Telugu bharatha viplava keratam bhagat singh - anilvaranasi/indianlanguages GitHub Wiki

స నుం. మ సట. భన [1 తట ర టు టా. నం / హుం వ 1 ॥ చ టట. ఈ! సహా. సు పయ మలు మ పన రు నం. 1; వం (ఆ ౯5 6౦౨౩ల "౯ ఆ హల స. 1 కా సరగ యం యేల ంళు నం లాటా షై స టి రో కీ టే 1/1 సం కతన... ఆ శం. న న్‌ | గ ళు మక న్‌ 4 “యో షు: :'.' 2. | క శ |

  • / ' |
  • | య ష్‌ ల్‌ | నోటి క్‌ఖ న్‌ క ల్‌ న నవకెందొణ దుగ వాం శివవర్మ | |

భారత విప్లవ 3రటం భగత్‌సింగ్‌ శివవర్మ

భారత విప్లవ క5రటం భగత్‌సింగ్‌

శివవర్మ

అనువాదం ఎ.జి. యతిరాజులు, బొన్సారెడ్డి

నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎమ్‌హెచ్‌ భవన్‌, ప్లాట్‌ నెం, 21/1, అడామాబాద్‌, ఆర్‌టీసి కళ్యాణమండపం దగ్గర

హైదరాబాద్‌ -20, ఫోన్‌: 040-27673787

క12202 పంచే డా2 కమలుజ(800 విట! కాల!

  • న2లడ 1/67/7274 178608

వెంంయడండ లం :; 1590

న వం క. వ వౌంంు2ంు 2023

(6౦౪౬ 6918౧ వ [మర20

₹01 6౦16 :

న న

4 ఈ 3210, 1060౦. 21/1, త౭2002016, గోలు [00 [20201 11102020 క్రైరేయ20164-500 020. ౨8 : 040 - 27673787

కాజా లషంం్రటు2 920%9మ02 10056 91200ల5 :

1స్రారఅడ0%6 (యిమడరం3ు, తై0022090281 ధక ; సజీర్రంం6 కేజంరుఖుంరరేప జరుంఉైటు శముయింలరు, 12902026 206 1202000008 వెరుగంం6 16

ేషళాజల1208202 0౧6ల6 6 166. ూరేలయవ26ే 9 పెం : 021601208220202015010260656 ఇ౭9916 వ ఇారజా20ల102202000]10.0000 సర06: ₹ 50/-

ముందుమాట

“భారత స్వాతంత్ర్య సమరయోధుల్లోను, విప్లవకారులు, సోషలిస్టులలోనూ అ(గ్రశ్రేణికి చెందిన వారిలో భగత్‌సింగ్‌ ఒకరు. అంతేకాదు, మన దేశంలో మొట్టమొదటి మార్చిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో కూడా భగత్‌సింగ్‌ ఒకరు. అయితే ఆయన మార్చిస్టు దృక్చధాన్ని కలిగి వున్నాడన్న విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగానే భగత్‌సింగ్‌ మొదలగు ఆయన సహచరులకు మన దేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలను రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢవిశ్వాసపరులు, మతోన్నాదులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది” అని చెప్పిన ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్‌ బిపిన్‌ చంద్ర మాటలు అక్షర సత్యం. భగత్‌సింగ్‌ విషయంలోనే కాదు, నేడు సుభాష్‌ చంద్రబోస్‌ విషయంలోనూ, అంబేద్మర్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏ రకమైన స్వాతంత్రోద్యమ వారసత్వమూ లేని మతోన్నాద శక్తులు కొందరు యోధులను తమకనుకూలంగా, తమ వారిగా ముద్ర వేయించుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవిక చరిత్ర దానిని తిరస్కరిస్తుంది. అబద్దాలతో, అసత్యాలతో చరిత్రను నిర్మించలేరు, స్వాతంత్రోద్యమ యోధుల విప్లవకర వాస్తవిక చరిత్రను, వారి ఆలోచనలనూ మననం చేయాల్సిన అవసరం నేడున్నది.

షహీద్‌ భగత్‌సింగ్‌ను తలచుకోగానే ఉరికొయ్యకు తలవంచని ధీరత్వం గుర్తుకొస్తుంది. స్వేచ్చా స్వాతంత్ర్య కాంక్ష నినాదంతో పాటుగా జన విముక్తికై గొంతెత్తి పలికిన “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” రణధ్వని ప్రతిధ్వనిస్తుంది. త్యాగానికి వెరవని వీరత్వం స్మరణకొస్తుంది. ఆశయం కోసం అంకితమై ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరత్వ గీతాన్ని వినిపిస్తుంది. ఆయన త్యాగధనుడే కాదు, శాస్త్రీయ ఆలోచనలతో ఈ దేశ

ప్రజల విముక్తి సాధన కోసం మార్చిజాన్ని అధ్యయనం చేసినవాడు. ముఖ్యంగా మతం గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆయనలో గల శక్తివంతమైన మేధస్సు, విప్లవ సాధన పట్ల నిబద్ధత, చారిత్రక భౌతికవాద పద్ధతిలో ఆలోచించే సామర్ధ్యం మనకు కనిపిస్తాయి. “ప్రజలను మోసగించి తమ వర్ణ ఆధిక్యతను, అధికారాన్ని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే పాలక వర్గాలు, దోపిడీదారులూ మతాన్ని సృష్టించలేదని ఆయన అంటారు. (ప్రజలు మన్నుకిన్న పాముల్లా పడివుండేట్లు జీవించుతూ అలా తమ వర్షాలను నిజ జీవితంలో సమర్భుల చేతుల్లో పావుల్లా పడివుండే వారిగా తయారు చేయడానికి కూడా వారు మతాన్ని వినియోగించుకుంటారని, దానికంటే మిన్నగా మతం మానవుల అశక్తత వల్లనే సృష్టింబడిందని, తన చుట్టూ వున్న సమాజ వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తన జీవితాన్ని తన అధీనంలో వుంచుకోవడంలో విఫలమైనపుడు దేవుడు మానవునికి ఒక ఉపయోగకరమైన సాధనం కాగలడు అని ఆయన చేసిన విశ్లేషణ మార్క్‌ చేసిన రచనల అవగాహననే ప్రతిబింబిస్తుంది. ఒక చారిత్రక పరిణామంలో ఏర్పడిన మతం తాలూకు విషయాల పట్ల శాప్రీయ దృక్పధాన్ని భగత్‌సింగ్‌ ఎలా కనబరిచాడో కూడా మనకర్థమవుతుంది.

భగత్‌సింగ్‌ జీవితాన్ని అతని ఆచరణను, ఆచరణలోని నిబద్ధతను, అంకితభావాన్ని, దేశం కోసం అతను పడుతున్న తపనను సహచరుడుగా వుండి చూసిన శివవర్మ రాసిన విషయాలు మనకు ్రేరణనిస్తాయి. చైతన్యాన్ని రగలిస్తాయి. భగత్‌సింగ్‌ ఆలోచనలు, ఆయన జీవన విధానం, ప్రజల పట్ల, సహచరుల పట్ల కనబరచిన (ప్రేమ మొదలైన ఎన్నో విషయాలు మన కవగతమవుతాయి. ఎంత నిజాయితీతో మెలిగేవాడో తెలుస్తుంది. “త్యాగం, బలిదానం గురించి చెబుతూ ఒకటి గుండు దెబ్బతిని, ఉరికంబమెక్కి చనిపోవడంలో ఆకర్షణ అధికమైనా, కష్టం తక్కువే! రెండవది జీవితమంతా భవనం బరువును మోస్తూ వుండటం. పోరాట (క్రమంలో, (ప్రతికూల వాతావరణంలో, ఒంటరితనంలో ఓదార్చు మాటల కోసం మనిషి తపించిపోతాడు. అటువంటి సందర్భంలోనూ తొట్రుపాటు పడకుండా, కృంగిపోకుండా, నిర్మానుష్యమైన మార్గంలో చీకట్లు అలుముకోరాదని తమను తామే కొవ్యత్తిగా కరిగించుకునేవారు, ప్రాణత్యాగం చేసేవారికన్నా (శేష్టమైన వారని భగత్‌సింగ్‌ చెప్పిన మాటలు విప్లవ మార్గంలో నడిచే కార్యకర్తలకు గొప్ప అవగాహనను కలిగిస్తాయి.

భగత్‌సింగ్‌ గొప్ప అధ్యయనశీలి. ఆయన ఉ(గగ్రవాద చర్యల నుండి మార్చిజం

వైపుకు మరలడం ప్రారంభమైన తర్వాత విపరీతంగా పుస్తకాలు చదివాడు. రష్యన్‌ విప్లవం పైన, సోవియట్‌ యూనియన్‌ పైనా తనకు లభ్యమైన గగ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశాడు. పుస్తకాలు దొరకడం కష్టమైన సందర్భంలోనూ సంపాదించి చదివాడు. పుస్తకాలు చదవడం విప్లవాత్మక చర్యగా భావించాడు. తన సహచరుల చేత చదివించడమూ చేశాడు. “నిద్ధాంతాల అధ్యయనం ద్వారా వివ్లవ కత్తి మరింతగా వదునెక్కుతుంది” అని ఉద్దాటించాడు. భగత్‌సింగ్‌ సౌందర్యారాధకుడు. సంగీతమన్నాా కళలన్నా మంచి అభిరుచి. మంచి హాస్యప్రియుడు, గొప్ప స్నేహశీలి, అంతేకాదు ఆయన రాసిన వ్యాసాలు, కరపత్రాలు, 'నవ జవాన్‌ భారత్‌ సభ ప్రణాళిక మొదలైనవన్నీ అతని భాషా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఆ విప్లవ వీరుని జీవన గమనాన్ని చూసి, అతనితో నడిచిన శివవర్మ రచించిన ఈ పుస్తకం భగత్‌సింగ్‌ జీవితాన్ని అతని ఆలోచనలను ఎంతో అద్భుతంగా అవిష్మనిస్తుంది. శివవర్మ తదనంతరం కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టు)లో పనిచేశారు. ఈ రచనతో పాటు భగత్‌సింగ్‌ స్వయంగా రాసిన వీలునామా దీనికి అనుబంధంగా కలిపి 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌” పేరున తీసుకువస్తున్నాము. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్‌ డే సందర్భంగా విప్లవ వీరుని చదవడం మహాోత్తేజాన్ని అందిస్తుంది. మతతత్వ ఫాసిస్టు శక్తుల ఆలోచనలు (ప్రబలుతున్న సందర్భంలో స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు కోరుకున్న సమాజ నిర్మాణం జరగకపోగా తిరోగమనం పాలవుతున్న తీరు అవగతమవుతుంది. కర్తవ్యమూ బోధపడుతుంది. వారి జీవితాలు మన ఆచరణకు = కె. ఆనందాచారి

సంపాదకులు

నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ భారత విప్లవ కెుం భగత్‌సింగ్‌ |

భగత్‌సింగ్‌ జననం : 1907, అక్టోబర్‌ 7 స్థలం : బంగా గ్రామం, లాయల్‌పూరు జిల్లా తండ్రి ; సర్దార్‌ కిషన్‌సింగ్‌ మరణం : 1981 మార్చి 28, సాయంత్రం లాహోర్‌ సెంట్రల్‌ జైల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరి తీసింది.

భగత్‌సింగ్‌

ఎవరో ఒక పంజాబీ మహాశయుడు నన్నూ జయదేవ్‌నూ కలుసుకోవడానికి కాన్పూరుకు వస్తున్నట్లు ఢిల్లీ నుండి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. మేము విప్లవ పార్టీలో చేరి కొంతకాలమే అయింది. కాన్సూరుకు వెలుపల కొద్దిమందికే మేము తెలుసు. లక్నో అలహాబాదులకు చెందిన వారైతే ఆలోచించవచ్చు. కానీ ఈ పంజాబీ మహాశయుడు ఎవరు చెప్మా? “నేనున్న యమునా ఘాట్‌ వద్ద ఇతనితో పరిచయమయింది. ఇతడు మీకు అత్యంత సన్నిహితుడు. ఏదో పని మీద కాన్పూరు వెళ్ళాలని చెప్పినందువల్ల మీ ఇద్దరి అడ్రసులు అతనికిచ్చాను మిగతా విషయాలు అతడు నేరుగా చెపుతాడు అని ఆ మిత్రుడు తెలిపాడు.

ఆ ఉత్తరం చదివి మాకు మా చెడ్డ కోపం వచ్చింది. ఎట్లాంటి మనిషికి మా రహస్యమంతా వెల్లడిచేసి ఇక్కడకు పంపుతున్నాడో అని మేము కలత చెందాము. ఏమయినా అతడు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరే వుంటాడు. మార్గమధ్యంలో వుండి వుంటాడు. అందువల్ల అన్నిటికంటే ముందు మేము మా గదులను సోదా చేసుకున్నాము. మా కాలేజీ పుస్తకాలు తప్ప మిగతా పుస్తకాలనూ, కాగితాలనూ, ఉత్తరాలనూ మా గదుల నుంచి తాలగించేశాము. అప్పుడు మేము డి.ఎ.వి. కాలేజీ వాస్టలుకు చెందిన “ఎర్రబంగళా'లో వుండేవారం. జయదేవ్‌ తనగదిలో మహాత్మాగాంధీగారి రాట్నమొకదాన్ని వుంచుకొన్నాడు. జాతీయ భావాలకు చిహ్నమైన దాన్ని కూడా తొలగించేశాము. పంజాబీ మహాశయుడు మొదట జయదేవ్‌ను కలుసుకుంటే అతనికి నన్ను పరిచయం చేయకూడదనీ, ఒకవేళ అతడు మొదట నా వద్దకు వస్తే అతనికి జయదేవ్‌ను పరిచయం చేయకూడదనీ మేము నిశ్చయించుకున్నాము. భారత విష్లవ కెరటం భగత్‌సింగ్‌ 9

తర్వాత ఒక రోజు ఉదయమే నేను నా గదిలో కాలేజీ పారాలు చదువుకుంటుండగా బయట (ప్రక్క గది అతనిని ఎవరో నా అడ్రసు అడుగుతుండడం వినిపించింది. నా పేరు విని నేను గది వెలుపలికొచ్చాను. మురికి షల్వార్‌ కమీజ్‌ ధరించి, కంబళి కప్పుకున్న ఒక సిక్కుయువకుడు ఎదురుగా నిలబడి వున్నాడు. పొడవాటి శరీరం, మంచి గోధుమవన్నెరంగు, చిన్న చిన్న కళ్ళు, తీవ్రమైన సూటియైన కనుచూపు, అందమైన మోముపై తేలికపాటి చిన్నగడ్డం, తలనిండుగా వెంట్రుకలు, తలపాగా. నన్ను చూచి ప్రక్మగది అతను “వీరే శివవర్మ అని ఆ ఆగంతకునికి నన్ను చూపాడు.

అతడు తన రెండు చేతులూ చాపి, నేనేదో అతని పాత స్నేహితుడనైనట్లు నన్ను గాఢంగా కౌగలించుకున్నాడు. తర్వాత ఆ గది నాది కాదు అతనిదేనన్నట్లు నన్ను చేయి పుచ్చుకొని గదిలోకి లాక్కెళ్ళాడు. ఆ చిన్నగదిలో చోటు చాలనందువల్ల నేను నేలపైనే పరుపు పరచి వున్నాను. అతడు ముందూ వెనకా ఆలోచించక నిస్సంకోచంగా వెళ్ళి నా పరుపుమీదే కూర్చున్నాడు. నా చేయిపట్టిలాగి దగ్గర కూర్చోబెట్టుకొని “నా పేరు రంజిత్‌. రెండు మూడు రోజులు ఇక్కదే వుంటాను. ఢిల్లీలోని మీ స్నేహితుడు నీ గురించీ, జయదేవ్‌ గురించీ చెప్పాడు. నేను కూడా మీ మార్గంలో పయనించే యాత్రికుణ్ణే అని చెప్పి కొంత ఆలోచించి “విజయ్‌, సురేంద్ర పాండేలు నీకు తెలుసా?” అని అడిగాడు.

రంజిత్‌ సహజ ప్రవర్తన, నిష్కపటమైన నవ్వు, చిరునవ్వు చిందించే కళ్ళూ మొదటి కలయికలోనే నన్ను వివశుణ్ణి చేశాయి. ఇప్పుడు అతణ్ణి నమ్మకపోవడం అసాధ్యమైపోయింది. అనుమానాలు తొలగిపోయాయి. నేను కూడా అదే సహజ భావంతో “తెలుసు” అన్నాను.

“ల్తర్బుతే వారిద్దరినీ ఈ రాట్రి ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకొమ్మని కబురుపంపు” అని అతను చెప్పాడు. కొద్దిసేపు ఆగి “జయదేవ్‌ ఎక్కడ?” అని అడిగాడు.

ఇప్పుడు నేను అబద్ధమే చెప్పాను. ధైర్యాన్ని కూడగట్టుకుని, “ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడిక్కడ లేడు” అన్నాను.

నేను అసత్యం పలుకుతున్నాననే సంగతి కనిపెట్టేశాడు. అతణ్జి నేనింకా విశ్వసించడం లేదనే విషయం కొద్దిసేపు రంజిత్‌ని విచారగ్రస్తుణ్జి చేసింది. అతడు తనతో (ఫెంచి రచయిత విక్టర్‌ హ్యూగో సుప్రసిద్ధ నవల 'లే మిజరబులో (బీదల పాట్లు) తెచ్చుకున్నాడు. ఎవరో అతని నవ్వుకు, సంభాషణకు, నిస్సంకోచ (ప్రవర్తనకు ఉన్నట్టుండి “బేక్‌ వేసినట్లు నిశ్శబ్దంగా ఆ నవల చదవసాగాడు.

  1. భగత్‌సింగ్‌ మారుపేరే 'రంజిత్‌' - అనువాదకుడు

క0 శివవర్మ

నేను అబద్ధమాడినప్పటికీ మనసులో బాధగానే వుంది. విచారంగా భగత్‌సింగ్‌ ఎదుట నేను గదిలో వుండలేకపోయాను. విజయ్‌కి కబురు పంపే నెపంతో నేను కాలేజీకి వెళ్లిపోయాను. సురేంద్రకు రంజిత్‌ కబురందజేసినపుడు రంజిత్‌ పాత పార్టీ మనిషని సురేంద్ర చెప్పాడు.

కాలేజి నుంచి తిరిగొచ్చేటప్పటికి మధ్యాహ్న భోజన వేళయింది. జయదేవ్‌, నేనూ సాధారణంగా 'మెస్‌లో భోంచేయడానికి కలిసే వెళ్ళీవాళ్ళం. భోజనానికి రంజిత్‌ను కూడా నాతోబాటు తీసుకెళ్ళాను. అప్పుడు మెస్‌లో మేము ముగ్గురమే వున్నాము. రంజిత్‌ మధ్యలో జయదేవ్‌కు దగ్గరగానే కూర్చున్నప్పటికీ జయదేవ్‌ను 'మెన్‌ొకు సంబంధించిన వ్యక్తేమో అనుకొని రంజిత్‌ మొదట అతణ్జి సరిగ్గా గమనించలేదు. తర్వాత జయదేవ్‌ రంజిత్‌ పళ్ళెంలోని పప్పులో నిశ్శబ్దంగా వేడి నెయ్యి ధారాళంగా వేసినప్పుడు రంజిత్‌ మొదట జయదేవ్‌ వైపు చూచి, తర్వాత నన్ను ప్రశ్నార్థకంగా చూడసాగాడు. రంజిత్‌ అయోమయం చూచి మా ఇద్దరికీ నవ్వాగింది కాదు. రంజిత్‌ నోటి నుంచి “జయదేవ్‌?” అనే ప్రశ్న వెలువడింది. మేము మరింత బిగ్గరగా నవ్వాము. రంజిత్‌ నా వీపుమీద ఒక గుద్దు గుద్దుతూ “దొంగా!” అని అరిచాడు. “మీ ఇద్దరికీ రహస్యం బాగా కాపాడే అలవాటు వున్నట్టుందే?” అంటూ మమ్మల్ని ఎగతాళి పట్టించాడు రంజిత్‌.

“అలవాటు విషయం ఏమైనా నీ గుద్దుడు వల్ల నా దిమ్మ తిరిగిపోయింది” అన్నాను నేను.

అతడు ఎడమ చేతితో నా వీపును సవరిస్తూ “ఇదిగో, నీ వీపును సవరిస్తున్నాను. ఇక నిశ్శబ్దంగా భోంచేయ్‌” అని అన్నాడు.

రంజిత్‌ నా గదిలో వున్నన్నాళ్ళు విజయ్‌, సురేంద్ర పాందే ఇద్దరూ రోజూ వస్తుండేవారు. 'కాకోర్‌' దోపిడి కేసులో నేరస్తుడైన పండిత రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ను జైలు నుంచి తప్పించి తీసుకువచ్చే పధకం గురించి సం(ప్రదించడానికే రంజిత్‌ కాన్పూరుకు వచ్చాడు. జైల్లో వున్న బిస్మిల్‌తో సంప్రదించే భారం విజయపై మోపి రంజిత్‌ మూడు నాలుగు రోజుల తర్వాత పంజాబ్‌కు తిరిగి వెళ్ళిపోయాడు.

రంజిత్‌ వెళ్ళిపోయిన తర్వాత అతని అసలు పేరు “భగత్‌సింగ్‌ అనీ, అతను ఇంతకు మునుపే కాన్సూరులో శ్రీ గణేశ్‌ శంకర్‌ విద్యార్థి సంపాదకత్వాన వెలువడే “ప్రతాప్‌ పథత్రికలో పనిచేశాదనీ నాకు తెలిసింది. ఆ పత్రికలో పనిచేయడానికి ముందు అతను పత్రికలు అమ్ముతూ కూడా కొన్ని రోజులు గడిపాడు. బిస్మిల్‌ను జైలు నుంచి తప్పించడానికి ఇంతకుమునుపు కూడా ఒకసారి ప్రయత్నించారనీ, ఏదో కారణంవల్ల దానిని మధ్యలోనే ఆపివేశారనీ కూడా తెలిసింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ క!

భగత్‌సింగ్‌, సుఖదేవ్‌లతో ఇంకా కొంత మంది కామ్రేడ్స్‌ కూడా పంజాబ్‌ నుంచి వచ్చి వున్నారు. ఆ కార్యక్రమంలో ఒక భాగంగానే ఇప్పుడీ రెండో ప్రయత్నం! రెండు నెలల తర్వాత భగత్‌సింగ్‌ మళ్ళీ వచ్చాడు. ఈసారి అతను కాన్పూరులో ఎక్కువ రోజులే వున్నాడు. జైల్లో వున్న రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌తో విజయ్‌ బాగానే పరిచయం 'పెంచుకోగలిగాదు. బిస్మిల్‌ కూడా ఆ ప్రయత్నానికి తన ఆమోదం తెలిపాడు. అయితే తారీఖు, సమయం మాత్రం అప్పటికింకా నిశ్చయం కాలేదు. మరోవైపు తీర్పు చెప్పేరోజు దగ్గరపడుతోంది. ఇంతలో బిస్నిల్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు, కలుసుకోవదాలు ఉన్నట్టుండి నిలిచిపోయాయి. బిస్మిల్‌పై గట్టి నిఘా వేశారు. ఇదంతా ఎలా జరిగింది అనే విషయం నాకు తెలియకపోయినప్పటికీ, దీనివల్ల మా పథకానికి పెద్ద దెబ్బ తగిలింది. అయినా విజయ్‌ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వున్నాడు. భగత్‌సింగ్‌ నా గదిలో తన అధిక కాలాన్ని గ్రంథ పఠనంలోనే గడిపేవాడు. విక్టర్‌ హ్యూగో, హాల్మేన్‌, టాల్‌స్టాయ్‌, డాస్త్రోవస్కీ గోర్కీ బెర్నార్‌షా, డికెన్స్‌ మొదలైనవారు అతని అభిమాన రచయితలు! చదివి చదివి విసుగు కలిగినపుడు మా హాస్టల్‌ వెనుకనున్న గంగానది ఒడ్డుకెళ్ళి కూర్చునేవాడు. లేదా నేనూ, జయదేవ్‌ కాలేజీకి వెళ్ళకపోతే మాతో కబుర్లు చెబుతుందేవాడు. అతను ఎక్కువగా తొను చదివిన పుస్తకాల గుదించే మాట్లాడేవాడు. వాటి గురించి వివరించ్చి మమ్మల్ని కూడా ఆ పుస్తకాలను చదవమనేవాడు. అప్పుడప్పుడు పౌత విప్లవకారుల సాహసగాధలు కూడా వినిపించేవాడు 'కూకా' తిరుగుబాటు, గదర్‌ పార్టీ చరిత్ర, కర్తార్‌ సింగ్‌ సూఫీ అంబా ప్రసాద్‌, మున్నగువారి జీవితాలనూ బబర్‌ అకాలీల వీరగాథలను చెబుతూ అతను తన్మయత్వంలో మునిగిపోయేవాడు. అతని వర్ణనా వెలి చాలా ఆకర్షణీయంగా వుండేది. అందునల్ల మేము ముందుగానే కాలేజీ నుంచి పరిగెత్తి వచ్చేవాళ్ళం, క అత _మొదటి నుంచీ జయదేవ్‌ నాకంటె దృధకాయుడు, ఆపదల నెదుర్కోవడం ళు సర్వసాధారణ విషయం. కొట్లాటకు అతను ముందుందేవాడు జయదేవ్‌లోని న గణాలను చూడే బిస్మిల్‌ను విడిపించే 'యాక్షన్‌'*కు భగత్‌సింగ్‌ జయదేవ్‌ని సుకెళ్ళాలని నిర్ణయించాడు. ఒకరోజు మధ్యాహ్నం భగత్‌సింగ్‌ తన నిర్ణయాన్ని నాకు తెలిపినపుడు, నా దుర్భలమైన శరీరంపై నాకు మవా కోపమొచ్చింది. నన్ను పార్టీ పనికి యోగ్యమైనవాడుగా భావింపలేదనే విషయం నాకు తీవ్ర మనస్తాపం కలిగించింది. దీనివల్ల తనం ననన నక 2. విప్లవకారుల పరిభాషలో జైలు నుంచి ఎవరినైనా తప్పించడాన్నీ ఏ అధికారినైనా చంపడాన్నీ ద్రోప్రిడ్తీ చేయడాన్నీ పోలీసుల నెదుర్కొనటాన్నీ “యాక్షన్‌” అని అనేవారు. వం సత నం స ప. 12 శివవర్మ

కొంతసేపు కూర్చుని వుండి, నిద్రవస్తోందనే నెపంతో నేను ఒకవైపుగా పడుకున్నాను. నేను నిద్రపోవడంలేదని భగత్‌సింగ్‌కు తెలుసు. అతను కొంతసేపు ప్రక్కనున్న పుస్తకం తిరగేసిన తర్వాత నా భుజాన్ని కుదుపుతూ మెల్లగా “శివా!” అని నన్ను పిలిచాడు.

“ఏమిటి?” నేను అతనివైపు ఒత్తిగిలి అడిగాను.

“ఒక విషయం అడగనా?”

“అడుగు”

“ఒక వ్యక్తి పేరు గొప్పదా, పార్టీ పని గొప్పదా?”

“పార్టీ పనే గొప్పది” నేను జవాబిచ్చాను.

“పార్టీ పని అవిచ్చిన్నంగా సాగుతుండాలి. మనం గైకొనే 'యాక్షన్స్‌” విజయవంతమవుతుండాలి. మన సందేశం దేశ ప్రజలకు ఆటంకం లేకుండా అందుతుండాలి. ఈ స్వాతంత్ర్య సమరంలో మనం ఒక్కొక్క మజిలీలోను సఫలం చెందుతుండాలి కదూ! దీనికి మొదటి షరతేమిటో తెలుసా?”

“సంఘటితమైన, విస్పృతమైన ప్రజూ సమీకరణ” అని నేనన్నాను.

“ప్రజా సమీకరణ, ప్రచారం! దేశ ప్రజలు మన సాహసాన్నీ, కార్యక్రమాలనూ ప్రశంసిస్తున్నారు. కాని వారు మనతో ప్రత్యక్ష సంబంధం వుంచుకోలేని పరిస్థితిలో వున్నారు. మనం కూడా వారికింతవరకు మనం చెప్పే స్వాతంత్ర్యం రూపం ఎలా వుండబోతుంది, ఆంగ్రేయులు వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడే మన ప్రభుత్వం ఏ విధంగా వుంటుంది అనే విషయాలు వివరించి చెప్పలేదు. మన పోరాటానికి మద్దతుగా ప్రజలను సమీకరించడానికి మనం మన ఆదర్శాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే, ప్రజల మద్దతు సంపాదించకుండా మనం ఇదివరకటిలా కొందరు ఆంగ్లేయాధికారులనూ, వారి ఏజెంట్లనూ చంపుతూ కాలం గడపలేము. మనం ఇంతవరకు ప్రజాసమీకరణను, ప్రచారాన్నీ నిర్లక్ష్యం చేసి 'యాక్షన్స్‌'కే ప్రాధాన్యతనిస్తూ వచ్చాము. ఈ పద్ధతిని మనం వదలాలి. నేను నిన్నూ విజయ్‌నూ ప్రజలను సమీకరించడానికీ, ప్రచార నిర్వహణకూ వదలి వెళ్ళాలను కుంటున్నాను” అని చెప్పి కొంతసేపు ఊరుకుని మరలా భగత్‌సింగ్‌ అన్నాడు : “మనమందరం సైనికులం. సైనికులకు అన్నింటికంటే యుద్ధరంగమే ప్రీతికరమైంది. అందువల్లనే అందరూ 'యాక్షనొకు వెళ్ళడానికి ఉత్సాహపడారు. అయినప్పటికీ మన ఆందోళనను దృష్టిలో వుంచుకుని కొందరైనా 'యాక్షన్స్‌' పట్ల మోహం వదులుకోవలసిందే! సాధారణంగా 'యాక్షన్‌లో పాల్గొనేవారినే ఉరికంబమెక్కేవారినే కీర్తికాంత వరిస్తుంది. వారి స్థితి ఒక పెద్ద భవనపు ప్రధాన ద్వారంపై పొదిగిన ఒక వజం వంటిదే! అయితే పునాది క్రింద పడున్న ఒక రాయికన్నా ప్రాధాన్యత ఆ వజ్రానికి వుండదనేది నిజం!” భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ కం

నేను పడుకునే భగత్‌సింగ్‌ మాటలను వింటూ వున్నాను. అతడు నా తల వద్ద గోడకానుకుని కూర్చున్నాడు. అతడు ఆలోచించి ఆలోచించి మాట్లాడుతున్నట్లనిపించింది. మధ్య మధ్యలో అతని కుడిచేతి వ్రేళ్ళు నా ముంగురులను సవరిస్తున్నాయి. ఆగి ఆగి భగత్‌సింగ్‌ మాట్లాడుతూనే వున్నాడు: “వజ్రాలు భవనం అందాన్ని పెంపొందించవచ్చు చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తవచ్చు. అయితే అవి భవనానికి పునాది కాలేవు. భవనాన్ని దీర్హకాలం వరకు నిలిపి వుంచలేవు. శతాబ్దాల తరబడి తమ బలమైన భుజస్మ్కందాల మీద దానిని నిలిపివుంచలేవు. ఇంతవరకూ మన ఉద్యమం వజ్రాలను సమీకరించిందే తప్ప పునాది రాళ్ళను సేకరించనేలేదు. అందువల్లే మనం ఇన్ని త్యాగాలు చేసినప్పటికీ భవనం రూపురేఖలు కూడా దిద్దుకోలేకపోయాం. నేడు మనకు పునాదిరాళ్ళే కావాలి.”

భగత్‌సింగ్‌ తన మాటలిలా కొనసాగించాడు : “త్యాగం, బలిదానం కూడా రెండు విధాలు. ఒకటి - గుండు దెబ్బతినీ, ఉరికంబమెక్కీ చనిపోవడం, ఇందులో ఆకర్షణ అధికంగా వున్నా కష్టం తక్కువే! రెండవది - జీవితమంతా భవనం బరువును మోస్తూ వుండడం. పోరాట క్రమంలో ప్రతికూల వాతావరణంలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడుగా మన మిత్రులందరూ విడిపోయినప్పుడు మనిషి ఒకటి రెండు ఓదార్పు మాటలకు తపించిపోతాడు. అటువంటి సమయాల్లో విచలితులు కాకుండా తమ లక్ష్యపధాన్ని వీడనివారు, భవనం బరువుచేత తొట్రుపాటు పడనివారు, భారానికి కృంగిపోయి తమ భుజాలను క్రిందికి వంచనివారు, జ్యోతి మందగించరాదనుకుని తమను తాము దహించుకునేవారు, నిర్మానుష్యమైన మార్గంలో చీకట్లు అలుముకోరాదని తమ్ము తామే కొవ్యాత్తిలా కరిగించుకునేవారు ప్రాణత్యాగం చేసేవారికన్నా శ్రేస్టమైనవారు కారా?”

నేను తలపైకెత్తి భగత్‌సింగ్‌ను చూశాను. అతని పెదవులపై చిరునవ్వు నాట్యమాడుతోంది. “నీవు నన్ను అపార్థం చేసుకున్నావు. అందువల్లనే ఇంతగా చెప్పవలసి వచ్చింది. ఇప్పుడే మన ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి నుంచే మనం అపార్థాలకు గురై ఒకర్నొకరు సందేహించనారంభిస్తే గమ్యస్థానాన్ని ఎలా చేరుకోగలం?”

అప్పుడే జయదేవ్‌ గదిలో ప్రవేశించాడు. వచ్చీ రాగానే అతడు “ఏం మాట్లాడుకుంటున్నారు?” అనడిగాడు.

“నేను దొంగతనం చేశానని మీ మిత్రునికి సందేహం కలిగింది. దానికి సంజాయిషీ చెప్పుకుంటున్నాను” అని చెబుతూ భగత్‌సింగ్‌ నా చెయ్యి పట్టి నన్ను కూర్చోబెట్టాడు. అతడు మరలా తన మామూలు స్థితికి చేరుకున్నాడు. అతడు ఆ రోజు ఉదయం గంగానది ఒడ్డున కాలేజీ నావ చూసి వచ్చాడు. *ఈ రాత్రికి గంగానదిలో గడీ... శివవర్మ

పడవ షికారుకెడితే బాగుండదూ” అనీ క్రొత్త ప్రతిపాదన చేశాదు. పడవ షికారుకెళ్ళడం నిజమైపోయింది. ఈ సంగతి విజయ్‌, సురేంద్ర, బ్రహ్మదత్తలకు కూడా తెలిపాము.

అనుకున్నట్టే మా జట్టు పూర్తిగా రాత్రి పది గంటలకు పడవలో చేరింది. భగత్‌సింగ్‌కు పడవ నడపడమూ, ఈదడమూ చాలా ఇష్టం! అతడు పడవను విప్పి, తెడ్డు కర్రలను అందుకున్నాడు. ఇప్పుడు మేము గంగానదీ ప్రవాహం మధ్యలో వున్నాము. భగత్‌సింగ్‌ వేస్తున్న తెడ్డు కర్రల శబ్దం ఆ నిశ్శబ్ద నిశీధిని ఛేదిస్తూ వినబడుతోంది. అతని బలమైన చేతులు నదీ ప్రవాహాని కెదురుగా పడవను వేగంగా పరుగెత్తిస్తున్నాయి. అలా పడవ చాలా దూరం వెళ్ళిన తరువాత, అతడు తెద్దుకర్రలను ప్రక్కన పెట్టేశాడు. పడవ మెల్లగా కాలేజీ వైపు పోనారంభఖించింది. దానిని ఇటూ అటూ వెళ్ళకుండా చూసుకోవడమే ఇప్పటి పని! భగత్‌సింగ్‌, అజయ్‌ ఇద్దరూ పాడటం మొదలెట్టారు. వారి మధురస్వరాలు గాలిలో తేలియాడనారంభించాయి. ఈ సంగీత లహరిలో పదవ ఎటువైపు వెళుతుందో మేము గమనించలేదు. అది లోతు తక్కువ వైపుకు వెళ్ళి ఇసుకలో కూరుకుపోయి నిలిచిపోయింది. చంద్రుడు ఆకాశం నుంచి అదృశ్యమయ్యాడు. వెండి వెన్నెలకు బదులుగా అంధకారమనే నల్లటి దుప్పటి నలుదిశలా కప్పేసింది. మేము ఇటూ అటూ పరికించి చూశాము. పదవ గంగానది ఇంకో ఒద్దుకు కొంచెం దూరంలో వుంది.

