Telugu bharavi prathibha vaibhavam - anilvaranasi/indianlanguages GitHub Wiki
. (రణ ॥ ర్త సాంారరరప్లై _. భోర5వ్ తలో వైటీజే . . | న్ 62 + సంపాదకుడు స్ట ] . డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు . 1 + స సహజ కవి మల్లెమాల (1 ౯ ౩ + మనసుపడి మక్కువతో సేకరించిన ] 11 “గ | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి _ 1 . ॥ ఆనందంతో బహూకరిస్తున్నాం. ్ నే ళీ - మల్లెమాల కుటుంబం | |. నెం సంస్కృతభాషా ప్రచార సమితి సన్ గ హైదరాబాదు తమ్
రజతోత్సవ[గ్రంథమాల = నవమకుసుమం శ్రీః భారవి ప్రతిభా వైభవం సంపాదకులు పుల్లెల శ్రీరామచంద్రుడు శ్రీ పెంద్యాల శంకర శర్మ ఉపన్యాసకులు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల ధర్మపురి సె గ్ర) సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004
ఇప ఉట
మా బ్లో వం భారవి ప్రతిభా వెభవం ప్రథమముద్రణ : 2004 ప్రకాశకులు : సంస్కృతభాషా ప్రచార సమితి 5-4-749స్పి ధి నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, ॥ ॥ న హైదరాబాద్ - 500” 1. (౮/ అక్షరాల కూర్చు వ ను సమంత గ్రాఫిక్స్ రో కకష గు బేగంపేట, జో + 9% ర్త! ల హైదరాబాద్-500 016. వ డు ముద్రణ : శ్రీకళాంజలి గ్రాఫిక్స్ విఠల్వాడి, హైదరాబాదు = 500 029,
3 శ్రీః తొలిపలుకు
వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి ==దరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్థులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.
సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషా(శ్రద్ధాలువులనుంది ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.
ఈ సంవత్సరంలో (2008-2094 రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషమఖులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలకు పరిచయం చేసే ఇరవైయైదు లఘు (గ్రంథాలనేవ్రాయించి ప్రచురిస్తోన్లుటే. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్త్విజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు.
ఈ రజతోత్సవగ్రంథమాలానవమకుసుమంగా శ్రీ పెంద్యాల శంకరశర్మ గారు రచించిన భారవి ప్రతిభా వైభవం ను ప్రచురిస్తున్నాము. దీనిని సంస్కృతాభి మాను లందరూ ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్. కులపతి
డీ సంస్కృతభాషా ప్రచారసమితి హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు 1 త్రీ జి. పుల్గారెడ్డిగారు, అధ్యక్షుడు 2 మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి త డా. కే. రాజన్నశాస్రిగారు, ఉపకులపతి & శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5... శ్రీ పి. రామకృష్ణగారు, సభ్యుడు 6. శ్రీ ఆర్.రామానుజాచారిగారు, సభ్యుడు గా శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు & శ్రీ బి.యన్.రెడ్డిగారు, సభ్యుడు 9. శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. శ్రీ ఆర్.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీవై నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12 శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు
శ్రీః భారవి ప్రతిభా వైభవం సంస్కృత సాహితీ వియదంతరాళంలో మహాకవి కాళిదాస -అశ్వఘోషుల తర్వాత మహాకవి భారవి సూర్యుని వలె అవతరించినాడు. సూర్యతేజస్సు వలె
ఈ మహాకవికి గల అనన్య సామాన్య ప్రతిభా వైదుష్యములను జూచి
శ్లో “ప్రకాశం సర్వతో దివ్యం, విదధానా సతాం ముదే । ప్రబోధనపరా హృద్యా, భా రవేరివ భారవేః ॥ (క్షేమేంద్రుడు)
అని సాహితీలోకము ్రశంసించినది.
భారవి కాలనిర్ణయము ఈ మహాకవి కాలనిర్ణయ విషయమున సంస్కృత సాహితీ విమర్శకులలో భిన్నాభిప్రాయములు కలవు. కొన్ని ఉపపత్తుల నిట పరికింతుము :-
-
భారవి రచనలో చాలా చోట్ల కాళిదాస రచనా సరళి కనిపించడం వల్ల ఈ మహాకవి కాళిదాసు తర్వాత వాడని తెలియుచున్నది.
-
భారవి రచనా ప్రభావము మాఘునిపై సంపూర్ణంగా పడడం వలన శ్రీ.శ. 700 కంటే భారవి పూర్వుడని చెప్పవచ్చు.
-
క్రీ.శ. 684 రెండవ పులకేశి నాటిదైన “ఐహోలొ తామ శాసన ఫలకంలో “కవితాశ్రిత కాళిదాస భారవి కీర్తి” అని కాళిదాసుతో పాటు భారవి ప్రసక్తి కలదు.
4 అవంతి సుందరీ కథానుశీలనం వలన ఈ మహాకవి ఆంధ్రదేశంలోని వేం గి క్షేత్రమును పరిపాలించిన తూర్పు చాళుక్య వంశోదృవుడదైన ద్వితీయ పులకేశి విష్ణువర్ధన రాజసభా పండితమండలిలో మూర్ధ్థన్యుడని తెలియుచున్నది. “యతః కౌశికకుమారో (దామోదరః) మవాశైవం మహాప్రభావం గవాం ప్రభావం ప్రదీప్తమాసం భారవిం రవిమివ ఇందురివ అనురుధ్య దర్శ ఇవ పుణ్యకర్మణి విష్ణువర్ధనాఖ్యే రాజసూనౌ ప్రణయ మన్వబదధ్నాత్”. కనుక భారవి క్రీ.శ. 6వ శతాబ్దం ఉత్తరార్థంలో నివసించి నట్లుగా చెప్పవచ్చు.
6 భారవి (ప్రతిభా వైభవం 5. క్రీ.శ 675-600 మధ్యకాలం వాడైన పల్లవరాజు సింహవిష్ణువు ఆస్థానంలో భారవి చాలాకాలం ఉన్నట్లు కొంద రూహించుచున్నారు. 6. ఇంకను “తావద్భా భారవేర్భాతి యావన్నాఘస్య నోదయళొ ఇత్యాది నైషధ ప్రశస్తి శ్లోకంలో భారవి-మాఘ కవుల పేర్లుండడం వలన కొంత మంది విమర్శకులు ఈ కవు లిరువురు సమకాలికులుగా ఊహించుచున్నారు గాని అంత ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే మాఘకవికి పూర్వం రచించిన (గ్రంథాలలో కూడ భారవి రచించిన సుభాషితము కనిపించుచున్నది. కనుక అంతకు ముందే భారవి ఆవిర్భవించినాడని వ్యక్తమగుచున్నది. 7. క్రీశ. 698 సమయం నాటిదైన దక్షిణ భారతదేశ రాజు పృథివీ కోంకణుని దానపత్రంలోనిదైన “శ్రీమత్కోంకణ మహారాజాధిరాజస్య అవినీతనామ్నః పుత్రేణ ..... కిరాతార్దునీయ పంచదశ సర్గ టీకాకారేణ దుర్వినీత నామధేయేన” ఇత్యాది వచనముల వలన రాజు దుర్వినీతుడు కిరాతార్డునీయ మహాకావ్యములోని పంచదశసర్గకు టీక రచించినాడని తెలియుచున్నది. కనుక ఈ మహాకవి క్రీ.శ 6వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించి యుండునని ఊహించవచ్చు. కౌశికగోత్రోద్భవుడైన నారాయణస్వామి పుత్రుడు దామోదరుడు (భారవి), ఈతని దేశ విషయములో కూడ భిన్నాభిప్రాయములు కలవు. ఉత్తర దేశీయుడని, దాక్షిణాత్యుడని ఈ కవి గురించి విమర్శకు లూహించుచున్నారు.
ఉత్తరహిందూదేశంలో వాయవ్యభాగంలోనిదైన “ఆనందపురం” ఇతని పితామహాదుల నివాసము. ఆ తర్వాత ఇతని తండ్రి మహారాష్ట్రలోని నాసిక్ పురమునకు వచ్చినాదని తెలియుచున్నది.
శ్లో॥ “ఉరసి శూలభృతః ప్రహితా ముహుః ప్రతిహతిం యయు రర్జునముష్టయః । భృశరయా ఇవ సహ్యమహీభృతః పృథుని రోధసి సింధుమహోర్మయః!! (కిరా.18-5)
అను కిరాతార్డునీయశ్లోకము నాధారముగా జేసికొని, విమర్శకులు కొందరు
భారవి ప్రతిభా వైభవం 7 మహాకవి భారవి మహారాష్ట్రీయుదని, సహ్యాద్రియే కవి నివాసస్థల మని ఊహించుచున్నారు కాని ఈ విషయంలో విప్రతిపత్తి గలదు.
మరియు ఇతడు కిరాతార్జునీయం ప్రతిసర్గ చివరలో “లక్ష్మీ శబ్దము వాడడం వలన లక్ష్మీభక్తుడని, కొల్హాపురప్రాంతం వాడని తెలియుచున్నది. అంతేగాక ఇతడు కావ్యంలో వేరే స్థలంలో కూడ “లక్ష్మీ శబ్దమును ప్రయోగించినాడు.
మరియు ఉజ్జయినిలో కవుల పరీక్ష జరిగినప్పుడు దానిలో భారవి కూడ ఉన్నట్లు ---
“శ్రూయతే చ ఉజ్జయిన్యాం కావ్యపరీక్షా ---- శ్లో ఇహ కాళిదాసమేంఠా వత్రామర రూప సూర భారవయః!
హరిచంద్ర చంద్రగుప్తా పరీక్షితావిహ విశాలాయమ్!! ఈ శ్లోకం ద్వారా తెలియుచున్నది.
విష్ణువర్ధనరాజసభలో ఈ కవి ఉండడంవలన ఆంధ్రదేశవానిగా చెప్పవచ్చును. శివుడు మల్లరూపంలో అర్జునున్ని పరీక్షించిన కథ ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నది. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేశాడని ఐతిహ్యం. పూర్వకాలం ఆంధ్రదేశంలో “మల్లేశ్వర” మనే ఒక క్షేత్రముండేది. శ్రీశైలంలో వెలసిన శివుడు మల్లేశ్వరుడు. ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రచారంలో ఉన్న మహాభారతప్రసిద్ధమైన ఈ వృత్తాంతాన్ని భారవి తన కావ్యేతివృత్తంగా స్వీకరించినాడు. దీనివలన ఈ మహాకవి ఆంధ్రదేశీయుడుగా తప్పక చెప్పవచ్చును.
భారవి బాల్యము
భారవిమహాకవి బాల్యమందలి వాస్తవికనామము “దామోదరుడు”. “భారవి” అనే పేరు ఇతని పాండిత్యమునకు సంకేతమని, ఈ “పేరుతోనే జగత్ర్రసిద్ధు డయ్యెనని తెలియుచున్నది. భారవి బాల్యముననే సకలశాస్తసంపన్నుడు, అతిగంభీర ధీరస్వభావుడు, మహా మేధావి, జన్మజాతకవి. ఇతడు తండ్రి వెంట నుండి రాజసభలలో, పండితగోష్టులలో, శాస్త్రచర్చలలో పాల్గొని, తనకు గల అపారమైన పాండిత్యమును ప్రదర్శించుచు విద్వజ్ఞనప్రశంసాపాత్రు డయ్యెను. కాని తన
8 భారవి ప్రతిభా వైభవం తండ్రి (ప్రవరుడు) ఎహగు కూడ తన ప్రతిభాశక్తులను గుర్తించలేకున్నాడని ఒకనాడు భారవి “పండితు లందరు మెచ్చుకొనునట్లు నా పాండిత్యమును ప్రదర్శించుచున్నాను. కాని తండ్రిగారు నన్ను ఎల్లప్పుడు తిరస్మరించు చున్నారు” అని కలతచెందిన మనస్సు కలవాడై తల్లికి తన వృత్తాంతమును విన్నవించుకున్నాడు. కుమారునిపై.[్రేమతో నున్న తల్లి అది భర్తకు వినిపించినపుడు “గీర్భిర్దురూణాం పరుషాక్షరాఖిః, సుశిక్షితా యాన్తి నరా మహత్త్వ” -- మని, "పెద్దలు చిన్నపిల్లలను కఠినమైన వాక్యములతోనే మందలించవలయును. వానిచే పిల్లలు సుశిక్షితులై మహత్త్వము నందగులుగుదురు. కనుకనే నేనట్లు మందలించితిని. పుత్రుని సర్వగుణ డ్రేష్టనిగ చూడవలయునని తలంపే గాని, వేరు గాదని” తండ్రి పలికినాడు. తండ్రి పలికిన ఆ మాటలను విని భారవి చాల సంతోషించినాడు. పితృపాదుల యెడ తనకు కలిగిన దురభిప్రాయమునకు శిక్ష విధించుమని తండ్రిని బ్రతిమాలినాడు. దానికి తండ్రి శ్వశురగ్భహనివాసరూప ప్రాయశ్చిత్తము విధించగా, శ్వశురగృహముననుండి వనమున పశువుల కాపరియై సంచరించుచుండెను. ఆ వనములో సంచరిస్తూ “కిరాతార్డునీయ” మనే మహా కావ్యమును రచించినాడని ఊహించబడుచున్నది. ఒకనా డీ మహాకవి యిల్లాలు తానొక వ్రత మొనర్చు ప్రయత్నమున భర్తను ధన మడుగగా తన కావ్యమందలి పద్యము వ్రాసి యిచ్చి, యే వర్తకుని దగ్గరనైనా దీనిని కుదువబెట్టి, ధనమును స్వీకరించుమని చెప్పెనట. అట్లే ఆ యిల్లాలు ఆ శ్లోకమును (“సహసా విదధీత న క్రియామ్” - ఇత్యాదిశ్లోకమును) గ్రామమందలి రత్నాల వ్యాపారికి ఇచ్చి, ధనమును (గ్రహించి, వ్రతసమాప్తి చేసుకొనెనట. అట్టి శ్లోకమే తదనంతరము వ్యాపారి కుటుంబమునకు శ్రీరామరక్ష యగుటే కాక ఈ మహాకవికిని ధనప్రాప్తిహేతువైనదనియు ఒక “కింవదన్తి” లోకప్రచారముననున్నది. కిరాతార్డునీయము మహాకవి భారవి “కిరాతార్డునీయ” మను మహా[ప్రబంధమును రచించినాడు. ఏక్రైకరచనగా ఇది కనిపిస్తున్నది. ఈ కావ్యంలో అష్టాదశసర్గలు
భారవి ప్రతిభా వైభవం 9 కలవు. ఈ మహాకావ్యంలోని కథావస్తువు మహాభారతంలోని కిరాతపర్వం (వనపర్వము) లోని 38, 39, 40, &1 అధ్యాయముల నుండి స్వీకరించబడినది. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన ఘట్టం శివపురాణం జ్ఞానసంహితలో 63,64,65,66,67 అధ్యాయములలో కలదు.
జూదంలో ఓడిన యుధిష్టిరుడు సోదరులతో కూడ ద్వైతవనంలో ఉండును. దుర్యోధనుని రాజ్యపరిపాలనావిధానాన్ని తెలుసుకొనేందుకు ఒక వనేచరుని పంపించును. అతడు తిరిగివచ్చి దుర్యోధన రాజ్యపరిపాలన విధానమును గూర్చి వివరించును. ఆ తరువాత యుధిష్టిర-భీమ-ద్రాపదుల సంభాష్క కలవు. భీమ- ద్రౌాపదులు యుధిస్టిరున్ని యుద్దానికి సమాయత్తపరుస్తారు. యుద్ధం చేయడానికి అతడు నిరాకరించును. ఇంతలో వేదవ్యాసుడు అక్కడికి వచ్చి అర్జునున్ని ఇంద్రకీలపర్వతం మీద ఇంద్రునిగూర్చి తపస్సు చేయమని సలహా ఇచ్చును. ఆ రకంగా అర్జునుడు తపస్సు చేస్తుండగా దేవతాస్తీలు తపోభంగం చేయడానికి ప్రయత్నంచి విఫలులౌతారు. వృద్ధముని వేషధారియైన ఇంద్రుడు స్వయంగా వచ్చి ఇంకను స్థిరమైన మనస్సుతో శివుని గూర్చి తపస్సు చేయమని చెప్పును. ఆ రకంగా తపస్సు చేస్తుండగా, అర్జునున్ని పరీక్షించడానికి శివుడు కిరాతవేషధారియై వచ్చి, మాయాసూకరాన్ని అర్జునునిని పైకి పంపును. తనను రక్షించుకొనే ప్రయత్నంలో ఆ సూకరాన్ని బాణం వేసి అర్జునుడు చంపును. వెంటనే కిరాతుడు జాణంవేసి దానిని కూల్చును. ఆ తరువాత కిరాతార్డునుల ద్వంద్వయుద్ధం జరుగును. అర్జునుని బలపరాక్రమాలకు కిరాతవేషధారియైన శివుడు సంతోషించి పాశు పతాస్త్రమును అతనికి ఇచ్చును.
ఈ స్వల్పకథను గ్రహించి, స్వతంత్రభావములతో, నాటకీయసంభాషణా రీతితో, మార్పులు చేర్పులతో, నూతనపాత్ర సృష్టితో, “నగరార్జవ శైలర్తు చంద్రార్కో దయా” ది వర్ణనలే కాక, కథానుకూలముగా దుర్యోధన రాజ్య పరిపాలనా పద్ధతి, ద్రౌపదీవాక్యములు, భీమసేనుని గర్జనము, యుధిష్టిరుని నీతియుక్త వచనములు, వర్ణన-పుష్పాపచయ-జలక్రీడాది అష్టాదశవర్ణనలతో, కల్పనలతో గంభీరభావములతో “కిరాతార్జునీయ” మహాప్రబంధమును తీర్చిదిద్దినాడు భారవి మహాకవి.
10 భారవి ప్రతిభా వైభవం కావ్య ప్రథమసర్గలో యుధిష్టిరుని గూర్చి వనేచరోక్తులు, చతుర్ధసర్గలో శరదృతువర్ణన, పంచమసర్దలో హిమాలయవర్ణ్దన, షష్ట సర్షలో అప్సరసల ప్రయాణము, అష్టమసర్గ్దలో సురాంగనల విహారము, నవమసర్గలో సురస్త్రీల సంభోగము, త్రయోదశ - చతుర్దశ సర్గ్ణలలో వనేచర- అర్జున సంవాదము, కిరాతసైన్యంతో అర్జునుని యుద్ధము, కావ్యంలో వర్ణించిన వ్యాసమహర్షినుండి అర్జునుని విద్యాగ్రహణము, యక్షున్ని సహాయముగా చేసికొని హిమాలయమునకు ప్రయాణము మొదలైనవి కవికల్పితములు. కిరాతార్డునీయ ప్రతిసర్గ కథాంశములు ప్రథమసర్గ కథ ధర్మరాజును గూర్చి వనేచరుని మాటలు : ధర్మరాజు తన తమ్ములతో మరియు భార్యయగు (ద్రౌపదితో కలిసి
ద్వైతవనమందు నివసిస్తుండగా ఒక వనేచరుడు బ్రహ్మచారి వేషముతో దుర్యోధనుని యొక్క పంపున వచ్చెను. “ఓ మహారాజా! ఈ సమయమున దుర్యోధనుడు చక్కగా రాజ్యపరిపాలన చేస్తుందెను. కపటజూదములో తాను గెలిచిన పృథివిని నీతితో తన కైవసము చేసుకొనుటకై ఆలోచించుచుందెను. అందరితో చక్కగా వ్యవహరిస్తూ, సమయానుకూలముగా ధర్మార్థకామములకు సంబంధించిన కార్యములను చేయుచుండెను. సామ-దాన-దండ-భేదములను సముచిత స్థానమున ప్రయోగించు చుండెను. తన రాజ్యములో మంచినీటి వ్యవస్థ చేయుచుండెను. వ్యవసాయవిషయమై కర్షకులపైన నిర్భరముగా నుండుట లేదు. ఇతరరాజులు కూడ (ప్రేమతో అతని ఆదేశమును మన్నించుచుండిరి. సమయాను కూలముగా కప్పము గట్టుచుండిరి. ఏనుగులను, గుజ్బములను బహుమానముగా ఇచ్చుచుండిరి. ఈ విధముగా అతడు దినదినాభివృద్ధి చెందు చుండెను. అయినను అతడు మిమ్ములను శత్రువులుగా భావించుచుందడెను. ఇట్టి సమయమున అతని యొక్క ఈ సమాచారమును తెలిసికొని తమరు కూడ అతనిపై సముచితముగా ప్రతీకారము చేయవలెను. “ఈ విధంగా తెలియజేయగా ధర్మరాజు ఆ వనేచరునికి పురస్కారము నందించగా అతడు వెళ్ళిపోయెను. ధర్మరాజు కూడ ఈ 1మాచారమును (ద్రౌపది మరియు తమ్ములకు తెలియజేసెను.
భారవి ప్రతిభా వైభవం [11 ధర్మరాజుతో ద్రౌపది మాటలు :
మహారాజా! మీలాంటి వ్యక్తులకు ప్రీలయొక్క శాసనము అపమానముగా ద్యోతకమగును. అయినప్పటికి మనోవ్యథను దూరము చేసే కొరకు నామాటలు ఆవశ్యకములు. సమస్త సాధనములున్న కులాభిమాని యగు నన్ను విడిచిపెట్టి ఎవరుండగలరు? ఏలయనగా కులాచారముగా వస్తున్న రాజ్యలక్ష్మి సాధారణ ప్రీవలె మీ దగ్గర నుండి అపహరింపబడినది. ఏ భీముడైతే రక్తచందనమును పూసుకొని రథము మీద ప్రయాణము చేసెనో, అతడీనాడు అడవిలో ధూళి-దుమారము సోకగా పాదచారియై నడుచుచున్నాడు. ఎవరైతే ఉత్తర-కురు రాజులను జయించి, వారి ధనమును తీసుకవచ్చి, తమ కర్పించాడో ఆ అర్జునుడిపుడు అడవిలో వల్కల ధారియై చరించుచున్నాడు. అత్యంత సుకుమారులగు నకుల సహదేవులు అడవిలో వనుగుల వలె తిరుగుచున్నారు. ఈలాంటి దశలో తమరు ధైర్యమును, సంతోషమును వదలక ఉన్నారు. అత్యాశ్చర్యము. అనేకమంది బ్రాహ్మణులకు తమరు భోజనమునిచ్చు చుందేవారు. సుందరమైన శయ్య యందు నిద్రించేవారు. వంధిమాగధుల యొక్క సుప్రభాతములచే మేల్మొనేవారు. అలాంటి మీరు ప్రస్తుతము ఈ వనములో భూమి మీద పడుకొని నక్కల యొక్క ధ్వనులచే మేల్కొనుచున్నాము. నాకు మీయొక్క ఈ దశ చూడగా ఎంతో దుఃఖము కల్గుచున్నది. మహారాజా! కావున మీరు శాంతిని విడిచిపెట్టి ధైర్యముతో మునీశ్వరులయొక్క సిద్ధులతో కేవలం మునులవలె జీవితమును ధరించుటకు కోరుచున్నారు. కావున రాజలాంఛనమగు ధనుస్సును వదిలిపెట్టండి. జడలను ధరించి మునులవలె హవనము చేయండి. ఓ సామర్ధ్యము గల ధర్మరాజా! తమరు వనవాసము యొక్క వ్యవధిని ఎదురు చూడకండి. విజయము కోరు రాజు కపటముచే సంధిని గూడ దూషించును.
