Telugu bheemanna - anilvaranasi/indianlanguages GitHub Wiki
స _భీమన్నా(ద్య48) ష్ పు పద్యకాన్యం న
కా! . రచన. మ యో (॥ గే లె స" కవితా గాండీవి . హు సస. 1.4. 140. ౫౦. . వ న ాాాాంననాఆాంంఆంాంనంఖా.
౮1 బు లా భా న్ ధగ గే ం. యా శీ మాత్రే నమః ౧0 *భీమన్నా” (ద్విశతి) శ, యే థ్ / "న్ స. రచనః కవితా గాం4 ప _ ఆ / ( ము / అగో క సజ్దా ల్ఞక్టేరాజు సుద్దర్ధరామ సస్షు (ఆంధ్రోపస్యాసకుడు) 1-8-702/1/1, అంధ్రాబ్యాంకు సందు నల్లకుంట, హైదరాబాద్-500 044 ఫోనుః 040-27423496 0611: 98850-20205 ౧౧. 27635674
ఎగ [/ భీమన్నా (ద్విశతి) పద్యకావ్యం ఏ2 : దాః అక్కిరాజు సుందర రామకృష్ణ శ లె 1.4. 40.౬, ౯౧౦. ల ఖా శ భ' ' ప్రధమ ముద్రణ : 2005, జనవరి ॥ సర్వహక్కులు గగ్రంథకర్తవి వెల; 50 రూ. శ 9 బఠాలయ యు శ్సాో (ఖీ శ. ర ౩133..) నాం ప్రింటర్స్ : (శో స వీ ఆజ్ కాన ష్ వా న త నీ సరస్వతి ఆఫ్ స్షర్రిం్టక్స్, రం ఫుడ్‌వరట్డ్ ప్రక్కన, స్తొమట్ట్లమైద్దదాజాన్ ప్రతులకు : దా॥॥ అక్కిరాజు సుందర రామకృష్ణ ౧14 4.01, ౯౧.౦ ఆంధ్రోపన్యాసకుదు 1-8-702/12/2, ఆంధ్రాబ్యాంకు సందు, నల్లకుంట, హైదరాబాద్ - 500 044. ఫోన్ : 040 - 27423498, సెల్ : 98850 - 20205
శ్రీమాత్రే నమః అంగజ దర్చభంగ మహిమాన్విత శ్రీగిరిలింగ - (భ్రామరీ సంగ - జటాకటాహ పరిసర్పిత సంచలితాభ్రగంగ - ని స్సంగ - మునీంద్ర సద్ధదయ సారస భృంగ - దయాంతరంగ - మా తంగ వరాజినాంగ- ప్రమదంబున ్రోవుము 'రామకృష్ణునిన్ భవదీయుడు
విద్వత్మవి, చిల్లర కృష్ణమూర్తి
హైదరాబాద్ - 500 018.
ఫోన్ నెం. 040-27406950 తేది 18-6-2004
నామాట
ఈ లోకంలో కొందరు తాను కృషి చేసిన రంగంలో తనను గూర్చి చెప్పుకోవడం. మొదలైతే ఒక్కోసారి దానికి అంతూ. పంతూ ఉండకుండా మాట్లాడుతుంటారు. వేదికలపైన అయితే మరీ విచిత్రంగా మాట్లాడుతుంటారు. అవతలి వాడికి తన మాటలు అసహ్యం పుట్టిస్తాయేమోననే ఆలోచనే ఉండదు. ఈ సంప్రదాయం ఈనాటి దేంగాదు. మన తెలుగు వారికి తరతరాల నుంచీ వస్తున్న అలవాటే! సాహిత్య రంగంలో కొంచెం తక్కువేమోగాని, నాకు తెలిసినంత మటుకు నాటకరంగంలో ఈ అప్రశస్తపు ప్రసంగాలు ఎక్కువగా వినబడుతుంటాయి.. తల్లిగర్భంలో ఉండగానే మొగానికి రంగు పూసుకున్నట్ట్లు మాట్లాడడం, తన జీవితకాలంలో ఎన్నో వేల నాటకా లాడాననడం, ఆలా అనంగానే చప్పట్టు వినబడడం, అదే సభలో ఎదురుగా ప్రేక్షకులలో ఉన్న, అర్థాంగో, అర్థాంగిలాంటిదో మొగాన్ని చేట చేసుకోవడం ఈనాటికీ చూస్తూనే ఉన్నాం. ఇంతమటుకు ఫరవాలేదు,మర్ కొందరయితే తాను రంగస్థలం మీదనే చచ్చిపోవాలను కుంటున్నా నంటారు. ఎందు కంటారో నాకు ఈనాటికీ అర్థంగాదు. 'పాండవోద్యోగం'లో మొదటి 'సీను'
లో కృష్ణుడేసి నిజంగానే నిద్రపోతీ యెంత అనౌచిత్యమో, వీళ్లమూటలు గూడా నిజంగా అంత అప్రశస్తం . ఒకవేళ నిజంగా రంగస్థలం మీదనే చచ్చిపోవా అనుకుంటే ఒక్క పాదుకాపట్టాభిషేకంలో (పానుగంటి రచన ) దశరథుడి పాత్ర వేయాలి. అది గూడ కార్య నిర్వాహకులు, స్టేజి ఇన్‌చార్జి వాళ్లు “హా రాఘవా, హా | .... రామా ... యన్న దశరథుడి పద్యం తరువాత “కర్టెన్ వేయడం మరచిపోతే, ఆపాత్రధారి నిజంగా చచ్చా డన్న మాటే గదా ! కాబట్టి ఏ రంగంలోనైనా కవులుగానీ, నటులుగానీ, రాజకీయ నాయకులుగానీ సమాజంలో, ముఖ్యంగా వేదికల మీద యెంత తక్కువ మాట్లాడితే ఆంత మంచిదని నా అభిప్రాయం. కొంతమందికి, ఈ మధ్య మరో విచిత్రమైన వ్యాధి ముదిరింది. వేదికల మీద అవతలి వక్తలను తొందర పెట్టడం, కంగారుపెట్టి పరిగెత్తించడం, మధ్యలో ఏదన్నా అనుమానం వచ్చి, పక్కవాడి నడిగి విషయం తెలుసు కుంటూంటే, తానేదో మహా క్రమశిక్షణా యుకుడైన యోధుడిలా తర్జని చూపించడం, సైలెన్స్ అని గీసాక్షొలో జంఘాల. శాస్త్రి అంగ్ల పాండిత్యాన్ని ప్రదర్శించినట్లు ప్రదర్శించడంకూడా జరుగుతున్నాయి. " అందరినీ ఆతి తక్కువ మాట్లాడించి ఆ 'తర్జని' చూపించే పోటుగాడు
అరగంటో, గంటో, మాట్లాడి తనకు ఆత్మ సంతృప్తి అయిన తర్వాత ఛాయాగ్రాహకుడు. క్లిక్ మనిపించిన తర్వాత అమ్మయ్యా | 'ఫోటో పని అయిపోయింది. 'రేపు పేపర్లో గ్యారంటీ' అని నిశ్వాసించి - తన ప్రసంగానికి ప్రేక్షకులు సభలో చప్పట్లు కొట్టకపోతే మహా బాధతో ఆముదం సేవించిన వాడిలా ముఖాన్ని పెట్టీ, కొట్టండి అన్నట్లుగా మధ్యలో కొంచెం విరామం ఇచ్చి కొట్టించుకొని, ఎక్కడికో ఆతి తొందరగా జారుకుంటున్నారు... సాహిత్య రంగంలో, ముఖ్యంగా భాగ్యనగరంలో (రాష్ట్ర రాజధాని కదా) కొంత మంది మహా కవు లనుకుంటున్న వాళ్లకు కీర్తి కండూతి ఎక్కువౌతున్నది. రోజుకు ఒకటే సభికో, ఒకటే సమావేశానికో పోతే అది చాలా పరువు తక్కువయినట్లు భావన మొదలైంది. మరీ “ఒక పెగ్గేనా' అని “బార్గో కొత్తగా రంగంలోకి దిగుతున్న అర్భకుడికి ఆగ్రహం తెప్పించి నట్లవుతున్నది. పాఠకులారా ! “నేనుగూడా' బార్డో నే ఉన్నానని భావించవద్దు. నేనెప్పుడూ “కవితా దర్చార్' లో ఉంటాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, 94 సం.ల కవి భీష్ముడు “బోయి భీమన్న! గారి కవితా వైశిష్ట్యాన్ని గురించి, ఆయన సంతృప్త జీవితాన్ని గురించి చెప్పడానికి ముందు "నాందీ" వాక్యాలు పలికాను.
అంతే! ఎంతైనా నేనుగూడా నాటక రంగం మనిపిని గాబట్టి, కొంచెం పైన, నేనే చెప్పినట్టు ధోరణి ఉంటుంది గదా
బోయి భీమన్న గారిని 1971 నుంచీ ఎరుగుదును. 1972 సం .లో నేను ఎమ్.ఏ. చదువుకుంటున్న రోజుల్లో మా అన్నగారు (మంజుళ్రీ) నన్ను ఏదో పని మీద '“ఎర్ర మంజిల్ కాలనీలో ఉంటున్న భీమన్న గారింటికి పంపినట్లు గుర్తు. అది, మొట్టమొదటి సారిగా కవితాభిముల్ని దర్శించిన రోజు ఈయనే 'భీమన్న' అని తెలుసుకున్నరోజు. గొప్ప విషయం, విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ రోజు 1972 సం .లో ఏ ఇంటి ఇనుపగే టెలా ఉందో, ఏ ఇంటి గోడ లెలా ఉన్నాయో, ఆ ఇంటి ముంగిట తోట ఎలా ఉందో, ఆ కొబ్బరిచె ట్లైలా ఉన్నాయో, భీమన్న గారూ అలానే ఉన్నారు, ఒక్క వయసు మార్పుదక్క. నాకు తెలిసినంత వరకూ భీమన్న గారు గూడా 1.1.0. చేసినవారు. గొప్పగొప్ప రాజకీయ నాయకులతో (మర్రి చెన్నారె డ్డిగారి లాంటి వారితో) సత్సంబంధా లున్న వారే! మరి వారికి జూబ్లీహిల్సు మీదకో, బంజారాహిల్పు మీదకో, కనీసం “ఫిలింనగర్” మీదకో మన సెందుకు పోలేదో అర్ధంగాక ఛస్తున్నాను. జూబ్లి 'గిరి' జనులు కవితా “'హరోజునులు నాపై అగ్రహింపకుండా నుండెదరుగాక!
ఆపార్థముల నందకుండ నుండెదరుగాక ! అమంగళములు శాంతించునుగాక | అసందర్భములు, అకారణ కలహములు చెలరేగకుండును గాక 1 అక్కడ వసతి ఏర్పరుచుకుంటే వేరే లక్షణా లొస్తాయని ఈ భీమన్న గారు “గంధమాదనాన్ని! మించిన 'ఎర్రమంజిలే' నయ మనుకున్నారేమో 1 ఎవరిష్టం వారిది 1 ఇల్లెక్కడుంటేనేం మంచి 'దిలో ఉండాలిగాని ? భీమన్నగారిని దాదాపు జీవించి ఉన్నవారిలో కవితా గాంగేయుడు అని చెప్పవచ్చు. అన్ని కవితా ప్రక్రియల్నీ చేపట్టినవారే ! నాటకాలు వ్రాశారు, ఖండ కావ్యాలు భ్రాశారు. లలిత గేయాలు వ్రాశారు. శతకాలు వ్రాశారు. పత్రికలలో పనిచేశారు. పలు సమస్య లెదుర్కొన్నారు. పద్మశ్రీలు, కళా ప్రపూర్జులయ్యారు. అటువంటి భీమన్న గారికి ఈ మధ్య “జాషువా పౌండేషనొ హైదరాబాద్ వారు ఘనమైన సన్మానం “పబ్లిక్‌గార్డెన్స్'లోని 'జూబిలీహాలు' లో చేశారు.లక్ష రూపాయల నగదు బహుమానంతో దుశ్శాలువతో సత్కరించారు. గొప్ప గొప్ప వారు సభలో పాల్గొన్నారు. ఆ సభలో నేనూ పాల్గొనడం చేత గొప్పవాజణ్ఞయ్యాను. ఆ సభలో పాల్గొనడానికి మరో కారణం కూడా ఉంది. '“జాషువా' అంటే పడి చచ్చే వాళ్లల్లో నేను ప్రథముణ్ణ్లీ. ఈ విషయం ఇటీవలే ఆవిష్కరింపబడిన
నా 'శారదా' అధిక్షేప కావ్యం చదివితే తెలుస్తుంది. ఆ సభలో మహాకవి జూషువా గారి మీద నేను వ్రాసినవి కొన్ని పద్యాలు, జాషువా కవిగారి 'పిరదౌసి లో కొన్ని పద్యాలు నేను గొంతెత్తి పాడడం జరిగింది. ఆ సందర్భంగా భీమన్న గారి సంపూర్ణ కవితా జీవిత వైభవం. తెలుసుకున్నాను. ఇంతకాలం, ఇంత గొప్ప కృషి చేసిన ఈ కవికి ఇంత చిన్న సన్మానమా అని అనిపించింది నామనస్సుకు. మనసులో ఆ సన్నానం చూస్తూ ఆనందిస్తూనే బాధపడ్డాను. అదట్లావుంచి ఈనాడు అర్ధం పర్ధంలేని, తలా తోకలేని కవిత్వాలు వ్రాస్తూ, మూర్ధన్యాక్షరాలు పలకడము చేతగాని, దంత్యాక్షరాలనూ, తాలవ్యాక్షరాలను మహా దరిద్రంగా పలుకుతూ గొప్ప గొప్ప పురస్కారాలు అందుకుంటున్న కవులను చూసి మరీ బాధపడ్డాను. అటువంటి అర్భకులకు ఏకంగా సాహిత్య అకాడమీ పురస్కారాల నిప్పించడానికి దోహదపడుతున్న కవి వృషభుల్ని గురించి మరీ బాధపడ్డాను. కానీ, నాకు తెలిసినంతమటుకు భీమన్న గారు గొప్ప సంతృప్త జీవి. పదవులకోసం, బిరుదుల కోసం తాపత్రయ పడే వ్యక్తి గాదు. ఈనాటికీ రవనలు చేస్తున్నాడంటే ఆయనకున్న అత్మస్థెర్యానికి జోహార్లు. నిన్నగాక మొన్న రవీంద్ర భారతిలో ఆంధ్రప్రదేశ్ గవర్నరు
“సూర్ణిత్‌సింగ్ బర్నాలా' గారి సమక్షంలో 'భీమన్న మాట వెలదులు", “జగత్ సత్యం-బ్రహ్మ మిథ్య” అనే పుస్తకాలు అవిష్కరించబడ్డాయి. ఆ రోజు కూడా నా గళానికి పని కల్పించారు ఆ కార్యక్రమ నిర్వాహకులు, భీమన్న గారి మీద ఐదు పద్యాలు వ్రాసి చదివాను- అదే- పాడాను. కార్యక్రమం, భీమన్న గారి కావ్యాల సంగతి అది వేరే మాట గాని, అక్కిరాజు పద్యాలు చాలా బావున్నాయని వక్తలే నన్ను ప్రశంసించడం, తలచుకుంటే భలే ఆనందమనిపిస్తుంది. నా సంగతి నేను చెస్పుకోపడము బాగుండదు. ఏదో మర్దన అవుతుందని నాకు చచ్చే భయం. కానీ ఈ రోజుల్లో అట్లా చేసుకుంటేనే వాడికి ఉనికి. లేకపోతే వాడికి బలిచక్రవర్తికి పట్టిన గతి పడుతున్నది. ఏమైనా భీమన్న గారు గొప్ప సాహితీ తపస్వి. ఆశ్చర్య మేమిటంటే “శ్రీశ్రీ వచ్చి కవిత్వాన్ని చెడగొట్టాడు. ఘంటసాల వచ్చి సంగీతాన్ని నాశనం చేశాడు” అన్న భీమన్నగారు ఇప్పుడు “శ్రీ శ్రీ కమ్యూనిస్టుగాదు' అనే చిన్న పుస్తకం వ్రాశారు. అది త్వరలో ఆవిష్కరించబడనున్నది. అలాగే 'ఘంటసాల్ మహా గాయకుడు... తెలుగు జాతి గర్వించదగిన వాడు, గంధర్వుడు అని భ్రాస్తే బావుండును. అపుడు సంతోషించే వాళ్లలో నేను ప్రప్రథముణ్ణి అవుతాను.
