌! నెలవంక రాన్రాను లావుగైంది నా పాదముద్రల్లో పున్నమై పూసింది రుతువులు ఎగిరెగిరి ముందుకు రాలి పడుతున్నై...! కాలచక్రం (భ్రమణం చెందుతూ ఒక్కొక్క తేది ఎగిరిపడుతు గత ఇతిహాసాలను జాడిచ్చి తన్నుతునై! కాలగమనానికి గనుమేసి అస్తిత్వం మాటేందని ఆగి ఆగి మాటేసి ఘాటుగానే అడిగింది పాదముద్ర! వెనక్కి నడిచెల్లి చూస్తే రెండు సమాంతర బాటలున్నై ఒక్కొక్క బాట ఒక్కో గమ్యానికి మోసుకపోతుంది పసురం మేళతకై తొక్కిన పంచకంతల బాట! మిగ్గుబాట “మూలవాసుల పాదాల స్పర్శతో పర్సిన బాట! తానే బాటగా పుట్టి మహాప్రయాణమై సొగిన తొవ్వ!

“ఎరుక బహుజన మహోధ్యృమ దీర్ధకావ్ఫం 29

ఇంగోటి నిచ్చెన మెట్ల బాట కంపుతో నిండిన మోరీల మూట! కాలానికి బాటలకు సంబంధబాంధవ్యమేదో తెలువదు నేను నడిచేటప్పుడు నా బొటనవ్రేలు నుంచి కాలం మొలకెల్లుతుంది నా పాదాల అడుగుల్లోనే ప్రపంచం సేదదేరింది! శ్‌ బాలు బాట మూసుకపోతున్నప్పుడల్లా బాటలు కనపడకుండా గడ్డిపరకలు మొలుస్తున్నప్పుడల్లా కాలం అల్లారం పెట్టి బాటను నిద్రలేపి చేరవలసిన గమ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది! ప్రయాణం సాగుతూనే ఉంది .! కాలానికే కాదు చలనగుణం బాటకూ ఉంది ప్రయాణం చేయాలంటే బాట భూమికగా నిలవాల్సిందే బాటలో కిరణాలు పరిమళివ్వాల్సిందే! 30 గుడిపల్లి నిరంజన్‌

అన్నీ ఆధారాలే , ఆకాశమంత యానకం నది ధ్వనితరంగాలు మాట గొంతు అన్నీ యానకాలే! ఎన్మటి అడుగుకు శబ్దం” చారిత్రక ఆధారం ప్రయాణం సొగుతూనే ఉంది! జాంబవంతుడు బలవంతుడు ఆదిలో మానవుడికి ఆసరైండు చెట్ల కొసలకు ఆకుపచ్చని చిగురులు తొడిగిండు ఆదిలో రాజ్యమయిండు జంబూ రాజ్యానికి రాజయ్యిండు ౯. శబ్దమూ చరిత్రనే గాయిదోడు గొంతు సెరిత్రే వేల ఏండ్ల సంది గతాన్ని పాడుతూనే ఉంది! కరిగిన కాలపు సొగసులను పూడిన లోతులను స్పర్శిస్తూనే ఉంది! భూమి పుట్టుక, రహస్యాలను తేటతెల్లంగా గానమై పాదుతూనే ఉంది! వేల వేల ఏండ్ల మానని రాసపుండు గాయాల్ని

“ఎరుక బహుజన మహోధృమ దీర్ధకావ్సం తే

సన్నని జీరగొంతుతో ఆలపిస్తునే ఉంది! అంటరాని కుట్రల రహస్యాలను పట్టరాని కోపంతో విప్పి కుప్పలేసి... మాదిగే మహారాజని మాదిగే మహాపాలకుడని ఆ గొంతు మూలుగుతూనే ఉంది! “రాజాధిరాజా మాదిగ మహారాజా ఈ పల్లవే చరిత్రకు ఆధారం విశ్వమంత విస్తరించిన డ్రేమను మన చెవులకు వినిపిస్తునే ఉంది! ఆ గొంతంటుంది కదా... ఆ రాజ్యంలో వివేకం ఉదయించిందని ఆ రాజ్యంలో విశాలత్వం విస్తరించిందని ఆ రాజ్యంలో జ్ఞానం ఉషోదయమైై వ్యాపించిందని! గొంతు నిలదీస్తుంది నీవి కానివాటిని నీవేమోనని ఎందుకు హత్తుకుంటున్నావ్‌? సొంత విలువల్ని వొదిలి రాళ్లను ప్రేమిస్తున్నావ్‌ ఎందుకని? వస్తువుల కోసం విలువల్ని వొదులుకుంటున్నావ్‌ ఎందుకని? జంబు సూర్యకిరణాలే అందరికీ ఆనందప్రదాయకాలు ఆలకించమని ఆచరించమని అరుస్తుంది... అరుస్తుంది! 32. గుడిపల్లి నిరంజన్‌

మనమనుకున్నాం అది బువ్వకోసమని కాదు కాదు చరిత్రను నిర్మించటం కోసమే! ఆ గొంతు శబ్దం గాలిలో యానకమై పిచ్చిపట్టినట్టు తిరుగుతూనే ఉంది ఆ గొంతును వినకుండానే కనకుండానే నా బాల్యం కరిగిపోయింది నా యవ్వనం చెరిగిపోయింది నా వార్ధక్యం పరాయితనాన్ని ఆలింగనం చేసుకొంది నదిలాంటి సత్యాన్ని నాకోసం ఆ గొంతు విలపిస్తున్నా... ఎండుటాకు రాలిపోయినట్లు నా దేహం... నా దేశం... పక్క విలువల్ని పాటిస్తునే ఉంది! మట్టి రేణువుల్ని వాంటికి పూసుకొని ఆ గొంతు పాడిన పాటే ఆ గొంతు సూయించిన బాటే... ఆ గొంతు నిర్మించిన బాటే... జంబు సక్కని బాట...! క. కోట్ల అంతర్యామిల నడుమ కాలం గర్భాలను చీల్చుతూ జంబూద్వీప బాటలను కాడిమాకులను ఎందరో మోస్తూనే ఉన్నారు. కాడి వదిలింది లేదు బాట ఆగింది లేదు “ఎరుక బహుజన మహోద్మమ దీర్ధకాన్సం న్‌

ఆలోచన అంతమైంది లేదు బాట ఆగింది లేదంటే నిరంతరం సాగిందని కాదు అర్ధం సమస్య ముసిరినప్పుడల్లా బాటే తనను తాను శోధించుకుంది చర్చించుకుంది సాధించుకొని సాగిస్తునే ఉంది! బాటంటే అదేదో మట్టిపెడల దిబ్బ కాదు ఆ బాటల్లో రాజస్వం పర్సుకుంది రాజులు నడిసిన బాట మహారాజ్యపాలన పొడసూపిన బాట మానవ జీవిత ఘటన సంఘటనల సమాహారాల బాట! కుల పంచాంగాల కర్మల కట్టలు బాటకు బాకునే దించాలనుకున్నవి బాట బాధపడలే బోధించింది జీవిత సత్యాలు ఆనందరేఖ అటికెలు నాకొద్దని కుదురు మీద మెరిసే బువ్వే తినాలని బాట అదుపు లేకుండా సాగుతుంది సానపట్టిన ఆరేపై శింగిడి ఆగిడై బాట నడుస్తుంది! . పంటకై విత్తులు వేసేది వాకదైతే పంటలు మేసేది ఇంకొకడు!

ప్రసాదం 'ప్రలోభం' పేటేగిపోయి బాటలో బ్లాస్టింగ్‌ బాంబులు పెట్టిండ్రు బండెడు అద్దం బెచ్చులు బాటల్లో పోసిండ్రు అసత్యాలను “నాలుగు పాదాలపై నడిపి ముప్పది మూడు కోట్ల దేవతలను ఎగదోసిండ్రు! బెండ్లు నీళ్లలో మునుగుతాయని గుండ్లు తేలుతాయని అసత్యపు నిజాలు మనతో బుక్కించి సేతు సముద్రంపై బాటలేసిండ్రు! బాటను మధ్య ఆసియా పశుల కాపరులు చిందరవందర సిత్తకార్తి ఎండలై కుటై రూటు మార్సిండ్రు! జంబుధర్మం సాగకుండ ప్రలోభాల వలలు విసిరేసినారు మంచివారికే కష్టాలొస్తాయంట గదా మరి మంచిబాటకు రావా? ఐనా బాట వీగిపోలే సాగిపోతూనే ఉంది ఏది దారి అనేవాడికి ఎదురు నిలిసి ఎన్ని 'ఆర్యుల' మందలొచ్చిన ముందుకే దూసుకపోయింది! చండాలుడి బోధకు శిరస్సు వంచి ప్రణమిల్లిన ఆదిశంకరుడు గా బాటను సూసి దడ్సిండు “పాదుకల రాజ్యం”పై

*ఎరుకొ బహుజన మహాోదధృను దీర్ధకాన్సం 35

డాంబర్‌ రోడ్జె సాగుతుంది బాట! సొప్పవామిలో నిప్పు దాసిపెట్టినోన్ని పట్టి పదిమందిల లందలముందుకీడ్సింది! బాటలో ఒక్కొక్కరు.... బాటకై సాగిండ్రొక్కొక్కరు బాటలో గణరాజ్య వనాలు రెపరెపలాడుతున్న బహుజన జెండాలు! ఈఈ గుడిపల్లి నిరంజన్‌

ఖై అతడు మనిషికి పత్రహరితం పూసిండు వసంతకాలాన్ని మెదళ్లలో నాటిండు! పుట్టింది మద్దిచెట్టు కింద... జినుడైంది బోధిచెట్టు క్రింద... చెట్టే అతనికి ఆధారం చెట్టే మెదడులో చేతులు పెట్టి శాఖోపశాఖలై మనిషికి ఆలింగనమైంది! ఎప్పుడూ చిక్కుప్రశ్నలై పేలే అతడు నిరాడంబరత్వపు అరచేతుల్లో పూసిన పువ్వు! (ప్రశ్నలకు బదులు లేదు ఆలోచనలకు అంతులేదు! లోపల లోలోపల పురుగు తొలుసుడు ఆగుడు లేదు! ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆలోచనలను బంధించగలవా? 'ఎరుకొ బహుజన మహోధ్యమ టిర్హకావం ౩7

కష్టాలు కనపడనీయక ఎన్నాండ్లుంటావ్‌? దుఃఖాన్ని జారనీయకుండ మరణాన్ని సూడనీయకుండ ఆపలేవు! రాజభవన గోడలు పగిలాయి వనాలవైపు దారులు తెరుచుకుంటున్నాయి! ఈడేమో సిన్నది ఆలోచనేమో ఆకాశం! ఆలోచనను దారి మలపాలి (ప్రశ్నలను పాతరేయాలి ఎట్లా? ఏమిటి? ఎందుకు? ఇవేగా లేకుండా చేయాలనుకున్నది? ఇంగో... రాజా... సట్కునో పండితుడు సలహాను విసిరికొట్టిండు వివాహం చేయ్‌ ఆలోచనను తుంచేయ్‌! అప్పటికతని వయస్సు నూనూగు మీసాల నూతన యవ్వనమే! స్వర్గసీమను మరిపించే సతి నులువెచ్చని ఒడి బోసినవ్వుల ఆశల కొడుకు అవేవీ నిలబెట్టలేకపోతున్నాయి అతని సూపు వనాలవైపు అతడు బహుజన బాటకు ఆది గడ్డకట్టిన కాలంపై క్‌ గుడిపల్లి నిరంజన్‌

పిడికిలితో గుద్దడానికి అతని అదుగులు పిదుగులవుతున్నాయి దారి వెంట నడుస్తున్నకొద్దీ కాలం) ముసలిదై కాళ్లీడుస్తుంది జబ్బలు సరుస్తున్న మనిషిని కాలం జబ్బె పీడిస్తుంది! చారి వెంట అడుగులు పడుతూనే ఉన్నాయి. అంత దూరాన పుట్టగడ్డ గుండెలాలికిన ఏడుపు! అతడు వింటూనే అంటున్నాడు ఏమిటిది? ఎందుకిలా? ఇలా ఎందుకైంది? అలా ఎందుకు లేదు? ఇలా అలా కాకుండా ఇంగోలా ఎందుకు లేడు మనిషి? చెట్ల నీడల కింద పర్సుకున్న బాటల పోంటి ఎవరో మనిషిని మోసుకొస్తున్నరు తెల్లటి ఆకాశాన్ని అతడిపై కప్పిండు నక్షత్రాలను ఏరుకొచ్చి చల్లుతున్నరేంది? గుండెలు కుంభవృష్టై కురుస్తుంటే అతడు హాయిగా ఎలా నిద్రపోతున్నాడు? చెన్నా! ఓ మాల చెన్నా! నీకేమైనా తెలునా? తెలుసయ్య... తెలుసు నిద్రపోతలేడయ్య పైకి పోతాండు అవునూ... చెన్నా! ఎవరైనా ఎందుకు చనిపోవాలి?

“ఎరుక బహుజన మహోద్యమ టిర్ధతాన్నం 39

భూమిని బద్దలు చేసే ప్రశ్న విశ్వాన్ని ఉల్చాపల్డా చేసే ప్రశ్న విశ్వాసాల్ని ఊచకోత కోసే ప్రశ్న] చూసిన దృశ్యాలు కంద్లళ్ల మెదలుకున్నై విన్న మాటలు గుండెల్లో సల్మె పారలై సల్పుతున్నవీ మనస్సుపై ఎవడో అణుబాంబు విసిరిండు మనస్సు పొరలు విచ్చిత్రి చెంద్ర విశ్చవ్యాష్తమౌతున్నాయి సూపులు స్తురక్రత్తుభై కోలాటమేస్తున్నాయి ఆలోచనలు తీవ్రమై కోటగోడలన్సు తరిమికొడుతున్నాయ్‌, ఎందుకు మనిషిపై సీర్లక్ష్యపు గాల్బ్టు వీస్తున్నాయ్‌? ఎందుక ద్భృశ్యవ్వే అద్భశ్యమౌత్రుంద్ర? ఆ దృశ్యమే మళ్లీ పుడుతంద్రి? నిజానికి దృశ్యమే జ్ఞానం మూనవ నొసటిపై ప్రద్వ్బ్బ్వజ్ఞ భొనోదయం! దృశ్యం స్వభావదారిన్ని మలుషాచ్చు దృశ్యం కుంగదీయవచ్చు సత్యం ఒకే దర నిన్న ఉండేనీయక్షష్ర్య్యా ఫేశ్యం నిన్న కూరగాయల్లు తరుగొచ్చు దృశ్యం న్సీ గుండెలన్సు సలుషాచ్చు చృశ్యం స్థిమిత్నైత్తేన్న్యు శొంన్లి ద్బశ్యం సుఖస్తాక్ట్యాల్య నరక్ష్య్యా శం నడిపి నిరరీ

దృశ్యం తాళిబొట్టును తెంపొచ్చు దృశ్యం త్యజించడం నేర్పొచ్చు దృశ్యం సందేశం ఇవ్వొచ్చు దృశ్యం సత్యాన్వేషణకై రంధ్రాన్వేషణ చేయొచ్చు దృశ్యం మనస్సును నిమ్మలపరుచొచ్చు దృశ్యం స్వప్నాలను పేర్పొచ్చు దృశ్యం త్యాగాన్ని మనస్సుకు తాపొచ్చు దృశ్యమే అంతా... అంతా దృశ్యమే రావ్రైళ్లు నిద్రపోతూ మంచం మగత నిద్రలో ఉన్నప్పుడు దృశ్యం మేలుకొన్నది దీపమై వెలుగుతోంది. నేను వెళ్లిపోతాను... ఎక్కడికి? బాధల ప్రపంచం లేని చోటికి ఎక్కడ ఉంది? వెతుకుతా, దొరక్కపోతే? నేనే నిర్మిస్తా! అవును నా కోసం దేహం నీ యవ్వనాన్ని ఎందకొదులుకుంటున్నావ్‌? ఇంద్రియ సుఖమొద్దా? వొద్దు... రాజ్యాన్ని ఎడం కాలుతో తంతావేంటి? అవును తంతా సత్యాన్వేషణ కోసం తంతా! ప్రతి మనిషి ఉషోదయమవ్వాలి!

“ఎరుక బహుజన మహోద్బమ టిర్ధకావ్మం న్‌ా

ఓయు... కాంతి ఎక్కడున్నావ్‌? నేనిప్పుడు ఎల్లిపోతున్నాను ఎక్కడికి? అడ్రస్‌ లేని చోటికి తిరిగి రారా? రాను. మూడు దృశ్యాలు మూడుముళ్ల బంధాన్ని తెంపింది! ఒక్కో దృశ్యం ఒక్కో మనోవేదన ఎందుకీ సమాజం (డ్రైనేజ్‌ కంపుతో నిండిపోయింది? ఎందుకీ మనిషిలో రక్తానికి బదులు మురుగు ప్రవహిస్తుంది? ఈ రాజసం నాకొద్దు ఈ కిరీటం నాకు అసలే వొద్దు ఈ బంధనాలు నాకొద్దు నేను వెళ్లిపోతాను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోతాను నేను మిమ్మల్ని వాదిలిపెడికేనే మీలో ఉషోదయం సెలిమెలా ఊరుతుంది సత్యకాంతి ప్రపంచాన్ని కమ్ముకుంటుంది నిజం, అగ్ని పెనవేసుకుంటాయి నేను ఇప్పుడే వెళ్లిపోతాను సత్యాన్ని మీ దోసిట్లోకి తం గుడిపల్లి నిరంజన్‌

ఒంపితేనే తిరిగొస్తా! నేను వెళ్లిపోతేనే దీపపు వెలుగులు ప్రతి గుడిసెల్లో వెలుగుతాయి. ప్రతి మనిషి - శ్వాసకు బదులు “ఢ్రేమను" పీల్చుతాడు. నాకు కష్టాలుండొచ్చు! నాకవి కష్టాలు కావు నాకీ పడకగది జైలులా ఉందేంటి? నా మనస్సు అశాంతితో నిండిపోతుందేమిటి? ఓ యవ్వనమా! నన్ను మైథునంలోనే ఆగిపోనియ్యకు నేనుండను... ఇంక నేనాగను... నేను వెళ్లిపోతాను! బ్గా 2 అదిగో వింధ్యాచలం వాంగి వొంగి నమస్కరిస్తున్నది ఆసేతు హిమాచలం సాగిలపడి చలువగాలులతో ఆహ్వానిస్తుంది వనాలు స్థిరపడ్డాయి అడవి జీవరాసులు స్నేహహస్తాన్ని చాటుతున్నాయి. అడవి అమాంతం ఎదురొచ్చి అతని పాదధూళిని తొకుతున్నది 'ఎరుకి బహుజన మహోదృమ బిర్హకావ్యం క్‌ు.