ద్వితీయసర్గ కథ
ధర్మరాజుతో భీముని యొక్క మాటలు :
ఈ ప్రకారముగా తన కిష్టమైన ద్రౌపది యొక్కమాటలు విని భీమసేనుడు యుక్తియుక్తముగ పలుకుచున్నాడు. ఓ మహారాజా! ద్రౌపది చెప్పిన మాటలు
12 భారవి ప్రతిభా వైభవం బృహస్పతికి కూడ ఆశ్చర్యమును కలిగించడంలో సందేహములేదు. వీటిని తమరు ఆమోదించవలెను. ఏలయన విద్వాంసులు గుణముల యొక్క పక్షమునే వహింతురు కాని వక్తయొక్క ఉచిత వాక్యములపై ధ్యానముంచరు. చారులు విద్యావేత్తలైనప్పటికి తమరు కర్తవ్యనిర్ధారణలో భ్రమపడవద్దు. దేవతలకు కూడ 'ప్రశంసనీయమైన తమ పరాక్రమము ఈ సమయమున నష్టమైనదే! శత్రువుల ద్వారా ఘటించిన ఈ దుర్దశ అనుభవించవలసి వచ్చె గదా! శత్రువుల యొక్క నిరంతర ఉన్నతిని చూసి ఉపేక్షించ గూడదు. అయినప్పటికి ప్రస్తుతం మనము క్షీణదశలో ఉన్నప్పటికి రాబోయే కాలమున పరాక్రమము చూపించవలసి వచ్చును. ఆ సమయమున మన ఉత్సాహమును చూసి అందరు సహకారమును చూపించెదరు. మీ ఆలోచన దోషాస్పదమైనది. ఎందుకన వనవాస వ్యవధి గడిచిన తర్వాత దుర్యోధనుడు స్వయముగా మన రాజ్యము మనకు ఇవ్వడు. కావున ఈ ఆలస్యము విడిచిపెట్టుము. నిశ్చయించుకొనుము. శత్రువుల వలన వచ్చిన విపత్తులు ఉత్సాహమును నష్టపరుచును. మీ తమ్ములను ఎదిరించగలవారు శత్రువులలో ఎవడున్నాడు. నీవు ఇదేవిధంగా కూర్చుంటే మానవత్వము కూడా వ్యర్థమగును. భీమసేనుని యొక్క మాటలకు ధర్మరాజు సమాధానము :
భీమసేనా! నీవు యుక్తియుక్తముగా మరియు శాస్త్ర సమ్మతముగా ఏ మాటలనైతే పలికితివో అవి సమయోచితమైనవే! అయినప్పటికి నా మనస్సు దానిపై విచారపూర్వకముగా నిర్ణయము తీసుకొనును. కార్యాచరణపై విశేష జ్ఞానము సాధారణమైనది కాదు. మనము సభలో వనవాసము యొక్క వ్యవధిని స్వీకరించియే ఇచటికి ఏతెంచితిమి. వ్యవధి తర్వాత సమస్త రాజులు మన పక్షమునే వహింతురు. వ్యవధి గడవక ముందు మనము ఆక్రమణము చేసినచో ఆయా రాజులు కూడ మనకు దూరమగుదురు. కావున క్రోధమును జయించి, నీతి పూర్వకముగా కార్యమును సాధించవలెను. దీనివలన సమస్త యదువంశము మరియు మిత్రరాజులు మనపై (ప్రేమజూపుదురు. సమయానుకూలమున మన పక్షము చేరుదురు. దుర్యోధనుని యొక్క కఠిన వ్యవహారముపై శత్రురాజులు అతనికి దూరమగుదురు. ఈ ప్రకారముగా ఎదురుతిరిగిన మదోన్మత్త వనుగు
భారవి ప్రతిభా వైభవం 13 వలె భీమసేనున్ని ధర్మరాజు శాంతిపరచెను. అదే సమయమున వేదవ్యాస మహర్షి ఆకస్మికముగా అచటికి ఏతెంచెను. అతనిని చూసి అందరు అకస్మాత్తుగా లేచి నమస్కరించి స్వాగతమిచ్చిరి. మరియు అతనిని సముచితాసనముపై కూర్చోబెట్టి ఆజ్ఞానుసారముగా స్వయముగా అందరు కూర్చుండిరి.
తృతీయసర్గ కథ ధర్మరాజు మరియు అర్జునునితో వ్యాసుని యొక్క మాటలు :
ఆ తరువాత ధర్మరాజు వ్యాసునితో ఇట్లనెను.
ఓ మునీశ్వరా! మీ రాకచే నేను చాలా సంతోషించితిని. మీలాంటి నిస్పృహ కలవారిని అడగడం వృథా. అయినప్పటికి కళ్యాణకారకములైన మీ మాటలను వినగోరుచున్నాను. అప్పుడు వ్యాసుడిట్లనెను.
ఓ మహారాజా! పరాక్రమము చేతనే తమరు తమ రాజ్యాన్ని సాధించ వలయును. వలయన శత్రుపక్షం చాలా బలవంతమైనది. వారి దగ్గర పరాక్రమము, శస్తము మరియు సేన అత్యధికముగా కలదు. కావున ఉపాయము నాలోచించ వలయును. ఎందుకన యుద్ధములో విజయము అనునది ముఖ్యము. తన శిష్యుడైన భీష్మునిచే పరశురాముడు పరాజితు డాయెను. సామాన్య గుణము కూడ పొత్రతను అనుసరించి ప్రభావము నెక్కువగా చూపును. భీష్ముని ప్రభావముచే తానిచ్చిన విద్యయే ప్రబలమైనదని పరశురామునికి బోధపడెను. స్వేచ్భామృత్యువు గల భీష్మపితామహుడు మరియు ద్రోణాచార్యులు, కర్టుడు శత్రుపక్షమున గలరు. వారిని జయించడము మహా కఠినము. కావున నేనాక ఉపాయమును చెప్పెదను. అర్జునుడు దేవేంద్రుని ద్వారా దివ్యాస్త్రములను పొందినట్టైతే శత్రువీరులను ఓడించగలరు. అర్జునునికి తపస్సు ద్వారానే ఈ స్థానము లభించగలదు. ఈ విధముగా వ్యాసుడు చెప్పి అంతర్జాన మాయెను. అదే స్థానమున ఒక యక్షుడు నిల్చిపోయెను. అర్జునుని గూర్చి ద్రౌపది మాటలు :
తపస్సు కొరకై వెళ్ళుతున్న అర్జునునితో ద్రౌపది ఇట్లనెను. తమరు తపస్సు చేయు సమయమున ఉదాసీనత వహించవద్దు. ఎందుకన తపస్సు లేనిచో ఏ
14 భారవి ప్రతిభా వైభవం కార్యము కూడ సిద్ధించదు. మానధనులకు మానవాని ప్రాణహానితో సమానమైనది. శత్రువులపై విజయము సాధంచడమనునది కేవలం బలముపై ఆధారపడి యున్నది. శత్రువులు మనలను అవమానపరిచినారు. వాటిని విస్మరించకూడదు. నీవు తప్ప ఆ అవమానమును తీసివేయుటకు ఎవరును సమర్థులు కారు. ఏకాంతమునం దున్నప్పటికి ఆత్మరక్షణకై జాగ్రత్త పడవలెను. తపస్సుకు వెళ్ళుతున్న మీకు ఇంద్రుడు అన్ని సంకటములను దూరము చేయగలడు. తపస్సు నుండి తిరిగివచ్చిన తరువాత నేను మిమ్ములను కలుసుకొనగలను.
ద్రౌపది యొక్క ఈ మాటలను విని అర్జునుడు, వెంటనే యక్షుడు చూపించిన మార్గమున హిమాచలము దిక్కు ప్రయాణమాయెను.
అనగా శత్రువులే ముందర కనిపించుచుండెను.
చతుర్ధసర్గ కథ
శరత్కాల వర్ణనము :
తన ప్రయాణములో అర్జునుడు గ్రామసీమల్లో శరదృతువు యొక్క శోభను చూచుచుండెను. మార్గములో భూమిపై గల బురద శుష్కించెను, నదుల్లో నీళ్ళు నిర్మలమాయెను. తటాకముల యందు కమలములు వికసించెను. కమలముల యొక్క పరాగముచే గోపికలు ధ్యానముచే నుదుట తిలమును దిద్దుకొనుచుండిరి. నదీతీరములయందు ఇసుక తిన్నెలు శోభాయమానముగ నుండెను. లేగల యందలి (ప్రేమచే ఆవులయొక్క స్తనములనుండి పయోధార ప్రవహించుచుండెను. ఈలాంటి శరదృతుశోభను చూచి అర్జునునితో యక్షు డిట్లనెను. యక్షుడు వర్ణించిన శరద్వర్ణన :
అర్జునా! ఈ శరదృతువు ఎంతో సుందరముగా కనిపించుచున్నది. ఆకాశ మందలి మేఘములు దూరమగుటచే నిర్మలముగా గోచరించుచున్నది. నదీ జలములు గూడ స్వచ్చమాయెను. ఇప్పుడు పక్షులయొక్క పంక్తులు ఆకాశమునందు ఎగరడము లేదు. మేఘగర్జ్దన లేకపోవడంచే మయూరములయొక్క కేకాశబ్దములు గూడ వినిపించడంలేదు. గోపికలయొక్క మధురగానములను
భారవి ప్రతిభా వైభవం 15 వినడముచే తల్లీనములై ఆకలిగొన్నప్పటికీ గడ్డిని మేయడము లేదు. ఆకుల యొక్క పచ్చదనము, కమలములయొక్క ఎర్రదనము ఈ రెండు ఇంద్రధనుష్నల యొక్క శోభను చూచుచున్నవి. పక్షులు ధాన్యములను తీసుకవచ్చి తమ పిల్లల యొక్క చంచువులతో సమర్పించు చున్నవి.
ఈ విధముగా యక్షుడు శరత్కాలమును వర్ణించి హిమముచే నిండిన శిఖరము గల హిమాలయమును దూరము నుండియే చూపించెను.
పంచమసర్గ కథ కవికృత హిమాలయ వర్ణనము
ఇంద్రకీల పర్వతము వైపు నడుస్తూ అర్జునుడు హిమాలయము యొక్క శోభను చూచెను. అత్యున్నతమైన హిమాలయము యొక్క ఒక భాగము సూర్య కిరణములచే (ప్రకాశించుచుండెను. రెండవ భాగము అంధకారముచే నిండి యుండెను. ఈ పొమాలయశిఖరముపై దేవతలు మధ్యభాగమున, అంతరిక్షమున సంచరించువారు. నిమ్నభాగమున భూలోకవాసులు అదృ్భశ్యరూపమున నివసించు చుండిరి. ఈ హిమాలయవనములయందు దేవతాస్రీలు విహరించుచుండిరి. అందుచే ఆ ఉపవనములు శోభాయమానముగ నుండెను. వీటి శిరములయందు అనేకరత్నములు కలవు. రాథత్రివళల యందు మహౌషధులు అగ్నివలె (ప్రకాశించుచుందెను. ఈ హిమాలయముపైననే శంకరుడు పార్వతీదేవితో నివసించుచుండెను. ఈ శిఖరములనుండి గంగ ప్రవహించుచున్నది. యక్షుడు వర్ణించిన హిమాలయము :
ఈ హిమాలయమును దర్శించినంత మాత్రమున మానవులయొక్క పాపములు దూరమగుచున్నవి. దీనియొక్క చివరి భాగము ఎవరికి గూడ కనిపించడము లేదు. ఇచ్చట బహుమూల్యములైన రత్నములు గలవు. ఇచ్చట తపస్సు చేసిన మునులకు దివ్యమైన (బ్రహ్మజ్ఞానము కలుగును. ఇచట రాత్రి యందు గూడ ఓషధులు ప్రకాశించుచుండును. ఇచట సర్పములకు ప్రియమైన సుధారసము కూడ కలదు. ఇచట మదపుటేనుగులు కలవు. ఇచట గల ఓషధుల కాంతికి చల్లని చందనపల్లవములచే శీతలసుగంధ మందమారుతముచే దేవతా
16 భారవి ప్రతిభా వైభవం ప్తీలు విహరించుచు, స్వర్గమును గూడ మరిచి ఇచ్చటనే నిలిచిపోయిరి. ఇచటనే శంకరుడు పార్వతీదేవిని పరిగ్రహించెను. ఏ మందరాచలముచే సముద్రమును మథించెనో ఆ పర్వతమిచ్చటనే కలదు. దీని తర్వాత కైలాసమును వర్ణిస్తూ యక్షుడు చెప్పిన మాటలు ధనేశ్వరుడగు కుబేరుడు శంకరుని దర్శనముకొరకు మరియు ప్రసన్నత కొరకు ఎత్తైన భవనములను నిర్మించెను. ఇచ్చటి గడ్డి ఎప్పుడు పచ్చగనే యుండును. కమలములు వికసించియే యుందును. చెట్లపై గల ఆకులు ఎప్పుడును పండవు. సంధ్యాకాలమునందు శంకరుడు (ప్రదక్షిణము చేయుచు నదీతటమున నాట్య మొనర్చుచుండగా ఆతని వామపాదముయొక్క చిహ్నములు గోచరించుచుండును. ఈ కైలాసశిఖరముపైన శంకరుని వాహనమైన నందీశ్వరుడు కలడు. చూడు అర్జునా! మీ తండ్రిగారైన ఇంద్రునియొక్క ఇంద్రకీలపర్వతము ఇచ్చటినుండి కనిపించుచున్నది. ఇచ్చట స్వర్ణమయమైన అనేక గనులు కలవు. సూర్యుని కిరణములచే ఆ గనులు మెరుపు తీగ వలె శోభించుచున్నని. యక్షుడు అర్జునునికి చేసిన ఉపదేశము అర్జునా! నీవు ఇచటనే కూర్చొని వేదవ్యాసముని ఆదేశానుసారముగా సావధానచిత్తుడవై శస్త్రములను ధరించి తపస్సు చేయుము. తమరు ఇంద్రియ రూపులైన గుజ్జములను గట్టిగా లాగి తపస్సు చేయుము. ఏలయన దీనిచే ఇంద్రియములు చెడ్డమార్గమున అడుగిడవు. ఈ క్లిష్ట పరిస్థితులలో భగవంతుడైన శంకరుడు నీకు ఉత్సాహమును రెట్టింపు చేయగలడు. లోకపాలకులు నీ తపస్సులో అభిరుచిని పెంచగలరు. దీనివలన నీ తపస్సు తప్పక ఫలించును. ఈ విధముగా చెప్పి యక్షుడు అంతర్జానమాయెను. షష్టసర్గ కథ ఇంద్రకీలపర్వతముపై అర్జునుని తపస్సు మరియు ఇంద్రుడు అర్జునుని తపస్సును పరీక్షించుటకై అప్సరసలను పంపించడం అర్జునుడు మనోహరదృశ్యములు గల గంగానదికి అభిముఖముగా నున్న ఇంద్రకీలపర్వతమును చేరెను. అచ్చట గల వృక్షములు అర్జునుని పైన
భారవి ప్రతిభా వైభవం 17 వందిమాగధుల వలె పుష్పవర్ణమును కురిపించెను. మరియు శీతల మంద మారుతము మిత్రుని వలె ఆలింగనమొనర్చెను. సారసపక్షులు, హంసలు తమ కలవరములచే, సెలయేరులయొక్క ధ్వనులచే అర్జునుని కెదురుగా మంగళవాద్య ములను (మోగించి, ఆనందమును చేకూర్చెను. తర్వాత అచ్చటి మనోహర దృశ్యములను జూచి అర్జునుడు గంగానదిలో కలియుచున్న అనేక చిన్న నదులను దాటెను. ఆ తరువాత పర్వతము నధిరోహించి, పుష్పభారములచే వంగుచున్న వృక్షములు గల శాంతిమయమైన పవిత్రవనభూమిని చేరెను. అచ్చటి మనోహర శాంతిమయ వాతావరణము అతని తపస్సునకు రెట్టింపు అభిరుచిని కలుగజేసెను. పూర్వజన్మమందు నరరూపములో నున్న అర్జునునికి అచటి దృశ్యము అతని తపస్సునకు కష్టదాయకముగా కనిపించలేదు. మైత్రి, కరుణ, సంతోషము మరియు చిత్తశుద్ధి ఇవి ఆకర్షింపబడినప్పటికి మనోవిక్షేస కారకములు కాలేదు. శాంతి, సుఖమయ అనుభవము అర్జునునికి ప్రతిదినము చంద్రుని వలె తపోమయ తేజస్సును పెంపొందించుచుండెను. వివేకముచే బుద్ధియొక్క దుర్గుణములను దూరము చేసి, శాంతిసుఖమును కలుగజేయుచుండెను. మానసజపము 'ప్రణామముచే ఇంద్రుని సమీపము చేరిన అర్జునుడు స్వాభావికముగ క్షత్రియ జాతికి సంబంధించిన తపోజన్యమైన శమమును వహించి, పవిత్రచరిత్రచే మునులకు గోచరించనటువంటి రజోగుణరహితుడై మృగములను కూడ సంతోషపెట్టెను. అతనియొక్క తహాప్రభావముచే చల్లని సుగంధమలయమారుతము వీచుచుండెను. ఆ యా కాలబుతుధర్మమును విడనాడి సూర్యకిరణములు అతనియెడ సుఖదాయకము లాయెను. పూలను తెంపు సమయమున వృక్షములు తమంతట తామే వంగుచుండెను. శయనకాలమున వసుంధరాదేవి కోమలమైన తృణములచే మెత్తగా మారెను. మేఘములు లేకపోయినప్పటికి ఆకాశమునుండి చిన్నచిన్న జలకణములు భూమిపై పడుచుండెను.
ఈ విధముగా తపస్సుయొక్క ఫలమును సూచించు అచ్చటి కుసుమము లను చూచి అర్జునుడు విస్మయము నందెను. కొద్దిరోజుల లోపలనే తన తపఃసిద్ధి కలుగునని భావించి, అచ్చటి వనచరులు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి అర్జునుని తపస్సుయొక్కసమాచారము తెలియజేసిరి. ఇంద్రుడు తన ప్రియపుత్రుడైన అర్జునుని
18 భారవి ప్రతిభా వైభవం యొక్క తపస్సమాచారము విని ప్రసన్నచిత్తుడై అతనిని పరీక్షింపగోరి అప్సరః
స్త్రీలతో నిట్లు పలికెను .....
అప్ప్స్పరసలారా! మీరు కామదేవునికి కోమలమైన అమోఘాస్త్రములాంటి
వారు. మీరు నిరీక్షణరూపాంజలులచే మునీశ్వరులయొక్క తపస్సును కూడ
భంగపరిచితిరి. మీయొక్క ప్రభావముచే స్వర్గము కూడ లోకులకు ఆకర్షణీ
యమాయెను. మీరు భయపడవలసిన అవసరము లేదు. విషయ సుఖమునకై
లోకులు తపస్సు చేయుచుందురు. మీరు నిర్భయముగా వెళ్ళి ఈ యర్జునుని
యొక్క తపస్సును భంగపరచండి, అని చెప్పగా ఇంద్రునియొక్క ఆజ్ఞ తీసుకొని
అప్ప్సరఃస్త్రీలు గంధర్వులతో కూడ అర్జునుని తపోభంగ మొనర్చుటకై బయలుదేరిరి.
వారియొక్క మనోహర యాత్రాజన్యమైన భావభంగిమములను చూచి అందరు
ముగ్గులైరి.
సప్తమసర్గ కథ గంధర్వులతో కూడ అప్సరఃస్త్రీలు స్వర్గమునుండి బయలుదేరి ఇంద్రకీల పర్వతము చేరుట స్వర్ణమునుండి బయలుదేరు సమయమున ఇంద్రుడు అప్సరసల రక్షణకై
రథములను, ఏనుగులను మరియు అనేకసేవకులను పంపెను. ఆ సమయమున అనేకవాద్యములు మైోగుచుందెను. వారి యాత్రాసమయమున అమంగళమును సూచించునట్టి జంరూమారుతము వీచుచుండెను. ఆ వాయుపరాగములచే వారి ముఖములు వాడిపోయెను. సూర్యకిరణములచే ఆకాశమున ధూళి వ్యాపించెను. స్వేదభిందువులచే పులకితములగు దేవతా స్రీలయొక్క శరీరము నందు ముత్యముల వలె భూషింపబడెను. సుకుమార అవయవములు గల అప్సరసలు సూర్యకిరణము లను సహింపజాలక ఆశ్చర్యచకితులైరి. మదపు టేనుగులు తమ స్వర్ణశ్యంఖలము లను తెంపుకొనెను. ఈ విధముగా అప్సరసల యొక్క సైన్యము ఆకాశగంగ సమీపమును చేరుకొనెను. ఆకాశగంగ యొక్క శీతలమందవాయువుచే వారి మార్గశ్రమ దూరమాయెను! నిర్జల మేఘముల యొక్క పరంపరలచే ఇంద్రధనుస్సు యొక్క భాగములు అచ్చటచ్చట వీడి పోయెను. ఈ విధముగా అర్జునుని తపస్సు
భారవి ప్రతిభా వైభవం 19 భంగ మొనర్చుటకై అనేక విధములుగా మాటలు గుప్పించుచు, గంధర్వులు ఇం(ద్రకీలపర్వతము దగ్గరికి చేరుకొనిరి. ఇంద్రకీలపర్వతముపై చేరిన దేవాంగనాసమూహము ఆకాశముపై నుండి వాలిన నదుల వలె శోభించుచుందెను. అచ్చటచ్చట గల మేఘములు గజపంక్తుల వలె శోభించుచుండెను. సెలయేరుల యొక్క ్రతిధ్వనులచే రథములయొక్క గంభీర ధ్వనులు వినబడకుందెను. గంధర్వులు గంగాసమీపమున గల మణులచే ప్రకాశితమగు ఉభయతటములు పుష్ప వ్యాప్తమై గోచరించుచుండెను. గంధర్వులు నిలిచిన ఆ ప్రదేశము సమస్త సంపదలకు ఫలరూపమై యుండెను. దేవతాస్త్రీలు విశ్రాంతికి యోగ్యమైన చందన ఛాయలను విడనాడిరి. వలయన ఆ వృక్షముల పైన విషసర్పములు గలవు. వృక్షములపైనుండి పడుతున్న మధుధారలు పర్వతము పైన వ్యాపించెను. (శ్రమజనితమైన నిద్రను విడనాడి ఏనుగులు యుద్ధభూమికి పరుగిడుచుండెను. (భ్రమరములు కూడ పుష్పములపై మకరందమును విడనాడి ఇటు నటు పరుగిడుచు శోభించుచుందెను. అష్టమసర్గ కథ
దేవతాస్తీలయొక్క వనవిహారము మరియు జలక్రీడావర్షనము
దేవతాస్త్రీలు గంధర్వులతో కలిసి మాయాకల్పితములైన సమస్తభోగ సాధనములను వనవిహారముకొరకు త్యాగ మొనర్చిరి. తమ తమ ప్రియులతో అరణ్యములో ప్రవేశించి, దేవతాస్ర్రీలు విద్యుల్లేఖ వలె ప్రకాశించుచుండిరి. పావక రంజితమైన, రక్తసిక్తమైన నఖకిరణములను బాహువల్లరులయందలి సుగంధము లను చూచి భ్రమరములు మోహించెను. ఆ సమయమున కామిని యగు ఒక గంధర్వస్త్రీని జూచి గంధర్వు డిట్లు పలికెను. హే మానిని! కల్పలత యొక్క అంశముచే ఉద్భవించిన ఈ ట్రమరావళి నీ కరసంచాలనముచే భయపడదు. ఒక సఖురాలు ప్రణయకోపము గల కామినితో నిట్లనెను. సఖి! క్రోధమును విడనాడుము. ప్రియుని అనుసరించుము. లేదా నీ మనసు పశ్చాత్తాపము నొందును. అని ఈ విధముగా పలికి సఖురాలిని ప్రోత్సహించెను. అచ్చట పుపష్పించిన వృక్షములు గల నదీతటమునందు పడుచున్న సెలయేరుల వలె జల
20 భారవి ప్రతిభా వైభవం కణములు గోచరించుచుందెను. ఒక కామినీస్తీ తాను తెంపబోయిన పూలను వదిలిపెట్టి ఉపకారము చేయు కోరికతో ప్రియునియొక్క చేతులలో నున్న పూలను (గ్రహించెను. ఒకానొక ప్రీ తన సవతియొక్కపిలుపుచే ప్రియుని షేరుతో పిలిచెను. మరియు కన్నీరు కార్చుచు కాలిగోరుతో భూమిని త్రవ్వుచుండెను. ప్రియునితో మాటలచే పులకితమైన స్తీ తన శరీరమునుండి జారుతున్న వస్త్రమును గూడ సవరించలేకపోయెను.
