Telugu alochanaamayukamulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

(వైవిధ్యభరితమైన కవితల సంపుటి. కఠినపద అర్ధములతో సహి) . . అడి . శ్రీమంతులసుబ్బారావు లు

(ల న ం -. ॥ న [, ॥ స్ట క మే | య యు. 1. | ం "

వను. 'ధించీండి - ఆనందించండి - లభిస్తాయం తెలియజేయండి

ఇ 4 సంలు య ం ౨. భి థి సారి తెలుగు సాహిత్యాభిమానులకు యివ్వండి

(6 స్టోభకకొల్‌ యూ. ప్రబోధ వ్ల్‌ష్‌వన వబ్రనాళ్యక ప్రయుక్తములైన కవితలు) “(6౫:౩ ్‌ స్మ టా 'శ్రీమ్రులత ల్లఘ్లుబ్బారావు బి. కామ్‌ వ సస. 1! | ల ర లి 1 క ళా కృతికర్త చిరునామ: ప్లాట్‌ నెం. 58, ఫ్లాట్‌ నెం.101, కె.పి. రెసిడెన్సి, సి.హెచ్‌. ప్రతాప్‌రెడ్డి కాలని, ఖుత్సుల్లాపూర్‌, హైదరాబాద్‌-500 ౦54. ఫోన్‌: ౦4౦0-2317 3౦04 సెల్‌ 9397085585 మి 1765 ప£న్‌1 ౮౫ 520010 +. ౧030న ఉగమటుుగుుం (“గ 6611 : 860190280119, 9912157123

య మల

సఖీ. న. వ. రి ను క. "కలకలం సారె! [స రా 11

  1. వర్నాధిక్యము 17

  2. నీసొగసు చూస్తుంటే 18

  3. _ సామరస్యపు వెలుగు రేఖలు 21

11... సందియము 23

  1. మగువల్లారా జాగ్రత్త! 25

  2. వసంతమా కాస్తంత ఆగుమా 26

14 కవితా సౌందర్యము 27

  1. మిణుగుబులు 28

  2. చదువ నేర్వండి 30

బి 17. కవికోకిలకు తలిరాకు తాంబూలము 31

నా 18. ఆడదంటే అలుసేలనో 33

గ్హ్‌ 19. నాడు-నేడు 35

లే 20. కులవ్యాళగరళం 37

  1. సమైక్యభారతం లో 38

1 22... నిను కొలుచు నాకు . 4౦0

  1. కలసంకల్పం ___ జ త]

( 24. అపరభగీరథుడు ” “౫. ' స తం!

  1. కైవల్యంకోరవే : . , తద్‌

  2. వమనిపిలవాలి?, 47

పై7. సహృదయ సొహ్లితి తా . ఉం

భదరయ్య గ్రంధాల న్న్మామానసికధోరణి " -...._ క. 51

వ్‌ ంం ౫0. మో కఠినపదాలకు అర్ధమురై ల్ల స ఛే వ ఇకో స్‌ గ్‌! ని కం జత

హాయ తో

_న్లేను-వుట్సి పెరిగినది వన్స్లిత్రి, గోదావరీ నదీ తీరాన విరాజిల్లుచున్న లా న గ్గ ర ఇ రాజమ్లుత, సే హోపమండ్రి.19 ర టిపు ్ట95ల్డ్‌ నుండి 1973 మధ్య కాలంలో ముండ్రిలో విద్యాలస్థై స... చొమ్మట ఉద్యోగ రీత్యా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ త్వర్రతగె నర్దస్థ ౫ ఖల శ్రర: ౨ ర ఇట్‌ నుండి దాని యితర శాఖలగు వసు తిరుపతి స్టుశాఖ కాకి; రా! ండ్రీ. విశాఖ (ద్వితీయ పర్యాయం) మరియు గ విజయ్యన్ష 'ఇమ్లుల్లోవివిర్తహాటద్యల సః ”' నిర్వహణ గావించి ౩౦-4-1998లో స్వచ్చంద వదవీ పం చేతో 1 ఢిల్లీల్ఫో ప్ర సంగ సంస్థ శాఖలో చేరక ముందు అనగా

3-9-1974 కళ య్హ్య్య్టైవేటు సంస్థ ద్యోగం చేసాను.

1999 ఆగస్టు నెలలో హైదరాబాదుకి మళాం మార్చి ప్రైవేటు సంస్థలలో ఆరు సంవత్సరముల కాలం పాటు ఉద్యోగం చేసి 2009 ఫిబ్రవరిలో చద్యోగ జీవితానికి స్వస్తి పలికాను. మొత్తం మీద వ్యవధి దొరికినప్పుడల్లా విశాఖలో నైతేనేమి హైదరాబాదులో నైతేనేమి ఐదు సంవత్సరాలు మాత్రమే తెలుగు భాషా సాహిత్యం చదివేను. నా కాలేజీ జీవితము నుండి ఆంగ్ల భాషా సాహిత్యమును చదువ నారంభించి 1996లో తెలుగు భాష వైపుకు దృష్టీ మరల్చేను. అంతకు ముందు చానాళ్ళ క్రితం డెక్కన్‌ క్రానికల్‌లో నా ఉత్తరాలు ప్రచురింప

వివరాలు యివిగో పాఠక మహాశయులారా.

  1. లైఫ్‌ ట్యాక్స్‌ ఆన్‌ టూ వీలర్స్‌ 30-10- 1988)

  2. ఎప్రెన్‌టీస్‌షిప్‌ యిన్‌ లా (18-11- 1988)

  3. స్పిరిట్యయల్‌ నాలెడ్డ (24-1- 1990)

పై ఉత్తరములు ప్రచురణ అయిన తరువాత తృప్తి చెంది అ దిశగా యింక ప్రయాణించ లేదు. వ్యాన రచనా ప్రక్రియలో కృషి సలిపి యుండెదనేని తప్పక ఆంగ్లంలో ఆర్టికల్స్‌ వ్రాసుండెడివాడిని. నేను ఆంగ్లంలో బాగా రాస్తానని మాట్లాదకానని ఎకౌంటెంట్‌గా నా విధి నిర్వహణ బాగుంటుందని మా వార్ళాగనన్‌లో అందరూ అనుకొనే వాళ్లు. అప్పట్లో చాల మంది వివిధ రకాలైన లెటర్సు. మెమోలక్టు సమాధానాలు నాతోవ్రాయించుకొనే వారు. సంస్కృతాంధ్ర భాషలలోని మాధ్దుర్మర్హి చవి 'చ్రూచిన నేన్తుకెస్పిన్లుర్లబి వానిని చ్రదిల్సి యుండుంటే ఎంత బాగుండేదన్సి చసుంలొష్మద పదను? ననే స! వగా గ /. చేసికొని మిమ్ములను విసిగి కల్ల దున్నక్షష్ష లల సం స్‌ గ్‌ సాహితి-నేను-ఈ నా కవితో సం అన అంశమును బి వరన ఆనసున్నాను.

ఫ్‌ షో లం స.

సహృదయ సాహితి-నేను-ఈ నా కవితా సంపుటి ॥ నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థ శాఖలో ఉద్యోగిగా ఉన్న రోజులలో ఆగస్టు 1996లో సహృదయ సాహితి (సాహితీ సంస్థ్రలో సభ్యత్వము పొంది జూలై 1999 వరకు చాల నెలలు కేవలం సభ్యునిగా నుండుటయే గాక చివరి కాలంలో కొన్ని నెలల పాటు సహాయక కార్యదర్శిగా వ్యవహరించేను. ఆర్‌.టి.సి కాంప్లెక్స్‌ భవనములో నున్న రాష్టసమాచార కేంద్రములో ప్రతి బుధవారం శోతలతో సహా అందరము సమావేశమయి స్వీయరచనా పరనం చేసేవాళ్లం. పైన వివరించిన కాలంలో అప్పుడప్పుడు నేను చదివి వినిపించిన కవితలే యీ పుస్తకమునందు పొందుపరచబడినవి. నా కవితలకు కూడ మంచి స్పందన లభించేది. నేను సహృదయలో సభ్యునిగా నున్న రోజులలోనే ఆ నంస్థ అష్టాదశ వైజయంతిక జరుపుకొంది. ఇప్పటికి ముప్పది వసంతాలు పూర్రిచేసికొని యింకనూ ఉనికిని కోల్పోకుండా ఉందంటే ఆశ్చర్యంగా లేదూ. అది ఆ సంస్థ వ్యవస్థాపకాధ్యక్షులు చిత్రకవి ఆజ్రేయ గారి సహృదయతకు నిదర్శనం. సహృదయ సొహితి విశాఖలో 24-02-1980న ఆవిర్భవించింది. దానికి యిప్పటికీ కార్యదర్శి శేఖరమంతి (ప్రభాకరరావు గారే. తూర్చు గోదావరి జిల్లా శాఖ (కాకినాడ) అధ్యక్షులు డా॥ వేదుల శ్రీరామశర్మ (శిరీషు. ఇంకనూ వేరే శాఖలేమైనా ఉన్నవేమో నాకు తెలియదు.

నేను సహృదయలో సభ్యునిగా చేరిన మొట్టమొదటి రోజున నా ఆశయాన్ని మలిరెడ్డి చంద్రశేఖర రెడ్డి (౦011 500/8) గారికి తెలుపగా మనమంతా సుబ్బారావుగారి ఆకాంక్ష నెరవేరాలని భగవంతుని ్రార్ధిద్దాం అని సభాముఖంగా ఆయన అన్నారు. ఆయన నోటి చలువ ఫలితంగా “గీతమాలిక అను నా పుస్తకం ఆవిర్భవించింది. దానిని మలి ముద్రణలో రీసెట్‌ చేయాల్సుంటుంది. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు.

“నీ గ్రివమె కంబువు, నీ జీవమె ఆనందసింధువు” అన్న వాక్యములను విన్న శ్రీ చిత్రకవి ఆత్రేయ బావుంది బావుంది అన్నారు. ఆరోజు కవిసమ్మేళనంలో రచయితలు శ్రోతలు వేదికనలంకరించిన విద్వజ్ఞనుల సమక్షములో చదివి వినిపించిన కవిత (నెం.9) లోనిదీ వాక్యము.

“కులవ్యాళగరళం” అనే కవితను శ్రీ పేరాల భరతశర్మ (అవధాన సరస్వతి" 'కవిపంచానని రిటైర్జు ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ మహారాజ సంస్కుతకళాశాల, విజయనగరం) ప్రశంసించేరు. ఇది కూడా రాష్ట్ర సమాచార కేంద్రంలో సభలో చదవబడిన కవితే. “లోకానికి లోకువ అనైక్యత, అభ్యుదయానికి వేకువ సమైక్యత”

అను వాక్యములు (కవిత నెం.21) కొత్తూర్తి భాస్మరరావు గారి మనసును బాగా ఆకట్టుకున్నాయ్‌.

టౌన్‌హాల్లో చదివిన “కలసంకల్పం” అను నా కవితను విన్న వేదిక మీద నున్న ప్రముఖ కవి, విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు గారు నా జీవితాశయం తప్పక నెరవేరుళుందని నన్ను ఆశీర్వదించేరు. వారికి కూడా నా కృతజ్ఞతాభివందనములు.