ఒక్కొక్కరుగా అందరమూ నీటిలో దిగాము. పడవను కదిలించాము, తన్నాము, త్రిప్పి చూశాము, కానీ అది ఇంకా ఇంకా ఇసుకలో కూరుకుపోతూనే వుంది. ఇలా ఒక గంట ప్రయత్నించిన తర్వాత చేతిగడియారం చూస్తే మూడు గంటలయింది. పడవను అక్కడే వదిలేసి మేము తెద్దు కర్రతో నీటిలోతు చూసుకుంటూ, పట్టణానికి మరోవైపున వున్న ఎడమ ఒడ్డుకు చేరుకున్నాము. అంతసేపటి నుంచి నీటిలోనే వున్నందువల్ల మా కాళ్ళూ, చేతులూ తిమ్మిరెక్కాయి. ఆ కాలంలో కాన్పూరు నగరంలో గంగానది ఎడమ ఒద్దు నిర్మానుష్యంగానే వుండేది. చాలా దూరం వరకూ పొలాలూ, పొదలూ, గుబుర్లూ, తడి నేలలూ తప్ప వేరే ఏమీ వుండేవి కాదు. అక్కడ ఒద్దున ఎవరో ఎందు తెడ్డు కర్రలు సేకరించి వున్నారు. వాటిలో నుంచి కొన్నింటిని తీసి మంటవేసుకున్నాం. ఇక తెల్లవారే వరకు ఈ నిప్పే మాకు తోడు!

ఉషోదయం కాగానే నేనూ, జయదేవ్‌ తొందరగా హాస్టల్‌కు వెళ్ళాలని ఆతురత చెందాము. పది గంటలకు మాకు సైన్సు ప్రయోగాత్మక పరీక్ష వున్నందువల్ల మెల్లగా పడవ తీసుకురమ్మని ఇతరులకు చెప్పి, మేమక్కడినుంచి బయలుదేరాము, వంతెనను చేరుకోవాలంటే ఇంచుమించు ఒక మైలు నడవాల్సి వుంటుంది. అందువల్ల మేమొక కాలిబాటలో నడిచాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కాలిబాట ఎదురు దిశలో మళ్ళింది. మా ఎదుటి నేల తేమగా వున్నప్పటికీ అక్కడ నీరు లేదు. అయినా సుమారు భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 15

తొమ్మిది, పది అడుగుల దూరమున్న అటు నుంచి కాలిబాట వెళ్ళక, వందగజాల దూరం చుట్టుకొని అది అటువైపు వెళ్ళింది. జయదేవ్‌ ఇంతదూరం నడిచి వెళ్ళడానికి ఇష్టంలేక ఆ తడినేలను గెంతి, అటువైపు చేరాలనుకున్నాడు. నేనతణ్ణి వారించేలోపే అతను గెంతేశాడు. అటువైపు దూకగానే జయదేవ్‌ కాళ్ళు తడినేలలో కూరుకుపోయాయి. అతని శరీరం కూడా క్రిందికి కూరుకుపోతోంది. అతడు భయంకరమైన ఊబిలో చిక్కుకున్నాడు. అతణ్జి బోర్లాపడుకోమని చెప్పి, నేను కాలిబాట గుండా అటువైపు పరుగెత్తాను, నా వద్ద ఒక ఉన్ని శాలువా వుంది. అక్కడున్న తుంగమీద కాలూని నా శాలువాను జయదేవ్‌పై విసిరి వేశాను. అప్పటికే అతను నడుము వరకు బురదలో కూరుకుపోయాడు. అతికష్టంపై అతను శాలువా సహాయంతో బయటపడ్డాడు. తర్వాత ఒకచోట అతను తన శరీరాన్నంటిన బురదను కడిగేసుకున్నాడు. ఎంత భయంకరమైనదా ఊబి! అయినా ఆ వెన్నెల రాత్రి చాలా కాలం వరకూ మా స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. నేటికి కూడా అది ఆకర్షణీయంగానే వుంది. అప్పటి ఆ నిర్లక్ష్యం, ఆ చింతలేనితనం ఇప్పుడు మళ్ళీ పొందగలిగితే ఎంత బావుండును! రెండు మూడు రోజుల తర్వాత విజయ్‌ వచ్చి, జైల్లో 'బిస్మిల్‌”పై కొనసాగుతున్న నిఘా, అధికారుల జాగరూకత గురించి వివరించి, ప్రస్తుతానికి అతణ్జి జైలు నుంచి విడిపించే ప్రయత్నం మానుకోవడం మంచిదని చెప్పాడు. ఈ వార్త భగత్‌సింగ్‌ ష్లానులన్నింటినీ నాశనం చేసింది. అతని కలలన్నింటినీ కల్లలు చేసింది. ఎంతో ప్రయత్నం తర్వాత విజయ్‌కు బిస్మిల్‌ రచించిన ఒక కవిత మాత్రం అందింది. మేము మా ప్లానులను అమలు పరచడంలో ఆలస్యం చేయడం చూసి విసుగుచెంది, మమ్మల్ని నిరసించడానికే 'బిస్మిలో ఆ కవితను రాసినట్లుంది. కానీ జైలు అధికారులు దాన్నాక (ప్రేమ కవితగా భావించి, వెలుపలికి పంపుకోడానికి అనుమతించారు. ప్రస్తుతం ఆ కవితలోని కొన్ని పంక్తులే నాకు జ్ఞాపకమున్నాయి: “నశించవలసినవాడు నశించాడు ఇక కుశల మదడగదమెందుకు? హృదయం ముక్కలైన పిదప ఆమె సందేశం రావడమెందుకు? నమ్మకాలన్నీ చెదిరిపోయిన పిదప స్మృతులన్నీ చెరిగిపోయిన పిదప ఈ సమయంలో వార్వాహరుడు సమాచారమందించి ఏం లాభం! ఓ నా అమాయక హృదయమా! నన ననన గా

సహచరికోసం ఇక నీవు నళశించిపో!

అనుచిత సమయాల్లో

ఇక నీ ఉపయోగమేముంది?

నా జీవిత కాలంలోనే

నిన్ను కలుసుకుంటే ఎంత బావుండేది?

సంవత్సరాలు గడచిన తర్వాత ఈ సుదినం వచ్చి వం లాభం?”

భగత్‌సింగ్‌ విజయ్‌ చేతిలో నుంచి ఆ కాగితం తీసుకొని చదువుకున్నాడు. “ఏమైనా చేయాలనుకుంటే వెంటనే చేయండి! తర్వాత ఉరిత్రాడులో వేలాడే నా శవాన్ని మీరు విడిపించుకోగలిగినా, దానివల్ల మీకేం ప్రయోజనం ఉంటుంది?” అని బిస్మిల్‌ సూచనప్రాయంగా చెప్పి వున్నాడు. భగత్‌సింగ్‌ చేతి నుంచి ఆ కాగితం ముక్క క్రిందకు జారిపోయింది. అతడు నిర్జీవ ప్రతిమలా గోడకానుకొని చతికిలపడిపోయాడు. ఇక ఆ రోజుకు ఎవరమూ మాట్లాడలేకపోయాం. విజయే, సురేంద్ర ఇద్దరూ వెళ్ళిపోయారు. భగత్‌సింగ్‌ నిశ్ళబ్దంగా లేచి గంగానదివైపు వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి చాలా పొద్దు పోయింతర్వాత నేనూ, జయదేవ్‌ కలసి భగత్‌సింగ్‌ను వెదుక్కుంటూ గంగా తీరానికి వెళ్ళాం. అప్పుడు కూడా అతను అలాగే నెత్తిమీద చేయి వుంచుకుని చల్లటి ఇసుకలో నిశ్శబ్దంగా కూర్చుని వున్నాడు. మేము అతని దగ్గరకు వెళ్ళి అతని భుజంపై చేయి వేసి, “గదికి పోదాం” అన్నాం. అతడు లేచి నీడలా మమ్మనుసరించాడు. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు.

ఏమీ లేని చోట అనేక మాసాల కఠిన శ్రమ తర్వాత అతడు విప్లవకారులను సంఘటితపరిచాడు. ప్రణాళికా వ్యూహాలు రచించాడు. ఆయుధాలు సేకరించాడు. అతని లక్ష్యం నెరవేరే సమయాన, తన ప్రయత్నంలో విజయం సాధించే సమయాన అన్నీ తారుమారు అయిపోయాయి. బిస్మిల్‌ నిరసన మాత్రమే మిగిలింది. ఇందువల్ల భగక్‌సింగ్‌కు పెద్ద దెబ్బే తగిలింది. అయితే ఒకే రోజులో దీనినతడు తట్టుకుని నిలవగలిగాడు.

“వరాజయాలకు తలవంచి కూలబడిపోతే మనం ప్రయాణించే మార్గమే మూసుకుపోతుంది. అప్పుడు మనం దారిలోని అడ్డంకులను తొలగించి ముందడుగు వేయడానికి బదులు మనమే ఇతరులకు అడ్డంకిగా తయారవుతాము” అని మరురోజు భగత్‌సింగ్‌ అన్నాడు. అతడు మిత్రులందరినీ సమావేశపరచి, సంఘ సమస్యలనూ, ప్రచార సమస్యలనూ వారితో చర్చించాడు. భవిష్యత్‌ కార్యక్రమం రూపొందించాడు. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పి పంజాబ్‌కు వెళ్ళిపోయాడు. ఇది 1927 సంవత్సరం ప్రారంభంలో జరిగింది. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 17

1926లో భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, భగవతీచరణ్‌, యశ్‌పాల్‌ మొదలైనవారు లాహోరులో 'నవ జవాన్‌ భారత్‌ సభ (యువజన భారత సభను స్థాపించారు. ఇది విష్లవోద్యమానికి ఒకవిధమైన బహిరంగ వేదిక, బహిరంగ సభలు, ప్రకటనలు, కరపత్రాలు మున్నగు వాని ద్వారా విప్లవకారుల ఉద్దేశ్యాలనూ, అభిప్రాయాలనూ ప్రచారం చేయడమే దీని కార్యక్రమం! ప్రపంచవ్యాప్త సమస్యలైన దోపిడీ, దారిద్ర్యం, అసమానత్వం మొదలైన వాటిని వారు లోతుగా అధ్యయనం చేసి, భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యమేగాక ఆర్ధిక స్వాతంత్ర్యం కూడా అవసరమనే నిర్ణయానికి వచ్చారు. “గారడీ దీపం” ద్వారా అమరవీరులైన విప్లవకారుల చిత్రాలను చూపి, వ్యాఖ్యానాల ద్వారా విప్లవోద్యమం గురించి ప్రచారం చేయడం కూడా 'నవజవాన్‌ భారత్‌ సభ కార్యక్రమంగా వుండేది. అది ప్రచారానికి ఒక శక్తివంతమైన సాధనంగా ప్రసిద్ధి చెందింది.

రహస్య కార్యకలాపాలకు విస్సృత కార్యరంగాన్ని సిద్ధం చేయడానికి, ప్రజలలో సామ్రాజ్యవాద వ్యతిరేకమైన జాతీయ భావాలను జాగ్భతమొనర్చడానికి 'నవజవాన్‌ భారత్‌ సభా ఏర్పడింది. భగత్‌సింగ్‌, భగవతీచరణ్‌ వోహ్రా - వీరిద్దరూ దాని ప్రధాన సూత్రధారులు. భగత్‌సింగ్‌ దాని మొదటి ప్రధాన కార్యదర్శిగానూ, భగవతీచరణ్‌ ప్రచార కార్యదర్శిగానూ ఎన్నికయ్యారు. సుఖదేవ్‌, ధన్వంతరి, యళ్‌పాల్‌, ఎహసాొన్‌ ఇలాహీ మొదలైనవారు సభకు ముఖ్యమైన కార్యకర్తలుగా వుండేవారు. ఆ కాలంలో సోషలిజాన్ని ఇష్టపడే కాంగ్రెస్‌ యువకులందరూ 'నవజవాన్‌ భారత్‌ సభిలో చేరేవారు.

సభ కార్యకర్తల రాజకీయ, సామాజిక అవగాహనను పెంపొందించడంలోనూ, వారికి శాస్త్రీయ భౌతికవాదాన్ని బోధించడంలోనూ '“సర్వెంట్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సొసైటీ' 'ప్రధానాచార్యులైన ఛబీల్‌దాస్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆయన రచించిన చిన్న పుస్తకం “ఏం చదవాలి?” (1/41 10 26162” ) మేము చదవడానికి పుస్తకాల నెన్నుకోవడంలో చాలా సహాయపడింది. ఇదిగాక కొంతమంది కాంగ్రెస్‌, కాంగ్రెసేతర నాయకుల సహకారం కూడా సభకు లభించింది. అటువంటివారిలో డాక్టర్‌ సత్యపాల్‌, దాక్టర్‌ కిచ్లూ, కేదారనాథ్‌ సెహగల్‌, మోహన్‌సింగ్‌ జోషి పేర్కొనదగ్గవారు.

కాంగ్రైిసయొక్క గాంధీవాద సంస్మరణాత్మక విధానాన్ని విమర్శించి - ప్రజలలో తీవ్రవాద రాజకీయ కార్యకలాపాలను ప్రోత్సహించడం, వారిలో విప్లవోద్యమం పట్ల సానుభూతి కలుగచేయడం 'నవజవాన్‌ భారత్‌ సభ కార్యక్రమంలో ఉండేది ఆ సమయంలో వీలైనంతవరకూ 'నవజవాన్‌ భారత్‌ సభ విప్లవోద్యమం గురించి బహిరంగంగా ప్రచారం చేసింది.

భగత్‌సింగ్‌ కాన్పూర్‌ వచ్చినప్పుడల్లా ఇతర పుస్తకాలతో పాటు 'నవజవాన్‌ భారత్‌ సభకు సంబంధించిన కొంత సాహిత్యం కూడా తెచ్చేవాడు. రాధామోహన్‌, ఈ లారా వర

గోకుల్‌గారు, సత్యభక్త్‌వంటి వారు మా కామ్రేడ్స్‌ అందరిలోను సోషలిజం పట్ల (ప్రేమాభిమానాలు కలిగించారు. భగత్‌సింగ్‌ పరిచయం వీరిద్దరితోను శబీంద్రనాథ్‌ సన్యాల్‌ ద్వారా 'కాకోరి సంఘటనకు ముందే వుండేది. ఈ నలుగురు సోషలిజం గురించీ, కమ్యూనిజం గురించీ ఎంతో చర్చించి వున్నారు. కీర్తిశేషులు గణేశ శంకర్‌ విద్యార్ధి నేతృత్వంలో మేము కాన్సూర్‌ కార్మిక సంఘంలో కూడా ఛద్ద తీసుకోనారంభించాం. తర్వాత భగత్‌సింగ్‌ మా శ్రద్ధను పెంపొందింపచేసి - సోషలిస్టు గ్రంథాలను చదవడానికీ, దానిని గురించి చర్చించడానికీ మమ్మెంతో ప్రోత్సహించాడు.

ఆంగ్లేయుల బానిసత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం మొదటి ఘట్టమేననీ, అంతిమ సంఘర్షణ దోపిడీకి విరుద్ధంగా చేయవలసి వుందనీ అతను చెబుతూ వుండేవాడు. ఆ దోపిడీ మనుషుల మధ్య గానీ, దేశాల మధ్య గానీ వుండవచ్చు. ఈ పోరాటం ప్రజల సహకారం లేకుండా చేయలేం. కాబట్టి మనం వివిధ మార్గాల ద్వారా ప్రజల వద్దకెళ్ళడానికి ప్రయత్నిస్తూనే వుండాలి. 'నవజవాన్‌ భారత్‌ సభి స్థాపన, కార్మిక సంఘ కృషి పత్రికలలో వ్యాస పరంపరలు ప్రచురించడం, గారడీ దీపం, కరపత్రాలు మొదలైనవన్నీ ఈ ('ప్రయత్నంలోని భాగాలే!

భగత్‌సింగ్‌కు పూర్వం విప్లవకారులు ప్రజలతో ఇటువంటి విసృత సంబంధాల నేర్చరచుకోలేదు. అతడు ఖైదులోపడ్డ తర్వాత కూడా కోర్టులను తన భావ ప్రచారానికే ఉపయోగించుకున్నాడు. అతడు మంచి యోధుడేగాక, మంచి ప్రచారకుడుకూడా!

కలం, గళం - ఈ రెండూ (ప్రచారానికి రెండు ప్రధాన సాధనాలు. భగత్‌సింగ్‌ ఈ రెండింటినీ విజయవంతంగానే ఉపయోగించాడు. అతదు సంభాషణాచతురుదేగాక, మంచి వక్త కూడా! యువకులు, విద్యార్థులలో గారడీ దీపం కంటే అతడి ప్రసంగాలే సుప్రసిద్ధమైనవి.

రచనలో కూడా భగత్‌సింగ్‌ సిద్ధహస్తుడు. హిందీ, ఉర్దూ, పంజాబీ, ఆంగ్ల భాషలలో అతను మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఆ రోజుల్లో కామ్రేడ్‌ సోహన్‌సింగ్‌ జోషి అమృతసర్‌ నుంచి కీర్తి అనే మాసపత్రికను గురుముఖి, ఉర్జూలలో నడుపుతుందేవాదు. అనేక మారుపేర్లతో అందులో అమరవీరులైన విపష్లవయోధుల జీవిత చరిత్రలెన్నో వచ్చాయి. వాటిలో అత్యధికమైనవాటిని భగత్‌సింగే వ్రాశాడు. హిందీలో అతను ఎక్కువగా “ప్రతాప్‌; (ప్రభు (కాన్సూర్‌), 'మహారథి” (ఢిల్లీ), “చాంద్‌” (అలహాబాద్‌) పత్రికలలోనే వ్రాశాడు.

ఆంగ్లంలో వ్రాసిన అతని వ్యాసాలు, కోర్టు ప్రకటనలు, కరపత్రాలు మున్నగునవి అతని చక్కటి శైలికి నిదర్శనాలు. 'నవజవాన్‌ భారత్‌ సభ ప్రణాళికను భగవతీచరణ్‌తో భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 19

కలిసి 1928లో భగత్‌సింగ్‌ రచించాడు. భాష శైలి, అనాటి దేశ రాజకీయ పరిస్థితి - వీటి నేపథ్యంలో భావాల పరిపక్వత దృష్టితో చూస్తే నేటికీ ఆ ప్రణాళికకు చారిత్రక (ప్రాధాన్యత వుంది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్‌ అసెంబ్లీ (పార్లమెంటు)లో భాంబు దాడి తర్వాత కోర్టులో భగత్‌సింగ్‌ చేసిన ప్రకటన ఆనాదే ప్రపంచ ప్రసిద్ధమైన పత్రంగా రూషాందింది.

అతనికి రాయడమంటేనూ, చదవడమంటేనూ మవాో ఇష్టం. అతను కాన్పూర్‌కు వచ్చేటప్పుడల్లా తనతో కొన్ని పుస్తకొలను తప్పక తెచ్చుకానేవాడు. తర్వాత కాలంలో కూడా అజ్ఞాతవాసంలో అతనితో నేను కలిసినప్పుడు భగత్‌సింగ్‌ ఇరవై నాలుగ్గంటలూ పుస్తకాలతోనూ, పిస్టల్‌తోనూ వుండటం గమనించాను. అతని వద్ద ఒక్క పుస్తకం కూడా లేకుండిన సందర్భం నాకు జ్ఞాపకం లేదు.

1928-24 సంవత్సరాలలో భగత్‌సింగ్‌ తండ్రి అతనికి వివాహం చేయాలని వెంటపడ్డాడు. ఆయన మొండి పట్టుదల నుంచి తప్పించుకోడానికి భగత్‌సింగ్‌ కాన్పూర్‌ పారిపోయి వచ్చేశాడు. కొన్నీ రోజులు ఢిల్లీలో కూడా వున్నాడు. ఇక్కడ అతను ఫలు ఇబ్బందులతో కాలం గడిపాడు. ఢిల్లీ కాన్పూర్‌ల నుంచి లాహోర్‌ తిరిగి వెళ్ళిన తర్వాత అతని తలపై తలపాగాకు బదులు చిన్న టవల్‌ వెలిసింది. ఇప్పుడతను షర్టు ధరించడం మానివేసి గొంతు వరకు మూసిన ఖద్ధరు కోటును వేసుకోనారంభించాడు. కోటు చేతులు చిరిగిపోతే పైజమా క్రింది భాగాలను కోటుకు జతచేసి కుట్టుకున్నాడు. పైజమాకు బదులుగా తన శాలువానే లుంగీలా కట్టుకోసాగాడు. అయితే ఇటువంటి స్థితిలో కూడా అతని కోటు జేబులో ఏదో ఒక పుస్తకం తప్పక వుందేది.

భగత్‌సింగ్‌ సొందర్యాధకుడు. సంగీతమన్నాా కళలన్నా మంచి అఖిరుచి వుండేది. ఆగ్రా కేంద్రంలో అతను వుండే సమయాన పంజాబ్‌ నుంచి సుఖదేవ్‌ వచ్చాడంటే చాలు, ఇద్దరూ నిర్విరామంగా కబుర్లలో పడిపోయేవారు. అప్పటి పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకలాపాలు, ఆ నాయకుల కుట్రలూ - కుతంత్రాలూ, 'నవజవాన్‌ భారత్‌ సభి కార్యక్రమం, మేధావుల మానసికోన్నతి - పతనం, విష్రవోద్యమ సమస్యలూ, కార్మికుల పోరాటాల నుంచి ఎవరేమి చదివారు, చదివిన గగ్రంథకర్తల శైలీ, భావాలూ, కొత్త సినిమాలు, నటుల నటన వరకూ వారు మాట్లాడుకొనేవారు.

భగత్‌సింగ్‌, సుఖదేవ్‌ల వినోద స్వభావం గురించి రాజారాంశాపస్రి హృద్యంగా వర్ణించారు న

“భగత్‌సింగ్‌ ఏం చదివేవాడో, అతని ఆలోచనా ధోరణి ఎలా వికసించిందో, పార్లమెంటులో బాంబు వేసిన తర్వాత అతడు విసిరివేసిన కరపత్రంలోని విషయం న నన న న

అతనికెక్కడి నుంచి లభించిందో, అజ్ఞాతవాసంలో రష్యన్‌ విప్లవకారుల నుంచి అతనికెటువంటి ప్రోత్సాహం లభించిందో, రహస్య సాహిత్యాన్ని అతనెలా పంచిపెట్టేవాడో తర్వాత వివరిస్తాను. మొదట భగత్‌సింగ్‌కూ, నాకూ వున్న సాంగత్యం చెబుతాను. దీనినుంచి అతనెటువంటి వినోదప్రియుడో తెలుసుకోవచ్చు. అతడు మామూలు యువకుల్లా కొంటెచేష్టలు కూడా చేస్తుందేవాడు.

“రాత్రి సమయం. నేను గాఢంగా ని(ద్రపోతున్నాను నా గది తలుపును మూడుసార్లు తట్టడం విన్పించింది. నేను వెళ్ళి తలుపు తీశాను. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌ నా గదిలో ప్రవేశించారు. నేను మంచం మీద పడుకున్నాను. వారు తమ బట్టలు విప్పుకున్నారు. నా గది చాలా చిన్నది కావడాన, అందులో ఒకే ఒక మంచం పడుతుంది కానీ అప్పుడు మేము ముగ్గరమున్నాం. ఎవరు ఎక్కడ ఎలా నిద్రపోవాలి? గడ్డు సమస్యే! నేను నిద్ర ముంచుకొచ్చినట్టు మంచంలో మేను వాల్చాను. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌ మొదట మెల్లగా, తర్వాత బిగ్గరగా ముఖ్యంగా నాకు వినబడేటట్లు మాట్లాడుకో నారంభించారు. “పాపం, రాజారాంను నిద్రపోనీయ్‌! మనం మెల్లగా మాట్లాడుకుందాం” అని భగత్‌సింగ్‌ సుఖదేవ్‌తో చెబుతున్నాడు. అలాగంటూనే ఇద్దరూ మంచానికిరువైపులా బైరాయించారు. వారిద్దరూ మాట్లాడుతూ, మాట్లాడుతూ నన్ను రెండు ప్రక్కల నుంచి నొక్కడం ప్రారంభించారు. కొంతసేపైన తర్వాత నన్ను మధ్యలో వదిలి, వారిద్దరూ రెండువైపులా పడుకున్నారు. వారిద్దరూ మాట్లాడుకోవడం నటన మాత్రమే! నన్ను ఇబ్బంది పెట్టడం వారి ముఖ్యోద్దేశ్యం. వారిద్దరూ దగ్గర దగ్గరకు కదులుతున్నారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. చివరకు నేను విసుగుచెంది మంచం నుంచి లేచిపోయాను. నేల మీద పడుకున్నాను. ఈ విధంగా నేను మంచం మీద నుంచి లేవగానే ఇద్దరూ సుఖంగా నిద్రపోయారు. సోషలిజం పాఠం

“క్క నాటకం ఇంతటితో పూర్తికాలేదు. “సుఖదేవ్‌ భాయీ! రాజారాం చాలా మంచివాడనే విషయం ఒప్పుకొని తీరాల్సిందే! మన ఇబ్బందిని అతడు చూడలేక నేలపై పడుకున్నాడు. మనకోసం పరుపుతో మంచాన్ని వదిలేశాడు” అని భగత్‌సింగ్‌ చెప్పగా, సుఖదేవ్‌ “భగత్‌సింగ్‌! మన రాజారాం చాలా మంచి కామ్రేడ్‌. అతను మిత్రుల సౌకర్యాలకే ప్రాధాన్యతనిస్తాడు. పాపం, ఒక్కమాట కూడా మాట్లాడక కటికనేలపై వెళ్ళి పడుకున్నాడు” అని జవాబిచ్చాడు. నేను ఒక్క ఉదుటున కోపంతో లేచాను. “ఆపండి మీ వాగుడు! నా మంచాన్ని లాక్కున్నారు, నన్ను నేలపై పడుకునేట్టు చేశారు. మీదు మిక్కిలి నన్నే ఎగతాళి చేస్తున్నారా? ఇక నిశ్శబ్దంగా నిద్రపోండి! లేకపోతే దుడ్డుకర్రతో మిమ్మల్ని భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ ల

బాదేస్తాను, అల్లరి చేసేస్తాను. అప్పుడు మీరిద్దరూ బయటకు నడవాల్సి వస్తుంది” అని నేను కేకలు పెట్టాను. అప్పుడు భగత్‌సింగ్‌ అన్నాడు కదా, “రాజారాం కోసం సముచితమేనని నాకనిపిస్తోంది. మనిద్దరం కూడా మంచాన్ని నిలబెట్టేసి నేలపై పడుకోవడమే ఉచితమని సోషలిజం చెబుతోంది. అప్పుడు అందరి ఇబ్బందులూ సమానమైపోతాయి.” వారిద్దరూ మంచాన్ని నిలబెట్టేశారు. ఇంకేం? ముగ్గురమూ నేలమీదే పడుకున్నాము, భగత్‌సింగూ, సుఖదేవూ రాత్రి వేళల్లో వచ్చినప్పుడల్లా ఈ నాటకమే మరలా మరలా (ప్రదర్శించబదేది.

భోజన సమయంలో కూడా పరిహాసమే!

“భగత్‌సింగ్‌ వినోద స్వభావుడు. అవకాశం వచ్చినవ్వుడల్లా పరిహాసమాడకుందా వుండడు. మధ్యాహ్నమైనా, రా్రియైనా నన్ను ఆటపట్టించడానికి అతను రామకృష్ణా హోటల్‌కు వచ్చేవాడు. నేనక్కడ భోంచేస్తూండేవాణ్ణి. అతని పద్ధతి ఇదీ : నా ఎదుటి కుర్చీలో వచ్చి కూర్చుని ఏదైనా ఒక విషయాన్ని కాలక్షేపానికి ఎత్తుకొనేవాడు. అలా మాట్లాడుతూ, మాట్లాడుతూనే మెల్లగా చేయి చాపి నా పళ్ళెంలో నుంచి రొట్టెముక్క చశుంచుకునేవాడు. 'పళ్ళెంలో చేయి పెట్టడానికి ముందు చేతులు కడుగుకోవయ్యా! ఈ విధంగా నన్నడగకుండా నా వళ్ళింలో చేయి వుంచడం నా కిష్టంకాదు. భోం చేయాలనుంటే నాతో చెప్తే నీకు వేడి పళ్ళెం తెప్పించనూ?” అని నేను చెప్పేవాణ్ణి. 'భోంచేయాలనేమీ లేదు. అయితే, నీ కిష్టమైతే వేరే పళ్ళెమే తెప్పించు! అని భగత్‌సింగ్‌ అమాయకుడిలా జవాబిచ్చేవాడు. రొట్టెలతో పళ్ళెంరాగానే “కొంచెం నెయ్యికూదా తెప్పించవయ్యా!? అనేవాడు. అదీ వచ్చిం తర్వాత, 'భోజనం తర్వాత ఏదైనా తీపితింటే వాగుంటుంది. అందువల్ల భోజనం రుచికూడా అధికమవుతుంది" అని చెబుతూనే భగత్‌సింగ్‌ మరి రెండు రొట్టిలకూ, పాయసానికీ ఆర్జరిచ్చేసేవాడు. “రాజారాం! నీవిక్కడికి రోజా వస్తావా? ఏ షేళకాస్తావు? మరోలా అనుకోకపోతే చెప్పవయ్యా బాబూ! అనదిగేవాడు, “అలాగేనయ్యా! నేనెప్పుడొచ్చేద్‌ మీకు తెలియజేవుతాను. మీరు కరెక్టుగా ఆ వేళకొన్చి నా భోజనాన్ని ఎంగిలికానిద్దురుగాని. నాతో మాట్లాడదలిస్తే, ఇంటికొచ్చి ఎందుకు మాట్లాడరాదు ? రోడ్డుమీదా, అందులోను హోటల్లో ఎందుకు మాట్లాడాలి? అని నేను విసుక్కునేవాణ్జి. ఇలా భోంచేస్తూ మేమిద్దరమూ ఒకరినొకరి పరిహాసమాడుతుండేవారం.

ఎప్పుడైనా భగత్‌సింగూ, సుఖదేవూ ఇద్దరూ ఒకటిగా వచ్చారంటే ఒక చెప్పవలసిన పనేలేదు. నన్ను మధ్యలో వుంచి, నాకిరువైపులా ఇద్దరూ కూర్చునేవారు. తర్వాత, 'రాజూరాంకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం"? అంటూ ఆర్దర్లపై ఆర్దర్లు గుప్పిస్తూ వుండేవారు. “'ఆలోచిస్తావెందుకోయ్‌? రాజురాం కాదంటాధా?” అంటూ, ఇద్దరూ తృప్తిగా వ లూ

భోంచేసేవారు. అప్పుడప్పుడూ నాకు ఒళ్ళుమండి, 'మీకు తినాలనుంటే తినండి! మధ్యలో నా పేరెందుకు లాగడం?” అని అరిచేవాణ్జి. భగత్‌సింగ్‌కు రసగుల్లాలంటే చాలా ఇష్టం. వాటీని అత్యధికంగా తెప్పిస్తూ ఆరగిస్తూ వుండేవాడు. భోజన వేళల్లో ఈ స్మృతులు నేటికీ నన్ను ఆ గడచిన కాలానికి తీసుకెళ్ళిపోతాయి. 'ఆ రోజులు మళ్ళీ తిరిగొస్తే ఎంత బావుండును! నేను ప్రతీకారం తీర్చుకున్నాను “ఈ ఇద్దరికీ సరియైన గుణపాఠం నేర్పాలని ఒక రోజు నా మనసులో అనుకున్నాను. ఆ ఆలోచనతో వేరొక హోటల్‌కు భోంచేయడానికి వెళ్ళాను. ఆ మధ్యాహ్నంపూట భగత్‌సింగూ, సుఖదేవూ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలియదు - అక్కడకూ వచ్చేశారు. నన్ను మధ్యలో వుంచి ఇద్దరూ ఇరువైపులా కూర్చున్నారు. వారు యధాప్రకారం భోంచేయనారంభించారు. ఉత్సాహంగా పాయసానికి కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. వారు మామూలుగా నాకంటే వేగంగా మోసపు తలంపుతో భోంచేసేవారు. ఎప్పుడైనా నేను వారికంటే ముందుగా భోజనం ముగించి లేస్తే నన్ను బలవంతంగా కూర్చోబెట్టి మాటల్లో పడేసేవారు. ఆ రోజు వీరిని ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాను కదా! అందువల్ల నేను వారికంటే ముందే త్వరగా భోజనం ముగించి లేచి, 'మీరు నిదానంగా భోంచేయండి! తొందరేం లేదు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాను. మళ్ళా తిరిగి వస్తానని నేను చెప్పిన మాటలు వారు విశ్వసించారు. వారిద్దరూ ఆనందంగా భోంచేస్తున్నారు. నేను హోటలు నుంచి వెలుపలికొచ్చి ఉడాయించాను. దగ్గరిలోని ఒక పెద్ద దుకాణం వెనుక నక్కివుండి, వారలా బయటపడతారో చూద్దామని వేచి వున్నాను. వారు నాకోసం చాలాసేపు ఎదురు చూశారు. కానీ నేను పత్తాలేను. చివరకు వేరే మార్గంలేక భగత్‌సింగూ, సుఖదేవూ భోజనం ముగించి లేచారు. హోటల్‌ యజమాని వారిని డబ్బులడిగాడు. వారు 'మా స్నేహితుడు బయటకు వెళ్ళి వున్నాడు, వస్తూనే వుంటాడు. అతడు రాగానే డబ్బులిస్తాడు అని సర్జి చెప్పారు. కానీ అతను వీరి మాటలకు ఒప్పుకోలేదు. కొద్దిసేపటి వరకు ఇరుపక్షాలలోను తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. మనవారు హోటల్‌ యజమానిపై విజ్బంభించారు. అతను కూడా కొట్లాటకు సిద్ధమయ్యాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వీరి వద్ద డబ్బులు లేవు. హోటలతను డబ్బులు ఇవ్వకుండా వీరిని బయటకు పంపడానికి ఒప్పుకోలేదు. చివరికి వీరిద్దరూ ఏం చేయబోతారు? మనవారు ఇద్దరు మాత్రమే! హోటలు యజమాన్సీ, అక్కడ నౌకర్లూ, పనివారూ అందరూ వీరిని చుట్టుముట్టారు. ఇంకొంచెం సేపట్లో కొట్లాట జరగబోతుంది. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, మాటిమాటికి రోడ్డువైపు చూస్తున్నారు. కానీ నేనెక్కడా వారికి కనబడలేదు. నేను దుకాణం భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 23

వెనుక నుంచి ఈ తమాషానంతా చూస్తూ ఆనందిస్తున్నాను. ఇక కొట్లాట ప్రారంభమవుతుందనగా, ఆనందించడం ఇక చాలుననుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ హోటల్‌ వద్దకు వచ్చాను. ఏమి యెరగనివానిలా అమాయకంగా, “సంగతేంటి?” అని వారిని ప్రశ్నించాను. ఇద్దరూ నామీది కురికారు. 'నీవెక్కడికి వెళ్లిపోయావు? ఇంత ఆలస్యమెందుకయింది? ఈ హోటలతను మాతో కొట్లాట కొస్తున్నాడు.” చివరకు నేను డబ్బులు చెల్లించేశాను. ముగ్గురమూ అక్కడి నుండి బయటపడ్దాము. నేను ఇంకొంతసేపు రాకుండా వుండి వుంటే కొట్లాట జరిగివుందేది. మనం తలెత్తుకు తిరగలేమని దారిలో వారు నాతో నిష్ణురాలాడారు. “ప్రతిరోజూ మీరు నన్ను వేళాకోళం చేసినప్పుడల్లా మీకేమీ అనిపించలేదా? ఈ రోజు మిమ్మల్ని నేను కొద్దిగా అల్లరిపెట్టగానే ఇంతగా ఉడికిపోతున్నారు. దీనికి పరిహారం వమంటే- ఇకపై మీరు నన్ను అల్లరిపెట్టకండి!” అని నేన్నాను. ఇలా మేము మాట్లాడుకుంటూ ద్వారకాదాస్‌ గ్రంథాలయం చేరుకుని పత్రికా పఠనంలో మునిగిపోయాము. నేటికీ ఆనాటి ఈ తియ్యటి జ్ఞాపకాలను తలుచుకుంటే భగత్‌సింగ్‌, సుఖదేవ్‌ సృతులు బాధాకరంగా పరిణమిస్తాయి. అనిర్వచనీయ లోకాలలో నా మనసు వ్యధ చెందుతుంది.

