Telugu adyntalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

యా సహజకవి మల్లెమాల . ౫ మనసుపడి మక్కువతో సేకరించిన

  • న రే. ' ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం “| జో ' సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి 1. గ ఆనందంతో బహూకరిస్తున్నాం. . | ల - మల్లెమాలకుటుంబం | రో గార్థరీ సీంటషీళరీ ంక్మ్మీరార్వీ8

ఆద్యంతాలు (కవితాసంపుటి డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి ప్రచురణ యన్టీఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ

౮7 ళా

ఆద్యంతాలు (కవికాసంపుటి) జా

ముం ఈ గరిటిసిమం (2/2 320040) యో లా ా న య 4 [కటలా

న వం ల [= ళ్‌ ( (9 4440 | న ల! ౮ 0౧1 626611 20/2 నమ 00౮౪౯౦8 0౧ గ౧)12121 0॥20౧/ ౪54000 కడ110129%0

౧40 8[86 0౫ [1౧ 5060200141 806160, 82012౧2 [|15, 6246/2026. ౧గ౧(66 21 జీ8 0/36/౧196, 0014464040 గ౪6612026. 0% 27664525 1000018 గీ 1620100 60081003 ౨౧6 గం. 100/-

అంకితంరాడాా కష్టాల్లో, సుఖాల్లో, కన్నీళ్ళల్లో నా ఉత్సాహాన్ని ఆరనీకుండా అడుగడుగున నన్ను ప్రేరేపించి, ఈ పుస్తకం రావటానికి, యం.ఫిల్‌., పిహెచ్‌. డీలకు మార్గదర్శియై డాక్టరేట్‌ సాధించటానికి కారకులయిన మా మాస్టారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్భి - 11 సభక్తికంగా... ఎందరో మహానుభావులు ణా జ్‌ అందరికీ కవితావందనాలతో... స్ట. శు అంకితం

  • నందమూరి లక్షీ ఆవొర్వతి

ఈ వుస్తకంలోకి వెళ్ళేముందు...

సృష్టి అంటేనే ఆది - అంతం. మొదలయ్యిం దంటేనే దాని అంతం ఎక్కడోచోట వుండాలి. మూలం పుట్టుకదయితే ముగింపు మరణం. మధ్యలో నడిచేదంతా ఒక నాటక సన్నివేశం. ఒక స్వష్ప్నావిష్క్మరణం. కర్మ, జన్మ పరంపరా గతమైన జీవసమూహానికి జనన మరణాల కతీతమైన ముగింపు ఒక శూన్యం. ఆ శూన్యంలో దారి వెతుక్కోనటమే పరమార్ధ ్రస్థానాన్వేషణం. ఈ తాత్త్విక చింతనతో నడిచిన నా చిన్ని కవితా సుమాల్ని మహనీయుల పాదపద్మాలకు సమ

కవిత అంటే సృజనాత్మక వీధుల్లో తిరుగాడే ఒక భావకల్పన వూహలకు అందని మార్మిక రహస్యాలను ఏర్చి భాషలో పొదివి ౭ దిగేది కవిత. భాషలద్దిన లోగిలికి భావనా రంగవల్లి కవిత. ఎప్పటికప్పుడు కవికి తొలిప్రసూతి కవిత.

భాషాప్రవీణ చదువుకునే రోజుల్లో కృష్ణ శాస్రిగారి వూర్వశితోపాటు అనేక భావ కవితలు చదివాను. రాయ(ప్రోలువారి తృణకంకణం మనసులో ముద్రించుకు పోయింది. రవీంద్రనాధ రాగూర్‌ గీతాంజలి అనువాదం, చలంగారి కాన్క పూర్తిగా ఆ కవితా ప్రపంచంలోనే వుండి పోవాలనిపించేది. తొలి వలపు లేకపోయినా తొలి

వయస్సుకు అదొక మధురానుభూతి ఏడవ తరగతిలోనే ప్రారంభమైన కవితాకలం, యన్టీఆర్‌తో (ప్రేమలోపడ్డాక విజృంభించింది. భావకవిత్వం నా ప్రాణం ఆయన మీద ఎన్నో కవితలు రాసాను. చాలా పోగొట్టు కున్నాను. యన్టీఆర్‌గారు కూడా మంచి కవులు, భావుకులు నామీద ఆయన రాసిన కవితల్లో భావం, భాష, 'ప్రాస సమపాళ్ళలో వుండి కవిత్వానికే నిండు దనాన్నిచ్చాయి. నా కవితల కంటే వారి కవితలంటేనే ఇష్టపడేదాన్ని ఆ సమయంలో భావకవిత్వమే రాస్తుండేదాన్ని ఆ ఉత్సాహం, స్ఫూర్తివేరు. వారి మరణంతో భావకవిత తన తలుపులు తనే మూసుకుంది. ఎంతో ఇష్టమైన భావదారి శాశ్వతంగా మూతబడిపోయింది. అనుభవాలు, ఆవేదనలు, జీవనపరిస్టితులు, ఒడిదుడుకులు అన్నీ కలిపి మరోదారి చూపిం చాయి. అదే తాత్త్విక ధోరణి. పరిస్ట్‌తుల (ప్రాబల్యం, రాజకీయాలు వీటి కాగ ౦గా వెనకబడిపోయిన నా సాహిత్యాభి లాషను మళ్ళీ ప్రోత్సహించి ఈ పుస్తకం రావడానికి కారణ మయ్యింది *'మా గురువుగారు” శ్రీ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రోజుకు నాలుగులైన్లయినా రాయమని ఫోనుచేని చెప్పేవారు. బద్ధకించినప్పుడు బద్ధకించినా ఒక్కొక్కసారి వుత్సాహంగాా రాస్తుండేదాన్ని. అలాగే నా కవితల్ని చదివి కవితలు కావు, అగ్నిజ్వాలలు'

అంటూ లెటరు ద్వారా నన్ను ప్రోత్సహించిన మహాకవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారికి ఎంతో రుణపడి వున్నాను.

పరోక్షంగాకూడా నా అభివృద్ధిని చూసి ఆనం దించాలనుకునే నా స్వామి, నాదైవం శ్రీరామా రావుగారి ఆశీస్సులనెట్లా మరిచి పోగలను?

జీవితమంటేనే తెలుపు నలుపుల కలయిక. విషాదం ఆనందం దాని రెక్కలు. కాని నా జీవితం ఎప్పుడూ ఒకే విషాద విస్రబ్ధ వీణియ. ఆనందం తనతో తీసుకు పోయిన నా స్వామి పాదాల్నే ఉ'ర్ర్చేరకాలుగా మనసులో స్మరిస్తూ ఈ పుస్తకం రచించాను.

ఎంతోమంది ఆత్మీయులు. నా స్నేహితురాలు హైమ మొదటినుండి ఏ చిన్న కవిత రాసినా విని ఎంతో ఆనందించి నన్ను ప్రోత్సపిస్తుండేది. ఆమె కూడా ఇటీవలే 'నా తోటలో” అనే కవితా మంజరిని విడుదలచేసింది. నా కవితలు ఎన్నో సార్లు పత్రికల్లో అచ్చయ్యాయి. అందులో ఆంధ్ర భూమి, వార్త ఆదివారం మ్యాగజైన్లలో ఎక్కువ భాగం వచ్చాయి. ప్రచురించి ప్రోత్సహించి నందుకు శ్రీ శాస్త్రిగారికి, అశోక్‌గారికి ధన్య వాదాలు.

మరో ఆప్పుడు విజయభాస్కర్‌. మంచి నాటక రచయిత. ఆయనా కవి, భావుకుడు. నా కవితల్ని విని ఆనందించేవాడు అలాగే తెలంగాణా పార్టీ

వ్యవస్థాపకుల్లో ఒకరయిన శ్రీ హనుమంతరావు గార్కినా కవితలంటే ఎనటేని అభిమానం. ఫోను చేసి మదీ కవితలు వినిపించమనేవారు ఇంతమంది ఆత్మీయులు, రసజ్ఞులు, మరెందరో మహానుభావులు అందరికీ వందనం. శుభాఖి వందనం.

పుస్తకం అచ్చేసిన ఆకృతి ప్రింటర్స్‌, కవితల కనుగుణంగా బొమ్మలేసిచ్చిన కళాభాస్మర్‌గార్మి ముఖచిత్రం ఇచ్చిన శ్రీ అంజయ్యాచారిగార్మి (ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమాన (్రోతలందరికీ కవితావందనాలు.

మీ ఆశీస్సుల్ని కోరుకుంటూ...

  • నందమూరి లక్ష్మీపార్వతి

గుంటూరు శేషేంద్రశర్మ గ్యాంబొ ణు ఈల, శృన్‌బాగ్‌ పాలెస్‌, గోషామహల్‌, హైదరాబాద్‌ కవితలు కావు, అగ్నిజ్వాలలు క వో (సోన వట్టాల య్‌ల్మ యమన లో కస వమ అచాష్థతాల ఓన్ని బ్యాం లమ గ న్యర్న క్ల ఫ్య లనిత్‌ ట్స ఉడిన బటట వాంతి ల ఉం వడాల కే కవ వి కేలా నిళంనవాని మ్‌ల కనతలమ్ను శమ తా వంతమయా త అళ్లే ఫూదస్థడ ఇంటి ఈద హ్తాదల యని టా వం లును ఆలం ఉలలినే మావు సదొవన్ననత్యాంయి అత పా షప. 6 ళు బగ ఉలినా 3వ పద్వలు. ఈకల ున స్‌ న ఫడు రరైముా, ఉంతళందాన్నిదదాంటు హా తహపుషైకుత్సు ల యుల దూరాక చపేలాఎటి గు దదామి అ / సొంగత్ష్యాా అపింయం మా జాతం ఊం వే రీ లీ న వేస వ ్గ గ కం? రావా నా ఈశ హ్‌ ఓ మ ఎల కన. ర్రవటాపై మంచి ణి అశ్మక టీం కలది మ సళ్ళ విట ఉలప టుటాతే జిగి సల చూడక నత్యత కడు) ఆపంంి తిర ఊప ఒకవాణాలణరుకి మంలో మలం లంక ఉంళమ్చూస్తా వా బ్ర య అరర్మె౦ లను ఈవై యమనంణలో లా నొ ౬ లా టు పదుకోానతసింది సైందంలిం వశ కంంగా పరిళప ఉత న నంయ సవ స (లవ జలం శవా యట వు చవణులాతే ద్ర సరళం నంట శన ౨జి షం బజిాఆంనా మమకంన్త దడి పర్తివపెసాద్యాల శానా ధ డితకాో కో జ గాడ కా న బ్లెస్థిక్‌ వోచత్హ్యం లాగ యెలపివ ఈక లపల గాత్సగన్త్యుతుకి బలిఖి లతా ఎం యాతు య్యా విష్మ్యకన్మునా వచ్చ లును కటా శ లా! లూ దవన (రం లలు నా! షెలద్సృశర్ను )