రాష్ట్ర సమాచార కేంద్రంలో జరిగిన కవిసమ్మేళనంలో శ్రీమతి కోవెల నన్ను వారి స్నేహితులకు పరిచయం చేస్తూ “వీరి పేరు శ్రీమంతుల సుబ్బారావు, కవితలు బాగా వ్రాస్తారు” అన్నారు. హోటల్‌ మేఘాలయలో నిర్వహింపబడిన సాహితీ సభకు నేను హాజరగుటకు వెళ్లినపుడు శ్రీ కొత్తూర్తి భాస్మరరావు వారి మిత్రులైన న్యాయవాదికి నన్ను పరిచయం చేస్తూ నేను కవితలు బాగా వ్రాస్తనన్న విషయం ఆయన చెవిన వేశారు. సుస్వాంతులైన కోవెల గార్కి భాస్కరరావు గార్కి నా నమస్సుమాంజలులు. ఎవరిలోనైనా యే కొద్దిపాటి ప్రజ్ఞాపాటవములున్నా వానిని యితరుల ముందు వెల్లడి చేయడం సంస్కారం మూత్తీభవించిన వారికే సాధ్యం. ఇది అక్షర సత్యం. శల హైదరాబాద్‌, చింతల్‌లో నున్న కొత్తగా నాకు మిత్రులైన ఎన్నో పాటలు, పద్యములు, కవితల పుస్తకాలు వ్రాసిన ఒక సుకవి తనంతట తానే ఈ నా పుస్తకానికి ముందు మాట వ్రాస్తానని ముందుకి వచ్చారు. పుస్కక్రావిష్క్మరణ చేయించుకోండి ఎంతో ఖర్చవదని సలహా కూడా యిస్తూ సందర్భాన్ని పురస్కరించుకొని మిక్కిలి ప్రసిద్ధికెక్కిన నానుడి కూడా వినిపించేరు. కాని అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉ న్న వ్యక్తి వెనుకంజ వేసిన కారణంగా నేను ఆయనచే ముందు మాట వ్రాయించే విషయాన్ని నిద్రపుచ్చాను. దాని వెనుక ఎవరి హస్తం ఉందో నాకు బాగా తెలుసు ఎందుకో వాళ్లకంత బాధ. నాకర్ధం కావడం లేదు. అ.ర.సం., వి.ర సం. సభ్యుల దగ్గరకి వెళితే బేఖాతరుగా క్షణాల్లో చక్కటి ముందు మాటలు వ్రాసి నాకు సగౌరవంగా అందిస్తారు. హైదరాబాదులో ఎటువంటి కవితలనైనా ఎవరితోను కుమ్మక్కవకుందడా ప్రింటుచేసి యిచ్చే (ప్రెన్లున్నట్లు తెలిసింది. ఇప్పటికే పుస్తక ముద్రణలో చాల జాష్యం చోటుచేసికొన్న కారణాన ఆ విషయానికి గుడ్‌ బై చెప్పితిని. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ దగ్గరకు వెళ్లి నేననుకొన్న వారిచే ముందు మాటలు (వ్రాయించుకోగల సామర్థ్యం నాకుంది. ఆ విషయాన్ని యిక్కడితో విడిచి పెట్టేద్దాం. శే ఈ పుస్తకంపై ఎవరైనా సహృదయ పాఠకులు, రచయితలు తమ అమూల్యమైన అభిప్రాయములను, ముందు మాటలను నిర్మోమోటముగా ఎవరి విషపూరితమైన మాటల వలనను ్రభావిళులు కానివారలై వ్రాసి పంపిస్తే ఆనందంతో స్వీకరించి మలి ముద్రణలో వానిని ప్రచురింప జేసి పుస్తకావిష్కరణ చేయించుకొంటాను.

రచనా శక్తి పరిపక్వానికి రాక ముందే రచనలు చేపడిజే అవి ఎక్కువ కాలం కొనసాగవని డా॥ పి.వి. చలపతిరావు గారు వారి పుస్తకమగు “రాదగిన వ్యాసముల” యందు తెలియపరుస్తూ పుస్తక పఠనం విజ్ఞాన దాయకమే గాక మనశ్శాంతిని, ఆనందాన్ని మరియు ఆత్మతృప్తిని ప్రసాదిస్తుందని పుస్తకాన్ని శ్లాఘించేరు “నివేదనము” లో తెలియజేసినట్టు నాకు ఆటంకం కలిగించడం కూడా ఒక విధంగా మంచిదైంది. వేటూరి సుందరరామమూర్తి గారిలా పది నిమిషాలలో హృదయాన్ని హత్తుకొనేలా పాట రాయడం ఎవరివలనా కాదు. ఆయన నాకునూ అభిమానియే, ఆయన గురించి త్వరలో పాఠక లోకానికి నేను అందించబోయే వేరోక పుస్తకములో వివరిస్తాను, వారి అభిమానిగా. శ౯ నేను ప్రముఖ సినీ దర్శకులు కీ॥శే॥ ఇవి.వి. సత్యనారాయణ గారి యింటికి వెళ్లినపుడు (2002 లో) నా పాటలు వారు ఎక్కడ తీసుకొంటారో నని అర్ధగంటకు పైగా వారితో మాట్లాడి వారిచే నా అభిలాషను నెరవేరకుందా చేసారు. వారి ఆఫీసు మానేజరు మీరు కథలేమైనా వ్రాయండి తీసుకొంటాం అన్నారు. ప్రాజ్ఞులైన మీరంతా దానిలోని ఆంతర్య మేమయ్యుంటుందో గ్రహించండి. 113 2 01603008 11 61580136 109౬ 02%/ 280061626అ 02 0600౧06 &క్ర0064 ౪7116 శేషేంద్ర దానికి తార్మాణం. ఆ దారి వెంబడే నే పయనించి ఆశయసిద్ధి పొందాలని దీవించండి.

మా నాన్నగారితో ఒక జ్యోతిషుడు మీ అబ్బాయికి వృద్ధాప్య దశలో సమాజంలో మంచి పేరుప్రఖ్యాతులు వస్తాయి అంటూ అప్పటివరకూ మీరు (బ్రతికుంటారో లేదో నే చెప్పలేనన్నాడు. 1996 లో మా నాన్నగారు దివంగతులయ్యారు. కాని యీ విధంగా పేరు రావడం (11 సంవత్సరాలుగా) నాకు అంతగా యిష్టం లేకపోయినా చాల మంది యిష్టపడి యెన్నుకొనే మార్గమైయున్నది. పుస్తక విస్తరణ ముద్రణావ్యయ భీతులవలన యింతటితో యీ అంశాన్ని ముగిస్తున్నాను.

సాహితీ కుసుమాంజలులతో మీ విద్వజ్ఞన విధేయుడు శ్రీమంతుల సుబ్బారావు

వారాణసీపురాథీశ్వరా ష। శివనీ నామస్మరణమే నాకు శరణ్యం తవ దివ్యరూపసందర్శ్భనమే నా జన్మకు సాఫల్యం చ॥ _ విరచించ మనసాయె స్వామి రమ్యముగ రవళించు రీతిగ తవ కవితా సరసీరుహమాలిక దీవించుము నీవు దేవగణార్చిత భక్తజనరంజకమగు భావాలు ఉప్పొంగ చేయంగ ముక్తికోరు మనుజులు నీకర్పించు నిత్యనీరాజనమై నిలిచి పోవంగ చ। కరిమబ్బుల తోరణాలు కదిలియాడ నెమిలి పురివిప్పి నాట్యమాడినా కలికి పచ్చదనాలొలికించు సురభి శోభిల్ల కోకిల పాడినా కన్నప్పకు కైవల్యమొసగిన అంతరంగముగల ఆదిశంకరుని అక్కున చేర్చిన కారుణ్యముగల అభవుడవగు నీవే కదా కారణం అంబికానాధుడవైన నీవే కదా డ్రేురణం చ॥ కైలాసతైలవాసా ! కారుణ్యమణిదీపా ! మంచుకన్న చల్లనైన మనసున్న మేటిదొరా ! మహేశ్వరా ! నర్తకీమణులే ఇడుగడచెందు రీతి నటనమాడు నాట్యకళావతంసా ! నీ నటనకు నా గీశతపటలమె కావాలి స్వరర్వురి ఆశ్రిత భక్తజనులు అపవర్గము పొంద ఆ గీతజాలములె కావాలి పుణ్యసోపానాలు హృదయంగమ స్వరగంగా తరంగ సంగమాలు వినుము నా మొర ఓ హరా! నాదశరీరా ! సాక్షాత్కారము ప్రసాదించ రా ఓ నా వారాణసీపురాధీశ్వరా ! అ

న! ప శ్రీరామకృష్ణ సాధుపుంగవా ! ఈ దీనజనుల (బోవ దివి నుండి భువికి మరోసారి అవతారమూర్తివై అరుదెంచవా ! చః పంచభూతముల పరిష్వంగాన ప్రభవించినదీ మేని యని దేవుడే ఈ నేల జీవులనేలే ప్రభువని గ్రహియించని మనుజులు (ఎందరో) గ్రహణము పట్టిన వారిలా కొట్టుమిట్టాడుతున్నారు ఈ ఇల ఈశ్వరుని ఎరుక లేక నరుల-ఉనికి నరకమవుతున్నదీ ఇలాతలములోన చః కలిగిన వారికి కైవల్యమనే పదమే చేదు లేమికి వారసులై మిగిలినవారికి నిను నిందించక పోవకనే పోవదు '్రొద్దు కలిమిలేములకు కారణమేమిటో కష్టసుఖాలకు కారకులెవరో తెలియనివారలకు కనువిప్పు కలిగించ సురగంగవై అరుదెంచవా! చ పుట్టుట గిట్టుట ఆచారమై పరిపరి విధముల పొటులు పదుట (గ్రహచారమై భోగలాలసత్వపు వలలో పడినవారలై నిగమాగమబోధనలే రుచించక యజ్ఞయాగాదుల ఫలములనే తెలియక మానవజన్మ మహిమనే గ్రహియించకున్నారు వీరందరి హృదయక్షేత్రముల భక్తి భావబీజములు నాటగ ముక్తి పథమును చూపగ మరల జనియించి మరికొంతమంది నరేంద్రుల మాకందించగరావా! మా మొరలాలించవా! కొ

చేయూతనివ్వండి చేయండి చేయండి కరతాళధ్వనులు చేయండి కరములు కెందామరల్లా ఎజ్జబారేంతవరకూ, ఎజ్జబారిన కరములు మితిమీరిన హెచ్చుతగ్గుల అంతరాల్ని అంతం చేసేంతవరకూ జనసామాన్యుల హృదయాల్లో కల్లోలం చల్లారేంతవరకూ విష్లవకవిజనహృదయాలు తెప్పరిల్లేంతవరకూ చేయండి చేయండి కరతాళధ్వనులు చేయండి వీడువారిన కవిజనహృదయక్షేత్రాలలో హర్షము వర్షమై కురిసి మోదువారిన చెట్లుచేమలు మోసులెత్తేలా కవనవసంతకాశ్యపిలో వాగ్గేయకవిపికములు ఒళ్లుమరచి కళ్యాణిరాగాలు ఆలపించేలా చేయండి చేయండి కరతాళధ్వనులు చేయండి శబ్దచకోరములు నిశ్శబ్ద శూన్యం నుండి రాలిపడే మధురమరందబిందువుల తనివితీర త్రాగేంతవరకూ చేయండి చేయండి కరతాళధ్వనులు చేయండి ఆ నినాదము కొట్టిన కంచుజేగంటల నిర్జాదమై కవిగుండె కరిగి కంద్లు చెమ్మగిల్లేంత వరకూ అది కాంచిన ప్రతిశ్రోత హృది ఆహ్హాదంతో ఉప్పొంగి అంగజములు అంబుజములల్లే నెగదేంత వరకూ

కవిసేతలు గీతలుకావు అవి భావాడ్రాంత విక్రాంజి వర్దమాలికలు పలుశైలుల శిల్చలావణ్యలతలు పలు రసముల కలబోళలు అవి మదినుపష్పొంగే సంకీర్ణ సృజనాత్మక రసాయనోల్బణతలు పుస్తకావిష్కరణలు దుశ్శాలువల సత్మారాలు, పొగడ్తలు (ప్రతిభకు పట్టువస్త్రాలు కట్టబెట్టుటలు అభరణాల అద్దకాలు అద్దుటలు అభిమానాన్ని చాటే చాటువులు మాత్రమే అవి కవీ అగచాట్లను అణగార్బలేవు. హర్షధ్వానాలు కాగలుగు కేవలం మస్తిష్కాలను మత్తెక్కించే మధుపానాలుగ ముద్రిశాలకు మూల్యం చెల్లించి పుస్తకాలను హస్తగతం చేసుకోకున్న కవి కలానికి శక్తి సన్నగిల్లి - భావోద్దీపనకు ముష్పువాటిల్లుతుంది భావజాలబతలు మరుగుజ్జులై కాలగమనంలో కనుమరుగైపోతాయ్‌ అనర్హమైన కనికార్యాలు అముద్రితాలుగా అంతరిస్తాయ్‌ కవిజనమస్తిష్కాలు అనాదరణల వడగాడ్భులకు శుష్కాలొౌతాయ్‌ కవివరేణ్యులను ఆదరించే అభయహస్తాలు ముందుకొస్తే శుభదినాల కాలమార్గాలు కవులకనుల ముందర గోచరిస్తాయ్‌ (ప్రజల నికేతనాల 'ప్రాంగణాలలో కుసుమింతే పూలుకూడా కవితలనే ప్రసవిస్తాయ్‌ ఇ

కవికలం వాల్మెనా ఐతే (కల్పితం) కవికలం చవులపిలైతే రాసే సిరా కూడా రజ్జువై ఉచ్చు బిగిస్తుంది కవికలం పేలవమైతే పాలింకిన మొక్కజొన్నకంకి కూడా వెక్కిరిస్తుంది రాలిపడే ఉల్కలకు జన్మస్థలమైతే భూస్థాపితమైపోతుంది. దహించే వాల్మెనోలను వహిస్తే అధర్మం ధర్మాన్ని ఉక్కుపాదాల కుక్కపిల్లల తొక్కినట్లు తొక్క కంపిస్తుంది. న్యాయపథంలో నాటే బ్రహ్మజెముడు మట్టలు సైతం భస్మీపటలమై మట్టిలో కలిసిపోతాయ్‌. ప్రజాహక్కులను కాలదన్నుకుపోయే దుష్ట రాజకీయరాబందుల రెక్కలు ముక్కలై రాలిపోతాయ్‌ అకృత్యాలు అఘాయిత్యాలు చేసే అధినేతల మకుటాలు సహితం సమాజానికి పాదాక్రాంత మౌతాయ్‌ అందుకే చేస్తాను కోటిసలాములు విప్రవకవి కలానికి అందుకే చేస్తాను శతకోటిసలాములు విష్లవ వాగ్గేయకారుల కంచుకంరాలకు అందుకే చేస్తాను శతసహస్రకోటి సలాములు అక్రమాలను అన్యాయాలను ఎదుర్శొనే నేపథ్యంలో బందీలయ్యే వందలాది నిస్సహాయకార్యశూరులకు