ఆ తరువాత సమస్త దేవాంగనలు గంధర్వులతో నదిలో ప్రవేశించి, జలక్రీడ నొనర్చిరి. ఆ దేవాంగనల విలాసచేష్టలచే రాజహంసలు దూరముగా వెడలిపోయెను. వారు నీటిలో ప్రవేశించగానే సారసపక్షులు పైకెగిరి పోయెను. మరియు నదీ తరంగము లుప్పొంగెను. నదీతటము నాక్రమించెను. స్రీలయొక్క వెంట్రుకలు ఇటు నటు చెదిరిపోయెను. పూలమాలికలు ముకుళితము లాయెను. శరీరమందలి చందనము లేచిపోయెను. వారియొక్క జలక్రీడచే నదీజలము కంపించెను. కమలవనమందలి భ్రమరములు దేవతాస్రీలయొక్క నేత్రములను కేశములను, ముఖములను జూచి దగ్గరికి వచ్చుచుండెను. ఒక స్త్రీ ప్రియుడు పంపిన (పేమలేఖను వస్త్రములో చుట్టి భమరముల కందించుచుండెను. కొందరు దేవతాస్త్రీలు తమ చేతులచే నదీజలమును కొట్టుచు మృదంగధ్వనిని అనుసరింప జేసిరి. అట్టి సమయమున తమ వక్షస్టలమును తాళములచే కొట్టుచు నృత్య మొనర్చుచుండిరి. ఆ ధ్వనికి నీటియందలి చేపలు పైకెగురుచుండెను. ఒక దేవాంగన అగాధమైన జలములో భయపడుచు తన ్రియున్ని ఆలింగన మొనర్చుకొనెన్స.
ఒకస్త్రీ తన ప్రియున్ని పట్టుకొని కామముచే తన సఖీకరమును పట్టుకొనెన్స, ఈ విధముగా జలక్రీడ సల్పుచున్న స్త్రీల నుదుట నదీజలము తన సంతోషమును తటముపైన వెదజల్లేను. నవమసర్గ కథ సంధ్యాకాలము, అంధకారము, చంద్రోదయము మరియు విలాసవర్దన క్రీడావినోదము సలుపుటకై దేవతాస్రీలు వస్త్రములను, ఆభరణములను ధరించి తమ ప్రియులవద్దకు వచ్చుచుండగా, సూర్యుడు అస్తాచలము పైన
భారవి ప్రతిభా వైభవం 21 పశ్చిమసాగరములో మునిగెను. సూర్యుడు తన కిరణములనే అంజలులతో కమలములయందలి మకరందమును పానము చేయుచు, భూమిపైన, తన ఎర్రని రక్తిమను వెదజల్లెను. దేవతాప్తీలు తమ ప్రియుణ్జి కలుసుకొనుటకై ప్రియుని సమీపమున కేతెంచుచుండిరి. తమ (ప్రేమను ప్రదర్శించుటకై వారు చేతులు జోడించుకొని శిరస్సు వంచి సంధ్యాకాల మైనదని సూచించుచుండిరి. సూర్యుని భయముచే గుహలయం దున్న అంధకారము నలుదిక్కులయందు వ్యాపించెను. గాధాంధకారముచే నిమ్నాన్నతములు కానరాకుండెను. సూర్యుడు అస్తమించుటచే సంపూర్ణవివేక మనునది తనంతట తానే లుప్తమాయెను. చక్రవాకపక్షులు తమ ప్రియుని కొరకు వార్తాలాపము చేయుచు సరోవరప్రాంతమున తిరుగుచుండెను. ఆ తరువాత చంద్రుడు స్వచ్చమైన కిరణములచే ఉదయపర్వతముపైన ప్రకాశించుచుండెను. ఆ సమయమున అంధకారము దుఃఖాన్ని వదులుతూ, నక్షత్రరాశులను ఓదార్చుచు ప్రకాశించుచుండెను. నల్లని ఆకాశముపైన చంద్ర కిరణములు సముద్రములో మునిగిన గంగాజలము వఠె శోభించుచుందెను. ఉదయించిన చంద్రకిరణములచే గాఢాంధకారము సిగ్గుపడిన నవవధువు వలె దూరముననే నిలిచిపోయెను. రాత్రివేళ నిశ్శబ్బమయవాతావరణములో మంద మారుతము వీచుచు వనవృక్షములను కంపింప జేయుచుండెను. రాజనీతి గల చతురునివలె మన్మథుడు చంద్రరూపమైన రజతకలశమును ధరించి, రాజ్యాఖి షేకమునకు సన్నద్ధమాయెనా? యన్నట్లు గోచరించుచుండెను. ఒకానొక కామినీస్త్రీ తన సఖురాలియొక్క అవహేళనచే కంపించుచు తన ప్రియుని సన్నిధి చేరెను.
ఈ విధముగా మద్యపానమదప్రభావముచే మౌనమును, సిగ్గును విడనాడి కామినీస్రీలు కాముకజనులతో కామక్రీడ నొనర్భ్చుచు తమ మనోరథములను సఫలమొనర్చుకొనిరి.
ఈ విధముగా ప్రణయపరాయణభోగాసక్తులైన గంధర్వులు తమ ప్రీలతో రాత్రి గడిపిరి. అట్టి సమయమున వందిమాగధులయొక్క మంగళగానముచే నిద్రను విడనాడి మేల్మొనిరి,
22 భారవి ప్రతిభా వైభవం దశమసర్గ కథ
అప్సరసలు అర్జునుని లోభపెట్టుట ఆ తరువాత చక్కగా అలంకరించుకొని అప్సరసలు తమ గుడారము నుండి బయలుదేరిరి. ఆ స్రీలు తమ శరీరభారముచే మందమందముగా నడుచుచుండగా వారి ఆభరణములయొక్క ధ్వని వనమంతటా ప్రతిధ్వనించెను. హంసలు, సారసపక్షులు కలవరముగా గుంజారవము చేయుచుండెను. మహా మునీశ్వరుడైన అర్జునునియొక్క తపఃప్రభావముచే తమ వైరభావమును విడనాడి వన్యమృగములు కలసి సంచరించుచుండెను. పుష్పములను కోయుచున్న గంధర్వ ప్రీలు తేజోహీనులైరి. వృక్షములయొక్క శాఖలు ఫలభారముచే క్రిందికి వంగు చుండెను. వీటిని చూసి అప్సరసలు చకితులైరి. చంద్రుని వలె నయన మనోహరము లైన పసుపురంగు గల జడలచే వేదికపైన గల అగ్నిహోత్రమువలె మునీశ్వరులు 'ప్రకాశించుచుండిరి. ముల్లోకములను రక్షించ సామర్ధ్యము గల అర్జునుని జూచి గంధర్వులు మరియు దేవాంగనలు తమ విజయముపై విచారించుచుండిం. అప్సరసలు అర్జునుని మోహింపజేయుటకై వచ్చి కామాసక్తులైరి. ఆ తరువాత గంధర్వులు తమ మాయాజాలముతో మనోహరముగా వాద్యములను మోగించు చుండిరి. ఆ సమయమున బుతువులన్నియు ఒకేసారి వ్యాపించెనా? యన్నట్లు గోచరించుచుండెను. మాలతీ పుష్పములను వికసింపజేయుచు మేఘములు వర్షించుచుండెను. వర్షర్తు కారణమున జీవకోటి కామాసక్త మాయెను, ఆడ కోకిలలు చిత్తమును రంజింపచేయుచు, నూతనస్వరములచే మధురముగా కూయుచుండెను. కదంబ వృక్షములనుండి వచ్చిన వాయువు మధురముగా మయూరములయొక్క ధ్వనిని అనుసరించుచుందడెను. ఆ తరువాత శరదృతువు ప్రకటితమాయెను. హంసల యొక్క శబ్దములచే కలియునట్లుగా మయూరములు కేకారవములు చేయుచుండెను. భ్రమరములు కదంబ, కేతకీపుష్పములను వదలి ఇటు నటు సంచరించుచుండెను. ఆ తరువాత ప్రియంగు, అవిరల పుష్పములతో సుగంధ వాయువు తుషారకణములను చల్లుచు వీచుచుండెను. లవంగలతా కుసుమములు మందవాయువుతో కలిసి వీచుచున్నప్పటికి అర్జునుని మనస్సు చలించలేదు. ఆ తరువాత వసంతర్తువుయొక్క ఆరంభముచే మన్మథుడు
భారవి ప్రతిభా వైభవం 23 మనోరంజితమైన చూత, శిశిరర్తువులను సూచించుచుందెను. తరువాత భ్రమరముల యొక్క రుంకారము వసంతలక్షిని ప్రకాశింపజేయుచు చూతవృక్షములపైన రాజిల్లుచుందెను. తరువాత భ్రమరముల వసంతర్హువు తమ మిత్రుని సహాయముచే మన్మథుడు కూడ అర్జునుని మనస్సును చలింపజేయకుండెను. ఆ తరువాత మల్లికాపుష్పములతో వసంతర్హువును నవ్వింపజేయుచు గ్రీష్మర్తువు ఏతెంచెను. పరస్పరవిరోధముగల బుతుగణము కూడ అర్జునునియొక్క ధైర్యమును చలింపజేయకుండెను. ఈ విధముగా బుతుగణములు అప్పరసలయొక్క ప్రయాణము గూడ అర్జునుని తపస్సు ముందర విఫల మాయెను. ఇవన్నియు అర్జునుని మోహింపజేయుటకు వచ్చి నిరర్ధ్థకమాయెను. మునితో సమానమగు అర్జునుని జూచి ఆ కామినీప్రీలు చకితులై విస్మయము నందిరి. కొందరు వెళ్ళి ఆ అర్జునునితో ఇట్లనిరి. “అదిగో! ఆ యువతి నీకొరకు ప్రాణమును త్యజించుచున్నది. ఓ నిర్ణయ గల అర్జునా! తపస్సును వీడి-ఆమెయొక్క (ప్రేమను పొందుము”. ఈ విధముగా దేవతాస్త్రీలు కరుణాపూరితముగా ప్రార్థించిరి. లజ్జను విడనాడిరి. మరియు దీనముగా కన్నీరు గార్చిరి. ఈ విధముగా వారందరు ఓడిపోయిరి. ఆ తరువాత విజయలక్ష్మి కొరకు ఇంద్రుని ఆరాధనయందు అర్జునుడు తమ కోరికపై బహుప్రయాస మొనర్చుచుండెను. ఆ సమయమున అప్సరసలు తేజో విహీనులై స్వర్గమునకు తిరిగి వెళ్ళిపోయిరి. ఏకాదశసర్గ కథ అర్జునుని దగ్గరికి ఇంద్రుడు వృద్ధమునివేషముతో నేతెంచుట దేవతాస్రీలు విఫలప్రయాస నొనర్చుట చూచి, అర్జునునియొక్క జిజేంద్రి
యత్వమునకు ఇంద్రుడు ఆశ్చర్యము నొంది, మునివేషముతో అర్జునుని చెంత కేతెంచెను. ఇంద్రునియొక్క భవ్యప్రభావమును, ఆకారమును చూసి అర్జునుడు మునిజనోచితముగా ఇంద్రుని సత్కరించి, ఆసనముపై గూర్చుండబెట్టెను. అప్పుడు ఇంద్రుడు అర్జునునితో నిట్లు పలికెను ..... “అర్జునా! నీవు బుద్ధిశాలివి. యువావస్థలో ఇట్టి ఘఫోరతపస్సును ఒనర్చితివి. శరత్మాలీన మేఘచ్చాయతో సమానముగా ఈ యవ్వనము క్షణభంగుర మైనది. అయినను సుఖప్రదముగా గోచరించుచున్నది. దీని పరిణామము సంతోషదాయకము. జీవధారులయొక్ని
24 భారవి ప్రతిభా వైభవం జన్మము శ్లేశదాయకమైనది. మరియు దుఃఖపూరితమైనది. ఇంతేకాక ఇది మృత్యువు యొక్క గ్రాసము. కనుక జ్ఞానవంతులు సంసారము నందు విరక్తి చెంది మోక్షము కొరకు ప్రయత్నించెదరు. నీవు ప్రశస్తమైన చిత్తము గలవానివి. నీకు కళ్యాణప్రదమైన బుద్ధి కలదు. నీయొక్కనడవడి నా మనస్సును సంశయములో పడవేయుచున్నది. సర్వభూతములయందు స్నేహము గల మోక్షము గోరు వారికి ధనుస్సు, కవచము, తూణీరము ఇవన్నియు ఎందుకు? ఇవన్నియు నీకు శాంతిని కలుగజేయవు. దీనితో నీవు శత్రువుల పైన విజయమును సాధించుదు వని స్పష్టమగుచున్నది. ఏ మూర్చుడైతే మోక్షమును ప్రసాదించు ఈ తపస్సు పరహింసకొరకు చేయునో వానికి కేవలము క్లేశమే మిగులుచున్నది. కావున ఏకాంతచిత్తుడవై పవిత్రమైన గంగాజలస్థానమున ముక్తికొరకు తపస్సు చేయుము. అదియే నీకు అత్యంత సులభమైనది”.
ఈ విధముగా పలికి ఇంద్రుడు మౌనముగా నిలబడెను. అప్పుడు అర్జును డిట్లు పలికెను. “మహానుభావా! మీయొక్క వచనములు సుప్రసిద్ధమైన అర్థభావములు గలవి. మరియు ఆడంబరరహితమైన శబ్దజాలములు గలవి. యుక్తియుక్తముగా తమరు పలుకుటవలన ఆ వచనములు వేదవాక్యములతో సమానము. కాని మీరు తపస్సుయొక్క కారణమును, దాని ఫలమును తెలుసుకోజాలరైతిరి. కేవలము మాకు ముని వలె ఉపదేశము చేయుచున్నారు. పూర్వాపరము తెలుసుకొనజాలక పలికిన వాక్యములు బృహస్పతికి గూడ నిష్ఫలమగుచున్నవి. నేను క్షత్రియపుత్రుడను, పొండునందనుడను కుంత్రీ పుత్రుడను; మరియు ధనంజయుదను. శత్రువులచే పరాభవింపబడి మా జ్యేష్ట భ్రాత యగు ధర్మరాజుయొక్క ఆదేశానుసారముగా తపస్సు చేయుచున్నాను.
కృష్ణద్వైపాయనుడగు వేదవ్యాసునియొక్క ఆదేశానుసారముగా వీరోచితమైన వేషమును ధరించినాను. కపటయుక్తమైన మాయాజూదములో సంపూర్ణ రాజ్యమునోడి తమ తమ్ములను మరియు స్త్రీని కూడ పందెములో పెట్టి ఓడిపోయెను. ఇది భవితవ్యము. తమ్ములతో ధర్మరాజు (ద్రాపదీవిరహమున దీర్జకాలమునుండి క్లేశము ననుభవించుచున్నాడు. మాయొక్క గౌరవమును గూడ శత్రువులు అపహరించిరి. భీష్మ, ద్రోణాది గురువుల ముందర ద్రౌపదిని సభకీడ్చు
భారవి ప్రతిభా వైభవం 25 కొని వచ్చి, శత్రువులు మా సమక్షమున మమ్ములను అవమానపరిచిరి. అదే సమయమున మృత్యుదేవత శత్రువుల శిరస్సుపై నిజముగా తాండవించెను. మా యొక్కచివరి దురవస్థను మా జ్యేస్టభ్రాత యగు ధర్మరాజు సహించుకొనెను. ఏలయన శత్రువులను నాశమొందించుట సులభమే! అయినప్పటికి సజ్జనులపై దోషరహితముగా నుండుట దుర్లభము. ధృతరాహ్లునియొక్క పుత్రులగు దుర్యోధనాదు లచే మైత్రి కూడ భీష్మవైరరూపముగా పరిణమించెను. ఆ సమయమున శత్రువుల ద్వారా కలిగిన అవమానముచే మా హృదయములు పషగిలిపోయెను. దానికి ప్రతీకారము చేయుట మాచేత గాకుండెను. సంసారములో మానహీనుడగు ప్రాణి తృణముతో సమానముగా తుచ్చమగును. కావున మేము సుఖమును కోరడము లేదు. మరియు దుస్సహమగు సంసార క్లేశములపై ఉద్వేగపడి ముక్తిని కూడ కోరడము లేదు. మేము శత్రువులు గతించిన తరువాత వారి భార్యలయొక్క అ(శ్రుప్రవాహమును తుడుచుటయే కోరుచుంటిమి. మా విషయమై సజ్జనులు ఎగతాళి చేసిన, దానిని సహించుకొందుము. కాని వంశపరంపరగా వచ్చిన లక్ష్మిని ఉద్ధరించక కేవలము మోక్షమును, విజయమును కోరడము సముచితము కాదు. శత్రువులను పూర్తిగా తుడిచివేయడమువలన యశస్సు లభించును. అంతవరకు సంసారములో జన్మించడమనేది తృణ.ప్రాయముగా మారును. శత్రువులపై పరాక్రమముచే జయించిన, పేరు ప్రశంసనీ యముగా నుండును. మరియు ఆ విజయము నొందిన పురుషునియొక్క జన్మమే సార్ధకమైనది. 'ప్రతిజ్ఞానుసారముగా శత్రువులపై ప్రతీకారము తీసుకొనడమే ధర్మరాజుయొక్క సహనమునకు నిదర్శనము. సంకటకాలములో స్వామియొక్క ఆజ్ఞను నిరాకరించడము వంశమునకు కళంక మగును. ఇంతేగాక పర్వతము పైన వర్షించిన వర్షము వలె వారి పరాక్రమము నష్టమగును. ఇంద్రునియొక్క ఆరాధన చేసి మా హృదయములో చొచ్చిన అపకీర్తి యను శల్యమును తీసి వేయుదును.
ఈ విధముగా అర్జునుని మాటలు విని ఇంద్రుడు నిజరూపముతో తన ప్రియపుక్రుని (అర్జునుని) ఆలింగనము చేసికొని, వత్సా! భగవంతుడైన శంకరుని ఆరాధించుమని ఆదేశించి అంతర్జాన మాయెను.