ఒక్కో వృక్షం వేల వేల వృక్షాలకు సందేశమిస్తున్నాయి కాయైనా, పందైనా అతని పంటి కిందికి చేరాలని వృక్షాల 'ఫలసందేశం*! హుహు ఇ గుహనుంచి గయకు సాగుతుంది బాట గుహ హృదయాంతరాళాలను తెరిచింది అలారకముని అతనిని ఆహ్వానించిండు ధ్యాన రసగుళికలను మింగించిండు! మనస్సు తపస్సుతో తెల్ల్పపావురమై ఎగురుతుంది గని తెల్లని ఆలోచనల గని ఎదల నిండా తెల్లని ఆలోచనలే మనిషంతా హిమాలయమైండు. ఉడుకుతున్న మనస్సుపై శాంతి జలధారలై జారుతున్నాయ ప్రశ్నల పర్వతం కరుగుతుంది అశాంతి జ్వాలలు మంచుగడ్డలౌతున్నాయి సింతనిప్పెన మనిషి... అలాయి గుంతలా ఉన్న మనిషి... సన్నని మంచుకాలువై పారుతున్నడు! చిక్కు ముడులన్నీ ఒక్కొక్కటిగా విప్పుకుంటున్నాయి దీక్షకు దిక్కులు జడుసుకుంటున్నై న్‌ గుడిపల్లి నిరంజన్‌

దివ్యకాంతి మనస్సు హిమాలయమై వాలింది పరివర్తన స్థిరంగా నిలిచిపోతుంది! జభ ల అతనిని స్నానానికై 'నిరంజనా నది” పిలుస్తోంది మనస్సు నదిలా సుడులు తిరుగుతోంది పద్మాసనమేసిండు... ఆసనం వాదిలింది లేదు - శరీరంలో రగుతం ఇంకిపోయింది ఆ నలభై ఎనిమిది రోజులు బక్కచిక్కిన రోజులైనవి! సత్యసందర్భనకై దారులేసినయ్‌ గుండెల్లో జొరబడిన అమావాస్యలను అనుమానాల మబ్బులను జెప్ప జెప్ప సాగనంపిండు! అంధకారం నొసటి వలుగుల్లో మిణుగురు పురుగైంది మనిషి జినుడైండు ముసుగు వేసుకున్న మూలాన్ని వెతికిపట్టిండు సత్యాన్ని నాసటిన బంధించిండు! జ సు షు ఆ చెట్టే అమ్మెంది ఆ చెట్టే చల్లని నీడయింది బోధిమానుకు ఆనుకుంటే

'ఎరుకి బహుజన మహోద్యమ దీర్ధకాప్టం తీర్‌

“బుద్ధిమాన్‌” అయ్యిండు ఉదయం హృదయం నిండా పరుచుకున్నది ఆ నలుపై ఎనిమిది రోజులు పరిశోధనే భభ ల అతని ఆలోచనలు సైన్స్‌ అతని మాట సైన్స్‌ అతని బాట సైన్స్‌ అతని బోధన సైన్స్‌ సైన్స్‌ + మనిషి = అతడు! బోధివృక్షం జ్ఞానఖడద్ద్గమైంది మహాబోధి వృక్షమైంది! బౌద్ధగయలో చీకటి “గయా” ఒక మనిషి బోధకుడయ్యిండు పొందింది ప్రవహించాలంటే మనుష్యుడి నాఖిని జ్ఞాననాభిని చేయాలి యదార్ధాన్ని బోధిస్తున్నాడు తథాగతుడు తాను పొందింది దాచుకోలే కుట్రల విద్యలు తెల్వవు ఏలుకోసుడు తెల్వదు ముందుగాల్ని నిన్ను నిలబెడతానని ఏ శిష్యుడికీ హామీ ఇవ్వడు! గురుదక్షిణ తెల్వదు ప్రశ్నాపత్రాలు లీకులు తెల్వవు పొందింది స్మలించాడు సంకల్పం అందించి “తీర గుడిపల్లి నిరంజన్‌

బోధనలో ప్రయాణం

ప్రయాణంలో బోధన

అలసటే లేదు మాటకు

ఒక్కో ప్రయాణంలో

ఒక్కో సంఘటన

సత్యాన్వేషణం కోసం

రాచరికాన్నీ

ప్రపంచ క్షేమం కోసం

రాజరిక వైభోగాన్నీ

సన్యసించిన

వారు అంటే గౌరవమే!

విముక్తి విముక్తి

జనన విముక్తి

మరణ విముక్తి

వేదన విముక్తి

బాధల వలయం

పోవాలంటే ఏం చేయాలి?

వలయాలు జీవితాలను

చుట్టుముట్టాలా?

జీవితాలు వలయాలను

తెంచేయాలా?

నాకీ ప్రశ్నలకు

సరియైన సమాధానం కావాలి 'ఎరుకి బహుజన మహోదృమ టీర్ధకావ్వం జ

నిజమైన సమాధానం కావాలి! సత్యాన్వేషి సమాధానాల బాటై వెతుకుతుండు ఉరువిల్వ అడవి జీవిత సూత్రాల కాలిమి లోతులను చెక్కుతుండు ఆరు సంవత్సరాలు ధ్యానం కఠినమైపోయింది తీగెలు మరీ లాగితే తెగిపోతాయి. కిస్కింత తక్కువైన సంగీతం కుదురదు మార్గం... మార్గం మధ్యేమార్గం! అగో తెల్లని నురగలతో నిరంజనానది ప్రవహిస్తోంది నదిలా సాగుతున్నె సార్విక ఆలోచనలు నదిలా పొంగుతున్నె సత్యసంతుష్టాలు స్‌ నదిలా మెలికలు తిరుగుతున్నె దాహం కొన్న మనసు పక్షి నీటి ప్రవాహాన్ని చూసి సీరు తాగింది రెక్కలు అల్లల్లార్చింది ఆకాశంకేసి చూసి ఎగిరిపోయింది ఆ నీరు తాగితే ఎంత సంతోషమో! న్‌ా గుడిపల్లి నిరంజన్‌

నది స్నానం

మనస్సు ఉల్లాసపరిచింది

నది స్నానం

మార్గాన్వేషణ దారి తెలిపింది

నది స్నానం

మార్గాన్ని భరోసా నిచ్చింది.

స్నాన అనంతరం

చెట్టు కింద పద్మాసనం

శరీరం బూడిదయినా సరే...

దివ్యజ్ఞాన జ్యోతిని వెలిగించనిదే

ఈ భంగిమనాదలను

ఈ మనస్సును విడవను

ఒక శపథం పూనిక

ఒక కఠోర నిర్ణయ అవనిక

గప్పుడే

పక్షులు కూస్తున్నాయి

కొన్ని పక్షులు ఎగురుతున్నాయి

చెట్లు తలలూపుతున్నాయి

కొన్ని సెలయేర్లు

నిరంజన నదిలో కలుస్తున్నై

నదిపారుతోంది.

కింద మట్టి కదులుతోంది

గులకరాళ్లు దొర్లుతున్నాయి

నది 'పైనీటి తొనుకు కదులుతోంది

అడుగునది రగులుతోంది

ఆకాశం ఇల్లలికిన వాకిలిలా ఉంది “ఎరుకొ బహుజన మహోధ్యమ టిర్టకావ్యం క

చందమామ మా అమ్మ నొసటి బొట్టులా ఉంది సల్లని గాలి విసురుతోంది

జ్ఞానం బోధివృక్షం వద్దకు సమీపిస్తుంది నిరంజన నది ఉరకలెత్తుతోంది

మనసు పొంగుతోంది

రాత్రి సమీపిస్తోంది

రేయి ఎదురుచూస్తోంది

జ్ఞానం నొసటిన జలై

ఊటజలై ఊరింది!

మనోనేత్రంతో

కోటానుకోట్ల బతుకులను దర్శించిండు! అవతారాల పేరు జెప్పె

స్వాహాకారుల కుట్రలు దర్శించిండు

జ్ఞానం కోసం కాకుండా

శరీరం కోసం బతికే

జీవుల ప్రయాసను వీక్షించిండు!

పదే పదే బాధల

పుట్టుడుపై లొటుకేసిండు

బాధల కారణాలపై రణం జేసిండు

సామాజిక స్థస్యల మూలం తెలుసుకొమ్మన్నాడు ;నిజం జల్లెడ పట్టి “మర్ట్టూపం ఎరుకపట్టమన్నాడు

జ్ఞానం అందరికీ అందాలి

ఏయ్‌.. ఎవరు నీవు?

ఎందుకు చెవులో సీసం పోస్తున్నావ్‌?

ఎలా చేతులొచ్చాయి నాలుకలు కోయడానికి? మనిషికెందుకో ముడ్డికి పొరుకాట కట్టినవ్‌?

శర. గుడిపల్లి నిరంజన్‌

పాదముద్రలు ఎన్నాళ్లని చెరిపేస్తవ్‌? అక్షరం మెదడులోకి యింకనీయవు ఎందుకు? తప్పు... నీవు తప్పు చేస్తున్నావు విశ్వవ్యాపితమవ్వాల్సిన మనిషిని మరుగుజ్జు చేస్తున్నవ్‌ అపన్న హస్తమివ్వాల్సిన మనిషిని అంటరాని వసంతమై వ్వ్యాపిస్తున్నవ్‌ అతడు మనిషిపై... మెదడుపై... బోధివృక్షాన్ని నాటుతున్నాడు! అందరికీ ఒకేసారి బోధనా? వొద్దు ఐదుమందికూతే ఓకే! ధర్మాన్ని చక్రంలాగా తిప్పుతా పరివర్తనను నిజం చేస్తా లి “ధర్మచక్ర పరివర్తన'తో రల రా” నీ / బోధించడానికి సంఘం స్టాపిస్తో! (గ - శా “త్‌ 7 బోధన అందరికీ అవసరమే ణి ల్‌ 7 అ సో పరివర్తన అందరికీ అవసరమే శ సం ఒక్సొక్ళరు సంఘ నిర్మాణంకై ఇటుకలు పేరుస్తున్నారు శిష్యులు నడుస్తున్న దారులు బాటలౌతున్నాయి మనస్సులో ఏవిధమైన కోరికలు లేవు మనిషిలో ఏ విధమైన ఆశలు లేవు శిష్యులంత చెట్టైెనారు “ఎరుక బహుజన మహోద్భమ టిర్హకాన్సం _కేేే

శిష్యులంకా నీడనిస్తున్నారు

మనుష్యుల చుట్టూ నిర్మించిన బాధలనే

గోడలను శిష్యులు పలగొడుతున్నారు

శరీరంతో బందీగా ఉన్నవాళ్లను

జ్ఞానంతో పైకి లేపుతున్నారు

అందరికీ సమతా దారులు పరుస్తున్నారు

అస్తిత్వాలు పురుడు పోసుకుంటున్నాయి

చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మించిన

గోడలన్నీ పునాదులతో సహా

పెకిలించివేస్తున్నారు

గోడలను కూల్చి

జ్ఞానగూడులను నిర్మిస్తున్నారు.

శిష్యులారా!

మహాబోధి వృక్షాల్లారా

నలుదిక్కులై రాండ్రి

నలుదిక్కులకు వ్యాపించండ్రి

మీరే మనిషి దగ్గరకు వెళ్లండ్రి

ప్రతి మనిషి ముఖంలో

శాంతి కాంతిన్చేను చూడాలి

ప్రతి మనిషి శాంతిని కనుక్కునేలా

నహాయపీడుడీ

ప్రతి గుండెలో జ్యోతిని వెలిగించుడి

నీళ్లు పోసిన దీపం వెలగదు

శుష్కించిన కాయం వెలుగు నివ్వదు

అమ్టాంగమార్గానికి సాష్టాంగం 52. గుడిపల్లి నిరంజన్‌

ప్రశ్నలు పటాపంచలయ్యాయి

సందేహాలు నిస్సందేహంగా తప్పుకున్నై

లోకం కంద్లు తెరుచుకుంటున్నాయి

శిష్యులు ఎక్కడికెల్లితే అక్కడ

నోటినుండి అగ్నిజ్వాలలు చిమ్ముతున్నారు

జ్ఞానం వారికి లొంగిపోయింది.

గయ... గంధస్తి పర్వతం ఎక్కుడు దిగుడు

రాజ్యాలు రాజాలే

బోధనకు దాసోహమన్ననవి

గుంపులు గుంపులుగా రాజ్యాలొచ్చి

శాంతి ప్రయాణాల వెంట సాగుతున్నారు.

సత్యానికి సక్రమానికి

దాంబర రోడ్డు వేస్తున్నాడతడు

అప్పుడొచ్చిందో వార్త

'నీ తండ్రి మరణానికి సమీపమైండు

నీ సహచరి అలసిన కళ్లు రమ్మంటున్నాయని

అతడు బయలుదేరాడు

కపిలవస్తు కాంతితో వెలుగుతుంది

పోగాట్లుకున్న పేగు దొరికింది

తండ్రిని చూస్తూ కొడుకు... కొడుకును చూస్తు తండ్రీ

ఎట్లా ఉండాల్సిన కొడుకు

ఎట్లా ఉన్నడు

రాజుగా ఉండాల్సినోడు... ప్ప్‌!

ఒకటే బాధ

తండ్రి కండ్లు చూస్తూనే ఉన్నాయి

కన్నపేగుల్ని కపిలవస్తుకు తీసుకొనిపోవాలని

కాని పేగు వింటేనా? “ఎరుక' బహుజన మహాోధ్యమ బీర్ధకావ్పం 53

ఆయుధాలు, సైన్యం ఉంటేనే రాజు గాదు ఆశ, ఆగ్రహం, అమాయకత్వాల మీద గెలుపు సాధిస్తే... అదే రాజస్వం అతడే నిజమైన చక్రవర్తి అతడే అసలు సిసలు విజేత ప్రపంచ మానవ విజేత! చిన్నపేగు పెద్దప్రేగుకు జ్ఞానం నేర్చింది పెద్ద పప్రేగుకు జ్ఞానం వలన ప్రపంచం ఆనందమైంది! రాజు స్వరాజ్యంలో బిచ్చగాడు తండ్రీ... మనది ఇక్ష్వాకవంశం అయితే కాని మన వంశంలో ఎవరూ భిక్షమెత్తలేదు మీది ఇక్ష్వాక వంశం కావొచ్చు- మాది సన్యాసి వంశం రాజభవనంనుండి రాత్రికి రాశ్రే పోయిన మనిషి మల్లొచ్చిండు అందరొచ్చిండ్రు ఆమె రాలేదు. ఏ మాత్రం (ప్రేమున్నా ఆ కళ్లు నన్ను చూస్తాయనుకున్నది ఆమె అతను రాలేదు ఆమే వొచ్చింది పాదాలు కన్నీటితో తడిపింది అతనికి ఆమెకు మధ్య అనంత దూరం ఆయన బోధన

"క్‌4, గుడిపల్లి నిరంజన్‌

ఆమెకు వేదనే!

అపారమైన జ్ఞానైశ్వర్యం

వారసత్వంగా ఇమ్మని కొడుకు

రాజు సన్యాసైండు

వంశం రాలిపోయింది

మౌనంగానే అతడు

తనలో తానే

ఆలోచిస్తున్నాడు

వేణువనం... గూర్చి -

కొత్త జ్ఞానం

కొత్తదారుల మట్టిబాటకు

జీవం పోస్తుంది

ఎప్పుడో పుట్టిన

ఆలోచనను

ఇప్పుడు అలింగనం చేసుకోవాలి

కొత్తదారుల గుండా నడుస్తూ

బాటలను బహుజనవనాలు చేయాలి

అతడన్నాడూ

వర్ణవ్యవస్థకు ముందున్న...

వేదప్రస్తావనకు ముందున్న...

పాత మనిషిని ఆలింగనం చేసుకుంటున్నా!

పాతమనిషి పాదాలకు నమస్మరిస్తున్నానని!

ఒక మనిషి బాటలో మొదటి అడుగైందు

ఒక మనిషి బాటలో సాగిలపడిండు

ఆ బాటే అతనికి జ్ఞానమైంది ఎ 'ఎరుక' బహుజన మహోద్దమ టర్టకాన్సం _క్‌క్‌

మానవ (శ్రమల సుడిగుండాలను మనిషి పడే జీవిత ప్రయాసలను విప్పేసి జీలుబండపై ఆరేసిండు. అంతఃకుహరంలోని ఆలోచనలను వాస్తవ ప్రపంచ కొక్కానికి తగిలించిందు బాధల ప్రపంచం పోవాలంటే మధ్యే మార్గం రావాలన్నడు. తాను, తన అనుభవమే సత్యమన్నాడు అబ్బ ఎంత గొప్ప మాట అంతకు ముందెన్నడు వినని మాట అంతకు ముందెన్నడు లేని మాట అంతకు ముందెన్నడు చూడని మాట నిశితంగా పరిశీలించి తర్మించి విశ్లేషించి బహుజన బాటలను పరిచిన దిక్సూచి! అతడేసిన జ్ఞానబాటే చెదలు పట్టిన చరిత్రను బూజు పట్టిన విశ్లేషణలను కుదుపుతో దులిపి నిచ్చెన మెట్ల సంప్రదాయాలను నియ్యతితో అడ్డగించిండు! బుద్ధ పథమే సామాజిక పథం బుద్ధ ధమ్మయే సామాజిక హితం విశ్వప్రేమ విహారాలలో పురుడు పోసుకున్నది అంటరానివాడకు ఉపదేశమిచ్చి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని నింపి వేల వెలిజీవితాలను నిలబెట్టిండు జ ళు ఖు

ఒకే ఒక్కడే భిక్లువై వేలాది భిక్షువులను నాటిండు! బహుజన హితాయ బహుజన సఖాయ ఆలింగనం చేసుకుండు అంటరానివాడలను కుల నియమాల పేరుతో మనుషుల్ని దూషించే సంస్కృతిని నేలమట్టం చేసి జ్ఞానానికి, మనిషితనానికి ఎల్లలు లేవని నిరూపించాడు! పురుషుడే పౌరోహిత్యదారుడవ్వడమేంటని చెట్టుకు మొదలులా స్త్రీలకు ఆసరయ్యిండు విత్తనం నుండే చెట్టుగా పగిలి విత్తనాన్ని వెక్కిరింంచడమేంటని హీనంగా చూసే దుష్టబుద్దుల ముకుదూలాలు పగులగొట్టిండు. ధనాన్ని ఆర్జించడం కన్నా ధన్యులుగా జీవించూ సందర్భ్శించమన్నాడు సత్యాన్ని సత్యంగా... దర్భ్శించమన్నాడు ధర్మాన్ని ధర్మంగా... నిగ్గదీసిండు నిజాన్ని నిజంగా... (త్రికరణాలు చెక్కిండు (త్రిరత్సాలు నిల్పిండు అనాత్మను కొబ్చిండు జీవితమంతా సత్యాలనే పల్మిండు!

