Telugu bhagavan buddha - anilvaranasi/indianlanguages GitHub Wiki

(1 | ల) . షా... నవ్‌ యా ను యనం... , స్‌ రాన గ ల ," న | నా. / ల్తో ౮ గ సక స్‌ వ! న

జ త (1! (ల! శే లో | శ ,

| టు ల ఈ ము కు

షా? స ఎగ ఇలా

య ఇ౯ల ధనల

ఆ క 6 ₹టడట్యూకికీల్‌

(క * €శ్రడకతచ్సాటో

పటి కే లి కడం రుల నో స

భగవాన్‌ బుద (యి గౌతకుబుద్ద్ధుని సకుగ్రు జీవితం రచన ;: శ శార్వరి ప్రచురణ మాస్టర్‌ యోగాశ్రమం

814ఉ64ఉంగిస! 8౮00114 గ వా ౬౯610! ; 0! ౪443111 ౮402 26 515165610౧ : గిం౪ంగాం6/ 2006 న 5800066౬6110% : తీలర్రల61, 2007 ట్‌ గీ సద 064560400౧ :; 0606గ/060 2008 (పు ళల గింషగు కర॥ంగ : సిం౪6గ 568 2010 శు [౬109 ఏ... గ. 100/- న సరల ని ఛం న9115%66 0 : ౧ రే శ క న! షి [14575౧ 7064 49:౬4 గచ్చాబాల. పైపడల న|౦ఈ89, సగంగగ౧౭ ౬౯౧౮1276, గ1111120/ 0410/ ౯౬౧౫ గింజం, 714౧418010, 5క౬006%108౬గ4ద84ి0 + 500015. ౧౧౦౧౮ : (040) 27790094, 9393933946 6౯-౧11 : ౮౧/44౩||| €/2౧00.00. 4౧4. గొడ5190/00450౧౧4౧౧.౦0గ గ/1౧160 0౫ : +“0644ఓ4గగి ౧1౦1010. 90, గగం[౧౧౭ ౬6౧౦12౪6, 6గ౬4|10|గ, 5£0౮|౧/ం౬౧4840 - 500 0156. ౧౧౦౧8 : (040) 27796676

న / 1. / య్‌ నః; ఇటో ల్‌ రం క న. . గ్‌ జగ్‌ త 4 కే నం. టు గ మ. 1 ॥ |. ఇటో కు , . న. 1? 1. య. స . జ క్‌ (1 స్‌ +! లన (1 సె శ న. యం! క గర. శి. నం. ల. స. న. 11111 స్‌ ణ్‌ 1 గోట్‌ చం 1 . సు స;

  1. ల పటే న. 1 1] |. (ఫీ న... 11. న * య మా. న. 11 స... న? క. వ | న. న స ను యం. [గ్‌ య న... న వమనం టా? నం! (ఖం స టే /' / ల? న. మ్‌ (= ॥ ట్ట సల్ల ఆ ట్‌ 1101 (11. స (4 న శకి 1 . లక, సు న్‌ తే నం. ప ణే (మ స్‌ ఎ ల సల ఏ బుద్దం నార." / ః॥] న త్‌ న. | 1; వ ధర క ఇ ' న (| గ ఎం . సక శరణం గచ్చామి స 1 రలు యా జీంయ (న లా ! నం! యహ సంభుం స్‌ల్లీ శ యా. శ నంఖు శరణం గచ్చామి న! గ. గ నరు క్‌ నే ళల | స స టీ స

ఏమో ... నాకు తెలియదు ... మహాకాశం నిర్మలంగా, విశాలంగా, 'ప్రకాశవంతంగా ఎందుకుంటుంది? సాగరగర్భం గంభీరంగా, లోతుగా, ప్రశాంతంగా ఎందుకుంటుంది? మలయపవనం 'ప్రవిమలంగా, చల్లగా, యోగి హృదయంలా ఎందుకుంటుంది? గౌతమబుద్భని ప్రేమ, కరుణ విశ్వవ్యాప్తంగా, కాలాతీతంగా ఎందుకుంటుంది? ఏమో .. నాకు తెలియదు, సరిగ్గా యాలై సంవత్సరాల క్రితం 1956లో గౌతమ బుద్దుని 2500 జయంతి సందర్భంగా 'గాతమబుద్ధు నాటకం ప్రదర్శించాం ... ఆంధ్రాపారిస్‌ తెనాలిలో. ఆ నాటకం దర్శకత్వం నాది. అందులో ఒక చిన్న పాత్ర ధరించాను. బుద్ధుని అయిదుగురు శిష్యులలో ఒక శిష్యుడు సారిపుత ఆ పాత్ర నాది. అప్పుడు నేను ఆ పొత్ర ఎందుకు ధథరించానో ఇప్పుడు అర్ధమైంది. సరిగ్గా నలఖై సంవత్సరాల 'క్రితం నేనొక పుస్తకం రాశాను. దాని పేరు 'నాగార్జున. ఆ పుస్తకం హైస్కూలు విద్యార్థులకు పదేళ్ల పాటు నాన్‌-డిటైళ్స్‌, ఆచార్య నాగార్జునుడు బోధిసళ్చుడు. ఆయన తెలుగువాడు, తెలుగునాట సుప్రసిద్ధుడు. సరిగ్గా ముష్పయ్‌ సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు, వారి జీవన విభానాలు కధనాలుగా చేసి 'అజంతా' నవల రాశాసు. అది పరోక్షంగా బుద్ధుని సంస్మరణ. అపరోక్షానుభూతికి అది భూమిక. దక్షిణ భారతంలో అజంతా, ఎల్లోరాలు, అమరావతి, నాగర్జునకొండ గౌతమ బుద్దుని చెరగని జ్ఞాషికలు గదా! ఇటీవల ఎల్లోరా వెళ్లినపుడు 'బుద్ధగుహాలో గౌతమబుద్భని శిలా విగ్రహం ముందు గంటసేపు ధ్యానం చేసి, అద్భుతమైన ఆనంద సమాధిని అనుభవించాను. అదిగో, అనాదే, ఆ క్షణమే “భగవాన్‌ బుద్ధో సమగ్ర జీవితం రాయాలన్న సంకల్పం కలిగింది. అందుకు ప్రేరణ - బుద్ధుని కరుణ, ఆలంబన - “ధ్యానం. భగవంతుడున్నాడ్డా? వక ఏమో ... నాకు తెలియదు ... అది ప్పటైక్రీ ఎన్నటికీ సమాధానం (అప్పు అయినా, భగవంతుని గురించి ఆలోలించే తీరిక నాకు లేదు.

అవసరం అంతకన్న లేదు. నేను చేయవలసిన పని సక్రమంగా చేయడం నా కర్తవ్యం. భగవంతుడు ఉంటే చరిత్రలో ఉండాలి, మనిషి విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం అన్నది మనం ఏర్పరచుకున్నది. కనుక భగవంతుని రూపురేఖలు, గుణగణాలు మన సంకల్పాన్ని బట్టే ఉంటాయి. మనిషి 'కల్పన' భగవంతుడు.

ఏ దేశ చరిత్ర విప్పినా, ఏ జాతి చరిత్ర తిరగ తోడినా మనిషి మనస్సులోనే భగపంతుడు 'చిక్కుపడినట్లు తెలుస్తుంది. కనిపించని భగవంతుడు వినిపించని సందేశాలు వినిపించే వారంతా అవతార పురుషులవుతుంటారు. భగవంతునికి "లైసెన్స్‌" లేని ప్రతినిధులవుతున్నారు. వీరంతా ఏ విధంగా భగవంతునికి ప్రతినిధులు? దేవుని పేరు చెప్పుకుని, నాలుగు మంచిమాటలు చెప్పడం వీరు చేస్తున్నపని. ఈ వర్గంవారు ప్రవక్తలు, మహర్షులు, అవతారులు. వీరు చేయవలసిన పని ఏమిటి? చేస్తున్న పని ఏమిటి? మానవతకు మెరుగులు దిద్దవలసిన పని వీరిది. మానవతా విలువల్ని ఉద్ధరించడం వీరి పని. మనిషికి ఆనందాన్ని కలిగించడం వీరి నిజమైన పని. ఆ పనిని మొదటిసారిగా, మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినవాడు గౌతమబుద్దుడు.

'బొద్ధమతం' అంటారు. 'బుద్ధదేవుడు' అంటారు. బుద్దునిది 'మతం' ఎలా అయిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఎప్పటికీ అర్ధం కాదు కూడా. ఎందుకంటే, ఎప్పుడు, ఎక్కడ బుద్ధుడు “'మత'* (ప్రస్తావన చేయలేదు. సమాజంలోని అసమానతలు, కులవిఖేదాలు సిద్ద్ధార్థుని మనసు నొప్పించాయి. “అధర్మం సహించలేక 'ధర్మ' ఘోష చేశాడు. ఆయన తలకెత్తుకుంది మానవధర్శం. ఆయన పరితపించింది 'దుఃఖ' నివారణకు, 'అనందం' అందరికీ పంచడానికి మనిషికి, మనసుకు మూడు ఆవరణలుంటాయి. ప్రధానమైంది బుద్ధి. ఆ తర్వాతది స్వధర్మం. తర్వాతది సంఘం ఒకటి . భౌతిక జీవన వలయం రెండవది : వివేకం, నీతి కలగలసిన ధార్మిక జీవనం. మూడు జ్ఞానం, ఆధ్యాత్మికతకు నీడ నిచ్చే సంఘ జీవనం. ఈ మూడు కలిస్తేనే మానవ జీవితానికి పూర్ణత్వం.

భగవంతుడు 'లేడు' అనదానికి కారణం భగవంతునికి ఒక రూపం అంటూ లేదు కనక. అన్ని భగవత్‌ రూపాలు మనః కల్పితాలే. భగవంతుడు 'అరూపం”' అయినా అది చైతన్యం. విశ్వ వ్యాప్తమైన చైతన్యమే భగవంతుడు, ధ్యానం 'అజ్ఞానం' వదలక మంత్రాలు వల్లించినా ... పూజలు, పునస్మారాలు చేసినా విగ్రహాలు, పటాలు పెట్సి దేవాలయాలు, దేవ్యాలయాలు కట్టినా అసలైన దివ్యత్వం దాగి ఉన్నది శూన్యంలో ... హృదయ కుహరంలో . . మనసు తీరం

దాటిన తర్వాతనే. వివేకం అనే పడవలో 'అజ్ఞాన సాగరాన్ని దాటి జ్ఞానతీరాన్ని చేరాలి. మన మహాత్ములు, మహర్షులు, అవతార పురుషులు అందరూ బోధించింది అదే జ్ఞానం. కాలాన్ని బట్టి, దేశాల్ని బట్టి, మతాల్ని బట్టి అంతరాలు కనిపిస్తాయి. “సత్యం ఒక్కటే అయినప్పుడు ఇన్ని మతాలెందుకు? అసలు మతం ఎందుకు? సంకుల సమరాలెందుకు? బుద్ధునికి ఎదురైన ప్రశ్న అది. దానికి ధీటైన సమాధానమే గౌతమబుర్భుని జీవితం.

చరిత్రలో ఎంత వెనక్కి వెళ్లినా బుద్దుని వద్ద ఆగిపోవలసి వస్తుంది. జ్ఞాన కిరణాలు బుద్ధుని నుండే వెలువడ్డాయనిపిస్తుంది. జ్ఞానభాస్మరుడు ఉదయించింది కపిలవస్తులోనే. ఆయన “సిద్ధార్థుడు” - అంటేనే పూర్ణపురుషుడు అని సిద్ధ సంకల్పుడని అర్ధం. సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడైనాడు, తధాగతుడైనాదు. బుద్దుడు కావడం అంటే 'జ్ఞాని' కావడమే. 'ధ్యానం' పండినప్పుడు “జ్ఞానం' జ్యోతిగా పరిణమిస్తుంది. 'అమరుడు” కావడం బుద్దుని లక్ష్యం.

కుల వ్యవస్థ మోద అసహ్యం కలిగినప్పుడు, మత చాందసాలపైన రోత పుట్టినప్పుడు ప్రతి మనిషికి బుద్ధుడు జ్ఞాపకం వస్తాడు. కుల, మత నిర్మూలనకు జీవితాన్ని “కర్పూర హారతొ చేసినవాడు బుద్ధుడు. మనిషి కన్నీటి బరువును తూకంవేసి, బాధలగాధలు పరిశోధించి, ప్రతిమనిషికి 'ఆనంద' మార్గం చూపినవాడు బుద్ధుడు. మతాలకు అతీతమైనది 'మానవత్వం' అని నిర్మోహంగా చాటి చెప్పినవాడు బుద్ధుడు. మానవతకు 'మతం' నీడ అవసరం లేదని, *'కులం” ఆసరా అసలు అవసరం లేదని నిరూపించినవాడు బుద్ధుడు. మానవత్వం వికసించడానికి కావలసింది (ఢమ, కరుణ, అనురాగం.

చరిత్ర వెనక్కిపోయి పోయి బుద్దుని వద్ద ఆగిపోయింది చరిత్ర బుద్దుని వద్ద పెద్ద మలుపు తిరిగింది. బుద్ధునికి పూర్వం చరిత్ర లేదా? అంటే వుంది. ఆ చరిత్రకు కాళ్లు లేవు. హృదయం లేదు. కరుణ, (ప్రేమ కనిపించని కాలంలో మానవత్వాన్ని నిద్రలేపిన వాడు బుద్ధుడు. మానవతకు (ప్రేమ, కరుణ అనే రెండు కళ్లు తెరిపించినవాడు బుద్ధుడు. మతం 'దేవుజ్ణి' తలకెత్తుకుంటుంది, ఊరేగిస్తుంది, ఆ ఊరేగింపు “గుంపు” క్రిందపడి నలిగిపోతున్నవారు దళితులు. బడుగులు, అందుచేత సిద్ధార్థుడు వేదాల నీడ కాదని 'బోధి' నీడను ఆశ్రయించాడు. అంతః పురం వదలి అరణ్యాలకు చేరాడు. సుఖాలు పణంగాపెట్టి ఆనందాన్ని అన్వేషించాడు.

బుద్దుని కాలంనాటికి ఉన్నది ఒకే మతం. అది బ్రాహ్మణాధిక్యత. శాఖలు అసంఖ్యాకం ఒక్కొక్క గురువుది ఒక సిద్దాంతం. ఒక్కొక్క కులపతిది ఒక మతం. బగవాన్‌ బుద్ద

అభిమతాన్ని బట్టీ మతం. ఎవరి ధర్మం వారిది. ఎవరి మతం వారిదిగా ఉన్న కాలంలో అన్ని ధర్మాలు కడకు నళించేవే అన్నాడు బుద్దుడు.

శూన్యంలోనే సత్యావిష్కారం జరుగుతుందని మరిమరి వక్కాణించి చెప్పాడు. సమాజంలో అడుగడుగునా పురోహితుల పెత్తనాన్ని ఛీత్మరించాడు. పురిటిగది నుంచి వల్లకాటి వరకు పురోహితుల మంత్రాలు లేనిదే కాలం గడవని పరిస్థితి. సామాన్యుని బ్రతుకు సర్వత్రా పరాధీనం. సామాన్యుని కన్నీటి చారికలు తుడవాలని బుద్ధుడు ఆశించాడు.

మనం చిన్నతనంలో బళ్లోపారాలు చదివాం, బుద్ధుని గురించి. అవి మొక్కుబడి చదువులు, అవి మొక్కుబడి రాతలు. బుద్ధుని వృాదయాన్ని ఆవిష్కరించిన రాతలు కావవి. ఎన్నో బుద్ధ విగ్రహాలు చూస్తుంటాం. వేటిలోనూ తధాగతుని హృదయం కనిపించదు.

నా ప్రశ్న ఒక్కటే! ఈ దేశంలో పుట్టిన బౌద్ధం విదేశాలకు ఎందుకు వలసపోయింది? మనం జబౌద్దాన్ని ఎందుకు రక్షించుకోలేకపోయాం? దలైలామాకు ఆభ్రయం యిచ్చిన దేశం, బౌద్ధ ధర్నాన్ని ఎందుకు తిరస్కరించింది? బుద్దుని హత్య చేయాలనుకున్నది ఎవరు? బౌద్ధాన్ని హత్య చేసింది ఎవరు?

ఈ నా ప్రశ్నలు, సందేహాలు నా ఒక్కడివి కావు? రెండున్నర వేల సంవత్సరాలుగా బుద్దుడు పుట్టిన దేశంలో అప్పుడప్పుడు నాలాంటి “అజ్ఞానులు అడుగుతున్న ప్రశ్న ఇది.

నా సందేహాలకు సమాధానాలు గౌతమ బుద్ద్ధుడే యిచ్చాడు.

జ్ఞాన బుద్దుని సందేశాల సమాహారమే ఈ పుస్తకం 'భగవాన్‌ బుద్ధ.

మహాత్ముల జీవిత చరిత్రలు చదివితే జ్ఞానం కలుగుతుంది.

గౌతమబుద్భుని “జీవితం” చదివితే ధ్యానం కుదురుతుంది. “'ధ్యానం' అంటే గుర్తుకు వచ్చింది. గౌతమ బుద్దుని “ధ్యానబుద్ధునిగా ఊహించుకుంటూ చదవండి. మనో యవనికపై బుద్దుని దర్శించండి,

మోరూ బోధిసత్వులు కాగలరు. తధాగతులు కాగలరు.

నిజంగానా? .... ఏమో నాకు తెలిసింది అంతవరకే!

  • శార్వరి

1 || య ఇ క శ్‌ న [| | న. స. బహ! ఆ 4 ౪ సీ ఆ అన లో ( యమ్‌ గ్యర్తైగ గ నం / | టి” * - ళో న్‌. సో ఖై స స క న శే ఎట లప లం (వా న్లో ఏ మా న్‌! లంలో |. . 1, ప ॥ చ మల లలో వా భయమా వతంంన్స్య్యా ) ” శ స ్ష ప న ణక ళు గ్ల న్‌ శ .1 న. నం ను. మా ॥ ॥ " / మ సి సి సమయాన టిలో . [|

  • ॥ ర న న న. శత న్‌ శ గ్‌ , రం | సమన (౧౫ గ్‌ - సే + ్‌ | అ ల లు ॥ న న జ | హూ ౯ $* //| లా శ స. న ॥ స లీ | ౪. ఇం శా ౮ ( . నా 4వ - శా - గ్‌ కల హస | స ! మా క. న స. 41 న్‌ | 1 నన గయా ము! త శ యా. న. శ / గ ముంతలు) ( టం! జ్ర | స న క వా సె గ | న వ్‌ అం ఆత లే శయం. షా క్ష సప. త... చ ర సవర శక 190 1 ల గ కూ . న ణ్‌ యాం స్తో |. (అమె ః క్‌ [] 1 న | | ల (గ 2 తి. శ, తో ఖే 1! /; [1 నత్త... ల ల్‌? ( టీ సలల ఆ గ్జీ (| - | డు బం మం...” గ్‌ “లల లం. | | వై జ స సీ, ల ్ద త 2, 5 శ 4. యం అ ర. స శా: సక్‌ సంత్‌! శస క టట శల న _ శ ॥ వ చ్‌ హ్‌ థీ, శ్ర | న (౧ వ ్ల ఇటీ! శం. టి త బి యక 4 త. క్‌ి ఫ్‌ | /. (| బీ శై! లలన “న్‌. సగ లో ర శ్‌ ల్లి య య శే / అ. ప్‌ వ గో గ స న్‌. గ, చే మ లా క గే (1 ల్‌ న ణ్‌. ళ్‌ ఘన న ఓ _ వా 1 | సూ “సె ల్‌ ఎ గ ఆన. = రాస . |. టి న లగ గ్‌ క - _ః న 7 | | న్‌! న. 1 - న. (| గ్‌ లో తగా “డా. (౪ గ్‌ | గ ఇ లు (1 - నా యా ౪ | లం న. శే వా నా ఖు గి ఆ |! “ఫీ వ | | న ॥ గ! నా స న్‌ న్‌ శ | జ న్‌ కొ |

న గ త భగఠాన్‌ బుద్న ల రెందున్నర నవ్యా(సొబ్దులకు వూర్వం ... అదివో ... అల్లదివో .. అదే కపిలవస్తు నగరి ... రోపొణీ నదీ తరంగాలపైన సాయం సూర్చకీరణాలు నర్రిస్తున్న వేళ... నగరికి అల్లంత దూరాన, రోహిణీ తీరాన ... రాచబాట ... చూపు ఆనినంతమేర పచ్చని పొలాలు ... కనుల పండువ చేసే వనశోభలు. . గోధూళి వేళ ఇళ్లకు తరలిపోతున్న ఆలమందలు, పశుల కాపరులు అక్కడక్కడ, అముడప్పుడు ఎదురవుతున్న ఎడ్లబండ్లు ... పాదచారులు .. ప్రయాణీకులు ... జానపదులు .. పల్లె పడతులు ... రైతులు - బైతులు ... రాచబాటపైన శోభాయమానంగా, ప్రశాంతంగా తరలి వెళుతున్న రాజాంతః పురశోభ కపిలవస్తు నగరం నుండి రామగ్రామానికి వెళ్లే బాట అది. పూల మాలలతో అలంకరించబడిన మేనాలో రాచసౌందర్యం; ముందూ వెనుక శకటాలలో అంతఃపుర సుందరీమణులు, దాసీజనం. మొత్తం ఏడు మేనాల సందడి వారికి రక్షణగా సాయుధులైన ఆశ్వికులు. మేనాలకు ముందు ముగ్గురు, వెనక ముగ్గురు. ఒక్కొక్క మేనాకు కుడి ఎడమల ఒకొక్క రక్షకభటుడు. అది పరివారం. రోహిణీ నది పరీవాహక ప్రాంతంలో ఉత్తరదిశగా ప్రయాణం పొదువాలే వేళకు ఆ బృందం లుంబినీ వనం చేరుకున్నది. లుంబినీ గ వనం శాక్య ప్రభువుల విహారభూమి. అప్పుడప్పుడు శుద్దోదన మహారాజు వచ్చి విశ్రమిస్తుంటాడు. వనంలో సకల సదుపాయాలు గల విశాలభవనం, విందులకు వినోదాలకు అనువైన మందిరాలు. అంతఃపుర కాంతలకు లుంబిని చిరపరిచయం మహామాయాదేవి ఉదయం నుండి ప్రయాణం చేసి అలసిపోయింది. అమె పూర్ణ గర్బణి, ప్రసవానికి కన్న వారింటికి ప్రయాణమై వెళుతున్నది ఆమె 9 భగవాన్‌ బుద్ద

తండ్రిగారిది కోలీయం. కోలీయ రాజధాని రామగ్రామం. కపిలవస్తుకు ఒక్క రోజు ప్రయాణ దూరం శాక్యరాజధాని కపిలవస్తు. శాక్య, కోలీయ రాజ్యాలు రెండూ మగధకు సామంతదేశాలే. అయినా అన్నిటా స్వయం ప్రతిపత్తి గలవి. రెండూ సంపన్న దేశాలే. ఆనాడు పున్నమి. చీకటి పడగానే చంద్రోదయమైంది. లుంబినీ వనం వెన్నెల చల్లదనాన్ని పంచుతోంది. మహామాయాదేవి బృందం లుంబినీ మందిరంలో విడిది చేసింది. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి, మరునాటి ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయం. అర్ధరాత్రి సమయంలో మాయాదేవికి నొప్పులు ఆరంభమైనాయి. దాసీజనం హడావుడి. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు కనుక ఇబ్బింది లేదు. ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. పున్నమి చంద్రుని వంటి బిడ్డ మొహం చూచి మాయాదేవి ఆనందంతో పులకించింది. బిడ్డ మొహం చూడగానే ఆమెకు ఎప్పుడో తను కన్నకల జ్ఞాపకం వచ్చింది. తొమ్మిదవ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె కలగన్నది. బ్రహ్మ ముహూర్తంలో కన్న కల అది. గొప్పుగా ఫలిన్తుందని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో వచ్చిన కలలు వృధాకొవు. అవి శుభ సూచికలు. అవి బ్రహ్మదీవెనలు. మాయాదేవికి స్వప్నంలో ఒక తెల్ల ఏనుగు కనిపించింది. బలంగా, అం ంగా లీక గా ని విచిత్రం ఏమిటంటే ఆ ఏనుగుకు ఆరు దంతాలున్నాయి. ఆ క శ = మంచు ముద్గకట్లినట్లు కనిపించింది. మెరుస్తున్నాయి. ఏనుగు సైతం తెల్లగా, దాట కం ప ది. ఆ ఏనుగు సరాసరి తన ఏనుగు తొండంతో ఒక పద్మాన్ని పట్టుకుని వుం వర్మక్రు పవ్యింది. తను గన్యుంలో ఆ పద్మాన్ని డ౦చింది, అంతీకీన్నీ విచిత్రం ... ఆం షెర్ట ఏసుగు తన గర్భంలో ప్రవేశించటం. అలా ప్రవేశిస్తున్నప్పుదు తనకు ఏ మాత్రం బాధ అనిపించకపోగా ఆనందం కలిగింది ... ఆ క్షణంలో అనిపించింది _.. తనకు ఏలాంటి కష్టాలు, బాధలు ఉండబోవని. ఆనాడు నిద్రలేచే సరికి మాయాదేవి పరమ ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. అప్పుడే స్వర్ణం నుండి దిగి వచ్చిన అనుభూతి పొందింది. ఈ ఆనందం, సంతృప్తి చాలు - ప్రపంచంలోని ఏ సుఖాలూ, భోగాలూ, సంపదలు తనకు అవసరం లేదు. మేల్కొన్న తర్వాత కూడా ఆమెకు ఏదో మధుర గాంధర్వ గానం వినిపించ సాగింది. శుద్దోదన మహారాజుకు తన స్వవ్న వృత్తాంతం చెప్పింది. ఆయన ఆశ్చర్యపడి ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, నగరంలోని పండితుల్ని, దైవజ్ఞున్ని రప్పించాడు. మఫామాయాదేవి కలగురించి వివరించి, విశ్లేషించి, ఫలితం చెప్పమని ఆదేశించాడు. భగవాన్‌ బుద్ధ 10

పండితమ్మన్యులు సుదీర్హంగా యోచించి, చర్చించి శుద్దోదనునికి వివ రించారు. “ప్రభూ! మహారాణి మాయాదేవి ఒక మహాద్భుతమైన బిడ్డకు జన్మ నివ్వనున్నారు. ఆ బిడ్డ భూమండలాన్ని పరిపాలించగల కారణజన్ము డవుతాదు. ఏమైనా, మన కపిలవస్తు చరిత్ర ప్రసిద్ధమవుతుంది. జన్మించే బిడ్డవల్ల మా పేరు నిలబడుతుంది అతని కీర్తి అజరామరమై, ఆచంద్ర తారార్మమవుతుంది.” శుడ్డోదనుని మొహంపైన వెలుగునీడలు తారాడాయి. ఆనందం మాటున రవంత విషాదం కదలాడింది. అయినా మనసు కలతపడనీయక ఇనుమడించిన ఉత్సాహంతో, నగరంలోని పేదసాదలకు ధనం పంచిపెట్టి, ఊరూర ఉత్సవాలు చేయించాడు. కపిలవస్తు ఆనాడు పండగ చేసుకుంది. అది అలనాటి స్వప్న వృత్తాంతం మాయాదేవి ప్రసవించిన వార్త అందగానే శుద్దోదనుడు లుంబినికి రధం పైన ప్రయాణమైనాడు. పుత్రోత్సాహం... పైగా వారసుడు జన్మించాడు. పట్టు పుట్టాలలో పుత్తడి బొమ్మలా ఉన్న బిడ్డను చూడగానే శుద్దోదనునికి ధ్యాన నిష్టలో ఉన్న ఒక బాలయోగి కనిపించాడు. ఆయన కళ్లలో నీటితడి .. ఎవరూ గమనించ లేదు. అది ఆనందోద్వేగం అనుకున్నారు. మనసార మాయాదేవిని అభినందిం చాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దులు కురిపించాడు. ముగ్ధ మనోహరంగా, ముద్ద బంగారంలా, స్వచ్చంగా ఉన్న బిడ్డను చూచి పరివారం సంబరపడ్డది. ఇంక రామగ్రామం వెళ్లవలసిన అవసరం లేదు. కపిలవస్తుకు తిరుగుప్రయాణం ఏర్పాట్లు జరిగాయి. నగరికి చేరిన మరునాదే నామకరణోత్సవం ఏర్పాటు చేశారు. తన అభీష్టం సిద్ధించినందుకు “సిద్దార్థుడూ అని పేరు పెట్టుకున్నాడు శుద్ధోదనుడు. పురోహితులు “తథాస్తు అని ఆశీర్వదించారు. వెంటనే శుద్దోదనుడు జ్యోతిష పండితుల్ని రప్పించి, జన్మకుండలి వేసి, పిల్లవాని భవిష్యత్తు చెప్పమని కోరాడు. దైవజ్ఞులు పిల్లవాని జాతకం, గ్రహసంపత్తి పరిశీలించి, సాముద్రిక లక్షణాలతో పోల్చిచూచి, మహా చక్రవర్తి లక్షణాలు కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్నాయని చెప్పి, దండిగా బహుమతులు దండుకుని వెళ్లిపోయారు. వారం రోజులలో ఒక “అనుకోని అతిథి వచ్చి కల్లోలం సృష్టించాడు. ఆయన కాలదేవత (అసిత) మహర్షి గొప్ప తపస్సంపన్నుడని పేరుంది. ఆయన ఎక్కడో పర్వత గుహలో తపస్సు చేసుకుంటుంటాడు. ఎప్పుడూ కొండ దిగిరాడు. సాధారణంగా ఎవరికీ కనిపించడు. వయోభారంతో నడుము వంగిపోయింది. చేతి 'కర్ర ఊతంగా, ఏదో దివ్య ప్రేరణతో సరాసరి నగరంలో ప్రవేశించాడు. 11 భగవాన్‌ బుద్ధ

మహర్షి రాకను భటులు వెళ్లి చెప్పగానే శుద్దోదనుడు ఎదురువెళ్లి ప్రణామం చేసి, స్వాగతం చెప్పాడు. అంతఃపురంలోకి తీసుకువెళ్ల రాకుమారుని చూపించి ఆశీర్వ దించమని అర్ధించాడు. వృద్ధ తాపసి, కొంతసేపు బిడ్డని నిశితంగా గమనించి, మౌనం పొటించాడు. ఆ తర్వాత బిగ్గరగా రోదించసాగాడు అందరూ కలవరపడ సాగారు. కారణం అనూహ్యం. ఆయన ఏద్చి, ఏడ్చి అలసిపోయాడు అయినా కన్నీరు ధారాపాతంగా కారుతోంది. శుద్దోదనుడు ఆయనకు వినయంగా నమస్కరించి “మహాత్మా! పిల్లవానిలో ఏమైనా దోషం ఉందా? చెప్పంది స్వామా” అని అడిగాడు.

అనిత మహర్షి రోదన ఆపి, కన్నీరు తుడుచుకుంటూ అన్నాదు: “మహారాజా, దురదృష్టం ఈ మహాపురుషునిది కాదు. నా దురదృష్టానికి ఏడుస్తున్నాను. నీ బిడ్డ మహాత్ముడు. తను కారణ జన్ముడు. విశ్వ రహస్యాలు ఎరిగినవాడు, మహాజ్ఞాని. నీవు ఊహిస్తున్నట్లు, నీ కుమారుడు చేక్రవర్తి కాడు. దేశాలను పాలించడు. మానవ హృదయాలలో కొలువు తీరతాడు. మహాజ్ఞాని అవుతాడు. తాను పెరిగి పెద్దవాడయ్యేవరకు నేను జీవించి ఉండలేనని నా బాధ. ఆ మహాత్ముని దివ్యసందేశం వినే అదృష్టం నాకు లేకుండా పోతున్నందుకు బాధగా వుంది. ఈ బిడ్డను కన్నందుకు మి దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. కపిలవస్తుకు యావత్‌ ప్రపంచం సర్వదా రుణపడి ఉంటుంది”.

ఆ మాటలు చెప్పి 'అసిత మహర్షి వెళుతుండగా శుద్దోదనుడు ఆయన్ని నిలవరించదానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. తుఫానులా వచ్చి వెళ్లిపోయాడు. శుద్దోదనుని నోటమాట రాలేదు. శిలా ప్రతిమలా అయిపోయాడు. లేక లేక కలిగిన కుమారుడు సన్యాసి కావడం ఏమిటి? తను ఆ భావననే భరించలేకుండా ఉన్నాడు. మహారాజు కావాలి! ప్రపంచాన్ని పాలించే మహాచక్రవర్తి కావాలి! అసిత మహర్షి మాటలు పట్టించుకోలేదు, ఏదో పెద్దవాడు! మతి గతితప్పి ఉంటుంది అని తన 'మతి'ని సర్దిచెప్పుకోసాగాడు. ఆయన ఒక్కడేనా మహర్షి జ్ఞాని! దేశంలో ఎందరో ఉంటారు మహానుభావులు! జ్యోతిష పండితులు 'మహాిచకశ్రవర్తి అవుతాడని చెప్పారు గదా! వారి వాక్కు వలించడా! టాహ్మణోత్తములు గట్టిగా దీవించారు గదా! వారి దీవెనలు ఫలించవా?

అసిత మహర్షి కలకలం సృష్టించి వెళ్లిన మరునాడు, సిద్ధార్దుడు జన్మించిన ఎనీమిదవనాడు అకస్మాత్తుగా మహామాయ మరణించింది. అంతఃపురం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మహామాయ మరణం గురించి ఏ ఒక్క జ్యోతిష్కుడు ఎందుకు చెప్పలేదు? వారికి తెలియకనా? పురోహితుల ఆశీస్సులు ఏమైనాయి? సంభావనలకే ఆశీస్సులు పరిమితాలా? భగవాన్‌ బుద్ధ 12

ఏడు రోజుల పసిబిడ్డ ఆలనా పాలనా చూచేది ఎవరు? పరిచారికలు బిడ్డను పెంచగలరా? అది భావ్యమా? తల్లిలేని బిడ్డ కాకూడదు సిద్దార్ధ. వెంటనే మాయాదేవి సోదరి మహాప్రజాపతిని రప్పించి, అక్కకొడుకును తను కన్నబిడ్డగా సాకమని అర్ధించాడు ఆమెనే అర్ధాంగిని చేసుకున్నాడు. మహాప్రజాపతి గొప్ప సౌందర్యవతి ప్రతిభావంతురాలు విద్వన్మణి. ఆమెకు మరో పేరు గౌతమి సిద్దార్టుని తను కన్నవీడ్డ్దకన్నా ఎక్కువ ప్రేమగా సాకసాగింది. తనకు పిల్లలు కలగలేదన్న కౌరతలేదు. సిద్ధార్థుడు తన బిడ్డదే. గౌతమ సిద్ధార్థుడు. పెరిగి పెద్దవాడవుతున్న సిద్దార్టునికి తనను కన్నతల్లి గౌతమి కాదన్న విషయం తెలియదు. న సిద్ద్ధార్టుని వయసు నాలుగు సంవత్సరాలు. ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా, ముద్దులు మూటకట్టేలా వున్నాడు అంతఃపురంలో ఆడవారి మధ్య పెరిగాదేమో మరీ నవకంగా ఉన్నాడు. తోటలో ఆడుకుంటున్న సిద్దార్థుని చూచి గౌతమి ముచ్చటపడ్డది అలంకరిస్తే ఆడపిల్లలా మరీ ముద్దుగా ఉంటాడని భావించి, చెలికత్తెలతో నగలు తెప్పించి, అలంకరించింది. సిద్ద్ధార్థునికి నగలు నప్పలేదు. సహజంగానే బంగారుబొమ్మలా ఉండేవానికి ఇంకా బంగారు నగలు ఏం శోభిస్తాయి? నగలు ధరించడానికి, అలంకారానికి సిద్ధార్థుడు ఇష్టపడలేదు. అతనికి నగలంటే అసలు ఇష్టం ఉండదు. మిగిలిన రాచ బిడ్డలతో కలిసి ఆటలాడినా, అందరిలో తలమానికంగా ఉండేవాడు. కత్తి యుద్దాలు, మల్ల యుద్దాలు నేర్చాడు. అతని విద్యాగురువు విశ్వమిత్ర. తన జీవితంలో సిద్ధార్ధుని వంటి ఏకసంధాగ్రాహిని, ప్రతిభావంతుడిని చూడలేదని అభినందించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో కపిలవస్తులో ఏరువాక పున్నమికి గొప్ప ఉత్సవం జరిగింది. మహారాజు స్వయంగా నాగలిపట్టి, నేలదున్ని ఉత్సవం ప్రారంభించాలి. నగరం యావత్తు పండుగ ముస్తాబైంది. రాజోద్యోగులు, రైతులు, బ్రాహ్మణ్రేష్టులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరం దాపున పొలాలలో పందిళ్లు వేసి నృత్య, గాన వినోదాలు, వ్యాయామ పోటీలు ఏర్పాటు చేశారు. సిద్దార్థుని ఈడు వారే దేవదత్త, కాలూదయి. శుద్ధోదనుని సోదరి అమిత కుమారుడు దేవదత్త. ఎప్పుడు పోటీలు, వినోదాలు అవుతాయా, ఎప్పుడు విందులో చిందులు వేద్దామా అని జనం ఆరాటం. సిద్దార్థునికి విందులు వినోదాలు ఇష్టం లేదు. జనంలోంచి తప్పించుకుని బయటపడ్డాడు. అతనిని కనిపెట్టి కాలూదయి వెంట వెళ్లాడు. ఇద్దరూ దూరంగా, నిర్ణనంగా ఉన్న ఒక తోటలో ప్రవేశించారు. ఒక చెట్టు నీడన కూర్చున్నారు. వారిని వెదుకుతూ గౌతమి అక్కడకు వచ్చింది. 13 భగవాన్‌ బుద్ద

తండ్రిగారిది కోలీయం. కోలీయ రాజధాని రామగ్రామం. కపిలవస్తుకు ఒక్క రోజు ప్రయాణ దూరం. శాక్యరాజధాని కపిలవస్తు. శాక్య, కోలీయ రాజ్యాలు రెండూ మగధకు సామంతదేశాలే. అయినా అన్నిటా స్వయం ప్రతిపత్తి గలవి. రెండూ సంపన్న దేశాలే.

ఆనాడు పున్నమి. చీకటి పడగానే చంద్రోదయమైంది. లుంబినీ వనం వెన్నెల చల్లదనాన్ని పంచుతోంది. మహామాయాదేవి బృందం లుంబినీ మందిరంలో విడిది చేసింది. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి, మరునాటి ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయం. అర్ధరాత్రి సమయంలో మాయాదేవికి నొప్పులు ఆరంభమైనాయి. దాసీజనం హడావుడి. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు కనుక ఇబ్బంది లేదు. ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. పున్నమి చంద్రుని వంటి బిడ్డ మొహం చూచి మాయాదేవి ఆనందంతో పులకించింది. బిడ్డ మొహం చూడగానే ఆమెకు ఎప్పుడో తను కన్నకల జ్ఞాపకం వచ్చింది.

తొమ్మిదవ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె కలగన్నది. బ్రహ్మ ముహూర్తంలో కన్న కల అది. గొప్పగా ఫలిస్తుందని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో వచ్చిన కలలు వృధాకావు. అవి శుభ సూచికలు. అవి బ్రహ్మదీవెనలు. మాయాదేవికి స్వప్నంలో ఒక తెల్ల ఏనుగు కనిపించింది. బలంగా, అందంగా, ఠీవిగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఆ ఏనుగుకు ఆరు దంతాలున్నాయి. ఆరు దంతాలు ధగధగ మెరుస్తున్నాయి. ఏనుగు సైతం తెల్లగా, మంచు ముద్దకట్టినట్లు కనిపించింది. ఏనుగు తొండంతో ఒక పద్మాన్ని పట్టుకుని వుంది. ఆ ఏనుగు సరాసరి తన వద్దకు వచ్చింది. తన గర్భంలో ఆ పద్మాన్ని ఉంచింది. అంతకన్న విచిత్రం ... అంత పెద్ద ఏనుగు తన గర్భంలో ప్రవేశించటం. అలా ప్రవేశిస్తున్నప్పుడు తనకు ఏ మాత్రం బాధ అనిపించకపోగా ఆనందం కలిగింది ... ఆ క్షణంలో అనిపించింది -.. తనకు ఎలాంటి కష్టాలు, బాధలు ఉండబోవని.

ఆనాడు నిద్రలేచే సరికి మాయాదేవి పరమ (ప్రశాంతంగా, ఆనందంగా ఉంది అప్పుడే స్వర్గం నుండి దిగి వచ్చిన అనుభూతి పొందింది. ఈ ఆనందం, సంతృప్తి చాలు - ప్రపంచంలోని ఏ సుఖాలూ, భోగాలూ, సంపదలు తనకు అవసరం లేదు. మేల్కొన్న తర్వాత కూడా ఆమెకు ఏదో మధుర గాంధర్వ గానం వినిపించ సాగింది. శుద్దోదన మహారాజుకు తన స్వప్న వృత్తాంతం చెప్పింది. ఆయన ఆశ్చర్యపడి ఆనందంతో ఉక్కిరిబికిరై, నగరంలోని పండితుల్సి, దైవజ్ఞున్ని రప్పించాదు మఫామాయాదేవి కలగురించి వివరించి, విశ్లేషించి, ఫలితం చెప్పమని ఆదేశించాడు. భగవాన్‌ బుద్ధ 10

పండితమ్మన్యులు సుదీర్టంగా యోచించి, చర్చించి శుద్దోదనునికి వివ రించారు. “ప్రభూ! మహారాణి మాయాదేవి ఒక మహాద్భుతమైన బిడ్డకు జన్మ నివ్వనున్నారు. ఆ బిడ్డ భూమండలాన్ని పరిపాలించగల కారణజన్ము డవుతాడు. ఏమైనా, మన కపిలవస్తు చరిత్ర ప్రసిద్ధమవుతుంది. జన్మించే బిడ్డవల్ల మా పేరు నిలబడుతుంది. అతని క్తీర్తి అజరామరమై, ఆచంద్ర తారార్మమవుతుంది.” శుద్దోదనుని మొహంపైన వెలుగునీడలు తారాడాయి. ఆనందం మాటున రవంత విషాదం కదలాడింది అయినా మనసు కలతపడనీయక ఇనుమడించిన ఉత్సాహంతో, నగరంలోని పేదసాదలకు ధనం పంచిపెట్టి, ఊరూర ఉత్సవాలు చేయించాడు. కపిలవస్తు ఆనాడు పందగ చేసుకుంది. అది అలనాటి స్వప్న వృత్తాంతం మాయాదేవి ప్రసవించిన వార్త అందగానే శుద్దోదనుడు లుంబినికి రధం పైన ప్రయాణమైనాడు. పుత్రోత్సాహం... పైగా వారసుడు జన్మించాడు. పట్టు పుట్టాలలో పుత్తడి బొమ్మలా ఉన్న బిడ్డను చూడగానే శుద్ధోదనునికి ధ్యాన నిష్టలో ఉన్న ఒక బాలయోగి కనిపించాడు. ఆయన కళ్లలో నీటితడి... ఎవరూ గమనించ లేదు. అది ఆనందోద్వేగం అనుకున్నారు. మనసొర మాయాదేవిని అభినందిం చాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దులు కురిపించాడు. ముగ్ధ మనోహరంగా, ముద్ద బంగారంలా, స్వచ్చంగా ఉన్న బిడ్డను చూచి పరివారం సంబరపడ్డది. ఇంక రామగ్రామం వెళ్లవలసిన అవసరం లేదు. కపిలవస్తుకు తిరుగుప్రయాణం ఏర్పాట్లు జరిగాయి. నగరికి చేరిన మరునాడే నామకరణోత్సవం ఏర్పాటు చేశారు. తన అభీష్టం సిద్ధించినందుకు 'సెద్దార్థుడూ అని పేరు పెట్టుకున్నాడు శుద్ధొదనుడు. పురోహితులు “తధాస్తు అని ఆశీర్వదించారు. వెంటనే శుద్దోదనుడు జ్యోతిష పండితుల్ని రప్పించి, జన్మకుండలి వేసి, పిల్లవాని భవిష్యత్తు చెప్పమని కోరాడు. దైవజ్ఞులు పిల్లవాని జాతకం, గ్రహసంపత్తి పరిశీలించి, సాముద్రిక లక్షణాలతో పోల్చిచూచి, మహా చక్రవర్తి లక్షణాలు కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్నాయని చెప్పి, దండిగా బహుమతులు దండుకుని వెళ్లిపోయారు. వారం రోజులలో ఒక 'అనుకోని అతిథి వచ్చి కల్లోలం సృష్టించాడు. ఆయన కాలదేవత (అసిత) మహర్షి గొప్ప తపస్సంపన్నుడని పేరుంది. ఆయన ఎక్కడో పర్వత గుహలో తపస్సు చేసుకుంటుంటాడు ఎప్పుడూ కొండ దిగిరాడు. సాధారణంగా ఎవరికీ కనిపించడు. వయోభారంతో నడుము వంగిపోయింది. చేతి కర్ర ఊతంగా, ఏదో దివ్య ప్రేరణతో సరాసరి నగరంలో ప్రవేశించాడు. 11 భగవాన్‌ బుద్ధ

మహర్షి రాకను భటులు వెళ్లి చెప్పగానే శుద్దోదనుడు ఎదురువెళ్లి ప్రణామం చేసి, స్వాగతం చెప్పాడు. అంతఃపురంలోకి తీసుకువెళ్లి రాకుమారుని చూపించి ఆశీర్వ దించమని అర్ధించాడు. వృద్ధ తాపసి, కొంతసేపు బిడ్డని నిశితంగా గమనించి, మౌనం పాటించాడు. ఆ తర్వాత బిగ్గరగా రోదించసాగాడు. అందరూ కలవరపడ సాగారు. కారణం అనూహ్యం. ఆయన ఏడ్చి, ఏడ్చి అలసిపోయాడు. అయినా కన్నీరు ధారాపాతంగా కారుతోంది. శుద్దోదనుడు ఆయనకు వినయంగా నమస్కరించి “మహాత్మా! పిల్లవానిలో ఏమైనా దోషం ఉందా? చెప్పండి స్వామా” అని అడిగాడు. అసిత మహర్షి రోదన అపి, కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు: “మహారాజా, దురదృష్టం ఈ మహాపురుషునిది కాదు నా దురదృష్టానికి ఏడుస్తున్నాను. నీ బిడ్డ మహాత్ముడు. తను కారణ జన్ముడు. విశ్వ రహస్యాలు ఎరిగినవాడు, మహాజ్ఞాని. నీవు ఊహిస్తున్నట్లు, నీ కుమారుడు చక్రవర్తి కాడు. దేశాలను పాలించడు. మానవ హృదయాలలో కొలువు తీరతాదు. మహాజ్ఞాని అవుతాడు. తాను పెరిగి పెద్దవాడయ్యేవరకు నేను జీవించి ఉండలేనని నా బాధ. ఆ మహాత్ముని దివ్యసందేశం వినే అదృష్టం నాకు లేకుండా పోతున్నందుకు బాధగా వుంది. ఈ బిడ్డను కన్నందుకు మి దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. కపిలవస్తుకు యావత్‌ ప్రపంచం సర్వదా రుణపడి ఉంటుంది”. ఆ మాటలు చెప్పి 'అసిత మహర్షి వెళుతుండగా శుద్దోదనుడు ఆయన్ని నిలవరించడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. తుఫానులా వచ్చి వెళ్లిపోయాడు. శుద్దోదనుని నోటమాట రాలేదు. శిలా ప్రతిమలా అయిపోయాడు. లేక లేక కలిగిన కుమారుడు సన్వాసి కావడం ఏమిటి? తను ఆ భావననే భరించలేకుండా ఉన్నాడు. మహారాజు కావాలి! ప్రపంచాన్ని పాలించే మహాచక్రవర్తి కావాలి! అసిత మహర్షి మాటలు పట్టించుకోలేదు, ఏదో పెద్దవాడు! మతి గతితప్పి ఉంటుంది అని తన 'మతి'ని సర్దిచెప్పుకోసాగాడు ఆయన ఒక్కడేనా మహర్షి జ్ఞాని! దేశంలో ఎందరో ఉంటారు మహానుభావులు! జ్యోతిష పండితులు “'మహొచథకవర్తి అవుతాడని చెప్పారు గదా! వారి వాక్కు వలించదా! 'బాహ్మణోత్తములు గట్టిగా దీవించారు గదా! వారి దీవెనలు ఫలించవా? అసిత మహర్షి కలకలం సృష్టించి వెళ్లిన మరునాడు, సిద్ధార్టుడు జన్మించిన ఎనిమిదవనాడు అకస్మాత్తుగా మహామాయ మరణించింది. అంతఃపురం దుఃఖసాగరంలో మునిగిపోయింది మహామాయ మరణం గురించి ఏ ఒక్క జ్యోతిష్కుడు ఎందుకు చెప్పలేదు? వారికి తెలియకనా? పురోహితుల ఆశీస్సులు ఏమైనాయి? సంభావనలకే ఆశీస్సులు పరిమితాలా? భగవాన్‌ బుద్ద 12

ఏడు రోజుల పసిబిడ్డ ఆలనా పాలనా చూచేది ఎవరు? పరిచారికలు బిడ్డను 'పెంచగలరా? అది భావ్యమా? తల్లిలేన్‌ బిడ్డ కాకూడదు సిద్ధార్ధ. వెంటనే మాయాదేవి సోదరి మహాప్రజాపతిని రప్పించి, అక్కకొడుకును తను కన్నబిడ్డగా సాకమని అర్ధించాడు. ఆమెనే అర్ధాంగిని చేసుకున్నాడు మహాహప్రజాపతి గొప్ప సౌందర్యవతి. ప్రతిభావంతురాలు. విద్వన్మణ. ఆమెకు మరో పేరు గౌతమి. సిద్దార్డుని తను కన్నబిడ్డకన్నా ఎక్కువ ప్రేమగా సాకసాగింది. తనకు పిల్లలు కలగలేదన్న కొరతలేదు సిద్ధార్దుడు తన బిడ్డడే గౌతమ సిద్దార్టుడు. పెరిగి పెద్దవాడవుతున్న సిద్దార్థునికి తనను కన్నతల్లి గౌతమి కాదన్న విషయం తెలియదు. న న సిద్దార్థుని వయసు నాలుగు సంవత్సరాలు. ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా, ముద్దులు మూటకట్టేలా వున్నాడు. అంతఃపురంలో ఆడవారి మధ్య పెరిగాడేమో మరీ నవకంగా ఉన్నాడు తోటలో ఆడుకుంటున్న సిద్దార్టుని చూచి గౌతమి ముచ్చటపడ్డది. అలంకరిస్తే ఆడపిల్లలా మరీ ముద్దుగా ఉంటాడని భావించి, చెలికత్తెలతో నగలు తెప్పించి, అలంకరించింది. సిద్దార్థునికి నగలు నప్పలేదు. సహజంగానే బంగారుబొమ్మలా ఉండేవానికి ఇంకా బంగారు నగలు ఏం శోభిస్తాయి? నగలు ధరించడానికి, అలంకారానికి సిద్ధార్థుడు ఇష్టపడలేదు అతనికి నగలంటే అసలు ఇష్టం ఉండదు. మిగిలిన రాచ బిడ్డలతో కలిసి ఆటలాడినా, అందరిలో తలమానికంగా ఉండేవాడు. కత్తి యుద్దాలు, మల్ల యుద్దాలు నేర్చాడు. అతని విద్యాగురువు విశ్వమిత్ర. తన జీవితంలో సిద్దార్థుని వంటి ఏకసంధాగ్రాహిని, ప్రతిభావంతుడిని చూడలేదని అభినందించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో కపిలవస్తులో ఏరువాక పున్నమికి గొప్ప ఉత్సవం జరిగింది. మహారాజు స్వయంగా నాగలిపట్టి, నేలదున్ని ఉత్సవం ప్రారంభించాలి. నగరం యావత్తు పండుగ ముస్తాబైంది. రాజోద్యోగులు, రైతులు, బ్రాహ్మణ్రేష్టుల్లు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరం దాపున పొలాలలో పందిళ్లు వేసి నృత్య, గాన వినోదాలు, వ్యాయామ పోటీలు ఏర్పాటు చేశారు. సిద్దార్టుని ఈడు వారే దేవదత్త, కాలూదయి. శుద్ధోదనుని సోదరి అమిత కుమారుడు దేవదత్త. ఎప్పుడు పోటీలు, వినోదాలు అవుతాయా, ఎప్పుడు విందులో చిందులు వేద్దామా అని జనం ఆరాటం సిద్ధార్థునికి విందులు వినోదాలు ఇష్టం లేదు. జనంలోంచి తప్పించుకుని బయటపడ్డాడు. అతనిని కనిపెట్టి కాలూదయి వెంట వెళ్లాడు ఇద్దరూ దూరంగా, నిర్దనంగా ఉన్న ఒక తోటలో ప్రవేశించారు. ఒక చెట్టు నీడన కూర్చున్నారు. వారిని వెదుకుతూ గౌతమి అక్కడకు వచ్చింది. 13 భగవాన్‌ బుద్ధ

“అక్కడ ఉత్సవం జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు రండి పోదాం. అక్కడ బ్రాహ్మణులు వేదపఠనం చేస్తున్నారు. వింటే పుణ్యం!” అన్నది.

“వేదం వాళ్లు చదివితే పుణ్యం వాళ్లకు వస్తుందిగానీ, మనకెలా వస్తుంది? స్వయంగా నాన్నగారు చదవొచ్చుగా? వాళ్లు చదివితే మనకేం లాభం?” సిద్ధార్దుడు సూటిగా, అమాయకంగా ప్రశ్నించాడు.

గౌతమికి సరైన సమాధానం లభించలేదు. కంగారుపడి, తమాయించుకుని:

“అలా అనకూడదు నాన్నా! వేదాలు బ్రాహ్మలే చదవాలి ఇతరులెవరికీ వేదాలు చదివే హక్కు లేదు!”

“ఎందుకు లేదు. చదవడానికి హక్మేమిటి?”

“పూర్వం నుండి వస్తున్న ఆచారం తండ్రీ, కాదనకూడదు. పాపం”.

“పాపం, పుణ్యం ? ... నాకు వద్దు. నేను రాను పో. వెళ్లి నేను రానన్నానని నొన్నగ్రారికి ఫిర్యాదు చేసుకో. పో ... నాకిక్కడే బావుంది”.

ఆప్యాయంగా సిద్ద్ధార్థుని తల నిమిరి గౌతమి వెళ్లిపోయింది. సిద్దార్టుని మనసు నొప్పించడం ఆమెకిష్టం ఉండదు.

వేదపరనం, నాగలిపూజ అయిన తర్వాత శుద్దోదనుడు బంగారు నాగలితో పొలం దున్నాడు. జనం హర్ష ధ్వానాలు మిన్నంటాయి. సిద్ధార్థుడు ఒకసారి వెళ్లి చూచి తిరిగి వచ్చి చెట్టునీడన పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కళ్లు మూతలుపద్దాయి. శరీర స్పృహ పోయింది. పరిసరాలు మరచిపోయాడు. బయటి

శబ్దాలు ఏవీ వినిపించడం లేదు. లోపల ఎన్నడూ తనకు అనుభవంకాని నిశ్శబ్దం. తానేమైపోతున్నదీ తెలియని స్థితి. చాలా సేపటికి గౌతమి, శుద్దోదనుడు వచ్చారు. అప్పటికీ నిశ్చలంగా, ధ్యానంలోనే ఉన్నాడు. పిలిచినా పలికే స్థితిలో లేడు. శుద్దోదనుని గుండె గుభేల్‌ మన్నది. ఏది జరగరాదని ఇంతకాలం తను భావిస్తూ వచ్చాడో అది జరిగిపోయింది అసిత మహర్షి రూపం కళ్లలో మెదిలింది. ఆయన మాటలు గుండెలో గంట వాయించాయి. ధ్యానమగ్సుడైన చిన్ని సిద్ధార్టుని చూచి, గౌతమి పరవశించింది. ఆమె కళ్లవెంట ఆనందబాష్పాలు రాలాయి. ఆ దృశ్యం చూచి తట్టుకోలేక శుద్దోదనుడు రధమెక్కి వెళ్లిపోయాడు. కోపం, దుఃఖం అతని గుండెను చీల్చివేశాయి. "

కొద్దిసేపటికి సిద్ధార్థుడు కళ్లువిప్పి గౌతమిని గమనించి నవ్వాడు. అమ్మ వెంట బయలుదేరాడు. వారివెంట వచ్చిన పిల్లలు బయలుదేరారు. రాకుమారుడు సిద్ధార్థునితో కలిసి తోటలో ఆడుకోవాలని పిల్లల ఆరాటం. సిద్దార్థునికి తన భగవాన్‌ బుద్ధ శత

బట్టల్లో రాజసం కనిపించడం లేదు. తన ఈడువారితో తను కలవలేకపోతున్నాడు. ఆదుకోవాలన్న ఉత్సాహం నానాటికీ తగ్గిపోతున్నది. 4 ర 3

“వేదాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి. ఇతరులకు చదివే అర్హత లేదు” అని గౌతమి చెప్పిన రోజునే సిద్ధార్ధుని మనసులో సాంఘిక అసమానతల ముల్లు గుచ్చుకుంది, తండ్రిగారిని ఎదిరించడం ధర్మంకాదు. తల్లిగారి మాట కాదనడానికి మనసొప్పలేదు. తనలోనే అసంతృప్తిని అణచిపెట్టి అంతర్మధనం చేయసాగాడు. క్షత్రియ సంప్రదాయం ప్రకారం గుగర్రపుస్వారి, శస్త్రాస్రవిద్యలు నేర్చుకోసాగాడు. కత్తియుద్ధంలోను, విలువిద్యలోనూ అసమానప్రజ్ఞ సంపాదించాడు. సంగీత, సాహిత్యాలలో ప్రతిభ చూపించాడు. పధ్నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి సర్వకళా ప్రపూర్ణుడయినాడు. అప్పుడు గౌతమి కడుపు పండింది గౌతమి కన్న కొడుకు నంద. సిద్ధార్దుడు ఏ పనిచేస్తున్నా నందతో ఎక్కువ కాలక్షేపం చేయసాగాడు. సిద్ధార్డునికి మరో ముగ్గురు సోదరులున్నారు. వారు మహానామ, బుద్దియ, కింబిల.

ఆ ముగ్గురు సోదరులతో కలిసి ఆటపాటలలో పాల్గొనేవాడు. పినతండ్రి ద్రోణోదన రాజు కుమారుడు దేవదత్త. అతను సిద్ద్ధార్భుని కన్న బలవంతుడు. సిద్దార్థుని కన్న తనది పైచేయిగా ఉండాలని తాపత్రయపడేవాడు. అయినా చివరకు రెండవ స్థానంలోనే నిలిచేవాడు. దేవదత్తునిది భుజబలం, సిద్ధార్థునిది బుద్ధిబలం. సిద్ధార్థునికి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. వేణుగానం అంటే ప్రాణం. ప్రకృతి పరవశించి, పులకించేటట్లు వేణుగానం చేసేవాడు. అన్ని విద్యలలో అసమాన ప్రతిభావంతుడైన సిద్ధార్దుని మనస్సు బ్రహ్మవిద్య పైకి మళ్లింది. తనకు వేదాధ్యయనం చేయాలని ఉన్నట్లు తండ్రిగారికి చెప్పాడు. క్షత్రియుడు, రాకుమారుడు వేదాలు చదవడం ఏమిటని విస్తుపోయిన శుద్దోదనుడు నిరుత్సాహ పరిచాడు. “వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు బ్రాహ్మణుల సొత్తు. మనకెందుకు సిద్ధొ అని మనసు మార్చయత్నించాడు.

సిద్ధార్థుడు “జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరికీ అర్హత ఉంటుంది. ('బ్రహ్మజ్ఞానానికి అందరూ అర్హులే. నేను వేదాధ్యయనం చేస్తాను” అని పట్టుపట్టాడు.

కాదనలేక శుద్ధ్దోదనుడు దేశంలో పేరెన్నికగన్న వేద విదుల్ని రప్పించాడు. సిద్ధార్థుని అభిమతం తెలియచేశాడు. రాజుగారి కోరిక కొందరు తిరస్కరించారు. కొందరు రాజాగ్రహానికి గురికావలసి వస్తుందని భయపడి సిద్ధార్భునికి 'వేదం' చెప్పడానికి అంగీకరించారు. వేదాలు స్వరయుక్తంగా అభ్యసించడమే కాక, అర్ధ వివరణలు, అంతరార్జాలు తెలుసుకోసాగాడు. వేదాలు చిలకపలుకుల్లా వల్లించడం 15 భగవాన్‌ బుద్ద

కాదు, వేద మంత్రాలకు మహత్తరశక్తి ఉందని, శబ్గోచ్చారణ సరిగా ఉంటే మహత్మ్శార్యాలు నిర్వహించవచ్చునని [గ్రహించాడు అయితే వేద పరిచయం ఒక్కటే జ్ఞానం కాదన్న అనుమానం కలిగింది. వేదాలలో ఉన్నది దేవతాస్తుతులు, జగచ్చిల్పం. సృష్టికి మూలం మరేదో ఉంది. దానిని గ్రహించడం జ్ఞానం. వేదాధ్యయనం తమకే పరిమితం చేసి, బ్రాహ్మణ వర్గం సమాజానికి చాలా ద్రోహం చేస్తున్నదని గ్రహించాడు. మతం నీడలో బ్రాహ్మణ ధర్మాలను, ఆచారాలను ప్రజలు ఆచరిస్తున్నారు. అయినా బ్రాహ్మణులు మిగిలిన వారికి తమతో సమానహోదా ఇవ్వడం లేదు. తక్కువ కులాలను చిన్నచూవు దూత్తుల్నాడు ట్రజల్లో నమానత్వం కావాలి, కుబఫి్యేడాలు ఉండకూడదు. అంటరాని వారని, అంటుకట్టిన వారని తేడా ఎందుకు? కొందరు మిత్రులతో కలిసి, కపిలవస్తు వదలి, పల్లెల్లో పర్యటించ సాగాడు. ప్రజలు ఎలా జీవిస్తున్నది, వారి జీవన విధానం ఎలాంటిది తెలుసు కోసాగాడు. రాకుమారుని హోదాలో కాక, అతి సామాన్య పౌరుడిగా గ్రామాలు పర్యటించాడు. చాలా మందితో చర్చించాడు. ప్రజలు ఏదో రూపంలో బ్రహ్మ, విష్ణ, శిన రూపాలను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. అంతవరకు ఫరవాలేదు. నమ్మకం ఉంటేగాని భక్తి కుదరదు. భక్తి కుదిరితే తప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడదు. అయితే ఆ త్రిమూర్తుల ప్రతినిధుల్ని పూజించడం ఏమిటి? ప్రతి చిన్నపనికి, పెద్దపనికి పురోహితులు మంత్రాల అవసరాన్ని సృష్టించి దండిగా సంభావనలపేర సామాన్యుల్ని దోచుకుంటున్నారు. ఎవరికీ ఆత్మగౌరవం లేకుండాపోయింది బ్రాహ్మణులు కానివారంతా సమాజంలో ద్వితీయ పౌరులుగా జీవించవలసి వస్తోంది. ప్రతి దానికి వేదాలను ప్రమాణంగా చూపి భయపెట్టి బ్రతుకుతున్న వారి నిజాయితీని శంకించసాగాడు. వేదాలు చదివిన వారు జ్ఞానులా? సంస్కృతం చదవడమే జ్ఞానమా? దేశంలో అనేకమంది జ్ఞానులుంటారు. వారు వేదాలు వల్లించనవసరం లేదు. వేదానికి జ్ఞానానికి సంబంధం లేదు? చదువు రాకపోయినా జ్ఞానం పొందవచ్చు. ఎందరో అరణ్యాలలో, పర్వతగుహలలో తపస్సు చేసుకుంటూ జ్ఞానంతో పండిపోయిన వారున్నారని విన్నాడు. వారు వేదాధిక్యాన్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని అమోదించరు. అన్ని సుఖాలు, సంపదలు, భోగభాగ్యాలు త్యజించి అడవులు పట్టినవారు, జ్ఞానసీమలు మెట్టినవారు, సత్యాన్వేషణ చేస్తున్నవారు, ఆత్మశోధన చేస్తున్నవారు, యోగసాధనలో నిమగ్నమైనవారు. అలాంటి సన్యాసులు, యోగులు తమ పొరుగుదేశం కోసలలో చాలామంది ఉన్నారని విన్నాడు. వారిని కలిసి ధర్మచర్చ చేయాలని అభిలషించాడు సిద్ధార్ధ. _ భగవాన్‌ బుద్ద 16

సిద్దార్దుని మనస్సు శుద్దోదనునికి తెలుసు. అతని విప్లవ మనస్తత్వం తెలుసు అతని నిర్మల స్వభావం, నిరాడంబర జీవనం తెలుసు అతను ప్రజా హృదయం ఎరిగిన వాడని తెలుసు. ఒక్క కన్నీటి చుక్కకు కరిగిపోతాడని తెలుసు సత్యాన్ని అన్వేషించే స్వభావం కలవాడని తెలుసు. అన్ని తెలిసినా నిరోధించలేని పిత్భ(పప్రేమ తనది. ఏదో ఒకనాటికి అంతఃపురం వదలి సన్యసిస్తాడని లోపల అనుమానం తన ఆశలన్నీ సిద్ధార్టున పైన, దేవదత్తునిపైన పెట్టుకున్నాడు.

శుద్దోదనుని సోదరుడే ద్రోణధనరాజు. అతని పిల్లలు దేవదత్తుడు, ఆనందుడు తమ్ముని పిలిపించి తన మనసులోని మాట చెప్పుకున్నాడు.

“న్తోదరా! మన పొరుగుదేశం కోసలకు మన దేశంపైన కన్నుపడింది. అయినా మన సైనికబలం తక్కువ కాదనుకో. సిద్దార్ధ, దేవదత్త సమర్థులు. దేశాన్ని రక్షించగల వీరులు. నా అనుమానం సిద్ధార్థుడు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసుల్లో కలిసిపోతాడేమోనని. అసితమహర్ని చెప్పినమాటలు మరచిపోలేక పోతున్నాను ఇన్ని సంవత్సరాలు గడిచినా. సిద్ధార్థునితో పాటు దేవదత్తుడు సన్యసిస్తే మన గతి ఏమిటి? వీళ్లకి సాధు సన్యాసుల పైన, ఆశ్రమాల పైన ఎంత మక్షువో గమనించావా?”

అన్నగారి ఆవేదన గ్రహించాడు ర్రోణధనరాజు చలించిపోయాడు. కొంత తడవు ఆలోచించి అన్నాడు : “పోనీ, సిడ్డార్థునికి వివాహం చేస్తే! సంసార సుఖం మరిగితే సన్యాసి కాలేడు”.

ఆ మాట శుద్దోదనునికి నచ్చింది. ఆ రాత్రే రాణి గౌతమి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఈ మధ్యనే గౌతమి ఒక అడబిడ్డను కన్నది. ఆమె పేరు సుందరినంద. గౌతమి భర్త మాటను మన్నించి కపిలవస్తులో ఒక యువజనోత్సవం ఏర్పాటు చేసింది. అది ఒక విధమైన స్వయంవరం. సిద్ధార్థుడు తనకు నచ్చిన కన్యను ఎన్నుకోడానికి ఒక ఉపాయం. అన్ని దేశాల రాజవంశీకులకూ ఆహ్వానాలు పంపారు. అందరికీ తెలుసు శుద్దోదనుని కుమారుడు యువరాజు సిద్ధార్థుడు పెళ్లీడువాడున్నాడని. తామూ సిద్దార్టుని ప్రతిభాపాటవాలు గమనించవచ్చని అందరూ తరలివచ్చారు.

శుద్ధ్దోదనుని మరొకసోదరి పమిత. ఆమె భర్త కోలీయ ప్రభువు దండపాణి, వారి రాజధాని రామగ్రామ. కపిలవస్తు నుండి రామగ్రామానికి ఒక రోజు ప్రయాణం. రోహిణి నదికి ఒక వైపున కపిలవస్తు, ఎగువగా రెండవ వైపున రామగ్రామం. ఇరు దేశాల మధ్య బాంధవ్యం ఎక్కువ. సఖ్యసంబంధాలు ఎక్కువే. 1/7 భగవాన్‌ బుద్ధ

దండపాణి, పమీతల కన్న బిడ్డ యశోధర శుద్దోదనునికి స్వయాన మేనకోడలు, మహా సౌందర్యవతి. సేవాతత్సరురాలు. వివేకవతి. సిద్ధార్థునికి మేనత్త కూతురు. యువజనోత్సవాలకు అనేక దేశాల రాజకుటుంబీకులు, కులీనులు తరలి వచ్చారు. సిద్ధార్దుని అల్లుని చేసుకోవాలని ఆశపడుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు మెండుగానే వచ్చారు. సిద్ధార్దుడు ఎవరిని వరిస్తాడో! వచ్చిన అతిధులకు స్వాగత సత్మారాల బాధ్యత యశోధరకు అప్పగించింది గౌతమి. యశోధరలో ఢాంబికం, అహంకారం బొత్తిగా లేవు. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. అకర్షణ, మర్యాద మన్ననలు ఎక్కువ న విలువిద్య, కత్తిసాము, గుర్రపుస్వారి, దేహదారుధ్య పోటీలలో ప్రధముదడుగా నిలచిన సిద్దార్థుని చూచి యశోధర ముచ్చటపడ్డది. విజేతకు ఒక 'తెల్లవినుగును బహూకరించారు. తన చేతులతో బహుమతి నందిస్తూ యశోధర సిగ్గుపడ్డది. తలవంచి ఓరకంట చూస్తూ “బహుమతిని అందుకోండి రాకుమారా!” అన్నది అప్పుడు నిశితంగా గమనించాడు సిద్ధార్థుడు - విరసీ విరియని పద్మంలా వున్న యశోధర అందాల్ని. 'హృదయపద్మం' అనుకున్నాడు. పైకే అన్నాడు ఆ మాట. సిద్దార్థుని వెనక నిలబడి ఉన్న దేవదత్త అసూయతో, ద్వేషంతో ఊగిపోతూ బహూకరించిన వనుగును కాలితో ఒక్క తాపు తన్నాడు. ఏనుగు విలవిల్లాడి క్రింద పడిపోయింది సిద్ధార్దుడు దేవదత్తను చూచి “దేవదా! అసూయ అనర్ధ హేతువు. సహనం పాటించు అన్నాడు మందలింపుగా ఏనుగు ప్రక్మన నిలబడి (ప్రేమగా దాని తొండం, తల నిమిరాడు. నెమ్మదిగా ఏనుగు లేచి నిలబడ్డది. సిద్దార్థుని 'స్పర్శ' మహత్యం జనం గుర్తించి హర్ష ధ్వానాలు చేశారు ఆ ఏనుగు నెక్కి సిద్ధార్థుడు కపిలవస్తు నగరంలో విజయ విహారం చేశాడు. అది విజయానందమా? యశోధర ప్రియదర్శనానందమా! సిద్దార్థుడిప్పుడు నూనూగు మిసాల నవయువకుడు. మనస్సు అంత; పురంలో బందీగా ఉండలేకపోతున్నది. రాజాస్టానానికి వెళ్లినా, ఆంతర్యం ఎదురు తిరుగుతోంది. బయటి ప్రపంచాన్ని చూడాలని ఆరాటం. కొందరు మిత్రులతో కలిసి జనావాసాలకు వెళ్లసాగాడు పల్లె ప్రజల జీవితాల్లోని రుచి తెలుస్తున్నది. సామాన్య జనజీవనంలోని ఆనందం తెలుస్తున్నది ప్రజల కష్టసుఖాలు తెలుసుకో బగవాన్‌ బుద్ద 18

గలుగుతున్నాడు ప్రజల అవసరాలు గ్రహించగలుగుతున్నాడు. ప్రజల కన్నీటికి చలించిపోతున్నాడు.

ఒకనాడు చెన్నునితో కలిసి వెడుతున్నాడు. సిద్దార్థుని రధసారధి, నమ్మిన బంటు, ఆప్తమిత్రుడు చెన్నుడు. కొంతసేపు చెన్నుడు రధం నడిపితే, తాను మరి కొంత దూరం సారధ్యం వహిస్తున్నాడు. గుర్రాన్ని అదిలించడానికి సిద్ధార్థుడు కోల చేతపట్టడు అందుచేత చెన్నుడు కోలను వదిలిపెట్టాడు.

శాక్య దేశంలోని జనావాసాలన్నీ ఇప్పుడు సిద్ధార్థునికి పరిచయమే. పల్లెలు, పట్టణాలు పర్యటించాడు. హిమాలయ పొదపీరి నుండి దక్షిణంగా ఉన్న భూములన్నీ సారవంతాలు. పక్కలనున్న కోసల, మగధ దేశాలతో పోల్చితే శాక్యం చిన్నదే అయినా, అధిక సంపన్నం జనసాంద్రత ఎక్కువ. వ్యవసాయ భూములు కారణంగా రైతాంగం ఎక్కువ. రోహిణి, బన్‌గంగ నదులు హిమాలయ పర్వత శ్రేణులలో పుట్టి శాక్యభూముల గుండా ప్రవహిస్తూ దక్షిణదిశగా పయనించి, హిరణ్యవతి నదిని చేరతాయి. హిరణ్యవతి గంగానదికి ఉపనది. గంగానది వలెనే బన్‌గంగకు పవిత్రనది అని పేరు. ఆ నదిలో స్నానం చేస్తే జన్మపాపాలు నశిస్తాయని ప్రజల విశ్వాసం. నీరు గడ్డకట్టే చలిలోనూ (ప్రజలు బన్‌గంగ స్నానాలు చేస్తుంటారు.

ఒకనాడు నదీ తీరంలో కూర్చుని సిద్ధార్థుడు చెనని ప్రశ్నించాడు. “మిత్రమా ... గంగాస్నానంతో పాపాలు నశిస్తాయని నీవున గతున్నావా?”

“నమ్ముతున్నాను రాకుమారా! లేకపోతే ఇంతచలిలో ఇంతమంది ,ఎందుకు చలిస్తానాలు చేస్తారు?”

“నమ్మకం చెన్నా ... అయితే ఈ నీటిలో జీవించే చేపలు, పాములు, జలచరాలు మనుషుల కంటే ఎక్కువ పుణ్యం చేసుకున్నట్లే అవుతుందా?”

చెన్నడు క్షణం కంగారు పడ్డాడు :

“ఏమో రాకుమారా! నాకు తెలవదు. ఒంటికి పట్టిన మురికి, మాలిన్యం పోతాయని మాత్రం గట్టిగా చెప్పగలను”.

“అవునవును. ఒంటికి పట్టిన మురికిపోతుంది. పాపం పోయినట్లు కాదు”. అంతటితో ఆ చర్చ ముగిసింది. కానీ సిద్దార్టుని మనసులో 'పాపపుణ్యాలి సమరం మొదలైంది . “ఏది పాపం? ఏది పుణ్యం?”

ఒకనాడు సిద్ధార్థుడు (గ్రామాలు తిరుగ్గుతుండగా, ఒక కుగ్రామంలో యశోధరను చూడడం తటస్థించింది ఆమె ప్రక్కన ఒక స్నేహితురాలు మాత్రం ఉంది. ఆమె చెలికత్తె కాదు దాసీ అంతకన్న కాదు. రాకుమారి ఓ కుగ్రామంలో కనిపించడం సిద్ధార్టునికి అశ్చర్యం కలిగించింది. ఆమె కట్టుకున్న బట్టలు అతి 19" భగవాన్‌ బుద్ధ

సామాన్యంగా ఉన్నాయి. ఒంటిమిోద నగలు లేవు. అలంకరణ అసలే లేదు ఎవరూ ఆమెను రాకుమారిగా పోల్చుకునే అవకాశం లేదు. ఒక పూరి గుడిసె దగ్గర ఆమె చిన్న పిల్లలకు వైద్యచికిత్స చేస్తోంది ఆమె దిగివచ్చిన దేవతలాగా వుంది ... సిద్ధార్దుడు ఆమెను సమోపించి :

“యశోధరా! మిమ్మల్ని ఇక్కడ ఈ విధంగా చూడడం ఆశ్చర్యంగా ఉంది. ఎంతకాలంగా ఇలా ప్రజాసేవ చేస్తున్నారు?” ప్రశ్నించాడు.

ఆమె తల ఎత్తకుందా, సహజంగా జవాబిచ్చింది. “రెండు సంవత్సరాలుగా.

ఈ గ్రామానికి రావడం ఇది రెండవసారి.” =

“నాకూ ఈ (గ్రామాలు పరిచయమే. ఈ పిల్లలు, వీరి పెద్దలు నాకూ పరిచయమే. మోకు ఇలాంటి సేవలంటే ఇష్టమా?”

ఆమె నవ్వింది సమాధానంగా ... తిరిగి పనిలో నిమగ్నమైందీ.

యశోధరను మరొకమారు చూచి, పలకరించే అవకాశం రావడమే కాక, ఆమె ఆంతర్యం గ్రహించే వీలు కలిగింది. ఆమెకు ఆర్త జనం పట్ల అనురాగం ఉన్నది. అమెలో స్పందన ఉన్నది. కష్టాలలో ఉన్నవారి కన్నీరు తుడవాలన్న భావన ఉన్నది. అంతఃపురానికి అంకితమై ఉండకుండా, జనజీవనంలో పాలు పంచుకోవడం మానవతాదృష్టి ఆమె చదువుకున్నది. సమాజంలో నెలకొన్న అసమానతలు గుర్తించి చలించింది. సిద్ధార్టుని వలె ఆమె సంపదలు కోరడం లేదు. అతిశయం, అహంకారం ఏ మాత్రం లేవు. రాచరికం, బ్రాహ్మణాధిక్యత ఆమెకు నచ్చని విషయాలు, ఒక స్త్రీగా గొప్ప సంస్కరణలు తీసుకురాలేకపోవచ్చు కాని తన వంతు సేవ చేయడంలో, సహాయపడడంలో ఇబ్బంది లేదు. తనను ఆదర్శంగా తీసుకుని సంపన్నులు ఆపన్నులు కావచ్చుగదా!

అ సన్నివేశం తర్వాత యశోధర రూపంతో సిద్ధార్థుని హృదయం నిండిపోయింది. ఒక్కక్షణం ఆమె తన మనస్సు విడిచిపోవడం లేదు. ఆమె ప్రతి మాట సత్యసమ్మతం. శుద్దోదనుడు తన పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు విన్నాడు. యశోధర తనకు తగిన ఇల్లాలు అవుతుంది గదా! ఉత్సవ సమయంలో ఎందరినో చూచాడు తన మనస్సును ఆకర్షించింది ఒక్క యశోధర మాత్రమే. ఆమెతో పోల్చదగినవారు ఒక్కరూ లేరు.

ఒకనాడు మహారాణి గౌతమి నగరంలోని యువతుల్ని కన్యల్ని విందుకు ఆహ్వానించింది. ఆడబిడ్డ పమితను సహాయంగా రప్పించుకుంది. యశోధర కూడా వచ్చింది తల్లికి తోడుగా. విందు తర్వాత వచ్చిన వారందరికీ గౌతమి బహుమతులు ఏర్పాటు చేసింది బంగారు ఆభరణాలు, పట్టుచీరలు, అనేక వస్తువులు ఎన్నిక చేసింది. గౌతమీ వేదికను అలంకరింపచేసి సిద్దార్థుని ఆహ్వానించింది. అతని భగవాన్‌ బుద్ద 20

చేతుల మోదగా బహుమతి ప్రదానం అతనికి సహాయంగా యశోధర. వేయిమందికి పైగా వచ్చారు. ఆడపిల్లలు అంతమందికి తను కానుకలు ఇవ్వడం ఏమిటి? సిద్ధార్దుడు ఇష్టపడలేదు. అయినా గౌతమిని కష్టపెట్టడం ఇష్టంలేక అంగీకరించాడు. రాకుమారుని చేతుల మోదుగా బహుమతులు అందుకోవడం యువతులకు ఆనందంగా వుంది

ఇతరులకు ఆనందం కలిగించడంలో తనకు ఆనందం లభిస్తుంది - అది సిద్దార్టుని తత్వం. తన ఎదుట ఉన్న వేయిమందిలో ఎవరికి ఏది నప్పుతుందో తనకు తెలియదు. ఆ ఎంపిక బాధ్యత యశోధర తీసుకుంది. మొదట వచ్చిన అమ్మాయి 'సోమ*. ఆమె ఒక రాకుమారి. తర్వాత “రోహిణి' అనే సుందరి వచ్చి బహుమతి తీసుకుంది చివరగా వచ్చిన పాప 'షీలా. ఆమెతో బహుమతి కార్యక్రమం ముగుస్తుంది నగా నట్రా అన్నీ అయిపోయాయి. అనూహ్యంగా, యశోధర వేదికపైకి వచ్చి సిద్ధార్థుని ముందు నిలిచి చేయి చాచింది. కంగారు పడ్డాడు అక్కడ ఏ ఒక్క వస్తువు మిగిలిలేదు. యశోధరకు ఏమివ్వగలడు? ఆమె అందానికి, సౌశీల్యానికి తగినది ఏది?

“నాకేమిస్తారు రాకుమారా?” అడిగింది. నిరుత్తరుడైన సిద్ధార్థుడు తన మెడలోని ముత్యాలహారం తీసి ఆమె మెడలో వేశాడు. ఆమె కంగారు పడ్డది. తల వాల్చింది. సిగ్గుల మొగ్గ అయింది. తన కంఠసీమలో మెరుస్తున్న రత్నాల హారం తీసి, చేత పట్టుకుని ..

“నేను మాకు ఇవ్వడానికి వచ్చాను రాకుమారా!” అంటూ సిద్దార్థుని కంఠాన్ని తన హారంతో అలంకరించింది.

“ఈ మణిహారంలో నా హృదయం ఉన్నది గమనించండి” అన్నది.

ఆహూతుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

గౌతమి ఆశించింది అదే! అయినదీ అదే!

అంగరంగ వైభవంగా యశోధర సిద్ధార్థుల కళ్యాణోత్సవం జరిగింది. కపిలవస్తు కళ్యాణ తిలకం దిద్దుకుంది. ఊరంతా పెళ్లి పందిరి వేసుకుంది. ఇంటింటా పచ్చతోరణాలు, బాజా భజంత్రీలు ... సాలంకృత రధంపై వీధివీధికి వెళ్లి, ఇల్లిల్లు దర్శించారు. చుట్టు ప్రక్కల గ్రామాలు దర్శించి పేదలకు, పిల్లలకు మిరాయిలు, బహుమతులు పంచివచ్చారు. అది రాజవంశాలకు కొత్త ఒరవడి. సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం.

21 భగవాన్‌ బుద్ధ

నవదంపతుల కోసం శుద్దోధనుడు మూడు రుతువులకు అనువైన మూడు భవనాలు నిర్మించి పెట్టాడు. వేసవి ఆవాసానికి పర్వత సానువుల వద్ద శీతల భవనం. చుట్టూ తోట, కొలను తయారు చేయించాడు. అన్ని భవనాల ఆవరణలలో సరస్సులు తవ్వించి, తామరలు పూయించాడు. వారణాసి నుండి అత్తరులు, సుగంధాలు తెప్పించాడు. ఇప్పుడు శుద్దోదనునికి తృప్తిగా, ఆనందంగా వుంది, మనశ్శాంతిగా వుంది. తను కోరినట్లు సిద్ధార్థుడు ఒక ఇంటివాదైనాడు. పెళ్లి చేసుకుని గృహస్తు అయినాడు. నృత్య, సంగీత, వినోద మందిరాలలో నిత్యం కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. సిద్ధార్థునికి, యశోధరకు మనోరంజకమైనవి నృత్య గాన వినోదాలు కావని ఆయనకు తెలియదు. పరస్పరానురాగంతో సుఖంగా ఉన్నారనుకున్నాడు. వారిరువురి ఆలోచనల తీరే వేరు. వారు కోరేది పట్టుపీతాంబరాలు, నవరత్న ఖచిత భూషణలు కావు. మధుర పదార్థాలు అంతకన్న కావు. వారికి సుఖభోగాలు క్షణికప్రాయాలు. వారి కలలు వేరు, కలవరింతలు వేరు. మనిషి కన్నీరు తుడవడం ఎలా? అన్నది, మనిషికి కష్టాలు, బాధలు లేకుండా చేయడం ఎలా? అన్నది, వారి దృష్టి, ఒక సంవత్సరం గడిచింది. సిద్ధార్థుడు తన సారధి చెన్నుని సాయంతో యశోధరను వెంట బెట్టుకుని దేశపర్యటనకు బయలుదేరాడు. ఊరూరు తిరిగార్తు ప్రజల స్పందన (గ్రహించారు. సామాజిక, ఆర్థిక అసమానతల్ని బేరీజు వేసుకున్నారు. పేదవారి ఇళ్లలో నేలపైన, చాపలపైన పడుకున్నారు. కలిసి తిన్నారు. ప్రజాజీవనంపట్ల అవగాహన ఏర్పడ్డది. రాచరికపు లొసుగులు సిద్ద్ధార్థునికి తెలియనివి కావు. అంతా ఆర్భాటం పైన పటారం. ప్రతి ఒక్కరికీ అధికార వ్యామోహం. ధనసంపాదన, సుఖలాలస, స్వార్ధం. అకలితో అలమటించే సామాన్యుని ఎవరూ పట్టించుకోరు. వారి కన్నీటికి విలువ కట్టరు. వారి గుండె కోత అర్ధం చేసుకోరు. తన తండ్రిగారి బ్రతుకూ అంతే, రాజమందిరంలో బందీ అడుగడుగునా భటుల రక్షణ. సైనికుల కాపలా. స్వేచ్చ ఉండాలి బ్రతుక్కు రేపు తన జీవితమూ అంతే. ప్రజలు సంతృప్తిగా జీవించినప్పుదే రాజుకు నిజమైన తృప్తి, రక్షణ. అందుకు హృదయ పరివర్తన కలగాలి. ఆధ్యాత్మిక జీవనం ఒక్కటే నిశ్చింత. యశోధర కళ్లు చూచి మనస్సును చదవగలదు. సిద్ధార్థుని మనోగతం ఇట్టే గ్రహించింది. సిద్ధార్థుడు సంకల్ప సిద్ధుడు. అనుకున్నది సాధించగల సమర్థుడు, ఒక విధంగా కారణజన్ముడు. ఆమె వాస్తవం గుర్తించినా, (ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించసాగింది. బ్రహ్మజ్ఞానం పొందడం, ఆత్మసాక్షాత్మారం భగవాన్‌ బుద్ధ 22

ఒక్క రోజులో అయ్యేపని కాదు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే జ్ఞానోదయం అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా ఎన్ని కష్టాలు, మనోవేదనలు, వైఫల్యాలు చవి చూడవలసి వస్తుంది?! ప్రస్తుత పరిస్థితుల్ని సిద్ధార్టునితో కలిసి చర్చించింది. తను చాలా సంవత్సరాలు ప్రజాసేవ చేసింది పేదలకు అండగానూ ఉన్నది. తన సేవా కార్యక్రమాలకు సిద్దార్టుని సహాయసహకారాలు పూర్తిగా లభిస్తాయన్న నమ్మకం ఉంది.

వేసవి కావడంవల్ల వారి నివాసం పర్వత ప్రాంతంలోని శీతల భవనానికి మారింది. రాజభవనం నుండి సంబారాలు పుష్కలంగా అందుతున్నాయి. అవసరమైన సేవకుల్ని ఉంచుకుని మిగిలిన వారిని కపిలవస్తు పంపి వేశారు. తోటమాలీలు, వంటవాళ్లు మాత్రం ఉన్నారు. నిరాడంబర జీవనం. యశోధర చేసే పనులు మంచివే అయినా, అవి ఎందరికి ఊరట కలిగిస్తాయి? ఎందరి సమస్యలు పరిష్కరించగలదు? ప్రజలకు రోగాలు, బాధలు, దరిద్రం లేకుండా పోజేచాలదు, మనశ్శాంతి కావాలి. అన్ని సమస్యల్ని అందరి సమస్యల్ని పరిష్కరించే ఉపాయం ఆమె వద్ద లేదు.

తిరిగి రాజభవనం చేరారు. అంతఃపురంలో అభిమానుల పరామర్శ ఎక్కువైంది. సిద్ధార్థుడు వీలు దొరికినప్పుడల్లా బంధువులతో మతం గురించి వేదాంతచర్చలు, రాజకీయ, సాంఘిక విషయచర్చలు చేయసాగాడు. ఏ పనిలో నిమగ్నమైనా సిద్ద్ధార్టుని వైపు ఒక చెవి వేసి ఉంచేది యశోధర. "

ఒకసారి యశోధరతో కలిసి గౌతమి ఒక పల్లెకు వెళ్లింది. అక్కడ ఆమెకు లభించిన ప్రజాదరణకు, ప్రేమకు కళ్లు చెమర్చాయి. డబ్బు, ధన, ధాన్యాలిస్తే చూపించేది కృతజ్ఞత ఇది నిష్కల్మషమైన (ప్రేమ. ఇది హృదయ స్పందన. అంతః పురంలో అందరి వంటిది గౌతమి. ఆమె మహాప్రజాపతి. ఆడవారికి మగవారితో సమంగా మనోనిబ్బరం, ధైర్యం ఉండాలని ఆశిస్తుంది. సమానహక్షులు, సమాన హోదాలు కావాలని పోరాడుతుంది. కుటుంబం సుఖసంతోషాలకు ఆడవారిదే బాధ్యత అందుకు ఆడవారికి అదనంగా, సహజంగా, ఉండవలసింది (ప్రేమ. అవ్యాజమైన అనురాగం. అవి యశోధరలో అవసరాన్ని మించి ఉన్నాయి. అందుకే ఆమెను కోడలిగా కాక, ఒక స్నేహితురాలుగా గౌరవిస్తుంది. యశోధర స్వతంత్ర భావాలు గౌతమికి నచ్చాయి. ఆమె నిర్ణయాలు తాను ఎన్నడూ కాదనదు.

శుద్దోదనుని మనసు స్థిమిత పడ్డది. కొడుకు, కోడలు అన్యోన్యంగా, అనందంగా ఉంటున్నారు. అదే సమయంలో సిద్దార్టునికి రాజకీయ పరిజ్ఞానం కలిగించాలని ఆశించాడు. యువరాజుకు పరిపాలనా రహస్యాలు తెలియడం అవసరం. నేర్పడం తన కర్తవ్యం. రోజూ రాజాస్టానానికి రమ్మని ఆహ్వానించాడు. 23 భగవాన్‌ బుద్ధ

కొలువు లేని సమయంలో సిద్ధార్థునితో ధర్మాధర్మ చర్చలు చేయసాగాడు. సిద్ధార్థుడు మనసు పెట్టి వినసాగాడు. లోపల అనుకునేవాడు " ఈ రాజకీయాలు, ధర్మ పన్నాలు, పరిపాలన, ఆర్థికవ్యవహారాలు, సైన్యం గురించి నాకెందుకు? రాజ్యాధి కారం కోరేవారికి, అధికారాన్ని రక్షించుకోవాలనుకునేవారికి తంత్రాలు, కుతంత్రాలు కావాలి. తనకు తెలిసినంతవరకు రాజోద్యోగులు ఎవరిలోనూ నిజాయితీ లేదు. నీతి, రీతి లేవు. ప్రతి ఒక్కరిలో స్వార్ధం, అహం, దర్పం. హృదయ స్పందన ఎవరిలో కనిపించదు. అంతా కృత్రిమం, కుచ్చితం. గత్యంతరం లేక తండ్రిగారు చెప్పే విషయాలకు తలాడించేవాడు. ఈ చెవితో విని ఆ చెవితో వీదిలిపెట్టేవాడు.

శుద్ధోదనుడన్నాడు, “సిద్ధార్థా! అలా మౌనంగా ఉండకపోతే, దర్చారులో నీ అభిప్రాయాలు చెప్పవచ్చుగదా?”

దానికి సిద్ధార్ధ : “నాకు అభిప్రాయాలు, అభిమతాలు లేక కాదు మహారాజా! నామాట ఎవరు వింటారు? ఎవరు లెక్కచేస్తారు? చెప్పి ఏం ప్రయోజనం? అందరూ రోగాన్ని చూచి “అయ్యో” అంటారు గాని, రోగ కారణం కనుక్ళోరు. మన ఆస్థానంలో చాలా మందికి స్వార్ధం. కారణం ఏది? మన విశ్వమత్రుని చూడండి. అతనికి అధికారం వుంది. అతుల సంపదలున్నాయి. కానీ అవినీతి పరుడు. అతను ఎన్నిమార్లు మో సింహాసనం పైన కన్నువేసి కుట్ర చేయలేదు! అయినా, మారు అతనినే విశ్వసిస్తారు. ఎందుచేత? అవసరం. అతనిని కాదంటే దేశంలో అరాచకం సృష్టిస్తాడని, తిరుగుబాటు చేస్తాడని భయం”.

శుడ్డోదనుడు క్షణం విచలితుడైనాడు. ఈ విషయాలన్నీ సిద్ధార్టునికి ఎలా తెలిశాయి?

“సెద్ధార్ధా! కుటుంబం శాంతిగా ఉండాలంటే కొన్ని సర్టుకుపోవాలి. తెలిసినా తెలియనట్లు ఉండాలి. దేశం శాంతిగా ఉండాలన్నా అదే సూత్రం. సహనం, ఓర్పు కావాలి. నాకు తెలుసు నాశక్తి ఏపాటిదో! నీవు రాజువైతే నాకన్న సమర్ధవంతంగా పాలిస్తావని తెలుసు. నీవు అవినీతిని, అక్రమాలను నిర్మూలించ గలవు,

సిద్ధార్థుడు దీర్జంగా నిట్టూర్చి అన్నాడు : “ఇక్కడ సమస్య ప్రతిభ, చాతుర్యం కావు మహారాజా మనస్సు, హృదయం. అవి నిష్కల్మషం కావడం, పవిత్రంగా ఉండడం. రాజునైతే నాలోనూ కోపం, అసూయ, భయం, దురాశ పైకొస్తాయి కదా”.

తండ్రి తనయుల మధ్య ఇటువంటి చర్చ జరిగినపుడు సిద్దార్టుని పృాదయం శాంతించేది కాలాన్ని గమనించడంలో సిద్దార్టుని దృష్టి వేరు. రోజూ దర్బారుకు వస్తున్నా ఎవరినీ నొప్పించేవాడు కాదు. భగవాన్‌ బుద్ధ 24

అవకాశం దొరికినప్పుడు పండితులతో తలపడేవాడు. తలపండినవారి తలలు తిరిగేటట్లు వాదించేవాడు. సాధు సన్యాసులతో సత్సంగం జరిపేవాడు. కేవలం 'పవిత్ర' గ్రంధాలు చదవడం వల్ల ప్రయోజనం లేదని, మతధర్మాలు, నియమాలు పాటించడం వల్ల సంస్కారం కలగదని, జ్ఞానం అబ్బదని అచిరకాలం లోనే గ్రహించాడు. ధ్యానం గురించి అనుభవజ్ఞుల వల్ల తెలుసుకోవాలి. ధ్యానం మాత్రమే సత్యం వైపు నడిపిస్తుంది. తాను చదివిన విషయాలు, జరిపిన చర్చలు యశోధరకు చెప్పి, తాత్వికచర్చ చేయసాగాడు.

సిద్ధార్దుడు యశోధరను ముద్దుగా “గోపి అని పిలుస్తాడు.

