Telugu bhoddupegu - anilvaranasi/indianlanguages GitHub Wiki

య ఇ. హ్‌ స / గల " |" ౧! | [| సా! వా త ఇ శ్‌ ర్‌ " నస న్‌ య క 1 గ్‌ గా సా! వ్‌! గాం య్‌ కట్టుట / / గ న ప అల్మువాం! నంటీటై అగ 1 సాం [| (౮ యః శ్‌ మా న. నా నన ననే టు శ . జ | క్‌ టం యగ సం సళ | క్రై (యళ 1 స 1:1... 00స్రరిరథంలుంత. గ క హా. ద. ఛే గి స్‌ వ మన్న క స రాడా నరా" ల ర్‌ పటాల 42 | క | యం న / 1 శ 8 1 శీ వలల బ్‌

బొడుుఖీదు (టి (కవితా సంకలనం ం / ౫ -ిన్నప్పు జశతి తృ్వస్కోనాం -2ఒ01 లాం, కోసారి రవికుమార్‌ కననల4ీకం (థక్రచురణలు దాచేపల్లి

గ్ప డ్రశ్శిణ 1 శ

బొడ్డుపేగు ఏ - హొ కోసూరి రవికుమార్‌

అ 000/౧7౧ ౧6౨౭౧/96౮

తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ధిక సవోయంతో...

తాలిముద్రణ: ఫిబ్రవరి, 2008

కాపీలు: 1,000.

ముఖచిత్రం: గిరిధర్‌

రు. 40/-

కాపీలకు:

కోసూరి రవికుమార్‌

లైబ్రరీ దగ్గర [గ దాచేపల్లి - 522 414 ణ్‌ గుంటూరు జిల్లా గ

ఫోన్‌: 98858 51576, 99685 19938 7

ముద్రణ; (౮

రత్న ప్రింటింగ్‌ వర్క్స్‌ ప్రయ గంరాలడు నా విజయవాడ - 520 002 ట్టు

ఫోన్‌: 0866-6668666 సయిం242460) *

శ క

ప్రచురణ: ఈ లోగగో కవనలోకం ప్రచురణలు

దాచేపల్లి, గుంటూరు జిల్లా

ప్రేమ్లైకమూర్తులు సుగుణ, వారపారధిలకు నా ఈ తొలికృతి 200కటేం

( తోసే రవికిరణాలు డా॥ ఎన్‌. గోపి కేంద్ర సాపొత్వ అకాడమీ అవార్డు గ్రహీత పలనాటి గుండెల్లోంచి ఇలలోని యాతనలన్నీ వెక్కసమై వెలువడితే అది కోసూరి రవికుమార్‌ కవిత్వమౌళతుంది. ఏ కవిత ముట్టుకున్నా ఒక స్వభావోక్తి వెచ్చదనం, చెప్పకుండా ఉండలేని అనివార్యతాగుణం, పల్లెను (్రేమించకుండా ఉండలేని నిజాయితి. 'బొద్దుపేగు' ఇతని తొలి కవితాసంపుటి అంటే నమ్మడం కష్టం. కవిత్వం కోసం కాకుండా జీవితం కోసం కవిత్వాన్ని ఎన్నుకున్న వైనం కనిపిస్తుంది. పంటే పామై కాటేసింతర్వాత ఇత్తనాలకు బదులుగా బతుకులు కొల్చుకున్నోణ్ని అంటూ ఎన్నెముకను జెందాగా ఎగరేయక తప్పదంటాడు. అలాగే 'మన గోతులు మనమే తవ్వుకుందాం'” కవిత గుండెను మెలిపెదుతుంది. పిల్లాడిని చదివించే స్తోమత లేడు. చదువుకుంటానన్న వాడి దృష్టిని వాళ్లమ్మ ఎలా మళ్లిస్తుందో చూడండి... “పలక కోసం అలగకురా అబ్బయ్యా చెర్చకోలకు మువ్వలు గట్టుకుందూలే సద్దిమింద సన్నటి వులిగెడ్డ్ద ముక్కలేస్తలే ఇవాళ ఏ నేతకు చూసినా ఓ గన్‌మెన్‌. ఎందుకండీ...? ఎందుకో చెస్తన్నాడు రవి, “వాళ్లిద్దరికీ ఇపుడు రక్షణ కావాలట ఒకడు ఒంటిస్తంభం మేడలు కట్టుకునీ కరెంటును కాపలాపెట్టుకునీ...” పీడన పెరిగేకొద్దీ రక్షణ కరువవటం సహజం. టైటిల్‌ కవిత 'బొద్దుపేగు' చాలా బలమైంది. ప్రజాసాహిత్వాన్ని నిషేధించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన కవిత. ఈ ప్రక్రియలోనే కవిత్వమంటే ఏమిటో నిర్వచించాడు కవి. “కవిత్వమంటే... మంటే వెన్నెలంత చల్లని మంట వేలవేల గుండెలమీద వేలాడే దప్పులు చలికాచుకునే మంట” అంటూ లే

“ఉద్యమాల బొద్దుపేగును తెంపి పారేయాలనే కుట్రను భగ్నంచేసి తీరాలి అని నిర్వంద్వంగా నినదిస్తున్నాడు. ఈ సంపుటిలో మరో గట్టి కవిత “మట్టి. చెయ్యితిరిగిన కవిత కూడా. మట్టి ఒక గొప్ప విత్తనం ఇప్పటికీ మొలుస్తూనే ఉంది ఖ్‌ జ్‌ ఖ్‌ మట్టి ఒక మహా మస్తిష్కం స్వరాజ్యాన్ని స్వప్నించింది శ్‌ జ్‌ క్‌ మట్లి ఒక మవిశిల్ని! సిపాయిల్ని చెక్కి తుపాకీల తిరుగుబాటు చేసింది. ఇలా మట్టి విశ్వరూపాన్ని కళ్లకు కట్టించే కవిత. రూపపరంగా ఇది వినిర్మాణ కవిత (5ళాల4%! ౯60%). పెద్ద పెద్ద సీనియర్‌ కవులకే సాధ్యమయ్యే కవిత. అలాగే “దాయి, రెల్సు నీళ్లు, టెర్మినేటరో కవి పరిణతికి నిదర్శనాలు. గుంటూరు జిల్లా గతమెంతో ఘనకీర్తి కలిగినదే కానీ ఈ జిల్లాలోనే ఏడెనిమిది మహా వెనుకబడిన మండలాలున్నాయి. పలనాడు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ ప్రాంతాల్లోని కడగంద్లు మానవ సంవేదన కవిత్వంలో విస్తృతంగా పలకవలిసే ఉంది. రవి కవిత్వంలో అది నిసర్జ్ణరమ్యంగా, పరిష్మారగమ్యంగా సాగుతూ ఉంది. దాచేపల్లిలోని నానీల కవి నాగిశెట్టి తాతయ్యనాయుడి స్నేహితుడు రవికుమార్‌. అలాగే శిశిరసంకేతం' కవి నూతలపాటి వెంకటరత్నశర్మ వీరిద్దరికీ ప్రియనేస్తం. ఈ ముగ్గురూ ఉపాధ్యాయ వృత్తి జీవితంలోని పరిమితులను అధిగమిస్తూనే విశాలమైన సాహితీసేవకు పూనుకుంటున్నారు. నాగిశెట్టిలాగే రవి కూడా నా ఆత్మీయుడు, ప్రముఖ కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్యగారి ఆదరాభిమానాలను పొందినవాడు. జీవితాన్నీ బాధామయమైన బతుకుల్నీ పారదర్శకంగా ఆవిష్కరించిన “బొద్డుపేగుకు నా స్వాగతం. వ్‌

“ఈరోజు - రేపు కూడా...” కె. శివారెడ్డి కేంద్ర సాహిత్వ అకాడమీ అవార్జు హీ్‌త "1002 ౪101 ౪04 5103 ౦% 5016612 1ల6 ౪6 216 1616 ౪6 26 ] 2౧ ౪14౩౦౪ (0 902/8 2౧6 (0 0627 206 10 0276 గౌ15 19 ౪/2౧) | ౪61 ౪0౪ 12003 |! ౫2000064 21౧"

  • 6౫౯౧౦౧౦౬ * 880065 “వుట్టింది నేలమీదే అయినా వుడిశేదు నేల లేకపోవటం విడికెదు బంధాలు కరువైపోవటం ఎంత బాధో - నేనివ్లుడు మనుషుల్ని నీళ్లతోనే ముదేస్తాను అద్భశ్యమైపోతున్న నా ఆస్తేత్వమూలాలను వట్టుకొచ్చుకుందుకు మళ్లీ నదినే ఆవవొస్తాను అనునంధానిస్తాను” = కోసూరి రవికుమార్‌ ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేకమయిన నైసర్గికత ఉంటుంది. '060200162 కం61. గం0” ఆ ప్రాంతపు మనుషుల తత్వాలుగానీ, స్వాభావిక చేతనలుకానీ, సంస్కృతీ సంప్రదాయాలుగానీ, ఆచారవ్యవహారాలుకానీ, ఆహార నిమయాలుకానీ మొత్తంగా ఆ ప్రాంతపు మనిషి మూలతత్వమంతా ఆ ప్రాంతపు భౌగోళిక పునాదిమీద ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాంతపు ప్రత్యేకత ఆ ప్రాంతానిదే. ఏ ప్రాంతపు అస్తిత్వం ఆ ప్రాంతానిడే. ఆ ప్రాంతపు గతం, చరిత్ర ఆ ప్రాంతపు అస్తిత్వంలో అంతర్లీనమవుతాయి. ముఖ్యంగా పల్నాటి ప్రాంతానికి ఒక చరిత్ర వుంది. ఒక పోరాటం వుంది. చాపకూడు భోజనం దాకా వెళ్లిన ఒక నాగరికత, ఒక సంస్కృతీ వుంది. “నాగులేటి నీళ్లు నాపరాళ్స* అని శ్రీనాధుడన్నా - 'రాయి” వ్యక్తిత్వం రాయిదే. సమాజపు మలుపుల్లో రాయి చరిత్ర, రాయి నిర్వహించిన పాత్రా మామూలు అయిందికాదు. 6

మానవ అభివృద్ధి క్రమంలో రాతియుగమే మొదటి అభివృద్ధి దశ, ముందడుగు - తర్వాత దశలన్నీ రాతి నాగరికతమీదే. శ్‌రారు వ్యసాయంలో చెమట విత్తనమై నేలమీడ నీళ్లు పండినట్లు అద్దమై ముఖం చూయించినట్టు నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ నిజంగా ఈ రాతిదెంత మెత్తని గుండె” ఇవి 'రాయి' అనే కవితలోని కొన్ని చరణాలు. మరెవరన్నా రాయిని గురించి కవిత రాశారేమో నా దృష్టికి రాలేదు. రాసినా, పిడుగురాళ్ల ప్రాంతపు కుర్రాడు రాసిన రాయి కవిత ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. చలనమున్న రాతితనమేదో, బహు మృదునయిన రాతి ఆత్మ ఏదో ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది. అదొక $011 అదొక అద్భశ్యశక్తిలా ఆయా (ప్రాంతాల వ్యక్తులవెంట నీడలా కదలాడుతూ ఉంటుంది. ఇంకా ఇలా అంటున్నాడు అదే కవితలో - “బంగారం నల్లనయి నేల గుండెల్లోంచి తొంగిచూస్తున్నట్లు కొండ మనిషి చెవిలోకి వంగి నేలేకాదు, నేనూ అకలి తీరుస్తానని గుసగుసలాదుతున్నట్లు ఆకాశం చుక్కలతో సహా వొదిగి నేల గుందెల్లో దాక్కున్నట్లు ఏవో ఊహలు” నేనిపుడు ప్రశ్నిస్తున్నా రాతి మనిషి అని అనిందెవరు? మనిషికి, రాయి ఇప్పుగొక ఆదర్భవంతమయిన ప్రతీక" వేరే ప్రాంతపు కవులు రాయిమీద రాసినా ఈ రకంగా రాయలేరు. ఈ (ప్రాంతపు వేరే కవయినా ఈ రకంగా రాయడు. కవి (ప్రత్యేక దర్శనం ముఖ్యమౌతుంది ఈ కవితలో. కవిత. మొత్తం ప్రత్యేకమైన శక్తితో, సౌందర్యంతో బయటికి వచ్చేది కవి దర్శనాన్ని బట్టే. సర్వ ప్రకృతినీ కౌగలించినా కవి వ్యక్తీకరిస్తున్న లేదూ వస్తువు ద్వారా రూపుకడుతున్న, కళామయంచేస్తున్న దృక్పధం అనేది ముఖ్యమౌతుంది. రాయిని రాయితనాన్నుంచి విడదీసి, మనిషితనాన్నిచ్చేదిగానీ, సజీవ జీవద్భాష బెన్నత్యపు ఊహనిచ్చేదికానీ, కవి 606060. అది అతని కవిత్వమంతటా సూత్రప్రాయమై అల్లుకుం 7

టుంది. ఒక కవి అనేక వస్తువుల్ని స్పృశించవచ్చు. సాకారం చేయవచ్చు - కానీ వాటికి జీవలక్షణాన్ని యిచ్చేది ఇదే. అది అతని కవిత్వపు [౮౫౭ అంతర్వాహిని.

“వొద్దుకి ఇవతలా అవతలా

అలవోకగా గాలికి ఊగుతూ

గమ్మత్తయిన సుగంధాన్ని వెదజల్లుతూ

జీవితాన్ని వాటి తాలూకు ప్రకంపనాల్నీ

సుతిమెత్తగా బొమ్మగీస్తుంది”

రెల్లు అనే కవిత ఈ రకంగా మొదలవుతుంది. తర్వాత అద్భుతంగా విస్తరిస్తూ, అనేక దృశ్యాల్ని ఆ ప్రాంతపు ప్రత్యేక సందర్భంలో ఉప్పతిల్లిన అనేక ఘటనల్నీ వర్ణిస్తూ ముందుకు సాగుతుంది. అన్నీ దృశ్యాలే. అయినా వాటికి గట్టి వర్తమానత వుంది - అల్లకల్లోల వర్తమానపు రక్తస్పర్శ వుంది.

“ఒక్షోసారి నేలమీద సాగిలపడి

వరద పాటకు దరువుకొడుతుంది బూట్లపాటకు వంతపాదే పాతబస్తీ వీధిలా - ఈ ఒడ్డూ ఆ ఒడ్డూ గుడారాలు గుదారాలుగా మాటేసి వున్నప్పుడు

మదమల్ని తడిమితడిమి చూస్తూ

వూరు అడివెందుకయిందనీ?

అడవి అంటుకుందెందుకనీ? గుసగుసగా ప్రశ్నిస్తుంది. పల్లేరు పాదాలను పలకరించినపుడు

వంగిన చెవుల దగ్గర చేరి

మట్టిని మరిచిపోవద్దంటూ

లోగొంతుకలో హెచ్చరిస్తుంది”

ఏ ఏటి వొడ్డునో, చెరువు వొడ్దునో నిల్చుని గాలికి ఊగుతున్న 'ెల్లును కవి ఎలా సంభావించాడు. రూపుకడుతున్నాడు. స్థానిక సంక్షోభంతో కలగలిపి పలుకుతున్నాడు. * ఓ062] [620 చాలా గొఢమయింది. మొత్తం భారతదేశపు వాస్తవికతలో అది భాగవ్వే.

ఒక (ప్రాంతపు వాస్తవం మరొక ప్రాంతపు వాస్తవానికి ఊపిరులూదుతుంది. మరొక్ర ప్రాంతపు వాస్తవానికి చరిత్ర ఇవ్వబోతున్న రూపురేకలిపుడే అందిస్తుంది.

“నది కదిలొస్తే కావ్యం రాసిన అన్నపురెడ్డి విజయభాస్కరరెడ్డి పల్నాటి ప్రాంతపువాద్దే ఒక పదిపదిహేనేళ్ల కిందట హైదరాబాదులో కలిసినపుడు మాటల సందర్భంలో 'వామపక్ష ఉద్యమాలు, వాటీ తీరుతెన్నులు, ఒడిదుడుకులు, ఎత్తుగడలు, భవిష్యత్తు' వీటి గురించి

8

మాట్లాడుకునే సందర్భంలో అన్నా- రేపు మీ ప్రాంతానికీ విస్తరించవచ్చు అని. అప్పటికింకా పల్నాటి ప్రాంతంలో ఉద్యమ ఛాయలు లేవు. చాలాసేపు చర్చించుకున్నాం. ఒక పదేళ్లు గడిచింది. ఒకసారి హైదరాబాద్‌ వచ్చినపుడు కలిస్తే అన్నాడు. 'మీరన్నది నిజమయింది. మా ప్రాంతంలో అన్నలు తిరుగుతున్నారు. మొన్నాక దళం నన్ను కలిసింది” అని, రవికుమార్‌ ప్రస్తుతం నెలకొన్న ఒక వాస్తవాన్ని అద్భుతంగా 'ెల్లు' కవితలో ధ్వనించాడు. ఒక వస్తువును 00౧60614 చేసి, దానికొక రూపాన్నివ్వడంలో చుట్టూఉన్న పరిస్థితులు, జీవనస్థితులు, సాంస్కృతిక రాజకీయ అంశాలూ అంతర్లీనం చేయడంలో కవి ప్రతిభ, ప్రాపంచిక దృక్సధమూ వ్యక్తమవుతాయి. కవితకి ఒక సందర్భశుద్ధీ, ఒక లోతూ కలుగజేసేది ఇదే. “నూనూగు వేర్లతో మట్టిని కౌగలించుకుని మూలాలను మరువకందంటూ - ఇప్పుడు తప్పదుమరి గుప్పెడు ధైర్యాన్ని అరువు తెచ్చుకుందుకు ముంగిట్లో గులాబీలకు బదులు కాసిని రెల్లు పొరలు నాటుకోవాలి” 'రెల్లు ఒక [61916066 కి ప్రతీక - యిలా వంగి, అలా పైకి లేచే తత్వం - 'కవిత్వం'లో ఊహ - (11102100) - పాత్ర గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ వుంటా. కవిత 1260గచేయాలంటే, పైకి లేవాలంటే కల్పనాశక్తి, భావనాబలం పుష్కలంగా ఉందాలి. గొప్ప కవుల్లో ఉన్న ప్రధాన లక్షణం ఇది. వాస్తవం వాస్తవంగా పాఠకుడిలో భాసించాలన్నా దీని పాత్ర వుండాల్సిందే. “కవిత్వమంటే మంటే వెన్నెలంత చల్లని మంట వేలవేల గుండెలమీద వేలాడే దప్పులు చలిగాచుకునే మంట ఎంత తుపాకీ అయితే మాత్రం అక్షరాల్ని అదుపులో పెట్టటం సాధ్యమా?” ఈ కవితా సంపుటి పేరు బొడ్డుపేగు. యిందులోని ఒక కవిత పేరు అది. పై వాక్యాలు ఆ కవితలోనివే. ఒక కవితా సంపుటికి శీర్షికగా నిలిచిన కవిత, మొత్తం కవి కవిత్వ తత్వానికి ప్రాతిపదికగా అంతర్లీనంగా అతని ఆత్మ ఎక్కడుందో చెప్పే కవిత అయివుంటుంది. అది ధ్వని పూర్వకంగా అతని కవిత్వం మొత్తానికి సూత్రప్రాయంగా వుంటుంది. అంటే రవికుమార్‌ మొత్తంమీద దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో? అతని కవిత్వం ద్వారా దేన్ని 9