కరతల ఫురుం... అనంత ప్రయాణం 15 ఓం శాంతి 17 నిర్వేదనం 18 అడుగుజాడలు 20 చారిత్రక సత్యం 22 నేనెవర్ని? 24 జీవితయానం 26

వృద్ధాప్యం 28 జనారణ్యం 30 అ్థశ్రువేదనం 33 సత్యం-శివం-సుందరం 34 సమ్మోహనం 37

ప్రతీక 40

శునకం ఆత్మకద 42 ఇదా నీరూపం 45 తేనెటీగ 47 ఎవరతడు? 50 ఒరిపిడి. 52

రాత్రి 54

దైవం 55

పుడమి సంక్షోభం ల్‌/ ఊహాప్రేయసి 59 అసంతృప్త కామన 62 రోడ్లు 63

అనుభూతి 64 అపార్ధం 65 వియోగం 66 నిర్భాగ్యులు 67 ఎవరు వీళ్లు 68 కళ్లు 69

అస్థిర స్వరం 70 అన్వేషణ గ. నిర్లిప్తత 72 స్వార్ధం 78

నిరాశ 75

నింగీ -నేల 76 ఆయనొచ్చారు 77 నాలో నేను 79 శవరాజకీయం 81 సేద 83 పులకింత 83 ఎదురుచూపు 84

నీకై 84 ప్రియభావన 85 పరిమళం 85 లయం 86 స్వప్నం 86 ఎదురుచూపు 87 నిరీక్షణ 87 అకాంక్ష 688 విరహం 88 కరటం 89 సంయోగం 89 నావ 90

లోకం 90

స్మృతి 91 జ్ఞాపకం 91 విరాగం 92

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 15 అనంత ప్రయాణం

వర్తమానాల తైధిల్యపుఛాయల్లో రూపుమారిన గతాలు తొంగిచూస్తున్నాయ్‌ అనుభవాల కొలిమిలో మరుగుతున్న దృశ్యాలు తెఅచుకున్న చరిత్ర ద్వారాల్లో నుండి అత్మ వేదనల పుటల్లోకి జారుకుంటున్నాయ్‌ గతానికీ - వర్తమానానికి వున్న దూరాన్ని ఏకళ్ళు లెక్కించగలవు? నిదురమబ్బు మాటున మేల్మొన్న నా చైతన్యానికి మాత్రమే సాధ్యం కాలం అంచులు ఒరిపిడి పెడుతున్న క్షణాల్లో నన్ను నేను దిద్దుకోవటానికి ప్రయత్నిస్తున్నా

న నింగి కొసల్ని తాకుతున్న మోహపర్వతాల్ని అగస్తుడిలా అణచేయాలి పాతాళం పొరలు శోధిస్తున్న కామసముద్రాన్ని మధించాలి కన్పిస్తున్న లంకదారుల్లో రాక్షస విహారం స్పష్టంగా చూడగలుగుతున్నాను ఇదంతా కష్టమ్మీద దాటేయగలిగినా స్వప్నావరణలు మరో లోకంలో విహారాలు సిద్ధం చేస్తున్నాయ్‌ భ్రమల వాటికల్లో తిరుగుతున్నప్పుడు లోకానికావలంతా చీకటి కనిపించింది దిక్కులు కరువైన శూన్యంలో బరువును మోస్తూ అనంత ప్రయాణంలోకి అడుగులేస్తున్నా జీవచ్చవాల జీవన తీరాల్ని దాటుకుంటూ-

వార్త అదివారం అనుబంధం

దాక్టర్‌ నందమూరి లక్షీపార్వతి 17 ఓం శాంతి అంతర్మధనం జరుగుతున్నపష్పుడల్లా ఒక మహాఖీల హాలాహలం మరుగుతున్న సవ్వడి దూరంగా రాబందుల నివాసాల్లోంచి ఎముకలు నలుగుతున్న పటపటార్భాటాలు కాలం చెల్లని జీవచ్చవాల శవాలుకదా కొరుకుడు పడటం కొంచెం కష్టమే కబంధుని హస్తాలు చాచిన ప్రదేశం ఇదేననుకుంటా మిగిలిపోయిన జాడలెంతగా మొలకలెత్తాయో దయ్యాల వూడల్లా దశదిశలు ఆక్రమిస్తున్నాయ్‌ నరమేధం జరుగుతున్ననోట మహాకాళికల ఎ(ర్రటినాల్మలు భయపెడుతున్నాయ్‌ రక్తంతో గొంతు తడిసినప్పుడల్లా వికటాట్టహాసంతో వీరంగమాడుతున్న అగ్నిజ్వాలలు ఆర్హారావాల ఘోషలన్ని నొక్మివేయబడుతున్న గొంతుల్లోంచి పీలగా ధ్వనిస్తున్నాయ్‌ కండరాల్లో ఏమూలనుండో వేదనాదం సుస్వరంగా మెత్తటి మాంసకుహరం కరుగుతున్నవోట ఓం శాంతి - ఓం శాంతి - ఓం శాంతి వార్త ఆదివారం అనుబంధం, € 12 2004

118 ఆద్యంతాలు తగ (2 భ్‌ క... స్ట్‌, ల. అ... (. నన సనగ. సే స్ట్‌ గ గ నం. గ్ర నిర్వేదనం గమనా గమనాలను తన గమనంలోకి మార్చుకుని వ్యక్తా వ్యక్త చేతనలో లయిస్తోంది కాలభ్రాంతి ఉనికే లేని ఊహాభమణానికి ఉదయాస్తమయాలే కొలమానం నదకేరాని అనాది చేతనకు ఆది మధ్యాంతాలే ప్రమాణం అనంతమైన శూన్యవారాశిలో

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 19 గ్రహాల గుహల వాకిట్లో తిరిగే ఆత్మల సంచారం మరో జన్మకై పదే ఆరాటం పోషలన్ని నాదబ్రహ్మాన లీనమై ఏకవాదన వేదమే ఓంకార గానమై (శ్రుతిస్తూ గతిస్తున్న జీవజాలం అందుకునే అనంతకాంతి సంవీక్షణం నిర్వేదనా నిర్మమల నిశ్వసనమే మోక్షం ఆంధ్రభూమి" ఆదివారం అనుబంధం

20 అద్యంతాలు ప టం న ఆల్‌ అ నం! | న సా

ర క భాం భీ / 11 ॥ ః ల లీ ల బు! క్ట! న్న శి (న త? ల! ల జ్‌ శీ 11 క సకం! శే ల / 1 టం గా వా కన! న! 1 ఛు టో ము (| మఖ ళో న సో దనన శో "శీ తి సాటి ౯ టి | సస క య య అడుగు జాడలు విస్ఫోటనంలోనుండి విశ్వం పుడితే కణాల గుప్పిట్లో పిండం కళ్లు తెచింది జీవనాళాలు సరిదిద్దుకుని భావరాగాలు మేళవించుకుని పరివర్తనా దిశల్లో పరిడవిల్లుతూ అవస్థాత్రయంలో ఆదమఖచి అడుగు నేర్చింది జీవచేతన

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 21 మరఠరణశయనానికి మరోయాతన దహరాకాశపు తెలికాంతుల్లో చిదానంద చిరుజాడల నీడల్లో మెలిగిన మదుర జ్ఞాపకం విస్మృతమై మిగిలింది విషాద రోదనం అందుకే - జననం రోదనం మరణం పెనురోదనం మధ్యగమనం మహారోదనం దుప్పట్లో కదిలే మిన్నాగులా వెంటాడుతున్న మృత్యువు నీడల్లో అనుక్షణం అదలించే భయాల వాకిట్లో చేజార్చుకున్న కాలం కౌగిట్లో అంతరించిన ఆనందఛాయలు ఆదిమద్యాంతాల అడుగుజాడలు ఆంధ్రభామి' ఆదివారం అనుబంధం

22 మో నన. 11111 సన్‌... ఇతో [ఈ త" మ నం. న! బ్‌. న ల ఖే న చారిత్రక సత్యం కదలుశున్న కాలం పొరలో గతివ్తరాామ్‌. చర్చుపాట్రైాల? న శ్వ దు బలంగ ఆదిర పొంచి 2 టు” అట రలరిను. ఈయంటంంలానం ౭ న. . ళ్‌ వ. ”

దాక్టర్‌ నందమూరి లక్షీపార్వతి 23 ఏ మతంలో పుట్టాడు - ఏ వ్రతంలో పెరిగాడు పచ్చిమాంసాన్నే ఇక్షుఖండంగా పచ్చి నెత్తురే మధురామృతంగా భుజించిన ఆ రోజులను గమనిస్తే మొలకు గుడ్డ కట్టని ఆ దినాలను గుర్తిస్తే పవిత్రజననం ఏ స్థాయిలో జరిగిందో గ్రహిస్తే స్ఫురించే నిజం ఒక్కటే - ఆకలీ - కామం తరాలు గతించినా దాగని చారిత్రక సత్యం పంచభూతాలతో కలిగిన నేస్తం ప్రపంచావిర్భవానికి రూపమది వాస్తవం చలి తీర్చిన గుహలే గుడులయ్యాయి అక్షరం నేర్పిన వృక్షాలే బడులయ్యాయి ఆది దేవుడు అగ్నిరూపాన అవతరించాడు అర్ధంకాని సృష్టంతా అద్భుత వేదాంతమయింది అగమ్యగోచరమైన అయోమయంలో (బ్రహ్మతత్త్వం బ్రహ్మాండమై కూర్చుంది

జ ఆద్యంతాలు నేనెవరిని ?

పూలబరువు మోయలేని వసంతాన్ని సుఖ దుభానుభవంలో నిరంతరం రగిలే శిశిరాన్ని సంక్రాంతికి ఉదయించే ముద్దబంతిని ఉగాదులందించే తొలి వేపపువ్వను నేనే నా కళ్లు చీకటికెరటాల్లో ఈదుతున్న నక్షత్రాలు నిరంతరం సముద్రపు ఆవిరిమోసే నీలిమేఘాలు నాక్సు తెలీకుండా నాలోకి ప్రవహిస్తున్న

మానవత్వాన్ని

దాన్ని భక్షించే రాక్షసత్వాన్ని నేనే నేనెవరిని ?

