Telugu chichetana - anilvaranasi/indianlanguages GitHub Wiki
చిచ్చేతన నం. కసరీరీపు రాముకోచిశ్చా ( 1 ఈ ప్రి న్ సే 3 య జ.
న్.
చిచ్చేతన కపరీరీపు రామకోదిశాస్తే కూర్పు కాత్యాయనీ రిప జిజ్లాస ప్రచురణ ఖా వరంగల్లు
ణీ గ] (మ ౦ ౦ లం (1041౯414 శ్రి వ పు. |) థ్ రింగ్ శు శిం2460దం00ట/ 26-12-1931 28-10-1991 66 668110% : 0య096 28, 2006 చే1ర్రగ252 ౧౧౦౧౪౯2౧౩16-13 గం. 15/- బిటలీ[వగీంరో ల్వీ/ యగ! 1100084416 గాణ 0౫౯6418 5521600౪11 ౧౧4౧004411 5-11-667, జయం 10316402 ౪౧/6 519/ గండ6, 21306248 - 506 009 112౪706422 800% [0౪56 000: గగ(3 53003] |2061 స2ం0104642,. ౧౪64620364 నిగ౧(౭౮ ఈ/ తంగం[2 గగం[03 0౧66 ౧౧౧౪౭౧5 50966 ౧16113 06466 1372002 - 506 002 ౯; 0870-2427404 చకరయ్య గ్ర ( 0 ఈ (8 ద 2 ర
చిచ్చేతన పారవశ్యం
ఈ శతకం చదువుతున్నంత సేపూ, రామకోటి శాస్త్రిగారి చిలిపి చిరునవ్వుముఖం మనసులో మెదులుతూనే ఉంది. ఈ పుస్తకానికి ముందుమాట రాయమని కాత్యాయని నన్ను అడిగింది. ఆయన పుస్తకాన్ని విమర్శించి విశ్లేషించేటంత పాండిత్యం నాకు లేదు ఆయనలాగే నేనూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసినా, నేను వేరే మార్గంలో వెళ్ళిపోయి, భాషా పరిశోధనను ప్రధానరంగంగా ఎన్నుకున్నాను. ఆయన పరిశోధనలోనూ, రచనలోనూ, వయసులోనూ నాకూ సీనియర్
నాకు రామకోటిశాస్రిగారి కవిత్వం ఇష్టం. ఆయన కవిత్వాన్ని విశ్లేషించను గాని పారవశ్యంతో చదువుతాను. ఆ పారవశ్యాన్ని ఆయన పారకులతో పంచుకోటానికి కాత్యాయని నాకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చింది
రామకోటిశాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో చదవని గ్రంథం లేదనుకుంటా. ఎప్పుడో వావిళ్ల వారు 1927లో అచ్చువేసిన శకుంతలా పరిణయంలో వాసిరెడ్డి, చిటుమామిళ్ల వంశం వారి ప్రస్తావన ఉంది. ఈ ఇళ్ల పేర్లవారు మా బంధువర్గంలో వారు. దాన్ని గురించి మాట వరసకు శాస్తి గారితో మాట్లాడుతూ పేర్కొన్నాను. వెంటనే ఆయన అవును కృష్ణకవి రచించిన శకుంతలా పరిణయం కదూ అని వెంటనే ఆ పుస్తకం గురించి వివరాలు చెప్పారు ఏ మారుమూల పుస్తకం గురించి అయినా అడగండి. ఆయన దగ్గర సమాచారం తప్పకుండా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఆయన పాండిత్యం ఆంత గొప్పది
ఆయన ఎంత పండితుడో అంతటి రసజ్ఞుడు అందుకే ఆయన కవిత్వం చాలా ఇష్టంగా చదువుతాను. ఆయన పద్యరచన చాలా కమనీయంగా ఉంటుంది రమణీయంగా ఉంటుంది
ఈ శతకానికి ఆయన చిచ్చేతన అనే పేరు పెట్టారు పద్యరచనలో ఈయనపై విశ్వనాధ సత్యనారాయణ గారి ప్రభావం ఉందని ఆయన పారకులందరికీ తెలిసిందే ప్రభావం అంటే కవితాశక్తిని విస్తరించకుండా క్లుప్తీకరించేది అని కాదు. కవిత్వాన్ని దీప్తిమతం చేసే ప్రభావం అది శాస్త్రిగారి పద్యరచన పద్యంలా ఉండదు మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. మాట్లాడే భాషలో వాక్య విన్యాసం ఆయన కవిత్వంలో అలవోకగా కనిపిస్తుంది ప్రాచీన భాషను ఆధునికం చేసిన వైనం ఇందులో కనిపిస్తుంది. మొడలుపెట్టటమే “అనుకోలేదు” అని మొదలుపెట్టి పదకొండు పద్యాలు రచించారు. “నిన్ను చూడ గల్గుతాననుకోలేదు . * అనే
3
పద్ధతిలో మొదలయింది. ఆయన ఊహించని విధంగా ఆమె సాక్షాత్కారం అయిందన్న సంతోషాన్ని ఈ వ్యావహారిక వాక్య విన్యాసం అద్భుతంగా పట్టుకుంది ఈ శతకానికి మకుటం “రాజ రాజేశ్వరీ” అని. శాస్త్రిగారు శాక్తేయోపాసకులను కుంటాను దేవీ నవరాత్రి ఉత్సవాలు పాటించేవారని విన్నాను. రాజరాజేశ్వరి శక్తి స్వరూపణి ఆమెను ఉద్దేశించే ఈ శతకాన్ని రచించారు. చిచ్చేతన అనేది ఆమెకు ఒక పేరు. ఆత్మజ్ఞాన వైతన్యం కలది అని అర్ధం మకుటంతో పిలవాలంటే రాజరాజేశ్వరీ శతకం అనాలి. అయితే శతకాన్ని మకుటంతోనే పిలవాలనే నియమంలేదు. మకుటం తెలుగులో ఏర్పడ్డ ఒక పద్ధతి. శతకానికి మకుటం తప్పనిసరేం కాదు వ్యక్తిని కాని దైవాన్ని కాని ఉద్దేశించి చేసిన సంబోధనే ప్రధానం. సంబోధన పద్యాల ఎన్నికను నియంత్రిస్తుంది. రాజరాజేశ్వరీ ముకుటం వల్ల ఈ శతకంలో మత్తేభ, శార్జూలాలు వాడుకున్నారు శతకానికి అవసరమైన నూట ఎనిమిది పద్యాలను రచించిన తరువాత మరో మూడు పద్యాలు అదే మకుటంతో రాసినవి అనుబంధంలో ఉన్నాయి. ఆ తరువాత ఛందస్సు మార్చారు అంతేకాదు శతకలక్షణం నుంచి దూరం పోయారు. సంబోధన వదిలేశారు. దేవీస్తుతి పేరుతో రెండు రెండు పాదాల మధ్యాక్కరలను రచించారు. అట్లా ఇరవై ఒక్కజంట పాదాల మధ్యాక్కరలను రచించారు. ఆ మధ్యాక్కరలలో సరిపాదం అన్నింటా ఒకటే “ఆదేవికాదేవి కార్తి హంత్రికి సాష్టాంగనతులు” అని ఉంటుంది మళ్ళీ తర్వాత ఛందస్సు మార్చి నాలుగోపాదం మాత్రంపై మధ్యాక్కరలాగే 'ఆదేవికాదేవి కార్తి హంత్రికి సాష్టాంగనతులు” అని ఉంచి ఒక పద్యం రచించి మళ్లీ వేరే మూసలోక్షి వెళ్ళారు. శాస్త్రిగారి రచనలన్నీ నేను చదివి ఆనందించాను అట్లా ఆనందించి చేసిన పలవరింతలను నేను ఇతరత్రా రాశాను ముఖ్యంగా స్మృతి కిజాంకం (పే. 170-176) పుస్తకంలో ఆయన చిరునవ్వు ఒక చెరిగిపోని జ్ఞాపకం (చేరాతలు 1992) ఫిబ్రవరి 16) అనే పేరుతో ఆయన్ను గురించి జ్ఞాపకాలు అనేకం రాశాను. ముఖ్యంగా ఆయన రాసిన 'అనందచేతన” అనే పుస్తకాన్ని గురించి రాస్తూ దాన్ని శతకంగా వివరించి శతక లక్ష్య వివేచన చేశాను. అయితే “చిచ్చేతని అనే రాజరాజేశ్వరీ శతకాన్ని ఆయన రచించినట్టు అప్పుడు నాకు తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఆయన శతకంగానే ఉద్దేశించి రాసిన పుస్తకాన్ని చదివి ఆనందించే అవకాశం కలగటం నా అదృష్టం అందుకు ఆనందిస్తూ కాత్యాయనిని మరోసారి అభినందిస్తున్నాను. శాస్త్రిగారి కవితా రచనలో అనేక విశేషాలు కనిపిస్తాయి. ఆయన రచనలపై ఎవరైనా పరిశోధించి విశేషాలు వెలికి తీస్తే బాగుంటుంది. (ఆ పని కాత్యాయనే చేయించాలి) శీ
శాస్త్రిగారు పద్యరచనలో అనేక చమత్కారాలు చూపిస్తారు. అన్నిటినీ నేను గమనించానని చెప్పలేను గాని, గమనించిన వాటిని కొన్ని ప్రస్తావిస్తాను. శాస్త్రిగారి పద్యరచనలో ముఖ్యంగా గమనించవలసింది పదప్రయోగం. అది విశిష్టంగా ఉంటుంది. పాండిత్య స్ఫోరకంగా ఉండటమే కాదు ఆయన (ప్రయోగవైశిష్టం కూడా కనిపిస్తుంది మనందరికీ తెలిసిన (ప్రయోగం స్వాధీనపతిక. శాస్త్రిగారు 'స్వాధీనపతిన్” అని వాడతారు (పద్యం. 8) పద్యరచనలో సామ్యాన్ని భేదాన్ని ఏకకాలికంగా నూచించటం శాస్త్రిగారి టెక్సిక్. అందుకోసం ఆయన పద్యంలో కొంతభాగాన్ని పునరుక్తం చేస్తూనే భేదాన్ని సూచిస్తారు. ఉదాహరణంగా ఈ పద్యాన్ని గమనించండి. నిన్నంజూడగ గుండెవీకును గదే నీరేజ వశ్రేక్షజా నిన్నుంజూచిన భీతి గుందె లవియున్ నీరేజ వశ్రేక్షణా నిన్నం జూడక గుందెయాదడు కదే నీరేజ వత్రేక్షణా నిన్నుం జూచుడు, చూదముల్ వలయు చండీరాజరాజేళ్వరీ 16 శతకం ముక్తకాల సమాహారం అన్నమాట నిజమే అయినా వాటి మధ్య కొన్ని సంబంధాలను కల్పించటం తొలినుంచి నేటి వరకు అందరూ చేస్తున్న పనే. అంతేకాదు ఈ సంబంధాల కల్పనలో తమ తమ ప్రత్యేకతలను చూపించినవారూ ఉన్నారు. ఈ శతకంలోనూ అట్లాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు 38, 384 పద్యాల మధ్య సంబంధం చూడండి. నా ఇంద్రియాలు చాలా ఉద్ధతితో వర్తిస్తున్నాయి. బెద్ధత్వం ఇంత అవుదాక ఊరుకోవటం నీయందైన దోషం అని కవి పదోషారోపణ చేస్తాడు. ఆ తరువాత పద్యంలో వెంటనే “అమ్మా తప్పు క్షమించుము. నీయందు దోషం ఉందన్నాను. అజ్ఞాన భావం బెచిత్యమెరుంగనీదు దివ్యజ్ఞాన దీపొంకుర (బ్రహ్మమైన మవా మహస్సును అనరాని మాట అన్నాను. అమ్మా నా నోరు మంచిదికాదు. నా మీద దయరాదా రాజరాజేశ్వరీ 1” అని తన్ను క్షమించమని అడుగుతాడు. ఈ రెండు పద్యాలు ఈ క్రమంలోనే చదవాలి, మొదటి పద్యంలో అమ్మకు దోషం అంట గడతాడు. రెండో పద్యంలో తనదోషాన్ని ఒప్పుకుంటాడు ఇందులో ఇంకో చనుత్కారం ఉంది. మనలో గుణదోషాలకు అమ్మవారే మూలకారణం అని కూడా ఈ పద్యాలు చెపుతాయి. అంతేకాక ఈ పద్యాలశైలి చూడండి. వాడుకభాష సహజత్వాన్ని ఎంత బాగా పట్టుకున్నాయో 1! మొదటి పద్యంలో తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టటం, రెండో పద్యంలో *నాా నోరు మంచిదికాదు అనటం దీనికి గుర్తులు, నిజానికి వ్యవహారశైలిలో వాక్య నిర్మాణాన్ని పొందించటంలో శాస్త్రి గారు దిట్ట ఇది విశ్వనాధ సత్యనారాయణ గారి నుంచి గ్రహించిన విద్య 5