ధ్వనింపచేయదల్బుకున్నాడో తెలియజేస్తుంది. ఏ పక్కనున్నాడో తెలియచెబుతుంది. “వెరిగిపోని పర్యవసానాన్ని చరిత్ర పేజీల్లో లిఖించాలి ఉద్యమాల బొద్దుపేగును లెంపి పారేయాలనుకునే కుట్రను భగ్నంచేసి తీరాల ఆంటాడు. ఇక రాళ్ల నుంచి రోళ్లను తయారుచేసే రోళ్లు పాపయ్య మీద రాసిన 'మహాయాత్రి కవిత ఈ గ్లోబలైజేషన్‌ సందర్భాలలో అంతరించిపోతున్న చేతివృత్తులు, తత్భలితాలు దృష్టిలో ఉంచుకుని రాసిన కవిత. గ్రైండర్స్‌ పల్లెల్లోకి కూడా చొరబడ్డాక - అన్ని చేతివృత్తుల్లానే రోళ్లగొట్టే వృత్తీ అంతరించిపోతుంది. “మొద్దు రాతిముక్కను అన్నం మెతుకుల్లా చెక్కుతున్నాడు అతని చేతుల్లో మైనమో, మైదాపిండో వొదిగినట్లు ఆ రాయి ఎంత సౌందర్యవంతంగా తయారయిందో! చెమటకు తడిస్తే రాయి మెత్తనవుతుందా నీకో వృత్తలేఖినీ ఇస్తాను. అతను చెక్కినంత అందంగా, గుండ్రంగా ఆ రాతిని చెక్కగలవేమో ప్రయత్నించు సుఖపడ్డం అలవాటయ్యాక ఇక నువ్వే సౌందర్యాన్నీ సృష్టించలేవు, స్పర్శించలేవు, దర్శించలేవు” ఒక వస్తువును ముట్టుకోవడం వేరు: ముట్టుకుని కవిత్వం అనే పనిముట్టును చేయటం వేరు. బహుశ రోళ్ల పాపయ్య కవితలోని వాక్యాలు కవికే వర్తిస్తాయి. స్పర్శించడం, దర్శిం చడం, సృష్టించడం - యిది కవిత్వానికే వర్తిస్తుంది. మెలికంతా '“సుఖపడ్డం' అలవాటయ్యాక అనే మాటలోనే. ఒక మధన, ఒక యాతన, ఒక తపన, ఒక సాధన, ఒక రింగ. పర్యవసానంగా జన్మించేదేనా కవిత? అందుకేనేమో “నేనిప్పుడు ఈ మనుషుల్ని నీళ్లతోనే ముదేస్తాను” అని అనగలిగాడు . కవి. “నీళ్లక్రోసమే మనిషి కన్నీళ్షవటం నీళ్లకోసమే మనిషి వేటకొడవళ్లవడం నీళ్లకోసమే మనిషి ఎగిరిన జండా అయి 10

ఛలో హైద్రాబాద్‌లో మిట్టమధ్యాహ్నం

బతుకు పొద్దుగుంకించుకుంటూంటే

నా చూపుడు వేలును నరికేసుకోవాలన్నంత కోపమొస్తుంది అన్నమెటుతిరిగీ లేదు

కనీసం నీళ్లు తేలేని నీరోలకు

నీళ్లాదిలేయానిపిస్తోంది

నన్ను నేను తిరిగి రాసుకోవాలనిపిస్తోంది*

“నీళ్లాదిలేయాలనిపిస్తోంది' కవిత ఆఖరి వాక్యం కావాలి. బహుశా ఈ ఊహాతత్వం లేని కవి వస్తువును బహుముఖాలుగా దర్శించీ వర్ణించీ, ముగింపు దగ్గర విఫలం కావచ్చు. ఈ కవితలో ఆఖరివాక్యం ఆ అనుభవం నుంచి తను పిండుకున్న సారంతో ముగుస్తుంది. ఊహాశాలి కాని కవి ఇలా పలకలేదు. 'తన్నుతాను తిరిగి రాసుకోవడం” ఎప్పుడు, ఒక లోకానుభవదర్భనం తర్వాత. అది తనలో అంతర్లీనమయ్యాక, ఒక కొత్త చూపూ, కొత్త వ్యక్తిత్వం కావాలి. అందుకే ఆఖరివాక్యం చదివాక కవితకి ఒక కొత్త వెలుగు వస్తుంది. కవిత మొత్తాన్ని శక్తివంతం చేస్తుంది. ఆఖరివాక్యం లేకుండా కవిత చదవండి ఆఖరి వాక్యంతో కలిపి చదవండి. తేడా తెలుస్తుంది.

“కనీసం ఇప్పుడయినా మాట్లాడకపోతే

ఇక ఎప్పటికీ మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాం పగటికీ రాత్రికీ మధ్య

సాయంకాలాలమై పొద్దుగూకిపోతాం”

ఒకానొక ప్రత్యేక సామాజిక రాజకీయ సందర్భంలో నుంచుని కవి మాట్లాడుతున్నాడు. వైరివర్గాలు, రాజ్యం ఒకపక్క పోరాటం మరోపక్క మధ్యలో ప్రజలు. కవి మాట్లాడాల్సిందే, మాట్లాడకపోవటం సామాజిక నేరం.

“ఇప్పుడు కూడా మాట్లాడలేకపోయామో ఇహ మాట్లాడాల్సిన అవసరమే రాదు మరెప్పుడు మాట్లాదినా అసందర్భ ్రేలాపనే అవుతుంది” అదీ కవి కర్తవ్యం. చుట్టూ అనేక అంశాలుంటై - జీవితం నిండా వైరుధ్యాలు, వైవిధ్యాలుంటై. అనేక పార్య్యాలూ, అనేక కోణాలూ, అనుభవాలూ, మానసిక స్థితులూ వుంటై. అన్నింటినీ తనలోకి పీల్చుకోవాల్సిందే. అన్నింటినీ కవిత్వీకరించవలసిందే. అయితే (ప్రధాన అంశం ఒకటి ఉంటుంది. వేగుచుక్కలాగ కవిని నిర్దేశించి గమ్యం సూచించేది ఒకటి ఉంటుంది. అది ఆ కవి కవిత్వాన్ని 'కలిపి కుట్టే ప్రధాన అంశం అయివుంటుంది: అయి ఉందాలి. ఈ విషయంలోనే రవికుమార్‌ ఎక్కువ స్మోర్‌ చేసాడు. 1

ఒక సామాజిక చట్రాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేశాడు, దాని చలన సూత్రాలు ఏమిటి? అయితే భౌతిక వాస్తవికతతో తను గాఢంగా లీనమయ్యాడు. అక్కడ్నుంచి పలకటానికి ప్రయత్నిస్తున్నాడు. కళాత్మక దృష్టి ఉంది. కవిత చేయాలనే దృష్టీ ఉంది. “నీళ్లు, 'ఒకానొక ఖాలీ గురించి, 'బొద్డుపేగు, 'వంతెని, '“ఒకానాక సామూహిక ఎదురు చూపు, 'వెన్నెలచెట్టు, “ఒకే ఒక్క వాన చినుకు, '“నీళ్లైెలా బతికుంటాయి” లాంటి కవితలు చూడండి. తన్ను తాను ఎక్కడ పొజిషన్‌ చేసుకున్నాడో అర్ధమౌతుంది.

అక్కడో కవిత, ఇక్కడో కవిత అచ్చవటం వేరు - ఒక్కదగ్గర ఒక నలభై కవితలు చదవ డం వేరు. ఒక కవిని అంచనా వేయడానికి ఒక కవిత చాలదు. ఒక కవిత చదివి బాగుంది అనుకుంటాం. కానీ, అతని కవిత్వాన్ని అతని వ్యక్తిత్వాన్నీ, కవిత్వ తత్వాన్నీ అంచనా వేయాలంటే అతని అనేక కవితలు ఒకదగ్గర చదవాల్సిందే. మొత్తం అతని రూపు అపుడే అర్ధమౌతుంది.

ఇప్పుడు రవికుమార్‌ని “బొడ్డుపేగు' ద్వారా అందుకోవచ్చు, ఆనందించవచ్చు, అధ్యయనం చేయవచ్చు.

పలనాటి ప్రాంతం నుంచి బలమయిన గొంతుకతో ఒక కొత్తతరం కవి ముందుకొస్తు న్నాడు. ఒక నిజాయితీ పలుకును, సాహసిని, ఒక 110110౯ ని లోకానికందించడంలోనే అంతకు ముందుతరం విజయం ఉంది.

ఖచ్చితంగా కోసూరి రవికుమార్‌ది బలమైన గొంతుక. కొత్తగొంతుక, నిజాయితీ ఉన్న గొంతుక, నూత్న వ్యక్తీకరణ కోసం తపించే గొంతుక, దానికి దాఖలా యీ కవితా సంపుటి. మోహనరావు, రత్నశర్మ లాంటి కవిమిభ్రుల అండ వుంది, విశ్లేషణా వుంది. తన్ను తాను విశ్లేషించుకునే, ఆత్మవిమర్శ చేసుకునే మంచి లక్షణమూ వుంది. అన్నింటికంటే వినయం వుంది, కవినని విర్రవీగే లక్షణం ఎక్కడా నాకు కనపడలా. క్రమక్రమంగా, బహుశా నిదానంగా తన్ను తాను నిర్మించుకుంటున్నాడు. అన్నింటి పట్లా 'సృహతోనే, ఎరుకతోనే, మెలకువతోనే ఉన్నాడు. అయితే ఆగకూడదు. తీవ్రతరంకావాలి. తన్ను తాను అధిగమించే లక్షణం కావాలి. తనకు తానే పోటీ, '20201102 ౪118 2 ౧౪౧2౭౧/ అగి కొవాలి.

“08 9276 800108 10 1221 0౧ 6 ౧౦6 944 16 00” 766 30౧65

జీవితాన్ని బతుకును 06160121 చేసే ఒక లక్షణం వుంది. సెలబ్రేషన్‌ ఎందుకంటే - ౦౫6 13 జల.

నేను రవికుమార్‌ కవిత్వాన్ని 5%0౪ చేసాను. ఒక కొత్త ఆశ ఏదో నాలో మెరిసింది. నాలో కవిత్వపు వత్తి పెద్దదయింది.

అనందిస్తూ, అభినందిస్తూ -

= శివారెడ్డి, హైదరాబాద్‌ 12

ల్ని మట్టికీ మనిషికీ ఉన్న బంధమే 'బొడ్డుపేగు” అద్దేపల్లి రామమోహనరావు ప్రఖ్యాత విమర్శకులు, కవి కాలం మారిపోతుందన్నమాట నిజమే. “ప్రపంచంలో అన్నీ మారిపోతై మార్చుతప్ప” అంటారు. అంతేగాక మార్చుని అంగీకరించాలి అనే మాట కూడా చాలామంది అంటూ ఉంటారు. ఒప్పుకోవలసిందే. అయితే ఈ మార్చు రెండు విధాలు. ఒకటి ఒక సమాజం తన మూలాల్ని నిలుపుకుంటూ, ఎప్పటికప్పుడు సమాజపు కదలికల వల్ల అందరి అంగీకారంతో జరిగే మార్చు. రెండోది బలవంతంగా ఎవరో తెస్తే వచ్చే మార్పు. గురజాడ కలం నుంచి వచ్చిన సంస్మరణ ప్రధానమైన మార్పు మొదటిది. 90ల నుంచి రుద్దబడుతున్న ప్రపంచీకరణ వల్ల వస్తున్న మార్పు రెండోది. ఈ మార్పు అదివరకు మాదిరి నెమ్మదిగా జరగదు. నిమిషాల్లో, క్షణాల్లో జరుగుతుంది. ఎందుకంటే మొదటి మార్పుకి కారణం అందరూ క్షేమంగా, మానవసంబంధాలు సమన్యాయంగా ఉండాలని కోరుకునే మార్పు. రెండోది కేవలం కొద్దిమంది స్వదేశీయులూ, విదేశీయులూ కలిసి, వాళ్ల అంతులేని వ్యాపార దృక్పధంతో తెచ్చే మార్పు. ఈ మాళ్పునే యిప్పుడు కళ్లఎదుట ఈ దేశంలో అనుక్షణం చూస్తున్నాం. మార్పునంగీకరించవలసిందే. కానీ ఈ మార్పుని అంగీకరించవలసిన అవసరం లేదు. ఈ మార్చు సమాజ బీభత్సానికి, స్వార్ధద్వేషాలకీ, సమన్త' దుష్టసంస్కృతికీ తీసుకుపోతుంది. | కవులెప్పుడూ సమాజ సంక్షేమాన్నే కోరతారు. సమాజానికి కీడు చేసే విషయాల్ని ఖండిస్తూనే ఉంటారు. అందుకే ఒక్కొక్క సామాజిక పరిస్థితికీ తగిన మూలవైరుధ్యం ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఎన్నో అప్రధాన విషయాలుండవచ్చు. వాటి ప్రయోజనమూ ఎక్కువగానే ఉందవచ్చు. కానీ ప్రధాన వైరుధ్యమే కవుల్ని ఆకట్టుకుంటుంది. ఊపిరి సలపనివ్వదు. వర్తమానకాల వైరుధ్యం ఈ దేశపు మౌలిక రాజకీయార్టిక సంస్కృతికీ, ప్రపంచీకరణ పూర్తిగా మార్చివేయదలచుకున్న, సుస్థిరం చెయ్యదలచుకున్న విషసంస్కృతికీ. ఈ వైరుధ్యం ఈనాటి కవులందరిలో కనిపిస్తుంది. కొందరికిది ఆనుషంగిక అంశం. కొందరికి ప్రధానాంశం. ప్రధానాంశంగా భావించే కవుల్లో బలమైన కవితాస్వరంతో కోసూరి రవికుమార్‌ “బొద్దుపేగు” కవితా సంపుటి తెస్తున్నాడు. బొద్దుపేగు - అనే శీర్నికలోనే తల్లికీ, బిడ్డకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తున్నాడు. మౌలిక సంస్కృతి సామాజిక వారసత్వపు పునాదికి సంబంధించినది. బొడ్డుపేగు వేరుచేయబడినా ఆ వారసత్వం కొనసాగుతుంది. ఇది ప్రతీకాత్మకమైన శీర్షిక. సంస్కరణ అనే పదం ఈనాడు పాలకవర్గం ప్రచారం చేస్తున్న పదం. ఒకనాటి సంస్కరణ పీడితులకు సంబంధించిన మానవతాదృష్టి. ఈనాటి సంస్మరణ ఉన్నత వర్షాలకు 13 "

సంబంధించిన 'వ్యాపారాత్మక అమానుషదృష్టి. బహుళజాతుల కోసం ప్రాజెక్టులు, ఆనకట్టలు కడతారు. (ప్రజలకు మేలు జరుగుతుందన్నది నిజమే కావచ్చు. కానీ లక్ష్యంతో పాటు లక్ష్యసాధన మార్గం కూడా అత్యంత ప్రధానం. లక్ష్యసాధన మార్గంలో పేదలు, దళితులు, గిరిజనులు నష్టపోకూడదు. ఆత్మహత్యలు, ఆత్మహత్యాసదృశమైన వలసలు, యాచకత్వమూ, జీవన విధ్వంసమూ వారికి లభించే ప్రతిఫలం. కోటీశ్చరులకి ఎన్నోవిధాల రాయితీలు, లాభాలు ఇచ్చే పాలకవర్గం, పేదలకు అత్యల్పమైన ధనసౌకర్యం, భూమి సౌకర్యం కలిగించలేదా? తలచుకుంటే ఇది చిన్న విషయమే. కాని, ఇది జరగడంలేదు. ఈ పరిస్థితినే కవి యిలా చెప్తున్నాడు. ప్రాజెక్స పేరంటానికి ముందే ఆనకట్టలకు జనరక్తపారాణి పండే ఎకరాలుసరే మునిగే మడిచెక్కల సంగతేంటని పారలూ పలుగుల నిరాహారదీక్ష నీళ్లుపారేలోపు నేల మాయమైపోతుందని '... బాణాలూ బరిశెలూ ఇందిరాపార్ములో సమావేశమయ్యాక రాజ్యమంతా రాజీలేని హింస ఫేదల జీవితాన్ని సరిచెయ్యలేక, వాళ్లు నేలకోసం ఉద్యమిస్తే వారి కోరిక తీర్చకుండా లాఠీలు, జైళ్లూ, చివరకు తుపాకులూ ఉపయోగించి అణిచివెయ్యడంలో న్యాయమేముంది అని కవి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు పాలకవర్గాల ప్రణాళికలన్నీ దేశాన్ని నగరీకరణ చెయ్యాలని, నగరీకరణ అనేది పాశ్చాత్య దేశాలకు ప్రారంభం నుంచి వికసించిన సంస్కృతి. వారికి నాగరికత ప్రధానం కాబట్టి మొదటినుంచీ ఆ ధోరణిలోనే వాళ్ల అభివృద్ధి పెంపొందింది. కానీ నగరీకరణ పెరుగుతున్నకొద్దీ సంస్కృతి ధ్వంసమౌతోందని అక్కడి కవులూ రాశారు. ఇక్కడ మార్పుల్ని చూస్తూ నగరీకరణలోని లోపాల్ని గూర్చి యిక్కడి కవులూ ఇంతకుముందు రాశారు. ఇప్పుడైతే గ్రామీణత పూర్తిగా నాశనమౌతోందని కవులు, కథకులూ అందరూ రాస్తున్నారు. గ్రామీణత భారతీయ సంస్కృతికి ఆయువుపట్టు. ఈ దేశ సంస్కృతి సర్వస్వం వ్యవసాయం మీదనే అధారపడి ఉంది. నూతనమైన ఎన్ని సౌకర్యాలనైనా తెచ్చుకోవచ్చు. ఎంత నాగరికతనైనా పెంపొందించుకోవచ్చు గానీ మౌలికమైన గ్రామీణత నశించరాదు. (గౌమీణత అంటీ వ్యవసాయ సంస్కృతి, గగ్రామీణత అంటే ్రాకృతికత, గ్రామీణత అంటే కుటుంబ సంబంధాలు, మానవీయ అనుబంధాలు, ఇంకా ఎన్నైనా చెప్పవచ్చు. కమ్యూన్‌ అనేదానికి వి అర్ధముందో, ఆ అర్ధంలో స్వయం సంపూర్ణంగా తీర్చిదిద్దబడడం లక్ష్యంగా ఉండాలి. 14

ఈ భావాల్లోని లోతు గ్రామీణ నేపధ్యం ఉన్నవారికి బాగా మనస్సుకి పడుతుంది. కవులైతే నగరీకరణకి, గ్రామీణీకరణకీ ఉన్న భేదాన్ని చాలా స్పష్టంగా, ఆవేదనతో చెప్పగలరు. రవికుమార్‌ కవిత్వం నిండా ఈ వైరుధ్యత పరుచుకుని ఉంది. మొత్తం కవితా సంపుటికి బలమిచ్చిన అంశాల్లో ఇది ముఖ్యమైనది.

(గ్రామీణ నేపధ్యమున్న కవులు, గ్రామీణతలోని అన్ని అంశాళ్నీ వర్ణిస్తున్నారంటే అర్ధం సరిగ్గా అదే ఫ్యూడల్‌ సమాజం కొనసాగాలని కాదు. తమ నస్మృతుల్ని హృదయదఘ్నంగా వర్ణించడం, పూర్వసమాజ అనుబంధాల్నీ సౌందర్యాన్నీ గుర్తుచెయ్యడానికే. పై అంశాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, మౌలిక సంస్కృతిలోని అంశాలు మాయంకాకుండా ఉండాలనే. రవికుమార్‌కి గ్రామీణ నేపధ్య సౌందర్యం తెలుసు, రైతు జీవితం తెలుసు, అనుబంధాలు తెలుసు, నగరీకరణలో మాసిపోయే మానవతా విలువలు తెలుసు. 'మట్టీ-మనిషీ కవితలో వర్ణించిన పల్లెటూరి సౌందర్యం అనుభవించినవారికే తెలిసేటంత వాస్తవికతా దృశ్యమాలికలై, కవితాత్మకంగా రూపుదిద్దుకుంది.

