Telugu c naare chalokthulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

క . మూగ న్‌ “= మ్‌ | / సు [నా చ న. , శ్‌ సైజే ా కాం న. ట్‌. ల లే తీ ల న కై . మ బాం ? నో కల న్య మ్‌. అదా” | ల + / శ _ ల [ | లో క్‌. 1 టే 1 ర స | ళల ల ః 1 శీ . ప్త స నో సవ్త్యతల న ఎ గ్‌ జీ ల్‌ ్ట్‌] క్ల | | | . ( 1 | 0 ల ల అననే. ల . తాం ంం వ సే, ం క జ. లో న నా క / నం. ర్‌ న. క క. న వ. ్ట్‌ ర ల త ప. | (ల చ [| య్‌ న్యా = నం రంగ్‌ టల గ నం మాలల లో ౧ చా కా యయ గ ర పం సా... టు. స సన / టై ము. (1 [ల్‌ న! మై స! నా న క లే మ మం నను: (| లో ల స క యా క టో

సినారె ఛలోక్తులు సంసాదకుడు ఊఉ ఎన్‌, గోపి _మవస్వినీ ప్రచురణలు "హైదరాబాద్‌ 1998

౧౫4౬8 ౧౮415010840ఓ౬0 (ెలుడ66) వ 07. 6. సమ2 312 646? / ర్క 60160164, 2౧64 64164 0” (౧ ల? 1. 6౦91 50841600, ౯2) 198 భవతా 07౯ 69120 : షేశం[౧20 టో! అంజూ " బి క కగం8 : 23. &ర్‌ నీట్‌ కం 6౦016 ళ₹19212264013 ౨601161006 110486 ఉ-1-435, 920% 5066౬ కసడయ11014-500001 . జురే 41] 16 8ముయల్‌ & సశజం2ంళరుం1 2యయటట2141 ₹]106స౦.48, 00004828 ౧౦1౦” ]ఇ01ఆ 11119, 1రల2024 - 500 య - గాకా గ్‌ “శ్ర ళ్‌ ఎం అలల్న 60500664 14 ను | 1 కెం06116 6౯200116 (46 ౫6. || క2201008400002107 ల. *.౧ఫఇషరు | 620244. ఈ: 7660000 తం న్నా మా కెరగ6ే 14 నో 012 విరగటం కడల30264

కృతజ్ఞతలు

జ్ఞానపీఠ అవార్డు (గ్రహీత, పద్మభూషణ్‌, రాజ్యసభసభ్యులు డౌ॥ సి. నారాయణరెడ్డిగారు ఎన్నో యేళ్లుగా ఆయా సందర్భాల్లో విసిరిన ఛలోక్తుల భాండాగారంలోంచి కొన్నింటిని ఎంపికచేసి ఈ పుస్తకంగా (ప్రచురిస్తున్నాం. గత ఏడేళ్లుగా ఆయావ్యక్తుల నుండి వీటిని సేకరించి, పరిష్కరించి, సంపాదకత్వం వహించిన (ప్రముఖకవి, విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్‌ డా! ఎన్‌. గోపిగారికీ, మనస్వినీ ప్రచురణల తరపున వీటిని ప్రచురించడానికి అంగీకరించిన డౌ॥ సి. నారాయణరెడ్డి గారికీ మా కృతజ్ఞతలు.

విజయవాడ వాస్తవ్యులు, వాణిజ్యరంగ (ప్రముఖులు, వదాన్యులు శ్రీ గడ్డం సుబ్బారావుగారి ప్రేరణ ఈ (గ్రంథ ప్రచురణకు దోహదం చేసింది, అందుకు శ్రీ, సుబ్బారావు గారికీ -

భావస్సోరకంగా ముఖచి(త్రాన్ని రూపొందించిన (ప్రఖ్యాత చిత్రకారుడు మోహన్‌గారికీ, +, టైపు సెట్టింగ్‌ చేసిన ఫాంట్‌లైన్‌ (గ్రాఫిక్స్‌ నిర్మలకూ, అందంగా ముద్రించి యిచ్చిన విప్ణ ప్రింటర్స్‌ వారికీ మా కృతజ్ఞతలు.

అ మనస్వినీ ప్రచురణలు

నోటి ముత్యాలు

నారాయణరెడ్డి గారితో నాది 33 యేళ్ల గాఢమైన పరిచయం. విశ్చవిద్యాలయంలో నాకు ఐదేళ్లపాటు బి.ఏ. ఎం.ఏ.ల్లో పాఠాలు బోధించారు కూడా. కాబట్టి వందలాది గంటలు ఆయన మాటలు వినే అవకాశం కలిగింది. ఆయన మాటల్లో చమత్కారమో, కొత్త పద పప్రయోగమో లేకుండా ఉండదు. శబ్దం మీద ప్రత్యేకమైన స్పృహ కలిగినవారు సినారె. యమకమో, శ్లేషో, వ్యంగ్యమో, ధ్వనో ఆయన సంభాషణల్లో ఉపన్యాసాల్లో ఆలవోకగా దొర్జ్హుతుంటాయి. మాటల్లో ౪౧ చెయ్యడం ఆయనకు స్వాభావికంగా అబ్బిన విద్య, ఆ రకంగా ఆయన పన్‌కార్‌. ఫన్‌కార్‌ కూడా. ఉర్వులో ఫన్‌కార్‌ అంటే కళాకారుడని అర్ధం. ఛలోక్తి విన్యాసానికి మూలధాతువులు సృజనాత్మకత, భావుకత.

సినారె గొప్పవక్త అని నేనిప్పుడు కొత్తగా చెప్పనక్కరలేదు. మంచి 00౧౪6154|0౧౬|19[ కూడా. క్టాస్‌రూమ్‌లోనో, మార్చింగ్‌ వాక్‌లోనో, మి(త్రుల్లో గోష్టుల్లోనో, సభల్లోనో ఆయన ప్రదర్శించే వాగ్విలాసం ఉల్లాస పూరితమైన జ్ఞాపకాలను మిగిలిస్తుంది. _

ఏడేళ్లక్రితం అనుకుంటాను నాకెందుకో అనిపించింది, సినాం అయా నన్నివేశాల్లో (ప్రయోగించిన ఛలో క్తులన్ని కొన్నాళ్లకు గాలిలో కలిసిపోతాయేమోనని. మిత్రుల జ్ఞాపకాల మడతల్లో ఉండొచ్చు కానీ అవి రికార్డు అయితే చిరకాలం చిరునవ్వుల్ని వెలిగిస్తాయి కదా! అయితే ఆయామిత్రుల, సన్నిహితుల మస్తిష్కాల్లో నిక్షిప్త్రమైవున్న ఈ నోటిముత్యాలు మనదాకా రావడం ఎలా? అందుకని 1991లో ఓ పత్రికా ప్రకటన

సినారె ఛలోక్తులు ర్‌ ఇచ్చాను. దానికి దేశం నలుమూలల నుంచి మంచి (ప్రతిస్పందన లభించింది. వందలాదిమంది సినారె అభిమానులు తాము సినారె ముఖతః విన్న ఛలోక్తులను ఉత్తరాల్లో రాసి పంపారు. వాటిల్లో చాలా వాటిని తోటకూర రఘు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రకటించారు. అప్పట్లో పుస్తకంగా తెద్దామనుకున్నా ఎందుకో ఆ ప్రయత్నం అడుగున పడిపోయింది. రఘును ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరిస్తున్నాను.

దుఃఖపూరితమైన జీవితంలో నవ్వు ఎంత ముఖ్యమైందో అనుభవం ద్వారా తెలుసుకున్న నేను మళ్లీవాటిని పెట్టెైఅడుగునుంచి తీసి ముందేసుకున్నాను, మిత్రుల వొత్తిడి కూడా దీనికి తోడైంది.

ఇంతకూ ఛలోక్తి ఆంటే ఏమిటి? ఛలోక్తి అంటే తెలివైన సమాధానం, ఇంగ్రీషులో దీనిని [80466 అంటారు. ఐరోపాదేశాల్లో గిం౧౭గ6౪ ని గీగ16595 గగ గా వ్యవహరిస్తారు. గీగ1958 అంటే ఇంతకుముందు ఆలోచించింది కాదు, పథకం వేసుకున్నది కాదు అని అర్ధం. అప్పటికప్పుడు హఠాత్తుగా వెలువడిందన్నమాట. అంటే ఛలోక్తి (ప్రధాన లక్షణాలు

కర*416 50611/2౧ అనే ఐరిష్‌ విమర్శకుడు గం౧౬గ669 కి ఈ విధంగా లక్షణం చెప్పాడు.

'వఉీం్ర006 ౧902గ169 13 19 594౪1009 01 90గ౧౪౪౧1౧౦ ౦౧ ౧6 9౧64౯ 0 16 గాంగాంగ౧1 ౪1౧100 0 16 ఆగ౧4౧|౧౦౪౩ ౦౦౧౩6౧1 01 19 ౧046౧5, [82౪69 ౧06 ౧౦౯౧౪౦౧ [౧601166 10 ౧౧౬౦౪౦41/ ఢ65/419 0౮%ఓగ౧6 9069600 0౪ *౬౪/ 01 6616౧06' (4 141౧౦ ౦ సీండంగ 119)

ఛలోక్తి ఆహ్ల్హాదపరుస్తూనే (శ్రోతను నిరుత్తరున్ని చెయ్యాలన్నమాట!

గం4౮6౫/ *|1 అంటే సద్యఃస్పూర్తి. అది మేధకు సంబంధించింది.

ర సినారె ఛలోక్తులు హాస్యం హృదయసంబంధి. ఛలోక్తికారుడు ఆయా సన్నివేశాల్లో తన సంస్కారాన్ని బట్టి విలక్షణంగా ప్రతిస్పందిస్తాడు. దానిఫలితం ఉల్లాసం. ఎవరిమీదైతే విసురుతున్నామో వారు కూడా హాయిగా నవ్వగలిగేది మంచి ఛలోక్తి, కొన్ని నొప్పించే ఛలోక్తులు కూడా ఉంటాయి.

“౧/6 42/9 10164 0 90గ౧౪ 1౮౧౦౧౪69 1౧41 & ౧౧౧౬గ66 5౧౦౮16 09 ౦౦౮గ౧6౦౪8 1౧ 10గా, 0౮60 98౪68 1౧ 8605812006, &౧6 6141061 6106110 గ౫|4క6 0౯10 1896[0

నొప్పించటానికి ఛలోక్తే ఎందుకు? సినారెవి నొప్పించే ఛలోక్తులు కాదు. మెప్పించే ఛలోక్తులు. మన ప్రాచీనసాహిత్యంలో కూడా నిందాస్తుతి, స్తుతినింద, వక్రోక్తి వగయిరాలు ఉన్నాయి. సన్నివేశం కుదిరినప్పుడు అవి ఓ వెలుగు వెలుగుతాయి.

ఛలోక్తి ప్రయోగానికి మేధస్సు అవసరమే కాని దానికి తగిన సరళ వృదయముండాలి. జీవితాన్ని (పేమించేవాడు, జీవితాన్ని ఆస్వాదించగలిగినవాడు, జీవితంలోని అందచందాలను అరలుపొరలు లేకుండా చూడగలిగినవాడు మంచి ఛలోక్తి కారుడవుతాడు. సినారెలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి,

ఛలోక్తులు ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తుల వ్యాసంగాలకూ, న్వభావాలకూ చెందివుంటాయి. కోర్టుజోకులు, సభలజోకులు, విద్యాలయాలజోకులు, క్లరికల్‌జోకులు ఇలా అనంఖ్యాకంగా వర్గీకరించవచ్చు. (స్టూలార్థంలో జోకులంటున్నాను కాని విజానికివి జోకులు కావు). సాహిత్యరంగంలో ఆదిభట్ల నారాయణదాసు, సిఆర్‌రెడ్డి, శ్రీశ్రీ మొదలైన వారి ఛలోక్తులు ఇప్పటికీ మిత్రగోష్టులను వెలిగిస్తుంటాయి. వీటిలో కొన్ని రికార్డు అయ్యాయి. కొన్ని మౌఖికంగా తరాలను చీల్చుకొని

సినారె ఛలోక్తులు 7 ప్రసరిస్తూనే వున్నాయి. కాని అవి ఎన్నాళ్లుంటాయి (గ్రంథస్థం కాకపోతే!

నవ్వులను పువ్వులతో పోలుస్తాము. ఆవి వెలుగిచ్చే రవ్వలు కూడా. నవ్వడం, నవ్వించడం కనీసం చిరునవ్వించడం ఒక పవిత్రమైన బాధ్యత.దుఃఖపూరితమైన మానవజీవితంలో ఛలోక్తి ఒక పరిమళాల మబ్బులా పేలుతుంది. ముడుచుకున్న మొహంలోంచి, ఆగిపోయిన జీవితంలోంచి హాస్యం పుట్టదు. (ప్రవహించే జీవితంలోని నురగల హాసాలే ఛలోక్తులు. యాంశత్రికమైపోతున్న ఆధునిక జీవితానికి కుదుపునిచ్చేవి ఛలోక్తులు. ఘనీభవిస్తున్న నెగెటిన్‌ భావాల మంచుగడ్డలను కరిగించే సూర్యకిరణాలు ఛలోక్తులు.

నేనిక్కడ సినారె ఛలోక్తుల్ని విశ్లేషించే పనిని పెట్టుకోలేదు. హాయిగా మీముందు సిద్దాన్నం వుంటే కంం0692004180 1466 ఈ/000411/ పద్దతిలో మిమ్మల్ని యిబ్బంది పెట్టదలుచుకోలేదు.

ఒక వ్యక్తి ఛలోక్తులు పుస్తకరూపంలో వెలువడటం తెలుగులో ఇదే 'ప్రథమమనుకుంటాను.