ఇక ఈ శతకంలో పదప్రయోగం, సమాసరచన పాండిత్య స్ఫోరకం, బెచిత్యవంతం, రసభరితం. 18వ పద్యంలో ఆహా వుట్టు, అనీ, 88వ పద్యంలో “ఆహా వుట్టించు (ప్రాస స్థానంలో వకారం వచ్చేట్టు) అనీ వాడారు. అప్పకవీయంలో దీనిని సంధి గతప్రాసము అన్నాడు. సంధిం గూడిన వ్రాలు స్రొానంబులైన, నవియె నంధి గతాఖ్యల నమరుచుండు దివిజులాశ్చర్య మొంద శౌరి వడవైచె, జెంగి పోనీక మధురలోనంగరినన అని క్షణం చెప్పి భారతం నుంచి, కళాపూర్ణోదయం నుంచి ఉదాహరణ లిచ్చాడు “ఆహా వుట్టింపదే” అనే ప్రాస ప్రయోగంతో ఆ పద్యం ఇది ఆ వాలుంగనుదోయి యానగుమొగంబాగుబ్బపాలిండ్ల పెం పొవేజీ భరమాతనూ విలననంబాయొమ్పులే: జెప్పినం గైవారంబగు గాదె కేవలం శిరూ కంవంబుగల్సించి యా వో వుట్టింవదే యిక్షుధన్వునకు నయ్యాబ్దక్షి వీక్షించినన్ ప్రాస స్థానంలో వకారంతో 'ఆహా వుట్టింపదె” అనే కళాపూర్ణోదయం ప్రయోగంలాగే ఈయనా అదే పద్ధతి ప్రయోగించారు “ఆపి” అనేది నామమని, దాని మీద పకారం వకారం అవుతుందనీ అప్పకవి ఈ ప్రయోగం ఇచ్చాడు. శాస్త్రిగారు ఒకే సమయంలో అప్పకవినీ, కళాపూర్జోదయాన్నీ గుర్తుచేస్తున్నారు. అంటే శాస్త్ర పాండిత్యాన్ని, కావ్య ప్రయోగ రీతిని ఒకేసారి పరిచయం చేస్తున్నారన్న మాట ! ఇది రామకోటిశాస్త్రి గారికే చెల్లు ఈ శతకం మీద ఎంతైనా రాయవచ్చు. ఆ మాట కొస్తే ఓపిక, శక్తి ఉన్నవాళ్లైతే ఒక్ర పుస్తకమే రాయవచ్చు. ఆ పని ముందు తరాల వాళ్లకు వదిలేద్దాం ఇంతటి గొప్ప కవి, పండితుడూ, సన్నిత్రుడూ అయిన రామకోటిశాస్త్రిగారి శతకానికి పీరిక రాసే అవకాశం ఇచ్చిన కాత్యాయనికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ - ఉంటాను అక్టోబరు 22, 2006 = చేరా (ఈ వీరికా రచనలో అకృదక్సుదా కోవెల సంపత్ముమూరాచార్యల వారిని సంప్రదించాను అవసరమైన నమాచారాన్ని అందించి నవాకరించిన ఆచార్వుల వారికి బుణవడి ఉన్నాను ,)
- త్రాను చదివిన అవ్చుకవీయంలో కళావూర్ణ్జోదయం” అన్న మాటను కొట్టేని శాకుంతలం అని దాని పెట్టారు నాన్న. అది కృృష్ణకవిక్టుత శాకుంతం కావచ్చు. - కాత్వాయని 6
ఆముఖం
కేతవరపు రామకోటిశాద్రిగారు పండితలోక ప్రసిద్ధులు. కాకతీయ విశ్వవిద్యాలయాన విమర్శనకళను బోధించిన ఆచార్యులు ఇవి సామాన్యవిషయాలు. వారిలో ఒక అసామాన్య లక్షణమూ ఉంది. పదుగురిలో తాను ఒకడుగా ఉంటూ “ఇతడు అసాధారణుడు” అనిపించుకోగలదు గూడ. ఈ అసాధారణతకు ప్రసిద్దోదాహరణం, ఆయన గురజాడను పట్టుకొని, ఆకవి అని భారతి వంటి సాహితీ పత్రికలో నిస్సంకోచంగా ప్రకటించడం. ఇది సాహసమాత్రం కాదు వాద వివాదప్రవాదాలకు కోరి ఆహ్వానం పలకడం ఇటువంటి పని సాధారణ పండితుడు చేయడు, చేయలేడు. బహుముఖమైన శాస్రిగారి వ్యక్తిత్వంలో నా ఈ ఉదాహృతి ఏకదేశం
శాస్త్రిగారు ఉద్యోగ నిర్వహణ కాలాన వెలువరించిన రచనలకంటె ఉద్యోగ విరమణానంతరం వెలువరించదలచినవి అధికంగా ఉన్నట్లు, వారి హరాన్మరణానంతరం గాని తెలిసిరాలేదని, వారి సాహితీవారస కాత్యాయనీ విద్మహే అన్నారు. అది నిజమని నేనిపుడు స్వానుభవంగా (గ్రహించాను.
అప్రచురితాలయిన శాస్త్రిగారి రచనా పరంపరను ఒకటోకటిగా ఇపుడు ఆయన వారసురాండ్రు కాత్యాయనీ విద్మహే, మైథిలీ ధీమహి; శ్రీగౌరీ ప్రచోదయాత్లు, సంవత్సరానికి ఒకటి చొప్పున ప్రచురిస్తున్నారు ఇది అభినంద్యమూ ఆదర్శమూ అయిన నూతన ధోరణి.
శాస్త్రిగారి అనేక రచనలలో ఈ *“చిచ్చేతన' ఒకటి. ఇది శతకం - వంద పద్యాల సముచ్చయం,. సాధారణంగా శతక రచనకు కవి ఆరంభదశలో పూనుకుంటాడు ఇది సిద్ధాంతం కాదు గాని ఆచరణలో అధికంగా కనిపించే వాస్తవం. అయితే కొందరు కవులు ఈ వాస్తవానికి భిన్నంగా కవిత్వంతోపాటు వయస్సూ పరిణతి నందుకొన్న తరువాత, శతక రచన చేసిన వారూ ఉన్నారు ప్రాచీనులలో ధూర్జటి మహాకవి ఈ కోవకు చెందినవాడు అతని శ్రీకాళహస్తీశ్వర శతకం సుప్రసిద్ధం. అందులో ఆ కవి కవిత్వంతో పాటు అనుభవ సారమూ సాంద్రంగా, హృద్యంగా, అమహ్లాదకరంగా అభివ్యక్తమై అది శతకవాబ్మయానికే మకుటాయమానంగా నిలిచిన విషయం మనమెరిగినదే.
శాస్త్రిగారి చిచ్చేతన ప్రారంభ రచనగా తోచదు. దీనిలో ఆయన ఆశలు, ఆశయాలతో పాటుగా అనుభవమూ ్రదర్శితము, ప్రదర్శితానుభవంలో,
7
బ్రతుకెల్లన్ భయవివ్వాలార్తిమయమై రక్తమ్ము పోటెత్తి నం తతవేగాకుల తీవమౌచు నెదురొత్తన్ జీవుడల్లాడి పో యి తమాయించుకొనంగలేనపుడు తల్లీ ! నీదు కారుణ్య దృ ప్పి తమోదీపముగా కనంబడు గదె ! శ్రీ రాజరాజేళ్వరీ ॥ -26 వంటి పద్యాలు వయః పరిణామాన్నీ సూచిస్తున్నాయి గదా 1 రక్తం పోటేత్తడం సాధారణంగా వయసు పైబడిన తరువాతే జరుగుతూ ఉంటుంది జీవితంలో భయమూ, ఆర్తి అధికమై రక్తపుపోటు (బి.పి.) ఎక్కువై ప్రాణం విలవిలలాడే విపత్సమయాన శ్రీరాజరాజేశ్వరీ దృష్టి కారుణ్యపూర్ణమై కవిపై ప్రసరిస్తే, తమాయించుకోగల్లుతున్నట్లు నిజానుభవాన్ని శాస్త్రిగారు అక్షర బద్ధం చేశారు. శతకాలకు మకుటాలు అపరిహార్యాలు. సుమతి, వేమన, దాశరథి, శ్రీకాళహస్తీశ్వర, పెమ్మయసింగధీమణి - వంటి పేర్లు (మకుటాలు) ఆయా శతకాలకే పర్యాయపదాలు. ఈ మకుటాలు అనేక సందర్భాలలో ఆ శతకాలు పద్యాల స్వరూపాలను నిర్దేశిస్తాయి. శ్రీ కాళహాస్తీశ్వరా ! అనే మకుటం ఆ శతకమంతా మత్తేభశార్జూలలో తప్ప మరో వృత్తంతో నడవని పరిస్థితిని కల్పించింది. అలాగే ప్రస్తుత శతకానికి “రాజరాజేశ్వరీ ! అనేది మకుటం. దీని కారణంగా శతకమంతా ఆ మకుటాన్ని ధరించడం అనివార్యం కాబట్టి మత్తేభ శార్దూలాలతో రచన చేయవలసి వచ్చింది. బహుశ ఈ నియమాన్ని విస్మరించడం వల్లనేనేమో, అనుబంధంలో ఉత్పల, చంపకవృత్తాలకూ ఈ రాజరాజేశ్వరీ మకుటాన్ని తొడగ బోయినట్లున్నారు. మకుటమంటే కిరీటం. ప్రతి పద్యానికీ మకుటం తొడుగుతాడు. తన కృతి ప్రత్యక్షరమూ కవికి అతి ప్రీతి పాత్రము. “ప్రాయమింతకు మిగులకైవ్రాలకుండి అని శ్రీనాధ్ మహాకవి అన్నట్లు శాస్ట్రిగారు పొఢవయస్కులుగానే ఈ '“చిచ్చేతనిను సంతరించి ఉంటారు లేకుంటే శాంత స్వాంతత చచ్చి తామనము స్వేచ్భావర్తనాయత్తమై చింతా లోలత కళ్ళిలేములకునై బీవింవగా జూతుమున్ అంతర్వామిది నీ కెరుక లేదాయేమి చెప్పున్వలెన్ అంతా దొంగలు దొంగలందరును మాతా / రాజరాజేశ్వరి ! వంటి పద్యాలు వెల్పడజాలవు, 8
చిత్తశాంతిలేక తామస గుణమధికమై కలిమి లేమి ఈ రెంటిని మాత్రము దృష్టియందుంచుకొని స్వేచ్చా వర్తనుడనై చింతాక్రాంతుడనై జీవించాను - ముందు; అంటున్నాడు కవి. ఈ స్థితి జీవన సాగరాన మున్మలిడునప్పటిదే ! బహుశః తనకానాడు తనచుట్టూ ఉన్న లోకమంతా దొంగలు; దొంగలందరును అనే నిర్వేదం పెల్లుబుకగా, ఆ విషయాన్నే మాత రాజరాజేశ్వరికి విన్నవించాడు
శాస్త్రిగారికి దేవియెడ ఆపార భక్తి ప్రవత్తులతో పాటు అనంత విశ్వాస సంపత్తీ ఉన్నది అందువల్లనే 'ఆ తల్లిని వర్ణించే సమయాన మిగిలిన లౌకికాంశాలన్నిటినీ వదలి,
అనమానా ద్భుతకాంతికదళిత రేఖాకార లావణ్య వ
ల్లి నవాస్రార నుధా సముద్రమయమార్తీ ! మవోచడ్ర న
ద్మ నదాషోదళ వర్షయౌవన విధా ! దర్చాతి సొందర్యగం
ధనమాళ్లిష్త నువర్హ వర్హతను మధ్యా ! రాజరాజేశ్వరి / -95 అంటూ ద్ర్హ సమాసాలతో ఆ తల్లి రూపురేఖా లావణ్య విశేషాలను మనకు దర్శింపజేయ బూనుకుంటారు. ఈ పద్యం మొదలుకొని నాల్గు పద్యాలలో మాతృదర్శనం తన్మయత్వంతో చేశారు
ఆ తల్లిదీవెనలు అందకముందు తన ఫఫ్ధితి గతులను అందిన తరువాత తన ఆనందమయ ఆంతశ్చేత నావస్థను ఆవిష్కరించిన తీరు హృదయంగమము-
ఇంతకూ చిచ్చేతనా శబ్దార్థ వివరణ చేయనేలేదు చిత్ = జ్ఞానం, చేతన = జీవం, జ్ఞానమయ జీవవేదనను ఈ శతకం ద్వారా కవి మనకు విన్పింప సమకట్టినాడు; కృత కృత్యుడును అయినాడు మరొకమాట, శ్రీకారంతో కాక అనుకోలేదంటూ వ్యతిరేకార్థక క్రియతో మొదలు పెట్టి 11 పద్యాలు ఆ క్రియతోనే కొనసాగించడం ఒక కొత్త ఒరవడి. వరంగల్లు = అ. పున్నారావు 25-10-2006
9
చిచ్చేతన బిప్తిలోకి ....