“ఎరుక బహుజన మహోద్భమ బీర్ధకావ్యం _57.

కొండల్ని కొలుచుడేందని బండల్ని కడుగుడేంటని విగ్రహాల్ని పూజించుడేందని అమ్టాంగమార్గం ఎదల నిండ ఎత్తుకున్నాడు. అదిగో... సాష్టాంగపడ్డారు పూజారులు! ఎంత తియ్యని మాట పనసతొనల మాట ప్రతి ఒక్కరిలో సుగుణాలుకలియతిరుగుతున్నయ్‌ ప్రతి తలకాయలో అనంతమైన జ్ఞానము మండుతుంది అన్యాయం జరిగినోడికి న్యాయం అందిస్తే- అంతర్గత శక్తులు ఊటల్లా ఊరుతాయి! బాటల్లోనే బోధనలు బాటల్లోనే దీక్షా భిక్షలు ఒక్కసారి బోధించిండో వేలాది మనస్సులు విచ్చుకుంటాయి వందలాది కన్నులు తెరుచుకుంటాయి కరడు గట్టినవాడు మంచులా కరిగిపోతాడు పశ్చాత్తాపపడకుండా రాయి అయిన ఉండలేదు. జ ళు ల్ల కథలు కథలుగా సత్యాలను మనస్సుపై చిత్రిక పట్టిండు “కం! గుడిపల్లి నిరంజన్‌

కథలంటే యుద్ధ తంటత్రాలే ఒక్కో అగ్గాధాన్ని పూద్చడానికో కథ ఎంత తియ్యని సత్యం నిన్ను ఎదుటివారి రూపంలోకి జారవిడుచుకో ఆచరణంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చుటయే మెల్లగా బోధన దూరదేశాల దరులు చేరాయి సింధూ ధర్మాన్ని పారనూకడంతోనే చీకట్లు ఇక్కడ ప్రసరించాయి. ఇక్కట్లు మనిషిని అల్లుకున్నాయి నిజానికి పారద్రోలింది ధర్మమే కాదు సాహిత్య వెలుగులను కూడా! రాళ్ళు రప్పలు చూయించి మనస్సును లగ్నం చేయడమంటే మనిషిని అవమానించుడేనని తేల్చిండు! ఏ రాయి కంటే మనిషి తక్కువ? కోపంతో పగతో... ఈర్ష్యతో అసూయతో... మండిపోయే మనిషికి కాసింత కరుణపూత పూసిండు. ఉక్కిరిబిక్కిరి జీవితాలను ఆకలితో అదుగంటిపోయిన డొక్కలను యోగాసనాలేసి దర్శించిండు ప్రతి మనిషిలో ప్రశాంతతను తిలకించాలనుకున్నాడు ప్రతి జీవిలో “ఎరుక బహుజన మపోదృమ టిర్చకావ్సం _59.

ఆనందాన్ని పొంగించాలనుకున్నాడు ప్రతి అడుగు ఒక జ్ఞానమడుగు దుష్ట సంప్రదాయాల దిష్టిబొమ్మలను కాల్చేసిండు. అనాగరికమైన శ్లోక శోక సంస్కృతిలో అవమానాలు పడి పడి అలసిపోయిన మనిషిని దోసిట్లోకి జ్ఞానాన్ని ఒంపుకొని మనిషి పాదాలను కడిగిన మహనీయుదతడు! అవమానించిన ప్రతి మనస్సును బోధనలతో సేదదీర్చిండు సమస్త జీవుల సంక్షేమం కోసం లోకహితమే జీవితమని సాటిలేని ధర్మాన్ని ఈ భూమిపై మొక్కల్లా నాటిండు ఒక మనిషి ఇంకో మనిషిపై కాలకూట విషం కక్కే బతుకును అసహ్యించుకున్నాడు. య. ఎన్నో మోసపు ప్రయత్నాలను ఎన్నో కుట్రల వ్యూహాలను జ్ఞానంతో... చర్చలతో... సంభాషణలతో... ఓడించిండు! కోపాన్ని విచ్చుకున్న 60. గుడిపల్లి నిరంజన్‌

మంటల్లో మసి చేసిండు పగను ధర్మ ప్రభావంతో పూడ్చిండు అసూయను (ప్రణాళికలు రచించి మనిషితనం నుండి బయటికి పంపిండు! అహంకారం మనిషికి అలంకారం కానేకాదన్నాడు. బాటను పాదాల అడుగులతో నిర్మిస్తు నడుస్తు నడుస్తు నిర్మిస్తూ మానవతకు (ప్రేరణగా బాటను నిర్మిస్తూ సాగుతున్నది బాటకు ఊపిరి కారుణ్యం బాటకు మూలం (ప్రమవనం ప్రతి శిరస్సును స్పృశించి మనశ్శాంతిని వెలిగించడమే బాట అంతిమలక్ష్యం జ్ఞానాన్ని కులం రాళ్లతో తూచదమేంటని? జ్ఞానాన్ని బలహీనపర్చడమేంటని? ఎవడూ ఎదగకూడదని ఇంకెవ్వడూ బాగుందడకూడదని మడి కట్టుకున్న జీవితాన్ని దడి కట్టుకున్న ఆఅచారాల్ని గడ్డకట్టిన బతుకుల్ని పనిచేయక రాజుల్ని పొగిడే పండిత పరిషత్తుల్ని

“ఎరుక బహుజన మహోధ్యమ టిర్ధకావ్వం _6ే

గొప్పవారమని... లోకానికి జ్ఞానవారధులమని వారికి వారే సంప్రదాయ పెంటను మంటల్లో బూడిదజేసిండు! అంతా నటనని తెలుసు అంతా తేలిపోతూనే ఉంది సంకుచితత్వాలు + స్వార్ధాలు = కులాచారాలు జ్ఞానలింగమైన ప్రశ్నలతో బోధనలతో ఆచరణతో ఆదరాభిమానాలు చూపిస్తూ బాటనుసాగిస్తున్నాడొక భిక్షువు! ఎంత ఖండశక్కెర మాట? ఎంత గొప్ప (ప్రేమ? ఎదుటిమనిషిలో తనను దర్శించి శత్రువులో తనను చూసుకుంటే శత్రుత్వం ఎగిరిపోతుంది తుఫానులైన ఆలోచనలు మనుష్యుడి కోసం వెతుకులాట ద్వేషపు మాటలుండవ్‌ తుర్తుమాటలుండవ్‌ లోలోపల హృదయాంతరాలలో కరుణ, జాలి, గాలి, మొగ్గలైనాడు తప్పుల్ని సరిదిద్దుకునే

62" గుడిపల్లి నిరంజన్‌

సదుద్దేశాలను సమాజానికి అతికించింది సిద్దార్భుడే! దళిత బహుజనుల బు(ర్రలను పూజారుల బొ(ర్రలు తినుండేదని తిరగరాసిండు వంచన చరిత్రను. కుట్ర బాటలన్నింటిని మరుబాటలుగా మలిచి ఉల్చాపల్టా చేసిన సమన్యాయ ఉపాధ్యాయుడు! వర్ణవ్యవస్థనే దురవస్థని వర్జధర్మాన్ని సెడుగుడాడి మనిషిపై పగపట్టిన “ఆచారం మనిషిని నిగ్గదీసి అడిగిందు! కులవ్యవస్థ కుట్రలను ఒక్క తొక్కుడు తొక్కిండు! జ్ఞానమార్గాలు తెరుసుట్ల మాదిగ కక్కడు తల ఎత్తుకుండు చేసిన తప్పుకు గోతి తియ్యు దుష్ట స్నేహాలు మాను ఆహార్యంపైనే కాదు ఆహారంపై కూడా ఎరుకై ఉండు బాటలో బోధనలు పెంచిండు సమన్యాయం చెప్పి... మహావిప్లవ కెరటమైండు! ప్రజ్ఞకు పట్టంగట్టి యజ్ఞాల బీజాలు పీకేసి

“ఎరుక బహుజన మహోద్యమ దీర్ధకావ్చం 63

వేదాల కర్టాల కరుకు పొట్టల మురుగునంత సీపురుతో సుక్కల కంటే ఇంకా అసుంటే నూకి పారేసిండు! హింస మూలాలు ప్రాక్లెన్‌తో మరీ త్రొవ్వి కప్పలు కుప్పలుగా పేర్చి పెట్రోలు పోసి మరీ తగులేసిండు శాంతివనాలు (ప్రేమతో పెంచిండు. ఆడదంటే అజ్ఞానమన్న నిర్వచనాన్ని నిలువునా నరికేసిండు పాతివ్రత్యపు హత్యలను అరచేతితో అద్దుకుండు సంకెళ్లను సలసల కాగే నీళ్లలో అద్దిండు. ో స్రీ స్వాళంత్ర్య మర్దత్రీ చెరిపేసి స్త్రీ సాహసాలను శిలాశాసనాలుగా చెక్కిండు! పుక్కిటి పురాణాలను ఫుట్‌బాల్‌ అడి బుద్ధ జాతక కథలతో యథార్థాన్ని పైకెత్తిండు! ఈ కథల ముందు ఇంకే కథల కథలు సాగవ్‌ మగాడి దుర్చుద్దిని దుర్మార్ధాల్ని జాతక కథల సైన్యం ఓడించింది! లోకాన్ని ముందుకు తోస్తూ ధర్మాన్ని వెలిగిస్తూ సత్యాన్ని శోధిస్తూ సాగుతూనే ఉంది తథాగతుడి బాట! లా జ ఖు 64. గుడిపల్లి నిరంజన్‌

బాట ఒక దగ్గర

నదిని దాటాలి

జీవిత నదిని దాటాలి

చాటింది, దాటుతూనే ఉంది

సూక్ష్మాతి సూక్ష్మ విషయాల్లో

ధర్మనిష్ట ఎట్లా కొనసాగించాలో నేర్పింది!

బాటలో ధర్మ ప్రచారమే కాదు

ఆఅచరణకి ఉంది ఓ పద్దతి

ఆ బాటలో ధర్మపు మాటలు

అందమైన సువర్ణపు అక్షరాల

చెరిగిపోని కరపత్రాలు

ఎంత అందమైన బాట

గొప్ప అద్దమైన బాట

ప్రతిబింబమై సాగుతున్న బాట

నిందా దుఃఖమై పరుచుకున్న

వర్ణబాటల్లో తగులబడుతున్న

ఆత్మగౌరవాల్ని

తక్కెళ్ల బొందల్లో పాతిపెట్టిందు!

నడువు నడువు

అటు ఇటు సూదకు

నడుస్తూనే ఉండు

వచ్చేవారు వస్తుంటారు

కలిసి నడిచేవారు నడుస్తుంటారు

నడిచినల్లే నడిచి

మధ్యలో తప్పుకునేవారు

ఎట్లాగు ఉండనే ఉంటారు 'ఎరుకొ బహుజన మహోద్యమ టీర్ణకొవ్నం _65.

నడవడమంటే అడ్డదిడ్డంగా నడవకు ఇన్నాండ్లు అవమానాల బాటల్లో నడిచినవు అందరు నడిచిన బాట కాదు 6748 కులబాటలు ఏ బాట ఎంచుకుంటావు? ఒక్కో బాట ఒక్కోకంపు ఒక్కో బాట ఒక్కో అవమానం! కొందరు నడుస్తారు బాటలోని చెత్తను ఎత్తుతుంటారు నిత్యం రాలిపడే ఎండుటాకులు రాలి పడుతుంటే ఎత్తాల్సిందే కంప ఉంటే తొలగించాల్సిందే పల్లేరుగాయలుంటే ఊడ్చాల్సిందే కుక్క శిర్మెలుంటే దారి మలపాల్సిందే మౌనంగా... వినయంగా నడవాల్సిందే! పాతకాలపు కులబాటల్లో ఎవరో ఉచ్చ్వాస నిశ్వాసలు బంధించిండ్రు మూతికి ముంత కట్టింధ్రు ముడ్డికి పొరుకాట కట్టిండ్రు వంటికి దిష్టిపూసలు గుచ్చిండ్రు మనిషిని శనిగొట్టువాడని ఏ నీతినీ పాటించని కులబాట కామశాస్తాల బాట పట్టింది! చీకట్లు పారద్రోలిన బాటొకటి చీకట్ల పాలుజేసిన బాటొకటి

ఏది ఎంచుకుంటావు అంటూ

గుండె ఆగిపోయే నిర్హాంతాలను

ఎడం కాలుతో తన్నిండు

శత్రువు అతని భావాల్లోకి జొరబడిండు

అతన్ని నాశనం చేయాలంటే

పూజే ఆయుధమన్నాడు

అతన్ని పూజించాలన్నాడు

సాపేక్ష సిద్దాంత పెనుభూతంతో

అతని భావాల్లో

అణువిచ్చిత్తె 'పేలిండు

ఆ దెబ్బకు...

నాగార్జున కొండలు కరిగిపోయాయి

నాగదేశం తగ్గి

అనిల్చితిలోకి వెళ్లిపోయింది

గుంపుతత్త్వ్వమైన చార్వాకం

లోకహితమైన లోకాయుతం

ప్రశ్నలు ధైర్యాన్నిస్తాయి

ప్రశ్నలు నడక నేర్పుతాయి

భూమిలో పాతుకున్న

నాగళ్లను చూపుకు

బురదే బువ్వన్నాడు

బువ్వే మన్నన్నాడు

గణరాజ్యం గాలిపొరల

ఆవరణాలలో పారాడుతున్నది చూసి

చైతన్యపు పొరలుగా మలిచాడు

కొత్త ఆలోచనను కనురెప్పలతో ముద్దాడిండు 'ఎరుకొ బహుజన మహోధ్యమ టిర్హకావ్యం 6

అతడిది మూర్తీభవించిన కరుణే సమస్త మానవాళికి కడు ఆదరణే! తల్లి 'మాయననే కాని యధార్ధాన్ని కన్నది తంగ్రి శుద్భుడే పరిశుద్దుడిని కన్నాడు అతడు హేతువాది స్వానుభవమే కాని భగవంతుడు కాదన్నాడు అతడొస్తూనే మంత్రాల మూధత్వాన్ని బద్దలు కొట్టిండు మంత్రాలు తంత్రాలు కాదు కావాల్సింది యంత్రాల్లాంటి యదార్థాలన్నాడు! యుద్ధమంటే బలి కాదు తనను తాను జయించడమే! ఈ దేశాన్ని ఒంటరి చేసి ఆత్మీయంగా అతను వేరే దేశాలకు దారి మళ్లిపోయాడు అతన్ని మనం మరిచిపోయాం అతన్ని మళ్లీ పిలవండి గట్టిగా పిలవండి నోటితో కాదు నొసటితో కాదు హృదయంతో పిలవండి నమ్మకంగా పిలవండి ఎల్లలు దాటిపోయిన శ్‌ గుడిపల్లి నిరంజన్‌

సరిహద్దుల ఆవల సంచరిస్తున్న అతన్ని మళ్లీ పిలవండి మళ్లీ మళ్లీ పిలవండి బహుశా అతడు అలిగి ఉంటాడు మనం ఇన్నాళ్లు పిలవనందుకు అతడిని వదిలిపెట్టినందుకు నలిగిపోయి ఉంటాడు పాత జీవితాన్ని రోత జీవితాన్ని వాదులుకొని అతన్ని పిలుద్దాం అందరికీ అతన్ని పరిచయం చేద్దాం అతడు బహుజన రాజ్యాధికార తోటలో వెలిగిపోతున్నాడు ఆకుల చిగురులోగిళ్లు సాదర స్వాగతం పలుకుతున్నాయి చంద్రుని తలదన్నే కాంతి అతని నాసటన కేంద్రీకృతమైంది అంధకారంలో అతడో వెలుగు అమాయక జీవికలకు అరుగు అతడు బహుజన రాజ్యాధికార తొట్టతొలి బాటలో శతాబ్ది ఎక్స్‌(ప్రెస్‌లా పరిగెత్తిండు అతడు మనిషి కాదు జ్ఞానం జ్ఞానం!

“ఎరుక బహుజన మహోద్భను దీరకావ్యం 69

తి

మౌర్యవంశ సూర్యగోళం బాటల్లో బగబగ రాజస్వమై మండిండు చిల్లిన రాజ్యసృతులను

ఒక్కొక్కటి పేర్చిండు

అఖండ భారతాన్ని

ఆకాశమంత నేత్రాలతో వీక్షించి

తాతల అనుభవాలకు

కనుషాపలను కానుకగా ఇచ్చిండు! ఉన్నత కులం పాలనగా మారి

రొమ్ము విరుచుకుంటున్నప్పుడు శోకంలో ఉన్న దేశాన్ని

'అశోకంిలోకి మార్చిండు! మహానీచులని ముద్రలేసిన మనిషిని హృదయంతో చూడగలిగిన రాజు.