జీవితంలో, ఆలోచనలలో అభిప్రాయాలలో మార్పులు విచిత్రంగా ఉంటాయి. ఎవరిమాటో ఎందుకు ? నేనే చాలా మారాను. డిగ్రీ చదువుకునే రోజుల్లో ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు, ఎమ్.ఏ. చదివే రోజుల్లో లేవు. 50వ పడి దాటిన తర్వాత మరీ మరీ ఆలోచనలు, సిద్ధాంతాలు మారి పోయాయి. ఇది సహజం కూడానూ. ఏది ఏమైనా మహాకవీ, నిరాడంబరుడూ, ఇప్పుడు బతికున్న కవులలో నిస్సంశయంగా మానవతావాది అయిన శ్రీ బోయి భీమన్న గారిని గురించి ఒక కావ్యం ద్రాద్దామనుకున్నాను. వ్రాశాను. భీమన్న దంపతులకు _ అంకితం ఇద్దామనుకున్నాను. ఇస్తున్నాను. వారి కుటుంబానికి ఆ సదాశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక ! ఇది నా ఆకాంక్ష చివరగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను. నాకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు. జీవితంలో సగ భాగం పైగా నాటకాల '*రిహార్సల్సు' పద్యాల 'కంపోజింగు' తోనే సరిపోయింది. కానీ, ఇప్పుడిప్పుడే పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కారణం, మంచి సాహిత్యం వస్తున్నదని కాదు. అలా భ్రమపడితే పప్పులో కాలేసినట్లే. ఆ విషయం వదిలేయండి. “జగత్ సత్యం-బ్రహ్మ మిథ్య” కావ్యంలో చివరి
పుటలలో భీమన్న గారు ద్రాసిన మాటలు నాకు నచ్చాయి. నిజం చెప్పాలంటే నా స్వభావం కూడా నూటికి నూరుపాళ్లూ అదే! - “ఉన్నదున్నట్టుగా, నిజం చెప్పడం నా అలవాటు. దానివల్ల ఎన్నో నిష్ణురాలు చుట్టుముడతాయి. ఎంతో మంది స్నేహితులు దూరమైపోతారు. నిజం, ఉగాదినాటి వేప పువ్వు పచ్చడి లాంటిది. ఆరోగ్యకరమే గావచ్చు, కానీ చేదుగదా 1 బెల్లం ఎంత కలిపినా చేదు తగ్గదు. నిజం చేదు అయినా, దానిని వడ్డిస్తూనే ఉంటాను నేను. ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ లెక్క చెయ్యను. విశిష్టమైన ప్రత్యేక వ్యక్తిత్వం నాది. నాకు శత్రువు లెవరూ లేరు. నా రచనలు కిట్టని మిత్రులున్నారు."” ఇవి ఆయన మాటలు. నా రచనలు కిట్టని వాళ్లు లేరు కాని, భీమన్న గారి ఈ పై మాటలు అక్షరాల నాకూ వర్తిస్తాయి. 94 సం.ల వయస్సులో ఇలా చెప్పాల్సిన పని లేదు భీమన్న గారికి. ఈ మాటలు నన్ను చాలా ఆకర్షించాయి. భీమన్న గారిని గురించి, అంటే “భీమన్న మకుటంతో కొన్ని పద్యాలు వ్రాయా అనుకున్నాను. న్యాయానికి ఇందులో '*భీమన్న” మకుటమై కూర్చున్నాడు గాని, అప్రయత్నంగా “ఆకాశ (అవకాశ) రామన్న' ల గురించి కూడా వ్రాయడం జరిగింది. చదవండి. ఆనందంగా
నవ్వుతూ ఉండడం ఆరోగ్యానికి మంచిదంటారు, గాబట్టి నేను గూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తాను. నా ఈ చిన్ని కావ్యానికి ఎంతో అభిమానంతో అభిప్రాయాలు వ్రాసి యిచ్చిన ఇతర విద్వత్కవులకూ- ముఖ్యంగా- నాకు అనేక సూచనల నిచ్చిన 'సాహిత్య బ్రహ్మ డా! వి.వియల్స్‌నరసింహారావు గారికి చక్కగా డి.టి.పి. చేసి ఇచ్చిన వారికీ, అంతకన్నా చక్కగా ముద్రించి ఇచ్చిన ప్రెస్ వారికీ నా కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను. డా॥ అక్కిరాజు సుందర రామకృష్ణ 4,10౬,2౧0,
ఆత్మీయం
“ఆక్కిరాజు” యింటిపేరు వినగానే 'నేటి కాలపు కవిత్వం” అనే వ్యాసం వ్రాసి, భావకవులనందరినీ ఉలిక్కిపడేలా చేసి వెలిగిన 'ఉమాకాంతవిద్యాశేఖరులు' (అదే, ఉమాకాన్తమ్) గుర్తుకు వస్తారు. ఆయిన 'చనాలోకమ్” గుర్తుకు వస్తుంది. ఆయన పనిచేసిన మదరాసు ప్రెసిడెన్సీ కళాశాల గుర్తుకు వస్తుంది. ఆయన శిష్యులు గుర్తుకు వస్తారు. ఆయన 'పలనాటి వీరచరిత్ర" గుర్తుకు వస్తుంది. ఆయన వైదుష్యం గుర్తుకు వస్తుంది. ఆయన పాండిత్య ప్రతిభ గుర్తుకు వస్తుంది. ఇవాల్డి రోజుల్లో అయితే ఆ ఉమాకాంతాన్ని, ఆయన మాటలను ఎవరూ లెక్కచేయరేమోగాని ఆ రోజుల్లో మాత్రం ఆయనకు కవులూ, సంప్రదాయకవులూ, భావకవులూ చాలా గౌరవమిచ్చారు. ఆయన అభిప్రాయాలను ఆమోదించారు. భావకవితా చక్రవర్తి కృష్ణశా(స్తిలాంటివాడు, అలాగే ఆయనకు గురు తుల్యులైన వేంకట పార్వతీశ్వర కవులు కూడా ఉమాకాంత విద్యాశేఖరులవారి ఆక్షేపణలకు గురి అయినట్టు చెబుతారు. ఏది ఏమైనా ఈ 'అక్కిరాజు” వారిది ఒక ప్రత్యేకత. అదే వంశంలో ఉద్భవించిన డా॥ అక్కిరాజు రమాపతిరావు (మంజాశ్రీ) డా॥ అక్కిరాజు సుందర రామకృష్ణ నాకు చిరకాల పరిచితులు. వీరిద్దరూ ఏకోదరులే! 'మంజుత్రీ” గొప్ప పరిశోధకుడు. సృజనాత్మక రచయిత అని నేను చెప్పనవసరం లేదు. కానీ విలక్షణ పద్య నటుడైన సుందర రామకృష్ణ హఠాత్తుగా కవి గావడమే కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా, అంతకు మించిన ఆనందం కూడా అనిపిస్తున్నది. చి। సుందర రామకృష్ణ మంచి నటుడని, గాయకుడని, ఉపన్యాసకుడనీ తెలుసు. చలనచి(త్రాలలో గవర్నర్థుగా, డాక్టర్సుగా, రాజకీయ నాయకుడుగా నటించడం చూశాను కాని - యింత తీవ్ర భావుకుడని అనుకోలేదు. వాళ్ళ వూరు (నరసరావుపేట) నయాగరా కవులను నేనెరుగుదును, అదిగో, వాళ్ళ పేరు నిలబెట్టాడు సుందర రామకృష్ణ
నా పేరును మకుటంగా చేసికొని (భీమన్నా) రెండు వందల పై చిలుకు పద్యాలు వ్రాయాలని ఈ చిరంజీవికి ఎందుకు బుద్ధి పుట్టిందో అర్థం
గావడంలేదు. చి॥ సుందర రామకృష్ణకు అసలు నా గురించి ఏం తెలుసు? తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? పోనీ, నా సమ వయస్కుడు అందామంటే నాకంటే ఎంత చిన్నవాడో ఆతని మాటలే చదివితే తెలుస్తుంది. సుందర రామకృష్ణ ప్రతి పద్యంలో ఏదో ఒక నూత్నాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ కవికి ఆత్మాభిమానం హెచ్చు. దేశసమైక్యతను వాంఛిస్తాడు. సంప్రదాయాలు విడనాడొద్దంటాడు. ఆంధ్రుల సమైక్యతను నేనుగూడా బహుశా ఈ కవి పుట్టకముందే చాటాను. “వాణియె తీరవాటిక, భవానియె రాయలసీమ, శ్రీ "తెలంగాణము పూర్ణ రాజ్యరమగా ముగురమ్మల మూర్తి దాల్చి” - అని అన్నాను. ఈ కావ్యంలో నా పేరు ప్రతి పద్యంలో కనబడుతున్నా, వినబడుతున్నా - ప్రస్తుత సమాజాన్ని తూర్పారబట్టాడు. వర్తమాన సమాజం, కవిలోకం, చిత్రలోకంపై చిందులు తొక్కాడు. నాకే అనుమానంగా ఉంది. ఇదంతా అభిమానమా? లేక ఆ(గ్రహమో తెలియకుండా ఉంది. నన్నడ్డం బెట్టుకుని వర్తమాన సమాజాన్ని బండకేసి ఉతికినట్టు ఉతికాడు. ఈ ఉతుకుణ్ణి చూస్తుంటే నాకే భయం భయంగా ఉంది -
నోట్లో నాలుక యుండదు
సీట్లో కూర్చొనగ కాంక్ష చిల్లరగాండ్లీ
'ఘూట్టే' 'సాలే'లను, న
ట్టేట్లో ముంచి యుతకవలె నిల భీమన్నా! ఈ పద్యం కొంచెం మోటుగా కనబడుతున్నది, సుందర రామకృష్ణ ఎందుకు ఇలా (వ్రాశాడు? అని ప్రళ్టించడం కన్నా, అసలెందుకు యింత తీవ్రంగా స్పందించాడు? అని ఆలోచించడమే చాలా న్యాయం. నేను ఒక్క ఈ పద్యాన్నే ఎత్తిచూపుతున్నాను. ఇంతకు మించిన పద్యాలు ఈ కావ్యంలో కొల్లలున్నాయి. 1చిత్రసీమ'ను గూర్చి ఈ చిరంజీవి వాపోయిన విధానం నాకు చాలా నచ్చింది, ప్రతి పద్యంలో చమత్కారం, వ్యంగ్యం, అధిక్షేప కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. ఇలా (వ్రాయడం సుందర రామకృష్ణకే చెల్లింది. ఈ మధ్య అతడు ఆవిష్కరించిన
శారదా" అధిక్షేప పద్యకావ్యం చదివాను. ఈ మధ్య వచ్చిన ఆధునిక పద్యకావ్యాలలో లక్షణం, వ్యాకరణం మొదలైన కొన్ని విషయాలను కొంచెం పక్కకు పెడితే, 'శారదా' కావ్యం మళ్ళీ 'కూచిమంచి'” కవిని స్ఫురణకు తెస్తున్నది. వర్తమాన సమాజానికి “శారదా'లాంటి కావ్యాలు చాలా ఆవసరం అని అనిపిస్తున్నది. “శారదా కావ్యం చదివిన తర్వాత సుందర రామకృష్ణ వ్రాసిన ప్రతి కావ్యం చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది.
ఈ భీమన్న '“ద్విశతిలో సుందర రామకృష్ణ సంప్రదాయం కోసం ఎంత ఉబలాట పడుతున్నాడో అర్హమవుతున్నది. విదేశి నాగరికత, తెచ్చిపెట్టుకున్న సంస్కారాలను గురించి ఇతడు పడిన మనస్తాపం కొట్టవచ్చినట్టు ఈ కావ్యంలో కనపడుతుంది. సాహిత్యలోకంలో జరుగుతున్న ఆశ్రిత పక్షపాతాలను చాలా నిక్కచ్చిగా బహిర్గతం చేశాడు “అక్కిరాజు
పసలేని అర్భకాళిని
వెసపీఠమ్ములను నిల్పి, విబుధులెనిచ్చల్
అసమానులనుచు పొగడగ
కసి పుట్టదా లోకమనగ కవి భీమన్నా!? అంటాడు. అంతేగాదు - తనను గూర్చి
చెలువపు గుణ సంయుతుడను
తెలుగమ్మకు ముద్దుసుతుడ - *త్రీయిను వన్నున్
చలిగొండటేని యల్లుని
చెలి భక్తుడ! తెలిసికొనుర! శ్రీ భీమన్నా! అనడం చాలా బావుంది. ఏది ఏమైనా సుందర రామకృష్ణ తన కవితా ధోరణిని కేవలం అధిక్షేప (ప్రక్రియలకే పరిమితం కానీయకుండా, భావుకతను పండించి, రసావిష్కర్షను సంపూర్షంగా ప్రదర్శింపచేసి, అమోఘమైన, అపూర్వమైన మంచి సలక్షణ కావ్యం (వ్రాయాలని ఆశిస్తున్నాను. ఆశక్తి అతడు నమ్మిన శారదాంబ తప్పక ప్రసాదిస్తుందని గూడా నమ్ముతున్నాను. సుందర రామకృష్ణ - అక్కిరాజు,
వంశ కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేయాలని విశ్చసిస్తున్నాను. సుందర రామకృష్ణ మంచి గాయకుడు, నటుడు. కృష్ణపాత్ర పోషణలో రంగస్రలంపైన అతనికతనే సాటి. గళంలో ఘంటసాల ఛాయలున్నవాడు. ఇప్పుడు మంచి కవి గూడా అయినాడు. నాకూ, మా ఆవిడ హైమవతికీ సుందర రామకృష్ణ ఈ కావ్యాన్ని అంకితమీయడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి సుందర రామకృష్ణకు ఇవే మా నిండు దీవెనలు.
ముందుగ చనుదినములలో
కందమునకు సోమయాజి, కవిచౌడప్పల్
చందనము దిద్దినారో
సుందరిరామ్‌కృష్ణు నీవు శోభవు శ్రీకే!
సుందరులు రామకృష్ణులు
సుందరుడౌ మొదటివేల్పు శుభగుడు శివుడా
నందమును పంచ తామొక
సుందరతామూర్తి దాల్ఫి శోభింతురిటుల్!
నాపేరు మకుటముగ శుభ
మౌ పెనుకావ్యమును ద్రాసితౌ-దానిని న
న్నే పెద్దచేసి అంకిత
మా? పెద్దల పెద్దవైతివయ్యా! కృష్ణా! తారణ ఆషాఢ శుద్ధ నవమి = డా/ బోయి భీమన్లు ఎ(ర్రమంజిల్ హైదరాబాద్ - ఆం.ప్ర.
ప్రస్తుతి
డా॥ అక్కిరాజు నుందరరామకృత్మగారు వ్రాసిన “భీమన్నొ అను మకుటముగల ద్విశతి చదివినాను.
తెలుగు సాహితీ ప్రపంచంలో శతకవాబ్బయం' అతి విసృతమై బహుళప్రాచుర్యము సంతరించుకున్నది, దైవపరముగాను, వ్యక్తిపరముగాను, ఆత్మపరముగాను చెప్పిన శతకములెన్నో తెలుగునాట ఆబాలగోపాలమునకు కంఠస్థమై వున్నవి. ఇక సుమతిశతకము, వేమన శతకము, తెలుగు సాహితీ సరస్వతికి అలంకారములని చెప్పవచ్చును. ఇవి అనని వినని తెలుగువాడు ఉండడు. ధర్మపురి నరసింహస్వామి, శ్రీకాకుళ ఆంధ్రనాయకుడు, హంసలదీవి వేబుగోపాలుడు, భద్రా(ది శ్రీరామచం[ద్రుడు, (దాశరథి శతకము) సింహాద్రి నారసింహుడు ఇలా ఎందరో దేవుళ్లు మన శతక వాబ్మయానికి మణిమకుటాలుగా వెలుగొందినవారే.
వావిలాల వాసుదేవ శాస్త్రి జాగర్లమూడి కుప్పుస్వామి, వంటి వ్యక్తుల నాశ్రయించిన అధునిక శతకములు, అలాగే ఆత్నాశయములై కవి చౌడప్ప నాటినుంచి వెలసి వెలుగుజూసినవీ “నార్లవారిమాటి “నిజము రామచంద్ర నీదుమాటి వంటి శతకములు ఉన్నాయి. మహాకవి విశ్వనాధ కవితా ప్రస్థానం కూడా విశ్వేశ్వర శతకరచనతోనే ప్రారంభమైనది. విశ్వనాధ మధ్యాక్కరలు లెక్కకు మిక్కిలిగావున్నా శతకవాజ్మయం (క్రిందికే వస్తాయి.
సమకాలీన సమాజపు పోకడలను ఆమూలా(గ్రంగా పరిశీలించి కవితగా వెలయించిన ఆధునిక కవులలో శ్రీఅక్కిరాజు సుందర రామకృష్ణ గారు ఒకరు. కవి, పండితుడు అయిన శ్రీ బోయి భీమన్న గారిని ఉద్దేశించి మనసులోని మాటలను తేటగా కందపద్యములుగా చెప్పినారు, శ్రీ సుందర రామకృష్ణగారు.
వారి కవితాధార తైలధారా సమానకమైనది, ఎడతెగనిది. సునిశిత మేధాశ్తక్తితోబాటు సున్నితమైన విమర్శ ఈ శతకములో చోటుచేసుకున్నది. దేశ కాలాలను బట్టి శైలి రూపురేఖలను మార్చుకుంటూ రచనకు వన్నె తెచ్చినది.
“త్వమేనాహమ్” రచనలో ఆరుద్ర ఆంధ్రీకరించిన ఆంగ్రభాషో దాహరణలు, అటు తర్వాత కవులు తెలుగు కావ్యాలలో అలవోకగా వాడిన ఇంగ్లీషు మాటలు వాడుతూ శ్రీ సుందర రామకృష్ణ గారు నేటి తెలుగు చదువరికి అతిచేరువైన శైలీ నిర్వహణ గావించడం ఈ కందపద్యాలలో అందంగా కనిపిస్తుంది.
అక్కిరాజు వారు సప్రయోజన రచనా పారీణులై సారస్వతసేవ చిరకాలం చేయవలెనని నా అభిలాష
19-10-2004 అమీర్‌పేట్, హైదరాబాద్ భవదీయుడు ణ్ వేటూరి సుందర రానుమూర్రి
మరొక భీముడు
ఉగాది - తారణ | మార్చి - 2004
మహాభారతములో భీముని పాత్ర అత్యద్భుతమైనది. భీముణ్ణి క్రోధ రసానికి సాకారంగా వర్ణించడం కద్దు. కాని, భీముడు అందగాడు. యుద విద్యావిశారదుడు.. శివునికి భీముడనే "పేరు ఉన్నది. సృష్టిలో నిరాకారుడుగా కన్పించినా శివుడంత అందగాడు మరెవ్వరూ లేరు. అందుకే ఆయనను సత్య సుందరుడంటారు. అక్కిరాజు సుందర రామకృష్ణ కూడా మంచి శివభక్తుడు. అందగాడు. కవితాసుందరుడు. అందువల్ల లోగడ ఒక 'ఖీమలింగ శతకాన్ని" భక్తిరసప్రధానంగా వ్యంగ్యాత్మకంగా రచించాడు. ఇతని ఇష్టదైవం నర్సరావుపేట (గుంటూరు జిల్లా) పాతూరిలోని భీమలింగేశ్చరస్వామి. ఉపాసనా దైవం ఆయన అర్జాంగి రాజరాజేశ్వరీదేవి. భీముడు, హనుమంతుడు, వాయుపుత్రులు. ఇది సుందర సంకేతము. ఇక ఈ పుస్తకం సంగతికి వద్దాం!
హైదరాబాద్‌లో బోయి భీమన్న ఒక కవి. భావుకుడు, కవితా సంప్రదాయాలు తెలిసినవాడు. వార్హకం వల్ల ఇప్పుడు తరచూ కవి సమ్మేళనాలలో పాల్గొనడం లేదు. కాని పూర్వము భీమన్న లేని కవి సమ్మేళనమే ఉండేది కాదు. భీమన్న" మకుటంతో అక్కిరాజు రెండు వందల పైగా కంద పద్యాలు (ద్విశతి) రచించడం ఆశ్చర్యకరమే! కవిత్వం ఇలాగే ఉండాలన్నది ఎవరూ శాసించలేరు. ఒకే కవి భిన్న కావ్యములలో భిన్న భిన్న మార్గములను (ప్రదర్శింపవచ్చును.
కొన్నాళ్ళుగా అక్కిరాజు యధార్ధవాది అయినాడు. నిజము నిష్టురమే! అది ముఖిట్రీతిపరులకు నచ్చదు. కాని ఎవడో ఒక సాహసి, ఏదో ఒక మూలనుండి క్షాళన మొదలుపెడతాడు. తరువాతి తరాల వారు అతడిని వేనోళ్ళ కీర్తిస్తారు. అక్కిరాజు అట్టి పనులు చేస్తున్నాడు. ఫలితముగా ఈయనకు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపాధ్యక్ష పదవి గానీ, కేంద్ర సాహిత్య
అకాడమీ పురస్కారం గానీ రాకపోవచ్చు - పోనీ - ఏమైంది? అవి వచ్చిన వాళ్ళంతా యోగ్యులా ఏమిటి? ఈ కవితాగాండీవి, అభినవ ఘంటసాల బిరుదాంకితుడు, (ప్రజల నాలుకల మీద జీవిస్తున్నాడు. లోగడ 'ఆమ్మతోడు'లో వలెనే ఈ 'భీమన్న' ద్విశతిలో కూడా కావలసినంత వాడి, వేడి ఉంది. అందుకు కారణాలున్నాయి. అవసరం గూడా ఉంది. అందరూ చాటుమాటుగా అనుకునే విషయాలే అక్కిరాజు బహిర్గతం. చేసి పిల్లి మెడలో గంట కట్టాడు. గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకోవలసిన సమయం వచ్చింది. అక్కిరాజు సుందరుడు - లోగడ 'కవితాగాండీవి అనే బిరుదు సంపాదించాడు, ఇప్పుడు కవితా భీముడైనాడు. ఆయన ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్చరి ఆశీస్సు లందించుగాక! వేములవాడ భీమన్న వలె ఈ అక్కిరాజు భీముడు కూడా వాక్ళుద్ధి కలవాడు. కవిత్వంలో ఉద్దండుడే! కవితా సౌందర్యం చూపడం కోసం వ్యంగ్య వైభవాన్ని ఎత్తి చూపడానికి ఏదైనా పద్యం ఉదహరించాలనుకుంటే మొత్తం శతకాన్ని మళ్ళీ ఇక్కడ చూపవలసి వస్తుంది - అయినా మచ్చుకు - లోకము పోకడ మారెను 'జాకా'ల్లాళ్ళెక్కువైరి సాహితివనిలో “బాకా'లూదగా రావఠె 'కాకాసురు'లకె యుగమిది, కవి భీమన్నా! డా॥ ముదిగొండ శివప్రసాద్
- చారిత్రక నవలా చక్రవర్తి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఫోన్ : ౦040-2742 5668
అభినందనీయులు మా అక్కిరాజు భీమన్నలు “సాహిత్యబ్రహ్మ' డా. వివియల్. నరసింహారావు రిటైర్డ్ డైరెక్టర్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, హైదరాబాద్. ఇది 'భీమన్న ద్విశతి'. భీమన్నను సంబోధిస్తూ నిర్దిష్ట మకుటంతో నడిచే శతక సంప్రదాయపు రచన. కందపద్యాల్లో కమ్మగా సాగింది. ఇంతకూ ఈ భీమన్న ఎవరు? శ్రీనాధకవికృత భీమేశ్సరపురాణ ప్రసక్తుడైన భీమేశ్చరస్వామియా? తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామ, భీమారామ భీమేశ్చరుడా? పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న సోమేశ్చరభీమేశ్చరులా? ఎవరు? డా. అక్కిరాజు సుందరరామకృష్ణగారు రచించిన ఈ 'ఛీమన్నద్విశతిలో మకుటాయమానుడైన భీమన్న పైన పేర్కొన్న భీమన్నల్టోని ఏ భీమన్నాకాడు. ఆం(ధ్రసాహితీక్షేత్రాన్ని అమృతకవితాఫలాలతో నింపిన భాగ్యనగరనివాసి డా. బోయిభీమన్న. తాంభైనాల్లేళ్ల వృద్దకవి. డా. అక్కిరాజు ఆ మాటే అన్నారు - “తొంభైనాల్షేడులకును శుంభద్యశుడౌచును కవిసూరిగ నిల సం రంభంబున నుంటివి; కవిశంభుండవు; నీకు లేరుసరి భీమన్నా! (192వ పద్యం) “కళాప్రపూర్ణ, పద్మశ్రీ డా. బోయి భీమన్న, 0.1, లెజొస్టీటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు. అంతటి ప్రసిద్ధుడైన భీమన్నకవి పిల్లిని గూర్చి పద్యమల్లినా అది మహాజనాన్ని మురిపిస్తుందట. అందులోనూ కందపద్యం చెప్పటంలో అలనాటి తిక్కన సోమయాజినీ, కవి చౌడప్పను గుర్తుకుతెచ్చేట్టు చెప్పగలడట భీమన్న. “ఘనుడవు కందమున కీవు కవి భీమన్నా!” (15వ పద్యం) “నా యుల్లము దోచితివయ కవితల్లజు డన నీవె సుమ్ము ధర భీమన్నా! (16వ పద్యం) డా. అక్కిరాజు ఈ 'భీమన్నద్విశతి'ని కందాల్టోనే ఆనందకందంగా అల్టుకురావటానికి కూడా కారణం ఇదేననిపిస్తున్నది. డా. అక్కిరాజు కందాలు కూడా ఆత్మవిశ్వాసాన్ని పుక్కిలిస్తున్నవి.