ఈ ఛలోక్తులను ఎవరు పంపారో ఎవరు చెప్పారో వారి పేర్లతోనే వాటిని ఇస్తున్నాను. వారికీ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పడం నా ధర్మం. ఈ ఛలోక్తులు సినారెకి ఇతరత్రా సన్నిహితులైన వారికి కూడా అవి తెలిసి ఉండొచ్చు. పంపిన వాటిలో వందలాది ఛలోక్తులు పుస్తకంలోకి ఎక్కలేదు. కారణం, వారు తమ జ్ఞాపకాల్లోంచి సరిగ్గా ౧989౧1 చెయ్యలేక పోవటమే. శీగిపొదలా, ముడి సరుకులా ఉన్న ఉత్తరాల్లోని మెరుపుల్ని యేరి, ఆయాసభల్లో గోష్టుల్లో విన్నవారితో ౪&గ%/ చేసి కొన్ని ఛలోక్తులకు ఒక రూపం కల్పించడం జరిగింది. ఎన్నివేల ఛలోక్తులు గాలిలో కలిసి

8 సినారె ఛలోక్తులు పోయాయో! వెంట వుండి [1018 చేసుకునే వీలు ఆందరికీ వుండదు-కదా! ఇప్పటికైనా వీటిని ఓ పుస్తకం కప్పుకిందికి తెస్తున్నందుకు సంతోషిస్తున్నాను. పైకి తేలిగ్గా కనిపించే ఈ క్లిష్టతరమైన పనిలో నాకు చేదోడువాదోడుగా ఉన్న ఆత్మీయుడు డా॥ ఎండ్లూరి సుధాకర్‌, పరిశోధక విద్యార్థులు, కళాశాల అధ్యాపకులైన ఎస్‌. రఘు, అతని జీవనసహచరి నీరజ జవ్వాజిలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. పరిశ్రమశీలురైన వీరికి ఉబ్వ్బలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను. చివరగా ఒక మాట! విశిష్ట వ్యక్తుల ఉదంతాలను, వారి చమత్కొారాలను రికార్డు చెయ్యడం ప్రతి సహృదయసాహిత్యకారుడి బాధ్యత. దేని విలువైనా పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది. ఆయా సామాజిక, సాహిత్య ప్రక్రియల్లోంచి వెలువడే ఆణిముత్యాలు ఛలోక్తులు. కాల ప్రవాహంలో నునుపెక్కి దొర్హుతూపోయే సాల(గ్రామాలు. ఈ మౌఖిక దీపాలను ఆరిపోనీకండి. ఇటువంటివి రేపటి మన సాంస్కృతిక జీవనచరిత్రకు ఆధారశకలాలవుతాయి. రికార్డు చెయ్యండి. ఈ ఛలోక్తుల్ని మీ పెదవులపై చూడాలని ఆకాంక్షిస్తున్నాను. = గోపీ

సినారె ఛలోక్తులు ప్ర శ్రీ మడిపడగ బలరామాచార్యులు సుప్రసిద్ధ చిత్రకారులు, రూపళిల్సి. నారాయణరెడ్డి గారికి సన్నిహితులైన బాల్యమి(త్రుడు. సినారె కావ్యాలు కొన్నింటికి ముఖ పత్రాలంకరణ చేసినవారు. ఒకసారి నారాయణరెడ్డి గారు బలరామాచార్యుల ఇంటికి వెళ్ళారు. ఏదో పిచ్చాపాటీమాట్టాడుకుంటుంటే బలరామాచార్యులు గారి కుమారుడు ఒకటే అల్లరి చేస్తున్నాడు. వెంటనే నారాయణ రెడ్డిగారు 'శిల్పికి తద్భవం చిలిపి" అని చమత్కరించారు. ఇక్కడ శాద్దిక చమత్కారమే కాదు, గాఢమైన అర్థ చమత్కృతి కూడా వుంది. కుమారుడు అంటే తద్భవమే గదా!

  • వై. రామక్పుష్ణారావు హైదరాబాద్‌

10 సినారె ఛలోక్తులు ఓ పారి ఓ నఖ చిత్రకారుడు తాను గీసిన నఖచిత్రాలను నారాయణరెడ్డి గారికి చూపించాడు. అత్యద్భుతమైన అతని ప్రతిభను చిత్రరూపంలో చూసిన సినారె ప్రశంసా సూచకంగా శిరశ్చాలనం చేశారు. పక్కనే వున్నవారి మిత్రులు “ఈ చిత్రాలను గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. సినారె వెంటనే “నఖే నఖే సరస్వతీ” అన్నారు. “ముఖేముఖేసరస్వతీ” అనే లోకసూక్తి స్ఫురించగా ప్రశంసాపూర్వకంగా సినారె వైపు చూడడం మిత్రుల వంతయ్యింది.

డా. చేరెడ్డీ మస్తాన్‌ రెడ్డి, పోలేపెద్ది రాధాళ్సస్తమూర్తి, నరసరావుపేట

సివారె ఛలోక్తులు | 1957లో అవి నేను బి.ఎస్సీ. చదువుతున్న రోజులు. ఉస్మానియా యూనివర్శిటీ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంటులో ఓ మీటింగ్‌ జరుగుతోంది. ఆ సభలో అప్పటి వైన్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ సూరి భగవంతంగారు అధ్యక్ష పీఠంలో వున్నారు. వక్తగా మాట్లాడవలసి వున్న ఆనాటి తెలుగు లెక్బరర్‌ డాక్టర్‌. సి.నారాయణరెడ్డిగారు లేచినిలబడి మెల్లగామైకుదగ్గరికి వచ్చారు. వేదిక మర్యాదలన్నీ పాటించిన తర్వాత సివారె “నాకు భగవంతంగారిని చూస్తే భయవంతంగా వుంది” అన్నారు. అంతే హాలంతా నవ్వులతో నిండిపోయింది. భగవంతంగారు కూడా ఎడమచెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వడం నాకిప్పటికీ గుర్తు,

  • కునును, కె. మూద్రి హైదరాబాద్‌

12 సినారె ఛలోక్తులు ఒకప్పటి రెవిన్యూ మంత్రి, రైతు నాయకుడు పి. తిమ్మారెడ్డిగారి గురించి నారాయణరెడ్డిగారు ఓ సభలో మాట్లాడుతూ “తిమ్మారెడ్డి తతిమ్మా రెడ్డవలె కాదు” అనగానే సభ గొల్లుమంది.

=డ్సా జె. బావురెడ్డీ, హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 13 తెలుగు విద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠ ప్రాంగణంలో ఎగుడుదిగుళ్లు బుల్‌డోజర్లతో లెవెల్‌ చేయించి భవన నిరా 1౯౦ చురుగ్గా సాగించినందుకు ఇంజనీరుగారిని సత్కరిస్తున్న సన్నివేశం. ఆ ఇంజనీరుగారు ఆరడుగుల భారీమనిషి సత్కరించవలసిన యూనివర్సిటీ వైన్‌ఛాన్సలర్‌ డా. సి. నారాయణరెడ్డిగారు. అధిష్టించిన స్టేజీ అతిథుల్లో కిటకిటలాడుతూ ఇరుకుగా వుంది. అప్పుడు సినారె దండ చేత్తో పుచ్చుకుని తానే స్టేజీ చివరికి వచ్చి అది ఎక్కబోతున్న ఇంజనీరుగారి మెడలో వేశారు. స్టేజీ మీద వున్న సినారె చేతిలో దండ - స్టేజీ కింద వున్న ఇంజనీర్‌ మెడ లెవెల్‌కే సరిగ్గా సరిపోయింది. ఆ దండ వేస్తూ “ఇదే లెవెలింగ్‌ అంటే” అన్నారు సినారె. సభ అంతా గొల్లుమంది.

= ఆచార్వ బేతనోలు రానుబవ్మాం, రాజమం.

14 సినారె ఛలోక్తులు విశ్వవిద్యాలయాల్లో, నేటి పరిశోధన (గ్రంథాల గురించి సినారె సాధారణంగా విసిరే ఛలోక్తి. 'పరిశోధన మూడురకాలు. ఒకటి పరిశోధన, రెండోది ఉపరిశోధన, చివరిది గిరిశోధన. మొదటిది నూత్నాంశాలతో మౌలికంగా రూపొందేది. రెండోది పైపైన పరామర్శించేది. ఏదో రాసి డిగ్రీ సంపాదించుకునే వ్యవహారమిది. మూడోది గిరిశోధన. కొండను తవ్వి ఎలుకను పట్టడమన్నమాట!” చమత్కారమంతా ఎక్కడుందంటే సినారె పరిశోధన, ఉపరిశోధనల గురించి వివరిస్తూ శ్రోతల్లో ఏంచెప్తారో అన్న ఆసక్తిని 018816 చేసి కొసమెరుపుగా 'గిరిశోధన' అని 8౪858 ఇవ్వడం లో వుంది. దాః ఎన్సీ నత్వవారాయణ "హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 15 తణుకులో ఓసారి సినారెని 'సార్‌! మీరు పీతలు తింటారా?” అని అడిగారు. 'కష్టంలెండి అవి ఆముక్తమాల్యదలు” అన్నారు. అర్ధంకాక విస్తుపోయి చూస్తున్న వారికి సినారె ఇలా వివరించారు. “తెలుగులో ఆమ్ముక్తమాల్యద చాల క్లిష్టమైన (ప్రొాఢకావ్యం. అర్ధకావడం కూడా అంతే. పైన డొల్లంతా కొరికి తీసి... ఆ రుచి మన అనుభవంలోకి రావడానికి చాలాసేపు పడుతుంది.” ఇప్పటికీ ఎప్పుడు పీతలు తినే సందర్భం వచ్చినా సినారె మాటలు గుర్తుకొస్తాయి.

= రనరానా, తణుకు.

16 సినారె ఛలోక్తులు 199లో నగర కేంద్ర గ్రంథాలయంలో ఓ (గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ సినారె ఇలా అన్నారు. “ఈ రోజుల్లో పుస్తకం రాయడం కంటే ముద్రించుకోవడం కష్టం. కారణం ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. రచన వేళ్లతో కూడుకున్న పని (ప్రచురణ వేలతో కూడుకున్నపని”.

= బిన్‌. రఘు హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు శా కొకినాడలో సొహిత్యసభ సినారె ఆధునిక కవిత్వం గురించి రసోల్దాసంగా మాట్లాడుతున్నారు. అనుభూతి కవిత్వాన్ని (ప్రస్తావిస్తూ ఇస్మాయిల్‌ గారి గురించి ఇలా కామెంట్‌ విసిరారు ఇస్మాయిల్‌గారిది జరీపోగుల ఇమేజరీ', = దొ ఎండ్లూరి నుధాకల్‌ రాజమం(డీ

18 సీనారె ఛలోక్తులు (ప్రముఖకవి బోయి భీమన్న అనేక సాహతీ ప్రక్రియల్లో దిట్ట. వ్యాసాల్లో ఉపన్యాసాల్లో కూడా తన అభిప్రాయాలను నిర్భయంగా 'ప్రకటిస్తుంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సినారె భీమన్న పాల్గొన్న ఓ సభలో ప్రసంగిస్తూ “బోయి భీమన్న కాదు బాబోయి భీమన్న” అని చమత్కరించారు.

= నీరజ.నొ హైదరాబాట్‌

సినారె ఛలోక్తులు 19 మ(ద్రాను యూనివర్సిటీ సెంటినరీ హాలులో కళాసాగర్‌ వార్షికోత్సవసభ తర్వాత సంగీత విభావరి జరుగుతోంది. ఎస్‌.పి. బాలు, రామకృష్ణ, సుశీల, జానకీ, ఎల్‌.ఆర్‌. ఈశ్వరి పాటలు పాడేవారిలో వున్నారు. నభా కార్యక్రమాన్ని డా. ని. నారాయణరెడ్డిగారు నిర్వహిస్తున్నారు. పాటలు పాడే ముందు గాయకులను పరిచయం చేస్తూ రెడ్డిగారు 'ఎల్లరను ఆనందపరిచే ఎల్లారీశ్వరి ఇప్పుడు గానం చేస్తారు' అనగానే సభంతా నవ్వులతో మునిగిపోయింది. కార్యక్రమం జరిగే థియేటర్‌ ఎయిర్‌కండిషన్స్‌ థియేటర్‌. కార్య(క్రమం జరుగుతుండగా ఒక్కసారిగా ఎ.సి. పోయింది, వెంటనే సినారె “ఓసీ ఏసీ ఎక్కడే” అనేసరికి థియేటర్‌లో గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యే అందరూ కూడా రెడ్డిగారి సమయస్స్ఫూర్తికి హర్షధ్వానాలతో గొల్లుమని నవ్వారు.

= జవ్వాది, విడదవోలు

20 సినారె ఛలోక్తులు రాష్ట్ర స్టాయి పౌరాణిక నాటకోత్సవాల నిర్వహణ ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి డా. సి. నారాయణరెడ్డిగారు అధ్యక్షులు. ఆ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు మాట్టాడుతూ వినయంగా “ఈ కార్య'క్రమాల ఏర్పాట్లో నేను ఊరికే కర్ర పెత్తనం చేశాను. శ్రమ పడిందంతా ఇదిగో ఈ కార్యకర్తలే” అన్నారు. ఆనంతరం మాట్లాడిన సినారె “మీరు కర్ర పెత్తనం కాదు బుర్ర పెత్తనం చేశారు” అని చమత్కరించారు. సభలో చప్పట్లు,

= ఆచార్య బేతవోలు రామ(బన్మాం, రాజమంీ యక ఎ | ఇ లతే 2" ప

సినారె ఛలోక్తులు 21 డా. సి. నారాయణరెడ్డిగారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్తులో విశ్వవిద్యాలయం తరపున ఏర్పాటు చేసిన తులనాత్మక అధ్యయన కేంద్రాన్ని (ప్రారంభించారు. ఆనాటి సభలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు గారు (అప్పుడు వారికి మెడ నరాలు బలహీనంగా వుండడం వల్ల నెక్‌ సపోర్టు వుంది) ప్రసంగిస్తూ “ఒకప్పుడు నా గొంతుకొక మైకా అనేవాడిని. (వారిది గంభీరమైన స్వరం) ఇప్పుడు నాకు గర్వభంగం జరిగింది” అన్నారు. తర్వాత మాట్లాడిన నారాయణరెడ్డిగారు “రామానుజరావు గారికి జరిగింది గర్వభంగం కాదు. (గ్రీవా భంగం మాత్రమే” అన్నారు (గ్రీవ ఆంటే మెడ) సభలో చప్పట్టు మోగాయి.

= శంకరనుంచి శ్వాంటవ్రసొద్‌ హైదంాబాట్‌ క త టీ రి జ న చా టం శ్ర

22 సినారె ఛలోక్తులు “హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో ఏర్పాటయిన సాంస్కృతిక కార్యక్రమంలో హైకోర్టు ఉద్యోగి, ప్రముఖ రంగస్థల నటులు శ్రీ అంకయ్యగారికి సన్మానం జరుగుతోంది. ఆ సందర్భంగా ఆంకయ్యగారు వేదికపైన శ్రీకృష్ణుని పడక సీనుని నటించారు. చాలామంది (ప్రముఖులున్న ఆ సభలో ఆ రోజు ఆ పాత్రను అంకయ్యగారు అత్యధికోత్సాహంతో (ప్రదర్శించారు. అభినయం అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువయింది. (ప్రదర్శన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ డా. సి.నారాయణరెడ్డిగారు 'ప్రభుత్యోద్యోగిగా వుంటూ కళాసేవ చేస్తున్నందుకు అంకయ్యగారిని అభినందించారు. అంతేకాక పడకసీనులో శ్రీకృష్ణ పాత్ర పోషణ గురించి వ్యాఖ్యానిస్తూ “అంకయ్యగారి శ్రీకృష్ణపాత్రలో సాక్షాత్తు కృష్ణపురమాత్మునితో పాటు శ్రీ ఆంజనేయస్వామివారు కూడా సాక్షాత్కరించారు” ఆనగానే సభలో నవ్వులు మొదలైనాయి. ఆ నవ్వుల మధ్యేసినారె కొనసాగిస్తూ “ఎందుకంటే శ్రీకృష్ణపరమాత్ముని చిలివితనానికి కొద్దిగా అల్లరితనాన్ని మిళితంచేని శ్రీ ఆంజనేయస్వామివారి దర్శనభాగ్యాన్ని కల్షించిన అంకయ్య గారికి నా కృతజ్ఞతలు” అనగానే సభలో నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. 'అతి'ని సున్నితంగా మందలించిన సినారె చమత్కారానికి అం 'పుకోలేకపోయారు.

