Telugu dheshani sanitizer chedam - anilvaranasi/indianlanguages GitHub Wiki
వేశాన్ని సానిటైజ్ చేద్దాం! రా ర సనో , 1 (1) వట్రక్షనో శ షు థి గ్గ ను ం ము న 7 దల య కారలుర్య క / త్శ శ | “న్ / ్ క ్య స్. . జ తి గ్ , న టా వ్ర డ్ ఫి ' దా॥ దేవరాజు మహారాజు మె ము.
దేశాన్ని సానిటైజ్ చేద్దాం ! డా! దేవరాజు మహారాజు సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం జజయవాద
గ కర ( ౮ బ్ దో యయా. 6-10012 లో ట్ ర న షి వం 1610 1 శా (౬4010. టు | దేశాన్ని శానిటైజ్ చేద్దాం! వ్యాస సంపుటి థిప్రా। దేవరాజు మహారాజు ర9౪2౧)౮.౧౭౧౭౯౧౪|౮(్రం౧౧౭|1.00౧) ప్రచురణ: మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడ ప్రచురణ కాలం : 17.05.2021 వెల: రూ. 20/- ప్రతులకు: ఎం.వి. విజ్ఞానకేంద్రం 27-80-4, 4వ అంతస్తు ఆకులవారి వీధి గవర్నర్‌పేట, విజయవాడ - 520 002 సెల్: 9490098408 ప్రజాశక్తి బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు
- నిజాన్ని నీట ముంచి అబద్ధం రాజ్యమేలుతోంది! 4 2, విశ్వాసం వున్న చోట విశ్లేషణ వుండదు 7
- దేవుడు లేడని చెప్పడం కూడా హక్కే క్ష 4& ప్రీలను కించపరిచిన పాఠ్య [గ్రంథాలు 15
- ఇది మన కథ... మనందరి గాథ 18
- కరోనా నేర్పిన కొత్తపాఠాలు 25
- ఒక దేశం - ఒకే పువ్వు (కవిత) 29
- దేశాన్ని సానిటైజ్ చేద్దాం! (కవిత) త్రి కః
నిజాన్ని నీట ముంచి అబద్దం రాజ్యమేలుతోంది! యణ
పాలకులే పని గట్టుకుని అబద్ధాలకు ఆఫీసులు తెరచి, ప్రచారాలు మొదలు పెడితే ఆ దేశం ఎలా ఉంటుంది? ఆ దేశ ప్రజలకు దిక్కెవరూ? నిజమే, మన దేశం ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. దిక్కెవరు అని దిక్కులు చూడడం కాదు. ప్రతి పౌరుడూ నిజాల్ని నిలబెట్టే సైనికుడై దిక్కులు పిక్కటిల్లేలా నిజాల్ని ప్రకటిస్తూనే ఉండాలి, తప్పదు. సామాన్య పౌరులు ఎంతో బాధ్యతతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, నిజమేదో, అబద్ధమేదో తేల్చుకోవాల్సిన తరుణమిది. అబద్దాలు ప్రచారం కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన సమయం కూడా!
“వేడి వేడి కొబ్బరినీళ్ళు క్యాన్సర్‌ను తగ్గిస్తాయన్న వాట్సప్ మెసేజ్ వైరల్ అయ్యింది. దాని మీద ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టి.యం.సి) డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర బడ్వే పత్రికా ముఖంగా ఒకటికి రెండు సార్లు వివరణ ఇచ్చారు. క్యాన్సర్‌ను వేడి కొబ్బరి నీళ్ళు ఎంత మాత్రమూ తగ్గించవనీ, అలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరూ నమ్మకూడదని, ఎవరూ ఎవరికీ పంపకూడదనీ వివరణ ఇచ్చారు. ఇలాంటిదే మరో ఫేక్ మెసేజ్ సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో జోరుగా షికారు చేసింది. మహిళలు నలుపు రంగు బ్రాలు వేసుకుంటే క్యాన్సర్ తప్పక వస్తుందన్నది ఆ మెసేజ్ సారాంశం! దీని పట్ల కూడా టియంసి డైరెక్టర్ దాక్టర్ రాజేంద్ర ఇంగ్లీష్ దినపత్రిక 'ద హిందూ'తో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియా ఏమైనా ఆరోగ్య సమాచార కేంద్రమా? అక్కడ ఎవరైనా జబ్బుల్ని డయాగ్లైజ్ చేస్తారా? ట్రీట్‌మెంట్ ఇస్తారా? అదేదో మామూలు సమాచారం పంచుకున్నట్టు ఆరోగ్య సంబంధమైన విషయాన్ని ఎలా పంపుకుంటారూ? రోగుల్ని పరిశీలించి, పరీక్షించి నయం చేయడానికి డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. ఆసుపత్రులు, అందులో తగిన వైద్య పరికరాలు ఉన్నాయి. జబ్బు చేస్తే ఎవరైనా వారిని సంప్రదించాలి. అంతేగానీ, ఇలాంటి గాలి కబుర్లను ఎలా నమ్ముతారూ? తప్పుడు సమాచారం ఇతరులకు ఎలా చేరవేస్తారూ? తప్పు కదా? జబ్బు ఒకటే అయినా, పేషెంట్ శరీర ధర్మరీత్యా పాథలాజికల్ టెస్ట్ రిపోర్టుల రీత్యా, రోగుల స్థితిగతులేమిటో అనుభవజ్ఞులైన డాక్టర్లు కదా నిర్ణయించాలి? సరైన వారిని సంప్రదించి,
దేశాన్ని శానిటైజ్ చేద్దాం! * 4
సరైన సమాచారం తెలుసుకోకుండా బాధ్యతారహితంగా ఎలా దుషప్ప్రచారాలు చేస్తారు?
- అని నెటిజనుల్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మహిళలు నలుపురంగు లోదుస్తులు ధరించడం వల్ల క్యాన్సర్ రాదు అని ఆయన వివరణ ఇచ్చారు.
“ప్రతి సంవత్సరం భారతదేశంలో పది లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొంత మంది రోగులు ఇటీవలి కాలంలో ఆవు మూత్రం తాగి క్యాన్సర్ తగ్గుతుందేమోనని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టి, క్యాన్సర్ ముదిరిపోయిన దశలో చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. ఈ విషయాన్ని కలకత్తాలోని నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన దాక్టర్ సౌరవ్ దత్తా ధృవీకరించారు. అక్కడ ఈయన మెడ క్యాన్సర్ స్పెషలిస్ట్. అనారోగ్యకరమైన మూఢనమ్మకాల బారిన పడి ఎంతో మంది ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారనీ, వెంటనే అలాంటివి మానెయ్యాలని ఆయన హితవు పలికారు. వైజ్ఞానిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, జనం మూర్ధంగా అనామకులు, అజ్ఞానులు చెప్పింది నమ్మకూడదు.
భోపాల్ పార్లమెంట్ సభ్యురాలు బిజెపికి చెందిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్...తనకు రొమ్ము క్యాన్సర్ ఆవు మూత్రంతో నయమైందని ప్రకటించారు. దాన్ని మీడియా, సోషల్ మీడియా విసృతంగా ప్రచారం చేసింది. దానికి డాక్టర్ సౌరవ్ దత్తా కీలెరిగి వాత పెట్టారు. ఆమెకు నిజంగానే ఆవు మూత్రంతో క్యాన్సర్ నయమైపోతే మరి హాస్పిటల్లో మాసెక్టమీ చేయించుకోవడానికి ఎందుకు చేరారూ?” అని ప్రశ్నించారు. శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించకుందా ఆపరేషన్ చేసి రొమ్ము భాగాన్ని తొలగించడాన్ని 'మాసెక్టమీ అంటారు. అమాయక జనాన్ని అయోమయంలో పడదోసే అబద్ధపు ప్రకటనలు ఎవరిచ్చినా నమ్మకూడదు. నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఉన్నత పదవుల్లో ఉన్న వారు చెప్పినంత మాత్రాన ఏదైనా నిజమైపోదు. విషయ పరిజ్ఞానం ఉన్నవారు చెప్తేనే సత్యం బయటికి వస్తుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక నాటు వైద్యుడు పాము, తేలు, ఇతర విష పురుగుల కాటుకు తన దగ్గర వైద్యం ఉందని చెప్పుకున్నాడు. బాధితుల్ని ఎండలో కూర్చోబెట్టి, వారి వీపుల మీద ఇత్తడి పళ్ళాలు పెడుతున్నాడు. దాని వల్ల విషం దిగిపోతుందని నమ్మిస్తున్నాడు. అంధ విశ్వాసాలు వీడని ప్రజలు నమ్ముతూ అతను చెప్పినట్లు వింటున్నారు. ఇలాంటివి దేశ వ్యాప్తంగా ఎన్నో ఎన్నెన్నో నిత్యం జరుగుతూనే వున్నాయి. మోసపూరితంగా జనాన్ని నమ్మించే మోసగాళ్లు అడుగడుగునా వున్న ఈ దేశంలో పౌరులు వివేకవంతులైతే తప్ప మార్చు రాదు. ఒక అబద్ధంతో ఆ నాటు వైద్యుడు
డా. దేవరాజు మహారాజు ౦క్
పొట్ట పోసుకుంటున్నాడు. కానీ వందల మంది ప్రాణాలు ఫణంగా పెడుతున్నాడు. అదెంతో (ప్రమాదం కదా? 19వ శతాబ్దంలో ఓ మహానుభావుడు ఓ కథ చెప్పాడు. ఒక రోజు నిజం, అబద్ధం రెండు కలిశాయి. అబద్ధం అంది కదా... “చూడూ! ఈ రోజు ఎంత అందంగా ఉందో” అని. నిజం పైకి చూసింది. అకాశం నిర్మలంగా ఉంది. “అవును సుమా. ఈ రోజు ఎంతో హాయిగా ఉంది” అంది. వారు అలా నడుస్తూ ఒక దిగుడు బావి దగ్గరికి వచ్చారు. “చూడు! ఈ దిగుడు బావిలో నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయో. పద హాయిగా స్నానం చేద్దాం!” అంది అబద్ధం మనసులో ఏదో కుట్ర పెట్టుకుని. అది నిజం గ్రహించలేక స్నానానికి ఒప్పుకుంది. ఇద్దరూ బట్టలు గట్టు మీద విడిచి బావిలోకి దిగారు. సంతోషంగా జలకాలాడారు. ఉన్నట్టుండి అబద్ధం గబుక్కున బావిలోంచి బయటకి వచ్చింది. అంతకు ముందే నిజం విప్పేసిన బట్టలు తొడుక్కుని అక్కణ్ణించి జారుకుంది. జరిగిందేమిటో (గ్రహించి, నిజం బావిలోంచి బయటకు వచ్చేసరికి... అక్కడ తన గుడ్డలు కనిపించలేదు. అబద్ధం విడిచిన బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడక, నిజం మళ్లీ బావి లోకి వెళ్లి దాక్కుంది. తనను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చి తన బట్టలు తనకు ఇప్పిస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంది” నిజం విడిచేసిన బట్టలు తొడుక్కుని, అబద్ధం మాత్రం దర్జాగా “నిజంగా” చలామణి అవుతూ ఉంది. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, రాజకీయాలు, పరిపాలనా శాఖలు ఒక్కటేమిటి ప్రతి చోట, ప్రతి నోటా అది తన ప్రభావాన్ని చూపెట్టసాగింది. “నిజం ఇది కాదు! అది వేరే వుందని” ఆక్రోశించే నిజ నిర్ధారకులు, రచయితలు, వైజ్ఞానికులు, పౌర హక్షుల కార్యకర్తలు అన్యాయంగా శిక్షలకు గురవుతున్నారు. ఉరి తీయబడుతున్నారు. నిజం కోసం ఆ|క్రోశించే గొంతుల్ని పాలకుల తుపాకులు బలి తీసుకుంటున్నాయి. “నిజం నగ్నంగా నిర్భీతితో నిలబడడానికైనా వెనుకాడదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం విడిచేసిన బట్టలు మాత్రం తొడుక్కోదు' అని తెలిసిన సత్యాన్వేషకులు తమ జీవితాల్ని త్యాగం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిజాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తూనే ఉన్నారు... చేస్తూనే ఉన్నారు. (19.03. 2021, ఎడిట్ పేజి) దేశాన్ని శానివైజ్ చేద్దాం! ౨ 6