ఒకసారి “గోపా, నీవూ ధ్యానం చేయడం అలవాటు చేసుకో. ధ్యానం వల్ల పృాదయం శాంతిస్తుంది. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చైతన్యం ఇనుమడిస్తుంది. నీవు చేసే పనులు సమర్ధవంతంగా, ఉత్సాహంగా చేయగలుగు తావు” అన్నాదు.

ఆమె భర్త సలహా పాటించి ఎన్ని రాచకార్యాలు, ఇంటిపనులున్నా ధ్యానానికి వీలు కల్పించుకోసాగింది. ఒకేసారి ఇద్దరూ కలిసి ధ్యానానికి కూర్చునేవారు.

(బ్రాహ్మణులు నాలుగు రకాల ఆశ్రమ జీవనం సాగించాలని శాస్త్రం ఘోషిస్తుంది. బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం, యవ్వనంలో గార్డస్ట్యం, వానప్రస్టంలో ధర్మాచరణ, సన్యాసాశ్రమంలో తపస్సు. సిద్ధార్థుడు ఆలోచించసాగాడు. ఈ ఆశ్రమాలు ఒక్క బ్రాహ్మణులకే ఎందుకు పరిమితం కావాలి? అందరికీ వర్తిస్తాయి. సన్యాసం తీసుకుని తపస్సుచేసే అవసరం వచ్చేసరికి ముసలితనం వస్తుంది. శరీరం సహకరించదు. మనస్సు మొద్దుబారుతుంది. చైతన్యం ఉండదు. తపస్సు చేయడానికైనా మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా. కనుక తపస్సుకు అంతకాలం నిరీక్షించ పనిలేదు.

“ఈ ఆశ్రమాలు నాకొద్దు. సంసారిగా జీవిస్తూనే తపస్సు చేస్తాను.” అనుకున్నాడు. అఆ తలపు రాగానే వెంటనే తపస్సు ప్రారంభించాలనుకున్నాడు. మంచి పనికి కాలహరణం తగదు.

శావస్తి, రాజగ్భహ పరిసరాలలో మహాయోగులు, తాపసులు ఉన్నారని విన్నాడు. వారి సహాయం తీసుకోవాలి. వారి అనుభవం తనకు మార్గదర్శకం కావాలి. అనుభవజ్ఞుల సహకారంవల్ల ఆటంకాలు అధిగమించవచ్చు. అవరోధాలను సులభంగా దాటిపోవచ్చు. తను కలిసినవారు కొందరు ఉద్రక రామపుత్ర, అలర కలామ పేర్లు ప్రస్తావించిన జ్ఞాపకం ఉంది. వారు సిద్ధపురుషు లని, తపస్సంపన్నులని విన్నాడు. వారి శుతూష చేయాలని మనసు తొందర చేయసాగింది.

25 భగవాన్‌ బుద్ధ

ఒకసాటి సాయంత్రం యశోధర అంతఃపురం చేరేసరికి చాలా దిగులుగా కనిపించింది. ఆమె మొహంలో దైన్యం ప్రస్ఫుటంగా ఉంది. కారణం ఏమిటని గౌతమి విచారించగా చెప్పింది. వారం రోజులుగా జబ్బుగా ఉన్న ఒక పాప చనిపోయింది. తాను ఆపాపను మృత్యువు నుండి రక్షించలేకపోయినందుకు బాధ పడుతోంది. వచ్చీ రాగానే ధ్యానంలో కూర్చుండిపోయింది. ధ్యానం చేస్తున్నా కళ్ల వెంట నీరు ధారాపాతంగా కురవసాగింది. మనస్సు నిగ్రహించుకోలేకపోయింది. సిద్ధార్థుడు రాగానే బావురుమని ఏడ్చింది. ఆమె కరుణామయి, ఆర్రహృదయిని. సిద్ధార్థుడు ఆమె చెప్పిన సంఘటన విని చలించిపోయాడు. ఆమెను కౌగిలిలోకి తీసుకుని, కన్నీరు తుడిచి ఊరడించాదు.

“గోపా ఏడువు... ఇంకా ఇంకా ఏడువు. గుండె బరువు తగ్గే వరకు ఏడువు. ఏడవడం మంచిదే. ఏడుపువల్ల గుందెబరువు తగ్గుతుంది. బాధ ఉపశమిస్తుంది. జననం, వార్ధక్యం, అనారోగ్యం, మృత్యువు - నాలుగూ మనిషికి శాపాలు. ఎవరూ వీటిని తప్పించుకోలేరు. చివరకు మహర్షునైనా, మహాయోగులైనా అనుభవించి తీరవలసిందే. వాటి నీడలు కడవరకు మనిషిని వెన్నాడుతుంటాయి. ఆ పాపకు జరిగినట్లు ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ జరుగుతుంది. గుందె దిటవు పరచుకో. నిగ్రహం పాటించు”.

యశోధర వెక్కుతూ అన్నది, “మిరు చెప్పినవి నిత్య సత్యాలు రాకుమారా! రోజూ అనుభవానికి వస్తున్నాయి. ప్రపంచంలోని బాధనంతటినీ నా చేతులతో తుడిచివేయాలనిపిస్తుంది. ఆ పని చేయగలనా? నా హృదయం బాధతో విలవిల్లాడుతోంది. నా ఆందోళన తీరే మార్గం ఏదైనా ఉంటే చూపించండి”.

“గోపా! నేనూ అదే యోచిస్తున్నాను. నా మనస్సూ కల్లోలంగానే ఉంది విముక్తి మార్గం ఏదీ కనిపించడం లేదు. ఒకనాటికి అందరి కష్టాలు తీరే ఉపాయం దొరుకుతుందని నా నమ్మకం. నన్ను నమ్ము గోపా”,

“ప్రభూ! మిమ్మల్ని నేను విశ్వసించని దెప్పుడు. మో పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మారు అనుకున్నది, ఆశించింది సాధిస్తారని తెలుసు. మి సంకల్చ బలం అలాంటిది. ఈ సంపదల్ని, ప్రపంచాన్ని తృణప్రాయంగా వదలి

పెట్టగల నిబ్బరం మోకుంది. సత్యాన్వేషణ చేస్తారని తెలుసు. కాని, నా అభ్యర్థన ఒక్కటే - ప్రస్తుతం ఆపనికి పూనుకోవద్దు. ఇప్పుడు నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లవద్దు”.

ఆమె కళ్లలోకి ప్రశ్నార్థకంగా చూచాడు. ఆమె కళ్లలో ఒక వెలుగు కనిపించింది. అదొక ఆశాకిరణం. భగవాన్‌ బుద్ద 26

“అలాగే ఇప్పుడు కాదులే, నీవు నిశ్చింతగా ఉండు”.

యశోధర సిద్దార్టుని కౌగిలిలో బిగించి ఆనందంగా అడిగింది. “అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా” చెప్పుకోండి”.

సిద్దార్దునలో అరక్షణం కలవరం “నిజమా గోపా?” అన్నాడు.

అవునని తల ఆడించి, సిగ్గుల మొగ్గ అయింది.

“నాకు బాబు కావాలని ఉంది. మో ప్రతిరూపం కావాలి. అచ్చం మాలాంటి బాబు కావాలి. మో వంటి సుందర చైతన్యమూర్తి, ప్రజ్ఞాశాలి కావాలి”.

సిద్ధార్థుడు ఆమెను కౌగిలించుకుని “ఎవరైనా ఒక్కటే గోపా! నీ అనురాగం , . (పేమ పంచుకుని పుట్టిన అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒక్కటే. ఇంతకీ ఈ తీయని వార్త అత్తగారికి చెప్పావా, లేదా?”

“ఉహు. ముందు మోకే చెప్పాలని ఆగాను. నేను స్వయంగా వెళ్లి అత్తగారికి చెబుతాను”.

శుభవార్త క్షణాల్లో అంతఃపురం నిండా మంచి గంధం పరిమళంలా పాకింది.

శ స 7

సిద్ధార్భునికి ఆప్తమిక్రులు అనదగినవారు - ఉదయన, దేవదత్త, కింబిలి, భద్ర, మహానామ, కాలోదయి, అనిరుద్ధ, వీరు ఏడుగురు సిద్ధార్థునితో కలిసి మత, ధార్మిక రాజకీయాలు చర్చిస్తారు. సిద్ధార్థునికి సలహాదారులు ఆనందుడు, నంద. ఈ పదిమంది రాత్రి పొద్దుపోయే వరకు వినోదాలతో కాలం గడుపు తుంటారు. దేవదత్తునికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ. ఆసక్తీ అధికమే. ఉదయన, మహానామ అన్ని విషయాలలో ఆసక్తి చూపిస్తారు. సిద్ధార్దుడు అన్నిటా మౌనం వహిస్తాడు. ప్రదర్శనల మధ్యలో అనిరుద్ధ నిద్రమత్తులో జోగుతుంటే సిద్ధార్థుడు. తోటలోకి తీసుకువెళ్లి వెన్నెల, ప్రకృతి అందాలు చూపించి వర్ణిస్తూ మత్తు వదిలిస్తాడు. లేదా, నదీ తీరానికి తీసుకువెళ్లి కబుర్లు చెబుతాడు.

మహానామ చిన్న తమ్ముడు అనిరుద్ధ. వారి తండ్రి అమృతోధనుడు. అనిరుద్ధ అందమైన కుర్రాడు. నాట్యకత్తెలకు ఇష్టుడు. ముద్దు చేస్తుంటారు. సిద్దార్ధ, అనిరుద్ధ తోటల్లో తెల్లవార్లు గడిపేవారు. నదీ తీరంలో సిద్ధార్భడు పరవశంతో వేణుగానం చేసేవాడు.

యశోధరకు నెలలు నిండాయి. నొప్పులు మొదలవగానే సిద్ధార్థుడు పద్మాసనంవేసి కూర్చుని, ధ్యానమగ్బుడైనాడు. హృదయ కుహరంలో మనస్సును లీనం చేశాడు. అలా చేస్తే ఇష్టకామ్యసిద్ధి కలుగుతుందని సిద్దార్థుని నమ్మకం. 27 భగవాన్‌ బుద్ధ

మనశ్శాంతి, సమస్యల పరిష్కారానికి 'ధ్యానం' ఉపాలంబన అని విశ్వాసం. సిద్ధార్డునికి ధ్యానంలో యశోధర కనబోయే బిడ్డ రూపం కనిపించింది. అవును! అది తన రూపమే. చిన్ననాటి తన రూపం ఇప్పుడు తన ప్రతిబింబం. పుతోదయం సంతోషం కలిగిస్తుంది సరే! తన అన్వేషణకు మార్గం ఏది? తను ఏమవుతాడో తనకే తెలియడం లేదు. గౌతమి బయటకొచ్చింది. ఆమె మొహంలో ఆనందం! హమ్మయ్య! గోపకు ఏం కాలేదు! భారంగా నిట్టూర్చాడు. “మగబిడ్డ” అన్నది గౌతమి. సిద్ధార్థుడు వెంటనే స్పందించి “రాహుల్‌ జన్మించాడు” అన్నాడు. అదే నామకరణం జరిగింది. అపరాహ్న వేళ సిద్ధార్థుడు, బాబును చూడడానికి పురిటిగదికి వచ్చాడు. యశోధర ముద్ద మందారంలా వుంది. ఆనందం రూపుదిద్దుకున్నట్లు అనిపించింది. పొత్తిళ్లలోని బాబును చేతుల్లోకి తీసుకున్నాడు ముద్దుగా ఉన్నాడు. కళ్లు తెరవని మహాయోగిలాగా కనిపించాడు సిద్ధార్ధుడు. యశోధరవైపు అర్ధింపుగా చూచి, నోట మాట రాక, చేతిని స్పృశించాడు మెత్తగా. ఆ స్పర్శలో “ఇంక నాకు సెలవాదేవీ!?” అన్న అభ్యర్థన ఉంది, సిద్ధార్థుని మనస్సు తేలిక పడ్డది. గాలిలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. రాహులుని చూచినందుకా? యశోధర నవ్వినందుకా? బాబును యశోధర పక్కలో ఉంచి తోటలోకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపాడు. శా శ ఈ నాలుగు సంవత్సరాల క్రితం ఒక పాప చనిపోగా, తనూ యశోధర ఆపాప అంత్యక్రియలకు హాజరైన సంఘటన ఇప్పుడు మదిలో మెదిలింది. తాము వెళ్లే సరికి పాప నిర్జీవంగా ఉంది. శరీరం నల్లకప్పేసింది. పాప శరీరంలో ఎముకలు, చర్మం తప్ప చలనం లేదు, చైతన్యం లేదు. ప్రాణం ఎటు పోయినట్లు? కొంచెం సేపటికి ఒక పురోహితుడు వచ్చాడు. ఏవో మంత్రాలు వల్లిస్తుండగా శవాన్ని నదీ తీరానికి చేర్చారు ఇంధువులు. పురోహితులు చెప్పినట్లు పాప శవాన్ని నదిలో స్నానం చేయించారు. అలా నదిలో స్నానం చేయిస్తే జన్మ పాపాలు నశిన్తాయని నమ్మకం! ఆ పాప ఏ పాపం చేసిందని? గంగా స్నానం వల్ల శవానికి ఏం వారిగింది. అర్ధం కాలేదు సిద్ధార్టునికి. అంతా నమ్మకం, పిచ్చి నమ్మకం. చేయించిన పురోహితునికీ తెలియదు, చేసిన తల్లి దండ్రులకీ తెలియదు. చూచిన జనానికి అంతకంటే తెలియదు. భగవాన్‌ బుద్ద 28

యశోధర త్వరలోనే కోలుకుంది.

ఒకనాటి సాయంత్రం మహారాణి గౌతమి సిద్దార్టుని యశోధరను, రాహులుని, ఒక పరిచారికను వెంటతీసుకుని బయలుదేరింది. చెన్నడు రధం నడుపుతున్నాడు. నగరం పొలిమేరలు దాటి రధం గ్రామసీమలవైపు సాగింది. ప్రజలు సిద్దార్టుని యశోధరను గుర్తించి వెంటపడ్డారు. రధం బన్‌గంగ నదీ తీరం చేరగానే చెన్నడు రధం నిలిపాడు. అకస్మాత్తుగా త్రోవలో రథాశ్వానికి అడ్డంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. కాళ్లు చేతులు వంకర్లు తిరుగుతున్నాయి. బాధతో మెలికలు తిరిగిపోతూ, విలవిల్లాడుతున్నాడు. సిద్ధార్థుడు రథం నుండి క్రిందికి దూకాడు చెన్నడు రథం దిగి వచ్చాడు. అతనికి ముష్ఫయి ఏళ్లుండవచ్చు. సిద్ధార్దుడు అతని చేయి పట్టుకుని చూచి, “చెన్నా! ఇతని ఒళ్లు కాలిపోతోంది. జ్వరం” అన్నాడు.

చెన్నడు : “అది అంటురోగం రాకుమారా! అతని చేయి వదలండి".

సిద్ధార్దుడు : “ఇతనిని రాజువైద్యుని వద్దకు తీసుకుపోదాం పద”,

చెన్నడు : “ఈ రోగానికి వైద్యం లేదు రాకుమారా! రాజనైద్యుడూ నయం చేయలేడు. దూరంగా ఉండండి. ఇది అంటురోగం. చిన్నరాణివారికి, అమ్మగారికీ అంటుకోవచ్చు. (ప్రక్కన బాబు ఉన్నాడు”.

సిద్ధార్థుడు అతని చేయి వదలలేదు. “నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. " ఇతనిదీ తన వయస్సే.

అంతలో నదీ తీరంలో ఏదో కలకలం ... ఎవరిదో ... శవదహనం జరుగుతోంది. బంధువులు రోదిస్తున్నారు. బ్రాహ్మణుల మంత్రాలు రోదనల్లో కలిసిపోతున్నాయి. మంత్ర మహిమవల్ల చనిపోయిన వ్యక్తి బ్రతకవచ్చుగదా! మంత్రాలతో ఇతని రోగం కుదర్భవచ్చుగదా! లేనప్పుడు ఎందుకీ దండగమారి మంత్రాలు?” పురోహితుల కంఠరళోష

ఆ రోగి సిద్దార్టుని వైపు బేలగా, అతి దైన్యంగా చూస్తూ కళ్లు తేలేశాడు. క్షణంలో ప్రాణం గాలిలో కలిసింది. సిద్ధార్దుడు అతని చేయి విడిచాడు. దుఃఖంతో కళ్లు మూసుకున్నాడు. తర్వాత లేచి నిలబడ్డాడు. యశోధర అతని వెనకనే ఉంది - ఎప్పుడు వచ్చి తన వెనక నిబబడిందో గమనించలేదు.

“వెళ్లి నదిలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకురండి రాకుమారా! నీవూ వెళ్లు చెన్నా ... ప్రక్క గ్రామం వెళ్లి గ్రామాధికారులకు తెలియచేద్దాం న. 29 భగవాన్‌ బుద్ధ

సిద్దార్థునికి ముందుకు వెళ్లాలనిపించలేదు. ఉత్సాహం నీరు కారిపోయింది. “చెన్నా! రథం వెనక్కి మళ్లించు”

తిరుగు ప్రయాణంలో ఎవరినోట మాటల్లేవు మౌనంగా ఉన్నారు. సిద్ధార్థుడు కళ్లు మూసుకుని కూర్చున్నాడు. అతని మనస్సులో తుఫానులు, కల్లోలం, అలజడి. ఏది దారి? ఎటు పోదారి?

ఆ రోజు రాత్రి యశోధర ముమ్మారు కలగన్నది. మూడూ చిత్రమైన కలలే. ఒక స్వప్నంలో - ఒక తెల్లని ఆవు. కామధేనువా? కావచ్చు. ఆవు తలపైన ధగధగ మెధుస్తున్న వజం. కపిలధేనువు కపిలవస్తు వైపు వస్తున్నది. ఆ వెంటనే ఇంద్రుని సింహాసనం నుండి ఒక దివ్యవాణి వెలువడింది “ఈ ధేనువును రానివ్వకపోతే నగరం అంధకారమవుతుంది.”

నగరంలో అందరు దానిని తరిమి వేయడానికి ప్రయత్నించారు. ఎవరూ ఆప్యాయంగా ఆదరించలేదు. అది నగర ద్వారం దాటి బయటకుపోయి అంతర్జానమైంది.

రెండవ కలలో - నలుగురు దేవతలు దర్శనమిచ్చారు. వారు నలుగురూ సుమేరు పర్వతంపైన నిలబడి కపిలవస్తు నగరంపైకి కాంతుల్ని ప్రసరింప చేస్తున్నారు. అంతలో ఇంద్రసింహాసనం పైనున్న పతాకం నేలకూలింది. ఆకాశం నుండి పుష్పవృష్టి కురవసాగింది. నగరం నాలుగు చెరగులా దివ్య మధుర సంగీత రుతాలు వినపడసాగాయి.

మూడవ కలలో - ముల్లోకాలు ప్రతిధ్వనిస్తున్న రీతిలో యశోధర ఒక హెచ్చరిక విన్నది “ఇదే అదను... సమయం ఆసన్నమైంది” అని, దిగ్గున లేచింది. ప్రక్కన సిద్ధార్థుడు. తన తలలోని పూలచెండు నేల జారింది. సిద్ధార్టుని బట్టలు సర్పంగా మారాయి ఆ సర్పం నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది.

కలవరంతో యశోధర లేచి కూర్చున్నది. నిద్రపట్టలేదు శరీరం చెమటతో తడిసిముద్దయింది. సిద్దార్థుని తట్టి నిద్రలేపింది. సిద్ధార్థుడు మేలుకునే ఉన్నాడు.

“ఏమిటి గోపా? ఏమైనా కలగన్నావా? కలవరింతా? కలవరపద్దావా?”

తన స్వష్నాలు వివరించింది. “నా కలలునిజయమవుతాయా రాకుమారా?”

“నీ కలలు నాకు వరాలేమో!” అన్నాడు.

“నన్ను విడిచి వెళ్లిపోతారా ప్రభూ!” భగవాన్‌ బుద్ధ 30

ఒకింతసేపు మౌనం వహించాడు. వెళ్లిపొమ్మని గోప సూచిస్తోంది!

"ఊరుకో గోపా! నీవు ధైర్యవంతురాలివి. నా సహచరివి, సహధర్మచారిణివి, నీకు పరితాపం పనికిరాదు. నీ సహకారం నాకు అవసరం గోపా! నీవు తప్ప నన్ను ఇంకెవరు అర్ధం చేసుకుంటారు. నేను దూరంగా వెళ్లినా నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను నా ప్రేమ తగ్గదు. లక్ష్యం సిద్ధించిన వెంటనే తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. పడుకో”.

సిద్ధార్థుని పలుకులు ఆమెను ఊరడించాయి. వెంటనే నిద్రపట్టింది.

తెలతెలవారగానే సిద్ధార్టుడు వెళ్లి తండ్రిగారిని కలిశాడు.

“నాన్నగారూ! నాకు అనుమతి ఇవ్వండి మో అనుమతే నాకు ఆశీస్సు. ఇల్లు వదలిపోదలచుకున్నాను. సన్యసించి నా లక్ష్యం నెరవేర్చుకుంటాను. గమ్యం చేరుకుంటాను”

ఉరమని మేఘంలాగా, మేఘంలేని వర్షంలాగా అనుకోని రీతిలో అనుకోని సమయంలో సిద్దార్థుని ప్రకటనతో శుద్దోదనునికి దుఃఖం పొంగివచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే అనుమానం లేకపోలేదు. అయితే ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. కొంతసేపటికి మనసు దిటవు పరచుకొని అన్నాడు; “మన వంశంలో సన్యాసం స్వీకరించినవారు లేరని కాదు. యాభై, అరవై సంవత్సరాల వయసులో వైరాగ్యం చెందిన వారున్నారు. నీలాగా ఇంత చిన్న వయసులో ఎవరూ వైరాగ్యం పెంచుకోలేదు. మరికొంత కాలం ఆగవచ్చు గదా! రాహుల్‌ పసికూన. వాడినైనా పెద్దవాడిని కానివ్వు, నాకు వారసుడు కావాలి”.

సిద్ధార్థుడు: “ఒక్క రోజు సింహాసనంపైన కూర్చున్నా నాకు నిప్పుల కుంపటి పైన కూర్చున్నట్లు ఉంటుంది. నాకిష్టం లేని పని చేయలేను. ప్రజలను పాలించాలని నాకు లేదు. కాలం ఎంతలో గడిచిపోతుంది. దయచేసి నన్ను అపకండి",

కుమారుని నిగ్రహించడానికి శుద్దోదనుడు చాలా ప్రయత్నించాడు.

“చూడు, నాయనా! ఈ దేశ క్షేమం, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, వీరి క్షేమం నీ బాధ్యత కాదా?”

“నాన్నగారూ! బాధ్యతలు గుర్తెరిగిన వాడిని కనుకనే మా అనుమతి అర్ధిస్తున్నాను. నేను వైరాగ్యంతో పారిపోవడం లేదు. మి అందరిపట్ల నాకు పేమ వుంది. మోగుండె బరువును మారు తగ్గించుకోగలరు. కాని నా గుండెలోని బాధను నేను తగ్గించుకోలేను"”.

31 భగవాన్‌ బుద్ధ

శుద్దోదనుడు లేచి సిద్దార్టుని రెండుచేతులు తనచేతుల్లోకి తీసుకుని :

“నాన్నా, సిద్దార్ధా! నా ఆశలన్నీ నీ పైనే పెట్టుకున్నాను. నన్ను విడిచివెళ్లకు

“నేన్సు ఎవరినీ విడవను నాన్నగారూ. కొంతకాలం నన్ను దూరంగా ఉండనీయండి. నా లక్ష్యం సిద్ధించగానే తిరిగి మో దర్శనం చేసుకుంటాను”.

శుద్దోదనునికి ఏ ఉపాయం తోచక విసవిసా లోపలికి వెళ్లిపోయాడు.

ఆ రోజు రాత్రి మీత్రుడు ఉదయనుడు సిద్దార్టునికి ఒక విందు ఏర్పాటు చేశాడు శుద్దోదనుని ప్రోద్బలంతో. ఆ విందులో ఎలాగైనా సిద్ధార్థుని మనసు మార్చాలని ప్రయత్నం. ఆ పధకంలో గౌతమి చేయికూడా ఉన్నది. ఉదయనుడు స్వయంగా వెళ్లి దేవదత్త ఆనంద, అనిరుద్ధ, కింబిలీ, భద్రలను ఆహ్వానించాడు. రాత్రి పొద్దుపోయే వరకు విందు, వినోదాలు జరిగాయి. విందులో పాల్గొని గౌతమి ముందుగా తన మందిరానికి వెళ్లింది. ఆ తర్వాత యశోధర వెళ్లింది. త్రోవలో చెన్నడు కనిపించాడు. మంచి నిద్రలో ఉన్నాడు. అతనిని యశోధర నిద్రలేపి రహస్యంగా అన్నది : “చెన్నా! రాత్రి రాకుమారునికి నీ అవసరం రావచ్చు. కంటకాన్ని సిద్ధంగా ఉంచు. నీవూ అప్రమత్తంగా ఉండు. కునుకు తీయకు.”

“అమ్మా ... ఎక్కడికైనా వెళ్లే అవసరం ఉందా?” చెన్నడు ప్రశ్నించాడు.

“నన్ను ప్రశ్చించకు. సిద్ధంగా ఉండు. అవసరం కలగవచ్చు అన్నానంతే”.

చెన్నడు తలవంచుకుని అశ్వశాలకు వెళ్లి అశ్వాలను సిద్ధంచేశాడు. యశోధర శయన మందిరానికి వెళ్లి బల్లపైన సిద్ధార్టుని ప్రయాణపు దుస్తులు సిద్ధపరచి ఉంచింది. తను పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిరిచింది. కానీ నిద్ర రావడం లేదు. దుఃఖం పొంగివస్తోంది. క్రమంగా తోటలో నిశ్శబ్దం ఆవహించింది. అతిధులు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయినా సిద్ధార్థుడు శయన మందిరానికి తిరిగి వచ్చిన సవ్వడి లేదు.

సిద్ధార్ధ ఉద్యానంలో ఒంటరిగా కూర్చుని ఆకాశంలోకి, శూన్యంలోకి దృష్టి సారించాడు. పడమర దిశన చంద్రుడు, ఆకాశం నిండుగా నక్షత్రాలు ... ఆరాత్రే వెళ్లిపోవాలని అనిపించింది. అంతఃపురం చేరాడు. నిద్రిస్తున్న యశోధరను, ముద్దుల రాహుల్‌ను చూచాడు. ఆమె కదలడం లేదు. మంచినిద్రలో వుంది. చివరిమాటగా ఏదైనా చెప్పాలని వుంది. ఏం చెప్పాలి? అన్ని అచ్చట్లు, ముచ్చట్లు ముగిశాయి. నిద్రలేస్తే తను గోపను వదిలిపోలేడు. ఇద్దరి రూపాలు మనసులో ముద్రించుకున్నాడు. భగవాన్‌ బుద్ద 32

నృత్య మందిరంలోకి నడిచాడు. అడి, పాడి అలసిపోయిన నర్తకీమణులు తివాచీలపైన చిందరవందరగా పడి నిద్రపోతున్నారు. తలకట్లు చెదిరి, పూల మాలలు జారి, చచ్చిన శవాల్లా కనిపించారు. నృత్యం చేస్తున్నప్పుడు వొంపులు తిరిగిన శరీరాలు, కవ్వించిన చూపులు, మత్తెక్కించిన లావణ్యాలు ఇప్పుడేని? ఒకరి మాద ఒకరు పడి కట్టెల్లా ఉన్నారు. రణరంగంలో మరణించిన సైనికులవలె ఉన్నారు. తను ఒక స్మశానంలో నడుస్తున్న భావం కలిగింది.

అశ్వశాలకు వెళ్లేసరికి చెన్న మేలుకునే ఉన్నాడు. తనకోసమే ఎదురు చూస్తున్నట్లుంది.

“చెన్నా! కంటకం సిద్దం చేయగలవా?”

“సిద్ధంగానే ఉంది, రాకుమారా! నన్నూ తమతో రమ్మని సెలవా?”

సిద్ధార్దుడు తల పంకించాడు. ఇద్దరూ అశ్వాలను నగర ద్వారం దాటే వరకు నెమ్మదిగా నడిపించుకు వెళ్లారు. ద్వార పాలకులు గాఢనిద్రలో ఉన్నారు. నగరం సుషుప్తిలో ఉంది.

సిద్దార్ధాడు కంటకాన్ని నిమురుతూ “కంటకా! ఇది చాలా ముఖ్యమైన ప్రయాణం. నీ సహకారం చాలా అవసరం!” అని బుజ్జగించాడు. ,

ఇద్దరూ గుర్రాలు ఎక్కారు. సిద్ధార్ధుడు వెనుతిరిగి కపిలవస్తు నగరాన్ని తనివితీరా చూచాడు. తాను పుట్టింది, పెరిగింది, ఆడింది, పాడింది ఇక్కడనే. అందరూ నిద్రలో ఉన్నారు - తాము తప్ప! లక్ష్యం సిద్ధించేంతవరకు తిరిగి కపిలవస్తు రాకూడదు. దక్షిణదిశగా బయలుదేరారు సిడ్డార్టుడు, చెన్నడు.

శ శ ఈ ,

ఎంత వేగంగా ప్రయాణం చేసినా తెల్లవారే సరికి శాక్య సరిహద్దులు దాటలేకపోయారు. అరోమా నదీ తీరంలో ప్రవాహం వెంట దిగువకు కొంతదూరం వెళ్లి లోతులేనిచోట గుర్రాల్ని నది దాటించారు. మరికొంత ప్రయాణంతో ఒక అభయారణ్యం చేరుకున్నారు. అక్కడక్కడ హరిణాలు సంచరిస్తున్నాయి అంటే క్రూరమృగాలు లేని అడవి మనుషుల జాడ తెలియగానే పక్షులు రొద చేయసాగాయి సిద్ధార్దుడు కంటకం మేను నిమిరాడు “ఇంక చాలు అగు' అన్నట్లు.

గుర్రం దిగి “కంబకా, నీకునా కృతజ్ఞతలు ఎలా చెప్పను. నన్ను రక్షిత వనానికి చేర్చావు. నీ మేలు మరచిపోను” అన్నాడు.

గుర్రం తల విదిల్చి, సిద్దార్టుని వైపు చూచి కన్నీరు కార్చ సాగింది. జీనులో ఉన్న కత్తి తీసి, ఎడమ చేత్తో తస గిరజాల జుత్తును ఉత్తరించుకున్నాడు. చెన్నడికి తన జుత్తు. కత్తి, ధరించిన దుస్తులు, నగలు ఇస్తూ ఏ3 భగవాన్‌ బుద్ద

“వీటిని నా గుర్తుగా అమ్మగారికివ్వు చెన్నా నాపైన నమ్మకం ఉంచమని చెప్పు. నా బాధ్యతలు విస్మరించి, గోపపై (ప్రేమలేక వైరాగ్యం చెందానని భావించ వద్దని చెప్పు. మహారాణిని, యశోధరను ఊరడించు. గోపను దిగులు పడవద్దని చెప్పు. తాను నిబ్బరంగా, ధైర్యంగా ఉంటే నా లక్ష్యాన్ని తొందరగా సాధిస్తాను”.

రత్నాలహారం చేతిలోకి తీసుకోగానే చెన్నకు దుఃఖం పొంగుకు వచ్చింది నిగ్రహించలేక భోరున ఏడ్చాడు. _

“ర్రాక్రుమారా! నేను ఎవరినని ఊరడించను. వాళ్ల కన్నీరు తుడిచే శక్తి నాకెక్కడిది? గుండెలోని బాధను ఎవరు తీసివేయగలరు చెప్పు. ఈ అరణ్యంలో కటిక నేలపైన ఎట్లా పడుకోగలరు మోరు. పట్టు పరుపులపైన పవ్వళించిన మి శరీరం ఈ క్లేశాలకు తట్టుకోగలదా?”

సిద్ధార్దుడు మందస్మితం చేశాడు : “నా కోసం దిగులుపడకు చెన్నా... మో అందరి (శ్రేమలో, అనురాగంలో నేనుంటాను. మన వాళ్లు నా కోసం వెతికే లోగా నీవు నగరం చేరుకో. నన్ను ఒంటరిగా వదలి వెళ్లిపో... చెన్నా”,

" చెన్నడు కళ్లు ఒత్తుకుంటూ “నేను మోతోనే ఉండిపోతాను రాకుమారా! నేను మో సేవకుడిని. మోరు ఎక్కడ ఉంటే నేనూ అకృడే”

చెన్నని బుజంతట్టి కాస్త మందలింపుగా అన్నాడు, “చెన్నా మారు మాట్లాడకు. వెంటనే బయలుదేరు. నా సమాచారం ఎంత త్వరగా వారికి అందితే అంత మంచిది. ఇక్కడ నీ అవసరం నాకు లేదు సన్యాసులు ఒంటరిగా జీవిస్తారు. సేవకుల్ని పెట్టుకోరు. దయచేసి వెంటనే బయలుదేరు”.

రాకుమారుని ఆజ్ఞ అమల్లంఘనీయం కదా! సిద్దార్థుడిచ్చిన వస్తువులు కంటకుని జీనులో భద్రపరచి, సిద్ధార్థుని చేతులు తన చేతుల్లోకి తీసుకుని కళ్లకు హత్తుకున్నాడు. “అలాగే ప్రభూ! మా ఆజ్ఞ శిరసావహిస్తాను. నన్ను మరచిపోకండి మో తపస్సు పూర్తి అయిన వెంటనే వచ్చేయండి. అందరూ ఎదురు చూస్తుంటారు",

చెన్నడు తన అశ్వాన్ని అధిరోహించాడు. చివరిసారిగా వెనుతిరిగిచూచి బయలుదేరాడు. సిద్ధార్ధుడు అరణ్యంలో ప్రవేశించాడు ఇంక అరణ్యమే శరణ్యం, ఆకాశమే ఆచ్చాదన. మనస్సులో తృప్తి, ఆనందం. పది అడుగులు నడిచేసరికి

ఒక వ్యక్తి అరణ్యంలోంచి సిద్దార్థుని దిశగా వచ్చాడు. ఎవరో సన్వాసి అయివుంటా డనుకున్నాడు. అతని వేషం సన్యాసి వేషమే గాని, చేతిలో ఏల్లు, బుజాన అంబుల పొది వుంది.

భగవాన్‌ బుద్ధ ప

“నీవు వేటగాడివి కాదు కదూ?” ప్రశ్నించాడు సిద్దార్ధ.

“అవును. వేటగాడినే”

“మరి ఈ సన్యాసి వేషం ఏమిటి?”

సన్యాసి వేషధారి నవ్వాడు. “కాషాయ బట్టలు కట్టినవాళ్లను చూచి అడవి మృగాలు భయపడవు. నాకు వేట సులభమవుతుంది.”

సిద్ధార్దుడు విస్మయం చెందాడు కాషాయం మాటున ఇంత మోసమా?

“నీవు ఆధ్యాత్మికతను అవమానిస్తున్నావేమో! కాషాయ బట్టలు కట్టిన వారికి స్వార్ధం ఉండకూడదు. నీవు చేస్తున్నది మోసం కదా! ఆత్మద్రోహం కదా.. ”

ఈయన ఎవరో గొప్పింటివాదై ఉంటాడని అతను అనుమానించాడు. ఆ మాట తీరు, ఠీవి, దర్బ్భం చూచి రాజవంశీకుడనుకుని భయపడ్డాడు.

“స్వామి! మారు నావంటి వారేనా? వేట కొచ్చారా?”

“అవును. సత్యాన్ని జ్ఞానాన్ని వేటాడాలని వచ్చాను. నీ కాషాయబట్టలు నాకివ్వు. నా బట్టలు, ఆభరణాలు నీకిస్తాను. ఈ రత్నాభరణాలు అమ్మి జీవితాంతం సుఖంగా జీవించు. నేను సన్యాసిని కాదలచాను. వీటి అవసరం నాకు లేదు”.

సిద్ధార్థుడిచ్చిన విలువైన పట్టుబట్టలు, నగలు తీసుకుని, తనబట్టలు అతనికిచ్చి గబగబ పరుగెత్తాడు. ఆలస్యమైతే రాజకుమారుడు మనస్సు మార్చుకుంటాడేమోనని అనుమానం, కంగారు. ఇప్పుడు సిద్ధార్టునికి మరొకతృప్తి. తనను చూచే వారికి తానిప్పుడు సన్యాసి. ఆ దుస్తులతో ఒక చెట్టునీడన ధ్యానానికి కూర్చున్నాడు. రాత్రంతా గుర్రపుస్వారీతో అలసిపోయి ఉన్నాడు. అయినా ధ్యానం ప్రశాంతంగా సాగింది.

సాయంత్రం వరకు ధ్యానంలో గడిపాడు. తృప్తిగా కళ్లు తెరిచాడు. ఆశ్చర్యం! తన ఎదురుగా ఒక నిజం సన్యాసి కనిపించాడు. ఆయన శరీరం శుష్కించి ఉంది. మొహం బాగా పీక్కుపోయింది. ఉపవాసాలతో, తపస్సుతో నీరసించి పోయాడు. సిద్ధార్దుడు నిలబడి ఆయనకు నమస్కరించాడు. తాను ఇల్లు వదలి వచ్చానని, ఇంకా ఒక సద్గురు అనుగ్రహం కలగలేదని చెప్పాడు. దక్షిణదేశంలో ఒక మంచి గురువు ఉన్నాడని, ఆయన పేరు అలార కలామ అని, ఆయన్ని కలవాలని ఉన్నదని చెప్పాడు.

ఆ సన్యాసి అలార కలామ శిష్యుడు. ఆయన ఇప్పుడు వైశాలి నగరానికి ఉత్తరాన ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉంటున్నాడు. ఆయనకు నాలుగు వందల మంది శిష్యులున్నారు. తన వెంట వస్తే అలార కలామ ఆశ్రమానికి 35 భగవాన్‌ బుద్ధ

చేర్చుతానని చెప్పాడు. సిద్ధార్థుడు సన్యాసి వెంట బయలుదేరాడు. కొంతదూరం అడవిలో నడిచారు. వయే పళ్లు, కందమూలాలు తినవచ్చునో సన్యాసి వివరించి చెప్పాడు. ఆ సన్యాసి పేరు భార్గవ. అతను '“అలార కలామ అంత గొప్పు సిద్ద పురుషుడు కాదని, అతనిలో దివ్యశక్తులు ఏవీ లేవని, ఆయన శిష్యులు ఊళ్లమిద పడి ముఫ్టెత్తుకు బ్రతుకుతుంటారిని విమర్శించాడు. వైశాలి చేరడానికి వారికి తొమ్మిది రోజులు పట్టింది. అలార కలామ అశ్రమం పేరు 'అనుప్రియ'. భార్గవ, సిద్ధార్టుడు ఆశ్రమం చేరుకున్నారు. గురువు గారి వయస్సు ఏడుపదుల పైనే అంత వృద్దాప్యంలోనూ ఆయన చూపు ముందగించ లేదు. కంఠంలో తొాట్రుబాటు లేదు. వీరు వెళ్లేసరికి ఆయన నాలుగువందల మంది శిష్యులకు పారం చెబుతున్నాడు. వీరు చివరన నిలబడి వినసాగారు. పారం అయిన తర్వాత ఎవరి కుటీరాలకు వాళ్లు వెళ్లిపోయారు. సిద్ధార్దుడు ఆయనను సమీపించి ప్రణామం చేసి “మహాత్మా! నేను జ్ఞానార్తిని. తమ శిష్యునిగా స్వీకరించండి. ఎంతో దూరదేశం నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, " కలామ సిద్దార్టుని వైపు నిశితంగా చూచి, అర్హుడని గ్రహించాడు. “సంతోషం నాయనా, ఇక్కడే ఉండు. సాధన చేసుకో, జ్ఞానం పొందు. నా సహాయం నీకు పూర్తిగా లభిస్తుంది.” అన్నాడు. ఆయన పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు పొందాడు. అలార కులపతిగా ప్రసిద్దుడు. ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. అన్నీ తాటాకు పాకలు, పర్ణశాలలే అయినా సౌకర్యంగా ఉన్నాయి. సిద్దార్టునికి ఒక్ర పర్ణశాల ఇచ్చారు. ధ్యానానికి అనువుగా వుంది. పర్ణశాలలు దూరదూరంగా ఉన్నాయి. ప్రయాణ బడలిక వల్ల వెంటనే నిద్రపట్టింది. ఉదయం నిద్రలేచే వేళకు శిష్య బృందాలు భిక్షకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నారు. ధ్యానం పూర్తి చేసుకుని తనూ వాళ్లను అనుసరించాడు. సిద్దార్టుని చేతికి ఒక భిక్షాపాత్ర చ్చి, ఎట్లా వెళ్లాలో, ఎట్లా భిక్ష అర్ధించాలో వారు బోధించారు క్షత్రియుదైన తాను బిచ్చమెత్తడం? చేతిలో భిక్షాపాత్ర, వేషం సన్యాసి వేషం ఏదోలా అనిపించినా, మనస్సును జయించడం, అభిమానాలు, అహంకారం చంపుకోవడం- ఆధ్యాత్మ జీవనానికి తాలిమెట్లుగదా! ఏ మానసిక వికారాలు, అలజడులకు లోనుకాకుండా, భిక్షాపాత్రను చేతికి తీసుకుని కళ్ల కద్దుకున్నాడు సాటి వారితో కలిసి వైశాలి నగర వీధుల్లో ప్రవేశించాడు. తాను భిక్షావృత్తికి కొత్త. సిద్ధార్థుని పాత్ర స్వల్ప సమయంలో నిండిపోయింది. అయన అకర్షణ, అందం గృహిణులను అలరించింది. తనుకొత్త 'భిక్షుగాడు. తనకు కావలసినంత భగవాన్‌ బుద్ధ _36

తీసుకుని మిగిలింది తోటివారికి పంచి గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు. తను వచ్చింది తిండికోసం కాదు 'ధ్యానమార్గం' కోసం. సిద్దార్టుడు 'కులపతి' ఆశ్రమానికి వెళ్లేసరికి అలార ధ్యాన సమాధిలో ఉన్నాడు. చేసేది లేక ఆయన ఎదురుగా కూర్చుని అంతర్జృష్టిలో ఆయనను ధ్యానించసాగాడు ఎదుట ఒక వ్యక్తి తనపై మనసు లగ్నం చేసి, దృష్టి కేంద్రీకరించడంతో అలార ద్యాన భంగమై కళ్లు విప్పాడు ఎదురుగా సిద్దార్టుడు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు

అలార మొదటి పాఠం బోధించాడు

“సాధకునికి మొదట కావలసింది ఆత్మవిశ్వాసం. ఆపైన పట్టుదల, దృఢ దీక్ష హృదయంపైన మనస్సు ఏకాగ్రం చేయాలి శ్వాసతో పాటు ఆలోచనలు తగ్గుతాయి. అప్పుడు ధ్యాన నిష్ట ఏర్పడుతుంది. ఉద్రేకాలున్నంతవరకు శ్వాస హెచ్చుగా ఉంటుంది. శ్వాస తెలుస్తుంది ఉద్రేకాలు తగ్గినపుడు ఆలోచనలు తగ్గుతాయి. శ్వాసపైన దృష్టిపోతుంది అది నిశ్చలధ్యానం. కేవలం శాస్రాధ్యయనం వల్ల, సిద్ధాంత చర్చవల్ల ప్రయోజనం లేదు సాధకునికి కావలసింది అనుభవం అనుభవంవల్ల పొందే జ్ఞానం గొప్పది అది స్వీయజ్ఞానం అది ఆత్మ జ్ఞానం. నీవు ధ్యానంలో ఉన్నత స్థితులు చేరాలంటే గతాన్ని పూర్తిగా మరచిపోవాలి. ఆలోచనలకు కళ్లెంవేయాలి భవిష్యత్తును గురించి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సైతం ఆలోచించకూడదు. మనసు శూన్యం చేసుకోవడమే అసలైన ధ్యానరహస్యం. ఆ తరువాత 'విముక్తిపై ధారణ చేయవలసి ఉంటుంది ”

కులపతి వద్ధ సెలవు తీసుకుని తన కుబీరానికి బయలుదేరాడు. శరీరాన్ని మనస్సును అదుపు చేయడం ఎలా? అది గురువుగారు చెప్పలేదు “అనుభవం వల్ల జ్ఞానం అని ఒక మాబన్నారు అదీ అనుభవం వల్ల తెలుస్తుందా? ఏది ఏమైనా 'సాధని ఒక్కటే మార్గం. సాధన తీవ్రం చేయసాగాడు. అయిదారు రోజుల కొకమారు వెళ్లి గురుదర్శనం చేసుకుంటున్నాడు. తన సాధన గురించి వివరించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాడు. కొద్ది సమయంలోనే సిద్ధార్ధుడు చాలా అభివృద్ధి సాధించినట్లు 'అలారి గుర్తించాడు

సిద్ధార్దుడు ధ్యానంలో గతాన్ని విస్మరించగలిగాడు అది ఏమాత్రం కష్టమనిపించలేదు. క్షణంలో ఆలోచనలు ఆగిపోయి మనస్సు శూన్యం అవుతోంది అప్పుడు అనిర్వచనీయమైన ఆనందం అనుభూతమవుతోంది తృప్తిగానూ ఉంటోంది నిశ్చలంగా, ఎన్ని గంటలైనా ధ్యానంలో ఉండగలుగుతున్నాడు. అయినా ఇంకా తనలో ఏలో సష్టుతులు మిగిలి ఉంటున్నాయి ఆలోచనలు కాకపోయినా గతకాలపు నీలి నీడలు అవి కొన్ని అనురాగబంధాలు తనను 3/7 భగనాన్‌ బుద్ద

వదలడం లేదు ఎంతకాదనుకున్నా యశోధర మనసులోకి వస్తోంది కొన్ని వారాల తర్వాత గాని గత స్మృతి శేషాలను శాలగించ లేకపోయాడు అప్పుడు, ఇంద్రియాల తలుపులు పూర్తిగా మూసివేయగలిగాడు హృదయం నిర్మల కాసారం అయింది. మనస్సు నిశ్చలన సరోవరమైంది.

తన అనుభవాలు, మనస్థితి గురువుగారికి నివేదించినపుడు ఆయన సంతోషించి అభినందించాడు. “కాద్దిరోజులలోనే మంచి ఫలితాలు సాధించావు”.

మనస్సును 'అనంతం'గా సంభావించడం సిద్దార్టుని విశేషసాధన. గురువు గారు ఏది బోధించినా, దానిని మూడురోజుల్లో సాధిస్తున్నాడు. ఇంకా ఏదో వుంది సాధించవలసింది. గురువుగారన్నట్లు “ఎరుక ఉంటుంది కాని పూర్తిగా శూన్యం కావడం జరగడంలేదు 'శూన్య' భావన మాత్రం కలుగుతోంది. భావం అభావం కావాలి కదా! అవి ఎట్లా సాధ్యం?

“మరొక అంతస్సుపైకి వెళ్లాలి సిద్ధార్దా! అనియత శూన్యాకాశం కూడా మనోకల్పనే అవుతుంది అదీ ఒక విధమైన చైతన్యస్ఫురణే కదా! దానిని చేతనలో అనుభవించి, ఆపైన అధిగమించగలగాబి. అప్పుడే శూన్యతసు సాధించ గలుగుతావు “శూన్యత” అంటే 'శూన్యం” కావడం కాదు, పూర్ణత్వం. 'పూర్ణశూన్యం' శూన్యత అవుతుంది ఎరుక శూన్యం వేరు, భావ శూన్యం వేరు, సంపూర్ణ శూన్యం వేరు. శూన్యాలు చాలా రకాలుగా ఉంటాయి”.

తన కుటీరానికి తిరిగివచ్చిన సిద్ధార్థుడు రెండు రోజులు శూన్యతపై ధారణ

చేసి “శూన్యం” అనుభవించగలిగాడు. అయినా ఏదో అలజడి, కలవరం! మళ్లీ

గురువుగారిని కలిసి తన మనస్థితిని, శూన్యస్థితిని వివరించాడు అలార ఆయన

కళ్లలోకి లోతుగా చూచి అన్నాడు “సిడ్డ్దార్థా, నీవు గమ్యానికి చేరువలో ఉన్నావు

నీ కుటీరానికి వెళ్లి (ప్రపంచం అశాశ్వతం” అన్న భావనపైన ధారణ చెయ్యి,

జగమంతామాయ అనిపిస్తుంది అప్పుడు మాయపైన, భ్రాంతిపైన ధారణ చేస్తూ

శూవ్వ్యంలో లయించి పోవాలి. అశాశ్వతమైన లోకాన్ని దాటితే తప్ప 'అలోకం'

అనుభూతికి అందదు రూపం, గుణం, శబ్దం, రసం, స్పర్శ బంధం, ఉద్రేకాలు,

ఆరాటాలు, ఆలోచనలు అన్నీ మహాశూన్యంలో లయించి ఫోవాలి వాటన్నీంటికి (మనస్సుతో సంబంధం ఉంటుంది మనసు దాటి ఆవలి తీరం చేరితే అవన్నీ ఉపశమిస్తాయి. అవి ఉన్నవి కావు. మనసు కల్చించినవి, భావించినవి. అభావంలో భావాలన్నీ లయిస్తాయి. ఏది నీవు కల్పిస్తే భావన ఆ రూపాన్ని సృష్టిస్తుంది. అంటే భానం రూపాంతరం చెందుతుంది. రూపం అరూపం కావడం ముఖ్యం. బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా దాటిపోతే, శూన్యం నీ ఎదుట నిలుస్తుంది. శూన్యం దాటితే మహాశూన్యం. మహాశూన్యం దాటిన తర్వాతగానీ సత్యావిష్కారం జరగదు”. భగవాన్‌ బుద్ధ 38

అలార కలామ గురుకులాశ్రమంలోనే సిద్ధార్డునికి అనేక మందితో పరిచయం ఏర్పడ్డది ఆతని అభివృద్ధికి అందరూ ముచ్చట పడ్డారు. సాటి వారికి అతనిపై ఎనలేని గౌరవం కలిగింది. తను భిక్షకు వెళ్లకపోయినా, ఎవరో ఒకరు భిక్ష తెచ్చి పెడుతున్నారు అతని నుండి ధ్యానం నేర్చుకోవాలని చాలా మంది ఆరాటం ఒకసారి అలార గురువర్యులు సిద్దార్గుని గత జీవితం గురించి, పూర్వాశమం గురించి అడిగి తెలుసుకున్నాడు అక్కడి మిత్రులు రాజరికపు జీవిత విశేషాలు చెప్పమని ఒత్తిడి చేయగా “ఆ విషయాలు, ముచ్చట్లు ఇప్పుడు అనవసరం. మనం ధ్యానానుభవాలు చర్చించుకోవడం మంచిది” అనేవాడు

ఒక్క నెలదినాలలో సిద్ధార్థుడు ప్రాపంచిక వాసనలు వదలి, రససిద్ధిని పొందగలిగాడు. ఆధ్యాత్మిక పరిమళాలు అన్నీ సొంతం చేసుకోగలిగాడు హృదయం క్షణంలో శూన్యం అవుతోంది. భావాతీత, అతీంద్రియ స్థితులు అలవోకగా అందుతున్నాయి. ధ్యానంలో తను సాధించింది విశేషమే అయినా, అది మాత్రమే తన గమ్యం కాదనిపిస్తోంది. అదే విషయం గురువుగారిని అడిగాడు.

ఆయన కళ్లు మెరిశాయి, “సిద్దార్ధా! నీవు నిజంగా కారణజన్ముడివి పూర్వజన్మలో మహాతాపసివి అయివుంటావు మహర్షివి అయివుంటావు. ఒక జీవిత కాలంలో నావంటి వారు సాధించలేని దానిని నీవు నెలరోజులలో సాధించావు. నీది జన్మ సంస్కారం నేను నీకు బోధించగలది ఏమి లేదు. ఇప్పటికే నీవు నన్ను మించిపోయావు ఇకపైన ఆశ్రమ నిర్వహణలో నాకు సాయంగా ఉండు నా తదనంతరం కులపతివి అవుతావు”.

సిద్ధార్ధడు మౌనం వహించాడు. భౌతిక కామనలు లేకపోవడం, సుఖలాలస లేకపోవడం సరే శూన్యం అయినంత మాత్రాన నత్యదర్శనం అయినట్లు కాదుగదా! జనన, మరణ సమస్యలకు పరిష్కారం లభించినట్లు ఎట్లా అవుతుంది? మనిషి బాధల నుండి, కమ్టాల నుండి విముక్తి పొందడం ఎలా సాధ్యం? మనిషికి పూర్ణత్వం ఎట్లా లభిస్తుంది?

తన జీవిత ధ్యేయం ఒక ఆశ్రమంలో గురువు కావడం కాదు. “కులపతి” అనిపించుకోవడం కాదు గురువు గారికి వినయంగా నమస్కరించి అన్నాడు “గురువర్యా! ఇంతకాలం మోరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. ఇంక నాకు సెలవిప్పించండి నా జ్ఞానతృష్ణ ఈ ఆశ్రమంలో తీరదు. నా అన్వేషణ ఇంతటితో ఆగదు నా లక్షాన్ని సాధించడానికి, ముందుకు పోదలచుకున్నాను”

సిద్ధార్థుని ఆపడానికి అలార చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరునాడే సిద్ధార్ధుడు ఆశ్రమం వదలి బయలుదేరాడు. 39 భగవాన్‌ బుద్ధ

నా సంత. న టలటే లు స్త! ర. ర లస య ల జననం జు లై ను సం న్‌ షీ ము టీనో లో ్గ షా టం. న ను న జావా నంగ క /్‌ ” యమా మ యి కుట నాకు రాజసొధంలో మ న... వీ (1 ఫ్రే ౮1 టు. ఎట్ల శా ఎ శ్లకాా : య ర స్పందన తం

సిద్ధార్థుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించి. గంగానదిని దాటి మగధలో ప్రవేశించాడు కపిలవస్తు, శాక్యలతో పోల్చితే మగధ చాలా పెద్దదేశం. సంపన్న దేశంగానూ ప్రసిద్ధి చెందింది మగధ విద్యాకేంద్రం, విజ్ఞానకేంద్రం. అనేకమంది యోగులు, బుషులు, సన్వాసులు, గురువులు అక్కడ ఉంటారని వినికిడి తనకు అక్కడ సరైన గురువు లభించగలడని సిద్దార్థుని ఆశ అయితే సద్దురువులు, మహర్షులు నగరాలలో ఉండరు అరణ్యాలలో, పర్వత గుహలలో, జనావాసాలకు దూరంగా ఉంటారు. కొందరు అజ్ఞాతంగా ఉంటారు. నిరాడంబరంగా ఉంటారు. వారిని గుర్తించడం కష్టం. అలాంటి సద్గురువులు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేశాడు. ఎన్ని పర్వతాలైనా ఎక్కవచ్చు, కాకులు దూరని కారడవుల్లోకి వెళ్లవచ్చు- సద్గురువు లభించే పక్షంలో కొందరు దిగంబర సన్యాసులు కలిశారు. కొందరు ఒంటికాలిపై తవన్సు చేస్తున్న వారిని చూచాడు. వీకలలోతు భూమిలో కూరుకుపోయి సాధన చేస్తున్న వారినీ చూచాడు. వారిలో ఆకర్షణ తప్ప ఆత్మ సంస్కారం ఉన్నట్లు అనిపించలేదు. ఆత్మ జాగృతి అవసరం కదా! పంచాగ్నుల మధ్య ఘోర తపస్సు చేస్తున్నవారు, జలసమాధి అయిన వారు తనకు నచ్చలేదు. శరీరాలను శుష్కింపచేసుకుని, అస్థిపంజరాల్లా ఉన్నారు కొందరు. వీరికి కావలసింది స్వర్గం ...

అనిపించింది - ఈ శవ సద్భశులు స్వర్గానికి వెళ్లి ఏం బావుకుంటారు? భూలోకంలో కష్టాలు, బాధలు అనుభవించి స్వర్గంలో సుఖపడాలన్న కోరిక ఎంత వరకు సమంజసం? ఈ కరోర నియమాలు, తపస్సు మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి? తపస్సు వల్ల ఏం ప్రయోజనం? ఏమి సాధించినట్లు మనిషి కష్టాలు తొలిగే మార్గం ఇది కాదు. సుఖాలు ఆశించడం, స్వర్గం ఆశించడం రెండూ సమానమే!

తన అన్వేషణ అగదు. విసుగు, విరామం లేకుండా ఆశ్రమాలు దర్శిస్తూనే ఉన్నాడు గురువుల్ని కలుస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కచోట మూడు నాలుగు నెలలు సాధన చేస్తూ ముందుకు పోతున్నాడు. ధ్యానంలో లోతులకు వెళ్లగలుగుతున్నాడు ఏకాగ్రత పెరుగుతోంది. అవగాహన చాలడం లేదు జనన మరణాలు తప్పించుకునే ఉపాయం తోచడం లేదు, తనకు మార్గం చూపగల గురువు లభించలేదు. ఇల్లు విడిచి మూడు సంవత్సరాలవుతోంది. పరిస్థితిలో మార్పు లేదు. మనస్థితి కాస్త మారింది. అడవులు, కొండలు తిరుగుతూ, ఏ చెట్టు క్రిందనో ధ్యానం చేస్తూ గుహలలో తల దాచుకుంటూ కాలం గడుపుతున్నాడు తండ్రిగారు, యశోధర, టే భగవాన్‌ బుద్ద

రాహుల్‌ మనసులోకి వస్తున్నారు. కపిలవస్తు పదేపదే జ్ఞాపకం వస్తోంది. గమ్యం అగమ్యంగా వుంది. లక్ష్యసిద్ధికి ఏది మార్గం?

మగధ రాజధాని రాజగ్భహకు అల్లంత దూరంలో పాండవ పర్వతం ఉంది ఆ పర్వతం సిద్దార్టునికి ఆవాసం. ఒకనాడు ఖిక్షాపాత్ర పట్టుకుని నగరానికి బయలుదేరాడు. నీరసం కారణంగా నడక వేగం తగ్గింది. అయినా దర్పం, రీవి తగ్గలేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. సిద్ధారుని రాజసం చూచిన జనం నివ్వెరపోయి చూడసాగారు సన్యాసి వేషంలో రాకుమారుడు ,ఎవరో! మహారణ్యం నుండి తప్పిపోయివచ్చిన సింహంలా ఉన్నాడు. అదే సమయంలో మగధ దేశాధీశుడు బింబిసారుని రధం అటుగా పయనిస్తోంది సిద్ధార్టుని చూచిన వెంటనే బింబిసారుడు రధం నిలుపు చేయించాడు. ఒక భటుని పిలిచి ఆ సన్యాసి ఎవరో, ఎక్కడ ఉంటున్నాడో, అనుసరించి వివరాలు సేకరించ మని ఆజ్ఞాపించాడు.

మరునాడు బింబిసారుని రధం వచ్చి పాండవ పర్వత పాదం వద్ద ఆగింది. రాజు రధం దిగి, సైనికుడు చూపించిన వేపుగా, సన్యాసి ఉన్న తావుక్షు చేరుకున్నాడు. ఆయన ఒక చెట్టునీడన కూర్చుని ఉన్నాడు. రాజును చూడగానే సిద్ధార్థుడు సగౌరవంగా లేచి నిలబడి అభివాదం చేశాడు. సిద్ధార్థుడు బింబిసారుడు చెరాక రాతిబండపై కూర్చుని ఒకరి నొకరు చూచుకోసాగారు. బింబిసారునిక్రి సిద్ధార్థుడు నచ్చాడు. మళ్లీమళ్లీ చూడాలనిపించే అందం... ఎంతసేపు చూచ్చినా తనివి తీరడం లేదు.

“స్వామా! నేను మగధ రాజును. నా పేరు బింబిసారుడు మిమ్మల్ని సాదరంగా మా నగరానికి ఆహ్వానిస్తున్నాను. తమరు నాకు తోడుగా ఉండండి. నా ప్రజలకు మా కారుణ్యం వల్ల శాంతి సౌభాగ్యాలు సమకూరగలవని నా ₹ విశ్వాసం”

సిద్ధార్థుడన్నాడు : “అరణ్యాలలో నివశించడం నాకు అలవాటే”

బింబిసారుడు * “ఒక పడక లేదు. పట్టు పరుపు లేదు. కటికి నేలపైన పడుకోవడం దేనికి? నా వెంట రండి స్వామా, మికు అన్ని సౌకర్యాలు కల్పించి రాజగురువును చేస్తాను *”

“మహారాజా! ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. పదవి, హోదా అసలు ముఖ్యం కాదు. నేను బాధా విముక్తి కోసం మార్గం అన్వేషిస్తున్నాను. నా అన్వేషణకు అంతఃపురం, రాజాదరణ అనుకూలం కాదు”.

“స్వామి! నావలె మిరూ - యువకులు. నాకు మి వంటి మిక్రుని అవసరం వుంది నిన్న మిమ్మల్ని చూచిన క్షణంలోనే మాతో స్నేహం చేయాలని

బగవాన్‌ బుద్ద ష2

పించింది మారు అంగీకరిస్తే నా రాజ్యంలో సగభాగం, అర్ధసింహాసనం ఇస్తాను. వయసు చెల్లిన తర్వాత సన్యసించవచ్చు”.

“మో బెదార్యానికి కృతజ్ఞతలు మహారాజా! నా ఆశయం ఒక్కటే. అది నా కోరిక కాదు కోరికల వెనుక స్వార్ధం ఉంటుంది. స్వలాభాపేక్ష ఉంటుంది. స్వప్రయోజనం ఉంటుంది. నాది ఇశయం. బహుళ ప్రయోజనకరం. మనుషుల బాధలు, కష్టాలు తొలగించాలి కన్నీరు తుడవాలి అందుకు ఏది మార్గం? కాలం ఎంతలో గడుస్తుంది మహారాజా? వయస్సులో లేని శక్తి ముసలితనంలో ఉంటుందా? అప్పుడు పశ్చాత్తాపం తప్ప మిగిలేది ఏముంటుంది? ఏదైనా వయస్సులోనే చేయాలి. జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు రోగం, మృత్యువు ఎప్పుడైనా మనిషిని ఆవహించవచ్చు దయచేసి, నన్ను నా మార్గంలో వెళ్లనీయండి”

బింబిసారుడు . “మో మాటలు నాకు నచ్చాయి మో పట్టుదల నచ్చింది. మో స్వదేశం ఏది? మి పుట్టు పూర్వోత్తరా లేవి? అవైనా చెప్పండి.”

“మహారాజా! నేనూ క్షత్రియుడనే శాక్య మహారాజు శుద్ధోదనుడు నాతండ్రి నా పేరు సిద్ధార్దుడు. మా తల్లిగారు గౌతమి. భార్యా బిడ్డలను వదలి, మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నాను”.

“మిత్రమా! సిద్ధార్ధా! మగధ, శాక్యమైత్రి ఈనాటిది కాదు. మనం దగ్గరి బంధువులం”.

“సంతోషం మహారాజా! అయినా (ప్రస్తుతం మారు మహారాజు, నేను సన్యాసిని”

తరచు బింబిసారుడు వచ్చి తన ఏకాంతం భంగం చేస్తాడన్న అనుమానంతో సిద్ధార్థుడు అక్కడి నుండి బయలుదేరాడు. రాజగ్భహ సమిపంలో ఉద్రక రామపుత్ర అనే గురువు వున్నాడని తెలిసింది అక్కడకు బయలుదేరాడు ఉద్రక రామపుత్ర వద్ద మూడు వందలమంది ఆశ్రమ శిష్యులు, నాలుగు వందలమంది అభిమాన శిష్యులు ఉన్నారని ప్రతీతి.

శ శ

ఉద్రక మహర్షి డెబ్బయి అయిదు సంవత్సరాల వృద్ధుడు మహాజ్ఞాని అని, అవతార పురుషుడని ప్రతీతి యోగ శిఖరాలు ఎక్కిన వాడని ప్రచారం. కొత్తగా ఎవరు వచ్చినా అక్షరాభ్యాసంతో ఆరంభిస్తాడు లోగడ వారు చేసిన సాధనలు గాన్‌, నేర్చిన విద్యలు గానీ పరిగణనలోకి తీసుకోడు సిద్ధార్థునికి ఆసనాలతో క! భగవాన్‌ బుద్ధ

విద్య ప్రారంభించాడు కొద్దివారాలలోనే సిద్ధార్థుడు ప్రయోజకు డనిపించుకున్నాడు తర్వాత ధ్యానంలో ప్రాదమిక పారాలు నేర్పాడు. అందులోనూ సిద్ధార్దుడు ఉద్ధండుడని గ్రహించడానికి రెండు రోజులు పట్టలేదు అతను ధ్యానం లోతులెరిగిన వాడని, చాలాచాలా ద్యానానుభవాలు పాందినవాడని గ్రహించాడు తనకు సమ ఉజ్జీ సిద్ధార్భడని తెలుసుకుని సంతోషించాడు. అతనికి ఆశ్రమంలో ప్రత్యేక గౌరవం లభించింది. గురువు గౌరవించిన వ్యక్తిని మిగిలిన శిష్యులు గౌరవిస్తారు గదా' గురువుకు తగిన శిష్యుడు లభించడం ఎప్పుడో గాని, ఎవరికోగాని లభించదు. మహా మహాగురువులు, కులపతులు సైతం సచ్చిష్యులను పొందలేక పోతుంటారు! ఉద్రక మహర్షి ఒకనాడు సిద్దార్థునితో ఏకాంత చర్చ సాగించాడు “గౌతమా! భౌతిక స్పృహ లేకుండా పోయినంత మాత్రాన దానిని అధిభౌతికం అనకూడదు అది “అ భౌతికం' అవుతుంది. దానిని పూర్తి శూన్యం అనకూడదు. “స్పృహ ఉన్నంత కాలం “శూన్యం కాదు. అది ఏమో లేని స్థితి, ఏమో కాని స్థితి. వదో ఒక కాంత చైతన్యం మిగిలి ఉన్నట్లే కదా. చైతన్యం ఉన్నప్పుడు శూన్యం ఎలా అవుతుంది? కనుక సంపూర్ణ శూన్యం సాధించడం అసాధ్యం అనుకుంటాన్సు. అసాధ్యం కాకపోనూ వచ్చు. భౌతిక, చేతన, అచేతన స్థితులు ఉన్నాయి కదా, అచేతనలో చైతన్యం ఉన్నట్లా, లేనట్లా? చేతన అచేతన కాదు, కాలేదు, న్సీవు సంపూర్ణ శూన్యత సాధించాలంటే చేతనాచేతన స్థితుల్ని దాటి పోవాలి.” సిద్ధార్థుడు ప్రశ్నించాడు : “గురూజీ! అలా జరిగినప్పుడు - అంటే చేతన, అచేతనలు లేనప్పుడు ఏం మిగులుతుంది? చివరికి మిగిలేది ఏమిటి? క్ర చెక్కముక్క రాతిముక్క చైతన్యానికి ప్రతినిధులా, జడత్వానికి ప్రతీకలా?* ఉద్రక మహర్షి : “కొయ్యకు, రాతికి చలనం ఉండకపోవచ్చు. వాటిలో చైతన్యం సూక్ష్మంగా ఉంటుంది. చెట్టుకు ప్రాణం వుంది కొండకు ప్రాణం వుంది. చెట్టు నుండి విడిపోయి ఎండిపోయినప్పుడు చైతన్యం తగ్గుతుంది. అవి పూర్తి జడపదార్థాలు కావు. పూర్తి చైతన్యాలూ కావు” గురువు గారు చెప్పిన విషయాలు ధ్యానంలో రూడఢడిపరచుకోవాలి యోగంలో, ధ్యానంలో, అనుభవంలో నిరూపించుకోవాలి అందుకు అంతంత మాత్రం సాధన చాలదు తీవ్రసాధన అవసరం. చేతనాచేతన స్థితులపై ధ్యాస నిలిపి ధ్యానం చేయసాగాడు. అన్నిరకాల చేతనలు సులభంగా అధిగమించ గలిగాడు అచేతన స్థితి అనుభవానికి అందలేదు యోగపరంగా ఆ స్థితి మహోన్నతం అయి వుండవచ్చు. తాను లక్షించే జనన మరణ వలయం దానికి సంబంధం లేనిది సమాధిలో అచేతనంగా వందల సంవత్సరాలు ఉండి ఏం ప్రయోజనం? బగవాన్‌ బుద్ద డత

ఆయుర్ధాయం పొడిగింప్తు పెద్ద అర్హత కాదు. దాని అవసరమూ అంతంత మాత్రమే మనిష్‌ మనుగడకు ఉపకరించని ధ్యానం తనకు అనవసరం. కష్టాలు తీరాలి.

తన అనుమానం ఉద్రక మహర్షికి విన్నవించుకున్నాడు. ఆయన సిద్దార్భుని ప్రతిభకు ఆశ్చర్యపడి అభినందించాడు తప్ప జవాబు చెప్పలేదు “గౌతమా! నీ వంటి జిజ్ఞాసువును నేనింతవరకు చూడలేదు నీ మార్గం వేరు, మా మార్గం వేరు నీ లక్ష్యం వేరు, మా లక్ష్యం వేరు నీ జిజ్ఞాస, యోగం పతాక స్థితికి చేరాయి. నా అనంతరం ఈ ఆశ్రమ బాధ్యతలు నీవు తీసుకోగలవా? నిన్ను మించిన మహర్షి జ్ఞాని మరొకరు ప్రస్తుత కాలంలో లేరు.”

బుద్ధుడు : “గురుదేవా, మో అభిమానాన్ని ఆశీస్సులుగా స్వీకరిస్తాను. నా జీవిత ధ్యేయం కులపతిని కావడం, గురువు కావడం కాదు మహర్షిని అనిపించుకోవాలని నాకు లేదు. ఇంక నాకు సెలవిప్పించండి ”

అక్కడ చాలా మందికి సిద్దార్థుని పట్ల అనురక్తి ఏర్పడ్డది వారిలో కొండన్న అనే విద్యార్ధికి సిద్దార్దడంటే అమిత ఇష్టం అనంత కౌండిన్య (కొండన్న) సిద్దార్టుని గురువుగా భావించేవాడు అతను సిద్దార్జుని వెంట పర్వతం చివరి వరకు వెళ్లి వీడ్కోలు చెప్పాడు

మహాగురువులుగా ప్రసిద్ధి చెందిన ఇద్దరి వద్ద తాను శుశ్రూష చేశాడు. ఇంక తనకు మార్గం ఉపదేశించగల గురువు ఎక్కడా కనిపించే అవకాశం లేదు. తనంత తానుగా, స్వతంత్రంగా సాధించవలసిందే. అదే నిర్ణయానికి వచ్చాడు.

పొలాలకు అడ్డంపడి, వాగులు, వంకలు దాటుతూ పశ్చిమదిశగా పయనించి సిద్ధార్దుడు నైరంజర నదీ తీరానికి చేరాడు. నది దాటిన తర్వాత “డాంగసిరి' పర్వతం ఉంది. అక్కడకు చేరుకున్నాడు అక్కడ నుండి ఉరివిల గ్రామానికి ఒకపూట నడక. డాంగసిరి పర్వతశ్రేణులు దాటడం చాలా కష్ట సాధ్యం. నిటారుగా ఉన్న పర్వత పంక్తులు ఎక్కడం, దిగడం రెండూ కష్టమే. వాటిలో నిర్మానుష్యమైన గుహలు చాలా ఉన్నాయి పర్వత సాను ౨లో జనావాసాలున్నాయి తన సాధనకు అది అనుకూలమైన ప్రదేశంగా భావించాడు.

ధ్యానానికి అనువుగా వున్న ఒక గుహను ఎంచుకున్నాడు. అక్కడ గంటల కొద్దీ ధ్యానంలో ఉండవచ్చు. ఏ ఆటంకం ఉండదు. అయిదు సంవత్సరాలు తాను చేసిన సాధనలు, గురువుల బోధనలు గుర్తుకు వచ్చాయి. “శరీరాన్ని అలక్ష్యం చేయకూడదని, దాని వలన ఉన్న బాధలు కాక కొత్త కష్టాలు వస్తాయని తాను చెప్పేవాడు ఇప్పుడు తనకు అదే ఆలోచన వస్తోంది శరీరాన్ని శుష్కింప చేయకపోతే, జ్ఞానమార్గం కనిపించదేమో! పచ్చికట్టెలు మండవు మనిషి శరీరమూ ట్‌ భగవాన్‌ బుద్ధ

కటెలాంటిదే. భౌతిక కామనలు, కోరికలు జయించాలంటే శరీరాన్ని శుష్కింప చేయాలి. పూర్వం నుండి మహర్షులు చేస్తున్న పని అదే అన్న పానీయాలు వర్షిస్తే తప్ప తపస్సు ఫలించదు. గౌతముడు ఆహార పానీయాలు వర్జించి, శరీరాన్ని శుష్కింప చేసుకుని తపస్సు చేయసాగాడు. రాత్రింబవళ్లు కీకారణ్యం మధ్య చీకటి గుహలో ఒంటరి జీవనం. జంతువులు దగ్గరగా వచ్చినట్లు తెలుస్తుండేది. దెయ్యాలు, భూతాలు వచ్చి భయపెట్టాయి. అయినా అతనిలో చలనం లేదు. భయం లేదు అందోళనలు దూరమైనాయి మనిషికి శరీరం మీద వ్యామోహం నశిస్తే భయానికి ఆస్కారం ఉండదు. మనస్సు బాధల వలయం నుండి విముక్తమవుతుంది అవి తన అనుభవంలో గ్రహించిన సత్యాలు. ఒక్కొక్కసారి నాలుక వెనక్కు మడిచి అంగిటికి ఆనించి కూర్చునేవాడు. అప్పుడు భయాందోళనలు జయించినట్లు అనిపించేది. ప్రాణం బిగపట్టడంవల్ల శరీరం తడిసి ముద్దయ్యేది. అయినా బాధ లేదు, భయం లేదు. శరీరంపైన వ్యామోహం లేదు, ధ్యాస లేదు. ఒకసారి శ్వాసను బంధించగా, చెవుల నుండి హోరుమన్న శబ్దం వెలువడింది అలాగే శరీరం బిగుసుకు పోయింది. చెవులకు భయంకర శబ్దాలు వినిపించాయి. తల పగిలిపోతున్న బాధ. పొట్ట విచ్చుకుని పగిలి ముక్కలైన వేదన శరీరం నిప్పుల్లో కాలిపోతున్నట్లు ఉండేది అన్ని బాధలు ఎదురైనా అధైర్యం లేదు. శరీరం ఎన్ని యాతనలకు గురైనా, హృదయ పద్మం కనలి పోలేదు, వసివాడ లేదు కొత్త స్పందన కలగలేదు. అలా శరీరాన్ని కష్టాల కాష్టంలో కాల్చుతూ బహుప్రయోగాలు చేయసాగ్గాడ్రు, మొదటి మూడు మాసాలు పర్వత గుహలలో గడిపాడు నాలుగవ నెలలో అయిదుగురు శిష్యులు దొరికారు. వారు ఉద్రక రామ పుత్ర శిష్యులు పూర్వాశ్రమంలో తను అమితంగా ఇష్టపదే కొండన్న వారిలో ఒకడు. సిద్ధార్థుడు వెళ్లి పోయిన తర్వాత కొండన్నకు ఆశ్రమంలో ఉండబుద్ధి కాలేదు ఉద్రకమహర్షి వద్ద నేర్చుకోవలసింది ఏమి లేదు. సిద్దార్టుని సాహచర్యంలో ఒక్క నెలలోనే తనకు అనేక అనుభవాలు కలిగాయి. కొండన్న మరో నలుగురు మిత్రులతో కలిసి సిద్దార్థుని అన్వేషిస్తూ బయలుదేరాడు ఇంతకాలానికి జాడ తెలిసింది. సిద్ధార్థునితో కలిసి ధ్యానం చేసుకోడానికి అనుమతి పొందాడు. కొండన్న వప్ర, బద్రిక, అశ్వజిత్స్‌ మహానామ, ప్రతిఒక్కరు, విడివిడిగా, దగ్గర దగ్గరగా ఉన్న గుహల్ని ఎంచుకున్నారు. ప్రతిరోజు ఒకరు (గ్రామంలోకి వెళ్లి ఆరుగురికీ సరిపడా భిక్ష తీసుకు వచ్చేవారు రోజులు గడుస్తున్నాయి, నెలలు దాటిపోతున్నాయి. ఆరుగురి కళ్లలోనూ మిణుకు మిణుకు మంటున్న ఆశాదీపాలు. ఫలితం శూన్యం. పురోగతి నాస్తి భగవాన్‌ బుద్ద త్రి

పర్వతాలు వదిలి, నైరంజర నదీ తీరంలోని ఉరువిల గ్రామానికి చేరి అక్కడ ధ్యానం చేయసాగారు. సిద్దార్టుని పరిస్థితి మరీ విషమించింది. అతనితో కలిసి ట్రతకడం అసాధ్యం అనిపించింది మిగిలిన అయిదుగురికి సిద్ధార్దుడు స్నానం చేయడు, బిక్ష తీసుకోడు ఆమరణ సత్యాగ్రహిలా తయారైనాడు శరీరం శుష్కించి ఎముకల గూడైంది ఒకనాడు రుద్రభూమిలో ధ్యానం చేస్తుండగా ఒక 'మెరుపు లాంటి ఆలోచన కలిగింది “శరీరాన్ని శుష్కింపచేయడం ఆత్మహత్యా సదృశం అది తపస్సు కాదు, ఆత్మాహుతి అవుతుంది”.

సాయంకాలమై్రైంది చల్లగాలి వీస్తోంది నదీ తీరంలో ఉండగా అనిపించింది: "మనిషి - అంటే శరీరం, మనస్సు. అవి రెండూ వేరువేరు కావు. శరీరాన్ని శుష్కింపచేస్తే మనస్సు క్షోభిస్తుంది. మనస్సుకు బాధ కలిగితే ఆబాధ శరీరం పైన ప్రభావం చూపుతుంది అవి స్పందన - ప్రతిస్పందనలు శరీరానికి పోషణ, సుఖం ఉంటే మనస్సుకు శాంతి లభిస్తుంది శరీరాన్ని అలక్ష్యం చేయడాన్ని మనస్సు అంగీకరించదు.” ఇ

అంతలో మరొక ఆలోచన వచ్చింది - అసలీ పూర్వసంప్రదాయాలను ఎందుకు పాటించాలి? ధ్యానం వల్ల కలిగే ఆనందాలకు భయపడడం ఎందుకు? ధ్యానానికి, ఆనందానికి వైరం ఏముంది? ధ్యానంతో శరీరం, మనస్సు శక్తి పొందవచ్చు గదా! శరీరాన్ని శుష్కింవచేయడం మనస్సును బాధపెట్టడం అనవసరం పాత బాధల్ని నివారించే ప్రయత్నంలో కొత్త బాధల్ని సృష్టిస్తున్నామా? కరోర తపస్సువల్ల ఆనందం బదులు బాధలు కలుగుతున్నాయా?

తన ధ్యానాన్ని ఆరోగ్యం పైన కేంద్రీకరించదలిచాడు ముందు శరీరం, మనస్సు ఆరోగ్యం పొందాలి. మర్షాడు ఉదయం భిక్షాపాత్ర చేతిలోకి తీసుకున్నాడు బయలుదేరాడు. “ఇంక ఎవరి బోధనలు అవసరం లేదు నాకు నేనే గురువుని” కొంచెం సేపు సేద తీర్చుకున్నాడు అంతలో నిద్ర ముంచుకు వచ్చింది. లేచేసరికి పండు వెన్నెల ఆకాశం నిర్మలంగా వుంది ఒక్కచిరు మేఘం లేదు. తన మనస్సు ఆకాశమంత నిర్మలంగా ఉంది అలాగే చల్లని వెన్నెలలో ఆకాశం దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు మళ్లీ.

ఉదయం పక్షుల కలకలంతో నిద్ర మేల్కొన్నాడు. సూర్యోదయంతో తనలో జాగృతి కలిగింది. కొత్త ఉత్సాహం, రాత్రి నిర్ణయాలు జ్ఞప్తికి వచ్చాయి మట్టి కొట్టుకున్న బట్టలు అసహ్యంగా ఉన్నాయి. ఒళ్ళంతా చీదర నిన్న సాయంత్రం నదీ తీరంలో ఒక శవాన్ని చూచాడు. శవాన్ని నది ఒద్దున ఉంచి వెళ్లిపోయారు. మూడవ రోజున వచ్చి ఖననం చేస్తారు. నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకున్నాడు. పుట్టుక, చావు ఎంత విచిత్రం శవానికి కట్టిన బట్ట ఊడతీశాడు. అది ఒక ల భగవాన్‌ బుద్ధ

యువతి మృత శరీరం. కాషాయ రంగు చీర అది. అది తీసుకుని నదికి చేరాడు. బట్టను తడిపి ఆరవేశాడు. శుభ్రంగా స్నానం చేశాడు. మనస్సు చల్ల బడ్డది బట్ట అరే వరకు స్నానం చేసి ఆ కొత్త బట్ట ధరించాలని గట్టు పైకి ఎక్కుతుండగా కళ్లు తిరిగాయి. నీరసం ఆవహించింది. నీళ్ల లోంచి బయటకు రావడానికి శక్తిలేదు. ఎంత శ్వాస పీల్చినా శక్తి రాలేదు. ప్రక్కన చెట్టు కొమ్మ ఒకటి నీళ్ల పైకి వాలి ఉంది ఆ కొమ్మను ఆసరా చేసుకుని ఒడ్డుకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు మధ్యాహ్నం వరకు కదలలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా లేచి ఉరువిల గ్రామం వైపు నడవసాగాడు కాస్త దూరం నడిచి, నిస్సత్తువతో ఊపిరాడక మళ్లీ పడిపోయాడు. స్పృహ లేదు. అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి అడవిలో గుడిలో దేవతకు నైవేద్యం తీసుకుపోతూ త్రోవలో పడి ఉన్న సిద్ధార్టుని చూచింది. గొంతులో (ప్రాణం కొట్టుకుంటోంది. తను దేవతకు నివేదనకై తీసుకుపోతున్న వాయసం అతని పెదాలకు అందించింది. రెండు చుక్కలు గొంతులోకి జారగానే కాస్త స్పృహ వచ్చి శ్వాస పీల్చుకున్నాడు. ఆమె ఇచ్చిన పాలు తాగాడు. లేచ్చి "కూర్చున్నాడు. ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు ఉపవాసాలు పనికిరావని. గృహన్సు వదలిపెట్టి, అరణ్యాన్ని ఆశ్రయించి, ఒకచెట్టు నీడలో ధ్యానం కొనసాగించాడు. మనసు మారింది. రోజులు మారాయి. ఇప్పుడు సిద్దార్ధునికి అన్న పానీయాలపట్ల అలక్ష్యం లేదు. రోజూ భిక్షకు వెళ్లి వస్తున్నాడు ఒక్కొక్క రోజ్లు సుజాత భోజనం తెస్తుంది అలా కాలక్షేపం. ధ్యానం సాగుతోంది నిశ్చింతగా, నడకలో ధ్యానం, పడకలో ధ్యానం, మనసులో ధ్యానం, న్మిదలో ధ్యానం, సర్వం ధ్యానమయం. నదీ తీరాన నడుస్తున్నా ధ్యానమే. కూర్చున్నా ధ్యానమే. కళ్లు మూసినా తెరచినా ధ్యానమే. మిగిలిన ధ్యానాలలో చైతన్యం ఉంటుంది. హృదయం మాత్రం ఛ్యాన మగ్న మవుతుంది. తనకు సర్వం ధ్యానమయం, జగమంతా ధ్యానమయం. ప్రతిరోజు సాయంత్రం నైరంజర నదికి స్నానానికి వెడతాడు. సంప్రదా యాలు లేవు. నియమాలు, నిబంధనలు లేవు. పూర్వ పద్ధతులు లేవు. గురు సంప్రదాయాలన్నీ పక్కన పెట్టాడు. గురువుల బోధనలు తెరమరుగైనాయి. తనదైన మార్గంలో సత్యాన్ని (గ్రహించాలి. విజయమైనా, అపజయమైనా తనదే బాధ్యత. తన ధ్యానమే తనను నడిపిస్తుంది. మార్గం చూపిస్తుంది. హృదయం నిర్దేశించినట్లు ముందుకు సాగడం మంచిది. దాంతో అవగాహన పెరిగింది అంతర్వీక్షణ పెరిగింది. గమనిక తీవ్రమైంది. బగవాన్‌ బుద్ధ జి

బాహ్య ప్రపంచాన్ని విస్మరించగానే కోరికలు నశించాయి. తనలోకి నిష్రమించ గలుగుతున్నాడు అయినా లోక ధర్మం ఉంది. సంఘ ధర్మం వుంది ధర్మాన్ని, సంఘాన్ని కాదనరాదు. ఫలాన దానిపై మనసు పెట్టి ధ్యానించాలని లేదు శ్వాసపైన, మనసుపైన, శూన్యంపైన ధారణ చేయవచ్చు. కాలికి తగిలిన ప్రతిరాయి బాధిస్తుంది అలాగే పప్రతిధ్యానం విముక్తికి మార్గం చూపుతుంది.

లోగడ ధ్యానం చేస్తున్నపుడు శరీరంపైన ధ్యాస ఉండేది ఇప్పుడు శరీరాన్ని ఇంద్రియాలను విస్మరించి భావాలపైన ధ్యానం చేయసాగాడు. ఆపైన ధ్యానం అనుభూతుల పైకి మళ్లింది. అనుభూతులన్నీ మనస్సు పరిధిలోనివే. తనువు అంటే మనస్సు, శరీరం. శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణం విశ్వజ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక అణువుపైకి అంతర్జష్టిని సారించగలిగితే విశ్వరహస్యాన్ని ఛేదించవచ్చు. సత్యాన్ని ఆవిష్కరింపచేసుకోవచ్చు. ప్రతి అణువు 'బ్రవ్మాందానికి ప్రతిరూపమే, ప్రతిబింబమే. అణువులో బ్రహ్మాండం ఇమిడి ఉంటుంది. అణువుల సముదాయమే (బ్రహ్మాండం. అణువు లేకపోతే సృష్టిలేదు. సృష్టి లేనిచోట అంతా శూన్యమే.

శరీర ధర్మాలు అన్నీ కలిస్తేనే ఆత్మ . ఆత్మ అన్నది వేరే లేదని, ఉండదని సిద్దార్టుని విశ్వాసం. వేదాలు ప్రవచించిన 'ఆత్మ' లేనే లేదు. 'ఆత్మ' అర్ధం లేనిది, అర్ధం కానిది, కనిపించినది. ఎవరికీ 'ఆత్మ దర్శనం అయ్యే అవకాశమే లేదు. లేని ఆత్మ దర్శనం ఎలా అవుతుంది ఎవరికైనా? సృష్టించబడిన వేటికీ “ఆత్మ ఉండదు సిద్దార్టుని 'అనాత్మ' భావన పూర్వ విశ్వాసాలను దెబ్బతీసింది. 'అనాళ్మ' భావనతో సిద్ధార్థుడు 'శూన్యం' పైన భావన ధారణ చేసి, పిప్పల వృక్షం నీడలో తపస్సు సాగించాడు. తనలో సరికొత్త భూమికలు ఆవిష్ఫృతమైనాయి. పొరలు పొరలుగా చీకట్లు ప్రిదిలిపోయి, వెలుగురేఖలు కనిపించసాగాయి

సిద్ధార్థుని అయిదుగురు మిత్రులకు విసుగుపుట్టింది సిద్ధార్థుడు అనుసరించే పద్ధతి అర్ధం కాలేదు తినడం, నదీ తీరంలో తిరగడం, అడవిలో పడుకోవడం పైగా సిద్ధార్థుడు ఆ పిల్ల 'సుజాతితో ఊసులాడడం వారికి నచ్చలేదు. కొండన్న మిగిలిన వారితో అన్నాడు, “ఈ యతిని నమ్ముకుంటే మన గతి అధోగతి అయ్యేట్లుంది. ఇప్పుడు ఆయన సన్యాసి కాదు శరీరాన్ని పోషించడంలో ఉన్న (ద్ద తపస్సు పైన లేదు. ఆయన ఏం సాధిస్తాడో నాకు తెలియడం లేదు”

అయిదుగురు తనను వదలి వెళ్లిపోయినా సిద్ధార్థుడు పట్టించుకోలేదు. తనకు ధ్యానంలో కొత్తకొత్త అనుభవాలు కలుగుతున్నాయి. సత్యాలు తెలుస్తున్నాయి. లోకం ఆనందంగా కనిపిస్తోంది. “అదే నాకు కావాలి. నా కలలు నిజం కావాలి. త్రి భగవాన్‌ బుద్ధ

స వా?! [. న! ॥ =. రాజరికాన్ని వీడి యట లతా నల య లు స? (పి సల బ్‌ న బై | సఖీ అంతర్వీక్షణం సు నట ల గ, న 0 క. స వ య. యనే! శ ॥ వ ఎ ల్‌ో గ్‌ ఇల 4 ము. ము రట టను త ( శ్‌ వ ॥ 7 న. ట్ర... హం +. సవ. [క ము ఎ టంట పో గై వష స సమన ననే! కటట. జ్ఞానోదయం

నేను ధ్యానంలో పొందుతున్న ఆనందం, తృప్తి లోకంలో ప్రతి ఒక్కరిలోకి ఒదిగి పోవాలి మిత్రులు అపార్ధం చేసుకున్నారు. నమ్మించే ప్రయత్నం అనవసరం ముందు నాకు సత్యదర్శనం అయితే, నేను లక్ష్యాన్ని చేరితే, అప్పుడు లోకానికి నా జ్ఞానం పంచవచ్చు”.

తర్వాత కొద్ది రోజుల్లోనే అనేక అనుభవాలు కలిగాయి చాలా ప్రగతి సాధించాడు. అప్పుడే సిద్ద్ధార్థునికి స్వస్తితో పరిచయం కలిగింది సిద్దార్థునికి ఆ సమయంలో సహకరించినవారు సుజాత, స్వస్తి.

(6)

అప్పుడు స్వస్తి చిన్నవాడు.

పదకొండు సంవత్సరాల వయసు వాడు.

అంత చిన్నవాడికి సిద్దార్థునితో పరిచయం ఏమిటి? సుజాతతో పరిచయం లాంటిదే స్వస్తితో పరిచయం సిద్దార్భుని జీవితంలో సుజాతది స్మరణీయ పాత్ర. అలాగే స్వస్తిది సుజాత ఉరువిల [గ్రామంలో పెద్ద కుటుంబానికి చెందిన పిల్ల. అతిపేద కుటుంబానికి చెందిన పిల్లవాడు స్వస్తి, అతని తల్లి చనిపోయింది. ముగ్గురు పిల్లల్ని పోషించవలసిన బాధ్యత ఆ పిల్లవానిపైన పడ్డది. రామ్‌లాల్‌ ఒక మోతుబరి. వారి పశువుల్ని మేపుకువచ్చే పని స్వస్తిది. నాలుగు గేదెలు, ఒక దూడ.. వాటిని అడవికి తోలుకు పోయి మేపుకు రావాలి. చిల్లర మల్లర ఇంటి పనులు చేస్తాడు. పెట్టింది ఇంటికి తీసుకుపోయి మిగిలిన పిల్లలతో కలిసి తినడం ఒకపూట తింటే ఒకపూట పస్తు.

