Telugu adhbutha ramayanam - anilvaranasi/indianlanguages GitHub Wiki
_ అక్బుత రాహాకు జమ ప | -్బ సహజ కవి మల్లెమాల “2 | క స జ జ ఈ పుస్తకాన్ని సాహత్యాభిమానుల కోసం క నస వ | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి... స్తా మ ౧౧ ఆనందంతో బహూకరిస్తున్నాం. (౨.
ల్. ౯న _ మల్లెమాలకుటుంబం
- 86 మ జీ . థల తమ్మవరపు రామచంద్రరావు
తకుదదవు రొాకుచంద్రు ప్ర గౌతమీ నవ్య సాహితి చర్ల
40980184 గలి స! ల్స్ 76777౧౮6౧౧ గింగాంయ6గ76/6 గొం౦ం = ణి 56 5601000: 2006 24 డ్ క! న్ లాదు- అడు 10. 00600165: 1000 స్స అ 0 గ౧0| 600160: ₹120001223/206 2013012162 [280 8720౧01202 ౪664111 8140846144 - 507 111 జగ 0156 క2గగాడగ ౧6 చా ళు (€/ తా ఖా నో [0 గ్
ట్ల ఉ్తకోన €' ల 1
వి అనేలా
| గ గే కిగ౧66 26 గికంకింటడ కగం[౧8 04066 ౯౧౧465 065166 [611162 7062106 ౪220621506 002 ౧౧౦౧6: 0870 - 2427404
అంకెతము బిన్నతనీమంననే తండ్రిని గోల్తోయిన బొక్కలు రాని మన్కు పెంబి, పెద్ద డీసి నిద్భాబుద్ధులు నేర్పింణి, నూ సుఖమే తనీ సుఖనంగా భానింబి నును ప్రుయోజుకులుగా తీర్చి దిద్దిన నూ నూతానుహులు $;;డ| గుళ్ళపల్లి కిష్ణయ్యు గారికీ కృతజ్ఞతలతో... 8-12-1982 - తమ్మవరపు రామచంద్ర రావు
పరిచయం
అద్భుత రామాయణాలు, అహి మహిరావణ చరిత్రలు, సీతా విజయాలు అంటే సామాన్య ప్రజానీకానికి ఎంత ఆదరణో సాహితీపరులకూ అంత అభిమానమే అంటారు ప్రముఖ కవి ఆరుద్ర. ఆయన వ్రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం - పదవ సంపుటిలో ఈ విషయంపై చర్చ జరిగింది. అందులో ముడింది కృష్ణయ్య, పెనుమల్లి బాపయ్య, ముద్దు లక్ష్మీనారాయణ, వేల్చూరి వెంకటేశ్వరులు అద్భుతరామాయణ రచయితలుగా మనకు కనిపిస్తారు. వీరి గురించి పెద్దగా మనకేమీ తెలియదు గాని తెలిసిన వరకు ముచ్చటించుకుందాం.
ముడింది కృష్ణయ్య అద్భుత రామాయణాన్ని తెనిగించాడు. రామాయణం శతకోటి మితమని భరద్వాజుడు విన్నాడట. వాల్మీకి వద్దకు వెళ్ళి శతకోటి మిత రామచరిత్రలో నేమేమి రహస్యముల్ పరికించినారో మామూలు చరిత్రలో కనబడవు, చెప్పమన్నాడట. సీతామహాత్యాాన్ని ప్రతిపాదించే అద్భుత రామాయణాన్ని వాల్మీకే చెప్పాడట. ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యమో, కర్త వివరాలు ఏమిటో తెలియవు.
సీశ్రాదేవి శతకంఠ రావణుని చంపిన గాధను కథనం చేసిన మరొక కావ్యం సీతావిజయం. దీనిని పెనుమల్లి బాపయ్యగారు ఏకాశ్వాస కావ్యంగా వ్రాసారు. కౌశికీ నదీ తీరంలోనే విష్ణుసంవేద్యమనే పుణ్యక్షేత్ర మహిమను కూడా ప్రస్తావించారు. గద్యలో తాను విశేష చారిత్రుణ్జని చెప్పుకొన్న కవి గురించి ఏమీ వివరాలు తెలియవు.
దశకంర రావణునితో తృప్తి లేక ప్రజలు శతకంఠుణ్ణి, సహ(్రకంఠుణ్లి సృష్టించి వాడిని రామునిచేత చంపించారు. ఈ కథను సహహ్రకంఠ రామాయణము అనే పేర ముద్దు లక్ష్మీనారాయణ రచించారు. దీనికి లక్ష్మీనారాయణ కావ్యం అనే నామాంతరం గద్యలో కనిపిస్తుంది. ఈయన మందపాక రామయ్యగారి శిష్యుడు.
రామాయణ గాథలను విచిత్రతరంగా చేసి చెప్పుకోవడానికి వేయితలల రావణాసురులను విడ్డూరపు ఊహలు సృష్టించాయి. ఓడ్రభాషలో ఇటువంటి రామకధలు చాలా ఉన్నట్టున్నాయి. తుమరాడ బాపయ్య, గంద్రేటి గురవయ్యల
లాగ ఓడ్ర రామాయణం నుండే కథను సంగ్రహించి వల్పూరి వెంకటేశ్వరులు కూడా ఒక విచిత్ర రామాయణం వ్రాసారు. ఇతని కవిత్వం మృదువై శ్రావ్యంగా ఉందని వీరేశలింగంగారి అభిప్రాయం. పూర్వగాథాలహరిలో సహ(్రకంఠుడు అనే శీర్షికలో ఇలా ఉంది. దశకంఠ రావణుని అన్న పుష్కర ద్వీపమున నుండువాడు. ఇతని ముందు రావణుడు కీటకప్రాయుడు. దశకంఠ రావణుని సంహరించిన పిదప మునులు శ్రీరాముని గొనియాడగా సీత నవ్వి వానిని గెల్బుటేమిటి గొప్ప? సహ(్ర కంఠుడున్నాడని వాని చరిత్రమును చెప్పెను. రామాదులు వీనితో యుద్ధము చేసిరి. రాముడు వీనిచే మూర్భనొందింపబడెను. అంత సీత రౌద్రాకారమును దాల్చిను. ఆమె నుండి మాతృకలు అద్భుత రూపులు వెడలిరి. వారందరను గందుక శ్రీడలాడినట్లు సహ(్రకంఠుని శిరములుదునుము జేసిరి. ఆమెభారమును భూమి మోయలేక పోవుటచే శివుడు ఆమె పాదముల క్రింద పడెను. సహస్రకంఠుని జంపిన పిదప సీత విశ్చరూప దర్శనము చేసినది. శ్రీరాముడు మూర్చ్భదేలి చూచి ఆమె యాదిశక్తి యని (గ్రహించెను. ఇది యద్భుతమని యనబడుచు స్తుతింప బడుచున్నది. ఇవిగాక అద్భుతోత్తర రామాయణం అనే పేర తిరుమల వేంకట తాతాచార్యగారి 82 పుటల తాటాకు ప్రతి ఒకటి కనిపిస్తోంది. గ్రంథం పూర్తిగా లేదు. మొదటి ఆశ్వాసం మాత్రమే ఉంది. మిగిలిందంతా క్రిమిదష్టమై రాజమండ్రి లోని రాళ్ళబండి సుబ్బారావుగారి కందుకూరి వీరేశలింగం గ్రంథాలయంలో ఉంది. అందులో ప్రారంభ పద్యాలు చదువుదాం - శ్రీ రమణీ నిజాంకమున చెన్నగు నా యెలమేలు మంగ వి స్తార దయాంత రంగ వన దామము దోలిక లీల వేలి శృం గార రసంబు జిల్ళెనన క్ర మృగ న్భుద చర్చ నక్కునై గారవ మొవ్ప దాల్చు కలికాంబరు వేంకట భర్త గొల్బెదన్. శ్రీకర శాఖలుం గలిగి చెల్వగు గీర్తను మన్నిజాంకమై ప్రాకట దివ్వ రత్నముల ప్రాభవమే కవితాగ్ర భోగమై చోకతొ యిందిరా లతను సొంవుగ నల్లి కొనంగ జాలు నా వెంకట శైల మధ్య వని వెల్లెటి కల్పక మా(శ్రయించెదన్, న!
సరనుల నా(శయించి నగ జాలిన తమ్ముల యింట బుట్టి తా కరము జగంబు లీను వని గల్లిన మేటివి బొద్దు దామరన్ బిరుదుగ నిల్చు నచ్చుతుని బెండ్రయి రత్నపు పాలవెల్లిలో మురియుచు నంపదల్ యొనగు ముద్దుల తల్లియు మమ్ము గావుతన్ . హరి వక్షంబను దివ్య సౌధమున బాహాస్థంభ సజ్జన్మణీ వరపుం జాబను చెల్ల నుల్లసిలినన్ ఛాయాత్త తబ్బోన్నతిన్ వర సౌఖ్యావహ కౌస్తుభంబనెడు మన్వంబైన నుయ్యాలలో సరిమీ రందుల తూంగు తల్లి రమ నశ్రాంతంబు సేవించెదన్. వలయ రవంబు ఘల్లుమన వాణియు వీణెను మీటుచుండగన్ జిలిబిలి పాట బాడ గని చేతన నుండెటి వారు విన్నచో వలచిటు వత్తురంచు పరి భావితుడై నలు నోళ్ళ వేదముల్ గలయగ జేసి మోయు విధి గ్రమ్మన జేయు జిరాయు రున్నతిన్.
మున్ను శతకోటి విస్తృత మున్న నందు
నద్భుతోత్తర రామాయణమను బుణ్య
సత్మథను భరద్వాజున కుత్క తోడ
నాది కవి చెప్పె, దాని నీ వట్లు బలుకు.
సరసత జెప్పెడి నీకృతి
నరయ హితోక్తులను మాకు నంకిత మివ్వం
జిరతర శుభ సంపదలకు
నరమర లేకున్మి గల్గు ననఘ చరిత్రా ! అంకిలి ఐల్మనేల వినుమా యనుమానము మాని నీవు యా వెంకట శైల భర్త నిటు వింతగ నా సరసన్ వెలుంగ యో పంకజ గంధి నిత్యమని పాయగు నా యలమేలు మంగని శృంకత మాకు నీ గృతి యొసంగుము చిత్తము భక్తి యుక్తిగాన్.
కంటికి వెరగంటిన ప్ర
వ్వింటి గురుం డిటుల బల్మి వెంటనె సిరి వా
ల్లంటితొ జంటగ జన మేల్
గంటి ననుచు ముదము నంటి గను మేల్ కంటిన్.
!
అటు మేల్మాంచి సమంచి తాదరత కావ్యౌచిత్య కృత్యంబులన్
పటు భక్తిం వెస సల్పి పెద్దలను సంభావించి (మొక్కంగ వా
రటు దీవించ కలంత జెప్పనని రత్యం తానంద సంతుష్టులై
ఘటిత ప్రొఢి హరి ప్రియం బెసగ నుద్దంథంబు శాయందగున్.
ఈ విధంగా ప్రారంభించిన తన [గ్రంథాన్ని తొలి ఆశ్వాసం చివర మాలిని వృత్తంతో పూర్తి గావిస్తాడు కవి.
సమద రిపు విహారీ | సర్వ వేద ప్రచారీ !
విమల గుణ నిధానా! వీర రాజాధి యానా !
సుమవర సమ భాషా! సుందరా మాన వేషా!
సమ భవన విభూమా! నవ్య శేషాద్రి ధామా !
ఇదీ ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు అద్భుత రామాయణాల చరిత్ర. ఇంకా ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రామాయణం కాదు, అది సీతాయణం అనే వారికి ఇదొక తీపి కబురే.
అయితే ఈ అద్భుత రామాయణ గొథ తెలుగు వారికి కొత్తకాదనే విషయం ప్రస్తావించడానికే ఈ చరిత్ర అంతా చెప్పాల్సి వచ్చింది. మరుగునబడ్డ గాథ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి కన్నడం నుంచి ఇంగ్లీషు లోకి, అక్కడి నుంచి తెలుగులోకి వచ్చింది. రచయిత ఎంత బాగా వ్రాసినా వారి మీద వారికే అపనమ్మకం. వచనంలో వ్రాయడానికి ఎలా వ్రాస్తేనేం? అయినా కలశంలో పోస్తే గాని తీర్ధం కానట్లు పదిమందికీ సులభంగా అర్థంకావడం కోసం నాకు అప్పగించారు. చదివి అర్ధం చేసికోండి- అంతే. నేను కేవలం నిమిత్తమాక్రుణ్ణి. సత్యనారాయణపురం - చింతలపూడి వెంకటేశ్వర్లు 10-10-2006
14/
మున్నుడి
ఇరువదియైదు సంవత్సరముల క్రిందటి రోజులవి. నాకు మిక్రులు, నా సహోపాధ్యాయులు, పైగా నా శ్రేయోభిలాషులునైన శ్రీ గుంటూరు వెంకట సుబ్రహ్మణ్యంగారి ప్రోత్సాహంతో శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచార్యులు గారు వ్రాసిన మహాభారతం ఆంగ్లంలో చదవటం జరిగింది. ఆ తరువాత కె.యం. మున్నీగారు రచించిన రామాయణాన్ని కూడా చదివినాను. దానితో మున్నీగారి సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల్రప(త్రిక 'భవాన్సు జర్నలు నిరంతరం చదవటం ప్రారంభించినాను. అందులో ముద్దన్నగారు కన్నడంలో (వ్రాసిన అద్భుత రామాయణా న్ననుసరించి శ్రీ కె.జి. మాళ్యగారు వ్రాసిన ఆంగ్లానువాదం చదివాను. అది నాకెంతగానో నచ్చింది. నిజంగా సీతాదేవి మహాత్యం అద్భుత మనిపించింది. దాన్ని ఒకటికి రెండుసార్లు చదివాను. దానిని నా పిల్లలు కూడ చదివిన బాగుండు ననిపించింది. ఐతే అది తెలుగులో వుండవలెను కదా ! నేనే దాని అనువాదం చేపట్టి 1982లోనే పూర్తిచేసి ఒక చిన్ని పుస్తక రూపంలో నావద్ద పదిల పజిచుకున్నాను.
అది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. అవసానదశలోనున్న మా తాత గారిని, తనకు ఏకైక సంతానమైన మా అమ్మ గారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నాయనా నా కోసం, నా పిల్లలకోసం నీ సర్వస్వం ధారపోయడమే గాక, నీ సర్వసుఖాలను దూరం చేసుకున్నావు గదా ! అని అనగానే కూతుని కౌగిలించుకొని “అమ్మా ! కూలిపోతున్న నీ కుటుంబాన్ని నిలబెట్టానమ్మా, మిమ్ము గాలికి వదలి నేను వకాశీకో, రామేశ్వరానికో వెళ్ళితే, నాకు పుణ్యం వస్తుందామ్మా' అంటూ కన్నుమూసాొడు. అట్టి త్యాగ మూర్తికి ఈ చిన్న పుస్తకాన్ని అంకితమివ్వడం వుచితమనుకున్నాను.
తరువాత మాపిల్లలు చిన్న తరగతులలో వుండగా దాన్ని చదువ నారంభించినారు. నా శ్రీమతి సత్యవతి, నా అక్కగారు నేలటూరు సుభద్రమ్మగారు
౪
పదేపదే చదివి బాగుందన్నారు. నా పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ వాళ్ళ పిల్లలను తాతగారు(నేను) వ్రాసిన అద్భుత రామాయణాన్ని చదువమని ప్రోత్సహిస్తూ వుండేవారు. ఆతరువాత మా పిల్లలకు మెరుపులాంటి ఆలోచన కలిగిదాన్ని అచ్చు వేయించకూడదా యని నన్ను అడిగినారు. అందులకుగాను నా బలహీనతలను వారి ముందుంచినాను. నాకు తెలుగు భాషపై ఏపాటి ఆధిక్యత లేదని, పైగా నా భాష నడక ఒకే స్థాయిలో వుండదని చెప్పినాను, ఆపైన ఒక పుస్తకం అచ్చువేయించడం సామాన్యమైన పని కాదని, ఎంతో శ్రమతో కూడుకున్నదని వివరించి చెప్పాను. అది అంతా నేను చూచకుంటానని మా పెద్ద పిల్లవాడు చి! వేంకట రామకృష్ణారావు (గణిత శాస్త్రోపాధ్యాయుడు, సత్యనారాయణపురం) నాకు నచ్చచెప్పినాడు. వారి ఆసక్తిని కాదనలేక సరే నన్నాను.
మావాడి కృషి ఫలితంగా వాడి సహోపాధ్యాయులు, నాకు మిత్రులు డా॥ చింతలపూడి వేంకటేశ్వర్లు, 14.4.,౧.0., గారు ఎంతో శ్రమపడి నా వ్రాతప్రతిని సంస్కరించి వ్రాసి యిచ్చినారు. అంలేకాక ఈ పుస్తకానికి పరిచయం కూడా వ్రాసారు. వారికి నా ధన్యవాదాలు.
ఈ పుస్తకాన్ని ఆందంగా ముద్రించి ఇచ్చిన అశోకకృష్ణ ఆఫ్సెట్ ప్రింటర్స్, వరంగల్ అధిపతి శ్రీ నాగుల యుగంధర్ గారికి కృతజ్ఞతలు.
తమ్మవరపు రామచంద్ర రావు, అనువాదకులు న!
అద్భుత రామాయణం వాల్మీకి ఆశ్రమం
అది తమసానది. ఆ ఒడ్డున ఒక ఆశ్రమం, అది అత్యంత రమణీయం. కడు కమనీయం. మహనీయం. పరమ పవిత్రం. అది శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని గానం చేసిన వాల్నీకి ఆశ్రమం,
ధార్మిక కలాపాల కది హృదయ పీఠం. సకల విద్యలకు నిలయం. మహర్షి తపోశక్తి కారణంగా ఆ పరిసరాలన్నీ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. గంభీరమైన ఆ వాతావరణంలో నిరంతరంగా వేదఘోష వినిపిస్తుంది. ఆ వెనుక శ్రీరామ నామ సంకీర్తన. ఆకాశానికి అంటుతూన్న యజ్ఞధూమం. ఆ ధూమ మార్గం స్వర్గధామానికి మార్గదర్శకమా అనిపిస్తుంది.
విశ్వ శాంతికి, మమతానురాగాలకు ఆ మహర్షి ప్రతీక, ఆతని ఆశ్రమ ప్రాంగణంలో క్రూర వ్యాఘ్రం కూడా సాధు జంతువైన లేడితో అడుకొంటుంది. కోడెనాగు ముంగిసతో ముచ్చటలాడుతుంది. ప్రకృతి సైతం మహర్షిపట్ల మాననీయత ప్రకటించుకొంటుంది. నడి వేసవి సూర్యుడు మృదు కిరణాలు ప్రసారం చేస్తాడు. పెను తుఫానులు కూడ మంద మలయానిలాలు అవుతాయి. తమసానది పదారేళ్ళ పడుచులా ఒకచోట క్రుళ్ళి పడుతుంది, మరొక చోట సిగ్గుతో వయ్యారాలు పోతుంది. అచటి ప్రకృతి వినిర్మలం, అనిర్వచనీయం. అది విలక్షణమైన అనుభూతికి ఉనికి.
/
కథాప్రసక్తి
ఒకరోజు ఎప్పటిలాగే వాల్మీకి మహర్షి తమ శిష్యులకు రామాయణ వైభవాన్ని గురించి వివరిస్తున్నాడు. ఎంతో ఆసక్తితో వింటున్న ఆ శిష్యులలో భరద్వాజుడు లేచాడు. భక్తి ప్రపత్తులతో చేతులు కట్టుకొని గురువుగారిని ప్రార్ధించాడు.
“గృర్తువర్యా ! పరమ పవిత్రమైన శ్రీమద్రామాయణమును మాకు వినిపించినందులకు సదా కృతజ్ఞులము. బ్రహ్మ నివాసమైన సత్యలోకమున నూరు కోట్లు రామాయణము లున్నవని మాకొకపరి సెలవిచ్చినట్లు జ్ఞాపకము. ఆ గాథలన్నియు నొకేరీతి లేవనియును, వానిలో ఇరువది యైదు వేల గాథలు మాత్రమే ప్రచారమున గలవనియును చెప్పియుంటిరి. ఈ రామాయణములన్నియు నెవరి వైభవమును గానము చేయుచున్నవో యొరిగింపుడని ప్రార్ధించు చున్నాను. వానిలో నాసక్తికరమైన దెద్దియో తెలిపి మా జన్మముల చరితార్ధమొనరింపుడు.”
ఆ వేడికోలు విన్న మహర్షి ఒక్కసారి గంభీరంగా నవ్వాడు. క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు. మనో నేత్రంతో శ్రీరామచంద్రమూర్తిని సాక్షాత్కరింప జేసికొన్నాడు. మౌనంగా స్వామిని ప్రార్థించాడు. ఉప్పొంగే వాత్సల్యంతో శిష్యుల నుద్దేశించి ఇలా అన్నాడు.
“బిడ్డలారా ! ఇది అద్భుతమైన ప్రశ్న సత్యలోకమున నూరు కోట్ల రామాయణము లున్నవను మాట నిజము. అందు ఇరువది మైదు వేలు మాత్రమే భూమియం దవతరించినవి. అన్నియును నేను విని యుంటిని. కాని, అన్నియు నిచట వివరింప సాధ్యము కాదు. మనకు దొరకు రామాయణ గాథలన్నింటి యందును శ్రీరామచంద్రుని మాహాత్య వైభవములే మనకు గోచరించును. సీతామహాదేవి వైభవ మెందును
2
గోచరింపదు. ఆ తల్లి వైభవము గానము చేయబడిన రామాయణ గాథ యొకటి నేనిపుడు వినిపింతును. ఇది పరమ రహస్యమగుట చేత బ్రహ్మ లోకమండదే గుప్తపరుచ బడినది. అనుంగు శిష్యులగుటచే మీయందు గల వాత్సల్యము చేత ఆ కథను వినుపింప సమకట్టితిని. సావధాన చిత్తులై వినుడు” అంటూ ఆ అద్భుతగాథను చెప్పసాగాడు వాల్మీకి మహర్షి సృష్టికారిణి
ఈ సర్వ సృష్టికి సీతా మహాదేవియే మూలం. ఆమె ఈ విశ్వానికి తల్లి. జ్ఞానులైనవారు ఆమెను వేయి పేర్లతో పిలుస్తారు. వేయి విధాలుగా నుతిస్తారు. భక్తి ప్రపత్తులతో ఆమెను కొలిచిన వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. బ్రతికినన్నాళ్ళు భౌతిక సుఖాలు అనుభవించ వచ్చు. దివ్యానుభూతులు పొందవచ్చు. ఆపైన స్వర్గ సుఖాలు తథ్యం. ఆ తల్లి వీక్షణ మాథ్రం చేతనే ఈ విశ్వ మంతా పరిభ్రమిస్తున్నది. అంటే ఆమె మహాత్మ్యం ఎటువంటిదో ఊహించవచ్చు.
శక్తికి మూలమైన అఆ మహా మాత ఆదిశక్తి. క్రూరాత్ముల చేత ధర్మం వెనక్కు నెట్టబడినపుడల్లా ఆ జగన్నాత భూమిపై అవతరించి తిరిగి ధర్మప్రతిష్టాపన చేస్తూ వుంటుంది. దేవదేవుడైన శ్రీరామచం(్రుడికీ, ఆమెకూ భేదమే లేదు. ఇరువురూ సర్వ వ్యాపకులు, సర్వశక్తి సమున్నతులు. అతడు పురాణ పురుషుడు, ఆమె ప్రకృతి. అయితే వారెందుకు భూమిపైన సీతారాములుగా అవతరించారనే సందేహం కలుగవచ్చు. అదంతా మన కోసమేనని, మనల్ని ఉత్తములుగా తీర్చి దిద్దటానికేనని తెలిసికొండి. వారా విధంగా మానవ మాత్రులుగా అవతరించారంటే కారణం మానవజాతికి ఎలా ధర్మబద్ధంగా జీవించాలో ఆచరించి చూపించడానికే.
3
త్రిశంకుడు
సూర్య వంశంలో శ్రీరామచంద్రుడు వవిధంగా జన్మించాడో ఆ కథ మీకు వినిపిస్తాను వినండి.
పూర్వం త్రిశంకుడనే రాజు ఈ లోకాన్ని పాలించేవాడు. అతని భార్య పద్మావతి. వారిద్దరి మధ్య (ప్రేమానురాగాలకు కొదువ లేదు. అమేయమైన ఆనందాన్ని అనుభవించారు. కాని, సంతానం లేదనే చింత ఒకటి వారిని వేధిస్తుందేది. కాలం గడచేకొద్దీ ఆ చింత అంతకంతై పెరిగిపోయింది. నిరాశ సెరిగిన రాజు పరిపాలనా వ్యవహారాలలో ఆసక్తి చూపించడం మానివేశాడు. అయితే అతడు మహా జ్ఞాని. తొందరగానే నిజమేమిటో గ్రహించాడు. ఇదంతా విధివిలాసం అనీ, దీనినెవరూ తప్పించ లేరనీ తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. ఇందుకోసం బాధపడటం అవివేకం అనుకున్నాడు. తాను రాజు. (ప్రజాక్షేమం చూడవలసిన బాధ్యత తనమీద ఉంది. ప్రజలు తన కన్నబిడ్డల వంటి వారు. వారి యోగ
._ క్షేమాలే తన యోగ క్షేమాలు. ఆ విధంగా తలచిన రాజు త్రిశంకుడు
తిరిగి తన వరిపాలనా వ్యవవోరాల వట్ల (శ్రద్ధ వపాంచటం ప్రారంభించాడు. జ్ఞానికి మరొకరు చెప్పే పనేముంది !