చెల్లాయి తువ్వాయి తోక వెంట తూనీగయ్యేది పంటలు వంట యింట్లో పాలై పొంగి పొంగళ్లు పొంగళ్లుగా తిరునాళ్లయ్యేవి ఊరుఊరంతా

వేడన్నంమీద కొరివికారం ముద్ద గుబాళించేది బుట్టచేతులు పరికిణీలై ఆరిందాలై అత్తవారింటికి తరలివెళ్లేవి

విరగబండిన మిరపతోట

నూనూగు మీసాల తలకు పాగొ అయ్యి పెళ్లికొడుకుగా మారేది

పెళ్లి అంటేనే పల్లెతోరణమయ్యేది

పచ్చని పేరంటమయ్యేది

ఏటిమీద పాట అద్భుతమై

పల్లే సాయంత్రం చుట్టూ పరుచుకునేది ఎప్పటిలాగే ఎర్రమట్టి దుమ్ముతో చీకటీ ఎద్దుమెడలో గంటల శబ్దంతో వేకువా రోజును పంచుకునేవి

పై పంక్తుల్లోని ప్రతి పదమూ గగ్రామీణతా వ్యక్తీకరణలోకి ఒదిగిపోవడం గమనించదగిన విషయం.

రవికుమార్‌కి వ్యవసాయ సంబంధమైన అంశాలన్నీ తెలుసు. రైతు పడే పాట్లన్నీ తెలుసు.

15

వాటికి సంబంధించిన నుడికారాన్ని కవిత్వం చెయ్యడమూ తెలుసు. ఒకే ఒక్కవాన చినుకు కోసం ఎదురుచూడగా చూడగా, అతివృష్టి వచ్చి ఎలా ఆశల్ని భగ్నంచేస్తుందో చెప్తాడు “ఒకే ఒక్క చినుకు” కవితలో.

“ఈ ఏటికి అంతా పచ్చనే అనుకున్నాగాని

కళ్లు పచ్చబదేటట్లు కురుస్తుందనుకోలా -

గుకృపట్టిన చేనుగొంతుక

పాలమారి 'పోయేటట్లు చొరబడ్డదీ పాడువాన -

_ పెద్దబిడ్డ మంచినీళ్ల చట్టిమట్టి కొట్టుకుపోతుంటే

చెలమ పొలిమేర దాటించేలా పారుతోంది

నులివెచ్చని పచ్చని నారుమడిమీద

ఆంబోతు పడ్డట్లు ఉరికి పడిందీ మూర్ధపు ముసురు

వాన ఆగదు -”

“కళ్లు పచ్చబడేటట్లు కురుస్తుందనుకోలా' - ఈ మాటలో ఎంత వ్యంగ్యమైనా ఉంది. న్యాయంగా 'పైరు పచ్చబడాలి. కాని యిక్కడ “కళ్లు పచ్చబడినై. ఉండవలసిన పచ్చదనం లేకపోవడం, ఎదురుచూసే కళ్లు కాంతిని కోల్పోవడం చాలా అర్ధవంతంగా ఉంది. అలాగే వ్రను గొంతుక పొలమారడం”. పొలమారితే ఊపిరి అల్లకల్లోలమౌతుంది. అంతేగాక పొలం అరిపోతుందనే అర్ధం కూడా తెచ్చి, ఈ పదాన్ని బాగా వినియోగించాడు కవి. నారుమడి మీద ఆంబోతు పడడం, గ్రామీణతకు తగిన పోలిక.

పల్లెటూరి రైతుకి సంబంధించిన దృశ్యసౌందర్యం రవికుమార్‌ కవితల్లో పదేపదే

॥ ఆకర్షిస్తుంది. పదాలు, నుడికారాలూ, వాస్తవికత మొదలైనవి అందరూ రాయవచ్చు. కానీ వాటిని కవితాభివ్యక్తితో ముడివేసి రాయడం రవికుమార్‌లో కనిపిస్తుంది. మరోవిధంగా చెప్పాలి అనే తపనే కవిని ఉన్నత దశల్లోకి పయనింపజేసే మూలసూత్రం. తాతనీ, తండ్రినీ వర్ణిస్తూ, ఒక దృశ్యాన్ని యిలా కళ్లముందు నిలుపుతాడు. ఈ కవిత పేరు 'పౌక్కిలేను'. ఇది “ప్రాక్లెయినరొకి పల్లెమాట.

“శొలకరి చినుకు పడగానే మట్టిబెడ్డలు సిగ్గుతో నేల ఒళ్లోకి మెత్తగా పరుచుకుంటుంటే సద్దితిన్నాక తాత చుట్టకాలుస్తూ గుండెల్లోకి తృప్తిగా నవ్వుకున్నట్లు మట్టివాసనను మెత్తగా గుండెల్లోకి జుర్రుకునేవాణ్సి విద్దులబండిమీద నాన్న నాటుకర్రబట్టి నిలబడితే నా మువ్వల చెలకోల ఘల్లుమనిపిస్తూ 16

ఎలపట దాపట గులాంకుంకుమై మెరిసి ములుగర్ర చివరన తాబేటికాయై చల్లటి కలలుగనేవాణ్ణి నా కలలన్నీ వొడి పెరట్లో కట్టుకున్న ప్రాజెక్టు గోడకింద నిలువునా మునిగిపోయినై...” రవికుమార్‌ ఈ సంపుటిలో కొన్ని కొత్త వస్తువుల్ని తీసుకున్నాడు. సాధారణంగా ఈనాటి మనిషి మానవత్వం కోల్పోయాడని చెప్పడానికి పళువులకంటె, పక్షులకంటి హీనుడయ్యాడని చెప్తాం. రాతికన్నా హీనుడనడం కొత్తగా ఉంది. ఎందుకంటే 'రాతిగుండె' అన్నదే ఒక కఠిన వ్యక్తిత్వానికి చిహ్నంగా వాడుకలో ఉంది. అలా అనకూడదంటాడు, హేతువులు చెప్తాడు. “నిజంగా ఈ రాతిది ఎంత మెత్తని గుండె! గుడిముందు పగిలిన కొబ్బరికాయను పలకరిస్తోంది ప్రాజెక్టు ముంగిట్లో ఫలకమై స్వాగతగీతం పాడుతోంది... కోనేటి మెట్లపక్కన దాతపేరు దాచుకుని ఒదిగి నిలబదుతోంది. ఐడిమాని ప్లేట్లు తీస్తున్న పసిచేశుల్ని చూసి గోలచేస్తోంది అమ్మచేతి చలువని ళుచులారా వినిపిస్తోంది సాయంత్రానికి వీధి అరుగై విశ్వవీక్షణం చేస్తోంది! నేనిపుడు ప్రశ్చిస్తున్నా రాతిమనిషి అని అనిందెవరు?” కరుణశ్రీ పుష్పవిలాపం వింటే పూలమీద జాలి కలిగినట్లు ఈ “రాయి” కవిత రాతిమీద అనుకూల భావన కలిగిస్తుంది. అమెరికా పద్ధతులన్నీ గొప్పవనీ, అలా అయితేనే ఈ దేశం గొప్పదౌతుందనీ పెద్దలు, టి.వి.లు చేసే (ప్రచారాన్ని నమ్మి, ఈ దేశానికి వ్యతిరేక భావాలు పెంపొందించుకోవడం ఎంత ప్రమాదకరమో, కవి హెచ్చరిస్తున్నాడు. అమెరికా బాగానే ఉంటుంది. మనమే అటుయిటూ గాక, మన సంస్కృతిలో వారి సంస్కృతి ఒదగక, వారే ఎప్పుడూ మనమీద సవారీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. 17

“మనుషుల్లా తిరుగుతున్న గ్లోబల్‌ రోబోట్లలారా! మీ మెదళ్లకు చెదలు పట్టినట్లుంది బతుకులోటాలో బూతుషాంపేను ఒంపుకోకండి మీ అరచేతుల్లో మొలిచిన మూదో కన్ను కూదా మీకంటి సెగలకు అపర్చర్‌ తగ్గించుకుంటోంది. నెట్‌ నేలమీద బతికుండగానే సమాధి కట్టుకోకండి - ఆం(్రకూ అమెరికాకూ నుధ్య అవిరైపోతారు మనిషి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతారు రైతు జీవితం మీదుగా, అధునిక పెట్టుబడిదారీ విధానం వల్ల పోగుపడే పేదరికం మీదుగా, సామ్రాజ్యవాద ప్రభావ బీభత్సాన్ని కవితాత్మకంగా చేప్పిన రవికుమార్‌ నిరంతర కవితా యాధ్ర చేస్తే, ఇంకా ఉన్నతమైన వలువల్ని సాధించుకోగలడు. కోసూరి రవికుమార్‌ని అభినందిస్తున్నాను. 18

నేనూ... నాలుగు మాటలూ... కవిత్వమూ...

అజ్ఞాతంగా 'మాభూమి' నాటకాన్ని ప్రదర్శించిన రోజుల్లోనో కౌలుకు నేల తీసుకుని పొగాకూ, వేరుశెనగో పండించిన రోజుల్లోనో తులసికోటమీద కూచోబెట్టి నాకు కాసిని భావాలు పంచివుంటారు అమ్మమ్మా, తాతయ్యా,

కందులు, జొన్నలు పండించి గరిశెల్లోపోసి మురిసిపోతుంటే ఆకలిగా ఎగబడ్డ అగ్గి దేవుడికి పేలాలవుతున్న తిండిగింజలను చూసి నేలమీద, పంటమీద, పిల్లగాళ్ల అకలి మంటమీద బెంగబడ్డ తాత నాలుగ్గింజలు మిగిలించుకుందుకు అగ్గికి ఎదురీదినపుడు, వరద నీటికి పిల్లల్నీ పెళ్లాన్నీ మెడకు గట్టుకుని, ఎల్లీత కొట్టినపుడు వొంటిమీద పడ్డ మచ్చల్ని కథలుగా ఏ సంధ్యవేళో చెప్పివుంటుంది నాయనమ్మ. నులకమంచం కొళ్లకట్టన చుట్టకాలుస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ వేమన పద్యాలు చెబుతూ ఏ క్షణాన నేను కవి కావాలని మనసులో అనుకున్నాడో మా తాత ఇదిగో ఇపుడిలా... కవిత్వమవుతూ...

మట్టి తడిసిన వాసనను సీసాల్లోకి పట్టి ఈ నగరమ్మీద (స్పేచేయాలని అనిపిస్తూ వుంటుంది నాకు. నా మూలాలు మట్టిలోనే. మా పల్లెలోనే. పలనాటి మట్టివాసనకూ, నాకు ఈత నేర్చిన నాగులేటి నీటి వడికీ, మా గుంటూరు కొరివికారం రుచికీ, ముత్యాలంపాటికి బడికిపోయినంత దూరం నన్ను నిలేసి పలకరించిన రేగడి నేలకూ, రోజుకో రంగుతిరిగే వరిచేలూ, పత్తిచేలూ, మిరపతోటలూ, అన్నిటికీ నేను బతికినం కాలం తీర్చినా తీరనన్ని అక్షరాలు బాకీ...

ఇంకా నన్ను నా తిరుగుళ్లనూ, నా కవిత్వాన్నీ భరిస్తూ... ఫోనొస్తే, కార్డొస్తే... కవిసమ్మేళనపు కబురొస్తే నిలువునా కవిత్వమైపోయి ఇంటిని మరిచి పరిగెత్తే నాకు బాసటగా నిలుస్తున్న అనూరాధకూ, నేను సభనుంచి వస్తే సంచీలో పూలమాలను మెళ్లో వేసుకుని, జ్ఞాపికను చేతపట్టుకుని ఏ మిఠాయిలో తిన్నంత సంబరపడే నా రెండు కళ్లు సాహిత్యకు, సాకేతుడికీ నేనుగా పంచాల్సిన అనుభూతులు చాలా బాకీ... ఈ బుణమెలా తీర్చుకోనూ... కవిత్వమై కౌగిలించుకోటంతప్ప మరేం చెయ్యనూ...

నేను కవిత్వం రాస్తున్న తొలిరోజుల్లోనే నాకు అభ్యుదయ కవి అంటూ విజిటింగ్‌ కార్డ్‌ కొట్టించిన మామయ్య రంగాచార్యులుగార్మి అత్తమ్మ వెంకటరమణకూ...

బతుకు పోరాటంలో అలుపెరుగని యోధుడు తమ్ముడు రామచంద్రకూ... శ్రీవాజికీ... లక్మీగాడికీ...

ఏ రంగంలోనైనా నేర్పుగా రాణించగల గొవ్చ చొరబాటుదారుడు బావమరిది రామకృష్ణకూ, శ్రీలక్ష్మికీ, విస్ఫూగాడికీ...

నా బాల్యానికి గోలీలాటలై, బెచ్చాలాటలై వీధులు పంచిన ముసునూరూ, కొత్తపట్నమూ,

10

మా మాస్టార్లు రాధాకృష్ణమూర్తిగారూ, భరద్వాజగారు, అంగలూరు వీధుల్లో నా కవిత్వంలోకి తొంగిచూసి నన్ను ఆలోచనలవైపు నెట్టిన ఆత్మబంధువులు శ్రీధర్‌బాబు, బాన్టీలకూ... తొట్టతొలిగా నన్ను అభ్యుదయ కవిత్వం వైపు మరల్చిన అమ్మలో సగం, నాన్నలో సగం 'అన్ను బీరం సుందరరావుకూ, వారు పరిచయం చేసిన గురుదేవులు నాగభైరవ వారికీ, అక్కడ నుంచి మొదలైన నన్ను అవార్డులతో పాటు గొప్ప కవుల పరిచయాలతో ముంచెత్తిన ఎక్స్‌రే కొల్లూరికీ... నెరసంతో పరిచయం పెరిగి పుస్తకం ఎపుడోయ్‌ అంటూ కవిత్వమై పలకరించి, కవిత్వమై పరిమళించే ఒకానొక కవిత్వ శిఖరం, నా కవిత్వానికి ముందుమాటై నిలిచిన అద్దేపల్లివార్కి.. జిల్లా రచయితల సంఘం పెడదామని ప్రస్తావననే వ్యవస్థాపనగా చేసిన పల్లె మీగడ పెరుగు, గెనుంమీది తుమ్మచెట్టు నీడ, చల్లటి కాలువ నీళ్ల వంటి మనసున్న మా అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్యగార్మి, వారిద్వారా పరిచయమై రవీ నీ కవిత్వం బాగుందంటూ నన్ను ఆశీర్వదించి, నా పుస్తకానికి శీర్చిక సూచించి, ముందుమాటై ఊపిరిలూదిన సాహిత్య స్రష్ట ఇంటికి పిలిచి కవిత్వమూ, అమ్మతనమూ కలివి పంచే డా॥ గోపీసార్‌కి, అరుణమ్మగార్మి.. కవిత్వం మనిషిని కలుపుతుందని చెబుతుంటే నమ్మకం కలగకపోయినా పరిచయ మాత్రాన ఇంటికి రండయ్యా అని పిలిచి, పుస్తకాలిచ్చి, నా కవిత్వాన్ని నమ్మకంగా ఆశీర్వదించి, కలిసిన ప్రతిసారీ ఆత్మీయతతో, ఆప్యాయతతో మాటరానితనంలోకి నెట్టేసే మనిషంత కవిత్వం, కవిత్వమే మనిషి - ముందుమాటతో నా కవిత్వాన్ని పరిమళభరితం చేసిన శివారెడ్డిగార్కి.. ప్ర.ర.సం. సభల్తో నన్ను పదే పదే కవిత్వీకరించిన శ్రీ హనుమారెడ్డి గార్కి పొన్నూరి వేంకటశ్రీనివాసులుకూ, ఒంగోలు మిత్రులకూ, నన్ను సొంతమనిషిలా ఆదరించే పెరుగు రామకృష్ణ సుజనారామం - ఇంకా నె.ర.సం. మిత్రబృందానికీ... నేను సంఘం పెడదామని అనగానే ముందుకొచ్చి, పలనాడు రచయితల సంఘం (ప్రారంభంచేసిన నా అనుంగు కవిమిత్రులు నాగిశెట్టీ, రత్నశర్మకూ, నమ్మకంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన మోహనరావుకూ... నాకు కొండంత అండ అ.ర.సం,. అన్న పెనుగొండ లక్ష్మీనారాయణకూ, ఆకుపచ్చని లోకంలో సుతినెత్తని కవిత్వపు సంతకం అచ్చమైన కవితావాది మా పొపినేని శివశంకర్‌ సార్‌కీ... నువ్వొస్తే ఒక బహుమతి పట్టుకుపోతావని నా అక్షరాలమీద అచంచలమైన నమ్మకాన్ని చూపెట్టి, నన్ను అభిమానించి, ప్రోత్సహించే చలపాక ప్రకాష్‌, చింతా లక్ష్మీసుజుత, వేలూరి సతీష్స్‌ సుధారాణి... ఇంకా బెజవాడ మిత్రులకూ... 20

నా కవిత్వపు చలివేంద్రం అరసవిల్లి కృష్ణకూ, యువకవితా నేస్తాలు లకుమా, చిత్తలూరీ, ఆంజనేయకుమార్‌, శ్రీనివాసగౌడ్‌, ఈతకోటా, ఏటూరీ, చిరంజీవీ, కె.జె. రమేష్‌ ఇంకా ఎందరికో... మా దాచేపల్లిలో నన్ను 'కవీ అంటూ ఆప్యాయంగా పిలిచే ఉపాధ్యాయ మిత్రులందరికీ, నా స్పేహితులకూ, నిలువెత్తు స్నేహశిఖరం జోసెఫ్‌కుమార్‌ గార్కి, వారి బృందానికీ... సాహితీ సుమనస్ముడు, మండల అభివృద్ధి అధికారి శ్రీ పి. సత్యనారాయణగార్మి మా గుంటూరు జిల్లా రచయితల సంఘం సభ్యులందరికీ... ముఖ్యంగా బొమ్ము ఉమామహేశ్వర రెడ్డికీ... ౬ నన్ను ఆదరించి, నా కవిత్వాన్ని ప్రచురించిన పత్రికలు ఆంధ్రభూమి, నేటినిజం, విశాలాంధ్ర, ప్రజాశక్తి ఆంధ్రప్రదేశ్‌, ప్రజాసాహితి మొదలైన పత్రికలవారికి, కవిత-2004, కవిత-2005, (ప్రపంచీకరణ ప్రతిధ్వని, సంతకాలు, కవితా పుష్పకం (హరివిల్లు), ఒక నులివెచ్చని స్పర్శ సంకలనకర్తలకూ... (ప్రాణహిత నెట్‌ పత్రిక, రంజని సాహితీ సమితి వార్కి వేముగంటికీ... పరిచయమే లేకున్నా కవిత్వమై ప్రవహించి, క్రమశిక్షణతో కట్టిపదేసి, అక్షరానుబంధం చూపే కమర్షియలిజంలేని, మూర్తీభవించిన మానవత్వపు సుగంధం క్రిసెంట్‌ రామారావు గార్మి.. ముఖచిత్ర రచన చేసిన గిరిధర్‌ గార్కి “నన్ను నిరంతరం కవిత్వంలోకి నెట్టేసే తిలక్‌, శ్రీశ్రీలకూ” ఏమివ్వగలనూ... గుప్పెడు అక్షరాలూ రెండు చేతుల్నిండా కృతజ్ఞతలూ తప్ప...