ఆశయం మంచిదే కాని ఆశ్రయించిన మార్గం మాత్రం

అందరూ హర్షించేది కాదు

అడవుల్లో అజ్ఞాతంగా సంచరిస్తూ

ఆశయసాధనకు యత్నించడం అవివేకం

జనజీవన స్రవంతిలో కలిసి

సమాజాన్ని చక్కదిద్దితే జనం మెచ్చెదరు ఇది నిజం

చంపడం చావడం సమసమాజ న్థాపనకు బాటవేయదు

మందిలో మసలుతూ

అన్యాయాలకు అక్రమార్దనలకు సమాధి కటండి

దుర్నీతికి దురాగతాలకు చరమగీతం పాడండి

గళం విప్పి కలం నడిపి

సమాజ వృక్షానికి పట్టిన చీడను

మాటల వడగండ్ల వానతో ప్రక్షాళనం చేయండి

శిష్ట సమాజసాధనకై కష్టపడండి

చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి

సమాంతర ప్రభుత్వం నడుస్తుందా అని

అందరూ అనుకునేలా చెయ్యండి

వీలున్నంత మేరకు ప్రజాసేవ చేయండి

అందులో ఎవరికి మినహాయింపు లేదని చాటిచెప్పండి రండి పట్టం కడదాం రండి అందరూ విప్లవకవి మేధస్సుకి రండి ప్రణమిల్లుదాం రండి అందరూ కలిసి అభినవరవి తేజస్సుకి కో

శ్రీకారం చుట్టేయ్‌ ష। తలపెట్టిన కార్యానికి ఈ రోజే శ్రీకారం చుట్టేయ్‌ రేపు మాపన్న మాటలు మూలపెట్టేయ్‌ ఏ రోజు యేమి జరుగనున్నదో యెవరికెరుకోయ్‌. చః అలక్ష్యం అవలక్షణం సలక్షణంగా సాగాలంటే జీవితం ఇప్పుడే చేయగలిగే ఏ పనైనా ఎప్పటికో వాయిదా వేయకోయ్‌ జ్ఞానమే జీవితం అజ్ఞానమే మరణం = పాటుపడుము నిరంతరం జ్ఞానధన ఆర్జన కోసం చ॥ గతించిన రోజులు కళ్లెమేసి లాగినా వెనుదిరిగిరావు ఏతమేసి యెంత తోడినా జ్ఞానజలం తరుగదు అన్నీ తెలిసి తెలిసి యెందుకు జడమై ఉంటావ్‌ చివరకు సున్నాగా నిలుస్తావ్‌ మనిషివై పుట్టి మ్రానులా జీవించక తెలివిని పెంచి ప్రగతిని పంచి జగతి పథంలో జైత్రరథంపై చిట్టచివరి వరకూ సాగిపోవోయ్‌ చః అతిచిన్నది జీవితం ప్రతిక్షణం అమూల్యం కరిగిపోయే ప్రతిక్షణం కావాలోయ్‌ కాంచనం పైపై మెరుగులు చూసి పరుగులు తీస్తావెందుకు ? రేపో మాపో నీకూ దక్కేదే ఆ విందు లక్ష్యం మరచి పరిధిని విడచి భ్రమణం చేయకు ఇకముందు తొ

దయరాదా దయార్దహృదయా!

ప దీనావనా ! నీవుండేది ఆ కొండకొన పైన

నిను చేరేదెలా ఈ అవిటితనాన

ఆనతినీయ జాగేలరా తిరుమలనగదేవరా !

ఆశ్రయుడనై వేచియున్నానురా

నీ కొండ దిగువున చ॥ లేగదూడలల్లై చంగుచంగున గెంతుతు

నిను చూడ పిల్లలు పాపలు

అడుతు పాడుతు

నీ కొండను అధిరోహణ చేయుచునున్నారు

నీ సన్నిధి చేరగవచ్చే వనితల

కాలిమువ్వల సవ్వడులు

నీ నామస్మరణమే చేయుచూ

నీ దివ్యశ్రవణయుగళం తాకుచునున్నవి

నిను సేవించే పెద్దల వృద్ధుల గమనశ్రమల సేదతీర్చాలని

గిరుల పైనున్న తరువులు

నవ్యకుసుమాల నెత్తావుల వింజామరలూపుచునున్నవి చ నిత్యనవ్యతేజము చిందించు

నీ దివ్యముఖ పారిజాతము తిలకించవలె ననిపించినా

నీ పదాంభోజయుగళమును సేవించి

తరించాలని నా మనసు తపియించినా

నీ ఆశీస్సుల లేమిచే అసక్తుడనై పడివున్నా చ॥ మధురమైన వేణుగాన అలాపనతో

వేదవీణ తంత్రుల మీటి

ఆలమందల సహితము అలరించిన ఆదిదేవా

కరిమొర ఆలించి మకరమును క్రుంచీన

నీవు నను కరుణించగలేవా

కర్మబంధనాలను క్రుంచు నీ అభయకరములు

ఏల శుభముకలుగజేయ సమ్మతించకున్నవయా

దయార్దహృదయా 1! ఇందిరా హృదయ మందారా!

సుందర వదనారవిందా |

ఓ గోవిందా! జ

'సేద్రసోదరా! భూస్వామి భవంతిలో విద్యుద్దీపాల పాలవెన్నెల ప్రక్కనున్న పేదవాని పూరిగుడిసెలో కటిక చీకటి మధ్య చిరుగాలికి అల్లల్లాడే తిల్లిక పేదవాడుండేది చాలీచాలని పూరిగుడిసెలోనే కాని ఆతడి మనసు మాత్రం వెన్న కామందుండేది విశాలమైన భవంతిలోనైనా కానరాదు జాలి వాడి హృదయమందున రవ్వంతైనా కామందు పనిమోద ఊరు వీడి వెళితే పేదింటి ఆలూమగలే కావాలి కావలి భవంతికీ భూస్వామి యింతికి పేద పొరుగూరు వెళితే లేదు రక్ష "వాని పదతికీ అరమరికలు ఎరుగని నరకపు పేదరికానికి ఆపదలోనున్న పెద్దింటి పదతిని కాపాడ తాకితే కాచిన పేదింటి చేతినే కాకుండా చేస్తుంది కామందు కబందహస్తం తెలుసుగా నేస్తం ఇది జీవిత వాస్తవం. లేకుంటే పేద ఉంటే పెద్ద మరోలా చెప్పాలంటే ఉంటే నాయుడూ రాయుడూ లేకుంటే గోచిపాతరాయుడూ లేక త్రాగితే గంజినీళ్లు ఉండి సేవిస్తే విటమిను “బి” ఉన్నవాడి పిల్లలకి ఊటీలో చదువు లేనివాడు పోరగాళ్లను చదవేస్తే పక్కబెమ్ములెండు

లేనివాడికి వానొస్తే వరదొస్తే పనిలేక పస్తు కష్టమెరుగని ఉన్నవాడికి నిత్యం ఇష్టాన్న భోజనం మస్తు చెప్పుకొంటూ పోతే చేన్తాడంత దోస్తూ ఒప్పుకోకురా పేదసోదరా వట్టి దద్దమ్మవని ఎదురు తిరగరా సోదరా ! నువ్వెదురు తిరగరా సోదరా ! జగమంతా అదిరిపదేలా నువ్వెదురు తిరగరా పేదసోదరా ! భయపడితే భయపెడుతుందీ సంఘం భయపెడితే భయపడుతుందీ లోకం ఈ పాడులోకపు నైజమంతేరా సోదరా వేడుకోకు ఎవరినీ నిను కాపాడమంటూ ఎదురుచూడకు ఆత్రంగా వమాత్రం అవతారమూర్తుల అవతరణ కోసం ఏర్పరుచుకో నీ చుట్టూ నీవే రక్తాకవచం అప్పుడే అవుతుంది ఈ లోకం నీకు దాసోహం హస్తగతం చేసుకో (ప్రజాస్వామ్యం నీకిచ్చిన హక్కులన్నీ తలవంచకు తల్లడిల్లకు ఈ నేపథ్యపు యజ్ఞంలో సమిధవగుట తథ్యమని తెలిసినా సాగిపో చివరివరకూ కుళ్లిపోతున్న వ్యవస్థకు సూది మందులేసి సాధించు ప్రక్షాళనం అద్దుపడ్డ కలుపు మొక్కలను ఏరిపారేయ్‌ నల్లధనం మేరువుల హరుడవై దహించేయ్‌ కార్మిక కర్షక ప్రగతికి నాందీ గీతానివై నిలిచిపో, సాగిపోయే శ్రామికస్రవంతిలో అలసిపోని అలవై అలరారు నీకు సీవై కర్మయోగపు మర్మమెరిగిన పుణ్యభూమికి . వారసుడవై నిలిచిపో ఈ ఇలాతలముపై

వర్నాధిక్యము

మాటల ఈటెలు పలుగులై గుండెల సైకతాలను పెకలించివేస్తుంటే అ(శ్రుగంగ పొంగులెత్తినట్లు ఆకాశాన్ని అంటి తోరణాల్లా వ్రేలాడే తోయదములు తెమ్మెరల విహంగాలు పొడవగ ఓటికుండలల్లె నీటిని వలక పోస్తున్నాయ్‌

పుడమి కడుపు నిండి

ఎక్కువైన పుష్యరాన్ని

పాము కుబుసము విడిచినట్లు విడుస్తోంది ఆధిక్యతను పుంజుకొన్న వర్షం గృహాలను కారాగృ్భహాల్లా మార్చింది అది పంజావిప్పి నెల కూల్చిన చేలు రణరంగపు తోటలో పెనుతుఫానుకి తనువు చాలించిన వాహినీద్రుమ సమూహాల్లా అనిపిస్తున్నాయ్‌ రైతుల ఆశల హరివిల్లుల నడుములు విరిగి వివర్దపు తుత్తునియల తురాయిలయ్యాయ్‌ నగరాలు నయాగరాలయ్యాయ్‌ జనపద వీధుల్లో కన్నీటి వాగుల్లా పారేటి నీటిలో కష్టాల కంటకాల కాట్లుపడని బాధ్యతల బరువులెత్తని అభం శుభం అన్నెం పున్నెం యెరుగని నిస్వార్ధ పసిహృదయాలు కాగితపు పడవల వేతల జాతర చేసికొంటున్నాయ్‌ అది చూస్తుంటే మధురక్షణాల ముత్యాల తీతలా తోస్తోంది రైతుల వధూ జనహృదయ సదనముల కుద్యములు అతివృష్టి తాకిడికి బీటలు వారగ జలజల జారింది కన్నీరు ధారగ. అనతికాలంలోనే మింటినంటిన ధాన్యాల ధరలు వ్యాపారుల భార్యల గళసీమల కాసులపేర్తై కళ్ళు మిటకరించాయ్‌ పుచ్చకాయల్లా పెరిగి బరువెక్కిన వ్యాపారుల బొజ్జలు వీపునంటిన పేదల డొక్కల చూసి పరిహసించాయ కో

నీ సాగసు చూస్తుంటే నీ జుంటిమోవి నునుపు లేకుండ చేసి నా కంటికి కునుకు అదిమి పెట్టకు దాన్ని నీ పంటితో సెగలు రగులు నా ఒంటిలో సే పలువరుస మంచిముత్యాలపేరు అది కనిపిస్తేనే చాలు పుట్టుకొచ్చు సరసాల సాహిత్యపుటేరు నెట్టుకొచ్చు నాలో ఆనందం అందాల పుట్టగొడుగులై ! చిలుకముక్కు చెలువం చూస్తేనె చాలె చెలియ పడగవిప్పి ఆడు నా పరువం గొంళు విప్పి పాడు వ్యామోహం కవ్వించే ఆ కళ్లు కలువరేకుల వాకిళ్లు కరడుగట్టిన అంతరంగాన్నైన మంధనం చేయు కవ్వాలు మైకాల తేలించు మధుపాన లోకాలు మతిపోగొట్టు మహిమాన్వితమణులు ఆ విశాల ఫాలం తళుకులీను మనోజ్ఞఫలకం సద్దుచేయక ముద్దు లొలికించు నీ నగుమోము దానిపై వాలేటి రింగులు తిరిగిన ముంగురులు నా పాలిటి వ్యామోహ వాగురులు

అవి నా మనోఫలకమ్ముపై వేసె

చెరగని అనురాగ ముద్రలు

అంటి రానంటున్నవె అవి

ఓ కొంటె కొమరాల నీ ఆడతనము చూచి నవ్వీ నవ్వగనే లొత్తలుదేరు ఆమెత్తని బుగ్గల నిగారింపులు హరించె నా మనసు కర్పూరకళికలై విరించే నిను చూచి వరించునంటే అతిశయోక్తి కాదె ఓ అందాలమొలక