మానాన్న కేతవరపు రామకోటిశాస్రి లోకానికి సాహిత్య విమర్శకుడిగా తెలిసినంత కవిగా తెలియదు. అయినా ఆయన వ్రాసిన కవిత్వంలోని భావ గాంభీర్యాన్ని, తాత్త్విక గాఢతను గుర్తించిన చేరా వంటి కవి మిత్రులున్నారు. ఆనందచేతన పద్యాలంటే ఆయనకు చాలా ఇష్టం. అనంగహేల, శతృంజయము, గీతాంజలి అనే మరి మూడు పద్యకావ్యాలు కూడా నాన్న వ్రాసినవి వున్నాయి అనంగహేలకు కాళిదాస కృతి మూలమైకే, గీతాంజలికి రవీంద్రుని కృతిమూలం. అనందచేతన వలెనే శత్రుంజయము స్వతంతభ్రకావ్యం. నాన్న ఇంతమంచి కవిత్వం (వ్రాస్తే మీరెంతసేపూ విమర్శనే పట్టుకొంటారేమని పోట్లాడినట్లు మాట్లాడే అనుమాండ్ల భూమయ్య గారి మాటమీద 1996 అక్టోబరులో నాన్న అముద్రిత కావ్యసంపద నుండి ప్రణయ కవితాశాఖకు చెందిన భావకవితా పద్యాలను 'ఒకే ఇద్దరం” అనే పేరుతో (ప్రచురించాను. ఇది కాకతాళీయమే కావచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు పదేళ్ళకు నాన్న వ్రాసిన శతకం అచ్చువేద్దామన్న నా ఆలోచనకు మద్దతు ఇచ్చినదీ భూమయ్యగారే. ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ పద్యకావ్యం “చిచ్చేతన. ఇది శతకం. 1967 అక్టోబరు
7వ తేదీ నుండి ప్రారంభించి అప్పుడప్పుడు కొన్ని కొన్ని వ్రాస్తూ 1969 సెప్టెంబరు 2వ తేదీ నాటికి 108 పద్యాలు పూర్తిచేశారు నాన్నా. 1967 డిసెంబరు 80 నాటికి 40 పద్యాలు వ్రాశారు. 1968లో వ్రాసినవి 10 పద్యాలు మాత్రమే 1969 ఫిబ్రవరి నుండి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలం మీద మిగిలిన యాభై ఎనిమిది పద్యాలు పూర్తి చేశారు. మొత్తం మీద ఈ శతకరచన రెండేళ్ళ కాలం మీద పరచుకొని సాగింద్ప ఈ కాలం నాన్న వరంగల్లు పి.జి. సెంటరు ఉద్యోగానికి వచ్చేముందు హైదరాబాదులో గడివిన చివరి నంవత్సరాలు. దాదాపు ఆ కాలంలోనే అనుకొంటా బిరుదురాజు రామరాజుగారి ద్వారా నాన్నకు మన్నన అమ్మ పరిచయం అయింది ఆవ్సె రాజరాజేశ్వరితో తాదాత్మ్యం చెంది మహిమ పొందిన స్త్రీ అన్నది విశ్వాసం పట్టుచీరల్సు మెడలో నగలు నడుముకు వడ్డాణం, కిరీటం, చేతిలో త్రిశూలంతో ఆమె రాజరాజేశ్వరీ అవతారంగా (ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ శతకం ఆమెను ఉద్దేశించి వ్రాసినది మాత్రం కాదు. ఎందుకంటే మన్నవ రాజరాజేశ్వరీ అన్న మకుటంతో మరి మూడు పద్యాలు విడిగా లభించాయి ఆమె తక్షణ ప్రేరణ కావచ్చు కానీ నాన్న మాత్రం ఆకాలంలో
' 10
నిరంతర లలిత చింతనలో నిమగ్నుడయ్యే సాధన చేశాడన్నది వాస్తవం. తత్ఫలితమే ఈ శతకం.
వరంగల్లుకు 1969 అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చాం. ఆ తరువాత దసరా నుండే నాన్న ఇంట్లో దేవీ శప్తశతి మూలా నక్షత్రం నాడు ప్రారంభించి సప్తమి అష్టమి నవములు తిరాత్ర ఉపవాసవ్రతం చేయటం (ప్రారంభించారు. 1975 తరువాత పదేళ్ళ పాటు శరన్నవరాత్రి ఉత్సవంగా అది కొనసాగింది. భౌతిక జీవితంలో ఒడిదుడుకులను ఒత్తిడులను తట్టుకానటానికి తనను తాను నిలబెట్టుకోవటానికి నాన్న లలితాశక్తిని ఆలంబనగా చేనుకొన్నారనిపిస్తుంది అమ్మ, మా అమ్మ అని ఆ శక్తిని ఎప్పుడూ ఒక వ్యక్తిగా ఏ పరిమితులు లేకుండా తనను కాపాడే బాధ్యత తీసుకొన్న ఒక అత్యంత సహజ మానవీయ సంబంధంగా ఖావిస్తూ, సంబోధిస్తూ, చెప్తూ వచ్చారు. అది పూర్తిగా ఆంతరంగిక గృహవ్యవహారమే ఆ కాలంలోనే నాన్న దేవీ నప్తశతి పారాయణ కూడా చేశారు. దేవీ సప్తశతి పంచమాధ్యాయంలో శుంభనిశుంభులనే రాక్షసులు పెట్టే బాధల నుండి తమను రక్షించమని దేవతలు హిమవత్స్పర్వతానికి వెళ్ళి దుర్గాదేవిని సందర్శించి గొప్పగా స్తుతించిన ఘట్టం వుంది. ఆ దేవీ న్తుతిలో 12వ శ్లోకం నుండి (ప్రారంభించి 86వ శ్లోకం వరకు వున్న శ్లోకాలలో 34వ శ్లోకాన్ని మాత్రం వదిలి మిగిలిన 24 శోకాలను నాన్న తెలుగు చేశారు మన్నవ రాజరాజేశ్వరిని సంబోధించిన ఆ మూడు పద్యాలను, ఈ దేవీన్తుతిని కూడా ఈ శతకానికి అనుబంధంగా చేర్చాను,
చిచ్చేతన ఈ శతకం పేరు నాన్న అనుకొన్నదే ఇది. రాజరాజేశ్వరీ అన్న నంబోధన మకుటంగాగల శతకం ఇది. ఆమెను సంబోధిన్తూ నాన్న తన ఆత్మీయ భావోద్రేకాలను, (ప్రవృత్తివైఖరులను, ఆశలను, ఆకాంక్షలను, అన్నింటినీ వ్యక్తీకరిస్తూ ఒక అంతరంగ ఆవివ్మరణగా ఈ శతక రచన చేశారు. చూడలేననుకొన్న లలితా అమ్మవారిని చూడగలగటం వలన పొందిన దిగ్భ్రాంతిని, తన మీద దయతో తనను చూడటానికి సాక్షాత్తూ ఆమె దిగివచ్చింది కదా అన్న ఆనందాన్ని, లలితాదేవి సౌందర్యాన్ని కారుణ్య దృష్టిని, లలితమీద నిలవకుండా పారిపోయే ఆలోచనలను, మనస్సును, ఇంద్రియాలను కూడదీసుకొనటానికి ఆమెనే ఆశ్రయించి అర్ధించే వైఖరిని, ఆమె కొరకు చేసే నిరీక్షణను, ఆమెను కొనుగొన్నప్పుడు పొందే ఆనందాన్ని ఆమె కనబడకుండా ఏడిపిస్తున్నపుడు పొందే ఆవేదనను, లలితాసాధనలో పొందే జీవబ్రవ్మ సమైక్య భావానంద ఉద్వేగాన్ని లోకంలోని ఆత్మ వంచనల, పరవంచనల మానవ (ప్రవృత్తి నుండి తళ్ళలితమైన భయాల నుండి కాపాడమని శరణుకోరే తత్త్వాన్ని నాన్న అంచెలంచెలుగా ఈ శతకంలో వ్యక్తీకరించారు. ఇదంతా పరమేశ్వరీ 'ప్రసన్నతకైన ఉపాసన ఈ ఉపాసన ఫలించిన
| 11
స్థితిలో పరమేశ్వరికి తనకు అభేదాన్ని భావించగలిగిన ఉన్నత తాత్త్విక న్థాయికి (వ్రస్థానం పూర్తవుతుంది. అక్కడ కవి “నన్నెరుగం గల్గితి నిన్నుగా తుదకు దేవీరాజరాజేశ్వరీ (862) ఒక సంతృప్తిని భజించగలిగారు. ఆత్మజ్ఞాన చైతన్యం అమ్మవారిలో ఏదైనా గొప్పగా వెలుగుతున్నదో ఆ వెలుగు వెన్నెలలో సాధకుడు పొందిన గాఢానుభూతి ఇది ఆ సాధన, భావనల ఫలితమే లలితాసహ(్రంలోని అనేక నామాలు అలవోకగా ఈ శతక పద్యాల నిర్మాణంలో ఒదిగిపోవటం. అనుభూతి గాఢత భావనాశక్తితో పాటు ఈ పద్యాలలో సారళ్యం వుంది అందుకనే
ఇవి చదువు కొనటానికి హాయిగా వుంటాయి కవి సంవేదనా శీలతతో మనకు సహానుభూతిని కలిగిస్తాయి. సంతోషాన్నిస్తాయి ముప్ఫైరెండు సంవత్సరాలక్రితం నాన్న వ్రాసిపెట్టిపోయిన ఈ శతకాన్ని ఇన్నాళ్ళకు ఆయన స్మృతిలో అచ్చువేయగలుగు తున్నందుకు ఆనందంగా వుంది. పారకులు కూడా తమ తమ శక్తికొలది ఈ శతకంలోని భావ గాఢతను, తాత్త్విక సౌందర్యాన్ని అద్ధం చేసుకొని, అనుభవించి ఈ ఆనందాన్ని పంచుకొంటారని ఆళశిన్తున్నాను.
పశ్యంతి జా కాత్యాయనీ విద్మహే
౩3-10-2006
12
మామాట
మా నాన్న కేతవరపు రామకోటిశాస్తి మమ్మల్ని వదిలివెళ్ళి ఈ అక్టోబరు 28కి పదిహేనేళ్ళు ఆయన స్మృతిలో ఏడాది కొకటిగా మేము (ప్రచురిస్తున్న పుస్తకాల వరుసలో ఇది వదిహేనవది కవిత్వ రచనలలో రెండవది. మిగిలిన పదమూడూ విమర్శ రచనలు ఈ పుస్తకాలలో మూడు మినవాో మిగిలిన పది పుస్తకాలు జిజ్ఞాస ప్రచురణలుగా వచ్చాయి నాన్న ఆశలకు, ఆకాంక్షలకు గుర్తుగా మేము ఏర్పరచిన సంస్థ జిజ్ఞాస. నాన్న రచనలు, ముఖ్యంగా సాహిత్య విమర్శ రచనలు సాపొత్య సమాజానికి కొత్త భావనలను ఆలోచనలను, నమూనాలను అందించే నిత్యనూతనత్వం కలిగినవని ఈ పదిహేనేళ్ల కాలంలో ప్రచురించబడిన ఈ పుస్తకాలకు స్నేపొతుల నుండి, సాహిత్య జిజ్ఞాసువుల నుండి, పరిశోధన విద్యార్థుల నుండి వస్తున్న ప్రతి న్నృందనలు నూచిస్తున్నాయి. మేము చేస్తున్న ఈ పని తండ్రికి పిల్లలు నమర్చించే ఒక నివాళిగా మాకు తృప్తిని ఇవ్వటమే కాదు, ఇది నలుగురికీ వనికి వచ్చేపని అన్న ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయి. ఈ పని మా ముగ్గురిదే కాదు, ఆలోచనావరులదీ, అధ్యయన నంస్థలదీ అని బుజువు చేస్తూ నాన్న పుస్తకాలలో ఒక దానిని (అభ్యుదయ సాహిత్య విమర్శన దృక్పథం) విశాలాంధ్ర వారు, మరొక దానిని (కవిత్వం - సమాజం, క్రిస్టోఫర్ కాద్వెల్ విశ్లేషణ) (ప్రజాశక్తివారు, 'దృష్టి-దృశ్యం' అనే శీర్షికతో తెలుగులో సాహిత్య విమర్శ పరిశోధనల గురించి నాన్న వ్రాసిన వ్యాసాల నంకలనాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా విభాగం వారు ప్రచురించారు. ఇవి మాకు ఎంతో సంతోషాన్ని, నైతిక మద్దతును ఇచ్చిన నందర్భాలు
2005లో ప్రచురించబడిన 'దృష్టి - దృశ్యం” పుస్తకాన్ని వరిచయం చేయటాన్ని ఉద్దేశించి అక్టోబరు 28న యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్లాటినమ్ జూబ్లీ 'సెమినారు వోలులో నాన్న సంస్మరణ నభను ఏర్పాటు చేశాం. ఆ సభకు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ట్రిన్స్పాల్ పబ్లిక్ అడ్మిని(స్టేషన్ ప్రొఫెసర్ జి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. తల్లిదండ్రుల స్మృతి వ్యక్తిగతమైనది అయినా అది నలుగురికీ పనికి వచ్చేదయితే వాళ్ళేదైతే చేసిపెట్టి వెళ్ళారో, దానిని వినియోగంలోకి తీసుకొని రావటం మంచి సంప్రదాయమనీ కాత్యాయని ఆమె చెల్లెళ్ళు మైథిలి, శ్రీ గౌరి వాళ్ళ తండ్రి గారి స్మృతిలో ఆయన ప్రచురించిన పుస్తకాలను ప్రతియేడూ (ప్రచురించటం అభినందించదగిన విషయమనీ అధ్యక్షోపన్యాసం చేశారు శ్రీనివాసరెడ్డి. మంచి రాజకీయపార్టీ, మంచి
1413
ప్రతిపక్షం, మంచి (ఫెస్ ప్రజాస్వామ్యానికి వుండవలసిన ముఖ్యాంశాలని చెప్పి ఆ మూడు విమర్శ సాధనాలేనని, విమర్శ ప్రజాస్వామ్య యుగ లక్షణమని చెప్పిన రామకోటిశాస్త్రి గారి సాహిత్య విమర్శ పరిశోధనలకు సంబంధించిన వ్యాస సంకలన పరిచయ సభకు అధ్యక్షత వహించటం తనకు గౌరవకరమైన విషయమని శ్రీనివానరెడ్డిగారు తన ఉపన్యాసంలో చెప్పారు.