రోజులు గడున్తున్నాయి. మానవ సేవలోని మాధుర్యాన్ని చవిజూచిన రాజు రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. మహారాణి పద్మావతీ దేవి శ్రీమహా విష్ణువును ఆరాధిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఆ పరమాత్మనే నమ్ముకుంటే వదో ఒకరోజు ఆ స్వామి కరుణించడా, తన కడుపున ఒక నలుసు పడదా అని ఆమె ఆశ. ఆ ఆశతోనే పదివేల సంవత్సరాలు గడిచి పోయాయి.
ఏకాదశి దినాల్లో ఉపవాసం చేయడం, శ్రీమహావిష్ణు నామ స్తోత్రం చేయడం, ఆ స్వామి రూపాన్ని ధ్యానించడం రాణి పద్మావతి జీవన విధానం
త్న
అయింది. అలా జరుగుతూండగా ఒక ఏకాదశినాడు ఎప్పటిలాగానే శ్రీమహావిష్ణువును ఆరాధించి పదే పదే ఆ పరమాత్మను ఆత్మలో తలచుకొంటూ ని(ద్రపోయింది. ఆనిద్రతో ఆమె ఒక కలకన్నది. ఆ కలలో శ్రీమహావిష్ణువు కనిపించి ఏమి కావాలని అడిగాడు. అటువంటి అవకాశం కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహారాజి తనకొక తనయుని ప్రసాదించమని వేడుకొంది. ఆ బిడ్డ పరమ భాగవతుడు కావాలని, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడే ధర్మ ప్రభువు కావాలని కోరుకొంది. శ్రీమహావిష్ణువు ఆమె సదాశయానికి సంతసించి 'తథాస్తు' అని దీవించి తన లోకానికి వెళ్ళిపోయాడు. మహారాణి హృదయం ఆనందంతో నిండిపోయింది.
ఆ మధురానుభూతిలో కనులు విప్పిన మహారాణికి నిజంగా తాను పరున్న తల్పంపై ఒక పండు కనిపించింది. కల కల్లకాదు కదా అనే అనుమాన లేశం కూడా తొలగిపోయి, ఆమె ముఖంలో కోటికాంతులు వెల్లివిరిసాయి. వెంటనే తన ఆనందాన్ని భర్తతో పంచుకోవాలి. ఆయన తన ్రక్శనే మంచి నిద్రలో ఉన్నారు. లేచేదాకా ఆగే పరిస్థితి కాదు. వెంటనే బిగి కౌగిలితో ఆయనకు తెలివి రప్పించి స్వప్పవృత్తాంతమంతా తనివితీరా చెప్పింది. దివ్య ఫలాన్ని చూపించింది. తన రాణి ముఖంలో చాలాకాలంగా కనిపించని ఆ సంతోషం చూచిన (త్రిశంకుడు చేతులు జోడించి పరమాత్మకు వ్రణామాలు అర్పించాడు. భక్తితో ఆ ఫలాన్ని ఇద్దరూ ఒక సుముహూర్తంలో భుజించారు.
అంబరీషుడు
రోజులు గడచిపోతున్నాయి. త్రిశంకు మహారాజు, పద్మావతీ మహారాణి దంపతులు ఆరగించిన ఆ దివ్యఫలం వారి మనోవాంఛను
ర్
సఫలం చేసింది. అనతికాలం లోనే మహారాణి గర్భం ధరించింది. నవమాసాలు నిండి మగబిడ్డను ప్రసవించింది. రాజ్యంలోని ప్రజలందరికి అదొక గొప్ప శుభవార్త. అందరూ ఎంతో సంబరంగా వేడుకలు జరుపుకొన్నారు. బాణాసంచా శబ్దాలు దిక్కులు ప్రతిధ్వనించాయి. మంగళ తూర్య నాదాలు సర్వత్రా మారుమైోగాయి. నృత్య సంగీతాది వినోద కార్యక్రమాలు దేశమంతా వీనులకు విందు, కనులకు పసందు చేకూర్చాయి. పుట్టిన బిడ్డకు ఆయురారోగ్యాలు చేకూరాలని ఆలయా లన్నింటిలోనూ పూజాదికాలు నిర్వహించారు. ఆ బిడ్డ చిరంజీవి కావాలని, సకల సద్గుణ సంపన్నుడు కావాలనీ శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. దినదిన (ప్రవర్ధమానుడగుచు ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి అంబరీషుడని నామకరణం చేసారు. పరాత్పరుని వరప్రసాదంచే జనించిన వాడగుట వలన ఆ బాలుడు మిగుల తేజోవంతుడుగాను, మహా బలవంతుడుగాను, మేధాశక్తి సంపన్నుడుగాను రూపు దిద్దుకున్నాడు. సంపూర్ణ యెవనవంతు డయ్యానాటికి వేద వేదాంగాలు, సకల శాస్త్రాలు అంబరీషునికి కరతలామలకాలు అయ్యాయి. కాలానుగుణమైన నాటి ఆచారాల ప్రకారం యుక్తవయస్సు వచ్చిన తమ సంతానానికి తగిన జీవిత భాగస్వామిని వెదకి వివాహం చేయడం తల్లితండ్రుల కర్తవ్యం. అది వారి కనీస బాధ్యతగాను, ధర్మంగాను భావించే వారు. సంప్రదాయబద్ధంగా త్రిశంకుడు తమకు తగిన రాకుమార్తిను తెచ్చి అంబరీషునకు పెండ్లి జరిపించాడు. నవ దంపతులు ఆనందంగా కాలం గడుపుతున్నారు. అలా కొంత కాలం గడచింది. త్రిశంకుడు వృద్ధుడయ్యాడు. ఇక తన తనువు చాలించ వలసిన సమయం ఆసన్నమైందని గుర్తించాడు. 6
కుమారుడు అంబరీషునకు పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పగించాడు. తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన స్వర్గధామాన్ని అధిరోహించాడు.
అంబరీషుడు ధర్మబద్ధమైన పరిపాలనలో తండ్రిని మించి పోయాడు. ప్రజల మన్ననలను, అభిమానాన్ని చూరగొన్నాడు. ధర్మ ప్రభువన్న గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. కాని, అంబరీషుని ఆశయం వేరు. శ్రీమహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు కావాలి. అందుకోసం గొప్ప తపస్సు చేయాలని సంకల్పించాడు. మంత్రి పుంగవులను రావించి తన మనస్సులోని మాట బయట పెట్టాడు. తన దీక్షాకాలంలో రాజధానిలో రాజు లేడన్న లోటు రానీయకుండా చూడాలన్నాడు. ప్రభుభక్తి పరాయణులైన మంత్రులందరూ రాజు (ప్రయత్నాన్ని ప్రశంసించారు. పరిపాలనలో పటుత్వం సడలనీయకుందడా చూస్తామని మాట యిచ్చారు.
అంబరీషుని తపస్సు
అంబరీషుడు రాజ్యభారాన్ని మంత్రులకు వదలిపెట్టి అరణ్యంలో (ప్రవేశించాడు. ఒక శుభముహూర్తాన అనువైన చోటు చూచుకొని తపస్సు ప్రారంభించాడు. తనువును, మనస్సును ఏకంచేసి కఠోరంగా తపస్సు చేసాడు. తదేక ధ్యానంతో శ్రీమన్నారాయణుని మీద మనస్సు కేంద్రీకరించాడు. అలా ఆ తపస్సు వేయేండ్లు సాగింది. అంబరీషుని ప్రగాఢ భక్తికి శ్రీమహావిష్ణువు ఎంతగానో మెచ్చుకున్నాడు. అయినప్పటికి ఇంకా పరీక్షించాలని దేవేంద్రుని రూపంలో ఐరావతాన్ని అధిరోహించి అంబరీషుని ముందు ప్రత్యక్షమయ్యాడు. 'అంబరీషా ! నేను స్వర్గాధిపతి మహేంద్రుడను. నిన్నాశీర్వదింప వచ్చితిని. నీకేమి కావలయునో కోరుకొను మిచ్చెదను అన్నాదు.
7
అంబరీషుడు ఆ పలుకు లాలకించి మెల్లగా కనులు విప్పి “ఇంద్రుని పరికించి చూచాడు. చిరునవ్వుతో 'ఓ దేవేంద్రా! నిన్ను జూడ నా కానంద మగుచున్నది. సర్వ లోకాధిపతియైన శ్రీమహావిష్ణువే నాకు సర్వస్వమని నీకు తెలియును కదా ! నాయాత్మ అ పరమాత్మ కేనాడో పూర్తిగా నంకితమైనది. ఆయన కరుణా కటాక్షములు తక్కనే కోరదగిన దేమున్నది? నిన్నడుగ వలసిన వరము లేమియు లేవు. కాదు కూడదంటివేని నా కిదియ చాలు-నా మనస్సు శ్రీమన్నారాయణుని పద పద్మముల నుండి మరలకుండునట్లు పరమాత్ముని కరుణ సంపాదించు నాతపస్సు నిరంతరాయముగ కొనసాగనిమ్ము. ఇదియే నా కోరిక అన్నాడు. అంబరీషుని అచంచలమైన భక్తికి, పట్టుదలకు శ్రీమహావిష్ణువు చకితుడయ్యాడు. ఆ భాగవతుని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ మరు క్షణం నిజరూప దర్శనం ఇచ్చాడు. ఎవని తేజస్సుచేత సూర్య చంద్రాదులు 'ప్రకాశించుచున్నారో, ఎవని వీక్షణ మాత్రంచేత ఈ విశ్వం నిరంతరం పరిభ్రమించుచున్నదో, ఎవని దివ్య ముఖం నుండి వేద వేదాంగాలు ఆవిర్భవించాయో, ఎవని రోమకూపమందు సమస్త చరాచరసృష్టి నిలిచియున్నదో అట్టి శ్రీమహావిష్ణువు అతని ఎదుట సాక్షాత్కరించాడు. అంబరీషుని ఆనందానికి అవధులు లేవు. ఆనంద బాష్టాలు చెక్కిళ్ళనుండి జాలువారాయి. చేతులు జోడించి అప్రయత్నంగా శ్రీమన్నారాయణుని కీర్తింప సాగాడు. *ఓ దేవాధి దేవా ! పరంధామా ! నన్ను క్షమించుము. నీ వెన్నడు నింద్రుని రూపమున నరుదెంతువని ఊహించలేక పోయితిని. నా మూర్థత్వమునకు నన్ను మన్నించుము"” అనుచు శ్రీమహావిష్ణువు పాదాలపై బడ్డాడు. భక్తవరుని వినయ సంపదను మనస్సులోనే మెచ్చుకొంటూ అతని శిరస్సును తన వరద హస్తంతో నిమురుతూ శ్రీమహావిష్ణువు ఇలా 8
అన్నాడు- “వత్సా అంబరీషా ! నీ భక్తిని పరీక్షింప దలచి నే నింద్రుని రూపమున వచ్చితిని. నీది వజ సంకల్పము. నీ కేమి కావలయునో కోరుకొను మిచ్చెదను. నేను భక్త విధేయుడనని నీకు తెలియును కదా ! భక్తుల యానందమే నా యానందము.”
అంబరీషుని కన్నులు ఆనందంతో తడిచి ముద్దలయ్యాయి. నాలుక తడబడ సాగింది. తన భక్తిని మెచ్చుకొని సాక్షాత్తూ ఆ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమైనప్పుడు భక్తునకు అంతకంటె కావలసిం దేముంది ! నోట మాట పెగలని భక్తుని స్థితిని గ్రహించాడు శ్రీమహావిష్ణువు.
“నీ వనుకున్నది నెరవేరును గాక ! అంబరీషా ! నీ భక్తికి మెచ్చితిని. ఈ సుదర్శన చక్రమును నీకు (ప్రసాదించుచున్నాను. గ్రహింపుము. పూర్వము పరమేశ్వరుడు దీనిని నాకొసంగి యుండెను. ప్రతిఫలాపేక్ష లేని నీ భక్తికి మెచ్చి నేను నీకొసంగుచున్నాను. ఇది నిన్ను ఈతి బాధలనుండియు, తాపసుల శాపముల నుండియు కాపాడగలదు. రాజధానికి తిరిగి వెళ్ళి నీ ప్రజలతో సుఖముగా నుండుము అని ఆళీర్వదించి పంపాడు.
అంబరీషుని సంకల్పం నెరవేరింది. శ్రీమన్నారాయణుని అనుగ్రహం చేత పొందిన చక్రాయుధాన్ని ధరించి రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ శుభ సమయాన గౌరవ మర్యాదలతోను, సకల రాజ లాంఛనాలతోను అయోధ్య పౌరులు, మంట్రి పుంగవులు, సామంతులు తమ రాజుకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.
అంబరీషుడు తిరిగి పరిపాలనా భారాన్ని స్వీకరించాడు. అయోధ్య చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. ఆదర్శప్రాయమైన తమ రాజు పాలనలో ప్రజలందరు నిండు హృదయాలతో తమతమ విధులు
9
నిర్వహింప సాగారు. ప్రతి యింటా నారాయణ నామ స్మరణ వినిపించ సాగింది. పల్లెల్లో కూడా యజ్ఞ యాగాదులు నిర్వహింప సాగారు. ఇంతెందుకు- రాజప్రాసాదమే ధర్మపీఠమైంది. అక్కడ నూరు అశ్వమేధ యాగాలు చేసారు. తత్ఫలితంగా దేశం నాలుగు వైపులా శాంతి సౌఖ్యాలు వెల్లివిరిసాయి. సర్వ (ప్రజానీకంలోను సుఖ సంతోషాలు వరదలయ్యాయి. శ్రీమతి సయంవరం
శ్రీమహావిష్ణువు కరుణ చేత అంబరీషునకు ఒక కుమార్తె కలిగింది. ఆ బిడ్డకు శ్రీమతి అని పేరు పెట్టారు. అందాలమూట ఆ బిడ్డ తల్లిదండ్రులను మురిపించి మైమరపిస్తోంది. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేక పోతున్నాడు అంబరీషుడు. కాలం గడచినకొద్దీ మొగ్గ అయినా రేకులు విచ్చుకొంటుంది కదా! శ్రీమతి ఇప్పుడు నవయవ్వనవతి. అందాల రాచబొమ్మ, అతిలోక సుందరి.
ఒకరోజు యథావిధిగా రాజు కొలువుదీరి వున్నాడు. తన ప్రజలకు దర్శనమిస్తున్నాడు. ఆ సమయాన ఆకాశాన సంచరిస్తూ యౌవన ప్రాయంలో ఉన్న నారద పర్వత మునీంద్రులు చెరొక మార్గాన అక్కడకు చేరారు. ముని ద్వయాన్ని చూచిన అంబరీషుడు వెంటనే లేచి వారికి ఎదురేగి వినయపూర్వకంగా నమస్కరించాడు. వినమ్రతతో స్వాగతం పలికాడు. అతిథి సత్కారాలు చేసాడు. ఉచితాసనాలు చూపించి కూర్చుండబెట్టాడు. ఇంక తానేమి సేవలు చేయవలెనో ఆనతిమ్మని వేడుకొన్నాడు.
మునులిద్దరూ సభనంతా ఒకసారి కలయజూచారు. రాజు (ప్రక్కనే ఠీవిగా కూర్చున్న అందాలరాశి శ్రీమతి మీద వారి చూపులు నిలిచి పోయాయి. ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన ఆ సౌందర్యవతిని నఖ
10
శిఖ పర్యంతం పరిశీలించి చూచారు. ముల్లోకాలలోను సాటి లేనట్టి ఆ ముగ్ధ మోహన సుకుమార మనోహర లావణ్య మూర్తిని చూస్తూ నోరప్పళించి గుటకలు (మింగసాగారు.
ఒత్తుగా ఉన్న తుమ్మెద రెక్కలవంటి ఆమె కురులు సముద్ర తరంగాల్లా వంకులు తిరిగి ఉన్నాయి. ఆమె కనుబొమలు అరవంగిన హరివిల్లును తలపిస్తున్నాయి. అమితాకర్షణీయంగా ఆమె నవ్వినపుడు ముత్యాలు రాలుతున్నాయి. సంపెంగ పూవువంటి ఆమె ముక్కు మొనదేలి ఉంది. ఆమెకు సాటిరాగల సుందరి ఈ విశ్వంలోనే లేదని యువ మునీంద్రు లిద్దరూ చకితులయ్యారు. ఆ జవ్వని ఎవరో అర్ధంగాక సతమతమయ్యారు. తెలిసికోవాలన్న కుతూహలంతో వాళ్ళ గుండెల వేగం పెరిగిపోయింది. లోన భేరీనినాదాలు హాోరెక్కి నాలుకలు తడారిపోయాయి. ముఖాల నిండా చెమటలు పట్టాయి.
అయినా వాళ్ళు వెనుకాడలేదు. గుండెలు దిటవుచేసుకున్నారు. ధైర్యం చిక్కబట్టుకున్నారు. ఇద్దరూ ఒక్క మారుగా రాజును ప్రశ్నించారు.
1 రాజా ! ఈ అందాల భరిణ ఎవరో తెలిసికోవచ్చునా రా
ఆ యిద్దరి వింత ప్రవర్తన రాజు గమనిస్తూనే ఉన్నాడు. అందుకు అతనికి గర్వంగానూ ఉంది.
“ఈమె నా ఏకైక పుత్రిక శ్రీమతి. యుక్త వయస్సు వచ్చిన నాబిద్దకు తగిన వరుని కొరకెదురు చూచుచున్నాను' అంటూ అంబరీషుడు సమాధానం చెప్పసాగాడు. ఆ మాట వింటూనే మునిద్వయానికి మరింత ఆసక్తి కలిగింది. ఉద్వేగంతో ఆ యువతి వైపు చూడసాగారు.
అంబరీషుడు చెప్పదలచుకొన్నదంతా ఇంకా పూర్తి చేయనేలేదు. నారదుడు తన ఆసనం నుండి లేచాడు. చేసైగతో రాజును ఒక మూలకు పిలుచుకెళ్ళాడు. రహస్యంగా అతని చెవిలో గుసగుసలాడాడు- 'శ్రీమతిని
11
నాకిచ్చి మీరేల వివాహము చేయరాదు ! నేను మీ కూతురునకు తగిన భర్తనని భావించుచున్నాను.”
అయాచితంగా "నేను చేసుకుంటాను అని ముందుకు వచ్చిన మునిపుంగవుని మోమును (ప్రశ్నార్ధకంగా చూచాడు రాజు. అవును, నారదుడు నిజంగా అందమైన వాడే! సకల శాస్త్ర పారంగతుడు. నిరంతర హరినామ చింతనా తత్పరుడు. యమ నియమ సాధనచేత కలిగిన దివ్యశక్తితో అతని ముఖం తేజో మయమై వెలుగు లీనుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నారదుడు అల్లుడు కావటానికి అన్నివిధాలా అర్హమైనవాడు.
రాజు తన అంగీకారం తెలపడానికి సిద్ధపడుతూండగా మరోవైపు నుండి పర్వత మునీంద్రుడు తనవద్దకు రమ్మని సైగ చేసాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. పర్వతుడు మెల్లగా “నీ కుమార్తెకు నేను తగిన వరుడనని భావించుచున్నాను. నన్నేల అల్లునిగా స్వీకరింపరాదు ?” అని (ప్రశ్నించాడు.
అది విన్న అంబరీషుడు నిశ్చేష్టికుడయ్యాడు. కారణం- ఏక కాలంలో ఇద్దరు మహాపురుషులైన మునీంద్రులు తన కుమార్తెను వివాహమాడటానికి ముందుకు రావడమే ! అతని హృదయం ఒకింత కలవరపడింది. చాలాసేపు ఆలోచించాడు. ఎంతకీ ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఏమి నిర్ణయం తీసుకున్నావంటూ నారదుడు తొందర పెడుతున్నాడు. తన కనుకూలంగా చెప్పాలన్నట్లు పర్వతముని చూపులతోనే గద్దిస్తున్నాడు.
అంబరీషునకు ఏమీ పాలుపోవడం లేదు. కొంతసేపు మాట్లాడలేదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరికీ నమస్కరించి కడు వినయంగా ఇలా అన్నాడు.
12
“యోగిపుంగవులారా ! మీరిరువురును నా పత్రిని ధర్మపత్నిగ వరింప వేగిరపడుచున్నారు. అందులకు నా కానందమును, గర్వమును కలుగుచున్నవి. మీ యందొకనికి నా కుమార్తె నొసగిన రెండవ వానికి అసంతృప్తి కలుగును కదా ! మీ రిరువురును సర్వ సమర్ధులు. మీరు కోపించి శపించిన నాకును, నా దేశమునకును మేలు కాదు. ధర్మశాస్త్రములు మీకు తెలియనివి కావు. ఒక స్తీ ఒకనికే పత్ని యగుట ధర్మము. ఇరువురును ఒకరినే కోరుచుంటిరి గాన ఈ సమస్యను ఆమెకే విడచిపెట్టుచున్నాను. ఆమె నిర్ణయమే నా నిర్ణయము. ఆమె తనకు వలసిన వరుని వరించుటకు వీలగునటుల న్వయంవరమును ఏర్పాటు చేయుదును.”
అందుకు మునీంద్రు లిద్దరూ సమ్మతించారు. ఆ మర్షాడే శ్రీమతికి స్వయంవరమని నిర్ణయించారు, సవిత్ర కార్యానికి ఆలస్య మెందుకని కాబోలు ! 'రేపీ సమయమునకు తిరిగి వచ్చెదము, శ్రీమతిని పత్నిగ చేపట్టనున్న అదృష్టవంతు డెవ్వడో చూచెదముగాక !? అంటూ మునులిద్దరూ ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారే గాని ఆ యిద్దరినీ ఒకటే ప్రశ్న పీడించుకు తింటోంది. అది ఆమె హృదయాన్ని ఎలా వశం చేసుకోవడమా అన్నది.
నారదుని మనసులో ఒక ఊహ మెదిలింది. వెంటనే తన తపోబలంతో మనోవేగాన వైకుంఠపురం చేరుకున్నాడు. శ్రీహరి నారదునికి సాదరంగా స్వాగతం పలికి సుఖాసీనుణ్ణి చేసాడు. దేవర్షి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు వివరించాడు. అంబరీషుని పుత్రిక తనకు శ్రీమతి కాకుంటే బ్రతకలేనన్నాడు. తల వంచుకొని నీదే భారం అన్నట్లు నిలబడ్డాడు.
13
నారదుని ఆ స్థితిని చూచి శ్రీమన్నారాయణుడు జాలి పడ్డాడు. నీ కోసం ఏమి చేయమంటావో చెప్పమన్నాడు. సందేహించ వలదని ప్రోత్సహించాడు. నారదుడు సందేహిస్తూనే తల పైకెత్తకుండానే విన్నవించాడు-
“దేవా ! రేపు జరుగనున్న స్వయంవరమునందు పర్వతుని ముఖము కోతిముఖము వలె కనిపించు నటుల చేయుము. అప్పుడామె వానిని వరింపదు కదా ! నా యీ చిన్ని కోరికను తీర్చలేవా స్వామీ ! ఈ రహస్యమును మరెవ్వరికినీ తెలియరాదు సుమా 1”
శ్రీమహావిష్ణువు కొన్ని క్షణాలుఆలోచించాడు. సరే అన్నట్లు తల ఊపి చిరునవ్వుతో అలాగే చేస్తానంటూ ఆశీర్వదించాడు. నారదుడు పరమానందంతో ఆ పరంధాముని వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.
అక్కడ పర్వతుడు కూడా శ్రీమతిని ఎలా చేపట్టాలా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరికి తన కోరిక నెరవేరాలంటే శ్రీమన్నారాయణుని శరణు వేడక తప్పదనుకున్నాడు. అప్పటి కప్పుడే మనోవేగంతో వైకుంఠం చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు పాదాలు తాకి ఆయన కీర్తిని గానం చేసాడు. భక్త వత్సలుడైన స్వామి 'క్షేమమా మునీంద్రా ! ఇంత ఆకస్మికముగ నిటకు రాగల కారణము నెరుగ వచ్చునా అని కుశల ప్రశ్నలు వేసాడు. స్వామి ప్రసన్న వదనం చూచి పర్వతుడు ధైర్యంగా తన మనసులోని మాట బయట పెట్టాడు.