గ గుడిపల్లి నిరంజన్‌

తప్పిపోయిన సూర్యుడ్ని నట్టనడి వాకిట్లో నిలబెట్టిండు! గంగానదిలో ప్రవహిస్తున్న ఆర్యత్వాన్ని సెంధునదిలోకి మలిపిండు! పాత పునాదులపై కొత్తదేశాన్ని నిర్మించిండు ఒక సూర్చుణ్ణి అడ్డగిస్తే వేల సూర్యులు పుడతారని నిరూపించిండు. సచ్చిన అక్షరాలకు జీవంపోసి రాతిస్తంభాల పైకి ఎక్కించిండు శిలాశాసనాలపై గుహశాసనాలపై సూర్యునిలాగ వెలుగులీనుతున్న నీ చరిత్రను పదిలపరిచిండు! కళింగయుద్ధమై అకాశం వొంగినప్పుడు విఘాతమైన శాంతిని చూసి బోరుబోరున ఏద్సిండు! బాట కుంగినప్పుడల్తా బిడ్డకు ఎండ తప్పించుటకై అమ్మ కొంగైండు! పాలనలో ప్రపంచ వెలుగై ఎన్ని యుగాలకైనా ఆదర్శపాలకుడైండు ఆజ్ఞలన్నీ నీటి అలలుగా కాకుండ శిలలుగా మార్చిండు!

“ఎరుక బహుజన మహోద్మను దీర్ధకానవ్సం యే

బౌద్ధసంఘంతో బంధం పెనవేసుకొని పాలన పగ్గాలకు పురిపెట్టిండు! దెబ్బకు దేడ్‌తడి పోశమ్మ గుడి అంటే శత్రువు దాసోహమన్నారు. దేవానాం ప్రియదర్శినై

దమ్మ మహామాత్తలై

బహుజన ధర్మాన్ని ప్రచారం చేసిండు! కులవ్యవస్థ కాఠిన్యాన్ని

తన కత్తివేటుతో బలి తీసుకున్నాడు! బౌద్ధ ధమ్మాన్ని దేశ గుమ్మంగా మార్చిండు చక్రంపై ధమ్మాన్ని అమర్చిండు ఎర్రచుక్కలున్న రాయి

నలుపు చుక్కలున్న రాళ్లు

అశోకుని స్తంభాలపై వాలిన

నీ జీవితపు పావురాల ఆనవాళ్లు స్తంభాల తలలపై

ఆదిజాంబవుని ఆకృతిని చెక్కిండు సారనాథ్‌ సాంచి స్టూపాలపై నిన్నుసింహరూపం చేసిండు!

ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది

ద కింగ్‌ ఆఫ్‌ అశోక

ఇజ్‌ నత్తింగ్‌ బట్‌

ద కింగ్‌ ఆఫ్‌ బహుజన్‌!

మె క ే / | భ్‌ చో ఈ ౫: త్‌ చా. లో [1 న! వా, ల! జాూట బగ్గున మండుతుంది జెగ్గున మెరుస్తుంది! భావాలే బాటను నడిపిస్తున్నాయి తనకు కావాల్సిన శక్తిని బాటే సమకూర్చుకుంటుంది అంతర్తినంగా బాటను బౌద్ధ ఆధ్యాత్మికత నడిపిస్తూనే ఉంది! యుద్ధం... యుద్ధం...! సంతు రవిదాసు జ్ఞానయుద్ధం మనువాదానికి మానవతావాదానికి యుద్ధం ఘర్షణ నిరంతర ఘర్షణ వర్ణ విరుద్ధ విలువలపైన సంఘర్షణ. అతడు జ్ఞానపంజా కులతత్వంపై విసిరిన పులిపంజా వాదనలో మహాజన తత్వం

బోధనలో బుద్ధుడి సమతా తత్త్వం! దడి కట్టుకున్న కుట్రల కోటల దర్చారుల్ని వాదనలో ఓడించిండు పూజారితనం తన పాదాలకు నమస్నరించింది! రాళ్లకు పూజించిన చేతులే కాళ్లకు గండపెండేరాలు తొడిగినయ్‌ అతడు మానవ ధర్మమే మాదిగ ధర్మమని ఏకనాదం మోతై మోగిండు. అడుగు కులాల పాదాలకు అచ్చులు కోసి ఆత్మన్యూనతను పడగొట్టిండు! అంతరాలొదిలి నిరంతరం చైతన్య బహుజనశీలురు కమ్మన్నాడు. సీలో సచ్చుబడిన జ్ఞాననాడులకు నిప్పపెట్టిండు. రాజువు నీవేనని - నీ నరాలకు కరెంటద్దిందు. నీవే అన్నింటిలో గొప్పోడివని సచ్చుబడిన నీ శుక్రకణాలకు సిచ్చుబుడ్దులను చూయించిండు! అస్ట్రాలాయిద్స్‌ను నీ అరచేతుల్లో రాశులు పోసిందు! అశోకవనంలో పొడిచిన వేకువలను సే దోసిట్లో సుక్కల రాశులు పోసిండు! ౩టై గుడిపల్లి నిరంజన్‌

నీలో నిక్షిప్తియెన

నిస్సారపు ఆలోచనలను

ఉద్దీపించుటకై ఒండు కొట్టిండు!

నీ జాతి ధర్మనిరతిని

మెట్ల కిన్నెరపై పాడి ఎరుకజేసిండు.

తన జ్ఞానం నీ కోసమే

తన గానామృతం నీ కోసమే

పూజత్వంపై ఫిరంగులను పేల్చి

దేశమట్టి పొరల్లోకి మాదిగత్వాన్ని

వర్షమై ఇంకిపోయిండు!

గుడి కపట నాటక నిలయం

పేదవాడి గుడిసే జీవన తాత్విక

చిత్రమాలికల హారం!

అతనికి ఏ సరస్వతీదేవి

నాలుకపై అక్షరాలు రాయలేదు

మహాబోధనలన్నీ అతని చుట్టూ (ప్రదక్షిణం చేసినవి

అతడు మనిషిపై వాలిన

ధూళిని తుడిచేశాడు

మూలాల్లోకి వెళ్లి

హద్దుల్లేని ఆకాశంకై చూస్తుండు!

విజ్ఞానాన్ని శతాబ్దాలుగొ లేవనివ్వని

కుంకుమ రాశుల్లో ఉచ్చబోసిండు!

దడి కట్టుకున్న ఎవరో మనిషి

బానిసత్వానికి పునాదిరాయి నాటితే “ఎరుక బహుజన మహోదృమ దీర్జకాన్సం 75

జ్ఞానవేట కొడవలి తీస్మాని వెంటబడ్డడు! అతడు శత్రువుకు సవాల్‌ విసిరిండు సయోధ్యకాస్తేనే అయోధ్య...

జభ ల

ప్రియాతిప్రియమైన శత్రువా!

నీవెన్ని చెప్పు

నీ మధ్య నా మధ్య సామరస్యం కుదరదు నీ విలువలు

నా విలువలు మిళితమయ్యే సమస్యే లేదు నిన్ను హెచ్చరిస్తున్న ఓ నా శత్రువా! అప్రతిష్ట భావాలను ప్రతిస్టిస్తూనే ఉంటావా? నీకు నాకు మధ్యన భౌతిక యుద్ధమని పొరపడేవు ప్రియమైన శత్రువా!

కాదు కాదు భావయుద్ధం

బ్రాహ్మణవాదంపై బహుజన సింహనాదం! ఏమంటివి నీవు

గుణహీనుడవు అయినప్పటికీ పూజించాలా? కుట్రదారుడా!

మనిషికి మనిషికి మధ్య

సంబంధం కలపమంటే

లేని దేవుడికి - ఉన్న మనిషికి

మధ్య సంబంధం పాడుతున్నావు!

ప.

సంతు రవిదాసు

బుద్ధునికి నిజమైన వారసుడు

సత్యసమాజ నిర్మాణంలోకి

76 గుడిపల్లి నిరంజన్‌

రాజులను రప్పించి మెప్పించిండు

గంగానది ఒడ్డును

వేలాది చమార్ల నీతికి అడ్డగా జమాయించిండు!

అతనికి తెలుసు నీకు వది కావాలో

నీవు దేనిని అడుగుతావో

తాను అదే గుర్తించగలడు

అతనికి అడగడం రాదు

అజ్ఞాపించడమే వాచ్చు

నిన్ను నన్ను కాదు

విశ్వాన్ని అజ్ఞాపించగలడు

ఎంపిక చేసుకో

సంకోచించకు స్పష్టతతో ఎంచుకో

కోరికలు అస్పష్టమైతే

ఫలితాలు అంతే...!

ఆకాశమంత చెవులు పెట్టి కనండి

ఉంటే...

రాజ్యసింహాసనం మీద ఉండు

లేదంటే

బొందలగడ్డ మీదుండు.

కులవ్యవస్థను కూల్చాలన్నందుకు

కట్టారు రాజులు కక్ష

చంపారు తల నరికి!

స వ 2

ఓ నా మహాదిగల గురుదాసు

మా గుండెల నిండుదనపు సంతు రవిదాసూ!

చేయలేరు నీ బోధనలను ఎవరూ హత్య!

మీరు హరిద్వార్‌లో మా చమార్ల గురుద్వారం! 'ఎరుకొ బహుజన మవోద్యమ దీర్హకావం 7.

సర్‌

త్‌ వొస్తున్నాడొస్తున్నాడు సంత్‌ కబీర్‌ వొస్తున్నాడు మట్టిబాటల పొంటి కాశగడ్డల పొంటి గండదీపం ఎత్తుకొని సామూహిక గానమై బయలుదేరిండు! గోసిలేనివాణ్డి గూర్చి కాశీలో గానం చేసిన 'దోహాలి గండికోట “లహర్‌లారా' మట్టి పాత్తిళ్లలో దొరికిన “నీరూ'లాంటి స్వచ్చమైన వానసినుకుల నీటిబొట్టు! వొస్తు వొస్తూనే బుద్ధుడి పాదాలకు నమస్మరించిండు సంత రవిదాసు తత్త్వాన్ని తాగిండు అశోకరాజ్యం రహస్యాలను పలుగురాళ్లల్లో ఏరి ఏరి ఆణిముత్యాలను పట్టుకుండు!

నందరాజుల బొందలపై సంచరిస్తున్న

బహుజన విజయాలను సప్పరించిండు!

దర్శనం సామాజిక బహుజన దర్శనం

బాటలో మాటలో

సత్సంగ దర్శనం

పహృదయగదిలో ఊరుతున్న

మురికి గంగను ఆపుతుండు!

మనిషే మైలైనప్పుడు

వేరే మైలెక్కడిదని ప్రశ్చార్ధకమైండు!

మనిషిని అవమానించుడే 'మహామైలని'

నిజతత్త్వం ఎరుకలేని ఆధ్యాత్మిక తత్వంపై

గుత్చ తీసుకొని ఎంటబడ్డాడు!

నిజానికి ప్రతిదీ మైలే

తల్లి మైల తండ్రి మైల

బొద్దు మైల బిడ్డ మైల

వచ్చినవారు మైల

పోయినవారు మైల

దారులన్నీ మైల

జన్మదారులన్నీ మైల

మాయ మైల మనిషి మైల

ఇంతకు లేనిదెక్కడ మైల?

ఇది రాకెటు ప్రశ్న!

బబు షః

మంత్రాలు వల్లించే మనిషి

సంధ్య తర్పణాది షట్మర్మలు సాగించే మనిషి “ఎరుక బహుజన మవోద్యమ టీర్టకాన్సం 29

వేదాలు వల్లించే మనిషి మైల పేరుతో దారులు తప్పుతూనే ఉన్నాడు! మనిషిని తాకితే స్నానం చేస్తూనే ఉన్నాడు! నాలుగు యుగాల సంది గాయత్రి మంత్రం పొడ లందనీడకు సోకనే లేదు. విత్తనం మరణించినప్పుడే పచ్చదనం రూపు ఆగిపోతుంది జీవం జాడలేకపోతుంది ఆధ్యాత్మిక ఫాసిజంపై ప్రశ్చల దోహాలై పొడిచిన లందపొద్దతడు! అతడు తాత్త్విక పులి మతాల సాటున దాగిన మాయలను చీల్చి పారేసిన శాంతి పులి! ఎక్కడ గాట్లు కనపడవు సీరిన గీతలగుపడవు పూజత్వం చేసిన వెలితిని అక్షరాలుగా దోహాల్లో పొదిగిండు! మెత్త మెత్తటి గాలి చరిత్ర జ్ఞాపకాలను మోసుకొస్తుంటే ముక్కురంధ్రాలు పట్టుకున్నాయి! అనేక దీర్ధ రాత్రులను మేలుకొలిపిన బుద్దుడి మనోకాంతి కబీర్‌ నాసటిపై వాలింది గప్పుడేగా తనను తాను జ్ఞానఖద్గంగా మలుచుకున్నాడు! 80. గుడిపల్లి నిరంజన్‌

సూర్యుడివైపు చూశాడు

భగ్గున బహుజన చరితై మండుతుండు! చంద్రునివైపు చూశాడు

మరకను హెచ్చరించాడు!

బాటలో అందరు మాట్లాడింది విన్నాడు బహుజన చరిత్రను చెరిపిన

కెరటాన్ని గువ్వకు బెత్తెడు సూసి కొట్టిండు! అతడు బాట పేగులను మెడలేసుకొని పుట్టిండు ఎన్ని పాగమంచులు కమ్మేసిన

ఆరని దీపమై వెలుగుతూనే ఉన్నాడు! ఆకాశానికి పూసిన ఇంద్రధనుస్సులో

అతడి రంగులు కొత్తకాంతిని ప్రసరిస్తున్నాయి! చరిత్ర మూలుగుల కిందున్న

భయంకర సత్యాల పొరలు విప్పి

దళితుడికి పట్టిస్తున్నాడు!

అతని తాపత్రయమంతా

చెదిరిన చిరునవ్వుల్ని అతికించడమే!

అతడు వేసిన తాత్విక జ్ఞానబాటే

ఎప్పటికైన మనల్ని తల ఎత్తి నిలుపగలదు! కబీరుతో మాట్లాడుతుంటే

పాతమిత్రుడితో మాట్లాడిన అనుభూతి!

నిన్ను నిన్నుగా

నన్ను నన్నుగా

మనల్ని మనంగా

పునాదిబాటకు

కొత్తమిత్రుడి మల్లే పరిచయం చేస్తూనే ఉన్నాడు!

. వ | | | తా శా. ' ం య. (మ! మ, | వల ర కా (స. స వక టన్ని శతాబ్దాలు ఈ దేశం టబ వ్యధశిలపై శవాసనమేసిందో సగటు మనిషికి కలల పుట్టయిండు అది అందమైన కల అందరికై పొడసూపిన కల మత నమ్మకపు మూర్ధపు పునాదులను ధ్వంసం చేయాలనే కల! ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సోషల్‌ రెవల్యూషనరీ తాతయ్య! మా మంచి తాతయ్య ఎంత మంచి పని చేశావయ్యా ఎంత గొప్ప బాటను ఎంచుకున్నానయ్యా! సమతా ధర్మపు బాటల్లో ఎన్ని 'ఫూలు” చల్లినావయ్యా మీ ఇల్లు ఫుల్లుగా 'ఫూలితో నిండింది కులమైకపు పొరల్లోంచి మూలుగుతున్న గ్రి2. గుడిపల్లి నిరంజన్‌

వట్టిపోయిన ఈ దేశ చరిత్రను మనిషి చుట్టూ తిప్పాలనుకున్నావు కపాలాలను ముద్దాడుతూ పురైలను పూజిస్తూన్న ద్విజుల బాటల్లో ప్రశ్నలు చల్లావు! కాదు... కాదు... ప్రశ్నలు నాటావు సమ్మెట దెబ్బలు వేశావు వారెంత ముంచ జూస్తే సముద్రంలో పారబోసిన పెట్రోలోలే తేలినావు వాళ్లొద్దన్నా... ఈ దేశ అక్షరాలను వాడల్లోకి మొలక జల్లావు పాఠశాలల్ని కట్టించి ఎన్నో ఇండ్లల్లో గింతంత దీపం పెట్టావు అక్షర నక్షత్రం మీద అంటరానితనాన్ని సిచ్చుబుడ్డిని చేసి కొత్త గాలులను ఆహ్వానించావు కొత్త రంగులను మనిషికి పూసినావు వఏందడ్లనాటి గాయాలను మాన్సించినావు రాసపుండు గడ్డలను ఫూల(లే) రేకులతో కోసినావు ఇటు గాలి వీస్తే ఇటు... అటు గాలి వీస్తే అటు...

“ఎరుక బహుజన మహోధ్యమ టీర్ధకావ్చం 83.

కొట్టుకుపోయే గాలిపటం కాదు కొత్త చూపునిచ్చిన దార్భనికుడతడు అందరు చూసిన వస్తువునే అందరిలా కాక చిన్నచూపును చూసినోళ్లకు భిన్న చూపు నిచ్చిన భారత సామాజిక విష్లవమూర్తి అతను! దేశ మాస్కెల నూస్మెల బట్ట పేలికలు కుట్టిన చరిత్రపై తొలితరం కులరహిత సంతకమతడు! భౌగోళిక సరిహద్దులకే కాదు మనుషులకు... భావాలకు హేతుబద్ధతను అద్ధిండు! ఏ అసమానతలు లేని సరికొత్త భారతదేశాన్ని చెక్కిందు! దూరంగా విసిరివేయబడ్డ మనిషిని విద్యావంతుడిగా... జ్ఞానవంతుడిగా... మేధావిగా... తీర్చిదిద్ది మనిషికి అంటిన కులం మరకలపై యుద్ధమే చేసిండతడు బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమం నెలబాలుడై సవాళ్లను ముద్దిడిండు! నీచ సంస్కృతిని చెడుగుడాడి సమతా బీజాలు నాటిండతడు! హెచ్చుతగ్గుల పునాదీ పూజారి బుర్రల్లోకి శాస్త్రీయతా కాలువను మలిపిండు! ర. గుడిపల్లి నిరంజన్‌

'హేతువును కొలిచిండు సామాజిక పరివర్తనకై సాగిండు! బహుజన ఆకాంక్షల్ని పాఠశాలల్లో పలికించిండు! “వాళ్లను” దోషులుగా నిలబెట్టిండు “వాళ్లను” సిగ్గుపడేలా చేసిండు ఇప్పుడు యుద్ధం “పాఠశాల” మైదానమని ఆధునిక ఆంగ్రవిద్యను ఆరంభించి మేకాలేను బహుజన "లార్డ్‌ చేసిండు ఆర్వజాతిపై ఆరె రంపె ఆధిపత్యమై జమిడీకే దరువైంది! ద్విజుల మంత్రాలపై ఎద్దుకొమ్ములోని మిగ్గును పిచికారి చేసిండతడు! వర్ణాశ్రమ ధర్మసూత్రాలపై సమస్త వృత్తుల సమ్మెట పాటై మోగిందడతడు! వేదవాబ్బయాలపై వాలిన భౌతికవాద పెనుతుఫానతను! (గ్రామ పునాదుల్నీ... కుటుంబ పునాదుల్నీ సమాజ పునాదుల్నీ బౌద్ధవాద దృక్పధంతో “విల్లంబు దెబ్బ మోగించిండు! వ్యక్తి సాఫల్యం అతని ఆశ సామాజిక పరివర్తన అతని కాంక్ష శిష్టాధిపత్యాన్ని ధ్వంసం చేసి “ఎరుక బహుజన మహోద్భమ టీర్ధకాన్యం _రిక్‌

గర్భగుడుల్లో ఎద్దు తుంకలారేసిండు! బహుజన సాంస్కతిపై

ధ్వంసావాదాన్ని ఆపి

“ఆలోచనను” రాజ్యం చుట్టు తిప్పె తూనీరైండతడు!