పారాణి అలదిన నీ పదద్వయం

కాంతులీను కల్టార యుగళం

నీ గ్రీవమె కంబువు

నీ జీవమె ఆనందసింధువు

నీ గళము కుంబరించు కలనాద నిర్షరములు

నీ సొగసులు అలరించు వన్నెల స్వర్ణ పంజర కీరముల కులుకులు నీ నితంబముల తాకేటి నల్లటి నాగువంటి ఆ వాల్దెడ వక్షోజముల నడుమచేరి చెప్పె కాదు నేను కదిలేటి నాగును కదిలియాడని కనుమనని అంతటితో ఆగక చిత్తమందు చిగురులు దొడిగి చిత్తశాంతి లేకుండ చేసె

గతి తప్పిన నీ వాళ్దెడ గతము మరచి

చెలిమి చేసె నిమ్న నాభితో

అడ్డుతొలిగిన నీ నడుము సన్నన

అందగించె నా మనసు జివ్వన

ఏమని బదులు పలికెదవె కోమలి

నీ కడ ద్రవ్యరాశులేవని అడుగుతోంది ఆ జదకొన? పలికేందుకేముంది పరమసరసుడ

సౌందర్యరాశినై నీ కేలమైోల నేనుండ

ధనరాశుల అక్క నీకేల

మరిజాగేలనే జాణ

మురిపాల తేలించవే

సరససల్లాపాల డోలలూగించవే

సాగవురా ఆగడాలు అందగాడ

హద్దులుంటే ముద్దురా మదనగోపాల

మూడు ముళ్ళు పద్దాకే ముద్దుమురిపాలు సరస సల్లాపాలురా కో

సామరస్యపు వెలుగు రేఖలు ఈ పవిత్ర దేశం మన స్వతంత్ర భారతదేశం ఇది భరతమాత కన్నబిడ్డల సువిశాల సుందర ప్రదేశం మనదేశాన పరిమళించే మతములన్నీ పావన చరిత భరతమాత సిగమల్లియలే హిందువైన ముస్లిమైన మరేమతస్టుడైన ఈ దేశవాసి భారతీయుడే కాయమెవరిదైన గాయమైతే చిందేవి మతవిద్వేషం మన్నించని మమత్వం మోయని రుధిరాగ్నీ కణములే కావు సేదడీరని నిస్సహాయతశ్రామిక జీవుల స్వేదబిందువులు కావు తావులేని చావురాని నిరాధార వృద్ధజీవుల వ్యర్ధజీవనాల అ(థశుకణములు ఈశ్వరుడైన అల్లా అయిన మందిరాన నెలకొన్నా మసీదులో వెలసినా పరబ్రహ్మమొక్కటే కానీ మతతత్వం మౌధ్య జాద్యమై సామరస్య భావనకు సమాధి కడుతుంటే స్వార్థపరుల స్వప్రయోజనాల ప్రమేయం ప్రజ్బరిల్లి చితిమంటలు రేపుతుంటే మతాతీత ప్రజాస్వామ్య చట్టనిర్మాణ చతురులు చట్టాలను ఛేదించి కల్లోలములకు కర్తలైతే మతకల్లోలపు చిచ్చురగిల్చి చిచ్చర పిడుగులని భ్రమింప జేస్తుంటే

బుద్ధుడు వెలసిన ఈ పుణ్యభూమి కంటికి నిద్దుర ఉంటుందా! ప్రగతికి బాటలు వేసిన అధినేతల చేతలకు అర్ధం నిరర్ధకం కాకుంటుందా! మతధర్శ్మ సూత్రాలు సమసమాజ సుమదళాల రంగవల్లుల పదఘట్టనం చేస్తుంటే క్రుంకుతున్న పొద్దు కొండల మాటుకు పోతున్నట్టు కర్తవ్యం కనుమరుగైపోతుంటే సామరస్య సాధనకై పరితపియించిన గాంధీలూ సమరస భావం చవిచూపించిన అక్చరులూ కరవై పోతుంటే మతసామరస్యమా నీవుందేది ఎండమావులలోనా! శాంతినొసగే జీవనప్రదీప కాంఠికిరణ సముదయమా నిను పరిరక్షించే అభయహస్త యుగళములుందేది కొండకోనలలోనా! సర్వమత సమభావ స్వభావ సంక్షీర్తనమా నిను ఆలపించే గళములుందేది ఖగోళాంతరాళములలోనా! అంటూ నిరీక్షిస్తుంటే వీడిపోవు యీ కల్లోలపు సుడిగుండాలు వాడిపోవును మన నవభారత యువకుసుమ బృందాలు మచ్చుకు జరిగే మతాంతర్వివాహాలు హెచ్చుగ కొనసాగి అంబరాన సంబరాల వెలుగులు వ్యాపిస్తుంటే గద్దెనెక్కిన గండశిలల గుందెలదర మతసామరసోద్యమపు దుందుభులు నినదిస్తుంటే మతము మానవాళి హితము కొరకేనని మనమంతా మరువకుంటే ఆసన్నమౌను సామరస్య సిద్ధి సంప్రాప్తించే ఆ రోజు గాంధీజీ కన్నకలలు నిజమయ్యే పండుగరోజు కో (15-01-1997)

సందియము మంచుపువ్వుల వాన వెలిసిపోతోంది తెలిమంచుపొగ తరలి పోతోంది తెలతెలవారబోతోంది ఎముకలు కొరికే చలిలో ఎదను వేధించే ఈ గాలిలో నీ గుడిముంగిట నిలిచి గుడిగంటలు (మోగించి శిరము వంచి కరములు మోద్చి వరములడుగకనే వేడుకొను ఈ దీనమానవునిపై దయరాదా ఓ దీనబాంధవా! మాధవా! అజ్ఞాతవాస! ఆశ్రితజనపరిరక్షక్రా ! క్షితి జన పరిపాలకా! ప్రతిఫలము నాశించని పూజలగైకొని కైవల్యము నొసగెదవందురయా ఓ పరాత్పరా కైవల్యమన్నది ఉన్నదో లేదో నీవు కలవో నిజమో ననే సందియము అనునిత్యము నా డెందమును కలవరపరచేనయా ఓ దయాకరా ! కలవను వారలు కొందరు లేవను వారలు కొందరు కలవో లేవో తెలియక సందిగ్గాబ్ధిలో మునుగుతు తేలుతు జీవన యానము సాగించేదెందరో ఇందరి మనుషుల యెదలను దొలిచే ఈ మర్మము తెలియకనే

కలిమిలేములూ కష్టసుఖాలూ పురాకృత ప్రారబ్బాల ఫలములని వగచి చివరకు చితి మంటయయి రగిలి బూడిదగ మీగిలి ఆత్మ యొక్క గుట్టు అంతు పట్టక అపార విజ్ఞాన సముపార్దనము యావత్తు నిస్సత్తువ కాగ మది మదనపడేనయా ఓ దేవా! దయ చూపగ రావా! ఈ జీవుని మొరలాలించి తొలగించగలేవా అనుమానపుతెరలు వెలిగించగరావా తార్మాణపు దివ్వెలు నిజము తెలిపి నీ దాసునిగా నన్ను నిరతము నిలిచిపోవనననుమతి నీయవా! హేప్రభో! కొ ఫస ॥ చా ని

మగువల్లారా జాగ్రత్త! ఈడొచ్చిన ఆడపిల్లల్లారా! మనసిచ్చే తెగువవున్న మగువల్లారా ! జాగ్రత్త ! అడుగుతీసి అడుగువేసే లోపే కాటేసే కోడెనాగులున్నాయి జాగ్రత్త! తస్మాత్‌ జాగ్రత్త! మామా గుణగణములు మామి ఆలోచనావళులు ఒకటేనంటూ చెప్పిందానికి సయ్యంటూ వంతపాడి కురిపిస్తారు ఆనందపు విరిజల్లులు మీ మనసుల్లో కొందరు ఖలులు మేకవన్నెపులులు మంచికి మారుపేర్తమూ నీతికి ప్రతినిధులమూ అంటూ కల్లబొల్లి కబుర్లెన్నో చెప్పి కన్నె మధువులు కాచేయ తలచి చక్కదనాల చమక్కుల ఎరవేసి ఎదదోచే మగమహారాజులు మృగరాజులై మసిలే జనారణ్యమిది జాగ్రత్త! ఆంతర్యం తెలుసుకొనక తొందరపడి చనువిస్తే తనివితీర ప్రాయపు విందారగించి మోజు తీరగానే గాజుబొమ్మలా విసిరికొడతారు! కొందరు కలియుగ కీచకులు! నయవంచకులు! నీతిని ప్రేమించే నాతివైన ఓ ప్రణయ వసంతపు కవన పూబంతీ!

మగువ మానధనం పై

కన్ను వేసిన మగతనం

కన్నెణికాన్ని కాటువేయకముందే

వంచనకు వారధి కట్టి

సాగిపోనీ నీ జీవితం

కళంక రహితమై కలకాలం కో

వసంతమా కాస్తంత ఆగుమా

వసంతమా కాస్తంత ఆగుమా

వన్నెలు చూపి వీడి పోకుమా

వీచే గాలి పూయాలి గంధాలు గర్వంతో

రాలే పుష్పాడి ఆచరింపచేయాలి అభిషేకం అరుదైన రీతిలో పూలు సోకాలి నీ పాదయుగళి

కోకిలలు కీర్తించాలి నీ కిలకిలల అవళి

ఇగము హారతులు ఇవ్వాలి

జగమంత హాయిగ నవ్వాలి

వెన్నెలలో కిన్నెర సానివని

వన్నెలలో సీకాకోకచిలుకల హెయలు ఉన్న దానివని నిన్ను కని అందమైన కన్నెలు కూదా అసూయపదుదురని నిను పొగడగ విని పొంగిపోవుదువని నీవు లేని లోకం కారుమబ్బులు కమ్మిన ఆకాశమ్మని నీకు సాదరంగా వీడుకోలు చెపితే అనందిస్తావని ఆశించనీ ఇ

కవితా సొందర్యం భాష మాద పట్టు భావాన్ని చేపట్టు భాష మోసుకొచ్చిన భావం ఆకట్టు మనసును భావ ప్రధానమైన భాష కోసం పోరాటం తలపెట్టు రెండూ జతకూడితే రచనా శక్తి రెట్టింపైనట్టు చిట్కా తెలిసింది కదా అని చిందులెయ్యకు మేధావుల రచనా శైలిని, ఆలోచనా ్రవంతిని యోచనా దృష్టితో తిలకించే సత్మార్యం చేపట్టు మేధ సౌదాల అధిరోహించి జ్ఞాన సౌందర్యం తిలకించే సుందరదృశ్యం అందరికీ చూపెట్టు చేతల్లోని చతురతపై నేత్రం సారించు రాతల్లోని రమణీయం గమనించే ఆత్రం పెంచు శోతల మాటలలోని బెచిత్యం గ్రహియించు మాటల్లోని మర్మం మనకెందుకనుకోకు గమ్యాన్ని ముందుకు జరుపుకుంటూ ప్రయాణం సాగించు అవసానం వయసుకే గాని మనసుకు కాదని జగతికి చాటి చూపించు ఆలోచనల్ని పంచి ఆశల్చిపెంచి ఆనందంలో ముంచి నీవైపో ఓ కవితా విపంచివి కో క్యా టీ కి 15 ఆ ళు 1 జీ

మణుగుజులు రోడ్డు మీద దొమ్మరాట చూస్తే మాసు అదే ఆట సర్మసు టెంటులో చూస్తే క్లాసు ఇదే లోకం పోకడ తెలుసుకో బాసు తెలిసి తెలివిగా మసలుకోకున్న అవుతావు అందరికీ అలుసు పేదవాని కోపం పెదవికి చేటు పెద్దవాని కోపం పేదవాని హాయికి వేటు అదను తెలియక ఎదురు తిరిగితే పడుతుంది నీ బ్రతుకునకు గ్రహపాటు ఎదను గెలిచేలా వ్యవహరిస్తే దొరుకుతుంది నిత్యం నీకు సాపాటు నీవు పండించే పంటకు లేదాయె అంటరానితనం నీవు ఖండించే ఇంచుగదకు లేదాయె అంటరానితనం మరెక్కడి నుండి వచ్చిందీ తుంటరితనం సేదదీర్చే నీ చేతులకు లేకపోయె చేదవేసే యోగ్యతయే లేకపోయె సేద్యపు పని చేసే నీ శ్రామికశక్తికి లేకపోయె కలేజాయే లేకపోయె తలదించి దారిదాటకుంటే ఎదురుపడిన రైతు బడితపూజ చేయునేమోననే ధ్యాస లోలోన బాధపెడుతుంటే కలేజా లేకపోయె నీ ఊడిగం ఉప్పెనొచ్చి కొట్టుకుపోను నీ కసలు కలేజా రవ్వంత్రెనా లేక పోయె అసలు అంటరానితనం ఓ స్టంటు తెలుసా ఇది నీకు ఓ నేస్తం అంటరానితనం అడుగంటిపోజే రాజకీయనాయకుల మనుగదకి రాస్తా శూన్యం దూరదృష్టితో యోచించి త్వరితగతిని దారి ఏర్పరచుకోకుంటే