భగత్‌సింగ్‌ అల్లరిపనులు

“సాధారణంగా యువకులలో వుండే కొంటెతనమూ, అల్లరితనమూ భగత్‌సింగ్‌లో కూడా వుండేవి. ఒకరోజు అతను నా వద్దకొచ్చి “రాజారాం! నీవు నిజమైన స్నేహితుదవైతే నా పని ఒకటి చేసిపెట్టు, నీకు రుణపడి వుంటాను అన్నాడు. “చేయదగిన పనిగా వుంటే తప్పక చేస్తాను” అన్నాన్నేను. అతడు జేబు నుండి ఒక చిత్రపటాన్ని తీశాడు. దానిని పుస్తకం నుంచో, పత్రిక నుంచో చింపుకొచ్చినట్లుంది. అది ఒక గెరిల్లా (చింపాజీ, అదవి మనిషి చిత్రం. మా అందరికీ ఒక దగ్గరి స్నేహితుడుందేవాడు. ఆయన అడవి మనిషిలాగే వుండేవాడు. భగత్‌సింగ్‌ తను మాట్లాడేటప్పుడు ఆయన్ని “అడవి మనిషనే పేర్మానేవాడు. “ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆయనగారికి చేర్చు! దీన్ని చూచింతర్వాత ఆయన ప్రతి క్రియ ఎలా వుంటుందో నాకు చెప్పూ అన్నాడు భగత్‌సింగ్‌.

ఆ చిత్రం చూచి నాకు నవ్వొచ్చింది. అయితే నేను “భగత్‌సింగ్‌! నీవు మహా కొంటెవాడివి. ఆ పెద్దమనిషిని ఈ విధంగా ఎగతాళి చేయడం బాగా లేదు. నీవే ఆ చిత్రాన్ని పంపావని ఆయనకు తెలిస్తే ఆయన నీ మీదకు ఉరకనూ వచ్చు, నిన్ను కోపగించుకోనూవచ్చు! వద్దు భాయీ, ఇలాంటి పని చేయకూడదు” అని అన్నాను. కానీ భగత్‌సింగ్‌ “భాయీ! నేను ఊరుకోను. నీవు దీన్ని ఆయనకు చేర్చకపోతే వేరెవరిచేతైనా పంపే తీరతాను. ఆయన కోపగించు కుంటాడంటావా? ఆయనెందుకు కోపగించు 2కే... శివర్మ

కుంటాడు? ఆయన నా బాల్యమి(త్రుదైతేను! ఒకవేళ కోపగించుకుంటే మనందరం కలిసి ఆయనకు నచ్చచెబుదాం! అప్పటికీ ఆయన ఒప్పుకోకపోతే మీరందరూ చేరి నన్ను తిట్టిపోయండి, ఆయన శాంతిస్తాడు” అని చెప్పాడు. అతను ఎంత చెప్పినా నేను అంగీకరించక పోయేటప్పటికీ భగత్‌సింగ్‌ “నీవు తీసుకువెళ్ళి దీన్ని ఆయనకివ్వకపోతే నేనే దీన్ని ఆయనకు పోస్టులో పంపేస్తాను. క్రింద నీ పేరు రాసేస్తాను అని బెదిరించాడు. “నీవలా చేశావంటే నేనే ఆయన దగ్గిరకెళ్ళి ఈ కొంటెపనంతా నీవే చేశావని చెప్పేస్తాను” అని నేనూ ఎదురుతిరిగాను. కొద్దిసేపటి తర్వాత భగత్‌సింగ్‌ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. అతడు ఆ చిత్రాన్ని ఆ పెద్దమనిషికి పంపాడా, లేదా అనేది నాకిప్పుడు జ్ఞాపకం లేదు. అయితే ఆ గొరిల్లా చిత్రం క్రింద ఆ పెద్దమనిషి పేరు మాత్రం భగత్‌సింగ్‌ రాశాడు. ఇంతకాలం తర్వాత కూడా భగత్‌సింగ్‌ నవ్వు ముఖం, కొంటెతనం తొణికిసలాడే అతని కళ్ళు నేటికీ నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. నిజంగానే అతను అమాయకుడు, నిష్కపట హృదయుడు, విశ్వాసపాత్రుడైన స్నేహితుడు. నూనె సీసా, విప్లవ సంభాషణ “చిన్న చిన్న విషయాలలో కూడా నేనూ, భగత్‌సింగ్‌ తగాదా పడుతుండేవారం. ఒకరోజు నేను బజారు నుండి సామానులు తీసుకొచ్చాను. వాటిలో ఒక నూనె సీసా కూడా వుంది. కొంతసేపట్లో భగత్‌సింగ్‌ వచ్చాడు. కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడింతర్వాత తలగోక్కుంటూ” భాయీ! ఈ సీసాలోని నూనె కొంచెమివ్వు చాలా రోజుల నుండి తలకు నూనె రాసుకోలేకపోయాను, తల దురద పెడుతోంది” అన్నాడు భగత్‌సింగ్‌. నేను బజారు నుండి అప్పుడే వచ్చాను. చాలా అలసి కూడా వున్నాను. ఇంకా సీసా మూత కూడా తీయలేదు. అప్పుడే నూనె ఇమ్మని ఆజ్ఞాపించాడు. నేను కొంచెం కోపంలో కూడా వున్నాను. “భాయి! నిన్ను అర్ధం చేసుకోవడమే కష్టంగా వుంది. నేను భోంచేస్తుంటే నా పళ్ళెంలోంచే రొట్టె తుంచుకుంటావు. బజారు నుంచి నేను తెచ్చిన నూనెను చూడగానే నీ తల దురద పెడుతుంది. నీకు నిజంగానే నూనె కావాలా లేక నన్ను ఉడికించాలని అడుగుతున్నావా? ఏమైనాసరే ఈ రోజు నీకు నూనె ఇవ్వనుగాక ఇవ్వను” అని అన్నాను. కాని భగత్‌సింగ్‌ పట్టుదలగా మాట్లాడసాగాడు. “నీ వద్ద నూనె వున్నప్పుడు, దాని అవసరం నాకు వున్నప్పుడు, దాన్ని నేను తీసుకోకుండా వుండను. నీవుగా ఇవ్వకపోతే నేను లాక్కుంటాను. మనిద్దరి పోట్లాటలో సీసా పగిలిపోవచ్చు. నూనె మనిద్దరికీ దక్కకపోవచ్చు. అప్పుడు మనిద్దరం బాధపడాల్సి వస్తుంది.” భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ £గ్‌

“నీవు నా వస్తువును దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నావు. ఇది దోపిడీ గాక మరేమిటి?” అని నేనరచాను.

శ్సీవు దీన్ని దోపిడీ అనైనా అనుకో, లేక మరేమైనా అనుకో - నేను నూనె తప్పక తీసుకుంటాను” అన్నాడు భగత్‌సింగ్‌.

దీనితర్వాత కొద్దిసేపటివరకు సీసా కోసం మా ఇద్దరి మధ్యా వాదం జరిగింది. భగత్‌సింగ్‌ నా మణికట్టును త్రిప్పి, నా చేతిలోంచి సీసాను లాగుకుని, బిరడా తీసి తన తలపై ఒంపుకున్నాడు. ఆతను తన పొడవాటి వెంట్రుకలను బాగా విప్పి తలకు పూర్తిగా నూనె పట్టించాడు. అతను సీసాలోని నూనెనంతటినీ ఒంపుకొని వెంట్రుకలను సవరించుకోసాగాడు. అది చూచి నాకొశ్చర్యమేసింది. అది చూడదగిన దృశ్యం. నూనెవల్ల వెంట్రుకలు నునుపుదేలదమేగాక తలనుంచి నూనె కారబోయేటట్లుంది. “ఇక వెంట్రుకల ఆకలి తీరిపోయింది. ఒక వారం వరకు నూనె రాచుకొనే పనిలేదు” అని భగత్‌సింగ్‌ సంతోషంగా చెప్పుకుపోయాడు. నూనె అంతా ఒంపుకున్న తర్వాత అతను ఖాళీ సీసాను నా చేతికివ్వబోయాడు. నేను తీసుకో నిరాకరించాను. అతను ఖాళీ సీసాను అక్కడ బల్లపైన వుంచేశాడు.”*

ఒకసారి ఫ్రెంచి నవలాకారుడు విక్టర్‌ హ్యూగో రచన 'నైంటీత్రిలోని ఒక ఘటన గురించి భగత్‌సింగ్‌కూ, సుఖదేవుకూ అభిప్రాయభేదం వచ్చింది. ఫ్రాన్స్‌ చక్రవర్తి సైన్యాలకూ, విప్లవ సైనికులకూ యుద్ధం జరుగుతుంది. విప్లవ సైన్యాలు విజయం సాధిస్తాయి. శత్రు సైన్యాధ్యక్షుడు 'లాంతృక్‌' ఖైదులో పడతాడు. విప్లవ సైన్యాధినేత “గావెన్‌ లాంత్నక్‌ వంశానికి చెందిన యువకుడు. అతడు లాంత్నక్‌ సోదరుని మునిమనవడూ, అతని సంస్థానానికి వారసుడూ కూడా. ఉరి తీయడానికి ముందు రాట్రి గావెన్‌ తన చినతాతను చెరసాల గదిలో కలుసుకుంటాడు. గావెన్‌ చక్రవర్తి కుటుంబానికి ద్రోహం చేసి, (ప్రజాతంత్రవాదులలో చేయి కలిపాడని లాంత్నక్‌ అతడ్ని గర్జిస్తాడు. గావెన్‌ కోమలమైన హృదయ తంత్రులను కూడా స్పందింపచేస్తాడు. చివరకు గావెన్‌కు వృద్ధుడైన లాంత్నక్‌ మీద జాలేస్తుంది. అతడు తన సైన్యాధినేత ఉడుపులను చిన తాతకు ధరింప చేసి, రక్షకుల కళ్ళుగప్పి చెరసాల నుంచి అతద్ని బయటకు తప్పిస్తాడు. అతనికి బదులుగా తానే జైలు గదిలో బందీగా వుండిపోతాడు. మరురోజు ఉదయం ఉరి తీయడానికి ఖైదీని వెలుపలికి తెచ్చినపుడు లాంత్సక్‌ బదులుగా గావెన్‌ వుండడం చూచి అందరూ ఆశ్చర్యపోతారు. విప్లవ సైన్యాల మధ్య ప్రజా సురక్షా పరిషత్‌ ప్రతినిధిగా అవపను

8, రాజారామ్‌ శాస్త్రీ రచించిన “అమరవీరుల సంస్కరణలు” 70 పేజీ.

ాాాాాాోోాలవవ్న లిం శినవర్శ్మ

'సిమర్దిన్‌ అనే మత గురువు కూడా వుంటాడు. అతడు గావెన్‌కు బాల్యంలో విద్య గరిపినవాడే గాక, తండ్రిలా (ప్రేమించినవాడు. సిమర్దిన్‌ కర్తవ్య నిర్వహణలో ఎంత పట్టుదలగలవాడో, మానవ సహజమైన మృదుభావాలలో అంత దుర్చలుడు. గావెన్‌ అతని యెడల తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సిమర్దిన్‌ ఆధ్వర్యాన విప్లవ న్యాయస్థానం విప్లవానికి ద్రోహం చేసిన నేరానికిగాను అతనికి మరణదండన విధించింది. ఉరితీయదానికి ముందు రాత్రి నిమర్దిన్‌ గావెన్‌ను చెరసాల గదిలో కలుసుకుంటాడు. సిమర్దిన్‌ని చూడగానే గావెన్‌ మర్యాదపూర్వకంగా లేచి నిలబడతాడు. ఇద్దరి కళ్ళ నుంచి కన్నీరు ప్రవాహంగా కురుస్తుంది. మరురోజు ఉదయం వధ్య స్థలంలో గావెన్‌ చేతులు కట్టబడి నిలుచున్నాడు. సైనికులు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఎదుట ఒక బురుజుమీద సిమర్దిన్‌ నిలబడి వున్నాడు. అతనిచేతి సైగతోపాటు గావెన్‌ మృత శరీరం భూమ్మీద పడుతుంది. దానితోపాటే ఒక పిస్తోలు (క్రేలిన శబ్దం వినబడుతుంది. సిమర్దిన్‌ శరీరం కూడా బురుజు పైనుండి నేలపై కూలుతుంది అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుని సిమర్దిన్‌ విప్లవకారుల ముందు మంచి ఆదర్శాన్ని వుంచలేదనేది సుఖదేవ్‌ వాదన! విప్లవానికి అతని అవసరం అధికంగా వున్న సమయాన సిమర్దిన్‌ ఒక యువకుని పట్ల మోహంతో తన లక్ష్యాన్ని కాలదన్నాడు. సిమర్దిన్‌ ఏనాడో తన జీవితాన్ని విప్లవాదర్శానికి అంకితం చేసేశాడు. అటువంటివాడు మధ్యలో తన ఆదర్శమార్గం నుంచి తప్పుకోడానికి వీల్లేదనేది సుఖదేవ్‌ అభిప్రాయం. విప్లవ వీరునికి భావావేశమో, వ్యక్తిగత మమతా వాత్సల్యాలో వుండడాన్ని సుఖదేవ్‌ అంగీకరించలేదు. దీనికి వ్యతిరేకంగా భగత్‌సింగ్‌ సిమర్దిన్‌ పట్ల సానుభూతి చూపాడు. సిమర్దిన్‌ గావెన్‌కు మరణశిక్ష విధించి, విప్లవోద్యమం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అయితే అతనూ మానవుడే! మానవ సహజమైన, వాత్సల్యపూరితమైన హృదయం అతనికుంది. అతను గావెన్‌ను పుత్రునితో సమానంగా చూచుకున్నాడు. కాబట్టి గావెన్‌ మృత్యువును సిమర్దిన్‌ ఓర్చుకోలేకపోయాడు. మానవుల మధ్య తరతరాలుగా వస్తోన్న మమకానుబంధాల్ని గౌరవించడం ద్వారానే విప్లవ ధర్మాన్ని కూడా మనం సరిగ్గా నిర్వహించగలమని భగత్‌సింగ్‌ చెప్పాడు. “మనం మానవులుగా వుండి విష్లవకారులం కాగలం. దేవతలుగా వుండి కాదు.” నాకు జ్ఞాపకమున్నంత వరకు ఆనాడు ఎంతోసేపు తీవ్రంగా చర్చించుకున్న తర్వాత కూడా భగత్‌సింగ్‌కూ, సుఖదేవ్‌కూ ఏకాభిప్రాయం ఏర్పడలేదు. చివరకు సుఖదేవ్‌, భారత విష్తవ కెరటం భగత్‌సింగ్‌ ల

“దైవత్వం గురించి నీవు చెప్పింది ఒప్పుకుంటాగానీ, కవుల్లా వాదించే నీ నవలా తర్మం నా కర్థం కాలేదూ అని చెబుతూ లేచిపోయాడు. భగత్‌సింగ్‌కు ముందున్న విప్లవకారుల ప్రధాన లక్ష్యం దేశ స్వాతంత్ర్యం మాత్రమే కానీ ఈ స్వాతంత్ర్యము ఎలా వుండాలి. అనే విషయంలో మాకెవరికీ స్పష్టమైన అభిప్రాయాలు లేవు. ఆంగ్లేయుల వైస్రాయిని తొలగించి, ఆయనకు బదులుగా ఒక భారతీయ వైప్రాయిని వుంచేస్తే సమస్య పరిష్కారమైపోతుందా? మన సమాజంలో ఆర్థిక అసమానత్వం, ఒక మనిషిని మరో మనిషి దోచుకుంటుండగా, నిజంగా మనం స్వాతంత్ర్యాన్ని అనుభవించగలమా? దేశ స్వాతంత్ర్యం తర్వాత ఏర్చడే ప్రభుత్వం ఎవరిదిగా వుండాలి? అప్పటి సాంఘిక వ్యవస్థ ఎలా వుండాలి?- ఇటువంటి విషయాల గురించి విప్లవ వీరులలో అస్పష్టత అత్యధికంగా వుండేది. భగత్‌సింగ్‌ అందరికన్నా ముందుగా ఈ సమస్యలను లేవనెత్తి సోషలిజాన్ని పార్టీ ధ్యేయంగా ముందుంచాడు. మన స్వాతంత్ర్య పోరాటం గమ్యస్థానం వైపు ఒక ముందడుగు మాత్రమేననీ, అక్కదే మనం ఆగిపోతే మన మహాప్రస్థానం అసంపూర్ణమైపోతుందనీ అతడు చెప్పేవాడు. సాంఘిక, ఆర్ధిక స్వాతంత్ర్యం లేని రాజకీయ స్వాతంత్ర్యం కొందరు పలువురిని దోచుకునే స్వాతంత్ర్యంగానే వుంటుంది. దోపిడీ, అసమానత్వాల నిర్మూలన అనే సిద్ధాంతం పైన నిర్మితమైన సోషలిస్టు సమాజంలోనే, సోషలిస్టు రాజ్యాధికారంలోనే సర్వతోముఖమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. సోషలిజం ఆ కాలంలో యుగ నినాదంగా వుంది. విప్రవకారులలో భగత్‌సింగే ఈ విషయంలో మొట్టమొదట ఆ నినాదాన్ని విన్నాడు, గుర్తించాడు. అతను తన ఇతర మిత్రులందరికంటే ముందున్నాడు. భగత్‌సింగ్‌కు మునుపు దేశవ్యాష్తమైన విప్లవకారుల సంస్థ ఏదీ లేదు. బెంగాల్‌లో 'యుగాంతరొ, “అనుశీలన్‌” మున్నగు సంస్థలుండేవి. పంజాబ్‌లో “గదర్‌ పార్టీ పని చేస్తుండేది. ఉత్తరప్రదేశ్‌, బీహారుల్లో ప్రధానంగా హిందూస్సాన్‌ ప్రజాతంత్ర సంఘం పని చేస్తుండేది. అమర వీరులను అందరూ సమానంగానే కీర్తించవచ్చు. కానీ వారిలో పరస్పర సహకారమేదీ వుందేది కాదు. భగత్‌సింగ్‌ అందరినీ ఏకంచేసి దేశవ్యాప్తమైన సంస్థ నొకదాన్ని స్థాపించాలనుకున్నాడు. ఈ ఉద్దేశ్యంతోనే అతను 1928వ సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారుల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, పంజాబు నుండి పదిమంది ప్రతినిధులు హాజరయ్యారు. బెంగాల్‌ విప్లవకారుల్లో చాలామంది అప్పుడు జైళ్ళలో వున్నారు. వెలుపలవున్న కొద్దిమంది మా సోషలిస్టు భావాలతోను, 28 శివవర్మ

ప్రజాతంత్ర పద్ధతులతోనూ ఏకీభవించలేదు. అందువల్ల వారు ఢిల్లీ సమావేశంలో పాల్గనడానికి నిరాకరించారు. ఢిల్లీ సమావేశానికి భగత్‌సింగే అధ్యక్షత వహించాడు. అతని సూచన మేరకు “సోషలిజం” పార్టీ లక్ష్యంగా అంగీకరించారు. పేరు కూడా 'హిందూస్తాన్‌ ప్రజాతంత్ర సంఘం) నుంచి 'హిందూస్తాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అని మారింది. దీని అర్ధం మేము మార్చిజాన్నోో శాప్రీయ సోషలిజాన్నో సంపూర్ణంగా బోధపరచుకున్నామని కాదు. అది సోషలిజం వైపు మేము వేసిన మొదటి అడుగు మాత్రమే. మేము సమాజంలోని వర్గ తారతమ్యాలను అర్థం చేసుకున్నాం. రైతు, కూలీల ప్రభుత్వ స్థాపనే మా లక్ష్యమైంది. అయితే రైతు, కూలీల సంఘటిత శక్తితో ఈ లక్ష్యాన్నెలా సాధించగలమనే విషయం మేము పూర్తిగా అర్థం చేసుకోలేదు. ల్‌ సమావేశంలో తీసుకున్న రెండవ నిర్ణయం సంస్థను ప్రజాతంత్రీకరించడం. ఎవరో ఒక వ్యక్తిని ఉద్యమాధినేతగా చేసి, అతని మంచిచెడ్డలపై అన్నిటినీ వదలివేయడం భగత్‌సింగ్‌కు ఇష్టంలేదు. అతని సలహాపైనే ఉద్యమ నిర్వహణకు ఒక కేంద్ర కమిటీ ఏర్పడింది. విధాన నిర్ణయాలలో దానికే సంపూర్చాధికారం కల్పించారు. ఈ సమావేశంలోనే సుఖదేవ్‌ పంజాబ్‌కు, ఫణీంద్రఘోష్‌ బీహారుకు, కుందన్‌లాల్‌ రాజస్థాన్‌కు, శివవర్మ (నేను) ఉత్తరప్రదేశ్‌కు కన్వీనర్లుగా ఎన్నికయ్యారు. భగత్‌సింగ్‌కు, విజయకుమార్‌ సిన్హాలకు ప్రచారం, అంతర్‌ ప్రాంతీయ సంబంధాల బాధ్యతా ఇవ్వటం జరిగింది. ఈ ఆరుగురితో చంద్రశేఖర్‌ అజాద్‌ను కలుపుకొని కేంద్ర కమిటీ ఏర్పడింది. ఆ సమావేశంలో జయదేవ్‌ కపూర్‌, సురేంద్రనాథ్‌ పాండే, బ్రహ్మదత్త మిశ్రా, బీహారుకు చెందిన మన్‌మోహన్‌ బెనర్జీ కూడా పాల్గొన్నారు. పార్టీకి ఒక సైన్యాధ్యక్షుణ్జి కూడా ఎన్నుకొనే విధానం అవలంబించాం. చంద్రశేఖర్‌ అజాద్‌ మొదటి పార్టీ సైన్యాధ్యక్షుడయ్యారు. సమావేశంలో అజాద్‌ పాల్గొనలేక పోయినప్పటికీ భగత్‌సింగ్‌, విజయకుమార్‌ సిన్హా ముందుగానే ఆయన్ను కలుసుకుని అన్ని విషయాలనూ చర్చించారు. వారి సూచనలను అజాద్‌ అమోదించాడు కూడా. ఇంతకుమునుపు విప్లవకారుల అత్యధికశక్తి ప్రభుత్వం తరపున సాక్ష్యమిచ్చేవారిని, అప్రూవర్‌లను, సిఐడి శాఖాధికారులనూ చంపడంలోనూ, డబ్బు కోసం దోపిడీలు సాగించడంలోనూ ఖర్చయిపోతూండేది. ఈ కార్యక్రమాలవల్ల పొందే లాభంకంటే ఎక్కువగా ప్రాణాల్ని బలియిచ్చి వచ్చేవారు. ఢిల్లీ సమావేశంలో ఈ విషయం గురించి కూడా నిర్ణయం తీసుకొన్నాం. వీలయినంతవరకు ప్రభుత్వ సొమ్మునే దోచుకోవాలని నిశ్చయించుకున్నాం. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 29

'ప్రజలతోను, దేశ రాజకీయ సమస్యలతోను (ప్రత్యక్ష సంబంధమున్నవాటినే 'యాక్షన్‌*కు తీసుకోవాలనుకున్నాం. ఈ నిర్ణయాలన్నింటి వెనుక భగత్‌సింగే ప్రధాన సూత్రధారి! రాజకీయాందోళనల దృష్ట్యా 1928వ సంవత్సరం చాలా ప్రాధాన్యత గలది. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్మికుల సమ్మెలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తమైన పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభం యొక్క నీలి నీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. ఇందువల్ల రైతులు, మధ్యతరగతివారు, జాతీయ పెట్టుబడిదారులు గూడా కష్టాలపాలయ్యారు. సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటిష్‌ పెట్టుబడిదారులకు కొంత వెసులుబాటు కల్గించడానికై ప్రభుత్వం రూపాయి విలువను ఒక షిల్లింగ్‌ నాలుగు పెన్నీల నుంచి ఒక షిల్లింగ్‌ ఆరు పెన్నీలుగా నిర్ణయించింది. ఇందువల్ల ఆంగ్లేయ వ్యాపారులూ, పెట్టుబడిదారులూ రాత్రికి రాత్రే అనేక లక్షల రూపాయలు సంపాదించుకోడానికి మార్గం సుగమం అయింది. మరోవైపు స్వదేశీ ఉక్కు పరిళ్రమకు ఇచ్చివుండిన సంరక్షణను ప్రభుత్వం రద్దుచేసింది. ఇందువల్ల విదేశీ ఉక్కుదేశంలోకి వచ్చిపడింది. దీనితో భారతీయ పెట్టుబడిదారీ వర్గం కూడా అసంతృప్తి చెందింది. దేశ వ్యాప్తమైన ఈ అసంతృప్తిని ఉపశమింపచేయడానికై ప్రభుత్వం కొన్ని సంస్కరణల ఎర చూపి, సైమన్‌ కమిషన్‌ ఏర్పాటును ప్రకటించింది. ఈ కమిషన్‌ సభ్యులందరూ ఆంగ్లేయులే! భారతదేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఈ కమిషన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకించాయి. దీని తర్వాత కూడా సైమన్‌ కమిషన్‌ భారతదేశానికి వచ్చింది. దేశమంతా దాన్ని బహిష్కరించింది. ప్రజలు కమిషన్‌ రాకన్సు నిరసించి సమ్మెలు చేశారు. "సైమన్‌ కమిషన్‌- తిరిగి వెళ్ళిపో నినాదాలతో నల్లజెండాలు చూపారు. బ్రిటిష్‌ (ప్రభుత్వం వీటినేమీ ఖాతరు చేయలేదు. ప్రజల అభిలాషకు విరుద్ధంగా ఆ కమిషన్‌ను దేశం మీద రుద్దారు. ఇది మన భారతదేశానికే ఘోర అవమానం. మేము ఉత్తర భారతదేశంలో సైమన్‌ కమిషన్‌ను వెంబడించాలని నిశ్చయించాం. కమిషన్‌ ఢిల్లీకి వచ్చినప్పుడు భగత్‌సింగ్‌, బటకేశ్వరదత్తు, జయదేవ్‌ కపూర్‌ ముగ్గురూ కమిషన్‌ సభ్యులకు దగ్గరగా వెళ్ళాలని ఢిల్లీ వీధులంతా గాలించారు. కానీ వారి నీడలను కూడా మనవారు చూడలేకపోయారు. ఆ సమయంలో ఈ కామ్రేడ్స్‌ వద్ద రివాల్వర్లూ, పిస్తోళ్ళు మాత్రమే వున్నాయి. ఢిల్లీలో పొందిన అనుభవంతో విజయం సాధించాలంటే బాంబు సంపాదించాలనే నిర్ణయానికొచ్చాం. పార్టీ బాంబులు తయారు చేయడానికి ఫ్యాక్టరీని స్థాపించాలని నిశ్చయించింది. దీనికి అన్నిటికన్నా ముందు చాలా డబ్బు కావాలి. ఇందుకై లాహోరులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం మీద దాడి చేయాలని నిర్ణయించాం. ప్రణాళిక తయారైంది. కామ్రేడ్స్‌ లాహోరు చేరుకున్నారు. ఒకరోజు బ్యాంకు ముఖద్వారం వరకు న. 4 _ సాండర్స్‌ హత్య, పార్లమెంట్‌ భవనంలో బాంబుదాడి అటువంటి 'యాక్షన్సే!” తిం శివవర్శ్మ

కూడా వెళ్ళారు. కానీ చివరి నిమిషంలో తాము తీసుకెళ్ళిన కారు మంచి స్థితిలో లేదనే విషయం కనుగొన్నారు. కాబట్టి మరో మంచి కారు తీసుకుని మరో రోజు రావాలనుకుని తిరిగివచ్చేశారు.

ఇదిలా వుండగా, 1928 అక్టోబర్‌ 80వ తేదీనాడు సైమన్‌ కమిషన్‌ లాహోర్‌ వచ్చింది. ఓ పెద్ద ప్రజాసమూహం నల్లజెండాలతో కమిషన్‌కు “స్వాగతం పలికింది. ప్రభుత్వాధికార్లు పిచ్చివారైపోయారు. పోలీసులు ప్రజల ఊరేగింపుపై లారీలతో విరుచుకుపడ్డారు. అప్పుడు జాతీయ నాయకుడైన లాలా లజపతిరాయ్‌ తీవ్రంగా గాయపడి, కొన్నాళ్ళ తర్వాత 1928 నవంబర్‌ 19న చనిపోయాడు. దీంతో దేశమంతా క్రోధావేశాలు వ్యాపించాయి. ప్రజలందర్నీ తీవ్ర దుఃఖం అలముకుంది. 'దేశ గౌరవాన్ని కాపాడుకోలేక పోయిన అసహాయులైపోయామా మనం?” అనే ప్రశ్న ప్రతిచోటా విన్పించింది.!

లాలా లజపతిరాయ్‌ తన అంతిమ కాలంలో విష్లవకారులను ద్వేషించ నారంభించారు. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌లకు తమ బంగళా ద్వారాలను కూడ మూసివేశారు. కాంగ్రెస్‌లో కూడా మోతీలాల్‌ నెహ్రూతో విభేధించి వున్నారు. ఆయన కాంగ్రెస్‌ లౌకిక సంప్రదాయాలకు విరుద్ధంగా మతతత్వాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. అయినా ఇవన్నీ మనదేశ ఆంతరంగిక సమస్యలు. విదేశాలలో లజపతిరాయ్‌ని మన జాతీయోద్యమ అ(గ్రనాయకులలో ఒకరుగానే భావించారు. కాబట్టి ఆయనపై లాఠీలదాడి దేశంపై దాడిచేసినట్టే! ఆ దాడి మన పౌరుషానికి సవాల్‌ వంటిది. ఆ సవాలును మేము స్వీకరించాం.

బ్యాంకు దోపిడీ ఆలోచనను విరమించుకొన్నాం. లజపతిరాయ్‌ చనిపోయిన ఒక నెల తరువాత భగత్‌సింగ్‌, రాజగురు లాహోరు పోలీసు కేంద్ర కార్యాలయం నుంచి వెలుపలికి వస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ సాండర్స్‌ను తుపాకీతో కాల్చి చంపారు. సాందర్సే లాఠీతో లాలా లజపతిరాయ్‌ని చావబాదాడు.*

  1. “మన ప్రముఖ నాయకునిపట్ల ఆంగ్లేయుల ప్రవర్తన అందరికీ రాక్షస ప్రవృత్తి అనిపించింది. దీనికి విరుద్ధంగా భారతదేశమంతటా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక నిర్దివమైన క్రోధానలం వ్యాపించింది. మనం మన నాయకుల గౌరవాన్ని కూడా రక్షించుకోలేని అసహాయులుగాను, అసహ్యకరమైనవారుగాను వున్నాం) (నెహ్రూజీ ఆత్మ కథ పేజి 215, సప్పా సాహిత్య మండల్‌ 1986).

  2. మేము లాహోరు పోలీసు సూపరింటెండెంట్‌ స్మాట్‌ను చంపాలనుకొన్నాం. జయగోపాల్‌ అనే మిక్రుడు పొరపాటుగా సాండర్స్‌నే స్కాట్‌ అనుకొని మాకు చూపాడు. సాండర్స్‌ హత్య తరువాత, స్కాట్‌ లారీ దెబ్బలకే లాలా లజపతిరాయ్‌ చనిపోయాడనే విషయం తెలిసింది.

భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ తే

ఈ హత్యా ప్రయత్నానికై అనేక రోజులుగా మన కామ్రేడ్స్‌ పోలీసు ఆధీసు కెదురుగా తిరుగుతూ వున్నారు. ఆ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కూడా. చివరగా 1928 డిశంబరు 17న సాండర్స్‌ మాకు దొరికిపోయాడు. అతడు పోలీసు కార్యాలయం నుంచి మోటారు సైకిలుపై వెలుపలికి వచ్చేటప్పుడు కాల్పులు సాగించాలని ముందుగానే అనుకొన్నాం. భగత్‌సెంగ్‌, రాజగురు ఇద్దరూ పోలీసు కార్యాలయం గేటుకు కొంత దూరంలో నిలబడి వున్నారు. అక్కడి నుంచి కౌంత దూరంలో జయగోపాల్‌ సైకిల్‌తో నిలబడ్డాడు. సైకిల్‌కు ఏదో చిన్న రిపేరు చేస్తున్నవాడిలాగా అతడు అక్కడ నటిస్తున్నాడు. భగత్‌సింగ్‌, రాజగురు-జయగోపాల్‌ చేసే సైగలనుబట్టియే ముందుకు పోవాల్సి వుంది. వీరికి కొంత దూరంలో డిఎవి కాలేజీ ఆవరణలో చంద్రశేఖర్‌ అజూద్‌ తన మౌజర్‌ పిస్టలుతో నిలబడి వున్నాడు. భగత్‌సింగ్‌ రాజగురు తమ పని పూర్తి చేసిన తరువాత కాలేజీ మార్గంగా హాస్టలుకు చేరుకోవలసి వుంది. వారిని ఎవరైనా వెంబడిస్తే వారి నెదుర్కొని భగత్‌సింగ్‌, రాజగురుబకు పారిపోవడానికి మార్గం సుగమం చేయడానికే అజాద్‌ అక్కడ నిలబడ్డాడు. సాండర్స్‌ జార్యాలయం నుండి వెలుపబీకి రాగానే జయగోపాల్‌ సైగ చేశాడు. రాజగురు వెంటనే సాండర్స్‌ తలపై పిస్టలు పేల్చాడు. మొదటి గుండుదెబ్బకే అతడు మోటారు సపైకీలుతో సవా నేలమీద పడిపోయాడు. సాండర్స్‌ మళ్ళీ సజీవుడు కాకూడదనే ఉద్దేశ్యంతో భగత్‌సింగ్‌ మళ్ళీ నాలుగైదుసార్లు కాల్బాదు. తర్వాత వారిద్దరూ కాలేజీ ఆపరణ నుండి హాస్టలు వైపు వెళ్ళిపోయారు. చనన్‌సింగ్‌ అనే ఒక పోలీసు హెడ్‌ కానిష్టేబుల్‌ వారి వెనక పడ్డాడు. చంద్రశేఖర్‌ అజాద్‌ అతజణ్జి హెచ్చరించినప్పటికీ విననందువల్ల ఆజాద్‌ అతనిని కాల్చాడు. పిస్తోలు గుండు చనన్‌సింగ్‌ తొడను చీలుస్తూ దూసుకుపోయింది. అయినా అతడు వేంబడిస్తూనే వున్నాడు. అందువల్ల అజాద్‌ మరో గుండు కేల్చాడు. కానిస్టేబుల్‌ భూమి మీధ బోర్దాపడిపోయాడు.

ఈ సంఘటన జరిగిన మరురోజు దీని ప్రాధాన్యతను వివరిస్తూ లాహోరు నగరంలో ఆంగ్లభాషలో ఎర్రటి కరపత్రాలు పంపిణీ అయ్యాయి. గోడలమీద పోస్టర్లు కూడా వెలిశాయి. అవి సాండర్స్‌ మరణంతో బాలా లజపతిరాయ్‌ చావుకు ్రతీకొరం తీరిందనే విషయాన్ని ఎలుగెత్తిచాటాయి.