వెలుగు చీకట్లు కలబోసుకున్న జీవనప్రమాణాన్ని

దివారాత్రుల నడుమ నలిగే

సంచలిత చక్రభ్రమణాన్ని

కాలంతో కలసి నడుస్తున్న బాటసారిని యుగాల అవర్తనల్లో రేగిన చిరుశకలాన్ని

నా ఉనికి స్వల్చ్బం - నా తలపు అనల్పం బ్రహ్మసత్యమనే వాక్యానికర్థం నేనైతే నేను అనంతాన్ని - ఆనందసర్వాన్ని మరణరహిత - అమృత తత్త్వాన్ని తిమిర లోకాలు దాటి వెలిగే

కోటి ప్రభాకాంతి సముచ్చయాన్ని అహంబ్రహ్మాస్మి - నేనే నేనే

26 ఆద్యంతాలు మమ గ స్ట్‌ లగ ళో. క నా అ. త ఆస్ట జ న ర. లే జే ము నే కా న్న ప . ప నె ర | స! సీ త్త హో [/ న ఆఅ ( టా చ్న్హా షా జు జో స అ క్ష్‌ ఆ స్య = న. జీవితయానం జీవన తరంగాల్లో వూగిపోతున్న నా ఆశల స్వప్నాల విహారం తీరం చేర్చలేని నీరాశానౌకాయానం ఎక్కడో - సముద్రమధ్యంలో సాగేటప్పుడే చుక్కాని తెగిపోయిందన్న భావన దిక్కులు కరువైన - అనంతజలరాశిలో అగమ్యమైన హాహాకారాల సవ్వడులు దానికీ - నాకూ పెద్ద తేదా యేముంది

డాక్టర్‌ నందమూరి లక్షీ పార్వతి గ నేనూ జడదినే - కదలిపోతున్న కాలం అంచులు పట్టుకునే ప్రయత్నంలో జారుతున్న కెరటంలానే వేసారి పోతున్నాను షనీభవించిన గుండెల్లాగానే ఈ కొండలు నన్ను దీనంగా చూస్తున్నాయ్‌ పొరలు పొరలుగా పేరుకుంటున్న అహంకార పైత్యాన్ని దూషిస్తున్నాయ్‌ తుఫానులు రేపుతున్న కల్లోలంనుండి నిశ్చలంగా నిర్మోహంగా నిలబడమంటున్నాయ్‌ ఈ కష్టసుఖాలు మోసే జీవనయాత్ర మరణానికి మరికొంచెం దూరంలో లంగరేసుకుని మరీ నిరీక్షిస్తోంది. ఆంధభూమి”' ఆదివారం అనుబంధం

చరి ఆద్యంతాలు న మడ ప్ల కమా వాడ |: న్న్న కో ధు € స్ట తమ జ వృద్ధాప్యం (భ్రమలేవీ లేకుండా బ్రతుకు పొద్దు సందె వాకిట్లోకి చల్లగా జారుకుంటోంది ఇన్నాళ్లు తోడైవచ్చిన దేహం పొరల దుప్పట్లో చోటు వెతుక్కుంటున్నది కాలాన్ని వెక్కిరించిన కళ్లసోయగం మసక చీకట్లోకి మౌనంగా చూస్తున్నది తెరలు విచ్చుకున్న జీవన నగ్నసత్యం ఇహపాశాలను తెంచుకోమంటున్నది

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 29 ముగుస్తున్న యవ్వనానికి భవబంధాల భవనంలో అప్పగింతల కార్యక్రమం అతి విషాదంగా జరుగుతున్నది అనుభవాలన్నీ ఒడిదుడుకుల తీరంలో కట్టిన ఇసుకగూళ్లల్లో జీవచ్చవాల్లా పడివున్నాయ్‌ అనుభూతుల రంగుల్లో ఊపిరిదిద్దుకున్న ఆశల చిత్రం ముగింపుగా వృద్దాప్యపు రంగు అద్దుకుంటోంది ఆర్హారావాల జేగంటల నడుమ అంతిమయాత్రకు మృతజీవి సన్నద్ధమవుతోంది తెలుపునలుపుల్లో సాగిన ఈ విచిత్రనాటకం ముగుస్తున్న పాత్రకు ప్రపంచపు తెరమీద ఆఖరి వీడ్కోలు పలుకుతోంది

క అద్యంతాలు రు క త, జ షు రన్‌ 4 జ ని ఎయు. వక. జనారణ్యం “శా జనారణ్యంలో తప్పిపోయి తిరుగుతున్న సాధుజీవితం విలయాన్ని తలపించే కుల వర్గాల పావక జ్వాలలు ప్రళయాన్ని మరపించే నదీ నదాల అపవాద హోరులు కరగిపోయిన గుండెలన్ని మొండి గోడల్లా భయపెడుతున్న వికృత శిదిలాలయాల్లో వూగుతున్న నేతల గబ్బిలాల గుంపులు

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 31 అధికారానికై అర్రులు చాచే దయ్యాల నీడలు చీకటి కళ్ళల్లో నుండి డేగల భయానక చూపులు విషం చిమ్ముతున్న సమాచార సర్పాల ఎజ్జటి నాల్మలు నల్లధనాన్ని భోంచేసి అవినీతి బురదలో దొర్గాడుతున్న సూకరాకారాలు కరకు పిడికిళ్ళతో న్యాయాన్ని ఛిద్రం చేస్తున్న నల్లకోటుల పులిపంజాలు తల రాతలను మార్చే పెత్తందారీ గుంటనక్కలు అభాండాల వూబుల్లోకి తోసే రాజకీయ చింపాజీలు ఎటుచూసినా అగాధాల దారులు ముసుగు తీసేసుకున్న రాకాసి వృక్షాల వూడలు కాలిక్రింద తవ్వుతున్న గోతులతో బిగుస్తున్న వురులు వురికంబాలలో వేలాడుతున్న జీవచ్చవం సమాజపు (అ) న్యాయస్థానంలో శిక్ష విధించబడ్డ దోషిని బలికి సిద్ధపడ్డ నిస్సహాయజీవిని అయితే - ఎన్నాళ్ళో ఈ అన్యాయం సాగదు ఈ ఆవేశం లోపల దాగదు అది తెగించి వీరభద్రుడి అవతారం ఎత్తినపుడు దక్షాధ్వర మహా నాశక విధ్వంస మౌతుంది అప్పుడు నాకళ్ళు ఆ నిర్నిమేష నిటలాక్షాక్షుని విస్ఫులింగాలే

ఏ2 ఆద్యంతాలు నానరాలు మహా ర్వురీ గంగా తరంగాలే భూన భోంతరాలు దద్దరిల్లే వికటాట్ట హాసం చేస్తూ భూగోళం - చెదిరేలా (గగ్రహాలకూటం బెదిరేలా సాగే ఈ ప్రళయానల భీకర నృత్యం నికృష్ణుల తలలు నరికేస్తుంది ప్రపంచపుటగ్ని బావుటా ఎగురవేస్తుంది '“అంధ్రభూమి”* ఆదివారం అనుబంధం

చాక్ట్షర్‌ నందమూరి ఇక్షీపార్వతి 33 అశ్రువేదనం

ఒక అ(శ్రువు రాల్బటానికి గుండె చేసుకునే గాయాలెన్నో మనసు మోస్తున్న బాధలు మరెన్నో కలుసుకున్న నాడులకూడల్లో ముసురుకుంటున్న నరాల మూలాల్లోనుండి ఆవిష్కరిస్తున్న ఆక్రందనల రోదనం పృాదయాన్ని ఒరుసుకుంటూ గొంతునాళాల్ని ఛేదించుకుంటూ మరెన్నో ఇక్కట్లను మోసుకుంటూ కంటి కొలకలు చేరేనాటికి అక్షరాల్ని పోగొట్టుకున్న నిస్బృహ ఆలంబనం కరవైన నిశ్శబ్దంలో మహా ప్రస్థానం ముగిసింది ఆవలి స్వరాన్ని శబ్దం రానీకుండా-

వెత ంంాాాాాానియకాలు టా ౨ కీ న టు. ఫ్ర / నం '- న ఉహ యళ లో ఓ శ య్‌ న. న న టో... ల న న ట్‌... ౯ లే... 1 శ సత్వం - శివం - స సేం - శివం - సుందరం ఉత్తరాన ఉరుము ఉరిమింది ఊరు ఊరంతా వులికిపడింది రాకాసీ నిశిలా - కారుమేఘం

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి త్రెక్‌ కప్పిన గగన గహ్వ్యరం లోనుండి మిరుమిట్లు గొలిపే మెరుపుతీగెలు మృత్యు కోరల్లా మెరుస్తున్నాయ్‌ దిగంతాలు చుట్టేసిన ఆదిశేషుని చేయి పడగల విసురుకు కదలిపోతున్న మహా పర్వతాల ప్రకంపనలు పెళాపెళార్భాటాల చెలరేగుతున్న పర్జన్య గర్జారావాల ప్రహేళికలు జీవ ఆర్తరావాల పెను పోషలు వినిపించనంతగా మార్నోగుతున్న రుంరూూ మారుతాల కలవరింతలు విస్ఫులింగాల మైదానంలో వినోదంగా భూమితో బంతులాడుతున్న సముద్రాలు మింటిసో మంటినీ ఏకంచేస్తూ ఒకే ధారగా అవనికి బాటేసిన ఆకాశం అండపిండ (బ్రహ్మాందాల నాక్రమిస్తున్న అనంతమైన ప్రకృతి విశ్వరూపంలో కునారిల్లుతున్న మానవ అస్తిత్వాలు ఇంతై - ఇసుమంత కుంచించుకుపోతున్న అహాల మరగుజ్ఞు వికృతరూపాలు భీతిల్లుతున్న మానవ విజ్ఞానం ప్రకృతికి ప్రణామాలర్చిస్తోంది ద్వైతం - అద్వైతం అనాది వాదనలన్ని అనంత తిమిరంలో నీటి బిందువుల్లా ఆవిరవుతున్నాయ్‌

