Telugu enupa kanija egumatulu enduku - anilvaranasi/indianlanguages GitHub Wiki

| గ న. ప్‌ స న" న్‌ (| నాన టా త్‌ ఆం ల చవల న న హ్‌ ?- , న న స అక! జూద నరు న 1 కా ఖతి జా. ల ఛా లు 1 / | మ కా ల ఫు ఏ సేన [స పాస లో నం. మై క! ణా. ర. ల ళీ లకీ కే య శల గ ే న? మ. న మంట్‌ యం న టం. క్ష సు ట్ట న టు వ ప? శకస సాననం ఇ న్‌ా ఇ ప్‌ టి టై ళం న! (1 బస వత స తంటం. ..! | ఖనిజిటి | సతి? 1. 9౪/౮0 జా ఖ్‌ ను - స స పు. మ సు [1 శ్‌ ప వ గ || లగ షక గీ ళ్‌ ఇ బని భే, న వ్‌ రాం ముతత లు! పి మం... సు. నలం నా న ప న. | ప న | స సు స క శ్‌. [! పని న కహ గ | చని ళ్‌ " న | క. తప ఇ మ... సా మ ము? సం ళ్‌ వళ ఆలం వట. న! | స శ్‌ ల న హి నం... జీన రక్‌ (|. నిష [39960 న. |. పా సమయ" క న్నా ఫా చే స టన (ృుమ్మన్న! 2:నుప ఖనిజ ఎగుమతి వృతిరేక కమిటే

కవిత ఓర్చు-ఒక్‌ నివురుగప్పిన నిప్ప

  • పద్దాకర్‌ మట్టిని బంగారం అంటాడు రైతు “ఇక దేశాన్ని దేవుడే కాపాడాలని” మట్టెనే నమ్ముకుని జీవిస్తాడు గనుక- నిర్వేదంతో ప్రకటించిన న్యాయమూర్తి మనుషుల్ని శవాలుగా మార్చి గారూ... మట్టేసి కప్పెడుతూ నాయకులను దృష్టిలో పెట్టుకుని మట్టి బంగారం కంటే ఎక్కువేనని దేశం గురించి వ్యాఖ్యానించడాన్ని (| మట్టిని అమ్ముకునే వాడొకడు తిరస్కరిస్తూ నిరూపిస్తున్నాడిపుడు- దేశ సార్వభౌమాధికారాన్ని ప్రజల చైతన్యమే కాపాడుతుందని రోజుకొక్కరి ప్రాణమైనా తీసేలా చరిత్రను రెఫర్‌ బేస్తున్నాను- '' యముడికి లీజుకట్టి 1 ప్రాణాలు తీసే టెండర్‌ | పాడుకున్నట్టున్నాడు వాడు- మై డియర్‌ జస్టిస్‌! , దేశాన్నీ, రాష్ట్రాలన్నీ క్షైవేటు లిమిటెడ్‌ |, గనుల్లోంచి తరలించే కంపెనీలుగా మారుస్తున్న మట్టిలోని ఇనుములా నాయకులందరికీ ఇనుములోని మట్టిలా కలిసిపోయిన పోర్టు దగ్గర లారీతో చిష్టితీసిన || ఇద్దరి సంపాదనకు ఖర్మకాలి ప్రజాగ్రహాన్ని చూపించి నెల్లూరొక ముఖద్వారం చెందింది! ఈసారి హెచ్చరించండి యువరానర్‌! | ఇంటి గడప దాటగానే 1౬ర్పు ప్రజల అమాయకత్వం కాదనీ |" ఫృశానం చేరుకునేలా *ర్పు నివురుగప్పిన నిప్పనీ . |, ఇందిరమ్మ రాజ్యం మీ తదుపరి తీర్పులో (| అభివృద్ధి అయిపోయింది! నొక్కి చెప్పండి మిస్టర్‌ జఫ్టిస్‌! | | |

ఇనుప ఖనిజ ఎరుమతిని నిలిపివేయాలి! ఇనుప ఖనిజంపై హక్కు ప్రజలదే. దేశ ప్రజలకు స్టీలు టన్ను1ర5 వేల రు.కే. అమ్మాలి! ప్రజల ప్రాణాల్నీ ఆరోగ్యాన్నీ సంపదనూ బలిగొంటున్న ఇనుప ఖనిజ రోడ్డు రవాణా నిలిపివేయాలి!!! ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి నెల్లూరు

ఇనుప ఖనిజ ఎరుమతిని నిలిపివేయాలి! ఇనుప ఖనిజంపై హక్కు ప్రజలదే. దేశ ప్రజలకు స్టీలు టన్ను15 వేల రు.కే. అమ్మాలి! ఇనుప ఖనిజ రోడ్డు రవాణా నిలిపివేయాలి!!! రా 40" ఉర రు ప్రచురణ కాలం: ఆగప్టు, 2008 శ 'ప్రతులుః 5000 వెల:5్‌, 00 * ర్‌ (1 క. ల ఇ ఖో యుగ యా మం ప్రతులకు; నుణీ బుక్‌ స్టాల్‌ మ్రెత్తీ బుక్‌ వస్‌ సండే మార్కెట్‌ జలీల్‌ వీధి నెల్లూరు-1 కారల్‌మార్స్‌ రోడ్‌ విజయవాదడ-2ై వివరాలకు: జ్పెకిషోర్‌ బాబు, కన్వీనర్‌, ఇనుప ఖనిజ వ్యతిరేక కమిటి, రైతుకూలీసంఘం(ఆం.్ర.)అఫీసు, జనశక్తి నగర్‌, నెల్లూరు-524 004= దూరవాణి: 0861-2849519

గాడా అ మ వాల మా అనాను పాన. టభనన | మంద ము మాట్‌ | వా ఆద, జి శ | (భుత్వం వం | / కే ర్చుకుంది. ర్‌ హుం కదోతను క దారి (టు . రేవులో బెర్తు (వైవేటు గా | రెలు న్‌ హో నక గ క | బైలు మార్ల ని బ్‌రును ల ము | రో వూర్తి ంది రేవుకు రోడ్డు, వు | ఇనుప 2007వ ళు తాలేదు ను ఓబు' ఖనిజ ఎగు, సంవత్న అప ॥ న! ౧వ నంద శరం ఆరంభ! దు. | | గారల ౫ గనుల నుంది ా* నా [లని నువ వజ ్రంలోం న | జాన్నీ మో; ఖనిజాన్ని- ఖః నన ా | నహ ల బర రెడ్రి గా సపురంజిల్లా | | ౧వ వేగా, ని లారీ - పెరాస్సే వ య్‌ న న్నంకు వచ్చా ఇనువ క | వనున': (పారం గ్‌ ల | న్‌ నుమోను నా యు న | 08 జులై ఇనుప లా గ వ | మరో జా మొదట్‌ వార ద్‌ ఢీకాటి నర పెళ్ళీ జ ల | ఢీకాని 22 1 న్ని కృష్ణపట్ల ౧లో ఎ.ఎన్‌, ర మందిని లం పదరా ప [గింది ఈ గె న్‌ ల | మౌ ధట విడిగా వ . ళ్‌ కోళూ ప్రజలూ- నా న . క్‌ రో లి వంద ఆర్‌ ప మో న వ అలాస్లోడ వక్క గ్రామా! ప్రమాదాల్లో 'దాల గ | ఈ ఘో న్న ఇళ్ళలోకి మృత్యు ప నావ లు | తరబడి రాస్తా, న టవ వ ల " | వోమీలి స్తారోకోలు చే ప న కా | మూ చ్చారు ద వా | (గ్రహం న నా. హా త్తో మెనీ నిక మా - | 4న పోర్టు నెక ఇ చల్లడా రాయ బం _ | (గ్రామన్తు క్వూరి సిజి లు సాగుతూ రు జ వ వగ న్నాయి. రా | భం కిందవడది లే ప్పుర్లను న + గా ందపది చ పోవడంతో అనా వానా? మనాలి . శాఖ అలా వినని అాఖ . | | వాం వణ లా | ణు జ

క న న నన ॥. | | |

  • ఎన్ని మానవ (ప్రాణాలు హననమవుతున్నా ప్రభుత్వ | | యంత్రాంగానికి బీమ కుట్టినట్టయినా. లేదు. దేశ్కీ విదేశీ | | పెట్టుబడిదారుల ధనదావాం ముందు జనం (ప్రాణాలు | తృణవాయం. | ల నముద్ర తీరంలో ఉప్పు పండించే రైతులు కూడ రోడ్లపైకి | |] వచ్చారు. లారీలు వెదజల్లుతున్న ఇనుపధూళి ఉవ్ఫుకొటార్లను | | కమ్మివేసి పనికిరాకుందా చేసింది. మత్స్యకారుల జీవితం కూడ | | ఛిద్రమయింది. | | పోర్టు ప్రారంభోత్సవానికి సోనియా 'అమ్మ” నెల్లూరు వచ్చిన | [సందర్భంగా ఆమె వర్చటనకు ఈ ఎర్రమట్టి దుమ్ము సోకకుందా | గ వుండడానికి మాత్రమే 8 రోజులపాటు (జులై 25 నుండి 27) గ || లారీలు ఆపాడు. జనం ఆ మూడు రోజులూ ఎంత సంబరపద్డారో! శ | ప్రజల (ప్రాణాల్లూ వారి జీవనాధారమైన వషశువులూ, | ం ఆస్తులూ, వారి ఆరోగ్యాలూ ఎంతగా బలయినా- ధనదావాంతో | | మన జాతీయ నంవదను విదోశాలకు తరలించడం | | ఆవకవోవదడంపట్ల న్ఫందించిన రైతుకూలీ నంఘం (ఆం.ప్ర | చొరవతో ఇనువ ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి ఏర్పడింది. | | (ఈ కమిటీ రిపోర్టు అనుబంధంలో చూడగలరు.) | | రోడ్డు మార్గంలో ్రజలు చదుతున్న 'ఇబ్బందులు ఒక | ॥1 భాగం, ఇనుప ఖనిజ రవాజూ దేశ వ్రజల ప్రయోజనాలకు | | ఎంతో వోనికరం; దేశ (ద్రోవాకరం. భవివ్యత్‌ తరాలకు, | | చేశాబిన్చద్ధికి అవసరమైన ఇనుప ఖనిజ ఎగుమతి నిలువరించదం | | మనందరి బాధ్యత, ఆ కర్తవ్య నిర్వవాణలోకి (వ్రజలంతా ం ॥ కదలాలని కోరుతూ ఈ బుక్‌లెట్‌ని విడుదల చేస్తున్నాం. | | | | | | చపోస్నే ఇనువ ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి | [| | | | లువ వవ మం దాం వుం మాం ము యాలు లీ

ఇనుప ఖనిజ ఎరుమతిని నిలిపివయాలి! చూసీ కార్‌ చూసీ ౯ ఇనుప ఖనిజంపై హక్కు ప్రజలదే.

దేశ ప్రజలకు స్టీలు టన్ను15 వేల రు.కే. అమ్మాలి!

చమురు, బొగ్గుల వలెనే ఇనుప ఖనిజం అత్యంత విలువైనది. ఖరీదు విషయంలో బంగారం విలువైనదిగా మనం చూస్తాం. కానీ వినియోగపు విలువ రీత్యా, మన జీవితపు ప్రతి అడుగులోనూ ఇనుము లేకుండా మనం బ్రతకలేం.. రక్తంలో ఇనుము తగ్గితే రక్తహీనత వచ్చి రోగాలపొలయినట్లే ఇనుము లేనీ సమాజం కూడ మనుగడ సాగించడం కష్టం. ఆధునిక సమాజంలో ఇల్లు కట్టుకోవాలన్నా, రోడ్డు వేయాలన్నా, రైళ్ళు నడవాలన్నాా ఓడలు, కార్డు, పరిశ్రమలు అన్నిటి తయారీలోనూ ఇనుము అత్యంత కీలకమయినది. ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణంలో లెక్కలలో పెరిగిన స్టీలు ధరల వంతు 21" శాతంగా వున్నదంటే ఇనుము ప్రాధాన్యత ఎంతో, ఎన్ని రంగాలపై దీని ప్రభావం వుందో అత్థం చేసుకోవచ్చు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో షోలిస్తే మనం పరిశ్రమలు నెలకొల్పుకోవడంలోనూ-రోడ్డు, రైలు, నౌకా రవాణా, ఆటోమొబైల్‌ పరిశ్రమల్లోనూ ఇప్పటికి సాధించిన దానికన్నా వందల,రెట్లు మన పునాది రంగాన్ని (ఇన్‌ప్రాస్టక్చరు) బలపరచుకోవలసి వుందన్నది అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. ఈ ముందు చూపుతో ఆలోచించినప్పుడు మన దేశంలో. వున్న ఇనుప ఖనిజ నిల్వలను లెక్క వేసుకుని భవిష్యత్‌ అవసరాలరీత్యా భద్రపరచుకోవాలి. కూరగాయలు, పాలలాగా వెంటనే వాడుకోకపోతే చెడిపోయే వస్తువు కాదు గనుక నిల్వలు వుంచుకోవడంలో ప్రమాదమేమీ' లేదు ఖనిజ నిల్వలు వ్యక్తిగత అన్తులు కాదు

వలస పాలన కాలంలోనే భూగర్భంలో లేదా జల గర్భంలో దొరికే ఏ నిక్షేపాలయినా వ్యక్తుల సొంత ఆస్తిగా కాక దేశ ప్రజలు మొత్తం అనుభవించాల్సినవిగా గుర్తించారు అది బొగ్గుగానీ, చమురుగానీ, సున్నంగానీ, గ్రానైట్‌ గానీ, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం -బంగారంతో సహా ఎక్కడ ఏది లభ్యమయినా అది జాతి మొత్తానికి సంబంధించిన ఉమ్మడి సొత్తుగానే పరిగణిస్తున్నాం. అందువల్ల వీటిని ఉపయోగించుకొని మనకు కావలసిన పరిశ్రమలు నెలకొల్పుకున్నా ఎగుమతులు చేసినా ఆ వచ్చే ఆదాయ వనరులు జాతీయ సంపదలో భాగం కావాలి. మొదటి మన ప్రజల అవసరాలు తీర్చడం- ఆ తర్వాత రాబట్టగలిగితే విదేశీ వాణిజ్యం చ్వారా లాభాలు రాబట్టడానికి పూనుకోవడం సహజంగా ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడే ముడి ఖనిజాలను అమ్నుకోవాలా లేక ఆ ఖనిజాలి,

నుండి వస్తువులను తయారు చేసి అమ్ముకోవాలా అన్నది కూడ ప్రభుత్వాలు ఆలోచించాలి. నాటి వలస పాలకులు మన దేశంలో పండిన ప్రత్తిని కారుచౌకగా కొని దాన్ని తరలించుకెళ్ళి లండన్‌లో బట్టల మిల్లుల్లో ఉత్పత్తి అయిన బట్టల్ని ఎక్కువ రేట్లకు మనకే అమ్మి లాభాలు చేసుకున్న అనుభవం మనకుంది...

జాతీయవాద దృక్పధంతో ఆలోచించే పాలకులు అయినా, కనీసం ప్రజల పట్ల బాధ్యత వున్న ఏ పొలకులయినా దేశ సంపదను విదేశాలకు - అదీ కారుచౌకగా అసలు తరలించరు. అయితే మన స్వతంత్ర పాలకులు ఏం చేశారో చూద్దాం. విద్రోహకరమైన గనుల విధానం- నష్టాలతో జపాన్‌కు ఎగుమతులు

గనులను తవ్వితీయడం మన దేశంలో రెండు రకాలుగా జరుగుతోంది. స్టీలు పరిశ్రమ పెట్టుకునే వాళ్ళకు మైనింగు లీజుకిచ్చి, భూములు కేటాయించి వాటి నుండి ప్రభుత్వం సీనరేజి వసూలు చేసుకోవడం. రెండవది ప్రభుత్వమే గనులు తవ్వడం. ఇందుకోసం ఎన్‌.ఎం.డి.సి. (నేషనల్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్బోరేషన్‌-జాతీయ గనుల అభివృద్ధి సంస్థని ఏర్పాటుచేసి ప్రభుత్వరంగంలోనే ఖనిజాల్ని వెలికితీసి అమ్మడం రెండో పద్ధతి. గని దగ్గరే పరిశ్రమ పెట్టడం అన్నిచోట్లా సాధ్యంకాదు గనుక పరిశ్రమకు అనువైన చోటికి రవాణా సౌకర్యం కల్పించడం కూడ గని కార్యకలాపంతో ముడిపడిన కీలకమైన అంశం అవుతుంది.

"ఇనుప పరిజ్రమ విషయానికొస్తే 1906లో స్టీలు కర్మాగారాలు నెలకొల్పిన టాటాలాంటి వాళ్ళకు గనుల్ని సొంతంగానే (కాప్టివ్‌ మైన్స్‌) కేటాయించారు. గనులు స్వతహాగా లేని పరిశ్రమలకు ఎన్‌.ఎం.డి.సి. సరఫరా చేసేది. జపాన్‌లో స్టీలు పరిశ్రమకు ఇనుప ఖనిజం అవసరమై మన పాలకుల్లో సంప్రదింపులు జరిపారు. మధ్యప్రదేశ్‌లోని బైలదిల్లా గనుల నుండి విశాఖపట్నం ఓడరేవుకి చేర్చి అప్పగించేలా మన పాలకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం కిరండల్‌ రైలుమార్గ నిర్మాణం, విశాఖ పోర్టు అభివృద్ధీ జపాన్‌ ఇచ్చిన అప్పుతో 1970లలోనే చకచకా జరిగిపోయాయి.

అయితే ఆనాటి లేక్కల ప్రకారమే గని నుండి ఇనుప ఖనిజాన్ని వెలికితీయడానికి అయిన ఖర్చు టన్నుకు 70 రూ.లు. కాగా టన్ను రూ.47కే జపాన్‌ పారిశ్రామికవేత్తలకు అమ్మారు. (జపాన్‌ ఇచ్చిన అప్పులువడ్డీతోసహా తీర్చాల్సిందేనన్న విషయం మరచి పోకూడదు). తీరా జపాన్‌లో స్టీలు పర్తిత్రమ సంక్షోభానికి గురయి ఎగుమతులు నిలిపివేయమంటే ఇనుప గనులు మూసివేశారు. 1978 ఏప్రిల్‌లో ఫనీ కోల్పోయిన కార్మికులు సమ్మెచేస్తే రాత్రి వేళ నిద్రిస్తున్న కార్మికులపై కాల్పులు జరిపించింది నాటి జనతా ప్రభుత్వం.