సత్యశోధక సమాజమై

కొత్త జ్ఞానాన్ని సేదుకోవడానికి

మోట గిలకబాయిగా మారిండు!

సత్యం ప్రచారం చేయలేనిదని

సత్యం కనుగొనలేనిదని

సత్యం స్వంత అనుభవమని తేల్చిండు! కొత్త సమతావాదాన్ని మనకొరకై మోసుకొచ్చి మొద్దువారిన మెదళ్ల తలుపులు తెరిచిండు! క్షత్రియులే వీరులని

మాదిగలే అసలు సిసలైన క్షత్రియులని క్షతియులే బహుజన ధథీరులని మూలవాసులందరూ

ఈ దేశ రాజులని

డప్పు భుజానేసుకాని

సీలుగుర్రం దరువేసిండు!

వొంటి మీద ఓ అంగిలేని కంసలయనా భూమిల యిత్తులు జల్లే కాపాయన గొరైెమందకు కంటిరెప్పల

దాపైన గొల్లాయనా

మేకల ఆకలిదూపలు తీర్చే ముష్టాయనా అడవి జీవరాసుల నేలే బోయాయనా సవుడును కనిపెట్టిన సాకలాయనా

ఎంటిక పదును ఎరిగిన మంగలాయనా ఏకలవ్యుని రగుతం వొంటికి పూసుకున్న ఎరుకలెల్లనా లంబాద జాతికే తిరుగుబాటు నేర్చిన సంతుసేవాలాల్‌ వారసుడా కాలికి చెప్పులేనోడా మెడలో కడెమున్నోడా పయ్యికి జాకెట్‌ లేని తల్లి నీవు రాణివవ్మా! నీవు రాజువయ్యా! అతని తలపై ఉన్నది తలపాగా కాదు ఈ దేశపు రాజకిరీటం శూద్రాతిశళూద్ర సింహాసనం ఒకనాడు గుంజుకున్న రాజసం అది కనలేకే మనమేసినం శవాసనం “గులాంగిరై సలాంగిరి చేసుకొనేటోన్ని ఆధిపత్యాన్ని తాగి పారేసిన సిగరెట్టులా నల్చిండు అతడు ఆచరణావాది అణా చారణాకు అమ్ముదువోలే! పునాది సంబంధాలు దొండతీగల్లా అల్లుకొన్నాడు మహిళా స్వేచ్చను ఎగరేసి సనాతన కుటుంబాన్ని ధ్వంసం చేసి కట్టు బానిసత్వాన్ని ఇడుపులకు కట్టేసిన ఆర్యేతరుడతడు! “ఎరుక బహుజన భమహోద్యమ టిర్హకాన్యం 87.

ఎంత సుతారంగా యిప్పిండు గుట్లు రెందంచుల ఖడ్గమైన వైదిక వేద ఆర్యసిద్ధాంతాన్ని ఆరె రంపెతో సరం కోయాలన్నాడు అవతారాల గుట్లు తొమ్మిది అవతారాల గుట్లు ఒక్కో అవతారం బహుజన జాతిపై ఒక్కోమెరుపుదాడి తొమ్మిది తిరుల్లా తిరొక్క దాడి అవతారమంటే 'దాడినే మత్స్య అవతారమెత్తి సముద్రయానమై దారితెన్నులను కోసేసిండు! కూర్మ అవతారమై బహుజన జాతి కుత్తుకలపై కత్తులేలాడదీసిండు! నరసింహ అవతారమై నాగరికులను అనాగరికులను చేసిండు! గివి ప్రతీకలు గవి గుట్లు గవే జాతిపై దాడి చేసి దింపిన తూట్లు! ఏదో కసి ఏదో గురి లక్ష్యంవైపు బలమైన పరుగు అతని రక్తంలో యుద్ధం ప్రవహిస్తుంది జాతి రక్తమే యుద్ధం! రాజ్యం అనివార్యం 62 గుడిపల్లి నిరంజన్‌

అడుగు వర్షాల మార్గమే అవుదార్యం ఇన్నాళ్లు కాలానికే వొదిలిన జీవితం ఇప్పుడు మూలవాసియే మావటివాదై కాలాన్ని నడిపించాలి! ఇప్పుడు కొత్త రాజ్యం సుదూర స్వప్నం కానేకాదు విప్లవ లక్ష్యాన్ని బహుజన జనావళి అలక్ష్యం చేయకూడదు. ఆధిపత్యాన్ని స్టిరపరచిన సాంస్కృతిక ఆనకట్టలను బాంబు బ్లాస్టులై లేపాలి అతడు హేతువాది 'జ్యోతిభాకై జోల పట్టాలి ఖండోబాకై కదలాలి మర్తాండ్‌ మనస్సుకు హత్తుకోవాలి ద్విజ సంస్కృతి అందరిదంటే ఒప్పుకోను. కష్టాలు దుఃఖములు పోవాలి బలిరాజ్యం రావాలి. విద్య అందరి సొత్తంటే పెడబొబ్బలు మంత్రాలిన్పించినై పాఠశాలలకై పునాది వేస్తే సంప్రదాయం గద్దున వొణికింది! మహిళలకై బడి తెరిస్తే బరిసెలెత్తింది బ్రహ్మనిజం విషప్రచారం! విషప్రచారం! మీరు బడి జెప్పితే...

'ఎరుకొ బహుజన మహాద్యమ టీర్చకొన్కం 89.

మీ బట్టలపై పెండేస్తాం

మేం చెప్పింది వినకపోతే

వెళ్లేటప్పుడు రాళ్లేస్తాం

ఇంకా వినకపోతే యిటకలేస్తాం

అయినా భయపడిందా బాట?

తలవొంచిందా సామాజిక విప్లవ బాట?

పీడనం ఎక్కువైతే

పుట్టసెండోలే లేసిండు

నిధులు లేకున్నా విధుల్లో వెనకడుగు వేయలేదు

హంటర్‌ దగ్గరికోయిండు

ఆడపిల్లలకై బడి కోరిండు

అగ్రకులాలొద్దన్నా బలిరాజ్యంకై

శాఖోపశాఖలై ఇగురువెట్టిండు

అంతర్గత విప్లవానికి అతను

ముడిసరుకుగా నిలిచిండు

ఉత్పత్తి దోపిడీ కన్నా

సామాజిక దోపిడీ ఘోరం

పురాణాల పొట్టలు విప్పి

కట్టుకథలపై పూసిన చేదుపూతను

లందనీళ్లతో కడిగిండు!

ఖలు ల

ఈడా పీడా జావో

బలికా రాజ్య్‌ అవో

సర్వ్‌ ఏకందర్‌ ప్రీ పురుష్‌

తారాబాయి షిండేకు తట్ట కుదురై

పండిత రమాబాయికి దోసిట్ల సెల్మెయిండు! 0. గుడిపల్లి నిరంజన్‌

అతడు అత్యాధునికుడు వర్ణవ్యవస్థ గుట్టు విప్పిన సత్యశోధకుడు! జ్ఞానం నిర్మించమని విద్యను పెంపొందించమని సైన్స్‌ను ఆచరించమని ప్రతి ఇంట్లో సూర్యుడై పొడిసిండు ప్రతి కంట్ల వెలుగై పూసిండు ధామస్‌ పెయిన్‌ చిటికెనవేలు పట్టుకుండు మానవహక్షులకై మండిండు! ఫూలే 'మాలె' కులమని ఇసుక్కున్న జంద్యాన్ని సూసి అంబటె సరులా సలసల ఉదికిండు! నీళ్లు నిండిన కండ్లల్లో కనుగుడ్లలో నిప్పు కొర్మాసు జేసిండు వేదన నిండిన హృదయంతో బయటకు నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతమై అమానుషత్వాన్ని బూడిద కుప్పల్ని జేసిండు! మహిళల అభ్యున్నతికై ఒక మనిషి అద్దా జమాయించిండు! యుగాలనాటి అన్యాయాన్ని గండ్రగొడ్డలితో నరికి లందజ్ఞానాన్ని బొందవెట్టిన లత్మోరోళ్లను రోకళ్లతో దంచి సమన్యాయాన్ని సమానకుప్పలేసిండు ఇడిస్తే ఇడుపుకు తొడిగితే కాలుకుండాలన్న

'ఎరుకొ బహుజన మవోద్దమ థిర్హకొవం _తే

మహిళా కులసూత్రాన్ని జిమాప్టిక్‌ సర్మసై ఎగిరి తన్ని భార్యను సదువుల తల్లిని జేసిందు మనకు తల్లిలేని కొరతను తీర్చిండు సత్యార్ధ ప్రకాశిక కంటే సత్యశోధకం భేష్‌ 'ఆర్యసమాజొ కంటే బహుజన సమాజ్‌ ఖుష్‌ బ్రహ్మసమాజ పునాదిరాళ్లూ వర్ణభేదాలు మధ్యలో చేర్చిండ్రు “అంటు...” కలలు కంటున్నావ్‌ ఎప్పుడు చేర్చిండ్రనేది కాదు ముచ్చట తరాలనుండి నన్ను రాసపుండై సల్పిందా? లేదా? రాజారామ్మాహన్‌రాయ దయానంద సరస్వతీ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు ఎందుకు నాయన సంఘసంస్కరణ ముసుగుల మాస్క్‌లు ధరించిండ్రు మా ఫూలేనే అసలు సిసలు సంఘసంస్కర్త బడి హర్‌ మంగ్‌ బాలికల బడి సావిత్రీబాయ్‌ సదువుల ఒడి ఆది సదువుల పాది ఆ తల్లి! అ(గ్రకులం కుటిలమై కరువై కురిస్తే అన్నసత్రమై అన్నం గిన్నె ఆదుకున్నడు విక్టోరియా అనాధ శరణాలయం వేల జీవితాలను నిలబెట్టిన రక్షణాలయం “దీనబంధు అడుగు కులాల జనబంధు 92 గుడిపల్లి నిరంజన్‌

“'సత్యసారాంశ'మై వెలిగిండు “తు చెర్చకోలై? రాజ్యాధికారంవైపు ఎడ్లబండిని అల్లిస్తుండు గా బండ్ల బాటను వాదలకు గా జ్ఞానమార్గం విడువకు ఆయన మాటలు మనకు నిత్యం వినిపిస్తునే ఉండాలి కానరాని చరిత్రను కండ్ల ముందర పరిచి రాజ్యబాటలు వేసిన మెకడమ్‌డతడు బహుజన పోరాటాలకు వెనకడుగువేయని ధీరుడతడు బహుజన రాజకీయబాట నిర్వహణ నిధి అతడు అతడు నడిచిన బాటలో ముక్కోటి దేవతల ఆకార విశ్వాసాల్లేవు ఆయుధాల హంగులు లేవు గోపురాల గౌడవళ్లేవ్‌ చాదస్తమైన ఆచారాల్లేవ్‌ గుడిలో కులగోడలు కూలదోస్తుంది ఫూలే అంటే హక్కులు మొలిపిచ్చిన బుద్ధుడు. ఇప్పటికైన ఎప్పటికైన ఇంకెప్పటికైనా ఫూలేనే మన మవాత్ముడు!

“ఎరుక బహుజన మహోద్మమ దీర్ధకాన్నం 93

ళ్‌ అడుగు కులాల వాకిట్లో అక్షరవనాల సాంపై కురిసింది! అక్షరం అడ్డదిడ్డ నామాల్లో అల్లల్లాడిపోతుంటే బడుగుల మెదళ్లపై సాకవోసింది అవిరేను కుండల్లో అక్షరాలను నిలిపి పోలు పందిట్లో ముగ్గేసింది ఇంటింటికి తలదోర్నం గట్టి అక్షరజ్ఞానాన్ని మావిడాకులై గుచ్చింది వెలుగును సీకటి వెంటాడినట్లు ఆమెకెప్పుడు పెండనీళ్ల ఎదురుసూపులే చైతన్య రవళిని ఆందెం నూనెలో జ్యోతిలా వెలిగిచ్చింది అక్షరాన్ని పుదిచ్చి అ(గ్రకులాన్ని అదిట్బి ఎండుతుంకలు దండెంపై అక్షర కైతుంకలను ఆరేసింది. వాడల్లోని మౌనఘోషల్ని తన గుండె ఘోషలుగా స్వీకరించింది అక్కడ పేరుకపోయిన దుఃఖాన్ని తన దోసిట్లతో ఎత్తింది అక్షరాలను జీవితాలకు ఆసరాగా మోహరిస్తూ కవాతుకై సాగింది బహుజన బందూకు చేతబట్టి జ్యోతిబా ఫూలే విడిసిన బాణమైంది! అదిగో ఆమె పురిటినొప్పుల్లోని వాడల్లో అక్షరాలు భళ్ళున పొద్దెక్కినవి న్‌్‌ గుడిపల్లి నిరంజన్‌

అనే క్‌.

తి ఆ తల్లి అంటరాని జాతుల కల్పతల్లి పేదల ఈతిబాధలను పెరికెయ్యదానికి భీమాబాయి రామ్‌జీలు సముద్రం, ఆకాశం వొక్కటె బహుజన బాటను ఇగుర్లు తొడ్డించారు! ఆ తల్లి... దేశ వ్యాప్తియైన కురుస ఆలోచనల్ని మసిబొగ్గు అంటించిన జీవితాల్ని స్వేచ్చకు ముకుకాళ్లేసిన శాస్త్రాన్ని తెలివికి లెంకపీటలు కట్టిన నీతిని సూసి సూసి మనిషి మండిపోయింది! వెన్నముద్దలు వేలాడే ముత్యాల చెట్టు సామాజికోద్యమాల “మాణిక్యాన్ని కడుపులో పొదుగుకొని సింహాన్ని కని ఆదుకొన్నదీ దేశాన్ని మహాతల్లి!

“ఎరుక' బహుజన మహోద్మమ దీర్ధకాన్కం 095

సింహం జుంపాలు పెంచుతూ ఎలిఫిన్‌స్టన్‌ హైస్కూల్‌లో సదువు సదివిండు బరోడా మహారాజు మేధోపరమైన ఏజెంట్‌ పీడితకులాల ప్రోత్సాహక ఛాంపియన్‌ వాంగ్మూలం ముప్ఫై మూడు కోట్ల 'దైవత్వపు గుండాలి వర్ణసంకరతత్వాన్ని బయలుపర్చె వాంగ్మూలం సౌత్‌ ఐడో కమిటీకి వాంగ్మూలం నోరు లేని ప్రజల పత్రికై అక్షరాన్ని. చైతన్య ప్రగతి ఫలానికై 'మూక్‌ నాయకైై ముంగిలైండు! బహిష్టుత హితకారిణి సఖై వర్ణచరిత్ర గుండెలపై పాదాలు మోపి బహిష్మరణకు కారణాలు బహిరంగపరచమన్నాడు! మహద్‌ చెరువులో చిటికెనవేలద్ది ప్రకృతి 'పంచముని సొత్తన్నాడు తరాలనుండి కాలనాగులై కాటేస్తున్న కాలరాం దేవాలయంలో కాలిడి గర్భగుడిలో ఎద్దుకొమ్ములోని మిగ్గును ముద్దాడిండు! సమత్వ భవన నిర్మాణంకై సమతా సైనికదళం నాయకుడు! మహద్‌లో మనుస్మృతి దహనమై దమ్ముంటే రమ్మని దందోరేసిండు! ఆల్‌ ఇండియా డి(థైస్‌డ్‌ క్లాసెస్‌ నాయకుడై న్‌్‌ గుడిపల్లి నిరంజన్‌

రౌండ్‌ టేబుల్‌లో రొడ్డకొట్టుడు కొట్టినోళ్ల నోళ్లు మూయించిండు! మనువు రాసిన “రాజ్యాంగం” భంగం జేసి బౌద్ధధమ్మ రాజ్యాంగం గుండెలపై నిలబెట్టిండు “కులనిర్మూలని మన కాలపు 'మహాబైబిలు"! కత్తులు పొట్టలో పొడువగలవు గొడ్డళ్లు గొంతులు నరకగలవు తుపాకులు మనిషిని ఛిద్రం చేయగలవు బాంబులు గుండెలను బెంబేలెత్తించగలవు ప్రభుత్వాలను నీ గనుమల్లో కూకుండబెట్టింది ఓటు మాత్రమే! ఓటు మాత్రమే! విజ్ఞానం ఇచ్చాను ఓటు నీకాయుధంగా ఇచ్చాను నిన్ను నీవు నిర్మించుకోవాలి నిన్ను నీవు పేర్చుకోవాలి నీవు నీవుగా ఉండొద్దు నీకు నీవుగా ప్రభుత్వమవ్వాలి! నా సమస్తం నా జాతీయులే నా శక్తినంతా నా జాతికై నా యుక్తినంత జాతికై నిద్రిస్తున్న మెదళ్ల మెలకువకై మట్టికి వాంటికి బహుజన కాంతిని పూసి మహద్‌ చెరువు పోరాటంతో మొగిలిపూవు మొలక 'ఎరుకి బహుజన మహోద్భమ దీర్ధకావ్సం 97

కుల ఉగ్రవాదుల ఉచ్చుల మధ్య... రాళ్ల సందుల్ల మొల్సిన రావిమొలక! తరాలనుండి వెతలే సొత్తుగా, సంపత్తిగా జీవిస్తున్న సహజమనిషి ఊపిరితడు! దేవాలయాలపై...