36 ఆద్యంతాలు ఎ పొంగుతున్న జలరాశుల

క్రుంగుతున్న కులపర్వతాలు

లయవాదంతో మమేకమౌశున్న

ప్రళయం - మహాప్రళయం

ఉప్పెనలా లేస్తూ

పాము నాల్మల్లా చుట్టేస్తూ

తన సృష్టినే తాను మింగుతున్న

విరాట్స్వరూపం

విశ్వం - దైవం - ఎవరి నెవరు సృష్టించారో

ఆత్మ - పరమాత్మ - ఏదినేది కనుగొన్నదో

జగన్మిధ్య - (బ్రహ్మ సత్యం ఏది వాస్తవికతో

ఈ

ఇజాలన్ని ఒకే నిజంలో

కలసిపోతున్నాయ్‌

పరివర్తనల ఆవర్తనలన్ని మహా

సుడిగుండాన అంతరించి పోతున్నాయ్‌

ఇదే అద్వైతం - అనంతం - అలౌకికం

ప్రళయ రోదసిలో సాక్షాత్కరించిన

సత్యం - శివం = సుందరం

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 37 సమ్మోహనం

పూలదుప్పటి పజిచుకున్న నక్షత్రాల శయ్యపై నీలిపరదాకప్పుకున్న రాత్రి ధ్యానమగ్నతలో గోచరించే భౌతిక ఉన్మీలనం గాలినిబంధించిన ప్రకృతి మౌనంలో యోగ రహస్యాల సమ్మేళనం ఉచ్చ్వాస నిశ్వాస క్రమంలో లయబద్ధంగా అడే వూపిరితిత్తుల వెనక నడకసాగిస్తున్న ఆత్మల సంశోధనం రాగరంజితావహమైన మనసు పొరల్లో నుండి నిశ్శబ్దంగా జారిపోతున్న కాలపు మృత్యునీడలు

368 ఆద్యంతాలు అనంతగమంలోకి ఆశగా చూస్తున్న జిజ్ఞాసుల ఆలోకనా వీక్షణం " రెక్కలు చాపి చీకటి లోకాలు దాటుకుంటూ ఎగరాలనే హంసల అలపులేని ఆరాట (్రేక్షణం వాస్తవాలు గుర్తించలేని మానవ అస్తిత్వం జీవన రుంరూమారుతంలో తడబడుతూ నడకసాగిస్తోంది అవగాహనా రాహిత్యంతో సాగిస్తున్న ఇంద్రియాల పోరాటం నీలినీడల్లా బ్రతుకు వెలుగును కప్పేస్తున్నాయ్‌ అజ్ఞానపు అద్ధంలో ఆకృతి కనిపించనంతగా చీకటి ఆవరించింది ఆరుబయల్లాంటి యవ్వనంలో రోదసిలా విస్తరించిన ఆధివ్యాధుల కీటకాలకాట్లు సరీసృపాల్లా పెనవేస్తున్న సాంసారిక బంధాలు మండుతున్న గ్రీష్మంలా జరారుజల గాయాలు స్వేచ్చా గమనాలను విచ్చేదం చేస్తున్న ఆశా మూషికల ఛిద్రాలు వినువీధుల కంరాల్లోనుండి విశ్వశాంతి శంఖారావం (మైగుతున్నా లోకాలతీరంలో శోకాల సముద్రాలు ఘోషిస్తున్నాయ్‌ ఎందుకో తెలియని పుట్టుకనే ప్రశ్నిస్తూ అడుగుతున్నదొక్కటే పరమార్ధ ప్రస్థానానికి భ్రమాజనిత పంజరం నుండి వివపక్తి ఎన్నడో?

డాక్షర్‌ నందమూరి లక్షీపార్వతి 39 మా (ప్రశాంత నివాసానికి చిరునామా ఎక్కడ? సమాధానాలకు అందని రహస్యాల శాఖలన్ని యుగాల్ని గుడ్డిగా నమిలేస్తూ పాతవాసనలు నెమరేస్తున్నాయ్‌ శృశానవైరాగ్య బాప్పశకలాల్లో నుండి విశ్వ విపంచి సమ్మోహనరాగం ఆలపీస్తూనే వుంది అనంతంగా - అప్రతిహతంగా-=

ఆంధ్రభూమి" ఆదివారం అనుబంధం, నెప్టెంరు-2009

మాలా నద్తంకాలు ప్రతీక

తొలివలపు మొగ్గలు విచ్చేనాటికి

నా వయసు పైటేసుకుంటోంది యవ్వనం రాల్బుకున్న రేకుల్లోంచి తొంగిచూసిన పరువం పదారేళ్ళే కాలానికి కళ్ళెం బిగించిన మనసు వసంతాలన్ని గది వాకిట్లో ఆపేసింది మూగబోయిన రాగాలన్ని ముద్దగా మార్చి గుండె గుయ్యారంలో సర్దేసింది అప్పుడెప్పుడో ఒక కిరణం తాకితే మెల్లగా చీకటి తలుపు తెజచుకుంది తీరా చూస్తే- నరాల ప్రకంపనాల్లో ముఖం చాటేసుకుని

ఒదిగి ఒదిగి చూస్తోంది పసిభయం చీకటి రాళ్చిన చిరునక్షత్రంలా అగాధాల అంచుల్లో ఆశాదీపం గుండెలో పొదువుకునే అందతానై ఆర్తిగా హృదయానికి హత్తుకుంటే కాలం పొరల్లో షునీభవించిన గతాన్ని తిరిగొచ్చిన వసంతంలా స్వాగతించాను అదే నిజమనుకుని మురిసాను

ఆ ఆనందంలో కాసేపు మైమజచాను కాని జరిగిందేమిటి

నాకు మిగిలిందేమిటి

రేయి చుక్కకు రేపనేది లేదని

మాపటి వెలుగుతో అది ముగుస్తుందని తెలిసేసరికి -

మళ్ళీ అగాధాల అంచుల్లో బ్రతుకు ముగిసే గమ్యానికి ముడేసుకున్న మరో అతుకు

గై ఆద్యంతాలు షి 1 న సు - నకు టం జోల క మ ం మ ల యుతం శునకం ఆత్మకథ నిర్దాక్షిణ్యంగా రోడ్లు అంతకంటె నిర్ణయగా వాహనాలు రోడ్లపై ఎన్నో జంతువుల కళేబరాలు మధ్యమధ్య మనుష్యుల శవాలుకూదా అయితే వారికి సానుభూతిగా కొందరు

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 43 వేలాదిగావున్న ఈ శవాలదగ్గర ఒక్కరూలేరు రోడ్డుకంటుకుపోయి. ఎండిపోయిన ఆ దీనమైన శవాల చరిత్రలో౭ళితే అట్టముక్కలాంటి బొమికలతో ఒక శునకం చెప్పిన కధ ఇది కళ్ళకుదగ్గరగా మూసుకుపోయినంత వెలుగు ఒక్క నిమిషంలో పైనుండి చక్రం దొర్లింది నడుము ఎముకలు పటపటమన్నాయి కుయ్యోమన్న ఆర్తనాదం వినకుండానే చచ్చానో బతికానో చూడకుండానే మరో వాహనం దూసుకొచ్చింది కారుమేఘం రోడ్డునంతా అక్రమించింది భీతి ఛాయలు ముసురుకునే లోపలే కళ్ళముందు అంధకారం మెదడుపొరల్ని కప్పేస్తుంటే కొసప్రాణం కసితో అరవాలని ప్రయత్నిస్తుంటే గొంతుపైనుండి మరో మృత్యుశకటం దొర్లింది అర్ధమయింది నేను మరణిస్తున్నాని అర్ధంకానిది ఈ మానవత్వం చచ్చిన మనుష్యులకే ఆపై మరో వాహనం భూతంలా నా రక్ష మాంసాల్ని రోడ్డంతా చిమ్మేసింది మరొకటి అస్తికల్ని నుజ్జు నుజ్ఞు చేసింది నావునికి రసం పీల్చేసిన చెరకు పిప్పిలా రోడ్డుకంటుకుపోయి మిగిలింది 'ఆత్మవత్సర్వ భూతాని అన్న సూత్రం

డి ఆద్యంతాలు మట్టిలో కలసి గాలిలో నింగికెగిరింది అను నిత్యం జరుగుతున్న ఈ పోర కలిని అపరేం? మా ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించరేం? మనిషిచస్తే కోర్టులు, కేసులట. ఎక్స్‌గ్రేషియాలట మరి మా న్యాయస్థానాలు ఎక్కడ? నోరులేని మూగ జీవులంకదా నోరున్న బాబుల కారుచక్రాలకు మా జీవితాల్ని బలిపెడుతున్నామే వందలు వేలుగా మరణిస్తున్నామే ఇదేం న్యాయం? మాకు బ్రతికే హక్కేలేదా? అని మా నిర్జీవ శవాలు అడుగుతున్నాయ్‌ సమాధానాలకందని మానవత్వం మరుగునపడ్డా రోడ్లు సాక్ష్యమిస్తున్నాయ్‌ సంవత్సరాలు గడచినా చరిత్ర పుటలేంటో మేమెరక్కపోయినా రోడ్డు పొదల్లో మా బడుగుజీవితాలు శిధిల సమాధుల్లా మిగిలిపోతున్నాయ రక్తంతో దిద్దిన అక్షరాలపై కండలద్దిన రంగులతో కలిపి మరీ చెప్తన్నాం మేం చస్తున్నామని.