నదిలో గేదెల్ని శుభ్రంగా కడిగి అడవిలోని పచ్చిక బయళ్లలో మేతకు వదిలి ఓ చెట్టు క్రింద కూర్చున్న స్వస్తికి అల్లంత దూరంలో మరో చెట్టు నీడన ఒక మనిషి కనిపించాడు స్వస్తికి ఆశ్చర్యం వేసి, దగ్గరకు వెళ్లి చూచాడు. తమ ఊరివాడు కాదు. పైగా రంగుబట్ట కట్టాడు. చెట్టుకింద పెద్ద మహర్షిలా కళ్లు మూసుకు కూర్చున్నాడు మహర్షి అయితే దండ కమండలాలు ఉండాలి కదా! అవి లేని కొత్త రకం స్వామి ఈయన ఎవరో? ఆ స్వామి కూర్చున్న తీరు బాగుంది. ఆయన అందంగా ఒక రాజకుమారుడు తపస్సు చేస్తున్నట్లుగా ఉంది. రెండు పాదాలను తొడలపైకి లాగి, వెన్ను నిటారు చేసి, కళ్లు మూసుకుని ఏం చేస్తున్నట్లు? కళ్లు సగమే మూసుకున్నా ప్రపంచాన్ని గమనిస్తున్నట్లు లేదు. సగం లోపల, సగం బయట చూస్తున్నాడా! గమ్మత్తుగా వుంది ఆ స్వామి వాలకం. ఇయన గారిని చూస్తుంటే తన మనస్సు చల్లబడ్డది_ హా డ& ఏమిటో తన కష్టాలు

తయుదాయ 51 జ స్స (గ్రంధాలయ స్వైగవాన్‌ బుద్ద యు త క్ట

తీరినంత ఆనందం! ఆయన్ని ఇంకా ఇంకా చూడాలనిపించింది అలా చూస్తూ ఉండిపోయాడు, సిద్ధార్థుడు కళ్లు విప్పాడు. కాని స్వస్తిని చూడలేదు. కాళ్లు సాచి, మోకాళ్లు సవరించుకుని, లేచి నిలబడి, నడవసాగాడు. అటుగా వెళ్లడం వల్ల స్వస్రిని చూచే వీలు కలుగలేదు. కొంతదూరం, వెళ్లి వెనుతిరిగి చూచాడు స్వస్తిని చూచి మందహాసం చేశాడు. ఎంత అందంగా వుంది ఆ నవ్వు! ఎంత ఇష్టంగా నవ్వాడు! తనను అంత ఇష్టంగా చూచినవారు లేరు. ఆ నవ్వులో (పేమ, కరుణ, అప్యాయత పొంగి పొరలినట్లుంది. ఎవరో ముందుకు తోసినట్లు స్వస్తి ఆయన వైపు నడిచాడు తాను అస్పృుశ్యుడు. పెద్దవారికి దగ్గరగా వెళ్లకూడదు. స్వస్తి నడక ఆగింది. సిద్ధార్టుడే ముందుకు వచ్చి స్వస్తి భుజం మిద చేయి వేశాడు. స్వస్తికి నోట మాట రాలెదు. పెద్దకులం వారెవరూ తనను స్పృశించరు. ఆ స్పర్శ తనకు ఎంతో ఆనందం కలిగించింది. పులకించాడు “భయపడకు” ఆయనే అభయమిచ్చాడు. ఆయన స్వరం వినగానే భయం తీరిపోయింది. ఆయన స్వనం సుస్వన్వం “స్వామో! మిరంటే నాకిష్టం” అన్నాడు స్వస్తి. “న్సీవన్నా నాకు అంతే ఇష్టం. నువ్వు ఉండేది?” “నన్ను తాకారు స్వామి. మిరు మైలపడ్డారు” భయంగా అన్నాడు. 4! నళ ళం ఆక "నేను ముట్టుకోవడం వల్ల నీవు మైల పడ్డావా? సిద్ధార్థుని ప్రశ్న సబ అర్థం కానట్లు మొహం పెట్టాడు. పో “మైల అంటే ఏమిటి? నీవు మనిషివి, నేను మనిషిని. మనిషికి మనిషికి మధ్య మైల ఉండదు ఎవరివల్ల ఎవరూ మైల పడరు. జనం చెప్పే 'మైల మాటలు? నమ్మకు”! సిద్ధార్థుడు స్వస్తిని తనతో అరణ్యంలో కొంతదూరం తీసుకువెళ్లాడు, “నీ పేరు చెప్పలేదు? నీ ఊరేది? ఏం చేస్తుంటావు?” “న్వామో నన్ను స్వస్తి అంటారు. ఉరువిల మా ఊరు... అమ్మానాన్న లేరు. అయ్యా మిరు?” “నాపేరు సిద్దార్ధ. మా ఊరు చాలా దూరం ఈ అరణ్యమే ప్రస్తుతంనా ఊరు”. “మిరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా? సన్యాసులా?” తల ఊపాడు సిదార్లుడు ధిథఖ బగవాన్‌ బుద్ద 52

సన్యాసులు కొండల మాద గుహల్లో ఉంటారని విన్నాడు ఉరువిల గ్రామంలో ఎవరూ స్వస్తిని అంత ఇష్టంగా పలకరించరు. ఇప్పుడు తనను ప్రేమగా పలకరించే ఒకస్వామి దొరికాడు. ఆయనకి ఏదైనా ఇవ్వాలి. ఏమివ్వగలడు తను. “స్వామో నేను పేదవాదిని. మాకేదైనా ఇవ్వాలని వుంది”. సిద్ధార్దుడు నవ్వాడు “నీవు గేదెల కోసం గడ్డి తెస్తావు కదూ. నాకూ కొంచెం తుంగ తెచ్చి పెట్టు. ద్యానానికి ఒకచాప అల్లుకుంటాను ...” స్వస్తి ఒక “పని రెల్లుగడ్డి తెచ్చి ఇచ్చాడు. సిద్ధార్థుడు (ప్రేమగా అందుకున్నాడు. “నీవు మంచివాడివి. రేపూ వస్తావుగా” స్వస్తి వెళ్లిపోయాడు. రేపన్నది తొందరగా వస్తే బావుండును స్వస్తి జీవితంలో మొదటిసారిగా గుండెనిండా ఆనందం నింపుకున్నాడు శ శే 2 మర్నాడు ప్రొద్దుటే స్వస్తి అడవికి బయలుదేరాడు, ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుందామా. అని తమి పశువుల్ని పచ్చికబయలులో వదలి అదవిలోకి పరుగుతీశాడు చెల్లెలు బాల మధ్యాహ్నం తినడానికి అన్నం మూటకట్టి ఇచ్చింది కొత్త మిత్రునితో కలిసి తినాలి ఆయన తను తెచ్చిన అన్నం తింటాడా? తను అంటరాని కులం వాడు. ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు అంత దూరంలో సిద్ధార్దుడు కనిపించాడు - పిప్పల వృక్షం నీడలో. ఆయన ప్రక్కన ఓ ఆడపిల్ల కూర్చుని ఉంది తన వయసే ఉండవచ్చు కాని గొప్పింటి పిల్లలా ఉంది. పట్టు పరికిణి, జాకెట్‌ వేసుకున్నది ఎవరో భాగ్యవంతుల బిడ్డ. ఈ స్వామికి ఆ పిల్లతో ఎట్లా పరిచయం? అంతదూరంలో వస్తున్న స్వస్తిని చూచి “రా స్వస్తో అని" ఆహ్వానించాడు సిద్ధార్థుడు ఆ పిల్లను ఎక్కడో చూచిన జ్ఞాపకం ఉంది. సిద్ధార్థుని ఎదురుగా, అరిటాకులో భోజనం వడ్డించి ఉంది. దానిని రెండు ఆకులలో పంచాడు “స్వస్తీ, నీవు ఇంకా తినలేదు కదూ! “లేదు స్వామో!” “రా. ఇద్దరం కలిసి తిందాం” “నేను సంకటి తెచ్చుకున్నాను స్వామి, చెల్లి మూట కట్టి ఇచ్చింది” అన్నాడు తన మూట చూపుతూ. “రా .. అది, ఇది కలిపి తిందాం”. 53 భగవాన్‌ బుద్ధ

సిద్ధార్థుని విస్తరివైపు చూస్తూ “మో భోజనం బావుంటుంది స్వామి. అది గొప్పోళ్ల భోజనం”

“ఇది సుజాత తెచ్చింది. స్వస్తీీ ఈ అమ్మాయి రోజూ నా కోసం వస్తూ భోజనం తెస్తుంది. మంచి అమ్మాయి!”

ఆ అమ్మాయి పేరు సుజాత. ఆమె తనకంటే రెండు మూడేళ్లు పెద్దదిగా వుంది. ఆమె కళ్లలో ఆకర్షణ ఉంది. మెరుపు ఉంది. తింటూ ఆలోచించాడు.

“అమ్మాయిగారూ, మిమ్మల్ని నేను చూచాను. మో పేరు సుజాత అని తెలియదు”.

“నీ పేరు స్వస్తి కదూ! నువ్వు నాకు తెలుసు”.

సుజాత కుండలోని మంచినీరు గ్లాసులో పోసి సిద్ధార్టునికి అందించింది.

సిద్ధార్ధుడు “ముందు మోరు తాగండి - నేను తర్వాత”,

స్వస్తి గ్లాసు అందుకోడానికి చేయి చాపబోయి వెనక్కు తీసుకున్నాడు. అంతలో గ్లాసు తీసుకుని గటగట తాగాడు. తర్వాత సుజాత తాగింది. క్ర అంటరాని వాడు తాగిన గ్లాసుతో తను నీళ్లు తాగడం అదే మొదటిసారి. సిదారుడు రాకుమారుడు ఆయన తాగగా లేంది తను తాగితే తప్పేమిటి అనుకుంది "

సిద్ధార్థుడు ఇద్దరి తలలు నిమిరి, “పిల్లలూ! పుట్టుకతో మనుషులంతా ఒక్కటే! ఎవరికీ పుట్టుకతో కులం లేదు ప్రతి మనిషి కన్నీరు ఉప్పగానే ఉంటుంది. ప్రతివాడి రక్తం ఎర్రగానే ఉంటుంది. మనుషుల్నీ కులాలుగా విభజించడం పెద తప్పు. అలా చేయడం వల్లనే అసమానతలు, అసూయలు, ద్వేషాలు ఏర్పడు తున్నాయి. ఇది నేను ధ్యానంలో తెలుసుకున్న సత్యం”.

సుజాత అన్నది ; మేము మి విద్యార్థులం, మి పిల్లలం. మిరు చెప్పేది నమ్ముతాం. ఎవరూ మా అంత సులభంగా చెప్పరు. పవిత్ర గ్రంధాలలో చెప్పారని మనుషుల్ని వేరు చేస్తారు.

సిద్ధార్థుడు : అవును సుజాతా. ఆ విషయం నాకూ తెలుసు ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సత్యం సత్యమే కదా! లక్ష మంది ఒక అసత్యాన్ని ప్రచారం చేసినా ఆది అసత్యమేగాని, సత్యం కాదు. సత్యాన్ని నమ్మడానికి చాలా ధైర్యం కాచాలి. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను, వినండి!

“అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు మా ఉద్యాన వనంలో అటు ఇటు తిరుగుతున్నాను. ఆకాశం నుండి ఒక కొంగ కింద పడ్డది విలవిలా కొట్టుకో సాగింది. ఎవరో దానిని బాణంతో కొట్టారు. దానిని నా చేతుల్లోకి తీసుకొని, భగవాన్‌ బుద్ధ ర్‌4

బలవంతంగా 'అంబు" లాగాను రక్తం కారసాగింది. దానిని సుందరికి చూపించాను. ఏవో ఆకులు తెచ్చి నూరి పసరు పూసి కట్టు కట్టింది. చలికి, బాధకు కొంగ వణుకుతోంది నాచొక్కా విప్పి దానికి కప్పాను మంట దగ్గర చలి కాచాను”.

అక్కడ ఆపి, “స్వస్తీ, నేను ఎవరో నీకు తెలియదు కదూ! నేనొక రాజకుమారుడిని మాది శాక్యరాజ్యం. కపిలవస్తు మా నగరం శుద్ధోదన మహారాజు నా తండ్రి. మాది గౌతమ మహర్షి సంప్రదాయం మా తండ్రిగారు నన్ను సిద్ధార్థా అని, గౌతమా అని పిలుస్తుంటారు అంటే, నాకు గౌతముడు అని మరో పేరు ఉంది. ”

“అంతలో దేవదత్త అక్కడకు వచ్చాడు అతని చేతిలో విల్లంబు, బాణాలు ఉన్నాయి. విషయం అర్ధమైంది. తనే ఆ కొంగను కొట్టాడు ,

“సిద్ధార్థా! ఇక్కడ ఒక కొంగ పడ్డది చూచావా?”

నేను సమాదానం చెప్పేలోగా కొంగ అతని కంటపడ్డది.

“అది నాది” అన్నాడు అధికారికంగా

“నీవు తీసుకోవడానికి నేను ఒప్పను. దానిని నేను రక్షించాను”

“కొట్టింది నేను కదా! కొట్టిన వాడికి చెందాలి గానీ, దొరికించుకున్న వాడికి కాదు”,

“కావచ్చు అది ఆకాశంలో స్వేచ్చగా ఎగురుతున్నప్పుడు అది నాదీ కాదు, సీదీ కాదు”

ఇద్దరికీ వాదన జరిగింది. నేనన్నాను -

“చూడు, సోదరా! ప్రేమించే వాళ్లకు కలిసి జీవించే హక్కు ఉంటుంది ద్వేషించే వారు శత్రువు లవుతారు. నీవు దానిని చంపదలిచావు కనుక మిరు శత్రువులు నేను దాని ప్రాణాలు కాపొదాను ప్రేమిస్తున్నాను. దానికి కావలసింది నేను గాని, నీవు కావు.

సుజాత ఆనందంతో చప్పట్లు కొట్టింది, “గురువుగారూ ! మోరు చెప్పిందే నిజం”.

సిద్ధార్దుడు స్వస్తి వైపు చూచి, “నీకేమనిపిస్తుంది స్వస్తీ అని అడిగాడు.

“స్వామీ ! మిరు చేసిన పని మంచిదే కానీ అందరూ అది దేవదత్తునికి చెందాలంటారు", క5్‌5్‌ బగవాన్‌ బుద్ద

“అంటే 'న్యాయం వేరు - సత్యం వేరు అంటావు. ఏది ధర్మం? ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది స్వస్తే.”

తర్వాత జరిగిన కధ వినండి :

“మా వివాదం మా మధ్య పరిష్కారం కాలేదు పెద్ద వారికి విన్నవించాం. ఆ రోజు రాజుగారి ఆస్థానంలో, మా వివాదం విచారణ. నేను కొంగను తీసుకుని దర్బారుకు వెళ్లాను. దేవదత్త బాణం, విల్లంబులతో వచ్చాడు. మా సమస్యను వివరించి తీర్పు చెప్పమని అర్జించాం. న్యాయమూర్తులు చాల సేపు చర్చించారు కాస్‌ తేల్చి చెప్పలేకపోయారు. సామాన్య జనానికి తీర్చు చెబుతారు. ఇది రాజపుత్రుల తగాదా. ఎటు వైపు తీర్పు చెబితే పషమవుతుందో నని భయం మా నాయనగారు, అంటే మహారాజు గొంతు సవరించుకుని ఏదో తీర్చు చెప్పబోయారు. మంత్రులు, న్యాయమూర్తులు ఆత్రంగా ఎదురు చూడసాగారు.

కెద్ధార్థుని వాదనలో బలం ఉంది. అతనిదే న్యాయం అనిపిస్తోంది.”

దేవదత్తునికి కోపం వచ్చింది. అయినా చేయగలిగింది లేదు కదా! ఏమైనా

ఒక ప్రాణాన్ని రక్షించానన్న తృప్తి నాది. సుజాతా, లోకంలో 'కరుణితో చూచే వారు తక్కువ కరుణ, ్రేమ లేన్న కారణంగానే మనుషుల్లో క్రౌర్యం, ద్వేషం ప్రబలుతుంటాయి. అది కారణంగాన్సే బలవంతులు బలహీనుల్ని అణచి వేస్తుంటారు. ఆ రోజున నా వాదనలో ధర్మం ఉంది అధికులు అమోదించినా అసత్యం సత్యం కాదు. సత్యాన్ని రక్షించడానికి ధైర్యం కావాలి. ధర్మదీక్ష అవసరం.” “తర్వాత ఆ కొంగను ఏం చేశారు గురువుగారూ?” సుజాత అడిగింద్రి

“నాలుగు దినాలలో దాని గాయం మానింది. స్వేచ్చగా ఆకాశంలోక్తి వదిలాను

పిల్లలిద్దరి ముఖాలు గంభీరంగా మారాయి.

“మోరు ఇళ్లకు వెళ్లండి. మా వాళ్లు ఎదురు చూస్తుంటారు అన్నట్లు స్వస్త్రే నిన్న నీవిచ్చిన దర్చలతో ఇదిగో చాప తయారు చేశాను. మెత్తగా బావుందయ్యా! రాత్రి, ప్రొద్దున దీనిపైన కూర్చునే ధ్యానం చేశాను. ఇకపైన నా ధ్యానం దీనిపైనే. నీవు చాలా మంచి సహాయం చేశావు వెళ్లిరండి ”

నమస్కారం చేసి బయలుదేరారు సిద్దార్టుని పసినేస్తాలు ఇద్దరు

శ న 7 పిల్లలు వెళ్లిపోయారు. చీకటి పడేవరకు నదీ తీరంలో గడిపి, చంద్రోదయ వేళకు చెట్టుక్రిందికి చేరాడు అరణ్యం వెన్నెల దుప్పటి కప్పుకుని, ప్రశాంతంగా భగవాన్‌ బుద్ద 56

నిద్రలోకి జారుతోంది సిద్ధార్థుడు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో శరీర స్పృహ దాటి అంతర్ముఖుడైనాడు. అంతరవలోకనంలో సాధన చేయసాగాడు. తనలోని ప్రతి కణం, ప్రతి అణువు మహా ప్రవాహంలోని బిందువులా కనిపించింది. ఆ ప్రవాహంలో జననం, అస్తిత్వం, మరణం అనేవి మూడు పాయలు. అది త్రివేణీ సంగమం ఈ శరీరంలో శాశ్వతంగా మిగిలేది ఏమో కనిపించలేదు. అంతా శూన్యం. ఆత్మకోసం అన్వేషణ సాగించాడు. ఎక్కదా ఆత్మ జాడ తెలియలేదు శరీరంలో ఆత్మస్టానం ఏది? దాని తావలం ఎక్కడ? జీవన ప్రవాహంలో అన్ని అనుభూతులు కొట్టుకుపోత్తున్నాయి. ప్రతి అనుభవం ఒక కెరటం, ప్రతి అనుభూతి అనుభవంలో లయించి పోతోంది అనుభవాలు, అనుభూతులు కలగలిసి జననం, అస్తిత్వం, మరణంగా రంగులు మారుతున్నాయి. వాటి రాపిడికి ఎగిసి పడుతు న్నాయి. ఆనందాలు, విషాదాలు, అనుభవాలు, అనుభూతుల ఉద్భతికి, రాపిడికి పుట్టుకొస్తున్నాయి. విషాదాలు, బాధలు, ఆనందాలు అవీ క్రమంగా జీవన ప్రవాహంలో మునిగి అడుగుకు చేరుతున్నాయి

తర్వాత ధ్యానంలో కేంద్రీకరణ వైపు దృష్టి సారించాడు. మొదట మొదట ధ్యానంలో కేంద్రీకరణ ఎంత అవసరమో, తర్వాత్తర్వాత అంత అనవసరం. ఏకాగ్రత మొదట ఎంత ముఖ్యమో తర్వాత శూన్యం కావడం అంత ముఖ్యం. అనుభూతుల్ని శరీర ధర్మాలకు దూరం' చేయగలిగాడు. అవగాహన సక్రమంగా సాగితే “సత్యం” గోచరమవుతుంది. సత్యానికి మార్గం దొరుకుతుంది. ప్రజలు అవగాహన లేనికారణంగానే అష్టకష్టాలు పడుతున్నారు. అవాస్త్రవాన్ని వాస్తవంగా భమిస్తున్నారు. అశాశ్వతమైనది శాశ్వతంగా భావిస్తున్నారు. శూన్యాన్ని ఆత్మగా అపార్ధం చేసుకుంటున్నారు. జనన మరణాలు లేని స్థితికి ఆరాటపడుతున్నారు. జననానికి సంబరపడుతున్నారు. మరణానికి రోదిస్తున్నారు అవిభక్తమైన సత్యాన్ని చెక్కలు ముక్కలు చేస్తున్నారు. +

తర్వాత గౌతముని వీక్షణ మనోయవనికల్ని దాటి, మనఃస్థితుల పైకి పోయింది. ఆ భావనలే అన్ని బాధలకు కారణాలు, భయం, కోపం, 'తాపం, ద్వేషం, మూర్ధత్వం, అసూయ, అజ్ఞానం, లోభత్వం- వీటి మూలాల్ని కనిపెట్ట గలిగాడు. అది అంతర్‌ అవగాహన వల్ల సాధ్యమైంది ఆలోకన వల్ల సిద్ధించింది సూర్యుని తేజస్సు వంటి అంతర్జ్యోతి వెలుగులో వాటిని సమిక్షించాదు. మానసిక వైకల్యాలు అవి. అన్నింటికి మూలహేతువు అజ్ఞానం మనశ్చర్యలన్నీ అజ్ఞానం పండించిన ఫలాలు. వెలుగు లేకపోవడంవల్ల చీకటి వ్యాపిస్తోంది. స్వేచ్చ పొందడానికి మనిషి తనలోని అంధకారాన్ని తొలగించుకోవాలి. హృదయంలోకి దూసుకుపోతున్న కొద్దీ చీకట్లు చీలి వెలుగులు కనిపిస్తాయి. ప్రత్యక్షంగా ఎవరికి 57 భగవాన్‌ బుద్ద

వారు అనుభవించాలి. ఒకరి జ్ఞానం మరొకరికి ఉపకరించదు. ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్షానుభవం ముఖ్యం ... ప్రతీక్ష ఉండాలి తప్ప, వివక్ష పనికి రాదు దానికి బుద్ధితో, వివేకంతో నిమిత్తం లేదు. గతంలో గౌతముడు భయం, ఆందోళన, కోపం, లోభత్వం పరిహరించ డానికి అనేక ఉపాయాలు అన్వేషించాడు. అనేక మార్గాల ప్రయత్నించాడు. ఏ మాత్రం ఫలితం కనిపించలేదు. ఆ ఉపాయాలన్నీ ఉన్నవాటిని అణచడానికే పనికొచ్చాయి తప్ప సమూలంగా తొలగించడానికి వలను పడలేదు. మూలకారణం అజ్ఞానం. మనిషి అజ్ఞానం అనే అంధకారం నుండి బయట పదడనిదే విముక్తి సాధ్యపడదు. సూర్యోదయం అయితే తప్ప చీకట్లు సమసిపోవు, అది సిద్ధార్టుని అన్వేషణ ఫలితం, అంతర్జృష్టికి అందిన సత్యం. తనలో ఒక ఆనందహేల. ఆకాశం వైపు దృష్టి సారించాడు. ఒక పిషల పత్రం గాలికి ఊగుతూ కనిపించింది. తనను పిలుస్తున్నట్లు అనిపించింది. వెళ్లి చూచాడు. దానిలో సూర్యుడు, నక్షత్రాలు కనిపించాయి. సూర్యరశ్మి లేనిది ఆ పళత్రానికి జీవం ఉండదు. వెలుగు, వేడి సోకనిది పత్రం పచ్చగా ఉండదు, అ పత్రంలో మేఘ చలనం ఉంది. మేఘాలు లేకపోతే వర్షం కురవదు. చెట్టు బ్రతకదు. ఆకులు వేయదు. పూలు పూయదు. ఒక్క ఆకులో ఎన్ని ఆధారాలు! అలాగే భూమి, ఆకాశం, కాలం, మనస్సు- అన్నీ పరస్పరాధీనాలు. ఆ నాలుగు ఆ చిన్ని ఆకులో ప్రతిబింబిస్తున్నాయి. సృష్టి యావత్తు సిద్ధార్టుని లోచూపుకు ఆక్రులో కనిపించింది. ఓహ్‌!” ఇదీ సృష్టి రహస్యం. మనం అనుకుంటాం వసంత బుతువులోనే చెట్లు చిగురిస్తాయని. సిద్రార్తుని అవగాహనలో ఆకు సూర్యరశ్మిలో, మేఘంలో, చెట్టులో ఎప్పటి నుండో ఉం దని. అకు కొత్తగా పుట్టింది కాదు. వాటివాటి సమ్మేళనంతో రూపుదిద్దుకున్నది. ఏద్ద జన్మించడం జరగదు. మరణించడం జరగదు. రూపాంతరం చెందుతుంది. వికేంద్రీకరణ జరుగుతుంది. మనిషీ అంతే. జనన మరణాలు వికేంద్రీకరణాలు, పరిణామం సహజాతి నవాజ కృతులు ఒకదాని కారణంగా మరాకటి ఏర్పడుతుంది. ఒకదాని కారణంగా మరొకటి పరిణామం చెందుతుంది నిజానిక్తి ఉన్నది లేదు, పోయిందీ లేదు. అన్నీ ఉండీ లేనట్లే! స్వేచ్ళకు రెండు ప్రాధమిక సూత్రాలు తెలుసుకున్నాడు అనాత్మ, పరస్పరా ధీనత. మేఘాలు ఏర్పడుతున్నాయి, వర్షిస్తున్నాయి. అవీ పుట్టడం లేదు, లయించడం లేదు. పరిణామంలో మార్పులు చెందుతున్నాయి. మానవశరీరం నదీ సదృశం, భగవాన్‌ బుద్ధ 58

మన శరీరాల్లో ఎన్నెన్నో నదులు ప్రవహిస్తున్నాయి మన భావాలు, ఆలోచనలు, అనుభూతులు, మనుక్రియలు, చైతన్యం అన్నీ ప్రవాహాలే. అన్నీ అశాశ్వతాలే. అశ్వాశతత్వం పై భావన చేస్తే, ధారణ చేస్తే వాటి నిజం తెలుస్తుంది. నిజం వెనుక దాగిన సత్యం తెలుస్తుంది. మేఘాలు వర్షిస్తే శూన్యం అయినట్లు మనిషి తనలోని ప్రవాహాలను నిలుపుచేస్తే శూన్యం అవుతాడు. తన అశాశ్వతత్వాన్ని తనలోని శూన్యాన్ని మేఘం గుర్తిస్తుందా? లేదు.

పిప్పల తరుచ్చాయలో ధ్యానం రోజు రోజుకు తీవ్రం అవుతున్నది అవగాహన పెరుగుతున్నది. హృదయ కవాటాలు ఒక్కటొక్కటిగా తెరుచు కుంటున్నాయి. కొత్త లోకాలు, కొత్త సత్యాలు తెలుస్తున్నాయి. శరీరం, మనస్సు, విశ్వం దైతన్యంతో నిండిపోతున్నాయి. ఆనాడు తెల్లవార్లు ధ్యానంలోనే గడిపాడు.

ధ్యానంలో చిత్రమైన భావాలు కదలాడాయి. తనకు జ్ఞానోదయం అవబో తున్నట్లు అనుభూతి కలిగింది. తను ఒక ప్రక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు... తన మోకాళ్లు హిమాలయాన్ని స్పృళిస్తున్నాయి. ఎడమకాలు తూర్పు సముద్రాన్ని చుట్టింది. కుడికాలు పశ్చిమ సముద్రం వరకు సాగింది. పాదాలు దక్షిణ సముద్ర తీరం చేరాయి,

మరొక అనుభూతి. బండి చక్రం అంత పద్మం తన నాఖభినుండి పుట్టి ఆకాశంలో మేఘాల వరకు ఎదిగింది. మరొకసారి రకరకాల పక్షులు నాలుగు వైపుల నుండి తన వైపు దూసుకువచ్చాయి. ఇవన్నీ తనకు త్వరలో జ్ఞానోదయం కానున్న శుభసూచన లనిపించింది.

ఆ రోజున మనసు చాలా ఉల్లాసంగా ఉంది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది. పాదాలు నేలను తాకటం లేదు. కొంతతదవు నదీ తీరంలో నడిచాడు. కెరటాలను తదేకంగా గమనించాడు. స్నానం చేసి తన తపోసీమకు చేరుకున్నాడు. పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అరణ్యం ప్రశాంతంగా, సమాధిలోకి జారిపోయింది. కళ్లు విప్పి చూచాడు. ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం దర్శనమిచ్చింది.

సిద్ధార్ధుడు మరొక ప్రయోగం చేయపూనుకున్నాడు. శ్వాసను బంధించి, శరీరాన్ని మనస్సులో లయంచేసి, ప్రజ్ఞను మేల్కొల్పసాగాడు. గతంలో ప్రజ్ఞతోనే ఏకాగ్రత సాధించి, ఏకాగ్రతపై మనసు నిమగ్నంచేసి అద్భుత శక్తులు సాధించాడు. ఇప్పుడు పూర్ణప్రజ్ఞతో మనస్సును, శరీరాన్ని శోధించ పూనుకున్నాడు. సమాధి చైతన్యంతో తనలోనే సకల చరాచరాల్ని, అనంత జీవకోటిని దర్శించాడు. కాలంలో వెనక్కిపోయి తన గత జన్మలు చూచాడు. వేలాది లోకాలు, పాలపుంతలు, బగ్రహమండలాలు తనలోనే పుట్టడం, లయించడం అనుభవానికి వచ్చింది. అది 59 భగవాన్‌ బుద్ధ

విశ్వరూపదర్శనం. మానవుల సుఖదుఃఖాలు, వాటి కారణాలు తెలిసివచ్చాయి తనలోని ప్రతి అణువులో భూమి, ఆకాశం, త్రికాలాలు స్పష్టంగా దర్శించాడు అది ఆరేయి తొలి అనుభవం. పట్టుదలతో ఆ రాత్రి ధ్యానంలో ఇంకా లోతులు వెతకసాగాడు. అసంఖ్యాకంగా లోకాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. కొంతకాలం మనుగడ సాగించి అంతరిస్తున్నాయి అసంఖ్యాకంగా జీవులు వేల లక్షల సార్లు పుట్టడం, గిట్టడం తెలుస్తోంది. సముద్రం పైన అలల వలె, బుడగల వలె ఆయా రూపాలు ఎగసిపడి, పేలిపోతున్నాయి తనలో సముద్రగర్భంలో వలె అలజడి లేదు, అలల తాకిడి లేదు. ఉధృతి లేదు నిశ్శబ్దం మహాప్రశాంతత, జనన మరణాలు లేని తావు తనకు నెలవని తెలియవచ్చింది సిద్ధార్టునిలో అనుమానాలు తీరాయి, భయాలు నశించాయి ప్రజ్ఞతో ఎవరైనా జనన మరణ వలయాన్ని దాటిపోవచ్చు సత్యం తెలిసింది. నవ్వుకున్నాడు. ఆ నవ్వు వికసించిన పద్మంలా వుంది నిశ్శబ్ద నిశీధంలో తేజోపుష్పంలా వుంది. ప్రపంచంలోని విషాదాలకు అది చరమ గీతం. అది రెండవ రూము అనుభవం. ఆకాశంలో ఉరుములు. నలువేపుల కారుమబ్బులు (క్రమ్మాయి ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మేఘగర్జనకు ఆకాశం చీలిందా అనిపించింది. వెన్నెల, నక్షత్రాలు, చంద్రుడు - ఏవీ లేని. గాఢాంధ తిమిరవారాశి. సిద్ధార్థుడు తడ్షిస్స ముద్దయినాడు అయినా కదలలేదు. మెదలలేదు. మెలకువ రాలేదు శిలా ప్రతిమలా ధ్యానముద్రలో ఉండిపోయాడు మనస్సు దాటిపోగా బయట ప్రళయం సర్దు మణిగింది మనస్సు ఎక్కడికి పోయిందో తెలియదు, ఏమైందో తెలియదు మనసే శూన్యంలో లయిస్తే తెలిసేదెలా? తెలియవలసింది ఉండదు. అజ్ఞానం అన్ని అనర్థాలకు మూలం. మానవుల కష్టాలకు కారణం- అసూయ, ద్వేషం, అహంకారం, అనుమానం, అవమానం, భయం - అన్నింటికి మూలహేతువు అజ్ఞానం. మనస్సు లోపలికి పయనిస్తే, శూన్యంలో లయించగలిగితే అవగాహన ఏర్పడుతుంది అధ్యయనం సాగుతుంది సత్యం గోచరమవుతుంది. అవగాహనలో విచారాలు లయించి ప్రేమ జనిస్తుంది. అంగీకారం లభిస్తుంది. అవగాహనలోంచి ప్రేమ జనిస్తుందని అర్ధమైంది. సదవగాహన లేనిది (ప్రేమ, కరుణ పుప్పించవు, వికసించవు, పరిమళించవు ప్రతి మనిషిలో కాన్ని సామాజిక, మానసిక, బౌద్ధిక బలహీనతలుంటాయి ఆ మూడు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంటాయి. దుర్మార్గాన్ని ద్వేషించనపుడు, ప్రేమతో దుర్మార్గాన్ని జయించ వచ్చు ప్రేమించడానికి కావలసింది సదవగాహన అవగాహన వల్ల బాధా విముక్తి కలుగుతుంది సదవగాహన ఏర్పదాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. భగవాన్‌ బుద్ద 60

వాస్తవాన్ని అర్ధం చేసుకోగలిగితే మనసు నిర్మలమవుతుంది. ఆ పని జరగాలంటే మనసుకు సంస్కారం అలవడాలి. ఇతరుల్ని లోతుగా అర్ధం చేసుకోవడం సంస్కారం అధ్యయనం చేయడం సంస్కారం. స్పందించగలగడం సంస్కారం మనసులోని ఆలోచనల్ని, స్పందనల్ని గ్రహించడం పరిష్కారం అది మనోవృత్తి. అది జ్ఞానమార్గం అదే జ్ఞానసూత్రం సమ్యక్‌ దృష్టి సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ వాక్కు సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ జీవనం, సమ్యక్‌ కృషి సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాది - ఎనిమిది మార్గాలు అవే సిద్ధార్థుడు మూడవ రూమున అందుకున్న సత్యసూత్రాలు విముక్తికి నాలుగు సూత్రాలు ్రవచించాడు - దుఃఖం, దుఃఖ హేతువు, దుఃఖోపశమనం, దుఃఖభోపశమన మార్గం

ఫలాపేక్ష సుఖలాలస, తృష్ణ - ఇవి దుఃఖానికి హేతువులు. దుఃఖానికి కారణం అజ్ఞానం, అవగాహన.లేకపోవడం. అంటే దుఃఖానికి, దుస్థితికి కారణం తెలుసుకుని, అర్ధం చేసుకుని దానిని తొలగించుకోవాలి. అంతవరకు విముక్తి లభించదు అదే దుఃఖోపశమన సూత్రం. మానవ హృదయ స్పందన (గ్రహించడం అంటే మనసు తెలుసుకోవడం. హృదయంలోకి చూచి, ప్రతిస్పందించ గలిగితే వేదనలు వినవచ్చు దివ్యదృష్టి, దివ్యశవణం, దూరసంచారం, ఉన్నచోటు నుండి కదలకుండా మనో నేత్రంతో చూడడం - ఇవి మూడవ రూమున అందిన జ్ఞాన విశేషాలు. ఆ వెంటనే త్తుఫాను సమసిపోయింది ఆకాశం నిర్మలమై, నక్షత్రాలు. వెన్నెల .. చంద్రుడు కనిపించాయి.

ఇంతకాలం వేనవేల జీవాలు బందీగా ఉన్నాయి ఇప్పుడు బందిఖానా తలుపులు తెరచినట్లయింది. ఆ జైలుకు కాపలా ఉన్నది అజ్ఞానం అజ్ఞానం ప్రభావం వల్ల మనస్సు గతి తప్పింది. మొద్దు బారింది మేఘావృతమైన ఆకాశం వంటిది మనిషి జీవితం. ఆలోచనా మేఘాలు దట్టంగా కమ్మినపుడు వాస్తవం కనుమరు గవుతుంది తన, పర భేదం పెరుగుతుంది ఆస్తి, నాస్తి భేదాలు ఏర్పడతాయి. జనన, మరణ భయాలు చుట్టుకుంటాయి. జరా, రుజ, మృత్యు బాధలు భయాలు బందిఖానా తలుపుల్ని మరింత గట్టిగా బిగిస్తాయి.

గౌతముడు స్వగతంలో అనుకున్నాడు “ఓ అజ్ఞానమా! నీ చిరునామా ఇప్పటికి తెలియనిచ్చావా! ఎన్ని జన్మలుగా నన్ను అజ్ఞానంలో బంధించి ఉంచావు. ఇప్పుడు నీ"గుట్టు రట్టయింది. నీ రహస్యం బట్టబయలైంది ఇంక నేను అజ్ఞానంలో బందీగా ఉండను, ఉండనవసరం లేదు”

తల ఎత్తి చూచాడు. ఉదయతార ప్రకాశిస్తోంది మణిమయ కాంతులు వెదజల్లుతోంది ఈ ఉదయతారను లోగడ ఎన్నిసార్లు చూడలేదు తను, ఇంత 61 భగవాన్‌ బుద్ద

కాంతివంతంగా ఎప్పుడూ లేదు. పిప్పల వృక్షం నీడలో, ఇప్పుడే మొదటిసారి దర్శించినట్లు అనిపించింది. ప్రతి మనిషి జ్ఞానానికి అర్జుడే. ప్రతి వారిలోనూ జ్ఞాన బీజాలుంటాయి. అవి మొలకెత్తడానికి జన్మలు పడుతుంది. తనకు జ్ఞాన మార్గం తెలిసింది. తనలో జ్ఞానజ్యోతి వెలిగింది. తాను గమ్యం చేరుకున్నట్లే. తన లక్ష్యం సిద్ధించినట్లే, తపస్సు ఫలించి మనస్సు ప్రశాంతమైంది. వినిర్మలమైంది. హృదయం తేలిక పద్దది. ఎన్ని సంవత్సరాల ఆవేదన, రోదన, పరివేదన! ఎన్ని ఆశలు, అపజయాలు, వెంటనే తల్లి గౌతమి, తండ్రి శుద్దోదనుడు, యశోధర, రాహుల్‌, మిత్రులు మనసులోకి వచ్చారు. ఇంతకాలం వారి గురించిన స్మృతి లేదు... వెంటనే కళ్లలో స్వస్తి మెదిలాడు. కళ్లు తెరిచేసరికి ఎదురుగా స్వస్తి, రాత్రి తుఫానుకు స్వామి ఏమైనాడోనని వర్షం తగ్గగానే పరుగున వచ్చాడు స్వస్తి “ర్రా.. స్వస్తికా” అని పిలిచాడు సిద్దార్ధ. “స్వ్వామో ... మాకేం కాలేదు కదా!” ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. “నాాక్రేమవుతుంది”. “మోరు చాలా ఆనందంగా ఉన్నారు స్వామా”. “అవునా! ఎలా కనిపిస్తున్నాను? ఏమైనా మార్చు ఉందా నాలో.” సిద్దార్టుని వైపు ఎగాదిగా చూచాడు స్వస్తి “చెప్పలేను స్వామి. మిమ్మల్ని చూస్తుంటే బలేగా వుంది. అనందంగా వుంది. ఇప్పుడే వికసించిన పద్మంలా ఉన్నారు. గయసిర పర్వతంపై ఉదయిస్తున్న పూర్ణచంద్రునిలాగ ఉన్నారు.” ల్‌ స్వస్తి కళ్లలోకి చూచి అన్నాడు “నీకు కవిత్వం వస్తోంది స్వస్తీ. నిటి ఇంత పొద్దుటే వచ్చావు. ఏమైనా విశేషమా?” “రాత్రి వాన వచ్చింది గదా స్వామి. గేదెల్ని తోలే పని లేద్ద, మిమ్మల్ని చూద్దామనిపించి వచ్చాను”. “నాకూ నిన్ను చూడాలనిపించింది. వెళ్లి సుజాతను రమ్మని చెప్పు మి అందరికీ ఒక శుభవార్త చెప్పాలి.” న సిద్ధార్థుడు రమ్మన్నాదన్న వార్త చెప్పగానే సుజాత భోజనం సిద్ధం చేసుకుని బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి సిద్ధార్థుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు భగవాన్‌ బుద్ధ 62

ఎప్పుడూ లేనంత అనందం ఆయనలో కనిపించింది. ఆయనను చూడగానే తన మనస్సు చల్లబడ్డది. ఇప్పటికి వందసార్లు చూచి ఉంటుంది. కాని ఈ రోజు కలిగినంత తృప్తి ఇదివరకు ఎన్నడూ కలగలేదు. అలా చూస్తూ కూర్చోవాలని పిస్తోంది.

“రా సుజాతా, కూర్చో, కొన్ని మాసాలుగా నా కోసం రోజూ భోజనం తెస్తున్నావు. సీ సహాయం మరచిపోను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా గమ్యం చేరుకున్నాను. త్వరలో వెళ్లిపోతాను. అందుకే నిన్ను చూడాలని రమ్మన్నాను ”

ఆమె ఆశ్చర్యపడి “వెళ్లిపోతారా, గురువుగారూ, మమ్మల్ని వదలిపోతారా” అన్నది.

“వదలి పెట్టను కాని వెళ్లక తప్పదు. ఎవరికోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను తపస్సు చేశానో, ఆ తపఃఫలం వాళ్లందరికీ పంచిపెట్టాలి గదా. వాళ్లంతా నా కోసం ఎదురు చూస్తుంటారు”.

ఆమె దిగులు పడ్డది. “అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తాలే దిగులుపడకు”.

అంతలో స్వస్తి మరికొంత మంది పిల్లలతో వచ్చాడు. సుజూత్మ నందబాల, భాను, సుభాష్‌ రూపక్‌ అంతా సిద్ద్ధార్థుని చుట్టు వలయంగా కూర్చున్నారు.

సుజాత అన్నది, “ఈ రోజు భలే మంచి రోజు. గురువుగారు సత్యాన్ని తెలుసుకున్న రోజిది ఇంక గురువుగారు వెళ్లిపోతారుట. ఈలోగా వారు చెప్పే మంచి మాటలు ఏందాంో. సిద్దార్థుని వైపు తిరిగి “మేం పిల్లలం. మాకు అర్ధమయ్యేటట్లు చెప్పండి మాకు చదువులు లేవు".

అందరూ థద్ధగా వినసాగారు.

సిద్ధార్థుడు ఇలా చెప్పాడు . బాలలూ, మిరు పిల్లలే గానీ మంచి బుద్ధి మంతులు నేచెప్పే విషయాలు అర్ధం చేసుకోగలరు. నాది కొత్త మార్గం. చాలా సున్నితమైంది. అందరికీ పనికొచ్చేది. అందరికీ అవసరమైంది.

మోరు బత్తాయి పండు తినాలనుకున్నారు. అలా అనుకోవడంలోనే దాని రుచి మోకు తెలుస్తుంది. నోరూరుతుంది. పండు తిన్నంత సంతోషం తినాలనే ఆలోచన కలిగినప్పుడే కొంత కలుగుతుంది అలా అనుకోవడంలోనే పండు రుచి ఉంది తిన్న తర్వాత పూర్తి తృప్తి పండు తినాలంటే తొక్క తీయాలి. తొనలు తీయాలి. నోట్లో పెట్టుకుని నమలాలి, తినాలి, రసం మింగాలి. అన్ని పనులు. తృప్తి ఎట్లా కలుగుతుంది? బత్తాయి పండు రుచి మా ఎరుకలో ఉంది అట్లాగే 63 భగవాన్‌ బుద్ధ

మన 'ఆనందం' మన ఎరుకలో ఉండాలి. కళ్లు మూసుకుని తింటే రుచి తెలుస్తుంది గానీ తృప్తి ఉండదు చూస్తూ తింటేనే రుచి, తృప్తి. అలాగే మన మనస్సులోకి నిన్నటి విషయాలు లేవనుకోండి. రేపటి గురించి ఆలోచించరనుకోండి అప్పుడు దిగులు ఉండదు ఆశ ఉండదు. నిన్నటిది దిగులు, రేపటిది ఆశ. ఈ రోజు నిశ్చింతగా, ప్రశాంతంగా, హాయిగా గడపవచ్చు భయం ఉండదు. బాధ ఉండదు. దిగులు ఉండదు. చేసే ప్రతిపని సంకోచం లేకుండా, ఎరుకతో చేస్తాం. ఆనందంగా చేస్తాం. అదే నేను కనిపెట్టిన సత్యం. (ప్రస్తుతంలో మనం అనందంగా జీవించాలంటే గతాన్ని గురించి మరచిపోవాలి, భవిష్యత్తు గురించి అసలు ఆలోచించకూడదన్న మాట. దానినే మనస్సు, ధ్యాస, ధ్యానం అనవచ్చు. అలా జీవిస్తే బావుంటుంది కదూ! సుజాతా, నువ్వు చెప్పు. అలా ఎరుకతో జీవించే మనిషి తప్పులు చేస్తాదా? ఎవరినైనా కష్టపెడతాడా! తను బాధపడే అవకాశం ఉంటుందా?” సుజాత : తెలిసి ఎవరూ తప్పు చేయరుగదా గురుదేవా. మా అమ అంటుంది... ఆడపిల్ల నడక, నడవడి, మాటా, మంతి సవ్యంగా ఉండాలని మిరు అదే చెప్పారు మనిషి ఆలోచనలు, చేసే పనులు సవ్యంగా ఉండాలని తప్పుగా ఆలోచిస్తే తప్పు పనులు చేస్తే కష్టాలు, బాధలు వస్తాయని. అంతేనా గురుదేవా “అవును సుజాతా, మనం తెలివితో పని చేయాలి తెలివి అంటే ఎరుక ఎరుక ఉన్నవానికి తను చేస్తున్న ఆలోచన, చేస్తున్న పని ముందే తెలుస్తుంది ఎవరికీ కష్టం కలిగించడు. అలా ప్రవర్తించడు వా సరైన అవగాహన ఉన్నప్పుడు (ప్రేమించగలుగుతాం. (ప్రేమకు “ఇష్టం” కలగాలి మిరంటే నాకు ఇష్టం కనుక మిమ్మల్ని నేను (ప్రేమిస్తాను. (ప్రేమించాలంటే మనసు తెలియాలి. హృదయంలోని మంచితనం తెలియాలి మోరు మంచిగా జీవించండి. ఎవరికీ కష్టం కలిగించవద్దు. అందర్నీ ప్రేమించండి. అందరికీ మో (ప్రేమను పంచిపెట్టండి”. సుజాత అన్నది గురువుగారూ ఇలా మంచి విషయాలు చెప్పేవారిని మా భాషలో బుద్ధులంటారు మిమ్మల్ని 'బుద్దా' అనవచ్చా? స్ట సిద్ధార్థడు నవ్వుతూ తల ఊపాడు. పిల్లలంతా “బుద్దా, బుద్ధా అని హర్షం ప్రకటించారు. సిద్ధార్థడన్నాడు, “గత ఆరు మాసాలుగా నేను ఈ చెట్టు క్రిందనే ధ్యానం చేశాను. ఈ చెట్టు నీడనే నాకు 'జ్ఞానం' కలిగింది దానిని “బోధివృక్షు మందాం.” బగవాన్‌ బుద్ధ 64

చీకటి పడే వేళకు పిల్లలందరూ వెళ్లిపోయారు. బోధి వృక్షం క్రింద బుద్దుడు ఒక్కడే మిగిలాడు న మరికొంతకాలం అక్కడే ఉండదలచుకున్నాడు గౌతముడు. అయిదు సంవత్సరాల కరోర తపస్సు తర్వాత విశ్రాంతి. ఇంక తను ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచడమే పని. అందుకు ఒక పధకం వేసుకోవాలి. ముందు తన ఆలోచనల్ని అత్మ జ్ఞానంతో నింపాలి తనది స్వార్టిత జ్ఞానం తానుగా తెలుసుకున్న సత్యం, ధర్మం “ఆత్మతో సంబంధంలేని ఆత్మజ్ఞానం. స్వప్రజ్ఞా విశేషం. రోజూ నైరంజర నదీ స్నానాలు, తీరంలో విహారాలు, నడకలో ధ్యానమగ్నత, మాటల్లో ధ్యాన పూర్ణత. మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా ధ్యానంపై ధ్యాస. అంతా ధ్యానమయం. తనువెల్ల ధ్యానపులకింత. ముందు కపిలవస్తు వెళ్లాలి. లక్ష్యం నెరవేరిన వెంటనే తిరిగి వస్తానని మాట ఇచ్చాడు. మమతానుబంధాలు కాకపోయినా ఇచ్చిన మాట తప్పడం మంచిది కాదు అలాగే రాజగ్భృహలో బింబిసారునికి మాట ఇచ్చాడు. తన తపస్సు పూర్తి కాగానే వస్తానని. ఆయనపట్ల తనకు ఇష్టం ఏర్పడ్డది. మంచివాడు, యువకుడు. తన అయిదుగురు మిక్రులు జ్ఞాపకం వచ్చారు. వారు ఎక్కడ ఉన్నారో? పాపం. తనను నమ్ముకుని వచ్చారు అలిగి వెళ్లిపోయారు. అయిదుగురు యోగ్యులు జ్ఞానార్తి కలవారు. తన పనికి పనికొస్తారు. ఎక్కడో దగ్గరలో ఏ మరంలోనో ఉండి ఉంటారు. తన తపస్సు వృధా కానందుకు సంతోషంగా వుంది. సంప్రదాయాల్ని కాదని, గురువుల్ని త్రోసిరాజని, స్వతంత్రంగా ప్రయోగాలు చేసినందుకు మంచి ఫలితమే దక్కింది. తన హృదయమే తనకు మార్గం నిర్దేశించింది 'జ్ఞాన మార్గం చూపింది. జ్ఞానం ప్రసాదించింది. ఎవరికి వారు స్వతంత్రంగా సత్యాన్వేషణ చేయడమే ఉత్తమ మార్గం అని తెలుసుకోగలిగాడు. ఇదీ సరికొత్త సత్యమే గురువుల సేవ జీవితాంతం చేయనవసరం లేకుండా, స్వప్రజ్ఞతో సత్యావిష్మరణ చేసుకోవచ్చు నన్నది గొప్ప సూత్రం, సరికొత్త అనుభవం. ప్రతిమనిషి హృదయంలో ఒక కాంతి కిరణం ఉంటుంది. జ్ఞాన బీజం ఉంటుంది. ఆ బీజం వృక్షంగా ఎదిగితే విశ్వ విజ్ఞానం అందుతుంది. అది ఆనందహేల. రోజూ పల్లె నుండి పిల్లలు వస్తుంటారు వస్తూ ఏవేవో తెస్తుంటారు వాళ్లతో కలిసి కబుర్లు చెప్పడం తనకు తృప్తిగా వుంది. తన బాల్యంలో ఈ ఆనందాలు పొందలేదు. పసిమనసులు ఎంతో నిర్మలంగా, కల్మష రహితంగా ఉంటాయి. వారిని చుట్టు కూర్చోపెట్టుకుని ధ్యానం నేర్చసాగాడు ముందు “ఆసనం”, తర్వాత 65 భగవాన్‌ బుద్ధ

శ్వాసక్రియ, తర్వాత మనసులో ఆలోచనలు రాకుండా చేయడం - ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. మెట్లు మెట్లుగా యోగం నేర్పుతున్నాడు. అలా చేయడం వల్ల మనస్సు విచారాలకు దూరం అవుతోంది. నడుస్తూ ధ్యానం చేయడం నేర్పాడు. అతిగా మాట్లాడకపోవడంవల్ల మనసు విలువ పెరుగుతుంది. మాట బరువు పెరుగుతుంది. శరీరానికి అరోగ్యం చేకూరుతుంది మనస్సు ప్రశాంతం అవుతుంది ఇతరుల చెడు ఆలోచనల్ని సైతం పరిహరించ వీలవుతుంది. సుజాత, స్వస్తి కలిసి సిద్ధార్టునికి కొత్త కాషాయ బట్టలు తెచ్చారు ఆయన ధ్యానం నుండి లేచే వరకు ఎదురుగా కూర్చుని బట్టలు బహూకరించారు సుజాత స్నేహితురాలు బాలగుప్త స్నేహం గురించి మంచి మాటలు చెప్పమని అడిగింది. సిద్ధార్భడు అందరిని తన చుట్టూ కూర్చోపెట్టుకుని ఓ కధ చెప్పసాగాడు - “ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఒక అడవిలో ఒక జింక ఉండేది. సరస్సు పక్కన దాని నివాసం. ఆ సరస్సులో ఒక తాబేలు ఉండేది, సరస్సు పక్కన చెట్టు మోద గూడు కట్టుకుని ఒక పక్షి ఉండేది. జింక, తాబేల్సు పక్షి మంచి స్నేహితులు. ఒక రోజున ఒక వేటగాడు వచ్చి జింకను పట్టుకోడ్రాన్సిక్షి వల పన్నాడు. జింక నీళ్లకోసం సరస్సు దగ్గరకు వచ్చి వలలో చిక్కుకొంటుంద ని అతని ఆశ. తను అక్కడ ఉంటే జింక రాకపోవచ్చు. వచ్చినా తనను చూచి పారిపోవచ్చు. అంచేత ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత వచ్చి వలలో చిక్కిన జి కను పట్టుకు పోవచ్చునని. జింక రానే వచ్చింది. వలలో చికృనేచిక్కింది తనను ఎవరెనా రక్షించవ్రు అరిచింది జింక అరుపులు నీళ్లలో ఉన్న తాబేలుకు, చెట్టు మాద ఉన. చ ష వినిపించాయి. వచ్చిచూడగా జింక వలలో చిక్కుబడి ఉంది ఉమెయో ఆలోచించాయి. పక్షి తాబేలుతో అన్నది 'మిత్రమా! నీ పళ్లు చాలా పదునుగో గట్టిగా ఉంటాయి గదా వల తాళ్లను కొరుకు. నీపని అయ్యేవరకు వేటగాడు రాకుండా నేను చూచుకుంటాను.” ఇదేదో ఉపాయం అపాయం లేనిదిగా ఉన్నది అనుకుని తాబేలు వల తాళ్లు కొరకసాగింది పక్షి వేటగాడి ఇల్లు కనిపెట్టి అక్కడకు చేర, రాత్రంతా చెట్టు మోద నక్కింది. ప్రొద్దున వేటగాడు చేతితో కత్తి, ఒక సంచి పట్టుకుని బయటకు వచ్చాడు పక్షి తిన్నగా వెళ్లి అతని మొహం చీరింది శకునం 'బాగా లేదనుకుని వేటగాడు ఇంట్లోకి వెళ్లి కాసేపు పడుకున్నాడు. అతను మళ్లీ బయటకు రాగా పక్షి మళ్లీ అదే పనిచేసింది. ఆ రోజు మంచిగాలేదని అతను ఇల్లు కదలలేదు మర్నాడు ఉదయం దిక్కులుచూస్తూ పక్షిలేదన్న ధైర్యంతో సరస్సు వద్గకు చేరాడు అప్పటికి తాబేలు వలను కొరకడం అయింది రెండు రాత్రులు ఒక భగవాన్‌ బుద్ద 66

పగలు అదే పనిగా కొరకడం వల్ల తాబేలు నోరు పుండై రక్తం కారసాగింది అంత దూరాన వేటగాడు రావడం గమనించి జింక ఒక్క ఉదుటున లేచింది. తాళ్లు తెగిపోయాయి. జింక అడవిలోకి పారిపోయింది. పక్షి ఎగిరిపోయింది వేటగాడు కోపంతో తాబేలును పట్టుకుని సంచిలో పెట్సీ చెట్టుకు సంచిని వేలాడదీశాడు జింకను పట్టుకోవాలని బయలుదేరాడు. పొదమాటున నక్కి ఉన్న జింక బయట కొచ్చింది. . తనను రక్షించిన తాబేలు ప్రమాదంలో చిక్కుకుంది కదా.

జింక వేటగాడి కంటపడుతూ తప్పించుకుంటూ అదవిలోకి దారితీసింది. అలా వేటగాడిని చాలా దూరం తీసుకుపోయింది వేటగాడు తిరిగి సరస్సు దగ్గరకు వచ్చి సంచిని విదిలించాడు చప్పున తాబేలు క్రిందికి దూకి నీళ్లలోకి జూురుకుంది. పక్షి ఎగిరిపోయింది జింక అడవిలోకి పారిపోయింది. అదీ కథ.”

అంతకు ముందురోజు బాలగుప్త, జతిలిక దెబ్బలాడుకున్నారు. మాట్లాడు కోపడం మానేశారు. వారు దెబ్బలాడుకున్న విషయం సుజాతకు తెలియదు. జతిలిక ఇంటికి వెళ్లి. “అడవికి వెళుతున్నాను వస్తావా అని అడిగింది. వచ్చిన తర్వాత జతిలిక, బాలగుప్త దూరదూరంగా కూర్చుని, కోపంగా చూచుకోవడం గమనించింది. అది సిద్ధార్థుడు గమనించాడు. అందుకే సమయస్ఫూర్తిగా ఆ కధ చెప్పాడు.

సిద్ధార్దునికి జ్ఞానోదయమై ఏడు వారాలు గడిచింది. లోకం తనని రమ్మని పిలుస్తోంది ఇక్కడనే స్థిరపడిపోతే తన లక్ష్యం 'నెరవేరినట్లు కాదు. అడవి దారి వదలి నదీ తీరంలో కొంతదూరం నడిచి, లోతులేనిచోట నదిని దాటి, ఆవలి తీరం చేరుకున్నాడు. అక్కడొక కలువ కొలను ఉంది. అది సిద్ధార్టునికి ఇష్టమైన ప్రదేశం. కొలనులో రకరకాల కలువలు, పద్మాలు ఉన్నాయి. పద్మం జ్ఞానానికి సంకేతం పద్మం వికసించడానికి ఎన్నో దశల్ని దాటాలి. వేళ్లు ఎప్పుడూ బురదలోనే కూరుకుపోయి గజిబిజిగా ఉంటాయి. తామరతూంద్లు అల్లి బిల్లిగా, మనిషి మనసు లాగా, జ్ఞానార్తి బుద్ధిలాగా అల్లుకుని ఉంటాయి. ఆకులు మాత్రం సేటిపైన పరుచుకుంటాయి వాటిలోంచి పద్మాలు మాత్రం పైకి లేస్తాయి. కొన్నితూండ్లు ఆకుల్ని గట్టిగాపట్టి బందిస్తాయి. క్రిందికి లాగుతుంటాయి. ఆకుల్ని పైకి పోనీయవు మనిషి బంధాలవలె కొన్ని తూండ్లకు మొగ్గలు మాత్రమే ఉంటాయి. అవి వికసించవు. పద్మపత్రాలు రాలిపోగా లోపల కాయలుంటాయి. పద్మాలలో ఎన్ని రకాలు, ఎన్ని రంగులు, ఎన్నెన్ని అందాలు ! 67 భగవాన్‌ బుద్ధ

మనుషులు అంతే, మనస్తత్వాలు అంతే ఎవరి స్వభావం వారిది ఎవరి వ్యక్తిత్వం వారిది దేవదత్తుని స్వభావం వేరు, ఆనందుని వ్యక్తిత్వం వేరు యశోధర మనస్సు వేరు, సుజాత హృదయం వేరు. వారివారి తెలివితేటలు, వ్యక్తిత్వం, ప్రతిభ, అవగాహన అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తుల స్వబావం ఒకటిగా ఉండదు. జ్ఞానం కూడా అంతే. తాను పొందిన జ్ఞానం లాంటిది అందరూ ఒకేలా పొందలేరు. కష్టపడినా సాధించలేకపోవచ్చు. తను బోధించినా అందరు ఒకేలా గ్రహించక పోవచ్చు. మనిషి స్థాయిని బట్టి వివేకం, విజ్ఞత, అవగాహన, గహింపు మారుతుంది. అందరూ పల్లెపిల్లలంత అమాయకంగా ఉండరు. అహంకారం, అహంభావం, స్వార్థం లాంటి గుణాలు ఎన్నో ఉంటాయి నాగరీకులకు బోధించే తీరులో రీతి ఉండాలి, అవగాహన మారాలి. బోధనాపద్ధతి మారుతుంది. ఒక్కొక్క విధానం “జ్ఞానానికి? ఒక్కొక్క ప్రవేశద్వారం వంటిది. ఒక్కొక్క ద్వారం గుండా కొందరు లోపల ప్రవేశిస్తారు. వచ్చేవారు వస్తుంటారు. పోయేవారు పోతుంటారు. ప్రజలను నేరుగా కలిసినప్పుడు, ముఖాముఖి మాట్లాడినపుడు సద్యః స్ఫూర్తి అవసరం. సమయానుకూలంగా ప్రవర్తించాలి. శిక్షణ బోధన కావాలి తప్ప శిక్ష అవకూడదు. బౌద్ధధర్మ ప్రచారాన్సిక్ష ధర్మం, సంఘం రెండు సింహద్వారాలు. ధర్మచక్రం తిరగాలి జ్ఞాన బీజాలు మొలకెత్తాలి. ఇంక ఉరువిల గ్రామం వదలిపెట్టాలి నైరంజర నదికి, బోధివృక్షాన్సిక్ర “వినమం'గా నమస్కరించాడు. మరునాడు ప్రయాణం. గురువర్యులు అలార కలామ, ఉద్రక రామపుత్రులకు హృదయంలోనే నమస్కరించాడు వారిద్దరిక్రీ జ్ఞానోదయం కలగాలని ఆశించాడు. వెళ్లి పూర్వగురువుల్ని దర్శించి వారి ఆ శీస్సులు పొందాలి. అయిదుగురు మిత్రుల్ని కలిసి, ఆపైన మగధవెళ్లి బింబిసారుని చ్రూద్రాలి ఉదయాన స్నానం, ధ్యానం పూర్తి చేసుకుని పాత ఉడుపుల్ని వదలి క్రాశ్ర బట్టలు ధరించి ఉరువిల గ్రామానికి బయలుదేరాడు. ఇన్నాళ్లు తానెవరో తెలి యక పోయినా, తనను ఆదరించిన గ్రామం అది. బుణం తీర్చుకోలేకపోయినా కృతజ్ఞతలు చెప్పడం ధర్మం. స్వస్తి గుడిసెకు వెళ్లి అందరినీ పలకరించి “వెల్లి పోతున్నాను” అని చెప్పాడు. సుజాత ఇంటికి వెళ్లి తన ప్రయాణవార్త చెప్పగా అమె కన్నీరు కార్చింది “సుజాతా, నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వెళ్లక తప్పదు, నేను సన్యాసిని, ఒక్కచోట ఉండిపోకూడదు. నేను చేయవలసిన పనులు చేయాలి. ప్రతి మనిషి తన కర్తవ్యం నిర్వహించాలి ఇక్కడ ఉండిపోతే నా లక్ష్యం నెరవేరదు. వీలు చూచుకుని మళ్లీ వస్తా. నేను ఎవరినీ విస్మరించను. విడిచి పెట్టను. మరు నన్ను భగవాన్‌ బుద్ధ 686

స్మరించినంతకాలం మోరూ నా స్మృతిలో కదులుతుంటారు, మెదులుతుంటారు సంతోషంగా సాగనంపండి. మో కళ్లలో ఎప్పుడూ సంతోషం కనిపించాలి. ఆనందం తొంగిచూడాలి అది నా ఆకాంక్ష...”

పిల్లలు, కొందరు పెద్దలు - ఊరి చివరి వరకు వచ్చి వీడ్మోలు చెప్పారు. వారి నుండి విడివడి రెండడుగులు వేసే లోగా ఒక సన్యాసి తన వైపుగా రావటం గమనించాడు ఆయన సిద్దార్థుని దగ్గరగా వచ్చి, ఆయనలోని ప్రశాంతిని, వర్చస్సును గుర్తించి, “మిత్రమా, మో రెవరు” మో గురువు ఎవరు” అని ప్రశ్నించాడు

“అయ్యా! నా ప్రస్తుత నామం బుద్దుడు. గౌతమ బుద్దుడు. మా గోశ్రరుషి గౌతమ మహర్షి... నా పూర్వనామం సిద్ధార్థుడు. ౫9

“అయ్యా! నా పేరు ఉపాక. ఉద్రక రామపుత్ర ఆశ్రమం నుండి వస్తున్నాను*.

“మహర్షి ఉద్రకులు క్షేమమేనా”.

“వారు ఈ మధ్యనే గతించారు స్వామా”.

సిద్ధార్థుడు నిట్టూర్చాడు తాను దర్శించ దలచిన గురుద్వయంలో ఒకరు కాలం చేశారు

“మోరు అలార కలామ వద్ద విద్యాభ్యాసం చేశారా”

“చేశాను. వారూ ఈ మధ్యనే గతించారు.”

“వారి శిష్యుడు కౌండిన్య మికు తెలుసునా?”

“విన్నాను. కొండన్నతో పాటు మరో నలుగురిని ఉదకమహర్ష్ని వద్ద చూచాను వారు ఇప్పుడు మృగదాయి వద్ధ హరిణవనంలో ఉంటున్నారు. మృగదాయి వారణాశికి సమిపంలో ఉంది. నేను బయలు దేరతాను. చాలా దూరం వెళ్లాలి”. సన్యాసి వెళ్లిపోయాడు.

“అమ్మాయిలూ, అబ్బాయిలూ ! ఇప్పుడు నా ప్రయాణం వారణాశికి అక్కడ నా పూర్వ మిత్రు లున్నారట. ముందుగా వారిని కలవాలో.

ఉత్తరదిశగా, నదీతీరం వెంట నడక సాగించాడు. ఆ మార్గం దూరం అయినా ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కొద్ది రోజుల్లో. పాటలీపుత్రం చేరవచ్చు అక్కడ గంగా నదిని దాటితే వారణాశి చేరడం సులభం.

. హరిణవనంలో ధ్యానంలో ఉన్న అశ్వజిత్‌కు ఒక మహాయోగి దర్శనమైంది. ఆయన మహాతేజస్వి, ఆయనలో సిద్ధార్టుని పోలికలు కనిపించాయి. కలవరంతో కళ్లు తెరిచాడు. మిగిలిన మిత్రులకు తన కల గురించి చెప్పాడు నిజంగా సిద్ధార్థుడే వచ్చినా మనం ఆదరించి, గౌరవించవద్దని నలుగురు నిర్ణయించుకున్నారు 69 భగవాన్‌ బుద్ద

భద్రి అన్నాడు “పాపం మంచివాడే సన్యాసధర్మాలు మరిచి, శుభ్రంగా తిని, తాగి, ఆడపిల్లలతో ముచ్చట్లాడి పాడైనాడు”. అంతలో సిద్ధార్థుడు అక్కడకు రానే వచ్చాడు. అందరి నోళ్లు మూతపడ్డాయి. విగ్రహాల్లా నిలబడిపోయారు. ఏమి తేజస్సు! ఎంత కాంతి? ఎంత ప్రశాంతి! తమ ఆశ్రమం ఒక క్షణంలో దివ్యప్రభా భాసురమైంది. ఆ నడకలో రీవి, చూపులో కారుణ్యం. అప్రయత్నంగా కొండన్న (కౌందిన్య) వెళ్లి ఆయన చేతిలోని భిక్షాపాత్ర అందుకున్నాడు. మహానామ పరుగున వెళ్లి పాదప్రక్షాళనకు నీళ్లు తెచ్చాడు భద్రైయ కుశాసనం సిద్ధం చేశాడు. వప్ర విసనకర్రతో వీచసాగాడు. అశ్వజిత్‌ చేష్టలుడిగి వినయంగా ఒక ్రక్కన నిలిచాడు. సిద్ధార్థుడు 'పాదప్రక్షాళన కావించి వచ్చి చాపపైన కూర్చున్నాడు. అయిదుగురు చుట్టూ కూర్చున్నారు. సి ద్ధార్భుడు : “మిత్రులారా! నా అన్వేషణ ఫలించింది. నాకొక జ్ఞానమార్గం కనిపించింది" అశ్వజిత్‌ సిద్ధార్థుని మాట విశ్వసించలేకపోయాడు. మిగిలిన్న వారు (ప్రశ్నార్ధకంగా సిద్ద్ధార్టుని వైపు చూడసాగారు. కొండన్న థైర్యం చేసి అన్నాడ్చు “మిత్రమా, సిద్దార్ధ! నీవు ఎప్పుడో బాట తప్పావని మాకు తెలుస్త, మాట తప్పినా, బాట తప్పినా ఒకటే కదా!” సిద్ధార్థుడు : “కొండిన్యా, నేను మాట తప్పలేదు, బాటా తప్పలేదు న్హా్స్హ నేను వెతుక్కున్నాను అంతే అందరూ ఒకే బాటలో నడవాలని లేదు. నాగ ర్గం నేను చేరుకున్నాను. నేనెన్నడైనా అబద్ధం చెప్పానా?” మ్యాన్ని కభ్రేద్దు” “నన్ను విశ్వసించండి మిటత్రులారా! మిమ్మ న్‌ న్ను విశ్వసించండి మి సున్నీ వెతుక్కుంటూ వచ్చాన్సు, నన్న మోతో పంచుకోనివ్వండి. ఆలోచనవల్ల ధర్మం నిలబడదు. జానం కలగదు అనుభవం కావాలి. నా జ్ఞానం అనుభవం వల్ల కలిగింది. అన్యధా క్రాద్దు, క్రన్తుర్ష ఇది సత్యం నేను చెప్పే విషయాలు హృదయంతో వినండి. అవలోకన ముఖ్యం. సిద్ధార్టుని మాటల్లో నిజాయితీ ఉందనిపించింది ఆధ్యాత్మిక గడసరితనం, తెంపరితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. “చెప్పు మిత్రమా” అన్నాడు కొండన్న సిద్ధార్థుడు చెప్పసాగాడు . “మిత్రులారా! నా మార్గంలో తెలుసుకున్న నిజాలు రెండున్నాయి. ఒకటి . భోగాలను, సుఖాలను త్యజించడం. రెండు * శరీర ధర్మాలను గౌరవిస్తూ సాధన చేయడం. వఏిదీ అతి కాకూడదు. నాది మధ్యమ మార్గం. ఈ మార్గంలో శాంతిని వేరుగా అన్వేషించ పనిలేదు. శాంతి సాధన భగవాన్‌ బుద్ధ 7/0

సులభం అవగాహన ముఖ్యం స్వతంత్రం, స్వేచ్చ అవసరం వాటిని ఎనిమిది సూత్రాలుగా విభజించాను. దీనిని 'అనుకూల మార్గం' అని ఎందుకు అన్నానంటే

  • ఇందులో బాధల్ని తప్పించుకోవడం ఉండదు, కాదనడం జరగదు. అయినా బాధల్ని తప్పించు కోగలం దుఃఖోపశమనానికి ఎనిమిది పద్ధతులున్నాయి. అవే సమ్యక్‌ దృష్టి, సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ వాక్కు సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ జీవనం, సమ్యక్‌ కృషి, సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాధి. ధ్యానం వల్ల ఏకాగ్రత కలుగుతుందని, పెరుగుతుందని మికు తెలుసు. ఏకాగ్రభావన వల్ల అవగాహన కలుగుతుంది దానిని మారు విస్మరిస్తున్నారు ఇంతకాలం. సదవగాహన వల్ల బాధలు తగ్గుతాయి. తద్వారా శాంతిని పొందవీలుంది. శాంతి ఆనందానికి చివరి మెట్టు

“మిత్రులారా! మరో నాలుగు ముఖ్య విషయాలు గమనించండి : దుఃఖం, దుఃఖకారణం, దుఃఖోపశమనం, దుఃఖోపశమనమార్గం, పుట్టడం, జీవించడం దుఃఖమయం అనుకోవడం మొదటి కారణం. సుభాపేక్ష తృష్ణ రెండవ కారణం. దుఃఖానికి అసలు కారణం అజ్ఞానం, అవిద్య మన దుఃఖానికి, దుస్థితికి అసలు కారణం పట్టుకుని దానిని నిర్మూలించగలగాలి మూల కారణాన్ని తొలగించకపోతే దుఃఖవిముక్తి కలగదని తెలుసుకోవాలి. దుఃభోపశమనానికి మార్గం నాల్గవ కారణం”.

సిద్ధార్దుడు ఈ విషయాలు చెబుతుండగానే కొండన్న హృదయంలో ఒక మెరుపులాంటి ఆలోచన కదిలి “సత్యం ... సత్యం' అనిపించింది. అతని మొహం సంతోషంతో వెలిగింది. ఆ మార్పు గమనించిన సిద్దార్డుడు “కౌండిన్యా! నీకు అర్థమైందని నాకు అర్థమైంది”.

వెంటనే కొండన్న వినయంగా చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి ; “మహాత్మా, నన్ను కరుణించండి మో శిష్యునిగా స్వీకరించండి 'అన్యధా శరణం నాస్తి. .. త్వమేవ శరణం మమి”

మిగిలిన నలుగురు కొండన్నను అనుసరించారు.

సిద్ధార్థుడు అన్నాడు * “మిత్రులారా! ఉరువిల గ్రామంల్నోవ్వర్మిఫీ విరియని మొగ్గల్లాంటి పిల్లలు నాకు “బుద్ధ” అని పేరు పెట్టారు. ఆ పేరు నాకూ బావుంది. మోరూ నన్ను ఆ పేరుతో పిలవండి. నన్ను నమ్మండి - మూడు మాసాల సాధనలో మిరు జ్ఞానులవుతారు. బోధిసత్వులవుతారు.” గే భగవాన్‌ బుద్ధ

సిద్ధార్థునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి, సాధనచేసి జ్ఞానం పొందిన మొదటి వ్యక్తి కొండన్న మరో రెండు నెలల వ్యవధిలో వప్ర, భద్రిక అర్హత సంపాదించారు. చివరన సిద్ధి పొందినవారు అశ్వజిత్‌, మహానామ.

అప్పుడు సిద్ధార్దడన్నాడు - “ఇప్పుడు మనం ఒక సంఘం మనది బౌద్ధ సంఘం. (పేమ, కరుణ పంచడం మన కర్తవ్యం”.

శ ర ౮

సిద్ధార్థునికి ప్రాతఃకాలంలో నిద్రలేచి ధ్యానం చేసుకునే అలవాటు. తెలతెల వారుతుండగా అడవి దారంట వావ్యోళికి వెడతాడు. అదీ ధ్యానమే. నాటి ఉదయం అలా నడుస్తుండగా మసక చీకటిలో ఒక వ్యక్తి కనిపించాడు ఒక రాతిబండ మోద కూర్చుని పరమచిరాకు పడుతున్నాడు. “ఛ... అసహ్యం... రోత... చిరాకు” తనలో తనే సణుక్కుంటున్నాడు. సిద్ధార్థుడు అతనికి దగ్గరగా వెళ్లాడు.

“అవును అసహ్యమే =.” అన్నాడు, అతని మాటల్ని తాను పలుకుతూ,

అతను తల ఎత్తి చూచాడు. ఎవరో సన్వాసి ... మహాశాంతంగా ఉన్నాడు. తనను చూచి నవ్వుతున్నాడు. అతని కంటికి ఉదయ సూర్యునిలా అగుపించాడు సిద్ధార్థుడు. ఆయన తేజస్సు చూచి కళ్లు తిరిగినట్లయింది. దిగ్గున లేచి నిలబడి నమస్కరించాడు! సన్యాసి కదా...! సన్యాసి అంటే పవిక్రుడని.

“ఏమిటయ్యా అంత బాధ? ఏం జరిగింది?” అడిగాడు.

అతను చెప్పసాగాడు ;

“నా పేరు 'యశ స్వామి! మా నాయన వారణాళశిలోనే గొప్ప సంపన్నుడు, నేను జీవితం ఇష్టం వచ్చినట్లు అనుభవించాను. నేను పొందని సుఖం లేదు, అందుకోని ఆనందం లేదు. అన్ని వ్యసనాలు నావే. మదిర, మగువ నాకు అత్యంత నేస్తాలు ఈ వయసులోనే అన్నీ అనుభవించాను. రాత్రంతా మిత్రులతో తాగి, తందనాలాడాను,. ఈ అడవిలో ఒక అప్సరసను అనుభవించాను. ఒక అపరాత్రి మెలకువ వచ్చింది. అందరూ మైకంలో నిద్రపోతున్నారు. నాకు చిరాకు వేసింది. శవాల్లా పడివున్న అందాల భామల్సి రసికుల్ని చూచాను అసహ్యం కలిగింది. వారికి దూరంగా పారిపోయి వచ్చాను స్వామి”.

సిద్ధార్థుడు ఊరడించాడు, “యశా! ధ్రపంచం సుఖమయం అనుకుంటాం కాని, నిజానికి ప్రపంచం, జీవితం దుఃుఖమయం, బాధలమయం, కష్టాల కాష్టం అయినా మానవజీవితం, ప్రపంచం ఆనంద నిలయాలు. అశాంతి శాంతికి

తొలిమెట్టు. బాధలు ఆనందానికి తెరచాపలు కష్టాలు చుక్కాని సుఖభోగాలలో బగవాన్‌ బుద్ద 72

మునిగిపోవడం వల్ల శరీరం, మనస్సు చెడిపోతాయి సంసారం, సుఖాలు వద్దనడం లేదు. పరిమితంగా అనుభవించు అతి అనర్ధదాయకం. నిరాడంబర జీవనం సుఖంగా ఉంటుంది. కోర్కెలకు కళ్లిం వేయగలిగితే అదుపు తప్పవు కోరికల ప్రవాహంలో కొట్టుకుపోయినంతకాలం ఆనంద తీరాలకు చేరలేవు. చూడు! చంద్రుడు. నక్షత్రాలు వెలవెలపోతున్నాయి సూర్యోదయం కాగానే. రాత్రంతా వాటిదే ఇష్టా రాజ్యం. రాత్రి అంత చల్లగా, ఆనందంగా, సుఖంగా ఉన్న చంద్రికలు ఇప్పుడేవి? నీలో జ్ఞాన సూర్యుడు ఉదయిస్తే ఈ సుఖాలలో సుఖం కనిపించదు. చూడగలిగిన కళ్లుంటే ప్రపంచం అందంగానే ఉంటుంది. సవ్యంగా ప్రపంచాన్ని. ఆనందాన్ని అనుభవించలేని నీవంటి వారికి అసహ్యం, జుగుప్పు కలుగుతుంది.

“నేనొక ఉపాయం చెబుతాను విను. కళ్లు మూసుకుని కూర్చుని ధ్యానం చేయి ఒక పదినిమిషాలు. అన్నీ మరచిపోయి ధ్యానించు. ఆ తర్వాత ప్రపంచాన్ని చూడు ముందు అసహ్యం అనిపించిన ప్రపంచమే సుందరంగా కనిపిస్తుంది. ప్రపంచం మారదు. మనమే మారాలి. మన దృష్టిలో, అవగాహనలో మార్పు రావాలి. నున మనసు మారితే ప్రపంచం మారినట్లు. లోకం అందంగా, ఆనందంగా కనిపించిందీ అంటే నీ మనసులో ఆనందం నెలకొన్నదని అర్ధం. నీ ఆనందాన్ని నీ స్వేచ్చను ఎవరూ అపహరించలేరు, హరించలేరు. కొందరు కష్టాలు, బాధలు భరించలేక చనిపోవాలనుకుంటారు. కారణం కష్టాలు కాదు, కన్నీళ్లు కాదు. శరీరాన్ని మనస్సును అదుపు చేయలేకపోవడం వల్ల. సృష్టి లక్షణం బాధ కాదు - 'ఆనందం”* మనం జీవించే పద్ధతిని బట్టి, ఎన్నుకున్న విధానం వల్ల కష్టాలు, సుఖాలు ఏర్పడుతుంటాయి. "

సిద్ధార్థుని మాటలు అతనికి ఉపశమనం కలిగించాయి ఆశలు రేకెత్తించాయి. గుండెలో గుచ్చుకున్న ముళ్లు తీసివేసినట్లయింది. 'ఈయన ఎవరో మహాత్ముడు! అని నిశ్చయంగా భావించాడు పాదాభివందనం చేసి “నన్ను రక్షించారు మహాత్మా” అన్నాడు.

“మావంటి వారు నిరాడంబరంగా జీవిస్తారు. మా వద్దీ డబ్బుండదు. చెట్ల క్రిందనో, పర్జశాలల్లోనో చాపలపైన పడుకుంటాం. భిక్షాటన చేస్తాం ఏక భుక్తం. అదీ దొరకకపోతే నిరాహారమే. సదా ధ్యానంలో గడుపుతాం. మావలె జీవించడం నీకు సాధ్యమా?”

“నేన్స కోరుకునేది అలాంటి జీవితమే మహాత్మా”.

“భిక్షువు అంటే సర్వసంగ పరిత్యాగి. అయినా సంఘ శ్రేయోభిలాషి సర్వ మానవ హితాన్ని కాంక్షిస్తాడు విశ్వశాంతిని అభిలషిస్తాడు. అందుకు తన తపస్సు 73 భగవాన్‌ బుద్ధ

ధారపోస్తాడు స్వార్ధం ఉండదు తన విముక్తిని, సాటి మానవుల విముక్తిని కాంక్షిస్తాడు. ప్రపంచంలో బాధా విముక్తి అభిలషిస్తాడు ఈ పనుల్ని నిస్వార్ధంగా నీవు చేయగలవా?”

“శరణు ... శరణు!”

“అయితే నిన్ను ఆమోదిస్తాను. మా సంఘంలో సాధకుల్ని 'భిక్షు లంటాం భిక్షువు అంటే బిచ్చగాడని అర్ధం. భిక్షచే జీవించేవాడని భిక్షను అర్ధించడం వల్ల మనిషిలో అహం చచ్చిపోతుంది సమతా దృష్టి ఏర్పడుతుంది. నీ భిక్షను నీవే తెచ్చుకోవాలి. కోపతాపా లుందకూడదు. దానివల్ల వినయం కలుగుతుంది ఇతరులకు మన జీవితం ఆదర్భంగా నిలవాలి.

అంతలో సిద్దార్థుని వెతుక్కుంటూ అయిదుగురు శిష్యులు వచ్చారు అక్కడకు, యశ వారందరికి నమస్కరించాడు.

సిద్దార్టు డన్నాడు : “కొండన్నా! ఇతను యశ, మనతో ఉండతలుస్తున్నాడ్రు, మన పద్ధతులు బోధించి అర్హుని చేయి”.

యశ బాధ్యత కొందన్నకి అప్పగించాడు. అతనిని ఒక పర్ణశాలలోక్షి నడిపించి శుభ్రంగా గుండు గీకించాడు. స్నానం చేశాక, కాషాయ బట్టలు కట్టబెట్లి చేతికి భిక్షాపాత్ర ఇచ్చాడు కూర్చుని ప్రాణాయామ సాధన చేయించసాగాడ్తు అది యతికి మొదటి శిక్షణ.

ఉదయం యశ ఇంటికి చేరకపోయే సరికి కంగారు పడ్డారు. నాల్సగ్బ వైవులకు మనుషుల్ని పంపారు. మధ్యాహ్నానికి 'హరిణవనం” వైప్ప వచ్చిన అన్వేషకుడు యశ ఆచూకి తెలుసుకొని వెళ్లి యజమానికి చెప్పాడు. యశ తండ్రి పరుగున వచ్చి వాలాడు. ఒక రాత్రి పలకపైన కూర్చుని ఉన్న బుద్ధుని సమిపింల్చి అడిగాడు, “అయ్యా, నా కొదుకు యశ ఇక్కడ ఉన్నాడని తెలిసింది .వాడి ఆచ్రూక్తీ చెప్పగలరా?”

“అదిగో ఆ పర్ణశాలలో ఉన్నాడు మంచి కుర్రాడు. జ్ఞానం కోసం వచ్చాడు అజ్ఞానం చివరి అంచుకు చేరాడు, మనిషిని బాధించేది అజ్ఞానమే కదా! అతను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాదు వెళ్లి చూడు”

యశ తండ్రి పర్ణశాలకు వెళ్లి చూచాడు. తన కొడుకును గుర్తు పట్టలేక పోయాడు. సన్యాసి వేషంలో చూడముచ్చటగా ఉన్నాడు. ఒక్కరోజులో ఎంత

మార్చు “మో అమ్మ నీ కోసం బెంగ పెట్టుకున్నది ... వళదాంరా” భగవాన్‌ బుద్ధ 74

“వస్తాను అయితే ఇప్పుడు కాదు. అమ్మ కన్నీరు ఎండిపోయిన తర్వాత తప్పక వస్తాను. యశ తండ్రి వారిని భిక్షకు ఆహ్వానించాడు. భిక్ష చేసిన తర్వాత, చూడవచ్చిన వారికి సిద్ధార్ధుడు హితవాక్యాలు బోధించాడు “అందరూ, అన్నీ వదులుకుని సన్యాసులు కానవసరం లేదు. ధర్మంగా జీవిస్తే చాలు. సుఖంగా, శాంతిగా జీవించండి. బౌద్ధ ధర్మాన్ని పాటిస్తే మనశ్శాంతి కలుగుతుంది సామాన్యులు, సంసారులు అయిదు సూత్రాలు పాటిస్తే చాలు. ఒకటి :; అహింసావ్రత దీక్ష ఏ విధమైన హింస కూడదు, జీవహింస కూడదు. మనుషులవలె పశుపక్ష్యాదులకు చావంటే భయం ఉంటుంది. వేటినీ చంపకూడదు. హింసించ కూడదు. ప్రేమించడం అందరి ఏకైక హక్కు

రెండు : దొంగతనం చేయకూడదు. ఇతరుల కష్టార్జితం, ధనం తన సొంతం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. అది నీచం. అందరికీ శక్తి ఉన్నంతలో సాయపడాలి.

మూడు : వ్యభిచారం తగదు. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలి. పరుల సొమ్మును ఆశించడం వంటిదే పరస్త్రీ వ్యామోహం, పరపురుష సాంగత్యం. శీలాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి.

నాలుగు : సత్య భాషణ. అబద్దాలాడకూడదు. సత్యానికి అపచారం చేసే పనులు చేయకూడదు. మికు స్పష్టంగా తెలియని విషయాలు ఎవరికీ చెప్ప కూడదు.

అయిదు మద్యం, మాదక ద్రవ్యాలు నిషేధం. మద్యపానం వల్ల వివేకం నశిస్తుంది. ఉద్రేకాలకు లోనవుతారు తప్పు పనులు చేస్తారు. కనుక మత్తు పానీయాలు సేవించకండి.

ఈ అయిదు సూత్రాలను పాటిస్తే మనశ్శాంతితో జీవించగలరు మిరు మో కుటుంబ సభ్యులు, మీ మిత్రులు అందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారు.”

యశ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ సంతృప్తి చెందారు. ఇంతవరకు ఇన్ని మంచి విషయాలు ఇంత సులభంగా చెప్పిన వారు లేరు. అంతా గురువులే. భేషజ గురువులు పనికొచ్చే మంచిమాట ఒక్కటి చెప్పరు

అలా జీవిస్తామని బుద్ధుని ముందు ప్రమాణం చేశారు అందరూ,

శ శ 2

యశ సన్యాసం స్వీకరించాడన్న వార్త వారణాశిలో వ్యాపించింది. కులీనుడు, సంపన్నుడు, యువకుడు. బుద్దుని గురించి, బౌద్ధ ధర్మం గురించి ఎవరికీ 7/5 భగవాన్‌ బుద్ద

తెలియదు. ఎవరూ ఆ పేరు వినలేదు. యశ సన్నిహిత మిత్రులు విమల, సుబాహు, పూర్ణజిత, గవాంపతి, మృగదావం వెళ్లి అతనిని కలవాలని బయలుదేరారు. సుబాహు అన్నాడు, “యశని మార్చగలిగాడంటే ఆ గురువెవరో సామాన్యుడై ఉండడు. మనవాడు ఒక పట్టాన లొంగే ఘటం కాదుగా” విమల అన్నాడు “అంతగా పొగడకు. మనవాడు ఏదో ఎత్తు వేసి ఉంటాడు మళ్లీ తనే వస్తాడు. సుఖాలు మరిగిన వాడు కదా”! గవాంపతి : “అలా అనకు. యశ పట్టుదల మనిషి పడితే ఉడుంపట్లే. మిరు గమనించి ఉండరు ఈమధ్య వాడిలో చాలా మార్పు వచ్చింది 9? హరిణ వనంలో తన మిత్రుల్ని సిద్దార్టునికి పరిచయం చేశాడు. “వీరికీ జ్ఞాన మార్గం చూపించండి” అర్ధించాడు నలుగురు సిద్దార్థుని ఎదుభుగా కూర్చున్నారు. విమల మొదట అయిష్టంగా ఉన్నాడు. చివరికి శరణాగతుడైన మొదటి వ్యక్తి అతనే. నలుగురు దీక్ష తీసుక్రోడ్రాన్సిక్రి సిద్ధమైనారు. ఆ నలుగురి బాధ్యత కొండన్నకు అప్పగించాడు సిద్ధార్ధ. యశక్రు చాలా మంది ఆప్త మిత్రు లున్నారు. అయిదుగురు భిక్షువు లైనారని తెలిస నూట ఇరవై మంది ఒక్కసారిగా వచ్చిపడ్దారు. అందరూ బుద్ధుని బోధనల శ్రద్ధగా విన్నారు. వారిలో యాఖై మంది వెంటనే సన్యసించదానికి సిద్ధపడ్డారు. మిగిలిన వారు సంసార బాధ్యతల సాకు చెప్పి వెళ్లిపోయారు య యశ బుద్దునితో అన్నాడు “గురుదేవా! రేపు నేను నగరంలోకి వెళ్లి వస్తా మన కొత్త విద్యార్థులకు అవసరమైన కాషాయబట్టలు, భిక్షాపాత్రలు సమక్షూర్తే, ఏర్పాటు చేస్తాను. మా నాన్నగారు కాదనరు” ఖ్‌ రోజూ స్రీలు, పురుషులు ధర్మబోధ వినడానికి రాసాగారు బుద్ధుడు అందరిక్తీ ప్రాధమిక సూత్రాలు వివరించి, ధ్యానం మెలకువలు చెప్పసాగాడు. తన సమక్షంలో, తన పర్యవేక్షణలో ధ్యానం సాధన చేయించాడు. ముందు శరీరం పైన ధారణ, శరీరంలోని ప్రతి అవయవం పైన ధారణ, తర్వాత ఇంద్రియాల పైన మనస్సు లగ్నం చేయడం, తర్వాత మనస్సుపైన భావన నిలపడం, భావాలపైన బుద్ధిని కేంద్రీకరించి ఆపైన భావశూన్యం కావడం, ఆ తర్వాత రూపాలను అరూపంగా భావించడం. మొత్తం అయిదు స్థితుల్ని సాధించే పద్ధతి నేర్పాడు “అన్నింటికన్న 'పరస్పరాధీనభావని ముఖ్యం, సాధన కష్టసాధ్యం ప్రపంచంలో దేనికీ సంపూర్ణ స్వేచ్చ ఉండదు. ఒక దాని మనుగడ మరొకదాని భగవాన్‌ బుద్ద 76

స్థితిపైన ఆధారపడి ఉంటుంది. అది లోక ధర్మం అదే సృష్టి ధర్మం ఏ ఆదారం లేకుండా జీవించడం సాధ్యపడదు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రకృతి ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అది సహజీవన రహస్యం. అదే సహధర్మ సిద్ధాంతం పరస్పరాదీనత వల్లనే ప్రగతి సాధించ వీలుంది. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. అది జనన మరణ ద్వారాలను దాటిపోయే పద్ధతి".

“మనిషిలో సంకుచితత్వం నశించాలి కుచ్చితం నశించాలి అందుకు “ధ్యానం” ఉపాదేయం. “ఈ లోకాన్ని ఎవరో భగవంతుడు సృష్టించాడు. దేవతలు పాలిస్తున్నారు లేక పంచభూతాల వల్ల లోకం ఏర్పడ్డది" లాంటి నమ్మకాలు వదలండి. ధ్యానం చేస్తే అలాంటి నమ్మకాలు సడలిపోతాయి. స్వతంత్ర భావన ఏర్పడుతుంది. అంతర్జష్టి ఏర్పడి మి అవగాహనలో మార్చు వస్తుంది”.

తనకు బాధ్యతలు పెరుగుతున్నాయని సిద్ధార్థుడు గుర్తించాడు. అరవై మంది విద్యార్థులకు తను పారం చెప్పాలి, ధ్యానం నేర్పాలి, వారిని తీర్చిదిద్దాలి. తానిపుడు ఆచార్య గొతమ బుద్ధుడు మొదటి అయిదుగురు శిష్యులకు కొన్ని బాధ్యతలు పంచాలి. వారు విధి నిర్వహణలో సమర్థులు, యోగ్యులు కొండన్నకు ఇరవైమంది శిష్యుల్ని ఇచ్చాడు మిగిలిన నలుగురికి పదిమంది చొప్పున బాధ్యతలు అప్పగించాడు. వారిని తీర్చి దిద్దే బాధ్యత ఈ అయిదుగురిది.

ఒకనాడు భిక్షు సంఘాన్ని సమావేశపరచి చిన్న ప్రసంగం చేశాడు :

“సోదర భిక్షులారా, సాదర మిత్రులారా! కాషాయం కట్టినా, భిక్షా పాత్ర చేత పట్టినా, సంఘంలో సభ్యులైనా, మా అందరికీ సంపూర్ణ స్వేచ్చ ఉంటుంది. నియమాలు ఎవరినీ కట్టడి చేయవు. మి కిప్పుడు బుద్ధ ధర్మపధం తెలిసింది. పూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. మికు తెలిసిన జ్ఞానం పదిమందికి పంచండి. వారికి వివేకం కలిగించండి. అందరికీ శాంతి, ఆనందం కలిగించడమే మన లక్ష్యం, ధర్మాన్ని నలుదిక్కులా విస్తరింపచేయండి. నేను మిమ్మల్ని వదలి పోతున్నాను. ఒకసారి బోధివృక్షాన్ని ఉరువిల గ్రామాన్ని దర్శించాలి. తర్వాత రాజగ్భహం వెళ్లాలి.

బుద్దుని మాట ప్రకారం కొందరు వివిధ ప్రాంతాలకు ప్రచార నిమిత్తం వెళ్లారు. ఇరవై మంది అక్కడ మిగిలారు. బుద్దుని ధర్మప్రచారం ఊపందుకుంది. కాశీ మగధ దేశాలలో ఖిక్షులు విస్తారంగా పర్యటిస్తూ, ధర్మబోధ చేయసాగారు. శాక్యరాజకుమారుడు ఒకరు మృగదావంలో ఉన్నాడని, మహాజ్ఞాని అనీ 'ప్రచారం సాగింది. యువకుల రాక రోజురోజుకీ ఎక్కువైంది.

భగవాన్‌ బుద్ధ

ఒకనాడు బుద్ధుడు సంఘ సభ్యులను సమావేశపరిచాడు “సోదరులారా! ఇకపైన ప్రతి ఒక్కరికీ నేనే దీక్ష ఇవ్వనవసరం లేదు. మారంతా ఆ పని చేయవచ్చు. (గ్రామాలకు వెళ్లినపుడు బంధుమిత్రుల సమక్షంలో 'దీక్షు కార్యక్రమం నిర్వహించండి. ఇందులో రహస్యం, గోప్యం లేవు అందరూ ఇంతదూరం రాలేరు నేను దీక్ష ఇచ్చిన పద్ధతినే మోరూ, అనుసరించండి” అశ్వజిత్‌ ఒక సూచన చేశాడు : “కొన్ని నియమాలు పాటిస్తే బావుంటుంది గురుదేవా! కొండన్నకు ఆ బాధ్యత ఇవ్వండి. విధి, విధానాలు రూపొందిస్తాడు” కొండన్న లేచి అన్నాడు : “ప్రాధమిక పద్ధతులు ఏవీ మార్చపని లేదు. దీక్ష తీసుకుంటున్న సమయంలో దీక్షితులు పద్మాసనంలో కూర్చుని అరచేతుల్ని పద్మాకృతిలో ఉంచాలి. కళ్లు మూసుకుని త్రిశరణాలు వల్లించాలి. “బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి" అని ప్రమాణం చేయాలి * వారణాశి నుండి రాజగ్భహకు వెళ్లే రాజమార్గంలో ప్రయాణం. పలైలో భిక్ష ఎండవేళ అడవిలో విశ్రాంతి. ఒక గాయక బృందం కలిసింది. అందులో సంపన్నులున్నారు. ఒక యువకుడు బుద్ధుని సమిోపించి నమస్కరించి “అయ్యా! ఇటుగా ఎవరైనా ఒక అందమైన యువతి వెళ్లడం గమనించారా” ప్రశ్నించాడు. “ప్పీయా, యువతా! అందమైందా?” బుద్దుని ప్రశ్న “అయ్యా, మేం వారణాశి నుండి వినోదార్ధం వచ్చాం. మాతో ఒక విలాసినిని తీసుకువచ్చాం. ఆమె నృత్య, సంగీతాలతో మమ్మల్ని అలరించింది. రాత్రి ఆద మరచి నిద్రిస్తుండగా పరారైంది మా నగానట్రా అన్నీ పోయాయి స్వామా. ఆమె కోసం వెతుకుతున్నాం” “ఆమెను వెతకడం అంత అవసరమా? మిమ్మల్ని మారు వెతుక్కోండి” ఆ మాటల అంతరార్థం ఆ యువకునికి బోధపడలేదు. సన్యాసి చూడడానికి చాలా గొప్పవాడిలా ఉన్నాడు ఆయనలో మంచి తేజస్సు ఉంది “మమ్మల్ని వెతుక్కోవడం అన్నారు అంటే అర్ధం ఏమిటి స్వామి” “బాబూ, జీవితం అంటే ఏమిటి? వెతుక్కోవడమే గదా! సుఖాలు వెతుక్కోవడం, సంపదలు వెతుక్కోవడం, స్నేహాలు వెతుక్కోవడం. అవి అన్నీ ఇవ్వాళ ఉండేవి రేపు నళించేవి మనిషి లోపల నశించని ఆనందం ఉంటుంది. భగవాన్‌ బుద్ధ 78

దానిని వెతకాలి. ఆ అమ్మాయి గతం ఆమె పరిచయం గతం. ఆవిడతో నీవు పాందిన సుఖాలు గతం. రేపు అన్నది ఊహ ... రేపు సుఖించవచ్చునన్నది భమ. రేపటి సంపాదన ఓ పెద్ద భ్రమ. వర్రమానంలో, ఈ క్షణంలో పొందే ఆనందం నిజమైన జీవితం.”

వారిలో కొందరు బుద్దుని బోధనలకు పరవశించారు తమని శిష్యులుగా చేర్చుకోమని అభ్యర్థించారు

  • = “మృగదావం వెళ్లి కొండన్న అనే భిక్షుని కలవండి. నేను దేశాంతరం

వెళుతున్నాను ఎవరికోసం నా ప్రయాణం ఆగదు.”

ఆరాత్రికి అడవిలో నిద్రించి ఉదయం గంగానదిని దాటి ప్రయాణం సాగించాడు. ముందు ఉరువిల గ్రామం... తర్వాత రాజగ్భహకు - ప్రయాణం.

