Telugu bangaru dhara - anilvaranasi/indianlanguages GitHub Wiki

॥ క షేన్‌ ల ఈ ల నా న్నా! న = లే పనన య. | న నా. చా బా క స నన నన. నాన ల నయ డుం వ |. ర వదత నరు లా | వంట యు. న న టా : రు. గ [రం య లా ఇ లకీ? ల దాన లం మ న్నన గు శే సు ఎ న ఏ న ప్యారా. న య్‌ ల్‌ స; "మ వా | అ వ తత ప మ స తే! ఎంబీ ర కరం9.4 శక్త... కా టే. వ్‌ ( సనన స జపనరం క (హ్‌ న త స అ పిన న స న గొ నే టల్‌ మ క “60 ౪౦ రౌఖ)

బంగారం ధర డేవిడ్‌ రికార్డో తెలుగు: పి ఎస్‌ ఎం రావు పీకాక్‌ క్లాసిక్స్‌ హైదరాబాద్‌

తజు౭8810ు జ, 20012600 00416 మంజరేం'5 గ౫౦ 2016, క4లండ వెంత 26 వంచన [2085066 9 లింంం066 రటూతలూ ౧001102600 ఇమిరై 05ల2ం/8న 20000 ౧౦౮౪౯ ౨ట!ంై8: 500/2 02064022 యో క లో స రే ౨901104608 ౫0: 14 భో శ | ర్హ్త" ర్చి ళో అ: ౨౭౦౧1౬)౩ ౧౩ ర (=. స్తో "జే ౮6216: 1000 “2 (రల తం ట్‌ శ౦ిటి కరంలము 20 (ఇగ ఓ హో రి నవా యా... గ కంంనంంకకింయ ప 2004, “నంత 0 కరం2026, ఉంయ02 ?664ట1, 10412 ర విం4664 2521 01401212 2126ల గ్ర 0 2గెం2643, పరల2026.

౮00199 20 27282016 221] 16 900;%ట 0 */15212206102 206 2225210011

0001 00565. 02 028 2150 601264 ౦౮౫౧4౧౦౫ 1148౯29 0 6 005

కైం[6664 0గ060960016 ౧56 6 1లీ 288601 2001276, 92820482 0010%) కంర 00200, క్ప4ల2024-500072. ౨. 2306 3729, 610౧ 98499 40791

నా వివరణ ఈ చిరు పుస్తకంలో రెండు వ్యాసాలున్నాయి. ఒకటి, బంగారం ధర రెండు, లాభాలు: విశ్లేషణ. అర్ధశాస్తాన్ని ప్రత్యేకించి అధ్యయనం చేయనివారు కూడా అద్ధం చేసుకునేటట్లు ఈ వ్యాసాలు ఉంటే బాగుండుననిపించింది. కనుక మూల(గ్రంధంలో మరీ సాంకేతికంగా ఉన్న అంశాల్ని కూడా సరళంగా ఉండేట్టు అనువదించటానికి ప్రయత్నించాను. అయినా రచయిత తాను చెప్పదల్చుకున్న అభిప్రాయాలు, సేద్ధాంతీకరించిన విషయాల్నీ. ఉన్నదున్నట్టు చెప్పాల్సిన అనువాదకుడి బాధ్యతను ఎక్కడా మరవలేదు. అక్కడక్కడా కొన్ని విషయాల్ని వదిలేసినప్పటికీ అది అనువొదలక్ష్యాన్ని భంగపరచలేదు. చివరగా మనసులోని మాట: ఈ వ్యాసాల్ని అనువదించటం ఒక గొప్ప అవకాశంగా బ్లావ్రిస్తున్నాన్ను. సమాజ (శ్రేయస్సుకోసం 'పీకాక్‌ క్లాసిక్స్‌'వారు మహాయజ్ఞం చేస్తున్నార్ముష్టోర్టోళ్లుద్గప 'న్‌పంతో పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం స్వార్ధ ప్రయోజనం. సంస్థ సంపాదకులు గాంధీగారు. ఈ పుస్తకాన్ని అనువదించమని అదగ్గానే అంగీకరించడంలోని అనలు రహన్యమిదేనని కన్ఫెషనల్‌ స్టేట్‌మెంటుగా ఒప్పుకుంటున్నాా గాంధీగారికి అప్పుడు మనసులో చెప్పుకున్న కృతజ్ఞతలు ఇప్పుడు అక్షరరూపంలో తెలియజేసుకుంటూ...

  • అనువాదకుడు

బంగారం ధర (పెరుగుతున్న బంగారం ధర తరుగుతున్న కరెన్సీ విలువని నిరూపిస్తుంది)

ఈ రచయిత కరెన్సినోట్లకు సంబంధించిన తన ఆలోచనల్లో కొన్నింటిని మార్నింగ్‌ క్రానికల్‌ పత్రికలోని వ్యాసం ద్వారా ఇదివరకే ప్రజల దృష్టికి తెచ్చాడు. ఐనప్పటికీ తన అభిప్రాయాల్ని మరోసారి సుస్పష్టంగా ప్రచురించి తగు చర్చకు వీలు కల్పించడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాడు. కాగితపు కరెన్సీ విలువ అమితవేగంతో పడిపోతుండదాన్ని అత్యంత ఆందోళనతో పరిశీలించడం ఈ ఆలోచనకి (ప్రేరణ నిచ్చింది.

'ప్రజల్లో ఎక్కువమంది కరెన్సీ విలువ పతనాన్ని గమనించడంలేదు. విలువ పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో వారికి సరియైన అవగాహనలేదు. కరెన్సీ విలువ పతనం అవుతోందన్న సంగతి కొద్దిమందికి తెలుసు. అయితే అందుకు వారు ఏవేవో కారణాలు ఊహిస్తున్నారు త్‌ప్ప అసలు కారణాన్ని మాత్రం (గ్రహించడం లేదు. ఈ స్థితి రచయితని మరింత కలవర వరున్తున్నది. కరెన్నీ విలువ పతనమనే ఈ తీవ్రమయిన జబ్బుకి మందుని సూచించడానికి ముందు ఆ జబ్బుకి గల కారణాలను సందేహానికి తావు లేని విధంగా వివరించాల్సిన అవసరం ఉంది.

చాలా కాలంగా ఈ దేశంలో కాగితం కరెన్సీ విలువ పతనమౌతున్న వైనాన్ని ఈ రచయిత ఆమోదిత రాజకీయ అర్థశా(స్త సూత్రాల ఆధారంగా నిరూపించ దబచుకున్నాడు. ఈ పతనానికి అసలు కారణం మితిమీరిన పరిమాణంలో నగదు లభ్యమవడమే కాని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌పైనా దాని పనితీరుపైనా విశ్వాసం సన్నగిల్లడంగాని మరోకారణంవల్లగాని కాదనేది గట్టి నిజం. నిజానికి కాగితపు కరెన్సీకి ఉండాల్సిన విలువని పునరుద్ధరించే శక్తి ఈ దేశానికి నిస్సందేహంగా ఉందని రచయిత సంపూర్ణంగా నమ్ముతున్నాడు. కాగితపు కరెన్సీ విలువ నాణాల విలువకి సమానంగా ఉండాలనేది సూత్రం. నాజాల చెల్లింపుకు కాగితపు కరెన్సీ హామీగా ఉంటుందనేది జగద్వితం. ఈ హామీని నిలబెట్టుకొనేశక్తి ఈ దేశానికి ఉంది కనుక కాగితపు కరెన్సీ నిర్ధారిత విలువని పునరుద్ధరించే శక్తి దానికుందని గమనించాలి. అంటే ఈ ౪౮ పి ఎస్‌ ఎం రావు

విషయంలో అవసరమైన చర్యలు గనక తీసుకోగలిగితే ఎంతమాత్రం భయపడాల్సిన పని ఉండదు. లార్డ్‌కింగ్‌ సమర్ధంగా చేసిన వాదనలకి ఈవిషయంలో ఈ రచయిత అదనంగా చెప్పుకోతగ్గ స్థాయిలో చేర్చేదేమీలేదు. కాని చెడు మితిమీరుతున్న తరుణంలో సార్వత్రిక సంక్షేమానికి సంబంధించిన అంశాన్ని ప్రజలు (శ్రద్ధగా పరిశీలించాలని అటువైపు వారి దృష్టిని మరలించాలనేదే రచయిత అసలు ఉద్దేశ్యం. బ్యాంకుల స్థాపనకి పూర్వం (ప్రపంచంలో వస్తు పంపిణీ కోసం వినియోగించిన అపురూప లోహాల్ని ఆయా నాగరిక దేశాలు వాటి సంపద, వాణిజ్యం లావాదేవీలు, చలామణి స్థాయిలను బట్టి నిర్దిష్ట పరిమాణంలోకి విభజించుకొన్నట్టు ప్రనిద్ధ రాజకీయార్డికవేత్తలు నమ్ముతున్నారు. అలా విభాజ్యమైన లోహానికి సర్వత్రా సమాన విలువ ఉండి ప్రతీ దేశానికి దాని లభ్యత సమానంగా అవసరమైన కారణంగా ఎగుమతి దిగుమతులకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడలేదు. ఇతర ఉత్పత్తులకు మళ్లేనే వెండి, బంగారాలకూ అంతర్గత విలువ ఉంటుంది. అంటే స్వతహాగా వాటికి వస్తురూపేణా ఉండే విలువ అన్నమాట. అది అసమంజసమైన విలువకాదు. ఈ వస్తువులకున్న కొరత, వాటిని "సేకరించడంలో వినియోగించిన శమ, పెట్టుబడులవంటి అంశాలపైన వాటి విలువ ఆధారపడి ఉంటుంది. పైగా వాటి నాణ్యమైన ఉపయోగం, అందం, అరుదైన లభ్యతలు ఈ లోవాలు ప్రియంగా ఉండడానికి మౌలిక ్రాతిపదికలని దాక్టర్‌ స్మిత్‌ తెలియజేస్తారు. అందుకే ఎక్కువ మొత్తంలో వస్తుమార్చిడి సర్వత్రా ఆమోదం ఉన్న ఈ లోవోల మార్చిడి ద్వారా జరుగుతుంది. ఈ లోహాలకు విలువ వాటిని నాణాలుగా వాడడం వల్ల వచ్చింది కాదు. అట్టి వాడకానికి ముందు నుండే దానితో నిమిత్తం లేకుండానే వాటికా విలువ ఉందని ఆ కారణంగానే వాటిని నాణాలుగొ వాడే వీలు కలిగిందని స్మిత్‌ అంటారు. ద్రవ్యంగా ఉపయుక్తమయ్యే వెండి బంగారాలు అతి అరుదుగా లభ్యమైనా అత్యంత పుష్కలంగా దొరికినా జరిగే ప్రమాదమేలేదని గమనించాలి. ఈ (ద్రవ్య మాధ్యమం దృష్టా మాత్రమే వస్తువుల కొనుగోలు చవకగాగాని లేదా ఖరీదుగాగాని కనిపిస్తుంది. అంతకు మించి ఈలోహాల లభ్యతలోని హెచ్చు తగ్గులు చూపించగల ప్రభావం ఏదీ ఉండదు. తక్కువ పరిమాణంలో లభ్యమయ్యే ద్రవ్యం అధిక మొత్తంలో దానిలానే చలామణి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ఒక కోటి లభ్యత ఎంత ఉపయోగపడుతుందో వది కోట్ల మొత్తం కూడా అదే ప్రయోజనాన్ని బంగారం ధర ళా

సమకూరుస్తుంది. అత్యంత సమృద్ధమైన బంగారు గనులు ప్రపంచ సంపదని 'పెంచజాలవని దాక్టర్‌ స్మిత్‌ అనడం ఇక్కడ గమనార్హం. దాని కొరత వల్ల విలువను పొందిన వస్తువు అధికంగా లభిస్తే అది (అంటే బంగారం) కోల్పోయేది దాని విలువ మాత్రమేనని స్మిత్‌ భావన.

సంపదని అభివృద్ధి పరచుకొనే ప్రక్రియలో ఒక దేశం మరో దేశానికంటే ముందుంటే ఆ దేశానికి ఎక్కువ స్థాయిలో ద్రవ్యం అవసరమవుతుంది. ఆ అవసరం మేరకు అది దానిని సేకరించుకొంటుంది. దాని సంపదకు అనుగుణమైన స్థాయిలో ప్రపంచ ద్రవ్యంలో ఇది తన వాటాను పొందుతుంది. అభివృద్ధిలో ముందున్న దేశపు వాణిజ్యం, వస్తు సంపద, చెల్లింపులు కూడా ఇతర దేశాల కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ప్రపంచపు సార్వత్రిక ద్రవ్యం అంటే అన్నిచోట్లా ఆమోదయోగ్యమై ద్రవ్య పంపిణీ జరుగుతుంది. అన్ని దేశాలు ఈ విధంగా (ద్రవ్యానికి తమ వంతు గిరాకీని సృష్టిస్తాయి.

అదే విధంగా ఏదేశమైనా తన సంపదలో కొంత భాగాన్ని వ్యర్ధపరచుకొన్నా లేక వాణిజ్య వాటాని కోల్పోయినా తన చలామణి మాధ్యమ పరిమాణాన్ని అంటే ద్రవ్యాన్ని కూడా కోల్పోతుంది. అంటే ముందున్నంత పరిమాణంలో ద్రవ్యం దాని వద్ద ఉండదు. కొంత ఇతర దేశాల్లోకి ఎగుమతై వివిధ దేశాల వ్యాపార వాణిజ్యాల స్థాయికి అనుగుణంగా విభాజ్యమై ఒక రకమైన సంతులనాన్ని సొధిస్తుంది. అంటే ఈ దేశం కోల్పోయిన మేర ఇతర దేశాలు ద్రవ్యాన్ని పొందుతాయి.

(ప్రపంచ దేశాల సాపేక్ష స్థితి మారక పోయినప్పటికీ ఒకరితో ఒకరికి విసృత వాణిజ్యం జరుగుతున్నప్పటికీ మొత్తంపైన వారి ఎగుమతి దిగుమతులు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి. ఇంగ్లాండ్‌ తాను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేసే మొత్తం కన్నా ఎక్కువ వస్తువుల్ని దిగుమతి చేసుకోవచ్చుగాక కాని తతృ్భలితంగా మరో దేశానికి ఎక్కువ ఎగుమతి చేయడం ఆ దేశం నుండి ఫ్రాన్స్‌ అధికంగా దిగుమతి చేసుకోవడం లాంటి ప్రక్రియ వల్ల మొత్తం ప్రపంచ ఎగుమతులు (ప్రపంచ దిగుమతులకు సమాన మవుతాయి. చెక్కులవంటి మార్చిడి పథ్రాలే ఎగుమతి దిగుమతుల లెక్కలు సరిచేయడానికి చేతులు మారతాయిగాని ద్రవ్యం చెల్లించడం జరగదు. అన్ని దేశాల్లో దానికి సమాన విలువ ఉండడంవల్ల ఇలాంటి సవరణలతో చెల్లింపు బాధ్యతలు రాబడితో సరిచూసుకొనే వీలుకలుగుతుంది.

విషయాన్ని ఇంకా స్పష్టంగా అర్ధంచేసుకోడానికి ఒక అంశాన్ని గమనిద్దాం. వ! పి ఎస్‌ ఎం రావు

ఉదాహరణకి, ఏదో ఒక దేశంలో ఒక కొత్త బంగారు గనిని కనుక్కోవడం జరిగిందనుకుందాం. అట్టి దేశంలో పెరిగిన బంగారం లభ్యత దృష్ట్వా కరెన్సీ విలువ ఇతర దేశాల్లోలాగా ఉండదు. వెండి బంగారాలు వాటి సహజ రూపంలో నున్నా నాణాలుగా ఉన్నా ఇతర వస్తువుల స్టీతిని నిర్దేశించే సూత్రాలే వాటికీ వర్తిస్తాయి. చవకగా లభ్యమయ్యి చోటి నుండి ప్రియంగా ఉన్న దేశంలోకి ఇవి కూడా ఎగుమతవుతాయి. పెట్టుబడి, కరెన్సీల మధ్య ఈ గనుల ఆవిర్భావానికి ముందున్న విలువ తిరిగి స్థాపితమయ్యే వరకు ఇలా జరిగి చివరకు సమతౌల్యస్థితి ఏర్పడుతుంది. అలా వెండి బంగారాలకు సర్వత్రా ఒకే విలువ ఏర్పడుతుంది. బంగారం ఎగుమతై వస్తువులు దిగుమతవుతాయి. బంగారం లేదా ద్రవ్య ఎగుమతుల వల్ల వస్తువుల దిగుమతి చేసుకొన్న దేశం ప్రతికూల వ్యాపార సమతౌల్య స్థితి గల దేశంగా కన్పించినా ఈ దేశం తనకు అక్కరకు కొని వస్తువుని ఎగుమతి చేసి ఉత్పత్తి సంపదలను పెంచే వస్తువులను దిగుమతి చేసుకుంటున్న దేశంగా గుర్తించాలి. అంటే ఈ రూపంలో ఒక దేశంలో అధికంగా లభ్యమైన బంగారం క్రమంగా ఇతర దేశాలకు ఎగుమతై సమతౌల్య స్థితికి దోహదపడుతుంది.

కొత్త బంగారు గనికి బదులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ లాంటి ఒక బ్యాంకు ఒక దేశంలో స్థాపిత మయిందనుకుందాం. ఆ బ్యాంకు చలామణికి వీలున్న బ్యాంకు నోట్లు విడుదలచేసి వ్యాపారులకు లేదా (ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో రుణాన్ని అందించి ద్రవ్య పరిమాణాన్ని పెంచితే కొత్త బంగారు గని సృష్టించిన ఫలితాన్నే అది కూడా సృష్టిస్తుంది. అప్పుడు కరెన్సీ విలువ పతనమై వస్తువుల ధరలు 'ప్రియమవుతాయి. ఈ దేశానికీ ఇతర దేశాలకీ మధ్య పూర్వపు సమతౌల్య స్థితి నాజాల్లో కొంత భాగాన్ని ఎగుమతి చేసినప్పుడే సాధ్యపడుతుంది. కొత్త గని నుండి వచ్చిన బంగారంగాని కొత్త బ్యాంకు విడుదల చేసిన నోట్లుగాని బంగారం లేదా నాణాల ఎగుమతినే ప్రోత్సహిస్తాయి. ఎంతమాత్రం విలువలేని కరెన్సీని అతి విలువైన బంగారానికి ప్రత్యామ్నాయంగా బ్యాంకు ఉపయోగిస్తుంది. అలాగే అదనంగా దొరికే బంగారం పెట్టుబడిగా మారి ఆదాయం పెంచే మాధ్యమంగా ఉపయోగపడుతుంది.

బ్యాంకు వల్ల వచ్చే లాభాల్ని మన రహదార్లని పంట పొలాలకింద మార్చి రోడ్లు వాయు మార్గాన వేయడం వల్ల సమకూరే ప్రయోజనంతో పోలుస్తాడు దాక్టర్‌ స్మిత్‌. రహదార్లు నాజాలలాగా బాగొ ఉపయుక్తమైనవే ఐనప్పటికీ ఎలాంటి ఆదాయాన్ని నంపాయించి పెట్టవు. నాణాలు దేశం నుండి దాటించడం పట్ల కొందరు అంగారం ధర ఫ్ర

కలవరపడవచ్చు. (ప్రతికూల వ్యాపార పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. ఇలా భావించే దీని ఎగుమతికి వ్యతిరేకమైన చట్టం ఏర్పడింది. కాని ఈ ఎగుమతి మన ఇష్టం మేరకే జరుగుతుంది కాని తప్పని స్థితి వల్ల మాత్రం కాదు. వ్యర్థ వస్తువుని ఎగుమతి చేసి ఉత్పాదక వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం లాభసాటి వ్యాపారమే అవుతుంది. వ్యక్తుల ఇష్టాఇష్టాలకు నాణాల ఎగుమతిని వదిలిపెడితే వచ్చే నష్టమేమీ ఉండదు. ఇతర వస్తువులకన్నా దీని ఎగుమతి హెచ్చుస్థాయిలో ఏమీ జరగదు. దేశానికి ప్రయోజనం కలిగినప్పుడు మాత్రమే హెచ్చు న్థాయి ఎగుమతి జరుగుతుంది.

ఎగుమతి లాభసాటిదైనప్పుడు ఏచట్టమూ దానిని నియంత్రించజాలదు. ఈ విషయంలోగాని స్వేద్భాయుత పోటీ ఉన్న ఇతర వాణిజ్య విషయంలోగాని సామాజిక, వ్యక్తిగత ప్రయోజనాలు వేరు వేరుగా ఉండవు. నాణాల కరిగింపు, ఎగుమతులకు సంబంధించిన చట్టాన్ని కచ్చితంగా అమలుచేస్తూ బంగారం ఎగుమతి గనక స్వేచ్చగా అనుమతిస్తే దానివల్ల ఒరిగే ప్రయోజనమేమీ ఉండదు. కాని నాణాల రూపంలోని బంగారానికి మామూలు బంగారానికంటే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది కరెన్సీ వాస్తవ తరుగుకు దారితీస్తుంది. బంగారం ధర దాని నిష్పత్తి లోనే ఇతర అన్ని వస్తువుల ధరల్ని పెంచుతుంది. ధాన్యం పండించిన వాడిని గనక తన ఉత్పత్తిని మార్కెటు ధరలో సగానికి ఎక్కువకు అమ్మడానికి వీలులేదని గనక చట్టం చేస్తే ఎంత నష్టమైతే వాటిల్లుతుందో అదే రీతిని ద్రవ్యంపై గల నియమం దాని యజమానిని ఆమేర నష్టపరుస్తుంది.

నాణాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని సులభంగా బేఖాతరు చెయ్యవచ్చు. ఎందుకంటే బంగారానికి సహజరూపంలో గాని నాణాల రూపంలోగాని ఇంచుమించు ఒకే విలువ ఉంటుంది. కనుక ఒక దేశం కరెన్సీ ఎంతో కాలం మరో దేశం కరెన్సీకంటే విలువైనదిగా ఉండదు. హెచ్చు కరెన్సీ కల్లి ఉండడమనేది కేవలం సాపేక్షం మాత్రమేనని గమనించాలి. ఇంగ్లాండులో కోటి, ఫ్రాన్స్‌లో ఏఖై లక్షలు, హాలెండ్‌లో నలభైలక్షలు మరో దేశంలో ఇంకో మొత్తంలో ద్రవ్య చలామణి ఉన్నా తగు నిష్పత్తులు కొనసాగుతుంటే (ద్రవ్యస్థాయి ఇబ్బడి ముబ్బడైనా అదిగమనార్దమే కాదు. కరెన్సీ మోతాదు పెరిగినప్పుడు వస్తువుల ధరలు సర్వత్రా పెరుగుతాయి. కాని కరెన్సీ ఎగుమతి జరగదు. అయితే నిప్పత్తులను తారుమారు చేస్తూ ఒక్క ఇంగ్లాందే తన కరెన్సీని రెండింతలు పెంచి ఫ్రాన్స్‌, హాలెండ్‌ వగైరాలు మునుపటి స్థాయిలోనే తమ కం పి ఏస్‌ ఎం రావు

కరెన్సీలని నిర్వహిస్తే అప్పుడు ఇంగ్లాండు కరెన్సీ పెరిగినట్టు ఇతర దేశాల కరెన్సీ పరిమాణం తగ్గినట్లు భావించాల్సి వస్తుంది. అప్పుడు ఇంగ్లాండ్‌ మొదటి నిష్పత్తిని సాధించేవరకు ఎగుమతిని పెంచాల్సి ఉంటుంది.

ఉదాహరణకి (ఫ్రాన్స్‌లో ఒక బెన్సు బంగారం ఇంగ్లాండు కన్న విలువైనదిగా మారితే ఫ్రాన్స్‌లో వస్తువులు చవకగా ఉంటాయి అప్పుడు ఇంగ్లాండు నుండి బంగారం (ఫ్రాన్స్‌కు తరలుతుంది. చవకగా ఉన్న బంగారాన్ని ఎగుమతి చేసి ఇంగ్లాండులో ప్రియంగా ఉన్న వస్తువుల్ని కొనుక్కోనడం తెలివైనపని. వస్తువులు సహజంగా చవకగా లభించే దేశం నుండి ఎక్కువ ఖరీదు గల దేశంలోకి ఎగుమతవుతాయి.

బ్యాంకు తన దగ్గరనున్న బంగారు నాణాల విలువ కనుగుణంగానే నోట్ల విడుదల చేస్తుంది కనక అది నిశ్చింతగా నోట్లని విడుదలచేస్తూ పోవచ్చు. విషయాన్ని స్పష్టంగా వివరించాలంటే నాణాలకూ బ్యాంకునోట్లకూ ఉన్న లంకెను ఇక్కడ కొంత వివరించాలి. బ్యాంకు ఎంత మొత్తంలో కరెన్సీని విడుదల చేస్తుందో ఆ విలువకు సమాన పరిమాణంలో తన వద్ద బంగారాన్ని నాణాల రూపంలో నిలువ చేసుకోవాలి. నోట్లపైన ఉన్న విలువకి సమానమైన నాజాల్ని నోట్లు కలిగి ఉన్న వారు అవి బ్యాంకుకు సమర్పించి అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుపైన ఉంటుంది. అంటే కాగితపు నోట్లను కలిగి ఉండడం బంగారు నాణాలను కలిగి ఉండడంతో సమానమేనని అంటే అన్ని దేశాల్లో ఆమోదం పొందిన బంగారం కలిగి ఉండదమేనని తెలుసుకోవాలి.

మన దేశంలోని వస్తువుల ధరలు బంగారం మాధ్యమం ద్వారా చూసినప్పుడు ఇతర దేశాలలోని వస్తువులకంటే భిన్నంగా ఉన్నప్పుడు బంగారం ఎగుమతి దిగుమతుల ద్వారా లేదా దానికి ప్రాతినిధ్యం వహించే కరెన్సీద్వారా వస్తువుల ఎగుమతులు లేదా దిగుమతులు జరుగుతాయి. ఈ విధంగా మన కరెన్సీ ఇతర దేశాల కరెన్సీలతో సమాన విలువని సాధించే ప్రయత్నం చేస్తుంది. ఇలా సమస్థాయి విలువ ఏర్పడ్డ తర్వాత ఎగుమతి వల్ల చేకూరే అదనపు ప్రయోజనాలు మృగ్యమవుతాయి. ఈ విషయాన్ని విస్మరించి బ్యాంకు గనక నిరుడు కొంత స్థాయిలో నోట్ల విడుదల అవసరమయింది కనక ఈ ఏడూ అంతే అవసరమని విడుదల చేస్తే బంగారానికి గిరాకీ పెరిగి దాని విలున పెరుగుతుంది.

బ్యాంకు ఇలాగే నోట్ల విడుదల చేస్తూ పోతుంటే నోట్లు బ్యాంకుకు సమర్పించి నాణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుంది. అప్పుడు తన వద్ద ఉన్న చివరి నాణం వరకూ చెల్లించే పరిస్థితి ఏర్పడి తిరిగి బంగారాన్ని సేకరించి నాణాలు తయారుచేసే బంగారం ధర క్‌

పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తిరిగి నాణాలు కరిగించి బంగారంగా బ్యాంకుకే అమ్మే స్థితి నెలకొంటుంది. తిరిగి బ్యాంకు నోట్ల విడుదల వాటిని సమర్ప్చించినప్పుదు నాజీలను అందజేయడం జరుగుతుంది. బ్యాంకు పని గ్రీకు పురాణంలోని పెనలోప్‌ కథలా ఉంటుందని స్మిత్‌ అభివర్షించారు. పొద్దంతా చేసిన పనిని రాత్రి పాడుచేయడం అదే పనిని మరుసటి రోజు నిర్వహించి తదుపరి పాడుచేయడం పని ఎప్పటికీ పూర్తవకుండా చూసుకోవడమే పెనలోప్‌ లక్ష్యం. (తనను మోహించి పొందు కోరినవారిని మభ్యపెట్టడానికిగాను తాను ఒక అల్లిక పనిలో ఉన్నానని ఆ పని పూర్తి కొగానే తాను వారి కోర్కెను ఆమోదిస్తానని పెనలోప్‌ అంటుంది. కాని ఆమె తన పనిని ఎప్పటికీ పూర్తి కాకుండా పొద్దంతా అల్లడమూ రాత్రిపూట విపష్పడమూ చేస్తుంది. - అను.) బ్యాంకు చేసే ఈ వ్యర్థ ప్రయత్నాన్ని థోర్నీటన్‌ కూడా న్నిత్‌ లాగే వివరిస్తారు. మితిమీరి విడుదలైన నోట్లు సమర్పించిన ఫలితంగా బంగారు నాణాలు కోల్పోవడం నాణాలు తయారుచేయడానికి బ్యాంక్లు బంగారాన్ని కొనడం, తయారైన నాణాల్ని దొంగ వ్యాపారులు లాభసాటిగా భావించి కరిగించి తిరిగి బంగారంగా అమ్మడం జరుగుతుంది. ఇలా నాణాలు తయారు చేయడం ఒక పనైతే అవి కరిగించి అమ్మడం మరో వృత్తిగా తయారై చివరకు బ్యాంకు తన్నుతాను కాపాడుకోడానికిగాను విడుదల చేసిన నోట్లను కొంతమేర చలామణి నుంచి ఉపనంవారించుకొనే పరిస్థితి ఎదురవుతుంది. విదేశాల్లో వాటికున్న సాపేక్ష విలువల్ని బట్టి నాణాల ఎగుమతి దిగుమతులు జరుగుతాయి. నోట్ల పరిస్థితి కూడా ఇదే. రెండు చోట్లా విలువ సమానమయ్యే వరకు ఇలా జరుగుతుంది. చివరకు ఇతర దేశాల కరెన్సీతో సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. అప్పుడు బంగారాన్ని ఎగుమతి చేయడంలోని అదనపు ప్రయోజనం మాయమవుతుంది. అలానే బ్యాంకుకు నోట్లనందించి నాణేలు పొంది కరిగించి అమ్మడంలోని ఆకర్షణ కూడా తొలగిపోతుంది. అధిక విలువలేని ద్రవ్యాన్ని ఎగుమతి చేసి వస్తువులు దిగుమతి చేసుకోవడం లాభసాటి వ్యాపారం కాదని తెలుస్తుంది. అయితే విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన థోర్న్‌టన్‌ ఈ దేశానికి చెల్లింపుల (ప్రతికూల స్థితి అన్నది పంటలు సరిగా పందక పోవడం, ధాన్యం దిగుమతి పెరగడం వల్ల వస్తుందని భావిస్తాడు. ధాన్యాన్ని ఎగుమతి చేసిన దేశం మన దేశంలోని ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకోకపోవడం వల్ల తన ఎగుమతికి ప్రతిఫలంగా $2 పి ఎస్‌ ఏం రావు

(ద్రవ్యాన్ని పొందుతుంది. అంటే దిగుమతికి సమానంగా వస్తువుల ఎగుమతి జరగదు. అప్పుడు మన దేశంలోని ద్రవ్యం అంటే పరోక్షంగా నాణాలు ఎగుమతవుతాయి. అప్పుడు బంగారానికి గిరాకీ పెరిగి దాని విలువ పెరుగుతుంది. అంటే దాని ధర 'పెరగుతుంది, అంటారు ధోర్నీటన్‌. బంగారం ధర బంగారు నాణాల్లో వ్యక్తం అవుతుందని, నాణాలు కరిగించి ఎగుమతిచేయదాన్ని నిషేదించే చట్టం సులభంగా అతిక్రమించడం వీలవుతుందని ఆయన అంటారు. బంగారం గిరాకీ దాని ధరని ద్రవ్య ప్రమాణంలో పెంచుతుందని కూడా ఆయన అంటారు.

బంగారం విలువ పెరగడం దాని ద్రవ్య ప్రమాణ ధర పెరగడం మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తించకపోవడమే ఈ వాదనలో లోపం. ఒకవేళ ధాన్యానికి ఎక్కువ గిరాకీ పెరిగితే దాని ధర పెరుగుతుంది. దాని ధరని ద్రవ్యంతో అంటే ఇతర వస్తువులతో పోలుస్తున్నామన్నమాట. అదే విధంగా బంగారానికి గిరాకీ పెరిగిదంటే చాని ధాన్యం రూపేణా ధర పెరిగిందన్నమాట. కాని ఎక్కడైనా ఒక క్వింటాలు ధాన్యం విలువ మరో క్వింటాల్‌ విలువకు సమానంగా, ఒక తులం బంగారం మరో తులం బంగారానికి సమానంగానే ఉంటాయి. తులం బంగారానికి గాని తులం బంగారంతో తయారైన నాణానికి గాని నేరు వేరు విలువలు ఉండవు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమంటే కాగితపు కరెన్సీ పతనం దానిపైని ఆంక్షలవల్ల తాత్కాలికంగా జరుగుతుంది. కాని దాని వెలితి బంగారం దిగుమతితో వెంటనే పూడుకుంటుంది. ధాన్యానికి ఎంత కొరత ఏర్పడినా (ద్రవ్యం ఎగుమతిని ద్రవ్య కొరతే నియంత్రిస్తుంది. ద్రవ్యానికి సార్వతికంగా గిరాకీ ఉంటుంది. ప్రస్తుత నాగరిక సమాజంలో వాణిజ్య లావాదేవీలలో అది కీలకపాత్ర నసొస్తుందె. అంచేత అది ఎప్పుడూ ప్రస్తుతపు యుద్ధవాతావరణంలో కూడా అంటే మన వాణిజ్యాన్ని శత్రువు నాశనం చేయాలని చూస్తున్న పరిస్థితిలో కూడా మితిమీరి ఎగుమతి అవదు. పెరుగుతున్న ద్రవ్యకొరత దాని ఎగుమతికి అసలు అవకాశం కలిగించదు.

విదేశీయులు వారి ధాన్యం ఎగుమతికి బదులు మన ఇతర వస్తువుల్ని ఎందుకు దిగుమతి చేసుకోరో ధోర్నిటన్‌ గారు విశదీకరించలేదు. వారి అయిష్టత వల్లనే మన నాణేలను ఎగుమతిచేయక గత్యంతరంలేని పరిస్టితి ఏర్పడుతుందని థోర్నీటన్‌ నిరూపీించగలగాలి. వస్తువులకు బదులుగా మన నాణాల్ని ఇస్తున్నామంటే అది మనం ఇష్ట పూర్వకంగా చేస్తున్న పనేగాని తప్పనిసరి స్థితి వల్ల మాత్రం కాదు.

కరెన్సీకి కల్గిన నిష్ప్రయోజకత సందర్భంలో తప్ప మన ఎగుమళతులకి మించిన బంగారం ధర కప

దిగుమతులు చేసుకోరాదు. నాణాలు చవక అయిన కారణంగా ఈ సందర్భంలోని ఇతర వస్తువుల లాగే ఎగుమతి అవుతాయి తప్ప మరొకటి కాదు. ప్రతికూల చెల్లింపుల స్థితికి ఇది కారణమవుతుందే కాని దాని ఫలితం మాత్రం కాదు. వేరే ఎగుమతి యోగ్య వస్తువులు లేనప్పుడుగాని ఉన్నత విపణికి పంపుతున్న సందర్భాలలో గాని నాజేలను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలా చేయడం నిష్రయోజనమైన కరెన్సీపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. గతంలో సూచించినట్టు నిష్ప్రయోజనం హెచ్చు స్థాయి కరెన్సీలనేవి ఇతర అంశాలతో సంబంధమున్న సాపేక్ష విషయాలు. వేరే దేశంలో మన కరెన్సీకి విలువ పెరగడమంటే అక్కడి కరెన్సీలోని లోపమే అందుకు కారణమని గమనించాలి. ఉదాహరణకు ఇంగ్లాండుకు ధాన్యాన్ని ఎగుమతి చేసినవారు తత్ఫలితంగా లభించే పదిలక్షల ఇంగ్లాండు కరెన్సీతో వస్తువులుకొని వాటిని తమ దేశంలో అమ్ముకున్నప్పుడు అదనపు లాభం కలిగితే అప్పుడు వస్తువుల్ని దిగుమతి చేసుకొంటారు. అలా కాకుండా విదేశీ కరెన్సీయే తమ దేశంలో ఎక్కువ ప్రతిఫలాన్నిస్తే ఆ కరెన్సీకే గిరాకీ పెంచుతారు. విదేశంలోని వస్తువుల ధరని స్వదేశం ధరతో అట్లాగే ఇరు దేశాల్లోని బంగారం విలువల్ని అంచనావేసి ఏది ఎక్కువ లాభాన్నార్దిస్తే దానిక గిరాకీ పెంచుతారు. అంటే తమ ఎగుమతికి ప్రతిగా బంగారాన్నిగాని ఇతర వస్తువులనుగాని లాభదాయకతని బట్టి దిగుమతి చేసుకుంటారు.

లండన్‌ మార్కెట్లో ఇతర దేశాలకంటె బంగారం చవక గనక దాన్నే కోరుకుంటారు. మనం కరెన్సీ పరిమాణాన్ని తగ్గిస్తే బంగారం విలువ పెరుగుతుంది. అప్పుడు వారు సహజంగా బంగారం కన్న వస్తువుల దిగుమతికే ప్రాధాన్యతను ఇస్తారు. విషయ వివరణకోసం ఒక ఉదాహరణ ఇక్కడ అవసరం. ఒక వ్యక్తి హ్యామ్‌బర్గ్‌లోని వ్యక్తికి 100 పౌండ్లు అప్పుపడి ఉన్నాడనుకుందాం. ఇది చెల్లించడానికయ్యే ఖర్చు 5 పౌండ్లనుకుందాం. అప్పుడు అప్పుతీర్చడం 105 పొంద్లతో సరిపడుతుంది. అలాకాక 106 పౌంద్లకు ఇక్కడ కొన్ని మీటర్ల ఖ్లాుట్టను కొని అక్కడ అమ్మితే 101 పౌండ్లు వస్తే ఐదు పౌండ్ల నష్టం వస్తుంది. అప్పుడు అప్పుతీర్చడానికి బట్టలు కొని అమ్మడం తెలివైనపని కాదు. డబ్బు రూపేణా చెల్లించడమే వివేకవంతమైన పని. అలాకాక ఏవైనా ఇనుపవస్తువులు కొని అప్పుతీర్చడానికి 107 పౌండ్ల అయిందనుకుందాం. అప్పుడు బట్టల ఎగుమతే ఇనుము కన్న మేలైన పని, కాని ఇనుము, బట్టల ఎగుమతి రెండింటి కంటే డబ్బు ద్వారా చెల్లించడమే లాభదాయకం. ఇదే తర్మం ధాన్యం ఎగుమతిదారుకూ వర్తిస్తుంది. . న! పి ఎస్‌ వం రావు

కాని ఒకవేళ బ్యాంకు తన భద్రత విషయంలోని భయంచేత సర్భులేషన్‌లో ఉన్న కరెన్సీని తగ్గిస్తే అప్పుడు ద్రవ్యం, బట్టలు, ఇనుముల విలువలు 105, 106, 107 పొంద్లుగా ఉండవు. అన్నీ తారుమారు అవుతాయి. ద్రవ్యమే అన్నింటికన్న విలువైందిగా మారి విదేశీ అప్పు తీర్చడంలో దాని వినియోగం అవివేకమైన చర్యగా మారుతుంది. మనం వేరే దేశానికేదైనా ఉచిత సహాయం అందించ దలచుకుంటే (ద్రవ్యానికి బదులు ఏవైనా వస్తువుల్నే సరఫరా చేస్తాం. అప్పు తీర్చడానికి నాణాల్ని ఎగుమతి చేయడం అవి పుష్కలంగా ఉన్నప్పుడు ఇతరాల కంటే చవకగా ఉన్నప్పుడు మాత్రమే అలా చేస్తాం. అప్పుడు బ్యాంకు తన నోట్లకు బదులు నాజాల్ని అందజేస్తుంది కనక బంగారానికి డిమాండ్‌ ఏర్పడుతుంది. బంగారాన్ని చట్టపరంగా ఎగుమతి చేసే వీలుంటుంది. నాణాలను అలా ఎగుమతి చేసే వీలుండదు. అందుకే బంగారం ధర నాణాలకన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి తేలేదేమంటే చలామణిలో నున్న కరెన్సీ విలువ పడిపోవడానికి కారణం దాని నిష్ర్రయోజకత్వమే. విలువని వునరుద్ధరించుకోడానిగ్గాను బంగారాన్ని ఎగుమతి చేయాల్సి వుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అపురూపలోహాల ఎగుమతి, దిగుమతులను నియంత్రించే సూత్రాలివేననిపిస్తుంది. ఈ సూత్రాల పరిశీలనే ఈ వ్యాసకర్త ప్రధానోద్దేశం.

కాని ఈ దేశంలో విలువకి ప్రామాణిక కొలమానమేమిటనేది ఈ పరిశీలనకి ముందు తేల్చాల్సిన అంశం. ఏ దేశంలోనూ విలవకి కొలమానం శాశ్వతంగా ఉండదు. ఏంచేతంటే రెండులోహాలు (బంగారం, వెండి) అన్ని దేశాల్లో చలామణిలో ఉంటాయి. ఒకదానితో ఒకటి పోల్చినపుడు ఆ రెంటి విలువలూ మారుతుంటాయి. నాణాల తయారి సమయంలో వీటి పరస్పర విలువని ఎంత కచ్చితంగా నిర్ధారించగలిగినా తదుపరి మార్పును ఎవరూ నియంత్రించలేరు. ఒక లోహం విలువపడిపోవచ్చు లేదా పెరగనూవచ్చు. రెండోదానిది అలానే జరగవచ్చు లేదా స్థిరంగా వుండవచ్చు. ఈ తారతమ్యం ఫలితంగా ఒక లోహపు నాణాన్ని కరిగించి మరో లోహపు నాణాన్ని పొంది లాభం గడించే వీలుంటుంది. లాక్‌, లార్డ్‌ లివర్‌ పూల్‌ వంటి అనేక మేధావులు ఈ దుష్ఫలితాన్ని అరికట్టేందుకు ఈ రెంటిల్లో ఒక్క లోవోన్ని మాత్రమే (ప్రామాణిక కొలమానంగా చేయాలని సూచించారు. వెండి ఇందుకు తగిన లోహమని లాక్‌ అభిప్రాయం పడతాదు. బంగారు నాణాలు తమ విలువని తాము మార్కెటు ధరవరల్ని బట్టి నిర్ణయించుకుంటాయంటాడు. కాని లివర్‌పూల్‌ విశ్వవ్యాప్తంగా దానికున్న ఆదరణ, విలువని బట్టి బంగారాన్నే సార్వత్రిక విలువకి ప్రామాణికంగా బంగారం ధర 15

తీసుకోవాలంటాడు. బంగారం ఒక గినీకి మించిన నాణాల తయారీకి మాత్రమే వినియోగించాలని అంతకు తక్కువైన నాణాలని వెండితో తయారుచేయాలని ఆయన సూచిస్తారు. కాని ఇప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం అన్ని విలువల నాణాలకి బంగారాన్ని ఉపయోగించే వీలున్నది.

కాని 1774లో రూపొందిన చట్టం ప్రకారం ఒక్సేమారు 25 పౌండ్లకు మించిన చెల్లింపు విషయంలో వెండి నాణాలకు శాసనాత్మక గుర్తింపు ఉండదు. ఐర్లాండు, గ్రేట్‌ బ్రిటన్లలో వాటి బరువుని బట్టి నిర్ణయించిన విలువకు మించిన చెల్లింపులు వెండి నాణాలకు ఉండ వీలులేదు. ఇదే నిబంధనని 1798లో పునరుద్ధరించారు అది నేటికీ అమల్లో ఉంది. ివర్‌పూల్‌ చూపిన అనేక ఆధారాల దృష్టా ఒక శతాబ్దానికి పైగా బంగారు నాణాలు విలువను సూచించడానికి ప్రధాన కొలమానంగా ఉన్నాయి. కాని టంకశాలల్లో లోహాల సాపేక్ష విలువల్ని సరిగ్గా నిర్దారించని కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. బంగారానికి అతి ఎక్కువ విలువని ఆపాదించడం జరిగింది. అప్పుడు వెండి చలామణిలో పోటీపడి నిలువలేని పరిస్థితి ఏర్పడింది. ఒక కొత్త చట్టం ద్వారా గనక వెండికి చలామణిలో (ప్రాముఖ్యాన్నిస్తే దానికి ఇప్పుడు పట్టిన గతే బంగారానికి తర్వాత పడుతుంది. అప్పుడు బంగారం అదృశ్యమై వెండి ప్రామాణిక కరెన్సీ అవుతుంది.

ఇక్కడ కొంత వివరణ అవసరం. బంగారం వెండి నాజాల విలువ ఇప్పుడు 15/1 నిష్పత్తిలో ఉంది. అంటే ఒక బెన్సు బంగారం మింటు వారి లెక్కల ప్రకారం 1రోగ్మ్‌ జెన్సుల వెండికి సమానం. ఈ రెంటితో సమాన విలువగల నాణజాలే తయారవుతాయి.

కాని చాలాకాలం ఈ రెండు లోహాల మధ్య వాస్తవ మార్కెటు విలువ 15“1 గా మాత్రమే ఉంది. కనుక బ్యాంకు గాని మరాకరు గాని 15ీగ్మ పాళ్ళ వెండిని టంకశాలకు పంపి నాజాలుగా మార్చుకోరు. అంతకు తక్కువ మొత్తం వెండితోనే ఆమేర బంగారాన్ని బయచ నుండి పొందే వీలున్నది కనుక అలా చేయరు. అలానే బంగారం మార్కెటు విలువ టంకశాల నిర్ధారించిన దానికంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఎవరూ బంగారాన్ని టంకశాలకు పంపి నాణాలుగా తయారుచేయించుకోరు. అలా నష్టం పొందే పిచ్చి ప్రయత్నం ఎవరూ చేయరు. అంటే ఎక్కువ బంగారాన్ని 16 పి ఏస్‌ ఏం రావు

టంకశాలకు పంపి తక్కువ విలువగల నాణాల్ని పొందడు. సైగా అక్రమవ్యాపారి బంగారు నాణాల్ని కరిగించి సొమ్ముచేసుకుంటాడు.

ఈ స్థితిలో బంగారం బదులు వెండిని టంకశాలకు పంపి లాభం పొందే వీలుకలుగుతుంది. వాస్తవానికి వెండి నాణాల తయారీని నియంత్రిస్తూ పార్లమెంటు చేసిన శాసనాన్ని గనక రద్దు చేస్తే ఇప్పటికే అలా జరిగి ఉండేది, పార్లమెంటు ఉద్దేశ్యం బంగారాన్ని (ప్రామాణిక కరెన్సీగా గుర్తించాలని ఉండి ఉంటుంది. అందుకే చిల్లర అవసరాలకు సరిపడే విధంగా మాత్రమే వెండి నాణాల వినియోగాన్ని ప్రోత్సహించడం జరిగింది. వెండిని టంకశాలకు పంవి నాణాలు తయారు చేయించుకోడాన్ని చట్టం నిషేధించింది. కనుక పెద్ద మొత్తం అప్పు వెండి నాణుల రూపంలో తీర్చవీలులేని పరిస్థితి ఏర్పడింది. తప్పని సరిగా బంగారునాణాలు చెల్లించే అప్పుతీర్చాల్సి వస్తున్నది. బంగారాన్ని పెద్దమొత్తంలో టంకశాలకు పంపి నాణాలుగా తయారుచేయించుకొనే వీలు చట్టం కల్పిస్తున్నది. ఈ చట్టం అమల్లో ఉన్నంతకాలం బంగారమే ప్రామాణిక కరెన్సీగా నిలుస్తుంది.

ఒక వేళ ఒక జెన్సు బంగారం మార్కెట్లో 30 జెన్సుల వెండికి సమానంగా మారితే ఒక జెన్సుకు సమానమైన సొమ్ము (ఆంటే 3 పౌండ్లకు కొద్దిగా ఎక్కువ) బాకీపడ్డవాడు మొత్తం 80 జెన్సుల వెండిని ఇప్పుడు దత్తం చేయాల్సి ఉంటుంది. వెండి నాజాల నియంత్రణ చట్టం పూర్వం ఇలా జరిగి ఉంటే కేవలం సుమారు 15 బెన్సుల వెండిని టంకశాలకు పంపి నాణాలు తయారుచేయించి మూడు పౌండ్ల అప్పు తీర్చ వీలుపదేది. అనేక సందర్భాల్లో (ప్రజలు కరెన్సీస్థాయి పడిపోవడం వల్ల ఇలా నష్టపోయారు. అన్ని వస్తువులతో నహా వెండి బంగారం ధరలు కూడా చలామణిలోనున్న కరెన్సీని ఉపసంహరించడం వల్ల పడిపోయాయి. దబ్బు విలువ పెరగడం అంటే వస్తువుల ధరలు తగ్గినట్టే నని భావించాలి.

మూడవ కింగ్‌ విలియమ్‌ నాణాల విడుదలని పునరుద్ధరించక పూర్వం ఒక జెన్సు వెండి ధర 77 పెన్స్‌లకు పెరిగింది వాస్తవానికి 22 పెన్స్‌ల వెండి నాణాలు ఒక బెన్సు వెండితో తయారవుతాయి. అలాగే టంకశాలలో 20 షిల్లింగులు విలువ చేసే ఒక గినీ (బంగారు నాణెం) మార్కెటులో 30 షిల్లింగుల మేర విలువను పొందింది. బంగారు నాణాల ఉపసంహరణ వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఏర్చడింది.

1774లో బంగారు నాణాల పరిస్థితిని చక్కదిద్దారు. అటు తర్వాత ఈ నాణాలు వాటి (ప్రామాణిక విశుద్ధతిని కోల్పోలేదనే చెప్పాలి. కాని ఎక్కువ బంగారాన్ని జంగాదం ధర క్ష?

టంకశాలకు పంపి తక్కువ విలువ గల నాణాల్ని ఎవరూ పొందడు. అయినా ఈ విషయంలో అలా జరగలేదు. వాటి ఉపసంహరణ వల్ల విలువలో స్థిరత్వం లేని పరిస్థితి ఏర్పడింది.

వెండి నాణాలు కింగ్‌ విలియం పాలన తర్వాత శుద్ధమైన వెండితో తయారవడం లేదు. షిల్లింగ్‌ నాణెంలో 24 శాతం ఆరు పెన్సుల నాణెంలో 38 శాతం మాత్రమే శుద్ధమైన వెండి ఉన్నట్టు తెలుస్తున్నది. 1798కి పూర్వం ఈ పరిస్థితి లేదు. అప్పట్లో నాణెంలో తగ్గిన శుద్ధత అనుపాతంలో వెండి బంగారాల విలువ పెరిగింది. మన కరెన్సీ విదేశీ కరెన్సీల విలువల్లో భేదం 20 శాతం ఉండేది. నాణాల్లో వెండి విలువ 1798కి పూర్వం చాలా సార్లు తగ్గించినా అది వెండి బంగారు ధరలపైనా, విదేశీ మారకం పైనా ఎలాంటి ప్రభావం చూపలేదు. బంగారం అప్పట్లో విలువకి ఒక (ప్రామాణిక కొలమానంగా ఉందనడానికి ఇదొక నిదర్శనం. నాణాలలో బంగారం శుద్దతని వెండిలాగానే అప్పట్లో తగ్గించి ఉంటే వెండి తగ్గింపు వల్ల పడిన ప్రభావమే వెండి బంగారాల మార్కెటు ధరలపైనా విదేశీ మారకంపైనా పడి ఉండేది.

వివిధ దేశాల కరెన్సీ అంతా కలిపి కాగితం రూపంలో, వెండి బంగారు నాణాల రూపంలో ఉంటుంది. నాజాల మారకం విలువ వాటిలోని లోహం బరువు శుద్ధతలపై ఆధారపడి నిర్ణయమవుతుంది. ఇంగ్లాండు, హాలెండుల కరెన్సీల మధ్య విలువని బట్టి చూస్తే 11 ప్లోరిన్లకు 20 షిల్లింగులు సమానమని చెప్పవచ్చు. ఎందుకంటే 11 ఫ్లోరిన్లలో వాడినంత వెండినే 20 షిల్లింగుల తయారీకి ఉపయోగిస్తారు. కాని ఇంగ్లాండులో బంగారు నాణాలని వాణిజ్యానికి ప్రామాణికంగా వాడతారు. అదే హాలెందులో అందుకు వెండి నాణాలను వాడతారు. కనుక మారకం విలవని 11 ప్లోరిన్లని 20 షిల్లింగులుగా స్థిరంగా నిర్ణయించ వీలులేదు. బంగారు వెండి పరస్పర విలువలని బట్టి మారకం విలువ తారుమారయ్యే వీలుంటుంది.

ఇతర దేశాలతో వ్యాపార సంబంధానికి అంటే చెల్లించాల్సిన సొమ్ము విషయంలో మన దేశం వేరే దేశంలోని వెండి లేక బంగారు నాణాలలోని శుద్ధత బరువులు తెలుసుకొంటే చాలు. అక్కడ తీర్చాల్సిన అప్పుకి సమానమైన వెండి బంగారాన్నందించే . మొత్తం కలిగిన నాణాలను ఎగుమతి చేస్తే సరిపోతుంది. అలా కాకుండా బయటి రుణదాతకి కాగితం కరెన్సి గనక అందజేస్తే ఆ కరెన్సీ అప్పు విలువకి సమానమైన వెండి బంగారం దానివల్ల లభ్యమవుతుందా లేదా అని చూస్తాడు. అలా లేనప్పుడు అదనపు చెల్లింపు తాను నష్టపోకుండా ఉండే విధంగా కోరతాడు. అయిజే చలామణిలో 18 పి ఎస్‌ ఎం రావు

ఉన్న మొత్తం ద్రవ్యంలో భాగంగా విలువ తగ్గని కాగితం కరెన్సీ, నాణాలు ఉంటాయి.

మారకం విలువల్లో కాగితం కరెన్సీ నాణాల మధ్య హెచ్చుతగ్గులు సాధారణంగా ఉండవు. కాని కాగితం కరెన్సీ విలువతగ్గించినవుడు అదనపు చెల్లింవు అవసరమవుతుంది. కనుక మారకం విలువని కరెన్సీ విలువ పతనానికి ఇంచు మించు సరియైన కొలమానంగా తీసుకోవచ్చు. ఇంగ్లాండులో గనక ఒక అడుగు నిడివిని ఉన్నట్టుండి పెంచడం గాని తగ్గించడం గాని చేస్తూ ఆమార్చుని ఈ కొలత స్థిరంగా ఉన్న ఫ్రొన్స్‌ లేదా ఇతర దేశాల అడుగు నిడివితో పోల్చి మార్పును గమనించవచ్చని సర్‌జేమ్స్‌ స్టూవర్ట్‌ అంటారు. అదే విధంగా ్రైటీష్‌ పౌండ్‌ విలువ గనక మారితే మార్పుకు లోనుగాని ఇతర దేశపు కరెన్సీతో పొండుకు ఉన్న విలువని బట్టి ఆమార్చుని లెక్కగట్టవచ్చు. అంటే విదేశీమారకం విలువని కచ్చితంగా తేల్చదంలో ఉపయుక్తమయ్యే సాధనంగా గుర్తించవచ్చు.

ఎడింబర్లు పరిశీలకులు మటుకు వెండి బంగారాలకు ఇతర వస్తువులకు మల్లే గిరాకీ సరఫరాలు ఉంటాయని ఎగుమతి చేయడమా లేక దిగుమతి చేసుకోవడమా అనేది వీటిని బట్టే ఉంటుందని తెలియజేశారు. కనుక మారకం విలువని వెండి బంగారాలు ఇతర వస్తువులకి భిన్నంగా (ప్రభావితం చేయజాలవని వారంటారు. కాని మారకం విలవని పరిగణనలోకి తీసుకోకుండా ఏ వ్యక్తిగాని వెండి బంగారాల ఎగుమతి దిగుమతుల నిర్ణయం తీసుకోడు. ఇతర వస్తువుల విదేశీ వ్యాపారం విషయంలోలానే వెండి బంగారాల వ్యాపారులు ప్రవర్తిస్తారు. ధరవరల్ని ముందే గమనిస్తారు. ఒక వేళ హాలండ్‌లోని 11 ఫ్లోరిన్లలో, ఇంగ్లండ్‌లో 20 షిల్లింగ్‌లలో ఒకే తూకపు వెండి ఉంటే ఇంగ్లండు నుండి హాలెంద్‌కు వెండి ఎగుమతి కాదు. దీనివల్ల ప్రత్యేక ప్రయోజనం ఉండదు గనక అలా జరగదు. పైగా ఎగుమతి పైన జరిగే అదనపు ఖర్చుతో ఎవరూ వెండి ఎగుమతిచేసి నష్టం పొంద సిద్ధపడరు. దానికి బదులు బిల్‌ ఆఫ్‌ ఎక్సేంజ్‌ సమాన విలువకి పొంది వెండి కావలసిన వారికి అదే దేశంలో అందేటట్టు చూస్తారు.

నాణాల విషయంలోని ఒదుదుడుకుల్ని చూశాం. ఇప్పుడు మరింత తీవ్రమైన పరిణామాలున్న విషయాల్ని పరిశీలిద్దాం. మన చలామణి మాధ్యమం చాలావరకు కాగితంతో నిర్మితమైందే. కాగితం కరెన్సీ విలువ పతనమవడం పట్ల నాణాల విషయంలో లాగే తగు శ్రద్ధ, జాగరూకతలు వహించాల్సి ఉంటుంది. కాని మనం ఈ భాద్యతని విస్మరించాం. బ్యాంకుల నాణాల రూపంలో చేసే చెల్లింపుల్ని పార్లమెంటు ఇంగాంం ధర 13

అదువుచేసింది. దీని వలితంగా బ్యాంకులు తమకు ఇష్టంవచ్చినట్టు నోట్లని పెంచుతున్నాయి. తగ్గిస్తున్నాయి. ఇలా మితిమీరిన విడుదలపై నున్న ఆంక్షలు తొలగిపోయిన కారణంగా కాగితపు కరెన్సీ విలువను నిర్ధారించే (మెంచడం లేక తగ్గించడం) స్వేచ్చ బ్యాంకులకు సమకూరింది.

ప్రస్తుత అవకతవకలకి మూలకారణాలు గూర్చి వివరించే ముందు ఇక్కడ ధోర్న్‌టన్‌ అభిప్రాయాన్ని ఒకసారి పరిశీలిస్తే మంచిది. బ్యాంకులపై నిబంధనలు విధించక పూర్వం అవి విడుదల చేసిన నోట్ల విలువ విడుదల పరిమాణం మొత్తం పైనే ఆధారపడి ఉండేదని ఆయన అభిప్రాయం. వాటి విలువలో మార్చును తెలుసుకోడానికి థోర్న్‌టన్‌ కూడా ఈ వ్యాసకర్త ఉపయోగించిన సూడ్రాలపైనే, అంటే బంగారం ధరకు సంబంధించిన అంశాలపైనే ఆధారపద్దాడు. విదేశీమారకం ప్రతికూల ఆర్ధిక స్థితిని కలిగించి టంకశాలలో నిర్ధారించిన దానికంటే ఎక్కువగా బంగారం ధరని పెంచి అసమతౌల్యం కలిగించినప్పుడు బ్యాంకులు తమ కాగితపు కరెన్సీని కొంత ఉపనసంహరించుకొని తమ సంస్థలకి భద్రత కల్గించుకున్నాయని థోర్న్‌టన్‌ తెలియజేశారు. ఈ విషయాన్ని బ్యాంకు డైరెక్టర్లు పార్లమెంటు ముందు వారిచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. బ్యాంకులు అన్ని వేళలా తాము విడుదల చేసే నోట్ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాయి. మన నాణాల విలువ విదేశీ ఎగుమతులకు ఆకర్షణీయంగా మారిన తరుణంలో గూడా బ్యాంకులు కాగితపు కరెన్సీని తగ్గించి నాణాలపై పెరిగిన గిరాకీ ఒత్తిడిని తగ్గించుకొని తమను తాము రక్షించుకొనే ప్రయత్నం చేస్తాయి. నోట్ల పరిమాణాన్ని తగ్గించడం వల్ల వాటి విలువ పెరుగుతుంది. పెరిగిన విలువ నోట్లకు బదులుగా పొందే నాణాల విలువని కూడా ఇంగ్లాండులో పెంచుతుంది. అప్పుడు బంగారు నాణాలతో సమానంగా కాగితం కరెన్సీ విలువ స్థిరపడుతుంది. ఈ రెంటి మధ్య కొద్దిపాటి హెచ్చుతగ్గులతో ఐనప్పటికీ పెద్ద మొత్తం నాణాల ఎగుమతి జరగకుండా బ్యాంకుల వారు కాగితం కరెన్సీ విడుదలని క్రమబద్ధం చేస్తూ చర్య తీసుకుంటుంటారు.

బ్యాంకులు తమని తాము కాపాడుకోవాల్సిన అవసరమే వాటిని తమ కాగితపు కరెన్సీ విడుదల విషయంలో స్వయం నియంత్రణ పాటించేటట్టు చేసింది. (మితిమీరి గనక నోట్లను విడుదల చేస్తే అవి సమర్పించినప్పుడు అంతమొత్తం నాణాల రూపంలోని కరెన్సీ అందించాల్సిన బాధ్యత బ్యాంకుల పైన ఉంటుంది. కనుక అవి విచ్చలవిడిగా ప్రవర్తించే వీలుండదు). నగదు చెల్లింపుల్ని నిలిపివేయడానికి ముందు 20 పి ఎస్‌ ఎం రావు

అంటే 1797కి ముందు 28 సంవత్సరాల తీరు తెన్నుల్ని పదిశీలిస్తే బంగారం సగటుధర ఒక బెన్సుకి ౩ పౌండ్ల 17 షిల్లింగులకు మించలేదు. అలాగే ఆ సంవత్సరానికి ముందు 16 సంవత్సరాల కాలంలో అది ఎప్పుడూ 4 పౌండ్లని దాటలేదు. ఈ పదహారేళ్ళలో వాడకం వల్ల అరిగిపోయి 4 పౌండ్ల నాణెంలో బంగారం బరువు ఒక బెన్సు కన్నా కొంత తగ్గినా తగ్గి ఉంటుంది.

టంకశాల నిర్ధారిత ధరకన్నా బంగారం ధర ఎక్కువగా ఉండడం నాణాల స్థితివల్ల ఏర్పడేదే కాని 'మరోటికాదని దాక్టర్‌ ఆడమ్‌ స్మిత్‌ అంటారు. నాణొంలోని బంగారం ప్రామాణిక స్వచ్చత బరువులు కలిగి ఉంటే బంగారం మార్కెటు ధర టంకశాల ధరకి మించి ఉండదని ఆయన అభిప్రాయం. ధోర్నీటన్‌ మటుకు ఇదొక్కటే కారణం కాదని చెబుతూ విదేశీ మారకంలోని హెచ్చుతగ్గులు నాణాలలోని బంగారం బరువు, స్వచ్చతలతో నిమిత్తం లేకుండా బంగారం మార్కెటు ధరని 8 నుండి 10 శాతానికి టంకశాల ధరకన్నా భిన్నంగా మార్చిన వైనాన్ని వివరిస్తాడు. కాని థోర్న్‌టన్‌ రాసిన కాలంలో నోట్లకు బదులుగా బ్యాంకుల్లో బంగారాన్ని డిమాండు చేసే వీలులేదు. త్మ సలిజామాన్ని స్మిత్‌ ఊపాంచి ఉండదని కూడా థోర్నీటన్‌ వివరించి ఉండి ఉండాల్సింది. కరెన్సీ నోట్లకు బదులు నాణాలు చెల్లించాల్సిన పని లేదని పార్లమెంటు చట్టాన్ని చేసిన తర్వాత కరెన్సీ నోట్ల విడుదల పరిమాణంపై అన్ని నియంత్రణలు తొలగిపోయిన నేపథ్యంలో బ్యాంకులు తమ భద్రత దృష్ట్వా కరెన్సీ విడుదలని క్రమబద్ధం చేసుకోవాల్సిన అవసరం, భయాలు తొలగిపోయాయి. నాణాల విలువకి సమానంగానే నోట్లను విడుదల చేయాలన్న స్థితి ఇప్పుడు లేదు. అందుకే 1797లో 3 పౌండ్ల 17 షిల్లింగుల మేర ఉన్న బెన్సు బంగారం ధర ఈరోజు (1810) 4 పౌండ్ల 18 షిల్లింగులకు పెరిగింది. దీన్నిబట్టి సాపేక్ష విలువల తారతమ్యం అంటే బంగారం, బంగారు నాణాలు, నోట్ల మధ్య పెరిగిన వ్యత్యాసం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పడిపోయిన కరెన్సీ విలువకి కారణం బ్యాంకులు మితిమీరి కరెన్సీ నోట్లను విడుదల చేయడమేకాని మరోటికాదని తెలుస్తుంది. ఈ కారణంగానే బంగారం కరెన్సీ ధరల వ్యత్యాసం 15 నుండి 20 శాకానికి పెరిగింది. అదే కారణంగా అంటే అమితంగా పెరిగే కాగితపు కరెన్సీ వల్ల అది మరింతగా,50 శాతం మేరకు కూడా పెరిగే ప్రమాదముంది.

అసలు కాగితపు కరెన్సీ విడుదల పరిమాణాన్ని పెంచుతూ పోతుంటే దాని విలువ పతనానికి ఎలాంటి అవధులూ ఉండవు. విలువ పడిపోతూనే ఉంటుంది. బంగారం ధర ల

నిష్రయోజనమవుతూ వస్తున్న కాగితపు కరెన్సీ నాణాల ఎగుమతిని ప్రోత్సహించి నూతనోత్సాహాన్నిస్తుంది. కాని గతంలో లాగా సమస్య తనకుగా తాను తొలగిపోయే వీలులేని స్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన దేశంలో (ఇంగ్లాండులో) చలామణిలో నున్నది కాగితపు కరెన్సీ మాత్రమే. దాని పరిమాణాన్ని పెంచినకొద్దీ దాని విలువ, వెండి బంగారాలతో పోల్చినప్పుడు లేదా ఇతర దేశాల కరెన్సీల దృష్టా పడిపోతూ ఉంటుంది. నాణాల్లో వెండి బంగారాల బరువు తగ్గించినప్పుడు వచ్చిన ఫలితమే ఇప్పుడూ కలుగుతుంది. ఉదాహరణకి ఒక నాణెం ఐదోవంతు బంగారాన్ని తగ్గిస్తే ఆ మేర స్వచ్చమైన బంగారపు మార్కెటు ధర టంకశాల ధరకన్నా ఎక్కువగా పెరుగుతుంది. నలభై నాలుగున్నర గినీ (బంగారు నాణాలు)లలో ఒక పౌండు బంగారం వాడతారు. అది గనక 20 శాతం తగ్గిస్తే పొండు బంగారం ధర నలభై నాలుగున్నర గినీలు కాక 56 గినీలవుతుంది. అప్పుడు బంగారపు టంకశాల ధర మార్కెటు ధర ఒకటిగా ఉండదు. ఈ ధరల మధ్య వ్యత్యాసం 14 షిల్లింగులకు మించి ఉంటుంది. ఒకవేళ బంగారం పరిమాణాన్ని తగ్గించిన నాణాన్ని కూడా గినీ అని వ్యవహరించి బంగారం ఇతర వస్తువుల ధరలకు ఈ నాణాన్నే కొలమానంగా తీసుకుంటే టంకశాలలో అప్పుడే తయారై వచ్చిన గినీ ధర 1 పౌండు 5 షిల్లింగులుగా అక్రమ వ్యాపారి గుర్తిస్తాడు. ఒకవేళ బంగారాన్ని తగ్గించిన గినీలకు వాటిలోని బంగారం ఆధారంగానే విలువ కట్టాలని చట్టం గనక వస్తే అప్పుడు ఎక్కువ బరువు గల కొత్త గినీలు తయారౌతాయి. వాటినే విలువకి ప్రమాణంగా వాడతారు. తక్కువ బంగారం కలిగిన పాత నాణాల్ని 17 లేక 18 షిల్లింగులకు సమానమైన తునకలుగానే చూస్తారు. అదే విధంగా ఒకవేళ ఇప్పుడు చట్టం గనక తెస్తే బ్యాంకు నోట్ల చలామణి తగ్గదు కాని ఆ నోట్లవల్ల కొవగల బంగారం పరిమాణంలో వాటి విలువ నిర్ధారితమవుతుంది. ఒక పొౌండు నోటు 16 లేక 17 షిల్లింగులకు సమానం అవుతుంది. ప్రస్తుతం బంగారు నాణాలు వస్తువులుగా మారాయి. కరెన్సీనోట్లు విలువకి ప్రామాణిక కొలమానాలైనాయి. అలాకాక బంగారు నాణాన్ని గనక విలువకి [ప్రామాణిక కొలమానంగా మారిస్తే అప్పుడు నోట్లు అమ్మకమయ్యే వస్తువుల జాబితాలో చేరుతాయి. బంగారపు మార్కెటు ధర టంకశాలలో నిర్ణయమైన దానికి సమానంగా గనక ఉంటే చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ విలువ పతనం కాలేదనడానికి నిదర్శనమని థోర్న్‌టన్‌ అంటారు. బంగారం ఎగుమతికి ఆకర్షణ పెరిగినప్పుడు బ్యాంకులు నాణాలను అమ్మవు. 22 పి ఎస్‌ ఎం రావు

కనుక బ్యాంకు నోట్లతో బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. అయితే గిరాకి పెరిగి బంగారం ప్రియమైనట్టు కనిపిస్తుంది, వాస్తవానికి ఇక్కడ జరిగింది బంగారం ధర "పెరగడం కాదు కాగితం కరెన్సి విలువ తగ్గిందని తెలుసుకోవాలి. కావాలంటే ఒక అవున్సు బంగారంతో ధర పెరగక పూర్వంఎన్ని వస్తువులు కొనగలిగామో తర్వాత ఎన్ని కొనగలుగుతున్నామో పోల్చి చూసుకోవచ్చు. అప్పుడు ధర పెరగకపూర్వం కొన్ని వస్తువుల్ని అంతే పరిమాణంలో అంతే మొత్తం బంగారంతో కొనవీలైందని గమనిస్తాం. మహా అయితే కొంత పన్నులలో మార్పు కారణంగా గాని ఇతరత్రా కారణాల "వల్ల కొద్దిపాటి బేధం కనిపించవచ్చు. బంగారం బదులుగా బ్యాంకు నోట్లను వినియోగించి చూస్తే మునుపటి కంటే తక్కువ వస్తువులు కొనగలగడం అంటే కాగితపు కరెన్సీ విలువ పతనమవడం తేటతెల్లమవుతుంది.

ప్రపంచంలో ఏ మౌర్కెటులోనైనా ఇక్కడి కరెన్సీ నుపయోగిస్తే ఎంత బంగారమైతే లభ్యమవుతుందో ఆ బంగారం కొనగలిగినన్ని వస్తువుల్ని మాత్రమే అక్కడ కొన వీలవుతుంది. అయితే ఇక్కడి ఒక గినీ హామ్‌బర్గ్‌లో 26 లేదా 28 షిల్లింగులకు సమానమంటారు. కాని ఈ నాణాల్లో ఉన్న మొత్తం వెండిన ఒక గినీతో మనం కొనలేము. 21 ప్రామాణిక షిల్లింగులోని వెండికంటే ఎక్కువ ఒక గినీ కొనలేదు. ఇది మన టంకశాలలో తయారయే 2 షిల్లింగ్‌లలోని వెండికి సమానమైన మొత్తంలోనే ఉంటుంది. కాని హంబర్జ్గులో అంత మొత్తం వెండి 26 నుండి 28 షిల్లింగుల వరకు చెల్లించయోగ్యమైన పత్రాన్ని (బిల్లును) కొనగలుగుతుంది. మన కరెన్సీ విలువ పడిపోతుందనడానికి ఇంతకు మించిన రుజువు అక్కరలేదు. నాణాల ఎగుమతి పైన ఆంక్షలు లేకుంటే ఈ పాటికే అన్ని 'నాణాలు ఎగుమతైై ఉండేవి. బ్యాంకులు తమ కరెన్సీని దాని విలువ పునరుద్ధరించకొనే మేర పరిమాణాన్ని తగ్గిస్తే నాణాల ఎగుమతికి ఎలాంటి ఆకర్షణా ఉండదు. అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండానే ఎగుమతిని తగ్గించే వీలుంటుంది. నోట్ల వరిమాణాన్ని తగ్గించకుండా నాణాల చెల్లింవుపై నిబంధనలు ఎంతకాలం విధించినా లాభంలేదు. కొంత కరెన్సీ ఉపసంహరించి దాని విలువని పేంచకుండా ఉంటే నిబంధనలను ఎత్తివేసినప్పుడు నాణాలని సరఫరా చేయలేని పరిస్థితి బ్యాంకులకు ఏర్పడుతుంది.

రాజకీయార్థిక శాస్త్రవేత్త లందరూ చట్టం ద్వారా నాణాల ఎగువమతిని నిరోధించడం సాధ్యంకాదనే విషయంపైన ఏకాభిప్రాయంతో ఉన్నారు. చట్టాన్ని సులభంగా అతిక్రమిస్తారని, చట్టం ఉన్నా లేకున్నా నాణాల ఎగుమతిఫైన ఎలాంటి ప్రభావం ఐంగారం ధర ల

ఉండదని వారి అభిప్రాయం. లాక్‌, సర్‌ జె. స్పూవర్ట్‌, దాక్టర్‌ ఏ. స్మిత్‌, లార్డ్‌ లివర్‌పూల్‌ థోర్నటన్‌ వంటి మేధావులందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు. అయితే బ్రిటీష్‌ చట్టం కొంతమేర ప్రతికూల చెల్లింపుల స్థితిని ప్రోత్సహిస్తున్న గినీల ఎగుమతిని నిరుత్సాహపరచవచ్చు కాని పూర్తిగా నిరోధించలేదు. ఎగమతి వల్ల లాభం పెరిగినప్పుడు నిరోధించడం ఇంకా కష్టతరమవుతుంది. అయితే అక్రమ వ్యాపారి తాను సేకరించగలిగిన మేర నాణాలని కరిగించి ఎగుమతి చేసిన తర్వాత బహిరంగంగా నోట్లను వినియోగించి నాణాలను కొనడానికి కొంత సందేహించవచ్చు. అలా కొనడం లాభదాయకమే అయినా చట్టానికి చిక్కి శిక్షకు గురయ్యే భయం అతడిని విచ్చలవిడిగా (ప్రవర్తించకుండా నిరోధిస్తుంది. బ్యాంకుకు నోట్లను పంపి సులభంగా నాణాలను కొనే స్థితి ఉంటే చట్టాన్ని సులభంగా అతిక్రమిస్తారు. అలాకాక అందరిదృష్టిని ఆకర్షించే విధంగా మార్కెట్‌లో కొనేటప్పుడు పట్టుబడితే పడే శిక్ష భయాన్ని తోసిపుచ్చేటంత ఎక్కువ స్థాయిలో లాభాలు వస్తే అక్రమవ్యాపారానికి 'ప్రోత్సహాం కలుగుతుంది.

ఒకవేళ ఇప్పటి (బ్రిటీష్‌ రాజు హయాంలో ఆరుకోట్ల బంగారు నాణాలు తయారైనాయనుకుందాం. దాంతోపాటు నాణాల ఎగుమతిపై అంక్షలూ తొలగించారని అనుకుందాం. అప్పుడు ఒక జెన్సు బంగారం కలిగిన నాణెం, అంతే బరువున్న స్వచ్చమైన బంగారం లేదా ఒక బెన్సు బరువు గల పోర్చుగీసు బంగారు నాణెం సమాన విలువ లేకుండా ఉండ వీలుంటుందా అనే ప్రశ్నని పరిశీలిస్తే కొందరు అంగీకరించకపోయినా విలువ సమానంగానే ఉంటుందనేది వాస్తవం. ఎడింబర్ల్‌ పరిశీలకులు ఇది అంగీకరించరు. కాని ధోర్న్‌టన్‌ మటుకు ప్రతికూల వ్యాపారం ప్రతికూల మారకానికి దారి తీస్తుందని చెబుతాడు. కాని ప్రతికూల వ్యాపార ప్రభావం ఆంత ఎక్కువగా ఉండదని, పరిమీతమైందని ఇదివరకే మనం గమనించాం. మారకంపైన దీని ప్రభావం నాలుగైదు శాతానికి మంచి ఉండదు. అలాకాక 15 నుండి 20 శాతం దాకా ఉండే వీలులేదు. థోర్న్‌టన్‌ తెలియజేసింది ఈ వ్యాసరచయిత అంగీకరించింది ఒకటే. అది వాణిజ్య ఎగుమతి దిగుమతులలో అసమానత్వం తాత్యాలికమనేది. ఎగుమతి దిగుమతులు ఒక దేశానికి అమితంగా అనుకూల లేక ప్రతికూల స్థితిని కలుగజేయవు.

1802లోని థోర్నీటన్‌ రచనకి ముందునుండే తక్కువగానున్న మారకం విలువ మనకు (ప్రతికూలంగా క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 15 నుండి 20 శాతానికి గూ పి ఎస్‌ ఎం రావు

చేరింది. దీనికి కారణం ఆయన సూత్రాల ప్రకారం అసంతులన వ్యాపారం కాకూడదు. మరో శాశ్వత కారణమయ్యుండాలి. అంతకు ముందాయన అఖిప్రాయమేదైనా ప్రస్తుతంమటుకు కరెన్సీ పతనమే ఇందుకు కారణమని ఆయన అంగీకరించకమానరు. బ్యాంకు నోట్ల విలువ పడిపోతుందనడాన్ని విభేదించడం కష్టం. స్వచ్చమైన బంగారం ధర జెన్సుకు 4 పౌండ్ల 10 షిల్లింగులు. కాని 4 పౌండ్ల 10 షిల్లింగులు నాణాల విలువకి సమానంగా నోట్ల విలువలేదు. ఒక బెన్సు బంగారంతో 3 పౌండ్లు 17 షిల్లింగులు 10 పెన్స్‌ నాజాలు తయారుచేస్తారు. ఇంతమొత్తం డబ్బు ఉంటే ఒక బెన్సు బంగారం ఉన్నట్టు లెక్క అప్పుడు జెన్సు బంగారానికి బదులు 4 పౌండ్ర 10 షిల్లింగుల బంగారు నాణాలు ఇవ్వడం తెలివైన పనికాదు. అట్లాగే 4 పౌండ్ల 10 షిల్లింగులు తెచ్చిపెట్టే కరెన్సీ నోట్లు కూదా ఇవ్వడం సబబుకాదు. పతనమైన కరెన్సీ విలువను తేల్చకుండా మార్కెటు ధరలిలా ఉంటాయని ఊహించడం కూడా వివేవకవంతంకాదు.

బంగారాన్ని వెండితో గనక పోల్చి ధర నిర్ణయిస్తే అప్పుడు నాలుగు, ఐదు లేక పది పౌంద్లకు సమానంగా బంగారం ధర కనిపించవచ్చు. కాని ఇది కాగితపు కరెన్సీ పతనానికి నిదర్శనం కాదు. వెండి బంగారం న్‌ పక్ష ధరలలో వ్వర్కాంం వల్ల ఈ మార్పు ఏర్పడి ఉండవచ్చని భావించాలి. వెండి ప్రామాణిక కొలమానం కాదని వ్యాసకర్త ఇప్పటికే రుజువు చేశాడు. కాని ఒకవేళ ఒక బెన్సు బంగారం మార్కెట్లో 15 జెన్సుల వెండికి సమానమయితే అప్పుడా వెండితో 80 షిల్లింగులు తయారు చేయడం సాధ్యం. అప్పుడు ఒక బెన్సు బంగారం నాలుగు పౌంద్రకు మించిన ధర పలకగూడదు. వెండి ప్రామాణికం కాగలదని వాదించిన వారు కారణమేదైనా బంగారానికి పెరిగిన గిరాకే దాని ధరను ఒక అవున్సు 4 పొండ్లకు మించి పెంచుతుందని రుజువు చేయలేరు. వారి సూత్రం ప్రకారం దానికి మించిన ధరని కరెన్సీ నోట్ల విలువ పతనానికి చిహ్నంగా గుర్తించాల్సి ఉంటుంది.

బ్యాంకు నోట్లే గనక వెండి నాజాలకి ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పుడు 4 పౌండ్ల 10 షిల్లింగులకు లభ్యమవుతున్న ఒక జెన్సు బంగారం 17 “గ బెన్సుల వెండికి ప్రాతినిధ్యం వహించే కరెన్సీ నోట్లకు అమ్ముడవాలి. కాని అది అంగడిలో 15*/ బెన్సులకే దొరుకుతుంది. కాని బ్యాంకు నోటు ప్రకారం నోటు తిరిగి బ్యాంకుకు అప్పజెప్పిన బంగారం ధర జ్‌

వారికి 15 బెన్సుల వెండిని ఇవ్వాల్సి ఉంటుంది. వెండి (ప్రస్తుత మార్కెటు ధర బెన్సుకు 5 షిల్లింగుల 9ే/ పెన్స్‌ టంకశాల ధర ర5 షిల్లింగుల 2 పెన్స్‌. ఆ లెక్కన 100 పౌండ్ల వెండి 112 పౌండ్ల కరెన్సీ నోట్లకు సమానం. కాని బ్యాంకు నోట్లు తగ్గించిన వెండి గల నాణాలకి ప్రతి రూపం కదా అనే ప్రశ్న రావచ్చు. ఇది నిజంకాదు. చట్టం ప్రకారం 25 పౌండ్లు దాటని చెల్లింపుతో మాత్రమే వెండి నాణాల రూపంలో ఉండవీలున్నది. వెండి పొండ్ర నోట్లు గల వ్యక్తి అడిగినప్పుడు మొత్తం ఆ విలువ గలిగిన వెండిని గాని మొదటి 25 పొండగ్షకి నాణాల రూపంలో మిగతాది వెండి రూపంలో అందజేయాల్సి ఉంటుంది. వ్యాపార లావాదేవీల అవసరానికి మించిన పెద్ద మొత్తంలో బ్యాంకు నోట్లు విడుదల కాలేదనేది నమ్మశక్యంకాదు. నోట్ల వాడకంలో పాటిస్తున్న ఆధునిక విధానాలు ఇప్పుడున్న స్థాయి కరెన్సీనే అనవసరంగా ఉన్న పెద్ద మొత్తంగా భావించేటట్టు చేస్తున్నాయి. దీనికి తోడు బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాండుతో ఇతర బ్యాంకులు పోటీపడుతూ తమ నోట్ల ఆధిక్యతన్ను నిరూపించుకొనే ప్రయత్నంలో బ్యాంకు కరెన్సీని పెంచుతున్నాయి. కరెన్సీ ఎంత మొత్తంలో పెరిగిందనేది కచ్చితంగా చెప్పవీలులేకపోయినా బంగారం ధర బ్యాంకు నోట్లు ఒకదాని వెంట మరొకటి పెరుగుతున్నాయని మాత్రం చెప్పగలం. ఇరవై ముప్పై లక్షల అదనపు బ్యాంకు నోట్లు విడుదల అయ్యాయా అనేది అనుమానాస్పద విషయమైనా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఇతర దేశీ బ్యాంకుల విడుదలని క్రమబద్ధం చేసినప్పటికి తాను విడుధలచేసిన మొత్తాని కంటే అదనంగా ఈ బ్యాంకులు విడుదల చేసే వీలున్నది. ప్రపంచ ద్రవ్యం ప్రపంచదేశాల్లో విభాజ్యమైనట్టుగానే ఒక దేశంలోని కరెన్సీ ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభజితమవుతుంది. ప్రతీ జిల్లా తన ప్రాంతంలోని వ్యాపారం చెల్లింపుల అవసరానికనుగుణమైన మొత్తంలో కరెన్సీని పోగు చేసుకుంటోంది. ఈ అవసరమే భ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోట్లకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమాన విలువని కలిగిస్తుంది. ఒక వేళ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు నోట్లు చలామణిలో నున్న లందన్లో ఒక పది లక్షలు అదనపు కరెన్సి గనక విడుదల అయితే ఇతర (ప్రొంతాలకంటే లండన్‌లో కరెన్సీ విలువ పడిపోయి వస్తువులు 'ప్రియమవుతాయి. అప్పుడు లండన్‌ మార్కెటుకు గ్రామ ప్రాంతాల వస్తువులు అదనపు లాభం కోసం ఎగుమతి అవుతాయి. (గ్రామ ప్రాంతపు బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కంటే తమ నోట్లు విలువైనవిగా భావించి అదనపు లాభం పొందడానికి ల పి ఎస్‌ వం రావు

అదనంగా నోట్లను జారీ చేస్తాయి. అప్పుడు కరెన్సీ పతనం సార్వత్రికమయి ధరలు అన్ని చోట్ల ఒక మాదిరే అవుతాయి. ఇందుకు భిన్నంగా ఇంగ్లాండులో పది లక్షల కరెన్సీని ఉపసంహరిస్తే అప్పుడు ఇతర ప్రాంతాలలోకన్నా లండన్‌లో కరెన్సీ విలువ పెరిగి వస్తువుల ధరలు పడిపోతాయి. అప్పుడు లండన్‌ నుండి ఇతర ప్రాంతాలకు వస్తువులు ఎగుమతి అవడం షరామామూలే. అప్పుడు ఇతర బ్యాంకులు కూడా తమ కరెన్సి విలువని కాపాడుకోడానికోసం చలామణిలో ఉన్న కొంత కరెన్సీని లండన్‌ బ్యాంకు కనుగుణంగా ఉపసంహరించుకుంటాయి. వాస్తవానికి దేశంలో ఇతర ప్రాంతంలోని బ్యాంకులు తమకు తాముగా ఎప్పుడూ కరెన్సీని పెంచవు. లండన్‌ బ్యాంకు చర్య వల్ల విలువను కోల్పోయిన తమ కరెన్సీని కాపాడుకోడానికే అవి అలా చేస్తాయి. ఒక వేళ అవి కూడా పెంచితే పెంచిన కరెన్సీకి తగిన నిష్పత్తిలో నాణాలను సరఫరా చేయాల్సిన బాధ్యత వాటిపైన అంటే లండన్‌ బ్యాంకు చేయాల్సిన పని అంటే తదుపరి కొంత కాగితపు కరెన్సీని ఉపసంహరించుకోవడం తామూ చేయాల్సి ఉంటుంది కనుక అక్కడి బ్యాంకులు అలా కరెన్సీని పెంచవు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండుకు దేశంలోని కరెన్సీని క్రమబద్దం చేసే శక్తి ఉంది. ఈ బ్యాంకు కరెన్సీని పెంచితే ఇతర దేశ బ్యాంకులు పెంచడం అది తగ్గిస్తే అవి తగ్గించడం చేస్తాయి. కాని స్వతహాగా కరెన్సీ పరిమాణంలో తమకుగా తాము ఎలాంటి మార్పులు తేలేవు. వెండి బంగారాలు మాత్రమే కాకుండా వడ్డీరేట్ల ప్రభావంకూడా కరెన్సీలపైన ఉంటుందనే వాదన ఉంది. కరెన్సీ అతి ఎక్కువగా లభ్యమైతే వడ్డీరేట్లు పడిపోతాయని కరెన్సీ కొరత ఆ రేట్లను పెంచుతుందని కూడా అంటారు. కాని వడ్డీరేట్లను (ద్రవ్యం ప్రభావితం చేయదని ద్రవ్యేతర మూలధనం మార్పుకి కారణమని రుజువుచేయ వీలున్నది. ద్రవ్యం వస్తువుల లావాదేవీలను నడిపే ఒక పెద్ద చక్రం లేదా వాణిజ్య నిర్వహణకి ఒక ప్రధాన ఉపకరణం అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు కాని సామాజిక రాబడిలో అది భాగం మాత్రం కాదని దాక్టర్‌ ఎ. స్మిత్‌ అంటారు. ద్రవ్య రూపంలో గుర్తింపు పొందే లోహపు తునకలు ఆదాయ పంపిణీకి మాద్యమంగా ఉపకరిస్తాయే తప్ప అవే ఆదాయాలుకావు అని ఆయన అంటారు. మనమొక పరిశ్రమ స్థాయిని కొలిచేటప్పుడు ముడిసరుకు, తయారీలో నున్న వస్తువులు, తయారైన వస్తువులు వంటి మూలధనాన్ని లెక్కలోకి తీసుకుంటాం. వీటిని చేతులు మార్చే సాధనమైన (ద్రవ్యం దీనిలో భాగం కాదు. దాన్ని కాకుండానే పెట్టుబడిని లెక్క కట్టాల్సి బంగారం ధర ల

ఉంటుంది. పరిశ్రమ నడవాలంటే ముడిసరకు కావాలి. పరికరాలు (యంత్రాలు) కావాలి. పని నడపడానికి వేతనాలు కావాలి. ఈ మూడు లేకుందా పరిశ్రమలు నడవవు. కాని ద్రవ్యం ఉపయుక్తమైన ఒక ముడి సరకుకాదు. దాన్ని వస్తువుగా తయారు చేసే యంత్రం కూడా కాదు. ముడిసరకుని ఉపకరణాల ద్వారా వస్తువుగా మార్చే శ్రమకి ఇచ్చే వేతనం 'ద్రవ్యరూపంలో అందజేయడం వాస్తవమేకాని శ్రామికులు (ద్రవ్యాన్ని (ద్రవ్యంగా కాక అది కొనగల వస్తువుల దృష్టా దాన్ని ఆదాయంగా అంగీకరిస్తారు. కనుక ద్రవ్య ప్రభావం వడ్డీలపైన ఉండదని గమనించాలి. అమెరికా వంటి దేశాలలో అపురూప లోహాలగనులు కనుక్కోవడంతో అక్కడ ద్రవ్యపరిమాణం పెరిగింది కాని అది వడ్డీలపైన ఏ రకమైన ప్రభావం చూపలేదు. పెట్టబడి, లాభాలు, వడ్డీని నిర్ధారిస్తాయి కాని (ద్రవ్యం మాత్రం అలా నిర్ణయించలేదు. అదొక మాద్యమమేకాని అదే పెట్టుబడిగాని ఆదాయంగాని కాదని గమనించాలి. ్రతీదేశంలో చలామణిలో నున్న ద్రవ్యం అక్కడ అమ్ముదవుతున్న వస్తువులకనుగుణంగానే ఉంటుంది. కొన్ని దేశాల్లో వస్తువులు ద్రవ్యాల మద్య నిష్పత్తి ఇతర కేజాంరంటే భిన్నంగా ఉండవచ్చు. లేదా ఒకే దేశంలో కొన్నీ కొన్ని సందర్భాలలో మార్పుకు గురికావచ్చు. ఇది ద్రవ్య చాలామణి వేగాన్ని బట్టి. వ్యాపార సరళినిబట్టి, బ్యాంకింగ్‌ సమర్ధకార్యకలాపాలను బట్టీ నర్మయమవుతుంది. ఇంగ్లాండులో అనేక పద్ధతుల ద్వారా ద్రవ్య చలామణిని నియంత్రించారు. దాని విలువ దాని ద్వారా చేతులు మారే వస్తువుల విలువ సాధ్యమైనంత తక్కువ నిష్పత్తిలో ఉండేటట్టు జాగ్రత్త పద్దారు. అది ఏ నిష్పత్తి అనేది రకరకాలుగా అంచనా గట్టారు. బంగారు. వెండి నాజాలు గాని కాగితం రూపేణా ఉన్న ద్రవ్యంగాని ఈ రెంటి మొత్తంలోని హెచ్చుతగ్గులు ఆ నిష్పత్తి విలువని తారుమారుచేయలేదు. గనుల నుండి వచ్చే వెండి బంగారాలు తగ్గితే ద్రవ్యం విలువ పెరిగి కొద్దిపాటి (ద్రవ్యాన్నే చలామణి మాద్యమంగా ఉపయోగించవ్చు. ద్రవ్య పరిమాణం ఎంత తగ్గితే దాని విలువ అంత పెరుగుతుంది. ఇలా కాకుండా కొత్త గనులు అదనంగా వెండి బంగారాలను సమకూరిస్తే ద్రవ్య పరిమాణం పెరుగుతుంది. వెండి ఐంగొరాల విలువ పడిపోతుంది. మొత్తం మీద ద్రవ్యం తద్వారా జరిగే వస్తువుల లావాదేవీల మధ్య నిష్పత్తి మొదటిలాగే ఉంటుంది. బ్యాంకులు ఒక వేళ కాగితపు కరెన్సీ బదులు నాణాల్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే వాటి పరిమాణాన్ని పెంచాల్సి వచ్చేది. 2్ర్ర పీ ఎస్‌ ఎం రావు

నోట్లకు బదులుగా నాణాలు చెల్లించడంపై గనక ఆంక్షలుంటే ఎక్కువగా ఉన్న చలామణి మాద్యమం విలువ పడిపోతుంది.

ఇంగ్వాందులోని (ద్రవ్యం మొత్తం రెండుకోట్లమేర ఉందనుకుందాం. తరువాత ఒక 40 లక్షలు అదనంగా విడుదలయిందనుకుందాం. అప్పుడు ఈ రెండు కోట్ల నలభై లక్షల (ద్రవ్యానికి వస్తూత్పత్తిలో గనక మార్పులేకుంటే మునుపటి రెండుకోట్ల ద్రవ్యంకన్నా అదనపు విలువ ఉండదు. ఈ పరిస్థితి అంటే అదనపు వస్తూత్పత్తి లేక నాణాల ఎగుమతి లేకుండా ఉన్నంతకాలం (ద్రవ్య పరిమాణాన్ని ఎంత పెంచినా దాని విలువ వస్తురూపంలో మొదట ఉన్న రెండు కోట్ల స్థాయిలోనే ఉంటుంది. అంటే మొదట రెందు కోట్లు కానగలిగినన్ని వస్తువులే ఇప్పుడు రెండు కోట్ల నలఖైలక్షలు కొనగలుగుతాయి.

ఒక వేళ బ్యాంకులు అదనంగా మార్కెట్లోకి నోట్లని అప్పుపైన విడుదల చేస్తే కొంతకాలం అది నిస్సందేహంగా వడ్డీ రేట్లని ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ పెద్దమొత్తంలోని ద్రవ్యం బయటికి వస్తే మూడు నాలుగు శాతానికి మించి వడ్డీకివ్వడం కుదరదు. కాని చెలామణిలోకొచ్చిన ద్రవ్యం ప్రతీ మార్కెట్‌లోనికి చొచ్చుకొని పోయి వస్తువుల ధరల్లో వ్యత్యాసాన్ని తొలగిస్తుంది.

బ్యాంకులు అదనంగా నోట్లను విడుదల చేస్తున్నప్పుడు మాత్రమే అధిక ద్రవ్యం వెంటనే కలిగించే ప్రభావాన్ని గూర్చి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కాని అదనపు (ద్రవ్యం చలామణిలోకి వచ్చిన వెంటనే వడ్డీరేటు పెరుగుతుంది. కొత్త అప్పులకి గిరాకి అదనపు నోట్ల విడుదలకి ముందున్న స్థాయిలో ఉంటుంది. వెండి బంగారాల పరిమాణంలో వృద్ధి జరిగితే అది ప్రపంచవ్యాప్తంగా విభాజ్యమవుతుంది. అదే గనక కాగితపు కరెన్సీ అయితే దాని ప్రభావం విడుదలైన దేశం వరకే పరిమితమవుతుంది, ధరలపైన దాని ప్రభావం స్థానికంగా ఉంటుంది. (ద్రవ్య రూవంలో ధరలు పెరుగుతాయి కాని వాస్తవంగా పెరుగవు. మారకంలోని మార్పువల్ల విదేశీ కొనుగోలుదార్లు రక్షణ పొందుతారు.

బ్యాంకు నోట్ల పెరుగుదల వడ్డీ రేట్లని శాశ్వతంగా తగ్గిస్తుందని, అప్పుదార్లందరి గిరాకీని సంతృప్తిపరుస్తుందని గానీ లేక బంగారు, వెండి గనులు ఇలాంటి ప్రభావాన్నే చూపుతాయనిగాని అనుకుంటే చలామణి మాధ్యమానికి దానికి లేని శక్తిని ఆపాదించినట్టవుతుంది. ఇది (ఇలాంటి శక్తి ఉండడం) గనక నిజమే అయితే బ్యాంకులు శక్తివంతమైన ఉపకరణాలు అయివుండేవి. కాగితపు కరెన్సీని సృష్టించి బంగారం ధర !

రెండు మూడు శాతానికి గనుక అప్పుగా ఇస్తే ఆమేర బ్యాంకులు వ్యాపొరంలోని లాభాన్ని తగ్గించినట్టే లెక్క అలాకాక బ్యాంకులు తమ నిర్వహణ వ్యయం మేరనే వడీ నిరయించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు కూడా లాభాలు పడిపోతాయి. లాభాలు పడిపోవడం (ద్రవ్యేతర పెట్టుబడి పోటీవల్ల జరుగుతుంది. బ్యాంకు నోట్ల పెంపుదల పెట్టుబడిని పెంచదు. అది ఎగుమతి యోగ్య వస్తువుల్నిగానీ మన యంత్రాల్ని గానీ లేదా ముడి సరకుని గానీ పెంచజాలదు. అలానే మన లాభాల్ని 'పెంచజాలదు. వడ్డీలని తగ్గింపజాలదు. _ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న ఒక వ్యక్తి డబ్బుని అప్పుగా పొందడంలో అసలు ఉద్దేశం ఆ సొమ్ముని ఉపయోగించి ఆ వ్యాపారానికి అవసరమైన వస్తువులు కొనడం మాత్రమే. కావల్సిన పరిమాణంలో వస్తువులు పొందడం ముఖ్యం కాని ఎంత డబ్బువల్ల అవి కొనొచ్చనేది ప్రధానాంశంకాదు. ఒక వెయ్యి వల్ల అవి కొనడం సాధ్యమైతే అంతేమొత్తం లేదా పదివేలు అవసరమైతే ఆ మొత్తాన్ని అప్పుగా పొందుతాడు. ఒక వేళ పదివేలు కనుక అప్పు పొందాల్సి వస్తే అతని ఉత్పత్తి నామమాత్రపు విలువ వెయ్యి అప్పుతో చేసిన వ్యాపారానికి పది రెట్లు ఉంటుంది. (కాని వాస్తవ ఉత్పత్తి మటుకు రెండు సదర్భాల్లో కూడా సమానమని గమనించాలి). ఒక దేశంలో ఉత్పత్తి అందుకు వినియోగించిన వస్తువుల విలువకు సమానంగా ఉంటుంది. సర్వత్రా వస్తుమార్చిడే కనుక జరిగితే ఉత్పాదకత కూడా సమానంగానే ఉంటుంది. ఒకరి తరువాత ఒకరు పొందే చలామణి (ద్రవ్యం ఈ పెట్టుబడిని నియంట్రిస్తుంది. ద్రవ్య పరిమాణం లేదా బ్యాంకు నోట్లు ఎంత తక్కువ న్థాయిలో ఉన్నప్పటికీ అవి వస్తువుల నామమాత్రపు ధరను మాత్రమే పెంచుతాయి. కేవలం ద్రవ్య చలామణివల్ల సమకూరినట్టు కనిపించే ఆదాయం అదనపు వస్తూత్పత్తి లేకుండా వాస్తవాదాయం కాజాలదు. ఉదాహరణకు గతంలో 'వి, 'సి అనే వ్యక్తులు చేసే వ్యాపారాన్ని ఇప్పుడు 'ఎ' గనక కొనుక్కొని నిర్వహిస్తే “బి, 'సి' లు కోల్పోయిన వ్యాపారాన్ని 'ఏ' పొందుతాడు. ఒకరి లాభం ఇంకొకరి నప్పానికి సమానం. ఒకరి అస్తి అన్యాయంగా అక్రమంగా సంక్రమించవచ్చు. కాని మొత్తం సమాజానికి అదనపు లాభ నష్టాలు ఉండవు. ద్రవ్యపు విలువ పతనానికి పూర్వము 80 ఏళ్ళకు ఒక పొలాన్ని బాడుగకు తీసుకోవడం అలానే 25 ఏళ్ళ వార్షిక సెక్యూరిటీలను (పెట్టుబడులు, షేర్లు) కొన్నట్టయితే భూమికి సెక్యూరిటీల కన్న అతి ఎక్కువగా ద్రవ్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే తిం పి ఎస్‌ ఎం రావు

పొలంలోని ఉత్పత్తి వాస్తవ విలువ అధికంగా ఉంటుంది. ఒకవేళ బంగారు నాణాలలోని బంగారాన్ని సగానికి సగం తగ్గిస్తే భూమితో సహా ప్రతి వస్తువు ధర (ద్రవ్య ప్రమాణంలో రెట్టింపవుతుంది. కానీ సెక్యూరిటీలపైన వడ్డీని నాణ్యత తగ్దించిన నాణాల రూపంలో చెల్లిస్తారు కనుక ఆ వడ్డీ పెరగదు. మన కరెన్సీలోని చెడులన్నింటినీ నివారించటానికి గాను బ్యాంకులు క్రమంగా తమ నోట్ల పరిమాణాన్ని వాటి విలువ నాణాలతో సమానమయ్యే వరకు తగ్గిస్తే మంచిది. ఇంకో రకంగా చెప్పాలంటే వెండి బంగారు లోహాల ధర టంకశాల ధరకు సమానమయ్యే స్థాయిని కాగితపు కరెన్సీని తగ్గించడం ద్వారా సాధించాలి. కాగితపు పరపతి వైఫల్యం వల్ల దేశంలోని వాణిజ్య వ్యాపారాల్లో తీవ్ర విపరిణామాలు ఏర్పడతాయి. ఉన్నట్టుండి కరెన్సీపైన విధించే ఆంక్షలు కూడా, ఇలాంటి ఫలితాలివ్వడం కూడా వాస్తవమే. బంగారం మార్కెట్‌ ధర టంకశాల నిర్ణయించిన ధరకంటే ఎక్కువగా ఉండి ప్రతికూల విదేశీ మారక స్థితి ఉన్నప్పుడు కరెన్సీ విషయంలో తగు జాగ్రత్త తీసుకోకుంటే విపరీతమైన నష్టం జరుగుతుంది. కరెన్సీఅందించి నాణాలు పొంది వాటిని అకస్మాత్తుగా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇలా జరగక ముందే అదనపు కరెన్సీని చలామణినించి ఉపసంహరించుకోవడం మంచిది. ఇది క్రమంగా జరిగితే ఏమంత అసౌకర్యం అనిపించదు. బ్యాంకులు ముందుగా అంగీకరించిన సూత్రానికి అనుగుణంగా కరెన్సీని నియంత్రించి ఉంటే ఇప్పుడు చూస్తున్న దుష్ఫలితాలు ఎదురయ్యేవి కావు. ప్రస్తుతం అవి పని చేస్తున్న తీరున బ్యాంకులకు ప్రయోజనం కలిగిన మాట వాస్తవమే వాటి మూలధనం నిలువ 1797 నుంచి నేటికి రెట్టింపయ్యింది. వాటి లాభాలూ అదే దామాషాలో పెరిగాయి. బ్యాంకు డైరెక్టర్లు మాత్రం బ్యాంకులకు లాభం వచ్చినా వారుమాత్రం ఇతరుల్లాగే కరెన్సీ పతనం వల్ల నష్టపోయారని ధోర్నీటన్‌ అంటారు. న్‌ా యజమానులుగా సంక్రమించిన లాభం కంటే ఇలా వారు కోల్పోయిందే ఎక్కువ. దీన్ని బట్టి బ్యాంకు డైరెక్టర్లు స్వప్రయోజనం కోసం విధానాలను అమలు చేయలేదని చెప్పవచ్చు. కాని వారి తప్పిదాలు మొత్తం సమాజానికి నష్టం కలిగించాయి. వారికున్న అసాధారణ అధికారాలు వారికి ఇన్టం వచ్చిన రీతిన (ద్రవ్యాన్ని నియంటత్రించేటట్టు చేన్తున్నాయి. ఇది (ద్రవ్యం కలవారందరి ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నది. నేడు వారి పుణ్యమా అని 4 పౌండ్ల 10 షిల్లింగులు కేవలం 8 పౌండ్ల 17 షిల్లింగుల 101/2 పెన్స్‌ల మేర మాత్రమే విలువను పొందుతున్నాయి. బంగారం ధర వై

వారు తల్చుకుంటే రేపు 4 పౌండ్ల 15 షిన్లింగులు ఈ మొత్తానికి సమానం కావచ్చు మరో సంవత్సరంలో 10 పౌొండ్లకు ఇంతకన్నా ఎక్కువ విలువ ఉండకపోవచ్చు. (దవ్యం ఎంత అభద్రత అనిశ్చితిలకు గురవుతుందో దీన్నిబట్టి తెలుస్తుంది. ప్రభుత్వానికి రుజాలందించిన వారికి తిరిగి చెల్లింపులు సహజంగానే ద్రవ్య రూపంలో ఉంటాయి. పతనమవుతున్న (ద్రవ్యపు విలువ వారిచ్చిన అప్పుకు గల భద్రతని తగ్గించినట్టే లెక్క వాస్తవానికి (ప్రైవేటు అప్పుదార్లకు కూడా తక్కువ నష్టమేమీ కలుగలేదు. 1797లో వారిచ్చిన అప్పు ఇప్పుడు 85 శాతం తగ్గిన విలువలో తిరిగి పొందుతారు. ఈ విలువ ఇంకా పతనమవదనే నమ్మకం లేదు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్మిత్‌ అభిప్రాయాన్ని పరిశీలించడం మంచిది. నాణాల విలువని పెంచడం దివాలా పరిస్థితిని దాచుకోవదడమేనని ఆయన అంటారు. ఉదాహరణకి ఒక ఆరు పెన్స్‌ల నాణాన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా లేదా టంకశాల ఉత్తర్వు ద్వారా ఒక పిల్లింగుగా మార్చి. అలాగే 22 పెన్సులను ఫౌండుగా మారిస్తే గతంలో అంటే ఈ మార్పుకు పూర్వం 20 షిల్లింగులు లేదా సుమారు 4 జెన్సుల వెండి అప్పుగా పొందిన వ్యక్తి నాణాల విలువ మారిన కారణంగా 26 పెన్సులు గానీ, లేదా రెండు జెన్సులకు కొద్ది తక్కువగా వెండిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ_ లెక్కన 12 కోట్ల ప్రభుత్వ రుణం తీర్చదానికిగాను మార్పు చెందిన నాణెంలో ఆరు కోట్ల నలభై లక్షలు చెల్లిస్తే చాలు. వాస్తవానికి ఇలా చేయడం మోసపూరితమైంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రతి పౌండులో 10 షిల్లింగులు కోల్పోతారు. ఈ నష్టం కేవలం రుణదాతలకే పరిమితం కాదు. ప్రతీ వ్యక్తి అదే నిష్పత్తిలో నష్టపోతాడు. ఒకవేళ ప్రభుత్వానికి అప్పు ఇచ్చినవారు ఇతరులకు గనుక అప్పుపడి ఉంటే కొంత తమ నష్టాన్ని కొత్త నాణాలలో చెల్లించి పూడ్చుకోగలుగుతారు. కాని ప్రభుత్వానికి అప్పు పెట్టిన వారు చాలా వరకు ధనికులే కనుక ఇలాంటి అవకాశం ఉండదు. ఇలా నాణాలను ఉన్నత నాణాలుగా మార్చడం వల్ల సమస్యను తీర్చకపోగా మరింత జటిలం చేస్తుంది అమాయకులైన జనబాహుణ్యానికి హాని కలిగిస్తుంది. అప్పులిచ్చిన (ఫైవేటు వ్యక్తులకు నష్టాన్ని కలిగిస్తూ అప్పు పుచ్చుకున్న సోమరులైన బుణబ్రహీతలకు లాభం కలిగిస్తుంది. దేశాభివృద్ధికి తోడ్పడే వారి దగ్గర ఉన్న డబ్బు వ్యర్థంగా ఖర్చుచేసే సోమరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. దివాలా ప్రకటించే వ్యక్తి ఆ ప్రకటననైనా బహిరంగంగా న్యాయంగా చేస్తే అది దివాలా కోరుపైనున్న అగౌరవాన్ని కనీస స్థాయికి తెస్తుంది. అలాగే బుణదాతకు 82 పి ఎస్‌ ఎం రావు

కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వ కూడా దివాలా స్థితిలో ఇదే విధంగా (ప్రవర్తిస్తే మంచిది. అలా కాకుండా తన అసహాయతని కప్పి పుచ్చుకోవడానికి గాను నాణాల విలువను పెంచడం వంటి జిత్తులు చేస్తే దాని పైనున్న గౌరవం పెరగదు. డాక్టర్‌ స్మిత్‌ చేసిన ఈ వ్యాక్యలు కాగితపు కరెన్సీ విలువను తగ్గించే ప్రక్రియకు కూడా వర్తిస్తాయి. నాణాల విలువ తగ్గించడం వల్ల కలిగే కొన్ని నష్టాలను మాత్రమే స్మిత్‌ పేర్కొన్నప్పటికీ ఈ చర్య ('ప్రమాదకరమైైందని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాల అనుభవాన్ని చూసి కూడా ఈ దేశం లోపభూయిష్టమైన చర్యను తీసుకుంటే చరిత్రలో దోషిగా నిలబడవలసి వస్తుంది. ఇంత గొప్ప దేశం వివేకవంతంగా వర్తిస్తుందని ఆశిద్దాం.

ఇతర దేశాల కంటే భిన్నమైన పరిస్థితి ఇంగ్లాండులో ఉందనే వాదన ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (ప్రభుత్వంలో భాగంకాక ఒక స్వతంత్ర సంస్థ అనే భావన దీనికి ఆధారం కలిగిస్తుంది. ఇది వాస్తవమైనా కూడా అమితంగా పెరిగిన కరెన్సీ తన దుష్ప్రభావాన్ని చూపించక మానదు. ప్రభుత్వ మార్గదర్భకంలో విడుదల చేసినా లేక స్వతంత్రంగా అదే పని చేసినా సమాజానికి కలిగించే చెడు భిన్నంగా ఉందదు. వాస్తవానికి తన మూలధనం, పొదుపుల మొత్తాని కంటె ఎక్కువగా ప్రభుత్వానికి బుణమిచ్చే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండును స్వతంత్రంగా నడిచే సంస్థగా పేర్కొనడం హాస్యాస్పదం. బ్యాంకు నగదు చెల్లింపుల్ని 1797లో కౌన్సిలు తాత్కాలికంగా నిలిపివేసినప్పుడు (ప్రజలు భయంతో బ్యాంకుపై ఎగబడదానికి అసలు కారణం రాజకీయమైనదే కానీ అమితంగా లేదా కొందరనుకున్నట్లుగా తక్కువ పరిమాణంలో బ్యాంకు నోట్లు ఉండడం కారణం కాదు ఈ బ్యాంకు ప్రతిపత్తి స్వభావమే ఎల్లవేళల దాన్ని ప్రమాదానికి గురిచేస్తున్నది. బ్యాంకు డైరెక్టర్లు ఎంతటి తెలివితేటలు ఉపయోగించినా సమస్యకు పరిష్కారం దొరకదు. ప్రభుత్వానికి అప్పు ఇచ్చే బదులు డిస్కౌంటు పద్ధతిలో ప్రజలకు నోట్లు విడుదల చేస్తే ప్రమాద ఘంటికలు ఆగిపోయేదాక బ్యాంకు చెల్లింపులు కొనసాగించ గలిగి ఉండేది. బ్యాంకుకు అప్పు పడ్డవారు 60 రోజుల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉండేది కనక ఈలోపల బ్యాంకు డైరెక్టర్లు అవసరమైతే చలామణిలో ఉన్న ప్రతీనోటును తిరిగి సేకరించుకోగలిగి ఉందేవారు. ప్రభుత్వం, బ్యాంకుల మధ్య ఉన్న అతినన్నిపాత నంబంధం కారణంగా నిబంధన అవసరమయింది. ఈ కారణంగానే అలాంటి నింబంధనని కొనసాగించడమూ అవసరమైంది. ఈ వ్యవస్థలోని దుష్ఫలితాలను నిరోధించడానికి మనము ఎంత బంగారం ధర తి

మాత్రం వమరుపాటు లేకుండా నిషేధం బిల్లు రద్దును గమనిస్తూ ఉండాలి. బ్యాంకులు తమ భాద్యత నుండి తప్పించుకోకుందా చూడడానికి గల ఏకైక మార్గం ప్రజలు తమ నోట్లను సమర్పించినపుడు అవి నాణాలను చెల్లించేటట్టు వత్తిడి తేవడమే. బంగారం మార్కెట్‌ధర టంకశాల నిర్ణయించిన ధరతో సమానమయ్యే స్థాయికి వచ్చే మేర బ్యాంకు విడుదలచేసిన అదనపు కరెన్సీని ఉపసంహరించుకొని దాని విలువని పెంచడం న్యాయం. తన ఈ వాదనని ఈ మేర ప్రజల దృష్టికి తెచ్చి ఇక ఇక్కడ ఈ వ్యాసకర్త ముగించదల్చుకున్నాడు. ఇప్పటికే ఎంతో మంది విజ్ఞులు తెలియజేసిందానికి అదనంగా చెప్పగలిగానని గాని చెప్పే ఉత్సాహం తనకు ఉందని గానీ రచయిత అంగీకరించలేదని మరోసారి చెప్పదలచుకొని ఆయన ఉద్దేశం ఇంత ముఖ్యమైన విషయాన్ని నిష్పాక్షిక దృష్టితో తెలియజేయాలనేది మాత్రమేనని గమనించాలని కోరుతున్నాడు. లాభాలు : ఒక విశ్లేషణ భా ధాన్యపు చవక ధరలు పెట్టుబడులపై వచ్చే లాభాలపై చూపించే ప్రభావాన్ని విశదీకరించే వ్యాసమిది. దిగుమతి పైవిధించే ఆంక్షలలోని అసంబద్ధతని చర్చిస్తూ ఇటీవల ప్రచురితమైన రెండు మాల్ధస్‌ రచనల్ని (ఒకటి, కౌలు న్వభావం, వృద్ధి పరిశీలన. రెండు, విదేశీ ధాన్యపు దిగుమతి ఆంక్షలపై గల అభిప్రాయలకు ఆధారాలు) ఈ సందర్భంగా ఈ వ్యాసకర్త సమీక్షించదలచుకున్నారు. పెట్టుబడిపైన ఒనగూరే లాభానికి భూమిపైన వచ్చే కౌలు కి దగ్గరి సంబంధం ఉంటుంది. అందుకే లాభాల్ని గూర్చిన విశ్లేషణకి ముందు కౌలు (1609) హెచ్చుతగ్గుల్ని నియంత్రించే సూత్రాల్ని పరిశీలించడం మంచిది. ఈ వ్యాసంలో క్లుప్తంగా పేర్ళాన్న సూత్రాలు ఇటీవలే ప్రచురితమైన తన (గ్రంధంలో మాల్దస్‌ ఇచ్చిన సమగ్ర వివరణకి ఏమంత భిన్నంగా ఉండవు. కౌలు, లాభాలు, ఈరెంటిని నిర్దేశించే సూత్రాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ధాన్యం దిగుమతిపై చట్టం ఎలాంటి ఆంక్షలు విధించకుంటేనే మంచిదని తేలుతుంది. ఆయన రచనల్నిబట్టి చూస్తే మల్దస్‌కు కూడా ఇదే అభిప్రాయం ఉన్నట్టు అవగతమవుతుంది. కాని దిగుమతులపైన గనక నియంత్రణ లేకుంటే ఆహార అవసరాల కోసం విదేశాలపై ఆధారపడే ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది కనుక రక పి ఎస్‌ ఏం రావు

ఆంక్షలు విధించడమే వివేకవంతమని మాట్దస్‌ భావిస్తాడు. ఈ భయాందోళనలతో నిమిత్తం లేకుండా ధాన్యం చవగ్గా లభ్యమవడాన్ని దృష్టిలో పెట్టుకొని మాల్ధస్‌తో ఈ విషయంలో మాత్రం వ్యాసకర్త విభేదించదలచుకున్నాడు. మాల్దస్‌ అభ్యంతరాలు కొన్ని సమంజసంగా లేవు. ఎంతో సమర్ధవంతంగా తొనే నిరూపించిన స్వేచ్చా వాణిజ్య సూత్రాలను దిగుమతులపై ఆయన చేసిన వాదన బలహీన పరిచింది. నిజానికి కౌలుకు ఒక చక్కటి నిర్వచనాన్నిచ్చిన ఒక గొప్ప మేధావి దిగుమతి ఆంక్షలు ఉండాలని వాదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

“పంటలు పండించడానికి అయిన అన్ని ఖర్చులు, పెట్టుబడికి ప్రతిఫలంగా అందజేసిన లాభం వగైరాలు మినహాయించిన అనంతరం భూన్వామికి మిగిలే ప్రతిఫలమే కౌలుగా గుర్తించాలి.

అయితే ఈ ఖర్చులు లాభం అన్నీ కలిపి పండిప పంట విలువకు సమానంగా మాత్రమే ఉంటే అప్పుడు కౌలు ఏమాత్రం మిగలదు. అలాగే పంట విలువ కేవలం పండించడానికి అయిన ఖర్చుకు మాత్రమే సమానంగా ఉంటే అప్పుదు కౌలుతో పాటు లాభాలు కూడా శూన్యమే అని గమనించాలి. కావాలనుకున్న వాళ్ళకి సారవంతమైన భూమి లభ్యమైన తొలిదశలో సేద్యానికయిన ఖర్చులు పోగా మిగతాదంతా లాభంగానే ఉంటుంది. ఈ లాభం పెట్టుబడి పెట్టిన వాళ్లకే దక్కుతుంది. అంతేగాని కౌలుగా మిగులు ఏర్పడదు. ఉదాహరణకు రెండొందల కొలతల గోధుమలకి సమానమైన పెట్టుబడి దాంట్లో సగం స్థిర మూలధనంగా పనిముట్లు వగైరాల కోసం మిగతా సగం నిర్వహణ వ్యయంగా పెడితే మూడొంతుల కొలతలకి సమానమైన గోధుమలు పండాయనుకుందాం. అప్పుడు పెట్టుబడి పెట్టిన వాడి లాభం నివృత్తి యాజ్లై శాతం లేదా రెండొాందలపైన వంద లాభానికి సమానమన్నమాట. _

తొలి దశలో వ్యవసాయంపై స్థిరపడ్డ వారికి సారవంతమైన భూములు సులభంగా దొరుకుతాయి కనక ఆ దశలో లాభం నిష్పత్తి ఇదే స్థాయిలో కొనసాగుతుంది. వాస్తవానికి ఆ దశలో లాభం పెరిగే వీలున్నది. జనాభా పెరిగి శ్రామికుల సంఖ్య పెరుగుతూ పోతుందడడంవల్ల కూలీలు పడిపోయి నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇందుగ్గాను తొలుత వంద కొలతల గోధుమలకి సమానమైన పెట్టుబడి 90కి పడిపోవచ్చు. అంటే లాభాలు 50 బదులు 57 శాతమవుతాయి. పనిముట్ల నాణ్యత బంగారం ధర వి

పెరగడం, వాటిపై కర్చు తగ్గడం ఉత్పత్తి పెరగడం వంటి ఇతర కారణలవల్ల కూడా లాభాలు పెరిగే వీలున్నది. అలాకాక కూలీలు పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవడం వంటివి జరిగితే లాభాలు పడిపోతాయి. ఇలాంటి పరిస్థితులు అన్ని కాలాల్లోను తారసపడతాయి. లాభాలు పెరగడం లేదా తగ్గడం, సంపద వృద్ధి, హీనతలకు కారణమవుతాయి. అంతే మొత్తం పెట్టుబడి ఆహార సరఫరాని ఒకసారి పెంచడం మరోసారి తగ్గించడం చేయవచ్చు.

కానీ మనం వ్యవసాయంలో ఎలాంటి వృద్ధి లేదనుకుందాం. అలాగ పెట్టుబడి జనాభాలు తగు నిష్పత్తిలోనే పెరుగుతుంటాయనుకుందాం అంటే వాస్తవ వేతనాల్లో మార్పు ఉండదనుకుందాం. అప్పుడు సుదూర ప్రాంతపు వ్యవసాయం, తక్కువ సారవంతమైన భూమిలోని వ్యవసాయం ఎలాంటి (ప్రభావం చూపుతాయో అర్ధంచేసుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో వ్యవసాయంపై లాభం 60 శాతం ఉన్నప్పుడు ఇతర ఉత్పత్తి రంగం లేదా విదేశీ వాణిజ్యాలపైన కూడా అంతే మొత్తంలో లాభం సమకూరుతుంది. ఒకవేళ వ్యాపారంలో వ్యవసాయానికన్న ఎక్కువ లాభాలువస్తే వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి వ్యాపార రంగంలోకి మరలుతాయి. ఒకవేళ వ్యాపారంలో లాభాలు తగ్గితే వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతాయి.

దగ్గరలో ఉన్న సారవంతభూములన్నింటినీ తాలి దశలో స్టిరపడ్డవారు సాగులోకి తెచ్చిన తర్వాత పెట్టుబడులు జనాభాలు పెరిగి అలాగే ఆహార అవసరాలు పెరుగుతున్నప్పుడు తక్కువ సారవంతమైన సుదూర క్షేత్రాల్లోని భూములను కూడా సాగు చేయాల్సి వస్తుంది. ఒకవేళ భూమి సారవంతమైనదే అయినా కూలీలలో పెంపులేకపోయినా దూర ప్రాంతాల్లో వ్యవసాయానికి రవాణా ఇతరత్రా కర్చులు అవనరమై గతం:గీ వండించిన మొత్తానికే ఇవ్వుడు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఒకవేళ ఈ అదనపు పెట్టుబడి పది కొలతల గోధుమలకి సమానమనుకుందాం. అప్పుడు పెట్టుబడి మొత్తం 210 కొలతలకి సమానమవుతుంది. ఫలితంగా లాభాలు 50 నుండి 43 శాతానికి పడిపోతాయి.

మొదటి తరహా భూమిపై వచ్చే లాభం మనుపటిలాగే ఉంటుంది. అంటే వంద కొలతల గోధుమలపై 50 శాతం ఉంటుంది. అయితే లాభాలు మొత్తం పైన లెక్కించాలి. గనక 43 శాతం లాభంగా శాతం కౌలుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే పెట్టుబడిదారు ఎక్కువ వ్యయంతో దూర క్షేతంలో వ్యవసాయంచేసినా సమీప క్షేత్రంలో తక్కువ పెట్టుబడి పెట్టినా ఒనగూరే ప్రయోజనం 48 శాతం మేరకే 86 పి ఎస్‌ ఏం రావు

ఉంటుందన్నమాట. జనాభా సంపద పెరుగుతూ పోతూవుంటే రెండవ దఫాలో సీద్యం చేసిన భూములకంటే మరింత దూరంలో ఉన్నచోట ఇంకా తక్కువ సారవంతమైన భూముల్లో కూడా సేద్యం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవ్వుడు అంతే మొత్తం ఉత్పత్తికి మరింత ఎక్కువ, ఉదావారణకి 220 కౌలతలగోధుమలకి సమానమైన పెట్టుబడి అవసరమవుతుంది. ఈ స్థితిలో మొదటి దశలోని లేదా మొదటి తరహా భూములకి కౌలు 28 కొలతల గోధుమలకి సమానంగా పెరుగుతుంది. రెండవ తరహా భూములు కూడా మూడవ తరహాకంటే మేలైనవి కనుక వాటికి కౌలు ఆరంభమవుతుంది. అది 14 కొలతలకి సమానంగా ఉంటుంది.

అంటే కౌలు పెరిగి లాభాలు 36 శాతానికి పడిపోతాయి. ఇలా లాభాలు పడిపోవడం

తక్కువసారవంతమైన భూముల సేద్యం కౌలు పెరగడం క్రమంగా జరుగుతూ

ఉంటుంది.

ఇప్పుడు సేద్యమవుతున్న అతితక్కువ సారవంతమైన భూమికి కౌలు ఉండదు.

కాని అంతకంటే తక్కువ నాణ్యమైన భూమిని సాగులోకి తెచ్చినప్పుడు దీనికి కౌలు

దొరుకుతుంది. ఇలా పెరుగుతున్న కౌలు సహజంగానే పెట్టుబడిపై వచ్చే లాభాన్ని తగ్గిస్తూ పోతుంది. దూరప్రాంకాల్లో తక్కువ సారవంతమైన భూమిలో వ్యవసాయానికి

బదులు మొదటి తరహాలోనే చేయాలనుకునే వారికి లాభంమటుకు ముందటిలాగా

50 శాతం రాదు. వారు వ్యవసాయం చేస్తున్న దశలో సాగవుతున్న భూముల్లోని

కనిష్ట నాణ్యతగల భూమిపై పెట్టే పెట్టుబడినిబట్టి అగ్రశ్రేణి భూమిపై లాభం ఆధారపడి

ఉంటుంది. అంటే మొత్తంపై పెరిగే పెట్టుబడి వ్యయం, మేలైన భూములపై కౌలు

పెంచి లాభాల్ని తగ్గిస్తుంది. (రికార్జో కౌలు సూత్రం ప్రకారం మొదటి తరహా అంటే

అత్యధిక సారవంతమైన భూమిలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ భూమిపై కౌలు

లభించదు. ఆ స్థాయి భూమిని పూర్తిగా సాగులోకి తెచ్చిన తర్వాత దానికంటే తక్కువ

స్థాయి భూమిలో సేద్యం చేసినప్పుడే మొదటి క్రేజి భూమికి కౌలు లభిస్తుంది.

అలానే వ్యవసాయం మూడవ శ్రేజికి విస్తరించినప్పుడు రెండవశ్రేణి భూమికి కూడా కౌలు లభిస్తుంది. అలాగే నాలుగో(్రేజికి వ్యవసాయం విస్తరించినప్పుడు మూడో స్థాయి క్షేత్రానికి కౌలు దొరుకుతుంది.) ఉన్నట్టుండి మానవ న్వభావం మారి ఇప్పటికన్న రెట్టింపు ఆహారం దొరికితేనే బతకడం సాధ్యమవుతుందనుకుందాం. ఎక్కువ ఉత్పత్తిచేయడానికిగాను గణనీయంగాపెట్టుబడి అవసరమైందని అనుకుందాం, ఈ స్థితిలో గతానుభవంతో కొత్తచోట సారవంతమైన భూమిలోని పెట్టుబడి వల్ల బంగారం ధర ష్‌

ఒకగూరే అదనపు ఉత్పత్తి అతిస్వల్బంగా ఉంటుంది. కాని వృద్ధిక్రమం తక్కువగా ఉన్నప్పటికీ నంపదమా(త్రం పెరుగుతూనే ఉంటుంది. సారహీన భూములు దూరప్రాంతభూములు సాగులోకి వస్తూన్నకొద్ది వాటికంటే మంచి భూములకు కౌలు దొరుకుతుంది. అయితే పరిస్థితి ఇలానే నిరంతరం కొనసాగదు. జనాభాపెరుగుదలకు పరిమితులు ఉంటాయి. సారహీన భూములు కూడా అలానే లభ్యమవుతూ పోవు. ప్రయోజనంశూన్యమైనప్పుడు పెట్టుబడులు నిరాఘాటంగా కానసాగవు. దేశం ఆర్ధికంగా వృద్ది చెందుతున్న దశలో వ్యవసాయోత్పత్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. లాభాలు కౌలు రెండూ పెరుగుతూనే ఉంటాయి. కాని కొంత కాలం తరువాత కౌలు పెరిగనప్పటికే లాభాలువడిపోతే ఉంటాయి. పెట్టుబడిదారుల ఆదాయం సన్నగిల్లుతూ ఉంటుంది. భూస్వామి ఆదాయం(కౌలు రూపేణా) పెరుగుతూ పోవడం పెట్టుబడిదారు లాభాలు పడిపోతూ ఉండడం వంటి ఒక విచిత్ర స్థితిని మనం గమనిస్తాం. కౌలు మొత్తం ఉత్పత్తిలో అంటే లాభంలో భాగంగానే సమకూరుతుంది గాని అదనపు ప్రయోజనం కాదు. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగానే లాభాలు పడిపోతూ ఉంటాయి. సారవంతమైన భూములకు కొదవలేనంత కాలం ఖర్చులు పెరగవు, లాభం తగ్గదు. అప్పుడు కౌలు పెరిగే వీలుండదని గమనించాలి. జనాభా, సంపదలు వృద్ధిచెందుతున్న దశలో ధాన్యం ధర (శ్రామికుల కూలీలు పెరుగనప్పటికీ దూరప్రాంత క్షేశ్రాలపైన తక్కువ ఉత్పాదక శక్తిగల క్షేత్రాలపైన అయ్యే కర్చు ఎక్కువశ్రామికులను నియోగించదం వల్ల అయ్యే కర్చులు పెట్టుబడి మొత్తాన్ని పెంచి లాభాల్ని తగ్గిస్తాయి. కౌలుని పెంచుతాయి. దేశం సంపన్నమైన దశలో ధాన్యం ఇతర ముడిసరుకుల ధరలు పెరుగుతాయి. తక్కువ సారవంతమైన భూమిలో సేద్యం దాన్నుండి వచ్చే లాభం తగ్గినప్పటికీ నిర్వహించక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నకొద్దీ వస్తువుల మార్చిడివిలువ పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ధాన్యం పండించదానికి అదనపు శ్రమ అవసరమై వెండి, బంగారాలు, బట్టలు ఇతర వస్తువుల ఉత్పత్తికి అలాంటి అదనపు శ్రమ అవసరం కానప్పుడు ధాన్యం ధర ఈ వస్తువుల మారకపు విలువలో మునుపటి స్థాయిలో ఉండదు. దాని మారకం విలున హెచ్చుతుంది. ఇందుకు భిన్నంగా ధాన్యం ఉత్పత్తి వ్యయం ఏ కారణం చేతనైనా తగ్గితే ఇతర వస్తువులతో పోల్చినప్పుడు దాని ధర పతనమవుతుంది. వ్యవసాయ ఉపకరణాలు వ్యయాన్ని తగ్గిస్తే ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. అలాగే 88 పి ఎస్‌ ఎం రావు

ఇతర వస్తువులను ఉత్పత్తిచేసే యంత్రాల సామర్ధ్యం పెరిగి కర్చు తగ్గితే ఆ వస్తువుల మార్పిడి ధర తప్పకుండా తగ్గుతుంది.

పోటీ పూర్తి స్థాయిలో వుండి కొన్ని రకాల సారాయిల్లాగా వస్తూత్పత్తి ఏ మేరనైనా చేసే వీలున్నప్పుడు వస్తువుల మారకం ధరల్ని వాటి ఉత్పత్తిలో ఉన్న సౌలభ్యం లేదా ఇబ్బందులే నిర్ణయిస్తాయి. మొత్తంపై సంపద పెంపుదల ప్రక్రియ ముడిసరుకుల ధరను, వేతనాల్ని పెంచి లాభాలని తగ్గిస్తుంది.

వేతనాల్లోని సార్వత్రిక వృద్ధి లాభాల్ని తగ్గిస్తుందన్నమాట. ఇది కొంత క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం. పెట్టుబడిదారుడి వల్ల లాభం తగ్గుతూ భూస్వామి ప్రతిఫలం మాత్రం పెరుగుతున్న స్థితి ఇది. కౌలు రూపంలోనేగాక ధాన్యం మారకపు విలువకూడా భూస్వామి ప్రయోజనం పెరుగుతుంది. అతడికివచ్చే కౌలు 14 నుండి 286 కొలతల ధాన్యం మేర పెరిగితే కలిగే వాస్తవ ప్రయోజనం రెండు రెట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. పెరిగిన ధాన్యం మారకపు విలువ అతడి ఆదాయాల్ని పెంచడంవల్ల ఇలా జరుగుతుంది. కౌలు గనక ద్రవ్య రూపేణా చెల్లిస్తే ఈ దామాషాలో రెట్టింపుకంటే ఎక్కువ ధనాన్నే దత్తం చేయాల్సి ఉంటుంది. కౌలు పెరిగినవ్వుడు పైకి కన్పించినదానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగినట్టే అది పడిపోయినప్పుడు సంభవించే నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. లైతు, భూస్వాముల ఆదాయాలు వస్తు రూపేణా ఉన్నప్పుడు వారు దాని మారకం ధర ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. ద్రవ్య రూపేణా చెల్లింపు జరిగితే ధాన్యం లెక్కల్లో ఎక్కువ ద్రవ్యాన్ని పొందజూస్తారు. దీన్నిబట్టి చూస్తే భూస్వామి ప్రయోజనం సమాజంలోని ఇతర అన్ని వర్ధాల వారి (ప్రయోజనానికి విరుద్ధంగా ఉంటుంది. ఆహారానికి అత్యంత కొరత ఏర్పడి ఆహార ధాన్యాల ధర పెరిగి అందరూ ఇబ్బందులకు పొల్పడుతున్నప్పూడు భూస్వామికి అమితమైన ప్రయోజనం కలుగుతుంది. ప్రజలకు ధాన్యం తక్కువ ధరకు లభించడం భూస్వామికి లాభదాయకం కాదు. కౌలు పెరగడం లాభాలు పడిపోవడం దానికి తోడు విపరీతంగా పెరుగుతున్న జనాభాలు భూస్వామి సంపదని వృద్ధి చేస్తాయి.

కనిష్ట శ్రేణి అంటే అతితక్కువ సారవంతమైన భూమిపై పెట్టే పెట్టబడి మొత్తంపైన పెట్టుబడులు కలుగజేసే లాభాల్ని నిర్ణయిస్తుంది. భూస్వాములు తమకు సమకూరే కౌలును గనక వదులుకుంటే లాభాలు పెరగడంగాని ధాన్యం ధర తగ్గడంగాని జరగదు. కొని ఇలా చేయడంవల్ల భూస్వాములు మర్యాదగల పెద్ద మనుషుల్లాగా గుర్తింపు పొందుతారని మాల్టస్‌ అంటారు. బంగారం ధద తి

ఒక దేశ సౌభాగ్యం దాని ద్రవ్య పరిమాణాన్ని బట్టీగాని లేదా ఆదేశంలో ఉత్పత్తయిన వస్తువులు అధిక ధరలకు అమ్ముడవదాన్నిబట్టిగాని నిర్ధారితంకాదు. దేశంలో వస్తూత్పత్తి సమృద్ధిగా ఉంటే దాన్ని ధనిక దేశంగా గుర్తించాలి.

పుష్కలంగా లభించే వస్తు సంపద దేశ ప్రజల సుఖసౌఖ్యాల పెంపుకు తోడ్చడుతుంది. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. కాని తమ వద్దకి వచ్చేటప్పుటికి ద్రవ్యరూపంలో ఆదాయం తగ్గడాన్ని అంగీకరించరు. (ద్రవ్య పరిమాణం తగ్గితే దానివిలువ పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుందనే విషయాన్ని అందరూ విస్మరించి విలువ తగ్గుతున్న ధనం అధిక మొత్తంలో సమకూరడంతోటే సంతృప్తి చెందుతారు.

దేశంలో లాభాలు పెరగడమంటే ఒక రకంగా ఆహారపు మారకపు విలువ పడిపోవడమన్నట్టే. ఇలా పతనమవడం మూడు రకాలుగా జరిగే వీలున్నది. ఒకటి, వ్యవసాయ కూలీలకిచ్చే వాస్తవ భృతిపడిపోతే రైతుకు మిగులుబాట పెరిగి అధిక మొత్తంలో ధాన్యాన్ని అంగడికి తరలించి లాభం పొందుతాడు. రెండు, మేలైన ఉపకరణాలు ఇతరత్రా సామర్ధ్యం పెరిగి అధికోత్పత్తి సమకూరడం ఎక్కువ లాభాన్ని ఆర్జించి పెడుతుంది. ఇక మూడవ తరహాలో స్థానిక ఉత్పత్తి వ్యయానికంటే తక్కువ కర్చుతో ధాన్యాన్ని దిగుమతి చేనుకోగలిగితే అంటే అలాంటి కొత్త మార్కెట్లు తారసపడితే అధిక ప్రయోజనం కలుగుతుంది.

వీటిలో మొదటి తరహా లాభానికి ఒక ప్రత్యేకత ఉంది. వేతనాలు ఇంచుమించు కనీస జీవనావసరాల స్థాయి మేర పడిపోయే వీలుంటుంది. ఆర్ధిక వ్యవస్థ ఏ దశలో ఉన్నప్పటికీ అంటే పురోగమిస్తున్నా స్టిరంగావున్నా లేదా తిరోగమన పధంలో ఉన్నా వేతనాల్లో హెచ్చుతగ్గులు జరగడంకద్దు. సిర న్ఫితిలోని దేశంలో జనాభా పరిమాణంలోని మార్చు మాత్రమే వేతనాలపై ప్రభావం చూపుతుంది పురోగమన దశలో పెట్టుబడి జనాభాల పెరుగుదలలోని వేగం వేతనాన్ని నిర్ణయిస్తుంది. తిరోగమన దశలో పెట్టుబడి జనాభాల తగ్గుదల రేటు దానిని నిర్ణయిస్తుంది. జనాభా పెట్టుబడులు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతుండడం గమనార్హం. తతృ్సలితంగా వేతనాల్లో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. ఈ హెచ్చుతగ్గులు లాభాలసై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది చెప్పలేం. కాని వ్యవసాయోత్సాదకత పెరగకపోవడం అలానే చవక దిగుమతులకు కూడా ఆస్కారం లేకపోయిన స్థితిలో జనాభా, సంపదలు పెరుగుతుంటే లాభాలుపడిపోతుంటాయి. వేతన వ్యత్యాసాలతో లాభాలకు సంబంధం ఉండదు. శం పి ఎస్‌ ఎం రావు

కౌలు నియంత్రించే సూత్రాల ఫలితంగా ఇలా జరుగుతుందనే దానిని కొందరు అంగీకరించక వాణిజ్య విస్పృతి, లాభసాటి ఎగుమతులు, చవక దిగుమతుల వంటి వాటి కారణంగా లాభాలు పెరుగుతాయని వాదిస్తారు. వ్యవసాయం తద్వారా కలిగే ఫలితాలకీ లాభాలకీ వీరి దృష్టిలో ఎలాంటి సంబంధం వుండదు. వీరు వాణిజ్యపర లాభాలు వ్యవసాయిక లాభాలను ప్రభావితం చేసినంతమేర వ్యవసాయ లాభాలు వాణిజ్యపర లాభాలను శాసించవని నమ్ముతారు. వాణిజ్యంలో లాభాలు పెరుగితే వ్యవసాయంలో కూడా పెరుగుతాయని అలా జరగనప్పుడు వ్యవసాయం నుండి పెట్టుబడులను ఉపసంహరించి లాభదాయకమైన వాణిజ్యంలో పెడతారనేది వాదన. మరి కౌలు నిర్ధారించే సిద్ధాంతాన్ని గనక నమ్మినట్టయితే పెట్టుబడి, జనాభాలలో మార్పులేక అదే స్థాయిలో ఉన్నప్పుడు వ్యవసాయ లాభాలు పెరగడంగాని కౌలు తగ్గడంగాని జరగదు. ఇక్కడ రెండు ప్రత్వామ్నాయ ఫలితాల్ని కూడా ఊహించవచ్చు. ఒకటి, వాణిజ్య పరపెట్టుబడులపై లాభాలు గణనీయంగా పెరగడం, వ్యవసాయ పెట్టుబడులపై వచ్చే లాభంలో ఎలాంటి మార్పులేకపోవడం. రెండు- వాణిజ్య లాభాలు పెరగకపోవడం. ఈ రెండు అభిప్రాయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని వ్యాసకర్త నమ్మకం, తొలుత వ్యాపారం చేసినవారు ముఖ్యంగా విదేశీ వాణిజ్యంలో పాల్గొన్న కొందరికి అపరిమిత లాభాలు సమకూరితే సమకూరవచ్చుగాక. ఎగుమతి చేసుకొన్న వస్తువులు చవకగా లభ్యమయి స్థానిక మార్కెట్లో ఎక్కువ లాభం రావచ్చు. కాని ఇది తాత్మాలికం మాత్రమే. వస్తువులు ప్రియంగా ఉన్నాయని ఎగుమతి చేస్తూపోతే దిగుమతైన దేశంలో కొరత తొలగి ధరలు తగ్గి లాభాలూ తగ్గుతాయి. ముందుముందు వ్యాపారం చేసిన వారికే అదనపు లాభాలు దొరుకుతాయనికాని నిరంతరం అదే పరిస్థితి కొనసాగదు. సర్వత్రా లాభాలు రావు. అదే విధంగా కొత్తగా మంచి యంత్రాలను ఉపయోగించి వ్యాపారం చేసిన వారికి అధిక లాభం కలుగుతుంది. కాని తర్వాతి కాలంలో అందరూ అలాంటి యాంత్రిక ఉత్పత్తినే చేపట్టడం మూలాన లాభాలు పడిపోతాయి. పెట్టుబడి ఒక పరిశ్రమ నుండి మరో పరిశ్రమలోకి మరలుతున్న తొలి దశలో మాత్రమే లాభాలు కొత్త పెట్టుబడులు వస్తున్న పరిశ్రమలో పెరుగుతాయి. ఒక పరిమితి దాటిన పెట్టుబడి రావడంతో వస్తూత్పత్తి ఆ పరిశ్రమలో పెరిగి లాభాలు పడిపోతాయి. వ్యాపార రీత్యా ఏ దేశమైనా రెండు రకాలుగా లాభపడవచ్చు. ఒకటి, సార్వత్రిక బంగారం ధర త్తే

లాభాల రేటు పెరగడం. కాని ఇది ఆహార వస్తువుల ధరలు తగ్గిన తర్వాత జరుగుతుంది. లాభాలు కూడా వ్యవసాయం, పరిశమలు, వాణిజ్యంలో లేదా ఇతరత్రా పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రమే సమకూరుతాయి. రెండు, వస్తూత్పత్తి గణనీయంగా పెరగడం తద్వారా వాటి మారకం విలువ మొత్తం సమాజానికి ప్రయోజనం కలిగే విధంగా తగ్గడం. మొదటి స్థితిలో దేశాదాయం పెరుగుతుంది. రెండవ పద్ధతిన అదే ఆదాయపు సొమర్ధ్వం పెరిగి వినిమయ, విలాస వస్తువుల లభ్యత పెరుగుతుంది. శ్రమవిభజన జరుగుతుంది. కొత్త యంత్రాల ఉపయోగం "పెరుగుతుంది. వస్తూతృత్తి బాగా పెరిగి ప్రజల స్థితిగతులు పెరుగుతాయి. కాని లాభాలు మాథత్రం పెరగవు. వ్యవసాయంపైన పెరిగే కర్చుకనుగుణంగా వ్యవసాయోత్పత్తి పెరగని కారణంగా లాభాలు పెరగవు. వ్యవసాయ రంగంలో లాభాలు పెరగకుండా ఉండడం లేదా తగ్గుతున్న స్థితిలో ఇతర రంగాలలో లాభాలు 'పెరగవని గమనించాలి. అప్పుడు లాభాలు ధరలపై ఆధారపడతాయి అంటే ఆహారపు విలువనుబట్టి అవి నిర్ణయమవుతాయని అర్ధం. ఆహారోత్పత్తిని పెంచే ప్రతీ కారకం లాభాల పెంపుకు దోహదపడుతుంది. ఆహారోత్బత్తిని పెంచక ఉత్పత్తి వ్యయాన్ని మాత్రమే పెంచే ప్రక్రియ లాభాల్ని తగ్గిస్తుంది. ఆహారోత్పత్తి లాభాల వృద్ధికే కాక, ఇతర వస్తువుల వినిమయపు పెంపుకు కూడా తోద్బడుతుంది. ఆహారేతర వస్తూత్చత్తి లాభాలను పెంచదు. మరి చవకగా దొరికే ఆహారం లాభాలను పెంచినప్పుడు చవకగా లభించే ఆహార దిగుమతులపట్ల అభ్యంతరం తెలుపడం ఏ మేరకు సబబనేది ఆలోచించాల్సిన విషయం. ఆహార ధాన్యాల దిగుమతి విదేశాలపైన ఆధారపడడాన్ని పెంచుతుందనే వాదనతో వ్యవసాయానికి బదులు ఇతర రంగాలలో ఉత్పాదకతను పెంచే పెట్టుబడులను నిరుత్సాహపరిచే చర్య కూడా చర్చనీయాంశమవుతుంది. అలాగే స్వేచ్చా వాణిజ్యాన్ని ఉన్నట్టుండి అనుమతించే చట్టాన్ని తెచ్చి ఏ ఆంక్షలు లేకుండా ధాన్యంలో దిగుమతులను ప్రోత్సహిస్తే అప్పుడు మన దేశం నిస్సందేహంగా శాస్వతంగా దిగుమతి చేసుకొనే దేశంగా మారుతుంది. కాని ఒక దేశంలో సారవంతమైన భూములన్నీ సాగులోకి వచ్చిన తర్వాత నాసిరకం భూములు కూడా దున్నే పరిస్థితి వచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న దశలో గనక దిగుమకుల్ని (ప్రోత్సహిస్తే అప్పుడు ఆ దేశానికి వాస్తవ ప్రయోజనంకలుగుతుంది. దిగుమతుల వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే కలిగే నష్టాలు ఆహార సాధనలో విదేశాలపై ఆధారపడే అంశాల్ని అప్పుడు ఆలోచించాలి. కాని దిగుమతులు కల్పించే ప్రమాదాల్ని త్తి ప్‌ ఎస్‌ ఏం రావు

అవితెచ్చే ప్రయోజనాల విషయంలో లాగా కచ్చితంగా లెక్కించడం లేదు. కొన్ని సందర్భాల్లో అవి కేవలం అంచనాల కందని అథి[ప్రాయాల్లాగానే మిగిలిపోతున్నాయి. సాధారణంగా రెండు భయాలు వ్యక్తమవుతుంటాయి. ఒకవేళ యుద్ధం గనకవస్తే ఉన్నట్టుండి శతృదేశం దిగుమతుల్ని ఆపు చేని ఇబ్బందులపాలు చేయవచ్చనేది మొదటి భయం. దిగుమతుల కోసం మనం ఆధారపడ్డ దేశంలో కరువు ఏర్పడితే మనదేశంలో ఆహారపు కొరత ఏర్పడవచ్చనేది రెండవ భయం.

కాని మనం క్రమం తప్పకుండా దిగుమతి చేసుకొనే దేశంగా మారితే ఎగుమతి చేసే దేశం మన గిరాకీకి అనుగుణంగా తన వ్యవసాయాన్ని అభివృద్ది పరచుకుంటుంది. అంటే భారీ మొత్తంలో ఎగుమతికి ఆ దేశం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నమాట, కౌన్ని వారాల మన ఆహారపు అవసరాన్ని లెక్కగట్టినా అది పెద్ద న్థాయిలో ఉంటుందనేది తేటతెల్లమవుతుంది. మరి అంత పెద్ద మొత్తం ఉత్పత్తకి సరిపడే శక్తిని పెంచుకున్న దేశం ఎగుమతి చేయకుండా ఉండలేదు. మనది శతృదేశంగా మారినా తన దేశ ప్రజలకు ఏ దేశం నష్టం చేసుకోదు. ఉన్నట్టుండి వారు ఎగుమతి చేసి గడించే లాభాలు రాకుండా చేస్తే అక్కడి ప్రజలు కూడా ఆ చర్యని సహించలేరు. దేశంలో ఇలాంటి నష్టాన్ని అబ్లకల్లోలాన్ని స్పష్టించడానికే బొనపార్దే రష్యా ఎగుమతులను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. వ్యవసాయంలో పెట్టిన పెద్దమొత్తం పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సాధ్యంకాదు కనుక ఎగుమతులను ఒకసారి భారీఎత్తున సాగించిన తర్వాత నిలిపి వేయడం సాధ్యపదే విషయం కాదు. అటు పెట్టబదులను ఉపసంహరించుకోవడం సాధ్యంకాదు. ఇటు ఉత్పత్తయిన పంటల్ని నిల్వ ఉంచుకోవడం సాధ్యం కాదు. అవసరానికి మించి లభ్యమయ్యే ఉత్పత్సి దేశంలో ఆర్థిక విపరిణామాలకే దారితీస్తుందనేది విస్పష్టం. ఎగుమతి చేస్తున్న దేశానికి కలిగిన అరిష్టం స్థాయిలో దిగుమతి ఆగిపోయినప్పుడు మనకు కలగదు.మహా అంటే మన ఆహార అవసరంలో ఎనిమిదో వంతు దిగుమతి చేసుకుంటాం. ఆ మేర దిగుమతి ఆగినప్పుడు కలిగే అసౌకర్యం అందుకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది. వాస్తవానికి విదేశీ వ్యాపార క్రమబద్దీకరణ లేని రోజుల్లో ఈమేర కొరత ఏర్చడప్పుడు ఆ సమస్యని సులభంగా మనం అధిగమించగలిగాం. ఒకవేళ భయపడ్డట్టుగా మనం ఆహారం దిగుమతి చేసుకుంటున్న దేశంతో యుద్ధమే జరిగినప్పటికే కొంత అధిక వ్యయంతో వేరే దేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకోగలుగుతాం. అలా చేస్తూనే అవసరమైన మేర భవిష్యత్తులో స్థానికంగా ఉత్పత్తి పెంచే విధంగా పెట్టుబడులు ఐంగారం ధర త్తి

పెంచి తగు చర్యలు చేపడతాం. మనతో శతృత్వం తీవ్రస్థాయిలో నున్నప్పుడు కూడా బొనపాళ్టే మన దేశానికి వచ్చే ఆహారపు ఎగుమతులకు లైసెన్సులు ఇచ్చి అంగీకరించాడు. మన పంటలు దెబ్బతిని ధరలు విపరీతంగా పెరిగిన రోజులవి. కాని అలాంటి పరిస్థితి కూడా తిరిగి ఆకస్మికంగా తారసపడదు. ప్రమాదాన్ని ముందే అంచనా కట్టి అవసరమైన జాగ్రత్తల్ని ముందే తీసుకొనే వెసులుబాటు ఉండకమానదు. మరి ఇంతటి వెసులుబాటు ఉన్న తర్వాత కూడా అనవసర భయాందోళనలతో, దిగుమతి ఆంక్షలను కోరడం ఏమంత వివేకవంతం కాదు. అలా చేసుకోవడంవల్ల ఎప్పుడో జరగవచ్చనే (ప్రమాదం ఆ మాటకొస్తే అలా అసలు జరుగవీలులేని ప్రమాదాన్ని ఊహించుకొని ప్రతి ఏటా వచ్చే కోట్లకొద్దీ ఆదాయాన్ని తలదన్నినట్టవుతుంది.

ఇక్కడ తెలియజేయాల్సిన మరో విషయమేమంటే (ప్రాన్స్‌ వంటి దేశాల్నుండి మనం పండించడంలో జరిగే కర్చులో సగానికే దిగుమతి చేసుకొనే వీలున్నప్పుడు నిబంధనల ద్వారా దాన్ని ఆపాలని మాల్దస్‌ కోరడం ఆదేశంలో ఉత్పత్తిని తగ్గించమన్నట్టే అవుతుంది. మన దేశంలోని సారహీన భూముల్లో ఎక్కువ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ విదేశాల్లో ఇలా నిరుత్సాహపరచడం సరియైన ఆలోచనకాదు. ధాన్యం ఎగుమతి చేసే దేశాలకు గనక ఆంక్షలులేని ఎగుమతులు నిరంతరం సాధ్యమేననే నమ్మకం కలిగితే నియంత్రణలు లేని దిగుమతులవల్ల కలుగుతాయనే (ప్రమాదాలు అస్సలు జరిగే వీలు లేదు. మన గిరాకీ అంచనానిబట్టి ఎడతెరిపి లేకుండా ఎగుమతిచేసే ఏర్పాట్లు ఆయా దేశాలు చేసుకుంటాయి.

మనదేశంలో గిరాకీ మేర ధాన్యాన్ని ఎగుమతి చేయలేని పరిస్థితిలో ధాన్యం విలువ కొరత మేరకేకాక ఇబ్బడిముబ్బడిగా ఉండే వీలున్నది. ఉదాహరణకి ఒక కోటి కొలతల ధాన్యం మామూలుగా నాలుగు కోట్ల డబ్బుకు అమ్ముడ్రైందనుకుందాం. తదుపరి ధాన్యంలో నాలుగో వంతు కొరత ఏర్పడితే ధర పెరిగి మిగిలిన మూడువంతుల ధాన్యానికే ఐదుకోట్ల డబ్బు ఆదాయం వచ్చినా ఆశ్చర్యం లేదు. పంటలు విఫలమై ధరలు పెరిగిన సందర్భంలో తమ వినిమయానికి అవసరమైన కనిష్ట స్థాయి ధాన్యాన్ని మినహాయించి సాధ్యమైనంత ఎక్కువ ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తారు.

అయితే పెరిగిన మన గిరాకీకి అనుగుణంగా ధాన్యం ఉత్పత్తి పెరిగి దాని ధర మితిమీరి పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఒక దేశంలో ఒక ప్రాంతంలో పంటలు విఫలమైతే అది అన్నిచోట్ల జరగదు. మొత్తంపైన చూస్తే ఒక చోట ఉత్పత్తి త్తే పి ఎస్‌ ఎం రావు

తగ్గినా మరోచోట అది పెరిగి పెద్ద లోటులేని స్థితి స్వాభావికంగా జరుగుతుంది. ఒక దేశంలోనే పరిస్టితి ఇలా ఉంటే ప్రపంచంలో దేశాలన్నిటి స్థితి ఇందుకు భిన్నంగా ఉండవీలులేదు. ప్రపంచం మొత్తంమీద చూస్తే ఉత్పత్తి మొత్తంపై పడిపోదు. కనుక ఒక దేశంలో వర్పడే కరువు, తాత్కాలిక లోపాలు మనల్ని కలవర పర్చాల్సిన విషయాలుకావు.

హాలెండ్‌ పరిస్థితిని ఉదాహరణగా తీసుకుంటే అది సుమారు సంపూర్ణంగా ఆహార అవసరాలకు దిగుమతులపైన ఆధారపడిన దేశం. కాని ఆ దేశంలో ధాన్యం ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఈ దేశం చిన్నదే అయినా అక్కడి అనుభవం దిగుమతి నిబంధనలు సరియైనవి కావనే వాదనకి బలాన్నిస్తుంది.

మన దేశం వ్యవసాయంలో గణనీయమైన ప్రగతి సాధించినమాట వాస్తవమే. కాని పెరుగుతున్న సంపద గిరాక్రీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పనికిరాని భూమిలో కూడా వ్యవసాయం చేసే పరిస్థితిని కలిగిస్తాయి. చట్టపర నిబంధనలు గనకలేకుంటే అలాంటి వ్యర్ధ పెట్టుబడి వ్యవసాయంపై పెట్టక లాభసాటి అయిన దిగుమతుల మార్గాన్ని అనుసరించే వాళ్లం. వ్యవసాయాన్నుంచి ఉపసంహరించిన పెట్టుబడిని ఇతర రంగంలో వినియోగించి తద్వారా ఉత్పత్తయిన వస్తువుల్ని ధాన్యానికి బదులుగా ఎగుమతి చేసే వీలై యుండేది. పెట్టుబడి పంపిణీ ఇలా సమర్థవంతంగా జరగడాన్ని రాజకీయార్థిక శాస్త్ర సిద్ధాంతాలు సంపూర్ణంగా సమర్ధిస్తాయి. మౌబ్ద లాంటి మేధావులు ఈ సూత్రాల్ని నిరాకరించ వీలు లేదు. నిజానికి ధాన్యపు చట్టానిపై ఆయన రచించిన వ్యాసంలోని వాదనలకు ఈ సిద్ధాంతాలే పునాదులుగా వున్నాయి. కానీ ఆయన తదుపరి రచనలో దిగుమతులవల్ల వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టిన వారికి కలిగే నష్టాన్ని గూర్చి వివరిస్తారు. ఇలాంటి నష్టం పట్ల తన బాధని వ్యక్తం చేస్తారు. కాని మారిన పరిస్థితులలో ఇలాంటి నష్టాల పేరుతో కొత్తవిధానంవల్ల, అంటే ఇక్కడ ధాన్యం దిగుమతులవల్ల, కలిగే భారీ ప్రయోజనాన్ని వదులుకొమ్మనడం సరియైన ఆలోచనకాదు. పాత యంత్రాలపైన పెట్టిన పెట్టుబడిని నష్టపోతామని కొత్తగా ఆవిష్ఫ్రతమైన ఆవిరి యంత్రాలనో లేదా ఆర్క్‌ రైట్‌ పత్తి యంత్రాన్నో నిరాకరించడంవల్ల కలిగే నష్టం లాంటిదే దిగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల కలుగుతుందని భావించాలి.

నిస్సారమైన భూములపై వ్యవసాయం చేసే బీద రైతులకు దిగుమతులవల్ల కొంత నష్టం కలిగేమాట వాస్తవమే. కాని అది తాత్కాలికం మాత్రమే. దిగుమతులవల్ల బంగారం ఛం క్ష్‌

ఛాన్యం ధర తగ్గి బీద రైతు లాభిస్తాదు. దాంతోపాటు వ్యవసాయంలోనివ్యర్ధ పెట్టుబడి, ఇతర ఉత్పాదక రంగాలకు మరలి వస్తూత్పత్తి పెరిగి దేశంలోని (ప్రజలందరితోపాటు చిన్న రైతుకు కూడా లాభం కలుగుతుంది. భూస్వాముల ప్రయోజనానికి భంగం కలిగించడం మినహా మరెవ్వరికీ ఆహార ధాన్యాల దిగుమతులు నష్టం కలిగించవు. వాస్తవానికి తాత్కాలికంగా చిన్న రైతులు కోల్పోయేది జాతికి కలిగే నష్టం ముందు లెక్కలోనిది కాదు. ప్రారంభంలో కౌంత నష్టాన్ని పూడ్చుకోడానిగ్గాను మూడు నాలుగు సంవత్సరాల వరకు కొంత దిగుమతి సుంకాన్ని విధించవచ్చు. తదుపరి అలాంటి పన్నులన్నీ రద్దుచేసి మన దేశంలోని వ్యవసాయోత్పత్తులపై విధించే పన్నులేమైనా ఉంటే ఆ మేరకే దిగుమతులపై విధిస్తామని స్పష్టంగా ప్రకటించాలి.

మాల్ళిస్‌ చెప్పినట్లుగా ఇతర దేశాలతో సమానమైన స్థాయిలో అభివృద్ధి చెందడం, అక్కడి అత్యుత్తమ స్థాయి సాంకేతికతను సాధించడం అవసరమే. కాని అభివృద్ధి ప్రక్రియలో తగు వ్యూహాన్ని విధానాన్ని అవలంభించి ఆదర్శ ఫలితాల్ని సాధించాల్సి ఉంటుంది. దిగుమతులపై నిబంధనలను విధించకుండా (ప్రగతి సాధ్యమైనప్పుడు ఆ అవకాశాన్ని తిరస్కరించడం మంచిదికాదు.

భూమిని మాల్దస్‌ అసంఖ్యాక యంత్రాలుగా వర్ణించదాన్ని ఇక్కడ గమనించాలి. పెట్టుబడిపెట్టి యంత్రాలలాగా దానిని ఉపయోగించి ఫలితం పొందవచ్చంటారాయన. మరి అలాంటప్పుడు పనికిరాని యంత్రాలపైన వృధా కర్చు చేయకూడదని ఆయన అంగీకరించి తీరాలి. పనికిమాలిన యంత్రాలని ఎలాగైతే తిరస్మరిస్తామో నిస్సారమైన భూములపై పెట్టుబడికూడా పెట్టగూడదని ఆయన అంగీకరించాలి. ధాన్యం చవక (ద్రవ్య రూపంలో) ధరలు దిగువ తరగతి ప్రజలకు లాభదాయకంకాదని వస్తువుల కొనుగోలుకు వారి శమవల్ల సంపాదించిన ఆదాయం సరిపదదని మాబ్‌ వాదన, కాని దేశం మొత్తంపైన పెరిగిన పెట్టుబడి తద్వారా పెరిగిన ఉద్యోగిత ఆదాయాలు వారికి ప్రయోజనం కలిగిస్తాయనే విషయాన్ని ఆయన ఆలోచించలేదు. దిగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం నిర్వహిస్తున్న వారికే లాభం సమకూరుతుందనికూడా మాళ్ఞస్‌ అంటారు. కాని కౌలు సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఇది వాస్తవం కాదని తేలుతుంది. సార్వత్రిక లాభాలు పెరిగిజే కౌలు తగ్గుతుందని కౌలు పెరిగితే లాభాలు తగ్గుతాయని ఈ సిద్ధాంత సారాంశం. మరి వ్యవసాయ చవక దిగుమతులు కౌలు తగ్గిస్తాయి. కనక కచ్చితంగా లాభాలు పెరగుతాయి. అప్పుడు అందరికీ (వ్రయోజనం కలుగుతుందేకాని మాల్దస్‌ అన్నట్లు ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. త్త పి ఏస్‌ ఎం రావు

కేవలం భూస్వాముల ఆదాయం తగ్గుతుంది. వారి ఆదాయం తగ్గి తదనుగుణంగా వారి నుండి వచ్చే గిరాకీ తగ్గవచ్చు. కాని ఈ ఒక్క వర్గం నుండి తగ్గిన గిరాకీ కన్న ఎన్నో రెట్లు ఎక్కువగా ఇతర వర్ణాల నుండి గిరాకీ పెరిగి వస్తూత్పత్తికి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. మాల్ధిస్‌ కూడా అంతకుముందు హ్యూమ్‌ చెప్పినవిధంగానే ధరలు పెరగడంవల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయంటాడు. పెరిగిన ధరలు వాణిజ్య వర్ణాలకు అదనపు లాభం, అంటే పెట్టుబడి సౌలభ్యం కలిగిస్తాయని దానివల్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందంటాదు. దిగుమతుల్దవల్ల ధాన్యం ధరలు చవకఅవడం చేత ఈ ప్రయోజనాన్ని దేశం కోల్పోతుందనేది ఆయన వాదన. మరి ఈ వాదన సరియైందే అయితే ధరల పెరుగుదల పెట్టుబడిదారుకొనే వస్తువులకూ అమ్మే వస్తువులకు కూడా వర్తిస్తుంది. కనక లాభాలు ఉండే వీలు లేదు. అదే గనక ఆహార ధాన్యాల దిగుమతులవల్ల చవకగా కొనుగోళ్లు చేసి తమ ఉత్పత్తుల్ని ప్రియంగా అమ్మే వాణిజ్యవేత్తకు అధిక లాభం పొందే వీలు కలుగుతుంది.

ద్రవ్యం విలువ పెరిగితే అన్ని వస్తువుల నిలువని తగ్గిస్తుంది. అలాకాక కేవలం ఆహార ధాన్యాల విలువ తగ్గితే కేవలం వేతనాలు తగ్గుతాయి. అంటే లాభాలు పెరుగుతాయి. దానివల్లో అదనపు పెట్టుబడులు సాధ్యమవుతాయి. చవకగా ధాన్యం దిగుమతి చేసుకోవడంవల్లి ఇతీతటొ ప్రయోజనం ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

పరిశ్రమల (శ్రామిక ఉత్సాదకత(అంటే అక్కడి వినియోగించిన శ్రమకు ఫలితంగా జరిగే సగటు ఉత్పత్తి) ఎన్నడూ వ్యవసాయోత్పాదకత స్థాయిలో లేదని ఆడంస్మిత్‌ అన్న మాటల్ని మాల్బస్‌ తప్పుగా అర్ధం చేసుకొన్నాడు. “ఎన్నడూ లేదు' అన్న పదాలను వదిలేసి. శాస్వతంగా వ్యవసాయంలో ఉత్పాదకత భవిష్యత్తులో మాడా నిరంతరం ఎక్కువగా ఉంటుందనే భావనని వ్యక్తం చేశారు.

వ్యవసాయ దిగుమతులకు సంబంధించిన ఈ ఒక్క విషయంలోనే ఎందుకో మాల్దస్‌ ఆలోచన భిన్నంగా వుంది. అన్ని ఇతర విషయాల్లో ఆయన వాదన బలంగా ఉంటుంది. ఇంకొక సందర్భంలో ఆడంస్మిత్‌ గూర్చి మాట్లాడుతూ, అన్ని రకాల భూములకు కౌలు వస్తుందనే స్మిత్‌ వాదనతో మాళ్ధస్‌ విఖేదిస్తాడు. కొంత లాభం, తక్కువ వేతనాలు మాత్రమే వ్యవసాయాన్ని '్రోత్సహిస్తాయని ఆయన వివరిస్తాడు.

ధాన్యం దిగుమతి వల్ల లాభాలు పెరుగుతాయనేది గమనించాం. ట్రాభాలు పెరుగుతున్న కొద్దీ కౌళ్లు పడిపోతాయి. నిస్సారమైన భూములలో వ్యవసాయం జరగదు. నాణ్యతలో చివరి నుండి ఒక్కో శ్రేణి నేలలో వ్యవసొయం చేయడం ఆగితే బంగారం ధర త్త

అంతకు పైశ్రేణి భూమికి కౌలు దొరకదు. ఉదాహరణికి నాలుగో శ్రేణిలో వ్యవసాయం, మూడో (శ్రేణి భూమికి కౌలు సౌకర్యం కలిగిస్తుంది. మూదోశ్రేణి వరకే జరిగిన వ్యవసాయం మొదటి రెండు డ్రేణులకే కౌలు వచ్చేటట్టు చేస్తుంది. ముడో డ్రేణి నుండి కూడా పెట్టుబడి ఉపసంహరణ జరిగితే మొదటి స్థాయి భూమి సాగుచేసే వారే కౌలు చెల్లిస్తారు. వ్యవసాయ భూమి ఎంత నిస్సారమైందయితే అంత ఎక్కువగా శమ,పెట్టుబడులు అవసరమవుతాయి. ఆహార ధాన్యాల దిగుమతివల్ల దేశ సంపద పెరుగుతుంది. ఆహారేతర వస్తువుల ఎగుమతి పెరుగుతుంది. జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఆదాయంతోపాటు అధికమొత్తంలో పన్నులు చెల్లించాల్సి వచ్చినా వాటిని ఆదాయాల్నుండే ముదరా పెడతాం. కనక ఏమాత్రం చింతించాల్సిన పనిలేదు. ఒకవేళ ద్రవ్య ఆదాయ్లర్హ.శ్లగ్గాఅఇతక్షన్న ఎక్కువగా వాస్తవాదాయం పెరిగితే మొత్తం మీద కోల్పోయేది వమ్మీ స్టుడ్షేద్రన్లువాస్తపాద్దాయం పెరిగినప్పుడు అంటే ధరలు తగ్గి ద్రవ్యం విలువ ఇళ్ధగసప్తుడు రావాల్గోన్టీక్షోబ్ళు ఒప్పందం [ప్రకారమే ముట్టినా అదనపు ఆదాయరలొ -హ్రఖ్యుకూరినట్లు అవుతుందోసజ్తంతే మొత్తం దబ్బుతో వారు ఎక్కువ వస్తువుల్ని కొనుక్కో గలుగుతారన్న మాట్య ద్ద్‌ఫ్ట వల్ల ఒక భూస్వామి మాత్రమే తగ్గిన కౌలు కారణంగా నష్టపోతాడ్డు కాని. మకీడ్ధక్హాలలో స్థిరాదాయాలు గలవారు. పెట్టుబడిదారులు ధరలు పెరిగి హస్తఖీల్లోనట్లోహ్హ్‌స్లో కోల్పోయి. ఎక్కువగా నష్టపోయారు.

ఒక్క భూస్వామి ప్రయోజనాన్ని కాపొడ్దం కోసం మొత్తం దేశ ప్రయోజనాల్ని కాలరాయడంకన్న ఘోరమైన విషయం మరొకటి ఉండదు. వారి ప్రభావానికి లోనై గనుక చవకగా వచ్చే ధాన్యం దిగుమతిని ఆపితే రేపు వారు వ్యవసాయ పద్ధతుల్లో వచ్చేమార్చుల్ని అభివృద్ధిని కూడా మనపై వత్తిడి తెచ్చి ఆపగలుగుతారు. ఉత్పాదకత పెరిగితే ధరలు పడిపోయి వారి ప్రయోజనం దెబ్బతింటుంది కనుక వారు ఎప్పుడూ వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోనీయరు. వారికి భయపడి అప్పుడు మనం వ్యవసాయాభివృద్ధికి కృషి చేయం. అయితే మరి ఇప్పుడూ అలానే భయపడదాం. దిగుమతుల్ని నిషేధించి అభివృద్ధి నిరోధకులుగా చరిత్రలో మిగిలిపోదాం.

సమాప్తం

న! పి ఎస్‌ ఎం రావు

వు త నం స న. మ తానా మ. ల న. నా లం గ. యల ల్‌. వ ద ననే ల భ్‌. ల 1 టా గో, గ గ నం. షై సై స్ట మ! నో వ. ర. స త్‌ న్‌ా య, [1 న్‌

వల ౩... . / గ5.20/- . . ఒం ఇది డేవిడ్‌ రికార్డో రాసిన రెండు ప్రసిద్ధ వ్యాసాల సంకలనం. బంగారం ధరకీ కాగితపు కరెన్సీకీ ఇతర వస్తువుల ధరలకీ ఉన్న లంకెను 1810లో ప్రచురితమైన మొదటివ్యాసం వివరిస్తుంది. బంగారంతో నాణాలు న తయారయ్యే రోజులవి. నాణాల రూపంలో లభించే / బంగారం మార్కెటులో లభించే బంగారం కన్నా ఎక్కువ .| లాభం చేకూర్చినప్పుడు నాణాలను కరిగించే దొంగ

  • వ్యాపారం జోరుగా సాగేది. మార్కెటు శక్తులు బంగారం ధరపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఈ వ్యాసం -. వివరిస్తుంది. 'స్వేచ్చావిపణిలో లాభాలు ఎలా నిర్ణయమవుతాయనేది 1815లో ప్రచురితమైన రెండో వ్యాసం తెలియజేస్తుంది. - " | ఆహారధాన్యాల దిగుమతుల్ని నిషేధించే చట్టాల్ని ఇది వ్యతిరేకిన్హుంది. భూస్వాముల అక్రమలాభాలను " ; విమర్శిస్తుంది. ఆర్ధిక వ్యవస్థను. మార్మెటు శక్తులకు వదిలివేయాలని వాదిస్తుంది. భూస్వామ్య 'ఆర్థికవ్యవస్థకి . వ్యతికేకంగా బూర్జువా వ్యవస్థ మొగ్గతొదుగుతున్న దశ .: వక్తి. ఈ రదోవ్యవస్థకు ప్రతినిధిగా డేవిడ్‌ కార్గో...