విశ్వాసం వున్న చోట విశ్లేషణ వుండదు వాస్తవికత లేని కల మూడ్ధుల న్వర్గం లాంటిది. న్యాదపోతున్నంత వరజూ ఆక్చుడో వమైనా నొద్దుము /
- జేమ్స్ రస్సెల్ లోవెల్
అమెరికన్ కవి, సంపాదకుడు, రాజనీతిజ్ఞుడు మనిషి కోతిలా ఉండే ఓ జాతిలో నుంచి పరిణామం చెందుతూ వచ్చాడంటే నమ్మంగాక నమ్మం. అదే కోతి జాతికి చెందిన హనుమంతుడనేవాడు రెక్కలు లేకుండానే అమాంతం గాల్లో ఎగిరి వెళ్ళి ఒక సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొచ్చాడంటే మాత్రం అర్ధ నిమిలిత నేత్రాలతో, భక్తి పారవశ్యంతో, భజనలు చేస్తూ నమ్ముతాం!! ఈ 'పవిత్ర భారతావనిలో పుట్టాక ఇక ఏం చేస్తాం? నమ్మక ఛస్తామా? నమ్ముతాం! నమ్ముతాం! “ఒకటో తరగతిలో చదివిన వాచకం, రెండో తరగతికి పనికిరాదు. మరి డెబ్బయి సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం “రాజ్యాంగం మన దేశ అభివృద్ధికి ఎంత వరకు దోహదపడుతుందీ?” అని ప్రశ్నించాడు ఒక దేశభక్తుడు. అవును కదా! ఎంత గొప్ప విషయం చెప్పాడూ అని మనం గుద్గు మిటకరించేలోపు మనకు మరొక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 1500 ఏళ్ల (క్రితం రాసిన 'మనుధర్మ శాస్తం ఇప్పటికీ పనికొస్తుందని మనువాదులు చెపుతున్నారే విడ్డూరం? ఈ మనువాద దేశభక్తులు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకటో తరగతి, రెండో తరగతి వాచకాల్లాగా భారత రాజ్యాంగం ఒక వాచకం కాదు. మరో విశేషమేమంటే, ఒకటో తరగతి వాచకానికున్న విలువకూడా
వారి శాస్త్రానికి లేదు. పులిహారలో “పులి లేనట్టే, “అచ్చే దినొలో అచ్చా ఎక్కడుందీ ? ఓ స్వామిజీ తన ఫేస్‌బుక్ వాల్ మీద “వేదాలు ఏం ఘోషిస్తున్నాయంటే. ” అని రాయడం మొదలు పెట్టాడు. అంటే టైప్ చేయడం ప్రారంభించగానే బయట కాలింగ్ బెల్ మోగింది. అతను కంగారుగా ఫోను గదిలోనే వదిలేసి, హాల్లోకి వెళ్ళాడు. అదే గదిలో ఓ మూల బాల్‌తో ఆడుకుంటున్న ఆయన మనుమడు బాల్ వదిలేసి, ఫోన్ చేతిలోకి తీసుకుని, అదీ ఇదీ నొక్కడం ప్రారంభించాడు. దానితో స్కీన్ మీద “జ ఇను డా, దేవరాజు మహారాజు ౪ 7
అగు ఓరస హ క్ జెప్టిక్ జిల్ వైర హాక్ ద్రజిక్ గజా పుంజెగ్..” అంటూ ఏవేవో అక్షరాలు టైపు అయిపోయాయి. అక్కడ జరిగింది.. అది! కానీ ఫేస్ బుక్‌లో అరగంట అవ్వక ముందే అర లక్ష లైకులు, పావులక్ష షేర్‌లు, ౩0కె నమస్కారాలు, 103 సూపర్‌లు వచ్చాయి. ఇది దేశంలో సామాన్యుల మానసిక స్థితిని తెలియజేస్తోంది. “చూశారా? స్వామిజీ వారి జ్ఞానసారం? ఆ పదాల అర్ధం తెలుసుకోవాలంటే మనబోటి వారికి ఒక జీవితకాలం సరిపోదు... అని అర్ధం వచ్చేట్టు వేల మంది కామెంట్స్ చేశారు. అంటే అర్ధం పర్ధం లేనివన్నీ మహాద్భుతాలు అని జనం గుడ్డిగా నమ్మేస్తున్నారన్న మాట ! ఇలాగే వెనకటికి ఒకాయన ప్రతి ఉగాదికి సత్యనారాయణ వ్రతం చేసుకునేవాడు. అయితే ఆయన ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి మాటిమాటికి వ్రతం మీద కూర్చున్న యజమాని ఒళ్ళోకి వచ్చి కూర్చునేది. పూజలో అంతరాయం కలుగుతోందని ఆయన పక్కనే ఉన్న బుట్ట కిందికి పిల్లిని తోసేశాడు. వోయిగా వ్రతం చేసుకున్నాడు. ఇదంతా ఆ ఇంటి యజమాని కొడుకు గమనించాడు. ఆ మరుసటి సంవత్సరం వ్రతం చేసుకోవాల్సిన ఉగాది రోజు, కొడుకు పిల్లిని ముందే గంప కింద దాచి, తల్లిదండ్రుల పక్కన కూర్చున్నాడు. కొడుకు తెలివికి ఇంటి యజమాని సంతోషించాడు. అలా పిల్లిని గంప కింద దాచి, ఆ పక్కనే వ్రతం చేసుకోవాలని పిల్లవాడికి అర్ధమైంది. అది ఆ ఇంటి సంప్రదాయమైంది. కాలం గడిచింది. యజమాని చనిపోయాడు. పిల్లీ అంతకు ముందే చనిపోయింది. ఉన్నత చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చిన కొడుక్కి సత్యనారాయణ (వ్రతం చేయాల్సి వచ్చింది. పిల్లి లేనిది వ్రతం చేసుకోవడం ఎలాగా? అని ఊళ్ళో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లిని తెచ్చాడు. దాన్ని గంప కింద కప్పి పెట్టి.. ఆ పక్కనే ఇంటి సంప్రదాయాన్ని కొనసాగించాడు. అంటే ఎప్పటిలాగే వ్రతం చేసుకున్నాడు. మనకున్న సంప్రదాయాలలో చాలా వరకు ఇలాంటివే. అనాలోచితంగా అనుసరిస్తున్నవే. అసలు వ్రతాలు, నోములు నోచుకోవడం అవసరమా అనేది ఒక అంశం అయితే, పక్సనే పిల్లిని గంప కింద దాచి పెట్టడం మరో అంశం. చిలువలు పలువలుగా ఒక మూఢత్వానికి మరో మూఢత్వం జత కూడుతూ, సమాజమే సంఫ్రదాయాలనే మూధత్వంలో కూరుకుపోయింది! ఇది ఒక ఇంట్లో ఏర్పడిన ఆచారం. ఇలాంటివి కొన్ని కొన్ని వర్గాలకు, జాతులకు పరిమితమైన మూధచారాలు ఎన్నో ఉన్నాయి. గుడ్డిగా అనుసరిస్తున్నంత కాలం అవి కొనసాగుతాయి. ఎవరో ఒకరు పూనుకుని విశ్లేషించకపోతే వాస్తవాలు బయటపడవు. దేశాన్ని శానివ్రైజ్ చేద్దాం! ౦ 8
చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారి, గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం లోకి ఒక తాబేలు వచ్చినప్పుడు, సాక్షాత్తూ కూర్మావతారమే తనకు ్రత్యక్షమైనట్టు ప్రకటించాడు. ఆ పక్కనే హిమాయత్‌సాగర్ చెరువు ఉండటం వల్ల అందులోంచి తాబేలు మెల్లగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఉంటుందన్న ఒక చిన్న విషయం ఆ పూజారిగారికి తోచలేదు. పైగా ఆర్భాటంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. భక్తులను ఆకట్టుకుని వారి మూఢత్వం మరింతగా పెంచి పోషించడంలో విజయం సాధించారు. ఇంగిత జ్ఞానం లోపించిన చోట భక్తి వర్ధిల్లుతుంది! “కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి / స్వార్ధలోలురు నా భుక్తి ననుభవింట్రు / కర్మ మననేమొ దాని కక్షయేమొ / ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ” అన్నారు కవి గుర్రం జాషువా. పనికొచ్చే వాస్తవమైన మాటలు మనం ఎవ్పుడు మననుకెక్కించుకున్నామనీ? ఎవ్వుడు నిజానిజాలు విశ్లేషించుకున్నామనీ ?
9-18 సంవత్సరాల మధ్య గల బ్రాహ్మణ బ్రహ్మచారులు కావాలని శ్రీశైలం లోని శ్రీ దేవీ వేద విద్యాలయం ప్రకటించింది. 108 మంది వేద విద్యార్థులకు ఉచిత భోజనం, ఇతర వసతులు ఏర్పరిచామని ఆ సంస్థ ప్రకటించింది. వేదాలు అంతరించి పోతున్నాయని, 'వాటిని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత” అని అ సంస్థ గుర్తుచేసింది. అంతా బాగానే ఉంది. అది ప్రతి భారతీయుడి బాధ్యత అయినప్పుడు, కేవలం (బ్రాహ్మణ బ్రహ్మచారులే ఎందుకు కావాలి? కేవలం అది వారి బాధ్యతే అని ప్రకటించుకుంటే సరిపోయేది. ప్రతి భారతీయుడు (బ్రాహ్మణుడు కాలేడు కదా? ఇందులో మతపరంగా జనాన్ని విడదీసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రతి భారతీయుడూ వేదాల్ని రక్షించే బాధ్యత నెత్తిన వేసుకోవాలి. వాటిని అధ్యయనం చేసే అవకాశం మాత్రం (బ్రాహ్మణ వర్గానికే ఇవ్వాలి. ఒక రకంగా నిచ్చెనమెట్ల సంస్కృతిని బతికిస్తూనే ఉండాలని ఆ ప్రకటన పరోక్షంగా ప్రకటిస్తూ ఉంది.
మార్చిన్ లూథర్‌కింగ్ జూనియర్ స్వప్నం ప్రపంచ మానవుల స్వప్నంగా ఎప్పుడు
మారుతుందో తెలియదు. ఆయన వమన్నాడంటే “నాకు ఒక స్వప్నం ఉంది. ఈ దేశం
స్వేచ్చా సమానత్వాల ఆదర్శాలకు నిలయంగా మారుతుందని... నాకాక స్వప్నం ఉంది.