వేదవాక్యాలపై...

వర్ణ పురాణాలపై...

చాతుర్వర్ణ కులవ్యవస్థపై

ప్రతి ఉదయం ఒక ఉద్యమమై ఉరిమిండు! తను రాజ్యాంగం రాయబట్టి కొత్తకాంతిని...

కొంత బౌద్ధకాంతిని దేశం వంటికి పూసిండు తలకిందులైన దేశాన్ని

నిట్టాడి పెట్టి నిలిపిండు!

మనిషి స్వేచ్చకు మేకులు గొట్టినవాణ్ణి కలంతో సంపిండు.

నా జాతి మాంసపు ముద్దలారా! సంఘం పెట్టుండ్రీ...

జ్ఞానంతో సంఘటితం కాండ్రీ!

అవునూ ఆఫ్‌ నిక్కర్‌ తాతా...

ఉంటే నిజాయితీ మిత్రుడుగా ఉండు కాదంటే నిజాయితీ శత్రువుగా ఉండు నిమ్న జాతీయులంతా హరిజనులయితే సవర్జులంతా దెయ్యాలబిడ్డలా?

ఖద్దరు తెలుపే కావొచ్చు

చేతలు నలుప... చేష్టలు నలుపు!

నేనడుగుతున్నది 'తేనె మాటలు” కావు

నేనడుగుతున్నది విషం లేని చేష్టలు!

తప్పు... తప్పు... తప్పు

ఒకే వర్దానికే సదువు తప్పు

ఒకే వర్దానికి ఆయుధం తప్పు

ఒకే వర్దానికి వ్యాపారం తప్పు

మంచి మంచివేమో మీ అవ్వసిగల

బాలేని బాలేనివి బరై కొమ్ములకా?

నేను దేశభక్తుడినే

కులనిర్మూలనే నిజమైన దేశభక్తి

నేను బహుజనుల సహజ నాయకుణ్ణి

లేదు లేదు నాకు మాతృభూమి

లేదు లేదు నాకు మాతృమతం

వ కు షు

అబ్బా...!

ఎంత తేనె పూసిన కత్తులు

గొంతులు తెగేంత వరకూ తీపినే

మీ మతం మా మతం ఒక్కటే నంటివి

మీ సంస్కృతి మా సంస్కృతి ఒక్కటేనంటివి

మీ జాతి మా జాతి ఒక్కటేనంటివి

మరి మీకున్న సంపద మాకేదీ?

మీకున్న హక్కులు మాకేవి?

అంబేడ్మర్‌ అంటే

నిక్కంగా... వా “ఎరుక బహుజన మహోద్భమ దీర్హకావ్సం 699

నివొద్దెగా... సామాజిక బౌద్దుడు ణ్‌ ళు పా ఒరే కడగొట్టు మనుషులు శరీర ధర్మాన్ని వొదలండి మెదర్లకు కొంచెకంత జ్ఞానం పూత పూయండి ఓయ్‌ అడుగు కులాల శరీరాల్లారా! మీ మీ హృదయాలకు విజ్ఞాన గంధం పూయండి మధ్య యుగాల్లోని జంధ్యాలు మీ మీ మనస్సుల్లో బానిస విత్తనాలు నాటిండ్రు నిజానికి మీరు ఈ దేశ రాజ్యసింహాసనపు దగదగ మెరిసే కిరిటపు వారసులు నీవెప్పుడు నిన్ను నీవు తలొంచుకొని పోయే మేకల గుంపుల వారసడవనుకుంటున్నావు కాదు కాదు సింహాల్లా జీవించినవాడివి! దేశ చరిత్రను డోకా బాజితనంతో సిరాను కుంకుమకాయల్లో అద్ది గుద్ది తిలకం దిద్దిన న్‌ గుడిపల్లి నిరంజన్‌

తీరుల్లా రాసిండ్రు మహారాజులను మాదిగలను జేసిండ్రు నేనేదో అంటరానితనాన్ని రూపుమాపదానికే వాచ్చాననుకుంటున్నారు కాదు కాదు మీలో మంటలరాపిడి రేకెత్తించి ఠంచనుగా రాజ్యసింహాసనాన్ని నీతోనే ముద్దాడిద్దామనుకున్నాను! భారతదేశానికి స్వాతంత్ర్యం రావడమంటే “తెల్లరక్తకణాలు ఈ మట్టి నుండి వేరు కావడమే కాదు అస్పృశ్యుడు సింవాసనంపై రాజసమై మీసం మెలేసి తిప్పడమే నీవేమో మనమంతా హిందువులం గంగా సింధూ బిందువుల్లో తుంపరైతున్నవ్‌! నిజానికి నీలో నాలో మనలో జాంబవుడి డిఎన్‌ఎ పారాడుతుంది! సింహాసనమెక్షితేనే సింహాల్లా జీవించగలం అర'చేతులు నాకినవాడు నాయకుడు కొదు అడుక్కునే ఉద్యమాలు చేసేవాడు అసలే నాయకుడు కాదు “గొడ్డు చాకిరి పోరాటాలు నాయకత్వం కాదు నాయకత్వమంటే మనల్ని మనం నిర్మించుకోవడమే!

'ఎరుకి బహుజన మపోద్యను దీర్ధకావ్సం 101.

ఎన్నాళ్లని ఆకారాలు మార్చే

“అమీబాను (ప్రేమిస్తావు

చెప్పు ఆకారం పారామేషియం

పేరే డప్పేసి చెప్ప ఉంటావు? నాలుగువేల ఏండ్ల కిందనే

సమతా చట్టాలు చేసినోడివి

గిప్పుడేమో సాగిలపడుతున్నావు సనంఘరిలో నిజాయితీకి తెలివున్నది “ధమ్మంిలో నీ జాతి రాజ్యధర్మమున్నది 'బుద్ధం'లో బహుజన బుద్ధిజీవలున్నారు! సిప్పలో నాలుగు మెతుకులేస్తే సిందాటాడుకున్నవ్‌

ఇగురం లేకుంట వాడి గల్మకాడ

రెక్కల పురుగువై ఎగురుకున్నవ్‌

పైపై దుంప గడ్డిని కాదు పీకాల్సింది

భూ పైపొరల్లో దాగిన తుంగముష్టి గడ్డలు! ఇప్పుడు 'స్వరాజ్యోద్యమం కావాలి

దళిత స్వరాజ్యోద్యమం కావాలి

బహుజన స్వరాజ్య నిర్మాణోద్యమం కావాలి తెరిస్తే రాజ్యాధికారం తలుపులే తెరువు అరిస్తే రాజ్యాధికారం కోసమే అరువు ఎగిరితే రాజ్యాధికారం కోసమే ఎగురు పాడితే రాజ్యాధికారం కోసమే పాడు బూట్లు చెయ్యడం మానేసి

ఓట్లు వేయడం నేర్చుకో

చెప్పుల్లేసిన చేతులతోనే

“హస్తవాసి చేతిరేఖలు సెరిపెయ్యాలి 'పూలరేకుల్ని విరిసెయ్యాలి ఎక్కుతవా ఏనుగునెక్కు! లేదనుకుంటె బొందలగడ్డనెక్కు ప్రతిసారీ రాజకీయయుద్ధంలో పరాన్నజీవిగా మారుతావెందుకు? సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కనపడాలంటే భూతద్దమే కావాలి దళితుల సమస్యలు తీరాలంటే రాజ్యాధికారమే కావాలి! జాతి నీవెంటున్నది అనుకుంటున్నావు ఓట్లను నోట్లకు అమ్ముకుంటే ఇక బూట్లను నాకినట్లే! ఇంటివాడు రెండు మెతుకులు ఎక్కువ తింటేనే సహించనివాడివి బయటివాడు రాసులు రాసులు మేసిపోతున్నాడు మరి! మంచిని ఎక్కడినుందైనా స్వీకరించు వాడన్నాడు కులవ్యవస్థ శ్రమ విభజనని నేనంటాను శ్రామికుల విభజనని! బోసినవ్వులవాడు వాంటిపై అంగిలేనివాడు

“ఎరుక బహుజన మహోద్యను టిర్హకొన్నం శం

నన్ను 'మెచ్చు'కుంటూనే అవుతలోడిని నాపైకి ఎగేసి “గిచ్చుతుంటాడు! శూద్ర కులాలను నిస్సహాయులుగా మార్చి నాకు అడ్డు తగులుతాడు 'పై మూడు వర్ధాలే అధికారానికి పట్టాదారులని పగలబడి పగలబడి నవ్వుతాడు. దేశవర్దబుర్రలకు ప్రజాస్వామిక విలువలను ఎక్కించిండు సమన్యాయ సూత్రాల సారాన్ని వర్ణభూమికి అర్నంగా ఇచ్చిండు! గీ దేశంలో చిత్తశుద్ధి సిల్లులు వడ్డ కండ సోదరభావమే లేని వేదభూమిలో సౌభ్రాతృత్వాన్ని సెలైన్లా ఎక్కించిండు! భూమి తిరిగినట్టే చరిత్ర పునరావృత్తమౌతుంది గిరగిర తిరిగిన కుమ్మరి సెక్రం అశోకసెక్రమయ్యింది సెరిత్ర కూడా సెక్రమేనోయ్‌! కులం రాజ్యాధికారానికి అద్దు కాదు తేనె తెట్టె పుట్టకు వందల గదులు ఏ గదినుండి వెళ్లినా

కర్ర గుడిపల్లి నిరంజన్‌

మకరందమనే 'రాజ్యం'” దొరుకుతుంది వేల గదులున్నాయని తీపి పుట్ట లేదా? వేల కులాలు ఏకమైతే రాజ్యం రాదా? అవును నేను శోధించింది నిజమే లండన్‌ ఆఫ్‌ లైబ్రరీలో పరిశోధించింది నిజమే ఆది జాంబవుడు అందరి బంధువు నేటి కాలంలో నిద్రిస్తున్న జాంబవులను తట్టి పట్టి లేపుతున్నాడు నేను శ్యానోద్దుల నుండి జాంబవంతుడి రక్తాన్ని సీసాల్లో భద్రంగా దాసుకున్నాను ఎనీమియాతో సతమతమైన బహుజన జాతికి ఎక్కిస్తున్న రాతి కడీలతో నిర్మిస్తున్నా జంబుజాతిని బహుసక్కని సింధూ జాతిని నల్లసర్ప గుండ్లతో రాజ్యగోడలు నిర్మిస్తున్న! చరిత్ర పునరావృత్తమౌతుంది కోల్పోయిన క్‌ తిరిగి అవృత్తమౌతుంది అవుతదా? సందేహం వద్దు అయితుంది... అయ్యి తీరుతుంది. ఇటు అగ్రకుల మొగోళ్లు అటు అడుగుకులాల మొగోళ్లు 'ఎరుకి బహుజన మహోదృమ టీర్ధకావ్మం 105

కాళ్లకు హత్తుకపోయే చెప్పులనుకున్న స్త్రీని

హిందూ కోడు మహిళా బిల్లె నిటారుగా నిలబెట్టిండు నిచ్చెన మెట్లలో న అడుగు మెట్టులోనైన

ఆసర లేని అరుంధతిని సూసి ఎదలు బాదుకున్నడు

ఆమె హక్కులను “చట్ట'మై పలవరించిండు! మెజార్టీ, మైనార్టీకి

దోఖా చేయరాదు

సంవిధాన్‌ సంకల్పం -

అసమత్వ (ప్రజలు

రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని చేయవద్దు తునాతునకలు! నిమ్నజాతుల రక్షణలే

రాజ్యాంగ రక్షణలు!

పట్టీపట్టని వైఖరులు వొద్దు

చేద్దాం ఇన్నాండ్ల దళిత వెట్టి రద్దు! రాజ్యాంగమంటే...

బుద్ద్భుడేసిన రాజబాట!

పూలే మొగ్గ తొడిగిన

బలిరాజ్య కాంక్ష

అశోకుడేసిన

శిలాశాసనాల బాట

రవిదాస్‌ రచించిన రాజనాల కోట!

రాజ్యాంగమంటే...

అస్పృశ్యతపై నిషేధపు టుత్తర్వు

ఎన్నో ఏండ్లనుండి

హక్కులు మట్టీ కలిస్తే -

తిరిగి మనిషి కాళ్లకు తొడిగిన

మహావిధానం సంవిధానం!

హాట్సాఫ్‌ టు ముస్లింలీగ్‌

“జ్ఞానరథం” రాజ్యాంగసభలో

డప్పు దరువుల సవ్వడిని వేయించింది!

డ్రాఫ్టింగ్‌ కమిటి అధ్యక్షుడిగా

ఈ దేశ ముఖచిత్రాన్ని

స్మూత్‌గా డ్రాఫ్ట్‌ చేశాడు

దేశానికే గాదు

వ్యక్తులకు స్వాతంత్రాలను ప్రకటించాడు

రాజ్యాంగసభ యుద్ధశిబిరమైంది

నిమ్నవర్ణాల శిబిరయుద్ధనౌకతడు!

ఉన్నతవర్థ్ణాల యుద్ధ శిబిరం

ఇసుక తుఫాను ఇనుప డేగై

విసురుక పడ్డప్పుడల్లా...

ప్రశ్నల అగ్నిపర్వతాలై పేలినప్పుదల్లా...

విసుగులేని శాంతి సమాధానాలను

సభ ముంగిట్లోకి విసిరినాడు!

అపోహలన్నీ మేఘాల్లా తేలిపోయేవి!

కాలమూ, పరిస్థితులు

దేశభవిష్యత్‌ ముందరి కాళ్లకు వేసిన

బంధాన్ని పెద్దమ్యాతరీ కత్తితో కోశొడు!

ప్రతి అవకాశం భిక్ష కొదని అ “ఎరుక బహుజన మహోద్యమ దీర్టకావ్యం వేం

పక్కాగా హక్కని

మన పిడికిట్లోకి జారవిడిచాడు!

యుద్ధం తప్పదు

అంతర్యుద్ధము తప్పుదు

కులనియమాల '“గీతులపై యుద్ధం తప్పదు

వే(దుధ నియమాలపై

“గూటం దెబ్బ'ల సమ్మెట తప్పదు

“నెత్తురుబొట్లి భారతంపై

సావు దరువులేసే యుద్ధం తప్పదు

ఖాయం ఖాయం

పూజల అంగడి మీద గొంగడి కప్పుడు ఖాయం

చరిత్ర గీసిన నెత్తురు మరకలను

కర్సుపొట్టలు తీసిన కత్తితో

నరుకుడు ఖాయం ఖాయం!

అగ్గి అగ్గిసై బుగ్గి బుగ్గిసై

గ్యాసునూనె సూద్దానికి నీరే

అంతర్గతంగా అగ్గిని దాసుకుంది!

కులంతో అవమానించావుగా

గా కులమే రాజ్యాధికార సేతుదారి!

ఇప్పుడంబేద్మరంటే

భగ్గున మండే గడ్డివాము మంట కాదు

కణేలన మండే చింతనిప్పుల కొలిమె!

కవిత్వమంటే తీరని దాహం కాదు

కవిత్వమంటే ప్రతీకారం కాదు

కవిత్వమంటే బహుజన రాజ్యాధికారం! 108 గుడిపల్లి నిరంజన్‌

త్ర 'పెరియార్‌ రామస్వామంటేనే ఉత్తేజం ప్రసంగించిన ప్రతిచోట ప్రజాచైతన్యం ఊటలా ఊరింది సంప్రదాయపు గొలుసుకట్టు సంబంధాలను గండ్రగొడ్డలితో నరికి అంటరాని పాదాలను అఖభిపేకించిండు! దేవుడి పేరుతో జరిగే కుతంత్రాల కుతికెలను పిసికి మానవునికి పట్టంగట్టిన హేతువాది! దేవుడు, కులం, ప్రజాస్వామ్యమనే అందమైన అబద్ధాలను రంగు రంగుల భూతాలను లందల ముందు బొ ందపెట్టాలన్నాడు!

“ఎరుక బహుజన మహోదృమ టీర్ధకావ్పం 109

ఎవరినీ అణగద్రొక్కని మరెవ్వరినీ పైకెత్తని సమత్వ సామాజిక పునాదులకు నిరంతరం నీలిరంగులద్దాడు! అతడు అంటరాని జాతుల యుద్దానికి పురిపెట్టాడు ఆ యుద్దాల పొగల్లోంచి “'హిందూమహాసముద్రం) యొక్క ముఖం వాడు పట్టిపోయేది అతడి కుల వ్యతిరేక గొంతు జలపాతానికి జంధ్యాలన్నీ చెదిరి బెదిరిపోయాయి! అతడు నడిపిన 'వైకోమ్‌” ఉద్యమం అంటరానితనానికి మేకులు దించింది! అతడి ఊపిరిలో గాలి కాదు ప్రవహించేది యుద్ధవ్యూహం! అతడి అడుగులు కుల పట్టింపుగాండ్ల గుండెల్లో పిడుగులు! ఎదురులేని ప్రశ్నించే ధైర్యంతో ఆధిపత్యానికి హద్దులు పెట్టాడు! భయానికే భయం పుట్టించి బహుజన ఉద్యమాలకు జీవం పోశాడు! 'పెరియారంటే కండ్ల ముందర జరిగే అవమానాన్ని మౌనంగా భరించడం చేతగానివాడు 'పెరియారంటే కులతత్వంపై పేలిన పెనుమంట!