ఈ నభకు ముఖ్య అతిధిగా వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. గోపాలరెడ్డి కేతవరపు రామకోటిశాస్రి ఎన్నో స్థాయిలలో యూనివర్సిటీకి సేవలు చేశారని వారి పుస్తకాన్ని ఈ విధంగా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం ద్వారా (ప్రచురించటం తనకు ఆనందాన్ని కలిగిస్తున్న దని, ఈ పనికి చారవ చూపిన ప్రొఫెసర్ లింగమూర్తి గారిని అభినందిస్తూ మాట్లాడారు తాను ప్రిన్స్‌పాల్‌గా వున్న కాలంలో ఆర్ట్స్ కాలేజీలో ఎన్నో పనులలో చురుకుగా పనిచేసిన ప్రొఫెసరు కాత్యాయని నిబద్ధత తనకు తెలుసునని అందువలన ఆమె తండ్రిగారి పుస్తకాలను పద్నాలుగేళ్ళుగా ఈ విధంగా వరుసగా ప్రచురించటం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించటం లేదని చెప్పారు.
దృష్టి- దృశ్యం పుస్తకాన్ని పరిచయం చేయటానికి, ఆహ్వానించబడిన ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామమోహనరాయ్ మాట్లాడుతూ రామకోటిశాస్రిగారి వ్యాసాలు సీరియస్‌గా సాహిత్యం చదివేవాళ్ళ కోసం ఉద్దేశింపబడినవని అన్నారు. ఆత్మ విమర్శ చేసుకొంటూ ముందుకు సాగిన విమర్శకుడు శాస్రిగారని అందుకే ఆయన పట్ల తనకు గౌరవమని చెప్పారు. ఈ సందర్భంగా 1955లో కన్యాశుల్కం నాటకాన్ని తాను అర్ధం చేసుకొన్న తీరులోని లోపాలను (గ్రహించి వాటిని సవరించుకొంటూ 1990లో రామకోటిశాస్త్రిగారు కన్యాశుల్మం నాటకం మీద వ్రాసిన సరియైన సమగ్రమైన విమర్శను ఆయన ప్రస్తావించారు. రామకోటి శాస్త్రిగారి మరణానంతరం ఆయన పుస్తకాల ప్రచురణ ఈ కన్యాశుల్కం విమర్శతోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ప్రశంస మాత్రమే వున్నది విమర్శ కాదని, ఆవేశం విమర్శ లక్షణం కాదని, శాస్రిగారు నిర్మాహమాటంగా, నిక్కచ్చిగా చెప్పారని, సాహిత్య ప్రయోజనాన్ని విమర్శించటమే సాపొత్య విమర్శగా ఆయన భావించారని దృష్టి-దృశ్వం వున్తకంలోని వ్యాసాలు తెలియచేస్తాయని చెప్పారు (ప్రపంచాన్ని సరిగా చూపించేది మార్చిజమ్ అని నమ్మి దానిని సాహిత్య విమర్శకు ఒక ప్రధాన అంగంగా శాస్త్రిగారు స్వీకరించారని కూడా ఆయన చెప్పారు.
విశిష్ట అతిథులుగా ఈ సభకు తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ పి. జ్యోతి, 50105 డైరెక్టర్ ప్రొఫెసర్ యన్. లింగమూర్తి హాజరయ్యారు పి. జ్యోతి
శత
మాట్లాడుతూ దృష్టి - దృశ్యం పరిశోధకులకే కాదు పర్యవేక్షకులకు కూడా తోడ్పడే పుస్తకం అని చెప్పారు. ముద్రారాక్షసం వంటి నాటకాలను వేసి చూపుతున్నట్లుగా చెప్పిన రామకోటి శాష్త్రిగారి అధ్యాపక కౌశలాన్ని తన విద్యార్ధి కాలపు జ్ఞాపకంగా ఆమె శోతలతో పంచుకొన్నారు. కాత్యాయనితో పాటు ఆడ పిల్లలందరినీ కూతుళ్ళగానే చూచి అభిమానించి అదరించిన శాస్త్రిగారి పితృవాత్సల్యాన్ని కూడా ఆమె ఈ సందర్భంలో గుర్తు చేసుకొన్నారు విమర్శకు చారిత్రక వాస్తవిక పరిజ్ఞానం వుండాలని, వూర్వసాహిత్య విమర్శకు ప్రధానంగా ఆలంకారశాస్త్ర పరిజ్ఞానం, ఆధునిక సాహిత్య విమర్శకు ఇంగ్లీషు భాషా లక్షణశాస్తాల పరిచయం వుండాలని శాస్త్రిగారు వ్రానిన ఈ విమర్శ వ్యాసాలు సూచిస్తున్నాయని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
301౬08 డైరెక్టర్ ప్రొఫెసర్ లింగమూర్తి మాట్లాడుతూ సీనియర్ ప్రొఫెసర్ అయిన రామకోటిశాస్రిగారితో తనకు ఏర్పడిన వరిచయ సొన్నిపిత్యాల సందర్భాలను గురించి ప్రస్తావించారు. రామకోటిశాస్రిగారు మార్కిస్టు దృక్సధంగల వ్యక్తి అని తనకు ఆచార్య శివరామకృష్ణగారి ద్వారా తెలినిందని అన్నారు. ఆచరణలో ఆయన ఎంత (ప్రజాస్వామ్య వాదో, ప్రాంతీయాఖివృద్ధి పట్ల ఎంతటి ఆర్తి కలవాడో ఆయనతో పనిచేసిన క్రమంలో తనకు తెలిసివచ్చిందని చెప్పారు. యూనివర్సిటీ పి.జి. కాలేజిలో ఎకనామిక్స్ రావటానికి ఆనాటి యూనివర్సిటీ పాలకమండలి నభ్యులుగా శాస్త్రిగారు చేసిన కృషిని లింగమూర్తి గారు గౌరవాభిమానాలతో గుర్తుచేసుకొన్నారు తెలంగాణ కళాశాలలకు పర్మినెంట్ అఫిలీయేషన్ లేకపోవటం వలన, ఆ కళాశాలలో వనిచేసే అధ్యాపకులు వరిశోధనకు [|౧ వంటి సౌకర్యాలను వినియోగించుకొనటానికి అవకాశాలు లేని తరుణంలో ఆ విషయమై ఆలోచించటానికి కాకతీయ యూనివర్సిటీ రామకోటిశాస్త్రిగారి అధ్యక్షతన ఒక కమిటీని వేసిందని ఆ కమిటీలో తాను కూడా సభ్యుడినేనని చెప్తూ లింగమూర్తిగారు ఆనాడు కమిటీ సభ్యులందరి అభిప్రాయాలను కూడగట్టి సరియైన నిర్ణయాలను తీనుకొనటంలో రామకోటిశాస్రిగారు చూపిన చొరవను (ప్రస్తావించారు అనాడు తెలంగాణలో కాలేజీలు యూనివర్సిటీ పర్మినెంట్ అఫిలియేషన్లోకి రావటానికి ఆ నిర్ణయాలే కారణమైనాయని చెప్పారు పరిశోధనలో నిజాయితీ రామకోటిశాస్త్రిగారి దగ్గర నుండి నేర్చుకొనవలసిన గొప్ప విలువ అని, పరిశోధన గురించి ఆయన యువతను ఎప్పుడూ హెచ్చరిస్తూనే వున్నారని తన జ్ఞాపకాల నుండి అనేక సంఘటనలను పేర్కొంటూ ప్రొఫెసర్ లింగమూర్తి మాట్లాడారు. డా॥ జి, కిషన్‌ప్రసాద్ స్వాగత వాక్యాలతో (ప్రారంభమైన ఈ సభ డా॥ ఎ. నాగేశ్వరరావు వందన సమర్పణతో ముగిసింది
15
ఈ 2006 సంవత్సరపు (ప్రచురణగా “చిచ్చేతన శతకాన్ని తీసుకొని వస్తున్నాం నాన్న అంటే (ప్రేమ, మేమంటే అభిమానం, పద్యమంటే ప్రలోభం, శతకమంటే సాధికారత కలిగిన చేరా ఈ శతకానికి ముందుమాట వ్రాస్తే బాగుంటుందనిపించింది కోరగానే సంతోషంగా ఆయన అందుకు అంగీకరించినారు. ఆయనకు ఎప్పుడూ మేము కృతజ్ఞులం అన్నది చిన్నమాట
సంప్రదాయ సంస్కృత భాషా సాహిత్య సంపత్తు కలిగిన పున్నారావు గారు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి తెలుగు అచార్యులుగా పదవీ విరమణ పొంది, ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం వెలుగు విభాగంలో వారి ప్రత్యేక ఆహ్వానంపై విజిటింగ్ ప్రాఫెసరుగా వున్నారు. ఈ శతకానికి కోరగానే ముందుమాటగా నాలుగు మంచిమాటలు వ్రాసినందుకు వున్నారావుగారికి కృతజ్ఞతలు.