“దేవాధి దేవా! భూత భవిష్య ద్వర్తమానముల సమస్తము నెరిగినట్టి తమకు నేను వేరుగ చెప్పవలసిన దేమి కలదు ! అయినను విన్నవించు కొనుట నా ధర్మము గావున చిత్తగింపుడు. అంబరీషుని పుత్రిక శ్రీమతిని వివాహమాడ దలచితిని. అందుకు నారదుడు నాకు ప్రతిస్పర్ధియైనాడు.
14
ఆమె మాలో నొక్కరిని మాత్రమే వరించ వలయునుగాన రాజు ఆమెకు స్వయంవరము నేర్పాటు గావించినాడు. నా హృదయమును స్పందింప జేసిన ఆమెనెట్టి స్థితిలోను జార విడుచుకొన లేకున్నాను. అందులకై స్వయంవరమున నారదుడు కొండ(ముచ్చు వలె కనిపించు నటుల వరమీయ గోరెదను. ఇందు దోషమున్న మన్నింప ప్రార్ధన.!
“ఇరువురును జ్ఞానయోగులే. అమాయకురాలు రాకుమార్తెను కైవస మొనరించుకొనుటకు కుమార్గమున బడినారు. ఒండొరుల మోసగింప బూనుకొనుట మిగుల శోచనీయము” అని మహావిష్ణువు మనసులో చింతించి “మునీంద్రా! నీ కోరిక నెరవేరును. ఈ రహస్యము నారదునకు తెలియరాదు సుమా !? అని పర్వతమునికి మాటిచ్చాడు.
తన యొత్తు ఫలించినందుకు పర్వతుని హృదయం ఆనందంతో పొంగిపోయింది. శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపి అయోధ్యకు తిరిగి వచ్చాడు. (బ్రహ్మచర్యం నుండి గృహస్తాశ్రమం లోనికి అడుగు పెడుతున్న అతని మనసులో ఎన్నెన్నో ఊహలు ఉయ్యాల లూగసాగాయి. తన పథకం ఫలించింది. అందాల పుత్తడిబొమ్మ శ్రీమతి ఇకపై తన శ్రీమతి. తను పెండ్లికుమారుడు కావడం ఎంత ఆనందం ! మంగళ వాద్యాలు, ముతైదువుల అలంకారాలు, విందులు, వినోదాలు, నృత్యాలు, సంగీతాలు- ఎక్కడ చూచినా పెళ్ళిసందడే ! ముఖ్యంగా శ్రీమతి నారదుని ముఖం కొండ(ముచ్చులా ఉందని అనప్యాంచుకొంటుంది. ఆ దృశ్యం తలచుకొంటేనే నవ్వొస్తుంది. అలా జరుగబోయే కార్యక్రమం పర్వతుని ఊహల్లో వర్ణచిత్రాలు గీస్తోంది.
అక్కడ నారదుడు కూడ శ్రీమతిని తలచుకొని పగటి కలలు కంటున్నాడు. “రేపు నా జీవితమున నూతన సంక్రాంతి. స్వయంవరమున శ్రీమతి ప్రేమతో నా గళమున వరమాల వేయును. ఆహా! ఆ తరువాత
15
రాజలాంఛనముల తోడ నా వివాహము. ఎచట చూచినను నృత్య నాటక సంగీత వినోద సంరంభములే! పాపమా పర్వతుడు మర్కట ముఖముతో పరాభవమును భరింపలేక ఎచటకు పలాయనము చిత్తగించునో కదా! అనుకొంటూ ఆనందంతో పిచ్చిపిచ్చిగ గంతులు వేస్తున్నాడు. శ్రీమతి స్వయంవరానికి అయోధ్యా నగరమంతా అలంకరించారు. రంగురంగుల పతాకాలతో, మామిడి తోరణాలతో రాజధానిని తీర్చి దిద్దారు. ఏ వీధి చూచినా వినోద కార్యక్రమాలతో కన్నుల పండువుగా వుంది. ప్రజల ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. రాజప్రాసాదాన్ని మరకత మాణిక్యాలతోను, బంగారు నగిషీలతోను అలంకరిచారు. రాజ మందిరంలో కళ్ళు చెదిరిపోయేట్లు వివాహ వేదిక సిద్ధం చేసారు. అనుకున్న వేళకే పర్వత నారదులు అక్కడకు చేరుకున్నారు. ఎవరికి వారు ఎదుటి వానికి జరుగబోయే పరాభవాన్ని తలచుకొంటూ ముసిముసి నవ్వులతో మురిసిపోతున్నారు. వివాహ లంఛనాలతో మునులిద్దరినీ కల్యాణవేదిక దగ్గరకు తీసుకెళ్ళారు. రాజ ప్రాసాద మంతా అతిథులతోను, మంత్రి పురోహిత సామంతులతోను, రాజోద్యోగులతోను నిండిపోయింది. చూడ వచ్చిన ప్రజలతో సభాస్థలం కిటకిటలాడుతోంది. సుముహూర్త సమయానికి పెళ్లికూతురు శ్రీమతి రెండు చేతులందు వరమాలతో సభలో ప్రవేశించింది. చెలికత్తె లామెకు దారి చూపిస్తున్నారు. సభ అంతా సద్దుమణిగింది. వధువు రూపంలో శ్రీమతి పూర్వం కంటె అందంగావుంది. ఆమె అందానికి ముగ్ధులైన మునులిద్దరూ తమ ఠీవిని ప్రదర్శించడానికి ఆరాటపడుతున్నారు. తమ ముందుకు వస్తూన్న రాజపుత్రిని గుడ్లప్పగించి చూడసాగారు. ఆమె వేసే ప్రతి అడుగూ వారి గుండెల మీద సమ్మెట పోటులా వినిపిస్తూంది. అంతలో అంబరీషుడు ముందుకు వచ్చి మునులిద్దరిని కుమార్తకు పరిచయం చేసాడు. 16
“అమ్మా శ్రీమతీ ! ఈ మహాత్ము లిరువురిలో ఒకరు నారద మునీంద్రులు, మరొకరు పర్వత మునీంద్రులు. ఇరువురును నీ కరగ్రహణమునకై మనసుపడి ఉన్నారు. ఇరువురిని నీవెరుగుదువు. కావున నీ కెవరు తగినవానిగ తలంతువో వాని గళమున వరమాలను వేయుము. అతడు నీకు నాథుడు కాగలడు.”
తండ్రి మాటలు విన్న శ్రీమతికి చెక్కిళ్ళు కెంపువారాయి. సిగ్గు ముంచుకొచ్చింది. పూర్తిగా తల యొత్తలేక ఓరచూపులతోనే నారదుని చూచింది. ఆమె ముఖంలో సిగ్గు మాయమై విస్మయం ప్రవేశించింది. పర్వతుని చూచింది. అక్కడా అదే పరిస్థితి. ఇద్దరినీ మళ్ళీ మళ్ళీ చూచింది. ఆమెకేమీ అర్ధం కావడం లేదు. మనసు నిండా సందేహాలు. వారు తండ్రి చెప్పినట్లు పర్వత నారదులు కారు. ఏమి చేయాలో తెలియక నేలచూపులు చూడసాగింది. లోలోపల నుండి ఉవికి వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుంది.
ఇదంతా చూస్తున్న అంబరీషుడు కూతురు సిగ్గుపడుతున్నదేమోనని భావించాడు. ధైర్యంగా నచ్చిన వాని మెడలో వరమాల వేయమన్నాడు. వారిద్దరూ సకలశాస్త్ర కోవిదులన్నాడు. ఉత్తమ వరులన్నాడు. ఎవరిని వరించినా తమ ప్రాణంగా చూచుకుంటా రన్నాడు.
శ్రీమతి సమస్య అది కాదాయె ! తాను చూస్తున్న దృశ్యాన్ని ఏమని చెప్పాలి ! నిండు సభలో వీరు మునులు కాదని ఎలా చెప్పగలదు ? సభ దృష్టిలో వీరు మునులేకదా...నిండు చందమామను మబ్బులు మూసినట్లు ఆమె ముఖాన్ని కప్పుతున్న నీలినీడల్ని గమనించిన అంబరీషుడు ' ఎందుకు సందేహిస్తున్నావు చెప్పమ్మా అంటూ బుజ్జగించాడు. రాకుమారి కిక చెప్పక తప్పని స్థితి. నోరు విప్పింది. గ
“తండ్రీ ! ఇచట నిరువురు మునులు గలరని మీ రనుచున్నారు. వారెచట నున్నారో - నా కనులకు గాన్పింపరేమి? నా యెదుట నొక కోతియును, నాక కొండమ్రుచ్చును దప్ప మును లెవ్వరును లేరు. ఆ రెండు ముఖముల నడుమ నెవరో ఒక సుందరాకారుడు కాన్ప్సించు చున్నాడు. అతడు నీలమేఘ శ్యాముడు. నిండు జవ్వన మూర్తి. పీతాంబర ధారి. పద్మ పత్రాక్షుడు. పరిచయ మున్నవాని వలె ననుజూచి చిరు మందహాసము చేయుచున్నాడు. ఆ నవ్వు మల్లెల జల్లువలె నున్నది. అతడు నాకు తగిన వరుడు కావచ్చును. మీకట్లు కనిపించుట లేదా . ..”
శ్రీమతి అలా అంటూంటే విన్న వారంతా విస్తుపోయారు. అక్కడ రెండు కోతులేమిటి . . . మధ్యలో వేరే మనిషి ఎవరు . . . కళ్ళు నులుపుకొని మరీ చూచారు. వారెంత ప్రయత్నించినా అక్కడ మునులు ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. మునులు కూడా ఆశ్చర్యంలో మునిగి పోయారు. కోతులు అనే సరికి తమను తాము చూచుకొన్నారు.
ఒకళ్ళనొకరు చూచుకొన్నారు. మామూలుగానే ఉన్నారు. అయినా బుజాలు తడుముకున్నారు. ఆమెకు కనిపించ వలసింది ఒక కోతి మాత్రమే కదా *, =. =. ఆెండంటుందేమిటి ... ఇద్దరికీ సందేహమే ! ఇక భరించలేక అసలు విషయాన్ని ఆమె నుండే రాబట్టసాగారు.
“సుందరీ ! ఆతడెవరేని మాయావి కావలయును. నీకు మాత్రమే కనిపించుచున్న ఆ సుందరాంగుడు ఇచట నెవరికిని గాన్సించడేల?” మునులు ప్రశ్నించారు.
“నాకిప్పటికిని అట్లే కాన్సించుచున్నాడు. అతడు మాయ కాదు, నిజము.” ఆమె సమాధానము.
“అతడి కెన్ని చేతులు కలవో చెప్పగలవా?”
18
“రెండు మాత్రమే కలవు.”
“ఆ చేతుల యందేమేమి కలవు?”
“వామ హస్తమున ధనువు, దక్షిణ హస్తమున శరము కలవు.”
మాయావి తనం చూస్తే అతదెవరో సామాన్యుడు కాడు. వేషం చూస్తే ఎవడో వేటగాడైనా కావచ్చును. సామాన్యుడో అసామాన్యుడో ఇద్దరికీ అంతుబట్టలేదు. అంతలో ఏదో స్ఫురించి చివరిగా ఒక ప్రశ్న వేసారు.
“అతడి హృదయ ఫలకమున నేమేని విశేషమును గమనించితివా?
“అవు నొక విశేషము కలదు. ఆతని హృదయ ఫలకమున నొక వనమాల కలదు. అది విరజిమ్ము దివ్య ప్రకాశము జూడ నది యెప్పటికిని వాడిపోవనిదని యనిపించుచున్నది.”
శ్రీమతి చెప్పిన సమాధానం విన్నాక మునులిద్దరి గుండెలు గుభేలుమన్నాయి. వాళ్ళ అనుమానం నిజమైంది. ఆ మాయావి శ్రీమహావిష్ణువు గాక మరెవ్వరు? కొత్త కొత్త రూపాలెత్తడం అతడి కలవాటే కదా ! అనుకుంటూ ఇద్దరూ ఎవరికి వారే కలవర పడిపోయారు.
నిన్సహాయ స్థితిలో పడ్డ అంబరీషుడు చేతులు జోడించి నమస్కరించి 'మహాత్ములారా ! ఏమి జరుగుచున్నదో, ఏమి జరుగనున్నదో నాకేమియు బోధపడుట లేదు అని అనునయ వాక్యాలు పలికాడు. ఏదో మాయ కమ్మినట్లుంది, అది తొలగి పోయేదాకా ఆగి చూద్దాం అన్నాడు.
మునిపుంగవు లామాటలకు మరింత కుపితులయ్యారు. లోలోపల నిజం తెలిసినప్పటికి పైకి మాత్రం కళ్ళెర్రజేసి 'చాలు చాలును అంబరీషా! మమ్మింక నెంత మాత్రమును మోస మొనరింప జాలవు. ధనుర్బాణములు
19
ధరించిన వాడెవ్వడును మా మధ్య నిలిచియుండలేదు. మమ్ములను తప్పించుటకై నీ వేదియో కుయుక్తి పన్ని నీ కూతు నట్లు నటింపుమని దుర్చోధ చేసియుందువు' అని నిందించ సాగారు. యదార్థమేమిటో తెలియని అంబరీషునకు విచారం ఎక్కువైంది. శ్రీమతి కూడా విచార వదనంతో క్రుంగిపోయింది. మునులా శక్తిమంతులు. తలచుకొంటే తమను, తమ రాజ్యాన్నీ శపించి నశింప జేయగలరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ ఎవరినో ఒకరిని వరిస్తే పరిస్థితి మరింత విషమించవచ్చు. ఆలస్యం చేద్దామంటే అదీ మంచిది కాదు. అలా కాదని మనసు కుదుటపరచుకొని అడుగు ముందుకు వేసింది శ్రీమతి. తనకు కనిపించిన నూతన యువకుని మనసులోనే తలచుకొంది. తాము నిత్యం ఆరాధించే శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ కొంతసేపు కళ్ళు మూసుకొంది. ఆ తరువాత కళ్ళు తెరచి తన చేతుల్లోని పూలమాలను పైకెత్తింది. ఇదంతా గమనిస్తున్న మునులిద్దరూ పూలమాల తమకోసమే అనుకున్నారు కాబోలు, మెడలు ముందుకు చాచారు. ఎవరికి వారు లోన శంకిస్తూనే తన మెడలో వరమాల పడుతుందనే భావించారు. కాని, దైవ నిర్ణయం వేరు. నీలమేఘ శ్యాముడు, దివ్యసుందర విగ్రహుడు అయిన శ్రీమహావిష్ణువు శ్రీమతి ముందు (ప్రత్యక్షమయ్యాడు. అంతే- అతని మెడలో వరమాల పడింది. వధూ వరులిద్దరూ క్షణంలో అద్భశ్య మయ్యారు. మునీంద్రు లిద్దరూ అది గమనించి విచారసాగరంలో మునిగిపోయారు. సాక్షత్తూ ఆ వైకుంఠధాముడే కల్యాణవేదిక వద్దకు వచ్చి తాము వరించిన వధువును తీసుకుపోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కాసేపు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. చివరకు ఇద్దరూ కూడబలుక్కొని ఆ శ్రీహరినే అడుగుదామని వైకుంఠానికి ప్రయాణమయ్యారు. 20
అక్కడ వారు ఊహించింది నిజమే. శ్రీమహావిష్ణువు శ్రీమతితో కబుర్గాడుతున్నాడు. మునుల రాకను గమనించిన శ్రీమన్నారాయణుడు శ్రీమతిని లోనికి పంపించాదు. ముని శాపము మోసపోయామన్న కోపంతో వైకుంఠం చేరుకున్న మునులు మహావిష్ణువును చూచి వ్యంగ్యంగా శవో దేవా! మహానుభావా ! మాకుగా నిర్ణయించుకొన్న పెండ్లికుమార్తెను నీ విట్లు దొంగిలి తెచ్చు నైచ్యమునకు దిగజారుదువని మేము కలలోనైనా ఊహింపలేదు” అన్నారు. శ్రీహరి రెండు చేతులా తన చెవులు మూసికొని చిరుకోపంతో * మునివరులారా 1! మీరు యోగిపుంగవులు. సర్వము నెరిగిన వారు. యదార్థమెరుంగక నన్నిట్లు నిందించుట మీకు భావ్యము కాదూ అని హెచ్చరించాడు. నిస్ప ్రహతోనున్న నారదుడు తన ముఖం కొండముచ్చులా ఎందుకు కనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీహరి 'నీవు నాకు చిరకాల భక్తుడవు నారదా ! అయినను నన్నర్ధము చేసికొనినట్లు లేదు. నేనేది యొనరించినను నాకొరకు కాదని నీకు తెలియును. నాకందరును సమానులే. నీవేతెంచి వరమడిగితివి. అడిగినదే తడవుగ నేనిచ్చితిని. నీవేగినంత పర్వతుడును వచ్చి నీవలెనే వరమడిగెను. కాదనలేను కదా ! నేనెల్లప్పుడును సత్యమునే వచింతును. ఆ సత్యమునకు ప్రతీక ఈ చక్రము. నన్ను నమ్ముము అని అనునయించాడు. “మరి పెండ్లికుమార్తె శ్రీమతి నెవరు కొనిపోగలిగిర? మాకు కనపడని ధనుర్భాణధారి శ్రీమతి కెట్లు కనిపించెను? కంఠమున 21
పుష్పదామముగల ఆ నీలమేఘ శ్యాముదెవరు . .. అంటూ ప్రశ్చల వర్షం కురిపిస్తున్న నారదుని మాటలకడ్డం వచ్చి 'ఆగుము నారదా .. ఈ (ప్రపంచమున నద్భుతములు గావించు వారెందరు లేరు! నన్నేల యనుమానింతువు? నాకు నాలుగు చేతులనియు, శంఖ చక్రములు ధరింతు ననియు మీకు తెలియును. స్వయంవరమున కన్య నపహరించిన వానికి రెండు చేతులు మాత్రమే కలవనియు, ధనుర్చాణములు ధరించెననియు నుడువుచున్నారు. నేనెన్నడదేని యట్సి రూపమున గాన్పించితినా ! నేనేల యబద్ధమాడ వలయును ?” అన్నాడు శ్రీహరి.
ఆ విశ్వనాటక సూత్రధారి మాటలు నమ్మిన మునులు తమను క్షమింపుమని వేడుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు. కాని, వారి మనస్సుల్లో తమకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం తగ్గలేదు. ఆ మోసానికి కారకుడెవరో నిశ్చయానికి రాలేక చివరికి ఆ నింద రాజు అంబరీషుని పైకి మోపారు. అతడే శిక్షకు పాత్రు డనుకున్నారు. జీవితాంతం మరచిపోకుండా గుణపాఠం నేర్పాలను కున్నారు. ఆ వేడి చల్లారనీయకుండా అయోధ్య చేరుకున్నారు.
అంబరీషునకు మునులను చూడటంతోనే ఏదో అనర్థం జరుగబోతోందని అనుమానం పట్టుకొంది. స్వాగతం కూడా చెప్పనివ్వ కుండా ఆ జంట కోపం బ్రద్దలయింది. “ఓరీ రాజాధమా ! జ్ఞాన గర్వము తోడ మమ్ములనే ధిక్కరింతువా ! స్వయంవరమునకు మమ్మాహ్వానించి అవమానించితివి. నీవును, నీకుమార్తెయును నేవియో క్షుద్ర విద్యలతోడ మమ్ము మోసగించితిరి. క్షుద్రులకడ జ్ఞానముండరాదు. ఇంత కాలము నీవార్టించిన జ్ఞానము జ్ఞాపకము నుండి తొలగిపోవును గాక |! అజ్ఞానాంధకారము శాశ్వతముగ నిన్ను పట్టి పీడించును గాక ! అంటూ శపించారు.
22
తపోబల గర్వితులైన ఆ మునులా మాటలన్న వెంటనే అజ్ఞాన తిమిరం అంబరీషుని చుట్టుముట్టింది. పాపం... ఆ రాజుకు నోట మాట రాలేదు. ఏతప్పును చేయని తనకు శిక్ష యేమిటని బాధపడ్డాడు. ఈ ముప్పునుండి కాపాడే వాడు శ్రీమన్నారాయణుడదేనని ఒక్కసారి స్మరించాడు. అతని రక్షణకై విష్ణుమూర్తి అతని వద్ద ఉంచిన సుదర్శన చక్రం ఈ సమయం కోసమే ఎదురు చూస్తోంది. తనస్వామి ఆదేశం నెరవేర్చే అవకాశం ఇంతవరకు రాలేదు మరి !
అజ్ఞానం అనే ఆ చీకటిమబ్బును చూచిన వెంటనే విష్ణుచక్రం జ్ఞానాగ్ని జ్వాలల్ని విరజిమ్మింది. ఆ మంటలు సకల ప్రకృతిని దహిస్తాయా అన్నట్లు ఆకాశానికంటాయి. అజ్ఞానతిమిర మేఘం వెనుకడుగు వేసింది. చక్రాయుధం ధాటికి నిలువలేక పారిపోస్తాగింది. తిమిరంతోపాటే మునులిద్దరూ భయపడి పారిపోసాగారు. చక్రం వారిని తరుముకుంటూ పోసాగింది. వాళ్ళు కారడవుల్లో దూరినా, పర్వత శిఖరాలెక్కినా, లోయల్లో దూకినా వదలిపెట్ట లేదు. ముల్లోకాలు తిరిగినా విడిచిపెట్ట లేదు. ఏదిక్కూ తోచని మునులు చివరకు వైకుంఠం చేరారు. నారాయణా పరంధామా పురుషోత్తమా పాహి పాహి అంటూ ఆర్తనాదాలు చేసారు.
మునుల ఆక్రందనలు విన్న మహావిష్ణువు వారిపై జాలిపడ్డాడు. వారు కూడా భక్తులే కదా మరి ! సాటి భక్తుణ్ణి శపించినందుకు శిక్ష అనుభవించారు. అనుభవించింది చాలు. ఇక తన నాటకంలో ద్వితీయాంకాన్ని మొదలు పెట్టవచ్చు. చక్రాన్ని ఆగిపొమ్మన్నాడు. నింగిలో చందమామలా అదక్కడ నిలిచిపోయి శీతకిరణాలు ప్రసరించసాగింది. అజ్ఞానాంధకార మేఘం తన చోటికి తాను వెళ్ళిపోయింది. గండం నుండి బయటపడ్డ మునులిద్దరూ నిట్టూర్పు విడిచారు. వారి పరిస్థితికి జాలిపడ్డాడు విష్ణుమూర్తి. వారిలో అపరాధభావం పోగొట్టి ఆత్మవిశ్వాసం కలిగిద్దామను కున్నాడు. తానే తప్పు చేసిన వానివలె ముఖం పెట్టాడు.
23
“యోగిపుంగవులారా ! అంబరీషుడును మీకువలె నా భక్తులలో నొకరు. అతడిని రక్షించుటకే నేనీ నాటకమాడితిని. మీకు బాధ కలిగించుట నాయభిమతము కాదు. అందులకు మిగుల చింతించుచున్నాను. నన్నును, నా సుదర్భ్శనమును క్షమింపుడు అని వేడుకొన్నాడు.
ఆ మాటలకు మునులిద్దరిలోను ఆత్మవిశ్వాసానికి బదులు అహంకారం తలెత్తింది. తమను మోసం చేసింది శ్రీహరే అని తెలిసాక కోపంతో ఊగిపోయారు. ఆవేశం కట్టలు తెంచుకొంది. వివేకం నశించి కళ్ళు మూసుకు పోయాయి. ఎవని కరుణవల్ల చక్రతాపం నుండి బయట పడ్డారో అతడినే నిందించసాగారు. మోసగాడి వన్నారు. తస్మరుడ వన్నారు. కామివన్నారు. మాయావి వన్నారు. చివరకు ఏ రూపంలో తమకు కావలసిన కాంతను అపహరించావో ఆ రూపంలోనే భూలోకంలో పుట్టుమన్నారు. అక్కడ భార్యను ఎవరో ఎత్తుకుపోగా తమలాగే ఏడువుమని శపించారు. అప్పటికిగాని వారి హృదయాలు చల్లబడలేదు.
ఆ శాపానికి శ్రీమన్నారాయణుడు ఏమాత్రమూ చలించలేదు. శాపమైనా పరమ శాంతంగా స్వీకరించాడు. బుషుల మాట, మునుల మాట తనకు ఆజ్ఞలా శిరోధార్య మన్నాడు. అవి శాపాలు కావన్నాడు. తాను వారి ఆనతి ప్రకారం అంబరీషుని వంశంలోనే దశరథ మహారాజుకు శ్రీరామునిగా జన్న్మిస్తానన్నాడు. విల్లమ్ములకు రెందు చేతులు పోగా చక్రం పట్టే హస్తం భరతుడుగాను, శంఖం ధరించే హస్తం శక్రుఘ్నుడుగాను, తల్చమైన ఆదిశేషుడు లక్ష్మణుడుగాను అవతరిస్తారన్నాడు. వారి మాటలు వృధాకావన్నాడు.