26 భారవి ప్రతిభా వైభవం ద్వాదశసర్గ కథ
ఇంద్రుని ఆదేశాన్నుసారముగ అర్జునుడు శంకరుని గూర్చి తపస్సు చేయుట ఇంద్రుడు అంతర్థానమైన తర్వాత అర్జునుడు శంకరుణ్ణి ప్రసన్నము చేసుకొనుటకు ఉగ్రమైన తపస్సు ఆరంభించెను. ఏకపాదముపై నిలిచి నిరాహార ముగా, అంతఃశుద్ధిపూర్వకముగా తపస్సు చేయుచుండగా చాలా దినములు గడిచిపోయెను. ఆ సమయమున అర్జునునియొక్క మనస్సు సమీపమునందలి వృక్షములపై నున్న ఫలముల వైపు మరియు నిర్మలశీతలజలము వైపు పోకుండెను. అతని తపస్సుయొక్క ఉత్కర్న తపోరహస్యము తెలిసినవారి మనస్సు నాకర్షించు చుండెను. ఆ సమయమున అర్జునుడు తేజోవంతుడైన అగ్నిహోశ్రుని వలె ప్రకాశించుచుండెను. ఆతదు సముద్రుని వలె ధైర్య-గాంభీర్యములను చూపు చుండెను. తపస్సుచే కృశించిన అర్జునుడు స్పానానికి వెళ్ళుచుండగా ఆతని పాదవిన్యాసములచే భూమి క్రుంగుచుండెను. భుజములను పైకెత్తి నతమస్తకుడై తపస్సు చేయుచుండెను. కృష్ణపక్షంలో అతని తపస్సు అనే ప్రకాశముతో చంద్ర కాంతి వలె గోచరించుచుండెను. అర్జునునియొక్క తపస్తేజస్సుచే సూర్యునియొక్క కిరణములు గూడ కాంతిహీనము లాయెను. ఆతని తపస్తేజస్సును చూచి లోక్షు లిటు సందేహించిరి..... “ఈత డగ్నిహోత్రుడా? లేక సూర్యుడా? లేక దేవేంద్రుడే తపస్సు చేయుచున్నాడా?” అని చూపరులు సంశయించుచుండిరి. ఆతని తపస్సును చూచి భయపడి, కొందరు శంకరుని సమీపమునకు వచ్చిరి. మరియు ఆ దేవదేవున్సి స్తుతించిరి. ఆ స్తోత్రమును విని కపాలమాలను ధరించిన చంద్రమౌళీశ్వరుడ్రు నాగయజ్ఞోపవీతమును ధరించి, దిగంతరాళంలో తన తేజస్సును వ్యాపింపజేయుచ్చు, మూడు నేత్రములచే అర్జునుని చూచెను. మునీశ్వరులు శంకరుని దగ్గరకు వెళ్ళి సంకేతపూర్వకముగా నిట్లు పలికిరి ..... “హే భువనైకపురుష! ప్రభో! వృత్రాసురుని వలె విశాలమైన శరీరము గల ఒకానొక పురుషుడు నిన్ను గూర్చి తపస్సు చేయుచున్నాడు. ఆతడు ధనుస్సు - తూణీర - కవచ - జటావల్కములను ధరించి విరుద్ధవేష మున్నప్పటికి శోఖించుచుండెను. ఆతడు నడుస్తుంటే భూమి కంపించుచుండెను. ఆతనియొక్క ఇంద్రియని[గ్రహముచే దిక్కులు గూడ స్తబ్ధ మాయెను. ఆత డీ విధంగా తపస్సు చేయుచుండగా దేవ - దానవ - మానవ
భారవి ప్రతిభా వైభవం 27 సహితముగా సమస్తసంసారము ఆశక్రమించబడెను. తమరు సర్వజ్ఞులైనప్పటికి ఎందు కుపేక్షించుచున్నారు? తమరి సమక్షమున మాకు పరాభవము కలుగ కూడదు”. ఈ విధముగా మునులయొక్క ప్రార్ధనను విని శంకరు డిట్లు పలికెను ..... “ఓ మునీశ్వరులారా! బదరికారణ్యములో తపస్సు చేయుచున్న నారాయణమూర్తి యొక్క అంశమగు నరరూపుడైన అర్జునుని విషయమై మీరు అన్యథా భావించవద్దు. సంసారముచే సంతప్తమైన విజేతలగు శత్రువులను నాశమొందించుటకై అర్జును డీ తపస్సును చేయుచున్నాడు. నరనారాయణులు బ్రహ్మయొక్క ప్రార్ధనచే ప్రస్తుతము భూలోకమున కృష్ణార్ణునరూపమున విరాజిల్లు చున్నారు. ఈ అర్జునునియొక్క తపస్సు దేవకార్యముగా భావించి మీరందరు నా వెంట భూలోకమునకు రాగలరు. కిరాతరూపమును ధరించిన నావలన వరాహ రూపధారి యగు ఒకానొక దానవుడు అచట మరణించును. ఆ తరువాత వేటకై వివాద మొనర్చి ఆ అర్జునుడు నాతో యుద్ధము చేయగలడు. అట్టి సమయమున ఆతనియొక్క భుజపరాక్రమమును తమ రందరు చూడగలరు.” ఈ విధముగా వారితో పలికిన శంకరుడు కిరాతరూపమును ధరించి దానికి అనుగుణములగు ధనుర్భాణములను తీసుకొని బయలుదేరెను. ఆ సమయమున ప్రమథగణములు భయపడిపోయెను. సమస్తపర్వత ప్రాంతము భయకంపిత మాయెను. నిద్రించిన సింహములు మేల్కొని నలుదిక్కుల గంభీర భావముతో చూచుచురిడెను. నదులయొక్క ప్రవాహమందలి జలములు పైకగురు చుండెను. ఈ విధముగా పయనించిన శంకరుని సేన అర్జునుని సమీపించెను. మరియు సైన్యమంతయు అడవిలో చుట్టు ముట్టి గుప్తరూపముగా నిలిచిపోయెను. శంకరుడు గూడ ధనుస్సునందు బాణమును సంధించి ఒక వృక్షము వెనుక నిలిచిపోయెను. (త్రయోదశసర్గ కథ అర్జునుడు వరాహమును జూచి తర్మించుట మరియు దానిని భేదించుట శంకరుడు పయనించిన తరువాత అర్జునుడు విశాలమైన ఆకారము గల, పర్వతమును భేదించునట్టి వరాహరూపధారియైన ఒకానొక దానవున్ని చూచెను. ఈ వరాహముయొక్క మెడపైనున్న వెంట్రుకలు నిటారుగ నిలిచి యుండెను. దానిని జూచి అర్జునుడు 'ఈ వరాహము నన్ను జయించుటకే
28 భారవి ప్రతిభా వైభవం వచ్చినది కాబోలు” నని ఈ విధంగా అనుమానంలో పడిన అర్జునుడు మనస్సులో తర్మించుకొనుచుండెను. ఈ తపోవనములో తపస్సుయొక్క ప్రభావముచే నిర్వైరము గల జంతువులవలన మునీశ్వరులు భయరహితులైరి. ఈ వరాహము నాపై ప్రతీకారము తీర్చుకొనుటకు వచ్చుచున్నదా ఏమి? లేక మాయనా? నిరపరాధియగు నన్ను చంపునని విచారించుట వ్యర్థమే! ఏలయన దుర్దనులు చేయరానటువంటి అకార్యము ఏది కూడ లేదు. శత్రువులను కూడ తన దగ్గరికి రానీయకూడదని వేదవ్యాసమహర్న్షి సూచించెను. నేను ధనుర్చాణములను ధరించుట ఈ లక్ష్యమును సూచించుచున్నది.
ఈ విధంగా విచారించి అర్జునుడు గాండీవముపై బాణమును సంధించెను. అటు శంకరుడు కూడ పినాకధనుష్యముపై బాణమును సంధించి విడిచెను. ఆ రెండు బాణములు వరాహముయొక్క వక్ష్యస్థ్టలమునకు తగులగ్గా ఆ వరాహము భూమిపై బడెను. అటు తరువాత అర్జునునియొక్క బాణము అధోముఖముగా అచ్చట పడిపోయెను. దానిని తీసికొనుటకై అర్జును డచ్చటికి ఏతెంచెను. అట్టి తజి అకస్మాత్తుగా ఒక వనచరున్ని అచ్చట చూచెను. ఆ వనచర్శడు గూడ సాంప్రదాయముగా అర్జునునికి నమస్కరించి ఇట్లు పలికెను ..... *“శ్రాంత్రి మరియు నీయొక్క వినమ్రత గల హృదయము, తపస్సుయొక్క సాంప్రదాయము, నీయొక్క శుద్ధశాస్త్రజ్ఞానమును మరియు దేవతాసమానత్వమును ఇంకను పవిత్రమైన రాజవంశమును తెలియజేయుచున్నవి. తేజోవంతమైన నీయొక్క మునిభావము ఇంద్రునితో సమానమైన శాసనమా! యన్నట్టు గోచరించుచున్నది. తప్రోధన్సుడ్రు తాను ఏకాకి యైనప్పటికి, తన తపఃప్రభావముచే అనేకమందితో గూడ్రిన్సట్లు కనిపించును. నీకు విజయలక్ష్మి ప్రాప్తించును. దీని విషయమై ఆశ్చర్యపడవలసిన
పనిలేదు. నీకు దుర్లభమైన ముక్తి కూడ లభించును. సర్వగుణ సంపన్నుడైన నీక్తు మా స్వామియొక్క బాణమును తీసుకొనుట ఉచితము గాదు. మనువు మున్నగు స్మృతికారులు గూడ న్యాయోచితమైన ఆచారమునే పాటించెదరు. మీలాంటి మహానుభావులు త్యాగమునకు వెఐవరు. వినయము, తపస్సు, గృహస్థాశ్రమము, యోగిజనులకు పుణ్యసుఖమును మరియు సిద్ధిని ప్రసాదించును. ఈ మా స్వామి యొక్క బాణము మీ బాణముతో సమానమైనది. మీలాంటి వారికి ఈ బాణము
భారవి (ప్రతిభా వైభవం 29 విషయమై, ఆశ యనునది ఉండదు. రెండవవారు వేటాడిన జంతువును మీలాంటి వారు వేటాడుట లజ్ఞాకరము. ఒకవేళ మాస్వామి ఈ వరాహమును సంహరించి నటులనే నీ పరిస్థితి కాగలదు. మా స్వామి తప్ప ఈ భయంకరమైన మృగమును ఎవరు వేటాడగలరు. ఈ విధముగా ఉపకారమొనర్చిన మాస్వామి యెడ నీవు కృతజ్ఞత తెలుపడమే ఉచితము. ఎందుకనగా కృతజ్ఞత తెలుపడము సజ్జనుల యొక్కలక్షణము. కావున ఆ బాణమును మాస్వామికి ఇచ్చి వేయుము. దీనివలన రామసుగ్రీవుల మైత్రి వలె నీ మైత్రి నిలువగలదు. ఒక్క బాణమేమి! ఈ సమస్త భూమిని కూడ నీకు రాజ్యాభిషేకము చేయును" ..... ఈ విధముగా వనచరుని యొక్క బాణమును గూర్చిన మాటలు అర్జునుడు వినెను. చతుర్దశసర్గ కథ
ఆ వనచరునితో అర్జునునియొక్క మాటలు.
ఈ విధముగా వనచరునియొక్క మాటలచే అర్జునుడు సముద్రతరంగముల వలె నిలిచి క్రోధము గలవాడై ధైర్యము విడనాడకుండెను. శత్రువుయొక్క సంపూర్ణ అభిప్రాయమును తెలుసుకొని అర్జునుడు వికారరహితుడై ఇట్లు పలికెను ..... “శ్చిరీ! నీ మాటలు చాలా విచిత్రముగా నున్నవి. విద్వాంసుడు కూడ నీ మాటల యొక్క అర్ధ గౌరవమును చూసి ప్రసన్నుడగును. నీవు పలికిన శబ్ద గాంభీర్యము ప్రశంస నీయమైనది. విద్వాంసులయందు గూడ ఇిన్న భిన్న అభిప్రాయములు గలవు అని గోచరించుచున్నది. మనోగతభావములు వాగ్రూపముగ బయట పడును. ఇలాంటివారు చాలా శ్రేష్టులని గంభీరము గల అర్ధము ప్రకటితమగు చున్నది. మీరు వనచరులైనప్పటికినీ సమస్తసద్దుణములు గల మాటలు పలుకుచున్నారు. ఇవి ఉత్తమవక్తలయొక్క (శ్రేణిభావమును సూచించుచున్నవి. నీవు ఈ బాణమును పొందేకొరకే లోభభూయిస్టమైన ఇట్టీ పలుకులను పలికితివి. ఎవరైతే ఈ బాజాన్ని ప్రయోగించారో వారు నిశ్చితముగా నాద్వారా నశించెదరు. ఖాండవవనమును దహించుటచే అగ్నిదేవుడు నాకు అక్షయబాణములను తూణీరము నొసంగెను. నేను దేవేంద్రునియొక్క బాణమును కూడ అపేక్తించును. అట్టి మీ వనచరులయొక్క బాణములతో నాకేమి పని? నిరపరాధి నగు నాపై
26 భారవి ప్రతిభా వైభవం
వచ్చినది కాబోలు” నని ఈ విధంగా అనుమానంలో పడిన అర్జునుడు మనస్సులో తర్మించుకొనుచుండెను. ఈ తపోవనములో తపస్సుయొక్క ప్రభావముచే నిర్వైరము గల జంతువులవలన మునీశ్వరులు భయరహితులైరి. ఈ వరాహము నాపై ప్రతీకారము తీర్చుకొనుటకు వచ్చుచున్నదా ఏమి? లేక మాయనా? నిరపరాధియగు నన్ను చంపునని విచారించుట వ్యర్థమే! ఏలయన దుర్దనులు చేయరానటువంటి అకార్యము ఏది కూడ లేదు. శత్రువులను కూడ తన దగ్గరికి రానీయకూడదని వేదవ్యాసమహర్షి సూచించెను. నేను ధనుర్చాణములను ధరించుట ఈ లక్ష్యమును సూచించుచున్నది.
ఈ విధంగా విచారించి అర్జునుడు గాండీవముపై బాణమును సంధించెను. అటు శంకరుడు కూడ పినాకధనుష్యముపై బాణమును సంధించి విడిచెను. ఆ రెండు బాణములు వరాహముయొక్క వక్ష్యస్థలమునకు తగులగా ఆ వరాహము భూమిపై బడెను. అటు తరువాత అర్జునునియొక్క బాణము అధోముఖముగా అచ్చట పడిపోయెను. దానిని తీసికొనుటకై అర్జును డచ్చటికి ఏతెంచెను. అట్టి తఠి అకస్మాత్తుగా ఒక వనచరున్ని అచ్చట చూచెను. ఆ వనచరుడు గూడ సాంప్రదాయముగా అర్జునునికి నమస్కరించి ఇట్లు పలికెను ..... “శాంతి మరియు నీయొక్క వినమ్రత గల హృదయము, తపస్సుయొక్క సాంప్రదాయము, నీయొక్క శుద్ధశాస్త్రజ్ఞానమును మరియు దేవతాసమానత్వమును ఇంకను పవిత్రమైన రాజవంశమును తెలియజేయుచున్నవి. తేజోవంతమైన నీయొక్క మునిభావము ఇంద్రునితో సమానమైన శాసనమా! యన్నట్టు గోచరించుచున్నది. తపోధనుడు తాను ఏకాకి యమెనప్పటికి, తన తపఃప్రభావముచే అనేకమందితో గూడినట్లు కనిపించును. నీకు విజయలక్ష్మి ప్రాప్తించును. దీని విషయమై ఆశ్చర్యపడవలసిన పనిలేదు. నీకు దుర్లభమైన ముక్తి కూడ లభించును. సర్వగుణ సంపన్నుడైన నీకు మా స్వామియొక్క బాణమును తీసుకొనుట ఉచితము గాదు. మనువు మున్నగు స్మృతికారులు గూడ న్యాయోచితమైన ఆచారమునే పాటించెదరు. మీలాంటి య ఫానలు య. “వెవరు | వినయము, తపస్సు, గృహస్థాశ్రమము, యొక్కబాము వురియు సిద్ధిని ప్రసాదించును. ఈ మా స్వామి
| బాణ బాణముతో సమానమైనది. మీలాంటి వారికి ఈ బాణము
భారవి ప్రతిభా వైభవం 29 విషయమై, ఆశ యనునది ఉండదు. రెండవవారు వేటాడిన జంతువును మీలాంటి వారు వేటాడుట లజ్ఞాకరము. ఒకవేళ మాస్వామి ఈ వరాహమును సంహరించి నటులనే నీ పరిస్థితి కాగలదు. మా స్వామి తప్ప ఈ భయంకరమైన మృగమును ఎవరు వేటాడగలరు. ఈ విధముగా ఉపకారమొనర్చిన మాస్వామి యెడ నీవు కృతజ్ఞత తెలుపడమే ఉచితము. ఎందుకనగా కృతజ్ఞత తెలుపడము సజ్జనుల యొక్కలక్షణము. కావున ఆ బాణమును మాస్వామికి ఇచ్చి వేయుము. దీనివలన రామసుగ్రీవుల మైత్రి వలె నీ మైత్రి నిలువగలదు. ఒక్క బాణమేమి! ఈ సమస్త భూమిని కూడ నీకు రాజ్యాభిషేకము చేయును” ..... ఈ విధముగా వనచరుని యొక్క బాణమును గూర్చిన మాటలు అర్జునుడు వినెను. చతుర్దశసర్గ కథ
ఆ వనచరునితో అర్జునునియొక్క మాటలు.
ఈ విధముగా వనచరునియొక్క మాటలచే అర్జునుడు సముద్రతరంగముల వలె నిలిచి క్రోధము గలవాడై ధైర్యము విడనాడకుండెను. శత్రువుయొక్క సంపూర్ణ అభిప్రాయమును తెలుసుకొని అర్జునుడు వికారరహితుడై ఇట్లు పలికెను ..... “కర్రీ! నీ మాటలు చాలా విచిత్రముగా నున్నవి. విద్వాంసుడు కూడ నీ మాటల యొక్క అర్ధ గౌరవమును చూసి ప్రసన్నుడగును. నీవు పలికిన శబ్ద గాంభీర్యము ప్రశంస నీయమైనది. విద్వాంసులయందు గూడ భిన్న భిన్న అభిప్రాయములు గలవు అని గోచరించుచున్నది. మనోగతభావములు వాగ్రూపముగ బయట పడును. ఇలాంటివారు చాలా శ్రేష్టులని గంభీరము గల అర్ధము '్రకటితమగు చున్నది. మీరు వనచరులైనప్పటికినీ సమస్తసద్దుణములు గల మాటలు పలుకుచున్నారు. ఇవి ఉత్తమవక్తలయొక్క శ్రేణిభావమును సూచించుచున్నవి. నీవు ఈ బాణమును పొందేకొరకే లోభభూయిస్టమైన ఇట్టి పలుకులను పలికితివి. ఎవరైతే ఈ బాణాన్ని ప్రయోగించారో వారు నిశ్చితముగా నాద్వారా నశించెదరు. ఖాండవవనమును దహించుటచే అగ్నిదేవుడు నాకు అక్షయబాణములను తూణీరము నొసంగెను. నేను దేవేంద్రునియొక్క బాణమును కూడ అపేక్షించును. అట్టి మీ వనచరులయొక్క బాణములతో నాకేమి పని? నిరపరాధి నగు నాపై
20 భారవి ప్రతిభా వైభవం దోషారోపణ ఎందుకు చేయుచున్నావు? సజ్జనులు ఇతరులను దూషించరు. వన జంతువులను ఎవరు వేటాడుదురో ఆ జంతువు వారిదే యగును కావున దీనినే నేనే వేటాడితిని. ఈ జంతువు నాదే. వృథా వాదించకూడదు. వ్యాసమునీంద్రుడు తపస్సుకై నన్ను ప్రేరేపించి ధనుర్చాణములను ధరించి వెళ్ళుమని ఆదేశించెను, కావున నా ధర్మప్రకారముగ ఈ మృగమును వేటాడితిని. కావున ఈ మృగము నాది. నేను బాణమును వదిలి ఈ మృగమును వేటాడితినని భావించుటలో ఎలాంటి దోషారోపణ లేదు. మీ స్వామి యొక్కకోరిక ఏదో చెప్పుము. సజ్జనులతో వైరము పనికిరాదు. మీ స్వామి యొక్క బుద్ధి మోహజాలములో పడి మాపైన మిథ్యారోపణ చేయుచున్నారు. వర్ణాశ్రమమును కాపాడే మేమెక్కడ? నికృష్టజాతి యందు జన్మించిన మీ వనచరులెక్కడ? నీచులతో గొప్పవారికి మైత్రి తగదు. ఏనుగు నక్కకు మిత్రుడగునా? నీచులతో విరోధము చేయుట కూడా తమ క్రీర్తిక్రి హాని కలుగును. వారితో మైత్రి తగదు. వారితో మైత్రి చేయడము కూడా దోషాస్పదమే. మీ స్వామి కేవలము,.బాణము కొరకే వచ్చిన యెడల విషసర్పము ఫణముపై గల మణిని పొందడమువలె దుర్లభము .....” ఈ విధముగా అర్జునుని యొక్క వచనములను విని వనచరులు అర్జునున్ని బెదిరించి తిరిగి తమ శంకరుని దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతము నంతయు తెలియ జేసిరి. తరువాత శంకరుని యొక్క ఆదేశానుసారముగ కిరాత సైన్యము అర్జునునిపై ఆక్రమించుటకు బయలుదేరెను. శంకరుడు కూడ పినాకముపై బాణమును సంధించి ముందు నడుచుచుండెను. అర్జునుడు కూడ తన గాండీవమును చేత ధరించి ధైర్యముగా నిలచెను. అట్టి తటి శంకరుని యొక్క కిరాత సైన్యము అర్జునునిపై బాణములను వర్షించెను. అర్జునుడు కూడ ధనుస్సును ధరించి బాణములను సంధించుచు, కిరాతులు ప్రయోగించిన బాణములను త్రుంచి వేసెను. మరియు తన బాణపరం పరలచే కిరాతులను మూర్చ్భనొందించెను. పంచదశసర్ల్గ కథ శంకరునికి మరియు అర్జునునికి యుద్ధము ఇంద్రుని పుత్రుడగు అర్జునుని బాణములచే ఆ ప్రాణులందరు భయఖీతులైరి.
భారవి ప్రతిభా వైభవం 31 శంకరునియొక్క సేనాగణములు తమ ఆయుధములను వదిలి నలుదిక్కుల పారి పోయిరి. ముందర నిలుచున్న శంకరున్ని కూడ చూడజాలకపోయిరి. విజయాభిలాషను వదిలి పరుగిడిన ఆ సైన్యమును జూచి అర్జునుని హృదయములో దయకలిగెను. శత్రువుల విషయమై వారిపైన దయ జూపడము కూడ మహాపురుషుల లక్షణము. ఆ పలాయనము చెప్పిన శత్రువులపై అర్జునుడు బాణములను వదలలేదు. ఆ తరువాత పరుగెత్తిన సైన్యమును జూచి అందరు ఆశ్చర్యపోయిరి. రాక్షసులను గూడ నశింపజేసిన మీరు సాధారణమనుష్యుల వలె ఎందుకు అపకీర్తి నందితిరి. మీరు తమ ఉత్తమమహిమను మరియు కీర్తిని నష్ట మొందించి ఆపదలో చిక్కుకొని పరుగిడితిరి. ఆహా! ఇతడు రాక్షసుడు గాదు. నాగరాజు (ఆదిశేషుడు) గూడ కాదు. పర్వతము వలె ధైర్యముగా నిలుచున్నాడు. కావున ఇతడు రాక్షసుడు కూడ కాదు. నూతన ఉత్సాహము గల ఈతడు రాజపుత్రుని వలె గోచరించుచున్నాడు. గుణములను సంపాదించిన వారి కంటే నష్టపోయిన నిర్ణుణపురుషుడే ఉత్తమము, ఇతని దగ్గర రథములు, గుజ్జములు, గజములు, పదాతివర్గము కూడ లేవు. కేవలము ఈతడొక్కడే ఉన్నాడు. శత్రువులచే నష్టమొందిన పౌరుషము గల మీరు కేవలము అపకీర్తి పాలైతిరి. పొౌరుషహీనుడైన శత్రువుచే పరాభవింపబడిన ప్రీవలె శంకరుడు దాగిపోదునా యని విచారించు చుండెను. మీరు గొప్ప గొప్ప రాక్షసులను కూడ జయించితిరి. కానీ ఈ నికృష్టమైన మానవునిచే భయపడి ఎందుకు పరుగెత్తుచుండిరి? ఈ విధముగా కార్తికేయునిచే సాంత్వత నొంది శంకరునికై సహాయరూపముగ నిలిచిపోయిరి. శత్రువులచే పరాభవింపబడిన సైన్యము సూర్యుని ప్రకాశముచే ఆచ్చ్భాదితమైన ఛాయావృక్షము వలె శంకరుడు నిలచిపోయెను. అట్టితణి చివరకు అర్జునునిపై పినాకధనువునుండి బాణములను వదులుచుందెను. ఆ బాణముయొక్క ధ్వనిచే పర్వతప్రాంతము ప్రతిధ్వనించు చుండెను. అట్టితణి అర్జునుడు ప్రయోగించిన బాణములను శంకరుని బాణములచే భిన్నాఖిన్నము లాయెను, తర్వాత అర్జునుడు కూడ శివుడు ప్రయోగించిన బాణములను తెగవేయుచు యుద్ధమొనర్చుచుండెను. శంకరుడు దయాగర్ధహృదయుడై ప్రాణఘాతకమైన బాణములను అర్జునుని పైన వదలలేదు. కానీ అనేక బాణములచే అర్జునుణ్ణి కప్పివేసెను. అయినను అర్జునుడు చలించలేదు.