“పండితపామరజనములు, మెండుగ ఆశీస్సు లిడుచు మెచ్చెడిపగిదిన్ కండగలవి కందములను రెండొందలు (వ్రాసినాడ శ్రీ భిమన్నా!” (210వ పద్యం) అటు శతక మకుటాయమానుడైన డా. బోయి భీమన్న ఇటు పండితపామర రంజక నవకవిగా డా. అక్కిరాజు ప్రస్తుతి పొత్రు లౌతున్నారు. డా. భీమన్న జగత్‌సత్యం ప్రవచించి, వార్టేవి అయిన 'మాటవెలది'ని సంభావించిన సత్కవి;పద శ్రైభూషణుడు. ఇంతకూ వస్తుదృష్టితో చూస్తే డా. అక్కిరాజును ఈ శతకరచనకు (ప్రేరేపించిన పరిస్టితు లేమిటనే (ప్రశ్న పుడుతుంది. భీమన్న 'గుడిసెలు కాలిపోతున్న'య్యని గగ్గోలుపెడితే అక్కిరాజు ఆర్యసంస్కృతి కుటీరాలు కాలిపోతున్నవని రోదించాడు.
ప్రధానంగా (ప్రాచీనమైన ఆర్యసంస్కృతికి పట్టిన దుర్గతి ఈ కవి హృదయాన్ని ఎంతగానో క్షోభింపజేసింది. నగరాలు నాడూ ఉన్నాయి: నేడూ ఉన్నాయి. నాగరికత నాడూ ఉంది; నేడూ ఉంది. అయితే నాటి సంస్కృతి, నాటి నాగరికత నేడు మనం చూడలేకపోతున్నాం.. దాదాపు వాటిని మనం మరచి పోయామా? అని అనిపిస్తుంది. అందుకే కవిగారు ఎంతగానో ఆవేదనపడుతున్నారు.
“మన నాగరికత మరచిరి, మన సంస్కృతిపట్ల (శ్రద్ధ మచ్చుకు గనమే!
మనసెంతొ కలతచెందును, కన మన చిత్రముల నిపుడు కవి భీమన్నా
(పద్యం 91)
ముఖసమ్మార్దనం చేసికొని గాని మంచినీళ్ళెనా పుచ్చుకోని మనం ఈనాడు “బెగ్‌కాఫీ' లేకుండా బ్రతకలేకపోతుంటిమి.
“పలు తోమకముందె.పతికి, చెలి కాఫీ నిడుటలయ్యె శ్రీ భీమన్నా[” (92) ఉండ్రాళ్ళ తదియ, అట్ట తదియ మర్చిపోయాము సరే! ఈ 'గెట్టుగెదర్దు, “బఫే” ల సంరంభ మేమిటి? విస్తట్లో తినటమే చాదస్తమైపోయింది. మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా నుదుట బొట్టు పెట్టుకోవటం మానేస్తున్నారా అనిపిస్తున్నది, చీరకట్టు మొరైపోయి పంజాబీ(డ్రెస్సులు బలిసిపోతున్నె.
ఇక సినిమాలు, బార్జు, గుర్తుకువస్తే గుండె బేజారౌతుంది.
“పిర్రలు పొంగినయట్టుల బిర్రుగ డ్రాయరులుగట్టి పిచ్చిగ డ్యాన్సుల్
వెర్రిగ మొగ్రిగ సల్పుట లర్రర్రే సిన్మకర్టమయె భీమన్న ! (67) “భరతుని నాట్యముకానీ, సురుచిరములు కూచిపూడి సొబగులు కానీ కరువయ్యెను తెల్లుతెరకు' అంటూ బాధపడక తప్పలేదు.
నగరాల్లో 'భగవంతుని గుడులకన్న 'బాన్లైక్కునవైనాయి” కొత్త సంవత్సరమంటే - 'రాతిరియంతయు విస్కీ త్రాగటమే" గాంధీబొమ్మలకంటే నేడు భారతదేశంలో (బ్రాందీషాపులే ఎక్కువైనాయి. ఈ పరిస్థితి సంస్కారంగల ఏ కవిని బాధించదు? అక్కిరాజుకవి ఆత క్షోభతో అపూర్వపద్యాలు ఆలపించాడు.
జాతినాయకులు గుర్తుకువస్తే కవిగారి హృదయం భక్తి పరవశమౌతుంది. గాయకులు జ్ఞప్తికి వస్తే గొంతు గీతాలాపం చేస్తుంది కమ్మగా.
“నాయకు డనగ ప్రకాశము, గాయకు డన ఘంటసాల' (49) ఇక సాలూరి, లత, రఫీ, బాలమురళి మొదలైన గానకోవిదులు స్ఫురణకు వస్తే హిందోళ, నీలాంబరి, హరికాంభోజి, సావేరి, శ్రీరాగా లాలపిస్తూ తనను తాను మరిచిపోతాడు డా. అక్కిరాజు.
మహాకవి పోతన, మీర్టాగాలీబ్, డా. దాశరధి ఇంకా ఇంకా చేరా గోరా, బేరా, రారా, కారా ఎందరో కవులు కవిగారి గుండెలో తాండవిస్తారు.
సినిమాకవుల్లో కృష్ణశాస్త్రి, వేటూరి మొదలైనవారు, డైరెక్టర్లలో కె.వి. రెడ్డి బి.ఎన్. రెడ్డి మొదలైన మహానుభావుల్ని మరచిపోగలమా? ఇక నటుల్లో నాగయ్య, వంగర, కొంగర, యన్.టి.ఆర్, అక్కినేని అక్కిరాజాను ఆనఖళిఖం పరవశింప జేస్తారు. అందాకా ఎందుకు? అక్కిరాజుగారి “వళ్యముఖితో ముఖాముఖి” కావ్యం ఎన్టీఆర్, ఎస్విఆర్, అక్కినేని, ఘంటసాల వంటి కళాకారులకే అంకితమైంది. వారినే కృతిపతులనుగా చేసి అర్చించాడు డా. అక్కిరాజు.
అక్కిరాజు ఆత్మ తెలిసినవారికి ఆయనగారి కులాతీత మతాతీత
విశాలదృష్టి విస్పష్టంగా తెలుస్తుంది. విశ్వజనీనమైన ఆ విశాలదృష్టి వల్లనే బోయి భీమన్నగారు ఈ కావ్యానికి మకుటాయమాను డైనారు. అయితే దళితులను హరిజనులను ఉద్ధరించటంకోసమే మేము రాజకీయాల్లోకి అడుగుపెట్టామని చెపుతూ పదవులకోసం ఎగబడే నాయకమ్మన్యుల్ని డా. అక్కిరాజు ఎడాపెడా వాయించినట్టు (వ్రాశాడు - కొన్ని పద్యాలు. 'ఓట్ల కోసమే ఎన్నిపాట్టైనా పడతారు, సిగ్లూఎగ్లూ లేకుండా" అని అంటాడు అక్కిరాజు - “కురిసీ కోసమె యేడ్చే వరనాయక తతిని గంటి వసుధాస్థలిలో ఆరయగ ఎగ్లూసిగ్గులు సురనదిలో ముంచినారు సూ భీమన్నా! (48) ఒక్కమాట చెప్పాలి. వెర్రితలలువేసే ఆధునికతను అక్కిరాజు మెచ్చని వాడే అయినా వ్యవహారంలోకి చొచ్చుకువచ్చిన నవ్యతకు నీరాజనం పట్టే తత్వమే ఈయనగారిది. కాబట్టే భాషావిషయంలో ఆవసరమైతే నన్నయ్యను చిన్నయ్యను అతిక్రమించి శబ్దజాలాన్ని ప్రయోగించటానికి వెనుదీయడు డా. అక్కిరాజు. భాషావిషయంలో భారతీయుణ్ణి మరి మురిపించిన ఇంగ్లీషు, ఉర్దు, హిందీ పదాలను సం'ప్రదాయచ్చందోబద్ధపద్యాలలో డా. అక్కిరాజు యధేచ్చగా వాడాడు. “స్పార్కున్న కవిని నిర్భయ'డార్కు'కు నూకేసి పరమ డాఫరునిన్ జ్ఞా నార్కుండని పొగడగ, నే నూర్కొనగాజూల విను మహో భీమన్నా! (201) భాషాభావచ్చందస్సులు మూడూ కైవసం చేసుకొన్న గడుసు 'కవిరాయడు” డా, అక్కిరాజు. అందుకే అన్నాడు “తెలుగమ్మకు ముద్దుసుతుడ త్రీయినువన్నున్ = 1 ఇగ 1166 1౧ 0౧6 అనేది హాయిగా పద్యంలో ఒదిగిపోయాయి. పద్యాన్ని వచనంకంటే 'ఫ్రీ'గా పలుకగల ధారాశుద్ది ఈయనది. అంతేకాదు, వచనాన్ని కూడా పద్యంకంటే లయాత్మకంగా పాడగల కవిగాయకుడు ఈయన. తనకున్న ఈ అపురూపమైన రాగశక్తిని చమత్కారంగా 'మాయ'రోగమంటాడు డా. అక్కిరాజు." వళ్వముఖి అయిన శ్రీరాజరాజేశ్చరీమాతతో ముఖాముఖిగా పలికిన కావ్యంలో ముందు మాటకు 'మాయరోగ'మని పేరుపెట్టుకొన్నాడు. జొను, ఆ తల్లి మాయామేయ జగన్మోహిని కదా! 'శారదా'మాత నుద్దేశించి పొడిన త్రిశతిలో కూడా చమత్కారంగా ఈయనగారు
“తల్లీ శారద! నీవె దిక్కు భువి, నీ దాసానుదాసుండ నా
యుల్లంబందున నిన్నె నమ్మితి ఇదే ఒట్టేయుచున్నాడ - ఓ
పుల్దాబ్దాక్షి సరస్వతీ భగవతీ! ప్రొవంగదే” యం చనే
సెల్లరోజులు 'కావుకావు' జననీ చింతామణీ! శారదా! (శారదాత్రిశతి-5) పోతన్నగారి పుణ్యదినాలను 'సిల్లీరోజు'లని అనటానికి వెనుదీయని 'అభినవ సి(యొల్లీకవి' అక్కిరాజు. 'గుంటూరోడిని తిక్కనార్యు కులుడన్ కోపింపకే శారదా! అంటూ గడుసుగా అభ్యర్థించాడు.
గుంటూరోడిని అంటే గుంటూరు జిల్లాలో ఉన్న నరసరావుపేటలో పుట్టిన వాబని అర్ధం. అక్కడ వేంచేసి ఉన్న శ్రీ రాజరాబేశ్చరి అమ వారినే డా. అక్కిరాజు వశ్యముఖీ సప్తశతిలో ప్రార్జించాడు. నరసరావుపేట నివాసులైన తన తలిదండ్రులు
- అన్నపూర్ణ రామయ్యలను ధవళయశశ్ళోభితులనీ, ప్రవిమలగుణులనీ వారి చిన్న కొడుకుగా పుట్టటమే తన అదృష్టమనీ ఈ 'ద్విశతి' చివర్ణో (209) చెప్పుకొన్నాడు డా. అక్కిరాజు.
“అవనీస్థలిలో కవి నటగాయకుడ నేను కవి భీమన్నా!” అన్నాడు కవినట గాయకుడుగా అవనీస్థలి నిండేటంత ధవళయశళశ్ళోభితుడైనాడు డా. అక్కిరాజు. కన్నకొడుకు ఆదృష్టం మాత్రమే కాదు; కన్నవారి అదృష్టం కూడా పండింది ఈ కావ్యంలో.
ఇంతటీ సత్కార్యానికి మకముటాయమానుడై ప్రస్తుతించబడిన (ప్రజాకవి, కళాప్రపూర్ణ డా. బోయిభీమన్న అవశ్యం అభినందనీయుడే.
3-5-2004 = వివియల్, నరసీంవోరావు
చాటుశతకం
నచ్చినవారిని పాగడుట
నచ్చనివారిని తెగడుట నవతా మార్గం
నచ్చీ నచ్చని లోకం
మెచ్చక పోవుట సుకవిత మీసం హాసం
కందము రాసిన వాడే
సుందర కవితా విభూతి సుశ్టోకంగా
మందుల మాలోకంలో
స్పందన కోసం చురకల వాటం పాఠం
ఇదీ “భీమన్నా” (ద్విశతి) సారాంశం -
“కల్దాకపటములెరుగని పిల్లాడిని సత్యమరయ'” అని “కవితాగాండీవి” స్వగతం - సుకవిస్తుతి అపారం - కుకవి నింద నేరుగా లేకున్నా కుపురుషుల నింద (ప్రతిచోట ప్రత్యక్షం “పలనాటిగడ్డ బిడ్డ” గాబట్టి పరుషాలే పురుషార్ధాలయ్యాయి.
శ్రీనాథుడు, తెనాలిరామకృష్ణుడు, ధూర్జటి ఎప్పుడూ ఈ కవిని ఆవహించి వుంటారు కాబట్టి, పలుకు పరుషంగా వస్తుంది. దుర్మార్లుల్ని తూర్చారపడుతుంది. సన్మార్గుల్ని శిరసావహిస్తుంది.
దీన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు, చుట్టూ “లౌక్యం” ఆవహించి వున్నప్పుడు “సత్యనిష్ట” కలవారికి చాల మానసిక ఆందోళనగా వుంటుంది. ఆ ఆందోళన సారమే సుందర రామకృష్ణకవి. తనకు తన చుట్టూ వుండే లౌక్య సమాజానికి సరిపడనంతకాలం కవి అశాంతంగానే ఆక్రోశిస్తాడు - శాపనార్జాల్ని శబ్దగీతం చేస్తాడు -
సత్యాన్న (ప్రమదితవ్యం
ధర్మాన్న పప్రమదితవ్యం
కొందరి (ప్రశంసలు పొందడానికి కవి రంగప్రవేశం చేయడు - ధర్మాగ్రహం బద్దలైనప్పుడు లోకమర్యాదలు ప్రమాణాలు కావు - సత్యాగ్రహం ఆవహించి నప్పుడు అక్షరం ఆవేశమవుతుంది.
“తెలంగాణా కవులలో నగధీరుడు దాశరథి” అన్నది కవికి నిత్య్యయ్రేరణ
- దాశరధి నిప్పులమీద నడిచాడు, నిప్పులు విరజిమ్ముతూ రాశాడు - చాల అవమానంతో అకాలమరణం పాలయ్యాడు - “ఎవ్వరూ ఇది అన్యాయం]! అర్జాంతరంగా ఆస్టానకవి పదవి నుండి దాశరథిని తొలగించడం అమర్యాద” అని . ఏ సాహితీవేత్త నోరు తెరవలేదు - చివరకు “ఆ(గ్రజుడ"ని సంబోధించే డా సి. నారాయణరెడ్డి కూడా “క్రిమ్మిన్నాస్తి”గా వుండిపోయాడు - “లౌక్యం” కవిని “బంటుగా చేస్తుంది. దాశరధి కూడా అంత బతుకు బతికీ కాంగ్రైసు (కపటం) పంచన చేరడం ఆయన వ్యక్తిత్వానికి తగని పని - ఎవరూ ప్రజల్ని నమ్ముకోలేదు
- అందరూ ప్రభుత్వవర్గాల అండదండలు కోరుకున్నారు. అందువల్ల అన్యాయం జరిగినా (ఒకవేళ అది అన్యాయం అనిపిస్తే) ప్రజలు పట్టించుకోలేదు దాశరధిని -
కాబట్టి నిజమైన కవి ప్రభుత్వాలకు “ప్రత్యామ్నాయవ్యవస్థ” లాగా వుండాలి - అలా వుండనప్పుడు పరిణామాలు వ్యక్తిగతాలవుతాయి = జలగం వెంగళ్రావు “ఆలోచనాలోచనాలు” “కవిసమయం” కావడం దాశరథిని చాల “స్థానికం” (౬౦౧౭1156) గా కుదించాయి.
కవి ఎప్పుడూ (ప్రభుత్వ వ్యతిరేకిగానే వుండాలి - అప్పుడే ప్రజలు గౌరవిస్తారు - పట్టించుకుంటారు.
“అధునిక సాహిత్య విమర్శ”ను “(ఫైచేటెజు” చేసిన ప్రకాండులు “బేరా* “చేరా “నారా”లు. సాంఘిక సందర్భానికి పదనుపెట్టినవాడు “రారా” - అందర్నీ ఒకేగాట కట్టడం అవగాహన కొరత - అలాగే “కారా” “లఘుపతనకుడు” - “విష్ణవాన్నిగా శ్రీశ్రీ” తుదిపలుకు “కవితా ఓ కవితా”, “భిక్షువర్టీయసి” - “కలకానిది విలువైనది బలిసేయకు బ్రతుకునంచు” శ్రీశ్రీ చెప్పిన “కన్నీటిధారల" విముక్తి ప్రస్తావన “ఉజ్బలమతిగా”, “కవిసూరీడు” వాక్‌శుద్దిగా వుంది.