నష్టానికి సిద్ధపడి దేశ సహజ సంపదను ఎందుకు. ఎగుమతి చేస్తున్నారన్న ప్రశ్నకు నాటి ప్రభుత్వాలు చెప్పిన జవాబు= గనుల నిర్వహణ ద్వారా, రవాణా ద్వారా కార్మికులకు పనులు కల్పిస్తున్నామని ఇపుడు దేశంలో స్టీలు ధరలు టన్ను 16.వేల రూ.లు నుండి (నాననా ఇనుప ఖనిజ

50 వేల రూ.ల్లుకి పెరిగి ఈ స్వక్షోభంలో ఎగుమతులు నిలిషివేయమన్న డిమాండ్‌కు ప్రస్తుత పాలకులు చెబుతున్న జవాబు కూడ ఉద్యోగాల కల్పనే. విదేశీ మారకాన్ని సంపాొదించడాన్ని దీనికి జోడిస్తున్నారు. ఎగుమతితో కాదు- పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగాలూ, లాభాలూ ముడిసరుకు ఎగుమతి కన్నా దానితో పరిశ్రమ స్టాపించడం- ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు కల్పించగలుగుతారనేది ఎవరైనా కళ్ళు మూసుకుని చెప్పగలిగే విషయం. స్టీలు పరిశ్రమలు నెలకొల్పడానికి మనదేశంలో అనుకూల పరిస్థితులు లేవా అని ప్రశ్నించుకుంటే కూడ కావలసినన్ని ఉన్నవని జవాబు వస్తుంది. 1970లలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో యువత సాగించిన ఉద్యమం ఈ సందర్భంగా గుర్తురాక మానదు. అది వచ్చింతర్వాత విశాఖ రూపురేఖలు మారడం మన కళ్ళముందున్న విషయమే. దేశంలోని అవసరాల రీత్యానూ, అంతర్జాతీయ ధరవరల రీత్యానూ ప్టీలు పరిశ్రమలను ప్రోత్సహించడం (ప్రయోజనకరం. విదేశీ మారక ద్రవ్య సంపాదన అన్న కోణం నుండి చూసినా స్టీలు అమ్మకం ద్వారానే పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ లాభాలు వస్తాయన్నది కూడ నిర్వివాదమయిన విషయం. క్షేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకుంటున్న ఎక్సైజు సుంకాలూ, అమ్మకంపన్నులు కూడ పెరిగేది పారిశ్రామిక సరుకుల నుండే. ముడిసరుకుకు మానవ (శ్రమ కలిస్తేనే విలువ ఆధారిత వస్తువులు రూపొందుతాయి. ఇనుపనిల్వలు ఎంత? ఎన్నాళ్ళ వరకు సరిపోతాయి? మన దేశంలో మధ్యప్రదేశ్‌ ఛత్తీస్మ్‌ఘడ్‌, కర్నాటక, జార్ధండ్‌, ఒరిస్సా, గోవా, మహారాష్ట్ర ఆంధ్ర, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు రాష్హ్రల్లో ' ఇనుప ఖనిజ నిల్వల్గున్నాయి. మొత్తం నిల్వలు 283.59 బిలియన్‌ టన్నులు (2359 కోట్ల టన్నులు) ఇప్పటి తాజా అంచనాల (ప్రకారం. సంవత్సరానికి 8.5 కోట్ల టన్నులు దేశంలో వినియోగమవుతుందగా 10 కోట్ల టన్నులు ఎగుమతి అవుతోంది. అంటే సుమోరు సంవత్సరానికి 20 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని వాడుతున్నారు. జనాభాలో మనకంటే ముందున్న ఏకైక దేశం ప్రస్తుతం దేశంలో వినియోగం ఏటా క.5 కోట్ల టన్నులు ఎగుమతి, చేస్తున్నది 10 కోట్ల టన్నులు. 2011-12 సంవత్సరం నాటికి దేశీయ వినియోగం 13 కోట్ల టన్నులని ప్లానింగ్‌ కమీషన్‌ అంచనా. అంటే సంవత్సరానికి మనం వాడుకునేది, ఎగుమతి కలిపి సుమారు 80 కోట్ల టన్నులకు సైర్టుగుతుంది. మొత్తం నిల్వలను , వెలికితీయలేమనీ, తీయగలిగేది కేవలం కళలో బన్నకనని నిపుణులంటున్నారు. + అంటే ఇదే వేగంతో వాడకం పెరిగితే 25, 380 సంవత్సరాల తర్వాత దేశంలో | ఇనుప ఖనిజం మిగలదన్నమాట! | విదేశీ ఎగుమతులు ఆపొలి. ననన వనన ౯

_ వివిధ దేశాల ఇనుప-ఖనిజ ఉత్పత్తి నిపుణులేమంటున్నార్లు? ప్రపంచ

దేశం ఉత్పత్తి నిల్వలు 'కూడ కొద్ది కాలానికే... (కోట్ల టన్నులు) ప్రపంచ సగటు వినిమయం చైనా 52 ఏటా 10% పెరుగుతోంది ప్రపంచంలో టెజిల్‌ 30 (నన్వ్తుతం ఎక్కువగా ఇనుము ఆస్టేలియా లా వినియోగిస్తున్న దేశాలు చైనా,. జపాన్‌, ఇండియా 15 కొరియా, అమెరికా, యూరోపియన్‌ వరిశ్రమల్లో అకిపెడ్గ వినియోగదారు

ఉక్రెయిన్‌ 7.8 న్స్‌ ద్ద

“అమెరికా ర్‌ వైనాయే. 2006 సంవత్సరంలో చైనా క్ని 58.8 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి దక్షిణాఫ్రికా ఇడ చేసింది. 2005 సంవత్సరంతో పోలిస్తే కెనడా 3 38% పెంచింది. ప్రపంచ మొత్తర స్వీడన్‌ వాక ఇనుప ఖనిజ నిల్వలు 80,000 కోట్ల వెనిజులా 2.0 టన్నులని అంచనా. ప్రస్తుతం అపారంగా ఇరాన్‌ 20 వున్నట్లు అనిపించవచ్చు. ఇదే లెక్కన మారిటేనియా న! వాడుతూపోతే నిల్వలు అంతరిస్తాయి. ఇతర దేశాలన్నీ కలసి శ3 వరల్డ్‌ వాచ్‌ ఇవిస్టిట్ట్యూట్‌కి చెందిన వెస్టర్‌ మొత్తం ప్రపంచం 169.0 + || బౌన్‌ అంచనా ప్రకారం సంవత్సరానికి

(2006 సంవత్సరానికి అమెరికా 2% వాదకం పెరుగుతుందనుకున్నా 68

జియలాజికల్‌ నర్వే లెక్టులు) సంవత్సరాల వరకే నిల్వలు సరిపోతాయి. చైనా, అక్కడ దేశీయంగానే సుమారు 60 కోట్ల టన్నుల ఖనిజాన్ని వాడుతున్నారు. వాళ్ళ దేశంలో అపార నిల్వలు ఉన్నప్పటికీ దాన్ని 'అట్టిపెట్టుకొని మన దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ పాలకుల,ముందు చూపునూ-మన పాలకుల విచ్చలవిడితనాన్నీ బాధ్యతారాహిత్యాన్నీ భవిష్యత్‌తరాలకు చేస్తున్న ద్రోవాన్నీ అర్ధం చేసుకోవచ్చు.

10 శాతం చొప్పున అవసరాలు 'పెరుగుతాయనుకుంటే ఈ నిల్వలను ఇలాగే ఎగుమతి చేస్తూపోతే 25, 30 సంవత్సరాల తర్వాత మన నిల్వలు ఖాళీ అయి-చీలలూ, గుండు సూదులు కూడ విదేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మైనింగ్‌రంగంలోకి (ప్రైవేటు కంపెనీల ప్రవాహం '

ఒకప్పుడు ఎన్‌.ఎం.డి.సి. వంటి ప్రభుత్వ సంస్థలే ఖనిజాల్ని వెలికి తీసేవి. ఎగుమతి కార్యకలాపాలు నిర్వహించేవి. అయితే సరళీకరణ, (ఫైవేటీకరణ, ప్రపంచీకరణ క్రమంలో చట్టాలన్నిటితోపాటు మైనింగ్‌ చట్టాలు కూడ , సవరణ చేశారు పాలకులు. పరిశ్రమ ఉన్నవారికే మైనింగ్‌ లైసెన్సులిచ్చే స్థానంలో (ప్రైవేటు అమ్మకం కోసం కూడ మైనింగ్‌ త్ర ననన ఇనుప ఖనిజ

లీజులిచ్చారు. లక్ష కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడిని ఆకర్షించే పేరిట గనుపీ విధానాన్ని సవరించి ప్రభుత్వం బొగ్గు, ఇనుము, బుక్సైటు, బంగారం తదితర ఖనిజాల గనుల రంగంలోకి విదేశీ, స్వదేశీ (ఫైవేటు పెట్టుబడులకు అనుమతించింది. = ఇనుము రంగంలోనే 2 లక్షల 78 వేల 778 చదరపు మైళ్ళ ప్రాంతంలో, ముడి ఇనుప ఖనిజాన్ని తవ్వకొనేందుకు, ఆ ఖనిజాన్ని ఎగుమతుల ద్వారా అమ్ముకునేందుకు (ప్రైవేటు కంపెనీలకు కేంద్రం అనుమతులిచ్చింది. ఇదికాక పలు గనులను రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. మన రాష్ట్రంలో ఓబుళాపురం గనుల తవ్వకానికి గాలి జనార్ధనరెడ్డికి 26 హెక్టార్లు (65 ఎకరాలు) అనుమతించారు. బ్రాహ్మణి స్టీలు పెడతామని మళ్ళీ మరో 104 హెక్టార్లు (260 ఎకరాలు) కేటాయించడం ఈ క్రమంలో జరిగిందే. దీంతో ప్రభుత్వరంగ మైనింగ్‌ కంటే పైవేటురంగ మైనింగు పెరిగింది. ఇనుప ఖనిజ ఉత్పత్తి కోట్ల టన్నులలో 2000-01 కతర్‌ 3.78 808 (పైవేటు రంగపు- ఈ ఉత్సాహానికి కారణం అంతర్జాతీయంగో పెరిగిన ఇనుప ఖనిజ ధరలే. టన్ను 2000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు ప్రస్తుతం 7500 రూపాయలకు ఎలా పెరిగిందో పట్టిక చూడండి. ఇనుప ఖనిజ ధరలు పెరుగుదల (టన్నుకు రు.) జాతీయ మైనింగ్‌ కార్పోరేషన్‌ (ఎన్‌,ఎం.డి.సి.)(64% ఇనుము) 1300-2200 2000-8500 పైవేటు గని కంపెనీలు 2200-8000 2500-5500 (ప్రస్తుత ప్రైవేటు కంపెనీల ధరలు ఇనుప సుద్దలు టన్నుకు 2500-7,500 63% (గ్రేడు మధ్యరకం టన్నుకు 2500-4000. _ స్ట (ఎకనమిక్‌ బైవ్స్‌, 6౬8 08 ప్రభుత్వ మైనింగ్‌ కంపెనీని మూసేయించిన (పైవేటు. గనులు ప్రైవేటు రంగానికి పెరిగిన ఈ లాభాపేక్ష తమ పని తాము చేసుకుపోవడానికి పరిమితం కాలేదు. ప్రభుత్వ మైనింగ్‌ కంపెనీని మూసేయించేందుకు పధకం వేశారు. కర్నాటకలో కుంద్రేముఖ్‌ ఇనుప ఖనిజ కంపెనీ, ఎన్‌,ఎం.డి.సి.లు కలసి ఖనిజం తవ్వితీసి ఇనుపగుళ్ళుగా మార్చి ఎగుమతి చేస్తున్నాయి. గనుల నుండి మంగుళూరు ఫ్యాక్టరీదాకా 67 కి.మీ. దూరం పైపులైను వేసుకుని ఇనుపగుళ్ళ తయారీ చేసే పనిలో 2500 మందికి విదేశీ ఎగుమతులు ఆపాలి నాన

ఉద్యోగాలు కల్పించారు. 1850 కోట్ల వ్యాపారం చేసిన కంపెనీ ఈ 2004 సంవత్సరంలో 129 కోట్ల రూపాయలను డివిడెండ్‌గా' పంచి పెట్టింది 650 కోట్ల రూపాయల నికరలాభాన్ని సాధించింది.

ఈ కంపెనీ పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదన్న సాకు చూపి కాలుష్య నియంత్రణ అథీకృత కమిటీని లోబరచుకుని తప్పుడు రిపోర్టు వ్రాయించి సుప్రీంకోర్టులో దావా వేశారు (ప్రైవేటుగని యజమానులు. 3] డిసెంబరు 2005నాదు ఆ కంపెనీ మూతపడి 2500 మంది కార్మికులు వీధిన పడ్డారు. (పైవేటురంగం ఎంత శక్తివంతమైనదో- ప్రభుత్వ అధికారుల్నీ సుప్రీంకోర్టుతో సహా ఎలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన నిరూపించింది. = “ప్రైవేటు కంపెనీల

లాభాలు-కర్నాటక చట్టప్రకారం కర్నాటకలో 64 కంపెనీలకే ఇనుప గనులు తవ్వకానికి అనుమతులున్నా 1200 మంది కరిగారూర్‌ " 1500 కొట్లు | ప్రైవేటు వ్యక్తులూ, సంస్థలూ అక్రమ తవ్వకాలు మినరల్స్‌ సేల్సు 1000 కోట్లు" | సాగిస్తున్నారు. ప్రభుత్వానికి రాయల్టీలు, ఇతర బళ్ళారి 560 కోట్లు | పన్నులూ ఎగవేయడానికి దొంగ పేర్లూ. దొంగ వి.జి.మైన్సు 560 కోట్లు (పే బిల్లులూ, నకిలీ సంతకపు పత్రాలతో ఇనుప రాం “ా ఖనిజాన్ని తరలిస్తున్నారు. బళ్ళారి -హోస్పేట ప్రాంతంలో ప్రభుత్వ గనుల-భూముల-అరణ్య ప్రాంతాల నుండి రోజూ 7500 లారీల్లో 8 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం తరలివెళ్ళినా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం* 80 కోట్ల రూపాయలే. వీరు ప్రభుత్వానికి చెల్లించేది టన్నుకు రు.11 నుండి రు.27 మాత్రమే. ట్రాక్టరు ఖనిజాన్ని స్థానికంగా రూ. 1800కు కొని అంతకు'5, 6 రెట్ల లాభాన్ని (పైవేటు పెట్టుబడిదారులు-పారిదుతున్నారు. ఈ అక్రమ'తవ్వకాల వలన కేవలం రెండేళ్ళ కాలంలో (ప్రభుత్వం 3000 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయిందని అంచనా. కర్నాటక అసెంబ్లీలో గాలి జనార్థనరెడ్డి రేపిన దుమారం

కర్నాటకలో పెరిగిన గని తవ్వకాలు ప్రైవేటు యజమానులకే గాదు. లంచగొండి ప్రభుత్వ అధికారులకూ, రాజకీయ నాయకులకూ కూడ జేబులు నింపాయి. అటవీ మంత్రిగా కుమారస్వామి ప్రభుత్వంలో పనిచేసిన చెనిగప్ప అధికారంలోకి రాగానే ఈ మైనింగ్‌ కంపెనీలపై విరుచుకుపడ్డాడు. అటవీ చట్టాలను, మైనింగ్‌ చట్టాలను, పర్యావరణ చట్టాలను ఈ కంపెనీలన్నీ ఉల్లంఘించాయని దుయ్యబట్టాడు. దీంతో లంచాల ప్రవాహం సాగింది.

కర్నాటక అసెంబ్లీలో - ప్రస్తుత కర్నాటక బి.జె.పి. ప్రభుత్వంలోని ' మంత్రి స్థానానికెదిగిన నాటి ఎం.ఎల్‌ సి. గాలి జనార్థనరెడ్డి స్వయంగా ఆరోపణలకు పూనుకున్నాడు. “ముఖ్యమంత్రి తరపున చెనిగప్ప 150 కోట్ల రూపాయల లంచాలు వసూలు చేశాడని” ఆరోపించాడు. దీంతో అసెంబ్లీలోను, కౌన్సిల్స్‌లోను దుమారంరేగి పలురోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు ్రతిష్టంభనకు గురయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి ఈ వ్యవహారాలపై విచారణ కమీషన్‌ను నియమించాల్సి వచ్చింది. శే కప -జనథక్తీ ప్రచురణ

ఒక సీనియర్‌ పోలీసు అధికారి రూపొందించిన అధికారిక రిపోర్టు ప్రకారం

“50 లీజు కంపెనీలు గత ఆర్ధిక సంవత్సరంలో 8000 నుండి 3500 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించినట్లు” పేర్మొన్నాడు. (ఫ్రంట్‌లైన్‌ 11.8. 2006).

తర్వాత జరిగిన పరిణామాల్లో విచారణ కమీషన్‌ నివేదిక ఏమయిందోగానీ కుమారస్వామి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ఇనుపగని యజమానులైన గాలి జనార్థనరెడ్డి గారి బిజెపి అధికారంలోకి రావడానికీ, ఆయన మంత్రి కావడానికీ దోహదపడింది ఇనుప గనుల లాభాలేనన్నది మనకందరికీ తెలిసిన విషయమే. రైతుల భూముల గుంజివేత-కార్మికుల అమానుష దోపిడి

ఈ గని ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతుల అవస్థ చెప్పనలవి. కాదు, అసలే దుర్భిక్షంతో, వానలుపడక, పంటలు పండక ఈ ప్రాంతంలో గనుల తవ్వకంవల్ల ధూళి పొలాల్లో పడి పంటలను నాశనం చేశాయి. ఫలిథంగా వారి పాలాలను గూడ గని యజమానులకే అప్పజెప్పి కూలీలుగా మారాల్సిన దుస్థితికి గురయ్యారు. 1నుండి 4 ఎకరాలున్న వేలాది చీన్నరైతులు తమ పొలాల్ని ఈ తవ్వకాలకే వదిలేశారు.

క్వారీల వద్ద కంకర కొట్టి రకరకాల సైజుగా చేసినట్తే-ఇనుప గనుల వద్ద కూడ తవి్వితీసి చేతో రకరకాల సైజులుగా ఇనుప ఖనిజున్ని మలివే పనిలో వేలాది కుటుంబాలు పనిచేస్తున్నాయి. వీరు వుండేందుకు తాటాకు పాకల్ని కూడ గని యజమానులు వేయలేదు. ప్లాస్టిక్‌ పట్టలత్రో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. మంచినీటి కోసం .5 క మీ. దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు. దాంతో అంత దుమ్ము మధ్యలో వుంటూ కనీసం రోజూ స్నానం కూడ చేయలేని దుస్థితి. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే రాత్రి పూటే సాధ్యం. దీంతో వీరు పలు జబ్బుల పాలవుతున్నారు. వారానికి ఒక రోజు సెలవు తీసుకుని ఆ రోజే బట్టలు ఉతుక్కోవడం, ఇతర పనులు చేసుకుంటున్నారు.