ముందుమాట (వ్రాసేవేళ ఈ శతకం అచ్చులో దోషాలు సవరించి సహాయ పడ్డందుకు కూడా చేకూరి రామారావు గారికి, వున్నారావు గారికి, ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోనాలి. అవసరమైన ధర్మసందేహాలు తీర్చి వుస్తకం పనిలో సలహాలిచ్చిన సంవత్ముమారాచార్య గారు - వారికి కృతజ్ఞతలు పుస్తకం పనిలో తోడ్పడిన డా! జి. కిషన్ ప్రసాద్‌కు అభినందనలు. పుస్తకాన్ని చక్కగా అచ్చువేసి ఇచ్చిన “అశోకకృష్ణ ఆఫ్సెట్ ప్రింటర్స్ యజమాని త్రీ నాగుల యుగంధర్ గారికి, ఆయన సిబ్బందికి కృతజ్ఞతలు. 39-10-2006 కాత్యాయనీ విద్మహే మైథిలీ దీమహి శ్రీగౌరీ ప్రచోదయాత్ 16
చిచ్చేతన అనుకోలేదు పరామృతప్రియను పద్మానంత సౌందర్యరే ఖను లీలా లలితా కృతిన్ సకల లోకస్తుత్య మైనట్టి త ల్లిని శ్రీశక్తిని చిద్వికల్పతనువల్లిన్ హంసికాయానర మ్యను నిన్నున్ కనగల్గుదంచెడదనమ్మా రాజరాజేశ్వరీ ! క్షే అనుకోలేదు ప్రధానమూర్తిని శివాత్మానంద భావస్వరూ పను శుంభాసుర శీర్షఖండన మవాో ప్రొఢ ప్రమోదాకృతిన్ కనదుత్తుంగ కదంబ వాటి నిలయన్ కామేశ్వరాంకస్థితన్ నినుచూడంగల నంచునున్న భిలనామ్ని రాజరాజేశ్వరీ ! లై అనుకోలేదు సుధాసము(ద్రమొక ముఖ్యావాసమై పొల్చిని ల్చిన సాక్షాత్సర దేవతన్ దనుజ పాళీ భీకరోత్సుల్ల మూ ర్రిని ధూ[మ్రాక్ష విపాటన (ప్రకటశక్తిన్ భక్త వాత్సల్య శా లిని నిన్నున్ కనగల్లు దంచెడద తల్లీ రాజరాజేశ్వరీ ! కి అనుకోలేదు మహేశ్వరప్రియను దీవ్యద్దివ్య సింహాసనే శిని దివ్యాంబర దివ్యగంధకలితన్ శ్రీచక్రసంభావ్యదే విని మందస్మిత చారు సుందర ముఖావిర్భూత కారుణ్య దృ ష్టిని నిన్నున్ కనగల్గు దంచభయరాశీ రాజరాజేశ్వరీ 1 తీ
17
అనుకోలేదు జగద్విభూతి విభవాచ్చాచ్చ స్వరూప స్వభా వను (బ్రహ్మాణిని బ్రహ్మమూర్తిని శుభ ప్రారంభ సంకల్పశ క్తిని సర్వాతి శయ (ప్రకాశగుణ వర్తిన్ సర్వభూతాత్మ భూ తను నిన్నీజని నేను చూతునని మాతా రాజరాజేశ్వరీ ! ర్ అనుకోలేదు యుగాంతకాల విలయానంతాతి వాత ప్రతా పను హర్ష క్రమణాతి హృద్యగతి బిభ్రద్దక్షిణాశాసుగం ధిని క్రోధోజ్వల సుప్రసన్న వదనన్ దేవర్షి సంస్త్రయమా నను నిన్నున్ కనజాలు దంచని యెడందన్ రాజరాజేశ్వరీ 6 అనుకోలేదవిచింత్య రూప మహిమైకాధ్య ప్రభానల్పక ల్పను సత్తాకలితాత్మతా లలిత సర్వవ్యాప్త తేజస్వరూ పను చిచ్చైత్య సమానధర్మ గుణ విశ్వానంత వస్తు స్వరూ పను నిన్నున్ కనజాలు దంచును పరాంబా! రాజరాజేశ్వరీ 1 ళా అనుకోలేదు సుమేరు శృంగతల మధ్యస్థాన వేశ్మాంతర స్థ నవాంగారకరత్న వేది నిలయన్ సర్వారుణ శ్రీప్రభాం గిని స్వాధీనపతిన్ శివాంగనను సాకి న్యాఖ్య చక్రేశ్వర మ్మను నిన్నున్ కనగల్గు దంచెడదనమ్మా రాజరాజేశ్వరీ ! 8 18
అనుకోలేదు పరాత్పరన్ గురుతరన్ ఆనందవల్లి ప్రనూ
నను విశ్వ భ్రమత్రైక కారణమయిన్ నారాయణీ దేవతా
ఘన విజ్ఞాన ఖనిన్ గిరీంద్ర తనయన్ కామేశ్వర (ప్రాణనా
డిని నిన్నున్ కనజాలుదం చెడద చండీ రాజరాజేశ్వరీ ! 9
అనుకోలేదు నిరంజనచ్చవిని నిత్యానంద సద్విగ్రహన్
ఇనచంద్రోజ్వల చారు నేత్రయుగళన్ ఇచ్చా క్రియా జ్ఞానశ
క్తిని సర్వాతిశయోద్ధతిన్ సరసరక్తిన్ భుక్తి ముక్తి ప్రదన్
నిను చూడంగలనంచు నేను శివపత్నీ ! రాజరాజేశ్వరీ |! 10
అనుకోలేదయినన్ దయానుతము నీ వౌటన్ (ప్రజాక్షేమ వ
ర్తన వర్తింపగమానుషాకృతిని పూర్ణ ప్రజ్ఞ ప్రాదుర్భ విం
చిననున్ వ్యర్థుని అప్రయోజకుని రాశీభూత మోవాంధమూ
ర్తిని చూడంజనుదెంచి నావటవెగౌరీ ! రాజరాజేశ్వరీ ! శ
నను అవ్యక్తుని మొండివానిని విహీనాచార కేళీ వివ
రుని దుష్పధ వర్తనాతురు మహారూక్షైక వాజ్నిష్టురా
త్ముని గర్విష్టిని ఊర్ధ్వ దృష్టిని దయామాూత్తీ ! జగన్మాత ! ర
క్షణ సేయంజను దెంచితే సుజనరక్షా రాజరాజేశ్వరీ 1 క? 19
అమ్మా దీప్త హుతాశకుండములు చేయంబోకువే నీదునే (త్రమ్ముల్ అగ్ని శిభాభవీక్షలను నారాటింపగా చూడకే అమ్మా పిచ్చుక మీద వేయకువె (బ్రవ్మాస్తంబు శాంతింవపవే నెమ్మింజూడు 'ప్రసన్నదృష్టిని భవానీ ! రాజరాజేశ్వరీ ! 13 దేవీ నీవు ప్రసన్నురాలవయి ఆర్తిం గూరియల్లాడు నా పై వాత్సల్యము పేర్మి జేసి కరుణింపంబూన వైతేని మా తా! వచ్చే రెవరాదుకోన్ వలదు క్రోధం బార సౌహార్దముల్ ప్రావృణ్మే ఘముగాగనై కురియుమంబా రాజరాజేశ్వరీ 1 కేశ చురుకుంజూవుల నేలవాలుకనులన్ చూడంగ కక్రొవ్వాడి చి చ్చణ కోలల్ మెయి దూరిపోవు వడువై సంతప్పడై జీవుడ బ్బుర పాటుంబడి దిక్కుతోచని రహింబొల్బెన్ త్వదీయైకమూ ర్తిరమా దర్శన మాత్ర నేత్ర యుగళాప్తిన్ రాజరాజేశ్వరీ ! 15 నిన్నుం జూడగ గుండె పీకును గదే నీరేజ పద్రేక్షణా ! నిన్నుం జూచిన ఖీతి గుందెలవియున్ నీరేజ పత్రేక్షణా ! నిన్నుం జూడక గుండెయాడదుకదే నీరేజ పత్రేక్షణా ! నిన్నుం జూచుడు చూడముల్ వలయు చండీ ! రాజరాజేశ్వరీ ! 16 20
ఈ నీ విగ్రూమెంత సుందరము తన్వీ ! మందవోసోజ్వలా
నూనస్ఫార విశాల లోలనయనా ! నోరూరగా జేయు ది
వ్యానం దామృత మూర్తి మత్తనువు లావణ్య ప్రవాహంబు త
ల్లీ ! నిశేయస దాయకంబు శివనారీ రాజరాజేశ్వరీ ! 7
అమ్మా ! కన్నులు రెండు చాలవు గదే ఆశ్చర్య వద్వ్వైభవా !
అమ్మా ! కన్నులు పట్ట వీ వెలుగు లాహావుట్టు రమ్యాకృతీ 1
అమ్మా ! కన్నులు లోన నిల్చి యెదలో నందంబు నిండించిన
న్నమ్మా ! నీదయ ముంచి కేల్చితివి కాదా రాజరాజేశ్వరీ ! 18
నీ వాల్ల భ్యము రీవి నీదు శివరాజ్డీత్వ ప్రభుత్వమ్ము నీ
భావాభావ వివర్జితత్వ గుణమున్ భావజ్ఞతా భావమున్
శ్రీవల్లీ మధుమంజరీ సురభిళ శ్రీ రమ్య పొదద్వయీ !
నావల్లన్ వికసింపజేసితి వపర్షా ! రాజరాజేశ్వరీ ! 19
తృప్తిం జెందుచు నున్న దీ మనసు తుష్టిన్ నీ దయా రూపమే
సుప్తింజెందిన నన్ను మేలుకొలిపెన్, సోత్చాసపుంజూపులన్
జ్ఞప్తింజేసెను పూర్వ వాసనల నజ్ఞాతైక గాధావళిన్
ఆప్తత్వమ్మన నింతకంటెనది యెట్లౌ రాజరాజేశ్వరీ ! లిం 2]
భువనాధీశ్వరి విశ్వమోహనకరీ భూమస్వరూపాధికా నవరాత్రవ్రత తృప్తచిత్త నవరత్నానల్ప భూషోజ్వలా భవబంధ (్రవిమోచన ప్రియకరీ పాపొఘ దావానలా శివ శక్త్యాత్మకతా విభూషితవపు శ్రీ రాజరాజేశ్వరీ 1 “111 శివదేవుండు (ప్రదోష కాలమున నిన్ సింహాసనాశీన జే సి విరించి ప్రముఖామరేంద్ర గణముల్ సేవింప వాద్యైక గో స్పి విరాజత్మరణాంగ పోర కలిత శ్రీ రేఖికా తాండవం బవతారించును నీదు వేడ్క కనికాదా రాజరాజేశ్వరీ ! 29 ఏతత్తాండవ కేళి లోలమగు నీయీ చూపు లార్టమ్ములై మా తాపత్రయ తప్త చిత్తముల నూష్మంబెల్ల మాయించి సం (ప్రీతింగూర్చె హృదంతరాంతరములన్ (మేమాభిమానాత్త చిత్ చైతన్యంబు సుధా తరంగములుగా శ్రీ రాజరాజేశ్వరీ ! 28 శ్రీ రమ్యమ్ములు దివ్య తేజ లలిత శ్రీ సాధు సౌందర్యముల్ (పహ్రీరమ్యమ్ములు సత్మళా కలితమూర్తిచ్చాయ సంపచ్చ్భటల్ వీరప్రాభవ మంగళాలయములొప్పెన్ నీదు కారుణ్య దృ గ్లీలాలాస్య విశేష రేఖికలు తల్లీ రాజరాజేశ్వరీ ! లశ 22
భవ బంధ ప్రవిమోచన ప్రియకరుల్ భక్తార్తినాశంకరుల్
భువనాధీశ్వర శక్తి యుక్తములు సంపూర్షైక భావాబ్బులున్
అవదాతాద్భుత చంచలా నిభము లమ్మా నీదయా పాంగముల్
శివహృన్నోహిని విశ్వ భద్రగుణరాశీ ! రాజరాజేశ్వరీ ! 25
(బ్రతుకెల్లన్ భయ విహ్వలార్తి మయమై రక్తమ్ము పోటెత్తి సం
తత వేగాకుల తీవ్ర మౌచు నెదురొత్తన్ జీవుడల్లాడి పో
యి తమాయించు కొనంగ లేనపుడు తల్లి నీదు కారుణ్య దృ
ష్టి తమోదీపముగా కనంబడుగదే శ్రీ రాజరాజేశ్వరీ ! 26
భయ సంత్రస్తతనున్న తెల్వియును పోవన్ తన్ను రక్షించు త
ల్లియునా జ్ఞానములేని జీవులను జాలిన్ జీరి యోదార్చి హా
యి యొనర్చున్ అభయ ప్రదాన గుణమి యీ నీదు కారుణ్య దృ
ష్టి య సర్వాతి శయ ్రభాష్టవిద దృష్టీ ! రాజరాజేశ్వరీ ! ౮
ఇంకన్నీ కరుణైక దృగృచులతల్లీ దీనచండోగ్రు డా
తంకుండార్తి భరాంతరంగుడు దరిద్ర ప్రజ్ఞు డౌనన్ను ని
శృంకుం జేసి త్వమేవ నా తెలివి నిచ్చన్నిల్సి రక్షింపగా
సంకల్ప బొనరింప వేడెదను రస్యా రాజరాజేశ్వరీ ! ౨8 23
అజ్ఞానాత్మక మో ఉపాధి బడి సాహంకార జాద్యమ్ము స్వా త్మ జ్ఞ త్వమ్మును మాయ జేయుటను ఉన్మాదమ్మునం జీవుడ (ప్రాజ్ఞుందైచన న్దయా మృదుకళా రమ్యావలోకచ్చవుల్
విజ్ఞుం జేసిన వింత సోకిన క్షణంబే రాజరాజేశ్వరీ 1 29 మళల్లెల్ మొల్లలు సన్నజాజులును సంపంగుల్ గులాబీలు సం వుల్లంబుల్ బలె ఏకకాలమున సంపూర్ణ ప్రమోదాచ్చ్భద్భృ
గ్వల్లుల్ సంతత మా విధమ్ము ప్రసరింపన్ జేసి ఆనంద సం
పల్లా భమ్మును పెంపు సేయు మిటులమ్మా రాజరాజేశ్వరీ ! 8౦ నిను ధ్యానింపగ నెంచి కూర్చొనెదనంతే యింక ఆలోచనల్
మనసున్ నిల్వగ నీయవొక్క క్షణమున్ మాతా నినుంబట్టి యై
నను కీర్తించును నాల్క చిల్మ నిను ఈనా జాతకం బిట్లు కా
లిన దేమందును ఏమి చేసెదవు తల్లీ రాజరాజేశ్వరీ 1! 91 అరిషడ్వర్గము నూత్న చేతన ఘనంబైనీదు శ్రీనామ సం
స్మరణంబే నొనరించు తోడన మనశ్చాంచల్యమున్ రేపితా
మరి వేధించును నేనునిన్వదలి అమ్మా దాని చే కీలుబొ
మ్మ రహిన్వెంబడి పోవకుండ కయికొమ్మా రాజరాజేశ్వరీ ! 892
24
అవు నీయింద్రియముల్ నిరంతరము నాత్మా యత్తమై తిన్నయిం
టివి వాసమ్ములు లెక్క పెట్టునటులుండెన్ వీని యౌద్ధత్య మిం
తవు దాకన్నిటు లూరకుండుటయ నీయందైన దోషమ్ము ఇం
క వడింజూడుము వీని నా గుటకు దుర్గా రాజరాజేశ్వరీ ! 88
అమ్మా తప్పు క్షమించు దోషమది నీయందంటి అజ్ఞాన భా
వమ్మౌ చిత్య మెరుంగనీదు నిను దివ్యజ్ఞాన దీపాంకుర
(బ్రహ్మంబైన మహామహస్సును అనన్రానట్టి మాటింటినే
అమ్మా మంచిదికాదు నోరు దయరాదా రాజరాజేశ్వరీ ! క!