కవుల వరుసలోకి “సావర్కరు” రావడం సబబుగా లేదు. ఆపై “సావర్కరు” వ్యక్తిత్వం ప్రశ్నగా మిగిలిపోయింది చర్చలో - శ్రీశ్రీ అనగా ఆవేశం పెల్లుబుకుట కవిగా సహజమే - ఈ ప్రస్తావనలో అమాంతంగా “మావో ఘనుడు సాక్షిగ” దూసుకురావడం శ్రేశ్రీ సమర్దనకు తగిన తర్కం ఈయదు - తర్కం యాదృచ్చికం కారాదు - అనేకాంశాల్ని ఒకే వరసలో చేర్చడం సరిగా తోచదు - మరికొంత వివరణ. అవసరం = అలాగే “నయాగరాకవుల” గురించి బెల్లంకొండ రామదాసు గురించి మరికొంత చర్చ చేయడం అవసరం - పరుగెత్తే రైల్టో కూర్చున్నప్పుడు దృశ్యాలు వడివడిగా పోయినట్టు విడివిడి అంశాలు దృశ్యాలై అదృశ్యాలైనట్టు చెప్పడంవల్ల చదువరి సంతృప్తి చెందడు - రైలును ఆపాలి - "స్టేషను చెప్పాలి - దిగడం దిగకపోవడం ఎదుటివాడి ఇష్టం - సుందర రామకృష్ణ గారి కవితాధోరణి “శతకరూపం”లో వున్నా “చాటువు స్వభావం” కలది - శతకం ఇష్టదైవాన్ని సంబోధిస్తూ లేదా తనని తాను సంబోధించుకుంటూ సమాజాన్ని జల్లెడ పడుతుంది - చాటువు సమాజానికి అద్దంపడుతూ దృశ్యాల్ని (ప్రస్తావనకు తెస్తుంది - వ్యాఖ్యానిస్తుంది. సుందర రామకృష్ణగారు తెలియకుండానే “శతకాన్ని చాటువు” చేశారు. దీనివల్ల నష్టమేమీ జరగలేదు కాని చదువరికి "కవి ఎటు తీసుకువెళ్తున్నాడ"నే ప్రశ్న లోన మిగిలిపోతుంది - ఇది కవి ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు - కాని ఫలితం (ప్రశ్నార్థకం - ఇది “చాటుశతక” ధోరణి - కులచర్భ చేశారు - “హరిజనుడు” (గాంధి) “దళితుడు” (అంబేద్కర్) ఒకానొక చారిత్రక అనివార్యతలో ఈ మాటలు సాంఘిక వ్యత్యాసాల చిహ్నాలుగా పుట్టి రాజకీయ హక్కులయ్యాయి. ఇవి “అస్పృళ్యత”లోంచి వచ్చిన యధార్జాలు. సాంప్రదాయ సంస్కారం వల్ల ఈ వైపరీత్యం నిత్యదృళ్యమైంది. దీన్ని కవి జౌదార్యంతో [గ్రహించాలి - “కులములు లేవని యనుచునె - దళితుడు, హరిజనుడు యనుట ధరలోనకటా అలవాట్రైపోయెను - ఆతితెలివన మన నాయకతతిదే” - అలాగే “ధరలో ఓట్టవి పొందగ హరిజను లాధారమైరి - అకటాతలపన్ - వరనేతల పలుమాయలు సిరికోసము తిప్పలరయ -” ఈ పద్యాలు “అపార్ధం” చేసుకోవడానికి అవకాశ
మిస్తాయి... “కురిసీ" కోసము ఏడ్చెడు వరనాయకతతి” లోకంలో 'నిజం' నిష్టురంగా చెప్పినా దాని “గురి” సరిగా వుండాలి - తిరుపతి వేంకటకవులు, జాషువ, శేషేంద్ర ఇష్టకవులుగా దర్శనమిస్తారు. “వీరు ఎందుకిష్టమనే విషయం?" ఇంకా స్పష్టం కావాలి - "పద్యశిల్పచాతురి” అంటే జాషువాకు సరిపోదు. ఆర్తి అపారం, అనాదృత జీవితం జాషువాను “కడుపు మంట”గా మిగిల్చి ఆ మంట లోంచి “కవిసమయం” పుట్టింది. అది కాలాన్ని నిలదీసింది. మిగతావారు “భావకవులై” రాలిపోతే జాషువా “మానవతా సంస్కార"మై రాటుదేలాడు. “పుట్టపర్తి (నారాయణాచార్యులు) హువ్‌కాకి” కావడానికి గల కారణం “జ్ఞానపీఠం- ఆవేదన” - ఇది చెప్పాలి. దాని వెనుకవున్న “లౌక్యం” చెప్పాలి - ఎక్కడ నిప్పులు చెరగాలో అక్కడ నిప్పులు చెరగాలి - లౌక్యాన్ని.ఎండగట్టాలి - పైరవీని బయట పెట్టాలి - సత్యసాక్షాత్కారప్రక్రియలో మినహాయింపులు క్టుప్తతలు సరిపోవు. టంగుటూరి ప్రకాశం, ఘంటసాల, దండి, ఒక వరసలో రావడం తప్పుకాదు కాని చదువరికి మాత్రం భావాల (క్రమంలో అన్వయం కుదరదు. “మతములపేరిట చిచ్చును ఆతిసులభముగా రేపునట్టియనఘులగనవా చతురగుణుల్ నేతలు - మరి - మరివాచస్పతులువారె మహి భీమన్నా - మతకల్లోలాల గురించి మతవిద్వేషాల గురించి దాని పేర సాగే రాజకీయాల గురించి కవి బాధపడడం కవిచింతనా ప్రపంచంలో వెలుగు. అలాగే “నాస్తికుడే నయము” అనడం, కవి ఆలోచనా,ప్రపంచం సంకుచితం కాదనేది స్పష్టం. “సన్నాసి కారు” లెక్కుట, సన్నాసికి సర్వగతుల ప్రదుపాయంబుల్...” ఈనాటి సన్నాసుల గిరాకీని ఓ పట్టుపట్టడం, అభిలషణీయమే. “నిజమౌ (ప్రేమను పంచెడు సుజనుల, నిస్వార్పపరుల చూపగలే మీ 'ప్రజయందిప్పుడు - ఖలులకు భజనలు పరిపాటియయ్యె వరభీమన్నా...”
- ఇన్ని కోపతాపాల మధ్య కాగిపోయిన కవి, అంతరాంతరాల్లో “నిజమైన (ప్రేమ పంచెడు నిస్వార్ద సుజనుల కోసం” ఆవేదన చెందడం, 'ఖలులకు భజనలు" చూసి వాపోవడం, ఉత్తమము మానవీయ విలువలకు పాటుపడే హృదయాన్ని తెలియజేస్తుంది. “కవులన ధర్మజులనుకుని భువిపయి (భ్రమపడితిని నేను - మోసంబాయెన్ కవులన ఉత్తరగురులని అవగతమయె "లేటు”గాను హా భీమన్నా!” లౌక్యంలో మునిగి తేలే కవులను చూసి వెతచెందిన సుందర రామకృష్ణ “సత్కవి” కోసం వాపోయాడు. సినిమావారి 'లోఫరు' వెగటుతనపు లొల్లి 'బ్లూఫిల్ము' స్వభావాల గురించి కవి కసిగా నిందించడం తప్పేమీ గాదు. నిందార్హులైనవారినే నిందించారు సుందరరామకృష్ణకవిగారు - అలాగే ప్రశంసార్హుల్నే ప్రశంసించారు. నాగయ్యను, రఘురామయ్యను, వంగర వెంకటసుబ్బయ్య, కొంగర జగ్గయ్యలను ప్రస్తుతించారు. యస్వీ రంగారావును గౌరవించారు. నిజానికి మోతాదుకు మించిన సత్కారాలు పొందారు నాగేశ్చరరావు, రామారావులు. సినిమా కళ అభివృద్ది కోసం ప్రభుత్వం నుండి ఉచిత స్థలాలను పొంది సొంత ఆస్తులు పెంచుకున్నారేగాని సినిమాకళకు సినిమాకళాకారులకు వారు చేసింది శూన్యమే. “జీవితమే సమర్చణ”గా జీవించిన నాగయ్యకు ప్రజల్లో అపారమైన ఆదరం లభించింది. "సోకాల్డు పెద్దలు” నాగయ్యగార్ని (ప్రస్తావనకు రాకుండా చేశారు. ట్యాంకుబండు మీద నాగయ్య ఘంటసాల విగ్రహాలు లేకపోవడం ఆలోచించాల్సిన తప్పిదం - “కందుకూరి జనినట్టి పధంబున జనువానిని నేడొక్కనినైనను కలిని గనము”
సమాజానికి సేవజేసినవారి గురించి సుందరరామకృష్ణ కట్టలు తెంచుకొని సహృదయతతో సాష్టాంగనమస్కారం చేస్తాడు.
“ప్రేమజాడ్యం” సరికాదంటున్నాడు కవి - వైఫల్యాలకు కారణం (ప్రేమ కాదు. సాంఘికవ్యవస్థ - సాంప్రదాయ వివాహాలు విఫలమవుతున్నాయి - సుముహూర్తంలో పెండ్లి జరిగినా “ముండెట్టుమోసెరా॥” అని వేమన సాంప్రదాయాన్ని నిలదీశారు. 'ప్రేమవివాహాల్ని ఆదరించి ఆదుకోనందువల్లే అవి కొన్ని సందర్భాల్లో అర్థాంతరంగా ముగుస్తున్నాయి - విఫల సాంప్రదాయ వివాహాలు ఆత్మహత్యల నాశ్రయిస్తున్నాయి. “వివాహవ్యవస్థ్ర”ను మానవీయమూల్యాలతో చూడాలి.
పంగీతజ్ఞుల (ప్రస్తావనలో పరవళించిసోయే సుందరరామకృష్ణ అభిరుచి సదా ప్రశంసనీయం - ఘంటసాల, రఫి, మన్నాడే; అలాగే రాగాలు సావేరీ, హరికాంభోజీ, కృష్ణశాస్త్రి కవిత మున్నగు అభిమానాలు సరైన అభిరుచులు. ఈ వరుసలో 'సైగలు' కనిపించకపోవడం కొరత - తలత్ మహమూద్, ఉస్తాడ్ బడే గులాం ఆలీఖాన్ నూర్జహాన్ ఈ వరసలో చేరాల్సినవారు - ఇకపోతే -
“ఒక సిద్దాంతము, పద్దతి
ఒక మార్గము, గానరాదు - ఓపినకొద్దిన్ సకలమును దోచుచుండిరి అకటికటా “నక్సలైట్టు” వా భీమన్నా!”
నక్సలైట్లకు మార్గం, పద్దతి, సిద్దాంతాలు లేవనడం సరికాదు - “సకలమును దోచుట” అనుట కూడా అభాండమే -
“ప్రజ సొమ్ము దోచుకౌనుచును
(ప్రజ సొమ్మును తగలబెట్టువారల నెటు లీ (ప్రజ మన్ననసేతురు? వీ రి “జబర్లస్తీ*లు త(ము)ప్పు శ్రీ భీమన్నా 1
ప్రజలకు సంబంధించినవాటిని నాశనం చేసిన సందర్భాలు తక్కువ,
అవి ప్రమాదాలు - అనుకోని పరిణామాలు - యాదృట్చికాలు.
“విలువైన జీవితంబని తెలిసియు ధర “నక్సలైట్టు” ధ్యేయ మటంచున్
బలియగుచుండిరి - పోలీ ॥
సుల చేతులలో నిజంబు, సూ భీమన్నా 1
సుందరరామకృష్ణ నక్సలైట్ల శత్రువుగా మాట్టాడడంలేదు; వారి ఆప్పుడుగా ఆర్తితో అన్నమాటలు పైన కవిహృదయంగా జాలువారాయి.
అన్యాయం అక్రమం దౌర్జన్యం దోపిడి నిండిన అసమ సమాజంలో నక్సలైట్లు పుట్టుకరావడం సహజ సామాజిక పరిణామం - దాన్ని సమాజం దయతో పరిష్కరించాలి - పగ తీర్చుకోవడం సరైన పద్దతి కాదు. సరైన “చర్చల” ద్వారా వారు ముందుకు తెచ్చే “భూసంస్కరణల్ని” “నిరుద్యోగ సమస్యని” పరిష్కరించాలి. (ప్రభుత్వం దీన్ని ౬4 & 0౧1౪ సమస్యగా చూస్తూ వుంది. అందువల్ల “ఆ(ప్రకటిత యుద్ధంతో” అన్నీ ఆపసవ్యంగా కనిపిస్తున్నాయి.
“కొందరి వీరుల సాహసచర్యలవల్ల సమాజం మారదు” అంటూ మార్క్సు ఏనాడో హెచ్చరించాడు. ఎవరికి మార్పుకావాలో వారు “మార్చు ఉద్యమం” (వర్గపోరాటం)లో భాగస్వాములు కానంతవరకు ఈ సంఘటనలు విష్లవాలుగా రూపాంతరం చెందవు - దళారి ప్రభుత్వాలు అమెరికా సామ్రాజ్యవాదానికి సాష్టాంగపడినంతకాలం (గ్రామాల్లో భూస్వాముల ఇష్టారాజ్యం కొనసాగినంత కాలం, పాలక పక్షాల విధేయులుగా మాత్రమే పోలీసులు పగతో ప్రవర్తించినంత కాలం ఈ నక్సలైట్టు అససవ్యంగానే చెలరేగుతారు.
వారిని ప్రజాస్వామిక “చర్చల్లోకి” తెచ్చి ప్రజాస్వామిక ప్రక్రియను 'ప్రారంభించనంతవరకు “వైపరీత్యాలు” నిత్యకృత్యాలవుతాయి - “చట్టబద్ధ రాజ్యహింస”, “చట్టరహిత ప్రతీకారం” రెండూ ప్రజాస్వామ్యానికి ప్రమాద కారణాలు
- అదే కవి ఆ(ర్రంగా చెప్పిన మాటలు మానవీయ మూల్యాల్ని తడుముతున్నాయి.
“నిచ్చులు 'ఎన్‌కొంటర్లే'
నిచ్చలు విధ్వంసనములె, నిచ్చలు నరరే
పచ్చని సంసారంబుల
పిచ్చిగ రోదనములయెను - విను భీమన్నా 1”
అన్నగా, తండ్రిగా, ఆత్మీయునిగా కవి తాదాత్మ్యం చెందడం గొప్ప కవి * హృదయం.
“ఆలోచింపగ నరరే
పోలీసులు, నక్సలైట్లు పోటాపోటిన్
రీ(య్ర)లగ పంపుచునుండిరి
కాలుపురి కమూయకులను - కవి భిమన్నా !
పోలీసులకు నక్సలైట్లకు సాగుతున్న ప్రతీకార యుద్దాన్ని వారించడం అవసరం -
“రక్షకభటులును సైతము
రాక్షసులను మించిపోయి రాజిలుటది - ఆ
త్ర్యక్షుని సాక్షిగ - నారెం
డక్షుల గనినాడ నేను హా భీమన్నా 1”
నక్సలైట్ల హింస పెరగడానికి కారణం 'ఎన్‌కౌంటర్ల దుర్మార్గం - “రాజ్యహింస?” కారణంగానే నక్సలైటు సమస్య పెరిగిపోయింది. ఆర్థిక సమస్యల్ని, రాజకీయ సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి “చర్చల్ని” పునరుద్దరించకపోతే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది ఉభయులకు - ఇది సామాజిక గమనానికి, వికాసానికి మంచిదికాదు.
లోకమాన్యతిలక్ జ్ఞాని - జాతీయోద్యమానికి వివేకాన్ని, వేగాన్ని (అతివాదాన్ని) తెచ్చిన జ్ఞానమయోగి తిలక్ గీతాభాష్యం (ప్రామాణికమైనది - సావర్కర్ సాహసి - ఏకపక్షంగా ఆలోచించినవాడు - అనివార్య “దేశవిభజన”ను వివేకంతో ఆలోచించలేక అతి వాదాన్నాశ్రయించి 'రాజీ'లోకి దిగినవాడు - సేరుచెడిన పాక్షికుడు. ఇద్దర్ని ఒకగాటకట్టడం తగని పని. హెందూమహాసభి, సావర్కర్ పరిభాషను సాహసంగా మార్చుకొని గాంధీని కడతేర్చేదాకా పోయింది
- సంఘపరివారంగా రూపాంతరం చెందింది. ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల కుటిల నీతి కారణంగా సహనం కోల్పోయిన మతవిశ్వాసాల కారణంగా “దేశవిభజన"” అనివార్యమైంది. దీనికి ఎవరినో, ఏ మతాన్నో బాధ్యుల్ని చేయడం తగని పని - ఆ కారణంగా “జాతిపిత” గాంధీమీద పగతీర్చుకోవడం సరికాదు, దాచేస్తే దాగని చరిత్ర దారుణంగా వుంటుంది.
అల్లూరి, భగత్‌సింగ్, ఆజాదు, బోసులాంటి 'యోధవేణ్యుల్ని' నుతించడం ఆహ్వానించదగ్గది.
బార్లని, బ్రాందీషాపుల్ని, రకరకాల మందుల్ని, ఎన్నికల సారాయిని, తెగడడం మంచిదే! “సారాయికున్న విలువ శ్రీరామునకును లేదనడం” కూడా ఎన్నికల సందర్భంలో సరైన విమర్శ - నోటుకు ఓటు, క్రికటుమ్యాచు, మ్యాచ్ ఫిక్సింగు రోజువారి దుర్భరదృశ్యాలు - ఓట్లను కొని అధికారంలోకి వచ్చే రాజక్రీయ పార్టీలు, “తాము చట్టబద్దంగా అధికారంలోకి వచ్చినట్టు”గా బుకాయించడం చూస్తున్నాం. ్రికెట్టు విషయంలో దొంగలు దొరికిపోయారు. మధ్యతరగతి పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయి - వేళాపాళాలేని క్రికెట్టు మ్యాచ్‌లవల్ల, ఇప్పుడవి ఇండియా పాకిస్టాన్ష రాజకీయ మాపకాలయ్యాయి -
పుల్దారెడ్డి మిరాయికి, బాలమురళి సంగీతానికి పొత్తు (ప్రశ్నార్థకం. పుల్టారెడ్డి మిఠాయి గణేశ్ ఉత్సవకమిటి ఆగడాలవల్ల ప్రతిష్టను కోల్పోయింది - దాన్ని మించిన మిరాయిషాపులొచ్చాయి.
జాస్మిన్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ భింపలాసరాగం బాగున్నాయి. ఈ అలౌకిక ఆనందంలో “సిల్కుస్మిత” సంతృప్తోస్మి” కావడం సరిపడని టేస్టు.
ఇలా అసంబద్ధసంబద్దాలు, అభిరుచుల వరస కావడం ఇబ్బంది కలిగిస్తాయి. ముదిగొండ స్పీచి, అదే ఆ శిప్రమునివ్రాత, రంజనిరాగం, తంజావూరు. వీణ, హేమామాలిని, హెలెను, కాంచనమాల, 'ఫ్రెంచిమద్యం' చీటేవాల అరటిపండు, వేటూరిపాట, పోతన - అభిరుచుల వరుస - క్రవి వైవిధ్యభరితం అభిరుచిని తెలియజేస్తాయి.
కలికంటె పరమలోభిని
కలికన్నను జూదగాని, కఠినుని, కొండ
మ్ములవానిని, నీచాతు శని ॥
ఇలునిన్ గన దుర్లభమ్ము కవి భీమన్నా |
కలిపురుషుని బొమ్మ కట్టించిన తీరు బాగుంది. అది నేటి వ్యవస్తకు, రాజ్యానికి, ప్రభుత్వానికి సరిపోయేట్టుంది.
కరణాల తెలివితేటలు, గోడమీది పిల్లులు, నానీలు" “హైకూలు” అన్నీ అక్షతలు పొందాయి. “గజలులు వ్రాయగ మాత్రము నిజముగ కావలెను మందు - నేకాదన” - ఇది సరికాదు.
“కసీతో దిట్టిన నేడ్తురు
మసలక = మనకెందుకంచు మౌనంబున్నన్
సిసలౌ కవి 'పోజు మహ "
ర్హశ యనగను వీరిదే గదా భీమన్నా 1” నిందాస్తుతికి గల కారణం చుట్టూ వున్నవారే అనడం గమనార్హం.
కవి చౌడప్పని మాదిరి
భువిలోపల కవిత చెప్ప మోక్షము వచ్చున్
ఎవరెన్ని గతుల చెప్పిన
కవివర్యా నిజము నమ్ము ఘన భీమన్నా !