అప్పటికిగాని మునులకు కనువిప్పు కలగలేదు. ఆవేశం తగ్గాక ఆలోచన మొదలైంది. తాము చేసినదేమిటో అర్ధం కాసాగింది. ఆత్మవిమర్శ మొదలైంది.
24
“ఎంతపని చేసితి మెంత పని చేసితిమి ! తాపసులమైన మనము రాజకన్యనేల కోరితిమి . . . కోరితిమిపో . .. మనమేల పరస్పరము మోసపుచ్చుకొన దలచితిమి . . . ఏపాపమెరుగని అంబరీషు నేల శపించితిమి . . . భక్తజన రక్షకుడైన పరంధాము నేల శపింప సాహసించితిమి . . . అరిషడ్వర్గమును జయింప వలసిన తామా... యీ కోపమునకు బానిసలగుట . ..”
ఈ ఆలోచనల మధ్య మునులు పశ్చాత్తాపంతో క్రుంగిపోయారు. ఇంకెప్పుడూ కామ క్రోధాదులకు లొంగ కూడదనుకున్నారు. ఎన్నడూ పెళ్ళిమాట తలపెట్ట కూడదనుకున్నారు. ఆ పరమాత్మ సాక్షిగా జన్మాంత (బ్రహ్మచర్యంతో ముని వృత్తిలోనే ఉండిపోదామని తీర్మానించుకొని తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు.
కౌశికుడు
“వత్సా భరద్వాజా ! రామ జన్మకారక వృత్తాంతమును విని యుంటిరి కదా ! ఇకపై సీతాజనన వృత్తాంతమును వినిపించెద వినుడు” అంటూ వాల్మీకి మహర్షి తరువాత కథను కొనసాగించాడు.
త్రేతాయుగంలో కౌశికుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు పుట్టుకచేత మాత్రమే కాదు, గుణంచేత, కర్మ చేత కూడా బ్రాహ్మణుడే. మనసులోను, మాటలలోను, చేతలలోను శ్రీమహావిష్ణువునే సేవించు మవీ భక్తుడు. హరిభక్తి తప్ప అతనికేమీ తెలియదు.
కౌశికుడు మంచి గాయకుడు కూడా. అతని పాటలన్నీ హరినామ సంకీర్తనలే. హరిని క్తీర్తించుకుంటూనే తీర్ధయాత్రలు చేసేవాడు. అతనిలోని నిర్మలమైన భక్తి నిరాడంబరత, సంగీత కుశలత లోక ప్రసిద్ధిని
25
తెచ్చిపెట్టాయి. నాలుగు దిక్కులా శిష్యులు తయారయ్యారు. మాలతీ మాళవులనే దంపతులు అతనికి శిష్యులై తమసర్వస్వం అర్చించి నిత్యం సేవించుకుంటున్నారు. పద్మాక్షుడనే మరొక శిష్యుదు గురువుగారికి, శిష్యగణానికి భోజనాదులు సమకూర్చేవాడు.
కౌశికుని పేరు కళింగ ప్రభువు చెవిన బడింది. అతడు సంగీత ప్రియుడే గాక స్వయంగా గాయకుడు. అతనికి కౌశికుని చూడాలని, అతని గానం వినాలని కుతూహలం కలిగింది. వెంటనే పరివారంతో బయలుదేరాడు.
కౌశికుని దర్శించి తన భాగ్యం పండిందని పొంగిపోయాడు. కౌశికుడు కూడా రాజును ఆహ్వానించి తనకున్నంతలో మర్యాదలు జరిపాడు. అతని వినయానికి రాజు సంతోషించి తన కోరిక ప్రకటించాడు.
“మిత్రమా ! నీవు గొప్ప గానకోవిదుడవని వినియుంటిని. నీ గానము విని తరింప నింత దూరమేతెంచితిని, ఆ శ్రీహరిని స్తుతించు నీ జిహ్వను ఈ భూపతిని సైతమొకింత కీర్తింపనిమ్ము. నావిష్ణుః పృథివీ పతి యనికదా శాస్త్ర వచనము ! శంకింపకుము. నీ గానము విన్నంతనే నేనును నీపై కీర్తన పాడుదును. మనయందెవరు సమర్థులో ప్రజలు నిర్ణయింతురు గాక 1
రాజు చెప్పింది విన్న కౌశికుడు నిర్దాంతపోయాడు. తన జీవితంలో అది ఊహించని పరిజామం, తానేదో భగవంతుని నమ్ముకొని బ్రతుకుచున్న వాడు. భగవన్నామ కీర్తన తప్ప శాస్త్రం సంగీతం యివేవీ తెలియని వాడు. నాలుకమీద ఆ శారదామాత పలికించినంత వరకే తన పాట. ఈ విషయాలన్నీ తలవంచి విన్నవించి క్షమింపుడని వేడుకున్నాడు. కౌశికుని శిష్యులందరూ తమగురువునే సమర్థించారు. తామంతా ఆ పరమాత్మనే
26
స్తుతిస్తామని, అంతకు మించి తమకే కోరికా లేదని ముక్త కంఠంతో చెప్పేసారు.
రాజుకు వీరి మాటలు అవమానంగా తోచాయి. కోపం వచ్చింది. వెంటనే తన పరివారంలో నుంచి ఒక గాయకుని పిలిచి తనమీద పాడమన్నాడు. అతడు పాట మొదలుపెట్టగానే కౌశికుడు, అతని శిష్యులు చెవులు మూసికొన్నారు.
రాజుకు కోపం మరింత ఎక్కువైంది. తోక త్రొక్కిన త్రాచులా మారాడు. ఆ విషయం అంతటితో ఆగదని కౌశికుడు ముందుగానే ఊహించాడు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదువా ! ఎంతటి హానినైనా తలపెట్ట గలడు. అతడి కేమాత్రం అవకాశం ఇవ్వకుండా తానే కత్తి తీసికొని తన నాలుక ఖండించుకొన్నాడు. మరుక్షణం శిష్యులు కూడా అదే పని చేసారు.
హద్దుమీరిన కోపంతో ఊగిపోతున్న రాజు ఆ సంఘటనతో నిర్విణ్ణుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. పిచ్చెక్కినట్లు చిందులు వేస్తూ కౌశికుని ఇల్లు వల్లకాడు చేసి పారేసాదు. ఎంత చేసినా ఎదురు తిరుగని కౌశికుని ఇంకేమీ చేయలేక భటులతో తిరిగి వెళ్ళిపోయాడు.
ఇంత జరిగినా కాశికుదుగాని, శిష్యులుగాని ఏమాత్రం చలించలేదు. జరిగిన దానినేమాత్రమూ పట్టించుకో లేదు. భగవంతునిపై భారం వేసి హరినామ చింతనలో కాలం గడుపసాగారు. కాలం కొంతవరకు గాయాలకు మందైనప్పటికీ మరణంతోకదా దేహబాధలన్నీ తీరేది ! కొంత కాలానికి గురు శిష్యులంతా తనువులు చాలించారు.
దేహముక్తులైన కౌశికాదులు యమలోకం చూడలేదు. బ్రహ్మదేవుడు వారందరినీ సత్యలోకానికి తీసుకుపోయాడు. అందరూ విధాత యింట
27
ఆతిథ్యం స్వీకరించారు. అంతలో ఒక దివ్యవాణి వినిపించింది. కౌశికుడు, అతని శిష్యులు విష్ణుభక్తులు కాబట్టి వెంటనే వైకుంఠానికి పంపించుమని, వారి రాక కోసం శ్రీమహావిష్ణువు ఎదురు చూస్తున్నాడని బ్రహ్మదేవునికి వార్త. తండ్రి యాజ్ఞను శిరసావహించిన ధాత తక్షణమే వారిని శ్రీహరి నివాసమైన శ్వేతద్వీపానికి తీసికొని వెళ్ళాడు. వైకుంఠానికి ఆహ్వానం లభించినందుకు కౌశికుడు మహదానందం పొందాడు. అందరికీ మహావిష్ణువు దర్శనభాగ్యం లభించింది. భక్తులైన వారికి అంతిమ లక్ష్యం అదేకదా !
కౌశికుడు శిష్యగణ సమేతంగా శ్రీమహావిష్ణువు కొలువుకు చేరుకొన్నాడు. వేయి యోజనాల వైశాల్యంతో ఆ మహాసభ వివిధ వర్థాల వజవైధూర్యాలతో వెలిగిపోతోంది. దివ్యాభరణాలు ధరించిన హరిదాసు లతో సభంతా సందడిగా వుంది. కొలువుదీరిన శ్రీమన్నారాయణుడు ఉన్నతాసనం మీద సేద తీరే భంగిమలో కనుల పండువుగా ఆసీనుడై వున్నాడు. ఆదిశేషుడు తన వేయి పడగలతో ఛత్రం పట్టివున్నాడు.
సుగుణాత్ములు, సచ్చీలురు, అకుంఠిత విష్ణుభక్తులు మాత్రమే వైకుంఠపురంలో నివసించడానికి అర్హులు. భగవంతుని సన్నిధిలో ఉండటం, ఎల్లవేళలా స్వామిని సేవించటం, శ్రీహరికి వలెనే నాలుగు చేతులు కలిగివుండటం ఆ భక్తుల ప్రత్యేకతలు. అటువంటి ఎనఖై వేలమంది భక్తులు ఆ దేవదేవుని సేవిస్తున్నారు. నారదాది దివ్యగాయకులు ఆ పరమాత్ముని స్తోత్రం చేస్తున్నారు.
అటువంటి సుందరమైన దృశ్యాన్ని చూస్తూ కౌశికాదులు బ్రహ్మదేవుని వెంట సభలో అడుగుపెట్టారు. పరాత్పరుని సమీపించగానే సాష్టాంగ (ప్రణామం చేసారు. ఆనంద బాష్పాలు వారి కళ్ళవెంట వర్షించాయి. ఆ సంతోషంతో వారికి నోటివెంట మాట రావటం లేదు.
28
గంభీరము[ద్రలో వున్న శ్రీనివాసుడు భక్తుల తన్మయత్వానికి పొంగిపోయి చిరునవ్వు చిందించాడు. పుత్ర వాత్సల్యంతో పలుకరించి అందరికి ఆసనాలు చూపించాడు. (బ్రహ్మవైపు తిరిగి తన భక్తులను పరిచయం చేసాడు.
“పుత్రా ! వీరు నా భక్తులు. అన్యుల స్తుతింప నొల్లనని ప్రతిన బూని తన నాలుకను సైతము ఖండించుకొన్న పరమ భక్తాగ్రేసరుదైన కౌశికుడితడు. ఇతరులను స్తుతించుటను కూడా విననొల్లక చెవులు మూసికొను దీక్షారతుడు. ఇతడు మాళవుడు, ఈమె మాలతి. ఈ దంపతులు నా భక్తుని సేవించి నన్ను సేవించిన వారైరి. ఇతడునా భక్తులకు అన్నపానాదులు సమకూర్చుట యందే జీవితమును వ్యయించిన పద్మాక్షుడు. వీరందరును ప్రతిఫలాపేక్ష లేక తమ ధర్మములను నెరవేర్చిన పుణ్యమూర్తులు. వీరందరిని నేనిపుడు సత్మరించెదగాక 1?
ఇలా అంటూనే మహావిష్ణువు వచ్చినవారిపై దృష్టి సారించి శాశికా! నీ విట నను కీర్తించు వారియందు అగ్రభాగమున నుండి నా సామీష్యమును పొందెదవుగాక ! మాలతీ మాళవులారా ! మీరీ లోకమున దివ్య శరీరములతో నాతో సాలోక్య మనుభవింతురు గాక ! పద్మాక్షా ! నిరతాన్నదానముచే నా భక్తులను సేవించితివి గాన నీకు కుబేర పదవిని ప్రసాదించుచున్నాను. అష్టదిక్సాలకుల యందు ఒక్కడవై ఉత్తర దిక్కును పాలింపుము' అనుచు పేరు పేరున పిలిచి వారిని సత్కరించాడు. అలాగే అచటకు చేరిన ఇతర భక్తులను కూడా ఉచితరీతిని సన్మానించి సంతోష పరచాడు.
సంగీత సభ
వైకుంఠానికి కౌశికుని రాకతో ఒక విశేషం జరిగింది. గాయకుదైన
కౌశికుని గౌరవార్థం శ్రీమహావిష్ణువు తన ఆంతరంగిక మందిరంలో 29
సంగీతసభ నొకదాన్ని ఏర్పాటు చేయించాడు. గొప్పగొప్ప సంగీత విద్వాంసులు, వైణికులు చాలామంది ఆ సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ సభనుండి బయలుదేరిన దివ్య సంగీత లహరులు వరుసగా ఒకదాని తరువాత మరొకటి ఇతర లోకాలన్నిటిని ముంచెత్తాయి. బ్రహ్మేంద్రాది దేవత అందరినీ వైకుంఠానికి పరుగులు తీయించాయి.
ఆ సంగీతసభను చూడాలని వచ్చిన ప్రముఖు లెవ్వరినీ ద్వారపాలకులు లోనికి అనుమతించ లేదు. ఆంతరంగిక భక్తులలో కొద్ది మందికి మాత్రమే అనుమతి పరిమితం అని వెనక్కుపంపించారు. స్వామి అనుమతి తమకు లేనందుకు చింతించిన దేవతలందరు వెనక్కి వెళ్ళారు కాని నారదుడు ఒప్పుకోలేదు. ఏమైనా లోపలికి వెళ్ళి తీరాలని పట్టుపట్టాడు. ఎంతకీ పోనీయక పోవడంతో మరొక ద్వారం దగ్గరకు చేరాడు. అక్కడ శ్రీమహాలక్ష్మీ దేవి చెలికత్తెలు అడ్డగించారు. వాళ్ళను లెక్కచేయకుండా నెట్టుకుంటూ లోపలకు పోబోయాడు. అప్పటిదాకా నారదమహర్షి అనే గౌరవభావంతో మిన్నకున్న ద్వారపాలకులు ముందుకొచ్చి బయటకు గెంటివేసారు.
అప్పుడు నారదుని అహం దెబ్బతింది. పట్టరాని కోపంతో అవమాన భారంతో వదో అనబోతూండగా మరో సంఘటన జరిగింది. దేవగాయకుడైన తుంబురుని సకల మర్యాదలతో మరొక ద్వారంగుండా లోపలికి తీసుకెళ్ళటం నారదుని కంటబడింది. వెంటనే అటు పరుగు తీసాడు. అక్కడకు చేరేలోపలే శ్రీహరి బయటకు రావడం, తుంబురునకు ఆహ్వానం పలికి లోపలికి తీసికెళ్ళటం అంతా జరిగిపోయింది. ఆ ద్వారంగుండా ప్రవేశించాలని ప్రయత్నించాడు నారదుడు. అక్కడా ద్వారపాలకులు అడ్డుపడ్డారు.
నారదుడు తనకంతటి అవమానం జరుగుతుందని కలలో కూడా తలవలేదు. పాడు బ్రతుకెందుకని తన్ను తాను నిందించుకున్నాడు. తనకు
30
జరిగిన అవమానం కంటే తుంబురునకు లభించిన సన్మానం ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాడు. చివరికి లక్ష్మీదేవి దాసీలుకూడా ఎంతమాత్రం మర్యాద పాటించకుండా తనను బయటకు నెట్టేసారు. అంతకు మించిన అవమానం ఏముంటుంది . . . అనుకొంటూ రగిలిపోయాడు. రగిలిన కోపాగ్ని పర్వతం అతనికి తెలియకుండానే బద్దలైంది. అప్రయత్నంగానే అతని నోట శాపవచనం వెలువడింది.
“ఎవరి అనతిచేత ఆ చెలికత్తెలు నన్ను లోనికేగ నీయక అడ్డగించితిరో ఆ విష్ణుపత్ని యొక రాక్షస స్తీ గర్భమున జన్మించుగాక !
ఆ శాపతాపాొనికి వైకుంఠం వణికిపోయింది. సంగీతసభ అర్థాంతరంగా ఆగిపోయింది. నారదుడున్న చోటుకు శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతంగా వాలిపోయాడు. వినయంగా తలవంచుకొని 'మునీంద్రా! నీకు జరిగిన అవమానమునకు మాకమిత విచారము కలుగుచున్నది. నేనుగాని, నా లక్ష్మీదేవి కాని నీ కవమానమును తలపెట్ట సాహసింతుమా! అపోహ పడకుము. కారణము లేక యేకార్యమును జరుగదు. మొదట శాంతింపుము' అని వేడుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి అందుకొని *నా చెలికత్తెలు నీ యెడల చూపిన నిరాదరణమునకు మన్నింపుము. ఈ శాపమును మనఃపూర్వకముగా తలదాల్తును. తప్పు చేసిన పిదప నెంతటి వానికైనను దండన తప్పదుకదా ! నేనొక రాక్షస స్త్రీ గర్భమున జన్మించుట తథ్యము. ఈ అకారణ వైరమున నీ తొందరపాటునకు చింతింతువేని శాపమును కొంత సంస్కరింపుము. నే జనింపబోవు రక్కసి గర్భమున వేయిమంది తాపసుల రక్తముండ వలెను. రక్కసి రక్తమున జన్మింప కుండునటుల యను[గ్రహింపుము” అని వేడుకొంది.
అప్పటికి నారదుని కోపం తగ్గింది. ముఖం పాలిపోయింది. శరీరం నీరసించింది. చేసిన తప్పుకు క్రుంగి పోతున్నాడు. నుదుటిమీద
31
పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. చివరికి “అటులనే జరుగునుగాకి అన్నమాట వాని "'పెదాలనుండి బయట పడింది.
కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసినదానికి సిగ్గుపడుతున్న నారదుని చూచి అన్నాడు-
“నారదా ! నీ కోపకారణము నాకు తెలియును. నిజమునకు భక్తి జ్ఞానములందును, శీల వర్తనములందును తుంబురుడు నీకన్న మిన్నయైన వాడు. ఏపనినైనను నన్నానందింప జేయుటకును, నా హృదయమునకు దగ్గరగుటకును మాత్రమే చేయును. నీవలె కపటి కాడు. గర్విష్టి కాడు. కపటభక్తిని ప్రదర్శించువారెన్ని తీర్ధములు సేవించినను వ్యర్థము. భక్తి శ్రద్ధలతో ననుగొలుచు వారలకు మాత్రమవశ్యము వళ్యుడను. సంగీతము చేత ననుజేర వచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబురుల నేను సత్కరించితిని. నీ శాపమున కేము బాధపడుట లేదు. లోకమునకు హితమే జరుగును. చింతింపకుము.”
నారదున కప్పటికి జ్ఞానోదయమైనది. '*ఓ దేవదేవా! నా తప్పులను క్షమింపుము. అవివేకినై ప్రవర్తించితిని. నాకు జ్ఞానోదయమైనది. తుంబుర కౌశికులవలె సంగీతమున మేటినైనచో నింతటి విపరీతము సంభవించెడిది కాదుకదా !? అంటూ కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరదల మధ్య నారదుడు శ్రీహరి పాదాలమీద పడ్డాడు.
భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించక మానదు కదా ! తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు నారాయణుడు. ధైర్యం చెప్పాడు. సంగీతం పూర్తిగా నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా వుంటే ఉత్తరానికి బయలుదేర మన్నాడు. మానస సరోవరానికి ఆవల ఒక పర్వత శిఖరం వుంది, దానిపైన ఒక దివాంధం ఉంది, ఆ ఉలూకపతికి శిష్యుడవై సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు.
32
గానబంధు దర్శనం
కృతజ్ఞతలు (ప్రకటిస్తూ శ్రీమన్నారాయణునకు చేతులు జోడించి సెలవు పుచ్చుకొన్న నారదుడు మనోవేగంతో మానస సరోవరం చేరాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా చెవుల కందుతున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకొని గిరిశిఖరం చేరాడు. గంధర్వ, కిన్నర, కింపురుష, అప్సరాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారిమధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగనే వినయంగా ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా స్వాగతం పలికి, ఆసనం చూపించి, కుశల ప్రశ్నలు వేసాడు. వచ్చిన పని ఆనతిమ్మని ప్రార్ధించాడు.
నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి అబ్బురపడ్డాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరా అనే ఆలోచనలో పడ్డాడు. తెలివొందిన పిదప, జప తపాదులకు సాధ్యముగాని శ్రీహరిని తుంబుర కౌశికులు తమ గానమాధుర్యంతో వశపరచుకొన్నారని, తనకూ అటువంటి దివ్య గానవిద్యను ప్రసాదింపుమని వేడుకొన్నాడు.
గానబంధు నారదుని పలుకులు జాగ్రత్తగా ఆలకించాడు. అతడు తనవద్దకు శిష్యునిగా వచ్చాడు. ఏ శిష్యునకైనా గురువును గురించిన అనుమానం ఉండకూడదు. అనుమానం ఉన్నచోట శ్రద్ధ లోపిస్తుంది. థ్ద్ధ లేకపోతే చదువు వంటబట్టదు. నారదునకు తనపై అనుమానం ఉంది. తానెవరో అతనికి తెలియదు. తెలియని వానిని గురువుగా ఎన్నుకోవడం ఎవరికైనా కష్టమే. శ్రీహరి ఆదేశించాడని తప్ప తానుగా తెలిసికొని రాలేదు. అటువంటి వానికి ముందుగా తనగురించి తెలియజెప్పటం తన విధి. అతని ఆంతర్యమూ అదే ! కాబట్టీ ముందు తానెవ్వరో వివరింప సాగాడు.
3
గానబంధు చరిత్ర పూర్వం భువనేశుడనే రాజొకడుండే వాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు. సంప్రదాయానుసారం అన్ని ధర్మకార్యాలు సక్రమంగా నిర్వహించాడు. రాజ్యమంతటా దేవాలయాలు కట్టించాడు. స్త్రీలు, "సేవకులు తప్ప అందరూ విధిగా వేద మంత్రాలతో భగవంతుని పూజించాలని శాసించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానం చేస్తే మరణశిక్ష విధించుమని మంత్రులను ఆదేశించాడు. భగవంతుని కూడా భక్తి గీతాలతో నుతించకూడదు. ఒకరోజు హరిమిత్రుడనే బ్రాహ్మణ భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన 'ప్రజలుకూడా అలా పాడకూడదన్న విషయం మరచిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. (బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైన శిక్ష రాజ్యబపిష్కరణ. కాబట్టి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదుకదా ! కొంత కాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రాణి పుట్టకా తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుద్గగూబగా జన్మించాడు. దివాంధ జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైంది. పురాకృత దోష ఫలితం కాబోలు . . . ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్భరమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించా డు మ 34
అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం చేత మరణదేవత ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా నిలుచున్న యమధర్మరాజును చూచి “ధర్మరాజా ! ఎందుకీ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయచూపవు? అని అడిగాడు.
దివాంధం స్థితికి యమధర్శ్మరాజుకు జాలి కలిగింది: తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం న్యాయం కాదుకదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది ! ఆ విధంగా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.
“దివాంధమా ! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కాని, పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలనుకోవడం నీ మూర్ధత్వం. పరమ పావనమైన సంగీతంతో హరిక్తీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపము తక్కువైనదా ?ఆ పాప ఫలితము కొండంతై నీకు లభించిన పుణ్యఫలముకన్న భారమయినది. అది యిప్పుడు నిన్ను కట్టి కుడుపుచున్నది. భరింపరాని ఈ ఆకలి, ఇది తీర్చుకొనుటకు ఆహారము లభింపక పోవుట యిదంతయు నీ దుష్కర్మ ఫలితమే ! విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ యవస్థ తెచ్చిపెట్టినది. దీని నుండి బయటపడుట ఎవరికిని సాధ్యము కానేరదు.”
సమవర్తి చెప్పింది విన్నాక దివాంధానికి తొను చేసిన తప్పేమిటో తెలిసింది. వఏమార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చునన్న జె 10 కలిగింది. తాను చేసిన తప్పుకు చింతించసాగాడు. ఎలాగైనా తొ సద పాపంనుండి బయటపడే దారి చూపించుమని ధర్మదేవత పాదాల పద్దాడ్షు,
35
యముని హృదయం ద్రవించింది. అందుకొక తరజోపాయం చూపించాడు -
“ఉలూకరాజా ! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. ఇంతకు మించిన శిక్ష అనుభవింతువా? చెప్పుము. శిక్షాకాలము తగ్గిపోవును. అదిగో, అక్కడగల గుహలోని కేగుము. అందు నీ గతజన్మ యందలి పార్ధివ దేహము కలదు. ఆ కాయము నుండి దినమున కొకింత మాంసఖండమును చీల్చి తినుము. అది పూర్తియగునంత నీకు శుభము కలుగ గలదు అని దీవించి వెళ్ళాడు.