  • కోసూరి రవికుమార్‌ 2

అవయంంంవవలలాలంంంందుపషయసూళలుకలాలాలాలాలాలాలాాాాాాాా ఒక నులివెచ్చని స్పర్శ... ౦44౦442 ఐఐ లైతి యా శ కక ౩. ఒకానొక సామూహికపు ఎదురుచూపు! ...........42 తక వెన్నెలచెట్టు ......౨౨౨౨౨౨౨౨౦౨ ౨౨౦౦౦౨౦౦ ల౦వం వలవల తిల్లై పరారీలోవున్న పూరిగుడిసె కోసం ...............4 తికి ఏకలవ్యులు మళ్ళీ వేళ్ళు కోసిచ్చేశారు ....................... 88 టెర్మినేటర్‌.............0000000000000002000 200000 త్యధి బొటనవేళ్ళ వాన ..........ంంంంంలంంలంలంంంలలంంం కీడే బొద్దుపేగు ౨.౨౨౨ లంంంలంంంలలలలలలంల కేర్‌ ఒకే ఒక్క వానచినుకు .......0020040000020000200 00 020002000004 క్వే ప. మట్టి... 0060000000 0లటలంంంటలంంల ర్‌1ే “బొంత” ంం0002000020ట0ల0 2020 ం 2500 ల0000002000000204 రజ రేపటికి!? ౨౨౨౨౨4౦4 4240 20020020 000020200000002022020002 రడ పంటాపామూ!.......౨లంంలలలలరవలమలవలమవవం టం ర్‌6 మన గోతులు మనమే!! ........౨౨౨౨౦౦౦౦౦౦ల ల 60 మాట్లాడి తీరాల్సిందే .......000000000000000000వ0ంటంంల 62 ఏటికేతంబట్టి .......... లలల 64 నీళ్ళు ...ంంలలంలలంంలలలలంంలలంలలంంలలం రికి మహాయాత్ర .......౨౨౨౨౦440 వం వంంవంలం లలల ౯0 నీళ్ళెలా బతికుంటాయీ?! 20000006 00626 0 బవఐ ఐం ంవళటం 2600020040 [డీ న క్షమించు బడీ.........లంంలంవలంలంలలంలలటలంలల 78 ఒకానొక ఖాళీ గురించి...........ంట0టటంంంలంంంం తి1ే అమ్మపాట ....౨౨౨౨౨౨౨౨౨౨౨౨౦౨౦44220000020020302ట0040ఆ కిర్‌ వంతెన............002600022లల వలల లవ వవ లం ంజలలల 3062020002 కి6 22

అన ఒక నులివెచ్చని స్పర్శ మునిమాపుకు ముందర, పలుచగా మబ్బులు, మంచు (్రవిస్తున్న వేళ ఫుట్‌పాత్‌ పైన పాదముద్రలు చెరిపేస్తూ మడతలు పెట్టిన రంగురంగుల నులివెచ్చదనాన్ని చలి చప్పరిస్తున్న మనుషుల ముందుకు పరుస్తుంది దూరమెంతైనా వుండనీ బతకటం కోసమే కానీ అనంతమైన ఆప్యాయత ముందు భాషరానితనం పారిపోతుంది అప్పుడే మాటలు నేర్చుకుంటున్నట్లు ఒక్కొక్క దారాన్నీ ముడివేస్తున్నట్లు పదాలను నీనుంచి నీకే పంచుతుంది పరుచబడ్డ వూలు పొదల్లోకి తోడేళ్ళు చారబడ్డట్లు దూరి, దూరి, దారాల దూరాలు కొలిచి అమ్మలేనితనాన్ని ఆసరా చేసుకుని తన ఆకలి మీద నుంచుని అరచేతులు రుద్దుకుంటూ అవసరం మీద ముసుగు కప్పి ఎంత నటించినా నమ్మితే తప్ప అమ్మటం కుదర్దని చెప్పదు. అనుమానాల (ప్రవాహంలో వూలు దారాలు పట్టుకు వేళ్ళాడుతుందేగానీ తెంచి వెళ్ళమనదు మడతల్ని విప్పి, విప్పి గంటల్ని నిమిషాలుగా మింగేస్తున్నా కనీసం కోపంగా చూడటం కూడా రాదు. మన మధ్యనే &రగే మామూలు మనిషే అయినా కోసూరి రవికుమారిాాలాలాలాలాలట్ల్రై

మీద కురిసే చూపుల పొగమంచును విసిరి అవతల పారేసే సాహసం చేయదు అదాటున చినుకులు పడ్డప్పుడు ఆ పిల్ల పడే ఆందోళన చూస్తే రెక్కల కింద పిల్లలను దాపెట్టే కోడిపెట్ట జ్ఞాపకమొస్తుంది. నువ్వూ నేనూ తోలు చొక్కాలమై వురుకులెత్తుతుంటే తను మాత్రం చక్కెర గుళికను గూట్లోకి చేరేసే చీమలాగా పెట్టెలోకి సరుకంతా చేర్చుకుంటూనే తడిసిపోతుంది. బైటి “తడి” కంటే లోపల పొడిబారటం ఎక్కువ ఇబ్బంది కదా. ఏదైతేం ఏలాగైతేం నువ్వు మాత్రం వెచ్చగా వుంటం కోసం. పచ్చిగా బేరమాడి బేరమాడి “బే యిజ్ఞతోగా కొంటానంటావ్‌. ఆమె మాత్రం “మై యవహా ఇజ్జత్‌ బేచ్‌నేకీ ఆయానహీ” అనదు. పతి ఏటా చలిని ఆహ్వానిస్తూ ఆమె వూలు కందెలా తిరుగుతూనే వుంటుంది. చలిలోకి జారిపడుతూ నువ్వూ తిరుగుతూనే వుంటావ్‌. బతుకు తూకంలో కష్టపు పళ్ళిం మాత్రం ఎప్పుడూ పైపైకే మంచుతో పాటు వచ్చే నులివెచ్చని మబ్బుముక్క ఏళ్ళ తరబడి నీకోసం నీరెండ కాస్తూనే వుంటుంది. చలీ ఆకలీ వున్నంత వరకూ చలికి ఆకలి అర్ధమయ్యేంత వరకూ- చెమట విలువ తేలనంత వరకూ ఒక నులివెచ్చని స్పర్శ నిలువునా ఆకలికి కాలుతూనే వుంటుంది

  • రంజని కుందుర్తి, మంచికవిత - ౦6 ద్ర్ర------------------- బొడ్డులీగు

నెమలీక దూసర గాలికి ఎగిరొచ్చిన నెమలీక కళ్ళను కప్పేసింది పచ్చిక చచ్చి, పాదాలతో పాపిట దీసినట్టున్న బీడు మీది బాటలో నడుస్తుంటే బొటనవేలు మీద కసుక్కున నుందారం పూసింది. ఎప్పటిదో పలకముక్క నేలలోంచి సూటిగా గుచ్చి చూస్తోంది నాకెందుకో ఇంటికాడ ఇసిరి పారేసిన బుడ్డోడి సిన్నప్పటి పుస్తకాల సంచీ గుర్తొచ్చింది. ఆకలీ, అరెకరమూ నా చేతకానితనమూ వాడి చదువుని అటకెక్కించినై వాడి పద్దేలెంత ఇంపుగా వుండేవో సందేళకు నులక మంచం కాళ్ళకట్టన వాడు వేమనో, బద్దెనో అవుతా వుంటే మసిబట్టిన కిరసనూనె బుడ్డీ దగ్గర వుసిళ్ళు తోలతా ఎంత బెమతబడేదో ఎంకట నర్సమ్మ గొడ్ల కాడికి బోకపోతే కూడెట్టనంటే బుక్కుల సంచీలో పురుగు మందు సీసా బెట్టుకుని బెదిరించిన వాణ్ణి గొడ్లెనుక గొడ్డును జేస్తెగాని నిండుకున్న కడుపుల్లోకి పున్నీళ్ళు కూడా దొరకలేదు బిళ్ళంగోడీలూ, బెచ్చాలాటలూ, గాలిపటాలూ అన్నీ వాణ్ణి మరిసేపోయినై వాడికిప్పుడు చెర్నాకోలే పిల్లంగోవీ చింతచెట్టు నీడే సలవచేసిన కొత్త చొక్కా నెమలీకై నా కంట్లో సలుపుతున్నది చిరిగిపోయిన వాడి ఒకటో తరగతి బుక్కే ములుకై గుచ్చుకున్నది. కోసూరి రవికుకూర్‌-ాాాాాాాాలట్ట్ర

ఆకలి పగలగొట్టిన వాడి మట్టి పలకే వీడు మీదిబాటలో ఇంకా వాడు బడికి దూరంగానే దూసరగాలికి దుమ్ములేపుతా పోతానే వుంది ఇంగ్రీసుబడి బస్సు అప్పుడూ ఇప్పుడూ ప్రజాసాహితి, కవిత 2005 భ్రై--------------------------- బొడ్డుపేదు

రెల్లు వొద్దుకి ఇవతలా అవతలా అలవోకగా గాలికి వూగుతూ గమ్మత్తయిన సుగంధాలు వెదజల్లుతూ జీవితాల్నీ వాటి తాలూకు ప్రకంపనల్నీ సుతిమెత్తగా బొమ్మగీస్తుంది ఆఫీసుల్లో, అడవుల్లో, రోడ్ల వెంటా, మైదానాలవెంటా తిరిగి, తిరిగీ పాదాల మీద పడుకున్న కళ్ళను దోసిట్లోంచి చల్లగా తాగే ఏటిగట్టు పక్కగా దాని ముఖమల్‌ పూలను ఒక్కసారి తాకి చూస్తే చాలు! బతుకు సంక్రాంతిలో గొబ్బెమ్మ మధ్యలో గుచ్చిన గుమ్మడి పువ్వూ ముగ్గు చుట్టూ చిందులు వేసే హరిదాసూ గుర్తొచ్చి తీర్తారు ముఖం మీది దాని స్పర్శ చిన్నప్పటి బాల్వాడీ ఆయమ్మ (ప్రేమను తలపిస్తుంది అమ్మ దగ్గర సంపాదించిన గోధుంపిండీ, నాన్నిచ్చిన రూపాయికి కొన్న గేలాంతో రబ్బరు తూటి కర్రకు వేలాడుతూ గిరికీలు కొట్టే బాల్యపు చేపలగుత్తికి తాడై నవ్వుతుంది ఒక్కొక్కసారి నేలమీద సాగిలపడి వరద పాటకు దరువు కొడుతుంది బూట్ల చప్పుడుకు వంత పాడే పాతబస్తీ వీధిలా? కోసూరి రవికుకూర్‌---ాాలాాాాాట్టి

ఆ ఒడ్డూ ఈ ఒడ్డూ గుడారాలు గుడారాలుగా మాటేసి వున్నప్పుడు మడమల్ని తడిమి తడిమి చూస్తూ వూరు అడివెందుకైందనీ? అడవి అంటుకుందెందుకనీ? గుసగుసగా పళ్చిస్తుంది చర్చల్లో భాగంగా ఆయుధాలు చేరగిలినప్పుడు మనుషుల మధ్య మీరెందుకర్రా!? అంటూ అమాయకంగా అడుగుతుంది పల్లేర్లు పాదాలను పలకరించినపుడు వంగిన చెవుల దగ్గర చేరి మట్టిని మరచిపోవద్దంటూ లోగొంతుకతో హెచ్చరిస్తుంది మబ్బు ముఖం చాటేసినా మెరుపు కత్తితో విరుచుకుపడినా ఎలా బతకాలో నేర్పిస్తుంది నూనూగు వేర్లతో మట్టిని కౌగిలించుకుని మూలాలను మరువకండంటూ గొంతు చించుకుంటుంది ఇక ఇప్పుడు తప్పదు మరి గుప్పెడు ధైర్యాన్ని అరువు తెచ్చుకుందుకు ముంగిట్లో గులాబీలకు బదులు కాసిని రెల్లు పొదలు నాటుకోవాలి సాహితి, ఆంధ్రభూమి దినపత్రిక భ్రై--------------- బాడ్వపేరు

పురుగుల దుప్పటి తెల్లారురూమున భయం మంచుపారై వీధుల్ని సమాధుల్నీ కలిపి కప్పేస్తోంది. దాడీ ప్రతి దాడుల మధ్య ఊర్నిప్పుడు వేట కుక్కలు గతుకుతున్నై ఎన్ని ఎలక్ష్రానిక్‌ ముక్కుల్లో వాసన చూచినా కల్వర్టు పక్కన తుమ్మచెట్టు ముళ్ళు క్లెమోర్‌ మైన్లె పేలే సంగతి కనిపెట్టలేదేమో!? శ్‌ ఛిద్రమైన బతుకుతెరువు చెల్లాచెదురుగా పడుంది, తెగిపడ్డ నల్లపూసలు రోడ్డంతా దొర్లిదొర్లి ఏడుస్తున్న ఒకటో తరగతి పుస్తకాలసంచీ బుగ్గలమీద ఎండిపోయిన కన్నీటి చారికలు ఎర్రబడ్డ తంగేడు పూల సాక్షిగా విరిగిపడ్డ ఆయుధాన్ని మౌనంగా పశ్చిస్తున్నై ఎద్దుమెడమీద కాడిచేసిన గాయంలా సాయంత్రం “ఎర్రబడ్డ” వేళ, గోడ మీద పోస్టరంటించిన బక్క చేతులు నిశ్శబ్దానిక్కూడా తెలీనంత నిశ్శబ్దంగా అజ్ఞాతాల ఖాతాలో. జమరాయబడ్దె పెద్దకాలవ కట్టమీద ఎర్రచొక్కా తొడగబడ్డ మేకల పిలగాడి శవంచుట్టూతా నాల్లెదు ఖాళీ బుల్లెట్లు ఏ నిజాన్ని చెప్పలేకనో సమాధి స్థితిలో వున్నై! పిల్లంగోవీ వాయించే వాడి లేత చేతివేళ్ళను పిస్తోల్లోకి వంచించారెవరో!? తప్పిపోయిన గొర్రె పిల్లను తోడేలు మింగినట్లు ఊర్నీ చావడినీ చీకటి మింగేసింది రెప్పలు మాయమయ్యేలా రెటీనాలమీద విధ్వంసాలు పోగుపడుతుంటే ఆకలి నెరైల్లో ఆవేశం నాటి రాజ్యం ఆయుధాలు పండిస్తుంటే కోసూరి రవికుమార్‌ ౧౧

అడవే ఊరయిందో ఊరే అడవయిందో!? అర్థంకాని స్థితిలో సందేళకు వీధిలైటు చటుక్కున “పురుగుల దుప్పటి” కప్పుకుంది వెలుతురుకూడా భయపడుతున్న చీకట్లో చేపట్టాల్సింది తుపాకులు కాదు చూపుడు వేళ్లూ వేలి చివర చుక్కల్లో తెరచుకునే కళ్ళూ స్వప్పించాల్సింది నెత్తురెండిన నేలమీది నిలువెత్తు స్థూపాలు కాదు పావురాయి రెక్కలకింద ఆకుపచ్చటి భూగోళాన్ని సరిచేసుకోవాల్సింది, మందుపాతర్లూ బూటకపు ఎన్‌కౌంటర్లూ కాదు నేల మాళిగలోంచి రాజ్యాంగాన్ని బయటకు తీసే పద్ధతులు

  • ఆంధ్రభూమి దినపత్రిక ట్రై బొడ్తలేరు

ఒకానొక సామూహికవు ఎదురుచూవు! ఒకానొక సామూహికపు ఎదురుచూపు! ఆశలు మూడంగుళాల లోతులో నాటి ఊరంతా ఊరిబయట దుక్కిలో కాళ్ళుపాతేసుకుని చూపు చివర తెల్లబడుతున్న నల్లమబ్బుల కోసం కళ్ళతివాచీలు పరచీ, పరచీ తడి ఇగిరిపోయిన కంటిపాపల మీదుగా నిర్దాక్షిణ్యంగా అవి పరుగెడుతుంటే ఒకానాక సామూహికపు ఎదురుచూపు! కోండ్రుతోలిన పత్తిచేలో మేడికర్ర ముక్కలై పోయినట్లు తెల్లారురూం కల బోరుగోతిలోకి అమ్మచేతి గాజులు కపిలింగులైనా పాతాళంలోనైనా తడి దొరుకుతుందేమోనని చేనంతా పంతులుగారు పెట్టిన కొబ్బరికాయ గాట్లతో ఒకానొక సామూహికపు ఎదురు చూపు! మడవ ఎయ్యాల్సిన మడిదగ్గరే రాత్రిని తలగుడ్డలో చుట్టి వాళ్ళంతా పారచేసుకుని పారేశబ్దంకోసం చెవుల్ని కాలవ చివరి వరకు పారించి ఎంతకీ కిందికి దుమకని నీటిమూటల కోసం ఒకానొక సామూహికపు ఎదురు చూపు! చేలోకి చేపలు, రాయ్యలు టేకు చెట్లు, కానుగ నూనెలూ నడిచొస్తుంటే ఎదురు చూపు చివరన ఏం మిగుల్తుంది ? ఎర్రటి కాగడా తప్ప ఏం వెలుగుతుంది! వేరుమరచిన చెట్టు నేలలోకి కుంగక ఏం జరుగుతుంది?

  • ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక

కోసూరి రవికుమార్‌ లాలా)

ఎన్నెల బెట్టు ఆకు పచ్చటి దుప్పటిలోంచి నాలుగైదు రెక్కలతో సన్నటి కాడతో మంచు జారుతున్నట్లుంది రుల్లున కురిసిన తెల్లటి వెన్నెలతో నేలంతా ముచ్చట్లు చెపుతున్నట్లుంది అప్పుడెప్పుడో చెల్లాయి కోసం నాన్న తెచ్చిన బుట్ట చేతుల గౌను తొడుక్కున్నట్లు ఫుట్‌పాత్‌ సిగ్గుల మొగ్గయింది. ఛ1 ఏంటిదీ, నా గౌలితిత్తులకు శక్తి ఇంతేనా ఇంకాస్త పెద్దవి చేసుకుంటే బాగుండు నాసికలోంచి దేహమంతా పాకిన కమ్మటి గుబాళింపు కళ్ళలో ్రతిఫలిస్తోంది. కాడల్లో జతకట్టించి చేర్చి కూర్చిన దండ నా మెడలో వేసిన మరదలికి నే పెట్టిన కాకెంగిలి నూగుజీడి గుర్హొచ్చి గతపు గంధపు పూత మనసంతా చక్కిలిగింత పెడుతోంది ఒక్కొక్క రెమ్మను రెండు వేళ్ళతో సుతారంగా నలిపి ఊది, సిద్దూగాడి నెత్తి మీద టప్‌.. మనిపించినప్పటి ఉ్రు--------------------- బొడ్డుపీగు

రాధ బాధ చూపు గుర్తొస్తున్నది. జ్ఞాపకాల అగరు పొగలో మత్తుగా తూలి, మేలుకొంటే నట్ట నడి రోడ్డులో నేను ఎవరు నాటారో ఈ మనసు పూల మొక్కను ఈ రోడ్డు పక్కన ! ఈ పూల సుగంధం కోసం నగరమంతా ఇక్కడే తిష్టవేస్తుందేమో ఇక.. ప్రియమైన నగరవాసులారా ఊపిరి వాడి పోకుందుకు, వారసులకు అపార్ట్‌మెంట్లతోపాటూ, ముంగిట్లో నాలుగు పున్నాగ పూల చెట్లు రాసి ఇవ్వండి చాలు

  • నేటినిజం దినపత్రిక కోసూరి రవికుమారి--ాలాాాాాట్తు

మట్టి గాజులు తరగతి గది అద్దమై భయపెడుతోంది నన్ను చిరిగిపోయి రెపరెపలాడుతున్న పేజీలూ తెగి కాలికింద పడుతున్న మువ్వల పట్టీలూ ఎర్రగా ఎండిపోయిన నల్లబల్లా చేష్టలుడిగి చేతులు నిలిచిన గోడగడియారమూ నిరంతరం అద్దమై నిద్రలో ప్రతిఫలిస్తూనే ఉంటాయి. ప్రపంచమంత గ్రామంలోకి పడమర పాదుల్లోంచి తీగెలు తీగెలుగా ఉన్మాదం ఊసర క్షేత్రమై పరచుకొంటుంటే విద్యాలయపు వాకిట్లో ప్రతిష్టించాల్సిన సరస్వతి వీణకర్ర కత్తిలా మెరుస్తోంది. పాఠాలుగా పరవశించాల్చిన సమయంలో వెనుక బెంచి అసహనంగా కదుల్తోంది. (ప్రేమ ఆవహించిన ప్రతిసారీ అదొక వాంఛా జ్వలిత మృగం. మానసిక రుగ్మతావలయంలో చిక్కుకున్నాక ప్రతి తిరస్మ్కారమూ దానికొక అహంభావ ప్రజ్వలనం. తలలో తచ్చాడే ఆలోచనను చొక్కా కింద దాచుకొని అమాయకంగా కూర్చుంటుంది. బతుకును తవ్విపోస్తున్న బరిసె సంగతి ఎన్నిసార్లు విన్నవించినా తుప్పు పట్టిన తుపాకీ గొట్టంలో దూది దూర్చుకొని వూర్ముంటుంది. ఎక్కుపెట్టాల్సినవన్నీ పక్కన పెట్టబడిన తర్వాత తాపీగా తలను తెగేసి. మెడ చుట్టుతా ఏడుపులు పోగులు పడుతుంటే - దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు సినిమాలోలా శ్ర వాడ్తుపేరు