32 భారవి ప్రతిభా వైభవం ఈ ఇద్దరి యుద్ధమును చూచుటకై ఏతెంచిన దేవతలు మరియు మునిగణములు చకితమాయెను. ఈ విధముగా అర్జునునికి, శంకరునికి యుద్ధము జరిగెను. షోడశసర్గ కథ కిరాతవేషధారియైన శంకరునియొక్క విచిత్రయుద్ధమును జూచి అర్జునుడు మనస్సులో తర్కించుకొనుట. ఆ తరువాత కిరాతవేషధారియైన శంకరునియొక్క రణక్రీడను చూచి అర్జునుడు తన మనస్సులో నిట్లు తర్మించుకొనెను. “ఈ యుద్ధములో మదపుటేనుగులు లేవు. అనేక రత్నఘటితమైన రథములు లేవు. ప్రకాశించుచున్న తరంగముల వంటి అశ్వసైన్యము లేదు. “సంహరింపుము సంహరింపుము” అనుచున్న పదాత్రి వర్గము లేదు. వీరులను సంహరించు యమధర్శ్మరాజు వలె ధూమ్రమయమైన వాతావరణము కూడ లేదు. ఎదుట యుద్ధభూమిలో మరణాభిముఖమె పడిపోయిన శవములు కూడ లేవు. సాహసోపేతమైన వీరులు కూడ కానరారు. మందారమాల వలె మూర్భపోయిన శత్రువులు కూడ కానరారు. శత్రువుల యొక్క ఏనుగులు యుద్ధభూమిలో పడిపోయిన దృశ్యము కూడ కానరాదు. ప్రళభయకాలమందలి వాతావరణములో చిక్కుకొనిన వీరులెవ్వరునూ కానరారు. దుర్వారమైన మహారథికులను జయించిన పరాక్రమము ఎచ్చటను కానరాదు. ఆహా! ఇదేమి మాయ? నాకు మతిభ్రమ కలుగుచున్నదా? లేక నేను అర్జునుణ్ణేనా కాదా? నా గౌండీవము నుండి బయలుదేరిన బాణములు పూర్వము వలె పరాక్రమోపేతముగా కానరాకున్నవి. ధనువుయొక్క ధ్వనిచే ఆకాశమంతయు ప్రతినినాదము చేయకున్నది. ధనువుయొక్క అల్లెత్రాడు కూడ ధ్వనించుచున్నది, తూణీరమునుండి తీసిన బాణములను సంధించగా వాటి ధ్వనులు వినరాకున్నవి. భుజబలము పనిచేయకున్నది. ప్రయాసమంతయు విశేషముగా కానరాకున్నది. నా ముఖము కృష్ణపక్షచంద్రుని వలె కాంతిహీనమైనది. చలము, అచలమును వీటిని లక్ష్యముగా చేసికొని బాణములను వదిలితిని. ఆ బాణములు శత్రువునకు ఎలాంటి అపాయము లేశమాత్రము కలుగజేయలేదు. అసాధారణమైన నా పరాక్రమము జూపినప్పటికి శత్రువును నశింపజేయలేదు.” ఈ విధముగా
భారవి ప్రతిభా వైభవం 3 అర్జునుడు విచారమగ్ను డాయెను. చివరకు సమ్మోహనాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రముయొక్క ప్రయోగముచే ఆ రణభూమిలో అంతట అంధకారము వ్యాపించెను. ఆ అంధకారముచే శంకరుడు ఆశ్చర్యచకితుదై ముందడుగువేసెను. చివరకు కిరాతరూపమును వదిలి చంద్రశేఖరుడు అయిన అతని శిరస్సునుండి తీవ్రజ్యోతి బయలుదేరెను. ఆ జ్యోతిచే అర్జునుని యొక్క అస్త ప్రభావము కూడ తత్క్షణమే నష్టమాయెను. అప్పుడు భూమిపై పడిపోయిన సైనికులు వెంటనే లేచి తమతమ అస్త్రములను ధరించి నిలిచిపోయిరి. ప్రభాతకాలము కాగానే మరల దినము ఉదయించినట్లు గోచరించుచుండెను. అట్టితజి అర్జునుడు నాగాస్రమును ప్రయోగించెను. శంకరుడు ఆ నాగాస్త్రమును కూడ (క్రుంచి వేసెను. తరువాత అర్జునుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్రమును శంకరుడు వారుణాస్త్రముచే నివారించెను. ఈ విధముగా అర్జునుడు ప్రయోగించిన అస్రముల నన్నింటిని శంకరుడు క్రుంచివేసెను. శంకరుడు ఇన్ని అస్త్రములను తెగవేసినను ప్రభావశాలియగు అర్జునుడు ధైర్యమును విడనాడ కుండెను. ఎలాగైనా ఇతనిని జయించి విజయలక్ష్మిని పొందవలెనని అర్జునుడు మనస్సులో నిశ్చయించుకొనెను. సప్తదశసర్గ కథ శంకరుని సైన్యముతో అర్జునుని యుద్ధము శత్రువు యొక్క దివ్యాస్తముతో పరాభూతుడైన అర్జునుడు తన గాండీవ
ధనువుపైన గల విశ్వాసముచే పురుషార్ధమును ప్రకటింపజేసెను. శత్రువు యొక్క పరాక్రమముచే అర్జునుడు ప్రసన్నుడైనప్పటికినీ భర్త గతించిన భార్య వలె అపకీర్తి పాలైతినా? అని సంతస్త్రడాయెను. శత్రువుపైన తన పరాక్రమమును చూపించుటకు అర్జునుడు మరల యుద్ధసన్నద్దు డాయెను. “ఆహా! ఇలాంటి యుద్ధము ఎప్పుడును చూడలేదు" అని పలుకుచు అర్జునుడు ఆనందబాప్పములను కార్చెను. అట్టి సమయమున అతని ముఖము ప్రాతణాలీన సూర్యబింబమువలె రక్తవర్జ మాయెను. కనుబొమ్మలను వడిబెట్టుటచే అవి ఎరుపురంగుకల వాయెను. అప్పుడు తన గాండీవమును ధ్వనింపజేయుచు ఘోరమైన బాణవర్షములచే శంకరుని యొక్క సేనలను సంతృప్పిపరచెను. శంకరుని యొక్క శరీరము పైన బాణములు వదలగా
34 భారవి ప్రతిభా వైభవం శంకరుడు కప్పిపోయెను. అట్టితజి శంకరుడు ప్రసన్నుడై చిరునవ్వు నవ్వుచుండెను. శంకరుడు అర్జునున్ని జూచి “ఈతడు భూభారమును తీసివేయుటకై అవతరించెను కాబోలు అని అభిప్రాయపడెను. శంకరుడు అర్జునుని ముందర తన తేజోహీనతను ప్రకటింపజేసెను. ఈ విధముగా శంకరుడు ద్వంద్వ యుద్ధము చేసినప్పటికినీ ఆ నిర్మలకీర్తి అర్జునునికే దక్కెను. సమస్తపసైన్యము అర్జునుని యొక్క బాణములచే చిన్నాభిన్నమాయెను. ఆ సైనికులకు బాణపరంపరచే ఏమియును కానరాకుండెను. కేవలము గాండీవము యొక్క ధ్వనియే వినిపించుచుండెను. అర్జునుని యొక్క బాణపరంపరచే వారికి అంతట అర్జునుడే కనిపించుచుండెను. ఎప్పుడైతే తన గణములు సంకటపరిస్థితిలో చిక్కుకొనెనో అప్పుడు శంకరుడు కొంచెము విచారము నొందెను. శంకరుడు తన పినాక ధనుస్సునందు బాణములను సంధించి వదులుచుండగా యమధర్మరాజా? యన్నట్లు గోచరించుచుండెను. అట్టి తత్సి శంకరుడు విజృంభించి అర్జునుని యొక్కబాణములను తెగవేసెను. తన బాణములు నిష్టలము కాగా అర్జునుడు ధైర్యమును కోల్పోయెను. తరువాత ధైర్యమును వహించి ఆశ్చర్యజనకముగా తన గాండీవము పైన బాణములను సంధించి శంకరుడు వదిలిన బాణములను తెగవేసెను.
ఈ విధముగా యుద్ధభూమిలో ఒకరిని మించి ఒకరు తన పరాక్రమములన్సు
చూపుచుండిరి. శంకరుడు వదలిన బాణములు అర్జునుని మర్శస్థలమునకు తగిలినా అర్జునుని శరీరమునకు ఎలాంటి బాధ కలుగలేదు. మరియు అధిక ఉత్సాహమ్సృన్సే పురికొల్పుచుండెను. తరువాత శంకరుడు రణరంగమున విజృంభించి అర్జునుని యొక్కరెండు తూణీరములను కవచముతో సహా తెగవేసెను. ఆ తరవాత ఇరువురు ఖద్గములను ధరించి యుద్ధమొనర్చిరి. తన సొాధనములన్నియు నిరర్ధకములు కాగా అర్జునుడు పాషాణములను మరియు వృక్షములను శంకరుని పైన విసిరెన్సు, శంకరుడు వాటిని కూడ నష్టపరచెను. అప్పుడు నిస్సహాయుడైన అర్జునుడు శంకరుని యొక్క బాణవర్షములను సహించుచు పరిగెత్తి వచ్చి శంకరుని వక్షస్థలమున ముష్టిప్రహార మొనర్చెను.
భారవి ప్రతిభా వైభవం 3ర5్ అవ్టాదశసర్గ కథ
శివార్డునుల బాహుయుద్ధమును వర్ణించుట
ఆ తరువాత శంకరుడు కూడ తన పినాకధనువును బాణములను దూరముగా విసిరి అర్జునునితో బాహుయుద్ధ మొనర్చెను. అప్పుడు ఒకరినొకరు దొబ్బుకొనుచు ముష్టిప్రహారముచే. దెబ్బలు కొట్టగా ఆ వనప్రదేశము ్రతిధ్వనించెను. ఇద్దరి శరీరములనుండి రక్తము ధారలుగా ప్రవహించెను. అప్పుడు శంకరుడు, అర్జునుడు ఎవరో తెలియరాకుండెను. అర్జునుని యొక్క ముష్టిప్రహారము శిలాఘాతము వలె శంకరుని యొక్క వక్షస్థలమున తగిలెను. తరువాత శంకరుడు కూడ తన రెండు ముష్టులతో అర్జునుని కొట్టెను. అట్టితథి అర్హునుడు మూర్భనొంది వెంటనే లేచెను. అర్జునుడు తన రెండు బాహువులచే శంకరుని యొక్కరెండు బాహువులను పట్టుకొనెను. ఆ తరువాత మల్లయుద్ధ మారంభ మాయెను. ఇద్దరు మల్లయుద్ధము చేయుచుండగా ఆ పర్వతప్రాంతము చలించుచుందెను. ఈ విధముగా కొంతవరకు యుద్ధము చేసి శంకరుని యొక్కరెండు పాదములను వేగముగా వచ్చి పట్టుకొనెను. శంకరుడు అర్జునుని యొక్కవైఖరిని చూచి ప్రసన్నచిత్తుడై నిజరూపముతో నిలిచెను. అప్పుడు అర్జునుని యొక్క తపస్సుచే ప్రసన్నుడైన శంకరుడు అర్జునుని గాఢాలింగనము చేసుకొనెను. అప్పుడు అర్జునుడు భస్మముచే, చంద్రరేఖచే విరాజిల్లుచున్న దివ్యమంగళవి[గ్రహము గల శంకరుని చూచి భక్తితో ప్రణామ మొనర్చెను. తూణీరముతో సహా ధనుర్భాణ కవచములను దూరముగా విసిరి అత్యాశ్చర్యముగా నిలబడెను. ఆ సమయములో మందమందముగా మేఘములు ఆకాశము నుండి పుష్పవర్షమును కురిపించెను. దేవదుందుభులు మోగెను. ఇంద్రాదిదేవతలు వచ్చి ఆకాశమున నిలిచిరి. వాయువు మందమందముగా వీచుచుండెను. అర్జునుని పైన శంకరుని పైన కల్పవృక్షము యొక్క పుష్పములచే వర్షము కురియు చుండెను. అర్జునుడు తన కోరిక ప్రకారముగా సిద్ధిని పొందుటకై శంకరున్ని స్తుతించి వరము కోరెను. హే భగవన్! శత్రువులను జయించుటికై నాకు సామర్థ్య మొసంగి దివ్యాస్తమును ప్రసాదించుము. అట్టి తజి శంకరుడు “తథాస్తు అని దివ్యాస్తమును అర్జునుని కొసంగెను. ఆ సమయమున లోకపాలకులు కూడ అర్జునునికి ఆశీర్వాద మొసంగిరి. ఆ తరువాత శంకరుని యొక్క ఆజ్ఞను
36 భారవి ప్రతిభా వైభవం తీసుకొని ప్రసన్నచిత్తుడైన అర్జునుడు తిరిగివచ్చి ధర్మరాజునకు నమస్కారము చేసెను. కిరాతార్డునీయ నామకరణము సామాన్యంగా కవులు తమ రచనలకు నాయికా-నాయికల నాశ్రయించి గాని, కథావస్తు ప్రాధాన్యము ననుసరించి గాని, ఫలము నాశ్రయించి గాని నామకరణము చేయుదురు. భారవి తాను రచించిన మహాకావ్యమునకు “క్రిరాతార్జునీయ” మని ప్రతినాయక-నాయక నామములతో నామకరణము చేసి, కొత్తదనమును ప్రదర్శించినాడు. ఈ (గ్రంథమునకు వ్యాఖ్యాత అయిన శ్రీ కోలాచల మల్లినాథ సూరి"... శ్లో; “నేతా మధ్యమపాందడవో భగవతో నారాయణస్యాంశజః, తస్యోత్కర్షకృతే త్వవర్హ్వృతతరాం దివ్యః కిరాతః పునః । శృంగారాదిరసో౭.ంగ మత్ర, విజయీ వీరః ప్రధానో రసః శైలాద్యాని చ వర్ణితాని బహుశో దివ్యాస్త్రలాభః ఫలమ్ 11” అని చెప్పినట్లు భగవదంశ సంభూతుడైన అర్జునునకు, సాక్షాత్ పరమేశ్వరునక్తు పాశుపతాస్త్ర ప్రదాన పరిరక్షణ విషయంలో యుద్ధము జరుగగా, పాశుపతాస్త్ర మును పొందడంలో విజయుడైన అర్జునుడు నాయకుడైనను, అస్త్రప్రదాత మాయా కిరాత వేషధారియమైన పరమేశ్వరుడు కావున ప్రథమముగ కిరాతనామముతో, ఈ కావ్యమునకు “కిరాతార్డునీయ” మని పేరుపెట్టుట ఎంతయో సముచితముగ్గా నున్నది. సంపూర్ణ సంస్కృతవాజ్బయములో ఓజోగుణభూయిష్టమైన మహాకావ్యము భారవిమహాకవిచే రచించబడిన “కిరాతార్జ్డునీయ” మొక్కటే కనిపించుచున్నది.
- భారవి - కిరాతార్జునీయం 2) మాఘుని - శిశుపాలవధ 8) శ్రీహర్నుని నైషధీయచరితమ్ ఈ మూడు మవాకావ్యములను “బృహత్రయీ” యని విమర్శకులు పిలుస్తున్నారు. ఈ మహాకావ్యము “శ్రీ” శబ్దముతో (ప్రారంభించ బడినది. ప్రతిసర్ద చివరి శ్లోకంలో “లక్ష్మీ” శబ్బము ప్రయోగించబడినది. అందుకే దీనిని “లక్ష్యంత” కావ్యమని అంటారు. భారవి ననుకరిస్తూ మాఘుడు తన
భారవి (ప్రతిభా వైభవం వీ “శిశుపాలవధ” మహాకావ్యంలో ప్రతిసర్గ చివరి శ్లోకంలో “శ్రీ” శబ్దమును, శ్రీహర్నుడు తన “నైషధమహాకావ్యం”లో “ఆనంద” శబ్దమును ప్రయోగించినారు. అందుకే మాఘకావ్యమును “థశ్యన్త కావ్య” మని, న్రైషధకావ్యమును “ఆనందాన్త కావ్య” మని విమర్శకులు అంటున్నారు.
మహాభారతంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని భారవి ఈ “కిరాతార్జునీయ” మహాకావ్యమును నిర్మించినాడు. అతని వర్జనాప్రతిభ అనన్యసామాన్యమై యలరారు చున్నది. శబ్దసౌందర్యము, అర్థగాంభీర్యం, వర్ణనాచమత్కృతులు, పాత్రచిత్రణ, రసపోషణ, అలంకారవర్ణ్దనలో భారవి సిద్ధహస్తుడు. “కిరాతార్జునీయము”లోని శ్లోకాలను ఈ మహాకవి తరువాతవారైన వామన - ఆనందవర్ధన - మమ్మటాద్యా లంకారికులు తమ అలంకారశాస్త్ర గ్రంథాలలో నుదహరించడం వలన ఈ మహాకావ్యప్రాశస్త్య్యం ఎంతయో యినుమడించినది. ఈ కావ్యానికి మల్లినాథ వ్యాఖ్యతో కలిపి మొత్తం 386 వ్యాఖ్యానా లుండటం మరియొక ప్రత్యేకత. “కృత్సప్రబోధకృద్వాణీ భా రవేరివ భారవేశ సూర్యప్రభతో సమానమైన భారవివాణి అందరిని మేల్కొలుపుతుందని రాజశేఖరుడు ప్రశంసించినాడు.
మహాకవి భారవి అనేక విద్యలలో పారదృశ్వుడు. వైదికసాహిత్య-దర్శన శాస్త్ర- ధర్మశాస్త్ర-రాజనీతిశాస్త్ర-పురాణ -కావ్యాలంకార -నాట్యశాస్తములయందు ఇతనికి గల పాండిత్యం అమోఘము. అందుకే ఇతని కావ్యార్ధజ్ఞానము కలగడానికి అనేకశాస్త్రజ్ఞానము పాఠకునికి కావలయునని తెలియుచున్నది. ఇతనికి కల (ప్రతిభాపాటవములను కిరాతార్జునీయశ్లోకముల ద్వారా కొన్నింటిని పరికింతము. శ్లో॥ మతిభేదతమస్తిరోహితే, గహనే కృత్యవిధౌ వివేకినామ్ ।
సుకృతః పరిశుద్ధ ఆగమః, కురుతే దీప ఇవార్ధదర్శనమ్ 1 (2-88) భీమసేనుని ఉపన్యాసము వినిన తర్వాత యుధిష్టిరుని వచనముల లోని దీ శ్లోకము. కార్యవి'ప్రతిపత్తులచే కూడుకొనుట వలన దురవగాహమైనప్పుడు కార్యానుష్టానము చాలా కష్టతరముగా నుండును. ఆ సమయంలో చీకటిలో నున్న వస్తువులను చూచుటకు దీప మాధారమైనట్లు, కార్యప్రతిపత్తుల నన్నింటిని దూరము చేసి కార్యానుష్థానము సుకరము చేయుటకు బహు(శ్రుతము,
38 భారవి (ప్రతిభా వైభవం సాంప్రదాయసిద్ధమును అయిన శాస్త్రమే ఆధారమైనది కనుక విమర్శోపాయము శాస్త్రమే అని ఈ శ్లోకము వలన తెలియుచున్నది. కిరాతార్డునీయములోని రాజనీతి భారవి రాజనీతివిశారదుడు. ఈ మహాకావ్యమున ప్రాసంగికముగా రాజనీతిని చొప్పించినాడు. వనేచరపాత్రను సృష్టించి, తన్ముఖమున సంభాషణా శైలిలో కావ్యప్రథమసర్ణయందు దుర్యోధనుని రాజనీతిని వర్ణించినాడు. జూదములో ఓడిపోయిన పాండవులు ద్వైతవనమున నివసిస్తూ ఉండగా ధర్మ రాజుచే పంపబడిన గూఢచారి వనేచరుడు దుర్యోధనరాజ్యపరిపాలనాతంత్రమును చూచి, పరిశీలించి సేకరించిన వృత్తాంతమును ధర్మరాజునకు తెలుపుచూ, శ్లోః నిసర్గదుర్పోధ మబోధవిక్షవాః . క్వ భూపతీనాం చరితం క్వ జంతవః | తవానుభావో2_ యమవేది యన్మయా నిగూఢతత్త్వం నయవర్మ విద్విషామ్ | (1-ఖ రాజుల చరిత్ర సామాన్యముగా తెలియునది కాదు. అందులో అజ్ఞానముతో ఉన్న మాబోటి కిరాత వనేచరులకు అసలే అర్ధము కానిదైనను, తమ దయవలన తెలిసినది తెలినినట్లుగా నిగూఢతత్త్వమగు శత్రువుల రాజనీతివిధానము తెలిపెదనని ప్రారంభించినాడు. దుర్యోధనుడు రాజ్యసింహాసనాధిష్టితుడై వనవాసులైన తమవలన భావి పరాభమును శంకించువాడై కపటద్యూతముచే సంపాదింపబడిన రాజ్యమును నీతిమార్గము ద్వారా సంపాదింపబూనినాడు. “కాతర్యం కేవలా నీత్తిః” అన్నది కాక, పౌరుష మాశ్రయించి మనుస్మృత్యుక్త మార్గమున కామక్రోధాద్యన్తః శత్రువులను జయించి, భృత్యాద్యనురాగమును సంపాదించుచున్నాడు. శ్లో “సభీనివ ప్రీతియుజో౭. నుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుఖిః | స సంతతం దర్శ్భయతే గతస్మయః, కృతాధిపత్యామివ సాధు ఐన్ఫుతామ్ [1 (11-10)
భారవి ప్రతిభా వైభవం 33 దుర్గుణములను విడిచిపెట్టిన దుర్యోధనుడు భృత్యులకు విశేషబహుమానములు చేయుచుండుటవలన మిత్రులనుగా, మిత్రులకు అధికసత్కారములు చేసి స్వకుటుంబబంధువులనుగా బంధువులకు విశేషబహుమానములు చేసి, రాజ్యాధికారులనుగా, అప్రమత్తుడై సర్వజన సంప్రీతిపాక్రుడై, భృత్యాదులను అధిక సంతుష్టులను జేయుచున్నాడు. అందువలన భృత్యాదులు దుర్యోధనుని యందు అధికానురక్తులై తత్క్మార్యములను తమ మానప్రాణములను కూడ లెక్కచేయక, తమ కార్యములను వలె సాధించుచున్నారు.