ఆ గుడ్లగూబ అలాగే చేయటం మొదలుపెట్టింది. ఒక రోజు శవం ప్రక్కన కూర్చున్నప్పుడు దివ్యమైన తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు రథంమీద పోతూ అవైపు వచ్చాడు. శవాన్ని ఉలూకాన్ని చూచి వింతగా కనిపించి ఆగిపోయాడు. దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూచాడు. అది భవనేశుని శరీరం. అక్కడెందుకు పడివున్నదా అని ఆశ్చర్యపడ్డాడు. ప్రక్మనే ఒక పక్షి ఆ శవాన్ని చీల్చుకు తినడం ఇంకా వింతగా కనిపించింది. ఉలూక పక్షి కూడా వచ్చిన విప్రని గుర్తించింది. అతడు తనచేత రాజ్యబహిష్మరణ గావింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలమీద పడింది. చేసిన తప్పును క్షమించుమని ప్రార్ధించింది. తానే భవనేశుడనని చెప్పింది. కన్నీటితో పాదాలు కడుగుతూ యమధర్మరాజు చెప్పిన వైనమంతా చెప్పింది.
హరిమిత్రుడు చలించి పోయాడు. పగవానికైనా అపకారం తలపెట్టని హృదయ నంస్కారం అతనిది. అందుకు తగినట్లుగానే
ఉలూకరాజును ఓదార్చాడు, 'నీ బాధలు చూడ నాకెంతయు విచారము కలుగుచున్నది. నీవు నా యెడల జూపిన కారిన్యమును నే నానాటితోడనే మరచితిని. 36
నీవనుభవించిన శిక్ష చాలును. ఈ క్షణమునుండి నీకు క్షుధయన్నది లేకుండ పోవుగాక ! నీవొక గొప్ప సంగీత విద్వాంసుడవై లోకమున నుత్తమ సంగీత విద్యను బోధింతువు గాక !
'ఇట్లు పలికి హరిమిట్రుడు నా కృతజ్ఞతా వచనము లాలకించి, దీవించి వైకుంఠ మార్గమున వెడలిపోయెను. వాని దీవన ఫలించి నేనిట్లుంటిని అంటూ తన కథనంతా వినిపించాడు గానబంధు.
నారదుని సంగీత పాటవం
ఆ తరువాత నారదుడు గానబంధుకు శిష్యుడయ్యాడు. తాలిరోజే సంగీతం ఏవిధంగా నేర్చుకోవాలో పాఠం చెప్పాడు గానబంధు. సంగీతం ఒక అమూల్యమైన దివ్యకళ అన్నాడు. తపస్సుతో కాని, తామసంతో కాని అది పట్టుపడదన్నాడు. కళకోసం జీవితాన్ని అర్చించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేసిన వారెవరైనా ఈ అపురూపమైన కళాభ్యాసంలో ఆధిక్యం పొందవచ్చన్నాడు. గౌరవభావం మొహంలో ఉట్టిపడుతుండగా తల వంచుకొని గురుబోధ లాలకించాడు నారదుడు. నియమ నిష్టలతో విధులు పొటిస్తానని ప్రమాణం చేసాడు. చెప్పినట్లుగనే ముందుగా శ్రీమహావిష్ణువును స్తుతించి భక్తి శ్రద్ధలతో సంగీత సాధన ఆరంభించేవాడు (ప్రతిరోజూ.
అలా ఆసాధన వెయ్యి వసంతాలు సాగింది. కఠోరమైన దీక్షతో 3,60,006 రాగాలలో ప్రావీణ్యం గడించాడు నారదుడు. సహపొఠులంతా పాగుడుతూంటే ఇక సంగీతంలో తనకు తిరుగు లేదనే గర్వంతో ఉల్బిపోయ్లాడు. అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు.
'గురుపుంగవా ! నీదయవలన సంగీత గరిమ సాధించ గలిగితిని.
ప డు. నావలన ఇప్పటి క్రింత్ర వరకు చాలును. గురుదక్షిణ చెల్లింప ననుజ్ఞ నిం నీకు వలసిన సేవలెట్టివో అనతిందు. సందేహింపకుడు.!” 37
శిష్యుడైన నారదుని మాటలు విన్న గానబంధు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరుకొన గలను ! దివాంధమునకు వలనిన యవసరము లేముండును? శిష్యుడవైనందున నేదియో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలము నిలచియుండునంత వరకు సంగీత కళతోపాటు నేనును లోకమునకు గుర్తుండునటుల వరమును ్రసాదింపుము' అన్నాడు. క్ట నారదుడు విశాలంగా నవ్వాడు. “గురువరా ! ఇది మరియు చిన్నకోరిక. ఈ చిరుకోరికను మీకున్న సంగీత పాండిత్యము తీర్చగలదు. శిష్య ప్రశిష్యకోటి వలన భూతలమున సంగీతకళ నిలచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతిలేదు. మీరు చేసిన ఈ మహత్మార్యమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షమును, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ్రసాదించుచున్నాను. ప్రళయము సంభవించిన వేళ శ్రీమహావిష్ణువునకు గరుత్మంతుని వలె శ్రీమహాలక్ష్మి కి వాహనమై వెలుగొందెదవు గాక ! అని శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు పొందాడు. గురువు వద్ద నుండి వెనుదిరిగినంతనే నారదునిలో మళ్ళీ అహంకారం ప్రవేశించింది. ఇక తనకు మించిన గానపాటవం ఎవరికీ ఉండదనుకున్నాడు. ఆ ముసలి గార్థభం తుంబురుని దగ్గరకు పోయి పాత లెక్కలు సరి చూచుకోవాలని అనుకున్నాడు. తిన్నగా తుంబురుని ఇంటికే వెళ్ళాడు సంగీతాలాపనతో, అక్కడ స్రీ పురుష విచక్షణ లేకుండా ఎందరో గుమిగూడి ఉన్నారు. వారంతా ఏదో ఒక రోగంత్రో బాధ పడుతున్నట్లు కనిపించింది. కొందరు వికలాంగులుగాను, మరికొందరు అవమానాగ్నిలో కాలిపోతున్నట్లుగాను కనిపించారు. నారదునకా దృశ్యం చూచి భయం వేసింది. దగ్గరకు వెళ్ళాడు. అలా ఉండటానిక్తి కారణం ఏమిటని అడిగాడు. 38
“ఏమని చెప్పగలము బాబూ! మేమందరము వివిధ రాగములము. సంగితమున తనకు మించిన వారు లేరను గర్వముతోనున్న నారదుడు మమ్ము తప్పుగాను, నిర్లక్ష్యముగాను ఆలపించినందున మేమిట్లు కురూపుల మైతిమి. అవమానభారమున క్రుంగి కృశించి పోవుచున్నాము. వాని యహంకారము మమ్ములనీ దుస్థితికి దెచ్చినది. సంగీత గరిమచేత మమ్ము సరిచేయగల సమర్థుడు తుంబురస్వామి తప్ప మరెవ్వరున్సారు ! వారిని వేడుకొనుటకు యిటు వచ్చినాము అంటూ వాళ్ళంతా బావురుమన్నారు.
విషాదకరములైన వారి మాటలు విన్న నారదుడు తానెవరో చెప్పకుండానే అక్కడనుండి జారుకున్నాడు. ఇంకెక్కడా ఆగకుండా యెకాయెకి వైకుంఠానికి దారితీసాడు. సర్వమూ తెలిసిన శ్రీమహావిష్ణువు నారదుని గమనించి విలాసంగా నవ్వకుంటూనే లోపలికి రమ్మన్నాడు. ఓదార్చుతున్నట్లుగా గొంతు సవరించుకొని ఆప్యాయంగానే పలుకరించాడు.
“నారదా ! తుంబురుడు సంపాదించిన సంగీత ప్రావీణ్యమును నీవింకను అందుకొనలేదు. ద్వాపర యుగాంతమున శ్రీకృష్ణుడనై పుడమి నవతరింతును. అప్పుడు నావద్దకు రమ్ము. అట్లయిన నేను నీకు సంగీతమున మర్శములెల్లను బోధింతును. అంతవరకు నీవు తుంబురునితో తులతూగలేవు. ముందు వినయము నేర్చుకొనుము.”
శ్రీహరి మాటలు విన్న నారదునిలో అహంకారమంతా అడుగంటి పోయింది. గర్వమంతా నీరుకారి పోయింది. తనలోని అహంకారం వల్లనే గానబంధు వద్ద అన్నాళ్ళూ కృషిచేసి సాధించిందంతా బూడిదలో ల్ పన్నీరైపోయింది. వినయ వినమిత గాత్రుడై తనస్వామ్ దగ్గర అలా
చేస్తానని చెప్పి ఇంటికి చేరాడు. భగవానుడు చెప్పినట్లే వినయాన్ని పాటిస్తూ, విద్వాంసులైన సంగీతవేత్తల శిథూష చేస్తూ, సాధన కొననాగ లై 39
కృష్ణావతారానికై ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఎంతో ఆత్రంగా నిరీక్షిస్తున్న ఆ శుభ ఘడియ కొంతకాలానికి రానే వచ్చింది.
భగవానుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ద్వారకలో అష్టమహిషు లతో ఇష్టసుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడకు చేరి తనకు సంగీతం నేర్చుమని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో స్వాగతించి అప్పుడు తనతో ఉన్న జాంబవతిని నారదునకు సంగీతంలోని మెలకువలు నేర్చుమని పురమాయించాడు.
నారదుడు ఒక సంవత్సరంపాటు జాంబవతి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. అయినా విద్య వంటబట్ట లేదు. శ్రీకృష్ణుని ఆనతిమేరక్రు మరొక ఏడాది సత్యభామ, ఇంకో యేదాది రుక్మిణీదేవి అతనికి సంగీతం నేర్పారు. మూడేళ్ళు గడచినా నారదుని పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ్చి అక్కడే అన్నట్లు తయారైంది. పాపం- నారదుడు ! అతదు పడిన పాట్లన్నీ వృధా అయ్యాయి. తుంబురుని ఓడించాలన్న ఒకేఒక కోరిక వీగిపోయ్బింద్ది. ఇంత జరగదానికి కారణం తనలోని ప్రతీకారేచ్చ మాత్రమేనని తెలిసికొన్నాడు. దానిని వదలుకాని భగవానుని కృపా కటాక్షాలకోసం వేడుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని గ్రహించాడు.
విద్యాభ్యాసానికి ముఖ్యంగా ఆటంకాలైన అవాంకార మమకారాలను వర్జించి నిర్మల హృదయంతో శ్రీకృష్ణ పరమాత్ముని ముందు నిలబడి తన హృదయంలోని ఆవేదన మొత్తం బయటపెట్టాడు నారదుడు. అంత పరమాత్మునకు పరమానందం కలిగింది. అహంకారాన్ని విడిచిపెట్టి భారమంతా తనపై పెట్టినప్పుడు భక్తుని కోరిక తీర్చటం భగవంతుని విధి. నారదుని తనముందు కూర్చుండబెట్టుకొని శ్రీకృష్ణుడు తనే గురుత్వం స్వీకరించాడు. భగవానుని శిక్షణలో ఎంతటి విద్యాభ్యాసానికైనా క్షణకాలం
శ్ర
సరిపోతుంది కదా ! అంతే . . . నారదుని యుగయుగాల ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. లభించిన సంగీతవిద్యతో ఆనంద పరవశుడై నృత్యం చేసాడు. భగవానుని నిర్మల హృదయంతో కీర్తించుతూ గానంచేసాడు. ఇప్పుడతని మదిలో మరొక చింత లేదు. రాగకన్య లందరూ సంపూర్ణ యౌవనంతో మాలిన్య రహితులై అతని స్వరంలో చిందులు వేసారు. సంగీత సరస్వతి పులకించిపోయింది.
శిష్యుని ఆనందాన్ని చూచి పరవశించిపోయిన కృష్ణభగవానుడు “నారదా ! నీవిష్పుడు తుంబుర తుల్యుడ వైతివి. సకల లోకములందును దివ్య గాయకుడవై గౌరవింపబడుదువు గాక !' అంటూ ఆశీర్వదించాడు. పులుగడిగిన ముత్యంలా నారద వదనారవిందం ప్రకాశించింది.
రావణ దురాగతాలు
నారదుని సంగీతపాటవాన్ని వివరించిన వాల్ళీకి మహర్షి తిరిగి రామాయణ కథలో ప్రవేశించాడు.
భారతదేశానికి దక్షిణాన లంకాద్వీపం ఉంది. అదొక రాక్షస రాజ్యం. దానిని రావణాసురుడు పాలిస్తున్నాడు. వృద్దాప్యం కాని, మరణం కొని తనవైపు తొంగిచూడ కూడదని అతని కోరిక. అది తీరటం కోసం (బ్రహ్మనుగురించి ఘోరమైన తపస్సు చేసాడు.
దశకంఠుదైన రావణాసురుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మన్నాడు. తపం ఫలించిందన్న సంతోషంతో రావణుడు బ్రహ్మదేవుని స్తోత్రగానం చేసాడు. తనకు మరణం లేకుండ వరాన్ని ఇమ్మని ప్రార్ధించాడు. ఆమాట విన్న విధాత జన్మను పొందిన ప్రతిజీవికి మరణం తప్పదని, జీవప్రకృతికి విరుద్ధంగా ఏదీ
న.
సాధ్యం కాదనీ, అది తప్ప మరో వరం కోరుకొమ్మనీ రాక్షసపతికి సూచించాడు. ఎవరి వలన భయముందో తెలిపితే వారివలన మరణం సంభవించకుండ చేయగలనని ఉపాయం కూడా చెప్పాడు.
రావణుడు బాగా ఆలోచించాడు. కన్నకుమార్తెను కామించినపుడు ఆయువు మూడుతుందని అంతకుముందే ఒక శాపం ఉంది. తానా పని చేయడు, ఆ శాపం ఫలించదు. నర వానర యక్ష గంధర్వ నాగ పిశాచాదు లెవ్వరూ తనవైపు కన్నెత్తి కూడా చూడలేరు. ఇక తనకు అపకారం తలపెట్టగలవారు దేవతలు లేదా దానవులు. వారి నుండి మరణం లేకపోతే తానిక చిరంజీవే కదా !
ఇలా అనుకుంటూ దేవ దానవుల నుండి మరణం సంభవించ కుండా తనకు వరం కావాలన్నాడు. (బ్రహ్మ సరే అన్నాడు. రావణుని ఆశయం నెరవేరింది. నూతన జవ సత్వాలతోను, పెద్ద పెద్ద ఆశలతోను లంకకు తిరిగి వచ్చాడు. మరణభయం లేదన్న మనోబలంతో ముల్లోకాలను జయించాలనుకున్నాడు. సైన్యాన్ని సిద్ధం చేసాడు. మొదటి దాడి నాకలోకం మీదే !
రాక్షస సైన్యం పెనుతుఫానులా అమరావతి మీద విరుచుకు పడింది. దేవతలంతా ఆ భీభత్సానికి తాళలేక చెల్లాచెదురై పోయారు. దేవేంద్రుడు, మిగిలిన దిక్పాలకులు ఆదాడిని ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. రావణసేన అప్పరాంగనలను బంధించి లంకాపతి అంతః పురానికి చేర్చింది.
స్వర్ణాన్ని జయించిన తరువాత రావణాసురుని చూపు నాగావాసమైన పాతాళం మీద పడింది. సకల సేనలతో దందెత్తి అక్కడున్న సర్వసంపదల్ని దోచుకున్నాడు. సుందరాంగులైన నాగకన్య లెందరినో
42
తనవెంట తెచ్చుకున్నాడు. రావణుని విజయం అంటే అర్ధం. . . దోపిడీలు, మానభంగాలు అని (ప్రజలు చెప్పుకోసాగారు. ఆ రాక్షస సేనల యుద్ధ క్రీడల్లో హింసకన్న కసాయితనం పాలు ఎక్కువయింది.
అనతి కాలంలోనే దశకంఠ రావణుడు ముల్లోకాధిపతి అయ్యాడు. అష్ట దిక్పాలకులు దాసోహం అన్నారు. దేవ గంధర్వాదుల స్త్రీలు అతని అంతఃపుర పరిచారిక లయ్యారు. అంతెందుకు . . . అతడాశించిన ప్రతి వనితా అతనిదే అయ్యింది. బ్రహ్మవరం కారణంగా అతన్ని ఎదిరించే నాథుడే కరువయ్యాడు. అతని ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. ముల్లోకాలలో కల్లోలం చెలరేగింది. ఎదిరించే సాహసవంతుడే కనిపించలేదు.
ఒకరోజు లంకాధిపతి దండకారణ్యంలో సంచరిస్తున్నాడు. అది మునులకు, తాపసులకు ఆలవాలం. అక్కడి మునులెవ్వరూ దశకంఠుని గుర్తించినట్టు లేరు. వానికెవరూ స్వాగతం చెప్పలేదు. ఆతిథ్య మీయలేదు. అదంతా గమనించిన దశకంఠుడిలా అనుకున్నాడు.
“బహుశః వీరికి నేను తమ ్రభువునని తెలియదుకాబోలు .. . తెలిసియున్న తగిన మర్యాదలేల చేయరు? నేనీ రాజ్యమునకు రాజునని తెలియజెప్పినచో. . . చెప్పినను నిత్య తపోదీక్షలతో కృశించి దీనాతి దీనముగ కాన్పించు యీ పేదమునులు నాకేమి యర్పించగలరు !
రావణుని ఆలోచనలు ఇలా ప్రశాంతంగా సాగిపోతూండగా మధ్యలో ఒక రాక్షసుడు ప్రవేశించాడు. దురాలోచన ఒకటి పుట్టింది. వెంటనే పరివారాన్ని పిలిచి 'ఈ దండక వనమున మునులందరిని నా సార్వభౌమత్వమును అంగీకరింపుడని తెలుపుడు. అంగీకరించినట్లు గుర్తుగా ప్రతి ముని తన శరీరము నుండి యొక రక్తబిందువు నిమ్మని
బ్ర
చెప్పుడు. అట్లు సేకరించిన రక్తము నొకభాండమున నింపి నా కడకు తెండు' అని చెప్పాడు. రాక్షసనాథుని ఆనతిని అమలుపరచడానికి అనుచర రాక్షసులంతా అన్నిదిక్కులకు బయలుదేరారు.
ఆ దండకారణ్యంలో గృష్టాముడనే ముని ఒకడున్నాడు. ఆయనకు వేయిమంది పుత్రులు. అయినా ఒక పుత్రికకోసం పరితపిస్తున్నాడు. తనకు కుమార్తెగా జన్మించుమని లక్ష్మీదేవిని ప్రార్ధిస్తున్నాడు. తన పూజా మందిరంలో బంగారుపాత్ర నొకదానిని కలశంగా నిలిపి ఆదేవి కరుణ కోసం పూజలు చేస్తున్నాడు. జప హోమాదులు నిర్వహిస్తున్నాడు. రావణశాసనం మేరకు అక్కడకు చేరిన రాక్షసులు మునుల రక్తాన్ని పట్టేందుకు ఆ బంగారు కలశాన్ని బలవంతంగా తీసుకున్నారు. మును లందరిని ఆథభమాలనుండి బయటకు లాగి తమ ఖద్దధారలతో మునుల రక్తాన్ని చిందించి బంగారుపాత్రను నింపారు. ఆ పాత్రను తమ ఏలికకు సమర్పించారు.
బంగారుకలశాన్ని, అందులోని రక్తద్రవ్యాన్ని చూచి రావణాసురుడు ఆనందించాడు. ఆ ఘనకార్యాన్ని సాధించినందుకు అనుచరగణాన్ని అభినందించాడు. అదొక ఘనవిజయంగా భావించి ఆపాత్రను తన విజయచిహ్నంగా లంకానగరానికి తీసుకుపోయాడు.
చాలాకాలంగా తన భర్తకోసం ఎదురుచూస్తున్న రావణపత్ని మండోదరీ మహారాణి పతి రాకను గమనించి ఎదురు వెళ్ళింది. విజయగర్వంతో రావణుడు తాను తెచ్చిన రక్తభాండాన్ని భార్యచేతి కందించాడు. ఆ పాత్రలోని రక్తం మునీశ్వరులదని, పొరపాటున కూడా దానిని త్రాగవద్దని చెప్పాడు. పైగా అది విషపూరితమని, ముల్లోకాలను జయించి వచ్చిన తన వరా[క్రమానికి అది విజయ్రతీక అని
44
హెచ్చరించాడు. మండోదరి (ప్రేమతో ఆ రక్తకలశాన్ని అందుకొంది. దానిని జాగ్రత్తపెట్టి ఎంతోకాలానికి తిరిగివచ్చిన భర్తకు సపర్యలు చేసి వానికి వినోదం కలిగించడానికి సిద్ధపడింది. మండోదరి గర్భం భార్య చేతికి రక్తపాత్ర నందించిన దశకంఠుడు ఆమె కోరికను మన్నించలేదు. తాను బంధించి తెచ్చిన దేవ గంధర్వ కాంతలలో కొందరిని తీసికొని తన శ్వేతరథాన్ని ఎక్కి మందారపర్వత సానువులపైకి వ్యాహ్యాళికి బయలుదేరాడు. ఆ దృశ్యాన్ని చూచిన మండోదరికి దుఃఖం పొర్గుకొచ్చింది. ఇన్నేళ్ళ నిరీక్షణ నీరుకారిపోయింది. జీవితం మీద విరక్తి కలిగింది. నిరాశ, నిస్పృహ ఆమె మనసులో వేయి ప్రశ్నలు లేపాయి. తాను అందంగా లేదా? విశ్వాసపాత్రురాలు కాదా? మనసారా (ప్రేమించడం లేదా? ఆకర్షణ తగ్గిందా? తనలో ఏలోపం వుందని పరస్రీలమీద మరులుగొంటున్నాడు? ఎంతగా తర్మించుకొన్నా తనపట్ల భర్త నిర్లక్ష్య వైఖరికి కారణం దొరకలేదు. మండోదరి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. భర్త నిరాదరణకు గురైన స్త్రీకి మరణమే శరణ్యం అనుకొంది. అదొక్కటే తనసమస్యకు పరిష్కారంగా భావించింది. భర్తతెచ్చిన రక్తభాండం గుర్తొచ్చింది. ఆ విషభాండం తనకోసమే తెచ్చినట్లు తోచింది. తనకు శాశ్వతముక్తిని ప్రసాదించి దరిజేర్చేందుకు తన పతి తన చేతికిచ్చిన వరప్రదాయిని తనకోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపించింది. అది భర్త ఆజ్ఞ. తలదాల్బడం తనధర్మం. వెంటనే ఏ సంకోచం లేకుండా ఆ విషపాత్రనెత్తి గడగడ త్రాగేసింది. హాయిగా నిట్టూర్చి కళ్ళు మూసుకొంది. కాని, అది మునుల రక్తం. నారద శాప ఫలితంగా లక్ష్మీదేవి భూమిపై జన్మించడానికి కారకమైన రక్తం. ప్రాణం ఎలా తీస్తుంది ! కీర్
మండోదరి గర్భంలోచేరి భద్రంగా నిలిచిపోయింది. అండంగా రూపుదిద్దు కొంది. గర్భ లక్షణాలు బయటపడ సాగాయి. మరణం కోసం ఎదురు చూస్తున్న మహారాణికి ఈ విపరీత లక్షణాలు మతి పోగొడు తున్నాయి. నాథుని దయలేకుండా ఇదెలా సాధ్యం? ఎక్కడైనా రక్తం సేవిస్తే గర్భం వస్తుందా? ఇది తెలిసే భర్త తనను శ్రాగవద్దన్నాడా ! ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. చివరికి తనను తాను నిందించుకొంది. విధివ్రాతను ఎవరు తప్పించగలరు అనే లోకోక్తితో కొంత ఓదార్చును పొందింది. చివరకు ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అనే నిర్ణయానికి వచ్చింది. దుఃఖాన్ని ఇతరమైన ఆలోచనలను విడిచిపెట్టి యిప్పుడేం చెయ్యలా అనే మీమాంసలో పడింది. ధైర్యంగా తన కర్తవ్యానికి ఒక పథకాన్ని సిద్ధం చేసుకొంది. అసలు విషయం ఎవరికీ తెలియకుండ తీర్థయాత్రల పేర్పుత్రో
పుష్పకవిమానం ఎక్కింది మండోదరి. లంకను వదిలిపెట్టి భరతఖండంలోన్సి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొంటూ కురుక్షేత్రం చేరింది. అక్కడ ఒక అందమైన బాలికను కన్నది. కన్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్ళేందుకు లజ్ఞ్జావమానాలు అద్దు వచ్చాయి. బిడ్డకు తల్లిగా తన్నుతాను (ప్రకటించు కొనేందుకు ధైర్యం చాలలేదు. లోకనీతికి విరుద్ధంగా ఒక మహారాణి
ఎలా బ్రతుకగలదు! చివరకు గుండె రాయిచేసికొని ఒక బంగారు
మందసాన్ని తెప్పించింది. బిడ్డను అందులో ఉంచింది. కారణజన్మురాలైన
ఆబిడ్డను చింజీవిగా దీవించి పవిత్ర హృదయంతో ఆపెట్టెను మూసివేసింది. రహస్యంగా నేలతల్లి ప్రెపొర క్రింద దాచిపెట్టింది. బిడ్డ మరణించకుండ యమని ప్రార్థించింది. ఎలాగో తన్నుదానోదార్చుకొని కొంత ఉపశమనం పొందాక మెల్లగా లంకానగరానికి చేరుకొంది.