ఎక్కడో లొంగుబాటు ప్రకటిస్తుంది. స్వష్నాలన్నీ శిధిలమయ్యాక భళ్ళున నిద్రలేస్తాయి బౌండు పుస్తకాలు విచారించి వివరించే లోపు సమాధుల దగ్గర నాటిన చింత చెట్లు పూస్తాయి. శిక్ష సక్రమమో అక్రమమో తెలియకపోతే పగిలి పోయిన మట్టి గాజులని పశ్నించు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కొమ్మలు నరకబడ్డ మావిచెట్ల నడుగు నిఖార్సైన తీర్పునిస్తాయి. నెప్పి ఆయుధానికీ తెలియాలంటే కంప్యూటర్‌తో పాటూ కత్తి తిప్పటంలో తర్చీదివ్వాలి. మట్టి గొజుముక్కల్ని బైండు పుస్తకాల అట్టల మీద తెల్లబొమ్మ చేతుల్లోని తక్కెడలోనూ ్రతిష్టించాలి. పాఠాలతో పాటూ పరమహింసల తత్వాన్ని బోధించాలి. = మిశాలాంధ్ర దినపత్రిక కోసూరి రవికుమారిాాాాాాాలట్ల్త్రు

పరారీలో వున్న వూరిగుడిసె కొసం పాదాల కింద పెంకులు నలిగిన శబ్దం బహుశా ఈ పల్లెలో చూరుకింద చల్లకుండ బద్దలై పోయినట్టుంది కొట్టంలో తెగిపడిన పలుపు అల్‌కబీర్‌ కరెంటు తీగల్లో చిక్కుకున్న లేగ గాలిపటం కోసం నేలంతా మూచూస్తున్నది ఎంతకీ రాని ఏరువాక కోసం చూచీ చూచీ ఎండిన గెనాల మీద అడుగులు తడబడుతూ పచ్చదనపు వాసన కోసం బసవన్న పరాయిదేశపు దారి పట్టాడు గెదెల కాశీం ఈతకోసం చేతులు బార్లా చాపి పెద్దకాలవ నిలువునా నిలబడిపోయింది పంచాయితీలు పంచాయితీలై ఎన్ని రాత్రిళ్లో నిద్రమేల్శొన్న కానుగచెట్టు పరారైన పూరిగుడిసెకోసం తెరచిన కన్ను మూతనబడక జ్బరపడి ఉంది దుక్కి లేదు, దున్నపోతు కొమ్ము మూత్రం సావిడి దగ్గర తుప్పుపట్టిన ఆరె పక్కన పడుంది కొండవాలున ఎన్ని దప్పికలకో దోసిక్సై పారిన సన్నటి సల్లనీట్‌ పాయ రక్తపు సారలైన బూట్లను చూచి బండైనా పర్లేదని కొండ గుండెల్లోకే ముడుచుకుపోయింది. అపుడెపుడో మనిషున్నాడన్నట్లు వీధి గోడలన్నీ ఎర్రమట్టి అక్షరాల ఆనవాళ్లు పేలిన క్లెమోర్‌మైన్‌ సాక్షిగా తూట్లు పడ్డ నెలజీతం సాక్షిగా తా వడకకు

నిర్దాక్షిణ్యంగా కూల్చబడ్డ జొన్న చేను కాపలాల సాక్షిగా ఇప్పుడు నా పల్లె రాజ్యం రోలర్‌ కింద బడ్డ బక్కచిక్కిన మేకపిల్ల చీకట్లో జరుగుతున్న యుద్ధంలో శత్రువెవరో మిత్రుడెవరో తెలీకుంటే ప్రతీసారీ గంతలు గట్టుకునంటున్న మన తలలను నిందిద్దామా!? వాటికే చూపులు మొలిపిద్దామా!? తేల్చండి ముందు

  • ఆంధ్రప్రభ దినపత్రిక కోసూరి రవికుమార్‌

ఏకలవ్యులు మళ్ళీవేళ్ళుకోసిచ్చేశారు అసలింతకీ ఈ ఏకలన్యులు ఏం నేర్చుకుంటున్నారో తెలీదు నిలబెడతామని వొచ్చిన ప్రతి ద్రోణుడి ముందూ బొటనవేళ్ళు కోసుకుంటున్నారు బాణమెయ్యటం అటుంచి బానిసల్లా సాగిలపడి మొక్కుతున్నారు పోయాక కూడా వుండిపోవాలని సమాధి కట్టించుకుంటున్న తాత మనవడి రియల్‌ దెబ్బకు బతికుండగానే సమాధిలో దూరి తలుపేసేసుకున్నాడు వేలంపాటలో లడ్డూను ఎలుక ఏడులక్షలకు కొనటం చూచి వినాయకుడు “ఆత్మహత్య మహాపాపం” బోర్డుకు తలబాదుకుని ఏడుస్తున్నాడు కండువాల కొలువులో కదలికలు చూచి రింగురోడ్డు సరే నీ పార్కు సంగతేంటని అడుగుతారనే భయంతో బుద్ధుడు ఒకటేపనిగా పచార్లు చేస్తున్నాడు తోడుకోసం ఎన్టీఆర్‌ను ఎలుగెత్తి పిలుస్తున్నాడు _ ఇపుడు టాంక్‌బండ్‌ మీద అన్నీ ఖాళీ దిమ్మలే!? విగ్రవోలన్నీ మూడు ముఠాలుగా సమాలోచనల్లో యోగివేమన తన దిమ్మను మాయంచేసిన ఖద్దరు గారితో గోచి బిగించి గోదాలో దిగి అటేపుగా పాక్లెయిన్‌ వచ్చినపుడల్లా పొలమారిపోతున్నాడు టై బాడ్తుకీరు

ప్రాజెక్ట్స పేరంటానికి ముందే ఆనకట్టలకు జనరక్త పారాణి పండే ఎకరాలు సరే మునిగే మడిచెక్కల సంగతేంటని పాఠరలూ పలుగుల నిరాహారదీక్ష న్‌ళ్ళు పారేలోపు నేల మాయమై పోతోందని బాణాలూ బరిశెలూ ఇందిరా పార్కులో సమావేశమయ్యాక రాజ్యమంతా రాజీలేని హింస ఇక జనమంతా పారేసుకున్న వేలిముద్రల్ని వెతుక్కుని కబంధుల చేతులు కట్టిపడేసేలా కోర్టుగదిలో తక్కెడ పళ్ళెం తిరగబడేలా దృష్టిమందగించిన చట్టపు కళ్ళల్లోకి గుచ్చి, గుచ్చి చూడాలి . = నేటెనిజం దినపత్రిక కోసూరి రవికుకూరి-ాాలాలాలాలాాట్ట్రి

టెర్మినటర్‌ ఇక్కడ వీడెవడో చీకటికి అంటుకట్టి చివురింపచేయాలని చూస్తున్నాడు. రష్యా ముక్కలైందని రంగు, రంగుల జెండాలవుతున్నాడు. ప్రపంచాన్ని పొగాకులా నలిపి తన పైపులోకి నెట్టుకోవాలని కలలు కంటున్నాడు _ఏరుపు ఎంత సజీవమైందో వాడి కంప్యూటర్‌ స్కీన్‌కేం తెలుసూ!? వాడి వెబ్‌సైట్‌లో సైబరాబాదులూ ప్లెఓవర్లూ తప్ప బషీర్‌భాగ్‌లూ చౌరస్తాల్లోకి నడిచొచ్చే కరెంటు స్తంభాలూ వుండవు కదా పేగు దారాలతో ఆకలిమగ్గం నేసే ఆత్మహత్యావస్త్రం సంగతి అసలే తెలీదు ఫ్యాబ్‌ సిటీలూ బూట్ల కంపెనీలూ తప్ప, పిడచగట్టుకు పోయిన పైరు గొంతులుపాడే ఎండిపోయిన పాటలూ పురుగుమందు దరువులూ అస్సలు టెలీకాస్టు కావు రోడ్డుకీ రోలరుకీ మధ్యలో అదృశ్యమైపోయిన టీ బండి సోమూ అరటిపండ్ల ఆదిలక్ష్మీ మనుషులేనని వాడికి తెలీదు వాళ్ళ ఆప్యాయమైన పలకరింపులు వాడికి వినపడవ్‌ ఆకలీ ఆక్రోశం కంటిచివర మొలిపించే ఎరుపు జీరల సంగతీ ఎర్రబారిన కన్నులే ఎర్రెర్రని జెండాలై

“విశాలాంధ్ర” నిండా విరబూసే సంగతీ తెలీటంలేదు వాడికి ఎత్తిన కొడవళ్ళమై వాడి ఆలోచన కంకుల్ని కోసేస్తే తప్ప రక్తం ఎర్రగా వుంటుందని వాడి క్లోనింగ్‌ మెదడుకు తెలీదు మోదే సమ్మెటలమై వాడి అద్దాల మేడపై బడితే తప్ప “భూ కంపం గురించి వాడికి అర్థం కాదు జాగ్రత్త సుమా వాడో టెర్మినేటర్‌ విత్తనం ఒక్కసారి నాటుకున్నామా వాడుతప్ప ఇక మనం మొలవనే మొలవం = విశాలాంధ్ర దినపత్రిక కినూరి రికమార-ాాాా భి

చొక్కా చీపురు ఆకలికి మాట్లాడ్డం తెలుసు కడుపుతో కాట్లాడ్డం తెలుసు తెలీనిదల్లా చిరుగుల చొక్కా చీపురవుతున్నవైనమే! ఆకాశమంత స్కూల్‌ బ్యాగులో చందమామ కనిపించకో చల్లారి పోయిన క్యారియర్‌ లోంచి పాలబువ్వ మాయమైనందుకో అమ్మా నాన్నల ఇజాల పోట్లాటల్లో ఇంట్లో వమూలా ఇల్లు కనిపించకో హఠాత్తుగా ఒక జీవితం టిక్కెట్టులేని రైలు ప్రయాణం అవుతుంది ఆకలికి రంగు ఆపాదిస్తే ఎరుపే అవుతుందనుకుంటా ఏదో ఒక ష్షాట్‌ఫాం రెడ్‌ కార్బెట్‌ స్వాగతమిస్తుంది. అమ్మవొడి కావాల్సిన రాత్రి సిమ్మెంటు బెంచీ అవుతుంది పంపునీటి జోలతో, వాడి కడుపు నిదురలోకి ప్రవహిస్తే అపుడపుడూ వాడ్ని యూజ్‌ అండ్‌ డ్రో చేస్తుంటుంది క్యాంటీన్‌ కుప్పతొట్లో ఉదయించే ఇడ్లీ సూర్యుడి కోసం వాడికడుపులోని చీకటి ఆశగా ఎదురుచూసే ప్రయాణాల నిండా పోగులు పడ్డ కాలక్షేపాలు చిరుగుల చొక్కాను చీపురు చేస్తాయి బూట్ల జతా హైహీల్ఫూ కాళ్ళూపు కుంటూ కూర్చునీ బద్దలైన బాల్యాన్ని వెగటుగా చూస్తూ, కిటికీ పక్కనున్న ఖరీదైన సెంటుసీసా అసహ్యాన్ని ఖర్చీఫ్‌ చేసి ముక్కుకడ్డం పెట్టుకుంటూ, బెర్త్‌ మీదినుంచి ఖద్దరు లాల్చీ ప్రభుత్వ వైఫల్యపు బోడిగుండుని వాడి ఆకలి మోకాలికి ముడిపెడుతూ, (బ్రెయిన్‌ (దైయిన్‌లోంచి ఓ మేథావి డ్రా బొడ్డుపీగు

బడీ ఇండియా ఆకాశంలోకి ఉమ్మేసుకుంటూ, ప్రయాణిస్తుంటే రొట్టెముక్కగా కూడా మారలేని మాటల్ని మూటగట్టి మన మొండాల మీదికి విసిరేయడు. ఆకలి లోపలికి తొంగిచూడలేని కడుపునిండినతనాన్ని పేరుకున్న కొవ్వపొరల్లో గుచ్చుకునేలా ప్రశ్నించడు ఆకలి మొలిపించిన ఆశలతీవల్ని నరుక్కుంటూ మౌనంగా నిష్రమించే పరిశుభ్ర పధికుడు వాడు!!??!!

  • ప్రకృతిసాహితి, సాహిత్య పత్రిక కినూరి రికకారాాాాాాాళి

బొటనవేళ్ళవాన

ముందస్తు మండువేసవిలో బొటనవేళ్ళు కురుస్తాయని గుడిశెల చుట్టూ ఎన్ని బెకబెకలో! చేలో ఎన్ని ఊపిరులు ఆవిరైనా నది నత్తగుల్లె, పుట్టుకలోకి ముడుచుకుపోయినా పత్తి ప్రమిదలో వత్తెన కళేబరం దగ్గర కూడా కాళ్ళబేరమాడుతున్నయ్‌, ఎన్ని ఊళలో!! సమయం, సందర్భం చూచుకుని మరీ తెరమీద చెల్లని చిల్లర బొమ్మలన్నీ తలొకగొట్టం పుచ్చుకుని ఓండ్రపెట్టడానికి సిద్ధం!!! తక్కెడలోని కప్పలన్నీ ఇపుడు “మూదోపళ్ళిం” కోసం గెంతుతున్నాయ్‌ ఒక్క నల్లటిచుక్క చూపుడువేలుమీద అమావాస్వై జీవితాల్ని చీకటి చేస్తుందని తెలిశాక వరుసల్లో నుంచున్న ప్రతిమనిషీ వెలిగే కాగడా అయి, నోటు చీకట్లను తరిమికొట్టాలి మేనిఫెస్టో తామరాకుల మీద నీటి బిందువై దొర్లిపోవాలి. మాటల కోటల కింద ఓటు మందుపాతరలు పేల్చి రాజ్యాంగపు నేలమాళిగలోంచి నిఖార్సైన ఐదు సంవత్సరాలను పరిపాలనకు తెచ్చుకోవాలి

  • నెల్లూరు జల్లా రచయితల సంఘం ప్రత్యేక సంచిక ిాాాాాాాాబాప్తకరు

బొడ్డుపేగు ఎంత తుపాకీ అయితే మాత్రం అక్షరాన్ని అదుపులో పెట్టటం సాధ్యమయ్యేపనేనా? అద్భశ్యాల ఆనవాళ్ళ కోసం దృశ్యాలను నిషేధించాలనుకోవటం ఎంతవరకూ సమంజసం! అర్ధరాత్రి తలుపువెనుక నక్కిన మేకపోతు ఎంతటి గాంభీర్యం ప్రకటించినా కళ్ళను ఖైదు చెయ్యగలదేమోగానీ వాటి కలల్ని చెరిపెయ్యలేదు కదా కళ్ళు కవిత్వం చెబుతున్నంతకాలం దాని ముసుగులు చిరిగిపోతూనే వుంటాయ్‌ ముసుగులేకండా ఐతకటమొకటే దానికి మిగిలింది వెన్నెల కాయకుండా వుండాలని చంద్రుడ్ని జైల్లో పెడుతున్న దాని వెర్రి ప్రయత్నం చూస్తోంటే నాకు నవ్వొస్తోంది. కవిత్వమంటే .. .. మంటే! వెన్నాలంత చల్లని మంట! వేల వేల గుండెల మీద వేలాడే డప్పులు చలికాచుకునే మంట కణ, కణ లాదే వాటి దరువు వినే దమ్ము దాని చెవులకుంటే ఇప్పుడిలా అక్షరాల్ని నిషేధించేదే కాదు కోసూరి రవికుమార్‌ ఆం

అకలి గొంతులు పాడే జానపదమన్నా దానికి గొంతెమ్మ కోర్కెలానే వినబడుతోంది. ఒక్కొక్క నిర్వంధమూ ఆకురాయి అయి అక్షరాలకు పదునుబెట్టాలిక విరిచి విసిరేసిన పాళీలన్నీ గిరిజనుడి బాణం ములికి మీద చేరి గురి కుదర్చటం మొదలెట్టాలి ప్రశ్నించటం నేరమంటున్న చోట ప్రశ్నలే కొడవళ్ళుగా సంకెళ్ళు తెంచుకోవాలి సాలెపురుగు అల్లినట్లు కవిత్వం అల్లి, అల్లి దీన్ని చుట్టేయాలి ఊపిరాడక జనంలోకి పరిగెత్తు కొచ్చేలాగ దీని దౌష్ట్యాన్ని ముఖం మీద పచ్చ, పచ్చగా, పచ్చబొట్లుగా నిరసించాలి చెరిగిపోని పర్యవసానాన్ని చరిత్ర పేజీల్లో లిఖించాలి ఉద్యమాల బొడ్డుపేగును తెంపిపారేయాలనే కుట్రను భగ్నం చేసితీరాలి

  • ఆంధ్రభూమి దినపత్రిక --------------------బాద్తుపీరు

ఒకే ఒక్కవానచినుకు

వెలిగే దీపం చుట్టూ

ఎగురుతున్న రెక్కల పురుగులా

వాన దీపం చుట్టూ

బలం మందు బస్తాలతో నేను ।

వాన ఆగదు

ముడతలుపడ్డ చేను ముఖం మీద నుంచి

నారు ప్రాణం పోదు

ఒక్క వాన చినుకు కోసం

గుక్కపట్టి ఏడ్చిన నా చేను

గుక్కెడు మంచి నీళ్ళ కోసం చెలమలో

వేళ్ళు గునపాలు చేసుకున్న నా పెద్ద బిడ్డ

పిడికెడు పచ్చగడ్డి కోసం నారు మేస్తారని

మూతికి చిక్కంగట్టించుకున్న నా రాముడు, భీముడు

కురిసే వాన కింద కుదేలయిపోయారు.

ఈ ఏటికి అంతా పచ్చనే అనుకున్నాగానీ

కళ్ళు పచ్చబడేటట్లు కురుస్తుందనుకోలా

గుక్కపట్టిన చేను గొంతులో

పొలమారిపోయేటట్లు చొరబడ్డదీ పాడు వాన

నులివెచ్చని, పచ్చని నారు మడి మీద

ఆంబోతు పడ్డట్లు ఉరికిపడిందీ మూర్ధపు ముసురు

వాన ఆగదు,

నీటి నిప్పుతో తగలబడిపోతున్న నా ఆశల గడ్డి వాము ఆరదు చివరకి గడ్డికీ కొరగాని మేట భూమి మీద

వెన్నెముకల గుట్టలు పేరుకున్నాక కాట్లాడుకోండి

ఆనకట్టలు కట్టాలో వద్దో

తేల్చుకోండి వాటాల వేటలో

గాజులు ఎవ్వరు తొడిగించుకున్నారో కోసూరి రికమార-ాాాాాి

ఇక్కడ పగిలిన గాజుల గుట్టలు మీ పాదాలలో దిగేందుకు పురుగు మందు పూసుకొని తయారు అవుతున్నాయిలే

  • ఆంధ్రభూమి దినపడ్రిక (----------------బార్తకేరు

మనిషీ మట్టే తోడేళ్ళు మళ్ళీ . మనుషుల్ని తొడుక్కున్నాయ్‌ కూడబలుక్కుని ఊర్చిండా స్మశానాన్ని చిత్రించాయ్‌! నది తలతెగిన నావమీదపడి ఏడుస్తోంది బ్రహ్మజెముడు పొదలు భయానికి దుష్పట్లయి రాత్రంతా ఊపిరి బిగపట్టే వున్నాయ్‌ తెల్లవారాక నరకబడ్డ పల్లెను చూచి బావురుమంటున్నై జెండాలు జెండాలై నేలకొరిగిన బిడ్డల్ని నేల నేరం చేసిన దానిలా చూస్తోంది ఇన్నాళ్ళూ ట్రాక్టరు టైర్ల కింద నలిగిపోయినా మొన్నీమధ్యనే మొలిచి గెలిచిన నాగలీ కొడవలి వీధిలో నిర్జీవంగా పడివున్నై కథల్నీ కలల్నీ కోల్పోయి దిగాలుపడ్డ నులక మంచాన్ని చూచి కుమిలి.. కుమిలి ఏడుస్తోంది! కూలిపోయిన గుడిసె తెరచివుంచిన రేపటి వాకిట తెగిపడ్డ పావురం రెక్కలు వీధి మలుపు సాక్షిగా తెల్లవారురూమున చీకటిపడ్డ బతుకులు చింతచెట్టు చుట్టూ చిన్నబోయిన అరుగుమీద తల్వార్లు తల్వార్లుగా తూటాలు తూటాలుగా పడివున్న దౌర్దన్యపు టానవాళ్ళు కోసూరి రికమారాాాాా భి

రెక్కలు ముక్కలు చేసుకుంటారని ముక్కలు ముక్కలుగా నరకబడ్డ ముక్కుపచ్చలారని రెక్కలు

చందమామ సాక్షిగా

ఎర్రబడ్డ పాలబువ్వా

మంచెమీదనే మరణించిన కాపలా ఆకలిని హత్యచేశారని తెలిశాక సహగమనానికి సిద్ధమవుతున్న

_ కాలగా మిగిలున్న ఆఖరి గోధుమకంకీ

ఇవి ఏ నాటకానికి నాందీదృశ్యాలు!? ఇది ఏ తరాలకు మనం రాయబోయే ముందుమాటలు!!??