బానిసల పిల్లలు, శ్వేత జాతీయుల పిల్లలు సోదర భావంతో కలిసి మెలిసి ఉంటారని దా, దేవరాజు మహారాజు ౨ 9
నాకొక స్వప్నం ఉంది. నా నలుగురు పిల్లలు చర్మం రంగుని బట్టి కాకుండా, వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతారని నాకొక స్వప్పం ఉంది!” అని. జాతి వివక్ష మాత్రమే కాదు, ఇక్కడ భారతీయ సమాజాన్ని నిచ్చెన మెట్ల సంస్కృతి ఇంకా అనేక విధాలుగా విభజించింది. అవన్నీ సమసిపోయి, మనుషులంతా ఒక్కటే అనే గ్రహింపు రావాలి. ఇది ఏ దేవుడో సృష్టించిన ప్రపంచం కాదు. లక్షల సంవత్సరాలుగా మానవ జాతులు సాధిస్తూ వచ్చిందే. ఆధునికుడు ఇంకా ఇంకా దాన్ని ఉన్నతీకరించుకుంటున్నదే ! అయితే ప్రస్తుత భారత ప్రభుత్వానికి ఆ స్పృహ ఉన్నట్టు లేదు. ఇంతటి కరోనా తీవ్రతలో, హరిద్వార్‌లో లక్షల మంది నగ్నంగా పాల్గొనే కుంభమేళాకు ఎందుకు అనుమతించినట్టూ? లక్షల కోట్ల బ్యాంకు దోపిడీ దార్లకు రుణ మాఫీ చేసే ఈ ప్రభుత్వానికి- ఉమ్ములు, మల మూత్రాలు విసర్జిస్తూ చేసే సామూహిక స్నానాలలో “పవిత్రత' మాత్రమే కనిపిస్తుంది కదా! మాస్క్ లేకుండా రోడ్దు మీద కనిపించిన సామాన్యుడికి మాత్రం జరిమానా విధిస్తారు! (21042021, ఎడిట్ పేజి త కాజా దాకాకాముకాలాలాదాదా టలు త మామకు రూబి ప్ల మేధావులు మవానంవపొంబినవ్చుడు | లై గై క్ మూర్ధుల నంబ్బు రెట్టీంవవుతుంది. వ్ క క్ ఇది ఎదిగో నమాజు బీనికీకే (నమాదం న్డ్ . జ్ ట్ర -నెల్సన్ మండేలా 1 . శ్ర దేశాన్ని శానిటైజ్ చేద్దాం) + 10
దేవుడు లేడని చెప్పడం కూడా హక్కే
నీద, నిప్పు, వాయువు, అగ్ని పదార్థాలతో ఈ విశ్వం, మానవ దేహం నిర్మితమైనవని తన పరిశీలనల వల్ల తెలియజెప్పినవాడు అజిత కేశ కంబళి. ప్రపంచం లోనే తొలి భౌతిక పదార్ధవాది. భారతీయుడు. పూర్వం నుంచే ఈ దేశంలో ఎన్నో జీవన విధానాలు వర్థిల్లాయి. చార్వాకం, లోకాయతం, సాంఖ్యం, వైశేషికం, న్యాయం, బౌద్ధం, జైనం మొదలైనవి. ఇవేవీ మతాలు కావు. జీవన తాత్విక దర్శనాలు. చార్వాక లోకాయత దర్శనాలు నాస్తిక దర్శనాలు. సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన ఇలాంటి దర్శనాల గురించి మనం చెప్పుకోం. ఇక మిగతా హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు దర్శనాలు కావు. కేవలం మతాలు. మతి లేని మతాలు. వాటికి ఒక నైతికత / ధార్మికత లేదు. ఉండదు.
“వేదాలు ప్రామాణికం కాదు. యజ్ఞాలు మోక్ష సాధనాలు కాదు. జంతు బలులు నిరసించాల్సినవిొ అని చెప్పిన మహావీరుడు అన్ని వర్దాలు సమానమేనన్నాడు. (బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. ఆయన సంవత్సర కాలంలో ఎనిమిది నెలలు దేశాటన చేసేవాడు. మిగిలిన నాలుగు నెలలు వైశాలి, చంప, రాజగ్భహ, మిథిల, శ్రావస్థి మొదలైన పట్టణాలలో కాలం గడిపేవాడు. ఈ పట్టణాలు నాటి జైనమత వ్యాప్తిని సూచిస్తాయి. క్రీ పూ. 468 సంవత్సరంలో పాటలీపుత సమీపం లోని పావపురిలో తన 72వ యేట నిర్యాణం చెందాడు. ఆ కాలంలో కేవలం జైనం, బౌద్ధం, అజీవక, చార్వాకం మాత్రమే కాదు, నాటి సమాజానికి సరికొత్త భావజాలం అందించడానికి సుమారు అరవై నాలుగు సంఘాలు పుట్టాయి. దేవుడు లేడని, ఆత్మ స్వర్ణ నరకాలు లేవని, ప్రతిదానికీ కార్యకారణ సంబంధం ఉంటుందని మొదట చెప్పింది చార్వాకులే! ఆ విషయాల్ని బౌద్ధం బలపరిచింది. ఒక రకంగా భారతీయ తత్వ చింతనలో బౌద్ధం ఒక ముందడుగు అయితే అది అన్యాయంగా అర్ధాంతరంగా ముగిసింది. గుప్తుల కాలం నాటికి వైదిక ధర్మం బలం పుంజుకుంది. ఫలితంగా భారతీయ భౌతికవాదం బలహీనపడుతూ వచ్చింది. క్రమక్రమంగా సమాజం దానికి పూర్తిగా దూరమయ్యింది.
వార్తా పత్రికలు, రేడియో, టీవీలు శాస్త్రీయ విజ్ఞానంతో మనిషి కనుగొన్న దా. దేవరాజు మహారాజు * 11
మాధ్యమాలే. కానీ, అవి పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకూ అశాస్రీయ మూఢనమ్మకాలు, అజ్ఞానం ప్రసారం చేస్తున్నాయి. దొంగ బాబాల ఉపన్యాసాలు, స్వాముల విన్యాసాలు వినిపీన్సున్నాయి. చూపిస్తున్నాయి. రుద్రాక్ష ధరించమని చెప్పడానికి ఒకరు, రంగురాళ్ళు ధరించమని మరొకరు. వీరేకాకుండా పేరులో అక్షరాలు మార్చుకోమని వేరొకరు వస్తుంటారు. సంఖ్యాశాస్త్రం, వాస్తు, జ్యోతిషం ప్రచారం చేయడానికి మరికొందరు వస్తారు. తప్పు వాళ్ళది కాదు. వాళ్ళను ప్రమోట్ చేస్తున్న ఆయా సంస్థల యాజమాన్యానిది. పూర్వాశ్రమంలో ఈ బాబాలు, స్వాములు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారో లేక డ్రగ్ మాఫియా గాళ్ళో, హీనమైన రాజకీయాలు చేసే (బోకర్‌గాళ్ళో అయి ఉంటారు. లేదా చిట్టీ డబ్బులు ఎగ్గొట్టి, బోర్డులు తిప్పేసి పారిపోయిన దౌంగస్వాములో అయి ఉంటారు. వీళ్ళ భరతం పట్టాలంటే మొదట వీళ్ళు పారిపోకుండా దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలి. దేశంలోని ప్రసార మాధ్యమాలు జనం మూఢనమ్మకాల్లో మునిగిపోకుండా చేతనత్వంతో పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మెరుగైన సమాజం స్థాపించబడుతుంది. కానీ, మరో వైపు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు.
“దేవుడు సర్వాంతర్యామి" అని భావించే వారంతా “దేవుడు లేడు. దేవుడు లేడు” అని పెరియార్ రామస్వామి విగ్రహం కింద చెక్కి ఉన్న అక్షరాలు చూసి ఇబ్బంది పడుతున్నారని - దైవ నాయకం అనే అతను మద్రాస్ (చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే - దేవుడు లేడని చెప్పే హక్కుకూడా ఉంటుంది. రాజ్యాంగంలోని 18వ అధికరణం (ప్రకారం భావ (ప్రకటనను అందరూ తమకు నచ్చినట్టు చేయవచ్చు - అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక మతసామరస్యం గురించి కొందరు పెద్ద పెద్ద మాటలు చెపుతుంటారు. కాని మనసులో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. మతాలన్నీ మూఢనమ్మకాలకు ్రతిరూపాలని మాత్రం [గగ్రహించరు. ఒక్కొసారి ఒక మతంలోని రెండు శాఖలు కలిసి మూడోదాన్ని నాశనం చేస్తాయి. లేదా ఒకదానికి మరొకటి సహాయపడతాయి. మత సామరస్యం అంటే ఒక మతం వాళ్ళు మరో మతానికి అద్దుపడకుండా దేవుడు, దయ్యం, ఆచారం, సంప్రదాయం అంటూ జనం (భ్రమని సమానంగా దోచుకోవడంగా వున్నది! నిజానికి మతాలకు గానీ, మత గురువులకు
దేశాన్ని శానిటైజ్ చేద్దాం! * 12
గానీ, వారి వారి దేవుళ్ళకు గానీ ఎక్కడా ఎప్పుడూ ఏ మహిమలు లేవన్నది ఇప్పుడౌచ్చిన కరోనా తేటతెల్లం చేసింది. ఈ దేశంలో ఇంత మంది స్వాములు, బాబాలు, పాస్టర్లు, ముల్లాల నుంచి ఏ పాజిటివ్ వైబ్రేషన్సూ రాలేదు. ఏ ఒక్కరూ కరోనాను కట్టడి చేయలేకపోయారు. మళ్ళీ మనిషే తన మేథోశక్తిని ఉపయోగించి, వాస్తవంలోంచి నివారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉండి, బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న గౌరవనీయులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో చూడండి. అన్ని రకాల మీడియాల్లో మనకు ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో నిజమెంత అనేది దేశ పౌరులు ఎవరికి వారే, వారి వారి విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి తేల్చుకోవాలి! “ఐజాక్ న్యూటన్, ఐన్‌స్టీన్‌లు ఆర్య బ్రాహ్మణులే” అని ఈ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. “మహాభారత కాలం నాటికే ఓలా, ఉబర్ క్యాబ్‌లు వాడుకలో ఉన్నట్టు త్రిపుర ముఖ్యమంత్రి ప్రకటించారు. పెట్రోలు ధరలు తగ్గాలని, పెట్రోలియం మంత్రి చండీయాగం చేశారు. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా, ఒక సామాన్యుడి న్థాయికి అసహాయంగా పడిపోవడం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమా? ఇంతటి ఘనాపాటి మరొక మంత్రిగారున్నారు. ఆయన పశుసంవర్ధక శాఖా మంత్రి. ఈయన దేశంలో నేరాలూ ఘోరాలూ తగ్గాలని ఆవులకు భగవద్గీత వినిపించారు. వర్షాల కోసం రెండు కప్పలకు పెళ్లి చేస్తారు గుజరాత్ విద్యామంత్రి. దేశ ప్రజల ఆరోగ్యం కోసం పిజ్జాలో చీజ్‌కు బదులు ఆవుపేడ పెట్టుకుని తినాలంటారు, ఆరోగ్యశాఖా మంత్రి. దేశంలో జీడీపీ రేటు పెరగాలని అశ్వమేథయాగం చేయాలని సూచిస్తారు ప్రధానమంత్రి ! ఇవన్నీ వాస్తవాలా? లేక ఎవరో కావాలని చేసిన వ్యంగ్య వ్యాఖ్యలా అని కొంతమందికి అనుమానం రావొచ్చు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ, అధికారంలో ఉన్న (ప్రభుత్వ పెద్దల ప్రకటనలు దాదాపు ఇలాగే ఉంటున్నాయి. ఒక్కోసారి ఇంతకన్నా హీనంగా కూడా ఉంటున్నాయి. అందువల్ల పదేపదే చెప్పేదేమంటే సామాన్య పౌరులు వివేకవంతులు కావాలి. నిజానిజాలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. 2020 సెప్టెంబర్ 10న భారత రక్షణ మంత్రి, ఫ్రాన్స్ రక్షణమంత్రి అంబాలా బేస్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన యుద్ధవిమానాల్ని భారత దా. దేవరాజు మహారాజు ౪ 18
వాయుసేనకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసిన కార్యక్రమం అది! అక్కడ సంప్రదాయం పేర 'సర్వ ధర్మ పూజు జరిపించారు. ఆ పూజల వల్ల ఆ యుద్ధ విమానాల నైపుణ్యం ఏమీ పెరగదు. జరిపించనంత మాత్రాన తరిగేదీ లేదు. ఇతర దేశాల్లో ఇలాంటి పూజలు జరగవు. ధర్మబోధకులు ఉంటే ఉంటారు. కానీ వారిని వైజ్ఞానిక / పరిశోధక / రక్షణ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలకు పిలవరు. మనదేశంలో మాత్రం ధర్మం పేరుతో అధర్మంగా జీవించే మూర్చుల్ని అనవసరంగా అవ్వానిస్తుంటారు. లేకపోతే ఇస్రో రాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉంటే అక్కడ జగ్గీవాసుదేవో మూడు (శ్రీల రవిశంకరో ఎందుకూ?