తి
పుత్రకామేష్టి
మిథిలాధిపతి అయిన జనక మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి చెయ్యాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. యజ్ఞానికి తగిన స్ధలం కోసం కురుక్షేత్రం చేరుకున్నాడు. దైవజ్ఞులు స్థలనిర్ణయం చేసారు. యజ్ఞబ్రహ్మల మంత్ర పఠనాల మధ్య జనకుడు భూమిని దున్నటం మొదలుపెట్టాడు. నాగలి ముందుకు సాగిపోతూండగా ఒకచోట కర్రుకు మందసం ఒకటి తగిలి పైకి లేచింది. యజ్ఞకర్తకు ఆశ్చర్యంవేసింది. ఏమిటా యీ బంగారుపెట్టె అని మూత తెరచి చూడగా అందులో బోసినవ్వులు చిందిన్తూ ఆడుకొంటున్న పసిపాప వనిడిబొమ్మలా కనిపించింది. అదే సమయంలో 'ఓ జనకమహారాజా ! ఈ బిడ్డ సామాన్యమైనది కాదు. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మీదేవి. సత్కార్యము లెన్నింటినో సలిపిన కతమున నీకీమె ప్రాప్తించినది. నీ యాగ లక్ష్యము సిద్దించినది. ఈమెను కన్న కుమార్తె వలె పెంచుకొనుము. ఈమెవలన
డు నీ వంశమునకు కీర్తి ప్రతిష్టలు సంప్రాప్తించ గలవు అంటూ ఆకాశవాణి వినిపించింది.
ఆ పలుకులు విన్న జనకుని ఆనందానికి హద్దులు లేవు. యజ్ఞప్రసాదంగా బిడ్డను స్వీకరించాడు. ఎత్తుకొని ముద్దాడాడు. భూమిని దున్నుతున్నపుడు నాగటి చాలున దొరికిన బిడ్డకాబట్టి దైవజ్ఞులామెకు శ్సత అని పేరు పెట్టారు. పుత్రకామేష్టి ఆ విధంగా ఫలించింది. ముద్దుబిడ్డ నెత్తుకొని జనకుడు మిథిలకు తిరిగి వచ్చాడు.
సీతావివాహం
భరద్వాజా ! శ్రీరాముడుగా శ్రీమహావిష్ణువు, సీతామహాదేవిగా శ్రీమహాలక్ష్మీదేవి అవతరించడానికి కారణం అయిన పూర్వకథ విన్నారుగా!
తగ
అక్కడ జనకుని కూతురుగా సీతాదేవి పెరుగుతూండగా ఇక్కడ అయోధ్యలో దశరథ చక్రవర్తి కూడా సంతానం కోసం పుత్రకామేష్టి జరిపించాడు. యజ్ఞఫలంగా మహారాణి కౌసల్య కడుపున శ్రీరాముడు జన్మించాడు. కాలక్రమంలో ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. స్వయంవరంలో రాముడు సీతను వివాహమాడాడు. ఆతి వైభవంగా జరిగిన ఆ వివాహ మహోత్సవాన్ని , ఆ సీతారాముల కల్యాణ వైభోగాన్ని అటు మిథిలావాసులుగాని, 'ఇటు అయోధ్యావాసులుగాని జన్మజన్మలకు మరచిపోరు. ఆ ప్రజల జీవితాలు ధన్యాలయ్యాయి.
వివాహ తతంగం అంతా పూర్తయ్యాక రాచ పరివారమంతా అయోధ్యకు ప్రయాణమైంది. నవదంపతుల ఉత్సాహం, ఆనందం ఇంతా అంతా కాదు. ప్రయాణమంతా ఆనందమయంగా సాగుతుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది.
పరశురాముని గర్వభంగం
తుఫానుదెబ్బకు రాజపరివారం అంతా కళ్ళు మూసుకుంది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పెద్ద విల్లు పట్టుకొని పరశురాముడు కనిపించాడు. భయోత్పాతం కలిగించిన ఆ దృశ్యాన్ని చూచి శ్రీరామచంద్ర మూర్తి తప్ప మిగిలినవారంతా భయపడిపోయారు. రామచంద్రుడు పరశురాముని చూచి వినయ విధేయతలు ముప్పిరిగొనగా 'ఓ మహాత్మా! మీకు ఈ దశరథరాముని శతాధిక వందనములు ఎదురు చూడని మీ దర్శన భాగ్యము నాకు లభించి నందులకు ధన్యుడనైతిని. మిమువంటి మహాత్ముల దర్శనము నిజమునకు మా యదృష్టము. మమ్మిట్లు ఆశ్చర్యమున ముంచిన తమ రాకకు కారణమరయ వచ్చునా” అని పలుకరించాడు.
తీపి
వినయం అన్నా మర్యాద అన్నా అర్ధం తెలియనివాడు పరశురాముడు. క్షత్రియులంటే ద్వేషం, పగ, రక్తం చిందుతున్న అతని కళ్ళలో స్ఫుటంగా కనిపిస్తున్నాయి. “నీవు దశరథరాముడవా? లోకమున నొక్క రాముడే యుండవలయును. మన బలాబలము లిప్పుడే తేలి పోవలయును అంటూ తీవ్ర స్వరంతో గర్జించాడు. 'పెళ్ళి బట్టలతో ఇంటికి వెడుతున్నప్పుడు ఇదేమి కోరిక మహాత్మా ! మీవంటి పెద్దలకు ఇది న్యాయమా? మమ్ము దీవించి పంపుము అని ఎంతగా బ్రతిమాలినా ఆ క్రోధమూర్తి తన మొండి పట్టు వదలిపెట్టలేదు.
“మిథిలానగరమున పురాతన శివధసుస్సును విరిచి జానకిని చేపట్టితివట. _బొగిలిపోయి తేలికపడ్డ విల్లునెత్తుట, యెక్కుపెట్టుట యెవరికైనను సాధ్యమే. క్షత్రియోచితమైన ఈ హరివిల్లు చేకొని యెక్కువెట్టి విరువుము చూచెద. ధైర్యము కలదేని నీవీ పరీక్షకు నిలచి నన్ను గెలువుము” అంటూ పరశురాముడు తనచేతిలోని విల్లును శ్రీరామునకు అందించాడు.
శ్రీరామచంద్రుడు ఆ వింటిని అవలీలగా అందుకున్నాడు. ఆ వింటిని పక్షియీకలా అతితేలికగా ఎడమ చేతితో ఎత్తి, కుడిచేత్తో నారిని లాగి వదిలాడు. అంతమాత్రానికే అది ఫెళఫెళమంటూ విరిగిపోయింది. ఆ ధ్వని దిక్కులన్నింటా ప్రతిధ్వనించింది. పరశురామునకది మాయలా కనిపించింది. శ్రీరాముని వైపు అలాగే చూస్తూంది పోయాడు. వింటి క్రిందపడి నలిగిపోతాడనుకున్న రాముడు సునాయాసంగా దాన్ని యెక్కు పెట్టాడు. నమ్మశక్యంగాని ఆ సంఘటన అతనికి మింగుడు పడలేదు.
“ఓ బ్రాహ్మణోత్తమా 1 ఇంకను పరీక్షింతువా. . = లేక మమ్ము పోనిత్తువా? నీవు వేలకొలది క్షత్రియులను సంహరించి యుండవచ్చును. అందుకు తగిన కారణము లుండవచ్చును. కాని, అది యహంకారమునకు
దారి తీసిన మూర్ధత్వమగును. కనులు తెరచి నీవీ లోకమున కేతెంచిన తం
యవసరము తీరినదని తెలియుము అంటూ హెచ్చరించిన రాముని మాటలు విన్నాక తన దివ్యదృష్టితో విషయాన్ని (గ్రహించాడు. అతడు సామాన్య మానవుడు కాడు. శ్రీరాముని ' పరికించి చూచాడు. అతనిలో ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను, దశయోగిను లను, నవగ్రహాలను, మహాష్టనాగాలను, షట్టాస్త్రాలను, పంచ భూతాలను, చతుర్వేదాలను, త్రిమూర్తులను, ద్వివర్గాలను చూచాడు. ఆ విశ్వరూపాన్ని చూచి విస్తుబోతూండగా అందులోనుండి ఒక దివ్య బాణం ఒకటి వచ్చి పరశురాముని తాకింది. తాకినంతనే అతడు మూర్చపోయాడు. ఏడాది పాటు మూర్చలోనే ఉండిపోయాడు. తేరుకున్న తరువాత వధూసరా నద్రి ఒడ్డున చేరి నష్టపోయిన తనశక్తిని తిరిగి పొందడానికి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు భార్గవరాముడు. శ్రీరాముని అరణ్యవాసం పరశురాముని జయించిన శ్రీరాముడు తన పరివారంతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ సంఘటన అప్పుడే మరచిపోయాడు. ఆనందంగా రాజభోగాలతో నవదంపతులు కొంత కాలం సుఖంగా ఉన్నారు. ఆ తరువాత కష్టాలు మొదలయ్యాయి. దైవ వశాన పినతల్లి కోరికమీద శ్రీరామునకు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాల్సివచ్చింది. భార్య సీత, తమ్ముడు లక్ష ఖ్రుడు రామునితో బయలుదేరారు. ముగ్గురూ దక్షిణదిశగా అనేక దుర్గ్షమారణ్యాలు దాటి దండకారణ్యానికి చేరారు. గోదావరి తీరాన పర్ణశాల నిర్మించు కున్నారు. అందులో సీతారాములు ఐహిక సుఖాల పట్ల నిరాసక్తులై మునివృత్తిలో జీవిస్తున్నారు. శ్రీరామునిలో తండ్రిని, సీతాదేవిలో తల్లిని 50
చూచుకుంటూ అత్యంత పూజ్యభావంతో సౌమిత్రి వారికి సేవలు చేస్తున్నాడు. వారు కూడా పుత్రవాత్సల్యంతో లక్ష్మణుని ఆదరిస్తున్నారు.
ఫల పుష్పాదులు సమృద్ధిగా దొరికే దండకవనం వారికెంతో ఆనందాన్ని కలిగించింది. వేకువనే లేచి అడవికి వెళ్ళి పూజకోసం పూలు, భుక్తి కోసం పళ్ళు 'సేకరించేవాడు లక్ష్మణుడు. ముందుగా అన్న వదినలకు సమర్పించిన పిదపనే తాను ఆహారం స్వీకరించేవాడు. రాత్రివేళ విల్లమ్ములు ధరించి ఆశ్రమాన్ని రక్షించేవాడు. వాకిటి ముందు కూర్చొని చీమ చిటుక్కుమన్నా పరిసరాలన్నీ పరిశీలించే వాడు. తాను నిద్ర మాని అన్న వదినలకు నిద్రాభంగం కలుగనిచ్చేవాడు కాడు.
సీతాపహరణం
ఇలా ఉండగా ఒక రోజు ఎప్పటిలాగే రామ లక్ష్మణులు వేట కెళ్ళారు. సీతాదేవి పర్ణకుటీరంలో ఒంటరిగా ఉండిపోయింది. ఆ సమయంలో రావణాసురుడు కపట మునివేషంలో అక్కడకువచ్చి ఆమెను భిక్ష కావాలన్నాడు. ఆమె భిక్ష వేసేందుకు గడప దాటి బయటకు వచ్చినంతనే నిజరూపం ధరించి ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయాడు.
వేటనుండి తిరిగి వచ్చిన శ్రీరామ లక్ష్మణులకు పర్ణశాలలో సీత్రాదేవి కనిపించలేదు. ఆందోళన చెందిన రాముడు భార్యను వెదుకుతూ పదేపదే గట్టిగా పిలిచాడు. అడవిలోనుండి ప్రతిధ్వనులు తప్ప తన సీత బదులీయలేదు. వెదకి వెదకి రాముడు నీరుకారిపోయాడు. పిలిచి పిలిచి స్పృహతప్పి పడిపోయాడు. లక్ష్మణుడు అన్నగారి దైన్యస్థితి చూచి సకల శీతలోపచారాలు చేసాడు. కొంతసేపటికి శ్రీరామచంద్రుడు తేరుకున్నాడు.
కళ ల వర్మ ఇ
కాని, మళ్ళీ సీతామాత కోసం విలపించ సాగాడు. తమ్ముదెంతగా ఓదార్చినా రాముడు చిన్నపిల్లవాడిలా రోదిస్తూనే ఉన్నాడు.
ఆ తరువాత సీతాదేవిని వెదుకుతూ అన్నదమ్ములిద్దరూ
లు
బయలుదేరారు. కనబడిన (ప్రతి పొదను, చెరువును, సెలయేరును గాలించారు. లాభం లేకుండా పోయింది. రామచంద్రుని కంట కన్నీరు మున్పీరైంది. అతడు ముందుకు వేసే ప్రతి అడుగూ అతని హృదయభారాన్ని 'పెంచుతూనేవుంది. బాధ, దుఃఖం అనే రెండు ప్రవాహాలు సంగమించి రాముని ధైర్యాన్ని ముంచివేసాయి.
ఎలాగో ఒకలాగు లక్ష్మణుడు మాత్రం ధైర్యంగా నిలబడ్తాడు
గైడు. అన్న గుండెల్లో అశాబీజాలు నాటుతూ ఓదార్చు మాటలతో అనున యించాడు. తాను ముందుండి దారి చూపుతూ రాముని ముందుకు నడుపుతూ సీతాన్వేషణ సాగించాడు. అలా అనేక తావులు వెదకి వెదకి చివరకు ఇద్దరూ బుష్యమూక పర్వతానికి చేరుకున్నారు. శ్రీరామ సుగ్రీవుల మైత్రి
అల్లంత దూరాన్నుండి శ్రీరామ లక్ష్మణులను చూచిన సుగ్రీవుడు తన మిత్రులతో *చూచితిరా ... మనవైపుకు వచ్చుచున్న ఆ యిరువురు యువకు లెవరైయుందురు? వారి నడకతీరును, చేత విల్లమ్ములు పట్టినతీరును బరికింప క్షత్రియ యువకులను బోలియున్నారు. వదనారవిందములను చూడ దివ్యపురుషుల వలె నున్నారు. మనమీదకు వీరిని నా సోదరుడైన వాలి పంపియుండలేదు కదా ! లేకున్న మనకు తెలియని బాటసారులును కావచ్చును. ఆంజనేయా ! వారెవరై యుందురో కనుగొని రాగలవా?” అని హనుమంతుని చూచాడు.
52
స్నేహమునకు మారుపేరైన మారుతి వెంటనే కొండ దిగి రామ లక్ష్మణుల ముందు వాలాడు. “మీరెవరో తెలిసికొన వచ్చునా?” అని ప్రశ్నించాడు. అది విన్న శ్రీరామచంద్రుడు హనుమంతుని వాత్సల్యంతో దగ్గరకు పిలిచి 'నేనెవరినో నీకు నీవే చూడుము అని నిజరూపాన్ని చూపించాడు. నమ్మశక్యంగాని దృశ్యం హనుమంతునికి కనిపించింది. శంఖం, చక్రం, గద, పద్మం, అతని నాలుగుచేతుల్లో కనిపించాయి. లక్ష్మీ సరస్వతులు ఆ రూపానికి వింజామరలు వీస్తున్నారు. సనక సనందనాది మహామునులు, విద్యాధర గంధర్వాది దేవగణాలు వానిముందు భక్తి ప్రపత్తులతో వేచివున్నారు. వేయితలల శేషునిపై కోటిసూర్యప్రభా భాసమానంగా అతడు ఆసీనుడై వున్నాడు.
హనుమంతుని చిరకాల మనోవాంభితం నెరవేరిన శుభసమయం అది. అనందంతో పొంగిపోయాడు. ఆ విష్ణుస్వరూపునకు నూరుమార్లు (ప్రణామం చేసాదు. ళు ప్రభూ ! నేను తమ పాదసేవ కంకితమైతిని. తమ సేవాభాగ్యమును కలిగించి నాపై దయజూపుడు. బంటురీతి క్రాలువొసంగి నాకు మార్గమును జూపుడు. నన్ను రక్షింపుడు అని అనేక విధాలుగా ప్రార్ధించాడు.
అంతలోనే హనుమంతుని స్థితి మారింది. తన ప్రభువైన శ్రీరామచంద్రుడు సామాన్యుడిలా విలపిస్తున్నాడు. బాధతో కుమిలి సోతున్నాడు. విచార వదనంతో తన దీనగాథ వినిపిస్తున్నాడు.
“మిత్రమా ! వినుము. ఈ ధరణిపై నయోధ్యయను ప్రసిద్ధమైన సుందర నగరమొకటి కలదు. దశరథ మహారాజు దానికి పాలకుడు. మేమిరువురము వాని కుమారులము. నేను రాముడను. ఈతడు నాతమ్ముడు లక్ష్మణుడు. తండ్రియానతి తలదాలిచి మేమీ వనవాసమునకు వచ్చితిమి. మేమిరువురము యింటలేని సమయము కనిపెట్టి రాక్షసుడొకడు
53
నాభార్య జానకిని బలవంతముగ నెత్తుకొని పోయినాడు. ఆ రక్కసుడు రావణుడని వింటిమి. జానకిని వెదకుచు నిటు వచ్చితిమి. మీరాజు సుగ్రీవుని సహాయ మర్ధించుచుంటిమి.'
శ్రీరాముని దీనగాథ విని ఆవేదన చెందిన హనుమంతుడు వినయంగా వంగి నమస్కరించి తమ ప్రభువు స్నేహపాత్రుడనీ, తప్పక సాయం చేస్తాడనీ చెప్పి రామ లక్ష్మణులను తన భుజాలమీద ఎక్కించుకొని సుగ్రీవుడున్న చోటికి లంఘించాడు. సుగ్రీవుడు వారికి ప్పాదయపూర్వకంగా స్వాగతం చెప్పాడు. తన విషాద గాథను వినిపించాడు. తన సంపదను, సహధర్మచారిణి రుమను అపహరించి తన అన్న వాలి తనను రాజ్యంనుండి వెడలగొట్టాడని చెప్పాడు. వానిని జయించి తన భార్యా వియోగాన్ని పోగొడితే తానూ సాయం చేస్తానని ప్రమాణం చేసాడు. శ్రీరాముడు సరే అన్నాడు. వాలిని నేలగూల్చి రుమను, రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు. సుగ్రీవుడు కూడా తన మాట నిలుపుకోవడానికి సిద్ధమయ్యాడు.
లంకా ప్రవేశం
సుగ్రీవుడు తన అనుచర సైన్యాన్నంతా పిలిపించాడు. రావణుడున్న లంకకు నడిపించాడు. తమ కిష్మింధారాజ్యానికి, లంకకు మధ్య మహా సముద్రం ఉంది. మహా కల్లోలంగా వుంది. దానిని ఎక్కడ దాటాలో అర్థంకాలేదు. అదిచూచి రాముడు సముద్రానికి అడ్డంగా సైన్యాన్ని నడిపించుమని లక్ష్మణుని ఆదేశించాడు. లక్ష్మణుడు ఉగ్రరూపం ధరించాడు. అంతే ... ఆ కోపాగ్నికి సముద్రంలోని నీరు ఇంకిపోయింది. జలచరాలన్నీ నశించిపోతున్నాయి. ఒక్కసారిగా భూమిపై ప్రళయం సంభవించింది. లోకమంతా హాహాకారాలు.
ర్డే
నాలుగు దిక్కులనుండి దేవతలు, మునులు అక్కడకు చేరుకున్నారు. సాగరుడే స్వయంగా వచ్చి శ్రీరాముని శరణుకోరాడు. ప్రాణభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. కరుణామూర్తి రామచంద్రునికి జాలికలిగింది. సీతా వియోగంతో అతడు కార్చిన కన్నీటితో సముద్రం నిండిపోయింది. ఆ వింత చూస్తున్న దేవతలు పూలవాన కురిపించారు.
సాగరుడు సంతోషించాడు. రామకార్యానికి అద్దురానన్నాడు. వానరులు సముద్రంమీద అడ్డంగా పర్వతాలతో వంతెన నిర్మించారు. సైన్యం మొత్తం లంకకు చేరింది. రావణుని రాక్షస సైన్యానికి, సుగ్రీవుని వానర సైన్యానికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి శ్రీరాముని చేతిలో రావణాసురుడు హతుడయ్యాడు. రాక్షసులంతా పలాయనం చిత్తగించారు. -
ఆవిధంగా సీతామవాదేవికి విముక్తి కలిగింది. పుష్పక విమానంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు అయోధ్య చేరుకున్నాడు. అనాటితో వారి పద్నాలుగేళ్ళ వనవాసం ముగిసింది. ఒక శుభముహూర్తాన శ్రీరామచంద్రుడు అయోధ్యా సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన నియమబద్ధ పరిపాలన ముందుతరాలవారికి ఆదర్భమైంది. రామరాజ్యంలో అన్యాయాలకుగాని, మోసానికిగాని, పేదరికానికిగాని, రోగబాధలకుగాని, అకలిమంటలకుగాని తావులేదు. శాంతి సొఖ్యాలకు రామరాజ్యం పర్యాయ పదమైంది.
మునిపుంగవుల సదస్సు
అంతటి జనరంజకంగా రామచంద్రుడు పరిపాలిస్తుండగా ఒకనాడు మునులంతా అయోధ్యకు వచ్చారు. శ్రీరామచంద్రుని పట్ల తమకున్న ఆదరాభిమానాలు ప్రకటించి ఆశీస్సులందజేయాలని వారి
ర్5్
సంకల్పం. తూర్పుదిక్కు నుండి విశ్వామిత్ర, శ్రైబ్య, చ్యవన, కణ్వులు; దక్షిణం నుండి అత్రి, నముచి, అగస్తులు; పశ్చిమాన్నుండి ఉషంగ, కామాజులు ఉత్తరదిక్కు నుండి వశిష్టమహర్షి తమ శిష్యగణాలతో సహా ఆ సదస్సులో పాల్గొన్నారు.
శ్రీరామచం(ద్రుడు తమ్ములతోను, మంత్రి పురోహితులతోను మునిపుంగవుల కెదురేగి స్వాగత సత్కారాలతో గౌరవించాడు. వారి రాకతో తామంతా పునీతులమయ్యామని, జ్ఞానులందరు ఒక్కసారిగా తమ రాజ్యాన్ని పావనంచేయటం తమ అదృష్టమని, తమ ఆనందాన్ని ప్రకటించేందుకు మాటలు చాలడంలేదని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.
రామచంద్రుని వినయాన్ని చూచి మునిపుంగవులు పులకించి పోయారు. ఒక్కొక్కరే రఘురాముని కొనియాడ సాగారు. కఠోరమైన నియమాలతో వేలాది వత్సరాలు తపస్సుచేసినా దొరకని శ్రీహరి దర్శనం, తమ పూర్వజన్మ సుకృతం వల్ల సాక్షాత్తు ఆ పరమాత్ముని అవతారమైన శ్రీరామచంద్రుని చూడటం ద్వారా లభించిందన్నారు. రామావతార మాహాత్మ్య వైభవాన్ని వర్ణించడం ఎవరివల్లా కాదన్నారు. ఖార్యను తిరిగి పొందే సాకుతో తమను, తమ ఆశ్రమాలను దర్శించి అందరి జీవితాలను ధన్యం చేసావన్నారు. తమను, యీలోకాన్నీ రావణాది రాక్షసుల కబంధహస్తాల నుండి కాపాడిన జగద్రక్షకుడ వన్నారు. కనీ వినీ యెరుగని అత్యద్భుతమైన సేతుబంధనం చేసిన మహాత్ముడవని కీర్తించారు. కష్టాలను ఎదిరించడంలో అతడు చూపిన ఓర్పు ప్రశంసనీయమన్నారు. రాజ్యాన్ని విడిచిపెట్టి, సుఖ భోగాలకు దూరమై, తల్లిదండ్రులు కూడా దగ్గరలేని అరణ్యవాసంలో నీకు సకలసేవలు చేసిన నీ తమ్ముడు లక్ష్మణుని త్యాగధనపు గొప్పతనాన్ని ఎవరూ వర్ణించలేరని మెచ్చుకొన్నారు. జనని
56
సీతమ్మ క్రూర రాక్షసుల చేతిలో యెన్ని బాధలు అనుభవించిందోకదా అని కంట తడిపెట్టారు.
ఇలా ఒకరి తరువాత ఒకరు ఎవరెంతగా పొగడినా శ్రీరామచంద్రుని ముఖంలో వినయంతప్ప మరో వికారం కనిపించలేదు. తలవంచుకొని మునులపట్ల గౌరవంతో మౌనంగా వింటూ ఉండి ప్రోయాడు. సింహాసనంలో ప్రక్కనే కూర్చున్న సీతామహాదేవి కూడా మునుల మచ్చుకోళ్ళను మౌనంగా వింటూ ఉండిపోయింది. అంతా పూర్తికానిచ్చి చివరన తన కలస్వనాన్ని సవరించుకొని 'మహాత్ములారా ! శ్రీరామచంద్ర ప్రభువు శక్తి సామర్ధ్యము లన్నియు నెల్లరకు తెలిసినట్టివే. వీసమెత్తు సందేహమును లేదు. రావణాసురుని బలదర్చములను నేనంగీకరింతును. కాని, రాముడు రాక్షసు లందరియందును వీర్యశాలి యనుటకు వీలులేదు” అంది.