దుర్యోధనుడు సామ-దాన-భేద-దండ రూప చతుర్విధోపాయములను చాతుర్యముచే ప్రయోగించుచున్నాడు. దానవిహీన సామము గాని, సత్కార విహీన దానము గాని లేదు. ఇతని దండోపాయము లోకోత్తరమైనది. శ్లో! “వసూని వాంఛ న్నవళశీన మన్యునా
స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః
గురూపదిప్టేన రిపౌ సుతే2 పివా
నిహన్తి దండేన స ధర్మవిష్లవమ్ 11” (1-18) దుర్యోధనుడు లోభోపహతచిత్తుడై ధనమును కోరి గాని, కోధముతో గాని ప్రజలను దండించడం లేదు. గురువులను దగ్గర ఉంచుకొని న్యాయ శాస్తానుసారము విమర్శ చేయించి, శత్రుమిత్రభేదము లేనివాడై రాజధర్మమనియే. తప్పు చేసిన వారలను శిక్షించుచున్నాడు. కనుక ప్రజ లందరికిని అతనియందు మరింత యధికభక్తి గలిగి ఆ రాజే చిరకాలము రాజ్యపరిపాలన కావించవలయునని కోరుకొనుచున్నారు.
ఇంకను దుర్యోధనుని జనపద క్షేమంకరత్వము గూర్చి వర్ణించిన ఈ శ్లోకము చూడండి ..... శ్లో! “సుఖేన లభ్యా దధతః కృషీవలై
రకృష్ణపచ్యా ఇవ సస్యసంపదః ।
వితన్వతి క్షేమమదేవమాతృక్షా
శ్చిరాయ తస్మిన్ కురువ శృకాసతి[” (1-17)
కీ. భారవి ప్రతిభా వైభవం ఆ దుర్యోధనుడు ప్రజాహిత కార్యచింతకుడై దేశక్షేమమునకు ఏ విధమైన లోపము కలుగనీయక, అత్యధికసమయము ్రజాభ్యుదయకార్యములకు వెచ్చించుచు, దైవముపై నాధారపడక నదీమాతృకములను నిర్మింపజేయుచు, కృషీవలులకు సంతోషము కలుగునట్లు చేయుచు, అనావృష్టిదోషము సంభవించినను పొలములకు నష్టము కలుగనివ్వక పోవుట వలన కర్షకులకు కష్టము లేకయే సమస్తభూములు ఫలించుచున్నవి. కనుక దేశము లన్నియు పాడిపంటలు కలిగియుండుటవలన అతని రాజ్యమునందు దుర్శిక్షమును తెలియనీయక బహుజాగరూకుడై రాజ్యపరిపాలన చేయుచున్నాడు.
ఆ దుర్యోధనునికి సేనావాహపినియు అనంతమై దేశభక్తి, రాజరక్తిపూరితమై
దేశరక్షణమున జాగ్రత్తగా మెలుగుచున్నది. శ్లో “మహౌజసో మానధనా ధనార్చితాః
ధనుర్చృతః సంయతి లబ్ధిక్తీర్ణయః |
న సంహతాస్తస్య న భిన్నవృత్తయః
ప్రయాణి వాంఛన్య్యసుభిః సమీహితుమ్ 11౫” (1-19)
ఆ దుర్యోధనుడు మహాబలపరాక్రమశాలురను, కులశీద్యభిమానధనులను, నిస్స్వార్థపరులను, ధనముచే పూజింపబడినవారును, ఆ విధములైన వీరులను సంపాదించి, పుష్కలమైన ధనమును ఇచ్చి, వారిని పోషించుచున్నాడు. వారి బలము చూచుకొని యా దుర్యోధనుడు రాబోవు మహాయుద్ధమునందు తనకే జయము కలుగునని ధైర్యముగా నున్నాడు. దుర్యోధనుని రాజ్యశాసనము :- శ్లోః “న తేన సజ్యం క్వచి దుద్యతం ధనుః
కృతంనవా కోపవిజహ్మ మాననమ్ ।
గుణానురాగేన శిరోభిరుహ్యతే
నరాధిపై ర్మాల్య మివాస్య శాసనమ్ 11” (1-21) దుర్యోధనుని దయాదాక్షిణ్యాది గుణములను బట్టి మహారాజు లందరు స్వయముగా నాతని యాజ్ఞను పూలదండ వలె శిరసావహించుచున్నారు.
భారవి ప్రతిభా వైభవం న!
ఆతని మిత్రనంపత్తికిని కొరత లేదు. దుర్యోధనుడు నవయౌవన మదగర్వితుదైన దుశ్శాసనుని యౌవరాజ్యపట్టాభిషిక్తుని జేసి, యజ్ఞయాగాది క్రతువుల నాచరించుచు ధార్మికుడై యున్నాడు. నిస్సపత్స్నుడై సాగరపర్యన్త భూమండలమును శాసించుచు, భారతచక్రవర్తియె, పాండవ సమూల నిర్మూలన విషయమున భవిష్యదాలోచనాసక్తుడై చింతానిమగ్నుడై యున్నాడని దుర్యోధనుని రాజనీతి నిట్లు చక్కని శైలిలో వర్ణించినాడు.
మరియు ధర్మరాజు - ద్రౌపదీ - భీమసేన సంభాషణములును రాజనీతి ప్రపూరితములై, యుత్తేజకరములై ప్రకాశించుచున్నవి. భారవిమహాకవి “రాజనీతి వైశారద్యమునకు ఈ వనేచరోపన్యాసము చక్కని తార్కాణము.
పాత్రచిత్రణ
భారవికవి పాత్రచిత్రణమున నిరుపమానశిల్పమును ప్రదర్శించినాడు. “క్రిరాతార్డునీయ” మహాకావ్యమున ద్రౌపదీ - భీమసేనుల పాత్రలను చక్కగా పోషించినాడు. రసానుకూలముగా వారి వారి స్వరూపస్వభావములకు తగినట్లుగా పదములను ప్రయోగించుచూ రమ్యముగా 'తీర్చిదిద్దినాడు.
పూర్వకాలమున భారతదేశమున స్త్రీల కెంతటి వాక్స్యాతంత్ర్యము, సమానతలు, ప్రాముఖ్యమును గలవో దదౌపదీపాత్రముఖమున వెల్లడించెను. వనేచరుడు దుర్యోధనుని రాజ్యపరిపాలనావిధానమును వర్ణించి వెళ్ళగా, ధర్మరాజు మొట్టమొదట ద్రౌపదీదేవితో ఆ వృత్తాంతమును తెలిపినాడు. అపుడు ఆ వీరనారీ మణి ధర్మరాజుతో మాట్లాడిన క్రోధోద్దీపనవచనములు, స్త్రీ స్వాతంత్ర్యమును, ఆమెరాజనీతి పరిజ్ఞానమును చాటుచున్నవి. కొన్నింటిని చూతము ..... శ్లో! “అఖండ మాఖండలతుల్యధామఖి -
శ్చిరం ధృతా భూపతిఖిస్స్ప్వవంశదైః ॥ త్వయాత్మహస్తేవ మహీ మదచ్యుతా మతంగజేన '్రగివాపవర్డితా 11” (1-29)
దేవేంద్రతుల్యప్రభావభాసమానులైన కురువంశరాజులైన రాజ్యలక్ష్మిని. అవి చ్చిన్నముగా పరిపాలించినాడు. నీవు అట్టి దానిని మదపుటేనుగు పూలదండను వలె నీ చేతులార నిష్కారణముగ పరిహరించివేసితివి. నీ ఉదాసీనదోషము
వం భారవి ప్రతిభా వైభవం వలననే యీ యనర్ధములు సంభవించినవి. కనుక నీవు తిరిగి యా యనర్ధముల నన్నింటిని తీసివేయుటకై శత్రుసంహారప్రయత్నములను చేసి, మిమ్ముల నందటిని రక్షించుటయే గాక నీ పూర్వుల బజెన్నత్యమును గూడ రక్షించవలసినదని నిందా స్తుతితో ధర్మరాజును ్రోత్సహించినది. మరియు ..... శో “గుణానురక్తా మనురక్తసాధనః కులాభిమానీ కులజాం నరాధిపః | పరైస్త్వదన్యః క ఇవాపహారయే - న్మనోరమా మాత్మవధూమివ (శ్రియమ్ ॥” (1-31) అనుకూలసహాయమును, క్ష్మత్రియత్వాఖిమానమును కలిగియుండిన మహారాజు లలో నీ వొక్కడవు తప్ప మరెవరు కూడ గుణానురక్తయై వంశపారంపర్యముగా వచ్చుచున్న రాజ్యలక్ష్మిని, గుణానురక్తయు, పవిత్రవంశమున జన్మించినదియు సౌందర్యవతియు నగు భార్యను వలె స్వయముగా శత్రువుల పాలుచేసినవారు లేరు. మానధనులకు రాజ్యలక్ష్యపహారము కళత్రాపహారము వలె అవమానకర మగుటవలన ఉపేక్షించకూడదు కనుక తద్విషయమై ప్రయత్నించుమని నొక్కి వక్కాణించినది. ఇంకను ..... శ్లో! “వ్రజన్తి తే మూధఢధియః పరాభవం భవన్తి మాయావిషు యే న మాయినః |” (1-80) శత్రువులు మాయావులై మాయలను పన్నుచుండగా వారి విషయమై మాయకు ప్రతిమాయలను పన్నక బుజుమార్గమున వ్యవహరించెడు నవివేకులు ఆ శత్రువుల వలన పరాభవమును తప్పక పొందుదురు. కనుక మాయావుల విషయమున మాయలను చూపవలసినదే గాని యుపేక్షించకూడదు. నీ వట్టి యుపేక్ష చేసినందు వలననే యీ యనర్థములు మనకు సంభవించినవని ప్రబోధించినది.
“ష్టన్సేన సిద్ధిం మునయో న భూభృతవొ (౧-42) క్రోధమువలన చాలా నష్టములున్నవి. జయాపజయములు దైవాధీనములు గనుక తప్పనిసరిగా మనకే జయము కలుగునని నిశ్చయించుటకు వీలులేదు. శాంతము చేత కూడ కార్యము సిద్ధించదు. ఎందుకనగా నిస్పృహులగు మహర్షులకు
భారవి ప్రతిభా వైభవం 4 మోక్షసిద్ధిని పొందుటకు శాంతి కార్యసాధక మైనట్లు, రాజులకు రాజకార్యములను సాధించుటకు సాధ్యము కాదు. కనుక క్షత్రియులు పౌరుషము నవలబించి, శత్రుజయమునకు ప్రయత్నించవలయును గాని శాంతిచే ప్రయత్నించుట తెలివితక్కువ పని యగునని లోకజ్జతను ప్రదర్శించినది.
మరియు భీమసేనుని వచనముల ద్వారా పాత్రౌచిత్యమును కవి పాటించినాడు. ఒకటి, రెండింటిని చూతము .....
“అభిమానవతో మనస్వినః
ప్రియమువ్సైః పద మారురుక్షతః ॥ వినిపాతనివర్తనక్షమం మతమాలంబన మాత్మపౌరుషమ్ 1” (2-13)
మానధనుదైన మహాశూరుడు మహోన్నతస్థానమగు రాజ్యమును పొందవలయునని మహోత్సాహముతో ప్రయత్నము చేయునప్పుడు, అనేక శత్రువు లుండుటవలన అనేకములగు అనర్ధములు సంభవించుచుండును. వాటిని పారద్రోలి ఈప్సితమును పొందుటకు ఆత్మపౌరుషమే సహాయమగును. మహాపురుషులకు పౌరుషమే సహాయము గాని యితరములతో పనిలేదు. కనుక పౌరుషము నవలంబించి శత్రుసంహారమునకు ప్రయత్నింపుమని భీమసేనుడు ధర్మరాజు నుద్చోధించినాడు. ఇంకను ..... శో మదసిక్తముఖైర్మృగాధిపః కరిభిర్వర్తయతే స్వయం హతైః |
లఘయన్ ఖలు తేజసా జగన్న మహానిచ్చతి భూతి మన్యతః।[(2-18) మహాతేజశ్ళాలి యగు మృగరాజు స్వయముగా చంపబడిన మదపుటేనుగులను మాత్రమే తిని జీవించును గాని, యితరజంతువులచే చంపబడిన మృగములను తినదు. అట్లే మహాతేజశ్చాలి యగు మహాపురుషుడు కూడ తన తేజస్సుచే జగత్తునంతయు వశపరచుకొని తనంతట తానే తన ఐశ్వర్యమును వృద్ధినాందించు కొనును గాని, యితరుల సహాయము నపేక్షించడు. కనుక సామము చేతనే కార్యసిద్ధి యగుచుండగా యుద్ధ మెందుకని ఆలోచించి సామముచేతనే కార్యమును సాధించుకొనకూడదు.
టే భారవి ప్రతిభా వైభవం శః “సామాదానేన భేదేన సమస్త రథవా పృథక్ | విజేతుం ప్రయతే తారీన్ న యుద్ధేన కదాచన 1 (మనుస్మృతి) మరియొకటి చూడండి ..... శ్లో; “కిమపేక్ష్య ఫలం పయోధరాన్ ధ్వనతః ప్రార్థయతే మృగాధిపః | ప్రకృతిః ఖలుసా మహీయస స్పహతే నాన్యసమున్నతిం యయా ॥ (2-21) అదియును గాక గొప్పవారికి ప్రయోజనముతో పనిలేదు. మహాతేజశ్ళాలియగు సింహము ఏవిధమైన ఫలము లేకపోయినను, ఉరుముచున్న మేఘముల మీద కురుకుచుండును. అది గొప్పవారి స్వభావము. గొప్పవారు ఇతరుల అభివృద్ధిని సహింపలేక తమ యాధిక్యమునే కోరుచుందురు. శత్రుసంహారము చేయుట వారికి పరమపురుషార్ధము. ఈ విధంగా లోకమునందలి శూరులందరు సంచరించుచుందురు. నీవు మాత్రము ఆ మార్గమున సంచరించక ప్రాకృతజనుల మార్గ మవలంబించి నీ క్తీర్తి-ప్రతిష్టలను పాడుచేసుకొనుచున్నావు. ఇది నీక్తు తగదని పొతవు పలికినాడు. ఈ రకంగా రాజనీతిపరిజ్ఞానం కలవానిగా భీమసేనుడు చిత్రించబడినాడు. నాయకుడైన అర్జునుడు ధీరోదాత్తుడు. మహాసత్త్వుడు, అతిగంభీరుడు, కృపాళువు, ఆత్మశ్లాఘారహితుడు, స్టెర్యము కలవాడు, దృధవ్రతుడు అను లక్షణములకు తగినవాదుగా, ఉత్తమనాయకునిగా చిత్రింపబడినాదు. ఒకటి రెండు ఉదాహరణలు ..... శ్లో! శరదంబుధరచ్చ్భాయాగత్వర్యో యౌావనశ్రియః । ఆపాతరమ్యా విషయాఃపర్యన్తపరితాపినః ॥ (11-12) శరత్కాలమందలి మేఘముల నీడ అస్థిరము, శీఘ్రముగా నశించును. అట్లే యౌవనశోభ కూడ అస్థిరమే! యౌవనము ఎవరకినీ స్థిరము కాదు. దాని వలన లోకులు మదించుదురు. అట్లే శబ్బాదివిషయములు కూడ అనుభవించు సమయమున మాత్రమే రమణీయము లగుచున్నవి. పరిణామంలో శరీరేంద్రియ
భారవి ప్రతిభా వైభవం ఉర్ శైథిల్యమువలన దుఃఖప్రదాయకము లగుచున్నవి. అందువలన విషయములను విడిచి తపస్సు చేయడ మనేది చాలా మంచిపని. శ్లో “జన్మినో ౬స్య స్థితిం విద్వాన్ లక్ష్మీమివ చలాచలామ్ ।
భవాన్ మా స్మ వధీన్న్యాయ్యం న్యాయాధారా హి సాధవః (11-380) ఏ విధంగా నైతే లక్ష్మి అస్థిరమో, అట్లే జీవనము కూడ అస్థిరమని నీకు తెలుసు. అందువలన అస్థిరములైన వస్తువులను గూర్చి పరులను పీడించడము చేత న్యాయమార్గము నీవు వదలకూడదు. సత్పురుషులు న్యాయకర్మను మాత్రమే చేయుదురు కాని అన్యాయమును చేయరు. ఒకవేళ నీవు పీడించువానివైతే ప్రజలచేత అసాధువుగా పిలువబడగలవు. శ్లో! “క్షతియస్తనయః పాండోరహం పార్టో ధనంజయః |
స్థితః ప్రాస్తస్య దాయాదై గరాతు ర్ట్యేష్టస్య శాసనే 1” (11-45) క్షత్రియవంశంలో నా జన్మ జరిగినది. పాండురాజకుమారునిగ మహాకులంలో జన్మించినాను. పృథాపుత్రులలో మహావీరుడైన అర్జ్హునుడను. ఉత్తరకురు దేశములను జయించడంవలన ధనంజయుడనని లోకంలో ప్రసిద్ధి. దుర్యోధనాదులచేత రాజ్య లోభంవలన నా పెద్ద అన్నయైన యుధిస్టిరుడు రాజ్యము నుండి వెడలగొట్టబడినాడు. ఆ అవమానప్రతిక్రియ చేయడానికి ధర్మరాజు ఆజ్ఞచేత తపస్సు చేస్తున్నాను. అంతే కాని మోక్షముకొరకు కాదు. అతని ఆజ్ఞను పాటించకపోవడంవలన మానహాని, సౌభ్రాత్రభంగము, పూజ్యపూజా వ్యతిక్రమము కాగలదు. అసూయతో కూడిన శత్రువులను అణిచివేసే కోరిక గల రాగద్వేషము యుక్తమగు మనస్సు గల నాకు సర్వథా మోక్షాధికారము లేదు. శ్లో! “ఉదాహరణ మాశీఃషు ప్రథమే తే మనస్వినామ్ ।
శుష్కే౭_శని రివామర్నో యైరరాతిషు పాత్యతే ౯” (11-65) ఏ వీరులైతే శుష్మవనసదృశులైన శత్రువులయందు వారి వినాశముకొరకు అశని సదృశమైన కోధమును పడవేయుదురో, వారే మానవులలో అ(గ్రగణ్యులు. వారే “త్వమేవం భూయాళ౯” అను విధంగా ఆశీర్వచన మివ్వడంలో ఆదర్శభూతులగు చున్నారు. ఎట్లు నీరసముచేత శుష్క్మవనవృక్షములు అనఘ్రము లగుచున్నవో, అట్లే అహంకారము చేత శత్రువులు కూడ అనమ్రులు, అవినీతు లగుచున్నారు.
46 భారవి ప్రతిభా వైభవం ఈ ఇంద్రార్జునసంవాదరూప శ్లోకముల ద్వారా అర్జునుని వ్యక్తిత్వము గమ్యమాన మగుచున్నది. ప్రకృతివర్ణన భారవికవీంద్రుడు “కిరాతార్డునీయ” మహాకావ్యమున ప్రాకృతిక సుందరదృశ్య నిరూపణమును జీవకళ ఉట్టిపడే విధంగా మనోహరంగా వర్ణించినాడు. హిమాలయ ..... సూర్యాస్తమయ ..... చంద్రోదయాది వర్ణనలు తరువాత కవులకు మార్గదర్శకము లగునట్లు చిత్రించగలిగినాడు. అర్జునుడు ఇంద్రకీలపర్వతమున తపమాచరించడానికి పోవునప్పుడు మధ్యమార్గమున శరదృతువును వర్ణించుచు జనపదములను కన్నుల కానందము కలిగించువిధముగా చి(త్రించినాడు. ఆలమందలు ..... వ్రజగోపికలు ..... సస్యములు మొదలగు వానిని శృంగారభావమున అపూర్వవర్ణరచన నొనర్చిన జానపద కవి, భావకవి, భారవి కవి. చతుర్ధసర్ణమున నవరసరుచిర రచనాచాతుర్యము ఉట్టిపడే విధంగా ప్రధాన రసము వీరమైనను, శృంగారాదులను మేళవించి, కవి శరదృతువర్ణనము గావించి, అర్జును డంతటివానిని మోహమున ముంచెత్తుచు “న హీంగితజ్ఞోలి వసరేలి. వసీదతి ....” (4-20) అని యక్షముఖమున అర్జునునికి మరోసారి శరత్సౌందర్య సంపదను వర్ణించు విధము ఈ మహాకవి ్రకృతివర్ణనాప్రతిభను వేనోళ్ళ చాటుచున్నది. మచ్చున కొకటి, రెండు చూతము యక్షుని వచనము ..... శ్లో “ఇయం శివాయా నియతే రివాయతిః కృతార్థయన్తీ జగతః ఫలైః క్రియాః | జయ(శ్రియం పార్ధ! పృథూకరోతు తే శరత్చ్రసన్నాంబు రనంబువారిదా 1” (4-21) ఓ అర్జునా! శుభకరమైన దైవముయొక్క ఫలప్రదానకాలము వలె, లోకము యొక్క కృష్యాదికర్మలను పంటలచే సఫలము గావించుచు నిర్మలజలయై, నిర్మల జలదయై యీ శరత్తు నీకు జయలక్ష్మిని వృద్ధినాందించుగాక యని యక్షు డాశీర్వదించినాడు.
భారవి ప్రతిభా వైభవం టీ
దైవ మెంత కళ్యాణకారకమైనను ఆ సమయమున ఫలించదు. కర్షకులు వర్చర్తువున ఎంత కష్టించినను, ఆ కృషి శరత్తున గాని ఫలించదు. కృషి విధికి వఫలప్రదానకాలము శరత్మాలము. శరత్తున నదీనదములు నిర్మలములైనవి. మేఘములు ప్రసన్నములైనవి. ఆకాశము నిర్మలమైనదని వర్ణించుట పార్గునకు శుభశకునసూచనము. పాండవజీవితమున దుఃఖప్రతీకయైన వర్షర్తువు పోయి, ఆనందప్రతీకయైన శరత్తు ప్రవేశించుచున్నది. అర్జునుడు దివ్యాస్త్ర సంపాదనమునకు బయలుదేరుచుండగా యక్షుడు అతనికి విజయమును గోరుచు శరద్వర్ణ్షనమును ఆరంభించినాడు.
అచేతనములైన వస్తువులకు చైతన్యమును కల్పించి చిత్రించు నీ కవి కల్పనా చాతుర్యము అనన్యసామాన్యము. ఒక ఉదాహరణ : ..... శ్లో “అసావనాస్థా పరయా£. వధీరితః
సరోరుహిణ్యా శిరసా నమన్నపి | ఉపైతి శుష్యన్ కలమః సహాంభసా మనోభువా తప్త ఇవాభిపాండుతామ్ ॥ (ఉ-384) శరత్కాలమున పండి కోతకు సిద్ధంగా ఉన్న వరిపైరును కవి వర్ణించు చున్నాడు. వరిధాన్యపు బరువుచే వంగి నమస్మరించుచున్నను, అనాదర పరయైన పద్శినిచే తిరస్కృతమై నిలువెల్ల యెండి, శిరమున శుష్కించి, మన్మథుని బారికి తప్తమగుచున్నదా యన్నట్లు తెల్లదనమును పొందుచున్నదట. శరత్తున కేదారములు పండి నీరమార తెల్లబడుట సహజము. శరదృతువున పద్మిని వికాసవంతమగు టయు ప్రకృతిసిద్ధము. ఇట్టి సన్నివేశమును కవి అలంకారములచే నలంకరించి నాడు.