ఈ సంఘటనతో చాలా మందికి సంతృప్తి కలిగింది.” మా విధానాలను అంగీకరించని కాంగ్రెసు నాయకులు కూడా మా భద్రత విషయంలో ఆదుర్దా చెందారు. మా సొనుభూతిపరుల ద్వారా మాకు కావలసినంత డబ్బుకూడా పంపించారు. దీని తరువాత చాలాకాలంవరకు మేము దోపిడీలు సాగించవలసిన అవసరం లేకపోయింది. న

  1. అ సమయంలో భగత్‌సింగ్‌ లజపతిరాయ్‌ గౌరవాన్నీ ఆయన ద్వారా జాతి గౌరవాన్నీ రక్షించాదని అందరూ భావించారు * (నెహ్రూజీ ఆత్మకథ, పేజీ 217) న

దేశానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి లాలాజీ హంతకుణ్ణి తుదముట్టించడం అవసరమనే ప్రతిపాదన చేసింది భగత్‌సింగే! అయినప్పటికీ సాండర్స్‌ని హత్య చేసిన తర్వాత అనేక రోజులుదాకా అతని మనస్సు వ్యాకులతతో నిండిపోయింది. అతడు విష్లవకారుదైనప్పటికీ రక్తపిపాసికాడు. మానవులందరినీ సుఖసంపన్నులు చేయడమే అతడి ధ్యేయం. అందువల్ల అందరి ప్రాణాలను అభిమానించడం అతని స్వాభావిక గుణం. విప్లవకారులు హంతకులు కారు. వారు మానవత్వాన్ని ఆరాధించేవారు. కాబట్టి మానవుల ప్రాణాల్ని హరించేటప్పుడు వారికి సహజంగానే విచారం కల్గుతుంది. ఈ విషయంలో ఢిల్లీ పార్లమెంటులో వెదజల్లిన పార్టీ కరపత్రాలలో ఇలా పేర్మొనటం జరిగింది:

“మేము మానవ జీవితాన్ని పవిత్రమైనదిగా భావిస్తాము. (ప్రతి ఒక్కరికీ సంపూర్ణమైన శాంతి, స్వాతంత్ర్యాలు లభించే ఉజ్వల భవిష్యత్తులో మాకు విశ్వాసముంది. తప్పనిసరైనప్పుడే మేము మానవరక్తాన్ని చిందిన్తున్నాం. ఆందుకు మేమెంతో బాధపదుతున్నాం. అయినా విప్లవం ద్వారా అందరికీ స్వాతంత్ర్యం ప్రసాదించడానికి, మనిషిని మనిషి దోచుకునే పద్ధతిని రూపుమాపడానికి విప్లవంలో కొంత రక్తపాతం కూడా తప్పుదు.”

ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలో బాంబులు వేసిన తర్వాత, భగత్‌సింగ్‌, దత్తు ఖైదు అయిన తర్వాత న్యాయన్థానములో వారిచ్చిన ప్రకటనలో కూడా విప్లవకారులు ఈ భావాన్నే వ్యక్తీకరించారు: “మానవత్వాన్ని ప్రేమించడంలో మేము ఎవరికీ తీసిపోం. మాకు ఎవరిపట్లా వ్యక్తిగతద్వేషం లేదు. మేము అందరినీ ఎల్లప్పుడూ (ప్రేమాద్ధ దృష్టితోనే చూస్తూ వచ్చాం...”

సాండర్స్‌ హత్య తరువాత లాహోరు వదలి వెళ్ళడం ఒక పెద్ద సమస్యగా తయారైంది. ముఖ్యంగా పోలీసులు భగత్‌సింగ్‌ను పట్టుకోవడం కోసం వేట ప్రారంభించారు. అజ్ఞాతవాసానికి పూర్వం అతడు కేశాలు, కడియం, దువ్వెన మొదలైన వాటిని ధరించిన పక్కా శిక్కు యువకునిగా వున్నాడు. కాని ఢిల్లీ సమావేశం తర్వాత అతని ఈ రూపం మారిపోయింది. పోలీసులకు అతని ఈ కొత్త రూపం గురించి ఏమీ తెలియదు. వారు జుట్టుతో వున్న భగత్‌సింగ్‌ కోసమే వెదుకుతున్నారు. అయినప్పటికీ దీర్జకాలం లాహోరులో వుండి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటూ వుంటే పోలీసులు అతనిని గుర్తుపట్టే ప్రమాదం వుంది. అందువల్ల భగత్‌సింగ్‌ పార్టీ ఆదేశానుసారం సూటు, కోటు ధరించి దొరబాబుగా మారాడు. దుర్గా వదిన, శచీని తీసుకొని అతనితో బయలుదేరింది. రాజగురు వారి నౌకరుగా వేషం ధరించాడు. ముగ్గురూ రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు.

  1. అమర వీరుడైన భగవతీ చరణ్‌ వోహ్రా భార్య శ్రీమతి దుర్గాదేవి వోహ్రాను పార్టీలోని వారందరు “దుర్దావదిన” అని పిలుస్తుండేవారు. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ తి

భగత్‌సింగ్‌ ఓవర్‌కోటు కాలర్‌ను పైకెత్తి, నెత్తిపై టోపీ లాగుకుని శచీ (భగవతీచరణ్‌ కుమారుడు) తలచాటున తన ముఖం దాచుకుని కలకత్తా మెయిల్‌ మొదటి తరగతిలోకి వెళ్లి కూర్చున్నాడు. భగత్‌సింగ్‌, రాజగురు ఇద్దరి వద్దా గుండ్లు నింపిన పిస్తోళ్ళు వున్నాయి. ఈ విధంగా దుర్గా వదిన, శబీలను చాటుచేసుకొని వారిద్దరూ క్షేమంగా లాహోరు నుండి బయటపడ్డారు. లక్నో నగరంలో రాజగురు వారి నుండి విడిపోయాడు. భగత్‌సింగ్‌ దుర్గా వదిన, శబీలతో కలకత్తా వెళ్ళిపోయాడు. అప్పుడు కలకత్తా నగరంలో 1928 సంవత్సరపు చారిత్షాకమైన కాంగ్రెస్‌ మహాసభ జరుగుతోంది. అప్పటికి కారాగారాల్లో బందీలుగా బెంగాల్‌ విప్లవకారులలో చాలా మంది విడుదలై వచ్చివున్నారు. వారిలో యతీంద్రనాధ్‌ దాస్‌ కూడా ఒకరు. కాంగ్రైస్‌ మహాసభలో దాస్‌ మున్నగు విష్లవకారులను భగత్‌సింగ్‌ కలుసుకున్నాడు. యతీంద్రనాథ్‌ దాస్‌ బాంబులు తయారుచేయడంలో విశేష నైపుణ్యం కలవాడు. ఆయన ఆగ్రా నగరం వచ్చి బాంబులు తయారుచేయడంలో కొందరు కామేద్స్‌కు శిక్షణ యివ్వాలనే భగత్‌సింగ్‌ కోరికను అంగీకరించాడు. దీనిమూలంగా బాంబుల ఫ్యాక్టరీ నిర్మించాలనే మా ఆలోచనకుండిన ప్రతిబంధకం తొలగిపోయింది. భగత్‌సింగ్‌ దేశ రాజకీయ కార్యకలాపాలపట్ల చాలా అప్రమత్తంగా వుండేవాడనే విషయం యింతకుముందే పేర్యొన్నాను. 1927-28 సంవత్సరాలలో మన దేశమంతటా జరిగిన కార్మికుల సమ్మెలు, వాటికనుకూలంగా విభిన్న దేశాలలోని కార్మికులు వ్యక్తపరచిన సంఘీభావం, ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారతీయ కార్మికులకు ్రిటిష్‌ కార్మికులు అందించిన ఆర్థిక సహాయం, బ్రిటిష్‌ కార్మిక నాయకులు భారతదేశం వచ్చి భారత కార్మికులను సంఘటితపర్చడానికి చేసిన కృషి భారత కార్మికోద్యమాన్ని శాయశక్తులా అణచివేయడానికి ఆంగ్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఈ ఉద్దేశ్యంతోనే పార్లమెంట్‌లో పారిశ్రామిక వివాదాల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ ప్రజలు, రాజకీయ పక్షాలు ఆ రెండు బిల్లులనూ తీవ్రంగా వ్యతిరేకించడం - ఈ అన్ని విషయాలను భగత్‌సింగ్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు. భారత కార్మికవర్గ్ణంయొక్క ఈ జాగృతి దేశ రాజకీయ జీవితంలో ఒక మలుపు వంటిదని అతని అభిప్రాయం. విష్లవోద్యమ అవకాశాల గురించి భగక్‌సింగ్‌ తరచూ - ప్రతిరోజూ - కామ్రేద్స్‌తో చర్చిస్తుండేవాడు. ఆ సమయంలోనే భారత వైస్రాయి ఒక ప్రకటన చేస్తూ - పార్లమెంటు ఆ రెండు బిల్లులను ఆమోదించకపోయినట్లయితే, తన విశేషాధికారాన్ని ఉపయోగించి ఆర్టినెన్స్‌లు జారీచేసి, వాటి నమలుపరుస్తానని ప్రకటించాడు. వార్తా పత్రికల్లో వైస్రాయి ప్రకటన రాగానే భగత్‌సింగ్‌ పార్టీ కేంద్ర కమిటీని సమావేశపరచి, ఎన్నికైన భారత ప్రతినిధులే ఆ దౌర్జన్యపూరితమైన బిల్లులను చట్టాలుగా చేశారని ప్రపంచానికి త్రి శివవర్మ

తెలియజెప్పడానికే వాటిని పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారని వివరించి చెప్పాడు. కాబట్టి ఆ బిల్లుల నమలుపరచదలుచుకుటే వైస్రాయి విశేషాధికారాలతోనే అమలు పరచవచ్చు గదా! (ప్రభుత్వం చెవిటిదైపోయిందని భగత్‌సింగ్‌ చెప్పాడు. ఆ బిల్లులకు వ్యతిరేకంగా దేశమంతటా వినిపిస్తున్న నిరసన ధ్వనులు (ప్రభుత్వానికి వినఐడలేదన్నాడు. “మనం ప్రభుత్వానికి వినబఐడేట్లు చేయాలి” అని పేర్ళొన్నాడు.

భగత్‌సింగ్‌ ప్రతిపాదనపై కేంద్ర కమిటీ, పార్లమెంటులో పారిశ్రామిక వివాద బిల్లుపై ఓటింగ్‌ జరిగిన తర్వాత, ఫలితం (ప్రకటించడానికి ముందు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ప్రభుత్వ పక్షం పైన బాంబు వేయాలని నిర్ణయించింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా భారతీయుల అసంతృప్తిని వ్యక్తపరచడమే బాంబు వేయడానికున్న ఉద్దేశ్యం. మరోరకంగా చెప్పాలంటేచెవిటివారికి వినిపించేటట్లు బాంబు వేయడమేగానీ, ఎవరి ప్రాణాలనే హారించాలనే అభిప్రాయం కాదు. బాంబు వేసిన తర్వాత అక్కడే కరపత్రాలను వెదజల్లి, తన ఉద్దేశ్యాన్ని స్పష్టీకరించాలని కూడా కేంద్ర కమిటీ నిర్ణయించింది.

బాంబు వేసిన తర్వాత అ కామ్రేడ్స్‌ పోలీసులకు లొంగిపోవాలనీ, కోర్టులో తమ భావాలను వ్యక్తపరచాలనీ భగత్‌సింగ్‌ అభిలషించాడు. అతడు కోర్టును రాజకీయ ప్రచారవేదికగా తయారుచేసుకోదలచాడు. (ప్రారంభంలో కేంద్ర కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. చివరకు భగత్‌సింగ్‌ తర్మానికి ప్రభావితులై, దాన్న ఒప్పుకున్నారు.

పార్లమెంటులో బాంబు వేసే పనిని కూడా భగత్‌సింగ్‌ తానే చేయకోరాడు. దాని రాజకీయ ప్రాధాన్యతను న్యాయస్థానంలో తాను వ్యక్తపరచేవిధంగా వేరే కామ్రేడ్స్‌ ఎవరూ స్పష్టంగా వ్యక్తం చేయలేరని అతని అభిప్రాయం. భగత్‌సింగ్‌కున్న ఆ అభిప్రాయం సరైందికూదా! కాని, పట్టుబడితే భగత్‌సింగ్‌కు మరణదండన తప్పదని కూడా తెలుసు. కాబట్టి అతణ్జి వెళ్ళనీయడం మాకిష్టంలేదు. ఎంతోసేపు చర్చించిన తర్వాతకూడా అతను కేంద్ర కమిటీని ఒప్పించలేకపోయినందున మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి తలగ్గాడు. చివరికి వేరే ఇద్దరు కామ్రేద్స్‌ను ఆ పనికి వినియోగించాం.

ఈ నిర్ణయం తీసుకున్న రెండు మూడు రోజులకే పంజాబ్‌ నుంచి సుఖదేవ్‌ వచ్చాడు. అతడు మా నిర్ణయం వినగానే మమ్మల్ని చీవాట్లు పెట్టాడు. మనం ఏ ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నామో, దాన్ని భగత్‌సింగే విజయవంతంగా నెరవేర్చగలడనేది సుఖదేవ్‌ అభిప్రాయం. మన ఉద్దేశ్యమూ నెరవేరక, ఇద్దరు కామ్రేడ్స్‌ ప్రాణాలను వ్యర్థంగా బలి చేయడం అతనికి సుతరామూ ఇష్టంలేదు. దీనిగురించి అంతకుమునుపే అతనూ, భగత్‌సింగూ సుదీర్హంగా చర్చించుకున్నారు. వారు నూటికి నూరు శాతం ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. సుఖదేవ్‌ అభ్యర్థనపై కేంద్ర కమిటీ మరలా సమావేశమైంది. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ తర్‌

ఆ సమావేశంలో భగత్‌సింగ్‌ ఆ కార్యక్రమంలో పాల్గొంటానని మొండిపట్టు పట్టడంతో మేము ఒప్పుకోక తప్పలేదు. కేంద్ర కమిటీ భగత్‌సింగ్‌ను శాశ్వతంగా కోల్పోతామనే భావనే మామధ్య ఒక విషాద వాతావరణాన్ని వ్యాపింపచేసింది. బాంబులు ఎక్కడ వేయాలి, ఏ చోట నుంచి వేయాలి అనే విషయాలను నిర్ణయించడానికై జయదేవ్‌ మునుపే పార్లమెంట్‌ భవన చిత్రాన్ని అధ్యయనం చేశాడు. ఐదారు రోజులు వరుసగా (ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని అవకాశాన్ని పరిశీలించాడు. ఓటింగుకు ముందు రోజు జయదేవ్‌ భగత్‌సింగ్‌ను పార్లమెంట్‌ భవనానికి తీసుకువెళ్ళి అక్కడి పరిస్థితిని వివరించాడు. మరురోజు అతను లోపలకు (ప్రవేశించడానికి మూడు “'పాసిలను సంపాదించి, ఇద్దరు కామ్రేడ్స్‌ను (పేక్షకుల గాలరీలో కూర్చోబెట్టి, వారి పాసులను తిరిగి తీసుకున్నాడు. ఈ 'ప్యాసులు ఒక కాంగ్రెస్‌ ఎం.పి. సంతకంతో లభించాయి. కాబట్టి వాటిని బయటకు వచ్చినతర్వాత తగలబెట్టేశాడు. పారిశ్రామిక వివాదాల బిల్లుపై సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. సభాధ్యక్షుడు విఠల్‌భాయి పటేల్‌ ఓటింగ్‌ ఫలితం యిక (ప్రకటించబోతారనగా (ప్రభుత్వ పక్షప్రు వెనుక బెంచీ నుంచి ఒక పెద్ద శబ్దం వినబడింది. భవనమంతా పాగ నిండిపోయింది. అందరూ నలువైపులకు పరుగులు తీశారు. పొగ కొంత తగ్గిన తర్వాత చూస్తే కొద్దిసేపటికి మునుపు సభ్యులతోను, ప్రేక్షకులతోను కిటకిటలాడిన పార్లమెంట్‌ భవనం నిర్మానుష్యంగా వుంది. భవనంలో ముగ్గురు వ్యక్తులు మాత్రమే మిగిలారు సభాధ్యక్షుడు పటేల్‌, మోతీలాల్‌ నెహ్రూ, ప్రభుత్వ పక్షనాయకుడు సర్‌ జేమ్స్‌ క్రీయర్‌. వారు తమ తమ స్థానాలలో విగ్రహాలవలె నిలబడి వున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఇద్దరు యువకులు మాత్రం నిలబడి తమ నినాదాలతో పార్లమెంట్‌ భవనాన్ని ప్రతిధ్వనింపచేస్తున్నారు. "కార్మికవర్గం వర్ధిల్లాలి!” “సామ్రాజ్యవాదం నశించాలి!” “విప్లవం వర్ధిల్లాలి!” అనే నినాదాలతోపాటు వారు భవనంలో కరపత్రాలు వెదజల్లుతున్నారు. వారు కోరి వుంటే అందరితోపాటు సులభంగా సభా భవనం నుండి బయటపడి వుండేవారు. అయితే వారు పారిపోలేదు. బాంబు పేలిన కొంతసేపటి తరువాత పోలీసులు అట్టహాసంగా అక్కడికీ చేరుకున్నారు. ఒక సార్దెంటు ముందడుగు వేసి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నాడు. పార్లమెంట్‌ భవనం మరోసారి నినాదాలతో మారు(మైోగింది. భగత్‌సింగ్‌, బటుకేశ్వరదత్‌ ఇద్దరూ భవనములో విసరి వేసిన కరపత్రాలలోని మొదటి పంక్తి ఇది: “చెవిటివారికి వినిపించడానికి పెద్ద శబ్దమే అవసరమవుతుంది.” అయితే ప్రభుత్వం చెవిటివానివలె నటిస్తోంది. పార్లమెంట్‌లో దానికి మెజారిటీ వుంది. పారిశ్రామిక వివాదాల బిల్లును సభ ఆమోదించింది. అయినప్పటికీ ప్రజాభ(ద్రతా బిల్లును సభలో ప్రవేశపెట్టే ధైర్యం దానికి లేకపోయింది ఆ బిల్లు ఆర్టినెన్సు రూపంలో దేశంపై తి శివవర్మ

రుద్దారు. భగత్‌సింగ్‌ వెదజల్లిన కరపత్రాలలో ఫ్రెంచి విప్లవాన్ని పేర్మాని, విప్లవ పార్టీ కార్యకలాపాలను సమర్ధించటం జరిగింది. ప్రజాప్రతినిధులు తమ తమ ఓటర్ల వద్దకు తిరిగి వెళ్ళి, వారిని విష్లవానికి సన్నద్దులు చేయమని ఆ కరపత్రాలలో కోరటం జరిగింది.

ఢిల్లీలో ఇప్పుడు జయదేవ్‌, నేను మాత్రమే మిగిలాము. మేము మొదటే ఒక విడి గది తీసుకొన్నాం. ఆ ఇద్దరు కామ్రేడ్స్‌ ఖైదు కాగానే మేము పాత ఇంటిని వదలి కొత్త గదికి వచ్చేశాం. రోజంతా శ్రమించిన తరువాత రాత్రి చాలా పొద్దుపోయింతర్వాత నిద్రకుపక్రమించినపుడు మా ఇద్దరి హృదయాలు చాలా బాధతో నిండివున్నాయి. ఇద్దరం ఏమీ మాట్లాడుకోకుండా కళ్లు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్న నా ముందు జైలు దృశ్యం కన్పించింది. అప్పటివరకు నేను జైలుకు వెళ్ళలేదు. అయితే చెరసాలలోని క్రూరమైన పరిస్థితుల గురించి విన్నాను. క్రితం రాత్రి మేము నలుగురం ఒకేచోట నిద్రపోయాం. కాని ఈ రాత్రి మా నుంచి ఇద్దరు శాశ్వతంగా విడిపోయారు. జీవితంలో ఇక ఎన్నడూ వారిని చూడలేనని అనుకోగానే నాకు ఏడుపొచ్చింది. కన్నీరు పెట్టుకోవడం బలహీనతకు గుర్తు. కాబట్టి నన్ను నేను అదుపు చేసుకోవడం కోసం, నా భావాలను అణచివేసుకొనే వుద్దేశంతో నిశ్శబ్దంగా లేచాను. ఆ నిశీధి వాతావరణంలో వీధి ప్రక్క వున్న కిటికీ వద్దకు వెళ్ళి కూర్చున్నాను.

జయదేవ్‌ కూడా బహుశ నావలెనే కళ్ళు మూసుకొని పడుకొని వున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతను కళ్ళు తెరచి చూసినప్పుడు నేను నా పడకలో లేను. నన్ను వెదకి కనిపెట్టడానికి అతనికి ఏమి ఇబ్బంది కలుగలేదు. నేను కిటికీ దగ్గర మౌనంగా కూర్చుని వుండడం చూచి అతను నా దగ్గరికి వచ్చాడు. “శివాగ అని నన్ను పిలుస్తూ నా పక్కనే కూర్చున్నాడు.

ప్రకృతి మన శరీరాలలో ఇద్దరు గూఢచారులను వుంచింది. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మన మనస్సులోని రహస్యాలను ఇతరులకు తెలియజేస్తారు. ఎంత నిగ్రహించుకొన్నప్పటికీ నా కళ్ల నుంచి రెండు కన్నీటి బిందువులు నేలరాలాయి. అప్పటికే ఆ ఇద్దరు గూఢచారులు కూడా తమ గాథను వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. జయదేవ్‌ కళ్ళు కూడ కన్నీటితో నిండాయి. ప్రాణమిత్రులు విడిపోయినప్పుడు ఎల్లెడలా ఈ విధంగానే జరుగుతుందనుకుంటాను. ఆ రాత్రి మేమిద్దరం చాలాసేపటివరకూ కిటికీ వద్దే నిశ్శబ్దంగా కూర్చున్నాం. మా శరీరంలోని గూఢచారులు (కళ్ళు) తమ తమ కథలను చెబుతూనే వున్నారు.

పార్టీ ఈ ఇద్దరు కామ్రేడ్స్‌ను ఏ లక్ష్యానికై బలి ఇచ్చిందో, దాన్ని వారు బాధ్యతాయుతంగా నిర్వహించారు. న్యాయస్థానంలో భగత్‌సింగూ, దత్తూ ఆ సమయంలో ఇచ్చిన ప్రకటన ఒక విధంగా విప్లవోద్యమ విధాన ప్రకటనగా భావించవచ్చు. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ తి

ఢిల్లీ బాంబు దాడి కేసులో భగత్‌సింగ్‌కు, దత్తుకు యావజ్జీవ కారాగారావాస శిక్ష పడింది. ఈ శిక్షకు వ్యతిరేకంగా లావోరు హైకోర్టులో అప్పీలు చేసుకున్నప్పటికిన్నీ వారిద్దరూ పార్లమెంటు భవనంలో బాంబు వేయడాన్ని నిరాకరించలేదు. కానీ ఎవరినీ చంపాలనే ఉద్దేశ్యంతో బాంబు వేయలేదని వాదించారు. తాము చేసిన బాంబు దాడిని ఉద్దేశరహితంగా చూడరాదని వాదించారు.

సెషన్స్‌ జడ్జి వారి ఉద్దేశ్యాన్ని ప్రధానంగా భావించక తన తీర్సులో “సాధారణంగా ఒక ఉద్దేశ్యం వున్నందు వల్ల నేరం యొక్క చట్టపరమైన స్థితిపై ఏ విధమైన (ప్రభావమూ వుండదు. న్యాయస్థానం ఆరోపించిన నేరం గురించే మనం ఆలోచించాలో అని రాశాడు. దీనికి జవాబుగా భగత్‌సింగూ, దత్తూ తమ సంయుక్త ప్రకటనలో ఇలా చెప్పారు:

“మేము మానవ జీవితాన్ని అనిర్వచనీయమైన పవిత్రమైనదిగా భావిస్తాం. సమానత్వానికి సేవ చేయడంలో ఇతరులకు వాని కలిగించడానికంటే, మా జీవితాన్నే మేము అంతం చేసుకుంటాం. మేము సామ్రాజ్యవాదుల కిరాయి సైనికుల వంటివారం కాము. వారికి నిరయగా హత్య చేయడమే నేర్పుతారు. మేము జీవితాన్ని గౌరవిస్తాం. వీలయినంతవరకు దాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తాం. అయినప్పటికీ మేము బాగా తెలిసే పార్లమెంటు భవనంలో బాంబు వేయదానికి ఆంగీకరించాం. సత్యం తన యధార్థాన్ని చాటుతోంది. ఈ కార్యఫలితాన్ని చూచే, ఉద్దేశ్యాన్ని అంచనా వేయాలి. ఉవోజనిత పరిస్థితులూ, ఇష్టమైన అభిప్రాయాల ఆధారంగా అంచనా వేయరాదు.”

సెషన్స్‌ జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భగత్‌సింగ్‌ హైకోర్టు ముందుంచిన తర్మాలు అతని సూక్ష్మమైన ప్రతిభకు ప్రతిబింబాలు. “మనం పనిని ఉద్దేశ్యం నుంచి వేరుగా చూసినపుడు ఒక వ్యక్తిని హత్య చేయడానికీ, యుద్ధంలో వేలకొలది మందిని మెషిన్‌గన్‌లకోనూ, ఫిరంగులతోనూ మాడ్చి మసిచేయడానికి తేదా కనబడదు. ఎందుకంటే, రెండింటి ఫలితం కూడా ఒకేలా వుంటుంది. అయినా సంఘం సైన్యాధిపతులనూ, యుద్ధంలో పాల్గనే దేశాలనూ హంతకులని చెప్పడం లేదు. ఇదేవిధంగా ఒకరిని బెదిరించి దోచుకునేవాణ్డి, పన్ను వసూలుచేసే ప్రభుత్చోద్యోగినీ ఒకేగాట కట్టలేం. ఇద్దరి పనుల పర్యవసానం ఒకటే అయినప్పటికీ, ఇద్దరినీ ఒకటిగానే చూడలేం” అని వివరించాడు భగత్‌సింగ్‌. అతను కోర్టవారికి “సాలమన్‌” ఉదాహరణను జ్ఞప్రికితెస్తూ “అన్నంలో విషం ఎలుకల్ని చంపడానికీ కలపవచ్చు. ఒక మనిషిని హత్య చేయడానికీ కలపవచ్చని” ఉద్దాటించాడు “అన్నంలో విషం కలిపే కార్యం మంచిదా, చెడ్డదా అనే విషయం ఆ కార్యోద్దేశ్యాన్ని గమనించే నిర్ణయించగలం...మాకు విధించిన శిక్షను మేమేమీ ఆక్షేపించడంలేదు. మమ్మల్ని హంతకులని పేర్కొనడాన్నీ మా ఉద్దేశ్యాన్ని తప్పుగా భావించడాన్ని మాత్రమే ఆక్షేపిస్తున్నాం” అని భగత్‌సింగ్‌ చెప్పాడు. త రాడా

హైకోర్టులో విప్లవానికి నిర్వచనం చెబుతూ, “విప్లవం ప్రపంచ నియమం. అది మానవాళి ప్రగతికి ఆధారం. కానీ అందుకు రక్తం పారించే సంఘర్షణ అనివార్యం కాదు. వ్యక్తిగత దౌర్జన్యానికి అందులో చోటులేదు. అది బాంబుల, పిస్తోళ్ళ సంప్రదాయం కాదు... విప్లవాన్ని వ్యతిరేకించేవారు కేవలం బాంబులు, పిస్తోళ్ళు, రక్తపాఠాన్నే విష్లవంగా పేర్కొంటారు. అయితే విప్లవం వీటికే పరిమితం కాలేదు. ఇవి విప్లవానికి సాధనాలు కావచ్చు. ఈ సాధనాల వుపయోగానికి వెనుక విష్రవంయొక్క నిజమైన బలం, సమాజాన్ని ఆర్థికంగా మార్చాలనే ప్రజల తీవ్రమైన కోరిక వుంటుంది. మన ఈనాటి పరిస్థితులలో కొంత మంది వ్యక్తులను హత్యగావించడమే విప్లవ వుద్దేశ్యం కాదు. మనిషిని మనిషి దోచుకునే పద్ధతిని అంతం చేసి, మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడమే విప్లవోద్దేశ్యం!? అని భగత్‌సింగ్‌ వివరించాడు.

భగత్‌సింగ్‌ సామ్రాజ్యవాదానికీ, దోపిడీకీ మాత్రమేగాక, భగవంతునికీ, మతానికీ కూడా వ్యతిరేకే! అతడెప్పుడూ తనను నాస్తికుడిగానే అభివర్షించుకునేవాడు. జైలు జీవితంలో అతడు చదివిన (గ్రంథాలు అతని భావాలను మరింత దృఢపరచాయి.

1928వ సంవత్సరం ఢిల్లీ సమావేశం తర్వాత ఫణీంద్రనాడ్‌ఘోష్‌ కొన్నిరోజులు గడపడానికి నాతో పంజాబు కొచ్చాడు. అతడు తన్ను తాను భగవద్భక్తుడిగాను, మత విశ్వాసిగాను, ఆదర్భవంతుడిగాను చెప్పుకొనేవాడు. అపుడు నేను అమృతసర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వుంటూ వుండేవాణ్ణి. ఒకరోజు భగత్‌సింగ్‌ లాహోరు నుంచి వచ్చాడు. మా చర్చ ఎక్కడినుంచి ప్రారంభమైందో ఇప్పుడు జ్ఞాపకం లేదుగానీ, చివరకు అది భగవంతుడు, మతాలకు వచ్చిచేరింది. ఏదో విషయంలో భగత్‌సింగ్‌కు జవాబిస్తూ ఫణీంద్ర ఓ గొప్ప 'జ్ఞానోపదేశం” గావించాడు. మాటిమాటికి “జ్ఞానోపదేశం” గావించడం అతని అలవాటు!

“ఈ మిధ్యాజగత్తు యొక్క మాయాజాలం నుంచి దూరంగా వుంటూ విష్లవకారులమైన మనం నిష్కామ భావనతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన కర్తవ్య నిర్వహణలో సఫలత చెందడమో, విఫలత చెందడమో సర్వశక్తిసంపన్నుడైన ఆ భగవంతుని చేతుల్లోనే వుంది. భారతదేశం యింకా కొన్నాళ్ళు బానిసత్వం అనుభవించాలని భగవదేచ్చగా వుంటే, ప్రపంచంలోని ఏ శక్తీ ఈ దేశానికి స్వాతంత్ర్యం లభింపజేయలేదు. అన్నీ భగవంతుని సంకల్పం ప్రకారమే జరుగుతాయి. మనమందరం అతనిచేతి కీలుబభమ్మలం మాత్రమే!” అతను ఇలా చెబుతూ ఇంకా ఇటువంటివే అనేక అసందర్భ(ప్రేలాపనలను చేశాడు. భారతదేశ ప్రజలు తమ హైందవ ధర్మం మరచిపోయారనీ, దానికి శిక్షగ్లానే భగవంతుడు వారిని అస్వతందత్రులను చేశాడనీ, వారు ధర్మపథాన్ని అవలంబించనంతవరకు భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 39

భగవంతుడు వారిని క్షమించదనీ, అంతవరకు వారికి స్వాతంత్ర్యం లభించదనీ వాగుతూనే వున్నాడు.

భగత్‌సింగ్‌ సాధారణంగా కామేద్స్‌తో అనేక సమస్యలపై చర్చిస్తుండేవాడు. ఆ చర్చలలో అతనెన్నడూ ఆవేశపడడాన్ని నేను చూడలేదు. ఆ రోజు కూడా అతను మామూలుగానే మాట్లాడాడు. అయితే అతని ఒక్కొక్క పలుకులోను ని([గ్రహమూ, పరిపూర్ణత్వమూ నిండివున్నాయి.

“మ్సీ మార్గం నిష్కియతా మార్గం. అన్నిటికీ భగవంతుని మీద భారంవేసి చేతులు ముడుచుకు కూర్చునే పద్ధతి మీది. నిష్కానుకర్మ సిద్ధాంతం చాటున “తలరాత” అనే మత్తుమందును యువకులకు త్రాగించి పడుకోబెట్టే మార్గం మీది. ఆ మార్గం ఎన్నటికీ నా మార్గం కాజులదు. ఈ ప్రపంచాన్ని మిధ్యగా భావించేవారు, ఈ దేశాన్నీ ప్రజలనూ మాయ అని చెప్పేవారు ఎప్పటికీ ప్రపంచ సంక్షేమం కోసమో, ఈ దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసమో నిజాయితీతో పోరాడలేరు. మిధ్యకోసం, మాయకోసం పోరాటం ఎలా చేయగలరు?” అని చెప్పి, ఆవేశంతో, “నేనీ ప్రపంచాన్ని మిధ్యగా భావించడంలేదు. ఈ దేశాన్నీ ప్రజలనూ మాయ అనో, నీడలనో అనుకోవడంలేదు. దేశం ఒక సజీవమైన వాస్తవం. అందమైన యథార్థం. నేను నా దేశాన్ని (ప్రేమిస్తున్నాను. నాకు ఈ ప్రపంచం తప్ప వేరే ప్రపంచమో, స్వర్గమో లేదు. కొంతమంది వ్యక్తులు ఈనాడు ఈ (ప్రపంచాన్ని తమ స్వార్థం కోసం నరకంగా తయారుచేశారనేది నిజమే. కానీ అంతమాత్రంచేత ఈ (వ్రవంచాన్నే మిధ్య అని (వ్రకటించి పారిపోవడంవల్ల (ప్రయోజనంలేదు. దోపిడీదారులనూ, ఇతరులను బానిసత్వంలో బంధించేవారినీ అంతంచేసి మనం ఈ ప్రపంచాన్నే స్వర్ణంగా మార్చవలసి వుంది” అని భగత్‌సింగ్‌ అన్నాడు.

తన వాదనను ఇంకా వివరిస్తూ, “మీరు భగవంతుణ్ణి సర్వశక్తి సంపన్నుడని చెబుతున్నారు. మరి ఆ దేవుడు సర్వశక్తివంతుడయ్యుండి కూడా అన్యాయం, అత్యాచారం, ఆకలి, పేదరికం, దోపిడి, అసమానత్వం, బానిసత్వం, రోగాలు, యుద్దాలు మొదలగు వాటినెందుకు అంతం చేయడు? వీటినన్నిటినీ అంతం చేయగలిగే శక్తి వుంటే, మానవత్వాన్ని కబళించివేసే వీటిని నాశనం చేయకుండా వున్నాడంటే అతజ్జి మంచి భగవంతుడని చెప్పలేం. అతనిలో వీటిని రూపుమాపే శక్తి లేదంటే ఆ భగవంతుణ్ణి “సర్వశక్తి సంపన్నుడని చెప్పలేం. తన లీలలను ప్రదర్శించడానికే అసహాయ మానవులను కష్టాలలో ముంచి అనందిస్తాడంటే అతడు నిర్ణయుడైన క్రూరుడు తప్ప వేరుకాదు. ప్రజాపొతాన్ని దృష్టిలో వుంచుకుంటే అటువంటి భగవంతుడు త్వరలో నశించిపోవడమే మంచిది. మాయ, మిధ్య, తలరాత, భగవంతుడు - ఇవన్నీ పాలకవర్తానికి చెందిన శ న శివవర్మ

దోపిడీదారులు సామాన్య ప్రజలను మోసగించడానిక వుపయోగించే విషపు భావాలుతప్ప వేరుకాదు”అని అతను ఉద్దాటించాడు.

“అలాగయితే ధర్మానికీ, అధర్మానికీ భేదం లేదంటారా?” అని ప్రశ్నించాడు ఫణీంద్రనాథ్‌.

“మ్సీరు మాటిమాటికి “ధర్మం” “ధర్మం” అంటారు. అయితే దాన్ని వివరించి చెప్పరెందుకు? ఇంతకాలం ఆ పదాన్ని ఏ అర్ధంలో ఉపయోగిస్తూ వచ్చారో ఇక ఆ విధంగా ఉపయోగపడదనే నా అభిప్రాయం! ఇంతవరకు అన్ని మతాలు ప్రపంచ (ప్రజలను విడదీశాయి. వారిలో కలహాలను రేకెత్తించాయి. ప్రపంచంలో ఇప్పటివరకు మతాధికారులు మతాలపేరిట కొనసాగించినంత రక్తపాతం వేరే ఏ విషయంలోను సంభవించలేదు. నిజం చెప్పాలంటే మతాలు ఈ ఆనందాయకమైన (ప్రపంచాన్నే ధ్వంసం చేశాయి. మనిషిని మనిషిని వేరుచేసే మతం, (ప్రేమకు బదులుగా ఒకరు మరొకరిని ద్వేషించడం నేర్చే మతం, మూఢ విశ్వాసాలను ప్రోత్సహించి (ప్రజల మానసికోన్నతిని అడ్డుకునే మతం, ఆలోచనా విధానాన్ని సంకుచితపరచే మతం ఎన్నటికి నా మతం కానేరదు. మనిషిని ఒక్కొక్క అడుగునా సుఖవంతుణ్ణి చేసే సిద్ధాంతం, సమృద్ధి-సౌభ్రాతృత్వం మార్గంలో అతడ్ని తీసుకుపోయే సిద్ధాంతమే నా సిద్ధాంతం. సంగ్రహంగా చెప్పాలంటే నాకు ఈ (ప్రపంచమే, అందునా మన మాతృ్ళదేశమే స్వర్గం. ఇక్కడున్న ప్రతి వ్యక్తీ నా దేవత. ఒక దేవతను మరో దేవతతో కొట్లాడేటట్టు చేసి ఈ స్వర్గాన్నే నరకంగా మార్చివేసే శక్తులను నశింపజేసి, మానవులను వర్గరహిత సమాజం వైపుకు తీసుకుపోయే అన్ని ప్రయత్నాలూ నా మతాలే!”