నిత్యం నీ పురోగతికి పురిటినొప్పులే ఇది గమనార్హం. నీవు పంజేసే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఢీకొండానికి ఎర్రజెండా ఎగురేస్తావు యావజ్ఞాతి ఎన్నికల విషయానికొస్తే నీ ఇంటిముందు ఏ జెండా ఎగురవేస్తావో నీ ఎజెండాకే ఎరుక లేకపోయెరా ఓ శ్రామిక సోదరా । పెట్టుబడిదారీ ప్రభుత్వపు గుజ్టాలు పట్ట పగ్గాలు లేకుండా పరుగులు తీస్తున్నాయి. కళ్ళెమేసి ఆపకుంటే కాళ్ళకిందపడి పచ్చడగుట ఖాయం మార్చుకోకుంటే నీ ధ్యేయం నీ బ్రతుకు నరకప్రాయమగుట తథ్యం ఖా ఇ క్‌

చదువ నేర్వండి షః పిన్నలార। పెద్దలార ॥ భరతదేశ పౌరులార 1 చదువనేర్వ తరలిరండి చదువు నేర్చు త్వరపడండి. చః కనులకు చూపుందనుటలో ఆశ్చర్యమేముందోయి ఆ కనులు జ్ఞాన నేత్రాలు కాగలిగినపుడే జన్మ సార్ధకత పొందినటులోయి జానెడుపొట్ట బారెదేసి చేతులు కలిగివుంటేనే చాలదోయి ఛమించాలోయ్‌ అవి కడుపునింపు కొనంగ పట్టాలోయ్‌ అవి సుజ్ఞానపు దివిటీలు అజ్ఞానపు చిమ్మచీకట్లను తరిమికొట్టంగ చ॥ నాగలి నర్తించే పంటపొలాల పలుగూ పారా పట్టేవాళ్లం పొగలెగసే పరిశ్రమల సుత్తీ సేనం చేపట్టి శ్రమించేవాళ్లం మాకెందులకీ చదువూ సామూ అనే మాటలు మరువండోయ్‌ పలకా బలపం చేపట్టి ఖాళీ వేళల చదువు నేర్వండోయ్‌ వంచన వలలో పడక మంచిగ బ్రతుకులు సాగాలంటే చదువే శరణ్యమని తెలియండోయ్‌ చదువొక్కటే దొంగల చేతికి చిక్కని చక్కని ఆభరణమని చెప్పగ వినరండోయ్‌. చ విద్యను పంచే కొలది పెరుగును జ్ఞానము జ్ఞానము పెరిగిన కొలది కాంచును దేశము (ప్రగతిని ప్రగతిని పొందినదేశము కలకలలాడును సిరిసంపదలతో అక్షరజ్ఞాన శూన్యం దేశానికే కళంకం పాతిపెట్టండి నిరక్షరాస్యతను భూమియందు హారతిపట్టీ ఊరేగించండి అక్షరలక్ష్మిని ప్రగతిరథమునందు కో

కవికోకిలకు తలిరాకు తాంబూలము (కీ॥ శే గుజ్టం జూషువాగారిపై వ్రాసిన కవిత) నీ రాతలు రమ్వాక్షరముల గీతములు ఆలపించెను అవి నవ్య వేణు నాదములు నీ సేతలు వెలిగే ప్రమదల సముదాయములు వెదజలైను అవి కావ్యజ్యోతులై కరుణకాంతులు కవికోకిల, కవితాశారదయని నీకొసగిన బిరుదుల జాబితా ఇల వెలుగొందు నిరంతరం విధివధువు గళసీమలో రంగురంగుల రతనాలసరమై పసందైన నీ పద్యకవితలు విద్వజ్ఞన (శ్రేణికి విందులు తెలుగు విశ్వమానవాళి పొందు మరువరాని మధురానుభూతుల చిందులు అవి పరవశమొందజేయు ఆంధ్రజనుల మనములు నీ సుకవితల పారిజాతపుష్పాలు గుబాళింపులు చిందించగ మత్తిల్లైను మానవమస్తిష్మభ్రమరములు మదిర 'సేవించినటులు జలకన్యలై నటనమాడి సృజియించినవి అలలు శ్రీనాథ కవివర్యు సీసపద్యసుందరులు మరుజన్మమెత్తి నీ కావ్యజగతీ పుణ్యస్థలులందు మీటినవి ఆ అలలు కొనగోరులై తటముల తటములు విరించి ప్రియసఖి వీణియలని భావించినవై దీనదళితజనుల దుస్థితి కాంచి నీ కలము గళమెత్తి విలపించినది నీదు ప్రతికావ్యమందు పదేపదే. (్రంథస్తమైన నీగొంతు

రాహువధూకుచములల్లె రాణించకుండె

ప్రజా బాహుళ్య్ళమునకు చేరరాని దూరమై. కవిపుంగవులకు ఆదరణ కానరాకున్నదని అంగలార్చిన నీవు రాయల కాలమున కవియైయుందెనేని మధురముగ సాగు నీదు కవితామకరంద ప్రవాహమునకు అబ్బురపడి అపరంజి పూదళముల పూజించి యుండేను ్రీకృష్ణదేవరాయవిభుండు, ఆం(్రసరస్వ్పతిని విద్యానగర భద్ర సింహాసనాన ఆసీనురాలిజేసి తెలుగువల్లభుడనని వచియించి మురిసిపోయిన మేటి కవిపోషకుండు. మానవజీవనసారమె నీ కవితాగారద్వారాన లతలై వ్రేలాడగ దేశభక్తి నచట నచట పొందుపరచి మనసులుప్పొంగజేసిన ఓ కవికోకిలా! గైకొనుము నేనందించు ఈ తలిరాకు తాంబూలము కో

ఆడదంటే అలుసేలనో ఆడదంటే అలుసేలనో అందరికీ కాదా వారిది జన్మ లేదా వారికి స్వేచ్చగా బతికే హక్కు ఎందులకీ ఆడామగా అనే అంతరాలు ఏల యీ వలపక్షపాత స్వభావాలు యుగాలు మారినా తరాలు గడచినా అలాగే ఉండాలా అంతరాలు అలాగే గడవాలా ఆడవాళ్ల జీవితాలు సాగిపోవా చక్కగా వారి బ్రతుకుల నావలు సహజీవన వేణీ సంగమములో సమభావన జీవనస్రవంతిలో కూతుక్లైనా కోడకైనా అమ్మలైనా అత్తమ్మలైనా అందరూ ఆడవాళ్లే కదా మరేల కోడళ్లకు కష్టాల కాపురాలు కూతుళ్లకే ఖులాసాల జీవితాలు ఏ గూటి మొలకనవ్వుల చిలుకలకొలికో మీ గూటికొస్తే అనురాగంతో ఆదరించక ఆప్యాయంతో ఆదుకొనక అత్తవై వేధిస్తుంటే ఆడపడుచులే సాధిస్తుంటే పతివై అసలు పట్టించుకొనకుంటే ఆ ఇల్లాలి బ్రతుకు నరకమవుతుంటే ద్రవించవా మీ మనసులు స్రవించవా దయామయాశ్రువులు

చదువులు లేకున్న చీదరింపులు

చదువులు మిన్నయైన యెకసెకియములు

వరకట్నాలకై వేధింపులు

లేనిపోని సాధింపులు. తెరపదనీయరా యెడతెరపిలేని యీ దుష్టచేష్టలకు మేమున్నామంటూ అండగనిలిచి, అరమరికలు మరచి అందరి అంతరంగాలు స్వాగతం పలుకవా ఆడువారి పాలిటి అసమానత తొలగించేందుకు, వివిధరంగాల ఘనత వహించే వనితల ఆదర్శజీవితాలకు. కో

/) జ వా గ్‌

నాడు-నేడు హరితసాగరం మనదేశం పల్లెసీమలు జీవనాడులు పాడిపంటల పెంపు సొంపులకు భాషాసంప్రదాయల భావవల్లరులు భిన్నసంస్కృతుల సుమసౌరభాలు ముదములందించె యీ సువిశాల సస్యసీమకు సువర్ణ కలువలేమకు పలు వన్నెల కళల కాణాచులు కవుల కమనీయకావ్యమంజరులు చెన్నుకూర్చె యీ దివ్యాంగన కళారంగానికి వాణీ వీణా నిక్వణానికి ఆవాసమయ్యె యీ కుసుమ సంశోభిత నందనం కార్మిక కర్షక ప్రజాసౌజన్యానికి శ్రామికసేనల సహజీవనానికి ఇదిరా నీ రత్నగర్భ ఇదిరానీ అన్నపూర్ణ ఇదిరా నీ మౌనివర్యుల మర్శ్యము ఇదేరా నీ ప్రజాస్వామిక సామ్యవాదభారతము దేశాఖిమానమే ఆత్మాభిమానముగ ప్రజాసేవయే పరమార్ధముగ స్వేచ్భాస్వాతంత్ర్యములే ఉచ్వాసనిశ్వాసములుగా వెలుగొందిన త్యాగధనుల యోగఫలమురా నీ స్వతంత్రభారతదేశం. ఆదర్శ్భమూర్తులౌ అమరవీరుల ఆశయసౌధమురా నీ దేశం అదిరా ఆనాటి నీ వీరభారతం అదిరా ఆనాటి నీ శూరభారతం అదిరా ఆనాటి నీ ధీరభారతం అణువణువున స్వార్థమును ధ్యేయముగా నింపుకొని అడుగడుగున అసమ్మతమును ఆరాధనముగా చేసుకొని

పరులటబకుకు నావల నడిపించే నరరూపరాక్షసులు పదవీ వ్యామోహమునే ప్రాణవాయువుగ చేసికొని ద్రవ్యభోగమే భవితవ్యమని యోచించే నీచరాజకీయ నాయకులు శాసించే సమాజ సానువురా నేటి నీ దేశం ఆనాటి అమరవీరుల ఆశయసౌధాలు శిధిలమౌతున్న యీ దేశం. మానవతావిలువలు మంటకలిసిపోతున్న నీ దేశం ధనదాహమె అధికారుల వేతనముకాగ థామిక సంపదయె పెట్టుబడిదారుల పెన్నిధికాగ పాషాణహృదయులౌ పెట్టుబడిదారులే (శమజీవుల పాలిటి యేలికలై సాగించే యా జనజీవనయాత్రల చేర్చాలి ఆఖరి మజిలీకి పాడాలి యీ దురాగతాలకు దుర్నీతులకు చరమగీతం ఆశించే మహోదయానికై పల్లవించే నవోదయానికై వెల్లువలై సాగే అక్రమాలకు అన్యాయాలకు కట్టాలి ఆనకట్టలు నవతరం నడుముకట్టి యువతరం ఉప్పెనలా పొంగి జాగుచేయక సాగుచేసి చేరాలి సమసమాజ గమ్యస్థానం రతనాలు పంచకున్నా రక్తం చిందించకుంటే చాలు పరమాన్నం చవిచూపించకున్నా పరబ్రహ్మస్వరూపాన్ని చూపిస్తే మేలు. కో (02-04-1997)

కులవ్యాళగరళం

ప్రజాస్వామ్యప్రగతికి ప్రతిబంధకమయి పట్టి పీడిస్తున్న పైశాచికతత్వమా సనాతన భారతప్రాంగణాన ప్రభవించిన చతుర్దళప్రసూనమా అధునాతన కురుక్షేత్ర సంగ్రామాల రక్షసిక్తమవుతున్న రౌద్రజాద్యమా నీ అస్థిత్వం సుదీర్ణవ్యాపిత సుస్థిరసమాజవృక్ష శాఖల నివహం నీలి నీరదముల యెదలలోనికి చొచ్చుకుపోతున్న లోహమార్గణవ్రజం స్వపరభేద సంకుచితత్వపు శృంఖలాల బంధనం ప్రజలిచ్చిన పట్టాలు పుచ్చుకొన్న వైద్యులు (రాజకీయనాయకులు) నివారించని అనివార్యానారోగ్య ఆరోహణావరోహణా పునరావృతం

ఈ వ్యాపించే విద్య

నిర్వహించే వర్ధాంతర్వివాహోద్యమాలు

కులవ్యాళగరళోత్పన్నము

ఆపేదెపుడోరూపుమాపేదెపుడో

అందుకే తొందరపడాలి

ఉరిమే నీపైశాచికత్వాన్ని భరతధరిత్రి నుండి తరిమికొట్టడానికి

సమూలనిర్మూలనా దండంతో. శి

సమైక్యభారతం కులవ్యాళగరళ ధూపాలు మతమౌధ్య మారణహోమాలు వర్షవైషమ్యసంగ్రామ ప్రభంజనాలు ప్రాంతీయాఖిమాన ప్రగాధతాపాలు భాషాభేదభావ ఇత్యాదులు శాంతియుతవాతావరణ విచ్చిన్నకరశక్తులు ప్రజలను అసక్తులను చేసే అనైక్యక్షుద్రశక్తులు ప్రగతిని నిరోధించే పయోధరములు. మతసామరస్యభావ వేదికలు స్నేహ సౌభ్రాతృత్వ శుభసంగమములు పరస్పరావగాహనాది మహోన్నత గుణగణములు శాంతియుతవాతావరణ దోహదకర కాంతిపుంజములు ప్రజలను శక్తివంతులను చేసే సమైక్య సాధనములు ప్రగతికి తోద్బడే సోపానములు లోకానికి లోకువ అనైక్యత అభ్యుదయానికి వేకువ సమైక్యత భిన్నత్వంలో ఏకత్వమైన మనతత్వం విశ్వవిఖ్యాతం ప్రజలంతా ఏకత్రాటిపై నడచిన ఆనాటి అశోకుని కాలం మనసమైక్యతకు తార్మాణం సుక్షేత్రమై విలసిల్లిన బౌద్ధారామం ఈ దేశంలో ఒక భాగం ఇది యావద్భారతం గర్వించదగ్గ విషయం. జగమెరిగిన సత్యం.