  1. గుడిపళ్లి నిరంజన్‌

అతన్ని సూస్తే జంధ్యం తడబడుతుంది రోజులు దిక్కుమొక్కు లేక పరిగెడుతాయి ధర్మసత్రం పత్తాసినకన అతని గడ్డం (బ్రాహ్మణత్వానికి అడ్డం అతన్ని సూస్తే... ఘుమఘుమలాడే సంభ్రానికి గత్తరోసన గుప్పుమంటది! 'వారతిని మీసం తిప్పి మరీ అడ్డుకున్నాడు శ్లోకానికి శోకమే! అతడు అష్టాదశ పురాణాలతో వాగ్వివాదమైతడు! దక్షిణాది (బ్రాహ్మణాధిపత్యాన్ని దహించే కుల వ్యతిరేక దావాగ్ని సృష్టించిన శూ విప్లవవేత్త... పెరియార్‌ (ప్రేమాస్పద “బహుజన గురొ ఆయన అసలు ధ్యేయం ఆత్మగౌరవ దాహం! “ఈరోద్‌'లో జన్మించి ఈ దేశంలో బహుజన రోడ్డులు నిర్మించాడు కులం ఈ దేశ దీర్హవ్యాధి వేర్వేరు రోగాలు వేర్వేరు మందు గజ్జి మందు గజ్జికెయ్యాలి క్యాన్సర్‌ మందు కాన్సర్‌జేయాలి రెండింటికి ఒకటే మందంటే ఎట్లా? కులం ఒక చెదుగుడు

“ఎరుక బహుజన మహోద్యమ దీర్హకావ్యం తే

కులం ఒక దౌర్భాగ్యం దానిని పీకి వేయాలి!

“బ్రహ్మినోక్రసీ' పీడన పీకి పారెయ్యాలి!

వివక్షతను సూస్తే...

భళ్లున బద్దలయ్యేవాడు!

ఆత్మగౌరవ ఉద్యమాన్ని

“ఈరోడులోనే కాదు

ఏ రోడ్డులోనైన సాగింపజేశాడు!

అయోగ్యుల కుట్రల్ని

సిగ్గుమాలిన వ్యవస్థల చెత్తల్ని

చూపులతోనే మంటలు రేపేవాడు

జస్టీస్‌ జననేతై

(బ్రహ్మాధిపత్య శిబిరంలో

విస్ఫోటనాలు సృష్టిస్తూ

నిప్పులు గక్కి నింగికెగిరే క్షిపణే పెరియార్‌!

(ద్రావిడ సింధూ నాగరికతా యుగానికి

సామాజిక ప్రవక్త

బహుజనోద్యమ శకానికి సోక్రటీస్‌

అర్ధం లేని ఆచారాలపై ఫైర్‌బ్రాండ్‌!

మరణించాల్సింది బ్రాహ్మణుడు కాదు

బ్రాహ్మణ వాదం!

బాట సాగుతూనే ఉంది

యాటింత విశాలమౌతూనే ఉంది. శే12 గుడిపల్లి నిరంజన్‌

౬ స కష గ? వై న 4 వల మండ 10 గా నేలలో కౌబ్బరిసెట్లు నిత్యం పహారా కాస్తున్న సైనికులు! నేలంత పచ్చగా పచ్చి పచ్చిగా హరిత సంతకమై నిత్యం పలకరిస్తుంది సెట్లతో నేల సుట్టరికం చేసినందుకేమో గా నేల పచ్చదనాన్ని ఈనుతుంది! ప్రకృతి మనిషి వేరు కాదని గుడిలో దడి పెత్తనమేంటని ఎజవ కులస్తుడి ఏకునాదం మోతీ! భక్తికే కొాత్తచూపు నిచ్చిన బహుజన బాటసారి అతను! 'ఎరుకి బహుజన మహోద్చమ బీర్హకావ్సం 113 ం

అరువిప్పురం ఆలయాన్ని కులనిర్మూలన వేదిక జేసిండు | అందుకే కాబోలు అబ్రాహ్మణ పూజారయిండు! కులం అడగొద్దు అడిగిన చెప్పొద్దు! విద్య ద్వారా స్వేచ్చ సంఘటితమవడం ద్వారా శక్తి పరిశ్రమించడం ద్వారా ప్రగతి నీలో నీవే స్వయంగా నిర్ధారించుకో పరిశీలించి నిర్ధారించుకో! అతడు సవర్ణ కేరళ గుందెల్లో అంటరాని పాదముద్రలు వేయించిండు “వైక్క్మమ్‌' దేవాలయ రహదారులు బహుజన అభ్యుదయ 'గురుదారులు! ఆలయాలను అక్షర దిమ్మెలుగా మార్చి అవర్జులను సవర్డులతో సమానం జేసిండు! ఛాందసానికి వాణుకు పుట్టించి మనిషికి పట్టం గట్టిన మహామనిషి అవమానాల మధ్య... కట్టడుల మధ్య... ముట్టడుల మధ్య వివక్షతల మధ్య... శరీరం నుండి బౌద్ధకాంతిపుంజం పూయించిండు! మొక్కుబళ్లని చెప్పి

114 గుడిపల్లి నిరంజన్‌

మెక్కే మనుషుల కుతికెలు పిసికిందు! ముడుపుల సంస్కృతిని మక్కెలిరగతన్ని...

మెక్కినదంతా కక్కించిండు! అహంకారంపై రూంకరించి దౌష్టికంపై బహుజన దౌడు తీయించిండు! దినం దినం కన్నీళ్ల కుంపటిని ఎదమీద నిలుపుకొని ఎదురీదుతూ కాలం పొడవాత ప్రవహిస్తున్న మనిషిని ఎదలకు హత్తుకుండు

ఎత్తి దించుతుండు!

ఆధ్యాత్మికతలో అంటరాని అణుబాంబులు పేల్చి

గర్భగుడిని జ్ఞానగుడి జేసిండు! అతడునారాయణ గురు

కేరళ రూపురేఖలు మార్చిన

నిశ్శబ్ద సాంఘిక

ఆధ్యాత్మిక మహావిప్లవ కెరటం!

అతడికి బాట మార్గం తేలుసు

బాటలో అతడు

బాటకై అతడు

సాగుతూనే ఉన్నాడు

సంచలనమై నిత్యం పేలుతూనే ఉన్నాడు!

“ఎరుక బహుజన మపోద్యమ థీర్చకాప్యం లేక్‌

1 ల్‌ో ల్‌ ఎ (శ) ఆ? క్ష బౌొట ఇప్పుడు రాజ్యమైంది! ఆకాశమంత సాహసం చింపిరి బతుకులోల్ల ఆశాదీపం మోడువారిన అతుకుల బత్కులకు చిగురుమామిడి పూతలై విచ్చుకున్నడు! మంత్రాల కంపల్లో ఇరుక్కున్న తలలకు పగడాల దండలు పరిసిండు! ఎంపళల్లం మొలిసిన వాకిట్లో ముత్యాల ముగ్గుల రంగైండు! తాతల కళ్లల్లో కళ్లు పెట్టి రాజ్యం వాటాల్లో హక్కులు పంచిండు! రాజైనప్పటికిని అడుగు అడుగున 116 గుడిపల్లి నిరంజన్‌

జంధ్యం ముళ్లు పొడుస్తూనే ఉన్నె! జంధ్య పీడనకు జడిసి స్‌ చివ్వున నెత్తురు ముఖం ముందర పులిదృశ్యమై పొంగేది! శూ(ద్రరాజుకై నా మంత్రం సాగదన్నప్పుడు సాహు మహారాజు నోటి వెంట పిడుగులు కురుస్తున్న! కులాహంకారం సూసి అవమానారగ్గిని తట్టుకోలేక అగ్నిపర్వతాన్ని ముఖానికి తొడుక్కున్నాడు! ఛత్రపతి సాహు మహారాజు ఆధిపత్యంపై అగ్గిబరాట! అగ్ని నిత్యం చింతనిప్పులై మండుతూనే ఉంది కుల కట్టడుల చట్రాలు బిగుసుకపోయినప్పుడు సప్పుడు లేకుండా గొంతులు కోసే కులాధిపత్య కత్తుల బోనులు జడలు విప్పినప్పుడు కులం కుతికలు పిస్కిన సాహసమతడు! సాహసం... సాహసం... సాహసం సాహు సాహసం...! శిఖర సమానమైన సాహు సాహసం రాజస్వం... బహుజన రాజస్వం నిర్ణయం అప్రతిహతమైన నిర్ణయం ఉద్యోగాలన్నింటిలో వాటొ విందులన్నింటిలో పసందైన వాటా యుగాల నాటీ వాటాలన్నీ కొల్దాపూర్‌లో కోలాహలం!

“ఎరుక బహుజన మహోద్యమ దీర్ధకావ్యం శ్ర

వేల సంవత్సరాల దాస్యపు శృంఖలాలను రాజనిర్ణయంతో రద్దు! రిజర్వేషన్ల ఊతకర్రలందించి కుంటిదేశాన్ని ముందుకు నడిపించిండు! అతడికి నడిపించడమే తెలుసు నడిచే మనిషి కాళ్లల్ల కట్టెలు పెట్టుడు తెల్వదు పడిన మనిషిని లేపడం తెలుసు! చేజారినది నిజం చేసిండు అపహరించబడినది అందరికై తెచ్చిండు శతాబ్దాల కింద చేజారిన కిరీటాన్ని తెచ్చి తరువాతి తరాల తలలకు తొడిగిండు! మనుషులను ఎలా గౌరవించుకోవాలో నేర్చిండు ఇష్టపడేదానిని ఎలా పొందాలో నేర్పిండు నిజంగా నీవెవరో నీకు తెలిపిండు నీకై రాజాబాట పర్సిండు! నిన్ను నీవుగా ఆవిష్మరించిండు నిన్ను మూలవాసుల మూలకణంగా ముందుకు తెచ్చిండు! బహుజన బాట రూపశిల్పి అతడు నీవు కనుగొనలేని శతాబ్దాల రహస్యాన్ని సీ చేతిలో పెట్టిండు! అతని తలపాగ నీకు పెట్టి నిన్ను అద్దం ముందు నిలబెట్టిండు! వెన్నెల రాత్రిని నీకు బహూకరించి చల్లని రాజ్యం నీవే కావాలన్నాడు! అగ్గిపుల్లను వెలిగించి క గుడిపల్లి నిదంజిన్‌

ఉన్నాదరాజ్యాన్ని భస్మం చేశాడు!

నిద్రపోయిన మనిషి కింద

సూర్యగోళాన్ని అమర్చిండు!

చరిత్ర శకలాల కింది

పాదము(ద్రలను తీర్ధంలో కడిగిందు!

నిన్ను ఉయ్యాలలో ఊపాలని ఉబలాటం

చరిత్ర కింద మూలుగుతున్న

వాస్తవాన్ని రహస్యాన్ని

బయటికి తీసి న్నానం చేయించిండు!

అడ్డదిడ్డ నామాలలో చిక్కుకున్న

చందమామను చూసి అతని కళ్లు అలిసిపోయాయి

పునాదిరాయి ఆత్మఘోష విన్నాడు...

ఇంకా కొంత చరిత్రను తవ్విపోసిండు

పాపాయిలా నవ్వుతున్న 'నందరాజ్యం”

వెన్నెల కాంతుల్లో ఈదుతున్న

ధననందుని నడిగాడు ఎవరు నీవని?

నేనే నువ్వన్నాడతడు!

మహోజ్వల చరిత్రను మాయం చేసి

నగ్నవరిత్రను చూపిస్తే

నీలా నాలా సహిస్తాదా?

కలలు చెరుపుకుంటాదా?

ముచ్చటే లేదు...

వేకువలోకి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయిండు!

ఇప్పుడు బహుజనతత్త్వం అరవదు

రహస్యంగా నిన్ను నన్ను పిలుస్తుంది!

అతడు లేపిన మెరుపులు

మనలో రాజ్యపరిమకాన్ని లేపుతూనే ఉన్నాయి! 'ఎరుకో బహుజన మహోద్భమ టీర్ధకావ్యం 119

ఎ న్‌ా * నో క్‌ క 12 ఖైద్దమృగాల్లాంటి మనుషుల మధ్య గాద్దేబాబా సంచార సాధువై స్వచ్చభారత్‌ను ఏనాడో ఆచరించిన మనిషతను! నిరాశ నిసుహల కులపొరల కింద మానవ విలువలు నలిగిపోతే భరించలేక అరవయ్యేళ్ల నడకతో బోధించి సరిసమం జేసిన పోరాటయోద్దానుడు! బౌద్ధ జీవనపధాన్ని పిడికిట్ల పట్టుకొని భావితరాలకు అందించిన విద్యుక్తుడు! దొంగ స్వాములు అల్లిన సాలెగూళ్లనుండి సామాన్యులను రక్షించిన బాబా! మా బాబా లోక బరోస మీ బాబాలు జీడిగింజలు మంత్రమే రోగనివారిణిగా 120 గుడిపల్లి నిరంజన్‌

జీవితాలకు మేకులు గొట్టిండ్రు!

మేమిచ్చిన ఉంగరము ధరిస్తే...

తరిచి చూస్తే అది మసిబొగ్గే!

వంచక అవతారం ఎత్తి

పరుసుకున్న దుప్పట్లో నల్లులొదిలిండ్రు

నాతో మాట్లాడితే పిల్లలౌతారని

ఇంగువసెట్టు ఇగురం జెప్పిండ్రు

మా సంతులు బాలసంతులు

చెత్త పుకార్లను చిత్తు చిత్తు చేసి

మనిషే మహా అద్భుతమని నిర్ధారించిండ్రు!

జీవితమంతా తిగ్లి

అందరికి ఒకే సందమామను సూపిచ్చిండు!

సత్యానికై పరితపించి సొటింపైయ్యిండు!

సంచరిస్తేనే సత్యం బోధపడుతుందని

బాసింగాల సత్యం వొడుపు జెప్పిండు!

సంచారంలో నిష్పులగుండం

వాండరింగ్‌ సెయింట్‌

సంత్‌ గాద్దే బాబా!

ఒక దిమ్మరిగా...

సత్యాన్ని దిద్దర్భనం చేసిండు

ఒక బైరాగిగా...

బహుజన బంధుత్వాన్ని సాదిండు!

ని

గలం క మన గుమ్మానికి వేలాడదీసిండు!

పాదాల అడుగుల్లో బతుకుల మడుగుల్ని పొదిగిండు!

ఎంత నడ్సిన అంతముండదని దేశదిమ్మరై . 'ఎరుకొ బహుజన మహోద్యమ దీర్ధకానం 121.

మనుషులకై తట్టెడు పేగుల్ని ఆరేసిండు! సత్యాన్ని అసత్యంగా చెప్పినోడి ముల్లుగట్టైతోటి గుచ్చి గుచ్చి

తడిదుక్కుల సత్యాన్ని తలదోర్నం గట్టిండు! భావ(ప్రకంపనలను సృష్టించి

బౌద్ధ భావజాలాన్ని నలుమూలలా వెదజల్లిన బౌద్దారకుడు!

చదువు లేకపోయిన సౌగసైన మాట ఆహూతుల నాకర్షించే పాటలు ఆయన సొంతం! మురికి పట్టిన ఆధ్యాత్మిక విలువలను కుడితి గోలెంలో కడ్డి

పొగడపూల దందలేసిందడు!

పగలు సూర్యుని పిలిచి

రాత్రులు నక్షత్రాలని పిలిచి

బహుజన వాకిట్లో వెలుగుదిమ్మెలు చేసి బతుకలకు నిట్టాడిలా నిలిపేవాడు!

ప్రతి పెదవిపైన చంద్రుని నిలిపి వెలుగులంటే ఏమిటో రుచి చూపాడు మాటా నవ్వే పాటా నవ్వే

కీర్తన నవ్వే సంకీర్తన నవ్వే!

పదే పదే పడుతూ లేస్తున్న

శూద్రబానిస సెమట సుక్కలకు

చెయ్యి అందించి పొత్తిలి పర్సిండు! శతాబ్దాలనుండి వొట్టిపోయిన

బహుజన చెట్టుకు నీళ్లు పోసి

లోపల వేర్లను తడిచేసిండు

నిలువెల్లా చిగుళ్లను తొడిగిండు! మనమే కట్‌ చేసిన కొమ్మలకు అహోరాక్రులు పత్రహరితాన్ని ప్రామిస్‌ చేసిండు! అప్పుడు గిట్మవారిన బడుగు మొక్కలు ఇప్పుడు బడా వృక్షమై కొమ్మలను విస్తరిస్తునే ఉంది! బడుగుల ఉయ్యాలను ఊపుతూనే ఉన్నాడు కూలుతున్న చెట్లను నిలుపుతూనే ఉన్నాడు వేలాది సపారాలను కప్పుతూనే ఉన్నాడు ప్రకృతిని నిష్పత్తి ప్రకారం మనుషులకు పంచుతూ ఫర్మానా జారిచేస్తూనే ఉన్నాడు వాటాలను బూటకము చేస్తే జైళ్లను ఆవాసాలుగా సూపించిండు! మొలుస్తున్న సమతా ధర్మాన్ని ఎవ్వడైనా ఛిన్నాభిన్నం చేస్తే చేతికర్రతో ఆవలికి నూకి పారేసిండు! తనకు తానే తన రాజ్యంలో కఠలోర సమత్వమైండు! తరతరాలుగా జీర్దించుకుపోయిన ఆటవిక సామాజిక చట్రాన్ని బద్దలు చేసి విముఖత్వపు మూర్ధపు వాదంలో ముసలం పుట్టించి బుద్దుని మూలసూత్రాన్ని చెట్టుగౌ నాబిండు! పసితనం నుండి కుల మూర్ధపు నియమము కుట్రలు, అవమానాలై రొజదర్చారును వెంటాడింది! “శాఖాహార ముసుగు ధరించిన సాధుపులుల

“ఎరుక బహుజన మహోద్భమ టిర్ధకావ్సం 123

వస్తధూళి ఒక వెక్కిరింతైంది!

అతడు నిత్యం భారతదేశాన్ని

బౌద్దదేశంగా మార్చే బాటసారైండు!

బాటల్లో భారతదేశం

తోటల్లో పూలసెండు

తన కనురెప్పలపై

గుడికి బదులు బడిని నిర్మించాడు!