గుణ దోషాస్పద చిత్త వృత్తి గలనాకున్ మోహసమ్మోహన
ప్రణతా రాధన తత్పరాంధునకు శుభ్రజ్యోత్న కన్పించుటె
ట్లణువున్ భూమము రెండునైవరలు (బ్రవ్మానంద సాంద్రాకృతీ
గుణమున్ దోషము రెండు నంటవును నీకున్ రాజరాజేశ్వరీ! _ 355
ఆలంబించును ఇం[ద్రియప్రకర మాయావస్తు సంభార మా
వీలుం బట్టి రమించునున్మనసు దేవీ నీవు వస్తు స్వరూ
పాలిప్పంబడనట్టి దాన వికయెట్లే నిన్ను లక్షింపల
క్ష్మీ లావణ్య మయూఖ పుంఖ లహరీ శ్రీ రాజరాజేశ్వరీ ! 36 జ!
ఆకర్షింప హృషీకముల్ విషయ మాయాకార మామిద తా నై కల్పించి వికల్పముల్ పిదప మిధ్యారూప సంవేదన 'ప్రాకారమ్ము మనస్సు జీవునచటన్ బంధించి వేధించు న మ్మా కారుణ్యము జూపు వాని విడిపింపన్ రాజరాజేశ్వరీ ! 87 నీవాశ్చర్యము కావు నీదు విభవా నీకంబునున్ కాదు పో జీవుండెచ్చట బద్భ్ధుడయ్యె నచటన్ స్వేచ్చా ప్రపూర్ణాత్ముడై తా వర్ధిల్లుచునుంట నెంచుకొనుటే తల్లీ మహాశ్చర్య మా హా వుట్టించున దొక్కటే జగతి నమ్మా రాజరాజేశ్వరీ ! 88 అతి వాంఛా కుల వృత్తి సంచరణమౌ ఆర్భాటమున్వీడి సు స్థితి నింబొంది సమత్వమున్నె నయగా జేయన్ త్వదాకారరూ పత గైకొంచు మనస్సు మారును త్వమేవాహం ('ప్రమోదమ్ము చెం దుత జీవుండు నిజాంతరంగమున యందున్ రాజరాజేశ్వరీ ! తెరి కొనవే నన్నును నిన్ను వీడిచను మూర్చున్ వత్సలత్వానకై కొనవే నన్నును క్రైబ్యకశ్ళల మనస్మున్ వోర్దభావానచే కొనవే నన్నును ధైర్య సాహస విరక్తున్ ప్రీతి భావానకై కొనవే నన్నును నీదు శ్రీచరణభక్తున్ రాజరాజేశ్వరీ ! తీ0 26
కలయం జూచితి చుట్టు ప్రక్కలను నీకల్యాణరూపంబు నే
కలయం జూచితి గుండెలోపలను నీ కల్యాణ రూపంబు ని
శ్చల సౌదామనిగా ప్రసన్న లలితా స్వాదు ప్రమోదమ్ముగా
విలసట్షీ మహిమైక దీధితిగ దేవీ రాజరాజేశ్వరీ ! క!
బహుధా నిన్ను తలంచి యెంచు కొనుటే భావమ్ముగా బుద్ధిని
స్పృహగా లౌకిక కార్యకల్పముల యల్పత్వంబు భావించి ని
(గ్రహ భావైక ముఖాన నిన్నుగని వఏకాకారమైనట్లుగా
సహ భావానుభమ్ముతోచెడిని యిచ్చన్ రాజరాజేశ్వరీ ! శె
అంతా నీదయ తల్లి నీకు నెవడేయౌ జాలి చేపుల్ దిగన్
చింతా దూరుడతండు శుద్ధు డతడున్ శ్రీ జ్ఞాన సంపద్ధనై
కాంత ప్రాగ్రసరుందడతండు మరి ముఖ్యుండాత డదన్నింట వా
డంతంతై తుది తల్లి పోలికను వాడౌ రాజరాజేశ్వరీ ! శం
తనయుల్ సర్వులు భక్తులై జనని పాదాబ్బంబు సౌగంధ్య మో
మినకాలమ్మది కాలమూలమగునీ మేనైన సౌందర్య వా
హిని లోకమ్ముల ముంచి తేల్చుటలుగా నెంతున్ మవోమాయ వ
ర్వనలీలన్ భ్రమ పెట్ట జూడకుము మాతా ! రాజరాజేశ్వరీ ! శశీ 27
నీవన్నన్ చనవెక్కుడున్ భయము లేనేలేదు సంతానమి ట్లైవర్తించుట చూచుచుంటివి గదమ్మా ఇదిమాకర్థముం గా వద్దన్నది నీదు చిత్తమయినంగానిమ్ము కాకున్నచో దేవీ బిడ్డల మంచి చెడ్డలవి నీవే రాజరాజేశ్వరీ ! త్తీర్ అమ్మా నీవు జగత్తు మూలమని మాకర్థమ్ము కాదేమికా లమ్మున్ వచ్చెను తల్లినిన్ వదలి పిల్లల్ తమ్ము భావించు మౌ ర్ధ్యమ్మిటైనది త్రుంచి వేయుమిది మొక్కన్గాక ('మ్రానైనచో నెమ్మై వీల్పడు యోజచేసికొను తల్లీ రాజరాజేశ్వరీ ! తర్ శశ్వచ్చక్తియు (ద్రవ్య మొక్క విధమై సాంద్రమ్ముగా సాగుచో విశ్వాకాశము వాయురాశి యగు సంవిజ్ఞ్యోతి మన్మూర్తివై విశ్వాకారము పోల్చి వెబ్లెదవు దేవీ ! నీవు మాహేశ్వరీ విశ్వ శ్రేయ మహాగుణాకలిత దీప్తీ ! రాజరాజేశ్వరీ 1 త్న? అంతర్యామివి సర్వ సృష్టికిని విద్యా వైభవోద్దామవున్ చింతాకర్షిణి వర్ధనారివిని రాశీభూత ్రుమాబ్బివిన్ కాంతా ఇంత దయాంత రంగమున చక్కంజూడు నీవారలన్ సంతాపత్రయ తప్తులన్ మముసుహాసా ! రాజరాజేశ్వరీ ! 48 28
అతసీపుష్ప సమానపేశల శరీరా నూనరమ్యాకృతీ !
మతి మాంద్య ప్రవిదారణైక పటు నామాఖండ శస్తాకృతీ |
కృత విశ్వేశ హృదంతర ప్రణయరక్తీ రాజ చూడామణీ !
ిత సంరక్షణ దక్ష! దక్ష వరపుత్రీ ! రాజరాజేశ్వరీ ! శ్రి
ఘన సంసిద్ధి గుణాఖి సేవ్య మహిమా 1! కషమ్రాబ్ద పాదద్వయీ
కనదుత్ఫుల్ల సరోజ శుభ్ర దళ లేఖాకార సంవీక్షణా !
('ప్రణతాపన్న జనార్తి నాశనకరీ 1! బ్రవ్మోండ భాండోదరీ !
మననంబుం బొనరింతునీ ప్రణవమమ్మా రాజరాజేశ్వరీ ! ఠ్0
అరుదైపోయినదమ్మ ఈనడుమ నీద్రైనట్సి వాత్సల్య భా
వరసాసేచన సౌఖ్య మిప్పటికి నాభాగ్యమ్ము పండింపగా
హర చూడాంక శశాంక హాసరుచి రమ్య స్ఫూర్తి మన్ఫూర్తి ! సుం
దరి ! గౌరి! దయ చేసినావభయ ముద్రన్ రాజరాజేశ్వరీ ! ర్1
ఎన్నాళ్లైనది నీవు నాకనులలో నిట్లేర్చడన్నిల్చి నా
కన్నుల్లప్పి మహాంధమోహతమముం గల్పించి ఎందేగినా
విన్నాళ్లున్ మరియింక వీడిచన బోకే నన్ను జ్యోత్సాపయ
స్స్విన్నానంద మాయాత్ముజేని కొనిపోవే రాజరాజేశ్వరీ ! ర్2 29
అనయమ్మున్నిను గూర్చి చింతనము చేయంజాలు స్వేచ్చా (క్రియా త్మనుగా జేసితి వీయుపాధి పరమార్ధ జ్ఞాన మార్గ (ప్రద రృన తారుణ్య వపు ప్రభా చకచకచ్చామోకరాంచచ్చవీ ! కనుగో గల్లితి నిన్ను నీకు దయగల్లన్ రాజరాజేశ్వరీ ! 58 శివశక్తి ద్వయ మేళన క్రమకళా శ్రీభవ్య భావాభిధా ! అవతంసాయిత చారు చంద్రమస రేఖానంతకాంతి ప్రదా! రవి బింబ ప్రతిబింబ సుందరముఖీ ! రాజీవ నేత్రో జ్వలా ! అవిముక్తేశ్వర వామ భాగతను రమ్యా ! రాజరాజేశ్వరీ 1 ర్&ీ ఏనీ చూపుల నుండి మన్మధుడు తానీ విశ్వ విశ్వాంతర ప్రాణి ప్రాణరహస్య చేతన ర్ఫురీ ప్రారంభ సరంభ కే లానందుండు సముద్భవించె నవలీలా పుష్ప శస్త్వాస్తుడై ఆనీ చూపులు మాకు కాపులగునమ్మా రాజరాజేశ్వరీ |! ర్5్ నీ కల్యాణ గుణానుకీర్త నమునన్ నిశ్రేయన ప్రాప్తి భా గ్యా కాంక్షన్ ఐడి యిట్టు లైతినిక కాంక్షల్ గోసి గైకోగదే ఏకాకారవు ఎల్ల కాలమునయందేకా (గ్రచిత్తా కృతీ ! ఏకైశ్వర్య వర ్రదానగుణ లక్ష్మీ ! రాజరాజేశ్వరీ ! ర5్్ర 30
హృత్తాపంబులడంగి మాయెడదలందెందున్ పరానందముల్
నెత్తావుల్ విరబూచు కాలమును రానీ మాకు మాహేశ్వరీ
సత్తారూప సహస్ర పద్మ విలసత్ సౌందర్య సౌగంధికా
చిత్తంబుంచుము భాగ్యహీనుల పయిన్ శ్రీ రాజరాజేశ్వరీ ! 57
పలుకుందేనెల తల్లి నామజపముం బాటించు వకాంత వే
ళల నోరూరును జాలి పాల గుటకల్లావౌను చిత్రమ్ము ని
ర్మలమంతః కరణమ్ము నెమ్మదిగ శుంభద్రాజ బింబోదయం
బుల వెల్గుంబడి యాత్మ విన్మరణ నొప్పున్ రాజరాజేశ్వరీ ! 58
అమితాశా వివశాకుల ప్రళయ దుఃఖాక్రాంత మోహాంధకా
రము పైకొన్నది నాకు నీవు కనన్ రావెట్రైన నీవింత నె
య్యముతో చూచిన కానవత్తునుగదమ్మా, నీకు పట్టింపుము
ఖ్యములే, చూడవు, నేను నీకు నొకలెక్కా రాజరాజేశ్వరీ ! 59
ఇందున్నావని ఇందులేవని అదెట్లే తల్లి గుర్తింపు నా
కెందుంజూచిన నీవిభూతి విభవంబే తోచుచున్నట్లుగా
స్పందించున్ హృదయాంతరాళమున అస్పష్టమ్ముగా సంశయం
బందున్ బుద్ధి వినాశమాదుకొనుమమ్మా రాజరాజేశ్వరీ ! 60 పే
ఏవో లోపల తెల్వి గంధములు నన్నిట్లట్లుగా ఊచుచున్ భావాభావ సుఖానుభూతి కలిగింపన్ నీదయా పాంగ కే
ఖా వర్చస్సున నిల్వుటీతలటులై పుల్మల్ పూచు నంతంతలో
జీవ బ్రహ్మసమైక్య బుద్ధి పొడమున్ శ్రీ రాజరాజేశ్వరీ ! 61 అసిధారావ్రత నిష్ట చిత్తమున సోహమ్మం(త్ర పారాయణా
వసరంబందు శరీరమందొక అపూర్వానంద విద్యుత్చ వా హసమాశ్లిష్టత యేచి అంగముల యందందంగనా మంగళాం
గ సముత్పన్నత్ర తోచి తోచదిక దుర్గా రాజరాజేశ్వరీ ! 62 ప్రాతర్వేళల మేలుకో నొడలు విర్వన్ రెప్పలల్లార్పులన్
జ్యోతీరూపముగా వెలుంగుచును తోచున్ కన్నులంగట్టిన