ఇక శ్రమ దోపిడి విషయానికొస్తే కుటుంబమంతా తెల్లారిన దగ్గర నుండి” చేకటి పడిన వరకు పనిచేస్తే ఇద్దరు సభ్యులు కలసి వారానికి రు.350 నుండి 500 రు. వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. కరువు వల్ల గ్రామా నుండి కూలీల వలస ఎక్కువ కావడంతో పుట్టిరాయికి (అక్కడి కొలత) ర్థు.8 చొప్పున 'ఇచ్చే కూలిని రు. 5కి దిగకోశారు. ఖనిజం ధర. పెరిగినా కార్మికుల కూలి దిగకోసి లాభాపేక్షను ప్రదర్శిస్తున్నారీ గని యజమానులు. బాల కార్మికులు కూడ వేలాదిగా గనుల్లో పని చేస్తున్నా ఏ ప్రభుత్వ యంత్రాంగమూ పట్టించుకోవడం లేదు. కార్మికుల శ్రమను రాబందుల్లా కొల్లగొట్టి అమానుషంగా వారిని పీల్చి పిప్పి చేస్తున్నారు. _

దేశాభివృద్ధిని గురించి గొప్పలు చెప్పే పాలకులకు ఆ సంపద సృృష్టికర్తలయిన కార్మికుల, రైతుల బాగోగులు పట్టవు ఇందుకు కారణం పాలకుల వర్గ స్వభావమే. సంపన్నుల, బడా బాబుల అభివృద్ధే దోపిడీ పాలకుల దృష్టిలో దేశాభివృద్ధి. సామ్రాజ్యవాద చెరలో విత్తనాలు. ఇడా ననిన క్షే

రైల్వే రవాణాతో నాశనమైన పంటలు గని నుండి ఇనుప ఖనిజ రవాణా కోసం రైల్వేలు కూడ రైతుల్ని వినాశనానికి గురి చేస్తున్నాయి. బళ్ళారి.నుండి విశాఖ-చెన్నై ఓడరేవులకు తరలించదానికి గుంతకల్లు-బళ్ళారి సెక్షన్ల మధ్యన గల హద్దినగుండు రైల్వేస్టేషన్‌ యార్డులో లోడింగ్‌ పాయింటును ఏర్పరచారు. రోడ్డుమార్దంలోని రైతులూ, స్టేషను చుట్టుపట్ల రెండు కి.మీ దూరం వరకు గల రైతులంతా తమ పొలాలు దుమ్ము వల్ల దెబ్బతింటున్నాయనీ, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనీ- వరుస కరువులతో అల్లాడుతున్న తమ జీవితాలను ఈ రవాఖా మరింత నాశనం చేస్తుందనీ ఆందోళన చేశారు. అయినా రైల్వేశాఖ పట్టించుకోకుండా గని యజమానులకోసం ఏర్పాట్లు చేసి పెట్టింది. ఇనుప ఖనిజ ఎగుమతుల్ని ఆపణోమంటున్న పారిశ్రామికవేత్తలు = ప్రభుత్వం అనుసరిస్తున్న వలసపాలన నాటి లాగే- ఇనుప ఖనిజ | ఎగువుతి విధానం జాతికి ఎగుమతి-టఉక్కు దిగుమతి! నష్టదోయకమని, అభివృద్ధికి దోహదం టాటా స్టీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ | శ్రేపేది కాదనీ, దేశంలోని పారిశ్రామిక, మత్తురామన్‌ మాటల్లో... వాణిజ్వ సంఘాలయిన సి.ఐ.ఐ., ఫిక్కీ '._ “*జక్కు వినియోగం మన దేశంలో ఫ్‌ య జాతీ టై సంవత్సరానికి 60 లక్షల టన్నుల నుండి కోటి | *సొమ్‌లు నిమ ర్భించాయి. జాతీయ టన్నుల చొప్పున పెరుగుతుంది. ...రాబోయే | వనరుగా వున్న ఉన్నతన్థాయి ముడి 5 సంవత్సరాల్లో (2018) నాటికి మనం 3 || ఇనుమును (ఎగుమతి చేసేది నాణ్యమైన 1/2 కోట్ల టన్నుల నీలును దిగుమతి ఇనుమునే!) సంరక్షించమనీ, దేశీయ చేసుకోవాల్సి వస్తుంది. 2018 నాటికి ఈ | ఉత్పత్తులకు, అవనరాలకు అది | పరిమాణం రెట్టింపు అవుతుంది దోహదపడి దేశాభివృద్ధికి తోడ్పడుతుంది (మెట్‌కామ్‌ టైమ్స్‌, జూన్‌ 2-08-2008.) | గనుక ఇనుప ఎగుమతిని నిషేధించమనీ ఆంక్షలను" విధిస్తూ కనీసం దశలవారీ గానయినా ఆ ఎగుమతులను నిరోధించాలని ప్రధానమంత్రికీ, ప్రణాళికా సంఘానికీ విన్నవించుకున్నాయి.

ఈ ప్రతిపాదన వెనుక దేశ, విదేశీ మిలాఖతు పెట్టుబడిదారులైన మిట్టల్‌, టొట్లా, ఎస్సార్‌లాంటి కంపెనీల ప్రయోజనాలు వృన్నప్దాటికీ జాతి వనరుల లూటీని అరికట్టమన్న' సహేతుకమయిన కోరిక వుంది.

స్టీలు ధరలు భోరీగా పెరిగిన నేపధ్యంలో (ప్రధాని మన్నోహన్‌ సింగ్‌ వీరితో సమావేశమయ్యారు. ధరలు సమీప కాలంలో పెంచకుండా తమంతట తామే నిగ్రహం వహిస్తామనీ, ఎగుమతులపై సుంకాలు పెంచడం ద్వారా వాటిని నిరుత్భాహపరచమనీ కోరారు.

అయితే ముడిఇనుప ఖనిజాన్ని తవ్వుకొని, చైనాకు ఎగుమతి 'చేసుకొంటూ లాభాలను గడిస్తున్న బళ్ళారి- హోస్పేట ఇనుపగని యజమానుల సంఘం, గోవా కేం. దనన నననవవవా జనశక్తి ప్రచురణ

ముడిఖనిజ వుత్పత్తిదారుల సంఘాలు విదేశీ ఎగుమతుల.పెరుగుదల విధించరాదని వత్తిడి తెచ్చాయి. ఈ (కోట్ల టన్నులలో) కోట్ల రూలు సంఘాల యజమానులంతా కాంగైసు, | 2004205 ఆ 13,650 వల్ల (వ్రభుత్వం వీరికనుకూలంగా 2006-07 9.37 _ 18,886 నిలబడింది. గని యజమానులు వీలైనంత వేగంగా లాభాలు పిండుకోవడానికి మైనింగ్‌ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఓబుళాపురం నుండి కృష్ణపట్నం రేవుకు చేరే వాహనాల రద్దీ పెరిగిందని ప్రజల నుండి ఎంత వ్యతిరేకత, నిరసనలు వచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదనీ మనం అర్ధం చేసుకోవాలి. కేంద్ర స్థాయిలో బలమైన లాబీ-పెరగని సుంకాలు అంతర్జాతీయ విపణిలో "పెట్రోలియం రేట్లు పెరిగాయంటూ సామాన్యుల

నడ్డివిరుస్తూ గత 4 సంవత్సరాల్లో శోసార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని యుపిఏ ప్రభుత్వం "పెంచింది. అయితే ముడి ఇనుముధర అంతర్జాతీయ' విపణిలో టన్ను 2000 రూ. నుండి 5 వేలకు, ప్రస్తుతం 7? వేలకు పెరిగినా ఇనుప గని యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి. చెల్లిస్తున్న రాయల్టీ టన్నుకు 11 రూ. నుండి 27 రూ. మాత్రమే. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదనీ రాయల్టీ నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్రం చోద్యం చూస్తోంది. టన్నుకు రు. 150కి రాయల్టీ పెంచమని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంది వై.యస్‌ ప్రభుత్వం. గత అక్టోబరులోనే కేంద్రం ఈ రాయల్టీని పెంచాల్సి వుండగా ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టింది. ఎగుమతి సుంకం విషయం కూడ ఇంతే. 62% లేదా ఆపై ఇనుము గల ఖనిజంపై టన్నుకు 300 రూ, ఎగుమతి సుంకం వసూలు చేస్తున్నారు. దానికన్నా తక్కువ రకం ఖనిజంపై కేవలం టన్నుకు 50 రూ. వేస్తున్నారు. రవాణా ఛార్జీలు పెరిగాయి కదా -సుంకాలు పెంచలేమని వారికి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది కేంద్ర ప్రభుత్వం. శః

మరోవైపు ఎన్‌ ఎం డి.సి. దేశీయ పారిశ్రామికవేత్తలపట్ల పక్షప్రాతం వహిస్తోంది. విదేశీ ఎగుమతిదారులు చెల్లించే ధర కన్నా 97 నుండి 231 శాతం అధిక ధరలను వారి నుండి డిమాండ్‌ చేస్తోంది (ఎకనమిక్‌ టైమ్స్‌, 30.5 08) టన్ను స్టీలు' దేశీయ మార్కెట్‌లో రుః15్‌ వేలకే "అమ్మాలి

సహజ వనరులు అమూల్యమైనవి దేశ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వాటిని వినియోగించాలి దీనికోసం దీర్హకాల దృష్టితో సమగ్ర వినియోగ ప్రణాళికను రూపొందించుకోవాలి. భారత దోపిడీ పాలక వర్గాలకుకానీ, వారి రాజకీయ పార్టీలకుగానీ ఇలాంటి దృక్సధం లేదు కనుకనే కారుచౌకకు ఈ ఇనుప ఖనిజాన్ని కొందరికి లాభార్దనా వనరుగా కట్టబెడుతున్నారు. మనం నిల్వలుంచుకుని అవసరాల ,మేరక్షు పొదుపుగా వాడుకునే బదులుగా) ప్రవాహంలా విదేశాలకు తరలిస్తున్నారు దేశీయంగా వినియోగం సామ్రాజ్యవాద చెరలో విత్తనాలు. మననవ నవనవ 11 పే

8:5 కోట్ల టన్నులుండగా, 18.5 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కనుకనే ఇనుప ఖనిజం ఎగుమతులను వెంటనే ఆపివేయాలి. గనులరంగాన్ని ప్రభుత్వ అజమాయిషీ లోనే వుంచాలి. " ఇది మొదటి చర్య అవుతుంది. ప్రైవేటీకరణ పేరిట ఉక్కుమిల్లులను కూడా

నిర్మించుకునేందుకు మిట్టల్‌ (60 లక్షల టన్నులు), జిందాల్‌ (66 లక్షల టన్నులు), పోస్కో (120 లక్షల టన్నులు) వంటి బహుళజాతి కంపెనీలకు అనుమతినిచ్చారు. దేశంలో నేడున్న స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం కంటే ఈ మూడు కంపెనీలకు అనుమతినిచ్చింది రెట్టింపుగా వుంది. మన సహజ వనరులనూ, శ్రమశక్తినీ కారుచౌకగా వినియోగించుకుని, స్టీలును విదేశాలకు తరలించుకుపోతారు. కనుక దేశ అవసరాలకు తగిన ఉత్పత్తి సామర్దాన్ని మాత్రమే వీరికి అనుమతించాలి. అంతేకాక ఈ రంగంలో సామ్రాజ్యవాదుల పెట్టుబడులను ఏ రూపంలోనూ అనుమతించరాదు. అప్పుడు*+మాత్రమే మన.దేశ సహజ వనరులను మన (ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా వినియోగించగలుగుతాం.

అలాగే ధరల నిర్ణయంలో కూడా ప్రభుత్వం తన నియంత్రణా అధికారాలను తిరిగి చేపట్టాలి. మార్కెట్టు శక్తులే ధరలను నిర్ణయిస్తాయంటూ ప్రభుత్వం ధరలను 'నియంత్రించే బాధ్యతను వదలివేసుకున్నది. ఫలితంగా దేశీయంగా ఇనుము, ఉక్కు ధరలు అనూహ్య స్థాయికి పెరిగిపోయాయి. గత ఐదారేళ్ల కాలంలో ఉక్కుధరలు 15 వేల నుండి 55వేల రూ.ల వరకూ పెరిగిపోయాయి. ప్రభుత్వం కోరినందున స్టీలు మిల్లులు మూడు నెలలు తమ ధరలను దాదాపు 40 వేల రూ.గా అమ్మాయి. అయినా అన్ని మిల్లులు బాగా లాభాలనే గడించాయి. ఉదా॥ విశాఖ స్టీలుకు జులై నెలలో 150 కోట్ల లాభం వచ్చింది. మార్కేట్టులో పోటీతో సరసమైన ధర వస్తుందన్హు సిద్ధాంతం తప్పనీ, ప్టీలు మిల్లులు అంతులేని అధిక ధరలకు"అమ్ముతున్నాయనీ స్పష్టమైంది. అసలు ఖర్చు ఎంత?

టన్ను ఇనుప ఖనిజానికి ప్రభుత్వం వసూలు చేస్తున్న రాయల్టీ గరిష్టంగా 27 రూపాయలు. గని నుండ్రి ఖనిజం వెలికి తీయడానికి అవుతున్న ఖర్చు బళ్ళారి గనుల్లో (ప్రసుత్తం 250 రూ.గా చెబుతున్నారు. దీన్ని స్టీలు ఫ్యాక్టరీ వరకు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చును, ఇనుప ఖనిజాన్ని శుద్ధిచేసి, వేడిచేసి తగిన రూపంలో మలచడానికి అయ్యే ఖర్చును కలిపితే అదే టన్ను స్టీలు ధర. దీనిపై (ప్రభుత్వం వసూలు చేసుకునే ఎక్సైజు సుంకాలు, పన్నులు వగైరా కలిసి మార్కెట్లో ధర నిర్ధారించాలి. టన్ను స్టీలు తయారీకి 2 టన్నుల ముడి ఖనిజం, 1 టన్ను కోకింగ్‌ బొగ్గు, ఇంకా ఫె[రో అల్లాయిస్‌ అవసరమవుతాయి. స్వంత గని లేని విశాఖ స్తీల్లు ప్లాంటు ప్రకటించిన రేట్ల ప్రకారం ఫైన్స్‌ టన్ను రు. 1860కి, లంప్స్‌ టన్ను రు.2,300కి రవాణాతో కలిపి చేరుతుంది. అంటే సగటున రెండు టన్నులకు 4000 రూ. ముడి ఖనిజపు ఖర్చుకు 1 టన్ను బొగ్గు, ఇతర ఇనుప మి(శ్రధాతువులు ధరలు ఎంత కలుపుకున్నా ఉత్పత్తి ఖర్చులు రు. 10,000కు మించాల్సిన అవసరం లేదు. (ప్రభుత్వ పన్నులన్నీ కలిపినా గరిష్టంగా ఇళ్ళనిర్మాణానికి వాడే 8 ఎం.ఎం. రార్లతో సహా టన్ను ఇనుము 15 వేలకు మించకుండా. వినియోగదార్లకు అందించవచ్చు. శై వనన ననన, ఇనుప ఖనిజ

కానీ స్టీలు మిల్లులు విచిత్ర వాదన తెస్తున్నాయి. తమ ఖర్చు, దానిపై కొంత లాభమూతో ధర నిర్ణయించటం కాక, అంతర్జాతీయ మార్కెట్టు ధరకు అమ్ముతా మంటున్నాయి. ఇది కూడా చాలక ఇంకో దేశం వద్ద కొని మన దేశానికి తీసుకురావాలంటే అయ్యే రవాణా ఛార్జీలను కూడా కలుపుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే, యూరపు, దేశం నుండి కొని, బొంబాయి రేవుకు తెస్తే ఎంతవుతుందో అంత ధరను వసూలు చేస్తున్నాయి. ఇది నిలువుదోపిడీ తప్ప మరేమీ కాదు. భారత్‌ ఉక్కు ఉత్పత్తి ధర కంటే నం చత ని పర సనన

ఇం: గా క జ

కలుపుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్టునుబట్టి రేటును నిర్ణయించే పద్ధతిని ప్రభుత్వమే ఆమోదించి అవ్బలుజరుపుతున్నది. ఈ విధానం ఎంత నష్టదాయకమో చమురు విషయంలో తేలింది. కేజి బేసిన్‌లో ఒక బ్లాకును కేయిర్న్‌ ఎనర్జీ అన్న (బ్రిటీషు కంపెనీకి భారత ప్రభుత్వం అమ్మింది. దానిలో నుండి చమురు తవ్వి తీయడానికి బ్యారలుకు నాలుగున్న డాలర్లు కాగా, రాయల్టీ సెస్సులూ కలిపి పదిన్నర డాలర్లయిందని ఆ కంపెనీ చెప్పింది. దానిని అంతర్జాతీయ మార్కెటు రేటు ప్రకారం 120 డాలర్లకు పైగా అది అమ్ముకుంటుంది. అంటే మన చమురును, మనం తవ్వి తీసుకుంటే అయ్యేదానికన్నా పదిరెట్లు ఎక్కువ పెట్టి మనమే కొనుక్కొంటున్నామన్న మాట. ప్రషంచబ్యాంకు ఆజ్ఞలను పాటించిన. భారత పాలకులు భారత (ప్రజలకిచ్చిన బహుమతి ఇది.

కనుక దేశీయ ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదికగా ఉక్కు ధరలను నిర్ణయించే విధానాన్ని అమలుచేయాలి.

ప్రభుత్వరంగంలోని, (పైవేటురంగంలోని స్టీలు కంపెనీలు గడిస్తున్న లాభాలు చూసినపుడు కూడా ఇది మనకు స్పష్టమవుతుంది. 2003 వరకు నష్టాల్లో వున్న విశాఖ స్టీలు ప్లాంటు కూడ వేల కోట్ల లాభాల్లో చేరింది. గత సంవత్సరం దాని నికర లాభం రు. 1943 కోట్లు.

కొన్ని కంపెనీల లాభాలు (దాచినవి దాచగా బయటకి ప్రకటించుకున్నవి) చూడండి స్టీలు పరిశ్రమల లాభాల పెరుగుదల(కోట్ల రూపాయలలో) న్‌ తా తాం తా టాటా స్టీల్‌ ' 2728,27 3118 65 3480.52 జె.ఎస్‌.డబ్యు. 4కీర్‌ రి5్‌ 878,75 1267 19, (బిజినెన్‌ స్థాందర్హు 16 408)

విదేశీ ఎగుమతులు ఆపాలి. నాననా. కేన్‌

_ఈ వాస్తవాలను మభ్యపుచ్చడానికి అంతర్జాతీయ మార్కెట్‌లోని స్టీలు ధరను చెప్పి, దాన్ని దిగుమతి చేసుకోవడానికి అయ్యే రవాణా ఖర్చును కూడ కలిపి అంత రేటు మాకు గిట్టుబాటు కావడం, లేదని గగ్గోలు పెడుతున్నారు పారిశ్రామికవేత్తలు మన దేశ ప్రజల ఉమ్మడి వనరు అయిన ఇనుము ఉపయోగపడాల్సింది దేశంలోని ప్రజలకే. ఇంత ఇనుప వనరులు దేశంలో వుంచుకుని సగటు మనిషి ఇల్లు కట్టుకోవడానికి స్టీలు. కొనాలంటే బెంబేలెత్తాల్సిన దుస్టితి రావడానికి కారణం, గని యజమానుల లాభాలూ-స్టీలు పరిశ్రమల లాభాలూ వీటికి వత్తాసుగా నిలుస్తున్న పాలకుల విధానాలే తప్ప వేరు కాదు.

. అందుకే మన దేశీయ వనరుల్ని మన ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలన్న డిమాండ్‌తో పాలకుల్ని నిగ్గదీద్దాం. వనరుల్ని దేశ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడాన్ని ప్రతిఘటిద్దాం.

చ్‌ య " | గం ఉపమ మో బ్‌? ్‌ కా వము. " జ్ర సొ 4 ర కానని ఇనుప ఖనిజ

యో యానా.

ఇనుప ఖనిజ రోడ్డుఫ్ష్‌పాణా.నలిపవేయాలి!

మనందరికీ మహాభారతం, అందులో బకాసురుని కధ తెలిసే ఉంటుంది. అందులో బకాసురుడనే రాక్షసుడు ఊర్లమీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్లు మనుషులను, జంతువులను అడ్డు అదుపు లేకుండా చంపుకుతినేవాడు. ఏ పెద్ద మనిషి పుణ్యం కట్టుకున్నాడో కాని చివరికి ఒక ఒప్పందానికి వచ్చి రోజుకి రెండు దున్నలు, బండెడు అన్నం, ఒక మనిషిని" అతడికి సమర్పించే ఒప్పందానికి సరిపెట్టుకున్నాడు. అలాంటి బకాసురుడు చివరికి భీముని చేతిలో బలిగావడం, (ప్రజలను కాపాడడం గత చరిత్ర.