ఫణీంద్ర పార్టీ సీనియర్‌ సభ్యుదేగాక, భగత్‌సింగ్‌ కంటె వయస్సులో కూడా ఎంతో పెద్దవాడు. విప్లవోద్యమంలో నాయకుని అజ్జే సుగ్రీవాజ్ఞగా చలామణి అవుతుందనే కాలానికి చెందినవాడతను. ఫణీంద్ర తన్ను తానే నాయకుడిగా అనుకుంటుండేవాడు. అతనికి రాజకీయ తెలివితేటలు లేనందువల్ల సారహీనమైన తర్మాలతోనే తన నాయకత్వాన్ని సంతృప్తిపరచుకునేవాడు. భగత్‌సింగ్‌ ఎదుట తన అహం దెబ్బతినడం చూసి, “ఈ ప్రపంచాన్నే స్వర్గధామం చేయాలనే మహాత్ములు ఇంతవరకెందరు జన్మించారో లెక్కలేదు. వారందరూ తమ ప్రయత్నంలో ఓడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొనగాడివి నీవు బయలుదేరావా? రెండు రోజులు తర్వాత నీ గొప్పదనమూ తెలిసిపోతుంది. కడపటికి భగవంతుని సంకల్పమే నెరవేరుతుంది” అని వ్యంగ్యంగా అన్నాడు.

ఫణీంద్ర చేసిన పరిహాసంతో భగత్‌సింగ్‌ ఆవేశం చెందినా తన నిగ్రహాన్ని కోల్పోలేదు. అతను నవ్వుతూ “ఫణీంద్రా! నా జీవితం మూన్నాళ్ల ముచ్చటగానే వుండుగాక! అయినా తుదివరకు నా భావాలు నన్ను వదలి పోవనే నానమ్మకం. నేను రేపు జీవించి భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ శః

వుందకపోయినప్పటికీ నా భావాలు కడవరకూ సొషయ్రాజ్యవాద దోపిడీదారులను వెంటాడుతూనే వుంటాయి. నాకు మన దేశ ఉజ్వల భవిష్యత్తుపట్ల అపారమైన నమ్మకం వుంది. ప్రపంచ మానవాళి మార్చువైపు ముందడుగు వేయడాన్ని నేను చూస్తున్నాను. మీరు చూడడంలేదు. నేను మానవుని సాహసాన్నీ బాహుబలాన్నీ విశ్వసిస్తున్నాను. అందువల్ల ఆశావాదిని. మీరు ప్రతి విషయానికీ దేవునివైపు చూస్తున్నారు. అందువల్లే మీరు కర్మవాదులు, నిరాశావాదులు కర్మసిద్ధాంతం మనం చేయాల్సిన కర్తవ్యం నుంచి తప్పుకునే మార్గం. దుర్చలులు, పిరికిపందలు, పలాయనం చిత్తగించేవారి అంతిమ నెలవు అది! ఇక మహాత్ముల విషయమంటారా? వారు నిజంగానే ఈ ప్రపంచాన్ని న్వర్గతుల్యంగా చేయాలని ప్రయత్నించివుంటే ఈనాడు అది ఇలా వుండదు. మహాక్ములనేవారు భూమ్మీద కాకుండా ఆకాశంలో స్వర్గనిర్మాణానికి ప్రయత్నించారు. అందువల్లే వారు తమ ప్రయత్నంలో సఫలీకృతులు కాలేకపోయారు. నేటి క్రొత్త మానవుడు ఆకాశహర్య్యాలను నిర్మించడానికి బదులు ఈ భూమిపైనే స్వర్ణం కోసం పునాది తవ్వడం ప్రారంభించాడు. ఈనాటి ప్రతి మనిషీ ఒక మహాత్ముడే. అందువల్లే అతని మీద నాకు అపారమైన నమ్మకముంది” అని జవాబిచ్చాడు. భగత్‌సింగ్‌ ఇంకా ఏమో చెప్పబోగా సుఖదేవ్‌ వచ్చేశాడు. అతడు కాల్చిన మొక్కజొన్న కండెలు తెచ్చాడు. వాటిని భగత్‌సింగ్‌ యెదుట పెడుతూ “మొదట వీటి పని పట్టు, ఇవి చల్లబడిపోతాయి. ఇవి తిన్న తర్వాత అన్నగారి పని పట్టవచ్చు” అని అన్నాడు. సుఖదేవ్‌తో వాగ్వివాదమంటే ఫణీంద్రకు కూడా భయమే. సుఖదేవ్‌ కూడా ఫణీంద్రగారి 'జ్ఞానోపదేశాన్ని' వేళాకోళం చేస్తుందేవాడే! అతను సుఖదేవ్‌ మాటను ఒప్పుకుంటూ ఒక మొక్కజొన్న కండెను చేతికి తీసుకున్నాడు. వేడి వేడి వాస్తవికత యెడుట ఊహాజనితమైన స్వరం కాంతిహీనమైంది. అంతటితో జ్ఞాన చర్చ ముగిసింది. ఢిల్లీలో కలుసుకున్న తర్వాత, మేము లాహోర్‌ కుట్ర కేసులో ముద్దాయిలుగా మళ్ళీ కలుసుకున్నాం. 1929వ సంవత్సరం జూలై పదవతేదీ. మా కేసు ప్రారంభమైన రోజున భగత్‌సింగ్‌ నిరాహారదీక్షలో వున్నాడు. అతనికి పార్లమెంట్‌ భవనం బాంబుకేసులో యావజ్జీవ కారాగారవాస శిక్షపడింది. ఇప్పుడు “చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడన్న? అభియోగంపై మాతోపాటు అతనిపై కేసు నడవాల్సి వుంది. 9. పోలీసులు బంధించిన తర్వాత ఫణీంద్రనాథ్‌ అప్రూవర్‌ ఆయిపోయాదు. అతడు కేంద్ర కమిటీ సభ్యుడు కూడా అయినందువల్ల అతని ద్వారా పార్టీకి అత్యధిక వోని కలిగింది. శై శివవర్మ

భోజనం చేసి అతను ఒక నెల అయినప్పటికి న్యాయస్థానానికి వచ్చాడు. అతని (ఫ్టెచర్‌పై తీసుకువచ్చినపుడు మా అందరి కళ్ళనుండి కన్నీరు ప్రవాహంలా ప్రవహించింది. అతడు మునుపటి మా భగత్‌సింగ్‌ కాదు. అందంగా, ఆరోగ్యంగా, సుదృఢ శరీరంతో మా అందరి ప్రశంసలందుకున్న భగత్‌సింగ్‌ కాడు. కోర్టులో మేము కలుసుకున్న భగత్‌సింగ్‌ మునుపటి భగత్‌సింగ్‌ నీడ మాత్రమే! దీర్ధమైన నిరాహారదీక్ష వల్ల అతని శరీరం చిక్కి శల్యం అయిపోయింది.

మేమందరం ఒకటిగా కలుసుకున్నందువల్ల ఇంచుమించు మూడు రోజులు “కోర్టులో మేమెలా జవాబివ్వాలి' అనే విషయం చర్చించాము. కొంతసేపు మాట్లాడేసరికి భగత్‌సింగ్‌ పడకకుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. అయినప్పటికీ అతను మా చర్చలో పాల్గొని నిర్ణయాత్మకమైన పాత్ర వహించాడు.

“మనం ఖైదు కాగానే అంతా అయిపోయిందని భావించకూడదు. ఇక మనం చేయవలసిందేమీ లేదనే నిర్ణయానికి వచ్చేయకూడదు. వీలయినంతమేర కామ్రేద్స్‌ను విడుదల చేయించడానికి ప్రయత్నిస్తూనే ఒక రాజకీయోద్దేశ్యంతో ఒక రాజకీయ పంథాలోనే పోరాడాలి. శత్రువుల కోర్టుల పట్ల ఆశలు పెంచుకోవడం బుద్ధిహీనతే అవుతుంది. కాబట్టి మనం విదేశీ ప్రభుత్వం ఆడే ఈ న్యాయస్థాన నాటకాన్ని బట్టబయలు చేసి, విప్లవకారుల అజేయమైన మానసిక శక్తిని ప్రదర్శించాలి అని వివరించాడు భగత్‌సింగ్‌. అతను కోర్టులను విఫ్లవకారుల ఆదర్శాలను ప్రచారం చేసుకునే వేదికలుగా మలచుకోవాలనేవాడు. దానితోపాటు మేము జైళ్ళలో రాజకీయ ఖైదీల హక్కుల కోసం నిరంతరం పోరాటం జరుపుతుండాలని ఉద్బోధించేవాడు. ప్రభుత్వం, దాని కోర్టులు, దాని విధానాలు అన్నింటిపట్లా మన ద్వేషాన్ని అసహ్యాన్ని అవకాశం దొరికినపుడల్లా వ్యక్తం చేస్తూ, కడపటి ప్రకటన ఇవ్వడానికి అనుమతి లఖిస్తే ఆ ప్రకటనలో రాజకీయ దృక్పథంతో వ్యవస్థ మొత్తంపై దెబ్బతీయాలనేవాడు భగత్‌సింగ్‌.

సర్దార్‌ భగత్‌సింగ్‌ చెప్పిన విషయాలన్నిటినీ కామ్రేడ్స్‌ అందరూ సమర్థించారు. ఈ ప్రణాళిక ననుసరించి ముద్దాయిలందరూ మూడు రకాలుగా విభజితులయ్యారు. న్యాయవాదుల ద్వారా కేసులు నడపవలసినవారు మొదటి రకానికి చెందుతారు. వీరు ఐదుగురు : దేశరాజ్‌ భారతి, పేమ్‌దత్‌, మాస్టర్‌ అజ్ఞారాం, అజయ్‌ఘోష్క్స్‌* కిశోరీలాల్‌, శత్రువుల న్యాయస్థానాన్ని అంగీకరించనివారు రెండవ రకం వారు. అవకాశం దొరికినప్పుడల్లా మోసపూరితమైన న్యాయవిధానాన్ని సైద్ధాంతికంగా తూర్చారపట్టడం

  1. అజయ్‌ఘోష్‌ : స్వాతంత్రానంతరం భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్నారు. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ శకి

వీరి పని. ఈ కామ్రేడ్స్‌ ట్రిబ్యునల్‌ ఎదుట మొదటిరోజే ఇచ్చిన ప్రకటన గురించి న్యాయమూర్తులిలా రాశారు : “ఆ ప్రకటన బ్రిటిష్‌ ప్రభుత్వంపై దౌర్దన్యపూరితమైన రాజకీయ దాడి! బహిరంగ న్యాయస్థానంలో రాజద్రోహాన్ని ప్రచారం చేసే ఈ ప్రకటన చదవడం చాలా అనుచితమైంది. అందువల్ల ట్రిబ్యునల్‌ ఆ ప్రకటనను చదవడం నిలిపివేసింది.” ఈ కామ్రేడ్స్‌ వారి ప్రకటన చివర “ఈ కారణాలవల్ల మేము వాస్యాస్పదమైన ఈ నటనలో భాగస్వాములు కావటానికి నిరాకరిస్తున్నాం. ఇక ఈ న్యాయస్థాన కార్యకలాపాలలో ఏవిధంగానూ పాల్గొనబోమని” ఉద్దాటించారు. ఈ రకానికి చెందిన వారు : మహావీర్‌సింగ్‌, బీ.కె.దత్‌, డాక్టర్‌ గయాప్రసాద్‌, కుందన్‌లాల్‌, యతీంద్రనాథ్‌ సన్యాల్‌. తమ కేసును తామే వాదించుకునెవారు మూడవ రకానికి చెందినవారు. ప్రభుత్వం తరఫు సాక్షులను త్రోసిపుచ్చడం, అప్రూవర్‌ల, సాక్షుల నోటినుందే తమ వాదనలను వినిపించడం వారి పని. వారు ప్రతి చర్యనూ ప్రచారం దృష్టితోనే తీసుకుంటాడు. ఈ (గ్రూపులోని కామ్రేద్స్‌ భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు, శివవర్మ,*1 జయదేవకపూర్‌, విజయకుమార్‌ సిన్హా కమల్‌నాథ్‌ తివారి, సురేంద్రనాథ్‌ పాండే మున్నగువారు. న్యాయస్థానాన్ని ప్రచార వేదికగా ఉపయోగించుకోవాలనే మా ప్రణాళిక బాగా విజయవంతమైంది. జూలై పదవ తేదీ మా కేసు విచారణ ప్రారంభమైన రోజున భగత్‌సింగ్‌, దత్‌ ఇద్దరూ నిరాహారదీక్షలో వున్నారని ముందే చెప్పాను. 1929 జూలై 13న మిగతా కామ్రేడ్స్‌ కూడా భగత్‌సింగ్‌, దత్తులు చేస్తున్న డిమాండ్ల కోసం నిరాహార దీక్ష (ప్రారంభించాలని నిశ్చయించాం. జైళ్ళలో అధికారులు రాజకీయ ఖైదీలతో అమానుషంగాను, అవమానకరంగాను ప్రవర్తిస్తున్నారు. మనం అరెస్టయితే వీటికి వ్యతిరేకంగా కూడా పోరాడాలి. పార్టీ కేంద్ర కమిటీ వెలుపల వుండగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానుసారం 1929 జులై 14న భగత్‌సింగ్‌ ప్రభుత్వం హోంమెంబర్‌కు రాసిన ఉత్తరంలో ఈ క్రింది కోర్కెలున్నాయి :

  1. వేము రాజకీయ ఖైదీలం కాబట్టి మాకు మంచి భోజనం ఇవ్వాలి. అది యూరోపియన్‌ ఖైదీలకిచ్చే స్థాయిలో వుండాలి. 2 “వని అనే పేరుతో జైళ్ళలో హీనమైన పనులు చేయమని రాజకీయ ఖైదీలను నిర్భంధించరాదు.

  2. పుస్తకాలు, వ్రాత సామగ్రి ఏ ఆటంకం లేకుండా లభింపజేయాలి.

  3. ప్రతి రాజకీయ ఖైదీకి ప్రభుత్వ ఖర్చుతోనే ఒక్కొక్క దినపత్రిక ఇప్పించాలి.

  4. శివవర్మ :; ఈ (గ్రంథ రచయిత - అనువాదకుడు. శ్తేశ్షే శివవర్మ

  5. రాజకీయ ఖైదీలకై ప్రత్యేకమైన ఒక శ్రేణిని ఏర్పరచాలి. ప్రతి చెరసాలలోను రాజకీయ ఖైదీల కోసం ఒక ప్రత్యేకమైన వార్డు ఏర్పరచాలి. అందులో యూరోపియన్‌ ఖైదీలకున్న సౌకర్యాలన్నిటినీ కలుగజేయాలి. ఒక జైలులో వున్న రాజకీయ కైదీలనందరినీ ఆ వార్డులోనే వుంచాలి.

  6. స్నానవసతి, ధరించడానికి మంచి బట్టలు ఇవ్వాలి.

  7. ఉత్తర ప్రదేశ్‌ జైలు సంస్కరణ సంఘ సభ్యులైన శ్రీ జగత్‌ నారాయణ్‌, ఖాన్‌ బహదూర్‌ హఫిజ్‌ హిదాయత్‌ హుసేన్‌ రాజకీయ ఖైదీలను ఉన్నతథ్రేణి ఖైదీలవలె పరిగణించాలని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మాకు కూడా అన్వ్నయింపజేయాలి.

ఈ నిరాహార దీక్ష 63 రోజులు కొనసాగింది. భగత్‌సింగ్‌, దత్తుల దీక్ష మూడు నెలలు కూదా దాటింది. ఈ మూడు నెలలు కూడా భగత్‌సింగ్‌ తన పనులను అంటే (వ్రాయడం, చదవడం, స్నానం చేయడం, కోర్టులో ప్రకటనలు ఇవ్వడం, చిత్తు ప్రతులు తయారు చేయడం, ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అన్నీ స్వయంగానే చేసుకునేవాడు. కేసు విచారణ జరుపుతుండగా భగత్‌సింగ్‌నూ, దత్తునూ లావోర్‌ సెంట్రల్‌ జైలులో వుంచారు. మిగతా ముద్దాయిలను బోస్టల్‌ జైల్లో వుంచారు. కేసు విచారణకుగాను పరస్పరం చర్చించుకోవాలనే నెపంతో వారిద్దరూ ప్రతి ఆదివారం బోస్టల్‌ జైలుకు వచ్చేవారు.

చెరసాల్లో పుస్తకాలుండేవి. ప్రారంభంలోనే పుస్తకాధ్యయనం చేసే వాతావరణం నెలకొంది. మాలో మేము సిద్ధాంత రాజకీయ చర్చలు సాగిస్తుండేవారం. కానీ భగత్‌సింగ్‌ వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్సాహం పెల్లుబికింది. భగత్‌సింగ వచ్చిన రోజు ఏ విషయాన్నీ మేము చర్చించుకోకుండా వదిలేవారంకాము. ఆ వారం మేము చదివిన (గ్రంథాలు, మార్చిజం, సోవియట్‌ యూనియన్‌ ప్రగతి, ఆస్టనిస్తాన్‌లోని మార్పులు, మీరట్‌ కుట్రకేసు, కార్మికుల పోరాటాలు, భారత పెట్టుబడిదారీ వర్గ పాత్ర, కాంగ్రెస్‌ కార్యకలాపాలు, లాహోరు కాంగ్రెస్‌ మహాసభలో లక్ష్యం మారడం వంటి అన్ని విషయాలనూ మేము చర్చించేవారం,

ఈ విధంగా మా కేసుకు సంబంధించిన కామ్రేద్స్‌ అందరికీ గ్రంథ పఠనంలో ఆసక్తి వున్నప్పటికీ భగత్‌సింగ్‌కు ఈ ఆసక్తి మరీ ఎక్కువ. అతనికి సామ్యవాదం చాలా ఇష్టమైన విషయమైనప్పటికి రాజకీయ, ఆర్థిక సమస్యలు ఆధారంగా రచించిన నవలలంటే

కూడా ఇష్టమే. ఆంగ్లంలో చార్లెస్‌ డికెన్స్‌, అఫష్టన్‌ సిన్‌క్షేయర్‌, హర్‌కేన్‌, విక్టర్‌ హ్యగో, మాక్సింగోర్కీ స్టేపనియేక్‌, ఆస్కార్‌ వైల్ణు, లియోనాయిడ్‌ ఆండ్రీవ్‌ మొదలైనవారి రచనలంటే అతనికి మరీ ఇష్టం! భగత్‌సింగ్‌ లియోనాయిడ్‌ ఆండ్రీవ్‌ రచించిన “సెవన్‌ దట్‌ వర్‌ హేంగ్ష్గ” నవలను మాకు కోర్టులో చదివి వినిపించాడు. ఆ నవలలో వచ్చే ఒక పాత్రకు ఉరిశిక్ష పడుతుంది. అయితే అతడు “నన్ను ఉరితీయకూడదు” “నన్ను ఉరితీయకూడదు” భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ శీర్‌

అని చెబుతూ వుంటాడు. అతన్ని ఉరికంబానికి తీసుకెళ్ళేటప్పుడు కూడా “నన్ను ఉరి తీయకూడదు” అని చెబుతూ వుంటాడు. భగత్‌సింగ్‌ ఈ ఘట్టాన్ని చదివేటప్పుడు అతని కళ్ళల్లో కన్నీళ్ళు తొణికాయి. మృత్యువును జయించే తమ కామేడ్‌ మరణభయంతో వణికే ఒక నవలా పాత్ర కోసం కన్నీరు కార్చే దృశ్యం చూచి మేమంతా ఆశ్చర్యపడ్డాం. మా కేసు జరుగుతున్న కాలంలో ప్రతి రెండు మూడు రోజులకొకసారి పోలీసులతోనో లేక జైలు అధికారులతోనో మా కొట్లాటలు జరుగుతుండేవి. ఆ కొట్లాటల్లో నావంటి బలహీనులు ఒకటి, రెండు దెబ్బలతోనే తప్పించుకునేవారు. తన్నులు, గుద్దులు, లాఠీదెబ్బలు మాలో ఐదారుగురికే ఎక్కువగా పడేవి. దృధకాయులైన అ కామేడ్స్‌ను అధికారులు కొట్టడానికే ఎన్నుకొన్నట్లు తోచేది. రాజకీయ చర్చల్లో పాల్గొనేవారిలో మాత్రమే కాక, దెబ్బలు తినేవారి పట్టికలో కూడా జయదేవ్‌కపూర్‌, మహావీర్‌సింగ్‌, కిశోరీలాల్‌, గయాప్రసాద్‌లకంటే కూడా భగత్‌సింగే ముందుండేవాడు. చివరకు తీర్పు చెప్పే రోజు వచ్చింది. భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధిస్తారని మాకు ముందే తెలుసు. కానీ అది విన్నదే నాకు కళ్ళు బైర్లుకమ్మాయి. నిన్నటివరకుండిన అనుమానం ఈ రోజు యధార్థమై మా ముందుకువచ్చి నిలబడింది. శిక్షపడిన తర్వాత మమ్మల్ని కూడా బోస్టల్‌ జైలు నుంచి సెంట్రల్‌ జైలుకు మార్చారు. అక్కడ ఉరిశిక్ష పడ్డ ఖైదీలను వుంచే పాత, కొత్త బ్లాక్‌లు ఒకదాని ప్రక్క ఒకటి వున్నాయి. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు కొత్త బ్లాక్‌లో వున్నారు. మేము పొత బ్లాక్‌లో వున్నాము. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా మా కొట్టుతాళాలు తెరచారు. మమ్మల్ని అక్కడ నుంచి బయలుదేరమన్నారు. మా కామ్రేడ్స్‌ను ఉరితీయకమునుపే మమ్మల్ని అక్కడ నుంచి తొలగించబూనుకుంది ప్రభుత్వం. జైలు సూపరింటెండెంట్‌ తన సిబ్బందితో మమ్మల్ని ముఖద్వారంవైపు తీసుకు వెళుతూ కొంతదూరం వెళ్ళిన తర్వాత “మీ కామేడ్స్‌ను కలుసుకుంటారా?” అని అడిగాడు. మా కృతజ్ఞతలు అందుకుని అతడే కొత్త 'బ్లాక్‌' గేటును తెరిచాడు. మమ్మల్ని భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు గదుల ముందుకు తీసుకువెళ్ళి నిలబెట్టారు. జీవితంలో ఈ కా(మ్రేడ్స్‌ను మరెన్నడూ చూడలేమనే భావంతో మా ముఖాలన్నీ చింతాక్రాంతమై వున్నాయి. వారి నుంచి సెలవు తీసుకొని బయలుదేరబోతుండగా మాలో ఒకరైన జయదేవ్‌కపూర్‌, భగళ్‌సింగ్‌ను “సర్టార్‌! నీవు చనిపోవడానికి సిద్ధంగా వున్నావు. ఇందుకై నీవేమీ విచారపడ్డంలేదు కదా?” అని అడిగాడు. 46 శివవర్మ

ఈ ప్రశ్న విన్నదే భగత్‌సింగ్‌ బిగ్గరగా నవ్వి గంభీరంగా అన్నాడు : “విప్లవ పథంలో నేను అడుగిడేటప్పుడే, నా ప్రాజాలర్పించి దేశమంతటా “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!” “విప్లవం వర్ధిల్లాలి!” అనే నినాదాన్ని వ్యాపింపజేయగలిగానంటే నా జీవితమే ధన్యమై పోతుందనుకున్నాను. ఈనాడు ఈ జైలుగదిలో ఉన్నప్పటికీ, ఇనుప కమ్మీల వెనుక కూర్చున్నప్పటికీ కోట్లాది మన ప్రజల కంఠం నుంచి మార్మోగుతున్న ఆ నినాదాన్ని వినగలుగుతున్నాను. నా ఈ నినాదం స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉద్ధీపింపజేసే శక్తిగా సామ్రాజ్యవాదులను చివరవరకు దెబ్బతీస్తూనే వుంటుందనే నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకంటే మరేం కావాలి?” ఇలా చెప్పి అతను చిరునవ్వు నవ్వాడు.

నేను అందరికన్నా వెనుకబడి వున్నాను. భగత్‌ నుంచి సెలవు తీసుకున్నపుడు నేను కన్నీటి నాపుకోలేకపోయాను. అతను నన్ను చూచి, “భావావేశానికి లోనయ్యే సమయం ఇంకా రాలేదు. (వ్రభాత్‌!* నేను కొన్ని రోజులలోనే ఈ జంజాటం నుంచి తప్పించుకుంటాను. కానీ మీరు సుదీర్టమైన (ప్రయాణం సాగించవలసి వుంది. బాధ్యతనే పెద్ద బరువున్నప్పటికీ ఈ దీర్చ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, నిరాశ చెందవనీ, పరాజితుడవై చతికిలబడిపోవనీ నా నమ్మకం!” అని అన్నాదు.

జైలు సూపరింటెండెంట్‌ మా వద్దకొచ్చి, “ఖక్ర బయలుదేరండి!” అని మెల్లగా అన్నాడు. భగత్‌సింగ్‌ను అదే మేము చివరగా కలుసుకోవడం.

తర్వాత 1931వ సంవత్సరం మార్చి 28న సంధ్యాసమయంలో (ప్రభుత్వం భగత్‌సింగ్‌ నుంచి శ్వాసించే హక్కును అపహరించి, తన హింసొదాహాన్ని తీర్చుకుంది. అన్యాయానికీ, దోపిడీకీ వ్యతిరేకంగా తిరుగుబాటుపతాకాన్నెగురవేసిన మరో ముగ్గురు యువకుల జీవితాలు కటికవాని ఉరితో అంతమైపోయాయి.

ఉరికంబం ఎక్కడానికి ముందు భగత్‌సింగ్‌ అక్కడున్న ఒక ఆంగ్ల మేజి'స్టేటును చూచి “మేజిస్టేట్‌ సార్‌! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు, ఒక భారతీయ విప్లవకారుడు తన మహత్తరమైన లక్ష్యసాధన కోసం నవ్వుతూ ఎలా ప్రాజాలర్చిస్తున్నాడో చూచే అవకాశం మీకు దొరికింది" అని చెప్పాడు.

ఉరి తీయడానికి కొంచెం ముందు తన సోదరునికి ఇలా ఉత్తరం రాశాడు భగత్‌సింగ్‌ : “నా జీవితావసానం దగ్గరపడింది. ప్రాతఃకాల దీపం వెలుగులా నా జీవన జ్యోతి కూడా ఉదయపు వెలుగులో విలీనమైపోతుంది. మా ఆదర్శం, మా భావాలు

  1. శివవర్శ్మకు విప్లవ పార్టీలో మారుపేరు *ప్రభాత్‌' -అనువాదకుడు. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ త్త

విద్యుల్లతలా ప్రపంచమంతటా జాగృతిని వ్యాపింపజేస్తాయి. నా పిడికెడు బూడిద నశించిపోతే మాత్రం ప్రపంచానికి కలిగే నష్టమేముంది?”

భగత్‌సింగ్‌ జీవితం ముగింపుకు వచ్చిన కొలదీ శ్రమజీవుల ఉజ్వల భవిష్యత్తు పట్ల అతని ప్రగాఢ విశ్వాసం అధికం కాజొచ్చింది. మరణించడానికి మునుపు అతను ప్రభుత్వానికి రాసిన ఒక ఉత్తరంలో “త్వరలోనే అంతిమ పోరాటానికి సూచకంగా దుంధుభులు (మోగనున్నాయి. దాని ఫలితం నిర్ణయాత్మకంగా వుండబోతోంది. సామ్రాజ్యవాదమూ, పెట్టుబడిదారీ వ్యవస్థా తమ అంతిమ క్షణాలను లెక్క బెడుతున్నాయి. మేము వాటికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాం. అందుకు మేమెంతో గర్విస్తున్నాం కూడా!” అని రాశాడు.

ఒక మహత్తరమైన, పవిత్రమైన ఆదర్శం పట్ల వున్న చెక్కుచెదరని నమ్మకమే దేశ యువకులను నవ్వుతూ వుండేటట్టు చేసి తలారి ఎదుట నిలబెడుతుంది. భగత్‌సింగ్‌కూ, అతని ఇద్దరు కామ్రేడ్స్‌కూ అంతిమ పోరాటంలోఎంత గాధవిశ్వాసముందో పై మాటల వల్ల తెలుస్తోంది. ఈ విశ్వాసమే వారి అమరత్వంలోని రహస్యం.

భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసినప్పుడు నేను ఆంధ్రలోని రాజమండ్రి కారాగారంలో వున్నాను. మేమందరం విడిపోవడానికే కలుసుకున్నట్లు నాకనిపించింది. యతీంద్రనాథ్‌దాస్‌, భగవతీచరణ్‌, చంద్రశేఖర్‌ అజాద్‌ ఏనాడో వెళ్ళిపోయారు. ఇప్పుడు తలారి నా ముగ్గురి కామ్రేడ్స్‌ను కూడా నానుండి లాక్కున్నాడు.

మా సహచరుల బృందం నుంచి విడిపోయి వారు అమరుల్లో కలసిపోయారు. అప్పటి నుంచి వారు దేశానికంతా చెందినవారై పోయారు. వారికి జయ జయనాదాలు పలుకుతూ వారి చిత్రాలపై పూదండలు వేసినపుడూ, వారిని కీర్తిస్తూ రచించిన వందల కొద్దీ పాటలలో కొన్ని పంక్తులను ఎవరైనా అపరిచిత వ్యక్తి పాడటం విన్నపుడూ నేను గర్వంతో పులకించిపోతాను. అయినప్పటికీ ప్రాణమిత్రులు విడిపోవడంవల్ల జీవితంలో నింపలేని వెలితి ఏర్పడుతుంది. అప్పుడు మనసు చింతాక్రాంతమవుతుంది. పాతకాలపు స్మృతులు మనసును కెలికినప్పుడు అది ఆలం కవీశ్వరుడు చెప్పినట్లు చెబుతుంది:

“కళ్ళల్లో ఎల్లప్పుడూ మెదులుతుండేవారి గాధలను

ఇక చెవులు వింటూ వుందనీ!”

అప్పుడు అంతఃస్వరాలు -

“ఆ భగవత్‌ స్వరూపులు ఏ దేశంలో నివసిస్తున్నారు?” అని ప్రశ్నించ నారంభిస్తాయి.

ఠి

క

భగత్‌సింగ్‌ వీలునామా

నేను ఎందుకు నాస్తికుడను ?

ఒక సరికొత్త ప్రశ్న ఉదయించింది. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడూ అయిన దేవుడు వున్నాడని నేను విశ్వసించకపోవడం కేవలం నా అహంకారం వల్లనేనా? ఇలాంటి ప్రశ్నను నేను ఎదుర్మోనలసి వస్తుందని నేనెన్నడూ వూహించి వుండలేదు. కాని కొంతమంది మిత్రులతో సంభాషించినప్పుడు దేవుడున్నాడనే విషయాన్ని నిరాకరించడం నాకు తగని విషయమని వారు భావించుతున్నట్లు అనిపించింది. ఈ రకంగా దేవునిపట్ల అవిశ్వాసాన్ని వెల్లడించడం నాలో వున్న ఒక రకమైన అహంకార భావమేనన్నట్లు వారు తలుస్తున్నారు. నిజమే సమస్య చాలా తీవ్రమైనదే. నేను మామూలు మానవులకంటే అతీతుడనని గొప్పలు చెప్పుకోవడం లేదు. నేనూ ఒక మానవుజ్ణే, అంతకంటే ఎక్కువేమీ కాదు. మామూలు మానవులకంటే నేను అకీతుడనని ఎవరూ భావించరాదు. నా సహచరులలో కొంతమంది నన్ను నిరంకుశుడినని కూడా అంటారు. నాలో కూడా బలహీనతలు లేకపోలేదు. కానీ డాంబికంగా వ్యవహరించడం నా స్వభావ లక్షణాలలో ఒకటి కాదు. అయితే నా మిత్రుడు బి.కె. దత్‌ కూడా అప్పుడప్పుడు నన్ను నిరంకుశుడని అంటాడు. కొన్ని సందర్భాల్లో నన్ను నిరంకుశుడిగా నిందించిన వారు కూడా లేకపోలేదు. అనుకోకుండానే నా అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతానని, ఆ విధంగా నా ప్రతిపాదనలు ఆమోదించబడేటట్లుగా యత్నిస్తానని కొంతమంది మిత్రులు తీవ్రంగానే ఫిర్యాదులు చేసిన ఉదాహరణలున్నాయి. కొంతవరకు అది నిజమే. దాన్ని నేను కాదనను. ఇది అహంభావం (క్రిందకు రావచ్చు. ఇతర సిద్ధాంతాలకన్నా మన సిద్ధాంతం ఉత్తమమైనదనీ, దానిని అనుసరించుతున్నందుకు నాలో ఒక రకమైన గర్వభావం వుండవచ్చు. అందులో వ్యక్తిగతమైన విషయమేమీ లేదు. ఇది సహేతుకంగా వుండవలసిన గర్వమే. అది అహంభావం క్రిందకు రాదు. ఈ అహంభావం వలనా? లేక తీవ్రంగా అధ్యయనం చేసిన తరువాత, గాఢంగా పరిశీలనానంతరమే నాకు దేవుని యందు విశ్వాసం లేకుండాపోయిందా? అన్న విషయాన్నే ఇక్కడ నేను చర్చించదలిచాను. ముందుగా ల నా స శివవర్మ

నేనొక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. అది ఏమిటంటే అహంభావం, దాంబికంగా వ్యవహరించడమూ- రెండూ ఒకటి కాదు.

మొదటి విషయం: మితిమీరిన గర్వం, లేదా డాంబిక ప్రవృత్తి ఒక వ్యక్తి దేవుడిని విశ్వసించడానికి ఎలా అవరోధం కాగలదో నాకు అర్ధం కావడం లేదు. అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రజాభిమానాన్ని చూరగొనగలిగి వుంటే అప్పుడు నిజంగానే ఒక గొప్పతనాన్ని నేను గుర్తించడానికి నిరాకరించి వుండవచ్చు. అలాంటిది కొంతవరకు నమ్మదగినదిగానే వుంటుంది. కాని, కేవలం వ్యక్తిగత అహంకారంతో దేవుడిని విశ్వసించకుండా ఎవరైనా ఎలా వుండగలడు? తనే దేవుడికి పోటీదారుడననీ, లేదా తాను దేవుడినని విశ్వసించే వ్యక్తి నిజానికి ఎలా నాస్తికుడు కాగలడు? మొదటి సందర్భంలో తనకు పోటీగా ఒక దేవుడు వున్నాడన్న విషయాన్ని నిరాకరించడం జరగదు.

ఇక రెండో సందర్భంలో ఈ ప్రకృతికి సంబంధించిన అన్ని వ్యవహారాలకు సారథ్యం వహించే ఒక అతీతశక్తి వున్నదా?

అలా అంగీకరించేవాడు నాస్తికుడు కాజాలడు. సర్వాంతర్యామి అయినా దేవుడొకడున్నాడనే విషయాన్నే నేను నిరాకరించుతున్నాను. ఎందుకలా నిరాకరిస్తున్నానో తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలిచాను. నాస్తికత్వాన్ని నేను అంగీకరించడానికి అహంకారం కాని, డాంబిక ప్రవత్తిగాని వుండడం కారణం కానేకాదు. అందువలన కొంతమంది మిత్రులు ఆలోచించుతున్నట్లు రెండు కేసుల్లో ఢిల్లీ బాంబుకేసు, లాహోర్‌ కుట్రకేసు సందర్భాల్లో నాకు లభించిన అపరిమితమైన ప్రజాభిమానం వలన నా తల తిరిగి నేను అహంకారిని కాలేదు.