ట్లో తల్లీ భవదీయ దివ్య విభవా టోపమ్ము హృన్నిష్టమై
చేతః వ్రీతిదమై ప్రసన్న ముఖమై శ్రీ రాజరాజేశ్వరీ ! 68 నిను యోచించుచు నిన్నెదన్నిలిపి నిన్నేనమ్మి ధ్యానించుచున్
తన సర్వస్వము నీవుగా నెరిగి ప్రన్ధానమ్ము సాగించు భా
గ్య నిధానమ్మది అబ్బినప్పుడు గదా ఆనంద సంపర్ధృ నా
బ్ధిని నిన్నుంబడి నన్ను నేనుడుతు దేవీ రాజరాజేశ్వరీ ! 64
32
అదియే భాగ్యమదెన్ని జన్మముల పుణ్యాఘంబు పండన్వలెన్
అదియే భాగ్యమదెన్ని జన్మముల పాపొఘంబు లెండన్వలెన్
అదియే భాగ్య మదెన్ని జన్మముల సేవాసక్తు లుందన్వలెన్
అదియే భాగ్యము భాగ్య మివు జగదంబా రాజరాజేశ్వరీ 1 65
ఇది నీ యాటలు పాటలైన విధ మింతే గాని వేరొండుకా
నిది సంకల్ప వికల్ప లీలలెదలో నీకెప్పుడన్సించు ని
య్యది సర్వమ్మపు డౌను రూపజును తానావెంట మాబుద్ధికె
క్కదు సుంతైనను గాని నీకు దయరాకన్ రాజరాజేశ్వరీ ! 66
ఎటు నేనేగిన నన్ను వెంటబడి నాకింతంత దూరానవ
చ్చుట ఒక్కొక్కపు డీబుజాల పయి కూర్చున్నట్టులానందమి
చ్చుట నిత్యానుభవైక వేద్యముగ తోచన్ నాకునీ వౌదువం
తట నీకెంతటి (ప్రేమ నేననిమాతా రాజరాజేశ్వరీ ! 67
ఆలా చూచెద వేమి క్రొత్తగను కామాక్షీ మవాదేవతా
నీ లీలా చపలాక్షికోణ రుచిరానీక ప్రవాహామృత
వ్యాలోలాత్ముడు వీడు వీడనిన నీకన్యుండు కానట్టి వా
దేలా చూచిన మేలొ చూడుము శివానీ రాజరాజేశ్వరీ ! 68 33
తరుణీ ! కారుణికాత్మవాభ్రితజ నోద్ధారక్రియా దక్షవున్ వరజాంబూనద రుగ్వి తాన తను శోభా వైభవోత్తాలవున్ పరమార్థ ప్రదభావ శీల వనుకంపాకల్పితానల్పవున్ తరణోపాయపదైక తారిణివి మాతా రాజరాజేశ్వరీ ! 69 ఇందున్నానని యిందు లేవనుచు నీకేమున్నదే తల్లి నా కెందుంజూచిన నీ విభూతి విభవంబేతోచు వేవెల్గు నా దెందంపున్నడిబొడ్డు పై నిలచినట్లే తోచు దేదీష్యమై ఉందు'న్నేను త్వదీయ దీప్తి గుణమట్లున్ రాజరాజేశ్వరీ ! 70 అగచాట్లెన్ని భరించి వచ్చితిని జన్నానేక దుఃఖప్రదా పగ సుళ్లంబడి క్రిందు మోదయి దయావార్ధీ కృపంజూడుమో జగతిన్ తల్లుల పాలు జేయకు మికన్ చాలయ్యె నా భోగముల్ నిగమాంతాఖిల తత్త్వభావితపురాణీ ! రాజరాజేశ్వరీ ! 71 చాలుంజాలును తల్గులింతకును చేర్చంజూడ కీమోదన న్నే లాగైనను వారి పజ్జలకు నీవే తల్లి వొక్కర్త విం తేలక్ష్యమ్ముగ సాగనీ బ్రతుకు లెన్నేనైన సాగించెదన్ నీలో నీవుగ నేను వెల్లగల రంధిన్ రాజరాజేశ్వరీ ! 792 34
చాలుంజాలు నివోను భోగములికన్ స్వర్గా పవర్గ ప్రదా
కేలందింపు ప్రవాహ వేగము కడున్ కేరింతలై గుంజెడిన్
కాలానించుట కైన నేలమరి చిక్కంబోదు నాపత్తులో
ఆలస్యంబొనరింపజూడకువె మాతా ! రాజరాజేశ్వరీ ! 738
తాళం జాలవు (ప్రాణవాయువులు చిద్గంధానిలస్పర్భ సం
బాళింపుల్ మరి దూరమైన వగుచో బాధా సహిష్ట్ణున్ననున్
బాళింబట్టుము కౌగిలింతలను నీ వాత్సల్యపు పుంద్రోవలన్
మౌళీందు ప్రమదా ! అవాజ్బనసగమ్యా ! రాజరాజేశ్వరీ ! [౯
మాయా మోహితమైనదీ బ్రతుకు దుర్మార్షైక తీవ్రస్ఫుర
ద్ధీయుక్తింబడి మన్ను మిన్నరయ బోదే మాజ్రముం గూడ తా
నేయైనట్లు జగటత్ర్రభుత్వ మిది యెంతే మూర్ధతంబోవు అ
న్యాయం బిప్పుడు వృత్తి యైనదికదమ్మా రాజరాజేశ్వరీ ! 75
శాంత స్వాంతత చచ్చి తామసము స్వేచ్చ్భావర్తనాయత్తమై
చింతాలోలత కల్మి లేములకు నై జీవింపగా జూతుమున్
అంతర్యామివి నీకెరుక లేదా యేమి చెప్పన్వలెన్
అంతా దొంగలు దొంగలందరును మాతా రాజరాజేశ్వరీ 1 76 35
అన్నన్నమ్మడు తమ్ము డింతయును, భార్యన్నమ్మడున్ భర్తభ ర్తన్నమ్మన్ పనిలేదు భార్యకును, మిత్రత్వమ్ము శత్రుత్వమ్ము తా మెన్నండయ్యవి యెందుకౌ తెలియరాదింతైన మాకున్ ధనం బన్నన్ దోచుట దాచుటే పని, పరాంబా ! రాజరాజేశ్వరీ ! 77 కుటిలాత్ముల్ జగమందు పెద్ద మనుషుల్ కోటీశ్వరుల్ నాయకుల్ జటిలంబైనది సంఘజీవనము విశ్వంబంత కల్లోలమె చ్చటనున్ దేబెమొగాలతో (ప్రజలు ఇచ్చంజచ్చి జీవింతు రిం తటి ఘోరమ్మిక సాగనీయకువె మాతా రాజరాజేశ్వరీ | 78 సకలాధర్మ తరంగ సంగత మహా సంసార ఘోరార్జవం బొక తీీవ్రాకుల శీఘ్రవేగమున యందుజ్బూతలూగించి మ మ్ముకనుల్ (బ్రామి భవద్దయాపదము సంపూర్ణమ్ము గామాకు నెం తకునున్ తోచని దాని చేసినది, మాతా ! రాజరాజేశ్వరీ 1 79 మము రక్షింపుము భీతి బాపుము పరాంబా ! పంచకోశస్థితా ! మము మన్నింపుము తప్పు సైవుము గణాంబా ! గాన విద్యా ప్రియా | మము శాసింపుము (ప్రేమ జూపుము గుహాంబా ! గుహ్యతేజోవత్తీ | మము పాలింపుము ధర్మ కర్తలుగ నమ్మా రాజరాజేశ్వరీ ! 80 36
పరిపూర్చుండను భద్రభావుడను సర్వాత్ముండ వాచామ గో
చర దివ్యామృత చిద్రసైక ఘనుడన్ స్వాత్మ ప్రబోధజ్ఞుడన్
పరమానందుడు (బ్రహ్మ చేతనుడుగా భావించి భావించిన
న్నెరుగం గల్టితి నిన్నుగా తుదకు, దేవీ రాజరాజేశ్వరీ | రే
పరమాకాశ విలగ్న మానసుడ భావాభావ నిర్ముక్తుడన్
పరమాత్మోపరతి ప్రధానుడను సర్వవ్యాప్త సందీప్తడన్
నిరహంకారుడ నిత్యతృప్తుడనుగా నేనెడ్డ భావించి న
న్నెరుగం గల్లితి నిన్నుగా తుదకు దేవీ రాజరాజేశ్వరీ ! 82
మాయా తీతుడ నవ్య యుండను పరాత్మ శ్రీ ప్రభాభాసుడన్
ధ్యేయ ధ్యానము లోలిధ్యాతయును మూర్తింగొన్న నైనట్టిడన్
ఈయంతైన ప్రపంచ రూపుదను గొనేనెడ్డ భావించుటన్
నీయాకారము నాదిగా తెలిని కొంటిన్ రాజరాజేశ్వరీ ! 88
జీవన్ముక్తుడ జీర్ణకాముడను పుంజీభూత విజ్ఞానుడన్
నీవారాగ్ర నిభాల్బ కల్పుడను నిర్నిద్రాంత రంగుండ చి
ద్భావాభావుడ భూమ పూర్చుడనుగా భావించి భావించుటన్
నీవేనేనుగ నన్నె అింగితి, మృడానీ ! రాజరాజేశ్వరీ ! 84 3/7
గత సంకల్పుడ ముక్త మత్సరుడ నిష్కామైక వర్ధిష్టుడన్
ప్రతిభా భాగ్య వివర్ధనుండను పర (బ్రవ్మాత్మ రూపుండ సం
తత సంతోష రసానుభూతి కలనాతత్త్వమ్ము భావించి కాం
చితి నన్నున్ తుది నిన్నుగాన గుణరాశీ రాజరాజేశ్వరీ 1 85 రాగద్వేష భయాతిరక్తుడను హర్షామర్న దూరాత్ముడన్
యోగానందుడ నిర్వికల్పుడను ఆత్మోపాసనా (ప్రజ్ఞుదన్
భోగోన్ముక్త విరక్త చిత్తము నీపూర్జాకృతింజూచినే
లో గొంటిన్ నిను నన్నుగా తుదకు నిట్లున్ రాజరాజేశ్వరీ ! 86 శాంతాకారుడ ద్వంద్వ భావరహితోత్సాహైక భావుండ న
త్యంతానంద ఘనప్రకాశ మహసీయ (బ్రహ్మ కల్పుండనై
చింకాదూరత నిర్వికారత నినున్ చింతించుటంగంటి నా స్వాంతంబందున నన్ను నిన్ను గను పూజ్యా ! రాజరాజేశ్వరీ ! 87 అపరిచ్చిన్నుడ నప్రమేయుడను తుర్యాతీతరూపుండ నా
త్మ పదార్థజ్డుడన ద్వితీయుడను (బ్రహ్మానంద తత్త్వాత్ముడన్ అపరోక్షానుభవాంతరంగమున మాయా మేయ సౌందర్య ని న్నుపలక్షించితి నన్ను నేనటులుగానున్ రాజరాజేశ్వరీ ! 88
38
అతిలోకుండను ఆత్మ తేజుడను విద్యాకార్య సంసార సం
గతి లేనట్టిడ నిత్య మంగళకళా కల్యాణ భావుండ నీ
ప్సితముల్ గోసి నిరీహ నిర్మల మనః వీఠమ్ము నందేను చూ
చితి నిన్నున్ నను నేను వోలె పరమేశీ రాజరాజేశ్వరీ ! 89
సదసద్భేద విహీన భావుడ మనస్సంకల్ప సన్యాస స
మ్ము దిత స్వాంతుడ నేక మాత్రుడను కర్మోపద్రవాపేతుడన్
హృదయాకాశము పాలవెల్లి పయి బ్రాహ్మీ మూర్తి నాత్మా కృతిన్
విదితా తీతను నిన్ను చూచితిని దేవీ ! రాజరాజేశ్వరీ ! 90
అనవచ్చిన్న మవానవావరణ మధ్యస్థాన బిందు (పదే
శ నివాపైక రసానురూప మహితాచ్చ బ్రహ్మ తేజోవతీ
మనుమంత్రాఖిల శక్తి కల్పిత జ్వలన్నాణిక్య దీపాకృతీ
ఇన సాహట(స్రనిభాభికాంతి కలితాంగీ ! రాజరాజేశ్వరీ ! 91
నిగమార్థాఖిల తత్త్వ సుందర వపుర్నిర్మాణ రమ్యాకృతీ !