రాజకీయాల ఒత్తిడీ, ఉన్నతాధికారుల బలహీనతా కాకపోతే ?? ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారి కార్యక్రమాల్ని చూసి సామాన్యులు కూదా మూర్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు నిత్యజీవితం లోంచి ఎన్ని సంఘటనలైనా చెప్పుకోవచ్చు. 2020 జూన్ 80న ఛత్తీస్‌గఢ్‌లో పిడుగుపాటుకు ఆవుపేడ వైద్యం జరిగింది. పిడుగుపడటంతో అక్కడ ఇద్దరు యువకులు, ఒక యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకుపోకుండా, తీరిగ్గా ఒంటి నిండా ఆవుపేడ పూస్తూ కాలయాపన చేశారు. వైద్యసహాయం అందక వారు మరణించారు. అమాయకులైన గిరిజనులు ఉండే ఆ గ్రామంలో మూఢనమ్మకాలు ఎక్కువ! ఉన్నత స్థాయి విద్యావంతుల్లో ఒకరకమైన మూఢనమ్మకాలుంటే, మారుమూల గ్రామాల్లో విద్యా విహీనుల్లో మరొకరకమైనవి ఉన్నాయి. దీనికి కారణం పరిపాలకులు, అధికారులు, రాజకీయాలు, స్వార్థం, కుత్సిత బుద్ధి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో. సనాతన ధర్మం చెప్పినట్టు... “ధర్మం నాలుగు పాదాల మీద” ఎప్పుడూ నడవలేదు. నాలుగు వర్దాల మీదే నడిచింది. దానిలోంచే ఎక్కడా లేని మూఢనమ్మకాలు జనంలో జీర్జించుకుపోయాయి. పరిస్థితి అలాగే ఉండాలనుకోవడం మూర్ధత్వం. అందరికీ సమానమైన విద్య, అవకాశాలు, హక్కులు, న్యాయం అందే దాకా సంఘర్షణ తప్పదు. అందుకే అర్జెంటీనా మార్కిస్టు విప్లవకారుడు చే గువేరా అంటాడు... “21వ శతాబ్దవు మానవుల్ని అంటే మనల్ని మనం తయారుచేసుకోవాలి. కొత్త సాంకేతిక శాస్త్రంతో కొత్త (స్రీ పురుషుల్ని తయారు
చేసుకోవడానికి మనం రోజువారిగా కృషి చేస్తూ ఉండాలి” అని !
(02.04.2021, ఎడిట్ పేజి) దేశాన్ని శానిటైజ్ చేద్దాం! * 14
స్త్రీలను కించపరిచిన పాఠ్య గ్రంథాలు వరునగా జరిగిన మానవ వాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనాపరులైన రచయితలపై ఒత్తిళ్ళు, నోట్ల రద్దు, జిఎస్‌టి, బ్యాంకుల దివాళా, రైతుల లాంగ్ మార్చ్ వంటివన్నీ భవిష్యత్తు చీకటిగా వుండబోతోందని హెచ్చరిస్తున్నాయి. (ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక కారణమైతే, వివిధ రాష్ట్రాలలోని పాఠ్యపుస్తకాల్లోని అంశాలు మరొక కారణం. పాఠ్యపుస్తకాలలో అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా చోటు చేసుకున్నాయో గమనించండి. పదమూడు-పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలకు తప్పుడు సమాచారం అందించడమంటే, వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా? గుజరాత్‌లో యాఖై వేలమంది చదువుకునే ఒక సామాన్య శాస్ర పాఠ్య [గ్రంథంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్, అమెరికాపై అణుయుద్ధం ప్రకటించిందని ఉంది. వక్రీకరించిన చారిత్రక అంశాలు చదువుకుని భావి భారత పౌరులు ఎలా తయారవుతారన్నది ఆందోళన పడాల్సిన విషయం. అదేవిధంగా ప్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్యగ్రంథాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏమిటీ? రాజస్థాన్‌లో బోధిస్తున్న ఒక పాఠ్య గ్రంథంలో స్త్రీలను గాడిదలతో పోల్చారు. ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీలు గాడిదల్లా చాకిరి చేయాల్సి ఉంటుందని హిందీ పాఠ్య పుస్తకంలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టు కింద కాసేపు విశ్రాంతి ఇవ్వొచ్చు. కానీ ప్రీలకు ఇవ్వకూడదు. “పాపం గాడిదలు పారిపోయినా వెంటనే మళ్ళీ దొరుకుతాయి. వాటికి ప్రీల వలే పుట్టింటికి పారిపోయే సౌకర్యం లేదు” అని ఆ పాఠం రాసిన రచయిత ఓ చమక్కు విసిరాడు. ఆ విషయాన్ని కింది స్థాయి నుండి పై న్థాయి అధికారుల దాకా అందరూ ఆమోదించారు. కాస్త సున్నిత మనస్సులు, ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ఆ పాఠం పిల్లలకు ఎలా చెప్తారు ? మనసు చంపుకొని ఉద్యోగ ధర్మంగా పాఠం చెప్పడమంత శిక్ష మరొకటి ఉండదు కదా? 'పిల్లల పాఠంలో అలాంటి అంశం ఎందుకుందిని ఒక జాతీయ పత్రికా విలేకరి సంబంధిత అధికారిని అడిగారు. దానికా అధికారి...ఏదో పిల్లలకు కాస్త సరదాగా డా, దేవరాజు మహారాజు 9 15
ఉంటుందని అలా పెట్టి ఉంటారు? అదో పెద్ద విషయమా? అని ఎదురు ప్రశ్నించాడు. “భార్యలు గాడిదల్లాంటి వారూ అన్న వాక్యంలో అతనికి ఏ తప్పూ కనిపించలేదు. బిజెపి (ప్రభుత్వాలున్న గుజరాత్, రాజస్థాన్‌లలో అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అలాగే కేంద్ర ప్రభుత్వం వారికీ ఎవరికీ అందులో తప్పే కనిపించలేదు. వీళ్ళంతా ఆధునిక మనువాద ్రతినిధులన్న మాట!
సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) పాఠ్య పుస్తకంలో పది, పదకొండేళ్ళ పిల్లలు చదువుకునే పుస్తకంలో మాంసాహారం తినేవారి వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. మాంసాహారం తీసుకునేవారు అవలీలగా అబద్దాలు చెప్తారని, ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోరని, అల్లర్లు అలజడులు సృష్టిస్తారని, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడతారని, వారికి నిజాయితీ, సీబద్ధత ఉండదని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడతారని ఉంది. ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి పసి మనసుల్ని ప్రభావితం చేయడం ఎంతవరకు సబబు? ఏ ఆహారం తీసుకుంటే ఏయే లాభాలున్నాయి? ఎందులో ఎన్ని నష్టాలున్నాయి? అనేది శాస్త్రీయంగా వివరించాలి. ఆహారం ఎంచుకునే స్వేచ్చ పిల్లలకు ఇవ్వాలి. అంతేగాని నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ గుదిగుచ్చి మాంసాహారులకు ఆపాదిస్తే అది నిజమైపోదు కదా? ఒక రకంగా చూస్తే మాంసాహారులు, శాఖాహారులు ప్రపంచంలో సమానంగా ఉండి ఉంటారు. లేదా మాంసాహారుల సంఖ్యే ఎక్కువగా ఉండి ఉంటుంది. అట్లని శాఖభాహారులంతా సచ్చీలురు, సత్యవ్రతులు, సత్‌ప్రవర్తన గల మహానీయులు కాదు గదా? ఈ విషయమే సిబిఎస్‌ఇ డైరెక్టర్‌ని అడిగితే పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో విషయాలు ఒక్కో రకంగా ఉన్నాయని ఒప్పుకున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్ళయిపోయినా బాలబాలికలకు చెప్పాల్సిన
పాఠ్యాంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం ఘోరం! ప్రభుత్వాలు మారినప్పుడుల్లొ అంశాలు, వక్రీకరణలు మారుతూ ఉండడం మరో ఘోరం!
మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్‌లోని హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో 'దేశంలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం మహిళలు” అని ఉంది. 'మహిళలు అల్ని రంగాల్లో విజ్బంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతున్నందు వల్ల పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది” అని ప్రభుత్వం వారు నిర్ధారించారు. స్త్రీ పురుషులందరూ దేశ
దేశాన్ని శానిటైజ్ చేద్దాం! 16
పౌరులైనప్పుడు పౌరులకు సమాన హక్ములున్నప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పని చేయాలి. ఉద్యోగావకాశాలు కల్పించాలి. అంతేగాని, మహిళలు చదువుకుని ఉద్యోగాలకు పోటీ పడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అసంబద్ధంగా ఉంది. (స్త్రీలను గొడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతి మాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగభాగమైన మహిళలను హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా లేదూ? ఇలాగైతే భవిష్యత్తు అంతా అంధకారమే కదా? అచ్చే దిన్, స్వచ్చ భారత్ నినాదాల కింద ఎంత మురుగు పేరుకు పోతోందో ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్కటి ముందడుగు వేయకపోగా, దేశం వెయ్యడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ నిజాలు (గ్రహించి, పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారికి హేతుబద్దంగా ఆలోచించడం నేర్పాలి. (12.08.2021, ఎడిట్ పేజి) నపననననపలతతతతతతతతతడానడడా ౬57 0౦| ౧౦౮౫౧17౧౬5 [౬౬౧౮ 101014 1% ఉనిగిం?॥న 6॥1515 5860110 ౪౪/౬
*|ఇ౯౬4|5
ఉశ్ళి్య లా జాం ఇ
*ట్రవన్నీ |... క. (
*కగ౮రి1 గగిగ8ి1గ వ లన.