గుప్పెడు మట్టిని

గూడెంమీద చల్లి

మట్టిని మట్టిచేశాననుకుంటే పొరబాటే ఒలికిన రక్తం ఆయుధాల బతుకులకు గ్యారంటీ ఇవ్వలేదని నిందించొద్దు హింస ఇపుడు “బూమెరాంగ్‌"”

వద్దు వద్దు మనుషుల్ని

మందుపాతర్లు చెయ్యొద్దు

=-1997 ఎక్స్‌రే ఉత్తమ కవిత

ట్రు-------------------- బొడ్డులీరు

మట్టి మట్టి ఒక గొప్ప విత్తనం ఇప్పటికీ మొలుస్తూనే వుంది. స్వతంత్రమై సంవత్సరానికోసారి విరబూస్తూనే వుంది మట్టి ఒక గొప్ప ఉద్యమం! మన్నెంలో బాణమై భగత్‌ చేతిలో బాంబైంది అజాద్‌ హింద్‌ పౌజై అహింసై, సత్యాగ్రహమై వురకలెత్తే పిడికిళ్ళ గొంతున వందేమాతరమైంది మట్టి ఒక మహామస్తిష్మం! స్వరాజ్యాన్ని స్వప్నించింది చౌరస్తాలో పోగులు పడ్డ విదేశం మీద అగ్గిపుల్లెంది ప్రకాశం ఎదుగ్రొమ్మున ఎగరేసిన జెండా అయింది డయ్యర్‌ తుపాకీకి ఎదురెగిరిన నిప్పు రెక్కల తూనీగైైంది మట్టీ ఒక మహాశిల్సి! సిపాయిల్ని చెక్కి తుపొకీల తిరుగుబాటు చేసింది ఉప్పుగల్లు మీద ఉప్పెనను మలచింది వురికొయ్యన వేలాడే దేహాలను ఒంటరి జైలుగది గోడలమీద మండే అక్షరాలుగా చెక్కింది మట్టి ఒక మవాో ప్రవాహం! విష్లవాలను, ఉద్యమాలను ఒరుసుకుంటూ ఎర్రకోట బురుజులకు మూడు రంగులద్దుకుంటూ మనిషిలోకి మనిషిని తర్జుమా చేస్తూనే వుంది మట్టంటే. నిలువెత్తు స్వాతంత్ర్యపు చిత్రం మట్టంటే తాతయ్య జైలు నుంచి రాసిన ఉత్తరాల కట్ట బహుశా మళ్ళీ మట్టీ మనిషీ ఒకైలేన తం(త్రం ఒక సజీవ స్పర్సె మిగిలెద్తి వ గ్‌ ర కోసూరి రవికుమార్‌ “్లైా6ళాజాక్తూాాడాోా

“జింంిత్ర” నిన్న సాయంత్రం నుంచీ కరెంట్‌ లేదు రోజూ మేం కొట్టుకుపోయే వరద రాలేదు డాబా మీద మబ్బుటద్దంలో నన్నునేను చూస్కుంటూ సీకో ఉత్తరం రాస్తున్నా బామ్మా! డిజిటల్లీ యువర్స్‌ అంటూ నిదుర రెప్పలు విప్పి మఠీ రెట్టలేస్తున్న కేబుల్‌ కాకులు లేకపోయే సరికి నులక మంచం కాళ్ళకట్టన నా చెవుల్లోకి నువ్వు కథలై ప్రవహించిన సంగతి గుర్తొస్తోంది రాత్రుల్ని డబుల్‌ కాట్లమీద ఎన్ని గంటలు దొర్లించినా చిన్నప్పటి బొంత మీది నిద్ర దొరకటంలేదు వంట ఇంట్లో ఓపెన్‌ చేసిన వెబ్‌సైటై ఆవిడచేసిన తోటకూర ధూం ధాం కెలుకుతూ బువ్వల బల్ల దగ్గిర బుజ్జిగాడి చికాకు వాట్‌ డాడ్‌ వీకెండ్‌లోనైనా సైబర్‌కేఫ్‌లో ఫైబర్‌ ఫుడ్‌ తిననివ్వరా!? జర్మన్‌సిల్వర్‌కంచంలో ముడిచింతకాయపచ్చడీ తులసికోట మీది కబుర్లూ ఏమైపోయాయో!! అలారం నెత్తిన మొట్టిన దుప్పటి ముసుగు ప్పాష్పా డిస్క్‌ఫోర్‌లో రికీమార్టిన్‌ని ఆన్‌ చెయ్యమంటూ ఆర్డరు తెల్లవారురూమునే నీ పూజతో నేను చిన్నప్పుడే శివస్తోత్రమైన సంగతి మరిచిపోతున్నా సిటీబస్సేంటి అసహ్యంగా - ఆటోలో వెళదాం మ్యాటరాఫ్‌ థర్టీరుపీస్‌ ఆవిడను వింటూంటే , నీ పాదాలకు మోకరిల్లిన ఎర్రచేనూ సీ రెండు చేతులకూ దండంబెట్టిన ఎనిమిది గెనాల గడ్డిమోపూ గుర్తుకొచ్చి ఎటు పరుగెడుతున్నామో అర్ధం చేసుకోలేకున్నా ట్ర బాడ్డుపీడు

బామ్మా నీకు తిలుసా!?

ఇక్కడ చావు పేరంటానికీ బఫే డిన్నర్హుంటాయ్‌

కానీ. సంక్రాంతికి పోసుకునే భోగిపళ్ళు మాత్రం మాయం భోగిమంటలుండవు

ఫైర్‌ప్లేస్‌లో పడే పచ్చని చెట్లుంటాయ్‌

కాలం ఎత్తుకుపోయిన పండుగలన్నీ

ప్రత్యేక కార్యక్రమాలై పేపర్లలో ఫోటోలై మిగిలాయి సంవత్సరానికొకసారి క్రిస్మస్‌ తాతలా వచ్చే మిలట్రీబాబాయి కనపడ్డంలేదు.

ఆకుపచ్చ యూనిఫాం సరిహద్దుల్లోనే మిగిలి

తుపాకులు మాత్రం అడవుల్లోకి

బీహార్‌ పొలాల్లోకీ రాయలసీమ వీధుల్లోకీ వచ్చేశాయ్‌

ఏం చేసేది బామ్మా?

ఉప్పో కర్పూరమో జేల్చుకుందుకు నాలుక వుంటేగా మాకు సిగరెట్టెంది గుట్కా ఐంది చివరికి కాన్సర్‌ పుండైంది ఇంకా రుచులేం తెలుస్తాయ్‌ బామ్మా

సంవత్సరమంతా నీ కష్టం కుప్పెతే

ఎరువు చల్లిన చేను నాలుగిళ్ళ ఆకలి తీర్చేది

పీర్ల పండక్కి మా కందరికీ బూరలు కొనిచ్చేది

నలభై బస్తాలు రసాయనాలు ధారపోసినా

ఇపుడు నాల్గు గింజలు పండటంలేదు

యూరియాకూ గడ్డికీ కూడా స్కాములు తప్పటంలేదు!! బామ్మా కరెంటొచ్చేస్తుందేమో భయంగా వుంది

మళ్ళీ నా తలలో కేబుల్‌ కాకుల గోల మొదలవుతుందేమో కార్పొరేట్‌ కార్యక్రమాల మత్తులో

తల తలలాలేదు

తల తీసేస్కోవాలనిపిస్తోంది

వుంటాను బామ్మా

ఉష్ట్రపక్షినై నా బతుకు ఇసుకలో తలదూర్చుకోవాలి

= నేటినిజం దినపత్రిక

కోసూరి రవికుమారిలాాలాలాలాాడ్త్రు

రేపటికి! పరుగెత్తి పరుగెత్తి పాదాలు పవళించినవేళ అలుపు మంచుపారై దారి మీద దాడిచేస్తోంది వచ్చిన దాదివెంట నాలుగు మొక్కలు నాటినా బాగుండేది నడక తడబడినవేళ నిలువెత్తు నీడనిచ్చేవి వంగిన నడుముకోసం వంకీ కరైనా ఇచ్చేవి తవ్వి పోస్మున్న గతంలొోంచి దారి కనబడనంతగా సిమెంటు ధూళిమేఘాలు కమ్ముకున్నై మనుషులూ, మనసులూ అంతా సిమెంటై ఇరుకు గదుల్లోకి, ఇనుపతెరల్లోకీ సర్శకుంటున్నప్పుడు మానవీయ స్పర్శ ఎలా దొరుకుతుంది పసితనాలను పంజరంలో పెడుతున్నప్పుడే పరాయీకరణ ప్రారంభమవుతున్నప్పుడు పనికి, పనికిరానితనాన్ని ఎలా భరిస్తారు? అనుభవాలూ ఆప్యాయతలూ అవసరమే లేనప్పుడు కళ్ల నుండి వచ్చేది ఖనిజ జలమేనా? అని అడిగేతరమే మిగిలుతుంది రేపటి కోసం దాపెట్టేందుకు ఏ చేతవెన్నముద్దా మిగలనపుడు రెప్పలుగా మనం శ్రై----------------------- బాడ్తువీదు

స్వప్నాలను రక్షించుకోవాలంటే సంస్పృతిని, సంప్రదాయాన్నీ పండుగనూ చలువపందిరి కింద ఊరు ఊరంతా పంచుకోవాల్సిందే కోలాటమై వీధులన్నీ తద్దినక ఆడాల్సిందే అమ్మ “పల్లెను అమెరికా కాకుండా ఆపి తీరాల్సిందే. చల్లకవ్వం చప్పుడుతో కోలాలకు చావుడప్పు మోగాల్సిందే తెలుగుతనపు తెగువంటే పల్లెతనపు పదునంటే పెద్దన్న బుష్నుగాడి తమ్ముళ్లకు గుండెల్లో గుబులు రేగాల్సిందే రేపటికి ఇవాళే రూపుదిద్దాల్సిందే = తిశాలాంధభ్ర కోసూరి రవికుమార్‌---ాాాలట్త్రి

వపంటాపామూ! ముడుతలు పడ్డ అవ్వముఖం నెరై గొట్టిన రేగడి చేనై పిలిచీ మడిసి కంటే మట్టినయంరా అయ్యా అన్నాకా! ట్రాక్టరు ఆయిలు కోసం పుస్తెలు పసుపు కొమ్మైనాకా ఎక్కిరిస్తున్న దుక్కికి వచ్చీరాని నీరుగట్నా పిల్లపెళ్లినీ, పిల్లాడి చదువునీ “బుర్రిలోంచి ఇత్తనాలుగా వదుల్తావుంటే నా పేణాలన్నీ అరసేతి లోంచి నేల నెర్రెల్లోకి జుర్రుకున్నట్లనిపించింది. వొట్టిపోయిన మబ్బులొంక పాఠరీ పారని సూపు సారించి సూస్తంటే “కాంగా కాంగా పాలుబొయ” అంటా సిన్నప్పుడు సేలో పడ్డ పాటు గ్యాపకవొచ్చింది రాలే ఒక్కో చుక్కా నోళ్ళు తెరిచిన పిట్టల్లాంటి సాళ్ళలో పడతావుంటే మట్టి రెక్కల్లో పాదువుకున్న విత్తనం వళ్ళు విరుచుకున్నట్లయింది పాతగుడ్డలో కట్టిన సద్ది మీద కొరివికారపు ముద్దజూస్తే అమ్మ మొగమ్మీది రూపాయి కాసంత బొట్టు గురుతొచ్చింది ఒక్కో మొక్కా మోసులెత్తతా వుంటే పెద్దబిడ్డ బుట్టినప్పటి మా యాడదాని కట్టం గురుతుకొచ్చింది మొలిసిన సేనంతా వూడలు దిగతా వుంటే ములకోల సేతపట్టిన నాయినలా అగపడ్డది కాయ గట్టిన మొలక పీకిసూస్తే పిల్ల పెళ్ళి పందిరి గానొచ్చింది, పిలగాడి కాలేజీ ఫీజు గానొచ్చింది కానొచ్చింది కానొచ్చినట్లుంటే మంటల్లో పనేముందీ!? శైాాాాాాాా బాస్తపేకు

తెల్లారే సరికి బతుకులల్ల సీకటి బడకపోతే

పురుగు మందుతో కలబడే అవుసరమేముందీ

సర్మారు సాయానికీ పురుగు బట్టి గనపడ్డాకా

నమ్మిన మట్టే నట్టేట ముంచాకా చలేముందీ

పంటే పామై కాటేసింతర్వాత

ఇత్త నాలుకు బదులుగా బతుకులు కొల్పుకున్నోణ్ణి

పంటల మంటల్లో పద్దురాయక తప్పేదేముంది

ఎన్నైముక జెండా అయి ఎగరక చేసేదేముందీ

  • ఎక్స్‌రే మాసపత్రిక

కోనూరి రవికుమూరిాాలాాాాాత్తి

అఆంలలు

బంగారం నల్లనయి నేల గుండెల్లోంచి తొంగి చూస్తున్నట్లు

కొండ మనిషి చెవిలోకి వొంగి,

నేలే కాదు, నేనూ ఆకలి తీరుస్తానని గుసగుసలాడుతున్నట్లు ఆకాశం చుక్కల్లో సహావొదిగి =

నేల గుండెల్లో దాక్కున్నట్లు

ఏవో ఊహలు.

రాతి వ్యవసాయంలో

చెమట విత్తనమై ॥

నేల మీద నీళ్ళు పండినట్టు,

అద్దమై ముఖం చూపించినట్టు,

నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ

నిజంగా ఈ రాతిదెంత మెత్తని గుండె!

ప్రపంచం నెత్తిమీద

జెండా అయి ఎగురుతోంది

గుడిముందు పగిలిన కొబ్బరికాయను పలకరిస్తోంది. ప్రాజెక్టు ముంగిట్లో.

ఫలకమై స్వాగత గీతం పాడుతోంది

వాంటినిండా రంగులద్దుకుని

మనుషుల్ని రాజుల్ని చేస్తోంది

మిళ్టీ హోటల్‌ పూరీపిండి కింద

నిగనిగలాడుతూ నవ్వుతోంది

కోనేటి మెట్ల పక్కన

దాత' పేరు దాచుకుని వొదిగి నిలబడుతోంది.

బడిమాని ప్లేట్లు తీస్తున్న పసి చేతుల్ని చూచి

గోల చేస్తోంది.

అమ్మచేతి చలువను

రుచులారా వినిపిస్తోంది ధ్ర... బొడ్డుపేగు

సాయంత్రానికి వీధి అరుగై విశ్వవీక్షణం చేస్తోంది! నేనిపుడు ప్రళ్చిస్తున్నా రాతి మనిషి అని అనిందెవరు? మనిషికి, రాయి ఇప్పుడొక ఆదర్శవంతమైన (ప్రతీక

  • ఆంధ్రభూమి దినపత్రిక

మన గోతులు మనమే! పలక కోసం అలగకురా అబ్బయ్యా చెర్షకోలకు మువ్వలు గట్టుకుందూలే సద్దిమింద సన్నటి వులిగెడ్డ ముక్కలేస్తలే అని దున్నకుగ్రని బెర్ర నిమిరినట్టు అమ్మ నాకు బుజ్జ్ఞగింపాయె అమ్మ మాటల్లో నా కళ్లలో ఎలిగిన ఆశల దీపాన్ని జూసిన నాన్న నన్ను పశులకొమ్ముల కట్టిన గాలిపటం జేసె తాడిసెట్టు కింద ఎంకటేసుగాడు వూదీ వూదని పిల్లంగోవై పిలస్తావుంటే బెమ్మంగోరంతటోడివిరా అని అవ్వ అన్నందుకేనేమో బరైలకు సుట్టూతా గిగ్రై గిరికీలు కొడతా ఎల మీద కొచ్చిన ఎర్రగోలీని కొాడదమనుకున్నగానీ వున్న పళంగా సమాధిలోకి పోతానని తెలీకపాయె వాడి ఆశ అరవై అడుగుల్లోతున నోరు తెరుసుకునుందని నాకేం తెలుసూ?! సేను గొంతులోకి నీళ్ల కోసం తవ్వుతున్నడనుకున్నంగానీ గొయ్యి గొంతులో పేణాలు పోస్తాడనుకోలా సెత్త కప్పేసి సేమం అనుకుంటే సరిపోద్దా? గొయ్యి పక్కకు గోలీలొస్తయని తెలుసుకోవద్దూ?! గోతి లోపలికి తొంగిచూచే ఫోన్లుంటయనీ నీళ్లు రాకుంటనే ఏడిసే కళ్ళుంటయనీ గొయ్యి తవ్వినోడికి తెలీకపాయె అడవుల్లో గొయ్యి తవ్వి జంతువయ్యే మనిషి ధ్ర్రి---------------ా బొడ్డుపీగు

ఇపుడు వూర్లల్ల చేలల్ల రాజధానుల్ల

గొయ్యి గొయ్యికీ నోరు తెగ్గిసిన రాక్షస బల్లి అవుతున్నడు

గొయ్యి తవ్వటం ఇపుడో వృత్తి

నిన్న మా పల్లె జనం నోల్లల్ల బువ్వను,

గద్దె తన్నుకుబోయిన పాక్షిలేనే

గూట్లో పాణం గుటుక్కుమనిందాకా

గొయ్యి తవ్వతోనే వుంటది

చెన్నపట్నం ఇంజినీరి గురి సెదిరి

గోతిలోనే అపర బెమ్మం అవుతాన్నేను.

మీరు తొవ్విన గోతిలో నీల్లుబడ్డా

మీ బోరుకాడికి కరెంటు తంబాలు నడిచాస్తాయనీ

మీ ఓట్లు రోజు మొత్తం కరెంటు తెస్తయనీ

. బెమత బడకండి పిచ్చి రైతు నాయనల్లారా

మనకు బయ్యోటెక్నాలజీ పారుకుళల్లేకపోతె మానె

మన గోతులు మనమే తవ్వకుంటున్న సంగతీ

ఆ గోతుల్లో మనమే పడుతున్న సంగతీ

అవి తవ్వుకుని మళ్లీ వాడు డబ్బులవుతున్న సంగతీ

అర్ధమైతే సాలు!