తిట్టుకవిత్వం చెబితేనే మోక్షం వస్తుందనే సూత్రాన్ని విర్దారించాడు కవి.
మంచోళ్లందరు పోయిరి
వంచకులకు నిలయమయ్యె భారతమన, నీ
చెంచా' గాళ్ళెక్కువైరి, శ్రీ భీమన్నా !
వంచకులకు భారతదేశంలో “నిందాస్తుతి” అనివార్య కావ్యకళ అని తేలింది - అందుకే సుందరరామకృష్ణ తీవ్రించినాడు. ఇది అతని బలహీనత కాదు. సమాజరుగ్మతకు అతడు కనిపెట్టిన “కాయకల్పచికిత్స” - పండితపామరజనములు మెండుగ ఆశీస్సులిడుచు మెచ్చెడిపగిదిన్ కండగలవి కందములను రెండొందలు (వ్రాసినాడ శ్రీ భీమన్నా ! కండగల కందాలను పండిత పామర జనం మెచ్చేట్టు రాసినాడు సుందరరామకృష్ణు సమాజం ఎట్లా వుందో అట్లా చెప్పినాడు. తప్పు ఆయనది కాదు - తప్పు సమాజానిది - చివరకు నాటక సాంప్రదాయం (ప్రకారం “సవమానసుతుడు హనుమ”కు ఆంజలి ఘటించాడు కళాకారునిగా - మనమున నా వరశక్తికి 'ప్రణతుల నిచ్చెదను - 'రాజరాజేశ్చరి'కిన్ ఘనముగ శ్రీరాగంబున వినుతించెద నిష్టమీర విను భీమన్నా 1 “వరశక్తి కారణంగానే రచన సాగిందని రాజరాజేశ్వరి కృప వుందని, శ్రీరాగంలో వినుతిగా 'ద్వశతి' సాగిందని కవి విశ్వాస సారాంశం = కవి చాలకాలంగా “ఒకే ధోరణి*లో పద్యరచన చేస్తున్నాడు - 'మి(శ్రభాషు “మిశ్రభావజాలం' - దృశ్యమాన జగత్తు విమర్శ - నచ్చని విషయాల్ని, వ్యక్తుల్ని ఎండగట్టడం, నచ్చిన విషయాల్ని, వ్యక్తుల్ని తలదాల్బడం - శతకంలో రాయడం చాటువులా దృశ్యమానం చేయడం సుందరరామకృష్ణగారి కవిత్వోద్యమ సారాంశం - ఈ వరసలో సత్యసాయిబాబా రాకపోవడం గమనార్హం. అది “అఫ్‌కోర్స్ ఆయన వైయక్తికం.
(ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలు రచనకు ప్రాణాలు - ప్రతిభ “సత్య"నిష్టం కావాలి. వ్యుత్చత్తి శివిప్రదం కావాలి. అభ్యాసం 'సుందరం'గా అభివృద్ది చెందాలి నిత్యనూతనంగా.
అధ్యయనం, అవగాహన, అభివ్యక్తి కవిత్వానికి నేపథ్యాలు - ఈ విషయంలో అజా(గగ్రతగా వుంటే 'రచన' 'పునరుక్తి బారిన పడుతుంది - చెప్పిందే చెబుతాం. చెప్పడంలో కార్యక్రమంగా వైవిధ్యం మందగిస్తుంది. అవే "పేరు - అవే విషయాలు - అవే విమర్శలు - అవే ప్రశంసలు - ఇవి గణయతి ప్రాసళ్లో ఒరుసుకొని వుంటాయి.
కాని 'ప్రాణవంతమైన ్రాసంగిక కవిత్వం నిత్యనూతనం కావాలి = “వస్తువు” మారాలి. శతకధోరణి తగ్గాలి - “చాటువు” రూపాంతరం చెందాలి,
ఒక ఇతివృత్తాన్ని తీసుకొని కవి వైవిధ్యంతో వేయి ముఖాలుగా విజ్బృంభించాల్సిన సమయం వచ్చింది.
భారతీయ సమాజం ఒక ఇతివృత్తానికి చెవినీయడానికి చాల ఇష్ట పడుతుంది. తద్వారా తన జీవితాన్ని తరింపజేసుకోవాలని చూస్తుంది - ఆధునికావసరంగా కవి ఛందోరూపాలు మారాలి - భాషాసంవిధానం మారాలి - ఆధునికత అంతటా నెలకొనాలి.
కవిగారు కొంతకాలం శెలవు ప్రకటించుకొని, తీవ్రంగా ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి విశాలమైన వ్యాప్తమైన అవగాహనను పెంచుకొని బాధ్యతతో ఉత్తమ ఇతివృత్త కావ్యాలు రాయాలి.
కొండపై పుట్టిన జల కొండమీదినుండి జారి ప్రవాహమై సముద్రంపాలు కారాదు. ప్రవాహం నదికాదు - నదిలో (ప్రవాహం ఒక క్షణిక విరాట్‌రూపం - నది ప్రశాంతం = దరులు కలది. ఊళ్లను ఉపశమింపజేసేది - దాహం తీర్చేది - పచ్చదనాన్ని (ప్రసాదించేది - నిర్మాణాత్మక జల నింపాదినది.
రామాయణంలోని పాత్రలు, భారతంలోని పాత్రలు చిరపరిచితాలు - ఆ పాత్రల ద్వారా మొత్తం రామాయణ భారతాల్ని తిరగరాయాలి. అలా చేసినవారు హిందీలో మైధిలీశరణ్‌గుప్తా “సాకేతో' అనే కావ్యాన్ని 'ఉర్మిళా (ప్రధానంగా రాశాడు - అలా మహాకావ్యాలలో విసృతపా(త్రల్ని తీసుకొని రాయడం మంచి సాధన. కావ్యం ఇతివృత్త ప్రధానంగా రాస్తే “నిర్మాణ” పద్ధతి వస్తుంది - “పాత్ర చిత్రణ” వస్తుంది - “నాటకీయత” అభివృద్ది చెందుతుంది. తిక్కన నిర్మాణకాశలం సామాన్యమైనది కాదు - 'కర్షప్రధానరిగా భారతాన్ని తిరగరాయవచ్చు - ఏకలవ్య ప్రధానంగా కూడా రాయవచ్చు - అలాగే పరశురాముని (ప్రధానంగా రామాయణాన్ని పునర్దర్శనం చేయవచ్చు. దీనివల్ల కవిరచనకు 'సంవిధానం' వస్తుంది - నిర్మాణబాధ్యతలు పెరిగి పాత్రల విజ్ఞతలు నాటకీయతను సంతరించుకుంటాయి. కవికి “ఏకాగ్రత” పెరుగుతుంది - ఏకాగ్రత, కావ్యనిర్మాణంతో వస్తు “ఐక్యతను సాధిస్తుంది. కవి ఇన్నాళ్లూ “ఏమి పోగొట్టుకున్నాడో” తెలిసివస్తుంది. కవి ప్రాథమిక, 'ప్రారంభదశలు అయిపోయాయి. ఇప్పుడు పరిణతదళ, కడప దాకా వచ్చి నిలుచుంది - తలుపు తడుతూ వుంది - కవి ద్వారాలు బిగించి లోపలే వున్నాడు - తనచుట్టూ తానే తిరుగుతున్నాడు - ఆత్మప్రదక్షిణ తృప్తి నిస్తుంది కాని గమ్యాన్నీయదు. గమ్యానికీ, గమనానికి సమన్వయాన్ని సమకూర్చేది 'కావ్యం'. “కావ్యం” లోనే ఆత్మ అనగా 'కావ్యాత్మ' వుంటుంది - ఆత్మబోధలో కావ్యం “దర్శనం”గా అభివృద్ది చెందుతుంది. ఒక మహాకావ్యం రాయాల్సినవాడు - ఒక శతకం రాసి కూర్చోవడం కవిత్యాపరాధం - కవిత్వం అంతళ్ళక్తి కేవలం శాబ్దిక అభివ్యక్తి కాదు - అంతశ్శక్తి
పలికినప్పుడు “చింతన” నిర్మాణబద్దమై 'తత్వాన్ని' పాత్రల ద్వారా చెబుతుంది - శబ్దాలు, అలంకారాలు, సంఘటనలు, భాష ఉపాంగాలవుతాయి. సుందర రామకృష్ణ మహాకావ్య నిర్మాత కావాలి - ఆ సంకల్పం చేయాలి
- పద్యాన్ని చమత్కారంగాకాక హృద్యంగా తీర్చిదిద్దే నైపుణ్యాన్ని కవి సంతరించు కోవాలి. ఆత్మబోధ శూన్యసంభాషణంగా వుండిపోరాదు - కావ్యనిర్మాణంలో కవిత్వం పరమార్ధం సాధించాలి. విడి పద్యాల్లో విడిభావాలుంటాయి. అంకె వుండకపోవడం వల్ల ముక్తకాలుగా ముచ్చటకొల్స్పినా “సద్యః పరనిర్హృతి"నీయవు. కవి ఏకాగ్రత కావ్యవిరాట్‌రూపానికి నేపధ్యాన్నిస్తుంది. ఆలోచించాలి - ఆత్మసాక్షాత్కారం సాధించాలి - కావ్య'ప్రపంచంలో చిరంజీవి కావాలి - చమత్కారిగా వుండిపోరాదు. వూ బ్యాలాముఖి 12-5-2004 2-3-64/డి, తిరుమలనగర్, సి.పి.ఎల్. రోడ్, అంబర్‌పేట్, "హైదరాబాద్ - 500 012. ఫోన్ 27403812
అభినందన చందనము
కవిగా, గాయకుడుగా, నటుడుగా కమనీయ కళాకృతులు ధరించిన డా॥ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు ఇదివరకే “అమ్మతోడు” మొదలైన హృద్య పద్యరచనలు వెలువరించి ఆంధ్రభారతికి మణిమయాలంకారాలు కైచేసి ప్రసిద్ధి నొందినారు. (ప్రస్తుతకావ్యం పద్మభూషణ, మహాకవి శ్రీ బోయి భీమన్నను సంబోధించుచూ రెండువందల (ద్విశతి) పైగా కంద పద్యాలను రచించారు. ఇందులో కవి సమకాలీన సామాజిక స్థితిగతులను చక్కగా చూపించారు. కావ్య (ప్రారంభంలో పూర్వకవుల పద్ధతిని, పూర్వకవులనూ, ఆధునిక కవివర్యులను (ప్రశంసించినారు. నన్నయ, తిక్కన, ఎజ్జాప్రెగ్గడ, శ్రీనాథుడు మొదలగు తొల్లిటి “కవులు కవిస్తుతికి పొత్రులైనారు. ఆధునిక కవులైన వాసుదాసు (వావిలకొలను సుబ్బారావు) మహాకవి దాశరథి, శ్రీశ్రీ, శేషేంద్ర, నయాగరా కవులు క్షీణే॥ అక్కిరాజు వెంకటేశ్ళరశర్మ, కావూరి పాపయ్యశాస్త్రి కోవెల సంపత్కుమార, మొదలైన వారిని కొనియాడినారు. తనను గూర్చి ఇలా చెప్పుకొన్నారు.
“కవి సూరి రామకృష్ణుడ
కవితాగాండీవి నేను కవి భీమన్నా!” “అల్లరిగాడని బిరుదిడి
లొల్లిని తిగచేయుచుండి రుర్విన్ నన్నున్ కల్గాకపటము లెరుగని
పిల్లాడిని సత్యమరయ విను భీమన్నా!”
ఈ కృతిలో ఈనాటి సమాజంలో జరుగుతున్న నీతిబాహ్యమైన రీతులను ఎత్తిచూపడం జరిగింది. ఆత్మీయమైన ఆహారాలనూ, రాగాలనూ, భోగాలను కొవ్యంలో చూపించారు. “నీలాంబరి”, హరికాంభోబి', “సావేరి'మొదలైన రాగాలు తన కిష్టమైనవని చెప్పినారు. ఘంటసాల, సాలూరి రాజేశ్చరరావు, రఫీ తనకు ఇష్టమైన గాయకులు అని తెలిపినారు. (బ్రింజాలు' కూర, పంజాబురోటి"
, 'నీంబూ సోడ, 'బాంబే హల్వా" మొదలైనవి తనకు ఇష్టమైన పదార్ధములని వెల్లడించారు.
ఇక నేటి సినీమాలలోని విపరీత ధోరణులను వికారమైన దృశ్యాలను పద్యాల పరదాపై ప్రదర్శించి, వాటివల్ల జరిగే అనర్థాలను ఎత్తి చూపినారు సుందర రామకృష్ణగారు. 66వ పద్యం నుండి 79 పద్యం వరకు నేటి సినీమాల విపరిత ధోరణులను ఎత్తి చూసించారు. మొదటి తరము నటులను పేర్కొని ప్రశంసించారు.
“వంగర వేంకటసుబ్బయ
కొంగర జగ్గయ్యయు నటకోవిదు 'జెస్వీ
రంగారావు'లు సినిమా
రంగంబున కీర్తిధనులురా భీమన్నా!” ఇలా సినిమా నటులూ, గాయకులూ రామకృష్ణ గారి కొనియాటకు భాజనులై రాబిల్లినారు.
ళా
సుందరరామకృష్ణ కవిగారు చిన్న్మయసూరిని గూర్చి ఒక గమ్మత్తైన పద్యం చెప్పినారు.
“విన్న్మయసూరికి పాపము
ఉన్నది ఉన్నట్టు వ్రాయు టొక్కటి దక్కన్
వన్నెలు చిన్నెలు టక్కరి
పన్నాగమ్ములును తెలియవవి భీమన్నా!”
రామకృష్ణగారు తమ జీవన విధానమును ఇలా ఒక పద్యంలో తెలిపినారు.
“క్షోర్కెలు నాకవి లేవిల
“వర్కే' సిసలైనయట్టి 'వర్షిప్ప'ని నే
పేర్కొను కవివరుడను న
య్యర్కుడు, శశిసాక్షి విముమయా భీమన్నా!”
కుల విభేదాలను నిరసిస్తూ కవి కొన్ని పద్యాలను వ్రాసినారు. అంతేకాదు కులమునుబట్టి కవిత్వం అబ్బుతుందని కొందరు చవటలు అంటుంటారు: అట్టి వారిని వెలి వేయాలని చెప్పుట సమంజసంగా భావిస్తాను. తొల్లిట రాజకీయ నాయకులైన టంగుటూరి ప్రకాశం పంతులు, సినిమా గాయకులైన ఘంటసాల, కర్ణాటక విద్వాంసుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ "షెహనాయ్ వాద్యకారుడైన బిస్మిల్లాఖాన్, యోధవర్యులైన సావర్కారు మొదలగు (ప్రముఖులను (ప్రస్తుతించారు. ఒకటి రెండు పద్యాలలో "క్రికెట్' మీద ఈ తరానికి ఉన్న మోజును దుయ్యబట్టినారు. ఈ పద్యం చెంపమీద -ఈడద్చికొట్టినట్టు ఉంది. “వందేళ్ళ ముసలిముండయు ఇందూ, 'స్కోరెంత యంత యంచునింపుగ నడగన్ శ్రీందా-మీదను మండదొ వందనములు క్రికెటు'కు వదెవా భీమన్నా!” ఈ విధంగా డా. అక్కిరాజువారు అనేక విషయాలను స్పృశిస్తూ పద్యాలు (వ్రాశారు. పద్యాలు ధారాళంగా సాగినాయి. అన్యభాషా పదాలు ఈ కృతిలో (ప్రయోగించడం విశేషం. ఏది యేమైనా సమకాలీనుడైన ఒక మహాకవిని మాధ్యమంగా చేసుకొని సంబోధిస్తూ ద్విశతిని రచించి, ఆ మహాకవిని గౌరవించినందుకు సుందర రామకృష్ణగారిని మనసార అభినందించుచున్నాను. డా. వేముగంటి నరసింహాచార్యులు రామ మందిర, గురుజాడవీధి, పారుపల్లి స్ట్రీట్ సిద్దిపేట = 502 103.
ప్రశంస మహాకవి, పద్మభూషణ, కళాప్రపూర్ణ పద్మశ్రీ బోయి భీమన్న నాకు చిరకాల' మిత్రులు. ఆయన సాహిత్యసేవ అమూల్యము. నేను, మీరు కోరినట్టు నా అభిప్రాయాన్ని వివరంగా వ్రాయవలసినవాడ్నే! కానీ, నా ఆరోగ్యపరిస్థితి అనుమతించడంలేదు. మీ వచనం, మీ పద్యం విలక్షణంగా తోస్తున్నాయ్. మీ ఊరి 'నయాగరా' కవులు గుర్తుకు వస్తున్నారు. ఏది ఏమైనా ఒక కవిని ఇతివృత్తంగా చేసికొని, సామాజిక స్పృహతో పద్యరచన చేసిన మీకివే నా హృత్పూర్వక శుభాభినందనలు - మీ శేషేంద్ర గ్యాన్‌బాగ్ ప్యాలెస్ గోషామహల్ హైదరాబాద్ - 500 012
కవి (అక్కి రాజు
డా॥ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు లబ్బ (ప్రతిష్టులు. కవిగా, రంగస్థల చలనచిత్ర నటుడిగా, గాయకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించుకున్నారు. వీరి 'అమ్మతోడు' కావ్యం సాహిత్య లోకంలో దుమారం లేపిన సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. “అమ్మ తోడుండబట్టే “శ్రీ రాజరాజేశ్వరీ" మకుటంతో సప్తశతి (వళ్యముఖితో ముఖాముఖి) గూడా (వ్రాయగలిగారు. ఆ పద్యాలన్నీ మకుటాయమానమైనవే! ఇప్పుడు వీరు రచించిన “భీమన్న” (ద్విశతి) సాహితీ లోకంలో ఒక కొత్త వెలుగును సంతరించుకోవడం ఖాయం, డా అక్కిరాజువారి రచనలంటే నాకు చాల ఇష్టం. ఒక్కసారి చదవడం మొదలెడితే పూర్తి అయ్యేదాకా వీరి రచనలను వదలలేం. కారణం - సామరులు సైతం చదివి రసాస్వాదన చేయగలిగిన సులభైలి ఈ కవిగారి రచనలలో చూస్తాం! నేటి తరానికి నిజానికి కావలసింది అదే! (ప్రాచీన కవుల ఓజో గుణభూయిష్టమైన శైలి పనికిరాదు. డా॥ సుందర .రామకృష్ణ గారు బహుముఖ ్రజ్ఞాధురీణులు. వీరి పద్యరచనలో ఎంత (ప్రావీణ్యం కనబడుతుందో, రంగస్థలం పైనగానీ, వెండితెర పైనగానీ ఆంతకుమించిన మూర్తిమత్వం వీరిలో గోచరిస్తుంది. గళంలో 'ఘంటసాల'" కనిపిస్తాడు. వేషంగడితే సాక్షాత్తూ కవిసార్వభౌముడు దర్శనమిస్తాడు. అందుకే వీరు ప్రతి కావ్యంలో శ్రీనాధుడికీ మనుమడనని చెప్పుకుంటారు. ఇది నిజమేనేమో ననిపిస్తుంది. మంచి సాహితీ విలువలున్న కవిధీరుడు అక్కిరాజు. నిగర్వి. సౌహితీలోకంలో వింతైన వ్యక్తి అందుకే వీరికి “అభినవ రామకృష్ణుడోని బిరుదు గూడా యిచ్చారు ఆంధ్ర కవిసోదరులు. వీరి కవిత్వం, వారి రూపం ఆంత సౌమ్యంగా ఉండదు. కొరడాతో ఈడ్చి గొట్టినంత బాధను గూడా కలిగిస్తాయి కొన్నికొన్ని సందర్భాల్లో వీరి పద్యాలు, వీరి శ్రైలి ఎంత ఘాటుగా ఉంటాయో చెప్పడానికి ఈ రెండు పద్యాలు చాలు -
నోట్లో నాలుక యుండదు సీట్లో: కూర్చొనగ కాంక్ష - చిల్లరగారిడ్డీ లా ళు యా
'ఘూట్లే' 'సాలేలను న
ట్టేట్లో ముంచియుతకవలె నిల బీమన్నా!