సు న నానా.
*గధ55్1గీ నా.
*510164%01 య మం తన.
*రిట కశ గమ ఓ!గి టి నం! .
*ంగి[1గిలిగి స్ట న
“50౮7141 [0౧౬4 స. ల. ర శ.
వ!
*దింగొత౧13 "4656 60౪౫౧1౬5 ౭౬ 6111541 ౫
ఉట౫ంగారింల?ం ౮5111 & 8౪001157 ౫॥4|౦|5.4%0 616
*దింగ6981 ల 0500౯00 ౧619 ౩ 60౮౧6౧ ౪186 1౧612
ఉన ఆరక్‌గి ఆం 6||౧15714045 & [1౮5౬1045 2౯6
ఉైగ్ల[తగథీ 6926066 [1%6 56006 61359 (19126౧52
ఉష 2631306 024044౫౪15 62౬4౯6౯2 764
*(తైగడెరేడె (గ్ర ని
దా. దేవరాజు మహారాజు + 17
ఇది మన కథ.. మనందరి గాథ...!
వనునిషి కోతి నుంచి పుట్టాడంటే చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. “మనమిప్పుడు చూస్తున్న కోతులకు మనుషులకు చాలా తేడాలున్నాయి కదా? ఇదంతా భగవంతుడి సృష్టి. ఈ భూమి మీదున్న చరాచర సృష్టికంతటికీ ఆ జగదక్షకుడే కారణం..! అని బలంగా నమ్మేవారికి వైజ్ఞానిక వివరణలు బుర్రకెక్కవు, వారి వారి విశ్వాసాల్లోంచి బయటవడి, మానవుడి విజయాల మీద గౌరవం పెంచుకుంటే వారి ఆలోచనలు మారిపోతాయి. ్రమల్ని వదిలి వారు వాస్తవంలోకి రాగలుగుతారు. అప్పుడు ఎలాంటి సున్నితమైన అంశమైనా, సంక్షిష్టమైన అంశమైనా అర్థం చేసుకోగలుగుతారు. *మా పూర్వీకులు కోతులు కాదు బాబూ! మేం మనుషులం మనుషులుగానే పుట్టాం” అని జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్‌నే ఆనాడు ఎంతోమంది ఎగతాళి చేశారు. ఎగతాళులు, వెకిలి మాటలు గాలికి కొట్టుకుపోయాయి. డార్విన్ సిద్ధాంతం మాత్రం స్థిరంగా నిలబడింది. ఆయన తర్వాత తరాలలో వచ్చిన శాస్త్ర పరిశోధకులకు అది ఒక మూల సూత్రమైంది. జీవధార అయ్యింది (ప్రపంచానికే *జీవన ప్రదాయిని” అయ్యింది. హేతువాదులకు, మానవ వాదులకు శక్తిప్రదాయిని అయ్యింది.
'కోతి నుంచి మనిషి వచ్చేశాడు కదా? మరింకా కోతులెందుకున్నాయీ?” అని కొందరు అమాయకంగా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్యజీవితంలోంచి ఒక సులభమైన ఉదాహరణ చెప్పుకుందాం. పాల డబ్బాలోంచి కొన్ని పాలు తీసి వేడి చేసుకుని, కప్పులో పోసుకుని, కాఫీ పొడి, చక్కెర కలుపుకుని కాఖీ చేసుకున్నాం అని అనుకుందాం. అప్పుడేమైంది? పాల నుంచి కాఫీ తయారైంది. కొన్ని పదార్థాల మిశ్రమం వల్ల కాఫీ అయ్యింది. డబ్బాలోని మిగతా పాలన్నీ పాలలాగే ఉన్నాయి. పదార్థాల మిశ్రమం జరిగిన కప్పులో మాభ్రమే కాఫీ ఉంటుంది. ఊరికే అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నాం గానీ,
ప్రకృతిలో జరిగే మార్పులు ఇంత సులభంగా ఉండవు. అనేకనేక కారణాల వల్ల పరిణామం జరిగినప్పుడు కొత్త జీవాలు ఉద్భవిస్తాయి. జరగనవ్షుడు జీవులు అలాగే పాత రూపాల్లో కొనసాగుతాయి. కొనసాగలేకపోతే అంతరించిపోతాయి. పరిణామం చెందినవి కూడా కొంతకాలం కొనసాగుతాయి. కొనసాగలేకపోతే అంతరించిపోతాయి.
దేశాన్ని శానిటైజ్ చేద్దాం! + 18
భూమికి 4.6 బిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. గ్రేట్ ఏప్స్ (6౧౬౯4౯౯5) అనబడే హోమినిడ్ (4011110) కుటుంబం ఈ భూమి మీద 20 మిలియన్ సంవత్సరాల (క్రితం రూపొందింది. హోమినిడ్ కుటుంబంలో ఎన్నో మానవ రూపాలు ఉద్భవించాయి. కాలక్రమంలో అంతరించాయి. మార్పులు, చేర్చులూ చేసుకుంటూ, కొన్ని మానవ రూపాలు హోమోసేపియన్‌కు చాలా దగ్గరి దాకా వచ్చాయి. పరిణామ క్రమంలో 4 నుంచి 2.5 లక్షల సంవత్సరాలకు పూర్వం మన ఈ మానవ జాతి అంటే ఆధునిక మానవ జాతి ఏర్పడింది. వీరినే 'హోమో సేపియన్స్' అనే శాస్ర్తీయ నామంతో పిలుచుకుంటున్నాం. 1859లో ఛాల్లెస్ డార్విన్ తొలిసారి ఒక కొత్త విషయం చెప్పాడు. “ప్రతి జీవి అంతకు ముందున్న జీవి నుంచి పరిణామం చెందుతూ ఆవిర్భవించిందేనని. ఆయన చెప్పిన విషయాన్ని ధామస్ హక్స్‌లే, రిచర్డ్ ఓవెన్ అనే ఇద్దరు శాస్రజ్ఞులు బలపరిచారు. 1908లో హక్స్‌లే- ప్రకృతిలో మానవుడి ఉనికికి సంబంధించిన రుజువుల గూర్చి ఒక పుస్తకం ప్రచురించాడు. ఒక సిద్ధాంతంగా ఆనాటి పలువురు శాస్త్రవేత్తలు డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకుని బలపర్చినా, అప్పటికి వారికి శిలాజాల ఆచూకీ దొరకలేదు. గ్రేట్ ఏప్స్‌కు- నరజాతికి మధ్య జరిగిన పరిణామానికి ఆధారాలు (114) దొరకలేదు. ఆ లోటు 1891లో తీరింది. యుగిన్ డుబోయిస్ అనే పరిశోధకుడికి డచ్ ఈస్ట్ ఇండీస్ (ఇప్పటి ఇండోనేసియా)లో ట్రినిల్ అనే చోట నరజాతి తొలి శిలాజం లఖించింది. అప్పుడే గ్రేట్ ఏప్స్‌కు తొలి మానవుడికి మధ్య కొన్ని దశలు ఉన్నాయన్నదీ ఆ రెంటికీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నదీ నిర్ధారణ అయ్యింది. యుగిన్ డుబోయిస్ తనకు దొరికిన ఆ శిలాజాన్ని అధ్యయనం చేసి, దానికి జావా మ్యాన్ (౧౧౫౯౦స౫+గ౦౯౮౪ ౯౧౬౯౦1౮9) అనే పేరు పెట్టాడు. ఆ రకంగా అన్వేషణ ప్రారంభమైంది. 1920లో ఆఫ్రికా ఖండంలో మరికొన్ని ఆది మానవ శిలాజాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి నరశాస్త్ర పరిశోధనలు విస్సతమవుతూ వచ్చాయి. ఇక్కడ కొన్ని హోమోజాతి నరుల గూర్చి, వారి ప్రత్యేకతల గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. ఉన్నవి మొత్తం ఇవే కాదు. కానీ, ఉన్నవాటిలో చాలా ముఖ్యమైన జాతుల గూర్చి మాత్రమే మనమిక్కడ ్రస్తావించుకుంటున్నాం. ఎన్నెన్నో దశలు దాటి వస్తేగాని ఈ ఆధునిక మానవుడు (10౪40 34౧1౪4) రూపొందాడన్నది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. హోమో హైడల్ బగ్గెన్సిస్ (4040 ౫8౦౬
దా. దేవరాజు మహారాజు 9 19
85౧6౬319), హోమో రుడోల్ఫెన్సిస్ (410140 ౧౮౦౬౯౯౫515), హోమో హాబిలిస్ (40810 ౧9115), హోమో ఫ్లోరిసియోన్సిస్ (4040 ౬0[౯51౯513), హోమో ఎరెక్టస్ (410140 6౧౬౦705) హోమో నియాండెర్తలెన్సిన్ (౧౦౪౦ ౫౯4౫౦౬౧7౧4 ౬౬౯౫౨|5), హోమోసేపియన్స్ (40140 91౧౯5) మొదలైన జాతుల వివరాలు చూద్దాం. చలి నుంచి తప్పించుకోడానికి... హోమో హైడెల్‌బర్దెన్సిస్‌కు చెందిన జాతి ఏడు నుంచి రెండు లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద జీవించింది. తొలుత ఆఫ్రికా ఖండంలో ఉద్భవించింది. ఇప్పుడున్న మనుషులతో పోలిస్తే వీరి ముఖం బల్లపరుపుగా ఉండేది. కపాలంలో పెద్ద పరిమాణంలో ఉండే మెదడు పట్టడానికి తగినంత చోటు ఉంది గనుక, మెదడు పెద్దదిగా ఉండేదని తెలున్తూ ఉంది. అతి శీతల (ప్రదేశాల్లో జీవించగలిగే ఈ జాతి చలి నుంచి తప్పించుకోవడానికి తొలిసారి చిన్నపాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంది. అతిపెద్ద ఆకారాలున్న జంతువుల్ని సైతం వీరు వేటాడగలిగేవారు. వీరి కంటే ముందున్న నరజాతులు చేయలేని ఈ సాహసోపేతమైన పనిని వీరు చేయగలిగారు. ఈ జాతి పురుషుడి ఎత్తు 175 సెం.మీ, బరువు 692 కి.గ్రా. ప్రీల ఎత్తు 157 సెం.మీ, బరువు 51 కి.గ్రా. ఈ హోమో హైడల్ బరగ్గెన్సిస్ శిలాజం తొలుత జర్మనీలో 1907 అక్టోబర్ 21న ఒక పనివాడికి దొరికింది. అతను హైడల్‌బర్ట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టో షృుటిన్ సాకు అప్పగించాడు. ఆ ప్రొఫెసర్ ఆ శిలాజాన్ని అధ్యయనం చేసి, వారి విశ్వవిద్యాలయం పేరుతో హోమో హైడెల్‌బర్గెన్సిస్ అనే పేరు పెట్టి పూర్తి వివరాలు శాస్త్ర ప్రపంచానికి తెలియజేశాడు. 20 లక్షల క్రితం హోమో రుడోల్ఫెన్సిస్ అనేది హోమినిడి కుటుంబానికి చెందిన మరొక అంతరించిన జాతి. 1.9 నుంచి 1.5 మిలియన్ సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేదని భావిస్తున్నారు. మిగతా శరీర భాగాల శిలాజాలు లభించినా, కపాలాస్థికల శిలాజాలు లభించక పోవడం వల్ల, ఈ జాతి వారి ఎత్తు, బరువు, దేహ సౌష్టవం, ముఖ కవళికలు వగైరా ఎలా ఉండేవో లెక్కకట్టడానికి వీలు కాలేదు. పేలియో ఆంత్రపాలజిస్ట్ మేవేలీకి ఆమె సహచరులు హోమో రుడోల్ఫెన్సిస్‌కు సంబంధించిన ముఖ భాగం, దవడ ఎముకలు వేశాన్ని శానిటైజ్ చేద్దాం! * 20
2012 ఆగస్టు 2న కనుగొన్నారు. ఆ జాతి జీవించి ఉన్న కాలం లెక్కగట్టడంలో చాలా తర్జన భర్ణన జరిగింది. చివరికి 1.9 మిలియన్ సంవత్సరాలకు పూర్వం జీవించిన జాతిగా నిర్ధారణ జరిగింది. ఆక్సిపిటల్ ఎముక గుండ్రంగా హోమో ఎరక్టన్ వలె ఉందడం, ముఖ్యంగా తలపై భాగం సన్నగా ఉండి, మధ్య భాగం వెడల్పుగా ఉండదం, అలాగే బలమైన కండరాలు లేకపోవడం, దంతాల వరుసలో కెనైన్‌లకు వెనక ఉన్న దంతాలు బాగా పెద్దవిగా ఉండడం మొదలైన కారణాల వల్ల ఇతర హోమో జాతులకు ఇది భిన్నంగా ఉందన్న విషయం తెలుసుకున్నారు. అందుకే రుడోల్ఫెన్సిస్ అని కొత్త పేరు నిర్ధారించి ప్రత్యేకంగా గుర్తించారు.