అనైక్యత కులమత విద్వేషవిషవలయలయ (ప్రభావం సమైక్యసాధన ఒక లక్ష్యం

స్వాతంత్ర్యం మనజాతి సమైక్యతాచిహ్నం సమైక్యతా పరిరక్షణ మనందరి ముందున్న కర్తవ్యం ఆ కర్తవ్యసాధనకై మారాలి మనమంతా మరలాలి సమైక్యతా పథం వైపు కలహాలెరుగని కారుణ్యమూర్తులమై సమతనూ మమతనూ వరించే శాంళికాముకులమై అజ్ఞానపుటంధకారములు అంతరించే విజ్ఞానపు చిరుదివ్వెలమై భారతమాత యశోతేజమ్ములు దిగంతాలు సారించే కాంతికిరణాలమై చైతన్యభారత రధచక్రాలమై పూరించాలి సమైక్యతా విప్లవశంఖం నెలకొల్పాలి భారతావనిలో శాంతినందనం ఎగురవేయాలి సమ్రైక్యతాపతాకం ఆలపించాలి సమైక్యతాగీతం చాటిచెప్పాలి జగతికి నాటిభారతం నేటిభారతం ఒకటేనని శో (08-12-1996) శీ (| | అణు [| [ు

నిను కొలుచు నాకు

పష గిరిధారి నిను కొలుచు తలపు మదిలోన ఇపుడె మొదలాయెరా! నా జీవితకాలగమనమును ఇంకాస్త పొడిగించి నను బ్రోవరా! మరుజన్మకొచ్చేటి ఇచ్చ మది నుండి తొలగి పోయేనురా!

చః జీవుడే దేవుడు దేహమే దేవాలయం అని (ప్రబోధించినారు తత్వవేత్తలు ఆత్మసాక్షాత్యారము పొందుటే కైవల్యమని ప్రవచించినారు ఆత్మజ్ఞానమెరిగిన ఆధ్యాల్మిక ప్రబోధకులు కట్టె లేకున్న కర్మలాచరించుట కల్లయన్నారు నా మేని కొలనులో నిను కొలువ ఓ కలువ నిన్నమొన్నె కోరికల పురివిప్పెరా నిను కొలువకున్న కైవల్యము రాదని అది కుందుచున్నదిరా ఆయాశ ఈదేఅకముందె నా జీవితమును అంతమొందించకురా

చ! జననమరణ శకటానికి చక్రాలగుచు నీ చేజిక్కినదీ దీనప్రాణి కాళ్లరిగేలా తిరిగి తిరిగి ఆలసి సొలసింది ప్రభూ! విసిగి వేసారింది విభూ! ఇక నడువనోపిక లేదంటున్నది ఓ గోపికాలోల కష్టాల కంటకాలు కాళ్లలో దిగి ప్రశాంతనిలయాన్ని విషాదకాసారంలో ముంచుచున్నవి ఈ ఇల నా ఏకాగ్రతకు అగ్రహం కలుగునెడల నిను కొలిచేదెలా, చ। అందుకో స్వామి ఆలాపనా కుసుమకుందన దళాలు

పొందు ఓ స్వామి పరిచర్యలు పవళింపుసేవలు మరచిపోకు మరి ఈ దీపమూపిరి వదిలేటివేళ నా దాపు నుండి తలపుగుజ్జపు కళ్ళెము లాగి నీ నామస్వరతరంగాలు నినదింపజేయంగ ఓ కరుణాపాంగా కరుణాపొంగా కరుణాపాంగా తొ

కలసంకల్చం అనునిత్య గంగాప్రవాహముగ మృదుమధురపదసంజనిత భావసాగరతరంగాల సంచయముగ అసమాన తేజోవిరాజితమూ ధీశక్తి సమన్వితములగు తేనెవాకల మయముగ విలసిల్లు సినీగీతహిరణ్య లతికల మలచు వేటూరిని కని నా కలము సంకల్పించింది కవితలు రాయాలని మనము సంకోచిస్తుంది రాయడానికి రచించుశక్తి పరిపక్వం చెందకున్నదేమోనని మెదులుతున్నాయి నా మదిలో భావతరంగాలు శూన్యం లోనికి చూచినప్పుడల్లా కోనేటి నీటిలో ఏర్పడిన వలయాల్లా, కలం కాగితంపై మొనమోపితే చాలు సంకల్పాలు వికల్పాలౌతున్నాయి భావాలు గువ్వలుగా మారి ఎగిరిపోతున్నాయ శూన్యంలోనికి కలం మన్నుతిన్న పాములా కదలలేకపోతుంది. అది కాగితంపై కునుకుతీస్తుంది కళ్లు దిగాలుగా దిక్కుతోచనట్లు చూస్తున్నాయ్‌ రకరకాల రంగుల్లో మెరిసిపోతున్న అద్దాలబీరువాలోని ఇంద్రచాపంవంటి పుస్త్రసముదాయం వంక సకాలంలో వర్షాలు రాక పైర్లు పెరుగక అణగారిన ఆశలతో దిగులు పెరిగి ఆకాశంలోనికి చూస్తున్న కర్షకుల్లా ఏవో నాల్గు పుస్తకాల్లోనికి తొంగిచూచి

పేరు కోసం పేరాశతో కవిత్వం రాయాలని కలం చేపట్టి ప్రాకులాడి ఫలితం లేక పరుగులు తీయడం ఆపి నూతన ఉత్సాహం నింపుకొని ఆఅశ్రయించితిని శ్రీశ్రీ సాహితీ సదనాన్ని గమనించితిని పదప్రయోగ ప్రతిభ పెంపొంద మొదలిడిందని నాటికి నేటికి వారధిగా నిలిచిన విప్లవకవి భాష అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నదని భాష భావాలకు బాట యేర్చరచునని పదప్రయోగం పాటకు ప్రాణదానం చేయునని రసమంటే యేమిటో తెలియని పసివానికి అలంకారమంటే కేవలం ఆభరణమనుకొనే అమాయకునికి తెలుగు సాహితీ ప్రాంగణాన తప్పటడుగులు వేసే చిన్నవానికి తెలుగుభాషాయోష ఒడిలో ఉయ్యాలలూగే బుజ్ఞాయికి కవివరేణ్యులు వాక్రుచ్చగ వ్యక్తమయింది రసాలంకారాలు రమణీయ నయనయుగళమని సమాసములు సంక్షిప్తాలంకార తోరణములని తెలుగుబాషకు వన్నె కూర్చు సన్నజాజుల సరములని చిన్న చిన్న చినుకులు పడుతున్నాయ్‌ ఈ కర్షకుని మానసంలో ఆశలు మొలకెత్తుతున్నాయ్‌ నా కృషి కొనసాగుతుంది నాలోని భావాల మిణుగురులు ఆధిక్యతను పుంజికుంటున్నాయ్‌ అవి సంచయములై జ్యోతులుగ రూపొంది తెలుగు భారతికి కర్పూరనీరాజనాలు కావాలని నా మనసు వేడుకుంటుంది వేచిచూడాలి ఆశలు హరివిల్లులౌతాయో। అడియాసలౌతాయా। కొ

అపరభగీరథుడు (గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్‌ ఇంజనీర్‌పై వ్రాసిన కవిత) కిలకిల నవ్వుతూ గలగల పరుగులు తీస్తూ అద్దుఆపులు లేకుండ మున్నీట్రి కౌగిట్లో చేరేది కన్నె గోదావరి. అతివృష్టులకు అనావృష్టులకు ఆలవాలమైన ఆకాశం కరువుకాటకాల కార్చిచ్చు కురిపిస్తుంటే తల్లడిల్లిన తెలుగుతల్లి బిడ్డలైన ఉభయగోదావరి జిల్లాల జనులకు అభయమై నిలిచాడు సర్‌ ఆర్జర్‌కాటన్‌ నేనున్నానని. అత్మీయతకి సాకారము అనురాగానికి ప్రాకారము అయిన అతడు రూపొందించాడు ఆనకట్టనొకదాన్ని దుస్థితి కాంచి దక్షత చేకూర్చాలని. అదే చెక్కుచెదరక నేటికీ నిలిచియున్న మేటి ధవళేశ్వరసేతువు. ఈ సేతు నిర్మాణపు హేతుభూతుడి యశం అచంచల వ్యాపితమయింది ఆసేతు హిమాచలం రుగ్మతల విఘ్నాలనెదుర్కొని కష్టాలనే కబళాలనే కుడిచి నష్టాల తాకిడికి ఓడిపోక విఘాతాల అగాధాలు దాటి తనయింటి ఇక్కట్ల చీకట్లు పుక్కిటపట్టి ఇక్కట్లపాలైన వారింట చీకట్లు తరిమి కొట్ట దీపాలు వెలిగించిన దిట్ట

లక్షలాది ఎకరాల సాగుకు సాక్షీభూతుడైన దెల్దాశిల్పి ఆంధ్రుల కోసం దివి నుండి భువికొచ్చిన దివ్యమూర్తి ఉభయగోదావరీ సీమ ప్రజలకు ఓగిరము బెట్టి ఓగు బాపినట్టి యోగి పుంగవోత్తముడు ధన్యచరితులు కన్న పుణ్యచరితాభిరూపుడు ఆ అపరభగీరథుడి పేరు తలిస్తేనేచాలు అం(ధ్రప్రజలకు ఒడలు పులకరించు ఆతడి నిలువెత్తు విగ్రహం చూస్తేనేచాలు మేలుపొందిన పొందని వారలందరికీ కూడా నీరాజనాలు అర్చించి బుణం తీర్చుకోవాలనిపించు ఎన్నెన్నో నీటిపారుదల కార్యకలాపాలు వాటన్నిటికీ ఎనలేని తన సేవలర్పించాడాతడు భారతావనికి దత్తపుత్రుదనిపించుకున్నాడు అట్టి కారణజన్ముని కీర్తికాయానికి ఏటేటా అభిషేకం చేసి అభినందన వందనాల మందారమాలల అలంకరణచేసినా తీర్చుకోలేదు ఈ దేశప్రజ ఆతని బుణం ప్రతి భారత ఇంజనీరుకు కావాలి ఆతడి జీవితం ఒక ఆదర్శం, కో

కైవల్యం కోరవే (గులాబీపై వ్రాసిన కవిత) ఆభరణ విహీనమైన గ్రీవముపై అలిగి నలిగి పెనగొని సిగలై నిగనిగలాడు అలినీలాలకాల నెన్నడుమ నెగది చెలువము చిందించు చెంగావి గులాబి ఇంతలోనే నీకు అంత ఆగడమా మగువల సిగలనెక్కేటి, జగతినేలేటీ మహీపతుల మకుటాల మెరిసేటి కలికి తురాయివనుకొనా! తపోబలసంపన్నుల సయితము తమవైపుకు తిప్పుకాన్న అబలల అందాల శిరోజాల తైలగంధాల విందారగిస్తున్నావనా! లేక చేరువనున్న చెంపల చిగుళ్లపూతల పులకింతల పుంతకు అధినేతవనా! పురుషపరిష్వంగాన పెంపొందిన యౌవనగిరుల స్నిగ్ధ సౌందర్యానికి వారసత్వపు వారాశివనా! ఎందులకు నీకంత అహంభావము? చెలిమితో మధువున చేరి సేవనమున పరిణామ(గ్రస్తమొంది వన్నెదేరి వనితలు కన్న కన్నెబుగ్గల కౌగిలించుకొన్న కుసుమరాజతేజ నివహానివనా! పచ్చని పచ్చిక బయలుపై గుమిగూడిన ఆరుద్రకీటక పటలమా! (పేమికజన హృదయానురాగపుష్యరాగమా! థ్రామికజన లక్ష్యసాధనకై సాగే విప్లవాగ్శికి సంకేతమైన వర్దాన్ని వశం చేసికొన్న భామా! సహాయ సహకారముల రహదారులలో నడచి జర్‌