వర్తమానానికి వస్తే, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ మీద తిష్ట వేసుకున్న ఆధునిక బకాసురునికి కూడా రోజూ బర్రెలు, గొర్రెలు, మనుషులు సరిపోవడం లేదు. ఓబుళాపురం నుండి క్రిష్టపట్నం వరకు రహధారి పొడవునా వున్న ప్రజానీకం అంతా పిల్లా పాపలతో సహా ఏ రోజు ఎవరి వంతో తెలియక ఖీతిల్లుతున్నారు. భీకరమైస శబ్దాలతో, ఎర్రటి దుమ్ము రేపుకుంటూ "మృత్యు శకటాలై వస్తున్న ముడి ఇనుప ఖసిజం లారీల దెబ్బకు ప్రజలు నిశ్చేష్టులై ఏ భీముడు గక్షిస్తాడో అని అరచేతిలో ప్రాణాలుంచుకుని బ్రతుకుతున్నారు.

అయితే నేది భారతంలో దుర్మార్గం ఏమిటంటే భీముడు కూడా బకాసురునికి మిత్రుడు కావడమే. మీ సమస్త భారమూ నాదేనని ప్రజలకు చెప్పి బందెక్కి కూర్చున్న ఖీముడు బకాసురుడికి మరింతగా సహాయ సహకారాలు అందజేస్తున్నాడు.

ప్రఖ్యాత' హాలివుడ్‌ చిత్రాలలో (గ్రహాంతరవాసులు ఖగోళం మీద మూకుమ్మడిగా దాడిచేసి ప్రజల ప్రాణాలను, ఆస్తులను ధ్వంసం చేయడం చూసి సినిమా అనుకుని మనలో ఎవ్వరూ పట్టించుకోకపోయి వుండొచ్చు.

సరిగ్గా అలాగే...అంతకంటే భయ్యంకరంగా కూడా జిల్లా వీధులను ఐరన్‌వోర్‌ లారీలు శతృసేనల్లా చుట్టేశాయి. జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన మర్రిపాడు వద్ద ప్రారంభమయ్యే వేలాది మృత్యుశకటాల పరుగులు ప్రతిరోజూ, ప్రతి నిమిషమూ ఎగ్రటి దుమ్ము రేపుకొని వస్తూ ప్రజలను భీతావహులను చేస్తున్నాయి.

_ ఏ క్షణాన ఎవరి మరణవార్తను ఎవరు వినవలసి వస్తుందోనని ప్రజలు నిర్లిప్తంగా, నిస్సహాయంగా, కసిగా మాట్లాడటం రాష్ట్రంలోని అరాచకపాలనకి, గని అధినేత నెత్తుటి సనంపాదనకి అడ్డం పడుతుంది ఏడాది క్రితం గాలి జనార్ధన్‌రెడ్డి గురించి అనంతపురంజిల్లాలో వున్న అతని ఇనుప ఖనిజం గనుల అక్రమ లీజుల వ్యవహారం గురించి దినపత్రికల్లో వచ్చినప్పుడు జిల్లా ప్రజానీకం తమకు పెద్దగా సంబంధంత్లేని విషయంగా ఊహించి వుంటారు అక్కడి గనుల పొరల్లోని మట్టీ మన కళ్ళల్లోనూ, విదేశీ ఎగుమతులు ఆపొలి మనన. కేల

ఆ మట్టిలో కలిసిపోయి వున్న ఇనుప రజను మన ఊపిరితిత్తుల్లోనూ తిష్టవేస్తుందని ఎవ్వరూ అనుకొని వుండరు. ఆ మట్టిని మోసుకొస్తున్న లారీలు మన రోగ్లన్నింటినీ చిందర వందర చేస్తాయని ఊహించి వుండరు. ఇనుప ఖనిజం మోసుకొస్తున్న లారీల్సు తమ చక్రాల క్రిందే మన శరీరాలను నుజ్జు నుజ్జు చేస్తాయనీ, పశువులు, గొరైల వంటి మూగజీవాలను అడ్డూ అదుపూ లేకుండా తొక్కించి వేస్తాయని కూడా అప్పుడు ఎవ్వరూ అనుకోలేదు.

అభివృద్ధి ముసుగులో వేలాది ఎకరాల పంట పొలాలను, బంగారం వంటి ఖనిజాలను గర్భంలో దాచుకున్న గనులను అస్మదీయులకు ధారాదత్తం చేస్తూ-పేదలకు ఉద్యోగాలను ఎరవేస్తూ ప్రభుత్వం చేన్తున్న నిర్వాకం ఫలితమే ఈ దారుణాలు.

గత సంవత్సర కాలంగా...

ఓబుళాపురం గనుల్లో త్రవ్వితీసే ముడి ఇనుము (ఐరన్‌ ఓర్‌)ను వేలాది లారీల్లో కృష్ణపట్టుం పోర్టుకు తరలిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి కోసం ఈ లారీలు నెల్లూరుజిల్లాలో మర్రిపాడులో ప్రవేశించి సంగం, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు మీదుగా మొత్తం 136 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుతాయి. మరో వైపు నెల్లూరుజిల్లాలోని వేంకటాచలం రైల్వేస్టేషన్‌కు వ్యాగన్లలో వచ్చే ఐరన్‌ఓర్‌ అక్కణ్డుంచి లారీల్లో సర్వేపల్లి, ముత్తుకూర్ల మీదుగా మొత్తం 25 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుతుంది. ఈ క్రమంలో మొత్తం 15 (గ్రామాల మీదుగా ఐరన్‌ వోర్‌ లారీలు ప్రయాణిస్తాయి. మొత్తం వెంకటాచలం, మర్రిపాడుల నుంచి కృష్ణపట్నానికి గల రెండు రోడ్లలోని ఈ నలఖై ఐదు (గ్రామాలలో, రోడ్డు సెంటర్లలో నిత్యమూ దాదాపు నలఖై రెండు వేల మంది ప్రజలు సంచరిస్తుంటారు. ఇక రోడ్డు ప్రక్క జీవించే కుటుంబాల సభ్యుల్ని లెక్కేస్తే ఈ లారీల వల్ల బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే వుంది. ఆర్నెల్ల క్రితం (ప్రశాంతంగా వుండే ఈ నెల్లూరుజిల్లా కుగ్రామాలను యముడి దున్నపోతుల్లా ఐరన్‌ వోర్‌ లారీలు వేలాదిగా ముట్టడించాయ. అపరిమితమైన వీగంతో అద్దొచ్చిన మనుషుల్ని గొధెల్ని బగ్రెల్ని వాహనాలను నుజ్జు నుజ్జు చేస్తూ.... విపరీతమైన శబ్దాలతో రాత్రింబవళ్ళు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, పచ్చటి గ్రామాల ముఖాలకు ఎర్రటి ఐరన్‌ ఓర్‌ పౌడర్‌ను పులుముతూ...: రోడ్లను దుగ్గు దుగ్గూ చేస్తూ దుమ్ము మేఘాలలో, మనుషుల్ని ఈడ్ప్చుకొంటూ, వొళ్ళంతా నెత్తురు పులుముకొని మృత్యుఘంటికలు మోగిస్తూ నిర్భయంగా నిర్లజ్జగా. ..1ిర్లక్ష్యంగా కృష్ణపట్నం పోర్టుకు పరుగుతీస్తున్నాయి. ఇప్పటి వరకు 100కు పైగా రైతులు, స్కూటరిస్టులూ, కూలీలు, ఆటోదదైవర్లూ, పశువుల, గొరైల కాపరులూ, ఒక పెళ్ళిబ్బందం,. ఒక భక్త కుటుంబం" ఈ ఐరన్‌వోర్‌ లారీలకు బలయ్యారు. ఇక మేకలూ, గొర్రేలూ లెక్కలేదు. తినే అన్నంలో, త్రాగే నీళ్ళలో, పీల్చే గాలిలో ఐరన్‌ వోర్‌ కలపిపోతోంది. ధర్నాలు చేసినా, లారీలు ఆపినా, నిరసనలు ప్రకటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గం.

ఐరన్‌ ఓర్‌ తీసుకెళుతున్న లారీల క్రిందపడి" ఎవరైనా చనిపోయినప్పుడు-లారీ (డైవర్లు...ఫోన్లలో సంప్రదించి తేలికగా “పరిహారం కావాలా? లేక కేసు పెట్టుకుంటారా” అంటూ వివరాలు తెలివి “ముందు అర్జెంటుగా లారీ వదిలేయండి” అని అనగలుగుతున్నారంటే (ప్రజల (ప్రాణాలవట్ల' ఎలాంటి చులకన చూవు వుందో అర్ధమవుతుంది. లారీకి లక్ష రూపాయలపైనే ఆదాయం గని యజమానికి చెందడమే ఈ తొందరకు కారణం. అసలేం జరుగుతోంది? అధికారులేం చేస్తున్నారు?

వేల కోట్లకు పడగెత్తి, ఇటు రాజకీయాల్లోను అటు వ్యాపారంలోనూ రెండు కాళ్ళు దోపి రెండు చేతులా సంపాదిస్తున్న గాలి జనార్ధనరెడ్డి తన రాజకీయ పలుకుబడి, దబ్బు ద్వారా అధికారుల నోళ్ళు మూయించగలగడమే ఈ ఘోరాలు కొనసాగడానికి ఒక కారణం.

గాలి జనార్థనరెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడని ప్రచారంలో వుంధడం, బ్రాహ్మ్‌జీ ప్టీల్స్‌గాని, మైనింగ్‌ కంపెనీగాని,కృష్ణపట్నం పోర్టగాని రాజశేఖర్‌రెడ్డి బినామీ కంపెనీలగటూ రాష్ట్రంలోని పశుపక్ష్యాదులు కూడా చెవులు కొరుక్కుంటూ వుండడంతో ఏ అధికారి కూడా, ఏ సంఘటనపై కూడా చర్య తీసుకునేందుకు ముందుకు రావడం లేదనేది వాస్తవం.

పైగా ప్రమాదాలకు కారణమౌళున్న లారీలలో చాలా భాగం రాజకీయనాయకులకు చెందినవేనని (అవి కూడా బినామీ పేర్తతో వున్నవి) ప్రచారం వుండడంతో ఎవ్వరూ చర్య తీసుకునేంచుకు ముందుకు రావటం లేదు. జిల్లా అధికారులెవరైనా గానీ ప్రజల సొమ్మునే జీతం రూపంలో తీసుకుంటూ కూడా, తామ్ము నిస్సిగ్గుగా ఆ ప్రజలకే అన్యాయం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా పర్యావరణం, రవాణా, అర్‌ అండ్‌ బి, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు మొక్కుబడ్‌గా ఒక్క సమావేశఇ మాత్రమే నిర్వహించిన వీళ్ళు పాలనాధికారులేనా అని, అసలు ప్రభుత్వం నడుస్తున్నదా అని అనిపించక మానదు. అందులో ప్రకటించిన నిర్ణయాలు కూడ కాగితాలకే పరిమిత

అభివృద్ధి పధంలో నెల్లూరుజిల్లా అనీ, కృష్ణపట్నం పోర్టుతో ప్రజానీకానికి మహర్దశ పట్టనున్నదనీ పత్రికల్లో వచ్చిన వార్తలకు అర్ధం, మహర్దశ ఏమిటో ప్రజలకు ఇన్నాళ్ళకు విశదమయ్యింది.

పోర్టుకు వచ్చే నౌకల ఎగుమతుల, దిగుమతులకు సంబంధించిన్న సరుకుల రవాణాకు అనుకూలమైన ప్రత్యేక రోడ్డు సదుపాయం లేకుండానే తేలికపాటి రోడ్లపై 60-70 టన్నుల వాహనాలను రవాణాకు అనుమతించడంవల్ల చెడిపోతున్న రోడ్లను ఎవరి డబ్బుతో బాగుచేయిస్తారో 'అధికారులు (గ్రహించాలి. పెరిగిన పర్యావరణ కాలుష్యం గురించి సంబంధిత అధికారులను కలిసి అడిగితే ఫ్యాక్టరీలలోంచి వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకేగాని-ప్రయాణించే వాహనాల నుండి వచ్చే దుమ్ము సమస్య తమ శాఖది కాదని ఆ అధికారులు సెలవిచ్చారంటే ఇందుకు గాను మరొక పొల్యూషన్‌ డిపార్టుమెంటు ఏర్పాటు చేయాలని వారి ఉద్దేశం అనుకోవాలేమో విదేశి ఎగుమతులు ఆపాలి. ననన. శం

జరుగుతున్న ప్రమాదాల నివారణ చర్యల గురించి మరొక జిల్లా అధికారిని అడిగితే, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్దోప్పుడు కొన్ని ప్రమాదాలు సహజమని మాట్లాడటం చూస్తే ఆయన దృష్టిలో-గాలి జనార్ధన్‌రెడ్డి సంపాదించుకోవడమే సమాజాభివృద్ధి అనుకోక తప్పదు. అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ఓబుళాపురం నుంచి బయలుదేరే లారీలకు ఫైరింజన్‌ రూల్స్‌ అప్లయ్‌ చేసి-వాటిక్రింద పడిత్తే కేసు లేదని చట్టం చేసినా చేస్తారనిపిస్తుంది. ప్రజలేమంటున్నారు? రైతుకూలీ సంఘం అభ్యర్థన మేరకు డాక్టర్‌ ధనిశెట్టి లెనిన్‌ మర్రిపాడు నుండి కృష్ణష్టట్నం పోర్టు వరకు, అక్కడ నుండి వెంకటాచలం వరకు ప్రజల కష్టాలను, కసినీ ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో ప్రత్యక్ష సాక్షుల నుండి వీడియో కెమెరాలో రికార్డు చేశాడు. వందలాది ఐరన్‌ ఓర్‌ లారీల మధ్యగా రెండు రోజుల నిరంతర ప్రయాణంలో డాక్టర్‌ లెనిన్‌ స్మాన్‌ రిపోర్టును ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. ఏప్రిల్‌ 28వ తేదీన తెల్లవారు జామునే బయలుదేరిపోతూ వుండగా బుచ్చిరెడ్డిపాళెం దాటాక అంతకుముందే జరిగిన యాక్సిడెంట్‌ ఒకటి వారి మోటార్‌ సైకిల్‌కు మెల్లగా టేకులు వెయ్యమంది. సూర్యుడి లేలేత వెలుగు కిరణాలు నల్లటి తారు రోడ్డుపై పడి చీకటి తెర తొలగించే సమయంలో "“నెత్తుకి స్వాగతం పలుకుతున్న దృశ్యం, నల్లటి రోడ్డు మీద ఎర్రటి లేసులల్లిన బర్రెల శవాలు. ఒకటి, రెండు, మొత్తం నాలుగు ...ఆ వైపు రోడ్డుకు అడ్డం ఆగిన ఐరన్‌ వోర్‌ లారీ... లారీ డ్రైవర్‌ మద్యం మత్తులోనో, నిద్ర మత్తులోనో ఉండ్రి వుండాలి. రోడ్డు కవతల పొదల్లో కొమ్ము విరిగి నెత్తురు కారుతూ బిత్తర చూపులతో ఒక చిన్న లేగదూడ, ప్రక్కన రోదిస్తూ దువ్వూరుకు చెందిన అన్నమ్మ. గని7యజమానికి గనితో ఉన్న అనుబంభఖం, లారీ యజమానికి లారీతో వున్న అనుబంధం వంటిది కాదు గదా ఆ మూగజీవాలతో అన్నమ్మ అనుబంధం. అనుబంధము పోయ్మే ఆస్తీపోయే, ఉండే నాలుగు బగైెల్ని ఈ లారీలు మిఠ్లోసినాయి. అన్నీ నాశనమైపోయాయంటూ నోట్లో చీర కుక్కుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ నిస్సహాయంగా రోదించింది అన్నమ్మ. మిత్రుడు కృష్టారెడ్డిగాని, తాను గాని ఓదార్చే ధైర్యం చేయలేకపోయాము అని పేఠ్మొన్నాడు లెనిన్‌ ప్రజల ఘోష

  • ర బర్రెలు, 2 దూడలు వున్నాయి నాకు. వాటిల్లో ఈ పొద్దు నాలిగిట్ని లారీలు మింగేశాయి. ఉండే బర్రెలన్నీ ఇట్టే నాశనమయిపోయాయి. అన్నమ్మ, దువ్వూరు. 20 ననన ఇనుప ఖనిజ

  • యాక్సిడెంట్‌ చేసి బండి గూడా నిలబెట్టడంలా,.. డైరెక్టుగా ఎల్లిపోతున్నారు అయ్యా ఏందని చెప్పుకునే దానికి లేదు. భయంకరంగా మవాీ ఘోరమయి పోతున్నాయి. కిష్టయ్య, రైతు, ఆత్మకూరు,

  • రోజుకు ఇద్దరు, ముగ్గురు ఛస్తున్నారు. భయంకరంగా అల్లాడిపోతుంటే రోడ్ల మీద రోజుకు రెండు మూడు వేల లారీలు వస్తున్నాయి. రోజ్జుకు నలుగురు, ముగ్గురు పోతూనే వుంటిరి. గొద్లకు, మనుషులకు ఎంత నష్టం. ఇంకా రెండు వేల లారీలు వస్తాయంట. గవర్నమైంటు కూడా 'పట్టించుకోవడంలా. చర్యలు తీసుకొంటే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? కిష్టయ్య, నెల్లూరుపాలెం సెంటర్‌, ఆత్మకూరు.