శ శ ఈ

ఏడు దినాలు ప్రయాణం చేసి బుద్ధుడు బోధి వృక్షాన్ని చేరుకున్నాడు. కన్న తల్లి ఒడిలో విశ్రమించినంత ఆనందం స్వంత ఇంటికి చేరిన తృప్తి, తనకు బోధికి ఎంత అనుబంధం! ఎంత గాఢత! ఆ రాత్రి బోధి వృక్షం క్రింద విశ్రమించాడు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఉదయం నైరంజర నదికి వెళ్లగా అక్కడ స్వస్తి కనిపించాడు. కొంతసేపు ఇద్దరు ముచ్చట్లాడుకున్నారు బుద్ధుడు వచ్చిన వార్త విని మధ్యాహ్నం పిల్లలు వచ్చారు బోధి వద్దకు. సుజాత తనతో ఊరిపిల్లల్ని తీసుకువచ్చింది.

“స్వస్తీ .. నీకు ఇరవై సంవత్సరాలు నిండితే నిన్ను నాతో తీసుకుపోతాను. అప్పటికి నీ తమ్ముళ్లు, చెల్లెలు కాస్త పెద్దవాళ్లవుతారు. వారి బాధ్యత నీకుండదు".

పిల్లలు చెప్పారు “స్వామా! కొద్దీ రోజులుగా ఇక్కడకు ఒక (బ్రాహ్మణస్వామి వచ్చి ఉన్నాడు. ఆయన వద్ద అయిదు వందల మంది శిష్యులున్నారు. మో లాగా వాళ్లు గుండు చేసుకోరు. జత్తు ముడి వేసుకుంటారు. అగ్నిని ఆరాధిస్తారు. ఆయన పేరు కశ్యపుడు చాలా గొప్పవాడు ”

సిద్ధార్థుడు లోగడ కశ్యపుని పేరు విన్నాడు. ఆయనను దర్శించాలని వెంటనే నది దాటి బయలుదేరాడు కశ్యపుడు శిష్య బృందంతో అక్కడ అరణ్యంలో ఉన్నాడు అందరూ పాకలు వేసుకుని ఉన్నారు వారు బట్టలు కట్టుకోరు. అకులు, చెట్ల బెరడులు ఆచ్చాదనగా ఉపయోగిస్తారు. గ్రామాలకు వెళ్లి భిక్ష చేయరు. దాతలు ఇచ్చింది పుచ్చుకుంటారు. స్వంతంగా వ్యవసాయం చేసి ధాన్యం పండిస్తారు తోటల్లో కాచిన కాయలు, పండ్లు తింటారు యజ్ఞాల కోసం జంతువుల్ని పెంచుతారు. 79 భగవాన్‌ బుద్ద

ఒక శిష్యుడు ఎదురుపడగా సిద్ధార్థుడు ప్రశ్నించాడు

“అయ్యా! మా గురువర్యులు వేదవిదులు, సకల శాస్త్రాలు చదివినవారు. ఆయనకు ఇద్దరు సోదరులున్నారు. వారూ యాజ్జికులే. ముగ్గురూ అగ్నిహోత్రా వధానులే. ఉరువిల కశ్యపుని సోదరుడు నాడీ కశ్యపుడు. ఆయన వద్ద మూడువందల మంది శిష్యులున్నారు”.

ఆ శిష్యుడు బుద్దుని వెంటబెట్టుకుని కశ్యపుని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆయన యువకుడు కాకపోయినా ఉత్సాహంగా కనిపించాడు. బుద్దుని గురించి ఆయన కర్ష్టాకర్ణిగా విన్నాడు. అతిధి సత్మారాల తర్వాత చర్చ సాగింది చర్చలో బుద్ధునికి వేదపరిజ్ఞానం బాగా ఉందని (గ్రహించాడు తనకు అంతుపట్టని అధర్వవేద సూత్రాలకు బుద్ధుడు గొప్పగా వివరణ ఇచ్చాడు. చరిత్ర, సిద్దాంత భాగం, బ్రహ్మజ్ఞానం గురించిన బుద్దుని అవగాహనకు ఆశ్చర్యపోయాడు

కశ్యపుని ఆతిధ్యం స్వీకరించాడు. బుద్దుని ప్రవర్తన కశ్యపునికి నచ్చింది. అతని వినయం, సౌశీల్యం అపూర్వం. భోజనానంతరం మరలా చర్చ మొదలైంది బుద్ధుడు ప్రశ్నించాడు : “మహాశయా! అగ్ని ఆరాధన వల్ల మనిషికి విముక్తి ఎలా సాధ్యం?”

కశ్యపుడు సూటిగా జవాబు చెప్పలేదు. ఏదో చెప్పి ఈ సన్యాసిని ఒప్పించడం అసాధ్యం అనుకున్నాడు : “సృష్టికి మూలం అగ్ని ... అదే బ్రహ్మం ు యజ్ఞశాలలో నిరంతరం అగ్నిని జ్వలింప చేయడానికి అదే కారణం ,..

కశ్యపుడు బ్రాహ్మణాభిమాని అని బుద్దుడు గమనించాడు. బుద్దుని (బ్రాహ్మణ వ్యతిరేకత కశ్యపుడు పసికట్టాడు.

“భ్రాహ్మణులు సమాజంలో తామే అధికులమని చెప్పుకుని, డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వేదాలు వల్లించడం, క్రతువులు నిర్వహించడం కేవలం ధనసంపొదనకే. అలాంటి వారి వల్ల బ్రాహ్మణ ధర్మం మంట కలుస్తోంది.”

బుద్దుడు ప్రశ్నించాడు : “కశ్యప మహాశయా! జీవితానికి నీరు ప్రధానం అంటారు. తీర్ధం మనిషిని పునీతుని చేసి బ్రహ్మైక్యం సిద్ధింప చేస్తుందంటారు, నిజమా?”

కశ్యపుడు కంగుతిన్నాడు. గంగాస్నానాలు చేసి లక్షలమంది పుణ్యం సంపాదిస్తున్నామన్న భ్రమలో ఉన్న సంగతి అతనికి తెలియంది కాదు.

“గౌతమా! ఒక్క నీటివల్లనే జన్మరాహిత్యం కలగదు. నీరు స్వభావం పల్లానికి ప్రవహించడం. అగ్ని స్వభావం పైకి పోవడం. మనం చనిపోయినపుడు, మన శరీరాలు అగ్నిలో దగ్ధం కాగా, ఆత్మలు ఆకాశంలోకి పోతాయి" భగవాన్‌ బుద్ధ 80

“కశ్యపా! నీ వన్నది నిజం కాదేమో, నీరు మేఘంగా మారి ఆకాశంలోకి పోతుంది గదా. పాగకూడా ఆవిరే కదా. ఆవిరి జలం నుండి వచ్చి మేఘాలైై, తిరిగి నీరుగా వర్సిస్తుంది. నా ఉద్దేశం అన్ని పదార్థాలు ప్రకృతి ధర్మానుసారం అనువర్తితమవుతాయి”.

“అంటే అన్నింటికి మూలధాతువు ఒక్కటే నంటారా? అన్ని రూపాలు తిరిగి మూలానికే చేరతాయంటారా”.

“కశ్యపా, అన్ని ధాతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. నా చేతిలోని ఈ ఆకునే తీసుకోండి. ఇందులో మట్టి, నీరు, అగ్ని బీజం, చెట్టు, కాలం, దూరం అన్నీ ఉన్నాయి. అందులో ఏ ఒక్క అంశం లోపించినా ఇది “ఆకు” కాదు. అలాగే జీవులు పరస్పరం ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవిస్తుంటారు ౫”

అప్పటికే చీకటి పడ్డది ఆ రాత్రికి తన ఆ(డశ్రమంలో నిద్రించమని కశ్యపుడు కోరాడు. ఆయన ఎవరికీ తన ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వడు. బుద్దుడు అంగీకరించలేదు తనకు ఒంటరిగా నిద్రించడం అలవాటని, వెళ్లి యజ్ఞశాలలో పడుకుంటానని చెప్పాడు.

కశ్యపు డన్నాడు : స్వామి! చాలా దినాలుగా యాగశాలకు రాత్రి వేళ ఒక భయంకర సర్బం వస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని నిరోధించలేక పోయాం. దయచేసి అక్కడ పడుకోవద్దు.

బుద్ధుడు . ఫరవాలేదు మిత్రమా! ఈ రాత్రి నేను యాగశాలలోనే నిద్రిస్తాను. నాకే ప్రమాదం ఉండదు.

అరణ్యాలలో కరోర తపస్సు చేసినప్పుడు అనేక మృగాలు వచ్చేవి కాని తనని ఏమో చేసేవి కావు. సర్పాలు మోద పాకేవి. వాటిని చూచి భయపడకపోతే విష జంతువులు, విష సర్పాలు మనల్ని ఏమి చేయవని బుద్ధుని నమ్మకం.

“మో ఇష్టం. యాగశాలలో నిద్రించదలిస్తే ఎన్ని రోజులైనా నిద్రించవచ్చు”.

ఆ రాత్రి బుద్ధుడు యాగశాలలో ప్రవేశించాడు... ఒక ప్రక్కయాగ సమిధలు, పెద్దపెద్ద గంధపు చెక్కలు, ఆముదపు దివిటీ, వెలుగుతోంది. సర్పం ఆ గంధపు చెక్కల మధ్య ఎక్కడో ఉంటుందని ఊహించాడు.

యజ్ఞవాటికలో ఒక వైపుగా బుద్దుడు ధ్యానానికి కూర్చున్నాడు. తనకు తెల్లవార్లు అలా ధ్యానం చేసే అలవాటుంది. అర్ధరాత్రి ధ్యానం నుండి లేచేసరికి పెద్ద తాచు చుట్టచుట్టుకుని తన వైపే చూస్తున్నది. బుద్ధుడు దానిని ప్రేమగా పలకరించాడు.

81 భగవాన్‌ బుద్ద

“మిత్రమా! హాయిగా అరణ్యంలోకి వెళ్లిపోక ఇక్కడ భయం భయంగా

జీవించడం దేనికి? అరణ్యంలో నీకు ఎవరి భయం ఉండదు”

సర్బం నెమ్మదిగా పాకుతూ బయటకు వెళ్లిపోయింది. బుద్దుడు నీర్విచారంగా నిద్రకు ఉపక్రమించాడు. కొంచెం సేపటికే మెలకువ వచ్చింది బయట వెన్నెల హాయిగా వుంది ఉత్తరీయం వేసుకుని యాగశాల నుండి బయటకు నడిచాడు. తెల్లవారే వరకు అరణ్యంలోనే గడిపాడు.

తెల తెల వారుతుండగా యజ్ఞశాల' అగ్నికి ఆహుతైంది. శిష్యమూక నది నుండి నీళ్లు తేవడానికి పరుగులు తీశారు. కశ్యపుడు నిర్దాతపోయి చూడసాగాడు. “నిన్న కలుసుకున్నాడు ఇవ్వాళ అగ్నికి ఆహుకైనాడు” అనుకున్నాడు. అంత దూరం నుండి ఆశ్రమంలో ఎగసిన మంటలు చూచిన బుద్దుడు వెనుతిరిగి వచ్చాడు. బుద్దుని చూడగానే కశ్యపుడు పరుగున వెళ్లి “తాము క్షేమమే గద!” అన్నాడు.

బుద్దుడు కశ్యపుని వైపు చూచి'నవ్వాడు.

ఆ రోజు ధర్మబోధ. అయిదు వందల మంది కశ్యపుని శిష్యులే కాక ఊళ్ల నుండి చాలా మంది వస్తారు వారంతా బుద్దుని సందేశం వింటే తనను ఛీత్మరిస్తారని, తన ప్రాభవం తగ్గిపోతుందని భావించాడు. అతనిని రాకుండా చేయాలని పన్నాగం. అది [గ్రహించిన బుద్దుడు భిక్షా పాత్రతో గ్రామంలోకి వెళ్లి, అటు నుండి పద్మవనానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రానేలేదు

బుద్దుని అన్వేషిస్తూ కశ్యపుడు పద్మవనానికి వెళ్లాడు. ఇద్దరూ సరోవరం ప్రక్కన కూర్చున్నారు

బుద్ధుడన్నాడు - “కశ్యపా, బహుకాలంగా మనం “ఆత్మ ప్రలోభంలో పడిపోయాం. ఆత్మ పరమాత్మ వేరు వేరు కావని నా అభిప్రాయం మరణంతో ఆత్మ వేరై పరమాత్మలో కలుస్తుందంటారు. అది తప్పు. ఏదీ వేరువేరుగా ఉండదు. ఏదీ శాశ్వతం కాదు.”

కశ్యపుడు ప్రశ్నించాడు. “ఆత్మ అన్నది తేనపుడు మనం చేసే తపస్సుకు లక్ష్యం ఏమిటి? ఫలితం ఏమిటి? తపస్సుకు, ధ్యానానికి ఆధారం అత్మ కదా?”

బుద్ధుడు చిరునవ్వు నవ్వి... “సమాధానం నీలోనే ఉంది అన్వేషించు”.

॥ సిద్ధార్థుని అభిదకు మొదట అసూయ చెందినా, కశ్యపుడు తర్వాత అభిమానం పెంచుకున్నాడు కొంతకాలం తమ ఆశ్రమంలో ఉండమని అర్ధించాడు సిద్ధార్థుడు భిక్షకు వెళ్లనవసరం లేదు. అన్ని ఏర్పాట్లు ఆశ్రమంలో ఉన్నాయి ఇద్దరు ఏవేవో తాత్వీక విషయాలు చర్చించుకున్నారు. సిద్దార్టుని ప్రజ్ఞకు దాసోహం అన్న కశ్యపుడు అతనిని అవతార పురుషునిగా ఆరాధించసాగాడు. భగవాన్‌ బుద్ద 82

ఒకరోజున పెద్ద తుఫాను వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి నైరంజరకు వరద వచ్చి చుట్టు పట్ల గ్రామాలన్నీ నీట మునిగాయి. జనం పడవల్లో సురక్షిత (ప్రాంతాలకు చేరుకున్నారు కశ్యపుని శిష్యమూక పర్వతాలపైకి పరుగులు తీశారు. ఎవరికీ గౌతముని జాడ తెలియలేదు. వెతకమని కశ్యపుడు మనుషుల్ని పడవల్లో పంపాడు. వరద వచ్చినంత వేగంగా తగ్గింది. తగలపడిన యాగశాల వరద నీటిలో కొట్టుకుపోయింది. శిష్యులు యాగశాల పునర్నిర్మాణం మొదలు పెట్టారు. కుటీరాలను మళ్లీ నిర్మించుకున్నారు. ఒకనాడు నైరంజర తీరంలో నడుస్తూ కశ్యపుడు ప్రశ్నించాడు : “నాకు అయోమయంగా ఉంది మిత్రమా! ఆత్మ అనేది లేనప్పుడు, ఆధ్యాత్మికతకు అర్ధమే లేకుండా పోతుంది. మోక్షం దేనికి? ఎవరికి? అసల్లు మోక్షం అనే పదానికి అర్ధమే ఉండదు”. సిద్ధార్దుడు కశ్యపా! క్లేశం సత్యమని విశ్వసిస్తావు కదా? కశ్యపుడు . అవును అంగీకరిస్తాను. కష్టాలు అందరం అనుభవిస్తున్నాం కదా. సిద్ధార్ధ : కష్టాలకు కారణాలుంటాయని అంగీకరిస్తావు గదా. కశ్యప : అవును. ఉండితీరాలి. సిద్ధార్ధ ; దుఃఖ కారణాలు ఉన్నప్పుడు దుఃఖం ఉన్నట్లే గదా! అంటే కష్టాలు, బాధలు తప్పని సరి. బాధల కారణాలను తొలగిస్తే బాధలు కలిగే అవకాశం

  • ఉండదు.

కశ్యప . అవును అది నిజం.

సిద్ధార్ధ - కవ్టాలకు మూలకారణం అజ్ఞానం. అంటే వాస్తవమైన సత్యాన్ని వక్రీకరించి చూడడం అశాశ్వతమైన దానిని శాశ్వతం అని భ్రమపడడం. లేని ఆత్మను ఉన్నది అని అనుకోవడం (భ్రాంతే కదా. అవి అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల కలుగుతున్న భ్రమలు, లోభత్వం, క్రోధం, భయం, అసూయ లాంటి వాటికి కారణం అజ్ఞానం, అవగాహన కొరవడదం. ప్రపంచంలోని వస్తు అశాశ్వ తత్వాన్ని గుర్తించ గలిగితే వాటి నుండి విముక్తి చెందవచ్చు. వాటిలో చిక్కుకోకపోవదమే విముక్తి. అంటే లేకుందా చేసుకోవడం. ఉన్నదాన్ని వదులుకోవడం అది స్వేచ్చ. మోక్షాన్ని స్వర్గాన్ని అపేక్షించడం కాదు- అజ్ఞానం తొలగించుకోవడం ముఖ్యం నా మార్గంలో 'ఆత్మ' వేరుగా విముక్తి పొందడం ఉండదు. ఊఉ

కశ్యపుడు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు ' “గౌతమా! అది మి అనుభవం కావచ్చు, కాదనను. ధ్యానం వల్ల, ఆలోచనల వల్ల స్ఫూర్తి కలుగుతుం 803 భగవాన్‌ బుద్ధ.

దన్నారు అయితే ఈ కర్మకాండ, ఆచారాలు, యజ్ఞాలు, క్రతువులు, పూజలు నిష్పయోజనాలా?”

“కశ్యప్రాా ఈ నది ఆవలి గట్టుకు చేరాఓ, ఏం చేస్తాం?”

“లోతులేనిచోట దాటవచ్చు ఈతవస్తే ఎక్కడైనా దాటవచ్చు. లేదా ఒక పడవలో అవతలి ఒడ్డుకు చేరవచ్చు.”

“అవును కదూ! నీళ్లలో తడవడానికి ఇష్టపడకపోతే? పడవపైన దాటడానికి భయపడితే? కేవలం ఒడ్డున నిలబడి అవతలి తీరం చేర్చమని దేవుళ్లను ప్రార్ధిస్తే అతనిని వమనాలి?”

“అజ్ఞాని”.

“క్రశ్యపా! అజ్ఞానం తొలగించుకోకుందా, మానసిక బలహీనతల్ని అధిగమించకుందా ఎవరూ భవసాగరాన్ని దాటలేరు. విముక్తి పొందలేరు. జీవితాంతం యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా వారిగేది ఏమి ఉండదు”

కశ్యపుని కళ్లు వర్షించసాగాయి. సిద్ధార్థుని పాదాలపై బడి “గౌతమ మహర్తీ! నా జీవితంలో సగభాగం వృధా అయింది. మో మార్గంలోకి నన్ను రానివ్వండి”.

“మిమ్మల్ని నా సంఘంలో చేర్చుకోడానికి నాకేమి అభ్యంతరం లేదు. కానీ ఇంతమంది శిష్య పరమాణువుల్ని ఏం చేస్తారు? వారంతా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు".

“వారితో నేను మాట్లాడతాను”.

మరునాడు ఉరువిల కశ్యపుడు తన అయిదు వందల మంది శిష్యులకు శిరోముండనం చేయించి బౌద్ధభిక్షుల్ని చేశాడు.

తర్వాత క్రమంగా నాడీ కశ్యపుడు, గయ కశ్యపుడు తమ శిష్య గణాలతో వచ్చి బౌద్ధం స్వీకరించారు.

“కోరికలు, భ్రమలు, ద్వేషాలు వదలిపెట్టండి. ఇంద్రియాలకు దాసులు కావద్దు. ఇంద్రియ సుఖాలను త్యజించండి. మిగిలిన సద్దుణాలు వాటంతట అవే ఏర్పడతాయి. ధ్యానం ఒక్కటే విముక్తికి సరైన మార్గం”.

మూడు మాసాలు గయశీర్షలోనే ఉండి ఉపాసకులకు ధ్యానం నేర్పాడు.

శ 3 7

సిద్ధార్ధుడు గయశీర్న నుండి రాజగ్భహకు బయలుదేరాడు ఉరువిల కశ్యపుడు తన పరివారంతో బయలుదేరాడు. రాజగృహ చేరడానికి చాలా రోజులు పడుతుంది. గయ ఇంతమంది భిక్షుల్ని భరించలేదు. మగధ మహానగరం కనుక భిక్షకు ఇబ్బంది

భగవాన్‌ బుద్ధ 864

ఉండదు ఇరవై అయిదు మందిని ఒక్కో బృందంగా విభజించి, ఒక్కొక్క బృందానికి ఒకరిని నాయకుడిని చేసి, ఎవరికి వారు విడివిడిగా ప్రయాణం సాగించే ఏర్పాట్లు చేశారు.

పదిరోజుల వ్యవదిలో రాజగృహ చేరుకున్నారు. నగరానికి రెండు మైళ్ల దూరంలో తామ్రవనం ఉంది. అందులో ఒక [ప్రాచీన దేవాలయం ఉంది. భిక్షులందరూ అక్కడకు చేరుకున్నారు. సిద్దార్థుడు భిక్షులకు కొన్ని నియమాలు పెట్టాడు. భిక్షకు వెళ్లినపుడు వరుసగా వెళ్లాలి. తలతిప్పి చూడకూడదు. భిక్ష ఇచ్చేవారు ధనికులా, పేదవారా అని ఆలోచించకూడదు. ఒక ఇంటి ముందు కొద్ది నిమిషాలు నిలబడి, భిక్ష పెట్టకపోతే తర్వాత ఇంటికి వెళ్లాలి. భిక్ష పెట్ట లేదని విమర్శించకూడదు. భిక్షాన్నం మంచిదా, చెడ్డదా అని చూడకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే మర్యాదగా సమాధానం చెప్పాలి. తాము బౌద్ధ సంఘ సభ్యులమని చెబితే చాలు. అధిక ప్రసంగం చేయకూడదు. అపరాహ్నం వేళకు అందరూ ఆరామానికి తిరిగి రావాలి. సాయంత్రం ధ్యానం, సత్సంగం, బోధనలు.

మధ్యాహ్నం తర్వాత నగరంలో ఒక్క కాషాయం కనిపించేది కాదు. రెండు వారాలలో బౌద్ద సంఘం గురించి నగరంలో తెలిసి పోయింది. పురజనులు బోధన వినడానికి తామ్రవనానికి వెల్లువలా రాసాగారు. బింబిసారునికి వార్త అందింది. తాను పూర్వం చూచిన మహాత్ముదే ఈయన అనుకున్నాడు. తామ్రవనానికి బయలుదేరాడు. తన వెంట నూరు మంది బ్రాహ్మణ పండితుల్ని విద్వాంసుల్ని రాజోద్యోగుల్ని తీసుకు వెళ్లాడు. రధాలను, శకటాలను అరణ్యం మొగదల నిలిపి బింబిసారుడు, రాణి, కుమారుడు అజాతశత్రు కాలినడన లోపలకు వెళ్లారు.

మహారాజ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తున్న వార్త వినగానే సిద్ధార్థుడు, కశ్యపుడు ఎదురేగి స్వాగతం పలికారు. మహారాజు వెంటవచ్చిన (బ్రాహ్మణ పండితులు కొందరికి ఉరువిల కశ్యపుడు పరిచయమే కాని వారికి బుద్ధుని పేరు తెలియదు. సిద్ద్ధార్టుని పేరు వారు వినలేదు కాని, కశ్యపుని వంటి మహాగురువు, సిద్ద్ధార్థునికి శిష్యుడు కావడం వారు జీర్ణించుకోలేని విషయం. బుద్ధుని ధర్మోపన్యాసం విని అందరూ ముగ్గ్దులైనారు. బుద్ధవాణికి పరవశించారు. వారికున్న సందేహాలు తీరాయి. జ్ఞానామృతం కడుపార తాగినంత తృప్తి కలిగింది చివరన బింబిసారుడు అన్నాడు -

“మహాభాగా! చిన్నతనం నుండి నాకు అయిదు తీరని కోరికలున్నాయి. ఇప్పుడు అవి ఒక్కటొక్కటిగా నెరవేరుతున్నాయి. ఒకటి : రాజ్యపట్టాభిషేకం. అది నెరవేరింది రెండు ఒక మహా జ్ఞానమూర్తిని దర్శించడం. అది మి 85 భగవాన్‌ బుద్ధ

దర్శనంతో సఫలమైంది. మూడు : అటువంటి మహాజ్ఞానిని సత్మరించడం నాలుగు" ఆ మహాత్ముని వద్ద దీక్ష తీసుకోవడం. అయిదు : జ్ఞానబోదను అర్ధం చేసుకునే శక్తిని పొందడం.

శాక్యమునీ! నన్ను మో అభిమాన శిష్యునిగా స్వీకరించగలరా.”

బుద్ధుని మందస్మితం అంగీకారం, రాజపరివారాన్ని తామవనం మొగదల వరకు సాగనంపారు.

జ ఈ

కతిపయ దినాలలో అనేక మంది విద్యావంతులు, ధనవంతులు ఆశ్రమాన్ని దర్శించసాగారు. కొందరు భిక్షు దీక్ష తీసుకున్నారు. యువతీ యువకులు బాగొ అకర్షితులవుతున్నారు. అర్హులనిపించుకున్నవారికి కొండన్న దీక్ష ఇచ్చాడు. 'త్రిశరణ ప్రవచనం ప్రధానం. ఒకనాడు కొండన్న కొత్తగా చేరిన వారికి కొంత వివరణ ఇచ్చాడు.

“బుద్దుడు అనే మాట ఒక్క సిద్ధార్థునికే వర్తించదు. జ్ఞాని అయిన ప్రతి వ్యక్తి బుద్దుడే. విశ్వాన్ని జ్ఞాని, బుద్ధుడైన వ్యక్తి జీవ స్వభావాన్ని స్వతంత్రంగా గ్రహించగలడు. భ్రమలు, భయాలు, లోభత్వం, క్రోధ, ద్వేషాసూయలు, రాగాలు, వాంఛలు లేని వాడే బుద్ధుడు. మన పరనగురువు గౌతమ సిద్దార్థుడు. ఆయన మనకు మార్గదర్శి. మహాజ్ఞాని సత్యస్వరూపుడు కరుణాకరుడు. మనలోని మాంద్యాన్ని తొలగించి. మనల్ని చైతన్యవంతుల్ని చేసి జాగృతి కలిగిస్తాడు. మనలో ప్రతి ఒక్కరిలో బుద్ధ ప్రజ్ఞ వుంది బుద్ధతత్వం ఉంది. అందరం బుద్ధులం కొవచ్చు అందుకు బౌద్ధధర్మం ప్రవేశద్వారం. సాధన పెరిగిన కొద్దీ మనలో బుద్ధప్రజ్జ ప్రకాశిస్తుంది. ఒక నాటికి మనం శాంతి, దాంతి, ఆనందం సంపూర్ణంగా పొందగలం. మన హృదయం బుద్దుని దర్శించాలి. బుద్ధుడు వం. వజ్రనికాయం “బుద్ధం శరణం గచ్చామి”

రెండవది * దమ్మపదం.. ధర్మాన్ని ఆచరించడం వల్ల జాగృతి కలుగుతుంది. జాగ్భతి అంటే అప్రమత్తత, మెలకువ. అంటే మనలో చైతన్యం కదలాడడం. అదే గౌతమ సిద్ధార్ధుడు మనకు బోధించింది. అజ్ఞానం, ఆగ్రహం, ఆక్రోశం, ఆశ, అహంకారం - వీటిని పరిహరించాభి, అధిగమించాలి. అప్పుడే స్వేచ్చ, శాంతి, ఆనందం లభ్యమవుతాయి. ఆ తర్వాత (ప్రేమ కలుగుతుంది. అవగాహన పర్చడుతుంది కరుణతో ఎవరినైనా ్రేమించగలం. చైతన్య పధంలో (ఢ్రేమ, ఆదరణ. అన్నవి గొప్ప అవసర గుణాలు. “ధర్మం శరణం గచ్చామి.

మూడవది సంఘం * సంఘం అంటే ఒక్తే లక్ష్యంతో, ఒకే రీతిగా సాధన చేస్తున్న మిత్ర సంఘం. ఇందులో సమత, సంఘీభావం, మిత్రభావన, సోదరడ్రేమ భగవాన్‌ బుద్ధ 86

ప్రదాన లక్షణాలు. కలిసి నడుస్తాం. కలిసి జీవిస్తాం. కలిసి కట్టుగా బ్రతుకుతాం. సాధనకు, ధ్యానానికి సమష్టి కృషి అవసరం. ఎక్కువమంది సాధన చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది అది సంఘ లక్షణం సంఘ లక్ష్యమూ అదే. అందుచేతనే సంఘాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. భిక్షులుగా మారడం జరుగుతుంది. 'సంఘం శరణం గచ్చామి”

శ ఈ 2

అప్పుడే సారిపుత్ర, మౌద్గల్యన సిద్దార్దుని సమాథ్రయించారు. వారు రాజ గృహలో ప్రసిద్ధ గురువు సంజయ శిష్యులు. సంజయ శిష్యుల్ని పరివ్రాజకు లంటారు. సారిపుత్ర, మౌద్గల్యన మంచి మేధావులు, మిత్రులు. వారిద్దరిలో ఎవరు ముందుగా 'ఆత్మ దర్శనం' పొందగలరని పోటీ. ఒకనాడు అశ్వజిత్‌ భిక్షువు రాజగ్భృహంలో భిక్షాటన చేస్తుండగా సారిపుత్రుడు చూచాడు. చూడగానే అతను జ్ఞాని అనిపించింది పరుగున వెళ్లి అతన్ని కలిశాడు. “మహాశయా! మిమ్మల్ని చూడగానే నా హృదయం స్పందించ నారంభించింది. తమదు ఎవరి శిష్యులు! ఎక్కడ మా నివాసం?”

“నా గురువు సిద్ధార్థుడు. బౌద్దం లోతైనది. (పేమ పూర్ణమైనదొ అన్నాడు జవాబుగా. సారిపుత్ర వెళ్లి ఆ విషయం తన మిత్రుడు మౌద్దల్యనకు చెప్పాడు. ఇద్దరు వచ్చి సిద్ధార్టుని ఆశ్రయించారు. వారి గురువు అనుమతి తీసుకురమ్మని సిద్ధార్ధుడు పంపివేశాడు. సంజయ వారిద్దరిని వదులుకోదానికి సిద్ధంగా లేడు.

“మోరు ఇక్కడే ఉండండి నా తర్వాత ఈ ఆశ్రమం మాది. అధికారం మోది”,

వారన్నారు : “గురువర్యా, మేం ఇక్కడకు వచ్చింది ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి గురు పీఠాలు మాకు అవసరం లేదు గురువు అనిపించుకోక పోయినా మార్గం మంచిదైతే, పదిమందికి సహాయపడవచ్చు.”

సంజయకు చివరి నమస్కారం చేసి, సిద్దార్టుని ఆశ్రయించారు. వారితో పాటు మరికాందరు పరివ్రాజకులు వెళ్లి బౌద్ధసంఘంలో చేరారు.

(9) నాడు పౌర్ణమి. బుద్దుడు చేతితో భిక్షాపాకత్రతో రాజగృహ నగరం (ప్రవేశించాడు. వెంట 1250 మంది భిక్షులున్నారు. అందరూ అడుగులో అడుగు వేస్తూ, నిశ్శబ్దంగా నడుస్తున్నారు నగరం శోభాయమానంగా అలంకరించబడింది. అన్నిచోట్ల స్వాగత తోరణాలు, వీధులలో దీప తోరణాలు. జనవాహిని 87 భగవాన్‌ బుద్ధ

బింబిసార చక్రవర్తి రాజోద్యోగులతో నగర సింహద్వారం వద్ద స్వాగతం చెప్పాడు రాజ ప్రాసొదంలో విశాలమైన పందిరి వేసి, వేదికను సిద్ధపరిచారు. వేదికపై సిద్ధార్థుడు ఆశీనుడు కాగా, ఒకవైపు బింబిసారుడు, రెండవవైపున ఉరివిల కశ్యపుడు కూర్చున్నారు యువరాజు అజాతశత్రు పాద ప్రక్షాళనకు నీళ్లు తెచ్చాడు. బుద్ధుడు ఎవరిచేత కాళ్లు కడిగించుకోడు. భిక్షులు స్వయంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు. భిక్షాపాత్రల్నీ సైతం తామే శుభం చేసుకుంటారు బుద్దునికి మాత్రం బింబిసారుడు తన చేతులతో వడ్డించాడు. మిగిలిన వారికి రాణి వైదేహి, తన పర్యవేక్షణలో సేవకుల చేత వడ్డింప చేసింది ఆనాటి ధర్మ ప్రసంగం విన్నవారు ఆరువేలమంది. సామాన్య కుటుంబీకులకు ఉపకరించే సూత్రాలను సిద్దార్డుడు బోధించాడు -

  1. అహింసా పరమోధర్మః : జంతుహింస పనికిరాదు. హింసాప్రవృత్తి నీచం." హింసను నివారించడంవల్ల మనలో (డ్రేమ జనిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. మనుషులకే కాదు ప్రతిజీవికి జీవించాలన్న ఆశ, మరణభయం ఉంటుంది. మనకు మన ప్రాణం ఎంత ముఖ్యమో వాటికి వాటి ప్రాణం అంతే ముఖ్యం. ఇతరుల ప్రాణాల్ని రక్షించడం మానవధర్శం. మరొకరిని హింసించి, బాధించే హక్కు మనకు లేదు. మన హృదయాలు ప్రేమతో నింపుకుంటే బాధలుండవు, జీవితం సుఖమయమవుతుంది. పురజనులంతా అహింస పాటిస్తే దేశం శాంతిగా ఉంటుంది. మనుషులు (ప్రేమించుకోవడం అలవాటు చేసుకుంటే పగలకు, '్రతీకారాలకు అవకాశం ఉండదు. ఏ దేశం దండయాత్రలకు భయ పడదు మనం శాంతిగా ఉండి వారి శాంతిని ఆపేక్షించాలి. సైనిక బలాన్ని నిర్మాణాత్మక కార్యాలకు ఉపయోగించవచ్చు.

  2. దొంగతనం కూడదు : ఒక వ్యక్తి సంపాదించుకున్న సొత్తును అపహరించే హక్కుమరొకరికి లేదు. అది నైచ్యం పరుల సాత్తుకు ఆశపడకూడదు. ఎవరినీ మోసం చేయకూడదు. అధికారం, పరపతి, బలం ప్రయోగించి ఇతరుల ఆస్తుల్ని స్వంతం చేసుకోకూడదు. కష్టించి సంపాదించుకున్నది అనుభవించే హక్కుప్రతి ఒక్కరికీ ఉంది. ఈ సూత్రం పాటిస్తే సమాజంలో అసమానతలుండవు. హత్యలు, దొంగతనాలు సమసిపోతాయి.

3 అవినీతి నిర్మూలనం - వ్యభిచార నిర్మూలనం . లైంగిక సంబంధాలు భార్యా భర్తలకే పరిమితం కావాలి. పరస్త్రీని ఆశించడం, పరపురుష సాంగత్యం తప్పు. అవినీతి వర్తనంవల్ల కుటుంబంలో సుఖశాంతులు నశిస్తాయి. భార్యా భర్తల మధ్య క్షలతలు, ద్వేషాలు ఏర్పడతాయి. దుర్వ్యసనాలకు ఖర్చు చేసే డబ్బుతో అనేక మంచిపనులు చేయవచ్చు. బగవాన్‌ బుద్ధ 88

  1. సత్యభాషణ * అబద్దాలు చెప్పకూడదు. ఇతరులతో అసూయ, అసహ్యం కలిగేటట్లు మాట్లాడకూడదు. మిరు చెప్పే మాటలు సత్యసమ్మతంగా ఉందాలి. మాటల శక్తి అమోఘం. సత్యవాక్కుల శక్తి అమోఘం సత్యంవద - ధర్మ్శంచర.

5, మద్యమాంసాలు ; ఎటువంటి మత్తు పానీయాలకు అలవాటు పడకండి. మద్యం వల్ల మనస్సు బలహీన మవుతుంది. ఆలోచించే శక్తి పోతుంది వివేకం నశిస్తుంది. అనేక అనర్జాలకు దారితీస్తుంది మద్యపానం -

రాజా! ఈ అయిదు సూత్రాలు ప్రజలు పాటించేలా చేయండి. దేశం సుభిక్షంగా ఉంటుంది.

బింబిసారుడు, వైదేహి, అజాతశత్రు బుద్ధునికి నమస్కరించారు. బింబిసారుడన్నాడు. “మహాత్మా, నాదొక విన్నపం రాజగ్భహకు రెండు మైళ్ల దూరంలో ఒక సుందరారణ్యం వుంది. దానిపేరు వేణువనం. చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది మో భిక్షు సంఘానికి అది నివాస యోగ్యం. ధ్యాన యోగ్యం. దానిని సమర్పించు కుంటున్నాను స్వీకరించండి.”

బుద్ధుడు ఆలోచించాడు. ఇంతమంది ఖిక్షులకు ఒక తావళం ఉండడం మంచిది. పర్ణశాలలు వేసుకోవచ్చు. తన అంగీకారం తెలిపాడు. అక్కడ సమావేశమైన బ్రాహ్మణ వర్గానికి రాజుగారి వితరణ నచ్చలేదు. కానీ వ్యతిరేకించే థైర్యం ఎవరికీ లేదు.

“ఒక బంగారు కలశంతో గంగోదకం తెప్పించి, బుద్ధుని చేతిలోకి నీరు వంపుతూ దాన క్రియ జరిపించాడు బింబిసారుడు. “ఈ పవిత్ర జలం సాక్షిగా నా వేణువనాన్ని బుద్ధ సంఘానికి సమర్పిస్తున్నాను స్వీకరించండి. 'స్వస్తి.”

శ రేల ఈ

మరునాడు సిద్దార్డుడు కొందరు ముఖ్యశిష్యులతో వేణువనం దర్శించాడు. వేల ఎకరాల విస్తీర్ణంలో రకరకాల వెదురు పొదలు, చాలా రకాల ఫలవ్నక్షాలు. వనం మధ్యలో కాలందక సరోవరం- స్నాన పానాలకు అనువుగా వుంది. అందరికీ నచ్చింది. వెంటనే అక్కడ విహార నిర్మాణం రూపుదిద్దుకోసాగింది. విహార నిర్మాణ బాధ్యత మౌద్గల్వ్యకు అప్పగించారు రకరకాల వెదురుగడలు, రెల్లుగడ్డి, తాటాకులు తెచ్చి పర్ణశాలలు నిర్మించసాగారు సిద్ద్ధార్టుని కోసం ఒక విశాలమైన పర్ణశాల ఏర్పాటైంది. నిద్రించడానికి ఒక గడ మంచం తయారు చేశారు. నాగశ్యామలను సిద్ధార్థునికి సహాయకునిగా నియమించారు. అతను ఒకప్పుడు ఉదువిల కశ్యపుని నమ్మినబంటు. మంచివాడు. యువకుడు.

89 భగవాన్‌ బుద్ధ

సారిపుత్ర విహార నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు ఒక జేగంట తెప్పించి సరోవరం వద్ద చెట్టుకు వేలాడదీయించాడు. గంట మోగగానే అందరు ధ్యానానికి రావాలి ప్రతి ఒక్కరు భిక్షకు ఊళ్లోకి వెళనవసరం లేకుండా అభిమానులనుంచి అందరికి విహారానికే భోజనం వచ్చే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క భిక్షువుకు ఒక పాత్ర, చాప, బట్టలు, నీళ్లకుండ ఏర్పాటు చేయించాడు. ప్రధాన శిష్యులు కొండన్న, అశ్వజిత్‌, కశ్యప, సారిపుత్ర, మౌద్గ్దల్యన, వ్ర, మహానామ లకు ఒక్కొక్కరికి యాభై, అరవై మంది భిక్షుల్ని కేటాయించారు. వారు ఒక్కొక్క బృందం.

భిక్షులు అర్ధరాత్రి వరకు ధ్యానం చేసి నిద్రపోతారు. బుద్ధునికి నిద్ర రాదు. తన పర్ణశాలలో ఒంటరిగా ఉంటాడు. ఆరు బయట మంచం మిద కూర్చుని ధ్యానం చేసుకుంటాడు కశ్యపుడు బుద్ద్ధునితో పాటు తెల్లవార్లు ధ్యానంలో ఉంటాడు.

బింబిసారుడు తరచు విహారానికి వచ్చి సిద్దార్టునితో గడుపుతున్నాడు. ఒకసారి బుద్ధునితో అన్నాడు . “నాకు అజాత కాక మరొక కుమారు డున్నాడు. అతని తల్లి ఆమ్రపాలి. ఆమె వైశాలి నగరంలో ఉంటుంది. వాడి వయస్సు పదమూడు. ఆమెకు అంతఃపుర జీవితం నచ్చదు. ఆమె పోషణకు అన్ని ఏర్పాట్లు చేశాను. జీవకుడు చురుకైనవాడు. వాడికి రాజకీయాలు నచ్చవు. వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు మిరు అనుమతిస్తే వారిని మి దర్శనానికి రప్పిస్తాను”.

బుద్ధుడు నవ్వి, తన అంగీకారం మౌనంగా తెలియచేశాడు

అదే రోజున కపిలవస్తు నుండి ఇద్దరు రాజబంధువులు అతిధులుగా వచ్చారు ఒకరు కాలూదయి. రెండవ వ్యక్తి చెన్న ఒకరు సిద్ధార్డుని బాల్యమిత్రుడు చెన్న ఆనాటి రధసారధి. ఏడు సంవత్సరాలైంది సిద్ధార్థుడు ఇల్లు విడిచి అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. కాలూదయి యువకుడే అయినా అతనిలో వృద్దాప్యపు ఛాయలు కనిపిస్తాయి కాలూదయి శుద్డోదన మహారాజుకు ఆత్మీయుడు, ఆంత రంగికుడు. అందుకే స్వయంగా వెళ్లి సిద్ధార్దుని ఆహ్వానించమని పంపాడు. చెన్నని తోడు తీసుకు వెళ్లమని యశోధర సలహా ఇచ్చింది. వారు వేణువనం చేరడానికి నెలరోజులు పట్టింది.

కాలూదయి చెప్పిన మాటల్ని బట్టి సిద్ద్ధార్డుడు (గ్రహించింది- తండ్రిగారి ఆరోగ్యం అంత బాగాలేదు గౌతమి మామూలుగానే వుంది నంద రాకుమారునికి యవ్వనం వచ్చింది కళ్యాణిని ప్రేమిస్తున్నాడు సిద్దార్టుని చెల్లెలు సుందరి నంద అందంగా తయారైంది. తను ఇల్లు వదిలిన వెంటనే యశోధర పట్టు వస్త్రాలు, నగలు త్యజించి సన్యాసినిగా జీవిస్తోంది. సిద్ధార్ధుడు ఏక భుక్తం అని తెలిసి తను ఒంటిపూట భోజనం అలవాటు చేసుకుంది. రాహుల్‌కి ఏడు సంవత్సరాలు బావుంటాడు. బగవాన్‌ బుద్ధ 90

కపిలవస్తు రమ్మని కాలూదయి అడిగాడు. బుద్దుడు వర్షాకాలం అవగానే వస్తానని మాట ఇచ్చాడు కొద్దిరోజులు విహారంలోనే ఉండమని, తమ జీవన విధానం గమనించమని వారిని కోరాడు. వారిద్దరికీ భిక్షుజీవన విధానం నచ్చింది. యశోధర అనుమతి లేనిది చెన్నడిని తాను అంగీకరించనని చెప్పాడు. కాలూదయి వెంటనే బౌద్ధ భిక్షువైనాడు శ శ ల్‌ ఒకనాడు సారిపుత్ర మౌద్దల్యన ఒక సన్యాసిని బుద్దుని దర్శనానికి తీసుకు వచ్చారు అతనిపేరు దీర్హనాఖ. సారిపుత్ర మేనమామ 'సంజయి అతని వ్యవహార నామం మహా అహంభావి. సారిపుత్ర బౌద్ధం స్వీకరించాడని కారాలు మిరియాలు నూరుతూ బుద్దునితో తలపడాలని వచ్చాడు. బుద్దుని నేరుగా, సూటిగా, అమర్యాదగా ప్రశ్నించాడు “గౌతమా! మోరేం బోధిస్తారు. మోది ఏ మతం? మో సిద్ధాంతం ఏది?” బుద్దుడు నవ్వాడు * “ఏదీ, ఎవరినీ నమ్మకపోవడం నా సిద్ధాంతం. అంటే అనుభవం కాని దేనినీ నమ్మకూడదన్న సిద్ధాంతం.” దీర్ణనాఖ తల తిరిగింది. “మిరు నమ్మడం, నమ్మకపోవడం నాకు ముఖ్యం కాదు”. బుద్ధుడు : నాకు అదే ముఖ్యం మహాశయా! ఒక సిద్ధాంతాన్ని నమ్మడం జరిగితే మన స్వేచ్చ నళించినట్లు. మిగిలినవి అసత్యాలని వాదిస్తాం. చర్చలు, వాదనలు స్పర్ధలకు, వైషమ్యాలకు దారి తీస్తాయి. కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ఆధ్యాత్మిక రంగంలో పెద్ద అవరోధం. తనచుట్టు గిరిగీసుకున్నవారు “సత్యం” దరి దాపులకు చేరలేరు. దీర్ణనాఖ : మి బోధలు నమ్మినవారు ఆ గిరిలో చిక్కుబడిపోతారు గదా! వారూ సత్యాన్ని తెలుసుకోలేరని అనుకోవచ్చునా? బుద్దుడు నేను వేదాంతం చెప్పడం లేదు. తత్వశాస్తాలు, సిద్ధాంతాలు బోధించను. నా జ్ఞానం పాండిత్యం వల్ల అబ్బింది కాదు నావి అనుభవసారాలు, అనుభవైక వేద్యాలు. అనుభవంతో సత్యాసత్యాలు తెలుసుకోవడం అవసరం దీర్టనాఖ * భేష్‌ గౌతమా! మో బోధనలనే సిద్ధాంతాలుగా భావించే ప్రమాదం ఉంది కదా! అప్పుడు ఏం జరుగుతుంది? మాది ఒక సిద్ధాంతం అవుతుంది కదా బుద్ధుడు . కాదు. అది ఒరవడి మాత్రమే అవుతుంది నేను చెప్పే విషయాలు సిద్ధాంతాలు కావు ఆమోదించడం, అఆమోదించక పోవడం మా యిష్టం. బలవంతం లేదు నా అనుభవాలను కాదనలేరు గదా వేలితో చంద్రుని 9] భగవాన్‌ బుద్ద

చూపిస్తే వేలును చూచి అదే చంద్రుడని భ్రమపడితే ఎలా? నా బోధన అనుభవాలకు (ప్రేరణ. నదిని దాటడానికి పడవను ఉపయోగిస్తాం. ఒద్దుకు చేరిన తర్వాత పడవను అక్కడ వదిలేస్తాం గానీ, తల మోద పెట్టుకు మోస్తూ పోము గదా. తత్వాలు పదడవల్లాంటివి

దీర్ణనాఖ : బాగా సెలవిచ్చారు గౌతమా నాకూ విముక్తి చూపించండి.

బుద్దుడు : మన భావాలు, అనుభూతులు మూడు రకాలు. కొన్ని సంతోషం కలిగిస్తాయి. కాన్ని దుఃఖం కలిగిస్తాయి. మిగిలినవి అటు ఇటు కానివి ఆ మూడురకాల భావాలకు, అనుభూతులకు మూలం మనస్సు, ఆధారం శరీరం. వాటి మూలం అన్వేషించుకోమని నేను చెబుతాను. ఎక్కడా ఆగిపోకూడదు. చెడ్డ ఆలోచనలు రాకుండా చేస్తే బాధలు కలగవు మో పూజల వల్ల, ఆరాధనల వల్ల ఎప్పటికీ అజ్ఞానం పోదు, జ్ఞానం కలగదు

శ శ ఆ

భువన మోహిని ఒకామె వేణువన విహారానికి వచ్చింది సిద్ధార్ధ దర్శనార్ధం. ఆమెది అప్స్పరసల్ని మించిన సౌందర్యం. దేవతల్ని మించిన దర్చం. ఆమె వెంట ఒక యువకుడు. ఆమె నడకలో ఆకర్షణ వుంది.

“భగవాన్‌ బుద్ధదేవుని ఆశ్రమం ఎటు?” అని అడిగింది ఎదురైన ఒక భిక్షువును. అతనే సిద్దార్థుని కుటీరానికి తీసుకు వెళ్లాడు. వీరు వెళ్లే సమయానికి సిద్ధార్థుడు పర్షశాలలో లేడు. కొంతసేపటికి కాలూదయి, సారిపుత్ర, నాగశ్యామలతో కలిసి వచ్చాడు. ఆ సుందరి, యువకుడు బుద్దునికి పాదాఖివందనం చేశారు.

“జన్మలో ఇంతటి సౌందర్యవతిని చూచి ఎరగను". అనుకున్నాడు కాలూదయి. ఇటీవలనే ఆశ్రమం స్వీకరించాడు భిక్షువైన తను అందాన్ని ఇలా ఆస్వాదించవచ్చునా? నాగశ్యామల స్థితి అంతే. . ఏవేవో కోరికలు బుసలు కొడుతున్నాయి. సారిపుత్ర, బుద్ధుడు మాత్రం ఆమె కళ్లలోకి సూటిగా, నిర్వికారంగా చూడగలిగారు. బుద్ధుని చూపులు ఎంతో చల్లగా అనిపించాయి ఆమెకు. ఆమె సూటిగా బుద్దుని కళ్లలోకి చూచింది. ఎంత పవిత్ర భావన. ఇంత కాలం తనను చూచిన వారంతా కాంక్షతోనే చూచారు ఇంతటి (ప్రేమతో ఎవరూ చూచింది లేదు.

“నా పేరు ఆమ్రపాలి. వీడు నా కొదుకు జీవకుడు బింబిసార మహారాజు గారి పుత్రుడు మి గురించి వినడమే గాని, దర్శన భాగ్యం కలగలేదు”

జీవకుని చదువు గురించి అడిగాడు. మంచి కుర్రవాడు, మనసున్నవాడు.

జీవకునికి సిద్దార్థుని పట్ల గౌరవం కలిగింది “భగవాన్‌, నా చదువు పూర్తి కాగానే విహారానికి వచ్చి ఇక్కడే ఉంటాను” భగవాన్‌ బుద్ధ 92

ఆమ్రపాలి తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంది క్షణంలో. ఆమె కళ్లు వర్షించాయి. “భగవాన్‌, నా జీవితం అంతా బాధలమయం. నాకు సంపదలకు ఏనాడూ కొదవలేదు. లేనిది మనశ్శాంతి - తృప్తి. నేను ఏం పోగొట్టుకున్నానో ఈనాడే తెలిసింది ”

ఆమ్రపాలి రాజనర్తకి పదహారవ ఏట (ప్రేమలో పడ్డది. భంగపడి తర్వాత బింబిసారునికి చేరువైంది. అంతఃపురం ఆమెను రాణివాసంలో అంగీకరించలేదు. జీవకుడు బింబిసారుని కుమారుడు కాదని పుకార్లు పుట్టించారు. అవమానం భరించలేక ఆమ్రపాలి అంతఃపురం వదలి వచ్చింది. బింబిసారుడు ఆమెకు వేరే ఏర్పాట్లు చేశాడు. స్వేచ్చగా జీవించడం ఆమెకు ఇష్టం.

సిద్ధార్దుడు అన్నాడు : అందానికీ వృద్ధి క్షయాలుంటాయి ఆమ్రపాలీ. కీర్తి సంపదలకు వృద్ధి క్షయాలుంటాయి. ధ్యానం ఒక్కటే అక్షయం, తరగని సంపద. మనిషికి నిజమైన సుఖాన్నిచ్చేది ధ్యానం ఒక్కటే.

తిరిగి వెళ్లిపోతూ సిద్ధార్థుని అర్ధించింది “భగవాన్‌, వైశాలి నగరం వెలుపల నాకొక పెద్ద మామిడితోట వుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మారు, మా సంఘం అక్కడికి దయచేయమని నా ప్రార్ధన”.

బుద్ధుడు అంగీకారం తెలిపాడు ఆమె వెళ్లగానే కాలూదయి సిద్దార్టుని సమోపించాడు. సారిపుత్ర కాలూదయి వైపు నిదానించి చూచి ఫక్కున నవ్వాడు. నాగశ్యామల వైపు చూచి సారిపుత్ర అలాగే నవ్వాడు. ఆ ఇద్దరికి కాస్త మానసిక వికారం కలిగిందని గ్రహించి సిద్దార్థుని ప్రశ్నించాడు “మహాభిక్లూ! సన్యాసి అందాన్ని ఆరాధించవచ్చునా? ఆస్వాదించవచ్చునా? స్రీ సౌందర్యం ఆధ్యాత్మికానికి అవరోధమా?”

బుద్ధుడు నవ్వి : ధర్మం అందానికి అందనిది. అతీతమైనది అందం, అహంకారం మనః కల్పితాలు. చూచేవారి సంస్కారం బట్టి, భావన బట్టి అందానికి విలువ. ఒక చిత్రకారునికి ఏదైనా అందంగా కనిపిస్తుంది. స్రీ అందానికి దాసులైన వారు సర్వం కోల్పోతారు. భగవంతుని ఆరాధించినట్లే స్రీని, ధర్మాన్ని ఆరాధించవచ్చు. సమదృష్టి ఏర్పడితేనే భిక్షువు. భిక్షువు మనసులో ఆకర్షణ, వికర్షణ రెండూ ఉండకూడదు నిజమైన (క్రేమ హృదయంలో ఉంటుంది. కరుణ నిండిన హృదయం మాత్రమే ్రేమించగలదు. ఆ (ప్రేమ పవిత్రం, స్వచ్చం. ఆనందం కలిగించేది అటువంటి అమలిన (పేమ.

సిద్ధార్ధుడు వెంటనే కాలూదయిని, చెన్నను కపిలవస్తుకు పంపేశాడు - తన రాక అక్కడ తెలియచేయమని తన భిక్షుక అవతారం చూచి నగరంలో ఎవరేం అనుకుంటారోనని తెగ సిగ్గుపడ్డాడు కాలూదయి. 93 భగవాన్‌ బుద్ద

ల రను? లు, ల్ల న త గో ్‌ లే ఎం లు న ట్రే న. నీ కా ఉపదేశం న. " సో న | లా శ క లో వ 1 ఖు... గ్గ వనభసోగు లలి ళం గ. ప్రచారానికి యయిన మాసో రాగా [వారానికే న న సూ న. మ పు ట్ట ల వ. సమతాదృక్స్పధం మ

తొమ్మిది రోజులు కాలినడకన సిద్ధార్ధ బృందం కపిలవస్తు చేరింది. వారికి స్వాగతం చెప్పదానికి రాజమందిరం సిద్ధం చేశారు. సిద్ధార్థుడు మూడు వందల మంది శిష్యులతో వేంచేశాడు మౌద్గల్యన, కొండన్న కశ్యప వేణువనంలో ఉండి మిగిలిన వారి బాగోగులు చూస్తున్నారు. సిద్ధార్దుని బృందం కపిలవస్తుకు మూడుమైళ్ల దూరంలోని న్యాగోధవనంలో బసచేసి మర్నాడు నగర ప్రవేశం చేశారు.

మూడు వందల మంది కాషాయ సన్వాసులు భిక్షాపాత్రలు చేతబట్టి నగరంలో సంచరించడం విచిత్రం అనిపించింది. ప్రజలు ఆ దృశ్యాన్ని వినోదంగా చూడసాగారు. సిద్ధార్థుడు నగరంలో ప్రవేశించిన వార్త రాజాంతఃపురంలో నిమిషాల్లో తెలిసింది. ఎదురువెళ్లి ఆహ్వానించడానికి మహారాజు రథం సిద్ధం చేయించాడు. మహారాణి ప్రజాపతి గౌతమి, యశోధర అంతఃపురంలోనే నిలిచి ఏర్పాట్లు చూడసాగారు

శుద్దోదనుని రథం నగర తూర్చ్పుద్వారం వద్ద భిక్షు బృందం ముందర వచ్చి ఆగింది. రధసారధి ముందుగా సిద్దార్టుని గుర్తించాడు. “మహారాజా అడుగో ఆయనే రాకుమారుడు!” కాషాయ వస్త్రాలు ధరించిన అతనా నా కుమారుడు- ఒక ఇంటిముందు నిలిచి భిక్ష గ్రహిస్తున్న దృశ్యం చూచి కళ్లలో నీరు తెరిగింది. ఎంతటి దుస్థితి. మహారాజు కుమారుడు బిచ్చగాడు కావడం? సిద్దార్థుని దృష్టి మహారాజు పైన లేదు. చిరిగిన బట్టలతో వచ్చి భిక్ష ఇస్తున్న స్తీ మూర్తి పైన నిలిచింది. శుద్దోదనుడు కాలి నడకన సిద్ద్ధార్జుని సమోపించాడు.

“నాయనా! సిద్దార్ధా అతని కంఠం జీరపోయింది కన్నీరు గొంతుకు అడ్డం పడుతోంది.

“నాన్నగారూ” సిద్దార్టుని పిలుపు ఆ పిలుపులోనే పలకరింపు, పులకరింత.

నాగశ్యామల వచ్చి సిద్ధార్థుని చేతిలోని భిక్షాపాత్రను అందుకున్నాడు సిద్ధార్థుడు రెండు చేతులు చాచి తండ్రిగారి చేతులు పట్టుకున్నాడు. ఆలింగనం చేసుకోవాలని అనిపించినా, కాషాయవస్తాలు అడ్డుపడ్డాయి. సిద్ధార్థుడు మిగిలిన భిక్షుల నుద్దేశించి “మిరంతా వనానికి వెళ్లండి. నాగశ్యామల నాతో రాజ మంది రానికి వస్తాడు”

సారిపుత్ర, మిగిలిన ఖిక్షులు వెనుతిరిగి వెళ్లారు,

శుద్డోదనుడు * సరాసరి అంతఃపురానికి వస్తావనుకున్నాం. 85 భగవాన్‌ బుద్ధ

సిద్ధార్ధుడు “నేను ఒంటరిగా రాలేదు నాన్నగారూ నా వెంట పెద్ద పరివారం ఉంది. మాకు భిక్షాటన అలవాటే! నేనూ భిక్షువునే”.

“ఇలా బిచ్చ మెత్తటం మన వంశంలో లేదు” నిష్టూరంగా అన్నాడు శుద్దోదనుడు.

“లోగడ లేదు. ఇప్పుడే ఆరంభం. భిక్షాటన వల్ల ఆభిజాత్యం నశిస్తుంది. అహంకారం నశిస్తుంది. వినయం ఏర్పడుతుంది. భిక్షుల దృష్టిలో ధనిక, పేద తారతమ్యం ఉండదు. రాజైనా, రంగసాని అయినా ఒక్కటే ఆదరణకు మాకు. భిక్షాటన వల్ల మా విలువ పెరుగుతుంది గానీ తగ్గదు పితాశ్రీ”.

అలా నడుస్తూ అంతఃపురం చేరారు. గౌతమి, యశోధర, రాహుల్‌ సుందరి నంద ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అంతదూరం నుంచి సిద్ధార్థుని యశోధర గుర్తించింది

“నాన్నా రాహుల్‌ ! అడుగో మా నాన్నగారు నీకు ఏం బహుమతులు తెచ్చారో వెళ్లి అడుగు” అన్నది.

క్షణంలో రాహుల్‌ మేడ దిగి బుద్దుని వద్దకు పరుగుతీశాడు వచ్చిన బాలుడు రాహులు డని గుర్తించడానికి ఆలస్యం కాలేదు. కౌగిలించుకుని ముద్దాడాడు.

ఉద్వేగంతో రాహుల్‌ అడిగాడు, “నాకేం తెచ్చారు నాన్నగారూ”

తల నిమురుతూ, “ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు నేనేం బహుమళులు తెచ్చానో తెలుస్తుంది. ఇంకా నీవు చిన్నవాడివి కదా”,

ఒక వైపు తండ్రిగారు, రెండవ వైపు రాహుల్‌... మధ్యలో సిద్ధార్థుడు ఇద్దరి చేతులు తాను పట్టుకున్నాడా? వారిద్దరు సిద్ధార్థుని చేతులు పట్టుకున్నారా? లోపలకు వచ్చారు. గౌతమి, యశోధర, సుందరి వచ్చారు. సిద్ధార్థుడు ఆ ముగ్గురికి “ఎదురుగా వెళ్లాడు గౌతమి ఎప్పటి లాగా ఠీవిగా, దర్పంగా వుంది “అమ్మా” అని ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకున్నాడు.

“గోపా ... నన్ను క్షమించు” ఆమెకు దుఃఖం ఆగలేదు.

దగ్గరగా వెళ్లి యశోధర చేతిని తన చేతుల్లోకి తీసుకుని “గోపా, నేను సర్వదా నీ త్యాగానికి రుణపడి ఉంటాను. నా విజయం నీది, నా జ్ఞానానికి ఆలంబన నీవు. నేనే కాదు, లోకమూ నీకు రుణపడ్డది గోపా”. క

గౌతమి కాస్త చిరుకోపంగా అన్నది, “సిద్దార్దా! నీవు వెళ్లి ఏడు సంవత్స రాలైంది. యశోధర కనుక ఇన్నాళ్లు ఓర్చుకుందయ్యా, గొప్ప త్యాగశీలి”

“అమ్మా! గోప, మిరు ఇద్దరూ నాకు రెండు కళ్లు ... మో మనస్సులు ఆమోదించి, అనుమతించిన తర్వాతనే నేను వెళ్లాను”. బగవాన్‌ బుద్ద 96

యశోధర తృప్తిగా తలవంచుకుంది.

“నందా! నేను వెళ్లేనాటికి నీ వయస్సు పదిహేను సంవత్సరాలు కదా!

ఇప్పుడు బాగా పెద్దవాడవైనావు”

నంద తల్లిగారి ఆదేశం మేరకు సిద్దార్థునికి పాదాభివందనం చేశాడు.

తర్వాత న్యాగ్రోధవనానికి బయలుదేరుతుండగా యశోధర అడిగింది -

“రేపు మిరు, కాలూదయి తూర్పుభవంతికి భిక్షకు దయచేయండి. మా కోసం నేను, రాహుల్‌ నిరీక్షిస్తుంటాం”.

సిద్ధార్దుడు మందస్మితం చేసి, తల ఊపి బయలుదేరాడు.

శుద్దోదనుడు రథం సిద్ధం చేయించాడు. సిద్ధార్థుడు అంగీకరించలేదు “సన్యాసికి రాజభోగాలా! నడక వంటికి, మనస్సుకు మంచిది”.

రాజవీధిలో బయలుదేరాడు. నగర ద్వారం వరకు శుడ్డోదనుడు సాగ నంపాడు. వారిద్దరు అలా రాజవీధిలో నడుస్తుంటే సూర్యచంద్రులు కలిసి 'ప్రయాణిస్తు న్నట్లుంది జనం వింతగా చూడసాగారు. బుద్దుడు నాగశ్యామలతో బయలుదేరాడు.

ల

కొంతకాలం కపిలవస్తులో ఉండమని శుద్ధోదనుడు అర్ధించాడు. తండ్రి గారి కోరిక తీర్చడానికి కుమారులుంగారు అంగీకరించారు అయితే ఒక నిబంధన. తనను న్యాగ్రోధవనంలోనే ఉండనివ్వాలి. అంతఃపురానికి ఆహ్వానించకూడదు ఆహ్వానించినా అది పగటి వేళకే పరిమితం,

“నేను ఇక్కడ సిద్దార్టునిగా ఉండను బుద్ధునిగా.... గౌతమ బుద్దునిగా ఉంటాను. ఎవరూ నన్ను సిద్దార్థుడని పిలవవద్దు. అలా భావించవద్దు. ఆ పేరు పూర్వ స్మృతుల్ని నా గృహస్థాశ్రమ జీవితాన్ని గుర్తుకు తెస్తుంది".

అందుకు అంగీకరించారు. మూడు దినాలలో న్యాగ్రోధవనంలో మూడు వందల పర్దశాలలు తయారైనాయి ఒక విశాలమైన ధర్మశాల సిద్ధమైంది. ఎవరూ నగరంలో భిక్షాటనకు రానవసరంలేకుండా విహారంలోనే సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు.

గౌతమికి, యశోధరకు న్యాగ్రోధవనానికి వెళ్లి సిద్దార్ధునితో మాట్లాడాలని కోరికగా వుంది. నందకుమారుడు రెందుసార్లు బుద్దుని దర్శించి వచ్చాడు ఆయన బోధనలు నచ్చాయి. అన్నగారంటే గౌరవం, బోధనలపట్ల అసక్తి. తనకూ అలా భిక్షువుగా జీవించాలన్న కోరిక కలిగింది.

97 భగవాన్‌ బుద్ధ

బుద్ధుడు కోరికలే కష్టాలకు కారణం అన్నాడు. ఇలా భిక్షువు కావాలన్న కోరిక కూడా కష్టాలు కలిగిస్తుందా?

“మో సంఘంలో నన్నూ చేర్చుకోండి” అని అడిగాడు. బుద్దుడు నవ్వీ మౌనం వహించాడు నందుడు యువకుడు భిక్షువు కాదగిన లక్షణాలున్నాయి కాని గుణదోషం ఉంది అతను కళ్యాణిని వదలలేదు. ప్రేమలో పడ్డాడు.

యశోధర తన మందిరానికి భిక్షకు ఆహ్వానించిన విషయం గుర్తుకు వచ్చి కాలూదయితో కబురు పంపాడు, తాము భిక్షకు వస్తున్నట్లు వచ్చే అతిధులు ముగ్గురు. బుద్ధుడు, కాలూదయి, *" నాగశ్యామల. అయినా యశోధర గౌతమిని తోడు పిలిచింది.

భోజనానంతరం అందరినీ ఉద్యాన వనానికి తీసుకువెళ్ళింది యశోధర. అక్కడ కడిమిచెట్టు క్రింద సమావేశం. ఆ చెట్టును చూడగానే సిద్దార్టునికి తన బాల్యం జ్ఞాపకం వచ్చింది. ఆ చెట్టు క్రిందనే చాలా సంవత్సరాల క్రితం, బాల్యంలో మొదటిసారి ధ్యానం చేసి, సమాధి స్థితిని అనుభవించాడు. ఇప్పుడు ఆ వృక్ష చ్భాయలో సమావేశం ఏర్పాటు చేయడం గౌతమి విజ్ఞతకు నిదర్శనం ఆ విషయం యశోధరకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పటికి ఆమెతో తనకు పరిచయం లేదు. తను ఉరువిల గ్రామంలో సుజాత, స్వస్తి మొదలైన వారికి చేసిన ఉపదేశం జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ ఉద్యానవనంలో యశోధర ఒక బాలసేవా సదనం నడుపుతోంది. ఆ పిల్లలకు చెట్లనీడలో చదువు చెబుతుంది. ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆమెది ఒక విధంగా ప్రజాసేవ వీరందరూ వెళ్ళే సరికి ఉద్యానవనంలో పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు

బుద్ధుడు రాహుల్‌ని తన ప్రక్కన కూర్చోమని పిలిచాడు. కొంచెం అవతలగా యశోధర, గౌతమి, సుందరి, నంద కూర్చున్నారు

పిల్లల్ని చూస్తే సిద్ద్ధార్థునిలో కధలు పొంగుకొస్తాయి. పూర్వజన్మల కధలు చెబుతుంటాడు.

పిల్లలూ, మాకో కధ చెబుతాను వినండి

“అనగనగా ... చాలా కాలం క్రితం ఒకానొక హిమాలయ దేశంలో 'మేఘ' అని ఒక యువకుడుండేవాడు. చాలా మంచివాడు. కష్టపడి పనిచేసేవాడన్న మాట. అతను పేదవాడు. చదువుకోవాలని ఉండేది కాని డబ్బు లేదు. చదువు నిమిత్తం ఒక నగరానికి బయలుదేరాడు. పేదవాడు కదా రధం, గుర్రం ఎక్కలేదు. నడిచి వెళ్లాడు. చేతిలో ఒక కర్ర, కట్టుకునే బట్టలు ఇంకేం లేవు. త్రోవలో కూలీ నాలీ పనిచేస్తూ, పొలాల్లో పనిచేస్తూ పొట్ట పోషించుకుంటూ కాసిని డబ్బులు బగవాన్‌ బుద్ధ 98

సంపాదించాడు “దివాపతి అనే నగరం చేరేసరికి అతని వద్ద అయిదు వందల నాణాలు చేరాయి

అతను వెళ్ళీ సమయానికి నగరం చాలా కోలాహలంగా వుంది. ఉత్సవ సంరంభం. ఏమై ఉంటుందో అర్ధం కాలేదు. ఏ పండుగ లేని సమయం. తెలుసుకుందామన్న జిజ్ఞాసతో అటు ఇటు చూచాడు. ఒక యువతి కనిపించింది చాలా అందంగా వుంది. కలువపూలు సెజ్జలో పెట్టుకుని వయ్యారంగా నడుస్తూ తన వైపుగా వస్తోంది.

మేఘ ఆమెని ఆపి “అమ్మాయి, ఏమిటీ కోలాహలం ఏమైనా విశేషమా?” అని ప్రశ్నించాడు.

ఆమె మేఘని ఎగాదిగా చూచింది. “మోరు మా ఊరికి కొత్తా? 'దీపంకరి మహర్షి మా నగరానికి వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఒకప్పుడు మహారాజు కుమారుడట. ఇల్లు విడిచి వెళ్లి జ్ఞానం సంపాదించాడు. ఇప్పుడు వచ్చాడు. అందుకే ఈ సంబరం”.

మేఘ సంతోషించాడు ఆడబోయిన తీర్ధం ఎదురైంది. ఒక మహాజ్ఞానిని దర్శించే అవకాశం తనకు కలిగింది. ఆయనకు ఏదైనా కానుకగా సమర్పించి, తనను ఆయన శిష్యునిగా స్వీకరించమని అడగాలనుకున్నాడు. ఏమివ్వాలి? తన దగ్గర ఏమి లేవు. ఆ సుందరి వద్ద పూలున్నాయి. అడిగితే ఇస్తుందా!

“సుందర్‌, ఒకటి అడుగుతాను, కాదనకుండా ఇస్తావా?” అడిగాడు.

“ఇవ్వదగ్గదైతే, నా వద్ద ఉన్నదైతే ఇస్తాను”

“ఈ పూలు నాకు ఇవ్వగలవా? ఎంతకు కొన్నావు?”

“బాటసారీ!! నేను కొన్నవి అయిదు పూలే. మిగిలిన రెండూ మా ఇంటి సరస్సులోవి”.

“పోనీ అయిదు పద్మాలు ఎంతకిస్తావు చెప్పు?”

“అయిదు వందలు.

“బాలా! నేను దీపంకర గురువును దర్శించాలి. అందుకు”

“నేనూ ఆయన దర్శనానికే వెళుతున్నాను ఉత్తి చేతులతో వెళ్లితే బావుండదు కనుక వీటిని అమ్మను కాక అమ్మను”.

మేఘ నిరాశ చెందాడు అయినా ప్రయత్నించడం తప్పు కాదు కదా! “సుందరీ ! నీవు చాలా అందంగా వున్నావు. నీ చూపే గొప్ప బహుమతి. నీవు 99 భగవాన్‌ బుద్ద

చాలా మంచి దానివి. దయతలచి అయిదుపూలు నాకివ్వు, రెండు నువ్వుంచుకో. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను!”

ఆమె నేలచూపులు చూడసాగింది. కొంచెం సేపటికి తల ఎత్తి అన్నది

“మోరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూచిన క్షణంలోనే మనది జన్మ జన్మల బంధం అనిపించింది. ఏడడుగుల బంధం అనిపించింది. చాలా మందిని చూచాను, ఎవరిపట్ల నాకు ఇష్టం కలగలేదు ఇప్పుడు నా హృదయం రెపరెప లాడింది. నన్ను పరి[గ్రహించగలరా? మో అర్జాంగిగా అంగీకరించగలరా?” సిగ్గుల మొగ్గయింది.

మేఘ రెండు నిమిషాలు ఆలోచించాడు, “తరుణీ, నిన్ను చూచినదే తడవు నాకూ అలానే అనిపించింది నిన్ను పెళ్లి చేసుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని నేను జ్ఞానార్తిని. నా జ్ఞాన గమ్యానికి అవరోధం కాకుంటే సరే”.

ఆమె “ప్రమాణం చేస్తున్నాను. మీ భార్యనైనంత మాత్రాన మీ అభ్యుదయానికి ఆటంకం కాను. అందుకు నేను చేయగల సాయం చేస్తాను”.

ఇరువురు దీపాంకర గురుదర్శనానికి వెళ్లారు భక్తజనం కిటకిట లాడు తున్నారు. ఆయన దూరంగా వేదికపై జ్ఞానజ్యోతి స్వరూపంగా వెలుగుతున్నారు. ఆయన తేజస్సు దశదిశలా పరచుకుంది.

“ఒకనాటికి నేనూ మో అంతటి వాడిని కావాలి గురుదేవా. నన్ను అనుగ్రహించి, ఆశీర్వదించండి” అని మనసులోనే అనుకున్నాడు.

దగ్గరగా వెళ్లే వీలు కలగలేదు. చేతిలో అయిదు పదాలున్నాయి. వాటిని పట్టుకుని దీపాంకర వైపు బలంగా విసిరి వేశాడు. అవి నేరుగా వెళ్లి ఆయన చేతుల్లో పడ్డాయి. ఆమె అదే పని చేసింది. ఆమె విసిరిన రెండు పద్మాలు ఆయన పాదాలపైన పడ్డాయి

“ఎవరా పద్మ పూజారులు? వారిని నా సమక్షానికి రమ్మనండి”.

మేఘ, సుందరి చేతులు ముకుళించి, ఆయన ముందు నిలబడ్డారు ఆయన మేఘ వైపు చ్లూచి” /'సిద్దార్ధడవు నాయనా, నీ ఆంతర్యం తెలిసింది.”

సుందరి వైపు తిరిగి, “బాలా, నీవు అతనికి ఈ జన్మలోనే అర్జాంగివి కాదు ముందు జన్మలలోనూ నీవే అతని అర్జాంగివి”.

ఇద్దరినీ ఆశీర్వదించాడు.

“బాలలూ, మనిషికి సంపద, కీర్తి కొలమానాలు కావు. ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. శాశ్వతంగా నిలిచి ఉండేది ప్రేమ అత్యంత విలువైనది ప్రేమ”. భగవాన్‌ బుద్ద 100

యశోధర రెండు చేతులతో ముఖం కప్పుకుని కన్నీరు కార్చింది - ఆనందం, దుఃఖం ఆమెలో ఒకేసారి పెల్లుబికాయి అది 'తమి కధే! గౌతమి యశోధర ఆంతర్యం గ్రహించి బుజంమాద చేయివేసి ఊరడించింది.

“ఈ జన్మలో మేఘ మన సిద్దార్టుదే. నీవే ఆ సుందరివి".

పిల్లలంతా కధ విని సంబరపడ్డారు యశోధర, గౌతమి మాత్రం గుండె బరువెక్కి విలవిల్లాడారు.

రాహుల్‌కి అర్ధం అయీకాక బుద్దుని కళ్లలోకి ప్రశ్నార్థకంగా చూడ సాగాడు.

బ్‌

కౌద్ది రోజుల తర్వాత శుద్దోదనుడు బుద్ధుని సారిపుత్రుని భిక్షకు ఆహ్వానించాడు. గౌతమి, యశోధర, నంద, సుందరి, రాహులుడు వీరు మాత్రమే కలిసి భోజనం చేశారు. 'నిత్య జీవితంలో ధ్యానం గురించి” బుద్దుడు చిన్న ప్రసంగం చేశాడు. నిత్యం ధ్యానం చేయడం వల్ల సంసారులకు చికాకులు తగ్గుతాయని, మనశ్శాంతి కలుగుతుందని సారాంశం బుద్దుడు ప్రసంగిస్తున్నంతసేపు రాహుల్‌ సారిపుత్ర చేయిపట్టుకుని ప్రక్కనే కూర్చున్నాడు.

బయలుదేరినప్పుడు బుద్దుడు శుద్దోదన మహారాజుకు నమస్మరించబోగా చేతిలోని భిక్షాపాత్రను నంద అందుకున్నాడు. తర్వాత దానిని తిరిగి తీసుకోలేదు. నందా ఇవ్వలేదు. విహారం వరకు తనే పట్టుకుని వెంట వెళ్లాడు. సారిపుత్ర చేయి రాహులుడు వదలలేదు. విహారం చేరిన తర్వాత సిద్ధార్థుడు అడిగాడు

“నందా! ఒక కొన్ని దినాలు ఆరామంలో ఉండు. ఖిక్షుక జీవనం చవిచూడు”. శ

అంతకుముందే సిద్ధార్థుడు తండ్రిగారి వద్ద నంద ప్రస్తావన తెచ్చాడు “నంద తెలివి గలవాడు కాని రాజుకుండవలసిన సద్యస్ఫూర్తి, వివేకం లేవు. కొంతకాలం ఆశ్రమంలో ఉండనీయండి” శుద్దోదనుడు అంగీకరించాడు

నెల తిరగక ముందే నంద ఆలోచనలు కళ్యాణివైపు తిరిగాయి. ఆ విషయమే సిద్దార్భునితో చెప్పాడు.

సిద్ధార్దుడు : “నందా, ఏ రంగంలోనైనా గమ్యం చేరాలంటే మనస్సుపైన పట్టు సంపాదించాలి. వ్యాకులపాటు పనికిరాదు. కోరికల్ని జయించాలి. సాధనపైన మనస్సు లగ్నం చేయి”

నందను చూచి రాహుల్‌ అసూయపడసాగాడు. “చిన్నాన్నను విహారానికి రానిచ్చారు. నన్ను రమ్మనలేదు నాన్నగారికి నేనంటే ఇష్టం లేదా” తల్లిని అడిగాడు.

“పెద్దవాడి వైనాక వెళ్లవచ్చు" అన్నది యశోధర. 101 బగవాన్‌ బుద్ధ

మర్నాడు బుద్దుడు భిక్షకు వచ్చినపుడు రాహుల్‌ని చూచి చిరునవ్వు నవ్వాడు. చేయి అందించాడు ఆ చేయి విడిచి పెట్టకుండా విహారానికి వెళ్లాడు రాహుల్‌

నంద, రాహుల్‌ చిన్నవాళ్లు అయినా వారికి ప్రాధమిక బౌద్ధ ధర్మాలు బోధించమని సారిపుత్రకు చెప్పాడు. వారిద్దరు దీక్ష తీసుకున్న విషయం రాజప్రాసాదానికి చేరింది శుద్దోదనుడు, యశోధర, గౌతమి విహారానికి బయలుదేరి వెళ్లారు.

శుర్ధోదనుడు బాధను అణచుకుంటూ అన్నాడు : “నాయనా! సిద్దార్ధ! నీవు బుద్ధావతారమెత్తావు సరే. గత్యంతరం లేక మనసు దిటవు చేసుకున్నాం ఈ పసివాళ్లకు ఎందుకీ శిక్షగా

“నాన్నగారూ! మోరు అనుకున్నట్లు ఇది శిక్ష కాదు వారికి శిక్షణ కొన్నాళ్లు ఉండనీయండి. తర్వాత వాళ్లకిష్టమైతే తిరిగి రాజ్యకార్యాలకు వస్తారు. భిక్షులుగా ఉండిపోవాలన్న నియమం లేదు”.

ఆ మాటలు కాస్త ఊరట కలిగించాయి.

పెద్దల ఆమోదం లేకుండా పిల్లలను సంఘంలో చేర్చుకోనని సిద్దార్టుని వద్ద మాట తీసుకున్నాడు శుద్డోదనుడు.

“నాన్నగారూ నాకు సెలవిప్పించండి. నేను రేపు మగధకు బయలు దేరుతున్నాను. మరొకసారి వస్తాను. సెలవ్‌”. '

కపిలవస్తు వదిలిన బుద్ధ సంఘం కోసలిదేశంలో ప్రవేశించింది. సంఘంలో నూట ఇరవై మంది భిక్షులున్నారు. ఉన్నత కుటుంబీకులు కొందరు వచ్చి దీక్ష తీసుకుంటున్నారు. అనుప్రియ నగరం వెలుపల ఒక వనంలో విడిది చేశారు. బుద్ధునితో పాటు సారిపుత్ర కాలూదయి, నంద, రాహుల్‌ ఉన్నారు. కపిలవస్తు నుండి బయలుదేరిన నెలరోజులలో ఇద్దరు భిక్షులుగా మారడానికి సంసిద్ధులైనారు వారు మహానామ, అనిరుద్ర వారి మిత్రులు అప్పటికే చాలామంది బుద్ధ సంఘంలో చేరారు. తన సోదరుడు అనిరుద్ర సంఘంలో చేరుతున్నాడని విని మహానామ విరమించుకున్నాడు తల్లి అనుమతి నిరాకరించింది “నాకు ఆధారం మారిద్దరే” అనిరుద్ర (్రతిమిలాడగా ఆమె అన్నది “నీ స్నేహితుడు భద్రిక నీతో పాటు సన్యసించేట్లయితే, నీవూ సన్యసించు”. భద్రిక ఎప్పటికీ అంగీకరించడని ఆమె నమ్మకం. అతను సంపన్నుడు. మంచి హోదాగల పదవిలో ఉన్నాడు భగవాన్‌ బుద్ద 102

అనిరుద్ర వెళ్లి మిత్రుని కలిసి విషయం చెప్పాడు.

“నేను సన్యసించ దలచాను”.

“మంచిది. సన్యసించు నిరభ్యంతరంగా”.

“నీవు కూడా సన్యసిస్తేగానీ అమ్మ ఒప్పుకోదు”

“నాకూ ఛిక్షువు కావాలనే వుంది మరో ఏడు సంవత్సరాలు ఆగు. అప్పుడు పోదాం”.

“ఏడు సంవత్సరాలా? అసంభవం అంతకాలం నేను ఆగలేను”.

“పోనీ మూదు సంవత్సరాలు ఓపిక పట్టు”.

“ఉహుం అదీ కష్టమే”.

“ఏడు మాసాలు అగలేవా? కొన్ని ముఖ్యమైన పనులు చక్కదిద్దాలి”.

“లాభం లేదు రోజులు గడిస్తే నీ మనసు మారుతుంది".

“పోనీ ఏడు రోజులు గడువివ్వు ...”

అనిరుద్ర అంగీకరించాడు మరికొంత మంది మిత్రుల్ని వప్పించాడు. అంతా రాజకుటుంబీకులే. బాగు, కింబిల, దేవదత్త, ఆనందుడు. అనుకున్న రోజుకు దేవదత్త ఇంటి నుండి బయలుదేరారు. అందరిలో చిన్నవాడు ఆనందుడు. తండ్రి అనుమతి తీసుకున్నాడు. అన్న దేవదత్తతో బయలుదేరాడు. ఆరుగురు శకటాలపై కోసల సరిహద్దులు చేరారు. బుద్ధపరివారం అనుప్రియ వనంలో ఉన్నట్లు తెలిసింది.

కోసలరాజ్యంలో ప్రవేశించగానే అందరు ఆభరణాలు, కరకంకణాలు, ఉంగరాలు, కంఠహారాలు తీసి మూటగట్టారు తాము సన్యాసం స్వీకరించ బోతున్నారు. నగానట్రా అనవసరం ఎవరైనా పేదవానికి ఇచ్చివేయాలి అటు ఇటు చూడగా తమ ఈడు వాడు ఒక మంగలి కనిపించాడు. అనిరుద్ధ వెళ్లి అతనిని అనుప్రియకు మార్గం చూపమని అడిగాడు. అతని పేరు ఉపాలి. కొంతదూరం వారి వెంట వెళ్లి దారి చూపాడు.

“ఇదిగో ఉపాలీ, ఈ మూటలో నగలున్నాయి నీవు తీసుకో” నగలమూట అతనికి అందించారు. రాకుమారులు వెళ్లిన తర్వాత మూట విప్పాడు. కళ్లు బైర్లు కమ్మాయి. ఎన్ని నగలు ! ఎంత విలువ ! అన్ని నగలు తనవంటి పేదవాడి దగ్గర ఎవరైనా చూస్తే దొంగతనమో, హత్యో చేశాననుకుంటారు లేదా, ఏ దొంగలో తనను చంపి నగలు కాజేయవచ్చు, లేనిపోని ప్రమాదం- నగల మూట అక్కడ వదలి వారికోసం పరుగుతీశాడు 103 భగవాన్‌ బుద్ధ

అతను వచ్చి కలవగానే దేవదత్త ఆశ్చర్యపడి అడిగాడు “నీవా? నగలు ఏం చేశావు?”

“గాప్పవారు మిరే నగలపై వ్యామోహం వదులుకొనిపోతుంటే, నేను వాటిపైన వ్యామోహం పెంచుకోవడం తప్పు గదా! నేనూ మాతో వస్తాను. నేనూ బుద్ధ భగవాన్‌ సేవ చేసుకుంటాను”.

మర్నాడు అందరు బుద్దుని కలిశారు. తమ అభిమతం తెలియచేశారు. భద్రిక వారిని పరిచయం చేశాడు. “మాలో ముందుగా ఉపాలీకి దీక్ష ఇవ్వ ప్రార్ధన”.

మూడు రోజుల తర్వాత వైశాలికి బయలుదేరారు. అక్కడ మహావనంలో మూడు రోజులు గడిపి, పది రోజుల్లో రాజగ్భహకు చేరుకున్నారు

అక్కడ బుద్దుడు దీక్ష ఇచ్చిన వారిలో మహాకశ్యపు డొకరు. మగధలో గొప్ప ధనవంతుని కుమారుడు కశ్యపుడు. వైశాలి నగరానికి చెందిన భద్ర కపిలని పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు సంవత్సరాలు సంసారం చేసి భార్యాభర్తలు ఒకేసారి దీక్ష తీసుకున్నారు. అది ఎలా జరిగిందంటే ...

ఒకనాటి ఉదయం కశ్యపుడు భార్యకంటె ముందుగా నిద్రలేచాడు. భార్య ప్రక్కన ఒక విషనాగు కనిపించింది. భయంతో వణికిపోయాడు. అంతలోనే సర్పం మంచం దిగి వెళ్లిపోయింది. భార్యను నిద్రలేపి విషయం చెప్పాడు. ఆమెకు తక్షణం వైరాగ్య భావం కలిగింది. ఇద్దరూ బుద్దుని దర్శించారు. చూడగానే కశ్యపునిలో ఆధ్యాత్మిక పరిణతిని బుద్దుడు గుర్తించాడు. తన భార్యకూ దీక్ష ఇమ్మని అర్థించాడు.

“లేదు, కశ్యపా! ఆడవారిని సంఘంలో చేర్చుకునే ఆలోచన ప్రస్తుతం లేదు. కొంతకాలం ఆగవలసి ఉంటుంది. ఇంట్లోనే ఉంటూ బౌద్ధ ధర్మాలు పాటించవచ్చు”.

శ శ 3

కొన్ని రోజుల తర్వాత సుదత్తుడనే సంపన్నుడు బుద్ధుని బోధనలకు ప్రభావితుడై బుద్ధుని దర్శించి, కోసలకు ఆహ్వానించాడు. శ్రావస్తి నగరంలో అతను గొప్ప వితరణశీలి. “అనంత పిండికి అనే పేరు అతనికి సార్ధకం. వ్యాపార నిమిత్తం రాజగ్భహకు వచ్చినపుడు బావగారింట దిగుతాడు. ఒకసారి సుదత్త వచ్చే సమయానికి అతని బావ, బుద్దునికి భిక్ష ఏర్పాట్లలో ఉన్నాడు. సరాసరి బావ కోసం వేణువనానికి వెళ్లాడు. వాహ్యళికి వెళ్లి వస్తున్న బుద్ధుడు అతనిని చూచి, 'సుదత్తా' అని పలకరించాడు. భగవాన్‌ బుద్ధ 104

బుద్ధుని పరివారానికి జేత వనం అనుకూలమని సుదత్త భావించాడు. కాని అది జేత రాకుమారునిది. వెళ్లి జేతను కలిసి విషయం చెప్పాడు. జేత వయస్సు రెండు పదులు. తండ్రి ప్రసేనజిత్తు బహుమతిగా ఇచ్చిన వనం అది. ఆ వనంలో బంగారు నాణాలు పరిచి, పరిచినంత మేర భూభాగాన్ని తీసుకోమని నోబంధన పెట్టాడు జేత. అతను అంత డబ్బు పరచలేడని అనుకున్నాడు. కాని సుదత్త మొత్తం జేతవనాన్ని బంగారు నాణాలు పరిపించి కైవశం చేసుకున్నాడు.

సుదత్త సారిపుత్రను రాకుమారునికి పరిచయం చేశ్తాడు. సారిపుత్రను చూడగానే జేత మనస్సు మారింది. జేతవనంలో పరివారాసీకీ భవనాలు తానే కట్టిస్తానని మాట ఇచ్చాడు. భిక్షకు ఎవరూ బయట తిరగనవసరం లేకుండా రాజమందిరం నుండి పంపే ఏర్పాటు చేశాడు. జేతవనంలో బౌద్ధ విహారం నిర్మిత మవుతున్న వార్త నగరంలో పాకింది. నాలుగు మాసాలలో విహారం సిద్ధమైంది.

బుద్ధుని వెంట అయిదు వందల మంది ఛిక్షులు వైశాలి చేరుకున్నారు. ఒకనాడు (ప్రాత సమయంలో ఆమ్రపాలి బుద్ధుని దర్శించి, తన ఆమ్రవనాన్ని బుద్ధ సంఘానికి బహూకరించింది. ఆ తర్వాత బుద్దుడు, సారిపుత్ర మరో మూడు వందల మంది భిక్షులతో శ్రావస్తి బయలుదేరారు.

అప్పటికి రాహుల్‌ వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఉపదీక్ష మాత్రం తీసుకున్నాడు. సారిపుత్ర శిక్షణలో ఉన్నాడు. రాహుల్‌కి సారిపుత్ర అంటే ఇష్టం. జేత వనానికి జేత తల్లి రాణి మల్లిక వస్తుంది కాని ప్రసేనజిత్తు రాడు ప్రసేన జిత్తు సోదరి బింబిసారుని పట్టమహిషి. వారు మూడేళ్లుగా బౌద్ధధర్మం ఆచరిస్తున్నారు. (ప్రసేనజిత్తుకు అనుమానం - ఇంత చిన్న వయస్సులో ఎవరైనా మహాజ్ఞాని కావడం ఎలా సాధ్యం?

అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకతను పుత్రశోకంతో బుద్దుని దర్శనానికి వచ్చాడు. అతను చాలా రోజులు రుద్రభూమిలో ఏడుస్తూ, గడిపాడు. అతని దుఃఖం చూచి బుద్దుడు అడిగాడు “ఢ్రేమలో అంతబాధ ఉంటుందా?”

అతనికి కోపం వచ్చింది “లేదు సామా, ప్రేమవల్ల బాధ కలగదు, (ప్రేమ సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. వియోగం దుఃఖం కలిగిస్తుంది”.

బుద్ధుడు వివరణ ఇచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు ... “బుద్ధుని నిర్వచనం తప్పు” అని ఎలుగెత్తి ప్రచారం చేశాడు. ప్రసేనజిత్‌ ఆ మాటవిని రాణితో అన్నాడు “బుద్ధుడు అజ్ఞాని” ... అని.

“గౌతముడు అలా చెప్పి ఉంటే అదే నిజం” అన్నది పట్టుదలగా. 105 భగవాన్‌ బుద్ధ

“గొప్పవాళ్లు చెప్పే ప్రతిమాట గొప్పది కానవసరం లేదు. నమ్మనవసరం లేదు” వాదించాడు భార్యతో,

మర్చాడు రాణి 'నళిజంఘు అనే బ్రాహ్మణ పండితుని పిలిచి “అన్ని బాధలకు (వేమే మూలకారణమా?” అని అడిగింది వెళ్లి బుద్ధుని అడిగి రమ్మంది. అతను వెళ్లి బుద్ధుని అదే ప్రశ్న వేశాడు. బుద్దుడు మరో సంఘటన ఉదహరించాడు.

“ఈ మధ్య శ్రావస్తిలో ఒకామె తల్లిని కోల్పోయింది. ఆ విచారంలో ఆమె మతి (భ్రమించింది. పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతూంది. ఎదురుపడ్డ వారిని “మా అమ్మను చూచారా?” అని ప్రశ్నిస్తూంది”

“బాధకు కారణం ఏమిటి విప్రోత్తమా?”

“ఇద్దరు (ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అమ్మాయిని తలిదండ్రులు వేరే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.”

దుఃఖానికి కారణం ఏమిటి నళి జంఘా?

ఆ కధలు బ్రాహ్మణుడు వెళ్లి రాణికి చెప్పాడు. ఆమె ఒక రోజు ప్రసేన తీరికగా ఉన్న సమయంలో (ప్రక్కన కూర్చుని “మహారాజా, మిరు రాకుమారి వజరిని 'ప్రేమిస్తున్నారు కదూ?” అని ప్రశ్నించింది

“అదేం పిచ్చి ప్రశ్న! నా ప్రాణం కన్న మిన్నగా (ఢ్రేమిస్తున్నాను”.

“తనకు ఏదైనా జరిగితే. మిరు బాధ పడతారా? ఆనందిస్తారా?”

మహారాజు నోట మాట రాలేదు. కళ్లు తిరిగినంత పనైంది.

“బుద్దుని బోధలు కరోర సత్యాలు. ఒక పట్టాన అర్ధం కావు” అనుకున్నాడు.

శ శం 3.

ఒకనాడు ప్రసేనజిత్‌ ఒంటరిగా బుద్ధుని కలవడానికి వెళ్లాడు జేతవనం సమిపంలో రధం దిగి కాలి నడకన పర్ణశాలకు చేరాడు. బుద్ధుడు ఉచిత రీతిని మర్యాదలు చేసి, స్వాగతం _ చెప్పాడు. తర్వాత ్రసేనజిత్‌ బుద్గుని సూటిగా ప్రలైలు స్వాగతం చెప్పాడు. తర్వాత ్ర గు

“ఆచార్యా, మిమ్మల్ని ప్రజలు 'బుద్ధి అని శ్లాఘిస్తున్నారు. 'బుద్ధ అంటే జ్ఞానోదయం అయినవాడని అర్ధం ... పరిపూర్ణ ప్రజ్ఞావంతుని జ్ఞాని అనవలె. మా వంటి యువకుడు జ్ఞాని కాగలడా? బుద్ధుడు కాగలదా? నాకు తెలిసి పురాణ కశ్యపుడు, మక్కల గోపాల, నిగంధనాధ పుత్ర, సంజయ బేలా శ్రిపుత్ర జ్ఞానవృద్దులు. వారెవరూ తాము బుద్ధులమని చెప్పుకోలేదు. మిరు ఆ మహాత్ముల్ని చూచారా? కనీసం వారి పేర్లయినా విన్నారా?” భగవాన్‌ బుద్ద 106

“మహారాజా, మారు చెప్పిన మహాత్ములు నాకు తెలుసు. ఆద్యాత్మిక వికసనానికి వయస్సుతో సంబంధం లేదు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే జ్ఞానం కలుగుతుందని ఎవరూ చెప్పలేరు. ఎవరి ప్రతిభను శంకించకూడదు. యువరాజు, విషనాగు, అగ్నికణిక, యువసన్యాసి. వారి గుణ గణాలు తగ్గవు. యువరాజు చిన్నవాదైనంత మాత్రాన (ప్రతిభ లేనట్లా? పాము చిన్నదైతే విషం తీయగా ఉంటుందా? చిన్న నిప్పురవ్వ కూడా మహారణ్యాల్ని దగ్ధం, చేయగలదు. వయసులో చిన్నవాడైనా మేధావి అయిన సన్యాసి మహాజ్ఞాని కావచ్చు”. _

ఆ మాటలు ప్రసేనజిత్‌కు నచ్చాయి.