ఆమె మాటలు విని మునులంతా విస్తుపోయారు. ఒకరిమొహం ఒకరు చూచుకున్నారు. సీతామాత పలుకులకు అర్థమేమిటో తెలియక తమలోతాము గుసగుస లాడుకున్నారు. మునుల స్థితి సీతమ్మ కర్ధమైంది. జీచి గౌరవ పురస్సరంగా అందరికీ అభివాదం చేసింది. మునుల సందేహాన్ని తీర్చేందుకు అనుమతించుమని భర్తను ప్రార్థించింది. అప్పటికే లావణుడు పెద్దబలశాలి కాదన్న భార్య మాటలు విని రాముని ముఖం వివర్ణమైంది. అదేమిటో తెలిసికోవాలన్న కోరిక అతనిలోనూ తలెత్తింది. తొనున్న స్టితి బయటపడనివ్వకుండా గంభీర వదనంతో ఆమెను అనుమతించాడు. అందరిలోనూ సీతామహాసాధ్వి ఏమి చెప్పబోతుందా అని ఆత్ఫత . . . చెవులు రిక్కించి వినడానికి సిద్ధమయ్యారు. సభంతా నిశ్శబ్దం. అటువంటి సమయంలో సీతామహాదేవి సభాముఖంగా తన అనుభవాన్ని నెమరువేసుకో సాగింది.
5/7
రావణుల జన్మవృత్తాంతం
“నేనప్పుడు చిన్నదానను. నా బాల్యమంతయు మిథిలానగరము నందు గడచెనని మీకు తెలియును. ఒకనాడు మీవద్దకు బ్రాహ్మణ పండితుడాకరు వచ్చి మా రాజప్రాసాదమున చాలాకాలము అతిథి సత్మారములు పొందెను. రాజభవనమునందు బాలలమైన మేమందరము పగలంతయు అతనివద్ద గడపెడివారము. అతడు మంచిమంచి కథలు చెప్పుటలో దిట్ట. అప్పుడప్పుడు అతడు జరిపెడి యాత్రలలో పాల్గొని వానికి సపర్యలు చేసెడివారము.
అటులుండ నొకదినమున నాబ్రాహ్మణుడు నన్ను చెంతకు పిలచి యాత్రలయందు నొకచో తాజూచిన వింత విషయమును వర్ణింతుననెను. నేనును కథాశ్రవణ కుతూహలమున దగ్గరకు జరిగితిని. ఆతడావింత నీవిధమున జెప్పదొాడగెను.
ఈ భూగోళమున సప్త్రమహాసముద్రము లున్నవి. అందులో దధిసముద్రమున కావల మధు సముద్రము, దానికవతల క్షీర సముద్రము లున్నవి. క్షీరసముద్రము నడుమ పుష్కర ద్వీపమున్నది. దాని మధ్య భాగమున మనోహరమైన సరోవర మొకటున్నది. అందు వేయిరేకులు విప్పుకొని నీటిపై తేలియాడుచున్న ఒక పెద్ద తామరపూవు కలదు. అది అరుణకాంతులు విరజిమ్ముచు దేదీప్యమానముగ ప్రకాశించుచున్నది. ఆ పద్మము పేరనే ఆ ద్వీపమునకు పుష్మరద్వీపమను పేరు వచ్చినది. ఆదీవి అష్టదిక్పాలకులకు నిలయము. వారి భవనములన్నియు నచ్చట నెంతయు నున్నతముగ కాన్సించును.
ఆ సమయమున నచ్చట సుమాలి యను రాక్షసుడుందెడివాడు. ఆతని యేకైక కుమార్తె పేరు కైకసి. ఆమెను విశ్రావసువున కిచ్చి పెండ్లి
58
చేసెను. ఆమె కిరువురు కుమారులు పుట్టిరి. పెద్దవానికి వేయితలలు,' చిన్నవానికి పది తలలు కలవు. వారు పుట్టినప్పుడు ఆకాశమున ఫెళఫెళమను భయంకరమైన ధ్వనులు వినిపించెను. దుర్భరములైన రవములతో పుట్టిరి కావున వారికి రావణులను పేరు వచ్చెను. వారిరువురును మహా క్రూరులగుదురనియు, మానవాళిని ప్రశాంతముగ (బ్రతుకనీయరనియు నాకాశవాణి పలికినది. అటులనే వారి వయస్సుతో పొటు వారియందు క్రూరత్వమును 'పెరిగిపోయినది.
తరువాత చిన్న రావణుడు (బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. బ్రహ్మను మెప్పించి యనేక వరములు పొందెను. ఆ వరబలమున దశకంఠు డజేయుడాయెను. మూడు లోకములపై జైత్ర యాళత్రను సలిపెను. తుద కాయాత్ర ఐశ్వర్యదేవత యగు కుబేరుని లాజధాని లంకానగరమున ప్రవేశించెను. ఇరువురి నడుమ భయంకర మన పోరు నడచినది. కుబేరుడు పరాజయమొందెను. లంకానగరము, ప్రష్పక విమానము దశకంఠుని వశమైనవి. బంగారులంకను వీడిపోలేక దశకంఠ రావణుడు లంకాధిపతిగ స్థిరపడెను.
పెద్దరావణుడు మరింత బలవంతుడు. మహావీరుడు. చిన్నతనము ననే ఆకాశమున కెగసి రెండు చేతులతోడ సూర్య చంద్రులను తాళములుగ పట్టి మోగించెడివాడు. తన రెండువేల చేతులతోను సముద్రములన్నియు కలచివైచి, అందు పుట్టిన పెద్దపెద్ద కెరటములు తీరప్రాంతములను ముంచుచుండ జనుల హాహాకారముల జూచి యానందించుచుండును. అమేయమైన భుజబలమున నష్టదిక్పతులను తరిమివైచి పుష్కర ద్వీపమునకు రాజాయెను. తమ్ముని వలె తానును లోకములన్నిటిని జయించి కొల్లగొట్టిన ధన కనక వస్తు వాహనాదులతో తన ధనాగారమును నింపివేసెను. పుష్మరద్వీపమును సుందరముగ తీర్చిదిద్దెను. రకరకముల
ర్9ి
పూవులు, పంద్దు, చిత్రములైన పొదలు, చెట్లు, పక్షులు, జంతువులు ఆదీవిని ఆకర్షణీయముగ నొనరించెను. సకల సంపదలు పుష్కలముగ లభించుట వలన నచటి ప్రజలెంతయును సుఖించుచుండిరి. సహ(్రకంఠుని బల పరాక్రమములకు భయపడి రాక్షసులెల్లరు నాతని భృత్యులైరి. దేవతలెల్లరు సేవకులైరి. బ్రహ్మదేవు డతని కొలువున పురోహితుడాయెను. శంకరుడు ద్వారపాలకు డయ్యెను. శత్రువులతని పేరు విన్నంతనే స్వప్నమున సహితము భయపడుచుండిరి. కనివిని యెరుగని యీ కథవిన నంతయును మాయగనున్నది కదూ 1”
ఈ విధంగా చిన్నప్పుడు (బ్రాహ్మణుని ద్వారా తాను విన్న వృత్తాంతాన్ని సభలో వివరించి సీతామహాదేవి యింకా ఇలా అన్నది. “ఓ మహాత్ములారా ! వేయితలల రావణుని గురించి విని మీర లాశ్చర్యము నాందియుండ వచ్చును. నేనును (బ్రాహ్మణ ముఖమున నీ కథ విన్న సమయమున నమ్మలేక యుంటిని. క్రార్యమునకును, నిర్జాక్షిణ్యమునకును ప్రతీకలై నిలచిన రావణులు తలపునకు వచ్చినంతనే నేటికిని నాతనువు జలదరించును. పదితలల రావణునితోడ జరిగిన పోరాటమును మనము కనులార గాంచియున్నాము. అతడు మనకు కలిగించిన కష్టములు, నష్టములు, బాధలు మనము స్వయముగ ననుభవించియుంటిమి. ఈ దశకంఠుని జయించుటకు శ్రీరామచంద్రు లెంతటి శ్రమకు గురికావలసి వచ్చినది ! ఇక సహ(స్రకంఠుని జయింప వలయునన్న నెంతటి శక్తి యుక్తులు కావలసియుండును ! అతడిని జయింపగలుగు వీరుడు ధరణిపైననే కాదు, ముల్లోకములందును కలడా యను సందేహము కలుగుచున్నది.”
సీతామహాదేవి సందేహాన్ని విన్న మునులకు నోళ్ళు పెగల్లేదు. వేయితలల రావణుని బల పరాక్రమాలను సీతాదేవి మెచ్చుకోవడం శ్రీరామునికి రుచించలేదు. అతనిలో అణగిమణగి ఉన్న అహంకారాన్ని
60
రెచ్చగొట్టింది. కళ్ళు ఎర్రబడ్డాయి. రోమాలు నిక్కబొడిచాయి. పళ్ళు పటపటలాదాయి. తనకు తెలియకుండానే రాముడు భుజాలు చరచుకున్నాడు. పుష్మరద్వీపం పైకి దాడి
శ్రీరామచంద్రుడు కోపంతో సింహాసనం నుండి లేచి సింహంలా గర్జించాడు. ఆ పరీక్షకు తాను సిద్ధమన్నాడు. వేయితలల రావణుడు నిజంగా అంతటి వాదైతే వాని సంగతి తానే తేలుస్తానన్నాడు. లక్ష్మణుని పిలిచి సైన్యాన్ని సిద్ధం చేయుమన్నాడు. పుష్మరద్వీపం మీద యుద్ధం ప్రకటించాడు. సుగ్రీవుడికి, విభీషణుడికి వర్తమానాలు పంపించాడు. తలచుకొన్నంతనే పుష్పక విమానం వారిముందు వాలింది. లక్ష్మణ భరత శత్రుఘ్నుల నేతృత్వంలో అయోధ్య సేనలు సిద్ధమయ్యాయి. నల జూంబవంత హనుమంత సుషేణ సుగ్రీవ అంగదాదుల నాయకత్వంలో కిష్కింధ నుండి పెద్ద వానర నైన్యం వచ్చి చేరింది. లంకనుండి రాక్షససేనతో విభీషణుడు వచ్చాడు. సైన్యాలన్నీ యుద్దానికి సన్నద్ధం అయ్యాయి.
వివిధ రంగుల బావుటాలు ఆకాశంలో ఎగురసాగాయి. రణభేరులు మోగాయి. తూర్యనాదాలతో దండయాత్ర ఇయలుదేరింది. మదగజాలు (్రేణులై కదిలాయి. అశ్వ పదఘట్టనలు మిన్నంటాయి. రథాల హయహేషలతో దిక్కులు దద్దరిల్లాయి. ధూళిమేఘాలు నింగికెగసాయి. సైన్యాలు బయలుదేరినట్లు లక్ష్మణుడు చెప్పిన వెంటనే శ్రీరామచంద్రుడు శృత్రా సమేతంగా పుష్పకాన్ని అధిరోహించాడు. యుద్దాన్ని చూడాలన్న తపనతో మునులందరూ విమానం ఎక్కారు. పుష్మరద్వీపానికి తీసికెళ్ళుమని రామచంద్రుడు చెప్పగానే విమానం ఆకాశంలోకి ఎగిరింది. ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుండే దివ్యమైన ఆ విమానంలో సైన్యమంతా
61
ప్రయాణించింది. వరుసగా సముద్రాలన్నీ దాటుకొంటూ ఆ విమానం మానసోత్తర పర్వతాలను సమీపించింది. ఆ వెనుక వేయితలల రావణుని రాజ్యం. సైన్యాలన్నీ ఆ పర్వతశ్రేణులపై దిగాయి. అవి చేసే యుద్ధ నినాదాలతో పర్వతాలు మారుమోగిపోయాయి.
వేయితలల రావణుడు ఆ అరుపులు విన్నాడు. అవి యేమిటనే విషయం తెలిసికొని రమ్మని భటుల్ని పంపించాడు. అప్పటికే గూఢచారులు వచ్చి సమాచారం అందించారు.
'మహాప్రభూ! ఎవరో వింత ప్రజలు సాయుధులై వచ్చి మనగడ్డపై కాలుపెట్టినారు. వారు మూడువిధాలుగా కనిపిస్తున్నారు. ఒకదళములోని వారు వాలములు కలిగి మిక్కిలి పొట్టిగానున్నారు. వింతచేష్టలు, వింత వాలకములతో వినోదమును కలిగించుచున్నారు. పెద్ద ముఖములు కలిగి పొడవుగ నున్నవారు వేరొక దళములోనున్నారు. సామాన్యమైన ఎత్తులో మానవాకారులైన వారు మూడవ దళములోనున్నారు. వారందరును ఏక్షణమునం దైనను తప్పక మనపై దాడిచేయగలరని అనుమానము కలుగుచున్నది.
సహ(స్రకంఠుడు చారుల మాటలు నమ్మలేకపోయాడు. “'మీరనునదేమి” అంటూ వారిపై గుద్గురిమి చూచాడు. 'తోకలుగల పిల్ల సైనికులు మనమీద దాడిచేయ వచ్చితిరా ! వింతగా నున్నది. వారెవరో అమాయకులవలె నున్నారు. నా గురించి వినియుండక పోవచ్చును. లేదా ముల్లోకములను జయించి వచ్చినవారు కావలెను. లేనిచో కాలుడు సైతము దేవతలతోకూడి నాయింట నూడిగములు చేయుచు నాయాదేశములకై పడిగాపులు గాయుచుండ నామీద దండెత్తుట కెంతటి సాహసము కావలయును ! నా యనుమతి లేక సూర్యుడు ప్రకాశింపడు. చంద్రు
62
డుదయింపడు. మేఘుడు నర్షింపదు. అగ్ని జ్వలింపదు. సప్త సముద్రముల యందు నొక్కయలయైనను కదలదు. నా పేరు వినినంతనే ముజ్జగములు గజగజలాదును. మహామహా బలశాలురు సైతము మనదీవిపై కాలూనుట కాదుకదా - కన్నెత్తి చూచుటకైనను వెరపొందెదరే! అట్టితరి యీ వింతసైన్యము నా యీ గడ్డపై నడుగిడుట కెట్లు సాహసించినది ? వీరినిజూడ నాకొకవైపు కోపమును, మరియొకవైవు జాలియును కలుగుచున్నవి. బలహీనుడగు శత్రువు బలశాలినగు నన్నెదిరింప బూనినందుకు కోపింపనా . .. అమాయకమగు లేడికూన ఆకలిగొన్న పులి యొద్దకు తనంతట తాను నడచి వచ్చినందుకు జాలిపడనా ! ఒకవేళ వారు దారితప్పి యిటువైపు వచ్చియుండ వచ్చును. తెలిసి తెలిసి నామీదకు వచ్చుట యసంభవము. ఏది యేమైనను ఇపుడు వారెవరో, ఎందుకు వచ్చితిరో స్వయముగ తెలిసికొందును అంటూ మంత్రులకు,
సైన్యాధిపతులకు వర్తమానం పంపాడు.
స్వయంగా బయలుదేరడానికి సహస్రకంఠ రావణుడు సర్వసం
సిద్ధుడయ్యాడు. వేయి తలలపై ధగధగ మెరిసే వేయి కిరీటాలు
ధరించాడు. అమూల్యమైన మణుల కాంతుల మధ్య వేయికిరిటాలు
ఒక్కటిగొ కనిపిస్తునాయి. తఠకతళలాడుతున్న రంగురంగుల రాచ దుస్తులు
ధరించాడు. మెడనిండా బంగారు నగలు తగిలించుకున్నాడు. రెండువేల
చేతులతో వేయివిధాలైన శస్తాస్తాలు ధరించాడు. పదునైన ఆ శస్త్రాలు భయంకరమైన విషనాగుల్లా మెరిసిపోతున్నాయి.
అటువంటి సహస్రకంఠ రావణుడు కదనరంగానికి కదిలాడు. వాని వెంట పదాతిదళాలు, ఆ వెనుక అంగరక్షకులు బయలుదేరారు. ఇరువైపుల కౌనప, కలవేగ, శార్వణ, హలీముఖాది దళపతులు తమతమ సైన్య విభాగాలను నడిపించారు. వారి వెనుక రాజకుమారులైన చిత్రదేవ, సుప్రసాద, కిరీట, కలశోదర, కాలకాక్షులు బయలుదేరారు. య
అది ఒక మహాద్భుత దృశ్యం. సైనికులందరు సమానమైన ఎత్తులో ఉన్నారు. ఆకారాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. వికారమైన ముఖాలు, లావుపాటి శరీరాలు, నెత్తురులు చిమ్ముతున్న ఎ(ర్రటి కళ్లు, చిందర వందరగా జుట్టు, ఎగుడు దిగుడు మీసాలు, రకరకాలైన ఆయుధాలు . .. అందరూ మహా భయంకరంగా ఉన్నారు. కొందరైతే పెద్దపెద్ద దూలాలు, బండరాళ్ళు, పర్వతాలు మోసుకొస్తున్నారు.
ఆ విధంగా శ్రీరామచం(ద్రుడు దిగిన ప్రదేశానికి సహ(స్రకంఠుని పరివారమంతా చేరింది. మహాసముద్రంలా కనిపిస్తున్న రాముని సేనావాహినిని రావణుడు తన రెండువేల కళ్ళతో పరికించాడు. ' వీరెవరు? ఇక్కడికేల వచ్చిరి? వీరి నాయకుడెవరు? ఇలా అతని పూర్వపు ప్రశ్నలే తిరిగి అతని మదిలో మెదిలాయి. అతని (ప్రశ్నలకు సమాధానంగా ఆకాశవాణి ఇలా పలికింది.
“ఓరీ మూఢాత్మా! నీ ముందున్న సైన్యమునకు నాయకుడెవరైనది నీకు తెలియదా? సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్ర మూర్తి నీకిపుడు ప్రత్యర్థి. నీ తమ్ముడైన దశకంఠరావణుడు ఆతని ధర్మపత్ని సీతామహాదేవి నపహరించినాడు. అందువలన వారిద్దరి మధ్య జరిగిన ఘోరయుద్ధమున శ్రీరాముడు నీ తమ్ముని, ఆతని యపారమైన సేనా వాహినిని నిర్మూలించినాడు. ఆ రావణునకు నీ వగ్రజుడవని తెలియుట వలన శత్రుశేషముండరాదను తలంపున నిన్ను నిర్జింప నపార సేనా సమూహముతో నిటకు వచ్చియున్నాడు.”
ఆకాశవాణీిని విన్నంతనే వేయితలల రావణుడు ఉగ్రుడయ్యాడు. పిచ్చిపట్టిన వాడిలా చిందులు వేసాడు. యుద్దానికే వస్తే యింకా ఆలస్య మెందుకని రంకెలు వేసాడు. దళపతులను పిలిచి 'చూచెదరేల? ఈ పురుగులను నలిపివేయండి. ఏ యొక్కటియును మిగులరాదు- పొండదు'
64
అంటూ సమర నాదాలు చేసాడు. మెరపులా అతని సేన ముందుకు దూసుకెళ్ళింది. రామదండులో ముందుండి యుద్దానికి సిద్ధంగావున్న విభీషణుని సేనపై బడింది. రెండు రాక్షస సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రాళ్ళకు రాళ్ళు, వృక్షాలకు వృక్షాలు, పర్వతాలకు పర్వతాలు ఎదురు సమాధానాలు వచ్చాయి. కేకలు, పొలికేకలు, వడుపులు, పెడబొబ్బలు, నిట్టూర్పులు, మూలుగులు యుద్ధరంగమంతా ప్రతి ధ్వనించాయి. రెండువైపులా వేలాది సైనికులు నేల కూలారు. రక్తాలు వరదలై పారాయి. యుద్ధం ఆగలేదు. చప్పగా సాగుతోంది ... అనుకున్నారేమో రెండు సైన్యాలు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలతో యుద్దాన్ని ఉధృతం చేసాయి. దుష్టశక్తులను (ప్రయోగించారు. మాయో పాయాలు పన్నసాగారు.
అటునుండి పులిరూపంలో ఒకడు వస్తే ఇటునుండి ఒకడు ఎలుగుబంటి రూపంలో ఎదురువెళ్ళి చీల్చి చెండాడతాడు. ఒకవైపు నుండి ఏనుగుల మంద రూపంలో మీదమీదకు వస్తే మరోవైపువాళ్ళు కొదమ సింవోల్లా రూపొంది వాటిమీదకు దూకుతున్నారు. ఈరకం పోరు కూడా కొద్దిసేపటికి లాభం లేదనిపించింది కాబోలు - ఆయుధాలు, మాయ మంత్రాలు పక్కన పడేసారు. బావా బాహీ తలపడ్డారు. చెంప దెబ్బలు, ముష్టి ఘాతాలు, గిచ్చుళ్ళు, రక్కుళ్ళు, ఎముకలు విరుచుకోవడాలు, ఎత్తిపడేయటాలు - రకరకాల నియుద్ధ ప్రక్రియల్లో యుద్ధరంగం అంతా హాహాకారాలతో మారుమోగిపోయింది. ఖేచరులు మేఘాల మాటునుండి వినోదం చూస్తున్నారు.
చివరికి విభీషణుని సేన బలహీనపడింది. పెద్ద రావణుని సీనముందు నిలబడలేక పోయింది. తెల్లజెండా ఎగరేసి వెనక్కితిరిగింది. అయోధ్య సేనలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి కాని, ఎంతోసేపు నిలవలేక
65
పోయాయి. కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి కదా ! యుద్ధం వకపక్షంగా సాగింది. నరసేన మెల్లగా వెనక్కి జారుకొంది.
అప్పుడు వానరసేన ముందుకొచ్చింది. విజయ గర్వంతో విర్రవీగుతున్న వేతలల రావణసేనకు గుజ్జు రూపాలైన వానరులను చూచి నవ్వొచ్చింది. తమను గేలి చేస్తూ, అనుకరిస్తూ, పళ్ళికిలిస్తూ కవ్విస్తున్న కోతిచేష్టలు చూచి పగలబడి నవ్వుకుంటున్నారు. ఇవి కోతులు, అవి ఆబోతులు ... వీళ్ళమధ్య యుద్ధమేమిటని పైనుండి చూస్తున్న వాళ్ళు నోళ్ళు నొక్కుకుంటూ ఆశ్చర్యం ప్రకటించినా, వాళ్ళలో ముందేమి జరుగుతుందోనన్న ఆసక్తి లేకపోలేదు. శ్రీరామచంద్రునికి ఓటమి తప్పదేమోనన్న అనుమానంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
కాని, వానరులు సొమాన్యులేమీ కారు. రాక్షసులతో యుద్ధం వారికి కొత్తేమీ కాదు. లంకలో జరిగిన యుద్ధంలో భయంకరాకారులైన రాక్షసుల నెదిరించి పోరిన అనుభవం ఉంది. కాబట్టి నిర్భయంగా ఈ రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ముందు జరిగిన రెండు పోరాటాలకంటె రాక్షస-వానర పోరాటం అతి భయంకరంగా జరిగింది. రథాలు విరిగిపోయాయి. గుజ్టాలు కుప్పకూలాయి. ఏనుగులు కొండల్లా గుట్టలు పడ్దాయి. అకస్మాత్తుగా వచ్చి మీదపడి పారిపోయే యుద్ధతంత్రం ప్రయోగించి యుద్ధభూమిలో కుప్పిగంతులు వేస్తూ కోతులు స్వేచ్భావిహారం చేయడం మొదలుపెట్టాయి. తమ వాలాలు పెంచి వేలకొలది రాక్షసులను కలిపి బంధించి గాలిలో ఎగురవేసాయి. అంత ఎత్తునుండి కిందపడిన అసురులు నేలను గుద్దుకొని అసువులు బాయసాగారు. కొందరికి తలల పగిలి, ఎముకలు విరిగిపోయాయి. ఆ రాక్షసులు ఎప్పుడూ అటువంటి దెబ్బలు రుచిచూడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి గుంపులు గుంపులుగా యుద్ధరంగం నుండి పలాయనం చిత్తగించారు. ఎటూ పోవటానికి దిక్కుతోచక అందరూ చెల్లాచెదరయ్యారు.
66
శ్రీరామచంద్రుని సైన్యంలో ఆనందోత్సావోలు తిరిగి వెల్లివిరిసాయి. పైనుండి చూచే దేవగణాలు కూడా సంతోషించాయి. వానరవీరుల యుద్ధలాఘవాన్ని ప్రశంసించారు. శతాబ్దాలుగా నెలవులు కోల్పోయిన అష్టదిక్పాలకులు కూడా తమకిక స్వేచ్చ లభించినట్లు భావించి ఊపిరి పీల్చుకున్నారు. తన సైన్యం ఓడిపోయిందన్న ప్రాణాంతక వార్త విన్న రావణాసురుడు మొదట ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఓటమి అన్నమాట తొలిసారిగా విన్నాడు. ఇక లాభం లేదని తానే యుద్దానికి పూనుకొన్నాడు. పూనుకొన్నాడే కాని, అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మానసికంగా ఏదో బలహీనత చోటుచేసికొంటోంది. తానెంతో తేలికగా తీసివేసిన కోతుల చేతిలో తన సేన పడిన పాట్లు అతని మనోపటలం మీద వికటాట్టహాసాలు చేస్తున్నాయి.