  • లైనంతా బొక్కలు పడింది. ప్రయాణీకులకు, దోవనబొయ్యే ప్యాసింజర్లకు ఇబ్బందిగా వుంది. ఎక్కడ జూసినా ట్రాఫిక్‌ జుమ్‌లే. ఎక్కడబడితే అక్కడ దూరి ట్రాఫిక్‌ జామ్‌ చేస్తారు రోడ్డు గుంటలు పడిపోయి, మరీ దరిద్రంగా వుంది. రోజుకు రెండు వేల లారీలు పోతున్నాయి సార్‌. దే అండ్‌ నైట్‌ తోలకం. కంటిన్యూగా తిరుగుతుంటాయి. లాత్రిపూటైతే మరీ భయంకరం సార్‌. మొత్తం బందధ్లన్నీ బ్లాకయిపోతుస్నాయి. ఏ.అశ్వంతరెడ్డి , కండక్టర్‌ ఏపిఎస్‌ఆర్‌టిసి, ప్రొద్దుటూరు డిపో _. నెల్లూరు నుంచి బయలుదేరితే మామూలుగా కడపకు నాలుగ్గంటల జర్నీ. అయితే లారీల మధ్యలో పోవాలంటే ఆరు గంటలు పడుతుంది. మేము ఉదయం బయలుదేరితే ఇంటికిపోతామో లేదో అని భయపడుతున్నాము, సంగం, బుచ్చి మధ్యలో రోడ్డు బాగా లేదు. తాగి తోలుతూ వుంటారు, క్లీనర్లు తోలుతూ వుంటారు. ట్రిప్పులు కలుపుకోవాలని రాత్రిళ్ళు నిద్రలేక దైవర్లు, క్లీనర్లచేత తోలిస్తుంటారు. ఎదురొస్తున్న బండికి హెడ్‌ లైట్లు వేసినా ఆపడంలేదు. దూరేస్తున్నారు. మేం మా యూనియన్లకు కూడా చెప్పాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటుంటారేగాని పట్టించుకోవడంలా. మోహన్‌లాల్‌ దైవర్‌, ఏపిఎస్‌ఆర్‌టిసి, నెల్లూరు డిపో _ జరిగేదేముంది యాడజూసినా గుద్దుకోవడమేగదా....పొయ్యేదాన్నికి ఐరన్‌ లారీల వోళ్ళు మాకు దారి ఇవ్వడం లేదు ఇరవై వేలు పెట్టి బండి (స్కూట్‌) కొని ఈ లారీలకు భయపడి బస్సులో వస్తున్నాను. వెంకటస్వామి, మంగలి, మర్రిపాడు,

  • ఆటోల్లో పోవాలన్నా భయమేస్తుంది. ఎంత సైడిచ్చినా మాపైకి వస్తున్నార్సు సందు లేకుండా అమ్మిడమ్మిదే వస్తున్నాయి లారీలు. హజరత్‌, ప్రయాణీకుడు, మర్రిపాడు,

  • ఇంతకు ముందు ఫ్రీగో నడిచిపోతున్నాము. ఇప్పుడు అడుగు ముందుకు వెయ్యాలంటే భయంగా వుంది ప్రతి నిమిషం చూసుకొని రోడ్డు దాటాల్సి వస్తుంది, సామాన్లకు పరు మీదకు పంపాలన్నా భయంగా వుంది. పగలని, రాత్రని లేద్సు,

  • వొక్టటే లారీలు, జాగింగ్‌ కూడా మానేశా. పట్టలు కూడా కట్టుకోకుండా తెరచాప పడవలు విచేశ్‌ ఎగుమతులు ఆపాలి. ఇాాననననననడనననననననననాననానవని 2 |

పోయినట్టు పోతుండాయి. లారీలు. వాటికో రూల్సు, రెగ్యులేషను లేదు. వడంటే ఆఢ నిలపడం, క్రాస్‌ చేయడం మార్టిన్‌ దిగకుండా రోడ్డు మీద లారీ పెట్టినందువల్ల ఈ మధ్య అనవసరంగా 18 మంది చనిపోయారు. (ప్రతి (దైవరు మా షాపుకొచ్చి బ్రాంది షాపెక్కడ అని అడుగుతున్నాడు. హరికృష్ణ, షాపు ఓనర్‌, మర్రిపాడు. ఈ లారీల మూలంగా వేరుశెనగ, మిరప తోటల్లో ఫనిచేసే కూలీలు ఆటోలెక్కాలంటే భయేపడి కూలీలకు కూడా పోవడం లేదు. స్కూటర్‌లో పోతే మావాళ్ళు మాటి మాటికి ఎక్కడుండాము అంటూ ఫోన్లు చేసుకునే పరిస్థితి ఉంది. స్పీడ్‌ బ్రేకర్లు వేసే దానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. పట్టించుకోవడం లేదు. రోడ్డు మీద ఇవతలి నుండి అవతలికీ పోవాలంటే భయంగా వుంది. పెద్ద సిటీలో మాదిరిగా వుంది. ఎరికలయ్య-మర్రిపాడు

  • నా గొర్రెలు రెండూ లారీ క్రిందబడి చనిపోయాయి. పైసా నష్టపరిహారం ఈలా. మాంసం కూడా పనికి రాక రోడ్డు మీద పారేశా. లారీల వల్ల చిన్నంగా ఇబ్బంది గాదు నాయినా. గొడ్లు వోయమ్మ సూస్తూ వుండాల. అవతలికీ, ఇవతలకీ తోలుకోలేక మనుషుల్ని తొక్కిస్తా వుండరు. ఏం చేస్తాం పోలీసు కేసు గూడా లే. మస్తానమ్మ నందవరం
  • గొల్లోల్ల గొరెల్ని గొట్టేసినాయి ఇనుపలారీలు. మా వొళ్ళు గూడ బోవాల్సింది. మా బం బాగున్నింది అటు ఇటు దాటు కోవాలంటే ఇబ్బందిగా వుంది. పిల్లోళ్ళను స్కూలుకు గూడా పంపించగూడదని అనుకుంటున్నాం. సంపుకునే దానికంటే స్కూలు మానేయడమే మేలు. శ్రీను, గిరిజన కూలీ, నందవరం.
  • వోవరు స్పీడు, టెన్నేజీ వోవరు, మా చెక్‌ పోస్టు కర్రల్ని ఇరగ్గాట్టి పోతున్నారు. అడిగితే రౌడీయిజం చేస్తున్నారు. మా కర్రను గుద్దేసి వెళ్ళారు. అడిగిందానికి కొట్టారు. ఈడ రోజూ యాక్సిడెంట్‌ జరుగుళకూ వుంది. హజరతయ్య, సెక్యూరిటీ గార్డ్‌, నందవరం చెక్‌ పోస్టు, = ఏమని జపమంటవన్నా! ఇబ్బందేగడా. బస్టాండుకు బొయ్యి కూరగాయలు తెచ్చుకోలేకపోతిమి. పిల్లోళ్ళు రోడ్డు మీదకి బోతుంటే భయమేస్తుందన్నా. రేత్రిళ్ళు నిదరెక్కడా? శబ్దాలు, రోడ్లమ్మెదేవుందే మా ఇళ్ళు. యాడ లారీలు రోడ్డు దిగి మా ఇళ్ళ మీద కొస్తాయా ఇని భయం. అదేభయం ఇంతకు ముందు ఇన్ని లారీలు లేవు. రమణమ్మ, అంకమ్మ, గిరిజన కూలీలు డి.సి.పల్లె గిరిజన సెంటర్‌.
  • యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. మాబోటోళ్ళకు దినదిన గండంగా వుంది. రోడ్డు 'దాటాలన్నాా రోడ్డు పక్కన కూర్చోవాలన్నా భయమేస్తా వుంది. ఈ దుమ్మువల్ల అనారోగ్యం కూడా ఎక్కువ అవుతుంది. మా ఆడోళ్ళు రోడ్డు మీద పడిపోయినారు. ఐరన్‌ మట్టి గాయంలో బడి విషం అయ్యింది. నారాయణ హాస్పిటల్‌ దాక్టర్‌ కూడా సెప్టిక్‌ 22 2న. ఇనుప ఖనిజ

అయ్యిందని చెప్పాడు. 2 నెల్ల 20 రోజులు ఆస్పత్రిలో వ్వన్నాము. ఐరన్‌ నిండబట్టే గదా గాయం సెప్టిక్‌ అయ్యింది. _ - అబ్బుల్‌ షుకూర్‌, పాన్‌ఐంక్‌, కరటంపాడు. ం వొచ్చేవోళ్ళంతా లారీల గురించే భయపడుతూ వుంటారు. లారీలు సందుబోవీడం లేదు. అందరూ భయపడుతున్నారు. లారీవోళ్ళు మిడిమేలంగా నేముందని...నేనేముందనీ పోళూ వుంటారు. లైను మీద పోలీసోళ్ళు కలెక్షన్లు జేసుకుంటున్నారు. అధికారులు కూడా టన్నుకింతని తీసుకొంటుండారు. డ్రైవర్లకు కూడా ఎన్ని ట్రిప్పులు తోలితే అంత కమీషను, రైతులు మేమేంజైగలం. ఈ లారీలు ఈ పక్క ఆపి వేరే మార్గంలో పంపాల. ఖౌదర్‌ భాషా మరికొందరు, బాలయ్య నగరం.

  • ఒకనాటి ఇనపలారీలు రావడం ల్యా... దుమ్ముతో నిండిపోతుండాయి. కళ్ళుబోతూ వుండాయి. పది నిమిషాలు కూడా నిలవలేకుండా వుండాం, ఒకనాటి యాక్సిడెంట్లు కాదు. ఆత్మకూరు, నెల్లూరు సందులో ముఫ్పై దాకా జరిగాయి. ఆంజనేయులు, రిక్షా కార్మికుడు సంగం.
  • మరీ ఘోరంగా వుంది. మొఖం గడిగినా, గుడ్డలు 'పనికిరావడంలేదు. దుమ్ము అణిగేదానికి నీళ్ళు బడతామన్నారు. అదీ లేదు. కారు (డైవర్స్‌ సంగం:
  • మమ్ము వల్ల దగ్గు వస్తుంది. ఏ వస్తువు తిన్నా దుమ్మే. హోటళ్ళలో, అంగళ్ళలో, ఇళ్ళలో అంతా దుమ్మే. (గ్రామ పంచాయితీకి గూడా చెప్పాం. ప్రతి రోజుట్రాఫిక్‌ జుమే. రాత్రి తెల్లవారులూ ఇంతే. ఈ మధ్య కలెక్టర్‌, ఎస్‌.పి. షద్దరూ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయారు. ఈ ట్రాఫిక్‌ జామ్‌ మూలంగా రోజూ తగూలు,-కొట్లాటలే. కారు డైవర్‌, సంగం.
  • దుమ్ము సార్‌-దుమ్ము. ఐదున్నర నుంచీ ఏడున్నరదాకా ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోతున్నాం. పిలకాయలు తోలడం, డ్రైవర్లు నిదరబోతూ క్షీనర్‌తో తోలించడం వల్ల యాక్సిడెంట్లు పెరగతండాయి. యాడంటే ఆడ ఆగడం, జనాల్ని కొట్టేయడం. గత రెండు నెలల్లో 25 మంది దాకా చనిపోయారు లారీలు గుద్ది (లారీలది విచ్చలవిడి అయిపోయింది). సాయంత్రం రాత్రుల్లో నెల్లూరుకు పోవాలంటే మా వల్ల కావటంలా. దగ్గు ఆయాసం, దుమ్ము వల్ల వస్తుండాయ్యి, బళ్ళు రావడం మరీ-ఘోరంగా వుంది సార్‌. ఎవ్వరూ పట్టించు కోవడంలేదు. బైపాస్‌ రోడ్డు లేదు.లారీలు పొయ్యి షొయ్యి రోడ్లు నాశనమయిపోతున్నాయి. అంగళ్ళలో, ఇళ్ళలో దుమ్ము, డైవర్లు బళ్ళు తోలితే ఇన్ని యాక్సిదెంట్లుండవు. రఫీ, మహ్మద్‌ బొషా, బుచ్చిరెగ్దిపాళిం,
  • మా అమ్మ, మా అత్త, చిలమత్తూరు కామేశ్వరమ్మా, సీనయ్య, లక్ష్యయ్య, పేరమ్మ మొత్తం 6 మంది చనిపోయారు. నారేతలకు, చెరుకు కట్టడానికి బట్టీల పనికి కూలికి పొయ్యేవాళ్ళు. ఎత్తుబడికి దేనికిగానీ ఇంత సరకు సైసా ఇవ్యలేదు. మేం ఏంజేస్తాం? విదేశి ఎగుమతులు ఆపాలి. వననననననావననననననా నాననా. వైప్ప

కేసని'లాయర్లు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండారు. ఈ లారీలు రావడం ఘోరంగా వుంది. పొలాల్లోనికి కూలికి పాయ్యే- మా ఊళ్ళో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పద్మ మృతురాలి కూతురు -. ఐరన్‌ ఓర్‌ లారీ ఆటోను ఢీ కొట్టింది. వెంటనే ఆటో పైకెగిరింది నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఏడు మంది పరిస్టితి సీరియస్‌గా వుంది. వాళ్ళని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి వాళ్ళని నారాయణ హాస్పిటల్‌కు పంపారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఇద్దరూ చనిపోయారు. ఆడవాళ్ళు 5 మంది, మగవాళ్ళు మొత్తం 6 మంది మా ఊళ్ళో చనిపోయారు. అందరూ దళితులే. విచారణకు మాపూరికి పోలీసులు ఇంత వరకూ రాలేదు. పుష్ప, మృతురాలి బంధువు, కాగలపాొడు.

  • డస్ట్‌ అలెర్జీ, ఆస్మా కేసులు ఎక్కువ వస్తున్నాయి. 5 నిమిషాలు బజార్లో ఉంటే తుమ్ములు, దగ్గులు సర్వ సాధారణం. దుమ్ము కాలుష్యమే కాదు. కార్బన్‌ పొల్యూషన్‌ కూడా ఎక్కువగా వుంది. ఐరన్‌ వోర్‌ లారీల వోవర్‌ టన్నేజ్‌ వల్ల బ్రిడ్జిలు కూడా దెబ్బతింటున్నాయి. కోవూరు బుచ్చిల మధ్య బ్రిడ్జిలు డిస్టర్స్‌ అవుతున్నాయి యన్‌.టి.యస్‌. దగ్గర రోడ్లు దెబ్బతిన్నాయి.
  • ఐరన్‌ ఓర్‌ డస్ట్‌ లంగ్స్‌లోకి వెళితే అది అలాగే ఊపిరితిత్తులులో పేరుకుపోయి ఇప్పుడు ఇఖయటపడక పోయినా మరో పది, పదహైదు సంవత్సరాల తర్వాత లంగ్స్‌ ఇన్ఫెక్షన్స్‌ రూపంలో బైటకొస్తాయి యలెర్జీ, రియాక్షన్స్‌ ముక్కుకు సంబంధించి ఎక్కువగా వస్తాయి. లంగ్స్‌లో మార్పులు వస్తాయి. లంగ్స్‌ ఎక్స్‌షాండ్‌ అయ్యే ప్రమాదం. వుంది. గాలి పీలవడం కష్టం అవుతుంది. ముడి ఖనిజం ఇక్కడ దొరక్కుండా వుంటే చెనాకు ఎ?ఎమతి చేయడం అర్ధరహితం. మనకు అవసరం అయితే బయది దేశాల నుంచి ఎక్కువ రేటుకు కొనుక్కోనలసి వస్తుంది. అంతకు ముందు నేను క్షినిక్‌కి స్కూటర్‌లో వచ్చేవాణ్ణి. 500 రూపాయల పెట్రోలు ఖర్చయ్యేది. ఇప్పుడు ఈ దుమ్ముకు భయపడి కార్గో వస్తున్నాను 5000 రూపాయల 'వరకు నా పర్సనల్‌ వ్యయం పెరిగింది. డాక్టర్‌ సురేష్క్‌ ఎం.బి,బి.ఎస్‌., కోవూరు. కర్నాటకలో స్కూల్లు పిల్లల అవస్థలు బళ్ళారి నుండి రోజుకు 7500 లారీలు ఇనుమును మోసుకెళ్తాయి. సందూరు తాలూకాలోని తారానగర్‌ ప్రభుత్వ పారశాల విద్యార్థులకు శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరిగాయి. ఇనుప లారీలు వెదజల్లే దుమ్మే దీనికి కారణం. ఆ స్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు ఫ్రంట్‌ లైన్‌ విలేకరితో. _ " | “మా స్కూలు ముందు నుండి రోజుకు కనీసం రెండు వేల లారీలు వెళ్తోయి సాయంత్రానికల్లా పిల్లలంతా దుమ్ముతో నిండుతారు” అని చెప్పాడు. | ” _-18.8.06, ఫ్రంట్‌లైన్‌ 2డీ దడా. ఇనుప ఖనిజు

= నిన్నే ఒక ఐరన్‌ లారీ ట్రాక్టర్‌ను గుద్దేశింది. నిన్నంతా లారీలు ఆపేశారు, మొన్న ఒక మనిషిని గుద్దేశారు. ఈ వార్తలు పత్రికల్లో రావడం లేదు. ఇవి డెఫెనెట్‌గా ఆపాలి. వీటిని వుండనీయగూడదు.

  • ఉదయం చొక్కా వేసుకుంటే మధ్యామ్నోనికి నల్లగా బోతుంది. వుష్పు కయ్యల మీద పెట్టుబడి పెట్టి వుప్పు తయారు చేసే రైతులం మేము ఈ ఎర్రమట్టి మా ఉప్పు కయ్యలపై బడి 50 ఎకరాల కయ్య డ్యామేజ్‌. (ధ్వంసం) అయిపోయింది. ధర్నా గూడా చేశాం. ఫలితం లేదు.

కలశెట్టి సుబ్బారావు, గోపాలపురం.

  • ఎర్రగా మారిన బకింగ్‌ హాం కాలువ పరిసర ప్రాంతాలు.

  • సార్‌ మా వుష్పు కయ్యలన్నీ ఐరన్‌ పొడి బడి ఎర్రగా మారిపోయాయి. పోర్టోళ్ళకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం కూడా తినలేకపోతున్నాం. 700 ఎకరాల ఉప్పు కయ్యిలో 400 ఎకరాలు ఎందుకూ పనికి రాకుండా బోయింది. (ఉప్పు తీసి చూపించేడు) ఎర్రగా అయిపోయింది. మేము నష్టపోయినాం సార్‌. పోర్టోళ్ళు వచ్చేది. చూసేది. ఎల్లిపోయేది.

  • కాళ్లు దెబ్బతింటుండాయి-ఎవరికి చెప్పి వోళ్ళకి చెప్పినా-పట్టించుకోవడం లేదు. డస్ట్‌ (దుమ్ము) వల్ల కళ్ళు దెబ్బతిని పది వేల రూపాయలు ఖర్చయ్యింది. నారాయణ హాస్పిటల్‌లో చూపించినా. 'ప్రతిఘటిస్తూనే వుండా. నాయకులే అడ్డం పడుతుంటారు. ' వాళ్ళకి ముడుపులు అందుతూ వుండాయి. నాయకులు కుమ్మక్కై ఎవరూ అడగడంలా.... ఇళ్ళకు వైట్‌ వాష్‌.బదులు ఎర్రరంగు గొట్టిస్తే మేలు, మా వూర్లో ఇళ్ళ రంగు గూడాో ఎర్రగా అయిపోయినాయి. వూరంతా ఈ కలరే. ముసిలోళ్ళకు వెంట్రుకలు కూడా ఎర్రగా నెరస్తుండాయి. యాక్సిడెంట్లు అయినా పట్టించుకోవడం లేదు. నాయకులు మధ్యస్థాలు చేస్తావుండారు. వెంకటాచలం సర్వేపల్లి క్రాస్‌ రోడ్‌లో ట్రిప్పర్ల వల్ల ఎంతో మంది చనిపోయారు. 50%, 60 సార్లో పేపర్లో గూడా రాశారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ లైట్‌ డ్రస్‌ వేసుకోలేం. అందరం కార్లలో బోలేం గదా? బస్సులో, వళ్ళు, కలర్‌ పరిస్థితులు ఇంతే. నిన్న ఒక లారీ వారు కొట్టేసి వెళ్ళిపోయారు. దీని కంతులేదు. వందసార్లు అర్జీలు ఇచ్చాం అధికారులకు .. ఈ కాలేజి స్టూడెంట్స్‌ యూనిఫారం ఎర్రగా బోతుండాయి. బయటకొస్తే ఎర్రదుమ్ము, ఎండా కాలం ఎంతసేపని ఇంట్లో ఉంటాం.

| శ్రీధర్‌, వెంకటాచలం. చట్టాలేం చెబుతున్నాయి? = ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కు ఉందని భారత రాజ్యాంగం చెబుతుంది.