  • అంధ్రభూమి దినపత్రిక

కోసూరి రవికుమార్‌---ాాాాాా్యి

మాట్లాడి తీరాల్సిందే అవును ఇప్పుడు మనం మాట్లాడి తీరాల్సిందే తుపాకులు మనుషుల్ని బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లుగా తాడుక్కుంటున్నప్పుడు పొతర్లు నేల గుందెల్ని చీల్చుకుని ఎండిన చెట్లకు మాంసం పూలు పూయిస్తున్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎలా? వాళ్ళిద్దరికీ ఇపుడు రక్షణ కావాలట ఒకడు ఒంటి స్తంభం మేడలు కట్టుకునీ కరెంటును కాపలా పెట్టుకునీ బురుజు మీదకెక్కి కళ్ళకు సెర్చిలైట్లు బిగించుకుంటున్నాడు ఒకడు భవనాలకూ, నోటు మనుషులకూ డిటోనేటరుత్తరాలు రాస్తూ శిథిలాల్ని గేలానికి తగిలించి గుట్ట చివరి గుబురులోంచి పొలిమేర్ల దగ్గర చూపుల్ని నాటి కూర్చుంటున్నాడు భయం ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందీ! నేల మీద *నడకే' భయపడ్డాక కల్వర్జు దగ్గరి వాడిపొరేసిన బ్యాటరీ కూడా వణుకుపుట్టిస్తుంది డ్రామా కంపెనీ వాడు పారేసిన వైరు ముక్కలు నేలలోంచి తొంగి చూస్తే చాలు, మనిషి మొత్తం మైన్‌ డిటెక్టర్‌ ఎండుటాకు గల గల రాలినా కలవరం తుపాకీ పేలుస్తోంది పొదలో చచ్చిపడి వుండేది దుంపల కోసం వెతికే కూలి కుందేలే కావచ్చు మాటున దాక్కున్న పెద్దపులే కావచ్చు ధ్రొ--..----------- బొడ్డులిరు

అనివార్యమైన యుద్ధమూ

చర్చలూ వాటి పర్యవసానాలూ సరేసరి! కనీసం ఇప్పుడైనా మాట్లాడకపోతే

ఇక ఎప్పటికీ మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాం. పగటికీ, రాత్రికీ మధ్య

సాయంత్రాలమై పొద్దుగూకి పోతాం

ఎరుపు 'వాళ్లు ఆలోచనల్లోనూ

“వీళ్ళ నెత్తిమీదో కాదు

జనం కళ్ళలో మెరవాలి కదా!

దాడికి ముందు మేడల్లోనూ

దాడి తర్వాత గుడిసెల్లోనూ

చీకటి ఏపుగా పెరుగుతోంది

ఇప్పుడు పల్లెలోని వాకిళ్ళలో

ఎవ్వరూ కళ్లాపి కూదా చల్లటంలేదు

ఏ బూటు గుర్హులు కన్పిస్తాయోనని

ఎన్నాళ్ళిలా ఊపిరి బిగపట్టి బతుకుతాం? బద్దలవుతున్న స్టేషన్లూ, కార్యాలయాలూ రూపాయిల బూమెరాంగులై

జనం గొంతుమీదికే కదా ఎగుర్తున్నాయి ఇప్పుడు కూడా మాట్లాడలేకపోయామో

ఇహ మాట్లాడాల్సిన అవసరమే రాదు మరెప్పుడు మాట్లాడినా

అసందర్భ (పేలాపనే అవుతుంది

ఇప్పటికైనా చౌరస్తాల్లో

మాటల్ని రాజేసి

నిరసనల సెగల్ని పుట్టించి తీరాల్సిందే

= ఆంధ్రభూమి దినపత్రిక

కోసూరి రవికుమారి---------ాలాడ్యు

ఏటికేతం బట్టి ఏతాము కర్రమీద నాన్న తూగుడు బల్లాట ఆడుతూ వుంటే ఎంత సొగసుగా వుండేదీ ఏరు వరంతా పొంగి దోనెలోకి వొదిగి కూర్చున్నట్లుందేది మల్లెతోటమీంచి వరినారు మడిలోకి అమ్మ కాలువలు కడుతున్నపుడు నన్ను పొత్తిళ్ళలో పదుకోబెట్టినంత సుతిమెత్తని దృశ్యమయ్యేది కాలువలో మొలిచిన చేమాకులో చద్దెన్నం తిన్నంత (పేమగా పొట్టమీదున్నంత చేనంతా నా అరచేతులు పాలిగంతలు పెడుతుంటే వొళ్లంతా పచ్చటి చక్కిలిగింతలు పుట్టేవి పావురాయి పిల్లలకు జొన్నలిసిరినట్లు ఎరువు చల్లుతూ వుంటే ' ఒక్కొక్మ వరిమొక్కా నులివెచ్చగా నవ్వుతున్నట్లుందేది తీరా నది ఎత్తు పెరిగిన ఆనకట్టగోతాములో కుక్కబడ్డ శవమయ్యాక వొట్టిపోయిన మబ్బులకింద కరెంటునాటితే ఓట్లు పండుతాయని టర్జెన్లలోకి మంచినీళ్ళు వొంపేస్తున్న వైనం చూసి గూట్లో నాన్నమ్మ వెలిగించిన “బుడ్డిదీపం” పగలబడి నవ్వుతున్నట్లుంది నాన్న కళ్ళల్లో సూరీడు పూలై పూస్తే ఆయన చేతికి కర్ర ఇవ్వటం తప్ప చినుకు తేలేను ఆలమట్టిని ఐదు మిల్లీమీటర్లు కూడా తగ్గించలేను

ఇంక లాభంలేదు

వాడి చెవుల్లో తాపడం చేసుకున్న సెల్లుఫోన్ను పెరికేసి

పెరట్లో కనీసం గడ్డికూడా లేక చచ్చిపోయిన

ముర్రాజుతి బర్రెచర్మంతో డప్పుకట్టి

ఇంకిపోతున్న పైరు గొంతుతో

పాటను సంధించక తప్పదు

నల్లబడ్డ చూపుడు వేళ్ళతో

వాడి “తెల్లింటి* మీద

దగాపడ్డ రైతుబొమ్మల్ని గీయక తప్పదు

గీయక తప్పదు. .

  • విశాలాంధ్ర దిసపత్రిక

సారి కమర 6

వళ్ళు నీళ్ళు నిప్పును ఆర్బుతాయని తెలుసు కానీ అవి నిలువునా మండుతున్నప్పుడే ప్రతి బిందువునూ అనుమానంగా చూడాల్సి వస్తోంది ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గరా బిందువుకు బిందువు రాచుకుని జనసింధువై రొడ్లెక్కటం చూస్తోంటే నాకు నీళ్ళ మీదనే అనుమానమొస్తోంది ఈ నీళ్ళతో ఓట్లెలా పండించాలా!? అని వాడూ ఈ నీళ్ళలోకే ఏ బాణమేస్తే అప్పుల అంపశయ్య మీదున్న నా పంట నోట్లో కాసిన్ని చుక్కలు పడతాయా అని బ్యానర్లు సర్దుకుంటూ నేనూ! ఇపుడు నీళ్ళమీదా నీటి వ్యవసాయంలో ఆరితేరిన ఓటు భూస్వాముల మీదా అనుమానం రావటం సహజమేనమకుంటా స్తూయిజ్‌లోకి వొంగి దాహంగా దోసిలి చాస్తే దోసిట్లో ముఖానికి దిదులు వేటకొడవలి కనిపిస్తోంది అందుకేనేమో ఆరుతడి పంటకీ ఇప్పుడు ఆరని నెత్తుటి తడి చెక్కు గట్టిన మాగాడి మధ్యలో నీరసంగా నిలబడిపోయిన నాగలి ఎలపట దాపట ఎదిగిన తుమ్మచెట్లకానుకుని బొమికెల గూల్ళెన ఎద్దుల్ని బాధగా చూస్తోంటే టప్రాాాాాాా వాడుకకు

నాకు మనిషి మీదనే అనుమానంగా వుంది

మట్టి నుంచి వచ్చిన మనిషి

మట్టి నుంచి నీటిని వేరుచేస్తున్నందుకే

మట్టిమనిషిని మాయ చేస్తున్నందుకే

బాధగా వుంది

మనిషి చచ్చిపోతాడుగానీ,

మట్టి చచ్చిపోతుందా?!

ఏమో వాళ్ళు మబ్బుల్ని చంపేస్తున్నట్లు

మట్టినీ చంపేస్తారేమో

తొందరగా చేలో విశ్చనరుడి తత్వపు విత్తనాలు ఎదబెట్టాలి

ట్రిబ్యునల్‌ బెంచీ మీద పిజ్ఞాలకు బదులు

చద్దెన్నం మాగాయబద్ద వడ్డించాలి

మట్టిమీద నమ్మకమున్న మనిషిని

బతికించుకుందుకు

అటకమీద దాచుకున్న అరబిందెడు

మంచినీళ్ళు పోసైనా సరే

మనిషిలో మట్టిని ప్రతిష్టించాలి!

= తుళాలాంధ్ర దినపత్రిక

కోనూరి రవికుమార్‌ ఆంాజడూర్ట్‌

మచ్చలు రాత్రి రహస్యంగా చిత్రీకరించిన ఆకలిని .. ఆకలిగా చూస్తూ మౌస్‌లు, వోండీకాంలు, కీబోర్డులూ, సీసాలు సీసాలుగా నగ్నంగా దొర్హుతున్నై. మనుషులే జంతువులు సిగ్గుపడేలా పుట్టుకల్లోకి తొంగి చూసుకుంటుంటే ఎవడక్కడ ఆకలిని ఆజ్ఞ్జలతో ఆర్పేశాననీ నిషేధించి పారేశాననీ ప్రభల కింద బానపొట్ట రుద్దుకుంటున్నాడు? ఆకలీ అజరామరం కదా రొట్టె ముక్కగూడా ఇంత శరీరాన్నీ శీర్షాసనం వేయించి ఆకలిగా నగ్నత్వాన్ని ఆస్వాదించే రోజులు కదా ఆకలిలో రకాలు తెలుసుకునే తీరాలి. గుప్పెడుమెతుకుల మీద గుడ్డ విప్పి కప్పేదొకటీ, గుప్పెడు గుందెల్నీ మూడోకంటితో దోచేదొకటీ రెంటినీ చూస్తూ బెల్బుచాటున నోట్లు సర్టుకునేదొకటీ ఇపుడు దేన్ని నిషేధించాలో తేల్చుకోవాలి మరి ఐనా నిత్యం గంటల కొద్దీ కావలసినన్ని కౌపీన దృశ్యాలు వేలి చివరనే వేలాడుతున్నై కదా! గుంపులు గుంపులుగా కొంపల్లో చేరి

కళ్ళనిండా కుక్కుకుంటూనే వున్నాం కదా! ఇంకా చిత్రీకరణ లెందుకూ మనుషుల్లా తిరుగుతున్న గ్లోబల్‌ రోబోట్లలారా . మీ మెదళ్ళకు చెదలు పట్టినట్లుంది మీ అరచేతుల్లో మొలిచిన మూడోకన్ను కూడా మీ కంటి సెగలకు అపర్చర్‌ తగ్గించుకుంటోంది. నెట్‌ నేల మీద బతికుండగానే సమాధి కట్టుకోకండి. ఆంధ్రకూ అమెరికాకూ మధ్య అవిరైపోతారు మనిషి చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోతారు

  • ఎక్స్‌రే మాసపత్రిక కోసూరి రవికమార్‌-ాాాలాాాాభ్ట)

మహాయాత్ర వడ్రంగి పిట్ట ఆహారంకోసం, బెరడుమీద కొట్టినట్టు ఆకలిగా, అదేపనిగా, వులినీ, సుత్తినీ వుపయోగిస్తూనే వుంటాడు. చెట్లు బోన్సాయిలై, వడ్రంగి పిట్ట మాయమై పోయింది దాని అకలి దరువు మాతం అతని సుత్తి దెబ్బల్లో ప్రతిధ్వనిస్తోంది గుంటలు పడ్డ కళ్ళలో తెలీని ఏకాగ్రత ఏదో గూడుకట్టుకొని వుంది. రావి చెట్టు నీడన కాలికి తాడుకట్టదడ్డ కోడిపెట్ట అక్కడక్కడే ఆహారమేరుకున్నట్టు మొద్దురాతి ముక్కను అన్నం మెతుకుల్లా చెక్కుతున్నాడు. అతడి చేతుల్లో మైనమో, మైదాపిండో వొదిగినట్లు ఆ రాయి ఎంత సౌందర్యవంతంగా తయారయిందో చెమటకు తడిస్తే రాయి మెత్తనవుతుందా? నీకో వృత్తలేభినీ ఇస్తాను అతను చెక్కినంత అందంగా గుండ్రంగా ఆ రాతిని చెక్కగలవేమో, ప్రయత్నించు సుఖపడ్డం అలవాటయ్యాక ఇక నువ్వే సౌందర్యాన్నీ సృష్టించలేవు, స్పర్శించలేవు, దర్శించలేవు. నీ సుఖాన్ని రగిల్చి అతడికి ఆకలిని మిగిల్చి తన పబ్బం గడుపుకొంటోందీ ప్రపంచం, భ్రై--ాాాాాాాాాాా బొడ్డుపేగు

అకలి అల్లిన సాలె గూడులో, అతడెప్పుడూ ఈగే రావి చెట్టు కింద, నిశ్శబ్దంగా వృత్తిని (ప్రేమిస్తూ రాతిపొడితో కొడిగట్టే ప్రాణ దీపంలా అతనూ అతి జాగ్రత్తల గదుల్లో సుతిమెత్తని సుఖాలన్నీ గొట్టాలతో ఊపిరి పీల్చేందుకే ఆయాసపడుతూ మనమూ యంత్రమయమైన కాళ్ళూ, చేతుల్ని మళ్ళీ మానవీకరించుకుని నొప్పిపుడితే తప్ప గుర్తుకురాని గుండెగదుల్లో అతడి అందమైన రూపాన్ని ప్రతిష్టించుకుందాం చెమటలో తడిసిచూద్దాం, మరోసారి మహాయాత్ర (ప్రారంభిద్దాం గోటి మీదనుంచి పైకి ఎగిరిన రూపాయిబిళ్ళ కిందపదేలోపు నేలనొక్కసారి తనివితీరా ముద్దాడి .మరణించేలోపు మరోసారి మనిషిగా జన్నిద్దాం. (ఇెదిరిన స్వవ్నం లాంటి వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్న “రోళ్ళపావయ్య” కోనం) కోసూరి రవికమార్‌ాాాాాాా టి

ఇచ్బోటనే!! ఇక్కడే ఈ నేల మీదనే పల్లె అమ్మలా పలుకరించేది! పిడికెడు రేగడిమట్టి చెమటకు తడిసి బుక్కెడు బువ్వయ్యేది మనిషి కానుగచెట్టు నీడైనట్లు బంధాలు, బంధాలుగా తిరిగేవాడు ఆప్యాయత అవు నాలుకై లేగల్ని నిమిరినట్లు నిమిరేది చెల్లాయి తువ్వాయి తోకవెంట తూనీగయ్యేది!! పంటలు వంటయింట్లో పాలైపొంగి పొంగళ్ళు పొంగళ్ళుగా తిరునాళ్ళయ్యేవి ఊరు ఊరంతా వేడన్నంమీద కొరివికారం ముద్దె గుబాళించేది బుట్టచేతులు పరికిణీలై ఆరిందాలై అత్తవారింటికి తరలివెళ్ళేవి!! విరగపండిన మిరపతోట నూనూగు మీసాల తలకు పాగా అయ్యి పెళ్ళికొడుకుగా మారేది!!! పెళ్ళి అంటేనే పల్లె తోరణమటయ్యేది పచ్చని పేరంటమయ్యేది ఏటిమీద పాట అద్భుతమై పల్లె సాయంత్రం చుట్టూ పరుచుకునేది ఎప్పటిటాగే ఎర్రమట్టి దుమ్ముతో చీకటీ ఎద్దు మెడలో గంటలశబ్దంతో వేకువా రోజును పంచుకునేవి హఠాత్తుగా ఒక ప్రకటన పల్లెనుదుటిమీద పచ్చబొట్టయ్యాక పల్లెరక్తంలోకి నిర్లిప్తతా విషం ఒక్కోబొట్టూ (ప్రవహిస్తూ నీరే నిప్పై ఊరిని కాల్చేస్తుంటే దేనితో ఆర్చుకోవాలో అర్ధంకాదు ఉాాాాాాాాాాాా బొడ్డుకు

పారాణికి నోచుకోని పాదాలు చూస్తూ సన్నాయి గొంతెండి స్వరం మరచిపోయింది తిధులున్నా చూచే అవసరమే కాక పంచాంగం చెదలుపట్టి పేజీలు పేజీలుగా గాలికి ఎగిరిపోతుంటే నమ్మకం కోల్పోయిన మట్టిలోకి విత్తనాలు కరువవుతుంటే బతుకు నెలాపండించుకోవాలో!? తెలీదు ఇక్కడికి ఏ రోడ్డూ తారు పాదాలతో రాదు ఏ అభివృద్ధి పధకమూ అరువు పూలైనా పూయదు ఊరు ఊరంతా కాందిశీకుడెలా మనిషి ఉనికే మాయమైన దానిలా పాదముద్రలేలేని పరాయి గ్రహంలా ఇక్కడి నీరు పరాయిది గాలి పరాయిది మనిషి తనకు తానే పరాయీకరణం చెంది ఊపిరిపోసుకున్న ఉదాసీనత ఊరికి వురిపోస్తున్నట్లు పంటే పల్లేరు ముల్లయి గుచ్చుకున్నట్లు చిట్లుతున్న కలలు ఇపుడు పల్లె అమ్మకాలూ కొనుగోళ్ళమధ్య కాలం కొండచిలువ నమిలి మింగుతున్న గొర్రెపిల్ల కాపరి కేక వినిపించదేం!?!?! _-1998 ఎక్స్‌రే ఉత్తమ కవిత కోసూరి రవికుమార్‌ ఆలాజాాళ్టై

నీళ్ళెలా బతికుంటాయీ*?! నా పాదము(ద్రలు చెరిగిపోయాయి తడిసిన మట్టిమీద బతుకు దిద్దుకున్న వొడ్డంతా పొగగొట్టాలు పొడుచుకొచ్చాయి ఇనుపకంచె తరిమేసిన అన్నపు పళ్ళెం కాలవల వెంట కంటితుడుపుగానే మిగిలిపోయింది! నన్ను గుందెలమీదేసుకుని ఎల్లీత నేర్పించిన కరకట్ట లంకెల బిందెల కోసం తవ్వి పారేసిన గర్భగుడి మాదిరిగా వుంది! పుట్టింది నేలమీదే అయినా పుడిశెడు నేల లేకపోవటం పిడికెడు బంధాలు కరువైపోవటం ఎంత బాధో! ఫ్యాక్టరీ గేటు ముందు నుంచుని టోపీ పెట్టుకుని, కాఖీ తొడుక్కున్న నాగలి చెబుతుంది! నడక నేర్చిన నీటి పాదాలను ఇటుకల్లో కట్టేసి” ఎవళ్ళకి వాళ్ళు బంధించేస్తే పాదాలెలా పరవశిస్తాయ్‌?! నాగనివ్వటమే కదా! వాటికి సరైన నివాళి అడుగడుగునా అర్ధించినా కడలి చేతుల్లోకి కదలిపోవటమే కదా! ్రైాాాాాాాాాా బాద్తుకిరు

వాటి కడపటి సరళి

నేలను కోల్పోయిన బతుకులిపుడు వలస లోయల్లోకి

నేల మీంచే నడిచెళుతుంటే

బతుకు తెరువు ఫిడేలు మీద కమానుబద్ద ఆకలిరాగాన్ని ఆలపిస్తోంది నీరు కరువవుతున్న నేలమీద మొలిచిందెక్కడో తెలీని జాతి గుర్రపుడెక్కై అల్లుకుంటుంటే యుద్ధమిప్పుడు సరిహద్దుల దగ్గరే కాదు సిమెంటు సంచులు మింగేసిన జలపాతపు తలుపుల దగ్గిరా మైదానాలు మాయంచేసిన

