Telugu birth without birthday - anilvaranasi/indianlanguages GitHub Wiki
నాళ 3 ( శ!
24 //2/26// బర్ వితౌట్ బర్డే అది అది కంచ ఐలయ్య జొస ప్రచురణలు (ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్, హైదరాబాద్)
సై యం! బర్త్ వితౌట్ బర్త్‌డే ం కంచ ఐలయ్య న్ పబ్లిషర్స్ ఏ కాస ప్రచురణలు (ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్, హైదరాబాద్) రైట్టు ఫేయిత్ టొ (ప్రచురణ ఏ సెప్టెంబర్, 2011 ల త్తు క న్నా ల (ప్రతులు వ 1000 కో న్ ఉం ఒనొ (ప్రచురణ సంఖ్య న. స్ కవర్ డిజైన్ ఏ కూరెల్ల శ్రీనివాస్ కంపోజింగ్/లేఅవుట్ : జాన్ దండెం, సునీత మిక్కిలినేని బ్యాక్ కవర్ పేజీ ఫోటో : రవీందర్ (ప్రతులకు : *69, డా॥ బి.ఆర్: అంబేద్కర్ హాస్టల్ (ఎన్.ఆర్.ఎస్) ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, తార్నాక, హైదరాబాద్ - 500 007. మొబైల్: 99088 94355 వెల : ఇై170/- భాషా రల. న్ గ్ న?
ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ (జౌస)కు ఈ పుస్తకం అంకితం
ది సింగిల్ టీచర్ వర్కింగ్ విత్ స్టూడెంట్స్ ఫర్ దళిత్, బహుజన్ ఐడియాలజీ
నేను ఈ మాట అంటున్నది ఆషామాషీగా కాదు. కొంతమందికి ఈ వాక్యం ఇబ్బందిగా ఉంటుందని కూడా నాకు తెలుసు. ఇది అనుభవం నుండి వచ్చిన వాక్యమనుకుంటున్నాను. దీన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోవాలంటే ......
ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో వ్యక్తిగతంగా పరిచయం ఏర్పడి చాలా తక్కువ కాలమే. కానీ ఆయన “వై ఐయామ్ నాట్ ఎ హీందూ” (ప్రపంచాన్ని కదిపివేసినట్టుగానే నేను గురయ్యాను. ఆ పుస్తకం చదివే ప్రతి దళిత, బహుజన విద్యార్థి తన తరతరాల జీవితంలోని మట్టి పారలను తవ్వుకున్న అనుభూతికి లోనవుతాడు. ఆ పుస్తకం తర్వాత తెలుగులో సమకాలీన సంఘటనలపై ఆయన రాసిన కొన్ని వందల వ్యాసాలు దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ మహిళా సమాజపు చైతన్యాన్ని మరింత సృజనాత్మకంగా మలిచాయి. కమ్యూనిస్టు (రాడికల్) దళిత విద్యార్థి ఉద్యమాల (ప్రభావం విసృతంగా కొనసాగిన ఈ రాష్ట్రంలో ఐలయ్య వ్యాసాలకు విపరీతమైన గిరాక్రి పాఠకుల్లో ఉంది. తెలుగు సమాజంపై విసృతమైన ప్రభావం చూపిన వ్యాసాలు ఇంగ్రీష్ భాషా అనివార్యతపై వ్రాసినవి. (గ్రామీణ శూద్రవర్గం (గొల్లకుర్మ) నుంచి విశ్చవిద్యాలయం దాకా కష్టించి చేరుకున్న ఆయనకు తన లాంటి వాళ్ళు ఎంతోమంది ఊర్జోనే ఉండిపోవడానికి జీవితంలో ఎటువంటి ఎదుగూ, బొదుగూ లేకపోవడానికి ఇంగ్షీష్ భాషే కారణమని బలంగా నమ్మాడు. మాతృభాషపై మమకారం అ(గ్రకులాలు ఆడుతున్న అబద్దమని వారిపిల్లలంతా ఇంగ్రీష్ మీడియంలో ఇష్టంగా, ప్రియంగా చదువుతున్నారని చెప్పాడు. తెలంగాణ (ప్రాంతంలోని దళిత, బహుజన విద్యార్థులు చదువుతున్న ఏకైక విద్యా సంస్థ ఉస్మానియా యూనివర్సిటీయే. దేశంలోని ఏ యూనివర్సిటీకి తీసిపోని విద్యార్దులు (మాల, మాదిగ, లంబాడి, గోండు, ఎరుకల, చాకలి, మంగలి, కుమ్మరి) ఉన్నత చదువులు చదివి కేవలం ఇంగ్లీష్ రాదన్న కారణంతో హైదరాబాద్‌లో ఎర్రబస్సు ఎక్కి మళ్ళీ పల్లెబాట పడ్డుంటే, ఆ(గ్రకులాల పిల్లలు మాత్రం ఎయిర్ బస్ (విమానం) ఎక్కి ఇక్కడి నుండి అమెరికా, లండన్‌లకు పోతున్నారు. బస్సు ఎక్కుతున్న మాలా, మాదిగల బతుకులు మార్చడానికి భాషా రాజకీయాలను బద్దలుకొడ్డూ సోకాల్డ్ మార్కిస్టులను, (బ్రాహ్మణులను ఆయన వెంటపడి తరిమాడు. అందరికీ సమాన విద్య లేకుండా సమాన అవకాశాలు కల్పించడం అసాధ్యమని, ఈ హక్కును నిరాకరించడమే బ్రాహ్మణత్వమని (మనువాదం) వాదిస్తున్నాడు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల్లో భాగంగా, దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ మహిళల నాయకత్వంతోనే సాధించబడాలని ఆయన చేస్తున్న
శ
వాదనను ఎంత అనివార్యమో చాలామంది ఉద్యమకారులుగా చెప్పుకోబడుతున్న కొద్ది మందికి అవగాహన కావడం లేదు. ఎలాంటి శక్తుల భాగస్వామ్యంతో తెలంగాణ సాధిస్తే, అది అట్టడుగు సమాజంలోని విశాల (ప్రజారాశులకు మేలు చేస్తుందో స్పష్టంగా చెప్పాడు. కానీ పరిస్టితులు అందుకు భిన్నంగా ఉన్నందుకు చింతించలేదు. తన కలానికి మరింత పదును పెట్టి తన జాతికి మేలు చేకూర్చే విమర్శలను, కార్యాచరణను అందించే ప్రయత్నం మంచిగానే చేశాడు. నిన్నటి దాకా పూలే, అంబేడ్కర్ పేరుతో తన చుట్టూనే తిరిగిన విద్యార్థులు తెలంగాణ పేరుతో అగ్రకులాలతో అంటకాగితే, దళితోద్యమం బలహీనమౌతుందని భయపడ్డాడు. దేశాన్ని సామాజిక న్యాయ వునాదులపై నిలబెట్టే నాయకులుగా ఈ పిల్లల్నే తీర్చిదిద్దాలనుకున్నాడు. స్పష్టం ధ్వంసం అవుతుంటే చింతించకుండా తను మహా వృక్షంలా బలంగా నిల్చున్నాడు. తెలంగాణ రాజకీయాలపై ఆయన టీవీల్లో మాట్లాడుతుంటే అ(గ్రకులాలకు, వారి బానిసలకు ముచ్చెమటలు పట్టాల్సిందే. తెలంగాణ కావాలనుకుంటే, రావాలనుకుంటే దాని వెనుకున్న రాజకీయాలు, కుట్రలు కూడా తెల్సుకోవాలని అంటున్నాడు. అ(గ్రకుల రాజకీయావసరాల కోసం అణగారిన వర్గాల సమస్త త్యాగాలను గుర్తుచేస్తున్నాడు.
బహుజనులకు ఆయుధమే అండ అని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఇండియన్ మావోయిస్టుల్లోని బ్రాహ్మాణత్వాన్ని బయటపెట్టాడు. తాను పూలే, అంబేడ్కర్లను అర్ధం చేసుకున్న నాటి నుంచి హీందూ మతంపై చేసిన భావజాల యుద్ధం తన ప్రతి రచనలో కన్పించినట్టుగానే ఈ పుస్తకంలోని 'కాషాయచరిత్ర' చాష్టర్లో కూడా అంతే పదునుగా కనిపిస్తుంది. పర్సనాలిటీస్ అనే చాప్టర్లో చేర్చిన కొన్ని వ్యాసాలు కొంత చర్చకు దారితీస్తాయని భావిస్తున్నాం. వీటిపట్ట ఆయన తన నోట్లో కొంత వివరణ ఇచ్చారు. దాంతో కొందరు దళిత, బహుజనులు కూడా సంతృప్తి చెందకపోవచ్చు. సామాజికం అనే మొదటి చాప్టర్లో చేర్చిన “బర్త్ డే లేని బర్త, “నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం” వ్యాసాలు ఎందుకు బతుకుతున్నామో తెలియని ఎంతో మంది బతుకులకు స్ఫూర్తినిస్తాయి. మిగతా వ్యాసాలు దళిత, బహుజనులపై ఆధిపత్య కుల, వర్గ సమూహాలు చేస్తున్న దాడులను ప్రతిఘటించడాన్ని నేర్పుతాయి.
ఉస్మానియా యూనివర్సిటీ... ఇక్కడ ఆదాయం కోసం [ప్రాఫెసర్స్, ఐడియాలజీ కోసం ప్రొఫెసర్డుంటారు. రెండోదాని కోసమే ఉన్న కొద్ది మంది ్రాఫెసర్లలో అతిబలమైన వాడు, నిబద్దుడు కంచ ఐలయ్య, చదువులు సజావుగా చెప్పే సార్లతో పాటు, విద్యార్దులను మోసగించే సార్టు, వీళ్ళను మోసగించే విద్యార్థులుంటారిక్కడ. కులం కోసం మార్క్సిజం, అంబేడ్కరిజం పరిడవిల్లునిక్కడ. ఇలాంటి విశ్వవిద్యాలయ వాతావరణంలో వ్యక్తిగత సంబంధాలను బలహీనపరుస్తూ భావజాల సంబంధాలను బలపరుస్తున్న అఆధ్యాపకుడాయన. పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాస్తున్న కొంతమంది పప్రాఫెసర్హు ఆచరణకు దూరంగా నిలబడ్డారు.
౪
భావజాల సామీష్యత గల టీచర్, స్టూడెంట్స్ మధ్య ఆచరణాత్మక ఐక్యత కోసం తెలంగాణ
విద్యార్థి ఉద్యమ (ప్రారంభ దశలో ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ (కాస)
కృషి చేసింది. రెండు వైపుల నుంచి సుముకత, విముకతలు వ్యక్తమయ్యాయి. కష్టంగానైనా ముందుకెళ్చామని ప్రయత్నిస్తున్న (క్రమంలో ప్రొఫెసర్ ఐలయ్య అందించిన చొరవ, కృషి అద్వితీయమైనది. దాపరికాలు లేకుండా కొండబద్దలు కొట్టినట్టుగా ఉండటం, తన విద్యార్థుల దగ్గర స్టాయి డాంబికాలు ప్రదర్శించని తత్వం ఈ ప్రయోగానికి మార్గం వేసింది. ఇప్పుడిప్పుడే యూనివర్సిటీల్లోకి వస్తున్న యస్.సి, యస్.టి. బి.సి. మైనార్టీ, మహిళా విద్యార్దులను మరింత శక్తివంతులుగా, సృజనశీలురుగా తీర్చిదిద్దడానికి మన అధ్యాపకులు ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంది. నిన్నటి దాకా అగ్రకుల విద్యార్దులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుకున్న అధ్యాపకులున్నారు. ఇప్పుడు ఆ పని చేయాల్సిన బాధ్యత మన అధ్యాపకులపైన, స్వీకరించే కర్తవ్యం విద్యార్దులపై ఉంది. టీచర్, స్టూడెంట్ మధ్య సక్యత, ఐక్యత లేకపోవడం వల్ల మన కళ్ళ ముందే భారీ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో అనామకంగా బతుకుతున్న జాతులను మేల్కొల్పడానికి టీచర్, స్టూడెంట్ సంబంధాలు బలపడాలి. నమ్మిన భావజాలాన్ని నిలబెట్టటానికి ఐలయ్య 'ది సింగిల్ టీచర్ వర్కింగ్ విత్ స్టూడెంట్స్ ఫర్ దళిత్, బహుజన్ ఐడియాలజీ*. అయినా ఆయన ముందు రెండు బాధ్యతలు ఉంచుతున్నాం. 1 మార్క్స్ పూలే, అంబేడ్కర్ సిద్దాంతాల పేరుతో అగ్రకులాల రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్న విద్యార్థులను 2. అంతర్గత పోరులో బలౌతున్న దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులను సరిదిద్దే బాధ్యత కూడా ఆయన పైనే ఉంది. మీ వ్యాసాలను పుస్తకంగా కౌస తేవాలనుకుంటుందని అడగడంతోనే అంగీకరించిన సార్‌కు ధన్యవాదాలు.
ఈ పుస్తకానికి ముందు మాట అందించిన చరిత్రకారులు 'ప్రా॥ః అడపా సత్యనారాయణకు, ఈ 'బర్త్ వితొట్ బర్త్‌డే' పుస్తక ప్రచురణకు ఐదేళ్ల సూర్య, వార్త ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికల నుండి వ్యాసాలు సేకరించిన బోధి వెంకట్. నాతో పాటు అన్ని వేళల శ్రమించిన జొస మిత్రులు బండారి వేణుగోపాల్‌రెడ్డి అడగ్గానే అందమైన కవర్‌పేజీని అందించిన కూరేళ్ళ శ్రీనివాస్‌కు, దానికి కారణమైన స్కాలర్ శివకృష్ణ ఫోటోగ్రాఫర్ రవిందర్ డిజైనర్ జాన్స్ ముఖ్యంగా ఈ పుస్తకం (ప్రచురించాలనుకోగానే పబ్లిషర్‌గా ఉంటానని హార్ధిక, ఆరిక సహకారం అందించిన రైట్టు ఫేయిత్ వారికి ధన్యవాదాలు.
పబ్లిషర్స్ సుదర్భన్ బాలబోయిన (గౌస అధ్యక్షులు), 6/10/2021 ఓయూ క్యాంపన్ న ందుకు భిన్సుంగా ఈ దేళ మూలవానీ మపొషాతూర వర్ధంతి వచ్చిన తర్వాత రాసినది) ఇ]
బర్త్‌డే లేని సెన్ను పోరాట యోధుడు అణాల
గత మూడు దశాబ్దాలుగా పెన్నునే గన్నుగా మార్చి గన్ను పార్టీల వర్ష సిద్ధాంతాలకు దేశీయ తాత్వికత, భావజాలాన్ని జోడించిన దళిత బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య. తన పదునైన కలంతో (బ్రాహ్మణీయ భావజాలంపై సైద్దాంతిక పోరాటాన్ని కొనసాగిస్తూ, దాని తాత్వికతను ప్రశ్నిస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రాపంచిక దృక్పథాన్ని, ఆలోచనా విధానాన్ని విసృతంగా (ప్రచారం చేస్తున్న 'గుడ్షపర్డ్ ఆయన. ఆయన రాసిన నేను హిందువునెట్టయిత' పుస్తకం (ప్రపంచవ్యాప్తంగా ఎకడమిక్, రాజకీయ, మత, సాంస్కృతిక, పౌర సంఘాల్లో ప్రాచుర్యం పొంది పలువురి ప్రశంసల్ని అందుకుంది. అందుకే అది అంతర్జాతీయ స్టాయిలో అనేక అమెరికన్, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా చేర్చబడింది. దళిత బహుజన ప్రత్యామ్నాయ భావజాలాన్ని, సైద్దాంతికత, తాత్వికతల్ని ప్రస్పుటంగా ప్రస్తావించడమే దాని ప్రత్యేకత. “నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం” అనే వ్యాసంలో దాన్ని గురించి రాస్తూ "వై అయామ్ నాట్ ఎ హిందూ” పుస్తకానికొచ్చిన గుర్తింపు ఈ రాష్ట్రం, ఈ దేశపు దళిత బహుజన సంస్కృతికి, దానిలో పుట్టి పెరిగిన తాత్విక ఆలోచనా విధానాలకు వచ్చిన గుర్తింపు అని చెప్పాడు. అదేవిధంగా ఈ పుస్తకంలో భారతీయ సమాజంలో (బ్రాహ్మణీయ సంస్కృతి, విలువలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఏ విధంగా అడుగు వర్గాల వారి కంటే భిన్నంగా ఉంటుందో తన అనుభవాల ద్వారా వివరించాడు.
'ప్రస్తుత పరిశీలనా (గ్రంధంలోని వ్యాసాలు కంచ ఐలయ్య రచనా శైలిలోని విశిష్టతను, ప్రత్యేకతను తెలియచేస్తాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన దృష్టిలో అణగారిన వర్గాలు ఒక నిర్దిష్టమైన రాజకీయ పోరాట లక్ష్యాన్ని కలిగి లేనంతవరకు, హేతుబద్ధ సిద్దాంతాన్ని, తాత్వికతను రూపొందించులేనంత వరకు సామాజిక న్యాయ పోరాటాలన్నీ ఆరాటాలుగానే ఉండి పోతాయి. అందువల్ల దేశీయ పరిజ్ఞానం, అ(గ్రకులాల ఆధిపత్యాలపై సమగ్ర ఉద్యమం, విశాల (ప్రాతిపదికపై కలిసి ఉండే ప్రగతిశిల సమూహాలు, (ప్రజా, కులసంఘాలు ఎదిరించాల్సిన శత్రువర్గాలు, కులాల గురించిన స్పష్టతలపై చేసే శాస్త్రీయ అధ్యయనమే దళిత బహుజనులకు సైద్దాంతిక పునాదిని ఏర్పరుస్తుందనేది ఆయన నమ్మకం. బుద్దుడు, వేమన, వీరబ్రహ్మం, పూలే, అయ్యంకలి, అయోదిదాన్ నారాయణగురు, అంబేడ్కర్; పెరియార్; మార్క్స్, లెనిన్, మావోల ఆలోచనలు, తాత్విక ధోరణులను ఆకళింపు చేసుకుని నిర్దిష్టమైన దేశీయ తాత్విక సిద్దాంతాన్ని, భావజాలాన్ని రూపొందించడం నేటి అవసరమని స్పష్టం చేశాడు. ఈ రకమైన సిద్దాంతిక పునాదిపై జరిగే పోరాటాలు మాత్రమే అట్టడుగు వర్గాల విజయానికి, విముక్తికి తోడ్పడుతాయని కూడా అనేక రచనలు తెలియచేస్తున్నాయి. అందుకోసం విశాల (ప్రాతిపదికపై దళిత
న.
బహుజనుల అణగారిన వర్గాల ఐక్య సంఘాలు ఏర్పడాలనేది ఐలయ్య ఆకాంక్ష తరతరాలుగా అట్టడుగు వర్గాల్ని అణచివేతకు, దోపిడికి గురిచేసిన అగ్రకుల సమాజం, అగ్ర వర్ష ఆధిపత్య రాజ్యంపై నిరంతర పోరాటాలు చేయడానికి కలసి వచ్చే సమిష్టి మిత్ర శిబిరాల్ని ఏర్పాటు చేసుకోవల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకంలోని అనేక వ్యాసాలు స్పష్టం చేశాయి. దళిత బహుజన, బడుగు బలహీన వర్గాలు సామాజిక న్యాయాన్ని పొందడానికి వాటా, కోటాలకు సంబంధించిన పోరాటాలతో పాటు (ప్రత్యామ్నాయ రాజకీయ స్పృహను, తాత్వికతను, సాంస్కృతిక శక్తిని మేళవించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దీర్హకాలిక కార్య(క్రమాన్ని రూపొందించుకోవల్సిన అవసరాన్ని తెలియచేశాడు. అంతేకాకుండా దళిత బహుజనులు అ(గ్రకులాల ఆధిపత్యంలో నడిచే వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం కింద పని చేయకుండా, పరాధీనతకు, దాస్యానికి గురి కాకుండా ప్రగతి శీల దృక్పధంతో ఆలోచించి, చైతన్య స్థాయిని పెంచుకొని రాజకీయ విముక్తి ఉద్యమాల్లో స్వతంత్రంగా నిలిచి పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. అందుకుగాను దళిత బహుజన మేధావులు, సిద్దాంతకర్తలు, ఉద్యమకారులు (బ్రాహ్మణేతర సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుందని తెలియచేశాడు. ఈ పుస్తకంలో అనేక వ్యాసాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
ఈ పుస్తకంలో ఐలయ్య రాసిన వ్యాసాల్ని అంశాల వారిగా పరిశీలించడం అసాధ్యం. ఎందుకంటే ఆయన చేసిన విశ్లేషణలు స్టానిక, జాతీయ, అంతర్జాతీయ కోణాల్ని కలిగి ఉన్నాయి. అయినప్పటికి ఈ వ్యాసాలన్నింటిని కలుపుతున్న సైద్దాంతిక, తాత్వికతల మూలం ఒక్కటే. అది దళిత బహుజనుల అస్టిత్వానికి, చైతన్యానికి, ఆత్మ స్టైర్యానికి, స్వాధికారతకు సంబంధించింది. నా ఉద్దేశంలో ఈ వ్యాసాలకు ఒక ప్రత్యేకత, నిర్దిష్టమైన సామాజిక, చారిత్రిక రాజకీయ నేపథ్యం ఉంది. అదేమంటే సమకాలీన పరిస్థితుల్లో, ముఖ్యంగా గత శతాబ్దపు చివరి దశకాల నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో విశాల (ప్రాతిపదికపై అణగారిన బడుగు బలహీన వర్గాల్లో విసృత స్థాయిలో నూతన ఆతా శభిమానం, చైతన్యం విస్తరించటం. 1970 దశకంలో (ప్రారంభమైన దళిత పాంథర్స్ ఉద్యమం, 1980 దశకంలోని దళిత మహాసభ పోరాటాలు, 1990 దశకంలోని మండల్. మజీద్ ఉద్యమాలు జరుగుతున్న (క్రమంలో దళిత బహుజనులు తమ అస్థిత్వాన్ని, ఉనికిని ప్రస్ఫుటంగా చాటుకుంటూ తమ చైతన్యాన్ని, సంఘటితశక్తిని పెంపొందించుకునే బలమైన (ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పరిణామాల (క్రమంలో కంచ ఐలయ్య లాంటి దళిత బహుజన ఆర్గానిక్ మేధావులు, తత్వవేత్తలు, సిద్దాంతకర్తలు అణగారిన వర్గాల, కులాల పక్షాన నిలబడి సాంప్రదాయ బ్రాహ్మణీయ శక్తులపై భావజాలపరమైన ఎదురుదాడికి అంకురార్పణ చేశారు. దానికి దళిత బహుజనుల (ప్రత్యామ్నాయ చరిత్ర, సామాజిక సాంస్కృతిక పరిశోధన, రచనలు ముఖ్యమైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి
అనేది నా అభిప్రాయం. అందులో భాగంగానే దళిత బహుజన ధిక్కార సాహిత్యం 11
(ప్రాచుర్యం పొందింది. కంచ ఐలయ్య రాసిన/ రాస్తున్న ఎకడమిక్ పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు, పాపులర్ వ్యాసాలు ఈ నూతన సాహిత్యంలో (ప్రముఖ స్టానాన్ని ఆ(క్రమించాయనేది వాస్తవం. సెక్యులర్ దళిత బహుజన (ప్రాపంచిక దృక్పథాన్ని, జాతీయతను, వారసత్వాన్ని స్వంతం చేసుకున్న మేధావి కంచ ఐలయ్య అనే విషయం ఈ పుస్తకం చదివిన వారందరికి స్పష్టమౌతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అపారమైన మేదో సంపత్తి రచనా సామర్థ్యం గల మేధావిగా ఆయనకున్న గుర్తింపును నేను ప్రత్యక్షంగా గమనించాను. నేను తరచుగా విదేశాల్లో ఉపన్యాసాలిచ్చినప్పుడు జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో చాలామంది ప్రొఫెసర్స్ ఐలయ్య రచనల్ని నాతో చర్చించారు. అంతేకాకుండా వికిపీడియా, ఇంటర్నెట్, గూగుల్‌తో ఆయన పాపులారిటీ గురించి వేరే చెప్పవల్సిన అవసరం లేదు. నాకు తెల్పిన ఒక ఉదంతాన్ని గురించి చెప్పి ఈ ఉపోద్దాతాన్ని ముగిస్తాను. గత సంవత్సరం కొంతమంది ప్రాంతీయ దురభిమానులు ఆయన పట్ల దురుసుగా (ప్రవర్తించినప్పుడు అమెరికా, యూరోప్ దేశాల్లోని అనేకమంది దాన్ని ఖండిస్తూ ఒక నిరసన ఉత్తరాన్ని రాశారు. దాంట్లో ఐలయ్యను “మిలియన్ల కొద్ది మూగ (ప్రజల స్వరమని” కొనియాడారు. నాకు నచ్చిన పేరా! "1065501 జాయ 1124121 15 66 001” 0061160041 ౪/10 $/566002602107 అంం564 116 ౯4461 05 0064641901 ఖర 616 ఇంకఠంగగకం 10260021 04016 05 8220020150 25 ౪611 25 006 లం1014676 26162 08 866 001 9అ2810” 01 16 ఇరఅా 9002. 06 0085 తర 0009850000 అడ్రజబ్రలం6గ6 100 66 ౧1౯- 612 01 159866 00[06యూ2 06 డ21రు200)20 216 2 $00766 0 350260 టా! [006 101 6 ౦6604158 91606664 060016" తన సృజనాత్మక రచనలతో అణగారిన అశేష ప్రజానీకానికి ఐలయ్య మార్గదర్శిగా కొనసాగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. చివరగా ఒకమాట ఈ పుస్తకాన్ని ప్రచురించే బాధ్యత తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనీయులు. ఎందుకంటే యూనివర్సిటీలోనే ఇది మొదటిసారిగా విద్యార్థి - ఉపాధ్యాయుల మధ్య ఏర్పడిన భావజాల ఐక్యత, దీనివల్ల (ప్రజాస్వామ్య, దళిత బహుజన ఉద్యమాల్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. దళిత బహుజన మేధావి వర్గంలో భావసారూప్యత, సమిష్టి కృషి పీడిత వర్గాల ఉద్యమాల్ని మరింత సంఘటిత పర్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతుందని నా నమ్మకం. ఉస్మానియా వర్సిటీ స్కాలర్స్ చేపట్టిన ఈ కార్యక్రమం మరింత ముందుకు కొనసాగాలని ఆశిస్తాను. అడపా సత్యనారాయణ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ 1%
పూచీ లేని పుట్లుక ఠు
'బర్త్ డే లేని బర్తో నేను చాలా పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం. ముఖ్యంగా సూర్య పత్రికలో రాసిన 'షఫక్ట్స్ వర్డో కాలం పారకుల మధ్య (ప్రాచుర్యం పొందింది. నేను ఆ కాలాన్ని ప్రారంభిస్తూ రాసిన మొదటి వ్యాసం బర్త్ డే లేని బర్త్ వాటితో పాటు వార్తలో నేను స్వయంగా తెలుగులో రాసిన వ్యాసాలు కొన్ని నా ఆంగ్ల వ్యాసాలకనువాదాలు, కొన్ని ఆంధ్రజ్యాతిలో వచ్చినవి ఇందులో ఉన్నాయి.
ఈ వ్యాస సంకలనం అచ్చవ్వాలని నేనెనప్పుడు కోరుకోలేదు. వివిధ పోరాట దశల్లో రాసిన ఈ వ్యాసాలకు దీర్హకాల విలువ అంతగా ఉండదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ (09%౫12 76910” 5య0142%5 శ5500142600) దానిని నడుపుతున్న బాలబోయిన సుదర్శన్ తదితర మిత్రులు తాము దీన్ని అచ్చు వేస్తామని పట్టుపట్టారు. వాళ్లే వ్యాసాలన్నీ సేకరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ దాని విద్యార్థులతో (అన్ని డిసిప్టేయిన్స్) నా సంబంధం 38 సంవత్సరాలకు పైపడినది. 1974లో నేను ౫44 విద్యార్థిగా చేరి అక్కడే అన్ని డిగ్రీలు పొంది, రీసెర్చ్ స్కాలర్‌గా, డాక్యుమెంటేషన్ ఆఫీసర్‌గా, లెక్సరర్గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా 1976 నుండి పని చేస్తూ ఉన్నాను. విద్యార్థుల అన్ని ఉద్యమాలతో మమేకమై ఆ క్యాంపస్ గంపలోని కోడిలా బతికాను. ముఖ్యంగా 1990 మండల్ పోరాటం రోజుల నుండి దళిత
- బహుజన, మైనారిటీ విద్యార్థులు నా చుట్టు కోడి పిల్లల్హా తిరిగారు. నా నుండి వాళ్లు వాళ్ల నుండి నేను ఎన్నో కొత్త అంశాలు నేర్చుకుంటూ జీవించాం. నా కళ్ల ముందు ఎన్నో బ్యాచ్‌లు వచ్చిపోయినాయి. ఆ క్యాంపస్ వాతావరణాన్ని నా రచనలు, ఉపన్వాసాలు ఎంతో మార్చాయని వాళ్లు ఎన్నోసార్లు చెప్పినా నేను సంతృప్తి చెందలేదు. ఆ క్యాంపస్‌లో పదవులకు దూరంగా ఉండి విద్యార్థులకు దగ్గరగా, పుస్తకాల్లో పుస్తకంగా జీవించడం నాక్సు, కొంత మంది విద్యార్థులకు ఒక నిరంతర సంఘర్షణగా ఉండేది. పదవుల పోటీకి బదులు, చదువుల పోటీని పెంచడం కత్తిమీద సామువంటిది.
ఉస్మానియాలోని వ్యూడల్ వాతావరణాన్ని మార్చి, దానిలో దశలు దశలుగా పుట్టుకొచ్చిన చదువు వ్యతిరేక మతతత్త శక్తులను ఎదుర్కొని నిరంతరం అక్షర పోరాటం చెయ్యడం, నాకు మహాత్మ పూలే, అంబేద్కర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న కొంత
మంది విద్యార్థులకు ఒక సవాల్‌గా నిలిచేది. కొన్ని ఉద్యమాలు వాళ్ల జీవితాలను మార్చితే, మరికొన్ని ఉద్యమాలు వాళ్లని తిరిగి బానిసల్ని చెయ్యడానికి ముందుకొచ్చేవి. కులాతీత ఉద్యమాలన్నిటికి మోసం చేసే లక్షణముండేది.
న
క్లాసులో విద్యార్థులు కూర్చోకుండా ఉండే స్థితిలో ముఖ్యంగా దళిత బహుజన పిల్లలు ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో, కాలేజీల్లో ఎక్కువ మంది చేరాక వాళ్ల కుల నిర్మూలనా చైతన్యం అనునిత్యం కాపాడుకోవడం అంత సులభం కాదు. టీచర్స్‌లో ఎవ్వరూ వాళ్లను వెన్నంటి 'దారి చూపకపోతే' "ఆడీ పాడే' వాళ్లు అంధ మేధావులయ్యే (ప్రమాదం అడుగు అడుగునా ఉండేది. దానికి పదవిలో ఉండే టీచర్కంటే కలంతో కాలం గడిపే టీచర్, పాఠం పటిష్టంగా చెప్పే టీచర్ కావాలి. ఈ పనికి కొంత మందిమి పూనుకున్నాం. ఏ ఉస్మానియానైతే సంవత్సరాలు, దశాబ్దాలు కష్టపడి, ఆ[గ్రకుల హిందూత్వ శక్తులను ఎదిరించే క్యాంపస్‌గా మల్చామో 2000లో తెలంగాణ ఉద్యమం పేరుతో కొంత మంది టీచర్జు, విద్యార్దులు దాన్ని కులాతీత ఉద్యమంగా, అగ్రకుల ఆధిపత్యంలో పైసల పంపకం, పూలే, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, దొడ్డి కొమురయ్యలు ప్రత్యామ్నాయ సింబల్స్‌గా రూపొందుతున్న చైతన్యాన్ని పాతిపెట్ట చూసారు. తెలంగాణ సాధన, హిందూత్వ, అ(గ్రకుల శక్తులతోనే సాధ్యమనే సాకు ముందుకు తెచ్చారు. తెలంగాణ ప్రాంతమంతా కుల చైతన్యాన్ని కూకటివేళ్లతో పీకే ప్రయత్నం చేశారు. దళిత బహుజన విద్యార్థులను ఆత శ్రహత్యలకు పురికొల్సారు.
దాన్ని కొద్ది మంది విద్యార్దులు (గ్రహించారు. కాని యూనివర్సిటీ ఉపాధ్యాయుల్లో ఒక చిన్న (గ్రూపు రాష్ట్ర సాధనను చావు బతుకుల సమస్యను చేసి సంపాదించడం మొదలెట్టింది. మొరాలిటీ మొత్తంగా అడ్డం తిరిగింది. ఉద్యోగాలు లేక ఏండ్ల తరబడి డిగ్రీలు పూర్తిగాక బతుకుదెరువే భయంగా కనిపించిన విద్యార్థులకు ఇదొక అదను అవకాశమైతే, రీసెర్చ్ ఒక భూతంగా కనబడే టీచర్లు రోడ్డు నాయకులయ్యారు. ఈ దశలో కుల నిర్మూలనా సిద్దాంతాన్ని మళ్లీ పట్టాల మీద పెట్టడం సమస్యే. ఈ దశలోనే జౌస చుట్టు ఉన్న ఒక చిన్న విద్యార్ధి వర్గం, అంబేద్కర్, పూలే నరకాసుర జయంతుల్ని పెద్ద ఎత్తున జరిపి అగ్రకుల కుట్రల్ని తిప్పికొట్టారు. ఈ పుస్తకాన్ని ఆ విద్యార్థులే అష్టకష్టాలకోర్చి ముద్రించాలని ముందుకొచ్చారు. ఇదే తెలంగాణను ధూం ధాంల సంస్కృతి నుంచి, అక్షరాలను దున్నే సంస్కృతిలోకి తిరిగి తేవడానికి ఉపయోగపడింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాసినవైనందున కొన్ని వ్యాసాలు 'ఐలయ్య' ఎట్లా రాసాడనిపించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా కొంత మంది రాజకీయ నాయకుల మీద నేనేసిన అంచనాలు తప్పుకదా! వాస్తవంలో వాళ్ల ఆ సిద్దాంతాలకు కట్టుబడిలేరు గదా అనిపించవచ్చు. ఒక్క నరేంద్ర మోడి వంటి బి.సి. నాయకున్ని తప్ప, బి.సి. ఎస్.సి. మైనారిటీ నాయకుల మీద నెగెటివ్ వ్యాసాలు నేను కావాలనే రాయలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కొంత మంది నాయకులు సామాజిక న్యాయంలోకి సమీకరించబడాలనే ఆశాభావంతో కొన్ని వ్యాసాలు రాసాను. వాళ్లు సామాజిక న్యాయం పట్ట పిల్లిమొగ్గలేసి తమ రాజకీయ జీవన పరిరక్షణకు పాకులాడి ఉండవచ్చు. అందరు
నే
అంబేద్కర్హు కావాలని ఎట్టాగైతే ఆశించలేమో, అందరు కాన్టీరాంలు కావాలని కూడా ఆశించలేం. అన్ని రంగాల్లో అగ్రకుల సూద్రులు ఆధిపత్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకత్వంపై మెట్టెక్కడం చాలా కష్టతరమైంది. మనం నిరంతరం చూస్తున్న ప్రయత్నం వల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొంత కంటికి కనబడే శక్తివంతమైన నాయకత్వం ఎదుగుతున్నది. దాని బలహీనతలెట్టున్నా ఎంకరేజ్ చెయ్యాల్సిన అవసరమున్నది. అందుకే ఇందులోని కొన్ని వ్యాసాలు బలహీనంగా ఉన్నా బలానికి నిదర్శనం.
తెలంగాణ సమస్య ముందుకొచ్చాక 'సామాజిక న్యాయం' సమస్య బాగా వెనక్కి నెట్టివేయబడ్డది. [ప్రాంతీయ ఉద్యమాలు ఈ పాత్రను బాగా నిర్వహించగలవు. కుల పోరాటాలను పక్కకు పెట్టి, ప్రాంతీయ పోరాటాల్లో పని చేసే దళిత బహుజనులు రేపో, మాపో ముఖ్యమంత్రులం, మందత్రులం మనమే కాబోతున్నామనే జోష్‌లో ఉంటారు. ఈ (క్రమంలో తెలంగాణలో చాలా పెద్ద ప్రమాదమొకటి మనముందుకొచ్చింది. అదే మతతత్వ పార్టీలకు, సంస్థలకు, సెక్యులర్, వామపక్ష, విష్ణవ శక్తుల పక్కన సంపూర్ష గౌరవ స్థానం దొరకడం. [క్రమంగా హిందూమతతత్వ శక్తులు, మళ్లీ ఆధిక్యతను సాధించి, మైనారిట్లపై యుద్ధం ప్రకటించే ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు ఆ (ప్రమాదం నుండి ఈ ప్రాంతాన్ని కాపాడడానికి ఉద్దేశించినవి. నా ఉద్దేశంలో అతి కీలమైన వ్యాసాలు ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు మీడియం విద్య మీద రాసినయి. దళిత బహుజనుల భవిష్యత్‌కూ ఇంగ్లీష్ విద్యకు ఎంతో సంబంధమున్నది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యనడ్డుకోవడానికి ఆగ్రకుల మేధావులు ఎన్నో ఎత్తుగడలేస్తున్నారు. ఈ దేశంలో కిండర్ గార్డెన్ నుండి 12వ తరగతి వరకు అన్ని వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో దేశమంతటా ఒకే సిలబస్ ఒకే విధమైన టీచర్ టైనింగ్ ఉన్న స్కూళ్లలో చదువుకోగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఈ పుస్తకం 092214 ౮౧176910” 5010145 ఓ58001260% విద్యార్థుల ('ప్రయత్నంతో బయటికొస్తుంది. అది వారికే అంకితం, ఏ పూచీలేని పుట్టుక పుట్టిన మానవుడైనా సచ్చేనాటికీ తనదంటూ ఒక పూచీ గల సంతకం చెయ్యాలి. అదే నా కోరిక.
కంచ ఐలయ్య 17/9/2011 హైదరాబాద్ క!
విషయ సూచిక 1 సామాజికం
-
బర్త్‌డే లేని బర్త్ 3
-
మంగలి కత్తి బాంబు కంటే పదునైనది ర్ 3, నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం 9 4, గాడ్ ఆడా, మగా? 12
-
కేపిటల్ హిల్, మానవీయ విలువల శిఖరం క్షే5
-
సాంస్కృతిక ప్రపంచీకరణ అంటే ఎందుకంత భయం? దళిత, బహుజనులకు మోక్షం కలిగించేది అదే! 18
-
లౌకికవాదం - భిన్నత్వంలో ఏకత్వం, కులాన్ని చర్చించడం తక్షణావసరం 22
-
అంబేడ్కర్ దశ, దిశ అగ్రకులాలకు అర్థం కావడం లేదు 26
-
మన జర్నలిస్టులు చెప్పులతో రాస్తున్నారా? 209
-
పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది! 3 1 ఇండీయన్ మావోయిస్టులు
-
సామాజిక న్యాయం మావోయిస్టుల మనోభావం 39
-
బ్రాహ్మణిజం వర్సెస్ మావోయిజం శ్త2
-
ప్రచండుడు కూలదోసిన ఆఖరి హిందూ రాజ్యం త్న్
-
నక్సల్స్‌తో చర్చలు - ఆయుధాల ప్రళ్ట - బహుజనులకు ఆయుధమే అండశ48ి
-
విష్ణవోద్యమాన్ని దళితీకరించడం ఎలా? 52
-
ఆ ముగ్గురి మధ్య కులం పనిచేయలేదా? 56 111 తెలంగాణ
-
మావోయిస్టుల పాత్ర లేకుండా తెలంగాణ వస్తుందా? 63 18 ప్రజా తెలంగాణ అంటే ఏమిటి 67
-
సామాజిక తెలంగాణ వ్యతిరేకళశక్తుల ఐక్య కదలిక! గ్లా్మే
-
రెండు రాష్ట్రాలు : ఒకే నినాదం 7త్తీ సై!
-
భాషా ప్రయుక్త రా[ష్టాలు బతుకుతాయా? 78
-
రెండవ ఎస్సార్సీ : 'భాషా రాష్ర్రాల' పునఃసమీక్షకే 81
-
పొత్తులు తెలంగాణ సాధనకేనా? 85 24, హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్టమైతే? 88
-
బతుకమ్మ కాదు .... రాజకీయాలాడాలి 9్షే
-
చదువుకు సమ్మె వద్దు 95 భాష - బహుజన దృక్పథం
-
మాతృభాషావాదంలో మతలబు ఏమిటి? 103
-
మాతృభాషా, వలస భాషా రెండూ సమానమే! 107
-
ఇంగ్లీష్ అంత భూతమైతే, ఇంతగా ఎందుకు వ్యాపించింది? 111
-
భాషా రాజకీయం బహుజనులతో చలగాటం కేర్ 31నా వాళ్ళంతా అమెరికాలో ఉంటే, నేను తెలుగునే (ప్రేమిస్తా కషం
-
ఇస్లాం సమాజం ఇంగ్రీష్ నేర్వాలి 124
-
'రెండు కాళ్ళ విద్య" అంటే ఏమిటి? 128 3% సిబిఎస్ఈ సిలబస్‌కు వ్యతిరేకత ఎందుకు? 131
-
ఉన్నత విద్య నాణ్యత ఎలా పెరుగుతుంది? 134 ₹ కామ్రేద్స్
-
కమ్యూనిస్టుల ప్రైవేట్ డిజైర్ క్షంం
-
భూ పోరాటానికి మించిన చదువు పోరాటం [42
-
కమ్యూనిస్టులు (ప్రభుత్వంలో ఎందుకు చేరాలి? కతర్ 11కుల నిర్మూలన
-
దళిత రాజకీయాలకు కొత్త దిక్సూచి 151
-
నేటికీ కనిపించని అపరాధభావన. కుల నిర్మూలన మన అజెండాలో లేదా? 155
-
కులంపై ఫిర్యాదు దేశద్రోహమా? 158
-
హౌస్ కమిటీ ముందు దళిత సమస్య, మన మేధావులకు భయమేల _ 162
-
జాతి ఎజెండాలో కుల నిర్మూలన ఉందా? 165 ౫17
౪711 ఒబిసి 44. ఒబిసి రిజర్వేషన్ ఒట్టిదేనా? వ్యతిరేకుల వత్తిడిలో నీరుగారిన ప్రతిపాదన 171 45. ఓటు పోర్స్‌గా మారిన ఒబిసి “ఓటుబ్యాంకు” 174 46. ఒబిసిల కాళ్ళు కట్టి పరుగెత్తమంటోంది - సుప్రీంకోర్టు 177 47. బి,సి.లకు ప్రత్యేక ప్రణాళిక 180 ఇ కాషాయ చరిత్ర 48. చరిత్రకు కాషాయ వర్షం తొలగితే చాలా? 187 49. అభివృద్రికీ, అయోధ్యకు పొత్తు ఎలా? 191 50. రాముడు - రామసేతువు వివాదం, న్యాయ పరిష్కారం సాధ్యమేనా? 195 ర్1, ఒరిస్సాలో కందమల్ ఎందుకు కాలుతుంది 108 52. ఇక్కడ కూడా ఒక మోడీ పుట్టొచ్చు 4 201 0 పర్సనాలిటీస్ 53. విపిసింగ్ ది ఇండియన్ లింకన్ 207 54. ఆఖరి గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే 210 55. సోనియా సంస్కర్త బాధ్యత స్వీకరిస్తారా? 213 56. విమర్శకులను చిత్తు చేసిన లాలూ 217 5్7, పి.వి. మనకిచ్చిన వారసత్వం ఆధునిక చాణక్యం 220 58. బారక్ ఒబామా మనదేశంలో పుట్టి ఉంటే? 224 59. మై రెన్పెక్ట్ టు చిరంజీవి గోస్ అప్ 227 ౫ డెమోక్రసీ 60. ఎన్నికలు, సామాజిక న్యాయం = కులసంఘాలు 233 61. ఈ ఎన్నికలు ఏం తేల్చనున్నాయి 236 62. పంచాంగాల (ప్రజాస్వామ్యం 239 63. ప్రజల ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? 242 గ
చాప్షర్ - 1 లట సామాజికం
- బర్త్‌డే లేని బర్త్
- మంగలి కత్తి బాంబు కంటే పదునైనది!
- నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం 4, “గాడ్ ఆడా, మగా?
- కేపిటల్ హిల్, మానవీయ విలువల శిఖరం
- సాంస్కృతిక ప్రపంచీకరణ అంటే ఎందుకంత భయం? దళిత బహుజనులకు మోక్షం కలిగేంచేది అదే!
- లౌకికవాదం - భిన్నత్వంలో ఏకత్వం కులాన్ని చర్చించడం తక్షణావసరం
- అంబేడ్కర్ దశ, దిశ అగ్రకులాలకు అర్ధం కానడం లేదు!
- మన జర్నలిస్టులు చెప్పులతో రాస్తున్నారా?
- పరిష్కారం ఇస్తుడు దొరుకుతుంది!
గే బర్త్‌డే లేని బర్త్ అవ అణాల
నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. పుట్టిన తేదీ, నక్షత్రం రాయగలిగే కుటుంబాలకు, కులాలకే ఈ దేశంలో పుట్టిన తేదీ ఉంటుంది. నేను పుట్టిన నాటికీ నా కుటుంబానికి గాని, కులానికి గాని చదువు లేదు. స్వాతంత్రానంతరం రాజలింగం అనే ఒక మొదటితరం బిసి టీచర్ మా ఊరి స్కూల్లో చేరి, నన్ను మా అన్నను బలవంతంగా బడిలో చేర్చాడు. ఆయనకున్న విద్యాభిమానం, పిల్లల్ని చేర్చి చూపించి జీతం తీసుకోవలసిన అవసరం రెండూ కలగలిసి నా చదువుకు నాంది పలికాయి. బడిలో పేరెక్కించినప్పుడు పుట్టిన తేదీ వెయ్యాలి కనుకు ఆయన మా అవ్వను (అమ్మను) వీడెప్పుడు పుట్టాడని అడిగాడు. ఆమె బహుశా వరి కలుపు తీసొచ్చి బతుకమ్మలాడే రోజుల్లో (పెత్తరమావాస్యతో) లెక్కచేసి నన్ను కన్న కాలం గురించి చెప్పి ఉంటుంది. నేను పుట్టాననే ఆనందం కంటే నన్ను కన్నప్పుడు తను పడ్డకష్టాలే ఆమెకు ఎక్కువ గుర్తుండి ఉంటాయి.
టీచర్ తన మెదడు నుండి అక్టోబరు 5, 1952 నా జన్మదినమని నిర్ణయించాడు. ఈ జన్మదినాన్ని నేను ఎప్పుడు జన్మదినంగా జరుపుకోలేదు. ఈ దేశంలో నా కుటుంబం లాంటి కుటుంబాల్లో, కులాల్లో బర్త్కే హిందూ సమాజం గౌరవమివ్వనప్పుడు ఆ కుటుంబాల్లో బర్త్‌డే సంస్కృతి ఎక్కడ ఉంటుంది? పుట్టినాక ఆరునెల్లకే అపారమైన 'అమ్మ తల్లి" నుండి చావు తప్పి బయటపడ్డాను. ఆధునిక మెడిసిన్ పుణ్యంతో కాదు, యాపాక్సు, పసుపు పుణ్యంతో - బర్త్‌డే జరుపుకుని ఆడుతూ పాడుతూ కేక్ కోసుకొని తినాల్సిన రోజుల్లో గార్ల మేకలతో ఆడుకున్నాం గాని కేకుతో గాదు. తరువాత చదువులో సంతకం పెట్టి మెట్టు, మెట్టు ఎక్కి వైతన్యవంతుణ్ణి అవుతున్న (క్రమంలో కమ్యూనిస్టునై పండుగలు బూర్జువా పండుగలనుకొని నా పుట్టిన రోజును కూడా జరుపుకునే సంస్కృతికి దూరమై సెలబ్రేషన్ లేని బతుకు మైదానంలో అడుగు లేసుకుంటూ నడిచాను. మూడు సంవత్సరాల క్రితం అక్టోబర్ 2004, 5న నేను అమెరికాలో ఉండగా, నాకు ఆతిథ్యమిచ్చిన ఒక తెల్ల స్త్రీ ఆ రోజు ఉదయం లేవగానే హ్యాపీ బర్త్‌డే కంచ" అంది. అప్పుడు నాకు
పె
౯ సామాజికం గుర్తొంచింది బర్త్‌డే లేని నా బర్త్‌కి టీచర్ ఇచ్చిన డే నాదైందని. హొడుయునో దట్ టుడే ఈజ్ మై బర్త్‌డే అని అడిగాను. గూగుల్ సర్చిలో, వికిపీడియాలో నీ బయోడేటా అంతా ఉంది, అంది ఆమె. ఆ సాయంకాలం వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్లో నాతో ఒక కేక్ కోయించి, క్యాండిల్స్ ఊదించి మొదటిసారి బర్త్‌డే జరిపారు. ఆ దేశంలో ప్రతి వ్యక్తి బర్త్‌డే చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. కనుక, నాకు దాని రుచి చూపించారు. కాని ఆ తరువాత కూడా నేను మళ్ళీ ఎప్పుడూ బర్త్‌డే జరుపుకోలేదు.
ఈ రోజు నుండి వెనక్కి చూసుకుంటే నేను 56 ఏండ్డు బతికాను. ఈ 56 ఏండ్లలో ఏమైనా సాధించానా అనే ప్రశ్న నా ముందు ఉంది. ఐతే నేను ఏమీ సాధించకుండా లేను. అక్టోబర్ 5కు సరిగ్గా ఒక నెల ముందు సెప్టెంబర్ 5న డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్‌డేను ఈ దేశంలో 'టీచర్స్ డే గా జరుపుకుంటారు. ఆయన ఇంగ్లాండులో చదువుకొని, హిందూ ధర్మరక్షణ కోసం హిందూ ఫిలాసఫీ గొప్పతనంపై ఇంగ్లీషులో పుస్తకాలు రాసినందుకు ఆయనకు వైస్ ఛాన్సలర్ పదువులు, వైస్(ప్రెసిడెంట్ పదవి, ఆఖరికి రాష్ట్రపతి పదవి కూడా వచ్చింది. ఆయన జీవితాంతం ఇంగ్లీషులోనే రాసాడు. ఆ హిందూ ఫిలాసఫీలో అంతా మంచే ఉన్నదని ఇంగ్లీషులోనే రాసినందుకు ఆయన బర్త్‌డేనే ఆందరు 'టీచర్స్' ఆనందించదగ్గ డే గా ప్రభుత్వమే ప్రకటించింది.
ఆయన ఇంగ్లాండుకు పోయి చదువుకున్న వయస్సులో నాకు ఆ దేశం గురించి చదివి ఆనందించే అవకాశం తప్ప అక్కడికి పోయే ఊహ కూడా గాలిమేడే. శక్తినంతా కూడగట్టుకుంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చదివే అదృష్టాన్ని మించిన అదృష్టం నాకు లేదు, నా కులానికి లేదు. దాని చుట్టూ ఉన్న కులాలకు లేదు. ఈ ఆర్ట్స్ కాలేజీని ఒకప్పుడు రాధాకృష్ణన్ చూసి (సందర్శించి) ఇది చలువరాయితో కట్టిన బిల్డింగ్ కాని ఇదొక్క చలువరాయిని కూడా ఉత్పత్తి చెయ్యలేదని కామెంట్ చేశాడట. బహుశా అది ఉస్మానలీఖాన్ కట్టిన బిల్లింగ్ అయినందువల్ల కావచ్చు. అక్కడ ఉరూ మీడియంలో చదువు చెబుతుండడం వల్ల కావచ్చు, లేదా తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న చిన్నచూపు వల్ల కావచ్చు. ఆ బిల్జింగ్లో ఒక్క చలువరాయి (లేదా పాలరాయి) వంటి అంటే తనవంటి విద్యావేత్త పుట్టడని ఆయన నమ్మకమై ఉండవచ్చు.
కాని ఆయన హిందూ వేదాంత ఫిలాసఫీకి ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టే వై అయామ్ నాట్ ఎ హిందూ" పుస్తకం ఈ బిల్డింగ్‌లోనే పుట్టింది. రాధాకృష్ణన్ రాసిన ఏ ఒక్కపుస్తకం లేదా ఏ పుస్తకంలోని ఏ కొద్ది భాగమైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రౌట్లెడ్డ్ ఎన్సైక్టోపీడియాలో
భాగం కాలేదు కాని, వై అయామ్ నాట్ ఎ హిందూ' అది ప్రచురించిన అతి కొద్ది కాలంలోనే అందులో ఒక చాప్టరైంది. రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీని వేదాల్లో వెతికిపట్టుకున్నాడు. నేను ఇండియన్ ఫిలాసఫీని మట్టి మనుషుల జీవితంలో వెతికి పట్టుకున్నాను.
బర్త్‌డే లేని బర్త్ క్
ఇండియానంతా ఆయన వేదాల్లో, ఉపనిషత్తుల్లో చూస్తే నేను ఇండియానంతా ఉత్పత్తి. మానవ (శ్రమకి, (ప్రకృతికి మధ్య ఉన్న సంఘర్షణలో చూసాను. ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. నేనూ అదే వృత్తి చేశాను. కాని మా ఇద్దరి ఇండియాలకొక దానికొకటి సంబంధం లేనివి. ఆయన లీజర్ (తినడం, మంత్ర పఠన చెయ్యడం, పండడం)లో తాత్వికత ఉన్నదంటే నేనందుకు పూర్తిగా విరుద్దంగా (క్రియాశీల తాత్వికత లేబర్‌లో ఉందని తేల్చాను.
భారతదేశం శక్తియుక్తులు లేని సైన్సులో స్వయం డిస్కవరీలు లేని దేశంగా మారడానికి కారణం ఫిలాసఫీ అంతా వేదాలు, ఉపనిషత్తుల్లోనే ఉన్నదని భావించడం, (శ్రమతత్వాన్ని పరిశోధించకపోవడమే. యూరపులో ఆధునిక అర్ధశాస్త్రం - ఆడమ్ స్మిత్ రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్" పుస్తకం. అందులో (శ్రమతత్వాన్ని ఆయన సిద్దాంతీకరించాడు. అక్కడి నుండి మార్క్స్ దాస్ క్యాపిటల్‌లో "లేబర్ పవర్‌ను సిద్దాంతీకరించే దశకు అక్కడ తత్వశాస్త్రం పయనించింది. ఈ దేశంలో లేబర్ పవర్ అంతా కింది కులాల్లో ఉంది, దాన్ని తాత్వీకరించొద్దనే కుట్ర బ్రహ్మణీయ కులాల్లో జరగడం వల్ల లేబర్ ఫిలాసఫీతో ముడివేయగల అంశంగా గాని, ఆ రంగంలో ఉన్న మానవులు కామన్సెన్స్ గల ఫిలాసర్స్ అనే అంశం గాని చర్చనీయాంశం కాలేదు.
వై అయామ్ నాట్ ఎ హిందూ" ఆ సంకెళ్ళను తెంపింది. అయితే మూడు వేల ఏండ్డు ఉత్పత్తికి, ఫిలాసఫీకి గల సంబంధాన్ని బలవంతంగా తెంపేసిన భారతదేశంలో, ఏ ఒక్క దళిత బహుజన రచయిత అ బంధాన్ని బలంగా ముడేసి దాన్నాక పరిపక్ప దశకు తీసుకపోలేదు. ఈనాటికీ ఎంతోమంది పిల్లలు గొప్ప తత్వవేత్తలు కావలసిన వాళ్ళు బర్త్‌డే లేని పుట్టుక పుడుతున్నారు, పెరుగుతున్నారు. వాళ్ళలో కొంతమందైనా ఆధునిక ఇంగ్లీషు విద్యలోకి వచ్చి రాధాకృష్ణన్‌లా ఇంగ్లాండు పోయి చదువుకోగలిగితే ఈ దేశ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
ఆ స్థితి రావడానికి ఇక్కడ వీధి పోరాటాలే కాదు, గన్ను పోరాటాలే కాదు, పెన్ను పోరాటాలు ఎన్నో జరగాల్సి ఉంది. ప్రపంచంలో మార్క్స్, అంబేద్కర్ వంటి కొద్దిమంది మహనీయులు మాత్రమే రాజీలేకుండా ఆ పనిని చేయగలిగారు. నా 56 ఏండ్ల జీవితంలో అటువంటి పని ఎంతో కొంత చెయ్యగలిగినందుకు సంతోషమే కాని చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది.
సూర్య -5 అక్షోబర్, 20086
2
మంగలి కత్తి బాంబు కంటే పదునైనది!
జెసి. ప్రభాకర్‌రెడ్డి ఆర్.టి.ఎ అధికారి (అడిషనల్ కమిషనర్) సి.ఎల్.ఎన్. గాంధీని “గడ్డం గీసే నా కొడకా ...” అని ఆయన ఆఫీసులో తిట్టి, తన శరీరపు హావభావాలను ఆయన ఆఫీసులోనే ప్రదర్భ్శించాక, గాంధీ మాత్రం ప్రభాకర్‌రెడ్డి తిట్టిన మాటలను గుర్తుచేస్తూ దానికి పరిష్కారాన్ని మాత్రం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి ఊరుకున్నాడు. ఈ అగ్రకుల అహంకార ధోరణిపై బలహీనవర్గాల నాయకులు, కులసంఘాల నాయకులు, ముఖ్యంగా రాష్ట్రంలోని మంగళ్ళందరూ ఎన్నడూ ఊహించని రీతిలో ఉద్యమించి, చివరికి ఆయన చేత బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఈ పోరాటం ఒక్క మంగళ్ళకే కాదు, మిగతా అణగారిన కులాలకు కూడా ఎంతో ఆత్మగారవాన్ని, అ(గ్రకుల శక్తులు తలవంచుకునే స్థితిని కల్పించింది.
(బ్రాహ్మణీయ భావజాలం తిట్ల రూపంలో, సామెతల రూపంలో, వివిధ ఉత్పత్తి కులాల వనిమంతుల్ని అవమానించే సంస్కృతి ఈ కులవ్యవన్స నరనరాన జీర్లించుకుపోయింది. దాని ఫలితం ప్యూడలిజం, రెడ్డి ఆధిపత్యం అణువణువునా సోకిన రాయలసీమ నాయకులు తమకు అడ్డుపడిన ప్రతి దళిత బహుజన అధికారిని ఇలా తిట్టి వరకు వచ్చింది. రాయలనీమది బాంబు రాజ్యం. అక్కడి సపెత్తందారులంతా బాంబులతో బంతులాడుకోవడం పరిపాటైన జీవనానికి అలవాటు పడ్డారు. కాని, మొదటిసారి వీధుల్లో పడిన మంగలి కత్తి పోరాటం ఆ బాంబుల కంటే బలమైన శక్తి తనకుందని నిరూపించుకుంది. గాంధీ ప్రవర్తన, (ప్రభాకర్‌రెడ్డి ప్రవర్తనలను టీవీల్లో చూసిన వారికెవరికైనా ఒక సూత్రబద్ద మర్యాదగల జీవనం ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో స్పష్టంగా అర్ధమైంది.
ఈ పోరాటం ఇక్కడితో ఆగడానికి వీలులేదు. మన రాష్టంలో మంగళ్ళు కనీసం కులం పేరు మార్చుకుంటేనన్నా ఇలా తిట్టరేమోనని తమ కులానికి 'నాయీ బ్రాహ్మణ”
6
మంగలి కత్తి బాంబు కంటే పదునైనది! (7 అని పేరు పెట్టుకున్నారు. ఆ మార్పును అటు (బ్రాహ్మణులు గుర్తించి వీళ్ళకు బ్రాహ్మణత్వం అంటగట్టలేదు. ఇటు ఇతర ఆధిపత్య, పెత్తందారీ కులాలు పాత పేరుతో తిట్టడం మానెయ్యలేదు. నేను 'సాలు దున్ను, సారె తిప్పు మనకాలపు శ్రమ గౌరవ పాఠాల పుస్తకంలో చూపించినట్టు మంగలి పనిలోని సైన్సును సమాజం మెదడులోకి విద్యార్థి దశలో ఎక్కిస్తే తప్ప కులం చిన్న చూపు, అవమానపు తిట్టు ఈ సమాజపు భాష నుండి తొలగిపోవు, మంగలి కత్తి చరిత్రను, అది రూపొందాక ఈ దేశంలో వచ్చిన మార్పును ఒక చారిత్రక, శాస్ర్తీయ దృక్పథంతో చూస్తే తప్ప ఈ విధమైన కులభాపను వాడకూడదనే ఆలోచన ప్రభాకర్‌రెడ్డి పిల్లలకు కూడా కలుగదు.
మంగలి కత్తి మనదేశంలో సైన్సు అభివృద్ది అవుతున్న మొదటి దళలో పుట్టింది. దీన్ని కనిపెట్టడంలో ఈనాటి మంగళ్ళు మూలవాసులే అనడంలో అనుమానం లేదు. అయితే దానిని హిందూ సన్యాసులు గడ్డం గీకడం, నెత్తి గీకడం హిందూ దైవ వ్యతిరేకమనుకున్నారు. కాని ఉత్పత్తి జీవనంలో ఉండే దళిత బహుజన సమాజం క్షవరాన్ని శరీర శుభ్రత సైన్సులో భాగంగా చూసి పెరుగుతున్న వెంట్రుకల్ని తీసేసి లేదా కత్తిరించి శుభ్రంగా జీవించక్పోతే తమ (శ్రమశక్తిని పెంచుకోలేమని భావించింది. ఈ (క్రమంలో క్షవరం అవసరాన్ని బ్రాహ్మణేతరులంతా ముఖ్యంగా సూద్రులంతా ఒప్పుకున్నారు. తమలో ఆ పని పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల్ని చేయమని ప్రోత్సహించారు. అయితే, శరీరం తోలు తెగకుండా వెంట్రుకల్ని మాత్రమే గీసేసే కత్తిని కమ్మరి కొలిమి పుట్టాకే రూపొందించ గలిగారు. కత్తి నమూనా తయారీని మంగలి పరిశోధకులే రూపొందించి ఉంటారు. కాని దాన్ని అతి సున్నితమైన కత్తిగా రూపొందించింది కమ్మర్జు మాత్రమే. మనదేశంలో ఆతి మెత్తని కమ్మరి కత్తి వర్ధమాన మహావీరుడు జైనమతం పుచ్చుకునే నాటికే రూపొందింది. అందువల్లనే వైదిక సన్యాసి సాంప్రదాయానికి వ్యతిరేకంగా జైనులంతా నున్నగా గుండు గీక్కొని తమ మత (ప్రచారకులుగా తిరిగారు. కాని, మంగలికి అత్యున్నత ఆధ్యాత్మిక, రాజకీయ స్టానం సమాజంలో, వ్యవస్థలో, సంఘంలో దొరికింది. గౌతమబుద్దుని కాలంలో మంగలి కత్తి శాప్రీయతను, క్షవరపు సైన్సు విలువను అర్ధం చేసుకున్న బుద్దుడు ఉపాలిని తన గురువుగా పెట్టుకొని స్వయంగా క్షవరం చెయ్యడం నేర్చుకున్నాడు. ఉపాలికి సంఘంలో తన తరువాత స్టానాన్ని ఇచ్చాడు. ఈ చరిత్ర తెలుసుకొని ఈ దేశంలోని మంగళ్ళు బుద్దిస్టాలు అయి ఉంటే బార్బర్ వృత్తి విలువ మారేది. వాళ్ళు పొలకవర్గంలో భాగస్వాములుగా కూడా ఉండే వారు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఈ చరిత్ర జోలికిపోలేదు.
మంగలి కత్తి క్షవరం చెయ్యడంతో పాటు, ఆపరేషన్లు కూడా చేసింది. మనదేశంలో మొదటి సర్దనులు, డాక్టర్లు మంత్రసానులు మంగళ్ళే. చాకళ్ళు, మంగళ్ళు లేకుంటే ఈ
8 సామాజికం దేశంలోని (గ్రామాలు ఏనాడో రోగాలతో చచ్చేవి. హిందూ సన్యాసులు చాలా మంది చాలా చిన్న వయస్సులో అశు(భ్రతతో చనిపోయేవారు. వాళ్ళు మంగలి డాక్షరు సలహాలను ఎప్పుడూ గౌరవించలేదు.
(గ్రామాల్లో ఉత్పత్తి బాగా పెరగడానికి చాకలి, మంగలి “శుభ్రత సైన్సు' చాలా పనిచేసింది. ఈ దృష్టి ఆలోచన ఈనాడు (గ్రామాల్లో ఏ కులస్తులకూ లేదు. ఎందుకంటే మన స్కూళ్ళలో చెప్పే పాఠాల్లో ఈ కులాలలోని సైన్సు గురించి చెప్పరు. ఇప్పుడైనా కుల సంఘాలు పాఠ్యాంశాల్లో ఈ వృత్తులలోని సైన్సును చెప్పే పార్యాంశాలను చేర్చించేందుకు ఉద్యమించాలి. (శ్రమ గౌరవ పాఠాలు పుస్తకంలో అటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ పని జరక్కపోతే ప్రతి అగ్రకుల లేదా కిందికుల మనిషిలో సైతం ఎంతో కొంత ప్రభాకర్‌రెడ్డి తరహా ఆలోచన ఉండే ఉంటుంది.
తిట్టు భాష ఎక్కడి నుండి పుడుతుంది? విద్యార్థి దశలో కుటుంబ జీవనంలో ఏది సైన్సు, ఏది మంచిది, ఏది చెడ్డదో తెలపనప్పుడు భాషా (ప్రవర్తన అదే విధంగా కొనసాగుతుంది. అది (ప్రభాకర్‌రెడ్డి ఒక్కడి లక్షణమే కాదు. ఈ దొంతర్హ కుల వ్యవస్థలోని చాలా కులాల్జో అలా ఆలోచించేవారు ఉన్నారు. దాన్ని మౌలికంగా మార్చాలి.
మంగలితనంలో సైన్సు మంచితనం లేకపోతే ఎంతమంది చనిపోయేవారనే విషయాన్ని స్కూలు దశలోనే పిల్లలకు చెప్పాలి. అంతేకాక మంగలి కత్తి చేతిలో ఉండి ప్రతి వ్యక్తి తల (మెడతో సహా) ఆ మంగలి చేతికి పోతున్నప్పుడు ఆ కత్తి ఎవరి తలపైనా కోయగలిగేది. ఆ కత్తి శుభ్రతకు, ఆపరేషన్లకు మాత్రమే ఎందుకు పరిమితమైంది? మంగలికి శత్రువునైనా కాపాడే మంచి విలువలు ఉన్నాయి కనుక. ఆ విలువలు ఉన్నాయి కనుకనే సిఎల్ఎన్ గాంధీ అలా వ్యవహరించారు. ఆ విలువలు లేవు కనుకనే ప్రభాకర్‌రెడ్డి అట్టా ప్రవర్తించారు. ఈ పోరాటంలో మంగలి కత్తి బాంబును ఓడించింది నిజమే. అయితే ఈ విలువల మౌర్పిడి ప్రక్రియను సమాజంలోకి చొప్పించాలి. కులనిర్మూలనా ఉద్యమాలు ఇక్కడే ష్యూలు షిలబస్పై ఫొక్షస్ పెట్రాలి, చాలాకాలం కుల ఉద్యమ నాయకులంతా తమ కులానికి అగ్రకుల తోక తగిలించుకుంటే తమ స్తితి మారుతుందనుకున్నారు. కాని అలా జరగలేదు. ఉదాహరణకు మాదిగత్వాన్ని ఓన్ చేసుకున్న మాదిగలకు ఇప్పుడు గౌరవం బాగా పెరిగింది. అందుకే బాంబుని ఓడించడం ఒక ఎత్తైతే, అగ్రకుల సంస్కృతిని ఓడించడం మరో ఎత్తు, దీనికి పూర్తిగా శాప్రీయ పద్ధతిని అవలంబించాల్సిందే. అందుకు పిల్లల మెదళ్ళను స్కూలు దశలోనే మార్చాలి, అప్పుడు అందర్ని, అందరూ గౌరవించుకునే సమాజం ఏర్పడుతుంది. అన్ని వృత్తుల్ని, అన్ని వృత్తుల వారు గౌరవించుకునే సమాజం కూడా అప్పుడే ఏర్పడుతుంది!
సూర్య - 10 ఆగస్టు, 2008
తె నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం అణాల
లండన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ యేషియా (లీసా) 'నేను హిందువు నెట్టయిత?” 2008 పుస్తకానికి ఇచ్చిన అవార్డు సమావేశం గత నెల 17న (బ్రిటీష్ పార్లమెంటు భవనంలో, థాచర్ రూంలో జరిగింది. దాదాపు 80 మంది సౌత్యేషియా మేధావులు హాజరైన ఆ సమావేశంలో (బ్రిటీష్ పార్లమెంటులో అల్ పార్టీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డేవిడ్ అండర్సన్ ఒక సైటేషన్ పత్రాన్ని అవార్డు డబ్బును నాకు అందచేశారు.
ఆ సమావేశానికి హాజరైన వారిలో కొంతమంది 'వై అయామ్ నాట్ ఎ హిందూ పుస్తకాన్ని చదివినవాళ్ళు ఉన్నారు. చదవని వాళ్ళూ ఉన్నారు. అక్కడ అమ్మకానికి పెట్టిన కాపీలను ఎగబడి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకు ముందు అమెరికా, యూరపుదేశాల్లో ముఖ్యంగా ఇదే (బ్రిటిష్ పార్లమెంట్. హౌజ్‌లో, అమెరికా పార్లమెంట్ భవనమైన క్యాపిటల్ హిల్‌లో ఉపన్యసించి ఉన్నప్పటికీ ఈ అవార్డు సమావేశం నన్నింతో కదిలించింది. నా బ్యాగ్‌గ్రౌండ్ నేను 'వై అయామ్ నాట్ ఎ హిందూ' రాసిన పరిస్థితుల బ్యాగ్[గ్రౌండ్ వివరించి మాట్లాడాను.
నేను ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, హార్వర్డ్ లేదా కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మేధావిని కాదు. పోనీ మనదేశంలోని పేరున్న విశ్చ్శవిద్యాలయాలైన ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో (ట్రైనింగ్ పొందిన మేధావిని కాదు. నేను మా (గ్రామంలో చెట్టుకింద స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుండి అందుబాటులో ఉన్న విద్యామెట్టు మాత్రమే ఎక్కాను. గూడూర్ హైస్కూలు, నర్ఫ్భంపేట హైస్కూలు, వరంగల్ యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ అంతిమంగా నేను చేరుకోగలిగింది తెలంగాణ గడ్డలోని, చదువులు సరిగా చెప్పరని పేరున్న ఉస్మానియా యూనివర్సిటీ వరకు మాత్రమే ఎంఎ, ఎంఫిల్: పీహెచ్‌డి ఈ గడ్డమీద మాత్రమే చేశాను. బూర్జువా చదువులు మనకొద్దని నా కమ్యూనిస్టు కామ్రేడ్లు చదువుమానేయించి మమ్మల్ని
9
10 సామాజికం ఉద్యమాల్లోకి రమ్మంటున్న రోజుల్లో నేను ఉద్యమానికి చదువుకు చిన్నవారధి కట్టుకొని డిగ్రీలు పూర్తి చేసుకున్నాను.
ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ మీడియం, ఇంగ్రీషు మీడియం, తెలుగుమీడియం చదువుల్లో చదువుల బురదలో ఒక సాలెపురుగులా పాకులాడుతున్న దశలో పుస్తకాలు కొనుక్కునే వనరు లేక లైబ్రరీలో కూర్చొని ఇంగ్రీషుతో కుస్తీ పట్టాను. హాస్టల్ రేడియో ఇంగ్లీషు న్యూస్ విని యాక్సెంట్ నేర్చుకున్నాను. నేను భాగస్వామినైన విపష్టవ విద్యార్థి ఉద్యమాలు సైతం ఇంగ్లీషును సామ్రాజ్యవాద భాషగా ఎద్దేవా చేస్తున్న రోజులవి. ఆ రోజుల్లో నా ముందేదో కర్తవ్యమున్నట్టు, ఆ కర్తవ్యంలోకి నన్నేదో శక్తి తోస్తున్నట్టు ఇంగ్రీషు భాషతో - ఒక రైతు నాగలితో నిరంతరం భూమిని చీల్చినట్టు నా తండ్రి గొంగడి భుజాన వేసుకొని నిరంతరం గొర్హ కడుపు నింపడానికి అడవులన్నీ తిరిగినట్టు, ఒక కాబ్బర్ చచ్చిన గొడ్డుతోలు పాక్కబోకుండా తియ్యడానికి తన కత్తీ బొటనవేలుతో ఆరుగాలం ఆరాటపడినట్టు ఇంగ్లీషుతో కుస్తీపట్టాను.
ఈ అవార్డు తెచ్చుకోడానికి మన రాష్ట్రంలో, మనదేశంలో (ప్రభుత్వ అవార్డు తెచ్చుకున్న వారిలా నేను పైరవీలు చెయ్యలేదు. ఒకరోజు నేను మద్రాసు "పెరియార్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లో ఉండగా లండన్ నుండి ఫోను వచ్చింది. 'లీసా' మీ పుస్తకాన్ని ఈ సంవత్సరానికి ప్రపంచ ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేసిన పుస్తకంగా ఎంపిక చేసింది. 'మీరు దయ చేసి మా ఎంపికను, అవార్డును అంగీకరించాలని అవలి వ్యక్తి అడిగాడు. నేను కాసేపు ఆలోచించి 'థాంక్స్, ఐయామ్ యాక్సెప్టింగ్ ఇట్ అని చెప్పాను. నాకు వచ్చిన ఈ అవార్డును = అదొక సామ్రాజ్యవాద అవార్హు అని ముక్కు విరిచే మిత్రులు ఉండవచ్చు కూడా. 'లీసా" ఒక ప్రభుత్వసంస్థ కాదు. వెస్టేనర్స్ నడిపే బాగా డబ్బున్న సంస్థ కాదు. ఇది సౌత్ యేషియా ప్రత్యామ్నాయ ఆలోవస్తా విధానాలున్న మేధావి వర్గం నడిపే సంస్థ. నేను అవార్డు అంగీకార ఉపన్యాసమిచ్చాక్ర హాలు దద్దరిల్లేట్టు కొట్టిన చప్పట్టు నా కండ్లకు నీళ్ళు తెప్పించాయి. ఎందుకు? "నై అయామ్ నాట్ ఎ హిందూ' పుస్తకానికొచ్చిన గుర్తింపు ఈ రాష్టం, ఈ దేశపు దళి్య బహుజన సంస్కృతికి, దానిలో పుట్టి పెరిగిన తాత్విక ఆలోచనా విధానాలకు వచ్చిన గుర్తింపు. ఆ పుస్తకాన్ని రాయడానికి నేను ఎంచుకున్న 'పద్దతి' పాశ్చాత్యదేశాల మనకు అందించిన పద్దతి కాదు. ఆ పుస్తకాన్ని నేను కొటేషన్లతో నింపిరాయలేద్సు (ఆ
పుస్తకంలో ఒక్క కొటోషన్ కూడా లేదు). ఈ దేశపు దళిత బహుజనులు అన్ని నిర్మాణాలకు తమ మెథడాలబీని తామే సృష్టించుకున్నట్టు ఈ పుస్తకం రాయడానికి నా మెథడాలజీని నేను ఏర్పరచుకున్నాను. అదే 'అనుభవం ఆధారంగా" పుస్తకం రాసే మెథడాలజీ (ఎక్స్పీరియన్స్ యాజ్ 'ప్రేమ్‌వర్క్ ఆఫ్ రైటింగ్). దాదాపు ఇదే మెథడాలజీని
నాకు కన్నీళ్ళు తెప్పించిన నా పుస్తకం [1 బారక్ ఒబామా తన రెండు పుస్తకాలు రాయడానికి (డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, ది అడాసిటీ ఆఫ్ హోప్) ఎంచుకున్నాడు. ఇదొక అద్భుతమైన మెథడాలజీ. అయితే దీన్ని నేను ప్రపంచ ఫెమినిస్ట్ రచనల నుండి తీసుకొని ఒక నూతన (ప్రక్రియలోకి మలచాను. 'వై అయామ్ నాట్ ఎ హిందూ' పుస్తకంలో నుండి ఇప్పటికే వందలాది భాగాలను వివిధ (గ్రంథాల్లో ప్రపంచ ఎన్సైక్టో పీడియాల్లో రీ (ప్రొడ్యూస్ చేశారు. (ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రౌటోలెడ్డ్ పబ్లిషర్స్ తెచ్చిన 'పోన్ట్ కలోనియల్ లిటరేచర్ అనే ఐదు వాల్యూమ్ల అంథాలోజీలో “దళితైజేషన్ నాట్ హిందూవైజన్ ఛాప్టర్ పూర్తిగా ముద్రించారు. విద్య మీద వచ్చిన ఎన్నో పుస్తకాల్లో ఇందులోని ఏదో ఒక భాగాన్ని తిరిగి ముద్రించారు. ఇక దీనిలో నుండి తీసుకున్న కొటేషన్లకు రిఫరెన్సులకు లెక్కలేదు. అయితే నన్ను బాగా సంతృప్తి పరిచే అంశమేమంటే ఇది గొప్ప స్కాలర్స్ అనుకునే వారికి ఎట్టా కనుతెరుపు పుస్తకంగా అనిపిస్తుందో, ఒక (గ్రామంలోని 10వ తరగతి ఫెయిల్ అయిన వారు చదివినా అతని/ఆమె జీవితం నుండి తాత్వికతను చూపిస్తుంది. (ప్రతి దళిత బహుజనుడు తన జీవితాన్ని అందులో చూసుకోవచ్చు.
ఆ సభకొచ్చిన చాలామంది “ఈ పుస్తకం మాకు మరో భారతదేశాన్ని చూపించింది” అనగా విన్నాను. ఆ భారతదేశాన్ని చూపించకుడా ఉండడానికి (బ్రాహ్మణీయ రచనలన్ని (ప్రయత్నం చేశాయి. అయితే మహాత్మాపూలే “గులాంగిరి రచనతో ఒక కొత్త ప్రయత్నం మొదలైంది. అంబేద్కర్ కులనిర్మూలనా పుస్తకం రాయడంలో అది పరిపక్వ స్థాయికి చేరుకుంది. నేను హిందునెట్టయిత? వై అయామ్ నాట్ ఎ హిందూ” వాటి కొనసాగింపు మాత్రమే. ఆ పుస్తకాల భుజాల మీద నిలబడి ఈ దేశపు నేలను చూసింది ఆ పుస్తకం. ఇది అవార్డుల ఆరాటపు నవల కాదు. ఆనందంలో ఊగిపోయే పాటల పుస్తకం కాదు. ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి వ్యక్తి ఈ భూమిని దున్ని కొత్త ఆలోచనల పంటను వేయడానికి ఉపయోగపడే సాధనం. దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది నా ముందు తరాల సమస్య. అది నా సమస్య కాదు. ఈ మధ్యకాలంలోనే కల్పనా కన్నభిరాన్ ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో తన కుటుంబంలోని “కులాంతర సంఘర్షణ' జీవితం గురించి రాస్తూ ఈ పుస్తకంలోని పద్ధతి, తననెట్ట్లా ప్రభావితం చేసిందో చెప్పారు. మొదటిసారి ఒక (బ్రాహ్మణీయ కుటుంబంలో పుట్టిన కులాంతర జీవన సంఘర్షణ, కులరహిత జీవనంవైపు, ఈ సమాజపు ప్రయాణం గురించి చర్చించింది. ఆమె ఉపయోగించుకున్న పద్దతి ఈ పుస్తకం పద్దతే. అందుకే నేను పుట్టిన తేదీ కంటేనొ చేతికి వై అయామ్ నాట్ ఎ హిందూ" మొదటి కాపీ అందిన 1996 ఫిబ్రవరి 6 ఎంతో ముఖ్యమైనదని తెలుగు పుస్తకం ముందు మాటలో రాశాను. నా క్లైమ్ను కొందరు ఎద్దేవా చేసి ఉండవచ్చు. కాని ఆ పుస్తకం (ప్రభావాన్ని ఆపలేరు. సూర్య - 3 అగస్టు, 2008
ద్తే “గాడ్ ఆడా, ముగా? గొడ్ ఆడ, మగ అనే లింగపరమైన పదప్రయోగంపై ఈ మధ్య అమెరికా, యూరపు దేశాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఇంగ్లీష్ పదమైన 'గాడ్‌కు లింగ వ్యక్తీకరణ లేదు. కాని అదే ఇండియన్ 'ప్రాంతీయ భాషలలో గాడ్‌కు సమానంగా ఉపయోగించే పదాలు స్పష్టంగా వుల్లింగంగా మాత్రమే వాడుతున్నారు. ఉదాహరణకు దేవుడు, లేదా ఈశ్వర్ అనే పదాలు స్పష్టంగా పురుషన్యక్తీకరణ గల పదాలు మా(త్రమే. కాని గాడ్ అనే ఇంగ్రీష్ పదానికి అటువంటి పురుషవ్యక్తీకరణ స్పష్టంగా లేదు. యూరప్, అమెరికా దేశాల్లో ఫెమినిస్టు సిద్దాంతవేత్తలు ముందుకొచ్చాక గాడ్ అనే పదం వాడుతూనే గాడ్ని ఫాదర్ (తండ్రిగా వ్యక్తీకరించే భాషా ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా స్త్రీ ఫెమినిస్టులు (పురుష పెమినిస్టులు కూడా ఉన్నారు) గాడ్‌ను గురించి చర్చించే న్యూట్రల్ పదాలను మాత్రమ ఉపయోగించాలని, ముఖ్యంగా బైబిల్ భాషను బాగా సంస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిబేట్లో శైస్తవ (గ్రంథాలలోని భాషను భావ వ్యక్తీకరణను బాగా మార్చాలనే చర్చ (ప్రారంభమైంది. అన్ని మతాల (గ్రంథాల్లో భాష పురుషాధిక్య సమాజపు భాషను, భావజాలాన్ని ప్రతిబించించేదిగాన్స ఉంది. అన్ని మత (గ్రంథాలు మాతృస్వామిక సమాజాల విటువల్ని మార్చి పితృస్వామ్య సమాజ విలువల్ని బలోపేతం చేశాక రాసినవే. అన్ని మతాలకన్నా బుద్ధిజం ఒక సంస్థగా రూపొందిన అతి పురాతన మతం. అది కూడా పితృస్వామ్య విలువలు బలో పేతమయ్యాక్ర సాపించినదే. అందుకే జాతకాల్లోని భాష. కూడా పితృస్వామ్య విలువల్ని మాత్రే ప్రతిబింబిస్తుంది. తర్వాత సంస్థాగత రూపం తీసుకున్నది (క్రష్టియానిటీ. బైబిల్లో వాడిన భాష అన్నిరం గాల్లోని జ్ఞాన ప్రక్రియలను ప్రభావితం చేసింది. యూరోపియన్ తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం. సైన్సు అన్ని రంగాలపై బైబిల్ ప్రభావం ఉన్నంతగా మరే ఇతర మత(గ్రంథపు (ప్రభావం ప్రపంచంమీద లేదు. ఇప్పుడు టైబిల్లో వాడిన భాష లింగ స్వభావం గురించిన చర్చ ఒక కొలిక్కి వచ్చి బైబిల్‌ను, భాషాపరంగా మళ్ళీ తిరగరాస్తే దొని ప్రభావం అన్ని మతాల మిద ఉండబోతోంది. [12
'గాడ్' ఆడా, మగా? 13
ఈ మధ్య పోప్ బెనెడిక్ట్-16 'గాడ్ అనే పదం లింగ స్వభావం గురించి ప్రకటిస్తూ గాడ్ని 'ఫాదర్' (తండ్రి)గానే చూడాలని, జీసస్‌ని ఆయన సన్ (కొడుకు)గానే చూడాలని, గాడ్ పురుషుని (ప్రతిరూపమని (ప్రకటించడం చాలా పెద్ద చర్చకు దారితీసింది. యూరో-అమెరికన్ ఫెమినిస్టులు క్యాథలిక్ తాత్విక విలువపై యుద్ధం ప్రకటించడానికి పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. చాలామంది ఫెమినిస్ట్ తత్వవేత్తలు 'గాడ్ అనే అబ్స్రాక్ట్ స్వరూపాన్ని ఏ లింగంతో ముడేసి చూడకూడదంటున్నారు. గాడ్ని ఫాదర్‌గా కాక (క్రియేటర్‌గా మాత్రమే అభివర్షించాలని వారి వాదన. పోప్ ఆ వాదనను తోసిపుచ్చాడు. ఈ వాదనను ప్రాటెస్ట్రాంట్ (గ్రూపులు పూర్తిగా (త్రోసిపుచ్చే అభిప్రాయాన్ని కలిగి లేవు. (ప్రొటెస్టంట్ [గ్రూపులలో ఏకకేంద్ర అథారిటీ ఏమి లేదు, అందుకని క్రిష్టియానిటీలో చర్చ 'ద హరోలి స్టేటో అంటే రోమ్‌లోని పోపు ఆఫీసుతో ముడిపడే సాగుతుంది.
ఈ చర్చ ప్రభావం ఇస్లాం మీద కూడా పడే అవకాశం ఉంది. ఇస్టాం అల్లాను స్పష్టంగా పురుషునిగానే గుర్తిస్తుంది. ఖురాన్ ఆ విషయంలో భిన్న అభిప్రాయాలు గలిగిన చర్చకు తావునివ్వదు. అయినా ఇరాన్ వంటి దేశంలో బలమైన స్త్రీవాద గొంతులు ఖురాన్‌లోని భాషను ్రళ్నిస్తున్న దాఖలాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. విచిత్రమేమంటే బుద్దిస్టు ప్రపంచంలో ఈ రకమైన చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే అవకాశం తక్కువ. చైనా, జపాన్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాల్లో బుద్దిస్పు మత (గ్రంథాల మీద స్త్రీవాదం ఏమి ప్రశ్నలు లేవనెత్తుతున్నదో మనకు తెలియదు. అసలు ఆ స్థితికి (స్త్రీవాద స్కాలర్టు ఎదిగారా అన్నది కూడా తెలియడం లేదు. బౌద్దమతం సిద్ధాంతరంగంలో వెనుకబడి ఉండడానికి ఇటువంటి చర్చలు అందులో తలెత్తకపోవడం కూడా ఒక కారణం.
ఇక హిందూ సమాజంలో ఇటువంటి తాత్విక చర్చ లేవనెత్తడానికి కూడా ఆస్కారం లేదు. అందులో దేవుళ్ళు, దేవతలు కోకొల్లలు. అది ఇంకా మూఢనమ్మకాల మతంగానే ఉన్నది. అందులో ఒక థియలాజికల్ డిబేట్ ముందుకొచ్చే ఆస్కారమే లేదు. అయితే వేదాలు, పురాణాలు పురుష దురహంకారాన్ని ప్రచారం చేశాయి. భారతీయ (స్త్రీ వాదులు ఎక్కువమంది అ(గ్రకులస్తులు - ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలు - అయినందువల్ల వాళ్ళు హిందూ మతాన్ని సమూలంగా మార్చే చర్చ అసలు మొదలుపెట్టలేదు. ఇక్కడ ముందుకొచ్చిన స్త్రీవాదం ఎక్కువగా యూరప్-అమెరికా (స్రీవాదుల అనుకరణ స్రీవాదమే. స్వతంత్ర రీసెర్చి ఇక్కడ ఎక్కువగొ జరుగలేదు.
దాదాపు గత 1000 సంవత్సరాలుగా ప్రతి మౌలిక తాత్విక చర్చ క్రిష్టియన్ ప్రపంచంలో పుట్టి, పెద్దదై ప్రపంచాన్ని మొత్తంగా ప్రభావితం చేసిందే అయినందువల్ల గాడ్ లింగ
కేశ సామాజికం స్వభావానికి సంబంధించిన చర్చ కూడా ప్రపంచాన్ని (ప్రభావితం చేస్తుంది. పోప్ వాదనను డజన్ల కొద్ది (స్త్రీవాదులు వ్యతిరేకించి పుస్తకాలు రాసే అవకాశం ఉంది. బైబిల్ భాషను లా చాలా తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది. ప్రతి పదానికి స్త్రీ-పురుష కోణాల నుండి కొత్త అర్భాలను వెతికే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో భారతదేశంలో కూడా స్రీ పురుష సమానత్వం ఒక కొలిక్కి రావాలంటే హిందూ మత (గ్రంథాలను తీవ్రంగా పరిశోధించాల్సిన అవసరముంది. అయితే నాలుగు పెద్దమతాలు వేళ్ళూనుకొని ఉన్న దేశం కనుక అన్ని మత (గ్రంథాల్గోని భాషను స్త్రీపురుష సమానత్వం కోణం నుండి పరిశోధించవలసిన అవసరం ఉంది. ఇటువంటి చర్చను, పరిశోధనను అన్ని మతాలు జరగనీయాల్సిన అవసరం ఉంది. ఏ మతంలోనైతే ఇటువంటి చర్చ అసలు మొదలు కాదో, లేదా ఏ మతమైతే ఇటువంటి చర్చను జరుగనివ్వదో ఆ మతం వెనుకబడిపోయే అవకాశం ఉంది. సూర్య - 9 మార్చి, 2008
ర్ కేపిటల్ హిల్ మానవీయ విలువల శిఖరం
ఆమెరికా అధికార పీఠమైన కేపిటల్ హిల్‌ను నేను మొదటిసారి సందర్శించాను. అది మనల్ని ఎంతో ముగ్గుల్ని చేసే రాజకీయవ్యవస్థ. భారతదేశం ఇంకా మరెన్నో దేశాల వలెనే (బ్రిటీష్ వలసవాద సామ్రాజ్యం నుంచే అవతరించిన అమెరికా చరిత్ర తెలిసినవారిని ఈ ప్రదేశం మరింత విజ్ఞానవంతుల్ని చేస్తుంది. ప్రపంచచరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని చేర్చిన ప్రదేశమిది, ప్రపంచానికి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చిందీ ఈ ప్రదేశమే. జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్ గురించి చదివి, అమెరికాకు వారు చేసిన దేమిటో చూడగలగడం నిజంగా స్ఫూర్తిదాయకమైన సందర్భం.
అజేయుడైన తన సహచరయోధుడు జార్జి వాషింగ్టన్ మార్గదర్శనంలో జెఫర్సన్ స్వాతంత్ర్య ప్రకటన తొలి ముసాయిదా రాస్తూ, 'మనుషులందరూ సమానులుగానే జన్మించారు. మనుషులు ఏర్పరచుకొనే ప్రభుత్వాలకు, కేవలం వారి అనుమతితోనే న్యాయమైన అధికారాలు సిద్దిస్తున్నాయి' అని ఎప్పుడో 1776లోనే ప్రకటించడం గమనార్హం.
తనకు కూడా లిఖిత రాజ్యాంగం ఉన్నప్పటికీ, 'మనుషులందరూ ఎప్పుడూ సమానులుగా జన్మించలే'దని చాటే సాంఘిక దురాచారాలను నేటికీ పాటించే ఒక దేశం నుంచి వెళ్ళిన నాకు, ఆ ప్రజాస్వామిక సూత్రానికి ప్రపంచంలోనే మొదటసారిగా ఒక రూపు కల్పించిన కేపిటల్‌ను సందర్శించడం ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. అమెరికన్ ప్రజాస్వామ్యంలో నాకు ఎలాంటి సమస్యా కనిపించలేదని కాదు. ఇక్కడి వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి. అయినా ఈ దేశపు రాజకీయ పీఠమైన కేపిటల్‌ను, ఇక్కడ (ప్రతిబింబించే విలువలను, వాటి స్మారక నిర్మాణాలను, కేవలం 230 సంవత్సరాల కాలంలో, జీవితంలో విడదీయరాని అంశంగా మానవ సమానత్యాన్ని ఎలుగెత్తి చాటేలా నిర్మాణం చేసిన ఇక్కడి మౌలిక వ్యవస్థలను దర్శించడం నిజంగా ఎంతగానో పులకింపదేసే అనుభవం,
15
16 సామాజికం దళిత ఫ్రీడం నెట్వర్క్ (డిఎఫ్ఎన్) ప్రతినిధి వర్గంలో సభ్యునిగా నేను కేపిటల్ హిల్‌ను దర్శించాను. కేపిటల్ భవనంలోనే జరిగిన 'కులనిర్మూలనా ఉద్యమం, దళిత హక్కులపై జరిగిన ఒక గోష్టిలో పాల్గొనడానికి డిఎఫ్ఎన్ అధ్యక్షుడు డా॥ జోసెఫ్ డిసౌజా, డైరెక్టర్ నాన్సీ రిక్స్, సభ్యులలో ఒకరైన మిసెస్ బెట్టీలతో కలిసి నవంబర్ 2004, 17న నేను అక్కడికి వెళ్ళాను. ఈ గోష్టీని డిఎఫ్ఎన్ ఏర్పాటు చేసింది. అమెరికా రాజధానిని ఫిలడెల్పియా నుంచి, తొలి అధ్యక్షుని పేరుతో అవతరించిన వాషింగ్టన్కు నూర్చిన తర్వాత, 1800 నుంచి కేపిటల్ హిల్ భవన సముదాయం (అమెరికా పార్లమెంటు భవన సముదాయం) రూపుదిద్దుకోవడం (ప్రారంభమైంది. కేపిటల్లోనూ, కాంగ్రైస్ లైబ్రరీలోనూ మా చేతికి ఇచ్చిన ఒక 'ప్రచారపత్రం, అమెరికన్ పార్లమెంట్ తొలి సమావేశం 1800లో కాంగ్రెస్ లైబ్రరీ భవనంలోనే జరిగినట్టు తెలియజేస్తోంది. అప్పట్లో అదొక చిన్న కట్టడం. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఉన్న అనేక పార్లమెంటు భవంతుల కంటే కూడా ఈ లైబ్రరీ ఎంతో పెద్దది. కులాన్నీ, అంటరానితనాన్నీ నిర్మూలించడం గురించి కొందరు కాంగైస్ సభ్యులతో చర్చించడానికి మేము వెళ్ళాం, “మానవులందరూ నమానులుగానే జన్మించార'న్న భావనను అమెరికాలో ఒక్క శాసనప్రక్రియలోకి ఎలా తీసుకురాగలిగారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలిగింది, కాం[గైన్ లైబ్రరీలో పై కప్పును తాకుతూ, గోడల నిండా అనేక శిల్పాలు, పెయింటింగ్‌లు ఉన్నాయి. పుస్తకం అవతరణ (క్రమాన్ని వివిధ దశలలో చిత్రీకరించారు. పురాతన కాలంలో రాళ్ళు చెక్కేవారు, చేపలు పట్టేవారు మొదలుకొని ఈజిప్టు వాసులు కథలు చెప్పుకోవడం వరకు పరస్పరం అభిప్రాయాలను వ్యక్తపరచుకొన్న పద్దతిని, [గ్రీకుల పుస్తక రచనా పరిణామంలో తుది రూపాన్ని చక్కని రంగులతో చిత్రీకరించారు. (ప్రపంచమంతటి నుంచీ పుస్తకరచనా సంస్కృతిని తాము వారసత్వంగా అందుకొన్నామని అమెరికా చాటుతున్నదా అనిపించింది. అన్ని రకాల ఉత్సాదక చర్యలలో నిమగ్నులైన మనుషుల్ని చిత్రించిన చిత్రాలు మరింత ఆసక్తి గొలిపాయి. కుండల తయారీని మనిష్ని చేపట్టిన తొలి శాస్త్రీయ చర్యగా ఒక చిత్రంలో చూపించారు. అమెరికన్ లైబ్రరీలో మానవ జీవనంలోని అన్ని చర్యలపై పుస్తకాలు ఉన్నట్టు చెప్పారు. లైబ్రరీని చూపిస్తూ దాని చరిత్రను వివరించిన గైడ్డు ఆ లైబ్రరీ ఎలా ప్రారంభమైందో చెప్పారు. చట్టాలను తయారు చేయడానికి న్యాయశాస్త్ర సంబంధమైన (గ్రంథాలతో ఒక లైబ్రరీని స్థాపించాలని అమెరికన్ కాంగగైస్ సభ్యులు సంకల్పించారు. అయితే పుస్తకాలేవీ దొరకలేదు. (బ్రిటీషర్సు తమ పుస్తకాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పటికీ మాజీ అధ్యక్షుడైన జెఫర్సన్ తన సొంత లైబ్రరీని ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో రకరకాల విషయాలపై మొత్తం 6,486 పుస్తకాలున్నాయి.
కేపిటల్ హిల్ మానవీయ విలువల శిఖరం [7 ఈ లైబ్రరీ ఆయన పేరుతో (ప్రారంభమయింది. పదవీవిరమణ చేనిన దేశాధ్యక్షులందరూ ఇప్పటికీ లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ ఉండడం ఎంతో ఆసక్తికర విషయం. బిల్ క్షింటన్ గత నెల 18వ తేదీన లిటిల్ రాక్‌లో ప్రారంభించిన లైబ్రరీ ఈ పరంపరలో తాజాది. ఈ పుస్తక పఠన సంప్రదాయం, వస్తూత్పత్తి, శ్రమ గౌరవంలో వేళ్ళూనుకొన్న సాంస్కృతిక విలువలు ఒక సా(మ్రాజ్యవాద దేశం కావడానికి చాలా ముందే అమెరికాను ప్రగతిపధంలో నడిపించాయి. ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి వీలుగా (గ్రంధాలయాలను స్థాపించిన ఏ దేశమైనా నూతన ఆలోచనలకు దోహదమవుతుంది. అయితే నాలుగు వందల సంవత్సరాల చరిత్రలో అమెరికాపై మాయని పెనుమచ్చలూ ఉన్నాయి. మొదటిది స్టానికులైన రెడ్ ఇండియన్లను నిర్మూలించడం. రెండోది ఆఫ్రికన్ అమెరికన్ల పై రుద్దిన బానిసత్వం, అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అన్ని రకాల బానిసత్వాలనూ రద్దు చేస్తూ నూతనాధ్యాయాన్ని ప్రారంభించారు. క్యాపిటల్ హిల్‌లో జార్జి వాష్టింగ్టన్ తర్వాత అత్యంత గౌరవాన్ని చూరగాంటున్న మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. కేపిటల్లో పక్కపక్కనే రెండు భారీ స్మారక నిర్మాణా లున్నాయి. ఒకటి జార్జి వాషింగ్టన్కు, రెండోది అబ్రహాం లింకన్‌కు చెందినవి. వివిధ (ప్రభుత్వ కార్యాలయాలలో, కాంగ్రెస్ సభ్యుల కార్యాలయాలలో ప్రముఖంగా కనిపించేవి అబ్రహాం లింకన్ ఫోటోలు, వి[గ్రహాలే. ఆయన ఎంతో దృఢసంకల్పంతో బానిసత్వాన్ని రద్దు చేసి స్టానికులైన రెడ్ ఇండియన్లకు పౌరసత్వం కల్పించడమే ఇందుకు కారణం, వెనకటి బానిసల యజమానుల వారసులు కూడా ఆయన పట్ల గౌరవం ప్రకటిస్తారు. కేపిటల్ హిల్‌లో సందర్శకుల (ప్రవేశద్వారం వద్ద ఆకులు అలములు చుట్టుకొని సాంప్రదాయిక వేషంలో కనిపించే ఒక స్టానిక అమెరికన్ మహిళ భారీ విగ్రహం కనిపిస్తుంది. స్వాతంత్ర్య భావన, ఇక్కడి ప్రతి ఒక్కరి మదిలో చెరగని అక్షరంలా లిఖితమై ఉంటుంది. కులాన్నీ, అంటరానితనాన్నీ నిర్మూలించే ప్రక్రియను 'ప్రపంచీకరించవలసిన అవసరం ఇక్కడే (ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది. భారతదేశంలో నేటికీ కులపరమైన హెచ్చుతగ్గులు, అంటరానితనం ఉన్నాయంటే కాం(గైన్ సభ్యులు చాలామంది నమ్మలేకపోయారు. మన దేశ పాలకులు, ఆధ్యాత్మికవాదులు, సామాజికులు మానవులందరూ సమానులుగా జన్మించారన్న సూత్రాన్ని ఇంకా జీర్షించుకోలేదు. కులాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నాన్ని 'ప్రపంచీకరించవలసిన అవసరం అందుకే కలుగుతోంది. ప్రపంచ వ్యవస్థలలో ప్రముఖులుగా ఉన్న వారందరూ దీనిని గుర్తించి ఇందులో భాగస్వాములు కావాలి. కేపిటల్ హిల్‌లో మేము కలుసుకొన్న వారందరికీ ఇదే విజ్ఞప్తి చేశాం. వార్త - 10 డిసెంబర్, 2004
సాంస్కృతిక ప్రపంచీకరణ అంటే ఎందుకంత భయం?
దళిత బహుజనులకు మోక్షం కలిగేంచేది అదే!
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆసియా సామాజిక వేదిక సమావేశంలో (ప్రపంచీకరణ మీద చాలా తీవ్రతరంగా చర్చ జరిగింది. డా సి. రంగరాజన్ తన వ్యాసంలో (హిందూ-జనవరి 6-7) ఆర్దిక (ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భంలో సాంస్కృత్తిక ప్రపంచీకరణ గురించి కొంత భయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచీకరణ ధనవంతులన్సి ఇంకా ధనవంతులుగా, పేదవారిని ఇంకా పేదవారిగా చేస్తుంది. భారతదేశ ఆర్థికవ్యవస్టను
డ్
పరిశీలించితే కులవృత్తుల మీద ఆధారపడి జీవించే ప్రజలు దిగువ కులాలకు చెందినవారు. ప్రపంచీకరణ సాంప్రదాయిక కులవృత్తులను నాశనం చేసింది. వారి ఉనికిని దెబ్బతీసింది. సామన్య ప్రజలకు వృత్తి మార్పిడి-కొన్ని నిబంధనలను సృష్టించింది. దళిత బహుజన ఉద్యమాలు ఈ పరిన్టితిని గమనించి, ఆర్థిక ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
సాంస్కృతిక సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చరిత్రలో అణగద్రొక్కబడిన వారికి ఒక్ష
కొత్త ఆశను చూపించింది. ఆధునిక సామాజిక విద్య కూడా హిందూ (బ్రాహ్మణీయతకు సంబంధించిన సాంస్కృతిక మత కర్మ కాండల పవిత్రత, అపవి(త్రతపై ఆధారపడి బోధనలు సాగించింది. దుస్తులు, ఆహార అలవాట్లు మొదలైనవి ఇలా ఏర్పడినవే. భారతదేశంలోని మెజారిటీ ప్రజలను - (బ్రాహ్మణిజం బానిసలుగా తయారుచేసింది. మత కర్మకాండలకు సంబంధించిన సంస్కృతిని ఒక పవి్య(శత్రమైన సంస్కృతిగా తయారుచేసింది, జ్ఞానమనే భావనను పూజ సంస్కృతి చుట్టూ తిప్పారు. ఉత్పత్తి కులాల పరిజ్ఞానాన్ని మాత్రం పనికి రానిదిగా చేశారు.