విభిన్నత... వైవిధ్యత...
హోమినిడి కుటుంబానికి చెందిన మరొక జాతి హోమో హబిలిస్. ఈ జాతి 2.4
నుంచి 1.4 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద సంచరించింది. మానవ లక్షణాల కన్నా ఈ జాతిలో గ్రేట్ ఏప్స్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాళ్లూ, చేతులు చాలా పొడవుగా ఉండడం వల్ల, తల చిన్నగా, ముఖ కవళికలు అధిక శాతం ఏప్స్‌ను పోలి ఉండడం వల్ల, ముఖం ఏటవాలుగా ఉండడం, ముక్కురం(్రాలు పైకి తెరుచుకుని ఉండడం వల్ల ఈ జాతిని హోమో జాతిలో చేర్చవచ్చా లేదా? అని కొంత సంశయం ఏర్పడింది. అయితే ఇది కూడా అభివృద్ధి చెందిన ఇతర మానవజాతుల్లాగా రాతి పనిముట్లు తయారు చేసుకోవడం వల్ల ఇక ఈ జాతిని హోమో సమూహంలో చేర్చక తప్పలేదు. మెదడు పేటిక (32౧41౫ 0459 550-687? సెం.మీ ఉంది. దంతాలు చిన్నవి. లూయిస్, మెరీ లీకె అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు తూర్పు ఆఫ్రికా టాంజానియాలోని ఓల్డ్ వాయ్, గార్జ్‌లో హోమో వాబిలిస్ శిలాజాలు మూడు సేకరించి 1960లో అధ్యయనం చేశారు.
మూదోవంతు తలతో...
హోమో ఫ్లోరిసియెన్సిస్ జాతి 95 నుంచి 17 వేల సంవత్సరాలకు పూర్వం
ఇందోనేసియాలో జీవించింది. వీరి ఆకారం చాలా చిన్నది. సుమారు మూడున్నర ఫీట్ల ఎత్తు మాత్రమే ఉండేవారు. మెదడు పరిమాణం కూడా చిన్నదే. ఇప్పుడున్న ఆధునిక మానవుడి మెదడు పరిమాణంలో మూడో వంతు ఎంతుంటుందో ఈ జాతి వారి తల అంతుంటుంది. కానీ, రాతి పరికరాలు తయారు చేసుకుని చిన్నపాటి ఏనుగుల్ని పెద్ద
డా, దేవరాజు మహారాజు ౪ 21
ఎలుకల్ని అవలీలగా వేటాడేవారు. చిన్న ఆకారాలతో కొద్దిపాటి ఆహారం తీసుకుని బతకగలిగారంటే బహుశా అందుకు కారణం, వారున్న ద్వీపంలో లభించే కొద్దిపాటి వనరులే కారణం అయి ఉంటుంది. ఈ జాతి శిలాజాలు ఇటీవలి కాలంలో 2003లో ఇండోనేసియాలో దొరికాయి. భారత్‌కు వలస వోమో ఎరెక్టస్ అనేది అంతరించిపోయిన మరొక పురాతన మానవ జాతి. ఇది ప్లిస్టోసిన్ కాలంలో అంటే 1.9 మిలియన్ల నుంచి లక్షా నలభై మూడు వేల ఏళ్లకు పూర్వం వరకు గల మధ్య కాలంలో జీవించి ఉంది. తొలి హోమో ఎరక్షస్ శిలాజాలు జూవాలో అంటే నేటి ఇండోనేసియాలో 1890లలో యుగిన్ డుబోయిస్ అనే పరిశోధకుడికి లభించింది. నరజాతి తొలి శిలాజం సాధించిన ఈ శాస్త్రవేత్త చారవ వల్లనే శిలాజ శాస్త్రం, నరశాస్త్రాలలో పరిశోధనలు వేగవంతమయ్యాయి. ఆఫ్రికాలో ఉద్భవించిన హోమో ఎరెక్టస్ భారత్, చైనా, జార్జియా, జావాలకు వలస వెళుతూ విస్తరించిన జాతి అని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ జాతి వారు 4 అడుగుల 9 అంగుళాల నుంచి 5 అడుగుల 1 అంగుళం మధ్య ఎత్తు ఉందేవారు. బరువు 88-150 (89) మధ్య, ఆఫ్రికాలో లభించిన ఇదే జాతి శిలాజాలు ఇండోనేసియా, చైనా, జార్జియా వంటి ఇతర ప్రాంతాల్లో లభ్యమైన శిలాజాల కంటే పెద్దవిగా ఉన్నాయి. పొడవైన కాళ్లూ, పొట్టి చేతులూ ఉండడం వల్ల ఈ జాతి వారు చెట్లు సులభంగా ఎక్కగలిగేవారు. ఇప్పటి ఆధునిక మానవుడి కంటే వీరు చాలా వేగంగా పరుగెత్తగలిగేవారు కూడా! దృఢకాయుల జాతి హోమో నియాండెర్తలెన్సిస్ నేటి ఆధునిక మానవుడైన హోమో సేపియన్స్ జాతికి అతి దగ్గరి సంబంధాలున్న జాతి. ఈ రెండు జాతులలోని డిఎన్‌ఎ అంతా ఒక్కటే. 0.12 శాతం డిఎన్‌ఎ మాత్రమే నియాండెర్లల్ మానవుల్లో వేరుగా ఉండేది. అంటే ఈ రెండు జాతులు ఎంత దగ్గరివో అర్ధం చేసుకోవాలి. అందుకే ఈ రెండు జాతుల మధ్య లైంగిక సంబంధాలు కూడా ఉండేవి. అందుకే శరీర నిర్మాణంలో అతి దగ్గరి పోలికలు కూడా వచ్చాయి. నియాండెర్తల్స్ జాతి యూరోప్, ఆసియాలలో చాలా చోట్లకు వలన వెళ్లింది. ఆయుధాలు తయారు చేసుకోవడం అంతకు ముందు నుండే ఇతర మానవ జాతుల్లో దేశాన్ని శానిటైజ్ చేద్దాం! * 22
ఉంది. నియాండెర్తల్స్‌లో కూడా ఉంది. అయితే వాటికన్నా ఈ జాతి మరింత పురోగతి సాధించింది. ఆభరణాలు తయారుచేసుకుని ధరించడం, చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం, తమ (శ్రద్ద్ధాసక్తుల్ని గౌరవ భావనలను పూలు సమర్పించి వ్యక్తపరుచుకోవడం చేసేవారు. పుట్టినప్పుడు నియాండెర్తల్ హోమోసేపియన్‌ల మెదడు పరిమాణం, శరీర సౌష్టవం ఒకేలా ఉందేది. కానీ పెరిగి పెద్దయ్యేసరికి నియాండెర్తల్స్ బాగా దృఢకాయులయ్యేవారు. పురుషులయితే 168 సెం.మీ, స్త్రీలు 158 సెం.మీ ఉండేవారు. హోమో సేపియన్స్‌లో అంటే ఆధునిక మానవుడిలో దేహదారుధ్యం అంతలా లేకపోయినా మెదడు పరిమాణం మాత్రం పెరిగింది. ఫలితంగా వివేచన, విచక్షణ పెరుగుతూ వచ్చింది. మన మనుగడ హోమినిడి కుటుంబానికి చెందిన మానవ జాతులెన్నో ఉద్భవించాయి.
అంతరించాయి. కానీ లక్షల వళ్లుగా నిరాఘాటంగా ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని నెలకొాల్పుకున్నది 'హోమో సేపియన్లు' మాత్రమే! ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ఖండాల్లో
వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా హోమో సేపియన్సే. ఎత్తులో,
రంగులో, దేహ దారుధ్యంలో తేడాలున్నది నిజమే గాని, అందరిదీ ఒకే హోమో సేపియన్ మానవ జాతి. ఇథియోపియాలోని హర్టోలో అతి పురాతన హోమో సేపియన్ శిలాజాలు
లభించాయి. ౪ తర్వాత కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకుల బృందానికి మూడు
కపాలాలు లభించాయి. అందులో రెండు పెద్దవారివైతే, ఒకటి చిన్నపిల్లది. ఇవి లక్షా
అరవై వేల నుంచి నలభై వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన హోమో సేపియన్ల
శిలాజాలని తేలింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ప్రకృతిని
అర్ధం చేసుకుంటూ మానవ సంబంధాల్ని పెంచుకుంటూ, సమూహాలుగా జీవిస్తూ ప్రతి
పనిలో నైపుణ్యం సాధించిన వారు హోమో సేపియన్లు. నిప్పును కనుక్కోవడం, చెట్లను
పెంచుకోవడం, పశువుల్ని మచ్చిక చేసుకోవడంతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది.
ఆవాసాల్ని అందంగా కట్టుకోవడం, పర్యావరణ నహ పెంచుకోవడం, భాషల్ని రూపొందించుకోవడం, తనను తాను వ్యక్తీకరించుకోగలగడం, లెక్కలు, సైన్సు, కళలు,
సంగీతం, వంటి వాటికి రూపకల్పన చేసుకోవడం.. కాలక్రమంలో ఏర్పడుతూ వచ్చిన
సమాజాల్ని బాగు చేసుకోవడం లాంటివన్నీ చేస్తూ వచ్చింది హోమో సేపియనులే! ఆలోచన,
దా. దేవరాజు, మహారాజు ౪ 28
అన్వేషణ, పరిశీలన, పరిశోధనల ఫలితంగా హోమో సేపియన్లు ఒక నూతన శకానికి నాంది పలికారు. ఆలోచించాలి కదా..!
