Telugu abhinava drukpatham - anilvaranasi/indianlanguages GitHub Wiki
వ. టు రం లే ॥ క నట. , శ ట్. కః ఆ వపా. న? " ఎస్ ము ం్ళ క్ న... మ. ౨ లు. న | న! క. నా ట్ర గట నడ బాద ఎలినరులా ర రటనడ్ నా ణా మ్మ లం న నే? . క - ఏ -- థి ౮ శ | , ం
తెలుగు కవిత దో యా ద్యక్సథం /4 అభినవ నూ డా, బన్న్మ అంలయ్య అ౦౧164 ర్స్ నగి 604047 భం ఊోరికిగర్ట్యగ్య కం నరం,
75666 నగల - ఉండలి లగ11రషం[14గ లగి 52౧12 40222౧ తీ55001266 0/018530/ అంం౭గగ౧౧6౧€ 01 18104606 ర య గ21306/2 6౧౧/౭16/ స 7/2120621506 009 (4౧) కగు హ్ 4 యో ల్ డు అ 4౩౪0౯ ఆ గంధా.మాు లోకీ ఆ య్యా ద్ కమల. లి న. భాం చ క క్గంఓ 661400 : 8000 2001 6౦. ౫౦..8..4 = ో 6౦౧165 వ 1000 (శ్ | ష్. అ ఖ్ న్ యం వరే. న్నా యు ర్ట నిగంఅ. ఓ0!80/ అంగం: గ్వ 1100-00 గ్ర 041౧30600౧ గం 60-00 రు ల సా... కంం% ౧రగ66 న &5513620066 52౧౦060౧66 0౫ 1 ₹౪ఆ6౦.౦.0 6౧౦ గజ! 26/2 6౧౫6౮౪6 82౧32! గ౦గ౦౦౧|౬: వ వ ఆంత శ ౧౧%. ఉం, 6౧1౪౩1” గట 6 50616౧06 6౦1686 ౧౧౧౧౪౩ 5408626, ౧2౧౮21 - 506 001 ౧00౧6: 08712-569661 నిగగ666 26 గీ5లిం!02 గగం౧౧8 ఆగం6 రిగగ కం 5653166 గి8ర[౧1:2 "౧6806 ౪/2౭/2౧84! ౯౧౦౧౪: 427404
శ న. ల్ని చాలూ లా రల నా రారా ' గర ” మ్ [1 న్న న్నే ఛీ ) | స! / " స , . 1 ఆ | గ కయట్ మలుచుకోనిళ్ళిన ప [మున ఈ గ య్య గారికీ ౦కితం
కృతజ్ఞతలు 'పరిశోధకుడికి ఒక వ్యక్తిత్వముందాలి, అప్పుడే తనదైన దృక్పధమొకటి ఏర్పర్చుకో గలడు' అంటూ నా ఆలోచనలకు స్వేచ్చనిచ్చి నా పరిశోధనకు మార్గదర్శకత్వం వహించి, వ్యాససంపుటిని అంకితం తీసికోవదానికి అంగీకరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారికి...
నా విద్యావిషయక అభివృద్ధిలో అమితంగా ప్రోత్సహించి నా ఎదుగుదలకు దోహదపడిన ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం, ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య, ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు, ప్రొఫెసర్ హరి శివకుమార్, డా॥ పి.వి. రమణ గార్లకు. ..
తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య బి. రుక్మిణి, దా॥ క. కాత్యాయని, దా॥ పి. జ్యోతీ, దాః! కె. యాదగిరి; కొత్త ఆలోచనలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే మిత్రులు సీతారాం, నా వ్యాసం ఎక్కడ అచ్చులో చూసినా అభిఉందిస్తూ ఉత్తరాలు రాసే కవిమిత్రులు డా॥ అఫ్సర్ గారికి. = =
అభిప్రాయాలతో విఖేదించినా అంతరంగంలో కలిసిపోయే ఆత్మీయులు దా॥ పంతంగి వెంకటేశ్వర్లు, పాతూరి రఘురామయ్యలకు, నా రచనా వ్యాసంగాన్ని ఎప్పుడూ వెన్నుకట్టే బాబాయి బన్న దేవేందర్, పిన్ని వినోద, సోదరి కళ్యాణి-కొరివి యాదగిరి, సోదరులు యన్. సుదర్శన్, గద్ద వెంకటేశ్వర్లుకు, డా. వి.యస్. రాజుకు, ప్రెస్ కాపీని సిద్ధం చేసిన తమ్ముడు మాతంగి వీరస్వామి, మన్నె శ్రీనివాస్, సరికిటి క్రాంతి, విద్యార్ధి మిత్రుడు పరిపూర్ణాచారి, పల్లేరు వీరస్వామి గార్లకు . =
నా ఆలోచనలోని 'సరికొత్త చూపుని గుర్తించిన “ప్రవహించే జ్ఞాపక కవి
దళితరాజ్యం, విమర్శిని, విశాలాంధ్ర ఇంకా ఇతర పత్రికా సంచికల్లో ఈ వ్యాసాలను ప్రచురించిన సంపాదకులకు ..
ఈ వ్యాససంపుటి ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన మా కాకతీయ విశ్వవిద్యాలయం యు.జి.సి. కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ యన్. సత్యనారాయణ గారికి, యూనిట్ సిబ్బందికి. . -
నా సాహితీ వ్యాస రచనకు సహకరించిన సహచరి విజయకు. .
పుస్తకాన్ని ముద్రించిన అళోకకృష్ణ ఆఫ్సెట్ ప్రింటర్స్, అధినేత నాగుల యుగంధర్, వారి సిబ్బందికి. . =
= రచయిత |
నివేదన
సాహిత్య విద్యార్థిగా నా తొలిమలి అడుగులు కవిత్వం వైపు పడ్డాయి. 1989 సంవత్సరములో రహస్యచిత్రం, 1998 సం॥లో నిప్పుకణిక పుస్తకాలు నాకొక గుర్తింపు నిచ్చాయి. రెండడుగుల నేలతోనే సరిపెట్టుకోకుండా మూడో అడుగుతో నేను సాగిస్తున్న (ప్రస్థానంలో భాగమే ఈ “తెలుగు కవిత అభినవ దృక్పథం” అన్న పుస్తకం.
ధ్వని, రసంల గురించి, బెచిత్య, వక్రోక్తుల గూర్చి, మార్చియన్ ఈస్తటిక్స్ గురించో లేదా మరిదేని గుర్తించో ఎంత ధారాళంగా మాట్లాడుకుంటామో, సాహిత్యంలో దళితవాదం, దళితదృక్పథం, ఆత్మాఖిమాన, ఆత్మాభిమాన పోరాటాల గురించి వాటి సాహిత్య అభివ్యక్తి రూపొలగురించి వాటివాటి నేపథ్యాలగూర్చి నిన్సంకోచంగా మాట్లాడుకునే స్థితి ఒకటి రావాలని నాకున్న చిన్న కోరిక. సాహిత్య దృక్పథాలను మరింత ప్రజాస్వామ్యీకరించడం ఒక అనివార్య అవసరం.
కాబట్టే నా అకాడమిక్ జీవితంలో చదవడం రాయడం ఒక భాగమైపోయింది. ఈ వ్యాసాల్లో ఎక్కువ భాగం దళిత దృక్కోణం ఉన్నా అకడమిక్ క్రమళిక్షణని విధిగా పాటించానని నేను అనుకుంటున్నాను. అందుకే టెక్స్ట్నే ఆధారం చేసికొని చర్చ చేసాను.
ఈ సంపుటిలోని ప్రతివ్యాసానికి ఒక్కొక్క సందర్భముంది. సందర్భం వేరైనా అన్ని వ్యాసాల్లో దృక్సధ సామ్యముంది; ఒకటి రెండు వ్యాసాలకు మినహాయింపున్నదని సహృదయులు గుర్తించినా, నవ్యత ఉన్నదని (గ్రహిస్తారు. రాయప్రోలు కవిత్వంలో కులమతాల ప్రస్తావన (13,14 మార్చి 1993), మహాభారతం - వర్ణవ్యవస్థ (45 మార్చి 1999), ప్రబంధం - వర్ణవ్యవస్థ (13, 14 మార్చి 2000) వ్యాసాలు కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం నిర్వహించిన జాతీయ సదస్సులో సమర్పించిన ప్రసంగ వ్యాసాలు. ఈ శతాబ్దికవి జాషువా (1996), పాల్కురికి సోమన - దళిత దృక్కోణం (1997) రెండువ్యాసాలు మా తెలుగుశాఖ వెలువరిస్తున్న పరిశోధనా పత్రిక విమర్శిని - 10,11 సంచికల్లో ముద్రితమైనవి. వైజ్ఞానిక దాశరథి (ఆగస్టు 1095)
వ్యాసం పేర్వారం సాహితీ నీరాజనం షష్టిపూర్తి సంచికలో ప్రచురించబడింది. పోటెత్తిన దళిత భావార్డవం - మద్దూరి కవిత (మార్చి 1997) దళిత రాజ్యంలో అచ్చైంది. గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్పధం కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యలో చదువుతున్న ఎం.ఏ. విద్యార్దులకోసం రాసిన వ్యాసం. ఆధునిక తెలుగు కవిత-దళిత కవిత్వం (1999 - 2000) మైనర్ రీసెర్చ్ (ప్రాజెక్టు కింద యు.జి.సి.కి సమర్పించిన వ్యాసం, తెలుగులో పోస్టు మాడ్రనిజం చర్చ జరుగుతున్న తరుణంలో దళిత స్రీ వాదాల గూర్చి పరంపరగా వ్యాసాలు వస్తున్న తరుణంలో ఆకోవకే చెందినదైన ప్రసేన్ కవితా సంపుటి “ఏదీకాదు మీద వ్యాసం రాయాల్సివచ్చింది.
వర్తమాన సాహిత్య వివేచనకు ఈ వ్యాసాలు ఏమాత్రం దోహదం చేసినా నా ప్రయత్నం సఫలమైనట్లే.
= రచయిత
కొత్త సందర్భం = సరికొత్త చూపు
శ్రీవాణి నుంచి దళితవాణిదొకా సాగి వచ్చిన తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని “అభినవ దృక్పథం” పేరిట పరిశీలించిన పదివ్యాసాల సంపుటి ఇది. డా॥ బన్న అయిలయ్యగారు ఈ సంపుటికి ముందు 'నిప్పు కణిక, రహస్యచిత్రం' లాంటి కవిత్వ సంపుటాలను అందించి కవిత్వంలో ఒక స్థానాన్ని పొంది ఉన్నారు.
తెలుగుకవిత “అభినవ దృక్పథం' అన్న పేరును వ్యాసాలు చదవకముందు విన్నప్పుడు అభ్యంతర పడ్డాను. ప్రసిద్ధ విమర్శకులు రా.రా. సాహిత్య విమర్శ సంపుటిని (సారస్వత వివేచన అన్నప్పుడు ఇటువంటి అభ్యంతరాలే వచ్చాయి. 00౧16౧1దృష్టితోనే ఏ రచననైనా స్థిరపరచాలేతప్ప, పేర్లను బట్టికాదని అయిలయ్య గారి పది వ్యాసాలను చదివాక ఈ వ్యాససంపుటికి ఇదే సరైన పేరని అనిపించింది. పాతమాటలకు ఉన్న పాత అర్జాలనుంచి కొత్త సందర్భంలో అవే పాతమాటలను వాడి కౌత్త అర్ధాన్ని ఆ అర్ధ స్ఫూర్తిని కలిగించడంలో అయిలయ్యగారు సఫలమయ్యారు. దళిత దృష్టికోణంతో, సాహిత్యాన్ని విశ్లేషించవలసి వచ్చినప్పుడు సాధారణంగా సమకాలీన సాహిత్యాన్ని మాత్రమే పట్టించుకోవడం పరిపాటి. ముఖ్యంగా దళిత కవిత్వం 1980ల తరువాత ఉధృతంగా వచ్చి ఉద్యమరూపాన్ని పొందాక సాహిత్య విమర్శ దళిత దృక్పథంతో పదునెక్కిందని, చిక్కబడిందని అంతా భావించారు. అది నిజం కూడా. వర్తమాన లేదా సమకాలీన ఉద్యమతత్త్వాన్ని ఆ దృక్పథాన్ని పూర్వసాహిత్యానికి వర్తింపజేస్తూ, సాహిత్యాన్ని వివేచించడం కష్టమైనపని.
ఈ కష్టమైన పనిని ఓర్పు, ప్రయాస ఉంటే తప్ప (ప్రాచీన సాహిత్యాలను దళిత స్త్రీవాద దృష్టికోణాల్లోంచి పరిశీలించడం సాధ్యంకాదు. దళితవాద సాహిత్య విమర్శకులు దళితవాద కళాతత్త్వానికి కావలసిన పరికరాలను ప్రాచీన ఆధునిక సాహిత్యాల నుంచి వెలికితీసి చూపడం ఈ వ్యాసాల ప్రత్యేకత. 'కొండ అద్ధమందు కొంచెమైయుండదా' అన్నట్టు అయిలయ్యగారు ఒక్కొక్క వ్యాసాన్ని ఒక్కో ప్రత్యేక అంశంతో దళితవాదదృక్పధంలోంచి విశ్లేషించి చూపారు.
ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు అయిలయ్య గారిలోని పరిశోధకుడు, ఎకాడమీషియన్ పోటీపడి ఇవి రాసారనిపిస్తుంది. మహాభారతం వర్ణవ్యవస్థ గురించి చెబుతూ నన్నయ్యగారు ఉటంకించిన “'ధర్మతత్వజ్ఞ్డులు ధర్మశాస్తంబని" అన్న పదాన్నే మరికొంత విస్తరించి సామాజికులు సమాజ శాస్తంబని నన్నయ్యగారే చెప్పిఉంటే ఆ శాస్త్ర దృష్టికోణంలోంచి మహాభారతాన్ని విస్తృతంగా చూసి ఉండేవారని చెబుతూ ఇప్పటిదాకా ఏ విస్తృత కోణమైతే ఉన్నదో దానిని మన దృష్టిలోకి తీసుకు వచ్చారు.
దృక్పథబలం, దృష్టినైశిత్యం ఈ రెండు లక్షణాలు అయిలయ్య గారిలో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ రెండూ ఉన్నచోట విమర్శకులలో సంయమనం కోల్పోవడమో బెచిత్యం కోల్పోవడమో జరుగుతూఉంటుంది. అయిలయ్యగారిలో సంయమనం అనే మరొక గుణంకూడా ఈ వ్యాసాలకు పుష్టినిస్తున్నది. తెలుగు సాహిత్యంలో మాల దాసర్ల కథలను మడివాలు మాచయ్యల కథలను వైష్ణవ శైవ సంప్రదాయాల్లోంచి, భక్తి ప్రపత్తుల్లోంచి, వీరతా రూపాల్తోంచి చదివి ఆనందించడం వేరు. దళిత దృక్పథంలోంచి వీక్షించడం వేరు. ఈ పనిని అయిలయ్యగారు సమర్ధంగా చేసినందుకు అభినందించక తప్పదు. పదివ్యాసాలలో మూడు, ప్రాచీన సాహిత్య సంబంధితాలు. ఒకటి : రాయప్రోలు కవిత్వాలలో కులమతాల ప్రస్తావనను, రాయప్రోలు లాంటి కవులకుండే 'సముదాత్త ఉదారి పరిమితులను అయిలయ్యగారు. బాగా గుర్తించారు. ఒక వ్యాసం జాషువాను ఈ శతాబ్ది కవిగా ఆవిష్కరించినదైతే, జాషువా దళితకవి గనుక, వ్యాసకర్తా దళితుడే కనుక, దళితాఖిమానంతోటి, దళితాభినివేశం తోటి చూసి కీర్తించకుందా, దళిత దృక్చథ (క్రమళశిక్షణలోంచి విశ్లేషించి చూపారు.
దళిత కవులుగాని, దళిత విమర్శకులుగాని దళితత్త్వాన్ని తమ కెరీరిజానికి వాడుకుంటున్న కాలంలోనే ఎకడమిక్ నిబద్దత ఉన్న అయిలయ్యలాంటి విమర్శకులు దళిత దృక్పథానికి ఉన్న పరిధిని స్త్రీవాదులు అభ్యంతర పెట్టకపోతే దాని 'పావిత్ర్యాన్ని కాపాడారు. ఈ పదివ్యాసాల్లో “వైజ్ఞానిక దాశరథి” అనే వ్యాసమొకటి విలక్షణంగా కనిపించినా ఆ కవిలోని విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని సమగ్రంగా ఆవిష్కరించింది. ఒక రకంగా పర్యావరణ స్పృహ బలంగా వ్యక్తమవుతున్న ఈ కాలంలో తెలుగులో సైన్సు
' కవిత్వము, పర్యావరణ కవిత్వము, అధికారికంగా రావడాన్ని అపేక్షించదగిన మార్పుగా ఈ వ్యాసం ఆహ్వానిస్తున్నది. “బోయి భీమన్లు గారి దృక్పథాన్ని 'గుడిసెలు కాలిపోతున్నాయి” అన్న రచనను విశ్లేషించడం ద్వారా నిరూపించారు. అయ్యిలయ్యగారిలో మరో విలక్షణ
అంశమేమంటే సంచలనాత్మక వ్యాఖ్యలుగాని, సంయమనం కోల్పోయిన వ్యాఖ్యానాలు గాని, చేయకుండా నిగ్రహాన్ని పాటించడం. తను పరిశీలించిన కవులకు ఉన్న పరిమితులను కూడా అయిలయ్య గారి దృష్టిలో ఉంచుకున్నట్లు మనకు కన్పిస్తుంది. స్థల, కాలదృక్పథ తాత్తికతల పరిథుల్ని, పరిమితుల్ని ఆయాకవులకు ఉన్నాయని గుర్తించడం వల్ల ఒక వెసులు బాటును అయిలయ్యగారు ఈ వ్యాసాల్లో పొందగలిగారు. ఏ మేరకు ఆయాచోట్ల దళిత దృక్పథం ప్రతిఫలించిందో అదెలా ఆయా సందర్భాలలో ప్రతిభాసించిందో నేర్పుతో చూపగలిగారు. ఈ సంపుటిలో మరోరెండు వ్యాసాలు మద్దూరి నగేష్ బాబు కవిత్వం గూర్చి, మరొకటి ప్రసేన్ 'ఏదీకాదు' గురించి ఉన్నాయి. ఈ రెండు వ్యాసాల్లోని ఇద్దరు కవులలోని గుణగణాలను విశ్లేషిచడంలో అయిలయ్య ప్రతిభ కన్పిస్తుంది. పోటెత్తిన దళిత భావార్థవంగా మద్దూరి కవితను విశ్లేషిస్తూనే, వర్తమాన కల్లోలకవితగా “ఏదీకాదు ను ఒక ఆధునికానంతర కవితా సంపుటిగా పేర్ళొనకుండానే పేర్కొన్నారు. కాలానుగుణంగా సైద్ధాంతిక చట్రాలు మారిపోయే క్రమంలో మారే ఆలోచనా పద్ధతుల్ని తెలుసుకుని సాహిత్యాన్ని ఆ పరిస్థితికి అనుగుణంగా వ్యాఖ్యానించుకోవల్సిన అవసరాన్ని అనివార్యంగానే అయిలయ్య గారు గుర్తించడానికి నిదర్శనం ఇది. ఇది పోస్ట్ మోడర్నిజం చెప్పే లక్షణం కూడా! ఈ రెండు వ్యాసాలకు నడుమ ఆధునిక తెలుగు కవిత దళిత కవిత్వం అన్నది ఒకటి. దీన్లో దళిత కవిత్వ నేపథ్యాన్ని, సామాజిక తాత్త్విక, సాహిత్య నేపథ్యాలను సమగ్రంగా ఆవిష్కరించి చూపారు.
విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు, అకాడమిక్ మేధావులు రాసే వ్యాసాలు సాధారణంగా కొరుకుడు పడవనే అపవ్రథ ఒకటుంది. అయిలయ్యగారు దీనికి మినహా యింపుగా కనిపిస్తున్నారు. రా.రా మాటల్లో చెబితే “తగిన సిద్ధాంత పరిజ్ఞానంతో సాహిత్య విమర్శలు రాయడం తెలుగు సాహిత్యంలో ఇటీవల వస్తున్న పరిణామం. సాహిత్య విమర్శకు కావలసిన 20206716 యోగ్యతలుండడం కొత్తతరం విమర్శకులలోని సద్గుణం” ఐలే రా.రా ఆ గుణంలోనే అకాడమిక్‌గా ఉండటమనే బలహీనత కూడా ఉంటుందన్నాడు. కానీ, అయిలయ్యగారిలో అది కనిపించడం లేదు. చాలా రకాల (పెజుడిసెస్ని జయించి పరిశోధనకు, విమర్శకు ఉన్న సార్వకాలిక లక్ష్యాన్ని గుర్తెరిగి నత్యావివ్యరణ వైపు, సత్యాన్ని నిష్కర్షగా చెప్పడం వైవు ఓ దళితుడు వేస్తున్న సాహసోపేత్తమైన అడుగిది.
పురాణం, ప్రబంధం, ఖండకావ్యం, గేయకవిత్వం, వచన కవిత్వం, ఇట్లా ప్రక్రియా భేదంతో ఉన్న కవిత్వాన్ని అందులోని దళిత సారాంశాన్ని వెలికితీసి చూపడంలో
అయిలయ్యగారు మెరుగైన ప్రయత్నం చేశారు. ఓ పదునైన విమర్శకుడు, ఓ ఆర్రమైన కవీ, ఒక సహృదయ పారకుడూ, ఓ నిబద్ద పరిశోధకుడూ, ఒక విషయ గౌరవం కలిగిన అధ్యాపకుడూ, సాహిత్య విద్యార్థులకు అందించిన అద్భుత వ్యాససంపుటి. అంతకుమించి నా ఆత్మీయకవి మిత్రుడు డా॥ బన్న అయిలయ్యగారు కొత్త సందర్భంలో సరికొత్త చూపుతో సిద్ధంచేసిన 'అభినవ దృక్పథం” ఇది. ఆదరించండి.
- యాకూబ్
విషయ సూచిక క్ష మహాభారతం - వర్ణవ్యవస్థ ఎఎం క్షే లె పాల్కురికి సోమనాథుడు - దళిత దృక్కోణం . ర్ తె ప్రబంధం - వర్ణ వ్యవస్ట ం క్షే? తీ రాయప్రోలు కవిత్వంలో కులమతాల ప్రస్తావన _... 23 5... ఈ శతాబ్ది కవి జాషువా . 28 6. వైజ్ఞానిక దాశరధి లం 40 7... గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్పధం ంం ర్5్ 8, పోటెక్తిన దళిత భావార్డవం -మద్దూరికవిత ... 65 ర ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం + 77 10. వర్తమాన కల్లోల కవిత ఏదీకాదు లం 99
- మహాభారతం - వర్ణవ్యవస్థ ళా మహాభారతానికున్న మొదటి గుర్తింపు పంచమవేదం. వేదాలకున్న ప్రామాణిక స్థాయి మహాభారతానికి నిరందంగా ఇవ్వబడినదనేది వాస్తవం. ఐదువేల ఏళ్ళ చరిత్ర సంస్కృతి కలిగిన ఒక జతి సమస్తజీవన విధానం మహాభారతంలో ్రసక్తం. తిరుగులేని ప్రశస్తిని పొందిన మహాభారతాన్ని వర్ణవ్యవస్థ దృష్టి కోణంలోంచి అనుశీలించడం ఇప్పుడు మనముందున్న పని.
వ్యాసుడు ఏ కాలంనాటివాడైనా మహాభారతం ఏ కాలంలో ఉదృవించినా తెలుగు మహాభారతం మాత్రం తారీఖులకు దస్తావేజులకు దొరకగలిగిన కాలంలోనే అంధ్రీకరించబడింది. మహాభారత ఆంధ్రీకరణలోని రాజరాజనరేంద్రుడి ప్రప్రథమ లక్ష్యమే వైదిక మత పునరుద్ధరణ. ఈ పునరుద్ధరణ సజావుగా జరిగిందా, ఒడి దొడుకులతో జరిగిందా అనేది కాసేపు పక్కన పెడితే ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని ఎవరు ఎలా అర్ధం చేసుకుంటారు అనే విషయంగా వివరణ నిచ్చిన పద్యం మనమందరం తరుచూ ఉదహరించుకునేదే.
'ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్తంబని అనుకుంటారని భావించే ప్రతిపాదన నుండి ఎంత దూరమైనా మనం వెళ్ళగలం. నన్నయ్య ఈ పద్యంలో ఎందుకనో ఒక చట్రాన్ని ఏర్చర్చాడు. నన్నయ్య యే కనక 'సామాజికులు సమాజ శాస్త్రంబని' అని ఉంటే మహాభారత అనుశీలన సామాజికశాస్త్ర దృష్టికోణం నుంచి కూడా అధ్యయన విశ్లేషణకు గురైఉందేది. అయితే ఈ నా ప్రయత్నం మొదటిది కాదు. కొత్త అంతకన్న కాదు. 11వ శతాబ్దం మొదలుకొని ఇప్పటిదాకా మహాభారతం మీదా ఎన్నో చర్చలు వాదోపవాదాలు జరిగాయి. ఇవన్నీ ఒక కోణాన్ని ఎంతో వెసులుబాటుతో విస్మరిస్తూ వచ్చాయి. ఆ విస్మృత కోణమే మనకు కావాలి. అది వర్ణవ్యవస్థ రూపంలో ఉండవచ్చు. కుల విభజన రూపంలో ఉండవచ్చు. కులాధిక్య, కుల న్యూనతా దృక్పథంతోనూ ఉండవచ్చు.
క్షత్రీయులైన పాండవులు ద్రౌపదీ స్వయంవరానికి వచ్చిన సందర్భంలో అనివార్యంగా బ్రాహ్మణుల రూపంలోనే ఎందుకున్నారో ఒక సామాజిక శాస్ర్రవేత్తగాని
౭ మహాభారతం వర్ణ వ్యవస్థ తేల్చలేడు. కౌశికోపాఖ్యాన కధలో కౌశికుడికి ధర్మసూక్ష్మాలను బోధించిన మాంస వ్యాపారి ధర్మవ్యాధుడు తన పూర్వ జన్మలో బ్రాహ్మణుడు ఎందుకు కావాలో ఎంతకీ అంతుచిక్కదు. మహాభారతంలో కుల (ప్రస్తావన పెద్దగా కనిపించనట్టే ఉంటుంది గాని కులాధిక్యత (ప్రధానంగానే కన్పిస్తుంటుంది. అది బుషుల జన్మ వృత్తాంతంలోను, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాల్సిన అతిరథ మహారథులైన వారి పుట్టుకల మూలాల్లోను మనకు కనిపిస్తుంది. వ్యాస మహా భారతంగాని, దాని ఆంధ్రీకృత రూపంగాని ఒకానొక 010366 0౫1. ఈ వాచకంలో ఒక వ్యవస్థ, ఒక కాలం, ఒక యుగధర్మం, ఒక ప్రచలిత సామాజిక విలువ అవశేష రూపంలో నిక్షిప్తమై ఉంది. వర్తమాన మహాభారతం ఒకానొక 0౧౪౫౭6 గ ఈ వాచకం మన ఉనికిని సామాజిక విలువని వర్ద లేదా కుల వ్యవస్థపట్ల మన దృక్పథాన్ని నిరంతరం ్రతిఫలింప జేస్తుంది. కుమారాస్త్ర విద్యాప్రదర్శనలో ద్రోణుడు ధృతరాష్తునితో తన విద్యార్థుల ఆస్రశస్త్ర విద్యలను చూడాల్సిందిగా కోరిన సందర్భంలో క్షత్రీయోచితమైన విద్యా ప్రదర్శనయే పరమ లక్ష్యంగా ప్రకటించబడింది. తన దగ్గర నేర్వలేని విద్యకు నిరాకరింపబడిన కర్టుడు అర్జునుడితో తన విద్య ద్వారా తలపడనీయకుండా వర్ణం లేదా కులం అనే అదనపు అర్హత ఉందా లేదా అన్నది ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చింది.
నిజానికి వర్ణ వ్యవస్థే ఆనాటికి అమలులో లేనట్రైతే కర్ణుడు ఏ విధమైన ప్రశ్నలకు గురికాకుండా అర్జునుడితో యుద్దానికి పూనుకొని ఉండేవాడు. క్షత్రీయుడు తప్ప అన్యులెవరూ అర్జునుడితో తలపడే వీలులేదని సమాజం భావించిందో అట్లా భావించాలనే ఆధిపత్యవర్గం అనుకుందో, ఆనాడే వర్ద వ్యవస్థ ఎంత ప్రబలమైందో గుర్తించగలిగాడు వ్యాసుడు. వ్యాసుడు పాత్రలను సృష్టించ గలిగాడేమో కానీ ఆ పాత్రల సామాజిక విలువలని తానుగా నిర్దేశించలేక పోయాడు. పాఠశాలలో లేదా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించ డానికి వచ్చిన విద్యార్థిని కులవాదియైన హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్, నిలదీయడం లాంటిదే కర్టుడి కుల ప్రస్తావన. ఆనాటికి కులాల మధ్య ఆధిక్య న్యూనత భావాలు సమాజంలో మనగలుగుతున్నాయి. ఆనాటికి ఒక ఉదాహరణ మాత్రమే ఇది.
అదే విధంగా ఏకలవ్యుడు క్షత్రీయులతో సమానంగా విద్య నేర్చుకోలేక పోవటానికి వర్ణం లేదా కులం అనే ప్రబలశక్తి అద్దుపడింది.
శ్రీ కృష్ణుడిని రాయబారిగా పంపుతూ ధర్మజుడు కృష్ణుడు పలకవలసిన మాటలేమిటో వినయంగా చెబుతూనే క్షత్రీయ ధర్మాన్ని గూర్చి ఒక వైపు విచారిస్తుంటాడు.
డా. బన్న అయిలయ్య త్రి కొత ధర్మమెంత కష్టమగునే పరధర్మము తగదటండ్రు కాన శాస్త్ర జీవికయే తగియున్నదని' సర్ది చెప్పుకుంటాడు. ఒక వైపు ఆ ధర్మాన్ని నిర్వర్తించలేని నిస్సహాయతతో ధర్మజుడు ఊగిసలాడినా చివరికి శస్త్ర జీవికే తగిందని సమాధానపర్చుకుంటాడు. భూమి మీదగాని, రాజ్యం మీదగాని, యాజమాన్యం, అధికారాలు ఎవరికి సంక్రమించి ఉంటాయో వారు ఈ విధమైన సంశయాలకులోనై వర్ణవ్యవస్థ పట్ల ఒక ఉదారభావాన్ని కలిగి ఉన్నట్లుగా నమ్మింపజూస్తారు. ధర్మజుని సృష్టించిన వ్యాసుడు ఒకానొక సమాజంలోని ప్రబలమైన విలువకు ఉదాహరణలు మాత్రమే. ధర్మజుడు ఏ సందర్భములో శస్త్ర జీవిక యే తగియున్నది' అని అనటానికి వీవార్లోని 'రణవీర్ సేని నాయకుడు 'షంషేర్‌సింగ్' “ఇగ01ఈ166 19 (6 0%0 2060286 060016 ౪964 ల58%64 “ అనటానికి, *”[ల౭ 10 6206 [16౯5 15 2 ౧666 (0 50౯౪1౪6, 061021 (0 0౪౯1206" (౧౧౯ 981612 6౧65 01 1161228-2-99 అనటానికి దగ్గరి పోలికల్ని గుర్తించడం పెద్ద కష్టమేమి కాదు. ధర్మనిష్టుడైన ధర్మజుడు యుద్ధం వద్దంటూనే పరధర్మాన్ని అనుసరించలేక ఒక చట్రంలో ఇరుక్కుపోయి శాంతిని గుర్తించి పలువరించినట్లే, ఇక్కడి సామాజిక వ్యవస్థలో జీవన విధానంలో కులవర్గ అధిపత్యాలకు ఆధిపత్య భావజాల చట్రానికి విధేయులైపోయి ఎంతో మంది కన్పిస్తుంటారు. అందుకే మహాభారతం వర్ణవ్యవస్థ మూలాలన్ని శోధించటం అంత సులభంగా కన్పించదు. వర్ద సాంకర్యాన్ని కొన్నిసార్లు అనుమతించిన చోట్ల అనుమతించినట్టే కన్పించి ఆ వెను వెంటనే ఎవరు నర్జ సంకరులైనారో వారిని హీనం చేసి చూడడం ఇతిహాసంలో మలుపు కోసమైతే కాదు, కథలోని 1151 కోసమైతే అసలేకాదు. అదొక కరుడు కట్టిన భావజాలం. ఎక్కడో శాంతిపర్వ తృతీయాశ్వాసంలో విశ్వామిత్ర చండాల సంవాదంలో- “ప్రాణములు సోవకుండంగం బరిహరింపన్ నొండుపాయ మె య్యదియు లేకుందె నేని (ముచ్చి విలయు ధర్మమగు నధముని ధనంబు గొనుట యెందును ముఖమై చనుట గలదు” (శాంతి పర్వం తృతీయ: 287 పద్యం) ప్రాణములు పోయే స్థితి వస్తే తప్ప అధముడి ధనాన్ని స్వీకరించడం సమ్మతింప బడలేదు. సమాజంలో వారి వారి బల ్రాబల్యాలను బట్టి ప్రాణాలు బలవంతంగా తీసి ధనాన్ని
యం! మహాభారతం వర్ణ వ్యవస్థ మానాన్ని స్వీకరించడం ఈ నాటి అగ్ర ధర్మజుల ధర్మ నడవడి అయితే ఈ మార్చు వెనుక కనీసం వెయ్యేళ్ళ సామాజిక పరిణామం ఉందని మనం అంగీకరించక తప్పదు. క్షత్రీయ ధర్మం ఎంత కష్టమో అదే విధంగా “బ్రాహ్మణత్వంబు కడుదుర్లభంబూ అని మహాభారత కాలం నాటికి అడుగడుగునా దర్శనమిస్తుంది. మహాభారతంలో యజ్ఞాలు, కతువులు, ఆడంబరకర్మకాండలు చేయగలిగిన ఒక వర్గం మనకు కన్పిస్తుంది. ద్విజేతరు లైన వర్గం, లేదా 'శూద్ర వర్దం' కాదంటే కిందికులాలు పై కులాల పద ఘట్టనల క్రింద నలిగిపోయిన చప్పుడే మనకు వినబడుతుంది. ఆదిపర్వం పంచమాశ్వాసంలో - “కలమునకున్ నఖిలలోకం బులకున్ న పాయంబుసేయు పురుషాద మునిమ్ముల దూషించి జగంబును గుల మును రక్షించుటణుడే కువలయ నాథా” (ఆది: పంచమ; 110 పద్యం) ఇక్కడ కులం అనే మాట వంశానికి పర్యాయార్ధ వాచిగా మనం గగ్రహించినప్పటికీ నేటి అర్ధంలో మట్టుకు కులం అనే అర్ధంలోనే గ్రహించాల్సి ఉంటుంది. భరతకులం, క్షత్రీయకులం, బ్రాహ్మణకులం, వైశ్యకులం, శూద్రకులం, పంచమకులం, వీటిలోనే రకరకాల విభజన మన సమాజమంతటా కన్పిస్తుంది. “కులము గలవాడు శౌర్యము గలవాడును అధిక సేనకలవాడున్ భూతలమున రాజను నామం విలసిల్లగ దాల్చు మూడు విధముల పేర్మిన్* (ఆది: షష్టీ: 46 పద్యం) కులహీనుడిగా నిందితుడైన కర్టుడిని అవమానభారం నుంచి రక్షించే నిమిత్తం దుర్యోధనుడు పలికిన మాటల్లో అధికారపు పగ్గాలకు ఏవి అవసరమో తెలుస్తూనే ఉంది.
- పాల్కురికి సోమనాథుడు-దళిత దృక్కోణం దళితవాదం ఒక ఉద్యమంగా కొనసాగుతుంది. ఇది ఒక దృక్పధంగా సాహిత్య
సొమాజిక రంగాల్లో స్థిరపడింది. నేడు తెలుగు సాహిత్యాన్నంతా దళితకోణం నుండి అధ్యయనం చేయడం జరుగుతోంది. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక యుగాన్ని అనంతర యుగాన్ని కూడా ప్రభావితం చేసిన కవి పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి (వీరశైవ) సాహిత్యాన్ని దళిత దృక్పథం నుండి చూసే ప్రయత్నం ఈ వ్యాసంలో జరుగుతుంది.
“ేదంబు లాదియో విధికల్పితంబు
లాదియో జాతులకది యెట్టులనిన
జనువేద చోదిత జాతులు రెండు
వినుము ప్రవర్తకంబును నివర్రకము
భవకర్మ సంస్మారి భువి బ్రవర్తకుడు
శివకర్మ సంస్కారి భువిని వర్తకుడు
సన్నుత వేదార్థ చరితంబులుండ
మొన్న బుట్టిన కులమ్ముల మాటలేల
ప్రష్టక్తమగునట్టి జాతులుగానె
యష్టాదశంబులు నివియేల చెప్ప
మిక్కిలి పదునెనిమిది వర్ణములకు
నిక్కమార్గయ భక్తినచయంబు కులము”
ఇలా కులం నిన్నమొన్న పుట్టినదని కులవ్యవస్థను నిరసిస్తూ సంస్కరణకు
శ్రీకారం చుట్టిన వీరశైవ మతాన్ని, సాహిత్యాన్నీ తెలుగు సీమలో ప్రచారం చేయటం జీవిత ప్రయోజనంగా భావించాడు పాల్కురికి. కన్నడ దేశంలో బసవేశ్వరుడు ప్రచారం చేసిన వీరశైవాన్నే తెలుగు దేశంలో పాల్కురికి ప్రచారం చేశాడు. మత ప్రచారంలో సాహితీ సృజనలోనూ విలక్షణతను చూపిన పాల్కురికి వీరశైవ సాహిత్యంలో అగ్రాసానాధిపత్యం వహించాడు. సంస్కృతాంధ్ర కన్నడ మూడు భాషల్లో దాదాపు ఇరవైకి
6 పాల్కురికి సోమనాథుడు-దళిత దృక్కోణం పైగా రచనలు చేసిన పాల్కురి లాంటి ప్రాచీనాంధ్ర కవులు లేరు. కనకనే మత ప్రచారకుడిగా, కవిగా పాల్కురికి స్థానం విశిష్టమైనది.