“కలమ” శబ్దము పుంలింగము. “సరోరూహిణీ” శబ్దము ్రీలింగము. “కలమము” వయస్సు మరలిన ఒకానొక నాయకుడు. “పద్మిని” జాతి స్రీ నాయిక. యౌవనమదగర్విత యైన నాయిక వయోవృద్ధుడగు నాయకుని తిరస్మరించుచున్నది. నాయికాతిరస్కారమున నాయకుడు విరహతప్తుడై కృశించిపోయినాడు. ఇచట నాయికానాయకవ్యవహార మారోపింపబడి, మదన సంతప్తగా నుత్రేక్షించుట ఎంతయో లోకోత్తరచమత్కృతిని అందించుచున్నది.
ఉం భారవి ప్రతిభా వైభవం ఈ మహాకవి చేసిన సాయంకాలవర్దనము చూడండి : ..... శ్లోః। “కాన్తదూత్య ఇవ కుంకుమతా(మ్రాః సాయమండల మభిత్వరయన్వః | సాదరం దద్భశిరే వనితాఖిః సొధజాలపతితా రవిభాసః | (9-6) భవన గవాక్షమార్గములనుండి ప్రవేశించు సూర్యకిరణములు ప్రియుని దూతికల వలె నాయికలచే చూడబడినవని మనోహరముగా వర్ణించినాడు. ఇచ్చట సూర్యకిరణములు సాయంకాలసమయము గనుక, కుంకుమ వలె ఎర్రని వని, సాయంకాలపు సూర్యమండలమునుండి వేగిరముగా సౌధజాలములనుండి గృహమున ప్రవేశించినవని చెప్పినాడు. అవే విశేషణములు దూతికల నుద్దేశించి కుంకుమ లలదుకొనుటచే ఎ(ర్రనివారని, సాయంకాల మగుచున్నందున త్వరపడుచున్న సౌధజాలము (దొడ్డిదారి) నుండి ్రవేశించువారని శ్లేషత్రో ఉపమానమునకు అన్వయించినవి. ఇందు శ్లేషానుప్రాణితమైన ఉపమాలంకారము గూడ కవికి గల ఉపమానైపుణ్యమును, వర్ణనారీతిని వ్యక్తము చేయుచున్నది, ఈ మహాకవి వర్జనాచాతుర్యమునకు ఇంకొక ఉదాహరణ : ..... శ్లోః “తిరోహితాన్తాని నితాన్తమాకులై .... రపాం విగాహా దలకైః ప్రసారిభిః | యయు ర్వధూనాం వదనాని తుల్యతాం ద్విరేఫవృన్టాన్తరితైః సరోరుహైః ॥॥ (8-47) అర్జునుని తపోభంగము గావించుటకై వచ్చిన అప్సరసల జలక్రీడలను వర్షించు సమయమున ఈ కవి చూపిన అర్ధగౌరవము, ఉపమానైపుణ్యము అమోఘములు. నీట మునిగి లేచిన కాంతలయొక్క ముఖములను వర్ణించుచు, ముంగురులు కప్పుకొనుటచే వారి ముఖములు ద్విరేవబ్బందములచే అంతరితములైన (కప్పబడిన) పద్మములతో తుల్యత్వమును పొందినవని చెప్పెను. అలకములు నీట మునిగినందువలన మిక్కిలి ఆకులములై ముఖమున పరచుకున్నవని, అందువలన వారి ముఖములు తిరోహితాన్తములని చెప్పుచు, వానికి ఉపమాన
భారవి (ప్రతిభా వైభవం షం ములుగా తుమ్మెదలచే ఆవరించబడిన కమలములను చెప్పుట ఎంతో రమణీయ మైన కవి భావనాశక్తికి అసాధారణమైన ఉదాహరణమై శోభించుచున్నది. ఇచ్చటి ఉపమాలంకారము ఎంతో శోభాయమానమైనది.
ఈ కవి వర్ణించిన ఒక అద్భుతసన్నివేశము చూడండి : ..... శ్లో! “ఉత్సుల్లస్థలనళినీవనా దముష్మా
దుద్భూతః సరసిజసంభవః పరాగః | వాత్యాభిర్వియతి వివర్తితః సమన్లా దాధత్తే కనకమయాతపత్రలక్ష్మీమ్ 11” (5-89)
స్టలకమలములనుండి లేచిన పరాగము గాలిచేత లేవగొట్టబడి ఆకాశంలో మండలాకారంగా వ్యాపించినది. అది సువర్జసూత్రనిర్మితమైన ఆతపత్రము (గొడుగు) యొక్క శోభను అనుకరిస్తున్నది. ఈ శ్లోకంలోని ఆతపదత్రభావన సుందరంగా ఉన్నది. దీనివలన “దీపశిఖ కాళిదాసు” - “ఘంటామాఘుని” వలె “ఆతపత్ర భారవిగా ప్రసిద్ధి కెక్కినాడు.
దీనికి భిన్నమైన వర్ణనలలో కూడ భారవి సిద్ధహస్తుడు. మన్మథుడు, యుద్ధము, సైన్యము, సురతక్రీడావర్జనలు కూడ మిక్కిలి విస్తారంగా, మనోహరంగా కలవు.
భారవేః అర్ధగౌరవమ్
మహాకవి భారవి కిరాతార్జునీయ రచనము సంస్కృతసాహితీజగత్తులో నర్ధగౌరవమున విశిష్టన్ధానము నలంకరించును. “ఉపమా కాళిదాసస్య భారవే రర్ధగౌరవమ్” అని కొనియాదడబడుచున్నది.
స్వల్పశబ్దములచే విపులార్థవర్దన మొక కళారహస్యము. భారవి మితభాషి. చెప్పిన కొద్ది శబ్దాలలో అపారమైన. అర్జాన్ని ఇనుమడింపజేయగల శక్తి ఈ మహాకవికి గలదు.
అర్ధగౌరవము చేత తక్కువ శబ్దాలను ప్రయోగించడంవలన భారవి కవిత్వంలో శబ్దార్ధసొందర్యంలో ఎక్కడా లోపం కనిపించదు. శబ్బసౌందర్యం భారవి ప్రతి శ్లోకంలో ఇంకను అధికంగా కనిపిస్తున్నది. లలితమైన పదావశిగో
50 భారవి (ప్రతిభా వైభవం అర్ధగొంభీర్యమునకు హృదయంగమమైన సమన్వయము ఒక మణిసంయోగము వలె కనిపించుచున్నది.
చతుర్దశసర్గలో వాక్చాతుర్యము గల అర్జునుడు శత్రువుయొక్క అభిప్రాయ మును తెలుసుకొని, వనేచరునితో నిట్లు మాట్లాడుచున్నాడు. శః “స్తువన్తి గుర్వీ మభిధేయసంపదం
విశుద్ధిముక్తే రపరే విపశ్చితః ॥ ఇతి స్థితాయాం ప్రతిపూరుషం రుచౌ సుదుర్లభాః సర్వమనోరమా గిరః ॥ (4-5)
ఈ కావ్య ద్వితీయసర్గలో శత్రుకృతపరాభవమును పరామర్శించుచు క్రోధోద్దీపన వచనములను పలికిన భీమసేనుని, ధర్మరాజు తన శాంతివచనముల ద్వారా సమాధాన పరిచినాడు.
భీమసేనుని సుదీర్జోసన్యాసము నిట్లు ప్రస్తుతించినాడు.... శ్లో “స్ఫుటతా న పదై రపాకృతా
న చ న స్వీకృత మర్ధగౌరవమ్ ।
రచితా పృథగర్థతా గిరాం
న చ సామర్థ్య మపోహితం క్వచిత్ 1” (2-27) భీమసేనుని ఉపన్యాసమందలి '్రతిపదము విస్పష్టమైనది. అర్ధగౌరవముతో కూడినది. ఏ విషయము చెప్పుచున్నను పునరుక్తిదోషము లేకుండ నున్నది. మాటలు భావపూరితములు. పరస్పరసాకాంక్షత్వము విడువబడకుండ ఉపన్యసించ బడినది. ఈ శ్లోకము భారవి మహాకవి రచనారీతిని, కవితా కమనీయతను, అర్థగాంభీర్యమును తెలుపుచున్నది.
సాహాసికునికే ఫలసిద్ధి కలుగును. వివేకము ఎందులకని, ధర్మరాజు భీమునితో శ్లో “అభివర్షతి యో౭.ను పొలయన్
విధిబీజాని వివేకవారిణా ॥
స సదా ఫలశాలినీం క్రియాం
+శరదం లోక ఇవాధితిస్టతి 1” (2-31)
భారవి ప్రతిభా వైభవం ర5్1 లోకమునందు కర్షకుడు బీజములను సకాలమున చల్లి నీటిచే తడుపుచున్నచో, శరత్మాలము వచ్చువరకు ఆ పంటలు ఫలించి, ఆ వ్యవసాయదారునకు ఆనందముగా నుండును. అదే విధంగా ఆలోచించి చేసిన వాని కార్యము ఫలించి, లాభము కలుగజేయును. కనుక తొందరపడి ఏ కార్యమూ చేయకూడదు.
“సాహసే లక్ష్మీ” అని సాహసమే పరమావధి కాదు. దానికి తోడు వివేక ముండవలయును. వివేకము అత్యంత ఆవశ్యకమని అతిగంభీరముగా తెలిపినాడు. శ్లో “గహనా విదధీత న క్రియా
మవివేకః పరమాపదాం పదమ్ ।
వృణతే హి విమృశ్యకారిణం
గుణలుబ్గాః స్వయమేవ సంపదః॥[” (2-80) ఏ కార్యమునైనను ఆలోచింపక తొందరపడి చేయకూడదు. అట్లు చేసిన కార్యం వలన లాభం లేకపోవుటయే గాక పైగా ఆపదలు కూడ వచ్చును. బాగుగా నాలోచించి కార్యములు చేయు పురుషునికి సంపదలు సిద్ధించునని వివరించినాడు.
సంపదలు ఎట్లు సిద్ధించునో ఈ క్రింది శ్లోకంలో చెప్పబడినది... శ్లో; “జితేన్రియత్వం వినయస్య కారణం
గుణప్రకర్నో వినయాదవాప్యతే | గుణాధికే పుంసి జనో ౬నురజ్యతే జనానురాగప్రభవా హి సంపదఖొ॥
ఇంద్రియని[గగ్రహత్వము వినయమునకు కారణము. వినయమువలన సద్గుణములు అలవడుచున్నవి. గుణవంతుడైన పురుషుని జనము అనురాగమున ఆదరించు చున్నది. జనానురాగమువలన సంపదలు సిద్ధించుచున్నవి. ఈ వాక్యములు ఎంత సత్యములో ఆలోచించిన గాని యవగతము కాదు.
మరియు విమర్శించి పనిచేయువాని సాఫల్యము గూర్చి చెప్పుచున్నాడు. శ్లో “సమవృత్తి రుపైతి మార్దవం సమయే యశ్చ తనోతి తిగ్మతామ్ |
అధితిష్టతి లోకమోజసా స వివస్వానివ మేదినీపతిః: | (2-38)
52 భారవి ప్రతిభా వైభవం ఏ రాజు సమయాసమయములను బట్టి మృదుత్వము చూపవలసి వచ్చినప్పుడు మృదుత్వమును, తీక్షణత్వమును చూపవలసి వచ్చినప్పుడు తీక్షణత్వము చూపుచూ పరిపాలన చేయుచుండునో, ఆ రాజు లోకమును తన ప్రభావముచే సూర్యుని వలె ఆక్రమించును. కనుక సమస్తకార్యములను విమర్శించి, సమయము వచ్చి నప్పుడు పౌరుషమును చూపించవలయును గాని సమయము కానప్పుడు సంరంభ మును చూపించకూడదు. భారవి కవి అర్భాలంకారశైలి నిరూపమానము. ఏ వస్తువునైన లోక ప్రసిద్ధ వస్తువుతో పోల్చిన ఆ వస్తు స్వరూప స్వభావ సౌందర్యముల నచ్చు పడునట్లు సాక్షాత్మరింపజేయదగును. కాళిదాసు వలె ఇతడును ఉపమానములను కూర్చుట యందును సిద్ధహస్తుడు. రాజునకు సూర్యోపమానము నొసంగుట అర్ధగాంభీ ర్యమునకు నిదియు నుదాహరించదగును. శ్లో “వజ్రాదపి కఠలోరాణి మృదూని కుసుమాదపి | లోకోత్తరాణాం చేతాంసి కో ను విజ్ఞాతు మర్షతి” ॥ అని భవభూతిపండితుడు “ఉత్తర రామచరిత్ర” లో శ్రీరామచంద్రుని వర్ణించ గలుగునట్లు భారవి తన కావ్యమున వెలిబుచ్చి, రాజప్రవృత్తిని విశదీకరించినాడు. రాజనీతి స్వరూపము శ్లో “సత్యాన్ఫతా చ పరుషా ప్రియవాదినీ చ హిస్రా దయాళురపి చార్థపరా వదాన్యా | నిత్యవ్యయా ప్రచురనిత్యధనాగమా చ వారాంగనేవ నృపనీతి రనేకరీతిః” || (హితోపదేశం 2-183) రాజనీతి ఒకే విధంగా నుండక బహుముఖముల నుండును. సమయము... వ్యక్తులు... కార్యాకార్యాద్యనుగతముగ వారాంగన వలె నత్యాసత్యాది స్వరూపములతో నానావిధముగా కనిపించునని వర్ణించబడినది. ఇచట వారాంగ నోపమానమున రాజనీతిస్వరూపము తేటతెల్లమగుచున్నది. ఇట్టి ఉపమాలాంకార రత్నములను పొదిగి గంభీరార్ధమును ప్రబోధించును. భారవి గుణప్రియుడు, గుణవంతుడే శ్రీమంతుడగునని అట్టి సిరియే
భారవి ప్రతిభా వైభవం న్ కలకాలము వర్దిల్లుననియు అడుగడుగున చెప్పినాడు. తేజస్విత్వము గురించి రాజునకు సూర్యోపమాన మొసంగుట నీ కవియొక్క రాజ్రవృత్తిని ధ్వనింప జేయుచున్నది.
మరియు క్రోధమువలన కార్యహానియే జరుగునని ధర్మజుడు చెప్పుచున్నాడు. శ్లో! “అతిపాతితకాలసాధనా స్వశరీరేన్దియవర్లతాపనీ |
జనవన్న భవన్త మక్షమా నయసిద్ధేరపనేతు మర్షతి” | (2-42) యుక్తాయుక్త... సమయాసమయ... కార్యాకార్యాది జ్ఞానము ఆవేశపరునకు నశించును. ఇంతియే గాక తన శరీరమునకును ఇంద్రియములకును సంతాప రూప బాధలు కలుగును. అసమయకోపము వలన నిట్టి యనర్ధపరంపరలు సంభవించును. రాజనీతివలన కాదగిన కార్యసిద్దు లన్నియు చెడిపోవును. కనుక మహావివేకశాలి వగు నీకు ఈ విధముగా అసమయక్రోధావేశపరవశత్వము తగదు. అట్లే కార్యములను చెడగొట్టకుము. అని ఇట్లు ధర్మజుడు భీమునికి నీతిని ఉపదేశించినాడు.
ఇట్టి రచనానైపుణ్యము సహృదయులకు “అర్ధచమత్కృతి' కలిగించుచు, మానవ మనుగడ కొక మార్గదర్శక మగుచున్నది. శ్లో! “సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్ ।
ఏక మాపాతమధుర మన్య దాలోచనామృతమ్” ॥ అను సూక్ష్యనుసారము రసికులకు ఆలోచించిన కొలది కావ్యసుధారసము అల వడుచునే ఉండును. సంపదగురించి వేరుగా ప్రయత్నించ నవసరము లేదు. పదిమంది ప్రశంసలకు పాత్రుడగు విధముగ నడవడి దిద్దుకొనిన చాలునని గంభీరభావమున వ్యంజింపజేయుట భారవి రచనయందలి కవితావైశిష్ట్రము.
రసపోషణ
“విభావానుభావవ్యభిచారి సంయోగా (ద్రసనిష్పత్తి” భరతుడు నాట్య శాస్త్రములో రసస్వరూపమును నిర్వచించినాడు.
విభావములు, అనుభావములు, సాత్త్విక భావములు, వ్యభిచారి భావములు
రీ భారవి ప్రతిభా వైభవం అను వాని సంయోగమువలన ఆస్వాద్యమానముగా చేయబడిన న్థాయిభావము, రసమని యర్థము. సజాతీయ, విజాతీయ భావములలో వేటిచేతను తిరస్కరింప బడక రసపరిణతివరకు నిలిచియుండునది స్థాయిభావము.
శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుతములని ఎనిమిది రసములను, వాటిని క్రమంగా రతి, హాస, శోక, క్రోధ, ఉత్సాహ, భయ, జుగుప్స, విసయములని, ఎనిమిది న్థాయిభావములను భరతముని నిరూపించినాడు. శమ న్థాయిభావాత్మకమైన శాంత రసమును తొమ్మిదవ రసంగా భరతు డంగీకరించినట్లు తరువాత అలంకార శాస్త్ర తత్త్వవేత్తలు ప్రతిపాదించినారు. కాలానుగుణంగా రససంఖ్యా విషయంలో చర్చ జరిగి, భక్తి - వత్సల మొదలైన రసములను, చివరికి వ్యభిచారి భావములన్నియు రసములనే యభిప్రాయమును విమర్శకులు వ్యక్తీకరించినారు.
ఈ మహాకావ్యంలో ప్రధానరసం వీరం. శృంగార, రౌద్ర, భయానకాదులు అంగరూపముగా వర్ణించబడినవి.
“అథ వీరో నామ ఉత్తమప్రకృతి రుత్సాహాత్మకః” గగౌరో వీరస్తు విజ్ణేయః”
“మహేద్ధ దైవతో£౬యం సముదాహృతఃా అని చెప్పినట్టు ఉత్సాహ న్థాయీభావాత్మకమైన వీరరసము ఉత్తమ ప్రకృతులకు సంబంధించినది. ఈ రసమునకు మహేంద్రుడు దేవుడు, గౌరవర్దంగా చెప్పబడినది. విజేతవ్యాదులు ఆలంబనవిభావములు, చేష్టలు ఉద్దీపన విభావములు. సహాయాన్వేషణాదులు విభావములు. ధృతి, మతి, గర్వ, స్మృతి, తర్క రోమాంచములు సంచారిభావములు. దాన, దయా, ధర్మ, యుద్ధ భేదములతో వీరరసము నాలుగు విధములుగా నిరూపించబడినది.
ఈ కావ్యంలో యుద్ధవీరము ప్రముఖంగా పోషించబడినది. అర్జునుడు తపస్సు చేయు సమయంలో ధర్మవీరప్రసక్తి కొద్దిగా కలదు. 8,9 సర్గలలో అప్సరసల రతిభావం, ఆలంబనవిభావం బుతువులు, సంధ్యా, రాత్రి, చంద్రో దయాదులు ఉద్దీపనవిభావములు.
భారవి ప్రతిభా వైభవం 5్5్ కిరాతార్డునీయంలో లోకోక్తులు
భారవికవిత్వంలో అనేకములైన లోకోక్తులు, నీతులు, ఉపదేశసూక్తులు, రాజనీతివిషయము లనేకములు కలవు. ఆ కథానకములు, సహృదయ హృదయా హ్లాదకములై యున్నవి అవి ఆ మహాకవియొక్క వ్యవహారకుశలతను, అనుభవాధిక్య తను చాటుచున్నవి. సూక్తిప్రియుడైన ఇతడు సూక్తిముత్యములతో మాలనే సిద్ధము చేసినాడు. కావ్యములో అధికభాగము సూక్తిమయమే ! అలంకార ప్రియుడైన భారవి ఉపమా ఉట్రేక్ష శ్లేషాద్యలంకారములను తన కావ్యమునందు ప్రయోగించి నాడు అయినా ఈ మవికవికి అర్థాంతరన్యాసాలంకారమన్న అధిక ప్రీతి. ఈ మహాకావ్యంలో శతాధికంగా అర్భాంతరన్యాసాలంకారములను చొప్పించినాడు.
“ఒక విశేషవిషయాన్ని చెప్పి సామాన్య విషయముచేత, సామాన్య విషయాన్ని విశేషవిషయము చేత సమర్ధించుటయే అర్భాంతరన్యాసాలంకార మని చెప్పబడు చున్నది. “ఈ అలంకారమును అధికంగా ఈ కావ్యమున ప్రయోగించడం వలన ఈ మహాకవికి గల అపారమైన లోకజ్ఞానము స్పష్టమగుచున్నది. కొన్నింటిని చూతము.
- “హితం మనోహారి చ దుర్లభం వచ. (1-4) చారులచే నివేదింపబడిన శత్రురాజుల వృత్తాంతములు అప్రియములైనను విని, చారులను మందలించక వారిని క్షమించుట ప్రభువులకు యుక్తమైనది. లోకమున ప్రియమైనట్టియు, హితమైనట్టియు వాక్యము దుర్లభము. కనుక నా వాక్యము లప్రియములైనను హితము లగుట వలన క్షమించవలసినదని వనేచరుడు ధర్మరాజుతో చెప్పినాడు.