“ఆచార్యా! మాకు ప్రేమపైన సదభిప్రాయం లేదని జనం అంటున్నారు?”

“రాజ్బా ప్రేమలో అనేక తర తమ ఖేదాలుంటాయి. సందర్భానుసారం (ప్రేమను విశ్లేషించవలె. జీవితంలో (్రేమ అవసరమే. కాని ప్రేమ మాత్రమే జీవితం కాదు. (ప్రేమ కామ ప్రకోపం కారాదు. బంధం కారాదు. అసూయకు తావివ్వకూడదు. ద్వేషం కలిగించేది ప్రేమ అవదు (ప్రేమకు ఆధారం మైత్రీభావన, కరుణ అయివుండాలి. మైత్రిలో స్వార్ధం ఉండదు.

“మరొక ప్రశ్న ఆచార్యా! ప్రేమించడానికి ఇష్టం, కోరిక ఉండాలి కదా! కోరికలు, ఇష్టాలు లేకుండా (ప్రేమించడం ఎలా సాధ్యం?”

“ఈ మధ్యనే శ్రావస్తిలో ఒక దుర్హటన జరిగింది గుర్తుందా? ఒక జంట ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆ కుగర్రవాని తల్లి, కొడుకు తనకు దూరమైనాదని బావించింది కోడలిపై కత్తి కట్టింది. కొడుకు తనను మోసం చేశాడనుకుంది. పేమ బదులు ద్వేషం పెరిగింది. భోజనంలో విషం పెట్టి కొడుకును, కోడలిని చంపింది ప్రేమ ద్వేషంగా మారింది

“సదవగాహన (ప్రేమకు అవసరం మహారాజా! (ప్రేమించగలిగిన ' వారే అర్ధం చేసుకోగలరు. అర్ధం చేసుకోలేనివారు ఢ్రుమించలేరు. భార్యాబిడ్డల మధ్య సదవగాహన ఉంటే ప్రేమ నిలుస్తుంది. అన్నా చెల్లెలు తల్లి తండ్రి అందరి మధ్య ఉండవలసింది అవగాహన. అదే (పేమ సూత్రం.”

బుద్ధుని మాటలు ప్రసేనజిత్‌కు నచ్చాయి.

“ఇతరుల కష్టాలకు, బాధలకు మనం స్పందించగలిగితే అవసరమైన శక్తి వస్తుంది. కోరిక లేకుండా కరుణ కలగాలి. కరుణ సహజంగా ఏర్పడాలి. కాలం అందరి కన్నీటిని తుడిచివేస్తుంది ఒకనాటికి ఎవరం మిగలం అంతా అశాశ్వతం. “అశాశ్వత” భావన హృదయంలో ఉంటే సంయమనం కలుగుతుంది కరుణ మనిషికి గొప్పశక్తి నిస్తుంది మహారాజా”

శ శ 3

ప్రసేన్‌జిత్‌ తరచు బుద్దుని దర్శనానికి రావడం వల్ల జేతవన విహారం ప్రజల్ని ఆకర్షించింది. బుద్ధుని ప్రవచనాలు వినడానికి రోజూ జనం రాసాగారు. మేధావులు సైతం ఆకర్షికులైనారు. సారిపుత నూట యాఖైమంది కొత్త వారికి దీక్ష ఇచ్చాడు

ఒకనాడు బుద్దునికి గంగాతీరంలో ఒకగ్రామం వెలుపల ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను రాత్రిళ్లు పేడ పోగుచేసుకుంటాదు. దళితుడు పేరు సునిత. బుద్దుడు ఎదురుపడగా కలవరపడి చెట్టుబాటున దాక్కున్నాడు. బుద్దుడు దగ్గరకు వచ్చి “మిత్రా, ఇలా రా ...” అని పిలిచాడు.

“స్వామి ... నేను అంటరానివాడిని ... దూరంగా ఉండండి” అన్నాడు సునిత.

బుద్దుడు “నీవూ నాలాంటి మనిషివే? అంటరానితనం నీలో ఏముంది. మనిషిలో అసూయ, ద్వేషం, అజ్ఞానం అంటరాని గుణాలు. జ్ఞానానికి కులాలు అద్దురావు. జ్ఞానికి కులఖేదం ఉండదు. అందరూ ఆత్మీయులే. అన్ని నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోతాయి. జ్ఞానంలో అన్ని గుణాలు కరిగిపోతాయి".

బుద్ధుడు స్వయంగా సునితకు స్నానం చేయించి దీక్ష ఇచ్చి, తనతో తీసుకువెళ్లాడు.

ఆ విషయం తెలిసి బుద్ధుడు పవిత్ర సంప్రదాయాలను కాలరాస్తున్నాడని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. ఆ విషయం బుద్దుని చెవిని పడ్డది.

“అంటరాని వారిని సంఘంలోకి రానివ్వడం ఈ రోజు కాకపోతే రేపైన తప్పదు”.

సారిపుత్రుడన్నాడు “మన లక్ష శం చెదరనంత కాలం ఎవరి ప్రచారానికి జంక నవసరం లేదు”.

సునిత ఉదంతం రాజుగారికి చేరింది. ప్రసేనజిత్‌ సరాసరి జేత వనానికి వచ్చాడు త్రోవలో ఒక భిక్షువు రాజుగారి దృష్టిని ఆకర్షించాడు. అతనిలో గొప్ప తేజస్సు కనిపించింది బుద్ధుని ప్రశ్నించగా అన్నాడు “అతను భిక్షువు మహారాజా అంటరానివాడు కాదు. పూజనీయుడు.”

అంతలో సునిత అక్కడకు వచ్చాడు మహారాజు మార్గమధ్యంలో చూచింది అతనినే. కాషాయ బట్టలతో పరమశాంతమూర్తిగా ఉన్న అస్పృశ్యుని చూచి రాజు అవాక్కయినాడు

శే శ 3

భగవాన్‌ బుద్ధ 108

ఒకరోజు మేఘయ బుద్ధునికి ఫిర్యాదు చేశాడు. “నంద తన ప్రియురాలు కళ్యాణిని మరచిపోలేక పోతున్నాడు. దీక్ష తీసుకున్నందుకు బాధపడుతున్నాడు. అతనికి ధ్యానం కుదరడం లేదట”.

మర్నాడు ఉదయం బుద్ధుడు నందని తనతో రమ్మని పిలిచాడు. ఇద్దరు జేతవనం వదలి చాలా దూరం వచ్చారు. అక్కడ ఒక సరస్సు, ప్రక్క్మన ఒక కుటీరం ఉన్నాయి.

“నందా, నీకు భిక్షుజీవనం నచ్చలేదట. కపిలవస్తు వెడతావా?” "

“లేదు. నాకు రాజ్యకాంక్ష లేదు.

క్శీ అసంతృప్తికి కారణం?”

నంద తలవంచుకున్నాడు

“నందా, ఇక్కడ కోసలలో కల్యాణిని మించిన సౌందర్యవంతు లెందరో ఉన్నారు. ప్రసేనజిత్‌ అంతఃపురంలో ఎందరు సుందరాంగులు లేరు. వారెవరూ కళ్యాణికి తీసిపోరు”.

“కావచ్చు కళ్యాణి ఒక్కతే నా దృష్టిలో సౌందర్యవతి. నాకు కళ్యాణి ముఖ్యం”. క

“నందా! ఈ (ప్రేమలు, అనుబంధాలు ఆధ్యాత్మికాభివృద్ధికి అవర్గోధాలు. గులాబిపూవు అందం ఎంతసేపు నిలుస్తుంది? స్త్రీ సౌందర్యమూ అంతే, అందం శాశ్వతం కాదు”. _

అంతలో ఒక ముసలమ్మ చేతి కర్రసాయంతో చెక్కవంతెన దాటి అటు వచ్చింది. మొహం, శరీరం ముడతలు పడివుంది. బుద్ధుడు ఆమెను చూపిస్తూ...

“చూడు నందా! ఆ ముసలమ్మ ఒకప్పుడు గొప్ప అందగత్తె. కళ్యాణి అందం కూడా అలా తరగిపోతుంది. నీవు జ్ఞానం పొందితే అది ఈ జన్మకే కాదు పై+* జన్మలకు ఉపయోగిస్తుంది. అటు చూడు. ఆ చెట్టు కొమ్మమిద రెండు కోతులు. అందులో ఆడ కోతి నీకు అందంగా కనిపిస్తుందా? మగకోతికి దాని ప్రియురాలు మహా అందంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఆ కోతికున్న అందం మనుషులకు, అప్పరసలకు సైతం లేదనుకుంటుంది”.

నంద అద్దు తగిలి “ఇంక ఏమా చెప్పకండి... నన్నుక్షమించండి, పొరపాట్లు చేయను”

ఇప్పుడు జేతవనం నిజంగా తపోవనం లాగా వుంది. లిచ్చలి రాకుమారుడు అరణ్యాన్ని ఆరామంగా మార్చాడు. రెండస్టుల ధర్మశాల కట్టించాడు దాని పేరు 109 భగవాన్‌ బుద్ధ

'కూటాగారం'. అడవి నిండా సాల్వవృక్షాలు వాటి నడుమ నడుమ పర్ణశాలలు రాకుమారుని బెదార్యం, ఆమ్రపాలి : ఆదరణ విహారానికి కీర్తి ప్రతిష్టలు సమకూర్పాయి.

శ 3 3

శుద్దోదనుడు మరణశయ్యపై ఉన్న వార్త మహారాజు మేనల్లుడు మహానామ మోసుకొచ్చాడు ఒకసారి వచ్చి చూచివెళ్లమన్న తండ్రిగారి అభ్యర్థన మన్నించి బుద్దుడు బయలుదేరాడు సత్వరం కపిలవస్తు చేరాలంటే రధంపైన వెళ్లాలి. వెంటనే బయలుదేరాడు. తర్వాత రెండువందల మంది భిక్షులు కాలినడకన బయలుదేరారు సిద్ధార్థుని తండ్రిగారి అంత్యక్రియలకు అందుకోవాలని.

బుద్ధుడు రాగానే మహాప్రజాపతి శుద్దోదనుని శయన మందిరానికి తీసుకువెళ్లింది శుద్ధోదనుడు చిక్కి శల్యావశిష్టంగా ఉన్నాడు. కుమారుని చూడగానే ఆయన ముఖం వికసించింది తండ్రిగారి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు (ప్రేమగా. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

“నాన్నగారూ! కళ్లు మూసుకుని నిశ్చింతగా ధ్యానం చేసుకోండి. మా కోసం మేమూ ధ్యానం చేస్తాం”.

కొంతసేపటికి కళ్లు విప్పి, “నాన్నా సిద్ధార్ధా! చాలా ప్రశాంతంగా, ఆనందంగా వుంది. దిగులు, భయం పోయాయి”.

“నాన్నగారూ! చనిపోవడం అంటే నశించడం కాదు. ఏదీ నశించదు. జీవం కొనసాగుతుంది. నాలో, నందలో, ఆనందునిలో, రాహుల్‌లో మోరు జీవించే ఉంటారు. మనిషి శరీరం నాలుగు ధాతువులతో తయారవుతుంది. మరణంతో దేనికది విడిపోతుంది తప్ప నశించదు. మరల జన్మించినపుడు ఏకమై ఒక రూపం ధరిస్తుంది”.

రాహులుని దగ్గరగా పిలిచి అతని చేతిని తన తండ్రిగారి చేతికి. అందించాడు. రాహుల్‌ మొహంలోకి చూచి అనుకున్నాడు “సిద్దార్దుని మాటలు సిద్ధవచనాలు. రాహుల్‌లో నా పోలికలున్నాయి. నా ప్రతిబింబాలే సిద్ధార్టుడు, రాహులుడు.”

కాలం ఆసన్నమవుతోంది

శుద్దోదధనుని తర్వాత రాజ్యభారం వహించడానికి మవహానామ అంగీకరించాడు.

శ 3 ఈ భగవాన్‌ బుద్ద 110

శుద్దోదనుడు మరణించిన వడవనాడు అంత్యక్రియలు జరిగాయి. నేయిమంది బ్రాహ్మణులు, అయిదు వందల మంది భిక్షులు అంత్యక్రియలకు హాజరైనారు. సంప్రదాయ బద్ధంగా వేద పరనం, బౌద్ధధర్మ ప్రవచనం జరిగాయి. సిద్ధార్థుడు కాదనలేదు. ముమ్మారు చితికి ప్రదక్షిణ నమస్కారం చేసి, నిప్పంటిం చాడు. శంభారావాలు మిన్నుముట్టాయి. అగ్ని కీలలు ఆకాశంలోకి పరుగుతీశాయి.

మహానామ పట్టాభిషేకం తర్వాత సిద్ధార్ధుడు కపిలవస్తులో మూడు మాసాలున్నాడు. ఒకనాడు మహాప్రజాపతి న్యాగ్రోధ వనవివారానికి వచి భిక్షులందరికీ నూతన వస్త్రాలు బహూకరించింది. తనకు బౌద్దధర్మ్శం బోధించి సంఘంలో చేర్చుకోమని బుద్దుని అర్ధించింది. బుద్ధుడు క్షణంసేపు మౌనం వహించి వీలు కాదని చెప్పాడు. ఆమె బ్రతిమలాడింది.

“అమ్మా ... సంఘంలో స్త్రీలను చేర్చుకునే పరిణతి .ఇంకా రాలేదు, మన్నించాలి”

కొద్ది రోజులకే బుద్ధ పరివారం వైశాలి చేరుకున్నది. వారు వెళ్లిన తర్వాత గౌతమి బౌద్ధ దీక్షకు సిద్ధంగా ఉన్న ఆడవారిని సమావేశ పరచింది. వారిలో కొందరు యువతులు, కొందరు అవివాహితులు ఉన్నారు.

“జ్ఞానానికి అందరూ అర్హులేనని బుద్ధుడు చెప్పాడు మనల్ని భిక్షుణిలుగా అంగీకరించకపోవడంలో అర్ధం లేదు. స్రీలు ఏ విధంగానూ పురుషులకు తక్కువ కాదు” అని బోధించింది.

అందరు శిరోముండనం చేయించుకుని పసుపు బట్టలు ధరించారు. కాలి నడకన వైశాలి బయలుదేరారు.

గౌతమి వారికి నాయకురాలు. గౌతమి పట్టుదల చూచి యశోధర నవ్వింది.

గౌతమి అన్నది, “గోపా, ఇప్పుడు నీవు మాతో రావద్దు. మా ప్రయత్నంలో విజయం పొందితే, బుద్ధుని అనుమతి లభిస్తే, అప్పుడు నీవు రావచ్చు”. యశోధర మరొక మారు నవ్వింది. శం ఈ 7

ఒకనాటి వేకువన ఆనందుడు మంచి తీర్ధం కోసం చలమకు వెడుతుండగా బుద్ధుని పర్ణశాల వద్ద కొందరు ఆడవారిని చూచాడు. వారంతా సన్యాసినులవలె కనిపించారు. తలలు బోడులు కావడం చిత్రం. బుద్దుని దర్శనార్ధం వచ్చారను కున్నాడు. దగ్గరగా వెళ్లాడు వివరాల కోసం, పసుపు బట్టలు ధరించి ఉన్నారు. 1111 భగవాన్‌ బుద్ద

పాదాల నుండి రక్తం స్రవిస్తోంది. వారిలో గౌతమిని గుర్తుపట్టి “అమ్మా మారా? ఎక్కడ నుండి వస్తున్నారు? ఏమిటీ వేషాలు?”

“ఆనందా! సర్వం త్యజించి వచ్చాం. కపిలవస్తు వదలి పదిహేను దినాలైంది. భిక్షమెత్తుకుంటూ వచ్చాం. బుద్ధునితో మాట్లాడు. మమ్మల్ని భిక్షుణిలుగా స్వీకరించ మని చెప్పు ...”.

“నేను చేయగల సాయం తప్పక చేస్తాను, ఉండండి”.

అనందుడు కుటీరంలోకి వెళ్లేసరికి బుద్దుడు ఉదయం వాప్యాళికి సిద్ధమవుతున్నాడు. వెంట నగిత ఉన్నాడు. ఆనందుడు చెప్పిందంతా విని బుద్ధుడు అవునని, కాదని అనలేదు.

“భగవాన్‌, ప్రీలు ఏ విధంగా అనర్జులో 'సెలవీయండి” అడిగాదు ఆనంద్‌.

“అందరూ అర్హులే ఆనందా”.

“గౌతమి మాకు మాతృసమానురాలు. కపిలవస్తు నుండి సర్వసంగ పరిత్యాగినిగా వచ్చిన రాజయోగిని. దయ తలచండి.”

బుద్ధుడు క్షణం యోచించి సారిపుత్ర, మౌద్దల్యన, అనిరుద్ర, భద్రిక, కింబిల, మహాకశ్యపులను వెంటనే వచ్చి తనను కలవమని కబురంపాడు. వచ్చిన తర్వాత వారితో చర్చించాడు.

“ఆడవారని చిన్నచూపు చూడడం కాదు. సంఘంలో ఆడవారికి ప్రవేశం

కల్పిస్తే విమర్శలు వస్తాయి.” అపార్జాలకు తావిచ్చినట్లు అవుతుంది.” సారిపుత్ర అన్నాడు : “స్త్రీలకు వేరే నియమాలు పెట్టీ, వేరే విహారాలలో ఉంచుదాం”. బుద్ధుడు “సరే ఆ నియమాలేవో అందరూ కలిసి తయారు చేయండి”. 1 భిక్షుణి వయస్సులో పెద్ద అయినా అందరు భిక్షువుల్ని గౌరవించాలి. 2. భిక్షు సంఘానికి వారు వెలుపలనే ఉండాలి. అధ్యయనానికి మాత్రం విహారానికి వస్తుండాలి. 3. నెలకు రెండుమార్హు, వారి ఆహ్వానంపైన అనుభవజ్ఞులైన భిక్షువు ఒకరు వెళ్లి వారి ధ్యానం గమనించి సలహాలివ్వాలి. 4 పరవణి సమావేశాలకు అందరూ తప్పక హాజరు కావాలి. 5, నియమాలు అతిక్రమించిన భిక్షుణి సంఘం ముందు క్షమాపణ కోరాలి. 6 శిక్షణ కాలం ముగిసిన తర్వాత భిక్షు సంఘంలో దీక్ష తీసుకోవాలి. భగవాన్‌ బుద్ధ 112

  1. భిక్షుణి ఏ భిక్షువును అవమానించకూడదు, విమర్శించకూడదు.
  2. _ ఏ భిక్షుణి కూడా భిక్షు సంఘంలో ధర్మబోధ చేయకూడదు.

“ఆనంద్‌ నీవు వెళ్లి మహాప్రజాపతికి ఈ నియమాలు చెప్పు. వాటిని అంగీకరిస్తే దీక్ష ఇవ్వండి”. బుద్ధుడు ఆనందుని పంపాదు.

ఆఅనందుని కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నియమాలు. అందరూ ఆమోదించదగినవే. అందరూ అంగీకరించారు.

“మాకు అంగీకారమేనని బుద్ధదేవునీకి విన్నవించు ఆనంద్‌”.

కొందరు కష్టమేమో అన్నట్లు చూచారు.

“విచారించకండి. ముందు వారిని తలుపులు తెరవనివ్వండి. నియమాలు ఎప్పుడూ సాధనకు అవరోధం కావు. అవి మనకు ఆహ్వాన పత్రికలు”.

ఆ రోజునే యాభై ఒక్క మందికి దీక్ష ఇవ్వడం జరిగింది. ఆమ్రవనంలో వారికి ఆశయం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.

ఎనిమిది రోజుల తర్వాత మహాప్రజాపతి ఒంటరిగా వెళ్లి బుద్దుని దర్శించింది. వైశాలిలో భిక్షుణి సంఘం కోసం ఒక విహారం సిర్మించ తలపెట్టింది. వెంటనే కపిలవస్తుకు కబురు పంపింది తాము బుద్ధ దీక్ష తీసుకున్నట్లు. ఆడవారి ప్రవేశం వల్ల కొన్ని అపనిందలు భరించవలసి వస్తుంది. ఆ విషయం గౌతమికి తెలుసు. అయినా ఆధ్వర్యం తనది. మార్గ నిర్దేశకుడు బుద్దుడు. జ్ఞానం లక్ష్యం.

రాజగృ్భహలోని వేణువన విహారం, వైశాలిలోని కూటగరసల విహారం, 'శ్రావస్తిలోని జేతవన విహారం ప్రసిద్ధ బౌద్ధారామాలుగా జనం చెప్పుకోసాగారు. అక్కడ బోధనలు, సాధనలు, శిక్షణలు బావుంటాయన్న ప్రచారం సాగింది. మగధ, కోసల తదితర దేశాలలోనూ బౌద్ద కేంద్రాలు అనేకం తల ఎత్తాయి. ఏ దేశం వెళ్లినా ఏ నగరం మెట్టినా కాషాయ దర్శనమే, భిక్షుల సంచారమే. ఆరు సంవత్సరాలలో బౌద్ధం ఆరు దేశాలలో విస్తరించింది.

యమునా తీరంలో కొశాంబి ప్రసిద్ధ నగరం. అక్కడ “ఘోషిరా పేరున ఒక విహారం వెలసింది. ఒక బౌద్దాభిమాని ఆ ఆరామాన్ని సంఘానికి అర్పించాడు. ఘోషిర ఆరామంలో శింసుపా వృక్షాలు అనేకం ఉన్నాయి. బుద్ధునికి మధ్యాహ్నవేళ శింసుపా వృక్షచ్చ్భాయల్లో ధ్యానించడం ఇష్టం. ఒకనాడు బుద్దుడు ధ్యానానంతరం కాసిన్ని శింసుపా పత్రాలతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భిక్షులను ప్రశ్నించాడు: “నా చేతిలో ఉన్న పత్రాలు ఎక్కువా? ఆరామంలోని పత్రాలు ఎక్కువా?” 113 భగవాన్‌ బుద్ధ

“ఆరామంలోని పత్రాలు ఎక్కువ గురుదేవా” శిష్యులు ముక్తకంఠంతో అన్నారు.

“అవును. అలాగే నేను చెప్పే విషయాలకన్న నేను తెలుసుకున్న సత్యాలు ఎక్కువ. నేను తెలుసుకున్న సత్యాలు కన్న తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఎక్కువ, అవునా? అవసరమైన మేరకే నేను బోధిస్తాను ఈ చేతిలో పట్టినన్ని పత్రాలు మాత్రమే పట్టుకోగలను”.

బుద్ధుడు అనవసర ప్రసంగం చేయడని అందరికీ తెలుసు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం వుంది. 'గోక్షీరిలో కొందరు భిక్షులు వేదాంత, తాత్విక చర్చలు జరుపుతున్నారు. సాధనకు దోహదం చేయని చర్చలు వద్దని బుద్దుడు మాల్యాంక పుత్రకు హితవు చెప్పాడు. అతను వినడు. ఆసక్తి ఎక్కువ. అభినివేశం జాస్తి. బుద్దుని పిచ్చి పిచ్చిగా ప్రశ్చిస్తుంటాడు - సృష్టి పరిమితమా! అపరిమితమా! శాశ్వతమా? అశాశ్వతమా? అలాంటి తిక్క ప్రశ్నలకు బుద్దుడు సమాధానం చెప్పడు. మౌనం పాటిస్తాడు. బుద్ధుని మౌనం మాల్యాంక భరించలేకపోతున్నాడు. చివరిసారిగా అడిగి, సమాధానం చెప్పకపోతే సంఘం వదలి పోవాలనుకున్నాడు.

“ఆచార్యా, నా ప్రశ్నలకు మిరు సరైన సమాధానం చెబితే నేనిక్కడనే ఉంటాను. లేకపోతే నా దోవ నేను చూచుకుంటాను... చెప్పండి సృష్టి పరిమితమా? అపరిమితమా...?”

బుద్దుడు : “మాల్యాంకా ... నీవు బౌద్ధం స్వీకరించినపుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతానని నేను హామా ఇవ్వలేదు”. /

“అంటే - మికు తెలియదని అనుకోవచ్చునా?”

“తెలిసి ఎందుకు ప్రశ్నిస్తావు. నీ ధోరణి ఎలా ఉందంటే నీవంటి ఒక మేధావికి విషబాణం తగిలింది. వైద్యుని పిలిపించారు. ముందు తన సందేహాలన్నీ తీర్చకపోతే వైద్యం చేయించుకోనని పట్టుబట్టాడు. ఏమిటా సందేహాలు? ఆ బాణం ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఆ బాణం ఏ లోహంతో చేశారు? దాని బరువెంత? మాల్యాంకా, సాధనకు అవసరమైన అంశాలే నేను ప్రస్తావిస్తాను. ఉపయోగం కాని, అవసరం లేని విషయాల జోలికి పోను”.

మాల్యాంక సిగ్గుతో తలదించుకుని, క్షమాపణ కోరాడు.

గోక్షీర్‌ ఆరామం నిర్మించి ఇచ్చినవాడు కుకుట. పవరిక, అలంబవన విహారాలు నిర్మించి ఇచ్చాడు. బదరిక వనంలో మరో విహారం నిర్మాణంలో వుంది. అన్ని విహారాలలో ధర్మబోధ జరుగుతుంది. రాహల్‌ ఇంకా పూర్తి భిక్షువు కాలేదు. భగవాన్‌ బుద్ధ 114

పది సంవత్సరాలలో బౌద్ద ప్రచారం విస్తారంగా సాగింది. చాలా మంది రాజులు బౌద్దాన్ని అభిమానించసాగారు. బ్రాహ్మణ ప్రాపకం తగ్గిపోతున్నది. పౌరోహిత్యానికి బ్రాహ్మల్ని పిలవడం మానుకున్నారు జనం. వేదాలను నమ్మితే ముక్తి వస్తుందని, స్వర్గం లభిస్తుందనే పురాణాలు నమ్మటం లేదు జనం. భక్తి సన్నగిల్లింది. పూజలు అటకెక్కాయి. బుద్ధ సంఘంలో ముసలం తెస్తేగాని తమకు మనుగడ ఉండదని భావించారు. ఆ చిచ్చు మొదట గోక్షీరారామంలో మొదలైంది. కొందరు సనాతన బ్రాహ్మణులే భిక్షువులుగా చేరారు. అక్కడ అంతఃకలహాలు సృష్టించసాగారు. బ్రాహ్మణ భిక్షులు, బ్రాహ్మణేతర భిక్షులు తయారైనారు. వీరు *వారిని, వారు వీరిని విమర్శించుకోసాగారు. మాటలు తూటాలుగా పేలాయి. అటు ఇటు మొగ్గుచూపని వారు బుద్దునికి ఫిర్యాదు చేశారు. భిక్షు సంఘంలో ద్వేషబీజాలు మొలకెత్తడం బుద్దుని బాధించింది. స్వయంగా విహారానికి వెళ్లి ఇరు వర్గాల వారిని పిలిపించాడు. “ఎప్పుడు మన వాదనే సరైనది అనుకోకూడదు. ఎదుటివారి వాదనలోని సత్యాన్ని గుర్తించాలి. అపోహలు విడనాడి సఖ్యతగా మెలగండి”. బుద్దుని హిత వచనాలు ఏవరికి తలకెక్కలేదు. అప్పటికే వారి మనసులు తూట్లుపడ్డాయి. తటస్థంగా ఉన్నవారు ఈ రొంపిలో ఎందుకు వచ్చిపడ్డామా అని బాధ పడ్డారు. బుద్దుని పరిచారకుడు 'నగిత అసలు భరించలేకపోతున్నాడు. మరొక మారు గట్టిగా మందలించమని బుద్దుని అర్ధించాడు. బుద్దుడు ఉత్తరీయం భుజాన వేసుకుని మౌనంగా బయలుదేరాడు. నగిత చేగంట మోగించి భిక్షులను ఆహ్వానించాడు. ఈసారి బుద్ధుడు గట్టిగా చెప్పాడు “ఇంక మీ మీ వాదనలు కట్టి పెట్టండి. మి వల్ల సంఘానికి అపకీర్తి వస్తున్నది. సంఘంలో చీలికలు రావడం మంచిది కాదు. సాధనపైన మనసు పెట్టండి. సవ్యంగా సాధన చేసే వారికి పగలు, ప్రతీకారాలు, అహంకారం, గర్వం ఉండవు”. ఒక (బ్రాహ్మణ ిక్షువుకు కోపం వచ్చింది “మారీ వ్యవహారంలో తలదూర్చకపోవడం మంచిది. మి పర్డశాలకు వెళ్లిపోండి. మేము మేము తేల్చుకుంటాం.” అతని కటు భాషణకు అందరు విస్తుపోయారు. బౌద్ధధర్మ భిక్షువులకు ఇంత ఆగ్రహం, ఇంత అసహనమా! బుద్దుడు వెంటనే తన ఆశ్రమానికి వచ్చి, ఛిక్షాపాత్ర చేత బట్టి నగరంలోకి వెళ్లిపోయాడు. ఒంటరిగా భిక్ష చేసి, నదిని దాటి ఆవలి తీరం చేరాడు. ఎక్కడకు పోతున్నడీ ఎవరికీ చెప్పలేదు. నగితకు, ఆనందునికి సైతం చెప్పలేదు. భిక్షుల ప్రవర్తనతో ఆయన మనస్సు గొయపడ్డది. 115 భగవాన్‌ బుద్ధ

బాలకలోనక అనే (గ్రామం చేరాడు. అక్కడ 'భాగు" అనే శిష్యుడు తటస్ట్థపడ్డాడు. భాగు తను నివశిస్తున్న అరణ్యానికి గురుదేవుని తీసుకువెళ్లాడు. అక్కడ నుండి వేణువనానికి బయలుదేరాడు. అక్కడ అనిరుద్ర భిక్షువు ఉన్నాడు. అతను గురుదేవునికి స్వాగతం చెప్పాడు. అతని ఆశ్రమంలోనే నందియ, కింబిల ఉన్నారు. ముగ్గురూ మంచివారు. బుద్ధునికి ఏ లోటు రాకుందా చూసుకున్నారు. “ఎలా వున్నారు?” బుద్ధుడు ప్రశ్నించాడు.

“ఆచార్యా! మేం ముగ్గురం అయినా, ఒక్కరంగా జీవిస్తాం పాలు, తేనెలా కలిసిపోతాం”.

శ శ 7

కొశాంబిలో అంతకలహాలు బుద్దుని మనస్సును కలచివేశాయి. పది సంవత్సరాలుగా మనస్సుపై ఒత్తిడి. సంఘ నిర్మాణం. ఇప్పుడు అదే సంఘంలో తుఫాను. కొంతకాలం విహారాలు, సంఘానికి, భిక్షులకు దూరంగా ఉందాలని నిర్ణయం. రక్షితవనం చేరుకున్నాడు. సొల్వ వృక్షచ్చాయలు తనకు మనశ్శాంతి నిస్తాయి. రక్షిత వనంలో సాధు జంతువు లెక్కువ. అవి తనకు నేస్తాలు.

ఒక తల్లి ఏనుగు రోజూ తన పిల్ల ఏనుగుల్ని సరస్సుకు తీసుకువచ్చి స్నానం చేయడం, నీళ్లు తాగడం, జలకా లాడడం నేర్పుతుంది. బుద్దుడు వాటితో స్నేహం చేశాడు. తల్లి ఏనుగు పండ్లు తెచ్చి బుద్ధునికి సమర్సించేది. బుద్ధుడు స్వయంగా పిల్ల ఏనుగుల్ని సరోవరానికి తీసుకు వెళ్ళేవాడు. తల్లి ఏనుగు అడవిలో ఎక్కడ ఉన్నా ఒకసారి ఘీంకరించి తన ఆచూకీ తెలిపేది. బుద్ధుడు కూదా అలాగే ఘీంకరించి తమ ఆచూకీ తెలియచేసేవాడు. ఏనుగు వచ్చి బుద్దుని పాదాల ముందు మోకరిల్లేది.

తనకు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ పదిసంవత్సరాలలో సిద్ధార్థుడు ఒంటరిగా ఉన్నది ఇప్పుడే. రెండు వారాల అనంతరం, శ్రావస్తిలోని జేతవనం చేరుకున్నాడు. అక్కడ సారిపుత్ర, రాహులుడు ఉన్నారు అది సారిపుత్ర ఆధ్వర్యంలో ఉన్న విహారం. మౌద్దల్యన, మహాకశ్యప, రేవత, దేవదత్త అక్కడ ఉండడం తృప్తి కలిగించింది. వేణువనం నుండి అనిరుద్ర, కింబిల, నందియ వచ్చారు. గౌతమి (థావస్తిలోనే ఉంది. ఆత్మీయులంతా ఒక్కచోట కలిశారు.

జేతవనంలో తన ఆశ్రమం చేరేసరికి ఆనందుడు దానిని శుభం చేస్తున్నాడు. పదహారు నెలలైంది బుద్ధుడు ఆశ్రమం వదలివెళ్లి,

“కోశాంబి విశేషాలేమిటి ఆనంద్‌?” బుద్ధుడు ప్రశ్నించాడు. భగవాన్‌ బుద్ధ 116

“మోరు వెళ్లగానే కొందరు నావద్దకు వచ్చి 'బుద్ధదేవుడు ఒంటరిగా వెళ్లారు. మారూ వెళ్లండి. లేకపోతే మేం వెడతాం' అన్నారు. నేనన్నాను - ఎవరికీ చెప్పకుండా వెళ్లారంటే ఎవరూ తన వెంట రావద్దని అర్ధం”.

“అక్కడ భిక్షులు ఇంకా దెబ్బలాడుకుంటున్నారా?”

“ఎవరి పట్టుదల వారిది. నేను బయలుదేరి వస్తున్న రోజున, ఇరుపక్షాల వారు మీ వద్దకు రావడానికి యోచిస్తున్నారు.

సాయంత్రానికి వారు రానే వచ్చారు. వారిని సమన్వయపరిచే బాధ్యత సారిపుత్రకు అప్పగించాడు.

“తగిలిన గాయాలు మానడానికి కొంత వ్యవధి అవసరం”,

మరునాడు మౌద్దల్యన జేతవనంలోని భిక్షులను, కొశాంబి నుండి వచ్చిన వారిని సమావేశ పరిచాడు. మహాకశ్యపుడు సభకు అధ్యక్షత వహించాడు. సపష్తాధికరణ సమతా సూత్రాలను రూపొందించారు. సంఘ సూత్రాలు, నియమాలు తయారు చేసే బాధ్యత ప్రధాన భిక్షులకు అప్పగించాడు.

జేత వనంలో ఆరు మాసాలు గడిపి బుద్ధుడు రాజగ్భహకు బయలుదేరాడు. మధ్యలో తాను తపస్సు చేసిన బోధివృక్షాన్ని దర్శించాడు. ఆయన మనస్సులో “స్వస్తి కదలాడాడు. మంచి కుర్రవాడు. నిజానికి తన మొదటి శ్రవణుడు అతనే. అతనిని సంఘంలో చేర్చుకోవాలి.

శ 3 ఈ

ఉరువిల గ్రామంతో బుద్ధుని అనుబంధం తాను సిద్ధార్థుడుగా ఉన్నప్పటిది: తన జ్ఞానానికి, బోధనకి ఎంత సంబంధమో, తనకు ఉరువిలకు అంతటి అనుబంధం. గయ సమీపంలోని ఓ కుగ్రామం ఉరువిల. అదే నేటి బుద్ధగయ. స్వస్తిక గ్రామం అదే. సుజాత గ్రామం అదే.

నైరంజర నది తీరంలో బుద్ధుని చూడగానే స్వస్తికి కళ్లనీళ్ళు తిరిగాయి ఆనందంతో “స్వామి మారు ... నా కోసం వచ్చారా” అన్నాడు.

“పెద్దవాడివైనావుగా” ...

పది సంవత్సరాల క్రితం అక్కడే స్వస్తి సిడ్దార్ధను చూచాడు ఇప్పుడు

బుద్దుని వెంట ఇరవై మంది స్వాములున్నారు. మారు మాట్లాడక స్వస్తి బుద్దుని అనుసరించాడు. పదిరోజుల ప్రయాణం చేసి రాజగ్భహ చేరారు. స్వస్తికను సారిపుత్రకు అప్పగించాడు - సారిపుత్ర స్వస్తిని రాహుల్‌కు పరిచయం చేశాడు భిక్షు సంఘ నియమాలు బోధించమని.

117 భగవాన్‌ బుద్ధ

రాహుల్‌ చెప్పాడు : "మొదట సంఘంలో నియమాలుండేవి కావు. దీక్ష ఇవ్వడం నిరాడంబరంగా జరిగేది. బుద్ధదేవుని పాదాల వద్ద పద్మాసనంలో కూర్చుని త్రిశరణాలు వల్లించాలి. భిక్ష చేయాలి. కాషాయం ధరించాలి. ధనాశ ఉండకూడదు. సుఖాలు, భోగాలు కోరకూడదు. అవే ప్రధానం. కాలక్రమేణ నియమాలు ఎక్కువైనాయి. నియమోల్లంఘన చేసిన మొదటివాడు సుదీన. అతని కారణంగానే ప్రధమ భిక్షులు నియమాలు తయారు చేశారు “స్సుద్రిన పెళ్లి చేసుకుని కలండ (గ్రామంలో ఉండేవాడు. వైశాలి దగ్గర ఊరు కలండ. బుద్దుని బోధలు విని భిక్షు దీక్ష తీసుకున్నాడు. అతను అప్పుడప్పుడు స్వగ్రామం వెళ్లివచ్చేవాడు భార్యను వదలలేక. ఆమెను మహావనంలో రహస్యంగా కలిసేవాడు. వారికొక కొడుకు పుట్టాడు. అప్పుడే సంఘానికి అపకీర్తి వచ్చింది. అప్పటి నుండి నియమాలు ఎక్కువైనాయి. జ్ఞానం పొందకుండా మహాజ్ఞానులమని చెప్పుకునేవారు ఎక్కువైనారు”. చిన్నవారని బుద్ధునికి రాహుల్‌, స్వస్తిక షట్ల అభిమానం ఎక్కువ. తనవెంట స్వస్తిని తీసుకు వెళ్లేవాడు. సారిప్తుత్ర వెంట రాహుల్‌ ఉంటాడు. ఒకసారి పొలాల్లో వెడుతుండగా భరద్వాజ అనే బ్రాహ్మణుడు బుద్ధుని ఆపి “నాకు పొలం పనికి కూలీలు అవసరం. వచ్చి నా పొలంలో పనిచేయి” అని అడిగాడు. “నీవు సన్యాసి వేషంలో తిరగడం తప్ప చేసేదేముంది” అని ఎద్దేవా చేశాడు. బుద్ధుడన్నాడు : “మారు విత్తనాలు నాటి పంట పండిస్తారు. మేము జనంలో విశ్వాసం అనే బీజాలు నాటి జ్ఞానం పండిస్తాం. మా పొలాలలో ప్రేమ, అనురాగాలు పండుతాయి.” రాహుల్‌లో గ్రహణశక్తి పెరిగిందని బుద్దుడు గ్రహించాడు. ఒకరోజు రాహుల్‌తో అన్నాడు : “మనిషి ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలి. మట్టి : అమృతం, విషం రెంటినీ స్వీకరిస్తుంది. మన మనస్సులోకి వచ్చే మంచి,.చెడు ఆలోచనలు మనం సమంగా స్వీకరించాలి. నీరు : న్లీళ్లలో ఎంత మురికి చేరినా స్వీకరిస్తుంది. స్వచ్చంగా ఉంటుంది. జ్ఞాని అలా ఉండాలి. నిప్పు : అన్నింటినీ కాల్చి వేస్తుంది. మంచి చెడు పదార్థాలని చూడదు. జ్ఞానంతో అన్ని మాలిన్యాలను దగ్ధం చేయాలి. గాలి : సుగంధాలను దుర్గంధాలను తనలో కలుపుకొని, అంతలో స్వస్థితిని చేరుతుంది. భగవాన్‌ బుద్ధ 118

ఈ నాలుగు ధర్మాలు ఆచరించే వారికి అపవిత్రత అంటదు. దయ, కరుణ, సానుభూతి ఉన్నవారు ఇతరులకు ఆనందం పంచగలరు. మనస్సుపై అధికారం సంపాదించుకో. ఆనందం నీదవుతుంది.” “'వైతన్యం కలిగి ఉందడమే బుద్ధత్వం.

శ ఈ 2

విజనర విహారంలో. అయిదువందల మంది భిక్షులున్నారు. ఆ విహార నిర్వహణ సారిపుత్ర, మౌద్దల్యనలది. ఆ సంవత్సరం వర్షాభావం వల్ల బ్రహ్మాండమైన కరువు ఏర్పడింది. దుర్భరమైన ఎండలు, వడగాల్పులు ... తాగడానికి నీరు సైతం కరువైంది. అడవిలో చెట్లు కూడా ఎండి మోడులైనాయి. బుద్ధుడు ధ్యానం చేసుకునే నింబవృక్షం మాత్రం పచ్చగా ఉంది. రాత్రింబవళ్ళు దాని క్రిందనే బుద్ధుని ఆవాసం. తెల్లవార్డు ధ్యానంలో గడిపేవారు. ప్రజలు వారికే తిండిలేక అవస్థలు పడుతుంటే సన్యాసులకు ఛిక్ష ఎలా యివ్వగలరు! చాలామంది రిక్త భిక్షా పాత్రలతో తిరిగి ఆరామం చేరేవారు. ఏ ఊరు వెళ్లినా అదే పరిస్థితి. ఒక్కొక్క రోజు బుద్దునిదీ శూన్య పాత్ర. అభోజనం. నీళ్లతో కడుపు నింపుకునేవారు. అందరూ చిక్కిసగమైనారు. ఉత్తర కురుదేశానికి వలస వెళ్లాలని మౌద్దల్యన సూచించాడు. అక్కడ కరువు లేదు. కాని బుద్ధుడు ఆ సూచన అంగీకరించలేదు.

“మౌద్దల్యనా! కరవు మనకే కాదు. దేశం మొత్తానికి ఉంది. కొద్ది మంది సంపన్నుల్ని మినహాయిస్తే ఎవరికీ తిండిలేదు. ఇంతకాలం మనల్ని పోషించింది వారు. వారు కష్టంలో ఉండగా వారిని విడిచి వెళ్లడం భావ్యం కాదు. వారి కష్టాలే మనవిగా భావించాలి.”

ఒక వెన్నెల రాత్రి నింబన్ఫక్షం క్రింద ఉన్న బుద్దుని వద్దకు సారిపుత్ర వచ్చి ప్రశ్నించాడు.

“భగవాన్‌! మా బోధనలు ప్రతివారికి వివేకం కలిగిస్తాయి. మోలోని చైతన్యం వారికి ఎలా అందుతుంది?”

బుద్దుడు “సారిపుత్రా, యోగసాధన దీక్షగా చేస్తే ఆ చైతన్యం కొన్ని శతాబ్దాల వరకూ చెక్కుచెదరదు. ఆసక్తి ఉన్న వారికి, ఆశించిన వారికి అందుతూనే

ఉంటుంది.”

“బుద్ధ ప్రజ్ఞ, బుద్ధ చైతన్యం అలా భవిష్యత్తరాలకు అందుతుందా? మి దర్శనంతో అనుగ్రహం కలుగుతుందని నా భావన".

“సారిపుత్రా! కేవలం నామోచ్చారణ చాలదు. సూత్రాలు వల్లించడం వల్ల ప్రయోజనం ఉండదు. సాధన కావాలి. ధ్యానం చేయాలి. ధ్యానంలో లీనం కావాలి. అనుభవంలో ఫలితాలు కలగనప్పుడు ఏ ధర్మాలు నిలవవు”.

119 భగవాన్‌ బుద్ధ

“మన ధర్మాలకు సిద్ధాంత ప్రాతిపదిక చేయవచ్చుగదా”.

“ఆ పని చేయడానికి ఇంకా వ్యవధి ఉంది. తొందర వద్దు. ఇంకా మన ధ్యానం 'ప్రయోగస్థాయిలోనే ఉంది. సంపూర్ణ సిద్ధి పొందినపుడు అదే నిలబడు తుంది”.

తల్వాత శిష్య బృందంతో బుద్ధుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. కాలిక పర్వత పంక్తులపైన విడిది చేసినప్పుడు, మేఘయ బుద్దుని ఏకాంతంగా కలిశాడు. అతని ఆలోచనల నిండా కోరికలే. ధ్యానం స్థిమితంగా కుదరడం లేదు.

బుద్దుని సలహా :

“మేఘా! నీవు ఒక్కడివే ఉన్నప్పుడు ధ్యానం సరిగా కుదరకపోతే, మిత్రుల సహకారం తీసుకో. బృందంలో ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇతరుల ధ్యాన వైతన్యం నిన్ను చక్కపరుస్తుంది. సామూహికంగా అందరూ అభివృద్ది చెందుతారు. సాధకులు అయిదు అంశాలు గుర్తించాలి. మార్గంలో యోగ్యులైన వారి సహాయం సహకారం పొందడం, నియమాలు పాటించడం, చదివి వివేకం పెంపొందించు కోవడం, బద్ధకం లేకపోవడం, అవగాహన కలిగి ఉండడం : ఈ అయిదు సూత్రాలు పాటించి తీరాలి.

సిద్ధార్థుడు బోధిసత్వుడై పదమూడు సంవత్సరాలు నిండాయి. ఈసారి జేతవనంలో ఉండదలిచాడు. స్వస్తిని, రాహులుని వెంట తీసుకుని శ్రావస్తి చేరాడు. జేతవనం చాలా ప్రశాంతంగా, ప్రభాస మానంగా ఉందే విహారం. స్వప్తి అక్కడకు రావడం అదే ప్రథమం. ఆ ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించవచ్చునని ఆశ పడ్డాడు. మిత్రుడు రాహుల్‌కు, గురుదేవులు బుద్ధునికి దగ్గరగా ఉండే అవకాశం ఎవరికీ రాదు. జేతవనం చేరిన తర్వాత స్వస్తికి సంఘం విలువ తెలిసి వచ్చింది. బౌద్ధ భిక్షువులకు సంఘ జీవనం మేలు చేస్తుంది. ధ్యానం బాగా కుదురుతుంది. జ్ఞానానికి అంకితం కావచ్చు.

రాహుల్‌కి ఇరవై సంవత్సరాల వయసు. సారిపుత్ర రాహుల్‌కి సంపూర్ణ దీక్ష ఇచ్చి పూర్ణభిక్షుని చేశాడు. అప్పుడే రాహుల్‌కి 'కాన్ని ధర్మాలు బోధించాడు.

రాహుల్‌తో మైత్రి స్వస్తికి కలిసొచ్చింది బుద్ధుడు స్వయంగా రాహుల్‌కి అనేక రహస్యాలు బోధిస్తున్నాడు. రాహుల్‌ వెంట ఉండే స్వస్తికి అవి ఒంటబడుతున్నాయి. ఆరు ఇంద్రియాలపైన ఎట్లా ధారణ చేయాలో, ఎట్లా ధ్యానం చేయాలో బోధించాడు. భగవాన్‌ బుద్ధ _ 120

కన్ను ముక్కు చెవి, నాలుక్క శరీరం, మనస్సు- వీటికి సంబంధిత గుణాలు- శబ్ద, రూప రస, గంధ, స్పర్శ, అవగాహనలు. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఆరు స్పందనలు - చైతన్య స్పందన, భావ స్పందన, ' దృశ్య స్పందన, శబ్ద స్పందన, రస స్పందన, అభిరుచి స్పందన. అదే అనుభూతి స్పందన. ఈ మొత్తం పద్ధెనిమిది స్కంధాలు. మనిషి జ్ఞానం పొందదానికి ఆరు రకాల స్పందనలు అవసరం. వాటిని అనుభవిస్తే “శూన్య” రహస్యం తెలుస్తుంది. జనన మరణాలకు అతీతం కావచ్చు. బుద్దుడు ప్రత్యేకంగా శూన్యం గురించి, ఆత్మశూన్యత గురించి రాహుల్‌కి బోధించాడు. “రాహుల్‌! మన శరీరం, భావాలు, అభిరుచులు, మనోరూపాలు, చైతన్యం - ఇవి పంచస్మంధాలు. వీటిలో ఏ ఒక్కటి శాశ్వతం కాదు. ఏ ఒక్కదానిని ఆత్మ అనదానికి లేదు. ఏదీ ఆత్మకు సంబంధించింది కాదు. భౌతిక శరీరం ఆత్మ కాదు. ఆత్మ భౌతికం కాదు. శరీరం ఆత్మలో ఉండదు. ఆత్మను గురించి మూడు సిద్ధాంతాలున్నాయి. ఒకటి : శరీరమే అత్మ అనేది ఒక సిద్ధాంతం. మన భావాలు, అనుభూతులు, మానసికచర్యలు, చైతన్యం - వెరసి “ఆత్మ అనే సిద్ధాంతం. రెండవది : దానిని 'స్కంధాత్మ' సిద్ధాంతం అంటారు. అంటే స్మంధాలకు వేరుగా, దూరంగా 'ఆత్మ' ఉంటుందనే భావన. అసలు స్మంధాలు ఆత్మకు భిన్నం అనుకోవడం కూడా అపార్ధమే. స్కంధంలోనే “అత్మ ఉన్నదనుకోవడం మూడవ భమ. మూదవసిద్ధాంతం ; స్కంధం, ఆత్మ పరస్పరాథ్రితాలని విశ్వసించడం. “రాహుల్‌! న్మంధాలపైన ధ్యానం చేయడమంటే పంచస్కంధాలపైన మనస్సును లగ్నం చేయడమే. అంటే ఆత్మపైన, అనాత్మపైన ధ్యానమగ్నం కావడం. ఆత్మ శరీరం పైన ధ్యాస ఉంచకపోవడం. అసలు ఈ మూడు భ్రమలు తొలగిపోతే అన్ని ధర్మాల శూన్యత తెలుస్తుంది”. శం శ 3 జేత వనంలో ఒక భిక్షువున్నాడు. అతను విలక్షణవ్యక్తి. ఎవరితో కలవడు. ఎవరితో మాట్లాడడు. అతని పేరు “తేర, ఎవరి విషయంలో జోక్యం కలిగించు కోడు. నియమోల్లంఘన చేయడు అతను ఎవరితో ఎందుకు సఖ్యతగా ఉందడడో స్వస్తికి అర్ధం కాలేదు. అందరూ అతనిని “ఏకాకి అంటారు. బుద్ధ భగవానులు తరచు చెబుతుంటారు “అనవసర చర్చలు వద్దని, ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించమని అదే ఆధ్యాత్మికాభివృద్ధికి అవసరమని”. తేర ఆ ప్రమాణాలు పొటిస్తున్నాడా అని స్వస్తి అనుమానం, ఆ విషయం నేరుగా గురువుగారిని ప్రళ్ళిస్తే... 121 భగవాన్‌ బుద్ద

మర్నాడు ధర్మోపదేశం అయిన తర్వాత బుద్ధుడు తేర ఛిక్షుని పిలిచి ప్రశ్నించాడు “నీవు ఎవరితో కలవడం లేదని తెలిసింది. మిగిలిన భిక్షులంటే నీకు సదభిప్రాయం లేదా?”

“గురుదేవా! నాకు ధ్యానం ముఖ్యం. ధ్యానం వల్ల లభించే తృప్తి ముఖ్యం. బుద్దుడు ఆ మాటల్ని విశ్లేషించి యోగాన్ని సాధనను సమన్వయ పరుస్తూ ఇలా చెప్పాడు : “ఏకాకిగా, ఏకాంతంగా జీవించడం వేరు. సంయమనం వేరు. రెండూ ఒకటి కావు. ఆత్మ సంయమనం పాటించే వ్యక్తి, సదా చైతన్యంగా ఉంటాడు. అ'్రమత్తంగానూ ఉంటాడు. తన చుట్టూ, తనలో అనుక్షణం ఏం జరుగుతున్నది గమనిస్తుంటాడు. అతను గతాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. భవిష్యత్తును అలక్ష్యం చేస్తాడు. కేవలం వర్తమానంలో సజీవ చైతన్యంతో జీవిస్తాడు. నిత్యసంతోషి అతను”.

“మిత్రులారా! గత జ్ఞాపకాలతో జీవించడం అంటే మనసు వెంట, జ్ఞాపకాల వెంట పరుగులు తీయడం. దానివల్ల లాభం లేదు. మనశ్శాంతి కలగదు. గతాన్ని ఎంత తవ్వినా ఏం ప్రయోజనం? శూన్యమే గదా! గతం వర్తమానం కాదు. అలాగే భవిష్యత్తు గురించి తలపోయడం అంటే వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం. ప్రస్తుతంలోని ఆనందాన్ని వదులుకోవడం. రేపన్న దానిని విశ్వసించలేము. జీవితం, జీవించదం ప్రస్తుతంలో, వర్తమానంలో. ఈ క్షణంలో తృప్తిగా నిండుగా

జీవించడం *క్షణికవాదం'. అది ఒక్కక్షణమే కావచ్చు, అది నిజం. అది మాత్రమే వాస్తవం, సత్యం”.

భగవానుడు తేర భిక్షువును అభినందించారా! అభిశంసించారా? ఎవరికీ అర్ధం కాలేదు. కాని “అఆత్మాశయం' అంటే ఏమిటో చెప్పక చెప్పినట్లయింది.

జ ల 3

బుద్ధునికి బాలలంటే చాలా ఇష్టం. వాళ్లలో తన బాల్యాన్ని చూచుకుంటాడు. బుద్ధుడైన తర్వాత తనకు తొలిశిష్యులు సుజాత, స్వస్తి. అంతా ఆ వయసు బాలలే. పిల్లలకు తన జాతక కధల ద్వారా నీతి పాఠాలు చెప్పడం మరీ ఇష్టం. అంచేత జేతవనంలో ఒక పాఠశాల ఏర్పాటు చేశాడు. దాని బాధ్యత రాహుల్‌కి అప్పగించాడు. నెలలో ఒక రోజు నగరంలోని పిల్లలు చాలామంది కధలు వినడానికి వస్తుంటారు. రాకుమారి వజరికి ఆ విద్యాలయం పట్ల ఆసక్తి కలిగింది.

ఒక పౌర్ణమి నాడు గురుదేవునికి బహూకరించడానికి, పిల్లలందరిని పూలు తెమ్మన్నది. అందరు పిల్లలు, వారి తోటల్లోని పూలు తెచ్చారు. వజరి అంతఃపుర ఉద్యానవనంలోని కొలను నుండి కలువ పూలు తెచ్చింది. ధర్మశాలలో బుద్దుని కలిసి ఆయన పాదాల వద్ద తెచ్చిన పూలు దోసిళ్లతో సమర్పించారు. బుద్దుడు పిల్లలందరిని ముందువరుసలో కూర్పోమన్నాడు. భగవాన్‌ బుద్ధ 122

అందులో ఒక పద్మాన్ని బుద్దుడు చేతిలోకి తీసుకుని అందరికీ చూపించాడు. ఏమి మాట్లాడ లేదు. తాను మౌనంగా ఆ పద్మంవైపు చూడసాగాడు. అందరు నిశ్శబ్దం పాటించారు. ఎంతసేపు? గంట గడచినా బుద్ధుడు అలా చూస్తూనే ఉన్నాడు. భిక్షులకు అద్ధంకాక బిత్తరి చూపులు చూడసాగారు. అప్పుడు బుద్దుడు అందరి వైపు చూచి నవ్వాడు. వెంటనే కశ్యపుడు నవ్వాడు.

బుద్ధుడన్నాడు : “నా శక్తిని మహాకశ్యపుని పరం చేస్తున్నాను”.

అందరూ కశ్యపుని వైపు తిరిగారు. అతను నవ్వుతున్నాడు. అతని చూపు బుద్ధుని చేతిలోని పద్మం పైన కేంద్రీకరించబడి వుంది. అతని దృష్టిలో బుద్ధుడు లేడు. పద్మం మాత్రమే వుంది.

బుద్ధుడన్నాడు : “ఇది అంతర్జృష్టి. ఇది సత్యదృష్టి. అలా దృష్టిని పద్మంపైన లగ్నం చేయడమే “ధ్యాన రహస్యం", అదే 'ధ్యాన లక్షణం'.

మహాకశ్యపుడు నవ్వాడు. ఎందుకు నవ్వినట్లు? అతని దృష్టిలో పద్మం మాత్రమే వుంది. మిగిలిన యావత్‌ ప్రపంచం శూన్యం. అది అంతర్హుష్టి రహస్యం. మోరు అనుకున్నారు “గౌతముడు పద్మాన్ని పట్టుకుని, ఏం చేస్తున్నాడని? మిరు ఆలోచించారు - కశ్యపుడు పద్మం హృదయంలోకి చొచ్చుకుపోయాడు. మిగిలిన ప్రపంచాన్ని విస్మరించగలిగాడు. అది ధారణ. అతని ధ్యాస, ధ్యానం, ధారణ ఒక్కటైనాయి.”

అందరూ అనుకున్నారు తామూ మహాకశ్యపుని స్థాయికి ఎదగాలని.

ఈ న

రాజగ్భహలో ఉన్నంతకాలం బుద్దుని నివాసం గిజ్జకూట పర్వత (గండ భేరుండ పర్వత) శిఖరం పైన ఆశ్రమంలో. బింబిసారుడు తరచు బుద్దుని దర్శనార్ధం వస్తున్నాడు. అనుకూలంగా కొండపైకి మెట్లు తొలిపించాడు. చిన్న చిన్న వాగులు, వంకలపైన చెక్క వంతెనలు నిర్మించాడు. బుద్దుని నివాసం కోసం ఒక సుందర రాతి కట్టడం నిర్మించాడు. ఆ పర్జశాల నుండి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు రమణీయంగా కనిపిస్తాయి. అవి బుద్ధునికి ఇష్టం. పర్వతసానువుల నుండి గంటల తరబడి ప్రకృతిని దర్శిస్తుంటాడు. (ప్రధాన భిక్షువులు సారిపుత, ఉరువిల, కశ్యప, మౌద్గల్యన, ఉపాలి, దేవదత్త ఆనందుడు మొదలైన వారికి బుద్ధాశమ సమిపంలో వేరువేరు ఆ(శ్రమాలున్నాయి.

ఆమ్రపాలి కుమారుడు జీవకుడు సిద్ధ వైద్యుదైనాడు. అతను బింబిసారునికి రాజవైద్యుడు. బుద్ధునికి, భిక్షువులకు అభిమాన వైద్యుడు. ' 123 భగవాన్‌ బుద్ధ

మరుసటి సంవత్సరం బుద్దుని నివాసం జేతవనానికి మారింది. అప్పటికి సిద్దార్టుని వయస్సు 55 సంవత్సరాలు గౌతమ బుద్దుడై ఇరవై సంవత్సరాలు బుద్దుని ఆగమనవార్త విని ప్రసేనజిత్‌ సకుటుంబంగా వచ్చి దర్శించుకున్నాడు. బింబిసారుని రెండవ భార్య వృషభ క్షత్రియ. ఆమె శాక్య రాజ వంశజురాలు. బుద్ధుని ప్రవచనాలు వినడానికి రాజకుటుంబీకులు తరచు రాసాగారు. అలా వచ్చినవారిలో విశాఖ ఒకరు. ఆమె శ్రావస్తికి తూర్పున ఉన్న తన ఉద్యాన వనాన్ని సంఘానికి బహూకరించింది. అది జేతవనం అంత విశాలం కాకపోయినా అన్ని వసతులు ఉన్నది. మరికొందరు అభిమానుల సహాయంతో అక్కడొక ధార్మిక మందిరం నిర్మించి ఇచ్చింది. దానిపేరు పూర్వాశ్రమం అదే విశాఖ మందిరంగా ప్రసిద్ధమైంది.

విశాఖ అంగరాజ్యానికి చెందిన మహిళ. భద్రియ నగరం ఆమె జన్మస్థలి. ఆమె తండ్రి ధనంజయ సంపన్నుడు. ఆమె భర్త శ్రావస్తికి చెందిన కులీనుడు. ఆమె భర్త, అత్తగారి కుటుంబ సభ్యులు నిగంత నటపుత్ర శిష్యులు. వారెవరికీ బౌద్ధం పట్ల సదభిప్రాయం లేదు. విశాఖ కారణంగా గౌరవం ఏర్పడ్డది. విశాఖ స్నేహితురాలు సుప్రియ. ఆమె పరమ భక్తురాలు. ఆమె విహారాలలో భిక్షులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. గంగానది తీరంలోని మహా ప్రజాపతి ఆధ్వర్యంలో నడిచే విహారానికి 'పెద్దథవనం కట్టించింది. భిక్షుల మధ్య చిన్నచిన్న తగాదాలు వస్తే ఆమె పెద్దరికం వహించి పరిష్కరిస్తుంది.

ఒకనాడు విశాఖ మందిరంలో ధర్మబోధ జరిగిన తర్వాత ప్రధాన భిక్షులు సమావేశమై చర్చ జరిపారు ... “గౌతమ బుద్ధునికి వయసు పైబడుతున్నది. ఒంటరిగా ఉండడం, తిరగడం మంచిది కాదు. ఆనందభిక్షుని బుద్ధునికి సహాయకునిగా ఉండమని అర్ధించాలి. రెండవది : ఇకపైన బుద్ధుడు వర్షాకాలంలో శావస్తిలోనే ఉండాలి.”

మొదటి సూచనకు సారిపుత్రుడు తన అభిమతం ఇలా వ్యక్తం చేశాడు “ఆనంద భిక్షువు మనందరికి గౌరవనీయుడు. బుద్ధ భగవాన్‌కి అత్యంత సన్నిహితుడు. ఆత్మ బంధువు. ప్రవచనాలు పొల్లు పోకుండా ప్రవచించ గలవాడు. గురుదేవులకు తోడు నీడగా ఉంటే వారు చెప్పే విషయాల్ని ధారణ చేయవీలుంది. గత ఇరవై సంవత్సరాలలో భగవాన్‌ చెప్పిన విషయాలు మనం చాలా మరచిపోయి ఉంటాం. కొన్ని ముఖ్యమైనవి, మనకు అవసరమైన మేరకు గుర్తుపెట్టుకున్నాం.”

సారిపుత్ర సూచనలు అందరూ అంగీకరించారు. ఆనంద్‌ మాత్రం మౌనం వహించాడు. ఆనంద్‌ తన అభ్యంతరాలు చెప్పాడు : *మి సూచన అంగీకరించ భగవాన్‌ బుద్ధ 124

డంలో కొన్ని సమస్యలున్నాయి. కొన్ని ఇబ్బందులున్నాయి. ఒకటి : సిద్దార్టుడు, నేను దగ్గర బంధువులం. ఆయన దగ్గర బంధువుల్ని అంత దగ్గరకు తీసుకోడు. బంధువు లెవరినీ ఆయన ప్రత్యేకంగా చూడటం లేదు. మహాప్రజాపతి గౌతమి గారి విషయం మి అందరికీ తెలుసు. స్వంత కొడుకు రాహుల్‌తో కలిసి భోజనం చేయలేడు. తన దగ్గర ఉండనీయడు. రాహుల్‌ని సారిపుత్ర సంరక్షణలో ఉంచిన విషయం అందరికీ తెలుసు. నాకు ఎలాంటి ప్రాధాన్యత, ప్రత్యేకత లేవు. నన్ను తన సహచరునిగా అంగీకరిస్తే కొందరు అసూయ పడవచ్చు. ఎవరైనా వచ్చి ఫిర్యాదులు చేస్తే నేను వినటం వారికి ఇష్టముండదు. నాకన్న బుద్ధునికి సారిపుత్త అంటే అభిమానం ఎక్కువ. నా కంటే మేధావి, ప్రజ్ఞావంతుడు తను. ధ్యానంలోనూ ముందున్నవాడు. సంఘం ఈ స్థితికి రావడానికి సారిపుత్ర కారణం. బుద్దుని తరఫున నిర్ణయాలు చేసేది తనే. ఈ బాధ్యతలు నాకు వద్దు.” సారిపుత్ర నవ్వి. “ఎవరి అసూయలు నన్ను అంటవు సోదరా, నాపని నేను సక్రమంగా చేశానా, లేదా అన్నదే నాకు ముఖ్యం. మిరు అంగీకరించకపోతే బౌద్ధం క్రమంగా అంతరిస్తుందని నా భయం.” కొంతసేపు మౌనం వహించి ఆనంద్‌ అన్నాడు “నా నిబంధనలు వారు అంగీకరిస్తే మా సలహా నేను పొటిస్తాను. ఒకటి : బుద్ధదేవుడు తను ధరించిన పేట్టలు ఏ పరిస్థితిలోనూ నాకివ్వకూడదు. రెండు : తనతో కలిసి భిక్షచేయమని అడగకూడదు. మూడు : తన పర్ణశాలలో తనతో కలిసి నన్ను నిద్రించమని అడగ కూడదు. నాలుగు : తాను ఎవరి ఇంటికైనా ప్రత్యేక భిక్షకు వెళ్లినపుడు నన్ను తనతో రమ్మనకూడదు. అయిదు * నేను భిక్షకు వెళ్లినపుడు తను నాతో రావచ్చు ఆరు ; తన దర్శనం కోసం వచ్చే వారిని అనుమతించడం, తిరస్కరించడం నా ఇష్టం. ఏడు : నాకు అర్ధం కాని విషయాలు అడిగితే వారు మళ్లీ చెప్పాలి. అర్ధమయ్యేట్లు చెప్పాలి. ఎనిమిది : నేను హాజరుగాని ధర్మోపన్యాసాల సారాంశం తిరిగి నాకు సుబోధకం చేయాలి. ఇవి పెద్ద అభ్యంతరమైన నిబంధనలు కావని సారిపుత్రకు తెలుసు. అసలు సమస్య రెండవది - ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావస్తిలో ఉండడం - నిజానికి శ్రావస్తి అన్ని విధాల అనుకూలం. ఇటు జేతవనం. అటు పూర్వారామం. గంగాతీరంలోని భిక్షుణి విహారం. విశాఖ మందీరం - ఇన్ని సౌకర్యాలు మరొక తావున లేవు. బౌద్ధానికి శ్రావస్తి ప్రధాన కేంద్రంగా భాసిస్తున్నది. ప్రధాన భిక్షులంతా వెళ్లి చెప్పగా బుద్ధుడు ఆమోదించాడు. “'ఆనందఖిక్షు తన ప్రక్క్మన ఉండటం తనకు అవసరం. తనకే కాదు రేపు బౌద్ధ ధర్మానికీ తనే రక్షకుడు కావాలి. 125 భగవాన్‌ బుద్ద

  • జ్‌ ళం సా ॥ లో న ' . యం ॥ ఉపచారం కా పల నం న షా. మ బం న ఆముంసత్తడాిం 14 మ వ యు. కా న మా నన స న్‌. 2! | (మ! దా / సక జీ వ. న 1. నన రం!

“సత్‌ వత్రణ నూత్ర - అంటే ధ్యానం గమనికతో చేయదం. ధ్యానంలో చైతన్యం అనుభూతించదం, అంటే ఎరుకతో ధ్యానం సాధన చేయడం. దీనిని టైతన్యవూర్హ ధ్యానం అంటారు. అది ధ్వానుల గమ్యం - గమనం. అటువంటి ధ్వానం వల్ల ప్రతి ఒక్టురికి మనశ్శాంతి లభిస్తుంది. వరివూర్జారోగ్యం నీద్ధిన్తుంది. అన్ని మానసిక వికారాలు తొలగిపోతాయి. (ప్రొానంచికమైన బాధలు, కష్టాలు పోతాయి. కష్టాలు కన్నీళ్లు లేకుందా ఆత్సజ్ఞానంతో త్పన్తీగా జీవించవచ్చు. చినరకు “విముక్తి లభించ చేనేది ఆ వూర్ణధ్యానమే!

గౌతమ బుద్దుని ప్రవచన సూత్రాలలో అతి ముఖ్యమైనది ఇదేనని సారిపుత్ర విశ్వాసం. ప్రతి సాధకుడు, ప్రతి భిక్షువు ఆ మాటల్ని మననం చేసుకుని ధ్యానం చేస్తే లక్ష్యం సిద్ధిస్తుందని సారిపుత్ర ఉద్దాబించాడు. తర్వాత ఆనంద భిక్షు దానిని విశ్లేషించాడు. 'సత్‌' అంటే జాగరూకత, జాగ్భతి. మనస్సును చైతన్యంతో నింపి ఎరుకలో ఉంచడం. అంటే సాధకుడు తనలో ఏం జరుగుతున్నది గమనిస్తూ ధ్యానం సాగించాలి. తన చుట్టూ, తనలో ఏం జరుగుతున్నది స్పృహ ఉండాలి. ధ్యానం చేస్తున్నా శరీరం, మనస్సు, భావాలు, సంవేదనలు, అనుభూతులు అన్నీ తెలుస్తూ ఉండాలి. అన్నింటినీ తెలుసుకుంటూ ఉండాలి.

ఉదాహరణకు; సాధకుడు తన శరీరంపై ధారణ చేస్తున్నాడనుకుందాం. శరీర భాగాలన్నింటినీ మనో నేత్రంతో చూడగలగాలి. అలా చేయడం వల్ల ఆయా భాగాలు, అవయవాలు చైతన్యం పొందుతాయి, శక్తిని సమకూర్చుకుంటాయి. ధారణవల్ల ఆయా శరీర భాగాలు లోపరహితమవుతాయి. ఒకచోట శరీరానికి గాయమైంది- ధ్యానంలో ఆ గాయం అయిన భాగంపైన ధారణ చేస్తే గాయం మానుతుంది. శ్వాసపైన ధ్యాస నిలిపినపుడు ఉచ్చాస నిశ్వాసలు తగ్గిపోయి అసలు శ్వాసించ నవసరంలేని స్థితి ఏర్పడుతుంది. అది 'శూన్యశ్వాస'. శ్వాసక్రియ జరుగుతుంది కాని మనం గుర్తించ వీలులేనంత మందంగా, సులభంగా జరుగుతుంది. శ్వాసక్రియ తగ్గడంవల్ల మనస్సులో అలజడి తగ్గుతుంది. దురాలోచనలుండవు. మనశ్శాంతి ఏర్పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఒక బాధ కలిగితే దానిపై ధ్యాసపెట్టి ధ్యానం చేస్తే ఆ బాధ ఉపశమిస్తుంది. అలాగ ఆలోచనలను, భావాలను క్రమబద్ధం చేయడం వల్ల అనుభూతులు పెరుగుతాయి. ధ్యాన గమన వేగం పెరుగుతుంది.

అలాగే మనస్సుపై భావన చేని ధారణ జరిపినపుడు మనిషి ఆలోచనలు తగ్గిపోతాయి. అసలు ఆలోచనలే లేకుందాపోయి మనస్సు నిర్మల సరోవరం 127 భగవాన్‌ బుద్ధ

అవుతుంది. "ఆ మనస్సు ఎంత స్వచ్చంగా ఉంటుందంటే మన ప్రతిబింబాన్ని మనం చూచుకోవచ్చు. మనోభావాలు, మనస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. మానసిక చర్యలపై ధారణ జరిపినపుడు అయిదు రకాల అవాంతరాలు ఏర్పడతాయి. వాంఛ, దుస్సంకల్పం, మగత, ఆందోళన, అనుమానం- ఈ అయిదు ధ్యానానికి తొలి అవరోధాలు, సాధనతో వీటిని అతిక్రమించాలి తప్ప వేరే ఉపాయం లేదు. ఆ విధంగా ఏడు సంవత్సరాలు సాధన చేస్తే విముక్తి లభిస్తుందని బుద్ధుడు చెప్పాడు. ఏడు నెలల సాధనలో కొంత ఫలితం కనిపిస్తుంది. ఏడు రోజులు సాధన చేస్తే ధ్యానంపై అభిరుచి కలుగుతుంది.

జేతవన విహారానికి వచ్చినపుడు ఒక సంఘటన జరిగింది. ఒకనాటి ఉదయం బుద్దుడు భిక్షకోసం శ్రావస్తి నగరం ప్రవేశించాడు. వీధుల్లో ఒక్క మనిషీ కనిపించలేదు. ఒక్క ఇంటి తలుపూ తెరుచుకోలేదు. నగరం నిర్మానుష్యమైంది. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడూ వెళ్లే ఒక ఇంటి ముందు నిలబడగా తలుపు ఓరగా తెరుచుకుంది. గృహస్థు బుద్దుని లోపలకు రమ్మని తొందర చేశాడు. ఇళ్లలోకి వెళ్లడం భిక్షులకు నిషేధం. ఆయన బుద్దుని లోపలకు తీసుకుపోయి తలుపులు బిగించాడు. తన ఇంట్లోనే భిక్ష భుజించమని అర్ధించాడు.

“స్వామి! ఈ రోజు బయట తిరగడం ప్రమాదం. మవో హంతకుడు అంగుళిమాల నగరంలో ప్రవేశించాడు. ఇప్పటికే అనేక మందిని చంపిన నరరూప రాక్షసుడు. హతుల వేళ్లను దండగా చేసుకుని మెడలో వేసుకుని తిరుగుతుంటాడు. ఇప్పటికి వందమందిని చంపాడని విన్నాం. మనుషుల్ని చంపుతాడు తప్ప దబ్బు, నగలు, నట్రా ఏవీ ముట్టుకోడు. ప్రసేనజిత్‌ మహారాజు వాడిని బంధించడానికి పైన్యాన్ని నగరంలో వీధి వీధినా నియమించాడు.”

“ఒక్కడిని బంధించడానికి సైనికులు అవసరమా?”

“అయ్యా! వాడు పరమకక్రూరుడు. చాలా క్షుద్ర విద్యలు తెలిసిన మాంత్రికుడు. ఒకసారి నలఖై మంది సైనికులు పట్టుకొని గొలుసులతో బంధిస్తే గొలుసులు త్రెంచుకుని పారిపోయాడు. వాడుందేది జాలినీ అరణ్యంలో. అటు ఎవరూ పోరు. రాజుగారు ఇరవైమంది సాయుధ సైనికుల్ని పంపితే ఇద్దరు మాత్రం (ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఇప్పుడు వాడు నగరంలోనే ఉన్నాడు. బయట ఎవరూ తిరగరు”.

కథ విని బుద్ధుడు బయలు దేరాడు. ఎంత బ్రతిమిలాడినా వినలేదు.

“నేను బయటకు వెళ్లి భిక్ష అర్ధిస్తాను”. భగవాన్‌ బుద్ద 128

బుద్ధుడు వీధిలో కొంతదూరం వెళ్లేసరికి తన వెనక ఎవరో వస్తున్న సవ్వడి వినిపించింది. అది అంగుళిమాల అయి వుంటాడని భావించాడు. అయినా తాను వెనుతిరిగి చూడలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవసాగాడు.

“ఏయ్‌ సన్యాసీ ... ఆగు ...” అంగుళిమాల అరిచాడు.

బుద్ధుడు ఆగలేదు. అడుగులు తడబడలేదు. వెనక నుండి అంగుళిమాల తన దగ్గరకు వేగంగా వస్తున్నట్లు గ్రహించాడు. అంగుళిమాల బుద్ధునికి దగ్గరగా వచ్చి గద్దించాడు “ఆగమంటే పోతావేం. ఆగు”. ల

బుద్దుడు ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు “అంగుళిమాలా, నేను ఆగిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు ఆగవలసింది నీవే.

బుద్దుని నిర్లక్ష్యానికి అంగుళిమాల తల తిరిగింది. ఎదురుగా వచ్చి, దారికి అడ్డంగా నిలబడి, ముందుకు కదలనీయ లేదు. బుద్దుడు ఆతని కళ్లలోకి సూటిగా చూదసాగాడు. ఆ చూపులకు ఒళ్లు కంపించి వజవజ వణికిపోయాడు. బుద్గుని నేత్రాలు రెండు నక్షత్రాలైనాయి. అంత తేజస్సును అతను భరించలేకపోయాడు.

సన్యాసికి తన పేరు తెలుసు. తన ఉనికి తెలిసే ఉంటుంది. తన మనికీ తెలిసే ఉండాలి. అకృత్యాలు విని ఉంటాడు. అయినా తన ముందు నిర్భయంగా నిలబడి సమాధానం చెప్పాడంటే సామాన్యుడు అయివుండడు. బుద్దుని కారుణ్య దృష్టిని భరించలేకపోయాడు.

“సన్యాసీ, నీవు ఎప్పుడో ఆగిపోయానన్నావు, మరి నడుస్తున్నావేం?” ప్రశ్నించాడు.

“అంగుళిమాలా ! నేను ఎప్పుడో కర్మలు చేయడం ఆపివేశానయ్యా! ఎవరికీ అపకారం చేయను. ఎవరికీ కష్టం కలిగించను. రక్షించడమే. నాకు తెలుసు. మనుషులనే కాదు, అన్ని జీవుల్ని రక్షిస్తాను. జీవకారుణ్యం నాది. అన్నింటికీ మృత్యు భయం ఉంటుంది గదా. (ప్రేమతో, కరుణతో మృత్యుభయం తొలగిస్తాను”.

“మనుషులు ఒకరినొకరు (ఢ్రేమించుకోరుగా, నేనెందుకు (ప్రేమించాలి? మనుషులంతా మోసగాళ్లు, కఠినాత్ములు, క్రూరులు. వీళ్లందరినీ చంపనిదే నాకు తృప్తి లేదు”.

“ల్రుంగుళల్లిమాలా, నీకు మనుషుల వల్ల కష్టం, నష్టం కలిగిందని ఒష్పుకుందాం. వారి ప్రవర్తనకు కారణం వారి అజ్ఞానం, ద్వేషం, కోరిక అసూయ. అయినా మనుషుల్లో (ప్రేమ ఉంది. ప్రేమించే గుణం ఉంది. ప్రేమించే మనసు ఉంది. మా ఛిక్షులు ఎవరికీ అపకారం చేయరు. భిక్షులే కాదు సమాజంలో 129 భగవాన్‌ బుద్ధ

ఎందరో మంచివారున్నారు. మనం ప్రయత్నిస్తే మనిషి క్రూరస్వభావాన్ని (ప్రేమగా మార్చవచ్చు. ప్రస్తుతం నీది ద్వేషించే మార్గం - అది ఆగిపోవాలి. కొత్త మార్గంలోకి రా. (ప్రేమ, దయ, కరుణ ... వీటిని ఆభ్రయించు.” బుద్దుని మాటలకు చలించిపోయాడు అంగుళిమాల. అయినా అనుమానం. పుండుమాద ఉప్పు చల్లినట్లయింది. “ఈ సన్యాసి మేమమూర్తి. కరుణామూర్తి. ఈయన గౌతమ సిద్ధార్థుడు కాదు గదా!” “స్వామి, నీ పేరు గౌతముడా?” అవునని తల ఊపాడు బుద్దుడు. “అయ్యా, ఇంతకాలం మిమ్మల్ని కలవలేకపోవడం నా దురదృష్టం. నా మార్గంలో చాలా దూరం వచ్చాను. (ఇంక వెనుతిరిగే అవకాశం లేదు”. “అంగుళిమాలా, మంచిగా మారడానికి కాలనియమం ఉండదు. వయస్సు అడ్డం కాదయ్యా, మంచి పని ఎప్పుడైనా చేయవచ్చు. 30 “ఇంక నేను చేయగల మంచిపని ఏముంది స్వామా?” “హింసామార్గం వదులు. ద్వేషం వదలిపెట్టు. విచారం సాగరమే కావచ్చు. వెనుతిరిగి చూస్తే ఒద్దు దగ్గరగానే కనిపిస్తుంది - తీరానికి చేరవచ్చు”. “నేను మారినా జనం నన్ను నమ్మరు. నన్ను బ్రతకనీయరు స్వామి”. “నేను నమ్ముతున్నాను. నీకేమి అపకారం జరగదు. నా వెంట రా. అంగుళిమాల బుద్ధుని పాదాలపై బడ్డాడు. మొలలో ఉన్న కత్తితీసి నేల మోద పెట్టి “చెడ్డ పనులు చేయను. స్వామో మా పైన ప్రమాణం చేస్తున్నాను. మా వెంట వస్తాను. నన్ను కనికరించండి.” అంతలో బుద్ధుని వెతుకుతూ సారిపుత్ర, ఆనంద, ఉపాలి, కింబలా - ఇంకా కొందరు భిక్షులు అక్కడికి చేరారు. బుద్ధునికి ప్రమాదం జరగనందుకు సంతోషించారు. కాని అంగుళిమాలను చూచి కంగుతిన్నారు విహారానికి తీసుకువెళ్లి అతనికి దీక్ష ఇచ్చారు. పది రోజుల్లో ఉపాలి, సారిపుత్ర అంగుళిమాలను తీర్చిదిద్దారు. ధ్యానం నేర్పారు. రాత్రింబవళ్లు అతను ధ్యానంలో గడపడం వల్ల పదిరోజులలోనే ఊహించని విధంగా మారిపోయాడు. రెండు వారాల తర్వాత బుద్ధుడే అతనిని గుర్తించలేకపోయాడు. మిగిలిన భిక్షువులు అతనిని 'అహింసక* అని పిలవసాగారు వాస్తవానికి పుట్టినపుడు తల్లిదండ్రులు అతనికి పెట్టినపేరు 'అహింసక. భగవాన్‌ బుద్ధ 130

ఒకనాడు గౌతమ బుద్దుడు యాఖైమంది శిష్యులతో శ్రావస్తి నగరం ప్రవేశించాడు. వారిలో అహింసకుడు ఒకరు. నగర ప్రధాన ద్వారం వద్ద ప్రసేనజిత్‌ మహారాజు సైనికులతో ఎదుఠుపడ్డాడు.

బుద్దుని చూడగానే ప్రసేన గుర్రం దిగి వచ్చి నమస్కరించాడు.

“ఏం జరిగింది మహారాజా! ఎవరైనా శక్రురాజులు దండెత్తి వస్తున్నారా? ఇంత మంది సైన్యంతో బయలుదేరారు?” బుద్దుడు ప్రశ్నించాడు.

“ఎవరూ దండెత్తి రావడం లేదు మహాత్మా. అంగుళిమాల అని ఒక నరహంతకుడు నగరంలో వీరవిహారం చేస్తున్నాడు. జనానికి నిద్రలు లేవు. వాడి కోసం గాలిస్తున్నాం. వాడు చాలా ప్రమాదకారి. రెండువారాల క్రితం నగరంలో ప్రవేశించాడు. ఎక్కడో దాగి ఉంటాడని ప్రజల అనుమానం”.

బుద్దుడు : “అంగుళిమాల అంత ప్రమాదకారా, మహారాజా?”

“అవును. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు - అందరికీ వాడు సింహస్వప్నం. వాడిని పట్టుకునేవరకు నాకు విశ్రాంతి లేదు”.

“అతను పశ్చాత్తాప పడి ఎవరినీ చంపనని ప్రమాణం చేస్తే? లేదా, అతను భిక్షువుగా మారితే అతనిని క్షమించగలరా?”

“అతగాడు భిక్షువైతే అంతకన్న ఏం కావాలి గురుదేవా? అతనికి క్షమాఖిక్ష పెట్టి వదిలేస్తాను”.

“అతను మా ఇిక్షు కోసమే బయలుదేరాడు మహారాజా”.

తన వెనకనే ఉన్న అహింసకుని చూపించి “మహారాజా! ఈ ఖిక్షువే మారు వెదుకుతున్న అంగుళిమాల. గుర్తించారా! రెండు వారాల క్రితమే బౌద్ధ సంఘంలో చేరాడు”.

ప్రసేనజిత్‌ ఒళ్లు కుతకుత లాడింది. తానొక మహాహంతకుని ఎదురుగా ఉన్న విషయం కంపరం కలిగించింది. మహారాజ, తాను చేయలేని పనిని ...

“భయపడకండి. ఖిక్షువైన అంగుళలిమాల ఇప్పుడు అహింసావ్రతుడు. ఎవరినీ హింసపెట్టడు”.

ప్రసేనజిత్‌ అహింసకుని వైపు చూచి “నీ క్రైరేది, నీతల్లి దండ్రు తెవరు?” ప్రశ్నించాడు.

“మహారాజా! మా తండ్రిగారిపేరు గర్గ నా తల్లి మంధనిపుత్ర”.

131 భగవాన్‌ బుద్ధ

ప్రసేనజిత్‌ బుద్ధునికి సాదరనమస్మారం చేసి, “అద్భుతం మహాత్మా ...” మహారాజు, సైనికులు వెళ్లిపోగా, బుద్దుడు, భిక్షులు భిక్షకై ముందుకుసాగారు. శ 3 3 బుద్ధుడు అంగుళిమాల వంటి నరరూప రాక్షసుని సన్యాసిగా మార్చిన విషయం పరిసరదేశాలలో సంచలనవార్త అయింది. అనేకమంది బౌద్ధం వైపు అకర్షితులైనారు. మహా మహా పండితులు, పీఠాధిపతులు, గురువులు బౌద్దాన్ని ఆశ్రయించసాగారు. అలా మారిన వారిలో *'ఉపాలి' ఒకడు. అతను నిగధ తెగకు చెందినవాడు. ఉపాలి నిగధను వదలడం చర్చనీయాంశమైంది. 'ఉపాలి గొప్ప జ్ఞానిగా ప్రసిద్దుడు. నిగ్రంధజ్ఞాతిపుత్రకు ప్రియశిష్యుడు. నిగ్రంధ విలాస పురుషుడు. ఆ ఏడాది గౌతముడు నలందలోని పవరిక వనంలో విడిదిచేశాడు. జ్ఞాతి పుత్ర శిష్యులలో ఒకడు దీర్హతాపసి వచ్చి బుద్ధుని దర్శించాడు. అతను బుద్దునితో చర్చించాడు. నిగ్రంధ శిష్యులు కర్మలను అంగీకరించరు. కాని పాపాలు అంగీకరిస్తారట. మూడు రకాల పాపాల గురించి తాపసి ప్రస్తావించాడు. (1) శరీరంతో చేసే పాపాలు (2) వాక్కువల్ల జరిగే పాపాలు (3) పాపపు ఆలోచనలు. “వాటిలో ఏది పెద్ద పాపం తాపసీ?” బుద్దుడు ప్రశ్నించాడు. “శరీరంతో చేసే పాపం చెడ్దదని మా గురువుల అభిప్రాయం”. బుద్ధుడు : “జ్ఞానపరంగా చూస్తే ఆలోచన ముందరిది కదా! ఆలోచన వచ్చిన తర్వాత గదా శరీరం పాపానికి సిద్ధమవుతుంది. అన్నింటికి మూలం మనస్సు.” ఆ విషయం ఆ మాట బుద్దుని చేత మూడు మార్లు అనిపించుకుని, విన, తాపసి వెళ్లిపోయాడు. (ముమ్మారు వచిస్తే అది సిద్ధాంతం). తాపసి వెళ్లి తన గురువుగారికి బుద్ధుడు ప్రవచించిన సిద్ధాంతం చెప్పాడు. జ్ఞాతి పుత్రుడు అన్నాడు : “గౌతముడు పొరపాటు చెప్పాడు. పాపపు ఆలోచనలు, పాపపు సంభాషణలు అంత పెద్ద ప్రమాదాలు కావు. శరీరం చేసే పాపాల ఫలితాలే భయంకరంగా ఉంటాయి.” తాపసి, నిగ్రంధల మధ్య చర్చ జరిగినపుడు విన్నవాడు ఉపాలి. స్వయంగా వెళ్లి బుద్ధునితో తలపడ్డాడు. బుద్ధుని వాదం ఉపాలికి నచ్చింది. భావన ప్రధానం

  • శరీరం అప్రధానం. వాక్కు సైతం అప్రధానమే అనడానికి బుద్ధుడు ఏడు ఉపాదులు చూపించాడు. నిగ్రంధ శాఖీయులు అహింసావ్రతులు (జైనులు). క్రిములకు సైతం అపకారం చేయరు. ఆ రెండింటినీ బుద్ధుడు ఆమోదించాడు. భగవాన్‌ బుద్ధ 132

“అయితే, ఉపాలీ, తెలియక లేదా ప్రమాదశాత్తూ ఒక క్రిమిపైన, కీటకంపైన కాలు వేస్తే, అది చస్తే ... అది పాపం అవుతుందా?”

“చంపాలన్న ఆలోచన లేనపుడు అది పాపం కాదు”.

“అంటే మో గురువుగారు 'కర్మ కన్న ఆలోచన ముఖ్యమని అంగీకరించి నట్లేనా? అయినప్పుడు ఆలోచన వల్ల చేసే ద్రైహికచర్య పాపమెలా అవుతుంది?”

ఆ మాటలు నచ్చాయి. ఉపాలి తనను శిష్యునిగా అంగీకరించమని బుద్దుని అర్జీంచాడు. “ఉపాలీ, నీవంటి మేధావి తొందరపడి నిర్ణయాలు చేయకూడదు.

" నిదానం ప్రధానం” ఉపాలి గటి పట్తుబట్లాడు. అప్పుడు బుద్దుడు టె బాట శ

“ఉపాలీ! నీవు నిగ్రంధ సంఘంలో ముఖ్యమైన వ్యక్తివి. నీవు బౌద్ధం స్వీకరించినా ఆ సంఘాన్ని చిన్నచూపు చూడవద్దు”.

“భగవాన్‌! మిలాగ పరమత సహనం కలవారు ఎందరుంటారు.”

ఉపాలి భిక్షువైన వార్త నటపుత్రకు తెలిసింది. విచారించాడు. తర్వాత మగధ, కోసల దేశాలలో చాలామంది బౌద్దాన్ని ఆశ్రయించారు.

“ఎంతమంది ఉపదేశ దీక్ష తీసుకున్నారన్నది ముఖ్యం కాదు. ఎందరు సర్వసమర్చ్సణ చేసుకోగలిగారన్నది ప్రధానం. జయాపజయాలను సమంగా స్వీకరించగల సమతాదృష్టి అవసరం.”

శ రే ఆ

నాటి ఉదయం బుద్దుడు కొందరు శిష్యులతో భిక్షకు బయలుదేరబోతున్న సమయంలో రాజభటులు జేతవనంలో ప్రవేశించారు. ఒక యువతి శవం అక్కడ ఉన్నదన్న అభియోగంపై అన్వేషించడానికి వచ్చారు.

“ఎవరా ప్రీ?” భద్రిక భటుల్ని ప్రశ్నించాడు.

“ఆమె పేరు సుందరి. వేరే మతస్థురాలు”.

కొంతకాలంగా ఒక సుందరి బుద్దుని బోధనలు వినదానికి వస్తోంది. ఆమె అయివుందవచ్చు ననుకున్నారు.

“ఇది ఆశ్రమం. ఇక్కడ శవా లెందుకుంటాయి?”

రాజభటులు ఆశ్రమ పరిసరాలు గాలించారు. బుద్దుని పర్దశాలకు అంత దూరంలో పూడ్చబడిన ఒక శవం దొరికింది. భటులు ఆ శవాన్ని తీసుకువెళ్లారు.

“నిగ్రహం పాటించండి. నిజం నిలకడమిద తెలుస్తుంది.” బుద్దుని హితవచనం.

133 భగవాన్‌ బుద్ధ

సుందరి శవాన్ని ఆడంబరంగా నగరంలో ఊరేగించారు. బుద్దుని శిష్యులు ఆమెపై అత్యాచారం చేశారని ప్రచారం జరిగింది.

శ్రావస్తి ప్రజలే కాదు, బౌద్ధభిక్షులూ కొందరు అనుమానించసాగారు. అది బుద్ధునికి కళంకం ఆపాదించడానికి పన్నిన పన్నాగం. ఎక్కడకు వెళ్లినా భిక్షులకు అవమానాలు ఎదురైనాయి. భిక్ష నిరాకరించి, ఛీత్మరించసాగారు. ఎంత నిగ్రహం పాటించినా మనస్సులో బాధ, కడుపులో ఆకలి దహించి వేస్తున్నాయి.

బుద్దుడు భిక్షులందరినీ సమావేశ పరిచాడు.

“ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా నిందలు రావడం సహజం. సిగ్గుపడ వలసిన అవసరం లేదు. తప్పుచేస్తే తలదించుకోవాలి. 'మనం' పవిత్రంగా జీవించినంతకాలం భయపడవలసిన పనిలేదు. అపనిందలు వచ్చిన దారినే పోతాయి అవి నిందలు - నిజాలు కావు కదా! ఎవరు అడిగినా ఒక మాట చెప్పండి “తప్పు చేసిన వారు అనుభవిస్తారు” అసి.”

ఈ అపప్రద వార్త విశాఖ చెవిని పడ్డది. ఆమె కలత చెంది, వెంటనే సుదత్తను కలిసి వేగుల్ని నియమించింది దోషులెవరో కనిపెట్టమని. ఆ పనిలో రాకుమారుడు 'జేత సహాయం తీసుకున్నారు.

వారం రోజుల్లో హంతకుల ఆచూకీ తెలిసింది. నగరం చివర, ఇద్దరు వ్యక్తులు తప్పతాగి దెబ్బలాడుకుంటుండగా వేగులు వెళ్లి పట్టుకున్నారు. సుందరి వర్గీయులే తమకు డబ్బిచ్చి ఆ పని చేయించారు. 'జేత వనంలో బుద్ధుని ఆశ్రమం సమిపంలో ఆమె శవాన్ని తామే పూడ్చి పెట్టామని అంగీకరించారు.

'ప్రసేనజిత్‌ జేతవనానికి వెళ్లి తన రాజ్యంలో ఇటువంటి దుష్కృత్యం చోటు చేసుకున్నందుకు బుద్ధుని క్షమాపణ కోరాడు.

హంతకులను క్షమించి వదిలిపెట్టమని బుద్దుడు సలహా ఇచ్చాడు. “తప్పు వారిది కాదు. ఆ ఆలోచన చేసినవారిది తప్పు”.

శావస్తి నగరం నిజానిజాలు తెలుసుకుని భిక్షుల్ని అపూర్వంగా ఆదరించ సాగింది.

(శ్రావస్తిలోని పూర్వారామ విహారం ఆడవారి కోసం కేటాయించబడింది. దానికి మహాప్రజాపతి గౌతమి ఆధ్వర్యం వహిస్తుంది. గౌతమి కారణంగానే భిక్షుణి సంఘం ఏర్పడ్డది. ఆమె స్వయంగా ధర్మబోధ చేస్తుంది. ఆమెకు సహాయంగా భిక్షుణి క్షేమ ఉంది. క్షేమ బింబిసారుని భార్యలలో ఒకరు. ఇరవై సంవత్సరాల క్రితమే ఆమె దీక్ష తీసుకుంది. సన్యాసినిగా జీవిస్తోంది. మొదట్లో క్షేమ భగవాన్‌ బుద్ద 134

అమాయకంగా సాదాసీదాగా ఉండేది. బుద్దదీక్ష తర్వాత, ధ్యానసాధన తర్వాత ఆమెకు వివేకం కలిగింది, జ్ఞాని అయింది నాలుగు సంవత్సరాలు శిక్షణ తర్వాత ఉపాసిక అయింది ఇప్పుడు ఆమె గౌతమి తర్వాత అందరికీ పూజనీయురాలు. ఆరాధనీయ. మంచి వక్తగా, జ్ఞానిగా ప్రశంసలు పొందింది. అప్పుడప్పుడు పూర్వారామానికి వచ్చి, భిక్షుణిల అవసరాలు, విహారం అవసరాలు చూస్తుంది. ఆమె ఒకసారి సుదత్తను విహారానికి ఆహ్వానించింది. సుదత్తుడే జేతవనాన్ని బౌద్ధారామానికి దత్తపరిచింది. విహారంలో క్షేమ, ధర్మదీన, ఉత్పలవర్హ, పాదచారలు ముఖ్యులు. వారు నలుగురిని సుదత్తకు పరిచయం చేస్తూ, వారు తనకు ముందు నుండే తెలిసిన వారని చెప్పింది.

ఆ పరిచయంతో సుదత్త మరొకమారు విశాఖతో పూర్వారామ విహారానికి వెళ్లాడు. విశాఖ ధర్మదీనకు బంధువు. ధర్మదీన అక్కడ ధర్మబోధన చేస్తుంది. ఆనాడు ఆమె పంచస్మంధాలపైన, అమ్హాంగ సూత్రాలపైన ప్రసంగించింది ఆమె వివరణ చాతురికి విశాఖ నిరత్తరుదైనాడు. జేతవనానికి వెళ్లి గౌతమునికి ధర్మదీన ప్రతిభను గురించి ప్రశంసాపూర్వకంగా వివరించాడు. కపిలాని కూడా ధర్మసూత్రాలు వివేచించదంలో దిట్ట. ధర్మదీనతో కలిసి భద్ర కూడా ఇతర భిక్షుణీ విహారాలకు వెళ్లి ధర్మబోధ చేసి వస్తుంది.

భిక్షుణి పాదచారిది ఒక విషాదగాథ. అమె శ్రావస్తిలో ఒక గొప్ప ధనవంతుని కూతురు. తల్లిదండ్రులు ఆమెను అమిత (ప్రేమగా చూస్తూ, ఇల్లు కదలనిచ్చేవారు కారు. బయట' ఎవరినీ కలిసే అవకాశం లేదు. వయసొచ్చింది. బయటి ప్రపంచంతో సంబంధంలేని కారణంగా ఇంటి సేవకుని ప్రేమించ సాగింది. తల్లి దండ్రులు వేరే పెద్ద సంబంధం చూచారు. ఆమె ప్రియుడితో లేచిపోవడానికి సిద్ధమైంది. తెల్లవారి ముహూర్తం అనగా, మారు వేషం వేసుకుని ఇల్లుదాటి ప్రియుడితో పారిపోయింది. వేరే దేశం చేరి అక్కడ పెళ్లి చేసుకున్నారు.

మూడు సంవత్సరాలకు ఆమె గర్భవతి అయింది. నెలలు నిండుతుండగా భర్తను కోరింది తనను కన్నవారింటికి చేర్చమని భర్త ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. మధ్యదారిలోనే ఆమె ప్రసవించింది. కొడుకును కన్నది. పుట్టింటికి వెళ్లే అవసరం తీరింది. తిరిగి ఇళ్లు చేరుకున్నారు.

రెండు సంవత్సరాలకు పాదచారి మళ్లీ గర్భవతి అయింది ఈసారైనా తనను పుట్టింటికి చేర్చమని కోరింది. సరే నన్నాడు. కొంతదూరం ప్రయాణం చేసేసరికి తుఫాను ముంచుకొచ్చింది. అడవిబాట. అప్పుడే ఆమెకు నొప్పులు మొదలైనాయి. ఆమెను ఒక చెట్టుక్రింద నిలిపి, అడవిలోకి వెళ్లాడు కర్రలూ 135 భగవాన్‌ బుద్ధ

ఆకులు తెచ్చి ఒక గుడిసె వేయాలని. వెళ్లినవాడు ఎంతకీ తిరిగి రాలేదు. అర్ధరాత్రి

  • జోరునవాన. ఆమె మరొక బిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారి పసిగుద్దును, మూడేళ్ల కొడుకును వెంటబెట్టుకాని భర్తకోసం వెతకసాగింది. అతని జాడలేదు. కొంత దూరంలో భర్త శవం కనిపించింది. విషసర్పం కాటుకు గురై చనిపోయాడు. ఏడ్చి, ఏడ్చి, పిల్లలతో బయలుదేరింది శ్రావస్తిలో కన్నవారిల్లు చేరాలని. నది ఒడ్డుకు చేరింది. వర్షాలకు నది పొంగి పార్షుతోంది. కుర్రవాడు నడిచే లోతు కాదు. పెద్ద పిల్ల వాడిని ఒద్దున నిలిపి, తాను పసిబిడ్డతో నదిని దాటసాగింది. పిల్లవానిని చేతులతో పైకెత్తిపట్టి నది దాటుతుండగా ఒక పెద్ద గద్ద వచ్చి చేతిలోని బిడ్డను తన్నుకుపోయింది. ఎంత అరిచినా గద్ద కనికరించలేదు. ఒడ్డున వదిలిన పిల్లవాడు “అమ్మ తననే పిలుస్తోందని" నీళ్లలోకి దిగాడు. ప్రవాహ ఉధృతానికి వాడు కొట్టుకుపోయాడు. పాదచారి ఒద్దుకు చేరి లబోదిబో మని ఏడ్చింది. నడిచి, నడిచి శ్రావస్తి చేరుకుంది.

దురదృష్టవశాత్తూ తుఫానుకు కన్నవారిల్లు కూలిపోయింది. కూలిన గోడల క్రిందపడి తలిదండ్రులు మరణించి శవాలై కనిపించారు. స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు జీవితంపైన అంతులేని విరక్తి కలిగింది. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బతకాలి? ఆత్మీయులు గతించారు. వీధిన పోతున్నవారు ఆమెకు స్పృహ తెప్పించి, బుద్దుని ఆశ్రమానికి చేర్చారు.

ఆమె కన్నీటి కధ విన్న బుద్దుడు : “పాదచారీ! నీవు చాలా కష్టాలు పడ్డాను. జీవితం అంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, రోదనలు మాత్రమే కావు తల్లీ! ధైర్యం తెచ్చుకో. ఆశ్రమంలో ఉండు. ధ్యానం చేసుకో. మనశ్శాంతి లభిస్తుంది. ఆత్మ స్రైర్యం కలుగుతుంది. జ్ఞానం పొందితే కష్టాల నీలినీడలు నిన్నేమి చేయవు”.

ఆమె ధర్మదీక్ష ప్రసాదించమని అర్ధించింది. బుద్దుడు ఆమెను మహాప్రజాపతి వద్దకు పంపాడు. ఆమె అనతికాలంలోనే అందరి ఆదరణకు పాథత్రమైంది. ఇప్పుడామెకు సేవ, ప్రేమ ... రెండు ఆధారాలు.

మరొక ప్రధాన భిక్షుణి ఉత్సలవర్ద . . ఆమె కూడా అనేక కష్టాలు ఎదుర్శొని సంఘాన్ని ఆశ్రయించింది. ఆమె గొప్ప సౌందర్యవతి. జుత్తు తీయించుకున్నా ఆమె అందానికి వచ్చిన లోటు లేదు. మౌద్గల్యన భిక్షుకు ఆమెపట్ల అభిమానం మెండు. ఒకసారి మౌద్గల్యన ఆరామంలో వెళుతూ ఉత్పలవర్దను చూడడం తటస్థించింది. ఆమె విరిసిన పద్మంలా వుంది. కాని మౌద్దల్యకు ఆమె కంటిలో తడి కనిపించింది. ఆమె బాధాతప్త హృదయ అని (గ్రహించాడు. సూటిగా కళ్లలోకి చూస్తూ ప్రశ్నించాడు - భగవాన్‌ బుద్ద 136

“అమ్మా నీవు అపురూప సౌందర్యవతివి. లావణ్య విలాసినివి. కానీన్‌ దుస్తులు నీ దుస్థితికి నిదర్శనం. నీ దైన్యస్థితికి అద్దంపడుతున్నాయి. నీలో కనిపించని వేదన వుంది. ఏమిటి తల్లీ నీ బాధ? నీవు బాధల్ని దిగమింగుతూ చీకట్లోకి నడుస్తున్నావనిపిస్తోంది?”

భిక్షువు తన హృదయాన్ని మనస్సును ఒడిసిపట్టుకున్నందుకు ఆశ్చర్యపద్దది. తాను ఎంత గంభీరం నటించినా ఆంతర్యం తెలిసిపోయింది. తనలోని తొట్రు బాటు కనిపించనీయలేదు. “మోరు ఊహించింది నిజమే మహాత్మా! నాకు మరో మార్గం కనిపించడం లేదు. నాది అధోగతి”.

“అంత నిరాశ కూడదు తల్లీ, గతాన్ని తలుచుకుని కుంగిపోతే, భవిష్యత్తు ప్రశ్చార్ధ్థక మవుతుంది. చీకటి మిగులుతుంది. కట్టిన బట్టలు మాసిపోతే ఉతికి, మలినాలు వదిలించుకుంటాం. చిరిగిపోతే కొత్తబట్టలు వేసుకుంటాం. జీవితమూ అంతే. బాధలతో భంగపడిన మనస్సును, కలుషితమైన హృదయాన్ని శుభ్రపరిస్తే చాలు. జ్ఞానజలాలలో స్నానం చేద్దువు. సిద్ధంగా ఉండు. ప్రతివారికి శాంతి, అనందాలు అనుభవించే అవకాశం ఉందని బుద్ధభగవానుడు అంటారు.”

ఉత్పలవర్ణ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.

“నా జీవితమే పాపకూపం స్వామో! బుద్ధభగవానుడు సైతం నన్ను ఉద్ధరించగలదని అనుకోవడం లేదు”.

ఉత్చలవర్ణ తన కథ చెప్పింది ఇలా-

“నేను సంపన్న కుటుంబంలో జన్మించాను మహాత్మా! పదవోరవ ఏటనే నాకు వివాహం జరిగింది. తర్వాత నా మామగారు చనిపోయారు. నా అత్త నా భర్తతో, అంటే స్వంత కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నాకొక కూతురు పుట్టింది. నా అత్త, భర్తల చర్యలు భరించలేకపోయాను. కూతుర్ని అక్కడే వదలి వచ్చేశాను. కొంతకాలం తర్వాత ఒక వ్యాపారిని పెళ్లి చేసుకున్నాను. కొన్నాళ్లకు అతను మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు. నా కన్న కూతురు. దాంతో నాకు ప్రపంచమన్నాా మనుషులన్నా రోత పుట్టింది. ఎవరినీ నమ్మలేక పోతున్నాను. వెలయాలిగా మారాను. బంగారం, రత్నాలు, ఆభరణాలు సంపాదించాను. నిజానికి మిమ్మల్ని వలలో వేసుకోవాలనే నా ప్రయత్నం”

ఆమె మొహాన్ని అవమానం 'క్రమ్మింది. సిగ్గువిడిచిన సౌందర్యవతి సిగ్గుపడ్డది, ఏడ్చింది. ఆమె గుండె బరువు తీరేవరకు మౌద్దల్యన ఏడవనిచ్చాడు. తర్వాత బుద్ధ విహాధానికి తీసుకువెళ్లాడు. ఆమెకు అనునయ వాక్యాలు చెప్పి 137 భగవాన్‌ బుద్ధ

గౌతమికి అప్పగించాడు. అచిరకాలంలోనే ఉత్పలవర్ణ గొప్ప ఉపాసికగా పరిణమించింది. శ శు 2

ప్రతి ఆశ్వయృజ పౌర్ణమికి సర్వభిక్షు సమావేశం నిర్వహిస్తారు. ఈసారి ఆనవాయితీ మారింది. కార్తీక పౌర్దమి నాడు భిక్షు సమ్మేళనం ఏర్పాటు చేశారు. నానా దేశ భిక్షు విహారాలకు చెందిన భిక్షులు శ్రావస్తి చేరారు. జేతవనంలో మూడు వేల మందికి వసతి ఏర్పాట్లు జరిగాయి విశాఖ, మల్లిక భిక్ష ఏర్పాట్లు చేశారు. కార్తిక పౌర్ణమికి తెల్ల కలువలు విరబూస్తాయి. బుద్ధునికి కలువలంటే ఇష్టం. ధ్యానానికి కలువలకు అభేదం అంటారు. ఈసారి సమారోహంలో 'ధ్యానం

  • చైతన్యం - గమనిక అనే అంశాలపైన ప్రవచనం సాగింది.

యశోధర, సుందరినంద ఉపాసికా దీక్ష తీసుకుని గౌతమి విహారంలో ఉంటున్నారు. కపిలవస్తుకు ఉత్తరంగా ఒక విహారం నెలకొల్పుకున్నారు. అదీ గౌతమి పర్యవేక్షణలోనే ఉంది. గౌతమి దీక్ష తీసుకున్న ఆరుమాసాలలో యశోధర వచ్చి చేరడం జరిగింది. ఒక్క ఏడాది కాలంలో యశోధర గౌతమి స్థాయికి చేరుకోగలిగింది. యశోధర జన్మతః మహాయోగిని. సిద్ధార్థుని అర్థాంగి కదా! గౌతమ బుద్దుని ప్రజ్ఞలో సహభాగి, సమభాగి. భిక్షుణి విహారాల నిర్వహణ, పోషణ బాధ్యతలు విశాఖ, రాణి మల్లికలది. తన రాజోద్యానం సైతం ఉపాసికలకు కైంకర్యం చేసింది రాణి మల్లిక, ఆమె వృద్ధురాలైంది. ఆనాడు పూర్వారామంలో బుద్ధుని ప్రసంగానికి యశోధర, నీల, విమల, సోమ అందరు హాజరైనారు. రాహుల్‌ స్వస్తికి తన తల్లిని, చెల్లిని పరిచయం చేశాడు.

బుద్దుని అనాటి ప్రవచనం :

“ఎరుకతో ధ్యానం చేయాలి. పూర్ణ ఎరుకతో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సమాధిలో శరీరాన్ని మరచిపోవడం, శరీరస్పృహ కోల్పోవడం తప్పు. శ్వాసపైన ధ్యాస ధ్యానంగా మారాలి. అది శూన్యంపైన ధ్యానం అవుతుంది. శ్వాసలు ఎన్నో రకాలున్నాయి. దీర్హశ్వాస : నేను దీర్హశ్వాస చేస్తున్నానన్న స్పృహ గమనిక ఉండాలి. దీర్హ నిశ్వాసంపై ధ్యాస ఉంచాలి. అలా దీర్చ ఉచ్చాస, నిశ్వాసలపై ధ్యాస ఉంచడం లాంటిదే హ్రస్వ ఉచ్చ్వాస, నిశ్వాసలపై ధారణ చేయడం. హ్రస్వ శ్వాసక్రియ జరిపినపుడు మరపు క్రమంగా తగ్గి, ఆలోచనలు సన్నబడి ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోవడంతో శూన్యమార్గం ఏర్పడుతుంది. శూన్యం పెద్ద సొరంగం లాంటిది. శూన్యంలో ప్రవేశించగానే చైతన్యం మేల్మొంటుంది. హృదయం జాగ్భతమవుతుంది. గమనిక ఉన్నా మనసు పనిచేయని స్థితిలో సత్యం మెరుస్తుంది. భగవాన్‌ బుద్ధ 138

జ్ఞానం తళుక్కుమంటుంది. ఎరుకతో ధ్యానించడం వల్ల సమాధి, అచేతనల భయం ఉండదు. ఏ క్షణంలోనైనా స్వస్థితికి రాగలరు. తర్వాత శరీరంపైన ధ్యానం, ఆ తర్వాత నిశ్చలత్వంపై ధ్యానం. ఇలా మొత్తం పన్నెండు రకాల ధ్యాన స్థితులున్నాయి. అన్నీ అనుభవంలో మోకే తెలుస్తాయి. దేనికైనా అనుభవం ప్రధానం. మొదటి నాలుగు ధ్యానాలలో మనస్సును దాటిపోవడం జరుగుతుంది. తర్వాత అనుభూతులు తెలుస్తాయి, ఆలోచనలు ఆగిపోతాయి. స్వేచ్చ పొందినపుడు ఆనందం అనంతంగా అనుభవిస్తారు. అదే శాశ్వతానందస్థితి, ప్రశాంతస్థితి. అదే నిర్వాణ సుఖం”. మూడువేలమంది భిక్షులు, భిక్షుణులు ఆ నిమిషంలో పరమానంద స్టితి అనుభవించారు. బుద్ధ చైతన్యం వారందరిలో నిండిపోయింది. న ఒకసారి అహింసకుడు భిక్షకు వెళ్లి గాయాలతో తిరిగి వచ్చాడు. భిక్ష అర్ధిస్తుండగా కొందరు అతనే అంగుళిమాలగా గుర్తించి మిదపడి కొట్టారు. అన్ని హింసలు భరించి విహారానికి తిరిగి వచ్చాడు. బుద్ధుడు స్వయంగా అహింసకుని గాయాలు నీటితో కడిగి మందు రాసి ఉపచర్యలు చేశాడు. “అహింసకా, బాధపడకు. ఒకనాటి నీ హింసాచర్యలకు ఇది ప్రతిఫలం. అనాడు నీ కారణంగా ప్రజలు ఎంత భయపడ్డారో, బాధపడ్డారో తెలిసింది గదా. గతంలో నీవు చేసిన పాపాలకు ఇది నిష్కృతిగా భావించు. ఒక రహస్యం తెలుసా! బాధల్ని మేమతో భరించగలిగితే వేయి జన్మల ద్వేషం కడిగివేసుకున్నట్లు.” “నీవు నిష్కల్మషంగా ఉంటే నీవాక్కు సిద్ధిస్తుంది. నీ సంకల్పం ఫలిస్తుంది. నీ వాక్కే మహా ధన్వంతరి!” న 1 వైశాలి నగరంలో కూటరాగశాల విహారంలో ఉండగా, వేరు విహారాలకు చెందిన భిక్షులు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్న వార్తలు అందాయి. అక్కడి వారిని పిలిచి విచారించాడు. “దేహం అశాశ్వతం - జీవితం అశాశ్వతం” అన్న భావనపై ధారణ చేయడం వల్ల, అంతా శూన్యం అనిపించి, శరీరం మాద, జీవితం మాద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆనాడు భిక్షుల్ని సమావేశపరచి “శాశ్వతత్వం - అశాశ్వతత్వం' పై వివరణ ఇవ్వవలసి వచ్చింది. “భఇిక్షులారా! అశాశ్వతత్వం అనే పదాన్ని మిరు అపార్ధం చేసుకుంటున్నారు. “అశాశ్వతం” అంటే శరీరం లేకుండా పోవడం కాదు. శరీరమే లేనప్పుడు ధ్యానం ఎలా చేస్తారు? అశాశ్వతత్వ భావన 'శూన్యతకు రహదారి కావాలి తప్ప శరీరంపైన 139 భగవాన్‌ బుద్ద

ద్వేషం పెంచుకోడానికి కాదు. మనది విజ్ఞానమార్లం. వైరాగ్యమార్లం కాదు. వేదాంత మార్గం కాదు. ఇది శాంతి పధం, నిర్వాణ పథం. అన్ని ధర్మాల నుండి విముక్తం కావాలి - అంటే స్వేచ్చ పొందాలి. ఏ ఒక్క ధర్మాన్ని పట్టుకు కూర్చోకూడదు. అన్ని ధర్మాల ఆంతర్యం (గ్రహించాలి. మనదైన పద్ధతిని స్వతం(త్రంగా అనుసరించాలి. ఆత్మహత్య చేసుకోవడం అజ్ఞానం, వెర్రి ఆలోచన. ఆత్మహత్య కూడా- హత్య చేయడం వంటిదే. మనది అహింసామార్గం. ఎలాంటి హింస కూడదు”. “స్వతంత్రించడం అంటే ఏదో ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం కాదు. వేరాక దానిని గర్హించడం, విమర్శించడం కూడ తప్పే. ఆ రెండింటినీ దాటితే సమతా దృష్టి ఏర్పడుతుంది. “సమత అంటే అన్నింటికి సమాన విలువలు ఇవ్వడం కాదు. తనదైన దృష్టిని అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం. 'సమత'” అంటే 'స్వ-మతం' అనుకోవచ్చు. అప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అలాంటి అనందానికి అవధులుండవు. స్వతంత్రించిన ఏ వ్యక్తి 'ఆత్మ'ను పట్టుకు కూర్చోడు. దానిని వదిలిపెడతాడు. ఆత్మకు ఆనందం ప్రతిరూపం - పర్యాయపదం. ధ్యానం చేసేటప్పుడు వివేకం ఉపయోగిస్తే, అంతా స్వచ్చంగా ఉంటుంది. దేనిని గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు. అనుభవంతో సత్యాన్ని నిగ్గుతేల్చాలి. అనుభవం "ఒక్కటే సరైన మార్గం చూపిస్తుంది. సన్నార్గంలోకి మళ్లిస్తుంది. దేనినీ అంటిపెట్టుకుని ఉండకూడదు. అదే స్వేచ్చా ప్రవృత్తి, స్వతంత్ర ప్రతిపత్తి. అప్పుడైనా తన దొక్కటే సత్య సమ్మతం అనుకోకూడదు. మో వరకు అది అనుసరణీయం. మా వరకు అది సన్మార్గం. మనిషి అవసరాన్ని బట్టి, తత్వాన్ని బట్టి విధి విధానాలు మారుతుంటాయి. చివరికి ఎవరి మార్గం వారిది కావాలి”. తర్వాత డ్రావస్తికి తిరిగి వచ్చిన తర్వాత ఒక జిజ్ఞాసి అడిగిన ప్రశ్నకు విపులంగా సమాధానం చెప్పాడు. “బంధాలు, బంధవిముక్తో గురించిన ప్రశ్న అది. తన బోధనలు అపార్ధం చేసుకుంటున్నారని, కొన్ని అపార్జాలు కల్పిస్తున్నా యని గ్రహించాడు. అంచేత జేత వనంలో భిక్షసంఘ సమావేశంలో ఇలా చెప్పాడు. “భిక్షులారా, సూత్రాలను సరిగా అర్ధం చేసుకోకపోతే, అనర్థాలు కలుగు తాయి. అపార్ధాలు ఏర్పడతాయి. ఆందువల్ల మాకే కాదు, ఇతరులకూ నష్టం కలుగుతుంది. సూత్రాలు వినడం చాలదు. వివేకంతో విశ్లేషించాలి. అన్వ్నయించు కోవాలి. ఆచరణలో, సాధనలో నిగ్గు తేల్చాలి. 'బోధని అన్నది ఒక సత్యాన్ని చెప్పడానికి ఉపయోగపడే మాధ్యమం. అదే సత్యం కాదు. చంద్రుని చూపించే వేలు వంటిది. వేలే చంద్రుడని భ్రమపడి, వేలినే చూస్తే ఎలా? వేలు చూపించే భగవాన్‌ బుద్ధ 140

దిక్కుగా చంద్రుని చూడాలి. సూత్ర పద్ధతి అంతే. సూత్రం చూపిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి. సత్యాన్ని అన్వేషించాలి. సూత్రానికి - అనుభవానికి మధ్య చాలా శూన్యం ఉంటుంది. నదిని దాటడానికి పడవ అవసరం. నా బోధన పడవ వంటిది జ్ఞానం అందుకున్న తర్వాత నా సూత్రాల అవసరం ఎవరికీ ఉండకూడదు. మిమ్మల్ని ప్రవాహం ఆవలితీరం చేర్చేవరకే నా సూత్రాల ఉపయోగం. ఆపైన మారు స్వతంత్రంగా ముందుకు సాగవలసి ఉంటుంది.”

కొంతకాలం తర్వాత తెలిసింది బంధ భిక్షుణి చక్కగా వ్యాఖ్యానం చేస్తారని: “భగవాన్‌ ఇకపైన నమర్శలైన భిక్షులకు ధర్మోవన్యానం చేయడానికి అనుమతివ్వండి”.

ఆ అభ్యర్థనకు సమాధానంగా బుద్ధుడన్నాడు : “మాటలు, ఉపన్యాసాలు ముఖ్యం కాదు. కొంతవరకే వాటి అవసరం. జ్ఞాని అయినవాడు మాటలు చెప్పడు. తన చుట్టూ ఉన్నవారిని మౌనంగా ప్రభావితం చేస్తాడు. చూపులతో సందేశాలు అందించగలడ్డు నిశ్శబ్దంగా జ్ఞానం ప్రసరింపచేయగలడు. అది దర్శన రహస్యం. ఉపదేశం కన్న దర్శనం విలువైనదని గ్రహించండి”.

శా ర ఆ

ఒకనాటి ఉదయం గౌతమబుద్ధ భిక్షాటన ముగించి తిరిగి వచ్చేసరికి, ఆనందభిక్షు ఆశ్రమంలో కనిపించలేదు. విచారించగా మరొక భిక్షువు చెప్పాడు: ప్రక్కన ఒక (గ్రామంలో ఆనంద భిక్షువును దళితవాడలో తాను చూచానని. వెంటనే వెళ్లి ఆనందుని తీసుకురమ్మని పంపాడు బుద్ధుడు. అతను వెళ్లి ఆనందుని, అతనితో ఇద్దరు స్త్రీలను తీసుకువచ్చాడు. వారు తల్లీ కూతుళ్లు. ఆ యువతి పేరు చండాలిక.

ఆనందుడు చెప్పిన కధ :

“గురుదేవా, కొన్ని వారాల క్రితం నేను భిక్ష తీసుకుని ఆశ్రమానికి వస్తున్నాను. దాహం వేసింది. అది దళితవాడ. మంచినీటి బావి దగ్గర ఆగాను.

ఎవరైనా వస్తే నీరు తోడుకుని తాగాలని. ఒకమ్మాయి వచ్చింది. అమ్మాయంటే చిన్నపిల్ల కాదు. పాతికేళ్ల యువతి. ఆమె పేరు ప్రకృతి. అందంగా ఉంది. మంచి యవ్వనంలో ఉంది. నేను మంచి తీర్ధం అడిగాను. అమె నిరాకరించింది. కారణం తను అంటరానిదాన్నని చెప్పింది. నాకు మంచి నీళ్లిచ్చి నన్ను అపవిత్రం చేయలేనని అన్నది.

“నేనన్నాను, “నాకు గొంతు ఎండిపోతున్నది. నాకు కావలసింది నీళ్లు. పవిత్రత కాదు. 'నేను అపవిత్రం అవుతానన్న భయం నీకొద్దు. నాకు అలాంటి భావన లేదు. దయచేసి నీళ్లివ్వండి”.

141 భగవాన్‌ బుద్ధ

“ఆమె నాకు మంచి తీర్ధం ఇచ్చింది. నా దాహం తీర్చింది. ఆమెకు నాపట్ల అనురాగం ఏర్పడిన విషయం నాకు తెలియదు. అది ఆమె *'దాహం'గా మారిన విషయం నాకు తెలియదు. నా పట్ల (ప్రేమ పెంచుకున్నది. రాత్రిళ్లు నిద్రపోవడం మానింది. నాపై మరులు పెంచుకోసాగింది. రోజూ బావివద్ద అదే వేళకు నాకోసం ఎదురుచూడసెాగింది. తన తల్లిని బ్రతిమలాడింది. వారింట భిక్షకు ఒప్పించింది. ఆమె పిలుపులో వలపు పసికట్టి ఆహ్వానాన్ని కాదన్నాను. ప్రకృతి ఢేమలో పడి చిక్కి సగమైంది. ఆడపిల్లలు (ప్రేమలో చిక్కుకుంటే బయటపడలే రనిపించింది. తన ప్రేమ గురించి శల్లికి చెప్పింది. నేను లేకుండా తను బ్రతకలేనని, చచ్చిపోతానని బెదిరించింది. నేను సన్యాసం వదలి, తనను పెళ్లాడాలని కోరింది. అధి జరగని పని. ఒక భిక్షువు సంసారి కావడం జరిగేపనా? అయినా కూతురి మోది ప్రేమతో ఆమె నన్ను కలిసి విషయం చెప్పింది. ఆమె మాతంగి ... మంత్ర తంత్రాలు తెలిసిన ఆమె. “ఒకనాటి ఉదయం ప్రకృతి నన్ను వారింటికి ఆహ్వానించింది. భిక్ష తిరస్మరించ కూడదన్న నియమం ఉంది కనుక, వారింటికి భిక్షకు వెళ్లాను. నాకు తెలియదు తల్లీ కూతురు పన్నాగం. భోజనంలో ఏదో మత్తు మందు కలిపారు. వశీకరణ ప్రయోగం ఏదో చేసి ఉంటుంది మాతంగి. నేను కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాను. కాస్త స్పృహ రాగానే, గురుదేవా, మో పాదాలకు నమస్కరించి అలాగే ధ్యానం చేసుకోసాగాను. క్రమంగా స్పృహ వచ్చింది. విషానికి మంచి విరుగుడు గురుధ్యానం. మోరు పంపిన భిక్షుసోదరుడు వచ్చేసరికి నేను ధ్యాన నిష్టలో ఉన్నాను గురుదేవా!” అంతా విని బుద్ధుడు ప్రకృతిని ప్రశ్నించాడు : “నీవు ఆనంద భిక్షుని ప్రేమించావా?

ప్రకృతి : అవును మహాత్మా నా మనసంతా తనే ..

బుద్ధుడు : ప్రేమించావు సరే. తనలో ఏం చూచి ప్రేమించావు? కాషాయ బట్టలా? భిక్షాపాత్రా? అందమా? యవ్వనమా? ఏది నీవు (ప్రేమించింది?

ప్రకృతి : ఆయనలో అన్ని గుణాలు నాకు నచ్చాయి. ఆయన గొప్పతనం నచ్చింది. ఆయనలో ఉన్నవి అన్నీ గొప్ప లక్షణాలే.

బుద్ధుడు : ఏమిటా గొప్ప లక్షణాలు?

ప్రకృతి : ఆయన హృదయం.

బుద్ధుడు : అలాగా, అతనికున్నది ఒకే హృదయం. అది తనకు అవసరం! ఆనందుడు ఏం ్రేమిస్తాడో నీకు తెలుసా?

ప్రకృతి : తెలియదు. నన్ను మాత్రం ఇష్టపడడం లేదని తెలుసు.

భగవాన్‌ బుద్ద 142

బుద్ధుడు : పొరపాటు ప్రకృతీ. ఆనంద్‌ నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే అతని (ప్రేమలో కాంక్ష లేదు. స్వార్ధం లేదు. ఆశ లేదు, కామం లేదు. అతను శాంతిని ప్రేమిస్తాడు. అతని 'ప్రేమిను అర్ధం చేసుకోగలిగితే నీవింతగా బాధపడవు.

ప్రకృతి ;: ఆయన వలె నేను ్రేమించగలనా?

బుద్దుడు : (ప్రేమలో కామాన్ని ఇష్టాన్ని, స్వార్థాన్ని తీసివేసి చూడు - ప్రేమించ గలవేమో? అఆనందుని (ప్రమ మంచిగంధ పరిమళం వంటిది. ఆ పరిమళాన్ని నీ కౌగిలిలో బంధించలేవు. నీ కామనతో కలుషితం చేయలేవు. అది చల్లని (పేమ. నీవూ ఆనందునివలె ప్రేమించడం నేర్చుకో - ఆనందుని కాదు- (ప్రేమను ప్రేమించు.

ప్రకృతి ] మార్గం చూపండి మహాత్నా, నేర్చుకుంటాను.

బుద్దుడు : భిక్షుణిగా మారి (ఆనంద తీర్ధం సేవించు.

ప్రకృతి : నేను చండాలికను కదా!

బుద్ధుడు : సంఘంలో కులాలుండవు. అందరూ బుద్దులే. అందరూ జ్ఞానానికి అర్జులే,

భిక్షుణి క్షేమ ఆమెకు ధర్శదీక్ష ఇచ్చి ఉపాసికను చేసింది.

శ రం ఈ

ఒకనాడు బుద్ధుడు, ఆనందుడు, మరికొంతమంది భిక్షులు నగరంలో తిరుగుతుండగా ఒకచోట చిన్న పిల్లలు మట్టితో ఆడుకోవడం చూచారు. మట్టితో, ఇసుకతో గూళ్లు లాంటి ఇళ్లు కట్టి, అదే నగరంగా భావించి వినోదిస్తున్నారు ఆ నగరంలో చాలా వీధులు, కోట మేడలు ఎన్నీ ఉన్నాయి. బుద్దుడు అటు రావడం చూచి “వాళ్లు మన బొమ్మల నగరానికి వస్తున్నారు. భిక్ష ఇద్దామా?” అనుకున్నారు.

“ఏం భిక్ష ఇస్తాం, మన దగ్గర ఏముంది, మట్టి, మశానం తప్ప”.

“వాళ్లు సన్యాసులు కదా. అదే 'భిక్షుగా ఇద్దాం. ఏం చేస్తారో చూద్దాం”.

బుద్ధుడు ఆనందంగా భిక్ష తీసుకుని ఒక కుర్రవాని భుజం తట్టాడు -

“్పిల్లలూ, కూర్చోండి. మికో కధ చెబుతా-

“చాలా కాలం క్రిందట ఒక యువరాజు ఉండేవాడు. అతని పేరు విశ్వంతర. మంచి యువరాజు, దయ, దాక్షిణ్యం కలవాడు. పేదవారంటే మహా (పేమ. ఎప్పుడూ పేదలకు ఏదో సహాయం చేస్తుండేవాడు. అతని భార్య పేరు మాద్రి. ఆమె కూడా చాలా మంచిది. భర్త ఏం చేసినా కాదనేదీ కాదు. వారికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వారి పేర్లు బాలిన్‌, కృష్ణజిన. 143 భగవాన్‌ బుద్ధ

“ఒకసారి ఆ దేశంలో పెద్ద కరువొచ్చింది. రాకుమారుడు తండ్రిని అడిగాడు దివాణంలో ఉన్న ధాన్యం, డబ్బు పేదలకు ఇద్దామని. అయన సరేనన్నాడు. కొద్ది రోజుల్లో దివాణం ఖాళీ అయింది. యువరాజు విశ్వంతర దాన ధర్మాలు కట్టడి చేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. రాజుగారితో చెప్పారు! “మహారాజా, యువరాజా వారి దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అయింది. బొక్కసాలు నిండుకున్నాయి. మనం చివరకు ఏనుగుల్ని సైతం అమ్ముకోవలసి వస్తుంది.”

“మహారాజుకు కోపం వచ్చింది. యువరాజుకు రాజ్య బహిషార శిక్ష విధించి జరాతుర పర్వతాలకు పంపివేశాడు. అప్పుడుగాని యువరాజుకు బుద్ధిరాదని అనుకున్నాడు. కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలి కదా! విశ్వంతర, అతని భార్య మాద్రి, ఇద్దరు పిల్లలతో దేశం వదలి వెళ్లిపోయారు.

“పర్వత బాటలో పయనిస్తుండగా వారికాక బిచ్చగాడు తారసపడ్డాడు. అతను చలికి వణుకుతున్నాడు. యువరాజుకు దయ ఎక్కువ గదా! తను వేసుకున్న అంగరఖా విప్పి బిచ్చగాడికి దానం చేశాడు. తర్వాత ఎదురైన పేదలకు మాద్రి

తన నగలు ఒక్కొక్కటి దానం చేసింది. చివరకు పిల్లలూ వారి నగలు దానం చేశారు. జరాతుర పర్వతం చేరేసరికి వారివద్ద కట్టుకున్న బట్టలు తప్ప ఒక్క విలువైన వస్తువు మిగల లేదు. తిండి లేదు. పిల్లల్ని ఎత్తుకొని భార్యాభర్తలు నడక సాగించారు. చాలాదూరం నడవడం వల్ల కాళ్లు పుళ్లె రక్తం స్రవిస్తున్నాయి. అదృష్టవశాత్తు వారికి కొండపైన ఒక పూరిగుడిసె కనిపించింది. ఆ గుడిసె చాలా కాలం క్రితం ఒక మహర్షిది. అందులో యువరాజు కుటుంబం మకాం వేశారు. కర్రలు, బొంగులు తెచ్చి మంచాలు తయారు చేసుకున్నారు. అడవిలో చెట్ల కాయలు, దుంపలు తెచ్చి తినసాగారు. నెమ్మదిగా కొత్త జీవితం అలవాటైంది. పిల్లలు గుడిసె దగ్గర నేల చదును చేసి ఒకతోట తయారు చేసి, కూరలు పండించ సాగారు. యువరాజు పిల్లలిద్దరికీ చక్కగా చదువు నేర్పసాగాడు.

“ఇప్పుడు యువరాజు వద్ద డబ్బు లేదు. గుర్రాలు రథాలు లేవు. సేవకులు లేరు. అయినా దిగులు లేదు. హాయిగా, తృప్తిగా జీవిస్తున్నారు. మూడు సంవత్సరాలు గడిచాయి. ఒకసారి విశ్వంతర, మాద్రి అడవికి వెళ్లారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు లేరు. ఎవరో దుండగులు వచ్చి ఎత్తుకుపోయారు. చుట్టుపట్ల గ్రామాలు గాలించారు. పిల్లల ఆచూకీ తెలియలేదు. విసిగి వేసారి ఎప్పటికైనా తమ పిల్లలు తమకు దక్కుతారన్న ఆశతో గుడిసెకు చేరుకున్నారు. వీరు గుడిసెను చేరుకునేసరికి మహారాజు పంపిన భటుడు ఒకడు వీరికోసం ఎదురుచూస్తున్నాడు. పిల్లలు అంతఃపురంలో సుఖంగా ఉన్నారన్న శుభవార్త చెప్పాడు. భగవాన్‌ బుద్ధ 144

“పిల్లలు అంతఃపురం ఎట్లా చేరారు? అదొక కథ = “అంతఃపుర పరిచారికలు నగరంలో పోతున్నపుడు ఒకచోట పిల్లల్ని అమ్మడం చూచారు. ఈ పిల్లలిద్దరు యువరాజా వారి సంతానంగా గుర్తించారు. వెంటనే వెళ్లి రాణి గారికి చెప్పారు. ఆమె భటుల్ని పంపి పిల్లల్ని తెప్పించుకుంది. పిల్లలు చెప్పిన కథ విని మహారాజు చలించాడు. ఆ పిల్లల్ని ఎత్తుకు వెళ్లింది దొంగలే. నగరంలోని విపణిలో అమ్మి డబ్బు చేసుకోవాలని వారి ప్రయత్నం. “పిల్లలూ! మనకున్నదానిలో ఇతరులకు పంచడంలో ఆనందం ఉంటుంది కదూ! మో దగ్గర ఉన్నది నాకు భిక్షగా ఇచ్చారు. సంతోషం. మిరు పెద్ద వారైన తర్వాత బోలెడు సంపాదిస్తారు కదా! అప్పుడూ మి సంపాదనలో కొంత భాగం పేదలకు దానం చేస్తుండండి. వాళ్ల ఆనందం మికు పంచుతారు. అలాగా ఆనందం పంచుకోవడంలో గొప్ప తృప్తి ఉంటుంది.” ఆయమపాలి కుమారుడు జీవకుని నివాసం ఆమవనం. ఆయన అక్కడ ఉండి వైద్యం చేస్తుంటాడు. తోటలో చాలా పర్ణశాల లున్నాయి భిక్షుల ఉపయోగార్థం. రోగుల కోసం కొన్ని కేటాయించారు. ఒకనాటి సాయం సమయంలో ఒక యువఖిక్షుణి బుద్ధ దేవుని దర్శించి తన ఆశమానికి తిరిగి వస్తుండగా ఒక రసిక యువకుడు ఎదురుపడ్డాడు. ఆమె చాలా అందగళ్తి. పైగా యువతి. ఆమె అందానికి ఆకర్షితుడై, దారికి అడ్డంగా నిలిచి, ఆమె అందాన్ని కళ్లతో ఆస్వాదించసాగాడు.. అది నిర్దన ప్రదేశం. జన సంచారం లేదు. చుట్టూ చెట్టు పొదలు. పైగా చీకటిపడే సమయం. అతని కాముకత్వం అతని చూపుల్లోనే కనిపించింది. ఆమె మనసులో కొంచెం సేపు ధ్యానం చేసి, నిదానించి, అతని వేపు తీవ్రంగా చూస్తూ అన్నది, “అయ్యా, మోరెవరో నాకు తెలియదు. నేను ఉపాసికను. బుద్ధ దేవుని శిష్యురాలిని, దారివ్వంది. త్వరగా వెళ్లాలి”, అతను “నీవు ఉపాసికవో, కాదో నాకు అనవసరం. నీవు అందంగా ఉన్నావు. మంచి యవ్వనంలో ఉన్నావు. నాకు నీవు కావాలి. బోడిగుండుతోనే ఇంత సొగసుగా ఉన్నావు. సకేశివైతే ఇంకెంత ముద్దొస్తావో. రా మనం ఈ రాత్రి సుఖిద్దాం. నీ అంత అందగత్తెను నెనెప్పుడూ పొందలేదు ” శుభ తొణకలేదు, బెణకలేదు. “నోరు మూసుకో, నేను విరాగినని చెప్పాను గదా. నీలాంటి క్షుద్ర కోరికల్ని ఎప్పుడో వదలిపెట్టాను. నన్ను పోనీయండి.” “నీ కళ్లు నన్ను కవ్విస్తున్నాయి. నీ చూపులు నాకు కైపెక్కిస్తున్నాయి రా”. అని ఆమె చేయి పట్టుకో బోయాడు. ఆమె దూరంగా జరిగింది. “నన్ను తాకవద్దు 145 భగవాన్‌ బుద్ధ

నా కళ్లు అందంగా ఉన్నాయి కదూ. నా కళ్లు పీకి ఇస్తాను తీసుకుపో. శీలం కోల్పోవడం కన్న కళ్లు పోగొట్టుకోవడం మంచిది.”

అతను గాభరా పడ్డాడు. ఆమె అన్నంత పనిచేసేట్లుంది. కాస్త వెనక్కి తగ్గాడు. శుభ అన్నది : “కామంతో కళ్లు మూసుకుపోయి పాపాలు చేయకండి. అఘాయిత్యాలకు వడిగట్టకండి. మా కామానికి అభం శుభం తెలియని ఆడవారిని బలిపెట్టకండి.”

అతని బుర్ర కాస్త పనిచేయసాగింది. నిజమేగదా! కామం ఎంత చెడ్డది. వెను తిరిగి వెడుతూ “అక్కా నన్ను క్షమించు” అన్నాడు.

శుభ బుద్ధి కుశలతను బుద్దుడు అభినందించాడు.

“నిర్జన ప్రదేశాలలో ఉపాసికలు ఒంటరిగా (ప్రయాణం చేయడం మంచిది కాదు. అందుచేతనే చాలాకాలం ఆడవారిని సంఘంలో చేర్చుకోలేదు. ఇకపైన భిక్షిణులు, ఉపాసికలు ఎవరూ ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒకరికిద్దరు తోడుండాలి. భిక్షకు సైతం ఒంటరిగా వెళ్లకూడదు”.

శే 2 చ

బుద్దుడు జీవకుని ఆశ్రమం నుండి నలందకు బయలుదేరాడు. చాలామంది భిక్షులు బుద్ధుని వెంట వచ్చారు. మార్గమధ్యంలో వారిని ఇద్దరు బ్రాహ్మణ సన్యాసులు వచ్చి కలిశారు. వారు సుప్రియ, అతని శిష్యుడు బ్రహ్మదత్త. వారు బుద్దుని సూత్రాలను గట్టిగా చర్చిస్తూ విమర్శించసొగారు. వారిద్దరి వెనక వస్తున్న బౌద్ధ భిక్షులు వారి మాటలు విన్నారు కాని వాదనకు దిగలేదు

చీకటి పదేవేళకు అంబలత్రిక వనం చేరారు. అది బింబిసారునిది. సన్యాసులు, బైరాగులు, విరాగులు ఎవరైనా ఆ వనంలో రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు. సుప్రియ, (బహ్మదత్తులు ఆరాత్రి అక్కడ విశ్రమించాలని నిర్ణయించుకున్నారు.

మరునాటి ఉదయం సన్యాసుల చర్చ గురించి భిక్షులు మాట్లాడుకోవడం బుద్ధుడు విన్నాడు ;

“భిక్షులారా! ఎవరైనా నన్ను విమర్శించినా, బుద్ధధర్మాన్ని విమర్శించినా కలవరపడకండి. కోపం తెచ్చుకోవద్దు. ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు. విననట్లు ఊరుకోండి. వారి మాటల్ని మనసులో ఉంచుకుంటే మోకే నష్టం. ఎవరైనా పొగిడినా, అభిశంసించినా పట్టించుకోవద్దు. పొగడ్తలు వినడం వల్ల మనకే నష్టం. ఆ విమర్శలో ఎంత యదార్ధం అని విళ్లేషించుకోండి. మో అంతట మిరు అధ్యయనం చేస్తే అభివృద్ధి కలుగుతుంది. మో జ్ఞానం పెరుగుతుంది.” భగవాన్‌ బుద్ధ 146

“భిక్షులారా! బుద్దుని, ధర్మాన్ని సంఘాన్ని పొగిడే వారికి సరైన అవగాహన ఉండదు. మన నిరాడంబర జీవనం వారికి నచ్చింది. అంతకంటే వారికి తెలియదు. ధర్మబోధ తెలిసిన వారు మాట్లాడరు, పొగదరు. బెన్నత్యం గ్రహించి ఊరుకుంటారు. విలువలు మాటలకు అందవు. ఆలోచనకు అందవు. దేశంలో అనేక సిద్దాంతా లున్నాయి. ఎవరి విశ్వాసం వారిది. ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. ఒకరినాకరు ద్వేషించుకుంటారు. దేశంలో అరవై రెండు సిద్ధాంతాలున్నాయి. వేలకొలది తాత్తికులున్నారు. జ్ఞానదృష్టితో చూస్తే అరవై రెండు మతాలలో ఏవో లోపాలు కనిపిస్తాయి. ఏదీ సమగ్రం కాదు. ఆ విష వలయంలో చిక్కుకోవద్దు. సాధన మించిన తత్వం లేదు. అవలోకనాన్ని మించిన జ్ఞానం ఉండదు.”

“అది బ్రహ్మజూల సూత్రం”.

అంబలత్రిక నుండి బయలుదేరి బుద్దుడు నలంద మ్లదుగా చంపానగరం చేరాడు. అంగరాజ్యం బింబిసారుని సామంతదేశం,. బహు సంపన్నదేశం. అక్కడి భిక్షువిహారం బుద్దుని రాకకు సంతోషించింది. రోజూ వందల సంఖ్యలో అభిమానులు బుద్దుని దర్శనానికి రాసాగారు. చంపా నగరంలో సోనదండ అనే బ్రాహ్మణ పండితు డున్నాడు. ఆయనకు గౌతముని చూడాలనే కోరిక ఎప్పటి నుండో ఉన్నది. సందర్భ పడలేదు. సాటివారు నిరుత్సాహపరచడం మరొక కారణం ... “నీవంటి బ్రాహ్మణోత్తముడు వెళ్లి ఒక సన్యాసిని కలవడం ఏమిటి?” అన్నారు.

“గౌత్రమ బుద్దుడు అసామాన్య ప్రతిభావంతుడు. మహాజ్ఞాని అని విన్నాను. ఎంతటి ప్రజ్ఞ కలవాడో చూచి, సంభాషిస్తే గదా తెలిసేది? అతను ఏ విధంగా ప్రొజ్జుడో ప్రత్యక్షంగా చూడాలి”.

గౌతమబుద్దునితో తలపడడానికి బయలుదేరిన సోనదండునికి అండగా కాన్ని వందలమంది బ్రాహ్మణ విద్వాంసులు బయలుదేరారు. బ్రాహ్మణాధిక్యత నిరూపించే సువర్థావకాశం చేజారనిస్తారా? సోనదత్తుని ప్రతిభపై వారికి పూర్ణ విశ్వాసం ఉంది. (బ్రాహ్మణులకు ఏ మాత్రం అవమానం జరగడం అతను సహించడు. బుద్ధునితో వాదించి, విజయం సాధిస్తే (బ్రాహ్మణ పతాకం ఇంకాస్త పైకి ఎగర వేయవచ్చు. సోనదత్తుడు వెళ్లేసరికి బుద్ధుని సమక్షంలో కొన్ని వందల మంది భిక్షులున్నారు. వారిలో ఎందరు బ్రాహ్మణులున్నారో సోనదండకు తెలియదు. బుద్దుడు సోనదత్తుని స్వాగతించి మర్యాద చేశాడు : 147 భగవాన్‌ బుద్ధ

“రండి మిత్రమా, సోనదండా! స్వాగతం. మిరు వచ్చిన పని అందరికీ తెలిసిందే. కాలయాపన చేయకుండా చర్చ ప్రారంభించండి లేదా, నేను ప్రారంభిస్తాను -

బుద్ధుని ప్రశ్న . ఉత్తమ బ్రాహ్మణుడి లక్షణాలేమిటి? అవసరమైతే వేద ప్రమాణాలను చూపించండి. నాకు అభ్యంతరం లేదు. మా వాదానికి వేదాల ఆధారాలు అవసరం కదా.”

అంత చిన్న ప్రశ్న వేసినందుకు సోనదండ సంతోషించాడు. మరీ శాస్త్ర చర్చలోకి వెడితే కష్టమయ్యేది. సోనదండ గొంతు సవరించుకుని గంభీరస్వరంతో అన్నాడు “గౌతమా! సదాహ్మణునికి అయిదు లక్షణాలుండాలి. ఒకటి . ఆకర్షణీయమైన రూపం; రెండు : యజ్ఞ యాగాలు, క్రతువులు నిర్వహించే సామర్థ్యం; మూడు: సుశ్రావ్యంగా వేదాలు పరించడం; నాలుగు : ఏడు తరాల మచ్చలేని సౌశీల్యం; అయిదు : సత్ప్రవర్తన, జ్ఞానం.”

బుద్దుడు ప్రశ్నించాడు “వాటిలో మరీ ముఖ్యమైనది ఏది? తాము సెలవిచ్చిన అయిదు గుణాలలో ఏ ఒక్కటైనా లోపిస్తే సద్బాహ్మణుడు కాదా?”

సోనదండ : “చివరి రెండు చాలా అవసరమైన గుణాలు గౌతమా! రూప సంపద, వేధ పాండిత్యం, క్రతు నిర్వహణ సామర్ధ్యం అంత ముఖ్యం కావు.

ఆ మాట వినగానే వెంటవచ్చి (శ్రద్ధగా చర్చ వింటున్న బ్రాహ్మణులు ఉలిక్కిపడ్డారు. గుంపుగా తేచి నిలబడి సోనదండ అభిమతాన్ని ఖండించారు.

బుద్దుడు వారి వైపు చూచి “మహోదయా, సోనదండపైన మికు ఏపాటి గౌరవం ఉన్నా నోరు మూసుకు కూర్చోండి తన అభిప్రాయం చెప్పనీయండి. ఆయనపై మికు విశ్వాసం లేకపోతే ఆయన్ని నోరుమూసుకుని కూర్చోమనండి. మాలో ఇంకెవరైనా ఉద్దండుడుంటే వచ్చీ చర్చలో పాల్గొనవచ్చు.”

సోనదండ తన వారికి నచ్చచెప్ప ప్రయత్నించాడు “నా సోదరుడు అగక ఉన్నాడు. అతను యువకుడు. అందగాడు. వేదాధ్యయనం చేసినవాడు. యజ్ఞాలు చేయించగలవాడు. పవిత్రత ఉంది. కాని అతను తాగుబోత్రైతే, స్రీలోలుదైతే, అసత్యభాషణుడైతే మిగిలిన అన్ని గుణాలు వీగిపోతాయి. కనుక గుణం ప్రధానం. ప్రతిభ ప్రధానం. ఆ రెండూ లేనివానికి ఎన్నిగుణాలుండి ఏం లాభం?” బుద్దుడు : సోనదండా! మోరు చెప్పిన రెండు గుణాలలో మరీ ముఖ్యం ఏది?

శీలం ముఖ్యమా? గుణం ముఖ్యమా? సోనదండ : జ్ఞానం ఉన్నచోట గుణం ఉంటుంది. ప్రతిభతో సదాచరణ ఉంటుంది. వాటిని విడదీయలేం,

భగవాన్‌ బుద్ద 148

బుద్దుడు : చక్కగా చెప్పారు. అయితే జ్ఞానం ప్రధానం అంటారు. సోనదండ : గౌతమా! నా కళ్లు తెరిపించారు. నా ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు బౌద్ధ దీక్ష అనుగ్రహించండి.

“ౌందరికి అసూయ, అసహనం జన్మ లక్షణాలు. వాటిని వదిలితే ఎవరైనా

జ్ఞానులు కావచ్చు.” శే రేం ఆగ్‌ బుద్ధుడు (శ్రావస్తి తిరిగివచ్చి పూర్వారామంలో విడిది చేశాడు. ఒకనాటి ఉదయం విశాఖ బుద్దుని దర్శనార్ధం వచ్చింది. ఆమె కట్టుకున్న బట్టలు, తల తడిసి ఉన్నాయి. 1

“ఎక్కడ నుండి వస్తున్నావు? ఎందుకు తడిశావు?”

“నా చిన్న మనవడు చనిపోయాడు”.

“ఎట్లా చనిపోయాడు? అతని వయసు?”

“మూడు సంవత్సరాలు. జ్వరంతో పోయాడు”.

“నీక్సు పీల్లలెందరు? మనవళ్లు, మనవరాళ్ళు?”

“పదహారు. తొమ్మిది మందికి పెళ్లిళ్లు అయినాయి. ఎనిమిది మంది మనవ సంతానం. ఇప్పుడు ఏడుగురే మిగిలారు.”

“విశాఖా! (శావస్తిలో రోజూ ఎంతమంది మరణిస్తుంటారో తెలుసా?”

“గృరుదేవా! మిమ్మల్ని దర్థించకపోతే మనస్సు అదోలా అవుతుంది. శూన్యం అనిపిస్తుంది మరు దేశాంతరం వెళ్లినపుడు ఈ పర్ణశాలలో. కొంచెం సేపు కూర్చున్నా, చుట్టూ ప్రదక్షిణ చేసినా, ఒక్కసారి దర్శించినా మనశ్శాంతి కలుగుతుంది”.

“విశాఖా! నన్ను దర్శించడం ముఖ్యం కాదు నీ సాధన ముఖ్యం. నేను లేకపోయినా ఇక్కడ భిక్షులుంటారు. వారంతా నా ప్రతినిధులు. నా ప్రజ్ఞ వారిలోను కనిపిస్తుంది. “బోధన అంటే బోధిసత్వం అని అర్ధం. నా బోధనలు అర్ధం చేసుకుంటే నన్ను దర్శించినట్లే. నేనిప్పుడు ఉన్నాను కనుక దర్శిస్తావు. నేను లేనిపక్షంలో బుద్ధదర్శనం చేసుకోగల సత్తా నీకు అలవదాలి. అదే ఆత్మదర్శనం. అంతర్జష్టి. దానిని సంపొదించుకో. అది ముఖ్యం.”

ఆనందుడు * “ఇక్కడ బోధి విత్తనాలు తీసుకుపోయి మన విహారాలన్నింటిలో వేస్తే, బోధి వృక్షాలు మొలకెత్తుతాయి. బోధి వృక్షం బౌద్దానికి, బుద్ధునికి ప్రతినిధి కావాలి.”

149 భగవాన్‌ బుద్ధ

“మో ఇష్టం అలాగే చేయండి”. శ శ ఈ

“స్తహ్రనావవతు ... సహనౌభునక్తు ... సహవీర్యంకరవావహై ...”

అంటే ఏమిటని ఆనందభిక్షు ప్రశ్నించాడు.

బుద్ధదేవుడు : అది చాలా సున్నితమైన అంశం ఆనంద్‌. ఒక జవాబు ఆశించిన ప్రశ్న కాదది. ఆ మాటల్లో 'పరస్పర సహకారం” ఎంతో ఉంది. మాటలతో వివరించడం కష్టం. వివరించినా అర్ధం చేసుకోవడం మరీ కష్టం. సుదీర్ట ప్రసంగాలు అర్ధం అయినట్లే ఉంటాయి కాని అర్ధం కావు. 'సద్ధర్మను అర్ధం చేసుకుని ఆచరిస్తున్నవాడు ఉరువిల కశ్యపుడు. సారిపుత్ర కొంతవరకు సాధించాడు. ప్రతిక్షణం చైతన్యంతో తొణికిస,లాడాలి. ప్రపంచం అంతా దారాల అల్లిక. ఒక దారం మరొక దారంతో ఎక్కడో ముడిపడి ఉంటుంది

“జనన మరణాలు అన్ని ధర్మాలకు వర్తిస్తాయి. 'పరస్పరాశ్రయం' అంటే ఏమిటి? ఒకటి మరాక దానిపై ఆధారపడడమే కాదు, ఒకదానిలో అన్నీ ఉండడం. అంటే ఒకదానికి మరొకదానికి ఆంతరంగిక సంబంధం ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మం తెలిస్తే జనన మరణాల వలయాన్ని భేదించవచ్చు. ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. కారణాలు నాలుగు విధాలుగా ఉంటాయి : ఒకటి సృష్టించబడడానికి వేరొకటి (ప్రధాన కారణం. వడ్లగింజ., వరి వంగడానికి కారణం. అది సృష్టించబడడానికి మట్టి, నీరు, గాలి, వేడి - ఆధారాలు. ఆ నాలుగింటిలో ఏ ఒక్కటి లోపించినా వడ్లగింజ మొలకెత్తదు మనిషి చేసే అన్ని కర్మలకు మూలం మనస్సు.

“మనిషి విచారాలకు, విషాదాలకు కారణం ఏది? జననం, మరణం, అజ్ఞానం. అజ్ఞానం వల్లనే జనన మరణాలు ఏర్పడతాయన్న వివేకం కలగడమే జ్ఞానం. అది అంత సులభం కాదు. కాని అది నిజం. అదే నిజం. జనన మరణాలు ఎలా, ఎక్కడ ఏర్పడుతుంటాయి? మన మనసులో. అవి చిత్తభ్రమలు, అవే చిత్త చాంచల్యాలు. వాటికి మూలకారణం అన్వేషిస్తే విచారాలు సమసిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అజ్ఞానం వదిబితే జనన మరణ భావనను, భయాల్ని అధిగమించవచ్చు.

“మొత్తం పన్నెండు అవరోధాలున్నాయి. ఒకటి తెలిస్తే మిగిలినవి అవే తెలుస్తాయి. ఆరు ఇంద్రియాలకు సంబంధించినవి. మరో ఆరు అనుభూతులకు సంబంధించినవి. మరణం, జననం, వృద్ధి గమనం, గ్రహణం, ఆరాటం, భావన ఇవి ఇంద్రియాలకు సంబంధించినవి. జ్ఞాని అయినవాడు వీటిని దాటిపోతాడు. భగవాన్‌ బుభ్ధ 150

వీటిని దాటి పోతే తప్ప జ్ఞాని కాడు. వీటిని అనుభవిస్తూనే వాటిలో చిక్కుపడకుందా తప్పించుకుంటాడు. జనన మరణాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే వాటినుండి విముక్తి పొందినట్లే.

ఆ సమయంలో బుద్ధునిపై ఒక అపప్రద వచ్చింది. (బ్రాహ్మణ వర్గం అసూయతో బుద్దునిపై బురద చల్లడానికి మరొక ప్రయత్నం చేశారు. బుద్ధునికి ఒకామెతో అక్రమ సంబంధం ఉందని, అతనివల్ల ఆమె గర్భవతి అయిందని కధ సృష్టించారు. అది ఎలా జరిగిందంటే : ఒక అందమైన (బ్రాహ్మణ స్త్రీని ఎన్నిక చేశారు ఆమె పేరు “చించి. చించను పావుగా ఉపయోగించుకున్నారు. ఆమె రోజూ చక్కగా, ముస్తాబై జేతవనానికి వెళుతుందేది. బుద్ధుని ధర్మ బోధ పూర్తయే వరకు మందిరం బయట తచ్చాడుతుందేది. ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లు నటించేది. ఉపన్యాసం అయిన తర్వాత నగఠంలోకి వెళ్లేవారు ఆమెను అదోలా. చూచేవారు. ఆమె నవ్వి సిగ్గుపదుతుందేది. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత అనుమానం వచ్చి “నీవు ఎవరు? ఎవరి కోసం నిరీక్షణ?” అని ప్రశ్నిస్తే

“గురువు గారితో నాకు పని, గురువుగారి ఆశమానికి వెళ్లాలి?” అనేది.

“వారితో నీకేం పని?”

“వారితోనే పని. రాత్రికి ఆశ్రమంలోనే ఉండి, తెల్లవారు రూమున వెళ్లిపోతాను” అనేది.

ఆఅ మాటలు కొందరిని బాధించాయి. కొందరికి నిజమేనేమో అని అనుమానం కలిగింది ఆమె ప్రవర్తన అలా వుంది.

ఒకనాడు ధర్మమందిరం లోపలికి వెళ్లి, ప్రసంగం విన్నది. మధ్యలో లేచి నిలబడి ప్రశ్నించింది “ఆచార్యా! తమరు ధర్మబోధ చేస్తారు గానీ ఆచరించరుగా?” సభికులు, ఛిక్షులు అవాక్కయినారు.

ఆమె మళ్లీ అన్నది “నా విషయంలో ధర్మం 'సెలవీయండి. మా వల్ల నేను గర్భవతినైనాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మోరే తండ్రినని సభా ముఖంగా అంగీకరిస్తారా?”

బుద్దుడు తొణకలేదు, బెణకలేదు “కుమారీ, నీ మాటల్లోని సత్యం నీకు తెలుసు, నాకు తెలుసు”.

బుద్దుని నిగ్రహం ఆమెను కలవర పరచింది, “అవును నిజానిజాలు మాకూ నాకూ తెలుసు” అన్నది. జనానికి కోపం వచ్చి ఆమెను తరిమికొట్టారు. ఆమె ప్రాణభయంతో పారిపోతూ బయట ఒక స్తంభానికి తగిలి క్రింద పడ్డది. పొత్తి కడుపులో చీరకింద దాచిన చెక్కపలక క్రింద పడ్డది. అది పాదాల మిద పడడం 151 భగవాన్‌ బుద్ధ

వల్ల పాదం గాయమైంది. ఆమె చేస్తున్న మోసం అందరూ (గ్రహించారు. భిక్షుణి క్షేమ ఆమెను తన కుటీరానికి తీసుకువెళ్లి ఉపచర్య చేసి పంపివేసింది

బుదుడు తన ప్రసంగం కొనసాగించాడు.

“జ్ఞానం చిన్నాచితకా విశ్వాసాలను తుడిచి పెడుతుంది. మహారణ్యంలో మృగరాజు ఉంటుంది. అది తన గుహ నుండి బయటకు రాదు వచ్చే ముందు భీకరంగా గర్జిస్తుంది. సింహగర్దనకు అరణ్యంలోని ఇతర జంతువులు ఎక్కడివక్కడ తప్పుకుంటాయి. సింహం దారికి అవి అడ్డం రావు. సింహగర్జన ఏనుగులకు సింహస్వప్పమే. అరణ్యంలో సంచరించడానికి బయలుదేరేముందు సింహం గర్జిస్తుంది.

“మారు వాస్తవం కాని దానిని వాస్తవంగా భ్రమపడతారు. ఏది అవాస్తవమో తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞాని అజ్ఞానం తెరలు తొలగిస్తాడు. జ్ఞానం దానంతట అదే ప్రకాశిస్తుంది. అదే సత్యదర్భనం. సమాజంలో మనుషులు నాలుగు రకాల ప్రలోభాలకు గురవుతుంటారు : విషయ వాంఛలు, సంకుచిత బంధాలు, అనుమానాలు, ఆత్మ గురించిన భావన. ఈ నాలుగు భ్రమల్ని తొలగించు కోవడమే జ్ఞానం”,

శ 4 2

జేతవనంలోని కొందరు భిక్షులకు సారిపుత్రపై ఆగ్రహం కలిగింది. గౌతమ మిద్ధుడు సారిపుత్రను తన తర్వాత వారసునిగా చేస్తున్నాడని అనుమానం. అనుమానం అసూయగా మారింది. ఆయన అహంభావి అని, గర్విష్టి అని, ఎవరికీ మర్యాద ఇవ్వడని రకరకాలుగా అభాండాలు వేయసాగారు. సారిపత ఎంతటి సమర్జ్భుగ్రో బుర్భునికి, తెలుసు. ఆనందునికి తెలుసు. అయితే అతనిని బహిరంగంగా బలపరిస్తే పక్షపాతం అనుకుంటారు. సారిపుత అర్హత ఏమిటో ఎపరికి వారే గ్రహించాలని బుద్దుని ఉద్దేశం. ధర్మమందిరంలో సర్వభిక్షు సమావేశం ఏర్పాటు చేయించాడు. మౌద్గల్యన, ఆనందుడు విహారంలోని ప్రతి ఆశ్రమం, ప్రతి పర్ణశాల తిరిగి అందరినీ ఆహ్వానించారు. సభామండపం భిక్షులతో కిటకిట లాడింది. ఒకసారి బుద్ధుడే సారిపుత్రునికి తన ప్రక్క్మన సమానస్థానం ఇచ్చిన సంగతి అందరూ మరచిపోయారు.

ఎనిమిది సంవత్సరాల క్రితం జేతవనంలో *కోకాలిక” అని ఒకరుండేవాడు. అతనికి సారిప్పుత్ర, మౌద్గల్యన లంటే అకారణ ద్వేషం ఏర్పడింది. గౌతముడు కూడా అతని ప్రవర్తన, మనసు మార్చలేకపోయాడు. వారిద్దరు స్వార్ధపరులని అతని అభిప్రాయం, వారు మంచివారని బుద్దుడు చెప్పినా వినక రాజగ్భహకు భగవాన్‌ బుద్ధ 152

వెళ్లి దేవదత్తుని ఆశ్రయించాడు. ఇప్పుడతను దేవదత్తునికి ప్రియశిష్యుదు. అది కారణంగానే ఆనందుడు బుద్ధుని ఆంతరంగిక భిక్షువు కావడానికి తటపటాయించాడు. అనవసరంగా స్పర్ధలు పెరుగుతాయి. అనుమానాలు ఏర్పడతాయి. చివరకు తాను బుద్దుని వదలి పోవలసిన పరిస్థితి రావచ్చు. ఆనందునికి మరాక సంఘటన జ్ఞాపకం వచ్చింది :

కోశాంబిలో మాగంధిక అని ఒకామె ఉందేది. ఆమె బుద్ధుడు తనని ప్రత్యేకంగా గౌరవించలేదని ఈసడించుకునేది. ఆమె చాలా అందమైన బ్రాహ్మణి. బుద్ధునికి 45 సంవత్సరాల వయస్సులో తారసపడి, పరిచయం పెంచుకుని, ప్రేమించ సాగింది. బుద్ధుని తనవైపు ఆకర్చించడానికి నానాయాతన పడ్డది. మౌద్దల్యన ఆమె ప్రయత్నాన్ని వారించాడు. దాంతో అమె తన (ప్రేమను ద్వేషంగా మార్చుకోసాగింది. తర్వాత అమె “ఉదేన' ప్రభువును పెళ్లిచేసుకుంది. రాణి అయింది. అయినా బుద్దునిపై మోజు తీరలేదు. బుద్దుని ద్వేషించసాొగింది. దుష్ప్రచారం చేసింది. బుద్దుని ధర్మబోధలు నిలిపివేయించమని భర్తని వేధించింది. ఉదేన ప్రభువుకు 'సమవతి' అనే (ప్రేయసి ఉంది. ఆమె బుద్దుని అభిమాని. మాగంధిక ఆమెను అవమానించేది.

ఆ గొడవలు భరించలేక ఆనందుడు కోశాంబి వదలి వేరే ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచించాడు. బుద్ధుడు వారించాడు : “ఎక్కడకు వెళ్లినా, అక్కడ ఇలాంటివి జరగవని ఏమిటి ఆనంద్‌”

“వేరొక చోటుకు పోతాం”.

“అది వివేకవంతుల లక్షణం కాదు ఆనంద్‌. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం, పారిపోవడం ధీరుల లక్షణం అనిపించుకోదు. అది పిరికితనం అవుతుంది. పలాయనం అవుతుంది. మనం సహనం వహించి, సంయమనం పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ ప్రమాదం జరగదు. మనల్ని బాధపెట్ట దలచినవారే బాధపడతారు. మనల్ని అవమానించిన వారే అవమానాల పాలవుతారు. ఎవరైనా ఆకాశంలోకి ఉమ్మివేస్తే అదివచ్చి వారి ముఖం మోదనే, పడుతుంది. ఆకాశం కలుషితం కాదు.”

ప్రస్తుత పరిస్థితిని సారిపుత్ర ఎదుర్కోగలడని ఆనందుని నమ్మకం. సారిపుత్రపై గౌతమ బుద్దునికి విశ్వాసం వుంది. సంఘంలో చెప్పుకోదగిన వ్యక్తి, జ్ఞాని అతను. సంఘ నిర్వహణ అతనే చూస్తాడు. సంఘానికి రూపకల్పన చేసింది సారిపుత్రుడే. బౌద్ధధర్మ సూత్రాలను సమికరించి, వ్యాఖ్యానించిన వాడు తనే. అతనిది స్వతంత్ర వైఖరి. బుద్దుని భావాలకు భాష్యం చెప్పగలవాడు సారిపుత్ర. 153 భగవాన్‌ బుద్ధ

సభామందిరంలో ప్రవేశించిన బుద్దుడు వేదికపైన తన ప్రక్కన సారిపుత్రను కూర్చోమని ఆహ్వానించాడు. అందుకు అంగీకరించక దూరంగా ఆనంద్‌, మౌద్గల్యనల సరసన వెళ్లి కూర్చున్నాడు వినయంగా. ఆ సమావేశం తనపై వచ్చిన అభియోగం విచారణకని తెలుసు.

“సారిపుత్రా! కొందరు ఖిక్షులు నీపైన కొన్ని ఫిర్యాదులు చేశారు. మరికొందరు అభియోగం మోపారు. వారిని అవమానించావని వారి అభియోగం. నీవు చెప్పుకోవలసింది ఏమైనా వుందా?” బుద్ధుడు సభ ఉద్దేశం ప్రకటించాడు.

సారిపుత్ర లేచి, బుద్ధుని పాదాలకు నమస్కరించి, సభకు నమస్కరించి అన్నాడు ; “భగవాన్‌, సవ్యంగా జీవించనివాడు, సక్రమంగా ధ్యానం చేయనివాడు, అంతర్ముఖుడు కాలేని వాడు, ఆత్మోన్మీలన చెందనివాడు, అజ్ఞానంలో ఉన్నవాడు సోదర భిక్షుని అవమానించవచ్చు. కాని నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. మిరు పధ్నాలుగు సంవత్సరాల క్రితం రాహుల్‌ కిచ్చిన సందేశం నాకు శిరోధార్యం

కరుణ, ప్రేమ, ఆనందం, సమత - అనే నాలుగు అంశాలు వివరించి బోధించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ధర్మాలను పాటిస్తున్నాను.

భగవాన్‌, నాకు ఎవరిపైన ద్వేషం లేదు. అయిష్టం లేదు. ఎవరైనా నా ప్రవర్తన అవమానంగా భావిస్తే నేను క్షంతవ్యుడిని. క్షమించండి.”

ఫిర్యాదు చేసిన వారు వచ్చి సారిపుత్రకు క్షమాపణ చెప్పారు.

శ శ ఈ _ తర్వాత బుద్ధుడు చాలా గ్రామాలు పర్యటించాడు. చాలా మంది వారి ధర్మబోధలు విన్నారు. అందులో ఒకరు వినయంగా వచ్చి చెప్పారు. “అయ్యా! మా కేశపుత్ర గ్రామానికి బ్రాహ్మణపండితులు వచ్చి బోధిస్తుంటారు. అన్ని మతాలకన్న (బ్రాహ్మణ ధర్మమే గొప్పదంటారు. కాని ఆ ధర్మాన్ని అనుసరించిన వారిని (బ్రాహ్మలుగా అంగీకరించరు. ఎందువల్ల?” బుద్దుడు : “ఒక విషయం ఒకటికి పదిసార్లు నొక్కి వక్కాణించినంత మాత్రాన అది నిజం కాదు. అది సత్యమూ కాదు. ప్రాచీన (గ్రంధాలలో రాయబడిందని చెప్పినంత మాత్రాన ప్రాచీన మైనదంతా.,సత్యం కాదు. గురువులు , బోధించినంత మాత్రాన దానికి పవిత్రత రాదు. అది సత్యమైపోదు. మా వివేకంతో దానిని విశ్లేషించుకోవాలి. మికు ఆనందం కలిగించేది, తృప్తిని, శాంతిని కలిగించేది, మోకు ఉపకరించేది మాత్రమే మిరు ఆమోదిస్తారు, నమ్ముతారు. నచ్చని వాటిని, ఉపయోగకరం కానివాటిని వదిలిపెట్టండి. చెప్పినవాడు మహామేధావి అయినంత మాత్రాన మికు వొరిగేది ఏమిలేదు. ప్రయోజనకరం భగవాన్‌ బుద్ధ 154

కాని వాటిని వదిలిపెట్టండి. “అత్యాశ, ఆక్రోశం, అజ్ఞానం” వీటిని పరిహరించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మోకు స్వేచ్చ ఉంది. స్వతంత్రం ఉంది. తను నమ్మిన వాటిని ఆచరించే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ ఉంది.”

బుద్ధుని ప్రవచనాలు, సూత్రాలు ఎంతో జటిలంగా ఉంటాయి. సారిపుత్ర లాంటివారు వ్యాఖ్యానిస్తే తప్ప అర్ధం అయ్యేవి కావు. కాని సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో చిన్నచిన్న సంఘటనలు ఆధారంగా, ఉపమానాలతో బోధించేవాడు. ఒకసారి బుద్ధుడు అలవి[గ్రామం వెళ్లాడు. ఊరిపెద్దలు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష అనంతరం ధర్మబోధ జరగబోతుండగా ఒక రైతు ఆదరాబాదరా పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటి విశేషం? అని ప్రశ్నించగా అతని గేదె తప్పి పోయిందని చెప్పాడు. ఎవరికీ అర్ధం కాలేదు. బుద్ధుడేం చేయాలి? అతని గేదె తప్పిపోతే?

ఆ రైతు బుద్ధుని దర్శించుకోవాలనుకున్నాడు. బయలుదేర పోతుండగా, గేదె తప్పి పోయిందన్న విషయం తెలిసింది. దానిని వెతికి పట్టుకోడంలో ఇంత ఆలస్యమైంది. భోజనం చేయకుందా పరిగెత్తుకు వచ్చాడు. భోజనం చేస్తే ధర్మబోధకు రాలేనని ఆత్రుత. బుద్ధుడు అతనికి ముందు భోజనం పెట్టించి తర్వాతనే ధర్మ బోధ చేశాడు. ప్రపంచంలో అన్ని అవసరాలకు మించింది ఆకలి. ఆకలితో ఉన్నవాడికి నీతిసూత్రాలు బోధిస్తే కడుపు మండుతుంది గానీ నిండదు. ధ్యానం అయినా, శ్రవణం అయినా కడుపు నిండిన తర్వాతనే. భోజనం చేసి వచ్చిన రైతు చక్కగా మనస్సు పెట్టి వినగలిగాడు.

ఎవరూ లోకంలో అకలితో బాధపడకూడదని బుద్దుడు చెప్పేవాడు.

తర్వాత కోశాంబి చేరడానికి గంగాతీరంలో నడుస్తుండగా, నదిలో ఒక కొయ్యదుంగ కొట్టుకుపోవడం గమనించాడు. వెంట వస్తున్న భిక్షుల్ని దగ్గరగా పిలిచి 'ఆ దుంగను చూస్తే మోకేం అనిపిస్తుంది. మిరంతా ఆ కొయ్య దుంగల్లాంటి వారే అన్నాడు. భిక్షులు బిత్తరపోయారు. తర్వాత వివరణ యిచ్చాడు: “చ్రూడండి, ఆ దుంగ సముద్రం చేరాలంటే ఎన్ని అవాంతరాలుంటాయి? ఎక్కడా గట్టుకు తగిలి ఆగిపోకూడదు. సీళ్లలో మునిగిపోకూడదు. నది మధ్యలో ఉన్న ఇసుక మేటల వద్ద ఆగిపోకూడదు. ఎవరూ దానిని తస్మరించాలన్న ఉద్దేశంతో ఒడ్డుకు లాగకూదదు. సుడిగుండాలలో చిక్కకూడదు. ఇన్ని అవాంతరాలు దాటితే తప్ప అది సముద్రాన్ని చేరదు.

“వమనం కూడా ఎన్నో అవరోధాలను అధిగమిస్తే తప్ప నిర్వాణపధం చేరలేము. ఇంద్రియ లోలత్వం కూడదు. కోరికలు, కామనలు, వాంఛలలో మునిగిపోకూడదు. లక్ష్యం మరచి, మధ్యలో ఆగిపోకూడదు. దారి తప్పకూడదు. 155 భగవాన్‌ బుద్ధ

పెడదారి పట్టకూడదు. నైతిక వర్తన లేని వారితో మైత్రి చేయకూడదు. ఆహార, నిద్రా, మైధునాలు పరిమితం చేసుకోవాలి ధన వ్యామోహం, కీర్తి వ్యామోహం కూడవు. ఆడంబర జీవనం పనికిరాదు ఇన్ని అవరోధాలు దాటితే తప్ప నిర్వాణం చేరలేము.”

ఇరవై సంవత్సరాలు నిండని వారిని సంఘంలో చేర్చుకోరాదన్న నియమం ఉండేది. ఒకసారి 17 మంది పిల్లకాయలు సంఘంలో చేరతామని వచ్చారు.

12-18 సంవత్సరాల వారే అందరూ. తల్లిదండ్రుల అనుమతి తీసుకురమ్మని

పంపివేశారు. ఉపాలి తల్లిదండ్రులు అనుమతి ఇవ్వలేదు. సంఘంలో చేరితే

మధ్యాహ్నం పన్నెండు లోగా భోజనం చేయాలి. రాత్రి భోజనం ఉండదు. పిల్లలు ఒక్కపూట తిని ఉండలేరు. ఆరోగ్యరీత్యా మంచిది కాదు. పైగా ఏది దొరికితే అది తినాలి. పిల్లలకు అదీ కష్టమే.

అందుచేత నియమాలు పెట్టారు. గృహస్తులు, ఆడవారు, పిల్లలు వారివారి ఇళ్లలోనే ఉండవచ్చు. పంచసూత్రాలు పాటిస్తే చాలు. అష్టాంగ సూత్రాలు అను సరిస్తే చాలు. బౌద్ధ ధర్మం పాటించినట్లే. అందరూ భిక్షులు కానవసరం లేదు.

శ శ 7

షాసుమరగిరిపైన వేసకాల వనంలో ఉన్న తరుణంలో కొందరు ముఖ్య భిక్షులను సమావేశపరచి “మహాపురుషుల విముక్తి” విధానాల గురించి వివరించాడు.

“భిక్షు సోదరులారా!”

మహాత్ములంతా నిర్వాణ పధం చేరిన వారే. జనన మరణాలకు అతీతమైన వారే. వారు నిర్వాణస్థితికి చేరిన ఉపాయాలను వివరిస్తాను వినండి : నిర్వాణ పథానికి ఎనిమిది మార్ధాలున్నాయి. పూర్వకాలం నుండి మహాత్ములైనవారు బోధించినవి, అనుసరించినవి ఆ సూత్రాలు.

ఓ ఏ ఒక్కధర్మం శాశ్వతం కాదు. అన్ని ధర్మాలు అశాశ్వతాలే. చివరకు అన్ని ధర్మాలను పరిత్యజించవలసిందే. అంటే చివరికి, శూన్యధర్శ్మం పైన కాకుండా 'ధర్మశూన్యత' పైన మనస్సు, భావం లగ్నం చేసి ధారణ చేయాలి. అదే శూన్యతా సాధన,

2 అవసరాలు పెరిగిన కొద్దీ ఆశలు పెరుగుతుంటాయి. కోరికలు పెరిగిన కొద్దీ కష్టాలు, బాధలు పెరుగుతుంటాయి. కోరికలు పెరిగితే, బాధలు పెరిగితే, జ్ఞానం దూరంగా పారిపోతుంది. జీవితంలో కష్టాలకు, బాధలకు కారణం అత్యాశ.

భగవాన్‌ బుద్ధ 156

  1. నిరాడంబరంగా కోరికల్ని అవసరాలకు పరిమితం చేస్తూ జీవించడం వల్ల శాంతి, ఆనందం లభిస్తాయి. భద్రత కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆత్మతృప్తి, మనశ్శాంతి కలుగుతాయి.

4& _ సాధనను నిర్లక్ష శ్రం చేయకూడదు. తీవ్రసాధన వల్లనే లక్ష్యాన్ని చేరగలరు. బద్దకం, సోమరితనం, నిర్లక్ష్యం, విషయవ్హాంఛలు ప్రగతి నిరోధకాలు.

  1. జనన మరణాలకు కారణం అజ్ఞానం. ఆత్మసంస్కారం కలగడమే జ్ఞానం. జ్ఞానాన్నీ పెంపాందించుకోవడమే విముక్తికి మార్గం

  2. మనిషి కోపానికి, ద్వేషానికి కారణం దరిద్రం, స్వార్ధం. వాటివల్ల ఆలోచనలు ప్రతికూలంగా మారతాయి.

'౧ _జ్ఞానమార్గంలో పయనిస్తూ ప్రాపంచిక ప్రలోభాలకు లోనుకాకూడదు, బంధాలలో చిక్కుపడి పోకూడదు.

  1. మనం ధ్యానం చేసేది మన కోసమే కాదు. ధ్యానం వల్ల పొందే జ్ఞానం ఇతరులను జ్ఞానంవైపు మళ్లించేది కావాలి.

ఈ ఎనిమిది సూత్రాలు మహాత్ములైన వారందరూ అనుసరించినవి ... శే శ ఈ వేణు వనానికి తిరిగి చేరేసరికి 'వక్రాలి అనే భిక్షువు జబ్బు పడ్డాడని తెలిసింది. వెంటనే ఆనందుని వెంటబెట్టుకుని వక్రాలి ఆశ్రమానికి బయలు దేరాడు. వెళ్లి చూచి పరామర్శించి హిత వచనాలు చెప్పాడు. “వక్రాలీ, ఇంక దేనికీ విచారించకు, దేని గురించి ఆలోచించకు. పవిత్రంగా జీవించావు. మచ్చలేని జీవితం గడిపావు. జ్ఞానివైనావు”. వక్రాలి : మహాగురూ, మి దర్శనానికి రాలేని అశక్తుడినైనాను. అదే నా విచారం. బుద్దుడు : అంతదూరం శ్రమపడి వచ్చి నా భౌతికరూపాన్ని చూడడం అవసరమా? నాశరీరం ముఖ్యం కాదు. నా రూపం ముఖ్యం కాదు. జ్ఞానం ముఖ్యం. నీలో నా భావన కలిగితే నా రూపం కలుగుతుంది. అది నన్ను దర్శించనట్లే కదా! నన్ను చూస్తూ, నిత్యం దర్శిస్తూ నీ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్యాన్ని చేరలేవు. నీకు జనన మరణాలు లేవు శాశ్వతత్వాన్ని సంపాదించావు, నీలో ఇంకా ఏమైనా బాధలు మిగిలివుంటే, వాటిపైన మనసు పెట్టు. అవి సమసిపోతాయి. నిశ్శేషం అవుతావు”. బుద్ధుడు, ఆనందుడు వెళ్లిపోయిన తర్వాత, వక్రాలి తనను పర్వతప్రాంతానికి తీసుకువెళ్లమని తన శిష్యుల్ని కోరాడు.

“నేను నాలుగుగోడల మధ్య చనిపోదలచలేదు. విశాల వినీల గగనాలక్రింద

విశ్రమిస్తాను. అక్కడే నేను నిర్యాణం చెందుతాను”. శ ర ౫

తర్వాత బుద్ధుడు నలందా విహారానికి వెళ్లాడు. అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఒకనాడు భిక్షుల్ని పిలిచి ఇష్టాగోష్టి జరిపి అన్నాడు.

“పుట్టిన ప్రతిజీవి మరణించక తప్పదు. ఎంత జ్ఞానం పొందిన మహాత్ముడైనా భౌతికంగా మరణిస్తాడు. మరణానికి ముందు బాధపడక తప్పదు. అయితే ధ్యానులు తక్కువ బాధపడతారు. బాధను బాధగా భావించరు. నిర్లక్ష్యం చేస్తారు. ధ్యానం అంటే ధర్మాన్ని ఆచరించడం. ప్రకృతి ధర్మాన్ని గౌరవించడం. ధ్యానం చేసేవారిని ధ్యానమే రక్షిస్తుంది.

ఒక బాణం గుచ్చుకుంటే నొప్పి కలుగుతుంది. అదే తావున మరొక బాణం గుచ్చుకుంటే నొప్పి పదింతలవుతుంది. అక్కడే మరొక బాణం తగిలితే నొప్పి వేయి రెట్లు పెరుగుతుంది. అజ్ఞానం అన్నది రెండవ, మూడవ బాణం దెబ్బల్లాంటిది. జ్ఞాని శారీరకమైన బాధను శరీరానికి అన్వయిస్తూ మనస్సును శాంతింప చేసుకుంటాడు. భయపడడు, బాధపడడు. 'అయ్యో” అనడు. సదవగాహన ఏర్పడితే అనారోగ్యం, వార్ధక్యం, మృత్యువు బాధించవు. అంతగా బాధ అనుభవించ వలసి వస్తే 'ఈ బాధ నేను కాను ... నేను బాధ కాను. కనుక బాధ నన్ను బాధించదు" అనుకుంటాడు. శరీరం గురించి, బాధల్ని గురించి ఆలోచన ఎలాంటిదంటే ప్రమిదలోని నూనె, వత్తి లాంటిది.”

ఒకసారి భిక్షులు ఆనందుని అర్ధించారు, బుద్ధునితో ధర్మచర్చ చేయమని. ఎవరికీ బుద్ధుని సూటిగా ప్రశ్నించే ధైర్యం లేదు. ఆనందుడు బుద్దునికి కావలసిన వాడని, సన్నిహితుడని అందరికీ తెలుసు. ఆనందుడు అడిగితే ఆయన కాదనడు. ఏది అడిగినా బుద్ధుడు మౌనం వహిస్తాడని ప్రతీతి.

సరేనని ఆనందుడు (ప్రశ్నించాడు.

“లోకం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి?”

అలాంటి ధర్మ సందేహాలు బుద్ధుడు లెక్కచేయడు. అనవసర చర్చ అని తోసివేస్తాడు. ఆనందుడు అడగడంలో ఏదో ఆంతర్యం ఉండి ఉంటుంది. బుద్ధుడు : ఆనందా! లోకం అంటే అనేక ధాతువుల కలయిక. అణువుల

సమాహారం. అవి కలిసి, రూపొంది, పరిణామం చెంది, పరిణామంలో

భగవాన్‌ బుద్ధ 156

మార్పులకు లోనై నశిస్తుంటాయి అన్ని ధర్మాలు, ఇంద్రియాలు, అభిరుచులు, అనుభూతులు, చేతనలు - అలా పరిణామం చెందుతూ నశిస్తుంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండవు. ప్రతిక్షణం పరిణామం చెందవలసిందే. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మార్పు చెందుతూ, నశించేది 'లోకం” అనుకోవాలి. ఆనంద్‌ : మారు అనేక సందర్భాలలో చెబుతుంటారు. అన్ని ధర్మాలు శూన్యాలే నని శూన్యం అంటే ఏమిటి గురుదేవా? బుద్దుడు , శూన్యం అనడంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని. శాశ్వతంగా నిలబడవని. మనం చెప్పుకునే పద్ధెనిమిది ప్రక్రియలలో దేనికీ స్థిరత్వం లేదని. ఆనంద్‌ : అంటే ధర్మాలు సైతం శూన్యాలేనా? బుద్దుడు : నీవు 'శూన్యం”పైన భావన చేయి. శూన్యభావనపై ధారణ చెయ్యి తెలు స్తుంది. ధ్యానంలో 'శూన్యం' బరువు తెలుస్తుంది, 'శూన్యత' విలువ తెలుస్తుంది. జనన మరణాల్ని దాటిపోవడానికి శూన్యధ్యానం మించిన సాధన లేదు. ఆనంద్‌ : గురుదేవా! ఇప్పుడీ మందిరం ధ్యానులతో నిండి వుంది. దీనిని పూర్ణం అనవచ్చు గదా! బుద్ధుడు : నిండి ఉండటం పూర్ణత్వం అయితే శూన్యంతో నిండి ఉండడమూ పూర్ణత్వమే. వీళ్లంతా ధ్యానంలో మైమరచి పోయినా రనుకుందాం. వారికి ప్రపంచ ధ్యాస లేదు. కనుక వారికి తామూ శూన్యమే, ప్రపంచమూ శూన్యమే, ఈ మందిరమూ శూన్యమే. అన్ని ధర్మాలు నశించేవి అనడంలో అన్నీ మార్పు చెందేవి అని అర్ధం. చివరకు ఏవీ మిగలవు. అది శూన్యం అంటే “ఆత్మ సైతం మిగలని స్థితి. ఆనంద్‌ : కొందరు బ్రాహ్మణులు, అన్యమతస్తులు బుద్దునిది శూన్య వాదం అని ప్రచారం చేస్తున్నారు. జీవనవాదానికి భిన్నమైంది శూన్యవాదం. అస్తిత్వానికి భిన్నమైంది నాస్తిక వాదం. కాదంటారా? ధర్మాలు శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది గదా? బుద్దుడు : ఈ విషయంలో పండితులే కాదు, యావత్‌ ప్రపంచం నన్ను అపార్ధం చేసుకుంటుంది. అన్నీ *శూన్యం' అని నేను ఎప్పుడూ చెప్పలేదు. జీవితాన్ని త్రోసి రాజనలేదు. అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికాన్ని ఆమోదిస్తారు. పూర్ణత్వాన్ని ఆమోదించే వారే శూన్యాన్ని ఆమోదిస్తారు. అస్తిత్వం ఎప్పటికీ శూన్యం కాదు. కాని చివరికి మిగిలేది శూన్యం. అంటే అస్తిత్వం శూన్యం 159 భగవాన్‌ బుద్ధ

కాదు. శూన్యతా భావన. ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు. మరొక విధంగా విశ్లేషిస్తే అన్నీ భ్రమలనిపిస్తాయి. భ్రమ వాదంలోకి వెళ్లితే గాని సత్యం గోచరించదు. ఒకసారి భిక్షు కాత్యాయన అడిగాడు. ఏది సవ్యమైన దృష్టి? ఏది అపసవ్య దృష్టి? అపసవ్య దృష్టి అంటే నాస్తికభావన ఏర్పరచుకోవడం సవ్యదృష్టి అంటే ఆ రెంటికీ విలువ ఇవ్వకపోవడం. ఆస్తిక, నాస్తిక భావనలు రెండింటికీ, దృష్టిదోషం ఉంది వాస్తవం ఎప్పుడు సిద్దాంత రాద్ధాంతాలకు అతీతం. సత్యాన్ని (గ్రహించిన వారిని ప్రాజ్ఞలంటారు. జ్ఞానులంటారు. ఆనంద్‌ : అర్ధం కాలేదు భగవాన్‌? బుద్ధుడు : ఉదాహరణకు ఈ ధర్మమందిరం ముందర ఉన్న బోధివృక్షాన్ని తీసుకో. అది ఎప్పుడు పుట్టింది? ఆనంద్‌ : నాలుగు సంవత్సరాలై ఉంటుంది. బుద్ధుడు : నాలుగేళ్లకు పూర్వం అక్కడ బోధి ఉన్నట్లా? లేనట్లా? ఆనంద్‌ : లేనట్లే. బుద్ధుడు : అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉదృవించిందా? కాదు గదా. అలాగే ఏ ధర్మం అయినా శూన్యం నుండే ఉద్భవిస్తుంది. బీజం ఎక్కడో ఉంటుంది. విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు. మహావృక్షంగా పెరగదు. అది పరిణామం. చెట్టు విత్తనానికి పొడిగింపు. వేళ్లు నేలలో పాతుకునే వరకు కొమ్మలు, రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే. కాదంటే చెట్టు రూపంలో ఉండదు. వేళ్లు నేలలో పొతుకున్నాక చెట్టు చచ్చిపోతుందా? లేదు. విత్తనం లేకుండా పోయింది. విత్తనమూ చచ్చిపోలేదు. విత్తనం రూపం మారింది. పరిణామంలో స్థితి మారింది. ఒక స్థితిలోంచి మరో స్థితికి మారడం నాస్తికత్వం. అలాగే మరణంతో మనిషి మరణించడు. పరిణామం చెందుతాడు. మృత్యువు వల్ల నళించేది ఏదీ ఉండదు. ప్రాయికమైన ధాతువులు వేటికి అవి విడిపోతాయి. జీవం ముందుకు సాగుతుంది. అందుకే జీవానికి జననం లేదు, మరణం లేదు. ఉన్నది ఒక్కటే పరిణామం. న ఒక రోజున ఉదయమే మౌద్గల్యన పుట్టెడు దుఃఖంతో బుద్దుని దర్శించడానికి వచ్చాడు. మౌద్దల్యన సామాన్య భిక్షువు కాదు. అసమాన ప్రజ్ఞావంతుడు. మహాజ్ఞాని, మహాధ్యాని అని అందరూ చెప్పుకుంటారు. అలాంటి మౌద్గల్యన విచారించడమా? భగవాన్‌ బుద్ధ 160

“ఏమిటి మౌద్గల్యనా, నీ దుఃఖానికి కారణం?”

మౌద్గల్యన : రాత్రి నాకు ధ్యానం సరిగా కుదరలేదు భగవాన్‌! కూర్చున్న క్షణం నుండి మా అమ్మగారు కళ్లముందు కనిపించారు. ఆమె ఆలోచనలు ఊపిరాడ నివ్వలేదు. అన్నీ ఆమెను గురించిన తలపోతలే. చిన్నప్పుడు మా అమ్మను చాలా బాధ పెట్టాను. ఎప్పుడూ నావల్ల ఆమెకు సుఖం లేదు. ఇప్పుడూ నావల్ల ఆమెకు సుఖం లేదు. ఆమె జీవించే ఉంది. కాని మృత్యుముఖంలో ఉంది. ఆమె చాలా పాపాలు చేసింది. జీవితంలో అన్నీ తప్పులే చేసింది. తను చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నానంటుంది. అని ఊరుకోలేం గదా! ధ్యానంలో ఆమె కనిపించింది. చిక్కి శల్యమైంది. ఆమె చేతిలో అన్నం పళ్లెం ఉంది. నోటిలో పెట్టుకోబోగా అన్నం నల్లగా బొగ్గులుగా మారింది. ఏమిటి దాని అర్ధం? అమె జ్ఞాపకాలు నన్ను వెన్నాడుతున్నాయి. కన్నకొడుకుగా, ఆమెకు కర్మ విముక్తి ఎలా కలిగించను?

బుద్ధుడు : ఆమె తప్పులు, పాపాలు చేసిందన్నావు. ఏమిటా తప్పులు?

మౌద్దల్యన : ఆమె మహా మొండిమనిషి. ఎవరిని గౌరవించేది కాదు. చెప్పేవన్నీ అబద్దాలే. ఎందరినో బాధించింది, వేధించింది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. చాలామంది జీవితాలు ఆమె కారణంగా నాశనమైనాయి. ఎన్ని అకృత్యాలు చేసిందో చెప్పలేను. అయినా ఆమె నా తల్లి. ఆమె చేసిన పాపాలకు నిష్కృతి వుందా భగవాన్‌.

బుద్దుడు : నీ తల్లి పట్ల నీకున్న (ప్రేమ పవిత్రం. ఒక రహస్యం తెలుసా? మన తల్లిదండ్రులకు మనం చూపే కృతజ్ఞత, వారిపట్ల మన (ప్రేమ ఆకాశమంత విశాలంగా, సముద్రమంత గంభీరంగా ఉంటుంది. తల్లిదండ్రుల రుణం బిడ్డలు తీర్చలేనిదే కావచ్చు. కాని తీర్చవచ్చు. గురువుల స్థానం తల్లిదండ్రులది. జ్ఞానుల స్థానం తల్లిదం'గ్రులది. జ్ఞానులు, బుద్దులు లేని కాలంలో తల్లిదండ్రులే బిడ్డలకు జ్ఞానవాహికలు. నీ ధ్యానంలోకి ఆమె రావడం జరిగింది అంటే ఆమెకు నిష్కృతి కలిగిందనే. నీ తపస్సు, నీ తపన, నీ ఆవేదన ఆమెను పునీతురాలిని చేశాయి.

తల్లిదండ్రుల రుణం తీర్చుకోడానికి ఒక చక్కని మార్గం - బుజువర్తనం,

సద్ధర్మజీవనం. నీవు సత్యవ్రతుడవు. ధర్మబద్ధంగా జీవించావు. ఎందరికో ఆదర్శంగా

నిలిచావు. ఎందరికో ధర్మజీవనం చూపించావు. జ్ఞానం బోధించావు. వాటి ఫలితంగా

నీ తల్లికి కర్మవిమోచనం కలుగుతుంది. ఆమె చేసిన పాపాలకు నిష్కృతి లభిస్తుంది.

మరొక సలహా. రేపు పరవన సమారోహంలో అందరు ఛిక్లులు కలిసి మన

161 భగవాన్‌ బుద్ధ

అందరి తల్లిదండ్రుల కోసం సామూహిక ధ్యానం చేద్దాం. మిగిలిన వారికీ నీలాంటి అవసరం ఉండవచ్చు గదా! అందరం ధ్యానం చేస్తే వారివారి పెద్దలకు, కర్మ విమోచనం కలుగుతుంది. వారందరికి సద్దతి ప్రాప్తిస్తుంది. సారిపుత్రతో చెప్పు.... సంఘ సమారోహం ఏర్పాటు గురించి. చాలామంది తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి గుణగణాలు పాగుడుతుంటారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండడం గొప్ప అదృష్టంగా భావించాలి. పిల్లల ఆనందానికి, అభివృద్ధికి తల్లిదండ్రుల ఆకాంక్షలే కారణం. జీవించి ఉండగానే బిడ్డలు తల్లిదండ్రుల్ని గౌరవించి, పూజించాలి, పోషించాలి. అది సరైన “ఆరాధన. వారు పరమపదించిన తర్వాత కూడ వీరి అభ్యుదయం కాంక్షిస్తుంటారు. వారికి ఆత్మ తృప్తి నిచ్చేది బిడ్డల సుఖసంతోషాలే.” శ శ శ ఆ రోజు సాయంత్రం బుద్దుడు విహారం వెలుపల ఉండగా ప్రసేనజిత్‌ రావడం గుర్తించాడు. అంతలో నిగంత వర్గానికి చెందిన సన్యాసులు ఏడుగురు ఎదురైనారు. వారు దిగంబర స్వాములు. గడ్డాలు, జుత్తు పెంచుకున్నారు. రాజు వారి వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించాడు. వారి ఆశీస్సులు తీసుకుని బుద్దుని వద్దకు వచ్చాడు. ఇద్దరూ ఆశ్రమం వైపు బయలుదేరారు.

ప్రసేనజిత్‌ బుద్ధుని ప్రశ్నించాడు : భగవాన్‌, ఈ సన్యాసులు అర్జ్హులేనా? వారు

ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించారని ఎలా తెలుసుకోవడం?

బుద్దుడు : మహారాజా! మిరు ప్రభువులు. మేము విరాగులం. మో ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. ఎవరు జ్ఞానులో తెలుసుకోవడం మికు కష్టం. ఒకటి రెండు సార్లు కలిసినంత మాత్రాన ఆధ్యాత్మికోన్నతి తెలియదు. జ్ఞానులు అవునో కాదో అసలు చెప్పలేరు. వారికి సన్నిహితంగా మెలగాలి. సమిాపంగా జీవించాలి. వారి నడవడి గమనించాలి. వారి ఆలోచనా విధానం కనిపెట్టాలి. అప్పుడే వారిది జ్ఞానమో, అజ్ఞానమో తెలుస్తుంది.

'ప్రసేన : వేగులను పంపినా నిజానిజాలు తెలియడం లేదు భగవాన్‌. అందరివీ పైపై వేషాలు. అన్నీ మోసాలు. గురుదేవా! ఇప్పుడు నా వయస్సు 70 సంవత్సరాలు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుంటే నిద్ర వస్తుంది. ధ్యానం చేద్దామంటే మనస్సు నిలకడగా ఉండదు.

బుద్దుడు : తిండి తగ్గించు మహారాజా. తిండిపై ధ్యాస తగ్గితే శరీరం, మనస్సు మో అధీనంలో ఉంటాయి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. రాణి మల్లికకు,

భగవాన్‌ బుద్ధ 162

రాకుమారి వజిరికి చెప్పండి... మా తిండి మాద ఓ కన్నేసి ఉంచమని. భోజనం విషయంలో పరిమితి చాలా అవసరం మహారాజా.

రాజా ! ఓ చిన్నకథ చెబుతాను వినండి. ఒక గూఢచారి, అదే వేగు ఒక వార్త తెచ్చాడు. తూర్పు వైపు నుండి ఒక మహాపర్వతం ఆకాశమంత పెద్దది మ నగరం వైపు వస్తోంది. మధ్యలో అడ్డమైన వాళ్లందరిని అణచివేస్తోంది. అలాగే పదమర నుండి, ఉత్తర దక్షిణ దిక్కుల నుండి మూడు పర్వతాలు వస్తున్నాయి. ఏం చేస్తారు? ఆ పర్వతాలు రోగం, వార్ధక్యం, మృత్యువు. వేటి నుండి తప్పించు కుంటారు? |

న

శ్రావస్తిలో మత మహాసభలు జరిగాయి. చర్చలు, ప్రసంగాలు... ఆపైన వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కొందరు బౌద్ధ భిక్షులు వెళ్లి ప్రసంగాలు విన్నారు. వారు బుడ్దునితో చెప్పారు : ప్రసంగించిన ప్రతివ్యక్తి తన సిద్ధాంతమే ఉత్తమమని నిరూపించడానికి నానా అవస్థ పడ్డాడు. చివరకు తిట్టుకుని, కొట్టుకోవడం వరకు వచ్చింది. అంతా నానా రసాభాస. బుద్ధుడు : ఆరుగురు అంధులు ఏనుగును వర్ణించిన కథ తెలుసు గదా. ఇదీ

అంతే! ఎవరికి ఎంత మేరకు తెలిస్తే అంతవరకే సత్యం అంటారు. సత్యం యొక్క సమగ్ర స్వరూపం, స్వభావం ఎవరికీ తెలియదు. ఎవరికీ, ఎన్నటికీ అంతుపట్టదు. ఎంత తెలినినా అది అసంపూర్ణమే. సంపూర్ణ సత్యం అవగాహనకు అందదు. అంచేత ఎవరి జ్ఞానమూ సంపూర్ణం కాదు, సమగ్రం కాదు. ముందుకు నదవడం ముఖ్యం. ఎంత జ్ఞానం ఆర్జించామన్నది ముఖ్యం కాదు. జ్ఞానాన్ని అంచనా వేయకూడదు. ప్రతిచిన్న విషయాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు.సాగాలి. ఎక్కడా ఆగి పోకూడదు. జ్ఞానయాత్ర అనంత యాత్ర. పరిమితి విధించుకుంటే సత్యదర్శనం అసాధ్యం. వినయం, నిష్మళంకమైన మనస్సు, విశాల హృదయం అభివృద్ధికి సోపొనాలు. శం స 3

బుద్దుని శిష్య వర్గంలోని అతి ముఖ్యులలో పూర్ణ మైత్రేయాని పుత్ర ఒకరు. అందరు అతనిని “పూర్ణ అని పిలుస్తారు. యోగ్యుడు, మితభాషి, ప్రతిభావంతుడు. అతను “సానపరంత” ద్వీపం నుండి వచ్చినవాడు. తనదేశం తిరిగి వెళ్లి అక్కడ బౌద్ధధర్మ ప్రచారం చేయడానికి అనుమతి అర్ధించడానికి వచ్చాడు.

“మో దేశం చాలా అనాగరికం అని విన్నాను. మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తారట. నీ బోధలు ఎవరు వింటారు పూర్ణా! మంచిమాటలు వినడానికైనా సంస్కారం ఉండాలి కదా” బుద్దుడు ప్రశ్నించాడు.

163 భగవాన్‌ బుద్ధ

“ఫరవాలేదు భగవాన్‌! రాళ్లు రువ్వి చంపరు కదా?”

“ఒకవేళ రాళ్లతో కొట్టిచంపితే ఏం చేయగలవు?”

“ధర్మప్రచారంలో చనిపోయినా మంచిదే. ఎప్పటికైనా చనిపోక తప్పదు. ఒక మంచి పనికై ప్రాణార్చన చేసిన వాడినవుతాను *”

గౌతమబుద్ధుడు 'పూర్ణను ఆశీర్వదించి పంపాడు.

పూర్ణ భిక్షు గొప్ప వణిక్ర్రముఖుడు. తన బావమరిదితో కలిసి సానాద్వీపం నుండి పడవలలో వస్తుసామగ్రి తెచ్చి శ్రావస్తి నగరంలో అమ్ముతుండేవాడు. ఒకనాడు అతను వీధిలో వెడుతున్న భిక్షుల్ని చూచి ముచ్చటపడి, వారి వెంట జేతవనానికి వెళ్లాడు. బుద్భుని ప్రసంగం విన్నాడు. వెంటనే తన వ్యాపారం బావమరిదికి అప్పగించి దీక్ష తీసుకున్నాడు. బుద్దుని అభిమానం సంపాదించి మగధ, కోసల దేశాలలో ధర్మప్రచారం చేశాడు అతను స్వదేశంలో ధర్మప్రచారం చేయగలడని అందరి నమ్మకం.

ఒకనాడు ఆనందునితో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు. సముద్రతరంగాలు బుద్ధుని ఆకర్షించాయి. ఆలోచింపచేశాయి. బుద్దుడు సముద్రం చూడడం అదే 'ప్రధమం, ఒక జాలరి కనిపిస్తే ఆనందుడు అతనిని ఆపి సముద్రం గురించి నీకేం తెలుసు? నని ప్రశ్నించాడు.

“అయ్యా! సముద్రం నాకు ప్రాణ సమానం. అలా నీళ్లలోకి జారిపోయే ఇసుకతీరం ఇష్టం. ఆ ఇసుకపై పడవను సముద్రంలోకి తీసుకుపోవడం మరీ ఇష్టం. సముద్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఎక్కడికీ పోదు. సముద్రం తనలో ఏ ఒక్క శవాన్ని ఉంచుకోదు. ఏ ఒక్క శరీరాన్ని ఉంచుకోదు, ఒడ్డుకు త్రోసి వేస్తుంది. గంగ యమున, అసిరావతి వంటి పెద్ద నదుల్ని తనలో లీనం చేసుకుం టుంది. అయినా సముద్రమట్టం పెరగదు. సముద్రం గర్వపడదు. రాత్రింబవళ్లు నదులు వచ్చి సముద్రంలో కలుస్తూనే ఉంటాయి. అయినా సముద్రం నీరు ఉప్పగానే ఉంటుంది. సముద్ర గర్భంలో విలువైన రత్నాలు, మాణిక్యాలు ఉంటాయి. వేల కొలది జలచరాలు సముద్రంలో జీవిస్తాయి. అందుకే సముద్రం అంటే నాకిష్టం.”

జాలరి వివరణకు ఆనంద్‌ ఆశ్చర్యపడి బుద్దునితో అన్నాడు.

“భగవాన్‌ ఈ జాలరి కవిత్వం చెబుతున్నాడు. విన్నారా!”

“అవును విన్నాను. అతను సముద్రగుణాలు ఎనిమిది చెప్పాడు. నేను సాధకుని అవసరాలు ఎనిమిది చెబుతాను విను : భగవాన్‌ బుద్ధ 164

ఒకటి : తీరంలోని పడవల్ని సులభంగా నీళ్లలోకి లాగుతారు. కాని మనం కష్టపడి పైకి రావాలి. సుఖాల్లోంచి కష్టాల్లోకి పయనిస్తాం. అవాస్తవం నుండి వాస్తవంలోకి మన ప్రస్థానం. 'ధమ్మ అన్ని వర్గాల వారిని, అన్ని వరాల వారిని ఆమోదిస్తుంది. యువకులు, పురుషులు, స్రీలు అందరూ ధర్మదీక్షకు అర్హులే. ధర్మ వారివారి ప్రవృత్తిని బట్టి ఉంటుంది.

రెండు : సముద్రం ఇక్కడే ఉంటుంది. ఎక్కడికీ పోదు. అలాగే ధర్నానికి క్షతి ఉండదు. స్థానచలనం ఉండదు. ధర్మసూత్రాలు ఎప్పటికీ మారవు. బోధన సులభం. ధర్మాన్ని అనుష్టించి ఆచరించే వారివల్ల ధర్మం రక్షించబడుతుంది. ఎవరు ధర్మాన్ని రక్షిస్తే వారిని ధర్మం కాపాడుతుంది. ధర్మం నష్టపోదు, నశించదు.

మూడు : సముద్రం శవాల్ని తనలో ఉంచుకోదు, ఒడ్డుకు విసిరివేస్తుంది. భరించదు. సరిగా సాధన చేయని వారికి సంఘంలో స్థానం లేదు.

నాలుగు : సముద్రం నదుల్ని తనలో కలుపుకుంటుంది. ధర్మం అన్ని వర్గాల వారిని, వర్దాల వారిని ఆమోదిస్తుంది. తర్వాత ఎవరికీ 'కులరలి మిగలదు.

అయిదు : సముద్ర మట్టం పెరగదు. అలాగే ధర్మం విలువ తరగదు, పెరగదు. ఎందరు వచ్చి చేరినా ధర్మం ధర్మంగానే ఉంటుంది.

ఆరు :; సముద్రజలాలు ఎప్పుడూ ఉప్పగా ఉంటాయి. ఎందరు కలుషితం చేసినా ధర్మం రుచి, విలువ మారదు.

ఏడు : సముద్ర గర్భంలో దాగిన రత్నరాశులవలె ధర్మాచరణలో అతుల సంపదలున్నాయి.

ఎనిమిది :; సముద్రంలో జలచరాలవలె ధర్మంనీడన అందరూ (బబ్రతకవచ్చు. ఇందులో బోధిసత్వులుంటారు. నిరక్షర కుక్షులుంటారు. సముద్రం లాంటిది జ్ఞానసాగరం,.

పాటలీపుత్ర, వైశాలి పర్యటన ముగించుకుని బుద్ధుడు కపిలవస్తుకు బయలుదేరాడు. శ్యామ గ్రామం చేరేసరికి నిగ్రంధ మరాధిపతి జ్ఞాతిపుత్ర మరణించిన వార్త తెలిసింది. అతని శిష్యులు రెండు వర్గాలుగా చీలి, దెబ్బలాడు కుంటున్నారని విన్నాడు. ఆ విషయాలు సారిపుత్ర శిష్యుడు “కుంది ఆనందునికి చెప్పగా, ఆనందుడు బుద్దుని చెవిని వేశాడు. ఆనంద్‌కి అక్కడి విషయాలు తెలుసు. తను కొంతకాలం 'పావా'లో ఉన్నాడు. ఆ విషయం చెప్పి ఆనంద్‌ అన్నాడు. 165 భగవాన్‌ బుద్ధ

“భగవాన్‌, మన సంథుంలో అలాంటి కలతలు, కల్లోలం రాకూడదని ఆశిస్తున్నాను”.

“నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది ఆనంద్‌? అలాంటివి ఏవైనా ఉన్నాయా?”

“భగవాన్‌! మా సమక్షంలో ఎవరూ బయటపడ సాహసించరు కాని మో అనంతరం తలెత్తవని చెప్పలేము”.

“విచారించకు ఆనంద్‌. నా బోధనల విషయంలో ఎవరూ వ్యతిరేకించలేరు. పోతే, సాధన విషయంలో, సంస్థల నిర్వహణ విషయంలో, విహారాలలో పెత్తనం విషయంలో చిన్నచిన్న భేదాభిప్రాయాలు వచ్చినా, అవే సర్దుకుంటాయి. పెద్దగా మనం పట్టించుకోనవసరం లేదు.”

బుద్ధుడు ఎంత థైర్యం చెప్పినా, ఆనందుని మనసులో అనుమానం 'పెనుభూతంలా పెరుగుతోంది. ఆ మధ్య వైశాలి నగరంలో 'సునక్రధి వ్యక్తిగత కారణాలవల్ల సంఘం విడిచిపెట్టి వెళ్లాడు. అతనికి ఏదో అసంతృప్తి. ఇతర చోట్ల వేదికలెక్కి బుద్ధుని దూషిస్తున్నాడని వింటున్నాడు. గౌతమబుద్ధుడు అందరిలాంటి వాడేనని, ఆయనలో జ్ఞానం ఏమిాలేదని, కాషాయబట్టలే ఆయన జ్ఞానమని విమర్శిస్తున్నాడని తెలిసి క్రుంగిపోయాడు. బుద్దుని బోధనల వల్ల సమాజానికి వొరిగేది ఏమీలేదని విమర్శిస్తున్నాడట. సారిపుత్రకు ఆ విషయాలు తెలుసు కాని నోరు విప్పడు.

రాజగ్భహలోను కొంత అశాంతి వాతావరణం ఏర్పడినట్లు వినికిడి. కొందరు భిక్షులు దేవదత్త ఆధ్వర్యంలో పోటీ సంఘం స్టాపిస్తున్నారుట. యోగ్యులైనవారు కూడా దేవదత్త వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి బుద్ధుని శిష్యవర్గంలో దేవదత్త వరిష్పడు, సమర్ధుడు. సారిపుత్ర సైతం దేవదత్త ప్రతిభా పాటవాలకు ఆశ్చర్యపోతాడు. ఈ మధ్యకాలంలో ఏ కారణంవల్లనో దేవదత్తలో మార్పు వచ్చింది. అసూయ పెరిగింది. ఎవరూ ఈ విషయాలు బుద్ధునికి చెప్పరు. ఎప్పుడో సమయం సందర్భం చూచీ తనే చెప్పాలనుకున్నాడు ఆనందుడు.

తర్వాత కొన్నాళ్లకు బుద్ధుడు శ్రావస్తి నగరం చేరుకున్నాడు. అక్కడ చాలా ముఖ్యమైన విషయాలపై ప్రసంగించాడు.

“భిక్షులారా! మా మనస్సులోని ఆలోచనలన్నీ తీసి ప్రక్కన పెట్టండి. నేను చెప్పే విషయాలు శూన్య మనస్సుతో, హృదయంతో వినండి. కొన్నికొన్ని ధర్మాలకు కొన్ని ప్రత్యేకత లుంటాయి. కొన్ని ప్రత్యేక విలువ లుంటాయి. స్థాయీ ఖేదా లుంటాయి. తరతమా లుంటాయి. ఒకటి : శూన్యత్వం; 60డు : లక్ష్య రాహిత్యం; భగవాన్‌ బుద్ధ 166

మూడు : నిశ్ళ్శేషత్వం. ఈ మూడు సాధనా మందిరానికి మూడు ప్రవేశ ద్వారాలు. నిర్వాణ పధంలోనూ అవి మూడు అంతస్టులు, అవస్థలు. ఏ పేరున పిలిచినా, ఏ పేరు పెట్టినా ఉండేది మూడే మూడు. మొదటి అంతరం - శూన్యత : అది శూన్యం కాదు, శూన్యస్థితీ కాదు. కేవలం “శూన్యత న-స్థితి కాదు. 'నాస్థి కాదు. అంటే శూన్యం స్వతంత్రంగా నెలకొనడం. “శూన్యత అంటే 'ఆత్మ' సైతం లేని స్థితి. ఆస్తి, నాస్తి - రెండింటి పైన నమ్మకం ఉండనవసరం లేదు. రెండూ తప్పే. అన్ని ధర్మాలు మనుగడ కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ప్రతి ఒక్కదానికి మిగిలినవన్నీ ఆధారాలవుతుంటాయి. ఒక ధర్మంలో అన్ని ధర్మాల ఛాయలు ఉంటాయి. ఏదో ఒక ధర్మం పట్ల ఇష్టం, అయిష్టం, అసూయ, విమర్శ పనికిరావు. “శూన్యత'ను ఆరాధించడం వల్ల మొదటి ద్వారం తెరుచుకుంటుంది. స్వేచ్చ లభిస్తుంది. నిర్వాణ పధంలో అది తొలిమజిలీ అవుతుంది. రెండవ అంతరం - అదిమిత్ర : ఇతగాలతో సంబంధం లేకపోవడం. అంటే మనసు, బుద్ధి, అహంకారం లేకపోవడం. వాటిని పట్టుకు వేలాడకపోవడం. ధర్మాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. ధర్మం నీడలో వ్యక్తిత్వం రాణింపుకు రాదు. మూడవ అంతరం - 'అప్రాణిహిత' ; దేని వెంట పడకపోవడం. అంటే మనుషులు చాలామంది ఇది కాదని, అది కాదని తిరుగుతుంటారు. దరిద్రం వద్దని సంపదలు ఆశిస్తారు. ఆధ్యాత్మిక వేత్తలు విముక్తి అంటే, మత పెద్దలు మోక్షం అంటారు. జనన మరణాలు వద్దనుకునేవారు మోక్షం, స్వర్గం కాంక్షిస్తారు ఒకటి వద్దంటూనే మరొకటి వాంఛిస్తారు. శూన్యం కారు. కోరికల్ని వదలుకోరు. స్వేచ్చ, జ్ఞానం రెండూ మనలోనే ఉంటాయి. మనకు భిన్నంగా ఎక్కడో అవి ఉండవు కళ్లు మూసిచూస్తే మన లోపలనే కనిపిస్తాయి. అంచేత దానికోసం వెంపర్లాడవద్దు. బ్రహ్మం, నిర్వాణం, విముక్తి, మోక్షం. అదే 'అప్రాణహిత' అంటే. మోకు కావలసింది మోకు లభిస్తుంది. ఈ మూడవ గుమ్మం దాటితే అంతా స్వేచ్చే. అదే 'శూన్యత' అంటే అర్థం. నేం రం స మరునాడు ఇద్దరు బ్రాహ్మణ పండితులు వచ్చారు. ఇద్దరు ప్రాచీన సాహిత్యం వడగట్టినవారు. వారిలో ఒకరు యమేలు ప్రశ్నింఛాడు : “మహాత్మా! అపూర్వము, అనితరసాధ్యమూ అయిన మి ధర్మబోధలు విన్నాను. తాము 'మాగధిలో ప్రసంగిస్తున్నారు. ఇతరదేశాల వారికి మాగధి రాదు. ఆయా ప్రాంతీయ భాషలలోకి 167 భగవాన్‌ బుద్ధ

అనువదించి బోధించవలసి వస్తుంది. మిరు ఆమోదిస్తే మా సూత్రాలను సంస్కృతంలోకి అనువదిస్తాను.”

బుద్ధుడు కొంతసేపు నిశ్శబ్దం వహించి అన్నాడు-

“మహోదయ్‌, మి సూచన నాకు ఆమోద యోగ్యం కాదు ధర్మప్రచారం భాషను బట్టి ఉండదు. ధర్మం అన్నది సజీవచైతన్యం. చెప్పేవారి మాటల్లో చైతన్యం పొంగులు వారాలి. జ్ఞానం ముఖతః అలవడుతుందిగానీ, భాష ద్వారా, సాహిత్యం ద్వారా కాదు. కొన్ని పదాలకు స్పందన ఉంటుంది. వాటిని అలాగే ఉచ్చరించాలి. శబ్దశక్తి మోకు తెలియనిది కాదు. మిరు సంస్కృతీకరిస్తారు సరే. పామరుల మాటేమిటి? సామాన్యుల మాటేమిటి? వారికి అసలు చదువులే లేవుగదా. వారివారి మాతృభాషలో వింటే, చదివితే ఉన్న తృప్తి పరభాషల్లో చదవడం వల్ల కలగదు. ధర్మబోధ జనజీవనానికి దగ్గరగా ఉండాలి. ప్రాంతీయ సంస్కృతిని పుణికి పుచ్చుకోవాలి. మో సంస్కృతానువాదాలు ఆ పని చేయలేవని నాకనిపిస్తుంది ... 'సెలవు ... |

షు ఆ ౮

ఒకపరి 'ఉత్రీయ' అనే సన్వాసి వర్షంలో తడుస్తూ బుద్ధుని ఆశ్రమానికి వచ్చాడు. ఆనందుడు అతనిని స్వాగతించి, మర్యాద చేసి, బుద్ధునికి పరిచయం చేశాడు. ఉత్రీయ బుద్ధుని ప్రశ్నించాడు : “మహాశయా! మరు మహాజ్ఞానులని ప్రచారం జరుగుతోంది. నా సందేహాలు కొన్ని తీర్చుకోవాలని వచ్చాను!”

బుద్ధుడు తల ఊపాడు. ఉత్రీయ ; సృష్టి శాశ్వతమా? అశాశ్వతమా? స్థిరంగా ఉంటుందా? నశిస్తుందా? బుద్ధుడు : క్షమించండి. మా ప్రశ్చకు సమాధానం చెప్పను ఉత్రీయ : పోనీ, లోకం అనంతమా! అశాశ్వతమా! చెప్పండి.

బుద్దుడు : దానికీ సమాధానం చెప్పను, ఉత్రీయ : దేహం, అత్మ ఒక్కటా? వేరు వేరా? బుద్దుని మౌనమే సమాధానం. ఉత్రీయకు కోపం వచ్చింది కోపంగా అడిగాడు. “మోరు మరణించిన తర్వాత ఉన్నట్లా? లేనట్లా?” బుద్దుడు : దానికీ నావద్ద సమాధానం లేదు. ఉత్రీయ : మరణం తర్వాత మిరు ఉంటారా? పోతారా? బుద్ధుడు : తెలియదు మహాశయా! భగవాన్‌ బుద్ధ 168

ఉత్రీయ : మోకు జ్ఞానోదయం అయిందంటారు. అది నిజమా? అబద్ధమా? నా ప్రతి ప్రశ్చకు మౌనం వహిస్తున్నారు. అసలు మారు ఏ ్రశ్నలకైనా సమాధానాలు ఇవ్వగలరా?

బుద్ధుడు : ధ్వాన సంబంధమైన వాటికి, సాధనకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తాను. మనస్సు, శరీరం, కష్టాలు, ఆందోళనల గురించి అడగండి చెబుతాను.

ఉత్రీయ : ప్రపంచంలో ఎంతమంది మా బోధనలు విని బాగుపడగలరని అనుకుంటున్నారు?

బుద్ధుడు మౌనం వహించాడు. అతనికి కంపరం పుట్టింది. కావాలనే బుద్ధుడు తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని అపోహపద్దాడు. అది గ్రహించి ఆనందుడు అతనిని ఊరడించాడు.

“స్వామో! ఒక ఉపమానం చెబుతాను ఆలకించండి. గౌతముని ఆంతర్యం (గ్రహించండి. ఒకరాజుగా రున్నారనుకుందాం. బ్రహ్మాండమైన కోటలో ఉన్నారు. కోట చుట్టూ కందకం ఉంది. ప్రవేశద్వారం వద్ద గట్టి బందోబస్తు వుంది చీమ కూడా లోపలకు చారబడే వీలులేదు. అది గౌతముని పద్ధతి. తనమార్గంలోకి ఎంత మంది వచ్చారని ఎప్పుడూ చూడరు. బోధించడం వారి పని. అర్ధం చేసుకుని ఆచరించదలచిన వారు ఆచరిస్తారు. లేదంటే లేదు. ఎవరినీ బలవంతం చేయరు. ఆచరించిన వారు ఆనందం పొందుతారు. దుఃఖాన్ని దాటిపోతారు. మనస్సు, శరీరం అదుపు చేయడం గురించి ప్రశ్నించండి చెబుతారు.”

ఉదత్రీయకు కావలసింది తాత్వికచర్చ. శుష్మవేదాంతం. వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు వాచ్యగోత్ర అనే సన్యాసి వచ్చాడు. అతను అలాంటి ప్రశ్చలే సంధించాడు. బుద్దుడు ఒక్క ప్రశ్నకూ స్పందించలేదు. అతను విసిగి వెళ్లిపోయాడు.

ఆనందుడు అడిగాడు “భగవాన్‌? ధర్మోపన్యాసాలలో అనేకమార్లు 'అత్మ' చర్చ చేశారు గదా! 'వాచ్యగోత' ప్రశ్నకు సమాధానం చెప్పని కారణం?”

“ఆనంద్‌, నేను 'అత్మ విచారణ” చేసేది మాకు ధ్యానంలో సహకరించ దానికి, అవి తాత్విక చర్చలు కావు. అవి బోధనాంశాలు., అందులో సిద్ధాంత భాగం ఉండదు సిద్ధాంతం అనగానే చర్చ మొదలవుతుంది. పూర్వపక్షం ఉత్తరపక్షం ఉంటాయి. నేను చెప్పే విషయాలు ఏవిగానీ, ప్రవాహం దాటడానికి ఉపకరించే పడవల్లాంటివి మాత్రమే. వాటిని తలకెత్తుకోకూడదు. ప్రవాహం దాటిన తర్వాత పడవ అవసరం ఉండదు. సాధనలో అనుభవం తర్వాత సిద్ధాంతాలు అనవసరం.

వాచ్యగోత్రుడు నానుండి సిద్ధాంత చర్చ ఆశించాడు. అతని సిద్ధాంత, రాద్ధాంతాలు 169 భగవాన్‌ బుద్ధ

నాకిష్టం లేదు. ఆత్మగాని, అనాత్మగానీ, మరొకటిగానీ చర్చ, తాత్వికదృష్టి అనవసరం. ఒకవేళ 'ఆత్మ' ఉన్నది అంటే నా అభిప్రాయాన్ని పూర్వపక్షం చేస్తాడు. ఆత్మ లేదని అంటే అది పట్టుకుని ప్రచారం చేస్తాడు. నా వద్ద సమాధానం లేదనుకున్నా, నాకు తెలియదనుకున్నా వచ్చే నష్టం లేదు. సంకుచిత భావాలతో ఉక్కిరి బిక్కిరి కావడం కన్న 'మౌనం' ఉత్తమం కదా.

శ 3 3

మరొకనాడు కొందరు సన్యాసులు అనిరుద్రకు వీధిలో ఎదురుపడి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే వదలమని పట్టుబట్టారు.

“బుద్దుడు జ్ఞాని అని విన్నాం. ఆయన సిద్ధాంతాలు గొప్పవని ప్రచారం జరుగుతోంది. నీవు ఆయన శిష్యుడివి. సమాధానం చెప్పు. బుద్ధుడు చనిపోయిన తర్వాత, ఆయన ఉన్నట్లా లేనట్లా?”

అనిరుద్ర సమాధానం చెప్పలేదు. “ఇతను కొత్త భిక్షుగాడులా ఉన్నాడు. నోరు విప్పడం లేదు” అని వదలిపెట్టి వెళ్లిపోయారు.

అదే ప్రశ్న అనిరుద్ర బుద్ధుని అడిగాడు “సమాధానం చెప్పండి భగవాన్‌! బయటవారి ఎదుట నోరు విష్పలేకపోతున్నాం”.

“అనిరుద్రా! లౌకిక ప్రజ్ఞకు బుద్ధుని ఆంతర్యం అర్ధం కాదు. బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? రూపంలో ఉన్నట్లా? భావనలో ఉన్నట్లా? బుద్ధిలో ఉన్నట్లా? ప్రజ్ఞలో ఉన్నట్లా? ఎక్కడ దర్శించగలవు బుద్దుని? ఎక్కడ దర్శించలేవు? ప్రయత్నిస్తే సాధన చేస్తే ధ్యానం చేస్తే. ఈ క్షణం నీముందు కనిపిస్తున్న రూపం శాశ్వతమా! భావం అశాశ్వతమా? ధర్మసూక్ష్మం అదే. ధర్మసూత్రం అదే! వివేకానికి అందడు బుద్దుడు. అన్ని ధర్మాలలోనూ బుద్ధుడుంటాడు. నిజస్వభావం తెలుసుకోగల వారికి ఎక్కడ దర్శనమివ్వడు! సత్యాన్ని మాటలతో నిర్వచించడం సాధ్యం కాదు. ధ్యానంలో అనుభూతించవలసిందే. మామిడి పండు ఎన్నడు చూడని వానికి ఎంత వర్ణించినా దాని రుచి తెలియదు. అలాగే “సత్యం” రుచి చూచిన వారే రుచి మరుగుతారు. అంచేతనే వ్యర్ధమైన చర్చలు వద్దని చెబుతుంటాను.

“అన్ని ధర్మాల ఆంతర్యం ఒక్కటే. “తత” - “తధాత' తత్‌ - అంటే సత్యం

  • తత్‌ నుండి, అంటే సత్యం నుండి, సర్వం ఏర్పడుతుంది. సత్యం నుండి ఉద్భవించిన వాడు తధాగతుడు సత్యం నుండి ఉద్భవించిన వారికి ధర్మా లెందుకు? ధర్మాలు ఎక్కడికీ పోవు. తధాగతుడు అంటే అరం - ఎక్కడినుండి వచ్చాడో, ఎక్కడకు పోతాడో తెలియనివాడని. నేను తధాగతుడిని. నేను, నాది అనే విచికిత్స ఉండదు. ఆది, అంతం లేని స్వభావం నాది. మన అందరి స్వభావం అదే. బీగవాన్‌ బుద్ద 1/0

మం శీలపరీక్ష ప. స్‌, మ షు: నాం ను న్‌ జ సళ య నా స స. 1 క. షా క్ష, 1 యం? 4 న. న వన ౧ ట్రం న. చేతనం లో... 1 ర ట్‌ సిటి నల్‌ || శ న్‌ వు టం ల నా. ఛా .. స్ట్‌ లలనా య్‌ ఫి న్‌. 1 22 యయ క. త్రో నా య లు జ

మృగదావంలోని హరిణవనం చేరుకున్నాడు బుద్ధుడు. 36 సంవత్సరాల క్రితం మొదటిసారిగా నాలుగు ధర్మాలను బోధించిన తావు అది. ఇంకా నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తోంది. అయినా ఎన్నీ మార్పులు. తొలి ధర్మబోధ తర్వాత గంగా తీరంలో అనేక దేశాలు పర్యటించాడు. మృగదావంలో బుద్దుని జ్ఞాపకంగా స్థానికులు ఒక స్తూపం నిర్మించుకున్నారు. అది తాలి ప్రవచన జ్ఞాపకచిహ్నం. అక్కడొక విహారం ఏర్పడ్డది. అనేకమంది భిక్షులు అక్కడ ఉంటున్నారు కొన్ని రోజులు అక్కడ ఉండి, పూర్వజ్ఞాపకాలను పునరుద్ధరించుకుని తృప్తిగా గయకు బయలుదేరాడు.

మధ్యలో ఉరువిల గ్రామంలో ఆగి బోధివృక్షాన్ని దర్శించాడు. తనకు జ్ఞాన భిక్ష పెట్టింది ఆ బోధి వృక్షమే. ఇప్పుడు బోధి మహావృక్షమైంది. బౌద్ధధర్మం వలె నలుదిక్కుల విస్తరించింది. చుట్టుపట్ల చాలా ఇళ్లు వర్పడ్డాయి. బుద్దుడు జ్ఞానోదయం పొందినచోట బింబిసారుడు ఒక స్థూప నిర్మాణం చేయాలని యోచిస్తున్నాడు. బుద్ధుడు ఉరువిల గ్రామప్రజల యోగక్షేమాలు విచారించాడు. అనాడు తనకు తెలిసిన పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్లయినారు - స్వస్తి తనతోనే ఉన్నాడు. తనకు 47 సంవత్సరాల వయస్సు. ఉరువిలలో ప్రతిఒక్కరు త్రిశరణాలు పఠిస్తూ సమ్యక్‌ జీవనం సాగించడం బుద్ధునికి ఆనందం కలిగించింది.

గయనుండి సరాసరి రాజగృహ చేరుకున్నాడు. న్యాగ్రోధ పర్వతం మాద తన ఆశ్రమం చేరేసరికి అక్కడ పూర్ణ మైత్రేయాని పుత్ర ఎదురుచూస్తున్నాడు తనకోసం. అతను వివిధ విహారాలు పర్యటించి వచ్చాడు. అక్కడి విషయాలు, విశేషాలు నివేదించాడు. సానవరంలో కొత్తగా అయిదు వందల మంది దీక్ష తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బుద్ధుడు ధ్యానంలో ఉండగా ఒక కుటీరంలోంచి ఎవరో భిక్షు సూత్రాలు పెద్దగా వల్లించడం వినిపించింది. అతని గొంతులో ఏదో విషాదం జీత ఆనందుని పంపి అతనిని పిలిపించాడు. అతని పేరు సోన. శ్రావస్తిలో అతనిని చూచిన జ్ఞాపకం. ధనిక కుటుంబం నుండి వచ్చాడు. తెలివిగలవాదే కాని మనస్సు చంచలం.

“సోనా! సాధనలో ఏదో ఇబ్బంది పడుతున్నావ్‌ ఏమిటీ కారణం? నీవు బలవంతంగా ధ్యానం చేయకు, కష్టంగా ఉంటే, చేయాలన్న మనసు లేకపోతే మానెయ్‌. బలవంతంగా కళ్లు మూసుకుంటే అది ధ్యానం అవదు. శరీరాన్ని మనస్సును కష్టపెట్టకూడదు”, భగవాన్‌ బుద్ద 172

ఒకనాడు జీవకుడు బుద్దుని దర్శనార్ధం వచ్చాడు. అప్పుడు బుద్ధుడు వేణు వనం వెళ్లి తిరిగి వస్తున్నాడు. సన్నగా, రివటలా ఉన్నా బుద్ధుడు 72 సంవత్సరాల వయస్సులో దృఢంగా, ఆరోగ్యంగా ఉండడం చూచి ఆశ్చర్యపోయాడు. ప్రక్శనే నడుస్తూ బుద్దుని చేతిలోని భిక్షాపాత్ర అందుకున్నాడు. బుద్ధుడన్నాడు, “జీవకా, తధాగతుడు ఈ పర్వతాన్ని ఎన్నో వందలసార్లు ఎక్కి ఉంటాడు. నా భిక్షాపాత్ర నా చేతికి బరువు కాదు.” ఇద్దరు పర్వతంపైకి వచ్చిన తర్వాత చెరొక రాతిబండ పైన కూర్చుని ముచ్చటించుకోసాగారు. జీవకుడు బింబిసారుని కుమారుడు కావడం వల్ల బుద్దుని వద్ద కాస్త చనువు ఎక్కువ. ఆమ్రపాలి కుమారుడు కావడం వల్ల అతనిపట్ల బుద్ధునికి ప్రేమాభిమానాలు ప్రత్యేకం.

“భగవాన్‌ ఇక్కడి పరిస్థితులు కొన్ని మాకు వివరించాలని వచ్చాను. ఆనంద్‌ భిక్షుకు తెలుసు గాని మాకు చెప్పినట్లు లేదు. సంఘంలో కలకలం రేగింది. దేశ రాజకీయ ప్రభావం మన బౌద్ధంపైన పడుతోంది ....”

“వివరంగా చెప్పు జీవకా, నిజంగా నాకేం తెలియదు ..”

“దేవదత్తుని విషయం భగవాన్‌. మిమ్మల్ని కాదని తనే సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. చాలామంది ఖిక్షుల్ని తనవేపు తిప్పుకున్నాడు. అతనికి ముఖ్యసలహాదారుడు కోకాలిక. అతనికో తోడు మెరక తిప్ర, ఖందదాని పుత్ర, సమాధ దత్త వంత పాడుతున్నారు. వీరి అభిమాన కూటాలు పెద్దవి. దేవదత్తను వీరంతా గురువుగా భావిస్తున్నారు. దేవదత్త బయటపడడం లేదు గానీ లోపల్లోపల కుట్ర చేస్తున్నాడు. మాట్లాడితే మోరు ముసలి వారైనారని సాకు చూపిస్తున్నాడు. సంఘాన్ని నడిపే శక్తి మాకు లేదని ప్రచారం చేస్తున్నాడు. ఈనాటి సమాజానికి మో బోధనలు, సిద్ధాంతాలు పనికిరావట.

“దేవదత్తకు చాలామంది ధనికుల అండ వుంది. యువరాజు అజాతశ్రతు దేవదత్త మనిషి మహారాజు బింబిసారుడు మోకు మిత్రుడు, అభిమాని. అయినా

అజాతశత్రు మహారాజును లెక్కచేయడం లేదు. దేవదత్త ఉపయోగార్థం గయశీర్నలో ఒక పెద్ద భవనం కట్టించి పెట్టాడు. అక్కడే తొలిసారిగా బుద్ధుడు బోధించింది. వేయిమంది శిష్యులకు దీక్ష ఇచ్చిన పుణ్యక్షేత్రం అది. యువరాజు స్వయంగా దేవదత్తకు భిక్ష తెస్తాడు రోజూ. దేవదత్తుని ప్రసంగాలు వినడానికి వేలసంఖ్యలో జనం వస్తున్నారు. నాలుగు వందల మంది వరకు మన ఛిక్షులు అతని పక్షాన ఉన్నట్లు వార్త.

“భగవాన్‌ నన్ను మన్నించండి. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటాయి. చెప్పకపోవడం గురుద్రోహం అవుతుంది. మనకు సంబంధంలేని మరొక విషయం: 173 భగవాన్‌ బుద్ధ

దేవదత్త సహాయంతో అజాతశత్రు అధికారం కోసం కుట్ర చేస్తున్నాడు. వెంటనే తను సింహాసనం అధిష్టించాలి. అతని తలలో విషబీజాలు నాటింది దేవదత్తుడు. నేను వైద్యం నిమిత్తంగా అంతఃపురానికి వెళుతుంటాను గదా! చూచాయగా విషయాలు తెలుస్తున్నాయి. మహారాజుకు ఏ క్షణంలోనైనా, ఏమైనా జరగవచ్చు. సంఘం విషయంలో మారూ కాస్త జాగరూకత వహిస్తే మంచిది” అంతా సావధానంగా విని బుద్దుడు, “సంతోషం, జీవకా! తధాగతునికి పరిస్థితులు వివరించావు. మంచిది. జరుగుతున్న చరిత్ర అధ్యయనం చేయ వలసిందే. నీవు దిగులు పడకు. సంఘానికి ఏమా కాదు. 'జీవకుడు తల భారం దించుకుని వెళ్లిపోయాడు. “జీవకుడు చెప్పిన విషయాలు మనకు తెలిసినట్లు ఎవరికీ అనుమానం రానీయకు ఆనంద్‌” హెచ్చరించాడు. పదిరోజుల తర్వాత వేణువన విహారంలో ఒక సంఘటన జరిగింది. బుద్దుడు యధాప్రకారం. ధర్మబోధ చేశాడు. మూడువేల మంది భిక్షులు హాజరైనారు. బింబిసారుడూ హాజరైనాడు. ప్రవచనం విరమించ బోతుండగా దేవదత్త లేచి నిలబడి అన్నాడు “భగవాన్‌, మరు పెద్దవారవుతున్నారు. వయసు పైబడుతోంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంక మిరు విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని మా ఆకాంక్ష సంఘ బాధ్యతలు ఇంకెవరికైనా ఇవ్వండి.”

“ఎవరు తీసుకుంటారని నీ ఉద్దేశం?”

“ఎవరో ఎందుకు భగవాన్‌, మా అంతటి జ్ఞానిని నేనుందగా.”

బుద్దుడు దేవదత్తుని వైపు నిదానించి చూచాడు “దేవదత్తా, నీ అభిప్రాయం తెలిసింది. తధాగతునికి సంఘాన్ని నిర్వహించే శక్తి ఉంది. ఆరోగ్యమూ బాగానే ఉంది. అనవసరపు ఆలోచనలతో నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు.”

దేవదత్తుడు సంఘ స్తభ్యుల వైపు తిరిగి “మోరంతా ఏమంటారు?”

అందరు ముక్తకంరంతో దేవదత్తుని బలపరిచారు.

“భగవాన్‌! చూచారుగా, వీరు నా అభిమానులు. నేను గీచిన గీత దాటరు. దయచేసి ఇప్పుడైనా సంఘ బాధ్యతలు నాకు అప్పగించండి”.

“దేవదత్తా! అధిక ప్రసంగం వద్దు. నీ కంటే ముఖ్యులు, (ప్రాజ్ఞులు, అర్హత గలవారు ఇక్కడ ఉన్నారు. వారెవరూ నోరు విప్పి అడగలేదు. నీకెలా బాధ్యత ఇస్తాను. నీకా అర్హత లేదు. యోగ్యత అంతకన్న లేదు.” భగవాన్‌ బుద్ద 1784

దేవదత్తకు కోపం వచ్చింది. విసవిసా సభాస్థలి వదలి వెళ్లిపోయాడు.

మరునాడు ఆశ్రమంలో ఆనంద్‌ బుద్ధుని ఏకాంతంగా కలిసి :

“భగవాన్‌! దేవదత్త ప్రవర్తన బాధ కలిగించింది. అతను ప్రతీకారం తీర్చుకుంటాడు. సంఘంలో అవమానం పొందాడు. మిరు అనుమతిస్తే నేను వెళ్లి దేవదత్తను శాంతింప చేస్తాను.”

“ఆనంద్‌! మహారాజు సమక్షంలో, భిక్షు సంఘంలో నేను నిజం చెప్పాను. నాకు అతనిపై ద్వేషం లేదు. అతని సమర్ధతపై అపనమ్మకం లేదు. అతనిలో అహంకారం, స్వార్ధం కనిపిస్తున్నాయి. అతను ఏం చేసినా అతనిష్టం. మాట్లాడితే వింటాడని నీకు అనిపిస్తే నీ యిష్టం. అలాగే వెళ్లి మాట్లాడు.

న స

ఇప్పుడు బుద్దుడు ఇతర విహారాలకు వెళ్లడం విరమించుకున్నాడు. వారం వారం వేణువన విహారంలోనే ప్రసంగాలు, ప్రబోధాలు. అన్ని ప్రాంతాల భిక్షులు అక్కడకే వస్తారు. ఒక సమావేశానికి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బింబిసారుని, అజాత శత్రుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. గత రెండు మూడు వారాల సమావేశాల కన్న ఈసారి సమావేశం వాడిగా, వేడిగా ఉండబోతున్నదని అనంద్‌కి అనిపించింది. వాతావరణం గంభీరంగా మారింది. దేవదత్త పరివారం చాలా గుంభనగా ప్రవర్తిస్తున్నారు. ఏదో జరగ బోతున్నదని అందరికీ అనిపించింది! ఏది ఎలా జరుగుతుందో! సారిపుత్ర, మహాకశ్యపుల నడుమ దేవదత్త కూర్చున్నాడు. బుద్ధుని అభిభాషణ పూర్తికాగానే దేవదత్త లేచి నిలబడి ప్రశ్నించాడు-

“భగవాన్‌! మారు భిక్షులు నిరాడంబరంగా జీవించాలని, వారికి కోరికలు ఉండరాదని, అవసరం మించి ఏ వస్తువులు దగ్గర ఉంచుకోరాదని అంటారు. నిరాడంబర భిక్షు జీవనానికి నేను కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నాను. పరిశీలించండి : 1) భిక్షులు అరణ్యాలలోనే నివశించాలి. గ్రామాలలో, పట్టణాలలో ఉండకూడదు. 2) భిక్షువు మాధూ కవలంతోనే సరిపెట్టు కోవాలి. అభిమానుల ఇళ్లకు విందులకు ఛిక్షపేరిట వెళ్లకూడదు. 8) వాడి పారేసిన బట్టలనే భిక్షులు వాడాలి. కొత్త బట్టలు .ధరించకూడదు. అభిమానుల నుండి స్వీకరించకూడదు. 4) భిక్షులు చెట్ల క్రింద నిద్రించాలి తప్ప ఆశ్రమాలలో, భవనాలలో ఉండకూడదు. 5) భిక్షులు శాఖాహారానికి పరిమితం కావాలి, ఈ పంచసూత్రాలు పాటిస్తే భిక్షులు కోరికలకు అతీతంగా, నిరాడంబరంగా జీవించ వీలవుతుంది.”

అంతా సావధానంగా విని బుద్ధుడన్నాడు : “దేవదత్తా! తధాగతుడు నీ సూచనలు అంగీకరించడు. అరణ్యాలలో నివశించ దలచినవారు అలాగే

ఉండవచ్చు. అభ్యంతరం లేదు. అందరూ అరణ్యవాసం చేయాలని చెప్పకూడదు. పట్టణాలలో, నగరాలలో, విహారాలలో ఉంటే బౌద్దానికి వచ్చే ప్రమాదం లేదు. మాధూ కవలంతో జీవించాలనుకున్నవారు అలాగే జీవించవచ్చు. అభిమానులు ప్రేమగా ఇచ్చే వాటిని తిరస్మరించకూడదు. అలా చేస్తే వారి మనసుల్ని బాధపెట్టినట్లు అవుతుంది. అదీ హింసలో ఒక భాగమే. శాఖాహారం మంచిదే. గృహస్థులు తమకు ఉన్నది, చేసుకున్నది పెట్టినపుడు కాదనకూడదు. భిక్షుల ప్రీతికోసం జంతువుల్ని చంపినట్లు తెలిస్తే దానిని తిరస్కరించవచ్చు. దేవదత్త! ఇప్పుడున్న పద్ధతులవల్ల "భిక్షు సంఘానికి, ప్రజలకు మధ్య సఖ్య సంబంధాలు ఏర్పడతాయి. బుద్ధ జ్ఞానంతో ప్రజలకు నిత్యానుబంధం ఏర్పడుతుంది. అరణ్యాలలో కూర్చుంటే ఆపని జరగదు.”

దేవదత్త : అయితే నా సూచనలు అమోదించనంటారు?

బుద్దుడు : లేదు. అవి తధాగతునికి అంగీకారం కావు.

అవమానంతో దేవదత్త తలదించుకున్నాడు. లోలోపల సంతోషంగానే వుంది. ఆ రాత్రి ఆశ్రమంలో ఆనందుడు బుద్ధునితో అన్నాడు : “దేవదత్తుని మనోభిప్రాయం తధాగతులు గ్రహించారు. త్వరలోనే సంఘంలో చీలిక వస్తుంది.”

కొంతకాలం తర్వాత దేవదత్త రాజగ్భృహలో ఆనందుని కలిశాడు. ఇద్దరూ వీధిలోనే సంభాషించుకున్నారు. తాను వేరే సంఘం నెలకొల్పుతున్నట్లు దేవదత్త చెప్పాడు.

ఆనందుడు వెళ్లి ఆ విషయాలు బుద్దునికి చెప్పాడు. ఆ తర్వాత వారంలో వేణువనానికి హాజరైన భిక్షుల సంఖ్య చాలా చిక్కిపోయింది. అంటే వారంతా దేవదత్తుని కూటమిలో చేరిపోయారని అర్ధమైంది.

ప్రవచనం తర్వాత కొందరు ముఖ్య భిక్షులు బుద్దుని ఆశ్రమానికి వెళ్లారు... విషయం చర్చించడానికి-

“భగవాన్‌, దేవదత్త వద్ద చేరినవారు కొందరు మమ్మల్ని కలిశారు. దేవదత్త బలవంతంగా వారిని బెదిరించి తన సంఘంలో చేర్చుకున్నాడట. మన నియమాల కన్న అక్కడ నియమాలు బాగున్నాయట. మోరు తనను గౌరవించలేదని అక్రోశంతో వేరే సంఘం పెట్టాడట. వేణువన విహారంలోని జీవనం కంటే అక్కడ జీవనం బాగుందిట. మోరు నిరాడంబర జీవనం గురించి చెబుతూ ఆడంబరంగా జీవిస్తున్నారట. వారి వాదనలు మాకు నచ్చలేదు. మీ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొత్తగా చేరిన వారు, అనుభవం లేని వారు ఆయన వద్దకు వెళ్లిపోతున్నారు. ఈ విషయం మికు మనవి చేద్దామని ..” భగవాన్‌ బుద్ద 176

బుద్దుడన్నాడు * “ఆ విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వపని లేదను కుంటాను. మాకు మా సాధన ముఖ్యం. పవిత్ర జీవనం ముఖ్యం.” కొద్ది రోజుల తర్వాత జీవకుడు బుద్దుని దర్శించి, దేవదత్త వద్ద అయిదు వందల మంది భిక్షులున్నట్లు చెప్పాడు. వారంతా గయశీర్చలోని: విహారాల భవనాలలో ఉంటున్నారు. దేవదత్త రాజ్యాంగం చేస్తున్నాడు. దేవదత్తుని సంఘానికి విశేష ప్రచారం లభించింది. ఎక్కడకు వెళ్లినా బౌద్ధ భిక్షులకు అదే ప్రశ్న ఎదురవుతోంది. సారిపుత్ర భిక్షులతో అన్నాడు “విషలీజాలు నాటిన వారికి విషఫలాలే దక్కుతాయి తప్ప మధుర ఫలాలు లభించవు గదా! సంఘాన్ని చీల్చదం అవివేకం, అహంకారం. ధర్మవిరుద్ధం.” ఒకనాడు ప్రధాన భిక్షులతో విషయాలు చర్చిస్తున్నప్పుడు బుద్గుడన్నాడు : “దేవదత్తను చరా యని ఉవపదు సంది ఇమాట వినగానే సారిపుత్ర కల్పించుకుని, “మనం బహిరంగంగానే అనేక సార్లు దేవీదత్తుని ప్రతిభను ప్రశంసించడం జరిగింది. ఇప్పుడు వీమర్శిస్తే ..* బుద్దుడు : సారిపుత్రా, లోగడ మనం దేవదత్తుని ప్రతిభను ప్రశంసించినపుడు నిజమే చెప్పాం. అబద్ధం చెప్పలేదుగా. సారిపుత్ర : లేదు భగవాన్‌. నిజమే చెప్పాము. , బుద్ధుడు ఇప్పుడు అతనిని విమర్శించినపుడు నిజం చెబుతున్నట్లా? అబద్ధం చెబుతున్నట్లా? సారిపుత్ర : ఇప్పుడు చెప్పేదీ నిజమే ... బుద్ధుడు .: అప్పుడు, ఇప్పుడు మనం చెబుతున్నది సత్యమే. ఎప్పుడు సత్యం చెప్పడమే మంచిది ఒక సమావేశంలో భిక్షులే ఒక నిర్ణయం చేశారు - దేవదత్త సంఘానికి మన సంఘానికి సంబంధం లేదు. అతని చేతలకు మనం బాధ్యత వహించం. సారిపుత్ర, మౌద్గల్యన పెదవి కదపలేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ కూర్చున్నారు. భిక్షుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. ఆనందుడు కల్పించుకుని ప్రశ్నించాడు. భిక్షు మిత్రులారా! దేవదత్తుని విషయంలో మో అభిమతం చెప్పలేదు. మాకు వేరే ఆలోచనలున్నాయా?” మౌద్గల్యన నవ్వి “అవును ఆనందా! మా శక్తివంచన లేకుండా బుద్దునికి సేవ చేస్తాం. అదే మా నిర్ణయం మిగిలిన విషయాలు మాకు పట్టవు. 177 భగవాన్‌ బుద్ధ

హ ఉలికిపడి అంతలోనే పిడుగు వంటి వార్త వచ్చింది. ఒక్కసారిగా రాజగ్భప ఉలి కాం (5 కంపించింది. బింబిసార చడ్రవర్తి, తన నింహాననం అజాతశ(త్రు టీ మి ఏమి అప్పగిస్తున్నాడని, పదిరోజులలో రాజ్యపట్టాభిషేకం జరగబోతున్నది. ఏమి హటాత్పరిణామం? అది రాజ ప్రకటన కాదు కేవలం వార్త ఏ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నా బింబిసారుడు బుద్దుని సంప్రదించడం అలవాటు. ఈసారి అలా జరగలేదు. జీవకుడు వచ్చి అసలు విషయం చెప్పాడు. అజాతశత్రు తన తండ్రి బింబిసారుని గృహ నిర్బంధంలో ఉంచాడు ఆయనను బందీగా ఉంచిన మందిరానికి తన సైనికుల్ని కాపలాపెట్టాడు. రౌ వైదేహిని తప్ప ఎవరినీ లోపలకు పోనివ్వడం లేదు. మహారాజు గారి ఇద్దరు ఆంతరంగికులదీ అదే పరిస్థితి, రాజ్యాభిషేకం జరిగేవరకు నిర్భంధం తప్పదంటున్నారు. ఒకవేళ వారిని బయటకు రానిస్తే తనకు సింహాసనం దక్కకుండా చేస్తారని భయం. ఏవో రాచకార్యాలవల్ల రాజమందిరంలో ఉండిపోయారని వారి ఇళ్లకు వర్తమానం పంపారో ఈ ఏషయాలు రాణిగారిక్షి మందులివ్వడానికి అంతఃపురానికి వెళ్లినపుడు తనకి తెలిసిందని జీవక్తుడ్తు చెప్పాడు. ఆమె చెప్పిన మరొక విషయం - నెలరోజుల క్రితం ఒక రోజు అర్ధరాత్రి రాజుగారి శయనమందిరం బయట యువరాజు తచ్చాడటం తనకు అనుమానం కలిగించింది. సైనికులు సోదొ చేయగా అతని వద్ద ఒక కత్తి దొర్రిక్రిద్చ. రాజుగారిని చంపడానికి ప్రయత్నించాడు. రాజుగారి ముందు హాజరు పరిచారు బింబిసారుడు : “అజాకా! అంతపురంలో కత్తులు వాడవలసిన అవసరం ఏమిటి? రక్షక -. క్‌ భటులున్నారు. సేవకులున్నారు. పరివారం ఉంది”. అతను నిర్భయంగా చెప్పాడు “మిమ్మల్ని చంపాలనే వచ్చాను.” నన్ను చంపడం దేన్సిక్రి యువరాజ్ఞా!” ఎన్నాక్షకి నువ్వు చ్ర్వద్రం లేదు. నేన్స రాజునయ్యే అవకాశం లేదు అడిగితే సింప్రాసనం ఇచ్చేవాడివా?? నిను పతపుట . నికి కన్న తండ్రిని కడతేరుస్తావా? రేపు లోకం న్‌ శ్రే వాంతకుడనదూ? నాకు రాజ్యకాంక్ష లేదు అ జాతా ...” ఇంత సులభంగా మార్సు అంగీకరిస్తారని అ్రన్సుక్రోలేదు మహారాజు”. “అజాతా' ఈ 10 న టీ నీది కాదు. ఎవరో నిన్ను ఎక్కత్రోశారు. ఎవరువారు? అజాతశత్రు దేవదత్తతో రహస్య మంతనాల్లు జరిపాడు. భగవాన్‌ బుద్ద 178

బింబిసారుడు తన మిత్రులతో సమాలోచన జరిపాడు- అర్ధరాత్రి వేళ.

“ఇది రాజద్రోహం మహారాజా! యువరాజుకి మరణదండన విధించండి. తనకి సలహాయిచ్చిన దేవదత్తకు, భిక్షువులందరినీ దేశబహిష్మారం శిక్ష వేయండి.”

బింబిసారుడు ఆమోదించలేదు. “అజాతశత్రుకు మరణదండనా? అసంభవం. తను నా కుమారుడు, రాజ్యానికి వారసుడు. దేవదత్త, భిక్షులు ఈ కుట్రలో భాగస్తులు, దేవదత్త ఇంతటి ఘాతుకం చేయగలడని బుద్ధదేవుడు ఎప్పుడూ చెప్పలేదు. అందువల్లనే సంఘం నుండి వెలివేశారు! అయినా నేను దేవదత్తను శిక్షించలేను. అతను పూజనీయుడు. ఒకప్పుడు బుద్ధభగవాన్‌ శిష్యుడు.”

“బుద్ధునిపై అభిమానంతో దేవదత్తకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారా మహారాజా”.

'శేపు ప్రకటన చేయండి... యువరాజు పట్టాభిషేకం గురించి. పదిరోజుల్లో ముహూర్తం నిర్ణయించండి. అంతఃపురంలో జరిగిన విషయాలు ఏవీ బయటకు తెలియకూడదు.”

మర్నాడు దేవదత్త రాజమందిరానికి వచ్చాడు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే బింబిసారుడు బందీ అయినాడు.

జీవకుడన్నాడు : “పట్టాభిషేకం జరిగిన తర్వాత బింబిసారుని విడుదల చేస్తారేమో,”

మరునాడు రాజోద్యోగి ఒకరు వచ్చి, బుద్దుని, భిక్షుల్ని ఉత్సవానికి ఆహ్వానించాడు.

బుదుడు సారిపుత్రతో అన్నాడు “ఆ ఉత్సవాన్ని నేను నిషేధిస్తున్నాను నేను వెళ్లడం లేదు. మోరూ ఎవరూ వెళ్లకండి. ఇలాంటి దుష్క్ఫృత్యాలను మనం సహించకూడదు.”

ఉత్సవంలో దేవదత్త శిష్యులు ఆరువందల మంది పాల్గొన్నారని వినికిడి.

ఉత్సవంలో బింబిసారుని జాడలేదు. గౌతమబుద్దుడుగాని, బొద్దభిమన లు గాని ఒక్కరూ కనిపించక పోవడంతో జనం ఏదో కీడు అను నారు. మహారాజును, ఆయన మిత్రులను అంతఃపురంలో నిర్బంధంలో ఉంచినట్లు

ప | ద. బౌదభిక్తుల సత్యాగహం అప్పుడు తెలిసింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది. జ బ్రైద క దొరకడం ప్రజలకు బలం. దేవదత్తునికి, అతని శిష్యవర్గానికి నగరంలో భిక్ష కష్టమైంది. అది ప్రజల సత్యాగ్రహం. 170 భగవాన్‌ బుద్ధ

బుద్ధుడు, తనను ఆమోదించలేదన్న అనుమానం అజాతశత్రుకు కలిగింది. అయినా ఏం చేయలేడు. బుద్దుని గాని, భిక్షు సంఘాన్ని గానీ ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడతారు. బుద్ధుని అభిమానులైన ఇరుగుపొరుగు రాజులు ఊరుకోరు. తన అంతం చూస్తారు. ముఖ్యంగా కోసలరాజు ప్రసేనజిత్‌ తనపై యుద్ధం ప్రకటించడం ఖాయం. ఆయన బుద్దునికి వీరాభిమాని. అజాతశత్రు వెంటనే దేవదత్తుని పిలిపించాడు మంతనాలకు. బుద్ధుడు తర్వాత్తర్వాత రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తన ఆశ్రమం వెలుపల, ఒంటరిగా ధ్యానంలో గడిపేవాడు. ఒకసారి అలా ఆరుబయట కూర్చుని ధ్యాన నిష్టలో ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చెట్లచాటున ఎవరివో నీడలు కనిపించాయి. వెన్నెల రాత్రి అయినా దూరానికి రూపం స్పష్టంగా లేదు.. “ఎవరది?” పిలిచాడు. ఒక వ్యక్తి ముందుకు వచ్చి బుద్దుని పాదాల ముందు వాలిపోయి “నన్ను మన్నించండి మహాత్మా" అని ఏడవసాగాడు. “ఎవరు నువ్వ? ఇక్కడ నీకేం పని? ఎందుకొచ్చావు?” ప్రశ్నించాడు. “నన్ను మన్నించండి. మిమ్మల్ని చంపడానికి వచ్చాను. ఆ పని చేయలేక పోయాను. ధ్యానంలో ఉన్న మిపైకి పదిసార్లు కత్తి ఎత్తాను. చేయి బిగుసుకు పోయింది. కాలు కదల్బలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని చంపనందుకు నా యజమాని నన్ను బ్రతకనీయడు. నన్ను క్షమించి రక్షించండి, స్వామా”. “నీ యజమాని ఎవరు? ఎవరు నిన్నీ పనికి పంపింది? తధాగతుని చంపవలసిన అవసరం ఎవరికుంది?”. “పేరు చెప్పలేను స్వామి ... మన్నించండి”. “చెప్పవద్దు కానీ అతను నీకేం చెప్పాడో అది చెప్పు”. “ఆయన కొండమిదికి ఎలా ఎక్కాలో చెప్పాడు. ఎటుగా దిగిపోవాలో చెప్పాడు. “నీకు పెళ్లాం పిల్లలున్నారా”, “లేరు స్వామో, నాకింకా పెళ్లికాలేదు. ఓ ముసలి తల్లి వుంది”. “అయితే నేను 'చెప్పినట్లు చెయ్‌. ఇంటికి వెళ్లిపో. రాత్రికి రాత్రి నీతల్లిని తీసుకుని ఊరువదల వెళ్లిపో, కోసల దేశం వెళ్లు. 'అక్కడ నీకు బ్రతుకుతెరువు భగవాన్‌ బుద్ద 180

లభిస్తుంది. నీ యజమాని చెప్పిన మార్గంలో వెళ్లకు. పక్కదారిలో వెళ్లు. అతనికి తెలిసిన మార్గంలో వెళ్లితే నిన్ను చంపేస్తాడు.” అతను కత్తి అక్కడే వదలి వెళ్లిపోయాడు. మరునాడు ' సారిపుత్ర, మౌద్దల్యన వచ్చారు : “భగవాన్‌, మేమిద్దరం దేశాంతరం వెళ్ల దలిచాం అక్కడి భిక్షు సంఘాలకు మా సహాయం అవసరపడ్డది”. “అవసరం అనిపిస్తే తప్పక వెళ్లిరండి జాగ్రత్త, మో ప్రాణాలకు హాని కలగకుండా చూచుకోండి”. అక్కడ ఉన్న కత్తిని చూచాడు సారిపుత్ర. బుద్ధునివైపు ప్రశ్నార్ధకంగా చూచాడు. అందుకు సమాధానంగా బుద్దుడన్నాడు “రాత్రి ఎవరో ఒకతను తధాగతుని హత్య చేయడాన్సిక్షి వచ్చాడు. అతని కత్తి అది. దానిని అక్కడ ఉండనీయండి జీవకుఢు వచ్చినపుడు తీసుకుపోతాడు.” మౌద్దల్యన సోరిపుత్రతో అన్నాడు : “మిత్రమా ఇప్పుడు మనం దేశాంతరం వెళ్లవద్దు. తధాగతునిపై' హత్యాప్రయత్నం జరిగిందంటే పరిస్థితి ఎంత ప్రమాద కరమో తెలుస్తోంది”. బుద్ధు డన్నాడు : “మిరు విచారించకండి మౌద్దల్యా, తధాగతునిక్షి ఎలాంటి ప్రమాదం రాదు వచ్చినా తను చూచుకోగలడు.” ఆరోజు మధ్యాన్నం వేణువన విహారం నుంది కొందరు భిక్షులు వచ్చారు. వారు లోపల చాలా బాధఫడుతున్నట్లు తెలుస్తోంది. కన్నీరు తుడుచుకుంటున్నారు. ఏదో భయం, మరేదో దిగులు వారి మొహాలలో. “ఏం జరిగింది. ఎందుకా బాధ ... ఒక భిక్షు కళ్లు తుడుచుకుని డగ్గుత్తికతో అన్నాడు : “భగవాన్‌, మేను వేణు వనం నుండి వస్తున్నాం. త్రోవలో సారిప్పత్ర, మౌద్గల్యన ఎదురుపడ్డారు. “ఎక్కడికి వెళుతున్నారని" అడిగాం. వారు గయశీర్న వెడుతున్నట్లు చెప్పారు. మాకు అనుమానం వచ్చింది వారితో పాటు అయిదు వందల మంది వారి అభిమానులు వెళ్లిపోతున్నారు. వారిద్దరు తమ ప్రియశిష్యులు. వారు ఇలా గురుద్రోహం చేస్తారని, చేయగలరని మేం ఊహించలేదు. అందుకే మా గుండెలు బాధపడుతున్నాయి”. బుద్దుడు : మారు విచారించకండి. మౌద్గల్యన, సారిపుత్రులు దేవదత్త వంటివారు కారు. తధాగతునికి వారిపై పూర్తి విశ్వాసం వుంది. వారు సంఘానికి మచ్చ తెచ్చే పనులు చేయరు. 181 భగవాన్‌ బుద్ధ

వచ్చినవారి మనస్సులు తేబికైనాయి. కొంచెంసేపు బుద్దుని సన్నిధిలో గడిపి వెళ్లిపోయారు. మర్నాడు జీవకుడు బుద్దుని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. బుద్దుని వెంట ఆనందుడు బయలుదేరాడు. భోజనాటైన తర్వాత, ఏవో కబుర్లు చెప్పుకుదటుందడగా రాజి వైవాహి బుద్దుని దర్శించడానికి వస్తున్నారని ఒక సేవకుడు వచ్చి చెప్పాడు. జీవకుడే ఈ రహస్య సమావేశం కల్పించాడని బుద్దునికి తెలిసి పోయింది. తన ఆశ్రమానికి రాణి వస్తే అజాతశత్రుకు తెలీసిపోతుంది. అమె బుద్ధునికి అభివాదం చేసి, కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. బుద్ధుడు : “చెప్పమ్మా. ఏమిటి నీ కష్టం”? వైదేహి : “మహాత్మా! ప్రభువు చాలా ప్రమాదంలో ఉన్నారు. అజాతశత్రు వారికి తిండి పెట్టకుండా మార్చి చంపుతున్నాడు. మొదట్లో నేను స్వయంగా భోజనం తీసుకు వెళ్లేదాన్ని ఒకరోజు రాజభటుడు భోజనం లాగేసుకున్నాడు. రిక్తహస్తాలతో వెళ్లి వారిని చూచాను. మహారాజుకు కోపం రాబేదు. కొడుకు చర్యల్ని గర్జించలేదు, తనవల్ల ఎవరికీ కష్టం కలగరాదంటారు. “చావనైనా చస్తాను అంటారు. మర్నాడు మహారాజును చూడడానికి వెళ్లాను భోజన పాత్రను భటులు లాక్కుంటారని తెలుసు. కొన్ని అన్నం ముద్దలు నా తలకొప్పులో దాచిపెట్టి తీసుకువెళ్లాను. భోజనపాత్రను భటులు లాక్కున్నారు. దాచి శీసుకువెళ్లిన రెండు ముద్దలు ఆయనకు తినిపించాను. అలా సాగుతోంది. ఇన్ని రోజులు భోజనం లేకపోయినా మహారాజు మరణించక పోవడం వల్ల అజుతకు అనుమానం వచ్చి నన్ను పూర్తిగా శోధించిన తర్వాత గానీ లోపలకు పంపవద్దని ఆజ్ఞలు జారీచేశాదు. మూదు రోజుల తర్వాత నాకొక ఉపాయం తట్షింది. పాలు, తేనె, ఫిండి కలిపి ముద్ధచేని దానిని గంధంలాగా ఒంటి నిండా మందంగా పూసుకుని ఎండబెట్టాను. తల కట్టులో అన్నం ముద్ద లేదు కనుక భటులు వదిలిపెట్టారు. లోపలకు వెళ్లి విషస్తనై నా ఒంటిమిద ఉన్న పాలు, తేనె, పిండి పెచ్చులుతీసి వారికి తినిపించాను. ఇప్పటికి అలా రెండు మూడు సార్లు చేశాను. కానీ ఆ రహస్యం బయట పడుతుందని భయంగా వుంది.”

ఆమె వెక్కివెక్కి ఏద్చి అలసిపోయింది.

“ప్పుడు మహారాజుగారి ఆరోగ్యం ఎలా వుంది?”

“చిక్మిపోయినారు గానీ, ఆరోగ్యంగానే ఉన్నారు. భగవాన్‌! వారికి ఎవరిపైన కోపం లేదు. ఎవరిపైన అభిమానం లేదు. నవ్వుతూ ఆనందంగా మాట్లాడు తున్నారు”. భగవాన్‌ బుద్ధ 182

“మో సోదరుడు ప్రసేనజిత్‌కు కబురంపక పోయావా?”

“అవకాశం లేదు భగవాన్‌. అక్కడ అంతా అజాత మనుషులే, ఎవరినీ నమ్మలేం”.

“ఇైకినీతే, నేను కబురు పంపుతాను ప్రసేనజిత్‌ను సాయం చేయమందాం”,

అమె కృతజ్ఞత చెప్పుకుంది. ఆమె అన్నది ; “అజాత పుట్టినపుడు దైవజ్ఞులు అతని జాతకం చూచి వాడు పితృద్రోహి అవుతాడని చెప్పారు. ఒకసారి వాడు కడుపులో ఉండగా, నాకు బింబిసారుని రక్తం తాగాలన్న కోరిక కలిగింది. ఆయన వేలు (ప్రేమగా నోట్లో పెట్టుకుని, కసిక్కిన కొరికి రక్తం తాగాను. అది నా కోరిక కాదు. కడుపులో పెరుగుతున్న 'అజాత' కోరిక. కడుపులో ఉండగానే, పుట్టక పూర్వమే వాడికి రక్తదాహం ఉంది ... అప్పుడే నాకు తెలుసు వాడి స్వభావం ఇది అని. దైవజ్ఞులు సలహా చెప్పారు ఆనాదే. పుట్టగానే చంపివేయమని లేదా ఎక్కడైనా మహారణ్యంలో వదలమని. కానీ మహారాజు రెండు పనులలో దేనికీ అంగీకరించలేదు. పైగా పుట్టిన బిడ్డడికి 'అజాతశత్రు” అని పేరు పెట్టారు. అజూతశత్రు అంటే ఆజన్మ విరోధి అని కదా అర్ధం భగవాన్‌”.

బుద్ధుడు వైదేహికి సలహా చెప్పాడు. భటులకు అనుమానం కలగకుండా అజాత కంటపడకుండా, బింబిసారుని రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రం కలుస్తుండమని. ఆమె అందించే మధుగంధాల్ని మహారాజు గుళికలుగా చేసి రోజూ రెండు మూడు సేవించినా, ప్రాణహాని ఉండదని.

జీవకుని అబినందించి రాణి వైదేహిని పంపివేశారు. బుద్ధుడు తన ఆశ్రమానికి బయలుదేరాడు ఆనందునితో కలిసి ...

శ చ 2

రాజకీయాలలో ఎత్తులు, పైఎత్తులు, తంత్రాలు, కుతంత్రాలు సాధారణం. తాడి తన్నేవా డొకడుంటే వాడితల తన్నేవాడు మరొక డుంటాడు. దేవదత్త స్వంత విహారం అజాతశత్రు అభిమానంతో పైకొచ్చింది. సారిపుత్ర, మౌద్దల్యన బుద్దుని అనుమతితో ఒకనెల రోజులు గయశీర్నలో గడిపి తిరిగి వేణు వనం చేరుకున్నారు. సోదర భిక్షులు సాదరంగా ఆహ్వానించారు గయశీర్న విశేషాలు ఎవరడిగినా నవ్వి ఊరుకున్నారు. కొద్దిరోజుల తర్వాత దేవదత్త సంఘంలోని మూడువందలమంది భిక్షులు పోలోమంటూ వేణువనానికి వచ్చి చేరారు. అక్కడివారు వచ్చిన వారిని ప్రశ్నించకుండా సగౌరవంగా ఆహ్వానించారు. గయశళీర్న నుండి 380 మంది వచ్చినట్లు సారిపుత్ర అంచనా. వారిని వెంటబెట్టుకుని బుద్ధుని దర్శనానికి సారిపుత్ర, మౌద్దల్యన కొండమీదికి బయలుచేరారు. 183 భగవాన్‌ బుద్ధ

అంతమంది. బారులుతీరి కొండ ఎక్కిరావడం బుద్దుడు తన ఆశ్రమం నుండి గమనించాడు. ఏమిటీ తీర్టప్రజ? ఆనందుడు, ఇతర ఛిక్షులు వారికి స్వాగతం పలికారు. వారిలో ముఖ్యులకు బుద్దునితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కల్పించారు. సారిపుత్ర అన్నాడు : “భగవాన్‌, నాలుగు వందల మంది భిక్షుసోదరులు తిరిగి వచ్చారు”.

“మంచిది, ఎవరి ప్రోత్సాహం? ఎవరి ప్రోద్బలం?” బుద్దుని ప్రశ్న

“భగవాన్‌! నేను, మౌద్గ్దల్యన అక్కడికి వెళ్లాం. మేము వెళ్లే సమయానికి దేవదత్త భోజనం ముగించి, ధర్మోపన్యాసం చేయడానికి వేదికపైకి ఎక్కుతున్నాడు.

, మా ఇద్దరినీ చూచి పరమానందం పొందాడు. మేము మో సంఘం వదలి తన సంఘంలో చేరడానికి వచ్చామని అభిప్రాయపడ్డాడు. ధర్మశాల వేదికపైకి మమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించాడు. నేను అంగీకరించలేదు. భిక్షులతో కలిసి, నేను క్రిందనే కూర్చున్నాను. ఆరోజు దేవదత్త ఇలా ప్రసంగించాడు. 'ఈ రోజు చాలా గొప్పరోజు. నా చిరకాల మిత్రులు మాన్యశ్రీ సారిపుత్ర, మౌద్దల్యనలు ఇక్కడికి వచ్చారు. నాకెంతో సంతోషంగా, సంతృప్తిగా వుంది. వారిద్దరు మనతో కలవదం గొప్ప చారిత్రక విశేషం. మి అందరికీ ఇది శుభవార్త. ఈరోజు సారిపుత్ర ధర్మప్రవచనం' చేస్తారు అంటూ నన్ను వేధికపైకి ఆహ్వానించాడు. *

“నేను వేదికపైకి వెళ్తాను ప్రసంగించడానికి. భిక్షులు నిశ్శబ్దంగా ఆలకించారు. దేవదత్తకు తిండి ఎక్కువైనట్లుంది. మత్తుగా కళ్లు మూశాడు. నా (ప్రసంగం పూర్తి అయిన తర్వాత నిద్రలేచాడు”

మిగిలిన కధ మౌద్గ్దల్యన వివరించాడు-

“భగవాన్‌! మేము గయశీర్నలో నెలరోజులున్నాం. వాళ్ల కార్యక్రమాలు మావిగా భావించి శ్రద్ధగా పాల్గొన్నాం. మూడురోజుల కొకమారు సారిపుత్ర ధర్మబోధ చేసేవాడు. సోదరుడు మంచి వక్త గురుదేవా! చాలా చక్కగా బోధించాడు. అందరినీ ప్రేమగా చూచేవాడు. కాని దేవదత్త శిష్యుడు' కోకాలిక మమ్మల్ని అనుమానించాడు. దేవదత్త చెవిలో ఏదో ఊదాడు. అయినా అతను పట్టించు కోలేదు. మమ్మల్ని నమ్మవద్దని చెప్పి ఉంటాడు ఎవరో ఒకరు చక్కగా ధర్మోపన్యాసం చేస్తున్నారు కదా! దేవదత్త పని తగ్గింది. అంచేత పెద్దగా పట్టించుకోలేదు. పైగా సారిపుత్రను వద్దనే సాహసం దేవదత్తకు లేదు. సారిపుత్రకు ఎవరూ సాటి రారు. అది అందరికీ తెలిసిందే కదా,

“చివరన ఒకరోజు ప్రసంగం పూర్తిచేసి సారిపుత్ర సభను ఉద్దేశించి “ఈ రోజు నేను, మౌద్దల్యన వెళ్లిపోతున్నాం. మనందరికీ బుద్దుడు ఒక్కడే. బౌద్ధసంఘం భగవాన్‌ బుద్ధ 1ర్రి4

ఒక్కటే. గౌతమబుద్ధుడు ఎక్కడ ఉంటే అక్కడిదే నిజమైన సంఘం. బౌద్ధ సంఘ రూపకర్త, నిర్మాత బుద్ధుడు. మనందరికీ ఆధారం ఆయన ఒక్కరే. మిరు మనసు మార్చుకుని వస్తే వారు కాదనరు. పూర్వంలాగా మో న్థానాలు మావిగా ఉంటాయి. మో అభిమానం మొక్కవోదు. వారి ఆత్మీయత తగ్గదు. ఒక సంఘం విచ్చిన్నం కావడం మంచిది కాదు ఆ పనికి పూనుకోవడం సంఘ విద్రోహ చర్య. నేను జీవితంలో ఒకే ఒక గురువును చూడగలిగాను. ఆయన గౌతమ బుద్ధుడు. ఆయన భగవాన్‌ బుద్ధ మేము ఎవరినీ బలవంతంగా తీసుకుపోము. ఇష్టమైతే వేణువనానికి రండి. అక్కడ మళ్లీ కలుద్దాం.

“మేము బయలుదేరి వచ్చేరోజు దేవదత్త నగరంలో లేడు. కోకాలిక మమ్మల్ని అద్దుకున్నాడు. నానా తిట్లు తిట్టాడు. విననట్లు వచ్చేశాం. వేణువనంలో అయిదు రోజులున్నాం. 380 మంది వచ్చారు. సారిపుత్ర అడిగాడు : భగవాన్‌! వారికి మరలా దీక్ష ఇవ్వాలా? అవసరమైతే దీక్షా

సమావేశం ఏర్పాటు చేద్దాం. బుద్దుడు : దీక్ష అవసరం లేదు సారిపుత్రా! సంఘ సమావేశంలో క్షమాపణలు చెబితే చాలు. పశ్చాత్తాపాన్ని మించిన పరిహారం ఏముంటుంది? ఆ మర్నాటికి మరో 385 మంది వచ్చారు గయశీర్ష నుండి. ప

ఒకనాడు బుద్ధుడు కొండ దిగువన నిలబడి ఏదో ఆలోచిస్తుండగా పై నుండి ఒక బండరాయి దొర్లుకుంటూ వచ్చింది. “భగవాన్‌ తప్పుకోండి” అని క్రిందనుండి ఎవరో అరిచారు. వెనుతిరిగి పైకి చూడగా, ఒక పెద్ద బండ, తన పైకి దొర్లించినట్లు తన దిక్కుగా వస్తోంది. బుద్ధునికి దగ్గరగా వచ్చి మరో కొండరాయిని తగిలి ముక్కలైంది. . అందులో ఒక రాతిముక్క వచ్చి బలంగా బుద్దుని కాలికి తగిలి గాయమైంది. తన ఉత్తరీయం తీసి కాలుకి కట్టుకడుతుండగా,

పై నుండి ఒక వ్యక్తి పారిపోతూ కనిపించాడు. అతని కోసం భిక్షులు కొండపైకి పరుగెత్తారు.

“గొడవ చేయవద్దు. తధాగతునికి ఎవరివల్ల ప్రమాదం రాదు. మోరు వెళ్లి జీవకునికి కబురు చేయండి”.

“కొన్ని రోజుల వ్యవధిలో రెండుమార్లు బుద్ధునిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ విషయం నగర ప్రజలకు తెలిసి కలవరపడ్డారు అంతలో బింబినారుని మరణవార్త అందింది.

185 భగవాన్‌ బుద్ధ

బింబిసారుని వయసు 67 సంవత్సరాలు. గౌతమ బుద్దుని కన్న అయిదేళ్లు చిన్నవాడు. 31వ ఏట ధర్మదీక్ష తీసుకున్నాడు. 15వ ఏటనే రాజైనాడు. అతి పిన్న వయసులో రాజై 52 సంవత్సరాలు పాలించాడు. అగ్ని ప్రమాదానికి గురై సర్వనాశనమైన రాజగ్భహను అందంగా పునరిర్మించాడు. ఒకసారి అంగరాజుతో చిన్నపోరు తప్ప ఎప్పుడూ యుద్దాల జోలికి వెళ్లలేదు. అందరు రాజులతో స్నేహంగా ఉండేవాడు, అతని కాలంలోనే మగధకు మంచిపేరు వచ్చింది. కోసల రాజైన ప్రసేనజిత్‌ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. మద్ర, లిచ్చలి దేశాధీశులకు అల్లుడైనాడు. తన చెల్లెల్ని కోసల రాజుకిచ్చి వివాహం జరిపించాడు. బుద్దుని తలవెంట్రుకలు, గోళ్లు భద్రపరచి, వాటిపై స్టూపాలు నిర్మింపచేశాడు. శ్రీమతి అనే ఆమెను స్టూపంవద్ద ఉంచాడు. అమె రోజూ స్టూపం చుట్టు శుభ్రం చేసి, పూలు తెచ్చి అలంకరిస్తుంది. కొండమీద నుండి జారిన బండ సంఘటన తర్వాత పది రోజులకు బుద్దుడు కొందరు భిక్షులతో నగరంలో భిక్షాటనకు బయలుదేరాడు. ఒక మదపుటేనుగు పిచ్చిపట్టినట్లు బుద్ధుని వైపు పరుగున రావడం ఆనంద్‌ గమనించాడు. అది గజశాల నుండి తప్పించుకు వచ్చిందా? లేక ఎవరైన ఉసికొల్చి వదిలారా? దాని పేరు నలగిరి. చాలా పొగరెక్కిన ఏనుగు, ప్రమాదకారి అని నగరంలో అందరికీ తెలుసు. అది ఎంతమందినైనా కాళ్ల క్రింద నలిపి వేయగలదు. మావటి లేకుండా అది బయటకెలా వచ్చి ఉంటుంది? బుద్దునిపై గురిపెట్టి ఘీంకరిస్తూ రాసాగింది. ఆనంద్‌ బుదుని చేయిపట్టి పక్కకు లాగాడు. బుద్ధ భగవాన్‌ తొణకలేదు, బెణకలేదు. నిశ్చలంగా నిలబడ్డాడు. జనం గగ్గోలుగా అరుస్తున్నారు. బుద్ధుడు ఒక్కసారిగా శ్వాసించి, ఘీంకరించాడు. పూర్వం రక్షితారణ్యంలో ఉండగా తల్లి ఏనుగును మచ్చిక చేసుకోడానికి తను ఏనుగువలె ఘీంకరించడాన్ని అభ్యాసం చేశాడు. ఆ ఘీంకారం వినగానే పది అడుగుల దూరంలోకి వచ్చిన 'నలగిరి చప్పున ఆగిపోయింది. నాలుగుకాళ్లు మడిచి, నేలమోద కూర్చుని, బుద్ధుని ముందు తలవంచింది. బుద్దుడు ప్రేమగా దాని తల నిమిరాడు. అది లేచి వెళ్లిపోయింది. శ శ ఈ బుద్ధుడు, ఇతర భిక్షులు బింబిసారుని అంత్యక్రియలకు హాజరైనారు నాలుగువేల మంది భిక్షులు, కొన్నివేల మంది నగరపౌరులు. దహనసంస్మ్కారాలు పూర్తయిన తర్వాత, ఆ రాత్రి జేతవనంలో విశమించాడు. రాణి వైదేహి నెలరోజులుగా మహారాజును కలవలేదు. బింబిసారుడు చివరి క్షణం వరకు తన మందిర గవాక్షంవద్ద నిలబడి కొండమోది బుద్దుని ఆశమం వైపు చూస్తుండే వాడని జీవకుడు చెప్పాడు. తర్వాత ఒకనాడు జీవకుడు బింబిసారుని భగవాన్‌ బుద్ద 186

మరొక భార్య పద్మావతిని, రాకుమారుడు అభయరాజును బుద్దుని దర్శనార్ధం తీసుకువచ్చాడు. తండ్రిగారి మరణం తర్వాత అతనికి సుఖభోగాల పైన మక్కువ పోయిందని, దీక్ష ఇమ్మని అర్ధించాడు. బుద్ధుడు అతనిని సంఘంలో చేర్చుకున్నాడు.

బుద్ధుని ప్రయాణం చిత్రంగా ఉంటలుంది. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పడు. ఎప్పుడు వచ్చేది తెలియనీయడు. ఒంటరిగా, చేతిలో భిక్షాపాత్ర, పైన ఉత్తరీయం, నడకలో ప్రశాంతత, అనందం లోకి నిషమిస్తున్నాడా అన్నట్లుంటుంది. అది ఎప్పుడూ మహా్రస్థానమే. వేళకాని వేళ బయలుదేరితే, ఎక్కడికో వెళుతున్నట్లే. అడిగే ధైర్యం, వెంట వెళ్ళే సాహసం ఎవరికీ ఉండదు. అకస్మాత్తుగా రాజగ్భహ వదలిపెట్టి నడక సాగించాడు. ఉత్తర దిశగా పయనించి, గంగానదిని దాటి 'కూటగారి విహారం చేరాడు. తర్వాత శ్రావస్తి వెళ్లాడు. అక్కడ జేతవనం చేరుకున్నాడు. వర్షాకాలం విడిది జేతవన విహారంలో. ఆనందుడు, సారిపుత్ర, మౌద్గల్యన, మరో మూడు వందల మంది భిక్షులు తధాగతుని రాకను స్వాగతించారు.

మగధలో రెండుమార్లు బుద్ద్ధునిపై హత్యా ప్రయత్నం జరిగినపుడు విహారాలలోని భిక్షులు విచారించారు. ఆయన కోసం (ప్రార్ధనలు చేశారు. అప్పటి నుండి బుద్ధదర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అక్కడ భిక్షుణి క్షేమ ఉంది. ఆమె ప్రధాన ఉపచారిక. బుద్ధుని ఆగమనవార్త తెలియగానే ప్రసేనజిత్‌ వచ్చాడు. రాజగ్భహలో జరిగిన విషయాలు బుద్దుని నోటిద్వారా విన్నాడు. ప్రసేన సోదరి రాణి వైదేహి. ఆమె వైధవ్యానికి చింతించాడు. ఆమె పైకి గుంభనంగా, నిబ్బరంగా కనిపిస్తున్నా లోపల్లోపల కుమిలిపోతున్నదని చెప్పాడు బుద్దుడు. బింబిసారుని విషయం తనకు వివరంగా తెలియచేయమని మేనల్లుడు అజాతకు కబురు పంపాధు. నెల గడిచినా సమాధానం రాలేదు. మరొక రాయబారిని పంపాడు. వెంటనే అసలైన సమాచారం ఇవ్వకపోతే తానే శ్రావస్తికి రావలసి ఉంటుందని, తగిన గుణపారం చెప్పవలసి ఉంటుందని హెచ్చరించాడు. తన సోదరికి ఆడబడుచు లాంఛనంగా ఇచ్చిన భూభాగాన్ని తిరిగి తను స్వాధీనం చేసుకుంటానని హెచ్చరించాడు. ఆ భూభాగం వారణాసి దగ్గరగా ఉంటుంది. రాబడి చాలా ఎక్కువ.

వర్షాకాలం దగ్గరవుతుండగా శ్రావస్తి పరిసరాలు విహారాలతో, పర్దశాలలతో నిండిపోయాయి. ఎక్కడెక్కడ నుండో భిక్షులు, భిక్షుణిలు వచ్చి చేరసాగారు. 187 భగవాన్‌ బుద్ధ

పదిరోజుల కొకమారు తధాగతుడు జేతవనంలోని సభామందిరంలో ప్రసంగిస్తాడు. మధ్యాహ్నం వేళల్లో ముఖ్యభిక్షులు రోజూ ప్రసంగిస్తారు మొత్తం మిద రెండు మూడు నెలలపాటు గొప్పగా జ్ఞాన విద్యా ప్రసంగాలు, ప్రవచనాలు ఉంబాయి. ధ్యాన సమావేశాలు చెప్పపనిలేదు. రోజు ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ధ్యానంలో ఉంటుంటారు. బుద్దుని మొదటి ప్రసంగం ఈసారి 'ఆనందం' గురించి-

“భిక్షులారా!

“ఆనందం ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఆనంద తీర్థాలున్నాయి. నిత్య జీవితంలో అనందాన్ని అన్వేషించాలి. ఇది ఆనంద సూత్రం. ఆనందం ఇంద్రియ సుఖాలతో లభించదు. ఇంద్రియ సుఖాలలో తృప్తి ఉంటుంది. అది ఆనందాన్నివ్వదు. అనుభూతిని మిగల్బదు. ఇంద్రియ సుఖాలవల్ల చివరికి మిగిలేవి బాధలూ, విచారాలు.

“ఒక కుష్టురోగి అరణ్యంలో జీవిస్తున్నాడు. రాత్రిం బవళ్లు కురుపులు సతాయిస్తాయి. చలికి తట్టుకోలేక, ఒక గుంట తవ్వుకుని, అందులో ముడుచుకుని కూర్చుని చలిమంట వేసుకుంటాడు. ఆ కాస్త వేడి సుఖాన్నిస్తుంది. తాత్కాలికంగా కురుపుల బాధ మరచిపోతాడు. ఆ వేడిని కురుపులపై అద్బుకునీ 'చమ్మ'గా ఉందనుకుంటాడు. అదితప్ప అతనికి వేరే సుఖపడే మార్గం లేదు. కొంత కాలానికి అదృష్టవశాత్తు అతని రోగం తగ్గింది. కుష్టు నయమై మామూలు మనిషి అయినాడు. గ్రామంలోక్రి తిరిగివెల్లి అందరిలా జీవించస్తాగాదు. తర్వాత ఒక రోజున అతను అడవి దారంట పోతున్నాడు. కొందరు కుష్టుళోగులు తోరసపడ్డారు. వారు తనలాగే మంటల వద్ద కూర్చుని కురుపులు వేడిచేసుకుంటూ సుఖపడు తున్నార్ము ఆరోగ్యం పొందిన తను ఇప్పుడు వారి మధ్యకు వెళ్లలేక పోయాడు. చలిమంట కోసం మనసు తొందర చేసినా వెళ్లలేదు. ఆనాడు తను సుఖం అనుకున్నది నిజంగా నరకబాధ. ఆరోగ్యంగా ఉన్న వాడికి 'రోగం) బాధ తెలియదు.

“భిక్షులారా! ఇంద్రియ సుఖాలు ఆ చలిమంటల్త్లాంటివి. కుష్టువాడికి, మాత్రమే అక్కడి సుఖం తెలుసు, ఆరోగ్యవంతునికి ఆ చలిమంటతో పనిలేదు. ఆనందానికి మూలం స్వేచ్చ. స్వేచ్చా జీవనమే స్వచ్చంద, నిరాడంబర జీవనం. జీవితాన్ని సమగ్రంగా అనుభవించడంలోనే ఆనందం ఉంటుంది. ఇష్టాలు, అయిష్టాలు పక్కనపెట్టి ఈ క్షణాన్ని ప్రస్తుతంలో అనుభవించగలగాలి. ఈ క్షణంలో జీవించేదే జీవిత్తం. నిన్నటిది, రేపటిది జీవితం కాదు. అవి జీవితం తాలూకు నీలినీడలు లేదా కలలు. నిన్న రేపులో బ్రతకడం కల ఆనందం అన్నది జీవితంలో ప్రతిక్షణం అనుభవించడం. వేటిలోను తన పాత్ర ఉండదు. దేనిని భిన్నంగా భగవాన్‌ బుద్ధ 188

చూడకూడదు ఆనందం, 'సుఖం అనేవి మనం అనుభవించే స్వేచ్భాజీవనాన్ని బట్టి ఉంటాయి. భయం, విచారం లేనప్పుడు మాత్రమే ఆనందం లభిస్తుంది.

“ఒక పూవును తీసుకోండి, అది కొద్ది సేపట్లో నలిగిపోతుంది, వాడి పోతుంది. సుగంధ పరిమళం కోల్పోతుంది. అయినా పూవు ఎంత ఆనందంగా ఉంటుంది! బ్రతికేది క్షణకాలమే అయినా, అది క్షణికానందం కాదు. తక్షణా నందం. అదే శాశ్వతానంద సూత్రం. ఆ వువ్వు వాసన తగ్గినా బాధపడం, విచారించం. బాగా ఉన్నంతసేపు వాసన చూస్తాం. అనందంగా జీవించ గలిగినవారికి మృత్యువు గురించిన భయం, బాధ ఉండవు. మళ్లీ జన్న్మిస్తామన్న ఆలోచన ఉండదు. జనన మరణాలను విస్మరిస్తారు. బ్రతికినన్నాళ్లు ఆనందంగా జీవించదంలో పూర్ణత్వం ఉంది.