లాల టి 0బ్య _ జెవి, విరూపాక్షరెడ్డీ శ్‌ యాతో 3కి) ల హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 23 ఆ మధ్య హైదరాబాద్‌ బిర్లా మందిరంలో మా 'అన్నమాచార్య అధ్యాత్మక శృంగార కీర్తనల క్యాసెట్‌ విడుదల సభ జరిగింది. డా. సి.నారాయణరెడ్డిగారు ఆ సభలో ముఖ్య అతిథి. క్యాసెట్‌ విన్న తరువాత నారాయణ రెడ్డిగారు ప్రసంగిస్తూ “ఈ దోనేపూడి సోదరీమణులు ఒక తల్లి గర్భంలో నుంచే కాకుండా ఒకే స్వరంలోంచి పుట్టారా అన్నంత చక్కని గొత్ర సమ్మేళనంతో ఈ క్యాసెట్లో పాడారనిపించింది” అన్నారు. అలాగే “చెవులకు నాల్కలుంటే ఈ గానామృతం రుచి తెలుస్తుంది” అని అభినందించారు. ఆ రోజు మా ఉత్సాహం ఆకాళశాన్నంటింది.

= జి. బాభ్యాతివురనుందరి (దోనేపూడి నిస్టర్స్‌) హైదరాబాబ్‌

డక సినారె ఛలోక్తులు గీతాంజలి డమ్మీ సంచికను మూల మూలలా పట్టిచూసిన సినారె డమ్మీ సంచిక అని లోపలా, నమూనాసంచిక అని అట్టమీదా వేయడం గురించి విమర్శిస్తూ “డమ్మీ అనడంకన్నా నమూనా అనడమే బాగుంద"”ని అంటూ “డమ్మీ క్యాహై? ఇంగ్లీషు పదంకన్నా ఉర్జూ పదమైన 'నమూనా' యే అద్భుతంగా ఉంది. పద ప్రయోగం చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇంగ్రీషు దెబ్బతింటుంది. ఒక్కోసారి తెలుగు కూడా దెబ్బతింటుంది.” అని వివరిస్తూ తమ పద పరిజ్ఞానాన్ని వెలిబుచ్చగా సభ్యులానందించారు. = దాః మిరియాల రానుళ్ళస్ణు కొకీనాడ.

సినారె ఛలోక్తులు 25 1988 లో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిగారికి $48001 16 ౫62౯ అవార్డు వచ్చినప్పుడు ఆయనకు విశాఖ పట్టణంలో సన్మానసభ ఏర్పాటు చేశారు. ఆ సభకు డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సభలో సినీనటుడు శోభన్‌బాబు, క్రికెటర్‌ అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు. సినారె ప్రసంగిస్తూ “ఈ సభలో ముగ్గురు 98! లు వున్నారు. గమ్మత్తేమిటంటే ఈ 3748 ల విశేషాలు కూడా 5 అక్షరంతోనే మొదలవుతాయి. అవి : 300141 5011 50/960 512!

50018 512౯ అని చమత్కారంగా మాట్లాడారు. 500181 5121

అంటే ఆది సుబ్బరామిరెడ్డి ప్రజాహిత కార్య(క్రమాలనీ, దానగుణాన్నీ

దృష్టిలో పెట్టుకొని అన్నది. మిగతా రెండింటిని వివరించక్కర్లేదు కదా! ఆ రోజు సినారె ఉపన్యాసం ఆ సభీకే హైలైట్‌.

= శొర్పపాటీ బాలమ(వ్మాణ్యం,

పాతగాబావాక

26 సినారె ఛలోక్తులు “హైదరాబాద్‌లో నాగార్జుననగర్‌ కమ్యూనిటీ హాల్‌లో, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ వచ్చిన సందర్భంగా సన్మానం జరిగింది. ఆ సభకు జస్టిస్‌ ఆవుల సాంబళశివరావుగారు అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా సినారె వారిని సంబోధిస్తూ “మేధావుల సాంబశివరావుగారూ” అన్నారు. ఆ పిలుపుకి ఆవులవారి పదవులపై ముసిముసి నవ్వులు మొలిచాయి. తెలుగునాట సాంబశివరావుగారికి మేధావిగా పేరుంది గదా! వారి ఇంటిపేరు 'అవుల' అనేది ఇక్కడ గమనించదగిన అంశం.

= జగన్‌, హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 27 సినారె సూర్య కళామందిరంలో అడుగుపెడుతూ ఉండగా (ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు ఎదురుగా వచ్చి 'అన్నా నేను నిర్హారంగా వచ్చాను" అన్నారు. అంటే 'నేను మీ మెడలో హారం వేయబోవడం లేదు' అనేగా! సినారె సందర్భం గమనించి 'ఏదీ నీ చెయ్యి చూపించు" అన్నారు. చెయ్యి చాచగానే పట్టుకుని “ఈ కైదండ దండ కాదా” అని షేక్‌ హాండిచ్చి అద్దేపల్లిని ఫక్కున నవ్వించారు.

= దౌః మిరియాల రాముళ్పున్హు కాకినాడ

గ్‌ా సివారె ఛలోక్తులు

ఓ (ప్రసంగంలో ఓ వక్త సినారెని “పూజ్యులు పూజ్యులు” అని పేర్కొంటున్నారు. అది వింటున్న సినారె కాస్త యిబ్బందిగా కదిలి అతన్ని ఉద్దేశించి “మీరు మాటిమాటికీ పూజ్యులు అంటున్నారు. తెలుగులో, సంస్కృతంలో దీనికి పూజనీయులు అని అర్ధం ఉంది. మరి హిందీలో పూజ్యశబ్దం సున్నా అనే అర్థంలో కూడా వుంది. ఇంతకూ నేను అదా, ఇదా?” అనగానే సభలో నవ్వులు విరిశాయి.

= నీరజ శౌ

హైదరాబాబట్‌

సినారె ఛలోక్తులు 29 ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాంగణంలో పరిణతవాణి -కార్య(క్రమం, తిరుమల రామచంద్రగారు వక్త. ఇటీవలనే తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు 50 వేల రూపాయల విశిష్టపురస్కారంతో సత్కరించింది. పరిణతవాణి కార్యక్రమంలో భాగంగా రామచం(ద్రగారు తన జీవిత విశేషాలను వివరిస్తూ తనకు కాస్త కోపం ఎక్కువనీ ఈ కారణంవల్లనే వేటూరి (ప్రభాకరశా(స్తిగారు తనను వీరభద్రుడనేవారని తెలిపారు. వారు వీరభద్రుడన్నారు గానీ నిజానికి తాను పరశురాముడినని అన్నారు. సభాధ్యక్షులుగా ఉన్న సినారె తర్వాత చమత్కరిస్తూ “తిరుమల రామచంద్ర పరశురాముడు. కాదు ఇప్పుడు పర్సురాముడు” అన్నారు. ఇటీవలి పురస్కారం స్సురించి అందరూ నవ్వారు. = దః నునన చెన్సవు హైదరాబాబ్‌

30 సివారె ఛలోక్తులు ఒకనాడు డా. సి. నారాయణరెడ్డిగారు ఖమ్మం (ప్రభుత్వ కళాశాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చారు. ఆ సందర్భంగా కళాశాల తెలుగు లెక్కరర్‌ గుమ్మడప్ప రామకృష్ణరాయణంగారు వారిని సభకు పరిచయం చేస్తూ ప్రశంసావాక్యాలు పలికారు. అనంతరం ఉపన్యసించిన నారాయణరెడ్డిగారు తనను పరిచయం చేసిన రాయణంగారిని గూర్చి మాట్లాడుతూ “రాయణంగారు నన్ను పొగిడారు, అందుకు కారణం ఆయన రాయణం నేను నారాయణం.” అనగానే సభ నవ్వుల జల్లుల్లో మునిగిపోయింది.

= నీరుకొండ వాముమంలరావు, ఖమ్మం

సినారె ఛలోక్తులు ౩ ఏ ప(త్రికలోనైనా శైలి ఉత్తమాభిరుచిని ప్రతిబింబిస్తూంధి అంటూ ఆ శైలికి సంస్కృత ద్వేషం ఉండదంటూ, తెలుగువాడు మాత్రం అంతటి దౌర్భాగ్య పరిస్థితి రానీయలేదని నొక్కి వక్కాణించారు. సంస్కృత పదాల్ని బహిష్కరించాలని గతంలో తమిళనాడులో చెలరేగిన ఉద్యమం గురించి తానేమీ కామెంటు చేయనంటూ, ఆ ఉద్యమకారులెక్కడ దెబ్బతిన్నారంటే 'జలంకొండా' “జలం కొండప్పా' అనడాన్ని మార్భలేక పోయారు. నీటికి అచ్చ తమిళం తన్ని. 'ఓరి నాయనా జలం సంస్కృతంరా అంటే ఎన్నసార్‌ జలం అంటే తమిళం అంటాడు. ఆ విధంగా సంస్కృతం పదాల్ని మన భాషలో కలిపేసుకోవడం తప్పదు” అన్నారు సినారె మద్రాసు కల్చరును వెల్లడిస్తూ,

= దొ మిరియాల రానుక్రున్హు కొకీనాడ

32 సివారె ఛలోక్తులు అవి కరెంటుకోత ఎక్కువగా ఉన్న రోజులు. సాయంత్రం గడిచి రాత్రి సరిగ్గా 8 గంటలకు కరెంటు పోవడం తప్పనిసరి. ఆం(ధ్రసారస్వత పరిషత్తు ప్రాంగణంలో డా॥ మసన చెన్నప్ప 'నేతోదయం' కవితాసంపుటి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. మొదటి ఇద్దరు ముగ్గురు వక్తలు సుదీర్టోపన్యాసం చేశారు. సభాధ్యక్షస్థానంలో ఉన్న సినారెలో కాస్త విసుగు కనిపించింది. (ప్రేక్షకుల విసుగును కూడా గమనించిన సినారె తర్వాతి వక్త (ప్రసంగించబోయీ ముందు “ఇప్పుడు మనకు కావలిసింది విద్వత్‌ సహకారం కాదు, విద్యుత్‌ సహకారం” అన్నారు. సభలో నవ్వులు. = డొ మనన చెన్పవు హైదరాబాట్‌

పివారి ఛలోక్తులు 33 మద్రాసులో డా. రాధాకృష్ణన్‌ రోడ్‌లో వున్న హోటల్‌ సవేరొలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారు సభావేదికపై ఆసీనులై వున్నారు. సభాధ్యక్షులు ఒక్కొక్కరినే పిలిచి (ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. మాట్లాడవలసిన వారిలో సినారె పేరు మొదటిది. కొని సినారె మాట్టాడిన తర్వాత (ప్రేక్షకులు వెళ్లిపోతారేమోనని భావించి సభాధ్యక్షులు మిగతా ముగ్గురు వక్తలు మాట్లాడిన తర్వాత నాలుగో వక్తగా సినారెని (ప్రసంగించవలసిందిగా ఆహ్వానించారు. అదేరోజు సినారె మరో కార్య(క్రమంలో పాల్గొనవలసి వుండింది, ఆలస్యమైందనే చిరాకును సున్నితమైన చమత్కారంలోకి మార్చుకుని ఆయన తన ప్రసంగాన్ని ఈ విధంగా ప్రారంభించారు. “వా పేరు నారాయణరెడ్డి. (ప్రసంగించవలనిన నభ్యుల్లో నాలుగోవాణ్ని. నలుగురితో పాటు నారాయణా అన్నట్టుగా నాలుగు మాటలు మాట్లాడతాను” అనగానే అర్ధమైన ప్రేక్షకుల్లో చిరునవ్వులు.

= వి దొరస్వామి, _ మద్రాను

గ్‌ా సినారె ఛలోక్తులు

తెలుగు విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవ సభ రేపనగా, రవీం(ద్రభారతిలో సన్నాహాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారు ప్రతి విషయాన్ని అజమాయిషీ చేస్తున్నారు. శ్రీ పి.వి. నరసింహారావుగారు భారత (ప్రధాని అయిన పదిహేను రోజుల్లో మొదటిసారిగా ఆం(ధ్రదేశం రావడం, అందునా తెలుగు యూనివర్సిటీ కాన్యాకేషన్‌కు ముఖ్య అతిథిగా వుండడం అరుదైన సంఘటనగా మారింది. రాజీవ్‌ హత్యానంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీ పి.వి.కి అనూహ్యమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. సినారె రేపు జరగబోయే తంతు ప్రతిదాన్ని రిహార్సల్స్‌ వేసి స్టలాన్నీ కాలాన్నీ పరీక్షిస్తున్నారు. ఆ సందర్భంగా గవర్నర్‌, ముఖ్యమంత్రి. (ప్రధానమంత్రి, ఉపాధ్యక్షులు, పీఠాధిపతులతో ఫోటో తీయించుకోవలసి వుంది. ఆ పని చకచకా జరిగిపోవాలి. ఫోటో దిగడానికి గాను, తగిన కుర్చీలను ఎంపిక చేయవలసి వచ్చింది. సి.నా.రె. తానే కుర్చీలో కూచొని చూస్తున్నారు ఎవరిని ఏ కుర్చీలో ఏ వరసలో కూచోబెట్టాలో సిబ్బందికి చెప్తూ... “ప్రోటోకాల్‌ ఫోటోకాల్‌ దగ్గర కూడా వుంటుంది. ఏమనుకుంటున్నారో” అన్నారు. అన్ని పనుల వత్తిడిలోనూ ఆయన అన్న మాటలకు సిబ్బంది హాయిగా నవ్వుకున్నారు.

= డొః జయధీల్‌ తిరునులరావు

సినారె ఛలోక్తులు 3ర్‌

గీతాంజలి ఆవిష్కరణ సభలో సినారె వేసిన మరో జోకు జీవన వాస్తవాన్ని బాగా (ప్రతిబింబించింది! ఆయనన్నారు కదా - వెలిగించడం వరకీ ముఖ్య అతిధి పని. ఆ తర్వాత జ్యోతి వెలుగుతుండడం అనేది తైలాన్ని బట్టి ఉంటుంది. తైలం అంటే మీకు తెలుసు అనే సరికి శ్రోతలు నవ్వారు. “ఎందుకంటే తైలం 'డబ్బు' అనే అర్ధంలో సినిమా ఫీల్డులో బాగా పాపులర్‌ వర్డ్‌ అనగానే “రేలంగి” అంటూ శ్రోతలు హింటు చేయగలిగారు.