- _“ప్రవృత్తిసారాః ఖలు మాదృశాం గిరౌ. (1-25) కపటప్రవృత్తికల దుర్యోధనుని విషయమై ప్రతిక్రియ శీఘ్రముగా ప్రభువు లాలోచించ వలసి యున్నది. అక్కడక్కడ ఇతరులచే మాట్లాడబడిన మాటలను విని, ప్రభువు సన్నిధిలో విన్నవించడమే మా పని కాని, ప్రతిక్రియ గురించి ఆలోచించుటకు గాని, నిర్ణయించుటకు గాని మాకు సామర్థ్యము లేదు. కనుక
5్6 భారవి ప్రతిభా వైభవం ప్రభువులే ఆలోచించవలసినది. ఇవి కూడ వనేచరుని యొక్క మాటలు. ఇక్కడ సామాన్యము చేత విశేషము సమర్ధించబడినది. 3) “విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః. (1-87) నీ హృదయమున ఏమున్నదో నాకు తెలియుట లేదు. నా చిత్తవ్యాపారముచే నీ చిత్తవృత్తిని ఆలోచించుదమన్నను “పరుల బుద్ధులు అప్రత్యక్షములు” గనుక, ధీరత్వాధీరత్వములచే అనేకవిధములుగా నుండుటవలన అనుమానించుటకు గూడ వీలుకాదు. “లోకో భిన్నరుచికొ అను నానుడి నిది తలపించుచున్నది. శ్ర) “గుణగ్భహ్యా వచనే విపళ్చితః. (2-4) (ప్రీ-పురుష-బాల-వృద్ధాదుల వచనముల యందు గుణములను మాత్రమే (గ్రహించుట పండితలక్షణము. నీవు గుణగ్రాహివగు పండితుడవు గనుక (ద్రౌపదీ వాక్యములు హితార్థసంపన్నములు కనుక, అవశ్యముగా నా వాక్యములు నీ కభిమతముగా నుండునని భీమసేనుడు ధర్మరాజుతో పలికెను. “బాలాదపి సుభాషితమ్” కదా ! 5) “న తితిక్షాసమ మస్తి సాధనమ్” (2-48) స్థిరముగా ఫలము కలుగుటకును, కార్యములు సిద్ధించుటకును, శత్రువినాశ మగుటకును క్షమయే ఉత్తమమైన సాధనము. దీనితో సమానమైనది మరియొకటి లేదు. కనుక వివేకవంతుడైన రాజు క్షమ నవలంబించి, కార్యములను సాధించుకొనవలయును. ధర్మరాజు భీమసేనుని గూర్చి పలికిన దీ వాక్యము. 6) “విశ్వాసాయత్యాశు సతాం హి యోగళొ, (3-31) సజ్జనులు పరస్పరం కలిసికొనునపుడు వారిలో వారికి విశ్వాసము కలిగి మైత్రి కలుగును. కనుక ఆ వచ్చిన యక్షుడు అర్జునునకు నమస్మ్కరించగా అతడు ప్రియ వచనములు పలికెను. యక్షునికి అర్జునునియందు అనురాగము కలుగగా, అర్జునునితో మైత్రిని పొందెను. ఇక్కడ కూడ సామాన్యముచేత విశేషము సమర్ధించబడినది. 7) “అక్షిష్యమాణం రిపుభిః ప్రమాదా -
న్నాగైరివా2.౩. లూనసటం మృగేంద్రమ్” (38-50)
భారవి ప్రతిభా వైభవం 57 బలపౌరుషములు కలిగియుండియు ప్రజ్ఞను చూపించని సింహమును లక్ష్యము చేయక గజములు దాని కేసరములను ఊడబీకినట్లు, బలపౌరుషములు కలిగి యుండియు ప్రజ్ఞను జూపించక పోవడం వలన నిన్ను నీ శత్రువులు అలక్ష్యం చేయుచున్నారు. ప్రజ్ఞను జూపి, మమ్ములను రక్షించి, నిర్వహించుటకు సమర్థుడవు గనుక, “దినలక్ష్మి సూర్యుని బొందినట్లు” కార్యభార్యము నిన్ను బొందినది. కనుక నాకేమని యుపేక్షించక యికనైనను మేల్కొని శత్రుసంహారమునకు ప్రయత్నించు మని అర్జునునితో ద్రౌపది మాట్లాడినది.
- “భవన్తి గోమాయుసఖా న దన్తినళ (14-22) వర్దాశ్రమ రక్షకులమై, పరిశుద్ధమైన చరిత్ర కలవారమైన రాజులము మేమెక్కడ? జాతిహీనులు హింసాజీవనులైన కిరాతులెక్కడ? నీచులతో గొప్పవారి యొక్క సాంగత్యము కుదరదు. గజములు నక్కలతో స్నేహము చేయవు కదా ! జాత్యా, వృత్యా ఉత్కృష్ట కులజులైనవారు తక్కువ కులము వారితో స్నేహము చేయరు. అర్జునుడు కిరాతునితో అన్నమాటలు. ఇక్కడ విశేషముచేత సామాన్యము సమర్థించ బడినది.
9 “సతాం హి వాణీ గుణమేవ భాషతే” (14-11) ఒకవేళ సజ్జనుల యొక్క చరిత్ర సాధుత్వముగా అంగీకరించబడినదైతే, ఏ దోషము లేకున్నను మేమెందుకు తిరస్కరించబడినాము? సత్పురుషుల వాక్కు గుణమునే పలుకును గాని, పరనిందను సహించదు గదా ! అర్జునుడు కిరాతునితో పలికిన మాటలు.
- “ప్రకర్షతన్హా హి రణే జయశ్రీజొ (8-17) “'యుద్ధమునందు _-జయలక్ష్మి ఆధిక్యము ప్రధానముగా గలది. బలవంతునికే జయము కలుగును గాని దుర్చలునకు కాదు మహాకవి వచనములు.
11 “పరమం లాభ మరాతిభంగమాహుః” (18-12) శత్రుక్షయమే. మిక్కిలి లాభము కలది కదా ! వరాహమును జూచిన తర్వాత అర్జునుని వితర్మము.
56 భారవి ప్రతిభా వైభవం 12) “నయహీనా దపరజ్యతే జనః (2-49) దర్చము గలిగి వర్తించెడి రాజుకు ఎప్పుడు ఎవరితో ఏయే కార్యములను చేయవలయునో, చేయకూడదో యను జ్ఞానము ఆవంతయైనను నుండదు. అట్టి మూఢుడు నీతిమార్గము విడిచి చరించును. అట్టివాని వలన లోకమునకు ద్వేషము కలుగుచున్నది. భీమసేనుని గూర్చి ధర్మరాజు మాటలు. ఈ రకంగా ఈ మహాకావ్యంలో అనేక సూక్తి రత్నములు భారవి కవిచే నిక్షేపింపబడినవి. కిరాతార్జునీయంలో చిత్రకావ్యతైలి భారవి చిత్రకావ్య రచనలోను అనన్యసాధారణ నైపుణ్యము గనబరచినాడు. సర్వతోభద్ర, యమక, విలోమకాద్యనేక చిత్రబంధములతో ఈ మహాకావ్య పంచదశ సర్గ అలంకరించబడినది. ఏకాక్షరపాదాత్మకమైన ఒక శ్లోకం చూడండి. స్వపౌరుషముచే జయించబడిన శత్రువులయందు కూడ కృప చూపించడం గొప్పవారికి భూషణమే కాగలదని చెప్పిన తరువాత అర్జునుని వర్ణిస్తున్న శ్లోకమిది... శ్లో “స సాసిః సాసుసూః సాసో యేయాయేయా౭.£౬ యయాయయః | లలౌ లీలాం లలో ౬.లోలః, శళీశశిశుశీః శశన్” ॥ (15-56) సహ అసినా వర్తమానః సాసిః, అసిః = ఖద్గము, ఖడ్గముతో కూడుకొనిన వాడు, అసూన్ సువన్తి అసుసువః, అసుసుఖిః సహ వర్తత ఇతి సాసుసూః = బాణముతో కూడుకొనినవాడు, ఆసః = ధనువు, ఆసేన సహ వర్తత ఇతి సాసః = ధనుస్సుతో కూడుకొనినవాడు, యేయాః = ఆక్రమణసాధ్యములు, అయేయాః = ఆక్రమణ సాధ్యములుకానివి,,ఆయే = స్వర్ణ గజాది లాభమందు, అయః = శుభావహమైన విధిని పొందువాడు, అదృష్టవంతుడు, లలః = ్రకాశించువాడు, అలోలః = చాంచల్యము లేనివాడు, శశి + ఈశః = చంద్రుణ్ణి శిరము నందు ధటించువాడైన శివుని యొక్క శిశుః = పుత్రుడైన కుమార స్వామిని జయించువాదై, శశన్ = ఫ్లత గమనము చేయుచున్నవాడై, సః = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందెను.
భారవి ప్రతిభా వైభవం 59 అర్ధ చతుష్టయ సమన్వితమైన మహాయమకాలంకారమునకు ఉదాహరణ... శ్లో; “వికాశ మీయు ర్దగతీశమార్గణాః వికాశ మీయు ర్లగతీశమార్గణాః । వికాశ మీయు ర్లగతీశమార్గణాః వికాశ మీయు ర్షగతీశమార్గణాఃొ | (15-52)
-
జగతీశుడు పృథివీపతియైన అర్జునుని బాణములు విస్తరించినవి.
-
_ జగతి = లోకమందు, ఈశమార్గణాః = శంభు శరములు, వికాశం = విషమగతి నొందినవి. (భంగపడినవి)
-
_ జగతీం = పృథివిని, శన్తి = బాధ పెట్టు వారైన, జగతీశులు = దానవులు, వారిని చంపువారైన ప్రమథ గణములు అర్జునుని పరాక్రమమును జూచి సంతోషించినారు.
-
జగతీశస్య = తైలోక్యనాథుదైన శివుణ్ణి, మార్దణాః = అన్వేషించు దేవర్వ్యాదులు, వీనాం = పక్షులయొక్క కాశః = స్థానమును, ఆకాశమును పొందినారు. అని శ్లోకభావము.
అర్ధత్రయవాచియైన ఈ శ్లోకము చూడండి...
శో! “జగతీశరణే యుక్తో హరికాన్తః సుధాసితః |
/్ దానవర్నీ కృతాశంసో నాగరాజ ఇవాబభౌ” ॥ (15-45)
- _ప్రథమార్ధము హిమాలయసామ్యముతో కవి చెప్పుచున్నాడు :.... పూజ్యుదైన శివునితో యుద్ధం చేయడమందు ఆసక్తి గల సింహసదృ్భశ పరాక్రమవంతుడు, చక్కగా ప్రజాపాలనమందు లగ్నమైనవాడును, నిరంతరము దానము చేయు వాడును, జయాభిలాష్కి అనేకవిధముల ఫలప్రాప్తి ఆశించువాడును లేదా దానవ బుషికృత శాసనము కలవాడును అగు అర్జునుడు హిమాలయముతో సమానుడై జగత్తున భాసించుచున్నాడు. ఇచట హిమాలయము జగతీశరణము నందు = భూరక్షణమునందు యుక్తమైనది. అర్జునుడు జగత్తున ఈశ్వరునితో యుద్ధము చేయడమందు శక్తి గలవాడు మరియు హిమాలయము హరికాంతము అనగా
60 భారవి ప్రతిభా వైభవం సింహములకు నివాసాదిప్రదానమువలన ప్రియమైనది. అర్జునుడు సింహము వలె మనోహరమైనవాడు. సుధాసితుడు = సున్నము వలె తెల్లనైన వాడు, అర్జునుడు సుష్టు దధాతి పాలయతి ప్రజా ఇతి సుధా = ప్రజలను చక్కగా పాలించువాడు. అసితః = కృష్ణవర్ణము కలవాడని అర్ధము. శైలరాజు దానవర్షీకృతాశంసుడు = దానవులచే బుషులచే కామముచే నానాఫలాభిలాష గావించబడినది. అర్జునుడు దానవర్ని = అనేక దానములను చేయువాడు, కృతాశంసుడు = చేయబడిన జయాభిలాష గలవాడు, అని ఇట్లు హిమాలయ పర్వత పక్షమున అన్వయించు చున్నది. 2) _ద్వితీయార్ధము ఐరావతసామ్యముతో చెప్పుచున్నాడు. “జగతీశరణే యుక్త” అనేచోట “జగతీశ” అను పదమునకు “జగతీం భువం శ్యన్తి తనూకుర్వన్తి జగతీశాః రాక్షసాః, తేషాం రణః జగతీశరణః, తత్ర యుక్తః విహితః సమర్గణూ అనగా రాక్షసులతో యుద్ధము చేయడమందు ఉపయోగించుటకు సమర్ధమైనది. హరికాన్త్న = ఇంద్రునికి ప్రియమైనది. సుధాసితము అనగా అమృతము వలె స్వచ్చమైనది. దానవర్ని = మదస్రావి, కృతాశంసము అనగా కృతజిగీష యని యర్థము. ఆ విధమైన ఐరావతము వఠె,అర్జునుడు ప్రకాశించెను. 3) _తృతీయార్ధము శేషనాగుని సామ్యముతో చెప్పుచున్నాడు. జగతీశరణే యుక్తః = అను పదమునకు దైవముచే భూరక్షణకార్యమునందు నియుక్తుడైన వాడని, హరికాన్తః = అను పదమునకు విష్ణుప్రియుడని, సుధాసితః = అను పదమునకు అమృతప్రియుడని లేదా వసుధారక్షణమున బద్భుడైనవాడని ఒకరి పక్షమున యర్థము. దానవర్నీకృతాశంసః = అనుచోట దానవులచే బుషులచే లక్ష్మిచే ప్రశంసించబడిన వాడని యర్థము గ్రహించి, అట్టి శేషనాగుని వలె అర్జునుడు ప్రకాశించెను. ఈ విధముగా ఈ శ్లోకములో వీరితో ఉపమానము చెప్పడంవలన శబ్ద శ్లేష అర్జునునితో నాలుగు అర్ధములు కూర్చబడినవి. మరియు సర్వతోభద్ర, అర్ధభ్రమకాది బంధములను కవి చూపించినాడు. ఈ రకమైన చిత్రకావ్య.... బంధములను కావ్యంలో ప్రయోగించడం వలన
భారవి ప్రతిభా వైభవం 61 ఈ మహాకవి ననుసరించి తరువాతివారైన మాఘ... రత్నాకరాది కవులు తమ కావ్యాలలో చిత్రకావ్యశైలిని ప్రారంభించినారు.
ఈ మహాకవికి గల వ్యాకరణశాస్రజ్ఞానము అమోఘము అనద్యతనంలో “లుజ్ లకారమును గాక 'లజ్ొ లకారమును మాత్రమే ప్రయోగించినాడు. ప్రాచీన వృత్తాంతమును వర్ణించినప్పుడు 'లిటొ లకారమును, అనద్యతన భూతార్థక 'లుజ్ లకారమును 10 సార్లు భారవి ప్రయోగించినాడు. మాఘుడు దీనిని 272 సార్లు ప్రయోగించినాడని విమర్శకులు చెప్పుచున్నారు.
ఈ మహాకవికి గల వ్యాకరణపాండిత్యమునకు ఒక ఉదాహరణ... శ్లో! “సంస్మ్కారవత్తాద్రమయత్సు చేతః ప్రయోగతశిక్షాగుణభూషణేషు ॥ అయం యథార్థేషు శరేషు పార్థః శబ్దేషు భావార్థ మివాశశంసే” ॥ (7-6) పార్టుని శరలాఘవమును కవి ఈ శ్లోకముద్వారా వర్ణించుచున్నాడు. 'ప్రకృతి ప్రత్యయ సంయోగ వశమున వ్యాకరణానుకూలమైన సాధుత్వము వలన మనస్సునకు ఆనందమును కలుగజేసెడు శబ్బములయందు భావార్ధము వలె, “శృణ్వన్తి హింసన్తి ఇతి శరాః అను వ్యుత్పత్తిచే యథార్ధరూపమును పొందిన శరీరములయందు అర్జునుడు జయము నాకాంక్షించినాడని వర్ణించినాడు. ఇచ్చట పై విశేషములు ఉపమానమునకు వర్తించుచు శబ్దిశ్లేషచే ఉపమేయమునకు చక్కగా అమరియున్నది. ఇతని శరములు సంస్కారము కలవని, అందువలన ప్రయోక్తకు చేతోమోదమును చేకూర్చుచున్నవని సంధాన, మోక్షాది అభ్యాస గుణ భూషితములని అర్ధము రమణీయమై, ఈ కవి శ్లేషప్రియత్వమును, వ్యాకరణ శాస్త్రప్రావీణ్యమును వ్యక్తీకరించుచు సందర్భమునకు శుద్ధిని చేకూర్చుచున్నవి. ఛందఃప్రయోగంలో కూడ ఈ మహాకవికి వైశిష్ట్యం కలదు. ఈతనికి “వంశస్థవృత్తం” మీద మక్కువ ఎక్కువ. క్షేమేంద్రుడు సువృత్తతిలకంలో.... శ్ల॥ “వృతచ్చత్రస్య సా కా ౬పి వంశస్థస్య విచిత్రతా । ప్రతిభా భారవేర్యేన సచ్చాయే నాధికీకృతా” 1
62 భారవి ప్రతిభా వైభవం అని ప్రశంసించినాడు. “షాడ్డుణ్యప్రగుణా నీతి ర్వంశస్థేన విరాజతే” అని క్షేమేం ద్రుడు చెప్పడం వలన రాజనీతిని వర్ణించడానికి ఈ ఛందస్సు నధికంగా వాడినాడని తెలియుచున్నది. 24 రకాల ఛందస్సులను తన కావ్యంలో ప్రయోగించినాడు. వీటిలో వైతాలియ - ఉపజాతి - వంశస్థ - ద్రుతవిలంబిత - ప్రహర్షిణీ - స్వాగతా - ప్రమితాక్షరా మొదలైన 12 ఛందస్సులు అధిక ప్రయోగంలో కలవు. జలోద్ధతగతి, జలధరమాలా, బెపచ్చందసికం, మత్తమయూర, కుటిలా, వంశ పత్రపతితా మొదలైన అప్రచలిత ఛందస్సులు కూడ ప్రయోగించబడినవి. ఒక్క పంచమసర్గలోనే 16 రకాల ఛందస్సులను వాడినాడు. భారవి కవితాప్రభావము తరువాతవాడైన మాఘకవియందు కనిపించు చున్నది. కిరాతార్జునీయ - శిశుపాలవధ మహాకావ్య రచనా ప్రణాళిక తులనాత్మక మైనది. ఆ పోలికలు చూడండి.... ఈ విధంగా ఈ కావ్యములు రెండును తులనాత్మకములై సంస్కృత సాహిత్యమున మహాకావ్యపదవుల నలంకరించుచున్నవి. భారవి కవిత్వం - వ్యక్తిత్వం శ్రీ భారవి కవి రచన రసగర్భనిర్భరమై ఆస్వాధ్యమైనది. ఈ మహాకవి చిత్రకావ్యరచన -శ్లేషాత్మక -ఏకాక్షర -ద్వ్యక్షర శ్లోకశిల్పసౌందర్యమును చూసి మల్లినాథసూరి “ఘంటాపథ వ్యాఖ్యానము” న శ్లో! “నవసర్గగతే మాఘే నవసర్గే చ నైషధే | నవసర్గే కిరాతే చ నవశట్టో న విద్యతే” ॥ అను నానుడి బయలుదేరినది. ఒక శ్లోకం చూడండి..... శ్లో “పరిణామసుఖే గరీయసి, వ్యథకే౭_స్మిన్ వచసి క్షతొజసొమ్ | అతివీర్యవతీవ భేషజే, బహురల్ప్సీయసి దృశ్యతే గుణః” ॥ (2-4) మొట్టమొదట మిక్కిలి కష్టముగా కనిపించుచుండినను ఆలోచించిన కొద్ది ఫలకాలమున మేలు కలుగును. లోకములో రోగము వచ్చినప్పుడు వేసుకొనుటకు కష్టముగా నున్నను, జీర్ణమైన కొద్ది బాధలు తగ్గించుననియు డ్రేస్టములు నగు
భారవి ప్రతిభా వైభవం గవ! చిన్నచిన్న మాత్రలయందు పెద్ద గుణము కనిపించును. అను ద్రౌపదివాక్యముల యందు గుణాధిక్య మున్నదని భీమసేనుడు ధర్మరాజుతో తెలిపినాడు. భారవి రచనావిధానములో కూడ ఇటువంటి భావమే కనిపించుచున్నది. రచనలో పైకి కష్టంగా కనిపించినను అర్ధము చేసికొన్నవారికి రసాస్వాదన సులభమే యని వ్యక్తమగుచున్నది.
ప్రథమసర్గలో వనేచర యధిస్టిర సంవాదము, ద్రౌపదీ యుధిష్టిర సంవాదము, ద్వితీయసర్గలో భీమ-యుధిష్టిర సంవాదము, తృతీయసర్గలో యుధిష్టిర - వ్యాస సంవాదము, ఏకాదశసర్గలో ఇంద్రార్జ్డున సంవాదము, త్రయోదశసర్గలో శివదూత
- అర్జున సంవాదము వీటిలో మిక్కిలి వాక్సాతుర్యము ప్రదర్శించబడినది. స్వాఖి మానము, వినయశీలము, శిష్టాచారము, బెచిత్యము ఎక్కడ అతిక్రమించలేదు. స్వపక్షము తర్మపూర్వకముగా స్థాపించుట, పరపక్షమును ఉద్వేగ రహితంగా, శాంతి పూర్వక మనస్సుతో ఖండించుట ఈ సంవాదముల వైళిష్ట్రము.
ద్రౌపదీ వచనములలో అవమానము, వ్యథ, బలము, స్వాభిమానము, జాతీయ గౌరవము, శిక్ష ఉపదేశము మొదలగు అనేక భావములు కలవు.
భారవి కర్మలను విశ్వసించును గాని అదృష్టమును కాదు. ద్రౌపదీ వచనము లోని ఒక రమ్యమైన ఉదాహరణ :........... శ్లో! “కరోతి యో౭.శేషజనాతిరిక్తాం, సంభావనా మర్ధవతీం క్రియాఖిః |
సంసత్సు జాతే పురుషాధికారే, న పూరణీ తం సముపైతి సంఖ్యా” (3-51)
ఏ పురుషుడు ఇతరజనముకంటే అధికమైన యోగ్యతను నడవడిచే సఫలమైన దానినిగా చేయుచున్నాడో ఆ పురుషులను లెక్కించునపుడు మొదటివానిగా నుండును.
భారవి తన ఆశ్రయదాత అయిన రాజుకు రహస్యాలోచన చెప్పేవాడుగా, ఆ స్థానంలో ప్రధానపాత్రధారిగా కనిపించును. భారవి మితభాషి, గంభీర స్వభావుడుగా కనిపించును. శృంగారసన్నివేశాలను వర్ణించినా శృంగారప్రియుడు కాడు. ఇతనిది క్షాత్రగుణం. స్వాభిమానపూర్జ్ణుడు. యాచన, దైన్యం, పలాయనం, ఇతనికి ఇష్టం కాదు. కీర్తి ఇతనికి గొప్పగా కనిపిస్తుంది. నిర్భయత్వం, పర్గాక్రమం, ధైర్యం ఇతనిలో మూర్తీభవించినవి. ఈ గుణాలన్నీ అర్జునపాత్రలో చూపించినాడు.
ఈ భారవి ప్రతిభా వైభవం
ఈ విధంగా ఈ మహాకావ్యము సంభాషణా రూప శైలిలో, విభిన్న ఛందో రీతులలో, ఆలంకారిక రచనలో, భావ గాంభీర్యములో సరస వచో ప్రవాహమున సహృదయుల హృదయము చూరగొనుచున్నది. ఇంతటి మహాకావ్యమును సంస్కృత సాహితీ లోకమునకు సమర్పించిన భారవి మహాశయుడు మహాకవిగొ మనందరికి సదా సంస్మరణీయుడు.
జయన్తి తే సుకృతినో రససిద్దాః కవీశ్వరాళొ లై కో
శనం. టో. గ ఖు యం యి తగి