ఏటి చాలుల దగ్గిరా

జరగటంలో ఆశ్చర్యమేముందీ!? కొండమీంచి వురికిపడే పరిమళాన్ని ఎన్నాళ్ళు నీ కాళ్ల దగ్గరే కట్టిపడేసుకుంటావ్‌ రాజ్యమా? అడుగంటిన మా అన్నపుగిన్నెల మీద “విస్తరిస్తున్న ఇసుక తివాచీల మీద నిలబడి వొడ్డంతా

పచ్చటి రంగులద్దుతానని

గొయ్యితీసి ఆశల్ని పాతిపెట్టి

గాజురాతి గోడలమీద ఎన్నిసార్లు ఎన్నిపేర్లు చెక్కుకున్నా

కోసూరి రవికుళూర్‌-ాాాాాాాి

బద్దలవుతున్న ఆకాశపుటద్దం బతికొస్తుందా!? కొత్తగా మొదలెట్టక పోతే నేలమీద నీళ్ళెలా బతికుంటాయీ? ఎగువ దుర్మార్దాన్ని ఎండగట్టీ చిమ్నీలు చిదిమేసి తడి విత్తనాలను “నిండుకున్న నీటి పాయల్లో నాటాలి అనివార్యంగా తరిమివేయబడుతున్న ఆనవాలు తరాల్ని మళ్ళీ ఈ గట్ల మీద పొదగాలి ఇనుప కంచెల్ని చెరిపేసి ఈ ఒద్దుల నిండా బువ్వగింజల్ని చల్లాలి నేనిప్పుడు ఈ మనుషుల్ని నీళ్ళతోనే ముడేస్తాను. అదృశ్యమైపోతున్న నా అస్తిత్వమూలాలను పట్టుకొచ్చుకుందుకు మళ్ళీ నదినే ఆహ్వానిస్తాను అనుసంధానిస్తాను

  • 2003 ఎక్స్‌రే ఉత్తమ కవిత భ్రై--------------------- బొడ్డుఖీదు

పొక్కిలేను అమ్మ కొబ్బెర సవీరు రాసి పాపిట దువ్వినట్టు నాగేటి సాలు ఇంత సక్కగా ఎలా వచ్చిందా!? అని ఆశ్చర్యపు గాలిపటాలు ఏపచెట్టుకింద కూచుని ఎగరేసేవాణ్ణి తొలకరి చినుకు పడగానే మట్టిబెడ్డలు సిగ్గుతో నేల వాళ్ళోకి మెత్తగా పరుచుకుంటుంటే సద్ది తిన్నాక తాత చుట్టకాలుస్తూ గుండెల్లోకి తృప్తిగా నవ్వుకున్నట్లు మట్టివాసనను మెత్తగా గుండెల్లోకి జుర్రుకునేవాణ్ణి ఎద్దలబండిమీద నాన్న నాటుకర్రబట్టి నిలబడితే నా మువ్వల చెలకోల ఘల్లుమనిపిస్తూ ఎలపట దాపట గులాం కుంకుమై మెరిసి ములుగర్ర 'చివరన తాబేటికాయై చల్లటి కలలుకనేవాణ్ణి నా కలలన్నీ వాడి పెరట్లో కట్టుకున్న ప్రాజెక్టు గోడకింద నిలువునా మునిగిపోయినై. చెలమల్లో మిగిలిన మబ్బు ముక్కల్నీ పనికి ఆహారంగా మింగిన “పాొక్షిలేను” ఊడ్చుకపోయింది ఇపుడింక నా నారుమడి లేగదూడకి నేను పాలెట్టా పట్టేదీ! తడికోసం ఎన్ని గొట్టాల్లో తడిమి తడిమి చూచినా పుస్తెలతో సహాకరిగి కరువవటం తప్ప బతుకుతెరువు కనపడటం లేదిపుడు తడి, కళ్ళల్లో తప్ప మిగలకపోయినా గెనుమ్మీద నుంచుని మబ్బుల్లోకి చూపుల్ని పారబోసుకుంటూనే వున్నాం! నీళ్ళకోసమే మనిషి కన్నీళ్ళవటం నీళ్ళకోసమే మనిషి వేటకొడవళ్ళవటం కోసూరి రవికుమార్‌--ాాళి

సీళ్ళకోసమే మనిషి ఎగిరిన జెండా అయి చలో హైదాబాద్‌లో మిట్టమధ్యాహ్నం బతుకు పొద్దుగుంకించుకుంటూంటే నా చూపుడు వేలును నరికేసుకోవాలన్నంత కోపమొస్తోంది, అన్నమెటు తిరిగి లేదు కనీసం నీళ్ళుతేలేని నీరోలకు నీళ్ళొదిలేయాలనిపిస్తోంది నన్ను నేను తిరగరాసుకోవాలని అనిపిస్తోంది

  • 2002 ఎక్స్‌రే ఉత్తమ కవిత భ్రై------------------------------ బొడ్డుపీగు

క్షమించు బడీ బడి అనగానే నా కళ్ళ ముందు ఓ సుందరద్భృశ్యం కదలాదేది బలపం ముక్కలూ, బత్తాయి తొనలూ చిట్టిగౌన్లూ, సీతాఫలాలూ ఆవరణ స్థంభాలకు ఆనుకుని అచ్చనగాయలు ఆడుకుంటూ వుండేవి తరగతులన్నీ పాఠాలు పాఠాలై పరవశించేవి సాయంత్రానికి నోట్‌బుక్‌ కాగితాలు, పడవలై రాకెట్లె గాలిపటంతోకలై బిళ్ళం గోడీ కర్రతో పిల్లంగోవై ఆటలరాగాలు ఆలపించేవి! ఒక్కసారిగా పచ్చటి సంతకంతో నల్లటి అక్షరాల గుంపు ఎలక్షన్‌ ఆర్టరై బడిమీద వాలిందగ్గరి నుంచీ లాఠీలు పుస్తకాలను సంచీల్లోకి తరిమేసినై తరగతులన్నీ శిక్షణా తరగతులుగా గోడకుర్చీ వేసినై బడిగోడలన్నీ నినాదాలు తగిలించుకుని పాఠాల్ని పరిగెత్తించి పారిపోయేలా చేశాక బడి ఇప్పుడు తప్పిపోయిన గొగ్రెపిల్లలా భయంగా చూస్తోంది! సాయంత్రానికి ఊరి చెవుల్లో వురకలెత్తే ఎక్కాల సముద్రం ఎపుడింకిపోయిందో!? తెలీటంలేదు బడి నాల్గు మూలలా “ఇనుపబూట్లుూ” విరగబూసిన కానుగచెట్లు బిడ్డను కోల్పోయిన తల్లిలా ఏడుపు నీడలు చాస్తున్నాయి. జెండా దిమ్మ దగ్గరి సరస్వతీ విగ్రహం ముందు గాలికి రెపరెపలాడుతున్న తెలుగుపుస్తకం పేజీల్లో చెదిరిపోతున్న నెమలీకలు చూచి పభుత్వం ప్రకటించిన “స్కూల్‌ కేలండర్‌” కడుపు చించుకుని తేదీల్ని బడికాళ్ళమీద కుమ్మరించింది కోసూరి రవికుమార్‌-ాలాాాాాళ్టి

నోట్లే, ఓట్లై వరుసల్లో నుంచున్నాక బడి ఇపుడు ఐడిలాలేదు కోతులు ఎగబడ్డ మామిడి తోటలా వుంది ముందన్తుగా నన్ను క్షమించు “బడీ” కాడి? అన్నిటికీ “ఒడి” అని చట్టాలే చెబుతున్నాయిట = విశాలాంధ్ర దినపత్రిక ధ్ర్రు------------------------- బొడ్డులీగు

ఒకానొక ఖాళీ గురించి గోడ మీద ఒక పెద్ద ఖాళీ! ఎన్ని రంగులు వేస్తున్నా ఆ కాస్తంత చోటు ముందు గోడంతా చీకటే ఆ ఖాళీలోకి చూచినపుడల్లా నిలువెల్లా చల్లని చూపులేవో తడుముతున్నట్లు ఎలా వున్నారర్రా! అంటూ మెత్తగా బుగ్గల్ని స్పృళిస్తున్నట్లు అనుభూతుల మేఘం ముఖమ్మీద వాలినట్లు గోడమీద వెన్న పులిమినట్లు తెలీని కాంతిపుంజమేదో ఆ చోట్లో అలుక్కుపోయింది నాలుగు గోడల మధ్యన తిరుగుతున్నామన్న మాటేగానీ కనబడని కవచాలేవో చుట్టూ వున్నట్లు మాటలను, మాయంచేసే మాయడబ్బా ముందు కుప్పగా కూలబడ్డామే గానీ మమ్మల్ని మాలకట్టే దారమేదో పుటుక్కున తెగిపోయినట్లు ఇల్లంతా చెల్లూ చెదురుగా ముందరింట్లో మచ్చుమీద ఆనబెట్టిన చల్లకవ్వాన్ని మూడు పిల్లి పిల్లలు ఆప్యాయంగా నాకుతూ ఆ గోడమీది ఖాళీతట్టే చూస్తున్నై స్లాబు చువ్వల మీద వాలిన ఊరపిచ్చుకలు కోసూరి రవకుకూరి-ాాాాాాత్తి

కిందటేడాది దాకా వరికంకులు కట్టిన చేతుల కోసం ముక్కులతో మూలమూలలా ఆరాతీస్తున్నై ఆమె అలికిడికి తత్తరపాటుతో

అతడు గోడపగులులో దాచిన

ఉత్తరాది పుగాకు చుట్ట

నుసికట్టిన కళ్ళతో అదేపనిగా అటేపే చూస్తోంది

లేగదూడ తల్లినాలుకను వద్దని

ఏ మెత్తటి స్పర్శకోసమో వెతుకులాడుతోంది

రాగి సంకటి మీద గోంగూర పచ్చడి అద్దుకున్న చేతులన్నీ పిజ్జాలు పారేసి

జీర్ణాశయాలకు లేపనాలు పూతేసుకుంటూ

గోడమీద ఖాళీ వేపే తొంగిచూస్తున్నాయి

వాళ్ళు గోడమీద కూడా కరువైపోతే

ఇక అంతా ఊపిరిపీల్చే

శిలాజాలమై పోతామేమో

అచ్చాత్తించిన అమ్మమ్మా నాన్నమ్మల్ని

మళ్ళీ ఆ ఖాళీలోకి ఆహ్వానించి తీరాల్సిందే

ప్రపంచం గ్రామమై పోతున్నా

(గ్రామాన్ని ప్రపంచం గోడమీద

ఫోటోలుగా కూడా మిగుల్చుకోకపోతే

అనుభూతుల్ని ఆప్యాయతల్నీ

మనసు గోడలమీద నిలబెట్టుకోకపోతే

మన ఫోటోలకు ఫోల్డర్లు కూడా మిగలవ్‌

= సాహిత్య ప్రస్థానం ట్రెలాాాాా- వాస్తవ

చల్లబువ్వ చిరుగు బట్టిన కండవాకు రొట్టెముక్క గోంగూర పచ్చడి అద్దినట్లు మా తాతనా నాలుక మీద వేమన పద్యాలు అద్దేవాడు. చేను కావిలికి బోయి కాసిన పచ్చిపల్లీలు తిన్నాక నీళ్ళను కాలువ కడుపారా తాపినట్లు బాలవాడీ ఆయమ్మ పాటల్ని అన్నం ముద్దలతో పాటు పెట్టేది తాళ్ళ చెడ్డీ పైకి లాక్కుంటూ జారుతున్న చూరు కింది బడిలో నర్సవ్వ చెప్పిన కథలతో తాత నులక తాడు పేనినట్లు పిలగాళ్ళందరినీ పేనేవాడ్ని బడంటే చాలు గాలిపటమై ఎగిరెళ్ళేవాళ్ళం కానుగ నీడన జ్ఞానపు ఊటలయ్యేవాళ్ళం నాలుగు తాడిచెట్లు వుంచుకోరా పిలగా ఆకలి ఎండై మండినపుడు కడుపులోకి సల్లని ముంజెమబ్బులిస్తయి నిట్రాడలై ఇంటిని నిలబెడతయి అని అమ్మమ్మ చెబితే ఇనిచచ్చానా కొడుకు ఇంగ్లీషు చదువు కోసం కూలదోస్తిని చేను మధ్యలో యాపచెట్టు మీ తాత మనసురా అబ్బయ్యా అబం సుభం తెలీని నీడనిస్తదంటే అర్ధం. చేసుకున్నానా మనవడి కంప్యూటర్‌ చదువుకింద అరెకరం నేలతో సహా నలిపేస్తిని, పికిలి పిట్టల్లాంటి కోసూరి రవికుమూర్‌---ాాాాాళ్టి

పల్లె పిల్లలంతా ఫారం కోళ్ళె

డాలర్‌ జబ్బుకు గురి అవుతుంటే

వూరికే వుంటే కుదరదిక

పాఠాల్ని పాముల పటం ఎక్కిస్తున్న

చేతుల్ని అరచేతులు చంకల్లో పెట్టుకునేలా శిక్షించాల్సిందే

అమ్మమ్మా నాన్నమ్మల్నే కాదు

అమ్మా నాన్నల్నూ మరచిపోతున్న

కొత్త తరానికి

ఒక కొత్త పాఠాన్ని తయారుచేయాల్సిందే. ట్రైాాాాాాాలాలాలా బొడ్డుకు

అమ్మృవాటి

అదేంటోగానీ ఆలోచనలు ఉప్పెనై మీదబడతాయ్‌ ఒంటరిగా మిద్దెమీద నుంచుని ఊరి మీద పరుచుకున్న మంచు దుప్పట్లోకి తొంగిచూస్తానా నీ నవ్వే వెన్నెలై కనబడుతుంది గుసగుసగా చుట్టుముట్టిన చల్లటి గాలితెమ్మెర నువ్వు చెంతలేవని చెప్పి వెళ్లిపోతుంది . అదేంటోగానీ ఆలోచనలు ఉప్పెనై మీదబడతాయ్‌ చుట్టూ ఇన్ని శరీరాలు తిరుగుతుంటాయా ఏ గొంతన్నా నువ్వై ధ్వనిస్తావని వెతుకుతుంటా నువ్వు రాలేదని చెప్పి నిశ్శబ్దం ప్రశాంతంగా వెళ్లిపోతుంది ఏం రాయాలన్నా అక్షరాలన్నీ నువ్వైపోతుంటే నాకు రాయటానికేమీ మిగలటంలేదు మనిద్ధర్నీ కలిపి నువ్వు మోస్తున్న అమ్మతనపు భారమేంటో లేబర్‌ రూమ్‌ ద్వారం బయటే ఈ నాన్నకు అర్థమైంది ఇక అన్నీ అమ్మపాటలే రాస్తాను నేస్తం!

= ఈంధ్రభూమి వారపత్రిక కోసూరి రవికుమార్‌ ఆాజంంంంర్తు

వంతెన

ఆఖరి మెట్టు మీద ఆమె, అతడు _ నిస్సత్తువగా ఇడ్షీతో యుద్ధం చేస్తూ ఆబగా వసంతాన్ని ఆరు చేతుల్తో జూర్రుకోవాలనుకున్నారో? " నిర్లక్ష్యం నిలువుగా పడేస్తే

తీరంలేని సముద్రంలోకి లాగబడ్డారో!

తెలీదు!

ఇపుడు మాత్రం ఆసుపతి మెట్ల చివరి మూలన

ఇడ్లీ పొట్లం వాళ్ళతో దాగుడుమూతలాడుతోంది

ముక్కగా తుంచలేని వేళ్ళను చూసి

ఇడ్లీ విరగబడి నవ్వుతోంది

గాలి, నేలా, ఆకాశం అన్నీవుంటై

తాము మాత్రం వుండమనే నిజం

ఎద్దుపుండు మీద కాకిలా వెంటాడుతుంటే

కండరాలన్నీ కూడబలుక్కుని మాయమై

ఎక్స్‌రే అవుసరమే లేకుండా చేస్తున్నపుడు

లోలోపల కొనసాగే ఆలోచనల హింస

ఎంతదారుణం"

పుట్టటం, చచ్చిపోవటం తెలిసిందే

చావు చీటీ రాసిచ్చి

బతుకు పో ! అని అనిపించుకోవటమే

మనకెవ్వరికీ అర్ధం కాని నెప్పి ,

ముసురుతున్న ఒక్కొక్క రోగపు మేఘమూ

బంధాలనూ, బంధువులనూ

దూరమయ్యేలా రుగ్మతలను వర్షిస్తోంటే

జ

బతికుండాలనే తపన గుండె పొరల్లో తచ్చాడుతుండటమే ఎవ్వరికీ అర్ధం కాని బాధ బళతుకుకి, తెలిసిపోయిన చావుకీ మధ్య ఎంతటి వేదన వుందో వాళ్ళు తినలేక వదిలేసిన ఇడ్లీ పొట్లం చూస్తే అర్ధమవుతుంది. బతుకు వంతెన మీద ఎగుర్తున్న చావు సీతాకోకలు వాళ్ళిద్దరూ కాసింత (ప్రేమ మకరందాన్ని మనసు మీద జల్లుకుని వాళ్ళముందు నుంచోటం తప్ప ఇంకేమివ్వగలం? వాటి రెక్కలమీద హెచ్చరికల్ని చౌరస్తాలో చల్లటం తప్ప చేయవలసిందేముందీ...? _ సంతకాలు, ప.ర.సం, సంకలనం కోసూరి రవికుమూర్‌ న 07

ఆకలికి అక్షరాల ఉపయోగం తెలీదు

పాఠాలు పరవశింప చేస్తున్నా

పాదాలను ఆకలి పనివేపుకే పరుగులెత్తిస్తుంది

సాయంత్రానికి అలసిన చేతుల్లోకి

బొబ్బలతో పాటూ వచ్చే కాసిని నోట్లూ

పసి కళ్లల్లో ఆశల గులాబీలు పూయిస్తాయ్‌

పలకా బలపం పరాయివై పోయినా

తెల్లవారగానే గుడిసెలోకి సూరీడుతోపాటూ తొంగి చూచే సమ్మెట దెబ్బలూ పరిగె పత్తీ గాలికి ఎగిరే ఖాళీ పాలకవర్లూ బంధువులై (ప్రేమగా పలకరిస్తాయ్‌

బలపం చుట్టూ అల్లుకోవాల్సిన వేళ్లు

చిత్తు కాగితాల వెతుకులాటలో చీపుర్లవుతాయి

ఆకలి అటకెక్కించిన పుస్తకాల సంచీ

బజార్లో మాస్టారి రూపంలో ఎదురై

ఆకలి ప్రశ్నకు ప్రభుత్వం బళ్ళోనే సమాధానం చెబుతోందన్నాక బడి చందమామ పావై పిలుస్తున్నట్లూ

కడుపులోని వేసవిలో మిట్టమధ్యాహ్నం

చల్లటి వాన కురిసినట్టు అనిపించి బువ్వతిన్న సంబరంతో అక్షరాల చుట్టూ అల్లుకుంటాయ్‌ పసి మనసులు

వొలికి పోవాల్సిన పాలబువ్వ

బడి దోసిట్లో పదిలంగా దొరుకుతున్నపుడు

బడికి దూరంగా బతకాల్సిన అవసరమే లేదంటూ భవిష్యత్తుకేసి నడుస్తున్న అడుగులన్నీ

మధ్యాహ్నం వెన్నెల కురిపిస్తున్న

చందమామకు జేజేలంటున్నై

నా క. - ఆంధ్రపదేశ్‌ మాసపత్రిక మం రంబ ఏ. బొడ్డుఫీగు

'శ్రైకా.' కసూరి రవికుమార్‌ . (. కవిత్వమంటే... మంటే వెన్నెలంత చల్లని మంట

  • వేల వేల గుండెల మీద చలికాచుకునే మంట స
  • దగసం/ంత. లి 6663666