మంచోళ్ళందరు పోయిరి
వంచకులకు నిలయమయ్యె భారతమున, నీ
'బాంచను కాల్మొాక్తా యను
చెంచాగాళ్ళిక్కువైరి శ్రీ భీమన్నా!
అంతేగాదు 'సుందర రామకృష్ణ గారు తనను గురించి తన వ్యక్తిత్వాన్ని గురించి గూడా మహా నిక్కచ్చిగా సెలవిస్తారు -
అవకాశవాది గాడని
నవకవితా (భ్రపురవియని, నయవిదుడంచున్
కవి జొమదగ్ని యంచును
భువినెప్తో నను పలికిరిపో భీమన్నా! అలాగే -
వేసము మోసము నచ్చదు
వేసము లేనెన్నివేసి వెళ్ళిన గూడన్
దోసములే నాదిది, స
ర్వేశుని శుభనామధారి! శ్రీ భీమన్నా!
ఇటువంటి వ్యక్తిత్వం, మనోధైర్యం ఉన్నతాశయాలు కలిగి ఈనాడు చలనచిత్ర రంగంలో, నాటక రంగంలో, సాహిత్యరంగంలో ఒక వెలుగు వెలుగుతున్న మిత్రులు సుందర రామకృష్ణ గారు ఇంకా మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ -
“కృష్ణుపాత్ర పోషణమున కీర్తిధనుడు
“నందమూరి'కి సరితూగు అందగాడు
ఘంటసాలను తలపించు గళమువాడు
కవికులంబున రత్నమై (గ్రాలువాడు
చూపరులకు ఆ "“శ్రీనాధు' రూపరేఖ
లచ్చు (గ్రుద్దిన యట్టుల నలరువాడు
ఆప్త జనులకు హితులకు ఆర్హులకును
అరయ తలలోని నాల్కలై అలరు వాడు
('ప్రధిత యశుడైన అభినవ '“రామకృష్ణు”
డాత డెవ్వండొ గాదు! మా “అక్కిరాజె కవి సోదరుడు
సండ్రప్రెగడ శ్రీనివాసరావు కస్తూర్చా మహిళా కళాశాల
సికింద్రాబాద్
భీమన్నా శ్రీమాతే నమః
1... థ్రీకంఠుని శుభనామము
'ప్రాకటముగ దాల్చి వరలు వాడవు గానక
నీ కమరె సుకవితా శ్రీ
చేకొను మివె నతులు నుతులు థ్రీ భీమ్లన్నా! 2. నన్నయ తిక్కన ఎర్రన
లెన్నగ మన తెల్లు జాతి నీడ్యులు, కడు వి
ద్వన్నుతు లౌటను మరి, నే
మన్నన భక్త్యంజలిడెద మహి భీమన్నా 1 3. _ హిమకరు మౌళికి భక్తుడు
కవితతిలో నిక్కమైన ఘను డెవ్వం డీ
భువిపయి - శ్రీనాథుం డా
కవిశూలికి మైొక్కులిడుదు కవి భీమన్నా 1 4. కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి గణుతింపంగన్
కవి సూరి రామకృష్ణుడ
“కవితాగాండీవి” నేను కవి భీమన్నా 1
భీమన్నా
- _ పలనాటి గడ్డ బిడ్డను
పలుకుల చెలి ననవరతము భక్తి భజించే
సలలిత'గుణ సంయుతుడను
ఖలమతులకు కాలయముడ కవి భీమన్నా | 6. అల్లరిగాడని బిరుదిడి
ల్లొల్లిని తెగచేయు చుండి రుర్విని నన్నున్
కల్లా కపటము లెరుగని
పిల్లాడిని సత్య మరయ - విను భీమన్నా | 7... 'టెంాయ చిప్ప' శతకము
పాంకముగా వ్రాసి తలప భువి, కవి సారం
గాంకుడు నయె ఆ శ్రీవ
త్సాంకుని భక్తుని నుతింతునయ భీమన్నా | 8. _ ప్రణతులు “మంధరము” కవికి
ఘనమతి థ్రీ “వాసుదాసుగా ధర యశ మం
దిన రామభక్త వరునకు
ననఘున కివె వందనాలయా భీమన్నా |
భీమన్నా
- _ శృంగార మూర్తి నరహరి
“మంగళగిరి” వెలసినట్టి మాలోలు డనన్
పొంగును డెందము - కనులా
రంగన్ గన బుద్దిపుట్టురా భీమన్నా 1 10. బెజవాడ దుర్గ మహిమము
సుజనుల వాక్చటిమలోన శోభిలు రుచియున్
గిజిగాని గూటి యల్లిక
అజుడును చెప్పంగ లేడయా భీమన్నా ! 11. _ తియ్యని వాక్కుల సర్వుల
కియ్యవనిన్ సఖుడు “వేంకటేశ్వర శ ర్మ
న్నయ్యకు, సుకవికి, పలుకుం
దొయ్యలి సుతునకు నతులిడుదున్ భీమన్నా 1 12. నరసింహ సుఫ్రభాతము
వర బుధతతి మెచ్చ వ్రాసి వసుధన్ నావే
స్వర పరిచి పాడజేసేియు
స్థిరయశు నన్ చేసె నతడు శ్రీ భీమన్నా!
భీమన్నా 13. 'కవితాకేసరి యయ్యును అవనిని “శ్రీ వేముగంటి" ఆశ్చర్యముగా నవనీత మనస్కుడు - ఆ కవివర్యున కంజలింతు కవి భీమన్నా 1 14. కందము వ్రాసి వెలిగిరిల నెందరొ ఘనులైన వార లీ లోకమునన్ అందర కంటెను బుధజన వందితుడవు తలపనీవు వరభీమన్నా 1 15. చనిన దినంబుల లోపల మనతిక్కన సోమయాజి, మన చౌడప్పీ గణుతికి నెక్కిరి 1 నేడో ఘనుడవు కందమున కీవు, కవి భీమన్నా 1 16. పిల్లిని గూరిచి 'వహవా' సల్లలితము చెప్పినావు శతకంటిల - నా యుల్లము దోచితివయ, కవి తల్లజాడన నీవె లేర ధర భీమన్నా |
థీమన్నా
- _ ఎలుకలను బట్టు పిల్లిని
పలువురు మెచ్చేటి పగిది, వస్తువు గాగన్
సలుపుచు పద్యము లల్లితె
కలబాణిని క్రొత్తపుంత కవి భిమన్నా | 18. తెలగాణ కవుల లోపల
తలపగ నగధీరుడనిన దాశరథ్‌ొకడే
అలగొద్దని మిగిలిన మా
చెలులకు నీవయిన చెపుమ - శ్రీ భీమన్నా | 19. “చేరా కో శతమానం
బారూఢిగ చెప్పినట్టి యనఘుని, కవితా
సొరున్ “కోవెలసారు”ని
పేరిమితో నుతిని సేతు విను భీమన్నా 1 20. “గోరా” యొక్కడె పూర్వము;
ఈ రోజులలో విచిత్ర మెట జూచిననున్
బీరా రారా చేరా
కారా లే కానిపింత్రు కవి భీమన్నా।
భీమన్నా 21. అఆ విప్లవార్ని ఠ్రీక్రీ భావావేశుండు అరుణ భాస్కరుపైనిన్ కోవిదులు మెచ్చ వ్రాసిన “కావూరి” నిఅభినుతింతు కవి భీమన్నా 1 22. కలకానిది, విలువైనది బలిసేయకు బ్రతుకు నంచు పలికిన ఘను డు జ్ఞ్వలమతి, కవి సూరీడదె కలకాలము శాశ్వతుండు కవి భీమన్నా 1 23. “సావర్క” రన్న - కవితా శ్రీ వైభవుడును, బుధుడగు శ్రీ శ్రీ యనగా ఆవేశము పెల్టుబుకును “మ్రావో” ఘనుసాక్షిగ వినుమూ భీమన్నా | 24. _భావాలపుట్ట శ్రీ శ్రీ కావేశము మెండటంచు ఘను డేనాడో మావూరి “రామదా”స నె కావాలన అడిగి చూడు | కవి భీమన్నా |
భీమన్నా
- ఘనులైన కీర్తి శేషుల
ననఘుల వినుతింతు మా 'నయాగరి కపవులన్
విని యుందువీవు ! నలువుర
కనియుందువు గూడ నేమొ కవి భీమన్నా 1 26. శుభదుండన శ్రీ హరియే
విబ. గులనగ తిరుపతి వేంకటకవులే
సభయనగా అవధానమె
శిబి యొక్కడె దాత యనగ థ్రీ భీమన్నా 27. నభమునకు 'రాజు అందము
సభ కందము 'ఆఅక్కిరాజు' జగతీ స్థలికిన్
తబలా పాటకు అందము
గుబు రందము పూలజాతి కో భీమన్నా ! 28. కవులందు ఘనుడు తిక్కన
బవరములో ఘనుడు క్రీడి పశుపతి సాక్షిన్
నవసంఖ్యనున్న గ్రహముల
రవి యొక్కడె రాజు నిజమురా భీమన్నా !
భీమన్నా 29. శేషేంద్ర కవితలన్నా “జాషువ కవి పద్య శిల్ప చాతురి యన్నా భాషాసతి నగవన్నా దాసోహ మనెద సుకవినుతా భీమన్నా 1 30. '“నరసారాట్స్పురి' పేర్విన నరములు నుప్పాంగు మనము నాట్యము సేయున్ మరి కారణమేమో యది ఆరయను నేటికిని గూడనయ భఖభీమన్నా | 31. “నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగ సాలివాని నటు” - ననుచును, ము రొమ్మున బలికిన కవి, స త్య మ్మెరుగడయా తలంప 1 హా! భీమన్నా! 32. చెడుగాకు లల్పబుద్ధులు మడిగట్టుకు నున్న ధూర్త మార్దాలములన్ పుడమిని కవితతి లోనే అడుగడుగున గనుచునుంటి ! హా! భీమన్నా !
భీమన్నా
- _చెడుగులు వీరల గాంచిన
మడి మెలగిన 'దీర్హకర్ణి మనసున మెదలున్
కడు నేర్పుగ దర్పముతో
పడదోతురు సుకవివరుల | వర భీమన్నా 34. కలరయ్య తలచి చూడగ
కలరయ్యా నాటి '“దీర్హకర్ణిని' మించే
పలు కవి శాబక భిక్షకు
లిల తెలియుమయా కవీంద్ర ! శ్రీ భీమన్నా | 35. "చిన్నయ సూరికి పాపము
ఉన్నది ఉన్నట్లు వ్రాయు టొక్కటి దక్కన్
వన్నెలు చిన్నెలు టక్కరి
పన్నాగమ్ములును తెలియ వవి భీమన్నా 36. ముసుగున గుద్దుల వేలా
విషయంబది ' సీదసాద' వివరింతునయా
ముసిముసి నగపులు నగకుము
పసిబాలుని రీతి ' వారెవా భీమన్నా |
భీమన్నా 37. _ అడ్జొచ్చినట్టి వానిని నడ్డిని విరుగంగ గొట్టి 'నైసుగ' మెలిగే దొ(ర్పెడ్డన్న లెక్కువై రిల బుడ్డా కవిరాజ ! తెలియు మో భీమన్నా | 38. గర్వాంధుల మాయలలో ఉర్వీస్థలి 'పుట్టపర్తి' హుష్ కాకయ్యెన్ సర్వులకు నిట్టి విద్యలు నేర్వంగను రావుర ధరణిన్ భీమన్నా ! 39, కడునేర్పుగ గొంతులపై తడిగుడ్డల వేసి కోయు త్రాష్టులగంటిన్ జడుపింతలేని వారిని గడుసరి సత్కవుల గంటి కవి భీమన్నా 1 40. మనవారిని మనమే, దు ర్లుణు లును త్రాష్టులు ననుచును క్రోధముతో, నిం 'దను సలుపుట యిలపయి, త ప్పని నే నెరుగుదునుర కవి పర భీమన్నా !
భీమన్నా
- కోర్కెలునాకవి లే విల
“వర్కీ” నిజమైన యట్టి 'పర్షిప్ప” ని -నే
పేర్కొనెద సతంబును -అ
య్యర్కుడు - శశి సాక్షి వినుమయా భీమన్నా !. 42. కులమును బట్టి కవిత్వము
సలలితముగ నబ్బునన్న చవటల నిలపై
వెలివేసి తీరగావలె
పలుమాటలు వలదు వలదు వర భీమన్నా 1 43. కానీ, ఒక్కటి మాత్రము
నే నీనాదెభయదంపు నిజమును గంటిన్
వాణిని కులమునకున్, మతి
హీనులు ముడి వెట్టు చుండి రిల భీమన్నా ! 44 పలుకుం జీడియ సత్కృప
కలుగ న్వలె నంతె గాని, కాకమ్మ కథల్
తల తోక లేని మాటలు
పలుకంగా వ్యర్ధము లిల వర భీమన్నా!
భీమన్నా 45. కులములు లేవని యనుచునె దళికుడు, హరిజనుడు ననుట ధరలో నకటా అలవాటయి పోయెను, అతి తెలివన మన నాయక తతిదే భీమన్నా 1 46. ధరలో ఓట్లవి పొందగ హరిజను లాధారమైరి అకటాతలపన్ వరనేతల పలు మాయలు సిరికోసము తిప్ప లరయ శ్రీ భీమన్నా 1 47. _ ధరలో నేతలు సర్వులు హరిజనులను గూర్చి పలుకు ననఘులె - ఆ శ్రీ హరి గూరిచి మాటాడరు సిరికోసము తిప్ప లివ్వి శ్రీ ఖిమన్నా 1 49. 'కురిసీ' కోసమె యేద్చెడు వరనాయక తతిని గంటి' వసుధాస్థలిలో అఆరయగ నెగ్లూ సిగ్గులు సురనదిలో ముంచినారు సూ భిమన్నా | యల న
భీమన్నా 50. నాయకు డనగ “ప్రకాశము గాయకు డన 'ఘంటసాలి - కవియన జగతిన్ ధీయుతుడగు 'దండి' యె - శుభ దాయకు డన హరియె కవినుతా భీమన్నా | 51. మునుపటి రోజుల మాదిరి కనిపింపదు తెన్గునాటి (మ) ఘన సంస్కృతి - స జ్ఞనులును ఘన గుణులు, తపో ధనులు కరవయిరి సుకవినుతా భీమన్నా | 52. మతముల పేరిట చిచ్చును ఆతిసులభత రేపునట్టి యనఘుల గనవా ? చతరగుణుల్ నేతలు - మరి మతి వావస్పతులు వారె మహి భీమన్నా! 53. మతముల నడ్డము పెట్టుచు ప్రతివారును పరము గూర్చి పలికెడివారే అతి చిత్రంబగు ధోరణి కతలేవో చెప్పువారె కవి భీమన్నా |
భీమన్నా 54. _ఆస్తికుని కన్న చూడగ నాస్తికుడే నయము నిజము, నయవంచకుడై “మస్తు గ నీతులు పలుకుభు “రాస్తా' వేరౌాట తప్పురా భీమన్నా ! 55. నరుసొమ్ముకంటె గూడను హరి సొమ్మును దిన్నవాడె అనఘుండి లపై ధరలో కొందర కకటా వెరపును భీతియును లేవు విను భిమన్నా | ఏ6. పెరుమాళ్ల సేవయంచును తిరముగ కడు చిత్రముగను 'తి.తి.దే' లోనే “సరివీసం తయు గడపుట లెరుగుదునే సుకవి వర్య శ్రీ భిమన్నా 1 56. సన్నాసి "కారు' లెక్కుట సన్నాసికి సర్వగతుల సదుపాయంబుల్ కన్నార గాంచుచుంటిని పన్నీ రత్తరుల సాక్షి వర భీమన్నా 1
భీమన్నా
57, _సన్నాసులయ్యు గూడను
అన్నన్నా భూపులటుల ఆశ్చర్యముగా
చెన్నగు పలు మర్యాదలు
మన్నన అవి పొంద గనవొ ? మహి భీమన్నా 1 58. సంసారుల కంటెను ధర
హంసలు భోగాలు మరగి అచ్చెరువుగ - ఆ
కంసారుల మించుట - కవి
హంసా కొందరిని గంటి నయ భీమన్నా | 59. నిజమౌ ప్రేమను పంచెడు
సుజనుల, నిస్వార్థపరుల చూపగలే మీ
పజయం దిప్పుడు - ఖలులకు
భజనలు పరిపాటియయ్యె వర భీమన్నా ! 60. అనఘుడు 'రఘుపతి' కులుడగు
వినుతిని గని నట్టి బుధుడు, వేంకట రత్నం
బును బోలిన బుషిసము నొ
క్కనినైనను కనము కలిని కవి భఖీమన్నా !
భీమన్నా 61. ఘనుడును కీర్తి ధనుండును, జనవంద్యుడు 'కందుకూరి' జనినట్టి పథం బున జను వానిని నే డొ క్కని నైనను కలిని గనము గద భీమన్నా 1 62. బిరుదుల కోసము,కవి సో దరతతి ధూర్తుల కిలపయి దాసులు నౌటన్ హరుసాక్షి గంటి, నిజముగ నరసితి నే పెక్కు కేసు" అవి భీమన్నా | 63. కవులన “ధర్మజు'లనుకుని భువిపయి భ్రమపడితి నేను - మోసం బాయెన్ కవులన ఉత్తర గురులని ఆవగతవమయె 'లేటు' గాను 1 హా 1 భీమన్నా! 64. కవులందర నొక గాటను భువిపయి నేగట్టి తంచు బుస్సని గనకో కవివర | గుమ్మడి కాయల కవిచోరులు వేరునుంద్రు కవి భీమన్నా !