“నర వానరు లెన్నడయినను దానవుల నోడించి యుండిరా! నేనెన్నడును వినియుండ లేదు, కనియుండ లేదు. ఓటమి నెరుగని గడ్డ మీద నేడా మాట వినిపించినది. ఇంత బలవంతుడ నయిన నేను వీరితో స్వయముగ పోరాడుటయా ! లేక వీరిని విజేతలుగ నంగీకరించి తల యొగ్గుటయా? లేదు . . . వీరితో పోరాడి తీరవలసినదే. అట్లు కానిచో నాకును, నా తల్లికిని, నా యిలవేలుపయిన మహేశ్వరునకును ఆజన్నాంతము తలయెత్తలేని యవమానము కాక తప్పదు. అయినను తొందరపడ రాదు. కడు జాగరూకతతో వ్యవహరించెద గాక.”
ఇలా బాగా ఆలోచించి సహ(స్రకంకఠుడు శక్తివంతమైన వాయు వ్యాస్తాన్ని 1పప్రయోగించాడు. మరుక్షణంలో అది అతివేగంగా వెళ్ళి యుద్ధభూమిలో వేలకొలది పిడుగులు వర్షించగల పెను తుఫానును సృష్టించింది. అందులో వైరిసైన్యమంతా చిక్కుకు పోయింది. ఎండుటాకులు పెనుగాలిలో కొట్టుకు పోయినట్లు రాముని మూడు సైనిక దళాలూ,
6/7
దళాధిపతులైన సుగ్రీవ, లక్ష్మణ, విభీషణులతో సహా గాలిలో లేచిపోయి వారివారి మాతృదేశాలలో పడిపోయారు. వారికి తెలియకుండానే క్షణాల్లో సముద్రాలు దాటి తమతమ యిండ్లలో పడిపోయారు. ఆ దెబ్బకు వాళ్ళు మళ్ళీ లేవలేదు.
అప్పటిదాకా శ్రీరామచంద్రమూర్తి, సీతామవాోదేవి, ముని పుంగవులు కూర్చున్న పుష్పక విమానం యుద్ధభూమిపై ఆకాశంలో తిరుగుతూనేవుంది. శ్రీరాముని సైన్యమంతా అంతర్థానం కావడం గమనించిన మునుల ముఖాలు వెలవెల పోయాయి. వారి సంతోషమంతా నీరుగారిపోయింది. కదనరంగమంతా కటిక ఎడారిలా నిర్మానుష్యంగా (ప్రశాంతంగా తయారైంది వేతలలవాని అట్టహాసం తప్ప,
సహస్రకంఠుని ప్రతాపాన్ని చూచి విస్తుబోయిన శ్రీరామచంద్రుడు వెంటనే విల్లందుకున్నాడు. నారి సంధించి ధనుష్టంకారం చేసాడు. (ప్రాణాంతకమైన ఆ అశనిపాత ధ్వనికి యుద్ధభూమి దద్దరిల్లింది. తమ నాయకుని సామర్ధానికి ధైర్యం పుంజుకొని తిరిగి వస్తున్న రాక్షససేనకు గుండె గుఖిల్లుమంది. ముందుకు రావడానికి వెనుకాడుతున్న తన సైనికుల్ని చూచి రావణాసురుడు 'ఓరీ మూఢులారా ! మన శత్రువాక మానవ మాటత్రుడు. ఇప్పుడత డొంటరియై మన దయా దాక్షిణ్యములపై జీవించ వలసినవాడు. మృత్యువునైనను విసిరివేయగల నేనుండ మీకేల భయము?” అంటూ ధైర్యం చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తిని చూచి '*ఓయీ తెలివి తక్కువవాడా ! నిన్ను చూడ విచారము కలుగుచున్నది. నీ కనుల ముందు నీ సైన్యమంతయును మటుమాయమైనది. ఇంకను యుద్ధప్రయత్న మేల చేసెదవు? వెనుదిరిగి వెళ్ళవలయునను ఆలోచనయే కలుగలేదా? నీకింకను నొక యవకాశమిచ్చుచున్నాను. ఇప్పటికేని తిరిగి పొమ్ము, నా తమ్ముని జయించిన వీరుడవనుచు క్షమించెద !? అని హెచ్చరించాడు.
68
శ్రీరాముని కోపం నసాళాని కెక్కింది. 'శునకమువలె మొరగకుము.
ధైర్యము కలదేని యుద్ధమొనరింపుము' అని విల్లెక్కుపెట్టాడు. రామ రావణ ద్వంద యుద్ధం
సహ(ప్రాననుడు రెండువేల చేతులతో వేలకొలది బాణాలను ఒక్కసారిగా ప్రయోగించాడు. శ్రీరాముడు తక్కువైనవాడా ! విలువిద్యలో మేటి. అన్నివేల బాణాలను అవి తనను తాకకముందే తుత్తునియలు చేసాడు. అదొక విచిత్రమైన ద్వంద్వ యుద్ధం వేలచేతులతో వేతలలవాడు వేస్తున్న వేలకొలది బాణాలొక వైవు, కేవలం రెండు చేతుల నుండి వెలువడుతున్న వేలకొలది బాణపరంపర మరొక వైపు. ఆ విధంగా ఎంతసేపు యుద్ధం చేసినా వారి చేతులకు అలసట రాలేదు. ఇక లాభం లేదని రావణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అది విషజ్వాలలు కక్కుతూ రామునివైపు దూసుకెళ్ళింది. అ(ప్రమత్తుడైన రాముడు గరుడాస్తాన్ని ప్రయోగించాడు. అది ఆ మహానాగాన్ని పొడిచి పొడిచి చంపింది. అలా సహ'్రకంఠుని ప్రతి దివ్యాస్తానికి దశరథ సుతుని దివ్యాస్తం సమాధానం చెప్పింది. ఆ యుద్ధం కూడా చాలాకాలం సాగింది. తానెంత పోరినా మేరు పర్వతంలా కదలకుండా నిలబడ్డ రామచంద్రుని చూచి రావణాసురునికి చెమటలు పట్టాయి. నాలుక తడారిపోయింది. మొదటిసారిగా గుండెల్లో ఆందోళన బయలుదేరింది. యుద్ధం ఇలాగే సాగితే ఓటమి తప్పదేమో అన్న అనుమానం కలిగింది. ఇక ధర్మయుద్దం పనికిరాదనుకున్నాడు. మాయోపాయం ఆలోచించాడు.
రాక్షసపతి నీచాలోచనలు శ్రీరామచంద్రునికి అర్ధమయ్యాయి. శత్రువు బలహీనంగా వున్నప్పుడే పడగొట్టాలి అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అగస్వుడు తనకిచ్చిన దివ్యాస్తాన్ని ప్రయోగించాడు. అతి
69
భయంకరంగా కదలిన దాని ప్రతాపం చూస్తే ప్రత్యర్థికున్న వేయితలలు ఒక్కసారిగా తెగిపడాలి- అనిపించక మానదు. అంత వేగంగా బయలు దేరింది ఆ బాణం. అయినా రావణుడు నిర్భయంగా నిలబడ్డాడు. అతని వెన్నులో ఎంత వణుకు పుట్టినా మహేశుని అపారమైన కరుణ ఉంది అతనిమీద. వట్టిచేతులతోనే మహోధృతంగా మీదికి వస్తున్న రాముని బాణాన్ని ఒడిసిపట్టుకొని రెండుముక్కలు చేసాడు. ఆ రెండు ముక్కలను రెండుచేతులతో రామునిమీదకే విసిరేసాడు. అందులో ఒకటి దూరంగా పడింది కాని, రెండోది రామునికి తగిలింది. ఆ దెబ్బతో శ్రీరామచంద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు.
అదిచూచి రాక్షస సేన సంతోషంతో చిందులు వేసింది. తమ రాజు గొప్పతనాన్ని మెచ్చుకొంటూ బహుపరాకులు చెప్పసాగింది. పుష్పకంలోని మునులు విషాదసాగరంలో మునిగిపోయారు. మబ్బుల మాటున సురగణాలలో అంతవరకూ వున్న ఆనందం ఆవిరైపోయింది. ఇక తమకు విముక్తి లేదని విలపించ సాగారు. చతుర్ముఖ (బ్రహ్మ వారి దుఃఖాన్ని చూచి ఓదార్చి థైర్యంచెప్పాడు- 'విచారింపనేల? జరుగుచున్న నాటకమున నిది ప్రథమాంకము. ద్వితీయార్ధము ప్రారంభము కానున్నది, చూచి యానందింపుడు' అని వాళ్ళలో మళ్ళీ ఆశలు రగిలించాడు. క్రింద రణభూమిలో విజయోత్సవం జరుపుకొంటున్న రాక్షససేనలతో కలసి సహస్రకంఠుడు ఆనందతాండవం చేయసాగాడు.
ఇప్పుడు విమానంలో సీతమ్మ మాత్రమే నిబ్బరంగావుంది. ఆమె ముఖం చూచినవారికి ఈమె కిదంతా ముందే తెలుసా!” అనిపిస్తోంది. తాపసులంతా ఆమెనుజేరి చేతులు జోడించి “అమ్మా సీతమ్మ తల్లీ ! జగన్మాతా! నీవు చెప్పినదంతయు జరిగినది. ఈ సహ్రకంఠుడు చేసిన పని ప్రత్యక్షముగ చూచితిమి. అతడెంతటి యోధుడు కానిచో బహు
70
పరాక్రమవంతులైన మన ముగ్గురు దళాధిపతులు తమ సేనలతోసహా కదనభూమి నుండి యంతర్జ్థానమై యుందురు ! మన ప్రభువు శ్రీరామచంద్రమూర్తి పరాజయము నొందుట మిగుల వింత గొలుపు చున్నది. మనయెడల విధి యెంత క్రూరముగ వర్తించినది ! రణభూమి యందొంటరియై నిస్సహాయ స్థితిలో పడియున్న ప్రభువును చూచియు నీవేల మిన్నకుంటివి? నీవు జగన్నాతవే ! ఈ రాక్షసాధముడు మనకిట్టీ యాపదను తెచ్చిపెట్టెను కదా ! నీవింకను నోరిమి వహించుట తగునా? మా ప్రార్ధన వినుము. వెంటనే లేచి విజ్బంభించుము. శిక్షార్డుడైన వీని నంతమొందింపుము. లెమ్ము తల్లీ ! లెమ్ము అంటూ మొరపెట్టుకున్నారు. సీతామహాదేవి మహాకాళ యగుట
మునుల ప్రార్ధన వింటూండగానే సీతామహాదేవిలో అద్భుతమైన మార్పు మొదలైంది. ఆకర్షణీయమైన ఆమె స్మితవదనం గంభీరంగా తయారైంది. చంద్రకాంతులు వెదజల్లే ఆమె నేత్రద్వయం ఎరుపెక్కి భయంకరంగా మారింది. అర్ధచంద్రాకృతిలోని చిరు లలాటం ఆకాశమంత విశాలమైంది. అందమైన ఆమె కురులు బిరుసెక్కి నిక్కబొడుచుకున్నాయి. రక్తగోళాలవంటి కళ్ళతోను, పొడవుగా బయటకు సాగిన నాలుకతోను, కుసుమకోమలాలైన ఆ చేతుల్లో కరకు కత్తులతోను, బంగారునగలు ధరించే మెడలో కపాల మాలలతోను ... అప్పుడు సీతామహాదేవి స్థానంలో సాక్షాత్తూ కాళికామాత కనిపించింది. అతి భయానకమైన ఆ రౌద్రరూపం విమానం నుండి ఒక్కసారిగా క్రిందికి దూకింది. ఆకాశమంత యెత్తు పెరిగి సహస్రకంఠరావణుని మీద అమాంతంగా విరుచుకు పడింది.
రావబాసురునకు ఎదురుగా కనిపించే దృశ్యం నమ్మశక్యం కావడంలేదు. భయంకరమైన ఆ కాళీరూపంలో మృత్యుదేవత అలా
71
మీదపడుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆమెను ఎదిరించాలనే ఆలోచన కూడా రాకముందే క్షణకాలంలో ఆమె చేతులనుండి అతని వేయి తలలు మిగులముగ్గిన మామిడి పండుల్లా నేల రాలిపడ్డాయి. రాక్షస సైన్యమంతా ఆమె కాళ్ళకింద పడి నల్లుల్లా నలిగిపోయారు. రణరంగ మంతా రాక్షసుల శవాలతో నిండిపోయింది. మునులు, దేవతలు ఆనందంతో పొంగిపోయారు.
రాక్షసులంతా చనిపోయారు. సీతామహాదేవి కాళిక రూపం యెొత్తిన అవసరం తీరిపోయింది. లోకానికి రాక్షసపీడ తొలగిపోయింది. అయినా ఆ ప్రళయమూర్తి శాంతింపలేదు. మహా భయంకరంగా ప్రళయనృత్యం చేస్తూ పెద్దపెద్ద పొలికేకలతో తన మాతృకలందరినీ ఆహ్వానించింది. వేలకొలది కాళీరూపాలు ఆమెచుట్టూ ప్రత్యక్షమయ్యాయి. వారంతా కలిసి శవాలనన్నింటిని పోగుజేసి ఎత్తుగా గద్దె ఒకటి సిద్ధం చేసారు. దానిమీద సీతామహాకాళి వికటాట్టహాసం చేస్తూ ఒక నియంతలా కూర్చుంది. కొందరు ఆమెకు వింజామరలు వీస్తూంటే మరికొందరు కైవారాలు పలుకుతున్నారు. తన ఆనతికోసం ఎదురుచూస్తున్న మిగిలిన వారినందరినీ వేడుకలు చేయుడని ఆదేశించగా వాళ్ళందరూ తెగిపడిన తలలను తన్నుకుంటూ, బంతులాడుకొంటూ తమ నృత్యాలతో భీభత్సం సృష్టించారు.
సహ(స్రకంఠ రావణ వధ పూర్తయిందన్న సంతోషంతో ఉన్న దేవగణాలకు మహాకాళి కోపాగ్ని అలాగే వుంటే ముల్లోకాలను దహించివేస్తుందన్న భయం పట్టుకొంది. అందరూ మళ్ళీ బ్రహ్మ దగ్గరకు చేరి, వాని నాయకత్వంలో యుద్ధభూమికి వచ్చారు. సీతామహాకాళిక ముందు సాష్టాంగపద్డారు. శాతించుమని వేడుకొన్నారు. సహస్ర నామాలతో ఆమె కీర్తిని గానంచేసారు. ఆ భీకరాకారాన్ని తాము భరించలేమన్నారు. లోకాలను దహించ వద్దని ప్రార్ధించారు. ప్రాణదాతవైన నీవు హంతకివి
72
కావద్దన్నారు. కరుణించి కాపాడుమని అనేక విధాలుగా శరణు వేడుకున్నారు.
ఆ కాళికారూపం కొంత శాంతించింది. బ్రహ్మదేవునకు కనుసన్న చేసింది. అతడు రణభూమిలో పడివున్న శ్రీరామచందద్రమూర్తిని తట్టి లేపాడు. నిద్రనుండి లేచినట్లు రాముడు లేచాడు. తన విల్లంబుల కోసం వెదకి హదావిడిగా వాటినందుకున్నాడు. 'ఎక్కడ ఆ రాక్షసుడు? వాడినింక వదలను” అంటూ చుట్టూ కలదిరిగాడు. ఎక్కడ చూచినా శవాలు, వాటిమీద గంతులేస్తున్న మాతృకలే కనిపిస్తున్నారు. దూరంగా పెద్ద ఎముకల గుట్ట, దానిపై దర్జాగా కూర్చున్న ఒక భీకరాకృతి కనిపించింది. ఆ రూపాన్ని చూడగానే అంతటి రాముడు భయంతో వణికి పోయాడు. చేతులలోని విల్లమ్ములు జారి పడిపోయాయి. తెరచుకున్న నోరు తెరచుకున్నట్లే కొయ్యబారి పోయింది.
ఉలుకూ పలుకూ లేక కళ్ళప్పగించి చూస్తున్న శ్రీరాముని బ్రహ్మదేవుడే మళ్ళీ దగ్గరకు బేరి పలుకరించాడు. అతడు సహస్రకంఠ రావణుడు విసిరిన బాణంముక్క తగిలి పడిపోవడం, సీత్రామహాదేవి మహాకాళిగా మారడం, వేయితలల రావణుని క్షణకాలంలో సంహరించటం . . . ఇలా జరిగిన కథనంతా వివరంగా చెప్పాడు. రాముడు తాను విన్నదంతా నిజం అని నమ్మలేక పోతున్నాడు. ఎదురుగా కనిపించే భయంకరమైన వికృతరూపం అతి సుకుమారమైన తన ఫీతదేనంటే ఎలా నమ్మాలి? అతి భయంకరుడైన సహస్రకంఠ రాక్షసుని క్రుటిలో
సంహరించిందంటే ఆమె ఆదిపరాశక్తే కావాలి, తన సీతకాదు అనుకొంటూ భయం భయంగానే అడుగులువేస్తూ చేతులు జోడించాడు. వినయంగానే “పరమేశ్వరీ ! నీవెవరవో నాకు తెలియదు. నన్ను క్షమించి నీ కరుణా వీక్షణములు నాపై ప్రసరింపుము' అని ప్రార్థించాడు
73
మొదటిసారిగా కరుణారస పూరితాలైన కన్నులతో సీత్రామహాకాళిక నవ్వింది. “ వినుము, నేను మహేశ్వరిని. అన్ని శక్తులకు మూలకారణమైన ఆదిశక్తిని నేను. దివ్యదృష్టి నొసంగుచుంటిని చూడుము” అని తన నిజరూపాన్ని చూపించింది. ఈ సారి శ్రీరామచంద్రుని దివ్యదృష్టికి నమ్మశక్యం గాని కమనీయ దృశ్యం సాక్షాత్కరించింది. ఉన్నతమైన రత్న ఖచిత సింహాసనం మీద కోటిసూర్య ప్రభా భాసమానంగా కూర్చొని ఉన్న పరమేశ్వరి వెలుగులీనుతూ కనిపించింది. ఆమె మెడసిండా సువాసనలు వెదజల్సుచున్న పూలమాలలు అలంకరించి ఉన్నాయి. తలమీద తళతళా మెరిసిపోతున్న అమూల్యములైన రత్నాలు పొదిగిన సువర్ణ కిరీటం కాంతులీనుతూంది. శుభకరమైన రంగురంగుల చీరలు ధరించింది. రంగారు బంగారు అభరణాలు ఆమె శరీరంనిండా ప్రకాశిస్తున్నాయి. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టుతో విలాసంగా అమె కూర్చొని ఉంది. తుంబుర నారదాదులు తమ మధుర గానంతో ఆమెను కీర్తిస్తున్నారు. బ్రహ్మదేవుడు వేద మంత్రాలు పఠిస్తున్నాడు. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది సకల విషయాలను శ్రీమహావిష్ణువు అమెకు వివరిస్తున్నాడు. పరమ శివుడు ఆమె ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అల్లంత దూరంలో సాక్షాత్తూ మృత్యుదేవత అయిన యమధర్మరాజు భయభక్తులతో చేతులుకట్టుకొని నిలబడ్డాడు. విశ్వమంతా ఆమె రూపంగానే కనిపిస్తున్నది.
ఆ దృశ్యం వర్ణనాతీతం. వేయినామాలతో స్తుతిస్తూ, చేయి మారులు నమస్కరించే శ్రీరామచంద్రుని చూచి ఆదిశక్తి చిరునవ్వులు చిందించింది. తాను అదే రూపంలో మానసోత్తర పర్వత సానువుల్లో నిలిచిపోతానంది. కావలసిం దేదైనా కోరుకుంటే ఇస్తానంటూ ఒక తల్లి తన బిడ్డను అడిగినట్లు వాత్సల్యం చూపించింది. ఇప్పుడామెలో (క్రేమ తప్ప కోపం లేదు.
74
పరమ శాంతమూర్తిలా కనిపిస్తున్న పరాశక్తిని చూచి మళ్ళీ నమస్కరించి శ్రీరాముడు మూడు కోరికలు కోరాడు. తాను దివ్యదృష్టితో చూచిన ఆదిపరాశక్తి రూపం సదా తన హృదయంలో స్థిరంగా ఉండాలని మొదటి కోరిక. తనకోసం ప్రాణాలర్పించిన తన సైనికులను తిరిగి బ్రతికించు మన్నది రెండవ కోరిక. తాను చేయబోయే సాహసకృత్యాలలో ప్రతిసారి జయం కలిగేటట్లు దీవించు మన్నది మూడవ కోరిక.
“తధాస్తు అన్నది ఆ జగదేకమాత. తాను ఎవరోకాదని, శ్రీరాముని అర్ధాంగి సీత్రామహాదేవిని తానేనని చెప్పి తన పరివారంతో అంతర్జాన మైంది. ఆ వెంటనే సహజ కోమలమైన రూపాన్ని ధరించి, రమణీయమైన వైభవంతో సీత్రామహదేవిగా శ్రీరామచం(ద్ర ప్రభువును చేరి తానేమీ ఎరుగనట్లుగా వినమ వదనంతో నిలబడింది. ఆమె ఇప్పుడు సిగ్గుతో చెక్కిళ్ళు కెంపులు కురుస్తున్న సీతమ్మ. నిజం తెలిసికొన్నాడు రామచంద్రుడు. తానెవరో, తన భార్య శక్తి యేమిటో గుర్తించాడు. సాదరంగా సీతమ్మను దగ్గరకు తీసికొని పుష్పక విమానం అధిరోహించాడు. మునులు కూడా సంశయ రహితులై ఆ దివ్య దంపతులకు అంజలించి విమానం ఎక్కారు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న దేవతలు వేనోళ్ళ సీతా రాములను ప్రస్తుతించారు. తమకింక స్వేచ్చ లభించినందుకు ఆనందంతో వారి కీర్తిని గానం చేసారు.
తిరుగు ప్రయాణం మొదలైంది. అందరూ ఆనంద తన్మయత్వంలో మునిగిపోవటం వలన సమయం తెలియలేదు. మాటల్లోనే సరయూనదికి చేరుకొన్నారు. మరుక్షణమే విమానం అయోధ్యలో దిగింది. ఆనంద కోలాహలం మిన్ను ముట్టేటట్లు పురజనులందరూ వారికి స్వాగత వచనాలు పలికారు. పట్టణమంతా ఆరోజు పండుగ చేసికొంది.
అద్భుత రామాయణ కథ సంపూర్ణమ్ 75
శ్రీరామచంద్రప్రభువు సీతామవాదేవితో కూడి ఆతరువాత అనేక శతాబ్దాలు భూమిని పాలించాడు. ఆయన పరిపాలనను ఆదర్శపాలనగా తరువాత తరాలవారు గుర్తుంచుకొంటున్నారు.
ఆ విధంగా నూరు కోట్ల రామాయణాలలో ఉత్తమోత్తమమైన అద్భుత రామాయణ కథను తన శిష్యుడైన భరద్వాజునకు చెప్పి మహర్షి వాల్మీకి కవి కథను పూర్తి చేసాడు.
మంగళం మహత్ టి జట /్ పు? పలల ప్రమ్రైడ లో 76
ననిన ॥ వై; న. . జి అష " తమ్మవరపు రామచంద్రరావు - సత్యవతి పీతామభహోదేవి మభళాోకాళి యగుట మునుల ప్రార్థన వింటూండగానే సీతామహాదేవిలో అద్భుతమైన మార్పు మొదలైంది. ఆకర్షణీయమైన ఆమె స్మితవదనం గంభీరంగా తయారైంది. చంద్రకాంతులు వెదజల్లే ఆమె నేత్రద్వయం ఎరుపెక్కి భయంకరంగా మారింది. అర్ధచంద్రాకృతిలోని చిరు లలాటం ఆకాశమంత విశాలమైంది. అందమైన ఆమె కురులు బిరుసెక్కి ;. నిక్కబొడుచుకున్నాయి. రక్తగోళాలవంటి కళ్ళతోను, పొడవుగా . బయటకు సాగిన నాలుకతోను, కుసుమ కోమలాలైన ఆ చేతుల్లో కరకు కత్తులతోను, బంగారునగలు ధరించే మెడలో కపాల మాలలతోను.. అప్పుడు సీతామహాదేవి స్థానంలో సాక్షాత్తూ
- కాళికామాత కనిపించింది. అతి భయానకమైన ఆ రౌద్రరూపం . విమానం నుండి ఒక్కసారిగా క్రిందికి దూకింది. ఆకాశమంత ఎత్తు పెరిగి సహస్రకంఠ రావణుని మీద అమాంతంగా విరుచుకు పడింది. [, |