ఒకవైపు అంతరిక్షాన్ని అవగతం చేసుకుంటూ, మరోవైపు తాను నడిచొచ్చిన దారుల్ని అధ్యయనం చేస్తూ పురోగామి అయినవాడు మనిషి-హోమో సేపియన్. అన్నిటికీ జన్యువులే కారణమని తెలుసుకోగలిగినవాడు, డిఎన్‌ఎ-ఆర్‌ఎన్‌ఎ రహస్యాలను అర్థం చేసుకోగలిగినవాడు, ఒకానొక చీకటి క్షణంలో, అవగాహన పెరగని కాలంలో సృష్టికర్త. ఎవరో ఒకరున్నారని (భ్రమించాడు. అయితే అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని ఊహించుకోలేకపోయాడు. అందుకే చూడండి..! ఇంత అభివృద్ధి సాధించిన 21వ శతాబ్ధంలో కూడా, వివేచన, విచక్షణ పెరిగిన దశలో కూడా చాలా మంది అతిపురాతన మానవ జాతులకున్న అవగాహనతోనే ప్రవర్తిస్తుంటారు. బాహ్యంగా అత్యాధునికుల్లా కనిపిస్తుంటారు. కానీ, సమకాలీన వైజ్ఞానిక స్పృహ పెంచుకోరు. మానవ జాతుల గూర్చి మనం సమీక్షించుకోవడం ఎందుకంటే, జీవ పరిణామంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల్లో మార్పులకు గురవుతూ, మంచు యుగాన్ని శిలా యుగాన్ని లోహ యుగాన్ని యంత్ర యుగాన్ని దాటుకుంటూ పురోగమనమే ధ్యేయంగా నంవుర్నిస్తూ, ఒక్కొక్కటి సాధించుకుంటూ ఈ న్థాయికి చేరుకున్న ఆధునికుడు, వాస్తవాలను పక్కనపెట్టి అభూత కల్పనల్ని నమ్ముతూ తిరోగమనంలో బతుకీద్చడం సిగ్గుచేటు కాదా? మిలియన్ సంవత్సరాలుగా తనను తాను నిలబెట్టుకోవడానికి మానవుడు పడిన, పడుతున్న ఈ 'ప్రయాస అంతా వృథా అయిపోదా? దానికి విలువే లేదా? యుగాల మానవ చరిత్రను అపహాస్యం చేసి, అభాసుపాలు చేసి, మనిషి పుట్టుకకు, ఎదుగుదలకు సంబంధించిన గొప్పతనాన్నంతా ఏ మాత్రం ఆలోచన లేకుండా ఏదో అదృశ్య శక్తికి అంటగట్టడం ఏ
రకంగా న్యాయం? తర్మించుకునే పనే లేదా?
(25.08.2019 స్నేహ, ఆదివారం అనుబంధం, అట్టమీది కథ) దేశాన్ని శానిటైజ్ చేద్దాం! 24
కరోనా నేర్పిన కొత్త పాఠాలు
మనుషల్ని కాపాడటం దేవుళ్ళకు, దైవాంశ సంభూతులు అనుకునేవారికి సాధ్యం కాదు.
కరోనా ధాటికి తట్టుకోలేక అన్ని మతాల దేవుళ్ళు పారిపోయారు. యుద్ధంలో ఓడిపోయిన, ఎవరికీ ఉపయోగపడని ఆ దైవ భావనని ఇంకా నిలుపుకోవడం ఎందుకూ? మనకు నిజంగా సహాయ పడ్డవారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన విలువ పెరుగుతుంది. నిరంతరం మానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న శాస్ర్రవేత్తల్ని గౌరవించుకుందాం. అలాగే వ్యాపారానికి దూరంగా ఉంటూ, 'సేవా భావంతో పని చేసే ఇతర వృత్తుల వారినందరినీ గుర్తిద్దాం. ఒకరకంగా కరోనా హేతువాదాన్ని తట్టి లేపింది. లేకపోతే మతం, భక్తి పూజ, (యేయర్హు, నమాజులు అన్నీ ఎందుకు పనిచేయలేదూ? అవన్నీ బతుకుదెరువు కోసం మార్గాలు, ఆత్మవంచనలు, నటనలు అని తేలిపోయింది! మత విశ్వాసాన్ని మంచి ప్రవర్తనగా అనుకోగూడదు. ఎందుకంటే మత విశ్వాసానికీ నైతికతకు సంబంధం లేదు. మంచి ప్రవర్తనకు నైతికతకూ గట్టి సంబంధం ఉంటుంది. మత విశ్వాసకులే అనేక అనైతిక కార్యకలాపాలకు పూనుకుంటున్నది మనం (ప్రతక్షంగా చూస్తున్నాం! నువ్వు మంచి వ్యక్తివా కాదా? అనేది నీ మత విశ్వాసం మీదనో, నీ స్థాయి మీదనో, నీ సంస్కృతీ సాంప్రదాయాల మీదనో, నీ చర్మం రంగు మీదనో రాజకీయ ధోరణి మీదనో ఆధారపడి ఉండదు. అది కేవలం నువ్వు ఇతర మనుషుల్ని ఎలా చూస్తావు, వారితో ఎలా వ్యవహరిస్తావనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ప్రపంచంలో దయాళువులకు కొదవలేదు.
సినీ నటులు సోనూ సూద్, ప్రకాశ్‌రాజ్‌లు తెర మీద విలన్లు. కానీ నిజ జీవితంలో హీరోల్లాగా ప్రవర్తించారు. కొందరు సూపర్‌స్టార్లు మౌత్రం ఇంట్లో దోశలు వేస్తూనో, చెట్లకు నీళ్ళు పెడుతూనో కాలక్షేపం చేశారు. ఉన్నవాళ్ళు రూ. కోట్లలో విరాళాలు ప్రకటిస్తే, కొందరు సామాన్యులు వెలకట్టలేని దొతృత్వం (ప్రదర్శించారు. ఆస్పత్రులలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, ఇంటికొచ్చి వంటలు చేసి వలస కార్మికుల
దా. దేవరాజు మహారాజు * 2క్
ఆకలి బాధ తీర్చిన వారున్నారు. ఎందరో దయార్ద్ర హృదయలు, ఎన్నో సామాజిక సంస్థలు కుల, మత, ప్రాంతీయ బేధాలు చూడకుండా కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆహారం అందించడం మన చూశాం. రాజకీయాలకు అతీతంగా మనిషిలోని మానవత్వమే గెలచి నిలిచింది. పరిశుభ్రత - ఆరోగ్యాల ప్రాముఖ్యం తెలిసి వచ్చింది చేతులు కడుక్కుంటూ ఉండటం, సానిటైజర్లు వాడుతూ ఉండటం మామూలైపోయింది. ఇమ్యూనిటీ గురించిన అవగాహన, విటమిన్ల పరిజ్ఞానం పెరిగింది. జీవ-వైద్య శాస్త్రాల ప్రాముఖ్యం తెలిసొచ్చింది. ఉన్న ఫళాన ఆక్సీ మీటర్ల వాడకం పెరిగింది. గోరు వెచ్చని నీరు తాగడం, అనవసరంగా బయటికి వెళ్ళకుండా ఇళ్లల్లోనే ఉండటం మనకు అలవాటైంది. జంతు ప్రదర్శనశాలల్లో జంతువులు ఎలాంటి బాధను అనుభవిస్తాయో అర్థమయ్యింది. స్వేచ్చగా అడవుల్లో తిరిగే జంతువులు, మనుషుల వినోదం కోసం బందీలై, ముక్కుతూ మూల్గుతూ జంతు ప్రదర్శనశాలల్లో ఎలా కాలం గడుపుతాయో, వౌస్ అరెస్టయిన నాయకులు ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుందో... ప్రపంచ వ్యాప్తంగా సామాన్య పౌరులు కూడా అలాంటి బాధను, వేదనను అనుభవించాల్సి వచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్లు ప్రకటించినా.. ఆ లాక్‌డౌన్లు ఎన్నో ఇతర రంగాల మీద ప్రభావం చూపాయి. పరిస్థితుల్ని ఎదుర్కొని, తట్టుకోలేని పిల్లల్లో, వృద్ధుల్లో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలకు విఘాతం కలిగింది. కొత్త జీవన విధానాలు అలవరుచుకోవాల్సి వచ్చింది. మనిషి తన శాస్త్ర సాంకేతికాభివృద్ధిని చూసి విర్రవీగకూడదు. ఇంకా సాధించాల్సింది చాలా వుంది. కోవిడ్-19కు వ్యాక్సిన్లు వచ్చినా, అవి నూటికి నూరు పాళ్ళు విజయవంతంగా పని చేస్తున్నాయన్న విషయం ఇంకా తేలలేదు. మనిషి తప్పులు చేస్తే, గుర్తించుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సింది కూడా మళ్ళీ మనిషేనన్నది రుజువైంది. శాస్త్రవేత్తలయినా, మందుల కంపెనీ వారైనా, డాక్టర్లయినా, పారామెడికల్ దేశాన్ని శానిటైజ్ చేద్దాం! 9 26
సిబ్బందయినా, సఫాయి కార్మికులయినా, పోలీసులయినా.. శ్రమించి పని చేసేవారే 'హీరోలవుతారు. అసమర్థతతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు కీలక స్థానాల్లో వున్నా జనం దృష్టిలో వారు జీరోలే!
ఐటి సెల్ పెట్టి వేలాదిమందితో అబద్ధాలు ప్రచారం చేయించినంత మాత్రాన (ప్రజల్ని విడదీయడం ఏ ప్రభుత్వానికీ చేతకాదు.
ఇతర దేశాల నుంచి ముస్లింలు రావడం వల్లనే ఇండియాలో కరోనా వ్యాపించిందన్న అబద్ధం ఏమైంది? పౌరసత్వ చట్టానికీ, ఇటీవల నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారి గురించి . ఎన్నెన్ని అబద్దాలు ప్రచారం చేశారూ? కుల మత ప్రాంతీయ భేదాలతో దేశ ప్రజలు విడిపోలేదే? ఐకమత్యంగానే ఉన్నారు.
ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాల్ని తిప్పికొట్టారు.
డార్విన్ చెప్పిన “మనుగడ కోసం పోరాటం ఎలాగో నిజ జీవితంలో ప్రత్యక్షంగా చూశాం
కాలి నడకన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు ప్రయాణించడం, దేశవ్యాప్తంగా షాహీన్‌బాగ్‌లు, సింగూ సరిహద్దులో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రైతుల ఆందోళనలు తాజా ఉదాహరణలు. ఇవన్నీ కరోనా రాక ముందు, వచ్చిన తర్వాతా జరిగినవే! ఊపిరి వదిలి, ఊపిరి తీసుకోవడంలో ఒక సంఘర్షణ ఉంది. అడుగు తీసి, అడుగేయడంలో ఒక పోరాటం ఉంది!