= డొః మిరియాల రామక్పన్థు

కొజీనాడ

36 సివారె ఛలోక్తులు హైదరాబాద్‌లో ఓ సాహిత్య సభకు డా. సి. నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. వేదికపైన వక్తలు చాలా మందే వున్నారు. ఎవరైనా తమకు కేటాయించిన దానికంటే ఎక్కువసేపు మాట్లాడితే ఆయనకు నచ్చదు. అధ్యక్షుని తాలిపలుకులు ముగిశాక ఆయన ఆ విషయాన్ని సున్నితంగా హెచ్చరించారు.

“ఈ రోజు వేదికపైవున్న పెద్దలందరూ క్లుప్తంగా ప్రసంగించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఉపన్యాసాలను పొడిగిస్తూపోతే సభలో సీట్లలో ప్రసవ వేదనని అనుభవించే పురుష పుంగవుల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత మీ యిష్టం” అన్నారు. బోర్‌ చేస్తే ప్రేక్షకులు సీట్లలో అసహనంగా కదుల్తుంటారని ఆయన భావం. అది అర్ధంకాగానే (క్రమంగా నవ్వులు విరిశాయి.

  • టీ. వేణుగోపాలరెడ్డి, హైదరాబాట్‌

సీవారె ఛలోక్తులు 37 అవి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సినారె అవిశ్రాంతంగా పర్యటిస్తున్న రోజులు! ఓ సమావేశంలో సినారె మాట్లాడుతూ “తెలుగును అభిమానిస్తున్నాం అని అందరూ పైకి అంటారు. అంతేకాదు వేదిక ఎక్కగానే తెలుగు తెలుగు అని ప్రశంసిస్తారు. కాని తమదాకా వస్తే, ఆచరణలో అభిమానం నిరూపించుకోవలసి వస్తే ఏం చేస్తారు,” దానిపైన సినారె వ్యాఖ్య యిది.

“తెలుగు చచ్చెనవి కామెంట్లు తమ బిడ్డలకేమో కాన్వెంట్లు” నవ్వించాలని కాదు ఆవేదనతో అన్నారు. అయినా సినారె మార్కు ఛలోక్తి గుణం ఎక్కడికి పోతుంది. = గంగాధల్‌ హైదరాబాద్‌

36 సినారె ఛలోక్తులు చలనచిత్రరంగంలో కూడా తన నభిమానించే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెబుతూ “యంగ్మెన్సుహాపీక్షబ్‌ ద్వారా సినీరంగానికి చేరిన మ్యూజిక్‌ డైరెక్టరు ఆదినారాయణ రావుకు నా థీసిస్పు అచ్చయిన కొత్తలో కాపీ యిచ్చాను. తరవాత ఆయనింటికి నన్నాహ్యానిస్తే వెళ్లాను. అప్పటికాయన నాథీసిస్సంతా చదివేసి, మార్టిన్సులో నోట్సు రాసుకుని ఉన్నాడు. దాన్ని నేను చూసి గుండెలు బాదుకున్నాను. ఎందుకో తెలుసా? దాన్నే ఓ పుస్తకం వేస్తే నాకు తెలియని సంగతులెన్ని ఉంటాయో” అని అనగానే సభాసదులు ఆశ్చర్యపోయారు.

= డొః మిరియాల రానుక్పుస్థు కాకీనాడు

సినారె ఛలోక్తులు 39 సుమారు దశాబ్దం క్రితం... మార్కాపురం శ్రీ, వాసవీ కన్యకాపరమేశ్వరీ కళాశాల విద్యార్థి సంఘం వార్షికోత్సవ సభకు డాక్షర్‌ సి. నారాయణరెడ్డి గారు (ప్రధాన వక్తగా విచ్చేశారు. మార్కాపురం పలకల గనులకు (ప్రసిద్ది. గనులలోని బండలను తీసుకువచ్చి రాతి పొరలను చీల్చి పలకలుగా రూపొందిస్తారు. సినారె తమ ఉపన్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ -

“కొందరు మనుషుల గుండెల్లో పారలున్నట్టే మార్కాపురం బండల్లో

కూడా పొరలున్నాయి. అయితే అవి ఉండగూడని పొరలు. ఇవి

అందరికీ పనికొచ్చే మంచి పొరలు” ఆంటూ చమత్కరించారు. ఆ మాటలను మా వూళ్లో మేం ఇప్పటికీ మర్చిపోలేదు.

= యెనిశెట్టీ సాంబళినరావు,

మార్కావురం

40 సివారె ఛలోక్తులు ఓసారి నారాయణరెడ్డిగారు మిత్రులతో కలిసి టి.వి. వార్తలు వింటున్నారు. పట్టుపరి(శ్రమ దేశంలో బాగా అభివృద్ది చెందుతోందని వార్త. అది విన్నవెంటనే సినారె “పట్టు పరిశ్రమ కాదు కొళ్లుపట్టు పరిశ్రమ” అని చమత్కరించారు.

తా మాధవి, హైదరాబాబ్‌

సినారె ఛలోక్టులు ల! అవి నేను ఎం.ఏ. చదువుతున్న రోజులు. దివాకర్ణా, సినారె తెలుగు శాఖాధ్యన్షుని గదిలో కూచాని వున్నారు. ఈలోగా ఓ పెళ్ళి పత్రిక పోస్టులో వచ్చింది. సినారె దాన్ని విప్పి చదువుతూ వధూవరుల "పేర్లను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. వరునిపేరు శివాజీరావు, వధువు పేరు రూన్సీలక్ష్మి. వెంటనే “పేర్డు బాగున్నాయే, ఇరువురూ కలిస్తే మదనరంగానికి బదులు కదనరంగం జరుగుతుందేమో” అని ఛలోక్తిగా అన్నారు.

  • ఆచార్య ఎల్లూరి శివారెడ్డి హైదరాబాట్‌

శ2 సినారె ఛలోక్తులు

197కలో అనుకుంటాను. ఓసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు,

నారాయణరెడ్డిగారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తూ

ముచ్చటించుకుంటున్నారు. మాటల సందర్భంగా కరుణశ్రీ, సినారెని

“మీకు పిల్లలెందరండీ?” అని అడిగారు. “నలుగురాడపిల్లలు”

అని సినారె సమాధానం. “మరి మగ పిల్లలు?” అని అడిగారు

శాస్త్రిగారు. “నేనే మా ఇంట్లో ఏకైక మగ పిల్హాణ్ని” అన్న రెడ్డిగారి సమాధానానికి కరుణశ్రీ, పసిపిల్లాడిలా పడీ పడీ తెగ నవ్వారు.

= డొ, క. లక్ష్రణరావు,

హైదరాబాట్‌

సినారె ఛలోక్తులు శ సినారె ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తూ “పుస్తకాలు రెండు రకాలుగా వుంటాయి. అలమార్లలో నిద్రపాయ్యేవి, నిద్ర పాయ్యేవి” అని అన్నారు. మొదటి 'నిద్రపాయ్యేవి'లో ఎవరూ చదవకుండా నిరుపయోగంగా ఉండేవని అర్ధం. రెండో దాంట్లో ఆ పుస్తకాలు చదివితే “నిద్ర (ఎగిరి) పోయ్యేవి' అంటే అవి చదివితే చైతన్యం కలుగుతుందని భావం. శబ్ద చమత్కారంలోని స్వారస్యం (క్రమంగా అర్ధమై సభలో నవ్వులు విరిశాయి. = డొః నునుతీ నరేంద్ర హైదరాబాబ్‌

శశ సివారె ఛలోక్తులు

రెండేళ్ల క్రితం అనుకుంటాను! రవీంద్రభారతిలో రేలంగి ఆర్ట్‌ అకాడమీ తరపున అవార్డ్స్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. ఆ సభలో 'ప్రధానవక్తగా డా. సి. నారాయణరెడ్డిగారు వచ్చారు. అవార్డ్స్‌ ఇవ్వడానికి ముందు స్టానికకళాకారులతో ఓ నాటకం (ప్రదర్శించబడింది. నాటక ప్రదర్శన అనంతరం సినారె ప్రసంగిస్తూ “సినిమాలో కంటె నాటకంలో ఏకధాటిగా నటించి మెప్పించడం చాలా కష్టం. అంటే నాటకంలో కంటే సినిమాలో నటించడం తేలిక. ఎందుకంటే సినిమావాళ్లు మేకప్పులో లోకప్పులో పైకప్పులో నటిస్తారు కనుక అది సులువైన పని. “సినారె చమత్కారానికి సభలో నవ్వులు విరిశాయి.

= రషీద్‌ వూర్చు

మవాోరాస్త్ర స్టేట్‌

సినారె ఛలోక్తులు శక్‌ “మనది సంస్కృత భాషా గంధం వంటబట్టించిన నన్నయ వారసత్వం కాబట్టి మొట్టమొదట మనకు దొరికిన కావ్యం ఆంధ్ర మహాభారతం పదకొండవ శతాబ్దిదయితే మొట్టమొదటి పద్యంలో సంస్కృత పదాలెన్నో చూద్దాం!” అంటూ సినారె ఇటీవల తాను అమెరికా తెలుగు మహాసభల్లో (జూలై 94) చదివిన ఆ పద్యాన్ని 'గీతాంజలి' ఆవిష్కరణ సభలోనూ చదివారు. ఆక్కడ ఆమెరికాలో ఆపద్యం చదివి వినిపించేసరికి మనవాళ్లంతా ఆశ్చర్యపోయారుట! “అయ్యా మన మొదటి పద్యం వినండి!” రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజతేబోజయశొలిశౌర్యుడు, యశళ్ళరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు, రాజనరేంద్రుడు ఉన్నతిన్‌” ఇందులో నకార ప్పాల్టునీ, 'డు” లనీ తీసేస్తే మిగతా అంతా సంస్కృతం” అంటూ సినారె విసిరిన జోకు ఏమిటంటే “ఎంత సులువుగా అర్ధమవుతుంది తెలుగువాడికి సంస్కృతం?” అని. = డొ మిరియాల రాముఖ్టున్థు కొకినాడు

శం సినారె ఛలోక్టులు

రవీ[ర్రదభారతిలోని ఓ సమావేశానికి ఆహ్యాన పత్రం వచ్చింది. దాన్ని చదువుతూ సినారె ఓ పరిచితవ్యక్తి పేరుకు ముందు డాక్టర్‌ అని వుండటం గమనించి “అరె ఇతను డాక్టరెప్తుడయ్యాడు?” అన్నాడు. “ఈ మధ్యే అమెరికాలోని గుర్తింపు పొందని కొన్ని సంస్థలు యూనివర్సిటీల పేరుతో వెలుస్తున్నాయి. అక్కడి నుండి వచ్చిన డాక్టరేటేమో” అన్నాను. దానికి సినారె “ఓహో అలాగా ఈ రోజుల్లో డాక్టరేట్లు రెండు రకాలు. ఒకరకం రాసి మోసి కన్నది. మరోరకం. 'రాళి' పోసి కొన్నది” అని చమత్కరించారు. ఇక్కడ “రాళిపోసి'ని గమనించాలి. తెలుగులో రాశి అంటే కుప్ప, నిధి అని అర్జాలున్నాయి. హిందీలో “రాశి'కి అర్ధం స్పష్టంగా డబ్బే. అయితే యుజిసి గుర్తింపుపొందిన విశ్వవిద్యాలయాలు అందించే గౌరవడాక్టరేట్‌ పురస్కారాలు ఈ కోవలోకి రావు అని ఆయన వివరణ ఇచ్చారు.

= జీ. రొనుక్పున్ణారొవు

హైదరాబాబ్‌

సినారె ఛలోక్తులు క్ష 1988లో రిపబ్లిక్‌ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ నగరంలోని (ప్రముఖులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఆ కార్య(క్రమానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు, డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్‌.టి.రామారావుగారు గుంటూరు జిల్లా ఎన్నికల్లో పాల్గొని నేరుగా అక్కడికొచ్చారు. ఎవరో ఓ (ప్రముఖుడు “ఏమండి రామారావుగారు ఎన్నికల (ప్రచారంలో పాల్గొని బరువు తగ్గినట్టున్నారే” అనగానే పక్కనే వున్న నారాయణరెడ్డిగారు “ఎవరికైనా బరువు తరగాలి, పరువు పెరగాలి” అన్నారు. ఈ ఛలోక్తికి రామారావుగారితో సహా అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు. = శంకరమంచి శ్వ్యాం(న్రసాద్‌, హైదరాబాద్‌

శరీ సినారె ఛలోక్తులు

డా. సి, నారాయణరెడ్డిగారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా వున్నప్పుడు తెలుగు అమలు కోసం ఎన్నో ఊళ్ళు తిరుగుతూ అనేక సభల్లో ప్రసంగించేవారు. అట్లాంటి ఓ సభలో మాట్లాడుతూ “ప్రభుత్వం అధికార భాషగా తెలుగును ఆమలు చెయ్యాలనే చట్టం ఏర్పాటు చేసింది. కాని అమలు విషయంలో అది అంతంత మాత్రంగానే వుంది” అంటూ సుమతి శతకంలో అక్కరకు రాని చుట్టం పద్యం స్ఫురించేట్టుగా ఇలా చమత్కరించారు. “ఆమలుకాని చట్టం. అక్కరకు రాని చుట్టం”

= గర్భుకుర్తి రానేం(ద్ర

కొమారెడ్డీ

పినారె ఛలోక్తులు 49 (ప్రాసకోసం తడుముకుంటున్నట్లు కనిపించకుండానే అతి సహజమైన (ప్రాసవేసి, చమత్కారం వెలిగించి, శూన్యాన్ని తొలగించగల వక్త సినారె. సూర్యకళామందిరంలో దంటు సూర్యారావు తనని సన్మానించాక, ఆయనను మాటలతో నైనా సన్మానించాలని సినారెకి అనిపించింది. అందుకే “సాంస్కృతికాంశ ఎక్కడున్నా దంటు వంశం సూదంటు రాయిలాగా ఆకర్షించే సూర్యవంశం. పైగా సూర్యారావు నాన్నగారు భాస్కరరావు. ఎక్కడికి పోతుంది ఆ వెలుతురు?” అన్నారు.

= దొ మిరియాల దానుక్ఫున్హు కొకీనాడ

క0 సినారె ఛలోక్తులు ఓసారి సినారె రాజమండ్రి వచ్చారు. పేపర్‌మిల్స్‌ గెస్ట్‌హౌజ్‌లో బస. నేనప్పుడు గురువు గారితో వున్నాను. ఈ లోపల వారిని కలవడానికి బేతవోలు రామబ్రహ్మం, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణగార్జు వచ్చారు. వారిని చూడగానే సినారె “ఒకరు విద్వత్కవీ, మరొకరు విద్యుత్కవీ” అని ఛలోక్తి విసిరారు. ఇందులో స్వారస్యం ఏమిటంటే బేతవోలు విద్యత్కవి అనేది జగమెరిగిన సత్యమే. ఇక కొత్తపల్లి సుప్రసిద్ద ఆధునిక కవే కాక వృత్తిరీత్యా ఎల|క్టికల్‌ ఇంజనీరు. అందుకు విద్యుత్కవి. = డా॥ ఎండ్లూరి మధాకర్‌ రాజమండ్రి ఆనా ఎల్‌ శ - ఇ? న. * శే త్‌ శ్శీ " క ఎట " య ఇ అడి ( క న మ. నా.

సినారె ఛలోక్తులు క్‌1 తెలుగు విశ్శవిద్యాలయం వి.సిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ బడ్జెట్‌ సమావేశంలో సినారె ఛలోక్తి, “నాకు వాణి తప్ప వాణిజ్యం తెలియదు” అని అంటూనే అవసరమైనప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో కూడా కలగజేసుకునేవారు. నిజానికి ఆయన వి.సిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆర్థిక పుష్టితో ఉండేది. = దొ త చెన్సుయ్య హైదరాబాట్‌ ర జో జ్‌ || థై అయ్య నైంర్తరి జ్ర ఖ ముల తం ల న్‌ టీన్‌

ర్‌2 సినారె ఛలోక్తులు భారతీ యోగ సంస్టాన్‌ వారు ప్రచురించిన 'ఆసనాలు, యోగ విజ్ఞానము"

అనే (గ్రంథాన్ని ఆచార్య భీమ్‌సేన్‌నిర్మల్‌గారు అనువాదం చేశారు. దాని ఆవిష్కరణసభ. ఆ సభలో వేదికపైన బ్యానర్‌పైన “ఆసనాలు, యోగ, విజ్ఞానము” అని రాసి వుంది. 'యోగ'కు “విజ్ఞానము” నకు మధ్య కామా

ఉండటం చూసిన సినారె “ఏమండీ యోగవిజ్ఞానం నిష్కామంగా ఉండాలే”

అని చమత్కరించారు. స్వారస్యం అర్థమై క్రమంగా సభలో నవ్వులు. = డా భీమ్‌సేన్‌ నిర్మల్‌ హైదరాబాద్‌ | ఎ౨తో టి 0

సినారె ఛలోక్తులు 53 సాదనాల వెంకటసామినాయుడు పెళ్లి సభలో జరిగిన కవి సమ్మేళనంలో మైకు సరిగా (శ్రోతలకు వినబడటంలేదని అధ్యక్షస్థానం నుంచి సినారె గమనించారు. 'మరో మైకుని కూడా జత చేయండి” అని సభా నిర్వాహకులకు సూచించారు. వెంటనే రెండు మైకులూ ఒక్క చోటికొచ్చాయి. అప్పుడే సినారె ఒక జోకు పేల్చారు. “చూశారా! రెండు మైకుల సహయోగం జరిగితేనే అది పెళ్లవుతు౦ది” అంటూ.

= డొః మిరియాల రామక్పున్ణ

కాకినాడ

ఖు శోకంఖ్యార్ఞ్య్య ఆ న. ళా / ష్ట జీ ల “" ఛఉ ఇ +

శ ళ్‌ న లో

ర్‌శీ సినారె ఛలోక్తులు ఓ సభలో డా. సి. నారాయణరెడ్డిగారు పరిశోధకుల్లో రకాలను ఇలా ఉదాహరణ పూర్వకంగా చెప్పారు ; “భావ కవిత్వాన్ని నారాయణరెడ్డిగారు ఈ ఈ శాఖలుగా విభజించారు. దీంతో నేనూ ఏకీభవిస్తున్నాను - అని రాసేవాడు ఓ రకం పరిశోధకుడు.” “భావ కవిత్వాన్ని ఈ ఈ శాఖలుగా విభజించ వచ్చని నా అభిప్రాయం. ఈ అభి[ప్రాయాన్నే నారాయణరెడ్డిగారు కూడా వెలిబుచ్చారు అని రాసేవాడు మరో రకం పరిశోధకుడు.” “ఈరెండో వాడితో మాత్రం మనం జా(గ్రత్తగా వుండాలి” అన్నారు నారాయణరెడ్డిగారు. = మాధవి, హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు ఠ్‌5్‌ 1989లో సినారె తెలుగు విశ్శవిద్యాలయం వి.సి.గా ఉన్నప్పుడు ఆయన పర్యవేక్షణలో బెంగుళూరులో అఖిలభారత తెలుగు మహాసభలు జరిగాయి. ఆసభల్లో సినారె ఆహ్వానితులందర్నీ పలుకరిస్తున్నారు. పాడేటి జాన్సన్‌ అనే యువకవి పంచేలాల్చీ కండువా ధరించి అచ్చమైన తెలుగు వేషంలో ఆ సభల కొచ్చాడు. అతన్ని చూసి సినారె ముగ్దుడై “పాడేటి జాన్సన్‌ తెలుగు సంస్కృతిని కాపాడేటి జాన్సన్‌” అన్నారు. ఆ ఛలోక్తికి జాన్సన్‌తో పాటు అక్కడి వారందరూ ముగ్దులైపోవడమే తరువాయి. = డొః ఎండ్లూరి నుధాకల్‌ రాజనుం్రీ

క్‌ సినారె ఛలోక్తులు తెలుగుదేశం. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు ముద్దుకృష్ణమనాయుడుగారు విద్యాశాఖ మంత్రిగా వుండేవారు. తరువాత కొన్నాళ్ళకు విద్యాశాఖ నుండి అటవీశాఖకు మారారు. ఆ కాలంలో తిరుపతిలో డా. సి. నారాయణరెడ్డిగారు, ముద్దుకృష్ణమ నాయుడు గొరు కలిసి ఓ సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. సినారె ప్రసంగిస్తూ మంత్రివైపు చూస్తూ “మీరిప్పుడు అటవీ శాఖలో వున్నా విద్యను ఉపేక్షించవద్దు. ఎందుకంటే మీరు విద్యారణ్యులు గదా” అన్నారు. గతంలో మీరు విద్యామంత్రిగా ఉన్నారు. ఇప్పటి పరిస్టితులకు మీరూ బాధ్యులే అన్న సున్నితమైన చురక వుంది. సినారె చమత్కొరానికి ముద్దుకృషమనాయుడుతో సహా అందరూ నవ్వేశారు. = యాకూబ్‌ హైదరాబాద్‌

పివారె ఛలోక్తులు ర్‌7

జీవన వాస్తవాల్ని చిత్రించే గీతాంజలి పక్షపత్రిక కావడం గురించి

సినారె మెచ్చుకుంటూ పక్షప(త్రిక పక్షపాత రహితంగా ఉండాలని

నిగ విసిరారు. పక్షపాతం అంటే ఏమిటని ప్రళ్నించి “రెక్కపాటు”

అని తెలిగించి రెక్కపాటు లేని పత్రిక పైకి బాగా ఎగరగల్లుతుందని

సూచించారు. పత్రిక ఏదో ఒక వైపుకి తన రెక్కని వాల్చేయ కూడదని వ్యాఖ్యానించారు.

  • దాః మిరియాల రామళ్ఫున్హు

కొకినొడ

58 సినారె ఛలోక్తులు 1990లో సి, నారాయణరెడ్డిగారిని జంటనగరాలలోని వంద సాహితీ, సాంస్కృతిక సంస్థలు సంగం థియేటర్‌లో సన్మానించాయి. ఆ సభకు మహానటులు అక్కినేని నాగేశ్వరరావుగారు అధ్యక్షులు. అధ్యక్ష ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆయన “ఇరవై సంవత్సరాల (క్రితమైతే బలవంతంగా నాకు అధ్యక్షఠం అప్పగించినప్పుడు పెళ్లిపందిట్లో నూతన వధువు కూచున్నంత సిగ్గుతో కూచునేవాణ్ని” అని అన్నారు. తర్వాత (ప్రసంగించిన నారాయణరెడ్డిగారు మాట్లాడుతూ “అవును ఒకప్పుడు వధువులా కూచునే నాగేశ్వరుడు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఇప్పుడు మాలాంటివాళ్లకే వరుడై కూచున్నాడు” అనగానే నాగేశ్చరరావుగారితో సహా సభికులంతా ఫక్కున నవ్వారు.

= శంకరమంచి శ్వాం(వ్రసాద్‌, హైదరాబాద్‌

సివారె ఛలోక్తులు క్‌ పిహెచ్‌డి పరిశోధకుల సంఖ్య సెరిగిపోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పరిశోధన మౌలిక ప్రమాణాలు కాస్త తగ్గిపోతున్నందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సినారె ఇలా అన్నారు. “ఈ మధ్య పిహెచ్‌డి పరిశోధనలు ఎత్తిపోతల పథకంగా మారడం మా(త్రమే కాదు ఎత్తిరాతల పథకంగా మారాయి.” = బిన్‌ రఘు హైదరాబాట్‌

రి సినారె ఛలోక్తులు ప్రభుత్వం ఆచార్య పేర్వారం జగన్నాధంగారిని తెలుగు విశ్శవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా నియమించింది. చిద్విలాసంగా విసిగా తన గదిలో కూచున్న సినారె దగ్గరికి కొందరు ఉద్యోగులు వచ్చి వారు వెళ్లిపోతున్నందుకు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. “సార్‌ మీరు మమ్మల్ని అనాధల్ని చేసి పోతున్నారు” అని ఒకరన్నారు. దానికి వెంటనే సినారె “పొరపాటు మిమ్మల్ని జగన్నాధంచేసి పోతున్నాను” అన్నారు. విచారం వినోదంగా మారింది. = శొంలిగ్రీ హైదూబాల్‌ కో

సినారె ఛలోక్తులు 61 1992లో తెలుగు విశ్వవిద్యాలయంలో, సంగీత శాఖ అధిపతిగా వున్న నూకల చిననత్యనారాయణగారు తిరువతిలోని శ్రీవెంకటేశ్వర సంగీత కళాశాలకు నియామకమై వెళ్ళిపోతే ఆయన స్థానంలో సినారె ద్వారం భావనారాయణ రావును నియమించారు. ఆయన వోకలిస్టు కూడ. ఆ విషయం అందరికి చెప్తూ “ఈ “ద్యారం' గళద్యారం. వాద్య ద్వారం (ద్వారం వెంకటస్వామి నాయుడు) కాదు”

=డొానె బెన్సుయ్యా సహైదరాబాట్‌

62 పినారె ఛలోక్తులు అవి ఎన్‌టిఆర్‌ నిర్మించిన విశ్వామిత్ర షూటింగ్‌ జరుగుతున్న రోజులు. నేను అందులో వశిష్టుని వేషం వేశాను. ఆరోజుల్లోనే నేను “హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాను. గృహప్రవేశానికి ఎన్‌టిఆర్‌, సివారె తదితర ప్రముఖులు వచ్చారు. మాయిల్లు కుటీరం ఆకారంలో వుంటుంది. నేము ఎన్‌టిఆర్‌ను ఉద్దేశించి “ఇది వళిషాశ్రమమండీ” అన్నాను. పక్కనే వున్న సినారె వెంటనే “ఈ విశిష్టాశ్రమం వశిష్టాశ్రమం కాక మరేమవుతుంది” అంటూ చమత్కరించారు. విశ్వామిత్రుడు కూడా (ఎన్‌టిఆర్‌) ఓ చిరునవ్వు విసిరారు.

= దాః గుమ్మడి వేంకటేళ్షురరావు హైదరాబాట్‌

సినారె ఛలోక్తులు 6 ఆ మధ్య డా. సి. నారాయణరెడ్డిగారింటికి హైదరాబాదు వెళ్ళాం. ఆ సాయంత్రం ఎక్కడికో పెళ్ళికి వెళ్ళాలి వారు. ఆ రోజే వారి కారుకు కొత్తగా ఎ.సి. (ఎయిర్‌ కండిషన్‌) పెట్టించారు. “వెళ్ళొద్దాం రండి పెళ్ళికి - ఎ.సి. కారు ఈ రోజు మీతోనే ప్రారంభం” అన్నారు సినారె. కారులో కూచున్నాక నేము ఉన్నట్టుండి “గురువుగారూ! ఈ సందర్భంగా సరదాగా ఓ మినీ కవిత చెప్పండి” అవి అన్నాను. అడిగిందే తడవుగా ఆయన ఇలా అన్నారు.

“అయితే విను వి.సి. నారాయణరెడ్డి అప్పుడు ఆయన తెలుగు విశ్వవిద్యాలయానికి వైన్‌ ఛాన్స్‌లర్‌ (వి.సి.)గా వున్నారు. ఇలా ఆయన ఛలోక్తుల్లో పెళ్ళి ఆవరణలోకి ఎప్పుడు (ప్రవేశించామో తెలియలేదు. = రవరానా, తణుకు.

! సినారె ఛలోక్తులు కరీంనగర్‌ జిల్లాలోని కళాభారతి ఆధ్వర్యంలో డా. సి. నారాయణరెడ్డిగారు ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు. బిల్లా కలెక్టరు కూడా సభలో వున్నారు. అనుకోకుండా నిర్వాహకులు సినారెకు సన్మానం ఏర్పాటు చేశారు. సన్మాన స్వీకరణకు కొంచెం వెనక ముందాడుతూ సినారె “నేను ఈ జిల్లావాణ్మి. నేను ఇక్కడి పెద్దలను గౌరవించాలి. సన్మానించాలి. అయితే మీరు నాకే సన్మానం చేయడంవల్ల పూబారే పెళ్లికొడుకు అయినట్టుగా వుంది" అన్నారు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

= బీ. వెంకటరమణారెడ్డి చాకుంట

సినారె ఛలోక్తులు 65్‌ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్చరరావుగారికి సన్మాన సభ జరుగుతోంది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.ఆర్‌. సన్మానకర్త, ఆ సభలో పాల్గొన్న డా. సి. నారాయణరెడ్డిగారు ప్రసంగిస్తూ “సినిమా పాటల్లో మూడు రకాలున్నాయి. పాత రోజాల్లోనైతే నిలబడే పాటలుండేవి. ఆ తర్వాతి కాలంలో నడిచే పాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో దొర్లిపడే పాటలూ ఎదురవుతున్నాయి” అని చమత్కరించారు. సభలో నవ్వులే నవ్వులు. = టీ. వేణుగోసాలరెడ్డ, హైదరాబాట్‌

66 సినారె ఛలోక్తులు 1969 లో అనుకుంటాను. కరీంనగర్‌లోని జూనియర్‌ కళాశాల వార్షికోత్సవానికి డా. సి. నారాయణరెడ్డిగారిని ఆహ్వానించారు. స్వంత బిల్లా కాబట్టి ఆయనకు పెద్దలూ పిన్నలూ ఆందరూ పరిచయమే. మైకువద్దకు నడిచి ఉపన్యాసం (ప్రారంభించడానికి ముందు సభంతా ఆప్యాయంగా కలయజుస్తూ,

“ముందు కూర్చున్నవారు పాత బంధువులు వెనక కూర్చున్నవారు లేత బంధువులు అందరికీ నా నమస్కారం” అన్నారు. సభాముఖంలో చిరునవ్వులు విరిశాయి. ఉపన్యాసానికి ముందే ఒక వాతావరణం సృష్టించడం ఆయన నేర్పు. = ఇ. రాముమోనొనరావు, కరీంనగల్‌

సివారె ఛలోక్తులు ళ7 హైదరాబాద్‌ సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో ఓ సాహిత్య సభ జరుగుతోంది. డా. సి. నారాయణరెడ్డిగారు ఆనాటి ముఖ్య అతిథి. ఆయన ఆ రోజు కొంత అస్వస్టులుగా కనపడుతున్నారు. అయినా ఓపిక చేసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ “ఇవాళ నా గళమందిరంలోకి ముగ్గురు అనాహూతులైన అతిథులు వచ్చారు. (ప్రస్తుతం వారి "సేవలో వున్నాను. ఏం చేస్తాం. వారి పేర్డు దగ్గు, బొంగురు, జలుబు" అన్నారు. అనారోగ్యంగా వుండి కూడా చమత్కారం వదలని సినారె మాటలకు అందరూ చప్పట్టు కొట్టారు. = ట్ట వేణుగోపాలరెడ్డి, హైదరాబాబ్‌

రకి సినారె ఛలోక్తులు

కాకినాడ యంగ్మెన్స్‌ హాపీక్షబ్‌నుంచి ఎందరో నటులు చలన

రంగంలోకి (ప్రవేశించినట్టు తెలుసుకున్న సినారె ఆ క్షజీ

సన్మానోత్సవంలో (ప్రసంగిస్తూ “చలన చిత్రరంగం నారె

రెక్కల్లో ఒక రెక్క. ఒక ప్రత్యేకమైన, శక్తిమంతమైన రెక్క

దాని పేరేమిటో తెలుసా?” అని కొంచెం అగి సినీరెక్క దానిశే అని చమత్కరించడంతో అందరికీ ఆహ్లాదం కలిగింది.

= థః మిరియాల రాను

కః

సివారె ఛలోక్తులు ళం పదేళ్ల (క్రితం ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ అయినప్పుడు డా. సి నారాయణరెడ్డి గారికి సన్మానం జరిగింది. ఆ సన్మానానికి సమాధానం చెప్పే (ప్రసంగంలో నారాయణరెడ్డి గారు ఇలా అన్నారు. “వి. సి. నారాయణరెడ్డి వుండేది మూడేళ్లే. కాని సి. నారాయణరెడ్డి కవిగా వుండేది కలకాలం” అని చమత్కరించారు. అంటే రాష్ట్ర విశ్శవిద్యాలయాల్లో వి.సి. పదవీ కాలమితి మూడేళ్లనీ, కవి పదవి ఎప్పటికీ పోయేది కాదనే స్వారస్యంతో (ప్రసంగించి ఆనాటి సభలోఅందరిని ఆనందింపజేశారు. = దాః ఎండ్లూరి మధాకల్‌ రాజనుండి

70 సివారె ఛలోక్తులు (ప్రసంగాల్లో మాటల్ని మీటే విద్యలో సినారె మేటి. ఏ ఉపన్యాసాన్నయినా శబ్దభేరి' విద్యతో రక్తికట్టిస్తాయన. 1989లో మ(ద్రాసులో జరిగిన రాజాలక్ష్మి అవార్డుల సభలో సినారె ప్రసంగం. రమణయ్యరాజా వితరణను ప్రశంసిస్తూ "మంచియన్నది పెంచుమన్నా అన్నాడు గురజాడ. ఇప్పుడైతే సంచియన్నది 'పెంచుమన్నా అనేవాడు. సంచియన్నది పంచుమన్నా (లంచం యివ్వడం) అని కూడా విసురు విసిరేవాడేమో. ఈ కాలానికి భిన్నంగా సంచి మీద కాకుండా మంచిమీద దృష్టి ఉన్నవాడు మా రమణయ్య రాజా” అన్నారు. = డొః పైడీసాల, అమలాపురం

పీవారె ఛలోక్తులు 77 పదిహేనేళ్ల క్రితం ఆమకుంటాను. హైదరాబాద్‌లో డాక్టర్‌ జయ సూర్యా మెడికల్‌ కాలేజీ వార్షికోత్సవం జరిగింది. డా. సి. నారాయణరెడ్డి గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. సినారె ముఖ్య ప్రసంగం చేస్తూ “నాకు హోమియోపతి కాలేజీలన్నా, హోమియో డాక్టర్లన్నా చాలా ఇష్టం! ఎందుకంటే మీరు రోగి పడే బాధలను తీపి మాత్రలతో తగ్గిస్తారు. అదే అలోపతి అయితే రోగి బాధతోపాటు సూది పోట్టూ, కత్తిపోట్లూ, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డపొట్టు.” ఆ మాటలకీ డాక్టర్లూ,. కాబోయే డాక్టర్లూ అందరూ గొల్లుమని నవ్వారు.

_ వీ, కేళవరెడ్డీ క్న్ణనగర్‌

72 పినారె ఛలోక్తులు కొన్ని పత్రికల్లో వస్తున్న కేష్ప్టన్సు సెన్సేషనలిజం కోసం మంఛిని వ(శ్రీకరిస్తున్నాయని సోదాహరణంగా నిరూపించిన తరవాత, సినారె “కాబట్టి గీతాంజలిలోని రచనలు మంచిని పెంచడాని కుపయోగించాలి గురజాడ చెప్పినట్టు. మంచిని వ్రీకరించడానికి కాదు, చెడును ఎలివేట్‌ చేయడానికి కాదు. కాబట్టి మంచిని మంచిగా మరింత మంచిగా 'జనమంచి'గా ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను.”

= డాః మిరియాల రానుఖ్ళిస్లు కాకినాడ

సినారె ఛలోక్తులు 73 “డా. గోపి అంటే ఎవరండీ?” అని ఒకాయన నారాయణరెడ్డి గారిని అడిగాడు. అక్కడేవున్న కవి బాపురెడ్డిగారిని చూపిస్తూ ఇచనికీ, నాకూ అప్తమి(దత్రుడు - అంటే డా. గోపి 'ఉభయ కవిమి(త్రుడు' అన్నమాట అని నవ్వారు.

= డా. కె. బావురెడ్డీ, హైదరాబాద్‌

7 సినారె ఛలోక్తులు డా. సి. నారాయణరెడ్డిగారు రోజూ పొద్దున (క్రమం తప్పకుండా మార్నింగ్‌ వాక్‌ చేస్తారు. ముప్పయ్యేళ్ళుగా ఈ అలవాటుంది. అందుకే ఓ కావ్యానికి 'నడక నా తల్లి' అని పేరు పెట్టుకున్నారు. ఓ రోజు గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రిలో దిగినప్పుడు వారితో నేనూ ధవళేశ్వరం గెస్ట్‌హౌస్‌కు అనుసరించాను. గెస్ట్‌హౌస్‌ చేరగానే ఆయన 'వాకింగ్‌కు వెళ్ళాలిపద' అన్నారు. ఆనకట్టపై అడుగులు వేయడానికి ఇద్దరం బయల్లేరాం. బయళ్లేరే ముందు ఆయనన్నారూ “ఏది తప్పినా ఇది తప్పదు కదా! నాది గతివ్రతం” గతివ్రతం ఎంత మంచిమాట! పతివ్రతంలాగ. దీక్షగా మార్షింగ్‌ వాక్‌ చేసే వారందరికీ నిజంగా గతివ్రతమే అది.

= రనరాణా, తణుకు

సినారె ఛలోక్తులు 75 ఒకసారి పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు సి. నారాయణరెడ్డి గారితో ఏమండీ మీ ఆత్మకథ రాయకూడదూ ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తాను' అన్నారట. దానికి నారాయణరెడ్డి గౌరు నవ్వుతూ “ఎక్కడండీ! ఇప్పుడెలా కుదుర్తుంది, పనిముట్టుడిగిన తర్వాత రాస్తానులెండి” అన్నారట.

“పనిముట్టు” మాటలోని కొంటె అర్జానికి పురాణం పురాణం మార్కు నవ్వుతో గలగలమన్నారట.

= డా, ఎన్‌. గోసి,

హైదరాబాద్‌

76 సినారె ఛలోక్తులు సినారె తన ముప్పయ్యో యేటి దాకా సిగరెట్లు పీలుస్తూండేవారు. కానీ హఠాత్తుగా దానికి ఉద్వాసన చెప్పారు దీన్ని గురించి చెబుతూ, “అసలు నాకు అగ్గిపుల్ల గీసే అలవాటు పోయింది. ముప్పయ్యేళ్ళ క్రితం మానేశాను. పగలే వెన్నెల అని పూజాఫలం సినిమాకి పాటలు రాసేటపుడు బి.యన్‌ంరెడ్డి గారితో స్నేహమయింది. ఆయన సిగరెట్‌ మానేశారు. ఆంతే ఆయనకి సహోదరంగా నేనూ మానేశాను = సహచరంగా! సహ స్వరంగా మానేశాను. అప్పటినుంచి అగ్గిపుల్ల వెలిగించడం రాదు.

= దొ మిరియాల రానుక్సస్ణు కాకీనాడ

సినారె ఛలోక్తులు 77 ఆయన లీనిదే నభకి నిండురాదు. (ప్రారంభోత్సవాలకీ, సన్మానోత్సవాలకీ కూడా, సినారె ఉపన్యాసకుడుగా ఉంటేనే సమగ్రత లభిస్తుంది అని తెలుగునాట, ప్రతిచోట, ఏసభ జరిగినా, సినారెని ఆహ్వానించడం పరిపాటి. ఇటీవల అమెరికాకి కూడా చాలమార్జు ఆహ్వానించారు. నగరంలో సరేసరి. ఎన్ని సభలకు వెళ్ళావు అని ఎవరైనా అడిగితే, దాన్ని దృష్టిలో ఉంచుకుని సినారె ఓ నభలో పేల్చిన జోకు “ఎన్ని సభలు తిరిగానని కాదు; ఎంత సిద్ది పొందావని! మీ ప్రశ్నకు నా జవాబు అదీ” అన్నారు కనుబొమలెగరేస్తూ,

= దాః మిరియాల రాముళ్పున్హు కాకినాడ

78 సినారె ఛలోక్తులు ఓ మధ్యాహ్నం బేతవోలూ, నేనూ గురువుగారితో కలిసి భోంచేస్తున్నాం. భోజనం పూర్తయ్యింది. చేతులు కడుక్కున్నాం. అక్కడ ఒకే టవల్‌ వుంది. ఒక ఆంచు బేరాగారికిచ్చి మరో అంచుతో గురువుగారు తుడుచుకుంటూ “రామబ్రహ్మం గారూ! ఇవాళ మనది రసనబంధమే కాదు వసనబంధంకూడా” అన్నారు. ఈ ఛలోక్తి భోజనం తర్వాత వక్కపొడిలా అమరింది.

= డొః ఎండ్లూరి మధాకల్‌ రాజమండ్రీ

సీనారె ఛలోక్తులు 79 రవీంద్రభారతిలో సినారె రచించిన 'మాటలో ఏముంది నా పాటలో ఏీముంది' (గ్రంథావిష్కరణ సభ, పాత సినిమాల్లో పాటల చిత్రీకరణ గురించి తన ఉపన్యాసంలో (ప్రస్తావిస్తూ 'ఆనాటి సినిమాల్లో అవసరమైతేనే బృందగానాలుండేవి. మరి ఇప్పుడు బృందగానాలు కాదు మందగానాల స్టాయికి వెళ్లిపోయాయి” అన్నారు. సభలో గొల్లున నవ్వులు.

= డౌ నె చెన్టయ్య హైదరాబాబ్‌

80 సినారె ఛలోక్తులు విజయవాడలో ఓ (ప్రముఖహోటల్లో శాంతి స్నేహ సంఘం ఆధ్వర్యంలో మత సామరస్యం, దేశ సమైక్యతల మీద సభ, సినారె ముఖ్య అతిథి. కార్యక్రమం మధ్యలో కరెంటుపోయింది. సినారె “అయ్యో ఇప్పుడెలా, ఎప్పుడొస్తుందో కరెంటు” అన్నారు. నిర్వాహకుడొకాయన “పరవాలేదు సార్‌ జనరేటరుంది తొందరలోనే వస్తుంది” అన్నాడు. ఐదునిమిషాలు వెయిటింగ్‌. అంతలో కరెంటు వచ్చింది, జనరేటర్‌వల్లనే. వెంటనే సినారె “శ్పిహో ఇది జనరేటర్‌ గ్యాప్‌ అన్నమాట” అని చమత్కరించారు. “జనరేషన్‌ గ్యాప్‌” అనే వదాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటే ఆచమత్కారం ఇనుమడిస్తుంది.

=ముంకర కనకారావు విజయవాడ

సినారె ఛలోక్తులు తి ఓసారి తంజావూర్‌ నుండి మద్రాసు రావటానికి విమానాశ్రయంలో నారాయణరెడ్డి గారితోపాటు నేనూ వున్నాను. వాతావరణం అనుకూలంగా లేక విమానం అక్కడ దిగకుండానే వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడనుండి తిరుచ్చివెళ్లి, తిరుచ్చి నుండి మద్రాసు వెళ్లే విమానాన్ని పట్టుకోవాలి. దానికి విమానాశ్రయ అధికారులు కారును ఏర్పాటు చేశారు. సకాలంలో విమానాన్ని అందుకోడానికి (డైవర్‌ కారును అతివేగంగా నడుపుతున్నాడు. పైగా “నీంగే కవలైపడవేణాం సార్‌! నీంగే త్రిచ్చిలేరిందె మ'ద్రాస్‌కి తొవి పొయిడలాన్ల'”' అన్నాడు. అంటే, “మీకేం కంగారు అక్కర్ర్తేదు సార్‌! మీరు తిరుచ్చి నుండి మద్రాస్‌కి తప్పకుండా ఎగిరిపోతారు సార్‌'' అని అన్నారు. నారాయణ రెడ్డిగారు నావైపు చూస్తూ ఇలా అన్నారు “విన్నారా! వీడివేగం చూస్తే ఎగిరిపోవడం ఖాయం. ఏ సైకో, అది ఇప్పుడే చెప్పలేం.” ఆయన చమత్కారాన్ని ఆస్వాదిస్తుండగానే తిరుచ్చి చేరుకున్నాం. = జీ. రానుకుష్ణారావు హైదరాబాట్‌

82 సినారె ఛలోక్తులు ఓ రోజు నారాయణరెడ్డి గారింట్లో భోజనాల బల్ల దగ్గర వారి "పెద్దమ్మాయి గంగ నాన్నకు వడ్డిస్తూ “ఈ పొడి వేసుకోండి కృష్ణ చేసింది” అంది. కృష్ణవేణి సినారె గారి మూడో అమ్మాయి. దానికి సినారె మార్క్‌ శిరఃకంపనంతో 'ఓహో ఆవసరమైతే కృష్ణరూడా “పొడి' చేస్తుందన్నమాట” అన్నారు. పొడి చెయ్యడంలోని స్వారస్యానికి

మిగతావారు ముసిముసినవ్వుల్ని నంజుకున్నారు. = దాః జె చెన్నయ్య హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 83 ఒక మి(షత్రుడు నారాయణరెడ్డిగారితో అన్నాడు “మా నాన్నగారు చరిత్ర బోధించే టీచరుగా పనిచేశారు. నేను కూడా చరిత్ర మాపష్టారుగానే పనిచేస్తున్నాను” వెంటనే సినారె “హిస్టరీ రిపీట్స్‌ ఇట్‌సెల్ఫ్‌” అని ఛలోక్తి విసిరారు.

= డొక్టర్‌ కె. బావురెడ్డీ, హైదరాబాబ్‌

84 సీనారె ఛలోక్తులు తణుకు శ్రీ నన్నయ భట్టారక పీఠ స్వర్ణోత్పవ సాహితికి డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారు ప్రధాన అతిథిగా విచ్చేశారు. ఆ సందర్భంగా ప్రముఖ చిత్రకారులు బాల గోపాల భాస్కరరాజు గారినీ, మిమిశ్రీ కళాకారులు నేటి (ప్రముఖ సినీ హాస్య నటులు బ్రహ్మానందం గారినీ సినారె సత్కరించారు. ఆ సందర్భంలో మరో నాటక కళాకారునికి కూడా సన్మానం చేయవలసి వున్నది. ఆ మహా వ్యక్తి ఎవరో కాదు. ఆంధ్ర బాల గంధర్వ బిరుదాంకితులు శ్రీ, షణ్ముఖి ఆంజనేయరాజు గారు. రంగస్థలంపై ఆయన పాడిన పద్యాలు కరతాళ ధ్వనుల ప్రశంసలే కాక వన్స్‌మోర్‌ అభ్యర్థనలను కూడా అందుకోవటం మామూలే! నారాయణరెడ్డి గారు ఆంధ్ర బాల గంధర్వునికి హారసత్కారం చేసి దుశ్ళాలువను కప్పబోతుండగా ఓ మూల నుండి కెమెరా తళుక్కున మెరిసింది. సన్మాన కార్యక్రమం ముగిసింది కదా అని సినారె అనుకుంటూ వుండగా ఇంతలో ఫోటోగ్రాఫర్‌ 'మరో స్నాప్‌ ప్లీజ్‌ అన్నాడు. అప్పుడు ఫొటో కోసం మళ్ళీ దుశ్ళాలువను కప్పుతూ సినారె ఏమన్నారో చూడండి - “ఆంజనేయరాజాగారి గళానికే అనుకున్నాను - ఆయన రూపానికీ వన్స్‌మోర్‌ తప్పలేదే!' అన్న ఛలోక్తితో ఆనాటి సభ ఆనందంగా నవ్వుకుంది. ఆ మధురకవి వాక్కుతో ఆంజనేయరాజు గారికి నిజంగా అక్షర సన్మానం జరిగినట్టయ్యింది.

  • రనరావో, తణుకు

సివారె ఛలోక్తులు 85 చాలానాళ్ల కిందట కరుణానిధి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. మద్రాసులో ఒకానొక బహిరంగసభలో కరుణానిధి ప్రసంగిస్తూ “తమిళ భాషనుండి సంస్కృత పదాలను తీసివెయ్యాలి” అన్నారు. ఆ సభకు ముఖ్య అతిథి అయిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్టాడుతూ, “తమిళభాషలో దొర్లీ సంస్కృత పదాలను తొలగించదలచుకుంటే ముందు శ్రీ, కరుణానిధి తను పేరును మార్చుకోవాలి. ఎందుకంటే కరుణ, నిధి ఈ రెండూ సంస్కృతపదాలే. అందుచేత జాలికుప్ప, జాలి'ప్రోగు, జాలిదిబ్బ వీటిల్లో ఏదో ఒకదాన్ని తమ పేరుగా పెట్టుకోవాల్సి వస్తుంది” అన్నారు. కరుణానిధితోసహా సభంతా నవ్వుల నిరిజల్దులతో వెల్లి విరిసింది.

= జీ. పాయినరనసొదరావు, వెంకటగిరి

86 సినారె ఛలోక్తులు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి డా. సి. నారాయణరెడ్డిగారు ఏదో పని మీద వచ్చారు. వారు వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పటానికి ఎయిర్‌ పోర్టుకు వెళ్ళాము. ఎస్‌.వి. యూనివర్సిటీ కారు (డ్రైవరు డి. వెంకట రామరెడ్డి కర్షుడి పాత్ర, అల్లూరి సీతారామరాజు పాత్రల ఏకపాత్రాభినయం చేశాడట. ఆ విషయం నారాయణరెడ్డి గారికి తెలియజేసుకున్నాడు. ఆయన తల పంకించి మెప్ప్తుదలగా చూశాడు. కొంతసేపటికి దాహం వేసి (డైవర్ని నీళ్ళు తెమ్మన్నారు. అతడు ఒక గ్లాసుతో నీళ్ళు తెచ్చి యిచ్చాడు. గ్యానందుకొని సినారె “ఇది ఏకపాత్రాభినయం” అన్నారు. అర్ధగంట తర్వాత మళ్ళీ నీళ్ళు తెమ్మన్నారు. (సినారెకి నీళ్ళు ఎక్కువగా తాగే అలవాటుంది) (డ్రైవరు తెచ్చాడు. మళ్ళీ అందుకుంటూ ఇది “ద్విపాత్రాభినయం” అన్నారు. ఏకపా'త్రాభినయ కళాకారుడు వెంకటరామరెడ్డితో సహా అక్కడున్న అందరం హాయిగా నవ్వేశాము. = ఆచార్య నీ. రమణయ్య, రాజమండ్రి.

సినారె ఛలోక్తులు 87 1992 అక్టోబర్‌ గాంధీజయంతి నాడు రాజ్‌భవన్‌లో సినారె రచించిన “బాపూజీ మళ్లీ పుడితే' రూపకం ప్రదర్శించారు. ప్రదర్శనను తిలకించడానికి ప్రముఖ నటి జమున ప్రభృతులు హాజరయ్యారు. ప్రదర్శనకు ముందు అందరు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. జమున మౌనంగా చిరునవ్వు నవ్వుతూ తలవూపుతూ కూచుంది. జమున గారికి ఎప్పుడూ తలవూగుతుంటుందని అందరికి తెలిసిందే. సినారె ఆమె వైపు చూస్తూ “మీరు మాట్లాడకున్నా, మౌనంగా అసంకల్పితంగా మీ తల వూగుతుంటే ఇవాళ నాకనిపిస్తుంది. “ఇదీ జమునాస్టిక్స్‌ అంటే” అన్నారు. అది జిమ్నాస్టిక్స్‌ ఎనాలజీ అని అర్హమై బజమునగారితో పాటు అందరూ ఫక్కుమన్నారు.

= దాః జె. చెన్సయ్య హైదరాబాద్‌

88 సినారె ఛలోక్తులు

యువకవి సాదనాల డా॥ మాధురిని రిజిస్టర్‌ మారేజి చేసుకున్నారు.

ఆ తర్వాత నవీన పద్దతిలో రాజమండ్రిలో పెళ్లి కూడా జరిగింది. దానికి కవులూ కళాకారులూ ఎందరో హాజరయ్యారు. సినారె అధ్యక్షత వహించి, ముందు మాటలు చెబుతూ 'మూడు నెలల (క్రితమే సాదనాల డా॥ మాధురి చట్టం రీత్యా పెళ్లాడేశారు - రిజిస్ట్రారాఫీసులో. ఇప్పుడు చుట్టం రీత్యా మీ అందరిముందు పెళ్ళిడుతున్నారు” అనగానే సదస్సులో చప్పట్టు మారుమోగాయి.

  • డొః మిరియాల రానుళ్ఫున్లు

కొకినాడ

సినారె ఛలోక్తులు 89 పదేళ్ల (క్రితం అనుకుంటాను. ఒకనాటి ఉదయం ఓ సాహిత్య సభలో పాల్గొనడానికి డాక్టర్‌ సి.నారాయణరెడ్డిగారు భీమవరం వచ్చారు. సభ సాయంత్రం వుంది. ఆయినా ఆ రోజంతా వారు భీమవరంలో వుండాలని నిర్వాహకుల కోరిక ఇంతలో వారిని మేము తణుకు రావలసిందిగా ఆహ్వానించాం. సహృదయంతో ఆయన సరే అన్నారు. ఆ ఉదయం ఉపాహారం తీసుకొని తణుకు బయలుదేరడానికి అడుగు బయట పెట్టాం. రెండడుగులే వేశాం. అది గమనించిన నిర్వాహకులలో ఒకరు ప్రల్షించారు. “ఎక్కడికి మళ్ళీ” అని. అప్పుడు నారాయణరెడ్డిగారు మా వైపు తిరిగి ఇలా అన్నారు.

“ప్పండి వారితో తన్నుకు (తణుకు) పోతున్నామని”! ఇదీ

నారాయణరెడ్డిగారిలో తన్నుకువచ్చే సమయసు్యర్త, ఆ ఛలోక్తితో అక్కడున్న రసహృదయాలన్నీ ఒక్కసారిగా స్తుాకించాయి.

  • రనరానా,

తణుకు

ఫ్య సినారె ఛలోక్తులు 1990లో తూర్పు గోదావరి జిల్లా రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్‌ వారు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. ఆనాటి సన్మాన సభకు జరిగిన (బ్రహ్మాండమైన ఏర్పాట్లనూ, అసంఖ్యాక ప్రజానీకాన్ని చూసి ఒక వక్త తన శ్రయత్వంతో ఆ సభను మయసభతో పోల్చగా దానికి స్పందిస్తూ సినారె “ఈ 'మహాసభిను ఇంతకు ముందు ప్రసంగించిన మి(త్రులు మయసభ గా అభివర్లించారు. కాని 'మయసభ' అంటే ఉన్నవి లేనట్లుగా లేనివి వున్నట్టుగా... ఆంతా గందరగోళం వ్యవహారం, పైగా అపోహలు, అవమానాలు... కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. 'వాజయసభ' అందాం” అన్నారు. భావగర్భితమైన ఆయన చమత్కారానికి ఆనాటి సభ హాయిగా నవ్వుకుంది. = దొః టీ.వి. వారాయణరెడ్డే, గణవవరం

సినారి ఛలోక్తులు |

తూర్పు గోదావరి జిల్లా 'రామవరం' (గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్‌ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటికల- పోటీ సందర్భంగా 24-4-90 తేదీన జ్ఞానపీఠ్‌ అవార్డు (గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారికి సన్మానం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారి ప్రసంగంలో చిన్న (గ్రామమైన 'రామవరం'లో పెద్ద స్థాయిలో కళా సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడాన్ని ప్రశంసిస్తూ సినారె “ఇది రామవరం కాదు (గ్రామవరం” (గ్రామాలలో (శ్రేష్టమైనది) అని చక్కని పద ప్రయోగం చేసి సభికుల్ని ఆనందభరితుల్ని చేశారు. డా. టీ.వి. వాంయణరెడ్డీ

గణవవరం

92 సినారె ఛలోక్తులు ఆ మధ్య ప్రభుత్వంవారు నారాయణరెడ్డిగారిని కాకతీయ విశ్చవిద్యాలయానికి తాత్కాలిక వైస్‌ ఛాన్సలర్‌గా నియమించిన వార్త వచ్చింది. సినారె గుంటూరులో వున్నప్పుడు ఆ వార్త తెలిసింది. ఆ సాయంత్రం జరిగిన ఒక సాహిత్యసభలో వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “కాకతీయ విశ్వవిద్యాలయంలో కాక- తీయదనం రెండూ వుంటాయి. కాక అంటే వేడి. ఆ పదవిలోకి వచ్చేవారికి ఎదురయ్యే, కాక పుట్టించే సమస్యలు అని భావం. తీయదనం అంటే అక్కడి అధ్యాపకసోదరుల ఆత్మీయతాభిమానాలు అని భావం' అని వ్యాఖ్యానించి సభలో చిరునవ్వులు మొలిపించారు.

  • దా. చేరెడ్డి మస్తావ్‌రెడ్డీ నర్చరావు పేట

సినారె ఛలోక్తులు ఫ్ర

ఒకసారి సినారెని కలవడానికి ఒక విద్యాంసుడైన నియోగి

(ప్రముఖుడు, ఆయనతో పాటు ఓ వ్యాకరణవేత్తా వచ్చారు.

ఇద్దరూ సినారెకు ఆత్మీయులు. ఇద్దరూ కాసేపు మాట్టాడి

సెలవుతీసుకొని స్కూటరు మీద కూచున్నారు. అప్పుడు వాళ్లిద్దర్ని

ముచ్చటగా చూస్తూ “బాగుంది ఈ జంట. ముందు కరణం వెనక వ్యాకరణం” అని ఆప్యాయత చిలకరిస్తూ ఛలోక్తివిసిరారు.