భీమన్నా
- సుందర సురుచిర కవితా
బంధురుడను, కాళికాంబ భక్తవరుండన్
'హిందోళి రాగ రతుడను
అందమ్మున ఆ 'నలుడి నయా భీమన్నా | 66. సినిమాలు కుర్రకారును
గుణహీనుల చేసి బ్రతుకు కూల్చుచు నుండెన్
ఘనులౌ నిర్మాతలకును
ధనార్జనయె ధ్యేయమాయె ధర భీమన్నా 67. పిర్రలు పొంగినయట్టుల
బిర్రగు 'డ్రాయరు'ల గట్టి పిచ్చిగ డ్యాన్సుల్
వెర్రిగ మొర్రిగ సల్పుట
లగ్రర్రే 'సిన్మ' కర్టమయె భీమన్నా | 68. భరతుని నాట్యము కానీ
సురుచిరములు కూచిపూడి సాబగులుగానీ
హరుసొక్షి నిక్క మెన్నగ
కరువయ్యెను తెల్లుతెరకు కవి భీమన్నా 1
భీమన్నా 69. పూవిలు కానటు వెలిగిన జూవళులును నృత్యగీత సౌందర్యంబుల్ హావము భావము లిప్పుడు లేవుగదా తెల్లుతెరను శ్రీ ఖీమన్నా 1 70. మితి మీరినట్టి 'సెక్సు' న కతిపేలవ మయినయట్టి హాస్యము జతగా అతుకుల బొంతగ అల్లిన కతయయ్యెను తెల్లు ' సిన్మ॥ కవి భీమన్నా।
- 'మాఫియగ్యాంగు” ల చర్యలు “లోఫరు' అవి వెగటు తనపు లొల్లియు - నెవియో “గ్రాఫికు' ల గనుట కంటెను “బ్లూఫిల్ములు చాల నయముపో భీమన్నా |
- నయగతి జూడగ “డ్యాన్సు'న్ “జయమాలిని - జ్యోతిలక్ష్మి చాలగ మేలౌ లయ,గతి, తాళములున్నా అయోమయము నేటి “డ్యాన్సు'లయొ భీమన్నా |
భీమన్నా 73. సినిమాల జూచి భ్రమతో మన పిల్లలు “ప్రేమ” యంచు మంచీ చెడులన్ కనజాలక నిల శ్రుతి మిం చిన పగిది మెలగుట గంటి, థ్రీ భీమన్నా 1 74. _ సినిమావారికి చిత్రము “దునియా' లో “ప్రేమ” దక్క దొరకకపోయిన్ ఘనమగు వస్తువు - నే డహొ కనుగొంటివా లేదొ నీవు, కవి భీమన్నా 1 75. సినిమాలు జనుల కక్కట ఘనమగు సందేశ మిచ్చి గ్రాలుటకు బదుల్ కనగూడనివే చక్కగ కనుమని చూపించుటయ్యె కవి భీమన్నా | 76. కరము విచిత్రపు ధోరణి నరయంగను “ప్రేమ జాడ్య' మధికం బయ్యెన్ ధర నెచ్చట జూచిన, ని క్కరణినె పలు కథలు గంటి కవి ఖీమన్నా |
భీమన్నా
- నీతులు దేవు ఢెరుంగును
బూతులు పలికింప గొప్ప మోజయ్యెను - ని
ర్మాతల కయయోం- జను లే
రీత్సిని బాగుపడెదరయ థ్రీ భీమన్నా | 78. “అతిసార యట్లు అకటా
మితిమీరెను 'సెక్సు' భరత మేదిని యందున్
మతిమంతులు నేగతి ఈ
కతలను (గు వినుచుంటిరొ గద | కవి భీమన్నా | “79, మన పిల్లలు నిక్కంబును
గన జాలక నిలను మూడు గంటల చిత్రం
బనుకొనుచుండిరి - జీవిత
మన | కలిమహిమము నిజమిదయా భీమన్నా 1 80. పోలీసుల సన్నిధి పూ
మాలలు 'ఖుసి' మార్చుకొనుటె 'మ్యారీజి యయెన్
కాలమహత్వము - మరి పో
గాలమ్మున కర్థమిదిర కవి భీమన్నా |
భీమన్నా 81. తలిదండ్రు లన్నదమ్ములు చెలులును బందుగులు హితులు చెప్పెడిమేలౌ పలుకుల పెడచెవి బెట్టుట చెలువల కిల ధర్మమయ్యె శ్రీ భిమన్నా | 82. సినిమాలో అందముగా కనిపించే వన్ని నిజము కాబో లనుచున్ మన పిల్లలు భ్రమ నుండిరి కనజాలరు సత్య మిలను కవి భీమన్నా ! 83. కనిపెంచి పెద్ద చేసిన జనయిత్రియు కడకు ప్రీమ జనకుని కంటెన్ ఘను డా గొట్టము స్రీమిం చిన వా డధికు డయిపోయె శ్రీ భిమన్నా 1 84. పగయును హింసయు ద్వేషము తెగమోటుదనంబు వెండి తెరపయి గంటిన్ సొాగసుందన మది లేశము నగుపించదు *చిత్రము' ల (గ) నయా భీమన్నా! [ ల _ క ఎగ హౌదా నం
భీమన్నా
- 'హీరోల పుత్రు లందరు
'హీరోలయి తెన్లు తెరకు నెంతో యశమున్
గౌరవమును తెచ్చుట నే
నారసితినిలే మహాశయా భఖీమన్నా | 86. బలవంతమైన తెరగున
ఇలను *“ద్విజార్ధు.మున కర్థ మిదియేగాదా
వెల వెల బోపుచు నాగతి
చెలువముగా నవ్వబోకు శ్రీ భీమన్నా 87. నటరాజమూర్తు లనదగు
నటగాయక వర్యులైన “నాగయ్య'లునున్
పటుతర ఘనగాత్రులు, న
ప్పటి 'రఘు రామయ” అ గనము వరఖీమన్నా | 88. “వంగర వెంకట సుబ్బయ
“కొంగర జగ్గయయును - నటకోవిదుడెస్వీ
రంగారావును, సినిమా
రంగంబున కీర్తిధనులు రా భీమన్నా !
భీమన్నా
- _'“లవుమ్యారేజీ'లవి, ఈ
భువి నే గాంచితి ననేకముల్ - పరికింపన్
చివరకు పస్ట్రాష్టకములె
ఎవరో కడు 'రేరు' సుకృతు లిల భీమన్నా 1 90, జగతిని తొలి పెండ్లియె ఆ
నగజది ఆది పెద్ద గొడవ, 'నానాగో "లై
తెగ కష్టముతో నయ్యెను
అగచాట్లౌ ప్రేమ పెండ్లి యన | భిమన్నా! 91. మన నాగరకత మరచిరి
మన సంస్కృతి పట్ల శ్రద్ధ మచ్చుకు గనమే
మన సెంతొ కలత చెందును
కన మన *“చిత్రము' అ నివ్లు కవి భీమన్నా | 92, తెలుగుల మయ్యును అకటా
తెలుగిండ్లవి మంచి చెడులు తెరమరుగయ్యెన్
పలు తోమక ముందె పతికి
చెలి 'కాఫీ' నిడుటలయ్యె శ్రీ భీమన్నా!
భీమన్నా
- _మరచిరి “ఉండ్రాళ్ల తదియ'
మరచిరహో 'అట్ల తదియ” మన పండుగలన్
మరచిరి చలిమంటలునున్
మరచిరి మన వేడ్కలన్ని మహి భీమన్నా | 94. తెనుగింటి పిండి వంటలు
కనుమరుగయె నేడు పాపకర్మ మిదేమో ?
మన యింటి పెండ్లి విందుకు
ఘనమయ్యిను *“ఫ్రూట్‌సలాడు' కవి భీమన్నా ! 95. పండుగ 'గెట్టుగెదరు' లకు
“సండేలను జరుపుకొనెడి సంరంభత ,కిం
గ్లాం' డా దర్శంబయ - బల్
“వండరు” గద తెలుగు ధాత్రి! వా! భీమన్నా | 96. విస్తట్లోతినుటది, చా
దస్తముగా నయ్యె నేడు తాతయ కేనిన్
విస్తును పోబోకుమురా
“బస్తీ ల 'హవా' లు లేర వర భీమన్నా !
భీమన్నా
- "సైబరు' యుగమిది - “డైనింగ్
టేబులు' పయి *“మీల్సు' తినుట - *టీ కాఫీ" లున్
“డాబాల కేగి త్రావుట
కాబోలిది గొప్ప ఘనత - కవి భిమన్నా | 98. తెలుగింటి సంప్రదాయము
సలలితముగ నటకనెక్కె సర్వుల యిండ్లన్
తిలకింప తెల్లవారల
పలుకులు, అభిరుచులునయ్యె | వా ! భీమన్నా। 99. నుదుటను బొట్టును పెట్టెడి
ముదితల గన కష్టముయ్యె పుడమీస్థలిలో
ఇది యేమి చేటుకాలమొ
గద | భరతావనిని నేడు 1 కవి భీమన్నా | 100. అ సదృశ ప్రజ్ఞావంతుల
కిసుమంతయు నాదరంబు, లిల లేకుండెన్
బుపిభూమి భారతంబున
విష సంస్కృతి పెచ్చుమీరె విను భీమన్నా !
భిమన్నా
- భువిలోన ఆర్య సంస్కృతి
కవివర్యా నేతిబీర కరణిని నయ్యెన్
నవనాగరికత పేరున
చివరకు కడు భ్రష్టుపట్టె శ్రీ భీమన్నా | 102. అనఘుండును 'దీవి” కులుడు
“హనుమంతాచారో;బోలు ఆగమ విదునిన్
ఘన సుస్వరయుతునిలపయి
కనగా కడు దుర్లభంబు కవి భీమన్నా | 103. ఈశుని పరమేశుని స
ర్వేశుని మదిగొల్బు భక్త బృందములోనన్
భాసుర 'కొండురి” కులుడగు
'శేషయలింగంబు' ఘనుడు థ్రీ థీమన్నా 1 104. దానము ధర్మము నందున
కానీనుని మించునట్టి ఘనుడన, కడు సు
జ్ఞానియె 'శేషయలింగము'
కానము నేడట్టి పుణ్యు కవి భీమన్నా !
భీమన్నా
- సినిమా కవి 'పింగళికిని
ఘనగాత్రుడు 'ఘంటసాలి గాయకమణికిన్
ఘనుడా కే.వీ రెడ్డికి
కనిపింపరు సాటి 1! నిజము కవి భీమన్నా | 106. 'జలకాలాటలలో, కల
కల పాటలలో - ననియెడు కమ్మని బాణుల్
తొలి గీతాలవి యిప్పుడు
కలలా యని పించుచుందె కవి భీమన్నా | 107. “సాలూరి' వారటన్నను
'ఫీలు' న “స్పెషలిస్టు నయిన 'పెండ్యా'లన్నన్
“నీలాంబరి' రాగంబన
కేలెత్తి నమస్కరింతు క్షితి 1 భీమన్నా! 108. ఒడుపున్న పాట మెచ్చెద
పడి చచ్చెద 'లత' ది ' స్వీటు వాయి'స్పన్నన్
“బడెభాయి రఫి' కి నిచ్చెద
కడుభక్తిని నే 'సలాము* కవి భీమన్నా |
భీమన్నా
- వెన్నెలరాత్రుళ్లన్నా
'మన్నాడే' గొంతులోని మధురిమ లన్నా
పున్నాగ పూవు లన్నా
చెన్నుగనా మనము పొంగు శ్రీ భీమన్నా | 110. స్వర జతుల గతులటన్నను
వరయశుడౌ, టీ.వి. రాజు బాణీలన్నన్
“హరికాంభోజీ' యన్నను
మరి మరి నే నిష్టపడుదు ! మహీ భీమన్నా 1 111. పూవుల సొగసు దనమునకు
భావుక శళి “కృష్ణ శాస్త్రి! పద్యంబునకున్
“సావేరి రాగమునకు
లే వెల్లలు లేవు లేవు థ్రీ ఖీమన్నా! 112. చేవగల 'సైన్మ దీయగ
కోవిదులును సకలజనులు గొప్పగ పొగడన్
కే.వీ. రెడ్డికె చెల్లెను
ఆ “వాహిని” సంస్థ 'గ్రే టయా భీమన్నా |
భీమన్నా
- “సినిమా” కు స్వర్ణయుగ మది
ఇన తేజులు సత్కవీంద్రులిల నుండుటచే
ఘనమైన కీర్తి వడయుట
కనినారమునాడు నిజము, కవి భీమన్నా | 114. 'తెలిగి దయతో నే డిదె
తెలుగుం దేశంపు కీర్తి దెసలన్ ప్రాకెన్
పలు తెరగుల 'స్కాము' లతో
విలువగు పీఠంబు మనదె విను.భీమన్నా 1 115. “ఖాకీ గుడ్డల 'సారు' ల
“లాకర్లను కోట్లు కోట్లు రాజిలు చుండన్
ఊకొనెదరొ అన్నయ్యలు
వ్యాకులమున్‌చెందరొ ? వరెవా, భీమన్నా 116. ఒక సిద్ధాంతము, పద్ధతి
ఒక మార్గము గానరాదు - ఓపినకొద్దిన్
సకలము దోచుచు నుండిరి
అకటకటా “నక్సలైట్లు హా | భీమన్నా!
భీమన్నా
- ప్రజ సొమ్ము దోచుకొనుచును
ప్రజ సొమ్మును తగులబెట్టు వారల నెటు లీ
ప్రజ మన్నన సేతురు ? వీ
రి “జబర్దస్తీ లు త(ము)ప్పు శ్రీ భీమన్నా | 118. విలువైన జీవితంబని
తెలిసియు ధర 'నక్సలైట్టు' ధ్యేయ మటంచున్
బిలియగుచుండిరి పోలీ
సుల చేతులలో నిజంబు సూ! భీమన్నా | 119. నిచ్చలు “ఎన్‌కౌంటర్లో
నిచ్చలు విధ్వంసనములె, నిచ్చలు నరరే
పచ్చని సంసారంబుల
పిచ్చిగ రోదనములఅయెను - విను భిమన్నా 1 120. ఆలోవింపగ నరరే
పోలీసులు, నక్సలైట్లు పోటాపోటిన్
ఠీ ట్రాలగ పంపుచునుండిరి
కాలుపురి, కమూయకులను - కవి భీమన్నా |
భీమన్నా 121. రక్షకభటులును సైతము రాక్షసులను మించి పోయి రాజిలుటది - ఆ త్ర్యళక్షుని సాక్షిగ - నారెం డక్షుల గనినాడ నేను హా 1 భీమన్నా! 122. దొర యెవడ్శొ, దొంగ యెవడో అరయంగను కష్టమయ్యె నరరీధాత్రిన్ “దొరలైన దొంగలకె' - నే డిరవయె మన భరత ధాత్రి హే భీమన్నా। 123. మన “టంగుటూరి సింహము, జన నుతుడును ఘనుడునైన '“సంజీవయ” యున్ మనసున మెదలిన యప్పుడు కను లయ్యవి చెమ్మగిల్లు కవి భీమన్నా ! 123. ఘనులైన “లోకమాన్యు' ల జనతాళిని వెళ్లినట్టి 'సావర్కరు' లన్ మన భారతమున నేడహొ కన జాలము నాొక్కనేని కవి భీమన్నా |
భీమన్నా 124, మునుపటి యోధుల మరచిరి మనగాంధిని జాతి పితనె మరచిరి అకటా “జనగణమన'నే మరచిరి కనజాలను నేటి స్థితిని కవి భీమన్నా | 125. మరవిరి యోధవరేణ్యుల మరచిరి సద్యశుల ఘనుల మన సోదరులన్ మరచిరి ఆచారములను మరచిరి గత వైభవంబు మరి భిమన్నా ! 126. యోధుండన '“అల్లూరి'యె యోధుండన “భగతుసింగె' ఉర్వీస్థలిపైన్ యోధుండన 'ఆజాదే” యోధుండన “బోసు” బాటె ! ఓ 1 భీమన్నా 1 127. నగరాలన్నియు చూడగ పగలును రాత్రులును గూడ 'బారుల 'రష్‌తో తెగ భారమ్ముల మైయుచు వగతో కుందుట అవి కనవా భీమన్నా 1
భీమన్నా 128. నగరాలలోన నక్కట భగవంతుని గుడులకన్న 'బాగ్లెక్కువయెన్ పగటికి రాత్రికి తేడా అగు పించదు నిజము నమ్ము, హా! భీమన్నా! 129. నూతన వత్సరమనగా రాతిరి యంతయును '*విస్కి త్రాగుటలయ్యెన్ భ్రాతలు మన తెల్లుల గన చేతము దురపీల్లుచుండె, శ్రీ భీమన్నా | 130. '“బారు' లు 'ెస్టారెంటు' లు ఊరూరను వెలయుచుండె నొప్పుగ తలపన్ భూరియశంబన నిక్కము భారత ధారుణికి నిదియె వర భీమన్నా ! 131. 'గాంధీ బొమ్మల కన్నను “బ్రాందీషాపు' లనె నేను భారతమందున్ సందుల గొందులలో కను విందుగ గనుచుంటి నిజము విను భీమన్నా 1
భీమన్నా
- “బందరులడ్డు'కు బదులుగ
విందులలో ఘనులయింట పెండిళు లందున్
“మందు” కు విలువ దిహెచ్చెను
వందనములు మందు కిడుదు వర భీమన్నా। 133. '*బ్రాంది' “విస్కీ” లేనిదె
విందుకు నవ భారతమున విలువన్ గన, మే
మందును మన వైభవ మిపు
డందరు గుర్తించి నారయా భీమన్నా | 134. మందును గొట్టెనొ యని కవి
సుందరు నను గూర్చి నీవు చూడకు మటులన్
కొందలమందుచు డెందము
కందగ నిటు వ్రాయుభుంటి కవి భీమన్నా 1 135. ఉర్వి నిదెక్కడి పాపమొ
సర్వేశుని పేర “వైను షాపు! లగంటిన్
పర్విడు కాలమునకు కడు
గర్వమురా తలచి చూడ కవి భీమన్నా !
భీమన్నా
- శ్వేతజనుల దోలి మనకు
స్వాతంత్ర్యము తెచ్చినట్టి వారలగన - నా
చేతము సిగ్గున నేడ్చును
శీత నగ సుతధవు నామ, శ్రీ భీమన్నా ! 137. ఎన్నిక లొస్తున్నాయన
అన్నన్నా 'వైను' కంత ఆహ్లాదమొ - ఆ
వెన్నుని పద సంజనిత - వి
యన్నదిలా పొంగుచుండు హా | భీమన్నా | 138. సారాయికున్న విలువది
శ్రీరాముని కేని లేదులే, ఎన్నికలం
దే రాష్ట్రమేగి చూచిన
గౌరవమది 'మందు' కేర కవి భీమన్నా | 139. ఓటు కహో ఐదొందల
“నోటు” ను మరి 'బాటి'లొకటి - నూతన వస్టాల్
“గ్రేటగు మన ఎన్నికలను
“లేటె' స్టగు పథక మిద్ది శ్రీ ఖీమన్నా !
భీమన్నా 140. కలలయ్యి రామ రాజ్యము లిలపయి దుష్కృత్య పరులె ఈడ్యులు నయి రీ కలియుగ మందున -తలపగ ఖలులే సంపూజ్యలైరి కవి భీమన్నా 1 141. 'కిరకట్టు' ఆట యొక్కటె ధరలోపల విద్యయయ్య తలపగ నహహా పెరవిద్యలన్ని చూడగ చిరువిద్యలు గాగనయ్యె శ్రీ భీమన్నా | 142. “కిరకెటు మ్యాచు' లు రోజూ వరుసగ టీ.వీ.లొ చూప, బడి కెవ డెళ్లున్ ? ధర పిల్లలకు, వ్యసనమయి పరగుచునుండె నిజము కనవా భిమన్నా | 143. వందేళ్ల ముసలి ముండయు “ఇందూ” 'స్కోరెంత' ? యంచు, ఇంపుగ పల్కన్ క్రిందా మీదను మండదొ? వందనములు *క్రికెటు' కు 'వహవా' భీమన్నా !
భీమన్నా 144. కవివర, కడునాశ్చర్యము అవనీస్థలి నెవట జూడు, “మ్యాచ్ ఫిక్సింగు' ల్ ఎవరికి గూడను సుంతయు నవమానము సిగ్గులేదు హా ! భీమన్నా | 145. చిన్నారి పాపలన్నను సన్నని విరజాజులన్న, 'సన్‌ఫ్లవ'రన్నన్ పున్నమ చంద్రుడు పరపెడి వెన్నెల యన 'లైకు” సేతు విను భిమన్నా! 146. పిల్లాండ్ర ముద్దు ముచ్చట లల్లుండ్రవి పనికిరాని ఆర్భాటంబుల్ ఇల్లాండ్ర కోపతాపము లెల్లన్ గన నింపు నుండులే భీమన్నా | 147. “పుల్లారెడ్డి మిఠాయికి సల్లలిత(పు)ము “బాలమురళి స్వరగతులకునున్ నెల్లూరి కవుల పాండితి కెల్లరు జేజీలనిత్తు రిల భీమన్నా !