వాస్తవం చెప్పుకోవాలంటే నా నాస్తికత్వం ఇటీవలిది కాదు. నేను ఎవరికీ తెలియని అనామకుడైన ఒక యువకుడుగా వున్న రోజుల్లోనే దైవాన్ని విశ్వసించడం మానివేశాను. నా మిత్రులకు ఈ విషయం తెలియదు. ఒక కాలేజీ విద్యార్థిగా వున్న వాడు ఏదో గర్వంతోనో, అహంభావంతోనో, నాస్తికత్వాన్ని చేపట్టడన్న విషయాన్ని (గ్రహించడం అవసరం. కొంతమంది (ప్రాఫెసర్లకు అభిమానపాత్రుడైన విద్యార్ధిగాను, మరికొందరిచే నిరసించబడే విద్యార్థినైనప్పటికీ నేను బాగా కష్టపడి చదివి ప్రముఖ విద్యార్థిగా 'పేరు పొందిన వాడిని కాదు. కాబట్టి నాకు గర్వం వుండటానికి, అహంభావిని కావడానికి గాని అవకాశం లేదు. నేను కొంత వరకు సిగ్గుతో వుండే స్వభావం గల యువకుడిని, భవిష్యత్‌ జీవితాన్ని గురించి నిరాశాజనకంగా వుండే స్వభావం నాది. ఆ రోజుల్లో నేను ఖచ్చితమైన నాస్తికవాదిని కాదు. మాతాతగారి పలుకుబడిలో సనాతన భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ ర్‌

ఆర్యసమాజవాదిగా పెరిగినవాడిని. సనాతన ఆర్యసమాజవాది ఏదైనా కావచ్చుగాని నాస్తికుడు మాత్రం కాదు. నా ప్రాథమిక విద్య ముగిసిన తరువాత లాహోరులోని డ&.ఎ.వి. స్కూల్‌లో నేను చేరాను. అక్కడ బోర్టింగ్‌ హోస్‌లో ఒక సంవత్సరకాలం వున్నాను. అక్కడ వున్నప్పుడు ఉదయం, సాయంత్రం ప్రార్థనలు చేయడంతోపాటు నేను “గాయత్రి మంత్రాన్ని. గంటల తరబడి పఠించేవాడిని, ఆ రోజుల్లో నేను దైవభక్తుడుగా వుండేవాడిని. ఆ తరువాత నేను నా తండ్రితో కలిసి వున్నాను. మా తండ్రిగారు సనాతనులకు సంబంధించి గాక ఉదారవాదిగా వుండేవారు. ఆయన బోధనల ఫలితంగానే నా జీవితాన్ని దేశ స్వాతంత్ర్య సాధనకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. కాని ఆయన నాస్తికుడు కాదు. దైవంలో పూర్తిగా విశ్వాసమున్నవాడు. రోజు ప్రార్ధనలు చేయాలని ఆయన నన్ను ప్రోత్సహించుతూ వుండేవారు. ఈ విధంగానే నేను పెరిగాను. సహాయ నిరాకరణోద్యమ రోజుల్లో నేను నేషనల్‌ కాలేజీలో చేరాను. అక్కడ నేను ఉదారబుద్ధితో ఆలోచనలు జరుపుతూ అన్ని మతాలను, చివరకు దేవుడినీ విమర్శించుతూ వుండేవాడిని. అయినప్పటికీ అప్పటి వరకూ నేను దైవభక్తుడనే. అప్పటి వరకూ గడ్డాన్ని తలజుట్టునూ పెంచుతూనే వుండేవాడిని, కాని సిక్కు మతం లేదా ఇతర మతాలు చెప్పే సూత్రాలను మాత్రం నేను నమ్మే వాడిని కాదు. కాని దేవుడున్నాడనే విషయంలో మాత్రం నాకు దృఢ విశ్వాసం వుండేది.

ఆ తరువాత నేను విప్లవ పార్టీలో చేరాను. నేను మొట్టమొదటి కాంటాక్ట్‌ లోకి వచ్చిన నాయకుడికి అంత నమ్మకం లేకపోయినా దేవుడున్నాడన్న విషయాన్ని నిరాకరించే ధైర్యం లేదు. దేవుడిని గురించి నేను ఆదే పనిగా ఆయనను ప్రశ్చ్నించుతూ వుంటే “నీకు అవసరమనుకున్నప్పుడల్లా దేవుడిని ప్రార్ధించు” అని మా(త్రం చెప్పేవాడు. నేను కాంటాక్ట్‌లోకి వచ్చిన రెండో నాయకుడు దేవుడిమీద గట్టి విశ్వాసం వున్న వ్యక్తి. ఆయన పేరు శచీంద్రనాథ్‌ సన్యాల్‌. అందరూ గౌరవించే కామ్రేడ్‌ ఆయన. ఆయనిప్పుడు కకోరి కుట్రకేసు సందర్భంగా ద్వీపాంతరవాస శిక్షను అనుభవించుతున్నారు. ఆయన “బందీజీవన్‌' అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రచించారు. ఆ పుస్తకంలోని మొదటి పేజీ నుండి కూడా దేవుడిని అత్యంత గొప్పగా శ్లాఫఘించుతూ వుండటం గమనించదగిన విషయం. నేనిక్కడ చెప్పదలచుకున్నదేమిటంటే విప్లవపార్టీలో దేవుడి మీద అవిశ్వాసమనే భావమే జనించలేదు.

ప్రఖ్యాతిగాంచిన కకోరి కుట్రకేసులోని నలుగురు కూడా దేవుడ్ని ప్రార్ధించుతూనే (ప్రాణాలను విడిచారు. రామ్‌ప్రసాద్‌ బీస్మిల్‌ సనాతన ఆర్యసమాజవాది. సోషలిజాన్ని గురించి కమ్యూనిజాన్ని గురించి రాజెన్‌లహిరీ లోతుగా అధ్యయనం చేసినప్పటికీ ఉపనిషత్తులలోని మంత్రాలను, గీతను ఆలాపించాలనే ఆకాంక్షను ఆయన తగ్గించు 5్‌2 శివవర్శ్మ

కోలేకపోయారు. ఈ విష్లవకారుల్లో ఎన్నడూ [ప్రార్ధన చేయని వారిని ఒక్కరినే నేను చూడగలిగాను. “మానవుని బలహీనత ఫలితమే వేదాంతం” అని ఆయన అనేవారు. మన విజ్ఞానానికి పరిమితి వుండటం వల్లనే వేదాంతాన్ని నమ్ముతున్నామని కూడా ఆయన అనేవారు. ఆయన కూడా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్షను అనుభవించారు. కాని ఆయన కూడా దేవుడు లేదని చెప్పడానికి ఎన్నడూ సాహసించేవారు కాదు.

ఆ దశ వరకూ నేను ఒక స్వాప్పిక ఆదర్శ విష్లవవాదిగ మాత్రమే వుండేవాడిని. అప్పటి వరకూ నాయకులను అనుసరించడమే మా పని. ఇంక ఆ తరువాత మొత్తం బాధ్యతలను నెత్తిమీద వేసుకానే సమయమాసన్నమైనది. అనివార్య కారణాల వలన అసలు పార్టీ వునికే అసాధ్యమన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్సాహవంతమైన కామ్రేడ్స్‌ మమ్ములను ఎగతాళి పట్టించడం ప్రారంభించారు. కొంత కాలానికి నేను కూడా భయపడ్డాను. మా కార్యక్రమం ఏవిధంగానూ ఫలించబోదనే అనుమానం ఏర్పడింది. అప్పుడే నా విప్లవ జీవితంలో ఒక మూల మలుపు ఏర్చడింది. “అధ్యయనం” అవసరమన్న ఆవేశం నా మనస్సులో ప్రతిధ్వనించడం ఆరంభించింది. ప్రతికూలురు తెచ్చే వాదనలను ఎదుర్కొనాలంటే అధ్యయనం ఒక్కటే మార్గమనిపించింది. సిద్ధాంతం సరియైనదని నిరూపించుకోవాలంటే అధ్యయనం చేసి వాదనలకు అవసరమైన పరిపుష్టిని చేజిక్కించుకోవడం అవసరం. అందుకని గ్రంథాలను అధ్యయనం చేయడం ఆరంభించాను. దీనితో అంతకుముందు నాలో వున్న విశ్వాసాల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. మా ముందు తరం విప్లవకారుల కార్యక్రమంలో హింసాపూరితమైన పద్ధతులకే ప్రాధాన్యత వుండేది. ఇప్పుడు ఆ స్థానంలో కొన్ని తీవ్రమైన భావాలకు స్థానం ఏర్పడింది. అద్భుతాలను విశ్వసించడంగాని, గుడ్డిగా నమ్మడంగాని వదిలివేశాం. వాటి స్థానంలో వాస్తవికత చోటుచేనుకున్నది. తవృనినరి వరిన్ఫితుల్లోనే పొంసాచర్యలను చేవట్టడం అవసరమనుకున్నాం. (ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసా పద్ధతులే తప్పనిసరి అని భావించడం మొదలైంది. పద్ధతులకు సంబంధించి నిర్ణయం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే మనం ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నామనే విషయంలో స్పష్టత ఏర్పడింది. కార్యాచరణకు ! సంబంధించి నిర్వహించవలసిన ముఖ్య కార్యకలాపాలు లేనందువలన ప్రపంచ వివ్లవానికి సంబంధించి వివిధ రకాల భావాలను గురించి అధ్యయనం చేయడానికి బాగా అవకాశం ఏర్పడింది. అనార్మిస్టు నాయకుడైన బకునిన్‌ను నేను అధ్యయనం చేశాను. కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్‌ను గురించి కొంత చదివాను. తమ దేశంలో విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించిన అనుభవం గల లెనిన్‌, భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ రం

ట్రాట్‌స్కీ తదితరుల రచనలను గురించి హెచ్చుగా అధ్యయనం చేశాం. వారంతా నాస్తికులే, “దేవుడు-రాజ్యం” అన్న బకునిన్‌ రచన పైపైనే ఉన్నప్పటికీ చదవడానికి ఎంతో ఆసక్తిదాయకమైన విధంగా తోచింది. ఆ తరువాత నిర్మలానంద స్వామి రచించిన “ఇంగిత జ్ఞానం” అన్న గ్రంథం చదవడం సంభవించింది. అది ఒక రకమైన స్వాప్నిక నాస్తికత్వాన్ని గురించిన రచన. నాస్తికత్వం నాకు అత్యంత ఆసక్తిదాయకంగా పరిణమించింది. 1926 సంవత్సరం ముగిసేటప్పటికీ ఈ జగత్తును సృష్టించి నడుపుతున్న సర్వంతర్వ్యామి ఒకడున్నాడన్న విషయానికి ప్రాతిపదికలేదని నేను విశ్వసించడం ఆరంభించాను. ఈ విషయాన్ని గురించి నా మిత్రులతో చర్చించడం మొదలుపెట్టాను. దానితో నేనే ఖచ్చితమైన నాస్తికుడనయ్యాను. అయితే అదంటే ఏమిటో ఇప్పుడు చర్చించుదాం,.

1927 మేలో నేను లాహోర్‌లో అరెస్టు అయ్యాను. ఆ అరెస్టు ఏమాత్రం వూహించని ఆకస్మిక సంఘటన. పోలీసులు నన్ను వేటాడుతున్నారన్న విషయమే నాకు ఎరుకలేదు. నేనొక తోటలో నుండి వెళుతుండగా అకస్మాత్తుగా పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఆ సమయంలో నేను ఏ మాత్రం ఉద్రేకపడకుండా ప్రశాంతంగానే ఉండగలగడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను పోలీసు కస్టడీలో ఉంచారు. మరునాడు రైల్వే పోలీసు లాకప్‌కు తీసుకొని వెళ్ళిపూర్తిగా నన్ను ఒక నెల రోజులపాటు అక్కడ బంధించారు. కొన్ని రోజులపాటు పోలీసు ఆఫీసర్లతో సంభాషణలు జరిపిన ఫలితంగా కకోరి పార్టీతోనూ, విష్లవోద్యమానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలతోనూ నాకేదో సంబంధం వున్నట్లు వాళ్ళకు సమాచారం అందినట్లు నేనే వూహించాను. కకోరి కుట కేసు విచారణ జరుగుతున్న సమయంలో నేను లక్నో వెళ్ళానని, వారిని తప్పించడానికి ఏదో పధకాన్ని గురించి మేము ఆలోచించామని, దానికి వారి ఆమోదాన్ని పొందిన తరువాత మేము కొన్ని బాంబులను సేకరించామని, వాటిని పరీక్షించేందుకు 1926 దసరా పండుగనాడు ఒక గుంపు మీద ఒక బాంబును విసిరామని వారు నాతో చెప్పారు. విప్లవ పార్టీ కార్యకలాపాలను గురించి మరికొంత సమాచారాన్ని తెలుపుతూ నేను ఒక ప్రకటన చేసే పక్షంలో నన్ను జైలులో వుంచబోమని, ఇదంతా నామేలు కోసమే చెబుతున్నామని వారు చెప్పారు. వారి ప్రతిపాదన విని నేను ఫక్కున నవ్వాను. అదంతా అబద్ధమన్నాను. కొన్ని ఉన్నత భావాలు కలిగిన నాలాంటి వాళ్ళు అమాయకులైన ప్రజల పైన బాంబులు వేయరు. ఒకరోజు ఉదయం పూట అప్పటి సి.ఐ.డి. సీనియర్‌ సూపరింటెండెంట్‌ నా వద్దకు వచ్చాడు. చాలాసేపు నాతో ఎంతో అభిమానపూర్వకంగా ర్‌కీ శివవర్మ

మాట్లాడిన తరువాత తాము కోరినట్లుగా స్టేట్‌మెంట్‌ ఇవ్వనిపక్షంలో చక్రవర్తిపై యుద్ధం చేయడానికి కుట్రపన్నిన కకోరి కేసులో నన్ను కూడా ఒక ముద్దాయిగా చేరుస్తామనీ, దసరా సందర్భంగా బాంబులు వేసి క్రూరంగా హత్యలకు తలపడినట్లు ఆరోపించుతూ కేసు పెడతామని ఆయన తెలిపారు. ఇలా తెలువుతున్నందున తాను ఎంతో విచారపడుతున్నట్లు నటించాడు. ఈ సందర్భంగా నాపై తగినంత సాక్ష్యం తన వద్ద గలదనీ, దానితో ఉరిశిక్షపడేటట్లు చేయగలనని కూడా ఆయన నన్ను బెదిరించాడు. ఈ విషయంలో నాకు అంతగా తెలియనప్పటికి పోలీసులు కావాలనుకుంటే అంతపనీ చేయగలరని నేను విశ్వసించాను. నేను ఎలాగూ ఉరిశిక్షకు ఆహుతికాక తప్పదు కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ప్రార్ధనలు జరుపుకోవలసిందని పోలీసు ఆఫీసర్లు నాకు సలహా ఇచ్చారు. అప్పటికే నేను నాస్తికుడను. శాంతిగాను, సరదాగాను వున్నప్పుడు నేను నాస్తికుదనని గర్వంగా చెప్పుకోవచ్చు కాని కష్ట సమయంలో కూడా ఆ సూత్రానికి కట్టుబడి వుండగలనా అనేదే కీలక సమస్య. ఈ సమస్యను గురించి బాగా ఆలోచించుకున్న తరువాత దేవుడిని ప్రార్ధించరాదనే నిర్ణయానికి వచ్చాను. అది నిజానికి పరీక్షా సమయం. ఆ పరీక్షలో నేను దృథంగా నిలవగలిగాను. ఇతర కారణాలతో నేను ఉరి నుండి తప్పించుకోవాలనే ఆలోచన నాలో ఏ మాత్రం రాలేదు. ఆ విధంగా నేను ఖచ్చితంగా దేవుడిపై నమ్మకం లేనివాడిని. అప్పటినుండి అలాగే కొనసాగాను. ఆ పరీక్షలో నిలబడి నెగ్గడం అంత సులభమైన విషయమేమీ కాదు. దేవుడి మీద “నమ్మకం” అనేది కష్టాలను కొంతవరకు మరిచిపోయేలా చేయగలదు. ఒక విధంగా సంతోషాన్ని కూడా కలుగజేయగలదు. దేవునిపై గల నమ్మకంతో మానవుడు ఎంతో ఓదార్పును, ఆత్మస్థైర్యాన్ని పొందగలడు.

(దేవుడు కనుక లేకపోతే మానవుడు కేవలం తనపైననే ఆధారపడవలసి వస్తుంది విపరీతమైన కష్టాల మధ్య పెను తుపాన్ల మధ్య ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడగలగడం ఏమాత్రం చిన్న విషయం కాదు అలాంటి సమయంలో అహంకారం అంటూ ఏమైనా ఉంటే అది ఎగిరిపోతుంది. అందరూ నమ్మేదానిని కాదనడానికి ఎవ్వరూ సాహసించలేదు. అలా కాదనగలిగితే ఆ వ్యక్తికి అహంకారానికి మించి మరో శక్తి అతనిలో వున్నదనే అభిప్రాయానికి రావాలసి వస్తుంది. ఇదీ అనాటి పరిస్థితి. నా కేసుపై తీర్పు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అది మరో వారం లోపల (ప్రకటించబడుతుంది. ఒక ఆశయం కోసం నా జీవితాన్ని త్యాగం చేయబోతున్నాననే సంతృప్తి మినవా మరొకటేమిటి వుంటుంది. దేవుడి మీద నమ్మకం వున్న హిందువైతే వచ్చే జన్మలో ఒక రాజుగా పునర్జన్మ భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 55

వుంటుందని ఆశించుతాడు. ముస్లిం లేదా కైస్తవుడైతే ఇలా త్యాగం చేసినందుకు స్వర్గంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చునని ఆశించవచ్చు. కాని నాకు ఏమి ఆశ వుంది? నాకు తెలుసు? నా మెడకు ఉరిత్రాడు బిగించడంతో అదే నా జీవితంలో అఖరిక్షణం కాగలదని ఇంకా ఆ తర్వాత ఏమీ వుండదు. ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తి జీవితం ఆ విధంగా ముగించడం మినహా మరేమీలేదు. ఎలాంటి స్వార్ధం లేకుండా లేదా ఎలాంటి పారితోషికం ఇప్పుడు గాని, ఆ తరువాత గాని పొందకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్ర్య సాధనకోసం వినియోగించాననే సంతృప్తి, ఆనందం మాత్రమే మిగులుతుంది. మామూలుగా అయితే విజయమో, వీర స్వర్గమో అన్న ఆశతో యుద్ధంలో వీరులు తమ ప్రాణాల నర్చించడానికి సిద్ధపడతారు. కాని అలాంటిదేమీ లేకుండా మానవాళికి సేవచేయడానికి, పీడితులకు విముక్తిని సాధించడానికి నిస్వార్ధంగా అధికారికంగా స్త్రీపురుషులు ముందుకొచ్చినపుడు విముక్తి యుగానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది.

ఇక్కడ రాజు కావడమో లేదా ఇతరంగా లాభపడడమో లేదు. మరణించిన అనంతరం వుంటుందనుకునే స్వర్గంలోకి వెడతామనే ఆశలేకుండా కేవలం దోపిడీదార్లను, పీడకులను, నిరంకుశులను సవాలు చేసి, మానవ జాతిని బానిసత్వాన్నుండి విముక్తిచేసి, మానవులకు స్వాతండ్ర్యాన్ని శాంతిని ప్రసాదించే లక్ష్యం కోసం ప్రాణాలర్పించడంలో అహంకారం ఏముంటుంది? అహంకారంతో దేవుడిపై అవిశ్వాసాన్ని నేను ప్రకటించాననే అపవాదు వేయడానికి సాహసం ఎవరికి వుంటుంది? అలాంటి వారు తెలివితక్కువ వారో, దుర్చుద్ధిగలవారో అయివుంటారు. అలాంటి వారిని క్షమించుదాం. ఆ తరువాత అయినా అలాంటి మహోన్నతమైన త్యాగాన్ని ప్రేరేపించడానికి ఏ మహోన్నత లక్ష్యాలు కారణమైనాయో వారు గుర్తించగలరు. ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలవటాన్ని అహంకారంగా పరిగణించడం అత్యంత శోచనీయమైన విషయం.

అనాడు ప్రజల్లో బలంగా వున్న విశ్వాసాలను మీరు వ్యతిరేకించికే, అందరిచే విమర్శకు అతీతుడనుకున్న ఒక గొప్ప వ్యక్తిని లేదా ఒక వీరుడిని మీరు విమర్శించితే అందుకోసం మీరు చేసే వాదనలన్నీ అహంకారయుతమైనవని జనం మిమ్ములను తెగనాడటం కద్దు. ఇందుకు కారణం మానసికంగా స్తబ్ధత ఏర్చడడమే. విమర్శ, స్వతంత్ర ఆలోచన. ఇవి రెండూ ఏ విప్లవకారునికైనా తప్పనిసరిగా వుండవలసిన మంచి లక్షణాలు. మహాత్మాజీ గొప్పవాడు కాబట్టి ఆయనను ఎవ్వరూ విమర్శించలేదు. ఆయన చాలా పెద్దవాడైనాడు గాబట్టి రాజకీయాల్లో, మత వ్యవహారాల్లో, ఆర్థిక రంగంలో లేదా నైతిక సూత్రాల విషయంలో ఆయన ఏమి చెప్పినా సరియైనదే. ఆయన చెప్పే తీరాలి. 56 శివవర్మ

ఈ రకమైన మనస్తత్వం ప్రగతి వైపుకు దారి తీయదు. పైపెచ్చు అది అభివృద్ధి నిరోధకమైనది కాగలదు. గమన తాత ముత్తాతలు సర్వశక్తిమంతుడైన దేవుడిపై నమ్మకం కలిగిన వారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎవరైనా సవాల్‌ చేయడానికి సాహసించితే అతజ్జి విద్రోహి కింద నిందించుతార్లు అతని వాదనలు సహేతుకంగా వుండి, నిరాకరించడానికి వీలులేనివైతే అతణ్జి అహంకారి అని ప్రకటిస్తారు. అలాంటి వారితో వాదించి ఫలితం వుండదు. ఈ సమస్య ప్రజల ముందు బహిరంగ చర్చకు మొదటిసారిగా వస్తుంది. కాబట్టి దీనిని గురించి మొత్తంగానే వాదించుతాను. మొట్టమొదటి సమస్య: నేను నాస్తికుడను కావడానికి దారి తీసింది అహంభావం కాదనేది ఇప్పటికే నేను స్పష్టం చేయగలిగానని భావించుతున్నాను. నేను వాదన చేసిన తీరు నచ్చిందీ లేనిదీ తీర్చు చెప్పవలసింది నేను కాదు పాఠకులే. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం వుంటే నా జీవితం మరింత సులభతరమై వుండేది. నా భారం కూడా తగ్గేది. కాని దేవుడిపై నాకు నమ్మకం లేకపోవడం వలన పరిస్థితి నాకు కష్టతరంగా పరిణమించింది. దైవత్వంపైనా, పరలోకంలోని సుఖభోగాలపైనా నమ్మకం వుండివుంటే మరణం ఆనందకరంగానే వుండేది. కాని ఆ మైకంలో నేను వుండదలచలేదు. నేను వాస్తవికవాదిని. హేతువాదం సవాయం పైననే నేను నిలబడదలచాను. ఈ లక్ష్యసాధనలో నేనెప్పుడూ జయప్రదం కాలేను. కాని అందుకోసం ప్రయత్నించడం మానవ ధర్మం. విజయం పరిస్టితులపైన ఆధారపడి వుంటుంది. ఇంక రెండో ప్రశ్న ఉదయించుళుంది. ఇది అహంభావం వలన కాకపోతే ప్రాచీన కాలం నుండి వస్తూ నేటికీ ప్రబలంగా వున్న దేవునిపై విశ్వాసం లేకపోవడానికి మరొక కారణం వుండి తీరాలి, దాని విషయానికే ఇప్పుడు వస్తున్నాను. అందుకు మరో కారణం లేకపోలేదు. నా ఉద్దేశ్యంలో ఏ వ్యక్తికైనా ఏమాత్రం వాదనాశక్తి వున్నా తాను వున్న పరిస్థితుల్లో ఏది ఏమిటన్న విషయాన్ని గురించి తర్మించుతాడు. ఎప్పుడైతే సరియైన ప్రత్యక్షమైన ఆధారాలు దొరకవో అప్పుడు విశ్వాసమనేది ప్రధాన స్ట్థానమాక్రమించుతుంది. ఇంతకు ముందే నేను చెప్పినట్లు మానవుని బలహీనత ఫలితమే మత విశ్వాసమని ఒక విప్లవ మిత్రుడు నాతో అంటూ వుండేవాడు. మన పూర్వీకులకు ఈ ప్రపంచ రహస్యాన్ని దాని గతం, వర్తమానం, భవిష్యత్తును గురించి పరిశోధించి తెలుసుకోవడానికి తగినంత సమయం వుండేది. ఈ ప్రపంచం ఎక్కడ నుండి పుట్టింది? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? మొదలైన విషయాలను ఆలోచించినప్పుడు వారి వద్ద సూటిగా ఆధారాలు కొరవదేవి. భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ ర్‌?

ప్రతి ఒక్కరూ తమ కిష్టం వచ్చిన రీతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. అందువల్లనే వివిధ మతాలు సిద్ధాంతాలు మధ్య విపరీతమైన భేదాలు మనకు కనిపించుతాయి. ఆ సిద్ధాంతాలు ఒక్కోసారి పరస్పర విరుద్ధంగా వుండి ఘర్షణకు సిద్ధపడే ధోరణిలో వుంటాయి. ప్రాక్‌ పశ్చిమ వేదాంతాలు విభిన్నమైనవి. తిరిగి ప్రాచ్య దేశాల్లోని మతాల్లోనే ముస్లిం మతం హిందూ మతానికి పూర్తిగా విరుద్ధంగా వుంటుంది. భారతదేశంలోనే బౌద్ధమతమూ, జైనమతమూ బ్రాహ్మణత్వంతో భిన్నంగా వుంటాయి. మళ్ళీ పరస్పర విరుద్ధమైన ఆర్యసమాజం, సనాతన ధర్మమూ వేరుగా వుంటాయి. చార్వాకుడు గత యుగాలకు సంబంధించిన మరో స్వతంత్ర ఆలోచనాపరుడు. గత యుగంలోనే ఆయన దేవుడి అస్తిత్వాన్ని సవాలు చేశారు. మౌలిక సమస్యలపైన ఈ మతాలన్నీ ఒక దానితో మరొకటి విభేదించుతాయి. అజ్ఞానాన్ని అధిగమించి ఈ నిగూఢమైన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి బదులుగా వాటినే [గ్రుడ్డిగా విశ్వసించుతూ మానవ ప్రగతికి అడ్డుపడుతుంటారు. అభ్యుదయం కోసం నిలబడే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలలోని ప్రతి ఒక్క అంశాన్ని మూఢంగా నమ్మకుండా ఒక దాని తరువాత మరొకదానిని సవాలు చేయాలి. దానిపై వాదోపవాదాలకు సిద్ధపడాలి. వాదనల అనంతరం ఆ సిద్ధాంతాన్ని గాని, ఆ మత విశ్వాసాన్ని గాని అంగీకరించితే మనం ఆహ్వానించవలసిందే. ఆ వ్యక్తి వాదన పొరపాటు కావచ్చు. కొన్ని సందర్భాలలో తప్పుకావచ్చు. కాని ఆ తరువాత సరిదిద్దుకోవచ్చు. ఎందువల్లనంటే ఆ వ్యక్తి జీవితంలో హేతువాదం మార్గదర్శకం కావాలి. కాని కేవలం విశ్వసించడం, గ్రుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. అది మేధస్సును పనిచేయకుండా చేస్తుంది. వ్యక్తిని అభివృద్ధి నిరోధకంగా మార్చివేస్తుంది. వాస్తవిక వాదినని చెప్పుకొనే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలను సవాలు చేయాలి. అవి వాదనకు నిలబడలేక పోతే సహజంగానే కుప్పకూలిపోతాయి. అప్పుడు పాత విశ్వాసాలను త్రోసిపుచ్చి నూతన తత్వశాస్త్రం కోసం అన్వేషించాలి. ఇందుకోసం పాత విశ్వాసాలకు సంబంధించినంత వరకూ ఈ అంశంపై నేను పెద్దగా అధ్యయనం చేయలేదని ఒప్పుకొంటాను. ప్రాచ్యదేశాలకు సంబంధించిన మతాలను గురించి అధ్యయనం చేయాలని నాకు ఎంతో ఆసక్తి వుంది. కాని అందుకు నాకు అవకాశం లభించలేదు. కాని ఈ ప్రకృతి నంతటినీ శాసించే ఒక అతీతశక్తి లేదనే విషయంలో మాత్రం నేను గట్టిగానే వున్నాను. మేము ప్రకృతిని విశ్వసించుతాం. ప్రకృతిని తన కోసం ఉపయోగించుకోవడానికి 58 శివవర్మ

దానిపై అధిపత్యాన్ని సాధించడానికి మానవుడు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. మొత్తం అభ్యుదయ ఉద్యమం ఇందుకే కృషి చేస్తుంది.

ఇంక అతీతశక్తిపై నమ్మకం వుండేవారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం.

ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఒక సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, భగవంతుడు వున్నాడని మీరు నమ్ముతున్నారు. అలా అయితే దానిని ఆయన ఎందుకు సృష్టించాడు చెప్పగలరా? ఈ ప్రపంచంలో ప్రజలు పేదరికంతో, రకరకాల కష్టాలతో, బాధలతో అనేక అత్యాచారాలకు గురవుతూ జీవించుతున్నారు. ఎవ్వరూ తృప్తిగా జీవించడం లేదు.

దయచేసి ఆయనకున్న శాసనాలకు లోబడి చేస్తున్నాడని అనబోకండి. ఆయనే గనుక కొన్ని శాసనాలకు కట్టుబడి వుండవలసినవాదైతే ఆయన కూడా ఒదిగిఒదిగి వుండవలసిన బానిస మాత్రమే కాగలడు. ఇలా జనాన్ని బాధపెట్టడం ఆయనకు సరదా అని అనబోకండి.

నీరో చక్రవర్తి రోమ్‌ నగరాన్ని తగులబెట్టించాడు. నీరో పరిమిత సంఖ్యలోనే ప్రజలను హతమార్చాడు. అనేక విషాదాలను తన చిద్విలాసం కోసమే ఆయన జరిపించాడు. మరి అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్రలో ఏమిటి? చరిత్రకారులు ఆయనను ఏ పేరుతో పిలుస్తారు? నీరో చక్రవర్తిని ఎన్ని రకాల విషభరితమైన, అపభ్రంశమైన పేర్లను పెట్టి పిలవాలో అన్నీ పెట్టి మరీ పిలుస్తారు. నీరో చక్రవర్తి పరమ నిరంకుశుడు, హృదయంలేని పరమ క్రూరుడు అని చరిత్ర పుటలన్నింటా వర్ణించబడ్డాడు.

ఇక చెంఘిజ్‌ఖాన్‌ తన క్రూరమైన సంతోషం కోసం వేలమందిని హతమార్చాడు. చెంఘిజ్‌ఖాన్‌ పేరు చెపితేనే మనకు వళ్ళు మండుతుంది. అత్యంత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రపంచంలోని అశేష ప్రజల జీవితాలనే దుఃఖభాజనం చేసే దేవుణ్ణి, ప్రతిరోజూ, ప్రతి గంట, ప్రతి నిముషం కష్టాలతో, విషాదాలతో వారి జీవితాలను అధోగతి పాల్టేసే దేవుణ్ని ఈనాటికి వారిని కష్ట సముద్రాల్లో నిత్యమూ ముంచుతున్న దేవుణ్ని మనం ఏమనాలి? చెంఘిజ్‌ఖాన్‌, నీరోచక్రవర్తి ఎప్పుడో ఒకసారి చేసిన దానికంటే దేవుడు ఈ (ప్రపంచంలోని ప్రజలను నిత్యమూ కష్టాలకు, బాధలకు, అత్యాచారాలకు గురి చేస్తున్నప్పుడు ఆయనను ఎలా పూజించాలి? ఎలా కొలవాలి?