= ఆచార్య ఎల్లూరి శివారెడ్డీ

హైదరాబాట్‌

9ిక్ష సినారె ఛలోక్తులు “తెలుగువాడు అసాధ్యుడులెండి! పదాలను అలా తీసుకుని లోపలి "పేగుల్లో వేసుకుంటాడు! అక్కడ జీర్లించుకుంటాడు” అంటూ సినారె తెలుగువాడి వ్యవహార లక్షణాన్ని వ్యాఖ్యానించారు. 'హీ బ్రదర్‌! బావున్నారా" అంటాడు! తెలుగువాడి లక్షణం అది! అంటూ తెలుగులో మనం వాడుతున్న 'హుందా' అనే పదం 'ఉమ్‌దా' అనే పారసీ పదం నుంచి వచ్చిందనీ అక్కడ '“ఉందా' అంటే ఉత్తమమైన, (శ్రేష్టమైన అని అర్ధ్హమనీ తన ఉర్జూభాషా పరిజ్ఞానాన్ని నిరూపించుకున్నారు. దీనితో సభ్యులు కాసేపు ఎం.ఏ., లింగ్విస్టిక్స్‌ క్లాసులో కూచున్నట్టయింది. = దః మిరియాల రానుఖ్టిన్హు కాకివొడ

సివారె ఛలోక్తులు ఫక్‌ ఒకసారి గురువుగారితో పాటు నేనూ, బేతవోలు రామబ్రహ్మం, పట్టపగలు వెంకట్రావు, ఏలూరి సాంబళివరావు, హరిబాబు మొదలైన వాళ్లమంతా కలిసి రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి వెళ్ళాం. అక్కడ ఓ గెస్ట్‌హౌజ్‌లో విడిది. రాత్రి ఇష్టాగోస్ట్రిగా సరదాగా కబుర్జు చెప్పుకుంటున్నాం. ఇంతలో కరెంటు పోయింది. అప్పుడు పట్టపగలు వెంకట్రావు సినారె చెవిలో ఏదో చెప్పబోతుంటే “వెంకట్రావుగారూ మీరు చెవి దాకా రానవసరం లేదు. మీరంటున్నది నేను వింటున్నా. మీరుండగా కరెంటు లేకుంటే యేం? ఎందుకంటే మీరే 'పట్టపగలు” కదా!” అన్నారు. ఆ ఛలోక్తి చీకట్లో కూడా వెలిగింది. = డొః ఎండ్లూరి మధాకల్‌ రాజమం/(డీ

96 సినారె ఛలోక్తులు 1992 జూలై 14న సివారె తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు ఆయన చేంబర్‌లో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు ప్రభృతులు ఉన్నారు. అప్పుడు కొత్తపల్లి వారు అక్కడే ఉన్న యూనివర్సిటీ పి.ఆర్‌.ఓ. చెన్న్షయ్యను చూపిస్తూ “"చెన్స్షయ్యగారు విశ్వవిద్యాలయ కార్యకలాపాలకు మంచి (ప్రచారం కల్పిస్తున్నారు. కాని ఆయన వస్త్రధారణ అత్యాధునికంగా లేదేం?” అన్నారు. దానికి సినారె “చెన్నయ్య పూలదండలా ఉండడు. పూలలో దారంలా ఉంటాడు” అని సమర్థించారు.

= దొ జె. వెన్టయ్య హైదరాబాబ్‌

సినారె ఛలోక్తులు త్త్గా

ఆంధ్రదేశంలో సురభి నాటక సమాజానికి వందేళ్ల గొప్ప చరిత్ర వుంది. పల్లెల్లో (ప్రదర్శించే వారి నాటకాలు ఈనాడు టౌన్లకూ పట్టణాలకూ పరిమితమవుతున్నాయి. టెంట్లు వేసి ప్రదర్శించే సురభి వారిని ఈ మధ్య రవీంద్ర భారతి, గాన సభల ఏర్‌కండీషన్హ్‌ ఆడిటోరియంలకు పిలిపించి ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అలాంటి ఒక సందర్భంలో సురభి వారు తమకు తాముగా హైదరాబాదులోని ఓ స్తేగ్రాండులో నాటకాల్ని ప్రదర్శిస్తున్నారు. (22-6-91); వాటికి సినారెని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. ఆ సందర్భంగా ప్రసిద్ధ కథా రచయిత జీ. రామకృష్ణారావుగొరు నారాయణరెడ్డి గారితో “సురభి వారు 90 ఏళ్ల తర్వాత హైదరాబాదులో తాముగా నాటకాల్ని ప్రదర్శిస్తున్నారు. అదీ విశేషం!” అన్నారు. “అదేంటి? అప్పుడప్పుడు రవీంద్రభారతిలో వేసే వారు గదా” అని సినారె ప్రల్నించారు. “ప్రత్యేకంగా టెంట్లు వేసి ప్రదర్శిస్తున్నారండీ” అన్నారు జి.రా. "టెంట్‌ వేసినా కంటెంట్‌ సురభే గదా!” అని సినారె చమత్కరించారు. చుట్టూ వున్న మేమందరం గొల్లున నవ్వాం.

= ఆవార్వ జయధీర్‌ తరుములరావు,

హైదరాబాట్‌

98 సినారె ఛలోక్తులు హైదరాబాద్‌ సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో ఓ పుస్తకావిష్కరణ సభ డా॥ సి. నారాయణరెడ్డిగారు ఆవిష్కర్తగా విచ్చేశారు. డా, ఎన్‌. గోపి ఆ పుస్తకాన్ని పరిచయం చెయ్యాల్సి వుంది. గోపికి కాగితం మీద పాయింట్స్‌ రాసుకొని ఉపన్యాసం చెప్పడం అలవాటు. ఆవాళటి ఉపన్యాసంలో కాగితం లేకుండానే అనర్గళంగా మాట్లాడాడు. తరువాత మాట్లాడిన సినారె “గోపి ఇవాళ నోట్సుతో కాక నోటితో మాట్లాడాడు. సంతోషం!” అని చమత్కరించారు.

= డాః ఎన్‌ గోన, హైదరాబాట్‌

సినారె ఛలోక్తులు ంం 1988లో నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ వచ్చినపుడు దూరదర్శన్‌వారు ఇంటర్వ్యూ చేశారు. అందుకోసం దూరదర్శన్‌కు బయలు దేరుతుండగానే ఆంధ్రజ్యోతి సీనియర్‌ రిపోర్టర్‌ శ్రీ టి. ఉడయవర్హు కూడా సినారె ఇంటర్వ్యూ కోసం వచ్చారు. కార్లో మాట్లాడదాం రమ్మని సినారె టి.యు (ఉడయవర్దు పొట్టిపేరు) ను కోరడం ఇద్దరూ టి.వి స్టూడియోకి వెళ్ళడం, అక్కడ ఇంటర్వ్యూ రికార్డు చేయడం అయ్యాక తిరిగి కార్టో బయళల్టేరారు. అప్పుడు నారాయణరెడ్డిగారు తడుముకోకుండా “టి.వి. ఇంటర్వ్యూ ఆయిపోయింది ఇక టి.యు ఇంటర్వ్యూ” అన్నారు. = డా క చెన్టయ్య హైదరాబాద్‌

100 సినారె ఛలోక్తులు సూర్యకళామందిర్‌లో సినారెకి సన్మానం రోజున డా॥ సోమసుందర్‌ సినారె కవిత్వం గురించి ప్రశంసిస్తూ “సినారె కోరేవి దండలుకావు. ఆయన కవిత్వాన్ని అర్ధం చేసుకునే గుండెలు” అంటూ మాట్లాడారు. సినారె దాన్ని సమర్థిస్తూనే ఒక దండ వేయడానికి ఆవకాశమివ్వకపోతే,

ఆ దండ వేయదలిచినవాడి గుండె విరుగుతుందేమో అని దండ

కంగీకరిస్తా అంటూ ఛలోక్తి విసరడంతో అంతా తెగ నవ్వుకున్నారు.

= దొః మిరియాల రానుళ్పున్లు

కొకీనాడ

సివారె ఛలోక్తులు 101 1974 లో నేను తెలుగు ఎం.ఎ. రెండో సంవత్సరం చదువుతున్న రోజులు. దివాకర్ల వేంకటావధానిగారు, సి.నారాయణరెడ్డిగారు, పాటిబండ్ల మాధవశర్మగారు, పల్హాదుర్గయ్యగారి వంటి దిగ్దంతులు మా అధ్యాపకులు. ఒకరోజు ఎం.ఎ. రెండో సంవత్సరం విద్యార్దులకు ప్రీవియస్‌ విద్యార్థులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఓ ఫైనలియర్‌ విద్యార్థి ఉపన్యసిస్తూ “ఈ ఎం.ఎ. మూడేళ్లున్నా బాగుండేది. ఎందుకంటే ఇప్పటివరకు విద్యార్హులం రేపటి నుండి నిరుద్యోగులం” అని వాపోయాడు. వెంటనే నారాయణరెడ్డిగారు కలగజేసుకొని “అప్పుడే ఊహాత్మక నిరాశ వద్దు నాయనా, ఇప్పటి విద్యార్థులే రేపటి ఉద్యోగార్జులు” అన్నారు. సభలో వున్నవారంతా ఉల్లాసంగా నవ్వేశారు.

=డ్రొ క్రై లక్ష్మణరావు, హైదరాబాట్‌

102 సినారె ఛలోక్తుల ఓ రోజు (డ్రాయింగ్‌ రూములో ఒకతను సినారె ముందు కుర్చీలో కూచొని హావభావ విన్యాసాల్తో సినారెను పొగుడుతున్నాడు. అతను వెళ్ళిపోయాక సినారె మిత్రుడు “ఎవరండీ అతను?” అని అడిగాడు. సమాధానంగా సినారె పైకి చూపించాడు. పైన సీలింగ్‌ ఫ్యాను తిరుగుతూంది. అంటే అతడు సినారె గ&౧ అన్నమాట.

= డ్రా ఎన్‌, గోని హైదరాబాబ్‌

సినారె ఛలోక్తులు 103 1992లో తెలుగు విశ్వవిద్యాలయం ముళ్ళపూడి వెంకట రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. ముందుగా ఈ విషయాన్ని అప్పుడు వి.సి.గా ఉన్న సినారె విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఆ సమావేశంలో ఓ విలేకరి 'ఆం(ధ్రా యూనివర్సిటీ 'బాపూ'కి

డాక్టరేటిచ్చి బాపూరమణలను విడదీసింది' అన్నారు. దానికి సినారె

“మేం రమణకు డాక్టరేటిచ్చి ఇద్దర్నీ కలుపుతున్నాం” అని చమత్కరించారు.

= దాః కె. చెన్సయ్య

హైదరాబాద్‌

104 సినారె ఛలోక్తులు గరిమెళ్ల శతజయంతి ఉత్సవం జరుగుతుంది. ఆ సభలో సినారె గరిమెళ్ల గాంధీవాదే అయినా ఆయన స్వరంలో విష్టవతీ[వ్రత ఉండేదనీ తెల్లదొరతనాన్ని పేల్ళేసే మాటలు ఆయన గీతాల్లో కనిపిస్తాయనీ అంటూ ఆరకంగా గరిమెళ్ల “ఇద్దర్‌ గద్దర్‌” అని ముగించారు.

= ఎన్‌, రఘు హైదరాబాద్‌

సినారె ఛలోక్తులు 105 రవీంద్రభారతిలో జరిగిన ఒక సభలో ఒక గాయకుడు ఆడగొాంతూ మగ గొంతూ తనే పలికిస్తూ అద్భుతంగా పాడాడు. సభకు అధ్యక్షత వహించిన డా. సి. నారాయణరెడ్డిగారు తర్వాత మాట్లాడుతూ ఆ గాయకున్ని 'అర్హనారీస్వరుడు' అని (ప్రశంసించడం అందరికీ. ఆనందం కలిగించింది. అప్పటికప్పుడు అర్హనారీశ్వరుడులోని 'శ' ను 'స'గా మార్చి ఆరోగ్యకరంగా అర్ధభేదం సాధించడం సినారె సమయస్పూర్తి.

= గౌలి వానరరెడ్డీ, హైదరాబాబ్‌

106 సినారె ఛలోక్తులు సినీనేపధ్యగాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రభృతులు పాల్గొన్న సమావేశం రవీంద్ర భారతిలో జరిగింది. ఆవేదిక మీద సినారె ఎన్‌.పి.ని గురించి చెప్తూ “మామూలుగా మనం ఏకఛత్రాధిపత్యం అనే మాట వింటుంటాం. కాని ఎస్‌.పి. ది ఏకగాత్రాధిపత్యం.” ఎందుకంటున్నానంటే ఏ పాత్రకైనా సరిపోయేట్టుపాడే గాత్రనైపుణ్యం ఎస్‌.పి. కి ఉంది. ఘంటసాల కాలంలోనైతే నలుగురైదుగురు ఉండేవారు, పి.బి. శ్రీనివాస్‌, మాధవపెద్ది, పిఠాపురం వగయిరా. ఎస్‌.పి. ఒక దశలో ఇంచుమించుగా అన్ని పాత్రలకూ తానే పాడేవాడు. ఆల్‌ ఇన్‌ వన్‌ అన్నమాట. అందుకే ఏక గాత్రాధిపత్యం అన్నాను.”

  • దొ వె. చెన్సయ్య హైదరాబాబ్‌

సినారె ఛలోక్తులు 107 1992 జనవరి 13న హైదరాబాద్‌లో ఎన్‌.టి.ఆర్‌. దర్శకత్వం వహించిన '“సాొ(మ్రాట్‌ ఆశోక' వెండితెరనవల ఆవిష్కరణ -సభ జరిగింది. ఆ సభలో ఎన్‌టిఆర్‌ గురించి ప్రత్యేకంగా సినారె ప్రసంగిస్తూ ఎన్‌.టి.రామారావు సినిమాల్లో కారణజన్ముడు, మరి రాజకీయ రంగంలో రణజన్ముడు” అని చమత్కరించారు.

= దొ జె. చెన్సయ్య హైదరాబాబ్‌ శశి | యు శై శ న ల అతి ఖగ లో

108 సినారె ఛలోక్తులు సివారె ఏదో సమావేశానికి బయల్టేరుతున్నారు. సినారె అభిమాని గొడుగు భాస్కర రెడ్డి, సంస్థ కార్యదర్శి ఆయన వెంట ఉన్నారు. బయళ్లేరుతుండగా చినుకులు మొదలైనాయి. “అయ్యో గొడుగుంటే బాగుండేదే” అని సంస్థ కార్యదర్శి అంటుండగానే భాస్కర రెడ్డిగారు ఎక్కన్నుంచో ఠపీమని ఓ గొడుగు తెచ్చి సినారె చేతికిచ్చారు. సినారె చిరునవ్వుతో “గొడుగు భాస్కరరెడ్డి గారిది ఇక్కడ మాత్రం బహుచ్చత్రాధిపత్యం” అన్నారు 'అంటే ఇంటి పేరులోనే కాదు చేతిలో కూడా గొడుగు తయారు” అన్నారు.

  • దాః ఎన్‌ గోనీ హైదరాబాబ్‌ తభ న (శ లటాంటం, రంప నై ఇం

త. . ” | | న. ల తళ! ॥ గ్‌ | ' గ లో . . - స్త్‌ మ . ॥ _ వం కం ను. . స్‌ సాం! 111 |. క్‌ ర ల్‌, న్‌ ఉత్‌ పశ ల ౯ ॥ న. స మో సఘి యం టట టాం / టీ! య న గ . న. క స క. న , , " | మ దం వ లఖన ని (1 కం. | న? ం లో స గ11 వ్‌?! స స స క మనలో రండ కంటా. గ. నట స్వ బే స వ మ. శ న నం (| కం న. క ర నట న ల క. _ |. వణ క న టో గ సు యమత్తటలి సట ము | క్‌ “నత ర మ ౯1) కట... /. ర టం! తట వ... ల నీ . శల ల శే శ న ప పంట ల. న. ? వ. | . క... మలో వ న హా న్‌ ఖో | వ. ల లో | యా . ట్‌ ల ల (5 నో , నా . న. ళ్‌ స చ క ఇ ల | వ. న. ల లు న ర ౬