(ప్రాచీన మధ్యకాలాలలో జ్ఞానం అంటే అత్యుత్తమ సంస్కృత (గ్రంథాలను చదవడం, మతపరమైన సామ్రాజ్యవాదం రోజువారి పనులకు సంబంధించిన ఆహార ఉత్పత్తి పశు సంపదను మచ్చిక చేసుకోవడం, నీటి పారుదల సౌకర్యాలను పెంపొందించడం సాంకేతిక
18
దళిత బహుజనులకు మోక్షం కలిగేంచేది అదే! 19 పరిజ్ఞానం పనికి రాని దానిగా చేసింది. (ప్రజలు చేస్తున్న చిన్న చిన్న ప్రయోగాలకు పుస్తకాలలో చోటు లేదు. ఎందుకంటే ఆ (గ్రంథాలన్నీ హిందూ సంస్కృతికి సంబంధించినవి కనుక.
భారతదేశాన్ని పరిపాలించిన ముస్లింలు, వారి ఇస్లాం ఆలోచన (బ్రాహ్మణ సంస్కృతిని మార్చలేదు. ఖురాన్ భావం ఒక మతంలా కనిపించదు. ఉత్పత్తి ఒక విరోధిగా కనిపించదు. ఈ పని హిందూ భావన చేసింది. ముస్లిం మేధావులు బ్రాహ్మణిజం సంస్కృతిగా మారుతుందని ఆలోచించలేదు. ముస్లిం పాండిత్యం తమ చరిత్రను గమనించడం లేదు. దళిత బహుజనులు ఉత్పత్తి కులాల సంస్కృతిని చదవలేదు.
(క్రిస్టియన్ మిషనరీలు వచ్చి ప్రజలతో కలిశాక సంస్కృతికి సంబంధించిన పవిత్రత, అపవిత్రత, నమ్మకాలు మెజారిటీ (ప్రజలకు దూర అయ్యాయి. క్రిస్టియన్ మిషనరీలు ఆహారపు అలవాట్లను, దుస్తుల వాడకాన్ని ఖండించడానికి బదులుగా, వారితో జీవిస్తూ వారి అలవాట్లను పాటిస్తూ వారిలో సాంస్కృతిక పరిజ్ఞానం పెంచారు. ఈ విధంగా ఆచరించిన వారిలో ముఖ్యులు విలియం క్యేరి, డెనోబిలీ. లౌకిక సామాజికవాద పండితులు వారికి ఎల్వీన్, హైమాన్డార్లు ఆదివాసీలలో అంతర్గత విలువలను పెంపాందించారు. ఒక గొప్ప సంఘటన - చదవడం, రాయడం అనే హక్కుని చారిత్రకమైన మెజారిటీ ఉత్పత్తిదారులు పొందడం లేదు. ఎందుకంటే చదవడం, రాయడం అనేది దైవత్వానికి సంబంధించినవిగా పాఠశాలలు పరిగణించాయి. వలసవాద కాలంలో మిషనరీ పాఠశాలల్లో మహాతా పూలే సూద్ర, అతి సూద్రగా పిలువబడ్డాడు. ఆ కాలంలో విద్యావంతులైన దళిత బహుజన యువకులు పాశ్చాత్య సంస్కృతిని, తమ సంస్కృతిని అర్హం చేసుకోవడానికి (ప్రయత్నించారు. చాలా కాలం తర్వాత భారతదేశంలో మెజారిటీ సంఖ్యాకులైన (ప్రజలు సంస్కృతికి చాలా (ప్రాధాన్యత ఉన్నదని తెలుసుకున్నారు. కాని అక్కడి పూజారి వర్గం వీళ్ళ సంస్కృతిని అపవిత్రంగా చూపెట్టారు.
(బ్రాహ్మణిజం - స్వాతంత్రోద్యమ కాలంలో, స్వాతంత్ర్యానంతర కాలంలో - భారతదేశంలో తమ సంస్కృతీ సామ్రాజ్యాన్ని స్థాపించింది. కాని వలసవాద కాలంలో సాధించలేకపోయింది. తిరిగి మెజారిటీ ఉత్పత్తి కులాలు సంస్కృతి లేనివారిగా తయారయ్యారు. ఈ మధ్యకాలంలో జరగుతున్న సాంస్కృతిక (ప్రపంచీకరణలో - ఉత్పత్తి కులాల సంస్కృతిని కలపడంతో విద్యావంతులైన బ్రాహ్మణ వ్యతిరేకులకు ఒక రకమైన ఆళ వచ్చింది. విద్య - ప్రజల సంస్కృతిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే సాధనంగా గమనించారు. మెజారిటీ ఉత్పత్తిదారులకు విద్య - వలసవాద పరిపాలనకు పూర్వం అందలేదు. మహాతా పూలే అంగ్ల విద్య అభ్యసించి, అంతర్గతమైన హిందూ సంస్కృతిని వ్యతిరేకించిన మొదటివ్యక్తిగా విద్యనందించగలిగారు.
20 సామాజికం భిన్న సామాజిక వర్గాలకి సాంస్కృతిక అవగాహన కోసం భాష మతం రెండు కూడా ముఖ్యమైన మార్గాలు. (ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో ఆంగ్ల విద్యా పాఠశాలలు చాలా అభివృద్ధి చెందాయి. ప్రాంతీయ భాషా విద్య వల్ల ఆంగ్ల భాష వచ్చిన వారిని, రాని వారిని భారతదేశ మెజారిటీ - హిందూయేతర సంస్కృతిని, పాశ్చాత్య సంస్కృతిని కలుపుకోలేక పోతున్నది. పురాతన కాలంలో సంస్కృత భాషకన్న, మధ్యయుగ కాలంలో ఉర్జూ, పర్షియన్ భాషల కన్నా ఆంగ భాష సౌలభ్యంగా లభించింది. ఆంగ్రభాషతో మొదటి జాతీయ భాషగా అన్ని ప్రాంతాలలోని, అన్ని వర్గాల పిల్లలకు సంబంధం ఏర్పడింది. ఆంగ్ల భాషకు ఎటువంటి ఆధ్యాత్మిక ఆంక్షలు లేవు. దీంతో దళిత బహుజనుల పిల్లలు ఆంగ్లభాషలో నైపుణ్యాన్ని పెంచుకొని ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ప్రపంచంలో కలిసిపోయారు, రాను రాను ఆంగ్ల భాష ఉన్నత కులాలకు దగ్గర అయ్యింది. కాని అణగారిన కులాల మెజారిటీ ప్రజలు ఆంగ భాష నేర్చుకొని సమ సమాజ (ప్రపంచ పరిజ్ఞానాన్ని సంపొదించారు. వ్యక్తుల మధ్య చాలా భేదం ఉంది. అది చారిత్రకంగా ఇంగ్లీష్ నేర్చుకున్న కులాలు, చారిత్రకంగా అణగద్రొక్కబడిన కులాలు - ఆంగ భాష, పాశ్చాత్య పరిజ్ఞానాలను పొందేందుకు బయటికొచ్చారు. ఒక బ్రాహ్మణ పండితుణ్ణే తీసుకుంటే, పాశ్చాత్య సంస్కృతి - ఆంగ్ర భాష ద్వారా = అతని అంతర్గత వ్యతిరేకత - ఆహారం అలవాట్టు, తాగడం, అధ్యాత్మిక సంస్కృతి మీద ఉంటుంది. ఒక దళిత బహుజనున్ని తీసుకుంటే - ఇంగ్లీష్ నేర్చుకొని ప్రాశ్చాత్య సంస్కృతిలోకి పోయినట్టయితే అతడి/ఆమె సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి దగ్గరి సంబంధాలు ఉంటాయి. డైనింగ్ టేబుల్‌పై భోంచేయడం, చెంచాతో తినే ఆహారపు అలవాట్టు సాధారణంగా సామీష్యంగా ఉంటాయి. శాఖాహార బ్రాహ్మణ బనియా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడానికి ఎక్కువ కష్టపడాలి. సరికదా సమాజంలో గాని, తన కుల సంఘంలో గాని కలువలేకపోతాడు. అదే దళిత బహుజనులకైతే ఆహారపు అలవాట్టు వాళ్ళ సంస్కృతితో కలవడానికి చాలా తేలిక, ఎందుకంటే వారివలె (బ్రాహ్మణులు) మాంసం, పంది మాంసం మీద నిషేధం లేదు కాబట్టి. అంబేద్కర్ పై చదువులకు న్యూయార్క్ వెళ్ళినప్పుడు గాంధీలా తల్లిదండ్రులు, బంధుమిత్రులకు (ప్రాశ్చాత్య అలవాట్లకు దూరంగా, మన ఆహారపు అలవాట్లను కాపాడతానని హామీ ఇవ్వలేదు. గాంధీ లాగ పవిత్రతను కాపాడడానికి అంబేద్కర్ విదేశాలల్లో ఉన్నప్పుడు ఎటువంటి పోరాటం చేయలేదు. తనకు ఎటువంటి ఆహారం లభించినా దాన్ని ఎటువంటి భయం లేకుండా తిన్నాడు. ఈ సంస్కృతి భారతీయ సంస్కృతా? అంబేద్కర్ సంస్కృతా? గాంధీ సంస్కృతా?
దళిత బహుజనులకు మోక్షం కలిగేంచేది అదే! 2]
అంబేద్కర్ - నెహ్రూ, గాంధీలలా కాకుండా తన జీవితకాలం, తమ వర్గం వారి నుండి ఎటువంటి భయం లేకుండా కోటు ధరించాడు. గాంధీ మాత్రం పాశ్చాత్య విధానానికి వ్యతిరేకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. సామాజిక ఆదర్శభావాలు, హేతుబద్ధమైన ఆలోచన ఉండి కూడా జంర్వ్య్యుం, షేర్వాణి ధరించేవాడు నెహ్రూ, అయినా ఆయన్ని హిందువుగా పరిగణించలేదు.
మెజారిటీ బ్రాహ్మణ రచయితలు అంబేద్కర్ తొందరగా (ప్రాశ్చాత్య విద్యా విధానానికి అలవాటుపడడాన్ని విమర్శించారు. వారే గాంధీ భారతీయ సాధారణ జీవితాన్ని అవలంభించి, (ప్రాశ్చాత్య విద్యా విధానాన్ని వ్యతిరేకించినందుకు పొగిడారు. అంబేడ్కర్‌ను విమర్శించినవారు చాలా సందర్భాల్లో కోటు ధరించారు. ఇలాంటి వాళ్ళని బిజెపి (ప్రభుత్వంలో చూడవచ్చు. ఒకటి మాత్రం నిజం! అదేమిటంటే భవిష్యత్‌లో భారతీయులు కోటు ధరించడం ఒక సాధారణ విషయం. ఎవరైతే (ప్రాశ్చాత్య అలవాట్లు పొందడం కోసం కష్టపడుతున్నారో అట్లాంటి భారతీయ సంస్కృతి (తెలుగు సంస్కృతిలో కట్టు బొట్టుగాలా) ఆడవారి దుస్తుల విధానం ద్వారా సాధ్యమవుతుంది.
ఎవరైతే సాంస్కృతిక ప్రపంచీకరణకు భయపడతారో అక్కడ (బ్రాహ్మణ, పితృస్వామ్య విలువలు కలిగినవారు సాంస్కృతిక ప్రపంచీకరణలో కలవడాన్ని వ్యతిరేకించుతారు. సాంస్కృతిక ప్రపంచీకరణ బ్రాహ్మణ పవిత్రతకు, అపవిత్రతకు వ్యతిరేకత, కాని ఇది దళిత బహుజనులకి చాలా విధాలుగా మోక్షం కల్గిస్తుంది. ఏదైతే మొదటగా దళిత బహుజనులకు మోక్షం కల్గిస్తుందో అది సాంస్కృతిక ప్రపంచీకరణలో ఖండించబడి, వారికి అనుకూలమైన వస్తువుగా అమ్ముడవుతుంది. ఏదైతే ఖండించబడుతుందో - అది తాను అన్న భావన గౌరవం పొందుతుంది. ఆర్దిక (ప్రపంచీకరణ అనేది దానికదే ప్రమాదకరమైనది. వార్త - 26 ఫీబ్రనరి, 2003
గౌ లౌకికవాదం - భిన్నత్వంలో ఏకత్వం కులాన్ని చర్చించడం తక్షణావసరం భారతదేశంలో నేటి పరిస్థితుల్లో సెక్యులరిజం భావన అర్ధ్థవంతమైనదిగా ఉండాలంటే ఆ పదాన్ని మళ్ళీ నిర్వచించాలి. ఇక్కడి కుల సమాజానికి పనికివచ్చే విధంగా ఆ ప్రక్రియ జరగాలి. మనదేశంలో 'మతం' సరిహద్దులను మార్చడానికి (ప్రధాన కారకం కులమే. జ్ర స్థితిలో బ్రాహ్మణీయ శక్తులు - కుల పీడన నించి ఇతర మతాల్లోకి ప్రవాహంలా పోతున్న వారిని ఆపేందుకు మతోన్మాద ప్రేరిత హింసను సాధనంగా వాడుతున్నారు. ఏద్రి మెజారిటీ మతం, ఏది మైనారిటీ మతం అనే సమస్య కేవలం ప్రజల విషయ (హణ సామర్థ్యం మీదే ఆధారపడదు. హిందూ మెజారిటీ అన్న భావన కల్పనే! ఇక్కడ మెజారిటీ మైనారిటీ సమస్యను మతం లోపల్నుంచి చూడాలి. ఆ మతం తనను అనుసరించే 'ప్రజలకిచ్చే సమిష్టి భాగస్వామ్యం. ఆ మత సంస్టలిచ్చే కనీస హక్కుల హామీ ఎటువంటివో గమనించాలి. ఒకవేళ ఆ మతం, పవిత్ర (గ్రంధాన్ని ఆధారం చేసుకున్నదైతే, ఆ (గ్రంథం ఆ మతంలోని భాగస్తులందరికీ సమాన ఆధ్యాత్మిక హక్కుల హామీ ఇవ్వాలి. ఏ ఆధ్యాత్మిక (గ్రంథమైనా ఆధారపడాల్సిన తొలి సూత్రం ఏమిటంటే, అది సార్వత్రిక సమానత గల భాష వాడాలి. దైవపరమైన సమానత గురించి ఆ పుస్తకం పేర్కొంటున్నదంటి తను నిర్మించదలుచుకున్న ఆధ్యాత్మిక నిర్మాణాన్ని తానే తిరస్కరించినట్టు లెక్క, దైవమనే భావన హిందూ మత (గ్రంథాలలో చెప్పినట్టు కులాధారం కాదు. అది సార్వత్రికమైంది. అందరికీ అందుబాటులో ఉండాల్సిన భావన. మతం పవిత్ర (గ్రంథ ఆధారమైంది కాక ప్రజల నిత్య జీవిత ఆచరణ నించి పరిణమించింది కూడా కావచ్చు. అప్పుడు ఆ మతం సమాన హక్కులను సార్వత్రిక నైతిక మార్గదర్శక సూత్రంగా అందించాలి. హిందూయిజం మతంగా ఈ రెండు తరహాల్లో దేనికైనా చెందుతుందా? ఎప్పుడైతే ఈ రెండు నిరచనాల పరిధిలోకి అది రాదో అప్పుడు 'సెక్కులరిజం” సమస్యలను ఎట్లా ఎదుర్కొంటుంది? యూరో అమెరికన్ సందర్భంలో (కైస్తవం ఇస్లాం పోటిపడుతున్న 22
కులాన్ని చర్చించడం తక్షణావసరం 23 నేపథ్యంలో సెక్యులరిజం భావన సర్వమత సామరస్యం అనే విసృత అర్జాన్ని సంతరించుకుంది. ఆసియా సమాజాల్లో భారతదేశం మినహా బహుళ మతాలున్న సమాజాలు లేవు. బ్రిటీష్ పాలనాకాలంలో మతమంటే క్రైస్తవం, ఇస్లాం అన్న దృష్టే ఉండింది. కొంతమంది హిందూయిజంను మతంగా చూపే ప్రయత్నం చేశారు. భగవద్గీతను హిందూ మతతాత్విక (గ్రంథంగా చూపే ప్రయత్నం కూడా సాగింది. హిందూమతపు ఈ కొత్త అవతరణ దురదృష్టవశాత్తూ పాశ్చాత్య పండితుల సృష్టే చాలామంది (బ్రాహ్మణ రచయితలు (బ్రిటీష్ జర్మన్ రచనల ఆధారంగా భగవద్గీత మీద వ్యాఖ్యానాలు రాసి హిందూ ఆధ్యాత్మిక (గ్రంథంగా చూపారు. ఏ శూద్ర ఛండాల (నేటి దళిత) మేధావీ దీన్ని సవాలు చేయలేదు. అందువల్ల అన్ని కులాలు 'వసుదైక కుటుంబం” అన్న తీరులో సహజీవనం చేస్తున్నారన్న కుహనా సిద్దాంతాన్ని పుట్టించారు. ఇటువంటి (తప్పుడు) అవగాహన పై ఆధారపడి హిందూ మతాన్ని కూడా క్రైస్తవ, ఇస్టాంలవలె ([గ్రంథాధారిత మతంగా చూస్తున్నారు. హిందూయిజం గురించి రాసిన మేధావులు ఎక్కువమంది, సహనాన్ని ప్రధాన కేంద్రం చేసుకొన్న మతం
- హిందూమతం అని పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగానే సెక్యులరిజం గురించి వ్యాఖ్యానించిన భారతీయ వ్యాఖ్యాతలు భిన్నత్వంలో ఏకత్వం' సిద్దాంతాన్ని సృష్టించారు. ఈ అవగాహనతో హిందూయిజాన్ని, కులాన్ని చూస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వ సిద్దాంత ఎదుగుదల నెహ్రూ వాద ఆలోచనాపరుల సృష్టి వారు అంటరానితనాన్ని, బ్రాహ్మణీయ కులతత్వాన్ని రెండు విభిన్న భారతీయ సంస్కృతులుగా పేర్కొన్నారు. కైస్తవంగానీ, ఇస్టాంగానీ అంటరానివారిని, ఆదివాసులను ఆకర్షించేందుకు ('ప్రయత్నించినప్పుడల్హా అవాంఛనీయమైన కలయికగా పేర్కొంటారు. 'దళితులు మంచి అంటరాని వారు' విదేశీ సంస్కృతికి బానిసలౌతున్నారని వాపోతుంటారు. కానీ ఈ మంచి అంటరానివారిని, ఆదివాసీలను ఆధ్యాత్మిక ఫాసిస్టు స్ప్వభావమున్న హిందూమతంలో కలవడం గురించి (నామమాత్రంగానే, నిజంగా కాదు), ఆ మతంలో ఆధ్యాత్మిక సమానత్యాన్ని పొందకపోవడం గురించి భిన్నత్వంలో ఏకత్వ సిద్దాంతవాదులు మూట మాత్రం చెప్పరు. శూద్ర ఛండాల జీవితాల పునాది నుంచి వచ్చిన రచయితెవరూ హిందూయిజాన్ని సంవర్ధకమైన మానవమతంగా ఒప్పుకోరు. పూలే, పెరియార్, అంబేద్కర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వ సిద్దాంతవేత్తలు ఈ దళిత చింతకుల ఆలోచనలకు సవాళ్ళను ఎన్నడూ గుర్తించలేదు. బ్రాహ్మణీయ శక్తులకు, శైస్తవులకు భిన్నత్వంలో ఏకత్వం సూత్రానికి అర్ధం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ భిన్నమైన సమాన న్ధాయున్న మత సంస్కృతులు. కాని (బ్రాహ్మణ జీవనం అంటరాని వారి జీవనం - ఒబిసిల జీవితం సమానం, విభిన్నం అని పేర్కొనడం సరైనదేనా? విశ్శవ్యాప్తంగా బ్రాహ్మణులకు గుర్తింపదగిన హిందూ సాంస్కృతిక లక్షణాలున్నాయి. ఇతర మతాల వారికీ - వాళ్ళలో లక్షణాలున్నాయి. దళితులకు,
24 సామాజికం ఆదివాసీలకు ఒబిసిలకు ఉన్న హిందూ సాంస్కృతిక లక్షణాలేమిటి? వారూ ఇంకెవరికో చెందిన సాంస్కృతిక లక్షణాలను ఎందుకు గుర్తించాలి? ఈ స్థితిలో దళితులు, ఆదివాసీలు తమను చిన్న చూపు చూసే (బ్రాహ్మణీయ సంస్కృతిని వీడి (కైస్తవం ఇస్లాంల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా మారుతున్నప్పుడు వారు తమ భారతీయతనేమీ పోగొట్టుకోవడం లేదు. భారతీయత అంటే బ్రాహ్మణీయ - హిందూ గుర్తింపు మాత్రమే కాదు. అది ఇస్లామిక్, (క్రైస్తవ రూపంలో కూడా ఉంటుంది. ప్రజలు ఏ మతంలోకైనా మారే హక్కును సెక్యులరిజం కాపాడాలి. మతం మారిన దళిత - ఆదివాసీ సమూహాలక్షు, మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్టు కల్పించే హామీ ఇవ్వాలి. వీరి విషయంలో మతం మారినా కులం బరువు వారితో సాగుతూనే ఉంటుంది. వారు చేరిన మతంలో ముందునించి ఉన్న వారితో సమానస్టాయి అందుకోవడం, కులపీడనా (ప్రభావం నుంచి విముక్తి కావడం వెంటనే జరిగిపోవు. భారతీయ సెక్యులరిజం - సామాజిక పరివర్తన లక్ష్యం కలిగిన మతాల మధ్య వారధిలా పనిచేయాలి. అప్పుడు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మతాలకు అదనపు ప్రయోజనం ఉంటుంది. అవి నైతికంగా 'పై మెట్ట మీద ఉండే మతాలు. వాటికి ఆ గుర్తింపు అవసరం. సెక్యులరిజం హిందూవాద ఆధ్యాత్తి శక ఫాసిజం పట్ట ఏమీ పట్టనట్టు ఉండ వీలులేదు. సెక్యులరిస్టులు మతసమానత్వం గురించై మాట్లాడతామని, కుల అసమానతలు పట్టించుకోమని అంటే కుదరదు. భారతదేశంలో సెక్యులరిజం మతాల మధ్య సమానత్వం గురించి మాత్రమే కాక కులసమస్యను పట్టించు కునే భాష మాట్లాడాలి. మనిషి సంవర్థక లక్షణాలను తిరస్కరించే (బ్రాహ్మణీయ భావ జాలాన్ని సెక్యులరిస్టులు సవాలు చేయడంవల్లే ఇది సాధ్యమౌతుంది. సామాజిక విశేష చర్చతో పాసిటివిజం ఒక గుర్తింపు పొందిన పద్దతిగా స్థానం పొందిన తర్వాతే సెక్యుల రిజానికి (ప్రాధాన్యత పెరిగింది. మార్క్సిజం ఒక వ్తేషణా సాధనంగా 'మతాన్ని' పరిశీలిం చింది. మార్క్సిజం మతాల మధ్య ఘర్షణను నివారించడానికి సెక్యులరిజాన్ని వాడలేదు. అది (శ్రామిక రాజ్యశక్తిని మతాలన్నింటికీ వ్యతిరేకమైన శక్తిగా వాడుకున్నది. కొందరు విమర్శకులు తూర్పు యూరోపు దేశాల్లో మార్క్టిజం విఫలం కావడం వెనుక్క అది ప్రజల ఆధ్యాత్మిక ఆపేక్షలను పట్టించుకోకపోవడం ఉందని అభిప్రాయపడ్డారు. భారతీయ మార్క్సిస్టులు ఇక్కడి బహుళ మత సమాజ సంక్షిష్ట స్థితిలో వ్యవహరించాల్సిన తీరులో తికమకకు గురై తప్పనిసరై 'సెక్యులరిజంను ఆశ్రయించారు. కానీ అది వారికి సంబం ధించింది కాదు. మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి 'సెక్యులరిజాన్ల్ని ఆయుధంగా వారు వాడినప్పటికీ, దాని నించి కుల వ్యతిరేక భాషను సృష్టించలేకపోయారు. ఫూలే, ఆంబేద్కరిస్టుల చర్చలను ఆమోదించేందుకు ఇష్టపడటం లేదు. విచారకరమైన పరిణామం
- వారు వివేకానందుని ఆలోచనల్లోకి పయనించడం! అ(గ్రవర్ష లిబరల్వాదులు,
కులాన్ని చర్చించడం తక్షణావసరం 25 మార్క్సిస్టులు (బ్రాహ్మణత్వ శిక్షణ ప్రభావం నించి బయటపడుతున్నట్టు అనిపించడం లేదు. వారు పాశ్చాత్య పురోగమన ఆలోచనలను ఆమోదించగలుగుతున్నారు గానీ దేశంలో దళిత బహుజన వేధావుల పరివర్తనాశీలమైన భావాలను ఆమోదించేందుకు సంకోచిస్తున్నారు. మతోన్మాద వ్యతిరేక ఆగ్రహం కులవ్యతిరేక ఆలోచనలతో కలవనంత వరకూ బలమైన సామాజిక సంకీర్షంగా మారదు. భారతీయ ముస్లింలు కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకున్నట్టనిపించదు. హిందూత్వంలో దళిత బహుజనుల అణచివేతని చర్చిస్తూ వారు హిందూత్వానికి కండ బలంగా మాత్రమే పనిచేసే (దు)స్టితి నించి, విశ్వ నాగరికతలో (క్రియాశీలకులుగా పనిచేసే శక్తిగా మార్చాలి. అందుకు నిర్మాణాత్మకంగా కుల వ్యతిరేక చర్చ సాగాలి. వివిధ సామాజిక, రాజకీయ నిర్మాణాల్లో నాయకత్వ స్టానంలో ఉన్న అ(గ్ర వర్షస్టులు కుల వ్యతిరేక నినాదాలు మాత్రమే ఇస్తూ ఆస్టానాలను పైకి వచ్చే దళిత బహుజన మేధావులకు అందకుండా చేస్తున్నారు. ఈ స్థితిలో ఉత్పాదక సామర్థ్యమున్న జనసమూహ పాత్ర, అటువంటి నాయకుల సంస్థలలో నామమాత్రమే. వారు మాట్లాడే భావజాలం పట్ట విశ్వాసం పోతున్నది. దళిత, బహుజనులు హిందుత్వ గుప్పిటలోకి పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. కులాన్ని చర్చించే విషయంగా మార్చడం ద్వారానే దళిత, బహుజన యువతను హిందూత్వం వైపు మళ్ళడం కూడా ఆపవచ్చు. సెక్యులరిస్టులు మతం కంటే కులం 'ప్రమాదకరమైనదని భావిస్తారు. అధికార స్టానాలు దళిత బహుజనులకు పోవడం కంటే హిందుత్వ మతోన్మాదాన్ని సమర్థించడమే మంచిదనుకుంటారు. మతోన్మాదం యధాతథ స్టితిని కొనసాగిస్తుంది. అందుకే వారు దాన్ని ఇష్టపడతారు. ఈ తిరోగమనాన్ని 'ప్రశ్నించకుంటే సామాజిక సిద్దాంతవేత్త కులోన్మాద శక్తుల సరసన చేరే ప్రమాదం ఉంది. ఈ శక్తులే మతోన్మాదానికి చోదకశక్తులని గమనించాలి. వార్త - 2 మార్చి, 2003
రి అంబేడ్కర్ దశ, దిశ అగ్రకులాలకు అర్ధం కావడం లేదు! అంబేడ్కరొప్టై ఉండవల్లి అరుణ్‌కుమార్ దాడి, తిరిగి ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లడం రాష్టంలో ఒక రెండు రోజుల నాటకం అయింది. ప్రపంచంలో మహమ్మద్‌ను ఒక మాట తిట్టి ఎవడైనా ఒకరోజు ఎలా బతకలేడో, దేశంలో అంబేద్కర్‌ను తిట్టి బతకలేన్సి స్టితి ఇప్పుడిప్పుడే వస్తున్నది. అట్టడుగు ప్రజల విముక్తి కోసం పోరాడిన యోధుడు అత్రి కొద్దిరోజుల్లోనే ఒక ప్రవక్త స్థాయికి ఎలా చేరతాడో మనం అంబేడ్కర్లో చూడవచ్చు. ఎక్కడో ఒక మారుమూల అంబేడ్కర్ వి(గ్రహాన్లి కూ లకొడితే ఒక రాష్ట్రంలో మంటలెట్టా ఆంటుకుంటాయో గత సంవత్సరం మహారా(ష్టలో చూశాం. నాలుగుగోడల మధ్య జరిగిన ఒక మీటింగ్‌లో అంబేద్కర్‌ను ఒకమాట తిడితే రాష్ట్రమంతా ఎలా తిరుగబడుతుందో, మీడియా సైతం ఎట్లా నిప్పులు కక్కుతుందో మనరా(ష్టంలో మొన్న చూశాం. నా జీవితంలో అతి సంతృప్తితో చూసిన దృశ్యాలు ఇవే. 1985 నాటికి కమ్యూనిస్టులు సైతం అంబేడ్కర్ వలసవాద ఏజెంటు అని ప్రతి మీటింగ్‌లో తిట్టినా వారిని నిలదీసే సత్తా ఎవరికీ లేకుండింది. కాని మార్క్‌ను ఒక్క మాట అంటే, ఆ వ్యక్తిని పార్టీ నుండి బహిష్కరించి, కమ్యూనిస్ర సంఘ బహిష్కరణ చేసిన సంఘటనలెన్నో ఉన్నాయి. మనరా(ష్టంలో అంబేడ్కర్ తాత్విక హోదా, స్టాయి మార్క్‌ను మించిపోయింది. ఉండవల్లి ఒకవేళ మార్క్స్‌ను కాలం చెల్లిన సిద్ధాంతకర్త అంటే కమ్యూనిస్టు పార్టీలు విమర్శించేవి. అంతటితో సమస్య ఆగిపోయేది. ఆయన ఆఘమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్కండీషనల్గా క్షమాపణ చెప్పాల్సిన స్థితి వచ్చేది కాదు. అట్టని మార్క్స్ (ప్రభావాన్ని (ప్రపంచం మీద తక్కువ అంచనా వేయడం లేదు. అంబేడ్కర్ ప్రభావం 1985కు ముందు ఎట్లా ఉన్నది, 2005 నాటికి అది ఎట్టా మారింది అని చెప్పడానికి మాత్రమే ఈ పోలిక. ఒకవేళ ఉండవల్లి మహాత్మాగాంధీని తిట్టినా వాళ్ళ పార్టీ కూడా పట్టించుకొనేది కాదు. 26
అంబేడ్కర్ దశ, దిశ అ(గ్రములాలకు అర్ధం కావడం లేదు! 27 అంబేడ్కర్, గాంధీ అనుచరుల్లో ఎమోషనల్ ఎటాచ్మెంట్ తేడా ఊహించిలేనంత ఉన్నది. గాంధీది ఒక నాయకునిస్టాయి అయితే, అంబేడ్కర్‌ది ఒక (ప్రవక్త స్థాయి అనే అంశాన్ని ఆ(గ్రకులాలు అర్ధం చేసుకోవడం లేదు.
మనకు అందుబాటులో కొచ్చిన చరిత్రలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే (ప్రవక్తలుగా మారారు. బుద్దుడు, జీసస్, మహమ న మార్క్స్, అంబేడ్కర్, ప్రవక్తకుండాల్సిన (ప్రథమ లక్షణం, ఆయన తనకాలంలోని అత్యంత అణిచివేతకు గురైన మానవ సమూహాల విముక్తి కోసం పోరాడడం, బోధించడం, రాయడం. బుద్దుడు, జీసస్ కాలంలో లిపి అంత అభివృద్ది చెందలేదు కనుక వాళ్ళు పోరాడారు. తమ స్వేచ్చా సమానతత్వాన్ని బోధించారు. కాని మహమ శద్, మార్క్స్, అంబేడ్కర్లు పోరాడడం, బోధించడంతో పాటు రాయడం కూడా చూస్తాం. ప్రవక్తలు మాత్రమే మానవుల మీద మానవాతీత ప్రభావాన్ని పడేస్తారు. వారిని ఎవరైనా దూపిస్తే రాజ్యాలు కదిలే దుమారం లేస్తుంది. (బ్రాహ్మణ సంస్కృతిలో పుట్టి పెరిగి, రాళ్ళకు, రప్పలకు, చరిత్ర కందని దేవుళ్ళకు మొక్కే అరుణ్‌కుమార్ వంటి వాళ్ళకు మానవులుగా పుట్టి ప్రవక్తలుగా మారిన మహనీయుల గురించి అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. ఇప్పుడు అంబేడ్కర్ దశ ఒక ప్రవక్త దశ. ఆయన రాళ్ళను, పాముల్ని, చరిత్రకందని వ్యక్తుల్ని (అబ్'స్త్రాక్ట్ గాడ్ని కాదు) పూజించే శక్తుల్ని మట్టిగరిపించే ప్రవక్తగా మారుతున్నాడు. అది ఆయన దొశ అంబేడ్కర్‌ను దూషించే శక్తుల్ని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కాపాడలేరు.
మహమ్మద్‌ను దూషించిన వ్యక్తుల మీద ఎంత దాడి జరుగుతుందో, రానున్న రోజుల్లో అంబేడ్కర్‌ను దూషించిన వ్యక్తుల మీద అంత దాడి జరుగుతుంది. ఆ స్థితి తన అనుచరులపై ప్రవక్త ప్రభావాన్ని మాత్రమే చూపుతుంది. ఇది మంచిదా అని కొంతమంది అ(గ్రకుల 'హేతువాదు'లనొచ్చు. అణిచివేతకు గురైన, అంటరాని వాళ్ళుగా జీవించి తమ సామాజిక స్థానాన్ని అగ్రకులం తలపై నిలబెట్టకోవాలంటే అంత ప్రభావం గల (ప్రవక్త వాళ్ళకు అవసరం. మార్క్సిజం ప్రాణాలు ఇచ్చి, ప్రాణాలు పుచ్చుకునే స్థాయికి ఎదిగింది కూడా, మార్క్‌ను ఆయన అనుచరులు ఒక ప్రవక్త స్థాయిలో గౌరవించాకే. ఆయన పేరుతో సాయుధ దళాలు, సైన్యాలు పుట్టింది ఆయన సిద్దాంతంపై అచంచల విశ్వాసం కలిగాకనే, ఆ మార్క్‌ను కూడా ప్రవక్త అని ఎందుకంటున్నాను? ఆయన తన సమకాలీన (శ్రామికవర్గం = అంటే అణిచివేతకు గురయ్యే అట్టడుగు జనం పక్షాన నిలబడ్డాడు, పోరాడాడు, వారికి బోధించాడు, వారి విముక్తి గురించి రాసాడు. బుద్దుడిది ఒక చారిత్రక దశ ఆ తరువాత 6-7 వందల సంవత్సరాలకు జీసస్ పుట్టాడు. ఆయన సమరిటన్లు (ఇజరేలీ అంటరానివాళ్ళు) , జైంటైళ్ళు (ఆనాటి సూదులు), బానిసలు మొదలగు వారిని
28 సామాజికం విముక్తి చేశాడు. ఆ తరువాత 7-8 వందల సంవత్సరాలకు మహమ్మద్ పుట్టాడు. ఆయన అరబ్బు బానిసల్ని, టటైబుల్ని బానిసత్వం, మూఢనమ్మకం, అజ్ఞానం నుండి విముక్తి చేశాడు. మహమ్మద్ పుట్టాక దాదాపు 13 వందల ఏళ్ళకు మార్క్స్ పుట్టాడు. ఆయన యూరోపియన్, ప్రపంచ శ్రమజీవుల విముక్తికై పోరాడాడు. ఆ తర్వాత అంతిమంగా అంటరానితనం కులవ్యవస్థ రూపంలో మిగిలి ఉన్న బానిసత్వాల నుండి మానవుల్ని విముక్తి చేయడానికి అంబేడ్కర్ పుట్టాడు. అందుకే ఆయన మీద అగ్రకుల వ్యక్తులు ఎవరు దాడి చేసినా ఆయన అనుచరులు మెడలు వంచి ఆయన ముందు మోకరిల్లే స్థితికి తెచ్చే పరిస్టితి మన కళ్ళ ముందు ఉన్నది. అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగం రాయడంతో మాత్రమే ముడేసి చూడొద్దు. ఆయన జీసస్కు సైంట్పాల్ ఎటువంటి అనుచరుడో, బుద్దునికి అటువంటి అనుచరుడు. అందుకే ఆయన నవయాన బుద్దిజాన్ని స్థాపించాడు. కుల నిర్మూలన సిద్దాంతాన్ని రాసాడు, (బ్రాహ్మణిజాన్ని ఈ దేశంలోనే రూపుమాపే రోడ్డు మ్యాప్ రూపొందించాడు. అరుణ్ కుమార్‌కి పుస్తకాలు, వ్యాసాలు చదివే అలవాటు ఉందో లేదో తెలియదు. ఈ దేశంలో రాజకీయనాయకులకు చాలామందికి ఆ అలవాటు లేదు. ఆయనకు ఇప్పటివరకు ఆ అలవాటు లేకపోయినా ఇప్పుడు (ప్రయత్నించి అంబేడ్కర్ పుస్తకాల్లో మొదటి వాల్యూమ్, మూడవ వాల్యూమ్ చదివితే ఆయన కనీసం “భావ బానిసత్వం" నుండి విముక్తి పొందగలడు. అంబేడ్కర్ మాత్రమే ఆయన్ని విముక్తి చెయ్యగలడు. సూర్య - 2 మార్చి, 2008
0 మన జర్నలిస్టులు లు అట్లీ అ చెప్పులతో రాస్తున్నారా? ఆంధ్రజ్యోతి 26వ తేదీన “బాడుగ నేతల కథనం' రాసింది. అదే రోజున మందకృష్ణమాదిగ, ఆర్కృష్ణయ్యల నేతృత్వంలో ఆ కథనానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం శాంతియుతంగా అంబేద్కర్ వి[గ్రహం వద్ద జరుగుతున్న (క్రమంలో కొంతమంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి చేశారు. ఆ దాడిని నేను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అదే రోజు కొంతమంది పత్రికా విలేఖరులు, దేవులపల్లి అమర్ (ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు, జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు), క. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్) దాడికి వ్యతిరేకంగా ఊరేగింపు తీశారు. ఆ ఊరేగింపు ఆంధ్రజ్యోతి ఆఫీసునుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు పోయింది. అక్కడ మందకృష్ణమాదిగ దిష్టిటొమ్మును ఈ ఇద్దరి నేతృత్వంలో జర్నలిస్టులు చెప్పులతో కొట్టి తగులబెట్టారు. ఈ చెప్పుల వీరంగాన్ని అన్ని టివిలు తమ కమెరాలల్లో బంధించి రాష్ర్రానికంతా చూపించాయి. మరుసటిరోజు ఆంధ్రజ్యోతి ఆఫీసును అధికారికంగా సందర్శించిన దేవులపల్లి అమర్ ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణతో 'మీరు వెంటనే కృష్ణ మాదిగపై కేసు పెట్టాలి" అని ఒత్తిడి తెచ్చి పెట్టించారు. ఆయన చేసిన ఆ డిమాండ్‌ను ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తగా ప్రచురించింది. దేవులపల్లి ఒక ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వ్యక్తి దాదాపు కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్రపు అత్యున్నత జర్నలిస్ట్ యూనియన్‌కు అధ్యక్షుడు. ఆయన అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని శాంతియుతంగా ధర్నా చేస్తున్న మందకృష్ణ దాడికి బాధ్యుడని కేసు పెట్టించారు. మందకృష్ణ ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఆఫీసుకు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో శాంతియుత సమరంలో మీడియా వారందరి ముందే కూర్చొని ఉన్నారు. కానీ అమర్, శ్రీనివాస్‌లు ఇద్దరూ స్వయంగా మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టే ప్రక్రియలో ఉన్నారు. 29
30 సామాజికం చెప్పులతో కొట్టే ప్రక్రియలో, దుర్భాషలాడే భాషా యుద్దంలో భాగస్వాములై ఉన్నారు. వీరి మీద మందకృష్ణ మాదిగ ఆయన (ప్రాతినిధ్యం, నాయకత్వం వహించే దళితులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడం న్యాయమా, అన్యాయమా అనే చర్చ జరుగుతోంది.
మూడువేల సంవత్సరాల అంటరానితనాన్ని, (శ్రమ బానిసత్వాన్ని, అగ్రకుల దురహంకారాన్ని అనుభవించిన దళితులు ఇక ముందు ఏ రూపంలోనూ ఆ బాధలు అనుభవించకుండా బయటపడేందుకు రాజ్యాంగం ఇచ్చిన చట్టం “ఎస్సి, ఎస్.టి, అట్రాసిటీస్ యాక్టు ఈ చట్టం కింద దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌లను అరెస్టు చేయాలని మందకృష్ణమాదిగ కేసు పెట్టారు. అదే సందర్భంలో 27వ తేదీన ఆంధ్రజ్యోతి మొదటిపేజీలో వేసిన కార్టూన్లో నిలువెత్తు కాళ్ళకు చెప్పులు తొడుక్కొని కూర్చున్న ఒక భూస్వామి పాదాల దగ్గర (వ్రైఎస్రాజశేఖర్రెడ్డి అనే అర్ధంలో) మంద కృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్య, విజిఆర్ నారగోని, జూపూడి (ప్రభాకర్, కాసాని జ్ఞానేశ్వర్ - వీరు ప్రాతినిధ్యం వహించే బడుగువర్గాల (ప్రజలు దాసోహం చేస్తున్నట్టు బాడుగ (కూలీ) తీసుకుని బతుకుగడిపే జీతగాళ్ళలా చిత్రించారు. అయితే ఆ భూస్వామి చెప్పులకు వీళ్ళంతా కట్టుబానిసలని అర్ధం. అదే రోజు పత్రిక హెడ్లైన్లో మిమ్మల్ని బాడుగనేతలని పదిసార్జు అంటాము' అన్నట్టు తాటికాయంత అక్షరాలతో కలంతోటి కాదు, రాధాకృష్ణ చెప్పుతో రాశారు. దీనికి మంద కృష్ణ ఎంఆర్పిఎన్ కార్యకర్తలు రాధాకృష్ణపై ఎస్సి, ఎస్.టి, అట్రాసిటీస్ యాక్టు కింద కేసు పెట్టారు.
ఈ రకంగా ఎన్.,ఎస్.టి అట్రాసిటీన్ యాక్టు కింద దేవులపల్లి అమర్, కె. శ్రీనివాసరెడ్డి, వి. రాధాకృష్ణలపై మందకృష్ణ మాదిగ, ఆయన ఉద్యమం కేసు పెట్టడంపై పత్రికలు, మీడియా అపహాస్యం చేయవచ్చు. వారిని అరెస్టు చేయకుండా పోలీన్ యంత్రాంగాన్నంతా కట్టిపడేసి మంద కృష్ణమాదిగను మాత్రం అరెస్టు చేయించవచ్చు. ఆ బలం రాధాక్షృష్టక్తి దేవులపల్లి అమర్‌కి ఉంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలోని జర్నలిస్టులంతా, పత్రిక, టివిల ఎడిటర్లంతా. ప(త్రికా యాజమాన్యం మొత్తం - వారి కులం ఏదైనా, వారి బలం ఎంతయినా ఆలోచించాల్సిందేమంటే - ఆంధ్రజ్యోతి ఈ కథనం రాయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిలో పత్రిక యాజమాన్యం, జర్నలిస్టు నాయకత్వం కలం యుద్దం చేస్తున్నదా, చెప్పుల యుద్ధం చేస్తున్నదా అని! ఈ యుద్ధంలో బడుగు వర్గాల నాయకత్వంపై కలం బలం కంటే చెప్పుల బలం ఎక్కువ చూపిస్తున్నారు. కలంతో రాసే వారి 'సవిత్ర' కార్యక్రమాన్ని పక్కకు పెట్టి చెప్పులతో కొట్టడం, చెప్పులతో రాయడం అనే ఒక విచిత్ర జర్నలిస్టు సంస్కృతిని ఈ రాష్ట సమాజం మీద వెదజల్లదలుచుకున్నారు.
మున జర్నలిస్టులు చెప్పులతో రాస్తున్నారా? 31
చెప్పు చరిత్ర, కులం చరిత్ర మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. భారతదేశంలో (బ్రాహ్మణ వ్యవస్థ నిర్మించిన సంస్కృతిలో మంద కృష్ణ జాతి - మాదిగ జాతి మాత్రమే చెప్పులు చెయ్యాలి. బ్రాహ్మణులు వేల సంవత్సరాలు ఆ చెప్పుల్ని ముట్టకోను కూడా ముట్టకోలేదు. తోలు చెప్పులు అపవిత్రమమైనవని, (బ్రహ్మ నుంచి ఇప్పుడున్న శంకరాచార్యుల వరకు చెక్క పాద కోళ్ళు వేసుకొని నడుస్తారు. చెప్పులు ఏ దేవుని సన్నిధిలోకి రావడానికి వీల్లేదు. ఆ చెప్పుల్ని ఇప్పుడు అమర్, కె. శ్రీనివాస్, రాధాకృష్ణ - మాదిగపై దయదలచి ఆధునిక అవతారంలో తొడుక్కుంటున్నారు. వీళ్ళు హిందూ దేవుళ్ళను నమ్ముతారో లేదో నాకు తెలియదు. కె. శ్రీనివాస్ దళిత బహుజనుల పట్ట, తెలంగాణ జీవనం పట్ట సానుభూతి ఉన్న రచయిత. నేను గౌరవించేవాళ్ళల్లో ఆయనొకరు. మరి మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని, ఆయన చరిత్రను కె.శ్రీనివాస్ గౌరవిస్తారో లేదో నాకు తెలియదు. మందకృష్ణ మాదిగ సంఘటనా స్థలానికి ఆరు మైళ్ళ దూరంలో కెమెరాల ముందు కూర్చుని ఉన్న స్థితిలో, ఆయన దిష్టిబొమ్మలను చెప్పుతో కొట్టడం, ఎడిటర్‌గా తాను ఆయనపై కేసు పెట్టడం ఎంత న్యాయమని కె. శ్రీనివాస్ అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ కొందరు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చెయ్యగానే మందకృష్ణ ఉద్యమ చరిత్రను, మాదిగ సామాజిక జీవనాన్ని నడిరోడ్డుమీద చెప్పుతో కొట్టే సంస్కృతి ఒక పత్రికా ఎడిటర్‌కు, ఆ సంస్కృతికి నాయకత్వం వహించడం ఒక సీనియర్ జర్నలిస్టుకు తగదు. ఈ ఒక్క ఘటనతో మాదిగ జాతి గౌరవాన్ని, మందకృష్ణ నాయకత్వాన్ని చెప్పుతో కొట్టాలని నిర్ణయించుకున్నారంటే, వీరు జర్నలిజాన్ని ఎటువైపుకు తీసుకుపోదల్చుకున్నారో? ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులంతా, యూనియన్ అంతా, పత్రికల యాజమాన్యమంతా ఆలోచించాల్సిన అవసరం లేదా?
చెప్పులకు బ్రాహ్మణీయ సమాజం - హిందూ దేవతలు దూరముండడమే కాక కలాన్ని ఎప్పుడో మాల, మాదిగ, చాకలి, మంగలి, కమ్మరి, గొల్లకుర్మ వంటి బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి రాకుండా చూశారు. ఆ కలాన్ని ఈనాటికీ కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వ్యవస్థలో ఎంతమంది ఎస్సి, ఎస్టి, బిసిల చేతులకు అందించారో లెక్కలు చెప్పగలరా? కలం దళిత జనుల చేతుల్లోకి రాకుండా చూడడమే కాకుండా వాళ్ళ చేతికి ఒక సంస్థ, తమదంటూ ఒక నాయకత్వం వస్తే ఈ బ్రాహ్మణీయ కలం బడుగు నేతలు అనే బదులు వాళ్ళను “బాడుగ నేతలు' అని ఎద్దేవా చేస్తూ రాస్తుంది. రోడ్ల మీద చెప్పులతో కొడుతుంది. ఆం(ధ్రజ్యోతిపై జరిగిన దాడి రాక్షస దాడి అని ఆ పత్రిక మాజీ ఎడిటర్జు ఇద్దరు జాతికి నీతిని బోధించే వ్యాసాలు రాశారు. దాడిని ఖండించాలని రాష్ట్ర (ప్రజానీకాన్ని అడిగారు. కానీ మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను చెప్పులతో నడిరోడ్డు మీద కొడితే అది ఖండించదగ్గ చర్య అని ఒక్కమాట కూడా చెప్పలేదు. అంటే పత్రికారంగం ఏ (ప్రమాణాలకు ప్రాతినిధ్యం వహించాలని వీరు అనుకుంటున్నారు? జర్నలిస్ట యూనియన్
32 సామాజికం కూడా ఆం(ధ్రజ్యోతిసై దాడిని ఖండించిన స్పాయిలో కాకపోయినా ఈ చెప్పుల దాడిని తప్పని చెప్పిన దాఖలాలు లేవు. ఈ దేశంలో జర్నలిజం ఏ ప్రజాస్వామిక విలువల్ని నిలబెట్టాలని వీరు కోరుకుంటున్నారు? కులవ్యవస్థ అంటరానితనం, అ(గ్రకుల ఆధిపత్యం, పెత్తనం మీడియాలో లేకుండా పోయిందని వీళ్ళు సమాజానికి చెప్పదలచుకున్నారా? ఉదాహరణకు, ఒక పత్రికపై కాం(గ్రైన్ కార్యకర్తలు లేదా తెలుగుదేశం కార్యకర్తలు లేదా టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, పత్రికల ఎడిటర్జు ఒక ఊరేగింపు తీసి, ఈనాటి కాం(గైస్ నాయకుడైన రాజశేఖరరెడ్డి దిష్టిబామ శ్రను రోడ్లపై చెప్పుతో కొడతారా? తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను రోడ్డుపై చెప్పుతో కొట్టగలరా? టిఆర్‌ఎస్‌నేత చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను రోడ్డుపై చెప్పుతో కొడతారా? మరి మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను ఎందుకు చెప్పుతో కొట్టారు?
ఆయన మాదిగ నాయకుడు కనుక! ఏ పత్రికలో రాతలైనా మాదిగలపై ఒకే రకంగా ఉంటాయి. మాలలపై ఒకే రకంగా ఉంటాయి. బిసిలపై ఒకే రకంగా ఉంటాయి. అదే అ(గ్రకులాలపై మరోరకంగా ఉంటాయి. ఏదైనా ఘటన జరిగితే అది అనుకోకుండా జరిగినా, ఆవేశంతో జరిగినా బడుగు వర్గాల వారిని పత్రికల్లో కలంతో తిట్టాలి. రోడ్డ మీద చెప్పులతో కొట్టాలి! అగ్రకులాల వారు, వారి నాయకత్వంలోని సంఘాలు దాడులు చేస్తే సర్ధి చెప్పుకోవాలి, రహస్య సమావేశాల్లో సర్దుబాట్టు చేసుకోవాలి. గౌరవప్రద హెచ్చరింపులు చేసుకోవాలి! ఇవీ ఈనాటి పత్రికా విలువలు,
ఈ విలువల్ని మార్చడానికి, ఈ చెప్పులతో రాసే సంస్కృతిని మార్చడానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఏమి చేయదలచుకున్నదో (ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కులం ఒకే రూపంలో పనిచేయదు. అది మహా విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు ప్రతి రంగంలో ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. ఈ ఆంధ్రజ్యోతి సంఘటనలో కులం ఎత్తాల్సినన్ని అవతారాలు ఎత్తుతూనే ఉంది. కనుక కులరహిత జర్నలిజాన్ని, చెప్పులతో రాయలేనటువంటి సంస్కృతిని, మనిషిని మనిషిగా, మందకృష్ణ మాదిగను ఒక మంద కృష్ణ మాదిగగా, ఆర్. కృష్ణయ్య ఒక ఆర్: కృష్ణయ్యగా గౌరవించదలచుకున్నారా? లేదా? వీరు వారిని బడుగు వర్గాల వారైనందుకు 'బాడుగ' నేతలుగానే చూడదలచుకున్నారా అనేది యూనియన్ కూడా ఆలోచించాల్సి ఉంది. మందకృష్ణ మాదిగ పెట్టిన ఎస్సి., ఎస్.టి, అట్రాసిటీస్ యాక్టు కేసు కింద అమర్; శ్రీనివాస్, రాధాకృష్ణ అరెస్టు కావచ్చు. కాకపోవచ్చు. వాళ్ళకున్న బలంతో మందకృష్ణ మాదిగ అరెస్టు కావచ్చు. జైల్లోనే సుదీర్హకాలం మగ్గవచ్చు! కొని చరిత్ర మాత్రం ఈ చెప్పుల రాతలను మరచిపోదు. ఈ రాష్ట్రపు, ఈ దేశపు బహుజన సమాజం పత్రికా స్వేచ్చ ముసుగులో కలం పేరుతో, చెప్పుల జులుం చేస్తే సహించదు. మీరే ఆలోచించండి! సూర్య - 31 మే, 2008
10
పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది!
(పైస్ అకాడమీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ నేను మే 31న 'సూర్య'లో 'మన జర్నలిస్టులు చెప్పులతో రాస్తున్నారా?” అని రాసిన వ్యాసానికి రిజాయిండర్ రాశారు. అందులో ఆయన 'వప్పులతో కొట్టే సంస్కృతికి నేను వ్యతిరేకం" అని చెప్పారు. 'ఆంధ్రజ్యోతి' బాడుగ నేతల కధనం, దానిపై దాడి, కృష్ణమాదిగ దిష్టిబొమ్మను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద జర్నలిస్టులు చెప్పులతో కొట్టి తగులబెట్టడం అనే మూడు సమస్యలు మొత్తం చర్చలో అతిముఖ్యమైనవి. ఈ మూడింటిలో అతి ప్రాధాన్యత గల సమస్య కృష్ణమాదిగ నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని. మాదిగజాతిని, బహుజన జాతిని చెప్పుతో కొడతామని అగారవపరచడం. ఆయన కేవలం మాదిగ పోరాట సమితి నాయకుడే కాదు. పసిపిల్లల గుండె రక్షణ పోరాట సమితి. వికలాంగుల అంగరక్షణ పోరాట సమితి నాయకుడు కూడా. ఎన్నో దళిత బహుజన ఉద్యమాలతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన పాలకుడు కాదు, మంత్రి అంతకన్నా కాదు. ఎంతోమంది మీద దాడులు చేసిన (స్టీట్రౌడీ అంతకన్నా కాదు. ఆయన దిష్టిబొమ్మను చెప్పుతోకొట్టడం బడుగువర్గాలందరి ఆత్మగౌరవ సమస్య,
అంతేకాక అందులో, చెప్పు అనే సరుకులో మానవులకు మహా ఉపయోగమైన మాదిగ శ్రమ మాత్రమే ఉన్నది. ఆ చెప్పును హిందూ దేవతలు, (బ్రాహ్మాణీయ పండితులు (పూజారులు) వాడుకొని అవమానపరిచిన చరిత్ర ఈ దేళానికున్నది. ఆయన దిష్టిబొమ్మను చెప్పుతోటే ఎందుకు కొట్టారు? కలంతో ఎందుకు కొట్టలేదు? అగ్రకుల ఆధిపత్య వాదులు, పలుకుబడి ఉన్న జర్నలిస్టులు కూడా ఇష్టంగా హిందూ దేవతల ముందు పెట్టుకొనే పువ్వులతో ఎంతుకు కొట్టలేదు? వారి దృష్టిలో భాషలో, అక్షర సత్యపు ఆరగింపులో చెప్పు నీచాతి నీచమైన పదార్ధం. ఆ చర్యలో మానవ కాలి రక్షణకు, శరీర రక్షణకు ఉపయోగపడ్డ తోలును అవమానించడం ఉంది. అలాంటి చెప్పుతో మందకృష్ణ మాదిగను ఆ ఊరేగింపులో కొట్టారా? లేదా? అమర్ చెప్పలేదు. కొడితే వారికి శిక్ష
33
ఏడ సామాజికం ఉండాలా, వద్దా? అమర్ చెప్పలేదు. ఉండాలంటే, ఆయన జ్యోతిపై దాడిని ఖండించినట్టు ఈ 'జర్నలిస్ట్ చెప్పుల దాడిని' ఎందుకు ఖండించలేదు? అమర్ జర్నలిస్టు సంఘం నాయకుడు కాదు. కేవలం ప్రెస్ అకాడమి అధ్యక్షుడు. నిజాలను, నిజాలుగా చెప్పే అనుభవం ఉన్న జర్నలిస్టు. ఆయనకు “బాడుగ” పదం ఎంత హింసాత్మకమైందో ఎలా తెలియకుండా పోయిందా? (పైన్ అకాడమి ఇటువంటి హింసాత్మక పదజాలాన్ని వాడవచ్చని చెబుతుందా? అసలు (ప్రెస్ అకాడమి విధులేమిటి అనే ప్రశ్నపై ఎప్పుడో ఒకప్పుడు చర్చ జరగాలి కదా!
అమర్ పెన్ అకాడమి అధ్యక్షుడు మాత్రమే అయినప్పుడు కృష్ణ మాదిగ మీద కేసుపెట్టాలని ఎందుకు డిమాండ్ చేశారు? 28 మే ఆంధ్రజ్యోతి పేజీ 9లోని వార్త చూడండి. 'మంద కృష్ణ పై కేసు పెట్టాలి: అమరో అనే శీర్షికన వచ్చిన వార్త ఏం చెబుతోంది? 'ఆం(ధ్రజ్యోతిపై దాడిని సమర్ధించుకుంటూ ఇట్లే దాడులు చేస్తామని (ప్రకటించిన మందకృష్ణ మాదిగపై ఇంకా కేసు పెట్టకపోవడం శోచనీయమని (ప్రెస్ అకాడమి వైర్మన్ దేవులపల్లి ఆమర్ అన్నారు. వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. (ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా ఫలానా వ్యక్తి మీద కేసు పెట్టమని ఆయన ఎలా డిమాండ్ చేస్తారు? అదొక 'ప్రభుత్యసంస్థ. అది జర్నలిస్టుల యూనియన్ కాదే? ఈ సంఘటన జరిగాక ప్రెస్ అకాడమి
- బలహీన వర్గాల పట్ట ప్రెస్‌కు ఎటువంటి దృష్టి ఉన్నది, వారు ఒక పత్రికపై ఇలా (ఎందుకు స్పందించారు అని ఒక సదస్సు జరిపి చర్చించి ప్రెస్‌కు ఒక భాషా కోడ్‌ను, బలహీనవర్గాలకు అందులో సఠితృప్తికర వాటాను కల్పించే ప్రయత్నం చేయాలి కదా! అందుకు బదులు యూనియన్ పనులకు ఎందుకు దిగింది ప్రెస్ అకాడమి?
నేను, ప్రా॥ విశ్వేశ్చరరావు ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ప్రధానకార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి అమర్నాథ్, అమర్‌లతో ఈ మొత్తం సమస్యకు పరిష్కారం చర్చించినప్పుడు అమర్ స్వయంగా మేమే “మీట్ ది ప్రెస్' ఏర్పాటు చేస్తాం. కృష్ణమాదిగ దానికి హాజరై ఒక పరిష్కార ప్రకటన చేయమనండి అని ప్రతిపాదించారు. ఆ విషయంపై మేం కృష్ణ మాదిగతో చర్చించి ఒప్పించాం. మరుసటి రోజుకు యూనియన్ నాయకత్వం తాము 'మీట్ ది ప్రెస్ పెట్టబోమని, కృష్ణమాదిగే 'మాకు చూపించి" స్వయం (ప్రకటన చేయాలని ఒక ప్యూడల్ ప్రతిపాదన చేసింది. దానితో రాజీ చర్చ రాళ్ళలో కలిసింది.
సమస్య “జ్యోతి వాడిన దళిత వ్యతిరేక భాష జర్నలిస్టు విలువలకు సంబంధంలేని కథనం, అగ్రకుల అహంకార ధోరణి నుండి ప్రారంభమైంది. దాని తరువాత క(ర్రల, రాళ్ళ, పెట్రోల్ దాడి, ఆ తరువాత జర్జలిస్టుల చెప్పులను, మాదిగలను, బహుజనులను అవమానించే ఊరేగింపు అనే అంశాలు అందులో ఉన్నాయి. నా దృష్టిలో అన్నిటి కంటే
పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది! వై5 చెప్పులదాడి సాంస్కృతిక బ్రాహ్మణిజపు ముద్దుబిడ్డ దాన్ని నడిరోడ్డు మీద (ప్రదర్శించారు. ఈ మొత్తం సమస్యకు మందు, ఈ చెప్పుల దాడి చేసినందుకు ఆ వస్తు ఉత్పత్తిదారులైన మాదిగలకు లేదా దళితులందరికీ ఆ ఊరేగింపులో పాల్గొన్నవారు గాని, వారి యూనియన్‌గానీ క్షమాపణ చెప్పాలి. తరువాత దాడి జరిపినవారు గాని వారి నాయకత్వం గాని తప్పునాప్పుకోవాలి, అంతిమంగా జ్యోతి ఆ వార్త రాసిన స్టానంలోనే బాడుగలనే తిట్టపదంతో, జర్నలిస్టు విలువలతో సంబంధంలేని కథనం రాసినందుకు, అటువంటి రాతలు మునుముందు ఉండవని రాయాలి. ఈ మూడు పనులు ఆ (క్రమంలో జరిగితే అందరూ ఆదర్శవంతమైన సంస్కరణవైపు పయనించినట్టు.
ఒక విచిత్రమేమంటే అక్షరసత్యం సిద్దాంతంతో కమ్యూనిస్టు, మావోయిస్టు రచయితలు రాద్దాంతమొకటి చెబుతున్నారు. అవునూ! పట్వారి భూస్వాముల భూములకు రక్షణ కల్పించేది అక్షరంతోనే, రుగ్వేదం కులాలను పుట్టించింది అక్షరంతోనే, మనువు దాన్ని కాపాడే చట్టాన్ని రాసింది అక్షరంతోనే, మార్క్స్పోరాటాన్ని రూపొందించింది అక్షరంతోనే. పూలే బ్రాహ్మణిజాన్ని కూలదోసింది అక్షరంతోనే, అంబేద్కర్ కుల నిర్మూలనకు పూనుకున్నది అక్షరంతోటే. ఇవన్నీ ఒక రకపు అక్షరాలా? మనువు అక్షరం, అంబేద్కర్ అక్షరం ఒక్కటైతే, అంబేద్కర్ మనువు అక్షరాన్ని ఎందుకు తగులబెట్టినట్టు? మార్క్సిస్టులు మనువాదులై అక్షరసత్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
దళిత బహుజనులను అణచివేసి వారిని బానిసలను చేసేందుకు ఒక అక్షరం పుట్టి పెరిగింది. వారిని ఆ బానిసత్వం నుండి విముక్తి చేసేందుకు మరో అక్షరం (దళిత బహుజన అక్షరం) పుట్టింది. “ఆంధ్రజ్యోతి మా అక్షరం మీ ఆయుధం' అని రాష్ట్రమంతా గోడలు నింపింది. ఇప్పుడు దాని అక్షరం ఎవరి ఆయుధమైంది? అది ఎవరిని 'బాడుగ'లని తిడుతున్నది? ఎవరిని మేధావులని పొగుడుతున్నది? ఈ దేశపు దళిత బహుజనుల దృష్టిలో హిందూ గుడి ఎట్లైతే పవిత్రమైంది కాదో, ఇక్కడి అగ్రకుల ఆధీనంలో నడిచే పత్రికలన్నీ సత్య పుత్రికలేమి కావు. ఇక్కడి అగ్రకుల అక్షరం దళిత బహుజన ఆయుధం కాదు. అది దళిత బహుజనుల పట్ల ఉరితాడు. ఆ అక్షరం తోటే వాళ్ళను మూడువేల ఏళ్ళు బంధించారు. అమర్ నేతృత్వంలోని ప్రెస్ అకాడమీ కేసులు పెట్టి ఈ ద్వంద విలువలు గల అక్షరసత్యం గురించి జర్నలిస్టులకు చెప్పాలి. నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్పాలంటే 'అకాడమి' అంటే అర్ధం అటువంటి పనిచేసే సంస్థ, ఇక్కడ మార్క్సిస్టు, మావోయిస్టు అక్షర సత్యపు సిద్దాంతం పవిత్ర మీడియా సిద్దాంతం, జీవించినంతకాలం ఇక్కడ మార్పురాదు. ఇక్కడ గణపతులు గాదు, ప్రచండులు పాలించినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
సూర్య - 8 జూన్, 2008
చాప్టర్ - 11 ఇండియన్ నూవోయిస్టులు
- సామాజిక న్యాయం నూవోయిస్టుల మనోభావం
- బ్రాహ్మణిజం వర్సెస్ మావోయిజం
- ప్రచండుడు కూలదోసిన ఆఖరి హిందూరాజ్యం
- నక్సల్చ్తో చర్చలు - ఆయుధాల ప్రశ్న
బహుజనులకు ఆయుధమే అండ 15. విప్లవోద్యమాన్ని దళితీకరించడం ఎలా? 16. ఆ ముగ్గురి మధ్య కులం పనిచేయలేదా?
కక! సామాజిక న్యాయం మావోయిస్టుల మనోభావం
నవంబర్ 10, 2007 రోజున పోరమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ (బలహీనవర్గాల సాధికార వేదిక) ఇందిరా ప్రియదర్శిని హాలులో సదస్సు జరిపిన దగ్గరి నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణమే మారిపోయింది. ఆ మరుసటి రోజు పత్రికలన్నీ “కమ్మ, రెడ్డి" రాజ్యమింక ఎంతకాలమని హెడ్లైన్ వార్తలు రాశాయి. టీవి ఛానెళ్ళు బాహాటంగా కులవ్యవస్థ మీద చర్చ (ప్రారంభించాయి. అగ్రకుల ఆధిపత్యాన్ని రాజకీయరంగంలో కూలదొయ్యాలని అన్ని పార్టీల్లో గుసగుసలు మొదలయ్యాయి.
ఆ రెండు రోజులకే వాతావరణం మారుతుందని గమనించి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన మిత్రులు మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో బిసిలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై గొడవ మొదలైంది. క్రమంగా రాష్ట్రంలోనే బిసిల రాజకీయ (ప్రతినిధిగా తన గొంతు విప్పనారంభించిన దేవెందర్‌గౌడ్ (క్రమంగా టిడిపి నుండి బయటకు వచ్చి నవతెలంగాణ ప్రజూపార్టీని స్థాపించారు. చివరిగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ పరిణామ(క్రమంలోనే మహాత్మాపూలే, అంబేద్కర్; జగజ్జీవన్‌రామ్, మదర్‌థెరిస్సా, కొమురంభీమ్, చాకలి ఐలమ్మ, తు(ర్రైబాజ్ఖాన్ వంటి వ్యక్తుల పోటోలు రాజకీయ పార్టీల వేదికల మీదికెక్కాయి. మన రాష్ట్ర రాజకీయరంగంలో 2007 నవంబర్ 10వ తేదీ నుంచి సామాజిక న్యాయం కీలకాంశం అయింది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో ఇక్కడి పార్టీలన్నింటికీ సామాజిక న్యాయం పట్ట ఉన్న అవగాహన, ఆచరణలను అంచనా వేయడం ప్రారంభించింది. ఇది మంచి పరిణామం. చిరంజీవి పార్టీని ఈ గీటురాయితో వాళ్ళు అంచనా వేయదల్చుకున్నట్టు వాళ్ళ ప్రకటన చెబుతున్నది. మావోయిస్టు పార్టీ ఈ గీటురాయితో అన్ని రాజకీయపార్టీలను అంచనా వేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు మరెంతో వేగంగా జరుగుతాయి. (ప్రభుత్వంతో చర్చలు జరిపాక సర్వం కోల్పోయిన మావోయిస్టులు ప్రజాస్వామికబద్ద మార్పుల్లో ఒక కీలకపాత్ర
ఏం
త0 ఇండియన్ మావోయిస్టులు నిర్వహించే దశ వచ్చింది. ముఖ్యంగా నేపాల్‌లో (ప్రచండ నాయకత్వంలో అక్కడి మావోయిస్టు పార్టీ ఎన్నికల రంగంలో అధికారంలోకి వచ్చిన ప్రక్రియ ప్రపంచ మావోయిస్టు ఉద్యమాన్ని ఆలోచింపచేస్తున్నది, సామాజిక న్యాయం పునాదిగా గల రాజకీయం ఈ దేశంలో ఒక గణనీయమైన మార్పు తేగలదు. ఇక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థ లక్ష్యాన్ని అది కొన్ని కీలక అంశాల్లో మార్చగలదు. అన్ని పెట్టుబడిదారీ దేశాల్లో కూడా జాన్ రాల్ఫ్ ముందుకు తెచ్చిన సోషల్ జస్టిస్ సిద్దాంతం అత్యంత దోపిడీ వ్యవస్థలను అత్యంత మధ్యతరగతి డిస్టిబ్యూటివ్ వ్యవస్థలుగా మార్చింది. ఉదాహరణకు, మన రాష్టంలో అన్ని రాజకీయపార్టీలను సోషల్ జస్టిస్ సూత్రంతో మెడలువంచగలిగితే కరడుగట్టిన భూస్వాములు, మురారాజకీయ నాయకులు, అత్యంత దోపిడీ చేసే కాంట్రాక్టరు రాజకీయ పట్టులేక బలహీన పడతారు. ముఖ్యమంత్రి పదవి ఒక స్వశక్తి గల బిసి లేదా ఎస్సి నాయకుని చేతిలోకి వస్తే పాత ధనికవర్గం - కులం చాలా పట్టుకోల్పోతాయి. ఏ మార్పు సాధ్యం కాదనుకునే ఆదివాసి, దళిత, బిసి, మైనారిటీ ప్రజలకు ఎంతో ఆత్మధైర్యం వస్తుంది. రాజకీయరంగంలో సామాజిక న్యాయమంటే అగ్రకుల ప్యూడల్ శక్తుల అధికారాన్ని కూలదోసి మధ్యతరగతి దళిత-బహుజనుల చేతుల్లోకి రాజకీయ అధికారాన్ని నెట్టడం. ఎన్నికల్లో పోటీ డబ్బుతో కూడుకున్నదే అయినా అ(గ్రకుల- ప్యూడల్ డబ్బు స్వభావం వేరు. దళిత- బహుజన రాజకీయ శక్తుల చేతుల్లోకి అధికారం వచ్చాక వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు తేవచ్చు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనది విద్యారంగం. వ్యవస్థ అంతా గ్లోబలైజ్డ్ - పెట్టుబడిదారీ రంగంలో నడుస్తున్నా విద్యారంగంలో సంపూర్ణ సామాజిక న్యాయసూ(త్రం ద్వారా అందరు పిల్లలకు ఒకే విద్యావిధానం అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వరంగాన్ని మార్చవచ్చు. మాతృభాష ఉగ్గుపాలు అనే చిల్లర ఆలోచనల్ని పక్కకుపెట్టి కమ్యూనిస్టులంతా మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల వలె రాడికల్‌గా ఆలోచిస్తే అంబేద్కర్ వారిలా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పుల్ని, ఆధునికతను కోరుకున్నాడు. వారిలా సూట్ అండ్ బూట్లో జీవించాడు. కనుక మన రాష్ట్ర విద్యారంగాన్నంతా ఇంగ్రీషు మీడియంలోకి మార్చి, ఉపొధ్యాయ వృత్తిని ఒక డిసిప్లిన్ నేషనల్ సర్వీస్ కిందికి మార్చి పిల్లలందరికీ నిర్బంధ విద్యను సమాన అవకాశాలతో ఇంగ్లీషులో బోధిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక విద్యావిప్లవం వస్తుంది. కె.జి. నుండి 12వ తరగతి వరకు అన్ని సౌకర్యాలు గల అధునిక విద్య పిల్లలందరికీ వచ్చాక ఆత్మగౌరవ పోరాటాలు అడుగడుగునా జరుగుతాయి. విద్యావ్యవస్థ భాష వనరుల తేడా మీద దెబ్బతీయకుంటే, బెంగాల్ విద్యావస్థలా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఆ(గ్రకుల- ప్యూడల్ శక్తులే పాతకాలపు భావాలను
సామాజిక న్యాయం నూవోయిస్టుల మనోభావం 4] కొనసాగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తిని కూడా వాళ్ళు ఒక సోమరి వృత్తిగా మారుస్తారు. జలయజ్ఞం డబ్బులో రెడ్డి-కాపు కాంట్రాక్టర్లు తిన్నట్టు స్కూలు- కాలేజీ కట్టడాల్లో కూడా ఆ కులాలవారు అలానే తింటారు. తమ పిల్లల్ని (ప్రైవేటు ఇంగ్లీషు మీడియంలో చదివించే వారంతా ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, 'సోషలిజం' పేరు చెప్పేవారంతా క్యాపిటలిజాన్ని (ప్రేమిస్తూ వ్యవస్థను యథాతథంగా కాపాడగలరు. సామాజిక న్యాయం ఈ ద్వంద్వ నీతి శక్తుల్ని ముందు కులం పునాదిగా మార్చుతుంది. మీడియా అంతా అ(గ్రకులానిది కనుక సామాజిక న్యాయాన్ని ఒక పనికిమాలిన సిద్దాంతమని చెబుతున్నారు. దానికి కారణం వాళ్ళకు ఇవాళ మీడియా మీద ఉన్న ఆధిపత్యమంతా కూడా (ఫైవేటు రంగంలో నేర్చుకున్న ఇంగ్రీషు మీడియం విద్యతో వచ్చింది. దీన్ని కూలదొయ్యాలంటే మొత్తం (ప్రభుత్వ విద్యారంగాన్ని జాతీయం చేసి ప్రభుత్వరంగంలో కలపాలి. అందుకే రాజకీయరంగంతో పొటు విద్యారంగంలో సామాజిక న్యాయం ఒక ప్రధాన అంశం అవ్వాలి. అన్ని రాజకీయపార్టీలకు ఇంగ్లీషు మీడియం విద్యా అజెండా ఉన్నదా లేదా చూడడం చాలా ముఖ్యమైనది. అది కూడా ఆ పార్టీకి సామాజికన్యాయ సిద్దాంతం ఉన్నదా లేదా అనే అంశాన్ని తెలుపుతుంది.
మూడవది, సామాజిక న్యాయసిద్దాంతం పునాదిగా స్త్రీల జీవితాన్ని మార్చడం. అన్ని రంగాల్లో (స్త్రీలకు సమానావకాశాలు అనే అంశాన్ని వొరి ఇంగ్రీషు విద్యతో ముడేసి చూడాలి. భూమి, వేతనాలు, ఇంటి వనరులు అన్నీ వ్యక్తి హక్కుల పునాదితో చర్చిస్తేనే తేలుతుంది. మావోయిస్టు నిర్మాణాలు చాలా త్యాగాలు చేశాయి. పొత కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు త్యాగాలు చేశాయి గానీ ఇప్పుడు నాయకుల అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి. నాయకులంతా అగ్రకులాలవారు. వాటి క్యాడర్ దళిత బహుజనులు. వాటి సామాజిక న్యాయం నీటి బుడగలా కనిపిస్తున్నది. కనీసం త్యాగాలకు సిద్ధపడ్డ శక్తులన్నా తమ కళ్ళముందే కొంత మార్చునైనా చూడాలంటే సామాజికన్యాయాన్ని ఒక కీలక అంశంగా చేయడం చాలా మంచిది. సామాజిక న్యాయం భారతదేశంలో ఒక కీలకమైన మార్పు తెచ్చే అంశం. అది అన్ని రంగాలను గణనీయంగా ప్రభావితం చెయ్యగలదు. దీన్ని గమనిం చిన మావోయిస్టులు ఈ మార్పుకోసం పోరాడే శక్తులకు మద్దతిస్తే మార్పు ఎంత వేగవంత మవుతుంది? అలాగే ఇంగ్రీషు మీడియం విద్యమీద ఈ శక్తులు ఒక నిర్దిష్టమైన అవగా హనను ఏర్పర్చుకోవడం అవసరం. ఈ శక్తులు ఇంగ్లీషు మీడియం విద్యను వలసవాదంతో ముడెయ్యకుండా రాష్ట్రంలో, దేశంలో సమాన ఇంగ్లీషు మీడియం విద్య డిమాండ్ చేస్తే మార్పు మహావేగవంతమవుతుంది. సామాజిక న్యాయానికి కుల పునాదులను తలకిందులు చెయ్యడం, రాజకీయరంగాన్ని అగ్రకులాల నుండి తప్పించడం, విద్యారంగాన్ని సంపూర్ణ సమానత్వంలోకి మార్చడం, ఆడవారికి అన్ని హక్కులు కల్పించడం-అప్పుడే అంతిమంగా ఒక్ విప్లవాత్మక మార్పుకు పునాదులు పడతాయి. సూర్య ఎగా సెప్టెంబర్, 2008
112
బ్రాహ్మణిజం వర్సెస్ మావోయిజం
ఇండియాలో కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా (బ్రాహ్మణిజాన్ని ఒక సిద్దాంత (ప్రాతిపదికగా గుర్తించలేదు. (బ్రాహ్మణిజం వల్ల హిందూయిజం ఒక ఆధ్యాత్మిక ఫాసిస్టు మతంగా మారిందని గుర్తించలేదు. దాని స్పిరిచువల్ ఫాసిస్టు లక్షణంవల్లనే కులవ్యవస్థ రూపొంది అది మొత్తం సమాజ అభివృద్దికి అడ్డంకిగా మారిందని కూడా గుర్తించలేదు. ఈ కులవ్యవస్థ అన్ని సామాజిక వర్గాల అభివృద్దిని ఆపిందని గుర్తించలేదు. వర్గపోరాటాలు ఈ దేశంలో ఏ దశలోనూ జయప్రదం కాకపోవడానికి హిందూయిజం సమాజాన్ని ఒక చైతన్య రహిత సమాజంగా మార్చినందువల్లనే అని గుర్తించలేదు.
పూలే, అంబేద్కర్ తరువాత నాలాంటి చాలామంది వ్యక్తులు బ్రాహ్మణిజం అంతం కాకుండా ఏ దేశంలో భావ విప్లవం రాదని చెప్పినా కమ్యూనిస్టు పార్టీలు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో ఒరిస్సాలో మావోయిస్టు పార్టీ లక్ష్మణానంద సరస్వతిని, ఆయనతో పాటు నలుగురు బజరంగ్దళ్ నాయకులను చంపాక మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన చేసింది. లక్ష్మణానంద వంటి శక్తులు ఆదివాసీ ప్రాంతాలలో బ్రాహ్మణిజాన్ని ప్రచారం చేస్తూ అభివృద్దిని అడ్డుకుంటున్నాయని అందువల్లనే తాము వారిని చంపామని ఒక విలేకర్ల సమావేశంలోనే తేల్చిచెప్పారు. ఆ ప్రాంతంలో దళితులు, ఆదివాసులు క్రైస్తవులుగా మారుతుండడం వాళ్ళ విముక్తి మార్గంలో ఒక (క్రమమని మావోయిస్టులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో ఆ (ప్రాంతపు (కైస్తవులు మావోయిస్టు పార్టీలో చేరుతున్న (క్రమాన్ని కూడా వాళ్ళు వివరించారు. ఈ (క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని కైస్తవ సంస్థలు కూడా సాయుధ శక్తులుగా మారుతున్నాయని వార్తలొస్తున్నాయి. అహింసకు (ప్రతీకలుగా నిలిచే క్రైస్తవ సంస్థలు సాయుధశక్తులుగా మారడమేమిటని ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ స్థితి రావడానికి వారి మీద జరుగుతున్న నిరంతర దాడులు. వారి అనాథశరణాలయాలను తగులబెట్టడం, వారి స్కూళ్లపై దాడి చేయడం. దేశంలో (క్రైస్తవ స్కూళ్ళు ఇంగ్రీషు మీడియంలో విద్య బోధించడం తెలిసిందే.
42
బ్రాహ్మణిజం వర్సెస్ మావోయిజం తై
ఈ దేశంలోని ఆదివాసులకు, దళితులకు ఇంగ్రీషు మీడియం విద్య రాకుండా చూడాలని హిందూత్వ సంస్థలు చాలాకాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒరిస్సాలో మతకల్లోల మంటలు లేశాయి. ఐతే మొదటిసారి మావోయిస్టులు (బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ తమ సాయుధపోరాటాన్ని హిందూత్వ సంస్థలపైకి తిప్పారు. ఇది ఎటు దారితీస్తుందో చెప్పలేం.
ఈ హిందూత్వ సంస్పలలోని నాయకుల పిల్లలందరూ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలోనే ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు. కాని దళిత-బహుజన కుటుంబాల నుండి వచ్చిన పిల్లలను మాత్రం ఈ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించడానికి వీలులేదని చెబుతున్నారు. ఒరిస్సాలో మిషనరీ న్కూళ్ళను తగులబెట్టడంలో ఇదొక కీలక అంశం. దాదాపు గత 50 ఏళ్ళుగా దళితులు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు. వారు బుద్దిజంతో బాహాటంగా, కైస్తవ మతంతో లోపాయికారిగా చేరుతున్నారు. బుద్దిజంలో చరితే రిజర్వేషన్లకు నష్టం వాటిల్లదు. కాని వాళ్ళు క్రిష్టియానిటీలో చేరితే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఉండవు. ఈ నిబంధనను తీసివేయాలని దేశంలోని క్రైస్తవ సంస్తలన్నీ ఉద్యమిస్తూనే ఉన్నాయి.
దేశంలో అన్ని కులాల్లోని (శ్రామిక శక్తులు అభివృద్ది చెందాలంటే బ్రాహ్మణిజంపై సిద్దాంత దాడి అవసరం. (బ్రాహ్మణిజం మతవ్యవస్థను సమాజ మార్పుకు అడ్డుపడే విధంగా రూపొందించింది. అది అందరికి సమాన విద్యను వ్యతిరేకించడమే కాక అందరూ ఒకే భాష నేర్చుకొని సామాజికజీవనాన్ని సైన్సుతో ముడేసే ప్రక్రియను ఆపివేసింది. ఒకనాడు సంస్కృతం అందరూ నేర్చుకోవడానికి వీలులేదన్న (బ్రాహ్మణిజం ఇప్పుడు ఇంగ్రీషు భాషనూ అందరూ నేర్చుకోవడానికి వీలులేదని చెబుతున్నది. అగ్రకుల పిల్లలకు మాత్రమే ఇంగ్లీషు బోధించే ఆంగ్ల విద్యావిధానాన్ని ్రెస్తవుల అండతో బ్రాహ్మణిజం రూపొందించింది. నేడు అగ్రకులాల పిల్లలు 99 శాతం మంది ఇంగ్రీషు మీడియంలోనే చదువుకుంటున్నారు. కాని ఆదివాసి, దళిత పిల్లల కోసం స్కూళ్ళు పెట్టే సంస్థలన్నింటి మీద హిందూత్త శక్తులు దాడులు చేస్తున్నాయి.
దాడుల్లో పాల్గొనే వారంతా మళ్ళీ దళిత బహుజన పిల్లలే. వీరందరినీ సంఘాల పేరుతో ఆంగ్రవిద్యకు దూరముంచి, (బ్రాహ్మణిజాన్ని ప్రచారం చేసే మిడీవల్ మెంటాలిటీ గల శక్తులుగా తయారుచేసి దాడులు చేయిస్తున్నారు. ఆ దాడుల వల్ల జైలుకు పొయ్యేది కూడా కింది కులాల పిల్లలే. అయితే కమ్యూనిస్టు శక్తులు (బ్రాహ్మణిజంపై ఒక స్టాండ్ తీసుకొని దేశంలోని స్పిరిచ్యువల్ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే దేశంలోనే గొప్ప మార్పు వస్తుంది. బ్రాహ్మణిజం చాలా విషపూరితమైన వ్యవస్థ, మొదట అది
త్య ఇండియన్ నూనోయిస్టులు మనుషుల మెదళ్ళను మూఢనమ్మకాల్గో ఉంచుతుంది. అది సైన్సు అభివృద్ధిని సర్వశక్తులా అడ్డుకుంటుంది. ఒక దేశంలోని మనుషులందరూ ఒకే భాషలో మాట్టాడడాన్ని, రాయడాన్ని అది వ్యతిరేకిస్తుంది. జాతీయవాదాన్ని అభివృద్ధి కాని తెలుగు, ఒరియా, తమిళ్, హిందీ వంటి భాషలతో ముడేసి ఒకే జనంలోని మానవ మెదళ్ళను ప్రాగ్‌మెంటెడ్ ఆలోచనల్లో ఉండేట్టు చూస్తుంది. అదే సందర్భంలో అ(గ్రకులాల పిల్లలకు ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు నేర్పడానికి ఏ అడ్డంకి రానీయదు. (బ్రాహ్మణిజం అన్ని రంగాల్లో చర్చను సెంటిమెంటల్‌గా తయారుచేస్తుంది. కమ్యూనిస్టులు దీన్ని గమనించకపోవడంవల్ల వాళ్ళు సెక్యులరిజం అనే ముసుగులో బ్రాహ్మణిజాన్ని పోషించారు. సెక్యులరిజం బ్రాహ్మణిజానికి ప్రత్యామ్యాయం కాదు. కమ్యూనిజం చెడును తొలగించి దాని స్థానంలో అభివృద్ది కాముక మంచిని అభివృద్ధి చేస్తుంది. కాని సెక్యులరిజం దొన్ని తొలగంచదు. ఉదాహరణకు, హిందూయిజం అందరికీ సమాన అవకాశాన్ని, సమానజ్ఞానాన్ని, ఒకే భాషను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ మానవ వ్యతిరేక విలువ ఇతర మతాలకు లేదు. సెక్యులరిజం హిందూయిజాన్ని (ప్రపంచంలోని అన్ని మతాలతో సమానంగా చూస్తుంది కాని కమ్యూనిజం అలా చూడదు. అభివృద్ది కాముక మతానికి, అభివృద్ధి వ్యతిరేక మతానికి మధ్య గల వైరుధ్యాన్ని సెక్యులరిజం చూడదు. కాని కమ్యూనిజం చూడాలి. అందుకే మావోయిజం ఇప్పుడు తీసుకున్న (బ్రాహ్మణిజం వ్యతిరేక నిర్ణయం దాన్ని సెక్యులరిజం స్కూలు నుండి బయటకు లాగి కొత్త సంఘర్షణా పథంలో నిలబెడుతుంది. కాని విచిత్రంగా మావోయిస్టులకు ఇంకా కామన్ ఇంగ్రీషు విద్య మీద స్టాండ్ లేదు. చిన్న చిన్న భాషలన్నీ చనిపోయి ఒకే బలమైన జాతీయభాష దేశంలో ఏర్పడితే (బ్రాహ్మణిజం బలహీన పడుతుంది. బ్రాహ్మణిజం వేళ్ళు సంస్కృతంలో ఉంటే, వాటిని పెకిలించే శక్తి ఇంగ్లీషు భాషకు ఉంది. కమ్యూనిజం ఏ దేశంలో పుట్టిందో ఎలాగైతే చూడకూడదో, అలాగే ఇంగ్లీషు భాష కూడా ఏ దేశంలో పుట్టిందో చూడకూడదు. సమాజాన్ని మార్చడానికి దానికున్న శక్తిని చూడాలి. ఏది ఏమైనా (బ్రాహ్మణిజాన్ని బలహీనపరిచే అన్ని రకాల పోరాటాలూ అన్ని రంగాల్లో జరగాలి. ఈ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీలు ప్రారంభిస్తే వాటి స్వరూపం, దేశం స్వరూపం మారిపోతాయి. సూర్య - 12 అక్టోబర్, 2008
అ 5 ప్రచండుడు కూలదోసిన ర్రి ఆఖరి హిందూరాజ్యం
చివరగా మిగిలి ఉన్న హిందూరాజ్యం నేపాల్ దాని వెనుకబాటుతనానికి అనుగుణంగా ఆదివిష్ణువుతో పోల్చుకునే హిందూరాజులు దాదాపు 240 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మూఢనమ్మక రాజ్యమది. 1768లో పృద్వినారాయణ్ షా నేపాల్‌ను ఒక సమైక్య నేపాలీ భాష మాట్టాడే రాజ్యంగా ఏర్పరిచి దానిలోని కరడుకట్టిన కులవ్యవస్థను, అంటరానితనాన్ని మూఢనమ్మకాలను అతి జా(గ్రత్తగా కాపాడారు. అక్కడి ప్రజలు ఆధునికత అంటే ఏమిటో తెలియకుండా జీవించే స్థితిని హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా కాపాడారు.
ఈ భూగోళం మీద నాలుగు మత ప్రపంచాలున్నాయి. 1. బుద్దిస్టు (ప్రపంచం, 2. (క్రైస్తవ ప్రపంచం, 3. ముస్లిం ప్రపంచం, 4. హిందూ ప్రపంచం. ఈ నాలుగు మత (ప్రపంచాలు నాలుగు భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. బుద్దిస్టు ప్రపంచం ఫార్ ఈస్ట్‌లో, క్రైస్తవ ప్రపంచం ఇజ్రాయిల్‌లో, పాశాత్య దేశాల్లో, ఆఫ్రికాఖండంలో పాకి ఉన్నాయి. ఇస్టామిక్ ప్రపంచం సౌదీ అరేబియా నుండి ఆసియా ఖండంలోని చాలా దేశాలను ఆక్రమించింది. హిందూ ప్రపంచం ఇండియా, నేపాల్ దేశాల్లోనే తిష్టవేసుకొని కూర్చుంది. అక్కడనే తన మెడకు గుది బండలాంటి కులవ్యవస్థను స్థాపించుకొని, దాంట్ల్ అంటరానితనంతో పాటు అన్ని అశాప్రీయ సంబంధాలను నెలకొల్పింది. ఈ నాలుగు ప్రపంచాల్లో హిందూ ప్రపంచం అతి బీదది. శాస్త్రీయత కొరవడినది. నేపాల్, ఇండియా ఈనాటికీ అడుక్కుతినే దేశాలుగా మిగిలి ఉన్నాయి.
భారతదేశంపై ముస్లిం దండయాత్రలు జరిగేనాటికీ ఇండియా, నేపాల్ ఒకే స్టితిలో ఉన్నాయి. వాటిలో కులవ్యవస్థ నెలకొన బట్టి సాంస్కృతిక, సామాజిక అభివృద్ధి కొరవడింది. ఈ దేశాల్లో అభివృద్ది చెందిన అందరికీ అందుబాటులో ఉండే కామన్
4
తద ఇండియన్ మావోయిస్టులు భాష లేదు. పాలీభాషను చంపేసి, హిందూ రాజులు ప్రాంతీయ భాషలను వృద్ది కానియ్యలేదు. ఇండియాలో ఉరూ ఒక కామన్ భాష అయ్యేవరకు (ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ లేదు. కులం, అంటరానితనం కారణంగా ఆపస్ట్రనిస్టాన్, పాకిస్ట్రాన్, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలోని ప్రజలు ఇస్లాంలోకి పోయారు. సంస్కృతం భాషను ఇతరులు నేర్చుకునే వీలు లేకుండా చేశారు పూజారులు. బ్రిటీష్ వాళ్ళొచ్చాక భారతదేశంలో ఆధునికత, ఆంగ విద్య నేర్చుకొని ప్రపంచ జ్ఞానానికి ద్వారాలు తెరవడం జరిగింది. కాని నేపాల్ మాత్రం హిందూ కులవ్యవస్థలో కొట్టుమిట్టాడే ఆతి పురాతన దేశంగా మిగిలిపోయింది. అక్కడ ముస్టిం దండయాత్రల (ప్రభావం లేదు. బ్రిటీష్ వలసపాలకుల (ప్రభావం లేదు. అయినా ఎందుకంత వెనుకబడి ఉంది? 1768 పృద్వి నారాయణ్ షా అక్కడ ఘార్డా రాణాల రాజ్యం స్థాపించాక దానిని ఆ రాజవంశం వారు మహావిష్ణువు వారసులుగా పరిపాలించారు. ఆధునిక (ప్రజాస్వామ్యం గాని, ఆంగ్ల విద్య ప్రభావంగాని ఆ దేశంలో పడకుండా చూశారు. అక్కడ మహాత్మాపూలే, అంబేడ్కర్, పెరియార్ వంటి నాయకులు పుట్టడంగాని లేదా ఇక్కడి వారి ప్రభావం అక్కడి వారిమీద పడకుండా (ప్రజల్ని హిందూ అంధకారంలో ఉంచి తమ పాలన పబ్బం గడిపారు. పోనీ అక్కడి రాజులైనా ఆధునిక పాలకులుగా ఎదిగారా అంటే అదీ లేదు. బీరేంద్ర కొడుకు మొత్తం కుటుంబాన్ని ఎంత కిరాతకంగా చంపాడో చూశాం. ఈ (క్రమంలో అక్కడ నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పుట్టాయి. రాజరిక వ్యవస్థను రాజ్యాంగబద్ధ రాజరికవ్యవస్థగా మార్చే (ప్రక్రియకు పూనుకున్నాయి. కాని కులవ్యవస్ట్ర అంటరానితనం అతి దారుణంగా తాండవమాడే ఆ దేశంలో రాజ్యాంగ బద్దత నామమా(త్రమైంది. ఆధునిక విద్యాలయాలు అక్కడ అభివృద్ధి కాలేదు. (ప్రజాస్వామ్య సంస్థలుగాని, విలువలు గాని అంతగా అభివృద్ది కాలేదు. ఈ వెనుకబాటుతనంలో (ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఏ మాత్రం నమ్మకం కలుగలేదు. ఈ 'క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ నుండి చీలిపోయి మావోయిస్టు పార్టీ ఏర్పడింది. దానికి (క్రమంగా ఒక ప్రచండ నాయకుడయ్యాడు.
పుప్పకమల్ బహాల్ (ప్రచండ) ఒక బీద (బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా హిందూ వ్యవస్థలోని దేవతల - రాక్షసుల (అంటే దళిత బహుజనుల) పోరాటాన్ని ఇండియన్ కమ్యూనిస్టులు అర్థం చేసుకున్న పద్ధతి కంటే భిన్నంగా అర్ధం చేసుకొని ఉంటాడు. అందుకే ఆయన టెక్నేమ్ను హిందూ దేవతల నుండి కాక రాక్షస సంస్కృతి నుండి ఎన్నుకున్నాడు. మన తెలుగు వాడుకలో వాడొక ప్రచండుడు అంటే వాడొక “రక్తం తాగే రాక్షసుడు" అని అర్ధం. హిందూ (బ్రాహ్మణవాదం సూద్ర, చండాలుర నుండి వచ్చిన ఏ తిరుగుబాటు దార్నుల్షైనా 'వాడొక ప్రచండుడు, బ్రష్టుడు' అని పిలిచేవారు. మనదేశంలో అ(గ్రకుల కమ్యూనిస్టు నాయకులెవరూ ఇటువంటి రాక్షస పేరు పెట్టుకోలేదు. ఇక్కడి మావోయిస్టు పార్టీ నాయకుడు ముద్దుగా హిందూ దేవుని పేరు “గణపతి” అని
ప్రచండుడు కూలదోసిన ఆఖరి హిందూరాజ్యం చ పెట్టుకున్నాడు. ప్రచండ నాయకత్వంలో నేపాల్ మావోయిస్టులు అక్కడి సూద్ర, చండాల, ఆదివాసి కులాలను సాయుధపోరాటంలోకి సమీకరించగలిగారు. మంచి వ్యూహరచనతో ఆ సాయుధ పోరాటాన్ని ఒక యునైటెడ్ ఫ్రంట్ రాజరిక వ్యతిరేక నూనత ప్రజాస్వామిక (ప్రజాసంఘర్షగా మల్చగలిగారు. అక్కడి మావోయిస్టు పార్టీ (క్రమంగా విశాల ప్రజల మద్దతును సంతరించుకుంది. ఇప్పుడది రాజరికాన్ని రద్దుపరిచే మొట్టమొదటి ఎన్నికలను సింపుల్ మెజారిటీతో గెలుచుకుంది. ఆ దేశానికి ప్రచండ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి అవుతాడు. మావోయిస్టుల నాయకత్వంలో రాసే రాజ్యాంగం తప్పకుండా మత విలువల్ని వ్యతిరేకించేదిగా లేదా ఆసియా దేశాలకే నమూనాగా ఉండే ఒక సెక్యులర్ రాజ్యాంగంగా ఉండాలి. అది హీందూరాజ్యాన్ని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తుంది. దానితో పాటు మహావిష్ణు రాజరికం సంపూర్ణంగా రద్దు పర్ఫగలుగుతుంది. ప్రచండ నేతృత్వంలో రాసే రాజ్యాంగం ఆ దేశంలో సోషలిజం స్థాపనకు అనుగుణంగా కూడా ఉండాలి. హిందూ మత ప్రభావాన్ని - ముఖ్యంగా కులవ్యవస్థను రద్దుపరచడంలో అది ఎనలేని ఇబ్బందులను ఎదుర్కోనున్నది.
కులాన్ని రద్దుపరిచే చర్యలన్నీ హిందూయిజాన్ని బాగా బలహీనపరుస్తాయి. ఈ హిందూ ప్రపంచంలోని ఒక దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. మనదేశంలో కేరళ, బెంగాల్ కమ్యూనిస్టులు ఫెడరలిజంలో భాగంగా అధికారంలోకి వచ్చారు. కాని కులవ్యవస్థను రద్దుపరిచే కార్యక్రమం లేకుండా హిందూ వ్యవస్థను కాపాడే మార్గమే ఎన్నుకున్నారు. కాని నేపాల్‌లో ఆ దారిలో పయనిస్తే మళ్ళీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. నేపాల్ ఎక్స్పర్మెంట్ భారతదేశం మీద పెద్ద (ప్రభావాన్ని పడవేయవచ్చు.
సూర్య - 27 ఏప్రిల్, 2008
క నక్సల్స్‌తో చర్చలు - ఆయుధాల ప్రశ్న బహుజనులకు ఆయుధమే అండ
రౌష్ట ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య చర్చల (ప్రతిపాదన నేపథ్యం పీపుల్స్‌వార్, ఇతర విప్ణవసంస్థల ఆయుధధారణ మీద చర్చ జరుగుతోంది. ఇదే చర్చలకు అవరోధంగా పరిణమించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్క్స్-ఏంగెల్స్‌లు రచించిన “కమ్యూనిస్టు మేనిఫెస్టో, అంబేద్కర్ రచించిన “బుద్దుడు లేదా కారల్ మార్క్స్” అనే రెండు రచనలు ఉపయోగపడతాయి.
మార్క్స్-ఏంగెల్స్‌లు హింన అనేది విస్టవ (ప్రక్రియలో మంత్రసాని పని నిర్వహిస్తుందన్నారు. యూరప్ సందర్భంలో, అక్కడిది మత సిద్దాంతం చుట్టూ నిర్మించిన పౌరసమాజం కనుక్క భగవంతుడుగానీ, ప్రవక్తగానీ అన్ని రకాల హింసా పద్దతులకు వ్యతిరేకులు కనుక హింస మంత్రసాని పని నిర్వహిస్తుందనడం విపరీతంగా కనిపిస్తుంది. హిందూతాత్వికతలో 'దండనీతి' తొలి నుంచీ భాగంగానే ఉంది. అంబేడ్కర్ తన రచనలో బుద్దుడి మాటల్ని ప్రస్తావిస్తూ హింసను 'ఒక స్వభావంగా వ్యతిరేకించాలని, ఒక అవసరంగా సమర్జించాలిని అంటాడు. (క్రీస్తు వెనుక ఆరవశతాబ్దిలోనే బుద్దుడు అటువంటి నిర్దారణకెలా వచ్చాడు? హిందూ (బ్రాహ్మణీయ హింస ఎంతటి విపరీతస్టాయికి వెళ్ళిందంటే, ధర్మరక్షణ పేరుతో దేవతలే ఆయుధాలు ధరించి హంతకులుగా మారారు. మరోవైపు జైనులు, (క్రిమి కీటకాలను కూడా చంపకూడదన్న స్టాయిలో అహింసను బోధించారు. బుద్దుడు వీరికి భిన్నంగా 'ఒక స్వభావంగా హింస'ను జీర్లించుకున్న హిందూ హింసావాదాన్ని ప్రతిఘటించే సందర్భంలో హింసను ఒక అవసరంగా సమర్థిస్తూ మధ్యేమార్గాన్ని అనుసరించాడు.
హిందూచింతనలో అంతర్లీనంగా ఉన్న హింసాతత్వమే అనేక ఆయుధాలు ధరించిన దేవతామూర్తులను కల్పించింది. ఈ దైవహింసను, సామాజిక, రాజకీయ హింసను శూద్రులు, చండాలురు, ఆదివాసులపై చరిత్ర పొడవునా ప్రయోగించడం జరిగింది. ఈ
త్రి
బహుజనులకు ఆయుధమే అండ 49 దైవహింసా సిద్దాంతమే, దండనీతి కీలకంగా ఉండే కౌటిల్య రాజనీతికి కారణం. భారతదేశంలో అతి ప్రాచీనకాలం నుంచి దండనీతి సూత్రం మీద ఆధారపడి రాజ్యవ్యవస్త్ర కొనసాగింది. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీని కొనసాగింపు ఫలితమే ఆధునిక భారతదేశంలోనూ పోలీసులు అనాగరికంగా వ్యవహరిస్తుండడం, భారత సైన్యం పనిచేసే సైన్యంగా కాక కేవలం సైనిక విధులను మాత్రమే నిర్వర్తించేదిగా ఉండడం. పౌరపోలీసులకు, సాయుధ పోలీసులకు, కేవల సైనికులకు, పనచేసే సైనికులకు ఎంతో తేడా ఉంది. చైనా, పనిచేసే సైన్యాన్ని అత్యుత్తమంగా అభివృద్ది చేసింది. అనేక యూరప్ దేశాలలో పౌరపోలీస్ యంత్రాంగం వృద్ది చెందింది.