ఆంధ్రభూమి" అదివారం అనుబందం

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి _ _ త్‌

ల. ( శ ఇ

ఇదా నీరూపం? నిన్ను మొదటిసారిగా ఇలా చూస్తుంటే నన్ను నేను సంభాళించుకోలేనంత ఆశ్చర్యం అసలు నీ స్వరూపం ఇదా? లేక అంశమా ఏది ఏమయినా తరాలుగా నిన్ను ఆరాధిస్తున్న నా భావనాగీతంలో అపశ్రుతి దొర్లించావు లావణ్య శ్రీవై స్రీవై నీవై అన్న అపురూపాన్ని ఛిద్రం చేసావు మృదువయిన గులాబి చెక్కిళ్ళ సొంపును మార్దవమైన మాటల ఇంపును మాత్రమే చూస్తూ నీ అమాయకత్వాన్ని సమర్ధించుకుంటూ వచ్చాను ఈ ముళ్ళ సమాజం నీలేత శరీరాన్ని మనస్సును చీల్చి చెండాడుతున్నద్రని వేదనపడ్డాను

జట్‌ ఆద్యంతాలు కానీ- ఈరోజు కళ్ళముందు కన్పిస్తున్న ఈరూపం? నీకు ఆరాకాసి పళ్ళేమిటి? అంత వికృతంగా ఎనలేని ఆత్మీయతను కురిపించే ఆ కళ్ళల్లో అసూయా జీరలు ఎర్రగా అగ్ని నాలుకల్లా భయపెడుతున్నాయ్‌ ఎందుకలా మంచిని నాశనం చేస్తానని కత్తిచేతబట్టి మరీ బయల్దేరావ్‌? గుర్తించలేనరితగా నీరూపాన్ని మార్చుకున్నావ్‌? సోదరీ. నా మాటిను. నిన్నిలా చూడలేను సహస్ర గొంతులతో కొనియాడిన నీ జీవన సౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకో అమృతం పలికించే ఆ అధరాలను మలినం చేసుకోకు అమ్మలోని కమ్మదనం నీసొంతమని మర్చిపోకు వెర్రితలలేసే నాగరికత నీకు స్వేచ్చనిస్తుందనుకోకు విరూపంగా నీనగ్నత్వాన్ని వేలం వేస్తున్నది చూడు జాతికి నీతికి పట్టుగొమ్మవు నీవు తరాల సంస్కృతికి పునాదిరాయివినీవు నిన్ను నీవు మజచి నీవునికిని విడచి మరో ప్రపంచంలో మరో విధంగా రంగులుపూసుకుని అర్ధనగ్నంగా ఆత్మసౌందర్యం విడబినర్తిస్తుంటే సృష్టి తన రూపురేకలు మార్చేసుకుంటున్నది ఆదిశక్తి అవమానంతో తలదించుకుంటున్నది

వం! ను ల న్నా వ ల లా ఆమా ॥ క నీ న. నో లస ్‌ న. ల | శే | పాక్‌ డి ప్‌ జబ రం! వ్‌ భ్‌ % హై కొ స్‌ .. టీ క సదీరమెన కాలగమనంలో సుదీర్హమై నామధుర జీవితమెంతని? నీ కొన్ని క్షణాలకోసం సాగుతూనేవుంది అనంతంగా - అప్రతిహతంగా

తా విద్యంరాలు కళ్ళుకాచేలా ఎదురుచూపులుచూసి కాళ్ళరిగేలా తోటల్లో తిరిగి తిరిగి ఎగిరెగిరి రెక్కలరిగి అరిగి నన్ను నేను విస్మరిస్తున్న క్షణాల్లో ఒక చిన్న పూవై పలకరించింది నవ్వు చల్లగా మారుతిం వీచింది వేసారిన మనసు సేదదీరింది మధువులేరుకునే తొందరలో విరగ్గాట్టుకుంటున్న నా చిరురెక్కలు కండచీమలు పీకిన నాలేతకాళ్ళు అన్నీ మజచి పూవుపూవును తడిపి దినమంతా శ్రమించి సాధించిన తేనెబొట్లు తృప్తితో తడిసిన కన్నీటిరెప్పలు తీయని బరువుతో కైపెక్కిన శరీరాన్ని మోసుకుంటూ గూడుకు చేరాను గుండెలో పొదువుకున్న మధువును గడుల్లోనింపాను అనందం అతిశయించగా నిరంతరం సాగే ఈ వేటలో గదులు నిండాయి - కళ్ళు పొంగాయి నా చిన్ని రెక్కల అలుపు తీరుద్దామని హాయిగా విశ్రమించేంతలో కలకలం చుట్టుముట్టింది సాగవాసనలు నా సామ్రాజ్యాన్నాక్రమించాయి ఇన్నాళ్ళ నొశ్రమదోపిడీ జరుగుతోందని ఎర్ధమైనంతనే లేచాను ఆందోళనగా

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వ 4 ప్రకృతి ప్రసాదించిన ఆయుధాలతో యుద్ధఖేరి మైోగించాను- పదే పదే నా శత్రువులపై దాడిచేసాను మరిన్ని గాయాలు తప్ప నాకు దొరికిందేముంది? రెక్కలు పీకేసిన నెత్తుటిమడుగులో తడుస్తూ కొమ్మచాటున తలదాచుకున్నాను చిటికెడు ప్రాణం దక్కిందికానీ నా జీవిత సంపద కొల్లగొట్టబడింది నిర్దయగా పేదవాడి సర్వం పెద్దవాడిదేనన్న సూక్తి నిజమైంది నాకన్నీటి సాక్షిగా దులుపుకుందామన్నా లేవలెని రెక్కలతో మెల్లగా ఎగురుతూ మరో చోటికి నాపయనం మొదలయింది ఆద్యంతాలే నాకు తోడుగా నీడగా-

50 ఆద్యంతాలు ల గ | (జ్ర ం [01

ఎవరతడు? ఎవరతడు? ఎప్పుడు చూసిన జ్ఞాపకం కూడలేదే కనీస జన్మాంతరవాసనయినాలేదే ఎందుకింత ఆర్భాటం చేస్తున్నాడు అంతగా వీరంగమాడాల్సిన అవసరమేమిటి? సాధారణ జీవనయానంలో ప్రయాణిస్తున్న ఒక పాందుడు పాటల వనంలో పరిభ్రమిస్తున్న ఒక గండు తుమ్మెద చెలికాడు +సుమధుర సంగీత జలవాహినిలో కదులుతున్న చిరు అలమాత్రమే

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి ౯ అయినా = అతడు నడుస్తుంటే బూమి కంపిస్తుందేం? ఆ ర్వుంకారానికి తోటపరవశిస్తోంది ఉవ్వెత్తుగా లేచిన ఆకెరటానికి ఒడ్డు ఒరుసుకుని ప్రవహిస్తున్నాయ అంతతేలిగ్గా తీసిపారేయలేం అదుపుతప్పుతున్న ఆలోచనలను కూడా నేర్పుగా లెక్కిస్తున్నాడంటే అతడు సామాన్యుడుకాడు భావనా శకలాన్ని తన్నుకుపోతున్న విహంగం ప్రేమనిప్పురగిల్సి మానసారణ్యాన్ని దగ్ధం చేస్తున్న కార్చిచ్చు అమ్మో! నా అంతస్తుల భవనాలు కదులుతున్నాయ్‌ నిర్మించుకున్న ఆశయాల గోడలు బీటలు వారుతున్నాలా. వద్దు - వద్దు అతడి ప్రవేశం మహాప్రమాదం నుదుటిన మూడో కన్ను పెట్టుకున్న నిటలాక్షుడిలా వస్తున్నాడు ఆ మంటల్లో కాలి నాకు నేను బూడిదగా మిగలకముందే అతడిని పంపేయాలి య న న. తల! న. 9 న యడ ఇ ల వ న జ.

52 ఆద్యంతాలు ట్వొ బరిపిడి గుండెను ఎవరో లోతుగా తవ్వుతున్నారు ఎండిపోయింది కనుక బాధ ఎక్కువగా వుంది జ్యే పాటల తడి కొంత ఉపశమనాన్నిస్తున్నా రాగజలం అందక (వ్రేళ్ళు గట్టిగా వున్నాయ్‌ ఇంతకీ తవ్వతున్నదెందుకు? 'ప్రేమమొక్కను నాటిచూపటానికా పగుళ్ళను మరింత లేపటానికా ఆలోచించుకో నేస్తం నే మాట్లాడేదంతా వాస్తవం బ్రతికున్న రోజుల్లో అది సారవంతమైందే

దాక్టర్‌ నందమూరి లక్షీపార్వతి 53 తన జీవాన్ని నింపి మహా వృక్షాన్ని నిలబెట్టింది మరెన్నో గచ్చపొదలను కూడా పోషించింది పాపం ఈరోజు దానిది ఎదారి బ్రతుకు ఎండిపోయిన దాని గుండెల్ని చూస్తే జాలేస్తున్నది ఇంతకాలానికి ఏదో చెయ్యాలనే తపన నీకెందుకు? ఒకవేళ సఫలం కాకపోతే ఆ లోతును పూద్చేదెవరు? దాని గాయాల బాధను మాన్చేదెనరు? ఉప్పెనలాంటి ప్రేమను చిన్నకాలవతో సరిపెట్టకు వాస్తవాల ప్రపంచంలో అబద్దాల మేడలు నిర్మించకు గుండెకూ - మంటకూ చాల దగ్గర సంబంధముంది అది తెల్సుకో చేసింది చాలుగానీ ఇక బయల్టేరు నీచిన్న ప్రపంచానికి

క్క ఆద్యంతాలు రాత్రీ!

ఓ రాత్రీ జారిపోకు స్వప్పావరణాన్ని మేల్కొలపకు వేకువ అంటే ఎంతో భయం వేదనలకెన్నో అది నిలయం నిద్రించిన భయాలనెన్నిటినో కొరడా పట్టి కొట్టి మరీ లేపుతుంది మజచిపోయిన గతాల శేరి ముళ్ళ పందిరిగా ముందు పరుస్తుంది గుండెలోతుల్లో పసిపాపలా ఒదిగి హాయిగా సేదదీరుతున్న నిజాల్ని వాస్తవాల న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టి శిక్షించమంటుంది అందుకే నలుపైనా - వెజపైనా చీకటి క్షణాలతో నే చెలిమిచేస్తాను వెలుగు కళ్ళు మూసి నేను శాంతిస్తాను

డాక్టలం సందయూం లక్ష్మీపార్వతి 5్‌ల్‌ ఉనన్‌ లన శ లు గ] ఖ్‌ హం ల టు. 0న ఉను మో వం మ! హం [మ మం డాం శ లయ గా య. టీ లను క జ ల (చ స. నే ౧/2 ణా క్ష ల శత శద త్త |. ము టం. ర ర ను పట స ల తం (న గే స ల స్ట? యన దైవం? యా దైవం అంటే భావనా” ఆరాధనా” భౌతికానికి - అభౌతికానికి చేతనకు - అచేతనకు మద్య కాలసూచికలా వూగిసలాడే 'పెందులంలాంటి భావన దీవెనలో - శాపాలో అతడికే తెలియవు అ అగ్భే లి ఎన్ని సంవత్సరాలయినా ఆవునికి ప్రశ్నార్ధకం?