  • ఐరన్‌ ఓర్‌ లారీలు తిరిగే రోడ్లన్నీ ప్రజల కోసం, పౌర అవసరాల రవాణాకోసం వేసినవి ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ రూల్‌ ప్రకారం ప్రస్తుత రోడ్లపై 70 టన్నులు మించి బరువు రవాజా చేయకూడదు. అయితే ఐరన్‌ లారీ వోర్‌లు 80 టన్నుల బరువు కలిగి వుంటున్నాయి.

విదేశీ ఎగుమడులు ఆపాలి వడాడననననననననడనననవననననాాి 2ద్‌

ఐరన్‌ వోర్‌ కాలుష్యం నివారించేందుకు ఐరన్‌ వోర్‌ లారీలను టార్బాలిన్‌ పట్టలతో కట్టి దుమ్మురేగకుండా చేయాలి. లారీల ప్రయాణ- మార్గంలో నీళ్ళు చల్లాలని, ఐరన్‌" వోర్‌ పొలాల్లో కలవకుండా చూడాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. అమలు చేసేవారెవరు? గాలిలో దుమ్ము స్థాయి 220కి మించితే కాలుష్యమని కాలుష్య చట్టాలు చెబుతున్నాయి. అయితే నెల్లూరు చి(ల్లన్స్‌ పార్కు ధ్రగ్గరే గాలి, దుమ్ముస్థాయ 1628 వుందని సాక్షాత్తు కాలుష్య నియంత్రణ మండలే సెలవిచ్చింది. ఇక ముత్తుకూరు, సంగం, బుచ్చి, వెంకటాచలం ప్రాంతాలలో 5000 నుండి 10 వేలకు పైగా దుమ్ము స్థాయి వుంటున్నది. పోర్టు వల్ల అభివృద్ధి ఎవరికి? ॥ గతంలో పీ. వి'నర్‌సింవిరావు ప్రధానిగా వుండగా (ప్రపంచ దేశాల్లోని మేధావుల్లో ఒకరిగా ప్రచార సాధనాలు ఊదరగొట్టడం మనకి ఎప్ప్ఫటికీ గుర్తుండే అంశమే. అలా ప్రపంచ మేధావిగా ఊదరగొట్టి ప్రచారం చేయడం, గ్లోబలైజేషన్‌ విషయంలో ప్రతి ఒక్కరి నోరు మూయించడానికే అనేది అసలు విషయం. అంతర్జాతీయ ఆర్థిక సరళీకరణ చట్టం గొప్ప ముందడుగుగా ప్రజలు భావింప చేయడంలో భాగమే ఈ మేధోతంతు, ఫలితంగానే ప్రపంచ స్థాయి సంపన్న వర్గం భారత్‌లో తయారవుతోంది. అందులో కొందరు ముఖేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, టాటా (గ్రూప్‌, లక్ష్మీ మిట్టల్‌, అజీం(ప్రేంజీ-చివరకు వై.జగన్నోహన్‌రెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి వారు కూడాను. బ్రాహ్మిణి స్టీల్స్‌ గాని, కృష్ణపట్నం పోర్టుగానీ, రకరకాల ఇండస్రీస్‌గానీ, విద్యుత్‌ కేంద్రం గానీ మల్టీ మిలియనీర్లను తయారుచేసే విషయాన్నే అభివృద్ధికి గీటురాయని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ అభివృద్ధి?) లో భాగంగా.మారుతున్న జన జీవన చిత్రంలో బుగ్గిపాలవుతున్న లక్షలాది మంది బ్రతుకులను ఏ పత్రికలుగానీ, మీడియా గానీ సమర్ధవంతంగా వెలికితీయడం లేదు. ఒక వేళ చూసినా అది ఆనాటి సంచలన వార్తలో భాగమే తప్ప వాస్తవానికి బలవుతున్న పేద వారి జీవన చిత్రాలు మెరుగుపరిచే నిర్మాణాత్మకమైన, 'ప్రగతిశీలమైన చర్యలను మీడియా చేపట్టజాలదు, ఒకవేళ అలాంటి _ఆలోచనలు చేసినా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు కలగలసిపోయిన నేటి రాజకీయ యవనికలో ఆ సూచలన్నీ దున్నపోతు మీద వాన కురిసినట్టే. సముద్రంలో జరిగే ద్రెడ్జింగ్‌, పోర్టు నిరంతర కార్యక్రమాలవల్ల 16 (గ్రామాలకు సంబంధింఛిన మత్స్వకారులంతా వలసలతో బుట్ట సర్టుకొనవలసిన పరిస్థితి నెలకొంది. " కృష్ణపట్నం పోర్టు విషయమేమిటంటే... రాబోతున్న రెండు థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు మండించిన కారణంగా విడుదలయ్యే బూడిద భార్‌ స్థాయిలో చుట్టుప్రక్కల గ్రామాలన్ని గాలి వీచే దిక్కునుబట్టి ముంచెత్తబోతుంది. “కోవూరులో గతంలో ఎన్ని గ్రామాల్లో బూడిద విస్తరించేదో గుర్తు చేసుకుంటే! కోవూరుకు ఎన్నో రెట్ల సామర్ధ్యంతో నడిచే ఈ థర్మల్‌ కేంద్రాల వల్ల కలిగే ముప్పు అర్ధమవుతుంది. 26 నాననా ఇనున ఖనిజ

ఈ కేంద్రాలకు అవసరమైన షుమారు ఆరు లక్షల ఘ.మీ. నీళ్ళను సముద్రం నుండి తీసుకుని కూలింగ్‌ టవర్‌కు వాడి తిరిగి అక్కడికే వదులుతారు, ఈ విన్యాసంలో మత్స్యకారులకు వేట దొరకడం దుర్లభం. "

ధర్మల్‌ బూడిద కంటే ఐరన్‌ ఓర్‌ చాలా ప్రమాదకరమైన ముఢి పదార్థం. గాలి దుమారం వంటివి ఎదురైనప్పుడు సమీప గ్రామ పంటలు, చెరువులు, బావులు అన్నీ ప్రమాదస్థాయిలో ఐరన్‌ని కలిగి వుంటోయి.

బహిరంగ ప్రదేశంలో ఐరన్‌ ఓర్‌ని గుట్టలుగా 20-30 లక్షలు టన్నుల డంప్‌ చేయడం చల్ల వర్షాలకు కరిగి సముద్రంలో కలవడంతో ఎదురయ్యే పరిజామాల కారణంగా మత్స్య సంపదకు, సమీపంలోని పొలాలకు తీవ్రమైన ముష్పు ఎదురవుతుంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే పోర్టు వల్ల ఎదురయ్యే అభివృద్ధి ఎవరి కంటే ఎగుమతి, దిగుమతులు జరిపే మిలియనీర్లకు, ట్రాన్స్‌పోర్టు వాహన యజమానులకు, చుట్టుప్రక్కల మండలాల్లోని రాజకీయ నాయకులకు మాత్రమే. ప్రభుత్వరి తమ అఖివృద్ధి వల్ల ఉద్యోగాల గురించి ఏకరువు పెదుతుందేగాని- అంతకు మించిన జనాభాని అభివృద్ధి పేరుతో- బలి తీసుకుంటున్నదన్న. అంశాన్ని మరుగుపరుస్తోంది.

వాస్తవానికి అభివృద్ధి సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వ పధకాలు, నిర్ణయాలు, బాధ్యతలు వుంటే వ్యతిరేకించవలసిన అవసరం ఎవరికీ వుండదు.

పొరుగున'వున్న చైసా విషయం తీసుకుంటే భారతదేశంలోని భారీ పరిశ్రమలలో తయారయ్యే ఉక్కు కంటె ఎన్నోరెట్లు ఎక్కువగా చైనాలోని కుటీర వరిశ్రమల్లో తయారవుతోంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది. అనంతపురంజిల్లాలో వున్న ముడి ఇనుప ఖనిజపు గనులను. గమనించిన ప్రభుత్వం రాజకీయ నాయకులు కలిసి గాఖి జనార్ధన్‌రెడ్డిచేత బ్రాహ్మిణి స్టీల్‌ ప్లాంట్‌ నిర్మింపడేస్తున్నారు. ప్లాంట్‌కు అవసరమైన నీటిని తీసుకెళ్ళే వీలులేక గండికోటకు కేటాయించిన 26 టి.ఎం.సి.ల నీటిలోని 2 టి.ఎం.సి.ల నీరు మైలవరం జలాశయానికి వచ్చి, మైలవరం ద్వారా బ్రాహ్మిణికి సప్లయ్‌ చేయబోతున్నారు. అలాగే ఆఘమేఘాల మీద బళ్ళారి నుంచి కృష్ణపట్నం వరకు రైలుమార్గాన్ని 'రోడ్లను కూడా విస్తరించబోతున్నారు. నెల్లూరు సోమశిల 'ప్రాజెక్టు నుండి 4టి.ఎం.సి.ల నీటిని వెనక్కి తీసుకెళ్ళబోతున్నారు.. పంటలను పండించే రైతులను ఎండగట్టి అయినా పరిశ్రమ పేరుతో నీళ్ళు వాడుకొంటారు. భూగర్భ సంపద ఎవరిది? ఎలా వినియోగించాలి?

భూగర్భ సంపదలయిన బంగారు, వజ్రాలు, గ్యాస్‌, బాక్సైట్‌, గ్రానైట్‌ తదితరములు దేశ ప్రజల సమిష్టి సంపద. వీటి అన్నింటిపై అనుభవ హక్కు ప్రజలదే. ప్రభుత్వానికి యాజమాన్య హక్కు మాత్రమే వుంటుంది. అంటే భూగర్భ సంపదను లాభదాయకంగా ప్రభుత్వాలు నేరుగా ప్రజోపయోగం దృష్టా మాత్రమే వినియోగించాలి. ప్రభుత్వం పేరుతో లేదా ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలకు మాత్రమే భూగర్భ సంపదను విక్రయించి, పరిశ్రమలను నడిపి లాభాలను ప్రభుత్వ సంపదలో జమ చేయాల్సి వుంటుంది. విచేశ్‌ ఎగుమతులు ఆపాలి ననన. (౯.

అప్పుడు మాత్రమే ప్రజలకు ఉద్యోగాలు రావడంతోపాటు, (ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మాత్రం భారీస్థాయిలో భూములను, భూగర్భ సంపదలనంతా బడా సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు నీచంగా, దుర్మార్గంగా, అన్యాయంగా, నిర్లజ్జగా ధారాదత్తం చేసేస్తున్నాయి. మరోవైపు పావలా వడ్డీలు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు గురించి 'ప్రచారంచేస్తూ, ప్రజలపై కపట (ప్రేమను కురిపిస్తూ నటిస్తున్నారు ఈ కపట నాటకాలన్నీ స్పష్టంగా తెలిసిన పత్రికలు, మీడియా సైతం ప్రజలను అతి దుర్మార్గంగా మభ్యపెడుతూ వస్తున్నారు కాదంటే ఏనాటి కానాడు సంచలన వార్తలకోసం వ్యక్తులకు సంబంధించిన ఒకటి అరా అవినీతి వార్తలను హెడ్‌లైన్‌ న్యూస్‌గా మార్చి అతినైపుణ్యంగా (ప్రభుత్వాలకు వంతపాడుతున్నాయి. ఎందుకంటే మీడియా కూడ్రా పెద్ద పరిశ్రమగా మారిపోయింది కాబట్టి ఈ నిజాన్ని ఇటీవల 600 కోట్ల బడ్జెట్‌తో రిలీజయిన సాక్షి పత్రిక నిరూపించింది కూడాను. వైయస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ (ప్రధాన (ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు" ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఇనుము) - 260 ఎకరాలు జిందాల్‌ (బాక్స్రట్‌) = 6115 ఎకరాలు . రస్‌-ఆల్‌-క్రైమా (బాక్సైట్‌ - తృీ122 ఎకరాలు రఘురామ్‌ సిమెంట్స్‌ (సున్నపురాయి) - 2087 ఎకరాలు 'తమాల్‌ సిమెంట్స్‌ (సున్నపురాయి) = 1600 ఎకరాలు పెన్నా సిమెంట్స్‌ (సున్నపురాయి) = శ48 ఎకరాలు గాయత్రి సిమెంట్స్‌ - 1800 ఎకరాలు బోళ్లీ ట్రేడ్‌ ఏజీ (ఇసుక) -18,750 ఎకరాలు ప్రపంచవ్యాప్తంగా లోహాలకు గిరాకీ పెరుగుతూ వుండడం వల్లు,భూగర్భ ఖనిజాలకు గిరాకీ పెరుగుతూ వుంది నాలుగైదు సంవత్సరాల క్రితం టన్ను 5-6 వందల రూపాయలు మాత్రమే వున్న ముడి ఇనుప ఖనీజం వెల. 5,000 రూపాయలకు ఇటీవల పెరిగింది ప్రకాశంజిల్లాలోని గెలాక్సీ గ్రానైట్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది దేశంలోని భూగర్భ సంపదల విలువ ఈ క్రమంలో పెరుగుతున్న సమయంలో దేశ ప్రజలకు చెందిన ఈ భూగర్భ సంపదను పట్టుమని పది మంది పెద్దలకు ధారాదత్తం చేయడం పై పట్టికను చూసి గమనించవచ్చు. నిద్ర నటిస్తున్న ఖనిజాభివృద్ధి సంస్థ అక్రమాలను, ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలని కాగ్‌నివేదిక సైతం ఉతికి ఆరేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు ప్రజలు వైతన్యవంతమై రక్షించుకోవడ మొక్కటే దీనికి పరిష్కారం, 2త్ర మానని ఇనుప ఖనిజ

ఈ తెరచాటు వాస్తవాలను ప్రజలు గమనించినప్పుడు మాత్రమే భూగరృణుంపద వినియోగం విషయంలో ప్రజలు చైతన్యం కాగలుగుతారు. భూగర్భ సంపదను (పైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం అంటే 100 కోట్ల ప్రజల రక్తాన్ని భవిష్యత్‌ తరాల (బ్రతుకులని. అతికొద్ది మంది పెట్టుబడిదారులకు బలిసెట్టడమేనన్న వాస్తవం ప్రజలంతా (గ్రహించాలి.

భూగర్భ సంపద విక్రయాల విషయంలో ప్రాంతీయ శక్తులు, ప్రజలు ఏకమై అన్ని పార్టీల రాజకీయ నాయకులను నిలదీయాలి. ముడి ఇనుప ఖనిజం ప్రజల సంపదగా మనందరం (గ్రహించాలి. మన సంపదను అది ఏ రకమైన ముడిఖనిజమైనా, ఏ దేశానికైనా అమ్మే హక్కు ఏ గాలికీ, ఏ రెడ్డికీ లేదని. ప్రజలంతా అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇందుకుగాను చైతన్యవంతులం కావాలి. ఒక్కటవ్వాలి.

కులం లేదు. మతం లేదు. స్త్రీ పురుషులన్న తేడా లేదు. ఏ పార్టీవారన్న తేడా లేకుండా భూగర్భ సంపదలను కాపాడుకునేందుకు ప్రజలంతా ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైనదని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఒక్కగానొక్క బిడ్డకు మిగిలిన 2 ఎకరాల మడిచెక్కను- జూదరి, త్రాగుబోతు అయిన తండ్రి-పేకాటకు తాకట్టు పెట్టినట్లు బాధ్యత లేకుండా దోచిపెడుతున్న (ప్రభుత్వ నిర్ణయాలని మనం నిగ్గదియ్యాలి. ప్రతిఘటించాలి. ముడి ఇనుప ఖనిజ ఎగుమతిని ప్రభుత్వం నిలిపివేయాలన్న నినాదంతో మనందరం పోరాడాలి.

కృష్ణపట్నం రేవుకు వచ్చే లారీల వల్ల గని యజమానుల లాభం రోజుకు

రోజుకు 1100 లారీలు సగటున వస్తున్నట్లు జిల్లా అధికారులే నిర్ధారించారు. లాగ్షీకి కనీస లోడు 17 టన్నులు. గరిష్ట లోడు 50 టన్నులు సగటున 25 టన్నులు వేసుకున్నా ప్రభుత్వానికి కట్టే సీనరేజి -25%97 = 675-00 గనిలో నుండి తీసినదానికి -252250 = 6250-00 | టన్నుకు వెయ్యి రూ. చొప్పున లారీ బాడుగ 2541000 = 25,000-00 ఖర్చుల మొత్తం (25 టన్నులకు) = పైకే 825200. టన్నుకు సగటున క వేల ర్యూచొ॥న రాబడి-25%45000 = 1,25,000 పై ఖర్చులు గరిష్టంగా 35 వేలుగా అనుకుని తీసేస్తే వచ్చే నికర లాభం-90,000 లారీ ఒక్కింటికి ప్రతి రోజూ గని యజమానులకు 1,100 లారీలపై వచ్చే లాభం 9,90,00,000 (9 కోట్ల 90 లక్షల రూపాయలు) విదేశీ ఎగుమతులు అపాలి. నవనవ. 2

ఇనుప ఖనిజం రవాణా చేస్తున్న లారీలు సృష్టిస్తున్న సమస్యలపై “ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి” ఆధ్వర్యంలో ప్రజాతంత్ర, పార, మానవ హక్కుల సంఘాలతో కూడిన రాష్ట్రవ్యాప్త “అధ్యయన కమిటీ నివేదిక”

ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి, నెల్లూరువారి ఆహ్వానం మేరకు రాష్ట్ర స్థాయి

హక్కుల సంఘాల నేతలతో . కూడిన -అధ్యయన బృందం ఏప్రిల్‌ 3, 4 తేదీలలో నెల్లూరుజిల్లాలో పర్యటించింది. ఈ కమిటీలో 1. వి.హనుమంతరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ఆార్యదర్శి, ఓపిడిఆర్‌. 2. ఎం.వి.కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓపిడిఆర్‌. ౩. డి.సురేష్‌కుమార్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏపిసిఎల్‌సె. 4 క్రాంతి వైతన్య, సహాయ కార్యదర్శి, ఏపిసిఎల్‌సి. 5. బుర్రా రాములు, రాష్ట్ర అధ్యక్షులు, మానవహక్కుల వేదిక. 6.డా॥ లెనిన్‌, హ్యూమన్లైట్స్‌ యాక్టివిస్టు సభ్యులుగా వున్నారు. కమిటీ పర్యటనలో భాగంగా బాధిత ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను ఎగుమతితో ముడిపడివున్న వివిధ ప్రభుత్వ శాఖల (కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, ఆర్‌ అండ్‌ బి., పోలీసు, ఆర్‌.టి.సి, తదితర) ఉన్నతాధికారులను కలిసింది. జిల్లా కలెక్టర్‌ ఈ రెండు రోజులూ కమిటీ ప్రయత్నించినప్పటికీ అందుబాటులో లేరు.

కమిటీ పరిశీలనలో వెలదయిన అంశాలు;

  1. ఇప్పటికే నెల్లూరుజిల్లా పరిధిలో ఐరన్‌ లారీల మూలంగా పలు ప్రమాదాలలో 70 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది వీకలాంగులయ్యారు. వంధలకొద్దీ పశువులు, గొర్రెలు, మేకలు, బఐ(రైలు మరణించినాయి.

  2. ప్రతిరోజు ఐరన్‌ వోర్‌ లారీల రవాణా మార్గంలో కనీసం ఒక్క ప్రమాదమైనా, జరుగుతోంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవిస్తుంది.