పుడమిని వీడే పుణ్యమూర్తుల గళసీమల చేరి మసనమునకేగి చితాభస్మానివై పుణ్యనదీ తీర్ధమ్ముల మునిగి పునీతవైన వైనమెరిగిన వన్నెలాడివనా! రకరకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఏది బాగుందంటే యేమి చెప్పను? అన్నీ గులాబీలే యెన్నో వన్నెలున్నవి ఏది అందమైనది? ఎందుచేతనంటే కిష్ట్రపరిస్థితే భావాంబరపురిలో సప్తాశ్చుడై స్వేచ్భావిహారము సేయు రాయప్రోలెరావలె పరలోకము నుండి పంచకల్యాణిపై గాలికి తరంగడోలికలపై ఊగిసలాడు నీ సోయగాల వర్ణించంగ మరి నా జోలికైతే సాహితీ సమయస్ఫూర్తి నందించంగ. రేకురేకున రాలి తొడిమవై మిగిలిన నిను చూస్తుంటే యేమనిపిస్తుందో తెలుసా నే పసివాడ్షైతే ఇంకిపోతున్న ఇంద్రధనుస్సును చూచి చీన్నబోయినట్లు అనుభూతి పొందేవాద్నని నే సంగీతప్రియుడ్నైతే మధురంగా సాగే రాగాలాపనకు విఘాతపుఘాతం యేర్చడిందని మిడిసిపడకే రంగవల్లుల ప్రాంగణమా! వీక్షించే విశ్వం సర్వస్వం అశాశ్వతం (బ్రహ్మమొక్కటే శాశ్వతం అందుకే ఆరాధించవే ఆదిదేవుని కైవల్యం నీకు కైవశం చేయమని. ఇ

ఏమని పిలవాలి? మండువేసవి మిట్టమధ్యాహ్నం నడినెత్తి మీద మండుతున్న సూర్యుడు ఆకాశంలో వేలాడే పెద్ద లావాముద్ద కదలికలను మరచిపోయిన చెట్ల ఆకులు అలిగిన గాలికి అద్దంపట్టే ప్రతీకలు కనుచూపుమేర వరకూ కనిపిస్తున్న రహదారి పరచబడిన ఒక యెబ్బని తివాచీ అనిపిస్తుంటే దూరాన దారికిరువైపులా నెలకొన్న కొండలు నెచ్చెలి నునుజెక్కిళ్లులా స్నిద్ధంగా వాటి వెనుక నున్న నింగి నేలను చుంబిస్తున్న నీలియవనికలా కొన్ని గజాల దూరాన గోచరించే యెండమావి ఎక్కడికో వెళుతున్న సెలయేటి నీటిలా కనిపిస్తున్నాయ్‌. ఉదడుతపిల్లలు పొగడపందు తింటున్న రమణీయదృశ్యం చెట్టుక్రింద కూర్చుని ఉన్న నా దృక్కులకు విందు చేస్తుంటే నా నుదుటి మీది స్వేదబిందువులు కనుకొలుకుల్లోకి కులుకు చూపుతూ జారుతున్నాయ్‌ నా కలంలోని కవితాక్షరాలు కాగితం మీదికి జాలువారుతున్నట్టు తలపైకెత్తి చూచిన నన్ను ఆకుల మధ్య నున్న పగడాల్లాంటి పొగడపండ్లు పొంచిచూస్తున్నాయ్‌. సంసారభారాన్ని మోయలేక ఆధ్యాత్మిక జ్ఞానం అనే నెపంతో అలుబిడ్దల గాలికొదిలి కాషాయాన్ని కౌగిలించుకొన్న ఓ కుటుంబనాయకుడ్ని చితికిన ఆతని సంసారాన్ని గుర్తుచేసి నా వృదయ(వ్రసూనమును ఒక్కక్షణం చివుక్కుమనివించింది పొంచిచూచే ఆ పొగడపండ్ల వన్నె ఇంతలో నిర్మానుష్యం ఆవహించిన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినవచ్చిన మువ్వల సవ్వడులు కురిసాయ్‌ నా యెదలో హర్షపు విరులజడుల్లా. వస్తున్న గూళ్లున్న జోడెడ్లబండ్లు నా కళ్లముందే కనిపించే

ఆ కొండలవైపుకు ఒకదాని వెంబడి మరొకటి యొడారిలో యెొడారి ఓడల్లా పయనిస్తుంటే యెండమావుల్లో నీళ్లకోసం వెదుకులాడే కుందేటికూనలు నడిచే యెడ్ల మెడల్లోని మువ్వల నినదానికి బెదరి చెదరిపోతున్నాయ్‌. బండ్లు కొండల సమీపం చేరుతుంటే లేజరుబీమ్స్‌లాంటి నా కంటి చూపులు పొగడచెట్టు మీంచి చీమలు క్రిందికి వరుసదీరి (ప్రాకుతున్నట్టు కొండకొనల మీంచి యెవరో అజ్ఞాతవ్యక్తులు దిగుతున్న దృశ్యాన్ని తాకాయ్‌. కొండ దిగిన ఆ వ్యక్తులు బండ్లను చుట్టుముట్టారు బండ్లను చుట్టుముట్టిన ఆ కొండ దిగిన వ్యక్తులు మృతకళేబరం చుట్టూ చేరిన రాబందుల్లా చేలపై ఐడిన మిడుతల దండులా స్ఫురిస్తున్నారు ఇంతలో ఆశ్చర్యచకితమైన అరుపులు అంబరాన్ని అలముకొన్నాయ్‌. ఆ ఘటన ఒక మెరుపుదాడిలా ఆ అరుపుల ప్రతిధ్వని నా గుండెను తాకిన అశనిపాతంలా నా బాధ్యతకు ఒక మేలుకొల్పులా అనిపించిన నేను ఘటనా స్థలాన్ని హుటాహుటీన చేరి నిలువుదోపిడి చేస్తూ నగలివ్వమన్న మగువల్ని రాచిరంపాన పెడుతున్న ఆ దోపిడీదొంగల్ని అటకాయించ యత్నించాను తత్ఫలితంగా ఒక చోరుని ఖడ్గోరగం నా భుజంపై కాటేసింది అమ్మా! అని అరచిన నన్ను ఓ హస్తం తట్టి లేపింది. అర్ధంతరంగా అలిగి పోయిన ఓ నా కవితా నిన్ను వేసవివర్దన అని పిలువనా! చారిదోపిడని పిలువనా! పొగడచెట్టని పిలువనా! ఇది కథ కాదని పిలువనా! ఏమని పిలువను? శో (29-01-1997)

శన మవర్ట్రు నన్‌ అతన వివకనమా మిం (సహృదయ సాహితీ సంస్థపై అమ్టాదశవైజయంతిక సందర్భమున వ్రాసిన కవిత) ఆంధ్రసాహితీ సదనమై విలసిల్లే విశకాఖసాగరనగరాన వెలిగిందొక చిరుదివ్వె చిత్రకవి అశ్రేయ దివ్యమంగళకరములు ్రజ్వలనము గావించగ. నెగడినదొక పారిజాతమె నవకమలముగ ఆం(ధ్రసారస్వత సరోవరాన ఆతని మానసమె ఒక కాసారముకాగా. దాని పేరే సహృదయ సాహితి ఆ రోజే మంగళకర మహోత్సవదినం వ్యాపించిన దాని శాఖలే వారి ఆశయసాధనకు అందాల రూపురేఖలు ఆదర్శాన్ని ప్రతిబింబించే ఆత్మదర్శములు లేనేలేదు యీ రోజు యే సాహితీ సభకూ శోభ ఆ నవకమలదళ పరిమళాలు సోకనిదే అసలు కనిపించనే కనిపించవు ఆ విరిదళములు గళము విప్పని కవినమ్మేళనములు. అని సహృదయ సాహితీవనంలోని కుసుమాలయితే అధ్యక్షులు ఆశ్రేయ యీ ఘనకీర్తికి పాత్రులు. సహృదయ సాహితి శాఖలు క్రియాశీల సాహితీవేత్తల పాలిటి సారస్వత వ్యాసంగాలు రచయితల మదిలో మెదిలే భావాల ప్రకటనలకు అభ్యసనవేదికలు వివిధ సాపొతీ ప్రక్రియలు విరిజల్లులై కురిసే విశాఖ వియత్తల తోయదమాలికలు కురిసే ఆ విరుల జడులు యావదాంధ్ర సాహితీ ప్రియుల డెందములు అలరించు విరజాజి గంధములు కావుకావవి విరజాజిగంధములు

రసభావహృదయులు మాన్యశ్రీ చిత్రకవి ఆశ్రేయ

సృజియించిన పారిజాతలతాంత పరిమళములు

ఆ నాడు వెలిగించిన దివ్వె ప్రసరిస్తూ ఉన్న

సంప్రదాయ ఆధునిక సాహిత్యపు దీధితుల తతులు నిర్వహిస్తున్నది ఆ హస్తం ఎన్నో విశిష్ట బహుమతి పప్రదానోత్సవాలను ఎన్నేన్నో సాహితీ మహోత్సవాలను విజయవంతంగ విజయోన్ముఖులగు కార్యవర్గ సభ్యులు అనుచరుల హస్తాళలి నేస్తంతో. జరుపుకొంటున్నది వారం వారం సాహితీ సమావేశాలు జనజాగృతీ విస్తరణ దృక్పథంతో. చాటిచెబుతున్నది సహృదయ సాహితి ఎడతెగని దీక్షకు ఎడబాయని సాహితీ కళాసేవకు వేలెత్తి చూపించగరాని నేతృత్వాలకు ఆలవాలమైన ఆత్రేయ ఆదర్శప్రాయులని, కళాహృదయులు సాహితీప్రియులు అగు ఉపాధ్యక్షులు శ్రీ కొత్తూర్తి భాస్మరరావు వారికి చేదోడువాదోడుగా నిలిచి ఎనలేని చెలిమిని పంచియిస్తూ స్వార్ధమెరుగని సేవాదీక్షతో పక్షప్రాతరాహిత్యధోరణితో మెలగు సహచరులనీ, వీరిరువురి సాంగత్యాన జరుగుతున్న యీ అష్టాదశ వైజయంతిక విజయవంతమై మరెన్నో జయంతులకు నాంది కావాలని, సహృదయ సాహితి విద్వజ్ఞన ప్రశంసలు అందుకోవాలని, ఆకాంక్షించి నా మనసు పలికే యా పలుకులు అతిశయోక్తులు కావు వాస్తవోక్తులే సూక్తులే. అ ళా

గ

మానసికధోరణి (నాకు జరిగిన దుర్హటనకు నిరసిస్తూ) సక్రమ సరణిలో నడచు సహోద్యోగిని సదా పెంపును ఆకాంక్షించే ఆశాజీవిని శక్తి మేరకు సమున్నతికై పాటుపడే కష్టజీవిని న్యాయమర్థించిన నిస్సహాయశూరుని వినయసంపన్నుని వివేచన మరచి అ(క్రమార్దనను ఆలింగన చేసికొన్న అధికారమదాంధుడు దుర్నీతిపధికుడు దుశ్శాసనశీలుడైన ఒక ప్రధానాధికారి దుష్టకార్యనిర్వాహకులను, సంస్థను అంటిపెట్టుకుని పట్టి పీడిస్తున్న గాంగలీకీటకాళిని అక్రమచర్యలకు అండదండగ నిలిచి అకృత్యాలు కొనసాగించే న్యాయార్ధి సహచరులకు నిస్సహాయుని సహోద్యోగులకు పదవులను ఎజవేసి ప్రలోభపరచి ఉసిగొలిపాడు ఆ నిస్సహాయ సుమనస్మునిపై వారి మాటలు ములుకులై దొలిచాయ్‌ ఆతని యెదను అంతరంగం కదిలింది వ్యధాకులితవ్యాకమై ఆవేశం రగిలింది అతడిలో పరాభవమొందిన అభిమానధనుని స్వాంతానలకీలలా దేహం వేడెక్కింది మందువేసవికాలపు మేదినీమండలంలా ఆవేదన ఉప్పొంగింది నయనాలు అరుణమందారాలు అయ్యేలా! తుదకు యెద శ్రాచై ఎగసింది బుస్సంటూ శే య్వ గ్రంధాలయ్యు స్‌ మనోవేగ గతిని మింటినంటేలా సం సవా. విషాగ్ని జ్వాలలు కక్కింది విలయతాండవం చేసింది ణా. అవ్‌ మాకూ = ఫో