56 ఆద్యంతాలు పాపపుణ్యాలపట్టికలో మాత్రం అతడి (ప్రస్తావన అనూచానం ఇక్కడ కూడా బలవంతుడికీ - బలహీనుడికీ వున్నతేడాలే పనిచేస్తున్నాయ్‌ అంతరంగాన్ని చంపేసుకున్న వాడికి ఆత్మవిశ్వాసం వున్నవాడికి వాడే దేవుడు కర్మలతో పనిలేని విశాల సామ్రాజ్యం అతడిది తప్పొప్పుల తేడా లేకుండా జీవితాన్ని యధేచ్చగా అనుభవిస్తాడు అదిగమించలేని వాడికి దేవుడున్నాడని అశ జరుగుతున్న పోరాలను నేరాలను స్వర్ణ నరకాల పట్టికలో లెక్కిస్తుంటాడు ఎంతకాలమైనా అదే నమ్మకంతో జీవిస్తాడు చివరికి తేలేదేమంటే అతడు కర్మసాక్షియట పాపపుణ్యాలతో అతడికే సంబంధం లేదట నీకర్మ పలమే నువ్వనుభవిస్తున్నావట మరయితే ఏం చేద్దాం? కద కంచికెళ్ళింది మనం ఇంటికెళ్దాం

దాక్టర్‌ సపందమూరి లక్ష్మీపార్వతి ర్‌ | ర్య న హా సట

పుడమి సంక్షోభం పుడమితల్లి పొదుగు పిండినా గొంతు తడవదు శతాబ్దాలుగా పాలుత్రాగి రొమ్ముగుద్దుతున్న కసాయిచేతుల్లో పొరలు పొరలుగా పేరుకున్న ఆక్రోశనల అపస్వరాలు శోషించిన రక్తాన్ని పీల్చాలనుకునే స్వార్ధరాబందకీయంలో జారిపోయి. వ్రేలాడుతున్న అవని కండరాల బండరాళ్ళు జాతి మొత్తం నిర్వీర్యమై తనను తాను శిక్షించుకుంటున్న అభాగ్యోదయం పాలబుగ్గల్ని చిదిమేసి ఆనందిస్తున్న

58 ఆద్యంతాలు కసాయితనం ఆరావళులు కుంచిస్తూ మానవస్వార్ధానికి తలొంచుతున్నాయ్‌ తెగవేయబడుతున్న తలకాయల్లోంచి మోసులైనా కనిపించని నల్లమలవనాలు పారిశ్రామికీకరణకు పడుపుకత్తెలుగా నల్లబజార్లో అమ్ముడౌతున్న పంటపొలాల అమ్మదనాలు. ముష్కర మూకల అకృృత్యానికి బలౌతున్న తన సంతానం కళ్ళముందే ఎండి అస్థిపంజరాల్లా చరిత్ర పుటల్లో కలుస్తుంటే ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన గుండెల్లో ఎండిన సైకతాల సరోవరాలు దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా కప్పిపుచ్చుకునే అహంకార చెయిదల్లో ఆత్మాబిమానం క్రుంగిన ప్రకృతి హృదయహపోషలు ఆవిష్కరించలేని వాస్తవాల ప్రతిబింబాల క్రీనీడల్లో అంతరిస్తున్న ఆనందసాగర జలాలు అంతటా ధ్వనిస్తున్న దుర్భర దారిద్ర్య దేవతా పదనీడలు తనను తాను చంపుకుని ఆనందించే ఆధునిక మానవ విజ్ఞానం తిరగ రాయలేని మేదిని విషాద చరిత్రలో రాస్తున్న ఆఖరిపేజీ కధనం అంధ్రభూమి' ఆదివారం అనుబందం

డాకర్‌ నందమూరి లక్ష్యృపార్వతి క్‌ర్తి న! || ము | వ! న (| , ర లా వూహాప్రేయసి ఊహల విహాయసంలో భావతారను వెతుకుతూ రవీంద్రుని కవితావనంలో కాలుపెట్టాను అక్కదెన్నో కవితాసుమాలు రాలినా వాడని కొన్నిటిని ఏరి ఒడిలో నింపుకున్నాను తిరుగు గమనంలో ఎక్కడో

60 ఆద్యంతాలు గీతాంజలి కోకిలాలాపం కాని ప్రయాణం అటువైపుకాదుగా అందుకే ముందుకేసాగాను చలం మైదానందాకా చేరలేక చివరి క్షణాల్లో అందించిన కానుకల సంపుటి నందుకున్నాను ఇంకా తృష్ణ తీరదేం? గమ్యమెంత వజకో? సరే- కదిలాను కాలంతో సమానంగా నాభావాలకు నేనే తోడుగా పదాలకందని పెదాల నవ్వుతో నింగికీ - నేలకూ నీలి తెరను జార్చిన పరదామాటున వెలిగే ఆ వదన సౌందర్యం కన్నుల్లో - మెరిసే ప్రణయసౌగంధ్యం ఓహో! నీవా? తెలిసింది. మాకృష్ణశాస్త్రి ఊహాడ్రేయసివా? కమ్మని కవితాగాన వూర్వశివా? రాచేలీ! వర్నా శరత్తులనిబిడ సంగమంలో సంధ్యాకుమారిలా నిన్నుంచలేను నీపదపల్లవాల నర్చించటానికి పరిమళ లతాంతాల నర్చించలేను

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి ర్‌1 ఎదలో కదిలిన ప్రణయభావానికి నీ ఆలంబనయే తోడుగా నీవూసులే నాకు నీడగా నన్ను సాగిపోనీ- ఈ ముగ్ధసౌందర్యసీమలో ఆగిపోనీ

62 ఆద్యంతాలు

అసంతృప్త కామన ఎక్కడో కదిలాడుతున్నాను ఒక్క నిస్తబ్ధతావరణలో వూపిరిసంకేతంగా వూహాపోహల వూర్మికలవూర్చుల్లో భావానికి - చైతన్యానికి మద్య వూగిసలాట అక్కడకాలం ఆగిపోయినట్టేవుంది సంకల్ప వికల్పాల పొరలు తొలగించుకున్న సంచలిత ఆలోచనా సముచ్చయాల ప్రవాహంలో షునీభవించిన మంచుకుహరాల్లో ఈదులాడుతున్న కణసముదాయమది జీవికా మార్మికల తెరలఛేదనల్లో భేదనమౌతున్న జన్మాంతర మోహపదబంధాలు చిరంతనావాహికల్లో ప్రక్షాలితమౌతున్న మానసతీరం జదానికీ - అజడానికీ మధ్య చిన్న కదలికలో నా స్పృహ విశ్వరహస్యాల పదకోశంలో శిదిలపుటల జాగ్భదీకరణం అంతరాంతరాలు శోధిస్తున్నా బయల్పడని అగాదాల ఇత్మిక సత్యాల అన్నేషణలో అన్వేషిస్తున్న నా యీ మానవయాత్ర అభరిమజిలీ

ఆంధ్రభూమి. అదివారం. 29 నెఫైంబర్‌ ౨00౨

చాక్తర్‌ నందమూరి లక్ష్మపార్వతి 63 . (భీ | /. రోడ్లు

రక్తంతో రోడ్డు తడుస్తున్నాయ్‌ జేగురు రంగు పూసినట్లు మెరుస్తున్నాయ్‌ దాహం తీరక వాహనాలు పదే పదే అరుస్తున్నాయ యముని మహిషపు సుంటల్లా మొరుస్తున్నాయ్‌ అదుపుతప్పుతున్న ఆలోచనల వేగంలో నున్నటి దారులు పణిచుకున్న మృత్యు శయనాలు ఆర్తావని అర్ధంగా దిద్దుకున్న రక్తపు తిలకాలు అక్కడ - జీవితం క్షణకాలమన్న సత్యం బుజువౌతున్నది నుదిటి రాతలు మార్చేంతగా రోడ్డు శాసిస్తున్నది ఒక్కటి మాత్రం నిజం దేశాన్ని ఇరవయ్యొకటవ శతాబ్దిలోకి నడిపిస్తున్న రోదసీ నౌకలను అంతరిక్షంలోకి చేరవేస్తున్న మహా మేధావుల్ని సయితం విడచిపెట్టడంలేదు తనకంతా సమానమన్న సూత్రం మీదే నడుస్తోందట

641 ఆద్యంతాలు అనుభూతి మధురమైన నీగొంతు సవ్వడి ఎప్పుడో రేనిద్ర తాలూకు మత్తులో విన్నట్టుగా గుర్తు తెల్లవారి లేచి నీవు విరజిమ్మిన పూలనేరుకుందామంటే ఏదీ! ఒక్కటీ అగుపించదేం? గతరాత్రి మత్తు అంతగా ముంచిందా? అనుభూతుల పేటికలో పదిలపర్చిందా! నిరంతరమైన నీ ఆలోచనల్లో కాలం మజచిన నాకు కలైనా మెలకువయినా ఒకటిగానే వుంది.

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి క్‌ అపారం థ్‌ వసంతంలోని నిజమైన ఆహ్ష్హాదం కోసం గుండెలో కదలు దాచాను కన్నీటి మాటున వేచాను వేకువ వచ్చింది వేడి నిట్టూర్పు మిగిలింది కోయిల _ పాటలో కోటి అపస్వరాలు సేదదీరుస్తుందనుకున్న చల్లని హస్తం చేతికందనంతగా దూరం తొలగింది భావంలో ఊపిరిగా ఆక్రందనలో ఆర్తిగా ఆదిరిస్తావనుకున్న నేస్తం అందుకోలేనంతగా బాహ్యానికీ - భావానికి మధ్య తెరలు దించావా అంతరంగాన్ని కుదించావా

66 ఆద్యంతాలు వియోగం

ఎన్నిరాత్రులు నీ ఆలోచనలు నిద్రను దూరం చేసాయో ఎన్ని ఊహలు నీ వియోగంలో నలిగి విరహాన్ని రగిలించాయో ఎజ్జబారిన నా కళ్ళను చూస్తే బరువెక్కిన శ్వాసను వింటే తెలుస్తుంది నిన్ను నేనెంత ్రేమిస్తున్నానో అగాధమైన జడధిలా అరచేయి గుందెగదిలో దాగి చీకటి వేదనలను తరిమేస్తూ విశ్వాంత రాళంలో విలీనం చేస్తున్న నాదైవమా! నువ్వు విడలేని భావానివా? నాలో కదిలే ప్రాణానివా

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 67 గా నిర్భాగ్యులు అకటి చూపులో రేపటి తలపులు మాపటి వెలుగులో చీకటి తలుపులు నిబిడాందకారాన నిర్భాగ్య జీవితాలు దౌర్భాగ్య దేవత అందించిన వరాలు దరిరాని పయనం (శ్రుతి లేనిగీతం ఎడారి బాటలో కడవరకు ఆట తదడారిన గొంతులో పలుకలేని దీపాట విధి ఆదే చదరంగం ఈ జీవిత నాటకరంగం

68 ఆద్యంతాలు

ఎవరువీళ్ళు? ఆటరాక కాళ్ళిరగ్గొట్టుకున్నప్పుడు వికటాట్టహాసాలు చేసింది వీళ్ళే బతుకు మార్గాన నడవటం చేతకాక అడుగులు తడబడినప్పుదు కనికరం మజచి కళ్ళతో వెక్కిరించింది వీళ్ళే రివ్వున జీవన పతంగం ఒక్కసారి నింగి కెగసినపుడు నిప్పులు చెలగుతున్న ముఖాలతో వీళ్ళే ఎవరు వీళ్ళు మానవ చర్మాన్ని కప్పుకున్న క్టూరమృగాలా? మనిషి ముఖం పెట్టుకున్న పిశాచాలా?