  3. వ్రత్యేకించి 'రోడ్డు వరినరాలలో నివసించే ('వ్రజానీకం అభద్రత మధ్య కొట్టుమిట్టాడుతూ, దిన దినగండంగా బ్రతుకులీడుస్తున్నారు. పగలు కూలీ పనులు, వ్యాపారాలు చేస్తుకొనే తమకు రాత్రులు ఐరన్‌ వోర్‌ లారీల శబ్దాల మూలంగా తమకు నిద్ర కూడా కరువే అవుతున్నదని బాధితులు తెలిపారు.

30 ననన ఇనుప ఖనిజ

4 ఏ క్షణంలో లారీలు తమ ఇళ్ళపైకి దూసుకువస్తాయో అనే ఆందోళన తమను మరింత భయానికి గురిచేస్తుందన్నారు.

  1. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలనలో నెల్లూరు చిల్దన్స్‌ పార్కు వద్ద గాలిలో దుమ్ము శాతం వుండవలసిన గరిష్టన్థాయి కంటే ఎనిమిది రెట్లు (200కు బదులు 1628) వుంది. ఇక ముత్తుకూరు ప్రాంతంలో కాలుష్యం దీనికి పదిరెట్లు వుందని కమిటీ గమనించింది.

6.. ఒక్కసారిగా: పెరిగిన వేలాది ఐరన్‌ లారీల అధిక లోడు రవాజా ఫలితంగా మర్రిపాడు నుంచి ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు వరకు, ముత్తుకూరు నుంచి వెంకటాచలం వరకూ గల_రోడ్లు ధ్వంసమయ్యాయి. ఆర్‌ అండీ బి అధికారుల వివరాల ప్రకారం నెల్లూరు ముత్తుకూరు రోడ్డు సగటు సామర్ధ్యం రోజుకు 850 వాహనాలు కాగా ప్రస్తుతం 8,450 వోహనాలు నిరంతరమూ తిరుగుతున్నాయి.

  1. ఈ రవాణా ఫలితంగా ఆర్‌.టి.సి. బస్సులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. శోడ్డు గోతుల మూలంగా కట్టలు విరిగిపోవడం, ట్రాఫిక్‌ జామ్‌ల మూలంగా డీజిల్‌ వినియోగం మరింత పెరగడం, బస్సులు తరచూ రిపేర్లకు గురికావడం, ప్రయాణ సమయం రెట్టింపు కావడం జరుగుతుంది. అలాగే సిబ్బంది, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రత్యేకించి సంగం, బుచ్చి, నెల్లూరు మధ్య ప్రయాణం నరకంగా మారింది...

  2. అధిక లోడుతో వస్తున్న సందర్భాలలోను, గ్రైవింగ్‌ లైసెన్సు లేకుందా క్లీనర్లు లారీలు నడుపుతున్న. సందర్భాలలోను రవాణా అధికారులు (బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌) కేసులు నమోదు చేయగా వారు రౌడీ శక్తుల నుండి, రాజకీయ నాయకుల నుండి బెదిరింపులను ఎదుర్కోవడం కమిటీ పరిశీలనలో తేలింది.

  3. అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రమాదాలు సహజమైనవేనన్న పోలీసు ఉన్నతాధికారి మాటలు కమిటీని విన్మయపరిచింది. ప్రజల ప్రాణాలవట్ల అధికారులకు. పాలకవర్ణాలకూ గల చులకనభావం ఆయిన మాటల్లో వెల్లడయ్యింది. అధికారులు రాజకీయ నాయకులు జిల్లాలో జరుగుతున్న తీవ్ర ప్రమాదాలపట్ల స్పందించ! పోవడం ఈ వైఖరి ఫలితమే.

  4. ప్రధానంగా ప్రమాదాలు జరుగుతున్న మర్రిపాడు-నెల్లూరు మధ్య ఏ రక్షణ చర్యలూ చేపట్టని: పోర్టు యాజమాన్యం నెల్లూరు నుంచి పోర్టు వరకూ మాత్రం ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్జులను నియమించింది. వారి ద్వారా తమ ఐరన్‌ లారీలను నియంత్రించడమే కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే పోర్టు యాజమాన్య ప్రతినిధులు నష్టపరిహారం పేరిట డబ్బు వెదజల్లుతూ ప్రజల (ప్రాణాలకు వెల

విదేశీ ఎగుమతులు ఆపాలి. డాని. ప్ర 1

కడుతారు. తమ ఖనిజ రవాణాకు ఏమాత్రం అవరోధం లేకుండా చూసుకోవడం కమిటీ గమనించింది.

  1. మరోవైపు రోడ్దు యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రతినిధుల ద్వారా ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను నియంత్రించేందుకు పధకం (ప్రకారం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవడం కమిటీ దృష్టికి వచ్చింది. జిల్లాలోని “ప్రధాన పాలక పార్టీల నాయకులందరికీ పోర్టు కార్యకలాపాల్లో ముఖ్యంగా పోర్టు నిర్మాణ, రవాణా రంగాల్లో భాగస్వామ్యం కల్పించి లాభాల్లో వాటా ఇవ్వటం ద్వారా ప్రజల వ్యతిరేకతను అద్దుకునేరదుకు దాన్ని సాధనంగా చేసుకుంటుంది.

కమిటి డిమాండ్లు

1 దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాగుతున్న ముడి ఇనుప ఖనిజ విదేశీ ఎగుమతిసి వెంటనే నిలిపి వేయాలి.

  1. ఇనుప ఖనిజ రవాజా 'ప్రమాదాలవట్స, (ప్రజల ప్రాజాలపట్ల, పర్యావరణ

_కాలుష్యంపట్ల తమ బాధ్యతలను విస్మరిస్తున్న అధికారులి వైఖరి మారాలని డిమాండ్‌ చేస్తున్నాము.

  1. ఇనుప ఖనిజ రవాణా వాహనాల రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన '*వారికి తగిన నష్టపరిహారం తక్షణం చెల్లించాలి.

4*. ఇనుప ఖనిజ రవాణా వాహన కాలుష్య నివారణకు ఆర్‌.టి.ఏ. వారు బాధ్యత వహించాలి.

  1. కృష్ణపట్నం పోర్టుకు ప్రత్యేక రైలు-రోడ్డు మార్గాలు పూర్తయ్యే వరకూ ఇనుప ఖనిజం రవాణా నిలిపివేయాలి.

  2. ఓబుళాపురం తదితర గనులలో లభించే ఇనుప ఖనిజం ద్వారా దేశంలోనే ఇనుప ఆధారిత పరిశ్రమలు నెలకొల్సి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

భల

తద. ననన ఇనుప ఖనిజ

నెల్లూరు జిల్లాలో ఇనుప్‌ ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రబార, ఆందోళన కార్యక్రమం

డిశెంబర్‌ 2007 నుండి అనంతపురం జిల్లా ఓబుళాపురం ఇనుప గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి కొరకు నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఓడరేవుకు వేలాది లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. సాధారణ పొరజీవనానికి ఉద్దేశించిన బొంబాయి-నెల్లూరు రహదారిపై అతిభారీ వాహనాలు (18,20 టైర్ల) 28,82 టన్నుల బరువుతో నెల్లూరు జిల్లాలో 90 కి.మీ మేర ప్రయాణిస్తూ ఈ 8 నెలల కాలంలోనే 60 మంది సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్నాయి. వందలాది మంది క్షతగాత్రులై కాళ్ళు, చేతులు ఫొగొట్టుకున్నారు. వందలాది పశువులను బలి తీసుకున్నాయి. ఈ లారీల ప్రమాదాలు జరగని రోజు అంటూ లేదు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడని రోజు లేదు.

ఈ పరిస్థితిని పరిశీలించి తీవ్రంగా స్పందిచిన రైతుకూలీసంఘం(ఆం.'ప్ర) జిల్లా కమిటి 4.4.08న విలేకర్ల సమావేశం నిర్వహించి మన రాష్ట్రంలోని సహజవనరులు మన రాష్ట్ర ప్రజలకే దక్కాలని, విదేశాలకు కారుచౌకగా తరలించరాదని, ఎగుమతులను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణపట్నం ఓడరేవుకు ఓబుళాపురం-గనుల నుండి దూసుకువస్తున్న లార్తీలు మృత్యశకటాలుగా మారాయని రోడ్డు ద్వారా.రవాణాని వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకున్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం:

వామపక్ష్మ ప్రజానంఘాలను, హక్కుల సంఘాలను రౌండ్‌టేబుల్‌ సమావేశానికి రైతుకూలీసంఘం (ఆం.ప్ర) ఆహ్వానించింది. స్థానిక ఇందిరాభవన్‌లో 6.04.08న జరిగిన ఈ సమావేశంలో రైతుకూలీ, కార్మిక, మహిళా ప్రజాస్వామిక, పౌర, మానవహక్కుల సంఘాల నాయకులు ప్రజాతంత్రవాదులు పాల్గొన్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే రూ. 57,000 పెట్టి టన్ను ఇనుము కొనుగోలు చేయవలసిన దుస్థితి ఈ రాష్ట్రంలో వుంటే, ఈ రాష్ట్ర ప్రజల విలువైన సహజ వనరులు విదేశాలకు కారుచౌకగా తరలించడం రాష్ట్ర ప్రజలప్రయోజనాలను, అవసరాలను తుంగలో తొక్కినట్లని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ దోపిడి విధానాలను తీవ్రంగా గర్జించి ఇనుపఖసిజ ఎగుమతులను వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. బ్రిటీష్‌ పరిపాలకులు నాడు మన సహజసంపదలను కొల్లగొడితే, "నేటి పాలకులు గనులను, నదులను (ఫైవేట్‌ వ్యక్తులకు అప్పగించి వారి లాభాల కొరకు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్ర దేశ ప్రజల కళ్ళలో కారం కొట్టడం దారుణమన్నారు. విదేశి ఎగుమతులు ఆపాలి. 2222వ. పప్ప

ఓడరేవును పూర్తిగా అభివృద్ధి చేయక్తుండానే దానికి తగిన రవాణా మార్గాన్ని (రైల్వే లైను) నిర్మించకుండానే సాధారణ రవాణా కోసం వాడుతున్న రోడ్లపైకి వేలాధిగా ఇనుప 5జను లారీలు రావడం ఫలితంగా 60 మందికిపైగా చనిపోయారని వందలాది మంది క్షతగాత్రు లయ్యారని, వందలాది పశువులు చనిపోయాయని ఇనుపరజను గాలిలో కలిసి పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ దీర్ధకాలిక జబ్బులకు గురిచేస్తుస్నాయన్నారు. రోడ్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయని అభిప్రాయపడి, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య తప్ప వేరు కాదని ప్రజల (ప్రాణాలను, ఆస్తి, ఆరోగ్యాలను తృణప్రాయంగా లెక్కించి బలిచేయడానికి ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటీ ఏర్పాటు-డిమాంద్లు:

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సంఘాల తోటి ఇనుప ఖనిజ. ఎగుమతి వ్యతిరేక కమిటీ ఏర్పాటు జరిగింది. రైతుకూలీ సంఘం(ఆం.'ప్ర) రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.కిశోర్‌బాబు కన్వీనర్‌గా, ఓ.పి.డి. ఆర్‌ నాయకులు శివశంకర్‌, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం నాయకుల్లు వెంకటేశ్వర్లు, మానవహక్షుల వేదికనేత సాంబశివరావు, స్రీ విముక్తి సంఘటన నాయకులు పి.కొండమ్మ, రచయిత పద్నాకర్‌, ('ప్రజాతంత్రవాదులు, సామాజిక కార్యకర్తలు టి.సుకుమార్‌రెడ్డి, ఎన్‌, దశరధరామయ్య, బి.వి.జి. దేవరాజులు, కార్మిక నాయకులు పి.యానాదయ్య, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నాయకులు కృష్ణ-నభ్యులుగా ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి ఏర్పడి డిమాండ్లను రూపొందించుకుంది. డిమాంద్లు:

1 జాతికి నష్టం-కలిగించే ఇనుప ఖనిజ ఎగుమతి విధానాన్ని రద్దు చేయాలి.

  1. .తక్షణమే ప్రజల ప్రాణాలను, ఆస్తులను' బలి" గొంటున్న రోడ్డు మార్గము ద్వారా ఇనుప ఖనిజ లారీల రవాణాను ఆపివేయాలి.

8 రైల్వే మార్గము నిర్మాణం చేసే వరకు పోర్టు కార్యకలాపాలు నిలుపు చేయాలి!

4 దెబ్బతిన్న రోగ్లన్నింటిని ప్రభుత్వం తక్షణమే:పునరుద్ధరించాలి!

  1. ముడి. ఇనుప ఖనిజ రవాణా లారీల క్రింద చనిపోయిన వారందరికి అదనపు నష్టపరిహారము గని యజమానుల నుండి ఇప్పించాలి.

ఈ డిమాండ్ల' సాధన కోసం (ప్రజలు ఆందోళనకు పూనుకోవాలని కమిటీ పిలుపునిచ్చింది. అందుకోసము కమిటీ తక్షణ కార్యక్రమంగా వాల్‌పోస్టర్లను, కరపత్రాలను ముధద్రించి,. మర్రిపాడు నుండి కృష్ణపట్నం వరకు కృష్ణపట్నం నుండి వెంకటాచలం వరకు

“రోడ్డుపై వున్న గ్రామాలలో, పట్టణాలలో (ప్రచారం చేయాలని, ప్రజలను కలపాలని కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ప్రశ వనన. ఇనుప ఖనిజ

వాల్‌పోస్టర్లు, కరపత్రాలు విడుదల:

తమ డిమాండ్లతో వెయ్యి వాల్‌పోస్టర్లను, 16వేల కరపత్రాలను ముద్రించి 11.4.08న పత్రికా విలేఖర్ల సమావేశంలో విడుదల చేసింది.

“లాభాలు గనుల యజమానులకూ-చావులూ, అనారోగ్యాలు ప్రజలకా!! ఇనుప ఖనిజ లారీల క్రింద పడి ఇంకెంతమంది చావాలి!, “దేశ సందపను గని యజమానులకూ విదేశాలకూ దోచిపెట్టడం దేశద్రోహమే' అన్న శీర్షికతో మరియు తమ డిమాండ్లతో (ప్రచురించిన ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటీ వాల్‌పోస్టర్లను కమిటీ నాయకులు మీడియాకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ “దేశంలో వున్న ఖనిజాన్ని ఇతర దెశాలకు తరలించడం వలన భవిష్యత్తులో ఇనుపఖనిజం దొరక్క మనం విదేశాల మీద ఆధ్యారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. విదేశాలకు టన్ను ముడి'ఖనిజం 3,4 వేలకు అమ్ముతూ దేశంలో ఇనుము ధరను రూ. 60 వేలకు పెంచారని ఈ ముడి ఇనుపఖనిజాన్ని ఇక్కడే వినియోగిస్తే మన దేశంలో వినియోగదారులకు టన్ను 15 వేలకు లభించగలదని వివరించారు. ప్రచార జాతా;

ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యాన ఏప్రిల్‌ 18వ తేదీన మర్రిపాడు నుండి నెల్లూరు వరకు డిమాంద్స్‌ను వివరిస్తూ ప్రచారజాతా జరిగింది. దాదాపు 4 మండలాలలో-బొంబాయి రహదారి వెంబడివున్న మర్రిపాడు సెంటర్‌, ఆత్మకూరి పట్టణం, సంగం, బుచ్చిరెడ్డిపాళెం పట్టణాలతో సహా ప్రజల అభిప్రాయాలను సేకరించారు. పెద్ద పెద్ద వాహనాలు అతివేగముగా వెళ్ళడం, బారులు తీరిన వాహనాల కదలికవల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు తెలియచేశారు. ఏ గ్రామంలో ప్రజలను కదిలించినా అభద్రత, భయంతోటిఆందోకన చెందుతున్నారు. జరిగే ప్రమాదాలాపట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు. మునుపు ఇలాంటీ అభద్రత తమకు లేదని ఇంటి నుండి బయలుదేరిన తమ బిడ్డలు, ఇంటికి తిరిగి వచ్చేవరకు ఆందోళన చెందుతున్నట్లు, ప్రమాదాలకు పాల్పడీనపుడు లారీ(డైవర్లు నిర్లక్ష్యంగా ఇవిగో మా ఓనర్‌ ఫోను నెంబర్లు మాట్లాడు కోండి మా లారీలకు అద్దు నిలవద్దని సమాధాన మిస్తున్నారు. పోలీసులు దగ్గరికెళితే నిమ్మకు నీలేత్తినట్లు వున్నారన్నారు. పశువులు చనిపోయినపుడు కేసు కూడా పెట్టడం లేదని వాపోతున్నారు... ప్రమాదం జరిగినపుడు జనం తిరగబడి లారీలు ఆపివేస్తే రాత్రిపూట మోటార్‌ బైకుల-మీద వచ్చి కాపలా వున్న ప్రజలను కొట్టి లారీలను తీసుకొని వెళు బ్రతున్నారన్నారు: నిత్యం భయపడుతూ జీవిస్తున్నామన్నారు. "సంగం, బుచ్చి మండలం. సెంటర్లలో రోడ్లు మఠీ అధ్వాన్నంగా తయారయ్యి ఒక్క లైనులోనే రాకపోకల్సు సాగుతున్నాయన్ని బజారు సెంటర్‌ అంతా విపరీతమైన దుమ్ము, ధూళితో నిండిపోయినట్లు కమిటీ నాయకులు గుర్తించారు. బుచ్చి, కోవూరు; నెల్లూరు వరకు మరీ జనసమర్థంగా విదేశి ఎగుమతులు ఆపాలి. ననన. వేన్‌