భారతదేశంలో నిరంతర హింసాత్మక వాతావరణం వేళ్ళూనుకోవడం వల్లనే కులవ్యవస్త్ర, దోపిడీ ఉనికిలోకి వచ్చాయి. శ్రామికవర్గంగా ఉన్న ఉత్పాదకకులాలు ఒక అవసరంగా ప్రతిహింసను వినియోగించకపోతే ఈ దేశంలో శాంతి ఎప్పటికీ నెలకొనదు. అన్ని రూపాలలోని కౌటిల్యహింస అంతమొందే వరకు, ఉత్స్పాదకకులాలు, సంస్థలు తమ హక్కుల రక్షణ కోసం ఆయుధం ధరించవలసిందే. పీపుల్స్‌వార్ కానీ, మరొక సంస్థగానీ ప్రజల కోసం పనిచేసే సంస్థలను ఆయుధాలు విడిచిపెట్టమని చెప్పేముందు అధికారపక్షాలు ఈ చారిత్రకమైన చిక్కుముడిని అర్ధంచేసుకోవాలి.
కౌటిల్య రాజనీతి
ర్ట జాతీయస్థాయిలో హిందూసంస్థ్రలు యధేచ్చగా ఆయుధాలను పంపిణీ చేయడానికి, బహిరంగంగా వాటిని ప్రదర్శించడానికి ఈ కౌటిల్య రాజనీతి నేటికీ అనుమతిస్తుంది. ఆధునికకాలంలో హిందూ (బ్రాహ్మాణీయ శక్తులు స్థాపించిన తీవ్రవాదసంస్థ ఆర్ఎస్ఎస్ ఆయుధధారణనే సిద్దాంతంగా చేసుకుంటూ పుట్టింది. ఇప్పుడా సంస్థ నాయకత్వంలో తుపాకులే పంపిణీ అవుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ బహిరంగంగానే (త్రిశూలాలు పంచుతూ ఉంటుంది. దేవుడి నుంచి మనిషి వరకు, హిందూ వ్యవస్థలన్నీ ఆయుధాలను ధరించే అసాధారణ హక్కు కలిగి ఉన్నప్పుడు, అవి సృష్టించిన కులవ్యవస్థ కింద, వర్గ వ్యవస్థ కింద నలిగిపోతున్న వారికి కూడా ఆత్మరక్షణార్థం అటువంటి హక్కు ఉండవలసిందే.
అందుకే బహుజనులు ఆత్మరక్ష్టణకోనం, ఒక అవనరంగా హీంనను ప్రయోగించవచ్చునన్న సూత్రాన్ని బుద్దుడు ప్రతిపాదించాడు. ఆధునిక కాలంలో కూడా బహుజనులకు అటువంటి ఆత్మరక్షణ అవసరమైంది కనుకనే అంబేడ్కర్ దీనిని ఆమోదించాడు. మార్క్స్ సిద్దాంతానికి కూడా ఈ ఆత్మరక్షణ సూత్రమే (ప్రాతిపదిక. అయితే మార్క్స్ సిద్దాంతం మీద ప్రపంచవ్యాప్తంగా జరిగినంత చర్చ, ఒక స్వభావంగా,
వ్ర ఇండియన్ మూవోయిస్టులు ఒక అవసరంగా హింసను వర్లీకరిస్తూ బుద్దుడు చేసిన సూత్రీకరణపై జరగలేదు. ఈ సూత్రం హింసకు గల అనుకూల, ప్రతికూల కోణాలు రెంటినీ విసృతంగా వివరిస్తుంది.
రాజ్యవ్యవస్థ అంతరించడంతోనే హింస కూడా అంతరిస్తుందని మార్క్స్ భావిస్తే రాజ్యాన్ని ఒక నాగరికవ్యవస్థగా మార్చడం ద్వారా హింస అంతమయ్యే అవకాశాన్ని అంబేడ్కర్ ఊహించాడు. రాజ్యాన్ని రద్దు చేయడమనేది ఎప్పుడో సుదూర భవిష్యత్తులో ఏమైనా సాధ్యమవుతుందేమో కానీ రాజ్యాన్ని ప్రజలపట్ల స్నేహపూర్వకంగా, నాగరికంగా మార్చడానికి అంత సమయం అవసరం లేదు. దళిత, బహుజనులు అంబేడ్కర్ పంథానే అనుసరించడం అవసరం. అందుకు మొట్టమొదటగా చేయవలసింది రాజ్యానికి సంబంధించిన అన్ని నిర్మాణాల నుంచి, కీలకమైన పౌరసామాజిక వ్యవస్థ నుంచి (బ్రాహ్మణీయ శక్తులను తొలగించడం.
త్యాగాలు వృధా పోరాదు
పీపుల్స్‌వార్ లోపలి (బ్రాహ్మణీయశక్తులు ఆ సంస్థను కొంతవరకు హింసను స్వభావంగా ప్రయోగించే స్థాయికి తీసుకెళ్ళాయి. కింది కులాల నుంచి వచ్చినవారినీ, నిరుపేదలను, చాలామందిని వారు హతమార్చడానికి అదే కారణం. అంబేడ్కర్ వాదాన్ని అనుసరించడం ద్వారా ఇటువంటి సంస్థల నాయకత్వాన్ని మార్చడం ద్వారానే దీనిని నివారించగలుగుతారు. దళిత విష్ణపకారుడు అంబేడ్కరిజాన్ని, మార్క్సిజాన్ని క్షుఖ్మంగా ఆకళించుకోవాలి. అంబేడ్కరిజం, మార్కిజం కోణాల నుంచి చూసినప్పుడు ఆయుధధారణను ఒక అంశంగా మార్చకుండానే ప్రభుత్వానికీ, నక్సల్స్‌కీ మధ్య చర్చలు జరగడం సముచితం. ఎందుకంటే, కొన్ని నక్సలైట్ సంస్థల నాయకులు అ(గ్రవర్హ భూస్వామ్య (బ్రాహ్మణీయ నేపథ్యం నుంచి వచ్చినా, వాస్తవంగా ఆయుధం ధరించినవారు ఎస్సి, ఎస్టి, ఇతర వెనుకబడిన తరగతులవారు. అ(గ్రవర్ల, అర్జ-భూస్వామ్య, అర్ధ-పెట్టుబడిదారీ శక్తుల ఏజెంట్లుగా పనిచేసే సాయుధపోలీసుల పీడన నుంచి పీడిత వర్గాలను రక్షించే బాధ్యత వీరు నిర్వహిస్తున్నారు కనుక వీరి చేతుల్లోని ఆయుధం అవసరార్థం వచ్చినది. రాజ్యానికిగల అమానుష కులతత్వ పూరిత, అర్హ - భూస్వామ్య, అర్హ-పెట్టుబడిదారీ సంబంధాలలో మార్పురాకుండా వీరు ఆయుధం విడిచిపెట్టడం, (గ్రామీణ నిరుపేదలపై దుర్భరమైన సాంఘిక - ఆర్థిక హింసకు దారితీయిస్తుంది. రెండోది, చర్చలకు ఏకులశక్తులు నాయకత్వం వహిస్తాయన్నదీ ముఖ్యమే, అంబేడ్కర్ ప్రకారం (ప్రస్తుత పాలకవర్గం అ(గ్రవర్శాలతో రూపొందినదే కనుక విష్ణవసంస్థలకు ప్రాతినిధ్యం వహించేవారు పీడిత, తాడిత, దోపిడీకి గురవుతున్న కులాల నుంచి వచ్చిన వారై ఉండాలి. అలాకాక వర్గం పేరుతో అగ్రవర్ణాల వారే విష్ణవకారులకు (ప్రాతినిధ్యం వహిస్తే పాలకవర్లానికీ, అ(గ్రవర్ష
బహుజనులకు ఆయుధమే అండ వ్] విష్ణవకారులకీ మధ్యనున్న కులసంబంధాల రీత్యా యూరోపియన్ మార్క్సిజానికో, భారతీయ వైదిక చింతనకో చెందిన అర్జం కాని భాషలో అ(ప్రధాన విషయాలే చర్చించుకుంటారు. వీటివల్ల ఉత్సాదక కులాలవారికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. విప్లవానికి సంబంధించిన అంశాలు ఎస్సి. ఎస్టి. ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవైనప్పుడు నాయకత్వం కూడా ఆ కులాల నుంచే రావాలి. లేకపోతే విప్లవసంస్థలలో పనిచేస్తూ ఈ కులాలు చేసిన త్యాగాలు వృధా అవుతాయి, నాయకులు అ(గ్రవర్షం నుంచి, ప్రత్యేకించి బ్రాహ్మణీయ కులాల నుంచి రావడమంటే వారిని పై నుంచి రుద్దడమే. అటువంటి నాయకులలో అంతర్లీనంగా (బ్రాహ్మణీయవిలువలే ఉండి హింసను ఒక స్వభావంగా ఉద్యమం మీద రుద్దుతారు. ఈ పరిస్టితి మారాలి. వార్త - 27 సెప్టెంబర్, 2004 గ జ్రటయ రే య 0' షంంం ఖ్, టీ. సం స్తలం ఫశ (గ నీలం గఆ న తో ముచయంమంంటంనాతుో
శ్షే5 విప్లవోద్యమాన్ని దళితీకరించడం ఎలా? వరవరరావు నా వ్యాసానికి సమాధానమిస్తూ ఒక (బ్రాహ్మణుడు వ్యక్తిగతంగా దళితీకరణ చెందే అవకాశముందా లేదా అని (ప్రశ్నించారు. విష్ణవోద్యమం దళితికరణ చెందడం గురించి చర్చ అవసరం. నా ఉద్దేశ్యంలో కుల సమస్యను ఎదుర్కోకుండా కమ్యూనిస్టు విప్లవం విజయవంతం కాదు. విప్లవానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్నకూ, దానికీ సంబంధముంది. (శ్రామికవర్గం పేరుతో (బ్రాహ్మణులు కానీ, ఇతర అ(గ్రకులాలవారు కానీ ఉద్యమానికి నాయకత్వం వహించగలరా? అంబేద్కర్. చెప్పిన అర్ధంలో హిందూత్వ నిర్మూలనతో దగ్గర సంబంధమున్న కులనిర్మూలన కార్యక్రమం గుండా వీరు విష్ణవం నిర్వహిస్తే ఆ విష్ణవం ఏమవుతుంది? అప్పుడు విప్లవోద్యమాన్ని శితీకరణ చెందించడం సాధ్యమవుతుందా? సాధ్యమైనప్పుడు దళితీకరణ అంటే అర్థమేమిటి? భారతీయ సమాజాన్ని విష్ణవీకరించడం, భారతీయ సమాజాన్ని దళితీకరించడం ఒకదానితో ఒకటి దగ్గర సంబంధమున్నవి. దళితీకరణ అంటే అన్ని కులాలు ఉత్సాదక (శ్రమలో పాలు పంచుకోవడం. అప్పుడు “ఎంత పెద్దకులమైతే అంత తక్కువగా ఉత్పాదక (శ్రమలో పాలు పంచుకోవాలన్న (బ్రాహ్మణీయ సూత్రాన్ని అంతమొందించవలసి ఉంటుంది. పశువుల చర్మం ఒలవడం, పరిసరాలను శుభ్రం చేయడంతో మొదలుపెట్టి, అన్ని రకాల వ్యవసాయం పనుల వరకు దళితులు అన్ని రకాల ఉత్పాదక (శ్రమలోనూ పాలుపంచుకొంటుంటారు. చారిత్రకంగా (బ్రాహ్మణీయ కులాలు చేతికి మట్టి అంటే పనులకు దూరంగా ఉంటూ ఎటువంటి చర్మకార వృత్తిని కానీ, పారిశుధ్యం పనినిగానీ అసహ్యించుకుంటారు. శూద్రులు చేతికి మట్టి అంటే పనులు చేస్తున్నా, చర్మకార వృత్తులకూ, సాంఘికంగా ఉపయుక్తమైన పారిశుధ్యం పనికీ దూరంగానే ఉంటారు. దళితీకరణలో రెండవ అంశం 'శ్రమే జీవితం'గా జీవించడం. దళితులు శతాబ్దాలుగా భూమి, పరిశ్రమల రూపంలో ప్రైవేట్ ఆస్తులను పోగు చేసుకోకుండా పూర్తిగా దైనందిన 52
విష్ణవోద్యమాన్ని దళితీకరించడం ఎలా? 53 శ్రమ మీద ఆధారపడే జీవిస్తున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉండే సాముదాయిక ఆస్తి మీద ఆధారపడే బతుకుతున్నారు. నేడు పట్టణాల్లో కూడా వారికి భారీ ఎత్తున (ప్రైవేట్ ఆస్తులు లేవు. అ(గ్రవర్ధాలు అన్ని రకాల ఆస్తులను కూడబెట్టుకోవడానికి అవకాశమిచ్చిన హిందూ ధర్మశా[స్తాలు దళితులకు మాత్రం దానిని నిరాకరించాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆస్తులు అన్వాక్రాంతమైపోయినా, లేదా (గ్రామీణ ఆర్థికతలోని ఉమ్మడి వనరులను రద్దుచేసినా దళితులు బతికి బట్టకట్టలేరు. సాంఘికంగా అన్ని కులాల ఉపయోగం కోసం దళితులు తమ అపారమైన (శ్రమను పెట్టుబడిగా పెడుతున్నా, వ్యక్తిగతంగా కులపరంగా వారు పోగు చేసుకొనే సంపద మాత్రం శూన్యం. ఆహార సంస్కృతి
మూడో అంశం ఆహార సంస్కృతికి సంబంధించినది. దళితుల ఆహార సంస్కృతి అన్నింటికీ విస్తరించింది. అన్ని రకాల మాంసాహారం దగ్గర నుంచి కూరగాయల వరకు వారికి ఏదీ పనికిరానిది కాదు. తమ ఆహారపు అలవాట్లను ఏవగించుకొనే సాంస్కృతిక వాతావరణంలో దళితులు గొడ్డుమాంసం, పందిమాంసం, వివిధ పక్షులు, సరీసృపాల మాంసాన్ని భుజించే అలవాటును అంటిపెట్టుకొని, వాస్తవానికి ఆహార పుష్కలతకు, పెంపుకు సాయపడుతున్నారు. ఆ సంస్కృతిని పోషించడం అవసరం. దళితులు అదే చేస్తూ వస్తున్నారు. 'కులం పెద్దదవుతున్న కొద్దీ ఆహారపు అవకాశాలు తగ్గిపోయే” విధంగా హిందూ సామాజిక వ్యవస్థ ఆహారపు సంస్కృతిని నిర్మించుకుంది. ఆధ్యాత్మిక నియమాలు దేవాలయాలకు, హిందూ దేవతలకు సంబంధించిన అంశాలలో మాంసాహార పదార్థాలను అనుమతించవు. ఆధ్యాత్మిక మార్గంలో బ్రాహ్మణీయ శక్తుల శాఖాహార సంస్కృతిని దేశం మొత్తం మీద రుద్దడం జరిగింది. క్రమంగా ఇది భారతీయ వ్యవసాయాన్ని శాఖాహార వ్యవసాయంగా మార్చింది. దేశం విస్తారమైన పశు మాంసాహారాన్ని కోల్పోయింది. మన గొర్రె, మేక, పంది ఆర్థికత అణగారిపోతోంది. హిందూ, ఇస్తాంల మధ్య పోటీ గొడ్డు, పంది మాంసాలతో ముడిపడిన ఆర్థికతను నాశనం చేసింది. ఫలితంగా మనదేశం ఆహారపు వనరుల భారీ లోటును ఎదుర్కొంటోంది. అన్నింటినీ ఇముడ్చుకొనే దళిత, గిరిజన ఆహారపు అలవాట్లకు మళ్ళడమే దీనికి ఏకైక పరిష్కారం.
దళిత, గిరిజన ఆహార సంస్కృతిని నీచంగానూ, ఆటనికంగానూ నేడు చాలామంది భావిస్తున్నారు. కానీ వారి ఆహారపు సంస్కృతి అంతర్జాతీయ ఆహార సంస్కృతికి తులతూగేలా ఉంది. ఇందుకు భిన్నంగా శాఖాహార సంస్కృతి సంకుచితమైనది. (ప్రపంచంలో ఏ మతమూ పూజారి వర్గంపై, ప్రజలపై ఆహారపు నియమాలను విధించడం లేదు. హిందూ మతం ఒక్కటే ఆ పని చేస్తోంది. అటువంటి సంస్కృతి విషయంలో ఒక విష్ణవపార్టీ ఏం చేస్తుంది? తమ పెంపకం అడ్డు వస్తుంది కనుక బ్రాహ్మణ కమ్యూనిస్టు
నాయకులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేరు. తమ ఆలోచలకే సంకెళ్ళు ఉన్నప్పుడు వష్ణవాత్మక పరివర్తనకు వారు పనిముట్టు ఎలా కాగలుగుతారు? ఒక వే నిమ్న వగ్గికరణ పేరుతో తన ఆహార సంస్కృతిని మార్చుకొన్నంత మాత్రాన అహా సంస్కృతికి గల కుల స్వభావం అంతరించి పోదు. (ప్రతి విష్ణవకారునికీ కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆ కుటుంబం ఏదో ఒక్ష కులంలో వేళ్ళూనుకొని ఉంటుంది. కనుక వ్యక్తులు, కులాలు దళితీకరణ చెందాలంటే, వ్యక్తిగత, కుటుంబ, కుల స్థాయిలలో ఆహార సంస్కృతి పెద్ద ఎత్తున 'ప్రజాస్వామికీకరణ చెందవలసి ఉంటుంది. ఈ మేరకు బ్రాహ్మణీయ సైగ సత్వాన్ని పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఇది దళితీకరణ ప్రక్రియలో భాగం, కులపరమైన అర్థికత కులకేంద్రిత ఆస్తి సంబంధాలు, కులసంబంధమైన ఆహార సంస్కృతి, కులాధారమ్రైన 'శామిక విలువలు రూపాొందటానికి ప్రధాన బాధ్య లందూత్వానిదే. ప్రతి దానినీ అద్రి ఒక చట్రంలో బిగించింది. కమ్యూనిస్టు మేధావులు వతవరకు హిందూ వ్యవస్థను, కులవ్యవస్థను, వ్యక్తులతో, సాంఘిక బృందాలతో మొత్తం ప్రల ఖీ పాఠీలు వర్గంతో అత్ర దగ్గరగా ముడిపడి ఉన్న కులవ్వవస్త నిర్మూలనో ప్రక్రియలో ఏనాడూ త్ర ల్ షల దు బెంగాల్లో (బ్రాహజీ అదూర్చృలేద్చు, బెంగాల్ 'ప్రయోగం విఫలమయింది. పళ్ళి గ ఎదగడానికి అవకాశ లెరు ఎందులోనూ దళిత బహుజన నాయకలే పార్టీ అధికారం నెర్ప్య శే ల తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కమ్యూణ”బీ మార్క్ కులవ్యవస్థ మరింత ఊపుతెచ్చుకొని వర్టిల్దుతోంది. తన్ కార్మిక్ర్వర్డ ని న్ సోషలిస్ట్ వ్యవస్థ స్థాపించడంలో ప్ర ఇష * యట్ సోషలిస్ట్ వ్యవస్త అభివృద్ది డ నిజమైన (శ్రామిక వర్గం అధిక్రార్య నస సౌకాలను ఎదుర్కోవడ్రానిక్తి కారణం, ఆఅ ద తముడు పూర్తిగా ద్రువపడిన వాస్తవ కపోపడమే. మనదేశంలో కులమే వర్గం కొద ల్ ఆధారంగా గల వ్యవస్థ రావల్ కొక జాత్రిపర్రగ్గా నిర్మాణాత్మకమైన బృందా ర ప్రజాస్వామ్య ప్రయోగం కులవ్యవస్థ సంది. గత 67 ఏళ్ళలోనూ వైయక్తిక ఉ క లోపించడ్తవ్సే కారణం. త “ప్రభావంలో మ్య తీస నికి ఆ ఎ ఏ ఆసుకురాక్రపోవడా, భారతీయ్స్వ్వ న్ త్ర ల ళీ నిర్మూలించక్రష్రోశ్ర కం. నేహిల్ర్యళ వస్తి శ్రే ఇటువంటి నై్రల్స్బ కూడ్రా అక్కడి కులవ్య వో లొల్లి ఫిచ్చితంగ్గా ఎదురో ప్రజ కులొలి బహ్రావలసి వసుంది.
నిష్ణవోద్యమాన్ని దళితీకరించడం ఎలా? చ్ నిండిన దేశంలో కేవలం వర్ల విశ్తేణ మీద ఆధారపడి పనిచేసే ఏ కమ్యూనిస్టు పార్టీ మార్పులను తీసుకురాలేదు. కుల సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలంటే, విప్ణవపార్టీల నాయకులు అత్యంత పీడనకు గురైన కులాలకు చెందినవారే అయిండాలి. దళితీకరణ తొలిరూపం ఇది అక్కడి నుంచి దళితీకరణ వివిధ దశల మీదుగా సాగుతోంది. అన్ని కులాలు ఉత్పాదక[శ్రమలో పాల్గొనాలన్న (ప్రచారాన్ని అది చేవట్టాలి. దీనిని 'ప్రారంభించాలంటే ఆధ్యాత్మిక ఫాసిస్టు మతంగా ఉన్న హిందూత్వాన్ని ప్రజాస్వామికీ కరించాలని వారు కోరాలి. ఒక కులం పెత్తందారీ నుంచి ఆలయవ్యవస్థను విముక్తం చేయాలి. దళితులు పూజారులుగానూ, బ్రాహ్మణు ఉత్పాదక (శ్రామికులుగానూ ఉండే వ్యవస్థ కోసం ప్రచారం చేయాలి. భూస్వామ్యాన్ని నిర్మూలించిన తరహాలోనే అన్నిటా కొన్ని కులాల పెత్తందారీని నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒక భారీ ప్రక్రియగా దళితీకరణ కనుక దళితీకరణ అనేది అనేక అంశాలు ఇమిడి ఉన్న భారీ ప్రక్రియ. శ్రమగారవం నుంచి కులవ్యవస్టను స్టాపించిన హిందూ నిర్మాణాలను ధ్వంసం చేయడం వరకు అందులో ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిలో చేయగలిగీనవి కావు. వివిధ దశలలో నిర్మాణపరమైన మార్పులతో ఇవి ముడిపడినవి. ఆస్తి సామాజిక పంపిణీ ఇందులో భాగం. దేశ మౌలిక నిర్మాణంలో మార్పు తీసుకురావాలనుకొనే ఏ విప్లవ బృందమైనా కులవ్యవస్థతో, హిందూ వ్యవస్థత్రో తలపడడం అవసరం. మావోయిస్టులకు ఇంతవరకు ఎటువంటి అజెండా ఏదీ లేదు, వాగ్ర అజ్ఞాతపు పేరు కూడా గణపతి, రామకృష్ణ వంటి హిందూ పేర్లే ఒక పేరు, వ్యక్తుల సంస్కృతినీ, భౌగోళిక ఉనికినీ, సైద్దాంతిక చింతననూ సూచిస్తుంది. ఆ విధంగా మావోయిస్టు నాయకులందరూ, తమ ఉనికిని మార్చుకొనే ఎటువంటి అజెండా లేని వాందువుల్తే, కులాన్ని గుర్తించబోమని చెప్పే (బ్రాహ్మణీయ నాయకులు, మరికొన్ని శతాబ్దాల పాట్సు అ|గ్రవర్హ వ్యవస్థ హిందూత్వాల పెత్తనం కొనసాగడానికి సాయపడుతున్నారు. అటువంటి స్తీలో ఈ పారీలో విష్ణవాత్మకమైనదేముంది? లేని విప్లవాత్మకత కోసం అంతమంది ఎందుకు ప్రాణాలు బలిపెట్టాలి? (ప్రాణాలు బలిపెట్టా వార్త - 10 ఆగస్టు, 2005
లె పనిచేయలేదొ”* ఆ ముగ్గురి మధ్య కులం పనిచేయలే గద్దర్, కల్యాణ్రాుల పట్ట వరవరరావు వ్యవహరించిన తీరుపై చర్చ జ విడుదలి తరుణంలో స్పిష్ట్వి (మావోయిస్టృ) పోలిట్ర్ బ్యూరో సభ్యుడు ఒక ప్రకటన సరైనది చేశారు. ఆ ప్రకటనలో, మేథావులు ఈ సమస్యను కుల సమస్యగా చూడడం భేధాలు కాదన్నారు. ఈ మున్గురి సంబంధాలు రచ్చకెక్కడంలో కులం కాదు. కొన్ని వి శేడు మౌత్రమే పనిచేశాయని, వాటిన పార్టీలోన్స పరిష్కరించుకుంటామని చెప ే నారి విభేదాల్స వ్యా నిర్మాణం ల్రోపలే ఉన్నాయా, అలా పరిష్కరించుకో గలి, వరవరరా్య్య ప(త్రికాసమ్రావే్యుల్రా గద్దర్స్ కల్యాణ్రావలక్ష క్షమాపణ ఎందుకు లో ఆ సమావేశత్రో అన్ని టివీలు క్రెవ్పైర్రాా ముందు గద్దర్, కల్యాణరావులకు, తనో ను గీరొన అధిక్రార్తలక్ర్ర (వారిద్దరూ దళిత్తుత్సే క్షమాపణ చేప్పేంత నేరం చేశాక వర చేసిన చ న చెద నాయకత్త పాత్రన్స ఎలా సరిగ్గా పోషించినట్లు? పత్రికలకు విడుద భన ప్యూట కొఎని పోల్చీస్పృళ్ర సృష్టించార్రన వరవరరావు చెప్పారు. దాన్ని ఆసరా చ్ఫు పోలీసులు (పజల మంద్ర ముఖ్యంగా ప్ర నికి కాన ల గ౦గా దళిత్ర 'ప్రజల ముందు ఉంచడా దల సమ (ప్రయోజనాల నెరవేర్చుక్ష్వోడ్ష్య్య్య కౌవచ్చు. ఆయన చేతిరాత ప్రతిని విడ శారు. పద్రిక్ర్వ | ప ఖ అలక క ౦దు ఆ లేఖలు త్రను రౌసేనవే అని వరవరరావు ఒప్పుకున్నా గ సులు జృబ్బంచినవని ఒక మావ్ష్ప్సో్సస్సు పార్టీ చెబితే, అది తన ప్రజ దెబ్బ సుకు౦ట్పుంద్రా లేక రా 0 (ప్రత్రిష మండే . క్ ప్రతిష్టను దెబ్బతీీస్తుంద్రా? థి లౌ ఎంగెల్స్, లెనిన్ వ్వా పిల చర్యకు పార్చడడమైనై నేరమే లి కారం విప్లవకారుడు రాజ్యాన దుల ళ్ళ ఏలిం్లీ అణాల కుక శ్రైణత్వం భారతదేశాన్ని అబద్దాలతోటే జరిగీల వాస్తవాన్ని అవాస్తవంగ్గా చిక్రిస్స అదొ ఉండదలుచ్రుక్షున్న విస్తవపారీ న్ బలపరుస్తుంది, బో ఉదాహర్త ర్ పెప్టవాన్ని తలకిందులు చేస్తుంది. ౮ జ్యం మళ్ళీ మళ్ళీ చైబ్బశ్రా్వ వ్ద్ర
ఆ ముగ్గురి మధ్య కులం పనిచేయలేదా? వా కులం లేదా!
వరవరరావు ధోరణిలో కులతత్వం లేదని పార్టీ చెప్పదల్చుకున్నదా! పిరికిపందలుగా, దగాకోర్టుగా, లంచగాండ్డుగా, పైసలు వసూలు చేసుకునే వారిగా తనతో పాటు భుజం భుజం కలిపి పనిచేసిన ఇద్దరు ప్రతినిధులను ఆయన పార్టీ ముందు నిలదీశారు. ఆ ఉత్తరాలు పోలీసుల చేజిక్కి ఆ గొడవ (ప్రజల ముందుకొచ్చింది. ఆ ఇద్దరు దళితులు కాకుంటే ఆయన ఇటువంటి ఉత్తరాలు రాసేవారా, ఇంతకుముందు ఎవరి మీదనైనా రాసిన ఉదాహరణలున్నాయా, ఉంటే వారి కులస్టితి ఏమిటి, వారితో పాటు దోషులుగా నిలబెట్టిన డాక్టరైతేనేమి, అధికారైతేనేమి వాళ్ళు దళితులే. కల్యాణ్‌రావు వారిని కలిసింది నిజమా కాదా అని వారి దగ్గరికెళ్ళి వరవరరావు అడగలేదు. కనీసం వారిని ఫోనులో కూడా అడిగి తెలుసుకోలేదు. అంటే ఒక దళితుడు మరో దళితుడ్ని కలిస్తే ఆయన అనుమానించి, వారిని పరీక్షించాలి, శిక్షించాలి అని పార్టీ ముందు పెట్టారు. అలా చేయడంలో కులం పనిచేసిందా, నాయకత్వ లక్షణం పనిచేసిందా? అంత నిర్బంధంలో ఉన్న పార్టీకి చేత్తో ఉత్తరం రాసి, అది దొరికాక కూడా అది అబద్దమంటే ఎలా?
హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ సభలో మాట్లాడడానికి వచ్చిన అరుణశౌరి, అప్పుడు జంటనగరాల జైల్లో ఉన్న వరవరరావును కలిసి గంటల తరబడి చర్చించారు. ఆయన్ని జైలుకు తీసుకుపోయింది కెబి కన్నాభిరాన్. అదే రోజు సాయంత్రం అరుణ్‌శౌరి ఉస్మానియా క్యాంపస్ ఎబివిపి సభలో మరో ఆర్ఎస్ఎస్ సభలో ప్రసంగించారు. అప్పుడు వీరికి ఇదేమి స ిరిధమని గద్దర్, కల్యాణ్రావులు పార్టీకి లేఖరాసి ఉండొచ్చుగొ! వరవరరావు కూడా ౦తోమందిిన్సి కలుస్తూనే ఉన్నారు. ఆ కలయికలన్నీ వసూళ్ళ కోసమే అని పార్టీ రాస్తే పార్టీ వారిని సమర్షించేదా, వారి మీద చర్యకు పూనుకునేదా? మార్క్సిస్టు సిద్దాంతం 'పకారం స్ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి అయినా, ఆ కమిటీ పనితీరును ఆ కమిట్రీ సభ్యుల సమక్షంలోనే సమీక్షించాలి. అందుకు భిన్నంగా పై కమిటీకి 'శిక్షించండి అని రాయడంలో ఏ అంశం పని చేసింది? గుండెలో ఉన్న తుపాొకిగుండ్లతో గద్దర్, హత్యకు గరైన పరిటాల రవి శవం దగ్గరకు పోతే పిరికితనం ఎలా అవుతుంది? ఆ స్టానంల్రో దళితవాడల నుండి వచ్చిన గద్దరో, కల్యాణరావో కాక ఇంకెవరైనా ఉంటే వరవరరావు అలా రాసేవారా?
విష్టవ సాహిత్య చరిత్రలో వరవరరావు శ్రీశ్రీకి, కాళోజీ నారాయణరావుకు అంటగడుత్రున్న సాసాలను చూడండి. శ్రీశ్రీ వ్యక్తిగత జీవితం గద్దర్, కల్యా రావుల వ్యక్తిగత జీవితాలకంటే గొప్పది అని ఆయన చెప్పగలరా? శ్రీశ్రీ జీవితాంతం సినిమా రంగం చుట్టూ తిరగలేదా, వసూళ్ళు చేసుకోలేదా? ఆయన వ్యక్తిగత (ప్రవర్తన కాదు, సాహి విలువ చూడాలి అంటారు. అదే సూత్రం కల్యాణ్రావుకు నిజంగా వసూళ్ళు
వ్ఫి ఇండియన్ మావోయిస్టులు చేసుకున్నా వర్తిస్తుందా, లేదా? కాళోజీ నారాయణరావు (ప్రభుత్వపట్టాలను, అవార్డులను అందుకున్న కవి. స్వయాన పివి నరసింహారావు, (ప్రధానమంత్రి హోదాలో పిలిచి అవార్డు అందించారు. అయినా ఆయన సాహిత్యరంగంలో - విప్లవ సాహిత్యరంగంలో కూడా ఒక విష్ణవాత్మక స్టానానికి నోచుకుంటారు. కాని గద్దర్, కల్యాణ్రావులే పిరికివాళ్లు. వసూలుదార్జ్హు అవుతారట! ఇటువంటి అంచనాలు దేని వల్ల ముందుకొస్తున్నాయి. ఈ వయస్సులో కాళ్ళకు గజ్జెకట్టి, భుజాన గొంగళేసి, అసెంబ్లీలో, సెక్రటేరియట్లో, మంత్రుల ఇళ్ళ ముందు, చివరికి కర్ణాటక ముఖ్యమంత్రి ఇంటిముందు సైతం చిందులు తొక్కి రాజ్యాన్ని ప్రజల ముందు నిలదీసిన గద్దర్ పిరికివాడు ఎలా అవుతాడు? ఛండాలుడ్ని ఏ రంగంలోనూ మెచ్చుకోవడానికి వీలులేదని కౌటిల్యుడు, మనువు అన్నారు. కల్యాణరావు తిండికి సైతం తిప్పలు పడుతున్నారని ఆయన గురించి తెలిసిన ప్రజాస్వామికవాదులు చెబుతున్నారు. ఆయన పైసలు వసూలు చేసుకుంటున్నాడని వరవరరావు అంటున్నారు. మూడువేల సంవత్సరాల హైందవ సంస్కృతి దళితులకు భూమిపై ఆస్తిహక్కును, బంగారం ధరించే హక్కును, వ్యాపారాన్ని నడిపే హక్కును ధిక్కరించింది. చిప్పలు "సైతం లేనివాడు ఇత్తడి గిన్నె కొన్నా అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వరవరరావు కల్యాణ్రావుపై చేసిన ఆరోపణలపై దళిత మేధావులతో కూడిన ఒక నిజ నిర్ధారణ కమిటీని పార్టీ నియమించాలి కదా? అలా, ఎవరి ఆస్తులు ఎంతో తేల్చవచ్చు కదా! అలా తేల్చే ముందు, ఒక దళిత విప్రవకారుడి మీద ఆరోపణలు చేసినందుకు ముందు వరవరరావును సస్పెండ్ చేయాలీ కదా! అలా చేయకుండా తప్పు చేసానని బాహాటంగా ఒప్పుకున్నాక కూడా ఆ వ్యక్తిని విప్లవ పార్టీ ఎలా వెనకేసుకొస్తుంది?
వరవరరావును టీమ్ లీడర్‌గా అన్నీ ఆలోచించే నియమించామని పార్టీ చెబుతోంది. ఆ టీమ్ లీడర్ సమక్షంలోనే చంద్రకొంతారావు మంజీరా గెస్ట్ హౌస్‌లో నాయకులను కలిసాడని చెబుతున్నారు. అతణ్ణి అనాడు ప్రతినిధి వర్గం టీమ్ లీడర్ అడ్డుకోలేదు. తరువాత ఆ సంబంధంతో కల్యాణ్‌రావు కాళ్ళకు బంధం వేశారు. అందుకు బాధ్యత ఎవరిది? టీమ్ లీడర్‌దా? ఆ టీమ్‌లో సభ్యుడిదా? విష్ణవంలో కూడా హిందూ ధర్మ శాస్త్రం అమలులోకి వచ్చి కౌటిల్య దండనీతిని మళ్ళీ దళితుల మీదకే ఎక్కుపెడితే విప్లవంసై ప్రజలకు నమ్మకం ఏముంటుంది? విప్లవ సానుభూతి పరులుగా ఉండి, పైసలు, పలుకుబడి ఎవరి బంధువులు సంపొదించుకొన్నారో చూడనక్కరలేదా? ఏ కుటుంబాలు విష్ణవ నీడలో విలాసంగా (బ్రతుకుతున్నాయో, వాటి సాంఘిక కులసంబంధాలు ఏమిటో చూడనక్కరలేదా?
బిజెపి వంటి పార్టీలో ఒక్కసారి అధ్యక్షుడైన బంగారు లక్ష్మణ్ లక్షల రూపాయల లంచంతో దొరికితే రాజకీయ రంగం నుంచి తొలగించారు. కల్యాణ్‌రావు ఒక్కసారి
ఆ ముగ్గురి మధ్య కులం పనిచేయలేదా? 5్లె ప్రచార సాధనాలకు పరిచయం కాగానే ఆయనకు డాక్టర్లతో, యాక్టర్తతో ఉన్న సంబంధాలు విష్ణవపార్టీలోని తహల్కాలే పట్టేయాలా! వీటన్నింటిలో కులం పనిచేయటం లేదా, బంగారు లక్ష్మణ్, కల్యాణ్రావుల వర్షస్థితి మాత్రమే పనిచేస్తున్నదని ఒక విష్టవ పార్టీ చెప్పగలదా? భారతదేశంలో బ్రాహ్మణీయకులాల్లో పుట్టి బడి-గుడుల చుట్టూ తిరిగి, పెరిగిన వాళ్లు కార్మిక వర్గ మేథావులుగా ఎదగగలరా లేదా! దళిత వాడల్లో పుట్టి అన్ని అణచివేతలూ అనుభవించిన వాళ్ళు ఎటువంటి కారి శక వర్ల మేథావులుగా ఎదగగలరని అంచనా వేయటం అవసరం కాదా? గద్దర్ మీద ఇప్పుడు కొన్ని గురుతర బాధ్యతలు ఉన్నాయి, ఆయన ఎంతోమంది దళిత బహుజన యువకుల్ని విష్ణవంలోకి తోలారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. ఇంకేంతోవముంది బతికున్నారు. వాళ్ళందరికీ విస్టవ పార్టీలో సైతం (బ్రాహ్మణీయ అంచనాలకు గురై పిరికి పందలుగా, మోసకారులుగా ముద్రపడితే చరిత్ర గద్దర్‌ను సహించదు. ఆ పార్టీ (బ్రాహ్మణీయ ఎత్తుగడలలో ఆధిక్యతను మార్చే పోరాటం పెద్ద ఎత్తున చేయకుండా దళిత-బహుజన యువకుల్ని విష్ణవంలోకి పంపితే వాళ్ళు ఊరూ పేరూ లేకుండా పోతారు. వరవరరావు ప్రవర్తన కేవలం వ్యక్తిగత ప్రవర్తన కాదు. అది బ్రాహ్మణీయ భావజాలపు ప్రవర్తన, నక్కకు గాని, పులికి గాని వాటి ప్రవర్తనలు కేవలం వ్యక్తిగతంగా ఉండవు. అవి జాతి ప్రవర్తనలు. అట్లాగే మనదేశంలో కుల ్రవర్తనలూ ఉంటాయి, కులంగా ఉంటాయి. దానిని మార్చాలి. అది చేయకుండా దళిత-బహుజనుల చేతికి తుపాకులు ఇస్తే వాళ్ళెంత యుద్ధం చేసినా, కలాలు చేతిలో ఉన్న పండితులు ఇటువంటి ఉత్తరాలే కాదు, పుస్తకాలు రాస్తారు. ఇంకో 500 వందల సంవత్సరాలు ఈ
సమాజం వెనక్కి పోతుంది. వార్త - 8 జూన్, 2005
చాప్టర్ - 111 తెలంగాణ 17. మావోయిస్టుల పాత్ర లేకుండా తెలంగాణ వస్తుందా? 18. ప్రజా తెలంగాణ అంటే ఏమిటి? 19. సానూజిక తెలంగాణ వ్యతిరేకళక్తుల ఐక్య కదలిక! 20, రెండు రాష్ట్రాలు ; ఒకే నినాదం 21. భాషా ప్రయుక్త రాష్ట్రాలు బతుకుతాయా? 22. రెండన ఎస్సార్సీ ; 'భాషారాష్ట్రా'ల పునస్పమీక్షకే 23. పొత్తులు తెలంగాణ సాధనకేనా? 24. హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్టమైతే? 25. బతుకమ్మ కాదు .... రాజకీయాలాడాలి 26. చదువుకు సమ్మె వద్దు
శ మావోయిస్టుల పాత్ర లేకుండా తెలంగాణ వస్తుందా?
అన్ని గ్రూపులకు చెందిన మావోయిస్టులు తెలంగాణను తమ కేంద్ర స్థావరంగా చేసుకొని పనిచేశారు. ఈ దేశంలో కమ్యూనిస్టు సాయుధ పోరాటాలకు తెలంగాణనే పుట్టినిల్లు, అది దొడ్డి కొమురయ్య రక్తతర్పణతో, చాకలి ఐలమ్మ పోరాట దీక్షతో పురుడు పోసుకుంది. దాని వెనుక నేపథ్యంలో సమక్క-సారక్కల స్వయం పాలన ఆకాంక్ష కొమురం భీం స్వపరిపాలన పోరాట దీక్షలు ఉన్నాయి. “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” సిద్దాంత భూమికపై యునైటెడ్ కమ్యూనిస్టు పార్టీ 'భాషా రాష్ట్రాల్ నిర్మాణ భూమికకు పునాదులు వేసిన దగ్గరి నుండి ఉమ్మడి కమ్యూనిస్టులు, ఆ తరువాత విడిపోయిన సిపిఐ, సిపిఎం, భాషా సిద్దాంతం'లోనే తెలంగాణాలో ఆంధ్రుల ఆధిపత్యం కొనసాగించడాన్ని సమర్జించాయి. భాషకు, బతుక్కు తేడా ఉన్నదనే మార్కిస్టు దృక్పథం వీరికి కనిపించలేదు, వినిపించలేదు.
1969లో ఆంధ్రప్రదేశ్‌ను పునాదిగా చేనుకొనే కమ్యూనిన్చు పార్టీ నుండి మావోయిస్టులు విడిపోయారు. అదే సంవత్సరం తెలంగాణ (ప్రత్యేక ఉద్యమం ఊపందుకున్నది. అది శ్రీకాకుళం గిరిజన విముక్తిని కేంద్రంగా చేసుకొని వర్గ శత్రు నిర్మూలనను పోరాట పంథాగా ఎన్నుకుంటే ప్రత్యేక తెలంగాణకోసం ప్రజాపోరాటాలు లేచాయి. ఆ పోరాటాన్ని సమర్పించింది, సాగనిచ్చింది మావోయిస్టు రాజకీయపక్షాలే. ఈ రెండు ఉద్యమాలు త్యాగాల ఉద్యమాలుగానే ఆనాటి నుండి ఈనాటికి సాగుతున్నాయి. అయితే మావోయిస్టు ఉద్యమం పెటీ-బూర్జువా మేధావి వర్గం చేతిలో నడిస్తే తెలంగాణ ఉద్యమం ఈ మధ్యకాలం వరకు ప్యూడల్ పాలకపక్షాల చేతుల్లో నడిచింది. మావోయిస్టు రాజకీయంలో తెలంగాణలో పుట్టిన అతితెలివైన అగ్రకుల మేధావులు, దళిత బహుజన మేధావులు చనిపోయారు, సిరిసిల్ల జగిత్యాల ఉద్యమాలు కింది కులాల నుండి మావోయిజాన్ని తమ నరాల్లోకి ఎక్కించుకొని అటు దళిత బహుజన వర్గాల నుండి,
63
64 తెలంగాణ అ(గ్రకులాల నుండి నాయకత్వం పుట్టుకొచ్చింది. (ప్రాణాలు కోల్పోయింది. అందులో కనీసం ప్రత్యేక రా[ష్ట్రాన్నైనా ఒక (ప్రజాస్వామ్య రాష్ట్రంగా చూసి చనిపోదామనుకున్న వాళ్ళు లేకపోలేదు. అందులో నుంచి దళిత బహుజన ప్రతినిధులుగా కూర రాజన్న వంటి నాయకులు ఎదుగుతే అ(గ్రకులాల నుండి లక్ష్మణరావు (మావోయిస్సు పార్టీ సెక్రటరీ) ఎదిగారు. మావోయిజం వారికి త్యాగాన్ని. ఆత్మ బలిదానాన్ని నేర్పింది. 1969 నుండి నేటి వరకు మావోయిస్టు మూమెంట్లో తెలంగాణ కోల్పోయినంత మంది మెరికల్లాంటి మేధావుల్ని ఏ ప్రాంతం కోల్పోలేదు. బతికున్న నాయకులు కూడా గుండెల్లో గుండ్డు పెట్టుకొని (గద్దర్, కాళ్ళు చేతులు విరగగొట్టుకొని తెలంగాణ రావాలని నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళు మావోయిస్టు పక్షం నుండి ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గద్దర్ గుండెల్లో తుపాకి గుండ్డు, శరీరం నిండా షుగర్ వ్యాధి, అనునిత్యం వాస్తున్న కాళ్ళు, చేతులు పెట్టుకొని తెలంగాణ గల్లి, గల్లి తిరుగుతున్నారు. గత పదేళ్లుగా (టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు నుండి) ప్రత్యేక రాష్ట్రం కావాలని కాలికి గజ్జె కట్టి గొంగడి భుజాన వేసుకొని పది జిల్హాలు సాలు, సాలు సందు లేకుండా దున్నుతే, భౌగోళిక తెలంగాణ పేరుతో ఏ మావోయిస్టులు ఏ శక్తులనైతే (గ్రామాల నుండి తరిమికొట్టారో వాళ్ళు అత్యాధునిక కార్లల్లో (గ్రామాలకెళ్లి ఓట్ల విత్తనాల వేసుకున్నారు. గద్దర్ మావోయిస్టుల ప్రతినిధి. అంటే తెలంగాణ చైతన్యాన్ని దున్ని 'పెకిలించడంలో వారి (ప్రతినిధిగా ఆయన, ఆయనతో పాటు మరెందరో పాటుపడితే ఓట్ల పంట పండించుకున్నాది తెలంగాణ భూస్వామ్య-నయా బూర్జువాలు. భౌగోళిక తెలంగాణ పేరుతో - మావోయిస్టులు (గ్రామాల నుండి తరిమికొడితే కచ్చరం బండ్లల్లో, ఎ|ర్రబస్సుల్లో హైదరాబాదొచ్చిన వాళ్ళు ఇప్పుడు బెంజి కార్లలలో మళ్ళీ (గ్రామాలకు )సోతున్నారు. దేశం మొత్తం మీద కోడై కూస్తున్న సామాజిక న్యాయ విలువల్ని కూడా తమ ప్యూడల్- పట్టణ బూర్జువా కార్ల వీల్స్ కింద నలిపేసి పోదల్బ్చుకున్నారు. తెలంగాణను సాధించి, కనీస (ప్రజాస్వామ్య విలువలకు అది (ప్రాతినిధ్యం వహించి బతికి బట్టకట్టాలంటే కనీసం సామాజిక న్యాయ సూథత్రాన్నైనా బలంగా అమలు చెయ్యాలి. ఆదివాసులు, దళితులు, బిసిలు, అధికారం ముఖం చూడని తెలంగాణ ఆడవాళ్లు కనిస ఆత్మగౌరవంతో తిరగాలంటే “సంస్కరించు-సాధించు' సాధించు - సంస్కరించు” సూత్రంపై ఆధారపడి ఒక నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. సంస్కరణ విష్టవం కాదు. సామాజిక న్యాయం విష్ణవాత్మక మార్పుకోసం జరిగేపోరాటంలో అతికీలకమైన మొదటి మెట్టు. బ్రాహ్మణిజం, అగ్రకుల ఆధిపత్యంపై పోరు చెయ్యకుండా విప్లవం తెస్తామని గత 80 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలు ఫెయిల్ అయ్యాయి.
మావోయిస్టుల పాత్ర లేకుండా తెలంగాణ వస్తుందా? 65
1947లో స్వాతంత్ర్యం పేరుతో అగ్రకుల భూస్వామ్య శక్తులకు అధికారం అప్పజెప్పి 60 ఏండ్లు ఆకలితో బాధపెట్టిన, సాధారణ విద్య కూడా లేని స్వాతంత్రాన్ని తిట్టి, తిట్టి కమ్యూనిస్టుల నోర్డు వాచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయకూడదు. తెలంగాణ సాధించుకునే క్రమంలోనే సామాజిక న్యాయంతో కూడుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో ఏం జరగాలో తమ ప్రోగ్రామ్‌ను కూడా వాళ్ళు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ శక్తులను (ప్రజలు రాజీలేకుండా వ్యతిరేకించాలో, ఏ శక్తులను ప్రశ్నించి (ప్రజల్లో తిరుగనివ్వాలో ప్రతిసారి చెప్పినట్టు ఈసారి కూడా అని చెప్పొచ్చు. కాని ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తమ ప్రోగ్రామ్ ఏమిటో చెప్పడం చాలా ముఖ్యం. సామాజికన్యాయాన్ని ఈ మొత్తం ప్రక్రియలో ఒక కీలక అంశంగా చూడకపోతే భూస్వామికి, రైతుకు, కూలికి తేడా చూడకుండా మాట్టాడడం అవుతుంది. దానివల్ల మొత్తం తెలంగాణ నష్టపోతుంది.
కులం కొంతమందిని పుట్టుకతో భూస్వాములుగా, కొంతమందిని పుట్టుకతో పూజారులుగా ఉంచితే, కొంతమందిని పుట్టుకతో అంటరానివారుగా, పుట్టుకతో నిరాశా జీవులుగా ఉంచుతుంది. ఆ కులం పునాదిగా కింది వారిని పైకి, పై వారిని కిందికి కనీసం అధికార రంగంలో మార్చాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులు ఈ పోరాటం చేసి ఉంటే భారతదేశపు పునాదులు ఈ పాటికే బాగా మారేవి. మహాత్మాపూలే, అంబేద్కర్లను తమ వారిగా చేసుకోగలిగిన వారి మధ్య, చేసుకోలేని వారి మధ్య ఒక మౌలిక తేడా ఉంటుంది. అది కులాధిపత్యం. దాన్ని ముందు మార్చాలి. తెలంగాణ సాధనలో ఇది సమాన వాటా గల అంశం. మావోయిస్టులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాల్లో చావు దెబ్బలుతిన్నారు. వాటి మీద ఎదురుదాడులు చేశారు. మళ్లీ అవి అధికారం ఒకరికి పోతే మరొకరు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని మార్చ చూస్తున్నాయి. ఈ రెంటికి (ప్రత్యామ్నాయంగా 'సామాబిక న్యాయం” అజెండాగా గల మూడవ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇది అరుదుగా వచ్చే అవకాశం. ఆదివాసులు, దళితులు, బిసిలు, మైనారిటీలకు తమ జీవితాల్లో ఆత్మగౌరవ దీపం వెలిగే ప్రక్రియ ఒకటి కనిపిస్తున్నది. దానికి మావోయిస్టులు తమ చేయూతనియ్యకపోతే అ(గ్రకులాలు ఆ దీపాన్ని సులభంగా ఆర్బగలవు. తాము అధికారంలోకి వచ్చేవరకు సామాజికన్యాయం ఆగాలని కాని, తెలంగాణ ఆగాలని కానీ కోరుకోవడం అశాస్రీయం. ఏ పోరాటమైనా సానుకూల సంధికాలం కోసం చూడాలి. రాష్ట్రంలో, దేశంలో సామాజిక న్యాయ పోరాటంలో కలిసొచ్చే శక్తులేవి, వ్యతిరేకించే శక్తులేవి అని చూడాలి. తెలంగాణ సాధనలో సంధికాల ప్రజాస్వామ్యానికి దీర్హకాల విప్లవానికి అనుకూల శక్తులేవి, వ్యతిరేక శక్తులేవి అని చూడాలి. ఒక భూస్వామి హాస్పటల్లో 'అన్న' దగ్గరి కొచ్చి పోతేనో, కొడుకు చేత కోలాట మాడిస్తేనో, బిడ్డ చేత బతుకమ్మ నాడిస్తేనో నిజంగా మారినట్టు కాదు. అదొక రాజకీయ నాటకం.
66 తెలంగాణ యుగాలుగా, తరాలుగా కోలాట పాటలలో కొట్టుకు పోయ్యినోళ్ళెవరు, బతుకమ్మ ఆటలో బతుకుదెరువు లేకుండా పోయిన కులాలేవి అని చూడాలి. నాటకం నిజం కాదు. ఆ నాటకంలో కూడా ముందున్న మనుషులను బట్టి వేషం మార్చేవారిని అసలు నమ్మొద్దు. తెలంగాణ (గ్రామాల్లో ఒక సామెతుంది. 'అసలు వేషమే బాగా లేదంటే బట్టలు మార్చుకొస్తానంటావేమి?” అని. ఏ వేషం భాగలేదో మీరైనా తేల్చి చెప్పాలి గదా! వేషం అంగీకారమే, బట్టలు మార్చుకోవలసిన వారికి అది చెప్పండి. కాని మీ పాత్ర కీలకమని
అందరికీ తెలుసు. సూర్య - 19 అక్టోబర్, 2008
16 ప్రజా తెలంగాణ అంటే ఏమిటి?
దేవేందర్గాడ్ చంద్రబాబుతో అవమానం పొంది తిరగబడ్డాక ఆయనకు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా తిరగబడే దశ వచ్చింది. 'ఆకలినైనా భరిస్తాం కాని అవమానాన్ని సహించం" అని ఆయన పింగళి వెంకట్రామిరెడ్డి హాలులో జూన్ 28న ఇచ్చిన నినాదం హాలంతా దద్దరిల్లజేసింది. ఈ ఇద్దరు రాజకీయనాయకులు రాయలసీమలో ఒకే బడిలో చదువుకొని, ఒకే గదిలో పడుకున్నారన్న చమత్కార వ్యాఖ్య వాళ్ళ ఆధిపత్యానికి గండికొట్టే గళంగా మారింది. మా తెలంగాణ 'ప్రజా తెలంగాణ" మా తెలంగాణ 'నవ తెలంగాణ' అని ఆయన చేసిన సూత్రీకరణ ఆయనలో ఒక తెలంగాణ దార్శనికుణ్జో చూపింది.
'ప్రజా తెలంగాణ సాధనకి, తెలంగాణ రాష్ట సాధనకి ఒక మౌలిక సిద్దాంత, ఆచరణ తేడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంలో తండాస్టాయి. గ్రామస్థాయి, మండలస్థాయి (ప్రజల పాత్రేమిటి, వాటా ఏమిటి అనే చర్చ లేదు, ఆలోచన లేదు. ఒకపార్టీ ఉద్యమరూపంలో ఉన్నా. ఓట్ల పార్టీగా ఉన్నా ఇక్కడి ఆదివాసుల, దళితుల, బిసిల, ముస్లింల భాగస్వామ్యం అందులో ఎంత అనేది అతి కీలకమైన సమస్య, అన్ని కులాల్లోని ధనవంతులు కనీసం అ(గ్రకుల పేదలకు కూడా భాగస్వామ్యం లేని రాజకీయ నిర్మాణం నడిపితే ఆ పార్టీ ఎన్నికల పోటీదార్లను 'సేట్టబేరగాండ్లుగా మాత్రమే తయారు చేస్తుంది. దేవేందర్గాడ్ “ఇప్పుడున్న పార్టీలన్నీ సీట్లను వేలం వేస్తున్నాయి, అది మారేదెట్ల' అని అడుగుతున్నారు. రాష్ట్ర సాధన ముఖ్యం కాని (ప్రజలు ముఖ్యం కాదన్నప్పుడు గెలుపు గుర్రపు సూటుకేసును ముందు తూకమెయ్యడం, గెలిచాక అది ప్రజల రక్తం తాగడం అనివార్యం.
కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీ క్యాండిటేట్కి ముందే కొన్ని కోట్లిచ్చి, ఏదో ఒక పార్టీలో సీటు కొనిపించి, ఎన్నికల్లో కేండిడేట్ ఇనేక్షివ్గా ఉండాలని లేదా గెలవగానే తమవైపు రావాలని పైసల (ప్రజాస్వామ్యాన్ని నిర్మించాయి. దీన్ని ఛేదించేదెట్ల అని
67
658 తెలంగాణ దేవేందర్‌గౌడ్ అడుగుతున్నారు. నాకు తెలిసి ఇంతకు ముందు మన రాష్ట్రంలో ఏ రాజకీయనాయకుడు ఈ ప్రశ్న అడగలేదు. దేవేందర్గొడ్, చం్యద్రశేఖరరావులు సమాంతరంగాకాని, నమ్రైక్యంగాగాని ఉండాలనే వేడావులు ఈ సమస్యకొక పరిష్కారమున్నదా లేదా అని ఆలోచించిన దాఖలాలు లేవు. భౌగోళిక తెలంగాణ సాధనే సర్వస్వం అనుకున్నప్పుడు ఈ ప్రక్రియను కూర్చే ఒక ప్రజాస్వామిక చర్చ ఉండదు. ఇటు ఎన్నికల రంగంలోగాని ఆటు పోరాట రంగంలోగాని అటువైపు ప్రయత్నం ఉండదు. (ప్రజా తెలంగాణ అంటే (ప్రజా సమీకరణను కింది నుండి చూడాల్సి వస్తుంది. అంటే ప్రజా తెలంగాణ ఒక ప్రజాస్వామిక సూత్రంపై ఆధారపడుతూనే సామాజిక న్యాయాన్ని, సెక్యులరిజాన్ని సమతూకంపై నడిపే రాజకీయవ్యవస్త్ర నాకదాన్ని నిర్మించాలి. అంటే (ప్రజాస్వామ్యం ఒక బండిలాంటిదైతే ఈ దేశంలో ఈ (ప్రాంతంలో సామాజిక న్యాయం, సెక్యులరిజం బండికుండే రెండు గుర్రాలే కాకుండా బండిని లాగే రెండు ఎడ్డు కూడా. సామాజిక న్యాయ సూత్రంతో ఆదివాసులను, దళితులను, బిసిలను సమానత్వం, ఆత్మగౌరవం పునాదిపై సమీకరించాలి. ముస్తింలను సెక్యురిజంతో! వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కోల్పోయిన రాజకీయ అధికారాన్ని వారి జనాభా ప్రాతిపదికన వారికివ్వాలి. అంటే ఆత్మగౌరవం తెలంగాణ ప్రాంతంలో మూడుస్టాయిల్లో పట్టాలమీది కెక్కాలి. తెలంగాణ ఒక (ప్రాంతంగా, ఒక రాష్టంగా ఆత్మగారవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడి దళిత బహుజనులు తమ ఆత్మగౌరవాన్ని ఆం(ధ్రప్రాంతపు, ఆధిపత్య శక్తుల అణిచివేత నుండి, ఇక్కడి ప్యూడల్ శక్తుల అణిచివేత నుండి కాపాడుకోవాలి. ఇక్కడి । ఆదివాసులకు, దళితులకు, బిసిలకు ఈ పోరాట (క్రమంలోనే ఆ గ్యారంటీ ఇవ్వకుండా వాళ్ళు ఈ (ఎన్నికలు - ఎన్నికేతర) పోరాటంలో ఎందుకు పాల్గొనాలి అనే ప్రశ్ళ వస్తుంది. ఇక్కడే నాయకత్వం సమస్య కూడా వస్తుంది. ఈ ప్రాంతంలో మెజారిటీ (ప్రజలు వీళ్ళు కనుకు తమ నాయకుడిని తమ అద్దంలోనే చూసుకోవాలి అని సహజంగానే వీళ్ళకు ఉంటుంది. ఇక్కడే గౌడ్ ఒక బిసిగా తమ నాయకుడుగా కనిపిస్తాడు. అయితే తమవాడనేదొక్కటే కాదు, నాయకత్వంలో ఒక రాజకీయ దార్భనికత అవసరం. పరిపాలన పట్టుదల అవసరం. ముస్లింలు నిజాం పాలన పోగానే అధికార కైలాస పటంలో పాము మింగితే మళ్ళీ 'మొదటికొచ్చిన వారయ్యారు, వారు ఎక్కడానికి ఒక్క నిచ్చెన కూడా ఆ పటంలో దొరకలేదు. బిసి నాయకత్వం వారికొక నిచ్చెనగా కనిపించకపోతే వాళ్ళు ఈ ఉద్యమంలో కలిసి రారు. వచ్చినా నమ్మరు. వారికి సంపూర్ణ నమ్మకాన్ని కలిగించే సెక్యులర్ (ప్రాక్టీసు నాయకునికి ఉండడం చాలా ముఖ్యం, ఒకరోజు గుడి ఒకరోజు దర్గాకి లేదా మసీదుకు పోతే వారికి నమ్మకం కుదరదు. ఆ నాయకుని జీవితం నిరంతరం (ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రజా తెలంగాణ అంటే ఏమిటి? 659 ఉండడం అవసరం, ఈ ప్రజాస్వామికతను నిత్యజీవితంలో చూపించాలి. అది మామూలు విషయమేమీ కాదు. ప్రజా తెలంగాణలో మరి పైవారు - అంటే ధనవంతులు, పెత్తందారులు బాగస్వాములు కారా అంటే ఖచ్చితంగా వాళ్ళూ భాగస్వాములే! కాని వారి భాగస్వామ్యధూపం, (ప్రక్రియ మారాలి. అంటే విసృత ప్రజల ప్రజాబలం లేదా జన బలం
- ధనవంతుల ధనబలం తెలంగాణను సంస్కరించే పయనం జోడించాలి గాని, తెలంగాణ రాగానే దండుకుతింటాం అనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. అంటే తెలంగాణను సంస్కరించు, సాధించు; సాధించు, ఆ తరువాత సంస్కరించు అనే సూత్రంపై ఎన్నికలు, ఎన్నికేతర పోరాటం సాగితే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందుకు భిన్నంగా 1969 నుండి ఇప్పటి వరకు సాగిన (ప్రక్రియలో తెలంగాణ సాధించే పేరు తో సంపాదించు అనే సూత్రంపై ఎన్నికలు, ఎన్నికేతర ఉద్యమాలు నడిచాయి. అందుకే వారు కోరుకున్న భౌగోళిక తెలంగాణ కూడా రాలేదు. అలా వచ్చినా అయ్యో! విశాలాంధ్ర ఉంటే బాగుండునే అనే ఆలోచన ప్రజల్గో అతి త్వరలోనే వస్తుంది.
అందుకే ప్రజా తెలంగాణ నాయకుడు ప్రజల -అత్యధిక ప్రజల-ప్రతినిధిగా కూడా ఉండాలి. నాయకుడు ముందు నోటు, ఆ తరువాత ఓట్లు లెక్కబెట్టుకునేవాడుగా ఉంటే (ప్రజలకు ఆ నాయకుని మీద నమ్మకం కలగడం కష్టం. అట్టని ఎన్నికలు, ఎన్నికేతర ఉద్యమాల్లో డబ్బు అవసరం ఉండదని కాదు. అందుకు గౌడ్ చెబుతున్నట్లు ఈ మనీ బ్యాగుల ఎన్నికల సంస్కృతిపై ఒక బలమైన దాడి చెయ్యాలి. తెలంగాణలో ఎన్నికల్ని ఉత్తరప్రదేశ్ కాన్షీరాం నాయకత్వంలో బిఎస్పి గెలిచిన రీతిలో గెలిచే ప్రక్రియనాకదాన్ని ఆచరణలోకి తేవాలి. అయితే ఉత్తరప్రదేశ్ కంటే ఇక్కడ డబ్బు అందుబాటు ఎక్కువ. గత 15 సంవత్సరాల్లో ఒక ఓటుకు ఒక 500 నోటు ఇచ్చే సంస్కృతి (గ్రామస్థ్రాయికి చేరింది. ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి - అమెరికా అధ్యక్షుడు అయ్యే వ్యక్తి పెట్టే ఖర్చుకంటే ఎక్కువే "పెడుతున్నారు. దీనిని మార్చడమెట్లా అన్నది సమస్య, గూడెం, తండా, (గ్రామం, మండలం, జిల్టా, హైదరాబాద్ స్థాయిల్లో (ప్రజల్ని పోరాటంలో భాగస్వాముల్ని చెయ్యడంతోనే ఈ స్థితిని మార్చగలం. అందుకు (ప్రజల్ని భాగస్వాముల్ని చేసే నమ్మకం గల నాయకత్వం చాలా ముఖ్యం. ఆ నాయకుడిది కొత్త బ్యాక్(గ్రౌండ్, కొత్తముఖం, శ్రమజీవులలో తమలోని మనిషిగా ఉండడం ప్రజల (ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పరచడంలో అతి కీలకం. బూర్లుల రామకృష్ణారావు నుండి అంజయ్య (అంజిరెడ్డి) వరకు తెలంగాణ నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వాళ్ళంతా ప్రజల భుజాల మీద కూర్చొని స్వారీ చేసినవారే. అది పి.వి.నరసింహారావు అయినా, జలగం వెంగళరావు అయినా, ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి అయినా అంతా పై నుండి ఊడిపడ్డ వాళ్ళే! సామాజిక న్యాయపోరాటంలో ఎదిగిన వారెవ్వరూ లేరు.
70 తెలంగాణ (ప్రజా తెలంగాణలో నాయకత్వం - అమెరికాలో బానిస (ప్రజల నుండి ఒక ఒబామా ఎదిగినట్టు - కిందిస్టాయి నుండి ఎదిగి ఉండడం అతి కీలకమైంది. అలా ఎదిగిన నాయకుని ఉదాహరణ - ప్రతి ఇంట్లో, ప్రతి చైల్ణులో ఒక నాయకుడు/నాయకురాలు 'మొగ్గరూపంలో ఉన్నదన్న ఆశ కల్పించాలి. తెలంగాణలోని ప్రతి ఆదివాసి గూడెం, దళివాడ, బహుజనవాడ ఒక కొత్త ఆశతో ఈ పోరాటంలో పాల్గొనగలగాలి. అటువంటి (ప్రజా
తెలంగాణకై ఎదురు చూద్దాం. సూర్య - 6 జూలై, 2008
శం
సామాజిక తెలంగాణ వ్యతిరేకళశక్తుల
ఐక్య క దలిక!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో సామాజిక న్యాయం ఎన్నికల ఎజెండాగా మారుతున్న తరుణంలో తెలంగాణ వచ్చినా మంచిదే, రాకున్నా మంచిదే గాని సామాజిక న్యాయ అంశాన్ని ఎజెండా మీదికి రానియ్యవద్దనే శక్తులు బాగా కదులుతున్నాయి.
తెలంగాణ (ప్రత్యేక రాష్ట్రం కోసం గత కొంతకాలంగా పనిచేస్తున్న శక్తులు తమ అ(గ్రకుల భూస్వామ్య అధికారాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే పటిష్టంగా రూపొందించవచ్చని అంచనా వేసుకున్నాయి. పూలే, అంబేద్కర్‌వాదం, పునాదిపైన ఆధారపడి తెలంగాణ రాష్ట్రంతో పాటు సామాజిక న్యాయ, రాజకీయ అధికారాన్ని ఏకకాలంలో సాధించి మార్చువైపు తీసుకుపోవాలనే శక్తులది ప్రమాదకర సిద్దాంతమని లోలోపల ప్రచారం చేశారు ఈ అ(గ్రకుల భూస్వామ్య శక్తులు. గత ఏడు సంవత్సరాలు తమ కుల/వర్గాలు తెలంగాణ పేరుతో భూవ్యాపారం, రాజకీయ వ్యాపారం చేసి పేదలకు గజం భూమి దొరకని స్థితికి తీసుకువచ్చారు. "హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని తెలంగాణ భూవ్యాపారంగా రెడ్డి వెలమ కులస్టులు మలుస్తుంటే ఈ సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులు తెలంగాణ ఉద్యమం పేరుతో తమ కుల ఆస్తుల్ని, అధికారాన్ని "పెంచుకున్నారు.
ఈ శక్తులతో ఏవో కొన్ని బిసి, ఎస్సి, ఎస్టి శక్తులు కూడా జమ అవుతాయి. మావోయిస్టు ఉద్యమం చుట్టూ నిర్బంధాన్ని పెంచే శక్తులు, నిర్భంధాన్ని వ్యతిరేకిస్తామనే కొన్ని శక్తులు, ఆ ఉద్యమంలో దళిత బహుజనుల పాత్ర, ప్రాతినిధ్యం పెరుగుతుందనగానే అది సన్హగిల్లి, సమసిపోయేందుకు రహస్య ప్రయత్నాలు చేసిన శక్తులు తెలంగాణను ఒక అనుకూల అంశంగా మార్చుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ శక్తుల కుల/వర్గ బంధువులు భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారి వ్యవస్థలోకి మారుతున్నారు. వీరికి అండగా ఉండే బిసి, ఎస్టి, ఎస్సి శక్తులు (అతికొద్ది మందే) పూలే, అంబేద్కర్, కొమురం భీమ్,
౮
72 తెలంగాణ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి పేర్లు వింటేనే ద్వేషించుకొని అధికార మెట్టని తెలంగాణ భూస్వామ్య/ అ(గ్రకుల ఆధిపత్య శక్తుల అండతో ఎక్కి ఆ అధికారాన్ని ఒక సామాజిక మార్పుకు 'అడ్డుకట్ట'గా నిలిపినవే. పూలే, అంబేద్కర్ల పేరు చెబితేనే ఉలికిపడడం, అ(గ్రకుల కంపెనీల్లో కల్టులో నీరులా కలగలిసి ఉన్నవే. అధికారం రావాలంటే ఆ మార్గమే మంచిదని గత కాలమంతా సమాజ మార్పుకు సంకెళ్ళు వేసినవే.
ఈ దేశ ఈ రాష్ట్ర ఈ ప్రాంత దురదృష్టమేమంటే ఇటువంటి శక్తులు చాలా యూనివర్సిటీల చుట్టూ ఉన్నాయి. వాటిని ఒకనాడు అవి శాసించాయి. నేటికి అవే శాసిస్తున్నాయి. వాటంతట అవి సమాజం మీద శక్తివంతమైన శాస్త్ర పరిశోధన చేసినవి కావు. ఇవన్నీ పైరవీలు, పైసలు ఆసరాగా చేసుకొని అగ్రకుల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని పెంచి, దళిత బహుజనులపై దోపిడిని, అణచివేతను పెంచి ఆ దోపిడీదారులిచ్చిన సర్టిఫికెట్టపై ఆధారపడి కొనసాగినవే. ఇవన్నీ ఇప్పుడు కులసమస్యగాని, వర్గ సమస్యగాని చర్చ పెట్టాలని పనిచేసినవే. దారకంటే ఎక్కువ దొర చుట్టూ ఉండే వంది మాగధులు పనిచేసినట్టు 'సామాజిక న్యాయం” తలెత్తకుండా ఇటువంటి బిసి, ఎస్సి, ఎస్టి శక్తులు ఎక్కువ పనిచేస్తాయి. ముఖ్యంగా బిసి కులాల్లో నుండి వచ్చి రిజర్వేషన్ అక్కర్రేదు మేమే మెరిట్ ప్రతిరూపమని చెప్పిన బిసి మేధావులు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు తమ రంగంలో తాము చేసిందానికంటే అ(గ్రకుల ఆధిపత్యాన్ని పెంచే అడ్మిని'స్ట్రేషన్‌లో రాత్రింబవళ్ళు కృషి చేశారు. ఎందుకంటే అ(గ్రకులాలిచ్చే చిన్న పొగడ్త సర్టిఫికెట్ కూడా వాళ్ళకు వెయ్యి ఏనుగులంత బలాన్ని ఇస్తుంది. అధికారాన్ని ఇవ్వలేని దళిత బహుజనుల పొగడ్త వారికి పొగమంచు లాంటిది. గత ఏడేళ్ళుగా సామాజిక తెలంగాణ కావాలి. దొరల తెలంగాణ కాదు అన్న వారిని వీళ్ళనెవరు పట్టించుకుంటారులే (అ(గ్రకుల పట్టింపే, పట్టింపుగా భావించి తాము తెలంగాణ విముక్తిదారులమని పోజు కొట్టిన వారంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు) ఎందుకు? సామాజిక న్యాయ తెలంగాణ (సామాజిక న్యాయ ఆం(ధ్రప్రదేక్ కూడా అకస్మాత్తుగా పెద్దదై కూర్చుంది.
నవ తెలంగాణ పార్టీగా ఆ పునాదితో ఒక పార్టీ రావడం, ప్రజారాజ్యం కూడా సంపూర్ణ సామాజిక న్యాయం తమ రాజకీయ ఆలోచన అని చెప్పడంతో అనుకోని జరం ఈ వర్గాల్లో మొదలైంది. చిరంజీవి మేం అధికారంలోకి వస్తే 'దొరల తెలంగాణ కొదు సామాజిక న్యాయ తెలంగాణనిస్తామంటే ఈ శక్తులే ఆయన మీద కోడిగుడ్డు వేయించాయి. దొరల చుట్టూ ఉండే 'మేధావివర్గం' తెలంగాణ సంస్కృతి అంటే సామాజికన్యాయంపై కోడిగుడ్డు కొట్టడం, ఆ సిద్దాంతం చెప్పే శక్తులను తిట్టడం అని సైలెంట్ కితాబులిచ్చాయి.
సామాజిక తెలంగాణ న్యతిరేకశక్తుల ఐక్య కదలిక! 73 ఇప్పుడవి రాజశేఖరరెడ్డిని తిడుతూ, చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ తెస్తామని మళ్ళీ ఒక కొత్త సిద్దాంతం చెబుతున్నాయి. సామాజిక తెలంగాణ నేను ఇస్తానని బహిరంగంగా మావోయిస్టు గడ్డగా చెప్పుకునే జగిత్యాలలో ప్రకటించిన చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా చూడాలనేది వీరి కోరిక. రాజశేఖరరెడ్డి పోయి చంద్రబాబు వచ్చినా మళ్ళీ ఐదేళ్ళు తెలంగాణ భూవ్యాపారం, రాజకీయవ్యాపారం చేసుకోవచ్చు అని వాటి అసలు నమ్మకం. 2004 ఎన్నికలలో రెడ్డి + వెలమ = అధికారం అయితే, ఈ ఎన్నికల్లో కమ్ము + వెలమలు = మళ్ళీ అధికారం. ఈ (క్రమంలో తెలంగాణ రాకపోతే పోని, సామాజిక న్యాయ తెలంగాణ మాత్రం రాదు. చిరంజీవి చేతిలోకి ముఖ్యమంతి వదవిపోతే జరిగే విభజన సామాజికన్యాయ విభజన. ఇది తెలంగాణరాకపోవడం కంటే ఎక్కువ ప్రమాదకరమని భావించి ఈ రాష్ట్రంలో 'సామ్రాజ్య కులాల కూటమి' జరిగింది. ఈ కూటమి చుట్టూ ఉన్న మేధావులు రాత చర్చల్లోకి రారు “బిర్యానీ, బీరు సమావేశాల్లో “కష్టజీవుల కల్లుని' మార్కెట్లో లేకుండా చేసే సిద్దాంతం ఇప్పుడు మార్క్స్ పుస్తకాల్లో వెతుకుతున్నారు. అందుకే ఎన్నడూ ప్రజాజీవితం లేని ఆగ్రకుల మేధావులు నల్ల బ్యాడ్జి పెట్టుకొని 'సామాజిక తెలంగాణ బందు' అని బండ్లెక్కి వస్తున్నారు. వారి బండ్లలో కొంతమంది బిసి, ఎస్సి, ఎస్టిలు కూడా ఉంటారు. వీళ్ళంతా మన చెవుల్లో పువ్వులు పెట్టేందుకు పూలే, అంబేద్కర్ జిందాబాద్ అంటారు. వాళ్ళ ఆధునిక బండ్లు ఎక్కగానే “ఈ కొడుకులను పొగిడే రోజొచ్చే' అని తిట్టుకొని తిరిగిపోతారు. వారి వెంట ఉన్న మన బిసి, ఎస్సి, ఎస్టి మేధావులు కూడా నిజమే చెడ్డ రోజులొచ్చినయి
అంటారు. అట్టన్నంక బీరుకు బిర్యానికి కొదువలేదు. సూర్య - డిసెబర్ 2007
20 రెండు రాష్ట్రాలు : ఒకే నినాదం
ఆంధ్ర, తెలంగాణ ప్రజలు 50 సంవత్సరాలకు పైగా ఒక రాష్ట్రంగా, ప్రధానంగా భాషా ప్రాతిపదికన కలిసి జీవించారు. కోస్తా ఉత్తరాంద్ర, రాయలసీమ, మద్రాసు రాష్టం నుండి విడిపోయాక ఆ మూడు ప్రాంతాలు ఉమ్మడి ఆం(ధ్రరాషష్ట్రంగా బ్రాహ్మణ పరిపాలనలోకి జారుకొని 1956 వరకు కొనసాగాయి. పట్టాభి సీతారామయ్య, టంగుటూరి (ప్రకాశం పంతులు (ప్రాబల్యం నుండి రాష్ట్రం క్రమంగా బెజవాడ గోపాలరెడ్డి ఆ తర్వాత రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి వంటి రెడ్డ ఆధిక్యతలోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి బ్రహ్మానందరెడ్డి, కొద్ది రోజులు మాత్రమే రాయలసీమకు చెందిన దామోదరం సంజీవయ్య, మళ్ళీ పి.వి. నరసింహారావు, వెంగళరావు, వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రం కూడా రెడ్డ చేతుల్లోనే ఉంది.
తెలంగాణ కూడా నిజాం చేతి నుండి బయటపడ్డాక బూర్లుల రామకృష్ణారావుతో మొదలై అవకాశం వచ్చినప్పుడల్లా బ్రాహ్మణ, రెడ్డి, వెలమల అధికార పంపిణీలో నడిచింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ మూడు (ప్రాంతాల్లో బ్రాహ్మణ, రెడ్డి, కమ్మల నాయకత్వాన్ని ముందుకు తెస్తే తెలంగాణ ప్రాంతంలో (బ్రాహ్మణ, రెడ్డి వెలమ నాయకత్వం ముందుకొచ్చింది. గత 50 సంవత్సరాలకు పైబడి నడిచిన ఉమ గైడ్ రాష్ట్రం తెలంగాణ అభివృద్దికి అడ్డంకిగా మారితే ఆ మూడు [ప్రాంతాల్లో వ్యత్యాసాల అభివృద్దితో పాటు బలహీన వర్గాలను పూర్తిగా తొక్కివేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి రాష్టం ఉనికికి తెలంగాణ వాసులంతా వ్యతిరేకమయ్యారు. ఆం(ధ్ర, రాయలసీమ (ప్రాంతాల్లో ఆ(గ్రకుల దోపిడీదారులంతా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారు పెద్దచెరువులో పెద్ద చేపల్లా చిన్న చేపలన్నింటిని తిన్నారు. ఈ రెండు (ప్రాంతాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అధికారం ముఖంచూడకుండా దూరముంచారు. విశాలాంధ్రలో (బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి రాజ్యం ఇంతకాలం నడిచింది, విశాలాంధ్రలో (ప్రజారాజ్యం ఎప్పుడూ లేదు.
“7ల్మే
రెండు రాష్ట్రాలు : ఒకే నినాదం 75
ఆంధ్ర (ప్రాంత పాలకులు తెలంగాణ (ప్రాంతాన్ని తమ ఆస్తిగా మార్చుకుని హైదరాబాదులో అడ్డాపెట్టి దోపిడీ చేశారు. ఆ ప్రక్రియకు ఆంధ్ర (ప్రాంత బలహీనవర్లాల (ప్రజలంతా బాధ్యత వహించవలసిన అవసరం లేదు. విశాలాంధ్రలో ఈ బడుగు జీవితాలు ఏ ప్రాంతంలో చూసినా బాగుపడలేదు. అదే సందర్భంలో పెద్ద రాష్టంలో పెద్ద చేపలు చిన్న చేపలను ఎదగనిచ్చే పరిస్థితి భవిష్యత్తులో కూడా లేదు. ఈ రాష్ట్రంలోని బడుగుల ముందున్న కర్తవ్యమల్లా రెండు రాష్ట్రాలు; ఒకే నినాదంతో పని చేయడం. అంటే ఇరువైపుల బడుగులు ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాటం చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలిపోవడం సామాజిక మార్పుకు అనుకూలించే అంశం అనేది వాళ్ళు గమనించాలి. రెండు రాష్ట్రాల్లో బలహీనవర్గాల సాధికారత, అభివృద్ది కీలకమైంది. అభివృద్ది బలహీనవర్గాల ఎంపవర్మెంట్తో ముడిపడి ఉంది. గనుక బలహీనవర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం, ఆధిక్యత ఏకకాలంలో దొరకాలి, అందుకు రెండు రా(మ్రైాల పోరాటాన్ని అటు కోస్తా, రాయలసీమ, ఉత్తరాం[ధ్ర నుండి బలహీనవర్గాల నాయకత్వం, (ప్రజలు మూకుమ్మడిగా చేయాలి. అదే సందర్భంలో తెలంగాణ పోరాటాన్ని బలహీనవర్ల నాయకత్వం కిందికి తెచ్చుకోవాలి.
తెలంగాణ ఉద్యమం ఒక పరిపక్ష దశకు వచ్చింది. కనుక ఈ దళలో సూత్రబద్దత, చిత్తపద్ధి, సామర్ధ్యత గల బహుజన నాయకత్వం, మేధావివర్గం, బలమైన రాజకీయశక్తి అవసరం. అది తెలంగాణలో పుట్టింది, పెరుగుతున్నది. కాని ఆంధ్ర ప్రాంతంలో అటువంటి నాయకత్వాన్ని పుట్టనియ్యకుండా ఆంధ్ర అగ్రకుల నాయకులు జా(గ్రత్తలు తీసుకున్నారు. అక్కడి కమ్మ, రెడ్డు ఆ పని కలసి చేశారు. కాపులు తమ అవసరాల రీతా $ వారితో చేతులు కలిపారు. ఇప్పుడు (ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పోరాటం అక్కడి బలవానవర్గాల నాయకత్వంలో జరగాల్సి ఉంది. అది 1971-72 నాటి ఆంధ్రోద్యమానికి భిన్నంగా జరగాలి. అది ఎన్నికలు, ఎన్నికలేతర రంగాలలో కూడా జరగాలి. అక్కడ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బలహీనవర్గాల నాయకులు, తెలంగాణ నాయకుల్లా ఒక కంఠంతో మాట్లాడితే మంచిది. అది సాధ్యం కాదు. ఆ నాయకులు పూర్తిగా అగ్రకుల చేతిలో కీలుబొమ్మలు అయ్యారనుకుంటే ప్రజా బాహుళ్యం నుండి, రెండో శ్రేణి నాయకుల నుండి ఒక కొత్త నాయకత్వం పుట్టుకు రావాలి. బలహీనవర్లాల్లో నాయకత్వం సృష్టించడానికి, ఉన్న దాన్ని స్వతంత్రంగా దాని కాళ్ళమీద దానిని నిలబెట్టడానికి మీడియాలో కూడా ఒక వర్గం ఇవ్వాళ తోడ్పడానికి సిద్దంగా ఉంది. అయితే ఆంధ్ర, రాయలసీమ, బహుజన శక్తులు విభజన పోరాటంలోనే ఎదుగుతాయి.
(ప్రత్యేక తెలంగాణకు పార్గవెంటులోగానీ, అసెంబ్లీలోగానీ అనుకూల ఓటువెయ్యడానికి (కాంగ్రైన్ బిల్లు ప్రవేశపెట్టినా) ఆంధ్ర, రాయలసీమ సభ్యులు
76 తెలంగాణ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తారని తెలిసిందే. కాం(గైన్పార్టీ విప్ జారిచేసినా వాళ్ళు ధిక్కరించడానికి సిద్దంగా ఉన్నారు. ఈ స్థితిలో రెండు రాష్ట్రాల ప్రజాస్వామ్య పంపిణీ నినాదంపై బడుగువర్గం నాయకులు ఈసారి ఎన్నికల రంగంలోకి దిగే శక్తులుగా సిద్ధం కావాలి. ఆంధ్రప్రాంతంలో అ(గ్రకుల, ప్రాబల్య ధనిక శక్తులు అటువంటి నిర్మాణాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం (ఒకవేళ చిరంజీవి) నిర్మాణాల నుండి వ్యతిరేకించినా బహుజన నాయకత్వశక్తులు అక్కడ కూడా తమ ఓటు బ్యాంకును ఏర్పరచుకునే స్థితికి రావాలి. అందుకు, సిద్దాంత రీత్యా రెండు రాష్ట్రాలు; బలహీన వర్గాల సాధికారత అనే నినాదం కీలకం. అంటే రెండు రాష్ట్రాల్లో సాధికారికత పునాదిగా ఉద్యమం జరగాలి. తెలంగాణవాళ్ళు తమ ప్రాంతం అభివృద్ది సమస్య ప్రధానంగా చేసినా దానిని ఛేదించి బడుగువర్గాల రాజకీయ అధికార ఆకాంక్షను ఇందులో భాగంగా నెరవేర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటువంటి నిర్మాణాల్లో అగ్రకులాల వారు అసలు ఉండద్దనేది కాదు. ముఖ్యమంత్రి పదవులు రెండు రాష్ట్రాల్లో బడుగువర్గాల చేతిలోకి మారడానికి కావలసిన అంగీకారం మౌలికం. ఒక్క తెలంగాణ కోసం, తెలంగాణ అని అన్ని వర్గాల నాయకత్వం పోరాడినా రెండు రాష్ట్రాల ఏర్పాటు అనివార్యమవుతుంది. కాని తెలంగాణ “ప్రజా తెలంగాణ అంటే బహుజన నాయకత్వం ఉండే తెలంగాణ కాదు. మరో మాటలో చెప్పాలంటే బహుజన ముఖ్యమంత్రిత్వ తెలంగాణ తెచ్చుకునే ప్రయత్నాలు తీవ్రంగా జరగాల్సి ఉంది. ఆ వైపు ఆలోచించని ఆంధ్రరాష్ట్రంలో అగ్రకుల అధికారం, ఆధిపత్యం ఆ రాష్టం ఏర్పడ్డాక కూడా కొనసాగుతుంది. అప్పుడు ఆంధ్ర ప్రాంతపు బహుజన నాయకత్తం ఎదగడానిక్సీ అక్కడ అగ్రకుల శక్తులను కూలదాయ్యడానికి ఆ తర్వాత కూడా చాలాకాలం పడుతుంది. తెలంగాణ ప్రాంతంలోని అగ్రకుల నాయకత్వం గత పదేండ్ల చర్చల్లో మానసికంగా ఆ మార్పుకు అనివార్యంగానైనా సిద్ధపడ్డది. కాని ఆం(ధ్ర(ప్రాంతపు అగ్రకుల నాయకత్వం అటువంటి మార్పు (ప్రశ్నను ఇంతవరకు ఎదుర్కొనే లేదు. ఆ ప్రళ్ళవేసి చిన్నవో, పెద్దవో ఉద్యమాలు నడిపే నాయకత్వం అక్కడి బడుగువర్గాల నుండి ఎదుగనే లేదు. రాష్ట్ర విభజన అనివార్యమవుతుందని ఆంధ్ర, రాయలసీమ (ప్రాంతపు అన్ని దశల నాయకత్వం గమనిస్తూనే ఉన్నది. ఈ దశలో వారి ముందున్న కర్తవ్యమల్లా ఈ అనివార్య విభజనకు ఒక కొత్త కోణాన్ని జోడించి రాష్ట్ర విభజనతో పాటు సామాజిక మార్పు కూడా అందిపుచ్చుకోవడం అవసరం ఉంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతపు అగ్రకుల శక్తులు విబజన సంధికాలంలో, ఒక మౌలిక కైసిస్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ల ఆస్తులన్నింటినీ హైదరాబాద్ చుట్టూ పెంచుకున్నారు.
రెండు రాష్ట్రాలు : ఒకే నినాదం 77 అక్కడి బడుగు వర్గ నాయకత్వానికి ఈ క్రైసిస్ లేదు. వారికున్న కొద్దిపాటి ఆస్తులు వారి వారి (గ్రామాల్లో గాని, అక్కడి పట్టణాల్లో గాని ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఏర్పడగానే వారి (అక్కడి) ఆస్తులకు దరలు, విలువ పెరిగి బాగుపడే స్థితి వస్తుంది, కాని అగ్రకుల నాయకులు హైదరాబాద్ ఆస్తుల వల్ల నష్టపోకుండా ఇంకా చాలాకాలం రాష్టం విడిపోకుండా చూస్తారు. ఒకవేళ విడిపోయినా హైదరాబాద్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరచుకునే కైసిస్లోనే ఉంటారు. ఈ స్థితిలో ఆ ప్రాంతపు బడుగు వర్లనాయకత్వం చాలా త్వరగా ఎదిగి ఉద్యమం నడపొచ్చు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోగానే ఆ (ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం, హైదరాబాదులో ధరలు తగ్గడం జరుగుతూనే ఉంది. అది ఆంధ్రప్రాంతపు అగ్రకుల సైకలాజికల్ కైసిస్కు అద్దం పడుతున్నది. కనుక ఆ ప్రాంతంలో కొత్త బహుజన నాయకత్తం ఎదగడానికి ఇదొక అదను.
ఈ స్థితిలో ప్రో - తెలంగాణవాదులు, ప్రో - ఆం(ధ్రవాదులు ఎదిగి, ఉన్న సింగిల్ నాయకత్వం కిందగాని లేదా విడి విడి నాయకత్వం కిందగాని పని చెయ్యవచ్చు. కాని రెండు రాష్ట్రాల ఉద్యమం మధ్య ఒక సయోధ్య, ఇచ్చిపుచ్చుకునే బహుజన మిత్రత్వం సాధ్యమవుతుంది. ఇది రాష్ట్రాల మధ్య పంపకం మరింత (ప్రజాస్వామ్య వాతావరణంలో జరగడానికి తోడ్పడుతుంది. ఈ రెండు ఉద్యమ శక్తులు హైదరాబాద్ సమస్యను కూడా అంగీకారయోగ్యంగా అది తెంగాణదే అని తేల్చవచ్చు. ఆంధ్ర (ప్రాంతపు బహుజన నాయకత్వం తమ రాష్ట్ర రాజధాని ప్రతిపాదన కూడా తెగేసి చెయ్యవచ్చు. అప్పుడే పెరిగే ధరలతో, మారే పెట్టబడులతో ఆ (ప్రాంతపు బహుజనులు కూడా లాభపడతారు. అక్కడ జరిగే బహుజన ఆంధ్ర ఉద్యమానికి కొంతమంది అగ్రకులాల వారు కూడా కలిసి వస్తారు. "హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం వల్ల ఆంధ్ర, రాయలసీమ (ప్రాంతపు బహుజనుల కొరిగేదీమీ లేదు. నిజానికి వారి ఆస్తుల పెరుగుదలకు అది అడ్డువస్తుంది.
రెండు రా(ష్ట్రాలు: ఒకే నినాదం, పాత పంచాయితీకి కొత్త పరిష్కారాన్ని కనుక్కుంటుంది. సామాజికంగా వందల ఏండ్లు అణచివేతకు గురైన శక్తులు తమ అభివృద్ది, సాధికారిత చూసుకోవాలి గాని, అగ్రకుల దోపిడీ శక్తులు ఉసికాల్చే సెంటిమెంట్‌కు తల తాకట్టు పెట్టరాదు. ఏ సమస్యకైనా సామాజిక న్యాయం దృష్టితో పరిష్కారం వెతకాలి. భూమి పుండులా తయారైన సమైక్యాంధ్రప్రదేశ్‌కు మంచి పరిష్కారం “సామాజిక న్యాయంతో రెండు రా[ష్ట్రాలు' అనే నినాదంలో దొరుకుతుంది. అందరూ అందుకై నడుం కట్టండి.
సూర్య - 22 జూన్, 2008
21
భాషా ప్రయుక్త రాష్ట్రాలు బతుకుతాయా?
స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాలు పునరేకీకరణ ఎలా జరగాలనే చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. (బ్రిటీష్ వలసవాద కాలంలో అడ్మిని(స్ర్రేటివ్ (ప్రావిన్సెస్ భాషా ప్రాతిపదికన లేవు. అవి ప్రధానంగా సైనిక మొబిలిటీపై ఆధారపడి బొంబాయి, మద్రాస్, కలకత్తా ప్రావిన్సెస్‌గా ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా పరిపాలన మొదలయ్యాక కూడా పరిపాలనా (ప్రాంతాలను భాషను దృష్టిలో పెట్టుకొని విభజించలేదు. మొదటి ఎస్ఆర్సీ వేయగానే బాషా (ప్రాతిపదిక రా[ష్ట్రాలను విభజించాలని ఉద్యమాలు వెొందలయ్యాయి. అంతకుముందు కూడా భాషా పునాదిగా రా(ష్ణ్రాల విభజన జరగాలనే వారి సంఖ్య దేశంలో బలంగా పెరుక్కుంటూ వచ్చింది. ఆనాటికి ఇండియన్ ఫెడరల్ వ్యవస్త స్వభావ స్వరూపాలు కూడా స్పష్టంగా రూపుదిద్దుకోలేదు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఎలా ఉంటుంది, రాజ్యాంగంలో జరిగిన విభజన ఆచరణలో ఎలా ఉంటుంది అనే అంశాలపై స్పష్టత లేదు. అసలు కేంద్రప్రభుత్వం ఏ భాష పునాదిపైన అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని నడుపుతుంది. రాష్ట్రాలు ఎలా నడపాలి అనే అంశంపై అసలే అంచనా లేదు.
గత 60 సంవత్సరాల స్వాతంత్ర్య అనుభవంలో మన ఫెడరలిజం రూపురేఖలు స్పష్టంగా ఏర్పాడ్డాయి. మన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించినప్పటికీ హిందీ దేశంలో ఉన్నత విద్యారంగపు భాషగా అభివృద్ధి చెందలేదు. కేంద్రప్రభుత్వం అన్ని రంగాల్లో ఇంగ్లీషును అటు ఉన్నత విద్యారంగపు భాషగాను, ఇటు అడ్మినిస్ట్రేటివ్ భాషగాను అభివృద్ధి చేస్తూ వచ్చింది. పార్లమెంటు చర్చల దగ్గరి నుండి, అడ్మినిర్రేటివ్ వ్యవహారాలన్నీ ఇంగ్రీషులో నడుస్తూ వచ్చాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్రం ఆధీనంలో నడిచే మెడికల్ ఇనిస్టిట్యూట్స్, యూనివర్సిటీలు, రాష్ట్రప్రభుత్వాలు నడిపే అన్ని యూనివర్సిటీలు ఇంగ్లీషులోనే నడువనారంభించాయి. దక్షిణ భారతదేశంలో పాలకవర్గం ఇంగ్రీషువైపునకు మొగ్గు చూపింది. తమిళనాడు వంటి రాష్టం హిందీ భాషను పూర్తిగా ధిక్కరించింది. అది ఇంగ్లీష్ తమిళం అనే ద్విభాష (ప్రాతిపదికను ఎన్నుకుంది.
76
భాషా ప్రయుక్త రాష్ట్రాలు బతుకుతాయా? 70
గత 60 సంవత్సరాల అనుభవంలో తేలిందేమిటి? ముందుగా విద్యారంగంలోకి చొరబడ్డ పాలక/కులవర్లాలు ఇంగ్రీషును తమ భాషగా ఎన్నుకొని ఇంగ్రీషు భాషలో నడుస్తున్న అన్ని విద్యాసంస్థల్ని - కేంద్ర, రాష్ట్రాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కేంద్రప్రభుత్వ సంస్థలు (ప్రధానంగా ఇంగ్షీషు భాషలో నడుస్తున్నాయి. ఆ భాషలో ప్రావీణ్యత సంపాదించుకోలేని కులవర్గాలను ఆ సంస్థల బయట ఉంచారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న వారి చేతుల్లోనే రాజ్యం, వ్యాపారం, ఇండస్ట్రీ విద్యావ్యవస్థలు ఉన్నాయి. ప్రాంతీయ భాషల్లో బతుకుతున్న (ప్రజలు రెండవ గ్రేడ్ సీటిజన్సుగా మారారు. అంటే దేశంలోని మొత్తం జనాభా ఇంగ్రీషులో చదువుకొని, ఇంగ్లీషు భాష పునాదిగా పోటీ పడకపోతే ఇంగ్లీషు రాని వారు ఎంతో వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలను బాగా బలపరిచింది కమ్యూనిస్టు పార్టీలు. ఆనాడు సోవియట్ యూనియన్, చైనా ప్రభావంలో సోషలిస్టు క్యాంపు ఉన్నందున (ప్రపంచభాషగా ఇంగ్లీషు కొనసాగుతుందనే నమ్మకం వారికి లేదు. భారతదేశంలో హిందీ, ఇతర (ప్రాంతీయ భాషలు బాగా అభివృద్ది చెందుతాయని వారు ఆశించి ఉండవచ్చు. కాని (క్రమంగా సోవియట్ యూనియన్ కూలిపోవడం, చైనా అమెరికాతో మి(త్ర సంబంధాల్లో కొనసాగడం, ఐటి ఇండస్ట్రీ అమెరికా పునాదిగా అభివృద్ది చెందడంతో కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఇంగ్లీషు భాష బలంగా పునాదులు వేసుకోవలసిన పరిస్టితి వచ్చింది. కేంద్ర నాయకత్వం, రాష్ట్రాల్లో ఉన్నత నాయకత్వం ఇంగ్రీషు భాషపై పట్టు సంపాదించిన వారికే దొారకడం మొదలైంది. ఇప్పుడు ఇంగ్లీషు సంపూర్ణ దేశ భాషగా మారకుండా జనాభా ఉండలేని స్థితికి వచ్చింది.
ఇంగ్లీషు అందరి భాష అయ్యే దశ వచ్చాక రాష్ట్రాలు భాషా ప్రాతిపదికపైన బతకడం సాధ్యం కాదు. ప్రతి పౌరుడు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్, అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్మెంట్ వ్యవస్థల్లో బతకాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలుగాని, లేదా భాషా రా(ష్ట్రాల అభిమానులు కాని భాషా రాష్ట్రాలు ఉండాల్సిందే అని ఎలా వాదిస్తారు? తెలుగు మాట్టాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎవరైతే వాదిస్తున్నారో వారి పిల్లలే పూర్తిగా ఇంగ్రీషు భాషలో బతుకుతున్నప్పుడు తెలుగుభాష ఒక ప్రయోజన భాషగా ఎలా ఉంటుంది? ఇంగ్లీషు ఒక కామన్ దేశ భాషగా ఎదుగుతున్నప్పుడు రాష్ట్రాలు అమెరికా లాగా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లుగా మాత్రమే ఉంటాయి. ఈ దశలో సిపిఐ(ఎం) లాంటి పార్టీగాని, తెలుగుదేశం గాని భాష (ప్రయుక్త రాష్ట్రం సిద్దాంతంపై ఆధారపడి తెలంగాణను వ్యతిరేకించడం తప్పు. అసలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. సంస్కృతం పదజాలాన్ని తెలుగీకరించుకొని బతుకుతున్న ఆంధ్రప్రాంతానికి, ఉర్జూ భాషతో మిళితమై బతుకుతున్న తెలంగాణ ప్రాంతానికి ప్రజల భాషలో ఆనాడే
80 తెలంగాణ ఎంతో తేడా ఉంది. ఆనాటి కలయికే అసమాన కలయిక. ఇక ఈనాడు అసలు తెలుగు ప్రాధాన్యత అంతమొందిపోతుంటే ఇంకా ఈ రాష్ట్రం భాషా (ప్రయుక్త రాష్ట్రంగా ఉండాలనడం వెనుకబాటు దృక్పథమే. తెలంగాణ (ప్రత్యేక రాష్ట్రం సమస్యను ఇంత సుదీర్హపోరాట సమస్యగా ఉంచడం అన్నిరకాల అభివృద్దికి ఆటంకమే. భాషాప్రయుక్త రాష్ట్రాల ఉనికి పూర్తిగా దెబ్బతిన్న దశలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్టం కావాలనే అంశంపై ఇంత రగడ అవసరం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైనా హైదరాబాద్‌లో తమ ఉనికి, ఆస్తులు ఎలా అనే సమస్యే చాలామందిలో బలంగా ఉన్నది. హైదరాబాద్ కేంద్రపాలిత (ప్రాంతం కావాలనుకోవడం వల్ల కూడా తెలంగాణ (గ్రామీణ ప్రాంతాలకు ఎనలేని నష్టం జరుగుతుంది. ఈ అన్ని కారణాలవల్ల తెలంగాణ ప్రత్యేక రాష్టం సమస్యను కేంద్రం తాందరగా పరిష్కరిస్తేనే మంచిది. సిపిఐ(ఎం) కూడా అందుకు అనుకూల వైఖరి తీసుకుంటేనే గౌరవప్రదం. సూర్య - 23 మార్చి, 2008
22
రెండన ఎస్సార్సీ : 'భాషారామ్రై'ల పునస్పమీక్షకే
రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్ట్రీకరణ సంఘాన్ని (ఎన్ఆర్సీ-2) ఏర్పాటు చేయాలన్న కాం(గైస్ ఆలోచన రెండు ముఖ్యకారణాల రీత్యా స్వాగతించదగినది. అది కేవలం తెలంగాణకో, విదర్భకో చెందిన విషయం కాదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భావననే పునఃపరిశీలించడం అవసరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో జాతీయభాష అనేది ఎలా రూపుమార్చుకొంటుందో ఎవరికీ తగిన అంచనా లేదు. హిందీ (క్రమంగా ఒక అనుసంధాన భాషగా అవతరిస్తుందనీ, ఇతర ప్రాంతీయ భాషలు కూడా పరిపాలనా, మార్కెట్ భాషలుగా బాగా అభివృద్ది చెందుతాయని జాతీయనాయకులలో ఒక పెద్ద వర్గం భావించింది. కానీ ఆ రెండు ఊహలూ నెరవేరలేదు. అంతర్జాతీయంగా పోటీపడగల భారతదేశపు జాతీయభాషగా పరిణమించడంలో పొందీ వివలమైైంది. నేటి (ప్రపంచీకరణయుగంలో హిందీ దేశ ప్రయోజనాలను నెరవేర్చలేదు. ఒక సామాన్యునికి అది సాధికారత కూడా కల్పించలేదు.