పాల్కురికి సోమనాథుని (12వ శతాబ్దం)కి పూర్వం నుండి మత కల్లోలాలు సమాజాన్ని అశాంతి పరిచాయి. వైదిక మతంలో ఛాందసత్వం, కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పేరుకు పోయాయి. శైవ వైష్ణవాలు ఒకదానికంటే ఒకటి గొప్పదనే కలహాలు నిత్యం జరుగుతుండేవి. ఈ కలహాల నుండి సమాజాన్ని తప్పించాలని చార్వాకజైన బౌద్ధమతాలు కృషి చేస్తూ వస్తున్నాయి. ప్రజలను హేతు మార్గంలో నడిపించాలని ఈ మతాల ప్రయత్నం. శైవ వైష్ణవాల కలహాన్నీ ప్రజలకు నాస్తికత్వం బోధించే మతాలని నిర్మూలించాలనే శంకరా చార్యులు “అద్వైతాన్ని స్థాపించాడు. అయినా పై మతాల అశాంతి నుండి సమాజాన్ని తప్పించలేక పోయాడు. ఎక్కడైతే శంకరాచార్యులు వైఫల్యం పొందాడో అక్కడి నుండి వీరశైవం విజ్బభించి ప్రజలను తనవైపు తిప్పుకోవటంలో సాఫల్యం పొందినది.
పాల్కురికి కాలం నాటికి సంఘంలో ప్రాబల్యమున్న ఈ మతాలేవి అభివృద్ధి కరమైనవిగాదు. వీటిపట్ల ప్రజలకు మేలు జరుగకపోగా నష్టమే ఎక్కువగా కన్పిస్తుంది. పలాయనత్వాన్ని బోధించే మతమొకటైతే, సన్యాసాన్ని ఆశ్రయించమని చెప్పే మతాలు మరికొన్నైనాయి. శంకరాచార్యులు “అద్వైతం” జీవుడికి దేవుడికి అఖేదమని చెప్పినా ఆచరణలో మాత్రం తద్విరుద్ధంగా ప్రవర్తించింది. వైదికం సమాజాన్ని వర్దాల పేరున విభజించి ప్రజల్లోని అనైక్య భావానికి కారణమైంది. (బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్దాలను ఏర్పరచి ఒక వర్ణానికంటే మరొక వర్ణం గొప్పదని వైదికం చెప్పింది. వైదికం ఆది పురుషుని శరీరంలో అందరికీ స్ట్థానమిచ్చి గౌరవభావాన్ని కలిగించిందని చెప్పినా, అందరికి సమాన గౌరవం సమాజంలో లేదు. పైగా పంచములు లేదా అంత్యజులనే మరొక వర్ణం పుట్టుకొచ్చింది. వీరు వర్ణ వ్యవస్థలో చోటే లేనివాళ్ళు. ఆది పురుషుని శరీర భాగాల్లో ఎక్కడా వీళ్ళకు స్థానమే లేకుండా పోయింది. వైదికం వర్ణాశ్రమ ధర్మాలను బోధించి పై మూడు వర్ణాల వాళ్ళు మాత్రమే వర్ణాశ్రమ ధర్మాను వర్తకులని నియమాన్ని ఏర్పర్చింది. శూద్రులకు, అంత్యజులకు, ్రీలకు ఈ ధర్మాలు పాటించే అర్హత లేదు. ఈ నియమాలను అతిక్రమించిన వాళ్ళకు కఠినమైన శిక్షలు వేసింది. 'గుణకర్మను బట్టి కుల నిర్ణయం జరుగుతుందని ప్రవచించిన “గీతను కూడ వైదికం పక్కకు తోసేసింది. జన్మతోనే కులం సంక్రమిస్తుందని ప్రచారం చేసింది. దీన్ని సమాజంలో
దొ. బన్న అయిలయ్య 7 స్థిరపరచడం కోసం ఆధార రహితమైన కథలకు సాహిత్య గౌరవం కల్పించింది వైదికం. కర్మకాండలు, యజ్ఞయాగాది క్రతువుల పేర అనేక జంతువులను బలిచేసింది వైదికం. హింసకు తావిచ్చి సమాజంలో కరుణకు స్థానం లేకుండా చేసింది. వివిధ రకాల కట్టుబాట్లు ఆంక్షలు ఎల్లెడల సమాజంలో కొనసాగేవి. ఇవి సమాజ చైతన్నాన్ని దెబ్బతీసాయి. వైదికం శూద్రులకు అంత్యజులకు స్త్రీలకు సంఘంలో అగౌరవస్థానం ఏర్పర్చింది. కనక ఈ ప్రజలు వైదికం పట్ల విముఖులైనారు. అ(గ్రవర్జాల తిరస్కారం వారి స్వాభిమానాన్ని దెబ్బతీసింది. (బ్రాహ్మణ ప్రాబల్యమున్న వైదిక మతాన్ని కింది తరగతి ప్రజలు అంగీకరించలేక పోయారు. వీరు ఆర్యుల కాలం నుండి అద్వైత కాలం వరకు ఆధ్యాత్మిక, సామాజికార్థిక అసమానతలకు లోనవుతూ వస్తున్నారు. ముఖ్యంగా అస్పృశ్యత కింది తరగతి ప్రజల స్వాఖిమానంకు మరింత విఘాతం కలిగించింది. దీనివల్ల కింది తరగతి ప్రజలే నష్టపోతారనుకుంటే పొరపాటు. ఈ నష్టాన్నంతా జాతియావత్తు అని వార్యంగా పంచుకోవల్సిందే. అస్పృశ్యత వలన సంఘంలో సంఘటిత శక్తి నశించి అభివృద్ధి బీటలు వారింది. ఈ విధంగా వైదికం కమ్మిన చీకట్లనుంచి సమాజాన్ని వెలుగు రేఖవైపు నడిపించాలనే వీరశైవం ఆవిర్భవించింది. ఈ సమయంలోనే తెలుగు దేశంలో వీరశైవ మత ప్రచారం కోసం వజసంకల్చ్పంతో పాల్కురికి సోమనాథుడు ముందు కొచ్చాడు. మత ప్రచారం కోసమే వాడియైన సాహితీ సృజన చేసాడు. వైదికం-శైవం-దళితం భేదసాదృశ్యాలను పరిశీలించితే వీటిలో సంఘ ప్రయోజనం కలిగిన దృక్సధమేదో స్పష్టమవుతుంది.
- జగత్తు మిధ్య జగత్తు సత్యం జగత్తు సత్యం 2 కర్మ-పునర్జన్మ- కర్మ ఆత్మలను నమ్మదు కర్మ-పునర్దన్మ-ఆత్మ ఆత్మలను నమ్ముతుంది. పునర్ణన్మలను నమ్మతుంది హేతురహితాలు 3 వర్ణాశ్రమ ధర్మాలను వర్ణాశ్రమ ధర్మాలను వర్ణాశ్రమ ధర్మాలను యజ్ఞయాగాది క్రతువులను యజ్ఞయాగాది క్రతువులను యజ్ఞయాగాది కర్మకాండలను ఏర్చరిచింది- కర్మకాండను (క్రతువులను ఆచరించింది నిరసించింది తోసిపుచ్చింది. 4, స్ఫృశ్య-అస్పృశ్యతలను అస్పృశ్యతను నిరసించింది. అస్పృశ్యత నిర్మూలన పెంచి పోషించింది సమానత్వాన్ని బోధించింది జరగాలంటుంది
రి పాల్కురికి సోమనాధుడు-దళిత దృక్కోణం
ఈ బ్రాహ్మణాధిక్య అంగీకారం బ్రాహ్మణాధిక్య నిరసన బ్రాహ్మణాధిక్య నిర్మూలన
6 _ శ్రమను కులప్పత్తులను “కాయకమే కైలాసం” కులవృత్తిని, శ్రమను హీనంగా చూసింది (మను, కులవృత్తులను సౌందర్యంగా భావించింది
గౌరవించింది.
7... శిష్ణజనామోదం కోసం సంస్కృతాన్ని నిరసించింది. సంస్కృతాన్ని నిరసించి సంస్కృత భాషను సామాన్యుల భాషే సాహిత్య జనసామాన్యం మాట్లాడే గౌరవించింది. భాషగా స్వీకరించింది జీవద్చాషే సాహిత్య భాష
కావాలన్నది.
& _ శిష్టులకే సాహిత్యంలో అతి సొమాన్యులకు కూడా ఎవరి అనుభవాలని వాళ్ళే (ప్రాధాన్యాన్నిచ్చింది సాహిత్య గౌరవం సాహిత్య వస్తువుగా
కల్పించింది చేసుకోవాలంది
పై పట్టికలో వైదిక-వీరశైవ-దళిత దృక్సథాలను పరిశీలిస్తే ఏది సమాజ హితం కోరిందో తెలుస్తుంది. సమాజాన్ని వాస్తవం వైపుకు నడిపించాలనే దృక్పథం దేనిలో ఉందో తెలుస్తుంది.
మన కళ్లముందు కన్పించే ఈ భౌతిక ప్రపంచమంతా మిథ్యని వైదికం చెప్పుతుంది. ఇవియే శాశ్వతం కాదు. దీనికోసం నరులు వెంపర్లాడకూడదు. నిత్యం భగవంతుని ధ్యానిస్తూ మోహ (ప్రపంచాన్ని మరచిపోవాలంటుంది వైదికం. జగత్తు సత్యం అని వీరశైవం, దళితాలు అంటాయి.
కర్మ-పునర్జన్మ-ఆత్మలను వైదికం కల్పించినది. వేదం కల్పించింది. వైదికం అలౌకిక అర్ధాన్ని చెప్పింది. దీన్ని దృష్టిలో పుట్టుక నుండి చావువరకు తరువాత జన్మలోను కర్మప్రభావం ఉంటుందని విశ్వసిస్తుంది. సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనదని వైదికం నమ్ముతుంది. కర్మకు లౌకికార్ధం కల్పించింది వీరశైవం. కర్మంటే మనిషి చేసే శ్రమయే. జీవుడికి ఈశ్వరుడికి అభేదం కనక జీవి మరణించి ఈశ్వరాక్ష్యెం పొందుతుంది. కనక పునర్జన్మ ఉందంటుంది వీరశైవం. ఆత్మ అనేది ఇంద్రియగోచర మైనదికాదు. దీన్ని వీరశైవం నమ్మదు. ఈ మూడు కూడా హేతురహితాలని దళితం కొట్టి పడేస్తుంది. ఆత్మపదమే ఉపయోగించకుండా 'ఆత్మాభఖిమానానికి బదులు “స్వాభిమానం వాడుతుంది.
డా. బన్న అయిలయ్య ర వర్జాశ్రమ ధర్మాలు కేవలం వర్ణ వ్యవస్థలోని పై మూడు వర్ణాలవాళ్లకే వర్తిస్తాయి. యజ్ఞ యాగాది క్రతువులు ఆ వర్జాలకు అనివార్యమైనవి. సమాజంలో శాంతి నెలకొల్పాలనో, భౌతిక ఆథ్యాత్మిక సంపదలు పెరగాలనో లేదా శౌర్యత్వాన్ని దర్చాన్ని ప్రదర్శించాలనో వీటిని నిర్వహించాలని వైదికం అంటుంది. అందుకే పుట్టుక నుండి చావువరకు ఏదో పేరున కర్మకాండలు నిర్వహించాల్సిందే. షోడష కర్మలు ఇలాంటివే అనుకోవచ్చు. వీటిని వీరశైవం నిరసించింది. దళితం వీటిని తోసివేసింది. వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసిన వైదికం స్పృశ్యా-అస్పృశ్యతను పాటించింది. దీని వలన సమాజంలో కింది కులాల వాళ్ళు పశుతుల్యులుగా, ఇంకా హీనంగా చూడబడ్డారు. ఒక మనిషి మరొక మనిషిని తాకితే మైల పడడం అవమాననీయమని వీరశైవం అస్పృశ్యతను నిరసించింది. అస్పృశ్యత వలన మానవతకు విఘాతం కలుగుతుంది. కనక దీన్ని నిర్మూలించాలని దళితవాదం బలంగా కోరుకుంటుంది. వర్ణవ్యవస్థ ఏర్పాటు మూలంగా విద్యను హక్కుభుక్తం చేసుకున్నారు బ్రాహ్మణులు. సకల శాస్తాలని అధ్యయనం చేసి విద్యను వాళ్ల కుల వృత్తిగా భావించారు. జ్ఞాన సంపన్నులైనా కాకున్నా బ్రాహ్మణులదే సమాజంలో అధిక్యతని వైదికం చాటిచెప్తుతుంది. విద్యకు జ్ఞానంకు ప్రాముఖ్యం లేదు. వ్యవస్థలో ఆందరూ సమానులే అంటూ వీరశైవం చెప్పింది. బ్రాహ్మణులు వరకంగాను ఇతరుల కంటే అధికులు కారంటు వారి అధిక్యాన్ని నిరసించింది. కుట్ర, పూరితమైన వర్ణవ్యవస్థకు కారకులు బ్రాహ్మణులు. దానిలో భాగంగానే విద్యను అన్ని వర్ణాల వారికి అందకుండా నిరోధించారు. పైగా వివిధ ఆచారా వ్యవహారాల పేరు మీద సమాజాన్ని దోచుకుంటున్నారు. వీరికున్న జ్ఞానంతో సమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టి ప్రజల బలహీనతను ఆసరాగా చేసికొని అధికులనుని చెలాయిస్తున్నారు. జ్ఞాని ఎప్పుడూ అజ్ఞానాంధకార ప్రపంచాన్ని వెలుతురు వైపుకు నడిపించాలి. కాని విద్యా సంపన్నులైన బ్రాహ్మణులు దీనిని విస్మరిస్తుండడం వలన బ్రాహ్మణాధిక్యతా నిర్మూలన కావాలంటారు దళితులు. శఛమను ముఖ్యంగా శరీర శ్రమను వృత్తులను హీనంగా చూసింది వైదికం. సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రమచేస్తు వివిధ రకాల వస్తూత్పత్తిచేసే వర్ధాలను వైదికం గౌరవించలేదు. వారి శ్రమ ఫలాలను మాత్రం సంతోషంగానే స్వీకరించింది. “కాయకమే కైలాసం” అని వీరశైవం నమ్ముతుంది దీన్ని ఒక సిద్ద్ధాంతంగానే ప్రచారం
10 పాల్కురికి సోమనాథుడు-దళిత దృక్కోణం చేసింది. కాయకం అంటే శరీర సంబంధమైనవి. శరీరంతో చేయబడునవి అని అర్ధం. వృత్తిని, శ్రమను గౌరవించే వ్యవస్థ ఎప్పుడూ అభివృద్ధిని కాంక్షించేదే వ్యక్తి నిజాయితీతో పని చేసి సంపాదనలో కొంత భాగాన్ని వీరశైవానికివ్వాలి. ఇది సంఘ ప్రయోజనానికి ఉపయోగిస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం చాకలి, కమ్మరి, కుమ్మరి, చేటలు చేసేవాడు, కాయకష్టం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, రాజు కొలువులో ఉద్యోగం చేసేవాడు, చివరికి వేదం చదివిన బ్రాహ్మణుడు కూడా అందరూ సమానులే. ఎవరెక్కువ తక్కువనే తారతమ్యాలు లేవు. అందరికి సమాన గౌరవాన్ని ఈ సిద్ధాంతం ద్వారా వీరశైవమిచ్చింది. ప్రతి వ్యక్తి తన కష్టంలో ఎంతివ్వాలనేది వీరశైవం (ప్రవేశపెట్టిన పద్ధతి ప్రజలలో సమిష్టి భావనను పెంపొందించింది. ఈ పద్ధతి వీరశైవ మతానికి ప్రజలను దగ్గర చేసింది. వైదికంలో రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, తప్ప మత సంబంధమైన కార్య కలాపాలకు ఇతర కులాల నుంచి ధన రూపేణా సేకరించినట్లు కనిపించదు. తద్వార కింది వర్ద (ప్రజలకు ఈ మతం తమది కాదనే దృక్పధాన్ని ఏర్పరుస్తుంది. ప్రజలను వైదిక మతం దూరంగా ఉంచడం వలననే ఆ మతం పట్ల సామాన్య ప్రజల్లో వైముఖ్యం పెరిగి ఉంటుంది. ఫలితంగా (ప్రజలు శైవానికి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంది. దేవమాన్యాలపై వచ్చే ఆదాయంతో పొట్ట పోసుకునే విధానానికి వైదికం ప్రాముఖ్యతనిస్తే, పనిచేసే వాడికే తిండి నివ్వాలనేది వీరశైవం అభిమతం. దళితులు (శమనే నమ్ముకున్నారు, వారి జీవితం అద్యంతాలు (శ్రమతో కూడుకున్నవి. (శమ సౌందర్యాన్ని అమితంగా గౌరవించి ఆచరిస్తుంటారు.
శిష్ణజనామోదం కోసం సంస్కృత భాషను సాహిత్యభాషగా స్వీకరించింది. వైదికం అంటే వైదిక కవుల దృష్టి పండితుల మీదే కాని పామరుల మీదకాదు. మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతామో వారిని బట్టే మనం ఉపయోగించే భాష ఉంటుంది. సమాజంలో శిష్టవర్గానికి శిష్టవర్గ వినిమయానికి ఉద్దేశించిన సాహిత్యంలో భాష సంస్కృత పదాదంబరత, దీర్చ సమాస ఘటనం మొదలైనవి వైదిక సాహిత్యంలో కన్పిస్తున్నది. శైవ కవులు సామాన్యుల కోసం సాహితీ సృజన చేసారు. వారు మాట్లాడే భాషనే రచనల్లో స్వీకరించారు. ఇది వైదిక, శైవ కవుల మధ్య ఉన్న ప్రధానమైన తేడా. అయితే ఒక జైవకవి “బ్రాహ్మణ్యంబుతో పొత్తు బాయలేను” అని వ్యక్త పరచాడు. శివ కవుల్లోనే ఇలాంటి సంశయాలు కొద్దోగొప్పో ఉన్న కవుల రచనల్లో శిష్టవర్ద భాష అయిన సంస్కృతం కన్పించినా, సర్వసాధారణంగా కింది కులాల వ్యవహారిక భాషే కన్పిస్తుంది. భాషా
దా. బన్న అయిలయ్య మై పరమైన తేడాల్లో ఈ రెండు వర్ణాల మధ్య చెప్పుకోదగ్గ భేదమిదే. దళితం వీరశ్రైవం లాగే సంస్కృత భాషను నిరసించింది. బహుజనులు మాట్లాడే జీవద్భాషే సాహిత్య భాష కావాలని కోరుకుంటుంది. వైదికం శిష్ణులకే సాహిత్యంలో (ప్రాధాన్యమిచ్చింది. వారి సాహిత్యంలో కధా నాయికానాయకులు దేవకాంతలు, దివ్యమానవులు, రాజులు. వీరశైవంలో మాత్రం చారిత్రక పురుషులు, సమకాలీన భక్తులు, వివిధ కుల వృత్తులవాళ్లు కధానాయకులు నాయకురాళ్లు. ఏ వర్గ ప్రజల జీవితం వారికే స్వంతం. కనుక వారి అనుభవాన్ని వారే స్పష్టంగా చెప్పుకోగలుగుతారని దళితవాదం అంటుంది. పాల్కురికి (వీరశైవ) సాహిత్యం భక్తుల సామాజిక స్థితిగతులు చిత్రించగలిగింది. దీన్ని వైదిక కవులు చేయలేక పోయారు శైవకవులు ఇంటిపేర్లు వారి కులాన్ని లేదా వృత్తిని తెలియ జేస్తారు. చేటల వేమయ్య, కుమ్మరి గుండయ్య, సుంకేసు (సుంకాలు వసూలు) బంకయ్య, దోహరి (కుట్టుపని) కక్కయ్య, కన్నడ (కన్నాలు వేసేవాడు) బ్రహ్మయ్య మొదలై నవి. వీరితోపాటు మరికొందరు దళితులని కూడా మనం పాల్కురికి సాహిత్యంలో చూస్తాం. కాటుకోటుడు (గొల్ల), ఉడుమూరి కన్నప్ప (ఎలుకల), మడివాలు మాచయ్య (చాకలి), శంకరదాసి (బొంతలు కుట్టేవాడు), ఆడి భర్తుడు (జాలరి), శివనాగుమయ్య (మాల), దూడర దాసయ్య (నేతగాడు) కేంబాలిభోగయ్య (మాదిగ), గుడ్డవ (హీనకులజురాలు), మొదలైనవాళ్ళు. పాల్కురికి సాహిత్యంలో కొన్ని కధలను పరిశీలిస్తే, ఈ దళిత లేదా కాయస్తులకు తన సాహిత్యంలో ఎంత గౌరవమిచ్చాడో తెలుస్తుంది. ఉడుమూరి కన్నప్ప కథ పురాణం కథల్లో పెద్దది. కన్నప్ప ఎలుకల జాతికి చెందిన ఆటవికుడు. వేటాడిన జంతు మాంసాన్ని నిత్యం శివునికే అర్పించేవాడు. ఇతనిది ముగ్గభక్తి. ప్రతిరోజు శివలింగం వద్దకు వచ్చి చెప్పుతో లింగంపై పడిన ఆకులను ఊడ్చి, పుక్కిటితో నీళ్ళు తెచ్చి లింగమును అఖభిషేకించేవాడు. ఒక రోజు లింగం కంటినుండి నీరు కారుతుండగా కన్నప్ప గమనించాడు. లింగంకి ఉపచారాలు చేసినా నీరు కారడం తగ్గిపోలేదు. వెంటనే కన్నప్న తన కన్నును బాణముతో పెగిలించి, లింగంకి సీరుగారు కన్నుపై అతికించాడు. తర్వాత రెండోకన్ను నుండి నీరు కారుతుండగా, తన రెండవ కన్నును పెగిలించి శివునికి అర్చితం చేయబోయాడు కన్నప్ప. శివుడు ప్రత్యక్షమై అతని ప్రయత్తాన్ని నివారించాడు. కన్నప్ప పూర్వనామం తిన్నడు. శివుడికి కన్నప్పగించాడు కనక “కన్నప్ప” అనే పేరు స్థిరపడింది.
12 పాల్కురికి సోమనాథుడు-దళిత దృక్కోణం
ఈ కథలో విద్యకు జ్ఞానానికి (ప్రాధాన్యత లేదు. నిశ్చలమైన, నిర్మలమైన భక్తి మోక్షానికి మార్గం. దీనిలో తిన్నని భక్తి ముగ్గమైనది. మడికట్టుకొని, ఆచార సంప్ర దాయాలతో ఉత్తమ కుల సంజాతుడు చేసే పూజకు ఒక ఎలుకల జాతివాడి పూజకు తేదాను ఇది తెలియజేస్తుంది. రెండు వర్షాల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇక్కడ గమనించాలి.
మాదర చెన్నలింగము (వృషాధిప శతకం) అను హీనకులజుడు శివభక్తుడు. ఈ భక్తుడిని పరీక్షించదలచి అతని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ భక్తుడు తనవద్ద ఉన్న పాచి అంబలిని శివునకు సమర్పించగా శివుడు ప్రీతితో దాన్నారగిస్తాడు. ఈ కథలో కూడా భక్తి ప్రధానం ఇతరములు కాదని తెలుస్తుంది. ఒక హీనకులజుడి ఆహారం అంబలి అని తెలుస్తుంది. అదీ పాచిపోయిన అంబలి.
కాయక సిద్ధాంతం ఆదర్భాన్నీ పాల్ఫురికి సాహిత్యంలోని అనేక కథల్లో చూడగలం. శంకరదాసి అనే శివభక్తుడు బొంతలు కుట్టి జీవించేవాడు. వృత్తిద్వారా వచ్చిన ధాన్యాన్ని కొంత భక్తితో జంగముల కర్చించేవాడు. ఇతని భక్తిని మెచ్చి శివుడు వరం కోరుకోమనగా “ర్రాత్రియు సూది దారంబు (గ్రువ్వగ నేత్రములకు దృష్టి నెక్కొల్చుమనుడు” అని శంకరదాసి కోరుకున్నాడంటే, ఒక భక్తుడు తన వృత్తికి అధిక ప్రాధాన్యమిచ్చునట్లు తెలుస్తుంది. తను చేస్తున్న వృత్తిని దైవతుల్యంగా భావించారు. కాని నిరంతరం బొంతలు కుట్టే వృత్తి నుండి కాని, లోకం నుండి కాని, విముక్తం చేసి శివైక్స్కమయ్యేలా వరమియ్యమని కోరలేదతడు. సంపాదనలో కొంతభాగాన్ని జంగముల కివ్వడంలోని శివభక్తుల అంకితభక్తి, కాయక సిద్ధాంతాచరణని తెలియజేస్తుంది.
శివకవులు సామాన్యులను అమితంగా గౌరవించినట్లు పాల్ఫురికి సాహిత్యం ద్వారా తెలుస్తుంది. భక్తులను మడివాలు మాచయ్య “గారూ కెంబావి భోగయ్య 'గారు కక్కయ్య “గారు” అంటు వారి పేరుకి 'గారు” లనే గౌరవశబ్దాన్ని ఉపయోగించి వారి గౌరవాన్ని ఇనుమడింపజేసాడు. సామాన్యులైన శివభక్తులకు మహాత్యములు కల్పించి ఆ(గ్రవర్దాల కంటే వారిని ఉన్నతులుగా పాల్కురికి చిత్రించాడు. కెంబావి బోగయ్య (మాదిగ) అనే శివభక్తుడు గలడు. అతనింటికి ఒక శివభక్తుడు చనిపోయిన ఆవు పెయ్యను లాక్మోనొచ్చి దాని మాంసము వండి పెట్టమని భోగయ్యను కోరాడు. భోగయ్య మాంసము వండి భక్తుడికి పెట్టాడు. ఇది బ్రాహ్మణులందరికి కోపాన్నితెప్పించింది. భోగయ్యను చుట్టుముట్టి పెయ్యను లాక్కొచ్చినతని గురించి ఆరా తీయగా, ఆ భక్తుడు అద్భశ్యమవుతాడు.
డా. బన్న అయిలయ్య 18 బ్రాహ్మణులంతా భోగయ్యను నిలదీయగా శివభక్తుల ఇళ్ళల్లో శివేతరులుందడరని చెప్పి, శివ దూషకులైన మిమ్ములను చూడరాదని ఊరి వెలుపలికి వెళ్ళిపోయాడని తెల్పి, తానూ ఊరి వెలుపలికి పోతాడు. ఊరిలోని శివలింగములు స్థానం వీడి భోగయ్యతోపాటు ఊరి వెలుపలికి వెళ్ళాయి. శివలింగాలు స్థానభ్రంశం చెందడం చూసి తట్టుకోలేని (బ్రాహ్మణులు భోగయ్యను వేడుకొనగా ఊరి లింగములను యధాస్థానంలో నిలిపాడు. ఒక అస్పృశ్యుడికి శివలింగాలను కదిలించే శక్తినిచ్చి, అహంకారులైన వాళ్ళను అణచేందుకు కింది కులాల వారిని ఏ విధంగా పాల్కురికి చిత్రించాడో తెలుస్తుంది. అలాగే మాదర దూడయ్య (హీనకులజుడు) స్నానం చేసిన నీరు వల్ల ఏర్పడిన బురదలో కాలుజారి బ్రాహ్మణుడు పడతాడు. బురద నుంచి లేసిన బ్రాహ్మణుడి శరీరం మిక్కిలి కాంతివంతమై ప్రకాశిస్తుంది. ఈ కధ వల్ల ఒక హీనకులజుడికి మహత్తుని, గౌరవాన్ని కల్పించిన విషయం తెలుస్తుంది.
(బ్రాహ్మణాధిక్యాన్ని పాల్కురికి నిరపిస్తూ బిబ్బ బాచయ్య, కల్లి దేవయ్య మొదలైన కథలు రాసాడు. కల్లి దేవయ్య అనే శివభక్తుడి దాసి కడవతో నీళ్ళు తెచ్చుచుండగా ఒక (బ్రాహణుని చేయి అమెకు తగిలింది. ఆ నీళ్ళు మైలపడినవని భావించిన దాసి, కడవను అచ్చటనే పగులగొట్టింది. కొత్త కడవతెచ్చి నీళ్ళు తీసికొని పోయింది. ఈ సంఘటనను చూస్తున్న బ్రాహ్మణులకు దాసి ఆగడము అర్ధం కాలేదు (బ్రాహ్మణులకు ఇతర వర్ణముల వారు తాకితే స్నానం చేస్తారు. కాని బ్రాహ్మణులు తాకారని దాసి ఇట్లు చేసింది. పైగా దాసికి తాకిన బ్రాహ్మణుడు సాక్ష్యాత్తు వళిష్టుడంతటివాడు. రాజైన బిజ్జలునికి ఈ విషయాన్ని (బ్రాహ్మణులు వివరిస్తారు. దాసి చేసిన పనికి బ్రాహ్మణులు అవమాన పడ్డారని భావించిన బిజ్జలుడు దేవయ్యను పిలిచి వివరణ కోరాడు. (బ్రాహ్మణులకు అగ్రవర్ణత్వం, ఆధిక్యత వేదములు చదవటం వలన వచ్చింది. వేదములు మా ఇంటి కుక్కలు కూడా చదువుతాయని, తన ఇంటి కుక్కలను పిలిచి వేదములు చదువమని దేవయ్య, కుక్కలను ఆజ్ఞాపించాడు. ఆ కుక్కలు తప్పులు లేకుండా వేదములు చదివాయి. దీన్ని బట్టి శివభక్తుల కంటే విప్రులు గొప్పవారు కాదని కల్లి దేవయ్య బిజ్జలునికి వివరించాడు.
(బ్రాహ్మణులు విద్యనేర్చుకోవడం ద్వారా యితర వర్జాల కంటే గొప్ప వారమని భావిస్తారు. సమాజంలో తామే అధికులమని ప్రవర్తిస్తారు. విద్య నేర్చుకున్నంత మాత్రాన గొప్పవారు కాదని, విద్య నేర్చుకోవటం ఎంత సులభమో కుక్కల ద్వారా వేదములు చదివించడం వలన తెలుస్తుంది. బ్రాహ్మణుల విద్యాజ్ఞానాధిక్యాలని ఈ విధమైన కధల ద్వారా తగ్గించే ప్రయత్నం చేసాడు కవి. _
షేడ పాల్కురికి సోమనాథుడు-దళిత దృక్కోణం
వృత్తికి అమిత గౌరవమిచ్చిన పాల్కురికి, వృత్తిని ఆశ్రయించిన శివ భక్తులు రాజు కంటే గొప్పవారని మడివాలు మాచయ్య కధ ద్వారా నిరూపించాడు. మడివాలు మాచయ్య చాకలి. శివభక్తుల బట్టలు తప్ప, భవుల బట్టలుతకడు. భవుల బట్టలుతికే చాకి రేవులో శైవ భక్తుల బట్టలు ఉతకటానికి కూడా ఇష్టపడడు. రేవునుండి ఉతికి తెచ్చే బట్టలను ఎవరూ తాకరాదని ఒక చేతిలో గంట పట్టుకొని ఊపుతూ మరొక చేతిలో కరవాలం పట్టుకొని బయట్టేరేవాడు. ఒకవేళ తనను ఎవరేనా తాకితే కత్తికి ఎరవుతానని హెచ్చరించేవాడు. ఒకనాడొక పరదేశి మాచయ్య రాకను గమనించక అతనిని తాకాడు. మాచయ్య ఆ పరదేశిని హత్యచేశాదు. వీధిలో ఉన్న జనం భయపడి హత్యవార్తను వెంటనే రాజైన బిజ్ఞలునికి తెలియజేస్తారు. కోపించిన రాజు మడివాలు మాచయ్యను వధించమని పట్టపుటేనుగును పంపిస్తాడు. మంత్రి బసవేశ్వరుడు కూడదని చెప్పినా బిజ్జలుడు తన పంతాన్ని వదులుకోడు. తనను వధించాలని వచ్చిన ఏనుగును మాచయ్య సంహరిస్తాడు. తనపైకి ఏనుగును పంపిన వాడిని వధిస్తానని మాచయ్య ఆగ్రహంతో బిజ్జలుని కొలువుకి వెళ్తుంటాడు. విషయం తెలిసిన బిజలుడు మాచయ్య నుండి కాపాడమని మంతి ఐసవేశ్వరున్ని వేడుకుంటాడు. మంత్రి సలవా పైన మాచయ్యకు ఎదురేగి క్షమాపణలు కోరాలని బయలు దేరిన బిజ్జ్ఞలుడు దారిలోనే మాచయ్య రాకను గమనించి భయకంపితుడై అతనికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని వేడుకుంటాడు. బసవేశ్వరుడు కూడా మాచయ్యను వేడుకొని బిజ్జలుని క్షమించమనగా మాచయ్య శాంతించి, ఏనుగుని బ్రతికించి తిరిగి బిజ్ఞలునికిస్తాడు.
సుంకేశు బంకయ్య అనే మరొక కధలో కూడా రాజు కంటే పన్నులు వసూలు చేసే బంకయ్య గొప్పవాడని సోమన చిత్రించాడు. బిజ్జలుని కొలువులో పన్నులు వసూలు చేసే బంకయ్య, పన్నుల ద్వారా వచ్చిన ధనాన్ని శివభక్తులకు దానం చేస్తున్నాడని, దానం చేసిన సొమ్ము తెమ్మని బంకయ్యను రాజు నిర్భందిస్తాడు. బంకయ్య శివుడినే హామీగా ఉంచుతాడు. వెంటనే శివుడు బిజ్జలునికి ప్రత్యక్షం అవుతాడు. రాజైన బిజ్జలుడు బంకయ్య మహాత్యానికి భీతిల్లి సాష్టాంగ నమస్కారం చేస్తాడు.
పై రెండు కధల్లో బట్టలుతికే మాచయ్యకు, పన్నులు వసూలు చేసే బంకయ్యల కంటే సర్వశక్తి సంపన్నుడనుకొంటున్న రాజు ఏ విధంగాను గొప్పవాడు కాదని నిరూపిత మవుతుంది.
డా. బన్న అయిలయ్య 15 వీరశైవ కాలంలో ఆధిపత్య వర్గాలు వ్యవస్థను శాసించడం, వాటికి ప్రజలు ఎదురు తిరగటం కూడా కన్పిస్తుంది. అంటే మతం ద్వారనే కుల రహిత సమాజాన్ని ఏర్పరచాలని వీరశైవులు భావించారు. రాజు, పేద అనే తారతమ్యాన్ని నిర్మూలించాలనే ప్రయత్నం కూడా జరిగింది. అయితే రాజ్యాధిపతియైన రాజుకాని, అతన్ని నడిపే బ్రాహ్మ ణులు కాని ఈ సంస్కరణను అంగీకరించినట్లుగా కన్పించదు. కళ్యాణ కటకాన్ని పాలించే రాజు బిజ్జలుదు ఎప్పుడూ బ్రాహ్మణులను సమర్థిస్తూ వచ్చాడు. వారు ఏర్పరచిన వర్ణ వ్యవస్థను అంగీకరించాడు. కల్లి దేవయ్య, బిబ్బ బాచయ్య ఉద్భటుని కధలు ఇందుకు ఉదాహరణలు, వర్ణవ్యవస్థను సంస్కరించే ఉద్దేశ్యంతోనో “ఎట్టి దుర్దాతిని బట్టిన నేమి / ఎట్టును శివ భక్తుండిల పవిత్రుండు ఏ జాతిలో పుట్టినా శివభక్తుదైతే జాతి పరిగణింపబడదని వీరశైవం చెప్పింది. అయినా బ్రాహ్మణ నిందకు *'మాలి పదాన్ని పదేపదే పాల్కురికి ఉపయోగించాడు. “మాలలు యీ త్రాటి మాలలు పచ్చి మాలలు మాటలు తోలునే వినగ ? మాలడే యీతని మాలడన్ త్రాటి మాలలు భువి పచ్చి మాలలుగాక ! పై వాక్యాల్లో అండర్ లైన్ చేసిన పదాలు వాడిన పాల్కురికికి కులంపై తక్కువ భావం పోలేదనిపిస్తుంది. వైదికం కంటే వీరైైవం సంస్కరణా పూరితమైనది. వీరశైవం దళితానికి దగ్గరగా కన్పిస్తుంది. కొంత భావ, దృక్పథ సామ్యతలు యివి కలిగి ఉన్నాయి. అయితే వీరశైవం ఎంతగా కులాన్ని నిరసించిందో, లింగం ధరించిన వాడికి కులం ఉండదని బోధించిందో అందుకు విరుద్దంగా కుల సమాజం స్థిరపడింది. నేడు కర్ణాటకలో లింగం ధరించిన వాళ్ళు, “లింగాయతులు” అనే కులంగా స్థిరపడ్డారు. పాల్కురికి 'మాలి పదం వాడిన నాటినుండి కులం పోలేదని చెప్పడానికి 'లింగాయతు' కులం ఒక సాక్ష్యం. ఏ కొత్త సిద్ధాంతమైనా, వాదమైన తనకంటె ముందు ప్రవర్తిల్లిన సిద్ధాంతంలోని లేదా వాదంలోని లోపాలను ఎత్తి చూపుతుంది. గత కాలాన్ని ఆ కాలంలోని భావజాలాన్ని అవసరమైన మేరకు వ్యతిరేకిస్తుంది. తనకు కావల్సిన మేరకు స్వీకరిస్తుంది. వైదికాన్ని
16 పాల్ఫురికి సోమనాథుడు-దళిత దృక్కోణం దళిత వాదం తిరస్కరించడానికి కారణం దానిలో ఈ నాటికి పనికి వచ్చే అంశాలు లేకపోవడం. అలాగే శైవంలోని ప్రయోజన వంతమైన అశాలు గ్రహించి, సమకాలీన దృక్చథానికి నిరోధకంగా నిలిచే అంశాలను వ్యతిరేకిస్తుంది.
పాల్కురికి సోమన సాహిత్యంలో దళిత దృక్పథం ఏ మేరకుందో చూపడమే ఈ వ్యాసోద్దేశమని గమనించాలి.
అచ ఇచి 8. ప్రబంధం - వర్ణ వ్యవస్థ మానవ నాగరికత వికాసంలో రాజ్యం ఏర్పడిన తరువాత పాలక వర్దాలు రాజ్య ప్రశాంతతను కాపాడటం కోసం వర్ణవ్యవస్థను బలపరచాయి. దీనికి ఆనాటి మేధావి వర్గాలు సహకరించాయి. మధ్య యుగాలలో కూడా వర్ణవ్యవస్థ రక్షించడానికి పాలకులే ప్రధాన కారకులైనారు. దీనికి మూలకారణం మేధావి, పాలక వర్ణాల ప్రయోజనాలు కాపాడటం మాత్రమే. సొహిత్యపరంగా చూస్తే మహాభారత కాలం నుండి 19వ శతాబ్ది దాకా వర్దవ్యవస్థను కాపాడే దృష్టి తోనే సొహిత్య కృషి కొనసాగింది. అయితే మధ్య మధ్యలో వీరశైవులు, (బ్రహ్మనాయుడు, వేమన మొదలగు వారు వర్ణ వ్యవస్థను వ్యతిరేకించినా, సాహిత్యం మీద వారి ప్రభావం పడలేదు. బుగ్వేదంలోని పురుషసూక్తం వర్ణవ్యవస్థకు బీజం వేస్తే (బ్రాహ్మణోస్య మాఖమాసీ ద్భాహూ రాజన్యకృత: ఊరు తదస్య యద్వైశః ప ద్య్యాంశూద్రో అజాయత), మనుస్మృతి దాన్ని శాసనబద్దం చేసింది. భగవద్గీత “చాతుర్వర్హ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ ఈ అంటున్నది. జన్మచేత కాక గుణంచేత వర్దాన్ని నిర్ణయించడం పద్ధతే అయినా, వర్ణాలన్నీ జన్మచేత నిర్ణయింపబడటం తర్వాత జరిగింది.” (ముదిగొండ వీరభద్రయ్య తె.కసా. సిపుట 25) ఈ క్రమంలోనే అగ్రవర్జాల్లో స్వార్ధం ప్రవేశించింది అనటానికి మన ప్రబంధాలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. వర్ణవ్యవస్థకు ఎలాంటి ఉపద్రవం రాకుండా ఈ (ప్రబంధాలు కంకణం కట్టుకున్నాయి. ఆదికవి నన్నయ్య మహాభారత కాలం నుండి ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టిన పెద్దన మనుచరిత్ర దాకా వర్ణవ్యవస్థను కాపాడటానికి కవులు కృషి చేసారు. పెద్దన (మార్మండేయ పురాణం) మనువు పుట్టుకనే ఎందుకు ఇతి వృత్తంగా తీసుకున్నాడు ? మనువు కొన్ని యుగాలపాటు వర్ణధర్శ్మ పరిరక్షణ చేసే చక్రవర్తి కనుక అటువంటి వ్యక్తి చరిత్రనే ఇతివృత్తంగా స్వీకరించాడు. ఈ విషయాన్ని ప్రథమాశ్వాసంలోని మూడవ పద్యం ద్రువీకరిస్తుంది.
18 ప్రబంధం - వర్ణ వ్యవస్థ “అచట విప్రల మెచ్చ రఖిల విద్యాప్రాఢి ముది మది దప్పిన మొదటి వేల్చు నచటి రాజులు బంటునంపి భార్గవునైన బింకాన బిలిపింతు రంకమునకు నచట మేటికిరాటు లలకాధి పతినైన మును సంచి మొదలిచ్చిమనుప దక్షు లచటి నాలవ జాతి హలముఖాత్త విభూతి నాది భిక్షువు భైక్ష మైన మాన్‌ను ” (మను; 3వ పద్యం. ప్ర.) ఈ పద్యం ప్రకారం వర్దవ్యవస్థలోని వివిధ వర్ణముల (్రేష్టతను నొక్కి చెప్పటమే. (బ్రాహ్మణులు అఖిల విద్యా ప్రాథి వలన ముదుసలి వాడైన బ్రహ్మదేవుని యొక్క మతిమరుపును వెక్కిరిస్తారట. రాజులు పరుశురాముడినైనా సరే బంటును పంపించి పిలిపిస్తారట. అంటే రాజుల పరాక్రమం అంత గొప్పది. వైశ్యులు కుబేరులను మించి పోయారు. నాల్గవ జాకైన శూద్రులు ఆదిశంకరుడిని కూడా బిక్షం అడుక్కోనివ్వరట. పంటలు పండించడంలో అంతటి శ్రమజీవులని అర్ధం. వీరితో పొటు వెలయాండ్రని కూడా పెద్దన ఎంతగానో ప్రశంసించాడు. దానికి కారణం ఉన్నత వర్జాల సుఖభోగ లాలసతకు వేశ్యలు పనికి రావడమే. వర్జవ్యవస్థలోకి రాని నిమ్నజాతులవారి గురించి పెద్దన ప్రస్తావించలేదు. పెద్దనవర్జవ్యవస్థను పరిరక్షించడానికి ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఒక దేవతా స్ర్తీకి మరియు సద్ర్రాహ్మణుడిగా పరిగణింపబడుతున్న మానవునికి మధ్యన సంగమం జరుగకుండా చూసాడు. దేవతా స్త్రీకి స్వేచ్చా విహారం సహజం. అయినా గంధర్వుని (ప్రేమను తిరస్కరించింది. గంధర్వుడు దివ్యడైనప్పటికిని అతని (ప్రేమను తిరస్మరించిం దనటంలో ఆమె మానసిక స్వచ్చత కన్పిస్తుంది. తనను తిరస్కరించిన ప్రవరుడినే వరూధిని తన హృదయంలో స్థిరపరుచుకుంది. ఈ విషయాన్ని గమనించిన గంధర్వుడు ఒక వ్యూహం ప్రకారం వరూధినితో సుఖిస్తాడు. కాని ఆమె అతనిని ప్రవరుడే అనుకుంటుంది. ఈ నిర్మల హృదయం మూలంగా, భ్రాంతి మూలంగా, ఆమెకు స్వరోచి జన్మించాడు.
దా. బన్న అయిలయ్య 19 వరూధుని దేవకన్య, గంధర్వుడు కూడా దివ్యుడు కనుక వారిద్దరు కలుసుకోవటం కవికి సమ్మతం ఎందుకంటే మానవులు దివ్యులతో గాని, దివ్యులు మానవులతో గాని, కలువ కుండా చూడటం కవి ఉద్ధేశ్యం అయిఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దైవం కూడా వర్ణవ్యవస్థను (భ్రష్టుపట్టించ కూడదని కవి అభిప్రాయం.
మన ప్రబంధాలలో బ్రాహ్మణులు కూడా తమతమ విధులను మరచి భోగలా లసులు కావటం, నీతి బాహ్యమైన పనులు చేసి పవిత్రులు కావటం కూడా ఉంది. ఇందుకు నిగమ శర్మ వృత్తాంతం ప్రబలమైన సాక్ష్యం. రామకృష్ణుడి పాండురంగ మహాత్మ్యం లోని నిగమశర్మ దుష్టనాయకుడు. నిగమశర్మ చేయని దౌస్ట్రం లేదు. చీమకు కూడా వాని చేయని ఆర్థమైన చిత్తవృత్తిగలవారు బ్రాహ్మణులు అనబడతారు. కాని నిగమశర్మ కన్యాశుల్మంలోని గిరీశంకంటే పరమ దుర్మార్గుడు. అక్కగారు చెప్పిన హితవచనములు వినక నగల మూటతో పారిపోవటం దొంగల బారినపడి నగలు పోగొట్టుకొని వారి చేతిలో దెబ్బలు తింటాడు. అప్పుడు కాపు యువకుడు నిగమశర్మను రక్షించి ఇంటిలో ఆశ్రయమిస్తాడు. నిగమశర్మ కోలుకున్న తరువాత విశ్వాసఘాతకుడై కాపుయువకుని భార్యను అపహరించుకుపోతాడు. కొంతకాలం తరువాత ఆమె చనిపోతుంది. తరువాత మరొక మాలప్టీని వివాహం చేసుకుంటాడు. మాలస్రీకి ఒక కుమారుడు కూడా కలిగొడు. తల్లీ కొడుకులిద్దరూ గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు. గుడిసె కాలిపోతుంది; తల్లీ కొడుకు మరణిస్తారు.
కాపుస్తీ, మాలప్రీ, బాలకుడు ముగ్గురు మరణించడం కవి దౌష్ట్రం. కవి ఈ దౌస్ట్రం ఎందుకు చేసాడంటే వర్జపరిరక్షణ కొరకే. నిగమశర్మకు మాలస్ట్రీకి కలిగిన బాలకుడు (బ్రతికి ఉంటే అతడు బ్రాహ్మణుడిగా చలామణి అయ్యే అవకాశం ఉంది. దాన్ని నివారించడం కవి ఉద్దేశ్యం కావచ్చు.
తెనాలి రామకృష్ణుడు ఘటికాచల మహాత్యం రచించాడు. ఇందులో నారదుని పూర్వజన్మ వృత్తాంతం కూడా వర్ణ వివక్షణను చూపించేదే. ఒక భాగవతుని ఇంటిలో
20 ప్రబంధం - వర్ణ వ్యవస్థ ఒక దాసి ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే అతిథులంతా కేవలం వైష్ణవ స్వాములే వారికి మాత్రమే ఆ దాసి సేవ చేస్తుంది. ఆమెకొక పుత్రుడు కలిగాడు ఆమెదాసి కనుక తన పుత్రుడికి తండ్రి ఎవరో తెలియదు. ఆ బాలకుడికి ఒక వైష్ణవ స్వామి దయతో విష్ణుభక్తిని బోధిస్తాడు. అతడు నిత్యం భక్తి భావంతో ఉంటాడు, తపస్సు చేసుకోవాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. ఇంతలో బాలుని తల్లి అయిన దాసిని ప్రబంధ కవి చంపేస్తాడు. అతడు పరిపూర్ణమైన వైరాగ్యభావనతో అడవికి వెళ్ళి విష్ణుదర్శ్భనం కోసం తీవ్రంగా తపస్సు చేస్తాడు. శ్రీ మమా విష్ణువు ఆ బాలునికి లిప్తపాటు మెరుపువలే కన్పించి మాయమై, ఈ జన్మలో నీకు కైవల్యం ప్రాప్తించదు. నీవు దాసి పుత్రుడివి. వచ్చే జన్మలో నీకు నా సాన్నిధ్యం లభిస్తుంది అంటాడు. భగవంతుడితో అలా అనిపించవలసిన అగత్యం కవికి ఎందుకు కలిగింది? ఆ విధంగా నిరాశపడిన బాలకుడు కొండమీదనుండి దూకి చనిపోతాడు. (మరు జన్మకొరకు) భక్త సులభుడైన స్వామిని కర్కశ హృదయుడిగా కవి ఎందుకు తీర్చాడన్నది ప్రశ్న
ఇక్కడ మనం గమనించవలసిందేమిటంటే బాలకుడు కూడా రాక్షసపుత్రుడైన 'ప్రహ్లాదునిలా దేవుని చేత ఎందుకు రక్షింపబడలేక పోయాడు. ఇది వర్ణవ్యవస్థ పరిరక్షణ కోసం ప్రబంధ కవి చేసిన చిత్రణకాదా ?
తపస్సంపన్సుడైన ఈ దాసీ పుత్రుడిని బ్రతికిస్తే భగవంతునితో సమానమని కీర్రిస్తే రేపు ఉన్నత వర్దాలు అతనిని పూజించాల్సి వస్తుందేమోనని కవి భయం కాదా ?
ఆముక్త మాల్యదలోని మాలదాసరి కధ ఆసక్తి దాయకమైంది. మాలదాసరి వైష్ణవ భక్తుడు. ప్రతిరోజు చాలా దూరంలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామిని సేవించి (మంగళ కైశికీ గానము ద్వారా కీర్తించి)నిత్యం దేవ చింతన కలిగి ఉంటాడు. భక్తులు బయటకు తెచ్చిన తీర్ధప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తాడు. మాల దాసరికి ఆలయ ప్రవేశం లేదు. గుడికి దూరంగా ఎండలో నిలబడి గానం చేస్తాడు. ఇది అతని దిన చర్య.
ఒక రాత్రి ప్రమాదవశాత్తు కోడి కూసింది. మాల దాసరి వెంటనే లేచి ఆలయానికి బయల్దేరి చీకటిలో దార్తి తప్పి కీకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. తెల్లవారే సరికి
డా. బన్న అయిలయ్య లే ఒక వటవృక్షం దగ్గరకు అతడు చేరుకుంటాడు. ఆ చెట్టు పైనున్న బ్రహ్మరాక్షసుడు (బ్రాహ్మణులలో కూడా రాక్షసులుంటారని గమనించాలి) కిందికి దూకి మాలదాసరిని పట్టుకోవాలని చూస్తాడు. దాసరి తప్పించుకో జూస్తాడు. చివరికి రాక్షసుని చేతికి చిక్కుతాడు. ఇద్దరిమధ్య కొంత వాగ్వివాదం జరుగుతుంది. మాలదాసరి తాను భక్తుడినని భగవదర్శన నిత్యకృత్యమని, ప్రతిభంగం మంచిది కాదని, ఆ స్వామిని సేవించి వెంటనే వచ్చి నీకు ఆవారంగా మారిపోతానని దాసరి దీనంగా (బ్రహ్మరాక్షసుడిని వేడుకుంటాడు. రాక్షసుడు అతనిని వదికేయగా దాసరి గుడి ముందుకు వెళ్ళి అర్చన పూర్తి చేసుకొని తీర్ధ ప్రసాదాలతో సహా తిరిగి వస్తాడు. మాలదాసరి నిజాయితికి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతాడు. ఒక భక్తుడిని శంకించినందుకు పశ్చాత్తాప పడతాడు. శాపవిముక్తి కొరకు దాసరిని అతి దీనంగా వేడుకుంటాడు. అతని దైన్యానికి కరిగిపోయిన దాసరి 'ఉద్దరింప బడుదువు గాక అంటాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడుగా మారిపోతాడు.
మాల దాసరిని పరమభక్తునిగా, పుణ్యపురుషనిగా చిత్రీకరించినప్పటికీ నిమ్న వర్ణస్థుడైన కారాణంగానే అతనికి ఆలయ ప్రవేశం లేకుండానే చేసారు. భక్తి భావముతో పరిశీలిస్తే మాలదాసరిని కవి ఉన్నతుడిగా చిత్రించినట్లు కనిపించినా, వర్ణవ్యవస్థ దృష్టా ఆలోచిస్తే హీనుడిగానే చిత్రణ జరిగింది. ఒక నిమ్న వర్దస్థుని భక్తి తత్పరత ఉన్నత వర్ణస్థుడి శాపవిముక్తికి అవసరమైంది. కాని, ఆ భక్తి ఆలయ ప్రవేశానికి పనికి రాలేదు. దీనికి కారణం వర్ణ వివక్షయే.
మధ్యయుగాల్లోను, ప్రజాస్వామ్యయుగంలోను, దళితులకు ఆలయప్రవేశం గగన కుసుమమే అవుతుంది. ఇటీవల కర్ణాటకలో ఒక ఆలయంలోకి నిమ్న వర్ణస్థుడు ప్రవేశించాడని, అగ్రవర్దాల వాళ్ళు అతనికి మనిషి మలం తినిపించారు. అన్ని ప్రాంతాలలో నిమ్న వర్ణాల వారికి ఇలాంటి అనుభవాలు లేకపోయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటిది ఒక్కటి జరిగినా తీవ్రంగా పరిగణించవలసిందే !
నాలుగు వర్జాల వాళ్ళకి తమతమ వృత్తులను, విధులను నిర్ణయించారు. ఈ విధులను వృత్తులను అతిక్రమించకుండా చూసారు. అయితే బ్రాహ్మణులకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. “ఆయుధ ధా శ గ్ర్టిగవ వ్యాణ్రుడు
జి జ డాం గి (1/25 )
ఖం ప్రబంధం - వర్ణ వ్యవస్థ క్షత్రసముడౌతాడు - వాణిజ్యం చేసి అతడు వైశ్యుడౌతాడు. - నిత్యానుష్టానాన్ని విడిచి శూద్రప్రాయులై చరించి శూద్రసములౌతారు. - అని భారతం చెప్పుతూ - “తక్షిన జాతులవారంతఅలు6 తమతమ తారతమ్యంబు లలో నిట్లు నిజజాతి విహీనులగుదురట్టి వారు జాత్యుత్తమ వృత్యంబునకుం బాత్రంబులుకారు అని క్రింది వర్ణాలవాళ్ళు పైకి పోవటాన్ని నిషేధిస్తుంది. ఈ నిషేధం వర్ణవ్యవస్థను పటిష్ట పరచదానికని మనం గమనించాలి. మహాభారతంలోని వర్ణవ్యవస్థా ధర్మపరిరక్షణ ప్రబంధాలలో కథల ద్వారా మరింత దృష్ట్యాంతాలతో చిత్రించారు.
శ రాయప్రోలు కవిత్వంలో కులమతాల ప్రస్తావన
భారతదేశం 'నాడు వేదాలకు వేదికగా, కళలకు కాణాచిగా, శాస్త్రాలకు పుట్టినిల్లుగా విరాజిల్లిన దేశం” ప్రపంచం అంకా కళ్ళు తెరవక అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు జ్ఞానజ్యోతిని వెలిగించి ప్రపంచానికి దారి చూపిన విజ్ఞులు పుట్టిన దేశం ఈ దేశ పురావైభవాన్ని గూర్చిగాన్ సంస్కృతి గురించిగాని చెప్పుకోవటం గొప్పగానే వుంటుంది. ఈ భూగోళంపై భారతదేశంతో పాటు చాలా దేశాలున్నాయి. ఈ దేశాలన్నింటితో పోల్చినపుడు భారతదేశం చిరునామా ఎక్కడో చూడటం తప్పుకాదేమో-
పాశ్చాత్య దేశాల చరిత్రలో భారతదేశ చరిత్రని అధ్యయనం చేస్తే చాలా విషయాలలో భారతదేశం యితర దేశాలకంటే భిన్నంగా వుందని చెప్పవచ్చు. “పాశ్చాత్య దేశాల చరిత్రలో నవ్యసాహిత్య వికాసం, సంఘ సంస్కరణోద్యమం జంటగా 16వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. మన పూర్వీకులు అన్ని విద్యలలోను ఎంత (ప్రావీణ్యులైనా, భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైనదైనా, పాశ్చాత్య దేశాల కంటే నవయుగంలో మనం అన్ని విధాల చాలా వెనుకబడ్డాం. కాలచక్ర పరిభమణంలో మనం అడుగున పడిపోయాం. భారతదేశంలో నవ్యసాహిత్యం, సమాజ సంస్కరణ 19వ శతాబ్దంలో ప్రారంభం అయ్యాయి.” (తెలుగునాడులో సంఘ సంస్మరణోద్యమం
- శ్రీ తారకం - పేజీ ౩)
భారతదేశంలో ఈ స్థితి ఏర్పడటానికి కుల కుత్సితాలు, మతమాత్సర్యాలు, వర్గ వైరుధ్యాలని భావించక తప్పదు. ఆంధ్ర సాహిత్యారంభమే మతోద్దరణ కోసం, వర్దాశమ ధర్మాల పరిరక్షణకోసం ఉద్భవించినట్లు తెలుస్తుంది. వైష్ణవ, శైవ మతాల పోట్లాటలు, వీరశైవం తీసుకొచ్చిన మత విప్లవం, తిక్కన బోధించిన హరిహరనాధతత్వం. శ్రీ కృష్ణదేవరాయల యుగంలో దేదీప్యమానంగా వెలిగిన వైష్ణవ సాహిత్యం ఓ వేపు వుండగా, ఈ మతాల మీద కులాల మీద తీవ్రమైన నిరసనను తెలియజేసారు వేమనలాంటి యోగీశ్వర్లు. భారతీయుల మనస్తత్వాన్ని గ్రహించిన ఆంగ్లేయులు క్రైస్తవ
జ. శ్రీ రాయప్రోలు కవిత్వంలో కులమతాల ప్రస్తావస్థ మతాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. క్రైస్తవ మతం కూడా తెలుగు సాహిత్యంపై ప్రభావాన్ని చూపింది. ఈ మతం ద్వారా సంభవించిన ఉషద్రవాలు సమాజాభివృద్ధిని ఆటంక పరచకుండా వుండలేవు. ఈ ఉపద్రవాలు సంభవించినప్పుడల్లా ఏదో ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేయడం సహజమే. ఆ ప్రయత్నంలో భాగంగానే సంఘసంస్మరణోద్యమం ప్రాదుర్భవించింది.
వంగదేశంలో రాజారామోహనరాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణ చేయడం మొదలుపెట్టాడు. మహారాష్ట్రలో ఫూలే సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. ఈ సంఘ సంస్కరణకు మూలం “మానవోద్యమ దృకృధమే”. ఆంధ్రదేశంలో ఈ సంస్కరణోద్యమాన్ని అందిపుచ్చుకున్నవారు వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు నిజాంరాషష్టంలో భాగ్యవర్శరెడ్డి లాంటి వాళ్లు. ఈ ఉద్యమం ద్వారా కుల మతాల పునాదులు కదలకపోయినా, గోడలు మాత్రం పగుళ్ళు పడ్డాయని చెప్పవచ్చు. కులమతాలు వ్యక్తి వికాసానికి నిరోధాలని, సమాజఖివృద్ధికి ఆటంకాలని తెలిసి పోయాయి. ఈ సాంఘిక రుగ్మతలని నిరసిస్తూ తెలుగుదేశంలోని కవులు కవిత్వం రాశారు. “సంఘ సంస్కరణ కవిత్వంపై మానవోద్యమం, గాంధీజీ మున్నగు స్వదేశీయ ప్రభావమే కాని విదేశీయ ప్రభావము అణుమాత్రమైనను లేదు. (ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు సినారె పేజీ - 421)
నాడు సంఘ సంస్మరణోద్యమం రాయప్రోలుని కూడా ప్రభావితం చేసింది. వారి కావ్యాల్ని పరిశీలిస్తే నాటి సమకాలీన సమస్యలెన్నో వారి కవిత్వంలో దర్శన మిస్తాయి. రాయప్రోలు కవిగా ఎదుగుతున్నప్పుడు దేశంలో జాతీయోద్యమ గాలులు వీస్తున్నాయి. సంఘ సంస్కరణ కూడా జాతీయోద్యమంలో భాగమే. రాయప్రోలు సుబ్బారావు నవ్యకవితా సృష్టికి ఎక్కువ కృషి చేసినా అక్కదక్కడా కులమతాల ప్రస్తావన కూడా తమ కవిత్వంలో తీసుకువచ్చారు. రాయప్రోలు కావ్యాలలో (బ్రాహ్మణ వాతావరణానికి నంబంధించిన వర్షన కన్పిన్తుంది. బాహ్మణ సంన్కృతిని ఉన్నతీకరించాడు రాయప్రోలు.
ఉన్నత కులాల వారు నిమ్నకులాల వారిని తాకరాదని, తాకితే వారు అస్పృశ్యతకు గురి అవుతారు అనే ఆలోచన భారతీయ సమాజంలో వుంది. ఒకే (ప్రదేశంలో అందరూ కలసి జీవిస్తూ కొందరిని తాకరాదనే అమానుషత్వం క్షమించరానిది.
దా. బన్న అయిలయ్య 25్ అస్పృశ్యత అనే ఆచారం కొన్ని కులాల్ని అధమాధమ స్దానానికి నెట్టివేసి హైన్య దైన్య స్థితిని కల్పిస్తుంది. రాయస్రోలుని ఇది మనస్తాపానికి గురిచేసింది. “అల్లులేక యధోగతి యందు గ్రుంగి, జాతి మాటిన నిమ్న సంజాతమెల్ల తాకరాదని పిడికిలి దైన్యమునకు (తెనుగుతోట - పేజి 3) అని తన వేదనని వ్యక్తం చేసాడు.
రాయప్రోలు సుబ్బారావు దృష్టిలో సృష్టే ప్రేమమయం. ప్రేమకు వర్ణభేదాలు లేవు. ప్రేమనే పదమే అందరి హృదయాలలో లయిస్తుంది. పరస్పర (ప్రేమ భావనతో సుఖజీవనము గడపవచ్చును. పంచభూతాలకు వివక్షలేదు సమాజంలోని సర్వ జీవులు పంచభూతాలని సమంగా వాడుకుంటాయి. పంచభూతాలకు లేని వివక్ష (ప్రేమ కెందుకంటూ “ప్రేమ వృత్తికి చండాల భేదమేల బ్రాహ్మణాగ్రహారము నందు పవలురేయి పిసరు పోనీరు కడజాతి వీటియందు తాకలేక వీచునె పక్షతంత్ర జడిమ” (తెనుగు తోట - పేజీ 2) నంటాడు.
కులం వ్యక్తినీ నైతికంగా క్రుంగదీస్తుంది. సాంఘికంగా వెలివేస్తుంది. అస్పృశ్యుడు అనే భావమే అతన్ని సమాజం నుంచి విడదీస్తుంది. అస్పృశ్యుడు, తన కోసం తాను మాత్రమే బ్రతికే జంతుస్థితికి రావలసిన స్థితి సమాజంలో కల్పించబడింది. ఒక వర్గాన్ని జాతీయ శక్తినుంచి విడగొట్టి ఆ వర్గం శ్రమని వినియోగించుకోకుండా పరిమిత పరిధిలోనే బంధించి సమాజాభివృద్ధిని కుంటుపరచటం జరుగుతుంది. ఈ “కుల విద్వేషము కుష్టిదోషమయి ప్రాకున్ సంఘ కాయంబూ (పాపమ్ మిశ్రమంజరి పేజీ 105) నని నిశ్చయంగా చెబుతాడు.
“క్సృుల భేదము - మత విరోధము పొటమరించె స్పోటకము వలె ఇరుగు పొరుగుల యివ్వబంధము తెగెన్ వురివిడికటకటన్” (ఫాల్లుణి జు మిశ్రమంజరి పేజీ 96) కుల మత విరోధము స్పోటక వ్యాధివలె వ్యాపించి, ఇరుగుపొరుగు రాష్ట్ర బంధాల్ని కూడా తెంపి వేస్తాయని రాయప్రోలు చెబుతాడు. సర్వమతాలు శాంతి సహజీవనమే కోరుకుంటాయి; సమాజ (శ్రేయస్సునే బోధిస్తాయి. మతావలంబికుల వ్యక్తిగత అభిప్రాయాల్లో స్వార్థ చింతనతో దౌర్జన్యాలకు పాల్పడి స్పర్థలు సృష్టించి, పరమత సహనం పాటింపక మానవత్వాన్ని వీడి అశాంతి ఆయుధంతో శాంతిని చెరబట్టారు.
26 త్రీ రాయప్రోలు కవిత్వంలో కులమతాల ప్రస్తావన్ధ (ప్రేమ బంధం మచ్చుకైనా కానరాక (ప్రేమ స్థానంలో ఉన్మాదం చోటు చేసుకుంది. “రాష్ట దురాక్రమణలన్ మతమతాంతర మత్సరములన్ ప్రమమయమగు విశ్వమానవ గర్భమే గాయాలు పదెన్” (భద్రయాత్రి - మిశ్ర మంజరి - 24) ననే ఆవేదనని వ్యక్తం చేస్తాడు రాయప్రోలు సుబ్బారావు.
పూర్వం బ్రహ్మర్షులు తపస్సులు చేసి మానవ జన్మ పరమార్ధ మార్దాన్ని చూపారు. విశ్వ వేదన, జీవకారుణ్యం, ఆత్మబలిదానం విశ్వంలో వ్యాపింప జేయాలనే చిరునవ్వుతో శిలువ నెక్కాడు క్రీస్తు. “నిలువునా దేహము నెత్తుట జౌత్తిల శిలువ మీద బడె జీససు తానే (ప్రేమ రాజ్యమును భూమి నిలుపొ (తారణ - వనమాల, పేజీ 14) (ప్రేమ రాజ్యం నెల కొల్పాలనే క్రీస్తు ఆత్మబలిదానం చేసికున్నాడు. రక రకాల పేర్లతో దేవుణ్ణి మొక్కటం కంటే “ఏకేశ్వర మతి లోకము నతికి” ననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఏకేశ్వర భావన బ్రహ్మ సమాజం వల్ల రాయప్రోలుకు అబ్బినదనే విషయాన్ని గ్రహించాలి. మానవులంతా దేవుడొక్కడేననే భావం వుండి వుంటే పోట్లాటలకు అవకాశం లేదు. విరోధాలకు తావు లేదు. మతం బొడ్లో మడతకత్తులు దాగవు. ఏకేశ్వర భావనతో ప్రజలు మెలగిన రోజు” ప్రజా సహోదర బంధము పెంచ......” వచ్చుననే నమ్మకాన్ని రాయప్రోలు తెలియజేస్తాడు.
మత విద్వేష జ్వాలలు మానవత్వాన్ని కాల్చి వేస్తాయి. సహృదయుల్ని బలితీసుకున్నాయి. అమాయకుల్ని మట్టుబెట్టాయి. ఎందరో మహాత్ముల్ని కాల్చివేస్తాయి; మతమనే మత్సరం మనిషి శరీరం నిందా వ్యాపించి జంతువును చేస్తున్నాయి. “మనిషి జంతువు అయితే జంతువు కన్నా (క్రూరంగా మారిపోతాడు” - “ఊరి నలుప్రక్కలందును మదయవవేళ కదలి, చేమలి పుట్టల వెదికి వెదికి మంచి బియ్యం చల్లు సంసారులకు మారినారు మతద్వేష మలిన మంటి” (బుద్ధ దీక్ష - ఆంధ్రావళి, పేజీ 63) జాలి, దయ, కరుణల గూర్చి బోధించాల్సిన మతం భిన్నంగా (ప్రవర్తించి మానవత్వాన్ని నశింపజేసింది. ప్రజలు కలసి మెలగిన రోజు “ప్రజా సహోదర బంధము పెంచ......” వచ్చుననే నమ్మకాన్ని రాప్రోలు తెలియజేస్తాడు.
ఇరుగు పొరుగు వారు పోట్లాడుకోవటమే కాదు దాయాదులు పోట్లాడుకోవడం ఎంతటి అనర్ధానికి దారితీస్తుందో మనకు మహాభారతం ద్వారానే తెలిసింది. ఆయినా
డా. బన్న అయిలయ్య జ్ కోక ఈ సమాజంలో “జాతులు, జాతులును. .. మతములు; మతములను రాజులును రాజులు/ అసహనముతో అలిగి పెనగిరి /స్నీహ దీపములాజగన్” - రాజులు పోట్లాడుకొని రాజ్యాల్ని నాశనం చేసారు. మతాలు, మతాలు పోట్లాదుకొని మానవత్వాన్ని రూపుమాపాయి. వీటన్నిటి ఫలితమే స్నేహబంధం దెబ్బతిందని రాయప్రోలు గత చరిత్రని స్ఫురణకు తెచ్చి, పోట్లాటలు మానుకోందనే ప్రబోధిస్తాడు.
కులమతాలు వెర్రితలలు వేస్తే సమాజంలో శాంతి సౌఖ్య జీవనం గడపటం కష్టమనే విషయాన్ని రాయప్రోలు గ్రహించాడు. రాయప్రోలు హిందూమతాన్ని సమర్ధిస్తూన్న పరమత సహనం పాటించినట్లు తన కవిత్వం బుజుపరుస్తుంది. రాయప్రోలు పూర్తిగా కులమతాలు పోవాలనే స్పష్టమైన అభిప్రాయాన్ని ఎక్కడా తెలియజేయలేదు కాని, కులబేధాలు, కులమత విద్వేషాలు మరిచి జీవించాలని తన కవిత్వం ద్వారా సమాజానికి బోధించాడు.
రాయప్రోలు సుబ్బారావు కవిత్వంలో కన్పించే ఈ ప్రగతిభావాలు, నాటి సంఘ సంస్కరణ, మానవతా ఉద్యమాల ప్రభావ ఫలితమని చెప్పవచ్చు.
ర్. ఈ శతాబ్ది కవి జాషువా
ఇరవయ్యో శతాబ్ది తెలుగు కవులలో నవయుగ కవి చక్రవర్తి గుజ్జం జాషువా స్థానం విశిష్టమైనది. సమకాలీన కవుల కవిత్వం కంటే జాషువా కవిత్వం విలక్షణమైనదిగా తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించింది. నాటి కవులలాగా దంతశిఖరాలపై కూర్చుండి మబ్బుల వస్త్రాలని మొహంపై వేసుకొని అకారణంగా వెళ్టిగా దుఃఖించిన కవి కాదు జాషువా. కేవలం గులాబి రేకుల్నేతింటూ గగన సీమల్లో స్వప్నలోకాల్లో విహరించిన కాల్పానిక కవికాదు. అతని రచనలు వాస్తవ భూమికపై మొలకెత్తి వికాసం పొంది విస్తరింపబడినవి. దేశంలో బహుజనుల ఆర్తిని ఆవేదనని వ్యధని తన కవిత్వంలో ప్రతిఫలింపజేశాడు. కుల జాధ్యాన్ని అస్ఫృశ్యతని మతమౌధ్యాన్ని సంఘంలో పాతుకు పోయిన హేతురహితమైన ఆచారాలని (భ్రష్టుపట్టిన సంప్రదాయాలని, హింసని, జాషువా నిరసిస్తూ రచనలు చేశాడు. స్త్రీ, పురుషుల మధ్య కొనసాగుతున్న ద్వంద్వ నీతిని, అనేక సాంఘిక రుగ్మతలని తన రచనల ద్వారా ఖండించాడు జాషువా. ఆయన రచనలు కారుణ్యానికి, మానవతకు, ప్రతిఘటనా చైతన్యానికి, జాతీయతకు దేశ భక్తికి, విశ్వ కళ్యాణునికి పట్టం గట్టాయి. కనుకనే జాషువా రచనలకు విశ్వజనీనత అబ్బింది. ఈ శతాబ్ది తొలితరం తెలుగు కవులల్లో కెల్లా వినూత్న మార్గాన్ని అనుసరించి సాహితీ సృజన చేసిన కవి శ్రేష్టుడు జాషువా.
ఏ ఆధునిక తెలుగు కవికి లేని సొమాజిక నేపధ్యం జాషువాకుంది. ఒక విలక్షణమైన సామాజిక నేపథ్యం నుండి ఆయన సాహితీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. జాషువా జీవితం సాహిత్యం అవిభాజ్యమైనవి. అందుకే ఆయనకు ముందు, ఆయన సమకాలీనంలోని సామాజిక వ్యవస్థను తెలిసికోవటం అనివార్యం.
పూర్వం నుండి భారతదేశ సామాజిక వ్యవస్థలో కులం, మతం బలంగా వేళ్లూనుకొని పోయి, సంఘంలోని వ్యక్తుల జీవితాలని అశాంతిమయం చేశాయి. సమాజ సహగమనానికి ఆటంకం కల్గించాయి. వ్యక్తులకు వ్యక్తులకూ మధ్య వ్యవస్థకు వ్యవస్థకూ మధ్య
డా. బన్న అయిలయ్య 29 నిరంతరం ఘర్షణ జరుగుతుంది. కులమతాలపై ప్రాచీన కాలంలో చార్వాకులు, బుద్దుడు, వీరశైవులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం లాంటి మహానుభావులు తిరుగు బాటు చేస్తూనే వచ్చారు. ఆధునిక కాలంలో కుల వివక్ష అస్బృశ్యత, మత మౌధ్యంపై కాలం చెల్లిన మూధాచారాలపై, నిర్హేతుకమైన సంప్రదాయాలపై ఎందరో ఉద్యమాలు లేవదీసి సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నించారు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజాలు నడిపిన సంస్మరణ ఉద్యమాలు చెప్పుకోదగినవి. సంస్మరణ ఉద్యమాల వలన బలపడిన జాతీయోద్యమం కూడా వీటిపై పోరాటం చేసింది. సమాజాన్ని నూతన దిశకు తీసికెళ్ళాలని, కోల్పోయిన విలువలని పునరుద్ధరించాలని సంఘ సంస్క్మరణోద్యమం, జాతీయోద్యమం. కృషి చేశాయి. కాని ఈ ఉద్యమాలు సమాజం ఉపరితలంలో మార్పు తీసుకొచ్చినంతగా, పునాదుల్లో మార్పు తీసుకు రాలేక పోయాయి. పునాదుల్లో మార్పు తీసుకొచ్చిన ఉద్యమాలు (బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాలు. మహారాష్ట్రంలో జ్యోతీరావ్ ఫూలే “సత్యశోధక' స్థాపనతో ఉద్యమాలు బలపడి దేశంలో విస్తరించాయి. మహారాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని అందుకున్నవారు సాహుమహరాజ్, డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్. బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని కేరళలో నడిపినవాడు నారాయణగుర్వు తమిళనాడులో రామస్వామి నాయకర్. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన తెలుగువాళ్ళపై కూడా ఈ ఉద్యమం అమితమైన ప్రభావాన్నే చూవింది. త్రిపురనేని రామస్వామి తదితరులు కులతత్వం మీద, (బ్రాహ్మజాధిక్యత మాద చేసిన పోరు, మూఢాచారాలకు గుడ్డి నమ్మకాలకు వ్యతిరేకంగా ఎగురవేసిన హేతువాదబావుట (ఎన్. అంజయ్య - జాషువా ప్రాపంచిక దృక్పధం- ప్రజాసాహితి, అక్టోబర్ 1995, పుట 16) హిందూ మతంలోని వర్ణవ్యవస్థను అస్తిత్వాన్ని ప్రశ్నించినట్లయింది. తెలుగు దేశంలో వీరేశలింగం నడిపిన సంస్మరణ ఉద్యమం కూడా విస్మరింపరానిదే. ఈ నేపధ్యమే జాషువా సాహిత్యానికి ప్రాతిపదిక అయ్యింది. పుట్టుకతోనే కుల వివక్ష అస్పృశ్యత, కటిక దారిద్ర్యం, వారసత్వంగా లభించే పంచమ జాతిలో 1995 సెప్టెంబర్ 28 నాడు గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించాడు జాషువా. 1971 జూలై 24న కీర్తిశేషుడైనాడు. గబ్బిలం, పిరదౌసి, అనాధ, ముసాఫరులు, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, రా(ష్టపూజ, నాగార్జున సాగర్, శివాజి, కొత్తలోకం, క్రీస్తుచరిత్ర, నాకధ, (మూడు భాగాలు) ఖండ కావ్యాలు (ఏడు భాగాలు) జాషువా రచించాడు. వీటిలో లఘు కావ్యాలున్నాయి. ఖండ కావ్యాలున్నాయి. ఇవే కాకుండా రుక్మిణీ కళ్యాణం, ధ్రువ విజయం, చిదానంద ప్రభాతం, వీరాబాయి, తెరచాటు నాటకాలు.
30 ఈ శతాబ్ది కవి జాషువా చిన్న నాయకుడు (చరిత్రాత్మక), లవకుశోపాఖ్యానం (పౌరాణిక) అనే రెండు నవలలు కూడా జూషువా రచించాడు. జాషువా ప్రతిభా సంపత్తిని గుర్తించినదేశం ఆయనకు కవిశారద, కవికోకిల, కవిదిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి మధురశ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ బిరుదులిచ్చి, వేయికి పైగా సన్మానాలు చేసి ఆయనను గౌరవించింది.
ఖండకావ్య ప్రక్రియని సుసంపన్నం చేసిన కీర్తిజాషువాకే దక్కుతుంది. “జాషువా కవి గారికి ఖండ కావ్యాల వల్లనూ లఘుకావ్యాల వల్లనూ సమంగా కీర్తి లభించింది. ఉభయ ప్రక్రియ శిల్పాచార్యుడనిపించుకున్నారు. ” (ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం- సాహిత్యంలో చర్చనీయాంశాలు, పుట 561 తెలుగు అకాడమి ముద్రణ 1991) జాషువా స్వీకరించిన కవితావస్తువులు అపూర్వాలు. ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ఆయన కవితా వస్తువులు ఆయన జీవితంలో తారసపడినవే. పేదలు, అనాధలు, బాటసారులు, చారిత్రక పురుషులు, సాహసనారీమణులు, త్యాగమూర్తులు, ప్రకృతిలోని మూగజీవాలైన సాలెపురుగు, గిజిగాడు. దేశభక్తి, ఆంధ్రాఖిమానం, కాందిశీకులు, గబ్బిలం, మొదలైనవి ఆయన కవితా వస్తువులు. సమకాలీనంలో జరిగిన యుద్ధం, ప్రపంచ చరిత్రలో అకలి దశాబ్దంగా గుర్తించిన హంగ్రీ థర్టీస్ల ప్రభావం జాషువా రచనలపై ఉంది. ఎన్నో స్వీయానుభవాలు, నిరంతర మానసిక వేదన, సాంఘిక కట్టుబాట్లు, అవమానాలు, అన్యాయాలు, ఉద్యమాలని, సంక్షిష్టకలని చూసిన జాషువా కవిత్వంలో ఇంతటి వస్తు వైవిధ్యం ఉండటం సహజమే. ఈ వస్తువులన్నీ సామాజిక స్పృహతో కూడుకున్నవి కావడం విశేషం. జాషువాది నిశితమైన దృష్టి కనుకనే మరే కవి దృష్టికెళ్ళని సామాజిక కోజాలని దర్శించి కవిత్వీకరించ గలిగాడు. అభ్యుదయ సాహితోద్యమం వచ్చాక వస్తువు మారింది. కవితా రూపం మారింది. “కవిత్వానికి రూపం ("0134 కంటే వస్తువే ముఖ్యమని నిరూపించిన కవి జాషువా. వస్తువు (60%గ8గౌ) మారినప్పుడు రూపం కూడా మారడం సర్వసాధారణమైన సాహిత్య సూత్రం. అయినా ఆ సార్వత్రిక సూత్రాన్ని అధిగమించి కాలం పరీక్షలో నిలిచి గెలుపొందింది జాషువా పద్యం.” (డా॥ కంటె వరపు వెంకట్రామయ్య -- గబ్బిలం జాషువా ఆత్మ కధాత్మక కావ్యం (ప్రజాసాహితి, అక్టోబర్ 1995 పుట 70) తన భావం జన సామాన్యానికి అందివ్వడంకోసం ప్రయత్నించిన జాషువా “గహన సంచారం లేని కవిత్వం నా లక్ష్యం” అని చెప్పుకున్నాడు. 'కావ్యశిల్చ్బం కన్నా భావ ప్రకటనమే నా పరమావధి అని ప్రకటించుకున్నాడు పద్యం పామరుని
దా. బన్న అయిలయ్య తే హృదయానికి కూడా హత్తుకునేలా శ్రవణపేయంగా రాశాడు. బహుళ ప్రచారంలో ఉండే భాషాపద జాలమే ఆయన పద్యంకు జీవగజ్జలైనాయి. జాషువా వస్తువుకున్న ప్రత్యేకత, ఆయన పద్యోక్తులకుంది. కనుకనే "గుజ్జం జాషువా గారి మార్గం ఒకటి కవితా లోకంలో వెలసింది” (ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, సాహిత్యంలో చర్చనీయాంశాలు, పుట 662 తెలుగు అకాడమి ముద్రణ 1991) అని చెప్పవచ్చు. జాషువా ఆటస్థలాల్లో కులభేదాన్ని చూశాడు. వినోద ప్రదర్శనాశాలల్లో అస్పృశ్యతా జాధ్యం ఎదురైంది. కులభేదం, పేదరికం, రెండూ తన గురువులని చెప్పుకున్నాడు జాషువా. పేదరికం ఆయనలో వినయ విధేయతను పెంపొందిస్తే, కులభేదం బానిసని చేయక ప్రతిఘటనా శక్తిని పెంపొందించిందన్నాడు. సంఘంలో అంతటా విస్తరించిన పేదరికంపై, కులంపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. వీటిపై కత్తి కట్టాడు. ఆ కత్తి ఆయన కలం. అ కలానికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై మాత్రమే ద్వేషం ఉందని ప్రకటించాడు జాషువా. పంచముడైన కారణంగా “సభలోని కెట్లు జొరబడే నిమ్నజుండని' సవర్ణ హిందువులు జాషువాని దూషించారు. కవిత్వం రాసినందుకు “శ్రేరిపారన్నను దిలకించి మాటల నడుము లలిత కళల గొడవ దెచ్చి పృథివీ సురులు దక్క నితర జాతులు కైత లల్లరాదు నెరమండ్రు..........* (నాకథ-మొదటి భాగం) అంటూ అంక్షలు విధించారు. ఒకవేళ ఆంక్షలని ధిక్కరించి కవితలల్లిన పంచముడ్నీ “నరికిన పాపము లేదని పురాణ యుగధర్మ సూత్రాలు “ఫత్వా జాకీ చేశాయి. ఇలాంటి 'ప్రతీకూల పరిస్థితులుని అధిగమించి కవితాలతని పెంచి పోషించుకొని తన ప్రత్యేకతని చాటుకున్నాడు జాషువా. తన కవిత్వంను మెచ్చుకున్న వారే కులం తెలియగానే ప్రవర్తించిన తీరును ఈ విధంగా చెప్పాడు. “నా కవితా వధూటి వదనంబు నెగాదిగజూచి, రూపురే భాక మనీయవైఖరులు గాంచి “భళీభళి యన్నవాడె “మా దేకుల” మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో బాకున (గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర ! వచింప సిగ్గుగన్” (ఖండకావ్యం మొదటి భాగం) ఇలా అనేక అవమానాలు చవిచూసిన జాషువా, తనని అవమానించిన వారందరూ “గవ్వకు సొటిరాని' వారని గ్రహించాడు. అగ్రవర్దాల ఆంక్షలతో 'నను వరించిన
౩టబై ఈ శతాబ్ది కవి జాషువా శారద లేచిపోవునా? అని నవ్వుకున్నాడు. 'పలుగాకుల మూకల సూయచే' తన కవిత్వాన్ని అవమాన పరచి ఆటంక పరచినా 'గంట మూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగల్ సవరించెద నాంధ్రవాజికిన్' అని ఆత్మ విశ్వాస ప్రకటన చేసి తన కవితా ముద్రని తెలుగు సాహిత్యంపై వేశాడు. ఈ కుల సమాజంపై ధ్వజమొత్తాలని పూనుకున్నాడు జాషువా. అయితే జాషువా కంటే ముందే సామాజిక సాహిత్యరంగాలలో కులమతాలపై పోరాటం చేసిన వారున్నారు. వారిలో మహాత్మా గాంధీ, గురజాడ, వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి, మంగినపూడి, కమ్యూనిష్టుల కృషి చెప్పుకోదగినదే. అయితే వీరంతా సామాజిక స్థాయిలో ఉన్నతమైనవారు. కుల మతాలపై వీరిది ఉదారవాదం. కాని అట్టడుగు వర్గంలోపుట్టి కులాహంకారానికి బలై, అనేక అవమానాలకు ఎదురీది వాటి మిద నిరంతరం పోరు సల్చిన వారు అటు మధ్యభారతంలో డా! అంబేద్కర్ మినహా, ఇటు ఆంధ్రదేశంలో ఒక జాషువా తప్ప మరొకరు లేరు (ఎన్. అంజయ్య - జాషువా ప్రాపంచిక దృక్పథం-ప్రజా సాహితి, పుట 16 అక్టోబర్ 1995) కులమత వివక్షపై సామాజిక పోరాటం సాగించిన డా॥ అంబేద్కర్‌కు ఎంతటి మహోన్నత స్థానం ఉందో తెలుగు సాహిత్యంలో జాషువాకు అంతటి స్థానం ఉంది. “కలడంబేద్కర్ నా సహోదరుడు మాకై యష్టకష్టాలకుం బలియ్రై సీమకు పోయి కమ్మరిని విద్వాంసుడు” అని జాషువా అంబేద్మరుని స్తుతించి ఆయన మార్గాన్ని అనుసరించాడు.
హిందూమతం సజాతీయులని అస్పృశ్యులుగా చిత్రించి తరతరాలుగా అణచి వేసి వారిని సామాజిక బహిష్కరణకు గురిచేసి, ఆర్ధిక దోపిడి చేస్తూ 'ససరం కన్నా హీనంగా” చూడడాన్ని సహించని జాషువా “మనిషి కోసం మతం కాని, మతంకోసం మనిషి కాదనే సత్యప్రకటన చేశాడు. హిందూ మతానికి ప్రాతిపదిక లనదగిన, (ప్రామాణికమైన గ్రంథాలు, ధర్మ శాస్త్రాలే విరుద్ధ భావాలతో'కూడుకొని ఉన్నాయి. జన్మనా జాయతే శూద్రః (జన్మరీత్యా అందరూ శూద్రులే), ఆర్యాతై వర్ణికా (ఆర్యులు మూడు వర్ణాల వారే) చాతుర్వర్హ్య మాయాసృష్టం గుణకర్మ విభాగశః (గుణ కర్మాలను బట్టినాలుగు వర్దాలు నాచే సృష్టించబడినాయి), నాస్తితు పంచమః (పంచమ వర్ణం లేదు) ఇలా ఒకశాస్తానికి మరో శాస్త్రానికి పొంతన లేని భావాలు కన్పిస్తున్నాయి. దీన్ని బట్టి 'కులం' స్వార్ధపరుల సృష్టి అని తెలుస్తుంది. కులసృష్టి ఒక సామాజిక కుట్రగా కనిపిస్తుంది.
“ముసలి వాడైన బ్రహ్మకు బుట్టినారు
నలువురు కుమారు లనుట వీన్నాము కాని
డా. బన్న అయిలయ్య 33 పసరము కన్నా హీను డ భాగ్యుడైన యమైదవ కులస్య దెవరమ్మా భారతి” (ఖండ కావ్యము) అని భరతమాతని ప్రశ్నించిన జాషువాకు 'కర్మ ఫలమున పంచమజాతిలో పుట్టినట్లు జవాబు వస్తుంది. 'కర్మ' “పునర్జన్మ అనే రెండు పదాలు భారత సమాజంలో బలంగా వెళ్లూనుకొని పోయాయి. అవి కేవలం విశ్వసింపదగినవే తప్ప బుజువర్తనకు నిలిచేవి కావు. “కర్మ మననేమో దానికి కక్షయేమొ ఈశ్వరుని చేత బుజువు చేయించవమ్మా” (గబ్బిలం) అని అనటంలో నోరులేని దేవుళ్ళనుండి సమాధానం ఆశించని జాషువా వేదన ఇక్కడ కనిపిస్తుంది. భారతీయతత్వం గొప్పదే కావచ్చు!? సకల చరాచరాల మిద సానుభూతి చూపుతుంది. “పామునకు పాలు, చీమకు పంచదార” పెట్టి ప్రతి జంతువులో ఒక దైవాన్ని చూస్తుంది. “కనబడలేదు దైవతముగాని పదార్ధము భారతంబునన్ గనబడలేదు వర్ణమున కన్న మహాకళ భారతంబునన్ కనబడలేదు సత్ములముకన్న పిశాచము భారతంబునన్ గనుబడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్” (గబ్బిలం) దైవము సర్వంతర్యామని చెప్పిన మతమే తోటి మానవుడిని పంచముడుగా ముద్రవేసి నీచపు జంతువుగా చేసింది. సవర్థుడైన హిందువునే అస్ప బగ్చుడిని చేసి అంటరానివాదనీ, చూడరానివాడని, వినరాని వాడని, సాంఘిక బహిష్కరణకు, సాహిత్య సంస్కృతులకు దూరం చేసింది. “మనిషిని మనిషి దూరం కొట్టి జంతువుని ప్రేమించి మనిషిని ద్వేషించు స్వభావం జంతుస్వభావమా? మానవ స్వభావమా?” (కత్తి పద్మారావు - సాంఘిక విప్లవ మూర్తులు -పుట 109 లోకాయత ప్రచురణలు) అనే సందేహం కలుగక మానదు. “వాడు చమటోద్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు” వాడి శ్రమ పరాయీకరణకు గురవుతుంది. జాతీయ జీవన ప్రధాన స్రవంతి నుండి పంచముడిని దూరంకొట్టి అమానుషంగా ప్రవర్తిస్తుంది హిందూమతం- “ఆయభాగ్యుని రక్తంబు నాహరించి యినుపగజ్జెల తల్లి జీవనము సేయుం
లెక ఈ శతాబ్ది కవి జాషువా గసరి బుసకొట్టు నాతని గాలిసోక నాల్గుపడగల హైందవ నాగరాజు (గబ్బిలం) నిరంతరం శ్రమచేస్తున్న పంచముడి శ్రమని, శ్రమ ఫలాలని దోపిడి చేస్తున్నారు. ఆ పంచముడి ఇల్లు దారిద్యదేవతకు నిలయమై పోయింది. నాలుగు పడగలని నాలుగు కులాలు (బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర)గా చిత్రించాడు జాషువా. ఒక కులం మరొక కులం కంటే గొప్పదైనట్లు, ఒక పడగ మరొక పడగ కంటే పెద్దది. ఒక కులం మరొక కులాన్ని వెలివేసి తమకంటే తక్కువగా భావించుకుంటాయి. నిచ్చెన మెట్ల లాంటి కుల సమాజంలో ఇది సహజం. పాములు వాయువునే ఆహారంగా స్వీకరిస్తాయని జనోక్తి కాని పంచముడిగాలి సోకితేనే 'కసరి బుసకొట్టుతుంది హైందవనాగరాజు సమాజంలో పంచముడి స్థితి ధ్వని పూర్వకంగా చెప్పాడిక్కడ జాషువా. సజాతీయ హిందువులు పులిమిన కులం రంగు “లక్ష సబ్బులకు గూడా పోదు అంజేకాక వాని తలమీదా బులిమిన పంకిలమును గడిగి కరుణింపదయ్యె గగనగంగ, సకల కల్మషాన్ని తొలగించే గంగానది కులం కల్మషాన్ని తొలగించలేదంటే సమాజశరీరంలో కులంరంగు ఎలా జీర్ణించుకు పోయిందో తెలుస్తుంది. 'నరులను ముట్టకనందులన్ గొలిచె' పుణ్యం పొందాలనే మనుష్యులు, నరుని కష్టపెట్టి నారాయణున్నిగొల్బె' పవిత్ర భూమిలో ఎందరు (ప్రతిభావంతులు వ్యర్థమై పోయారో చెబుతాడు. ఎంత కోయిలపాట వృధాయయ్యెనో కదా చిక్కు చీకటి మనసీమలందు ఎన్ని వెన్నెల వాగుభింకి పోయెనో గదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా మురికి తిన్నెల మాద పరిమళించి ఎంతగంధ వహనమెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమై పోయెనో పుట్టరాని చోట పుట్టకతన” (గబ్బిలం)
దా, బన్న అయిలయ్య ఏర్ కులం పునాదులపై నిర్మించిన సమాజంలో వివక్షకులోనై చరిత్ర గర్భంలో కల్సిపోయిన వాళ్ళ గురించి జాషువా చేసిన వేదనా ప్రకటనకు సాక్ష్యం మిపద్యం.
మతం పేరున జరిగే జంతుబలులను, హింసను తీవ్రంగా ఖండించాడు జాషువా. రాతిదేవుళ్ళకు మూగ జీవులైన జంతువులను బలివ్వటం సంస్కర్తయిన జాషువా హృదయం విలవిల్లాడింది. శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణాలు, విగ్రహాలకు నిత్యనైవేద్యాలు పెట్టడం వీటిపేర వందలువేలు ఖర్చు చేయడాన్ని నిరసించాడు. ఈ దేశంలోకోట్లాది మంది తిండి లేక ఆకలి డొక్కలతో మాడిపోతుంటే హైందవ భక్తులు “ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని” అని ఘనమైన మతమని ఒకరికొకరు పోటీలు పడుతూ శైవ, వైష్ణవాలుగా విడిపోయి సమాజాన్ని అశాంతికి గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో “ఇస్లాం, క్రైస్తవ మతాలు కాలూనిన తరువాత, శాంతీ క్రాంతీ భారతావనిలో కరువయ్యాయి.” (కత్తి పద్మారావు సాంఘిక విప్లవమూర్తులు పుట 112 , లోకాయత ప్రచురణలు) ద్వితీయ ముద్రణ, 1995 ఆగస్టు) కైస్తవ మతం పంచములని రెండుగా చీల్చడంతో, “దేవుడొక్కడే దేవళంబులు రెండైనాయి.” “పుట్టుకతోనే మనుష్యులందరూ పాపులు అనే క్రైస్త్వ మతం జాషువాకు నచ్చలేదు. కాని ఏసుక్రీస్తు బోధించిన శాంతి, (ప్రేమ, త్యాగం, లాంటివి నేటి సంక్షిష్ట ప్రపంచానికి అవసరమని భావించాడు జాషువా. తన కృతులలో “మత పిచ్చిగాని వర్గోన్నతి గానీ స్వార్ధవింతనముగానీ నా కృతులందుండదు” (కొత్త లోకం) అని హామి ఇచ్చాడు జాషువా. ఆయన కృతులందు ఆద్యంతమూ మానవతే ప్రకాశిస్తుంది. కులం చేత మతాలచేత అనేక దూషణలను, దుర్భర పరిస్థితులను, ఎదుర్కొన్న జాషువా -
“కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు విశ్వనరుడ నేను.” (ఖండ కావ్యం-5వ భాగం) అని ప్రకటించుకున్నాడు.
జాషువా పీడిత వర్ణం నుండి పుట్టుకొచ్చిన కవి. సామాజిక అణచివేతను (ప్రత్యక్షంగా అనుభవించాడు. సాంఘిక దోపిడిని గుర్తించాడు. పేదవారి బాధలు ఎంత దయనీయంగా ఉంటాయో స్వీయానుభవం ఆయనకుంది. అందుకే నిరుపేదల బాధల
36 ఈ శతాబ్ది కవి జూషువా గాయాన్ని తన కవిత్వంలో బలంగా పలికించాడు. ధనికుల దోపిడిని తన రచనల్లో ఖండించాడు; పేదల దైన్యస్థితిని చిత్రించాడు. “పేదరికము పెద్ద ఏంత విద్యాశాల దానిలోని లజ్జ గానబడదు ఉదరమెజ్జ యగుచు ఓరంత ప్రొద్దులనోర్మి విద్దేనేర్పుచుండు నచట” (స్వపష్నకధ) పేదరికంతో బ్రతికేవారు పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి వస్తుంది. వారి ఆకలి అవసరాలు వారిని అనేక విధాలుగా మార్చిపారేస్తుంది. కేవలం ఆకలి తీరడం కోసమే వారు రకరకాలుగా మారుతుంటారు. పేదరికం నలన ఎన్నో అనుభవాలని చవిచూసిన జాషువా జీవితం నుండి జాలువారినదీ పద్యం. పేదల పట్ల కొందరు ధనికులు మానవతా దృష్టితో ప్రవర్తిస్తే, మరికొందరు అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా కొందరు వారిని పశువులుగా భావించి ఈ సడించుకుంటారు. ఇలా రకరకాల మనస్తత్వాలని అనాధ కావ్యంలో చూపించాడు జాషువా. ఒకప్పుడు బాగా బ్రతికి కాలం కలిసిరాక ఐశ్వర్యం కోల్పోయి, తినడానికి తిండిలేక, దిగజారిన ఆర్థిక పరిస్థితిని ప్రపంచానికి తెలియనీయకుండా ఆత్మాభిమానం కోసం ప్రాకులాడే వ్యక్తుల జీవితాలని స్వప్పకథలో చిత్రించాడు. దీన్నిబట్టి 'సిరినిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము అన్పించకమానదు. 'ఎకరమొక్కటికి మానికగింజరాలక” పన్నుగట్టడం కోసం ఇండ్లూ వాకిళ్ళూ అమ్ముకునే రైతులు, బ్లాక్ మార్కెట్ సాగించే బేహార్లు పెరటి బేరాలు సాగించే దొంగ వర్తకులు, లంచాలు గుంజి అక్రమార్దనకు పాల్పడే ఉద్యోగులు, పేదల ఓట్లతో పదవులు సంపాదించి తరువాత పేదవారినే విస్మరించే రాజకీయనాయకులు నైచ్చబుద్దులు మొదలైన సామాజిక రుగ్మతలని తన కవిత్వంలో చూపాడు జాషువా. ఎవదారగించు నమృత భోజనంబున గలిసెనో ఈ లేమ గంజిబువ్వ ఎవడు వాసముసేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె ఎవని దేహము మిద ధవళాంబరములో నొదిగెనో యిన్నాతి ముదుక పంచె ఎవడు దేహము సెర్చు మృదుతల్పములోన నక్కెనో యీాయమ్మ కుక్కిపడక" (అనాధ)
డా. బన్న అయిలయ్య త వర్గవ్యవస్ట వికృత స్వరూపాన్ని ఈ పద్యంలో కళ్ళకు కట్టినట్లు చూపాడు. అనాధలు, పేదల శ్రమను దోచుకోవడం వళ్లే ధనవంతులు మరింత ధనవంతులు కావడం, పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడటం జరుగుతుంది అంటాడు జాషువా. 'సహజ ప్రకృతి సౌఖ్యంబు లొకవ్యక్తి దొంగిలించడం నేరం” అంటాడు. ఆర్థికపీడనని, దోపిడీని ప్రతిభావంతంగా చిత్రించిన జాషువా వర్గవ్యవస్థని వ్యతిరేకించాడు.
“భాగవతంబు నా బాలశిక్ష భరత ఖండంబు నా పారశాలి అని పలికిన జాషువా నిష్కళంక దేశభక్తుడు, జాతీయవాది. 'చావలేదు భారత జాతీయ సంస్కృతి జూతి జీవశక్తి చావబోదని తనకు జాతి మీదున్న గౌరవాన్ని తెలిపాడు. 'సగర మాంధాతాది షట్బక్రవర్తుల యంకసీమల నిల్పినట్టి సాధ్వి భరతమాత. ఇది కాళిదాసాది కవులనుకన్న తల్లిగా కీర్తించాడు. గబ్బిలం కావ్యంలో తంజావూరు మొదలుకొని టిబెట్దాకా వర్ణించి భారతదేశ సంస్కృతిని బెన్నత్యాన్ని కీర్తించాడు. దేశం పరాయి పాలనలో బానిసగా ఉన్నప్పుడు, స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ దేశభక్తి కవిత్వం రాసాడు. జాతీయోద్యమాన్ని నడిపి దేశవిముక్తికి పోరాడిన మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ, జవహర్లాల్ నెహ్రూలని తన కవిత్వంలో స్తుతించాడు. ఒక వైపు అంబేద్మర్ రాజకీయ రిజర్వేషన్లు అడుగుతుంటే, చెప్పులు కుట్టేవాడు పార్లమెంటుకు వచ్చి ఏం చేస్తాడని, కుల అహంకారంతో ప్రవర్తించిన పటేల్‌ను కూడా స్తుతించిన జూషువా. వారి త్యాగం దేశ సౌభాగ్యాన్ని ఇనుమడింపజేస్తుందని విశ్వసించాడు. జాషువా, బుద్దుడి, వివేకానందుడి తాత్వికతని స్వీకరించి శ్లాఘించాడు. “చైనా భారత దేశంపై యుద్ధం (1962) ప్రకటించినపుడు 'ఇటనీయబ్బ గడించినట్టి ధరలేదేనాడు నీ పిచ్చి మర్కట చేష్టల్ పని చేయవెన్నడు అని హెచ్చరించాడు. బాపూజీ నేతాజీ, స్వయంవరం మొదలైన కావ్యాల్లో గబ్బిలం, కాందిశీకుడు కావ్యాల్లో కొంతభాగం దేశవైభవాన్ని తెలుపుతున్నాయి. రాష్ట్రపూజ, వీరచానమ్మ మొదలైన ఖండికలు జాషువా రాష్ర్రాభిమానాన్ని ఎత్తి చూపుతున్నాయి.
భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎనలేని గౌరవముందని చెప్పినా ఆచరణలో శూన్యమే. మధ్యయుగాల్లో ప్రీని భోగ్యవస్తువుగా చూశారు. పురుష స్వామ్య వ్యవస్థలో పురుషాధిక్యతతో, అహంకారంతో స్త్రీని అన్ని విధాల ఆణచివేసే ప్రయత్నం కొనసాగటం
38 ఈ శతాబ్ది కవి జూుషువా సహజమే. “భావకవితా యుగంలో స్రీ కోసం ఏడ్చి స్త్రీని ఏడిపించిన దేవులపల్లి, రాయప్రోలు, వేదుల వారెవ్వరికి స్రీపట్ల, న్రీవేదనపట్ల, స్రీ సంకెళ్లపట్ల, ఆమె హృదయాక్రందనను విన్సించినా జాషువా కున్నంత నిబద్ధత, సాంఘిక దృక్పధం వారికి లేదు. (కత్తి పద్మారావు - సాంఘిక విప్రవమూర్తులు పుట 112, లోకాయత ప్రచురణలు ద్వితీయ ముద్రణ 1995 ఆగస్టు) 'తెరచాటు' నాటకంలో బాల్య వివాహాలని ఖండించాడు జాషువా. వైధవ్యం పొందిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడాన్ని సమర్ధించాడు. అని వార్యంబగు యౌవనం బువికి సర్వంగమ్ములన్ నిండి, వెచ్చని రక్తంబును రెచ్చగొట్టి వేధింప'గా ఆవేదనకు గురి కావల్సిన అవసరం లేదన్నాడు. 'పతిమరణింప నాతని శవంబునకున్ సతి నాటగట్టడం క్రూరమని సతీసహగమనాన్ని నిరసించాడు. పురుషుడు అహంకారంతో ప్రవర్తిస్తూ స్త్రీని కించపరచే బహు భార్యత్వాన్ని వ్యతిరేకించాడు. వరకట్న దురాచారం వల్ల అనేక మంది యువతులు ఆత్మాహుతి చేసుకోవటం జాషువా హృదయాన్ని కాల్చివేసింది.
“పుర్సుషుల్ నిర్మితిజేయు సాంఘిక మహాభూతంబు పెన్లోరలం
దిరికింపంబడి దుష్టభర్తల కృపాహీన 'ప్రవృత్తుల్ హృద
తరమున్ అంపపు కోతగోయనిజహత్యానేరముల్సేయుసుం
దరులన్నివెటు తారడించునో మహాత్మా ! (ప్రేమ వారాన్నిధీ” అని ప్రీలపట్ల పురుషుల ప్రవర్తనని తెలిపాడు ్రీలకు జరుగుతున్న అన్యాయాలు స్త్రీలే ఎదురించాలని సంకల్పించిన జాషువా, స్త్రీజాతి చైతన్యవంతం కావాలని కోరుకున్నాడు. అందుకు మహిళలంతా విద్యనభ్యసించి, చైతన్య ప్రతిఘటనా శక్తి పెంపొందించు కోవాలన్నాడు. పురుషులకు ధీటుగా ధైర్య సాహసాలు (ప్రదర్శించి అంతరిక్షయానం చేసివచ్చిన రష్యన్ వనిత 'తెరిష్పోవాను 'వీరకుమారిగా అభివర్ణించాడు. స్త్రీలను కొట్టుటకు తిట్టుటకు నొంక పట్టాన జన్మించినట్లు భావించే పురుషాంకారము కూడదన్నాడు. పురుషుడు “ఎంత గడ్డి గజచి యెన్నిండ్లు దూరిన సంఘశక్తి నాకు సాయమయ్యె” అనే ద్వంద్వనీతి అంతమొందాలని కోరుకున్నాడు జాషువా. స్త్రీని ఆకాశందాకా పొగడుతూ అమె అందచందాలపై కవిత్వం రాసి, ఆమెని వాస్తవ జీవితం వైపుకు ఆలోచించకుందా చేస్తున్నారని, ఈ పొగడ్తలు ఆమెని 'వంటింటి కొరముట్టుగా గడించడం' జరుగుతుందని ఈ పరిస్థితులన్ని గమనిస్తూ స్రీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
డా, బన్న అయిలయ్య 39
హిందూ మతంలోని వర్ణవ్యవస్థ సజాతీయులని సాంఘిక బహిష్కరణకు గురి చేసింది. అస్పృశ్యులకు విద్యని, సాంస్కృతిక వారసత్వాన్ని అందకుండా చేసింది. 'కర్మ' సిద్ధాంతం బోధించి చైతన్య రహితులని చేసింది. హిందూమతంలోని భ్రష్టుపట్టి పోయిన చాతుర్వర్ణ వ్యవస్థ కల్మషాన్ని కడిగివేయాలని ఆధునిక కాలంలో అనేక ఉద్యమాలు వచ్చాయి. “ప్రపంచంలోని అన్ని దేశాలలో శ్రమవిభజన జరిగితే మన దేశంలో శ్రామికుల విభజన జరిగిందో. అని డా॥ అంబేద్కర్ బోధనలతో, నిర్జీవులైపడివున్న పంచములు నిప్పురవ్వలై లేచారు. దీనితో సామాజిక రంగంలో ఆత్మాభిమానోద్యమం బయలు దేరింది. దేశీయ సాహిత్యంపై ఈ ఉద్యమ ప్రభావం పడింది. తెలుగు సాహిత్యంలో అత్మాఖి మానోద్యమమే నేడు దళిత సాహిత్యోద్యమంగా పరిణమించింది. “దళిత వాద సాహిత్యానికి యుగ కర్శృత్వ స్థానములో గుజ్జం జాషువా నిలబడ్డాడు. (కత్తి పద్మారావు - దళిత సాహిత్యవాదం జాషువా, పుట క లోకాయత (ప్రచురణలు ప్రథమ ముద్రణ అక్టోబర్ 1994).
“క్రూరల్ కుత్సితుల్
అస్మదీయముల్ హక్కుల్దోచుకున్నారు
నన్నూరింబెటన్ నెట్టినారు
ఇప్పుడు నన్నోదార్చుతున్నారు.” అని ప్రతిఘంటించదానికి సిద్ధపడ్డాడు జాషువా. ఆ ప్రతి ఘటన వైతన్యకేతనం 'గబ్బిలం”. గబ్బిలం కావ్యవస్తువే తెలుగు సాహిత్యంలో అపూర్వం. జాషువా కంటే పూర్వం ఉన్న దళిత సాహిత్యాన్ని జాషువా సమకాలీనంలో వచ్చిన దళిత సాహిత్యాన్ని జాషువానే కేంద్రంగా చేసుకొని నేడు దళిత సాహిత్యోద్యమ కారులు చర్చించడం గమనార్హం. జాషువా స్మశాన వాటికా పద్యాలు దళిత వాద తాత్విక భూమికకు ్రాతిపాదికలైనాయి.
ఈ విధంగా జాషువాకవి మానవతా వాదిగా, సమతా వాదిగా, పరిపూర్ణమైన జాతీయవాదిగా విశ్వకళ్యాణాన్ని ఆలాపించిన కవి కోకిలగా దళిత సాహిత్యానికి కేంద్రంగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయాడు. కవిత్వాన్ని సామాజిక శక్తిగా తీర్చిదిద్దిన జాషువా “సుకవి చేతి కలము సుధలు” గురిపించినది తెలుగు సాహిత్య సీమలో.
- వైజ్ఞానిక దాశరథి
మానవుడు భూమి మాద ఉద్భవించిన నాటి నుండి నిరంతరం ప్రకృతిని అన్వేషిస్తూనే ఉన్నాడు. అన్వేషణ్ మానవ స్వభావంగా కన్పిస్తుంది. అన్వేషణ మూలంగా భౌతిక ప్రపంచాన్ని అర్ధంచేసుకొని, జీవితానికి అనుగుణంగా మార్చుకుంటున్నాడు. ఫలితంగా విజ్ఞాన శాస్త్రావిర్భావం జరిగింది. విజ్ఞాన శాస్తాన్నే "సైన్స్'గా చెప్పుకుంటాం. రసాయన జీవపదార్థ వైద్య, గణిత, ఇంజనీరింగ్ రంగాలలో క్రమబద్ధము, బుజువర్తన కల్గిన విజ్ఞానాన్నే "సైన్స్ అంటున్నాం. మానవ చరిత్ర అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం చేసిన దోహదం ఎనలేనిది. ప్రాచీన మానవుని జీవితం మిద వైజ్ఞానిక శాస్త ప్రభావం లేదని చెప్పవచ్చును. ఆ మానవుని జీవితం పరిమితమైంది. దాని మొద ఏ విధంగాను విజ్ఞాన శాస్త్ర ప్రభావం లేదు కాని ఆధునిక మానవుని జీవితం విశాలమైనది. ఆధునిక జీవితంలోని అన్ని రంగాలమోద విజ్ఞాన శాస్త్ర ప్రభావం ఉంది. ప్రాచీన మానవునికి వైజ్ఞానిక వాసనలు తెలియవు. కనక వారి సాంఘిక జీవితములో ఊహలకు, భ్రమలకు, అవాస్తమైన కట్టు కథలకు స్థానం ఉండేది. ఆధునిక మానవుడు వైజ్ఞానిక యుగంలో జీవిస్తున్నాడు గనక భౌతిక విజ్ఞాన శాస్తావగాహనతో హేతు దృక్పధం అలవర్చుకొని జీవిత ప్రస్థానం సాగిస్తున్నాడు. ఈ వైరుధ్యమే ్రావీన ఆధునిక రచయితల కవుల రచనలలో కన్పిస్తుంది.
ఏ యుగంలోని సృజనాకారుల రచనలలోనైనా సమకాలీన సంఘ జీవితం ప్రతిఫలించక మానదు. ప్రాచీనకాలంలోని సాంఘిక జీవితం మోద విజ్ఞాన శాస్త్ర ప్రభావం లేనందున నాటి రచయితల రచనలలో హేతురహితమైన అనేక విషయాలకు స్థాన ముంది.కాని ఆధునిక కాలంలోని సాంఘిక జీవితం మిద అన్ని రంగాలలో విజ్ఞాన శాస్తప్రభావం వుంది. కనకనే ఆధునిక సాహిత్యంపై శాస్తప్రభావం ఉంది.
పాశ్చాత్య రచయితల రచనలలో విజ్ఞాన శాస్త్ర ప్రభావం 17వ శతాబ్దం నుండే కన్పిస్తుంది. ఆకాలంనుండే వారి సాంఘిక జీవితాల మిద విజ్ఞాన శాస్త్ర ప్రభావం ఉంది. పాశ్చాత్యులకంటే రెందు శతాబ్దాలు ఆలస్యంగా విజ్ఞాన శాస్త్ర ప్రభావం భారతీయ
డా. బన్న అయిలయ్య త్తే సాహిత్యం మిద పడిందంటే మన సాంఘిక జీవితం మిద కూడా దాని ప్రభావం ఆలస్యంగా పడింది. తెలుగులో అనేకమంది రచయితల్లాగే దాశరథి విజ్ఞాన శాస్త్ర ప్రభావానికి లోనైనాడు. ఉద్యమకవి అభ్యుదయ కవిగా పేరుపొందిన దాశరధి అన్ని రచనల కంటే 'పునర్నవం' లోని కొన్ని కవితలు పూర్తిగా విజ్ఞాన శాస్త దృక్పథంతో (వ్రాసినవి.
ిరణశకలం' అనే కవితా ఖండికలో విద్యుత్తు, పరమాణువు కాస్మిక్ రెడియేషన్, ఫైర్ బ్రిగేడ్లాంటి విజ్ఞాన శాస్త్ర పదాలతో పాటు '“జోన్ ఆఫ్ ఆర్క్ అనే (ఫ్రేజ్ కూడా ఉంది.
విజ్ఞాన శాస్త్ర ప్రభావం వల్ల ఆధునిక సాహిత్యం, పద్ధతులు, రూపం మారిపోయింది. రచయితలందరూ వేగవంతమైన ఈ యుగాన్ని విద్యుత్తు యుగంగా భావించారు. అందుకే “ఆద్యపాషాన యుగం పోయి విద్యుద్యుగం దిగిన....” దని దాశరధి గుర్తించాడు. కాలవేగంతో పాటు ఆలోచనలు మారుతున్నాయి. వేగవంతమైన ఈ ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వాలంటే పాత పద్ధతులు పనికి రావనే “విద్యుత్తుగా ఊహించగల మనకు మద్యంలా పారే ఛందస్సు.....” పనికి రాదనే, ఛందోబద్ధమైన పద్యాన్ని వదిలి వచన కవిత్వం రాశాడు దాశరధి. “జల ప్రపొతంలో వినఐడు విద్యుత్తు గుసగుసవలె” నే
దాశరథి మనస్సులోనున్న కవితకు భవిష్యత్తుకు బాటలు వేసే మాటలున్నాయి. కొండ చరియల్లోంచి నేలకు దూకే జలప్రవాహానికి గొప్ప శక్తి ఉంటుంది. జలవిద్యుత్తు కేంద్రాలలో “టర్చిన్స్ ౧౮౧౦16)ని ఉపయోగించి ఆ శక్తిని బయటికి తీయటంలాంటి క్రియ సైన్స్ వల్లనే సాధ్యమవుతంది. జల ప్రసారంలో ఉండదే విద్యుత్తు కవి రాసే కవిత్వానికికుంది. ఈ కవిత్వం అంధకారంలో మగ్గిన సమాజానికి కాంతి కిరణాలు అందిస్తుంది. జలం వలన ఇదొక ప్రయోజనమైతే ప్రమాదం కూడా సూచిస్తున్నాడు దాశరథి. “ఏడ్చే దీనుని కన్నీళ్ళలో ఎంతో కొంత విద్యుత్తు పుడుతుంది.” అంటూ హెచ్చరిస్తున్నాడు. పేదవాడి కన్నీళ్ళకు కారణమేమిటో తెలుసుకుంటే ఆ కనీళ్ళ నుండి వచ్చే విద్యుత్ 'షాక్' నిస్తుంది. విద్యుత్ ప్రవాహాన్ని ఎవడు తట్టుకుంటాడు? ఎదుర్కొంటే కుదుపు తప్పదు కదా?
శె వైజ్ఞానిక దాశరధి
“చల్లని నీటిలో ఎంతో
జలవిద్యుత్తున్నప్పుడు
పల్లెవాని గుండెల్లో
పెల్లుగా తిరుగుబాటుండదూ?” అంటూ ప్రశ్నిస్తున్న దాశరథి, ఉంటుందనే ధ్వని పూర్వకమైన సమాధానం కూడా ఇస్తున్నాడు. విద్యుత్తుకుండే వేగం, వెలుగు కవి భావాలకుంది. విద్యుత్తులో ఉండే శక్తి పల్లెవాని గుండెలోదాగుందని, ఆశక్తి (షాక్) తిరుగుబాటు రూపంలో ఉండి సమాజానికి “షాక్ నిస్తుందని దాశరథి చెబుతున్నాడు.
ఆధునిక మానవుడు ఇంతగా అభివృద్ధిచెందాడంటే కారణం విజ్ఞానశాస్త్రం చేసిన మేలు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెంది అవసరాలు తీరుస్తుంది. సౌకర్యాలు పెంచి సౌఖ్యాన్ని అందిస్తుంది. “మూలపదార్థాల కోసం వేలేళ్ళు తపం చేసిన” శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే ఇది. శాస్త్రజ్ఞులు వాళ్ల జీవితాలను లాబొరేటరీలకు అంకితం చేసి పరిశోధనల ఫలితాల ద్వారా మానవ జీవితం ఆనందమయం చేయాలని పరిశ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కొక్కప్పుడు వీరి పరిశోధనా ఫలితాలను స్వార్ధపరులు విధ్వంసానికి ఉపయోగించు కుంటున్నారు. “పరమాణువు పగలగొట్టి ధరిత్రికి ప్రమాదాలు తెచ్చిన” వారు లేకపోలేదు. “పరమాణువుల” లో ఎలక్ష్రానులు, ప్రోటానులు ఉంటాయి. వీటిని విభజిస్తే విశ్వాంతరాలకు అమితనష్టం జరుగుతుంది. “పీలిస్తే విషపుగాలి, రాలిస్తే కన్నీరు, అలిస్తే ఆక్రందన, కాలూనితే అడుగడుక్కి విషక్రీిములు” ఉంటాయి. వ్స్మ్టీ* బ్రనే శాస్రజ్ఞుడు వాయుమండలంలో కూడా ఐదవ వంతు (ప్రాణముందని నిరూపించాడు. కాని అణుబాంబు విస్పోటనం వల్ల విశ్వాంతరాలకు ముప్పువాటిల్లుతుంది. హిరోషమా, నాగసాకీలపై అణుబాంబు ప్రయోగిస్తే ప్రపంచములోని ఏనాడు జరుగని మానవ విధ్వంసం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఒకనాటికి ప్రపంచానికి గొప్పవిపత్తు రాకమానదని ఒకవైపు విజ్ఞానశాస్త్రం
మరోవైపు ఆధ్యాత్మిక గ్రంథాలు వాటి వాటి పద్ధతుల్లో చెబుతూనే వున్నాయి. యుద్ధాలలో ఉపయోగించే అజ్వస్తాల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి సమతుల్యత దెబ్బతిని సమాజం క్షీణిస్తుందని సైన్స్ చెబుతుంది. జనాభా పెరిగి నైతిక విలువలు నశించి, జీవిత విలువలు కోల్పోయి మనిషిని మనిషే చంపుకునే దశ వచ్చినప్పుడు సమాజాన్ని ఒక పెద్ద ప్రళయం వచ్చి ముంచేస్తుందని ఆధ్యాత్మిక (గ్రంథాలు చెబుతున్నాయి. ఈ
డా. బన్న అయిలయ్య శం రెండు కోణాలని దృష్టిలో ఉంచుకున్న దాశరథి -
“భూమిని చుట్టిన జలనిధి
పోలిక శాంతిని పెంచి
యుద్దాన్ని అరెస్టు చేసి
మరణ శిక్ష విధిస్తా .... నంటాడు. భూగోళం మోద మూడొంతుల నీళ్ళు, ఒక వంతు భూభాగంవుంది. ఒక భాగం మోదనే సమాజానికి విపత్తు సంభవించే నానారకాల సంఘటనలు ఉద్భవిస్తున్నాయి. 'యుద్ద్ధాల మహాగ్నితో కాలిపోతున్న ఈ భూభాగాన్ని మూడొంతులు చుట్టి ఉన్న జలం ఉప్పెనలా వచ్చి ఆర్పేస్తుందంటున్నాడు. ఈ ప్రకయంలో అమాయకులు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. “నోవాస్ ఆర్ట్ (రక్షణనావ) వచ్చి పాపరహితుల్ని కాపాడుతుందని వైబీలు కథనం దాశరథి కవిత కూడా యుద్దాగ్నులతో కాలిపోతున్న అమాయకులకు “జోన్ ఆఫ్ ఆర్భ్ (రక్షణ స్థలం)ను ఏర్పాటు చేస్తుంది. “చితి మంటల యుద్దాగ్లుని ఆర్బటానికి ప్రతికవి మంటల్ని ఆర్బే యంత్రాంగమైన "సఫైర్ బ్రిగెడ్' కావాలంటాడు. కవి సృష్టించే ప్రతి పద్యం ఒక మేఘమై అబ్వస్తపు ప్రయోగం వల్ల గ్రిష్మమైన సమాజాన్ని చిగురింప జేయాలంటాడు దాశరథి.*కలం అంటేనేగా బలం” కవి కలానికున్న బలమేమిటంటే-
“కోత్రిని మనిషిగా తొలిచిన
కాస్మిక్ - రేడియేషన్ బలమే
కలంలోకి జొరబడి నేడు
మనిషిని దేవతగా మలుస్తుంది.” కాస్మిక్ కిరణాలవల్ల జీవులలో మ్యూటేషన్ (94812809) జరిగి మార్పులు వచ్చి కొత్త జీవరాశులు రావటానికి అవకాశం ఉంది. కాస్మిక్ కిరణాలవల్లే కోతి మనిషిగా పరిణామం చెందటం జరిగింది. కవి కలంలోకి జొరబడిన కాస్మిక్ కిరణాలు మనిషిలో ఉన్న స్వార్ధం, సంకుచిత, నైచ్య భావాలను రూపు మాపి దేవతగా మలుస్తుందని గ్రహించాలి. వీటిని దాశరథి ఎలా కనుక్కుంటాడనే సందేహం మనకక్కరలేదు. ఆయన చూపు “ఎక్స్ కిరణం లాంటిది. 'ఎక్స్‌రేస్' వల్ల శరీరంలోని అన్ని బాగాలను స్పష్టంగా చూడగలం. ఏయే భాగాలు అనారోగ్యానికి గురైనవో తెలిసికొని చికిత్స చేయవచ్చు. దాశరథి ఎక్స్ కిరణం వల్ల సమాజ శరీరంలో ఏ భాగం ఎలాంటిదో చూసి అవసరమైన భాగానికి 'కవితా చికిత్స” చేస్తాడు.
వ వైజ్ఞానిక దాశరథి
“యుగాంతర రేఖలు” కవితని విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రళయం ఎలా వస్తుందో అదే సూత్రాన్ని ప్రజావిప్లవానికి అన్వయించి చెప్పిన కవిత ఇది. దీనిలో పాథాలాజిస్టులు, కెమికల్ బెట్రేజి, క్షయ, స్పైనల్ కార్డ్, ఓకాల్ కార్ట్, న్యూట్రానులు, యురేనియం, పరమాణువు, సైంటిస్టులు, న్యూక్షియర్ ఫిషన్, డయామిటర్, సెంటీమోటర్ల లాంటి సైన్స్ పదాలే కాక కొరియా, మాగ్నా కార్టా, చారిత్రక విషయాలతో పాటు గ్రీకు శిల్పకారుదైన అగాసియన్ ప్రస్తావన కన్పిస్తుంది.
ప్రపంచ సాంన్కృతిక పునరుజ్జీవనానికి రాజధాని యురోపియన్, క్రీస్తు పూర్వమే జగద్వ్యాప్తమైన శిల్ప కళని గ్రీకులో సృష్టించినవాడు 'అగాసియన్” అనే శిల్పకారుడు. అదంతా గత వైభవం. మరి నేడు సామ్రాజ్య వాదులు బాంబులు తయారుచేసి “దూరాలకు చాస్తున్నారు వాళ్ళు” ఇతర దేశాలని బాంబులతో బెదిరించి దాసోహం చేయించు కుంటున్నారు. అగ్రదేశాలని మహాసర్బంగా పోల్చిన దాశరథి “ఒక మహాసర్నానికి కారియా' ఇరుక్కో చావటానికి బొరియా' అంటున్నాడు. జపాన్ దేశం కొరియాను ఆక్రమించుకున్నప్పుడు ఒకటిగానే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నుండి కొరియా విముక్తి పొందగానే పాశ్చాత్య శక్తులు, కమ్యూనిష్టు రష్యా దానిని ఉత్తర కొరియా దక్షణ కారియాలుగా విడగొట్టి రాజకీయ పావుగా వాడుకున్నాయి. ఇలా రెండుగా విడిపోవటం ఆయా (ప్రాంతాలలో వున్న కొరియా ప్రజలకి ఇష్టం లేదు. ఒకటి కావాలని నేటికీ కోరుకుంటున్నారు. అయినా సామ్రాజ్యవాద దేశాలు ఏకం కానీయటం లేదు. రెండవ ప్రపంచోయుద్ధకాలంలో అంటుకున్న కొరియా చిచ్చు నేటికి రావణ కాష్టంలా కాలుతుందంటే కారణం సామ్రాజ్యవాద దేశాల చలవనే చెప్పవచ్చు. దాన్ని గుణపారంగా తీసుకొమ్మని భారతీయులను హెచ్చరిస్తున్నాడు దాశరధి. సామ్రాజ్యవాదుల రాజకీయ పాచికలకు గురికావద్దని -
“ఆ బొరియలో అది ఇరుక్కువచ్చి మనవాళ్ళకు
వొదిలిస్తుంది పిచ్చి” అంటాడు ఈ హెచ్చరికను పట్టించుకోకుండా వెళ్ళితే 'అగరు వత్తిలా మసికురుస్తుంది' కాలిన అగరువత్తిలామృత ప్రాయులమై పోతాం.
“అప్పుడు పాథాలజిస్టులు' వచ్చి
అకస్మాత్ మృతిని డొక్కవిచ్ని
డా. బన్న అయిలయ్య శీర్ ఏబొపెద్ద కెమికల్ బెట్రేజి జరిగిందని ప్రకటిస్తారాక పేజి” ఇక్కడ “పాథాలజిస్టు' సామ్రాజ్యవాద దేశాలుగా గుర్తించాలి. చావుకు కారణమైన వారే శల్య పరీక్ష చేసి రోగనిర్ధారణ చేసే పాథాలజిస్టు (0280108130 లా మారిపోతారు. మరణానికి కారణం కెమికల్ జెట్రేజి (రసాయనిక విపత్తు) అని అప్పుడు రిపోర్టు ఇస్తారు. అసలు కారణం వేరొకటుంది. “క్షయ ఆవరిస్తే తెలీక “స్పైనల్ కార్డు బావుందని ముడుస్తారు దాక్టర్లు తోక మరి “వోకల్ కార్టు'లో ధ్వని? క్షయ” ఊపిరితిత్తులకు వస్తుంది. కాని డాక్టర్లు మాత్రం "స్పైనల్ కార్డు” (5010241 ౦జశుని చూసి బాగుందంటున్నారు. రోగ నిర్ధారణలోనే లోపం ఉన్నప్పుడు రోగం తగ్గటం అసంభవం. దాక్టరు గుర్తించకుండా ఉన్నంత మాత్రాన రోగం వ్యక్తిని క్షీణింపజేయకుండ ఉండదు. రోజురోజుకి వ్యక్తిలో భౌతిక, మానసిక, మార్పులని తెస్తుంది. అది రోగి స్వరపేటిక వల్ల మరింత స్పష్టంగా గోచరిస్తుంది. “వోకల్ కార్టు (స్వరపేటిక) లోంచి వస్తున్న ధ్వనిరోగి పరిస్థితిని చెప్పుతుంది. ఇక్కడ రోగి వర్ధమాన దేశాలు, పాథాలాజిస్టులు, దాక్టర్లు సామ్రాజ్యవాద దేశాలుగా కవి భావించాడు. ఆకలి మంటలతో దహించుకుపోయేవాదు దేనికి వెరవదు ఎవరికీ భయపడడు. ఎవరైనా ఎదురొస్తే ఆ మంటలకు తాకి భస్మం కావల్సిందే. 'ఈ నిజాలు నిట్టూర్చిననాడు భుజాల బరువు ఓర్చని నేడు తప్పక ఢీకొంటై న్యూట్రాన్లు తలలు పైకెత్తుతవి (ప్రాణులు” అప్పుడు విప్లవ ప్రళభయంవచ్చి సమాజ పునాదుల్ని కదిలించక మానదు. సామాన్యుడు భుజాల మీద మోస్తున్నాడు కాబట్టే కొందరు గొప్పవాళ్ళుగా చెలామణి అవుతున్నారు. పరమాణువులో న్యూట్రానులు నిశ్శబ్దంగా ఉన్నాయి, కనక ఏ విపత్తు జరగదు. కాని నిజం తెలుసుకున్న సామాన్యుడు విబ్బంభిస్తే- “న్యూట్రాను జోరుగా తగిలి యురేనియం పరమాణువు పగిలి కిరణాలు చిమ్మితే ప్రళయం”లా
డ్రి వైజ్ఞానిక దాశరధి ఉంటుంది పరిస్థితి. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే పరమాణువులాంటి పేదవాడిలో దాగిన ప్రళయానికి కారణం కనుగొనడానికి “పరమాణువు సదస్సులో పలువురు కూర్చున్నారు. ఆ నిరుపేదల ఆస్యంలో సైంటిస్టులు కొలుస్తున్నారు. పరమాణువు 'డయామిటర్' లు ఎన్నెన్ని సెంటీమిటర్లలో పేదవాని ఉనికి కనుగొనడానికిఒక వృత్త వ్యాసార్థం తెలిపే 'డయామిటరొని సెంటీ మిటర్లలో కొలుస్తున్నారు. (ప్రతి సూక్ష్మమైన దాన్ని సెంటీ మోటర్లలో కొలవటమంటే అది వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట్రంగా చెప్పుకోవాలి. పేదవాడి ఉనికి కొలత కందదు. కనుకనే వాడు సృష్టించే ప్రళయం ఆపడానికి ఎవరితరం కాదు. దాశరథి “విజన్” సిసలైన భౌతిక శాస్రజ్జుని చూపులాంటిది. హేతురహితమైన విషయాలని, నిరాధారమైన రిపోర్టులని నమ్మే చూపుకాదు. “న్యూక్లియర్ ఫిషన్' లాంటిది. ఈ ఫిషన్లో కొత్త జగత్తు కన్పిస్తుంది. అదే- “మన జగత్తు కొక కొత్తతరం సామ్యవాదపు “మాగ్నకార్దా' మిద చేవ్రాలు చేశాడు నిరుపేద”. మాగ్చక్షార్జాకు చారిత్రకమైన గుర్తింపు ఉంది. 1215లో కింగ్ జాన్- కాలంలో రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య జరిగిన ఒక ఒప్పంద పత్రం. ఇక్కడ విస్పోటనం చెందిన పరమాణువు లాంటి సామాన్యమానవుడు అసమాన సమాజం పునాదుల్ని కదిలించేసి సామ్యవాద యుగం కావాలని “మాగ్నాకార్దా మోద సంతకం చేసి తిరుగులేని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని 'యుగాంతరాన్ని? ప్రకటిస్తున్నాడు దాశరథి. “మస్తిష్కంలో లాబోరేటరీ" - మానవుడి మస్తిష్కం ఒక ప్రయోగశాల ఇది వైజ్ఞానిక ప్రయోగశాల వంటిది కాదు. వైజ్ఞానిక ప్రయోగశాలలో విశ్వశాంతికి, మానవ పురోభివృద్ధికి తోద్చదే పరిశోధనలు జరిగి జీవితాన్ని వికాసవంతం చేయాలి. కాని ప్రపంచం అశాంతికి గురై, ఉపద్రవాలు సంభవించేలా సంక్లిష్టమైన పరిస్థితులను సృష్టించి, జీవిత విధ్వంసానికి పనికివచ్చే ప్రయోగాలు జరగటం సహించని దాశరధి. “మస్తిష్కంలో లాబొరేటరీని నిర్మించుకోక తప్పదు. “భౌతిక పరిస్థితులు మానసిక చైతన్యాన్ని నిర్ణయిస్తాయని” మార్చ్ చెప్పాడు. ఇది పూర్తిగా నిజం కాదనటానికి ప్రపంచంలోని సోషలిస్టు వ్యవస్థలు పతనమవటమే నిదర్శనం. మానవుడి మేధస్సుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. దానికి స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మానవ విలువల్నీ మానవుడి
డా. బన్న అయిలయ్య త్న మేధస్సు నుంచి మనస్సునుంచే ఉదృ్భవిస్తాయనం ఆశ్చర్యం కాదు. దాశరధి మస్తిష్కంలో నిర్మించిన లాబోరేటరీకి మూడు దారులున్నాయి. అవి -
ఇమ్సైహంజోదారో శిథిలాల లోతులోకి
శతాబ్దాల మట్టిపారల (క్రింది బొగ్గెపోయిన పురాతన
నాగరికతా గర్భంలోకి,
సూర్యుడు, అస్తమించిన జాడల్లోకి వొకదారిొ” మొహంజోదారో కాలంలోని జీవితాలు నాగరికతని సంతరించుకున్నవే. ఆధునిక మానవుని కంటే తీసిపోని నాగరికతను వాళ్ళు సృష్టించుకున్నారు. విద్యుత్తు లేక పోయిన వాళ్ల నాగరికత విశ్వవ్యాప్తంగా ప్రభావం పొందినది. వాళ్ళ సామాజిక జీవితం ఉన్నతమైనది. వాళ్ల ఆలోచనలు ఉన్నతమైనవి. చిత్ర, శిల్ప కళారంగాలలో నాగరికత అత్యున్నతస్థాయికి చేరుకోగలిగింది. అదంతా మళ్లీ వెలుగు చూడని కాలగర్భంలో కలిసిపోయిన “మట్టి పొరల క్రింద బౌగ్గె పోయినది! ఇది ప్రాచీన కాలంలోని మాట.
మధ్యయుగంలోకి తీసికెళ్లేది రెండో దారి
“మస్తిష్కంలోని మాఇంటికి
మా ఇంటి వెనకగా
తాజ్ మహల్ అందాల్లో మెరిసిన షాజహాన్ కీర్తి
అఇఉ్ ణ్డులతో
బులుక్కులతో కట్టిన వైయాకరణి సమాధి,
లోకాన్ని అడక్కుండా ఎవడో దుష్టన్ఫపతి రచించిన కఠిన శాసనాల రాసులు మధ్యయుగంలో జరిగిన అభివృద్ధి కూడా గొప్పదే. ఆధునిక ఇంజనీరింగ్
కంటే ముందే కళాత్మకమైన, సౌందర్య వంతమైన 'తాజ్ మహల్ నిర్మాణం జరిగింది. వ్యూడల్ సంస్కృతి అవశేషంగా నేటికి నిలిచి ఆ కాలంనాటి కీర్తిని దిక్కులకు విరజిమ్ముతూనే ఉంది. కాని ఈ అభివృద్ధి సాధాలకు మూల స్తంభాలైన ప్రజల బ్రతుకులు మాత్రం అధః పాతాళంలోనే ఉన్నాయి. రాజులు నిర్మించే కఠిన శాసనాలకు ప్రజల యోగ క్షేమాలతో పనిలేదు. రాజు చెప్పిందే వేదం. ఆ యుగం నాటి సాహిత్యం కూడా
48 వైజ్ఞానిక దాశరధి రాజు ఆలోచనలకు భిన్నంగా ఉండేది కాదు. ఒక రకంగా భాష కూడా సమాధి చేయబడింది. దాశరథి దీన్ని గుర్తించి “మరి ఆనాటి పాతగటం కంటిలో రాక్షసి వికటాట్టహాసం రంభోర్వసీ నాకవాసం” అంటాడు. ఊహాపూరితమైన రచనలు, కట్టుకధ లుండే కావ్యాలు సృష్టించి ప్రజల్లో అజ్ఞానాన్ని పెంచి మూఢవిశ్వాసాలు పెరగటానికి దోహదం చేసే రచనలు చేశారు నాటి రచయితలు. అందుకే నాటి జీవితాలు “రాజుల పాదాల క్రిందుగా పరచిన రైతుల రతనాల (బ్రతుకులు తివాసీలూోగా మరిపోయి “చితికిన ఆటంలా” తయారైనాయి. కవులంతా “గతంలోని కొంత నేర్చుకోబోయి గతానికి తాకట్టు పడుతున్నారు. జీవితాలకు కొత్త అర్ధాలు చెప్పి, నూతన విలువలు సంతరించి పెట్టాల్సిన కవులంతా ఈ దారుల్లో నడిపించారు. కనుకనే ప్రజలు “కటిక రాతి గోడలలో కట్టిన కారాగేహంలో గతకాలపు శాసనాల కట్టుబడిన ఖైదీవలే భయంభయంగా బ్రతికేవారు. భౌతిక జ్ఞానంలేని రోజులు కనక కొన్ని కులాలకు, వర్గాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉండేది. వేళ్ళమీద లెక్కించదగిన పండితు లుండేవారు. ఈ పండితులు రాజుల నిరంకుశ భావాలకు అద్ధంపట్టే కావ్యాలు వ్రాసి ప్రజలని అజ్ఞాన మార్గం వైపుకు మరలించారు. కాని కాలం మార్చుతో పాటు ప్రజల మనో వ్యాపారంలో కూడా మార్పు సంభవించక తప్పదు. “కదల్లేని వృక్షం వలే కాలం అక్కడక్కడే పెరగ్గలదా?” లేదు కాలం నయాగర జలపాతం వంటిది. “నడుము విరిగేటట్టు దూకైనా' మార్పును కోరుతుంది. ఆ మార్చే మూదోదారిలోకి తీసికెళ్ళుతుంది. ఈ దారి విజ్ఞాన శాస్తం ప్రభావం కలిగిన ఆధునిక యుగము.
“ఛేదాకు దొరికే పెన్సిల్ ముక్కులో-
జగత్తుకు ప్రాణం ప్రసాదించిన కార్బన్ పరమాణువు”
అందులో సెంట్రల్ న్యూక్లియస్ చుట్టూ చంద్రాయాణం చేసే ఆరు ఎలక్ష్రానులు
సూర్యతేజోరాశి చుట్టూ శనీ, గురువూ మరొకడు మరొకడు
వాళ్ళవెంట భూమి తల్లి ప్రదక్షిణం చేసినట్టు” గెలీలియో సూర్యకేంద్రం విశ్వభావనకు శ్రీకారం చుట్టి పాత సూర్యుడికి కొత్త అర్ధం చెప్పాడు. సూర్యమండలం చుట్టూ తిరిగే గ్రహాలు ఒక పద్దతి ప్రకారం ఎలా తిరుగుతున్నాయంటే కార్చన్లో న్యూక్లియస్ చుట్టూ తిరిగే గ్రహాలు ఒక పద్ధతి ప్రకారం ఎలా తిరుగుతున్నాయంటే కార్చన్లో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆరు ఎలక్షాన్ల్లా తిరుగుతున్నాయి.
దా. బన్న అయిలయ్య త్తం ఈ ఆరు ఎలక్షాన్ల అమరిక వల్ల కార్బన్‌కు మిగతా పదార్థాలతో కలిసే శక్తి
వచ్చింది. ఇక్కడ చౌకగా దొరికే పెన్సిల్లో కూడా జీవద్రవ్యం సృష్టించే పదార్ధం దొరుకుతుంది. ఎంతటి సామాన్య మానవుడిలోనైనా కొంత శక్తి ఉంటుంది. ఇది సమాజాభివృద్ధికి తప్పక పనికి వస్తుందని వైజ్ఞానిక దృక్పథంతో వివరించాడు దాశరథి. ఈ సామాన్యుడు నిద్రపోతున్న పరమాణువు లాంటి వాడు. అంతేకాని నిర్జీవంగా ఉన్న “అజంతాలోని శిలాసుందరి” లాంటివాడు కాదంటారు. ఈ శిల్పానికి లేని ఆకలి బాధ “పల్లె పడుచుకుందని తెలుసుకో భాయీ ! అని హెచ్చరిస్తున్నాడు.
“మస్మెట్ల నుండి రైఫిళ్ళ దాకా నడిచిన దేశం
కౌొడవళ్ళనుండి కోతయంత్రం దాకా సాగలేదు” కర్షక్షుడి జీవితంలో ఆద్యంతాలు శ్రమే కన్పిస్తుంది. ఒక యం(్రంలా అవిశ్రాంతంగా (శమిస్తూనే ఉంటాడు. వాడి శ్రమని తగ్గించి కొంత విశ్రాంతి నివ్వాల్సిన పరికరాలను కనుగొనటం మానివేసి మానవ జీవితాన్ని విధ్వంసానికి గురిచేసే ఆయుధాల తయారీలో మాత్రం పూర్వం నుండి ప్రగతి సాధిస్తూనే వున్నారు. చేతి తుపొకులనుండి మరతుపాకుల దాకా ఆ అభివృద్ధి సాగుతుందంటే విజ్ఞాన శాస్త్రం ఏ వైపుకు పయనిస్తుందో ఆలోచించాలి. నేడు ఈ పరిస్థితులను వివరించి చెప్పేందుకే 'మస్తిష్కంలోని లాబోరేటరీ' పని చేస్తుంది. ఆ ఫలితమే కవితా రూపంలో వెలువడుతుంది. కానీ, “వేడివేడి కవిత్వం చురుకుదనం సహించేదాకా రాలేదు” నేటి సమాజం. కారణమేమిటంటే “ఇంకా అక్కడక్కడ ఎతైన గడీగోడ నీడలు చిన్న చిన్న గుడిసెల్ని పెరగనీయటం లేదు-” దోపిడీకి అలవాటు పడిన వాళ్ళు ప్రజలస్వేచ్చని రూపుమాపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మస్తిష్కంలో నిర్మితమైన ప్రయోగశాలలో ప్రతి విషయాన్ని పరిశీలనా దృష్టితో
చూసి, సృష్టిమూలములలో ఉన్న ప్రతి కోణాన్ని పలకరించుకుంది. నిశితమైన ఆలోచనా దృష్టి కలిగి పూర్వ చరిత్రని మధించి “ఏ ఖిల్లా గోడనీడ ఏ మహారాజ వంశాన్ని ఎంతకాలం కాపాడిందో ఏ రకం ఎత్తుగడల్లో పెత్తనం ఎవడెవడి చేతుల్లో ఎన్నెన్ని నాళ్లుంటుందో” పరిశోధించి వివరిస్తుంది. దీనివల్ల చేవచచ్చి చైతన్య రహితులై పడివున్న పేదవాళ్ళని మేల్మొలిపి వారిలో “ఒక పెద్ద ప్రజభయ జలధరాన్ని పట్టుకువచ్చి కట్టివేసి, ఉరమించి, ఉల్మలు కురిపించి, కరిగించి, జీవనం ప్రసాదించే కాలం ........”ను చేస్తుంది.
“సన్నని ఇసుకకణం పరీక్షించి
జగజ్ఞ్జాతకం వ్రాయని శాస్తజ్ఞులను-
50 వైజ్ఞానిక దాశరథి
ఏ డిగ్రీలో ఎంత వేది నిలిస్తే
ఏ రకం ప్రాణికోటి పుడుతుందో
ఏ డిగ్రీతో ఎంత వేడి జారితే
ఈ విశ్వగోళం మృత్యుజలధి అంతస్తున
తన్నుకులాడి నళిస్తుందో”.
వైజ్ఞానిక దృక్పథంలో సామాన్యుని ఆగ్రహాన్ని పోల్చి చెప్పాడు దాశరథి.
జీవపరిణామానికి, ప్రాణుల జీవనానికి ఊప్టోగ్రతి కీలకమైనది. ఏజీవి మనుగడకైన పరిమిత ఊష్టోగ్రత అవసరం. ఊప్లోగ్రత బాగా తగ్గినా, పెరిగినా, జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఆవరణ వ్యవస్థ (800 50348) లో ప్రతిజీవికి కొన్ని కట్టుబాట్టు, క్రమహిత జీవనం ఉంటుంది. ఈ వ్యవస్థలో భాగమైన మానవుడు తన స్టానాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నాడు. ఇలా జరిగినప్పుడు విపత్తు సంభవించక తప్పదు. ధనిక, పేద, వర్గాల మధ్య ఉండే వైరుధ్యం సంఘర్షణకు దారి తీస్తుంది. బడుగు వర్గాలే ఎక్కువగా ఉన్న సమాజంలో ఉద్యమ జ్వాలలు ఉప్పెనలా వచ్చి విశ్వాన్ని ముంచేయక తప్పదని దాశరథి వివరించాడు. “పేదవాడి స్వేదంలోంచి ఎంతగా దేశానికి భోజనం ప్రసాదించవచ్చో” మనకు తెలియనిది కాదు. అలాంటి పేదవాడి “డదొక్కకు బాగా ఆకలి రుచి దొరికిన-” దాన్ని అణచి పెట్టాలని ప్రయత్నిస్తే వాడు విద్యుత్‌వేగంతో సమాజ ఉనికిని “ప్రశ్నలగొలుసుతో బంధించి” వేస్తాడు.
“ఖైతుకు నాగజెముడు కూడా
పూలుపూయనీయవయ్యా !
మెతుకులో ప్రోటీనులు
మిక్కిలిగా రానీవయ్యా !
బక్కపడిన దేహానికి
వౌండు పౌండు మాంనానికి
ఎంత తిండి కావాలో” అవన్ని కల్పించేందుకే ఈ లాబోరేటరీల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. నాగజెముడు (02613) కు ఎలాంటి పోషణ లేకపోయినా బ్రతుకుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ వికసించడానికి ప్రయత్నిస్తూ అందమైన పుష్పాలను కూడా అందిస్తుంది. పొలాలను, తోటలను, రక్షించడానికి కంచెగా దీనిని మనం ఉపయోగిస్తున్నాం. పేదవాడి
దా. బన్న అయిలయ్య ర్1 (బ్రతుకు కూడా నాగజెముడు లాంటిది. వాడు అన్ని బుతువుల్లోను పొలాల్లోనే జీవిస్తాడు. యజమాని వాడి రక్షణను పట్టించుకోకుండా ఒక పనిముట్టుగా పంటని రక్షించే కంచెలోని “నాగజెముడులా ఉపయోగించుకుంటున్నా తన ఉనికిని చాటుకోవటానికి శ్రమ పుష్పాన్ని వికసింపజేస్తూనే ఉన్నాడు పేదవాడు. ఒక వ్యక్తి పోషణకు రోజు 2500 కాలరీల శక్తి అవసరమని సైన్స్ చెబుతుంది. కర్షకులు, తీసుకునే ఆహారం ఎక్కువ పిండి పదార్థాలతో కూడుకొని ఉంటుంది. కేవలం పిండి పదార్జాలలోనే సరిపోయే పోషక విలువలు దొరకవు. వీటితో పాటు ప్రోటీనులు (మాంసకృతులు) కూడా ఉన్న ఆహారం అందినపుడు శరీర దారుధ్యానికి తోద్చడే పోషక విలువలు అందుతాయని దాశరథి భావించాడు. బక్కచిక్కిన వాడి దేహానికి పోషక విలువలు కలిగిన ఆహారం అందించే “అమృత ఘటిక కోసరమై.........త్వరగా ఫలమందించే మార్గాన్ని అన్వేషించడం” కోసమే మస్తిష్కంలోని ఈ లాబోరేటరీలో పరిశోధనలు జరిపిస్తున్నాడు దాశరథి. మనం వైజ్ఞానికంగా ఎంతగా అభివృద్ధి చెంచామంటే ఆంటీ బయాటిక్ కనిపెట్టి
మరణాలరేటుని తగ్గించాం. సూపర్ స్పెషలైజేషన్ శస్త్ర చికిత్సలు చేసి ఆయుః ప్రమాణాన్ని పెంచుతున్నాం. సూర్యుడస్తమించాక మూలతట్టు గ్రామాలు కూడా అంధకారంలో మగ్గకుందా విద్యుత్ దీపాలకాంతులతో వెలిగి పోయేలా చేశాం. కృత్రిమ గోళాలని సృష్టించి భూగోళం చుట్టూ పరిభ్రమింపజేస్తున్నాం. రిస్టవాచ్ల టేప్ రికార్డ్లను అమర్చగలుగుతున్నాం ఉపగ్రహ (ప్రసారాలు కలిగిన టి.వి.లు తయారుచేసి ఉపయోగిస్తున్నాం. ఇదేకాకుండా ఇంకా అనేక రకాలైన అద్భుతాలు సృష్టించి ప్రకృతి సౌందర్యాన్ని రెండింతలు చేసి సంతోషిస్తున్నాం. మరింత అత్యాధునిక జీవితాన్ని అనుభవిస్తున్న చోట పేదలు ధనికులని చెప్పుకోవటమే వినసొంపుగా లేదు. ఈ సౌఖ్యాలన్నీ కావాలని పేదవాడు కోరుకోవటం లేదు. కనీసం వాడు తినే తిండిలో 'ప్రోటీనులైనా రానియ్యవయ్యా !? అంటూ వేడుకుంటున్నాడు కవి. ఈ పరిస్థితులను గమనించాకా మనం ఎక్కడున్నామని మరో కోణంనుండి చూస్తే-
“ఇన్ని శతాబ్దాలు ప్రయాణం చేసినా వం
ఇక్కడే వున్నాం ఈ ఊరిపాలిమేర ప్రకృన్త్యదర ౯ 1 టో ఎదాలాన్న్యా
డార్విన్ బయాలజీలో పరిణామ పట్టి భా సం క
న... సె లో
52 వైజ్ఞానిక దాశరథి
పదియోజనాలంతా ఉన్నా
మానవుడు మానవుడయ్యే కాలాన్ని
నిర్దేశించగల (ప్రదేశం కానరాదు 1”
భూమి మాద మనిషిపుట్టి పదిలక్షల సంవత్సరాలైందని డార్విన్ చెప్పాడు.
దార్విన్ పట్టిక ౯0102016, 12102016, 46502010, 02102016 అనే నాలుగు రకాల విభజనతో కూడి వుంది. మొదటి విభజన ప్రకారం 136 మిలియన్ల ముందున్న జీవులున్నాయి. నాలుగో విభాగంలో ఆధునిక జీవులున్నాయి. డార్విన్ (ప్రకారం జీవులన్నింటితో పాటు మనిషి కూడా ఒక జంతువే (3610 కాని, మిగిలిన జీవులకంటే అత్యున్నతుడు మానవుడని డార్విన్ తేల్చి చెప్పాడు. ఇంగిత జ్ఞానం కలిగిన మానవుడు జంతువులకన్నా క్రూరంగా, రాక్షస, ప్రవృత్తిని అలవర్చుకొని తోటి మానవుని జీవితాన్ని విధ్వసం పాలు చేస్తున్నాడు. శాస్త విజ్ఞానంలో శిఖరాగ్రం చేరిన మానవుడు సంఘ వ్యతిరేకిగా మారి రాక్షస ప్రవృత్తిని అలవర్చుకొన్నారంటే కారణం వాళ్ళ మనస్సులు సరిగ్గా పని చేయటం లేదు. మానవ మేధస్సు అంతా ఈ విధ్వంసానికే ఉపయోగ పడకూడదని నొక్కి చెప్పటానికే-
“క లాబొరేటరీలో కూచుని
లోకం నిండా విరివిగా శాంతి పందే రీతిని
కొత్తరకం విత్తనాల్ని
కనిపెట్టే వీలు......”” ని వెదుకుతున్నాడు దాశరథి. “మస్తిష్కంలో వెలిగే మాయింటికి ముందుండిన లేబొరేటరీ తెరచి ఉంది. ......” అంటూ మానవతావాదులందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాడు దాశరథి. అగమ్య గోచరంగా మారిపోయిన సమాజ పరిస్థితులని చూసి మధనపదే మేధావుల శిథిలాలు చివురించే రసరాజ్యం ఈ లాబొరేటరీ ”- అజ్ఞానాంధకారంతో మగ్గిన పేదవాళ్లకు జ్ఞాన దీపం వెలుగు ప్రసరించడానికి నిరంతరం ఈ లాబొరేటరీ ద్వారాలు తెరచే ఉంటాయి. పేదవాడి శ్రమ పేదవాడికే దక్కే వరకు ఈ ప్రయోగశాలలో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.
'జ్యోతిశ్చక్రం' కవితా ఖండికను పేరా పద్ధతిలో రాశాడు దాశరధి. ఒక్కొక్క
పేరాకు తూర్పు, శరధి, దక్షిణం, కాలం,. భవిష్యత్తు, పడమర, ఉత్తరం, స్వస్తి అనే పేర్లు పెట్టాడు. భవిష్యత్తు, పదమర భాగాలలో సైన్స్ పదాలని ఉపయోగించాడు.
డా. బన్న అయిలయ్య ర్ “అగ్నిధార లోని అనంత సంగ్రామం కవితని జ్యోతిశ్చక్రంలో శరథి అనే విభాగంలో చేర్చడం జరిగింది. దానిలో 'అనాథుడికీ ఆగర్భ శ్రీనాథుడికి మధ్య జరుగుతున్న సంగ్రామాన్ని వర్ణ సమాజంలో జరిగే సంఘర్షణని గురించి వివరించాడు. “మథనపడే మేధావులు శాస్త్రజ్ఞులు, విద్వాంసులు కనిపెట్టిన అణుశక్తికి (ప్రభుత్వాల కంటోళ్ళు” శాస్రజ్ఞులు చేస్తున్న పరిశోధనల వల్ల చరిత్ర పూర్వదశ నుండి భవిష్యత్ దర్శనం చేస్తూ, జీవితంలో కొత్త విలువలు సంతరించుకుంటున్నాం. శాస్త్రజ్ఞుల జీవితాల్ని ప్రయోగశాలకు అంకితం చేసి, ప్రజల జీవితాన్ని ఆనందమయం చేయాలని, మానవ సమాజానికి మరింత సౌఖ్యాలందించాలని శాస్త్రజ్ఞులు మధనపడుతూనే ఉన్నారు. వారి పరిశోధన ఫలితాలు స్వార్ధపరులైన పాలకుల చేతుల్లోకి తీసికొని ప్రపంచానికి ప్రమాదం తెస్తున్నారు. వాళ్ళు కనిపెట్టిన అణుబాంబులు వానికరమైన ప్రయోజనానికి ఉపయోగిస్తూ మానవ జాతినే నిర్మూలన చేసేంత భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భవిష్యత్తు అనే పేరాలో భయంతో ఉన్నవ్యక్తి నిరంతరం మరణిస్తూనే ఉంటాడని, ధైర్యం సంజీవని గుళికలాంటి దంటాడు దాశరథి. పాశ్చాత్య రాజకీయులకు ప్రపంచ (ప్రజలు “ఎక్సెరిమెంటుకైపెంచిన గినీ పిగ్లులా ....” పనికి వస్తున్నారంటున్నాడు. జన్యు శాస్రజ్ఞులందరూ 'గినీ పిగ్గు అనే ప్రాణిని ప్రయోగ పరికరంగా ఉపయోగిస్తారు. ఒక ఆరోగ్యవంతమైన ప్రాణిని అనారోగ్య పరుస్తారు. మళ్ళీ ఆరోగ్య పరచడానికి, కనిపెట్టిన ఓషధాన్ని దానిమాదే.ప్రయోగించి ఫలితాన్ని గ్రహిస్తారు. ఈ ప్రయోగంలో 'గినీపిగ్గు రకరకాల హింసలకు గురికాక తప్పదు. పాశ్చాత్యులు వారి స్వార్ధ రాజకీయాలోచనలని తఅచరణలోకి తేవాలంటే మొదట వారిపై ఆధారపడిన వివిధ దేశప్రజలపై ప్రయోగించి అనేకమైన ఇక్కట్లకు గురి చేస్తుంటారు. ఈ విషయాన్ని దాశరథి వైజ్ఞానిక దృక్పధంలో వివరించాడు. 'పడమరి అనే పేరాలో సామ్రాజ్యవాద దేశమైన అమెరికాని ఎక్కడ కూడా పేరుపెట్టకుండానే ఆ దేశం దుశ్చర్యలను ఖండిస్తున్నాడు. అమెరికానే ఉద్దేశించి ఎలా చెప్పాడంటే - ఆ దేశంలో 'కాలిఫోర్నియా' రాష్ట్రం వుంది. ఆ రాష్ట్రంలో కొలరాడో అనే
ర్డ్త వైజ్ఞానిక దాశరథి ఎడారీ ప్రాంతం ఉంది. “కొలరాడో బీటెల్సు” అనే పదబంధం ఉపయోగించడం వల్ల అది అమెరికాయేననే ధ్వని పూర్వకమైన అర్ధం గోచరిస్తుంది.
“వి బాంబు మాకు రక్షణ
“హెచ్ బాంబుకు ఇస్తున్నాం శిక్షణ
“ఎక్స్ బాంబు కూడా చేసేస్తాం
చేస్తే మా మాదే వేస్తాం” అని - (ప్రపంచములో అగ్రరాజ్యాలు సామ్రాజ్యవాద కాంక్షతో వర్థమాన దేశాల్ని బెదిరించడం జరుగుతుంది. *వి బాంబు అంటే ఆటంబాంబు. దాని దుష్పరిజామం ఎలా ఉంటుందో రెండో (ప్రపంచయుద్ధంలో దెబ్బతిన్న దేశాలే సాక్ష్యం. ఒక దేశ సార్వభౌమాధికారం దెబ్బతీయటం కోసం మరో దేశాన్ని ఆ దేశం మోదికి ఉసిగొల్పుతూ, ఆ దేశానికి మాత్రం అగ్రరాజ్యం తయారు చేసిన ఆటంబాంబు రక్షణగా ఉంటుందని ధైర్యాన్నిస్తుంది. “హెచ్ బాంబులంటే హైడ్రోజన్ బాంబులు తయారు చేశారు. శత్రురాజ్యాన్ని మరింత విధ్వంసం చేయటం కోసం దాని ప్రయోగానికి శిక్షణనిస్తున్నారు. ఇంకా వీటికి కూదా బెదిరిపోని దేశాలుంటే 'ఎక్స్' బాంబులను కూడా తయారు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. సొమ్రాజ్యవాద దేశాలు 'ఎక్స్' అంటే తయారు చేయబోయే బాంబులకు పేరు పెట్టలేదను కోవాలి. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన కొలదీ మనిషిలో రాక్షస ప్రవృత్తి తగ్గి, శాంతిని పెంచుకొని, నాగరికతని అభివృద్ధి చేసుకొనేదిపోయి - ఆటవిక చర్యలకు పూను కుంటున్నాడని దాశరథి చెబుతున్నాడు. ఈ అగ్రదేశాలు ఇంతగా ఎందుకు కక్ష గడుతున్నా యంటే”- మిరు స్వయం సమృద్ధి చెందుతున్న దేశాలేవీ స్వయం సమృద్ధిని సాధించడానికి వీలులేదు. అలా సాధించిన రోజు అగ్రరాజ్యాల పెత్తనానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకే (గాట్ లాంటి ఒప్పందాలతో ఆయా దేశాల స్వయం సమృద్ధిని దెబ్బతీస్తున్నాయి.
ప్రపంచంలో విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన కొలదీ మనిషి రాక్షస ప్రవృత్తిని
పెంచుకుంటూ పోతున్నాడే కాని తగ్గటం లేదు. వైజ్ఞానికాభివృద్ధే అభివృద్ధి కాదు. దానికి తగినట్లు మానవుల మనస్సులలో కూడా మార్పు రావాలి. కాని, విజ్ఞాన శాస్తాభివృద్ధిని తప్పుదారి పటించి మానవ జాతి ఉనికికి ముప్పు వాటిల్లజేస్తున్న పరిస్థితులను ప్రతిఘటించాల్సిన అవసరం నేటి మానవ కారుణ్యవాదులైన కవుల మిద వుంది. అజ్వస్త ప్రయోగాల్ని ఖండించి, వాటి నిజమైన ఉద్దేశాలని, సద్వినియోగ పరుచుకునే విధానం గురించి చాటి చెప్పాల్సిన బాధ్యత కవులకుందని గ్రహించిన దాశరథి తన కవిత్వంలో విజ్ఞాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టి కవిత్వానికి అన్నయించి చెప్పాడు
- గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్పథం
“గృడిసెలు కాలిపోతున్న” వచనా కవితా సంపుటి దా బోయి భీమన్న సామాజిక దృక్పథానికి నిలువుటద్దం. ఇది కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
“గృడిసెలు కాలిపోతున్నై లో భారతీయ సమాజాన్ని అన్ని కోణూలనుండా చిత్రించి చూపించాడు భీమన్న ఈ సమాజంలో మతం-కులం-వర్గం- ఒక దాని నొకటి ఆక్రమించుకొని అస్తిత్వంలో ఉన్నాయి. వీటి మూలంగా ప్రపంచంలోని అన్ని సమాజాల కంటే విలక్షణంగా భారత సమాజం కన్పిస్తుంది. ఇవి సమాజాన్ని కలుషితం చేసి సామాజిక న్యాయం కొరవడటానికి దోహాదపడుతున్నాయి. మతం భారత సమాజాన్ని సర్వత్రా ఆవరించి ఉంది. మతమే కుల వ్యవస్థకు మూలమైంది. కులాన్ని బట్టి వ్యక్తి సాంఘిక స్థాయిని నిర్ణయించడం జరుగుతుంది. కాని అతని గుణగణాలను బట్టి, శక్తి సామార్జాలను బట్టి కాదు. ఉన్నత కులాల వాళ్ళు సామాజిక స్థాయిలో ఉన్నతంగా పరిగణింపబడటానికి కారణం “వీరికి పుట్టుకవల్ల, చదువువల్ల, వంశప్రఖ్యాతి వ్యాపార సంబంధాలు, వారసత్వంగా వచ్చిన ధనం .......” (కుల నిర్మూలన : మూలం డా! బి. ఆర్. అంబేద్మర్: అనువాదం డా॥ బోయి భీమన్న : 39) వల్ల సామాజిక స్థాయిలో గొప్పవాళ్ళుగా నిలువ గలుగుతారు. పైవన్నీ వీరికి అనుకూలంగా ఉంటాయి. కనుక, సమాజంపై ఆధిపత్యం చలాయించడానికి అన్ని హంగులూ కలిగి ఉంటాయి.
పూర్వం నాలుగు వర్ధాలుగా వర్ణించబడిన హిందూ మతం నాల్లువేల కులాలుగా పెరిగి పోయాయి. కులాల వల్లే ఆర్ధిక స్థాయి నిర్ణయించడం జరిగింది. కనుక భారత దేశంలోని నిమ్న బలహీన వర్గ్ణాలవాళ్ళు ఆర్థికంగా ఎదగక పోవడం కన్సిస్తుంటుంది. మత, కుల, వ్యవస్థను శాస్త్రబద్ధం చేయడం కోసం ప్రయత్నించేవి (శ్రుతులు, స్మృతులు పురాణాలు, ఇతిహాసాలు, వీటినిండా ఒక వర్దానికి మరొక వర్ధానికి జరిగిన సంఘర్షణే చిత్రించబడి ఉంది. వీటిద్వారా కుల, మత, వ్యవస్థ అస్తిత్వానికి కొన్ని నిర్ధిష్టమైన సూత్రాలు చేయబడ్డాయి. అయితే ఈ సూత్రాలకు ఏ విధమైన శాస్రీయత లేదు. ఉన్నదల్లా ఒకటే
ర్6 గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్ళధం ఉన్నత కులాలు క్రింది కులాలను అణచివేయడం “హిందువులలో సాంఘికంగా ఉన్నత న్థాయిలో ఉండి తమ క్రింది వారిని తమ ఇష్టానుసారంగా అణచిపెట్టి ఉంచగలిగినంత నిరంకుశాధికారం గల వక్రబుద్ధులైన కొంత మంది స్వప్రయోజనంతో కల్పించిన సంఘ వ్యవస్థ” (కుల నిర్మూలన: మూలం డా॥ బి. ఆర్ అంబేద్మర్: అనువాదం డా॥ బోయి భీమన్న: 28) అయితే కులం మతంపునాదులపై నిర్మింపబడినది కనుక మతాన్ని నిర్మూలిస్తే కులం దానంతటది నిర్మూలించబడుతుంది. ఆ తర్వాత ఆర్థిక సమానత్వం సాధించే అవకాశం ఉంది. అంటే ముందు సామాజిక విప్లవం ద్వారా మత, కుల సమస్యలలో మార్పువస్తే ఆ తరువాత సమాజంలోని హెచ్చుతగ్గులు, ఎగుడు దిగుడులు, ధనిక పేద, అనే అంతరాలు తొలగిపోతాయి. సమాజంలో మతం ద్వార్హా కులం ద్వారా, వర్గం ద్వారా, నష్టపోతున్నవారు కోట్లాది జనం ఉంటే, వీటివల్ల లాభం పొందే వాళ్ళు ఏ కౌద్ది మందో ఉన్నారు. ఈ కొద్ది మందే సమాజంలోని ప్రజల నైతిక బలహీనతలని ఆసరా చేసికొని ధన బెత్తంతో అధికారం చేపట్టి, (ప్రజలను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు.
దేవుడిని ఆశ్రయించుకొని మతం. మతాన్ని ఆశ్రయించుకొని కులం. కులాన్ని ఆశ్రయించుకొని వర్గం, ఉన్నాయి, వీటిని నిర్మూలించిన రోజు సామాజిక న్యాయం జరుగుతుందని డా॥ బోయి భీమన్న దృక్పథం.
భీమన్న కవితా కత్తికి రెండంచుల పదునున్నది. దేవుడిని, మతాన్ని, కులాన్ని, రద్దు చేయమన్నప్పుడు ప్రగతి కాముకుడిగా కనిపిస్తాడు. ప్రాచీనార్ష సమాజంలో కుల భేదం లేదని భావించి "60 346110 ౪66419” అన్నప్పుడు సంప్రదాయాను వర్తకుడుగా కనిపిస్తాడు. దీన్నిబట్టి ఖీమన్న ప్రగతివాదుల సంప్రదాయవాదుల సమన్వయవాదిగా గుర్తించవచ్చు. దేవుడిని మతాన్ని కులాన్ని రద్దు చేయమన్నప్పుడు ఎంత నాస్తికుదుగా కనిపిస్తాడో అనంతమైన ఈ సృష్టిని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నదన్నప్పుడు అంతటి ఆస్తికుడిగా కనిపిస్తాడు. దీన్ని బట్టి “జీవిత మార్గంలో నైతికతా మతమూ - ఈ రెండింటినీ బ్రతుకు పోరాటంలో రెండు ఆయుధాలుగా, రెండు సాధనాలుగా పరిగణించవలసి ఉంటుంది.” (కుల నిర్మూలన: మూలం డా॥ బి. ఆర్ అంబేద్మర్: అనువాదం డా॥ బోయి భీమన్న : 68) అని భీమన్న మతం నమ్ముతాడనిపిస్తుంది. మతానికో దేవుడుండటమేమిటని ప్రశ్నించిన భీమన్న మతం నైతికతని శంకించాడు. మతం కొందరిని చిన్న చూపు చూసింది. వారిని ఎంతో మనోక్షోభకు గురి చేసింది. అందుకే దేవుడిని, మతాన్ని భీమన్న
"డా. బన్న అయిలయ్య 57 రద్దు చేయమంటాడు. అయితే మంచి, చెడూ రెండూ ఉన్నాయి. చెడును తొలగించు కుంటూ, మంచిని అభివృద్ధి పరచుకుంటూ వెళ్ళితే మానవాళికి శ్రేయస్సు. కాని మతం మార్పుకు వ్యతిరేకంగా నిలిచిందని భీమన్న అభిప్రాయం. భీమన్నను సంప్రదాయ వర్తకుడుగా గుర్తించినపుడు ప్రొఫెసర్ జాన్ డ్యూయి మాటలు గుర్తుకొస్తాయి. “సమాజం ఏవో పనికి మాలిన గతానికి సంబంధించిన సంప్రదాయాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. అందులో అధికభాగం వట్టి మృత పదార్ధం. దాని చుట్టు అల్లుకొన్న వక్రవృత్తులు. ఒక సమాజం వికాసం చెందే కొలది ఈ చెత్తనంతా, ఈ మృత పదార్థాన్నంతా దులిపిపారేసి, భవిష్య సమాజాన్ని శక్తిమంతమూ, తేజోవంతమూ చెయ్యగలిగిన జీవపదార్భాన్ని మాత్రమే ముందుకు అందివ్వటం దాని కర్తవ్యం” (కుల నిర్మూలన: మూలం డా! బి. ఆర్. అంబేద్కర్: అనువాదం దా॥ బోయి భీమన్న: 69) మతంలో నెలకొన్న ఆచారాలు సమకాలీనంలో నిలువదగినవి కావు. భ్రష్టుపట్టిన సంప్రదాయాలని పరిహరించినపుడు సమాజం పునర్వికాసం పొంది చైతన్యవంత మవుతుందని భీమన్న అభిప్రాయంగా కన్పిస్తుంది. ప్రస్తుత సమాజాన్ని జంతు సమాజంగా పోల్చాడు భీమన్న ఇదే 'వన్యవ్యవస్థ' అంటాడు.
బలం కలవాడు పులి
తెలివి కలవాడు నక్క
ఈ ఇరువర్ణాలకు ఆహారంగా
బ్రతుకుతున్న మూర్చలు గొట్టెలు (టుమ్రీలు)
సమాజంలోని మనుష్యులను పులులు, నక్కలు, గొట్టిలు, అని మూడు వర్ణాలుగా విభజించాడు. సమాజంలో ఆటవిక న్యాయం కొనసాగుతుంది. కులబలంతో, ధనబలంతో, భుజ బలంతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వారు పులులు. అర్ధంలేని ఆచారాలని, సంప్రదాయాలని సమాజం పాటించాలంటూ, అధికారవర్గానికి సన్నిహితులుగా, వారి దోపిడికే సహకరిస్తూ బ్రతికే ఆశ్రిత గణాలు నక్కలు. అమాయకమైన పేదప్రజలు కులం చేత, ధనంచేత, క్రింది స్థాయిలో నిలిచిపై వారిచే అన్ని రకాలుగా దోపిడీ చేయబడుతున్న వారు గొఖట్టిలు. పులులు నక్కలు కలిసి తరతరాలుగా అమాయక గొట్జెలను మోసం చేస్తూనే వున్నాయి. దోపిడికి ఒక వ్యూహాన్ని పన్నాయి. ఆ వ్యూహమే మతం, వర్గం. “నాలుగు వర్జాలన్నది హిందూయిజం రెండు వర్జాలన్నది కమ్యూనిజం
న! గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృకృధం ఈ వర్ణ విభజనా, వర్గ విభజనా చేసింది పులి నక్కాయిజం” (టుమ్రీలు)-అంటాడు. భీమన్న నాలుగు వర్దాలుగా మనుష్యులను మతం విడదీస్తే, రెండు వర్గాలుగా కమ్యూనిజం విడదీసింది. ఈ విభజనకు ప్రాతిపదిక సామాన్య జనాన్ని ఏదో రకంగా ఏకం కాకుండా చేయటమే.
“మతం ఒక పిచ్చి మనుష్యులను వాస్తవ ప్రపంచానికి దూరంగా వుంచి వారిని ఉన్మాదులుగా చేస్తుంది. నిజాన్ని కప్పేసి పెట్టి ప్రజల ఆలోచనా మార్గాన్ని వక్రీకరించగలదు. మానవ చరిత్రలో మతం వల్ల జరిగినంత హింసాకాండ మరొకటి లేదు. ఇంత జరిగినా మతానికి అస్తిత్వం ఉందంటే పేదవాళ్ళ అజ్ఞానంతో దాన్ని పెంచి పోషిస్తున్నారు. మతం క్రావలసింది పేదవాళ్ళకే కాని, ధనవంతులకు కాదు. మతం ఆశలు కల్పిస్తుంది. పేదవాళ్ళు ఆశలతో ఓదార్పు పొందుతారు. అందుకే పేదవాళ్ళు మతాన్ని నిరంతరం బ్రతికిస్తుంటారు. “మతం విషం' 'అది నల్ల మందు కంటే' ప్రమాదకారి అని చెప్పినా వారు వినిపించుకోరు.
మానవుడికి మతపిచ్చి హిందువుడికి అదనంగా ఒక విశ్వసమన్వయ పిచ్చి (మతం ఒక పిచ్చి : 8) అన్ని మతాలను ఏకం చేసి వాటిపై తన ఆధిక్యతను చాటుకోవాలని హిందూ మతానికుంటుంది. “విశ్వసమన్వయ' మనే పిచ్చితోనే ప్రచారం చేస్తుండడం జరుగుతుంది. హిందూ మతం చారిత్రక పురుషులను దేవుళ్ళుగా చేసి పూజించింది. హేతువాదుల, మేధావుల, సామజిక విప్లవ కారులను కూడా దేవుళ్ళను చేసింది. రాముణ్ని దేవుణ్ని చేసి రామాయణాన్ని పురాణం చేసాం, బుద్ధుడికి జాతక కధలంట గట్టీ మనిషికి ఆందకుండా చేశాం. నూరు శాతం పురుషుడైన కృష్ణున్ని నారాయణడ్నీ చేసి వదిలేశాం (మనిషే మార్గ దర్శకుఢు : 15)
దా. బన్న అయిలయ్య 59 రాముడు, బుద్దుడు, కృష్ణుడు మొదలైన వాళ్ళంతా చారిత్రక పురుషులు; ప్రతిభావంతులు. ప్రతిభావంతుడైన ప్రతి వాడికి ఏదో ఒక ఆదర్శం అంట గట్టి వాళ్ళను దేవుళ్ళుగా చేయడం జరిగింది. ఆదర్భం ఎప్పదైనా కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆకాశంలోని మెరుపు లాంటిది. ఆచరణ సాధ్యం కానిది. అయితే మనిషికి మార్గదర్శకుడు తన ముందున్న మనిషేకాని, అందుకోలేని ఆదర్శాలను వల్లించే దేవుళ్ళు కాదని గ్రహించాలి. శ్రేతాయుగం, ద్వాపర యుగం నాటి కధలు తెలిపేవి రామాయణ మహాభారతాలు, వాటిని మాత్రమే “కథలుగా విని సినిమాలుగా చూచి సంతోషించాలి తప్ప” అవి సర్వ కాలాల్లో సత్యాలని నమ్మకూడదు. వారు ఆయా కాలాల్లో మంచిగానో చెడ్డగానో టబ్రితికి చనిపోయిన వ్యక్తులు. అంతే కాని మత బోధకులు చెప్పినట్లుగా వారు అవతార పురుషులుకారు. ఒక వేళ అవతార పురుషులే అయికే తాత్మాలికంగా “అవతారమెత్తి చాలించిన వాళ్ళను మొక్కడం కంటే, ఆ విష్ణువునే మొక్కవచ్చు కదా”. వారి వ్యక్తిత్యాలు, ఆదర్శాలు నచ్చితే వారిని అనుసరించాలి కానీ, వాళ్ళను దేవుళ్ళుగా పూజించి మానవాతీతులుగా చేయకూడదు. వారి వ్యక్తిత్వాల పట్ల గౌరవం అంటారా? అయితే అంతకంటే ఎక్కువ పరిధిలో ఎక్కువ సేవ చేసిన గాంధీ, ఆంబేద్మర్ వంటి మహాత్ముల్ని కూడా ఆ జాబితాలో చేర్చండి. (చచ్చిన వాడిని సహాయమడిగితే : 18) ప్రతి తరంలో కొందరు ప్రతిభావంతులు, మేధావులు పుడుతుంటారు. వారివారి మార్గాలలో పయనిస్తూ మానవాళి అనుసరించాల్సిన పద్ధతుల గురించి కొన్ని సూత్రీకరణలు చేస్తుంటారు. అవి సర్వజనామోదం పొందినవి కావచ్చు, కాకపోవచ్చు. కానీ సమకాలీకుల కంటే వైవిధ్యమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నందుకు ఎల్లపుడూ గుర్తుంచుకో దగినవారే! అంతే కాని ఏనాడో చనిపోయిన వారిని దేవుళ్ళుగా భావించి సహాయం చేయమని ప్రార్ధిస్తే లాభం లేదు. కృష్ణ నిర్యాణం తరువాత, ఆ మరునాదే మరిది పార్టుడికే దిక్కులేక పోయి.........న
60 గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్సథం సత్యాన్ని గ్రహించాలి. వాళ్ళు దేవుళ్ళు కాదని ఇంతకంటే నగ్న సత్యం మరొకటి అక్కర లేదు. మనిషిని పశువునుంచి వేరు చేసే గుణాలు సత్యం, అహింస, న్యాయం, నీతి, నిజాయితీ కానీ ఇవి నేటి సమాజంలో మృగ్యం. మతము సమాజాన్ని ఆటవిక దశకు చేర్చిందని భీమన్న అభిప్రాయం. బలంకలవాడు, తెలివి కలవాడు బలహీనుడిని, అజ్ఞానిని దోచుకునే న్యాయం చలామణి అవుతుంది. కనుక 'మనిషి బాగుపడాలంటే, మరొక మెట్టెక్కడ మంటే' మతం నుంచి బైటపడ్డప్పడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ గుడులన్నీ మట్టివి ఈ దేవుళ్ళంతా మిణుగురులు ఈ మతాలన్నీ దొంగల గుహలు ఈ మనుషులు బుల్ఞల్లేని బొమ్మలు _ (ఇదిగో మోక్ష మార్గం: 36) గుడులలో కనిపించని దేవుళ్ళుండి ప్రజలను బూచీ పెడుతుంటారు. మతాలు సామాన్యులను మోక్షం, కర్మ పేరున దోచుకుంటాయి. దేవుడిని, మతాన్ని నమ్మిన మానవులు హేతుబద్ధంగా ఆలోచించక గ్రుడ్డిగా బ్రతుకుతున్నారు. మనుష్యులకు మోక్షమే కావాలంటే -- “కుల, మత, వర్ణ, వర్గ విముక్తమైన విశ్తైక మానవతా మార్గం” అనుసరించాలని భీమన్న సూచించాడు. దీనిలోనే మానవులందరికి ' ఆనంద రసాదై గతం), ఉందంటాడు. మతం వికృత రూపమే కులం. వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్న వాళ్ళంతా అవర్జులుగా, కులం లేని వాళ్ళుగా, చండాలురుగా పిలువబడుతున్నారు. అ స్పృశ్యులైన కారణంగా, వారు సాంస్కృతిక వికాసానికి నోచుకోలేదు. తరతరాలుగా అస్పృశ్యులు పశుతుల్యులుగా బ్రతుకుతున్నారు. 'ముడులు కట్టిన జడలతో, సుడులుచుట్టిన ఒడలతో కన్పిస్తారు. 'లోకంలోని సమస్త పంకిలాన్నీ తొక్కేస్తున్నట్టుంటారు. వీడు మారుతున్న సమాజంతో మారలేనివారు. ప్రభుత్వం- వీడికెన్ని రిజర్వేషన్లు కల్పించినా ఎంత సానుభూతితో రాసుకు తిరిగినా ఎన్ని చట్టాల రాజ్యాంగ రధాలపై వీణ్ని
డా. బన్న అయిలయ్య 61 కాస్త ముందుకు తోలుకుపోదామన్నా వీడు ఒక్క అడుగైనా ముందుకు కదలదు (మారని వాడు: 105)
“వీడు వట్టి మారని వాడుగా కన్పిస్తున్నాడు. నిమ్నజాతులు మారకపోవదడానికి కారణం. వాళ్ళకోసంచేసిన శాసనాలు, చట్టాలు, సబ్సిడీలు, రాయితీలు అమలు పర్చడంలో చిత్తశుద్ధి లేదు. వాళ్ళు పురోభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నారు. నిరంతరం వారు ఆకలిని తీర్చుకోవడం కోసం ఆహారాన్వేషణలోనే కాలం గడుపుతున్నారు. పాలకులకు కూడా వీనిని అభివృద్ధి పరచాలనే చిత్తశుద్ధి లేక పోవడం చేత వాళ్ళ కడుపూ, కన్నూ నకనక మండుతున్నా తమ నిజాయితీని అతిక్రమించకుండా ఉన్నారు.
“కుల మతాల ఉమ్మడి కాష్ట్ర మైన ఈ సమాజంలో అస్పృశ్యుడికి స్థానం లేకుండా పోయింది. అతడికి ఈ దేశ సాంస్కృతిక వారసత్వంలో భాగం లేకుండా పోయింది. ఈ దేశ సాంస్కృతిక వైభవానికి పునాది రాయి అయినవాడు వీడే. నిజానికి ఈ దేశ సాంస్కృతిక వారసత్వపు హక్కులు కల్గిన వాడు అతడే, పేదరికం, విద్యలేమి- ఈ రెండే కదా! అస్పృశ్యులకు గల బలహీనతలు. ఇవి కేవలం లౌకికమైన బలహీనతలు. “సాంస్కృతికంగా సంస్మారికంగా భారత సమాజంలో నిమ్నజులదే అగ్రస్థానం”.
ఓ అహంకార కులాగ్రేసరా నా హక్కు లేవో నాకిలా పారెయ-అంటూ (నాకురావలసిన బాకీ : 44) ఈ దేశంలో నిమ్నజులకు రావాల్సిన బాకీని నిలదీసి అడుక్కుంటున్నారు.
భారత సమాజం ఆర్య సంస్కృతికి ప్రాధాన్యత నిస్తుంది. దీన్ని గూర్చి ప్రచారం చేస్తూ గౌరవోన్నకులు పెంచుకోవాలని ముమ్మర ప్రయత్నం, అవకాశం దొరికిన ప్రతిసారి చేస్తున్నట్లు కన్పిస్తుంది. ఆధిక్యత కోసం కొన్ని వర్ణాలు ఈ ప్రయత్నం కొసాగిస్తుంటాయి. కానీ “హరిజనులు ఆర్యులే' (పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయిభీమన్న; 440) అంటే మాత్రం ఒప్పకోరు.
ఆర్యజాతి వ్యక్తిత్వానికే ఆది పురుషుడు వ్యాసుడు మాల మాదిగ వాడే కదా! ఈనాడు అతడు అగ్రవర్గం వాడు, అతడి వంశం వాణ్ని నేను అంత్యజుణ్ని!
62 గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృక్సృధం
ఇదే - మన భారతీయసమాజ ధర్మం
నేటి దాకా సాధించిన పురోగమనం
(నా వారనత్వము హక్కులు:6) భారతేతిహాస కర్త వ్యాసుడు. నేడున్న అర్యజాతి వ్యక్తిత్వానికి ఆద్యుదతడే. వ్యాసుడు నిమ్నజాతీయుడు గాని, సవర్గులు ఆధిక్యతతో తమ వర్ణం వాడుగా లెక్కకట్టుకున్నారు. అతడి సంతతికి చెందిన నిమ్నవర్దాల వారిని మాత్రం వెలివేసింది. విశ్వాన్ని ఆర్యం చేయాలనుకున్న మహానుభావుడి వారసులు అమానవీకరణకు గురికావల్సి వచ్చింది. “ఇదే భారత సమాజ ధర్మం” అది నుండి నేటి దాకా సాధించిన పురోగమనం. వీరికి “వేద వేదాంగాలపై వారసత్వ హక్కులు దొంగిలించబిడ్డాయి. వాటిని వెలికి తీసి తమ వేనని ప్రపంచానికి చాటి చెప్పి, నిమ్న వర్గాలలో ఉన్న ఆత్మ న్యూనతను పోగొట్టు కోవాలి. ప్రస్తుత సమాజానికి అవి పనిచేయవని “గర్వంగా అవతల పారేయాలి" అంటాడు భీమన్న మతం కులం సమాజ సంపదను స్వార్ధంకు ఉపయోగించుకోవాలని చూశాయి.
పైకి బోధించే ఆదర్శాలు వాళ్ళ దోపిడికి రక్షక కవచాలు. కాలం మారుతుంటే, ప్రజాధనం కొల్లగొట్టే పద్ధతులు మారుతున్నాయి. ఆధునిక యుగంలో “ప్రజాస్వామ్య వ్యవస్థ ఆమోదయోగ్యమైనది. అన్ని వర్గాల వారు, అన్ని వర్దాల వారు (ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానులుగా ఉంటారు. ప్రజాభీష్టం మేరకే నాయకులు పుట్టుకొచ్చి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజా సంక్షేమం కోసం పరిపాలన సాగించాలి. నేడు ప్రజాస్వామ్య వ్యవస్థకు భిన్నమైన పరిస్థితులను చూస్తున్నాం. కులం వల్ల వారసత్వంగా వచ్చిన ఆస్టిపాస్తులను ప్రజలకు ఎరగా చూపి అధికారాన్ని చేజిక్కించు కుంటున్నారు. వారి స్వార్థానికి ఓటింగు విధానం కీలకమైనది. ప్రజాశ్రేయస్సుకు కృషి చేసే ఏ నాయకుడికైనా స్వేచ్చగా ఓటు వేసి తమకున్న రాజ్యాంగ హక్కును సామాన్యులు కాపాడుకోవచ్చు. కానీ, ఆ సామాన్యుడే టూ హక్కును చూసి-
ఈ దేశములో పేదలకు వోటుండడం
పక్కలో పాముండడమే (బానిసల జాబితా :12) అని వణికి పోతున్నాడు. ఓటురాజకీయం ప్రజల్ని బానిసలను చేసింది. 'రకరకాల జెండాల వాళ్ళు సామాన్యులను చుట్టుముట్టి, వాళ్ళ జీవితాలని అశాంతిమయం చేస్తున్నారు.
డా. బన్న అయిలయ్య 63 ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం పేదజనుల ఆమోదమే ఈ ఎన్నికలని
- నిర్వచనమే మారిపోయింది. ఎన్నికలలో పాల్గొనే ఇరువర్గాలు ప్రజల “ప్రాణాలు తోడేస్తున్నారు'.. రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ళ '“గుడెసెలు తగలబెట్టేస్తున్నారు. బానిసలకుండే సుఖశాంతులు సైతం పేదవాళ్ళకు లేకుండా పోతున్నాయి. ఆ-ఓట్లేవో-మీ దొరలే వుంచేసుకోండి మా గుడిసెల్లో మమ్ము బ్రతకనివ్వండి మేం వెనుకబడ్డ వాళ్ళం, బలహీన వర్గాల వాళ్ళం విలువైన దేన్నీ కాపొడు కోలేం. దొరతనం సాగించే అహంకార వర్ణాలు అధికారం చేపట్టి చట్టబద్దంగా నిమ్న బలహీనవర్గాల దోపిడి చేయడం కోసం ఎన్నికల క్రీడలో పాల్గొంటున్నారు. 'ఓటు జాబితా నుండి మార్చేసి, బానిసల జాబితాలో చేర్చండంటూ వారి దైన్యస్థితిని తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తిరుగులేని అధికారం ఉందని చెప్పే నాయకులు, “ఒక్కొక్క వోటును, ఒక్కొక్క లక్షరూపాయల నోటుగా మార్చుకొని మంత్రులై పోయి ప్రజా క్షేమాన్ని మరచిపోతున్నారు. నిరంతరంగా ప్రజాధనాన్ని దోచుకుంటూ జాతీయ సంపదను కాల్లగొట్టి 'సౌభాగ్యపు కోటలు కట్టుకుంటుంటే' ప్రజలు నిస్సహాయులై చూస్తున్నారు. అది తమ “కర్ణుని ఆ బాధలు మరచిపోవటానికి “సారాతో కళ్ళు మూసుకుపోయిన కల్లు కాంపౌండ్ అయినారు. మతం వల్ల మోసపోతున్న వారు నిరుపేదలు. కులంచేత బాధింపబడుతున్నవారు, బానిసలుగా పరిగణింపబడుతున్నవారూ కూడా ఈ నిర్భాగ్యలే, వీరి ఓట్ల వల్లనే అధికారాన్ని సంపాదించినవారు సంక్షేమం మరచి స్వార్ధపరులైఉన్నారు. కుహనాపాలనలో చేయబడుతున్న చట్టాలు పేదలను మరింత పేదలుగా మారుస్తున్నాయి. పేదలంతా గుడిసెవాసులే. గుడిసెలు ప్రతి యేటా కాలిపోతుంటాయి. గుడిసెలు కాలిపోతున్నై ఎవరి గుదిసెలో పాపం ! మాల మాదిగలవే అయిఉంటాయి. గుడిసెలు మరెవరి కుంటై-
64 గుడిసెలు కాలిపోతున్నై - భీమన్న దృకృథం అంటూ కాలిపోతున్నవి గుడిసెలు మాత్రమే కాదు గుడిసెలలో ఉందే గొట్టెల (పేదల) 'అజ్ఞానం' అబలత్వం చీకటి కాలిపోతున్నాయి. నిమ్నజాతీయులు ఎవరి వల్ల దోపిడీకి గురి అవుతున్నారో తెలుసుకో గలుగుతున్నారు. ఇది తెలుసుకున్న రోజు దోపిడీ మూకల ఆటలు సాగవనే హెచ్చరిక పరోక్షంగా చెప్పబడింది.
మతం, కులం పునాదులపై నిర్మించిన సమాజంలో దోపిడీయే సర్వాంతర్యామి అయిందన్న విషయాన్ని బోయి భీమన్న చక్కగా కవిత్వీకరించి చెప్పాడు. మతం, కులం నశిస్తే వర్గం నశిస్తుంది. వర్గ దోపిడి నశిస్తే సర్వ మానవాళికి సమానత్వం వస్తుందని భీమన్న చెబుతాడు.
& పోటెత్తిన దళిత భావార్హవం - మద్దూరి కవిత
దళిత కవిత్వం ఉద్ధతమైతే, సాహిత్యం అస్పృశ్యమైపోతుందని కవులంతా భావిస్తున్న కాలమది. అడపాదడపా ఒకటి అరా సంఘటనలకు స్పందిస్తూ ఒక దృక్పథం లేకుండా కవులు ఉదార మానవతా వాదంతో కవిత్వం రాస్తున్న కాలమది. దళితుల గురించి ఇతర కవులు రాస్తున్నారు మేం ఎందుకు రాయటం లేదు? రాసినా దళిత జీవితానుభవం, దళితాగ్రహం కావలసినంతగా ప్రకటితం కావటం లేదేమిటా? అని దళిత కవులు భావిస్తూ ఉన్న కాలం కూడా అదే. దళిత కవిత్వమే రాస్తే దళిత కవులుగా తప్ప కవులుగా గుర్తింపు లేకుండా కొట్టుకుపోతామేమోనన్న బెంగ దళితులమైన కవుల్లో పోడసూపి అటు రాయలేక రాయకుండానూ ఉండలేక తడబడుతున్న కవిత్వ సమయంలోకి, ....!
ఒక ఇనుపగొంతు వచ్చింది. ఆ గొంతు మద్దూరి నగేష్బాబుది. రాజ్యం నీడన, సంస్కృతి పంచిన, మతం మేలిముసుగులో మనమంతా వర్గరహిత సమాజం గురించి; ఇంకా పీడించే కలలే కంటున్న సంధి కాలంలోకి, చీలిన పిల్లన (గ్రోవిల్లోంచి వచ్చే కాఠిన్యం కురిపించే పాట వచ్చింది. ఆ పాట మద్దూరి నగేష్బాబుది. నన్నయ నుంచి నాదాకా అని ప్రతి ఆధునిక తెలుగు కవి కేరీరిజం వెంట కొట్టుకుపోతున్న విచిత్ర సన్నివేశంలోకి నిప్పు పదాల్ని వెదజల్లుతూ వచ్చిన కవి నగేష్‌బాబు. అతను తన వెంట తెచ్చిన కవితా సంపుటి 'వెలివాడి.
ఈ వెలివాడు దళితాత్మ వ్యధనే కాదు. విసురుని, వాడిని, వేగాన్నీ తీక్షణతనిచ్చింది. క్రోధ పూర్వక తిట్టుని, శస్త్రచికిత్స తనతో మోసుకు వచ్చింది.
దళితులందే కేవలం మాలమాదిగలే కాదు. సమస్త పీడిత కులాలు, మైనార్టీలు అంటూ ఓ మినహాయింపు వాదాన్ని దళిత కవిత్వోద్యమం కోసం బి.సి. విమర్శకులు (ప్రయత్నిస్తూ ఉద్యమ నాయకత్వాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న కాలంలో వచ్చాడతడు. 0 02006, 6 92౪, 6 00004666 అని ఒక ఆంగ్లకవి అన్నట్లు. అతడొచ్చి దళిత కవిత్వాన్ని 'రచ్చబండి దగ్గర ఆవిష్కరించి తాలి విజయాన్ని నమోదు చేసాడు. అతడొచ్చి
66 పోటెత్తిన దళిత భావార్డవం - మద్దూరి కవిత నా కవిత్వానికి దళితులే విమర్శకులు అని ప్రకటించి అందరి నోళ్ళు మూయించాడు. 'వెలివాడను తెచ్చి గ్రామం నడిబొడ్డున నిలబెట్టి కవిత్వానికి పహారా కాస్తున్న దళిత మిలిటెంటు కవి నగేష్‌బాబు. ఈయన కవిత్వం తెలుగు కవిత్వానికి కొత్త పలుకుబడిని నేర్పించి ఇతర దళిత కవులకు స్ఫూర్తినిచ్చింది. ఆకాశమంత ఎత్తరచి ఆక్రోశిస్తున్న నగేష్‌బాబు కవిత్వంలో ఏముంది?
ఒక మొరటుదనం ఉంది. అది దళిత జీవితంలో ఉందే మొరటుదనం. ఒక రాక్షసత్వముంది. దౌర్జన్యానికి బలైన దళితులు రాక్షసులు కావల్సిన అవసరముంది. తలారిలో తప్ప కనిపించని కాఠిన్యం ఇది. శిలా కారిన్యం కాదు. దళిత హృదయ వజ కాఠిన్యం. వజం వజ్రేన భిచ్యతే” అని ఎవరన్నారో కాని, బ్రాహ్మణ భావజాల సంస్కృతిని, దాని ఛాయలో ఎదిగిన కవిత్వాన్ని తన కవిత్వంలో ముక్కలు ముక్కలు చేసి అవతల పారేశాడు. ఆతరువాత దళిత కవిత్వం మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వెలివాడని అందించాక వివాదస్పద '“నిశాని కవులలో ఒకడుగా రూపొంది 'నిశాసిని అందించాడు. దళిత కవిత్వం మందార మకరందాలను చిందించే భాషలో ఉండాలని సమస్త సాహిత్యకులు భావిస్తున్న తరుణంలో వరదయ్య, ఖాజాలతో కలిసి బూతుల్లోంచి వ్యంగ్యాన్నీ, నీచ పదజాలంతో క్రోధాన్నీ పుట్టించి రప్పించాడు. తెలుగు కవిత్వాన్ని రెండోసారి దీవించి, శాసించి ఊరేగించి వెలివాడల నుంచి ఊరి మధ్యన నిలబెట్టిన కవినగేష్
వెలివాడలో వస్తు వైవిధ్యముంది. అస్పృశ్యత సాంస్కృతిక సమస్య, రిజర్వేషన్, దారిద్ర్యం, దౌర్జన్యం, ప్రతిఘటన, దేశభక్తి మొదలైనవి 'వెలివాడలోని కవితా వస్తువులు ఇవన్నీ దళితుల జీవితంలో ఉన్న సమస్యలో ఈ సమస్యలని ప్రతిభావంతంగా చిత్రించి చూపించాడు నగేష్
నిమ్న జాతీయులను తాకరాదని హిందూ ధర్మశాస్త్రాలు నిబంధల్ని విధించాయి. అవి గతించిన కాలంలోని విషయాలు. మెడకు ముంతను, మొలకు చీపురును కటు కోవాలనే నిబంధన నేటి నిమ్న జాతులు, సంబంధిత కులాలు కట్టుకోవటం లేదు. అది వేరే విషయం. ప్రస్తుతం ఈ కులాలు నోటికి ముంతలు మొలక్తు చీపుర్లు కట్టుకోవటం లేదు కనుక నేడు అస్పృశ్యత లేదని తేల్చిపారేస్తే అది అబద్దమే. హోటళ్లలో, దేవాల యాలలో, విద్యాలయాలలో, యధేచ్చగా కొనసాగుతుంది. కాదంటే దాని రూపం మారింది. అస్పృశ్యులు ఇంకా రెండో తరగతి ప్రజలుగానే పరిగణింపబడుతున్నారు.
దా. బన్న అయిలయ్య 67 నీళ్ళు కులం రూపాన్ని దాల్చి తగవులకు నెలవయ్యాయి. నీళ్లకోసం ప్రాణాలు పోయాయి. నీళ్లకోసం కృష్ణానదిలో జాలర్లు ఎన్కౌంటర్ అయినారు. నీళ్లకోసం చీమకుర్తి మహిళలు ప్రాణాలు విడిచారు. నీళ్లకోసం చుండూరు దళితులు హతులయ్యారు. అమరావతి నాగేశ్వరరావు కూడా నీళ్లకోసమే కుల సమాజం చేతిలో ప్రాణాలు విడిచారు. నీళ్లుపారిన ప్రాంతాలలో నాగరికత అభివృద్ధి చెందినట్లు చరిత్రే చెబుతున్న సాక్ష్యం. నేడు నీళ్లున్న ప్రతిచోట 'అనాగరికత వెల్లివిరుస్తుందిని వర్తమానం రోదిస్తోంది. క్ష నిమ్నజాతుల శ్రమవల్ల పాతాళంలోని నీళ్లు మనిషి దోసిళ్లలోకి వస్తున్నాయి. దేవుని నెత్తినెక్కి కూర్చున్న గంగలను నేలకు లాగిన 'భగీరథులు దళితులు. ఆకాశం నుండి రాలిన చినుకులకు అద్దు కట్టలు వేసి వాటిని రక్షిస్తున్నవారు దళితులు. కాని అస్పృశ్యత పేరుతో దళితులను నీళ్లకు దూరంగా ఉంచుతున్నారు. వారు దప్పికని నీళ్లు అడిగితే బురద గుంట చూపించే పరిస్థితులున్నాయంటే అతిశయోక్తి కాదు. దళితుల శ్రమవల్ల వచ్చిన నీళ్లు ఏమైనాయని ప్రశ్నించుకుంటే “కలిగినోళ్ల నల్లాలకో/ దేవుళ్ల పాదాలు కడగటానికి తప్ప” దళితుల దాహం తీర్చడానికి, వారి ప్రాణాలు నిలపటానికి అక్కరకు రాకుందా పోతున్నాయి. “మ్సేం నదుస్తున్న పాకీందిబ్బలం కాకపోయినా చచ్చి గబ్బు కొడుతున్న శవాలం కాకపోయినా మేం నడుస్తుంటేనే పూటకూళ్ల ఇళ్లుకూడా గబాగబా తలపులు మూసుకొని ముక్కు మూసుకొని ముడ్డి మూసుకొని కూచుంటాయి. ఇలాంటి సంఘటనలు సమాజంలో కన్పిస్తాయి. అయితే మరికొన్ని చోట్ల ఈ అస్పృశ్యత మరో తీరుగా ఉంటుంది. దళితులు హోటళ్లలోకి వెళ్లవచ్చు. ఈ మేరకు అస్పృశ్యత ఉండనే ఉండదు. కాని గ్రామంలోని అందరికిచ్చే పాత్రలలో దళితులకు నీళ్ళు పదార్గాలు ఇవ్వరు. వారికి వేరువేరు పాత్రలను కేటాయించి వేరుగా ఉంచుతారు ఆ ధి గొంతు తడవకుండా నీళ్లు తాగుతున్న మనుష్యుల్ని ఎక్కడయినా చూసారా
68 పోటెత్తిన దళిత భావార్లవం - మద్దూరి కవిత మనుషులకీ రెండు వేరువేరు గళాసులుండటం ఎన్నడైనా... ఎక్కడైనా చూసారా !
ఇది దళితులను కించపరచటమే. వాళ్లని మనుషులుగా కాక కుక్కలుగా, పశువులుగా చూడటం జరుగుతుంది. ఇలాంటి అహ్రజాస్వామిక సంఘటన చూడాలంటే మహబూబ్‌నగర్‌లోని “హన్వాడ” గ్రామం సందర్శిస్తేచాలు.
నిమ్నజాతులకు అస్పృశ్యత అంటకట్టి వాళ్ల సంస్కృతిని కించపరిచారు. వారి సంస్కృతిని సంస్కృతే కాదంటూ అవమానించారు. వారి జీవితానికి దూరంగా ఉండే సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆ సంస్కృతిని దళితుడు అనుకరించబోతే అస్పృశ్యుడివి నీవు అనర్హుడవని, సాంస్కృతికంగా వెలివేసారు. “వేదాల కొమ్మలోంచి వాళ్లను నరికే సారు. మాలమాదిగల పల్లెల్ని వెలివాడలను చేసారు. విద్యకు వికాసానికి దూరంగా ఉంచారు. వాళ్లు కొలిచే ప్రకృతి దేవతలను నీచమైనవిగా చిత్రించి ఆస్థానంలో కొత్త దేవతలను సృష్టించారు. దేవుడు సర్వంతర్యామి అంటూనే గుడిని కట్టి నిర్భంధించారు. అర్చకుడి పేరుతో గుడిలో పూజారిని ఏర్పాటు చేశారు. కనిపించని దేవుడు మనుష్యులందరిని ఏ విధంగా చూస్తాడో తెలియదు కానీ, దేవుడికంటే మిన్నగా కన్పించే పూజారి మాత్రం భక్తులను పక్షపాత ధోరణితో చూస్తాడు. కన్పించిన ప్రతివాడికి చిరునవ్వుతో శఠగోపం పెట్టిన పూజారి, నిమ్నుజాతివాడు కనబడగానే శఠగోపం పెట్టడానికి నిరాకరిస్తాడు. ఆధిక్య సంస్కృతిని అనుకరించబోయిన దళితులు అనేక విధాలుగా దేవాలయాలలో భంగపడ్డారు.
మనషులందరికిలాగే దళితులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారిలో భక్తి “సెలయేళ్ళు పొరు తుంటాయ్' అయినా వారి భక్తిని స్వీకరించే దేవుళ్లు కరువైనారు. హిందూ దేవుళ్లంతా రకరకాల జీవరాసుల అవతారాలు ధరించారు. 'కోతుల్నో పందుల్సో తాబేళ్లన్నో చేపల్నో దర్శించుకోవాలని" దళితులు తపన పడుతుంటారు. “తమ తలకాయల్ని కొబ్బరి కాయల్ని చేసి/శిల పాదాల దగ్గర భళ్లున మూర్ధవిధేయతనీ చాటుకోవాలన్న వెర్రి కోరికలూ” దళితులకుంటాయి. కాని వారి కోరిక నెరవేరదు. ఆలయంలోకి ప్రవేశించడానికి అస్పృశ్యత అడ్డమొస్తుంది. దేవుడిపై దళితునికి ఎంతటి భక్తి ప్రపత్తులున్నాయో ప్రకటించుకోవాలనుకున్నా ఫలితం శూన్యం. నిమ్న జాతీయులకు ఆలయ ప్రవేశం లేదని ఆంక్షలు విధించారు. అయినా దాన్ని ధిక్కరించి ఆలయ ప్రవేశం
దా. బన్న అయిలయ్య 69 చేసిన 'పాకోలొ దళితులకు 25 చెప్పదెబ్బలు, పదివేల రూపాయలు శిక్షను ఖరారు చేసారు. దళితుడు ఆలయ ప్రవేశం చేసినందుకు 'కర్ణాటకలో మనిషి పెంట తినిపించారు. ఈ వాస్తవాలు మనం నిత్యం చూస్తున్నవే. అస్పృశ్యత నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు చేసినా రోజురోజుకది విజ్బంభిస్తునే ఉంది. దళితులకు "స్వేచ్చా, స్వాతంత్రాలున్నాయని ఒక పక్క చెప్పి; మరో పక్క వాళ్లను నాశనం చేయడం, చట్టాలు చేసి, వాళ్లచుట్టూ అస్పృశ్యతల 'లక్ష్మణ రేఖలు” గీయటాలూ, జరుగుతునే ఉన్నాయి. విద్య మానవ జీవిత వికాసానికి తోద్బడుతుంది. కాని వర్ణవ్యవస్థ కొందరినే మనుషులుగా గుర్తించింది. ఏలాంటి విద్యనైనా చదవటానికి కొందరినే అనుమతించింది. శూద్రుడైన శంభూకుడు తపస్సు చేసుకున్నందుకు, వర్ణవ్యవస్థ అతని తలను నరికి వేసింది. అడవిలో గురువు ప్రతిమను మాత్రమే ఎదురుగా పెట్టుకొని విలువిద్య ప్రతిభను సాధించాడు ఏకలవ్యుడు. ప్రతిమ ద్వారానే ప్రతిభను సాధించినందుకు గురువుకు దక్షిణగా వేలునే ఇచ్చాడు ఏకలవ్యుడు. నిమ్నజాతి ప్రతిభావంతులంతా కపట గురువుల దక్షిణలకు ఎంతాగానో బలైపోయారు. వోరే పంతులూ ! మా వాళ్ల ఏలిముద్దర్లు సూసుకున్నప్పుడు నీ మనువుగాడు గుర్తొస్తున్నాడు నా ఆగిపోయిన అయిదో తరగతిల్ని సూసుకున్నప్పుదల్లా నీ రాముడు గుర్తొస్తున్నాడు. అని దళితులు చరిత్రను గుణపారంగా నేర్చుకున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్శొన్న దళితులు విద్యను నేర్చుకున్నారు. గుడ్డిలో మెల్లగానున్న రిజర్వేషనుల సహాయంతో దళితులు ఉన్నత విద్యావంతులవుతున్నారు. దళితులు రిజర్వేషనులు అనుభవిస్తున్నందుకు, అగ్రవర్ణ విద్యార్థుల వలన అనేక అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. కకేస్ట్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు చదువే వచ్చేది కాదంటూ హేళన చేస్తుంటారు. ఈ అవహేళనలను తిప్పికొట్టడం కోసం కేస్ట్ 'కిరీటమయ్యింది. “ఒరలో దాగిన ఖద్గమయ్యింది, అని ఆత్మవిశ్వాసం ప్రకటించారు. ఈ క్తేస్ట్ దళితులు శాయజటోయే కొత్త చరిత్రకి ముందు మాటవుతుందని, హెచ్చరిక చేయటం జరుగుతుంది. అయినా రిజర్వేషన్ గాళ్లకు ప్రతిభే లేదంటూ సూటిపోటి మాటల శూలాల్లో దళిత విద్వార్థులని, అగ్రవర్ణ విద్యార్థులు బాధించడం నిత్యకృత్యమైంది.
70 పోటెత్తిన దళిత భావార్దవం - మద్దూరి కవిత వాడికి వారెంటూ ఉండదు నా మీద ఏకేసూ ఫైలయి ఉండదు. అయినా వాడికళ్ళు నాకోసం నిశితంగా వెదుకుతూ నేను భయంతో సిగ్గుతో దాక్కుంటూ “దొంగ పోలీసాటి గా... దళిత విద్యార్థులు జీవితాలని గడుపుతున్నారు. లక్షలాది రూపాయలు డోనేషన్స్ కట్టి 9.8; 14.3.23.5 పట్టాలను కొనుక్కునే అగ్రవర్ణ విద్యార్థులు దళితులను చూసి ప్రతిభ లేనివాడని “ఎంగిలి నవ్వులు” నవ్వుతుంటారు. అగ్రవర్దాల వాళ్లకు వారసత్వంగా వచ్చిన అన్ని సౌకర్యాలు వాళ్లని విద్యావంతులను చేసాయి. మందబుద్ధి కలిగిన వాడు ధనంతో ప్రతిభను కొనుక్కొంటున్నాడు. నిమ్నజాతిలో పుట్టి ప్రతిభావంతుడైనా కూడా దళితుడు “రిజర్వేషన్ గాదే' నని అవహేళన చేస్తారు. నాకూ ఊళ్లోకి రావాలనుంది నాకూ అరుగుల మీద కూకోవాలనుంది కూర్చోటానికి మీకయితే ముడ్డి ఉంటే చాలు నాకు మాత్రం ప్రతిభ ఉండాలంటారేంది? అని దళితులు ప్రశ్నిస్తున్నారు. దేశం అంటే నాలుగు దిక్కులు మధ్యకాక, నాలుగు వర్ణాల మధ్య బిక్క చచ్చిన శవం” అయిన దళితులు, నేడు ఉన్నత చదువు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఆగ్రవర్దాలతో సమంగా తెల్లగుడ్డలు ధరిస్తున్నారు. శుచి, శుభతలలో కూడా ఎవరికి తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. ఆత్మాభిమానం పెంచుకుంటూ మంచాలపై కుర్చీలపై కూర్చుంటున్నారు. కాళ్లకు చెప్పలేసుకుని వీధుల్లో భలాదూర్గా తిరుగుతున్నారు. చివరికి నిమ్నజాతుల సమాధుల వద్ద కూడా దళితులు సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్ని అగ్రవర్జాల వాళ్లకు కంటగింపుని కలిగించాయి. దళితులపై భౌతిక దాడులకు అగ్రవర్ణాల వారు సిద్ధపడ్డారు. మీరు చదువుకోకూడదు మీరు సరిగ్గా గుడ్డలయినా కట్టుకోకూడదు నడవటానికి చూడటానికి మీ మంచాలమీద కూర్చోటానికీ మీకు హక్కు లేదు
డా. బన్న అయిలయ్య 71
చివరికి మీ సమాధులు కూడా
వాళ్ళ సమాధులకు దూరంగా
దగ్గరిగా జరిపారో........
నష్టపరిహారాల వెలలకు మీ తలలు గెలలవుతాయి. ఎక్సీగ్రేషియాల గేటుకి మీ శీలాలు వేలాడతాయి.
అనే హెచ్చరికలు అ(గ్రవర్జ్ణాల వాళ్లు చేస్తున్నారు. తిమ్మ సముద్రం,
పదిరికుప్పం, కారంచేడు, చుండూరు మొదలైన గ్రామాలలో దళితులపై ఆగ్రవర్థాల వారు దాడులు చేసారు. ఈ దాడులలో జరిగిన రాక్షస హింస రాష్ట్రం, దేశం సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలని కలవర పెట్టాయి. చుండూరులో శవాలు పోగులు పడ్డాయి. అనేక మంది దళితులు అదృశ్యమైనారు. అదృశ్యమైన భర్తల గురించి, కొడుకుల గురించి స్రీలు పరిపరి విధాలుగా రోదించారు. గర్భీణీ స్త్రీలు అనే విచక్షణ లేకుండా, ముసలి ముతక అనే భేదం లేకుండా నిర్లజ్జగా దళితులపై దాడులు జరిగాయి. కాళ్లు నరకటం, చేతులు నరకటం, తల నుండి మొండెం వేరు చేయడం. ముక్కలు ముక్కలుగా నరికిన శరీరాంగాల్ని గోతాలలో కుట్టటం, పొలాల్లోకి ఏసిరి వేయడం, పారుతన్న నదుల్లోకి తోసేయటం జరిగింది. శవాల్ని పంచనామా చేసిన డాక్టర్ సైతం ఈ అమానుష, రాక్షస క్రీడను చూసి ఆత్మహత్య చేసుకున్నాడంటే అతిశయోక్తి కాదు. చుండూరు 'మానవ చరిత్ర పుస్తకంలో” నెత్తుట తడిసిన మరో కాగితమైంది. దురహంకారంతో అగ్రవర్దాల వాళ్లు దళితులపై చేస్తున్న దాడులు ఈ నాటివి కాదు. ఈ దౌర్జన్యానికి వేలయేళ్ల చరిత్ర ఉంది. ఈ దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దళితుల జీవితాల్ని క్షోభకు గురిచేస్తున్నాయి. ఈ పైశాచిక దాడులు, దౌర్జన్యాలు కేవలం దళిత పురుషులపైన మాత్రమే కాకుండా, స్త్రీ లపై కూడా జరుగుతున్నాయి. ఆడవాళ్ల పుస్తెలు ఎడాపెడా తెంచేసి, వాళ్ల గాజులు చేతుల్ని 'మోళ్లని చేసి, వారి అంగాలతో అష్టాచెమ్మలు ఆడుకోవడం, ఆడకూతుళ్లు అంగాలని తోరణాలుగా కట్టడం అగ్రవర్ణాల రాక్షసత్వానికి నిదర్శనం. దళిత 'కూతుళ్లకు సక్కదనం ఉండడం” నేరమైంది. అందుకు ఊరి 'పెసిరెంటు” మదాన్ని దళిత స్త్రీలు శిక్షగా భరించాల్సి వస్తుంది.
అయ్యా అగ్రకులాల్లారా?
మా గుండెల్లో దిగుతున్న మదం బట్టిన శూలాల్లారా
దించండ్రా దించండి
79 పోటెత్తిన దళిత భావార్డవం - మద్దూరి కవిత మా తల్లుల పొత్తి కడుపుల్లో మీ పట్టుడు గరలు మరింత లోతుగా దించండి. అంటూ దళితులు, వారి స్త్రీలపై, జరిగే ఆత్యాచారాలకు నిస్సహాయతను ప్రకటిస్తున్నారు. “క్షణానికో దహనం/(ఘడియకో మానభంగంిప్తకో హత్య చేసి/ మాజాడ లేకుందా ఈ నేలను పునీతం చేయండి” అంటూ దళితుల పైన జరుగుతున్న భౌతిక దాడుల గురించి రోదిస్తున్నారు. దళితులు పుట్టటమే ఈ దేశానికి అరిష్టం దాపురించినట్టుగా అగ్రకుల స్వ్యష్ప్రలు భాపిస్తుంటాలు. వారిని అంతం చేస్తే చేశం పునీత మవుతుందని భావించే దాడులకు దిగుతున్నారు? యుగయుగాల నుండి దళితులు హైన్యదైన్య స్థితిలో (బతుకుతున్నారు. వారనుభవిస్తున్న నికృష్ట పరిస్థితులను నిర్మూలించి, వారిని సంస్మరించాలని తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు దా. బాబాసాహెబ్ అంబేద్మర్. దళితులు జాగృతమవ్వాలంటే, దారిద్ర్యం నుండి బయట పడాలంటే, కుల రక్కసి పైశాచిక దాడుల నుండి వారిని రక్షించాలంటే వారికి రాజ్యాంగ రక్షణ అవసరమని భావించాడు. నూతన రాజ్యాంగం రాసి దళితులకు కొన్ని సదుపాయాలు సౌకర్యాలు అదనంగా ప్రభుత్వం చేకూర్చాల్సిన అవసరముందని నొక్కి చెప్పాడు. దళితుల పురోభివృద్ధికి అంబేద్మర్ వేసిన బాటలు ఆశాజనకంగా ఉన్నాయి. దళిత జాతి అభివృద్ధి సాధిస్తే తద్వారా భారతజాతే ప్రగతి పధంలోకి వెళ్తుందని అంబేద్కర్ చెప్పాడు. దళితులు విద్యావంతులు కావాలని, ఆత్మన్యూనతా భావం వొదులుకొని ప్రగతి పధం వైపు దృష్టి సారించాలని చెప్పిన అంబేద్కర్, దళితుల ఆత్మాభిమానానికి (ప్రతీకగా నిలిచాడు. అలాంటి మహానుభావుని విగ్రహం మెడలో అగ్రకుల అహంకారం “చెప్పల దండి వేసింది. దళిత జాతిని కించపరిచింది. దానితో దళితులు ఆగ్రహం చెందారు. తమ ఆస్తులను హరించిన వాళ్లు, తమ తల్లుల, చెల్లెళ్ల, భార్యల మానాలు దోచిన వాళ్లు, తమ మహానాయకుని విగ్రహం మెడలో చెప్పల దండ వేసిన వాళ్లు ఒక్కరనే గుర్తించారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో అగ్రవర్ణాల అహంకార చేష్టలని, దౌర్దన్యాలని ప్రతిఘటించడం మొదలు పెట్టారు. దళితులు మనుష్యులను మనుష్యులుగా (ప్రేమించారు. తమపై జరుగుతున్న ఆత్యాచారాలను, దౌర్జన్యాలను తరతరాల నుండి సహిస్తూ రావటానిక్రి కారణం దళిత తల్లులు తమ “పిల్లలకు ఉగ్గుపాలతోనే (ప్రేమను రంగరించి పోశారు, “ప్రేమని మానవ
డా. బన్న అయిలయ్య 78 భాషగా అక్షరాలు నేర్పారు". దళితుల ఓపికని బలహీనతగా భావించిన అగ్రవర్జాల వాళ్లకు తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రేమించటం చేతకాని తనమౌతున్న చోట 'సహనం' బలహీనతగా భావిస్తున్న సమాజంలో ప్రతిఘటించకపోవటం నేరమని దళితులు భావించారు. ప్రతిఘటనే తమ జీవితాలను సరిదిద్ద గలదని నిర్ణయించు కున్నారు. అమ్మా నన్ను క్షమించు రాడ్‌క్లిఫ్ దండెం మీద వాడు నాపేగులు ఆరేస్తుంటే నేను శాంతి వచనాలు వల్లించలేను నా నిస్సహాయతపు చేతుల ముందే వాడు నా ఆదోళ్లని ఆగం ఆగం చేస్తుంటే వాడు నన్నో సరికొత్త అస్పృశ్యుడిని చేసి నా కుల బూడిద దిబ్బల మీద సింహాసనాలు చెక్కుకుంటుంటే వాడ్ని క్షమించమని నేను ప్రార్ధనలు చేయలేను. అంటూ పోరాటానికి దళితులు సిద్ధపడ్డారు. దళిత స్త్రీలను రేపులు చేయటం, వాళ్ల మర్శాంగాలలో కారం కుక్కడం, కర్రలు జొనపటం లాంటి కిరాతక చర్యలకు ఎందరో స్త్రీలు బలైపోయారు. “మాతంగి కోటేశ్వర అంజమ్మ, రాములమ్మ ఏసమ్మ, సారమ్మ లాంటి దళిత స్త్రీలు ఈలాంటి అత్యాచారాలకు గురై హత్య గావింపబడినవారే. మరెందరో దళిత ప్రీల జీవితాలు “లాడ్జింగులకు, దొమ్మరి గుడిసెలకు, అర్ధరాత్రి స్వేచ్చలకు' బలైపోయాయి. ఈ దారుణాలని మౌనంగా భరిస్తున్న మహిళలు 'బావుల గుండెల్లో మందుపాతరై పేలాల్సిందే' అలా ప్రతిఘటించిన రోజు దళిత స్రీలు తమను తాము రక్షించుకోగలుగు తారు. 'పురుటి నొప్పులు పడే తల్లులు పదునైన కత్తుల్ని కనాల్సిన' రోజు వచ్చింది. 'కీకరారణ్యం లాంటి వ్యవస్థను తెగనరకడానికి, మళ్లీ మళ్లీ స్త్రీల మీద జరిగే దౌర్జన్యాలని నిర్మూలించడానికి కొత్త రక్తం కావాలి. కొత్త తరం రావాలి. కొత్త విలువలని ప్రతిపాదించాలి. ఈ దేశంలో వీధి నాయకుడు చనిపోయినా అతని స్మృత్యర్థం ఒక వీధికో, కళాశాలకో, డ్యామ్లకో, ఉద్యానవనాలకో అతని పేరు పెట్టడం జరుగుతుంది.
74 పోటెత్తిన దళిత భావార్ణవం - మద్దూరి కవిత పాలకులకు సన్నిహితుడో, దగ్గరి బంధువో అయితే అతను జాతి రత్నమని ఒక బిరుదును కూడా ప్రదానం చేస్తారు. కాని నిజమైన దేశభక్తులకు గుర్తింపే లేకుండా పోతుంది. డా. అంబేద్కర్ తన ప్రతిభను, పాండిత్యాన్ని జీవితాన్ని స్వార్ధాన్ని సర్వాన్ని ఫణంగా పెట్టి జాతికి నవభారత రాజ్యాంగాన్ని రాసిచ్చాడు. జాతంతా ఒక క్రమబద్ధమైన జీవన రతిని కలిగి ఉండేలా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దాడు. అతని మేధా సంపత్తికి ప్రపంచ దేశాలన్నీ జోహార్లు అర్చించాయి. 'మరట్వాడ” యూనివర్సిటికి దా. అంబేద్కర్ పేరు పెట్టినందుకు కుల సమాజం అంగీకరించలేదు. ఉద్యమం లేవదీసింది.
'సివరికి లెట్రిన్ దొడ్లకి కూడా నాయకుల పేర్లుందే ఇక్కడ
మరట్వాడలో ఒక యూనివర్సిటికి మావోడి పేరుపెట్టడం
సంకుచిత భావజాలమై యాంటి సోషలిజమై విగ్రహాలు ధ్వంసం చేసి -
సంసారాలు కూల్చేసి
దళిత వాడల్ని దహన క్రీడల్ని చేస్తున్నారు. పని చేసే వాడికే తిండి దొరకిని సమాజ మిది. వారానికి ఏడు రోజులూ 24 గంటలు పనిచేసినా పస్తులుండాల్సి వస్తుంది. “పద్మవ్యూహం! లాంటి బొగ్గు గనిలోకి 'ఇల్లాళ్ల గుప్పిళ్ళలో భయంగా నలిగే మంగళ సూత్రాల మీంచి గబగబాలేచి” వెళతాడు కార్మికుడు. అతను తీసే బొగ్గు పరిశ్రమలకు, రైళ్లకు, కరెంటుకు ముడి సరుకవుతుంది. చిమ్మ చీకట్లో ఉన్న సమాజంకు వెలుగునందించడం కోసం కార్మికుడు '*జలపాతమై జాలువారతాడు; అలాంటి కార్మికుని జీవితమంతా బతుకు '*కోతితో చీకటి మయమవుతుంది. వాడి ఆకలి చీకటి గూట్లో చిన్న దీపమైన పెట్టే వారు లేకుండా పోయారు.
దారిద్ర్యం ప్రజలకు వెన్నుముకయింది. ఏ దేశంలోని ప్రజలైన దారిద్యంతో కుంగిపోతున్నారు. చదివిన చదువుకు ఉద్యోగం దొరకక కొందరు, దొరికిన ఉద్యోగం ఉపాధినివ్వక కొందరు, అటు చదువు ఇటు ఉద్యోగం లేక పుట్‌పాత్‌లపై ఆకలితో అలమటించే వారు మరి కొందరు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నారు, ప్రతిదేశంలో నగరాలుంటాయి. నగరాలకు రోడ్లకు “ఫుట్‌పాత్ లుంటాయి. *విస్తరికి అన్నంలాగో / రాజకీయ నారోకుడికి ఓటర్లాగో/రోడ్డుకి పుట్పాతొలుంటాయి. రోజురోజుకు నగరాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఫుట్‌పాత్‌లు పెరుగుతున్నాయి. ఏదో ఒక రోజు ఫుట్‌పాత్
డా. బన్న అయిలయ్య 75 “మందు పాతరవుతుంది, మానవ బాంబవుతుంది. సమస్త సంపదల్ని జాతికి సమకూర్చా పెట్టిన పౌరులు నేదు అక్కరకు రాని వస్తువులుగా “ఫుట్‌పాత్” మీద విసిరికొట్ట బడ్డారు. శ్రామికుల శ్రమని దోచుకున్నవాడు సంపన్నుడై నగరంలో 'బ్యూటీ పార్లర్లని తాగి, ద్రమ్ముల డమ్ముల పెట్రోలు తాగి" కాలుమీద కాలేసుకొని సమస్త దేశం ఇలాగే ఉందను"కుని కలలు కంటుంటారు. వారి ధృతరాష్ట్ర కళ్ళకు వీధి గుమ్మాల ముందు ఆకలి కేకులైన అనాధ బాలలు కన్చించరు. ఆ నిర్భాగ్యులంతా 'మన బేంక్ బేలెన్సుల్సీ బంగారు నగల్నీ పేర్లనీ, ఇందిరా వికాస్ పత్రాలని, విదేశీ నిధుల్నీ ప్రశ్నించ' నంతకాలం ఈ 'పృథ్వీ అన్నపూర్ణేశ్వరి గానే వాళ్లకు కన్పిస్తుంది.
సోమాలియా నా నల్ల తల్లీ
ఎండిన నీ రొమ్ముల మీద
ఈ పసి అస్థిపంజరాలు దేనికోసమమ్మా
ఆబగా వెదుక్కుంటున్నాయా
దొరక్క దొరక్క దొరికిన రొట్టెముక్కని
బిడ్డ చేతుల్లోంచి లాక్కుని తల్లితినే ఈ దృశ్యం
ఏ మాయదారి చిత్రకారుడు చిత్రించిన
అధివాస్తవ చిత్రమమ్మా? ఇది సోమాలియా దేశ ముఖచిత్రం. బిడ్డ ఆకలిని చూడాల్సిన తల్లి పాలు తను అర్ధాకలితో ఉండి బిడ్డ కడుపు నింపే అమ్మ ప్రేమకు, అనురాగానికి మారు పేరుగా ఉండాల్సిన మాతే, బిడ్డ చేతిలోని రొట్టి ముక్కను లాక్కుతినే దారుణ పరిస్థితులు సోమాలియాలో ఉన్నాయి. తల్గులందరి (ప్రేమని బిడ్డలు శంకించాల్సిన దృశ్యమిది. ప్రపంచదేశాలన్నీ 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాయి. ఎంతో వైజ్ఞానిక ప్రగతిని సాధించి: నాగరికతను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మరి సోమాలియా 'ఆకలి దృశ్యం ఏ నాగరికతకు చిహ్నమని చెప్పకుందాం. అగ్రదేశాల సామ్రాజ్య వాదానికి ప్రపంచ దేశాలన్నీ మరో సోమాలియాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పేద దేశాలపై ఉంది. వర్తమాన దేశాల 'ఒంటి మీద అమెరికా గాయాలు” పదకుండా జాగ్రత్త పడాల్సి ఉందని సోమాలియా దేశం ఒక హెచ్చరిక చేస్తుంది.