ప్రళయకాలపు ప్రభంజనమై చెలరేగింది పాపభీతిని మరచి మనసు జ్ఞానశూన్యగేహమై గళము వేడెక్కింది వాచాలత్వపు కొలిమిలా దేహం దెబ్బలపాలయ్యింది కార్యాలయపు తలవాకిటలో హఠాత్తుగ మనసు నివ్వెరపోయింది నిశాంతసమయపు శీతసమీరణములో మౌనవ్రతము పూనిన యోగినిలా తేరుకొన్న మానసం అహితకార్యాలు చేయుటకై అహిభుక్కులా గాలించాలనుకొంది ప్రతీకారవాంఛతో ప్రజ్బరిల్లబోయింది హతుని ఆలి పసిగట్టింది పగను చోటు చేసికొన్న మగని మానసమనెడు గనిని ప్రజయసుధాపూర్ణ పదముల పతిని ఓదార్చింది ఊరడింపు మాటల ఉత్తేజపరచింది ఆతని మానసక్షేత్రంలో ఆమె హితబోధలు నీహారప్రసూనసోనలై వర్షించాయ్‌ హృదయక్షేత్రం చల్లబడింది. హర్షంతో నిండిన ఆతని మనస్సులో వసంతం పూచింది నిండు మనసు వెండివెన్నెలలు వీక్షించింది గువ్వల జంట కూనలతో కోనలమ్మ ఒడిలో కొత్తకాపురం చేయసాగింది. కో (14-05-1997) షు ఈనన జ్జ

1 వారాణసీపురాధీశ్వరా; ఉబ్బణము = పొంగు / అతిశయము సరసీరుహము = పద్మము, అంభోజము, చాటువులు = ప్రియమైన మాటలు అంబుజము అగచాట్లు = ఇడుమ, ఆపద సురఖభిజవసంతబుతువు మస్రిష్మము = తలమదడు కైవల్యము= మోక్షము, అపవర్గను అనర్జము = వెలలేనిది ఇదుగదడఐ అసూయ శుష్మము = ఎండినది వతంసము= సిగబంతి వరేణ్యుడు = ముఖ్యుడు వటలము= నమూవహము, జాలము, నికేతనము = ఇల్లు, గృహము, ఆవాసము. సముదాయము, సముదయము, (వ్రజము, సదనము, గేహము నివహము, సంచయము ప్రాంగణను = ముంగిలి

= సెలయ్‌లు, రుది= సెలయేలు నిర్ణరము శ కవికబం వాల్మెనొ ఐతే; 2 మరల జనింంంచవా: రజ్జువు = (త్రాడు పరిష్వంగము= కౌగిలింత పేలవము = ఫలుచనిది, విరళము పుంగవుడు= (శ్రేష్టుడు (ఉత్తరవదమైనచో) వహించు == తాల్చు ఇబాతలము=భూతలము పధము = మార్గము లాలస= అధికేచ | నిగమము. = వేగము కతన కా ఆగమము= దేవపూజావిధానమును చ్‌ తత్సంబంధిత ధా అపలగ్షనాము = దంర్లక్షణము. (బ్యాడ్‌ వషయము: ప క్వా!

షయములను తెలుపునట్టి శాస్త్రము. నిరంతరము = ఎదతెగనిది తె చేయూతనివ్వండి: ం హర్షము=సంతోషము, ముదము & దయరాదా దయాగర్ధసహ్బదయా : కవనము= పద్య ము వింజామర = తెల్లనిజామరము

వతా విగ్రహములకు విసరునది) కాశ్యపి= భూమి, మేదిని, పుడమి, రత్నగర్భ (దే ము పికము= కోకిల యుగళము = జత, యుగళి యుగ్మ! మరందము= పూదేనె, మకరందము _ శ శ్వేద్రస్తోదరా: నినాదము = నిర్హాదము, ధ్వని, భ్వానము, (ప్రక్షాశనము = చక్నగా కదుగుట [మోత స్రవంతి = నది, ఏటు, వాక, ధుని అంగజము = వెంక నెగడు = బయలుమెఖఇయు ౬& వర్నాధిక్యము: ఆ(కాంతవము = ఆ(క్రమింవబడినది, స్పైెకళము = ఇసుకనేల అణుమబడినది. శతోయదము. = మేఘము, మబ్బు, విక్రాంతి = అధికదబలము నీరదము, పయోధరము సంకీర్ణము = ఒకటితోనొకటి కలసినది విహంగము = పక్షి పుష్కరము = నీకు

(ద్రుమము = వృక్షము, చెట్టు నిరతము= ఎల్లప్పుడు వాహిని = సేన తురాయి = తలనుంచెడు భూషావిశేషము 12 మగువల్లారా జాగ్రత్త!: జనపదము = గ్రామము అవళి = వరుస కంటకము = ముల్లు 'ప్రజయము = (ప్రేమ వధువు = భార్య 1% వసంతమా కాస్తంత ఆగుమా: సదనము = ఇల్లు, గృహము, గేహము.. బ్బ = మంచు, హిమము, నీహారము కుద్యము = గోడ గళసీమ = కంరప్రదేశము 14కవితా సౌందర్యము: బెచిత్యము = సత్యము 9. నీ సొగసు చూస్తుంటే: మర్మము = కిటుకు (మిస్టరీ లేక సీకైట్‌) మోవి = పెదవి, అధరము అవసానము = ముగియిక చెలువము = చెన్ను, ఆందము, విపంచి = వీణ సౌందర్యము కల్దారము = ఇంచుక 15 మిణుగులులు ; యెటుపునుదెలువును గలిగి మిక్కిలి ఇంచుగడ = చెలుకుగడ పరిమళముగల కలువ ఊడిగము = పరిచర్య, సేవ రలగాదము లి వ్యక్తమధురధ్వని 17.కవికోకిలకు తలిరాకు తాంబూలము : కేలు = చేయ తలిరాకు = చిగురాకు (మైల = ఎదురు విధి = బ్రహ్మ విరించి = బ్రహ్మ వధువు = భార్య మదిర = సుర, మద్యము, కల్లు 10. సామరస్యపు వెలుగు రేఖలు: (రాహువునకు కాళ్లు చేతులుండవు) కాయము = శరీరము అంగలార్చు = దుఃఖించు రుధిరము = నెత్తురు వల్లభుడు = ప్రియుడు స్వేదము = చెమట మౌధ్యము = మూఢత్వము, మూఢభావము వః ” తీగ సౌరభము=వాసన, సౌరభ్యము 11.సందియము: మంజరి = చిగిరించిన లేత కొమ్మ పరాత్సరుడు = శ్రేష్టులకందటికి శ్రేష్టుడు నిక్వణము = వీణలోనగువాని మోత దెందము = హృదయము, ఉల్లము సౌజన్యము = సుజనత్వము, మంచితనము వురాకృతము = వూర్వజన్మమందు మర్శ్యము = భూలోకము చేయబడినది (శుభాశుభకర్మము) సానువు = అడవి/కొండనెత్తము ప్రారబ్ధము= శరీరము నెత్తించెడు పాషాణము = ఉాయి, శిల, గ్రావము కర్మవిశేషము వెల్లువ = ప్రవాహము

  1. కులవ్యాళగరళం: 24 అపరభగీరథుదు: వ్యాళము = పాము, కుండలి మున్నీరు = సముద్రము గరళము = విషము యశము = కీర్తి లోహము = ఇనుము రుగ్మత = రోగము, రుజ, రుక్కు మార్గణము = బాణము విఘాతము = అడ్డంకి సంకుచితము = సంకోచమునొందినది లేక ఇక్కట్లు = కష్టములు, సంకటములు నాట్‌ వైడ్‌ 25కైవల్యం కోరవే: స్థంఖలము = సంకెల గ్రీవము = మెద ప్రసూనము = పుష్పము అలకము = నెటి(అందమైన) కురులు అనివార్యము = నివారింపదగనిది (రంగెట్‌

  2. సమైక్యభారతం: చెంగావి = మనోజ్ఞమైన యెలుప్పు వైషమ్యము = విషమత్వము, వేభిమి *గడము = అకార్యము ప్రభంజనము = తుఫానుతో గూడినగాలి కలికి * మనోజ్ఞము (సుందరము) అంధకారము = ధ్వాంతము, చీకటి మసనము = శృశానము రంగవల్లి = ముగ్గు

  3. నిను కొలుచు నాకు: వీక్షించు = చూచు కట్టె = కాష్టము, కజ్జ (తృణప్రాయమైన స్పిగ్ధము = నునుపుగలది మని భావము) 24 ఏమని పిలవాలి?; కుందు = దుఃఖించు క్ష ఈడేజు = దృక్కు = చూపు ఆు = నెరవేరు, సిదించు జ క ద యవనిక = తెర స్‌ అవహించు = కలుగు విషాదము = భేదము, దుఃఖము అలముకొను = వ్యాపించు నినదించు = (మగు 27 సహృదయసాహితి :

  4. కలసంకల్పము: ప్రజ్వలనము = మందుట | ధీ = బుద్ధి సారస్వతము = సరస్వతీ సంబంధమైనది సమన్వితము = కూడుకొన్నది వ్యాసంగము = మిక్కిలి ఆసంగము మనము = మనసు, మానసము, (ఆసంగము = ఆశ్రయము) స్వాంతము వియత్తలము = ఆకాశము, వియత్తు, పరిపక్వము = పరిపాకము (పరువము) మిన్ను నొందినది. లతాంతము = పుష్పము, సుమము చాపము = ధనుస్సు దీధీతి = వెలుగు వరేణ్యుడు = ముఖ్యుడు తతి = సమూహము వాక్రుచ్చు = చెప్పు ఎడతెగని = ఆపులేని (సీజ్‌లెస్‌) వ్యక్తము = తెలియబడినది ఎడబాయు = వీడు, వదలు

  5. మానసిక ధోరణి :

ధోరణి = పద్ధతి

ఆళి = పంక్తి

సరణి = త్రోవ

వివేచనము = వివేకించుట (విచారించుట)

పధికుడు = దారినడచువాడు

ప్రలోభము = ఆశచూపి వశపరచుకానుట

అకులితము = చెదరినది / దుఃఖము

నొందినది

అనలము = అగ్ని

నయనము = కన్ను లోచనము, నేత్రము

శూన్యము = ఖాళీ ప్రదేశము, ఆకాశము

వాచాలత్వము = వదరుబోతుతనము

(చాటరింగ్‌)

సమీరణము = గాలి

అహిభుక్కు ఇ గరుత్మంతుడు

సోన = వర్షము

నీహారము = మంచు కృతికర్త శాశ్వత చిరునామ: 89-143, మహాదేవ నిలయం ఆదర్శ్భ్‌నగర్‌, కొంతమూరు గోకవరం రోడ్‌ రాజమండ్రి తూ॥ గో! జిల్లా

గ్రందాలయ | డాం య జ... ఓరీ! జ్‌ లి గే. పతనం 56...

ఈ ఫుస్తకమునందలి కవితలు అచటనచట సమాస తోరణాలతో అలంకార ం!

.... ప్రతిజంబాలతో చమత్కార యుక్తములై రసాత్మక హృదయములై సందేశాత్మక |

... సలహాలై ప్రబోధనాత్మక సుమసౌరభాలై వర్జనాత్మక సుందరములై విప్లవాత్మక . ప్రభంజనాలై విలసిల్లుచున్నవి. ఇదివరకు పాఠక లోకానికి అందజేయబడిన నా

పాటల పుస్తకమగు “గీతమాలిక” వెనుక అట్ట వెలుపలి పుటపై వ్రాసినట్లు యీ

..._ పుస్తకమునకు “కవితాకల్పారమాలిక” అను పేరుగాక “ఆలోచనామయూఖములు"

అని పేరుపెట్టబడినది. (=

సమిపభవిష్యత్తులో మరొక పుస్తకమును పాఠక సమాజంలోకి తీసుకురావాలనే ఉద్దేశములో ఉన్నాను. దానిని “తరంగిణి” అను శీర్షికతో గాక

వేరొక సరియైన శీర్షికతో వెలువరించాలని భావిస్తున్నాను. దానిలోని ఎక్కువ "

ఖండికలు యుగళగీతములలోని చరణములకు ఉపయుక్తములగునవిగా ॥

నుండును. ఆ పుస్తకము విద్యార్థిలోకం ప్రశంసలనందుకొంటుందని నా గ ప్రగాఢవిశ్వాసము. నేను సినీరంగ ప్రవేశము చేసినపుడు వానిని నా పాటలలో

అక్కడక్కడ చొప్పించాలని అభిప్రాయపడుతున్నాను. -

నా కృషికి తోడు భగవదనుగ్రహ ప్రాప్తి కలిగినచో నా జీవితాంతిమ 7

ఐహికాకాంక్ష నెరవేరుతుందని అనుకొంటున్నాను. సునాయాసంగా పాటలను

' _ శ్రాయగలనని నమ్మకం యేర్పడినవుడే ముందడుగువేస్తాను. 2002వ ]

సంవత్సరంలో కొంతమంది వెజ్టివెంగళప్పలు అడ్డుపడగా ఆ'* ప్రయత్నం

విరమించికొని ఉద్యోగంలో చేరాను. ఇకపై వారికి అటువంటి అవకాశం .

  • _కలుగకుండుటకై తగు చర్యలు తీసికొంటాను. -

ఇట్లు. ం. ॥

౨౧ మీశ్రేయోభలాషి్‌ శ ౧

శ్రీమంతుల సుబ్బారావ్మి .