“కొందరి ,నమ్మకం - ఈ జన్మలో: కష్టాలు పడితే వచ్చే జన్మలో సుఖపడతామని. వచ్చే జన్మ సుఖాల కోసం ఈ జన్మలో సుఖాలు త్యాగం చేయాలా? ఇప్పుదు _ఏరికోరి బాధ లనుభవించడం ఎందుకు? జీవితం ఆనందించదానికి ఈ క్షణంలో ఈ జన్మలో సుఖాలు, ఆనందం త్యాగం చేయనవసరంలేదు. త్యాగాలు అర్ధరహితం, మరికొందరు భవిష్యత్తులో శాంతి, సుఖం, ఆనందాల కోసం ఇప్పుడు శరీరాన్ని కష్టపెట్టక తప్పదంటారు. అందుకు ఉపవాసాలు చేస్తారు. మానసికంగా, శారీరకంగా బాధల్ని స్వాగతిస్తుంటారు. వాటివల్ల భవిష్యత్తులో కష్టాలు మిగులుతాయి తప్ప ఆనందం, సుఖం లభించవు. మరికొందరి దృష్టిలో జీవితం ఒక ప్రవాహం. మారడం జీవితానికి సహజగుణం. కష్టాలు, సుఖాలు కావడి కుండలు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచించరు. అలాంటివారు అందినంతవరకు భోగాలు, సుఖాలు అనుభవిస్తారు. ఇంద్రియ సుఖాలు తప్ప ఇంక జీవితంలో కోరదగింది, అనుభవించదగింది ఉండదు వారి దృష్టిలో. ఇంద్రియ సుఖాల వెంటపడిన వారంతా కవ్టాలపాలవుతుంటారు. వారి భవిష్యత్తు నరకం.

“అతి సర్వత్ర వర్టయేత్‌. ,అతి సర్వదా మంచిది కాదు. సుఖాలను అసహ్యించుకుంటూ, ద్వేషిస్తూ జీవితాన్ని ఎండకట్టుకోవడం తప్పు. అలా అని అతిగా అనుభవించి కష్టాల పాలవడమూ తప్పే. వర్తమానం భవిష్యత్తుకు పునాది

కావాలి. భవిష్యత్తును ఆనందమయం చేసుకోవాలంటే వర్తమానంలో నియతి ఉందాలి. పరిమితి ఉండాలి. వైరాగ్యం అంటే శరీరాన్ని శుష్కింపచేస్తూ, మనస్సును క్షోభ పెట్టటం కాదు భవిష్యత్తులోని సుఖాలకు వర్తమానాన్ని బలిపెట్టకూడదు భిక్షు కర్తవ్యం ఏమిటి? తను ఆనందంగా జీవిస్తూ తనచుట్టూ ఉన్న వారికి ఆనందమయ జీవితం ప్రసాదించడం. అందుకు అవసరమైన జ్ఞానం, వివేకం అందించడం. భిక్షులు అవివాహితులుగా ఉండడం, పిల్లల్ని కనకపోవడం నిర్బంధం 189 భగవాన్‌ బుద్ధ

కాదు. నిబంధన కాదు. ఆనందానికి సంసార జీవితం అవరోధం అన్న భావన ఒక్కటే కారణం. బ్రహ్మచర్యం వల్ల శాంతి, ఆనందం లభిస్తాయన్న నమ్మకం. ఆశలు, వాంఛలు తగ్గిపోతాయి. స్వార్ధం ఉండదు. నిరాడంబర జీవనంవల్ల అహంకారం తగ్గిపోతుంది.”

బుద్ధుని ప్రసంగం తర్వాత '“పూర్ణలక్షణ” అనే భక్తురాలు బుద్దునితో వ్యక్తిగతంగా మాట్లాడాలని అద్ధించింది. ఆమె భర్త సుదత్త అనంత పిండిక జబ్బుతో ఉన్నాడు. నీరసించిపోయాడు. లేచి కూర్చునే ఓపికలేదు. ధర్మప్రసంగాలు వినాలన్న ఆరాటం. ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అతని కోరిక తీరే అవకాశం లేదు. ఒక్కసారి, చివరసారిగా బుద్ధుని దర్శించాలని ఆరాట పడుతున్నాదు.

మర్నాడు బుద్దుడు ఆనంద్‌, సారిపుత్రలను వెంటతీసుకుని సుదత్త ఇంటికి వెళ్లాడు. సుదత్తుని ఆరోగ్యం పరామర్శించి బుద్ధుడు అన్నాడు, “సుదత్తా! నీవు జీవితంలో అన్నీ మంచి పనులే చేశావు. మంచివాడుగా పేరు తెచ్చుకున్నావు. ఎందరికో సహాయం చేశావు. వారి బాధలు తొలగించావు. అనంత పిండిక పేరు సార్థకమైంది. ఆపద్భాంధవు డనిపించుకున్నావు. నీ వితరణశీలానికి నిదర్శనం జీవకుని వైద్యశాల. ఆశ్రమం. చక్కగా ధర్మప్రచారం చేశావు. ధర్మంగా జీవించావు. సమాజానికి నీవల్ల మేలు, ఆనందం కలిగాయి. సారిపుత్ర వచ్చి నీకు అండగా ఉంటాడు. సారిపుత్ర నీ ప్రక్మన ఉంటే విహారం మొత్తం నీ ప్రక్కన ఉన్నట్లే.

సుదత్త కన్నీటితో బుద్ధునికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు.

పక్షంరోజుల తర్వాత బుద్ధుడు “సుదత్తుని' మనస్సులో ఉంచుకుని “సామాన్యుని జీవనం గురించి ప్రసంగించాడు-

“ప్రతిఒక్కరు నిత్యజీవితంలో ఆనందం అన్వేషించాలి. ఈరోజు మనం సుఖంగా, ఆనందంగా జీవిస్తే మన భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. మనమే విచారాలను పక్కకు తోసివేయాలి, వాటిని నిర్హక్ష్యం చేయాలి. ఇల్లూ వాకిలి లేని భిక్స్షులు మాత్రమే ఆనందంగా ఉంటారని భావించవద్దు. అదే

“ధనవ్యామోహం వర్ణించండి. అసలైన ఆనందానికి అవరోధం ధన వ్యామోహం. చేస్తున్న పనిలో ఆనందం ఫొందండి. మా కుటుంబంలో అనందం వెతుక్కోండి. 'అనందం' చుట్టూ పరిభ్రమించండి. మొోలోపల బయట ఆనందం కనిపిస్తుంది. అవగాహన ప్రధానం. చిరునవ్వు అనందానికి ప్రవేశద్వారం. భగవాన్‌ బుద్ధ 190

ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతుండండి. అనందం మోలోకి ప్రవహించి వస్తుంది. ఇతరులకు సహాయం చేయడంలో తృప్ప్తిమాత్రమే కాదు, తరగని ఆనందమూ వుంది ఆనందం డబ్బుతోను, కీర్తి ప్రతిష్టలతోనూ ముడిపడి ఉండదని గుర్తించండి”.

షా స

కొన్ని సంవత్సరాల క్రిందట గౌతమబుద్ద్ధునికి సిగాలా అనే వర్తకుడు తారసపడ్డాడు. తను చేతిలో భిక్షాపాత్రతో వెళుతుండగా నగరం బయట ఒక యువకుడు ఎదురైనాడు. అతని పేరే సిగాలా. అతను నాలుగు దిక్కులకు నమస్కారాలు చేస్తున్నాడు. ఆకాశంవైపు చేతులెత్తి నమస్కరించాడు. నేలమిద పడుకుని నమస్కరించాడు. అన్ని నమస్కారాలు ఎందుకని బుద్దుడు ప్రశ్నించాడు.

“ఏమో, నాకేం తెలుసు. చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు అలా చేయాలని. చేస్తున్నాను. ప్రతిరోజు ప్రాతఃకాలంలో నమస్కారాలు చేయడం నాకు అలవాటు”.

“అలాకాదు బాబూ. ఏపని చేస్తున్నా అర్ధం, పరమార్ధం తెలుసుకుని చేయాలి! లేకపోతే ఫలితం ఉండదు. తూర్పు దిక్కుకు నమస్కరిస్తే మన తల్లి దండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల రుణం గొప్పది. అందుచేత రోజూ నమస్కరించి, కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట. దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురుపరంపరకు నమస్మరించినట్లు. పళ్చిమదిక్కు నమస్కారం భార్యాబిడ్డలపై (యేమకు చిహ్నం. ఉత్తరదిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత భూమికి నమస్కరించడం సాటివారి ఆదరణకు కృతజ్ఞత. ఆకాశం వైపు నమస్మరించడం మహర్షులకు, మహాత్ములకు నమస్కరించడం.

“మనిషి మంచిగా జీవించడం అవసరం సిగాలా! కేవలం పది నిమిషాల పాటు నమస్కారం పెడితే చాలదు. మనిషి పరిహరించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి పాటించు మత్తుపానీయాలు సేవించవద్దు. పొద్దుపోయిన తర్వాత వీధులలో సంచరించవద్దు. జూదగ్భహాలకు వెళ్లవద్దు. వ్యభిచార వాడలకు వెళ్లవద్దు. దుష్ప్రవర్తన కలవారితో స్నేహం చేయవద్దు. బద్ధకం, సోమరితనం దగ్గరకు చేరనీయవద్దు.

“మంచిమిత్రుల్ని సంపాదించుకో. అది గొప్ప సంపద. ఎవరు మంచి మిత్రుడంటావా-

  1. నీదగ్గర డబ్బులేకపోయినా నీకు అండగా ఉండేవాడు.
  2. నీవు ఆనందంగా ఉన్నాా విచారంగా ఉన్నా నీ వెంట నడిచేవాడు. 1991 భగవాన్‌ బుద్ధ

3 నీ విజయంలో, అపజయంలో భాగం పంచుకునేవాడు. శీ నీ కష్టాలు, బాధలు సానుభూతితో అర్ధం చేసుకుని ఊరడించేవాడు. 5. నీకు సదా మంచి జరగాలని కాంక్షించేవాడు - మంచిమిత్రుడు. మంచిగా జీవించడానికి మరిన్ని సూత్రాలు : 1 మంచి ప్రవర్తన కలవారితో స్నేహం చేయి. చెడ్డబుద్ది కలవారిని దగ్గరకు చేర్చవద్దు. 2. ఆధ్యాత్మికాభివృద్ధికి మనశ్శాంతికి అనువైన చోట నివాసం ఉండు. 3 మంచి సంగతులు నేర్చుకునే అవకాశం ఎప్పుడు విడిచి పెట్టవద్దు. 4 తల్లిదండ్రుల విషయం, భార్యా బిడ్డల విషయం అశ్రద్ధ చేయవద్దు. 5. ఇతరులకు నీ ఆనందాన్ని పంచు, వారి ఆనందాన్ని నీవు పంచుకో. '6 * తాగుడు, జూదం, వ్యభిచారం పూర్తిగా త్యజించు. '౧ వినయం, సచ్చ్ళీలం, బెదార్యం, నిరాడంబర జీవితం అలవరచుకో. & సదా సత్పురుషుల సాంగత్యం అభిలషించు. ఏ మాత్రం అవకాశం ఉన్నా, వారి బోధనలు స్వీకరించి, ఆచరించు. 9. ధర్మబద్ధంగా జీవించడం అలవాటు చేసుకో. 160. కష్టాలు, బాధలు నివారణ కావదానికి ధ్యానం ఒక్కటే మార్గం. ప్రతిరోజు ధ్యానం చేసుకో”, ధర్మబద్ధంగా, నిరాడంబరంగా జీవించేవారు గృహస్తులైనా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు. అందుకు సుదత్త అనంత పిండిక చక్కని ఉదాహరణ, అతను బ్రహ్మచారి కాదు. అయినా (బ్రహ్మనిష్టాగరిష్టుడు, బ్రహ్మవిద్యావేత్త, ఆదర్శ గృహస్టు. అతని ఇల్లాలు పూర్ణలక్షణ - ఉత్తమ ఇల్లాలు. ధనవంతుల కంటే వారు సుఖంగా, ఆనందంగా జీవించారు. బుద్ధభగవానుడు తన భర్త గుణగణాలను శ్లాఘించడం వల్ల పూర్ణలక్షణ ఆనందం పొందింది. ఆమె అడిగింది, “భగవాన్‌ సంసార పక్షంగా జీవించే వారికి తీరిక ఉండదు. ఎప్పుడు ఏవో పనులుంటాయి. ధ్యానం చేసుకోవడం ఎలా వీలు? ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే ఆశ ఉంటుంది. మనిషికి ఆశ చావదు. జ్ఞానార్దనకు భిక్షు జీవనమే యుక్తమనిపిస్తుంది.” బుద్ధుడు : “పూరా! భిక్షులకూ బాధ్యతలున్నాయని మరచిపోకు. సంసారుల కంటే భిక్షులు ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి. 'మిరు 'సంసారపక్షంగా కొన్ని భగవాన్‌ బుద్ధ 192

నియమాలు, దర్శాలు పాటిస్తే చాలు. నియమంగా ఒక నెలకు రెండు మార్లు ఆశమంగాని, విహారంగాని దర్శిస్తే చాలు, ధర్మబోధ వింటే చాలు. మానసికంగా మారు భిక్షుభావనతో జీవించగలుగుతారు. భిక్షులు కానవసరం లేదు. దీక్ష తీసుకోనవసరం లేదు. సంసారులకు ధార్మికజీవనం చాలు”. శ స అంతలో కోసల, మగధ దేశాలపైన యుద్ధ మేఘాలు ్రమ్మాయి. అజాత శత్రు స్వయంగా సైన్యాన్ని గంగానది దాటించి కాశీలో ప్రవేశించాడు. కాశీ కోసల రాజ్యంలోది. చతురంగ బలాలు రంగంలోకి దిగాయి. వెళ్లి బుద్దుని ఆశీస్సులు పొందే వ్యవధి లేకపోయింది. తన కుమారుడు జేతను పంపాడు జరిగిన విషయం చెప్పమని. అజాతశత్రు కన్నతండ్రినే చంపుకున్న దుర్మార్డుడు. ఆ ప్రాంతం ఒకప్పుడు బింబిసారునిదే. చెల్లెలికి పెళ్లి సమయంలో బహుమానం ఇచ్చాడు. దానిపైన నూరువేల వరహాల రాబడి ఉంది. అజాతశత్రు ఆ రాబడి వదులు కోవడం ఇష్టంలేక యుద్దానికి తలపడ్డాడు. యుద్ధం జరిగినన్ని రోజులు ఎక్కడికీ ధర్మబోధకు వెళ్లవద్దని సారిపుత్ర మిగిలిన ముఖ్య భిక్షులను హెచ్చరించాడు. బుద్దుని కూడా శ్రావస్తి వదలి వెళ్లవద్దని అర్ధించాడు. రెండు నెలలకు ఒక దుర్వార్త వచ్చింది. యుద్ధంలో ప్రసేనజిత్‌ చాలా సైన్యాన్ని కోల్పోయి, వెనుతిరిగి వస్తున్నాడని. పరిస్థితి విషమంగా వుంది. (ావస్తి నగరానికి వచ్చిన నష్టం లేదు. అజాతశత్రు దృష్టి కాశీపైన మా్రమే. ఒకవేళ దురాశతో శ్రావస్తిపై దండెత్తి వచ్చినా, అజాత సేనలు శ్రావస్తిలో ప్రవేశించలేవు. కోట దుర్ఫేద్యంగా వుంది - ఈలోగా ప్రసేన సేనాపతులు కొత్త వ్యూహం రచించి తిరిగి దాడిచేశారు. ఈ పోరాటంలో ప్రసేన విజయం సాధించి అజాతశత్రును, అతని సేనాపతుల్ని బందీలుగా పట్టుకున్నారు. వేయిమంది సైనికులు పట్టుబడ్డారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు చేతికి చిక్కాయి. శత్రుసైనికులు చాలామంది హతులైనారు. కొద్దిమంది ప్రాణాలతో పారిపోయారు. అజాతశత్రు ప్రసేనకు బందీ అయినాడు. ావస్తి విజయోత్సవం జరుపుకుంది. ఆరునెలలపాటు యుద్ధం సాగింది ప్రసేన జేతవనానికి వచ్చి బుద్దుని దర్భించి, యుద్ధం వల్ల కలిగిన కష్టనష్టాలు వివరించాడు. “అజాత తానుగా దండెత్తి రావడంవల్ల యుద్ధంలోకి దిగక తప్పలేదు భగవాన్‌. అతనికి ఎవరో దుష్టసలహా ఇచ్చి ఉంటారు. లేకుంటే అంత సాహసానికి ఒడిగట్టడు ... “భగవాన్‌ అజాత పరాయివాడు కాడు. నా మేనల్లుడే. అతనిని చంపలేను బందీగా ఉంచడం ఉచితం కాదు. ఏదైనా మార్గాంతరం సూచించండి”. 193 భగవాన్‌ బుద్ధ

“రాజా! నీకు మంచి సలహాదారులున్నారు. యోగ్యులైన మంత్రులున్నారు: ఎప్పుడు మంచివారినే విజయం వరిస్తుంది. సత్యానిదే పైచేయి. ధర్మో రక్షతి రక్షితః. అజాతశత్రు సలహాదారులు మంచివారు కారు. కుటిలురు. అందువల్లనే ఓటమి. నీకు మేనల్లుడు కనుక మంచి మాటలు చెప్పండి. తర్వాత సగౌరవంగా సాగనంపండి. దేశంలో శాంతి భద్రతలు పాలకుల బెదార్యం పైన అధారపడి ఉంటాయి

బుద్ధుడు ఒక భిక్షుని పిలిపించి ప్రసేనకు పరిచయం చేశాడు. “ఇతని పేరు శీలవ్రతుడు. ఒకప్పుడు రాకుమారుడు. బింబిసారుని కుమారుడు. అంటే అజాతకు సోదరతుల్యుడు. మేధావి. మౌద్గల్యుని వద్ద శిక్షణ పొందుతున్నాడు. పదహారవ ఏటనే సంఘంలో చేరాడు. ఇతనికి రాజ్యకాంక్ష లేదు. పదవిపై వ్యామోహం లేదు. నీస్సంగుడు. అతనికి అజాతశత్రువల్ల హాని జరగవచ్చునని మౌద్గల్యుని అనుమానం.”

రాజగ్భహ పరిస్థితులు వివరించమని ప్రసేనజిత్‌ శీలవ్రతుని అడిగాడు. “నన్ను చంపడానికి ప్రయత్నం జరిగింది మహారాజా! తప్పించుకున్నాను. నన్ను హత్య చేయాలని వచ్చినవాడు ఇప్పుడు సంఘంలో చేరాడు మనస్సు మార్చుకుని.”

బుద్ధుని వద్ద సెలవు తీసుకుని ప్రసేనజిత్‌ రాజభవనానికి వెళ్లిపోయాడు.

కొద్దిరోజుల తర్వాత అజాతశత్రుని విడుదల చేశాడు. తన కుమార్తె వజీర నిచ్చి పెళ్లి చేసి కాశీ దగ్గర భూముల్ని ఆమెకు కట్నంగా యిచ్చాడు. ఇప్పుడు అజాతశత్రు ప్రసేనకు మేనల్లుడే కాదు, అల్లుడైనాదు.

యుద్ధానంతరం దేశం శాంతించింది. వప్రసేన నగరం పరిసరాలలో ఒక పెద్ద భవనం కట్టించి విహారానికి సమర్పించాడు. దాని పేరు రజతారామం. తర్వాత రెండు సంవత్సరాలు బుద్ధుడు ఎక్కడకు వెళ్లలేదు. మగధలో దేవదత్తుని ప్రాభవం సన్నగిలుతున్న వార్తలు భిక్షులు తెస్తున్నారు. అజాత అతనిని బొత్తిగా పట్టించుకోవడం లేదు. యుద్ధం తర్వాత ఒక్కసారైనా దేవదత్తుని దర్శించలేదట. దేవదత్తుని వద్ద మిగిలిన నూరుగురు ఛిక్షులలో ఎనఖైమంది వేణువనానికి వచ్చి చేరారు. దేవదత్త ఒంటరివాడైనాడు. బాగా జబ్బు చేసింది. గయశీర్న వదలలేని పరిస్థితి. బౌద్ధ సంఘం తిరిగి మగధ వస్తుందని జనం ఆశిస్తున్నారు.

కోసల రాణి మల్లిక కాలం చేసింది. భార్య వియోగంతో ప్రసేనజిత్‌ విరాగి అయినాడు. నలభై సంవత్సరాల అనుకూల దాంపత్యం వారిది. బుద్దుని విహారంలో ప్రసేనకు మనశ్శాంతి లభిస్తోంది. భగవాన్‌ బుద్ద 194

ఒకనాడు తధాగతుడు విశాఖ ధర్మశాల బయట కూర్చుని అస్తమిస్తున్న సూర్యుని తదేకంగా గమనిస్తున్నాడు. ఆ పారవశ్యం ఆనందుడు గమనించాడు. అలా సూర్యాస్తమయాన్ని వీక్షించడం బుద్దునికి మహాయిష్టం. ఆనందుడు బుద్ధుని కాళ్ల వద్ద కూర్చుని, కాళ్లు వత్తుతున్నాడు.

“భగవాన్‌! గత పదిహేను సంవత్సరాలుగా మికు నీడగా ఉంటున్నాను. లోగడ మి చర్మం గట్టిగా ఉండేది. ఇప్పుడు మెత్తబడి ముడతలు పడ్డది. ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి” అన్నాడు ఆనంద్‌,

బుద్ధుడు చిరునవ్వు నవ్వి “ఆనంద్‌! ఇంకా ఎన్నాళ్లు నీకీ సేవాశిక్ష నాకు చూపు మందగించబేదు. వినికిడి దోషం లేదు. నీకు వేణువనాన్ని చూడాలని ఉందా? న్యాగ్రోధ పర్వత శిఖరంపైన మన ఆశ్రమం జ్ఞాపకం వచ్చిందా? అక్కడ అస్తమయం రమణీయంగా ఉంటుంది కదూ?”

“క్షమించండి, భగవాన్‌! అది నా ఆకాంక్ష కాదు. నేను మితో వస్తాను అనుమతిష్తే”,

మగధకు ప్రయాణమైనారు. చాలా రోజులు నడవవలసీ నచ్చింది. వృద్దాప్యం వల్ల మార్గమధ్యంలో అన్ని బౌద్దారామాలలో నిలిచి, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం. శాక్య, మబ్ల, విదేహీ, వజ దేశాలు, నలందలోని సంఘాన్ని దర్శించారు. వేణువనం కళకళ లాడుతోంది. దాని అందాలు తగ్గలేదు. శోభాయమానంగా, ఆధ్యాత్మికసొందర్యంతో ఉట్టిపడుతోంది. న్యాగ్రోధ పర్వతం సొగసు అలానే వుంది. ఎందరో బుద్దుని దర్శించడానికి వచ్చారు. ఒకనెల తర్వాత జీవకుని ఆశ్రమానికి వెళ్లారు. జీవకుడు చూతవనంలో చాలా పెద్ద విహారం కట్టించాడు. వేయి మంది ఖిక్షులు అక్కడ హాయిగా ఉండవచ్చు.

ఈ మధ్యకాలంలో జరిగిన విశేషాలు జీవకుడు పూనగుచ్చినట్లు వివ రించాడు. వైదేహి ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి సాధించింది. అజాతశత్రు మానసి కంగా చాలా క్రుంగిపోయాదు. తండ్రిగారి ఆత్మ అతనిని వెన్నాడుతోంది. రోజూ పీడకలలు కంటున్నాడు. ఎందరో భిషగ్వరులు ప్రయత్నించి అతనికి స్వస్థత కలిగించలేకపోయారు. ఒకరోజు అజాతశత్రు. భార్య, తల్లి కొడుకుతో కలిసి భోజనం చేస్తున్నాడు. కొడుకు ఉదయభద్ర మూడదేళ్లవాడు. వైదేహివద్ద అతనికి గారాబం ఎక్కువ. కొడుకు కోదిందల్లా సమకూర్చడం అజాతకు అలవాటు. ఏదీ కాదనడు. పుత్రశ్రేమ జాస్తి, భోజనం చేస్తూ ఉదయభద్ర పెంపుడు కుక్కను ఒళ్లో పెట్టుకున్నాడు. అజాత చిరాకు పడ్డాడు. అసలే అతని మనసు చిరాకుగా ఉంటోంది. ఈ కుక్క చిరాకు భరించలేకపోయాడు. తల్లితో నిష్టురంగా అన్నాడు, “అమ్మా! భోజనం దగ్గర కుక్క ఏమిటి అసహ్యంగా".

195 భగవాన్‌ బుద్ధ

“తప్పేం ... కొడుకు మిది పప్రేమకదా భరించు. నీమిద (ప్రేమతో మా నాన్నగారు ఎన్నెన్ని అవమానాలు భరించలేదు!”

అజాతకు చికిత్స చేయడానికి జీవకుని పిలిపించారు. చెప్పిన వన్నీ విన్నాడు. జీవకుడు నోరు విప్పలేదు.

“నేను మాట్లాడటమే తప్ప, నీవు నోరు విప్పవా జీవకా!”.

“ఏం చెప్పను రాజా! నీకు సహాయం చేయగల ఒకే ఒక వ్యక్తి బుద్ధ భగవానుడు. ఆయన దగ్గర నీ రోగం కుదురుతుంది. మనో క్షేశానికి మందులు పనికిరావు. వెళ్లి బుద్ధుని కాళ్ల మొద పదు”.

కొద్ది నిమిషాలు మౌనం వహించి అడిగాడు : “గౌతమబుద్ధుడు నన్ను క్షమిస్తాడా! నేనంటేనే ఆయనకు అసహ్యం కదా!”

“తప్పు అజాతా! అలా అనకు. తధాగతునికి విరోధులుండరు. ఆయన అహింసా జ్యోతి. కరుణశ్రీయుతుడు. పైగా మితండ్రిగారికి పరమ ఆప్పుడు. నీవు ఆయన దగ్గరకు వెళ్లితే నీ తండ్రిగారి ఆత్మ సంతోషిస్తుంది. శాంతిస్తుంది. ఆయన నీకు పితృసమానుడు. ఆయనగారి అనుగ్రహం సంపాదిస్తే నీకు మనశ్శాంతి లభిస్తుంది. బుద్దడేవుని కరుణ ముందు మా మందులు వెలవెల పోతాయి. ఆయన ధన్వంతరి. ఇహ, భవ రోగాలకు చికిత్స చేయగలవాడు ఆయన ఒక్కరే”

అజాతశత్రు ఆలోచించాడు.

జీవకుడు తన విహారంలోనే అజాత, బుద్ధదేవుల సమాగమం ఏర్పాటు చేశాడు. అజాత ఏనుగునెక్కి పరివారంతో చూతవనానికి వచ్చాడు. వెన్నెల రేయి. వనం నిశ్శబ్దంగా ఉంది. అజాతకు భయం వేసింది. అందరూ ఎక్కడికైనా వలస వెళ్లలేదు గదా! బుద్ధుడు ధ్యానమందిరంలో ధ్యానంలో ఉన్నాడని తెలిసింది. వేయిమంది సమక్షంలో 'అహింసాజ్యోతి" వెలుగుతున్నట్లు బుద్ధదర్శనమైంది.

ధ్యానం ముగిసిన తర్వాత బుద్ధుడు అజాతను చూచి చిరునవ్వు నవ్వాడు. అజాత సాష్టాంగ నమస్కారం చేసి, “భగవాన్‌! ఎప్పుడో, చిన్నప్పుడు మా ప్రవచనం విన్నాను. అప్పుడు చిన్నవయసు. ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్వలడిగి సందేహాలు తీర్చుకోవాలని వచ్చాను”. “అడుగు అజాతా”,. అజాత : ఆధ్యాల్మికత వల్ల ప్రయోజనం ఏమిటి భగవాన్‌? ఇన్ని వేల మంది ఇళ్లు, వాకిళ్లు, సంసారాలు వదిలి భిక్షులుగా మారడానికి కారణం ఏమిటి? భగవాన్‌ బుద్ధ 196

బుద్దుడు . ఈ ప్రశ్న ఎప్పుడైనా మా గురువు దేవదత్తను అడిగావా? అజాత * దాదాపు ఓ డజను మంది మహాగురువులనే అడిగాను. ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. బుద్ధుడు . ఒక సేవకుడున్నాడనుకుందాం. అతనికి ఒక యజమాని ఉంటాడు. యజమాని చెప్పిన పనులన్నీ సేవకుడు రాత్రింబవళ్లు చేస్తుంటాడు. ఒకనాడు సేవకుడు అనుకున్నాడు “ఈయనా మనిష్కి నేనూ మనిషినే గదా! ఆయన తిట్టడం, నేను పడడం ఏమిటి!” అని. పని వదిలిపెట్టి వెళ్లి సన్యసించాడు. ఆ తర్వాత యజమాని సేవకుని కలిశాడనుకో. ఇదివరకు చెప్పినట్లు పనులు చెప్పగలడా! “అరే ఒరే! అనగలడా?” అజాత : లేదు. గౌరవంగా చూస్తాడు, నమస్కరిస్తాడు. బుద్దుడు : అంతకు మించి ఏం ఫలితం కావాలి. అతనికి సామాజిక బంధాలు లేవు. అదనంగా గౌరవం దక్కింది. పూజనీయుడైనాడు. రెండవ ఉపయోగం: భయం లేకపోవడం. భిక్షువు దేనికీ, ఎవరికీ భయపడడు. ఎవరికీ తలవంచడు. అతనికి డబ్బు అవసరం లేదు. సంపాదనపై ధ్యాస ఉండదు. కీర్తి వ్యామోహం ఉండవు. కోరికలు లేకుండా జీవిస్తాడు. ఎంత హాయి! ధ్యానం వల్ల ఆనందం లభిస్తుంది. ఎలాంటి కలతలు, వికారాలు ఉండవు. గొప్ప అనుభవాలు కలుగుతాయి. జీవితానికి నిర్వచనం తెలుస్తుంది. అర్ధం అవగతమవుతుంది. బంధాలు లేనివాడు విముక్తుడే గదా! ఈ చెప్పిన విషయాలు భిక్షులకే పరిమితం కావు, రాజా! అందరికీ అందుబాటులో ఉంటాయి. (22) బుద్ధ భగవాన్‌ జీవితం పైన వృద్దాప్యప్తు నీలినీడలు పరచుకుంటున్నాయి. ఆరోగ్యం సహకరించకపోయినా, ఆనందుని సహాయంతో అన్ని విహారాలు దర్శిస్తున్నాడు. బౌద్ధ సంఘాల అవసరాలు చూడవలసిన బాధ్యత ఏర్పడింది. ఇరవై సంవత్సరాలలో ఆనందుడు ఒక్క రోజైనా బుద్దుని వదిలి ఉండలేదు. జేతవనం వచ్చిన వార్త తెలియగానే ప్రసేనజిత్‌ పరుదున వచ్చాడు. ఆయనకు రాజ్యభోగాలపైన మనసులేదు. పరిపాలనా వ్యవహారాలు మంత్రులకు అప్పగించి ధ్యానంలో గడుపుతున్నాడు. మారువేషంలో దేశంలో పర్యటిస్తున్నాడు. తనను ఎవరూ మహారాజుగా గుర్తించడం లేదు. ఒక విరాగి అనుకుంటున్నారు. నిరాడంబర జీవితం రుచి మరిగాడు. ఆనందంగా వుంది. బుద్దుని దర్శించి, తన మనసులోని బాధ చెప్పుకున్నాడు. 197 భగవాన్‌ బుద్ధ

“భగవాన్‌, ఇప్పుడు నా వయస్సు 78 సంవత్సరాలు. మోదీ అంతే ననుకుంటాను. పర్యాటనంలో నన్ను నేను తెలుసుకున్నాను. శ్రేమ విలువ గ్రహించాను. ప్రేమించడంలోని ఆనందం, తృప్తి అద్భుతం. నేనొక తప్పుచేశాను. అది నన్ను క్రుంగదీస్తోంది. నాపైన ఒక సారి కుట్ర జరిగింది. సర్వ సేనాపతి “బందులి కుట్ర చేశాడని నా అనుమానం. అతనిని ఉరి తీయించాను. తర్వాత తెలిసింది అతనికీ కుట్రకు సంబంధం లేదని. అతని కుటుంబాన్ని ఆదుకున్నాను. అతని మేనల్లుడు కరయానను సేనాధిపతిని చేశాను”.

కొంతకాలం తర్వాత బుద్ధుడు ఆనందుడు ఒక దిక్కుగా, ప్రసేన వేరొక దిక్కుగా ధర్మబోధకు బయలుదేరి వెళ్లారు. బుద్ధుడు కురు, కోసల, వారణాశి, వైశాలిలో పర్యటించాడు. శాక్యదేశంలో '“మిడులంసొ గ్రామంలో ఉండగా ప్రసేనజిత్‌ వచ్చి కలిశాడు. తను ఆప్రాంతంలో పర్యటిస్తున్నాడట. బుద్ధుడు ఉన్నచోటుకు ఒకపూట ప్రయాణం. యువరాజు, సేనాపతి కరయనతో కలిసి రథాలలో వచ్చారు. బుద్దుడు విడిదిచేసిన అరణ్యం వెలుపల రధాలు నిలిపి లోపలకు వచ్చాడు. ప్రసేన తన కిరీటం, కరవాలం, రాజముద్రిక సేనాపతికిచ్చి “నీవు వెళ్లి రథం దగ్గర ఉండు. నేను వస్తాను" అని చెప్పి పంపాడు. సారిపుత్ర,

ఆనందుడు బుద్ధునివద్ద ఉండడంతో చాలా సేపు ముచ్చట్లతో గడిచిపోయింది. ప్రసేన అకస్మాత్తుగా బుద్ధదేవునికి పాదాభివందనం చేశాడు. బుద్ధుడు పాదాభివందనాలు అంగీకరించడు. దీక్షా సమయంలో తప్ప ఎవరినీ నమస్కారాలు చేయనీయడు. మహారాజు నమస్మరించేసరికి కొంచెం తొట్రుపడి “ఏమిటి మహారాజా! ఈ పని, ఈ నమస్కారాలు నాకు ఇష్టం ఉండవని తెలుసు గదా! మనది యాభై సంవత్సరాల మైత్రి. లాంఛనాలు బొత్తిగా అవసరం లేదు. ఇకపైన ఇలా చేయకండి”. ప్రసేన : లేదు భగవాన్‌, నా హృదయం ఆనందంలో నర్తిస్తోంది. పట్టలేకపోయాను. నాలో రగిలే అగ్నులు చల్లారాలంటే మాపాద స్పర్శ అవసరం అనిపించింది. ఇన్ని సంవత్సరాల పాటు నిరాడంబరంగా జీవించ గలిగింది మీరొక్కరే. ఎక్కడ ఎవరిలో చూచినా స్వార్ధం, ద్వేషం కనిపిస్తాయి. 'ప్రసేన సెలవు తీసుకుని బయలుదేర బోతుండగా “మో ఆరోగ్యం జాగ్రత్త మహారాజా! జాగ్రత్తగా ఉండండి” అన్నాడు బుద్దుడు. | ( బయటకు వచ్చే సరికి మూడు రధాలలో ఒక్కటే వుంది. రెండు రధాలను సనాపతి 'కారయన' శ్రావస్తికి పంపివేశాడు. ప్రసేన కిరీటం, కరవాలం, రాజముద్రిక అతనివద్దనే ఉన్నాయి. శ్రావస్తి చేరగానే యువరాజు విదుధరను భగవాన్‌ బుద్ధ 198

సింహాసనం ఎక్కించి తాను పెత్తనం చలాయించసాగాడు. మోసం జరిగిందని తెలిసిపోయింది. ప్రసేన సరాసరి రాజగ్భహ వెళ్లి తన మేనల్లుడు, అల్లుడు అయిన అజాతశత్రు సహాయం అర్జించదలిచాడు. సేనాపతి కుట్రను ఎదుర్కోవాలంటే తగిన సైన్యం బలగం కావాలి. రెండు రోజులు నిరాహారంగా నడిచి, రాజగ్భహ చేరి అలసిపోయాడు. నగరం చేరేసరికి అర్ధరాత్రి దాటింది. ఆ సమయంలో రాజభవనంలో ప్రవేశించడం, అంతఃపురంలో ప్రవేశించడం కష్టం. తన అవతారం చూచి, ఎవరూ మహారాజు అనుకోరు. రాజ దుస్తులు లేవు. రాజముద్రిక లేదు. తనను గుర్తించడానికి వీలుగా రాజభటులు పక్కన లేరు. ఒక అనాథగా, బికారిగా ఓ సత్రం చేరాడు- రాత్రికి అక్కడ విశ్రమించి తెల్లవారి రాజమందిరం చేరాలని. అలసిపోయి ఉండడం వల్ల గాఢని[ద్ర పట్టింది. నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.

ఉదయం అజాతశత్రుకు సత్రంలో ఎవరో చనిపోయినారన్న వార్త తెలిసింది. ఆ పోయింది తన మేనమామ. అక్కడే అంత్యక్రియలు జరిపించాడు. తర్వాత విదుధరపై దండయాత్రకు బయలుదేర బోతుండగా విమల కౌండిన్య సలహా ఇచ్చాడు. విమల కౌండిన్య ఎవరో కాదు, పూర్వాశ్రమంలో జీవకుడు. “మహారాజా! ప్రసేనజిత్‌ ఎటూ మరణించాడు. సింహాసనం ఎక్కింది ఆయన కుమారుడే గదా. అతనే వారసుడు. యుద్ధం చేసి ఏం చేస్తారు! ఎవరికి న్యాయం చేస్తారు...”

యుద్ధ ప్రయత్నం ఆపి విదుధరను ఆశీర్వదిస్తూ అభినందన సందేశం పంపాడు.

శ శ్ర 2

గౌతమ బుద్దుని శిష్యులలో ప్రధమశ్రేణికి చెందినవాడు మౌద్గల్యన. నిర్భయంగా నిజం చెప్పగల సాహసి. నిజాయితీ పరుడు. ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి కనుక అతనికి చాలామంది శత్రువులు ఏర్పడ్డారు. ఆనాడు ఇద్దరు భిక్షులతో కలిసి ప్రాతసమయాన బయటకువెళ్లి వస్తుండగా చెట్ల మాటున పొంచి ఉన్న శత్రువులు ఎవరో అతనిపైన బడి చితక్కొట్టారు. ప్రక్కన ఉన్న ఇద్దరు భిక్షులు చనిపోయారు. మౌద్దల్యన అరుపులు విని విహారంలోని భిక్షులు బయటకు వచ్చే సరికి హంతకులు పారిపోయారు. పాపం! మౌద్గల్యన దారుణంగా మరణించాడు.

బుద్ధుడు తిరిగి వచ్చేసరికి శవదహనం పూర్తిచేసి అతని చితాభస్మం, అస్థికలు కొత్త కుండలో భద్రంచేసి బుద్ధభగవానుని అశ్రమం బయట ఉంచారు. బుద్దుడు రాగానే సారిపుత మౌద్దల్యన మరణవార్త వినిపించాడు. బుద్ధుడు విచారంతో తన కుటీరం తలుపులు వేసుకుని ఒకరోజంతా బయటకు రాలేదు. 199 భగవాన్‌ బుద్ధ

ఇంతకాలం సారిపుత్ర, మౌద్దల్యన సోదరులుగా జీవించారు. వారి అన్యోన్యత అనితర సాధ్యం. మర్నాడు స్వయంగా సారిపుత్ర కుటీరానికి వెళ్లి ఓదార్చాడు. మౌద్గల్యన మరణం బుద్దుని క్రుంగదీసింది. గుండె చెరువైంది. కన్నతండ్రి మరణించినప్పుడు కూడా సిద్ధార్ధుడు అంతగా బాధపడలేదు. యోగంలో 'ప్రాణసమానుడైన ఒక మిత్రుడు మౌద్దల్యన మరణం తీరని వేదన మిగిల్చింది. ఆత్మీయులు ఒక్కొక్షదే దాటి పోతున్నారు. ప్రసేన, మౌద్గ్దల్యన - ఇద్దరిదీ దారుణమైన మరణమే. బుద్ధుడు సారిపుత్రను ఓదార్చగలడు. కాని బుద్దుని ఓదార్చేవారెవరు? మధ్యదారిలో ఆనందుడు కనిపించాడు. “ఆనంద్‌! ప్రతివారు నీ మేధాశక్తిని 'ప్రశంసిస్తారు. నీ జ్ఞాపకశక్తి అమోఘం అంటారు. ఆ ప్రతిభ చాలదు ఆనంద్‌! తధాగతుని, సంఘాన్ని రక్షంచవలసిన బాధ్యత నీపైన ఉన్నది. జనన, మరణాలు ధ్యానంతో అధిగమించగలంకాని మనస్సు బాధపడుతుంది గదా. కళ్లలో తడిని ఎవరాపగలరు ఆనంద్‌?” ఆనంద్‌ తలవంచుకుని మౌనంగా బుద్దుని అనుసరించాడు. ఆ మర్నాడు మౌ ద్గల్యన అస్థికలపై స్తూపాన్ని నిర్మించాలన్న నిర్వయం జరిగింది. బుద్ధుని ఆత్మీయులు ఒకరి తర్వాత ఒకరు (వప్రవంచం నుండి నిష్ర్రమిస్తున్నారు. కౌండిన్య, మౌద్దల్యన, కశ్యప సోదరులు లేనిలోటు ఎవరు పూరించగలరు! భిక్షుణి మహాప్రజాపతి కాలం చేసింది. తర్వాత యశోధర, ఆ తర్వాత ఆరు నెలలలోపునే రాహుల్‌ వెళ్లిపోయారు. మిగలింది తను ...! బ్‌ పొద్దువాలిపోతున్నది. ఆకాశంలో అక్కడక్కడ నల్లమబ్బులు విషాద జీమూతాలను తలపిస్తున్నాయి. పర్వతసానువులవద్ద నిలబడి బుద్దుడు జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాడు. దూరంగా ఎవరో కొండ ఎక్కుతున్నారు. గడమంచం పైన ఎవరినో మోసుకువస్తున్నారు. ఒక భిక్షువు పరుగున వచ్చి బుద్ధునికి చెప్పాడు “దేవదత్తుల వారు మా దర్శనం కోసం వస్తున్నారు భగవాన్‌”. అవును, దేవదత్తుని పరిస్థితి బాగాలేదు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో మంచం పట్టాడని విన్నాడు, మృత్యువు సమోపించడంతో రోజూ “బుద్ధనామస్మరణ చేస్తున్నాడు. వెంటనే తన పర్దశాలకు చేరాడు. దేవదత్త అనుంగ శిష్యుడు కోకాలిక ఎప్పుడో చనిపోయాడట. ఇప్పుడు గయశీర్నలో దేవదత్తునికి అండగా ఉంది ఆరుగురు భిక్షులే. బుద్దుని చూడగానే చేతులు జోడించి నమస్కరించాడు దేవదత్త. భగవాన్‌ బుద్ద 200

మంచం నుంచి లేవలేదు. నోట మాట లేదు. ఎంత దయనీయ స్థితి. ఎలాగో గొంతు సదిచేసుకుని “బుద్ధం శరణం” అనగలిగాడు. బుద్దుడు దగ్గరగా వెళ్లి అతని నుదురు స్పృశించాడు. ఆ స్పర్శలో ఎంత కరుణ, ఎంత సాంత్వన, దయ. ఆ సాయం(త్రమే దేవదత్తుడు కన్నుమూశాడు. బుద్ధదేవుని ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచాడు.

జ శ 3

వసంతకాలం ఆకాశం నిర్మలంగా వుంది. ఎక్కడా మబ్బుతునక లేదు. ఎండ, చలి సమతూకంలో ఉన్నాయి. ప్రయాణానికి అనుకూలం వసంతం. అంతలో అజాతశత్రు నుండి ఒక సందేశం తెచ్చాడు వేగు ... గంగ కద్దరి వజిపై తాను దండెత్త దలచినట్లు వర్తమానం. బుద్దుని వెనకనే ఉన్నాడు ఆనంద్‌. 'అనందొతో అన్నాడు-

“వజ్ర ప్రజలు రాజకీయాలు చర్చిస్తుంటారా?”

“లేదు భగవాన్‌! సల్లక్షణంగా, హాయిగా ఉంటారు”.

“ప్రజలు రాజును గౌరవిస్తారా? విమర్శిస్తారా?”

“ఎంతగానో ప్రేమిస్తారు, గౌరవిస్తారు గురుదేవా?”

“వారికి సత్చురుషుల పట్ల గౌరవం ఉందా! మహాత్ముల్ని ఆరాధిస్తారా?”

“గొప్పగా ఆరాధిస్తారు బుద్ధదేవా!”

“దేశంలో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయా?”

“అదీ లేదు, మంచి శీల స్వభావులు, మర్యాదస్తులు”.

“ఆనంద్‌! మగధరాజు వజ్రిని జయించలేడని చెప్పు. ప్రజలు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉన్నపుడు పరదేశీయులు దండెత్తి గెలవడం అసంభవం”.

అజాతశత్రు కుటిల స్వభావం బుద్ధునికి తెలియనిది కాదు. అతను ఎప్పటికైనా వజ్రిపై దందెత్తి పరాభవం చెందుతాడు.

ఒకరోజు వావ్యోళి ముగించుకుని, సరాసరి ధ్యానమందిరానికి వెళ్లాడు. అందరూ సమావేశ మందిరంలో ధ్యానానికి సిద్ధంగా ఉన్నారు. బుద్ధుడు సరాసరి వేదిక నెక్కి ప్రసంగించాడు.

“భిక్షు సోదర, సోదరీమణులారా!

“బుద్ధం, ధర్మం, సంఘం విడదీయరానివి. అది త్రివేణీ సంగమం. సంఘం, ధర్మం కలిసే ఉంటాయి పాలు తేనెలా. ధర్మరక్షణకు ిక్షులు కొన్ని సూత్రాలు పాటించాలి. అప్పుడు ధర్మం శాశ్వతంగా నిలుస్తుంది.

201 భగవాన్‌ బుద్ద

  1. భిక్షులు తరచుగా కలుస్తూ బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేస్తుండాలి
  2. ఎప్పుడూ ఐకమత్యంగా ఉండండి. అపార్థాలకు తావివ్వకండి. ౩. సూత్రాలు, ధర్నాలు గౌరవించండి, ఆచరించండి, బోధించండి. 4 అనుభవజ్ఞులైన భిక్షు సోదరుబ మాటలు గౌరవించండి, మన్నించండి.
  3. కోరికలు, అత్యాశలు లేకుండా నిరాడంబరంగా జీవిస్తూ పవిత్రంగా ఉండండి.
  4. విశ్వశాంతిని, నిర్మలజీవితాన్ని కాంక్షించండి. "7. ధ్యానాన్ని అలక్ష్యం చేయకండి. ధ్యానంవల్ల శాంతి, ఆనందం లభిస్తాయి. అన్ని సమస్యలకు పరిష్మారం ధ్యానమే. ధ్యానాన్ని ధ్వానించండి. ఈ సప్తసూత్రాలు ఆచరిస్తే ఎప్పటికీ ధర్మం నశించదు. బౌద్ధ సంఘం విచ్చిన్నం కాదు. మిరు ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మరొక విషయం : ఎప్పుడూ వ్యర్థమైన చర్చలలో పాల్గొనవద్దు. అతిగా నిద్రించవద్దు. కీర్తిప్రతిష్టలకు పాకులాడవద్దు. కోరికల వెంట పరుగులు తీయవద్దు. సీతి బాహ్యులతో స్నేహం చేయకండి. సదా జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ఉండండి”. భిక్షులు ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్లిన తర్వాత ఆనంద్‌తో అన్నాడు. “రేపు మనం వేణు వన విహారానికి వెళుతున్నాం”. బుద్ధుని వెంట నూరుమంది ిక్షులు, ఆనందుడు, సారిపుత్ర, అనిరుద్ర బయలు దేరారు. నలందలో పవరిక విహారంలో విడిదిచేశారు. మరునాడు సారిపుత్ర బుద్దునితో కలిసి చాలాసేపు ధ్యానం చేశాడు. “భగవాన్‌! భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలలో తధాగతుని మించిన “జ్ఞాని? లేడని, ఉండబోదని, అనిపిస్తుంది నాకు”. బుద్దుడు : సారిపుత్రా, నీది సింహగర్జన. సీవు ఎందరు జ్ఞానుల్ని చూచావు? ఎందరితో పరిచయం వుంది నీకు? జ్ఞానుల జ్ఞానం అంచనావేయడం దుస్సాహసం కదూ! సారిపుత్ర ; భగవాన్‌, నేను ఎవరినీ కలవకపోయినా నలభై సంవత్సరాలు మా నీడగా మసిలాను. అది చాలు. మి చైతన్యం నాలోకి ప్రవహించింది. మారు కరుణకు ప్రతిరూపం. మారు అహింసాజ్యోతి. నలందనుండి పాటలీపుత్ర చేరగానే సారిపుత్ర తల్లికి జబ్బుగా ఉందని వార్త వచ్చింది. ఆమె వయస్సు నూరు సంవత్సరాల పైనే. *కుందాను తోడుగా తీసుకుని, బుద్ధదేవుని అనుమతితో బయలుదేరాడు. భగవాన్‌ బుద్ధ 202

తిరుగు ప్రయాణంలో బుద్భునికి చాలా జబ్బు చేసింది. తను ఎంత బాధపడుతున్నా ఎవరికీ తెలియనివ్వలేదు.-బుద్ధ భగవాన్‌ కోలుకోవడం కష్టమని అందరూ భావించారు. కొద్దిరోజుల తర్వాత ఆరోగ్యం మెరుగుపడ్డధి.

శ స 2

ఆనందభిక్షు బుద్దభగవాన్‌కు సమిపంగా కూర్చుని, దీర్ధంగా ఆలోచి స్తున్నాడు. బుద్ధుడు అతని పరధ్యానం, దైన్యం గమనించి ప్రశ్నించాడు : “ఏమిటి! ఆనంద్‌, అంత దీర్చాలోచన?”

“భగవాన్‌! మరింత జబ్బుపడడం ఇదే ప్రథమం, నాకు తెలిసినంత వరకు. నాకెందుకో చాలా భయంగా వుంది. ఏపనీ చేయబుద్ధి కావడం లేదు. మోరు కోలుకుంటారని ఎవరూ అనుకోలేదు. మిరు స్వస్థులవుతారని నా అంతర్వాణి చెప్పింది. ఇంకా 'అంతిమ సందేశం” ఇవ్వలేదుగా. అంచేత అంతబాధని దిగమింగు కున్నాను”.

బుద్దుడు పేలవంగా నవ్వాడు. ఆ మందస్మితంలో విషాదం జీర కనిపించింది.

“ఆనంద్‌, ఇంకా నానుండి ఆశించే సందేశాలేమున్నాయి? నా వద్ద ఉన్నదంతా పంచిపెట్టాను. చెప్పవలసిన వన్నీ చెప్పాను. బోధించవలసిన వన్నీ బోధించాను. నీకు తెలియకుండా నేనేం దాచుకున్నాను చెప్పు.

“ఆనంద్‌, అసలు బోధనా రహస్యం సాధనలోనే ఉంటుంది. ఒకరు బోధించ నవసరం లేదు. సాధనచేస్తే అన్నీ బోధపడతాయి అందరికీ. సాధన ఏ కొందరికో పరిమితం కాదు. అంతా “శరణాగతి పై ఆధారపడి ఉంటుంది. తధాగతునికి శరణాగతులు కండి. బుద్దుడంటే అర్ధం తెలుస్తుంది. బౌద్ధం అవగతమవుతుంది. ప్రతిఒక్కరు తన జ్యోతిని తనే వెలిగించుకోవాలి. తన జ్యోతి వెలుగుల్లో తను వయనించాలి. (ప్రతిఒక్కరిలో బుద్ధం, ధర్మం, సంఘం ఉన్నాయి. జ్ఞానం పొందడమే బుద్ధం. జ్ఞానం ప్రబుద్ధం కావడం ముఖ్యం. బౌద్ధ ధర్మం ధర్మ రక్షణ సంఘ రక్షణ అందరి బాధ్యత. నీలోని బౌద్ధాన్ని ధర్మాన్ని. సంఘాన్ని ఎవరూ సంగ్రహించలేరు. ప్రతి మనిషిలో ఈ మూడు అంశలు ఉంటాయి. ఆశయించవల సింది వాటిని. ధ్యానంతో మెరుగుపరచుకోవలసింది వాటిని. అదే గమ్యం, అదే గమనం. అదే లక్ష్యం, అదే లక్షణం. తనలో తను స్థిరం కానివాడు జ్ఞాని కాలేడు”.

శ గ స

ఒకరోజున తెలతెలవారుతుండగా సారిపుత్రుని శిష్యుడు 'కుందా' పరుగున వచ్చి, 'నలిలో సారిపుత్ర అకాల మరణ వార్తను అందచేశాడు. సారిపుత్ర ధరించిన 203 భగవాన్‌ బుద్ద

ఉత్తరీయం, ఖిక్షాపాత్ర, కొత్తకుండలో అస్థికలు తెచ్చి ఆనందుని ముందుంచి భోరున విలపించ సాగాడు. తర్వాత నెమ్మదిగా వివరాలు చెప్పాడు- “సారిప్లుత్ర నల వెళ్లి తల్లికి ఉపచర్యలు చేశాడు. ఆమె పోయేవరకు పక్కనే ఉన్నాడు. అంత్యక్రియలు జరిగాక, బంధుమిత్రుల సమక్షంలో కొంచెం సేపు ధర్మబోధ చేసి, ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానం చేస్తూ నిర్యాణం చెందాడు. తన అవశేషాలు ఉత్తరీయం, భిక్షాపాత బుద్ధునికి అందచేయమని కోరాడు. సారిపుత్రుని ఏకైకవాంఛ బుద్ధభగవాన్‌కంటె ముందుగా తను నిర్యాణం చెందాలని". ఆ చివరి మాటలు విని ఆనందుడు గుండె పగిలేలా ఏడ్చాడు. కుందని తీసుకుని బుద్ధుని ఆశ్రమానికి వెళ్లి విషయం వివరించాడు. బుద్దుడు సారిపుక్రుని అవశేషాలను చేతితో స్పృశించి, మౌనం వహించాడు ... ఆనంద్‌ : సారిపుత్ర ఇంక లేడన్న ఆలోచన దుర్భరంగా వుంది భగవాన్‌. బుద్ధుడు : ఆనంద్‌! సారిపుత్ర చనిపోతూ నీ మనస్సును, మగ్నతను, ధ్యానాన్ని తనతో తీసుకువెళ్లాడా? నీ స్వేచ్చను తీసుకు వెళ్లలేదు గదా! నీవు నీవే ... సారిపుత్రుడు సారిపుత్రుడే ... ఎవరికి వారే!

ఆనంద్‌ : నా విచారానికి కారణం అది కాదు. సారిపుత్ర జీవించినంతకాలం ధర్మంగా, నిజాయితీగా జీవించాడు. అందరికీ తలలోని నాలుక అయినాడు. ఎందరినో ప్రభావితం చేశాడు. ఎందరికో ఆదర్భంగా నిలిచాడు. మౌద్గల్యన, సారిపుత్ర లేని సంఘం నాకు “శూన్యం అనిపిస్తోంది భగవాన్‌.

బుద్దుడు : ఆనంద్‌! అనేకమార్లు చెప్పాను. జననం వెంట మరణం ఉంటుందని, కొంతకాలం విడిపోయి ఉన్నా అవి కలవవలసిందే. అవి వేరుగా ఉండలేవు. జననంలో మరణం అంతర్లీనంగా ఉంటుంది. వాటి ఆచ్చ్భాదనలే శరీర ధర్మాలు. శరీర ధర్మాలు నశింపు కాగానే మరణం వచ్చి కూర్చుంటుంది. కనుక వేటితో అనుబంధాలు పెంచుకోకూడదు. మృత్యువును జయిస్తే, జననాన్ని జయించినట్లే. ధ్యానం ఒక్కటే మరణాన్ని జయించే ఉపాయం. మరల జన్మించే అవసరం లేకుండా చేసుకోవడమే మరణాన్ని జయించడం. విముక్తి అంటే అర్ధం జనన, మరణాల నుండి వముక్తి కావడం. ముందు మరణం నుండి విముక్తి పొందితే జననం నుండి విముక్తమైనట్లే. అది మనిషి ఆశించే సంపూర్ణ స్వేచ్చ. అదీ స్వతంత్రం అంటే.

“ఈ మహావృక్షంలో సారిపుత్ర ఒక కొమ్మవంటి వాడు. ఒక కొమ్మ విరిగిపోతే మహావృక్షం నశించినట్లు కాదు. ప్రతి కొమ్మ విరిగిపోయిన కొమ్మలాంటిదే.

భగవాన్‌ బుద్ధ 204

దానికి అందవలసిన జీవరసాన్ని మిగిలిన కొమ్మలు, ఆకులు, రెమ్మలు పంచు కుంటాయి. కొత్త చివుళ్లు వేస్తాయి. అవి కొమ్మ లవుతాయి. ప్రతి కొమ్మకు ఆ కొమ్మ లక్షణాలు, గుణాలు ఉంటాయి. కళ్లు మూసుకుని చూడు, నీలో సారిపుత్ర లేడా? తధాగతునిలోనూ, ప్రతి భిక్షు హృదయంలోను సారిపుత్ర ఉంటాడు. అతనిని విన్న ప్రతిఒక్కరిలో అతని స్మృతులు మిగిలి ఉంటాయి. అవి చెరిగిపోవు. అతను తిరిగిన తావులలో అతని అడుగుజాడ లుంటాయి. గాలిలో అతని శ్వాస కలిసే ఉంటుంది. కనుక సారిపుత్ర లేడని అనుకోవద్దు. అతను లేనిలోటు తీర్చవలసిన బాధ్యత మో అందరిపైన ఉంది.

ఆనంద్‌ : భగవాన్‌, సారిపుత్రుడు మహాజ్ఞాని, బోధిసత్వుడు. అతని జ్ఞానం, జ్ఞాపకం ఇతరులకు మార్గదర్శకం. భిక్సులందరిలో సారిపుత్ర మహాజ్ఞాని, పరిపూర్ణుడు. అతనిని అపర బోధిసత్వునిగా అభిమానిస్తారు.

బుద్దుడు : ఆనంద్‌, భవిష్యత్తులో సైతం బుద్ధధర్మాన్ని అనుసరించినవారంతా బోధిసత్వులు కాగలరు. ఎప్పుడూ బోధిసత్వులు ఉంటూనే ఉంటారు. కనుక సారిపుత్ర కోసం కన్నీరు కార్చకు.

మధ్యాహ్నం ఉక్రశీల ఆశ్రమం వద్ద, సమావేశమైన భిక్షు సంఘంలో బుద్దుడు స్వయంగా సారిపుత్ర మరణం గురించి చెప్పాడు.

“సారిపుత తన యావచ్చక్తిని మానవ (శ్రేయస్సుకు వినియోగించాడు. మోరంతా అలా అంకితం కావాలి. ఎవరికి వారు పూర్ణత్వం సంపాదించాలి. ఇతరులపై ఆధారపడకండి. విషాద, వీచారాలు మిమ్మల్ని అంటకుండా జా(గ్రత్త పడండి”.

ఒకనాడు బుద్దుడు, ఆనందుడు వైశాలినగరంలో ఖిక్షాటనం చేసి, సమీపంలోని అరణ్యంలో భోజనం ముగించి, విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు.

“ఆనంద్‌! దగ్గరలో ఒక కపాలీ అలయం ఉంది. అక్కడ విశ్రమిద్దాం పది” అన్నాడు.

కపాలీ ఆలయం చేరే లోగా బుద్ధుడు అనేక తావుల ఆగి, ప్రకృతిని తిలకించాడు. “అనంద్‌, వైశాలీనగరం ఇదివరకటికంటే ఇప్పుడు అందంగా వుంది కదూ! ఉదీనాలయం, గౌరాంబిక, సత్రాంబిక, బాహుపుత్ర ఆలయాలు బహుసుందరంగా ఉన్నాయి. మనం విశ్రాంతి తీసుకోబోతున్న కాపాలీ ఆలయం మరీ బావుంటుంది”,

205 భగవాన్‌ బుద్ధ

అలయానికి చేరిన తర్వాత బుద్ధుడు ఒక కునుకు తీశాడు. పెద్ద వయస్సు. నడకతో డస్సిపోయాడు. ఆయన ని(ద్ర లేచేలోగా పరిసరాలు చూడాలని ఆనంద్‌ బయటకు నడిచాడు. నడుస్తుండగా కాళ్ల క్రింద భూమి కంపించింది. తన శరీరం అటు ఇటు ఊగింది. మనస్సు ఒక్కసారిగా శూన్యమైంది. కంగారుగా ఆలయానికి చేరాడు. ఏదో ప్రళభయ సూచన. బుద్దుడు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. భూకంపం గురించి చెప్పి తన భయం వ్యక్తం చేశాడు.

బుద్ధు డన్నాడు “ఆనంద్‌! తధాగతుడు ఒక నిర్ణయానికి వస్తే దానికి తిరుగుండదు. మరో ఆరు మాసాలలో నేను నిర్యాణం చెందుతున్నాను.”

ఆ మాట వినగానే ఆనందుని కాళ్లు, చేతులు వణికాయి. నోట మాట రాలేదు కొంతసేపు. బుద్ధుని కాళ్లమాదపడి “భగవాన్‌ అంత మాట అనకండి. నేను వినలేను, విని తట్టుకోలేను. మోరు అప్పుడే నిర్వాణం చెందడానికి వీల్లేదు. గురుదేవా! దయచేసి మో నిర్ణయం మార్చుకోండి”.

బుద్ధుడు మౌనం దాల్చి, కళ్లు మూసుకున్నాడు. కొంతసేపటి తర్వాత అన్నాడు : “ఆనంద్‌! నీకు తధాగతుని మాటపై విశ్వాసం ఉందా, లేదా? నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఆరు నెలలు కాదు, మూడు నెలలే. మిగిలిన వారికి చెప్పండి. 'కూటగారి ధర్మశాలలో అందర్నీ సమావేశ పరచండి”.

ఏడు రోజుల వ్యవధిలో వేయి అయిదు వందల మంది భిక్షులు, భిక్షుణిలు కూటగార ధర్మ మందిరానికి చేరారు. బుద్దుడు ధర్మపీఠం పైన కూర్చుని అందరినీ వీక్షించి ఇలా చెప్పాడు. ల్‌

“మిత్రులారా! సంఘ సభ్యులారా! తధాగతుడు ఇంతకాలం మాకు అందించిన జ్ఞానాన్ని శక్తిని ఉపాసించండి. సద్వినియోగ పరచుకోండి. బౌద్ధ ధర్మానికి మిరే వారసులు. సంఘానికి మోరే నిర్మాతలు. ప్రస్తుత కాలానికి భవిష్యత్తుకు మధ్య వారధి నిర్మించవలసింది మిరు. మా ధ్యానంలో మానవు లందరికీ శాంత్రి, ఆనందం, సంతోషం కలగాలని సంకల్పించండి”.

బుద్దుడు త్వరలో నిర్యాణం చెందనున్న సంకేతం అందరికీ అందింది.

మర్నాడు అనందునితో కలిసి వైశాలిలో భిక్షకు బయలుదేరాడు.

“ఆనంద్‌, వైశాలి కొత్త అందాలు సమకూర్చుకున్నట్లు అనిపిస్తోంది. నేను ఇవాళే మొదట సారి వైశాలిని చూస్తున్నట్లుంది”.

అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు “పద, బంధ (గ్రామం వెడదాం”.

అక్కడ జ్ఞానబోధ చేశాడు. “ఎవరైనా, ఏవైనా ఇవి తధాగతుని సూక్తులని చెప్పినా నమ్మకండి. మూలసూత్రాలతో, ధర్మాలతో పోల్పుకోండి. ఎక్కడైనా విభేదిస్తే వాటీని నమ్మకండి. అవి సూత్రబద్ధంగా ఉంటేనే అమోదించండి”. భగవాన్‌ బుద్ధ 206

పావ గ్రామంలో 'కుందా' అనే అభిమాని అందరికీ భిక్ష ఏర్పాటు చేశాడు.

ఆ రాత్రి బుద్ధునికి విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. మెలికలు తిరిగాడు. నిద్ర పట్టలేదు. మర్నాడు అలాగే 'కుసినారుకు బయలుదేరారు. నొప్పి మరీ ఎక్కువైంది. ఒక చెట్టునీడన విత్రమించవలసి వచ్చింది. ఆనంద్‌ ఉత్తరీయం తీసి పక్కవేశాడు.

బుద్ధుడు పడుకుని “ఆనంద్‌, గొంతు ఎండుకుపోతోంది. మంచి తీర్ధం కావాలి” అన్నాడు.

ఆనంద్‌ పరుగున వెళ్లి తిరిగివచ్చి “భగవాన్‌! ప్రవాహంలో నీళ్లు బురద బురదగా ఉన్నాయి. తాగటానికి పనికిరావు. కొంచం ఓర్చుకోండి. 'కుకుర్త గ్రామం వెళ్లే వరకు ని([గ్రహించుకుంటే అక్కడ మంచి నీళ్లు లభిస్తాయి”.

“గొంతు తడారిపోతోంది ఆనంద్‌. ఏవో నీళ్ళు వెంటనే తీసుకురా”.

తప్పలేదు. ఆనందు వెళ్లి నీళ్లలో బిందె ముంచి తీసేవరకు పాత్రలోని నీరు స్వచ్చంగా మధురంగా మారింది. పరుగున వచ్చి బుద్ధుని దాహం తీర్చాడు. ఆనందుడు బుద్దుని పక్కనే కూర్చున్నాడు. మిగిలిన భఖిక్లులు దూరంగా వలయాకారంగా కూర్చున్నారు.

అందరు 'కుసినారు బయలుదేరారు. ఆనంద్‌ని దగ్గరగా పిలిచి చెప్పాడు, “ఆనంద్‌, కుంద ఇంట్లో చేసిన భిక్ష తధాగతుని చివరి భిక్ష అతను పెట్టిన భోజనంలో “విషం” ఉన్నదని రేపు జనం అతనిని నిందిస్తారు. నాకు జీవితంలో రెండు భోజనాలు బాగా గుర్తు ఆనంద్‌. జ్ఞానోదయం పొందిన రోజున సుజాత పెట్టిన భోజనం మొదటిది. నిర్వాణం చెందడానికి ముందు చేసిన నిన్నటి 'భిక్షు. కుంద అదృష్టవంతుడు. తధాగతునికి కడసారి “ప్రసాదం” ఇచ్చాడు”.

కొంచెం సేపు విశ్రమించి లేచి “ఆనంద్‌! హిరణ్యవతి నదిని దాటి అవతలి ఒడ్డుకు వెడదాం పద. అక్కడ మల్ల ప్రజల సాల్వవనాలున్నాయి. 'కుసినారి. ప్రవేశంలో ఉన్న ఆ వనాలు బహుసుందరంగా ఉంటాయి. పోదాం నడువు”.

కుంద ఆతిభక్తితో మంచిగంధం పుప్పొడి సేకరించి స్వయంగా వంటచేసి బుద్ధునికి వడ్డించాడు. దాని పేరు 'సుకర మార్దవం”. అది పొరపాటున విషంగా మారింది. భోజనం తర్వాత బుద్దుడు కుందను పిలిచి “కుందా! ఆ సుకరమార్దవం ఎవరికీ తినిపించకు. దానిని నేలలో గుంట తవ్వి, ఆ గుంటలో వేసి పూడ్చు. ఎవరూ దానిని తినవద్దు” ... కుంద ప్రేమ విషమించింది. 207 భగవాన్‌ బుద్ధ

నం అశ! స 11 నా లా [0 మం? యా జైరరే యం... న స 1. స ర వ, షు: 2 . స రె నా. వ్‌ న! క్ట పసం . న. స కటలా ల. టి న శ్‌ యన... మ. | లుంబినీ వనం ల వానా సా న టో నానన నానా న ంచీ క్తైరం న న. క్ష్‌ లం అలా లః య . లా గై 1. (| జ క. యక్‌ గ ॥ ్‌ ” . స్‌ నా _ భాగా: మనా న. న మ లలన న ష్‌ స న టన పోల న్‌ ర ల! ను? ష్స ప మ స పిన ర వే 1 టై జల్‌! (1 లత? ప! ను వ సు |

సాల్వవనం చేరేసరికి చీకట్లు ముసురుకున్నాయి. రెండు సాల్వవృక్షాల నడుమ తన పడక ఏర్పాటు చేయమని ఆనందునితో చెప్పాడు. తలను ఉత్తరదిశగా ఉంచి పడుకున్నాడు. భిక్షులంతా దూరదూరంగా వెళ్లి, వలయాకారంలో కూర్చున్నారు. ఆ రాత్రి తధాగతుడు నిర్యాణం చెందనున్నాడని అందరికీ అనిపించింది. ఎవరూ నిద్రపోలేదు. ఆ రేయి తెల్లవారకుండా ఉంటే ఎంత బాగుండును!

బుద్ధుడు వెల్లకిలా పడుకుని ఆకాశంవైపు దృష్టి సారించాడు. ఎంత నిర్మలంగా వుంది ఆకాశం! చెట్లు పూలు వర్షిస్తున్నాయి. “జ్తనంద్‌ చూడు పూలు ఎంత బావున్నాయో! తధాగతుని తాకి పరవశిస్తున్నాయి పూలు! నా పడక పూలపానుపు అయింది చూచావా. ఎంత చల్లగా, హాయిగా ఉన్నాయి గాలులు. ఎందుకో ప్రకృతి ఇంతగా పరవళిస్తోంది. ఎందుకింత ఆనందం ప్రకృతికి?”

ఆనందుడు అక్కడలేదు. ఉపవన భిక్షు విసనక(ర్రతో విసురుతుంటే “వద్దు ఉపవనా! విసరకు. నాదృష్టి అస్తమయం పైన మగ్నమైంది. దానిని మళ్లించ

“అనిరుద్రా! ఆనందుడు కనిపించదేం? ఎక్కడకు వెళ్లాడు”.

ఆనందుడు దూరంగా ఒక చెట్టుచాటున కూర్చుని విలపిస్తున్నాడు. తధాగతుడు నిర్యాణం చెందుతున్నాడు. తానింకా 'జ్ఞానశిఖరం చేరలేదు. ఇంక తనకు దిక్కెవరని ఆనందుని బాధ. నిర్వేదం.

బుద్దుడు ఆనందుని దగ్గరగా పిలిచి ఊరడించ ప్రయత్నించాడు.

శనిగ్రహం అవసరం అనంద్‌! విలపించ వలసిన సమయం కాదిది. అనేకసార్లు తధాగతుడు చెప్పాడు దేహధర్మాలన్నీ నశించేవేనని, మరచిపోయావా లేక విస్మరించావా? భౌతికత ఎప్పుడూ అశాశ్వతమని తెలియదా? జననం వెంట మరణం ఉండి తీరుతుంది. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు. తప్పదు. అది ప్రకృతి ధర్మం. రూపం అరూపంగా పరిణమించడమూ ప్రకృతి ధర్మమే. విడిపోవడం ఏకం కావడానికే గదా! అదే “ఐక్యం. నశిస్తే గదా మరల ఏర్పడేది. ఏదీ శాశ్వతంగా నిలవకపోవడమే సృష్టిధర్మం. అశాశ్వతత్వమే అసలైన సిద్ధాంతం. ఇన్ని సంవత్సరాలు తధాగతుని కంటికి రెప్పలా చూచుకున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను! నీ సహాయానికి ఏమిస్తే రుణం తీరుతుంది? నీవు ముందుకు పోవాలి ఆనంద్‌. మరికాస్త కృషి చేస్తే గమ్యం చేరగలవు. నీవూ తధాగతుడివి కాగలవు. 209 భగవాన్‌ బుద్ధ

“విముక్తి సాధిస్తే ఈ విచారాలుండవు. ఏ విషాదాలు నిన్ను బాధించవు. నీవు విముక్తి సాధించగలవని నానమ్మకం టి మిగిలినవారి నుద్దేశించి : “ఆనందుని ఆదర్శంగా తీసుకోండి. ఆనందుని వంటి ప్రియశిష్యుడు ప్రపంచంలో ఏ గురువుకు దొరకడు. ఆనంద్‌కి సొటి ఆనందుడే. ఉత్తమ శిష్యుడు అని చెప్పదగినవాడు తనొక్కడే. నా అవసరాలు తనకు తెలుసు. ఏ నిమిషం నాకు ఏది కావాలో తనకు తెలుసు. అసలు తను నిద్రపోతాడా అని నా అనుమానం. రాత్రింబవళ్లు ఎప్పుడూ నన్ను ఒక కంట కనిపెట్టి ఉండటమే అతని ధ్యానం, సాధన”. ఆనంద్‌ కళ్లు తుడుచుకుని “భగవాన్‌! కుసినార కుగ్రామం. ఇక్కడ నిర్యాణం చెందితే ఎవరికీ తెలియదు. చంప, రాజగృహ, (శ్రావస్తి, కోశాంబి, వారణాసి లాంటి మహానగరాలున్నాయి. వాటిలో ఏదైనా ఎన్నుకోండి. అక్కడ ఛిక్షులు, అభిమానులు అందరూ రావడానికి వీలుంటుంది.” బుద్భదడన్నాడు : జనం కోసం తధాగతుడు నిర్యాణం చెందడం లేదు. (ప్రచారం కోసం కాదు. తధాగతునికి ఇష్టమైంది కుసినార, ఈ సాల్వవనం. చూడు, నా మాటకు అంగీకారంగా చెట్లు పూలు వర్షిస్తున్నాయి. ఈ రాత్రి నాలుగవ రూమున బుద్ధుడు నిర్యాణం చెందనున్నాడని కబురుచెయ్యి.

తాను బుద్ధుని దర్శించాలని, మాట్లాడాలని సుభద్ర భిక్షువు అనందుని అర్థించాడు.

“వద్దు, భిక్షూ, భగవాన్‌ ఛాలా నీరసంగా ఉన్నారు. ఇబ్బంది పెట్టవద్దు.”

ఆ మాటలు విన్న బుద్యడు : “అతనిని రానివ్వు ఆనంద్‌! ఎవరినీ నిరాశపరచకు”.

సుభద్ర భిక్షు వచ్చి ప్రణామం చేసి అన్నాడు, "భగవాన్‌, నాకు మా బోధనలతో పరిచయం వుంది. ఎప్పుడూ మిమ్మల్ని దర్శించలేదు. నేను పురాణ కశ్యప, మక్కలి గోసాల, అసిత కేశకంబిలి, కాత్యాయన, సంజయ బేలా (తిపుత్ర, నిగంధ నాధపుత్ర వంటి గురువుల్ని సేవించాను. దర్శించుకున్నాను. వారిలో జ్ఞానులెవరు భగవాన్‌?”

“సుభద్రా, వారికి జ్ఞానోదయం అయిందా కాలేదా అన్నది అప్రస్తుతం. అది నీకు ముఖ్యం కాదు. చర్చ అనవసరం. నీవు జ్ఞానం పొందేమార్గం వెతుక్కో అది నీకు ముఖ్యం. నీకిష్టమైతే అనిరుద్ర మార్గం చూపిస్తాడు. వెళ్లి అతనివద్ద దీక్ష తీసుకో”. భగవాన్‌ బుద్ధ 210

నెమ్మదిగా బుద్దుని కళ్లు మూతపడ్డాయి. ఒక్కసారి భూమి జలదరించింది. సాల్వపుష్పాలు జలజల బుద్ధునిపై రాలాయి. అక్కడ చేరిన భిక్షులు ప్రతిఒక్కరు ఉలిక్కిపడ్డారు. బుద్ధుడు నిర్యాణం చెందాడు. కొందరు నేలమోదపడి రోదించారు. చాలామంది ధ్యానంలో బుద్దునికై శాంతి ప్రార్ధన చేయసాగారు. అనిరుద్ర అన్నాడు : “ఎవరూ దుఃఖించవద్దు. కన్నీరు కార్చవద్దు. తధాగతుడు ఇంతకాలం జీవించింది, బోధించింది దుఃఖనివారణ కోసం, కన్నీరు తుడవడం కోసం. బుద్ధ ధర్మం పాటించండి - తధాగతుని ఆశయం నెరవేర్చండి దయచేసి ఎవరూ కన్నీరు కార్చవద్దు. దుఃఖించవద్దు”. తెల్లవార్లు అందరూ బుద్ధుని చుట్టూ ధ్యానం చేస్తూనే గడిపారు. బుద్ధుడు పరమపదించిన వార్త తెలతెల వారుతుండగా కుసినార గ్రామంలో పాకింది. గోడుగోడున విలపిస్తూ సాల్వవనానికి జనం చేరుకున్నారు. ఆచారం ప్రకారం ఆరురోజులు బుద్దుని పార్ధివ శరీరాన్ని అక్కడే ఉంచి, పూలతో అలంకరించి, దూపదీపాలతో అర్చిస్తూ, మౌనప్రార్థనలు, ధ్యానాలు చేశారు. వేలాదిమంది భిక్షులు వివిధ విహారాలనుండి, ఆరామాలనుండి వచ్చారు. చివరిసారి “గురుదేవుని దర్శనం చేసుకున్నారు. ఏడవ రోజు 'ముల్లి పెద్దలు బుద్దుని శరీరానికి స్నానం చేయించి, కొత్త కాషాయబట్టలు ధరింవచేసి ఊరేగింపుగా, తూర్పు ద్వారం గుండా మక్కుట బంధనాలయానికి తీసుకువెళ్లారు. అది వారి ప్రధాన ఆలయం. అది వారి ఆచారం. ఆపైన బుద్ధుని మృతదేహాన్ని రాజలాంఛనాలతో పట్టుబట్టలతో అలంక రించారు. మంచిగంధం చెక్కల చితిపైన ఉంచి, అగ్ని సంస్కారం చేయబోయే సమయంలో ఒక ఆశ్వికుడు ఆపసోపాలు పడుతూ వచ్చాడు. “కొంచెం సేపు నిదానించండి. 'పావి నుండి మహాకశ్యపులవారు ఆరు వందల మంది భిక్షువులతో బుద్ధభగవాన్‌ దర్శనానికి వస్తున్నారు” అని చెప్పాడు. సంఘంలో మహాకశ్యపునికి గౌతమ బుద్దుని కున్నంత ఆదరణ ఉంది. బుద్దుడంతటి జ్ఞాని అని పేరుంది. చంపానగరం కేంద్రంగా చేసుకుని ధర్మబోధ చేస్తుంటాడు. అతను వైశాలిలో ఉండగా నిర్యాణ వార్త అందింది. వెంటనే బయలుదేరాడు. త్రోవలో అనేకమంది భిక్షులు కలిశారు. 'భాని గ్రామం చేరే సరికి, అయిదు వందల మంది ఖిక్షులు పోగైనారు. 'పావి గ్రామం చేరేసరికి ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి చెప్పాడు. “స్వాములూ, గౌతమ బుద్ధుడు మరణించి ఆరు రోజులైంది. కుసినార వద్ద సాల్వవనంలో అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి 211 భగవాన్‌ బుద్ధ

తాము వస్తున్న వార్త ఎవరైనా ఆశ్వికుని ద్వారా పంపండి. లేకపోతే మోరు వెళ్లే సరికి అంతా అయిపోతుంది”. మధ్యాహ్నానికి మహాకశ్యపుడు, అయిదువందలమంది భిక్షులు మకుట బంధనాలయం చేరుకున్నారు. తమ అంతిమ నివాళు లర్పించారు. చితి మంటలు ఆకాశాన్నంటాయి. చితాభస్మం, అస్థికలు బంగారు కలశాలలో భద్రపరిచారు. వివిధ దేశాల నుండి వచ్చిన వారికి అవశేషాలను వేరువేరు బంగారు కలశాలలో అందచేసి స్టూపనిర్మాణాలకు ఏర్పాట్లు చేశారు. మగధ, వైశాలి, శాక్య, కాలియ, బులయా, పావ, యేత రాజ్యాలలో స్థూప నిర్మాణం చేయదానికి సిద్ధమైనారు. అస్థికలను ఎనిమిది భాగాలు చేశారు. మగధ ప్రజలు రాజగ్భహలో స్టూపనిర్మాణం చేయడానికి మొదటగా ముందుకు వచ్చారు. లిచ్చలి ప్రతినిధులు వైశాలిలో, కశ్యప ప్రజలు కపిలవస్తులో, కోలియ ప్రజ రామగ్రామంలో, వేత భిక్షులు వేతద్వీపంలో, మల్ల ప్రజ 'కుసినారిలో, “పావిలో సూప నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మహాకశ్యపుడు, అనిరుద్ర, ఆనందుడు బుద్ధుడు ఉపయోగించిన భిక్షా పాత్రను వేణువనానికి చేర్చారు. బుద్దుని నిర్యాణానంతరం ... ఎక్కడి వారక్కడకు వెళ్లిపోయారు..... బుద్దభగవాన్‌ స్మృతులతో లలు ఒక నెల తర్వాత మహాకశ్యపుడు రాజగృహ విహారంలో “సర్వఖిక్షు సమావేశం” ఏర్పాటు చేశాడు. బుద్ధనిర్యాణానంతరం కార్యక్రమం రూపొందించా లనే సత్సంకల్పంతో, బుద్ధుని బోధనల నన్నింటినీ సంపాదించి, సమికరించ వలసిన అవసరం ఏర్పడ్డది, ఇంతకాలం ప్రవచనాలుగా ఉన్న బుద్దుని బోధనలన్నీ అక్షరబద్ధం చేయాలి. ఆ పని ఒక్కరివల్ల సాధ్యం కాదు. అయిదువందల మంది ప్రధాన భిక్షులను ఆ పనికి ఎంపిక చేసుకున్నారు. వారిలో బుద్దుని చిర పరిచయస్టులు, అనుభవజ్ఞులు, మేధావంతులు, పండితులు, విజ్ఞులు ఉన్నారు. ఆరు మాసాలలో ఆ పనులన్నీ పూర్తిచేయాలి. బుద్దుని తాలి శిష్యులలో అనంత కౌండిన్య, సారిపుత్ర, మౌద్దల్యన తర్వాత ఎన్నదగిన వ్యక్తి మహాకశ్యపుడు. అతను నిరాడంబరుడు, వినయశీలి అని ప్రతీతి. బుద్ధుడు మహాకశ్యపుని ఎక్కువగా అభిమానించేవాడు. (ప్రేమించేవాడు. ఇరవై సంవత్సరాలుగా విడిచి పారవేసిన బట్టలతోనే కశ్యపుడు తన ఉడుపులు తయారు చేసుకుని ధరించాడు తప్ప ఎన్నడూ కొత్తబట్టలు ధరించలేదు. సంఘ నియమావళిని భగవాన్‌ బుద్ధ 212

తూచ తప్పక పాటించిన నిష్టాగరిష్టుడు. జేతవనంలో బుద్దుడు పద్మాన్ని తదేకంగా వీక్షిస్తూ నవ్వినపుడు మొదట స్పందించినవాడు కశ్యపుడే బుద్ధుని హృదయాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవాడు కశ్యపుడు.

“అనంతర కార్యక్రమం అజాతశత్రు సహకారంతో జరుగుతున్నది బుద్దుని బోధనలు, ఉపదేశాలు మొత్తం కంరస్తం చేసినవాడు ఉపాలీ భిక్షు ఆయన సమావేశాలలో అన్ని సూత్రాలను వల్లించి వివరణ యిస్తూ ఏ సందర్భంలో ఎప్పుడు అవి బోధించిందీ చెప్పేవాడు. బుద్ధుని బోధనలు యదాతధంగా వప్పగించగల వకసంధాగ్రాహి ఆనందుడు. అయితే అంత బాధ్యత ఉపాలీ, ఆనందులకే ఇవ్వడంవల్ల మరికొన్ని సూత్రాలు, సూక్తులు చేజారిపోవచ్చు. అయిదువందల మంది ిక్షులు ఎవరికి జ్ఞాపకం ఉన్నవి వారు చెప్పాలి అన్ని సూత్రాలను చేర్చి “వినయ పిటకి అని నామకరణం చేశారు. ధర్మబోధనలకు 'సూత్ర పిటకి అని పేరు పెట్టారు. అన్నింటిని కలిపి నాలుగు శ్రేణులుగా విభజించారు.

“తన నిర్యాణం తర్వాత ముఖ్యం కాని సూత్రాలను వదలమని” బుద్దుడు తనతో చెప్పినట్లు ఆనందుడు చెప్పాడు. వేటిని వదలాలో స్పష్టంగా చెప్పలేదు. సుదీర్హ చర్చానంతరం అన్నిటిని భద్రపరచాలని నిర్ణయించారు. బుద్ధుడు ఆదేశించి నట్లు వాటిని వైదికభాషలోకి అనువాదం చేయరాదని తీర్మానించారు. అవి “అర్ధమాగధిలో ఉన్నా ప్రాంతీయ భాషలలోకి అనువదించుకోవచ్చు.

ఆనందునిపై అంతటి (ప్రేమ, విశ్వాసం ఉన్నా సర్వభిక్షు మహాసభలకు మూడు రోజులు ముందుగా మహాకశ్యపుడు ఆనందుని సభాషప్రాంగణంలోనికి అనుమతించరాదని నిర్ణయించాడు. కారణం ఆనందుడు ఇంకా జ్ఞాని కాలేదు. ఆ నిర్ణయం ఆనందునికి ఆశనిపాతమైంది. మహాకశ్యపుని అభిమతం తెలియగానే అనందుడు తన కుటీరానికి వెళ్లి తలుపులు బిగించి లోపల ఉండిపోయాడు. మూడురోజులు బయటకు రాలేడు. రాత్రింబవళ్లు నిశ్చల ధ్యానంలో ఉండి పోయాడు. మూడవరోజు రాత్రి నాల్గవ రూమున, బ్రహ్మముహూర్త సమయాన అలసిపోయి నడుం వాల్చాడు, కాస్త విశ్రమిద్దామని వెన్నులో జలదరింపు కలిగింది ఏదో మహాచైతన్యం ప్రవాహ సదృశంగా వెన్నులోంచి శిరోభాగానికి చేరింది. స్పృహతప్పి పడిపోయాడు. ఆ క్షణంలో ఆనందునిలో జ్ఞాన జ్యోతి వెలిగింది.

సూర్యోదయవేళ మహాకశ్యపుడు మనస్సు మార్చుకుని ఆనందుని మహాసభలకు తీసుకువెళ్లడానికి స్వయంగా ఆనందుని కుటీరానికి వచ్చాడు. 213 భగవాన్‌ బుద్ధ

ఆనందుని ముఖం మహాతేజస్సుతో ప్రకాశిస్తోంది అతనిలో మహా ప్రశాంతి, దాంతి, సాంత్వన .. ఓహ్‌ ... జ్ఞానోదయం అయింది. అతనిలో జ్ఞానజ్యోతి వెలుగుతోంది. మహాకశ్యపుడు ఉప్పొంగిన సంతోషంతో ఆనందుని ఆలింగనం చేసుకున్నాడు. “నిదరా ఆనంద్‌! బుద్ధ భగవాన్‌ నిన్ను అనుగ్రహించాడు. ధన్యుడవు సోదరా, ధన్యుడవు” అభినందించాడు మహాభినిష్కమణ సమయంలో ఆనందుని వెంట ఉన్నవాడు స్వస్తిక. సిద్ధార్థుడు జ్ఞానసిద్ధి పొందిన తర్వాత తొలి ఉపదేశం చేసింది స్వస్తికకు. ఆనాటి నుండి నిర్వాణం వరకు వెంటఉన్నవారు ఆనంద్‌, స్వస్తిక. శ ఈ ౮ పావనుండి కుసినారకు వెళుతున్నవ్హదు ఆనందుడు బుద్దుని (గ్రళ్నించాడు. “ఎక్షుడికి భగవాన్‌ మనం వెళ్లేది?” “ఉత్తరదిశకు నా ప్రయాణం అనంద జీవితంలో ఎప్పుడూ గౌతమబుద్ధుడు ఫలానా చోటుకు తను వెళుతున్నట్లు చెప్పలేదు. ఎప్పుదూ ఆయన గమ్యుం అగమ్యమే. అలోచించి నిర్ధయాలు తీనుకునే తత్వం కాదు ఆయనది. కాళ్లు ఎటు నదివిస్తే అటు నదిచేవాదు. శూన్వ మనస్సుతో, శూన్య వృదయంతోో శూన్యంలోనే సంచరిస్తూ ఉందేవాదు. శూన్యాన్ని చేరడం అంతిమ లక్ష్యం. శూన్యం కావదం అంతిమ గమ్యం. చివరి రోజుల్లో కవీలవస్తు వెళ్లాలనుకుని 'కుసినారిలోనే ఆగిపోయాడు. 'కుసినార” అంటే లుంబినీ వనం. “లుంబినీ వనం” బుద్ద భగవానుని “'మవోశ్వాన! బగవాన్‌ బుద్ధ 214

దా।। వాసివి వసంతకుమార్‌ రచనలు

  1. ర్‌6ి అత్మ దర్శనాలు దూ 100/- 2 మాస్టర్‌ శార్వరి . మిషన్‌ & విజన్‌ 100/ 3 77 సాధనా రహస్యాలు 100/ శ్రీ శార్వరి దచచనలు
  2. ఆంధ్ర మహాసావి(్రి (ఫుల్‌ బౌండ్‌) (డీలక్స్‌ ఎడిషన్‌) 300/- 5 మాస్టర్‌ ప్రేయర్స్‌ (తెలుగు) 200/-
  3. మాస్టర్‌ డ్రేయర్స్‌ : “ఎం” కోర్సు 100/- గా అత్మయోగి సత్యకధ (మొదటి భాగం) 100/-
  4. యోగా(శ్రమ జీవితం (రెండవ భాగం) 1004 ర యోగా విజన్‌ (మూడవ భాగం) 100/- ఫిలాసఫీ
  5. అత్మయోగం 100
  6. యోగామ్యూజింగ్స్‌ 100/- 12 మహాగురు 100/=
  7. రసచేఖలు 100 14 విశ్వదర్భనం 100- 15 మాస్టర్‌ యోగదర్శిని 16 అతీతమానసం 100/- మహాత్ముల జీవిత కధలు
  8. మాస్టర్‌ సి.వి.వి. సం.
  9. భగవాన్‌ బుద్ధ 100/2
  10. మహాత్మా జీసస్‌ 1004
  11. సద్దురు సాయిబాబా 100
  12. సద్గురు రమణ నల
  13. అరవింద దర్శనం
  14. కొత్తకోణంలో కృష్ణమూర్తి 100/- 24 యు.జి. కృష్ణమూర్తి. 100/-
  15. భగవాన్‌ రజనీష్‌ 100/-
  16. అవతార్‌ మెహర్‌బాబా 100/- 27 పరమహంస యోగానంద 100/- 215

28 మాడం బ్లవట్‌స్కీ 100/- 29 _పరేంగిత ప్రజ్ఞ (దాదాజీ ఆత్మకధ) 100/- యోగసాహిత్యం 30. ధ్యానం ఎలా చేయాలి? 60/- 31. ధ్యానం - యోగం 60/- 32. దివ్యజ్ఞానం (మహాచైతన్యం) 60 33. కుండలిని 60/- 34 నిర్వికల్ప సమాధి అభావ. 35. పరావిద్య “ 4 ౫ (గ్రంధాలయ నైన 36. మృత్యువు తర్వాతి జీవితం (య న 37. ఆత్మజ్ఞానం (6 0౫౦12202. ఉగ 38 అసతోమా సద్దమయా వ ౧.7 39. తమసోమా జ్యోతిరమయా ల్ని తీరి మృత్యోర్మా అమృతంగమయా జడ 60/- 41. మాస్టర్‌ "యోగచరిత్ర 60/- 42, భృక్తం - రహితం - తారకం 60/- 43. యోగాశ్రమ లేఖలు 60/- 44 సత్య సంహిత 60/- 4ర5్‌. శ్రీ కృష్ణావతారం 60/- ఇతరాలు 46. హస్తసాముద్రికం 150/- త్వీ/, మంజరీ ద్విపద కథలు 100/- క1౫61.1511 8200[నఏ తీరి 125610 న౧౭/65 (16౪ ౬౯6110౧) 100/- తరి 19 [0/516౧/01 గంగర2౬11౧| 60/=- 50. 706౬8 89/0౧6 0628) 60/- ఖరీదు మొత్తం ముందుగా ఎం.ఓ. ద్వారా గాని డి.డి. ద్వారా గాని పంపవలసి ఉంటుంది. పుస్తకాలు ౪.౧. లో పంపలేము. చెక్కులు స్వీకరింపబడవు. రిజిష్టర్‌ పోస్తులో పంపదానికి రూ. 20/- అదనం. [1457౬5౧ 7064 43!1241| ౧|౦1[౦. 89, గగం[౧గ౧& 6౧012౪8, 4.0. ౧౭గ౫ గింర, 1౧6౫4461౧1, 5౯0౮)10౬౧4940 - 500 015. ౧|| : (040) 2779 0094, 08|| . 9393933946 ద-౧4| . ౧/4851| ఆ&౧౦౦.౦౦.[౧ ౫౧4. గొడక16౧/౦౦౬9౧/2గ ౦0గ 216

_-పులలరి ఇద్ధభయానక జివ ప్వర్ధ జయం. . సిద్ధార్థుడు జన్మించి 2550 సంవళ్షరాలైంది. . గౌతమ బుద్దుని పేరు విననివారుండరు. .. తెలియని ప్రపంచం ఉండదు. బుద్దుని స్మరణ నిత్మావసరం. న న ప్రేమ, కరుణ ఉన్నంతకాలం బుద్ధుడు ఉన్నట్లే. నా ;.. దేశానికి దేశానికి దేవుళ్లు మారుతుంటారు. నం ; కాలానికి కాలానికి మతాలు మారుతుంటాయి. |. నాటికీ నేటికీ మారనిది మానవత్వం. ]. మానవతకు మతం నీడ అవసరం లేదని, | , _ కులం ఆసరా అసలు అవసరం లేదని . ఎలుగెత్తి చెప్పినవాడు బుద్దుడు. . వేదాల నీడలో మనుగడ సాగించలేక ౧౧౧. ] బోధి నీడను ఆశ్రయించి బుద్ధుడు అయ్యాడు గ్‌ శ | _ ధ్యానం పండించుకుని జ్ఞాని అయ్యాడు. పం న బౌద్దాన్షి వఏశ్వవ్యాప్తంచేసి . “ప స! నే | తధాగతుడు అయ్యాడు. క్‌ు ఉనే స , భగవాన్‌ బుద్ధ ళ్‌ శ అభిమానించింది మానవతను. గో ప్రేమించింది మానవత్వాన్ని తూ న ఆరాధించింది హృదయథధర్శ్మాన్ని జీకే 1 బుద్ధుని సందేశాల సమాహారం జి | “భగవాన్‌ బుద్ధ... జన్‌. | | _ 'భగవాన్‌ బుద్ది చరిత్ర చదివితే 1 ధ్యానం కుదురుతుంది. త్‌ " కి , యోగ సాహిత్యంలో శ్రీ శార్వరి 60 వ పుస్తకం 'భగవాన్‌ బుద్ధ _