వుండడం వల్ల సాధారణ జన జీవనానికి, పౌరరవాణాకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రచార బృందం తమ పరిశీలనలో గమనించారు. కోవూరు పట్టణమంతా దుమ్ముతో నిండి పోవడాన్ని గమనించారు. దారివెంబడి అనేక లారీలు రిపేర్లతో నట్టనడి రోడ్డుపై నిలచి.వున్న వాహనాలను, అనేక ప్రమాదాలకు గురియె నిలిచివున్న వాహనాలను కమిటీ గమనించింది. సంగం-బుచ్చి-కోవూరు గ్రామాలలో త్రాగునీరు, తినే తిండి దుమ్ము. ధూళీ ఇనుపరజనుతో నిండి వుంటున్నది. ఏప్రిల్‌ 14న నెల్లూరు నుండి ముత్తుకూరు వరకు, ముత్తుకూరు నుండి వెంకటాచలం వరకు ్రచారజాతా నిర్వహించారు. దాదాపు 80 గ్రామాల్లో 4 మండల సెంటర్లలో ప్రచారం కొనసాగించారు. జనసమర్ధము ఎక్కువగా వున్న తోటపల్లి గూడూరు, ముత్తుకోరు తీరప్రాంత మండలాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రహదారులంతా ఇనుపరజను, ఇళ్ళు, కంచెలు, రహదారి వెంబడి చెట్లు చేమలు ఎర్రని ఇనుప రజనుతో కమ్ముకొని వుండడం గమనించారు. ప్రతి (గ్రామం వద్ద ఫైవేట్‌ సెక్యూరిటీ వున్న ప్రమాదాలు తప్పడంలేదని ప్రజలు వాపోయారు మాట్లాడుకుంటూ నిల్చున్న మనుషులపైకి లారీలు వెళ్ళడం (ప్రజలు చావడం తమ కళ్ళతో చూశామన్నారు. (ప్రజలు ఆగ్రహం చెంది ఆందోళనకు, నిరసనకు పూనుకొన్నప్పుడు (గ్రామ స్థాయి నాయకులు కొందరు పోర్టు వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని మనం ఇలా నిరసనకు పూనుకొంటే భూమి ఇంత ధర పలకదని కుహనా వాదనలను వినిపిస్తూ ప్రజల ఆందోళనను పక్కదారి పట్టిస్తున్నారు. ఉప్పుకయ్యలలో రైతులు పండించే ఉప్పు కూడా ఇనుపరజనుతో నిండి వుండడం గమనించారు. పోర్టులో బెర్తులు పూర్త కాకుండానే ఇనుప ఖనిజం మేటలు పేరుకుపోవడం వల్ల కొండలు కొండలు పోర్టులో ఇనుపరజను నిండి వుండటం అది గాలిలో కలిసి కావురాయిగా మారిపోవడం గమనించారు. ముత్తుకూరు మండలం- సెంటరంతా దుమ్ము ధూళితో నిండి అధ్వాన్నమైన రోడ్లతోటి దారుణంగా వుందన్నారు. వెంకటాచలం' పరిస్థితి మరీ అధ్వాన్నం: లైల్వేవేగన్ల నుంచి వెంకటాచలం రైల్వే స్టేషన్‌కు వచ్చి కుప్పలుతెప్పలుగా దిగుమతి అవుతున్న ఇనుప ఖనిజం గుట్టలు గుట్టలుగా స్టేషన్‌ చుట్టుప్రక్కల పేరుకుపోతూవుంది. అది అక్కడినుండి కృష్ణపట్నం ఓడరేవుకు టిప్పర్ల ద్వారా తరలించబడుతూ వుంది. ఈ వెంకటాచలం [ప్రాంతమంతా చెట్టుచేమలు, మనుషులు దుమ్ముతో నిండిపోతున్నారు. కనీసము బస్సులో పోతున్న తెల్లబట్టలు వేసుకున్న మనుషులు కూడా వారగా మారిపోతున్నారు ఈ టిప్పర్లు ఎత్తి ఎత్తి ,వేస్తూ విపరీతమైన రణగొణధ్వనులతోటి అధ్వాన్నమైన రోడ్ల ద్వారా వెళ్ళడం వల్ల ప్రమాదాలే కాదు-గాలి, శబ్దకాలుష్యాన్ని ఆ ప్రాంత ప్రజలు భరించలేకున్నారు. వీరి పరిస్థితి కూడా ఆహారం, నీరు మొత్తం దుమ్ముగొట్టుకునే వున్నాయి. ఇది దీర్ధకాలిక జబ్బులకు కారణమౌతున్నది. వధ వాదదనానాననానానానననననననననననన ననన. ఇనుప ఖనిజ

మగ్రిపాడు మండలంలో (గ్రామ సభలు:

'ప్రచారజాతా అనంతరము కమిటీ సమావేశమై, ఆ (ప్రాంత పరిస్థితులను, ప్రజల ఇబ్బందులెను భాదితులను పరిశీలించిన తరువాత (గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించింది. వీలైతే న్యాయస్థానంలో కూడా పోరాటం సాగించాలని, హక్కుల సంఘాల ప్రతినిధుల బృందం బాధిత ప్రాంత గ్రామాఅను పరిశీలించాలని నిర్ణయించింది.

తొలి ధఫాగా ఏప్రిల్‌ 25, 26 తేదీలలో మర్రిపాడు మండలంలో గ్రామ సభలు నిర్వహించాలని ప్రచారదళం బయలుదేరింది. 25వ తేదీన మర్రిపాడు మండల కేంద్రగ్రామంలో మరియు బాలిపల్లి గ్రామంలో ఉదయాన్నే ప్రచార కార్యక్రమం నిర్వహించి (గ్రూప్‌ మీటింగ్‌లు వేస్తూ సా॥। 8 గంటలకు (గ్రంధాలయ సెంటర్‌లో సభ జరుగుతుందని ప్రచారం నిర్వహించింది. ప్రతి గ్రూపు మీటింగ్‌లోను మహిళలు పెద్దపెట్టున తమకు జరుగుతున్న ఇక్కట్లను ఏకరువుపెట్టారు, తాము పొలాలకు వెళ్ళాలంటే దాదాపు 20 ని॥ రోడ్డు దాటడానికి వేచి వుండవలసి వస్తుంది. తమకు జీవనపాధారమైన బరైలను, గొర్రెలను తమ కళ్ళముందే యధేచ్చగా తొక్కించుకువెళుతున్నారని తమ (గ్రామంలోనే 25 బర్రెలు ఐరన్‌ ఓర్‌ లారీల కింద నలిగిపోయాయని ఆక్రోశించారు. తమ గ్రామ చట్టుప్రక్కలనే దాదాపు పలు ప్రమాదాల్లో 17 మంది మృతిచెందినట్లు ఆవేదనను వ్యక్తం చేశారు. 20-80 టన్నుల లారీలను 18-19 ఏళ్ళ కుర్రాళ్ళు నడుపుతున్నారని వారికి (డైవింగ్‌ లైసెన్సులు వుండడం లేదని, అంతపెద్ద లారీలకు కొన్నింటికి క్లీనర్‌ కూడా వుండక ఒక డైవరే దాదాప్తు 400-500+కి.మీ లారీలను నడపడం వల్ల అలసిపోతున్నారని దీనికి తోడు మద్యం మత్తు అన్నీకలిసి ప్రమాదాలకు కారణమవుతున్నా యన్నారు. అని సి ఎం లారీలట కదా వాటిని ఆపడానికి హక్కులేదటగదా! వారు టాక్స్‌ కడుతున్నారటగదా అని చోటామోటా నాయకులు పోలీసులు తమతో అంటున్నారని ఏ విధంగానైనా వీటిని నిలువరింప జేయాలని 'ప్రాధేయపడ్డారు.

సా॥ః 8 గంటలకు గ్రంధాలయ సెంటర్‌లో జరిగిన 'సభకు కమిటీ కన్వీనర్‌ జెకిశోర్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ పారహక్కుల సంఘం అధ్యక్షులు పులిరామకృష్ణయ్య, ఓ.షిడి.ఆర్‌ _జిల్లా కార్యదర్శి శివశంకర్‌ పాల్గొని విషయాలను వివరించారు. గ్రామస్థుల సందేహాలను తీర్చారు అందరం కలిసి పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు గని యజమానులు గాలి జనార్ధన్‌రెడ్డికి 10 కోట్ల రూపాయల ఆదాయం ఒనగూడుచున్నది. లారీ యజమానులకు రెండు రోజులకు 15-30వేల మధ్య బాడుగలు అందు తున్నాయని, రాజకీయ నాయకులందరూ ఈ ఖనిజం రవాణాలో తమ వంతు లారీలు కలిగి వున్నార్షని అందుకే జిల్లాలో ఇప్పటికి 72 మరణాలు నమోదయిసా-ఏ ప్రజాప్రతినిధీ వాటిక్తి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నారు బాధిత ప్రజలంతా జిల్లా సెంటర్‌లో కలెక్టరేట్‌న్స ముట్టడించుటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 26న కండ్రిగ, నందవరం సెంటర్‌, డి సి.పల్లి కరటంపాడు గ్రామాల్లో పోస్టర్లు అంటిస్తూ (గ్రామసభలను, గ్రూప్‌

మీటింగ్‌లను నిర్వహించారు. ఏ వూరుకెళ్ళినా ఇవే ఆక్రందనలు. కరటంపాడు మాస్లిం విదేశి ఎగుమతులు ఆపాలి నానన వా

మహిళలు, తమ కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని వివరించారు. 24వ తేదీ సాయంత్రం సెద్ధీపురం వద్ద ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లికి చెందిన ఇద్దరు కుర్రాళ్ళు నెల్లూరుకు వెళ్ళుతూ వుంటే తమ వెనక వస్తున్న ఐరన్‌ఓర్‌ లారీ వెనుక వైపునుంచి ఢీ కొంటే వాళ్ళు ఎదురుగా వస్తున్న యూరియా లారీ కిందపడి నుజ్జునుజ్జు అయ్యారని, ఒకరు అక్కడికక్కడే చనిపోయాడని రెండవ అతని కాళ్ళు రెండు తెగి పోయాయని, ఇంతలో అక్కడికి చేరిన పోలీసులు చనిపోయిన వ్యక్తి శవాన్ని చెత్తకుప్పలోనికి ఈడ్చి లారీని కరెంటు స్థంభానికి _నెట్టి ప్రమాదం రూపురేఖలను మార్చడానికి ప్రయత్నించిన విషయాన్ని ఆవేదనతో వివరించారు. మాకు దిక్కెవరు? పోలీసులే ఇట్లా చేస్తే ఇంకేమిటి మా పరిస్థితి అని వాపోయారు. ఆ విధంగా (గ్రామగ్రామాన ప్రత్యక్ష అనుభవాలను ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రచార దళం ముందు వెళ్ళబోసుకున్నారు. వీడియో చిత్రీకరణ: ప్రజుతంత్రవాది డా॥ధనిశెట్టి లెనిన్‌ పైదారుణాలను పత్రికల్లో చూసి మరియు ఇనుప ఖనిజ ఎగుమతి వ్యతిరేక కమిటి పప్రచారోద్యమాన్ని పరిశీలించి తాను కూడా ఈ ఉద్యమానికి సహాకారాన్నందించాలన్న తలంపుతో ఏప్రిల్‌ 23, 24 తేదీలలో మర్రిపాడు నుండి ఉేయలుదేరి వెంకటాచలం వరకు బాధితులను, మరణించిన వారి కుటుంబాల వ్యక్తులను, వివిధ సంస్థల నాయకులను, డాక్టర్లను, దారిపోడవునా ఇబ్బందు గెదుర్కొంటున్న బాధిత ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను విడియో చిత్రీకరించారు. అవి కలిగిస్తున్న కాలుష్యాన్ని ఆగి'ఫన్న లారీల బారులను, అవి రేపుతున్న దుమ్మును.మొత్తం పైన వివరించిన అన్ని ఘటనల యొక్క సారాంశాన్ని తన వీడియో కెమెరాలో చిత్రీకరించి కమిటీకి అందించారు.

ఈ మొత్తం పరిస్థితి ఆందోళనను గమనించిన అధికారులు, జిల్లా 'మంత్రివర్యులు కంటి తడుపు చర్యలను ప్రకటించారే తప్ప ప్రజలకు ఏ విధమైన వెసులుబాటును కల్పించలేకపోయారు. ఏట్రిల్‌ 30వ తేదీ నాటికి జిల్లాలో ఐరన్‌ఓర్‌ లారీల కిందపడి మృత్యువాతపడ్డ వారి సంఖ్య 72కి చేరింది. నిమ్మకు నీరెత్తిన అధికార యంత్రాంగం మరియు పాలకుల నిర్లక్ష్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా పై డిమాండ్స్‌ సాధన కోసం-మిలిటెంట్‌ ఐక్య ప్రజావుద్యమాన్ని నిర్మించవలసి వుంది.

(నశక్తి 5-6-68 సంచిక నుండి) తతి ననన నవనవ ఇనుప ఖనిజ

ఇనుప ఖనిజ ఎగుమతుల్ని ఆపాలి (హిందూ 80.9. 06 నంపాదకీయం)

వస్త పరిశ్రమ్ములాగె ఉక్కు కూడా భారతదేశ పారిశ్రామికీకరణలో కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది. అందువల్ల ఈ పరిశ్రమకు కీలక ముడిపదార్థమైన ఇనుప ఖనిజం విషయంలో అనుసరించాల్సిన "విధానం గురించిన చర్చ ప్రాధాన్యతను సంతరించుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. దశాబ్దాలుగా మన దేశం ఇనుము ఎగుమతి చేస్తోంది. అందులో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌.ఎం.డి.సి. (జాతీయ గనుల అభివృద్ధి సంస్థ) ఖనిజాన్ని తవ్వితీయడంలోను, ఎగుమళి చేయడంలోను అతిపెద్ద పొత్ర పోషిస్తోంది. గతంలో ప్రధానంగో ఎగుమతులు జపాన్‌కు వెళుతుండగా ఇటీవల చైనాకు కూడ ఎగుమతులు పెరిగాయి. 2004-05 సంవత్సరంలో ఇనుప ఖనిజ ఎగుమతులు రు. 18,650 కోట్లకి చేరాయి. చరిత్రలోకి చూస్తే ఇనుప ఖనిజ ఎగుమతి విధానం దేశీయ గిరాకీ తక్కువ వుండడంతో ముడిపడి వుంది. కానీ ప్రస్తుత వినియోగపు స్థాయిరీత్యా చూస్తే మనదేశంలో ప్రస్తుతమున్న 23.6 బిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజనిల్వలు సరిపడినట్లుగా అనిపించవచ్చు, కానీ (ప్రస్తుతం మన దేశంలో కూడ ప్రజల తలసరి ఉక్కు వినిమయం అంతర్జాతీయ స్థాయికి చేరుతుండడంతో భవిష్యత్‌ అవసరాలతో పోల్చినపుడు ఇవి సరిపోవు. ఈ రీత్యా ఇనుప ఖనిజ ఎగుమతి విధానాన్ని పునఃపరిశీలించడం అవసరం. ఎకాఎకిన నిషేధం విధించడం తొందరపాటు కావడమేగాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు భిన్నం కావచ్చు. ఎందుకంటే ప్రత్యేక పరిస్థితిలో తప్ప ఎగుమతుల పరిమాణాత్మక నియంత్రణలను పై నిబంధనలు అనుమతించవు. అయితే ఎగ్గుమతి. సుంక్తాలను పెంచడం ద్వారా దేశంలో స్టీలు పరిశ్రమ విస్తరణకూ, ప్రత్యేక రకాల ఉక్కతయారీకి ప్రోత్సాహం కలిగించవచ్చు.

తోళ్ళ వరిశమ విషయంలో మనం అనునరించిన విధానంతో దీన్ని

సరిపోల్చుకోవచ్చు. 8 దశాబ్దాలపాటు మనం ముడితోళ్ళతో, ' కొంత బాగు చేసిన తోళ్ళ ఎగుమతులను పూర్తిగా నిషేధించిన కారణంగా ప్రస్తుతం బాగుచేసిన తోళ్ళ, చెప్పుల ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ మన దేశం ప్రముఖ స్థానం ఆక్రమించింది. (ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు ఎగుమళుల పరిమాణాత్మక ఆంక్షలను ఒప్పుకోని కారణంగా ఎగుమతి సుంకాల్ని పెంచి ఎగుమతుల్ని ఆపవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజ విషయంలో ఇలాంటి విధానాన్నే అనుసరించవచ్చు

సాంకేతిక కారణాల రీత్యా మన, వేశంలో వినియోగించుకోలేని రకాల ఇనుప ఖనిజాన్ని ఎగుమతికి ఈ విధానం అనుమతించాలి. అగే రకంగా ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, విదేశీ ఎగుమతులు ఆపాలి. వకవ వలనా. పలి

గోవాలలో ఇనువ ఖనిజ ఎగుమతిపై చాల మంది శ్రామికులు ఆధారపడివున్న విషయంపట్ల కూడ సానుకూలంగా వ్యవహరించాలి. ఏకీకృత రవాణో చార్జీల విధానం కారణంగా ఖనిజ “గనులకు సమీపంలో వున్నందున ఒనగూడే అనుకూలత తూర్పు రాష్ట్రాలకు, (ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌లకు కృతకంగా _నిరాకరించబడింది. 1991 తర్వాత ఈ విధానం రద్దు చేయబడింది. ముడిసరుకుకు విలువను చేర్చే ఉత్పత్తికి తగిన సహాయమందజేస్తే తూర్పు రాష్ట్రాలు తమ వాటాను పొందగలవు. అన్ని రకాలుగా పెరుగుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మన దేశంలో ఉక్కు పరిశ్రమ యూనిట్లను పెట్టడానికి అంతర్జాతీయ ఉత్పత్తిదారులకు ఆటంకాలేమీ లేవు. శశ+ జైభారత జననీ

  • నుబ్బారావు పాత్తీగ్రుపూ జై భారత జననీ నమో పతిత పావనీ అల్రత్రలిత హిమళిఖరాలే-నీదు రత్న కరిటం తృ మా భారత జాతికెల్ల-తగురక్షణ కవాటం గంగా గోదావరులూ-కృష్ణా సింధూనదులూ జీవధార లొలికించే- మా బ్రతుకులు పండించే ॥జై॥ ఎల్లోర అజంతాలు-కళ్ళార్చని యావింతలు ఈ అపూర్వ ఘనశిల్చ్పం-మా పూర్వుల స్కతి కల్పం జె! పరుల పంచ తలడాచే-దౌర్భాగ్యపు స్థితి నుండీ ఒరను కత్తి దూసి పోరి-పరువు నిల్పినారమ్మా 12 వేలకొలది మా నేతలు-నేల కొరిగి బలియైైతే ॥ నీదు బంధ విమోచనం-మా బ్రతుకుల పర్వదినం 12 దేశమంత ఘన సంపద-వీసమంత మాకందదు ఆశ పోతులంత జేరి-మోసుకు పోతున్నారు 1 నీవే తమ స్వంతమనీ-నీ పాలన హక్షుగొని నీ బిడ్డలు నినుపట్టి బంధించగ నున్నారే జై! పరులకమ్మ జూస్తుంటే-పరువు తగలవేస్తుంటే సహించమూ సహించ; మూర సరు ళ్యాము ॥జ॥ 4/1) మైల టాటా కూ. ఇనుప ఖనిజ అవణనాాానాానాాలలు! న్య? స్‌ ల షం: ం లీ “ఈ న్‌,” జ లలో క ల”

మ. స: ( . జే ళ్టు కే స్త ల... ఎకో రళ్తాళ్ల న యాన రసి [1 నా చం రి ప న్‌ు టో మ. | క్ల కే సం లస శ ల ల శి మట్‌ 4! శీ! న్‌ (౭ 1 11 గే జై షం 1. శఓజ్య్యన్టీపై శై స్టర్ట వ సే కరి 1 ఈ 1! వెస వను స ం] స్తా సనం తికి కపిత కక శ క కిం పం గ్ర చం! క నచ నుం | శ్‌ వ చి ర చ కళ 111 నే ళ్జే ని శే చై సె ళా న. 1. ప.

ల్ల " . 1౧౪94 సగ2౧1)4 క£590గ4000616౧64గ4? న [౧5.5/- ' వ. వళ్ళ పలల తదా నతు. ఓ స ల న నా ల్‌ టా... శే సచావవ ననా నుం తాం న టు. శ యం న ల తనా న నం. |] న త. బాం ఖల న స్ట. న] _ షట సో నో బానో వ స. జ్‌ ॥ కం న జే (న సీ టట. వట - సం. గ అష్ట యత (1 మ గ షి న్‌ గా న స క. శ్‌ సక మ... ఆ - ఇ కం న్‌ న కం హా శ హ్‌! మ యే ల రో ల ల గ న స్‌ మూ. స =. ఆ , క ల బ్‌ య. 1" ॥ ల్‌ న్న _ / వ ॥ స్టే క న. . ॥ న న సో చ వు / య 4 మ నన పాం, వ 4 క, క్‌ ముడి , ము యో యోనిం నట షం త కం సుతమ్‌ ఎ తా నన చం. పస పాట షు మున మమతల నమ ల తాం సా స్ట సే.