త్రిగుణా త్మైక విలాస భాసుర గుణా తీత స్వభావాకృతీ !
జగదాకార వివర్త వర్తన కళా సంలక్ష్య వ్యంగ్యాకృతీ 1
స్వగతానంత పరాపరా విభవకోశా ! రాజరాజేశ్వరీ ! 99 ఏ9
నిరవస్థాత్మికవై తటస్థవయి తూస్టీంభావ భావాత్తవై పరమానంద సుధాసముద్రమున కాపైనిల్చి వర్తించు ఓ పరమార్థాఖిల వస్తు భావమయ తత్త్వ స్ఫూర్తి మన్మూర్తి సుం దరి! గౌరీ! దయ చూడు మి బ్రతుకు పండన్ రాజరాజేశ్వరీ !
93 కావన్ సర్వజగమ్ములన్ తుదకు పోకార్వంగ భావించుటన్ కావింపం గలదాన వార్త జన రక్షా దుష్ట శిక్షార్ధమై ఆవిర్భావము చెందు దేవతవు నన్నా పన్ను నింబ్రోవవే నీవే నాకు శరణ్య మోజని శివానీ రాజరాజేశ్వరీ ! 94 అసమానాద్భుత కాంతికందళిత రేఖాకార లావణ్యవ ల్లి సహస్రార సుధా సముద్రమయమూర్తీ మహాచక్ర స ద్మ సదా షోడశవర్న యౌవన విధా మహా దర్వాతి సౌందర్య గం ధసమాళ్లిష్ట సువర్ణ వర్ణ తను మధ్యా రాజరాజేశ్వరీ ! 95 స్ఫటిక స్వచ్చ మృణాలకుంద ధవళచ్చ్భాయా ప్రకారైకవి స్ఫుట దేహాత్మ ! సమస్త రూప విభవ స్ఫూర్తి ప్రభావల్లరీ ! ఘటి తానంత జగచ్చిదాత్మ నిలయా ! కాత్యాయనీ ! కామదా! నిటలాక్షీ ! నిటలాక్ష దేవవరపల్నీ ! రాజరాజేశ్వరీ ! 96
40
శమితాశా వివశాకులాత్మము యదృచ్చాటప్రాప్త సంతృప్త చి
త్తము శ్రీ, పీఠము దివ్య దీధితుల మధ్య స్టాన బిందూపరి
(భ్రమణ భ్రాజిత వజకాంతి విభవ స్ఫారాభిరామాకృతీ
అమృతానందవు నీకు వందనము లమ్మా రాజరాజేశ్వరీ ! 97
అజమున్ భూమ మతర్మ్య మక్రియమున ద్వైతమ్ము బ్రహ్మామ్ము నా
గజ నున్నిన్ను తలంతునాన్యముగ సంకల్పింపవే నీవునున్
నిజ మాయా పరికల్పితాఖిల జగన్నిర్మాణ కర్మాకృతీ
త్రిజగత్సాక్షికి నీకు వందనము గౌరీ రాజరాజేశ్వరీ ! 98
కన్యా రూపమునీది నాకనులలో కర్పూర ఖండ స్పృహా
జన్యంబైనది నిల్చి పొల్చెడిని ఏ చక్కిన్ విలోకించినన్
అన్యం బెయ్యది నీవు కానిదని స్టూలాకార నిర్ముక్త చై
తన్యంబైన వెలుంగు వెల్లవగు మాతా రాజరాజేశ్వరీ ! 99
లోకాలోక విలోకన క్షమములున్ లోలమ్ములున్ (బ్రహ్మ భా
వాకర్ష ప్రధితమ్ములున్ సరనములో నీవైన దృక్కోణ మా
లా కల్యాణ విధాన తోరణము లెల్లన్ నిండి మాముంగిటన్
శ్రీ కల్యాణము నిత్య వైభవమగున్ శ్రీ రాజరాజేశ్వరీ ! 100 త]
శ్రీదేవీ ! శివకామినీ ! శివమయీ |! శ్రీ రాజరాజేశ్వరీ ! శ్రీదేవీ ! శివనాదినీ ! శివపరా ! శ్రీ రాజరాజేశ్వరీ !
శ్రీదేవీ ! శివయోగినీ ! శివమతీ ! శ్రీ రాజరాజేశ్వరీ !
శ్రీదేవీ ! శివరూపిణీ ! శివకరీ ! శ్రీ రాజరాజేశ్వరీ 1 101 దేవీ ! శాంభవి ! శాంకరీ ! శివమనోధిష్టాన నిష్టాకృతీ !
దేవీ ! శారద ! చంద్ర సుందరముఖీ ! దేదీప్య మానాకృతీ !
దేవీ 1! శక్తి గణాధిసేవితవతీ 1! దివ్యాత్మ గంధాకృతీ 1
దేవీ ! శాంతిమతీ శమైకగుణ మూర్తీ ! రాజరాజేశ్వరీ ! 102 మాతా ! మంగళదేవతా ! మధుమతీ ! మందస్మితోల్తాసినీ !
మాతా ! మానవతీ ! మహేంద్రవిభవా ! మార్తాండ తేజస్వినీ |!
మాతా ! మంజుల వాగ్విలాసవసతీ ! మాధ్వీ రసానందినీ !
మాతా ! మంత్రమహావిశేష మహితాత్మా ! రాజరాజేశ్వరీ ! 108 ఇది నీ సేవను గోరి చేసినది తల్లీ ! రాజరాజేశ్వరీ !
ఇది నీ భక్తికి గాగ కూర్చినది తల్లీ ! రాజరాజేశ్వరీ !
ఇది నీకంచు తలంచి పేర్చినది తల్లీ ! రాజరాజేశ్వరీ !
ఇదినీ వ్రీతికిగా సమర్పితము తల్లీ ! రాజరాజేశ్వరీ ! 104
42
నా దేమున్నది నీవు చెప్పితివి అంతా అట్టులే వ్రాసితిన్
కాదా నాముఖ యోగ్య లక్షణము లెక్కంజూచియే పల్మినా
వేదో నాదు పురాకృతమ్ము ఫలమింతే చాలు వాత్సల్య లీ
లా దివ్యా మృత వార్ధి ! శైలకుల బాలా ! రాజరాజేశ్వరీ ! 105
శరణంబుల్ భవదీయ దివ్య చరణాబ్ద (బ్రహ్మ విజ్ఞానముల్
శరణంబుల్ భవదీయ మాతృహృదయాబ్ద బ్రహ్మ వాత్సల్యముల్
శరణంబుల్ భవదీయ రమ్య నయనాబ్ద (బ్రహ్మ సౌందర్యముల్
తరణోపాయము నీ దయా గుణము మాతా రాజరాజేశ్వరీ ! 106
జయ ! కల్యాణ గుణాల వాల ! జయ ! విశ్వానంత శోభాకరీ
జయ ! సాహిత్య రసానుశీల ! జయ భాస్వ ట్బీ | పరావార్దరీ
జయ ! సంగీత వినోద లీల ! జయ శశ్వన్నాద రత్సాకరీ !
జయ ! కారుణ్య సుధాసముద్ర జయనిష్టా రాజరాజేశ్వరీ ! 107
శ్రీ మన్మంజుల దివ్య మంజుల మవాో శ్రీ రాజరాజేశ్వరీ
శ్రీ మత్సౌరభ దివ్య సౌరభ మవాశ్రీ రాజరాజేశ్వరీ
శ్రీ మత్సుందర దివ్య సుందర మహాశ్రీ రాజరాజేశ్వరీ
శ్రీ మన్మంగళ దివ్య మంగళ మవహాశ్రీ రాజరాజేశ్వరీ ! 108 4
అనుబంధభం మన్నవ రాజరాజేశ్వరీ
శ్రీయుత దివ్య తేజములు చిన్మయముల్ పరమ ప్రమోదసం ధాయక శక్తి లక్షణ విధా సవిధమ్ములు కోటి సూర్య కాం త్యాయత చారువుల్ పరమతాప భరార్తి జనాతి రక్షణ ధ్యేయములమ్మ ! నీవిమల దృక్కులు మన్నవ రాజ రాజేశ్వరీ ! మతిమతి లేని మూఢజనమైన జగమ్మిది అందులోన నే
నతి శయబుద్ధి జాడ్యుడననన్య శరణ్యుడనైన నన్ను నీ
స్మిత మధుదృగ్వితానమును చేరగనిచ్చి సమాదరమ్ము మై హితము ప్రియమ్ము చేసి కరుణింపుము మన్నవ రాజరాజేశ్వరీ | (బతుకు భయమ్ముకా నెడద రక్తము తానెదురొత్తు కొంచురా సతమత మౌచు జీవుడు విషాద విచార మహాగ్ని తప్తుడై నతరుణమందు నీవు కరుణారస సాగరమూర్తి ! వీచికా
కృతి కరముల్ వెలార్చి గయి కొందువు మన్నవ రాజ రాజేశ్వరీ !
శీ
దేవీస్తుతి
ఏదేవి సర్వభూతముల యెద
విష్ణు మాయనా వెలయు
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
చేతనాభిఖ్య పొలుచు
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సావ్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
బుద్ధి రూపాన పాలుచు
ఆదేవి కాదేవికి
ఆర్తి హాంత్రికి సాష్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
నిద్రగా నిలచి యుండు
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సావ్టాంగనతులు. 45
ఏదేవి సర్వభూతములయెద క్షుధా విస్ఫూర్తి మూర్తి
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సావ్టాంగనతులు. ఏదేవి సర్వభూతముల యెద ఛాయా స్వరూప మగును ఆఅదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సామ్టాంగనళులు. ఏదేవి సర్వభూతముల యెద శక్తి సామర్థ్య విధము
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు. ఏదేవి సర్వభూతముల యెద తృష్ణా స్వరూప కలిత
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సామ్టాంగనతులు.
తీ
ఏదేవి సర్వభూతముల యెద
క్షాంతి భావ ప్రదీప్తి
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
జాతి నిర్నిద్రముద్ర
ఆదేవి కాదేవికి
ఆర్తి హంట్రికి సామ్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
లజ్ఞాఖిమాన మహిత
ఆదేవి కాదేవికి
ఆర్తి హంట్రికి సామ్టాంగనతులు.
వదేవి సర్వభూతముల యెద
శాంతి కామ స్వరూ
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సామ్టాంగనతులు. తగ
ఏదేవి సర్వభూతముల యెద
ద్దా భక్తి విభావ
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
కాంతి కిరణ విస్ఫురణ
అదేవి కాదేవికి
అర్తి హంత్రికి సామ్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
శ్రీ మహాలక్ష్మి తాను
ఆదేవి కాదేవికి
ఆర్తి హంటత్రికి సాష్టాంగనతులు.
వదేవి సర్వభూతముల యెద
వృత్తి ప్రవృత్తి రూప
ఆదేవి కాదేవికి
ఆర్పి హంత్రికి సొష్టాంగనతులు. 48
ఏదేవి సర్వభూతముల యెద
స్మృతి జ్ఞాన విజ్ఞాన
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సామ్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
దయా దాక్షిణ్య భావ
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సామ్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
తుష్టి పుష్టి స్వరూప
ఆదేవి కాదేవికి
ఆర్తి హంట్రికి సాష్టాంగనతులు.
ఏదేవి సర్వభూతముల యెద
మాతృభావ ప్రభావ
అదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు. గం
ఏదేవి సర్వభూతముల యెద
భాంతి విభ్రాంతి మయము
ఆదేవి కాదేవికి
ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు, ఏదేవి సర్వేంద్రియ (గ్రామమున కధిష్టాత్రియగును ఏదేవి తానఖిల భూతముల యెద పరివ్యాస్తమగును ఏదేవి తానఖిల జీవములకు నంతర్యామి యగును ఆదేవి కాదేవికి ఆర్తి హంత్రికి సాష్టాంగనతులు, మునుపభిమత లాభమ్ములు పొందిన విబుధావలిచేతను దినదినోత్సవమ్ములు సాగించెడు దేవేంద్రుని చేతను అనిశము సంభశ్రితమును సదాసంసేవితమును అయిన దేవి కనికరించుత నా పదలను కాచి రక్షింపగామమ్ము ఈ దైత్యులు దురహంకారులు ఇంగిత మెరుగని మూఢులు ఏ దినమ మర్యాదులేమైన చేయ బ్రతుకుట భయమై ఏ దేవి దిక్కని శ్రీపాదములనా(శ్రయించితిమి మేము ఆదేవి రక్షింపగావలె నాపదలకు బాపిమమ్ము
50
తము లా్న్నా నస యు (( & ౧.౫౦ ఇలొడ్లళ్లల్లు ళ్ళ న్ ్ నావా
ఆళ్ళ | దా.