దేశంలోని పాలకవర్గాలు ఈ సమస్యను అర్హంచేసుకొన్నాయి. కనుకనే ఇంగ్లీష్‌ను కేంద్ర పరిపాలనకు తగిన మౌలికభాషగా, పాలకవర్గ భాషగా స్వీకరించాయి. (ప్రాంతీయ భాషలు కూడా అసమర్థమైనవని బ్రిటీష్ వలస పాలనా నేపథ్యం అనే చారిత్రక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొన్నాయి. ఇంగ్లీష్ మాత్రమే యావద్దేశానికి చెందిన పరిపాలనా, మార్కెట్భాషగా మారనున్నదన్న అవగాహనతో సంపన్న శిష్టవర్గాలు తమ పిల్లలను ఇంగ్లీషు విద్య (అది నాణ్యమైనదా, నాసిరకమా అన్నదానితో సంబంధం లేకుండా) వైపు నడిపించాయి. గోసంపద వర్డిల్లే హిందీ భూముల్లోనూ, బ(రైల మీద ఎక్కువగా ఆధారపడే దక్షిణ భారతంలోనూ కూడా సంపన్న వర్గాలు ఇంగ్రీష్నే పాలకవర్గ భాషగా భావించాయి. ఇటీవల ఏర్పడిన కొన్ని గిరిజన రాష్ట్రాల నుంచి పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తమిళనాడు వరకు అంతటా ఇంగ్లీష్ మాట్లాడే ఒక వర్గం అవతరించింది. అంతర్గతంగా నిర్మితమయ్యే ఒక పాలకవర్గ అవగాహనతో, దేశంలో
81
82 తెలంగాణ నిజమైన “అధికారి భాష కాబోతున్నది. ఇంగ్లీష్ తప్ప హిందీ కాదని ఈ వర్గం (గ్రహించింది. ఈ వర్గం అదృష్టం కొద్దీ, ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, యూరోపియన్, ఆ(స్ట్రేలియా దేశాలే (ప్రపంచ వ్యవహారాలలో పెత్తనం చెలాయిస్తూ ఉండటంతో భవిష్యత్తులో హిందీ కేవలం ఒక (ప్రాంతీయ భాషగానే మిగిలిపోయే పరిస్టితి పొడగట్టింది. పునాదే కదిలిపోతుంది ఢిల్లీ, కోల్కత్తా ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోని పాలకవర్గాల తరహాలోనే దక్షిణాది అంతటా పాలకవర్గాలు నిజమైన జాతీయభాష ఇంగ్రీషేనన్న సంగతిని గుర్తించాయి. ఈ వాస్తవికత భాషాప్రయుక్త రాష్ట్రాల (ప్రాతిపదికనే మార్చి వేసింది. అన్ని రాష్ట్రాలలోని సామాన్య (ప్రజానీకం పాలకవర్గాల అడుగుజాడల్లోనే నడుస్తూ రానున్న కొన్ని దశాబ్దాల కాలంలో ఇంగ్లీషులో అవసరమైన మేరకు (ప్రావీణ్యం గడించే స్టితిని ఒకసారి ఊహించుకోవడం అవసరం. అప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రాల పునాదే కదిలిపోతుంది. జనసామాన్యం ప్రయోజనాల రీత్యా జరగవలసింది అదే. దేశంలోని యావత్రజానీకం ఇంగ్లీష్‌లో మాట్లాడే నేర్పును సంపాదించుకోనిదే దేశం ముందుకు వెళ్ళే అవకాశం లేనేలేదు. ఏర్పాటులోనే తప్పుడు అంచనా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటే తప్పుడు అంచనాలతో జరిగింది. 'ప్రాంతీయభాషలు అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి ఎదుగుతాయని ఊహించడం కానీ, తమదైన జాతీయలక్ష్యాలను సృష్టించకుండా భాషాప్రయుక్త రాష్ట్రాల అభివృద్ది, 'ప్రాంతీయభాషల అభివృద్ధిపై ఆధారపడి జరిగిపోతుందని భావించడం కానీ రెండూ పొరపాటే. బాగా అభివృద్ధి చెందిన భాషాప్రయుక్త రాష్ష్రాలైన తమిళనాడు, పశ్చిమబెంగాల్లకీ, కేంద్రానికీ మధ్య పెద్దఎత్తున వైరుధ్యాలు అభివృద్ధి చెందడం చూశాం. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో పాలకవర్గం మాత్రం ఆంగ్లీకరణ చెందింది. భాషాప్రయుక్త రాష్ర్రాలన్న మౌలిక భావనక్తీ అత్యంత పురోగమన స్వభావాన్ని సంతరించుకొన్న ఆంగ్రీకృత సాంఘికశక్తిగా అభివృద్ది చెందిన విశాల భారత పాలక వర్షానికి ఆ రాష్ట్రాలు విదేయంగా ఉండడానికీ మధ్య వైరుధ్యం తలెత్తింది, ఇదంతా కలసి దేశంలో భాషాపరమైన ఒక వలసవాదాన్ని సృష్టించింది. రాష్ట్రాలను చిన్న చిన్న పరిపాలనా విభాగాలుగా విడగొట్టి, వాటిలో ఇంగ్లీష్‌కూ, (ప్రాంతీయభాపకూ కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ పునర్వ్యవస్ట్రీకరించడం ద్వారా మాత్రమే దీనిని విచ్చిన్నం చేయగలం,
రెండవ ఎస్సార్సీ వ “భాషారా[ష్టైల పునస్పమీక్షకే 83 ఇలా చేయడం వల్ల దేశవ్యాప్తంగా (గ్రామస్తాయి నుంచీ ఇంగ్రీష్ మాట్లాడే మేధావిశక్తులు అవతరించి (ప్రాంతీయ, సెడరల్ రాజకీయాలలో, పరిపాలనలో తమ స్టానాన్ని చేజిక్కించుకోగలుగుతాయి. అదే సమయంలో (ప్రాంతీయధోరణులను అధిగమించి తమ జాతీయ నిబద్ధతను ఇవి చాటుకోగలుగుతాయి. జనసామాన్య జాతీయభాషగా ఇంగ్లీష్
వివిధ రాష్ట్రాలలో ఉన్న మహానగరాల్లోనే కానీ, గ్రామాలు, పట్టణాల్లోనే కానీ అక్కడి స్థానికభాషల్లో, లేదా హిందీలో సంపాదించుకొనే జ్ఞానం దేశ 'ప్రజాజీవనంలో ఎటువంటి మానవవనరుల అభివృద్దికర పాత్రనూ నిర్వహించబోవడం లేదు. ఇంగ్లీష్ మాట్లాడే స్వార్థపరులతో నిండిన ఒక పరిమితవర్గం గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి. ఇంగ్లీష్‌ను జనసామాన్య జాతీయభాషగా మార్చినప్పుడే అది సాధ్యమవుతుంది.
ఈ నేపథ్యంలో, పరిపాలనా పరంగా కూడా భాషా (ప్రయుక్త రాష్ట్రాల భావన అర్హరహితం. (ప్రతి రాష్ట్రంలోనూ చారిత్రకంగా వెనుకబడి రాజకీయంగా మోసపూరిత వైఖరిని ప్రదర్శించే ఒక చిన్న గుంపు మాతృభాష. జాతీయ భాష (హిందీ) అంటూ భావోద్వేగాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఆలోచన లోపించిన కొందరు, పరిపాలన తెలుగు, కన్నడం, హిందీ వగైరా భాషల్లో జరగాలని అదే పనిగా ఊదరగొడుతూ ఉంటారు. అయితే గ్లోబల్ మార్కెట్ శక్తుల తర్కం ముందు వీళ్ల డిమాండ్లు తుడిచి పెట్టుకుపోతాయి. అందుకే ఇంగ్లీష్ పాత్ర రోజురోజుకీ విస్తరిస్తోంది. దానిని జాతీయభాషగా అధికారికంగా గుర్తించే రోజు కూడా ఒక నాటికి వచ్చి తీరుతుంది.
తెలంగాణ నాంది
రాష్ట్రాల పునర్వ్యవస్ట్రీకరణకు ఇతర కారణాలు ఆధారం కావాలి కానీ, భాష కాకూడదు. ఉదాహరణకు ఇప్పటి తెలంగాణ డిమాండ్‌కే వస్తే అది ఈ విసృత భూమిక మీద ఆధారపడి నిర్మించిన డిమాండ్ కాదు. తెలంగాణ ఇప్పుడో, లేక కొంతకాలం తర్వాతో (ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందా లేదా అన్నది కాదు ప్రళ్ళ. ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలనాపరంగా రెండు, లేదా మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించడం అవసరం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయడంలో అన్ని విధాలుగా విఫలమైంది. ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేని అన్ని భారీ భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు తెలంగాణ నాంది కావాలి. ఇంగ్లీష్ పాలక భాషగా, రాజ్యభాషగా స్థిరపడనున్న స్టితిలో దేశంలో అక్షరాస్య సమాజం అంతా రెండు భాషలు మాట్లాడేది అవుతుంది. ఒకటి ఇంగ్లీష్ రెండోది ప్రాంతీయ భాష
84 తెలంగాణ ఇటువంటి (ప్రక్రియ జాతీయస్ట్రాయిలో సాంఘికళక్తుల వైజ్ఞానిక (ప్రాతిపదికనే మార్చివేస్తుంది. (ప్రతి రాష్టమూ అందులో భాగం అవుతుంది. ఉత్పాదక కులాలు ఇంగ్లీషు విద్యలోకి రాకపోతే తెలంగాణతో సహా అనేక (ప్రాంతాలలో గల ఈ ఉత్సాదక కులాల శాస్త్ర విజ్ఞానపు వేళ్ళు ఆ రాష్ట్రానికిగానీ దేశానికి గానీ ఒక గొప్ప ఆస్తిగా మారలేవు. తెలంగాణ తెలుగుతో ఇంగ్రీష్కు సమానస్ట్రాయి కల్పిస్తే తప్ప తెలంగాణ కోసం పోరాడుతున్న నేటి నాయకులు గానీ, 'విద్యావంతులు'గా చెబుతున్నవారు కానీ సమాజపు అడ్డుగోడలను కూల్చలేరు. ఒక చిన్న వాస్తవం ఏమిటంటే, రాజకీయనాయకులు, మేధావి నాయకులు తమ పిల్లలను తెలంగాణలోని తెలుగు మీడియం స్కూళ్ళకు పంపడం లేదు. వాళ్ళీ పిల్లలు హైదరాబాదులోని (ప్రపంచీకరణ చెందిన ఇంగ్లీష్ మీడియం అంతర్జాతీయ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. తెలంగాణలోని పేద యువజనం ఇంగ్లీష్ నేర్చుకోకపోతే మరి కొన్ని దశాబ్దాల పాటు అమెరికాలో చదువుకున్న ప్యూడల్వర్గాల పాలన కింద అణగారిపోవలసి వస్తుంది. హైదరాబాదులోని అంతర్జాతీయ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివించి తమ పిల్లలను ఉన్నతవిద్య కోసం అమెరికాకు ఎగుమతి చేస్తున్న తెలంగాణ రాజకీయ, మేధావివర్గాల నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని, ఢిల్లీని ఏలడానికి తిరిగి వాళ్ళనే దిగుమతి చేసుకొంటారు. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడంతో పాటు తెలంగాణలోని జనసామాన్యాన్ని ద్విభాషా జనంగా (ఇంగ్లీష్ తెలంగాణ తెలుగు) మార్చడం ఎంతైనా
అవసరం, సూర్య - 22 జనవరి, 2007
23 పొత్తులు తెలంగాణ సాధనకేనా?
తెలంగాణ రాష్ట్ర సాధన చాలా కొత్త మలుపులు తిరుగుతున్నది. టిఆర్ఎస్ పదవులకు రాజీనామాలు, తిరిగి ఎన్నికలు జరిగాక తెలంగాణ ఉద్యమంలో కొంత డిప్రెషన్, కొంత గందరగోళం ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్ తెలంగాణ సమస్యపై ఒక సంక్షోభాన్ని సృష్టించాడు. (ప్రత్యేక రానికి అనుకూలంగా వైఖరి తీసుకోవలసిందేనని ఒత్తిడిేచేయడంతో ఆయన బయటికిపోయినా ఫర్వాలేదు గాని అనుకూల వైఖరి తీసుకునే అవకాశం లేదని చంద్రబాబు భీష్మించాడు. ఆ పార్టీ తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంటే ఆ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రానికి నాయకుడు అయ్యే రాజకీయ స్థాయి ఉన్న దేవేందర్గాడ్ ఆ పార్టీని విడిచి ప్రత్యేక రాష్ట్ర నినాదంపైనే నవ తెలంగాణ ప్రజాపార్టిని స్థాపించాడు. ఆయన బయటికి వచ్చి కొత్త పార్టీని పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 'పోరాటం-ఎన్నికలను' జోడెద్దుల బండిలా నడపాలని పిలుపునిచ్చాడు. అక్టోబర్ 2, నవంబర్ 1,2 తేదీల పోరాట అజెండాను ప్రకటించాడు.
ఎన్‌టిపిపి పుట్టేవరకు టిఆర్ఎన్ కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే రామ్ర్రాన్ని సాధించాలని, అది కాస్తా బెడిసికొట్టి, అధ్యక్షుని అలుక రాజీనామా, బతిమిలాటపై మళ్ళీ పీఠమెక్కే (ప్రక్రియలు జరిగాయి. ఒకవైపు దేవేందర్గొడ్ పోరాటం - ఎన్నికల కలగలిపిన సంఘర్షణలోకి యువతను తరలించడానికి యూనివర్సిటీలో సభలు, సమావేశాలు పెట్టి యువతను రంగంలోకి దింపుతుంటే చం(ద్రశేఖరరావు అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడితో మంతనాలు (ప్రారంభించాడు. బాబు “మీ కోసం యా(త్ర' అని ఆంధ్రుల కోసం ఆ ప్రాంతంలో తిరుగుతుంటే కెసీఆర్ ముందుచొరవ తీసుకోనని ఆయనకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన పొత్తుకు బాట సుగమమైందని, అంతకు ముందు దేవేందర్‌గౌడ్ దానికి అడ్డమైనట్టు “ఆంధ్ర-తెలంగాణ వియ్యంకుల ముచ్చట్లు మొదలయ్యాయి.
85
86 తెలంగాణ
“తెలంగాణ ఇచ్చేది లేదు, ఉంటే ఉండు పోతే పొ అని దేవేందర్గౌడ్నే ఏ ఆంధ్రాబాబు బయటికి పంపాడో, ఎవరైతే ఎన్‌డిఎ అధికార కాలంలో మిగతా చిన్న రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాకుండా చూశాడో ఆయనతో పాటు టిఆర్ఎస్ అధినేత సన్నద్ధం, సర్వం సిద్దం కూడా. ఈ ఇద్దరి పొత్తులో “విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అని 1948 నుంచి తెలంగాణను ఆంధ్ర కవ్వానికి తాడును చేసి చల్ల చేసుకొని తాగిన సిపిఎం నాయకత్వాన్ని కలుపుకోవడానికి రావు సిద్దన్న మాట.
సిపిఐ తెలంగాణపై ఒక వైఖరి తీసుకొని ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్తో పొత్తుకు "సై' అంటుంది. చం(ద్రబాబు, చంద్రశేఖర్‌రావు, రాఘవులు, నారాయణ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 'సంబంధాల సంపర్కం” చేస్తారన్నమాట. ఇక తెలంగాణకు శత్రువులెవరు? అందరికీ తెలిసిన శత్రువు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. చిరంజీవి ఇంకా శత్రువో, మిషత్రుడో తేలలేదు. కాని పై నలుగురి దృష్టిలో తెలంగాణకు నిజమైన శత్రువు దేవేందర్‌గౌడ్ అనుకోవలసి వస్తుంది. ఆయనతో కలవాలనేది అటుంచి, మాట్లాడదామని కూడా వారు అనడం లేదు. దేవేందర్‌గౌడ్ చుట్టూ ఓట్టు ఎన్ని ఉన్నాయి, సీట్లు ఎన్ని ఉన్నాయి అనే లెక్క ఇంకా తేలకపోవచ్చు. కాని ఆయన తెలంగాణ సాధనకోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. కొంత ప్రజాసమీకరణశక్తి ఉంది. ప్రజా తెలంగాణ, నవ తెలంగాణ అనే ఒక కొత్త కోణపు ఉద్యమం ఉంది. దేవేందర్గాడ్ మాత్రమే కాక ఇంకా తెలంగాణ శ్రవులెవరు? బండారు దత్తాత్రేయ అధ్యక్షుడుగా ఉన్న రాష్ట బిజెపినా? లేదా నరేంద్ర చేతిలో ఉన్న మరో టిఆర్ఎస్నా? బిజెపి నేనెన్నడు గౌరవించిన పార్టీ కాదు. కాని దానికి ఈ సమస్య పట్ట ఒక నిర్దిష్టమైన వైఖరి ఉంది. చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు, రాఘవులు, నారాయణ అందరూ తెలంగాణ కోసం పొత్తు కడితే మరి బిజెపితో కూడ ఎందుకొద్దు? చంద్రశేఖర్‌రావు బండారు దత్తాత్రేయతో పొత్తు కోసం చర్చిస్తున్నాడని ఒక్క వార్త కూడా మనం చూడలేదు. పాత్తుకట్టే పార్టీగా ఆయన గుర్తించడం లేదు. దేవేందర్‌గౌడ్‌ను వ్యక్తిగా వచ్చి తన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్మంటున్నాడు.
ఈ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ చిరంజీవి “ప్రజారాజ్యం” పార్టీని సామాజిక న్యాయ వ్యతిరేక పార్టీ అని ప్రకటించింది. వారం రోజులు కాక ముందే మరో ప్రకటనలో “ప్రజారాజ్యం” మంచి (ప్రత్యామ్నాయమే కాని అది మావోయిజం పట్ట, తెలంగాణ పట్ట తన వైఖరి చెప్పాలని అడిగింది. అదే ప్రకటనలో దేవేందర్‌గౌడ్‌ను తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా ఉండగా జరిగిన ఎన్కౌంటర్లన్నింటికీ బాధ్యుడ్ని చేసింది. ఇప్పుడున్న సందర్భంలో తెలంగాణ ఇచ్చే అసలు కూటమి 'చం(ద్రబాబు, చంద్రశేఖర్‌రావు, రాఘవులు, నారాయణ అని వాళ్ళు కూడా భావిస్తున్నారా? అలాకాకపోతే ఈ పాత్తుపైన వారి మౌనం ఏం చూపిస్తుంది? ఈ మొత్తం (ప్రక్రియ మనముందు కొక సామాజిక అంశాన్ని తెస్తుంది.
పొత్తులు తెలంగాణ సాధనకేనా? 87 అది ఇక్కడి కులవ్యవస్త్ర చూపిస్తుంది? ఈ మొత్తం ప్రక్రియ మనముందుకొక సామాజిక అంశాన్ని తెస్తుంది. అది ఇక్కడి కులవ్యవస్థ, ఈ రాష్ట్రంలో అగ్రకులాల నాయకులంతా తెలంగాణ పట్ల వైఖరిని ఎందుకు మార్చుకుంటున్నారు? ఇది నిజమైన మార్చేనా? లేదా ఈ కులం, బలం, ధనబలం ఉన్న అందరూ ఒక్కటై ఓట్లు తెచ్చుకుని సీట్లు గెలిచి తెలంగాణ నినాదాన్ని, దేవేందర్‌గౌడ్‌ను పర్మనెంట్‌గా రాజకీయరంగం నుంచి పక్కకు పెట్టే ప్రయత్నమా? దేవేందర్‌గౌడ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడితే తమ కులబలం, ధనబలం ఏమవుతుందోననే భయం చాలామందిలో కనిపిస్తున్నది. ఈ విధమైన 'కులకుట్ర' జరిగే అవకాళమున్న వాతావరణంలో సామాజిక న్యాయం కోసం నిలబడతామనే మావోయిస్టులు కూడా ఎలా ఆలోచించాలి? వాళ్ళు చిన్లు రాష్ట్రాల్లోనే దళిత-బహుజన కులాలు సంక్షేమం ఉంటుందనే సిద్దాంతాన్ని నమ్మితే ఈ దేశంలో మార్క్సిజాన్ని-అంబేద్కరిజాన్ని జోడెద్దులా నడపదల్బుకుంటే బహుజన కులాల నుంచి ఎదిగిన నాయకత్వాన్ని అంచనా కట్టిన పద్దతిలోనే మావోయిస్టులు అంచనా కట్టాలా? లేదా భిన్నంగా అంచనా కట్టాలా? పైన చర్చించిన పొత్తు ఎత్తుగడలన్నీ 'తెలంగాణ నినాదాన్ని - బహుజన నాయకత్వాన్ని అరికట్టే ఆలోచనలు. ఇది చం(ద్రబాబు, చంద్రశీఖర్రావు, మితృత్వపు ప్రయత్నం నుండి స్పష్టం. మావోయిస్టులది కూడా అదే దారా?
చిరంజీవిని సామాజిక న్యాయ పునాది నుంచి అంచనా వేసిన మావోయిస్టులు దేవేందర్‌గౌడ్‌ను కూడా అదే 'గీటురాయితో అంచనా వేయాలా వద్దా? రాష్ట్రంలో ఈనాడున్న మొత్తం శక్తులపై తమ అంచనా చెప్పకుండా ఒక్కొక్క పార్టీపైగాని, వ్యక్తిపైగాని ఒక విష్టవపార్టీ తన అంచనాను ఒక అంశానికి పరిమితమై చెబితే దాని చిత్తశుద్దిపైనే అనుమానాలు ఏర్పడే అవకాశముంది. మార్పును కోరుకునే ఏ రాజకీయ శక్తి అయినా 'తెలంగాణ'కు మళ్ళీ ఉరేసి కుల, రాజకీయ పెండ్లి సంబంధాల సంగతేమిటో చర్చ జరిపితే తెలంగాణలో సామాజిక న్యాయంపై సంతకం పెట్టినట్టు, లేకుంటే అది మావోయిస్టులకు గిట్టని అంశంగానే భావించవలసి వస్తుంది.
సామాజిక న్యాయం విప్లవానికి ప్రత్యామ్యాయం కాదు. కాని ఈ దేశంలో విష్ణవ దిశను, దశను మార్చే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రక్రియలో బలహీన వర్గాల నుంచే వచ్చే బూర్జువా నాయకుడైన దేవేందర్గాడ్ కంటే చాలా భిన్నంగా ఉండి ఎదిగే దశ ఉందా? ఇక్కడే దేవేందర్గాడొపైన చంద్రబాబునాయుడు, కెసిఆర్ ఒక కోణం నుంచి, మావోయిస్టులు మరోకోణం నుంచి శత్రుత్వాన్ని చూపడం సామాజిక న్యాయంతో కూడిన ప్రజాతెలంగాణ తెచ్చుకునే అవకాశముందా?
వార్త - 29 సెప్టెంబర్, 2006
241 = జి ల
హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్టమైతే?
-ఈ మధ్య జి. వెంకటస్వామి ఇంటికి ముఖ్యమంత్రి సంధి విందుకు పోయినప్పుడు తాను తెలంగాణ రాషష్టం ఎందుకు సాధ్యం కాదు అనుకుంటున్నారో చెప్పారు. అందులో భాగంగా (గ్రేటర్ హైదరాబాద్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగానో ఒక ప్రత్యేక రాషష్టంగొనో కావాలనే వాదన ఉంది. ఈ వాదన బలంగా ముస్తింల నుండి వస్తోంది అని చెప్పారు. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన కూడా ఉంది అని కూడా చెప్పారు. కాని రాయలసీమ, కోస్తాంధ్రవాళ్ళు ఏమంటున్నారో చెప్పలేదు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అవ్వాలనే వాదన ఒక కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్ సమస్య ఒక కీలకమైన అంశం అవుతుంది.
ఇప్పుడున్న కాంగ్రెస్ (ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్రేటర్ "హైదరాబాద్‌గా (ప్రకటించడం, రంగారెడ్డి మెదక్, నల్గొండ జిల్దాల్లోని చాలా మండలాలను అందులో కలపడం - తెలంగాణ రాష్ట్రం సమస్యతోపాటు హైదరాబాద్‌ను ముందు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, తరువాత (క్రమంగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దించాలనే పట్టుదలతోనే హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు, వ్యాపారాలు దండిగా ఉన్న కోస్తా రాయలసీమ, ఉత్తరాంధ్రుల ఆలోచనా ఆ వైపుకు బలంగా ఉంది. ఈ ఆలోచనతోనే ఒక వైపు తెలంగాణ డిమాండ్ బలంగా ఉన్నా, (గ్రేటర్ హైదరాబాద్‌గా డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెంచారు. తెలంగాణవాదం చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ దారులంతా ఈ ఆలోచనకు మద్రతుదారులుగానే ఉన్నారు. అన్ని పార్టీల్లో ఇప్పుడు హైదరాబాద్‌లో భూములమ్మేవారిదే పై చెయ్యి,
హైదరాబాద్ ప్రత్యేక రాష్టమైతే తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్‌కు తరిమిన భూస్వాములు తంతే పరుపుల్లో పడి పట్టణ ఆస్తులు సంపాదించినట్టు. హైదరాబాద్ రాష్టంలో అన్ని హంగులు తమకే ఉంటాయని, చుట్టు ముట్టు తెలంగాణ రాష్టంలో పెత్తనం, హైదరాబాద్‌లో అడ్డా, ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయనేది వారి అంతర్గత
88
హైదరాబాద్ ఒక (ప్రత్యేక రాష్ట్రమైతే? 89 కోరిక కూడా. టిఆర్ఎస్ చుట్టూ ఉన్న ధనవంతుల, ముఖ్యంగా హైదరాబాద్‌లో అడ్డాపెట్టిన నాయకుల ఆలోచన కూడా అదే. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ రాష్టం తెలంగాణ జిల్హాలకు, పల్లెలకు చూపులకు కాదు గదా, ఊహకందని ప్యారిస్ పట్టణాన్ని చేసుకొని తమ పిల్లల భవిష్యత్తుకు తిరుగులేనిదిగా తయారుచెయ్యవచ్చు అని అందరూ లోలోపల కలలు కంటూనే ఉన్నారు.
(ప్రపంచంలో ఏ దేశంలోనూ పట్టణాలు (ప్రత్యేక రాష్ట్రాలుగా లేవు. అమెరికాలో వాషింగ్టన్ - డిసి ఇండియాలో ఢిల్లీ, చండీఘడ్ తప్ప. వాషింగ్టన్ డిసి సెనేటర్‌ను ఎన్నుకునే హక్కు కూడా లేని పట్టణం. అది పెద్దగా అభివృద్ది కూడా లేనటువంటి పట్టణం. కానీ ఢిల్లీ అలా కాదు. దానికి అన్ని హక్కులు కల్పించుకున్న పట్టణం. కాని కొత్త ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలు - ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ (గ్రామాలను పీల్చి పిప్పిచేసి అన్ని వనరులను పొందుతున్న పట్టణం కూడా. ఢిల్లీ కేంద్రపాలిత (ప్రాంతంగా ఉన్నప్పుడు దానికి ఎన్నో సబ్సిడీలు ఉన్నాయి. అక్కడి ధనవంతులు అన్ని సుఖాలు అనుభవిస్తుంటే [గ్రామాలు దానిచుట్టూ ఉన్న స్లమ్స్గా మారాయి. చండీఘడ్ అనుభవం కూడా అంతే. ఆ పట్టణం పంజాబ్, హర్యానా (గ్రామాలను పీల్చుకుతినే పట్టణమైంది. అది అభివృద్ది చెందుతూ ఉంది కాని, దాని చుట్టూ ఉన్న (గ్రామాలు దిక్కు మొక్కులేనివిగా ఉన్నాయి.
"హైదరాబాద్ కనుక కేంద్ర పాలిత ప్రాంతమైతే తెలంగాణ ప్రజలకు విశాలాంధ్రలో ఉన్నదానికంటే నష్టమెక్కువ. తెలంగాణ ప్రాంతపు పాలకులు కేంద్రమిచ్చే సబ్సిడీలనన్నీ అనుభవిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని పీల్చిసిప్పి చేస్తారు. తెలంగాణ, ఆంధ్ర లేదా తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని రాష్ట్రాలు తమ రాజధానిని హైదరాబాద్‌లో పెట్టుకొని తాము పాలించే ప్రాంతాలను ఏ అభివృద్దికి నోచుకోనివ్వరు, తెలంగాణ ప్రత్యేకరాషష్టం అయ్యే ముందే హైదరాబాద్ తెలంగాణతో ఉంటుందా, ఉండదా తేల్చాలి. ఈ అంశంపై ముఖ్యమంత్రి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఏ రాజకీయ పార్టీ, లేదా నాయకుడు తన అభిప్రాయాన్ని, అది కుదరదు అని తేల్చి చెప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వాతావరణం దగ్గరపడుతున్న కొద్దీ ఈ అంశం గురించి చర్చలేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలవారూ చూస్తున్నారు. అన్ని పార్టీల్లో ఉన్న రియల్ ఎస్టేట్‌దారులకు హైదరాబాద్ (ప్రత్యేక రాష్ట్రంగా ఉండడమే కావాలి. అప్పుడే వాళ్ళ భూములకు ధరలుంటాయి. హైదరాబాద్‌తో కలిసి తెలంగాణ ప్రత్యేక రాష్టమైతే ముఖ్యంగా నష్టపోయేది రియల్ఎస్టైేట్లో కోట్టు సంపాదించిన అన్ని ప్రాంతాల వారూ,
హైదరాబాద్ తెలంగాణతో వస్తే మధ్యతరగతి, (శ్రమ జీవులు మళ్ళీ ఇళ్ళ స్థలాలు కొనుక్కునే స్థితి పెరుగుతుంది. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ ఇతర రాష్ట్రాల
90 తెలంగాణ రాజధానిగా ఉండడం సాధ్యం కాదు. రాష్టం విడిపోయాక విజయవాడ, గుంటూరు, కర్నూలు లేదా తిరుపతి వంటి పట్టణాలు ఆయా రాష్ట్రాల రాజధాని పట్టణాలుగా మారి అభివృద్ది అయ్యే అవకాశం ఉంది. భూముల ధరలు దాదాపు అన్ని పట్టణాల్లో సమతుల్యమవుతాయి. భూముల ధరలు పెరగడానికి మూలమైన సినిమా ఇండట్ట్రీ, ఐటి, 'పెద్దవ్యాపార రంగాలు, కంపెనీల స్టాపన రాష్ట్రంలోని చాలా పట్టణాల మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని సినిమా యాక్టర్జ్హు ఐటి కంపెనీదారులు, ఇండట్టీలు పెట్టాలనుకునేవారు పెద్ద భూ కొనుగోలుదారులుగా తిరిగి, అమ్మకదారులుగా తయారయ్యారు. అందుకే హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు ఆకాశానికి ఎక్కాయి. హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారికి సొంత ఇల్టు గురించి ఆలోచించడం అసంభవంగా మారింది.
"హైదరాబాద్ కనుక కేంద్రపాలిత రాషష్టమైతే ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. తెలంగాణ పాలకులు వరంగల్నో, మరో ఇతర పట్టణాన్న్నో తమ రాజధానిగా చేసుకొని అక్కడే ఉండి పాలించడానకి ఇష్టపడరు. ఒక మేరకు ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర నాయకులు తమ ప్రాంతపు పట్టణాల్లో రాజధాని పెట్టుకొని జీవించడానికి ఇష్టపడవచ్చు. కాని తెలంగాణ నాయకులు మాత్రం హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున ఉన్నందున ఇక్కడే తిష్టవేస్తారు. తమ రాజకీయ వ్యాపారాన్ని హైదరాబాద్ నుండే నడిపిస్తారు. ఇక్కడి జిల్దా కేంద్ర పట్టణాలను అభివృద్ధి కానివ్వరు. ఎందుకంటే హైదరాబాద్ ఒక ఆక్టోపన్లాగ తెలంగాణ నడిబొడ్డున ఉంటుంది. అన్ని ప్రాంతాల నుండి వనరులను లాక్కు తింటుంది. హైదరాబాద్ కనుక తెలంగాణతో ఉంటే ఇక్కడి భూములు ధరలు బాగా పడిపోతాయి. ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాం[ధ్ర వాళ్ళు భూముల (ఇండ్ల) అమ్మకందార్జు అయి, తెలంగాణ వాళ్ళు కొనుగోలుదార్జు అవుతారు. ఆ విధంగా క్రమంగా హైదరాబాద్‌లో కూడా ఆంధ్ర - రాయలసీమ, తెలంగాణ వారి నిష్పత్తి మారుతుంది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి వర్గం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించే స్థితి వచ్చింది. కనుక హైదరాబాద్ స్థితి గురించి నిర్దిష్టమైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఎంఐఎం కూడా ఈ అంశంపై తన స్టాండ్‌ను స్పష్టపరచాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై అన్ని రాజకీయపార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పకుండా ప్రత్యేక తెలంగాణ గురించి మాట్టాడడం తెలంగాణ (ప్రజలకే అన్యాయం చేసినట్టు అవుతుంది.
సూర్య - 16 మార్చి, 2008
25
బతుకమ్మ కాదు .... రాజకీయాలాడాలి
తెలంగాణలో బతుకమ్మ పండుగ బి.సి.ల పండుగ. (బ్రాహ్మండ్డు, కోమట్టు, రెడ్డు వెలమలు ఎప్పుడు ఆడెటోళ్లు కాదు. మాదిగ, మాలోళ్లను కూడా సూదరోళ్లు తమలో భాగం చేసుకొని ఆడనిచ్చెటోళ్ళు కాదు. పెతరమావాస్యనాడు, సద్దుల పండుగ నాడు డప్పు కొట్టి దరువేసే డ్యూటీ మాదిగల్లి. కాని బతుకమ్మల్ని పేర్చుకొని శూద్ర ఆడోళ్లతో ఆడే హక్కు తెలంగాణలో కూడా వీళ్లకు లేదు. అగ్రకుల దొరసాన్సు బతుకమ్మలు పేర్చుకొని ఎన్నడు చెరువు దగ్గరకు వచ్చేటోళ్లు కాదు.
ఇప్పుడు బతుకమ్మ ఉద్యమ పండుగైంది. మంచిదే, ఆ పండుగల వైపు కన్నెత్తి చూడని వెలమ, రెడ్డి దొరసాన్దు, అక్కడక్కడ బాగా చదువుకున్న (బ్రాహ్మణ అమ్మగార్జు బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఇప్పుడు ఊరూరి పండుగ అంటున్నారు. టి.మిల్లో చదువుకున్న దొరసాన్లు పట్టుబట్టలు కట్టుకొని (కెల్వార్ కమీజు లేసుకొని కాదు, బీన్ పాంట్టు తొడుక్కొని అంతకన్నా కాదు) 'బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో" అంటూ ఉయ్యాలూగుతుంటే అందరు ఆనందంగా చూస్తున్నారు. కాని ఊరి బతుకమ్మల్లో ఈ ఉద్యమ ఊర్రూతలో కూడ మాదిగ, మాల ఆడోళ్ళు పట్టుబట్టలు కట్టుకొని దొరసాన్ల పక్కన నిలబడి బతుకమ శై లాడుతున్నారా!
సహజంగా బతుకమ్మ ప్రకృతిని ప్రతిబింబించే పూల పండుగ. మొదటి తొమ్మిది రోజులు ఆడోళ్ల పండుగ, ఆడబిడ్డలు అన్నదమ్ముల మెడలొంచి బట్టలు కొనుక్కునే పండుగ, నగలు చేయించుకునే పండుగ. సద్దుల తెల్లారొచ్చే దసరా తాగి, తినే మొగోళ్ల పండుగ. ఆనాడు ఆయుధ పూజ అగ్రకుల సంస్కృతి అయితే, మందు తాగడం, మాంసం తినడం కింది కులాల పండుగ రూపం. ఈ పండుగను తెలంగాణ దొరలు వాళ్ల అవసరాన్ని బట్టి వాడుకున్నారు. సాధారణంగా బతుకమ్మ వరి కలుపుల సందర్భంగా వస్తుంది.
91
92 తెలంగాణ ఇంకా వానాకాలం ఉండి, చెరువులు, కుంటలు కళకళలాడే రోజుల్లో వచ్చే పండుగ ఇది. ఆడోళ్ళు బతుకమ్మలాడుతుంటే మొగపిల్లలు పాపెడు కాయలతో గొట్టాలాడే పండుగ ఇది, కాని దొరలు కలుపులు తీసే ఆడోళ్లను కనీసం సద్దుల పండుగనాడు కూడ కాస్త పొద్దుగాల యింటికి పోనివ్వకపోయేది. దాంతో ఆ తల్టులు తమ పసిపిల్లలకు సైతం డొప్పల్లో పాలు పిండి ఇంటికి పంపిన సంస్కృతి ఇక్కడి దొరలకున్నది. అందుకే దొరలున్న (గ్రామాల్లో ఆడోళ్ళు బతుకమ్మలాడేటప్పుడు ఇట్ల పాడేటోళ్టు, బతుకమ్మ బతుకమ్మ .... ఉయ్యాలో బంగారు బతుకమ్మ ... ఉయ్యాలో బట్టలిప్పి దొరలు .... ఉయ్యాలో బతుకమ్మ లాడిస్తే .... ఉయ్యాలో డొప్పలల్లో దొరలు .... ఉయ్యాలో పాలు పిండి ..... పంపే .... ఉయ్యాలో పాణాలు తీసిండ్రు .... ఉయ్యాలో .... తాంబాలాల్లో బతుకమ్మను పేర్చుకొని, నట్ట నడుమ బొడ్డమ్మను పెట్టుకొని సద్దుల పండుగ రోజున కూడ సద్దికి బువ్వలేక మొక్కజొన్న పాలా లేంచుకొని, సత్తు పిండి కొట్టుకొని, చెరువులో బతుకమ్మను వదులుతూ గౌరమ్మ గౌరమ్మ ఎన్నియలో బంగారు గౌరమ్మ ఎన్నియలో గంగలో కలువమ్మ .... ఎన్నియలో కన్నీళ్ళు కడతేర్చు ఎన్నియలో అని పాడి, తినడానికి పెరుగు బువ్వ కూడ దిక్కు లేక, సత్తు సిండి బుక్కి ఇక్కడి బి.సి. ఆడోళ్ళు ఇండ్లకు పోయిన రోజులెన్నో! ఈ స్థితిలో కూడ మాదిగ, మాలోళ్ళు డప్పులు కొడుతూ దూరంగా నిలబడాల్సిందే. (గ్రామాల్లోని ఈ స్థితిపై ఎన్నడూ కనికరం రాలేదు. అదే దొరలు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ప్రమాదమని కమ్యూనిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం పుట్టాయి. ఈ క్రమంలోనే ముందు రెడ్డి దొరల నాయకత్వంలో 1969 తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం పుట్టింది. ఇప్పుడు వెలమ దొరల నాయకత్వంలో నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాలు కూడ బతుకమ్మ పండుగలో మాదిగ, మాలల
బతుకమ్మ కాదు .... రాజకీయాలాడాలి 93 నుండి, చాకలి, మంగలి కులాలు, మిగతా బిసి కులాలతో కలిసి బతుకమ్మ ఆడాలని, ఆకలిని, అంటరానితనాన్ని ఈ ప్రాంతం నుండి పారదొయ్యాలని సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపలేదు. 1969 నుండి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్టు వెలమ, రెడ్డి దొరలు ఒక్కటయ్యారు.
ఇప్పుడు విష్ణవకారులు, వెలమలు, రెడ్డు కలిసి తెలంగాణ ఉద్యమం నడుపుతున్నారు. ఈ (క్రమంలో రెడ్డి వెలమ దొరలు, తిరిగి (గ్రామాల్లోకి పోవడమే కాక తెలంగాణ తల్లి పేరుతో పట్టుబట్ట కట్టుకొని, బంగారు నగలు పెట్టుకున్న ఒక దొరసాని చేతిలో బతుకమ్మను పెట్టారు. ఎంత విచిత్రం!
ఇప్పుడు బి.జె.పి. టి.ఆర్.ఎస్. విష్ణన పార్టీలు సెద్దాంతానికతీతంగా' తెలంగాణ తెస్తరట. ఒక దొర్పాని నాయకత్వంలో ఊరూర బతుకమ్మ ఉయ్యాలలూగుతున్నది. ఈ ప్రాంతంలో అందరికీ సమాన చదువు అమలై ఉంటే బతుకమ్మ పండుగను దళితులు, బిసి.లు, అగ్రకుల స్రీలతో కలిసి ఆడుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమమో, మావోయిస్టు ఉద్యమమో తెచ్చిన మార్పులో దళితులో, బిసి.లో ఉద్యమానికి నాయకత్వం వహించి ఒకనాటి దొరలు పాలితులుగా మరో కార్యకర్తలుగా పనిచేసే ఉద్యమమేదో నడుస్తుంటే ఇక్కడి దళిత-బహుజనులు ఆనందపడితే అర్ధముంది. కాని దొరలు దొరసాన్దు కొత్త తరహా ఉద్యమం నడుపుతున్నారు.
ఒకవైపు సమాజాన్ని మార్చే చదువును సంపూర్ణంగా ఈ ప్రాంతంలో బందు పెట్టి, ముఖ్యంగా ఇక్కడి బి.సిల చేత బతుకమ్మలాడిస్తూ, వాళ్ళు ఈ (ప్రాంతంపై సంపూర్ణ అధికారం సాధించడానికి రాజకీయాలాడుతున్నారు. అంటే ఇక్కడి దళిత, బహుజనులు నిరంతరం బతుకమ్మ, లేదా ధూం ధాం ఆడాలి. వాళ్ళు రాజకీయాలాడుతారు. దళితులు అన్నిటికీ డప్పులు కొట్టాలి.
ఇప్పుడు సంవత్సరాల తరబడి స్కూళ్ళు, కాలేజీలు బందు పెట్టి బతుకమ్మ లాడిస్తుంటే, ఆ పిల్లల తల్టులు ఏ పొట పాడాలి.
గౌరమ్మ, గౌరమ్మ... వలలో
బంగారు = గౌరమ్మ _ వలలో
దొరల రాజ్యమొస్తే .... వలలో
ధరలు తగ్గుతాయి .... వలలో
94 తెలంగాణ
'“ఆడి' కార్లళ్ళో .... వలలో
ఆనంద భోగాలు .... వలలో
మనింటికొస్తాయి ... వలలో
అని పాడుకోవాలి. ఊరూరి బతుకమ్మ “ఆంధ్ర టివి”లలో ఐక్య సంఘటన ఎందుకు కట్టింది? ఆంధ్రులు కరుణించి డొనేషన్హు ఇస్తే ఇప్పుడు బతుకమ్మలు పూలతో కాదు, నోట్టతో పేర్పొచ్చు!
బి.జె.పి. టి.ఆర్.ఎస్. ఒక మావోయిస్టు (గ్రూపు (న్యూడెమో!క్రసీ) రాబోయే ఎన్నికల్లో పొత్తుల పోటీ చెయ్యొచ్చు. ఈ పొత్తు పేరు 'తెలంగాణ విష్ణవిమని కూడ పెట్టొచ్చు. ఈ (ప్రాంతపు బి.సి.లంతా రేపు నరేంద్రమోడీ బి.జె.పి. ప్రధానమంత్రి కేండేట్ ఐతే బతుకమ్మలా కదిలి ఆ కూటమికి ఓటు వెయ్యవచ్చు. బి.జె.పి. “వచ్చేది మేమే ఇచ్చేది మేమే” అనే నినాదంతో మన చేత ధూంధాం ఆడించవచ్చు. కాని క్రమంలో మన రక్తం పంచుకొని ఇక్కడ బతుకుతున్న ముస్లింల సంగతేమైతుందో ఎవరు ఆలోచించాలి? ఇక్కడి సంస్కృతిని, విద్యను సర్వనాశనచేసిన దొరలు దొరసాన్లు (ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఇక్కడి దళిత-బహుజనుల్ని తోలుబొమ్మల్ని చేస్తే జరిగేదేంటి? రాబోయే తెలంగాణను ఎవరు పాలిస్తారు. ఇక్కడి స్కూళ్ళను బందుపెట్టి, తెలంగాణ ఉద్యమ నాయకులందరూ తమ పిల్లల్ని విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో చదివిస్తుంటే మన ఉపాధ్యాయులంతా ఉర్రూతలూగుతూ పాటలు పాడుతున్నారు.
ఈ మధ్య ఒక తెలంగాణ ఉపాధ్యాయ విద్యావేత్త తెలంగాణ వచ్చే వరకూ స్కూళ్ళు నడువకుండా చూసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ఏ స్కూళ్లను? ప్రభుత్వ స్కూళ్ళను। తెలంగాణ వచ్చినంక బతుకమ్మ లాడే బి.సి. స్రీలు మంత్రులౌతారా! ఐతే చదువు సరిగా రాకుండా ఫైలెట్ట రాస్తారు? ఈ (ప్రాంతపు యస్.సి. యస్.టి., బి.సి. తల్టుల కర్తవ్యం స్కూళ్ళు బందు పెడుతుంటే, ఆనందపడి బతుకమ్మ లాడితే లాభం లేదు. ఈనాటి బతుకమ్మకు రాజకీయాలు లేకుండా లేవు?
ఈ (ప్రాంతపు బడుగు జీవులు, రాజకీయాలు దొరలకు, దారసాన్లకు వదిలి వీళ్ళు బతుకమ్మలాడినంత కాలం వీళ్ళ బతుకు బతుకమ్మే అవుతుంది. దానితో ఆడుకొని చివరికి గంగలో కలుపుతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే లోపే వాళ్ళు బతుకమ్మ లాడుతుంటే ఇక్కడి బడుగు జీవులు రాజకీయాలాడే అ(గ్రిమెంట్కు సిద్దమేనా? అడుగండి.
ఆంధ్రజ్యోతి - 30 సెప్టెంబర్, 2011
26 చదువుకు సమ్మె నద్తు ో
నేను హిందువునెట్టయిత?”, “పోస్ట్ హిందు ఇండియా” పుస్తకాలను రాసినందుకు నన్నింతోమంది అ(గ్రకులాల వాళ్ళు 'దేశద్రోహి' అని తిడుతూనే ఉన్నారు. ఈ వ్యాసం రాస్తున్నందుకు 'తెలంగాణ ద్రోహి" అని తిట్టొచ్చు. అన్ని రంగాల కంటే చదువులో తెలంగాణ బాగా వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ ఒప్పుకుంది. అందుకు ఇతర కారణాలతో పాటు ఇక్కడి భూస్వాములు బడులను, పాఠశాలలను నడవనివ్వకపోవడం కూడా ఒక కారణం. నేను నర్భంపేట దగ్గరి గూడూర్జో వతరగతి 1966లో చదువుతున్నప్పుడు ఒకరోజు పనిబడి పంచాయతీ సమితి ఆఫీసుకు పోయాను. అప్పుడే బి,డి.ఒ. సమితి డ్రైసిడెంట్ మీటింగ్ అటెండ్ చేసి టీచర్ల్ణందరూ బయటికొచ్చి మాట్టాడుకొంటున్నారు. ఒక టీచర్ “వెంకట్‌రెడ్డి దొర మాబడిలో చదువు చెప్పాద్దంటున్నాడు. మీరు ఊరి పోరగాండ్లకు చదువు చెప్పితే మాకు జీతం ఎవరుంటారని తిడుతున్నాడు. సంతకం పెట్టిచప్పుడు చేకపో అంటున్నాడు” అన్నాడు. పక్కన టీచర్ “గంతమంచి ఊరు దొరికినంక ఇంకేంది, దొర నన్నక్కడ ఏయించుగద బాగుండు” అన్నాడు. ఈ సర్జ్హుబాటు వంతుళ్ళకు-దారలకు ఇక్కడ చాలా కాలంగా ఉన్నది.
తెలంగాణలో దొరలు చాలా (గ్రామాల్లో బడి పంతుళ్ళతో క్సేర్దార్టుగా పనిచేయించుకొని పాఠాలు చెప్పాద్దని బాహాటంగానే చెప్పేవాళ్ళు. 1969 నాటికి దొరలు లేని (గ్రామాల్లో కొద్దోగొప్పో స్కూళ్ళు నడిచేవి. అయితే దొరలు మాత్రం తమ పిల్లల్ని బయట చదివించేవాళ్ళు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనాక, ఆంధ్ర దోపిడీపై కోపంతో నాతరం ఒక సంవత్సరం పూర్తిగా కోల్పోయాం. ఆ తరువాత కూడ ఆంధ్రుల దోపిడీ అంతం కాలేదు కాని మా జీవితంలో 'కాపీ కొట్టి పరీక్ష రాయడం మొదలైంది.
05
96 తెలంగాణ బైకాట్ట్లు చాలా సంవత్సరాలు సాగేవి. ఈ (క్రమంలో పంతుళ్ళకు మార్కులు ఇచ్చుడు విద్యార్థులకు పుచ్చుకునుడు అలవాటైంది. చదివి పరీక్ష రాసేవాళ్ళను పిచ్చివాళ్ళుగా చూడడం, పేపర్డు చదివి మార్కులిచ్చే పద్దతి లేకపోవడం విద్యార్దుల జీవితంతో ఆడుకోవడం అలవాటైపోయింది. దాదాపు 1980 దాకా ఈ పద్దతి ఏ ఆత్మ విమర్శ లేకుండా నడిచింది. 1980 నుండి 1996 బోనగిరి తెలంగాణ సదస్సు వరకు ఈ అంశంపై బైకాట్టు జరగక కాస్త నిలకడగా స్కూళ్ళు నడిచాయి. ఈ కాలంలో (ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలే (గ్రామాల నుండి వచ్చి మంచి డాక్టర్డు, ఇంజనీర్హు అయ్యారు. కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు. కాని ఇదే దశలో కమ్యూనిస్టు, మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణ కేంద్రబిందువైంది. 1960 నుండి తెలంగాణ మావోయిజం కొంత కలగలిసి నడిచాయి. ఈ రెండు కూడ విద్యారంగాన్నే టార్లెట్ చేసేవి. మావోయిస్టు పోరాటం బలపడ్డంక ఈ “చదువులన్నీ బూర్జువా చదువులు” జై తెలంగాణ బైకాట్లకు బదులు “ఎ(ర్రజెండ, ఎర్రజెండ ఎన్నియలో” బైకాట్టు జరిగేవి. బతుకుదెరువు కోసం చదువుకోకపోతే ఎట్టా అనే విద్యార్దులను, భూస్వాముల తొత్తులని, బూర్జువాల తొత్తులని సామ్రాజ్యవాద ఏజెంట్లని తిట్టుడు మామూలైపోయింది. ఈ దశలోనే వందలాది మంది స్కూళ్ళు, కాలేజి చదువులు వదిలేసి ఎర్రదండులో చేరారు. 1990 దశకంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం ప్రపంచీకరణతో కలకలసి వచ్చింది. అన్ని తరగతుల కులాల ప్రజలకు పోటీపడి విద్య నేర్చుకోవలసిన అవసరమొచ్చింది. ఈ దశలో ప్రయివేటు, (ప్రభుత్వ స్కూళ్ళకు ఎనలేని అఘాతం ఏర్పడింది. ఊళ్ళలో మళ్ళీ బైకాట్లు మొక్కుబడి పరీక్షలు ఏం రాసినా మార్కులివ్వడం పద్ధతి, స్కూళ్ళ నుంచి కాలేజీలకు పాకింది. గత రెండేండ్లలో అసలు క్టాసురూంలో పాఠాలు సెప్పడం పంతుళ్ళకు, వినడం విద్యార్థులకు అలవాటు తప్పినంతపనైంది. ఈ అన్ని ఉద్యమాలకు యూనివర్సిటీ, కాలేజీ, స్కూలు టీచర్జు సిద్దాంత నాయకులయ్యారనేది ఒక వాస్తవం. అటు తెలంగాణ ఉద్యమానికి ఇటు కమ్యూనిస్టు - మావోయిస్టు హిందూత్వ ఉద్యమాలకు సిద్దాంతకర్తలు ఇక్కడి నుండే వస్తున్నారు. దురదృష్టవశాత్తు విద్యను నిలకడగా, సీరియస్‌గా క్లాస్‌రూంలో, లైబ్రరీలో నేర్చుకోవడం గురించి వీళ్ళు ఆలోచించలేదు. ఉద్యమాల్లో ఉన్నవాళ్ళందరికీ తాత్కాలిక దీర్హకాలిక ఉద్యమ అవసరాలుంటాయి. అందుకు ఉపయోగపడే కేంద్రాలుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఉంటాయి. వాటిని బైకాట్ చేయించి, లేదా నమ్మెల ద్వారా
చదువుకు సమ్మె వద్దు 97 మూసేయించడమే ఒక అత్యవసర కర్తవ్యంగా కనబడుతోంది. ఈ ఉద్యమ రూపానికి తీవ్రంగా బలయ్యేది మొదటితరం విద్యాలయాల్లో అడుగుపెట్టినవాళ్ళు. ఈ ఆధునిక దశలో విద్య ఒక్కటే వాళ్ళను, దారిద్ర్యం నుండి, రోగాల నుండి, మూఢ నమ్మకాల నుండి, బయట పడేయగలదని మనకు తెలుసు.
వాటిని అవసరాల వల్లనో ఆవేశం వల్లనో నిరంతరంగా మూసేస్తే ఒక్కతరం కాదు. ఎన్నో తరాలు దెబ్బతింటాయి. ఉద్యమరూపొలు కూడా 1969 నుండి ఇప్పటి వరకు ఒకే విధంగా ఉంటున్నాయి. తెలంగాణనో, విస్టవాన్నో లేదా హిందూ రా(ష్ట్రాన్నో సాధించడానికి స్కూళ్ళ మీదనే పడాలా! పోరాటాలే మంచి పాఠాలు చెబుతాయని మనం చెబుతున్నాం. ఇప్పుడున్న పోటీయుగంలో రోడ్లమీద పోరాటం కంప్యూటర్ విద్యనెలా నేర్పుతుంది? 1969 నుండి ఇప్పటివరకు విద్యార్థులను రోడ్డ మీదికి తేవడొన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చడం పరిపాటే,
ఆనాడున్న పోటీకి, ఈనాడున్న పోటీకి ఏమైనా పోలికలున్హయా? అనాడున్న ఉద్యోగ అవసరాలకు, ఈనాడున్న ఉద్యోగ అవసరాలకు పోలికలున్నాయా? ఈ పోలిక మన అవసరానికి న్యాయం చెయ్యొచ్చుకానీ, ఈ ప్రాంతపు పిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం పనికిరాదు. ప్రతి సంవత్సరం పదులకొద్దీ “స్కూల్ డేస్” పొఠాలు చెప్పకుండా, విద్యార్థులు వినకుండా ఉద్యమ అవసరాలతో పోడగొట్టి వాళ్ళ జీవితాలను ఏం చేయదలుచుకున్నాం,. స్కూలు విద్య, ముఖ్యంగా (గ్రామీణ (ప్రాంతాల్లో ఆరోగ్య అవసరాల కంటే, పండుగలు పబ్బాల కంటే, అత్యవసరమైన అంశం. దాన్ని ప్రభుత్వం అట్లా నిర్వచించకపోవచ్చు. అది ప్రాంతీయ దోపిడీ (ప్రభుత్వం ఐనప్పుడు ఈ ప్రాంతపు స్కూళ్ళను అరకొరగా నడిపే అవకాశం ఉంది. ఈ అన్యాయాన్ని ఆపే పోరాటంలో నిరంతరంగా, అదొక పోరాట రూపంగా చిన్నపిల్లలు చదువుకొనే స్కూళ్ళు బందు చేసుడేంది? స్కూలు టీచరు (గ్రామీణ
(ప్రాంతాలలో ఉండే పెద్ద మేధావి వర్గం, ఈ మేధావి వర్షం, కాలేజి, యూనివర్శిటీల్లో
ఉండే టీచర్ల వైపు ఆదర్శం కోసం చూస్తూంది. విద్యార్థులు వీరందరివైపు చూస్తారు.
“పాలబుగ్గల జీలుగాడ, పొలు మరిచి ఎన్నాళ్లైెందో' అనే పాట రాసిన తెలంగాణే, ఓ పాల
బుగ్గల పాపల్హారా! మీరు బడిలో ఉంటే తెలంగాణ ఎట్టా వస్తుంది" అంటే మన చైతన్యం
చెట్టు ఎక్కుతున్నట్టా, భూమి మీద నడుస్తున్నట్టా?
తెలంగాణ (ప్రభుత్వ స్కూళ్ళలో పాఠాలు లేని విద్యార్దులు నామమాత్రపు వడబోతలతో యూనివర్సిటీలకు వస్తున్నారు. ఇక్కడ కూడ మార్కులు ఇచ్చి పుచ్చుకోవడం మామూలు చేశాం. ఇక్కడ నిరంతరం రోడ్ల మీద నిలబెట్టుడు అలవాటుగా మారాక ఆ స్తితిని మార్చడానికి చాలా కాలం పడుతుంది. ఈ పెద్ద పిల్లల సంగతటంచుదాం. స్కూలు లేకుండా ఉంటే ఆనందమనుకునే పసికూనల జీవితాన్ని బలవంతంగా కూర్చోబెట్టి, మార్చేది స్కూలు; (గ్రామాలను మార్చేది కూడా (గ్రామాల్లోని స్కూలే. వాళ్ళకు మనం ఎందుకోసం స్కూలు మూస్తున్నామో అర్ధం కాదు. కాని టీచర్లకు తెలుసు. అన్ని ప్రాంతాల్లోని (గ్రామ టీచర్జు (గ్రామాల్లో ఉండడం లేదు. సమ్మె, బందు, బైకాట్ వల్ల తాను కాలు కదల్చకుండా ఇంట్లో ఉండేందుకు ఉపయోగపడుతుందనే స్లితి, నెలలుగా, సంవత్సరాలుగా స్కూళ్ళు మూయడం వల్ల నష్టం టీచర్లది కాదు, పిల్లలది. మనం కోరుకునే తెలంగాణో, విష్ణవమో వచ్చేదాక పోరాడాలనే పట్టుదల టీచర్‌కు ఉండవచ్చు. కాని అది ఒకటి, రెండు రోజుల్లో వచ్చేది కాదు అని తెలిసి కూడ ప్రతి నిత్యం స్కూలు మూయిస్సే జరిగేదేంటి? ఆ స్కూలుకు లేదా టీచర్ జీతబత్తాలకు చెందిన సమస్యల మీద బందులు చేస్తే పరవాలేదు. అవి త్వరలో పరిష్కరించదగ్గవి. కాని రాష్ట్రాల విభజన లేదా దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసే సమస్య ఎప్పుడు పరిష్కారమైతాయో తెలియదే! టీచర్లు ఉద్యమాల్లో పాల్గొనరాదని నేను అనడం లేదు. సెలవుల్లో, స్కూలు టైంకు ముందు, తరువాత వాళ్ళింత ఉద్యమకారులుగా ఉంటే అంత మంచిది. పాఠాలు చెప్పకుండా, రీసర్చి చేయకుండా ఒక సమస్యను ముందు పెట్టుకుని నిరంతరం తాము రోడ్ల మీద ఉండడం, విద్యార్థుల్ని రోడ్లమీద ఉంచడం మాత్రం ద్రోహం. దేనికి? విద్యకు. ఇప్పటివరకు మనం విద్యాహక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. కాని విద్య అన్నింటికంటే ముఖ్యమైన 'ఎస్సేనిషియల్ సర్వీన్' అని గుర్తించలేదు. ఇటువంటి ఆలోచనను టీచర్జు తీవ్రంగా వ్యతిరేకిస్తారని మనకు తెలుసు. తమ పిల్లల్ని (ప్రయివేటు స్కూళ్ళలో చదివించే ప్రభుత్వ టీచర్లంతా ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రభుత్వ స్కూళ్ళను నడుపమని సమ్మె నోటీసు ఇచ్చిన టీచర్లు తమ పిల్లలకు (ప్రయివేటు స్కూళ్ళలో చదువు చెప్పే టీచర్లకు ఆ హక్కు ఉండాలనీ పోరాడగలరా? ఆ టీచర్జు రాష్ట్ర సాధనో, విప్లవమో వచ్చే వరకు సమ్మె చేస్తే జీతాలు ఇవ్వాలని పోరాడుతారా? గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని రోజులు మూతపడ్డాయో లెక్కలు తీయండి. గ్రామీణ ప్రాంతపు ప్రభుత్వ స్కూళ్ళను దాదాపు సంవత్సరం పొడవున మూసే ఉంచారు? అక్కడ ఎవరు చదువుతున్నారు?
చదువుకు సమ్మె వద్దు
క్రింది కులాల బీద పిల్లలు. వాళ్ళకు స్కూలు ఎందుకు మూస్తున్నారు ఏం తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడ టీచర్లను అడగలేరు. కాని ఇదే టీచర్ల పిల్లలు ప్రయివేటు స్కూలు ఒక్కరోజు బందైన వీళ్ళే వెళ్ళి అడుగుతారు.
అవును తెలంగాణ రావాలి, ఈ దేశంలో విప్లవం కూడా రావాలి. వాటికి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోని పోరాట రూపాలు ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో ఏ అభివృద్ది చెందిన దేశాల్గొనైనా స్కూళ్ళు, కాలేజీలు బందుపెట్టి, రోజూ రోడ్ల మీద విద్యార్థుల్ని నిలబెట్టే ఉద్యమాలు చూస్తున్నామా? ఉద్యమమేదైన కాని, దాని కోసం సెంటిమెంట్ ఎంత బలంగానైనా ఉండనియి, స్కూళ్ళను, కాలేజీలను వాటిని బయట ఉంచకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ విధంగా (ప్రభుత్వ స్కూళ్ళను మూసెయ్యడానికి రూపొందిస్తున్లు ఉద్యమ ఎత్తుగడల్ని కింద కులం వారిని కొత్త తరం జీతగాళ్ళుగా తయారుచేసుకునేందుకే అనే ఆలోచన తప్పక వస్తుంది. మొత్తం విద్యారంగాన్ని ప్రయివేటీకరణ వైపు నెట్టేలా అనే ప్రళ్ళీ కూడ తలెత్తుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.
ఆంధ్రజ్యోతి - 16 సెప్టెంబర్, 2011 90
100
101
భాష - బహుజన దృక్పథం 27. “'నూతృభాషా” వాదంలో మతలబు ఏమిటి? 28. మాతృభాషా, వలస భాషా? రెండూ సమానమే! 29. ఇంగ్రీష్ అంత భూతమైతే, ఇంతగా ఎందుకు వ్యాపించింది? 30. భాషా రాజకీయం బహుజనులతో చలగాటం 31. నా వాళ్ళంతా అమెరికాలో ఉంటే నేను తెలుగునే ప్రేమిస్తా 32. ఇస్లాం సమాజం ఇంగ్లీషు నేర్వాలి 33. 'రెండు కాళ్ళ విద్య” అంటే ఏమిటి? 34 సిబిఎస్ఈ సిలబస్‌కు వ్యతిరీకత ఎందుకో? 35. ఉన్నత విద్య నాణ్యత ఎలా పెరుగుతుంది?
102
2
శ నూతృభాషా' వాదంలో మతలబు ఏమిటి?
(ప్రజలు తమ భాషను ఉత్పత్తి పనిలో భాగంగా నేర్చుకుంటారు. ఉత్పత్తికి భాషకు ఉన్న సంబంధాన్ని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అతి ప్రాచీన దశలో మానవులు ప్రకృతితో సంఘర్షణ పడుతున్న దశలో కూర్చుకున్న పదాలను తమ చుట్టూ ఉన్న చెట్లు, చేమలకు, (ప్రకృతి నుంచి రూపొందించుకున్న పరికరాలకు పెట్టుకున్న పేర్లను (క్రమంగా భాషరూపంలో కూర్చుకొంటారు. ఆదివాసి భాషలను పరిశీలిస్తే అది అర్ధమవుతుంది. మనరా(ష్టంలోనే గోండు తెగకు ఒక భాష, కోయతెగకు ఒక భాష లంబాడీ తెగకు ఒక భాష ఎరుకలి తెగకు ఒక భాష ఉండడం చూస్తున్నాం.
అరణ్యప్రాంతంలో అక్కడక్కడ జీవించిన తెగలు, మైదానప్రాంతంలోని సభ్యసమాజంలో చేరినప్పుడు ఒక (గామజీవనంలో ఒకటికంటే ఎక్కువ తెగలు రూపొందుతాయి. కాస్త అభివృద్ది చెందిన తెగ భాష మిగతా తెగల భాషలను మింగేసి, ఆ తెగలన్నింటినీ తెగాంతర భాషలోకి మారుస్తుంది. (గ్రామజీవనం ఒక ప్రాంత జీవనంగా, ప్రాంత జీవనం ఒక గణ (చిన్న రాజ్యం) జీవనంగా మారినప్పుడు ఆ గణంలో విభిన్న తెగల భాషలు క్రమంగా అంతరించి ఒక గణభాషగా రూపొంది ఉంటుందనే ఒక చారిత్రక అంచనా ఉంది. గణం జనపదంగా, జనపదం ఒక మహాజనపదంగా, మహాజనపదం ఒక సామ్రాజ్యంగా రాజకీయవ్యవస్థ మారుకుంటూ వచ్చినప్పుడు, ఆ రాజకీయ వ్యవస్థ ఆ ప్రాంత సభ్యసమాజాన్ని ఏకభాష సమాజంగా మార్చుకొంటూ పోయింది. ఈ (క్రమంలో ప్రజలు ఎన్నో అభివృద్ది చెందని భాషలను వదులుకొంటూ, అభివృద్ది చెందిన భాషలను నేర్చుకొంటూ వచ్చారు.
మాతృభాష సిద్దాంతం
ఈ అన్ని దశలలో సమాజం తన మౌలిక స్వభావాన్ని కూడా మార్చుకొంటూ వచ్చింది. ఇలా మార్చేక్రమంలోనే సిద్దాంత (ప్రక్రియలు పుట్టాయి. ఈ (క్రమంలో మాతృస్వామిక సమాజాలు హింస ద్వారా పితృస్వామ్యసమాజాలుగా మారాయని ఎల్‌హెచ్
104 భాష - బహుజన దృక్పథం మోర్గాన్ 'ప్రాచీన సమాజం” పుస్తకంలో తేల్చి చెప్పాడు. దాన్నే 'కుటుంబం, వ్యక్తిగత ఆస్తి రాజ్యం' పుస్తకంలో మరింత లోతుగా పరిశీలించి ఏంగెల్స్ మాతృస్వామ్య వ్యవస్థను పురుషస్వామ్యం కూలదోసిందని చెప్పాడు. భారతదేశంలో పితృస్వామం ఇతర దేశాలకంటే భిన్నంగా బ్రాహ్మణవాదం పునాదులతో ఎదిగింది. ఈ పునాదుల ప్రత్యేక లక్షణమేమంటే చాలా రంగాల్లో ఎన్నిటికో స్త్రీల పేర్లు పెట్టారు. కాని ప్తీలకు ఏ హక్కులు ఇవ్వకుండా అణగదొక్కారు. అందులో ముఖ్యమైనవి కొన్ని విద్య, ఆస్తి హక్కుకు సంబంధించినవి. ఉదాహరణకు, (బ్రాహ్మణవాదం సరస్వతిని విద్యాదేవతగా (ప్రకటించింది. కానీ స్త్రీలకు విద్య నేర్చుకునే హక్కును నిరాకరించింది. ఆస్తిహక్కు విషయంలో కూడా లక్ష్మిని ధనదేవతగా ప్రకటించి స్రీలకు ఆస్తిహక్కు లేకుండా చేశారు. సంస్కృతీకరించిన తెలుగులో పెండ్లి చేసుకున్న (స్రీ పురుషుల సంబంధాలను, 'భర్త' అంటే భరించేవాడని, 'భార్య' అంటే భరించవలసిన (స్త్రీ అని ఆమెను ఒక స్వయంశకక్తి లేని వ్యక్తిగా చిత్రీకరించారు. ఉత్పత్తికులాల్లో ఈ పదాలకు బదులు మొగుడు, పెండ్హాం అని అణచివేతకు సంబంధంలేని పదజాలం వాడారు. సంస్కృతీకరించిన తెలుగుపండితులు మాత్రం ప్రజల పదజాలాన్ని ఎప్పుడూ గౌరవించలేదు. ఈ మధ్య, మాతృభాషా సిద్దాంతం స్రీలకు మేలుచేసే సిద్దాంతమని రాద్దాంతం చేస్తున్నారు.
విద్యను 'మాతృభాషు విద్యగా ప్రకటించి, అభివృద్ది చెందిన భాషను నేర్చుకొనే అవకాశమూ, శక్తీ లేని వారుగా ప్రీలను మలచదలచుకొన్నారు. వీరి మరో విచిత్రమైన వాదన, భాషకు, సంస్కృతికి మధ్య తల్లికి, పిల్లకు ఉన్న సంబంధాన్ని కల్పించడం. (గ్రామ జీవనం, గణజీవనం రూపాందాక ఆదివాసి తెగల భాషలు అంతమొంది అభివృద్ది చెందిన | గాపలు బతికినట్టే, అభివృద్ధి చెందని ప్రాంతాల భాషలు, దేశాల భాషలు (ప్రపంచంలో వ్యాప్తి చెందుతాయి. ఈ (క్రమాన్ని మాతృభాష సిద్ధాంతంతో ముడివేసి అభివృద్ది చెందిన భాషను ఆ(గ్రకులాలకు, అభివృద్ది చెందని భాషలను దళిత బహుజనులకు కట్టబెడుతుంటే రాష్ట్రంలోని, దేశంలోని (ప్రీవాదులు భాషాచర్చలోకి రాకుండా ఉండడం విచిత్రమైన సంఘటనే.
స్త్రీ వాదులు ఎటువైపు?
'వ్యక్తిగతం రాజకీయం” (పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనే సిద్దాంతం ద్వారా తమ జీవితాలను, వ్యవస్థను మార్చాలనుకొనే స్తీ వాదులు తమ పిల్లల్ని ఆంగ్రభాషలోనే చదివిస్తున్నారు. అనుభవంలో అది మంచిదని తేలాకే ఆ పనికి పూనుకొన్నారు. ఇంగ్లీషు విద్యలోకి ప్రవేశించిన స్త్రీలే సమానత్వాన్ని ఎక్కువగా అనుభవిస్తున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. తమ అనుభవం రాష్ట్రానికి, దేశానికీ వర్తించాలనుకోవడం సిద్దాంతరీత్యా తప్పుకాదు. తమ పిల్లల్ని ఆంగ్లంలో చదివిస్తూ ఇతరుల పిల్లలకు మాతృభాష సిద్దాంతాన్ని,
“'మాతృభాషా' వాదంలో మతలబు ఏమిటి? 105 ఆచరణలో బానిసచదువులను అంటగట్టే (ప్రజాస్వామ్య' సోషలిస్హు కమ్యూనిస్టు పితృస్వామ్య మేధావులవలెనే (స్త్రీవాద సిద్దాంతకర్తలు కూడా భావిస్తున్నారా? ఆంగ్ల ప్రాంతీయ భాషల విద్యావిధానం చర్చల్లో, ఎన్నోచట్టాలను (స్రీలకు అనుకూలంగా మార్చిన (స్త్రీవాదులు, తటస్థంగా ఉంటే దాని పరిణామమేమిటో వారికి తెలియదా!
మాతృభాష అనే ఒక పితృస్వామ్య విలువను సెంటిమెంట్ల పండ్ల గంపలో పెట్టి, పితృస్వామ్యవాదులు అమ్ముతుంటే దాన్ని అడ్డుకోగల శక్తి ఒక్క (స్తీవాదులకు మాత్రమే ఉంది. మనరా॥ష్టంలో పితృస్వామ్య భాషాశా'స్తాన్ని మార్చగల (ప్రీవాదులు కూడా చాలామందే ఉన్నారు. మరి వాళ్ళంతా ఎందుకు మాట్టాడడం లేదు? దేశంలోని దళిత బహుజనులందరికీ ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మూడు సబ్జెక్ట్‌లు 'ప్రాంతీయ భాషలో, మూడు సబ్జైక్స్లు ఆంగ్లంలో బోధించాలనే అంశం దాదాపు అన్ని ఉద్యమాలను చీల్చే అవకాశముంది. దళిత ఉద్యమాలతో పాటు అన్ని ఉద్యమాల్లో పితృస్వామ్య విలువలు వేళ్ళూనుకొని ఉన్నాయి. గ్రామాల్లో కూడా మాతృభాషా సిద్దాంతం ప్రభావంతో ఆడపిల్లల్ని తెలుగు మాధ్యమం ప్రభుత్వ పాఠశాలలకు, మగపిల్లల్ని ప్రైవేట్ ఇంగ్రీష్ మాధ్యమం పాఠశాలలకు పంపించాలనే ఆలోచన పెరుగుతోందని బిఎస్ రాములు పదేపదే చెబుతున్నారు. ఇంతకాలం ఆడపిల్ల విద్య గురించి చర్చించాం. ఇప్పుడు వాళ్ళు ఏ భాషలో చదువుతున్నారనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోగాని, దేశంలోగాని (స్రీవాదసంస్థలు ఈ అంశం మీద పరిశోధన ప్రారంభించలేదు. ఎందుకనో తెలియదు.
(స్త్రీవాదుల అండ దళిత బహుజనులకు అవసరం, మాతృభాష సిద్దాంతాన్ని ఓడించనంతవరకు అధికారభాషగా చలామణి అవుతున్న ఇంగ్రీషును అందరూ నేర్చుకోవాలనే వాదనకు స్టానం, గౌరవం దొరకదు. ప్రభుత్వపాఠశాలల్లో పూర్తిగా తెలుగులో చదువుకొని నష్టపోతున్న వర్గం (ప్రతినిధులు కూడా ఇంగ్లీషు వాదనను బలపరచరు. కర్మ సిద్ధాంతంతో ప్రభావితమై బతుకుతున్న ప్రజలు తమ పిల్లలకు భాషారంగంలో కూడా సమానత్వం గురించి ఆలోచించలేరు. వారి ప్రతినిధి మేధావివర్గం కూడా ఈ విషయంలో ఒకే రీతిగా ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుభాషలో కూడా బహిరంగ ఉపన్యాసాలు, రచనలు ఈ తరంలో చేస్తున్న ప్రతినిధి నాయకత్వం ఇంగ్రీషుభాషలోకి తమ కులాలు, తెగలు మారాలని కోరుకోవడం ఆచరణకు దూరమైన విషయంగా కనిపిస్తుంది. ఇంగ్రీషు అందరూ నేర్చుకోగలరు అనే వాదన ప్రమాదకరమైనదిగా కనిపిస్తుంది.
106 భాష - బహుజన దృక్పథం భాష - సంస్కృతి ఇంగ్రీషు మాట్లాడే దేశాలన్నింటి మధ్య ఒకే సంస్కృతి లేదు. ఉదాహరణకు బ్రిటన్, అమెరికా, ఆథ్హ్రేలియా దేశ ప్రజల మధ్య ఒకే సంస్కృతి లేదు. ఈ మూడు దేశాలు మతం రీత్యా కూడా ఒకే మతాన్ని నమ్ముతాయి. అయినా సంస్కృతుల్లో తేడా ఉంది. కులం, ఆహారపు అలవాట్టు, ఉత్పత్తి సంబంధాలు ప్రధాన సంస్కృతిని నిక్రేళిస్తాయి. ఇంగ్లీషు నేర్చుకున్నా కుల సంస్కృతి దానంతట అదే పోదు. ఆం(ధ్రప్రదేశ్‌లో అత్యధిక (ప్రజలు తెలుగు మాట్టాడుతున్నా, వాళ్ళంతా ఒకే సంస్కృతిలో బతకడం లేదు. సంస్కృతిలో ప్రాంతాల తేడా ఉంది. కులాల, తెగల తేడా ఉంది. భవిష్యత్తులో తెలుగుభాషకు బదులు ఇంగ్లీషు ఇక్కడ చోటుచేసుకొన్నా ఒకే సంస్కృతి ఉండదు. కనుక 'మాతృభాషి ఏదో ఒక “మాతృ సంస్కృతి'ని నిర్మించింది. అది అందరికీ సాంస్కృతిక సమానత్వాన్ని, ఆర్థిక, రాజకీయ సమాన అవకాశాలను రూపొందించింది అనుకోవడానికి వీలులేదు. అసలు భాషకు “మాతృ” అనే పదం తగిలించడమే ఒక పితృస్వామ్య రాజకీయం. భాషలను అభివృద్ధి చెందిన భాషలు, అభివృద్ధి చెందని భాషలుగా చర్చించి, అభివృద్ది చెందిన భాషలు నేర్చుకున్న వారి భవిష్యత్తుకు, అభివృద్ది చెందని భాషలతో జీవిస్తున్న వారి భవిష్యత్తుకు తేడా చూడడం ముఖ్యం. అన్ని రాజకీయశక్తులు ఈ అవగాహనతో ఇంగ్లీషు - ప్రాంతీయ భాషల విషయంలో ఒక హేతుబద్ధ నిర్ణయం తీసుకోవడం అవసరం, వార్త - 5 మే, 2006
మాతృభాషా, నలస ఖాష్లా? శో రెండూ సమానమే!
ఆంగ్లం వలసభాష అవుతుందా? అనే నా వ్యాసంపై ఎబికె ప్రసాద్ 'వలసభాషా దాస్యం వెర్రితలలు” అనే వ్యాసంలో దాడి చేశారు. తెలుగు మాధ్యమంలో ఇంగ్లీష్ ఒక అంశంగా మాత్రమే ఉండాలనే అధికార భాషాసంఘం తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆంగ్లం వలసభాష అనే వారి నిర్వచనాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్‌ను ఇంకా వలసభాషగానే నిర్వచిస్తే సంస్కృతం మాత్రం వలస భాష ఎందుకు కాదు? ఒకటి ఈ దేశానికి వందల ఏళ్ళ కిందట వస్తే, మరొకటి వేల ఏళ్ళ (క్రితం వచ్చింది. ఈ రెండు వలస భాషలకుకలవ్యవధిలోనే తేడా తప్ప స్వభావంలో లేదు. సంస్కృతం, వేల ఏళ్ళు దళితులకు నేర్చుకునే హక్కును ధిక్కరిస్తే, ఇంగ్లీష్ ఈ దేశంలోకి రావడంతోనే వారికి ఈ భాషను నేర్చుకునే హక్కు కల్పించింది. ఈ రెండు భాషల్లో, సంస్కృతుల్లో ఇక్కడి దళిత బహుజనులు ఎన్నుకోవలసి వస్తే దేన్ని ఎన్నుకోవాలి? ఇచ్చితంగా మెకాలే భాషనే ఎన్నుకోవాలి! ఆ విధంగానే ఈ సంబంధాలను, సంస్కృతిని మార్చగలం,
హిందూ బ్రాహ్మణీయ సంస్కృతితో నిండి ఉన్న వారికి, దేవుణ్మి అన్ని భాషల్లో (ప్రార్థించవచ్చు. పిల్లకు పిల్లవాడికి, వారి బంధువులకు అర్థమయ్యే తెలుగుభాషలో పెండ్తిమంత్రాలు చదవాలి అనే నిబంధన అవసరమనిపించదు. సంస్కృతం అనే వలస భాష కుల సంబంధాలను, కులదోపిడీని కొనసాగిస్తుంది కనుక అది మన ప్రాచీనభాషగా కనిపిస్తుంది. తెలుగుదేశంలో కూడా అది యధేచ్చగా చలామణి అవుతుంది. కాని ఇంగ్లీషు మాత్రం ప్రపంచబ్యాంక్ వలసభాష అవుతుందట!
ఎవరి నిర్వచనాలు వారిని
వలసభాషు పరాయిభాష అనే నిర్వచనాలు ఈ రాష్ట్రంలోని తెగకు - తెగకు,
కులానికి - కులానికి భిన్నంగా ఉంటాయని అధికారభాషా సంఘానికి తెలియదా? ఈ 107
106 భాష - బహుజన దృక్పథం రాష్ట్రంలోని 70 లక్షల లంబాడీలకు మాతృభాష గోర్భాషు లేదా లంబాడీ భాష, కొన్ని దశాబ్దాల క్రితం కురుమ గొల్లలకు 'కురుము' మాతృభాష. వీరందరికీ తెలుగు పరాయిభాషే అది లంబాడీ తండాలకు వలసభాషే దాన్ని లంబాడీల మీద రుద్దే హక్కు అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? ఈ రాష్ట్రంలోని వందలాది తండాలలో, ఆదివాసి (గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో ఎందుకు చెప్పనివ్వాలి? ఈ గందరగోళమంతా జాతీయవాదానికి, తెలుగు జాతీయవాదానికి మధ్య తేడా చూడలేని సిద్దాంత దారి(ద్యంలో ఉంది. తెలుగు భాషా పెత్తనం కింద కురుమ భాష ఇప్పటికే పూర్తిగా చనిపోయింది. లంబాడీ, గోండు, కోయభాషలు ఇంకెన్నో భాషలూ చనిపోయే (క్రమంలో ఉన్నాయి. కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, అన్ని భాషా రాష్ట్రాల్లో అక్కడి పాలకకులాల భాష అధికార భాష అయ్యాక ఎన్నో ఉత్పత్తి కులాల, తెగల భాషలు అంతరించి పోయాయి. ఎబికె ఉటంకించే 'యునెస్కో' హెచ్చరిక ఇప్పుడు ప్రతినిత్యం లంబాడి తండాలలో తెలుగుభాష చేతిలో చనిపోతున్న లంబాడీభాషకు వర్తించదా? అధికారభాషా సంఘానికి ఇంకా బతికి ఉన్న లంబాడి, గోండు, కోయ భాషలను పారశాలల్లో పరిరక్షించే బాధ్యత లేదా? అవి వారి తల్లి భాషలు కావా? ఈ భాషలకు వలస భాషైన సంస్కృత పునాదులు గాని, ఇంగ్రీషు పునాదులు గాని లేవు. కాని రాష్ట్ర భాషలుగా ఎదిగిన మళయాలం, కన్నడం, తెలుగు, బెంగాలీ, హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి అన్ని భాషల్లో వలస భాష అయిన సంస్కృతాధిక్యత ఉంది. సంస్కృతం పునాదులు ఇరాన్లో ఉన్నాయని చరిత్రకారులు తేల్చిన సంగతి భాషా సంఘ మేధావులకు తెలియదా? ఇది బహుశా హిట్లర్ వారసులైన ఆర్యుల నుంచి వచ్చి ఉండవచ్చనే వాదం వారికి తెలిసి ఉండదనుకోడానికి కూడా (ఆస్కారం లేదు. సంస్కృత సంతతి ప్రాంతీయ భాషలు అభివృద్ది చెంది, ఈ దేశంలో తెగల, కులాల భాషలను చంపుతున్న దశలోనే ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్రీష్ భాష ఈ దేశానికి వచ్చాక ఒక స్కాటిష్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న మహాత్మాపూలే మేధావయ్యాడు. అంబేడ్కర్ ఇంగ్లీష్‌ను తన సిద్దాంత ప్రచారభాషగా ఎన్నుకొన్నాడు. ఇంగ్లీష్ విద్యారంగంలోకి వచ్చాక ఆ భాషవల్ల దళితుల్లో ఒక మేధావివర్గం ఎదిగి వచ్చింది. మరే భాషా వారి ఎదుగుదలను సాగనిచ్చేది కాదు. ఇంగ్లీష్ ద్వారా తెలుగు సంస్కృతి, తెలుగు విలువలు దెబ్బతింటాయనే వారందరూ తెలుగు రాష్ట్రంలో ఏ కులాల సంస్కృతి గురించి మాట్టాడుతున్నారు? తెలుగు వస్తేనే దాని ద్వారా ఇంగ్లీషు కూడా వస్తుందని వాదించే అధికారులు, తెలుగు భాషా పండితులు స్వాతంత్ర్యం వచ్చాక రెండవ తరాన్ని తమ కుటుంబాల్లో ఇంగ్లీష్ మాధ్యమంలోనే చదివించారు. మూడవతరం ఇప్పుడు ఆధునిక ఇంగ్లీష్ స్కూల్లోకి వచ్చింది.
మూత్సభాషా, వలస భాషా? రెండూ సమానమే! 109 తమ కులసంఘాల ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెట్టారు. వీరు ఇంగ్షీష్ వల్ల పోటీపరీక్షల్లో నెగ్గి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టు సంపాదించారు. ([గ్రామపేదలకు దిక్కైన (ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగుమాధ్యమమే ఉండాలని అధికార భాషా సంఘం తీర్మానాలు చేస్తోంది. (గ్రామాల్లోని పిల్లలకు కూడా మాధ్యమాన్ని ఎన్నుకునే హక్కు ఇవ్వవద్దా? రెండు మాధ్యమాల స్కూళ్ళూ అక్కడ ఉండవర్డా?
30 శాతం ప్రజలు ఒక భాషకు దూరమైతే ఆ భాష చనిపోతుందని చెప్పే అధికార భాషా సంఘం నేతలు బంజారాహిల్స్, జూబ్టీహిల్స్లోని కుటుంబాల్లో ఒక సర్వే చేయించగలరా? ఆ ఇళ్ళలో ఎంత తెలుగు ఉందో తేల్చగలరా? ఇప్పటికే తెలుగును చంపింది వాళ్ళు కాదా? ఇవాళ (ప్రభుత్వ, (ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉన్న వారి పిల్లలంతా తెలుగు భాష పునాదుల్లేని ఇంగ్రీషు మాధ్యమంలో చదువుతుంటే ఏ ఉద్యోగం చూపించలేని తెలుగును కాపాడమని ఉద్యోగాల ముఖం చూడని దళిత బహుజనులను ఎందుకు అడుగుతున్నారు?
ఒక తరంలో తెలుగు పుస్తకం ఒక్కటి కూడా లేని ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న ఈ మేధావుల పిల్లలు ఎవరైనా, ఏ దశలోనైనా మళ్ళీ తెలుగు మీడియం వైపు వచ్చే అవకాశమున్నదా? అది తెలిని “అదికారం రాగానే ఎవరి చెవుల్లో వువ్వు పెడదామనుకుంటున్నారు? మాతృభాషపై ఉపన్యాసాలు రెక్కాడితే తప్ప డొక్కాడని కుటుంబాలకిచ్చి, క్రమ క్రమంగా అమెరికాలో సైతం గవర్నర్లై, ఈ దేశ ప్రధానమం'త్రులై, మంత్రులై పాలిస్తుంటే, ఇంగ్లీష్ వలస భాష అని (గ్రామజీవులు దానిని తిడుతూ కూర్చోవాలా? మాటిమాటికి అంతర్జాతీయ రచయితల ఉటంకింపులను దళితుల ముఖానకొట్టి, సంస్థల నివేదికలు వారి నెత్తినబెట్టి ఇప్పటికే తెలుగుకు దూరమైన ఈ దేశపు ఇంగ్లీష్ వారు, తమ వారు అడ్డం లేకుండా అధికారం చెైలాయించాలనేగా ఈ ప్రయత్నమంతా చేసేది! అటు ప్రభుత్వ స్కూళ్లల్లో, ఇటు ైవేట్ స్కూళ్ళల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మూడు సబ్జెక్టులు తెలుగులో, మూడు సబ్టెక్టులు ఇంగ్లీసులో చెప్పే విద్యావిధానాన్ని రూపొందించమని డిమాండ్ చేయడానికి వీరంతా సిద్దమా? ఇంగ్లీష్ మాధ్యమం స్కూళ్ళ నుంచి, ఇంగ్షీష్ను తీసివేసి, అక్కడ కూడా రెండు భాషల విద్యావిధానాన్ని (ప్రవేశపెట్టించగలరా? అధికార భాషా సంఘానికి అధికారం లేకుండా ప్రైవేట్ స్కూళ్ళు చేసుకున్నాయని అందరికీ తెలుసు. అయినా అన్ని స్కూళ్ళల్లో 10వ తరగతి వరకు తెలుగు పెట్టిస్తామని ఎలా చెబుతున్నారు? ఈ ప్రయత్నమంతా (ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మాధ్యమం (ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఆపేందుకు కాదా? రిజర్వేషన్‌ను కోల్పోతున్న వారికండ్లల్లో మరో పిడికెడు మట్టి కొట్టేందుకే కాదా? ప్రతి ప్రభుత్వ స్కూల్లో
110 భాష - బహుజన దృక్పథం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రెండు మీడియంలు ఉండాలి. 15 సంవత్సరాల లోపే ఏ భాపనైనా నేర్చుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. ఆనాటికే రెండుభాషల్ని రెండు సమాన మీడియంలుగా నేర్చుకోవలసిన అవసరముంది. అందుకు మా శక్తి కొద్దీ పోరాడతాం. ఇది (గ్రామీణ బీద పిల్లల భవిష్యత్తు సమస్య. ఈ సమస్య మీద అధికార భాషా సంఘం రాషష్టమంతటా చర్చలు జరిపితే సంతోషం.
వార్త - ౩1 ఆగస్టు, 2005
209 గ్లీష్ తమైైతే ఇంష అంత భూతమ్రైత, ఇంతగా ఎందుకు వ్యాపించింది?
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో, ఇంగ్లీష్ తెలుగు సమస్థాయిలో నేర్చుకోవలసిన అవసరం అన్ని వర్గాలకు ఉందా లేదా? ఇంగ్రీష్ సామ్రాజ్యవాదకుట్రలో భాగంగా పెరుగుతోందని పెంటపాటి పుల్చారావు ఇటీవల తన వ్యాసంలో వాదించారు. ఇంగ్లీష్ నేర్చుకున్నా వివక్షకు పరిష్కారం దొరకలేదని వాదించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ నేర్చాలనే వారంతా అమెరికా, యూరప్ సామ్రాజ్యవాదపు కుట్రలో భాగస్వాములని వాదించారు.
ముందు నిత్యజీవితంలో ఇంగ్లీప్ను ప్రజలు ఎక్కడెక్కడ ఎదుర్కొంటున్నారో చూద్దాం. నేడు (గ్రామీణ ప్రాంతాలలో సైతం షాపుల్లో అమ్మే ప్రతి వస్తువు ప్యాకింగ్‌లో ఉంటుంది. దాని ధర, దానిని ఉపయోగించే విధానం ఇంగ్రీష్‌లో రాసి ఉంటాయి. కరెంట్బిల్లు ఇంగ్లీష్‌లో ఉంటుంది. దుస్తుల (బ్రాండ్ పేర్టు, ఇంగ్లీష్‌లో ఉంటాయి. మండల ఆఫీసుల నుంచి వచ్చే పత్రాలు ఇంగ్లీష్‌లో ఉంటాయి. టివిలో ప్రకటనలు ఎక్కువశాతం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. విద్యారంగంలో చూస్తే ఇంటర్మీడియట్, డిశ్రీ స్థాయిల్లో ప్రాంతీయభాష అయిన తెలుగులోనే చదువు చెప్పినప్పటికీ, యూనివర్సిటీ స్థాయిలో ఇంగ్రీష్లోనే విద్య బోధిస్తారు. పరీక్షలు ఇంగ్లీష్‌లో రాయాలి. పరిశోధన ఇంగ్రీష్లోనే చేయాలి. ఇన్ని సంవత్సరాల భాషోద్యమాలు జరిగాక, అది తెలుగు సంస్కృతికి పునాది వేసిన భాష అని ఎంతో (ప్రచారం జరుగుతున్నా, తెలుగులో రాసిన ఒక్క పుస్తకం కూడా ప్రపంచ జ్ఞానప్రక్రియ పై (ప్రభావం చూపలేదు. పరిశోధనలో పుట్‌నోట్సు ఎలా ఇవ్వాలి, రిఫరెన్సులు ఎలా ఇవ్వాలి అనే అంశాలు ఇంగ్లీష్‌లో జరిగిన పరిశోధనల నుంచే వచ్చాయి.
[111
112 భాష - బహుజన దృక్పథం జవాబు చెప్పవలసిన ప్రశ్న
అన్ని రాష్ట్రాలలో న్యాయవ్యవస్థ మున్సిఫ్ కోర్టుల నుంచి హైకోర్టు వరకూ అంతా ఇంగ్షీష్లోనే నడుస్తోంది. న్యాయం కోసం వెళ్ళిన వ్యక్తి తెలుగులో ఎంత మేధావైనా న్యాయవాది జడ్జికి ఏం చెప్తున్నారో, జడ్జి ఏమి అడుగుతున్నారో తెలియదు. సంస్కృత పురోహితుడి మంత్రాలు, పెళ్ళిలో వధూవరులకు అర్ధం కానట్టు, కోర్టులో తన కేసుపై వాదన ఆ కేసు పెట్టిన వ్యక్తికే అర్ధం కాదు. తెలుగువారు ఏ ఆఫీసుకువెళ్ళినా ఇంగ్లీష్ రాక్రపోత్తే తమ గురించి ఫైల్లో ఏమి రాసి ఉందో వారికి అసలు అర్ధం కాదు. ఈ విధంగా ఇంగ్లీష్ ప్రతి ఇంటిముందు నిలబడి, మీ సంగతేమిటి, నన్ను నేర్చుకుంటారా లేదా అని అడుగుతుంది. ఇదంతా బ్రిటీష్ అమెరికా వారు పన్నిన కు(ట్రవలనే జరిగిందా, లేక ఆ భాషకు కూడా పాకే శక్తి ఉన్నదా అనేది చూడనక్కరలేదా? అంత దుర్మార్గపు భాషను తెలుగు అభిమానులు ఎందుకు నేర్చుకుంటున్నారనేది కీలకమైన ప్రశ్న ఈ 'ప్రశ్ళకు జాతీయవాదులు, (ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలి.
“ప్రపంచంలో నల్లజాతివారు ఇంగ్రీష్ నేర్చుకుని విముక్తి పొందారా?' అని పుల్చారావు అడిగారు. ఆ ప్రశ్న అడగడంలో దళిత బహుజనులు ఎస్సి. ఎస్.టి. ఒబిసిలు ఆ భాష నేర్చుకొంటే విముక్తి పొందుతారా అనే ఆయన ప్రశ్న ఇమిడి ఉంది. తెలుగే మంచిది. మీరు తెలుగులోనే చదువుకోండి అనేది ఆయన వాదన. ఈ వాదనలో పస ఎంతో పరిశీలించేందుకు, ముందుగా నల్రజాతివారిని చూద్దాం. వారి బానిసత్వం 300 సంవత్సరాల కిందట మొదలైంది. అంతకుముందు ఆఫ్రికాఖండంలో వారు చిన్న చిన్న అభివృద్ది చెందని భాషలతో జీవించారు. బానిసత్వం అమెరికాలోని నల్లవారి జీవితంలోకి, వలసవాదం ఆఫ్రికా ఖండంలోని నల్లజాతివారి జీవితంలోకి ఇంగ్రీష్ భాషను తెచ్చింది. ఈ భాష వారికేమిచ్చింది? బానిసత్వం, వలసవాదంతో పాటు పోరాటాల చరిత్రను, ముఖ్యంగా జీసస్ జీననసంఘర్షణపై రాసిన ఎన్నో పుస్తకాలను వారి ఇళ్ళలోకి తెచ్చింది. ఇంగీష్ పాలకులు, అధిపతులు మాటాడుకొనే, చదువుకొనే ఇంగ్షీష్ను నేర్చుకోకుండా అమెరికాలోని నల్లజాతి వారు ఇప్పుడున్న సితికైనా చేరుకొనేవారా? వాళ్ళ జీవితాల్లో ఒక అంతర్జాతీయభాషగా ఎదిగిన ఇంగ్లీష్ లేకుండా, ఒక మార్టిన్లూథర్కింగ్, ఒక మాల్కమ్ ఎక్స్, ఒక సొజార్నో ట్రుత్, ఒక (ఫ్రెడరిక్ దగ్ద్హస్ ఎదగ గలిగేవారా?
ఆ(ఫ్రికాఖండాల్లో వలసవాదులు రుద్దినదైనా ఇంగ్లీషు లేకుండా ఆఫ్రికా ప్రజల జాతీయ పోరాటం ఆ స్టాయికెదిగేనా? ఇంగ్లీష్ భాష తన జీవితంలో లేకుండా నెల్సన్ మండేలా ఒక (ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా ఎదిగేవాడా? మండేలా తన (ట్రైబల్ భాషను మాత్రమే మాట్లాడగలిగి, రాయగలిగి ఉంటే ఆయన సిద్దాంత పోరాట పటిమ ఏ స్థాయిలో ఉండేదో చూడవలసిన అవసరం లేదా? న్ ల్
ఇంగ్లీష్ అంత భూతమైతే, ఇంతగా ఎందుకు వ్యాపించింది? 113
భారతదేశంలో దళిత బహుజనుల బానిసత్వం ఎన్ని వందల ఏండ్లది? తెలుగుభాష వీరందరూ మాట్లాడే, రాయగలిగే పరిస్థితి వందలాది సంవత్సరాల నుంచి ఉన్నా, నల్లజాతి వారికంటే వీరు వెనుకబడి ఉన్నారా లేదా? ఈ దళిత బహుజనులలో కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నవారి సితి ఏమిటి, ఇంగ్లీష్ రానివారి పరిస్థితి ఏమిటి? అతి దారుణమైన అంటరానితనాన్ని అనుభవించిన దళితుల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వారికి, నేర్చుకోని వారికి మధ్య సాంఘిక హోదాల్లో తేడాలేదని చెప్పదలచుకున్నారా? ఇంగ్రీష్ భాష అంత దుర్మార్గమైంది అన్నప్పుడు ధనవంతులంతా తమ పిల్లలను తెలుగు ఒక్క అంశంగా కూడా నేర్పని ఇంగ్లీష్ పాఠశాలల్లో ఎలా చదివిస్తున్నట్టు? ఆ ప్రక్రియను ఈ మేధావులెన్నడైనా 'ప్రశ్నించారా? ప్రాథమిక దశలో విద్య, మాతృభాషలో నేర్చుకోకపోతే క్రియాశీల చైతన్యం ఉండదని చెబుతున్న వీరంతా, ఇన్ని సంవత్సరాల నుంచి ధనవంతులు తమ పిల్లల్ని ఇంగ్లీష్‌లో చదివిస్తుంటే ఎందుకు ఊరుకున్నట్టు? అంతకంటే ఘోరం, తమ పిల్లల్ని అటువంటి స్కూళ్ళల్లోనే ఇప్పటి తరం కూడా ఎందుకు చదివిస్తున్నట్టు? కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదివిన తెలుగువారంతా ఇప్పుడు ఎటువంటి (క్రియాశీల తెలివి లేని వారిగా బతుకున్నారనే కదా వీరు అనేది! మరి వీరికే మంచి ఉద్యోగాలు ఎందుకు దొరుకుతున్నాయి? కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వారే ఎందుకు ముందంజలో ఉంటున్నారు? ఇళ్ళలో తెలుగు, స్కూళ్ళలో ఇంగ్లీషు వాడడం వల్లు ఆ వైరు ద్యంతో వీరంతా పిచ్చివారవాలి కదా? అది (గ్రహంచినవారైనా తమ పెల్లల్ని తెలుగులో చదివించడానికి సిద్ధంగా ఉన్నారా? తాము చేయని పనిని ఇతరులకు ఎందుకు బోధిస్తున్నారు?
తాము చెప్పే ఈ మాతృభాషా వాదనే నిజమైతే, ఇప్పటి ఇంగ్లీష్ మీడియం మొత్తం స్కూళ్ళలో 50 శాతం సిలబస్ తెలుగులో చెప్పాలనే వాదనను ఎందుకు ఒప్పుకోరు? రెండు భాషలు నేర్చుకోవడం పిల్లలకు అసలు కష్టం కాదని చెబుతున్నప్పుడు అన్ని స్కూళ్ళలో 50 శాతం సిలబస్ తెలుగులో, 50 శాతం సిలబస్ ఇంగ్రీష్‌లో చదివితే వచ్చే 'ప్రమాదమేమిటి? నేడు విశ్శవిద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టుల్లో హాస్పిటళ్ళలో పనిచేసే దళిత బహుజన (ప్రాఫెసర్టు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్.ఎస్. అధికారులు, లాయర్హు డాక్టర్హు అగ్రకులాల ఉద్యోగులతో పోటీపడేటప్పుడు ఏ అంశంలో ఇబ్బంది పడుతున్నారు? ముఖ్యంగా ఇంగ్రీష్ రాయవలసినప్పుడు, మాట్టాడవలనివచ్చినవ్వుడు ఇబ్బంది పడుతున్నారు. తొలుత తెలుగు మాధ్యమంలో చదువుకొని తర్వాత ఇంగ్రీష్ నేర్చుకోవడంలో అ(గ్రకులాలవారికి దళిత బహుజనులకు జేడా ఉంది. ఆ(గ్రకులాలవారికి ఆర్థిక వనరులు, చదువుకున్న తల్లిదండ్రులు, ట్యూషన్ చెప్పించుకోగలిగే ఆర్థిక స్థోమత ఉండేవి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కాని దళిత బహుజనుల స్థితి అది కాదు. అన్నీ స్వయంకృషితో నేర్చుకోవాలి. ఒకటవ తరగతి నుంచి రెండు భాషల్లో చదువుకొంటే అది చాలా సులభమవుతుంది.