ప్రేక్షక పాత్ర వహించిన ప్రభుత్వాధినేతల వల్ల ఏమీ జరగదని తేలిపోయింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో కోవిడ్-19 చర్యలు తీసుకున్నారు. వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లు జరపడం తప్పు, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ చేసిందేమీ లేదు. నిధులిచ్చిందీ లేదు. (ప్రోత్సహించిందీ లేదు. రెండు వ్యాక్సిన్లు బయటికి రాగానే 'మూనవత్వ పరిరక్షణలో భారత్ ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లు ప్రపంచానికి అందిస్తోంది” అని గొప్పగా చెప్పుకున్న ఈ దేశ నాయకుడు, వైజ్ఞానిక పరిశోధనాశాలలకు ఇవ్వాల్సిన నిధుల్లో ఎందుకు కోత విధించారు? వ్యాక్సిన్లు బయటికి రావడంలో శాస్త్రజ్ఞుల కృషి ఎంకో ఉంది. నిరంతరాయంగా ఆ ఇనిస్టిట్యూట్‌లు వ్యాక్సిన్లు కనిపెదుతూనే వున్నాయి. వాటిని ప్రోత్సహించడంలో దేశ నాయకుడి పాత్ర గానీ, కేంద్ర ప్రభుత్వ పాత్రగానీ ఏమీ లేదు. వారి వారి దేశాల్లో ట్రంప్, బోల్పోనారోల విధానాలూ ఇలాంటీవే!
దా. దేవరాజు మహారాజు ౨ 2
భక్తి ఆధ్యాత్మికత, భజనలు, పూజలు అన్నీ వ్యర్థం! వివేకంతో మసలుకోవడమే ముఖ్యం... నిజమే! అందుకే జనం వీటిని పక్కన పెట్టి, ఇమ్యూనిటీ పెంచుకోవడం గురించి తెలుసుకుంటున్నారు. నిన్నటి దాకా ఎవరికీ తెలియని 'ఆక్సీ మీటర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటోంది. మదనపల్లెలో అత్యున్నత విద్యావంతులైన తల్లిదం[డ్రులే విద్యావంతులైన స్వంత కూతుళ్లని చంపుకున్నారు. పైగా వారు బతికి, తిరిగొస్తారని నమ్ముతున్నారు. ఇలాంటి విషయాల్ని అసహ్యించుకునే ప్రజలు...నిజం వైపు, వాస్తవం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రమాదం కరోనా వల్ల ఎక్కువ జరుగుతోందా? లేక మనిషి వల్లనా అనేది ఇంకా తేలలేదు. కరోనానే మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ, భ్రమల్లో బతికే మనుషుల వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. సత్వరం దాన్ని ఆపాలి! (20.02.2021, ఎడిట్ పేజి) = 52,000 వేల కోట్ల రూపాయలు ... " కరోనా పరిశోధనకు, దానం చేసిన ల భారతీయ ముస్లిం కుబేరుడు . _ శ$అజీమ్ ప్రేమ్.జి =. దేశాన్ని శానివైజ్ చేద్దాం! * 28
ఒక దేశం - ఒకే పువ్వు
ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు
వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని
వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో
వివరాలు తెలియజేయాలని ఎవరో కొత్త చట్టం తెచ్చారు
గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో
అవి ఎంత వేగంతో వీచాలనుకున్నాయో
వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని
ఎవరో కొత్త చట్టం తెచ్చారు
ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు
సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది మా టక.
సల హ్
అందువల్ల ఈ చట్లాలు నా తర్వూ, ఒగరు రాం న సె
- వ ల్ని గ న, | [6 స
సత్వరమే అమల్లోకొస్తున్నాయి! మ. “ల.
మ ని ఇ వరం లం తమ చుట్టాలకు అనుగుణంగా న వ రకం ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు ఒద్దును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక! ఎగిసెగిసి పడడం మళ్ళీ తిరిగివెళ్ళడం బలం పుంజుకుని మళ్ళీ నీటి పిడికిళ్ళతో తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు తిరుగుబాట్లు, ఉద్యమాలు, హోరెత్తి పోవడాలు నిషిద్ధం ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒద్దు లోపల మాత్రమే నిశ్శబ్దంగా ('ప్రవహించాల్సి ఉంటుంది!
దా, దేవరాజు మహారాజు 9 29
తోటలోని మొక్కలన్నీ ఒకేవిధంగా పూయాలని పూచే పూల రంగు కూదా ఒకటిగానే ఉండాలని కొత్త చట్టం అమలులో కొచ్చింది
ఒకే రంగు మాత్రమే కాదు
ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట! ఒకే దేశం - ఒకే పువ్వు !!
ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి? తోటలో అన్ని మొక్కల పూలు ఒకేరంగా ఉండవని పూలన్నీ ఒకే రంగులో అసలే ఉండవని- ఉండడానికి వీలేలేదని-
ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా వారికి ఎవడు చెప్పాలి?
గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని కెరటం ఎవరి జి.ఒ.లతోనో వెనక్కి మళ్ళదని ఎంతటి వారైనా సరే వాటిని గమనిస్తూ
వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప
మరో మార్గం లేదని!
లేకపోతే... అవి సృష్టించే సునామీలో
అడ్రసు లేకుండా గల్లంతు కావాల్సిందేనని నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని
వారికి ఎవరైనా చెప్పండి! కనీస గౌరవమైనా.. కాపాడుకొమ్మని!! (దేశవ్యాప్తంగా జరిగిన రైతుదద్యమ నేపధ్యంలో)
(01.02.2021, అక్షరం, సాహిత్య పేజి) దేశాన్ని శానిట్రైజ్ చేద్దాం! * 80
దేశాన్ని సానిటైజ్ చేద్దాం ! ఈ దేశానికి కొత్త వైరస్ సోకింది, జాగ్రత్తగా ఉండండి ! ఇది ప్రశ్నను కాపు కాచి హత్య చేస్తుంది ముస్లింలు, మైనార్టీలు, దళితులపై బాహాటంగానే దాడి చేస్తుంది. ఊపిరి పీల్చుకుంటే వదలనివ్వదు వదిలితే పీల్చుకోనివ్వదు ఈ వైరస్ ! గడ్డ కట్టే చలిలో అక్కడ రైతులకు రక్తపరీక్షలు చేస్తుంది బ్యాంకులో నాలుగు డబ్బులుంటే చాలు లాగేసుకుని, నిన్ను రోడ్డున పడేస్తుంది. కాపలాదారు వైరస్ రూపంలో వచ్చి చేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వడు వైరస్ 'చాయ్‌వాలా'గా వచ్చేసి, మన చాయ్ మనల్ని తాగనివ్వదు. ఈ వైరస్ ఇంటికి ఎలా వస్తుందో మనకే తెలియట్లేదు. గ్యాస్ బండతో వస్తుందా? బండిలో పెట్రోలుతో వస్తుందా? కూరగాయలతో వస్తుందా? సరుకులతో వస్తుందా? జనాలతో కలిసి మెలసి ఉండొద్దని చెపుతోంది వైరస్ కులాల పేరుతో, మతాల పేరుతో వేరు చేస్తుంది వైరస్ మనుషులంకా ఒక్కటే అన్నవాణ్ణి
డా. దేవరాజు మహారాజు ౪ 31
పక్క దేశం పొమ్మని చెప్తుంది. ఆవు పేడ పూసుకుని ఈ వైరస్, ఆవు మూత్రం తాగుతుంది నినాదాళ్లేన్, హక్కుల్లేవ్, పోరాటాల్లేవ్ ఎక్కువ మాట్లాడితే నువ్వీ దేశ పౌరుడివని రుజువేంటి? అని ప్రశ్నిస్తుంది దేశభక్తి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటుంది. చదువుకున్నవారి చదువులన్నీ ఈ వైరస్‌తో చంకనాకిపోతాయి అబద్దాల ఫ్యాక్టరీలో ఉన్నతాధికారులవుతారు. చెవుల్లో పూలు పెట్టి, వైరస్ వీరితో భజన్లు చేయిస్తుంది. శరీర భాగాల్లో కాకుండా, ఈ వైరస్ కేవలం మెదళ్లలో తిష్ట వేస్తుంది. ఆలోచనల్ని తొలిచేసి డొల్లగా చేస్తుంది. రోడ్డు మీద మనుషులు తిరగాలి... కానీ, ఎవరిలోనూ మనిషితత్వం ఉండకూడదు, మానవత్వం మిగలకూడదు అయితే మరి, ఇప్పుడేం చేద్దాం? నువ్వు నేనూ శానిటైజర్ రుద్దుకుంటూ కూర్చుంటే కాదురా తమ్ముడూ ! లే...దేశాన్ని కేకేయ్... అందరినీ పిలువ్.. ఈ దేశాన్ని సానిటైజ్ చేయాల్సి ఉంది. (24042021, ఎడిట్ గన 444 “స్తవ్హ్వైత్రగ దేశాన్ని శానిటైజ్ చేద్దాం! ౦ 882
క్ష | దేశంలో కరోనా రెండవ దశ విలయతాందవం జాకి సిన వరసట అం చేస్తోంది. కనీసంగా తీసుకోవలసిన ముందు కన్తో న. [2 జాగత్తలు తీనుకోలేని దౌర్చాగ్యన్నితిలో ష్ // యు || (౮ ప్రభుత్వాధినేతలు ఉన్నారు. ప్రధానమంత్రి స్థాయి 1 జ (క్రూ ల కల నుండి, మంత్రులు, యం.పి.ల వరకు వందల యు (1 అ 2 సంవత్సరాల ముందే భారత్‌లో ప్లాస్టిక్ సర్జరీ న వో శల (0 శ ఉన్నదని, టెస్ట్‌ట్యూబ్ బేబీలను తయారుచేసే ఖీ | క్ష ( 0 సూ విధానం ఉందని, ఆవు మూత్రం వల్ల క్యాన్సర్‌లు టు
- (0 నయమవుతాయని రకరకాలుగా అశాస్త్రీయ ం 10, [5 భావజాలాన్ని వదులుతున్నారు. తమ వైఫల్యాల గీ ఆ నుండి దృష్టి మళ్ళించే తాత్విక ధోరణి ఇది. సమాజ _ డ్రా దేవరాజు మహారాజు 2న పురోగమనాన్ని ప్రజల ఐక్యతను దెబ్బతీసే మత దృక్కోణం కూడా ఇందుకు ఇ లై తోడయ్యింది. ఈ కరోనా సంక్షోభం దేశప్రజల ముందుకు అనేక మౌలిక ప్రశ్నలు (గ ణి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో డా॥ దేవరాజు మహారాజు గారు మూఢవిశ్వాసాలపై (0 *ణన్యా శాస్త్రీయ అవగాహన కలిగించే, ఆలోచింపజేసే వ్యాసాలు వెలువరించారు. మానవ "డై గై మేధస్సుతో కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమని ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సానిటైజ్ డై (1 చేయాల్సి ఉందని పేర్ళొన్నారు. ఈ వ్యాసాలన్నీ ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించారు.
౨ ఎంతో నిజాయితీతో కూడినవిగానూ, వేదనతో కదిలింపజేసేవిగానూ ఉన్న ఈ గై (0 వ్యాసాలను ఎక్కువ మందికి చేర్చాలనే ఉద్దేశంతో మాకినేని బసవపున్నయ్య గ్ర [0 విజ్ఞానేంద్రం తన వంతు కర్తవ్యంగా భావించి మీ ముందుకు ఈ చిన్నప్తుస్తకంగా | (0౬ తీసుకువస్తుంది. అత్యంత విలువైన ఈ పుస్తకాన్ని అందరూ అధ్యయనం చేయాలని 60 కరోనా.
మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం