Telugu amurtha kalasham, laxmi katakshamu, unmatha deekshithamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

హ్‌ ॥ న. అ శా ఇ 12 | క్ష లల , . న్‌ (1 . " " |. . పాడాను హను దాన డా రాక న్‌ా కా దా ॥ వయా నచుానానాం. రసమును ను చాత నాు, భక హో యు మ మం నయయయరా న రా జా లా మమా ర జ చట య్‌ గ .. ర యా? జని రాలు క్ల రాం సా. గ్‌ షో ఫి ళు లో సాలు సంకు హ్‌ నా న ననన ర ర ల్‌ ర న యి దరాకన ॥ ॥ కంస నాలుడమదనంనననలు నాం సూ యర నలా లలా సనం నుసి న న న చా ర తా నన న మం. నన న న ను సూ టు య . లహ టి సుమం నచట క్ష యాతన ఘా క వ. న్‌ా ము సడ నామా తమా న. న క | న్డ్‌ మప వ గ లే లర న నో ననిన రట? నాన గొ నా లవాసా టట డన టం వ. సు! ళు వణ రన ద యం టం ల లు న స రంల నడ న గ ] నానన వ్‌ ను జస... ఫో కన! న వు చద న ను వ న ల య /| న ల జ చాంననసపద చ ల ల యయ మరుల చనన టన తా. గా | న స్‌ నే సవ్వోలి గ సాలా ఉడీ [| | న (న స. న / క [౯ హో జ గం . జా చే న రు 4 కా. ల్‌ పీ ల పై ణా ను, పు రారా. కా న! సన ప /. న స యంత ము ణ్‌ హై వ. క ను షె నా న. గ. క నపైము = షా / అనీ వు క వం ళన లి వ ఎ మే లీ మడా మ. శే... న. నాం | మ్‌ స. మ | వయ నూ / ) ల 27-5-8944 25-983 మ 1 మం గ | నా వా (1 ర వ మరం = క జం లీ సన సం న రానుషష్తకని ళీ హా దాం వై ల | చత శక జో డా గ చా యయ యాన హన పడా నానా ల మాయా లతా మో ర. | టప చరడాడూన ళో సరూప క్ష న్‌ , ఫ్‌ _

అమృత కలశము లక్ష్మ కటాక్షము పేన్త త్ర దీక్రి ఉన్మత్త దీక్షితము స శా॥ ఫాలన్ఫార విభూతి కుంకుమ రుచిన్‌బాలార్కరుక్‌ శ్రీలతో ల్‌లా మానుష వేషధారిని జగల్లీలా కళామూర్తి గో పీలోలున్‌ గలశామ్యతున్‌ సలుపవే పీయూష పద్వోల్లస న్మాలా సృష్టిని రామకృష్ణకవి చంద్రా! శంభు పాదాత్రితా! కర్త మోచెర్ట రానుకృష్ణవని నెల్లూరు.

ఎ అయ్యా అవన్యుతకలశము దా పం ఓ శతుయి2 21252001 మూడవ కూర్చు . లక్ష్మీకటాక్షము 21000001 క22 1922001 500 ప్రతులు రెండవ కూర్చు . ఉన్యత్త థీక్షితము 10242 96లేంప[టు2ుు రం రెండవ కూర్చు . న. (2002 - ఐప్రిల్‌ స్ట గ లో చెల : అమూల్యం ప్రచురణ మోచెర్ల రామకృష్ణయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ వార్జు గుం. 1 ౨5/987, వెంకట్రామపురం, నెల్లూరు-1. నా చా న్‌ ప్రతులకు గ (లన * దుగ్గిశెట్టి వింకటరమణయ్య హ్‌ ఛార్జర్డ్‌ అకౌంటెంట్‌ సయపొలి హైదరాబాద్‌లి వార్డు నం. 15/987, వెంకట్రామపురం, నెల్లూరు-1. అగస్త్యంెడ్డి వెంకురెడ్డి 16/1252, గాంధీనగర్‌, నెల్లూరు-524 001. ముద్రణ : అన్నపూర్ణ ప్రెస్‌, నెల్లూరు.

పుంభావ సరస్వతి శ్రీమోచెర్ల “సరసకవి” - “కవిశేఖర” - “సాపిత్యరత్న” - “ప్రసన్న మధురకవి” సద్బిరుదాంచితులు బ్రహ్మశ్రీ మోచెర్ల రామకృష్ణయ్యగారు 18వ శతాబ్దము పూర్వార్థమున తమ అనర్గళ గంగార్సురీతుల్యమైన అద్వితీయ ఆశుకవితామృత ధారలచే ఆంధ్రదేశమును అమరత్వమొందించిన మోచెర్ల వెంకన్న దత్తప్ప సోదరకవులలో దత్తప్ప వంశీకులు. రామకృృష్ణయ్యగారు 1904 మేనెల 27వ తేది క్రోధినామ సంవత్సర అధిక జ్యేష్ట శుద్ధ త్రయోదశి శుక్రవార పవిత్ర దివసమున లక్ష్మీ నరసమ్మ రామలింగయ్య పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్తాఫలముగ మాతామహులైన పరమ భాగవతోత్తములు భాగవతుల రాఘవదాసుగారి యింట నాటి వేంకటగిరి సంస్థానాధీశుల గ్రామమగు తూర్పునాయుడుపాళెం (ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని టంగుటూరు ప్రకాశం పంతులుగారి జన్మస్థలమైన వల్లూరు (గ్రామ సమీపము)లో జన్మించిరి. పితృపితామహులు కావలి సమీపమునందలి తెట్టు దగ్గరున్న మోచెర్ల అగ్రహారీకులు. రామకృష్ణయ్యగారు నెల్లూరులో వి.ఆర్‌. కళాశాలలో యఫ్‌.ఏ. (ఫస్ట్‌ బ్యాచ్‌) మద్రాసు పచ్చయప్ప కళాశాలలో చరిత్ర ప్రధానాంశముగా 1924లో బి.ఏ. పరీక్షయందు విశ్వవిద్యాలయమునకు ప్రథములుగా ఉత్తీర్ణులైరి. మద్రాసు లా కాలేజిలో ప్లీడర్‌షిప్‌ పరీక్షయందు ఉత్తీర్ణులై 1926లో నెల్లూరులో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి పేరు (ప్రఖ్యాతులు గడించిరి. న్యాయవాదిగా తలమునకలుగాఉన్నను, కవితా సాహిత్య వ్యాసంగములతో అత్తితోట అగ్రహారము నందలి వారి గృహము “కవితా నికేతనము” నిత్యము కలకలలాడుతూ ఒక శారదావీఠంగా విలనిల్లింది. బాల్యమునందే నుకవితా నరన్వతిని సాక్షాత్మరింపజేసుకున్న రామకృష్ణయ్యగారు “అభినవ తిక్కన” - “సాహిత్య స్థాపక” “'మహోపాధ్యాయ” దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారి ప్రియ శిష్యులై కవితా రహస్యముల నాకళించుకొని ముప్పదింటికి పైగా రసవన్మధుర మంజులసుకృతుల సంసృజియించి ఆం(ధ్ర సాహిత్య ప్రపంచమును సుసంపన్నముకావించిన సుకృతాత్ములు. పద్యవిద్యయందేకాక గద్యవిద్యయందును సిద్ధహస్తులై లబ్ధిప్రతిష్టులైన సమకాలీన విద్వత్మవి మండల ప్రశంసలు చూరగొన్న మహితాత్ములు మోచెర్లవారు. వారు వానుమదుపానకులు కనుకనే (వప్రధమముగ “మారుతీ శతకము”తో కవితావిష్కరణము గావించిరి. సంస్కృత భాషలో కవి పండిత మూర్ధన్యుడగు శ్రీమదప్పయ్య దీక్షితులవారి “ఆత్మార్చణోదంతం” కవితానువాదముతో అవసితమైనది. వారికి చిరంతన యశస్సు నార్జించి పెట్టిన గద్యకృతి (కాళిదాస శే

మహాకవి కుమార సంభవకృతికి తెలుగు వచనానువాదము) గిరిజా కల్యాణము. అశేష ప్రజల ప్రశంసలు చూరగొన్న పద్యకృతి “అమృత కలశము”. సంస్కృతములో “శారదా ప్రసాదళొ అను వీరి స్వతంత్ర పద్యకృతికి ముగ్దులై అయోధ్య పీఠాధిపతులు రామకృష్ణయ్యగారిని “సాహిత్యరత్న” బిరుదముతో ఘనముగ సత్కరించిరి. ఆంధ్ర సారస్వత పరిషత్తువారు మంగళగిరి సమావేశమున “కవిశేఖర” బీరుదముతో గౌరవించిరి. జగన్నాథ పండిత రాయల సంస్కృత కావ్యమును అత్యంత మనోజ్ఞముగ తెలుగులో “గంగాలహరి' పేర పద్యకృతిగ సంతరించిరి. నెల్లూరున సుప్రసిద్ధ న్యాయవాదులు బి. రామస్వామిగారి మిద్దెపైన మరాక సుప్రసిద్ధ న్యాయవాదులు ఒంగోలు వేంకట రంగయ్య పంతులుగారి ఆధ్యక్షమున జరిగిన “గంగాలహరి” కావ్యావిష్మరణ సభలో “సరసకవి” బిరుదముతో సమ్మానించిరి. డా॥ బెజవాడ గోపాలరెడ్డి గారు అధ్యక్షించిన ఆంధ్ర సభలో జరిగిన పెద్దవిద్వత్సభలో మధుర వాస్తవ్యులు “మహామహోపాధ్యాయ” - “వైయాకరణ పంచానన” - “పండితరాజు శ్రీ కె.యస్‌. కృష్ణమూర్తిగారు “ప్రసన్న మధురకవి” బిరుదమిచ్చి మన్నించిరి.

రామకృష్ణ కవిశేఖరుని కావ్యములు పరిమాణమున చిన్నవే అయినను

ప్రమాణమున మిన్నలే. వీరి కావ్యములన్నియు శిరీష కుసుమపేశలలాలిత్య సదృశమై సద్భావనాభాసిత సురుచిర శబ్దఘటనా సౌొష్టవముతో, రసాభ్యుచిత రచనా చణత్వముతో రమ్యాతిరమ్యములై పాఠకుల రనజగత్తున నోలలాడించి పరవశులగావించుననుటలో లవలేశమును సందియములేదు.

రసవిశారదుడైన కవికనుకనే తమ కృతులకు, తమ జీవితమునకు అమృతత్త్వమును, అమరత్వమును సిద్ధింపజేసుకోగలిగినారు. రసవత్పద్య నిర్మాణ పఠన పాఠన కళాదురంధరులేకాక (శ్రోతలను సమ్మోహనము కావింపగల గాన కళాకుశలులు, రామకృష్ణయ్య కవిమాత్రులుకారు. గొప్ప నటులు. నాటక కర్తలు. నాటక ప్రయోక్తలు. జ్యోతిషశాస్త్ర పారంగతులు. మంచి వక్తలు, విమర్శక (శ్రేష్టులు. (శోతలను ఆనందడోలికలలో నుయ్యలలూపు వారి సుమధుర మంజుల గంభీర కంఠస్వరము వీణియమీటినట్లు విరాజిల్లు చుండెడిది.

“సరసకవి” రామకృష్ణయ్యగారి కృతులను స్థూలముగ నాలుగు విధాలుగా పేర్ళొనవచ్చును. 1) స్వతంత్ర కృతులు : మారుతీ శతకము, శారదా ్రసాదః సంస్కృత కావ్యము, అమృత కలశము, అమర గౌరవము, కథాకావ్యమణి మంజూష్క రమణానందలహరి మున్నగునవి. 2) అనువాదములు : కాళిదాసనాటక

క్ష

(త్రయానువాదము, కుమార సంభవ కావ్యమునకు “గిరిజా కల్యాణ”మను పేర కావించిన అత్యద్భుత వచనానువాదము, వేదాంతదేశికుని “హంస సందేశము”, జగన్నాథ పండితరాయల “గంగాలహరి", శంకరాచార్యకృత “ఆత్మబోధము” (రామకృష్ణయ్యగారు తమ గురువు సుబ్రహ్మణ్య శర్మగారికంకితమొసంగినది) ఉన్మత్త దీక్షితము; కర్పూర నీరాజనము - ఆనంద సాగరస్తవము (నీలకంఠ దీక్షితుని సంస్కృత కృతులు) “విద్యారత్న” ఆకిలి శ్రీరామశర్మగారితో కలిసి అనువదించారు. 3) స్వతంత్ర వచనకృతులు : త్యాగమహిమ, గురుదేవచరిత్రము, తెలుగు రచయిత్రులు మున్నగునవి. 4) స్వతంత్ర నాటకములు, నాటికలు, రూపకములు:- ప్రచండ భార్గవము, అనర్గళ భార్గవము, ఛత్రపతి శివాజి, (పేమ చిహ్నము, ధ్రువ రూపకము మొదలగునవి. వారి పుస్తకములు అనేక విశ్చవిద్యాలయములలో పాఠ్య పుస్తకాలుగాగూడ నిర్ణయింపబడినవి.

శ్రీ మోచెర్లవారి “అమృత కలశము” పద్యకావ్యము నెల్లూరు వేదసంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన కీ॥శే! బ్రహ్మశ్రీ ఉడాలి సుబ్బరామశాస్రిగారు సంస్కృతీకరించిరి. “శారదా ప్రసాద సంస్కృత కావ్యమును రిటైర్డ్‌ జిల్లా జడ్జి శ్రీ రావి నూతల శ్రీధరరావుగారు తెలుగు పద్యకృతిగా సంతరించిరి.

రామకృష్ణయ్యగారు శిష్యవత్సలులు. కులమత వర్దవివక్ష లేకుందా ఎందరెందరో కవికుమారుల సందేహములబావి నత్మవులుగ తీర్చిదిద్దిన మవహానీయులు. నెల్లూరువురమున అత్తితోట అ([గ్రవోరమునందలి వారి పవిత్రగృహము “కవితానికేతనము” సార్ధకనామముతో విరాజిల్లినది. వారి లై నిరంతరము, ఒక వైపు కవి పండితులతో, మరొక ప్రక్క కక్షిదారులత్‌ , బంధువర్గముతో కళకళలాడుచుందెడిది. అదియొక పుణ్యసత్రంవలె విరానలినం. వారి అర్ధాంగి శ్రీమతి వెంటసుబ్బమ్మగారు అన్నప్రూర్ణకుద్దియైనగేస్తురాంద్రమల్చం' .

మోచెర్లవారు ఆనందమయులు. వారి హృదయము ఆనందపయోరాళి. కనుకనే వారి కృతులన్నియు రమ్యాతిరమ్యములు. అమృత గులికలు. వారో వ కావ్యము విరచించినా, ఏ గ్రంథము చిత్రించినా, ఏ నాటకము కల్పన సిన గద్యకృతి సంతరించినా, మనోహరార్ధ కల్పనలతో, వస్తుపద శుచిత్వంత్‌ సుధామధుర భావములతో, ప్రసొాదగుణ భూయిస్టమై తేనెసోనలు జాలువారుస్తూ రసానందసాగరమున పరితృలనోలలాడించుచుండును. ఆర్బధర్శమన్న. వారికి ఎనలేని భక్తి. అది వారి కృతులన్నిటా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. నిలువెల్లా మాననీయ, మానవీయ గుణముల నిండుగా పండించుకున్న అమరమూర్త్‌

|!

రామకృష్ణయ్యగారు. ఆ స్ఫుర(ద్రూపులు, ఆ పుంభావసరస్వతి, ఆ నడయాడే బ్రాహ్మమయ మూర్తి మన హృదయాగారాలలో సుప్రతిస్టితులై ఆరాధనీయులుగా చిరంజీవులై ప్రభాసిస్తూనే ఉంటారు. వారి కవితా సాహిత్యమూర్తిమత్వము వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. ఆ మహితాత్ముని స్మృత్యంకముగ ఆయన శిష్యులు, అభిమానులు, బంధువులు “మోచెర్ల రామకృష్ణయ్య న్మారకనిధి (యం.ఆర్‌. మెమోరియల్‌ ట్రస్టు) సంస్థాపించి శ్రీ నెల్లూరు వర్ధమాన సమాజముతో కలిసి అనువత్సరము వారి జయంతి సభలు ఘనంగా నిర్వహిస్తూ కవిపండిత కళాకారుల సమ్మానములు జరుపుతూ భక్తి ప్రపత్తులను వ్యక్తీకరించుకుంటున్నది.

ఆ సుమనస్వికి, ఆ కళాతపస్వికి, ఆ మహా యశస్వికి, ఆ పుంభావ సరస్వతికి భక్ష్యంజలులు ఘటించడం ప్రతి సాహితీ సుగతుని కర్తవ్యం.

“సుకృతాత్ములు రససిద్ధులు

సుకవీంద్రులు విజయనిధులుసుమ్ము తదీయా

ధిక కీర్తి శరీరంబులు

ప్రకటజరామరణ జన్మ భయరహితంబులొ”

ఓం తత్సత్‌ స్మారకనిధి ప్రస్తుత సభ్యులు

మద్దాలి మల్లికార్జునరావు, దుగ్గిశెట్టి వెంకట రమణయ్య, అగస్త్యరెడద్ది వెంకురెడ్డి

మోచెర్ల వారి పుస్తకములన్నియు పునర్ముద్రణ కానింపవలసియున్నది. (ప్రస్తుతము “అమృతకలశమూ, “లక్ష్మీ కటాక్షము, వారి చివరి రచన అయిన అప్పయ్య దీక్షితుల వారి “ఉన్మత్త దీక్షితము” ఆంధ్ర పద్య కృతి ఒక సంపుటముగా వెలువరించి పాఠక మవహోాశయులకు అందింవ గలుగుచున్నందులకు ఆనందించుచున్నాము. అనతికాలములోనే ఈ సంపుటమును అనవద్యహృద్యంగా అచ్చొత్తి ఇచ్చిన నెల్లూరు, అన్నపూర్ణ ప్రింటర్స్‌ అధినేతలకు, వారిసిబ్బందికి కృతజ్ఞతలు.

  • మోబెర్ల రామకృష్ణయ్యు మెమోరియల్‌ ట్రస్ట్‌ శే

విజ్ఞప్తి మిత్రచింతామణి కీర్తిశేషుండు శ్రీ పులుగుండ్ల వేంకటకృష్ణయ్య (అధివక్త - నెల్లూరు) కు అంకితమై యీకావ్యము 1948లోంబ్రకటితమయ్యెను. అచిర కాలములో (గ్రంథము ప్రతులు లభింపని దశ తటస్థించెను. ప్రతులు కావలయునని యెందజో కోరుటయు, లేవని నేను బదులు చెప్పుటయు జరుగుటపరిపాటియైనది. ఇటీవల నాకూర్మి మిత్రుండును మద్దురువర్యుని పుత్రుండును స్థితప్రజ్ఞుండును స్వయము కవియు నగు శ్రీ దుర్భారామమూర్తి తన పుత్రిక సౌభాగ్యవతి యశోధరాదేవి పరిణయ సందర్భమున నవదంపతులకు ఆశీఃపురస్సరముగాం (బ్రకాశన మొనర్చుటకై నా'ప్రేమచిహ్నమును ముద్రించు నిమిత్తమిచ్చిన ధనముతో పాటు ఈనా 'అమృతకలశము'ను బునర్ముద్రణము సేయుటకు వలసిన విత్తము సైతమిచ్చి నా కృతజ్ఞతకుం బాత్రుండయ్యెను. ఈ కృతియం దభివర్ణితుండైన శ్రీ కృష్ణదేవుండు నామిత్రుండు శ్రీరామమూర్తికి సుచిరాయురారోగ్యభాగ్యముల ననుగ్రహించును గాక! కవితా నికేతనము” మోచెర్ల రామకృష్ణకవి అత్తితోట అగ్రహారము నెల్లూరు. 12-8-1970 క్షే

అంకితము ఎవరేమన్న నింకేమి ? నీ చెలిమి నా కీనాంటికిం గాటమై నవళోభల్‌ వెదచల్ల, నామనసునకా దైవాటి నీవంకకుకా బ్రవహించెక్‌ బ్రణయస్రవంతి మధురక్వాజప్రవీణోర్మికా నివహశ్రీనినదంబుతోం గలసిపో నీయాత్మలో నెచ్చెలీ. మోడువాజిన హృదయముల్‌ గూడ నీదు స్నేహవాసంతరక్తికిం జివురువెట్టె; సౌమనస్యంబు గలవారి (ప్రేమవల్లి కామతల్లులు పుప్పించు టేమి యరిది ? కలిమి౯ గన్గానిగాదు, పల్ముబడి యాకర్షించుటం గాదు, కే వల యుష్మత్త్రతిభాప్రకర్షమునకుకా వశ్యుండనైకాదు, ని శ్చల నిర్వ్యాజభవత్పరోపకృతి దీక్షాసిద్ధికిక- మెచ్చి, నె చ్చెలి, నీ కీకృతి నంకితం బొసంగ సంసిద్ధుండనైతిక- జుమీ ! తలలో నాలుకవై మెలంగెదవు మిత్రశ్రేణికికా, దీనబం ధుల కార్యంబులు చకృ్కబెట్టెదవు సంతుపష్టిక్‌ స్వకార్యంబుల ట్టులు-సామర్ధ్య మనుద్ధతత్వమును రెండుం గూడె నీయందుం, బి న్ను పెద్దల్‌నిను మెచ్చుటబ్బురమె కృష్ణయ్యా, యుదారాశయా! మన యీమైత్రికి శాశ్వతాంకముగ శ్రీమన్నందగోపాలదే వుని కల్యాణకధాసుధాకలశముక్‌ా బొంగారు సంప్రీతి పెం పున నీ కిచ్చితి, నాముకుందుండు యశంబుక్‌ బుత్రపౌత్రాభివృ దిని దీర్చాయురనామయంబు లనురక్తిక్‌ నీకుం జేకూర్చుతన్‌ ! ! 2

అమృతకలశము (ప్రస్తావన) శ్రీగోవింద పదారవిందములు స్వశ్షేయస్సదామోదిత ప్రాగల్బ్యంబు లభంగురాభ్యుదయముల్‌ వందారు సంక్రందనా భోగాంచన్మకుటేంద్ర నీలమధుపంబుల్‌ రంగదాకాశగం గాగుంజన్మ కరందబిందువులు మత్మాన్యస్థముల్‌ గావుతన్‌ ! క్షే మోహధ్వాంతనికృంతనంబులు దయాంభోరాశి సంభూతముల్‌ స్నేహాలోకన సుప్రసాదనసుధానిష్యందముల్‌ సాధుసం దోహస్వాంత కుముద్వతీప్రమదముల్‌ దుగ్గాబ్ధిజాలోచనో త్సాహంబుల్‌ హరి నవ్వువెన్నెలలు నిచ్చల్‌ నన్ను రక్షించుతన్‌. లై చతురాస్యు౯ గికురించి, యొక్మతుటిలో సర్వేశ్వరుక్‌ గామవం చితు6 గావించిన విష్ణుమాయకు జగజ్జీవేశ్వరుల్‌ భిన్నసం గతులో కారొ రహస్యమేమొ, యెజుంగంగారానిభంగిక (బ్రపం చితమై యొప్పు నిగూఢధతత్త్వమునకుకా జేమోడు గావించెదన్‌. తి రంతుల్‌ వింతల నీనంగాం బ్రణయసౌరభఖ్యంబు లేపారంగాం గాంతల్‌ పిన్నలు పెద్దలుక మురిసి ముగ్ధత్వంబునక- ముస్లి వి భ్రాంతి౯ా దేలిరెవాని లీలలకుం దద్వాత్సల్యవారాన్నిధిక జింతింతుకా బరమార్ధసాధనమతిక శ్రీకృష్ణదివ్యాకృతిన్‌. శ లలిత స్వైరవిహారినికా హరిని లీలామర్హ్యునికా- గృష్టునిక్‌ దలంపకొా జారుతరంగిణీ కలకలధ్వానంబు చంచద్వన స్థలభూరిద్రుమపర్ణమర్శ్మర మనోజ్ఞస్వానముక్‌ గోకులం బుల యంభానినదంబు నాశ్రుతిపథంబుం బొందు నెల్లప్పుడున్‌. ర్‌ రాధామాధవుండంచుం బిల్తురు, సమారాధింతురేమూర్తి ద దాథార్జైకరహస్యముక్‌ గనిన భక్తడ్రేణికిక్‌ మొక్కి నే సాధింపంగల సార మావిభుండు విశ్వప్రేమసూత్రంబు సృ ష్ట్యాధారంబగు బ్రహ్మతత్త్వమని, యన్యంబందు లేదెద్దియున్‌. 6 తె

మధురాలాపము లాడుచుకా బ్రణయసంపన్మూర్తియై సౌమ్యశే

వధియై, యాడుచుంబాడుచుకా బశువులకా బాలించుచుకా బాంధవ

వ్యథలకా దీర్చుచు, మిత్ర కార్యముల నిర్వర్తించు కారుణ్యవా

ర్నిధిగాకెవ్వండు లోంగాను౯ మనుజనికా నిత్యార్తినిర్మగ్నునిన్‌. 7

కృష్ణ (బ్రహ్మరసాయనంబు భవరుబ్నిర్మూలకంబౌట, నా

తృష్టాతాపము దానం దీజునని, భక్తి స్ఫూర్తిమచ్చిత్తవ

ర్ధిష్ణుత్వంబునం గూర్చితి౯- గృతిని - దద్దివ్యామృతాస్వాదరో

చిష్టుల్‌ గాంచు ఫలంబు పైనిడితి దృష్టి౯ా- భాగ్యమెట్లున్నదో 8

కృతులక్‌- గూర్చి యశశ్శరీరులయి యుర్వికా నిల్చియున్నట్రి స

త్కృృతులక గృష్టకథావినోదుల, జగద్దేయప్రభాభారతీ

పతులక్‌ శ్రీజయదేవమాఘముఖదీవ్యత్యావ్యనిర్మాతలకా

స్తుతియింతుకా దలదాల్తుం దత్ప్చదరజస్సుకా మంగళావాప్తికై. 8

తిరమై నిల్చెడుంగాత నాహృదయ మార్తిం గిర్తి నేకాకృతి౯

పరవిద్యాహృదయోపలబ్ధి, గురుసేవాసిద్ధి, వాగ్దేవతా

వరివస్యాంకితబుద్ధి, కృష్ణుక్సప నిర్వ్యాజంబులై నాకుం జే

కుజెడుంగావుతమర్ధవంతములు వాక్కుల్‌ వశ్యముల్‌ గావుతన్‌. 10 త్తే

శ్రీరస్తు అమృతకలశము క్ష నావాగ్రంగమునెక్కి యొక్క క్షణమైనక నిల్చి, లావణ్యలీ లావిర్భూతగతికా నటించి, యొక బ్రవ్మానందగీతంబు కృ ష్టా, వాయింపంగదోయి నీమురళిపై, నావాతెరకా దాంటి, నీ యావద్భారతవేష మచ్చుపడ రావయ్యా, దయాసాగరా. [

  • బృందక్‌ శారదసాంద్రచంద్రికలు పేర్మికా లాస్యముల్‌ సల్పం, గౌ ళిందీ సుందరిమేన వీచి పులకల్‌ రేకెత్తంగా, గోపికా సందోహంపుటెడందలకా వలపు మూర్భక్‌ ముంచె నేయవ్యయా నందాపాదక వేణుగాన మది కృష్ణా, నాకు విన్పింపుమా. 2 అరుదుగ విగళితవేద్యాం తరముగం జెవులొగ్గి గోపతరుణులు గోపా లురు విననోచిన యాలా హిరి నాదము లీను వేణు వెట మొలిచె హరీ ! తి ప్రణవనాదపరానంద రాశియందు గోపికలం దేలిచిన పిల్లగ్రోవి పాట మజచిపోరాని చందాన మామకీన హృదయఫలకాన కృష్ణ, ముద్రింపుమయ్య,. 4 మోవి మురళి మోయ, మూపు చిక్కము మోయ, చుంచుకురుల నెమిలిపించె మలర, నవ్వ మోముతోడ నా చిత్తముకు రాన నొదిగి ప్రతిఫలింపు మోయి కృష్ణు ర్‌ బలభిత్మార్ముక వేష్టిత జలధరముకా గెలిచె నీదు సౌందర్యము, సం కలిత మయూరశిఖండక వలయిత కుంతలకలాపవైభవము హరీ. 6 క్‌

అమృత కలశము శత్రాయమ్ముల్‌ తినుబండముల్‌ దినక మాతా, మన్నుందిన్నానటే, ఆయీ కల్లరిగాండ్ర మాట విననేలా, చూడవే, యంచునీ వాయిక్‌ జూపితివా, చరాచరపటుబ్రహ్మాండభాండోజ్జ్వుల న్మాయామంజులము౯ విచిత్రపు సినీమాచిత్రముకా మాధవా. “1 ,విసపుం జనుబాలు చాలం ద్రావినది నీవు, తత్‌ క్షణం బీలిగినది పూతన యదేమొ ! అస్మదాదుల యూహల కందరాని చిత్రలీలలు కృష్ణ, నీ చేష్ట లెల్ల. వ! బెరా, యెంతటి యైంద్రజాలికుండవయ్యా, పూవుంబోండ్లెందటు న్నారో యందజు కృష్ణులున్న మయిదు౯ా గల్పించి, శృంగారభం గీరంగన్ననరాసమండలమునకా గ్రీడించి రంజించి నా వా, రాజీవదళాక్షులం దవిలి కృష్ణా, బాలగోపాలకా ! రి వై వెలందుల నవనీతహృదయములను (ముచ్చిలించుటలో మెజమెచ్చుగలదె ? దుడుకుపోంకల నుటుకు నా దురుసు మనసు తస్మరింపంగ రమ్ము చూతము ముకుంద. 10 నాండు గోపాంగనల్‌ తాన మాడునపుడు పొంచి తచ్చేలములు దాంగిలించినట్లు | నన్ను గ్రమ్మిన యావరణమ్ము లూడ్చి యేలు కొనుమోయి బాలగోపాలకృష్ణ. క్ష అక్కజముగ నగ్నలై నీకు మొక్కిన యల్ల గొల్ల చేడియలకువలెనె, నాకు నందనందనా, శరీరాఖిమా నంబు నాశనం బొనర్ప్చుమయ్య, శబ 6

అమృత కలశము దివికికా గోత్రము నాతపత్రముగ బ్రాతికా వ్రేలితోనెత్తి యు (గ్రవిపత్తి౯ మరలించినందుల కుపగ్రాహ్యంబుగా, మందలో నువిదల్‌ ముద్దలు జేసి నీకిడిన యన్యూనంపు దధ్యన్నపుం జవి చూపింపుము నాకొకింతయినం గృష్టా, వల్లవీ పల్లవా. 18 తన మాణిక్యఫణాతలమ్మున భవత్కల్యాణపాదాంకముల్‌ దనరకా దాండవమాడి చంప కసువుల్‌ దానంబుగావించి నా వని, యాకాళియభోగి నీగళమునం దవ్యాహతాసక్తిం గూ ర్చిన నీలోత్చలమాలతావులు మురారీ, నాకు మూచూపవే ! గాడ లీలామానుషమూర్తియైన వనమాలిక౯ా నిన్ను గుర్తింపందే మాలాకారుండు నాండు, నీకు సుమదామంబుల్‌ సమర్చించి త న్మూలానక్‌ దరింజేరండే, యటులె నేనుకా నికా సమర్చింతు గో పాలా, యీనవపద్యమాలంగొని నీభక్తి౯ బ్రసాదింపవే ! 15 అదరి చిదంబరాంతర నిరంతరమైన ఘనాఘనంబవై జడి గురిపించినాండవు ప్రసాదసుధక్‌, బదికోట్లపాతరల్‌ వడినవి నందఘోషమునం బండిన మేలిమి భక్తిధాన్యముల్‌, పిడికెడు నా కిడకా దగదె బిచ్చము గోపవధూమనోహరా. 1 తాళని తల్లిదండ్రులకు. దావక మాతులకాలసర్పకా కోలవిమోహితాత్ములకు6 గొంకని జాంగలికుండవైన గో పాలక బాలకా, విషయపన్నగ దుర్విషబాధం దీర్చి న న్నేలవదేల ? జాలము సహింపంగంజాల నిమేష మేనియున్‌. 17 కంసు మణుగుజ్జుదాసి చక్కందనాల (క్రుఖ్బ్ర రాశి యయ్యెను నీ యనుగ్రహము కలిమి దేవ, వక్రోక్తిమయ మస్మదీయ కావ్య మమృతకలశమ్ము గాదె నీయాదరమున ! 18 ల అసత అరే ఇస్టం 7

అమృత కలశము |] పరులదరి కరిగి వెలుతురు తిరిపెమునకు వేవెలుంగు దిగినట్లు జగ ద్గురుండవు గురుకులవాసము నెజపితివి హరీ, యెలుంగనివి నేర్చితివే ? క్షే మించి జలదుర్గములు ప్రవేశించువిద్య ప్రాంతచదువుల కథలోని రీతిగాని కొత్తగా నేర్చినది గాదు - గురువరుండు నీకు నూతనకళ లేమినేర్పెం గృష్ట ! ౭ అభీరీకుముదాక్షి కౌముదికలేనా నీకళల్‌ ! రుక్మిణీ శోభాద్వీపవతికా దళన్నళిన విస్ఫూర్దన్ముఖి౯ గుండిన కాభృన్నౌళిసుతామళల్లిని సమాకర్షించు విద్యుల్లతా సౌభాగ్యోజ్జ్వల వీచికల్‌ గద మవాసౌందర్యరత్నాకరా ! తి ఒకరుక్మిణియేనా, తా వకలీలాసరసి సత్యభామాదిక హం సిక లెన్నో విహరించెనుముకుంద, నీసొబగు భువనమోహనము గదా ! ఎంత చెలువున్న నైశ్వర్య మెంతయున్న నంతయును నీదుభక్తుల యాస్తి సుమ్ము, కృష్ణు నీపాదధూళి సోంకిన తలమ్ము విష్ణులోకమ్ము - నీవాక్కు వేదబుక్కు ర్‌ /పీన్ననాంటి చెలిమి మన్నించి, పేదల యటుకు లారగించి, యాదరించి తజుగరాని సిరులం గురియించు కలవార లెవ్వరయ్య కృష్ణ యీవుగాక. 6 త్‌

అన్బుత కలశము

తావక ద్వారకాపురాస్థానియందు

కాపురంబైన యైశ్వర్యదీపకళిక

విధి విరామంబు లెజుంగక వెలింగెంగాని

యరయంగాలేదు స్నేహక్షయంబు కృష్ణ. 7

భూతలమ్మపారిజాతంబుగాం జేయం

బూనినట్టి వీరపూరుషుండవు,

స్వర్గమే యపారిజాతంబుగాం జేయ

న్యాయమా వచింపునూ యుపేంద్ర ! 8 అభీల కంసాసు వాలాహలము పాన మొనరించినట్టి మృత్యుంజయుండవు, ఆయతనరకాసురారణ్యము దహించి భస్మీకరించినపావకుండవు, బంధించి వటుజరాసంధవిశాచమ్ము మాయమ్ము సేనిన మాంత్రికుడవు, జల్పాకశిశుపాల సంగ్రామనౌకావినాశక “టార్సెడో” నావికుండవు.

కుటిలదంతవ!క్ర కుంభికుంభస్థలీ

విదళనక్రియాప్రవీణ వారివి -

హరివి గాక నరుండవా ? కాదు కాదు - శ్రీ

కృష్ణ, నీవు నరహరివి గదయ్య. 9

నీ కరుణ లేక నరునకు

జేకులునే పూరుషార్ధసిద్ధి, సుభద్రా

లోకానందము ? విజయుండు

గాకుందునె నరుండు తావకప్రియుందైనక్‌ ? 10

కౌరవద్రోహకల్లోల కలుషధునికి

నీవు నడగొండవై యడ్దు నిల్వకున్న

ఉక్కడంగి పొండవద్వీపమొక్కతూరి

యూడిపడి కొట్టుకొని పోవకున్నె కృష్ణ ! క్షే

9

అమృత కలశము భర్తలమోలం గౌరవసభక౯ా బరిభావితయైన కృష్ణ శో కార్తరవంబు వింటివంటె, ద్వారకనుండిన కృష్ణ 'రేడియో” వార్తల నాలకింపంగలవారికి మాకిది వింతయే ? జగ దృర్తవు నీ వాకానొక విపన్నను గాచుటయుకొ విచిత్రమే ! 12 వినియున్నారము నిన్నుంబోలిన యశస్విక నమ్ముకొన్నట్టి పా వని వృత్తమ్ము - తదీయవాలమె రిపుప్రారంభరీధాప్రక ల్పనమై యక్షయవృద్ధింగాంచెనంట-దేవా, నీపయిన్‌ భారముం చిన యీపావనికికా లభింపవంటె యక్షీణాంశుకవ్రాతముల్‌ ? 18 విళ్లికా బాండవపర్ణశాలకు నకాలాతిథ్య కాంక్షాబల వ్యాలోలుండయి, ఛాత్రయుక్తుండయి దుర్వాసుండు విచ్చేయం, బాం చాలీపాకగళంతికాకలితభిస్సా లేశముకా నీవు కృ ష్టా, లీలకా జవిచూడంగా మునిబుభుక్షాబాధ శాంతింపదే ! కేశ్త ఆకొలందిమంది మౌనుల యాకలిదీలుట విశేషమా ? బ్రహ్మాండా నీకము లుదరమునకా గల నీకతమునం దనివి గనవె నిఖిలజగంబుల్‌ ! 15 వాకిటి కాపరియై క న్నాకై హరుండున్న, వేయిహస్తము లున్నకా నీకృప దప్పిన వానికి శ్రీకృష్ణా, శుభము తారసిల్లదు ధరణిన్‌. 16 అమలరత్నసాను సముద(గ్రుందవు గాని స్వామి, నీవు ప్రకృతి కోమలుండవు - గాకయున్న దూతగానేల ? యా రాయ బారమేల వారివీరి నడుమ ? క్షే? మరకతన్తంభశుంభన్మనోహరవి(గ్రహంబునంబీతాంబరంబు వణఖయ, జ్యోతిర్మరీచికాస్తోమమ్ము వెదచిమ్ము కడగన్నులను నవ్వు గడలుకొనంగ, స్పాయత్సవా(ార వీయూష వీచికాచ్చాయంగల్కితురాయిసౌరుంజిల్క, కర్ణకుండలయుగోదీర్దరత్నచ్చవుల్‌ గండస్థలంబులం దాండవింప 10

అమృత కలశము హస్తినాపుర పౌర కాంతాభిరామ సుమసమంచిత లాజవర్షముల6 దడిసి పాండవుల రాయబారివై వచ్చునాంటి యబ్బురపు దృశ్యమునకు జోహారులయ్య ! 18 సభలో సంధికి నిల్చి, సూక్తి సుమనస్పౌరభ్యము౯ నింపి, నీ వుభయక్షేమములెంచి, యచ్చటి సదస్యుల్‌ మెచ్చ, నత్యద్భుత ప్రభుతకా దూత్యము నిర్వహించితివి, దేవా, కాని దుర్యోధన ప్రభృతుల్‌ త్రావక పాజంబోసిరి భవద్వాక్యామృతం బక్కటా ! 19 తాప మాత్సర్య సన్నిపాత ప్రకోప వివశులై ధార్త రాష్టులు తవిలి తావ కీయ దివ్యోపదేశరసాయనమ్ము నేలపొల్పేసిరన వింతయేల కృష్ణ ! 20 పడంతిచే తోటికిం గట్టువడిన గొల్ల బుడతవని వారు నిను గట్టం బోయిరేమొ, యవల వినలేదే నీవు దోంగాడి పోయి యమడమద్దులు గూల్చిన యాగడంబు. ల పెక్కురకుం జిక్కి పోవండె యొక్కండని నిన్నుంగట్ట నూహించిరి నీ వొక్కండవే ? మ్రుక్కడులకు దక్కుదువనుకొనుట వెట్టితలంపులు గావే ! 22 నే నొక్కందనె, రమ్ము నన్నిపుడు బంధింపంగ రావోయిరా జా, నీ లావును జూతునంచు దరహాసంబుక౯్‌ వహింపంగం, గృ మ్టా, నీఫాలమునక విధాతలు జగచ్చక్షుల్‌ (త్రినేత్రుల్‌ బృహ ద్భానుల్‌ పుట్టరె? యిట్టి యొంటరిని నిర్బంధింతురా కారవుల్‌ ! 293 అంభోజనయన, సమ్మద సంభూతికి హేతువయ్యె సాధులకు, భవ ద్దంభీర విశ్వరూప వి జృంభణ నాటకము పుట్టు చీంకులకైనన్‌ లగ తరత అసిత ఆక్టిం ల్టీం క్ష

అమృతకలశము క్‌ ఆ్రితులకు హితము నర్ధించి ఘనులెట్టి యగడు పనులకైన దిగుట నిజము - కాకయున్న నీవు కవ్వడి యరదమ్ముం దోల నూల్మొనంగనేల కృష్ణ ! క్షే తలలు వంచి, యంగమొలవేల్పు సారథి యయ్యెనాండు బ్రహ్మయంతవాండు - సరవి నీవు పార్ధసారథివగుటేమి యరిది, శౌరి, కాలసరణి గాక ! జి ఆ దుర్యోధనుం డెంత మూఢమతి యౌరా, వచ్చి, యాతండు నీ పాదాబ్దంబుల నా(శ్రయింపక శిరఃపార్యంబునం దుండ నే లా, దౌర్భాగ్యము నెత్తి కెక్కిగద, “అయ్యా, కోరితికా నిన్నునా మీందక్‌నీదయంజూపుమీయనినస్వామీ, యెట్టులైయుండునో 1 తి గ్రుడ్డి నరపాొలు జ్యేష్ట పుత్రునికి వాని కెంత మాత్రపు సువివేకదృష్టి గలదొ, యెజుంగుదువుగద, యతనికే యిచ్చియుండ రాదె తొలింగోరుకొనుపాడి యాదవేంద్ర ! లీ ఏ వేళకెట్టి యోచన గావించునొ రాజరాజు, కదనంబున గాం డీవికి నీ సాహాయ్య మ భావంబగు ననుచు యుక్తిం బన్నితివె హరీ ! ర్‌ మున్నే వెన్నుని విజయుం డెన్నుకొనె౯ - మిగిలియున్న దేమున్నది ? ద ద్దన్న సుమీ దుర్యోధనుం డన్నట్టి యక్షీర్తిగాక యన్యముగలదే ? 6 కేల

అమృత కలశము

గరుడధ్వజునికి గతుల౯్‌

బరంగక్‌ సద్దతులం బక్షపాతము లేదే ?

మణి సంశయింపనేటికి ?

హరి పాండవపక్ష పాతియగు టబ్బురమే ! 7 విజయమనోరథంబు నడపించు నియంతవు - గావునకా జతు ర్భృుజమహిమకొ, దురంగములం బూనిన వాగెలలాగునకా రిపు (వ్రజముల ధైర్యమీడ్చుచు నవార్యగతిక్‌ మునికోల టత్రిప్పుచుకా విజయుని “నందిఘోషము” ననికా నడిపించితి వీవు మాధవా ! 8 అనిమొనంజేంరెదేరు, కకుబంతచయం బగలించె శంఖని స్వనములు, సింహనాదములు సల్పిరి యోధులు, మార్గణంబుల౯్‌ ధనువుల నెక్కువెట్టు తరుణం బది - యే మొనరించెనప్పు నీ యనుంగుమజంది-నాండు త్రిపురాంతకు గెల్బినవాండుగా హరీ ! 9

చూడంగాలేదె యాతని జాడనీవు ?

వడంకు జనియించె, గగ్గురుపాటుగలిగె,

గాండివముగూడ హస్తంబునుండి జాటె;

మంచి మొనగాండు నీబావమటజంది కృష్ణ! 10

వలదంట రాజ్యము వానికి

వలదంట సౌఖ్యములు భోగభాగ్యంబులు; బం

ధుల గురువుల మిత్రుల దా

యలం జంపంగం జేతులాడవట యాతనికిన్‌. ॥|

అరయంగ నరునకు దురితము

దొరకొనునట యాతతాయి దుర్యోధనుని౯

బరిమార్చిన, నెవ్వరు నే

ర్పిరి తనకీలాటి మెట్టవేదాంతంబుల్‌ ? 12

13

అమృత కలశము ఇట్టి క్షుద్రమైన హృదయదౌర్చల్యంబు వచ్చెం బార్జువంటి బల్లిదునకు6 గాలమహిమ, మమ్ముంబోలు పృథగ్ద్గనుల్‌ పడెడుపాట్లు చెప్పవలెనె కృష్ణ 1 13 వెతంగొని చేతివిల్లు విడిపించిన యాతనికికా, రథమ్మునకా జతికిలంబడ్డ వీరునికి సారథివైతివి, వైరివాపొనీ పతు లిటువంటి మంచి రసవంతపు ఘట్టముం జూడమంచు నీ వితమునుజూచి, నీ రథికు బీరము నారసి నవ్వరే హరీ ! 14 ఇతరుల్‌ నవ్విరొ లేదొ, యేటికది? నీవే నాంటి వివ్వచ్చు ప ద్ధతికి౯ నవ్వి, తదీయసంశయపరీతస్వాంతము౯ దత్త్వని శ్చితముం జేయ, జగద్ధితం బుపనిషత్సిద్ధాంతముకా నూజిపో సితివో లేదొ, వచింపుమో నిగమరాశీ, భక్తకల్చద్రుమా ! 15 సౌరభేయి యుపనిషత్తు, వత్సము శ్రీడి, ధూర్తగోపబాల, దోగ్డవీవు, గీచి పితికినావు గీతామృతము సుధీ వరుల నోటంబోయు కొజకటయ్య ! 16 నరునకు నీ యమోఘవచనమ్మునం గల్గదె నమ్మకమ్ము ? నీ సురుచిర విశ్వరూపమును జూపినంగాని మథింతగట్టిలైై తిరమయి నిల్వదంచు గుణుతించినహేతువొ, వాని పుణ్యపుం బరిణతియో, యెటైన నటువంటి యదృష్టము గల్గె వానికిన్‌, 17 ఆ నీయద్భుతవిశ్వరూపమహిమం బా యాదిశేషుండొ, పో సీ నల్మోములవేల్పొ యోపు నభివర్ణింపక విమర్శింపం గృ మ్టా నేనెంతటివాండ, దావకకటాక్షంబున్నం జిక్రోడసే వా నిర్వ్యూఢమతి౯ బ్రయత్న మొనరింపన్నేర్తుం గీర్తింపంగన్‌. 18 కడ

అమృత కలశము దేవా, కోట్లకొలంది యాననములు£౯ దృష్టుల్‌ పిచండంబు, లె న్నోవక్షంబులు బాహువుల్‌గలిగి, యత్యుగ్రంబుగాం దోంచెనీ యావిశ్వాకృతి, దాని కాదియును మధ్యం బంతము౯ లేదు-వా గ్భావాతీతము దుర్నిరీక్ష్యమది, నిత్యం బఐవ్యయం బీశ్వరా. 19 ఒకండా,యెందతొ, వారు వీరని యెవం డూహింపంగానేర్చు? ను (గ్రకరుల్‌ రుద్రులు వాయువుల్‌ వసువు లేకా దశ్వినీదేవతల్‌ సకలస్థావరజంగమంబులును యుష్మద్దేహమందుండె : నే రికి సాధ్యంబగు6 జర్మచక్షువుల కాదృశ్యంబు దర్శింపంగన్‌ భి లిం ఎటం గన్నకా దలపైం గిరీటమును జేయిక్‌ జక్ర మింకొక్కచేం బటు కౌమోదకియుకా ధరించి, యనలప్రద్యోతనోద్యత్రభా పటలమ్ము౯ వెదచిమ్ము నీదయిన రూపం బప్రమేయమ్ముం బ్రా కటముం జేసితి వాకిరీటికి, భవత్మారుణ్యమేపాటిదో ! ల! పరమోత్కృష్టుండ వక్షరుండవు పరబ్రహ్మంబవుక్‌ విశ్వసం భరణాఢ్యుండవు ధర్మరక్షకుండ వవ్యక్తుండ విచ్చో భయం కరసందీప్త హుతాశవక్రుండవుగాం గన్పట్టుటేమీ హరీ, యరయక విశ్వమునెల్లంగాల్చి నుసి చేయక్‌ బుద్ధి నూహించితే ! ల శరణంచుకా, గరుణింపుమంచు వసువుల్‌ సంతుష్పులై నిన్ను బొం దిరి-బ్బందారకులందుం గొందటజు నినుక్‌ కీర్రించుచుకా భీతులై కరముల్‌ మోద్చిరి నీకడక్‌-బుషివరుల్‌ గైవారముల్‌ సల్పుచుం డిరి-సిద్ధుల్‌ జయశబ్దముల్‌ సలిపి రంతేవాసులై యీశ్వరా. ల బహువక్రుక బహునేత్రుని౯ మజి మహాబాహుకా బహూరు౯ా నినున్‌ మహనీయుక్‌ బహాుకుక్షిని౯ బహుపదు౯్‌ దంష్ట్రా కరాళున్‌ మహా మహు బీభత్సుండు చూచి బెగ్గడిలి కంపం బొందె, నిందేమి ఏం త హరీ, లోకములెల్లం దల్లడిలె నన్నక్‌ నిన్విలోకించుటన్‌. రశ

5

అమృత కలశము

(ప్రళయాగ్నుల్‌వెలింగ్రక్కు నీబహుళదంష్టాక్రూరవాగ్గహ్వరం బులలోంజొచ్చిరివచ్చిద్రోణుండునుభీష్ముండుకా గృపుండుక్‌-దురా త్ములు దుష్కీర్తులు ధార్తరాష్ట్ర లవినీతుల్‌ గర్జశల్యుల్‌ మహా బలవేగమ్మున నెందజెందజొ జగత్ర్రఖ్యాతవీరాగ్రణుల్‌. లెగ్‌ నీ దంమ్ర్రాంతరమందుం జూర్ణమయి డిందెక్‌ గొన్ని శీర్షంబు, లె న్నో దేహంబులు చొచ్చె నీయుదరముకా గూలంకషాజాలముల్‌ యాదోనాథుని జొచ్చు చందమున, నీయాస్యాగ్నిలోంబ్రాణులె న్న్తీ దగ్ధంబయిపోయెం బక్షులక్రియక్‌ దుర్గోక్యమై యీశ్వరా ! 26 ఇట్టి నినుం జూచుటకు దివ్యదృష్టి బలము గలిగి యుండియు. బార్జుండు నిలువలేక, గదగదవడంకి గద్దదకంఠళుందగుచు నేమి వచియించునో తానె యెజటుంగండయ్యె, 27 “ఈరూపమ్మును జూదంజాలను హృషీకేశా, యివేనానమ స్మారమ్ముల్‌ శతముల్‌ సహ[్రములు, నీ సర్వేశ్వరత్వమ్ముంగ న్నారక్‌ గాంచితి నేండు, బావయని హాస్యంబాడి యేవో తిర స్మారప్రాయపుంగార్యముల్‌ సలిపితికా క్షంతవ్యుండక మూఢుందన్‌, వ్ర యాదవుండవని, చుట్టంబవని, సఖుండ వని భ్రమించిన కతమున నాచరించి నట్టి చేంతలు, పలికినయట్టి పల్కు లెల్ల మన్నింపుమయ్య, నన్నేలుమయ్య ఏం అపురూపపు రూపం బిది యుపసంవారం బొనర్భుమో యీశ్వర, పూ ర్వపు సౌమ్యాకృతిం దాల్చుము కృపసేయుము చూడనోప నీ రూపమ్మున్‌.” 20 సుప్రసన్నుండవైతి వీ స్తోత్రములకు, నప్రమేయప్రకారంబు నవలంద్రోసి మునుపటి తెజంగుంగొని చతుర్భుజుండవైతి, వెపుడు జవదాంటితివి నీవు హితులమాట |! ౩1

తిల లస్టీల అస్టీల అఫ్టీల

16

అమృతకలశము గ భక్తజనముల యాపదల్‌ వాపుకొటకు మాట తప్పుట యొక పరిపాటి యయ్యె నౌర, నీవంటి యవతారపూరుషులకు : సత్యమునకన్న మిన్నయే సాధురక్ష ? క్షే “అర్జునుని తేరి సారథి నౌాదుంగాని యాయుధము కేల ధరియింప” నన్నమాట మజిచితివొ, '“యిష్పుడా నాంటిమాట ననుస రించుటే'మని దూరీకరించి నావా ! లై కాలాబాధ్యుండ వీవు, విస్మృతియటే ! గాండీవిపై నీ దయా శాలిత్వమ్మె కతమ్ముగాదటె, (ప్రతిజ్ఞ౯ రిత్తగావించి యు ద్వేలంపుం గతితో సుదర్శనముతో వి(స్రస్తపీతాంబర శ్రీలాలిత్యముతో నదీసుతునిపై జంభించు నుద్వత్తికిన్‌ ! 3 నినుం దానమ్మినవాని మాటపరువుకా నిల్బ్పంగదా, యున్నదా నిని లేనట్లుగ, లేని దున్నపగిదిక్‌ జిత్రించినా, వస్తమిం పని ప్రద్యోతనుం డస్తమించినటు దృజ్మాంద్యంబుం గల్పించి, పా ర్ధునిచే 'సైంధవు నుత్తమాంగము ననికా ద్రుంపించినా వీశ్వరా ! త్తే అటు గావింపనిచో, జయద్రథుని సంహారంబు సాధింప దు ర్హటమై యుండదె ? క్రీడి గాండివముతోం బ్రాయోపవేశంబు చే యుట కొకుండునె ? నీకృపాకలన లేకున్న౯ా నరుండేంచి త త్కుటిలారాతిని గూల్చ్బనోపినను మృత్యుగ్రస్తుందై యుండండే ! ర్‌ శ్రీకృష్ణా, భవదీయ దివ్యమతి సాచివ్యంబునక్‌ గాక, యే జోక౯ా బార్జుం డెజుంగు సైంధవు శిరస్సుకా బంతి చందంబునక్‌ బైకిక్‌ా జిమ్ముచుం బోయి, తల్చితృకరాబ్దస్థంబుం జేయ౯ వలె౯ా లేకున్నకా దననెత్తి (వ్రయ్యలగుటే నిక్కం బటంచుకా హరీ ! 6 కే

అమృత కలశము "అంబుధి గర్భమందు బడబాగ్ని విధంబున నీమహత్త్వవా ర్థింబడి ద్రోణకర్జుల యరిందమవిస్ఫురదస్తవహ్ని లీ నంబయి యుండెనేమొ, కదనంపుతుదికా నరుతే రదేల య శ్వంబులతోడ వ్రేల్మిడిని భస్మము కాంబడె, నట్టు కానిచోన్‌ ? శౌ గురుకుమారాస్త్ర పావకక్రూరశిఖల నుడికి పోకుండ నుత్తరకడుపుం గాచి పాండువంశక్షయంబు కాకుండునట్లు చేయ నెవరోపుదురు ? నీకె చెల్లెం గృష్ట ! 8 గోవిందా, యెటు సాధ్యమయ్యె నది, యంగుష్ట ప్రమాణంబుగా నీవిశ్వాక్ళతి సంగ్రహించు పని ? యందే శంఖముక౯ా జక్ర మం దే విస్సారకిరీటకంకణము లందే కౌస్తుభంబుకా గదకా శ్రీవత్సంబు నిముడ్చుకొంటివి పరీక్ష్మిత్చాణసంరక్షకై. రి చిన్మయ గాంగేయ హృన్మయూరమునకుం గమనీయ నీలమేఘంబ వీవు, విజ్ఞాన నిర్ద్హారి విదురస్ఫుటస్వాంత పుందరీకమున కర్ముండ వీవు, అక్రూరమేథాసదానందవల్లికి నలువారు ప్రమదావనంబ వీవు, ఉద్ధవ భక్తి సంశుద్ధిమచ్చేతనా ఘనవిపంచికి జీవ గజ్జ వీవు. భక్తి వర్షించి, జ్ఞానాతపమ్ము నెజపి, ముక్తి కల్యాణ పరిమళమ్ములను జిమ్మి యమృతనిక్వాణగీతిక లాలపించి నావు, చిత్రాకృతివి, వాసుదేవ, నీవు. 10 ఓం తత్సత్‌. ఆర్టీ లేం యిం ల్టం 18

లక్ష్మీకటాక్షము

కాని

శారదా ప్రసాదము సేకరించుకొన్నవారు లక్ష్మీకటాక్షమునకై యత్నించుట నహజవమేకదా ! అట్టి యత్నమునందున్న నేను 26-12-65 తేదిన సూళ్ళూరుపేటకు వెళ్లి మా యల్లుండు చిరంజీవి మద్దాళి రామచంద్ర రావును వెంటంబెట్టుకొని, చెంగాళమ్మ దర్శనము చేసికొని మరలి వచ్చు చుండంగా, లక్ష్మీ స్తుతిపరమైన పద్యమొకటి నా మనస్సునం దేర్చడినది. రచన కొంత సాగిన పిదప, శ్రీమచ్చంకర భగవత్పాదులవారి కనకధారాస్తవమును ఆత్రేయ వేంకటాధ్వరికృత లక్ష్మీనహ(స్రమును ఆ(శయించి నేను అచిరకాలములో ఈ కావ్యమును బూర్తిచేసికొనంగల్లితిని.

భగవతి దక్షిణకాళి (తెన్‌కాళి) దర్శనము చేనికొన్న నాంటి గోధూళికాలగ్నమున ఆరంభమైన యీ కృతి నిర్విఘ్నముగా ఆకృతి నొందిన దగుటచే, ఆ దేవికే దీని నంకితము గావించితిని.

కృతి సమర్పణము తే 9-9-1966 ది నాండు జరిగినది. ఈ గ్రంథమును ము(ద్రించుటకు6 గావలసిన ద్రవ్యసహాయము కావించిన నా మిత్రుండు సంఘసేవాపరాయణుండు, ఉదారహృదయుండు శ్రీ వనుగు పట్టాభిరామిరెడ్డి

[లే

చిరాయురభ్యుదయ పరంపరలతో వర్ధిల్లునట్లు శ్రీదేవి యనుగ్రహించునుగాత !

ఈ కావ్యము జగన్మాతకృపచే లోకకల్యాణమునకుం దోద్బడునేని నా జన్మము చరితార్ధమే.

థె నెల్లూరు. - కృతికర్త. 10-4-67 (ఫ్రవంగ-సంవత్సరాది) 20

అంకితము లోకత్రాణపరాయణాఖభిరతి, సూళూర్‌పేటలోనిల్చి, య స్తోకంబైన మహత్త్వమున్‌ నెపుచున్‌ శోభిల్లు చిచ్చక్తి గం గాకల్లోలవతీ సపత్నియగు చెంగాళమ్మ కర్పింతు, ల క్షీ కారుణ్యకటాక్షలబ్ధకవితాశ్చంగారరంగత్కృతిన్‌.

  • కృతికర్త. 2

పరిచయము ఏతత్కృతికర్త శ్రీ మోచెర్ల రామకృష్ణయ్యగారు సింహపుర మండలములోని ప్రసిద్ధ కవులలో గణుతికెక్కినవారు. అటు సంస్కృతమునను - ఇటు ఆంధ్రమునను కూలంకష వైదుష్యము కలవారు. ఉభయ భాషలయందును రుచిరతర రచనలు చేయనేర్చిన ప్రజ్ఞావంతులు. పండిత పరిషద్దత్త 'సరసకవి* ప్రముఖ బిరుద విరాజితులు. మజియు సాహిత్యముననేకాక, సంగీతమునను ప్రవేశముకలవారు. అంతేకాదు, జ్యోతిషమునను, వేదాంతమునను కూడ కృతపరిశ్రములు. శ్రీ రామకృష్ణయ్యగారు బహు([గ్రంధకర్తలు. ఆగ్రంధముల సంఖ్య, యేకవింశతినతిక్రమించినది. ఆరచనలలో న్వతం్యతములతో పాటు అనువాదములును కలవు. స్వతంత్రకృతులలో కావ్యములున్నవి, నాటకములున్నవి, గేయనాటికలున్నవి, స్తోత్రములున్నవి, గద్య ప్రబంధములును ఉన్నవి. అనువాదములలో, అభిజ్ఞాన శాకుంతలము, స్వతంత్రకృతులలో - ప్రచండభార్గన నాటకము, శారదాప్రసాదమను సంస్కృత కావ్యమును విద్వత్మవీ 'ప్రకాండుల వినుతులెక్కువగా నందుకొన్నవి. * ఎన్ని (గ్రంధములు (వానినను, ఎన్ని బిరుదులు పొందినను లక్ష్మీకటాక్షమునకు పాత్రము కాకున్నచో, అతని జీవిత మందదుకులే. విద్యావంతునికంటెను విత్తవంతుడే అధికుడు. విద్యాధికుడును విత్తవంతు నాశ్రయింపవలసినవాడే. కావుననే, అగస్యమహర్షిలక్ష్మిని నుతించుచు- “పండితుండాతం డాతండుప్రభావసమ(గ్రుం డతండుశూరుం డా తండువివేకి యాతండువదాన్యు డతండుమహాకులీనుం దా తండుకళావిదుం డతడుధన్యుం డతండుమనోజ్ఞమూర్తి యె వ్వండు భవత్కృపాకలనవైభవలక్ష్మికిం బాత్ర మిందిరా 1 కాశీ ౩- 45) న పన

  • “శ్లో! మహిత తవనవీనం కావ్యమాస్వాదయిత్వా నను కవిరయమేకః కోఒపి కావ్యప్రవీణః అనుభవతి రసజ్ఞ శ్శారదాయాః ప్రసాద మితిమనసి మమాయం ్రత్యయో౬ భూద్దఢీయాన్‌” (శారదాప్రసాదమును గూర్చి) చింతామణ్‌ - ద్వారకనాధ్‌ దేశ్‌ముఖ్‌. న్యూఢిల్లీ - 25-4-1955 22

అన్నాడు. కాబట్టియే, శారదాప్రసాదమును సంతరించుకొన్న రామకృష్ణయ్య గారు, లక్ష్మీ ప్రసాదలబ్ది నభిలషించి, ఈ “లక్ష్మీ కటాక్ష కావ్యమును రచించి నారు. ఆ జగన్నాత (ప్రాభవమును ప్రభావమును బహుప్రకారములుగా వర్ణించి, ప్రకర్షించి, ప్రశంసించి, - “అడుగుచున్నాండ నార్తుండ జడుడ నంబ ! నీయపాంగ సుధావృష్టి ; నీరదంబు పృధివిలో నొక్కరీతి వర్షించుంగాదె మేరువునంగాని మరుభూమి మీందంగాని,” (40) అని ప్రపత్తి పూర్వకముగా దీనముగా ప్రార్థించినారు. కాని, యెంతగా ప్రార్ధించినను, లక్ష్మికి కవులయెడ నెప్పటికిని చిన్నచూపే, కారణము, వారామెకు కోడలయిన శారద నారాధించుటతప్ప మటేమియుకాదు. ఆ తత్త్వముగుర్తించియే రామకృష్ణయ్యగారు,- 'ఏమోయీ, యింతకాలముగా శారదకొలువుచేసి, యీ నాం డు నన్నాశయింప వచ్చితివా ? అని యామె యెక్కడ త్రోసిపుచ్చునో - యని యనుమానించి, - “శారదాప్రసాద సంప్రీతమతుల దృ కృథమునం దయారె, పడితినిప్పు డని యుపేక్షసీయ కరసి కటాక్షించి యభయమిచ్చి కావు మబ్దితనయ 1!” (8) అని ముందుగనేమనవిచేసికొన్నారు. ఇది వారి పరేంగితజ్ఞతకును, కార్యమును సాధించుకొను నేర్చరితనమునకును తార్మాణమైయున్నది. చెప్పమజచినాను, రామకృష్ణయ్యగారు - అధివక్త (అడ్వకేటు), కావున వారికిట్టి వ్యవహారపుమెలకువలు నిత్యానుభవముననున్నవే. కావ్యానుశీలనము రామకృష్ణయ్యగారి రచనలలో, ఈ లక్ష్మీకటాక్షము - (ఇప్పటికి) తుదిరచన. ఇది యించుమించుగా అనువాదగ్రంథమే. దీనికి చాల వరకు వేంకటాధ్వరి లక్ష్మీనహ(స్రము, కొంతవరకు శ్రీ శంకరభగవత్పాదుల కనకధారాస్తవము, శ్రీ సూక్తము - ఆధారములు. లక్ష్మీనహ(స్రము శ్లేషయమకాద్యలంకార బంధురమైన ్రాధఢకావ్యము. అందలి శ్లోకములను చక్కగా అన్వయించుకొని, వానిలోని భావములను తెనుగునకు తెచ్చుట తేలికయైన పనికాదు. అంతంతమాత్రపు రచయితల కలవిగాని పనియనియే చెప్పవచ్చును శ్రీ రామకృష్ణయ్య గారు, ప్రతిభావ్యుత్పత్తులతో పాటు భాషాంతరీకరణపరిపాటియు 23

కలవారు గనుక మూలములోని భావములనుచెడనీక, తెనుంగుందనవు తీరుతియ్యములతో ప్రతి పద్య మును హృద్యముగా తీర్చినారు. ఉదాహారణములు కొన్ని :- (1) “శుత్యంతజుష్ట మమలోత్పల కాంతియోగా దత్యంతసుందర మనంగజనేర్నిదాన ముద్భాసితామరసభామహితం మదంబ, కోన స్తువీత నయనం తవ కృష్ణరూపమ్‌.” (45) ఇందులో, “ఉద్భాసికామరసభామహితం' అన్నచోట - “ఉద్భాసి - తామరస - భా - మహితంి అనియు, - “ఉద్భాసిత - అమరసభా - మహితంి అనియు రండు విధములుగా పదచ్చేదము. ఈ చమత్కారము పద్యములోను సమర్థింప బడినది. “అంబ, (చుత్యంతజుష్టు మత్యంతసుంద రంబు, మన్మథజన్మకారణము, రుచిర తామరసభాభినుతము, నీ తరళనయన మింబడరంజేయుం గృష్టరూపంబు మాకు.” 645) ఇక్కడ “రుచిర - తామరస - భా - అభినుతము” అనియు - *“రుచిరతా - అమరసభా - అభినుతము' అనియు రెండువిధముల పదచ్చేదము. (2) “త్వద్ధాన్ను స్పరసీరుహస్యచ మిథః త్వత్కాంతధామాత్మనో మార్తాండస్యచ పుండరీకనిలయే ! మైక్రీనిసర్లోదితా కల్యాణీ ! యువయో రియం వివృణుతే కై ముత్యనీత్యా మిథః ప్రీతిం కామపి భూయసీ మవిదితాక్షేపా మనౌపాధికీమ్‌.” 'కమలాలయా ! నీధామమగు సరసీరుహమునకును, నీ కాంతుని ధామమగు మార్తాండునకును పరస్పరముగల నిసర్గమై(త్రి, శుభకరమును అనిర్వచనీయమును నైన మీయుభయుల అన్యోన్య.ప్రేమను, కై ముతిక న్యాయముచే విశదముచేయు చున్నది” అని భావము. ఈ భావమంతయు, “తరణిమండలంబు ధామంబు విష్ణున, కంబుజంబు మందిరంబు నీకు, మిహిరకమలమైత్రి మీ మిథఃప్రేమ త త్త్వంబు మాకు విశదపజచు నంబ ! (54) అన్న చిన్నపద్యమున పొంకముగా పొందుపరచబడినది, 'కైముతిక న్యాయమును 24

అన్న మాట లోపించినది, కాని, అందువలన శ్లోకభావమునకు కల్లిన క్షతి యేమియులేదు. కావున, అది యొక లోపము కాదు. (3) _ 'శ్రీవత్సాంకం చిరతర మురస్సీమగోష్టే మురారేః అధ్యాసీనా మనఘరభరితోద్దామకాంత్యాభిరామాం కల్యాణి త్వా మమృత మతులం సం(్రితానాం దుహానాం. క్షీరాంభోధేః సముదితవఠీం బ్రూమహే కామధేనుమ్‌” ఇందులో విష్ణుమూర్తివక్షము గోశాలగను, ఆవక్షముననుండు లక్ష్మి, ఆశాలలో కట్టివేయబడిన కామధేనువుగను, ఆవక్షముననుండు శ్రీవత్సము, కామధేనువుదూడగను, లక్ష్మి ఆశ్రితుల కోర్కెలనాసగుట పాలిచ్చుట గాను రూపింప బడినది. పాలకడలిలోపుట్టుట, అర్భుల యఖీష్టములు తీర్చుట కామధేనువునకును లక్ష్మికిని సమాన ధర్మములు. ఈ విషయమంతయు, ఈక్రిందితేటగీతిలో సుబోధముగా చెప్పబడినది. అరయ శ్రీవత్సభాసితహరిభుజాంత రశుభగోష్టస్టవై బ్రితవ్రాతములకు నమృతమిడు కామగవిని నిన్నాశయించి నాండ, క్షీరాబ్టిజాత, యానందరూప ! (4 “దుర్లంఘ సంసృతి దురర్ణవ కర్ణధారాః సంపద్వధూ సతత నర్తన సూత్రధారాః అజ్ఞానకానన విదార కుఠారధారాః పద్మే ! భవన్తి భవదీయకటాక్షధారాః మ. సంపన్నర్త నసూత్రధారులు, దురాశాగ్రాహమోహోర్శికా కంపాభీల భవాబ్టిసంతరణ నౌకాకర్ణధారల్‌, కృపా సంపూర్తా ! త్వదపాంగధారలు తమస్సంఛన్నపాపాటవీ సంపాతో([గ్రకురారధార, లవి నిచ్చల్‌ మమ్ము రక్షించుతన్‌. (24) ఇందు, మూలములోని “దుర్లంఘ సంసృతి దురర్దవ కర్ణధారాః అన్న సమాసము, 'దురాశా గ్రాహ మోహూర్మికా కంపాభీల భవాబ్ధి సంతరణ నౌకా కర్ణధారలొగా పెంపొందినది, నిరర్ధకపు పెంపుదల కాదు, సమాసము నట్లు పెంచుటలో, “దుర్లంభుమైన నంనృతి దురర్హవము” - దురాశా (గావాములచేతను, మోహోర్మికాసంచలనము చేతను - 'అభీల” మైనది. వట్టి కర్ణధారలకు, నౌకలు 25

చేజిక్కినవి. మూలమునకు మెటుగును పద్యమునకు బిగువును సమకొన్నవి. ఇది నన్నయ శ్రీనాథాదుల యను వాదఫక్సిని, ప్రొఢదీర్చ సమాస గుంభనను తలపునకు తెచ్చు పద్యము. (5) “అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృంగాంగ నేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాకొ (కనకధారాస్తవము) “అరవిరి మొగ్గల నిగ్గుల విరంజిమ్ము తమాలము పయి భృంగాంగన వై ఖరిం బులకాభరణుందడగు హరి మెయి పయి నమరు నీ యపాంగముం గొల్లున (35) మూలమువలెనే, యీపద్యము మృదులమృదుల పదములతో కుదురుకొని హృదయరంజకముగానున్నది. ఇట్లీగ్రంధమున రచన యంతయు, దురన్వయ దూరాన్వయాది క్లేశముల యలజడి లేక హాయిగా జాలువాథినది. ఈ (గ్రంథము లక్ష్మీకటాక్షము నపేక్షించు వారికెల్లరకును అవశ్య పఠనీయమును పండిత ప్రశంసాపాత్రమును కాగలదని నావిశ్వాసము. శ్రీ రామకృష్ణయ్యగారు శారదాప్రసాదమున నిట్లేయింకను పెక్కు కృతులు వెలయింతురుగాక. లక్ష్మీకటాక్షమున అతులితైశ్వర్య విభ్రాజితులై వర్ధిల్లుదురుగాక. దీపాల పిచ్చయ్య శాస్త్రి. 26

కృతజ్ఞత ళా ఈ కావ్యమునకు “పరిచయము వ్రాసియిచ్చిన విద్వత్మని పుంగవులు “విమర్శకాగ్రేసరులు' బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్య శాస్తి గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. పరాభవసంవత్సరాది నాండు (28-8-66) నెల్లూరు వి. ఆర్‌. కాలేజి హైస్కూలు ఆవరణములో రమణీయమైన కావ్యావిష్మరణ సదస్సు నేర్పాటుచేసి, నాచే ఈకృతిని పఠింపంజేసిన రసజ్ఞులు శ్రీ కే. రామలింగారెడ్డిగారికి నాధన్యవాద ములు. ఏతత్సంవిధానము సమకూర్చిన నామిత్రులును (్రేయోబఒభిలాషులును అగు శ్రీ నేలనూతల శ్రీ కృష్ణమూర్తిగారికిని శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్యగారికిని నా ప్రణామములు. మో.రాకృ 27

లక్ష్మీకటాక్షము శ్రీదేవీ, జననీ, నా మీదన్‌ బ్రసరింపంజేయుమీ, యనుకంపా మేదురములం గౌముదికా సోదరముల వీక్షణముల శుభదక్షములన్‌. క్షే వేంకటాధ్వరి దీవ్యతృవిత్వశక్తి " లో శతాంశంబు నాలోంబ్రవేశపెట్టి, నీ కటాక్షప్రశస్తి వర్ణించు కావ్య కన్యకకు దీని కి మ్మలంకార దీప్తి. 7 ఎయ్యవి విద్యుల్లేఖల కొయ్యన వన్నియల దిద్దు, జ్యోత్సకుం జలువల్‌ నెయ్యమునం గూర్చు, భార్గవి, అయ్యవి నాపై వెలార్పుమా నీ చూపుల్‌. తె వేండి దారిద్యమున మాడి మైోడులైన మనుజభూజమ్ములు చిగిర్చి ననలు దొడిగి కాచునట్లు భవత్మటాక్షముల సుధలు క్షీరసాగరకన్య, వర్షింపుమమ్మ ! శ దురదృష్టవాతహతులన్‌ బొరిగొను దారిద్యభూతమును గూల్చెడి నీ గరువంపుం జూపు తూపుల కెరంగితి, జననీ, యను(గ్రహింపుమునన్నున్‌. ర్‌ నీ దయాద్చష్టి యెవ్వానిమీందం బడునొ యాతండంబేదయైన దిగ్దేత యగును, ఎవ్వనిం బాయు నీ కృపావీక్షణంబు ఆతనికి సున్నయాౌను ఖిక్షాన్నమైన. 6 28

లక్ష్మీ కటాక్షము ప్రాంచద్వైభవముల్‌ లభించు భవదీయాపాంగముల్‌సోకం; బ్రా పించున్‌ దుర్గతి నీ యనుగ్రహము లోపింపన్‌, జగద్దాత్రి, నీ సంచారంబులు మా కచింత్యములు ; వాత్సల్యంబుతోవచ్చి, నీ చాంచల్యంబుం దొరంగి, నా మనుగడన్‌ సంపన్నముం జేయుమీ ! లా శారదాప్రసాద సంప్రీతమళుల దృ కృథమునం దయారె, పడితి నిప్పు డని యుపేక్షసేయ కరసి కటాక్షించి యభయమిచ్చి కావు మబ్దితనయ ! 8 తావకీన వదన లావణ్యపీయూష వార్జి నుద్భవించి వజలు కల్ప వృక్షమైన నీ కటాక్ష మాకాంక్షితం బులను దీర్చి నన్నుం బ్రోచుగాంత ! 9 సుమితం బయ్యు ననంత ఫ లము నిచ్చు భవత్మటాక్షలత యమితామో దము విహితాగమశోభా ప్రమద ప్రాభవము మాధవ(ప్రేమమయీ ! 10 విప్రయోగులకార్తింగల్పింపనిది, యె పుడును మార్గణ పంచత్వమును సహింప నట్టిది నిజంబు తావకాపాంగలీల, సలుపు భవదహనం బిది, కలిమిచెలువ ! క్షే వికచబిసప్రసూనరుచివిభ్రమ సంభవసీమయై సము త్సుక సదుపాస్యమై యెసంగుచున్‌, విధునిన్‌ దగ సుప్రసన్నతా ప్రకటితుంజేయు నెయ్యది శరత్తునుబోలి, భవత్కటాక్ష మొ ద్దికం బ్రసరింపంజేయుము పదింబది నాపయి దాని భార్గవీ ! క్షణ అమరు మున్ముందు సంహ్రార్ధితార్థసిద్ధి, ఒదవుం బిమ్మటం ద్వత్కటాక్షోపలబి కడంగి తనమీంద నీ దృష్టి వడకమున్నె మించి హనుమంతు. డుదధిలంఘించెంగాదె ! 13 29

లక్ష్మీ కటాక్షము స్ఫారోదార భవత్కటాక్షములునాపైం బుండరీకాక్ష వ క్షోరక్షామణి, పర్వజేయుమని భక్తుందైన యీ నీ సుతుం డారాటించుచు వేండుచుంట వినవా ? యాత్మీయు సంప్రార్ధనం చీరీతిన్‌ వృథసేయ నాయమగునా ? యేలా యుపేక్షింపంగాన్‌. కేశ తల్లీ, దుర్విషయాభిలాష యను భూతం బొండు బాధించున న్నుల్లాసమ్మున : దాని పెంపడచు శక్త్యుత్సాహ మంత్రజ్ఞతల్‌ కొల్లల్‌గాంగల నీ కటాక్షరుచి సంకోచింపంగానీక, సొం పిల్లంగాం (బ్రసరింపంజేసి నను నిర్భీతాత్మునిం జేయుమీ ! 15 ఏ జనముల్‌ త్వదీయ శుభదృష్టికిం బాక్రులొ, వారలెన్నడే నో జననీ, యరి(ప్రతిఘకోహటిలం బనిలేదు- శత్రు సం యోజితుం డగ్నిహోత్రుం డతందోపెనె పావని తోంకంగాల్ప ? ని స్తేజుండుగాడె ? నీమహిమ దేవతలేన్‌ గనరో హరిప్రియా ! 16 విరజాద్వీపవతీ తరంగమది దేవీ, నీ యపాంగంబు, త త్పరమాహ్హాదకవీచి సోకు నెవనిన్‌ వాండొందుంబీతాంబరో త్తర సందీప్తి పదంబు, ధన్యతమ ముక్తాభూషితంబున్‌ నిరం తర సౌభాగ్య సమాస్పదంబు నిగమస్తవ్యంబు పద్మాలయా ! శై? నీ పురుషోత్తమప్రియత, నీ జగతీత్రయ జీవలోక సం తాప నివారణైక సుగుణత్వము, భక్తుల చిత్తవృత్తి నీ వైపు మరల్చు : రిక్తులు విపన్నులు గోరెడి నీ కటాక్షని క్షేషము పంచిపెట్టి బ్రతికింపుము వారి నుదారతా మతిన్‌. 18 తల్లి, జాబిల్లి శివశిఖోత్తంసమయ్యెం గుజ మరయం గల్పతరువయ్యెం, గొమరుమిగులం బశువొకటి కామగవి యయ్యె : వారి కీవె యిచ్చినా విట్టి మహిమ నీదృష్టి నెజిపి. 19 నీతోయబుట్టినవారిపట్లం బ్రణయోన్మేషంబు వాటించుటల్‌, ప్రీతిన్‌ వారికిం గీర్తింగూర్చు మహిమావిర్భూతిం గల్పించుటల్‌, మాతా, సాజము నీకుం గామగవియున్‌ మందారమున్‌ జం(ద్రుండున్‌ నీతోయుట్టువు, లట్టివారికిడవే నీచూపు లత్యున్నకతుల్‌ ! 20 30

లక్ష్మీ కటాక్షము నీ వీక్షాకాదంబిని మావంటి వనీపకులను మరుభూములపై సౌవర్ణవృష్టి గురియుత, ధీవర సారస్య సస్యదీప్తి దలిర్చన్‌, 21 అంతర్గతంబైన యంధకారంబేనిం దునియును సూర్యాకలనముచేత, భువనముం గప్పిన భూరిదోషోన్మేష మునకుం దనంతట పొసంగువిరతి, ద్విజచక్రములకు సంటప్రీతి పాత్రంబుగా సంపన్నమగు సారసవనవృద్ధి, నిఖిల దిబ్ముఖములనేకాదు, చూడం వర్తిల్లు దివమున భాసనంబు, ఓ (త్రిలోకైక జనయిత్రి, యుష్మదీయ నిర్మలాపాంగదర్భ్శనాహర్ముఖమునం, గాన, నాయెడ నీకటాక్షమ్ము సుంత నెలకొనం జేయుమంచు నిన్వేడుకొందు. 22 అంబ, యుష్టుత్కటాక్షదివ్యాషధంబ్ను రూపుమాపును గావుత రూధమూల ములను నాయఘరోగ బాధలను జనన మరణ రూపకమైన యామయములెల్ల. 22 సంపన్నర్తన సూత్రధారులు, దురాశాగ్రాహమోహోర్శికా కంపాభీల భవాబ్ధిసంతరణ నౌకాకర్ణధారుల్‌, కృపా సంపూర్చా, త్వదపాంగధారలు, తమస్సంఛన్న పాపాటవీ సంపొతోగ్ర కుళారధార, లవి నిచ్చల్‌ మమ్ము రక్షించుతన్‌ ! ర! నీ యపాంగలహరి నాయెదంబ్రవహింపం జేయ సమయ మిదియ, సింధుతనయ, ఆ ప్రవాహమహిమ నంతరించెడుంగాత దోసకారి యముని దోషద్బృష్టి 25 తే

లక్ష్మీ కటాక్షము అమృతోత్మ ద్విజసేవిత ము, మహితకరుణారసప్రపూరితము, భవ ద్విమలకటాక్షతటాకము శమం దీర్చుంగాక నాకు స్నానప్రదమై. 26 అగణితరుచిమత్నొస్తుభ మగు హరివక్షమున నీలహారావళిగా జిగింజిమ్ము నీ కటాక్షము లొగి నాకు శుభంబులిచ్చుచుండుంగాతన్‌ లగా వనదవర్డుందైన వనజాక్షు వక్షప్ర దేశమందు మెలుపుతీంగవోలెం దేజరిల్లు లక్ష్మిదివ్యకటాక్షమా లికలు నాకు భద్రనికర మిడుత 1 28 రమగాం బార్వతిగా సరస్వతిగ సర్దస్థిత్యభావక్రియా క్రమనిర్వాహక యాదిశక్తిగ నెవర్తన్‌ గొల్తురో భక్తులా గమ తత్త్వజ్ఞులు, నీవు నిక్క్మముగ నాకల్యాణివే, నీ కటా క్షమపేక్షించితి నక్షయంబయిన భిక్షంబెట్టి రక్షింపుమీ ! 29 “ప్రియునిం దూంచెదం దూంగినంత ధన మర్పింతున్‌, గ్రహింతున్‌ బతిన్‌, భయమొందన్‌ బనియే' మటంచు విభునిన్‌ దానంబుగావించి, కా తజియపాలైన సపత్నివేండం, గరమర్థిన్‌ నీ కటాక్షంబె కా సయశబ్దంబులు మిన్నుముట్ట విడిపించన్‌ గల్లెం బద్మాక్షునిన్‌ ! 80 వికచాంబుజరుచినికరము నకురూపాంతరము, సాధనము శుభములకున్‌, సుకృతులకు వివర్తము తా వక కరుణావీక్షణమ్ము వననిధి తనయా ! 31 ప్రతిభావల్లి కుపఘ్నయష్టి, కరుణాపాథోధి వీచీమత ల్లి, తపస్యావిజయోపలబ్ధి వనమాలి (ప్రేమసా[మ్రాజ్య స మృత సౌభాగ్యకళాప్రహేళిక, జగన్మాతా, మురద్విట్సుహ ల్లతికా, నీదుకటాక్షమాలిక, సిరుల్‌ మాకిచ్చు నెల్లప్పుడున్‌. 32 32

లక్ష్మీ కటాక్షము తాటంకరక్ష త్రిదశవ ధూటుల, కభ్యుదయశోభ దుగ్గాబ్ధికి, శృం గాటకము మంగళములకుం గైటభజిన్మహిషి, నీదుకాన్సు, తలంపన్‌. ౩3 'ఆమలకం బటే పరమహంసకు నేనిడు హేమభిక్ష ! తా ల్బామున నేమి సల్సితినొ పాపమునే'నని తీవరించు సా ధ్వీమణి యార్తింబాపం గురిపించిరి బంగరువాన శంకర స్వాములవారు దేని యనుభావముచే, నది నీకటాక్షమే ! క! అరవిరిమొగ్గల నిగ్గుల విరంజిమ్ము తమాలముపయి భృంగాంగనవై ఖరిం, బులకాభరణుండగు హరిమెయిపయి నమరు నీయపాంగముం గొల్తున్‌. తె5 మధుకరి పద్మంబునవలె, మధురిపు వదనమునం బ్రణయమహితవ్రీడా మధురముగ మసలునెది, వా ర్నిధిసుత, తదపాంగమాల శ్రీలిడుమాకున్‌. 86 నీవు నారాయణివిగదా, నీదురూపు పరిమిత (ప్రజ్ఞులైన నావంటివారు వర్ణనము 'సేయనేర్లురే ప్రకృతి రామ ణీయకాద్భుత, చిద్రూపధేయమహిత ! 87 సలుపుము నను యుష్టత్పద జలజమధువ్రతముగా యశస్విని, నీచూ డ్కుల మహిమను రుంకృతులన్‌ సలలితగీతములు వాడి సంకీర్తింతున్‌. 88 క్షణము సేపు భవత్మటాక్షంబు నెవని యందు నిల్పుదువీ వతండొందు నపుడె యా సహస్రాక్షపదవియొ యల త్రిలోచ నత్వమొ యథార్ధమిది పద్మనాభమహిషి ! 39 33

లక్ష్మీ కటాక్షము అదడుగుచున్నాండ నార్తుండ జడుండ నంబ, నీయపాంగసుధావృష్టి ; నీరదంబు పృథివిలో నొక్కరీతి వర్షించుంగాదె మేరువునంగాని, మరుభూమి మీందంగాని. 40 మాత, భవవిషాదమయరాత్రి నిదురించు నట్టి మాకు నీ యపాంగభేష జంబు నిమ్ము, తత్‌క్షణంబె మాకొదవుం (బ్ర బోధముం బ్రమోదముం జిరమ్ము. గ్‌. కువలయక్షేశనాశమ్ముంగోరి, దుగ్ధ వార్ధి నుదయించి, తగ విష్ణుపదవిభాస మానయగు చంద్రరేఖసమానవగుచు మాకొసంగుము నీ శుభాలోకములను. నం! కాచు నీయపాంగగంగ వర్ణితభంగ అంబ, మమ్ము భవమవహాబ్ధినుండి వ ప్రబలుంగాక శుభపరంపరల్‌ మాకింకం దొలంగి పోవుంగాక దురితవితతి. తప నీ కరుణాలోకనములు లేకున్న క్షణక్షణంబు క్లేశకరంబుల్‌ మాకాపురములు చీంకటి యాంకలు- మామీందంజూపుమక్కటికంబున్‌. డీ అంబ, శ్రుత్యంత జుష్ట మత్యంత సుంద రంబు, మన్మథజన్మకారణము, రుచిర తామరసభాభినుతము, నీ తరళనయన మం బడరంజేయుం గృష్టరూపంబు మాకు. డేర్‌ జ్ఞానానంద సువర్ణరమ్యము, జగత్సౌభాగ్యసంభార సం ధానోద్దామము త్రాసభంజకము త్వత్తాటంకయుగ్మంబునం దేనేత్రద్యుతి నీలరత్ససుషమాహేవాకముంగూర్చు, నా నీ నేత్రద్యుతి సర్వమంగళములన్‌ నిత్యంబు మాకిచ్చుతన్‌ ! తద 3డీ

లక్ష్మీ కటాక్షము ధృతరాషస్త్రజఆతమగుసుమ హిత కర్ణప్రణయతావకేక్షణమది, యే గతి నెజపెను జగదఖినం దితమగు కృష్ణార్జునైకదీప్తిన్‌ దేవీ ! శ? భువనామోదకరమ్ములౌ పరిమళమ్ముల్‌ జిమ్ముచున్‌ మంగళ చృవులన్‌ జిల్కు హిరణ్యపద్మమును యుష్మజ్జ్ఞన్మసద్మమ్ముగా నవలోకించిరి, సార్ధకంబయిన పద్మాఖిఖ్యతో నిన్ను సం స్తవముంజేసిరి తత్త్వవేత్తలు జగన్మాతా, రమాదేవతా ! 48 కపట కిటిరూపుదాల్చిన కైటభారి ప్రీతి నివసించెనల పంకజూతమందు : పంకజాతనివాసంబు పరమపురుష కాంత, నీకౌట కదియటే కారణంబు ! 49 సదసద్భేద వివేకశక్తి యుతముల్‌ సన్మానసోల్లాస సం పదుదారంబులునౌ గభీరశుభశబ్దంబుల్‌ ప్రపంచించుచున్‌ జదురొప్పన్‌ (శశుతిమార్గసౌఖ్యమును నిప్పన్నంబుగావించి, నీ సదనంబున్‌ బరిశుద్ధహూంసములు నిచ్చల్‌గొల్చుం బద్మాలయా ! 50 హరికరస్పర్శ హర్షసంభరితవగుచు, సంతతమ్మును రుచిరాళికాంతవగుచుం దనరు నీ గీము కమలాభిదానమును వ హించు టర్జంబెకద హృషీకేశదయిత ! ర్‌1 సారసంబున వాసంబు సలుపునట్టి నీదు సాధర్మ్యమాళించి, నీ మనోహ రుండు విష్ణుండు నివసించుచుందడునేమొ, అంబ, పురమధ్యపుండరీకంబునందు. 52 నిను వక్షస్టలమందు నెక్కాలిపి మన్నించున్‌ విరాట్పూరుషుం దనయంబున్‌ - బ్రియమార నవ్విభునకీ వర్పించుచున్నట్రి నే ర్పుననే కాదటె యమ్మహామహుండు దాంబోషించు బ్రహ్మాండముల్‌, జననీ, భారమె నన్నుంబ్రోవం ద్రిజగత్సొభాగ్యసంధాయినీ ! 53 2ె5్‌

లక్ష్మీ కటాక్షము తరణి మండలంబు ధామంబు విష్ణున, కంబుజంబు మందిరంబు నీకు- మిహిర కమలమైత్రి మీ మిధఃప్రేమ త త్త్వంబు మాకు విశదపజచు నంబఐ ! ర్‌ భగవతీ, శ్యామవీవు, నీ ప్రాణవిభుండు శ్రస్తపరమాళ్మ ; నీవు రుక్మిణివి, యుష్మ య పహృదయేశ్వరుండు గాంగేయ యోగ ముదితుం, డనురూప దాంపత్యమిది నిజంబు, ర్‌ర్‌ భవవార్థిమగ్నమానవ నివహమును సముద్ధరింప నిత్యము సలుపున్‌ సవనము నీవతి దీక్షితుం డవుచున్‌, నీవరయ సోమిదమ్మవు దేవీ ! ర్‌6 శ్రీహరి రాముందై యవతరింపంగ, నీ వుదయించినావు సీ తాహరిణాక్షిగా - దశరథక్షితిపాలునిదేవిగర్భమం దా హరిపుట్టె : నివు మహిమాద్భుతరీతి నయోనిజోల్లస ద్దేహముతో విదేహజగతీపతికిన్‌ సుతవైతివా రమా |! ర్‌7 జనకునికిందొల్తనీవెటం గనంబడితివా యదియె జీవికకు వలసిన భో జనమునిడు ననెడి నీసూ చనకా నాగేటిచాలు జననము నీకున్‌ ! 58 జన్నంపుంబట్టుననె యు తృన్నంబగు సిరి - యొనర్పందగు యజ్ఞములన్‌ విన్నాణులంచు నూచిం ప న్నీ వుదయించితివె సవనవాటికలోన్‌ ! 59 రామున్‌ సీతగం గృష్టు రుక్షిణిగ నారాధించినా, వా పరం భాముం డాద్యుండు వామనుం డయిన సందర్భంబునన్‌ సైతమున్‌ స్వామిన్‌ నీ వుపవీతరూపముగ నుద్భాసించు కృష్ణాజిన త్రీమన్నూర్తిధరించి కాల్చితివి - మీ [్రేమంబులీదృక్షముల్‌ ! 60 36

లక్ష్మీ కటాక్షము రామునిచేతనే మడియు రావణుం, డాతనిమీంద రాఘవ స్వామి కటారిదూయు నినుంబద్మను దాను హరించినప్టె, న్‌ వామహనీయువెంట గహనాంతరమున్‌ జొరకున్న నీ క్రియా స్తోమ మదెట్లుసాగు ? ననుచున్‌ బతితో వనికేగితే రమా ! 61 సుచరితయౌచిరంటి యనసూయనుజూచి యను(గ్రహింపం, బో రచి విపినంబుంజొచ్చితివి రామునివెంట - భవత్మటాక్షపున్‌ బ్రచురమహ త్త్వశక్తి కలనన్‌ గద యాసతి దివ్యలేపనం బుచితగతిన్‌ జగజ్జనని కొద్దిక నీ కొసంగెన్‌ బియంబునన్‌. 62 అన్నియుం జక్కంబెట్టెడి సమర్ధతగల్లినదానవయ్యు, సం పన్నలినాక్ష్మి భర్తకు సమగ్రయశం బొనంగూర్చునట్టి త్రో వన్న డవం దొడంగుదువు : పంక్తిముఖున్‌ ద్రుటిలోన బూదిజే య న్నెజిగల్లి రామవిజయార్ధము బాధలకోర్చినావుగా ! 63 “వారి వక్షోమణి లక్ష్మి యామెపయి నాయాకాంక్ష్మ నాకేటికా హరి ? చాలున్‌ సిరి యన్నవారలకు మాతా, చేకుజున్‌ రావణా సురుండెద్దాని గడించెం దద్గతి : మనుష్యుల్‌ శోభనార్భల్‌ మహిన్‌ హరిసంయుక్తను నిన్నుంగొల్బినపుడే యార్జింతు రౌత్కృష్ట్యమున్‌. . 64 ఇందిర సీతయంచెజఖుంగండే రఘురాముండు ? కృష్ణవర్మ ని న్నుం దహియింపలేందని ఘనుందెజబుంగండె యతండు +? నీ కృపా సుందరదృష్టిచేం బవనసూతి సురక్షితుండయ్యె : నిన్ను గో విందు పురంధ్రి నేక్రియం దపింపంగజేయును బావకుం డిలన్‌ ? 65 రమయే జానకి, లోకమాతసుమి, శ్రీరాముండు విష్ణుండు, శీ ప్రమ యాదేవిని దత్సమర్పణమొనర్చ్పన్‌ గార్యమంచెవ్వం డు త్తమలీలన్‌ వచియించె దైత్యుం దడతందొందంగల్లెం బట్టాభిషే కము- వాగ్రూపముగా నినుంగొలిచి సౌఖ్యంబొందెవాం డీక్రియన్‌. 66 ఉదయించెన్‌ హరి కృష్ణమూర్తియయి, నీవో రుక్కిణీదేవిగాం ద్రిదశాభిష్పుతుండైన భీష్మునకుంబ్రీతిం బుత్రివై పుట్టి, నీ హృదయేశుం గొనితేర నొక్క శుభకీర్తిం బంపి రప్పించి, య య్యదుసింహుం డరుదేర, నిచ్చితివి నీ హస్తాబ్దమా శౌరికిన్‌. 67

వ్‌

లక్ష్మీ కటాక్షము హరి సొమ్మేసిరి, దేవి రుక్కిణివి నీవౌనమ్మ, శ్రీకృష్ణుండే హరి సుమ్మీ, గుజుతింపరైరి శిశుపాలాదుల్‌ రహస్యమ్ము- నే ర్తురు గుర్తింపంగ దైవతంబులను భక్తుల్‌ జ్ఞానులున్‌ : ధూర్తులున్‌ దరళాంతఃకరణుల్‌ మహాత్ముల మహత్తన్‌ మాన్యతన్‌ మెత్తురే ! 68 నీ సందేశహరుండు భూమిసురుం డగ్నిద్యోతనుం డంబ, యే య్‌ సాధిష్టతపోవిశేషముల నేయే పుణ్యకార్యంబులన్‌ జేసెన్‌ బ్రాగృవమందు ? లేనియెడలన్‌ శ్రీకృష్ణుచే నట్టి పూ జాసత్మారము లందుకోంగలిగెనే సాక్షాన్మహావిష్ణుచేన్‌ ? 69 వీకారుణ్యకటాక్షవీక్షణమె యగ్నిద్యోతనుంజేసె, మా తా, కృష్ణారితపాదపంకజునిగాం, దద్భాగధేయంబు ప్ర త్యేకశ్చాఘకుం బాత్రమంచు మది నూహింతున్‌ : హనూమంతుందున్‌ గైకోంగల్లెనె యట్టిమన్నన రఘుక్ష్మాకాంతుహస్తంబులన్‌ ! 70 విష్ణు వక్షోభజనరూప విభుగ్భహ ్ర వేశమొనరించు దుహితకర్పించెనోటు నీకుం గౌస్తుభమణిని రత్నాకరుండు ? యౌతకము తండ్రి సుతకిచ్చు టబ్బురంబె ! 71 హరికి నీపిత శయ్యాగృహంబు, భ్రాత యక్ష్మి యింకొక్క తోయుట్టు వంగభూష్కు వఏష్టు వక్షస్థలంబె నీ వీడుపట్టు, ఇతర దుర్ల భవాల్లభ్యమిది సవిత్రి 79 చెలంగి బ్రహ్మాిండములను సృజించి పెంచి విలయ మొనరించు సామర్ధ్యములు వహించి మించు మహనీయ వాదిలక్ష్మివి, పురాణ పురుషు మహిషిని, మాత, కేల్మోడ్డు నీకు. 73 పాపాటోప నీదాఘ వ్యాష్పృత తాపమ్మునార్చ, భగవతి, మహిమో ద్దీపిత తావకనామ సు ధాపానమె, లక్ష్మి, యౌషధము మాకు మహిన్‌. 74 38

లక్ష్మీ కటాక్షము లేదమ్మా, మాకిమ్మహి, వేదపురాణోక్త ధర్మవిహితస్థితి, ల క్ష్మీదేవి, మాకు శరణము నీ దయితుని నామజపము, నీ స్మరణంబున్‌. 75 దేవి, ప్రాదేశపరిమితాత్మీయ కుక్షి పూరతైక ప్రయోజనమ్మును బురస్మ రించి చెప్పిన కల్లల వృజినమెల్ల గీటడంగు నీదునామసంకీర్తనమున. 76 భగవతి, మే మనంతు భగవంతు నుపాసనసేయంజాల, మా నిగమనియుక్త యజ్ఞముల నేర్పుదలిర్ప నొనర్చనేర, మీ జగమున మాకు సంసరణ సాగరతారక మంత్రమెన్న నీ యగణిత నామకీర్తనమె, యయ్యది మా కభయప్రదంబగున్‌. ళా హితమెదియొ, అహితమెదియో, మతింగనని వివేకహీను, మందు, దురధ్వ స్థితు, నను దారికియదోయుము, (బ్రతికింపదె తల్లి, నూతంబడంబోవు సుతున్‌. 78 అమ్మా దుర్విషయార ణ్యమ్ముల సొరంగళిశువునై తిరుగు ననున్‌ నెమ్మి, భవదీయ దృగ్గా లమ్ముల బంధించి సేవలన్‌ బనిగొనుమీ ! 79 ఇందిర, సొంద్రతమోఘన బృందంబులకున్‌ శరత్తువీవనుచుం జిదా నందాకారను నిన్ను ము కుందకుటుంబినిని మేలుంగోరి నుతింకున్‌. 80 ఓ మహానుభావ, ఓజఃప్రసాద సే వధివి, సొకుమార్యనిధివి నీవు- సారవిత్మవీంద్రసంస్తుతిపదవు, వై దర్భిరీతి రత్న గర్భతనయ ! 81 ౭ం

లక్ష్మీ కటాక్షము భక్తిప్రపత్తి సంపద్విలక్షణసార సంభారసాధనారంభమొంది, అవితధపురుషకార విశే షభగవదభిగమనయత్నాభివృద్ధింగాంచి, పరమపదప్రాప్తినిరతిశయావాప్తికలి తాశ్రయౌన్నత్యగరిమనెనసి, స్వీయ మాయాప్రకల్పిత చరాచర జగన్నాయక భూమికానందమాని, నాటకకలాప పరిపాటి తేటపడంగ శాశ్వతఫలైక నిష్పత్తి సంతరించు శ్రీమహారాజ్ఞి, యాశయించితిని నిన్ను నీ కటాక్షంబు నాయెడ నెజపుమమ్మ 1 82 భవరూపకాళరాత్రికి భవదీక్షణమగును సుప్రభాతము సింధూ దృవ, భువనావనరూప ధ్రువరూపకనాంది, నీ నిరుక్తి, సవిత్రీ | 83 కమలా, యోగి మనోనా గములకు శృంఖలికవీవు, కార్తాంత జగ ద్గమన ప్రతిరోధ సము ద్యమ ముద్రవు, ప్రణయ పుణ్యతటినివి, తల్లీ 84 ముని మానసజన హంసివి, జననీ, (శ్రుతిపంజరస్థ శారికవు, దయా ధనపేటివి, మురభి చ్చం దన లతికామంజరివి, యుదన్వత్తనయా. 8ర్‌ మూలికవు మోహనిర్మూలమునకు, సప్ర మాణనిశ్రేణికవు - మోక్షమార్గమునకు, సిద్ధ గుళికవు చిత్తసంశుద్ధికీవు, నీ కటాక్షంబు మారక్ష లోకజనని ! 86 సకలకల్యాణగుణముల సముదయమున కీవు నిలయంబ విందిరాదేవి, తావ కీన సౌశీల్య వాత్సల్వదాన విభవ వర్ణన మొనర్చ నేనెంతవాండనమ్మ | 87 40

లక్ష్మీ కటాక్షము జనని, మహాపరాధముల జన్మగ్భహంబులమైన మమ్ము బో లిన మనుజాళిమీందశుభలీలం గృపాసుధం జిల్మరింతు వీ వనుట నిజంబు- సంగరమునందు దశాస్యుండు క్రుంగ, రాక్షసాం గనలను [మింగంగోరి యడుగన్‌, హనుమంతుని కోర్కిందీర్చితే ! 88 వాయసరూపశాత్రవునిపట్ల నయోమయమైన నీ మనో నాయకు మానసమ్ము “శరణమ్మని వైరి శిరంబు వంపంగాం జేయంబడదెన్‌ ద్రవీకృతము శ్రీమతి, నీదు దయారసంబుచే, నీయిల నెంత గట్టి యినుమేనింగరంగునుగా రసంబుచేన్‌ ! 89 అరయ, శ్రీవత్సభాసిత హరిభుజాంత రశుభగోష్టస్థవై భ్రితవ్రాతములకు నమృతమిడు కామగవిని నిన్నాశయించి నాండ, క్షీరాబ్టిజాత, యానందరూప ! 90 సూరివర్యులకేది వచోవిధేయ, మేది భవతారకము, దాని నోదయాప యోధి, నీ నామధేయమే సాధకుండు జ పించు, నతండొందు (శ్రేయోఖివృద్ధి, దేవి ! 91 నా కవితాసరస్వతి జనార్దనమానసరంజనార్ధమై యో కలశాబ్ధికన్య, మహిమోజ్జ్వలమైన భవద్దుణావళిన్‌ గైకొని నీదు నామసుమన స్తతింగూరిచి, దండగట్టిడుం గాక విశిష్టసౌరభము గల్టిన తావకకంఠభూషగాన్‌ ! 92 నీ సోదరుండు కలానిధి, నీ సూనుండు మన్మథుండు, నీసౌందర్యం బాసేచనకము, సహజం బీ సంఘటనంబు భగవతీ, శ్రీదేవీ ! 93 స్వమకుటస్థిత కల్చ్పక ప్రసవ పుంజ మంజు మకరందధారల మఘవ ముఖ్య దివిజు లభిషేక మొనరింట్రు దేని నన్వ హంబు, తత్పదయుగము నే నాశయింతు, ర్య త్తే

లక్ష్మీ కటాక్షము హరి సఖీ, నీదు చరణద్వయంబు తార కంబు సంసార మకరాలయంబునకు- ని జంబు భవదీయచరణావలంబి నఖవి తతికి సైతము తారకత్వంబు గలదు. 95 అమ్మ, సురాదిమాన్యము శుభావహమున్‌ విధుతోపసర్గమున్‌ సమ్మదకారణంబు మృదుచారుసువర్ణము త్వత్పదంబు ని త్యమ్ము జపించునే నరుండు, తప్పక వాం డరమాపదంబు దూ రమ్ముగ నెట్టివేయును, దిరమ్మిది సాగరకన్యకామణీ ! 96 తల్లి, యెవ్వండు నీ పదద్వయముంగొల్చు నతందు (శీతులకు ద్విపదుండా అధిపుండగును- కొలువకున్నట్టి యాతం డీ కువలయమున వ్యవహరింపంగంబడుం జతుప్పదపదమున. 97 పూను విధుండు మౌళి, దేని లాక్షారాగ మును బరాగమును జననిరా, దానిం బంకజత్రపాద భవదీయ పాదమున్‌ భవము దాటుపొంటెం బట్టుకొంటి. 98 పరమానందధుమూలకందములు నీ పాదారవిందంబు, ల చ్చరపూంబోణులు కల్చసూనముల నిచ్చల్‌ వానింబూజింతు, 650 దిర, బృందారకసుందరీమణులతో నేం బోటికిన్‌ నిల్వం గొ ల్తురుపో, నీ పదభక్తి నా కొసంగుమీ, లోకైకదీపాంకురా ! 99 తావకపూజ్యపాదరుచిం దల్లిరొ, యెవ్వండు మచ్చరించు నా జీవుని మోముంజూచుట నిషిద్ధము - చూడరు వృద్ధికాము, లి ట్ల, వచియింతు రార్యు, 'లుదయించు రవిన్‌ గనరా దటంచ్చు, శ్రీ దేవి, యొనర్పుమీ ననుం ద్వదీయపదాంబుజభక్తియుక్తుగాన్‌. 100 త్రిగుణాతీత, భవత్సుతుం డగణితుండు హిరణ్యగర్భుందని వర్ణించున్‌ నిగమములు : తగినతనయుండె భగవతి, పుట్టెను హిరణ్యవర్ణకు నీకున్‌. 101 త్త

లక్ష్మీ కటాక్షము ఆత్మయందు జ్ఞాన, మర్మునిలోవెల్లు, చంద్రునందు జ్యోత్స్న చదల ధ్వనియు, బంగరువున వన్నె పాలలో నేయియు నీవ యగుదువమ్మ దేవదేవి ! 102 చక్రసంచార మొనరించు సమయమందు పద్మలత సామ్యమొంది, శోభాపరంప రలను వెలయించు శక్తివి, పలుకులకును మనసున కగోచరంబు నీ మహిమ, తల్లి ! 103 ఇంద్రియముల కధిష్టాత్రి వీవు, దేవి, హస్తినాదప్రబోధిని వంబ, నీవు, నీతిశాలుర లక్షించి ప్రీతినెఐపు జీవనజ్యోతి, శరణు చొచ్చితిని నిన్ను. 104 సమ్మతిమెయి, సాధకు గా త్ర మ్మానందామృతమునం దడిపి, యతనికిన్‌ నెమ్మిన్‌ దృషప్తిం గూర్చెడి యమ్మవు (ప్రేమస్వరూప వాద్యవు పద్మా! 105 హరిణివి, గంధద్వారవు, సురసేవ్యవు, సూర్యకాంతిశోభితవు, పరా తృరతత్త్వంబ వుదారవు, పురుషార్ధప్రదవు నిత్యపుష్టవు, దేవీ ! 106 జనని, యార్ధవు పద్మమాలినివి పూర్ణ కామ వీంబీజవాచ్యవు కామకళవు పుష్కరిణివి దురాధర్నవున్‌ సమస్త భూతతతి కీశ్వరివి, బోధమూర్తి వీవు. 107 పుట్టువొందితి నీ రాష్ట్రమున, ననుగ్ర హింపం బడుదునుగావుత, వృద్ధి కీర్తి మణియు నా కొదవుగాత, శ్రీమాత, యజ్ఞ పురుషుందును నీవు నన్ను నోముదురుగాత ! 108

  • ఓీం తత్సత్‌ - త్ర

సునీ ఉన్మత్త దీక్షైతము (శ్రీ మదప్పయ దీక్షితేంద్రులవారి ఆత్మార్పణ స్తవోదంతము) డడ

అంకితము పొనరన్‌ నాయెడం గూరిమిన్‌ నెలిపు మా మోచెర్ల కోటీశ్వరా ఖ్యునకున్‌ సాంబశివార్చనాభ్యుదయ భాగ్యోల్లాసికిన్‌ సాధువ ర్తన విద్వజ్ఞన దేవతాయతన సంరకైక దీక్షానిబ ద్ధున కీ నాకృతిరత్న మంకితమొనర్హున్‌ (బ్రేమచిహ్నంబుగాన్‌. మోచెర్ల రామకృష్ణ కవి. తీర్‌

అనఘుం డప్పయదీక్షికుండను ఘనుండన్వైత వేదాంత ద రృన పారంగతుం డుండె నాక్కండు, మనీషాభూషణుండైన యా యన కీశుండును గేశవుండును సమానారాధ్యులయ్యున్‌ మహే శుని ధ్యానించు, శివార్చనంబి యొనరించున్‌ బుణ్యుండెల్లప్పుడున్‌. క్ష ఆ. వె. “భువనములకు విభుండు శివుండు మహేశుండు

విష్ణుం డంతరాత్మ విశ్వమునకు :

ఇంచుకేని వీరి యిరువురి యందును

లేదు నాకు వస్తుఖేదబుద్ధి, లై కంఠ వాని తరుణేందుశేఖరు

పై నెలకొనియుండు నాదుభావం” బనియెన్‌

ధీనిధి యప్పయదీక్షితుం

దేనోహర మేతడీయ వృత్తం బరయన్‌. 3 కం॥ విన్నాణీయయ్యె నాతండు

పిన్న వయస్సుననె, వేదవిద్యావిదుండ

మయ్యె, న్నిగమాంతరహస్యము

ల న్ని పుణతనెజపి నిట్టలమ్మున నేర్చెన్‌, | కం॥ వళత్‌ పండితకృతు ల

ద్వైతమతన్థాపకములు (బ్రహ్మానంద

ద్యోతకములు 'శ్రుతిపితములు

పొతకవినివారకములు భవతారకముల్‌, ర్‌ ఉ॥ _ ధీమహిమన్‌ శివార్మమణిదీపిక నాతడు వెల్వరింపంగా

ఆమహనీయమైన కృతియందలి మర్మములన్‌ గగ్రహింవ, మే

ధామధురాకృతుల్‌ శివపదప్రవణాత్ములు శిష్యులైరి, శో

భఖామతులైనవా రయిదు సందలమంది గణించి చూడంగన్‌. 6 కం! _ శైహడ్వైతము శిష్యులు

భూవలయమునన్‌ (బ్రచారమున్‌ సలిపిరి, తక

పావన తాత్త్విక సుమన

థ్భీవిభవము దశదిశల విజృంభింపగన్‌. 7

త్ర

ఉన్మత్త దీక్షితము గ్‌! అమలుందాతండు వాజపేయంబొనర్భి యవబ్బధస్నాన మొనరించినట్టి తథిని సుప్రసిద్దుండు తంజాపురప్రభుండు కడంగి యాపూజ్యునికి వెల్లగాడుగువట్టె. తి గ చిర మనుభవించె వేలూరు చిన్నబొౌమ్మ నాయకాస్థాన కవివరేణ్యప్రశస్తి. పడసెం గనకాభిషేకంబువంటి వెన్నా దివ్యసత్కృతు లప్పయ్యదీక్షితుండు. 9 ఆ.వె! ధన్యుండతండు సంస్కృతమున రచించిన హృద్యమైన గద్యపద్యకృతులు నూటనాల్లు దొరకె నేంటికి గీర్వాణ వాగ్విలాసరసిక భాగ్యవశత. 10 ఆ.వె; ఆంధ్రభాషయన్న ఆంధ్రులన్నను యజు శ్శాఖయన్న అవిచక్షణుండు అనుపమానమైన యభిమానమువెలార్చు చుండు. దాను ద్రావిడుండెి యెన. క్షే గీ జగతి నాంధ్రత్వ మాంధ్రభాషయు యజుస్సు మరియు భ్రాభాకరపరిశమము ననల్బ పూర్వజన్మతపఃఫలమ్ములుగం దలంచి తెలిపె శిష్యుల కప్పయ్యదీక్షికుండు. 12 ఆ.వె! యోగసిద్ధుండాతం డొక్కనాం డుమ్మెత్త కాయ నూథి నీటంగలిపి త్రావి చేసినట్టిపనిని శిష్యులతోం జెప్పి యిచ్చ వారి కానతిచ్చె నిట్లు. 18 కం ఉండుండు నాసన్నిధిలో రెండున్నరగడియ జాగరితలై మీరల్‌ నిండు మెలంకువతో వ్రా యుండీ నానోట వెడలుచుందెడి నుడులన్‌ కేశ త్త

ఉన్మత్త దీక్షితము గీ; విణుపుమందిది, దీనిం ద్రావిపవలయు అరసి నిర్దిషస్టముయాంతమందు నాకు, మద్యథాపూర్వసుస్టితి మరలివచ్చుం 15 జెప్పినట్టు లౌనర్చుండ్‌ శిష్యులార ! క0॥ ఏ వంవిధమునం బలికిన యావల గుర్తింపంగలిగి రంతేవాసుల్‌ పావనుండగు తమసద్గురు 1 దేవుండు శివుండు వామదేవుం డనుచున్‌ అ.వె। హాలహలముం ద్రావినట్టి పురారి కే హానిగలిగె నపుడు వానివలన? అపరశంభువైన అప్పయ్య దీక్షితు నేమిసేయు ధూర్తవృజిన వృత్తి? క్షే శా ఆయున్మత్తర సానుభావభవభక్త్యావేశమాత్మార్చణ శ్రేయో రూపకనిస్తుల స్తుతిగమాటెన్‌, వెల్వదెన్‌, దీక్షితా గ్రీయాస్యాంబుజ మాకరందలహరీ శృంగారభంగీశివా దాయ శ్రీయుతసూనసౌరభపరార్థప్రాభవో పేతగాన్‌ షరి గ్‌! గంటములనూని శిష్యప్రకాందడులెల్ల రక్తి రేకొత్త దాళపత్రముల వ్రాసి నట్టి * యాత్మార్చణస్తుతి నామహాత్ము కృతిని వినిపించిరాయన కీవిధమున. 19

  • శ్రీమదప్పయదీక్షితేంద్రకృతమైన ఆత్మార్పణస్తుతికి నాయాంధ్రీకృతి. డి

ఉన్మత్త దీక్షితము ఆత్మార్పణస్తుతి

గీ ఇపుడె నీయద్దుదమ్మిదోయికి గిరీశ,

నన్ను నే నర్చముచేసికొన్నవాండ,

లేదు గత్యంతరమ్ము, నన్నాదుకొమ్ము,

అద్రికన్యాధినాథ, సర్వాంతరాత్మ |! 20 ఆ.వె॥ నీదు శివపదమ్ము నేనెజుంగను, గ్రియా

యోగచర్య లెట్టివో యెటుంగ,

నాకు నీదు పాదనలినమ్ములే దిక్కు

పాహిమాం మహేశ, వాహిపాహి! 2 మ భువనస్రష్టను వేల్చుంబెద్దనొకనిన్‌ బుట్టించి మున్నేకవి

ప్రవరుం డాయనకిచ్చె వేదములు శాస్త్రంబుల్‌ పురాణంబు, లా

భవు నాద్యున్‌ గురు ధీప్రకాశు నభవున్‌ భర్ణున్‌ నినున్‌ బార్వతీ

ధవునిన్‌ నే నిపుడాశ్రయింతు భవబాధన్‌ దీర్చి రక్షింపంగాన్‌ 22 శా; శంభూ, కేవల కుక్షిపూరణ కళాసంరంభచాతుర్యవాక్‌

సంభారం బసకృత్‌ పృథగ్దన సమజ్ఞా సంస్తవోచ్చిష్ట, మీ

దంభోపాయనమున్‌ ద్వదం[ఘ్రికమలద్వంద్వంబునన్‌ బెట్టి, వి

(్రంభ ద్రోహమొనర్చినాండ, నపచారం బిద్ది 'సైరింపుమీ ! 28 మ॥ కృపమై నాయపరాధముల్‌ సయిచి రక్షింపందగున్‌ సాంబ, యీ

విపదంభోనిధి మున్గుచున్న నను; రావే దేవదేవా, భవా,

త్రిపురారీ, గతి నీపదాబ్బయుగమే దీనుండనా నాకు, న

న్నిపుడే నీవు సముద్ధరింపవలెం తండ్రీ, సర్వలోకేశ్వరా ! 24 మ॥ సకలజ్ఞుండవు పూర్ణశక్తివి దయాసారా మృతాంబోధి వీ

వు, కపర్టీ, విపదబ్ధిమగ్ను నను దుర్చుద్ధికా హతాశుకా గణిం

పక నీ వేటికుపేక్ష సేయ? నృపశుకా భగ్నాశయుకా మాదృశుకా

జకితుక్‌ బ్రోచిన యాతండేకద ప్రశంసాపాత్రుండీధాత్రిలోకా. 25 మ॥ _ ప్రమథాధీశ్వర, ముక్తి పద్ధతులు కర్మజ్ఞాన యోగాది దు

ర్గమ మార్గమ్ములు నాకసాధ్యములు దుర్గానాయకా, పాపస

క్తము మచ్చిత్తము నిగ్రహించు శమసత్త్వస్ఫూర్తిలే, దంధకూ

పమునళ౯ా వందురు నా కొసంగు మభయం బాలంబమార్యాప్రియా ! 26

త్తం

ఉన్మత్త దీక్షితము ఉ॥ హేయపుటాజవంజవము హేతువుగా నొనరించు నీశ, యె న్నీ యఘముల్‌ జగమ్మున మనుష్యుండు, శ్వాస లయించు నత్తజిన్‌ స్వీయమనస్సు త్వత్పదకుశేశయలగ్న మొనర్చి పొందు ని శ్చేయస మందు : సన్నిహిత మృత్యువు నిన్ను భజింపంగల్లునా? 27 శా ఓ మృత్యుంజయ, నాకు సాధ్యమటె ప్రాజోత్రాంతివేళ౯ా భవ న్నామం బేను జపింప, నామది భవత్పాదంబులక౯ నిల్బంగా స్వామీ, బాధిత సంధిబంధములతోం బ్రజ్ఞావిహీనుండనై (ఢ్రేమోత్తంభిత బంధురోదనసముద్విగ్నుండనై యుండగఃా ? 28 గ ఆత్మబోధౌషధమున భవామయమ్ముం బాపి, భక్తులం గాపాడు స్వామివంచు శరణుజొచ్చితి వరదు నిన్‌ బరమశివుని సర్వగీర్వాణవంద్యు సంసార వైద్యు 29 ఉ॥ శ్రీమదుమాపతీ, భ్రమణశీలుండ, (శ్రాంతుండ, నేను దీనశా ఖా మృగతుల్యుండకా, సలుపంగాందగు కార్యమెదో యెజుంగలే క్తీమెయి నిట్లు వందురెడి యీ వివృతాస్యుని, జూచుచున్నవో నేమిఫలంబు నీకొదవు ? నిప్పుడె తప్పక వీని, బ్రోవుమీ ! 80 ఉ॥ కామవిపక్ష యంతమునంగంఠగతాసుకలావలోకనో ద్దామ విపద్దశాప్తరుదితక్షుభితస్థితిలో నరుంతుదో (గ్రామయవేదనానుభవకష్టము నాకొనంగూడెనేనియుక్‌, నామది తావకీనచరణద్వయమందె వసించుంగావుతకా ! త్రై శా నా జీవాత్మ భవత్‌ పదాంబుజములన్‌ లగ్నంబగుంగాత, గౌ రీజాన్సీ యసువర్గ నిర్గమన నిర్వేదంబు లెక్కింప, కు ద్వేజాధీరవిలాపముల్‌ వినక, శుగ్విద్ధాంతరంగా(శుద్భ (గ్రాజీవప్రకరంబులకా గనక శర్వా, యంతకాలంబునక. 82 మ॥ కమనీయస్మిత శోభితాననముతో ఖండేందుబింబావతం సముతో విస్ఫుట మల్లికాసుమసమ స్వచ్చస్వరూపంబుతో ఉమతో నుజ్జ్వలరత్న పీఠిపయి నీవుండన్‌ బుషుల్‌ గాంచు ద్భ శ్యము నా చూడ్చికి వేడ్మసేయవలయున్‌ సర్వేశ, యెల్లప్పుడున్‌. 33 క్‌

ఉన్మత్త దీక్షైతము చం॥ పితృవనభూములందొ సరవికా రజతాచలమందా మేరుప ర్వతమునయందా వేద్మగదురకా- విహరింతువుగాక, పార్వతీ పతి, కొనిపొమ్ము నీ వెనుక వచ్చెద, మోసెద నీదు పాదుకా ద్వితయము, నాకొసంగుము నిధికా, వెల లేనిది నీదు సన్నిధిన్‌. ౩4 ఉ॥ జ్ఞానమయస్వరూపక, యనన్యమనస్కుండనై యిదంకృతిన్‌ నేను రచింపకున్న నిది నిక్కముగా భగవన్నిబద్ధమే మైనది, గాన, వాక్కు లుపహారముగా నిడినాండంగావునక దీను భవాబ్ధిమగ్ను, గరుణింపుము నన్ను సముద్దరింపుమీ 1!” 8ెర్‌ కం॥ ఇది సూరిస్తుతమగు కృతి, చదివిన సుకృతులకు వినిన సాధువులకు నిం పొదవించు నిహమునన్‌ శివ పదసంపాదన విశేష భాగ్యము నొసంగున్‌ గ్‌! అతిపవిత్రచరిత్రుం డాంధ్రాభఖిమాని గణ్యుం డప్పయదీక్షితు కథ గ్రహించి సింహనగరాధివక్త మోచెన్త రామ కృష్ణకవి భక్తియుక్తి నీకృతిరచించె. ఓం తత్సత్‌. ల్‌ గ డుండరయ్య గం న నం...

  • క జ శ క లిం న్‌ బల ఇక గ కు ల్‌

. (పునర్ముద్రింపవలసినవి)

  1. శారదా ప్రసాదః - సంస్కృతకావ్యము

  2. ప్రచండ భార్గవము _.. నాటకము

  3. అనర్గళ భార్గవము _.. నాటకము |

  4. _ ధ్రువరూపకము - నాటకము

  5. ఛత్రపతి శివాజీ -.. నాటకము

  6. (ప్రేమ చిహ్నము _.. గేయనాటిక

  7. కథాకావ్య మణిమంజూష - కావ్యము

  8. మారుతి -.. శతకము

  9. రమణానందలహరి -.. స్తోత్రకావ్యము - జ

  10. కర్పూర నీరాజనము -... కావ్యము .

  11. గురుదేవ చరిత్రము -.. గద్యము “ల

  12. త్యాగమహిమ -... గద్యము

  13. తెలుగు రచయిత్రులు =. గద్యము .. .

  14. కల్యాణవాణి - ఖండ కావ్యకదంబము . +

  15. అభిజ్ఞాన శాకుంతలము చ్‌

  16. విక్రమోర్వశీయము

  17. మాళవికాగ్నిమిత్రము

  18. గంగాలహరి

.... 19. హంస సందేశము . 20. ఆత్మ బోధము - 21. కామ శుద్ధి " 22. గిరిజా కల్యాణము (

⚠️ **GitHub.com Fallback** ⚠️