కేషేత భాష - బహుజన దృక్పథం ఆమెరికాలో నల్లజాతివారు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం వల్ల చాలా సమస్యలను అధిగమించారు. 1960 దశాబ్దంలో జరిగిన పౌరహక్కుల పోరాటం నాటికే తెల్లవారిని అన్ని రంగాలలో సవాలు చేయగలిగే మేధావివర్గం ఎదిగింది. ఆఫ్రికా, అమెరికాలలో స్త్రీ సమానత్వం నుంచి, మన ఆ(గ్రకుల స్త్రీ మేధావులను మించిన ఎంతోమంది (ప్రీ మేధావులు ఎదిగారు. నల్ల (స్రీ వాదుల సాహిత్యాన్ని పుల్జారావు బహుశా చదివి ఉండరు. సాహసోపేతమైన, మొత్తం టివి మీడియాను శాసించగలిగే విన్ప్రీ ఓప్రా వంటి నల్లజాతి (స్రీ మేధావి అక్కడ ఉన్న ఇంగ్లీష్ మీడియం సైబర్హుడ్ స్కూలు నుంచే ఎదిగారు. ఓప్రా ఇంగ్లీష్ సిద్దాంత సాహిత్యాన్ని నవలా సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఆకలించుకొన్నారు. కనుకనే ఆమె టివిపై ఇంటర్వ్యూ చేసిన రచయిత మార్కెట్లో వెలిగిపోతుంది. అటువంటీ (స్తీ మేధావులు దళితులనుంచి కూడా ఎదిగే అవకాశం ఇంగ్రీష్తో వస్తుంది. వీరెలా అభివృద్ది చెందారు? నేడు ఇంగ్లీష్‌ను వ్యతిరేకిస్తున్న 'మేధావివర్గమే ఇంగ్షీష్ చదువుకొని ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడవచ్చు. వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువునే కానసాగించడాన్ని చూడవచ్చు. ఆ స్టితి వచ్చేదాకా అయినా ఇక్కడి పట్టణాలలోని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని పిల్లలకు అక్కడ ఆరణ్య (ప్రాంతంలోని పాపికొండలు, పార్వతీపురం గుట్టల్లో ఉన్న ఆదివాసి పిల్లలకు ఇంగ్లీష్ తెలుగులను సమభాగాల్లో నేర్పితే వచ్చే నష్టం ఏమిటి? జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని మేధావివర్గంతో పాపికొండలు, పార్వతీపురం గుట్టల్లో తయారయ్యే ఆదివాసి మేధావివర్గాన్ని ఇంగ్లీష్‌లో మాట్టాడనీయండి. ఏం జరుగుతుందో చూద్దాం! వార్త - 16 ఆగస్టు, 2006
30 భాషా రాజకీయం బహుజనులతో చలగాటం
-ఈ+ మధ్యకాలంలో ఢిల్లీ విశ్వ విద్యాలయంలోని దౌలత్‌రాం కాలేజీ ఇంగ్లీషు భాషపై ఒక సెమినార్ జరిపింది. ఇది ఢిల్లీలో చాలా గొప్ప పేరున్న ఉమెన్స్ కాలేజీ అన్న విషయం అందరికీ తెలుసు. ఆ సెమినార్లో ప్రధాన ప్రసంగం చెయ్యడానికి నన్ను పిలిచారు. ఆంగ్లాన్ని జాతీయభాషగా గుర్తించాలని ఒక తీర్మానం చెయ్యాలని చెబుతూ నా ఉపన్యాసం ముగించాను. అప్పుడే ఆ భాషను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక అర్ధమాధ్యమంగానైనా (ప్రవేశపెట్టడానికి వీలవుతుందని నా ఉద్దేశం. ఆంగ్ల విద్యను, ప్రాంతీయ భాషను ప్రతి స్కూల్లో సమానంగా బోధించాలనే నా వాదన తెలిసిందే.
నా ప్రసంగం ముగియగానే ఆ సెమినార్లో ఉన్న మహిళా ప్రొఫెసర్లు చాలామంది నా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి ఈ వలసవాద భాషను, జాతీయభాషగా గుర్తిస్తే మన సంస్కృతి, విలువలు చచ్చిపోతాయని ఏకధాటిన విరుచుకుపడ్డారు. మన జాతి సంస్కృతిని, భాషను వదిలిపెట్టి పరాయిభాషను మన భాషగా ఎలా ప్రకటిస్తామని విద్యార్థులు కూడా కొంతమంది నిలదీశారు. అక్కడున్న కొద్దిమంది దళిత ఆదివాసి ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళంలో పడి మిన్నకున్నారు. ఒక మహిళా ప్రొఫెసర్ మన సంస్కృతి, సంస్కృతభాష పెనవేసుకొని ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతం పునాదిగా ఉన్న హిందీ జాతీయభాషగా ఉండాలి. ఈ స్థితిలో ఇంగ్లీషును జాతీయభాషగా కోరడమా అని కంటతడి పెట్టింది. దానితో సెమినారంతా దుఃఖవాతావరణంలోకి జారుకుంది.
నేను ధైర్యం కూడగట్టుకొని సంస్కృతం, హిందీ మన జాతీయ సంస్కృతితో, సంపదతో ముడిపడిన భాషలైతే ఇక్కడున్న వారు ఎంతమంది తమ పిల్లల్ని సంస్కృత పాఠశాలల్లో హిందీ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారో చేతులెత్తండి అని అడిగాను. ఒక్క మహిళా (ప్రొఫెసర్ కూడా చేయి ఎత్తలేదు. ఒక్క పురుష మహాశయుడు మాత్రం, నా కొడుకును గురుకుల విద్యాలయంలో సంస్కృతం చదివిస్తున్నాను అన్నాడు. అయితే
శే[5్
116 భాష - బహుజన దృక్పథం ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్టోనే గదా మీ పిల్లల్ని చదివిస్తున్నది అన్నాను. సెమినారంతా మౌనం వహించింది. అధ్యక్షుడు చర్చ ఇలా జరగకూడదని భావించి ఆపడానికి (ప్రయత్నించారు. ఈ పాటికే దేశభాషల్ని చంపేపనిలో ఉన్నది - దళిత బహుజనులా, అ(గ్రకులాలవారా చెప్పండి అని నేను అడిగాను. సంస్కృతం తల్లిభాష అని కన్నీరు పెట్టిన ఆ తల్లి తల నేలమీదకు వాల్ళి కూర్చుంది.
విశాఖపట్నం కలెక్టర్ 80 ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్రీషు మీడియం పెట్టించినందుకు మన రాష్ట అధికార భాషాసంఘం, ఆంగ్రభాషా వ్యతిరేక తెలుగు అభిమానులు ఆ కలెక్టర్‌ను ఏడు చెరువుల నీళ్ళు తాగించి ఆ స్కూళ్ళను ఆపించారు. అనంతపురం జిల్లాలో జరగబోయే (ప్రయోగాన్ని కూడా ఆపించాలని చూస్తున్నారు. ఆపించగల శక్తి కూడా వీరికుందని తెలుసు. కాని ఈ రోజుల్లో ఒక్క ఇంగ్రీషు మీడియం స్కూల్లో కూడా సగం సబ్బెక్టులైనా తెలుగుభాషలోనే బోధింపచేసే యుద్దం వీరు ప్రారంభించనేలేదు. ఈ మేధావివర్గం అటువంటి యుద్దం చేయదు. అది వారి అజెండా కాదని కూడా మనకు తెలుసు. అధికారం, ఆధిపత్యం గల అధికార భాష ప్రజలందరికీ రాకుండా చూడాలనే రాజకీయం ఈనాటిది కాదు.
ప్రాచీనకాలంలో సంస్కృతం అ(గ్రకుల భాషగా ఉన్నప్పుడు మతరంగంలోగాని, రాజ్యరంగంలోగాని, దానిని ప్రజలందరూ నేర్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విధంగా గుడిపైగాని, బడిపైనగాని, రాజ్యంపైనగాని ఉత్పత్తి కులాలకు ఆధిపత్యం లేకుండా చేశారు. అశోకుని కాలంలో పాళి అధికారభాషగా ఎదగాలనే (ప్రయత్నాల్ని సభ్యసమాజంలో కూర్చొని (బ్రహ్మణీయ దురంధరులు ఆపారు. అశోకసా(మ్రాజ్యాన్ని అతలాకుతలం చేశారు. (క్రమంగా ఆ భాష ఈ దేశ చరిత్రపుటల్లో లేకుండా పోయింది.
అ(గ్రకులాలకే అన్ని భాషలూ!
ఆ తరువాత ముస్లిం రాజుల పాలనవచ్చాక పర్షియన్భాష అధికారభాష అయింది. ఆ భాష కూడా (ప్రజలందరి భాష కాకుండా జాగ్రత్త పడ్డారు. వనరులున్న అ(గ్రకుల పాలకులు పైసలతో పది భాషలు నేర్చుకోగలరు. నిజాం పరిపాలించిన తెలంగాణలో ఉర్జూభాషను ఎవరు నేర్చుకున్నారు? అగ్రకుల భూస్వాములు మాత్రమే నేర్చుకున్నారు. సాధారణ ప్రజలకు తీరికెక్కడిది, పైసలెక్కడివి, అన్ని భాషలు నేర్చుకోవడానికి ఇక వలసవాద కాలంలో ఇంగ్లీషు ప్రవేశపెట్టగానే దానిని నేర్చుకోవడానికి లంఘించింది అ(గ్రకుల ధనికశక్తులే. ఇంగ్లీషును పూర్తిగా పైసల భాషను చేసింది. ఈ దేశంలోని (క్రైస్తవ౦, రాజారాంమోహన్రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, తిలక్, సావర్కర్, గాంధీ, నెహ్రూ అందరూ ఇంగ్లాండుకు పోయి ఇంగ్లీషు నేర్చుకున్నవారే. జాతీయవాదులుగా
భాషా రాజకీయం బహవుజనులతో చలగాటం 17 ఎదిగిన ధనిక నాయకులంతా లండన్ పట్టణంలో ఇంగ్రీషు భాషలో చదివినవారే. ఇంగ్రీషు వ్యతిరేకి లోపాయా కూడా ఆంగ్లబాషను అమెరికాలో నేర్చుకున్నాడు. జాతీయోద్యమకాలంలో అంబేడ్కర్ ఒక్కడు తప్ప ఎన్‌సి, ఎస్టి, బిసిలలో ఎవరూ ఇంగ్లాండులో, అమెరికాలో చదువుకోలేదు. ఆయన కూడా బరోడారాజు దయాదాక్షిణ్యాల వల్ల అమెరికా, (బ్రిటన్లకు పోయాడు తప్ప స్వంత ఆస్తులతో కాదు. సంస్కృతం ద్విజులు మాత్రమే చదువుకోవాలన్నట్టు, కైస్తవులు కూడా తమ స్కూళ్ళలో ఇంగ్లీషు కైస్తవులు మాత్రమే నేర్చుకోవాలంటే ఈ బహుభాషా హిందూపండితులు ఇంగ్లీషు నేర్చుకొనేవారా? భారతీయ కైస్తవులు మతంతో సంబంధం లేకుండా ఇంగ్లీషును ఒక వ్యాపారవస్తువు చేసినందుకు అది ఇప్పుడు (క్రైస్తవాన్ని ప్రతినిత్యం తిట్టే అగ్రకులాల ఆస్తీ పెట్టుబడి అయింది.
ఇప్పుడు ఇంగ్రీషు మళ్ళీ పాలకభాష అయింది. అది ప్రైవేటు స్కూళ్ళలో ఉండి, డబ్బుతో కొనుక్కోగలిగే వారికి మాత్రమే దొరికే భాష అయింది. ఇప్పుడు కింది కులాలవారికి, బీద ప్రజలకు ఈ భాష రావాలంటే మార్గమేది? ప్రభుత్వ పాఠశాలల్లో 'ప్రవేశపెట్టడమొక్కటే మార్గం. ఆ పని విశాఖపట్నం కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ చేసినందుకు ఆయనపై కత్తి కట్టారు. ఆయన ఒక పైలెట్ (ప్రాజెక్టుగా మొదలెట్టిన 80 పాఠశాలల్ని మళ్ళీ తెలుగు మీడియంకు మాల్చినట్టు వార్తలు వచ్చాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటోతరగతి నుండి బీద పిల్లలు ఇంగ్లీషును (ప్రాంతీయ భాషతో సమానంగానైనా నేర్చుకోకుండా కొంతలో కొంతైనా ఇంగ్లీషు నేర్చుకొనే అవకాశం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మూడు సబ్జెక్టులైనా ఇంగ్రీషులో చదవాలనే ఆలోచనను ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఒకనాడు సంస్కృతం అధికారభాషగా ఉన్నప్పుడు దానిని ప్రజలకు నేర్చవద్దన్నవారి మెదడు గలవారు. ఇప్పుడు ఇంగ్లీషును తమ భాషగా ఏదో ఒక రూపంలో మలచుకొన్నవారు. అంటే మొత్తం దేశంలోని ప్రజానీకం ఒకే భాషను కనీసం మౌట్ట్లాడగలిగే స్థితి రాకుండా చూడాలనే పెత్తందారి వర్గ్మమొకటి దేశంలో రూసొందింది. ఈ వర్గం దౌలత్‌రాం కాలేజీలోని మహిళా ఉపాధ్యాయురాండ్రవలే “మాతృభాష చస్తోందని కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. “'మాతృభాషు అనే ఒక పితృస్వామ్య సిద్దాంతం ఒడిలో తలదాచుకొని అసలు అధికారాన్ని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని గుప్పెట్లో ఉంచుకొని ఈ సమాజంలో అధికారాన్ని, డబ్బును, ఆస్తుల్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకొంటున్నారు అ(గ్రకుల పెత్తందారులు.
(ప్రజలందరికీ ఇంగ్లీషు నేర్చుకొనే హక్కు ఉండాలనే వాదనను ఇవాళ వ్యతిరేకించేవారు వలసవాద సంస్కృతిలో ఎట్టా మంతనాలు జరిపారో చూడవలసిన అవసరం ఉంది. ఒకనాడు భారతీయులు టీ, కాఫీ తాగేవారు కాదు. బ్రిటీష్ వలసవాదులు టీ, కాఫీ
118 భాష - బహుజన దృక్పథం ఇళ్ళల్లో ప్రవేశపెట్టాక, ముందు వాటిని అలవరచుకొన్నది అ(గ్రకులాలవారా, దళిత-బహుజనులా! టీ, కాఫీ తాగే సంస్కృతి అని ప్రచారం చేసింది ఎవరు? జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న దళలో టీ, కాఫీ, విస్కీ, బ్రాందీలు తాగింది ఆ ఉద్యమాలలో పాల్గొన్నవారే. దళిత బహుజనులు ఆ రోజుల్లో చల్హా-కల్లు తప్ప ఏ విదేశీవస్తువూ ఎరుగరు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ నినాదం ఇచ్చేనాటికి విదేశీ వస్తువులు ఏ కుల-వర్గస్తుల ఇళ్ళలో ఉన్నాయి? దళిత బహుజనుల్లో అంబేడ్కర్ ఎదిగేంతవరకు సూటు-బూటు ముఖం చూసిన వారు లేరు కదా? నామమా(త్రంగా కొంతకాలం విదేశీ వస్తువులను బహిష్కురించినవారు ఇంగ్లీషు విద్యను మాత్రం బహిష్కరించలేదు. అదే వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుందని వారికి తెలుసు. కనుక వలసవాద వ్యతిరేక, నయా వలసవాద వ్యతిరేక ఉద్యమాలు నడిపిన ఉద్దండులంతా తమ పిల్లల్ని (పైవేటు-క్రిస్టియన్ ఇంగ్లీషు విద్యలోకి నెట్టిన వారే. అక్కడ తెలుగు ఒక్క సబ్జెక్టుగా కూడా లేదని వారందరికీ తెలుసు. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో తెలుగు నేర్చరని ఈనాడు తెలిసిందా? ఈ ప్రక్రియ ఎంతకాలం నుంచి సాగుతోంది? అసలు ఇంతకాలం రెండు విద్యావిధానాలను ఎవరు నడువనిచ్చారు? దేశంలోని మొత్తం స్కూళ్ళల్లో సగం సబ్జెక్టులు ఆంగ్లంలో, సగం సబ్టెక్టులు ప్రాంతీయ భాషలో బోధించే విధానాన్ని ఎందుకు అడగడం లేదు?
కనుక ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సగం భాషగానైనా ఇంగ్లీషు వద్దనే వారు కాఫీ, టీ మానడం లేదు. విస్కీ (బ్రాందీమాని చల్లా-కల్లు వైపునకు పోవడం లేదు. తమ ఇళ్ళలో పిజ్టా తినడాన్ని, బర్లర్ తినడాన్ని అడ్డుకోవడం లేదు. ఐఐటిల నుంచి అమెరికాకు దారులు వేస్తుంటే ఆపడం లేదు. కాని దళిత బహుజన పిల్లలు ఇంగ్రీషు, తెలుగుభాషలను సమానస్థాయిలో నేర్చుకోవాలంటే 'తల్లి భాష" అంటూ పిల్లిగంతులు వేస్తున్నారు. ఇంతకంటే ద్వంద్వ వైఖరి మరొకటుంటుందా?
తెలుగును రక్షించమని (ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పెద్దలంతా దేని నుంచి తెలుగుభాషను రక్షించమంటున్నారు. ఇంగ్లీషు భాషనుంచే కదా? అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కాశ్మీర్లో గుజరాత్లో ఉన్నట్టు సగం సబ్జెక్టులు ఇంగ్రీపులో బోధించకూడదనే వారి వాదన. ఇది ఎంత అన్యాయం! జాతీయవాదం దళిత బహుజనులకు, [ప్రాపంచిక వాదం తమ కుటుంబాలకు, కులాలకు, వర్గాలకా? ఈ స్థితిలో అందరికీ ఇంగ్రీషు కావాలని ఉద్యమించడం తప్ప దళిత బహుజనులకు మిగిలిందేమీ లేదు. కాని అందుకోసం పోరాడేవారు ఏరి? అందుకోసం ముఖ్యమంత్రుల దగ్గరికి (ప్రధానమంత్రి దగ్గరికి పోవాలనుకునేవారుగాని, పోగలిగేవారు గాని ఏరి?
వార్త - 23 ఫిబ్రవరి, 2006
ప్రశ నా వాళ్ళంతా అమెరికాలో ఉంటే నేను వే =ప్ తెలుగున (సమిస్తా
(ప్రతివాదన రచయిత మానసిక స్థితిని తెలుపుతుంది. ఆ వాదన భాషకు సంబంధించింది కావచ్చు. మరొకటి కావచ్చు. ఒక భాషలో పుట్టి పెరిగి చదువుకొని రచయితగా ఎదిగి, అవసరాల కోసం తన పిల్లల్ని మరో భాషలోకి పంపిన వ్యక్తి చివరకు ఒంటరి అవుతాడు. తన భాషలో తన స్థాయిలో మాట్లాడేవారు తన ఇంట్లో, తన కులంలో, తన నివాస ప్రాంతంలో తగ్గిపోతున్నప్పుడు తన పిల్లలకోసం తానెంచుకున్న పరాయిభాషు అది అందించిన ఆస్తుల్ని, విమాన విహారాలనూ భయానకంగా చూస్తాడు. తన పిల్లలు తన వారు కాకుండాపోయారని భావిస్తాడు. తాను జీవితాంతం ఒక భాషలో రాసి, చదివి ఉంటే తన పుస్తకాలను చదివేవారు తన కుటుంబంలోనే కరువవుతున్నప్పుడు, అది మరీ భయానకంగా కనిపిస్తుంది.
నా వాళ్ళంతా అమెరికాలో ఉండి, నా కుల సంఘాన్ని అమెరికాలో నడుపుతూ, వారికి పుట్టిన పిల్లలు అమెరికాలో ఇంగ్లీషు మాట్టాడుతున్నప్తుడు నేను తెలుగునే ప్రేమిస్తాను. ఇంగ్లీషును ద్వేషించుకుంటాను. నా బంధువుల సర్కిల్లో పెద్ద పెద్ద బంగళాల్లో ఇద్దరం ముసలివాళ్ళమే ఉంటూ, లంబాడోళ్ళ గుట్టల్ని 'బంజారాహిల్స్'గా మార్చుకొని జీవిస్తున్నప్పుడు, నా ఇంటి చుట్టూ పెరుగన్నం, దద్దోజనం, ఆవకాయ పచ్చడి, అల్లం మురబ్బాలు అమ్మే హోటళ్ళు అంతరించి, పిజ్జా హట్టులు, హమ్బర్లర్ రెస్టారెంట్టు వచ్చినప్పుడు నా తిండి సంస్కృతి మీద, దాని తల్లిగా కనిపించే భాషమీద ఎనలేని ప్రేమ పుడుతుంది. నా జాతి సంస్కృతి, భాషకట్టు, బట్టపై ఎనలేని శ్రేమపుట్టి నా పిల్లలకి, వారి బంధుమిత్రులకు ఆధునికం పేరుతో ఒకనాడు నేనే అందించిన వేషభాషల మీద ఎనలేని ద్వేషం పుడుతుంది. నేనొకనాడు దోతివదిలి పైజామా లాల్చి తొడిగినా, నా పిల్లలకు సూటు, బూటు సంస్కృతి అందించినా, వారి పిల్లలు కౌబాయ్ సంస్కృతిలోకి దిగజారి జీన్స్ పాంట్టు, నిక్కర్ణు వేసుకుని స్లీవ్‌లెస్ బనియన్లతో ఆదోవిధంగా కత్తిరించిన
110
120 భాష - బహుజన దృక్పథం జుట్టుతో హమ్బర్లర్ చేతిలో పట్టుకొని నా ముందు నిలబడితే వారిని కాల్ఫేయ్యాలని పిస్తుంది. బంజారాహిల్స్ బంగ్లా వదిలి లంబాడితండాలో నివసిస్తే బాగుండని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. నా ఇంటిముందు కనిపించే పూలతోట కూడా సా(మ్రాజ్యవాదపు సంస్కృతిలో భాగంగా నా ముందు నిలిచిన నాగుపాములా కనిపిస్తుంది. అప్పుడు నేను నిజంగా శ్మశాన వైరాగ్యంలోకి జారుకొని ఆ ఖాళీ గదుల బంగ్లాను, పిజ్ఞా హట్టుల వీధుల్ని, ఆ మార్షింగ్ వాకల మందహాసాలను బద్ధశత్రువుగా చూస్తాను. చక్కగా లంబాడి భాషను మాట్లాడుకుంటూ, పదిమంది పిల్లల్ని చుట్టూపెట్టుకుని పచ్చకూరతో అద్దుకుతినే జొన్నరొట్టె సంస్కృతిలోకి జారుకొని దాన్ని జీవ గంజిగా స్వీకరించి చచ్చి స్వర్గంలోనైనా వారికి న్యాయం చెయ్యాలనుకుంటాను.
లంబాడి తండా జౌన్నత్యాన్ని పొగుడుతూ, నా పొగడ్త మంచిదే అని నిరూపించడానికి ఓ నలుగురు యూరోపియన్లు, అయిదుగురి అమెరికన్త రచనలను కోట్‌చేసి వ్యాసాల మీద వ్యాసాలు రాసే ప్రయత్నం నేనూ చేస్తాను. నా రచనలు చదివే చదువరులు నా కుటుంబంలో, నా కులంలో, నా వర్షంలో నా బంజారాహిల్స్ భవంతుల్లో ఉండరని అర్థమయ్యాక వారికోసం, లంబాడితండాలోనూ మాదిగవాడలోనూ, గొర్లకాపర్ల గొంగడి మూటల్లోనూ వెతుక్కుంటాను. నాకున్న పలుకుబడిని అనుభవాన్ని, సజ్జలు బుక్కి సజ్జలువదిలే ఎత్తిపోతల రచనా సామర్య్యాన్ని ఉపయోగించి ఒక ప్రభుత్వపదవిలో కూర్చుంటే నా రచనా (ప్రభావాన్ని పదికాలాలు బతికేందుకు నిరంతరం కృషిచేస్తాను. నేనొక వరప్రసాదంగా పుట్టినా దేవుని (ప్రసాదాలెవ్వరూ నా చుట్టూ నా భాషలో, నా వేషంలో ఉండడం లేదనుకున్నప్పుడు ఒక ఎల్లయ్యనో, పుల్లయ్యనో అక్కున చేర్చుకొని నా భాషకు, భావానికి వారసునిగా చేసుకొనే ప్రయత్నం చేస్తాను.
నేను రాసిన భాషనీ, అందులో దాగిఉన్న సోషలిజాన్నీ పంచాలని చూస్తాను. అప్పుడు నా బంధువులు వాళ్ళ పిల్లల కోసం నడిపే స్కూళ్ళు నిప్పు కుంపట్లలా కనిపిస్తాయి. ఎందుకు? ఆ స్కూళ్ళ లైైబ్రరీల్లో నా రచనలు పెట్టేవాళ్లుండరు. వాటిని చదివే దిక్కు ఉండదు. అప్పుడు నా రచనలు చదివే అడవిజీవులు నయమనుకుంటాను. నా జనమంతా వారి పిల్లల్ని ఇంగ్లీషులో చదివిస్తున్నప్పుడు నా రచనల్లో విరివిగా ఇరికించిన ఇంగ్లీషు కొటేషన్తను ఇప్పుడు పూర్తిగా తొలగించాలని కూడా ఆలోచిస్తాను. నా జనం ఇంటిలో, వంటిలో తెలుగుదనం కనిపించక అమెరికా కౌబాయ్ సంస్కృతి కనిపిస్తున్నప్పుడు ఆ సంస్కృతినంతా సాంబార్ కాచినట్టు కాచి తెలుగు సంస్కృతిలోకి మార్చి వాళ్ళందరినీ తనతో లంబాడి తండాల్టోకి తీసుకుపోయి అక్కడ పొడుచుకొస్తున్న తెలుగుదనాన్ని నా వాళ్ళతో జుర్రిస్తే బాగుండని ఆశిస్తాను.
నా వాళ్ళంతా అమెరికాలో ఉంటే నేను తెలుగునే ప్రేమిస్తా 121
కానీ .... కానీ... నేనొక గొర్లకాపరిగా పుట్టి పెరిగి తంతే వరుపుల పడ్డట్టు" ఉన్నతవిద్యలో చేరితే ఏం చేస్తాను? ఎలా ఆలోచిస్తాను? నా చదువు ఈత మధ్యలో ఇంగ్లీషు తలిగి రెండుమూడుసార్లు నన్ను ముంచినప్పుడు నేనెట్లా ఆలోచిస్తాను? నా అక్కలు, చెల్లెండ్డు ఇత్తనాలేస్తూనో, కలుపులు తీస్తూనో, వరికోతలు కోస్తూనో, పిల్లల్ని చదివిస్తే అందరూ ఇంగ్రీషులో ఫేల్అయి ఆధునిక వ్యవస్థలో బతుకలేక మళ్ళీ గొర్హు, బర్జ్గుకాసే కార్యక్రమాన్ని ఇష్టపడక “లుంగీ సేనగా మారి రాజకీయ నాయకులను ఎన్నికల్లో గెలిపించే ఓటు గుద్దుడుగాండ్డుగా మారినప్పుడు నేనెట్లా ఆలోచించాలి?
నా అక్కచెల్లెండ్ల, అన్నదమ్ముల అనుభవంలోనే జాతీయవాదం గురించి మాట్లాడిన కాం(గ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు నాయకులు, తెలుగుభాషాభిమానియైన (గ్రామంలోని బడిపంతులు సైలెంటుగా తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించి ఇంజనీర్లను చేసి అమెరికాకు పంపి ఆనందిస్తున్నప్పుడు నేనెట్టా ఆలోచించాలి? “దేశభాషలందు తెలుగులెస్సా” అని ఉపన్యసించిన నాయకులంతా తమ భార్యలతో సైతం ఇంట్ల ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు నేనెట్లా ఆలోచించాలి? తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టిన పెద్దలంతా తమ పిల్లల్ని ఇంగ్లీషులో చదివిస్తుంటే నేనేం చెయ్యాలి?
గిరిజనులకు వారిభాషలో చదువుచెప్పిన మహానుభావులు, తెలుగుభాషకు వ్యాకరణాన్ని సృష్టించిన మహాపండితుల మనుమలు, మనుమరాండ్రు, అమెరికాలోనో, ఇంగ్లాండులోనూ అసలు ఆంగ్రేయుల్లా జీవిస్తుంటే వారి తొత చరిత్రను 'న భూతోన భవిష్యతి" పండితుని అడుగుజాడల్లో ఆంధధ్రభాషలోనో, గోండు భాషలోనో చదువుకోండి అని నా వారందరికీ చెప్పాలా? గిడుగు రామమూర్తి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇప్పుడు తమ పిల్లల్ని ఏ భాషగల స్కూళ్ళల్లో చదివిస్తున్నారో చూడనక్కరలేదా? నాకు పదవి రాగానే ప్రజలంతా పదవుల్లో ఉన్నారనుకోవాలా, నేను విమానమెక్కగానే ఇంకెవ్వరూ ఎక్కగూడదని సిద్దాంతం చెప్పేంత మూర్చుణ్మి కావాలా! లేక నేను విమానమెక్కినట్లే మిగతా జనమంతా ఎక్కాలని కోరుకునే సంస్కృతిలో బతకాలా! ఏ పద్ధతి మంచిది?
వలస భాషను “జాతీయ భాషుగా ప్రకటించాలనే నా వాదనను తప్పుపట్టే అధికార సరుకు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క సబ్జెక్టు కూడా తెలుగు చెప్పించలేని స్థితిలో ఎందుకుంది? అటువంటి స్కూళ్ళన్నీ వీరావేశంతో శివంతూలే ఈ తెలుగు అభిమానుల ఇండ్లచుట్టే ఉన్నాయి కదా! ఈ కోపమంతా నేను (ప్రభుత్వ పాఠశాలల్లో మూడు సబ్జెక్టులు ఇంగ్రీషులో చెప్పాలన్నందుకా, లేక ్రైవేటు పాఠశాలల్లో మూడు సబ్జెక్టులు తెలుగులో చెప్పాలన్నందుకా! ఈ (ప్రతిపాదన నేను వీరప్పమొయిలీ కమిటీ ముందు కూడా ఉంచానని ఈ తెలుగు ఛాందసులకు తెలువనట్టుంది.
122 భాష - బహుజన దృక్పథం
ఇంగ్రీసు ఎత్తిపోతల పధకాలను ఆపి ఈ దేశంలో మార్పుకోసం నేను రాసిన పుస్తకాలు చదివితే నా వాదన ఏమిటో అధికార గద్దెల మీద ఉన్న పెద్దలకు అర్ధమయ్యేది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సబార్టర్న్ స్టడీస్ (గ్రంథాల్లోనే నేను పాశ్చాత్య రచయితల కొటేషన్లతో, పుట్నోట్స్తో పుస్తకాలు నింపే పద్ధతిని చీళ్చి చెండానని వీరికి తెలియదు. ఇంగ్రీషు భాషను దేశభాషగా ప్రకటించాలని దేశమంతటా (ప్రచారం చేస్తూనే పాశ్చాత్య రచయితల భావ దాస్యంలో ఎన్నడూ నేను జీవించలేదు. నా వాదనలు నిరూపించుకోవడానికి ఏ పాశ్చాత్య రచయితనూ ఆ(శ్రయించలేదు. ఇక్కడి ఉత్సాదక ప్రజల జ్ఞానాన్ని అందరూ ఆమోదించే సిద్ధాంతంగా రాసే ప్రయత్నం (ప్రతినిత్యం చేస్తున్నాను. ఇంగ్రీషు దేశభాషగా మారి ప్రతి విమానంలో, ప్రతి రైల్వేస్టేషనులో, ప్రతి బస్టాండ్‌లో ప్రకటన భాషగా మారాక ఈ అధికార భాషా ధురంధరులు ఎవర్ని మభ్యపెట్టడానికి అది వలస భాష అని చెబుతున్నారు? ఇప్పుడు మీ చేతిలో కలాలు, తెలుగుపేరుతో సంస్కృతాన్ని, ఆ వాదనలను బలపరచుకోవడానికి ఇంగ్లీషు కొటేషన్సు మాత్రమే ఎత్తి రాయడానికే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవే కలాలు మా చేతుల్లో రెండు భాషల్లో మా ప్రజల జీవితాలను చిత్రీకరించడానికి ఉపయోగిస్తే తప్పా! ఇంగ్రీషును ప్రతి ప్రభుత్వ స్కూల్లో ప్రాంతీయ (తెలుగు ఒక్కటే కాదు) భాషను ప్రతి ప్రైవేటు స్కూల్లో సగ భాగాలుగా చెప్పేవరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ దేశ దళిత బహుజన వరాలు బావిలో కప్పల కెన్నడూ భయపడకూడదు. ప్రభుత్వ స్కూళ్ళలో సగం సిలబస్ ఇంగ్రీషులో చెప్పే దశ వచ్చే దాక ఎన్ని దేశాలైనా తిరిగి దళిత - బహుజనులకు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు పెట్టించే ప్రయత్నం చేస్తాం. అతి బీద పిల్లలకు ఇంగ్లీషులో మాత్రమే ఉచితంగా చదువు చెప్పే స్కూళ్ళు 54 ఇప్పటికే వచ్చాయి. నేను చెట్టుకింద స్కూల్లో తెలుగులోనే చదువుకున్న ఊళ్లో 300 మంది దిక్కుమాలిన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో ట్రెకట్టి, బూట్లేసి భిన్న సంస్కృతిలో చదువుకుంటున్నారు. ఇదొక ఉద్యమం.
ఇటువంటి స్కూళ్ళు ప్రతి (గ్రామానికి రావాలని ప్రతి భారతీయుడు కోరుకోవాలి. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి విమానమెక్కాలని కోరుకోవడం నిండు భారతీయత అవుతుంది.
అవసరం దళితులకు
ఈ (ప్రయాణాన్ని వ్యతిరేకించే వారు భవిష్యత్తులోనైనా తమ పిల్లలూ సంపూర్ణ తెలుగువైపు వచ్చే ప్రయత్నం చేసుకుంటే ఎవరూ అడ్డుకోరు. అది వారి ఇష్టం. తెలుగుభాపనే ప్రపంచ భాషగా రూపొందిస్తామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కాని ప్రస్తుత దశలో ప్రపంచ భాషను, అదీ భారతీయ అధికారభాషగా మారిన భాషను యుద్ధ ప్రాతిపదికపై నేర్చుకోవలసిన అవసరం దళిత బహుజనులకు ఉంది. ఆ అవసరాన్ని అర్ధం చేసుకున్నాక దాని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనీసం ఆ కులాల్లో పుట్టిన గర్భస్థ
నా వాళ్ళంచా అమెరికాలో ఉంటే నేను తెలుగునే ప్రేమిస్తా 123 మేథావులకుంది. భారతదేశంలో అ(గ్రకులాలుగాని, ధనికవర్గం గాని తాము నేర్చుకున్న భాషను (ప్రజలు నేర్చుకోవాలని కోరుకోలేదు. ప్రతిదశలోనూ ధనికవర్గ/అ(గ్రకుల ప్రతినిధి మేధావివర్గం (ప్రజల [శ్రేయస్సు గురించి మాట్టాడినట్టు నటిస్తూనే తమ వర్గ/కుల ఆధిపత్యాన్ని కాపాడుకున్నారు. ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగీషు వద్దనే వారి వాదన భిన్నమైంది కాదు. వీరి పక్కన కొంతమంది దళిత బహుజన మేధావులమనుకునే వారు ఉండొచ్చుకాక, వారు నిజంగానే తెలుగు గొప్పదని నమ్మినట్టు నటించవచ్చుగాక. సిద్దాంతం పట్టు ఆచరణలో తేలుతుంది. తెలుగు గొప్పదనే మేధావి వర్గ్షమంతా తమ పిల్లల్ని 'మంచి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదివిస్తున్నప్పుడే వీళ్ళంతా తాడిచెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్న మేధావులని తేలింది.
భాష విషయంలో ఏ అధికార సంఘం ఎన్ని చేసినా ప్రజలు ఆచరణలో ఎవరి పిల్లలు ఎక్కడున్నారని చూస్తున్నారు. అందుకే (గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్ళు ఖాళీగా ఉండే స్థితి వచ్చింది. ఇంగ్లీషు విద్య కావాలన్న వారిమీద ఇంత దాడిచేసే అధికార భాషా సంఘాన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తాను చదువు చెప్పే స్కూల్లోనే తనపిల్లల్ని చదివించాలనే రూల్ వచ్చెటట్టు చూసి దానిని అమలు చేయమనండి. అప్పుడు తెలుస్తుంది ఈనాడు (గ్రామాల్లో కూడా ఏ భాషకు ఎంత విలువ ఉందో.
వార్త - 12 సెప్టెంబర్, 2006
౩2 ఉఅగ్జీ అస్య ఇస్తాం సమాజం ఇంగ్లీషు నేర్వాలి
ముస్టింలపై జస్టిస్ సచార్కమిషన్ నివేదిక, మైనారిటీ హక్కుల విషయంలోనూ, రిజర్వేషన్ల విషయంలో కూడా మనదేశంలో కొత్త అధ్యాయాన్ని తెరచింది. ముస్లింలు తాము పాలకవర్గానికి చెందినవారమన్న మూస భావనలో చిరకాలంగా ఉండిపోయారు. హిందూ కులవ్యవస్థ నుంచి కొందరు ముస్లిం మతంలోకి మారడం వల్ల అందులో కూడా పరిమితరూపంలో కొంత కులవ్యవస్థ చోటు చేసుకొన్నప్పటికీ, భారతీయ ముస్లిం పౌరసమాజంలో సంపన్నుడుగా ఎదిగి సాంఘిక నిచ్చెన మీద పైకి వెళ్లగలిగిన ఒక ముస్లిం ఎటువంటి హోదానైనా అందుకొనే అవకాశం ఏర్పడింది. ముస్లింలందరికీ మసీదు దగ్గర సమానహక్కులు ఉన్నాయి కనుక, ఇతర నిచ్చెనల మీద పై మెట్టుకు వెళ్ళే అవకాశాలు వారందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాయి. పఠాన్, లేదా ఖాన్ నేపథ్యం నుంచి వచ్చిన సంపన్న ముసింలు వివిధ ముస్లిం జీవన రంగాలన్నింటిపై ప్రాబల్యం వహిస్తున్నప్పటికీ, ఒక మతంగా వారి మధ్యనున్న ఆధ్యాత్మిక సమానత్వం, కొన్ని శతాబ్దాల కాలంలో వారి జీవన సరళులను ఎంతగానో మార్చింది.
ఇప్పుడు 60 ఏళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా ముస్లింలు ఎస్సి., ఎస్.టి., ఒబిసిల కంటే కూడా మరింత వెనుకబడి ఉన్నారు. చారిత్రకంగా చూస్తే మనదేశంలోని దళిత, బహుజనులు ముస్లిం మతంలోకి మారడం వల్లనే ముస్లిం జనాభా ఏర్పడింది. అంటే, హిందూ కులవ్యవస్థ కారణంగానే భారత ఉపఖండంలో ముస్లిం మతం విస్తరించింది. స్టానిక ప్రజలు పెద్దఎత్తున ముస్లిం మతంలోకి మారిపోవడంవల్లనే ఆప్ట్రనిస్టాన్, పాకిస్టాన్, బంగ్లాదేశ్‌లు స్వతంత్ర దేశాలుగా ఏర్పడడమే కాదు, భారత రిపబ్లిక్లో కూడా ముస్లిం జనాభా నివృత్తి (క్రమంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ముస్టింలలోని బహుభార్యత్వమో, కుటుంబ నియంత్రణను పాటించకపోవడమో కారణం కాదు. సామాజిక హోదాకోసం, ఆధ్యాత్మిక సమానత్వం కోసం భారతదేశంలోని నిమ్నవర్గాలవారు
124
ఇస్లాం సమాజం ఇంగ్లీషు నేర్వాలి 125 ఇష్టపడి ఇస్టాంలోకి మారుతుండడమే దీనికి కారణం. తమిళనాడులోని మీనాక్షిపురంలో దళితులు ఇష్టపడి ముస్లిం మతంలోకి మారడం చెదురుమదురు ఘటన కాదు. దేశంలో అనేకమంది సామాజిక హోదాకోసమే ముస్లిం మతంలోకి మారుతున్నారు. తగ్గిన మతాంతరీకరణలు
అయితే వీరిలో పేదరికం "పెరుగుతూ, విద్యా, ఉద్యోగ అవకాశాలు క్షీణించడం (ప్రారంభమైన తర్వాత ఇటువంటి ఇష్టపూర్వక మతాంతరీకరణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిమ్నవర్గాల, (ప్రధానంగా దళితుల దృష్టిని రెండు అంశాలు ప్రధానంగా అటువైపు నుంచి మళ్ళిస్తున్నాయి. అవి: రిజర్వేషన్గు, ఇంగ్లీష్ విద్య, జైస్తవం, నవయాన బౌద్ధంలా ఇస్లాం మతాంతరీకరణలను (ప్రోత్సహించే మతం కాదని తెలిసిన విషయమే. ఎవరైనా స్వచ్చందంగా ముస్లిం మతంలోకి మారడానికి ముందుకు వస్తే వారిని ఆమోదిస్తుంది.
రిజర్వేషన్దు, ఇంగ్లీష్ విద్య దళిత మధ్యతరగతిని అవతరింపజేసి (చర్చి ద్వారా, యూనివర్సిటీ విద్య ద్వారా ఈ రెండూ సాధ్యమయ్యాయి), దళితులలో, ఒబిసిలలో ఆకాంక్షలను, ఆశలను పెంచాయి. రిజర్వేషన్లను హిందూ కులవ్యవస్థతో ముడిపెట్టడం వల్ల ముస్లిం మతంలోకి వెళ్ళే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. (క్రైస్తవానికి భిన్నంగా ఇన్లాం తన మతం వారికి ఆధునిక విద్యావ్యవస్థను నిర్మించకపోవడం ఇందుకు మరో కారణం. మనదేశ సందర్భంలో ఆధునిక విద్య అంటే, ఇంగ్రీష్‌ను, శాస్ర్రవిజ్ఞానాన్ని, సామాజిక శా(స్తాలను అధ్యయనం చేయడం. ఆధునిక మార్కెట్ వ్యవస్థకు తగినట్టుగా ఉర్పూను అభివృద్ధి చేయలేదు. ముస్లిం పిల్లలను మదరసాలకు, ప్రభుత్వ పారశాలలకు పరిమితం చేసి ఇంగ్లీష్ విద్యాభివృద్దికి దూరం చేస్తున్నారు. ఇంగ్లీష్ చదువుద్వారా ఆధునికీకరణ చెందిన ముస్లింలు డబ్బు సంపాదనే లక్ష్యంగా మైనారిటీ విద్యాసంస్థలను స్టాపిస్తూ, దేశంలోని సంపన్న, అ(గ్రవర్ష విద్యార్థులకు సీట్లు అమ్ముకొంటున్నారు.
ఆంగ్రీకరణ చెందిన ముస్లింలలోని ఒక చిన్నవర్గం అంతర్జాతీయ స్టాయికి ఎదిగినా వారిలో తమ మతం వారి శ్రేయస్సుకు పాటుపడాలన్న దృష్టి లేదు. ఎంఎఫ్ హుస్సేన్, సల్మాన్ రష్టీ సానియా మీర్జా, సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ఖాన్లు ఇంగీష్ విద్య నేపథ్యం నుంచి వచ్చిన వారే. నిజానికి అనేకరంగాలలో ఆంగ్లీకరణ చెందిన ముస్లింలే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంఎఫ్ హుస్సేన్ దేశంలోనే అగ్రశ్రేణి చిత్రకారుడు అయితే, సల్మాన్ రీ అ(గ్షశ్రేణి రచయిత. ఇక సానియామీర్జా దేశంలోనే అ(గ్రశ్రేణి మహిళా టెన్నీస్ (క్రీడాకారిణి. పారిశ్రామికరంగంలో విప్రో యజమాని అజీమ్ ప్రేమ్‌జీ దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. తమ తమ రంగాలలో (ప్రసిద్దులైన ముస్లిం మేధావులు కొద్దిమంది ఉన్నారు. అయితే వారెవరూ తమ మతస్థుల పాఠశాల విద్యావ్యవస్థను
126 భాష - బహుజన దృక్పధం పట్టించుకోవడం లేదు. రిజర్వేషన్హు దళితులకు, గిరిజనులకు ఎంత మేలు చేస్తున్నాయో వారు ఇంతవరకు గుర్తించలేదు. ముస్తింల వెనుకబాటు వ్యవస్థ్రాపరమైనదే కాదు, ఒక సామాజికవర్గంగా రాజ్యం నెలుపల ఆధునిక సాంస్కృతిక సంస్థలను నిర్మించుకోని ఫలితంగా కూడా. ముస్లింల కంటే చిన్న మైనారిటీ అయినా క్రైస్తవులు ఈ విషయంలో భిన్నమైన (ప్రభావం చూపగలుగుతున్నారు. ఈ రోజున చర్చి ఆంగ్ర విద్యకు, నాణ్యమైన వైద్యసేవలకు, వివిధ నగరాలలో (ప్రపంచస్థాయి శిక్షణాసంస్థల ఏర్పాటుకు (ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇటువంటి సంస్థల నిర్మాణానికి కేవలం పాశ్చాత్యుల డాలర్, పౌండ్ సంపద మాత్రమే దోహదం చేయడంలేదు. జ్ఞానవ్యవస్థ్టను కూడా మతవ్యవస్త్ర కాలానుగుణంగా మార్చుకొంటూ ప్రజోపయోగవ్యవస్థలను నిర్మించుకొనే సంస్కృతిని అభివృద్ది చేసుకోవలసి ఉంటుంది. హిందూత్వం వలెనే ఇస్లాం కూడా ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా తనను తీర్చి దిద్దుకోవడంలో విఫలమైంది. రాజ్య వైఫల్యమూ ఉంది అలాగని ఇందులో రాజ్యవైఫల్యం లేదని కాదు. అది కూడా అనేక మార్గాలలో జరిగింది. భారత జాతీయవాదాన్ని హిందూ జాతీయవాదం తరహాలో నిర్వచించినప్పటి నుంచి ముస్లిం జనాభా ఒత్తిడులను ఎదుర్కొంటోంది. అయితే, ఇది (కైస్తవులకూ వర్తించే మాట నిజమే అయినా, ఇంగ్లీష్ విద్య ఈ రెండు మతాల మధ్య తేడా కల్పిస్తోంది. కనుక ముస్లింల సమస్య కేవలం రాజ్యవిధానంతోనే ముడిపడినది కాదు. ముస్లిం సామాజికవర్గం విద్యాపరంగా, మతపరంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఆధునికీకదించే ప్రక్రియను చేపట్టటం అవసరం. రాజ్యం కొన్ని పనులనే చేయగలుగుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆయా సామాజికవర్గాలను అభివృద్ది చేయడంలో మత, సాంస్కృతిక సంస్థలు కూడా తమదైన స్వతంత్ర పాత్రను నిర్వహిస్తాయి. ముస్తిం సామాజికవర్గం ఈ కోణాన్ని తీవ్రంగా పట్టించుకోవాలి. మత సమాజంలో ఆధునికీకరణ చోటుచేసుకోకపోతే పౌరసమాజంలో కూడా అది సాధ్యం కాదు. వివిధ దేశాల్లో ఇస్లాం సమాజం ఆధునికీకరణ చెందుతూనే ఉంది. అయితే అది చైనా తదితర సమాజాల్లో జరుగుతున్నట్టుగా, సమకాలీనంగా పుంజుకోవడం లేదు. భారతదేశ ఆధునికీకరణ అనేది, ఇస్లాం సమాజాన్ని ఆధునికీకరించడంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇస్సాం సమాజాన్ని ఆధునికీకరించడంపైనే కులవ్యవస్థ విచ్చిన్నత కూడా ఆధారపడి ఉంటుంది. ఇస్లాం ఆధునికీకరణ చెందుతున్న కొద్ది హిందూవ్యవస్థ కూడా దానితో పోటీ పడవలసిన అవసరం ఏర్పడుతుంది. గత 60 ఏళ్ళ చరిత్రను గమనిస్తే, హిందుత్వ శక్తులు ఇస్పాంతో పోటీపడడం అన్నింటిలో కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఇంగ్లీష్ విద్య, అంతర్జాతీయ పోటీతత్వం మా(త్రమే ఆదుకోగలుగుతాయి. జన
ఇస్లాం సమాజం ఇంగ్లీషు నేర్వాలి 127 సమూహం ఇప్పటికే ఆ దిశగా వేగంగా పయనిస్తున్నారు కూడా. ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఆంగ విద్యలోకి అడుగుపెట్టవలసిన అవసరం అందుకే ఉత్పన్నమవుతోంది. హిందూవ్యవస్థకు భిన్నంగా ఇస్లాం వ్యవస్థ మసీదులో ప్రార్ధన సమయంలో ఖురాన్‌ను ఇంగ్లీషులో కూడా పఠించే అవకాశమిస్తోంది. హిందూవ్యవస్టలో ఇటువంటి మార్పు కష్టం కావచ్చు. ఏమైనా, పోటీతత్వం మాత్రమే మతాల భవిష్యత్తును కూడా నిర్హయిస్తుంది. భారతీయ ముస్లిం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
వార్త - 27 ఫిబ్రవరి, 2007
33
“రెండు కాళ్ళ విద్య అంటే ఏమిటి?
(ప్రపంచీకరణ ఒక దశకు చేరుకున్నాక దాన్ని తిప్పికొట్టడం అంత సులభం కాదు. దేశీయతను దాన్ని కాళ్ళ మీద దాన్ని నిలబెట్టడం అంత సులభం కాదు. సాంస్కృతిక, విద్యారంగాలలో ఆ రెండు భిన్నమైన పాయలుగా మనలేవు. ఈ దశలో అభివృద్ది చెందుతున్న దేశాలకున్న ఒకే ఒక మార్గం ప్రపంచీకరణను, దేశీయ పునాదుల్ని క్రమంగా సమన్వయపరచడం. అట్టా సమన్వయపచడం కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ అది తప్ప మరో మార్గం లేదు. ఆర్థిక ప్రపంచీకరణ చాలా రకాల ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతున్నది. (గ్రామీణ (ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక వనరులు రోజు రోజుకు సన్నగిల్లి | ప్రజలు మార్కెట్ వనరులను కొనుగోలు చేసే స్థితిలో లేరనేది అర్హమవుతూనే ఉంది. ఆర్థిక ప్రపంచీకరణను అడ్డుకోవడం చాలా అవసరం.
కాని విద్య, ఇతర సాంస్కృతిక రంగాలలో ప్రపంచీకరణ ప్రభావాన్ని ఆపడం అంత సులభం కాదు. ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలుగా రూపొందిన చైనా, క్యూబా అనుభవం అదే. మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలు పరిపాలించిన రా(ష్టాల అనుభవమూ అదే. ముఖ్యంగా విద్యారంగంలో (ప్రపంచీకరణ (ప్రభావం చాలా త్వరగా పాకుతుంది. అందులో బలమైన విద్యాపునాదులున్న దేశాల ప్రభావం, బలహీనమైన విద్యాపునాదులున్న దేశాల మీద ఎక్కువగా పడుతుంది. బలహీనమైన విద్యాపునాదులున్న దేశాలు బలమైన విద్యాపునాదులున్న దేశాల నుండి నేర్చుకునే అంశాలు కూడా చాలానే ఉంటాయి. ప్రపంచ జ్ఞానాన్ని, జాతీయ జ్ఞానాన్ని రెంటిని సమన్వయపరచడం చాలా కీలకమైన అంశమవుతుంది. అందులో భాగంగానే భాష ఉంటుంది. స్కూల్ విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు భాష, సిలబస్‌లకు సంబంధించి ఎటువంటి విధానాన్ని అనుసరించాలనే ప్రశ్న కీలకమైంది. (పైవేటురంగంలో ఇంగ్లీషు, ప్రభుత్వరంగంలో ప్రాంతీయ భాషల విద్య ఈ విద్యావిధానాన్నే గందరగోళంలోకి నెట్టిందనేది తెలిసినదే. ఒక్క భాష మాత్రమే కాక బోధించే సిలబస్ ఏముండాలి అనే అంశంపై ఒక జాతీయ విధానం రూపొందలేదు. దీన్నే మనం భాష
128
'రెండు కాళ్ళ విద్య” అంటే ఏమిటి? 120 భావం, విధానం అంటాం. భాష భావం, విధానం ఇప్పుడు అగ్రకుల ధనికులకు, ఆ స్థాయికి చేరుకున్న ఇతర కులాల, వర్గాల వారికి అనుకూలంగా ఉంది.
(పైవేటురంగాన్ని బలపరిచింది వీళ్ళే, వీళ్ళలో కొంతమంది తమ రాజకీయ సిద్దాంతాల కనుగుణంగా (పైవేటీకరణను వ్యతిరేకించవచ్చు. కాని ఆ వ్యవస్థ ప్రాణదాతలు వాళ్ళే. (ఫైవేటురంగం నుండి ప్రాబల్యం గల వ్యవస్థను నడిపే శక్తులుగా ఎదిగేది వీళ్ళ. మనదేశంలో నెహ్రూ రూపొందించిన వ్యవస్థీకృత విధానం వల్ల (ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండు కొళ్ళుగా నడుస్తున్నాయి. ఈ రెండు కాళ్ళలో (ప్రైవేటు కాలు చాలా బలమైనది. ప్రభుత్వం కాలు బలహీనమైనదే కాక అది (ప్రైవేటు రంగానికి ఉపయోగపడేది మాత్రమే.
విద్యారంగంలో మాత్రం (్రైవేట్రంగం, ప్రభుత్వరంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంటుంది. 'ప్రభుత్వరంగాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ రంగాన్ని పూర్తిగా మార్చకుండా మిగతా రంగాలు మారవు. దాన్ని మార్చి సమాజంలోని పిల్లలందర్నీ సమాన (ప్రాతిపదికపై నిలబెట్టాలంటే (ప్రైవేటు ప్రభుత్వరంగాలను ఏదో ఒక రంగంలోకి మార్చాలి. (ప్రపంచంలో అభివృద్ది చెందిన అన్ని దేశాల్లో స్కూలు విద్య పూర్తిగా ప్రభుత్వరంగంలో ఉన్నది. దేశంలోని అన్ని స్కూళ్ళలో దాదాపు ఒకే (ప్రామాణికత గల సిలబస్ ఉన్నది. భారతదేశంలో మాత్రం అందుకు భిన్నంగా బాగా బలహీనమైన ప్రభుత్వ విద్యారంగం, బాగా ఆధునికతను సంతరించుకున్న బలమైన ప్రైవేట్ విద్యారంగం ఉన్నాయి. ఆం(ధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో కూడా అధికార భాషాసంఘం వంటి సంఘాలు ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో కనీసం 25 శాతం సిలబస్‌ను కూడా తెలుగుభాషలో చెప్పించే స్థితిలో లేవు. (ప్రైవేటు ఇంగ్రీషు మీడియం స్కూళ్ళపై సాధారణ ప్రజలకు కూడా పెరుగుతున్న ్రమల్ని - ఆ భాష మార్కెట్ ప్రయోజనాన్ని తగ్గించే స్థితిలో లేవు.
అదే సందర్భంలో, ఇంగ్రీషు భాష ప్రైవేట్ స్కూళ్ళలో అమలులో ఉన్న సిలబస్ (ప్రభుత్వ స్కూళ్ళలోకి తేవాలనే డిమాండ్ వస్తే తమ శక్తినంతా ఉపయోగించి ఆపేస్తున్నారు. కనీసం (పైవేటు, (ప్రభుత్వస్కూళ్ళలో 50 శాతం సిలబస్ ఇంగ్లీషులో, 50 శాతం సిలబస్ తెలుగులో బోధించాలి. సిలబస్ అన్ని స్కూళ్లకు ఒకటే ఉండాలి అనే వాదన కూడా చెయ్యగలిగే పరిస్థితి లేదు. ఇలా జరిగిన్నట్లైతే మనం దాన్ని రెండు కాళ్ళ విద్యావిధానం అని చెప్పవచ్చు. ఆ విద్య భాషపరంగా రెండు కాళ్ళదైతే భావం పరంగా ఒకే శరీరం కలిగినదై ఉండాలి. అయితే సిలబస్‌ను - సైన్సు, సోషల్సైన్సు - రెండు భాగాలుగా విభజించాలి. ఈ రెండు భాగాల్లో ఉత్పత్తి సైన్సుకు, పారిశ్రామిక సైన్సుకు సమవాటా ఉండడం అవసరం. విద్యార్థులకు స్కూలు ఎడ్యుకేషన్ దశలోనే సామాజిక శాస్త్ర అవగాహనను, (గ్రామాలు, పట్టణాలు, కులాలు, వర్గాలు, (స్త్రీలు, పురుషులు మొదలగు
130 భాష - బహుజన దృక్పథం అంశాలపై రెండు కాళ్ళపై నడువగలిగే అవగాహనను అందించాలి. తాత్విక పునాదులు లేకుండా బలమైన సైన్సు పునాదులు పడవు. తత్వశా(స్తంలోగాని సైన్సులోగాని అబ్స్త్రాక్ట్గా ఆలోచించడం ప్రధానం. అబ్స్ల్టాక్ట్ ఆలోచనలోనే తాత్వికత పెరుగుతుంది. మనదేశంలో లెక్కలకు మంచి పునాది ఉన్నదని చాలామందే చెబుతుంటారు. కాని లెక్కలు నేర్చే విధానం బట్టీపట్టే విధానంతో ముడివడి ఉన్నది. క్రియేటివ్ మ్యాథమెటిషియన్హు మన దగ్గర ఎక్కువ మంది పుట్టలేదు. యూరప్, అమెరికా దేశాల్లో అభివృద్ది చెందిన క్రియేటివ్ మ్యాథ్స్ మన దగ్గర రూపొందలేదు కనుకనే (క్రియేటివ్ ఫిజిక్స్, క్రియేటివ్ కెమిష్ట్రీ అంతగా అభివృద్ధి చెందడం లేదు. (గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలను, పట్టణ పారిశ్రామిక రంగాలను సమానస్థాయిలో సాఠ్యాంశాల్టోకి తీసుకురావాలి. అందుకు (గ్రామీణ వ్యవస్థ మీద ఇప్పటివరకు జరిగిన రిసెర్చ్ చాలదు. స్కూలు పుస్తకాలను సంపూర్షంగా మార్చాలంటే పరిశోధనా రంగంలో చాలా కృషి జరపాల్సి ఉంది. భాషతో పాటు, భావాన్ని కూడా గణనీయంగా మార్చితేనే మన విద్యా వ్యవస్త రెండు కాళ్ళ మీద నిలబడుతుంది. సూర్య = 24 ఫిబ్రవరి, 2008
ర.
సిబిఎస్ఈః సిలబస్‌కు వ్యతిరేకత ఎందుకో?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6500 హైస్కూళ్ళను తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తూ ఒక జిఓ తెచ్చింది. ఆ జీఓలో ఈ సంవత్సరం నుండి 6వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్‌తో ఇంగ్షీష్ మీడియం బోధన (ప్రారంభమవుతుందని చెప్పింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ కొన్ని ఉపాధ్యాయసంఘాలు, కొంతమంది ఉపాధ్యాయ ఎంఎల్సీలు ప్రచారం (ప్రారంభించారు. కొంతమంది సీబిఎస్ఈ సిలబస్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, ఇంగ్రీష్ మీడియంను కాదని, కొంతమంది రెంటినీ వ్యతిరేకించాలని వాదిస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన జరుగాలని గత కొంతకాలంగా కొన్ని ఉద్యమాలు, వాదనలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. చివరికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు ఏదో ఒక పేరుతో వ్యతిరేకించడం శోచనీయం. ఈ నిర్ణయాన్ని (పైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ అసోసియేషన్లు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్ళు (ప్రైవేటు ఇంగ్రీషు మీడియం స్కూళ్ళ విద్యా వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశముంది. రాష్ట్రంలోని 'వైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు స్టేట్ సిలబస్‌తో అరకొర టీచర్లతో, ఇచ్చీ ఇవ్వని జీతాలతో లాభాలు పొందుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. అందుకని ప్రభుత్వ స్కూళ్ళలో సిబిఎస్ఈ సిలబన్ వచ్చిందంటే (ప్రైవేటు స్కూళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది.
సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సంస్థ కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్‌ను ప్రతిపాదిస్తుంది. ఇది ఎక్కువ మోతాదులో ఎన్.సి.ఇ.ఆర్.టి. వారు తయారుచేసిన పుస్తకాల ఆధారంగా సిలబస్‌ను రూపొందిస్తుంది. ఈ పాఠ్యపుస్తకాల స్టాండర్డ్ మిగతా సిలబస్ పుస్తకాల స్టాండర్డ్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సిలబస్ చాలా వరకు మంచి ఎక్స్‌పర్ట్స్‌తో రాయించినది. ఈ సిలబస్ తాము చెప్పలేమని
131
132 భాష - బహుజన దృక్పథం టీచర్జు. వాటి సంఘాలు, వాటి నాయకులు వ్యతిరేకిస్తున్నారా? లేక దాని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా చూడాలి.
ఈ ఇంగ్లీషు మీడియం స్కూలు విద్యావిధానంతో ప్రత్యేక ఇంటర్మీడియట్ కాలేజీల విధానం కూడా రద్దవుతుంది. ఈ విధానంలో 65వ తరగతి నుండి 12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నట్టు కంటిన్యువస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సిలబస్‌లో క్యాస్, క్లాస్‌కు మధ్య సంబంధం, కంటిన్యుటీ ఉంటాయి. ఈ వ్యవస్థను (గ్రామీణ (ప్రాంతంలో అంత పెద్ద సంఖ్య గల స్కూళ్ళలో, ఒక ప్రతిపత్తి గల స్టాండర్స్‌తో నడపడం కొంచెం ఇబ్బందితో కూడుకున్నదే అయినా ఇది విద్యాసమానత్వం వైపుకు దారితీసే ఒక గొప్ప విద్యావిధానం. దీనిని చాలా శక్తులు వ్యతిరేకించే అవకాశముంది.
అందులో మొదటి శక్తి ఉపాధ్యాయ సంఘాలు. ఈ సంఘాలు ఇంగ్లీషు మీడియంలోకి విద్యా విధానాన్ని మార్చడాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానంలో పాఠాలు చెప్పాల్సి రావడమే కాకుండా, ఈ విధానం తమ పిల్లల చదువును, తాము పాఠాలు చెప్పే బీద పిల్లల చదువును ఒకే స్థాయికి తెస్తుంది. అప్పుడు వాళ్ళు (గ్రామాల్లో ఉండక పట్టణాల్లో జీవించాల్సిన అవసరాన్ని (ప్రశ్నిస్తుంది. ఆ విధానం మారాల్సి వస్తుంది. ఇక రెండవది, తాము నిత్యం పారంతో కుస్తీ పడితే తప్ప ఇంగ్రీషు పాఠాన్ని బోధించడం సాధ్యం కాదు. ఆ కృషి తెలుగుమీడియంలో అవసరం లేదు. దీనికి తోడు సిబిఎస్ఈ సిలబస్ వస్తే పాఠాలు కాస్తా ఉన్న స్టాండర్స్స్లో హేతుబద్ధంగా ఉంటాయి. ఆ పాఠాలు చెప్పడానికి తప్పక అదనపు శ్రమ అవసరం. చాలామంది టీచర్జు బిఎడ్ డిగ్రీ ఉన్నప్పటికీ దాదాపు పూర్తిగా ఇంగ్రీషును మర్చిపోయిన స్టితి ఉంది. వాళ్ళు ఇప్పుడు పిల్లలకు చెప్పడానికి వాళ్ళే పిల్లలై చదువుకోవాలి. ఇన్ని కష్టాలు ఉన్నా ఈ కొత్త కష్టాల సముద్రంలోకి ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని తోయకుండా ఈ రాష్ట్ర ప్రజల జీవనంలో మార్పు తేలేము. ఈ మార్పు అవసరం, అనివార్యం.
ఈ విధానానికి ప్రైవేటు స్కూళ్ళు చాలా బలంగా అడ్డుపడుతాయి. రాష్ట్రంలోని మొత్తం (ప్రైవేటు ఇంగ్లీషు - తెలుగు మీడియం స్కూళ్ళు సంక్షోభంలో పడుతాయి. ప్రభుత్వ స్కూళ్ళపై ఒత్తిడి పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడుతాయి. రాష్ట్రంలో స్టేట్ సిలబస్‌తో నడిచే స్కూళ్ళని మార్చుకోవలసి వస్తుంది. అక్కడి టీచర్లు కూడా ఇంకొంత ఉన్నత స్టాండర్డ్‌లో పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టీచర్లకు జీతాలు పెంచాల్సిన పరిస్థితి కూడా వాటికి ఎదురవుతుంది. ఇంటర్మీడియట్ వ్యవస్థ (క్రమంగా రద్దు అవుతుంది. కనుక అన్ని స్కూళ్ళను 12వ తరగతి వరకు పెంచుకోవలసి వస్తుంది. అందుకని అక్కడ వసతులు, టీచర్జు పెరగాలి.
సిబిఎన్ఈ సిలబస్‌కు వ్యతిరేకత ఎందుకో? 133
ఇక మూడవది, (ఫైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల లాబీ ఈ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రకరకాల నిరసనలకు ఫైనాన్స్ చేస్తుంది. ఎందుకంటే లెక్కకు మించిన ఇంటర్మీడియట్ కాలేజీలు రాష్ట్రంలో విద్యావ్యాపారం చేస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్‌ను 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టడం ద్వారా మొత్తం విద్యారంగంలోనే మార్పు వస్తుంది.
క్రమంగా ఈ విద్యారంగం ఎంట్రెన్సుల వ్యవస్థను రద్దుపరిచే వైపుకు పయనించాలి. ఈ ఎంట్రెన్స్ విధానం వల్లనే ప్రైవేటు ఇనిస్టిట్యూషన్ల రాకెట్ ర్యాంకుల పేరుతో కోట్టు గడిస్తోంది. దానిని మొత్తంగా రద్దు పరిచి 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ట పంపిణీ అన్ని ్రీములలో జరగాలి. ఎంట్రెన్సుల మీద లక్షలు ఖర్చుపెట్టి రెండు, మూడు సంవత్సరాలు విద్యార్హులు ర్యాంకుల యుద్ధంలో మునిగి ఏ విధంగా థియరీ రాయలేని ఆబ్జైక్టు విధానానికి అలవాటుపడ్డారు.
ఎంట్రెన్సుల వల్ల విద్యార్దుల క్రియేటివ్ ఎబిలిటీస్ ఏమీ పెరగడం లేదు. ఈ అన్ని (స్టేములలో కూడా ఒక అఖిల భారత అడ్మిషన్ పాలసీని ముందుకు తేవలసి ఉంది. నేడు ఉపాధ్యాయ సంఘాలు, వాటి నాయకులు ఈ చిక్కుముడుల ఫ్రైవేట్ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. కనుక ఈ అన్ని సంస్థల (ప్రోత్సాహంతో ఈ కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తారు. దీనిని జాగ్రత్తగా పట్టాలకెక్కించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడే పట్టుదలతో ఉండాల్సి ఉంటుంది. ముందు 6వ తరగతి నుండి (ప్రారంభమయ్యే ఇంగ్లీషు మీడియం విద్యను కాపాడుకొని (క్రమంగా ప్రతి (గ్రామంలో కిండర్ గార్డెన్ స్కూళ్ళు, ఎల్‌కెజి, యుకెజి నుండి ఇంగ్లీషు మీడియం (ప్రారంభించాలి. అలా క్రమంగా (పైమరీ స్కూళ్ళనన్నింటినీ ఇంగ్రీషుమీడియంలోకి మార్చాలి. హైస్కూలు దశలో వచ్చే మార్పులు ఎదుర్కొనే సమస్యలు ప్రైమరీ విద్యారంగాన్ని కూడా ఇంగ్లీషు మీడియంలోకి మార్చడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఎస్సి. ఎస్టి. బిసి ఉద్యమాలు ఈ కొత్త విద్యావిధానాన్ని పట్టాల మీదికి ఎక్కేట్టు చూడాలి.
సూర్య - 15 జూన్, 2008
3ె5్ ఉన్నత విద్య నాణ్యత ఎలా
పెరుగుతుంది?
అభివృద్ధి చెందుతున్న దేశాల్జో చైనా మనదేశం ముఖ్యమైనవి. రెండింటి జనాభా చాలా ఎక్కువ. రెండుదేశాల్లో ప్రాచీన విద్యా పునాదులు కొంత ఉన్నాయి. మనదేశంలో కులవ్యవస్థ చెయ్యబట్టి ప్రాధమిక విద్య ఒకటి రెండు కులాలకు పరిమితమైంది. చైనాలో అన్ని వర్గాల్లో విద్య ఎంతోకొంత పునాదులు వేసుకుంది. కాని సైన్సు, సోషల్ సైన్సు రంగాలలో చైనా ఎప్పుడూ ముందుంటూ వచ్చింది. అందుకు (ప్రధానంగా అక్కడ బుద్ధిజం, కన్ప్యూసియజనిజం కలగలిసి హేతుబద్ధత, మూఢనమ్మకం కలగలిసి సైన్సు, మానవవిలువలు అభివృద్ది చెందాయి. అందుకే చైనాలో ఆధునికయుగం ప్రారంభం కాకముందే కంపాస్, గన్పొడర్, ప్రింటింగ్ మిషన్, పేపర్లను కనిపెట్టారు. కాని మనదేశంలో పరిస్థితి తలకిందులుగా తయారైంది.
కులవ్యవస్థ ఏ మాత్రం సైన్సు సమన్వయతను జరుగనివ్వలేదు, బుద్దిజాన్ని భూస్టాపితం చేశాక బ్రాహ్మణిజం సైన్సును చంపే అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. ఉన్నత విద్యారంగంలో మనదేశానికి చైనాకు ఉన్న (ప్రధాన తేడా అది. బ్రిటీష్ వలసరాజ్యం ఏర్పడ్డాక ఆధునిక శాస్త్రీయ విద్యావిధానం మనదేశంలో మెల్లమెల్లగా పునాదులు వేసుకున్నది. అయినా అదొక స్వతంత్ర (క్రియేటివ్ రూపాన్ని సంతరించుకోలేదు. సైన్సులోగాని, సోషల్ 'సైన్సులోగాని, ఇంజనీరింగ్, మెడిసిన్లోగాని మనం చైనాతో సరితూగగల ఇన్నోవేషన్లు (పరిశోధనలు) మనదేశంలో జరగడం లేదు. చైనా కంటే చాలా ముందుగా ఇంగ్రీషు భాష మనదేశంలో వేళ్లూనుకున్నది. కనుక ఆ భాష పునాదుల మీదనైనా మనం స్వంతశక్తిని సంపాదించుకోగలిగి ఉండాల్సింది. కాని గత 200 సంవత్సరాల్లో - ఇంగ్రీషు ఇక్కడ పునాదులు వేసుకున్నాక కూడా మన సోషల్ సైన్సు మౌలిక క్రియేటివ్ స్థాయికి చేరుకోలేదు. ఎక్కడైతే సోషల్ సైన్సు ఆ స్టాయికి చేరుకోదో మిగతా శాస్త్రాలు అభివృద్ది చెందడం సాధ్యం కాదు. అభివృద్ది చెందిన తత్వశాస్త్రంలేని దేశంలో బేసిక్ సైన్సు కాని, మెడిసిన్, ఇంజనీరింగ్ కాని అభివృద్ది చెందలేవు. ఉత్పత్తిలో
134
ఉన్నత విద్య నాణ్యత ఎలా పెరుగుతుంది? 135 పాల్గొనే (ప్రజలు, ఆ (ప్రజలతో నిరంతర సంబంధం ఉన్న లీజర్క్టాన్ పరస్పర అనుసంధానంలోకి అడుగుపెట్టకుండా తత్వశాస్త్రం బలమైన పునాదులు వేసుకోలేదు. ఉన్నత విద్యారంగం ఈ ఉత్పత్తి ప్రజానీకంతో ఒక కీలకమైన మి(త్రపూరిత అనుసంధానాన్ని రూపొందించుకుంటే మంచి తాత్వికశక్తులు ఇక్కడ పుట్టుకొచ్చేవి. కులవ్యవస్థ ఆ అవకాశాల్ని తెంపివేసింది. ప్రస్తుత ఉన్నత విద్యారంగం తత్వశాస్త్ర పునాదులు లేని కుల రోగ లక్షణంతో నడుస్తున్నది. ఏ లోతైన తత్వశాస్త్ర చర్చ అయినా మనకు సాధారణంగా అర్ధం కాదు. తాత్విక లోతుల్ని అర్హం చేసుకోలేని ఉపాధ్యాయులుగాని, విద్యార్భులుగాని ఎకనామిక్స్, పాలిటికల్సైన్సు, చరిత్ర మరే ఇతర సామాజికశా(స్తాలను కూడా లోతుగా తాత్వీకరించలేదు. బలహీనమైన భాషల్లో - అంటే పదకోళపుపట్టు, విసృతిలేని, తెలుగు, కన్నడ, హిందీ వంటి భాషల్లో ఉన్నత విద్యసాగుతే అందుకే విద్యావేత్తల్లో లోతైన తాత్విక పునాదులు పడడం అసంభవం. అందుకే ఈ దేశంలో ఉన్నతవిద్యనంతా తప్పకుండా ఇంగ్రీషు భాషలో నడపాల్సిందే. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇంగ్లీషు భాషపైన పట్టుగల ఉపాధ్యాయులు, విద్యార్థులు లేకపోవడం. ఈ సమస్యను యుద్రప్రాతిపదికపైన మనం అధిగమించగలగాలి.
మన యూనివర్సిటీల సాధారణ తాత్విక పునాదిని పెంచాలి. అందుకు స్కూలు విద్యనుండే బలమైన తాత్విక బీజాలు వెయ్యడం అవసరం. అదే సందర్భంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో బోధనావ్యవస్ట్రను సమూలంగా మార్చాల్సిన అవసరముంది. గ్రామాల్లో ఉన్న ఉత్పత్తిజ్ఞానం, తాత్వికత, మానవవిలువలను ఇంగ్రీషుభాషల్లో రాసిన పుస్తకాల్లో సమన్వయపరచాలి. ఇప్పుడున్న జ్ఞాన కరష్షన్, ఆర్థిక కరష్టన్లను (క్రమంగా అరికట్టుకుంటూ రావాలి.
ఉన్నత విద్యారంగాన్ని అధునాతన కంప్యూటర్ వెబ్ సిస్టమ్‌తో ముడేసి, విద్యార్థులు వెబ్ నుంచి చదవటం, ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానాన్ని ఏర్పర్చుకోవడం చాలా ముఖ్యం. సోషల్ సైన్సు రచనలను కూడా మారుమూల టౌన్లలో కంప్యూటర్ ముందు కూర్చొని నెట్ ద్వారా చదువుకోవచ్చు. కాని (గ్రామీణ ప్రాంతాల నుండి, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థులకు ఇంటర్నెట్కు సంబంధించిన పాఠాలు నేర్చుకునే అవకాశమే లేదు. అంటే ప్రతి ప్రభుత్వ స్కూల్లో మౌలిక కంప్యూటర్ ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పిల్లలు నేర్చుకోవడం అసాధ్యం. అంటే స్కూలు నుండి పిల్లలకు అన్ని రంగాల్లో జ్ఞానాన్ని అందించకుండా భవిష్యత్‌లో ఉన్నతవిద్యను ఒక బలమైన పునాదిపై నిర్మించడం కష్టం.
అదే సందర్భంలో పట్టణ (ప్రాంతాల్లో చదువుకునే అన్ని కులాల/వర్గాల పిల్లలకు
136 భాష - బహుజన దృక్పథం (గ్రామీణ ఉత్పత్తిరంగాలు, వాటిలో ఇమిడి ఉన్న సైన్సును నేర్పించాల్సిన అవసరమున్నది. కంప్యూటర్ జ్ఞానానికి, భూమి దున్ని విత్తనాలేసే జ్ఞానానికి, కుండలు చేసే జ్ఞానానికి, చెప్పులు చేసే జ్ఞానానికి సంబంధం ఉంది. కాగితం మీద లేదా కంప్యూటర్ మీద ఒక చెప్పు బొమ్మో, లేక ఒక కుండ బొమ్మో గీస్తే ఆ బొమ్మ నిజమైన కుండ ఊహాచిత్రం మాత్రమే. ఆ ఊహాచిత్రాన్ని ఎక్కువ (క్రియాశీలకంగా గియ్యాలంటే నిజమైన కుండను లేదా చెప్పును జా(గ్రత్తగా పదిసార్హు అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చెయ్యడమంటే ఒక్క పుస్తకాన్ని అధ్యయనం చెయ్యడమే కాదు. ప్రతి వస్తువును అధ్యయనం చెయ్యడం విద్యార్థులు నేర్చుకోవాలి. ఉత్పత్తిజీవనం, పనిముట్ల అభివృద్ది, వాటికి సంబంధించిన అధ్యయనం స్కూలు స్థాయిలో, వాటిని మార్చి ఆధునికీకరించే పరిశోధన యూనివర్సిటీలో సాగాలి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధమున్న పనులు, సామాజిక శాస్త్రాలను కూడా ఈ పద్ధతి ద్వారానే సంపూర్ణంగా మార్చవచ్చు. ఈ కీలకమైన మార్పుకు విశ్వవిద్యాలయాలు చర్చాకేంద్రాలుగా మారాలి. ఈ చర్చ సోషల్ సైన్సులో ముందు (ప్రారంభం కాకుండా "సైన్సు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాలను (ప్రభావితం చెయ్యలేము. ఇప్పుడు యూనివర్సిటీ టీచర్జు, విద్యార్థులు జ్ఞానం అంటే పుస్తకాల కొటేషన్లలో చేస్తున్నారు. పుస్తకానికి మానవ జీవితానికి, తత్వశాస్తానికి ఉన్న సంబంధాన్ని నిర్షిష్టంగా రూపొందాలి. అందుకు చదివి, పరిశోధించి, ఆచరణలోకి మార్చే సంస్థలుగా యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సిన అవసరముంది. యూనివర్సిటీల తాత్విక పునాదిని మార్చకుండా వాటి సాధారణ అభివృద్ధిని సాధించడం కష్టం. సూర్య - 17 ఫిబ్రవరి, 2008
చాప్టర్ - *ే/ అ కామ్రేడ్స్ 36. కమ్యూనిస్టుల ప్రైవేట్ డిజైర్ 37. భూ పోరాటానికి మించిన చదువు సోరాటం 38. కమ్యూనిస్టులు ప్రభుత్వంలో ఎందుకు చేరాలి?
36 కమ్యూనిస్టుల ప్రైవేట్ డిజైర్ ల్ జే
“ప్రపంచీకరణను వ్యతిరేకిద్దాం', 'పైవేటీకరణను (ప్రాణాలొడ్డి అడ్డుకుందాం' అని కమ్యూనిస్టు ఉద్యమంలోని ప్రతి నాయకుడు ఉపన్యసిస్తూనే ఉంటాడు. మీటింగులో కూర్చున్న ప్రతి కార్యకర్త తన ప్రాణం పోయినా మంచిదే కాని (ఫైవేటీకరణను వ్యతిరేకిస్తానని తనలో తాను శపధం చేస్తూ ఆలోచిస్తుంటాడు. నాయకుడు పెద్దనాయకుడైన కొద్దీ, కార్యకర్త నాయకుడుగా ఎదిగిన కొద్దీ తనకో కొడుకో, బిడ్డో ఉంటే తన స్థాయిని బట్టి బాగా చదివించాలని కలలు కనడం సహజం. ఆ బిడ్డో కొడుకో ఫ్రైవేట్రంగం స్కూళ్లో చదవాలా, ప్రభుత్వరంగం స్కూల్లో చదవాలా అనే ప్రశ్న వచ్చేసరికి, ఈ రాష్ట్రంలోని, లేదా ఈ దేశంలోని ఏ పప్రభుత్వస్కూల్లోనైనా తమ పిల్లల్ని చదివించాలనే ఆలోచన తన కుటుంబానికి ఎంతో అన్యాయం, ద్రోహం చేసేదిగా కనిపిస్తుంది ఎందుకు? ప్రైవేటు, ప్రభుత్వరంగాల్లో విద్య ఎంతో తేడాతో కూడుకొని ఉన్నది కనుక!
మన జీవితంలో ఒక సంస్థ పట్ల ఉండే గౌరవం, (ప్రేమ మన చిన్నతనం నుండీ రూపుదిద్దుకుంటాయి. మనం ఏ స్కూల్లో చదివామో ఆ స్కూలు జ్ఞాపకాలు జీవితాంతం మిగిలి ఉంటాయి. ప్రభుత్వరంగంలో ప్రపంచస్థాయి జ్ఞానాన్ని, డిసిస్లైన్ను, విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచితే ఆ స్కూలు పట్టనే కాక ప్రభుత్వం పట్ల కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. లేదా పైన చెప్పిన అంశాలన్నింటినీ (ప్రైవేటు స్కూలు ఇస్తే ఆ స్కూలు పట్ట, దాన్ని నడిపే యాజమాన్యం పట్ట ఆదరణ పెరుగుతుంది. ప్రైవేటీకరణను వ్యతిరేకించే కమ్యూనిస్టులంతా తమ పిల్లల్ని ప్రైవేట్‌రంగం స్కూళ్ళలో చదివిస్తున్నారా. (ప్రభుత్వరంగం స్కూళ్ళలో చదివిస్తున్నారా అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎఫిషియన్సీ, టైనింగ్, డిసిస్లైన్ రావాలంటే తమ పిల్లల్ని (ప్రైవేట్ స్కూల్లోనే చేర్చాలని ఒక కమ్యూనిస్టు నాయకుడు ఎంఎల్ఎ, ఎంఎల్సే, ఎంపిగా ఉన్నా తన భార్యతో చర్చించి లేదా చర్చింక (ప్రైవేటు స్కూల్లో తన 3 సంవత్సరాల కొడుకుని/కూతుర్ని చేరిస్తే ఆ నాయకుడు ఏ రంగాన్ని
139
140 కామ్రేడ్స్ తన వైల్డ్ మెదడులో నూరిపోస్తున్నట్టు? ఏ రంగం గొప్పదని తన భార్యకు, పిల్లలకు చెబుతున్నట్టు? లేదా చాలామంది కమ్యూనిస్టు నాయకులు పిల్లల్ని (ప్రైవేటు రంగంలో పెట్టడానికి తన భార్య కారణమని చెబితే, ఆ భార్య తన పిల్లలకోసం ఆ రంగాన్ని ఎందుకు ఎన్నుకుంటోందో చూడాలి కదా? తాను తీసుకొన్న ద్వంద్వ వైఖరికి భార్యను బలిపశువును చేసే కమ్యూనిస్టు నాయకుల్ని మనం చాలామందినే చూశాం. భార్య బలవంతాన తమ పిల్లలు (ప్రైవేటు, ఇంగ్రీషు మీడియం స్కూళ్ళలో చదువుకొని రివ్వున ఆకాశానికెగిరి అమెరికాలో దిగితే, ఎంతమంది కమ్యూనిస్టు నాయకులు ఆ ఎగురుడును చూసి ఆనందించడం లేదు? అమెరికా పట్ట ద్వేషం తమ పిల్లలకొచ్చేవరకు పనిచెయ్యదు.
విద్యారంగం పబ్లిక్క్ (ప్రైవేట్ స్టాండర్డ్ వ్యత్యాసాలతో ముడిపడి ఉన్నది. రెండవది ఈ రెండు రంగాల్టోని మీడియా తేడాతో ముడిపడి ఉన్నది కూడా. (పైవేటు స్కూళ్ళు, అందులోని ఇంగ్లీషు (బ్రిటీష్ వలసవాదం, అమెరికన్ సామాజ్యవాదంతో ముడేసి ఈ రెండింటిని ప్రాణాలొడైనా ఎదిరించాలనే నాయకులు, తమ పిల్లల జీవిత మార్గం వచ్చేవరకు సరిగ్గా పెట్టుబడిదారీ వ్యవస్థ (పైవేటు స్కూలును, సామ్రాజ్యవాదపు ఇంగ్రీషును తమ పిల్లల (ప్రాణవాయువుగా ఎందుకు చేస్తున్నారు? కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నడిచే ఉపాధ్యాయనాయకులు సరిగ్గా ఇదే మార్గాన్ని తమ పిల్లలకెన్నుకొని (శ్రామికవర్గానికి ప్రభుత్వరంగం విద్య గొప్పతనం గురించి ఎందుకు చెబుతున్నారు? సామ్రాజ్యవాద సంతతి అయిన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను తమ పిల్లల ఆయువుపట్టుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? కమ్యూనిస్టు నాయకుల, కార్యకర్తల, ఉపాధ్యాయుల పిల్లలు, శ్రామికవర్గం పిల్లలు చదివే (గ్రామ, పట్టణ, ప్రభుత్వ స్కూళ్ళలో లేకుండా ప్రభుత్వరంగంలో 'కామ్రేడరీషివ్'ని ఎలా నిర్మిస్తారు? తమ పిల్లలు (ఫైవేట్ స్కూళ్ళలో, తాము నాయకత్వం వహించే శ్రామిక వర్గం (ఈ దేశంలో (శ్రామిక కులాల) పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతుంటే ఈ విధానాన్ని మార్క్స్ చూసి సంతోషించాలా, ఆయన తన గోరీలో తలకిందులు కావాలా?
ఈ (ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళ మధ్య ఎనలేని వ్యత్యాసాన్ని కలిగించేది ఇంగ్లీష్ విద్య, ఇంగ్రీష్ సంస్కృతి. ఇంగ్లీష్ విద్యతో పాటే ఇంగ్లీష్ సంస్కృతి ముడిపడి ఉంటుంది. కిండర్ గార్టెన్ నుండి చైల్డ్టై కట్టుకోవడం, యూనిఫామ్ వేసుకోవడం, ఇంగ్లీష్ సంస్కృతి నుండే ఈ దేశానికి వచ్చింది. ఆ సంస్కృతినే అంబేద్కర్ తన రాజకీయ జీవితానికి కూడా అనువదించుకున్నారు. అందుకే ఆయన అనునిత్యం సూట్ అండ్ బూట్లో జీవించాడు. ఏదైనా ఇంగ్లీష్ మీడియం స్కూలు యాజమాన్యం గాంధీ (డ్రెస్‌లో, లేదా పుచ్చపల్లి సుందరయ్య డ్రెస్‌లో స్కూల్ నడిపితే కమ్యూనిస్టులైనా తమ పిల్లల్ని ఆ స్కూలుకు పంపుతారా? 1980 దశకం (ప్రారంభంలో అంబేడ్కర్ గురించి చర్చ వచ్చినప్పుడు
కమ్యూనిస్టుల (ప్రైవేట్ డిదైర్ శత] సూట్-బూట్ వేసుకున్నందుకు ఆయనను వలసవాదుల బంటుగా చూపించిన నాయకులు, సుందరయ్యను సగం గాంధేయ సింప్లిసిటీకి ప్రతినిధిగా చూసిన వారు కూడా తమ పిల్లల్ని మాత్రం అంబేడ్కర్ (డ్రెస్‌లోనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపేవారు. ఒక్క నాయకుని కొడుకుని కూడా సుందరయ్య (డైస్లో స్కూలుకు పంపగా నేను చూడలేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు కమ్యూనిస్టు పార్టీల కేంద్ర నాయకులు అంబేద్కర్ డ్రెస్ వేసుకుంటున్నారు. కొంతమంది కేంద్రనాయకులు అంబేద్కర్‌లా ఇంగ్రీష్లోనే మాట్టాడుతున్నారు. కాని ఆ భాషను, ఆ డడ్రెన్ను దేశంలోని అందరు పిల్లలకు అందుబాటులోకి తేవాలని అనుకోవడం లేదు. ఆ చర్చ ముందుకొచ్చినప్పుడల్హా సామ్రాజ్యవాద భాషను ప్రభుత్వ స్కూళ్ళలో ఎలా బోధిస్తారని వాళ్ళ విద్యార్థి సంఘాలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. ఆ రాజకీయ నిర్మాణంలో పుట్టి పెరిగిన ఉపాధ్యాయ నాయకులు (ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్రీష్ మీడియం పెట్టడాన్ని అమెరికా సా(మ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించినంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని తను పిల్లల్ని మాత్రమే ఇంగ్టీసులో చదివించి ఆ సామ్రాజ్యవాద దేశానికి ఎంతో గర్వంతో పంపుతున్నారు. తమ పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మిగతా పిల్లలందరికీ అదే చెందాలని కోరుకోని వ్యక్తి కమ్యూనిస్టు ఎట్టా అవుతాడు?
(ప్రైవేటీకరణ వ్యతిరేకత పబ్లిక్ స్టేట్మెంట్: కాని (ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంలో చదివించడం వారి ప్రైవేట్ డిజైర్. ఈ (ప్రైవేట్ డిజైర్ పుల్ఫేల్ చెయ్యడం వారి కుటుంబ లక్ష్యం. కాని ఆ ఇంగ్రీషు విద్య అనే ఆస్తి అందరికీ రాకుండా చూడడం వీరి పబ్లిక్ సంస్థ లక్ష్యం. ఈ రెండు లక్ష్యాలు ఏకరూపం తీసుకోవడానికి ఒకే ఒక మార్గ ముంది. పబ్లిక్ ('ఫైవేట్రంగంలో ఒకేరకమైన విద్యావిధానాన్ని రూపొందించడం, ఇంగీష్ మీడియం అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలను అందిస్తుంది కనుక ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇంగ్షీష్ మీడియం పెట్టాలని పోరాడడం. ఆ పార్టీల్లోని నాయకులపైన ఆ పార్టీలోని కార్యకర్తలు ఒక విద్యావిష్ణవం తేకుండా మాత్రం అది జరగనివ్వరు.
ఈ అంశంపై వారి సైలెన్సులోనే ఒక కౌంటర్ రివల్యూషన్ ఇమిడి ఉన్నది. వారి విద్యార్థి సంఘాలు పబ్లిక్, (ప్రైవేట్ స్కూళ్ళలో ఒకే మీడియం విద్య గురించి పోరాడడం లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో కిండర్ గార్జెనింగ్ విధానం ఉండాలని ఆడగడం లేదు. (గ్రామాల్లో (ప్రభుత్వ స్కూళ్ళు పిల్లల్ని వ్యాన్తలో తీసుకుపోయి వదిలిపెట్టాలని డిమాండ్ చెయ్యలేదు. (గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థపై అన్ని భాషల్లో పుస్తకాలు రాసి పిల్లలకు ఆత్మగౌరవ పాఠాలు చెప్పాలని అడగడం లేదు.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రైవేట్ డిజైర్ పాత్ర ఎంత ఉందో కాస్త లోతుగానే చూడాలి.
సూర్య - 10 ఫిబ్రవరి 2008
త్రో భూ పోరాటానికి మించిన చదువు పోరాటం ఇంకొద్ది రోజులకు ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక వస్తుంది. ఆ ఎన్నికల్లో నీ జీవితాన్ని మార్చేందుకు ఉన్న ఒకే ఒక మార్గమేదో ఆలోచించు. నువ్వు ఒక మారుమూల (గ్రామంలో జీవిస్తున్నావు, నువ్యో కూలి పని చేస్తున్నావు, లేదా తోలుపని చేస్తున్నావు. లేదా గొర్రెలు కాస్తున్నావు, లేదా ఊరివారందరివి బట్టలుతుకుతున్నావు. అదే పనిని నీ చైల్డ్ అంటే - నీ బిడ్డ గాని, కొడుకుగాని చెయ్యాలా? అంతే ఆదాయంతో బతకాలా? నీ పిల్లలు కూడా నువ్వుంటున్నటువంటి గుడిసెలోనే ఉండాలా? లేదు! ఆ స్థితి మారాలి. దానికి ఒకే ఒక మార్గం, నీ పిల్లలకు చదువు కావాలి. అది (ప్రభుత్వ స్కూల్లో ఉచితంగా దొరకాలి. అదిప్పుడు తెలుగులో మాత్రమే ఉంది. తెలుగులో చదువుకుంటే నా పిల్లలకు మంచి బతుకు ఉండదా అని నువ్వు అడగొచ్చు. ఉండదు అనేదే నీ అభిప్రాయం. ఎందుకుండదో తెల్సుకోవాలంటే మీ ఊరు బడిలో చదువు చెప్పే టీచర్ని ఖచ్చితంగా ఆడగాలి. ఏమని అడగాలి? 'సారు! నీ పిల్లల్ని ఏ భాషలో చెప్పే బడిలో చదివిస్తున్నావు? నీ పిల్లలు కూడా ఈ బడిలోనే చదువుతున్నారా?" 'లేదు నా పిల్లలు సిటీలో ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నా'రనే గర్వంతో కూడిన సమాధానమొస్తుంది. మరైతే మా పిల్లలకు కూడా ఈ బడిలో ఇంగ్లీషు చెప్పమని అడుగు. అతను కాస్త నీళ్ళు మింగి ఇంగ్లీషు మన భాష కొదు కనుక ఇక్కడ చెప్పరు. మన ప్రభుత్వం మన మాతృభాపైన తెలుగులోనే విద్యాబోధన జరగాలని నిర్ణయించిందని నీకో ఉపన్యాసమిస్తాడు. 'ప్రభుత్వమంటే ఎవరు?” అనే ్రళ్ళీ నువ్వు మామూలుగానే అడుగుతావు. “ప్రభుత్వం "హైదరాబాద్‌లో ఉంటుంది. మన ఊరికి సర్పంచిలాగే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయనను ఎన్నుకునేందుకు మన ప్రాంతపు ఎమ్మెల్యే ఉంటాడు. ఆ నిర్ణయాలన్నీ అక్కడ తీసుకోవాలి, నేను కాదు" అంటాడు. మరి (ప్రభుత్వం ఇంగ్లీషులో చెప్పమంటే నువ్వు చెప్పుతావా అని అడుగు. అది మా అసోసియేషన్ నిర్ణయిస్తుందని తప్పుకుంటారు. 142
భూ పోరాటానికి మించిన చదువు పోరాటం 143
అక్కడి నుండి నేరుగా సర్పంచ్ దగ్గరికి పో, 'సర్పంచ్ సారు! మన ఊరి ప్రభుత్వ బడిలో ఇంగ్లీషులో చదువెందుకు చెప్పరు?" అని ఆయన్ని అడుగు. ఇంగ్లీషు (పైవేటు చదువు, అది ప్రభుత్వ చదువు కాదు అంటాడు. ప్రభుత్వ బడిలో ఇంగ్లీషు చెబితే పిల్లలకు రాదా? అని అడుగు. మన ప్రభుత్వం తెలుగులోనే చెప్పాలని నిర్ణయించింది. మన ఎంఎల్ఎలు మన మంచికోసమే తెలుగులో చదువు కొనసాగాలని నిర్ణయించారు. మన మంత్రులు, ముఖ్యమంత్రి అంతా మన మంచి కోసమే తెలుగులో ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారని ఆయన ఉపన్యాసమిస్తాడు. మరి నీ పిల్లలెక్కడ చదువుతున్నారని అడుగు. (ప్రైవేటు ఇంగ్రీషు మీడియం స్కూల్లో, రోజు ఆటోల పొయ్యివస్తున్నారని ఆయన గర్వంగానే చెబుతాడు. మన ప్రభుత్వ స్కూళ్ళోనే ఇంగ్లీషు మీడియం పెట్టించి మీ పిల్లల్ని కూడా అందులోనే పెట్టొచ్చు కదా అని అడుగు. అదయ్యేది కాదు. ప్రభుత్వ మొప్పుకోదు, మనసార్హు చెప్పరు అని తప్పుకుంటాడు.
ఎన్నికల చర్చ మొదలైంది కనుక ఏదో ఒకరోజు ఎమ్మెల్యే ఊరికొస్తాడు. ఆయన రాకను కాస్త కనిపెట్టుకొని ఉండు. ఆయన వస్తున్నాడని తెలవగానే కాపలా కాసి ఉండు. ఆయన చుట్టూ అంతా నాయకులుంటారు. నిన్నాయన దగ్గరికి పోనియ్యకుండా చూస్తారు. ఆయన దగ్గరికి చొచ్చుకొని పో, ఎమ్మెల్యే, నా పిల్లలు ఇక్కడి (ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. అక్కడ తెలుగులో చెప్పుతుండ్రు. ఇంగ్లీషులో చదువుకుంటే ఉద్యోగాలు తాందరగొస్తయట. మా స్కూల్లో కూడా ఇంగ్లీషు మీడియం పెట్టించమని అడుగు. ఎమ్మెల్యే నువొక్క పిచ్చివాడివి ఇక్కడికి ఎట్లావచ్చావన్నట్టు కండ్లెర్రజేసి చూస్తడు. ఓ పిచ్చోడా! ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీషు మీడియం ఎట్ల చెప్పుతరు అని నీకో అడ్డు ప్రశ్న వేస్తాడు. ఎన్నికల టైమ్ కాకపోతే ఆయన కాపలా ఉన్న పోలీసుతో నిన్ను గెంటిస్తరు. కాని ఎన్నికలొస్తున్నాయంటే అట్టా చెయ్యడు. ప్రభుత్వ స్కూల్లో చెబితే ఇంగ్లీషు రాదా అని అడుగు. సర్పంచ్ నిన్నాపజూస్తడు. ఆగమని ఆయన్ని అదలాయించి ఈ ప్రశ్న అడుగు.
తెలుగు మన ఇంటిభాష ప్రభుత్వం ఇంటి భాషలో చదువు చెప్పిస్తుంది గాని పరాయి భాషలో ఎట్లా చెప్పిస్తుందని నీకో ఇంటి భాష ఉపన్యాసమిస్తాడు ఎమ్మెల్యే, మరి సారు, నీ పిల్లలు ఇంటి భాష చెప్పే బడిలోనే చదువుతున్నారా అని అడుగు. ఆయన ఇంటిమీద నువ్వొక బిడుగు పడేసినంత కోపమొస్తుంది. కండ్లెర్రజేసి చూస్తాడు, తన చుట్టూ ఉన్న చంచానాయకుల చుట్టూ చూస్తాడు. వీడేందో కొత్త సమస్య తెస్తాండు అని గంటెలాంటి ఎమ్మెల్యే, చంచాలంటి చుట్టున్న నాయకులు కోపంతో ఊగిపోనారంభిస్తారు. ఇక్కడున్న సార్లంతా తమ పిల్లగాండ్లను తెలుగుబడిలో చదివిస్తాండ్రా, ఇంగ్లీషు బడిలోనా అని కాస్త కండ్లైర్ర చేసి అడుగు. వాళ్ళు ఇంకా కోపంగా చూస్తే నువ్వూ తన వైపు కోపంగా చూడు, ఈ ఊరి (ప్రభుత్వ బడిలో ఇంగ్లీషులో చదువుచెప్పకుండా ఓట్టడగడానికి
[ఉత కామేడ్స్ రావద్దాను. అదీ పిల్లగాండ్లను మూడో ఏటి నుండే బడిలో చేర్చుకోవాలె. మీ పిల్లలకేమో కిండర్ గార్టెన్, మా పిల్లలకేమో దుమ్ము గార్టెనా. మూడో ఏటి నుండే మా పిల్లలంతా బడిలుండాలే. వాల్లను తీసుకుపోవడానికి ఊరూరా వ్యానులుండాలె. పిల్లలకు రంగుల గురించి చెప్పే పటాలు స్కూల్లో ఉండాలె. అప్పుడే మీ రంగు బయటపడుద్ది. లెక్కలు చెప్పే పటాలుండాలె. అప్పుడే మీ మోసపు లెక్కలు ఆగిపోతయి. పండ్ల గురించి చెప్పే పటాలుండాలె. అప్పుడే మీరు తినే పండ్లు కొన్ని మా ఇండ్లకొస్తయి. జంతువుల గురించి చెప్పే పటాలు స్కూల్లో వేలాడాలే. అప్పుడు మీ జంతు లక్షణం బయటపడుద్దీ. ఇంగ్లీషు మీడియం చదువు, కిండర్ గార్టెన్ బడుగుల సంగతి తేలకుండా ఓట్టు అంటే బాగుండడది అని ఉపన్యామిచ్చిపో. ఈ తల నాప్పేందని నాయకులందరూ తలపట్టుకుంటారు. సాధారణంగా (ప్రపంచ ప్రజాస్వామ్యాల్లో మొత్తం ప్రభుత్వ బడ్జెటులో 16 శాతం. విద్యారంగం మీద పెడతారు. అందులో దాదాపు 10 శాతం స్కూలు విద్య మీద పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం లక్షకోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అందులో 10 శాతమంటే 10,000 కోట్ల రూపాయలు. మన రాష్ట్రపు పాఠశాల విద్య మీద ఖర్చుపెడితే అందరి పిల్లలకు 3వ సంవత్సరం నుండే మంచి కిండర్ గార్టెన్ విద్యను, బీద పిల్లలకు ఉచిత తిండిని, వాళ్ళను ఇంటి నుండి తీసుకుపోయి తిరిగి ఇంట్లో దింపే వ్యవస్థను రూపొందించవచ్చు. అందరు పిల్లలు ఒకే సిలబస్ చదువుకునే విధానాన్ని మనం రూపొందించుకోవచ్చు. కిండర్ గార్టెన్ స్కూల్ సిస్టమ్, ఇంగ్రీషు మీడియం చదువు పోరాటం - భూపోరాటం కంటే కూడా చాలా ముఖ్యమైంది. మనరాష్ట్రంలోని పిల్లలందరు మంచి చదువు, మంచి తిండి, మంచి (డడ్రెస్కు అలవాటు పడితే అన్ని సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. ప్రతి ఛైళ్డ్లో ఒక మేధావి దాగి ఉన్నాడని మర్చిపోకండి. పోండి, పోరాడండి. సూర్య - 23 డిసెంబర్, 2007
చర
కమ్యూనిస్టులు ప్రభుత్వంలో ఎందుకు చేరాలి?
కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా ఈ దేశంలోని సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిమ్న కులస్థులు తమను తాము రక్షించుకున్నారు. మతతత్వ ఎన్‌డిఎ పట్టణ నగర ప్రజలైన ఉన్నత మధ్యతరగతి మాత్రమే వెలిగిపోయేలా, పేదలు ఆకలి చావులకు గురయ్యేలా ఆర్థిక గమనాన్ని తీర్చిదిద్దింది. అదృష్టవశాత్తూ ఈసారి, ఖ్ వెలిగిపోయే వర్గానికి ఓటు వేసేందుకు తీరిక లేకపోయింది. పేదలు, నిమ్నకులస్టులు అధికసంఖ్యలో వెళ్ళి ఓట్టు వేసి బ్రాహ్మణీయ (ప్రభుత్వాన్ని పరాజయం పాలు చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ, హిందీ భాషా ప్రాంతాలలో పటిష్టమైన ఓటు బ్యాంక్ కలిగిన దళిత బహుజన పార్టీలు, అవినీతి మరక అంటకుండా, తమ వర్గ రాజకీయాలనే అంటిపెట్టుకుని ఉన్న కమ్యూనిస్టులు కలసి నిర్మించిన ఒక సరికొత్త కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది దేశ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేయగల కూటమి అన్నది నిస్సందేహం.
కుప్పకూలిన ఆర్థికత
1977, 1989, 1999 సంక్షీర్ష ఎన్నికల ఫలితాలతో పోల్చితే ఈ ఎన్నికల ఫలితం విభిన్నమైన దిశను సూచిస్తోంది. ఇంతవరకు పాలించిన సంకీర్ణ ప్రభుత్వాలతో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలోని (ప్రభుత్వం అత్యంత ప్రగతిశీలమైనది. ఉత్తరప్రదేశ్, బీహార్లలోని నిమ్నకుల, రైతాంగ రాజకీయాలను కుదురుపరచిన మండల్ శక్తులకు ఈ (వ్రభుత్వవేఎ తౌరతీనింది. నిమ్న కులాలు, చేద వ్యవసాయ కులకు సంబంధించినంతవరకు 1999లోని ఎన్‌డిఎ ప్రయోగమే నికృష్టమైనది. ఈ హయాంలో వాళ్ళ ఆర్థికత కుప్పకూలిపోగా స్వల్ప సంఖ్యలో ఉన్న ప్రపంచీకృత వర్గం బాగా లాభపడింది. సాధారణ ప్రజానీకం ఈ కూటమికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేశం ముందు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని నిలిపారు. మొట్టమొదటిసారిగా దళిత, బహుజన, కమ్యూనిస్టు ఎంపీలు పార్లమెంటులో పెద్ద సంఖ్యలో కనిపించబోతున్నారు. భారతీయ కమ్యూనిస్టులు
145
146 కామ్రేడ్స్ కులం విషయంలో తగిన పాఠం నేర్చుకోగలిగితే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వారికి జనాదరణ మరింత పెరిగే అవకాశముంది.
కమ్యూనిస్టులు (ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకుని రెండో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. తమ పిడివాదపు రాజకీయాల నుంచి వారు బయటపడలేదని ఇది సూచిస్తోంది. కమ్యూనిస్టులు దేశ పాలనా ప్రక్రియలో భాగస్వాములైతే, తమ సామ్యవాద సిద్దాంతంతో రాజీపడకుండానే ప్రపంచీకృత పెట్టుబడి, ప్రపంచీకృత సంక్షేమ వాదాల మధ్య సమతూకాన్ని ఎలా నిలబెట్టాలో తెలుసుకోగలుగుతారు. సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలిన తర్వాత పరివర్తనకు లోనైన పెట్టుబడిదారీ విసృత సన్నివేశంలో కూడా నెహ్రూ తరహా ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలుచేయడం గురించి వారు ఆలోచించగలుగుతారు. ములాయంసింగ్, లాలూ్రసాద్, మాయావతి, రాంవిలాస్ పాళ్యాన్ వంటి నూతన సాంఘికళశక్తుల నాయకత్వాలకు - ఇంకోమాటలో చెప్పాలంటే - అంబేడ్కరీయులకు, లోహియావాదులకు పెట్టుబడిదారీ వాదం పట్ట బలమైన సైద్దాంతిక వ్యతిరేకత లేదు. కమ్యూనిస్టు ఆర్థిక నమూనా రూపొందినట్టుగా, అంబేడ్కరీయ ఆర్టిక నమూనా ఒక సంపూర్ణ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానస్ట్రాయికి పరిణమించలేదు. అందుకే వారు ఆత్మగౌరవ భావన కలిగించడం ద్వారాతమవము ఓటు బ్యాం కును నిలుపుకోగలుగుతున్నారు. హిందూత్వ శక్తుల ఆర్థిక, సాంఘిక విధ్వంస (క్రడనుంచి దానితోనే వారు దేశాన్ని రక్షించగలిగారు. కమ్యూనిస్టులు ప్రభుత్వంలో భాగస్వాములు కావడమంటే మార్క్సిజం, నెహ్రూవాదాల సమ్మేళనం జరగడమే. అప్పుడు వారు నూతన ఆర్థిక భావజాలంలో భాగంగా అంబేడ్కర్, లోహియావాదాలను అభివృద్ది చేయడంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. అంటే మార్క్సిజం, నెహ్రూ తాత్వికతలలోని సంక్షేమవాదానికి, సమాజాన్ని కులతత్వ రహితం చేసే ప్రక్రియను జత చేయడమన్నమాట.
కమ్యూనిస్టులు ఈ దేశ ప్రజల అనుభవం మీద ఆధారపడిన ఒక సరికొత్త భారతీయ నమూనాను రూపొందించాలి. వారి సాయుధ పోరాట ప్రక్రియ విజయవంతం కాలేదు. తరతరాల అణచివేత నుంచి ఎన్నటికైనా బయటపడగలరా అన్నంతగా కులవ్యవస్థ జనాన్ని అణచివేసింది. ఆర్థికంగా దేశం భూస్వామ్యం, పెట్టుబడిదారీవాదం, 'ప్రజాస్వామ్యాల ముప్పేట అల్లికలా మారింది. క్రమంగా బలపడుతూ వచ్చిన హిందూత్వ శక్తులు మౌలికంగా (ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు, పెట్టుబడిరీత్యా అవినీతి భూయిష్టులు. భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం గుప్తధనం పునాదులపై రూపు దిద్దుకున్నది. ఈ దేశంలోని వ్యాపారవర్గాలు సంపదను నేలమాళిగలో దాచుకుంటాయి తప్ప ప్రజలతో పంచుకోవడానికి ఇష్టపడవు.
కమ్యూనిస్టులు ప్రభుత్వంలో ఎందుకు చేరాలి? 147 అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
ఈ దేశంలోని పెట్టుబడిదారీ శక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడానికీ, కేవలం లాభమొక్కటే ధ్యేయంగా బతికి బట్టకట్టలేమన్న ఎరుక వాటికి కలిగించడానికీ తగిన విధానాలను కమ్యూనిస్టులు రూపొందించాలి. భారతీయ పెట్టుబడిదారులు ప్రజల పట్ట బాధ్యతాయుతంగా వ్యవహరించగల రీతిలో కమ్యూనిస్టులు పెట్టుబడితో వ్యవహరించవలసి ఉంటుంది. (శమ లేకుండా పెట్టుబడికి ఉనికిఉండదన్న మాట నిజమే. అయితే సాంస్కృతిక వ్యవస్థ ఉత్పాదకరంగం నుంచి కొంత స్వేచ్చను ఎలా పొందుతుందో అలాగే అత్యాధునిక ఉత్సాదకరంగంలో పెట్టుబడి కూడా కొంత స్వేచ్చను పొందుతుంది. శ్రమ నుంచి పెట్టుబడి స్వేచ్చను పాొందేదిశగా బిజెపి (ప్రభుత్వం కృషి చేసింది. మార్క్స్ తన సూత్రీకరణలు చేసిన నాటికీ ఇప్పటికీ సాంకేతిక విజ్ఞానం ఊహాతీతంగా పెరిగిపోవడం వల్లనే ఇది సాధ్యమైంది. కులాలుగా చీలిపోయిన మనదేశం వంటి దేశంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టిన ఫలితంగా అ(గ్రవర్షాలు అప్పటికే మార్కెట్ ఎకానమీలో అడుగుపెట్టేసి ఉండగా. లక్షలాది నిమ్న కులస్థులు ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోవలసి వచ్చింది. మనదేశం లాంటి దేశంలో మార్కెట్ చలనశీలాన్ని అర్హం చేసుకుని దానిని ప్రజా ప్రయోజనకరంగా మలచాలంటే, కమ్యూనిస్టు సాంఘికళక్తులు పెట్టుబడితో ముఖాముఖి వ్యవహరించవలసి ఉంటుంది. అధికారం అందుకునే అవకాళం తోసుకొచ్చినప్పుడు (ప్రజాశ్రేయస్సుకు వినియోగించడం కోసం కమ్యూనిస్టులు దానిని అందిపుచ్చుకోవాలి. పేదలు, అణగారిన వర్గాల కోసం, మనదేశం విషయానికొస్తే నిమ్న కులాల ఉద్ధరణ కోసం ఏ రైటిస్టుశక్తులూ పనిచేయవు. పేదల అంటే నిమ్నకులాల జీవన స్థితిగతులను మార్చడానికి కృషి చేయవలసింది కమ్యూనిస్టులే,
పాలకసంస్థలు సంక్షేమచర్యల గురించి ఎప్పుడు మాట్టాడినా షేర్‌మార్కెట్ కుప్పకూలుతూ ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి పెట్టుబడివర్లాలు స్వాభావికంగానే దళిత బహుజన వ్యతిరేకులు, వారు మానవతాముఖాన్ని ఎప్పటికీ వికసింపచేసుకోలేరు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక కమ్యూనిస్టులు ఆ పెట్టుబడీ వర్గాలతో సంబంధాలు పెంచుకుంటూ వాటికి మానవతా ముఖాన్ని కల్పించే ప్రయత్నం చేయవచ్చు. సంస్కరణలను ముందుకు తీసుకువెడుతున్నది ప్రపంచీకరణ పెట్టుబడి కనుక కమ్యూనిస్టులు దాని నుంచి పారిపోలేరు. అలాగే జనాన్ని దాని నుంచి దూరంగానూ ఉంచలేరు. (ప్రజలూ దానితో సంబంధం పెట్టకోవలసిందే. ఈ క్షణాన విష్ణవ పరిస్టితి ఏదీ లేకపోయినా, సామాన్య ప్రజలు, ప్రస్తుతమున్న (ప్రజాస్వామిక నిర్మాణాలను ఉపయోగించుకునే మార్కెట్ కేంద్రిత రైట్‌వింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారా, (ప్రజలను విస్మరించవద్దన్న హెచ్చరికను మార్కెట్ శక్తులకు అందించారు. లేకపోతే మార్కెట్లకు వనరులైన పరిశ్రమలనే కుప్పకూల్చి ఉండేవారు.
148 కామ్రేడ్స్ ఆం(ధ్రప్రదేశ్ అనుభవం దానినే చాటి చెప్పింది. సంపన్నులు కొత్త (బ్రాండు కార్లను కొంటూనే ఉన్నారు. పేదలు ఆకలి చావులకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్టితి పరాకాష్టను అందుకొంటున్న కొద్దీ, మరోవైపు పట్టణ, (గ్రామీణ టెర్రరిజం కూడా అసాధారణ స్థాయికి చేరుకుంటుంది. మరీ బరితెగించిన రీతిలో మార్కెట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో నక్సలిజం సాంఘిక పునాది కూడా విస్తరించడం గమనార్హం. 'పేదవర్గాలలో ఎంతో గౌరవాన్ని పొందుతున్న కమ్యూనిస్టులు ఈ దేశంలోని సామాన్య (ప్రజానీకంలో వెల్లివిరుస్తున్న (ప్రజాస్వామిక విష్టవ చైతన్యాన్ని గుర్తించాలి. మరోసారి మోసపోయామన్న భావన ప్రజలకు కలగకుండా చూడాలి. బాధ్యత ఏదీ తీసుకోకుండా కమ్యూనిస్టులు ప్రభుత్వానికి మార్గదర్శకం చేద్దామనుకుంటే ప్రజలు కూడా మెచ్చరు. వార్త - 24 మే, 2004
చాప్తర్ - శే ళు కుల నిరూ గ్రఅన
39, దళిత రాజకీయాలకు కొత్త దిక్సూచి 40. నేటికీ కనిపించని అపరాధభానన
కుల నిర్మూలన మన అజెండాలో లేదా? 4, కులంపై ఫిర్యాదు దేశద్రోహనూ? 42. “హౌస్ కమిటీ" ముందు దళిత సమస్య మన మేధావులకు భయమేల! 43. జాతి అజెండాలో కుల నిర్మూలన ఉందా?
39
దళిత రాజకీయాలకు కొత్త దిక్పూచి
ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్‌పార్టీ (బిఎస్పి) స్వల్ప మెజారిటీతో స్వంతంగా సాధించిన విజయం భారత రాజకీయాలపై సుదూర ప్రభావం చూపగలిగిన పరిణామం. ముందుగా (ప్రముఖంగా గుర్తించవలసిన అంశం చారిత్రకంగా అత్యంత శక్తిమంతుల చేతుల్లోంచి అధికారాన్ని, అత్యంత అణచివేతను, పీడనను ఎదుర్కొన్న కులాల చేతుల్లోకి బదిలీచేయడానికి కులప్రాతిపదికపై రాజకీయ సమీకరణ ఎంతో తోడ్పడుతుందన్న విషయాన్ని ఈ విజయం నిర్ష్యంద్వంగా స్థాపించడం. కులం అనేది సామాజిక - అధ్యాత్మిక వ్యవస్థ మాత్రమేకాక, రాజకీయ, సైద్దాంతిక వ్యవస్థ కూడాననీ, రాజకీయంగా కూడా దానిపై దాడిచేయవలసి ఉంటుందనీ అన్న డా! బాబాసాహెబ్ ఆంబేడ్కర్ దార్భనికత కూడా ఈ విజయం ద్వారా నిరూపితమైంది.
అన్ని కులాలు, తెగలలో అత్యధికంగా అణచివేతను ఎదుర్కొంటున్న దళితులను చిరకాలంగా (శ్రమకోర్చి రాజకీయంగా నమీకరించడం ద్వారా, వారినొక రాజకీయకూటమిగా మార్చవచ్చునని బిఎస్పి నిరూపించింది. ఈ (ప్రయత్నంలో, బహుజనసమాజానికి పునాది దళితులేనన్న కాన్టీరాం సూత్రీకరణ దానికి దారి చూపించింది. అత్యధికమైన పీడనను ఎదుర్కొంటున్న కులాలను మొదట ఒక రాజకీయ సమూహంగా రూపొందించి, ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోడానికి సహకరించే మిత్రులను కూడగట్టుకోవాలన్న విషయాన్ని గత పదిహేనేళ్ళ బిఎస్పి ప్రయోగం స్టాపించింది.
ములాయంసింగ్ యాదవ్ బ్రాహ్మణులు, క్షత్రియులు, తదితర అ(గ్రకులాలతో చేతులు కలిపి పనిచేస్తున్నారు. అందుకే అమర్సీంగ్, అమితాబ్‌బచ్చన్ ఆయన జట్టులో భాగస్వాములయ్యారు. కాగా, కాన్డీరాం, మాయావతి యుపిలో దళిత రాజకీయ సమూవాన్ని స్థాపించడంలో కృతకృత్యులయ్యారు. అధికార సంపాదనలో ఒబిసిలు తమకు సహజమిత్రులని వారు భావించారు. కానీ అదే సమయంలో ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలో ఒక ఒబిసి పార్టీ అవతరించి యాదవులను ఒక రాజకీయ సమూహంగా
151
152 కుల నిర్మూలన మలచుకొని ముస్లింలను, ఇతర ఒబిసిలను తనవైపు ఆకర్షించుకొంది. దిగువ కులాలు భూమి అనీ, అ(గ్రకులస్టులు విత్తనాలనీ, వ్యవస్థను మార్చడానికి ఈ ఉభయులూ సమన్వయంతో పనిచేయాలనీ అన్న రామ్ మనోహర్ లోహియా సైద్దాంతిక సూత్రీకరణ ఆధారంగా సమాజ్‌వాది పార్టీ (ఎన్పీ) ఉనికిలోకి వచ్చింది. ములాయంసింగ్ ప్రధానంగా యాదవుల (ప్రాబల్యం ఉన్న పార్టీకే నాయకత్తం వహిస్తున్నా, కాన్షీరాం వలె ఆయన తీవ్ర (బ్రాహ్మణ వ్యతిరేక వైఖరిని తీసుకోలేదు. (బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతర అ(గ్రకులస్థులను దగ్గరకు తీశారు.
మాయావతి నాయకత్వంలో బిఎస్పి ఎస్పిపై తన పట్టును నిలుపుకొంటూనే, ఉత్తరప్రదేశ్ ఓటర్లలో పెద్దసంఖ్యలో ఉన్న (బ్రాహ్మణులకు కూడా తన కూటమిని విస్తరింపచేసింది. బిజెపి అనుసరించే మతతత్వ పూరిత అజెండా తమనే ఇతరుల దాడికి లక్ష్యంగా చేస్తుండడంతో, ఆ పార్టీతో తమ మైత్రి ప్రయోజనకరంగా లేదని యుపిలోని (బ్రాహ్మణులు తెలుసుకొన్నారు.
ఇదే బిఎస్పి, వారిని మనువాదులుగా, బహుజనసమాజ్కు శత్రువులుగా చిత్రిస్తూ వచ్చింది. అయితే దళితులకు, ఒబిసిలోని వ్యవసాయవర్గాల మధ్యనున్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని, ప్రాథమికంగా పట్టణ మధ్యతరగతిగానున్న బ్రాహ్మణులతో మైత్రి కల్పించుకోవచ్చునని బిఎస్పి భావించింది. అలాగే ములాయంసింగ్ నాయకత్వంలో ఒక పటిష్టమైన ఒబిసి పార్టీ అవతరించడంతో, (బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకొని, అధికారంలో నిజమైన వాటా తమకు కూడా లభిస్తుందన్న విశ్వాసాన్ని వారిలో కలిగించవచ్చునన్న సంగతినీ బిఎస్పి (గ్రహించింది. ములాయంసింగ్, ఆయన పార్టీ (బ్రాహ్మణులను వ్యతిరేకించకపోయినా, ఆయన (ప్రభుత్వంలోని అధికార నిర్మితిలో (బ్రాహ్మణుల వాటా చాలా స్వల్పం. ఎస్సిల తర్వాత మాయావతి తమకే ఎక్కువ సీట్లు ఇచ్చారు కనుక బ్రాహ్మణులు ఆమెను విశ్వసించడంలో, ప్రయోగాత్మకంగా ఆమె పార్టీకే ఓటువేయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల గణాంకాల రీత్యా ఈ ప్రయోగం బాగా ఫలించింది. మాయావతి తన నాయకత్వంలో (బ్రాహ్మణులతో అధికారాన్ని పంచుకోడానికి సిద్దపడడం ఒక కీలకమైన దళిత సైద్దాంతిక చుక్కానిగా పరిగణించదగినది, దైనందిన అధికార రాజకీయాలలో ఈ చుక్కాని ఎటు తీసుకువెడుతుంటో వేచి చూడవలసిందే.
బిఎస్సి నాయకత్వం అంచనా వేసినట్టు, వ్యవసాయ ఉత్పాదక రంగంలోనే కానీ, పారిశ్రామిక మార్కెట్ ఆర్జికతా రంగంలోనే కానీ దళితులు, బ్రాహ్మణుల అఆక్ట్రిక (ప్రయోజనాల మర్య ఇప్పటికప్పుడు ఎటువంటి వైరుధ్యమూ లేదు. కానీ, ఒబిసిలలో ఒక వర్గానికీ, దళితులకే మధ్య అటువంటి వైరుధ్యం ఉంది. బురో(క్రసీకి సంబంధించినంత
దళిత రాజకీయాలకు కొత్త దిక్సూచి 153 వరకు (బ్రాహ్మణ బురోక్రాట్టకు, ఎస్సి, ఎస్టి బురోక్రాట్టకు మధ్య మాత్రం వైరుధ్యం ఉంది. సమాజ్‌వాదిపార్టీ కూడా (బ్రాహ్మణ బూరోక్రాట్ట మీద ఆధారపడుతూ వచ్చింది. ఒబిసి బురోతక్రాట్టు పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణం, (గ్రామ (ప్రాంతాలలో, దళితులపై, ఒబిసి దిగువ కులాలసై జరిగే హింసలో (బ్రాహ్మణుల భాగస్వామ్యం పెద్దగా లేదు. కానీ ఒబిసి భూయజమానులు అటువంటి హింసలో భాగస్వాములు కావడం కనిపిస్తుంది. సర్వజనసమాజ్ భావన
మాయావతి ఇప్పుడు బహుజనసమాజ్ భావనను వదులుకొని సర్వజనసమాజ్ గురించి మాట్టాడుతున్నారు. ఈ సర్వజననమాజ్ భావనలో సైద్దాంతికంగా, ఆచరణపరంగా ఒక సమస్య ఉంది. ఆధ్యాత్మికస్టాయిలో (బ్రాహ్మణ సిద్దాంతవాదులు “బ్రహ్మ, 'లోకం' అనే భావనలో 'సర్వజని అనే మాటలను ఉపయోగిస్తుంటారు. ఆ సైద్దాంతికత నుంచే కులవ్యవస్థను, అస్పృశ్యతను భగవంతుడు కల్పించినవిగా, సహజమైనవిగా సమర్థిస్తూ ఉంటారు. దళితులకు చోటులేని ఆధ్యాత్మికసంస్థలకు సంబంధించిన అనేక వ్యవహారాలను రాజ్యం చక్కబెట్టవలసి వస్తుంటుంది. ఆటువంటి చోట్ట (బ్రాహ్మణులు ప్రాబల్య స్థితిలో ఉంటారు. బ్రాహ్మణీయ శక్తులే కులాన్ని సృష్టించిన సంగతి తెలిసినదే.
ఇప్పటికీ బౌద్ధమతం స్వీకరించకుండా, హిందూత్వంలోనే ఆధ్యాత్మిక సమానత్వాన్ని కోరుకొంటున్న దళితులకీ, ఈ రంగాన్ని పూర్తిగా తమ అధీనంలోనే ఉంచుకోవాలని కోరుకుంటున్న బ్రాహ్మణులకీ మధ్యనున్న వైరుధ్యాన్ని బిఎస్పి ఎలా పరిష్కరిస్తుంది? బిఎస్పి దళితులపై ప్రత్యేక (శ్రద్ధను కోల్పోతే, (క్రమంగా వారిలో కూడా ఆ పార్టీ పట్ట ఆదరణ తగ్గిపోతుంది. తమ మౌలిక సమస్యలను కొన్నింటినైనా ఆ పార్టీ పరిష్కరిస్తుందన్న ఆశాభావం వాళ్ళలో పెరగడం సహజం. అలాగే, బ్రాహ్మణులు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని ఆశిస్తారు. ఎందుకంటే, మొదటిసారి వారు దళితులతో పొత్తుపెట్టుకొన్నారు. కనుక వారు తమ సాంఘిక సాంస్కృతిక డిమాండ్లను ముందుకు తెస్తారు. మాయావతి ఒక నేతగా, బిఎస్పి ఒక పార్టీగా ఈ అంశాలను ఎలా ఎదుర్కొంటారో వేచిచూడవలసిందే.
బిజెపి తన ప్రజాపునాదిని కోల్పోవడం ఈ మొత్తం ప్రక్రియలో ఒక శుభపరిణామం. ఇప్పుడిక ఆ పార్టీ రామమందిరం వివాదాన్ని లేవనెత్తలేదు. ఒకవేళ లేవనెత్తడమే జరిగితే, గతంలో దానిని సమర్థించిన బ్రాహ్మణ ప్రతినిధులే ఇప్పుడు వ్యతిరేకించవలసి వస్తుంది. రామమందిరం అజెండాను బ్రాహ్మణుల చేతుల్లోంచి తప్పించి తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఒబిసిలలోని ఒక వర్గం బిజెపి వేదికను వాడుకొనే ప్రయత్నం చేయవచ్చు. (బ్రాహ్మణుల కన్నా ఎక్కువ దూకుడుతో హిందుత్వను ఆవహింపచేసుకొనే ఒబిసి హిందూ
154 కుల నిర్మూలన సాధువులు యుపిలో పెద్దసంఖ్యలో పుట్టుకొస్తున్నారు. కాన్టీరాం అంత్యక్రియలు బౌద్ధ సంప్రదాయంలో జరిగాయి కనుక, ఆ విషయంలో అంబేడ్కర్ పక్కన కాన్షీరాం నిలవడానికి మాయావతి ఆ అంశాన్ని వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే తన ౮ాతన మి(త్రులను సంతోషపెట్టడానికి (బ్రాహ్మణ సమాజం నుంచి ఏ మూర్తులను మాయావతి సృష్టిస్తారన్నది ప్రశ్న. దళిత-బహుజననేతల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించిన అంబేడ్కర్ పార్క్‌లను నిర్మించి ఆమె చరిత్ర సృష్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బ్రాహ్మణులు తమవైన పార్కులను నిర్మించాలని అడిగే అవకాశం లేదా? అంబేద్కర్ పార్క్‌లలో (ప్రతిష్టించిన చారిత్రక మూర్తులను వారు ఆమోదిస్తారా?
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంత సామాజిక మధనం జరిగే ఉంటుంది. మాయావతి, ఇతర నాయకులు ప్రసంగించిన బహిరంగ సభలకు దళితులు, బ్రాహ్మణులు కూడా హాజరయ్యే ఉంటారు. ఒకరి పట్ట ఒకరి వైఖరిని అది ప్రభావితం చేసే ఉంటుంది. (బ్రాహ్మణులు (బ్రాహ్మాణీయత మెట్టు నుంచి కిందికి దిగడానికి అది తోడ్పడితే ఉత్తరప్రదేశ్ సమాజం కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే మతం పట్ట వైఖరుల విషయానికివస్తే (బ్రాహ్మణులు - దళితులు భిన్నద్రువాలే అవుతారు. ఇంతవరకు ఎడమొగం పెడమొగంగా ఉన్న ఈ రెండు కులాల మధ్య రాజకీయాలు సయోధ్య తీసుకురావలసి ఉంటుంది.
పరిపాలనారంగానికివస్తే, శాంతిభద్రతల పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి. ఉద్యోగాల సృష్టి వాటిని దళిత, బ్రాహ్మణులకు సంతృప్తికరంగా పంపిణీ చేయడం ఇప్పుడు మాయావతి ముందున్న సవాళ్ళు. ఆమె సరికొత్త రాజకీయ తారగా అవతరించారు. ఈ అయిదేళ్ళ అధికారమూ ఆమె భవిష్యత్తును, దేశంలోని మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని దళితుల భవిష్యత్తును కనీసం రాజకీయ క్షేత్రంలోనైనా నిర్హయిస్తుంది.
వార్త - 25 మే, 2007
త్త నేటికీ కనిపించని అపరాధభావన
కుల నిర్మూలన మన అజెండాలో లేదా?
'బ్రైటీష్ సామాజిక, రాజకీయ వ్యవస్త 1807, మార్చిలో బానిసలను వ్యాపార వస్తువుగా చేసి క్రయ విక్రయాలు జరపడాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఆ చట్టానికి రండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బానిసత్వంతో తనకున్న చారిత్రక సంబంధాన్ని పశ్చాత్తాప దృష్టిలో పునస్సమీక్షించుకోడానికి బ్రిటిష్ పౌర, రాజకీయ సమాజం ఈ ఏడాది మార్చి చివరి వారంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. బానిసత్వంతో తనకున్న సంబంధాల చరిత్రపై (బ్రిటీష్ పార్లమెంట్ చర్చ నిర్వహించింది. మార్చి 27వ తేదీన చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ అబేలో బానిసత్వ నిషేధ స్మారక సభ జరిగింది. కేంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ తన ప్రసంగంలో, ప్రపంచమంతటా ఉన్న ఒకప్పటి బానిసల సంతానానికి క్షమాపణ చెప్పారు. బానిసత్వం రద్దుకోసం పోరాడిన ప్రసిద్ద యోథుడు విలియం విల్చర్ఫోర్స్ జీవితం ఇతివృత్తంగా అత్యంత శక్తిమంతంగా నిర్మించిన హాలీవుడ్ చిత్రాన్ని ఈ మార్చి నెలలోనే యూరప్‌లోనూ, అమెరికాలోనూ విడుదల చేశారు. కులమూ, అస్పృశ్యతా ఆధారంగా జరిగే దోపిడీని బానిసత్వ సమస్యతో ముడిపెట్టడం సాధ్యమా అన్నది పరిశీలించడానికి బ్రిటీష్ నుంచి పనిచేసే క్రిష్టియన్ సాలిడారిటీ వరల్డ్‌వైడ్ అనే మానవ హక్కుల సంస్థ డా॥ జోసఫ్ డిసౌజా, డా॥ నాన్సీ రిక్స్, ఇందిరా అత్యాలే, మోజెస్ పన్మార్లతో పాటు ఈ వ్యాస రచయితను కూడా ఆహ్వానించింది.
కులమూ, అంటరానితనాల తీరుతెన్నుల గురించి, సమకాలీన బానిసత్వ రూపాలతో వాటికి గల సంబంధం గురించి అనేకమంది మేధావులతో, పార్లమెంటు ఉభయ సభల (హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్‌ట)తో, కౌంటర్బరీ ఆర్ బిషప్ డా॥ రోవాన్ విలియమ్స్‌తో అనేక చర్చాగోష్టులు నిర్వహించాం. భారతదేశంలోని కులవ్యవస్థ, వెట్టిచాకిరి సమకాలీన బానిసరూపాలలో భాగాలేనని ఆర్చ్బిషస్ తన బానిసత్వ నిషేధ స్మారకోత్సవ ప్రసంగంలో కూడా పేర్కొన్నారు.
155
హా కుల నిర్మూలన అపరాధ భావన
కులవ్యవస్థ గురించి కానీ, భారతదేశ పౌర, రాజకీయ సమాజంలో అది ఎలా పనిచేస్తూ ఉంటుందని కానీ ఇప్పటితరం (బ్రిటీషర్లకు తగినంత అవగాహన లేకపోయినా, దానిని అర్థం చేసుకోవడానికి, ఒక అంతర్జాతీయ సమస్యగా గుర్తించి దానిని అర్ధం చేసుకోవడానికి, ఒక అంతర్జాతీయ సమస్యగా గుర్రించి దానిని ఎదుర్కోవడానికి సుముఖత చూపించారు. తాము కూడా రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించామనీ, చవకగా (శ్రమను దోచుకోవడంలో తామూ భాగస్వాములమయ్యామన్న అపరాధ భావన చాలామంది బ్రిటీష్ ఎంపిలలోన్తూ లార్డ్లోనూ వ్యక్తమైంది.
కులవ్యవస్థ, అంతరానితనం బ్రిటీష్ పాలనలో రద్దు కాలేదా అని కొంతమంది ఎంపిలు అమాయకంగా మమ్మల్ని (ప్రశ్నించారు కూడా. రాజారామ్మోహన్రాయ్ వంటి (బ్రాహ్మణ సంస్కరణవాదుల చారవతో సతి (ఈ సమస్య బ్రాహ్మణ, క్షత్రియ కులాల్టోనే ఉండేది) ని నిషేధించేందుకు ఒక ప్రయత్నం జరిగింది తప్ప, అమానుషమైన కులవ్యవస్థను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి మాత్రం ఎటువంటి ప్రయత్నమూ జరగలేదని మేము చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయారు. రాజారామ్మోహన్రాయ్ రోజుల్లోనే కానీ, ఇప్పుడు కానీ భారతదేశపు వాస్తవిక సమస్యలుగా అ(గ్రవర్హ మేధావులు వేటిని ఫోకన్ చేశారో, చేస్తున్నారో - అవి మాత్రమే పళ్చిమ దేశాలకు తెలుసు. కులనిర్మూలన అన్నది అ(గ్రవర్ష మేధావుల అజెండాలో లేదు కనుక అదొక సమస్యగా అంతర్జాతీయ రాజకేయ, సామాజిక, మేధావిశక్తుల దృష్టికి రాలేదు. పాయిఖానాలను శుభ్రం చేయడాన్ని, ఇంకా రకరకాల రూపాలలోని అంటరానితనాన్ని, పేదరికాన్ని కన్నులకు కట్టించే చిత్రాలతో మైకేల్ లాసన్ నిర్మించిన భారతదేశపు 'రహస్య జాతి వివక్ష (హిడెన్ అపారైడ్) అనే డాక్యుమెంటరీని రాజకీయరంగానిక్షీ, చర్చికీ చెందిన అత్యంత పలుకుబడి కలిగిన మూడు వందలమంది వ్యక్తులు చూసి ఎంతో బాధతో నిట్టూర్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ఎలా సహాయం చేయగలమంటూ ప్రశ్నత్తరాల సదస్సులో కొంతమంది బరువెక్కిన హృదయాలతో మమ్మల్ని ప్రశ్నించారు.
'బ్రస్సెల్స్కు వెళ్ళే అవకాశం కూడా నాకు లభించింది. ఎంతోమంది యూరోపియన్ పార్లమెంటు సభ్యులతో నేరుగానూ, వారి సీనియర్ సిబ్బందితోనూ మాట్లాడాను. కులం, అంటరానితనం సమస్యలపై కొంతమంది యూరోపియన్ పార్తమెంట్ సభ్యులకు మంచి అవగాహన ఉంది. వాటిని నిర్మూలించడానికి కృషి చేయాలన్న దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే వారొక తీర్మానాన్ని ఆమోదించారు కూడా. కులవివక్షను కూడా జాతి వివక్షగా సమానంగా పరిగణించేలా ఐక్యరాజ్యసమితి యూరోపియన్ యూనియన్
కుల నిర్మూలన మన అజెండాలో లేదా? 157 (ప్రభావితం చేయగలదన్న కొంత ఆశాభావం దానివల్ల వ్యక్తమైంది. కులం, అంటరానితనం సమస్యలపై మంచి అవగాహన ఉన్న హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడైన డేవిడ్ అల్జన్ ఒక ప్రశ్హ వేయడంతో మార్చి 23వ తేదీన సభలో వాటిపై చర్చ జరిగింది. (ప్రవాస భారతీయుడైన మేఘనాథ్ దేశాయ్‌తో సహా అయిదుగురు సభ్యులు ఆ చర్చలో పాల్గొన్నారు. ఈ సమస్యలపై భారతప్రభుత్వంతో మాట్లాడవలసిందిగా ఆ అయిదుగురు సభ్యులూ అభివృద్ధి సహాయమంతత్రిని అభ్యర్థించారు కూడా.
తమ తమ అర్జికతల అభివృద్దికి వివిధ చారిత్రక రూపాలలోని బానిసల (శ్రమను కొల్లగొట్టామన్న అపరాధభావం (బ్రిటీష్ యూరోపియన్, అమెరికన్ సమాజాల్లో వ్యక్తమ వుతుండగా, భారతదేశంలోని అ(గ్రవర్దాలు, ముఖ్యంగా (బ్రాహ్మణీయ సామాజిక శక్తులు చారిత్రకంగా తమ సుఖ జీవనానికి ఎంతో దోహదం చేసిన దళిత, బహుజన సమూహాలపై అటువంటి కౌదార్యం ఎందుకు కనబరచలేకపోతున్నాయన్నది ఇక్కడ ప్రధానంగా వేధిస్తున్న (ప్రశ్న. ఒక వ్యూహం ప్రకారం ఒక వర్గానికి చెందిన ప్రజలను కారు చౌక శ్రమకు నియోగించడం, తాము చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడని పనులలోనే వారిని తరతరాల పాటు బంధించి ఉంచడం కూడా బానిసత్వపు మౌలిక రూపాలలో ఒకటి.
ఎన్నడూ లేని శ్రమ దోపిడీ
ఉదాహరణకు, బ్రాహ్మణీయ శక్తులు భూమిని దున్నడం కానీ, రోడ్డు ఊడ్చడం కానీ, పశువులు, మనుషుల మృతదేహాలను తొలగించడం కానీ ఎప్పుడూ చేయవు. దోభీలు చేసినట్లు ఇతరుల దుస్తులు తాము శుభ్రం చేయడాన్ని కలలో కూడా ఊహించలేవు. అలాగే, పాయిఖానాలను తాము శుభ్రం చేయడాన్ని కానీ, తమ మహిళలు దేవదాసీల్లా ఒళ్ళు అమ్ముకోవలసిన పరిస్థితి కానీ ఈ దేశంలోని ఆ(గ్రవర్థాలు కనీసం ఆలోచించను కూడా ఆలోచించలేవు. కానీ అత్యంత అల్పమైన ప్రతిఫలానికి ఈ హేయమైన పనులన్నీ దళితులు, ఇతర నిమ్నకులాలపై కులవ్యవస్థ రుద్దింది. చివరకు యూరప్‌లో వ్యాపార సరుకుగా మారిన బానిసలను కూడా నిర్బంధంగా ఇటువంటి శ్రమ దోపిడీకి గురిచేయడం ఎన్నడూ జరగలేదు.
బ్రిటన్ తీసుకొచ్చిన బానిసత్వ నిషేధచట్టం 200వ స్మారకోత్సవాన్ని పురస్కరించు కొని ఇప్పుడు (బ్రిటీష్ పౌర, ఆధ్యాత్మిక సమాజం తన పూర్వికులు జరిపిన బానిస వ్యాపారానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమైంది. అంగ్రికన్ చర్చికి పోప్‌గా పరిగణించదగిన కౌంటర్బరీ ఆర్చ్ బిషప్ నల్లజాతీయులకు క్షమాపణ చెప్పారు. వెస్ట్ మినిస్టర్ అబే ఉత్సవంలో పాల్లొన్న నాటి బానిసల వారసులు గుండెనిండా ఉప్పొంగే ఆనందంతో గానం చేశారు. హిందూ ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థ కూడా దీనిని వరవడిగా తీసుకొంటుందా? తీసుకోనప్పుడు సామరస్య సహజీవనాలు ఎలా సాధ్యం? వార్త - 16 ఏప్రిల్, 2007
వ! కులంపై ఫిర్యాదు దేశద్రోహనూ?
ఎస్ ఆర్: రామానుజన్ తన వ్యాసం (అక్టోబర్ 30)లో నన్నూ, ఉదిత్రాజ్నూ 'విదేశీ పాలకుల ముందు విచిత్ర విన్యాసాలు' చేసిన 'దళితజెట్టీలు'గా అభివర్షించారు. గతంలో ఈ దేశాన్ని ఆక్రమించిన వారికి ఇక్కడి ప్రజలు సాయపడినట్లే దళిత జెట్టిలమైన మేము ఇండియాను ఆ(క్రమించడానికి అమెరికాకు సాయపడుతున్నామనేది ఆయన బాధ. అమెరికా సభా సంఘం మానవ హక్కుల అధ్యయనం, పరిరక్షణ కోసం వివిధ దేశాల్లో జరిగే హక్కుల భంగం మీద విచారణ జరుపుతుంది. ఆ సంఘం అక్టోబరు 6న భారతదేశంలోని కులవ్యవస్థ, అంటరానితనం వల్ల ఎటువంటి మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదో తన అవగాహనను ప్రకటించి, కొన్ని కారణాలు చూపి ఆ సమస్యపై కషి చేస్తున్న వ్యక్తుల వాంగ్మూలాలను విన్నది. ఈ సంఘం మొట్టమొదటిసారి కులం, అంటరానితనం కోట్టాది ప్రజల హక్కులను హరిస్తున్న అంశాలుగా గుర్రించింది. ఇదే సంఘం దక్షిణాఫ్రికా చైనా, ఆప్ట్రనిస్తాన్ వంటి దేశాలలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా విచారణ జరిపింది. ఇతర దేశాల్లో అమెరికా జరిపే హక్కుల ఉల్లంఘనలపై కూడా ఈ సంఘం విచారిస్తుంది. ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సంఘంలో ఇద్దరు రిపబ్లికన్ కాం(గ్రెస్ సభ్యులు, ఇద్దరు డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు ఉంటారు. సీనియర్ రిపబ్లికన్ క్రిష్టఫర్ స్మిత్ దీనికి అధ్యక్షులు. కాగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆఫ్రికన్ అమెరికన్ బార్మోరాలీ సీనియర్ మెంబర్: స్మిత్‌తో పాటు తను కూడా కులవ్యవస్థ, అంటరానితనం మానవహక్కులను హరిస్తున్నాయని (ప్రకటించారు. భారతదేశంలోని దళితులు అమెరికాలోని నల్లజాతివారమైన మేము కలిసి పనిచేయాల్సిన అవసరమున్షదని ఆమె తేల్చి చెప్పారు.
ఒక్క రామానుజనే కాదు, చాలామంది రామచం[ద్ర గుహా, అమూల్య గంగూలి, సుదీందద్ర కులకర్ణి, శ్రీశ్రీరవిశంకర్ తదితర అగ్రకుల మేధావులు ఆంగ పత్రికట్టో మేము అమెరికా సభా సంఘం ముందు వాంగ్మూలాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశారు.
158
కులంపై ఫిర్యాదు దేశద్రోహనూ? 159 'దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ ఎందుకు ఏర్పడింది? జోసఫ్ డి సూజ, నాన్సీ రిక్స్ ఎవరు? అంటూ ఈ అ(గ్రకుల మేధావులు ఈ దేశపు ఇంటెలిజెన్స్ ఏజెంట్టలా ఆరాతీస్తూనే ఉన్నారు. అమెరికాలోని హిందూ ఫౌండేషన్ మా వాంగ్మూలాలను వ్యతిరేకించింది. అది ఒక మేధావి బృందాన్ని అమెరికా క్యాపిటల్ హిల్‌లో కాంగైన్ సభ్యులను కలిసి హిందూమతం గొప్పతనం గురించి చెప్పడానికి పంపింది. దీపావళి పండుగను అమెరికా పండుగగా గుర్తించాలని కోరింది. మా చర్యను దేశద్రోహ చర్యగా చూస్తున్న ఈ మేధావులు తమను తాము లౌకిక వాదులుగా చెప్పుకునే వారే. వీరు హిందూత్యాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నటించే వారే. వీరంతా అమెరికా నుంచి పనిచేస్తున్న 'దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్' ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ సంస్థ అమెరికా సభా సంఘం ముందుకు కులం, అంటరానితనాన్ని తీసుకుపోయింది కనుక దాన్ని దుయ్యబడుతున్నారు. దీనికి వాళ్ళ ఊహలన్నీ ఆపాదించి అమెరికాలోని కూక్లక్స్ క్లాస్ మేధావి వర్గంగా వ్యవహరిస్తున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా దర్పాన్లో ఐక్యరాజ్యసమితి సదస్సు (2001) దరిమిలా, కులం, అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేయడానికి రెండు అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి డెన్వర్ (అమెరికా) కేంద్రంగా పనిచేసే “దళిత్ (ఫ్రీడమ్ నెట్వర్క్ కాగా రెండోది లండన్ కేంద్రంగా పనిచేసే 'దళిత్ సాలిడారిటి నెట్వర్క్. కులవ్యతిరేక పోరాటంలో దళిత, బహుజనులకు అంతర్జాతీయ తోడ్పాటు ఈ నంస్థలతోనే (ప్రారంభమయింది. ఇక నాన్సీ రిక్ గురించి తెలుసుకోదలచుకున్నవారికి 'డబ్యు డబ్బ్యు డబ్బు. దళిత్ నెట్‌వర్క్‌లో చాలా సమాచారం లభిస్తుంది. ఆమె వృత్తిరీత్యా డాక్టర్. మన దేశంలో డజన్ల కొద్దీ మెడికల్ క్యాంపులు నిర్వహించి, కుష్టు వ్యాధితో బాధపడే దళితులు, ఆదివాసీలకు సేవలు చేసింది. మరి కుల వివక్షను అమెరికా శాసనకర్తల దృష్టికి తీసుకువెళ్ళడంపై గుండెలు బాదుకుంటున్న మేధావులు దళితులు, ఆదివాసీలు లేదా అడుక్కుతినే బిసిల కోసం ఏమి చేశారో చెప్పగలరా? అంతర్గత సమస్యను అంతర్జాతీయం చెయ్యవద్దని వ్యాసాలు మీద వ్యాసాలు రాస్తున్న మేధావులు కులం, అస్పృశ్యతలను నిర్మూలించడానకి ఏ కార్యక్రమం రూపొందించారు? అణచివేతకు గురైన కులాల ప్రజలు కనీసం అంటరానితనం నుంచైనా విముక్తం పొందడానికి తమ కార్య(క్రమమేదో చెబితే గదా మేము ఆ వైపు ఆశాదృక్కులతో చూసేది? నిజమే సెనేటర్ స్మిత్ మన దేశాన్ని సందర్శించలేదు. మా మాటలు, రాతల మీద ఆధారపడే కులవివక్ష అంటరానితనం ఆందోళనకరమైన ప్రపంచ సమస్య అని ప్రకటించాడు. అలాకాక అది ఆనందభరిత సమస్య అని మీరు భావిస్తున్నారా? దాదాపు 75 కోట్ల ప్రజలు అనుభవిస్తోన్న కుల కుళ్ళు 20 కోట్ల ప్రజలను అమానుషంగా వేధిస్తున్న అంటరానితనంను ప్రపంచ సమస్యలుగా పరిగణించకుండా వాటికి పరిష్కార మార్గాలు లభిస్తాయా? మూడు సహ(స్రాబ్బాలుగా
160 కుల నిర్మూలన ముఖ్యంగా 58 ఏళ్ళ స్వతంత్ర భారతంలో అధికారాలు అన్నీ అ(గ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేశారు? పోనీ దళిత, బహుజన మేధావులు, నాయకులు సూచించిన ఏ పరిష్కార మార్గానికి అగ్రకుల మేధావుల మద్దతు లభించింది? మహాత్మాఫూలే 'సత్యశోధన'ను ఆయన జీవిత కాలంలో అందరూ వ్యతిరేకించారు. అంబేద్కర్ ప్రయత్నాలన్నింటికీ గాంధీ నుంచే వ్యతిరేకత ఎదురయింది. ఎన్.టి.రామారావు వంటి రాజకీయ వేత్త రిజర్వేషన్లు పెంచితే ఇది పద్దతి కాదన్నారు. మండల్ నివేదిక ఎటువంటి కల్గోలాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. (పైవేట్ రంగంలో రిజర్వేషన్సు అమలుపరచాలన్న ప్రతిపొదనకు ఎంత వ్యతిరేకత వస్తుందో తెలిసిందే. నల్లడాతి సమస్యతో పాటు దీనిపై కూడా ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిపిస్తే ప్రపంచ ఒత్తిడితో పరిస్థితి మెరుగుపడవచ్చని భావించాము. అయితే ఐక్యరాజ్యసమితి వేదికలపై ఈ అంశాన్ని చర్చకు పెట్టడాన్ని వ్యతిరేకించని అగ్రకుల మేధావి లేడు. ఇప్పుడు అమెరికా (ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి వారి కంసెనీల్టో, వారి వీసాల్టో (ప్రపంచబ్యాంకు, ఐఎమ్ఎఫ్ డబ్బులో వాటా అడిగే ప్రయత్నం చేస్తుంటే దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. అసలు ఎవరి ఆలోచనలకనుకూలంగా కుల నిర్మూలనా శక్తులు పనిచెయ్యాలి? ప్రపంచీకరణలోని ఆర్థిక సమస్యలకు పరిష్కారం వెతికిన వాళ్ళు ఈ దేశపు సాంఘిక, మతపర, కులపర సమస్యలను ప్రపంచీకరించి పరిష్కార మార్గాలు వెతుకుదామంటే ఎందుకింత గగ్గోలు పడుతున్నారు? అమెరికాలో స్థిరపడ్డ అగ్రకుల భారతీయులంతా అక్కడ తమకు మైనారిటీ స్టేటస్ కావాలని సమానహక్కులు కావాలని అడుగుతున్నారు. కాని అక్కడి నల్లజాతి ప్రజల పోరాటాల మీద పుస్తకాలేమైనా రాశారా? మన (ప్రభుత్వం అమెరికన్ నల్లజాతి ప్రజల అణచివేతను మానవహక్కుల సమస్యగా గుర్తించింది. మరి మన దేశంలోని కులవివక్ష అంటరానితనం సమస్యలను అమెరికన్లు ఎందుకు గుర్తించకూడదు? వీటిపై వారు ఎందుకు ఆందోళన వ్యక్తం చేయకూడదు?
కుల వివక్ష అంటరానితనంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం వెనుక [క్రైస్తవుల కుట్ర ఉన్నదని ఆరోపిస్తున్నారు. ఆ దేశంలో హిందూ దేవాలయాల నిర్మాణానికి పూర్తి స్వేచ్చ ఉన్నప్పుడు వారి (కైస్తవ”) ఆరాధనా మందిరాలు మన భూమికి ఎగుమతి కాకూడదా? ఈ విషయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదా? డాలర్ల కోసం కన్నవారని, కన్న భూమిని వదిలివెళ్ళేవారు దళితులు, ఆదివాసీలు, క్రైస్తవులు అవుతున్నారని అరవడం ధర్మమేనా? అగ్రకుల మేధావులు కాసుల కోసం మాతృదేశాన్ని వదిలి వెళ్ళవచ్చు గాని, అణగారిన ప్రజలు, అంటరానితనంలో కునారిల్టుతున్నవారు డాలర్గు తీసుకోకుండాను, రూపాయి చేతిలో లేకుండాను హిందూమతంలోనే మగ్గిపోవాలి? ఎస్సిలు, ఎస్టిలు, బిసిలు అందరూ [క్రైస్తవులుగా మారిపోతారనుకుందాం. అందుకు బాధ్యులు ఎవరు?
కులంపై ఫిర్యాదు దేళశద్రోహమా? 161 ఆ(గ్రకులస్తులా? దళిత బహుజనులా? శతాబ్దాల క్రితం బౌద్దధర్మం వలే ఈనాడు హిందూమతం అమెరికా ఎత్తుగడలతో విలుప్తమవుతుందనుకుందాం. ఇందుకు బాధ్యత ఎవరు వహించాలి? దళితులను దూషించి, బిసిలను ఛీ కొట్టి, ఆదివాసులను అణచివేస్తూ హిందూమతాన్ని రక్షించుకోవటం ఎలా సాధ్యమవుతుంది? దళితులు రిజర్వేషను అడిగితే ఒకరకంగా తప్పు. మెరిట్ సంగతేమిటని ప్ర్నిస్తారు. అమెరికన్ కంపెనీలైనా రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని అడిగితే దేశద్రోహులమని ముద్ర. అమెరికా హౌజ్ కమిటీ ముందు మేం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాం. ప్రపంచీకరణకు నాయకత్తం వహించే మీరు భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరగడానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దళిత, బహుజనుల్లో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ప్రపంచబ్యాంకు, ఐఎమ్ఎఫ్ డబ్బు అగ్రకుల కాంట్రాక్టర్లు, అధికారులు, మంత్రుల పాలవుతోంది. అందుకే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయంలో ఎస్సి, ఎస్టి, బిసిలకు వాటా అడిగాము. (ప్రాథమిక విద్యారంగానికి ప్రపంచబ్యాంకు నిధుల మంజూరుకు ఇంగ్రీషు మాధ్యమంలో బోధన జరగాలనే షరతు విధించాలని అడిగాము. అమెరికన్ కంపెనీలన్నిటిలోనూ రిజర్వేషన్లు అమలుపరచాలని కోరాము. వీసాల ముంజూరులోను రిజర్వేషన్ ఉండాలన్నాం. దళితుల తిరుగుబాటుల వల్ల ఈ దేశంలోని కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగేంతవరకు, ఇక్కడి మేధావి వర్గాలు ఆ అణగారిన వర్గాల వారి మెరిట్‌ను గుర్తించరు. ఈనాడు అమెరికా తన అవసరాల రీత్యానైనా దళిత బహుజన వాదనను వినడానికి సిద్ధంగా ఉంది. కుల వివక్ష అంటరానితనం మానవహక్కుల సమస్యలని గుర్రించడానకి సిద్దంగా ఉంది. ఇక అమెరికా కాంగ్రైస్లో ఈ అంశంపై తీర్మానం జరగాలి. తరువాత ఐక్యరాజ్యసమితిలో చర్చించడానికి రంగం సిద్ధమవ్వాలి. అంతవరకు దళిత, బహుజన మేధావులు కృషి చేస్తూనే ఉండాలి. ఈ కృషికి 'దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్' వంటి అంతర్జాతీయ సంస్థల తోడ్పాటు ఎంతైనా అవసరం. నల్లజాతి వారి సమస్యలతో పాటు కులం, అంటరానితనం కూడా ప్రపంచ సమస్యలు కావలసి ఉంది, ఆంధ్రజ్యోతి - 17 ననంబర్, 2005
త్తం “హౌస్ కమిటీ" ముందు దళిత సమస మన మేధావులకు భయమేల?
కులవ్యవస్థ, అస్పృశ్యతల మీద అమెరికా హౌస్ కమిటీ అక్టోబర్ 6వ తేదీన వాదోపవాదాలను వినడం ప్రారంభించినప్పటి నుంచి దళిత ఫ్రీడం నెట్వర్క్ మీద హౌస్ కమిటీ ముందు వాదనలు వినిపించిన మా నలుగురి మీద (నేను, జోసఫ్, డిసౌజా, ఉదిత్‌రాజ్. ఇండియా అత్వాల్) విషపూరితమైన దాడి జరుగుతోంది. అక్టోబర్ 5వ తేదీన డిసి ప్రెస్‌క్లబ్‌లో మేము నిర్వహించిన పాత్రికేయ సమావేశం మీద వాషింగ్టన్ డిసిలోని (బ్రాహ్మణీయ విలేకరులు ఎటువంటి ఆసక్తి చూపించలేదు. కమిటీ ముందు వాదోపవాదాలను కూడా ఎక్కువగా తమ స్వంత అభిప్రాయాలనే జోడించి రాశారు. మరోవైపు అమెరికన్ మీడియా భారత్‌ను ఒక సాటి దేశంగా కూడా లక్ష్యపెట్టలేదు.
హిందూత్వం అధిక సంఖ్యాకులకు ఆధ్యాత్మిక సమానత్వాన్ని నిరాకరించిన కారణంగా మతాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలకు దారితీయించిన అత్యంత చారిత్రక సమస్య అయిన కులం, అస్పృళ్యతల గురించి మేము వినిపించిన వాదాలను అమెరికన్ మీడియా అసలు పట్టించుకోలేదు. అదే చైనా విషయంలో అయితే అవి చాలా శ్రద్ధ చూపిస్తాయి. కులం, అస్పృశ్యతా సమస్యల వల్లనే భారత్ ముక్కలుగా విడిపోయి ఒక అసమర్థ ్రజాస్వామ్యంగా మారింది. 'బ్రిటీష్‌వారు రుద్దడంవల్లనే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. నేడు అమెరికా స్పజనాత్మక వ్యక్తిత్వం గల దేశాలను, తన గుత్త పెత్తనాన్ని సవాలు చేసే దేశాలనే పట్టించుకుంటోంది. భారత్ ఇలా అనామకంగా, అసమర్థంగా పడి ఉండడానికీ వాలకులను అలా ఉంచి తాము కూడా బాధ్యులమేనన్న సంగతిని అగ్రవర్ష మేధావులు గుర్తించడం లేదు. అనే యూరో-అమెరికన్ దేశాలలో మేథటోపరమైన అత్యంత హీనమైన నిజాయితీ రాహిత్యంతో ఉష్టపక్షుల్దా జీవిస్తున్నారు. భారత్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఇటువంటి అ(గ్రవర్ల మేధావుల నిజాయితీ రాహిత్యాన్ని బట్టబయలు చెసే 'తీరడానికే మేమూ నిశ్చయించుకొన్నాం.
162
మన మేధావులకు భయమేల? 163
దక్షిణాసియాలో ముఖ్యంగా అప్టనిస్టాన్, పాకిస్ట్రాన్, భారత్, బంగ్జాదేశ్లలోని ఉగ్రవాదంపై అమెరికన్ మీడియా విరుచుకుపడుతోంది. కానీ మతతత్త్వ ఉగ్రవాదం వేళ్ళు ఎక్కడున్నాయో అర్ధం చేసుకొనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కులతత్వం, అస్పృశ్యతల కారణంగా అతి హేయమైన, హింసాత్మక ధోరణుల వేళ్ళు ఈ నేలలో లోతుగా పాతుకొని ఉన్నాయి. జార్జి డబ్బు బుష్ ఎవాంజలిజాన్ని తీవ్రంగా శంకిస్తూ, అమెరికా హౌస్ కమిటీ కులం, అస్పృశ్యతల మీద తీర్మానం చేసే అవకాశముందని భయపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఇదే భారతమేధావివర్గం, ఇన్నేళ్ళుగా (ప్రపంచీకరణ ప్రక్రియను సమర్థిస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో కేవలం అ(గ్రవర్ధ్ణాల ప్రయోజనాలే (ప్రపంచీకరణ చెందవని, నమ్న కులాల సమస్యలు కూడా ఇందుతాయనీ వీరు గుర్తించడం లేదు. అగ్రవర్ణాలకు ఆర్థిక ప్రపంచీకరణ అవసరమైతే, నిమ్న కులాలకు సాంస్కృతిక (ప్రపంచీకరణ అవసరం. అన్ని రకాల మానవహక్కుల ఉల్లంఘనలనూ (ప్రపంచ భద్రతకు ముప్పుగానే ఇప్పుడు అమెరికా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దక్షిణాసియాలోని మత ఘర్షణలతో కులతత్వ, అస్పుశ్వతలకు కూడా సంబంధముంది. ఈ అంశంపై అమెరికన్ కాంగ్రెస్‌తో తీర్మానం చేయించడానికి దళిత్ ఫ్రీడం నెట్వర్క్ కృషి చేస్తోంది. కులం, అస్పృళ్యతల గురించి ఈ మేధావులు తమ జీవితకాలంలో ఎన్నడూ ఏమీ రాసి ఎరుగరు. అమెరికన్ హౌస్ కమిటీ ముందు వాదోపవాదాలకు స్పందనగా కులం, అస్పృశ్వతల గురించి రాసినంత మాత్రానికే తమ కలాలలోని సిరా కలుషితమైపోతుందని కలవరపడుతున్నారు? కులతత్వ పీడితులు తమ చారిత్రక కష్టాలనూ, కడగండ్లనూ అంతర్జాతీయ విషయం చేసినప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పరిష్కారం కోసం వాళ్ళు వేలాది సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఆశాభంగం చెందారు.
మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై జరిగే దర్యాస్తుల రీతి రివాజులు కూడా . తెలియని ఒక మేధావి. కమిటీ ముందు వాదన వినిపించడానికి ఒక (బ్రాహ్మణుని ఎందుకు పిలవలేదని ప్రళ్చిస్తే క్రికెట్ మీద, జంతువుల హక్కుల మీద ఎక్కువగా కలం విదిలించే మరో మేధావి హఠాత్తుగా అంబేడ్కర్ అభిమానిగా మారిపోయారు. అంబేడ్కర్సై వాళ్ల (ప్రేమ హఠాత్తుగా ఎన్నిరెట్టు పెరిగిపోయిందంటే, మేము హౌస్ కమిటీ ముందుకు వెళ్ళడంలో కులతత్వమే వాళ్లకు కనిపించి, మేమెంత దేశభక్తి లేని వాళ్ళమో, అంబేడ్కర్ ఎంతటి దేశభక్తుడో నిరూపించడానికి కనిసం ఇప్పుడైనా అంబేడ్కర్ రచనలు చదవవలసి వచ్చీంది. మరో మేధావి విషయానికి వస్తే అంబేడ్కర్ మొదలుకొని ఐలయ్యవరకు అంతటా చెడు, ఒంటెత్తు ధోరణి, కుల దృష్టే ఆయనకు కనిపించి మాయావతిలో మాత్రం అకస్మాత్తుగా గొప్ప మంచి కనిపించింది. (బ్రాహ్మణులతో పొత్తు బహుజన
164 కుల నిర్మూలన రాజకీయాలకు మేలు చేస్తుందని ఆమె చెప్పడమే ఇందుకు కారణం. ఇప్పుడు బెంగాలీ భ(ద్రలోక్ కూడా అంబేడ్కర్‌ను జాతి వ్యతిరేక మేధావిగా నిరూపించడం కోసం ఆయన రచనల నుంచి విస్తారంగా ఉటంకించడం కూడా మనల్ని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు చేసే విషయమే. వాళ్ళు కనీసం ఇప్పుడైనా అంబేడ్కర్‌ను చదువుతున్నారు. అది కూడా హౌన్ కమిటీ జరిపిన ఒక హియరింగ్ ద్వారా అమెరికాయే. వాళ్ళ చేత ఆ పనిచేయించగలిగింది. అంబేడ్కర్ 1925లో మొదలుపెట్టి 1956 వరకు రాస్తూనే వచ్చారు. ఆయన రచనలు సంపుటాల కొద్దీ ఉన్నా, ఏ అ(గ్రవర్హ మేధావీ ఎప్పుడూ ఆయన రచనల మీద ఆసక్తి చూపించలేదు కనుక ఈ పరిణామం మాకూ సంతోషం కలిగించేదే. మరింత ప్రమాదకరం
కులతత్వం, అస్పృశ్యత అనేవి అంతర్జాతీయ సమస్య అయితే తప్ప, ఆ(గ్రవర్ష మేధావులు వాటి మీద జరిగే చర్చలను సీరియస్‌గా తీసుకోవడం కానీ, నిమ్న కులాల సాంఘిక, ఆర్థిక, తాత్విక సమస్యలను పట్టించుకోవడం గానీ జరగదు. మనదేశంలోని ఆ(గ్రవర్ష మేధావులతో సిగ్గుకానీ, అపరాధభావం కానీ మచ్చుకైనా లేవు. అందుకే కులం గురించి అస్పృళ్యత గురించి వారు మాట్టాడడం కానీ, రాయడం గానీ చేయరు. నల్లజాతీయుల పట్ట శ్వేతజాతి మనస్తత్వంతోనే కాదు, కూ క్రక్స్క్లాన్ మనస్తత్వంతో కూడా వారు బాధపడుతున్నారు. అమెరికాలో ఉన్న వారికంటే కూ క్షక్స్ క్లాన్ మనస్తత్వం కలిగిన (బ్రాహ్మణీయ మేధావి మరింత (ప్రమాదకరం. అమెరికన్ కూ క్లాక్స్ క్లాన్ ఒక మార్టిన్ లూథర్ కింగ్నో, ఒక మాల్కం ఎక్స్నో హత్య చేసింది తప్ప (బ్రాహ్మణీయ మేథావులు చేసినట్టుగా గూడుపుఠాణీ రాతలు రాయలేదు. దళిత బహుజనుల్లోంచే వచ్చిన మేధావులు ఈ సమస్యలను (ప్రపంచ వేదికల మీదికి తీసుకువెళ్ళేసరికి జాతి వ్యతిరేకత అనే ప్రమాదకర సిద్దాంతం తెచ్చి వారిని బెదిరిస్తున్నారు. కొందరు మేధావులు ఆరోపిస్తున్నట్టు ఈ సమస్యలను మేము హౌస్ కమిటీ ముందుకు నేరుగా తీసుకెళ్ళలేదు. ఈ సమస్యల గురించి అమెరికా పౌరసమాజానికి తెలియజెప్పడానికి గత నాలుగేళ్ళుగా అలుపెరగని ప్రయత్నం జరుగుతోంది. కాడ్మేన్స్ కాల్ అనే బ్యాండ్ భారీ కచేరీలు నిర్వ హిస్తోంది. అమెరికన్లు ఈ కచేరీలలో పాలు పంచుకొంటున్నారు. ఒకే దేవుడు సృష్టించిన వారిలో కొంతమంది అస్పృశ్యులన్న ముద్రతో పొందుతున్న అవమానాల గురించి వింటున్న కొందరు అమెరికన్ల చెక్కిళ్ళ నుంచి కన్నీళ్ళు జారిపడిన దృశ్యాన్ని నేను స్వయంగా చూశాను.
హౌస్‌కమిటీ హియరింగ్‌కు ఈ వాతావరణమే అనుకూల పరిస్థితిని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై ఇటువంటి హియరింగ్‌లు, చర్చలు జరగడంలో తప్పేముంది? దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు సంకెళ్ళు తప్ప పోయేదేమీ లేదు.
వార్త - 19 నవంబర్, 2005
డ్తం
జాతి అజెండాలో కుల నిర్మూలన ఉందా?
భారత్ ఒక దేశంగా కులనిర్మూలనకు కృతనిశ్చయంతో ఉన్నట్టు ఇంతవరకు (ప్రకటించలేదు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతుల సాంఘిక జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి అర్ధ మనస్కంగా చేస్తున్న ప్రయత్నాలు జాతీయ జీవనంలో చెప్పుకోదగిన మార్పును తీసుకురాలేవు. కులనిర్మూలన అనేది కేవలం రాజకీయ అంశం కాదు. రాజ్యాంగం ద్వారా దానిని నిర్మూలించడం అసాధ్యం. రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే కులాన్ని నిర్మూలించాలని ఎస్సి, ఎస్టి కమీషన్ అధ్యక్షుడు సూరజ్‌ఖాన్ అనడం బండిని గుర్రానికి కట్టేయడం లాంటిదే. ఆధ్యాత్మిక మార్గంలోనే కులనిర్మూలన సాధ్యం. హిందూ ఆధ్యాత్మిక సాధనాల ద్వారానే కులవ్యవస్థను నిర్మించడం, పోషించడం నిర్వహించడం జరుగుతోంది. హిందూత్వం కులాన్ని నిర్మూలించకపోతే అస్పృశ్యతను కూడా నిర్మూలించలేదు. కులాన్ని నిర్మూలించకపోతే అది తన మృత్యువును తనే ఆహ్వానించుకున్నట్టు అవుతుంది. తనంతట తాను కులనిర్మూలనకు సిద్దపడిన చరిత్ర దానికి ఇంతవరకు ఉన్నట్టు కనిపించడం లేదు. హిందూ ఆధ్యాత్మిక పండిత వర్గం మరీ కరుడుగట్టుకొని పాతరాతి యుగంలో జీవిస్తూ ఉంటుంది.
ఒక మత సంస్కృతిని నిర్మించడం గానీ, నిర్మూలించడం గానీ రాజ్యాంగాల మీద ఆధారపడి జరిగేది కాదు, మతానికీ సంబంధించిన సంస్కృతులకు అంతర్జాతీయ స్వభావం ఉంటుంది, కులవ్యవస్థ వల్ల హిందూత్వం ఒక మతంగా అంతర్జాతీయతను సంతరించుకోలేక పోయింది. ఆస్ట్యనిస్థ్రాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు “అఖండభారతోలో భాగాలు కనుక ఆ దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఇటువంటి కులవ్యవస్థనే అభివృద్ధి చేశారు. కులవ్యవస్ట్రే ఈ ప్రాంతంలోని 'చండాలురిను (నేటి దళితులను), గిరిజనులను, శూద్రులను ఇస్టాంలోకి నెట్టి నూతన ఇస్టామిక్ రాజ్యాల పుట్టుకకు కారణమైంది. ఈ దేశాలలో ఇస్టాం వ్యాప్తికి కులంతో పాటు అస్పృళ్యులపై, గిరిజనులపై, శూద్రులపై, హిందూ కులవ్యవస్థ సాగించిన అసాధారణ హింసే కారణమన్న విషయాన్ని హిందూ మతాచార్యులుగానీ, హిందూత్వరాజకీయశక్తులు గానీ గుర్తించడం లేదు.
165
166 కుల నిర్మూలన అనివార్యమైన చెడు
చైతన్యం తెచ్చుకొన్న ఏ వ్యక్తీ ఆధ్యాత్మిక రంగంలో తనను అవమానించడాన్ని సహించలేడు. మతం మీద, మతసంస్థల మీద ఆధిపత్యం వహించేవారు సాటి మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నప్పుడు, ఆ సంగతిని ఆ పీడిత జనం (గ్రహించినప్పుడు వారిని అదే మతంలో ఏ కర్మ సిద్దాంతమూ బంధించి ఉంచలేదు. అటువంటి సిద్దాంతాలు తమ పట్ట పురోహిత వర్గం పన్నిన కుట్రలో భాగమని వారు [గ్రహించినప్పుడు ఆ సిద్దాంతాల కట్టుతాళ్ళను తెంచుకుని వారు బయటపడగానే తమను అంతకాలం హింసించిన వారిపై అటువంటి ప్రతీకారచర్యల దిగుతారు. ఇసాంలోకి మారిన పీడితులు చేస్తున్నది అదే. ఆస్ట్రనిస్థ్రాన్, పాకిస్టాన్లలో కులాలు/తెగలకు చెందినవారు ఒకే ఇస్టామిక్ సామాజికశక్తిగా పరివర్తన చెందే (క్రమంలోనే అక్కడ ఇస్లాం హింసాత్మక రూపం ధరిస్తోంది. అంతవరకు అసమానతల కింద మగ్గిన జనం సమానత్వం పొందడం మొదలైనప్పుడు ఎంతోకొంత హింస సహజంగానే సంభవిస్తుంది. అది ఒక అనివార్యమైన చెడు. అన్ని సమాజాలు అటువంటి దశ మీదుగా ప్రయాణం చేసే ఉంటాయి. ఆధ్యాత్మికంగా సమానత్వాన్ని అనుసరించిన యూరప్ క్రైస్తవ సమాజాలు కూడా మధ్యయుగాల చివరలో హింసాత్మకంగా జరిగిన ఆయా దేశాల అవతరణ ఘట్టాలను చూడవలసి వచ్చింది. కుల అస్తిత్వమే హింస మీద ఆధారపడి ఉంటుంది కనుక చారిత్రక కుల సమాజాలలో ఈ పరివర్తన మరింత హింసను సృష్టిస్తుంది.
ఒక సమాజంలోని జనసమూహంలో మతపరివర్తన సంభవించిందంటే వారు ప్రత్యేక జాతీయతను డిమాండ్ చేయడం అనివార్యమవుతుంది. అటువంటి ఉదాహరణలు రెండు మన ముందు ఉన్నాయి. 1947లో నేటి బంగ్లాదేశ్‌తో సహా పాకిస్ట్రాన్ స్వతం(త్రదేశం కావడానికి కారణం, ఈ రెండు ప్రాంతాలలోని జనం అప్పటికే ఇస్పాంలోకి మారిపోవడమే, కొందరు బ్రాహ్మణీయ మేధావులు చెబుతున్నట్టు ఆ ప్రాంతాలలోని కింది కులాలవారు హిందువులుగా సంతోషంగా జీవిస్తూ ఉండి ఉంటే అంత పెద్ద ఎత్తున జనసమూహం ఇస్లాంలోకి వెళ్ళి ఉండేవారు కాదు. ఎంత బలవంతంగా మతాంతరీకరణ జరిపినా అంతమందిని మార్చడం అసాధ్యం. ఇస్టాంలోకి వెళ్ళిన ఈ జనం, ఆధ్యాత్మిక సమానత్వం మీద ఏ మాత్రం గౌరవం లేని హిందువులతో తాము సహజీవనం చేయలేమన్న నిర్హయానికి కూడా వచ్చారు. దీని ఫలితంగానే ద్విజాతి సిద్దాంతం ముందుకు వచ్చింది. హిందూ కులవ్యవస్థ, దాని పద్దతుల నీడ కూడా తమ మీద పడకూడదని ఇస్లాంను స్వీకరించిన కింది కులాల వారు భావించడం కూడా ఈ డిమాండ్‌కు ఒక కారణం. పేరులోనూ, రూపంలోనూ కూడా ఇస్లాం వారికి కులంతో ఉన్న సంబంధాన్ని తొలగించి వేసింది.
జాతి అజెండాలో కుల నిర్మూలన ఉందా? 167
రెండవ ఉదాహరణ కాశ్మీర్ 1947 నాటి అంచనా ప్రకారం కాశ్మీర్లో 40 శాతం మంది ముస్తిమేతరులు. అంటే ఈ 40 శాతం వేర్వేరు కులాలకు చెందిన వారన్నమాట. వీరిలో స్వల్పశాతం మంది పండితులుగా పిలిచే బ్రాహ్మణులు. అయితే, ఇరయ్యవ శతాబ్ది చివరికల్లా అక్కడి ముస్లిమేతరులు చాలావరకు ఇస్లాం స్వీకరించారు. వారిలో కింది కులాల వారు కూడా ఉన్నారు. 1990 నాటికి హిందూత్వంలో మిగిలినది పండిట్లు - అంటే (బ్రాహ్మాణులు మాత్రమే. నేడు మొత్తం కాళ్మీరే ఇన్లామీకరణ చెందింది. జనాన్ని కలుపుకొనే మతం, జనాన్ని విడగొట్టే మతం సహజీవనం చేయలేవు కనుక పండిట్టు కాశ్మీర్ విడిచి రాక తప్పలేదు. ఏ సెక్యులర్ సిద్దాంతమూ సమానస్టాయిలేని రెండు మతాలను ఒకచోట సహజీవనం చేయించలేదు. అన్ని మతాల వాళ్ళూ సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నప్పుడే ఒక (ప్రాంతంలో భిన్న మతాల సహజీవనం సాధ్యమవుతుంది. ఎస్సిలు, ఎన్టిలు, ఒబిసిలు ఈ రకమైన ఆధ్యాత్మిక అసంతృప్తికి లోనవుతున్నంతకాలం, హిందుత్వంపై (బ్రాహ్మాణవాదపు ఆధ్యాత్మిక నియం(త్రణ ఉన్నంతకాలం అసంతుష్ట సామాజికవర్గాలు వేరే మతంలోకి మారే భయం ఎప్పుడూ ఉంటుంది. దేవాలయాల ద్వారా సమీకరించే డబ్బు మీదే హిందుత్వం నేడు ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక పాసిజం హెందూత్తు నిర్మాణంలోనే ఇమిడి ఉంది కనుక్క అది దేవాలయాలకు విరాళాలిచ్చే వారి విషయం కూడా ఆధ్యాత్మిక సమానత్వానికి చోటివ్వదు.
జాతీయతకు మతపరమైన గుర్తింపు కీలకం కనుక, పెద్దఎత్తున మతం మారిన ప్రతి (ప్రాంతంలోనూ వేర్పాటు డిమాండ్లు తలెత్తుతాయి. క్రైస్తవ 'ప్రాబల్యంలోకి వచ్చిన మూడు ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే ఈ ధోరణిని కనబరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా గోవధను నిషేధిస్తే, ఇటువంటి రాష్ట్రాలు మరింత స్వయం ప్రతిపత్తి డిమాండ్ చేస్తూ (క్రమంగా వేరుపడే హక్కు కోసం నిలదీయవచ్చు. కాళ్మీర్, ఇస్టామిక్ జాతీయతావాదం మనజీవితకాలంలోనే నిజమవడం చూస్తున్నాం. తొలి ప్రధాని, కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ స్వరాషమైన కాశ్మీర్ ఆయన ఆయన కుటుంబసభ్యుల పాలనలోనే, అతి తక్కువ సమయంలో ఇస్టామీకరణ చెందింది. కాశ్మీర్ దేశంలోనే అత్యంత కులతత్వపూరిత రాష్ట్రమనీ, పండిట్టు కరడుగట్టిన (బ్రాహ్మణీయశక్తులనీ మనం మరచిపోకూడదు. గతంలో ఇటువంటి (బ్రాహ్మాణవాదమే ఆపష్టనిస్టాన్, పాకిస్టాన్లలో ఉండేది. ఇప్పుడీ దేశాలలో (బ్రాహ్మాణవాదం అంతరించిపోయింది. కులతత్వమూ, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇవ్వజూపిన ఇస్లాంలోకి కింది కులాల వారు మారిపోవడం ఇందుకు కారణం, హిందుత్వంలో ఎంతో సహనభావం ఉందని ప్రబోధించే హిందూ పండితులు, కులవ్యవస్థ ఉనికే ఆ మతంలోని అసహనానికి సూచన అన్న సంగతిని (గ్రహించడం అవసరం. ఆ కులవ్యవస్తే హిందూమతాన్ని మృత్యుబిలం వైపు నడిపిస్తోంది. (ప్రజలకు అర్థిక సమానత్వాన్ని అందించడమో, లేక ఆస్టనిస్థాన్స్ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మాదిరిగా అదృశ్యమైపోవడమో, ఏదో ఒకదానిని హిందుత్వం ఎంచుకోవాలి. వార్త - 20 డిసెంబర్, 2005
చాప్టర్ - 1/11 ర్ ఓబీస 44. ఒబిసి రిజర్వేషన్ ఒట్టిదేనా? వ్యతిరేకుల వత్తిడిలో నీరుగారిన ప్రతిపాదన 45. “ఓటు ఫోర్సుగా మారిన ఒబిసి 'ఓటు బ్యాంకు 46. ఒబిసిల కాళ్ళు కట్టి పరిగెత్తముంటోంది - సుప్రీంకోర్టు 47. బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక
డ్తేడ్తే ఒబిసి రిజర్వేషన్ ఒట్టిదేనా? వ్యతిరేకుల వత్తిడిలో నీరుగారిన ప్రతిపాదన
జౌతీయస్థాయిలోని ఉన్నత విద్యా నంన్ఫలలో 27శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలన్న కేంద్రప్రభుత్వ (ప్రతిపాదనపై మబ్బులు కమ్ముకొన్నాయి. అది అమలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం అమలు (ప్రక్రియ అంతా చిక్కుల్లో పడింది. ఐఐటి., ఐఐఎం, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు రిజర్వేషన్ ప్రతిపాదలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసినదే. మొయిలీ కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదిక, దశలవారీగా రిజర్వేషన్ అమలు చేయాలన్న హాస్యాస్పద సిఫార్సుతో ఒబిసిలను దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత పరిశ్రమల సమాఖ్య (సిపిఐ) ప్రధానికి సమర్పించిన తన నివేదికలో పారిశ్రామిక దాతృత్వం వంటి మరింత హాస్యాస్పద సిఫార్సు చేసింది తప్ప చివరకు సానుకూల చర్య అన్న ప్రతిపాదనను కూడా ఆమౌదెంచలేదు. దేశంలోని ప్రాబల్య శక్తులన్నీ రిజర్వేషన్ ఆలోచననే వ్యతిరేకిస్తుండడంతో యుపిఎ పాదాలు చల్లబడ్డాయి. ఫలితంగా సంబంధిత బిల్లును పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టకపోవచ్చు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతిపాదిత రిజర్వేషన్‌ను అమలు చేయాలని రిజర్వేషన్ అనుకూల శక్తులు ప్రభుత్వంపై ఒత్తిడి తేగల స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదు. సోనియాగాంధీ రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్నా, ఆమె నిర్ణయాలన్నింటినీ, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ములాయంసింగ్ యాదవ్ వైఖరితో బేరీజు వేయడం జరుగుతోంది. ఈ రిజర్వేషన్ విషయమై కాంగ్రైస్ను సవాలు చేయగల స్థితిలో ఒక్క సమాజ్‌వాది పార్టీ మాత్రమే ఉంది. ఆ పార్టీయే పూర్తిగా మౌనం వహించడం విచిత్రం. ఈ మౌనానికి కారణం ఎవరికీ తెలియదు. పారిశ్రామిక వేత్తలందరూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు కనుక పారిశ్రామిక లాబీని ప్రయోగించి అమర్‌సింగ్ ఎటువంటి ఒత్తిడైనా తెస్తున్నారేమో చెప్పలేం. లేదా కాంగ్రైస్ ఈ ఏడాది బిల్టు తీసుకురాలేకపోతే యుపి
171
172 ఓబీసీ ఎన్నికల యుద్దంలో ఈ అంశాన్ని వాడుకోవచ్చునని ములాయంసింగ్ అనుకొంటు న్నారేమో, ఏది ఏమైనా ఇంతటి కీలకమైన విషయంలో ఈ మౌనం దురదృష్టకరం. ఇంతకీ మొయిలీ కమిటీ ఎవరి (ప్రయోజనాలకు సాయపడుతోంది? వీరప్ప మొయిలీ చేసిన బహిరంగ ప్రకటనలను బట్టి ఈ రిజర్వేషన్‌ను మొత్తంగా ఒకేసారి అమలు చేయాలన్న దృడాభిప్రాయంతో ఉన్నట్టు కనిపించారు. కమిటీ లోపల ఒత్తిడికి ఆయన లొంగడం లేదన్న అభిప్రాయం ఒబిసిలకు కలిగింది. మధ్యంతర నివేదిక సరళిని గమనిస్తే రిజర్వేషన్ వ్యతిరేకవాదులు కమిటీ ఆలోచనను ప్రభావితం చేయగలిగారనే అనిపిస్తుంది. లేకపోతే సీట్లు పెంచి వాటికి అవసరమైన వసతులన్నీ కల్పించే వరకు 27 శాతం రిజర్వేషన్ అమలు వాయిదా వేయాలని సిఫార్సు చేయవలసిన అవసరం ఏమిటి? ప్రస్తుతమున్న సీట్టు అగ్రవర్ణాలకు రిజర్వ్ చేశారా? సీట్టు పెంచడానికీ, ఒబిసి రిజర్వేషన్ అమలు చేయడానికీ సంబంధం ఏమిటి? ఒబిసిలు రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్టాయిలో సమైక్యపోరాటాన్ని జరపగల స్థితిలో లేరు. ఈ అంశం చడీచప్పుడు లేకుండా సమాధికావాలని అ(గ్రవర్ష ప్రాబల్యం గల మీడియా కోరుకొంటోంది. రిజర్వేషన్ అంటేనే భయపడిపోయే రీతిలో అది వ్యతిరేక (ప్రచారం చేసింది, ఆ ప్రయత్నంలో చివరకు విజయవంతమైంది. అంతవరకు రిజర్వేషన్‌కు సంబంధించి కొన్ని మౌలిక అంశాలను లేవనెత్తుతూ వచ్చిన ఒబిసి గొంతులు కూడా మూగపోవడమే ఇందుకు నిదర్శనం. భిన్న వైఖరులు రిజర్వేషన్‌ను దశలవారీగా అమలుచేసే విధానానికి లాలూప్రసాద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్‌లను ఒప్పించడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని మొయిలీ కమిటీ ప్రభావితం చేయగలిగిందనడానికి ఇది సూచన. అర్జున్‌సింగ్ ఒకేసారి మొత్తం రిజర్వేషన్ అమలుచేయాలని గట్టిగా నొక్కి చెబుతున్నా. మొయిలీ కమిటీని ఏర్పాటుచేయడం ద్వారా (ప్రధానమంత్రి సాచివేత వ్యూహాన్ని అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా చూస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఈ రిజర్వేషన్ విషయంలో భిన్న భిన్న వైఖరులున్నట్టు స్పష్టమవుతుంది. (ప్రస్తుతం ఒబిసి శక్తులు ఎదుర్కొంటున్న బలహీనత ఏమిటంటే, వారికి సంబంధించిన విధానపరమైన అజెండా ముందుకు తీసుకురాగల రాజకీయ నాయకత్వం కొంతవారికి ఉన్నప్పటికీ, ఆ అజెండాను (క్రియారూపంలో మరింత ముందుకు తీసుకుపోవలసిన అధికారయం(త్రాంగంలో ఒబిసి ప్రయోజనాలను పరిరక్షించగల సీనియర్లు ఎవరూ లేరు. మండల్-1ను అమలు చేసే వరకు ఒబిసిలలో ఉన్నతాధికారులు ఎంతోమంది
వ్యతిరేకుల వత్తిడిలో నీరుగారిన ప్రతిపాదన 173 లేరు. అలాగే మంచి పలుకుబడి కలిగిన ఉన్నత విద్యాసంస్థలలో, రాజకీయ నాయకత్వం ఆలోచనా సరళిని ప్రభావితం చేయగల, చెప్పుకోదగిన ఒబిసి మేధావులూ అప్పటికి లేరు. ఒబిసి రాజకీయనాయకుల్లో కూడా జాతీయ విధానాలను ప్రభావితం చేయగల దార్శనికత, రాజకీయస్థాయి ఉన్నవారు కూడా ఎవరూ లేరు. మండల్-1 విషయంలో ఒక వైఖరిని తీసుకొని దానిని తక్షణమే అమలులోకి తేవాలని నిరంతరాయంగా ఒత్తిడి తెచ్చిన బలమైన రాజకీయశక్తి డిఎంకె, పిఎంకె కూటమి. తాజా రిజర్వేషన్ అమలులో జాప్యం చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తూ కరుణానిధి కేంద్రానికి లేఖరాయడం ఒక్కటే ప్రస్తుతానికి ఆశాకిరణం. సిఎంకె నాయకుడు రామదాస్‌కు కూడా రిజర్వేషన్ల పట్ట ఇటువంటి నిబద్ధతే ఉన్నప్పటికీ మెడికోల రిజర్వేషన్ వ్యతిరేక సమ్మెను ఎదుర్కొనడంలో తగిన చాకచక్యం చూపించలేకపోయారు. ఎఐఐఎంఎస్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) వ్యవహారాలలో, ముఖ్యంగా వేణుగోపాల్ ఉదంతంలో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారుల పట్ట ఎంతో సానుకూల దృష్టితో ఉన్న న్యాయస్థానాలు తాను తీసుకొనే ఏ నిర్ణయాన్ని అయినా రద్దు చేయగలవని రామదాస్ ఊహించలేకపోయారు. సమతాపార్టీ అధ్యక్షుడు శరద్‌యాదవ్ రిజర్వేషన్ చర్చను ప్రభావితం చేయడానికి కొంతమేరకు ప్రయత్నించారు. ఎంతో కొంత సైద్దాంతిక దృష్టి ఉన్న నాయకుడు ఆయన, అయితే మౌలికంగా రిజర్వేషన్ వ్యతిరేకపక్షమైన బిజెపికి ఆయన పార్టీ మిత్రపక్షంగా ఉంది కనుక ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. సిపిఐ. సిపిఎంలకు రిజర్వేషన్ల పట్ట గట్టి వైఖరి ఎప్పుడూ లేదు. కనుక ఒబిసిలతో ఎవరైనా, ఏ ఆట అయినా ఆడుకోవచ్చు. ఎందుకంటే వారు, ఒక ఓటు బ్యాంకూ కాలేరు. అగ్రవర్ల తరహాలో రాజక్రీయ, మీడియా ఉగ్రవాదానికి మళ్ళలేరు. వార్త - 25 ఆగస్టు, 2006
డ్తే5్ “ఓటు ఫోర్సుగా మారిన ఒబిసి “ఓటు బ్యాంకు ఇటీవల నాలుగు ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అవకాశాల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో ఒబిసిల, మహిళల ఓట్లను రాజస్థాన్‌లో అగ్రకులాల, మహిళల ఓట్లను గెలుచుకునేందుకు బిజెపి వ్యూహాత్మక ఎత్తుగడలు బాగా పనిచెయ్యగా, కాంగ్రెస్ మాత్రం తన వ్యూహాన్ని సమర్థవంతంగా రూపొందించుకోలేక పోయింది. ఈ ఫలితాలను ప్రభుత్వ వ్యతిరేకాంశంగా పేర్కొనడం అంటే ఎన్నికల (ప్రక్రియను తప్పుగా అర్ధం చేసుకోవడమే. మధ్యప్రదేశ్, రాజస్టాన్, ఛత్తీస్‌గడ్‌లలో కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దళిత అజెండాతో పాటు గోసంరక్షణ, దేవాలయాల గురించి కూడా మాట్టాడింది. దానిని పత్రికలు 'సున్నిత హిందూత్వ'గా వ్యాఖ్యానించాయి. దిగ్విజయ్‌సింగ్ అజెండా నుండి ఒబిసిలు వైదొలగారు. రాజస్టాన్‌లో ముఖ్యమంత్రే స్వయంగా ఒబిసి అయినా అక్కడ ఒబిసి అజెండాయే లేదు. పైగా మరోవైపు ఆయన కోటాలు (ప్రకటించడం ద్వారా అ(గ్రకులాల సమస్యని చేపట్టారు. అందువల్ల ఒబిసిలు సంతోషంగా లేరు. ఒబిసి సామాజిక శక్తుల ద్వారా మండల్ తీర్మానం ఆవిర్భవించాక అ(గ్రకులాలు, దళిత మేధావుల్లో ఒక వర్గమూ, ఒబిసిల తీర్మానాలు ప్రమాదకరమైనవనే సిద్దాంతాన్ని (ప్రతిపాదించాయి. ఒబిసిలను వారి స్థానంలో వారిని నిలబెట్టేందుకు దళితులు అ(గ్రకులాలు ఐక్యం కావాలని కోరారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ ప్రయోగం నిరుపయోగమయ్యిందని రుజువయ్యింది. ఎస్సీ, ఎస్టీలు అ(గ్రకులాలు కలిసి ఓట్ల శక్తిగా మారి మళ్ళీ అధికారం తెచ్చిపెడతాయని దిగిజయ్సింగ్ను నమ్మించారు. దళిత అజెండాను స్వంతం చేసుకోవడానికి అ్యగకులాలుగాని, లేదా తమ (ప్రయోజనాలను పూర్తిగా విస్మరించినా ఆయనను క్షమించడానికి ఒబిసిలు గాని 174
'ఓటు ఫోర్సు'గా మారిన ఒబిసి 'ఓటు బ్యాంకు" క్ష్ ఇష్టపడలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఎస్సీ, ఎస్టీలనూ, ఒబిసిలనూ ప్రత్యేక అజెండాలతో ఒకే వేదిక మీదికి తీసుకురావాలనేదే అంబేదృరీయుల అవగాహన. ఎవ్వరూ ఒక వర్గాన్ని పక్కన పెట్టి, మరో వర్గానికి పోటీగా నిలువలేరు. ఓట్ల శక్తిగా ఒబిసిలు
చతురులైన ఈ రాజకీయ వేత్తలకు ఒక ఓటు బ్యాంకుగా మౌనంగా మిగిలిపోయే సామాజికవర్గంగా ఒబిసిలు ఉండరన్న సూచనను ఈ ఎన్నికలు అందజేస్తున్నాయి. తాము కూడా ఒక ఓటు శక్తీ అన్న గుర్తింపు ఒబిసిల్లో నెలకొన్నది. కొన్ని రాజకీయ శక్తులకు ఓటు బ్యాంకుగా మారాలా లేక తామే ఒక ఓటు శక్తిగా ఎదగాలా అన్న విషయమై కొన్ని సామాజిక వర్గాల మధ్య అభిప్రాయ బేధం ఉన్నది. ఒక్కసారి గనుక వారొక ఓటు శక్తిగా మారితే అప్పుడు వారు రాజకీయ పార్టీలను వారి వారి అజెండాలను బట్టీ చూడడం ప్రారంభిస్తారు. ఒక ఓటు బ్యాంకునైతే 'నమ్మతి'గా పరిగణించవచ్చు. కాని ఒక ఓటు శక్తి మాత్రం అలా కాదు. మధ్యప్రదేశ్‌లో దళిత అజెండా చూడడానికి సానుకూలంగానే కనిపించినా - దానిని ఒబిసిలకు వ్యతిరేకంగా నిలపారు. ఈ కోణాన్ని బిజెపి అర్హం చేసుకోవడంవల్లనే దిగ్విజయ్‌సింగ్‌పై సైర్ బ్రాండ్ ఒబిసి మహిళా నాయకురాలు ఉమాభారతిని ప్రత్యామ్నాయంగా నిలిపింది. ఆమె మన ఆంధ్రప్రదేశ్‌లోని బిజెపి నేత దత్తాత్రేయవలె కాదు. ఆయన స్వయంగా ఒక ప్రముఖ ఒబిసి నాయకుడే అయినా, తన ఒబిసి గుర్తింపును సాధారణంగా వినియోగించుకోరు. కాని ఉమాభారతి నిరంతరం ఆ విషయాన్ని నొక్కి చెబుతూనే ఉంటారు. ఆమె ప్రధానమంత్రి తీసుకున్న అనేక నిర్ణయాలను నిరసించారు. తనకు క్యాబినెట్ స్థానం ఇచ్చే వరకూ ఆమె వాజ్‌పేయి మంత్రివర్గంలో కూడా చేరనే లేదు. అలాంటి మహిళను బిజెపి దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి నిలిపింది. దాంతో ఆమె సహజంగానే ఒబిసిలందరినీ సమీకరించగలిగిన అంశంగా మారారు.
బిజెపి చాలా కాలం పాటు పురుషాధిక్యత గల హిందూ పితృస్వామ్య పా ర్టీగా మిగిలిపోయింది. ఈ ఎన్నికలకు ముందు బిజెపి ముఖ్యమంత్రి స్ధాయి స్థానాలకు మహిళా అభ్యర్థులను ఏనాడూ ప్రతిపాదించలేదు. ఆఖరికి కాంగ్రెస్‌లో కూడా, ఒరిస్సాలో నందిని శతపథి తప్ప మరే మహిళా ఒక శాసనసభా పక్ష నాయకురాలిగా అవిర్భవించలేదు. కాంగ్రెస్ ఢిల్లీలో షీలా దీక్షితను ముందుకు తెచ్చినపుడు మధ్యతరగతి మహిళలంతా ఆమె వైపుకు తిరిగినట్టు కనిపిస్తోంది.
176 ఓబీసీ స్తీ వాదం ఈ పరిస్థితి భారతదేశ మహిళా ఓటర్లలో స్త్రీ వాద అంశాన్ని మాత్రమే సూచిస్తున్నది. నిమ్న కులాల జన సమూహాల్లో గర్భస్టమైన (స్తీ వాద అంశమే ఇందిరాగాంధీ నాయకత్వానికి మనుగడ కల్పించింది. మహిళలు నాయకులవ్వడానికి వ్యతిరేకమైన బిజెపి తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్యం, బ్రాహ్మణత్వం బలంగా ఉన్న మధ్యప్రదేశ్ వంటి రాష్టంలో బిజెపి ఉమాభారతి వంటి నాయకురాలిని ముందుకు తెచ్చి ఆమె ముఖ్యమంత్రి కావడానికి అనుమతించింది. కాంగైస్ పార్టీ ఎంతో కాలంగా కనీసం ఒక్క దళిత ఒబిసి మహిళా నాయకురాలినైనా ముఖ్యమంత్రిగా చేయలేకపోయింది. మహిళా రిజర్వేషన్ల సమస్యను అన్ని రాజకీయ పార్టీలూ విస్మరించాయి. ఈ వ్యవస్థలో పురుషాధిక్యత నెలకొన్న విషయాన్ని అట్టడుగు స్థానంలో ఉన్న మహిళలు కూడా గుర్తించారు. మహిళా రిజర్వేషన్లపై చర్యలు తప్పనిసరిగా మహిళా చైతన్యాన్ని ప్రభావితం చేశాయి. ఆ విధంగా మహిళలు ఒబిసిలు అన్న రెండు నూతన స్పృహలూ ప్రతి రాజకీయ పార్టీనీ నూతన రాజకీయ సర్దుబాటు రూపాల గురించి యోచింపచేయాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సర్దుబాటు రాజకీయ సంస్కృతిని అభివృద్ది పరచుకోలేకపోవడం చాలా ఆశ్చర్యకరం. సర్దుబాటు మార్గంలో బిజెపి చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు అతి వేగంగా సమీపిస్తున్నందున కాం(గ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని పునర్నిర్మించుకోవాలి. రాజస్ట్రాన్ మధ్యప్రదేశ్ తరహా వ్యూహాలు ఈ దేశంలో ఎక్కడా పనిచేయవు. సమిష్టి రాజకీయ అజెండా గల శక్తులను ఒకదానికి ఒకటి విరుద్దంగా నిలపడం ఏ రాజకీయ పార్టీకీ సాధ్యం కాదు. ఏదో ఒక పార్టీకి ఓటు బ్యాంకుగా మిగిలిపోవడం అనేది ఏ సామాజిక వర్గ రాజకీయ పరిపక్వతకూ నిదర్శనం కాదు. అది వారి వెనుకబాటుతనాన్నే సూచిస్తున్నది. ఒక సామాజిక వర్గం కనుక ఒక ఓటు శక్తిగా మారితేనే అది వారి పరిపక్వతకు సూచన అవుతుంది. కాం(గైస్ ఈ గుణపొఠాన్ని నేర్చుకోకపోతే అది ఏనాడూ మనుగడ సాగించలేదు. వార్త - 27 జనవరి, 2004
ఉగ్ర ఒబిసిల కాళ్ళు కట్టి పరిగెత్తమంటోంది ఎ సుట్రంకోర్పు వాని ఠు
సుప్రీంకో ర్హు ఈ మధ్య బఒబిసి రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు - పందెంలో ఉండే హక్కు మీకు ఉంది - అని ఒబిసిలకు చెబుతూనే, కాళ్ళు కట్టేసి ఉరకండి అంటోంది. 27 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యడం న్యాయమే అని చెప్పింది. అంతేకాదు, ఈ రిజర్వేషన్లను కల్పించేందుకు చేసిన 93వ రాజ్యాంగ సవరణ కూడా రాజ్యాంగబద్దమైందే అని తీర్చు చెప్పింది. ఈ రెండు అంశాలను చూసి చాలామంది ఒబిసిలు ఆనందపడ్డారు. నేను ముందు, టివి చానెళ్ళలో ఏప్రిల్ 10న వచ్చిన స్రోల్స్ను చూసి కోర్టు మంచి తీర్పు ఇచ్చిందనే అభి[ప్రాయపడ్డాను, ఆనందపడ్డాను కూడా,
కాని ఏప్రిల్ 10 రాత్రి ఎన్టివి, టైమ్స్ నా టివిల్లో ఈ అంశంపై చర్చించడానికి పిలిస్తే పోయాను. ఒక టివిలో సుప్రీంకోర్టులో కేసు వేసిన ప్రా॥ ఇందిరేశన్ (ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్, మరో టివిలో శివభేరా అనే మరో అగ్రకుల పిటిషన్‌దారు చర్చల్లో ఉన్నారు. వారిద్దరు సుప్రీంకోర్టు తీర్చును వేయి నోళ్ళా పొగుడుతున్నారు. అప్పుడు నాకు ఈ తీర్పులో ఏదో ప్రమాదముందని అనుమానమొచ్చింది. మరుసటిరోజు, అంటే ఏప్రిల్ 11న ఎన్డిటివి బిగ్ ఫైట్‌లో పాల్గొనటానికి రమ్మంటే ఢిల్లీ పోతూ విమానంలో పత్రికలన్నీ తిరిగేసి తీర్పు సారాంశాన్ని చదివాను. అప్పుడుగాని తీర్పులోని అసలు ప్రమాదం నాకు అర్థం కాలేదు. సరే, (క్రీమీలేయర్‌ను రిజర్వేషన్ నుంచి తొలగిస్తూ చేసిన వ్యాఖ్యల గురించి టివిలు కూడా చెప్పాయి. కాని అందులోని అసలు సంగతి పత్రికలు చదివేదాకా అర్ధం కాలేదు. ఆ తీర్పులో నాలుగు ప్రమాదకరమైన కండిషన్లతో ఒబిసి విద్యార్థులు అసలు కేంద్రప్రభుత్వ సంస్థల్లో అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకటి-2.5 లక్షల ఆదాయం ఉన్న ఒబిసిలకు అసలు ఎంటబ్రెన్సు కూడా రాసే హక్కు లేకుండా చేయటం. ఇప్పుడున్న ధరలు, వేతనస్కేళ్ళ ప్రకారం ప్యూన్ ఉద్యోగం చేసి పిల్లల్ని చదివించుకునే వాళ్ళు ఎంట్రన్సు పరీక్షలకు అర్హులు కారు. (గ్రామీణ ప్రాంతాలలో, (ప్రాంతీయ భాషల్లో
క్షే/7/
178 ఓబీసీ ఇంటర్ చదువుకుని ఎంట్రన్స్ రాయటానికి అర్హత ఉన్న ఒబిసి పిల్లలు ఇంగ్లీషు భాషలో ఉండే ఎంట్రన్స్ పేపర్‌ను అసలు అర్ధమే చేసుకోలేరు. అందుకని వాళ్ళు దీని జోలికి పోరు.
రెండవది-ఒక జడ్జి ఎంట్రన్స్ పరీక్షలో చివరి జనరల్ అభ్యర్థికి, చివరి ఒబిసి అభ్యర్థికి 5 మార్కుల కంటే ఎక్కువ తేడా ఉండడానికి వీలులేదని చెప్పారు. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో అడుగుపెట్టలేని బీద ఒబిసి పిల్లలు, కోచింగ్ అంటే ఏమిటో తెలియకుండా అన్ని హంగులు - ఇంగ్లీషు మీడియం చదువులు, లక్షల కొద్ది కుమ్మరించిన కోచింగ్‌లు - ఉన్న అ(గ్రకుల పిల్లలతో సమానంగా మార్కులు తెచ్చుకోవాలి. లేకపోతే (అంటే 5మార్కుల కంటే తేడా ఎక్కువ ఉంటే) సీటు ఇవ్వరు. మూడవది, ఈ విధంగా బబిసి విద్యార్థులు తమకు సాధ్యంకాని కష్టాలు పడి సీట్లు సంపాదించకపోతే మిగిలిన సీట్లను వెంటనే ఓపెన్ కేటగిరి అభ్యర్థులలో నింపుతారు. (శ్రీమీలేయర్ను పోటీపడకుండా చూసి, బీద ఒబిసిలు తమలో తాము పోటీపడే విధానాన్ని రద్దుచేసి, అగ్రకుల బలిసిన గుర్రాలతో సమానంగా పోటీపడమంటే ఇక జరిగేదేమిటి? సీట్ట్లన్ని ఖాళీ ఉండడమే. అంటే, సుప్రీంకోర్టు మనదేశంలో 27 శాతం ఒబిసి రిజర్వేషన్సు ఇవ్వవచ్చు అని చెప్పి, ఒక్కడు కూడా ఆ సీట్టలోకి అడుగుపెట్టకుండా చూసిందన్నమాట. అంతేకాక ఈ విధంగా అమలయ్యే రిజర్వేషన్లను (ప్రతి అయిదు సంవత్సరాలకు రివ్యూ చేసి చూడాలట. గత 60 సంవత్సరాలకు ఏ రంగంలో ఒబిసి అభ్యర్థులు కనిపించకపోతే 60 ఏళ్ళ స్వాతంత్ర్యంలో ఏం జరిగిందని రివ్యూ చేయాలని కోర్టు చెప్పదు. కాని ఇన్ని అడ్డంకులు తట్టుకొని ఎవరైనా కొద్ది మంది ఐఐటిగాని, మెడికల్ కాలేజీల్లో గౌని అడుగుపెడితే వారు ఇంకా బయటికి రాకముందే రిజర్వేషన్లను రివ్యూ చేయాలట!
ఇవన్నీ కాక మరొక జడ్జి - (గ్రాడ్యుయేట్ పట్టా పొందిన ప్రతి ఒబిసిని విద్యాపరంగా అభివృద్ధి చెందిన వ్యక్తిగా చూసి ఆ వ్యక్తి పోస్టు (గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోకి రిజర్వేషన్ ద్వారా పోకుండా చూడాలని తీర్పు చెప్పారు. అంటే ఇకముందు నుండి అన్ని పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రిజర్వేషన్సు ఉండొద్దని ఆ జడ్జి అభిప్రాయం. చాలా విచిత్రంగా సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారి ఎవరి ఇష్టమొచ్చిన తీర్పు వారు రాసారు. ఆ బెంచ్‌కి అధ్యక్షతన వహించిన చీఫ్ జస్టిస్, జడ్డిల్లో ఒక జడ్జిగా మాత్రమే మిగిలిపోయారు. ఇంతకుముందు ఇలా ఎప్పుడన్నా జరిగిందో లేదో నాకు తెలియదు. కాని ఈసారి జరిగింది అదీ!
ఈ మొత్తం జడ్జిమెంట్‌ను వీరప్ప మొయిలీ రికమెండేషన్లతో జతచేసి చూస్తే ఇప్పుడున్న సీట్లన్నీ జనరల్ అభ్యర్థులకే పోగా ఇంకో 27 శాతం సీట్లు వాళ్ళకు అదనంగా వస్తాయి. ఎందుకంటే, ఈ యాంటీ రిజర్వేషన్దార్లకు భయపడి ప్రతి కోర్సులో 27
పరిగెతమంటోంది - సుప్రీంకోర్టు 1/70 శాతం సీట్టు అదనంగా పెంచడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించింది. అందుకు తోడు కేంద్ర విద్యాసంస్థల్లో సౌకర్యాలు పెంచడానికి రూ. 1600 కోట్టు అదనంగా ఖర్చు చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు తీర్పువల్ల ఒబిసిలకు వచ్చే సీట్లు ఏమి ఉండవు. కాని అగ్రకులాలకు పెరుగుతాయి. రూ. 1600 కోట్లను ఏకధాటిన అన్ని సంస్థలకు పంపిణీ చేస్తారు. ఈ తీర్పును వ్యతిరేకించి, ఈ మొత్తం తీర్పు మీద మరో రివ్యూ పిటిషన్ వెయ్యాలని ఎవరైనా వాదిస్తారా? ఈ దేశంలోని అగ్రకుల మేదావులంతా - వీరందరూ దేశదోహులు, అసలు వీళ్ళు భారతీయులే కాదు - అని మన మీద ముద్రలు వేస్తారు. ప్రభుత్వాలు రిజర్వేషన్ల కోసం లొసుగులతో చట్టాలు తెస్తాయి. కోర్టులు వాటిని కొట్టివేయడమైనా చేస్తాయి, లేదా ఇలా కాళ్ళు కట్టివేసి పందెంలో పరుగెత్తమంటాయి. మరి ఒబిసిలు ఈ స్థితిలో ఏం చేయాలి? మీరే ఆలోచించండి!
వార్త - 20 ఏప్రిల్ 2008
శ్తీ బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక
వచ్చే ఆర్దిక సంవత్సర బడ్జెట్ (2012-13) మన రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వారికి ఒక (ప్రత్యేక ప్రణాళిక (స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ రూపొందించాలి. గత ఆదివారం నాడు హైదరాబాద్ జూబ్టీ హాలులో జరిగిన బి.సి. మేధావుల, ప్రజాసంఘాల, రాజకీయ నాయకుల సదస్సు తీర్మానమది. జాతీయ స్టాయిలో ఎస్సి/ఎస్టిలకు స్పెషల్ కంపొనెంట్ ప్లాను. సబ్ ప్లానులు ఉన్నాయి. బి.సి.లకు ఇప్పటివరకు కేంద్రస్థాయిలో కానీ, రాష్ట్ర స్టాయిలో కానీ అటువంటి ప్రణాళిక లేదు. ఆ మాట కొస్తే బిసిలకు ఇటీవలి వరకు కేంద్ర స్థాయిలో రాజ్యాంగబద్ద గుర్తింపు లేదు. మండల్ ఉద్యమం ఫలితంగా ఒక గుర్తింపు లభించింది. దాని ఫలితమే బిసిలకు విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు, ఇంతకు | మించి ఏ గుర్తింపూ లేదు. వనరులు అసలే లేవు. బిసిలు హిందూయిజంలో భాగం అనే దృక్పథం, దానితో పాటు కొంత అభివృద్ది చెందిన వారనే భావనతో బిసిలకు ఏ రంగంలో కూడా ఒక (ప్రత్యేక గుర్తింపు రాకుండా చూస్తున్నారు. అయితే అభివృద్ది పరంగా చూసినప్పుడు (మన రా[ష్ట్రాన్నే తీసుకుందాం) 'ఏ' (గ్రూపులోని బిసిలంతా సంచార కులాల వారై, హిందువులు నీచవృత్తులుగా భావించే “గొప్పు వృత్తులు చేసేవారుగా ఉన్నారు. గంగిరెద్దుల, పిచ్చగుంట్ల నుంచి చాకలి, మంగలి కులాల వరకు ఆర్థికంగా అథోగతిలో ఉన్నారు. విద్యాపరంగా దాదాపు జీరో లెవల్ అభివృద్దిలో ఉన్నారు. బిసిల పాత జాబితాలోని 93 కులాల్గో, ఇంగ్లీషు మీడియం విద్యారంగంలో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ కనుక బిసిలకు సైతం ఒక 'నిర్దిష్ట విద్యాప్రణాళికను రూపొందించాలి. అటువంటి విద్యా ప్రణాళికను రూసొందించని పక్షంలో కొన్ని బిసి కులాల్లోని పిల్లల్ని స్కూలుకు పంపడం
180
బిసిలకు ప్రత్యేక ప్రణాళిక 181 కూడా అసాధ్యమవుతుంది. ఇక వృత్తులతో బతికే బిసిలకు ఇప్పటివరకు 17 'ఫెడరేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ఒక ఛైర్మన్, ఒక కారు, ఆయనతోనే తిరిగే ఒక ప్యూను ఉంటారు. అంతే తప్ప ఆ వృత్తికారుల అభివృద్ధికి పైసలు కానీ, ప్రణాళికలు గానీ లేవు. అధ్యయనమనే ఆలోచన అంతకన్నా లేదు. కొత్తగా వచ్చి చేరిన (139) బిసి కులాల్లో కొందరికి నిర్దిష్టమైన వృత్తులున్నాయి. మిగతావారికి, రోడ్లమీద పడి తిరగడం, అడుక్కు తినడమే వృత్తి. 65 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత ఇన్ని కులాలు అడుక్కు తినే వృత్తిలో ఎట్లా ఉన్నాయి? ఈ స్థితిని ఎట్టా మార్చాలి? వారు ఇలా ఉండడం దేశానికే అవమానం కాదా?
అందుకే కొన్ని కులాల వృత్తుల్ని పూర్తిగా మార్చే ప్రణాళికతో పాటు మరికొన్ని వృత్తుల్ని, ఆధునికీకరించి పారిశ్రామికీకరణలోకి ప్రవేశపెట్టే ప్రణాళికను నిర్షిష్టంగా రూపొందించాలి. అది ఇప్పుడున్న సాధారణ ప్టాను వల్ల సాధ్యం కాదు. బిసి ప్రత్యేక ప్రణాళిక వల్లనే సాధ్యమవుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ (ప్రకారం ఆదాయ వ్యయాల మొత్తం విలువ 129 వేల కోట్ల రూపాయలని అంచనా, అందులో రమారమి 56 వేల కోట్ల రూపాయలను ప్లాన్డ్ బడ్జెట్‌గాను, 73 వేల కోట్లు నాన్-ష్టాన్స్ బడ్జెట్‌గాను చూపించారు. నాన్ ప్లాన్ బడ్జెట్ జీతభత్యాలకు, ఎస్టాబ్లిష్‌మెంట్‌కు, పాత స్కీములను నడపడానికి మాత్రమే వాడుతారు. ఆ డబ్బులో ఒక కొత్త ప్లాను ప్రతిపాదించలేదు. అందువల్ల 56 వేల కోట్ల రూపాయల ప్లాన్డ్ బడ్జెట్లో 25 శాతం స్పెషల్ బిసి వ్లానుకు 14వేల కోట్ల రూపాయలు ఇవ్వొచ్చు. 2012 నాటికి బడ్జెట్ పెరగనుంది కనుక దాదాపు 15 వేల కోట్ట రూపాయలతో బిసి బడ్జెట్ రూపొందించాలి అనేది వాదన. దాన్ని ఎట్టా ఖర్చు చెయ్యాలన్నది కూడా పెద్ద సమస్య. ఎస్సి, ఎస్టి స్టాన్ డబ్బును పూర్తిగా ఖర్చు కాలేదన్న నెపంతో దారిమళ్ళించిన సంగతి తెల్సిందే. అందుకే ఖర్చు ప్టాను చాలా కీలకమైనది. ఐతే ఇప్పుడు బిసిలకు కేటాయించిన 3,400 కోట్ట రూపాయలు స్కాలర్షేప్ల కోసం మా(త్రమే. ఈ అన్యాయాన్ని కచ్చితంగా సవరించాలి.
బిసి ప్లాన్ బడ్జెట్లో &0 శాతం డబ్బును బిసిల విద్యకు ప్రత్యేకంగా కేటాయించాలి. ముఖ్యంగా “ఎ (గ్రూపులోని కులాల పిల్లలకు మూడేళ్ళ వయసు నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేంతవరకు చదువు, తిండి ఇవ్వకుండా వారి బతుక్కు ఒక అర్జాన్ని ఇవ్వలేం. బి (గ్రూపుల్లో కూడా సంచార కులాలున్నాయి. కురుమ కులమే అందుకు మంచి ఉదాహరణ. ఈ కులంలో దాదాపు 50 శాతం కుటుంబాలు 'మండల మన్యాల్లో ఉంటారు. వారు
ఓబిస్
పిల్లలను బడికి తోలలేరు. వారికో వృత్తి ఉన్నా. సంచార అవసరం వారిని వెన్నాడుతూనే ఉంది. ఇటువంటి కులాల వృత్తులకు నిలకడ కల్పించాలి. వృత్తులున్న కులాలకు, ఆ వృత్తులను ఆధునికీకరించేందుకు, అవి పారిశ్రామీకరణ వైపు పయనించేందుకు ప్లాను తయారుచేయాలి. వృత్తులు లేనివారికి ఒక వృత్తిని కల్పించాలి. అది సాధించేందుకు అన్ని కులాల పిల్లల్ని ఇంగ్రీషు - తెలుగు సమపాళ్ళలో ఉండే విద్యావ్యవస్థను (గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఈ కులాల పిల్లలు కామన్ స్కూళ్ళలో ఉన్నా వారి పోషణ, పుస్తకాలు ష్టాన్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాలి. బిసిలకు (ప్రతి తాలూకాలో ఒక ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్/ఇంటర్మీడియట్ కాలేజీని ఈ డబ్బులో నుంచి ఖర్చు చేసి నడపాలి. (ప్రతి జిల్హాలో ఒక క్వాలిటీ ఇంగ్లీషు మీడియం డిగ్రీ కాలేజిని (రెసిడెన్షియల్ తప్పకుండా నడపాలి. ఇక్కడే వారిని ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్దం చెయ్యాలి. విద్య ఒక్కటి మాత్రమే కుటుంబాన్ని, కులాన్ని ఆధునికీకరిస్తుందనే ఆదర్శాన్ని ప్రజల జీవితాల మార్పులో నిరూపించాలి. ఇందుకు ముందే చెప్పినట్టు 40 శాతం ప్లాన్ బడ్జెట్‌ను ఖర్చు చెయ్యడం అవసరం,
మిగతా 60 శాతాన్ని అన్ని కులాలకు ఫెడరేషన్లను ఏర్పరిచి (ప్రతి కులానికి జనాభా (ప్రాతిపదికన వాటా అందేట్లు చూడడం. అందుకోసం ఇప్పుడున్న 17 ఫెడరేషన్సు పోగొ మిగిలిన కులాలన్నిటినీ ఫెడరేషన్ల కిందకి రాబట్టాలి. ఏ వృత్తిలేని చిన్న కులాలను ఆ కులాల అభివృద్ది ఫెడరేషన్ ఏర్పరచి, వాటికి స్థిర జీవితాన్ని, ఒక మంచి ఇల్టును, కొద్దో, గొప్పో భూమి లేదా గౌరవ (ప్రద వ్యాపారం లేదా మరో వృత్తిని ఏర్పరచాలి. తల్లిదండ్రులు అడుక్కొచ్చి పెడితే తిని పిల్లలు ఆత్మగౌరవంతో స్కూల్లో కూర్చోలేరు. అందుకని ఈ ప్లాను వాళ్ళ కుటుంబాలు సెటిల్మెంట్పై ఎక్కువగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది, మొత్తంగా అన్ని కులాల్ని (మున్నూర్ కాపులతో సహా) కాన్ఫెడరేషన్లుగా రూపొందితే వాటి ద్వారా (వాటికి ఆఫీసులు, మంచి అధ్యయన సిబ్బంది ఉండాలి) వృత్తుల ఆధునికీకరణకు పూనుకోవచ్చు. ఉదాహరణకు కల్టుగీత వృత్తిని ఆధునికీకరించాలంటే చెట్టు పెంచడంతో (ఫారెన్ లిక్కర్ కంటే కల్లు మంచిది కనుక) పాటు తాటికి, లొట్టి దాచే యంత్రాన్ని తయారు చెయ్యడం కష్టం కాదు. మనిషి చెట్టెక్కి పడిచచ్చే స్థితికి మార్చాలి. అలాగే చాకళ్ళు గాడిదల్లా బట్టలు మోసే స్థితి మార్చాలి. ఉతుకుడు పద్ధతిని, ఇస్త్రీ పద్ధతిని బాగా ఆఅధునికీకరించాలి. నేతగాళ్ళకు మిషన్లద్వారా నేసే పద్దతిని ఇంటింటికి తీసుకుపోవాలి. బట్టలమ్మే మార్కెట్‌ను కొంతైనా వారి చేతిలోకి తేవాలి.
బిసిలకు ప్రత్యేక ప్రణాళిక
ఫీప్ బ్రీడర్స్ ఫెడరేషన్ ద్యారా ఎరువు సమీకరణ, ఉన్ని కత్తిరింపు, పాలు పితకడం, మాంసం ఎగుమతి వంటి పనులన్నిటికీ, అలాగే తమ (గ్రామాల నుంచి ఆధునిక పద్దతిలో అమ్మకానికి, ఎగుమతికి ఉపయోగపడే శాస్రీయ పద్ధతుల్ని రూపొందించాలి. కుండల తయారీ వ్యవస్థను సంపూర్షంగా ఆధునికీకరించవచ్చు. ఐతే వీటన్నిటికి ఫెడరేషన్ల ద్వారా (ప్రత్యేక అధ్యయనాలు, మేధావులతో కూడిన చర్చలు జరగాలి. ఈ పనికి ప్రతి 'ఫెడరీేషన్లో ర్సెర్చి అండ్ డెవలప్మెంట్ కోసం డబ్బు కేటాయించుకొని నిపుణుల కమిటీలు వేయాల్సి ఉంటుంది. ఇవేకాక వ్యవసాయరంగంలో ఈ వృత్తులను ముడేసి అభివృద్ది చెయ్యాల్సి ఉంటుంది. బిసిల్లో కొన్ని కులాలు ్రత్యేక వ్యవసాయ కులాలు, కొన్ని పాక్షిక వ్యవసాయ కులాలు ఉన్నాయి. వ్యవసాయ పనిముట్లను ఆధునీకరిస్తే దున్నుడు, కలుపుతీసుడు నీళ్ళు పెట్టుడు వంటి పనులపై కూడా కొత్తకోణంలో రీసెర్చ్ జరగాలి. అందుకు ఒక బిసి వ్యవసాయ ఆధునిక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా చేపల పెంపకం, కుందేళ్ళ పెంపకం వంటి పనులు పల్లెకార్ల ఫెడరేషన్ ఆధునిక రూపంలో చెయ్యవచ్చు. నీటి, ఆహార వనరులను బిసి "ఫెడరేషన్త ద్యారానే అభివృద్ది చెయ్యగలం.
ఇక్కడ అన్ని కులవృత్తులను వ్రస్తావించలేకపోయినప్పటికీ బిసి ప్లానుతో ఆర్థికవ్యవస్థలో విష్ణవాన్ని తేవచ్చు. ఇటువంటి ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ద్వారా కులాల మధ్య సంబంధం మారుతుంది. ఎస్సి, బిసిల మధ్య ఉండే వైరుధ్యం, అగ్రకులాలతో వీరికుండే వైరుధ్యం బాగా మారుతుంది. ఇది ప్లాన్డ్ బడ్జెట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ప్లానులో (విద్యా ప్పానులో భాగంగా) పూలే నాలెడ్జ్ కేంద్రాల అభివృద్ధి, చాకలి, ఐలమ్మ సాంస్కృతిక రంగాల అభివృద్దిని, ల్లైబ్రరీలను పెట్టవచ్చు. బిసి కళల ఆధునీకరణ జరపొచ్చు. వీటన్నింటికీ (ప్రత్యేక అధ్యయనాలు, షాను రూపొందించాల్సి ఉంటుంది. కుల-సమీకరణ, వృత్తి-సమీకరణ ఏకకాలంగా జరగాలంటే చైతన్యవంతమైన శక్తులు కూడా ఆయా కులాల్లో ఎదగాల్సి ఉంటుంది. అప్పుడే (ప్రభుత్వ ఉద్యోగాల నుంచి (పైవేట్ ఎంటర్ 'ప్రైెన్యూయర్పేప్ వైపు యువత మరలుతుంది. ఈ మౌలిక మార్పును, త్వరితగతిని తీసుకురావడానికి, బిసిల్లోని మనుషుల్ని నాగరిక మానవులుగా తీర్చిదిద్దడానికి ఈ బిసి ప్లాన్ తప్పక అవసరం. అది బిసిల ఐక్యపోరాటంతోనే సాధించుకోగలం.
అంతకు ముందుగా జరగాల్సింది ఈ ఆలోచనను బిసిల ముందుండం. వారిని తమ కుల చైతన్యం నుంచి, ఒక బిసి వైతన్యంలోకి ఎదిగించడం. అందుకు ప్రతి పాత
శేక4 ఓబీసీ తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో బిసి సదస్సులు జరుపుకొని ఈ అంశంపైనే చర్చించడం అవసరం. ఈ (క్రమంలోనే అన్ని పార్టీల్లోని బిసి నాయకులపై వత్తిడి పెంచాలి. అన్ని పార్టీల్లో, ప్రజాసంఘాల్లో ఇదొక 'పిచ్చి వాదం'గా మారితే తప్ప బిసిలు బిసి స్పెషల్ ష్లానును సాధించుకోలేరు. అది రాకుండా ఆత్మహత్యలు తప్ప బిసిలకు మరోదారి కనిపించదు. రాష్టంలో బిసిల ఆత్మహత్యలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం. ఈ పోరాటం 2012 ష్టాన్ బడ్జెట్ ప్రతిపాదనలోపే జరగాలి.
ఆంధ్రజ్యోతి - 1 సెప్టెంబర్, 2009
చాప్టర్ - 111 కాషాయ చరిత్ర 48. చరిత్రకు కాషాయవర్ణం తొలగితే చాలా? 49. అభివృద్ధికీ, అయోధ్యకూ పొత్తు ఎలా? 50. రాముడు - రామసేతువు నివాదం న్యాయపరిష్కారం సాధ్యమేనా? 51. ఒరిస్సాలో కందమల్ ఎందుకు కాలుతోంది? 52. ఇక్కడ కూడా ఒక మోడీ పుట్టొచ్చు
డేగ
చరిత్రకు కాషాయనర్లం తొలగితే చాలా?
అర్జున్‌సింగ్ మానవ వనరుల అభివృద్ది శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యను కాషాయీకరణ నుంచి తప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. విద్యను కాషాయీకరించడం ఎంత లోతున జరిగిందంటే, మురళీ మనోహర్ జోషి విద్యావిధానంలో అన్ని స్టాయిలలో హిందూత్వ బభావజలాన్ని చొప్పించారు. అయితే, విద్యను లౌకికవాదానుకూలంగా మార్చే ఘట్టంలో విద్యావిధానాన్ని ఉత్పాదక తరగతులకు అనుకూలంగా మార్చారని కాదు, లౌకికవాద విద్యావేత్తలు చేసిందల్లా, హిందూ ముస్లిం చారిత్రక విధానాలలో మధ్యవర్తి పాత్రను పోషించడమే.
వారు కూడా, అనేక సంస్కృతులతో కూడిన సమాజం అన్న ప్రాతిపదికన ఉత్పాదక తరగతుల కోణం నుంచి చరిత్ర రచనా అవసరాన్ని గుర్తించడం కాదు అందుకు ప్రయత్నించడం గానీ చేయలేదు. జాతీయవాద చరిత్రకారుల దృష్టిలో జాతీయ మూల్యాలు వేదాలపై ఆధారపడినవి. మార్కిస్టు చరిత్రకారుల దృష్టిలో అవి భారతీయమైన ముక్కు మొహం లేని వ్రర్గం మీద ఆధారపడి ఉంటాయి. వర్గమంటే సారాంశంలో కులమే. పాలితవర్గ (సజీష్ణర్చ్) చరిత్రకారుల దృష్టిలో జాతి అంటే రైతు. మనిషి అస్తిత్వం కోసం ఆహారాన్ని, ఇతర పరికరాలను, వస్తువులను ఉత్పత్తి చేయడానికి ప్రకృతితో పోరాడే ఒక చర్మకారుడు, చెప్పులు కుట్టేవాడు, కుండలు చేసేవాడు, గొర్రెలు కాసేవాడు, నాగలి పట్టేవాడు - తదితర ఉత్పాదక తరగతుల నిజమైన గుర్తింపును ఇది ప్రతిబింబించదు. ఇటువంటి ప్రతి సామాజిక బృందానికి తమదైన కులనామాలు ఉన్నాయి.
ప్రాతినిధ్య చరిత్ర అవుతుందా?
కనుక్క విద్యను కాషాయీకరణ నుంచి తప్పించడమంటే, చరిత్ర పుస్తకాల నుంచి కొన్ని వాక్యాలనో, పేరాలనో తొలగించడం కానీ, హిందూత్వ చరిత్రకారులు తయారుచేసిన పుస్తకాల నుంచి జ్యోతిష్యం గురించిన పాఠాలను తొలగించడం కానీ కాదు. గణితాన్నో,
187
188 కాషాయ చరిత్ర వేదాలలో ఉన్నట్టు చెప్పే సైన్సునో తెలగించడమో లేదా, లౌకికవాద చరిత్రకారుల భాషలోకి వాటిని మార్చడమో చేసినంత మాత్రాన భారతదేశ చరిత్ర ఇక్కడి జనసమూహాలన్నింటికీ (ప్రాతినిధ్యం వహించే చరిత్ర కాబోదు. కులతత్వవాదానికీ, లౌకికవాదానికీ మధ్య తేడా చాలా స్వల్పం. ఈ దేశాన్ని పీడిస్తున్నది కేవలం మతతత్వమే కాదు, కులతత్వం కూడా. కనుక విద్య అనేది సమాజం మొత్తాన్ని కులతత్స రహితం చేసేదిగా ఉండాలి. బిజెపి హయాంలో ఎన్సీఇఆర్టి రూపొందించిన పాఠ్యపుస్తకాలు భారతీయ సమాజపు పునాదినే ధ్వంసం చేసేలా ఉన్నాయి. వేదకాలపు (బ్రాహ్మాణవాదాన్ని భవిష్య జీవితానికే కాదు, భవిష్యత్తులోని తరాలకు కూడా కేంద్రం చేయడానికి అందులో ప్రయత్నం జరిగింది. ముస్లిం పాలకుల చరిత్రను పిశాచప్రాయంగా చిత్రించారు. నిర్దిష్టమైన ఏ రూపాన్ని అయినా శా్రీయంగా విశ్లేషించడం కానీ, చరిత్రను, సామాజికశా(స్తాలను నిశితంగా పరిశీలించడం కానీ జరగలేదు. రాజ్పుట్ నేతృత్వంలో తయారైన ఆ పుస్తకాల రూపాన్నీ, వస్తువునూ పరిహరించడం అవసరం. అయితే ఇక్కడ ప్రశ్నలా వాటిని తొలగించి ఏం చేయాలన్నదే. లక్షలాది మంది పిల్లలకు మనం ఎటువంటి చరిత్రను అందించాలి? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బొద్దులు ఎటువంటి ఘర్షణలకు దిగకుండా పక్కపక్కనే జీవించడాన్ని బోధించే సిలబస్ ఇస్తే సరిపోతుందా? అటువంటి చరిత్ర వల్ల మతపరమైన ఘర్షణలను నివారించాలన్న ఒకే ఒక అనుకూలాంశాన్ని నొక్కి చెప్పడమవుతుంది. అది చారిత్రక మనః।ప్రవృత్తిని, మూస ధోరణులను, కుల వివక్షను నివారించలేదు. చరిత్ర, సామాజిక శా(స్తాలనేవి కులాలు, సంస్కృతులు, భిన్న భిన్న ఆచార వ్యవహారాలు, సం(ప్రదాయాలు, వాటి పునాదుల మీద అవతరించిన వ్యవస్థాగత నిర్మాణాలన్నింటి గురించి వివరించవలసి ఉంటుంది. మనదేశంలో ఉన్న కులపరమైన సామాజిక వ్యవస్థలో కేవలం కుల ప్రాతిపదిక మీద జరిపే విశ్లేషణ ద్వారానే విద్యార్థులు మనదేశంలోని సాంస్కృతిక బాహుళ్యంతో కూడిన నిర్మాణాలను అర్హం చేసుకోడానికి వీలవుతుంది. భవిష్యత్తరాలు భారతదేశానికి చెందిన అనుకూల, ప్రతికూల చరిత్రనంతటినీ తెలుసుకోవడం అవసరం. దేనిని ఆచరించాలో దేనిని ఆచరించకూడదో కూడా వారికి తెలియాలి. సమానత్వ లక్ష్యానికి చేరుకోవడానికి ఏది తోడ్పడుతుందో, ఏది అడ్డంకి అవుతుందో వారికి బోధపరచడం అవసరం. ఈ క్షణాన భారతదేశంలో అసమానతల మధ్య పోటీ నెలకొని ఉంది. కుల, లింగ, తాత్విక, రాజకీయపరమైన అసమానతలు మనదేశంలో ఎంత లోతున నెలకొన్నాయంటే, వాటి వలన సామాజిక వ్యవస్థ అంతా వేలాదిగా చీలికలు పేలికలై పోయింది. కులపరమైన అసమానతలు నిజమైన పోటీతత్వాన్ని ఎలా నాశనం చేశాయో పిల్లలందరూ తెలుసుకోవలసిన అవసరముంది. అన్నింటినీ మించి కులవ్యవస్థ సంఘంలో కొందరి గౌరవ మర్యాదలను, (శ్రమ చేయడంలోని ఉదాత్తతను
చరిత్రకు కాషాయవర్ణం తాలగితే చాలా? 189 భగ్టం చేసి వేసింది. మన పాఠశాల విద్యకు శ్రమ పట్ట గౌరవభావాన్ని కేంద్రాంశంగా ఎందుకు చేయాలి? ఇన్నేళ్ళుగా పాఠశాల విద్య ఒక అస్పష్ట స్థితిలో ఉండిపోయింది. సామాజికపరమైన వివరణలు గానీ, సాంస్కృతిక చరిత్ర గానీ, రాజకీయ చరిత్రగానీ ఇంతవరకు కులాన్ని ఒక విధ్వంసకర (ప్రతికూల వ్యవస్థగా పరిగణించలేదు. చెప్పులు కుట్టడం, కుండలు చేయడం, పశువులను కాయడం, చివరకు నేలదున్నడం వంటి శ్రమపూరిత చర్యల గురించీ, నిత్య జీవితంలో (శ్రమ శేయడంలోని ఉదాత్తతను గౌరవించడం గురించి ఏ చరిత్రకారుడూ చర్చించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అర్జున్‌సింగ్ నేతృత్వంలోని మానవవనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ రూపొందిస్తున్న నూతన విద్యా విధానం కులాల గురించి కానీ, శ్రమపట్ట కులవ్యవస్థ సృష్టించిన అగౌరవ భావాన్ని కానీ పట్టించుకోకపోతే, కులపరమైన అసమానతలు, వాటి ద్వారా పుట్టుకొచ్చే ఇతర అసమానతలతో కూడిన అదే వ్యవస్థను మనం మళ్ళీ కోరుకోవడమవుతుంది. మేధావుల మూఢ నమ శకం
అర్జున్‌సింగ్ స్వయంగా మతతత్వ వ్యతిరేకి అవడంలో సందేహం లేదు. ఆయన నియమించబోయే కమిటీలో కూడా గతంలోని మతతత్వ రచయితలు మతపరమైన మూసలో తయారుచేసిన చరిత్రను వ్యతిరేకించే వారే సభ్యులుగా ఉండవచ్చు. కానీ కులాల గురించిన చర్చ వాంఛనీయం కాదనే అభిప్రాయం చాలామంది చరిత్రకారులలో కనిపిస్తోంది. చరిత్ర పట్ట అటువంటి వైఖరి, ఇతరత్రా ప్రగతిశీల భావాలు గల అనేకమంది చరిత్రకారులలో కూడా, మూఢభావాల పట్ల గుప్తంగా ఉన్న గౌరవభావాన్ని పట్టి ఇస్తుంది.
కులం గురించి చర్చిస్తే, కులతత్వం మరింతగా విస్తరిస్తుందనే అభిప్రాయం కూడా కొందరు సామాజిక శాస్త్రవేత్తలలో ఉంది. ఇదెలా ఉందంటే, మనం కేన్సర్ గురించి చర్చిస్తే అది మనదేహంలో మరింత వ్యాపిస్తుందనీ, దాని గురించి మాట్లాడడం మానేస్తే దానంతటదే అదృశళ్యమైపోతుందనీ అనడంలా ఉంది. పిల్లలకు లైంగిక విద్యను బోధిస్తే అది వాళ్ళల్లో ఎయిడ్స్ వ్యాప్తికి దారితీస్తుందని నమ్మే రచయితలు కూడా మనలో ఉన్నారు. అలాగే విద్యార్థులకు కులం గురించి బోధిస్తే వాళ్ళు కులతత్వవాదులుగా మారతారని భావించే సామాజిక శాస్త్రవేత్తలూ మనలో ఉన్నారు. ఇంతకంటే మూఢనమ్మకం మరొకటి లేదు. కేన్సర్ శస్త్ర చికిత్స ద్వారానే తొలుగుతుంది. ఎయిడ్స్‌ను నిర్మూలించడం అనేది పిల్లలకు శాస్రీయమైన లైంగిక విద్యను బోధించడం ద్వారానే జరుగుతుంది. అలాగే, నిత్యజీవితంలో చోటు చేసుకునే అన్ని రకాల (శ్రమల పట్ల పిల్లలలో గౌరవభావం పెంచడం ద్వారా కులాన్ని అంతం చేయవచ్చు. సాంఘిక వ్యవస్థ మీద కులం చూపించే ప్రతికూల (ప్రభావాన్ని చర్చించుకునే అవకాశాన్ని కూడా పిల్లలకు ఇవ్వాలి.
190 కాషాయ చరిత్ర యూరప్, అమెరికా సమాజాలలో పెళ్ళిళ్ళు, పెళ్ళి చేసుకునే వారి సొంత ఇష్టాయిష్ట్రాల మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి కనుక ఆ సమాజాలలో కులవ్యవస్థ ఏర్పడలేదు. అన్ని వివాహాలు (ప్రేమ వివాహాలే కావాలనేమీ లేదు. అయితే అవి కేవలం సొంత ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి జరగడానికి ఖచ్చితంగా అవకాశముంది. వివాహ వ్యవస్త మీద తల్లిదండ్రుల, కులం కట్టుబాట్ల పట్టును కనుక తొలగిస్తే, క్రమంగా వివాహ వ్యవస్థలో కులంతో పాటు వరకట్న దురాచారం కూడా అంతరిస్తుంది. మనలో చాలామంది గుర్తించకపోవచ్చు కానీ కులవ్యవస్థ్రకు, వరకట్న దురాచారానికీ మధ్య ఖచ్చితమైన సంబంధముంది. కనుక పాఠ్యపుస్తకాలలో కులవ్యవస్థ గురించి, దాని దు(ప్ప్రభావాల గురించి కూడా చేర్చడం అవసరం. కాషాయీకరణను తాలగించడమనే ప్రక్రియలో
కులతత్యాన్ని తొలగించడం కూడా భాగం కావాలి. వార్త - 9 ఆగస్టు, 2004
త్తం అభివృద్దికీ, అయోధ్యకూ పొత్తు ఎలా? డా అది
ఎన్నికల (ప్రచారం మొదలైనప్పటి నుంచి బిజెపి తన మతతత్వాన్ని మార్చుకుందని భావించాం. పాకిస్థాన్‌తో యుద్దం కాక శాంతి, చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కారాన్ని కోరుతున్నందుకు సంతోషించాం. కాకపోతే, పోయిన ఎన్నికలు 'యుద్ధ' నినాదంతో జరిపే ఈసారి 'శాంతి' అనడం పట్ట అనుమానాలు లేకపోలేదు. “భారత్ వెలుగుతోంది" నినాదం బూటకమని అందరూ ఒవ్పుకున్నప్పటికీ 'అభివృద్ది' నినాదంపై ఎన్నికలు జరుపుతామన్నప్పుడు దేశం ఊరడిల్లింది, సంతోషపడింది. ఇప్పుడు ఆలయాన్ని కడతాం, ఆవురక్షణను అఖిలభారత సమస్య చేస్తామని అంటే రక్తపాతం ఆపబోమని పరోక్షంగా చెప్పడమే.
తీరా ఎన్‌డిఎ మేనిఫెస్టోలో ఆలయనిర్మాణం, ఆవురక్షణ నినాదాలు చోటు చేసుకోవడంతో మళ్ళీ మైనారిటీలలో భయం మొదలైంది. బాబ్రీ మసీదు స్టానంలోనే ఆలయం కడతామంటే దేశమంతటా రక్తపాతం జరిగినా ఫరవాలేదని (ప్రకటించడమే. ముస్లింలు దేశంలో మైనారిటీ కనుక వారినేదైనా చెయ్యవచ్చుననుకోవడం 'ఇరాక్ పట్ట అమెరికా అంచనా" వంటి ఆలోచనే. ఆ తప్పు చేసినందుకు అమెరికా మరో పాతికేళ్ల పాటు నిర్భయంగా నిద్రపోలేదు. ఇరాక్ వియత్నాం కంటే పెద్దపీడకలై అమెరికాను సుదీర్హకాలం వెంటాడుతుంది. బిజెపి ఎంతమంది ముస్లింలను తమ పార్టీలో చేర్చుకున్నా ఆలయ నిర్మాణం అంతర్యుద్దానికి దారితీయకమానదు. ఆలయం కట్టడం అభివృద్ధి కాదు, అది అంతర్వుద్దానికి నాంది అవుతుంది.
అవు ప్రపంచ జంతువు
మళ్ళీ బిజెపి ఆవురక్షణ సమస్యను దేశం ముందుకు తెచ్చింది. ఆవు ప్రపంచ జంతువు. అది ఒక్క భారతదేశంలోనే హిందువులు మాత్రమే తయారుచేసిన జంతువు కాదు. అది ప్రపంచంలో అన్ని దేశాల్జో కూడా పాలిచ్చే జంతువు. ఆహార జంతువు
19]
192 కాషాయ చరిత్ర కూడా. చాలా దేశాల్లో పశుమాంసం ప్రధానాహారం. మరి భారతదేశంలో మాత్రమే ఆవు ఇంత గందరగోళానికి ఎందుకు కారణమవుతోంది? నిజానికి భారతదేశపు లేదా దక్షిణాసియా మొత్తానికి ప్రత్యేక జంతువు బర. యూరప్, అమెరికా దేశాల్లో బ(ర్రైె లేదు. ఈ దేశంలో మాత్రం అది పేదల ఇంట్లో అతి గారాబంగా చూసుకునే పాడి జంతువు. భారతదేశంలో మూడొంతుల పాలు బ(రైలు ఇస్తే ఒకవంతు పాలు మాత్రమే ఆవులు, మేకలు, గొరైలు ఇస్తాయి. అయినా బ(్రెపైనలేని అభిమానం రాజకీయపార్టీలకు ఆవుపైన ఎందుకు పుట్టుకొస్తున్నది?
ఈ మధ్య 'బ(రై జాతీయవాదం” అనే నా ఆంగ్ల పుస్తకంపై వ్యాఖ్య రాస్తూ ప్రముఖ రచయిత కుష్వంత్సీంగ్ ఒక (ప్రశ్న వేశారు. ఆవు మూత్రం, "పేడ కూడా ఆరోగ్యానికి మంచివని చెప్పేవారు. బ(రై మూత్రాన్ని పేడను మెడికల్‌గా ఎప్పుడైనా పరీక్షించి చూశారా అని. ఆ రెండు జంతువుల పాలు, మూత్రం, పేడా దాదాపు ఒకే రకమైన కెమికల్స్‌ని కలిగి ఉంటాయి. సైన్సుతో సంబంధం లేకుండా సెంటిమెంట్ల ఆధారంగా ఆవును పవి[త్రజంతువుగా, బరైను అపవిత్రజంతువుగా చూసే రాజకీయపార్టీ దేశాన్ని అభివృద్ది పథంలోకి ఎట్లా నడిపిస్తుంది? ఈ దేశంలో బ(రైను పవిత్ర జంతువుగా భావించే కులాలు చాలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనే సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అంజన్‌కుమార్‌యాదవ్ బరైకు పూజ చేసి ప్రచారం మొదలుపెట్టుకున్నారు. కనుక జంతువుల పట్ల అభిమానాలు, (ప్రేమలు వ్యక్తిగతమైనవి కాని జాతీయమైనవి కావు. వాటిని జాతీయ విశ్యాసాలుగా చలామణి చేయడం అభివృద్ధి నిరోధకమే అవుతుంది.
కేరళ రాష్టంలో మతంతో సంబంధం లేకుండా అత్యధిక ప్రజలు పశుమాంసం తింటారు. పళుమాంసం అన్ని హోటల్స్‌లో దొరుకుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందరూ పశుమాంసం తింటారు. అన్ని రాష్ట్రాలలో ముస్లింలు, ఆదివాసులు, కొన్ని రాష్ట్రాల్లో దళితులు, క్రైస్తవులు పశుమాంసం తింటారు. కనుక గోరక్షణ పేరుతో దేశం మొత్తం మీద గోవధనిషేధిస్తే అంతర్యుద్దానికి కాక అది దేనికి దారితీస్తుంది? అభివృద్ది (ప్రజల ఆహార సమస్య తీరడంతో ముడిపడి ఉంది. ఇప్పటికే అతి తక్కువ పోషకాహారం తీసుకునే దేశం భారతదేశమే. అందుకే (ప్రజలు అంత సులభంగా అన్ని రకాల వ్యాధులకు గురౌతున్నారు. ఈ దేశంలో ఇప్పుడున్న ఆహారపు పరిమాణాన్నీ, నాణ్యతనూ తగ్గించే ఏ నిర్ణయమైనా అభివృద్ది నిరోధక నిర్ణయమే.
పనిచేసే మనుషుల్లో వ్యత్యాసాలను, పాలిచ్చే జంతువుల్లో వ్యత్యాసాలను (ప్రవేశపెట్టి ప్రాచీన మధ్యయుగాల నాడు ఈ దేశంలోని సైన్సును చంపారు. ఇప్పుడు ఒకపక్క అభివృద్ది అంటూ, మరోపక్క సైన్సును చంపే అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అభివృద్ధికీ, అయోధ్యకూ పొత్తు ఎలా? 1903 ఈ ఆలోచనతో అభివృద్ది ఎట్లా సాధ్యం? ఈ నినాదాలు ఇక్కడితో ఆగవు. కోడి మాంసం, చేప మాంసం, గొరై, మేక మాంసాలు గిట్టనివాళ్ళు ముందు, ముందు వాటినీ నిషేధిస్తామంటారు. అప్పుడు పోషకాహారం సంగతేమవుతుంది? ఇవాళ మనం దేశంలో వాడే చాలా అలోపతి మందుల్లో పశుమాంసముంటుంది. ఈ మూర్థ వాదనలతో ఆ మందులను కూడా నిషేధించాలనుకుంటే దేశమేమవుతుంది? లోపించిన అంచనాలు ఒక రాజకీయపార్టీకి ఏడేళ్ళు దేశాన్ని పరిపాలించాక కూడా అభివృద్ధి, అభివృద్ది
వ్యతిరేక అంశాలపై అంచనా లేకపోవడం విచారకరం. అది ఈ దేశపు దారిద్ర్యం కూడా.
హిందూయిజం సేరుతో మూఢనమ్మకాలను మతంగా మార్చడం వల్ల భారతదేశంలో
మేధస్సు అంతగా అభివృద్ది చెందలేదు. ఈ మధ్యకాలంలోనే ఇంగ్లీషు భాష ప్రభావం
వల్ల కొంత శాస్త్రీయ ఆలోచనలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఇంగ్లీషు భాష లేకుంటే
విదేశీమారకద్రవ్యం ఇక్కడ అంతగా పోగుబడే అవకాశం లేదు. 1950 దశకంలో నెహ్రా
సైతం నాటి జననంవు నినాదానికి తలొగ్గి పొందీని జూతీయభామగా
'ప్రవేశపెడతామన్నప్పుడు ఒక్క డిఎంకె పార్టీ బలంగా వ్యతిరేకించింది. అదే జరిగితే
తమిళనాడు దేశం నుంచి విడిపోతుందని అన్నాదురై నాయకత్వంలోని డీఎంకె
హెచ్చరించింది. ఫలితంగానే ఇంగ్రీషు కొనసాగింది. దాని ఫలితంగా సైన్సు, కంప్యూటర్ జ్ఞానం మనదేశంలో కొంతైనా అభివృద్ది చెంది చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు
చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఒక్క రాజకీయ పార్టీ కూడా (గ్రామీణ స్థాయిలో ఇంగ్లీషు
విద్యను అభివృద్ది చేస్తామని చెప్పలేదు.
దేశం అప్పులపాలై కొన్ని రోడ్డేసుకున్నది. ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు
కొనుక్కునే కార్లకు ఈ రోడ్డు ఉపయోగపడతాయి. ఎగుమతి, దిగుమతులు కూడా
ఎక్కువగానే జరగొచ్చు. కాని అభివృద్ది అంటే రోడ్డు మధ్య, ధనికవర్గాలు వాడుకునే
టెలిఫోన్లు కాదు. అభివృద్ది అనేది విద్య, ఉద్యోగం, తిండి వనరుల రంగాల్లో జరగాలి.
ప్రజల విద్యాప్రమాణాలు పెరగాలి. ఆలయం నిర్మిస్తామంటే లేదా ఆవుల్ని రక్షిస్తామంటే
(ప్రజలు ఓటేస్తే అది (వ్రజాస్వామ్యానికి గీటురాయి కాదు. అది ఈ దేశపు వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. (ప్రజాస్వామ్య దేశాలైన యూరప్‌దేశాల్లో మసీదులు కూల్చినందుకో, చర్చీలు కట్టినందుకో ప్రజలు ఓటు వెయ్యరు. ఆటువంటి ప్రభుత్వాలను కూలదోస్తారు.
104 కాషాయ చరిత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రజలు భారతదేశంలో బీద (ప్రజలు, ఆణగదొక్కబడ్డ కులాల వారు (ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. లేకపోతే ఇక్కడి పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో భూస్టాపితం చేసి ఉండేవారు. ప్రజలపై అకుంఠిత విశాసంతోనే అంబేద్కర్ నిరక్షరాస్యులకు, అణగదొక్కబడిన కులాల వారికి ఓటు హక్కు కావాలని వాదించాడు, ఆ (ప్రజల ఓటును లాక్కోవడానికి వారికి నష్టం తెచ్చే అంశాలను ముందుకు తెచ్చి మోసం చేసి ఓట్టు వేయించుకోవడం అమానుషత్వం. ముస్తింలలో అధికారంకోసం ఆరాటపడే వారిని పార్టీలో చేర్చుకొని వారితో కయ్యానికి కాలుదువ్వే అంశాలను మేనిఫెస్టోలో పెట్టి బిజెపి ఏం వెయ్యాలనుకుంటోంది? ఈ దేశంలో మరెన్ని గుజరాతుల్ని సృష్టిస్తుంది? బిజెపి నాయకులు అభివృద్ది గురించి మాట్లాడుతున్నప్తుడే దాని అనుబంధ సంస్థలు వి.హెచ్.పి., ఆర్.ఎస్.ఎస్. నాయకుడు సుదర్శన్ అంతర్వుద్దం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అభివృద్ది, హింస కలిసి పయనించలేవు. హింసను రెచ్చగొట్టే శక్తులు అభివృద్దిని కోరుకున్నట్టు నటించినా హింసను ఉసికొల్స్పే అంశాలనే ఆరాధిస్తాయి. మందిరం కట్టడాన్ని, గోమాంస నిషేధాన్ని మళ్ళీ ఎన్నికల రంగంమీదికి తెచ్చి బిజెపి తాను అభివృద్దిని కాక హింసాకాండను కోరుకుంటోందని చెప్పకనే చెప్పింది. వార్త - 24 ఏప్రిల్ 2004
ఇక్ రాముడు - రామనసతువు వివాదం జ్యో న్యాయపరిమ్కారం సాధ్యమేనా? శొల్మీకి రచించిన రామాయణంలోని కథానాయకుడు రాముని గురించి మరో కొత్త వివాదం తలెత్తింది. 'రాముని అస్తిత్వాన్ని కానీ, ఆయన రామసేతువును నిర్మించినట్టు కానీ స్థాపించే చారిత్రక, శాస్త్రీయ సాక్ష్యాలు ఏవీ లేవ'ని భారత పురావస్తు సర్వేశాఖ (ఎఎస్ఐ) తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. భగవంతునిగా భావించే రాముని అస్తిత్వాన్ని కేంద్రప్రభుత్వం ఎలా నిరాకరించగలదని ప్రశ్నిస్తూ బిజెపి దీనిని ఒక వివాదాంశం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఎఎస్ఐ వాదాన్నే సమర్థిస్తున్నారు. గాంధేయ జాతీయవాదం తన ఆమోదయోగ్యతను స్థాపించుకోవడం కోసం రాముడికి ఉన్న భగవంతుడన్న ప్రతిపత్తిని ఉపయోగించుకొంది. బిజెపి రాజకీయ బలసమీకరణకోసం అదే పని చేస్తోంది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం అవసరం. సుప్రీంకోర్టు ఒక పురావస్తుశాఖ నుంచి అభిప్రాయాన్ని కోరినప్పుడు, అది శాస్రీయ, చారిత్రక ఆధారాల కోణం నుంచి మాట్టాడటం సహజం. రాముడు ఒకప్పుడు ఈ భూమి మీద జీవించిన చారిత్రకవ్యక్తి అనడానికి ఆధారాలు లేవని ఎఎస్ఐ తన అఫిడవిట్లో నిర్దారణకు వచ్చినప్పుడు, దానిని ఉపసంహరించుకోవడం ఏ విధంగా సమంజసం? రాముడు భగవంతుడే తప్ప చారిత్రక వ్యక్తి కాడని బిజెపి, దాని అనుబంధ సంస్థల భావనా? భగవంతుని గురించి ప్రాచుర్యంలో ఉన్న ఊహల (ప్రకారం, ఆయన ఒక నిర్దిష్ట ప్రదేశంలో జన్మించినట్టుకానీ, ఇక్కడొక సేతువు, అక్కడొక సేతువు కట్టాడని కానీ అనుకోవడానికి అవకాళం లేదు. అన్ని ప్రదేశాలూ ఆయనవే. అన్ని నిర్మాణాలూ ఆయన చేసినవే. రాముడు అనే పేరు కూడా యహోవా, లేదా మెసయ్యా లేదా అల్లా వంటిదే అనుకొంటే, వీరెవరూ ఫలానా చోట జన్మించారని కానీ, ఫలానా నిర్మాణాలు చేశారనీ 195
196 కాషాయ చరిత్ర ఎవరూ అనడం లేదు. అన్ని (ప్రదేశాలూ వారి జన్మస్ట్రానాలే, అన్ని నిర్మాణాలూ వారివే. కనుక ఏ (ప్రదేశంకానీ, ఏ నిర్మాణంకానీ సామాజిక, లేదా ప్రభుత్వ వివాదంగా పరిణమించడానికి వీల్లేదు. స్టలాలు, నిర్మాణాల గురించిన ఇటువంటి వివాదాలలోకి భగవంతుని తీసుకురాలేరు. చారిత్రక ఆధారాలు తప్పునిసరి
రాముని గురించి హిందుత్వశక్తులు చేసే ఉద్దాటనలన్నీ ఆయన ఒక రాజనీ, ఒక నిర్దిష్టకాలంలో నిర్దిష్ట ప్రదేశంలో జీవించాడనీ సూచించేలా ఉన్నాయి. అయోధ్య అనేచోట ఆయన జన్మించినట్టు చెబుతున్నారు. అధర్మపరులైన తాటక, వాలి, శంబూకుడు తదితరులను ఆయన సంహరించాడనీ, నగరాలు, వంతెనలు నిర్మించాడనీ అంటున్నారు. అదే నిజమైతే, ఆయన జీవించిన కాలమూ, ఆయన జరిపిన నిర్మాణాలు చారిత్రక, పురావస్తు, శాస్త్రీయ సాక్ష్యాధారాల పరిశీలన పరిధిలోకి వస్తాయి. ఎఎస్ఐ అఫిడవిట్‌ను ఉపసంహరించుకొన్నా, ఉపసంహరించుకోకపోయినా సరే, రాజకీయ ఆలంబనంగా మారిన రాముని గురించి అది ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆయన భగవంతుడా, లేక్ష ఒకానొక సమయంలో రాజ్యాన్ని పాలించిన ఒకానొక రాజా? లేక ప్రవక్తలుగా గుర్తింపుపాంది మతాన్ని నిర్మించిన బుద్దుడు, జీసస్, మహమ్మద్‌లతో పోల్చదగినవాడా? రాజులు, ప్రవక్తల విషయంలో చారిత్రక సాక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి చారిత్రక వ్యక్తుల గురించి, వారి చర్యల గురించి వివాదం తలెత్తినప్పుడు పురావస్తు సంస్థలు సర్వే జరిపి సాక్ష్యాలను చూపించవలసిందే.
రాముడు కూడా బుద్దుడు, జీసస్, మహమ్మద్‌ల వంటి వాడే అయితే ఆయన పుట్టుక గురించి, ఇతర జీవిత విశేషాల గురించి చారిత్రక సాక్ష్యాలు ఉండి తీరవలసిందే. ఆయనను ఆ కోణం నుంచి పరిశీలించడానికి ఎందుకు అభ్యంతరం? బుద్దుడు, జీసస్, మహమ్మద్‌ల జీవితమూ, వారి చర్యల గురించి న్యాయవివాదాలు పెద్దగా కనిపించవు. కానీ రామునికి సంబంధించిన అంశాలు తరచూ వివాద(గ్రస్టం అవుతూ ఆధునిక న్యాయవ్యవస్థకు ముందుకీ, పరిశోధనా సంస్థల ముందుకీ వస్తున్నాయి. పైన పేర్కొన్న ముగ్గురి విషయంలో ఇటువంటి న్యాయవివాదాలు తలెత్తినప్పుడు వారు జీవించిన కాలాన్ని నిర్ణయించడం కానీ, వారి చర్యల గురించిన సాక్ష్యాలను చూపించడం కానీ కష్టం కావు. రాముని విషయంలో కూడా ఈ పద్దతిలోనే నిజానిజాలను నిర్దారించుకోడానికి హిందుత్వశక్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? రాముని పుట్టుక, జీవనం గురించి అంశాలు విశ్వాసంపై ఆధారపడినవనీ, కోర్టులు, పరిశోధనా సంస్థలు అందులో తలదూర్చ్భడానికి వీల్లేదని ఎందుకు అంటున్నాయి? బౌద్దమతస్సులు, క్రైస్తవులు, ముస్లింలు
న్యాయపరిష్కారం సాధ్యమేనా? 197 కూడా తమ (ప్రవక్తల విషయంలో ఇలాగే వాదిస్తే ఆ ప్రవక్తల ఉనికి గురించిన విశ్శసనీయత దెబ్బతినదా? రాముడు కూడా ఎంతోమంది రాజుల్దానే ఒక రాజు అయితే, ఆయన పేరుతో దేవాలయం నిర్మించడం కూడా దైవాపచారమే అవుతుంది. ఇటువంటి దేవాలయాలు చారిత్రక క్రమంలో అవతరించినవైనప్పుడు, ఆధునిక రాజ్యం వాటిపట్ల గౌరవభావాన్ని చాటుకొంటూ, అంతటితో ఊరుకోవాలి. ఈ దేవాలయాల చుట్టూ వివాదాలు సృష్టించి దేశానికి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఏ రాజకీయపార్టీకి ఇవ్వకూడదు. రామసేతువు వివాదం కూడా అయోధ్య వివాదం వంటిదే. ఇంతవరకు భారతప్రభుత్వం రామసేతువును చారిత్రక నిర్మాణంగా (ప్రకటించలేదు. అటువంటప్పుడు దేశమంతటికీ పనికొచ్చే ఒక ప్రాజెక్టు నిర్మించడం కోసం ఆ సేతువును ధ్వంసం చేయడంలో తప్పేమిటి? ఏ ఆధునిక న్యాయవ్యవస్థ అయినా ఇటువంటి వివాదాలతో సమయం వృథా చేసుకోజూలదు. ఇటువంటి కొన్ని అంశాలను రుజువూ చేయలేం. కొట్టిపారేయనూలేం. నిరూసించే బాధ్యత బిజెపిదే ఇటువంటి విషయాలను న్యాయవ్యవస్థ (ప్రభుత్వానికి పౌర సమాజం చర్చకూ విడిచిపెట్టడం ఉత్తమమార్గం. న్యాయస్థానంలో పరిష్కరించలేని అంశంగా పరిగణించి సేతు వివాదానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండవలసింది. కానీ, సుప్రీంకోర్టు దానిని విచారణకు స్వీకరించడమే కాకుండా, దానిపై అఫిడవిట్‌ను దాఖలు చేయమని ఆదేశించడం ఇక్కడ ఆసక్తికరం. ఇటువంటి అంశాలలో ప్రభుత్వం ఎవరి సహకారం తీసుకొంటుంది? సహజంగా ఎఎస్ఐ సహకారమే. తన వైఖరిని స్పష్టం చేయడానికి ఎఎస్ఐ ఎటువంటి పద్ధతిని అనుసరించాలి? పురావస్తు శాస్త్రీయ అంశాలపై ఆధారపడి అది నిర్దారణకు రావలసిందే. ఈ పరిస్థితిలో రాముడి ఉనికిని సాక్ష్యాలతో నిరూపించవలసిన బాధ్యత బిజెపిదీ, దాని అనుబంధ సంస్థలదే. వార్త - 26 సెప్టెంబర్, 2007
5్క్షే ఒరిస్సాలో కందనుల్ ఎందుకు కాలుతోంది?
ఒరిస్సా రాష్ట్రంలో కందమల్ జిల్లాలో చర్చిలు తగలబెడుతున్నారు. స్కూళ్ళు
కూలగొడుతున్నారు. అనాథ శరణాలయాలు ఆహుతి పాలవుతున్నాయి. ఆదివాసులకు ఇక్కడో, అక్కడో అందుబాటులో ఉండే హాస్పిటళ్ళు కూలగొడుతున్నారు. కొద్ది రోజుల కింద అక్కడ విశ్వహిందూ పరిషత్ అధిపతిగా పనిచేస్తున్న లక్ష్మణానంద సరస్వతిని, అతనితో పాటు మరో నలుగురిని మావోయిస్టులు కాల్ఫిచంపారు. ఈ హత్యలు జరిగిన మరుసటి రోజు నుండే విశ్చహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. బజరంగ్దళ్' సంస్థలు అక్కడి ఆదివాసుల మీదపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ జిల్లాలో దాదాపు 25 శాతం ఆదివాసులు, ఇతర కులాలవారు [క్రైస్తవ మతస్టులయ్యారు. వారికి (కైస్తవ మిషనరీలు స్కూళ్ళు పెట్టి, హాస్పిటళ్ళు కట్టి, తల్లిదండ్రులు లేని పిల్లలకు అనాధా(శ్రమాలను నడిపిస్తున్నారు. ఈ మొత్తం ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ఆపాలనేది సంఘ్‌పరివార్ డిమాండ్. ఈ కార్యక్రమాలే అక్కడి (ప్రజలు కైస్తవంలోకి పోయేట్టు చేస్తున్నాయి. కనుక వాటిని ఆపమంటున్నారు.
ఈ (క్రమాన్నంతా వాళ్ళు బలవంతపు |కైస్తవ మత(ప్రచారంగా, డబ్బు ఆశ చూపించి చేస్తున్న మతమార్పిడి ప్రక్రియగా చూపించి ఈ మొత్తాన్ని ఆపమంటున్నారు. అసలు మావోయిస్టులు జరిపిన హత్యకు క్రైస్తవసంస్తలకు ఏం సంబంధం? మావోయిస్టులు ఈ దేశంలో తమ వర్గశత్రువులు అనుకునే వారిని చాలాకాలంగా చంపుతూనే ఉన్నారు. అందుకు క్రైస్తవులుగా మారిన ఆదివాసులనెందుకు టార్లెట్ చెయ్యాలి? వాళ్ళ స్కూళ్ళను, హాస్పిటళ్ళను, అనాధశరణాలయాలను ఎందుకు టార్గెట్ చెయ్యాలి? కావాలంటే లక్ష్మణానందను చంపిన మావోయిస్టులతో వాళ్ళు నేరుగా యుద్దానికి దిగొచ్చు. ఇటు హిందూ మతసంస్థలు, అటు సంఘపరివార్ సంస్థలు ఆయుధాలతో యుద్ధం చెయ్యడాన్ని నమ్మినవే. ఈ దేశంలో ైస్తవ మిషనరీ సంస్థలు ఆయుధాలు ధరించి శత్రువులను చంపిన సంఘటనలు అసలు లేవు.
1906
ఒరిస్పాలో కందమల్ ఎందుకు కాలుతోంది? 100
ఇదే ఒరిస్సాలో (గ్రాహంస్ట్రేన్ను, ఆయనని ఇద్దరి పసికూనలను సజీవంగా మంటలో వేసి కాల్చి చంపినప్పుడు ఆయన భార్య (ప్రపంచానికి ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి? నా భర్తను, పిల్లల్ని చంపినవాళ్ళను చంపాలని నేను కోరుకోను. వారిని దేవుడు క్షమించాలని నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను' అని ఆమె అంది. ఆ హంతకులను చట్టం ప్రకారం ఉరిశిక్ష వెయ్యాలా అని ఆమెను అడిగినప్పుడు కూడా ఆమె వారిని ఉరి తియ్యకూడదు. దేవుడు వారిని మారుస్తాడు అని చెప్పింది. మొన్నటి కందమాల్ ఘటనలో పాల్గొన్నది మావోయిస్టులు కాక. హింసావాదులైన (క్రైస్తవ యువకులే అనుకుందాం! అందుకు ప్రతికూలంగా జాతీయవాదులమని చెప్పుకునే విశ్వ హిందూ పరిషత్ (అంటే ప్రపంచంలోనే హిందూయిజం వ్యాప్తి చెందాలని కోరుకునే సంస్థ) ఏం చేస్తోంది? (గ్రాహాం స్ట్రేన్ భార్యలా చంపిన వారిని రక్షించమని దేవుణ్ణి కోరడం లేదు. పోనీ చంపిన వారెవరో వారిని పట్టుకొని ఉరితియ్యమని అడగడం లేదు.
అందుకు ప్రతీకారంగా, అనాథశరణాలయాలలోని చిన్నపిల్లల్ని, వారికి తిండిపెట్టే (స్త్రీలను చంపుతున్నారు. ఆదివాసీ పిలలకోసం అరకొర జీతాలతో, ఉండీ లేని వనరులతో నడిపే స్కూళ్ళను తగలబెడుతున్నారు. గుజరాత్లో గోడా ట్రైన్‌కు నిప్పు అంటుకున్న సందర్భంగా, ముస్లిం స్త్రీల గర్భాలను కోసి పిండాలను తీసి మంటల్లో వేశారు. స్రీలు నడిరోడ్లమీద చెరిచారు. అన్ని టివీ ఛానళ్ళ కెమెరాల ముందు నిలబడి ఒక్కొక్క వ్యక్తి వారు స్త్రీలను ఎట్లా చెరిచింది, ఎట్టా గర్భాలను కోసింది సగర్వంగా చెప్పించారు. ఈ రోజు వాళ్ళు ఎంతమందిని చంపుతున్నారు, ఎట్లా చంపుతున్నారనే లెక్కల్ని పర్స్ 0 పెడితే అసలు ఈ సంస్కృతిని ఏమనాలి? ఇదొక జాతీయ, మత, మానవ సంస్కృ నా అసలు వీరి టార్గెట్ ఆదివాసి విద్య, వారికి నేడు లభించే మానవహక్కులు వారి అందుబాటులోకి వస్తోంది వైద్యం.
ఈ దేశంలోని ఆదివాసి ప్రాంతాల్లో క్రైస్తవమతం ఎందుకు పొకుతోంది? చర్చి ఎందుకు పెరుగుతోంది? హిందూమతం వారిని కనీసం మానవులుగా చూసి, వారికి రావలసిన కనీస అక్షరాస్యతను రానిచ్చి ఉంటే వేరే మతాలవైపు ప్రజలు చూసేవారు కాదు.
లక్ష్మణానంద ఆ ప్రాంతంలో క్రైస్తవమతం పెరగకుండా ఆపడానికి ఏం చేశారు? వారి పిల్లలకోసం ఎన్ని హాస్పిటళ్ళు కట్టారు? వాళ్ళకోసం ఎన్ని ఇంగ్లీషు మీడియం సళ పెట్టారు? ఈనాటికీ బ్రాహ్మణ పూజారుల చేతుల్లో ఉన్న జగన్నాథ టెంపు అదివాసులను కూడా రాకుండా అడ్డుకుంటూ ఉంటే వారు వేరే మతంలోకి పోకుండా ఎందుకుండాలి? హిందూ వ్యవస్థ వేళ్ళూనుకొని ఉన్న యావత్ దేశంలో కుల వ్యవస్తను
200 కాషాయ చరిత్ర రద్దుచేసి మానవ విలువలు గల సమాజాన్ని స్టాపించే స్థితి లేనపుడు ఆదివాసులను హిందూయిజంలోకి రమ్మని అడిగితే వాళ్ళు ఎలా వస్తారు? వచ్చి వాళ్ళు ఏ కులంలో చేరాలి? మానవ విద్యను అభివృద్ధి చేయడానికి కృషి చెయ్యని మతం ఏ దేశంలోనైనా ఎంతకాలం మనగలుగుతుంది? విద్య, తిండి, బట్ట, ఇంటి వనరులు ప్రపంచంలో మత వ్యవస్థలు రూపొందాక పెరుగుకుంటూ వచ్చాయి. హిందూమతాన్ని మిగతా మతాల్దా ఒక మతంగా నిర్వచించాకనైనా అది మానవ సమానత్వం కోసం, మానవ అభివృద్ది కోసం పనిచెయ్యడం [ప్రారంభించిందా? ఆ పని చెయ్యకపోగా అలా చేసేవారిని చంపడం, స్కూళ్ళను తగలబెట్టడం, పసిపిల్లలను చంపడం వంటి పనులు చెయ్యడానికి మానవులను ఉసికొలిపితే అసలు మానవ విలువలు ఎలా నెలకొంటాయి? ఒరిస్సాలో ఆదివాసుల పరిస్థితి, దళితుల పరిస్థితి అతిదారుణంగా ఉంటుంది. అక్కడి బ్రాహ్మణులు అతి పురాతన విలువలు గలిగిన ఛాందసవాదులు. ఇప్పటికీ వాళ్ళు మురికిగుంటల్లో చన్నీటి స్టానం చేస్తూ ఇళ్ళ నిండా విగ్రహాలను పెట్టుకొని ఒక భయానక జీవితాన్ని జీవిస్తారు. ఒరిస్సా, బెంగాల్ సరిహద్దు (గ్రామాల్టో ఇంటింటా ఒక కాళికావి[గ్రహం, లేదా దుర్గ విగ్రహం ఉంటాయి. మెడలో మానవ శిరస్సుల దండ, పాదాల కింద చంపబోతున్న ఒక మనిష్కి నాలుక చాచి భీకరంగా చూస్తున్న కండ్లతో ఉన్న వి([గ్రహాలను ఇండ్లలో పెట్టుకున్నాక కుటుంబాల్లో చిన్న పిల్లలకు సైతం ఎటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది? ఈ కరడుగట్టిన (బ్రాహ్మణవాదమే (గ్రామాల్లో, పట్టణాల్లో కులవ్యవస్థను పకడ్చందీగా కాపాడుతోంది. ఇటువంటి విలువలు గలిగిన హిందూ సమాజంలోకి ఆదివాసులను రమ్మని ఎందుకు అడుగుతున్నారు? వచ్చి వారిని ఏ కులంలో చేరమంటున్నారు? వి.హెచ్‌పి., ఆర్.ఎస్.ఎస్. సమాజంలో ఒక మౌరిక మార్పుకోసం ఆలోచించకుండా ఇతరులు చేసే (ప్రయత్నాలను ఆపుతామంటే ఈ ఆధునిక ప్రపంచం వారిని మెచ్చుకుంటుందా? ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అక్కడ ఎటువంటి మార్పులు తెచ్చిన దాఖలా లేదు. అక్కడి ఆదివాసులు, దళితులు కాస్తంత అభివృద్ధీ చెందిన దాఖలాలు కూడా లేవు. ఒరిస్సా విద్యావ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది. అక్కడ అక్షరాస్యత ఏ మాత్రం పెరగడం లేదు. వాటికి తోడు మతకల్లోలాను అదుపు చెయ్యడంలో చాలా దారుణంగా ఫెయిల్ అయింది. సూర్య - 14 సెప్టెంబర్, 2008
52 ఇక్కడ కూడా ఒక మోడీ పుట్టొచ్చు ల
కమ్యూనిస్టు పార్టీలు బలహీనవర్గాల కార్యకర్తలను నాయకులుగా ఎదగనిస్తాయా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. బడుగుల జీవితాలను మార్చాలిగాని నాయకులు వాళ్ళే కావాలనే వాదనెందుకు అని కమ్యూనిస్టు అగ్రకుల నాయకులు తేల్చి చెప్పాక ఆ పార్టీలోని కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోయారు. కుల వివిక్ష వ్యతిరేక ఉద్యమం అంటే, హిందూ గుడిలోని బ్రాహ్మణ పూజారి 'సూద్ర-ఛండాలురను గుడుల్లోకి రానిస్తున్నాం, పులిహార, దద్దోజనం పెడుతున్నాం. వారి మేలు కోసం దేవుణ్ణి మేమే ప్రార్ధిస్తున్నాం అనే పద్దతా? (బ్రాహ్మణేతరులు పూజారి ఎట్లవుతారు అనే ప్రశ్నకు, ఇప్పుడు కమ్యూనస్టు మిత్రులు వేసే ప్రశ్నకు తేడా లేదు. అయితే, ఈ సూత్రంలో హిందూమతం చావు కూడా దాగి ఉన్నది. దళిత, బహుజనులు నాయకులు ఎందుకు కావాలి, వాళ్ళకు ఇండ్హ స్థలాలు కావాలి, కూలిరేట్టు పెరగాలి, వాళ్ళకు కొంత ఆత్మగౌరవం కావాలి అనేవాదనలో
- కమ్యూనిస్టు పార్టీల పతనాన్ని కోరుకునే లక్షణం కూడా ఇమిడి ఉందని వాళ్ళు (గ్రహిస్తున్నట్టు లేరు.
నాయకుల కులం చూడకూడదు. వాళ్ళ త్యాగం చూడాలి, వాళ్ళ తెలివి చూడాలి. వాళ్ళు బడుగువర్గాల వారి కోసం పనిచేస్తున్నారా లేదా చూడాలి వంటి (ప్రశ్నలు చాలా పెద్ద మార్క్సిస్టు సూత్రాలుగా కనిపించవచ్చు. కాని భారతదేశంలో అవి కమ్యూనిస్టు పార్టీలను అభివృద్ది చేసే ప్రశ్నలు కూడా కావు. నేను ఆం(్రప్రదేశ్ పారహక్కుల సంఘంలో ఉండగా కులం-నాయకత్వం సమస్యపై చర్చ జరిగింది. నాలుగు మాటల్లో అది ఏమిటో చూద్దాం.
కెజి కన్నాభిరాన్ దాని ప్రెసిడెంట్‌గా, కె. బాలగోపాల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, సంస్థకు కింది కులాల వారిని ఆ రెండింటిలో ఒకదానికైనా ప్రమోట్ చెయ్యాలని లేఖ రాసాను. ఆ లేఖపై చర్చ జరిగినప్పుడు, వారిద్దరిలో ఏ ఒక్కరిని మార్చి అయినా సంన్హ బతుకగలుగుతుందా అనే ప్రశ్న వచ్చింది. అందులో నాయకుల త్యాగాలు, స్టోమతలు
201
202 కాషాయ చరిత్ర అన్నీ చర్భకొచ్చాయి. చర్చకు రాకుండా వెనుకదాగి ఉండి సమస్యను అడ్డం తిప్పే అంశం వనరుల సమీకరణశక్తి. ఆనాటికిగాని, ఈనాటికి గాని అన్నీ ఉన్నా దళిత బహుజన నాయకులకు లేనిది వనరుల సమీకరణ శక్తి అంటే అంత చిన్న సంఘమైనా అగ్రకుల వనరులు లేకుండా ఎలా నడుస్తుందనేది చర్చకు రాకుండా బంధమేసే అంశం.
త్యాగాలు, శక్తియుక్తులకు ఎప్పుడు కూడా ఒకే నిర్వచనం లేదు. ఇక నిర్దిష్టమైన నిర్వచనానికి నిలిచేది సంస్థకు డబ్బు సమీకరించే శక్తి నిర్రిష్టంగా అ(గ్రకులాల వారికే ఉన్నదనేది. కనుక దళిత-బహుజనుల నుండి నాయకత్వంలోకి వచ్చిన వ్యక్తి అన్నీ చెయ్యగల శక్తీ ఈనాడు ఉన్నా, డబ్బు సమీకరించగలిగిన శక్తి లేదు. ఎందుకు? ఈనాడు డబ్బు అగ్రకుల హుండీలో ఉంది గనుక, వాళ్ళ వ్యక్తి నాయకుడైతే ఆ కులం కొంతైనా హుండీలో నుంచి తీసి ఇస్తుంది. ఇది గమనించి నేనాకటే చెప్పాను.
దళిత-బహుజన వ్యక్తులు నాయకులైతే (చర్చలో అది వేరే వారైతే అని సాగుతుంది) సంస్థ బతుకుతుందా? అనే ప్రశ్నకు సంఘాలు, పార్టీలు దళిత - బహుజనం - అ(గ్రకుల ధనంతో నడిచే రోజులు కనుక, అగ్రకులాల వాళ్ళు డబ్బు సమీకరించాలి. దళిత - బహుజన నాయకులు జన సమీకరణ, పోరాటాలు చేసే నాయకులుగా ఎదగాలి. పార్టీ సెక్రటరీ పదవి ఎస్టి, ఎస్సి, బిసి వ్యక్తులకిస్తే ఆ వ్యక్తులు అ(గ్రకుల పెట్టుబడిదారులు, బిజినెన్దారులు, భూస్వాముల నుండి డబ్బు వసూలు చేయగలరా అనే (ప్రశ్నే (ప్రధానమవుతుంది. ఇప్పుడున్న స్థితిలో అది సాధ్యం కాదని పార్టీ కోర్ నాయకత్వం నిర్ణయించుకొని మళ్ళీ మళ్ళీ అగ్రనాయకులను తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళు బయటికి చెప్పలేని అంశం. ఇక్కడే వాళ్ళ అగ్రగామి నాయకత్వంలో నడువకపోయినా అగ్రకులాల వారు సంస్థల - పార్టీల చందాలు తేవాలి. కింది కులాల నుండి వచ్చిన నాయకత్త్సం జన సమీకరణ లేదా ఓట్ల సమీకరణ చేయాలి.
ఇటువంటి స్థితి బిజెపిలో కూడా ఉంది. అయితే అందులో జనబలం, ధనబలం. ఏ కులస్టుడు నాయకుడుగా ఎదిగినా కండబలాన్ని సమీకరించి ముస్తింలను ఊచకోత కోయిస్తే హిందూ పెట్టుబడి పార్టీకి కూడా సమీకరించడం జరుగుతుంది. ఈ సూత్రం నుండి బిజెపిలో నరేంద్రమోడీ ఒక తేలికులంలో (అతి చిన్న బిసికులమది) పుట్టి తండ్రి చాయకొట్టులో చాయ అమ్మి గుజరాత్ నాయకుడయ్యారు. కింది కులాల కండబలాన్ని సమీకరించుకొని అగ్రకులాలను అధిగమించారు. ఆ రాష్ట్రంలో అటు బ్రాహ్మణులను ఇటు పటేళ్ళను పూర్తిగా తొక్కేసి హిందూత్వ కండబలంతో ఎదిగారు. ఉమాభారతి కూడా అలాగే ఎదిగారు. కల్యాణ్‌సింగ్ అలాగే ఎదిగారు. కాని వాళ్ళిద్దరు అంతపెద్ద ఊచకోత కోయించలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఏదో ఒక ఊచకోత
ఇక్కడ కూడా ఒక మోడీ పుట్టొచ్చు 203 కోయించే నాయకుడు ఎదిగితే తప్ప, ఆ పార్టీలో అగ్రస్థానానికి ఎస్టి, ఎస్సి, బిసిలను రానిచ్చేట్టు లేరు అని పోల్చుకునే దశలో చర్చ జరుగుతోంది. ఇది గుజరాత్ నేర్పుతున్న గుణపాఠం. అంటే పార్టీలకు సమీకరించే పెట్టుబడి కుల గీతలు దాటి మత నిర్మాణంలోకి మలుస్తే - మత పార్టీల్లో అటువంటి నాయకులు ఎదుగుతున్నారు. మరి కమ్యూనిస్టు పార్టీల్లో ఏం జరుగవచ్చు?
బెంగాల్లో ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలకు ఎటువంటి ఎదుగుదల లేకుండా అక్కడి విద్యారంగంలోనే జాగ్రత్తలు తీసుకున్నారు. అ(గ్రకులాల్లో పిల్లలందరికి ఇంగ్లీషు, (పైవేటు విద్య, లేదా నిరక్షరాస్యత వ్యవస్థగా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్థితి కాస్త మారింది. దళిత బహుజనులలో కూడా మార్క్సిజాన్ని ఇంగ్లీషులో చదువుకోగలిగే మేధావివర్గం ఎదిగింది. ఇక్కడ ఎదిగిన చాలామంది మేధావులు కమ్యూనిస్టు పునాదుల నుండే వచ్చారు. ఈ రాష్ట్రాన్ని. ఇటు గుజరాత్, అటు బెంగాల్ కాకుండా ఒక ఆధునిక (ప్రజాస్వామ్య రాష్ట్రంగా మార్చాల్సి ఉంది. అందుకు కమ్యూనిస్టుపార్టీల్లో సైతం అగ్రగామి నాయకత్వం దళిత-బహుజన కులాల నుండి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఎదగాల్సి ఉంది. అందుకు గాంధీత్యాగాల సిద్దాంతాన్ని, అంబేద్కర్ సూటు-బూటు వేసుకున్నాడు కనుక బూర్జువా అనే సిద్దాంతాన్ని పక్కకు పెట్టి ముందు కుల ప్రజాస్వామ్యం గురించి ఆలోచించాలి. కాని అది అంత సులభం కాదు.
కమ్యూనిస్టు పార్టీలు హిందూయిజంలా బిగుసుకుపోవడమా లేదా ప్రజాస్వామిక మార్పుకు గురై తమను తాము మార్చుకొని ప్రజల్ని మార్చడానికి ప్రయత్నించడమా తేల్చుకోవాలి. గుజరాత్లో మోడీ ఫార్ములాను దేశానికి అనువదిస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా బిసిలను, ముస్లింలను ఊచకోత సైనికులుగా ఆయన మలుచుకోగలిగారు. కమ్యూనిస్టు నిర్మాణాలను అ(గ్రకుల ఆధిపత్యం గల విదేశీ తొత్తులుగా ఆయన చూపించాడు. కమ్యూనిస్టు నిర్మాణాలను బిసి వ్యతిరేక నిర్మాణాలని దళిత బహుజనులు
- ముఖ్యంగా నుదుట బొట్టు పెట్టుకొని చేతికో ఎర్రదారం కట్టుకొని తిరిగే బిసిలు సులభంగా నమ్ముతారు. ఆ (క్రమంలో మోడీలాంటి బిసి అధినేత నాయకత్వంలో అ(గ్రకులాల మీద కూడా ముస్లింలను మించిన దాడులు చెయ్యగల ఫాసిస్ట్ శక్తులు కూడా ఎదుగవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కమ్మ క్యాపిటల్‌ను తమ కుల నాయకత్వాలను పంచే బదులు బిసిల నేతృత్వంలోని ఫాసిస్టుశక్తులకు పంచుతారు. ఎందుకంటే క్యాపిటల్‌కు దాని రక్షణ ముఖ్యం.
ఆం(ధ్రప్రదేశ్‌లోని కమ శ్ర క్యాపిటల్ కమ్యూనిస్టు పునాదుల నుండి మాత్రమే పెరిగింది. ముందు యాంటీ -బ్రాహ్మణిజంగా ప్రారంభమై ఆ తరువాత కమ్యూనిస్టు కమ్మ
204 కాషాయ చరిత్ర క్యాపిటల్‌గా మారింది. దీనికి రెడ్డి ప్యూడలిజం కంటే అభివృద్ది లక్షణం ఉన్నమాట వాస్తవం. దీనికి గుజరాతీ పటేల్ క్యాపిటల్‌కు ఉన్న తేడాల్లా కమ్మ క్యాపిటల్ యాంటీ (బ్రాహ్మణిజంలో పుట్టింది కనుక పటేల్ క్యాపిటల్ లాగా మతోన్మాదంలోకి అది అడుగుపెట్టలేదు. కాని చాలా బలంగా కులోన్మాదిగా మారింది. అందువల్లే దళిత-బహుజన నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ కులాతీతంగా రూపాంతరం చెందితే ఆ పార్టీలకు అండగా నిలవడానికి ఆ క్యాపిటల్ సిద్ధంగా లేదు. ఇప్పుడు రెడ్డి ఎకానమి మొత్తం కాం(గ్రైస్ చుట్టూ తిరుగుతున్నది. కమ్మ ఎకానమి తెలుగుదేశం - కమ్యూనిస్టు పార్టీల చుట్టూ ఉన్నది. ఈ స్థితిలో బలహీనవర్గాలు తమ (ప్రత్యామ్నాయతను రూపొందించుకోవడం సాధ్యం కాదు అని వారి గట్టి నమ్మకం కూడా. ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలలో బిసిలకు మాత్రమే (గ్రామస్తాయిలో కూడా కొంత స్వతంత్ర ఓటు బ్యాంకుగా మారే అవకాశమున్నది. ఎస్సి ఓటు ఇంకా వివిధ దొంతర్ల ఆధిపత్య కులాల చేతిలో ఉన్నది. కనుక కమ్యూనిస్టు పార్టీల్లో సైతం అ(గ్రకులాలతో బిసిలు తలపడే అవకాశం ఎంతో కొంత లేకపోలేదు. కాని ఇక్కడ కేరళలో ఉన్నట్టు (ఇప్పటి ముఖ్యమంత్రి కులం) ఒక బలమైన మరో బిసి కులం ఇంకా ఎదగలేదు. కమ్యూనిస్టు పార్టీల్లో కులనిర్మూలన సిద్దాంత అంశంగా మారి, దానికి అనుకూలంగా ఒక సెక్షన్ కమ్మ క్యాపిటల్ నిలబడకుండా అక్కడ ఎస్సిలకో, బిసిలకో నాయకత్వం ఇవ్వరు. తమ క్షేమం కోసమైనా ఒక సెక్షన్ కమ శ క్యాపిటల్ ప్రజాస్వామ్య బలహీనవర్గాలకు మద్దతిచ్చి ఎన్నికల రంగాన్ని మార్చితే ఒక పద్దతిలో మార్పు సాధ్యం. లేకపోతే బిసి నుంచి ఒక మోడీ ఇక్కడ కూడా పుట్టే అవకాశం ఉన్నది. కమ్యూనిస్టు మిత్రులారా జర ఆలోచించండి! సూర్య - 30 డిసెంబర్, 2007
చాప్టర్ - 101 పర్ఫ్సనాలిటీస్ 53. వి.పి.సింగ్ ది ఇండియన్ లింకన్ 54. ఆఖరి గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే 55. సోనియా “సంస్కర్త బాధ్యత స్వీకరిస్తారా? 56. లాభాల పట్టాలపై రైలు విమర్శకులను చిత్తుచేసిన లాలూ 57. పివి మనకిచ్చిన వారసత్వం అధునిక చాణక్యం 58. బారక్ ఒబామా మనదేశంలో పుట్టి ఉంటే? 59. మై రెస్పెక్ట్ టు చిరంజీవి గోస్ అప్
వి.పి.సింగ్ ఎంబంగ ది ఇండియన్ లింకన్ న భంగా వంబర్ 27న రోజువారి పని నుండి 3 గం[లకు ఇంటికీ రాగానే మిత్రుడు చూప క్ సోన్చేసి వి.పి.సింగ్ చనిపోయాడు ఒక్ టివి నాసల్, ప్రోల్లో వల్పిన్డ్ తుంది అని చాలా విచారంగొ చెప్పడు. ను వెంటనే ఢిల్లీలోని సి ,) ్. కూ ఎన్ది టివిలను ఒకదాని తరువాతే *కీటి చూడడం ఆరంభించాను. లో భార కనిపించడం లేదు. చాలాసేపటి వనడిటివి ఒక చిన్నవాడ చెప్పి ఆయన తికకాయా ౬ గాథకు విచార ప్రకటనలు లేవు. కనీసం ప్ర న్ని చూపించింది. కాంగ్రెస్ నొ శ్రీదు. ఆయనను ఈ శ మీడియా న ది పథాన అ(గ్రకుల నాయకులు ఆయనను ఇ చావులో కూడా ద్వేపించుకున్నే ది ప్టలీలో స్థలం ఇవ్వలేదు గిర్ వెయ్యాలని చూశారు ప్రభుత్వం అయన దహనాని భించి ఇవ ఎంద్రుక్సు? జు న ప్రధాని పదవి నుండి మండల్ విప్లవాన్ని ప్రారంభించాడు కనుక. జి వ టు తరువాలే ఒక విశ్సనాళ ప్రతాప్ సింగ్ మాత్రమే అ బై పపచంలో అ(బ్రహం లిన్ గ శల సంవత్సరొలుగొ అణచివేయబడ్డ ప్రజల ల్ పదవిలో కూరని తో డు 1989లో ఆయన ప్రధాని అయ్యేనాటికి ఎస్సి. న్ 0 పోరాటాన్ని ప్రారం / ద్యోగొలో రిజర్వేషను ఉన్నాయి. బిసిలకు లేవు. సటిలకు మాత్రమే కంద్రత తేక వర్గంగొ కూడొ గుర్తింపులేదు. ఇందిరాగాంధీ అదవాక్ష అణగదొకూబజే సా పటిన 'ఉండల్ కమీషన్ రిపోర్టు అమలుకు పూనుకొని ంజకంందలు బార ను ఎస్‌టిల రిజర్వేషన్ అంబేద్కర్ సామాజిక విష్టవాన్నో ప్రొ ర అది దయాదొక్షిణ్యాల పద్ధతిగా చూస్తున్నారు. నను పోరాట ఫలితంగా వి అడవివాసులు కనుక వారికి ఇవువచ్చులే నుక ఎట న వ్వవచ్చులే! అనే తాత్విక అంటరానివాళ్ళు కచస్తను చిన్నాభిన్నం చేసి సమానత్వం వైపు పయనించే మా దృక్పథమున్నది" కుల్ల 'సబంచాలంటే శూద్ర కులం నుండి వచ్చి విదళు మ సమాజాన్సి *ీ దేశంల ల్యధ్ర్యమయ్యే సామాజిక చైత లు రాజాయ జాను తమదంల స్ట్ లే ణ్ రూ న్యానికి బిసిలు కూడా సిద అధికారానికి న ఎవరికీ అంచనొ' దు. విపిసింగ్ చుటూ ఉన్న ములా | ద్దం కావలసి ఉన బ యంసింగ్, 207
208 పర్సనాలిటీస్ లాలూప్రసాద్, శరద్‌పవార్, రాంవిలాస్ పాశ్వాన్ ఆయన మండల్ వైపు తిరగడానికి కారకులైనా స్వయంగా వి.పి.సింగ్‌కి సమాజంలో సమానత్వం సాధించాలనే తపన ఉన్నది. ఆ తపనలో భాగంగానే మండల్ పోరాటాన్ని నడపాలని సిద్దపడ్డాడు. నాటి నుంచి చనిపోయే వరకు ఆ సిద్దాంతాన్ని ప్రచారం చేసేందుకు బద్దకంకణుడై ఉన్నాడు. అమెరికాలో అబ్రహం లింకన్ తెల్లజాతిలో పుట్టి నల్లజాతి విముక్తి కోసం పోరాటం (ప్రారంభించినట్టు వి.పి.సింగ్ క్షత్రియ కులంలో పుట్టి బిసి., ఎస్సి., ఎస్టి., మైనారిటీలకు చివరి వరకు వెన్నంటి ఉన్నారు. మండల్ వ్యతిరేకత, అనుకూల పోరాటాలు అంతర్యుద్దంగా మారినా ఫర్వాలేదు గాని సామాజిక న్యాయాన్ని (గ్రామస్థాయి వరకు తీసుకుపోవడం తన కర్తవ్యమని ప్రకటించాడు. నిజానికి నేడు సామాజిక న్యాయం గురించి ఈ స్థాయిలో మాట్టాడుకుంటున్నామంటే దానికి మూలం వి.పి.సింగ్ మండల్ పోరాటంలో ఉంది. ఆయన దానికిచ్చిన కొత్త నిర్వచనంలో ఉంది. ఈ సమాజంలో కుల అణచివేత ఉన్నంతకాలం ఇక్కడ (ప్రజాస్వామ్యం పరిపక్షత చెందదని (ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని ముడేసి కొత్త నిర్వచనమిచ్చాడు. అమెరికాలో ఒకనాడు అబ్రహం లింకన్ లేకపోతే తరువాత మార్టిన్ లూధర్ కింగ్ జూ॥ ఆ తరువాత ఒబామా ఆ స్టాయిలో ఉండడం ఎట్టానైతే సాధ్యంకాదో ఈ దేశంలో 1990 దశకంలో వి.పి.సింగ్ ప్రధాని అయి ఉండకపోతే ములాయం సింగ్, లాలూప్రసాద్, కాన్టీరాం, మాయావతి వంటి నాయకులకు కష్టమయ్యేది. అబ్రహం లింకన్ పేదరికం నుండి వచ్చాడు. ఆయనకు నల్లవారి కష్టాలు తన స్వంత ఆకలిలో అర్జమయ్యాయి. కాని వి.పి.సింగ్ మాండ్యా రాజకుటుంబం నుండి వచ్చాడు. ఆకలిబాధ ఆయనకు ఎన్నడూ లేదు. కాని మార్పు కావాలి, కులం సమాజాన్ని శాసించకూడదు అనే తాత్వికపునాదిని ఆయన అంబేద్కర్, లోహియా నుండి నేర్చుకున్నాడు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలను జరపడానికి భారీఎత్తున సన్నాహాలు డబ్బు కేటాయింపులు జరిగాయి. అయితే ఆయనపై బిజెపి చేసిన కుట్రవల్ల, బాబ్రీమసీదును కూల్చేందుకు అద్వానీ ప్రారంభించిన మండల్ వ్యతిరేక 'కమండల్ో యాత్ర వల్ల 11 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ 11 నెలల్గో 11 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి చేయనటువంటి విప్లవాత్మక నిర్ణయాలు చేశాడు. ఆయన ఇంకొంతకాలం పదవిలో ఉంటే లింకన్‌ను చేసినట్టు హత్య చేసేవాళ్ళు. వ్యక్తి హత్య చెయ్యకుండా బిజెపి ఆయన పదవీకాలాన్ని హత్యచేసి చరిత్రలో మండల్ దోషిగా నిలబడింది. అందుకే బిసి, ఎస్సి, ఎన్టిలు దాన్ని నేటికీ క్షమించడానికి సిద్ధంగా లేరు. మండల్ వ్యతిరేక పోరాటంలో బిజెపి, కాంగ్రెస్ శక్తులు ఐక్యమై వి.పి.సింగ్‌ను నిద్ర పోనియ్యకుండా హింసించే (ప్రయత్నం చేశారు. ఢిల్లీ నగరాన్ని ఆ రెండు షార్టీల్లోని అ(గ్రకులాలు దిగ్బంధం చేశాయి. అగ్రకుల యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అ(గ్రకుల అహంకార ఢిల్లీ మీడియా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసింది. అయినా
వి.పి.సింగ్ ది ఇండియన్ లింకన్ 209 వి.పి.సింగ్ జంకకుండా మండల్ అనుకూల శక్తులకు అండగా నిలబడ్డాడు. నాడు యువకులుగా మండల్ అనుకూల ఉద్యమాలను నడిపిన మాకందరికి వి.పి.సింగ్ ఒక ఆదర్శమూర్తి. బుద్దుని తరువాత, బసవుని తరువాత, ఒక క్షత్రియ అగ్రకుల కులంలో కుల వ్యవస్థపై ఒక గొడ్డలి వేటు వేసిన వ్యక్తిగా ఆయన్ని మేం చూశాం. ఆయన కులం మాకు అడ్డురాలేదు. ఆయన తక్కువ మాట్టాడేవాడు, చాలా చిన్న కంఠంతో మాట్లాడేవాడు కాని ప్రతివాక్యంలో ఒక బలమైన తాత్వికత ఉండేది. అంత తాత్వికత నిండుతనమున్న్లు వ్యక్తి ఆ పదవిలో ఎవరూ కూర్చోలేదు. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆ పదవిలో కూర్చున్న ఏ ఒక్క వ్యక్తికి కుల వ్యవస్థను రద్దుచేసే అంశం పట్ట, బీదరికాన్ని బద్దలు కొట్టడం పట్ట, అవినీతిని అంతమొందించడం పట్ట వి.పి.సింగ్‌కు ఉన్నంత అవగాహన లేదు. కమిట్మెంట్ లేదు. ఆయన ప్రధాని పదవిని మార్పుకోసం ఉపయోగపడే సాధనంగా చూశాడు. ఆయన ముఖ్యమంత్రి పదవిని విలువల కోసం వదులుకున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ పదవిని కరష్టన్ వ్యతిరేకంగా నిలబడి వదులుకున్నాడు. సమాజ మార్పుకోసం పోరాటం [ప్రారంభించి ప్రధాని పదవిని వదులుకున్నారు. దేవెగౌడ వ్యవస్థను నడుపలేక దిగిపోయాక మూడో ఫ్రంట్ ఆయన్ని ప్రధాని పదవి చేపట్టమని బతిమిలాడినా ఆయన వద్దన్నారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండి దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడుపడంలేదని కాంగ్రెస్‌ను దింపే ఉద్యమం నడిపి, ఆ ఉద్యమం నుండి ఆయన (ప్రధాని అయ్యాడు. ఫైనాన్స్ మంత్రి పదవిని వదిలేసి జనమోర్చా పెట్టి రాజకీయ ఉద్యమం నడిపాడు. దాన్ని క్రమంగా జనతాదళ్గా మార్చి దేశంలో మార్పు తేవాలనే ఆకాంక్షతో ప్రధాని అయ్యారు. తరువాత పదవి ముఖంగాని, ఎన్నికల ముఖంగాని చూడలేదు. అప్పటి నుండి సామాజిక న్యాయ సిద్దాంతాన్ని (ప్రచారం చేసే ఉపన్యాసకుడుగా, కవిగొ, పెయింటర్‌గా బతికారు. ఆయన ఈ దేశపు అణగారిన ప్రజల గుండెల్లో తరతరాలు ఉంటాడు. చివరికి అగ్రకుల అహంకారపు కుట్రలో ఆయన మరణ సందర్భం కూడా అర్హమైన (ప్రచారానికి నోచుకోలేదు. అందుకు వి.పి.సింగ్ చింతిస్తాడని నేను అనుకోను. వి.పి.సింగ్ పేరు చెప్తేనే శరీరమంతా కాలి మండిపోయే సీనియర్ ఇంగ్రీష్ తెలుగు, ఇతర భాషల జర్నలిస్టులు నాకు తెలుసు. ఈ రోజు (ఫ్రంట్ పేజీ కథనాలకు నోచుకోని వి.పి.సింగ్ కొద్దికాలంలో మళ్ళీ అన్ని ఫ్రంట్' "పేజీల్లో వస్తాడు. ఒకనాడు ఇండియన్ అ(గ్రకుల మీడియా అసలే పట్టించుకోని అంబేద్కర్, మహాత్మాపూలేలు నేడు ఎక్కడున్నారు. మీడియా పేజీల మీద పేజీలు నింపి రాసినా (ప్రమోద్ మహజన్ ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు. ఆయనకు ఢిల్లీలో మండల్ ఘాట్ కట్టి ఢిల్లీలో ఆయన అంత్మక్రియలు జరుపని ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదునిచ్చి ఢిల్లీలోని గల్లీ గల్లీలో ఆయన బొమ్మలు పెట్టే రోజు వస్తుందని ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు గుర్తుంచుకుంటే మంచిది. వి.షిసింగ్కి నా బ్లూసెల్యూట్. వి.పి.సింగ్ ఈ యుగపు మండల్ హీరో, ఆయన ఈ యుగపు కమండల్ శత్రువు. వి.పి.సింగ్ అమర్హై. సూర్య - 30 నవంబర్, 2008
5్డ్తీ
ఆఖరి గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే
కొ న్ని నెలల క్రితం దేశంలోని యూనివర్సిటీల్లో గాంధీ సెంటర్స్‌ను స్థాపించే యుజిసి కమిటీ సమావేశం ఢిల్లీలోని యుజిసి భవన్లో జరిగింది. ఆ కమిటీకి నిర్మలాదేశ్‌పాండే అధ్యక్షురాలు. నాతోపాటు మరో ముగ్గురు సభ్యులం. ఆమె అడ్వాన్స్డ్ వయస్సుతో ఉన్నందువల్ల ఎక్కువగా మాట్టాడలేని స్థితిలో ఉన్నారు. కాని గాంధీకి సంబంధించిన ఏదో ఒక నీతి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమె ఒక కధ చెప్పి దీనిపై మీ యూనివర్సిటీ ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేవారు. కమిటీలోని సభ్యులపై అజమాయిషీ చేసే స్వభావం ఆమెకు అసలు లేదు. కులవ్యవస్థపై ఆమెకు పెద్దగా అవగాహన లేదు. గాని గాంధీ, అంబేడ్కర్ల భిన్న దృక్పధాల గురించి కమిటీలో చర్చ జరిగినప్పుడు అమె ఆసక్తిగా వినేవారు. ఈ సమాజం నుండి పూర్తిగా కులం పోవాలి అనే వాదనతో ఏకీభవించేవారు.
నిర్మలా దేశ్‌పాండే మే 1న చనిపోయారు అనే వార్త నన్ను కూడా కొంత విచారంలోకి నెట్టింది. ఢిల్లిలో 1994-97 మధ్య నేను నెహ్రూ ఫెలోగా ఉన్నప్పుడు కూడా ఆమెను నేను ఎన్నో మీటింగుల్లో ఇండియన్ సోషల్ ఇనిస్టిట్యూట్‌లో కలిసాను. ఢిల్లీలో మతసామరస్యానికి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా ఆమె అందులో ఉండేవారు. ఆ వయస్సులో ఆమె ఉత్సాహం ఎవరినైనా ఉత్తేజపరుస్తుంది. గాంధీకాలం నుండి ఈనాటి వరకు గాంధేయవాదుల (ప్రధాన అంశం హిందూ-ముస్లిం మత సామరస్యం. 1947 మతకల్లోలాలలో పుట్టి, పెరిగి పెద్దవారైన ఎవరికైనా మతకల్గోలాలు, హిందూ - ముస్లిం మత సామరస్యం జీవిత అజెండాగా రూపొందడంలో ఆశ్చర్యం లేదు. గాంధీ చనిపోయినాక కూడ ఆయన ఆలోచనలను ప్రచారం చేస్తూ బతికిన గాంధేయవాదులకు అదొక్కటే సామాజిక ఉద్యమ అంశంగా మిగిలింది. అంటే సమాజంలో ఒక కల్టోలంగా రూపొందింది. అంతర్ యుద్దాలలో హత్యాకాండకు కారణంగా కనిపించే అంశంపై నిరంతరంగా పనిచేసిన వ్యక్తులు కనిపిస్తారు, సంస్థలూ మనకు చాలానే కనిపిస్తాయి.
210
ఆఖరి గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే 211 మహాత్మాగాంధీ కాలంలో హరిజనోద్ధరణ కార్యక్రమం, వారి హిందూ ఉద్దరణలో భాగంగా ఉండింది. మానవ సామాజిక అంటరానితనానికి వ్యతిరేకంగా మాత్రమే వాళ్ళు కార్య(క్రమాలు చేపట్టారు. హిందూ సమాజంలోని ఆధ్యాత్మిక అంటరానితనం వారికెప్పుడు సమస్యగా కనిపించలేదు. నిజానికి గాంధీ - వర్ష వ్యవస్థ ఉండాలి, అంటరానితనం పోవాలి అనే వాదనలో హిందూ అంటరానితనాన్ని, అణిచివేతను పట్టించుకోకుండా దానిలోని సామాజిక అంశాన్ని రూపుమాపాలనే ఆలోచన మనకు కనిపిస్తోంది. అది ఈ కుల సమాజాన్ని మార్చలేదు. కులవ్యవస్థ (ప్రాతిపదికగా ఈనాటికే దేశంలో పెద్దపెద్ద రయిట్స్గాని, అంతర్ యుద్దం గాని జరగలేదు. కనుక గాంధేయవాదులు కుల వ్యతిరేక చర్చలు గాని, ప్రచారాలు గాని చేపట్టలేదు. నిర్మలా దేశ్‌పాండే మతసామరస్యం కోసం కృషి చేసినంత రిజర్వేషన్ పరిరక్షణ కోసం కృషి చేయలేదు. మత కల్గోవాదుల్ని ప్రశ్నించినట్టు, రిజర్వేషన్ వ్యతిరేకుల్ని (ప్రశ్నించలేదు. గాంధీకి పూనా పాక్ట్ సందర్భంలో ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకత గాంధేయవాదులలో ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. నిర్మలాదేశ్‌పాండే ఎప్పుడూ అటువంటి అభి(ప్రాయాన్ని బాహాటంగా చెప్పనప్పటికీ రిజర్వేషన్లను వ్యతిరేకించి దళితుల్ని
- బీసీలను అవమానపరిచే వారిని ఆమె ఎప్పుడూ బలంగా వ్యతిరేకించలేదు. వారికి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్తొనలేదు. ఇప్పుడు ఇంకా బతికి ఉన్న గాంధేయవాదులంతా ఇంగ్లీష్ హిందీ భాషలలో రాయగలిగి మాట్లాడగలిగే వారు. నిర్మలాదేశ్‌పాండే ఆనాటికే ఇంగ్రీషు చదువుకున్న వ్యక్తి. ఇంగ్రీషు బాగా మాట్టాడగలదు కనుకనే ఆమెను యుజిసి కమిటీల్లో కూడా చైర్‌పర్సన్‌గా వేస్తుండేవాళ్ళు కాని ఇంగ్లీషు మీడియం విద్య మీద, అంటే ఆ విద్య అందరికీ కామన్‌గా ఉండాలనే అంశం మీద గాంధేయవాదులు నిర్దిష్టంగా ఒక స్టాండ్ తీసుకోలేదు. ఈ ధోరణి మనం లోహియా వాదుల్లో కూడా చూస్తాం. లోహియా అనుచరుల్లో చాలామంది మంచి ఇంగ్రీషు మీడియం గాని / లేదా ప్రాంతీయ భాషా మీడియంలో భాగంగా ఇంగ్లీషు నేర్చుకున్న వాళ్ళు గాని ఉంటారు. కాని ప్రజలందరూ ఇంగ్లీషు నేర్చుకునేందుకు స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలంటే వీళ్ళంతా వ్యతిరేకిస్తారు. గాంధేయవాదులు - లోహియావాదులు ముఖ్యంగా సంపన్న అగ్రకులాల నుండి వచ్చిన వారే ఉంటారు. గాంధేయవాదం సాధారణ జీవన విధానానికి, మత సామరస్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దాంతంగా మనకు కనిపిస్తుంది. కాని దానికి మానవ సమానత్వంపై ఎటువంటి పాత్రలేదు గాంధీ ఆహింనకు ప్రాతినిధ్యం వహించారు, ఈనాటికీ గాంధేయవాదులు అహింసావాదులుగా ప్రచారంలో ఉన్నారు. ఆ మధ్య అమెరికా గొప్ప నల్లజాతి అహింసావాదిగా పేరున్న జెస్సీ జాక్సన్ నేను సిఎన్ఎన్ - ఐబిఎన్టివి చర్చల్లో
212 పర్సనాలిటీస్ పాల్తొన్నప్పుడు కూడా నేను ఇదే ప్రశ్న వేసాను. జెస్సీ జాక్సన్ అమెరికాలో కూడా గాంధేయ అహింసావాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆయన మతం రీత్యా క్రిష్టియన్. జీసస్‌ను ఒక (ప్రవక్తగా నమ్ముకొని బతుకుతున్న వాడు. జీసస్ అహింసావాదంలో మానవ సమానత్వం సమస్య బలంగా ఇమిడి ఉన్నది. దేవుడు కూడా అసమానతను గౌరవిస్తాడన్న రోజుల్లో జీసస్ దేవున్ని సమానత్వానికి ప్రతిబింబాన్ని చేశాడు. అహింసను ఆయుధంగా ఎన్నుకొని చివరికి తనను సిలువకేసి చంపిన ఆనాటి సమరిటనుల, జైంటల్ల సమానహక్కుల సంవుర్షణను ఆయన బలపరిచారు. వారికే హక్కుల్ని నూరిపోసాడు. గాంధీ అహింసావాదంలో 'సమానహక్కుల సమస్య" అంత బలంగా ఇమిడి లేదు. అది బలవంతుని, బలహీనుని సామరస్యత గురించి మాట్లాడుతుంది. ఆ సామరస్యత అందుకే ఎండమావిలా మిగిలిపోతుంది.
నిర్మల్ దేశ్‌పాండే గాంధేయవాదం కోసం జీవితాంతం కృషి చేసిన (స్త్రీ మానవ సమానత్వం కోసం కాదు గాని, మానవ సామరస్యం కోసం మాట్లాడారు, ప్రచారం చేశారు. ఇప్పుడున్న సామాజిక అసమానతలను తొలగించడానికి ఆమె గాంధేయవాదం అంత ఉపకరించదని మనకు తెలుసు. కాని ఆమె జీవితకాలపు పట్టుదలను, కృషిని అభిమానించవలసిన అవసరం చాలా ఉంది.
ముఖ్యంగా తన బాల్య యవ్వన దశలో అ(గ్రకుల (స్త్రీలను, గృహిణులుగా బంధించి, కుటుంబానికి కట్టేసే రోజుల్లో ఆమె గాంధేయ క్యాంపులో చేరి సామాజిక రంగంలో జీవితాన్ని గడిపింది. ఆమె ఎన్నడూ రాజకీయ అధికారం కోసం ప్రయత్నించలేదు. అందుకు ఆమెకు నా జోహార్డు.
సూర్య - 4 మే, 2008
55 కల టం గరి ర్స్
సోనియా సంస్కర్త బాధ్యత స్వకరిస్తారా? ఇటీవల ఎన్డిటివి తన 'బిగ్ పైటో కార్యక్రమంలో గాంధీ, నెహ్రూలు నేడు పట్టించుకోనవసరం లేని వారుగా మారిపోతున్నారా? అనే అంశం మీద చర్చ నిర్వహించింది. అందులో నేను పాల్గొన్నాను. దళిత ఉద్యమాల కారణంగా కింది నుంచి మహోన్నత ప్రమాణానికి ఎదిగిన అంబేడ్కర్‌కే, హిందుత్వశక్తులు అత్యంత (క్రూరంగా పై నుంచి భారతీయ పౌరసమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్న సావర్కార్కే మధ్య గాంధీ, నెహ్రూల (ప్రాసంగితి (రెలెవెన్స్) ఇరుక్కుపోయిందని నేను అభిప్రాయం వ్యక్తం చేశాను. నిరుపేదల ప్రతినిధిగా, చారిత్ర కులవ్యవస్థ, అస్పుశ్యతల రద్దుకు పోరాడినవాడుగా అంబేద్కర్ విగ్రహాల రూపంలోనే కాదు, ఒక సామాజిక, తాత్విక, రాజకీయ సంస్కర్తగా కూడా గాంధీని పక్కకు తప్పించాడు. అసమానతలు కొనసాగుతున్న భారత సామాజిక రాజకీయవ్యవస్థలో అంబేడ్కర్ అవతరణ ఒక సహజ పరిణామం మాత్రమే. కనుక అంబేడ్కర్‌ను సొంతం చేసుకోవడం మినహా కాంగగ్రైస్ లాంటి పార్టీకి మార్గాంతరం లేదు, సావర్కార్ భావజాలాన్ని విశ్వసించే రాజకీయశక్తులతో తుదివరకు పోరాడడానికి కూడా అంతకంటే వేరేదారిలేదు. సౌవర్కార్ ఈ దేశంలో హింసకూ, మతతత్వశక్తుల ఊచకోతకూ ప్రతినిధి. ప్రజానుకూల శక్తులు అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకుని సావర్కార్ అనుయాయులతో పోరాడకపోతే దేశానికి భవిష్యత్తు లేదు. ఈ పరిస్థితిలో గాంధీ, నెహ్రూలు మరింతగా ఉనికి కోల్పోతారు.
సోనియాగాంధీ, కాం(గైస్ పార్టీ ఈ చారిత్రక దృక్కోణాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటీవలి ఎన్నికల తర్వాత సోనియాగాంధీ ప్రతిష్ట స్థాయి ఎంతో మార్పు చెందాయి. ఆమె పదవీత్యాగం ద్వారా తన వ్యక్తిత్వ స్థాయిని ఎంతగా పెంచుకున్నారంటే, బిజెపిలో ఈ విషయంలో ఆమెతో తులతూగే నాయకుడే లేడు. ఈ స్థాయిని అందుకున్న తర్వాత ఆమె మళ్ళీ ప్రభుత్వాధికారం నైపు మొగ్గకూడదు. ప్రభుత్వంలో ఎటువంటి పదవినీ అధిష్టించకుండానే, పార్టీకి అధ్యక్షుడు అయినాకాకపోయినా, పార్టీలో తన ఆధిపత్యాన్ని స్టాపించుకున్న మహాత్మాగాంధీ ఒకప్పుడు నేతృత్వం వహించిన అత్యంత (ప్రాబల్యం
213
214 పర్పనాలిటీస్ కలిగిన కాం(గైస్ పార్టీకి తిరుగులేని నాయకురాలి హోదా పొందిన సోనియాగాంధీ భవిష్యత్తులో కూడా పార్టీపై అధికారం నెరపుతారు. అయితే 'ప్రశ్న్శల్హా ఆ అధికారాన్ని ఆమె ఎలా వినియోగస్తారన్నదే.
ఆమె ఆ అధికారాన్ని చరిత్రాత్మకం చేయడానికి పెద్దఎత్తున సాంఘిక సంస్కరణ అజెండాను ముందుకు తేవడమే ఏకైకమార్గం. గాంధీవల్లనే కాం(గైస్పార్టీ ప్రజానీకంలో శాశ్వత ప్రతిష్టను సంపాదించుకోగలిగింది. గాంధీ రాజకీయపోరాటానికి సాంఘిక సంస్కరణను మేళవించడడమే అందుకు కారణం. అస్పృశ్యతా నిర్మూలన, దళితుల ఆలయ ప్రవేశం వంటి అంశాలకు, వెన్నుదన్నుగా నిలిచాడు. అందుకే సావర్కార్ అనుయాయులు ఆయనను క్రైస్తవుల ఏజెంటుగా నిందించారు. కానీ గాంధీ వాటిని లెక్కచెయలేదు.
ఇప్పుడు సోనియాగాంధీ ఎదుట ఒక సవాలు ఉంది. దేశ పాలకవర్గంలోని ఒక తెగ, ఆమె తన వర్మ, కుల ప్రయోజనాలకు హాని చేస్తారని అనుమానిస్తోంది. అందుకే ఆమె ఒక విదేశీ మహిళ అనీ, దేశ ప్రయోజనాలకే చేటు తెస్తారని ఈ తెగ ప్రచారం (ప్రారంభించింది. ఆమె క్రైస్తవమత నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కనుక తమ కులవ్యవస్థను, సమాజంలో హిందూ ఆధిపత్యాన్ని అస్తవ్యస్తం చేస్తారనే బెదురు బిజెపిలో, చివరకు కాం(గైస్‌లో కూడా ఉన్న చాలామంది అ(గ్రవర్ష హిందూ రాజకీయ నాయకులలో ఉంది. పార్టీ మహిళా నాయకురాలిగా ఇందిరాగాంధీతో తమకున్న అనుభవమే ఈ బెదురుకు ఆధారం.
కమ్యూనిస్టు సిద్దాంతానికే నైతిక స్ఫూర్తి
మతాంతర వివాహ జీవితం గడిపిన ఇందిరాగాంధీ పితృస్వామ్యు ఆధిపత్యాన్ని, కులతత్వం నిండిన ప్యూడలిజాన్ని కుప్పకూల్చే (ప్రక్రియను ప్రారంభించారు. చారిత్రకంగా అణచివేతకు లోనవుతున్న మహిళలకు (ప్రాతినిధ్యంతో పాటు ఆమెకు పార్సీ మతపార్యం కూడా తోడయింది. నెహ్రూ కుమార్తె కావడం ఒక ముసుగుగానే ఆమెకు ఉపయోగపడింది. 1971 ఎన్నికల నుంచి ఆమె దళిత అనుకూల వైఖరిని తీసుకొన్నారు. ఎందుకంటే సాంఘిక, ఆర్థిక విముక్తి అవసరమైన (ప్రధానశక్తులు వారే. ఆమె తీసుకున్న, బ్యాంకు జాతీయకరణ, భూసంస్కరణల కార్యక్రమాలు, పేదల సముద్ధరణే లక్ష్యంగా గల కమ్యూనిస్టు సిద్దాంతానికి ఎంతో నైతికస్పూర్తిని అందించాయి.
నెహ్రూలా కాకుండా, ఇందిరాగాంధీ హిందూ కులవ్యవస్థ కీళ్ళు కదిలేలా చేశారు. ఇంటా, బయటా కూడా ఫ్యూడల్ పితృస్వామ్య చట్రాలను బద్దలుకొట్టడం ద్వారా అది
సోనియా 'సంస్కర్హా బాధ్యత స్వీకరిస్తారా? 215 సాధించారు. హిందూమత శక్తులు ఆమెను పార్సీగా పరిగణించాయి.భర్తకు గల సాంఘిక నేపథ్యం ఆమెను కులతత్వ ప్యూడలిజం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఆమె కొడుకులిద్దరిలో ఒకరు (కైన్తవ విదేశీయురాలిని, మరొకరు జాట్ నిక్కును వివాహమాడగలగడానికి అది కూడా ఒక కారణం. ఆమె మనమరాలు ఒక భారతీయ క్రైస్తవుని వివాహమాడింది. సోనియాగాంధీ కుమారుడు కూడా సహజంగానే కైస్తవ నేపథ్యం ఉండే పాశ్చాత్య యువతిని వివాహమాడే అవకాశముంది. సోనియా కుటుంబానికి గల ఈ సాంస్కృతిక బాహుళ్ళమే ఆర్ఎస్ఎస్ వర్గాలను ఎక్కువగా భయపెడుతోంది. అయితే, అదే నేపథ్యం సాంఘిక సంస్కరణకు అపారమైన అవకాళాన్ని ఆమెకు అందిస్తోంది. కులమనేది భారతదేశంలో ఒక కరుడుగట్టిన వాస్తవమన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకుని, సాంఘిక సంస్కరణను దాని చుట్టూనే కేంద్రీకరించవలసి ఉంటుంది. ఇందిరాగాంధీకి గల పార్సీ నేపధ్యం, మతపరమైన సంఖ్యాధిక్యకోణం నుంచి హిందూత్వ శక్తులను భయపెట్టలేదు. ఎందుకంటే పార్సీ మతం, మతాంతరీకరణల ద్యారా విస్తరించడానికి ప్రయత్నించే మతం కాదు. మనదేశంలో విస్తారమైన ఉనికి కలిగినది కూడా కాదు. అయితే సోనియాగాంధీ క్రైస్తవ కుటుంబం నుంచి రావడం వల్ల హిందూత్వశక్తులు ఎక్కువ భయపడుతున్నాయి. ఈ కుటుంబం మతం గురించి మాట్లాడినా, మాట్లాడకపోయినా సరే. కేవలం ఈ కుటుంబానికి గల రాజకీయ ప్రభావం వల్లనే ఈ దేశంలో క్రైస్తవమతం బలపడుతోంది. క్రైస్తవమతం భారతదేశంలో విస్తరిస్తున్న మతం. ఇప్పటికే దేశంలోని గిరిజన 'ప్రాంతాలలోకి చాలావరకు చొచ్చుకొని వెళ్ళిపోయింది. గత వందేళ్ళలో మూడు ఈశాన్య రాష్ట్రాలు కైస్తవమత ప్రాబల్యంలోకి వెళ్ళిపోయాయి. జార్థండ్, ఛత్తీస్‌గఢ్‌లలో, దక్షిణ భారతదేశమంతటా [క్రైస్తవం విస్తరిస్తోంది. ఇది కేవలం కులవ్యవస్థ కారణంగానే జరుగుతోంది తప్ప దీని వెనుక ఎలాంటి కుట్రలేదు. సోనియాగాంధీ అధికారంలోకి వస్తే తమ ఆధిపత్యం అంతమైపోతుందని ఆ(గ్రవర్ష హిందూశక్తులు భయపడుతున్నాయి. అయితే, ఆర్ఎస్ఎస్ జాతీయ వ్యవహారాలలో కీలకపాత్ర పోషించిన గత ఎనిమిదేళ్ళలో (క్రైస్తవమతం వేగంగా విస్తరించింది. కులవ్యవస్థ కారణంగా హిందూ సమాజం బలహీనపడింది. ఈ ఎనిమిదేళ్ళలో దళితులు, వెనుకబడిన తరగతులు చాలా కడగండ్లకు లోనయ్యారు. హిందూ మత కేంద్రితంగా రిజర్వేషన్లు ఉండడం వల్ల ఆగారు కానీ, లేకపోతే చాలా కులాలు ఇతర మతాలలోకి మారిపోయి ఉండేవి. సాంఘిక తాత్వికరంగాలలో కులవ్యవస్థను ఇలాగే కొనసాగిస్తే హిందూమతం అంతరించిపోతుందని గాంధీ, అంబేడ్కర్ అంతటివారే హెచ్చరించారు. హిందూమతానికీ, విద్యా, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్లకూ ఉన్న ముడిని తొలగిస్తే దేశంలో త్వరితగతిన మార్పులు చోటుచేసుకుంటాయి. ముస్లిం రిజర్వేషన్లపై చర్చ ఆ
216 పర్సనాలిటీస్ (ప్రక్రియను ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రైవేటు రంగంలోనూ ముస్తింలకూ రిజర్వేషన్ల కల్పనలో దృఢంగా వ్యవహరించాలి. సాంఘిక సంస్కరణ ప్రక్రియకు ఈ రెండు అంశాలూ తోడ్పడతాయి. సాంఘిక సంస్కరణ రంగంలో సోనియాగాంధీ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. అయితే పాత కాంగ్రెస్‌వాదులు వ్యవస్థలో సమూల పరివర్తనకు ఇష్టపడరు. కులవ్యవస్థ విషయంలో మురళీ మనోహర్ జోషి లేదా పూరి శంకరాచార్య ఎంత కరడుగట్టిన కులతత్వవాదులో, వీరూ అంతే. (ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల వివాదం పాతగాయాలను మళ్ళీ తెరవబోతోంది. (ప్రతిభను, సామర్థ్యాన్ని, ఉత్పాదకతను నేలరాసేదిగా చిత్రిస్తూ అ(గ్రవర్త సంపన్నులు అప్పుడే రిజర్వేషన్ల విధానంపై మళ్ళీ దాడి (ప్రారంభించారు. వారు వాడే భాష అవమానపూరితంగా ఉంది. కులతత్వ దుహంకారమే ఈ భాషలో వాళ్ళను మాట్టాడిస్తోంది. అంబేడ్కర్ మార్గదర్శకాలు ఆధారంగా సాంఘిక సంస్కరణల అజెండా రూపొందాలి. అంబేడ్కర్ కూడా చాలాకాలం పాటు మంతత్రిపదవికి దూరంగానే ఉన్నారు. కేంద్రంలో న్యాయశాఖామంత్రిగా నియమితులైనా, తన మనసులో ఉన్న సాంఘిక సంస్కరణల అజెండాను మంత్రి పదవి ద్వారా సాధించలేమని భావించి స్వల్ప కాలంలోనే దానిని విడిచిపెట్టారు. అధికారాన్ని నిరాకరించిన సోనియాగాంధీ ఇప్పుడీ సవాలును స్వీకరించాలి. భారతదేశంలో పెద్దఎత్తున సాంఘిక సంస్కరణను తీసుకురావడానికి ఆమె అనుకూల స్థితిలో ఉన్నారు. ఆ దిశగా ఆమె ముందడుగువేయాలి. వార్త - 11 సెప్టెంబర్, 2004
56 లాభాల పట్టాలపై రైలు విమర్శకులను చిత్తుచేసిన లాలూ చొలా కాలం పాటు భారతీయ మీడియా లాలూ ప్రసాద్‌ను అదేపనిగా సతాయించింది. ఆయన బీహార్ రాజకీయాలను అంటిపెట్టుకొని ఉన్నంతకాలం, అవినీతిపరుడుగా, అసమర్జుడిగా చిత్రిస్తూ వచ్చింది. ఒక బరైను ఆయనను కలిపి ఆయన నోట్టుమేస్తుంటే, బ(రై గడ్డిమేస్తున్నట్టు చిత్రించిన కార్టూన్లను ఇంగ్లీష్ దేశ భాషా పత్రికలు (ప్రచురించాయి. అవినీతి, అసమర్ధత లాలూ్రసాద్ యాదవ్ అనే వ్యక్తి రూపంలో జన్మించినట్టు మీడియా చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటైన భారతీయ రైల్వేకు మంత్రిగా ఉన్న అదే లాలూప్రసాద్ యాదవ్ యుపిఎ ప్రభుత్వంలో తనే అత్యుత్తమ మంత్రిననీ, రైల్వే మంత్రిత్వశాఖ చరిత్రలోనే తాను ఉత్తమోత్తమమంత్రిననీ మీడియా అమోదించి తనముందు మోకరిల్లేలా చేశారు. బీహార్ ఎన్నికలలో ఆయన ఓడిపోవడంవల్ల ఒకవిధంగా మంచే జరిగిందని నాకు అనిపిస్తుంది. ఇందువల్ల రైల్వే మంత్రిత్వశాఖ మీద దృష్టిపెట్టి అనూహ్యమైన ఫలితాలను సాధించి చూపించడానికి ఆయనకు అవకాశం కలిగింది. ఆయనను అవినీతిపరుడుగా, జోకర్‌గా చిత్రించిన అదే మీడియా రెండేళ్ళ స్వల్ప్బవ్యవధిలోనే యుపిఎ ప్రభుత్వంలో అత్యుత్తమ మంత్రిగా ఆయనకు రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు, ప్రతిభకు చిరునామాగా చెప్పుకొనే అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లాలూట్రసాద్ విజయ రహస్యంపై అధ్యయనం జరిపించడానికి సిద్ధమైంది. ఈ సంస్థలో పనిచేసే ్రొఫెసర్లే ఢిల్లీలోని అ(గ్రవర్ష మంత్రులకు సలహాలిచ్చి నడిపిస్తూ ఉంటారని చెప్పుకొంటుంటారు. కొనఊపిరితో ఉన్న రైల్వేలకు లాలూప్రసాద్ 'ప్రాణంపోయడం మీదే కాదు దానిని (ప్రపంచశ్రేణి వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి వేస్తున్న పధకాలపై కూడా ఈ సంస్థ అధ్యయనం చేస్తోంది. ప్రతిభామూర్తిగా చెప్పుకొనే అగ్రవర్షస్థుడు అరుణ్‌శౌరి తాను పెట్టుబడుల ఉపసంహరణల మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలను దాదాపు 217
218 పర్ఫ్సనాలిటీస్ (పైవేటీకరించాలన్న ఆలోచన చేశారు. రైల్వేవ్యవన్హ (ప్రభుత్వం కిందే ఉంటే కుప్పకూలిపోతుందని నిర్ధారణకు వచ్చారు. కానీ నయాజఉదారవాదులు 'జనాకర్షక' వాదంగా పేర్కొనే సంక్షేమ స్వభావాన్ని కాపాడుతూనే (ప్రభుత్వరంగాన్ని లాభాలు వర్షించేదిగా మలచుకోవచ్చునని *1ప్రతిభాశూన్యుడైన' ఒక ఒబిసి మంత్రి నిరూపించారు. గేలిచేసిన మీడియా
లాలూ్రసాద్ యాదవ్ తాను రైల్వేమంత్రి అయినప్పటి నుంచి (ప్రయాణీకుల చార్జీలను పెంచలేదు. 'రైళ్ళలో కోక్ తాగకండి. మట్టికప్పులలో మజ్జిగ తాగరిడని ఆయన చెప్పినప్పుడు మీడియా ఆయనను ఎగతాళి చేసింది. ప్రయాణీకులు మజ్జిగను ఆదరిస్తే పాలఉత్పత్తిదారులు లాభపడతారనీ, మట్టి కప్పులు వాడితే కుమ్మరులకు జీవనోపాధి ఏర్పడి ఆత్మహత్యలు తగ్గుతాయని ఆయన అన్నప్పుడు కూడా మీడియా గేలిచేసింది.
ఈ ఏడాది రైల్వేబడ్జెట్‌లో ఆయన రూ. 15,000 కోట్ల లాభాన్ని చూపించేవరకూ మీడియా ఆయన మాటల్ని నమ్మలేదు. లాలూప్రసాద్ వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యాపార చట్రంలో పనిచేస్తూనే ఉత్తమ ఫలితాలు సాధించారు. సరకు రవాణాలో మంచి వ్యాపారదక్షత చూపించారు. వ్యాపారానిక్తీ (ప్రయాణీకులకు సంబంధించిన సంక్షేమ చర్యలకీ మధ్య మంచి సమతూకం స్టాపించగలిగారు. సిబ్బంది పనిసామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తానే రైల్వేస్టేషన్లలో కూర్చోవడం ప్రారంభించారు. ఫలితంగా దుర్శటనల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి మంత్రిత్వశాఖలో అవినీతి స్థాయి కూడా తగ్గింది. రైల్వేశాఖ సోమరితనం నుంచి కూడా మెల్లమెల్లగా బయటపడుతోంది. తన విమర్శకుల నోళ్ళు మూయించడమే కాదు, రిజర్వేషన్ల చర్చ సందర్భంలో సాంఘికవర్గాలకు ఒకవిధంగా ఆయన నైతిక స్థైర్యాన్ని కూడా అందించారు.
ఎస్సి, ఎస్టి, ఒబిసి నాయకులు తమ అట్టడుగు, (గ్రామీణ అనుభవం మీద ఆధారపడి పరిపాలనలో తమ ప్రయోగాత్మక నైపుణ్యాలను నిరూపించుకోవాలి. (బ్రాహ్మణీయ అధికారులకు, రాజకీయనాయకులకు అటువంటి అనుభవం ఉండదు. రైల్వేమంత్రిత్వశాఖ తన మొత్తం చరిత్రలో ఇప్పటిలా తన విశ్చ్ససనీయతను ఏనాడూ స్టాపించుకోలేకపోయింది. కేవలం తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, రైల్వేశాఖ దేశంలోనే ప్రజల పట్ట అత్యంత స్నేహపూర్వక వ్యవస్థగా మారింది. అలాగే, రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జనరల్ కంపార్ట్మెంట్ 'ప్రయాణీకులపై సానుకూల దృక్పథాన్ని కనబరచడమూ ఇప్పుడే జరుగుతోంది. జనరల్కంపార్ట్మెంట్ ప్రయాణికులపై లాలూ చూపిస్తున్న సానుభూతిని ఇంతవరకు ఏ రైల్సేమంటత్రి చూపించలేదు.
విమర్శకులను చిత్తుచేసిన లాలూ ౨19
రిజర్వేషన్ల విధానం నిలకడగా అమలు జరుగుతున్న శాఖలలో రైల్వేలు ఒకటి. ఎన్‌డిఎ ప్రభుత్వంలో రిజర్వేషన్ వ్యతిరేకులైన అరుణ్ శౌరీవంటి వారు నేతృత్సం వహించిన (ప్రైవేటీకరణ అనుకూల లాబీ, రిజ్వేషన్ కింద ఉద్యోగాలు పొందిన సామాజిక వర్గం వల్లనే రైల్వేలకు నష్టాలు వస్తున్నట్టు చూపించే ఆలోచన చేసింది. రైల్వేమంత్రులుగా పనిచేసిన నితీష్‌కుమార్. రాం విలాస్ పాశ్యాన్ల “అసమర్ధత” గురించి వాళ్ళు (ప్రైవేట్ సంభాషణల్లో మాట్టాడుకొంటూ ఉండేవారు. ఇప్పుడు లాలూప్రసాద్ ప్రైవేటీకరణ లాబీ వాదాన్ని పూర్తిగా తలకిందులు చేసి ఎస్సి., ఎస్టి, ఒబిసిలకు ఎంతో మేలు చేశారు. ఒక 'ప్రభుత్వరంగ పరిశ్రమ అయిన రైల్వేలలో ఈ అసాధారణ పరివర్తనను ఎలా వివరించాలో తెలియక ఈ లాబీ ఇప్పుడు బుర్ర గోక్కుంటోంది.
లాలూ ఈ మహాద్భుతాన్ని సాధించడంలోని రహస్యం ఏమిటి? పేద ప్రజానీకానికి చేయవలసిన న్యాయం చేయాలనీ, రైలుమార్లాలు, బోగీలు వాడుకొన్నందుకు సంపన్నులు తమ స్థాయికి తగినట్టు బిల్లు చెల్లించాలనే తన తాత్విక చింతనను మేళవించడం ద్వారానే లాలూ దీనిని సాధించారు. గతంలో సంపన్నులు రైల్వేలను స్వప్రయోజనానికి దుర్వినియోగం చేస్తుండేవారు. మీరు వాడుకొన్న దానికి సక్రమంగా బిల్లు చెల్టించంద ముఖ్యంగా గూడ్స్ క్యారియర్ల విషయంలో - చెప్పే సాహసం గతంలో ఏ రైల్వేమంత్రి ఉండేది కాదు. లాలూకి ఆ ధై్యం ఉంది. ఇప్పుడాయన విమర్శకులు కిందమీదవుతున్నారు. రిజర్వేషన్ వ్యతిరేక మేధావులు తమ పుస్తకంలోంచి మరో అధ్యాయాన్ని కో లోయారు. లాలూ ఒబిసి మాత్రమే కాదు. మండల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన యోధుల ఒకరు.
లాలూ ప్రతిభ ఎటువంటిదో, ఒక రిజర్వేషన్ వ్యతిరేక యాజమాన్యం అధ్యయనం చేసి మనకు చెప్పనవసరం లేదు. ఐఐఎం డైరక్టర్లందరినీ రైల్వేలను నడపమని అడిగితే దానిని వాళ్ళు (ప్రైవేటీకరణ లాబీ చేతుల్లో పెట్టి ఉండేవారు. లక్షలాదిమంది పేద దళిత బహుజనుల జీవన పరిస్తితులను మెరుగుపరచడం పట్ట నిబద్దతే ఈ దేశంలో అతి ముఖ్యమైన అర్హత, లాలూప్రసాద్కు అది ఉంది.
వార్త - 22 జూలై, 2006
9 అ పివి మనకిచ్చిన వారసత్వం
ఆధునిక చాణక్యం మాజీ ప్రధాని పి.వి నరసింహారావు మరణవార్త పోస్ట్ డాక్టరల్ ఫెలోషిస్ పథకం కింద నేను అమెరికాలో ఉండగా తెలిసింది. అందువల్ల ఆయన మరణానికి దేవ (ప్రతిస్పందనను, సంతాపం ప్రకటించిన తీరును దగ్గరగా చూసే అవకాళం నాకు కలగలేదు.మెట్రో పేజీలోనే కావచ్చుగాక, డల్లాస్ మార్నింగ్ న్యూస్ పత్రిక ఆయన మరణవార్తను (ప్రచురించడం సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. అమెరికన్ వార్తాపత్రికలలో మెట్రో పేజీలో కూడా భారతదేశం గురించిన వార్తలు ఉండవు. ఆయన దత్తు వెళ్ళిన వరంగల్ జిల్లాకే చెందినవాడిగా ఒక (గ్రామీణ కోణం నుంచి ఆయన
గురించిన నా అంచనాను వెల్లడించడం ముఖ్యంగా భావించాను. మనరాష్ట్రంలో స్వాతంత్రానంతరకాలానికి చెందిన అత్యున్నత రాజకీయవేత్త పి.వి. అనడంలో సందేహం లేదు. ఎప్పుడు మౌనం వహించాలో, ఎప్పుడు నోరువిప్పాలో బాగా తెలిసినవాడాయన. ఆధునిక భారతంలో ఆయన కౌటిల్యుడు. ఒకవైపు సోషలిజం గురించి మాట్టాడుతూనే నెహ్రూ నాటిన స్టేట్ సోషలిజాన్ని ఎటువంటి సంకోచం లేకుండా పెకిలించివేసినవాడాయన. భారతదేశపు నూతన ఆర్థిక విధానానికి వేగుచుక్కగా ఇప్తుడాయనను పరిగణిస్తున్నారు. నరసింహారావు ప్రధాన మంత్రిత్వం అందుకొన్న తొలి దక్షిణ భారతీయుడు. దేవగౌడ రెండవ వ్యక్తి, అయితే దేవగౌడ పాదాలు దక్షిణభారతదేశపు నేలమీదే ఉండగా, పివి తన పాదాలను ఎక్కడా ఆనించినవాడు కాదు. ఎప్పుడూ అధికారం
చుట్టూనే తిరుగుతూ అదెక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్ళారు. అనేక భాషలలో లోతైన (ప్రవేశం ఉన్న వ్యక్తిగా, పండితుడుగా ఆయనకున్న పేరును ఎవరూ కాదనలేరు. పాత అర్ధంలోనే ఆయన పండితుడు. అంతే తప్ప, ప్రస్తుత విజ్ఞానానికి
220
పివి మనకిచ్చిన వారసత్వం ఆధునిక చాణక్యం 221 ఆయన అందించిన స్వతంత్రమైన దోహదమంటూ ఏదీలేదు. ఆయన అసలు స్వతంత్ర ఆలోచనా శీలి కానే కాదు. తనదైన నైపుణ్యంతో అనేక భాషలలో భావాలను బాగా వ్యక్తీకరించగలిగినవాడు. ఇవన్నీ ఆయన బలం,
తెలుగు నేల నుంచి వచ్చి రాజకీయ ఉన్నతిని సాధించిన ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని, ఈ రాషష్టంలోనూ, యావద్దేశంలోనూ ఉన్న బడుగులలో బడుగులకు గానీ చేసిన దేమిటీ? వివిధ స్థాయిలలో అధికార పీఠాలను అధిష్టించిన ఏ పెద్ద రాజకీయ వాదినైనా, అతడొక (గ్రామానికి చెందిన వాడైతే, ఆ (గ్రామం దృష్టి నుంచి అంచనా వేయవలసి ఉంటుంది. అతని వల్ల లేదా ఆమె వల్ల ఆ (గ్రామానికి దక్కిన దేమిటి? అతడు లేదా ఆమె తాము పుట్టి పెరిగిన (ప్రదేశం పట్ల చూపిన ఆసక్తి కారణంగా అక్కడ ఏ మేరకు మార్పు వచ్చింది?
పివి జన్మించిన కరీంనగర్ జిల్లాలోని వంగర (గ్రామస్థులు చాలామంది హైదరాబాద్‌లో జరగుతున్న తమ 'దొర' అంతిమయాత్రను దర్శించడానికి వచ్చారని పత్రికలు రాశాయి. ఆయన చనిపోయే నాటికి కూడా ఆయన వారికి దూరపు దొరగానే ఉండిపోలేదా? తన (గ్రామం సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక రూపురేఖలను మార్చడానికి ఆయన ఏమైనా చేశారా? ఆయన ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. నిజాం కాలం నాటి తెలంగాణ (ప్రాంతంలో అతి తక్కువ (బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే తమ భూస్వామ్య సంపదను నిలుపుకోగలిగాయి. ఆ కాలంలో (బ్రాహ్మణుల భూములన్నీ రెడ్డపరమయ్యాయి. కానీ కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకించి మంథని చుట్పప్రక్కల మాత్రం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు విస్తారమైన భూములతో తమ భూస్వామ్య ప్రాబల్యాన్ని నిలుపుకోగలిగాయి. అందులోనూ పివి కుటుంబం కిందే ఎక్కువ భూములున్నాయి.
కరిచే చట్టం కాదని తెలుసు
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ అమలుచేసిన భూసంస్కరణలలో భాగంగా 1973లో భూసంస్కరణల చట్టం వచ్చింది. అది అరిచే సంస్కరణే కానీ కరిచేది కాదని ఆయనకు బాగా తెలుసు. అప్పట్లో నరసింహారావే అతిపెద్ద భూస్వామి. ఆ చట్టం కింద దళితులే ఎక్కువ సంఖ్యలో ఉన్న భూమిలేని నిరుపేదవర్గానికి ఎన్నడూ భూమిని పంచలేదు. పివి విషయంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టానికి సారధ్యం వహించినది తానే అయినప్పటికీ, తను మరణించే నాటి వరకు తన మిగులు భూమిని ప్రకటించలేదు. తన కుటుంబం కింద ఉన్న భూమిని నామమాత్రంగానైనా పంపిణీ చేయడానికి నక్సలైట్టు పూనుకోవలసి వచ్చింది.
222 పర్సనాలిటీస్ భూమి పంపకం కాదు సరికదా, తను అధికారంలో ఉన్నప్పుడు కనీసం వంగర స్థితిగతులను బాగు చేయడానికి కూడా ఆయన చేసిందేమీ లేదు. కరీంనగర్ జిల్హాలో నక్సల్ ప్రాబల్యం గల ఎన్నో మారుమూల (గ్రామాల మాదిరిగానే వంగర కూడా నేటికీ ఎటువంటి అభివృద్దీ లేని దుస్టితిలోనే అల్లాడుతోంది. సాధారణంగా భూస్వాములందరూ చేసినట్టే పివి కుటుంబం కూడా హనుమకొండనే తమ కేంద్రంగా చేసుకొంది. హనుమకొండ తెలంగాణలో ఒక బ్రాహ్మణ పట్టణంగా మారింది. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలలోని ఎన్నో (బ్రాహ్మణ కుటుంబాలు పట్టణ విద్య కోసం హనుమకొండకు వలసవచ్చాయి. ముఖ్యంగా రజాకార్డు, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పెద్ద ఎత్తున (బ్రాహ్మణుల వలస సంభవించింది. హనుమకొండకు మజిలీ చేసుకున్న ప్రముఖ కుటుంబాలలో పివి కుటుంబం ఒకటి. అదే ఆయన నియోజకవర్గమయింది. ఒక్కసారి తప్పు ఆ నియోజకవర్గం నుంచి మరెప్పుడూ ఆయన గెలవలేదు. రాష్టంలో తనదంటూ ఒక ఎన్నికల పునాదిని ఆయన ఎప్పుడూ ఏర్పరచుకోలేదు. మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గాన్ని అఖిల భారత జాతీయ కాం(గైస్ ఆయనకు దత్తత ఇచ్చింది. అయితే (ప్రధానమంత్రిగా నంద్యాల ఆయనకు నియోజకవర్గమైంది. అది రాయలసీమ ముఠా నాయకుల పుణ్యం. మొత్తం మీద సారాంశమేమిటంటే, తాను పరివర్తన చెందించడానికి పునాదిగా పివి ఏ ప్రదేశాన్నీ ఎంచుకోలేదు. ఆయన స్వగ్రామం కానీ, హనుమకొండగానీ, ఆయన తుది మజిలీ హైదరాబాద్గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్టం గానీ ఆయన ఉన్నతోన్నత అధికార పదవుల ద్యారా పొందిన ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి తావునూ ఆయన చేతులు తుడుచుకొని పారేసే కాగితాల్డానే ఉపయోగించుకొన్నారు. కాంగ్రెస్ = బిజెసిల వారధి నరసింహారావుకు సాంఘిక సంస్కరణ మీద విశ్వాసం ఉందని చెప్పలేం. తన ప్రసిద్ద రచన 'ది ఇన్ సైడరోలో ఆయన కులం గురించి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ దేశ (ప్రధానులందరిలోనూ ఎక్కువ (బ్రాహ్మణత్వం కలిగిన ప్రధాని ఆయనే. తను (ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అర్థ నగ్న బ్రాహ్మణ వేషంలో ఆయన దేవాలయాలను దర్శించి పూజలు చేశారు. అనేకమంది స్వాములు ఆయన చుట్టూ ఉండేవారు. చంద్రస్వామి ఆయనకు గురవని చెబుతారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ తరహా లౌకికవాదం ముసుగు కూడా తీసేసుకున్నారు. బిజెపి, కాం(గైస్ రాజకీయ సంస్కృతుల మధ్య ఆయన వారధిగా పనిచేశారు. పివి ప్రధాని అయి ఉండకపోతే బిజెపి ఎన్నటికీ
పివి మనకిచ్చిన వారసత్వం ఆధునిక చాణక్యం 223 అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. (ప్రధానమంత్రి కార్యాలయంలోకి ఎంత నిళ్ళబ్దంగా వెళ్ళాడో, హిందూత్వ మిత్రులు 'బాబ్రీ మసీదును కూలగొడుతున్న దృశ్యాన్ని కూడా అంతే నిశ్శబ్దంగా తిలకించారు. ఆయన మరణంతో ఒక ఆధునిక చాణక్యుడు కన్నుమూశాడు.
స్వర్గంలో ఆయన తన పురాతన రాజకీయ సాంస్కృతిక గురువు, అర్థశాస్త్ర రచయిత ఆయన చాణక్యుని సరసన చేరతారు. చనిపోయే వరకు అర్ధశా'స్త సంస్కృతిలోనే ఆయన జీవించారు. ఆధునిక కాలంలో కూడా చాణక్యుని ఉనికిని నిలబెట్టే తన వారసత్వాన్ని మిగిల్చిపోయారు. ఈ దేశంలోని నిరుపేదలు కొన్ని శతాబ్దాల పాటు అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
వార్త - 7 జనవరి, 2005
58
బారక్ ఒబామా మనదేశంలో పుట్టి ఉంటే?
అమెరికా అధ్యక్షపదవికి డెమోశ్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడే ఇద్దరు ప్రముఖుల్లో బారక్ ఒబామా ఒకరు. నల్లజాతి తండ్రి, తెల్లజాతి తల్లికి పుట్టిన ఆయన ఒక విప్లవాత్మక యువకుడు. అతని వయస్సు 46 సంవత్సరాలు మా(త్రమే. కెన్యాకు చెందిన ఒక బానిస వంశం యువకుడు అమెరికాలో చదువుకోవడానికి వచ్చి ఒబామా తల్లిని కాలేజీలో కలిసి పెండ్లిచేసుకున్నాడు. ఆమె కూడా ఒక (శ్రామికవర్గానికి చెందిన వలసవాసుల కూతురు. వాళ్ళ స్వయంనిర్హయపెండ్లి అనంతరం ఒబామా పుట్టాడు. అయితే, బహుశా భార్యతో సరిపడక కావచ్చు. ఒబామా తండ్రి తిరిగి కెన్యా వెళ్లిపోయి అక్కడే ఆక్సిడెంట్లో చనిపోయాడు.
ఒబామా తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే బయటికి చెప్పని కారణంతో తల్లి కూడా చనిపోయింది. బారక్ ఒబామా తన అమ్మమ్మ దగ్గర చర్చి సహాయంతో పెరిగి చదువుకున్నాడు. ఎపిస్కోపల్ చర్చి ఒబామా చదువుకు ఎంతో సహకరించింది. ఒబామా క్రమంగా హార్వర్డ్ లా స్కూల్లో లా చదివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ స్కూల్. జర్నల్ను నడిపే టీమ్ అధ్యక్షుడయ్యాడు. అతను మొట్టమొదటి నల్లజాతి జర్నల్ అధ్యన్షుడుగా ఎన్నికై అతి చిన్నవయసులోనే అమెరికా మేధావి వర్గాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆనాడే అతని తెలివితేటలు, పట్టుదలపై అమెరికా పత్రికల్లో చర్చ (ప్రారంభమైంది. ఆ (ప్రఖ్యాత విశ్చవిద్యాలయంలో లా చదివి ఆయన చికాగో నగరంలో తన చర్చి లా టీములో చేరి మానవహక్కుల పరిరక్షణకు పూనుకున్నాడు. ఆ తర్వాత ఆయన చికాగో పట్టణం నుండి ఇల్లినాయిస్ స్టేట్ అసెంబ్లీకి పోటీ చేసి రెండు పర్యాయాలు గెలిచారు. అక్కడి నుండి అమెరికన్ సెనేట్‌కు చికాగో నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. ఆయన అమెరికా సెనేట్‌లో కూర్చున్న 6వ నల్లజాతీయుడు. 45 సంవత్సరాలలోపు సెనేటర్లుగా గెలిచిన అతికొద్దిమంది అమెరికన్లలో ఆయననొకరు.
224
బారక్ ఒబానూ మనదేశంలో పుట్టి ఉంటే? 225
రాజకీయరంగంలో పోరాడుతూనే ఆయన అద్భుతమైన రెండు పుస్తకాలు రాసాడు.
- డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, 2. ది అడాసిటీ ఆఫ్ హోప్. ఈ రెండు పుస్తకాలు అమెరికాలో బెస్ట్ సెల్లర్స్ అయ్యాయి. అందులో మొదటి పుస్తకం ఆయన లా పూర్తి చేశాక తన తండ్రి చరిత్ర తెలుసుకోవడం కోసం కెన్యాకు పోయి ఆయన మూలాలను వెతికి పట్టుకొని రాసిన కధ. ఇక రెండవ పుస్తకం అమెరికాలో నల్లజాతీయులు, బానిసబతుకులు గడిపిన వాళ్ళు ఊహించదగ్గ ఆశాజన జీవితం. వారి భవిష్యత్ గురించి, తన అనుభవం నుంచి రాసింది. ఈ పుస్తకం టైటిల్ 2004 ఎన్నికల ముందు డెమోక్రాటిక్ పార్టీ జనరల్ కన్వెన్షన్ ముందు ఆయన చేసిన కీ నోట్ అడ్రస్ టైటిల్‌గా ఎన్నుకున్నది. ఆ కీ నోటే ఒబామాను ఒక్కసారి అమెరికా గుర్తించగల నాయకుణ్ణి చేసింది.
ఒబామా ఇప్పుడు అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేసేందుకు డెమో!క్రొటిక్ పార్టీ టికెట్ కోసం హిల్లరీ క్షింటన్తో పోటీపడుతున్నాడు. ఆ పోటీలో హిల్లరీతో సమానంగా డబ్బు సేకరించాడు. పార్టీ సభ్యులు అధ్యక్షపదవి పోటీకోసం నాయకుణ్ణి ఎన్నుకునే మొదటి కాకస్ ఐయోవా రాష్ట్రం నుండి ఒబామా మంచి మెజారిటీతో గెలిచాడు. బయోవా స్టేట్ పార్టీలో ఆయన గెలుపు క్రింటన్ కుటుంబాన్ని ఖంగుతినిపించింది. రంగు భేదాలను అధిగమించి ఆయనకు ఆమెరికా ప్రజలు మద్దతు, డబ్బు ఇస్తున్నారు. ఒబామా మంచి రచయిత, మంచి వక్త కూడా. ఆయన ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ టిక్కెట్టు గెలుచుకొని అమెరికా అధ్యక్షుడైతే ఆయన నల్లజాతీయుల చరిత్రనే తిరగరాస్తాడు. 250 సంవత్సరాల బానిసత్వపు చరిత్రలో నల్లజాతీయుల విద్యా, మేధోపర సంఘర్షణలో వారి ఎదుగుదలను ఒబామా (ప్రతిబింబిస్తున్నాడు. 1960 దశకంలో మార్చిన్ లూథర్‌కింగ్ చేసిన పోరాట ఫలితాలను నల్లజాతీయులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కోలిన్ పావెల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవిని చేపట్టి ఎంతో సమర్హుడు అనిపించుకున్నాడు. ఆ తరువాత కండోలీసా రైస్ ఆయన బూట్లలో కాళ్ళు పెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. టివి ప్రచారరంగంలో వినొఫ్నే వోప్రా (ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి గల ధనిక స్త్రీగా ఎదిగింది. రాక్ అండ్ రోల్ డ్యాన్సురంగంలో మైఖేల్ జాక్నన్ సంపాదించిన ఖ్యాతి గురించి (ప్రపంచమంతటికీ తెలుసు. ఇప్పుడు ఒబామా అమాంతం అమెరికా అధ్యక్షపదవికి పోటీపడి ఎంతో పలుకుబడి, అధికార హోదా ఉన్న హిల్లరీ క్రింటన్ను ఢీ కొంటున్నాడు.
ఈ స్టితిలో ఒక్కసారి భారతదేశంలోని దళిత బహుజన శక్తుల ఎదుగుదలను పోల్చిచూస్తే వాళ్ళెక్కడ ఉన్నారు? ఇక్కడి దళిత - బహుజనులు 3 వేల ఏళ్ళ బానిసత్వంలో అణచివేతకు గురయ్యారు. వాళ్ళు విద్యారంగంలో అడుగుపెట్టాక కూడా అమెరికాలో ఆఫ్రికన్ - అమెరికన్లలా ఆత్మగౌరవ విద్యను పొందే అవకాశం వాళ్ళకు దొరకలేదు. ఇక్కడ (ప్రధానమంత్రి పదవికి పోటీపడడం కాదుగదా దాని గురించి కలగనే పరిస్థితి
226 పర్సవాలిటీస్ కూడా రానివ్వలేదు. ఈ మధ్య మాయావతి తాను (ప్రధానమంత్రిని అవుతాను అని (ప్రకటన చేస్తే ప్రచార సాధనాలు ఆమెను ఎద్దేవా చేశాయి. ఈనాటికీ ఈ దేశంలోని దళిత బహుజనవర్గాల్లో ఒక మంచి మేధావి - రాజకీయ నాయకుడు ఎదగలేదు. ఆఫ్రికన్ అమెరికన్లలో మార్చిన్ లూథర్ పుట్టి పెరిగినట్టు ఇక్కడ అంబేద్కర్ పుట్టి పెరిగాడు. కాని ఆ తదుపరి అన్నిరంగాల్లో స్వయంతశక్తి కలిగి ఉన్న మేధావిశక్తుల్ని ఇక్కడ ఎదగనియ్యలేదు. ఎదిగిన వారిని గుర్తించలేదు. అమెరికాలో బారక్ ఒబామాను డెమో॥క్రాటిక్ పార్టీ తన జాతీయ కన్వెషన్లో కీనోట్ ఇవ్వడానికి ఎన్నుకొని ఉండకపోతే 16 సంవత్సరాలకే ఆయన అధ్యక్షపదవికి పోటీచేసే ధైర్యం చేసేవాడు కాదు. ఆయన రాసిన డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ పుస్తకాన్ని రాజకీయ నాయకులు, ప్రజలు చదివి ఆదరించి ఉండకపోతే ఆయనకు ఈ ఆలోచన కూడా వచ్చేది కాదు. ఆయన హార్వర్డ్ లా రివ్వు జర్నల్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆయన తెలివితేటలను కొనియాడుతూ రాసింది, భారతదేశంలోని ఏ పత్రిక అయినా దళిత - బహుజన మేధావిని వెతికిపట్టుకొని (ప్రపంచానికి పరిచయం చేసిందా? పైకి రావాలని ప్రయత్నం చేసిన వారినందరినీ తొక్కుడు వాటికి బాగా తెలుసు, మేధావి వర్గానికి నీతి నియమాలు లేని దేశంలో అట్టడుగు వర్గాల నుండి మేధావులు పుట్టుకురావడం చాలా కష్టం. ఒబామాకు నల్లజాతి ప్రజల్లో కంటే తెల్లవాళ్ళలోనే ఎక్కువ మద్దతు దొరుకుతున్నది. ఆయన అధ్యక్షపదవికి పోటీ చేయాలనుకున్నప్పుడు ఒక నల్లజాతీయుడు అయిన ఆయన ఒక గుర్తింపు గల అభ్యర్థిగా ఎదగడం అసంభవమని నల్లజాతీయులంతా అనుకున్నారు. కాని ఐయోవా పూర్తిగా తెల్లజాతీయుల రాష్టం. అక్కడే ఆయన అధిక మెజారిటీతో కాకస్ ఓటు గెలుచుకున్నారు. భారతదేశంలో అగ్రకులాలవారు అత్యధిక శాతం ఉన్న ఒక నియోజకవర్గంలో ఒక దళితుడు పోటీచేస్తే పార్టీ (శ్రేణుల్లోనైనా గెలుపు సాధ్యమేనా! అటువంటి పరిణామాన్ని ఈ దేశంలో మరికొన్ని దశాబ్దాలకైనా చూడగలమా? సూర్య - 27 జనవరి, 2008
ర్ మై రెస్పెక్స్ టు చిరంజీవి గోస్ అస్ యా లు చిరంజీవి 'ప్రజారాజ్యం' అనే పేరుతో ఒక పార్టీ పెట్టాక పత్రికలు రోజూ ఆయన గురించిన వార్తలేవో రాస్తూనే ఉన్నాయి. ఒక పాపులర్ సినిమా హీరో రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటువంటి చర్చ జరుగుతూనే ఉంటుంది. చిరంజీవి పార్టీ పెట్టటోతున్నారని ప్రచారం మొదలయ్యాక స్పార్క్ అనే సంస్థ పేరుతో డా॥ మిత్రా, కె.విరావు, డా॥ విఠల్ మొదలగు వారి నేతృత్వంలో చాలా మీటింగులు పెట్టారు. ఆ మీటింగుల పరంపర మొదటిదశలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఒక మీటింగ్ పెట్టి నన్ను ఉపన్యాసకుడిగా పిలిచారు. ఆనాటికి అది చిరంజీవి పెట్టబోయే పార్టికి అనుబంధ సంస్థ అని నాకు తెలియదు. నా ఉపన్యాసం (ప్రారంభిస్తూ నా కుల బ్యాక్[గ్రౌండ్‌తో పాటు పరిచయం చేసుకొని హాలులో ఉన్నవారందరినీ ఎస్టీ, ఎస్సీ, బిసి, ఒసిలుగా ఎంతమంది ఉన్నారో చేతులు లేపండి అని అడిగాను. అందరూ ఆ విధంగానే లేపారు. ఒక్క డా॥ మిత్రా లేపలేదు. ఏమీ మీరు లేపలేదేమీ అని నేను అడిగిన ప్రశ్నకు ఆయన 'నాకు కులం లేదు” అని సమాధానం చెప్పారు. ఆయన సమాధానం నన్ను కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ దేశంలో కులం మానవులు నిలబడే భూమిలా తయారైంది. 'మనమెవ్వరం కూడా ఆ భూమి మీద నిలబడి అదేమిటో నాకు తెలియదు అని చెప్పలేము" అని చెప్పి నా ఉపన్యాసం కొనసాగించాను. నా ఉపన్యాసం ముగిశాక చిరంజీవి రాజకీయాల్లోకి రావడంపై మీ అభి'ప్రాయమేమని, వస్తే ఎన్ని ఓట్టు, ఎన్ని సీట్లు వస్తాయని రకరకాల ప్రశ్ళలు వేశారు. అవన్నీ ఊహిజనిత ప్రశ్నలు కనుక వాటికి సమాధానం చెప్పడం కష్టమని దాటవేశాను. చిరంజీవి అధికారంలోకి రావడంపై మీ అభిప్రాయాన్ని తప్పక చెప్పాలని కొంతమంది నన్ను నిలదీశారు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే అధికారం కొన్ని కులమెట్టు దిగుతుందని చెప్పాను. ఈ రాష్టంలో అధికారం (ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండే అధికారాన్ని) (బ్రాహ్మణులు 227
228 పర్సనాలిటీస్ అనుభవించారు. ఆ తరువాత రెడ్డు, కమ్మలు, వెలుమలు అనుభవించారు. ఒకవేళ చిరంజీవి అధికారంలోకి వస్తే శూద్ర - అగ్రకుల దొంతర్లలో చివరిదైన కాపుల చేతికి మారుతుంది. కాపులు ఆటు అ(గ్రకులాలకు ఇటు బిసి కులాలకు మధ్య లింక్ కనుక ఆ మార్పు ఆహ్యానించదగ్గదే అని చెప్పాను. చిరంజీవిని కాపు కుల వ్యక్తిగా చెప్పడం అక్కడ కొంతమందికి నచ్చలేదు. అందులో ఒక వ్యక్తి లేచి ఆయన కాపు కాదు 'అందరివాడు అని నా సమాధానాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాక ఆయన కులంపైనా చర్చ జరుగుతోంది. కాపు కులంలో పుట్టి చిరంజీవి బడుగు, బలహీన వర్గాలకు సీట్టెన్ని ఇస్తారని, ఒట్టు ఎన్ని తెచ్చుకుంటారని, సామాజిక న్యాయం పట్ట ఆయన నిర్దిష్ట అభిప్రాయమేమిటనే ప్రశ్నల పరంపర ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ఈ (క్రమంలో ఆయన తన కుల బ్యాక్‌గ్రౌండ్ గురించి చెబుతూ 'నా తండ్రి ఓసీ అయినా తల్లి ఒక బలిజ కులంలో పుట్టిన బిసి స్త్రీ అని తన తల్లి కుల బ్యాక్[గ్రాండ్ చెప్పాడు. ఇది చాలా మంచి పరిణామం. ఆయన తల్లి బలిజ, తండ్రి కాపు అయినప్పుడు ఆయన తండ్రి కులవారసత్వాన్ని మాత్రమే మోయనక్కరలేదు. నిజానికి ప్రతివ్యక్తికి తల్లి వారసత్వం కీలకమైంది. గుర్రం జాషువా తండ్రి యాదవ్, తల్లి మాదిగ అయితే, ఆయన తల్లి కుల వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నాడు. అదేవిధంగా చిరంజీవి తల్లి బీసీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నేను ఈ రాష్ట్రానికి బిసి ముఖ్యమంత్రినవుతానని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఈ రాష్ట్రం రెండుగా విడిపోయే పోరాటాలు తీవ్రతరమవుతున్నాయి కనుక ఆ విభజనను ఆహ్వానించి తెలంగాణ రా(స్టైనికి ఆంధ్ర రాష్ట్రానికి బిసిలే ముఖ్యమంత్రులు కాగలరని ఆశించవచ్చు, చిరంజీవి తల్లి కుల బ్యాక్‌గ్రౌండ్ చెప్పాకు ఆయన పట్ల నాకున్న గౌరవం చాలా పెరిగింది. ఈ మార్పుకోసం ఒక 30 ఏండ్టుగా కలం పట్టిరాస్తున్న వ్యక్తిగా నేను ఆనందపడడంలో ఆశ్చర్యం లేదు. కాని సమాజంలో తన తల్లి ఒక బ్రహ్మబైతేనో, రెడ్డి, కమ్మ అయితేనో గొప్పగా చెప్పుకొనే రోజుల నుండి, ప్రజలు గౌరవించాలంటే తన తల్లి ఒక బిసి, లేదా ఎస్సీ అని చెప్పుకొని గర్వపడే రోజులు నా జీవితకాలంలోనే వచ్చినందుకు ఆశ్చర్యంగానే ఉంది. 1996లో నేను 'వై అయామ్ నాట్ ఎ హిందూ'" పుస్తకంలో నా తల్లి ఉన్ని ఒడికి, కదురుతో గొరగడ నేసిన గొప్ప (స్త్రీ ఆమె మడి వంటలు చేసిన (బ్రాహ్మణ స్రీ కంటే ఎంతో గొప్పది అని చెప్పినప్పుడు ఎంతోమంది నవ్వారు. మడి వంటలు వండి (పంట పండించి కాదు) దేవునికి ప్రసాదం పెట్టడం గొప్పగాని, గొంగళ్ళు నెయ్యడం గొప్ప ఎట్లవుతుంది అని వారి మూర్థవాదన. ఆ వాదనను ఓడించి, జయించాం. ('వ్రతి వ్యక్తి, ముఖ్యంగా రాజకీయ నాయ కుడు/నాయ కురాలు అడ్డం చేసుకోవలసిందేమంటే తండ్రి కంటే తల్లి ప్రధానం. ఆమె అందించే వారసత్వం అతి
మై రెస్పెక్ష్ టు చిరంజీవి గోస్ అప్ 229 ముఖ్యమైంది. రాజకీయరంగంలో వూలే, అంబేద్కర్, మదర్ఖెరిస్సాలను తమ ఆదర్భవ్యక్తులుగా పెట్టుకున్న చిరంజీవి, ఎన్‌టి రామారావులా కులానికి అధికారం బదలాయిస్తే సరిపోదు. ఎన్టిఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మవారికి అధికారంలోకి రాగలిగే అర్ధబలం, అంగబలం సమకూరాయి. ఇప్పుడు కాపులకు కూడా అంగబలం, అర్థబలం ఉన్నాయి. కాని చిరంజీవి తల్లికులమైన బలిజలకు ఆ రెండూ లేవు. వాళ్ళకు చిరంజీవి అధికారంలో వాటా, వారితో పాటు చాకలి, మంగలి, ఆదివాసీ, మాదిగ, మాలలకు అధికారంలో వాటా, ఆత్మగౌరవస్ట్రానం ఇస్తే ఆయన ఆఫీసులో ఉన్‌ల పూలే, అంబేద్కర్; మదర్ఖెరిస్సాలకు ఆయన నిజమైన గౌరవం ఇచ్చినట్టు.
ఈ అవగాహన మిత్రాకు లేదు. పరకాల (ప్రభాకర్‌కు అంతకన్నా లేదు. అందుకే మిత్రా తనకు కులం లేదన్నాడు. కాని ఆయన రెడ్డి అని అందరికీ తెలుసు. ఆయన తల్లి వేరైతే చెప్పలేను. పరకాల ్రభాకర్ది ఆర్.ఎస్.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ కనుక ఈ కుల చర్చ అంటేనే చిగైత్తి పోవచ్చు. అయితే వాళ్ళు మారే అవకాశం అసలు లేదని నేను అనడం లేదు. ఇప్పటివరకైతే చిరంజీవిలా నా తల్లి 'బలిజ'అని చెప్పి గర్వపడే మనుషులు కారు.
మథర్ థెరిస్సా మానవత్వం బైబిల్లో పుట్టింది. ఫూలే మానవత్వం తోటమాలి కులంలో పుట్టింది. మట్టి పిసికి గోడలు పెట్టిన ఆయన తల్లి కడుపులో పుట్టింది. అంబేద్కర్ మానవత్వం గ్రామాల రోడ్డు ఊడ్చిన ఆయన అమ్మమ్మ, నాయనమ్మల నరాల్లో పుట్టింది, ఈ సంస్కృతి కొంతలో కొంతైనా బలిజ తల్లి కడుపులో పుట్టిన చిరంజీవి రక్త మాంసాల్లో ఉంటుంది.
ఈ పేగుబంధాన్ని కాపులందరూ అర్థం చేసుకోవాలి. ఆయన పార్టీలో చేరే అగ్రకుల నాయకులందరూ అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు చిరంజీవి చుట్టూ ఉన్న కంప కొ త క్లియర్ అయింది. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అన్నట్లు రాజకీయం సినిమా కాదు. అయితే రంగమేదైనా బలిజ పేగు తెంచుకొని పుట్టడం, రెడ్డి పేగు తెంచుకొని పుట్టడం కూడా ఒక్కటి కాదు. ఇప్పుడు మార్పును ఆపడం అంత సులభం కాదు.
రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలోని బడుగు ్రీలందర్నీ లక్షాధికారులను చేస్తానని ప్రామిస్ చెయ్యవచ్చు. కాని మీ శ్రమజీవుల పేగు తెంచుకొని పుట్టిన వ్యక్తిగా మీ ఆత్మగౌరవాన్ని అందిస్తాననీ చెప్పలేదు. ఇప్పుడు చిరంజీవి ఆ మాట చెప్పవచ్చు. ఈ రాష్ట్ర బలహనవర్గాల ప్రజలందరూ అడుక్కు తీనేందుకు కాదు ఎదురు చూస్తున్నది, ఆత్మ గౌరవం కోసం ఎదురుచూస్తున్నారు!
సూర్య - 21 సెప్టెంబర్, 2008
చాపర్ = చ వ్! ర్
ఉమో(క్రన 60. ఎన్నికలు, సామాజిక న్యాయం - కుల సంఘాలు 61. ఈ ఎన్నికలు ఏం తేల్చనున్నాయి? 62. పంచాంగాల ప్రజాస్వామ్యం 63. ప్రజల ప్రజాస్వామ్యమంటే ఏమిటి?
ఎన్నికలు, సామాజిక న్యాయం అల అఒల్జో = కుల సంఖూలు
రాష్ట్ర రాజకీయాల్లో సామాజికన్యాయం సమస్య మలుపు తిరిగింది. అయితే రాజకీయాల్లో సామాజిక న్యాయమంటే ఏమిటని ఆలోచించేవారు, అడిగేవారు చాలామందే ఉన్నారు. ఈ రాష్ట్రంలో, దేశంలో రాజకీయరంగంలో సామాజిక న్యాయమంటే అసెంబ్లీ, పార్లమెంటు సీట్టు కులాలవారిగా వాటా పంచుకోవడం. అంటే రాజకీయపార్టీలు ఇంతవరకు అధికారం చేజిక్కని ఎస్సి, ఎస్టి బిసి కులాలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ పార్లమెంటులో సీట్టొచ్చే విధంగా అభ్యర్థులను కుల ప్రాతిపదికన ఎంపికచేసి నిలబెట్టి గెలిపించడం.
అయితే నిలబెట్టడం రాజకీయ పార్టీలు చేయగలవు కాని గెలిపించడం అని చెయ్యలేవు! ముందు రాజకీయ పార్టీలు ఉన్న కుల లెక్కల అంచనా ప్రకారమైనా బిసి కులాలకు, స్రీలకు సీట్లు ఇవ్వడం కీలకమైంది. ఎన్‌సి, ఎస్టిలకు రిజర్వేషన్హు ఉన్నాయి కనుక జనరల్ సీట్లలో వారికెన్ని సీట్లు వస్తాయనే అంశంపైన వారికి రాజకీయ సామాజిక న్యాయం ఏం చేస్తుందనే అంశం ముడిపడి ఉంటుంది. బిసిలకు అయితే సీట్టు జనరల్ బట్ట నుండి కేటాయించాల్సిందే. కనుక రాజకీయ పార్టీలపై కుల సంఘాల నుండి తగినంత ఒత్తిడి లేకుండా సీట్లు కింది కులాలకు ఇస్తారని అనుకోవడం సరైంది కాదు. అన్ని రాజకీయ పార్టీలపైన కూడా అ(గ్రకుల ఒత్రిడి (పైసలు, పవర్‌తో కూడిన ఒత్తిడి) ఉన్నంతగా బిసి, ఎస్సి, ఎస్టి కులాలది గాని, ముస్లింలది గాని ఉండదు.
అ(గ్రకులాలు డబ్బులు, ఆస్తులు కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి రాజకీయ అధికారం కీలకమైంది. ఆయా కులాల డబ్బు, ఆస్తుల పెంపుదల కోసం ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తారు. దళిత బహుజనకులాలకు అలా ఖర్చు పెట్టేందుకు వనరులు తక్కువ. ఉన్న వనరులను రాజకీయ అధికారం కోసం ఖర్చుపెట్టే సమీకరణ కూడా లేదు. రాజకీయ అధికారంలో రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి పదవి, కేంద్రం స్థాయిలో
233
234 డెమోడ్రసీ (ప్రధానమంత్రి పదవి ముఖ్యమైనవి. అవి అ(గ్రకులాల నుండి కింది కులాల చేతుల్లోకి మారకుండా రాజ్యం దిశ దశ మారదు. ఈ ఎన్నికల్లో మొదటిసారి చిరంజీవి, దేవేందర్‌గౌడ్ ముఖ్యమంత్రి పదవులు మాకెందుకొద్దు, 'మేము చేసి చూపిస్తాం” అనే దృష్టితో సొంత పార్టీలు పెట్టారు. అలా పార్టీలు పెట్టడం అనేది వ్యక్తిగత స్వార్ధం కాదు. అలా ఆత్మగౌరవాన్ని పెంచే పార్టీ నాయకత్వం ఎదక్కుండా ముఖ్యమంత్రి పదవుల్లో మార్పు రాదు.
అమెరికాలో ఒక నల్లజాతి వ్యక్తి తాను అధ్యక్షుడిని కావాలి అని ఆత్మగౌరవంతో నిలబడి తన శక్తియుక్తుల గురించి తాను చెప్పుకోకుండా అధ్యక్షుడు అయ్యేవాడు కాదు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోయే దశ కనుక సామాజిక న్యాయసాధనకు ఇద్దరు నాయకులు అవసరం. వారి మధ్య సమన్వయం అవసరం. అయితే పైన నాయకులున్నంత మాత్రాన కింద ఓట్ట సమీకరణ జరక్కపోతే కూడా మార్పు రాదు. నేను గతవారం వ్యాసంలో చెప్పినట్టు నల్లవారిలో కింది కులస్తులు ఓట్లను తమ ఆత్మగౌరవ మార్పు సాధనంగా మల్చాలి. నల్లవారిలో బ్లాక్ చర్చి నిర్వహించిన పాత్ర ఇక్కడ కుల సంఘాలు నిర్వహించగలవు.
(గ్రామ(గ్రామాన అన్ని కులాలకు కుల సంఘాలుంటాయి. ఆ కుల సంఘాలు ముందు ఈసారి (అవకాశమొచ్చింది) నాయకత్వం రూపొందుతున్నది కనుక బిసి చైతన్యంతో కులాన్ని ఓటు బ్యాంకుగా మార్చాలి. అందుకు ప్రస్తుత రాజకీయ నిర్మాణాల నుండి యువతను క్యాడర్‌ను బయటికి లాగి ఈ కొత్త నిర్మాణాలకు జతచెయ్యాల్సిన అవసరముంది. ఆయా బిసి కులాల్లో ఉన్న నాయకత్వం ఈర్ష్యను పక్కనబెట్టి, అమెరికాలో నల్లజాతి నాయకులు, ప్రజలు అంతా ఒక్కతాటిపై నిలిచినట్టు ఎదిగిన నాయకత్వానికి అండగా నిలబడాలి. అగ్రకులాలకు, బిసి కులాలకు ఉన్న ప్రధాన తేడా అ(గ్రకులాలు దొంతర్ల వారి నాయకత్వాన్ని నిర్మించుకుంటాయి, గౌరవించుకుంటాయి. బిసి కులాల్లో అటువంటి చైతన్యం ఇంకారాలేదు. కులసంఘాలు (గ్రామస్త్రాయి నుండి అటువంటి చైతన్యాన్ని నూరిపోయాలి.
ఈ పని ఎన్నికల నాటికి జరగాలంటే బిసి కులాల నుండి వచ్చిన యువత ఒక కొత్త పాత్రను నిర్వహించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడ్డ రాజకీయ నిర్మాణాలను (గ్రామస్థాయి వరకు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు. దానికి.టైం పడుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎన్ వంటి పార్టీలకు పాత నిర్మాణాలతో పాటు, అ(గ్రకుల పెత్తందారులు వాటి నాయకులుగా పనిచేస్తారు. పైన తమ కులస్తుడికి ముఖ్యమంత్రి పదవో, లేదా మంత్రి పదవో వస్తే తమ కులస్తుందరికీ వచ్చినట్టేననే ఒక ఫీలింగ్ వారిలో ఉంది. అట్లని ఆ కులంలోని వారికందరికీ ఆర్థికవనరులు ఆ మంత్రి, ముఖ్యమంత్రి ఒనకూర్చలేకపోవచ్చు కాని చాలా కుల కుటుంబాల మీద ఆ పవర్ (ప్రభావం ఉంటుంది.
ఎన్నికలు, సామాజిక న్యాయం - కుల సంఘాలు 235 బిసి, ఎస్సి, ఎస్టి కులాల్లో అధికారాన్ని అనుభవించే చైతన్యం ఇంకా ఒనకూడలేదు. అధికారం తమ చేతికిరావడం ఒక ఎత్తు. దాన్ని తమ కులాలకు, పేదరిక నిర్మూలనకు ఉపయోగించడం ఒక ఎత్తు, ఈ పని చెయ్యడానికి బిసి, ఎస్సి, ఎస్టిలలోని యువత పూనుకోవాలి. అంటే అగ్రకుల 'కనుస్టైగ” నుండి ఓటును వేరుచెయ్యాలి. ఓటు బాక్సులో వేసేటప్పుడు ఒక నూతన, ఆత్మగౌరవ విలువగల ఓటుగా వేసేందుకు పూనుకోవాలి. పాత తరంలో కూడా మగవారికంటే ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో ఓటు వెయ్యడానికి ముందు కొస్తారు లేదా సిద్దపడుతారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీలు ప్రచారంలో కులవ్యవస్థ గురించి విడమర్శి చెప్పే రూపాన్ని ఎన్నుకోవాలి. సామాజిక న్యాయమంటే కింది కులానికి చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ఆలోచించి ఓటు వేయగలగాలి. సామాజిక న్యాయాన్ని సై నుండి కిందికి, కింది నుండి "పైకి చూడకపోతే ఓటును దానికి అనుకూలంగా వేయరు. సామాజిక న్యాయనిద్దాంతం పునాదిగా ముఖ్యమంత్రికాగల వ్యక్తి కొన్ని నియోజకవర్గాల్లో అగ్రకుల వ్యక్తులను కూడా తన అభ్యర్థులుగా "పెట్టవలసి వస్తుంది. అటువంటి చోట పైన ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి (ప్రాధాన్యతను, పార్టీ గుర్తును, దాని జెండాను చూసి ఓటు వెయ్యడం చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రక్రియ చర్చనీయాంశం చెయ్యడానికి కులసంఘాలు (గ్రామస్థాయి వరకు ఒక కొత్త పాత్రను పోషించవలసిన అవసరం ఉంది. అంటే కుల సంఘాలు రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను మార్చే 'కులపార్టీలుగా పనిచేసినప్పుడు అగ్రకుల ఆధిపత్యం దెబ్బతింటుంది. ఈ ఎన్నికల్ణో తనకేమొస్తుంది అనే దానికంటే తమ కులానికి ఏమొస్తుంది, కింది కుల సమూహాలైన బిసి, ఎస్సి, ఎస్టిలకు ఏమి వస్తుంది అని ఆలోచిస్తే పవర్ పార్టీ నుండి కుల సంఘాలకు మారుతుంది. అప్పుడు మనదేశంలో ప్రజాస్వామ్యానికి మనం ఒక కొత్త నిర్శచనం ఇస్తాం. సూర్య
61
ఈ ఎన్నికలు ఏం తేల్చనున్నాయి?
ఈ ఎన్నికలను తెలంగాణ రాష్టసమితి కావాలని తెచ్చిపెట్టింది. ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధిస్తాం అని చెప్పడానికి రాష్ట్ర సమితి స్వతంత్రంగా తెలంగాణలో గెలువగలదు అని నిరూపించడానికి ఆ పార్టీ రాజీనామాల బాణం సంధించింది. అయితే రాజీనామా చేసిన సీట్లన్నీ గెలిచే స్టితి కనిపించడం లేదు. గత ఎన్నికల లెక్కలు ప్రాజెక్టు చేసినా, (గ్రామస్ట్రాయి (గ్రాండ్ రియాలిటీ చూసినా ఈ అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి ఏర్పడి పార్టీల కతీతంగా తెలంగాణ (ప్రతినిధిగా, తెలంగాణ సాధిస్తుందనే నమ్మకం గల రాజకీయశక్తిగా ప్రజలు టిఆర్ఎస్కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేంత బలమైన సెంటిమెంట్ ఉన్న ఆధారాలు లేవు.
ప్రత్యేక తెలంగాణ కావాలనే రాజకీయ అభిప్రాయం అన్ని పార్టీల్లోని అత్యధిక సంఖ్యాలైన రాజకీయ నాయకుల్లో ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఎన్నికలుగా, ఒక స్థాయి రెఫరెండమ్‌గా సూచించే ఎన్నికలుగా ఇవి ముందుకొచ్చినా ఓట్టు 2004 నాటి ఎన్నికలకు ముందున్న స్థితిలో - అంతకు కాస్త భిన్నంగా పార్టీల వారిగా చీలి ఉన్నాయి. తెలంగాణ అ(గ్రకుల - ధనిక వర్గమూ, యువకులు టిఆర్ఎస్కు ఓటేసే స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ - దళితుల్గో సాధారణ కూలీల్లో, మధ్య కింది తరగతి రైతుల్లో, వృద్ధుల్లో ఒక నిర్దిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. రాజశేఖరరెడ్డి రాయితీల రాజకీయం బాగానే పనిచేసింది. రాయితీల చుట్టూ కొన్ని కొత్త ఓట్టు, 'లబ్దిదారుల ఓటు బ్యాంకు" తయారైందనేది (గ్రామాల్గో ఎవరితో మాట్టాడినా తెలుస్తుంది. తెలుగుదేశానికి బిసి ఓటు బ్యాంకు ఇంకా బలంగానే ఉందని చెప్పవచ్చు. 2004లో టిడిపికి ఓటేసిన ప్రజల్లో కొంతమంది కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చేరారేమో కాని టిఆర్ఎస్ ఓటు బ్యాంకులో చేరిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ స్థితిలో టిఆర్ఎన్ రాజీనామా చేసిన సగం సీట్ట కంటే ఎక్కువ గెలుస్తే తెలంగాణలో మెజారిటీ తమదనే వాదన పెట్టావచ్చు. ఒకవేళ సగం సీట్లు కూడా గెలువని పక్షంలో ఏం వాదన పెడతారు?
236
ఈ ఎన్నికలు ఏం తేల్చనున్నాయి? 237
ఆ స్థితిలో రాజశేఖరరెడ్డి చంద్రబాబు నాయుడు మా(త్రం ఒకే ఒక వాదన పెడతారు. (ప్రత్యేక రాష్టం కావాలనే సెంటిమెంట్ లేదు. టిఆర్ఎస్ ఒక సబ్ (ప్రాంతీయ పార్టీయే కాని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే పార్టీ కాదు అని ఒక నూతన వాదం ముందు పెడతారు. తమిళనాడులో కూడా సబ్ (ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. (ఉదా. పిఎంకె) కనుక (ప్రత్యేక రాష్ట్రాన్నీ సాధించేందుకు ఓటు బలమేమీ లేదని ఆయా పార్టీల నాయకత్వాన్ని కన్వెన్స్ చేసుకొని ఆ పార్టీల్లో ఉన్న తెలంగాణ వాయిస్‌ను అణిచిపెడతారు. కాంగ్రెస్‌లో వెంకటస్వామి వంటి నాయకులు, టిడిపిలో దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరి వంటి నాయకులు ఆయా పార్టీల్లో మెత్తబడాల్సిన పరిస్థితిలో పడతారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కో, టిడిపికో మెజారిటీ సీట్టు వస్తే రాష్ట్రంలో, తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతుంది. బహుశా చంద్రబాబునాయుడు కూడా తెలంగాణ వాదనను అంగీకరించి ఓట్లు తెచ్చుకున్నామని వాళ్ళ పార్టీలోని నాయకులు వాదించినా ఆ వాదనతో ఆయన అంగీకరించకపోవచ్చు. ఈ ఎన్నికల్లో వాళ్ళకు కొన్ని సీట్టు వచ్చినా, రాకపోయినా రాజశేఖరరెడ్డి ప్రత్యేకరాష్టవాదుల్ని వ్యతిరేకిస్తారు. ఆయన ఉమ్మడి రాష్టం సూత్రంపై ఆధారపడే కొనసాగాలనుకుంటున్నట్టు అర్ధమవుతోంది.
అంటే ఈ ఎన్నికలు 'ప్రత్యేక రాష్ట్రం" ప్రళ్ళీకు మరింత క్లారిటీ తెచ్చే బదులు, కన్ఫ్యూజన్ పెంచేటట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలని హైదరాబాద్ భూ వ్యాపారస్తులు, బిల్జర్సు ఆలోచిస్తున్నారు. టిఆర్ఎస్కు తక్కువ సెట్టు రాబోతున్నాయి కనుక ఎన్నికల తరువాత ఎక్కువ ధరలకు ప్లాట్టు, ప్లాట్లు అమ్ముకోవచ్చని భావిస్తున్నారు. టిఆర్ఎస్ చుట్టూ ఉండే రియల్ ఎస్టేట్‌దారులు కూడా దాని సీట్ల బలాన్ని తగ్గించి తమ లాభాలను పెంచుకోవాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే, తెలంగాణ నినాదం వచ్చాక, అంతకుముందు కంటే హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు పెరగడం, ప్లాట్ల ధరలు పెరగడం జరిగింది. ముందు టిడిపి ఆ తరువాత కాంగ్రెస్ - ప్రభుత్వ భూముల వేలంలో భూముల ధరలు పెంచి హైదరాబాదు చుట్టూ రైతాంగాన్ని తెలంగాణ వ్యతిరేకుల్ని చేశాయి. హైటెక్‌సిటీ, ఎయిర్‌పోర్టు, రింగ్‌రోడ్డు, ప్రభుత్వ ప్లాన్స్ భూవేలాలు భూముల ధరలను విపరీతంగా పెంచాయి. తెలంగాణ వస్తే ఈ ధరలు పడిపోతాయి. అది రాకుంటేనే మంచిదనే నాయకులు టిఆర్ఎస్లో కూడా చాలామందే ఉన్నారు. ఆ విధంగా ప్రత్యేక ర్యాష్టం నినాదం హైదరాబాద్ చుట్టూ స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచింది. ఈ రంగంలో ఉన్న వారంతా ఈ ఎన్నికల తరువాత తమ 'ధన భవిష్యత్ ఆంచనా వేసుకుంటున్నారు. వీళ్ళు తెలంగాణ నినాదానికి డబ్బులిప్పిస్తున్నారు, వ్యతిరేకవాదుల్ని ఫైనాన్స్ చేస్తున్నారు. స్పెక్యులేషన్‌ని ఏది పెంచితే అది మంచిదే. ఇందులో ఎక్కువ మంది ఆ(గ్రకులస్సులే.
238 డెమోక్రసీ అంటే ఇదొక గ్యాంబ్లింగ్ ఎన్నికల (ప్రక్రియ. సాధారణ (ప్రజాస్వామిక సంస్థల నిర్ణయాత్మక ఎన్నిక కాదు. ఇటువంటి గ్యాంబిలింగ్ ఎన్నికలు ఊహించని పరిణామాల్ని ముందుకు తెస్తాయి. ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇప్పుడు ఖర్చు పెట్టాలి, మళ్ళీ 2009లో ఖర్చు పెట్టాలి. కనుక కొత్త రూపాల్లో సంపాదనకు దిగొచ్చు కూడ, (ప్రత్యేక రాష్ట్రానికి ఇదొక ప్రత్యేక పరిస్థితి. బహుశా ఈ ఎన్నికల తరువాత బిజెపి మరోరూపం దాల్బవచ్చు. ఎందుకంటే అప్పటికే కర్ణాటక పరిస్థితి తేలుతుంది. దేశంలో చాలా చోట్ల కాం(గైస్ బలహీనపడింది. కర్ణాటకలో కూడా పుంజుకోకపోతే దానికి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎం పొత్తు టిడిపితో కుదరడంతో కేంద్రానికి సంకేతాలు పోయాయి. సిపిఎం కూడా మరో వాయిస్ లేని తెలంగాణ వ్యతిరేకవాది. ఇన్ని చిక్కుల మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ చిక్కులన్నీ అ(గ్రకుల నాయకులు వేసినవి కనుక యుపిలో లాగా కులాల పునాదిగా ఓటర్లను చీల్చినప్పుడు ఈ కన్యూజన్కు ఒక
క్లారిటీ వస్తుంది. సూర్య - 18 మే, 2008
62 సంచాంగాల ప్రజాస్వామ్యం
ఉగాది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కొత్త సంవత్సర దినం. దేశమంతటికీ కాదు. ఆ పండుగరోజు పచ్చడ తాగడం, (గ్రామాలలో అయితే కల్టు సారా తాగడం మామూలే. ఉగాది అందరికీ వెజిటేరియన్ పండుగ కాదు. తెలంగాణ (గ్రామాల్లో అది మంచి మాంసాహార పండుగ కూడా. ఆ రోజు తాగి తినడం దసరాను తలతన్నుతుంది. ఎవరెట్టా పండుగ జరుపుకుంటారనేది వారి సంస్కృతి, సాంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. కాని ఏ దేశంలో లేని విధంగా ఇక్కడ (ప్రతి పండుగ కొంత రాజకీయ రంగు పులుముకుంటుంది. పార్టీలు పోటీలుపడి పండుగల శుభాకాంక్షల బ్యానర్జు కడుతున్నాయి. పోస్టర్డు వేస్తున్నాయి. ఈ శుభాకాంక్షల బ్యానర్జు, పోస్టర్లు ప్రజాస్వామ్యాన్ని వెర్రితలలు వేయించే స్థితికి చేరింది.
ఈ ఉగాది తరువాత ఆశ్చర్యంగా కనిపించినదేమంటే, పంచాంగాల ప్రజాస్వామ్యం! పత్రికల నిండా రాజకీయ నాయకులు పొద్దున్న లేచి స్నానాలు, జపాలు చేసి పచ్చడి తాగి పంచాంగం చూపించుకోవడం గురించిన వార్తలే! పార్టీల పత్రికలు, పార్టీల మేధావులు, పార్టీల కవులు, పార్టీల కళాకారులు ఉన్నట్టే పార్టీల అయ్యగార్జ్హు కూడా ఉన్నారు. సాధారణంగా అయ్యగార్జ్హు నియంతలు. పంచాంగంలో ఏమి రాసి ఉంటుందో, దాన్ని ఎట్టా ఇంటర్ 'ప్రైెట్ చెయ్యాలో వాళ్ళకు తప్ప మరొకరికి అర్థం కాకుండా చూస్తారు. ఎవరికేమి చెప్పాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. అయితే అయ్యగారికిచ్చే పైసల బరువును బట్టి సంవత్సర జాతకం మార్చడం కూడా అందులో ఉంటుంది. నేను ఎప్పుడూ పంచాంగాల రాజకీయ తంతు గురించి అంత జా(గ్రత్తగా చూసేవాణ్ణి కాదు. కాని ఈ ఉగాది నాడు తెలుగుదేశం నాయకుడికి తెలంగాణ రావడంతో రాజకీయ అధికారం మారుతుందని పంచాంగం చెప్పిందని వార్తలు చదివాను. ఒక కాం(గైస్ నాయకునికి వాళ్ళే అధికారంలో ఉంటారని, చిరంజీవి పార్టీ చిగురెయ్యదు, కాయలు కాయదని పంచాంగం చెప్పిందని కూడా ఒక పేపర్లో చూశాను. మరి చిరంజీవికి పంచాంగం ఏం
2౩౮
240 డెమోక్రసీ చెప్పిందో తెలియదు. అంటే పంచాంగాలు కూడా ఇంత (ప్రజాస్వామ్య పద్దతిలో నాయకుల జాతకాలు చెబుతున్నాయన్నమాట.
ఈ పంచాంగం అనే పుస్తకం ప్రతి అయ్యగారికి ఒకటి ప్రత్యేకంగా, భిన్న జాతకాలు చెప్పే పద్ధతిలో ఉంటుందో, లేక ఆ పుస్తకం ఒక బైబిల్ లాగ, ఒక భగవద్గీత లాగ కామన్ (గ్రంథంగా ఉండి అయ్యగారి ఇంటర్ ్రెటేషన్ను బట్టి జాతకాలు బయట పడుతాయో నాకు తెలవదు. కాని ఈసారి మన రాజకీయ నాయకులకు పంచాంగం డాతకాలు చెప్పిన తీరును బట్టి చూస్తే ఓటర్హు నాయకులకు “మీరే గెలుస్తారు" అని చెప్పినట్టు, ప్రతి పార్టీ నాయకుడికి మీరే అధికారంలోకి వస్తారని పంచాంగం చెప్పింది. ఇది పంచాంగప్పు (ప్రజాస్వామ్య లక్షణం. రాజకీయ 'ప్రజాస్వామ్యంలా పంచాంగ (ప్రజాస్వామ్యం పనిచేస్తే అది (ప్రజల్ని ముంచుతుంది, పాలకుల్ని కుబేరుల్లా పెంచుతుంది.
ప్రతి మనిషికి లాగే రాజకీయనాయకులకు కూడా ఎవరి నమ కాలు వారికి ఉండడం తప్పు కాదు. మత విలువలు వాళ్ళ, వాళ్ళ కుటుంబాల నుండి, కులాల నుండి వచ్చినవి. వాటికి ఇప్పుడు బతికున్న తరాన్ని బాధ్యుల్ని చేయలేము. కాని రాజకీయ మేధావివర్గంగా వ్యవహరించే నాయకులు మూఢనమ్మకాల్ని, మత మోసాల్ని అంగీకార విలువలుగా మార్చకూడదు. రాజ్యరంగంలో, సమాజంలో సెక్యులరిజాన్ని కాపాడడమంటే మత మౌఢ్యాలకు, మోసాలకు తాము తావిచ్చి ప్రజానీకాన్ని ఆ మోసాలలోకి లాగడం చాలా నష్టదాయకం. (ప్రపంచంలో (ప్రాచుర్యం పొందిన ప్రజాస్వామ్య రాజకీయరంగంలో నాయకత్వం వహిస్తూ ఆ (ప్రజాస్వామ్యం అమలులోకి తెచ్చే లౌకిక విలువల్ని పాటించబోము అంటే నష్టపోయేది ప్రజలు. మనదేశంలో జాతీయోద్యమ మొదటితరం నాయకులు ఎక్కువమంది తమ, తమ మతాల్లో నమ్మకం కలిగినవారైనప్పటికీ మూఢనమ్మకాల్ని పోషించే 'సూత్ సేయర్స్'కి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా గాంధీ, అంబేడ్కర్, నెహ్రూలను తీసుకుందాం. గాంధీ గట్టి హిందూ మతవాది కాని పంచాంగాలు చూపించుకొని, జాతకాలు రాయించుకొని, బాబాలు, సన్యాసుల చుట్టూ ఆయన తిరిగినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఆయన మత ([గ్రంథాలపై వ్యాఖ్యానాలు చేశాడు. తన మత విలువల్ని రాజకీయ రంగం మీద రుద్దాడు. కాని ఆ విలువల్ని రాజకీయ నాయకులు చేస్తున్న పద్దతిలో మూఢనమ్మకాల స్థితికి దిగజారనివ్వలేదు.
అంబేడ్కర్ మత విలువల్ని మహా హేతువాద స్పితిలో రాజకీయరంగానికి అనువదించాడు. నాయకుని నమ్మకాలు, ప్రాక్టీసులు ప్రజల మీద ప్రభావం చూపుతాయని ఆయనకు తెలుసు. అందుకే పంచాంగ తంతులకు తావులేని బుద్దిజాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అందులో బుద్దుని జీవితంలో బోధనలు, బుద్దిస్తుల సంఘ జీవన సంస్కరణ
పంచాంగాల ప్రజాస్వామ్యం 241 విలువలు మాత్రమే మానవాళికి ఆదర్భం. బుద్ద జాతకాలు చదివి అందులోని మానవ విలువల్ని మరో తరానికి అందించడం అతి ముఖ్యం. తాను నమ్ముతున్న బుదిజం ఎటువంటిదో ఆయన 'బుద్ధ అండ్ హిజ్ ధర్మా పుస్తకంలో చర్చించాడు. ఆ పుస్తకొన్ని మన రాజకీయ నాయకులు చదివితే మంచిది. ఈ ఇద్దరికీ భిన్నంగా నెహ్రూ హేతువాదాన్ని తన రాజకీయ తాత్వికచింతనగా ఎన్నుకున్నాడు. నెహ్రూ తన నుదుట కుంకుమ బొట్టుపెట్టుకొని ఉన్న ఫోటో ఎక్కడా కనిపించదు. అలాగే, “ఈద్ముబారకొ పేరుతో మసీదులకు, (క్రిస్మస్ పేరుతో చర్చిలకు ఆయన పోయినట్టు కూడా దాఖలాలు లేవు. సెక్యులరిజానికి ఒక రాజకీయ సిద్దాంత విలువే కాకుండా ఒక నిజజీవన ఆచరణ విలువ కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు ఆ విలువల్ని కాపాడకపోతే నష్టపోయేది (ప్రజలూ, ప్రజాస్వామ్యం కూడా. మానవుల్లో విద్య పెరుగుతున్న కొద్దీ మత విలువలు కూడా అభివృద్ది చెందిన స్థాయిలో సమీకృతమవ్యాలి. రాజకీయనాయకులు తమ ఇండ్లలో పచ్చళ్ళు తాగినా, కల్లు తాగినా, సారా తాగినా అభ్యంతరం లేదు. కాని పంచాంగ పఠనం వంటి మూఢనమ్మక విద్యను ఇంట్లో చేయించుకున్నా ఈ సమాజానికి చాలా నష్టం చేసినవాళ్ళవుతారు. అందులో ఆ పంచాంగ పఠనం ఇంత రాజకీయంగా జరుగుతున్నప్పుడు ఎవర్నీ మోసం చేయడానికి ఈ పంచాంగాలు చూపించుకుంటున్నారు? (ప్రజల్నే కదా! రాజకీయ నాయకులకు అన్నీ ఉంటాయి, కాని తాత్వీక దృష్టి ఉండదనే స్థితి రావడం దురదృష్టకరం. ఈ దేశంలోనే దేవుణ్మై నమ్మని కరుణానిధికి కూడా ప్రజలు ఓట్లు వేస్తున్నారనే విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ప్రీ నాయకురాళ్ళు మరీ మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు. పుట్టల్గో పాలు పోసి, వాటిలోని పాముల్ని కూడా చంపుతున్నారు. ఈ దేశంలో షార్ట్ హేర్‌తో నుదుట బొట్టు కూడా పెట్టుకోని ఇందిరాగాంధీ (ప్రధానమంత్రి అయ్యారు. ఈ మధ్యకాలంలో అంతకంటే షార్ట్ హేర్ కటింగ్, నుదుటిన నో బొట్టుతో జీవించే మాయావతికి మాత్రమే ప్రజలు ఓట్టు వేస్తున్నారు. కనుక మన నాయకులు పంచాంగాన్ని నమ్మడం మానేసి ప్రజల్ని నమ్మితే దేశం, రాష్ట్రం బాగుపడతాయి. సూర్య - 3 ఏప్రిల్, 2008
63
ప్రజల ప్రజాస్వామ్యమంటే ఏమిటి?
దేవేందర్గాడ్ తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి బయటికొచ్చాక ఆయన చర్చ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. కొన్ని మౌలిక ప్రజాస్వామిక విలువలపై ఆయన చర్చను లేవనెత్తారు. 'ప్రజాస్వామ్యమంటే మనరా(ష్టంలో గాని, దేశంలోగాని ఓట్లతో ముడివేసి చూస్తున్నారు. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి, సీట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి అనే అంశంతో ప్రజాస్వామ్యాన్ని ముడేసి చూసినప్పుడు, ఓట్టు కొని సంపాదిస్తావా, దొంగ ఓట్టు వేయించుకుంటావా, నీకు రావనుకున్న ఓట్లను పడకుండా చూసి, నీకు వస్తాయనుకున్న ఓట్లను మాత్రమే పడేట్టు చూస్తావా అనేది అందులో భాగం.
ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇప్పుడు కాంగ(గైస్, తెలుగుదేశం ఏకవ్యక్తి పార్టీలుగా నడుస్తున్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది అన్నిటికన్నా ముఖ్యమైన సమస్యగా మారిందని ఆయన వాళ్ళిద్దర్ని దగ్గరి నుండి చూసిన వ్యక్తిగా చెబుతున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలనే ఈ పోటీలో రాష్ట్రంలో ఊహించని విధంగా ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరిగింది. ఈ ఇద్దరికే ఇప్పుడు తమవైన వార్తాపత్రికలు, టివి ఛానళ్ళు ఉన్నాయి. వారి వార్తాపత్రికల గురించి అందరికీ తెలుసు గాని టివి ఛానళ్ళ గురించి అంతగా తెలియదు. పరోక్షంగా వారి పైసలతోనో, పలుకుబడితోనో నడుస్తున్న ఛానళ్ళు పోటీపడి ఒకర్ని తిట్టడం మరొకర్ని పొగడడం చేస్తూ ఉన్నాయి. ఈ స్టీతిలో రాజకీయమంతా రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు చుట్టూ తిరుగుతున్నది. ఈ రెండు పార్టీల పోటీలో మద్రాసులో డిఎంకె, ఎఐడిఎంకె లను మించి ఎన్నికల ఖర్చుకు పూనుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క ఎంఎల్ఎ నియోజకవర్గం ఖర్చు తక్కువలో తక్కువ రూ.10కోట్ట్లకు పోతున్న రోజులివి. ఈ డబ్బు పోటీలో ప్రజాస్వామ్యం 'డబ్బుస్వామ్యం'గా మారింది. ఈ డబ్బు పోటీలోకి టిఆర్ఎస్ కూడా లాగబడి తెలంగాణ నినాదాన్ని సైతం ఎన్నికల డబ్బు వలలో చిక్కించక తప్పలేదు. రాబోయే దేవేందర్‌గౌడ్ పార్టీ గాని, చిరంజీవి పార్టీ గాని ఈ డబ్బు పోటీలోకి జారుకుంటే ఒక్క నియోజకవర్గంలో ఐదుపార్టీలు పోటీ చేస్తే
242
ప్రజల ప్రజాస్వామ్యముంటే ఏమిటి? 243 ఒక్కొక్కటి రూ.10 కోట్టు ఖర్చుపెడితే, రూ.50 కోట్టు అభివృద్దికి కాక వృథా ఖర్చు చేస్తాయన్నమాట. ఈ ప్రక్రియ మీద చర్చ జరగాలనేది గౌడ్ వాదన,
ఈ (క్రమంలో (ప్రజల్లో కూడా ఏ పార్టీ ఎంత ఇస్తుదనేదే (ప్రధానమై, అది ఏ కార్యక్రమంతో ఎన్నికల్లోకి వస్తోందనేది చర్చలో లేకుండా పోతోంది. ఈ (ప్రక్రియ ప్రజాస్వామ్యానికే (ప్రమాదకరం. దీన్నెట్టా మార్చాలనేది చాలా పెద్ద ప్రశ్న. ఎన్నికల (ప్రజాస్వామ్య ప్రక్రియ మార్పుకు యువకులు పూనుకుంటే తప్ప మార్పు సాధ్యం కాదు అని ఆయన అంటున్నారు. ఇంతవరకు దీనిపై ఒక అభిప్రాయమేముందంటే, (ప్రజలు ఎవరెంత ఇచ్చినా తీసుకొని అంతిమంగా ఓటు వెయ్యదల్పుకున్న వాళ్ళకు వెయ్యడం. ఇది తప్పు పద్దతంటున్నారాయన. యువతను కొన్ని విలువల కోసం, అభివృద్ది అంశాల చుట్టూ పనిచేయించి అతి తక్కువ ఖర్చుతో మేడ్చల్ నియోజకవర్గంలో గెలుస్తున్నాన్కు అదే పద్దతిలో తెలంగానం ఎందుకు గెలువలేం అనే ఆయన ప్రశ్న చాలా వీ. కూడుకున్నది. పైసల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజల అత్యున్నత చైత ఆధారపడ్డ సమస్య, ఒకవేళ చిరంజీవి పార్టీ పెట్టి దాన్ని విలువల రాజకీయాలతో నడిపించాలనుకుంటే ఆయన కూడా దేవేందర్‌గౌడ్‌తో గొంతు కలుపక తప్పదు.
(ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఓటెయ్యడమొక్కటే కాదు. పంచాయతీ నుండి అనే పార్లమెంటు వరకు వారు తమ భాగస్వామున్నదా లేదా అని చూడాలి. ఆ భాగస్యామ్యి!
ఏ రూపంలో ఉంటుంది? ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత ఈ రాష్ట్రం, ఈ దేశంలోని దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, అగ్రకుల' బీదలు ప్రజాస్వామ్యంలో ఒక నూతన ఆశతో జీవించగలగాలి. మనరాష్ట్రంలో ఈ రెండు పార్టీల హయాంలో తమ శ్రేణుల్లోని నాయకత్వానికి ముఖ్యమంత్రి పదవిగాని, లేదా స్వతంత్రంగా మంత్రి పదవి నడపగలిగే అధికారంగాని దొరుకుతాయనే ఆళ వారికి లేదు. ఇది ముఖ్యంగా రిప్రజెంటేషన్ సమస్య. ఆత్మగౌరవం సమస్య కూడా. ఆత్మగౌరవం: కింది కులశ్రేణి ప్రజలకు ఈ రాష్టంలో ఆత్మగౌరవం లేదు. అధికారం చలాయించే హక్కు పేరు చివరరెడ్డి రావు, నాయుడు వంటి ఉన్న అధిపత్య కులాల వారికే సాధ్యమనే ఒక భావన ఏర్పడింది. దేవేందర్గొడ్, చిరంజీవి ఇప్పుడున్న పాలకవర్గాల (శ్రేణుల్లో నుండి కాక కొన్ని మెట్ట కింద నుంచి వచ్చినవారు. కాపులకు కూడా ఈ రాష్టంలో ముఖ్యమంత్రి పదవి దొరకలేదని ఒక వాస్తవం. ఇక గౌడు, యాదవ, పద్మశాలి వంటి పెద్ద బిసి కులాలకు ఆ పదవి కూడా దొరకలేదనేది తెలిసిందే. అయితే అధికార మార్పిడి ఒక కుల (ప్రాతిపదికన మారడమొక్కటే కాకుండా ఆ మార్పు మన (ప్రజాస్వామ్య
డెమోక్రసీ బతక విలువల్ని ముఖ్యంగా (ప్రజల జీవితాన్ని మార్చేదిగా కూడా ఉండాలి. అందుకే తెలంగాణ సాధన పోరాటంలో కూడా సంస్కరణ విలువల సమస్యను లేవనెత్తడం చాలా ముఖ్యమైంది. (ప్రజాస్వామ్యం, డబ్బు, భుజబలం, మందు, మానభంగాల గేమ్‌గా మారినాక ఎంత హింస జరిగినా అది చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. ఆత్మగౌరవం ఎంత లేకుండా చేసినా ప్రజలు దానికి అలవాటు పడిపోతారు. పదేళ్ళకు పది ఉంగరాలు, మెడకో తలుగంతా బంగారు గొలుసు ఉంటే చాలు, ఎవరి కాళ్ళు మొక్కమంటే వారి కాళ్ళు మొక్కుతారు. పెట్టుబడిదారి వ్యవస్థలో, చట్టబద్ద సంపాదన చెయ్యవచ్చు అనే ఆలోచన ఉండదు. దీన్ని మార్చి మనదేశపు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజాస్వామిక రంగాన్ని కాస్తో కూస్తో విలువలున్న రంగంగా మార్చడమెట్లా అనే (ప్రశ్న ఏ రాజకీయ నాయకుడు వేసినా మనమొక కొత్తగాలి పీల్చుకుంటున్న వాళ్ళుగా ఫీల్ అవుతాము. (ప్రజల ఆత్మగౌరవం అనే పదాన్ని ఎంతో కాలంగా మనం మెయిన్ స్రీమ్ రాజకీయ నాయకుని నోటి నుండి వినలేదు. అది ఇప్పుడు వింటున్నాం. స్టేజి ప్రజాస్వామ్యం: దేవేందర్‌గౌడ్ తను వచ్చే అన్ని స్టేజీల పైన ఒక్క అధ్యక్షుడు తప్ప ఎవరూ కూర్చోకూడదని చెపుతున్నారు. పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ మీటింగ్ అలానే జరిగింది. ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థుల భారీ సభ కూడా అలానే జరిగింది. ఆయనతోపాటు వక్తలంతా కిందనే ఉంటారు. అధ్యక్షుడు పిలిచిన వ్యక్తి మాత్రమే వేదికపైకి పోయి మాట్లాడి దిగుతారు. పెద్ద నాయకునికి పెద్ద కుర్చి, చిన్న నాయకులకు చిన్న కుర్చీలు, వాళ్ళ పాదాల దగ్గర ఇంకొంచెం చిన్న నాయకులు స్టేజి మీద కూర్చొనే కుస్తీపట్టే ఈ రోజుల్లో ఈ పద్ధతి పెద్ద పోటీనే తప్పించింది. ఈ లైవ్ టీవీల పోటీ మొఖ చూపుల పోటీలతో స్టేజీలు ఆబోతుల పోట్లాట స్థలాలుగా మారిన రోజుల్లో దేవేందర్‌గౌడ్ స్టేజీకే ఒక కొత్త నిర్భచనం ఇస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ మార్పే అయితే ఎంత ఆచరణ సాధ్యమనేది ఎన్నో మీటింగుల తరువాత గాని చెప్పలేము. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం, (ప్రజల పార్టిసిపేషన్‌పై జరిగే చర్చ ఒక్క తెలంగాణకే కాదు, మొత్తం రాష్ట్రానికి యావచ్తు దేశానికి ఉపయోగకరమైంది. సూర్య - 13 జూలై, 2008 టం. నో
వాడు కంచ అలయ్య క స. 5 అక్టోబర్, 1952లో న స జా వరంగల్ జిల వ | / ర (శ ఫాపయ్యపేట గ్లాకుంలో వుట్టిడు. న (పుట్టి: రోజుకు ” బడిలంతులే నిష్ణంంచాడు) దళిత, బహాజన, ఆదిమ, మైనారిద్, కముహొళల శ్రకుశక్తితోనే ఈ దేశ సంపద సృష్టించబడిందని, అగ్రుకర్ణిలు దొన్ని దోచుకతింటున్నానని అలయ్య తన "థై అయామ్ నాట్ ఎ కొందూ”" వ్రీస్తకంలో చేపిన తొర్విః 3దనలు అర్పటికదకు ఉన్న తలక్తుందుల అకగాకొనను నిటారుగా నిలబెట్టిడు. వుఘుత ఈ వ్రీస్తఓంలో ఉత్పత్తి కులాల ఐద్యెర్భులకు భూతృభాష "పేదుతో ఇం్టీష్ ఐద్యకు దూరం చేస్తున్న అగ్రుకుల కునువాదుల చెంవచెళ్టుకునిలించాకు. తెలంగాణ ఉద్యకుంలో చాప్రలు దళిత బదొజనులక్కు, రాజకీయ ఆధివత్యం కూత్రుం అగ్రుకులాలకేనా అని ప్రశ్నిస్తున్నాడు. శూద్ర, అతి శూద్తులుగా వుట్టి 5౨% జేటాఫ్బర్త్లు బడీరంతులే నిర్ణయిస్తాడని చెర్టన్నాడు. కునుకొదులపై నిదీంతద యనథ్ధం లేపండా అట్టడుగు కులాలకు ఐకుసక్తి లేదని, ఆ నృతతో సకుకాలీన సాకూజిక్క రాజకీయార్థిక, సాంస్క థ్ పోరాటాలుండాలని అంటున్నాడు.