పొరుకాటతో బజారులుద్సినట్లె

కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిండు

సంత్‌ గాద్దేబాబా ఫాదర్‌ ఆఫ్‌ ది క్లీన్లీనెస్‌! 124 గుడిపల్లి నిరంజన్‌

ళ్‌ మాం క... య! న్‌ 0గ81041 1016 2౧6 2 600౧౧౧1816 ౧౦11008! 0620156 కతి బౌట బహుజన ఉప్పెనైంది జి సి స శక్తి కాదు... స్వశక్తి కొవాలి పోరాటం కాదు నిర్మాణం కావాలి ఎదగడం కాదు నిలబడడం నేర్చుకోవాలి ఫూలే, అంబేడ్యర్‌లను పెదవులపైన స్మరించడం కాదు ఆచరించడం అలవాటు చేసుకోవాలి! అతడో శాష్రీయత... న | సిద్ధాంత నిబద్ధత... ఖచ్చితత్వం అతని తత్వం ఉద్యమాలను పరిశోధించి ముక్కలు చెక్కలె మూలుగుతున్న చైతన్యాన్ని “ఎరుక బముజన మహోద్యమ దీర్ధకావ్యం 125

సంఘటిత శక్తిగా నిర్మాణమైండు! గతిశక్తిని భౌతికశక్తిగా మార్చగల మాంత్రికుడు! న్యూటన్‌ గమన సూత్రాలను రాజకీయ పుట్టలపై వొదిలినోడు! అతనికి ప్రతిదీ లెక్కే భావజాలమైన... ఆలోచనాచరణనైనా! సామాజిక ఆధిపత్య పెత్తనాల జన్మరహస్యాలన్నీ “రాజకీయాలని నిర్ధారించినోడు! ఇంకానా పెత్తనం? ఇకపై సాగదని ఆగకుండా సాగుతూ చెప్పినోడు! అవమానాలను రాజకీయ వ్యూహాలై పేల్చగలడు అతనికి ప్రతిదీ గణాంకమే అగ్రకులాలను అంకథ్రేజి చేసిండు బహుజనులను గుణథ్రేణి చేసిండు ప్రతి లెక్కను తను వేలికొానలమీద లెక్కించగలడు! గుణమేందో తెలియదు కాని గణాంకాలను తలకిందులు చేయాలంటాడు! కులాలను ఒప్పుకోడు ఓట్లను సీట్లను మాత్రమే ఒప్పుకుంటాడు! పెన్ను నిలబెడితే 'మనువటి పెన్ను పండబెడితే అంబేద్మరట! జపా ల మన '“అయ్య' ముల్లును ముల్లుతోనే తీసిపారేయమన్నాదడు ,₹2ద్ర. గుడిపల్లి నిరంజన్‌

మన కాన్షీరాం అయ్య

కులాన్ని రాజకీయ చైతన్యంతోనే బొంద పెట్టాలన్నాడు

బహుజన ఆత్మ గౌరవాన్ని

వేల ఏళ్లుగా పిలకజుట్టుకు

ముదేసుకొని ఊపు ఊపుతున్న కులాన్ని

'అంతరి చేయడం అనివార్యమన్నాదు!

అతని కనుగుడ్ల నీలాలు

నీలి మహాసముద్రాపై తెప్పలుగా ఉప్పాంగుతాయి!

అతని ఆశయం సుదూర కలను ఆవిష్కరించడం

అతని నియమము

ఊహాత్మక పోరాట నినాదాల నుండి

క్రియా పోరాట నినాదాల

ఊటలై ఊరేగడం!

పనిముట్లను ట్రేమించిన మనిషికి

పార్లమెంట్‌ మెట్లను... బ్యాలెట్‌ దబ్బాను సూపిచ్చిండు!

నిత్యం జీవితంలో ఓడిపోయే మనిషిని

వనుగునెక్కమన్నాడు

సెప్పిన వినకపోతే

తుప్పు తుప్పు ఉమ్మిస్తుండు!

పెంపుడు కుక్కలా కాకుండా

కక్కడిలా బ్రతకమన్నాడు!

దేశానికి అసలు నాయకుడు

నీవే నీవేనని నీవు మరిచినప్పుడల్లా పలకరించిండు!

నీ ఆయుధంతోనే వాడు మేధావినంటుండు

నిన్ను నీవు కౌగిలించుకో ఓటు ఆయుధాన్ని కౌగిలించుకో! “ఎరుక బహుజన మహోద్యమ దీర్ధకాన్కం 127.

మనమందరం కల్సి ఒకే అడుగు అవ్వాలన్నాడు అందుకై మనల్ని వెతుక్కుంటూ వాచ్చిండు చెప్పినా వినకపోతే నొచ్చుకుంటూ వెళ్లిండు! నల్లమబ్బులు కమ్మిన జీవితాల్లో వెన్నెలను గుమ్మరించిండు! “నా ప్రజలు పాలకులు కాబోతున్నారు” ఆ వాక్యం నిజము చేయడమే నా జీవితమన్నాడు! అవమానాల్ని బుల్‌డోజర్లతో నూకి - అంబేద్మర్‌ కలల సాఫల్య రాజనీతిజ్ఞ నీధి! మహారాష్ట్రలో పోగొట్టుకున్నది ఉత్తరప్రదేశ్‌లో దొరకబుచ్చుకున్నాడు వెట్టి పోవాలంటే ఎలక్షన్‌ పెట్టె నిండాలన్నాడు సైకిళ్లపై క్షిపణులను పెట్టి మోసుక తిరిగిన మహోజ్వల మనిషి! ఘనీభవించిన ఆశలను గంపల్లకెత్తుకొని మన వాకిట్ల గుమ్మరిచ్చిండు ఆయనంటేనే త్యాగం ఆయనంటేనే కఠోర శ్రమ ఆయనంటేనే అంబేద్కర్‌ పనివిధానం! ఆయనంటేనే పీడితజన విముక్తి నినాదం! ఆయనంటేనే అడుగుకులాల అధికారం! ఆయనంటేనే ప్రత్యర్థికో సవాల్‌! కులాలకు రాజనీతిని అద్దిన తత్త్వవేత్త! 128 గుడిపల్లి నిరంజన్‌

వ్యక్తిగత అపురూపాల్ని వాదులుకొని సహజక్రియలు మానేసి అసహజక్రియలకు కర్తయిండు! ఉన్నత కులాలతో సంఘర్షించడం మాని నిమ్నుకులాలను ఉన్నతంగా రాజకీయీకరించిండు! విత్తనం నాటిన వెంటనే పళ్ల కోసం చూసే ఆశావాది కానేకాదతడు చెంచాలు ఎవ్వరైనా సరే వదిలింది లేదు నిప్పుల కొలిమిలోకి నూకిందడు బుల్లెట్లతో కాదు బ్యాలెట్లతో భారత్‌ను “జౌద్ధదేశం'గా మార్చాలన్నాడు! అతని చూపు అంబేద్కర్‌ చూపే అతని సంకల్పం అంబేడ్మ్కర్‌ని నిలబెట్టటమే అతని బాట బామ్‌సెఫ్‌ అతని మాట వెంటే చమార్హు, జూతవ్‌లు ప్రతిమలనుకున్న మహిళలను ఐరన్‌ లేడిగా మార్చగలడు సిద్ధాంతాలను వాస్తవం జేసిన సిద్ధుడు దళిత సోషిత్‌ సంఘర్షణ సమితి ఎదిగింది అవమానాలు ఆటంకాల చక్రపు గిల్లలెగిరిపడ్డయ్‌ కంటగింపుల కండ్లు మూతపడ్డయ్‌ చిన్న చిన్న లోపాల ప్రాయలకు చిటికెలో పరిష్కారం బాటలనిండా రాళ్లు మొలుస్తున్నా ప్రత్యామ్నాయ బాటలు నిర్మిస్తున్న మెకడమతడు! బహుజన గళానికి రాజకీయ ప్రతినిధి! అంబేడ్మర్‌ నిర్మించిన దేవాలయంలో దళిత దేవతను ప్రతిష్టించిందు!

'ఎరుకొ బహుజన మహోద్భమ టీర్ధకావ్యం 129.

నీకు... ఆత్మగౌరవం కావాలా? రాజ్యం రావాలి. నీకు కులం పోవాలా? రాజ్యం రావాలి నీకు అభివృద్ధి కావాలా? రాజ్యం నీదవ్వాలి! పొత్తులతో అగ్రకుల మత్తులను వాదిలించిన వాస్తవమతను! కాళ్ల బేరానికై వొచ్చిన మను వారసులకు ముక్కుసూటిగా మిగ్గు వాసన సూపిచ్చిండు! మానండి మానండి అడుక్కోవడం మానండి ఇటు ప్రక్క బాట అటు ప్రక్క బాట ఇది నీలిబాట అది వాడి పానాలు దీసి దిష్టిపూసలు కట్టిన బాట మనువు బాట మనుషుల స్వేచ్భ్ళకు మేకులు గొట్టిన బాట కత్తులు వేలాడదీసిండ్రు రాకాసి పిట్టలకు ఇనుప ముక్కులు పెట్టి ఎద్దుపుండు మీద పొడవమని ఎగదోసి కాకులను ఉసిగొల్పినారు! గా బాటలో... స్నానము సేయని సన్నాసి జడలు పెంచిండు ఎంట్రుకలు పిడసకట్టినవి! 30, గుడిపల్లి నిరంజన్‌

పచ్చ పచ్చని వనాలు పెంచితే

ఆకులపై ఆకు తేలు వాదిలిండ్రు

సుంకు సుంకు

'పెయ్యంత కులం సుంకు

దళితులు బిసిలు వకమైతే

సముద్రం ఆకాశం ఒక్కటైెనట్లే!

ఇంగ సూడు అప్పుడు

సిరుజల్లులు కాదు

జడిసే జడివానే

ఆ జడివానలో ద్విజ సంస్కృతి కొట్టుకపోవుడు బహుజన సంస్కృతి నిలిసిపోవుడు ఖాయం! గప్పుడు

సముద్రం ఆకాశం ముద్దిచ్చుకుంటాయి సముద్రమంతా ఒకే రంగన్నట్లు బహుజనులంతా ఒకటే డిఎన్‌ఎ! కులమంటే అవమానం

కులమంటే అంటరానితనం కాని

నేడు కులమంటే ఆయుధం!

జాతి తోడో సమాజ్‌ జోడో

కొన్ని త్యాగాలు

కొన్ని సర్దుబాట్లు

గివే ఐక్యతకు మెట్లు!

'ఎరుక' బహుజన మహోద్మమ టిర్ధకాన్మం [131

(ప్రతిది ఓ కంట కనిపెట్టండీ “మీడియా మనకు నిప్పులగుండం “మాఫియా” మన పట్ల చీమలదండు 'మనీ' గొంతుల్లో బట్టలను కుక్కింది రిజర్వేషన్ల ఊతకర్రలు నమ్మకండి ఓటునే ఆయుధంగా వదలండి! అజమాయిషీ ధిక్కరిస్తారా? అణిగిమణిగి ... కొడతారా? త్వరగా త్వరగా తేల్చండి! మీ కంఠాల్లో ఊపిరి ఉంది అసలు మజా అధికారపీఠాల్లో ఉంది! కాన్నీరాం అంటే రాజకీయ బుద్ధుడు. 132 గుడిపల్లి నిరంజన్‌

కేడీ బాటల్లో 'భాగ్యోదయం'” వెలుగులీనింది కుంకుమ పసుపు నేల రక్తంలోకి ఇంకినప్పుడే జంబుద్వీప దేదీప్యం ఆవిరైనప్పుడే గీ దేశం ముందమోసింది! ఆయనేసింది ప్రతిది పునాదే ఆది ఆంధ్రసభ కావొచ్చు ఆడోళ్ళ పాఠశాల కావొచ్చు విద్య ద్వారానే “గద్ద అని విశ్వసించిన విదుషీమణి! “మాన్య సంఘ'మై మనిషిని ఆకాశంపై నిలబెట్టిందు! జగన్నిత్ర మండలితో కమండలం కదురు తీసిండు ఆదిలో గీ భూమినేలినోదు నా తాతేనని జులూస్‌ తీసిండు పునాదిరాళ్ళ నెలికి తీసి పూతరేకులను తినిపించిండు! అరిగె రామస్వామితో ఆలింగనమై సెరిత్రను తూర్చారవట్టిండు! దక్కన్‌లో కులతత్వం పొద్దెక్ళొద్దని మూసినదిలో ఆధిపత్యాన్ని నిమజ్జనం జేసిందు! న. చొకృమేళా నీవేసిన బాట భళా పోతులూరి తాత్విక అగ్గిబరాట 'ఎరుకో బహుజన మహోధ్యమ టిర్హకావ్సం 133

మీరు పర్సిన కొత్తవంతెన అలుగులను మేము స్పష్టంగానే చూస్తున్నాము కక్కయ్య నీవు మా ఊపిరయ్య అయోతిదాసు మా గుండెఘోషవు వేలవేల వసంతాల ద్రవిడ వైతన్యమై అవస్థలు పడుతున్న వ్యవస్థకు వైద్యం జేసిన సిద్ధ వైద్యుడవు సమాన (్రవంతివై బాటల్లో ద్రవీభవించినావు బడుగుల మార్గదర్శివై అడుగు మనిషిలో అగ్గి రాజేసిండు! దున్న ఇద్దాసు తాత్విక ఇరుసు జ్ఞాననాడులను అలుకు పిడిసెతో అలికిండు వాడు జ్ఞానమనుకున్నది అజ్ఞానమని ఎరుకలేని తనాన్ని ఎత్తిపొడ్సిండు సట్టవోయిన బాటను ఎత్తిపట్టిండు అరిగె రామస్వామి నల్లదొరతనంపై నిప్పులవాన ఎవడో తననుండి విడగొట్టబడిన మనిషి వాసనను వెతుకుతుండు సదాలక్ష్మి సాగిన బాట ఈశ్వరీబాయి ఈదిన బాట ఎరుకతో సాగించిన బాట! గీ దేశాన్ని గద్దించిన బాట!

134 గుడిపల్లి నిరంజన్‌

15

అడుగులన్నీ కలిసి

సామూహిక నినాదమైనవి

మేమూ ఈ దేశ భూమిపుత్రులమే నంటు

మాకు లేనిదేమి లేదు

మేం సాధించనిదేమి లేదు!

సత్యం ఎప్పుడూ సత్యమే

సత్యం మారనిది

సత్యం తుడిచేయలేనిది

మనం ఈ దేశ పాలకులమన్నది సత్యం

మళ్లీ ఈ దేశాన్ని ఏలుతామన్నది సత్యం

ఈ జ్ఞానమంతా మనమే

గీ మట్టిలో కుప్పపోశాం

మనం ఏం కోరుకుంటున్నామో

అది ఇదివరకే ఉండింది

ప్రతిది.ఓ:సమయంలో పెరుగుతుంది

“ఆలస్యమన్నది” అంతరంగంలో నుండి

గుసికాడి పీకిపారేయ

మార్చుకి ట్రైమంటు ఏదీ లేదు

ఎప్పుడైన రావొచ్చు, వ.

చేయాల్సిందల్లా ప్రయాణమె

వెనక రోజుల గూర్చి ఆలోచించు

ముందు రోజుల రూపం

కండ్ల ముందర ఊయలై ఊగుతుంది! “ఎరుక బహుజన మహోద్యమ టీర్ధకావ్యం శక్‌

వాన రాకపోదు పంట పండకపోదు ఎప్పుడు గడ్డకట్టిన కాలమేమీ ఉండదు ఉదయించే కాలమూ ఉంటుంది కావాల్సిందల్లా భ్రమణ కాంక్ష మాత్రమే తళతళలాడే సూర్యకిరణాలను ముద్దాడుదాం జలజల రాలే పూలను (ప్రేమిద్దాం నేరుగా మనతో మనం మాట్లాడుకుందాం ఒక్కొక్కరుగా సమూహమౌదాం జరిగిందేదో జరిగిపోయింది కోల్పోయినదేదో తిరిగి పొందుదాం!

జై భీం!

స్తై మంలో 136. గుడిపల్లి నిరంజన్‌

బయోడేటా పేరు ; కొడిదల నిరంజన్‌ కలంపేరు : గుడిపల్లి నిరంజన్‌ పుట్టిన తేది. : 15-04-1981 నరంథులు : కొడిదల కిష్టమ్మ, కీ.శే. పోషన్న న్న ; ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్హతలు ; ఎం.ఎ., అర్థశాస్త్రం, ఎం.ఎ. తెలుగు, బి.ఇడి. ప్రవృత్తి . కవితలు, కథలు వ్రాయడం రచనలు ; 1. 'లందపొద్దు తెలంగాణ బహుజన కవిత్వం 2. “ఎరుకి బహుజన మహోద్యమ దీర్జకావ్యం సంపాదకత్వం వహించిన పుస్తకాలు : 3. “పొద్దెంది (తెలంగాణా కవిత్వం) 4. 'జులూన్‌ తెలంగాణా కవితా సంకలనంలో ఒకరు. 5. 'మహాబోధి' జి.ప. ఉన్నత పాఠశాల, కుమ్మెర స్వర్ణోత్సవ సంచిక " 6. 'ఐడికైతలు” కుమ్మెర విద్యార్థుల కవితా సంకలనం గా “'ఎడిగెల్‌ తెలంగొణ సంకలనం (అముథధ్రితం) అడ్రస్‌ ఎభ్లామ్ల గుడిపల్లి, మం. నాగర్‌కర్చూల్‌, త్రాసాగర్‌కర్పూల్‌, జిల్లా నాగర్‌కర్పూల్‌. తెలంగాణ మొబైల్‌ నెం. . 9499819878 ఇమెయిల్‌ ౧|౬౧|2౧9౪౦|౧2|/అ్రంగా౭॥.00%

న లే ! ల. క్ష 6౧౮% 0206)20 ౧౦౪౭౧౬౧9 |0౧౪ ౧౦6౧౫ 96౮0124౬1౫ స|గషస్రుతగి (రొ... . | 1 మ | “ఎరుక కవిత్వం జ్ఞానం, తత్త్వం, - స్థలం, కాలం, సామాజిక స్పృహ దీనికి ఆయువు పట్టు. సాంస్కృతిక చారిత్రిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంగతుల్ని! ళ్‌ న్‌ * కునుకుపట్లు పదే సమాజాన్హొచ్చప్పున' చరిచి నిద్రలేపి, ముందుకు నడిమ్య్యే విధంగా నిరంజన్‌ రాసిండు. | జాంబవంతుడి దగ్గరి నుంచి కాన్నిరామ్‌. , "న్లకక్షు ఇండియాలో వచ్చిన సామాజిక మార్చులను-అవేశ్త ఆధ్ధతను__. మేళవించి చెప్పిండు. “మూలవాసుల. మం “పాదాల స్వర్శతో పర్సిన. బాటలో స్ట | వ్‌ నిరంజన్‌ కవిత్వం నదిచొచ్చిల య. = సంగిశెట్టి శ్రీనివి