మీకు నా సూటి ప్రశ్న ఇది. ఇంచుమించు నరకప్రాయంగా వున్న ఈ ప్రపంచాన్ని ఆయన యిలా ఎందుకు సృష్టించాలి? ఎల్లప్పుడూ మానవులకు ఆవేదనలనూ, అశాంతినీ భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 59

కలుగజేసే విధంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలి. దేవుడు సర్వశక్తి సమన్వతుడు కదా? ఏదైనాసరే చేయటానికి లేదా చేయకుండా వుండటానికి ఆయనకు శక్తివుంది కదా? అటువంటప్పుడు యిన్ని దుఃఖాలు, బాధలుపడే మానవుల్ని ఆయన ఎందుకు సృష్టించాలి? ఆయన చేసిన పనిని మనం యెలా సమర్ధించగలం? పూర్వం ఒక రకం మృత్యు క్రీడలు జరిపి ఆనందించేవారు వుందేవారట. (గాడియేటరు సంస్థ నిర్వాహకులు వారు) ఆకలితో ఆరాటపదే సింహాల ముందు, పులుల ముందు మనుషులను నెట్టేవారు. ఆ సింహాలకు, పులులకు ఆహారమై పోకుండా ఎవరైనా ఒక అభాగ్యుడు బయటపడితే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెడతాం, సర్వసౌఖ్యాలు, సంపదలు యిచ్చి సత్మరిస్తాం అనేవారట సరిగ్గా అలాగే వుంది దేవుడి సంగతి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వచైతన్యమూర్తి అయిన భగవంతుడు ఈ దుఃఖమయ ప్రపంచాన్ని అందులో అష్టకష్టాలు పడే మానవుడ్ని ఎందుకు సృష్టించాలి అని నేను అడుగుతున్నాను. ఇదంతా ఆయన అనందానికే అయితే, నీరో చక్రవర్తికి, భగవంతుడికి ఏమిటి తేడా? మహమ్మదీయ సోదరులకు, క్రైస్తవ సోదరులకూ నాదొక ప్రశ్న, హిందూ మతస్తులకు వేసిన పై ప్రశ్నలకు మీరిచ్చే సమాధానమేమిటి? హిందువుల్లా మీరు పునర్జన్మను అంగీకరించరు. అలాంటి పునర్జన్మ సిద్దాంతాన్ని మీరు విశ్వసించరు. పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాన్ని, దుష్కత్యాల ఫలితాలను మానవులు ఈ జన్మలో అనుభవిస్తారని మీరు హిందువులవలె వాదించరు. అయితే మీరు చెప్పేదేమిటి? మీ విశ్వాసాలు ఏమిటి? ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి భగవంతుడు వారంలో ఆరు రోజులు పనిచేస్తూ వుంటాడట. సృష్టి ఆరు రోజులు చేసేవాడు. ఏడో రోజున తను సృష్టించిన ప్రపంచంలో లోటుపాట్లను ఎందుకు తెలుసుకోడు? అనుభవాన్నుండి ఎందుకు నేర్చుకోడు? అలాకాక సృష్టి చేసిన ప్రతిరోజూ అఖరున “అంతా సవ్యంగా వుంది. అంతా సక్రమంగానే జరిగింది. అని ఎలా అనుకుంటాడు? చెరసాలలో మగ్గేవాళ్ళు, అకలి మంటలతో అలమటించేవాళ్ళు లక్షలాది కోట్లాది ప్రజలు ఈ ప్రపంచంలో వున్నారు. దోపిడీ చేయబడుతున్న కష్టజీవులు, కార్మికులు, అభాగ్యులు, దీనులు, హీనులూ వున్నారు. వీరంతా తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నారు. ఈ రక్తాన్ని పిండి పెట్టుబడిదారీ వర్ణాలు రాబందులవలె, జలగలవలె వీరిని పీలుస్తూ సంపన్నులవు తున్నారు. లక్షలాదిమందిని నిరుద్యోగులుగా, నిరర్ధకులుగా చేస్తున్నారు. అంతే కాదు, అవసరమైతే తమ లాభాల రక్షణ కోసం, అధికోత్పత్తి చేసి నిల్వపడి వున్న 60 శివవర్మ

సరకులను, ఆహార ధాన్యాలను సముద్రం పాలు చేస్తున్నారు. (పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభం ఏర్పడినప్పుడు, ధరల మాంద్యం వచ్చినప్పుడు లక్షల కోట్ల టన్నుల పాల డబ్బాలను ఇతర ఆహార పదార్థాలను పెట్టుబడిదారీ వర్గాలు సముద్రంపాలు చేస్తాయి. అనువాదకుడు) ఆకలితో మలమలమాడే కోటాను కోట్ల ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను, పాలడబ్బాలను, బట్టలను తదితర జీవితావసర వస్తువులను పంచిపెట్టరు. తమ చెమటను, రక్తాన్ని ధారపోసి శ్రామిక ప్రజలు పంటలు పండిస్తారు. తమ ఎముకలను సున్నంగా చేసి మహాభవనాలను కార్మికులు నిర్మిస్తారు. వారందరూ దారిద్యంతో కడుపునిండా తిండిలేక, బట్టలేక, ఇల్లులేక ఎందుకు అలమటించాలి? దీనికి భగవంతుడు ఏమి సమాధానం చెపుతాడు? ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇలా ఒక వైపున జరుగుతూ వుంటే నా సృష్టి అంతా సవ్యంగానే వున్నదని భగవంతుడు ఎలా అనగలడు? దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలదా? మౌనమే సమాధానమా? ఇంక పూర్వజన్మల, పాపపుణ్యాల సిద్ధాంతాలు ఎంతవరకు నిజమో కొంచెం పరిశీలించుదాం. నేరస్తుణ్సి సంస్కరించి సన్మార్గంలోకి, సమాజంలోకి తీసుకొని వచ్చేటట్లు శిక్షలుండాలనేది సర్వత్రా అంగీకరిస్తున్న విషయం. మానవ పురోభివృద్ధికి ఈ సృష్టి అవసరం. కాని తప్పుచేసిన వాళ్ళను దేవుడు ఎలా శిక్షించాలి? ఎలా శిక్షంచుతున్నట్లు నేడు చెపుతున్నారు? పాపం చేసిన వారిని కుక్కగానో, పిల్లిగానో, అవుగానో, చెట్టు చేమలుగానో పుట్టమని దేవుడు శాసిస్తున్నాదా లేదా శపించుతున్నాడా! ఇలాంటి శిక్షలు 84 లక్షలున్నాయట. నేను అడుగుతున్నాను దేవుడు విధించుతున్న ఈ శిక్షలు తప్పుచేసిన వారిని సంస్కరించే శిక్షలేనా అని, మీలో ఎప్పుడైనా ఎవరైనా నేను పూర్వజన్మలో గాడిదగా పుట్టాను. నేను చేసిన పాపానికి నాకు దేవుడు అలాంటి శిక్షను విధించాడని అని అన్నారా? అలా చెప్పినవాళ్ళు ఎవరైనా వున్నారా? వుండరు. పురాణాల సంగతినలా వుంచండి. అందులోకి నేను వెళ్ళదలచలేదు. కానీ ఒక్కసంగతి మాత్రం చెప్పగలను. అన్ని పాపాలకంటే మహాపాపం దరిద్రుడుగా వుండడమే. దరిద్రం కంటే పాపం మరొకటిలేదు. అంతకంటే శిక్ష మరొకటిలేదు. న్యాయవేత్త లేదా న్యాయాధిపతి లేదా నేరస్థుల శిక్షానిపుణుడు ఎవరైనా యిలాంటి శిక్షను విధించినట్లయితే అటువంటి శిక్షను ప్రశంసించుతారా? సమర్దిస్తారా? ఈ దారిద్య్యమనే శిక్ష ఇంకా అనేక నేరాలు చేయడానికి దారితీయదా? దోహదపడదా? భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 6౮1

ఉదాహరణకు ఒకరు దారిద్ర్యంలో నిరక్షరాస్యతతో వుందే కుటుంబంలో లేదా పాకీపని కుటుంబంలోనో జన్మించాడనుకొందాం. అతడు దారిద్ర్యంలో వున్నాడు. గాబట్టి చదువుకొనే అవకాశం లేదు. కడజాతికి చెందిన దౌర్భాగ్యుడు కాబట్టి అతణ్ణి ఎవ్వరూ దగ్గరకు చేరనివ్వరు. పైపెచ్చు చేసే వృత్తిరీత్యా చూస్తేనే అసహ్యించుకొంటారు. ఛీ కొడతారు. తాము అధికులమని అనుకుంటారు. దారిద్ర్యంలో పుట్టిన వ్యక్తి యొక్క అవిద్యా, అవిజ్ఞానం ఇతరులు అతనిపట్ల చూపే చిన్న చూపు యివన్నీ అతనిలో ఈ సమాజం పట్ల ఒక విధమైన కసిని, అసహనాన్ని కలుగజేస్తాయి. అతని మనస్సు కరుడుగట్టేట్లు చేస్తాయి. ఒకవేళ ఈ పరిస్థితుల్లో వున్న వ్యక్తి ఏదైనా అకార్యం లేదా చేయరాని పనిని చేశాడనుకుందాం. ఇందుకు బాధ్యత ఎవరిది? ఎవరు దీని ఫలితాన్ని పర్యవసానాన్ని అనుభవిస్తారు? దేవుడు బాధ్యత వహిస్తాడా లేక ఆ వ్యక్తి బాధ్యత వహిస్తాడా లేక ఈ సమాజాన్ని నడిపిస్తున్న పండితులు వహిస్తారా? అహంభావం, అధిక్యభావం కలిగిన (బ్రాహ్మణ వర్గం నంఖుంలో కొందరిని అజ్ఞానంలోనూ అమాయకత్వంలోనూ వుంచుతున్నారు. ఈ విధంగా అజ్ఞానంలో వుంచబడటం కూడా వారికి పూర్వజన్మ పాపఫలితంగా వచ్చిన శిక్షేనా?

వేదాలు చదువుతూ వుంటే వినకూడని వాళ్ళు ఈ సమాజంలో వున్నారట. వేదంలోని ఒక ముక్క విన్నప్పటికీ వాళ్ళ చెవుల్లో సీసం కరిగించి పోయాలట. అది వారికి శిక్షట. ఈ శిక్షలకు కూడా పూర్వజన్మలో చేసుకున్న పాపఫలమే కాణమా? ఈ పాపం చేయడానికి కారకులు, బాధ్యులు ఎవరు? ఫలితాన్ని అనుభవించేది ఎవరు?

ప్రియ మిత్రులారా! ఈ సిద్ధాంతాలన్నీ సమాజంలో కడుపునిండినవారు, అన్ని హంగులు, అధికారాలు కలిగినవారు సృష్టించినవేతప్ప మరొకటి కాదు. తాము చేజిక్కించుకున్న అధికారాన్ని సకల సంపదలనూ అధిక్యతలను కాపాడుకొనేందుకు ఈ నిద్ధాంతాలన్నిటినీ వారు కనిపెట్టారు. వాటి సాయంతోనే తమ స్థానాన్ని నిలబెట్టుకొంటున్నారు.

ఆప్టన్‌ సింక్లర్‌ అనుకొంటాను ఒకచోట ఇలా చెప్పాడు : “మానవుడు అమరుడు అనే విశ్వాసాన్ని కలిగించు. నీకు ఎన్నటికీ మరణం లేదు అని చెప్పు అతని వద్దనున్న సకల సంపదలు, వస్తు వాహనాలు అన్నీ లాగేసుకో, మారు మాట్లాడకుండా నీవు అడిగినదంతా యిస్తాడు” నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే మతాధిపతులకు, రాజ్యాధికారం చెలాయించే వారికి మధ్య సమన్వయం వుంది. ఈ సమన్వయం ఫలితంగానే జైళ్ళు, ఉరికంబాలు, విద్యాస్థానాలు ఈ పూర్వజన్మల పుణ్యంతో పొటు సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఈ లా... శివవర్మ

ఒక మనిషి ఏదైనా పాపకార్యం చేస్తున్నప్పుడు అది చేయకుండా దేవుడు... ఈ సర్వశక్తివంతుడైన భగవంతుడు ఆ పాపకార్యం చేయకుండా ఎందుకు అపు చేయకూడదు? యుద్ధ బీభత్సాలను, మానవ మారణహోమాన్ని సాగించే రాజులను, ప్రభువులను ఎందుకు హతమార్చడు? ఇలాంటి దుర్మార్గులను ముందుగానే ఎందుకు శిక్షించకూడదు? మానవజాతిని మారణహోమం చేసే భయంకరమైన ప్రపంచ యుద్దాన్ని రాకుండా దేవుడు ఆపుచేయలేడా?

మరొక ప్రశ్న అడుగుతాను : భారతదేశాన్ని బానిసత్వంలో ముంచిన బ్రిటిష్‌ వారి మనస్సును మార్చి భారతదేశాన్ని బానిసత్వాన్నుండి వారు విముక్తి అయ్యేటట్టు ఎందుకు చేయకూడదు? పెద్ద పెద్ద ధనవంతులు, పెట్టుబడిదారులు తమ వద్దనున్న ధనాన్ని ఉత్పత్తి సాధనాలను ప్రజల పరం చేసేటట్లు భగవంతుడు వారికి హృదయపరివర్తన ఎందుకు తీసుకొని రాకూడదు? ఆ విధంగా కష్టజీవులుందరినీ ఉద్ధరించేటట్లు చేయరాదా?

పరమ కిరాతకమైన ఈ దోపిడీ విధానం నుండీ, బానిసత్వాన్నుండీ యావత్‌ సమాజాన్ని దేవుడే స్వయంగా విముక్తి చేస్తే బాగుంటుందికదా?

అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు లేని సోషలిస్టు సమాజం ఏర్చడితే ఎంతో బాగుండునని మనం అనుకొంటున్నాం. అలాంటి సమాజాన్ని ఎలా సాధించుకుందాం అని చర్చించుకుంటాం. అందుకోసం పోరాడే మార్ధాలను అన్వేషించుదాం, కొందరు అది ఆచరణ సాధ్యంకాదని వాదిస్తారు. అయితే అలాంటి సోషలిస్టు సమాజాన్ని మనకు బాదరబందీ లేకుండా సర్వశక్తివంతుడైన దేవుడే సృష్టించవచ్చు కదా? భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగి సమాజాన్ని అంతటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి సవ్యంగా నడిపించవచ్చును కదా?

భగవదేచ్చ అలా వుంది గాబట్టే (బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు యిక్కడికి వచ్చి మనదేశంలో తిష్టవేసి కూర్చోలేదు. భగవంతుడు అలా రాసి పెట్టలేదు. బ్రిటిష్‌ వాళ్ళ చేతుల్లో అధికార బలం వుంది. మన దగ్గర ఆ బలం లేదు. కాబట్టి మనం వాళ్ళను రాకుండా చేయలేపోయాం. వాళ్ళను తిప్పికొట్టగల శక్తి సామర్ధ్యాలు మన వద్దలేవు. అంతేకాని భగవంతుని సాయం వలన ఆయన యిచ్చమేరకు బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఆక్రమించుకొని తమ అధీనంలో వుంచుకోలేదు. తుపాకులతో, రైఫిళ్ళతో, బాంబులతో, బుల్లెట్లతో, సైన్యంతో, పోలీసులతో వాళ్ళు మనలను బానిసలుగా చేసుకోగలిగారు. మనజాతిని బానిసత్వంలో ముంచి ఘోరమైన అన్యాయాన్ని, నేరాన్ని దారుణమైన దోపిడీని భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 68

వారు కొనసాగిస్తున్నారు. ఇంత ఘోరాతిఘోరం జరుగుతున్నదంటే భగవంతుడు వుంటే అతడు ఏమి చేస్తున్నట్టు. మానవకోటి పడుతున్న బాధలను చూస్తూ ఆనందిస్తున్నాడా? దేవుడు నీరో చక్రవర్తి లేదా చంఘీజ్‌ఖాన్‌ లాంటి కర్మోటకుడా? అయితే అలాంటి భగవంతుడు మనకు ఏమాత్రం అవసరంలేదు. అయితే, ఈ ప్రపంచానికి మూలం ఏమిటి? మానవునికి ఆది ఏమిటి? అని మీరు నన్ను అడుగుతారా? సరే, చెపుతాను వినండి. ఈ సమస్యపై ఛార్తెస్‌ డార్విన్‌ కొంత వెలుగు నివ్వడానికి యత్నించాడు. ఆయన రచనను చదవండి. అలాగే నిర్మలానందస్వామి రాసిన “ఇంగిత జ్ఞానం” అన్న [గ్రంథం చదవండి. మీ ప్రశ్చలకు కొంత వరకు వారు సమాధానాలు యివ్వగలరు. ప్రకృతి స్వభావాన్ని గురించి వారు వివరించారు. యాదృచ్చికంగా కొన్నిరకాల పదార్థాలు కలిసిన నెబ్యులా ఈ భూమిని సృష్టించింది. చరిత్రను పరిశీలించండి. ఈ పరిణామ క్రమంలో జంతువులు పుట్టాయి. సుదీర్ధకాలం అనంతరం జంతువుల నుండి మానవుడు పరిణామం చెందాడు. దార్విన్‌ రచించిన “ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీషిస్‌” అధ్యయనం చేయండి. ప్రకృతితో నిరంతరం మానవుడు ఘర్షణపడి ప్రకృతిని లోబరుచుకోగలుగుతున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే యిది పరిణామ క్రమం. కొంతమంది పిల్లలు (గ్రుడ్డిగాను, కుంటిగానూ పుడతారు. అదంతా గత జన్మలో వారు చేసిన పాప ఫలితమేనంటారు సనాతనులు. మానవ శాస్త్రవేత్తలు, వైద్యులు దానిని చక్కగా వివరించారు. వారి తల్లిదండ్రులలో గల లోపొల వల్లనే వారలా పుడతారని. సహజంగానే మీరు నన్ను మరో ప్రశ్న కూడా అడగవచ్చు. అసలు దేవుడే లేకపోతే ఈ ప్రపంచంలో దేవుడిని యింతమంది జనం నమ్మటం ఎలా సాధ్యమైందని. ఇందుకు నా సమాధానం క్లుప్తంగాను, స్పష్టంగాను ఇది : లేని దయ్యాలను గురించి మనుష్యులు ఎలా నమ్ముతున్నారో, దేవుణ్ణి గురించి కూడా అంతే. అయితే ఒక్కటే భేదం. దేవుడిని అందరూ నమ్మడం, దాన్ని గురించి ఒక తత్వశా'స్తాన్ని రూపొందించి చక్కగా ప్రచారంలో పెట్టగలగడం, కొంతమంది తీవ్రవాదులు చెప్పుతున్నట్లు దోపిడీదారులు, పీడకులు తమ స్వప్రయోజనాల కోసం దేవుడిని సృష్టించారని మాత్రం నేను చెప్పదలచలేదు. అయితే మతాన్ని వారు ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని నేను కాదనను. రాజు మీద తిరుగుబాటు చేయడం పాపమని అన్ని మతాలు చెబుతాయి. నా ఉద్దేశ్యంలో మానవుడు తనకున్న పరిమితులను, బలహీనతలను, లోపాలను దృష్టిలో వుంచుకుని దేవుడనే సర్వశక్తివంతుడిని వూహలోకి తెచ్చుకున్నాడు. కష్ట సమయంలో తష నవవ భివవర్మ

ప్రమాదాలను ధైర్యసాహసాలతో ఎదుర్శొనేందుకు దేవుడిమీద విశ్వాసం తోడ్పడు తుందనుకున్నాడు. అలాగే సమాజానికి వాని చేయకుండా మానవుడిని దేవుడు అదుపులో పెట్టగలడనుకొన్నాడు. ఒక తండ్రిగా, తల్లిగా, సోదరిలా, సోదరుడిగా. మిత్రుడిగా అవసరమైనపుడు దేవుడు ఆదుకోగలడనే విశ్వాసాన్ని మానవుడు తనలో పెంపొందించుకున్నాడు. ఆదిమ సమాజంలో తప్పులు చేయకుండా సమాజానికి దేవుడు అనే విశ్వాసం మానవుడికి సహాయపడింది. అలాగే దేవుడనే భావం కష్ట సమయంలో ఓదార్చుగా మానవునికి వుండేది.

ఆ తరువాత కాలంలో పూజలు చేస్తే దేవుడు రక్షించుతాదనే భావనకి వ్యతిరేకంగానూ, సంకుచిత మత విశ్వాసాలకు వ్యతిరేకంగానూ, ఇతర మూఢ విశ్వాసాలకు ప్రతికూలంగా సమాజంలో పోరాడవలసి వచ్చింది. అలాగే మానవుడు తన కాళ్ళపై తాను నిలబడటానికి ప్రయత్చించుకూ వాస్తవికవాది అయినప్పుడు ఈ దేవుడనే విశ్వాసాన్ని (తోసిపుచ్చుతాడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో అధిగమించడానికి ప్రయత్నించుతాడు. నా పరిస్థితి కూడా సరిగ్గా యిదే. మిత్రులారా, నేను అహంభావంతో దేవుడిని తిరస్మరించడం లేదు. పైన వివరించిన ఆలోచనా విధానమే నన్ను నాస్తికుడిగా చేసింది. దేవుడిని నమ్మడం, ఆయనను నిత్యం ప్రార్థించడమూ అత్యంత స్వార్ధపూరితమైన విషయమని నేను భావించుతాను. ప్రార్ధించడం ద్వారా దేవుడి నుండి ప్రయోజనం పొందాలనుకోవడం మానవుని నైతిక పతనానికి నిదర్శనం. అనేక కష్టాలను ధైర్యంతో ఎదుర్శొన్న నాస్తికుల జీవితాలను నేను చదివాను. కనుక నేను కూడా ఒక మనిషి వలే చివరి వరకూ నా ఆశయాల కోసం మనోనిబ్బరంతో నిలబడటానికి చివరికి ఉరికంబం ఎక్కడానికి కూడా సంసిద్ధంగా వున్నాను.

నేను ఎలా వ్యవహరించుతానో చూడండి. ఒక మిత్రుడు నన్ను దైవ ప్రార్ధన చేయవసిందిగా కోరాడు. నేను నాస్తికుడనని చెప్పినా ఆయన ఇలా అన్నాడు : “ఆఖరి రోజుల్లోనైనా దేవుడిని నమ్మడం నీవు ప్రారంభిస్తావు*. అలాంటిదేమీ లేదని నేనన్నాను. అది ఎన్నటికీ జరిగేదికాదని కూడా అతనికి స్పష్టం చేశాను. కష్ట సమయంలో అలా దేవుడిని నమ్మడమంటే నేను నైతికంగా దిగజారిపోవడమే కాగలదు. నా స్వార్థం కోసం నేను ప్రార్ధించదలచలేదు. పాఠకులారా, మిటత్రులారా ఇది అహంభావం అనిపించుకుంటుందా? ఒకవేళ అదే అయితే అందుకే నేను నిలబడతాను. భారత విప్తవ కెరటం భగత్‌సింగ్‌ 65్‌

భారతదేశంలో విప్లవం పట్ల భగత్‌సింగ్‌ అవగాహన

(1981 మార్చి 28వ తేదీన భగత్‌సింగ్‌ సగర్వంగా ఉరికంబం ఎక్కారు. ఆయన తన సహచరుల నుద్దేశించి రూపొందించిన విస్తవ కార్యక్రమాల ప్రతి కలకత్తాలో శ్రీమతి విమలా ్రతిభాదేవి (డిటెన్యూ) పరిశోధనా గృహంలో 1981 అక్టోబర్‌ 8వ తేదీన లభించింది. ఈ కార్యక్రమం ప్రతిని చదివితే విప్లవ సాధన పట్ల భగత్‌సింగ్‌కు ఎలాంటి అవగాహన వున్నదో మనకు తెలుస్తుంది - అనువాదకుడు)

వ్రీయమైన కామ్రేడ్స్‌

ప్రస్తుతం మనం సాగిస్తున్న ఉద్యమం అతి కీలకమైన దశ గుండా పయనిస్తున్నది. కొన్ని సంవత్సరాలు తీవ్ర పోరాటం సాగించిన అనంతరం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన కాన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలను రౌండ్‌టేబుల్‌ సమావేశం రూపొందించింది. ఈ ప్రతిపాదనల గురించి పరిశీలించేందుకు కాం(గైస్‌ నాయకులను ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆందోళన సాగించాలని గాని విరమించాలని గాని వారు నిర్ణయిస్తే అది మనకు ప్రాముఖ్యమైన విషయమేమీకాదు. ప్రస్తుతం సాగుతున్న ఆందోళన ఏదో ఒక రాజీతో ముగియబోతున్నది. త్వరలో గాని, కొంతకాలం తర్వాతగాని వారు రాజీ పడవచ్చు. మనం సాధారణంగా అనుకుంటున్నట్లు రాజీ పనికిమాలినదని గాని, ఖండించాల్సినదని గాని అనుకోరాదు. రాజకీయ వ్యూహంలో (త్రోసిపుచ్చరాని అంశమది. అణగద్రాక్కేవారికి వ్యతిరేకంగా పోరాదే దేశమయినా ప్రారంభంలో వైఫల్యాల దిశగా పయనిస్తుంది. పోరాటం మధ్యలో ఉన్నప్పుడు రాజీల ద్వారా పాక్షిక ప్రయోజనాల్ని పొందాల్సి వుంటుంది. అంత్యదశలో మాత్రమే సకల సంఘటిత శక్తులతో, దేశ వనరులతో 66 శివవర్మ

అంతిమదెబ్బకొట్టి పాలక ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. అప్పుడు కూడా విఫలంకావచ్చు. అటువంటప్పుడు కూడా ఏదో ఒక విధంగా రాజీ పడకతప్పదు. రష్యా ఉదాహరణ ఈ విషయాన్ని బాగా వివరిస్తుంది.

రష్యాలో 1905 విప్లవోద్యమం విజృంభించింది. నాయకులందరూ ఎంతో ఆశావహంగా వున్నారు. ప్రవాసంలో వున్న లెనిన్‌ విదేశాల నుండి తిరిగి వచ్చారు. ఆయన పోరాటాన్ని నిర్వహిస్తున్నారు. 12 మంది భూస్వాములు చంపబద్దారని, వారి భవనాలు దగ్ధం చేయబడ్డాయని లెనిన్‌తో చెప్పడానికై ప్రజలు వచ్చారు. 1200 మంది భూస్వాములను, వారి భవనాలనే కొన్ని తగులబెట్టేందుకురండని లెనిన్‌ సమాధానమిచ్చారు. విప్లవం విఫలమయితే అలాంటిది ఏదైనా జరిగినా మంచిదని ఆయన అభిప్రాయం. డ్యూమా ఏర్పాటు చేయబడింది. లెనిన్‌ డ్యూమాలో పాల్గొనాలన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది 1907లో జరిగింది. అవకాశాలు ఎక్కువగా వున్న రెండవ డ్యూమా కంటే పనిచేయడానికి బాగా అవకాశమిచ్చిన మొదటి డ్యూమాలో పాల్గొనడాన్ని 1906లో ఆయన వ్యతిరేకించారు. మారిన పరిస్థితుల వల్ల ఆయన అలా చేశారు. అభివృద్ధి నిరోధకత్వానిది పై చేయి అవుతున్నది. కనుక సోషలిస్టు భావాలను చర్చించడానికి ద్యూమాను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని లెనిన్‌ భావించారు.

1917 విష్లవానంతరం బోల్నివిక్‌ బ్రెస్ట్‌ లిటోవ్‌స్కీ ఒప్పందంపై సంతకాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. లెనిన్‌ తప్ప అందరూ అందుకు వ్యతిరేకించారు. అప్పుడు లెనిన్‌ ఇలా చెప్పారు. “శాంతి, శాంతి, శాంతి. ఏవిధంగానైనా సరే శాంతి కావాలి. జర్మన్‌ యుద్ధ ప్రభువులకు మరికొన్ని రష్యా ప్రాంతాలను ఇన్చైనా సరే శాంతి స్థాపించాలి.” ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు కొందరు బోల్చివిక్‌ వ్యతిరేక (ప్రజలు లెనిన్‌ను ఖండించగా జర్మన్త మారణకాండను ఎదుర్శొనే స్థితిలో బోల్నివిక్‌లు లేరని ఆయన నిర్మొహమాటంగా ప్రకటించారు. బోల్నినిక్‌ ప్రభుత్వం పూర్తిగా నాశనం అయ్యేకంటే సంధి కుదుర్చుకోవడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు.

ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు చెపుతున్నానంటే, పోరాటం వృద్ధి చెందుతున్నప్పుడైనా ఉపయోగించుకునే అత్యవసర ఆయుధం రాజీ అని చెప్పడానికే. అయితే సదా మన ముందుండాల్సింది ఉద్యమం ఆదర్శం. మనం ఏ లక్ష్యసాధన కోసమైతే పోరాడుతున్నామో దాని పట్ల మనకు సదా స్పష్టమైన అభిప్రాయం వుండాలి. మన ఉద్యమ జయాపజయాల గురించి సమీక్షించుకోవటానికి, మనం సులభంగా భవిష్యత్‌ కార్యక్రమాన్ని రూపొందించుకొనడానికి అది తోద్చడుతుంది. తిలక్‌ విధానం ఆశయానికి దూరమైనదయినా అది ఆయన వ్యూహం ఆయన విధానం మంచివి. నీవు 16 అణాలు భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 67

పొందడం కోసం నీ శత్రువుతో పోరాదుతున్నావు. నీకు ఒక్క అణా మాత్రమే దక్కింది. దాన్ని జేబులో వేసుకో. మిగతా అణాల కోసంపోరాడు. మితవాదుల్లో మనం గుర్తించవలసింది వారి ఆదర్శాన్ని వారు ఒక అణా సాధించుకోవాలని బయలుదేరుతారు. అణా పొందలేదు. తాము సంపూర్ణ విష్ణవం కోసం తపన పడుతున్నామన్న విషయాన్ని విప్లవకారులు సదా జ్ఞాపకం వుంచుకోవాలి. అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలి. రాజీ కుదుర్చుకున్న పిదప అభివృద్ది నిరోధకులైతే విప్లవశక్తులను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక అలాంటి రాజీలు బాధ కలిగిస్తాయి. అయినప్పటికీ సమర్భలయిన సాహసవంచులయిన విప్లవకారులు ఇటువంటి కుదుపుల నుండి ఉద్యమాన్ని రక్షించుకోగలరు. అసలు సమస్యల విషయంలో ముఖ్యంగా లక్ష్యం విషయంలో ఏ విధంగానూ గందరగోళపడకుండా ఇటువంటి క్లిష్ట సమయాలలోనే మనం చాలా జాగ్రత్తగా వుండాలి. బ్రిటిష్‌ కార్మిక నాయకులు తమ నిజమైన పోరాటాన్ని విచ్చిన్నం చేసి కపట సామ్రాజ్యవాదుల స్థాయికి దిగజారారు. నా అభిప్రాయంలో ఈ నగిషీ సామ్రాజ్యవాద, కార్మిక నాయకుల కంటే కరడుగట్టిన అభివృద్ధి నిరోధకులే మెరుగు. వ్యూహం, ఎత్తుగడల గురించి తెలుసుకోగోరే వారెవరైనా లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే. “వామపక్ష కమ్యూనిజం” అన్న పుస్తకంలో రాజీ చేసుకోవాలన్న అంశంపై ఆయన నిర్దిష్ట అభిప్రాయాలు తెలుస్తాయి. (ప్రస్తుత ఉద్యమం అంటే ఇప్పుడు సాగుతున్న పోరాటం ఏదో ఒక రాజీ కుదుర్చుకోవటమో లేక పూరిగా విఫలంగావటమో సంభవించే దిశగా సాగుతున్నది. నా అభిప్రాయంలో ఈసారి నిజమైన విష్లవ శక్తులను రంగం మీదికి తీసుకురాలేపోవటం వల్లనే నేను ఆ విధంగా చెప్పాను. మధ్య తరగతి వ్యాపారులపై కొద్ది మంది పెట్టుబడిదారులపై ఆధారపడి సాగుతున్న పోరాటమది. ఈ రెండు వర్గాలు ప్రత్యేకించి రెండవ వర్గం తన ఆస్తిపాస్తులను ఏ పోరాటంలోనూ ఫణంగా ఒద్దేందుకు ఎన్నదూ సాహసించదు. అసలైన విప్లవ సైన్యం క్షేత్రాలలోని రైతుల్లోనూ, కర్మాగారాలలోని కార్మికుల్లోనూ వుంది. వారి దగ్గరకెళ్ళే సాహసం మన బూర్జువా నాయకులు చేయరు. చేయలేరు. కునుకుదీస్తున్న సింహం ఒక్కసారి మేల్మొన్నదంటే మన నాయకులు అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత కూడా దానిని అదుపు చేయలేరు. 1920లో అహ్మదాబాద్‌ కార్మికులతో ఇట్లాంటి తొలి అనుభవం గడించాకనే “మనం కార్మికుల జోలికి పోవద్దు. కర్మాగారాల్లో కార్మికులను రాజకీయంగా ఉపయోగించుకోవడం ప్రమాదకరం” (ది టైమ్స్‌ మే 1921) అని మహాత్మాగాంధీ ప్రకటించారు. నాటి నుండి వారెన్నడూ కార్మికుల చెంతకెళ్ళలేదు. వారు రైతాంగంతోనే ఉండిపోయారు. విదేశీయుల ఆధిపత్యాన్నిగాక 68 శివవర్మ

బడా భూస్వాములను కూడా కుదిపేసేలా రైతాంగం మిరుమిట్లు గొలిపేలా పోరాటానికి దిగటం చూసిన ఆ నాయకులు ఎంతగా భీతిచెందారో 1922లో చేసిన బార్జోలీ తీర్మానం స్పష్టంగా తెలుపుతుంది. అందుచేత రైతాంగానికి లొంగిపోయేకంటే ్రీటిష్‌వారికి లొంగిపోవటానికే మన నాయకులు ఇష్టపడ్డారు. పండిట్‌ జవహర్‌లాల్‌ను అలావుంచండి. రైతాంగాన్నిగాని, కార్మికులనుగాని సంఘటితపరచేందుకు ఏదైనా ప్రయత్నం చేసిన నాయకుడెవరైనా ఉన్నారేమో చూపగలరా? చూపలేరు. వారు ఆ శమ తీసుకోరు. అదే వారికి లోపించింది. అందుచేతనే వారెన్నడూ సంపూర్ణ విప్లవానికి కృషిచేసే వారుకాదని నేనంటాను. ఆర్థికపరమైన, పరిపాలనా సంబంధమైన ఒత్తిడులు తీసుకురావడం ద్వారా మరికొన్ని సంస్కరణలు తీసుకురాగలమని, భారత పెట్టుబడిదారులకు మరికొన్ని రాయితీలు సంపాదించి పెట్టగలమని వారు ఆశపడ్డారు. అందుచేతనే ఏదో ఒక రాజీ కుదిరిన తరువాతగాని, రాజీ కుదరకుండానైనా ఈ ఉద్యమం మృత్యోన్మ్నుఖమవుతుందని నేను చెపుతున్నాను. నిక్కచ్చిగా “విప్లవం వర్ధిల్లాలి అని నినదించే యువ కార్యకర్తలు బాగా సంఘటితమై లేరు. తమంతట తాముగా ఉద్యమాన్ని సాగించేటంత బలంగానూ లేరు. నిజానికి పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూను మినహాయిస్తే మన నాయకులెవరూ ఏ బాధ్యతలైనా తమ భుజస్కంధాల మీద వేసుకొనేందుకు సాహసించరు. అందుచేతనే వారు అప్పుడప్పుడు బేషరతుగా గాంధీకి లొంగిపోతుంటారు.. వాళ్ళలో వాళ్ళకు విభేదాలున్నప్పటికి ఆయననెన్నడూ వారు తీవ్రంగా వ్యతిరేకించరు. మహాత్ముని కోసం తీర్మానాలు చేస్తూ వుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నిజంగా విప్లవం కోసం చిత్తశుద్ధితో పోరాడే యువకార్యకర్తలను రానున్న రోజులు గడ్డురోజులని నేను హెచ్చరించుతున్నాను. ఈ విషయం తెలియకపోతే వారు గందరగోళపడతారు. లేదా నీరుగారిపోతారు. జాగ్రత్తగా వుండాలి. మహాత్మాగాంధీ జరిపిన రెండు పోరాటాల ద్వారా అనుభవం సంపాదించిన పిదప మన ప్రస్తుత పరిస్థితి పట్ల, భవిషత్‌ కార్యక్రమం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పరచుకునే చక్కటి స్థితిలో మనమున్నాం. సులభరీతిలో దీన్ని గురించి చెప్పటానికి నేనిప్పుడు యత్నిస్తాను. మీరు “విప్లవం వర్ధిల్లాలి అని నినదిస్తారు. మీరు నిజంగా విప్లవం కోసమే పనిచేస్తున్నారని నేను భావిస్తాను. అసెంన్లీ బాంబుకేసులో మనం చేసిన ప్రకటనలో ఆ పదానికి మనమిచ్చిన నిర్వచనం (ప్రకారం విప్లవమంటే ప్రస్తుత సాంఘిక వ్యవస్థను సంపూర్తిగా తొలగించి చానిస్థానే సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పటమని ఆర్థం. ఇందుకు మన తక్షణ లక్ష్యం అధికారాన్ని భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ 69

కైవసం చేసుకోవడం. నిజానికి ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పాలకవర్థాల చేతుల్లో వారి ప్రయోజనాలను పరిరక్షించే ఆయుధాలు మాత్రమే. మనం అధికారాన్ని హస్తగతం చేసుకోవాల్సి వుంది. మన ఆశయాలను అంటే మార్కిస్టు సిద్దాంత ప్రాతిపదికగా సమాజ పునర్నిర్మాణం గావించడానికి దాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నాం. అందుకే మనం ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహించడం కోసం పోరాడుతున్నాం. మన సాంఘిక కార్యక్రమానికి అనువైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మనం నిత్యం ప్రజా బాహుళ్యాన్ని చైతన్యవంతం చేయాలి. పోరాటాల్లోనే మనం వారికి బాగా శిక్షణనిచ్చి చైతన్యవంతుల్ని చేయగలం. ఈ విషయాలు మనకు సృష్టం అయిన తరువాత మన తక్షణ, అంతీమ లక్ష్యాలేమిటో మన ముందున్నప్పుడు మనమిప్పుడు ప్రస్తుత పరిస్థితిని పరిశీలన చేయాలి. మనం సదావాస్తనికంగా వ్యవహరించాలి. ఏ పరిస్థితినైనా శ్రద్ధతో విశ్లేషించాలి.

భారత ప్రభుత్వంలో భారతీయులు చేరి బాధ్యతలను పాలు పంచుకోవడంపై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మింటోమార్లే సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇందువల్ల సలహాలిచ్చే హక్కులతో మాత్రమే భారతీయులతో వైస్రాయ్‌ మండలి ఏర్పడింది. మహాయుద్ధంలో భారతీయుల సహాయం అవసరమైనప్పుడు స్వపరిపాలనకు సంబంధించి వాగ్ధానాలు చేయబడ్డాయి. శాసనాలు చేసే అధికారాలను పరిమితంగా శాసనసభకు ఇచ్చారు. అయితే ఆ చట్టాలు వైస్రాయ్‌ కూడా అంగీకరించాలి అది మూడవ దశ ఇప్పుడు సమీప భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే సంస్కరణల గురించి చర్చ జరుగుతోంది. మన యువకులు వాటి మంచి చెడులనెలా నిర్ణయిస్తారు? ఇదొక ప్రశ్న కాంగ్రెస్‌ నాయకులు దేన్ని ప్రామాణికంగా తీసుకుని వాటి మంచిచెడులు నిర్ణయిస్తారో నాకు తెలియదు. అయితే విప్లవకారులమైన మనం మాత్రం దిగువ విధంగా వ్యవహరిస్తాం:

  1. భారతీయుల భుజస్మంధాలపై ఏ మేరకు బాధ్యతలను వుంచుతారనే దాన్ని బట్టి 2) ప్రవేశపెట్టబోయే ప్రభుత్వ సంస్థల స్వరూప స్వభావాలను, ప్రజాబాహుళ్ళానికి వానిలో పాల్గొనేందుకు ఇచ్చే హక్కులను బట్టి 3) భవిష్యత్‌లోగల అవకాశాలు, వాటికి ఇచ్చే రక్షణలు.

వీనికి మరికొంత వివరణ అవసరం కావచ్చు. మొదట ప్రభుత్వ కార్య నిర్వాహకవర్గంలో మన ప్రతినిధుల స్థానాన్ని బట్టి, మన ప్రజలకిచ్చే బాధ్యతలను బట్టి మనం సులభంగా నిర్ణయానికి రావచ్చు. ఇప్పటివరకు కార్యవర్గం శాసనసభకు బాధ్యత వహించేటట్లు చేయలేదు. ఎన్నికైన సభ్యుల నిర్ణయాలను దెబ్బతీసే వీటో అధికారాలు వైస్రాయ్‌కి వున్నాయి. స్వరాజ్‌ పార్టీ చేసిన కృషి ఫలితంగా జాతీయ ప్రతినిధులు చేసిన ఏకగ్రీవ నిర్ణయాలను త్రోసిపుచ్చడానికి వైస్రాయ్‌ అప్పుడప్పుడు ఈ అవశిష్ట 70 శివవర్మ

అధికారాలను వినియోగించడం జరుగుతున్నది. దీనిపై మరికొంత చర్చ జరగాలన్న విషయం తెలిసిందే. కార్యనిర్వాహక వర్షాన్ని ఏర్పాటు చేసే పద్ధతిని మనం ముందుగా చూడాలి. కార్యనిర్వాహక వర్గ సభ్యులు శాసనసభలోని ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారా లేక మునవటిలాగా పై వారే నియమిస్తారా అన్న విషయాన్ని దానితోపాటు కార్యనిర్వాహకవర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుందా లేక గతంలో మాదిరిగా శాసనసభను అవమానపరుస్తుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మనం వేచి చూడాలి. ఇక రెండవ విషయాన్ని పరిశీలించుదాం. ఓటు హక్కు పరిధిని బట్టి దాన్ని నిర్ణయించవచ్చు. ఆస్తిని బట్టి ఒక వ్యక్తికి ఓటు హక్కు వచ్చే పద్ధతి పూర్తిగా రద్దు గావాలి. దాని స్టానే సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టాలి. ప్రతి వ్యక్తికి వయోజనులైన స్రీ పురుషులందరికీ ఓటు హక్కును విస్తరింపజేస్తారో లేదో అప్పుడు మనం చూడాలి. రూపాన్ని బట్టి చూస్తే మనకు ద్విసభల ప్రభుత్వం వుంది. ఎగువ సభ బూర్చువాలకు చెందినదని, కేవలం మోసకారి అని నా అభిప్రాయం. ఏక సభా ప్రభుత్వమే మంచిదిగా మనం భావించవచ్చని నేననుకుంటున్నాను. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి నేనిక్కడ 'ప్రస్తావిస్తున్నాను. నేను విన్నదాన్ని బట్టి గవర్నర్‌కు అసాధారణ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. శాసనసభకు అతీతంగా వ్యవహరించే గవర్నర్‌ నిరంకుశుడని రుజువవుతుంది. దీనిని మనం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అని గాక రాష్ట్ర నిరంకుశత్వమని పిలవవచ్చు. ఇది వింతగొలిపే ప్రజాతంత్ర ప్రభుత్వ సంస్థ. మూడవ విషయం స్పష్టమైనదే. గత రెండేళ్ళుగా మాంటేగ్‌ చేసిన వాగ్ధానాలను అమలు జరపకుండా వుండేందుకు బ్రిటిష్‌ రాజకీయ వేత్తలు ప్రయత్నిస్తూనే బ్రిటిష్‌ ఖజానా అంతా ఖాళీ అయ్యే వరకూ ప్రతి పదేళ్ళకొకసారి ఇతర సంస్కరణలు చేస్తామంటున్నారు. ఇక భవిష్యత్‌ గురించి వారేమి నిర్ణయించారో చూద్దాం. ప్రస్తుత పరిస్థితిని చర్చించాము. గనుక భవిష్యత్‌ కార్యక్రమం గురించి, మనం చేపట్టవలసిన కార్యాచరణ పంథా గురించి మనం చర్చిద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఒక్క విప్లవ పార్టీకైనా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తప్పకుండా వుండాలి. విషవమంటే కార్యాచరణ అని మీరు తెలుసుకోవాలి. భారత విష్లవ కెరటం భగత్‌సింగ్‌ 1!

దాని అర్ధం సంఘటితంగా, క్రమపద్ధతిలో పనిచేయడం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా తెచ్చే మార్పు. ఆకస్మికంగానో, అనాలోచితంగానో, అసంఘటితంగానో, నాటి ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారానో తెచ్చే మార్పు తద్వతిరేకమైనది. కార్యక్రమాన్ని రూపొందించాలంటే తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందే.

  1. లక్ష్యం, 2) మనం ఎక్కడ నుండి ప్రారంభం కావాలో అంటే నేడు నెలకొని వున్నపరిస్టితులు, ౩) కార్యాచరణ పంథాకు సంబంధించి స్పష్టమైన అవగాహన లేనట్టయితే కార్యక్రమానికి సంబంధించి ఎవరూ ఏమీ చర్చించలేరు.

మనం ప్రస్తుత పరిస్థితిని కొంతమేరకు చర్చించాము. లక్ష్యాన్ని కూడా కొద్దిగా అందుకున్నాం. మనం కోరేది సోషలిస్టు విప్లవం. దానికి రాజకీయ విప్లవం అనివార్యంగా కావల్సిందే. మనం కోరేది అదే. రాజకీయ విష్లవమంటే అర్ధం ప్రభుత్వం (లేక మరింత మొరటుగా చెప్పాలంటే అధికారం) బ్రిటిష్‌ వారి నుండి భారతీయుల చేతుల్లోకి మారడం కాదు. అంతిమ లక్ష్యసాధనలో కలిసివుండే వారు ప్రజామద్దతుతో అధికారం విప్లవ పార్టీ చేతుల్లోకి మారుతున్నప్పుడు మరింత జాగరూకతతో వుండాలి. ఆ తర్వాత సోషలిస్టు సూత్రాల ప్రాతిపదికగా సమాజం మొత్తాన్ని పునర్చిర్మించే పనిని త్వరితంగా సాగించాలి. మీ ఉద్దేశ్యంలో ఇది విప్లవం కాకపోతే దయాఖభిక్ష పొందండి. “విప్లవం వర్ధిల్లాలి అని

నినాదాలు చేయడం మానండి. విష్లవమనే పదాన్ని ఇతరులు తెలియక వాడినా, దుర్వినియోగం చేసినా మనకు మాత్రం అది చాలా పవిత్రమైనది. జాతీయ విప్లవం కోసం మేమున్నామని మీరు చెప్పేటట్లయితే మీ పోరాట లక్ష్యాలు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా తరహా భారత రిపబ్లిక్‌ కోసం ఉద్దేశించినవే. అటువంటి విప్లవం తీసుకురావడానికి మీరు ఏ శక్తుల మీద ఆధారపడతారో, మీకు తోడ్పడే శక్తులేవో నాకు చెప్పమని నేనడుగుతున్నాను. ఏ విప్లవంతేవాలన్నా అది జాతీయ విప్లవం కానివ్వండి, సోషలిస్టు విప్లవం కానివ్వండి మీరు ఆధారపడవలసింది రైతాంగం, కార్మికుల మీద మాత్రమే. ఆ శక్తులను సంఘటిత పరచడానికి కాంగ్రెస్‌ నాయకులు సాహసించడం లేదు. ఈ శక్తులు లేకపోతే తాము పూర్తిగా నిస్సహాయులమౌతామని ఇతరుల కంటే వారికే బాగా తెలుసు. సంపూర్ణ స్వరాజ్యం కోసం వారు తీర్మానం ఆమోదించినప్పుడు అది నిజానికి విప్లవం కోసం ఉద్దేశించింది కాదు. వారు దానిని అందుకోసం ఉద్దేశించలేదు. యువజనులు, ఇతర శక్తుల వొత్తిడి వల్ల వారా తీర్మానం చేయాల్సి వచ్చింది. తామనుకున్న అధినివేశ ప్రతిపత్తిని సాధించడం కోసం దానిని వినియోగించుకోవాలని వారనుకున్నారు. గతంలో జరిగిన మూడు కాం(గైస్‌ మహాసభల తీర్మానాలను అంటే మద్రాస్‌, కలకత్తా, లాహోర్‌ సభలలో చేసిన తీర్మానాలను అధ్యయనం చేసినట్లయితే మనం బెల శివవర్మ

సులభంగా ఈ విషయం తెలుసుకోవచ్చు. కలకత్తా మహాసభలో 12 మాసాలలోగా డొమినియన్‌ ప్రతిపత్తి నివ్వాలనీ లేకపోతే సంపూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యంగా స్వీకరించాల్సి వస్తుందని తీర్మానం చేశారు. 1929 డిసెంబర్‌ 31 తరువాత అటువంటి బహుమానం కోసం ఎంతో ఆదుర్దాతో ఎదురు చూశారు. అప్పుడు స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడం గౌరవప్రదమని వారు భావించారు. అన్యధా అయితే వారలా కోరేవారు కాదు. అప్పుడు కూడా రాజీ కోసం ద్వారాలు తెరిచే వున్నాయన్న విషయాన్ని మహాత్మాజీ రహస్యంగా వుంచలేదు. అసలు అంతరార్థం అదీ, తాము సాగించే ఉద్యమం తుది వరకూ పాగబోదని, ఏదో రాజీతో సమాప్తమౌతుందని వారికి మొదటినుండీ తెలుసు. పోరాటం జరుగుతున్న ఒక ప్రత్యేక దశలో రాజీ పడుతున్నందుకు గాక కపటంతో వ్యవహరిస్తున్నందుకే మనం వారిని ద్వేషించేది. ఏమైనా విప్లవం కోసం మనం పోరాడేటప్పుడు ఏ శక్తుల మీద ఆధారపడవచ్చు అన్న విషయాన్ని మనం చర్చిస్తున్నాం. రైతుల, కార్మికుల క్రియాశీలక మద్దతు కోసం మనం వారిని కలుపుకుంటామని చెప్పొచ్చు. ఏవో నమ్మకమైన మాటల ద్వారా వారు మోసగింపబడరని మీరు నాకు చెప్పండి త్యాగాలు చేయమని మీరు వారిని కోరుతున్నందుకు మీరు కెచ్చే విప్లవం వల్ల తమ కొరిగేదేమిటని వారు మిమ్మల్ని సూటిగా అడుగుతారు. భారత (ప్రభుత్వ అధినేతగా లార్ట్‌రీడింగ్‌ అయితేనేమి, సర్‌ పురుషోత్తమ దాస్‌ ఠాకూర్‌ దాస్‌ అయితేనేమి వారికి తేడా ఏముంది? అతనికున్న జాతీయ విశ్వాసం కోసం అభ్యర్థించటం నిరుపయోగం. మీ ప్రయోజనం కోసం అతన్ని “ఉపయోగించుకో” కూడదు. విప్లవం నీ కోసం, నీ మంచి కోసం సాగుతున్నదని అతనికి అర్ధమయ్యేటట్లు చేయాలంటే మీకు పట్టుదల వుండాలి. కార్మిక విప్లవం కార్మికుల కోసమే. మీ లక్ష్యాల గురించి ఇటువంటి స్పష్టమైన అవగాహన కలుగజేసినట్లయితే అటువంటి కార్యాచరణ కోసం మీరు మీ శక్తులను సక్రమంగా త్వరగా సంఘటిత పరచగలరు. ఇప్పుడు మీరు రెండు విభిన్న దశలగుండా ప్రయాణించాల్సి వుంటుంది. మొదటిది సన్నాహాలు చేయడం. రెండవది కార్యాచరణకు ఉపక్రమించడం. ఇప్పటి ఉద్యమం ముగిశాక నిజమయిన విప్లవ కార్యకర్తల మధ్యనిరాశా నిస్పృహలు మీకు కన్పిస్తాయి. అయితే అందుకు మీరు బాధపడాల్సిన పని లేదు. విప్రవమనేది చాలా క్షిష్టమైనది. విప్లవం తీసుకురావడమన్నది ఏఒక్క వ్యక్తికీ సాధ్యమయేది కాదు. నిర్ణయించిన తేదీకి తీసుకొచ్చేదికాదు. అది ప్రత్యేక సాంఘిక, ఆర్థిక్క పరిసర ప్రభావాలతో తీసుకొచ్చేది. ఈ పరిస్థితులు ఇచ్చే ఏ అవకాశాన్నైనా వినియోగించుకునే సంఘటిత పార్టీ ఒకటి పని చేయాలి. విప్లవానికి ప్రజా బాహుళ్యాన్ని సన్నద్ధం చేసి ఆ శక్తులను సంఘటితపరచడమన్నది చాలా క్లిష్టమైన కర్తవ్యం. ఇందుకు విప్లవ కార్యకర్తలు భారత విష్లవ కెరటం భగత్‌సింగ్‌ 78

మహత్తర త్యాగాలు చేయవలసి వుంటుంది. వీరు వ్యాపారస్తులో లేక బాగా స్థిరపడ్డవారో లేక ధనిక కుటుంబీకులో నాకు చెప్పండి. దయచేసి నిప్పుతో చెలగాటమాడవద్దు.

మీరు నాయకులుగా పార్టీకి ఎందుకూ పనికిరారు. సాయంత్రం వేళల్లో గంటల తరబడి ఉపన్యాసాలివ్వగల నాయకులనేమంది మనకిప్పటికే వున్నారు. వారి వల్ల ఉపయోగంలేదు. లెనిన్‌ మాటలకు దగ్గర పదం వాడాలంటే వృత్తిరీత్యా విప్లవకారులు, విప్లవం తప్ప జీవితంలో మరే పని లేనటువంటి, ఇతర కోర్కెలు లేనటువంటి, పూర్తికాలం పనిచేసే కార్యకర్తలు కావాలి. ఇటువంటి కార్యకర్తలను పార్టీకి అధిక సంఖ్యలో సమీకరించినట్లయితే మీరు జయప్రదం కావడానికి ఎక్కువ అవకాశాలు వుంటాయి.

క్రమపద్ధతిలో ముందుకు సాగాలంటే స్పష్టమైన భావాలతో పై విషయాలను చర్చించి సునిశిత పరిశీలన, చొరవ, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం కలిగిన కార్యకర్తలతో కూడిన పార్టీ మీకు అవసరమౌతుంది. పార్టీ ఉక్కు శిక్షణ కలిగి వుండాలి. అది అజ్ఞాత పార్టీ అయి ఉండాల్సిన పని లేదు. తద్విరుద్ధంగానూ ఉండనకళళ్లేదు. స్వచ్చందంగా జైలుకెళ్ళే విధానం ఉన్నప్పటికీ తప్పనిసరై అజ్ఞాతజీవితం కూడా గడపవలసి రావచ్చు. అప్పుడు కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాల్సి వుంటుంది. ఈ తరహాకు చెందిన కార్యకర్తల బృందమే నిజంగా అవకాశమొచ్చే నాటికి కావలసిన సమర్ధులైన నాయకులను తయారు చేస్తుంది.

యువజనోద్యమం ద్వారానే పార్టీలోకి కార్యకర్తలను చేర్చుకోవాల్సి వుంటుంది. కనుక యువజనోద్యమాన్ని మనం మన కార్యక్రమానికే ప్రారంభకేంద్రంగా ఎంచుకోవాలి. యువజనోద్యమం అధ్యయన కేంద్రాలను, ఉపన్యాసాలను నిర్వహించాలి. పుస్తకాలను. పత్రికలను, కరపత్రాలను ప్రచురించి నడపాలి. రాజకీయ కార్యకర్తలను చేర్చుకోవడానికి శిక్షణ గరపడానికి ఇది మంచి ప్రాతిపదిక.

తమ భావాలను వంటబట్టించుకున్న యువకుల్లో అనేకమంది తమ జీవితాలను విప్లవం కోసం, పార్టీ కోసం అంకితం చేయడానికి సిద్ధపడతారు. వారిని పార్టీలోనికి తీసుకోవాలి. పార్టీ కార్యకర్తలు సదా యువజనోద్యమాన్ని నిర్వహణను నియంత్రిస్తూ మార్గదర్శకత్వం నెరపాలి. పార్టీ జనబహుళ్యంలో ప్రచారానికి దారితీసే కార్యక్రమంతో పని ప్రారంభించాలి. అది ఎంతో అవసరం. గదర్‌ పార్టీ (1914-15) ప్రయత్నాలు విఫలంగావడానికి మౌలిక కారణాలలో ఒకటి నిర్లక్ష్యం, అజ్ఞానం, కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటం, రైతుల, కార్మికుల సానుభూతి పొందటం, వారిని సంఘటితపరచడం తప్పనిసరి. పార్టి పేరు కమ్యూనిస్టు పార్టీ గానీయండి, మరొకటి గానీయండి ఆ పార్టీ రాజకీయ కార్యకర్తలదై వుండాలి. గట్టి క్రమ శిక్షణగల్లి ఇతర గ్గ శివవర్మ

ఉద్యమాలన్నింటినీ నిర్వహించగలిగినదై ఉండాలి. అది రైతులకు, కార్మికులకు చెందిన పార్టీలను కూడా సంఘటితం చేయాలి. కార్మిక సంఘాలు కాంగ్రెస్‌ను లేదా ఆ రకమైన సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలను అధీనంలోకి తెచ్చుకోవచ్చు. రాజకీయ చైతన్యం కలిగించడానికి జాతీయ రాజకీయాలనే కాకుండా వర్ణ రాజకీయాలను కూడా బోధించాలి. పార్టీ పెద్ద ఎత్తున ప్రచురణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రజాబాహుళ్యానికి వివరించేందుకు అన్ని సమస్యలపైనా (గ్రంధాలను ప్రచురించి సులభంగా వారికి అందేలా, పంపిణీ అయ్యేలా చూడాలి. రచనలు సులభకైలిలో స్పష్టంగా వుండాలి. రాజకీయ స్వేచ్చ లేకుండానే కార్మికులకు, రైతులకు ఆర్థిక స్వేచ్చ వుండాలనే కొన్ని అపహాస్య భావాలు కలిగిన ప్రజలు కార్మికోద్యమాలలో వున్నారు. వారు విచ్చిన్నకులు లేదా గందరగోళపరిచేవారు. అటువంటి భావాలు ఊహింపశక్యంగానివి, (ప్రకృతి విరుద్ధమైనవి. ప్రజా బాహుళ్యానికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలన్నది మన భావన. అందుకోసమే మనం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటున్నాం. ప్రారంభంలో ఈ తరగతులకు చెందిన ప్రజల చిన్న చిన్న ఆర్ధిక కోర్కెల కోసం, హక్కుల కోసం మనం పోరాడాలనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాధికారాన్ని జయించే అంతిమ పోరాటానికి కావలసిన చైతన్యాన్ని కలిగించేందుకు ఈ పోరాటాలే సరైన మార్గాలు. ఇంతే గాకుండా మనం సైనిక విభాగాన్ని నిర్వహించాల్సిన అవసరం కూడా వుంది. ఇది చాలా ముఖ్యం. అవసరమొచ్చినప్పుడు దీని అవసరం ఎంతగానో వున్నట్లు భావిస్తాం. అయితే అప్పటికప్పుడు ఆ విభాగాన్ని ఏర్పాటు చేసి, దాన్ని శక్తివంతంగా పనిచేసేటట్లు చేయలేదు. జాగ్రత్తగా వివరించాల్సిన అంశమిది. ఈ అంశాన్ని పొరపాటుగా అర్ధం చేసుకొనేందుకు ఎక్కువ అవకాశం వుంది. పైకి నేను టెర్రరిస్టుగా వ్యవహరించినట్లు కనిపిస్తాను. కాని నేను టెగర్రరిస్టును కాను. ఇక్కడ చర్చించినట్లుగా సుదీర్హ కార్యక్రమంతో నిర్దిష్ట భావాలు కలిగిన విప్లవకారుణ్ణి నేను. రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ వంటి సాయుధులైన నా కామ్రేడ్స్‌ నేను కండెమ్ట్‌ సెల్‌లో వుండి ఒక విధమైన మార్పుకు లోనైనందుకు (ఇది నిజం కాదు) నన్ను నిందించవచ్చు. నేను మునుపటి భావాలతోనే, మునుపటి దృఢనిశ్చయంతోనే, మునుపటి ఉత్సాహంతోనే వున్నాను. వెలుపల ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అంత పట్టుదలతోనే ఉన్నాను. అందువల్ల నామాటలను చదవబోయేముందు నేను నా పాఠకులను హెచ్చరిస్తున్నాను. ఈ వ్యాఖ్యలను వక్రంగా చదవడానికి వారు యత్నించరాదు. నేను విస్పష్టంగా చెప్పదలిచాను. నేను టెర్రరిస్టును కానేకాదు. విప్లవ జీవిత ప్రారంభదినాలలో మినహా నేనెన్నడూ టెర్రరిస్టుగా భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ క్‌

లేను. ఆ పద్ధతుల ద్వారా మనం సాధించేదేమీ లేదని నేనర్ధం చేసుకున్నా. హిందూస్సాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ సంస్థ చరిత్ర ద్వారా ఎవరయినా ఈ నిర్ణయానికి రాగలరు. మన కార్యక్రమాలన్నీ ఒక లక్ష్యంవైపు ఉద్దేశించబడ్డాయి. అంటే మహా ఉద్యమంలోనూ దాని సైనిక విభాగంలోనూ మన స్థానం నిర్ణయించుకుంటున్నాము

నా గురించి ఎవరైనా అపార్ధం చేసుకుంటే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. బాంబులు, పిస్టోళ్ళు నిరుపయోగమైనవన్నది నా భావన కాదు. బాంబులు విసరటమన్నది నిరుపషయోగమేగాకుండా కొన్ని కాన్ని సందర్భాలలో హానికరం కూడా. పార్టీ సైనిక విభాగాన్ని యుద్ధ పరికరాలన్నింటితో సర్వదా సంసిద్ధంగా వుంచాలి. అప్పుడే అది అత్యవసర సమయాలలో కర్తవ్యం నిర్వహించగలదు. పార్టీ రాజకీయ కార్యక్రమ నిర్వహణకు అది అండగా వుండాలి. అది స్వతంత్రంగా వ్యవహరించరాదు.

పైన పేర్కొన్న మార్దాన పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నిర్జీత వ్యవధిలో సమావేశాలు, సదస్సులు నిర్వహించడం ద్వారా వారు అన్ని అంశాలపై కార్యకర్తలను చైతన్యవంతుల్ని విజ్ఞానవంతుల్నిచేయాలి.

ఈ మార్గాలలో మీరు పనిచేయడం ప్రారంభించినట్టయితే చాలా ఉత్సాహంగా వుండాలి. ఈ కార్యక్రమం నెరవేరాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. పదేళ్ళలోనే విప్లవం వస్తుందనే కుర్రతనపు కలలను, ఏడాదిలో స్వరాజ్యమొస్తుందనే గాంధీ కాల్చనిక వాగ్దానాలను ప్రక్కన పెట్టండి. విప్లవానికి కావలసింది ఉద్రేకం, చావటం కాదు. నిరంతర పోరాటం కావాలి. బాధలను భరించాలి. త్యాగం కావాలి. ముందు నీ అహంభావాన్ని తొలగించు. వైయక్తిక సౌఖ్యానికి సంబంధించి కలలను తుడిచెయ్యి. అప్పుడు పని ప్రారంభించు. ఇందుకు ధైర్యం, సంరక్షణ, అకుంఠిత దీక్ష అవసరం. ఎటువంటి కష్టాలూ అడ్డంకులూ నిన్ను నిరుత్సాహపరచవు. ఏ వైఫల్యమూ, విచ్చిన్నతలూ నిన్ను అధైర్యపరచవు. నీపై మోపే ఎటువంటి బాధలూ నీలోని విష్లవ చేవను చంపలేవు. బాధల అగ్నిపరీక్షలను తట్టుకొని త్యాగాల ద్వారా నీవు విజయునిగా బైటకి వస్తావు. ఈ వ్యక్తిగత విజయాలే విప్లవానికి విలువైన ఆస్తులౌతాయి.

  1. శివవర్మ

“నా జీవితం సిద్ధాంతాలకన్నా గొప్పదికాదు'

లాహోరు కుట్రకేసుని ప్రత్యేకంగా విచారణ చేసేందుకు బ్రిటిష్‌ వైస్రాయి ఓ ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ట్రిబ్యునల్‌ కేసును విచారించి అక్టోబర్‌ 19న తీర్పు ఇచ్చింది. భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష పడింది. తమపై తీసుకొచ్చిన అభియోగాలకు భగత్‌సింగ్‌, అతని సహచరులూ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా కోర్టునే ఖాతరు చేయలేదు. ఈ ఎత్తుగడ భగత్‌సింగ్‌ది. దీనిపై నవూాచరుల మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. మొదట్లో వారు సమ్మతించలేదు. అయితే నిండు ట్రిబ్యునల్‌లో పోలీసులు తమని బాగా చావగొట్టిన తర్వాత గాని, వారు భగత్‌సింగ్‌ ఎత్తుగడని ఆమోదించలేదు. కేసు ఆరంభమయిన మొదటి నాలుగైదు రోజులు మాత్రం కోర్టుకి హాజరయి ఆ తర్వాత వెళ్ళడం మానుకున్నారు. వాళ్ళు లేకుండానే కోర్టు కేసు విచారణ కొనసాగించింది.

భగత్‌సింగ్‌ సాండర్స్‌ హత్యకేసులో నిర్జోషి అని నిరూపించేందుకు తమ వద్ద నిర్దిష్టమైన రుజువులున్నాయని, అందువల్ల తాను నిర్జోషినని నిరూపించుకునేందుకు భగత్‌సింగ్‌కు ఓ అవకాశం కల్పించవలసిందిగా, విన్నవిస్తూ భగత్‌సింగ్‌ తండ్రి సర్దార్‌ కిషన్‌ సింగ్‌ కోర్టులో ఒక అప్పీలును దాఖలు చేశాడు. అది తెలిసి భగత్‌సింగ్‌ తండ్రి కెంతో ఆవేదనతో ఈ దిగువ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం లాహోర్‌లో సెంట్రల్‌ జైలు నుండి రాశాడు. ఆ లేఖ ఇలా వుంది.

పూజ్యులైన తండ్రిగారికి,

నన్ను లాహోర్‌ కుట్ర కేసు నుండి తప్పించేందుకు స్పెషల్‌ ట్రిబ్యునల్‌కు మీరు ఓ అప్పీలు పెట్టారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. మీ చర్య నన్నెంతగానో వ్యధలో ముంచింది. సహించలేకపోయాను. ఈ విషయం తెలిశాక నాకు మనశ్శాంతి పూర్తిగా భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌ ౯7

కరువైపోయింది. ఈనాటి పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులో మీరు ఇలాంటి అప్పీలు ఎలా పెట్టారో నాకు బొత్తిగా అర్ధం కావడం లేదు.

మీ కొడుకునయినందుకు మీ ఆశల్ని ఆకాంక్షల్నీ గౌరవిస్తాను. అయితే దానితో పాటుగానే నాతో ముందుగా ఆలోచించకుండా నా విషయంలో ఎలాంటి అప్పీలు ఇచ్చే అధికారం మీకు లేదని కూడా నేను భావిస్తున్నాను.

రాజకీయరంగంలో నా ఆలోచనలు మీ ఆలోచనలకి పూర్తిగా భిన్నమైనవని మీకు బాగా తెలుసు. మీ ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుందా ఇన్నాళ్ళు నేను స్వతంత్రించి రాజకీయరంగంలో పనిచేస్తూ వచ్చాను. ఆది నుండి మీరు నన్ను ఈ కేసులో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని, నా నిర్జోషిత్వాన్ని సరైన పద్ధతిలో కోర్టు ముందు వుంచుతూ రావాలనీ, నన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన వాస్తవం మీకు గుర్తుండే వుంటుందని నమ్ముతున్నాను. దాన్ని నేను ప్రతిసారీ నిరాకరిస్తూ వస్తున్న సంగతి కూడా మీకు గుర్తుండే వుండాలి. నేనెప్పుడూ (మీ ముందు) నిర్జోషినని నిరూపించుకునేందుకు కోర్టులో వాదిస్తానని ఒప్పుకోలేదు. అంతేకాదు, ఈ విషయాన్ని నేనెన్నడూ పట్టించుకోలేదు కూడా. ఇది తప్పుడు ధోరణి ఫలితమే. ఈ విషయంలో నా నిర్ణోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు నా దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయనే విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. మాపై రుద్దిన నేరాలు చూసి నవ్వేస్తాం.

ఈ కేసులో మేము ఓ నిర్దిష్టమైన ఎత్తుగడను (భగత్‌సింగ్‌ నీతి అనే పదం వొడాడు - అను) అనుసరించి నడుచుకుంటూ వస్తున్నాం. ఈ సంగతి మీకూ తెలియంది కాదు. నా ప్రతి పనీ ఆ ఎత్తుగడని అనుసరించి నా సిద్ధాంతాలకూ, మా కార్యక్రమాలకూ అనుగుణంగా సాగాలి. ఈనాటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. అయినా పరిస్థితి ఇలాగాకుండా మరోలా వున్నప్పటికీ ఈ కేసులో నా నిర్జోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నమే ఓవేళ జరిగితే అలాంటి వ్యక్తులలో నేను చిట్టచివరన వుంటాను. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి నా ఆలోచన ఒక్కటే. ప్రభుత్వం మా మీద ఎంత ఘోరమైన నింద రుద్దినా దాని పట్ల పూర్తిగా తేలిక భావం (అవహేళన అనే పదం వాడాడు భగత్‌సింగ్‌-అను) చూపాలని నిర్ణయించుకున్నాం. నా అభిప్రాయంలో రాజకీయ కార్యకర్తలందరూ ఇలాంటి పరిస్థితుల్లో కోర్టుని తేలిగ్గా చూడడం, నిర్లక్ష్య వైఖరి అవలంబించడం చేయాలి. వాళ్ళకెలాంటి కఠిన శిక్షలు విధించినా, వాటిని నవ్వుతూనే భరించాలి. ఈ కేసులో మొత్తంగా మా ఎత్తుగడ ఈ సిద్దాంతానికి అనుగుణంగా వుంది. అయితే మేం అలా చేయడంలో విజయవంతం అయ్యామా లేదా అన్నది నిర్ణయించడం భత ల శివవర్మ

నా పనికాదు. అయితే ఒక మాట. ఈ విషయంలో మేం ఎలాంటి స్వార్దానికీ తలవంచకుండా పనిచేసుకుపోతున్నాం. లావోర్‌ కుట్రకేసులో వైస్రాయి ఓ ఆర్టినెన్స్‌ను జారీచేస్తూ ఈ కుట్రకు సంబంధించిన ముద్దాయిలు దేశంలో శాంతిని, సుస్థిరతని, చట్టాన్ని అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారు అని ప్రకటించాడు. దీనివల్ల ఉత్పన్నమైన వాతావరణంలో శాంతి, సుస్థిరత, చట్టాన్ని అంతమొందించే ప్రయత్నం మేం చేస్తున్నామో లేక మా శత్రువే (బ్రిటిష్‌ వలస (ప్రభుత్వం) ఆ పని చేస్తున్నాడో కాస్త పరికించవలసిందిగా దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు మాకో అవకాశం లభించింది. నా జీవితం మరీ 'అంత' విలువైంది కాదు.

బహుశా మీరు కూడా మాకు వ్యతిరేకమైన అభిప్రాయం కలిగి వున్నవారిలో ఒకరు కావచ్చు. అంతమాత్రాన మీరు నాతో ముందుగా ఎలాంటి ఆలోచన చేయకుండానే నా తరఫున ఇలాంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు. మీరనుకుంటున్నట్లుగా నా దృష్టిలో నా జీవితం అంతవిలువైనది కాదు. సిద్ధాంతాలను సైతం బలిపెట్టేంత విలువైంది కాదు నా జీవితం. నామీద మోపిన నేరమంతా బలమైనదే. నా సహచరుల మీద మోపిన నేరాలు కూడా! ఉమ్మడిగా మేమంతా ఓ ఎత్తుగడని అనుసరించాం. మేమంతా ఒకరితో ఒకరం భుజంభుజం కలిపి చివరిక్షణం దాకా నిలబడతాం. ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగతంగా మేం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా మాకు చింతలేదు. నాన్నగారూ! మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని నిందిస్తూ సభ్యతా పరిధిని అతిక్రమిస్తానేమోననీ, నా మాటలు మరింత కరోరంగా తయారవుతాయేమానని భయపడుతున్నాను. అయినా, స్పష్టంగా ఇది మాత్రం చెబుతున్నాను. మీకు బదులు మరొక వ్యక్తి ఎవరైనా ఇలా చేసి వుంటే అతణ్ని నేను దేశద్రోహికన్నా తక్కువగా భావించేవాడిని కాను. అయితే మీపై అలాంటి పద ప్రయోగం చేయలేను. సరే ఇదొక బలహీనతంటాను. మానసిక దౌర్చల్యమంటాను. ఇది మనందరికీ పరీక్షా సమయం, నాన్నగారు! మీరీ పరీక్ష నెగ్గలేక పోయారంటాను. మీ జీవిత సర్వస్వాన్ని భారతదేశ దాస్య విముక్తికై బలిపెట్టారని నాకు తెలుసు. కాని ఇలాంటి మహత్తరమైన తరుణంలో మీరు ఇలాంటి బలహీనతను ఎలా చూపించారో నాకయితే అంతుపట్టడంలేదు.

చివరిగా మీకు, నా ఇతర మిత్రులకూ, ఈ కేసులో సానుభూతి చూపిస్తున్న అందరు వ్యక్తులకూ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలచుకున్నాను. మీరు చేసిన ఈ పనిని నేను సదభిప్రాయంతో చూడడం లేదు. ఈనాడు కూడా నిర్జోషినని కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నేను ఇష్టపడడం లేదు. ఒకవేళ కొంతమంది భారత విష్లవ కెరటం భగత్‌సింగ్‌ 79

నా సహచరుల తరుపున ఈ తగాదా విషయంలో కోర్టు ఆ అప్పీలును స్వీకరించినా నేను మాత్రం కోర్టుకు ఎలాంటి స్పష్టీకరణా ఇవ్వదల్చుకోలేదు. నిరసనదీక్ష పాటించిన రోజుల్లో నేను కోర్టుకు అప్పీలు పెట్టుకోవడాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. వార్తా పత్రికల్లో నేను నా నిర్జోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వెలుపడ్డాయి. అది సరికాదు. అందుకు భిన్నంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను నేను రక్షించుకోవడానికి నేను ససేమిరా ఒప్పుకోను. ఆ అభిప్రాయమే నాలో ఈనాడు వుంది. బోస్టల్‌ జైలులో వుంటున్న నా సహచరులు ఈ నా చర్యను పార్టీ మీద నా తిరుగుబాటుగా విశాసఘాతకంగా భావిస్తూ వుండే వుంటారు. వారి ఎదుట నా పరిస్థితిని స్పష్టం చేసుకోవడానికి అవకాశం నాకు లభించకపోవచ్చు.

ఈ విషయంలో తలెత్తిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అసలు వాస్తవమేమిటో తెలియాలని నేను కోరుకుంటున్నాను. అందువల్ల మీరు దయచేసి ఈ ఉత్తరాన్ని ఎంత త్వరగా వీలయిజే అంత త్వరగా పత్రికల్లో ప్రచురించండి.

ఇట్లు భగత్‌సింగ్‌ తాల ఆమె 80 శివవర్మ

ః న మ 5 న. న 1... క. | టి ంటంంటి వ 1 రర ట నా. య. ల న ను సో బగ క శ చే. ఎం వ షకొరోళత్‌నాగ్‌ను ! ఈలవుకోగానే.. ? క్‌ =

  • ఉంకొథ్యుకుళలవంద్దని ధరత్చం సురుకొసుంది: య

_ “సృచ్భాస్యాత్యత్రకాంక్ష నినాదంతో పాటుగాజన న

విముక్తికై గొంతెత్త పలికిన “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌”. ] రణధ్నని ప్రతిధ్వనిస్తుంది: త్యాగానికి వేరవని వీరత్వం |.

స్మరణకొన్తుంది. ఆశయం :కోనం: అంకితమై. ॥

ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరత్వ న గీతాన్ని వినిపిస్తుంది. ఆయన: త్యాగధనుడే కాదు, . శాస్త్రీయ ఆలోచనలతో ఈ దేశ ప్రజల విముక్తి వ

సాధన కోసం మార్చిజాన్ని అధ్యయనం చేసినవాడు. ] ముఖ్యంగా మతం గురించి ఆయన చేసిన విశ్లేషణ .

ఆయనలో గల శక్తివంతమైన మేధస్సు, విప్లవ సాధన , పట్ల నిబద్ధత, చారిత్రక భౌతికవాద పద్ధతిలో ం.

ఆలోచించే సామర్ధ్యం మనకు కనిపిస్తాయి.

లూ స్నా నవరెళంగాణ "