డాక్షర్‌ సందమూరది లక్షీపార్వతి యు కళ్ళు కళ్ళు ఆ కనిపించేంత స్వచ్చమైనవి కొవు కలలకు సంకేతాలే అయినా కన్నీళ్ళకు నిలయం కూడా అవే పెద్దవయినా - చిన్నవయినా అన్నిటి వెనకాల అంతరంగం ఒక్కటే ఆవేదనలో - నివేరనలోదాచే మర్మగర్భాల మనోరహస్యాలు

70 ఆద్యంతాలు అస్థిర స్వరం

కళ్ళు తిరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం కనురెప్ప పాటు జీవితాన సాగుతున్న యాత్రల మజిలీ చేరబోయేది గమ్యమేది? అందాకా సాగే గమనమేది? ఇహానికి - పరానికీ మధ్య సాగుతున్న తరాల వాదాల్లో ఇహాల ఇజాల్లో ఇమడలేక పరాల అంచుల్ని పొందలేక నడుమ మలిగే జీవిత కధనం అస్థిర స్వరాన నలుగుతున్న మధనం

దొక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 71 అన్వేషణ శూన్యం అంచుల్లోకి నిశ్శబ్ధం జారుతున్న చోట స్పబత వూపిరి పోసుకుంటోంది నిరామయ గీతానికి నాందిగా సత్యాసత్యాల విచికిత్సలో అస్తి నాస్తుల తర్మాల పోషలు అనంత సత్యానికి అన్వేషలు

నా ఆద్యంతాలు నిర్లిప్తత

ఏదో నిర్వేదం నన్ను పట్టి వూపేస్తోంది నాలో ఒంటరి భూతం జూలు విదల్చుకుంటూ ఒళ్ళు కదల్చుకుంటూ మళ్ళీ లేస్తోంది అంతరాంతరాల దాగిన నిర్లిప్తత తన ఉనికిని స్పష్టంగా బయటపెట్టుకుంటోంది నాచైతన్య దీపిక ఒడలిన దేహంతో గదిలో ఒంటరిగా నిద్రపోతోంది నన్ను స్పందింపజేసిన జీవనాడి జరావ్యాధుల కోరల్లో నిస్సహాయంగా నారూపాన్ని గాజు కళ్ళతో వీక్షిస్తోంది వర్తమాన కాలపు నీడ్రల్లో నేను అన్వేషిస్తున్న అడుగుజాడలేవీ? కలుసుకోలేని స్వవ్నంలా జీవితం కలత నిదురలో ముఖం దాచుకుంది

దాక్షర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 73 స్వార్దం స్వార్ధం - వెదజల్లబడ్డ రూపాయల్లా జనం మద్యలో అవినీతి ఆశ్రయించిన బొజ్జల్లోనుండి ఒక (క్రేన్చు తరతరాలుగా జీర్ణించుకున్న అహంకార పైత్యం డొక్కలెండిన సామాన్యుడికి తల తిరుగుడవుతోంది అవకాశవాదం అందలాల అంచుల్లోనుండి మేదావితనాన్ని పరిహసిస్తున్నది ('ప్రధానాదిపత్యం- నిర్లజ్జగా కోటికమ్ముడుబోయి వేలవేల కోట్ల జీవాల ఉసురు నంజుకుంటోంది

గతీ ఆద్యంతాలు కుహనా లౌకికవాదం - పరాయి వాళ్ళ కర్రలతో తనవాళ్ళ తలకాయలను చితగ్గాడుతున్నది ఇదంతా- నిస్తేజంగా - నిర్తిప్తంగా చూస్తూ - రాస్తూ .... నీతి ఎవరిక్కావాలి - పదవి తప్ప శీలం ఎందుకు? ధనం వుంటేచాలు అన్యాయపు కోరల్లో నలిగిపోతున్న న్యాయాన్ని చూస్తూ ఎగదన్నుకొస్తున్న శ్వాసను కూడా గట్టిగా విడవకు దానీక్మూడా ఏకళంకమాపాదిస్తారో?

దాక్టర్‌ నందమూరి లక్షీపార్వతి 75 నిరాశ

స్వప్నంలాంటి జీవితంలో సత్యానికై సాగుతున్న అన్వేషణ శూన్యంలో పరుగెత్తుతున్న కాలాన్ని ఏ బంధాలు బిగించి ఆపగలవు ఆరాటపడ్డ ఆగతాలన్ని రేకులు రాల్చుకుని మౌనంగా చూస్తున్నాయ స్పందనలు జార్చుకున్న హృదయతంత్రుల్ని నిశ్శబ్ద రాకాసికి బలిపెడుతూ నాలో నేను అంతరిస్తున్న క్షణాలు జగతి వాకిట వెల్లువెత్తిన ఆర్హారావాలు

76 ఆద్యంతాలు నింగీ - నేల ప్రభూ! ఆలోచనలన్నీ నీవే అయితే మరో యోచనకు చోటేదీ? సర్వంలో ఉన్నది నీవే అయితే మరినేనెక్కడ? నీలో లేని నాకు నాలో ఉన్న నీకు జరిగే కలయిక నిరంతరమూ సమాంతరమే సూర్యుని చేరే సంధ్యాకుమారిలా అందుకోరాని ఆశల వూసులమధ్య నా ప్రణయం అది నిర్నిద్రంగా మండే జ్వలనం

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 77 ఆయనొచ్చ్దారు

ఆయనొచ్చారు ఎంతోకాలం తర్వాత దశాబ్దాన్ని పెళ్ళగించుకుంటూ కాలం పొరల్ని ఛేదించుకుంటూ చరిత్ర పుటల్ని తిరగేసుకుంటూ ఆయనొచ్చారు సంతోషాన్ని మోసుకుంటూ సంబరం అంబరాన్ని దాటేస్తుంటే పరవశం కోటివీణలు మీటుతున్నది తడబడుతున్న అడుగులతో హత్తుకుపోయాను అద్వైతానికి రూపంగా ఎన్ని జన్మల అలసట ఆ కౌగిలింతలో సద్దుమణిగిందో ఈ గుండెకు తెల్సు కారు చీకటిలాంటి ఒంటరితనం పటాపంచలైంది ఒక్క పలకరింతతో

రా ద్యంతాలు దిక్కుతోచని దైన్యజీవితం చుక్కాని నావలా జీవం పుంజుకున్నది ఎన్నో మాటలు నిశ్ళబ్దాన్ని తాకాలని (ప్రయత్నించి ఓడిపోతున్నాయ్‌ మౌనం మోస్తున్న భాషలోనే రెండు సంవేదనలు పలకరించుకున్నాయి ఆర్థత రసీభూతమైన చూపుల ఆవిష్మరణం దీర్హవియోగం దూరమైందన్న అనందం చల్లారకముందే తొలికూడి కూసింది వేకువ తెరలు విప్పుకున్నట్లు మంచుస్వప్నం ఆవిరై మిగిలింది అంతరంగాన్ని చీల్చిన షుంటంతో ఆవేదనలకు భాష్టంరాస్తూ తెల్లవారిన వెలుగు అస్తమించింది పడమటి సూర్యుడు ఉదయించాడు “ఇతి పరిభావయ సర్వమ సారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం"

| నన ణే హ్‌ య! | “స్ట... జ్ఞ శ న. [1 ( | | గళ్‌ ॥ నాలో - నేను

ఒకే అద్దంలో రెండు బింబాలు ఒకటి నాది రెండోది నాలోనిది ఆశ్చర్యం! రెండూ ఒక్కటిగానే వున్నాయ్‌ అంతర్గవాక్షంనుండి చూస్తున్నప్పుడు తెల్సింది నావంటిదే మరోరూపం వుందని ఆ రూపం పూర్తి నాకు భిన్నంగా, విరుద్ధంగా అన్వించింది అక్కడే సంశోదనం మొదలయ్యింది అప్పుడప్పుడు పిల్లాటలా బయటికొచ్చి గబుక్కున మాయమయ్యే ఆరూపం ఈరోజు పూర్తి స్వరూపంతో సాక్షాత్కరించింది చెప్పలేనంత భయానకంగా వుంది బానిసలా చేతులు కట్టుకు కన్పిస్తోంది

80 ఆద్యంతాలు పొంచివున్న పిల్లిలా కూర్చుని వుంది అవకాశాల గోడల్లో జీవనరాగం విన్పిస్తోంది అదిగో అందరూ పొగడుతున్నారు నేను యుద్ధం చేస్తున్నానని ప్రకటిస్తున్నారు నా ఆయుధాలన్ని అదే దాచేసుంటుంది ఆదర్శాల రణరంగంలో సమరమంటే మాటలా నేను గెలవాలని ప్రార్ధనలు మొదలయ్యాయి నాకూ విజేతను కావాలనిపిస్తోంది కానీ ముందుగా నేనెవరితో తలపడాలి నా శత్రువులతోనా? నా అంతర్గత శక్తులతోనా ?

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 8] శవరాజకీయం

అంతా గందరగోళంగా ఉంటే సంగీతం వినాలనుకునేదెవరు ? సునామీ పాడిన మృత్యుగీతానికి ఏ విషాదరాగం సరిపోతుంది చచ్చినవారికి సహాయార్థంగా పాప్‌ సంగీతాలు పొడతారట వెర్రెక్కించే గంతులతో ఆడతారట అవని కంపనాల్లో కదిలాడిన మృత్యుపద ఘట్టనల నృత్యానికి ఇదెక్కడి సరిపోలిక ? గుండెలు చీల్చే ఆర్హారావాలను ఎలుగెత్తుతున్న శవాల గొంతుల్లోనుండి వింటున్న శ్మశాన సంగీతానికి ఇదేమైనా కొలమానమా ?