భీమన్నా 148. “మేరీ కన్లవ జిగినిన్ “శారీ” లో దాని చెలువు - “జాకెటు” బిగినిన్ సార యశస్కుడు పెద్దన గారును వర్ణింప లేడు కవి భీమన్నా 1 149. సువిశాలనేత్ర 'మేరి' చె లువములు వర బాహుమూల రుచి ముంగట, ఆ జవరాలు వరూధినియును కవివర దిగదుడుపె తలపగా భీమన్నా ! 150. దానివి పరువపు గరువప హీనపు పొం (హం)గుల గరిమము నింపుగ చెప్పన్ వాళణీధవునకె కాదుర “థ్రీనాథుని' కైన *డౌటె” శ్రీ భీమన్నా 1 151. బరువది రొమ్మున గనగా విరుగునొ నడుమద్ది యనెడు భీతి, మనకు చూ పరులకు గలుగును, దానిని కరివరదుడు ప్రోచుగాత ! కవి భీమన్నా |
భీమన్నా 52. హరి మధ్య, దాని కన్నులు సరసిజములు నవ్వినట్టి చాడ్పున దోచున్ కరికుంభస్థలి, దానిని కరె వరదుడు ్రోచు గాత ।! కవి భీమన్నా। 153. దానికి పాపము కటి కడు హీనము, పైనేమొ బరువు హెచ్చగు కతనన్ దీనముగా మౌనముగా జ్ఞాని వలెన్ నడుచుచుండు కవి భీమన్నా | 154. “మేరీ “జాకెటు” కుట్టెడి “మీరావలి భాయి” కన్న మేదిని లోనన్ నేరుపు గలిగిన శిల్పిని వేరొక్కని గనగవైతి విను భీమన్నా ! 155. “మీర్జా గాలిబె' కవియన “దర్జీ యన “మీరవలి'యె ధాత్రి స్థలినిన్ “దర్దా యన 'మేరి దే తర్జన భర్జన లరరెవృధా భీమన్నా ర న న నటన న క.
భీమన్నా 156. '*'బ్రింజాలు' కూర యన్నను మంజులమౌ రుచులనీను '“మాగా' యన్నన్ పంజాబు “రోటి యన్నను “ఎంజాయిని' సేయు వాడ నిల భీమన్నా | 157. ఒంటెద్దు బండి యన్నను “గుంటూరు ది వరిగ చేల “గోంగూరన, - పే రంటా లాక్కూ'రన - నే నేంటో తెగ “లైకు' సేతు నిల భీమన్నా।! 158. “జాస్మిను” పువులన “ఉస్తాద్ బెస్మిల్లాఖాను భాయి 'భీంప్తా' సన - 'సి ల్కుస్మిత' డ్యాన్సన - సంతృ ప్త్మ్మొగ నెద పొంగు నా కహో భీమన్నా | 159. “నీంబూ' సోడా యన్నను “బాంబే హల్వా యటన్న పాయస మన్నన్ “సాంబారిడ్డీ యన్నను “రొంబా” నే 'రెలిషు' చేతురో భిమన్నా |
భీమన్నా,
- ఉదయార్కు శోభ యన్నను
సదయుండగు తిర్మలయ్య సంస్తుతులన్నన్
బుధు డన్నమయ్య యన్నను
హృదయం బుష్పాంగు నాకు నిల ఖీమన్నా! 161. అదె బసవేశ్వరుడన, కో
విదుడగు 'పాలకురికి శశి' ద్విపదలటన్నన్
'ముదిగొండ' 'స్పీచి యన్నను
మది తెగ నుప్పాంగు నాకు మహి భీమన్నా ! 162. 'శిప్రొనది హొయలకునూ
కొప్రపుకవు లాశుధారకును, ఘనుడౌ మా
“విప్రముని”' వ్రాతతీరుకు
కప్రపు హారతుల నిత్తు కవి భిమన్నా 1 163. 'పిజ్ఞుకన్నను' మిర్చీ
బజ్జీనే మనసు పడుచు భక్షింతు నయా
సజ్ఞు జొన్నన్నంబులు
'మజ్జిగి యే 'గ్రేటు' నాకు మహి భీమన్నా |
భీమన్నా
- సారపు తక్రము వలదని
“బార్రనువీటా'ను త్రాగు వారిని, చెడుపిం
జారీ వెధవలనుం గని
కారుణ్యమ్మునను జూతు కవి భిమన్నా | 165. తంజాపురి వీణన్నను
“రంజని” రాగాన సాగు ప్రభునిది, హరిదౌ
“ఉంజలుసి” వన్నను కడు
“ఎంజాయి” ని సేయు నరుడ నిల భీమన్నా | 166. "హేమామాలిని చెలువన
భామామణి 'హెలెను” నాట్య భంగిమ అన్నన్
కామిని “కాంచన మాలన
నా మది ముదమునను పొంగు నయ భీమన్నా 1 167. సిరులూ సంపద లున్నను
హరికృప లేనప్పు బ్రతుకు వ్యర్ధం బిలపై
నరు డెరుగం డీ విషయము
గరువంబున విగ్రవీగు కవి భీమన్నా |
భీమన్నా
- అంచితగణు 'బాణు'ని ని
ర్వంచిత గద్యమన, తెల్లు పద్యం బన్నన్
“ఫెంచి' ది మద్యంబన్నను
మంచిగ '“ఎంజాయి' సేతు మహి భీమన్నా ! 169. 'కాటూరి' పద్యమన్నను
“చీటేవాలరటిపండు 'స్వాటన్నను, మా
“వేటూరి' పాట యన్నను
ఏటో తెగ 'లైకు సేతు నిల భీమన్నా | 170. హరిచరణ సేవకుండన
మురహరు డా శౌరి సాక్షి 'పోతన' యొకడే
ఉరు కరుణామయు డనగా
కరివరదుం డొక్కరుండె కవి భీమన్నా ! 171. హాలికకవి “పోతన” యన
“వాలుని'వౌ గాథలన్న - ఆయ్యనఘుండౌ
'గాలిబు' గీతాలన, మది
గ్రాలున్ కడు పరవశమున కవి భీమన్నా !
భీమన్నా
- తీవల పచ్చదనంబును
పూవులలో చెలువు మెరయు పుప్పాడులకునున్
“కావేటి రంగయ' సిరికి
రా వేవీ సాటిరావు రా భీమన్నా। 173. ఓకవి। నే డహొ నరునకు
ఏకోశమునందు గూడ నింతయు కృపయున్
వాకున స్వచృ్శత లే దీ
లోకములో 1! గనుమ । మార్పులో భీమన్నా | 174. పరమేష్టి సృష్టిలోపల
నరయంగా నరుని సృష్టి అచ్చెరు వగురా
పరము నెరింగిన నరు లిల
కర మరుదుర చింతసేయ కవి భీమన్నా | 175. పరముని సంగత టుంచుము
నర పశువుల సంఖ్య చూడ నాలుగు దెసలన్
ధర ఈనిన గతి నకటా
కర మధికం బగుట గంటి కవి భీమన్నా !
భీమన్నా 176. పసగలుగు యువతులుండగ పసిమొగ్గలపైన మాన భంగము అయ్యెన్ అసురులె కడు మేలయ - నర పశువుల కంటె నిజము - తలపన్ భీమన్నా | 177. కలి కంటె పరమ లోభిని కఠి కన్నను జూదగాని, కఠినుని, కొండె 'మ్ముల వానిని, నీచాత్ముని ఖలునిన్ గన దుర్లభమ్ము కవి భీమన్నా | 178. ధరపయి కలిపూరుషు డన మరి తలపగ గోడమీద మార్దాల మహో అరసీకుడును “డా(ల్ఫోఫరు” ట క్కరిరా కలిగాడు నిజము కవి భీమన్నా! 179. కలియంత నీతి దూరుని కలియంత “గలీజు గాని, కలుషావారున్ కలియంత మొండి వానిని కలియంతటి తుచ్చు గనము కవి భీమన్నా
భీమన్నా
- ఇతరులకు నీతి చెప్పగ
మతి వాచస్పతులు నిజము మన తెల్లులెరా
స్తుతమతి । నగ కటు బోసిగ
సితకీర్తి ధనా 1 కవి సఖ ! శ్రీ భీమన్నా 1 181. కరణాల తెలివితేటలు
పరమేస్టి విశిష్ట సృష్టి పరతత్త్వమహో
అరవోళ్ల ఐకమత్యము
అఆరయగ నచ్చెరువు గదర । హా! భీమన్నా | 182. కవితా ప్రక్రియ లకటా
భువిపై కడు చిత్రమైన పోకడలౌరా!
ఎవరికి తోచిన పేరును
చివరకు వారతుకుటయ్యె శ్రీ భీమన్నా। 183. “నానీ లట 'హైకూ' లట
వాణిని నర్చింపగ కరవా పేళ్లవి ? బి
ర్యానీ - పల్లీ - బఠానీ
లేనా పాపంపు పేరు లిల భీమన్నా ?
భీమన్నా 184. “ఠండాపాొనీ మరి నా 'పిండాకూడం'చు గూడ పేళ్లవి పెట్టన్ “వండరు' లేదీ భువి - కవి గండర గండడవునైన కవి భిమన్నా ! 185. బుగ్విదుడన, వాగ్విదుడన ప్రగ్విణి, మధ్యాక్కరలను సరసపు కవితా రగ్వధ వర్ణన సేయుచు వాగ్వైభ వ మద్ది చూపవలె భీమన్నా! 186. సుందరిజడలోపూవును “బ్రాందీ” లో 'సోడ' నేను - రసికుడ ననియే మందూభాయిల కైతలు విం దొనరింపవహోొ నాకు విను భీమన్నా 187. దేనికి బడితే దానికి పూనిక తో మందు గొట్టి పొలుపుగ వ్రాసే వైనము కాదది నాది, పు రాణికి భక్తుడ నిజంబు రా భీమన్నా !
భీమన్నా
- '“గజలు' లు వ్రాయగ మాత్రము
నిజముగ కావలెను మందు, నే కాదన, న
ద్రిజ సాక్షిగమా ఘన స
ద్విజ వర్గ పదాల సాక్షి విను భీమన్నా 1 189. 'పె' గ్లేసి వ్రాయు “గజ ' లది
అగ్గపు భావనలతోడ, నలరుచు నుండున్
నాగ్గూడ నిన్ని నాళ్లకు
సోగ్గాడికి అర్ధమాయె సూ | భీమన్నా ! 190. డబ్బున్న వాడె సత్కవి
“'క్లబ్బు'ల తిరుగాడువాడె రసికుడు ధరపై
దబ్బరలాడుటె లౌక్యము
లబ్బబ్బా వింత లోకమయె భీమన్నా 1 191. రంగని సౌగసునకు, లసత్
భృంగాళి సునాదగరిమ విస్ఫురణకునున్
“'ముంగండ' కవికి దీ టర
యంగన్ కడు కష్టమవునయా భీమన్నా |
భీమన్నా
- తొంభై నాల్గేండులకును
శుంభద్యశుడౌచును కవి సూరిగ నిల సం
రంభంబున నుంటివి ! కవి
శంభుండవు 1 నీకు ఠేరుసరి । భీమన్నా | 193. లోకము పోకడమారెను
“జాకా' ల్లాల్లెక్కువైరి సాహితి వనిలో
“బాకా” లూదగ రావలె
“కాకాసురు' లకె యుగమిది, కవి భిమన్నా | 194. అవకాశవాదు లౌచును
కవులును చరియింప వారి కర్మము గాదో
ఆవమానంబని మది లో
లవమును చింతింపవలెనురా భీమన్నా 1 195. కసీతో దిట్టిన నేడ్తురు
మసలక - మనకెందు కంచు మౌనంబున్నన్
సిసలౌ *'పోజు'లహొ, మహ
ర్షశ యనగను వీరిదే గదా భీమన్నా
భీమన్నా 196. కవి చౌడప్పని మాదిరి భువిలోపల కవిత చెప్ప మోక్షము రాదా ? ఎవ రెన్ని గతుల చెప్పిన కవివర్యా నిజము నమ్ము! ఘన భీమన్నా ! 1977. నీతుల నెప్తో మరచితి బూతులె అలవాటుగ నయి పోయెడు నయయో కత మేమొ రామ రామా శితికంఠుని నామ ధారి ! థ్రీ భీమన్నా ! 198. విసురులు విసరుట లోపల పసగలిగిన పిండమంచు పలుకుచు, తలపన్ సిసలగు కవియని నను, స ద్యశు లేనాడో పలికిరయా భీమన్నా | 199. అవకాశవాది కాడని నవ కవితాభ్రపు రవియని నయవిదు డంచున్ కవిజామదగ్ని యంచును భువిచెప్తో నను పలికిరిపో ! భీమన్నా |
భీమన్నా 200. వేసము మోసము నచ్చదు వేసము లే నెన్ని వేసి వెల్లినగూడన్ దోసము లే నాదిది, స ర్వేశుని శుభనామధారి 1 శ్రీ భిమన్నా 1 201. '“స్పార్కున్న కవిని నిర్ణయ “డార్కు'కు నూకేసి పరమ 'డాఫరు” నే, జ్ఞా నార్కుండని పొగడగ, నే నూర్కొన గాజాల విను మహో భీమన్నా! ? 202. “నోట్లో నాలుక యుండదు సీట్లో కూర్చొనగ కాంక్ష , చిల్లరగాం డ్లీ 'ఘూట్లే' 'సాలే'లను,న ట్టేట్లో ముంచి యుతక వలె నిల భీమన్నా | 203. ఇటువంటోళ్లను గూరిచి పటుతర మగు 'స్పార్కు/ ఉన్న వారలె, కవితా నిటలాక్షుల చేసి పలుక నెటు లోర్తురు సద్బుధాళి ? ఇల భీమన్నా! స్సుపిదా క సత్తీ
భీమన్నా
- పసలేని ఆర్భకాళిని
వెస పీఠమ్ములను నిల్పి, విబుధులె నిత్యం
బసమానులనుచు పొగడగ
కసిపుట్టదొ లోకమనగ కవి భీమన్నా 1 205. ఇసుమంత గూడ తెలివియు
విషయంబది లేని వారు పీఠకములపయిన్
'ఖుసి' మీర వెల్లుదుండగ
కసి పుట్టదొ లోకమనగ కవి భీమన్నా | 206. సలహాలనీయ ప్రభుతకు '
బలెవారల నేరినారు *'వరెవా' సెహభాష్
తలపంగ ఆంధ్రమందున
లలిత మతు లవుర కరవటరా భిమన్నా | 207. మంచోళ్లందరు పోయిరి
వంచకులకు నిలయమయ్యె భారతమన, నీ
“బాంచను కాల్మొక్తా యను
'చెంచా' గాళ్లె క్కువైరి, శ్రీ భీమన్నా |
భీమన్నా 208. చెలువపు గుణ సంయుతుడను తెలుగమ్మకు ముద్దు సుతుడ ! “త్రీయినువన్నునో చలిగొండరేని యల్లుని చెలిభక్తుడ ! తెలిసికొనుర ! శ్రీ భీమన్నా 209. ధవళయశ శ్యోభితులగు ప్రవిమల గుణు అన్నపూర్ణ - రామయ్యలకున్ చివరకు బుట్టిన బిడ్డడ కవి - నట - గాయకుడ నేను కవి భీమన్నా! 210. పండిత పామర జనములు మెండుగ ఆశీస్సులిడుచు మెచ్చెడి పగిదిన్ కండగలవి కందములను రెండొందలు ద్రాసి నాడ శ్రీ ఖీమన్నా! 211. నూరువసంతాలకు పయి సూరివరా వెలుగుము కవి శూలివియై, యి " ద్ధారుణి సఖు నిను, వేదా కారుండు శివుండుప్రోచు కవి భిమన్నా !
భీమన్నా 212. సంజ నరుణ కాంతులలో “ఎంజాయి' ని సేయునట్టి ఇచ్చ్భారతుడన్ 'మంజాుఠ్రీ తమ్ముడ - కవి తాంజలు లిచ్చెద గయికొనుమయ భీమన్నా 1 213. ధవళావల మందిరునకు కవిలోకగురుండు కాళికా దాసునకున్ పవపమానసుతుడు హనుమకు అవనిజపతి కంజలింతునయ భీమన్నా 1 214. అలరుంగావుత సతతము సలలితముగ లలితకళలు శారద కృపతో ఇలపయి, ఖలమతులకునున్ చెలువపు గుణమబ్బుగాత థ్రీ భీమన్నా | 215. మనమున నా వరకక్తికి ప్రణతుల నిచ్చెదను “రాజరాజేశ్వరికిన్' ఘనముగ “శక్రో రాగంబున వినుతించెద నిస్టమీర విను భీమన్నా ! “భృభం భూయాత్” ష్ నా ళా కో చాధంతాలా వనర | న [| జ్ర”! ర్ ణా
- మెటా లగి. ల
న ల్ న్ గ్‌ా -.. రచయిత గూర్చి ప్రముఖుల అభిప్రాయాలు వ వ. [లే “నిన్న టి.వి.లో “భక్తపోతన్న” సీరియల్లో నీ “శ్రీనాథ మహాకవి” పాత్ర న (. క్ లు చూశాను. అద్భుతంగా ఉంది. ఆ బ్రాహ్మీవర్చస్సు, ఆ ఠీవి, అత్యంత న్న ష్ మగ మధురమైన నీ పద్యగానం బాగున్నాయి. శ్రీనాథునిగా నీకు నీవే సాటి. 6ళ్ల ని ./ (॥ పూర్వం 'పోతని సినిమాలో '“గౌరీనాథ శాప్రి గుర్తుకు వచ్చాడు. న బస ౩... శ్రీనాధునిగా ఎస్వీఆర్, ఎన్టీఆ్‌ల కంటే నీవే వేయిరెట్లు బాగున్నావు ( పాయో! అని అనిపించింది. వు న కవికౌస్తుభ, కీ॥శే॥ ఆచార్య తిరుమల గ్ | వష -... సకలకళా వైదుష్య చ వ్ ప్రకటితుడా అడవి బాపిరాజొకరుండే హ్
- (| ఇక నీ వౌదువు రెండవ ర్ద వ సుకృతివి మన తెలుగునాట సుందర రామా! క్ - ఉత్పల | ష్ ఈయన కవి అందామా! న్యూఢిల్లీ ఏ.పి. భవన్‌కూ, హైదరాబాద్ రవీంద్రభారతికీ, తెలుగు (షై న సాహితీ లోకానికీ అది విన్న మాటే అవుతుంది. సుందర రామకృష్ణ అక్కడా, ఇక్కడా. | | ఎక్కడైనా తన ఆశు కవితోధారలతో శ్రావ్యంగా, సుందరంగా రసజలధిలో శ్రోతల్ని సై న్‌ు + ఓలలాడించగలడు. ఇతణ్జి నటుడందామా! తెలుగు రంగస్థల చరిత్రలో ఒక అధ్యాయాన్ని వై వ ఏకరువు పెట్టినట్లవుతుంది. ఈ సంగతి శతాధిక సినిమాలు, సహస్రాధిక నాటక ప్రదర్శనలు క్ష చ చెప్పకుండా చెబుతాయి. సుందర రామకృష్ణ కళకు సిలబస్ - మేనర్స్‌కి మేనిఫెస్తో - (న న చిద్విలాసానికి చిరునామా. మ న్ నాగభైరవ కోటేశ్వరరావు, ఒంగోలు మై సనన -. మీలో ఒక అగ్నిపర్వతం ఉంది. అది ఇప్పుడే విస్ఫోటకం ప్రారంభించింది. పొగలు వ్ హ్ గగ్రక్కుతున్నది. అది ప్రచందమై, భగ్నమై, ఉద్విగ్నమై వ్యాపిస్తున్నది. అది కవిత్వ జ్వాల మ “తీవ్ర మనస్తరంగ పరిధీకృత భావుకులైన మీలో ఒక కూచిమంచి జగ్గకవి, ఒక కవి స... చౌడప్ప, ఒక గోగులపొటి కూర్మనాథకవి, ఒక థూర్దటి పరకాయశపవేశం చేసి ఉంటారు. |, ప... రాళ్ళబండి కవీతా ప్రసాద్; 'ద్విశతావధాని' 1] వ =... ఇతడు సత్యనిష్టుడు. నిష్కపటి. నిర్మల నిస్వార్థ సామాజిక చింతనాపరుడు; ఇష్ట దేవతను' న మ సైతం మందలించ గలిగే చనువును సంపాదించుకున్న నిఖార్సైన సంస్కార-సాహాసి.-.- ా ఇతడి పద్య విద్య పరిశ్రమగాదు. ఆశువుగా పరుగెత్తికొచ్చి ఇతడి పంచన చేరింది. ఇది వో న - - జ్వాలాములి