82 ఆద్యంతాలు అనుక్షణం బయటపడుతున్న లెక్కలేనన్ని తలకాయల్ని లెక్కిస్తూ ఆనందంతో ఆడుతున్న రాజకీయ రాబందులనాటకం రసరమ్యంగా సాగుతోంది వేదనాభరితకేకలతో ఘోషిస్తున్న జీవచ్చవాల సామ్రాజ్యం నిశ్శబ్దంగా గాజుకళ్లతో వీక్షిస్తుంటే ఇక్కడింత హడావుడి అవసరమా? పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నట్టు ఎవరికోసం ఈ సంరంభం ఎంతకాలమీ పై ముసుగుల ఆడంబరం చస్తున్నాం మేమిక్కడ అని ప్రశ్నిస్తూన్న వాళ్ల ప్రశ్నలకు సమాధాలు వెతుక్కోండి (శ్రమను దోపిడీ చెయ్యొచ్చుకానీ శవాలతో చెయ్యొచ్చా ?

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి సేద నీ మనోహర సౌందర్య సీమలో నన్ను నేను ఆవిష్కరించుకున్న క్షణం రేరాజువై పూగాలివై నన్నల్లుకో సేదదీరుదు నీ గుండె శయనంలో వేయి వసంతాలు జారనీకుండా- పులకింత మది తలపుల పూవులు పూస్తే మకరందం నువ్వ సువాసననే జ్ఞాపకం భావం చిరుగాలై మనసును తాకితే నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి-

హై ఆద్యంతాలు న. = మ! మ... | ల ఖై ప్‌ త త స తా న సస స మ టం! స. | ల స్‌ ల 1. ఎదురు చూపు ముసురు పట్టిన ఈ సాయంత్రం నీవు ముందే వస్తావని తలుపులు తెజచే వుంచాను మూయని గది వాకిలిలా నాకను రెప్పలు తడి బరువుతో తటపటాయిస్తున్నాయి. నీకై నీవు వెలిగించిన జ్ఞాపకాల్లో ఒంటరినై మిగిలిపోతున్నాను నీవు మిగిల్సిన ఆశయాలనెగడులో నిప్పురవ్వనై రగిలిపోతున్నాను

బౌ

ప్రాయభావన గోరింటాకుతో ఎల్జిగా పండిన సీపాదాలు రెల్లుపూలగడ్డిమీద పవనాన్‌తి కదిలాడే ముంగురుల్లా నాహ్బదయం రెపరెపలొడుతోంది.

పరిమళం పొలాలపైనుండి తేలివస్తున్న ఈగాలిలో నీ ఒంటి పరిమళం కూడ కలిసి వుందనుకుంటే నావూపిరి భారమవుతున్నది

86 ఆద్యంతాలు లయం ప్రభూ! ఈ విభావరి క్రీడలో నినుగూడి పొందిన ఆనందానుభూతిలో నీయిచ్చ యగునేని పూర్తిగా కలసిపోదును మరల జగతి మేల్మాంచకుండా! స్వప్నం విదియ చంద్రుని లలితకొంతుల శరన్మేఘాంచలమువంటి తుషార దివ్య స్వప్నమున నీతో కలసి విహరింతు.

డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 87 ఎదురుచూపు ఎదురు తెన్నులు చూచుచుంటి వేయి యుగాలుగా ఏవేళ నీపదములు నామందిరాంత ర్భాగమున ప్రవేశించునోయని నిరీక్షణ ద్వారబంధమున చేతులాన్ని గగనాంతరాళమున చూపులునిగిడ్బి నిరీక్షించుచుంటి, ఏయుగ విగశమ వేళనైనా వత్తువేమోనని!

88 ఆద్యంతాలు

ఆకాంక్ష ఎంతగా ఎదురు చూస్తుంది ప్రియా! హృదయం సీలి అంబరపు రెక్కల ముసుగున దాచి వుంచి గాలీ అడుగుల సవ్వడి వినబడకుండా మెరుగుకాంతులను కంటి పాపలనీడలో కుదించి పణిచుకున్న విశాల విహాయసంలో సాగే పయనానికై-

విరహం నేను లేని దిగులేమి లేక నీవు ఎక్కడో నీ ప్రపంచంలో మామూలుగా నవ్వతూ వుంటావన్న ఆలోచన నన్ను కోసేస్తుంది. నేను ఇక్కడమంటల్లో మాడిపోతున్నాను కలం సాగదు - ఆలోచనకదలదు నిద్రగన్నేరు పువ్వల్లే నా మనసు ముడుచుకుపోయింది ఈ నిరామయ అచేతనావస్థ ఇంకెంలకాలల? బాధ నీకుండదని కాదు. రెండు బాధలు కలిస్తే ఒక అనందం వస్తుందని తెల్పుగా. వచ్చేయ్‌.

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి 8కి కరటం నీలి జలాలను చీల్చి గాలిగళాలను కదిల్చి దూరాలు దాటిన కెరటం తీరాలసుభాన్ని చేరకపోతే సుడిగుందమే ముంచుతుందో హిమగండమే తాకుతుందో? సంయోగం ఆకాశ ద్వారానికి, నక్షత్రాల తోరణాలు కట్టి, నిద్రపోతున్న అంధకారాన్ని ఉషస్సు తట్టిలేపేదాకా వేచివుంటాను అప్పటిదాకా తొందరగా వెళ్ళమని ప్రాధేయపడిన నేను, నువ్వొచ్చాక కాస్త నెమ్మదిగా సాగమని ప్రార్థిస్తుంటే కాలం నావైపు అశ్చర్యంగా చూసింది.

90 ఆద్యంతాలు నావ అట్టడుగున కదిలే జీవితం అడుగడుగున రగిలే ఉద్యమం కష్టాలు కూర్చిన లంగరెత్తి కన్నీళ్ళు జార్చిన చుక్కానితో సాగిపోయింది బ్రతుకునావ సుడిగుండాలు మిగిలే (త్రోవ ఉద్వేగ తరంగాలలో వూర్చు లెగసిన పవనాలలో గమ్యమెరుగని చోటుకు కొట్టుమిట్టాడుతు కదిలింది నట్టనడి సంద్రాన మిగిలింది లోకం ఏతప్పూ చెయ్యనప్పుడు అన్ని తప్పులు ఆరోపించారు ఈరోజు ఎన్నో తప్పులు చేస్తుంటే అంతగా కీర్తిస్తున్నారెందుకు? ఇది మీ నైెజమా? నిరంకుశమా? సమాజ కంఠనాళాల్ని మీగొంతులు కొలబద్ధతో కట్టేస్తున్నాయ్‌ లక్ష్మణ రేఖలతో శాసిస్తున్నాయ

దాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి రి

ప్యృతి చేజారిన స్మృతుల్తోకి ఏ ఒక్క క్షణం నేను ఆగినా వేయి గ్రిష్ట వర్షాల రగిలే దుర్భర ప్రతప్త వేదనం నాది.

అష

జ్ఞాపకం నీలిమేఘాల నిర్వేదం మాటున తళుక్కుమనే తారల హరివిల్లులా నిర్లిప్త హృదయంచాటున అప్పుడప్పుడు నీ జ్ఞాపకాల దివ్వెలు

92 ఆద్యంతాలు య న... న. శ్‌ యా టే య మా న... .. స షన న 1 న |. వ; - జ ,. టీ న. య స మ న నన చ విరాగం ఈరేయీ గడచిపోయింది అతనిశ్శబ్దంగా తెల్లవారు బ్రతుకులో మౌనంగా లయించే తారకలా వేసారిన అభిసారికలా కంటిముందే కలలపుష్పాలు విచ్చుకుంటూ సౌరభాన్ని కోల్పోతుంటే ఆపలేని నిస్సహ్టాయపు (బతుకునాది డస్సిపోయిన మనసులో

దాక్టర్‌ నంచమూరి లక్ష్మీపార్వతి ౨ రి (ప్రేమభావాలు చల్లారుతుంటే వుద్వేగం లేని వూర్చునాది. కన్నీరింకిపోయిన ఎదకాగులో వేడిగా రగులుతున్న వేదనా మయస్వరాన్ని వివశనైవింటున్నా కదలిపోతున్న కాలయవనికల కొసలుపట్టి ఆపలేకున్నా విసువు చెందిన ఈనిరీక్షణం ఏ విరాగాంచలాన్ని తాకుతుందో. యహందం రల లు (| €

ా వ్‌. 1.“ దీపం తన కాంతిరేకల్ని దూరానికి ్రనరించినా “సా ౫. రనకింది చీకట్లను తొలగించుకోలేనట్లు క త. నా దృక్పథం వరులకంకితమైనా నన్ను నేను ఓదార్చుకోలేకపోతున్నాను” డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి జననం ; గుంటూరు జిల్లా, పచ్చలతాడిపర్రు (గ్రామం " విద్యాభ్యాసం : ఉభయభాషాప్రవీణ, ఎమ్‌.ఎ. తులనాత్మక అధ్యయనం క్రింద తెలుగు యూనివర్సిటీలో ఎమ్‌.ఫిల్‌ చేసారు. ఇదే యూనివర్సి టీలో, యన్‌.టి.ఆర్‌. గారి మీద మొదటి పరిశోధన చేశారు. సాహిత్య నిర్మాణం, అభినయ స్వరూపం, తెరపై కథనం అనే అంశాలను సమన్వయం చేస్తూ వీరు చేసిన పిహెచ్‌.డి. పరిశోధన ఆ రంగంలోనే మొదటిది. నటనాశిల్పి శ్రీనందమూరి తారక రామారావుగారి మీద చలన చిత్రశైలికరణ అనే పరిశోధనకు డాక్టరేట్‌ డిగ్రీ పొందారు. ఇతర రచనలు : = వ. యన్‌.టి.ఆర్‌. గారితో జీవితం పంచుకున్న వీరు వారి మీద' రాసిన ఎన్‌.టి.ఆర్‌. జీవితచరిత్ర గ్రంథరూపంలో విడుదల అయింది. అలాగే 'నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మీద పరిశోధనాత్మ కంగా రాసిన పుస్తకం, ఛమణకం (నవల) ద్వితీయ ముద్రణ పొందాయి. ఎన్నో కవితలు రాసారు. గేయాలు క్యాసెట్‌ రూపంలో విడుదల య్యాయి. త్వరలో (ద్రాపదిమీద సందేశాత్మకంగా రాస్తున్న నవల విడుదల కానున్నది.