76 పోటెత్తిన దళిత భావార్ణవం - మద్దూరి కవిత మన సమాజం కులమత రహిత మైనదిగా ప్రకటించుకున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానులేనని చాటుకున్నాం. అయినా వీటి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అవసరమను కున్నప్పడు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి కూడా. యుగాల క్రితం మనువు చూపిన శిథిలమైన దారిలోనే నిమ్నజాతులు, మహిళలు నడుచుకోవాలని ప్రబోధించడం జరుగుతునే ఉంది. ఈ క్రమం తప్పనప్పడు నిమ్నజాతు లపై మహిళలపై దాడులు జరుగుతున్నాయి. హత్యలూ జరుగుతున్నాయి. మనం మతంగానో కులంగానో వర్గంగానో లింగ వివక్షలతో బ్రతుకకుండా మనుష్యులుగా బ్రతుకుదామనే వారు దేశభక్తులుగా కాకుండా దోషులుగా పరిగణింప బడుతున్నారు. ఏ వివక్షలు లేని సమాజం కోసం “వేదకాలాల నుండి చెమట కళ్ళతో కలలు కంటు'న్నారు. దళితులు అయినా “చుండూరు చుండూరుగా కారంచేడు కారంచేదుగా బళుకు బొంబాయిగా, మానాలు మెహెందిలై, బతుకు పురాపాత రాతి యుగాల్లోకి 'పోతూనే” ఉంది. ఈ దేశంపై అవ్యాజ ప్రేమను ప్రకటిస్తున్నవారు దళితులు. 'వైద్యుడు రోగిని ప్రేమించినట్టు, ప్రవక్త కుష్టురోగిన ప్రేమించినంత బెదార్యంగా” దళితులు ఈ దేశాన్ని 'ప్రేమిస్తున్నారు. (ప్రేమించే దళితుల్లో ద్వేషం కూడా ఉంది. 'కులం మతం వర్గం లింగ వివక్షలతో దేశాన్ని “దీర్షరోగి' గా మార్చినోళ్లుని దళితులు ద్వేషిస్తూనే ఉంటారు. అకలి దారిద్ర్యం, నిరక్షరాస్యత సమాజంలో పేరుకుపోయి సమాజం వర్ణాలుగా విభజించ బడ్డప్పుడు, ఆ వర్గాలు బ్రాహ్మణీయ భావజాలంతో నేస్తం కట్టి పైకి కనిపించని అసమానతలను ప్రచారం చేస్తున్నప్పుడు, కులం పేరిట వ్యక్తి ఆత్మగౌరవాన్ని, వర్ణం పేరిట మానవ సంస్కారాన్ని మంటగలుపుతున్నప్పడు దళిత కవి కచ్చితంగా గొతెత్తు తాడు. సోమాలియా ఆకలి ఆలమటింపుకే కాదు. సవర్ణ జాతుల అధికార దుష్కృత్యానిక్తీ ఒక ప్రతీకే. అందుకే నగేష్‌బాబు 'వాడి దారిద్ర్యం నుండి మొదలై సోమాలియా ఆకలి చావు కేక వరకూ ఒకే కేక పెట్టాడు. ఇప్పటి దాక బ్రాహ్మణీయ భావ జాలం సృష్టించిన సాహిత్య ఇంద్రధనుస్సులోని రంగులన్నీ వివర్ణమై అవర్ణం రూపాన్ని తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఇంద్రధనుస్సు ఏడు రంగుల్లో కాక ఒకే ఒక రంగును చూపుతోంది. అదే దళిత వర్ణం దళిత భావార్ణవం.
- ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం ప్రపంచంలో ఏ ఇతర దేశాలనకి లేని ప్రత్యేకత భారతదేశానికుంది. భారతీయ సమాజానికి యించుమించుగా ఐదువేల ఏళ్ళ చరిత్ర ఘనంగా ఉంది. అయితే ఇదే సమాజానికి కులవ్యవస్థ మరింత ప్రత్యేకతను ఆపాదిస్తూ ఉన్నది.
భారతీయ సమాజం గురించి ఎవరేం మాట్లాడినా ముందుగా ్రస్తావించాల్సింది కులాన్నే. భారతీయ వ్యవస్థలో కులం బలంగా వెళ్ళూని నిలిచినందున కుల ప్రస్తావన లేకుండా వచర్చకూడా ముందుకు సాగదు. మనం ఎంతగా ఉమ్మడి సంస్కృతీ, వారసత్వాలను గురించి మాట్లాడినా అంతిమగా కులవ్యవస్థనుంచి మొదలుకావడమో, కులవ్యవస్థ దగ్గర ఆగిపోవటమో తప్పనిసరి అవుతున్నది.
ఈ వాస్తవాన్ని సందేహం లేకుండా ఆమోదించిన తరువాతనే మనం ఏమైనా ముందుకు పోగల మార్దాలను వెతకడానికి వీలుచిక్కుతుంది. భారతీయ సమాజంలోకి కులం ఎట్లా ప్రవేశించింది? అసలీ సమాజం ఇన్నిన్ని వేలకులాలుగా ఎట్లా ఎప్పుడు విభాగించబడిందీ చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, కులదృక్పథంతో వచ్చిన కవిత్వం గురించిన చర్చ ప్రధానంగా ఉద్దేశించిన ఈ వ్యాసానికి అవి గౌణవిషయాలే అవుతాయి. కనుక వాటినిక్కడ చర్చకు పెట్టడంలేదు.
సాంఘిక అసమానతకు మూలం కులం: తెలుగులో 1980ల నుంచి కొద్దికొద్దిగా కులచైతన్య ప్రభావంతో కవిత్వం రావడం మొదలైంది. ఎప్పడో 20వ శతాబ్ది పూర్వార్దంలో హరిజనాభ్యుదయాన్ని కాంక్షిస్తూ వచ్చిన కవిత్వం కంటే దృక్పథ పరంగా నైశిత్యం ఉన్న కవిత్వం వచ్చే సరికి అందరి దృష్టి మరొక్కసారి సాంఘిక అసమానత మీదకు మళ్ళింది. కుల వ్యవస్థ వివిధ రూపాలలో భిన్నమార్గాలలో కొనసాగుతున్న ఫలితంగా ఉత్పన్నమైన సాంఘిక, రాజకీయ సమస్యగా కులం ఈసారి పూర్వం కన్నా బలంగా చర్చకు వచ్చింది. కులమొక అవిచ్చిన్న వాస్తవంగా గుర్తించిన పిదప ఒక్కసారిగా ఇంతకు ముందున్న దృక్చధాల మీద కవులకు, మేధావులకు ఇతర బుద్ధి జీవులకు బలమైన సందేహం తలెత్తింది.
78 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం ఫలితంగా పూర్వ దృక్పథాలు ఏమీ కుల వ్యవస్థను గూర్చి సమాజానికి సరైన అవగాహనను అందించలేకపోయాయి అన్న ప్రతిపాదన వచ్చింది. ఇటువంటి ప్రతిపాదన వివిధ రాజకీయ, సామాజిక పరిణామాల పర్యవసానంగా రూపుదిద్దుకుంది. సహజంగానే, ఈ కొత్త ప్రతిపాదన ఇటు సాహిత్య రంగాల్లోనూ, అటు సామాజిక, రాజకీయ రంగాలలోను వివిధ పరిణామాలకు ప్రవేశ ద్వారమై నిలబడింది. స్వాతంత్ర్యం సిద్ధించేదాకా కులం పట్ల మనకున్న దృక్చధానికీ స్వాతంత్ర్యానంతర దృక్పథానికీ మౌళికమైన తేడా వెలుగులోకి వచ్చింది. అదే మంటే - కులం వేరు కులతత్త్వం వేరు అనేది. సామాజికంగా ఉన్న కులం కాస్తా రాజకీయ పరిసరాల్లోకి ప్రవేశించాక కులతత్త్వం వచ్చిచేరింది. తద్వారా కులం రాజకీయం చేయబడింది. అయితే దీనికి ఊతంగా అధిపత్య కులాలకు హిందూ బ్రాహ్మణీయ భావజాలం నిలబడితే, హిందూ బ్రాహ్మణీయ భావజాల వ్యతిరేక చైతన్యం తలెత్తి ప్రత్యామ్నాయ భావజాల సంస్కృతిని అందించాలనే అవగాహన స్థిరంగా నిలదొక్కుకుంది. తత్భలితమే దళిత కవిత్వం, దళిత కవిత్వ ఉద్యమం తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించడానికి కారణం. ఒక్కసారి కులం రాజకీయ నిర్మాణ చట్రంలోనికి రావడమంటూ జరిగాక తలెత్తే పరిణామం ఏమిటో ఊహకు చిక్కనిదేమీ కాదు. 16అ8౮00116605లో భాగంగా తలెత్తిన నూతన సామాజిక ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా 1960ల నుంచి (ప్రారంభమైతే, 1970లలో మహారాష్టలో, 1980-90లలో ఆంధ్రప్రదేశంలో దళితుల ఉద్యమం మొదలైంది. కుల వ్యవస్థ వ్యక్తి గౌరవం: 'కులమయ మిదమ్ భారత్” అంటూ ఒక దళిత కవి ప్రకటించడానికి నేపధ్యం ఎంతయినా ఉంది. కుల వ్యవస్థ వ్యక్తికి సమాజంలో ఇచ్చే స్థాయి అతడు పుట్టిన కులం ద్వారా నిర్ణయించడంగానో, నిర్ధారించడం తోనో ఆగిపోతే పెద్ద పేచీ ఉండదు. మిగిలిన కులాలతో అతడు ఏవిధమైన సంబంధ బాంధవ్యాలతో ఉండాలో కూడా నిర్ణయించి పెడుతుంది కుల వ్యవస్థ. అంటే తక్కిన అ కులాలతో అతని సాంఘిక స్థాయిని వేరుపరుస్తుంది. అతడు చేయాల్సిన వృత్తిని నిర్దేశిస్తుంది. తద్వారా ఒక ఆర్ధిక పరమైన పావును అతడికి అందిస్తుంది. ఫలితంగా సాంఘిక హోదాలో ఆ వ్యక్తిని ఇతర కులాల కంటే తక్కువగానో ఎక్కువగానో చూపే ప్రయత్నం చేస్తుంది. ఏదైన ఒక కులంలో పుట్టడమన్నది పుట్టే వ్యక్తికి ప్రమేయం టబ
డా. బన్న అయిలయ్య 79 ఉందదు. ఆ కులంలో పుట్టిన వ్యక్తికి సమాజంలో కుల వ్యవస్థ ఇచ్చేటటువంటి సాంఘిక స్థాయి, వృతిపరమైన గుర్తింపు గౌరవం, ఆర్ధిక స్థితి నిర్ణయం జరిగాక ఇక వ్యక్తి ఏం చేసి అయినా సరే ఎంత మాత్రమూ ఆ చట్రాల నుంచి బయటపడే వీలుండదు. అటువంటి వ్యక్తి ఏ రంగంలో ఎంతటి ఉన్నత న్టానానికి ఎదిగినా కులం అతడిని వదలి పెట్టదు. ఆ వ్యక్తి యొక్క కులానికి సామాజికంగా ఉన్న గుర్తింపు, హోదాను బట్టి మాత్రమే ఆ వ్యక్తికి లభించే గౌరవం ఉంటుంది. అంటే డా, అంబేద్మర్ అన్నట్లు “కులం నిచ్చెనమెట్లు' వ్యవస్థను పోలి ఉంటుంది. పైకి పోయే ప్రతి మెట్టు హీనతను కలిగి ఉన్నదిగా కుల వ్యవస్థ చూపిస్తుంది. కాగా “దీని వలన నిచ్చెన పై భాగంలో ఉన్న వారికి మర్యాద లభిస్తుంది. కింది వరసలో ఉన్న వారికి అమర్యాద మిగులుతుంది. అన్ని మెట్ల కంటే పైన ఉన్న వారికి పెద్ద మర్యాద, అన్ని మెట్ల కంటే కింద ఉన్న వారికి పెద్ద అమర్యాద లభిస్తున్న కులాలు పరిస్థితి అలాగే ఉండాలను కుంటాయి". (తారకం బొజ్జా-కులం-వర్గం-పుట9) మర్యాద లభించని కులాలు పరిస్థితి మారాలనుకుంటాయి. (ప్రయత్న పూర్వకంగా మార్చజూస్తాయి. అంటే కులాధిక్య కుల న్యూన భావాల మధ్య ఒక మానసిక సంఘర్షణ అనివార్యంగా పుడుతుంది. ఈ సంఘర్షణ కులన్యూనతను కలిగి ఉన్న వారికి ఎక్కువ. పైగా ఒత్తిడీ అధికమే. అందువల్లనే దళితులు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఈ రెండూ ఉద్యమానికి అనివార్య అవసరాలుగా గురిసారు. దళితులది ఆత్మగౌరవం పోరాటం. ఆత్మాభిమానపోరాటం, ఈ పునాది నుంచి ఉత్పన్నమయినదే దళిత సాహిత్యం, కవిత్వం. దళిత కవిత్వం సామాజిక నేపథ్యం : సాహిత్య రంగంలోకి ఏ కొత్త దృక్పథం వచ్చినా దానికొక నేపథ్యం తప్పని సరిగా ఉంటుంది. దళిత దృక్పధ కవిత్వాన్ని విశ్లేషించు కోవడానికి ముందుగా ఈ సామాజిక నేపధ్యం పరిశీలన తప్పని సరి.
ఈ దేశంలో కుల వ్యవస్థ ప్రారంభానికి బుగ్వేదంలో (పురుషసూక్తం) మూలాలు దొరుకుతున్నాయి. అదిపురుషుని ముఖం నుంచి బ్రాహ్మణులు, బావుల నుండి క్షత్రీయులు, ఊరువుల నుండి వైశ్యులు: పాదాల నుండి శూద్రులు పుట్టారని బుగ్వేద పురుష సూక్త శోక సారాంశం. ముఖానికి ఉత్తమాంగమన్న గుర్తింపు ఉంది. దీని నుంచి బ్రాహ్మణులు పుట్టారు. కనుక వారు ఉత్తములు వీరే వర్ణపంకిలంలోకి ఈ దేశాన్ని నెట్టివేశారు.
ర చ దాలు, మనిషి కుండే పు నరుత్పత్తి శక్తి ద్వారౌ మనిషి పుడుతాడ శాస్రియనిజున్ని
80 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం దీనిని విస్మరించి భగవంతుడి వివిధ అంగాల ద్వారా వివిధ వర్జాలు పుట్టాయనే కల్పనే దళితుల పాలిట శాపమైంది. ఇట్లాంటి కథలు యుగాల తరబడి బోధింపబడుతూ వాటిని విశ్వాసాలుగా కూర్చే క్రమంలో కొందరి ఆధిక్యత పెరిగింది. మరికొందరి జెన్నత్యం తరిగింది లేదా తక్కువ చేయబడింది.
బుగ్వేద పురుష సూక్తాన్ని తాను బలంగా నమ్మటమే కాక, దానిని బలంగా విస్తరించే శాస్త్రములో మనువు ఎవరూ పన్నలేని కుట్రను భారతీయ సమాజానికి వారసత్వంగా అందించారు. ఆయన చేసిన పని వర్ద వ్యవస్థ స్థిరీకరణే కాదు. వివిధ వర్జాల వారికి విధివిధానాల నిర్ణయం. ఈ విధుల నుండి వైదొలగ కుండా వివిధ వర్గాల వారు ఆచరించడం. విధింపబడిన విధులను విస్మరిస్తే కఠినమైన శిక్షలను కూడా నిర్దేశించారు. సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే మానవుడు అధికుడు. మానవులలో బ్రాహ్మణులు ఉత్తమోత్తముడని మనుషులను విడదీస్తాడు. క్రింది మెట్టున ఉన్న తక్కిన మూడు వర్దాల వారు పై వారికి సేవ చేయాలి. కాలక్రమంలో అయిదో వర్ణం ఏర్పడింది. ఇది పంచమ వర్దం. ఈ వర్గాన్ని ఆది పురుషుని ఏ అంగమూ జన్మస్థానం కాలేక పోయింది. వారే అతి శూద్రులు. దీనిని బట్టి కుల వ్యవస్థ కేవలం కొద్ది మంది కుక్షింభరులు స్వార్ధప్రయోజనాల నిమిత్తమే సృష్టించారని అర్ధం చేసుకోవచ్చు.
మనువు ఒకరకంగా వర్ణ విభజనను స్థిరీకరిస్తే దీనికి గీతాకారుడు సామాజిక అనుగుణ్యత (3061౫ 16క్రోరుు200ని సాధించాడు. “చాతుర్యర్దం మయా సృష్టం గుణకర్మ విభాగ శః అని మనువును అందిపుచ్చుకున్నాడు. ఈ నాలుగు వర్దాలే తదనంతర కాలంలో నాలుగు వేల పై చిలుకు కులాలయ్యాయి.
పే మూడు వర్ణాలలో శూద్ర, అతిశూద్ర వర్జాలకు చదువుకునే హక్కు అవకాశాల కల్పన మృగ్యం. మనువు విధించిన, కర్కశ, కరోర నియమాలు శూద్ర, అతిశూద్ర వర్జాల అభివృద్ధికి సహజంగానే ఆటంకమయ్యాయి. శూద్రులు వేద బాహ్యులయ్యారు. వేద పఠన, (శవణాలకు దూరమయ్యారు. మనువు విధించిన నీిమయాలు యధాతథంగా అమలు జరిగాయని ఇతిహాస కధలు సాక్ష శమిస్తున్నాయి.
శంభూకుని తపస్సు ధర్మవిరుద్దం కావడంలోని ఆంతర్యమిదే. శ్రీరాముడు తల నరకడం వెనుక పని చేసిన భావజాలం మనుప్రేరితమే, విలు విద్య నేర్చుకున్నందుకు మహాభారతంలో ఏకలవ్యుని బొటన వ్రేలును గురువు దక్షిణగా స్వీకరించడంలో మతలబు
డా. బన్న అయిలయ్య త్రిక్షే ఇదే. ఇటాంటి ఉదాహరణలు పురాణ, ఇతిహాస, ప్రాచీన సాహిత్యాల నుంచి ఎన్నైనా యివ్వవచ్చు. అంతిమంగా ఈ అన్నీ సారాంశంలో ఒకే అంశాన్ని తెలియజేస్తాయి. అదే కుల వ్యవస్థ లేదా వర్ణవివక్ష ఈ వివక్షకు తోడు స్పృశ్య, అస్పృశ్య భావనలు పెరిగాయి. కులం వల్ల మనుషులు చీలితే, అస్పృశ్యత వలన చీలికలు అధికమైనాయి. మనిషి సాటి మనిషిని పశువుకన్నా హీనంగా చూద్దానికి కూడా వెనుకాడని స్థితి కల్పించబడింది. కులం, అస్పృశ్యతలు రెండూ భారతీయ సమాజాన్ని సంకుచితత్త్వంలోకి నెట్టివేశాయి. అసమానతకు కాంక్రీటు పునాదులు ఇవి. కుల వివక్ష అస్పృశ్యతా జాధ్యం అసమానత్వం భారతీయ సమాజాన్ని నిర్వీర్యపరచడంలో ఒక దాన్ని మించి మరాకటి పోటీ పడ్డాయి. కుల వ్యవస్థ ప్రత్యామ్నాయవాదం: హిందూ భావజాల సంస్కృతి సమాజాన్ని ఎంతగానో నిర్వీర్య పరచడం గమనించిన మహనీయులు కులాన్ని అస్పృశ్యతని, అసమానతని సమాజం అంచులకు నెట్టి వేయాలని సంకల్పించారు. వాటిని నిరసించిన వారిలో చార్వాకులు, బుద్దుడు ప్రాచీన కాలానికీ చెందినవారు. హేతుబద్ధం కాని అనాచారాలు రూపుమాపితేనే కాని, సంఘం అభివృద్ది చెందదని, మౌధ్యాన్ని విడనాడాలని ప్రతి అంశాన్ని వేలెత్తి చూపుతూ జాతి వీటిని పరిహరించుకునే దిశగా అడుగువేయాలని చెప్పారు. 12వ శతాబ్ధం నుండి 17వ శతాబ్దం దాకా సాగిన భక్తి ఉద్యమం సాంఘిక, ఆర్థికాంశాలను పట్టించుకోకుండానే మానవతా వాదాన్ని బోధించింది. భక్తి ఉద్యమకారులు ప్రవచించిన మానవతావాదం మతాతీతమైందేమీ కాదు. ఏదో ఒక మతాన్ని ఆశ్రయించిందే.
ఆ తరువాత సంఘ సంస్కర్తలు, జాతీయోద్యమ కారులూ వాటి నిర్మూలనకు కృషి సాగించారు. అయితే వీరు మతం పునాదిగా కొనసాగి వస్తున్న సాంఘిక రుగ్గతలను గుర్తించడంలో పొరబడ్డారు. వీరిదంతా ఉదారవాద దృష్టి కోణంతో సాగిన ప్రయత్నం.
ఇదే సమయంలో కులమూ, అస్పృశ్యతా, అసమానతలను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసిన వారూ, వాటి వెనుక నున్న భావజాలక్రమాన్ని సరిగ్గా గుర్తించిన వారూ ఉన్నారు. జోతిబాపూలే, అంబేద్కర్, పెరియర్ రామస్వామి, నారాయణగురు తదితరులు. దళితులు ఈ దేశంలో ఇంత నికృష్ణస్థితిలో జీవించడానికి దారితీసిన
82 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం కారణాలు వెదికి వెలుగు చూపారు. చారిత్రక, సాంస్కృతికాంశాలను క్షుణంగా అధ్యయనం చేసి జాతి పునర్చిర్మాణానికి పాదులు వేసారు. వీరు సాంస్కృతిక భావజాల చట్రాన్ని బద్దలు చేస్తే తప్ప దళిత జాతికి బానిసవ్యవస్ట్థ నుంచి విముక్తి ఉండదని గుర్తించారు. లేకపోతే అణచివేత, అసమానత కొనసాగుతుందని హెచ్చరించారు. నిమ్నజాతులను చైతన్య పరిచేందుకు ఉద్యమించారు. అందుకోసం వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, ఇతర సాహిత్యమంతా పక్షపాతంతో రచింపబడినవని తేల్చిచెప్పారు. దళిత జాతి నిర్మించుకున్న సమసంస్కృతిని, శ్రమ సంస్కృతిని శిథిలంచేసి పాక్షిక న్యాయం చేకూర్చే మతాన్ని, సంప్రదాయాలను అత్యధిక ప్రజల సంస్కృతిగా చెలామణి చేస్తున్నారని దళిత (ప్రజలకు బోధించారు. సాంస్కృతిక కుట్ర జాతియావత్తునూ అజ్ఞానంలో ముంచుతూ ఉందని, దీనిని గుర్తించి దళిత ప్రజలు ఉద్యమించాలని ప్రబోధించారు. తద్వారా ప్రత్యామ్నాయ భావజాల సంస్కృతి నిర్మాణ పథానికి తొలి నిర్దేశకులయ్యారు. వారు అందించిన చైతన్యం ఆసరాగా సాంస్కృతిక అధ్యయనం కొనసాగుతూ ఉండటం దళిత సాహిత్యానికి మొదటి అడుగు. దళిత కవిత్వం-సాహిత్య నేపథ్యం: తెలుగులో దళిత కవిత్వం అనే పదం 80ల తర్వాత (ప్రబలంగా వినిపించసాగింది. 1970లో విప్లవ కవిత్వం అనేక సామాజిక ఉద్యమాల ప్రేరణతో వచ్చి క్రమంగా '85 నాటికి వెనుక బట్టింది. “సాంఘిక పరిస్థితుల్లోంచి పుట్టే సామాజిక ఉద్యమాలు, ఆ ఉద్యమాల ప్రేరణతో వర్టిల్లే కవిత్వోద్యమాలు ఉద్ధత పరిచే సాహిత్యం ఎప్పడైనా ఆ ఉద్యమాలు తగ్గుముఖం పట్టగానే వెనక్కి తగ్గుతుంది”. (మోగునూరి వెంకయ్య-చిక్కనవుతున్న పాట-ఒక పరిశీలన పుట 30 ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం (అముద్రితం) 1997] విప్లవ కవిత్వం వెనుక బడిన దశాబ్దంలోనే దళితుల మీద సాంఘికంగా రాజకీయంగా దాడులు ఉద్ధతమయ్యాయి. వాటిని సాహిత్య అభివ్యక్తితో ఖండించ వలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పూర్వసాహిత్యంలో అంతగా కన్పించని దళిత వస్తువు ముందు కొచ్చింది. అంతే కాదు దళిత జీవిత స్థితిగతులకు సాహిత్యంలో సరైన ప్రాధాన్యమూ, అభివ్యక్తి దొరకలేదన్న వాస్తవం కూడా వెలుగులోకి వచ్చింది. అభ్యుదయ, విప్లవ కవిత్వ దృక్పథాలలో దళితుల సమస్య ప్రధాన వస్తువుగా మారకపోవటం ఒక ముఖ్య లోపంగా పరిగణించబడింది. ఈ దృక్పధాల్లో ఒకటీ అర
డా. బన్న అయిలయ్య తతి ఉన్నా దాన్ని వస్తువుగా స్వీకరించిన కవి దళితుడు కావడం గమనార్దం, కవిత్వం మినహాయిస్తే జాతీయోద్యమ ప్రభావంతో వచ్చిన సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో హరిజన సమస్య ఆ కాల సంస్కరణ దృక్పథాన్ని బట్టి రేఖామాత్రంగా స్పృశించబడింది తప్ప, సంస్కరణ దృక్పథ సాహిత్యం కంటే మెరుగైన, అభివృద్ధికరమైన, విప్లవాత్మకమైన దృక్పథాన్ని కలిగి ఉన్న సాహిత్యంగా చెప్పబడుతున్న అభ్యుదయ, విష్లవ కవిత్వాలలో “దళితుడు ఎందుకు వస్తువుగా మారలేకపోయాడనే ప్రశ్నముందుకొచ్చింది. పూర్వ సాహిత్యాలకున్న దృక్చథాల పరిమితులను మినహాయించినా, ఈ రెండు రకాల దృక్పథాలలో వచ్చిన కవిత్వంలో దళిత జీవితం చిత్రీతం కాకపోవడానికి గల కారణాలను వెతకడం ప్రారంభమైంది. విమర్శకులు “ఇటీవలి కాలం దాకా తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం ఒక ప్రత్యేకమైన పాయగా కనిపించదు. సామాజిక, రాజకీయోద్యమాలు బలంగా ఉండడం, ఇతర సమస్యలతో పాటు దళిత సమస్యలు కూడా అందులో భాగంకావడం దీనికి కారణం కావచ్చు”. (రంగనాథా చార్యులు కె.కె.- తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం-ఆధునిక సాహిత్యం: దళిత స్పృహ, పుట:18) అని తేల్చారు. నిజానికి ఇప్పటి దాకా ఉన్న దళిత సాహిత్యాన్ని 'హరిజన సమస్య" అన్న కోణంలోనే చూసేందుకు అలవాటుపడింది సాహిత్య రంగం. అంతే కాని కులాధిక్య భావజాలం అనే దృష్టితో చూడబడలేదు. దళిత వర్ధ్ణాల నుంచి వచ్చిన కవులు దళితుల సమస్యను కులాధిపత్య భావజాలంతో సాహిత్యాన్ని సమాజాన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టడంతోటే తెలుగులో దళిత సాహిత్య/కవిత్వ శకానికి నాంది ఏర్పడింది. వర్గదోపిడిని ప్రధానంగా భావించి, దోపిడిలేని వ్యవస్థను అందించడమనే ఆదర్శం వైపు దృష్టిసారించినంతగా సాంఘిక ఆసమానతను రూపుమాపడం వైపు అభ్యు దయ, విప్లవ కవిత్వాలు చూడలేదని దళిత కవిత్వదృక్పథం భావించింది. అంటే తెలుగు కవిత్వంలోని వామపక్షవాద దృక్పథాన్ని ఆ దృక్పధ అసమగ్రతను దళిత దృక్పథం ప్రశ్నించడం మొదలయ్యాక దళిత దృక్పథం మరల బలాన్ని పుంజుకుంది. దళితుడిగా జాషువా చిత్రించిన “అరుంధతీ సుతుడు” కడగొట్టు బిడ్డడుగానే మిగలకుండా 'తొడగొట్టు బిడ్డడు'గా మారడమే తెలుగులో వచ్చిన కవిత్వ పరిణామం. ఈ విధమైన మార్పు రావడానికి సామాజిక స్థితిగతులు దాన్నుంచి వచ్చిన చైతన్యం ప్రబలంగా పనిచేసింది. ఇది రెండు మార్గాల ద్వారా జరిగింది. “ఒకటి: స్థానిక సమాజం, సాహిత్య వాతావరణం, సామాజిక స్థితిగతులు కాగా; రెండోది:
తి4 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం మొత్తం భారతదేశ వ్యాప్తంగా సాంఘికంగా జరుగుతున్న పోరాటాలు, కుల ఉద్యమాలు, ఇతర భాషా సాహిత్యాల ద్వారా అందిన బౌద్ధిక ప్రేరణలు” (మోగునూరి వెంకయ్య చిక్కనవుతున్న పాట-ఒక పరిశీలన, ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం అముద్రితం 1997, పుట:93).
ముఖ్యంగా 192లో మరాఠీ సాహిత్యంలో వచ్చిన దళిత పాంథర్ల ఉద్యమం తెలుగు దళిత కవిత్వానికి ఊతమిచ్చింది. 1972లో దళిత పాంధర్లు తమ ఉద్యమ మేనిఫెస్టోలు ప్రకటించారు. అందులో వారు “దళితుల విముక్తి పోరాటం ఒక సమగ్రమైన విప్లవాన్ని కోరుకుంటున్నది. పాక్షికంగా అది అసాధ్యం. అది మా కొద్దు మాకు సమగ్రమైన విప్లవాత్మకమైన మార్పు కావాలి. మొదట మాకు జరుగుతున్న సాంఘిక అన్యాయాలను ఎదిరించడంలో తృప్తిపడినాా తర్వాత ఆర్థిక, రాజకీయ రంగాలలో అధికారాన్ని మేమే చేపట్టాలి. మేము ఇక ఏ మాత్రం లొంగి ఉండం. దేశాన్నంతా మేమే పరిపాలించాలి. మాకు వ్యక్తులపై ద్వేషం లేదు. మా కసి అంతా వ్యవస్థపైనే హృదయ పరివర్తన, ఉదారమైన విద్యా విధానాలు -అన్యాయాన్ని గానీ, దోపిడిని గానీ రూపుమాపలేదు. దళిత ప్రజానీకంలో చైతన్యం కలిగించి వాళ్ళను కూడ గడతాం (డా. సత్యనారాయణ ఎస్వీ, తెలుగులో దళిత సాహిత్యం (వ్యాసం), ఆధునిక దళిత సాహిత్యం-దళిత స్పృహ పుట:40] అని ప్రకటించడం జరిగింది. 1970ల నాటికీ క్రింది కులాలు సాంఘిక అసమానతల మీద వ్యతిరేకతతో ఉద్యమించడాన్ని దళిత చైతన్యం పర్యాప్తం కావడాన్ని తెలుగు సాహిత్యం గమనిస్తూనే ఉన్నది. ఈ విధంగా “దళిత చైతన్య విస్తృతి, ఇతర ఉద్యమాల విస్తృతి మొత్తంగా సాంఘిక, ఆర్థిక సమస్యలను కొత్త ప్రశ్నలు సంధింపబడుతున్న నేపధ్యంలోంచే దళిత కవిత్వ ఆవిర్భావం జరిగింది. [వెంకయ్య మోగునూరి -చిక్కవుతున్నపాట-పరిశీలన ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం 1997 (అముద్రితం) పుట: 94] దీంతో దళితులు తమ సమస్యలను తాకు పరిష్కరించుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చారు. దళితేతర సాహిత్య కారులు దళిత సమస్యలను అవగతం చేసుకోవడంలో విఫలమైనారని ఈ కవులు గుర్తించారు. పైగా మరో వాస్తవం కూడా దళిత కవులకు కనువిప్పు కలిగించింది. ఈ కర్మ భూమిలో నడచిన ప్రతి ఉద్యమంలో, ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చిన ఉద్యమాలలో దళితుల సమస్య ఎజెండాలో లేని ఉద్యమం ఏదీ లేదు. అయినా అది ఎజెందాకే పరిమితమై ఆచరణలో శూన్యాన్ని మిగిల్చింది. నడిచిన ఉద్యమాలన్నిటికీ అగ్రవర్ణమే నాయకత్వం వహించింది. దళితులను
దా. బన్న అయిలయ్య రిల కేవలం కార్యకర్తలుగానే మిగిల్చింది. దళితులు అన్ని ఉద్యమాలలో జెండాలను చేబూని రొమ్మొడ్డి ముందు నడిచారు. ఫలితంగా వారికి లారీ దెబ్బలు, తూటాల గాయాలే మిగిలాయి. కానీ సామాజిక న్యాయం జరుగలేదు. దళితుల సమస్యలు, మానవశక్తి దళితేతరులను నాయకత్వ స్థాయికి ఎదిగేలా చేశాయి. కానీ దళితుల పురోభివృద్ధికి ఆశించినంతగా పనికి రాకుండా పోయాయి. ఈ చైతన్యం ఒక స్వాభిమాన ఉద్యమంగా పరిణమించింది. 1985 సంవత్సరం నుండి దళితుల కవిళ్వోద్యమంగా పరిణమించింది. ఆనాటి నుండి నేటి దాకా దళిత కవిత్వం వెనుదిరిగి చూడలేదు. దళిత కవిత్వం-దళిత శబ్ద విచార చర్చ: అసలు దళితులు అంటే ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే. దళిత అనే పదానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇచ్చే అర్ధాలు ఇట్లా ఉన్నాయి.
- ఖండించబడినది, ఛేదించబడినది. చీల్చ్బబడినది. 2, వికసించబడినది, విసిరి వేయబడినది.
- _ అర్ధికృతము, సగము చేయబడినది.
- నిక్షిప్తము, ఇటునటు చిమ్మబడినది అనే అర్ధాలున్నాయి. పై అర్భాలలో వికసించబడినది అనే అర్ధాన్ని వదలి వేస్తే మిగిలిన అర్భాలనీ ఒక దయనీయ స్థితిని తెలిపేవే. దీనిని బట్టి నిర్వచనాలు చూడాలి. “సామాజిక బహిష్కృతులందరు దళితులే” (అరుణ్ కాంబ్లే అఖిల భారత దళిత మహాసభలు, అక్టోబర్, 1987.)
శతాబ్దాల తరబడి సమాజంలోని కుల వ్యవస్థ పరంగా సాంఘికంగా అధో: గతిపాలై, ఆర్థికముగా చిక్కిపోయి, రాజకీయంగా అణగ దొక్కబడిన వారే దళితులు” (మునిరత్నం, యస్. తెలుగు నవల దళిత జనోద్ధరణ, తెలుగు సాహిత్యం దళీత జనోద్ధరణ.)
- . . = నిత్య జీవితంలో బ్రతకటానికి కనీస అవసరాలైన తిండి, బట్ట, గూడు మొదలైన వాటికి నోచుకోని అభాగ్యుడు దారిద్యంతో పాటు సామాజికంగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కబడిన వారు" (శ్యామలాదేవి. డి., దళిత జనోద్ధరణ
- అంబేద్కర్ మార్గము, తెలుగు సాహిత్యం దళిత జనోద్ధరణ.)
“తరతరాలుగా అస్పృశ్యతకు గురై మతం పేరిట సాంస్కృతికంగా హీనంగా చూడబడి, విద్యా సౌకర్యాలు కరువై, సమాజంలో ఉంటూ కూడా ప్రధాన జీవన స్రవంతికి
86 ఆధునిక తెలుగు కవిత - దళిత కపిత్వం దూరమై, ఆర్థికమైన అణచివేతకు శ్రమ దోపిడికి గురైన వాళ్ళు” (రంగనాథాచార్యులు. కెకె., తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం (వ్యాసం): ఆధునిక తెలుగు సాహిత్యం - దళిత స్పృహ, యువ భారతి
“సాంఘిక దోపిడికి గురి అవుతున్నవారు, అస్పృష్యులుగా పరిగణింపబడుతున్న వారు. నీచవృత్తులుగా భావించబదుతున్న వృత్తులు చేసుకుంటున్నవారు. శారీరక 'శ్రమపై ఆధారపడి బ్రతుకులు గడుపుతున్నవారు-దళితులు” (సత్యనారాయణ యస్.వి., తెలుగులో దళిత సాహిత్యం (వ్యాసం) :ఆధునిక తెలుగు సాహిత్యం-దళిత స్పృహ, యువ భారతి పుట-25.)
పై నిర్వచనాలను క్రోడికరిస్తే సంఘ బహిష్పుతులు, కులము వలన అధోగతి పాలైన వాళ్ళు, సాంఘికంగా రాజకీయంగా అణగ (దొక్కబడిన వారు, ఆర్ధిక దోపిడికి గురై నిత్య అవసరాలైన కూడు, గుడ్డ, గూడుకు దూరమైన వాళ్ళు, విద్యకు వికాసానికి నోచుకోక మతానికి, సంస్కృతికి దూరంగా నెట్టివేయబడిన వాళ్ళు, నీచ వృతులు చేసుకుంటూ శారీరక (శమనే నమ్ముకొని సభ్య సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు నిత్యం అవమానాలకు, అత్యాచారాలకు గురవుతూ ప్రధాన జీవన (స్రవంతిలో కలవ కుండనివసిస్తున్న వాళ్ళు దళితులు.
పై క్రోడీకరణను బట్టి ఈ దేశంలో దళితులు ఎవరు అని నిర్దారించడము సులభమే. 1985కు పూర్వము దళితులు అంటే కేవలము నిమ్నవర్ణాల వాళ్ళే. 1985 సంవత్సరం నుండి దేశములో రాజకీయ పెను మార్పులు వచ్చాయి. సామాజిక ఉద్యమాలు అట్టడగు ప్రజల నాయకత్వంలో నడుస్తూ వచ్చాయి. దీనితో 'దళిత అనే పధానికి సంకుచితార్ధం పోయి విస్తృతార్థం వచ్చింది. ఇలా మార్పు చెందటానికి కారణం బహుజనులు రాజకీయ చైతన్యులు కావటమే. ఈ రాజకీయ ఉద్యమమే దళిత శబ్దానికి విస్తృతార్థాన్ని ఇచ్చింది.
యస్.సి.. యస్.టి., బి.సి., మైనారిటి దళితులు అన్ని కులాలలో ఉన్న స్త్రీలు కూడా వివిధ రకాలైన దోపిడి, అణిచివేతకుగురి అవుతున్నారు. కనుక వీళ్ళు దళితులే. దీనితో దళిత ఉద్యమము విస్తృతమైంది. దీనిని దళిత సృజన కారులు యధాతథంగా స్వీకరించి దళిత కవిత్వాన్ని పుంఖానుపుంఖంగా వెలువరిస్తున్నారు.
డా. బన్న అయిలయ్య 87
దళిత కవిత్వం 1980 సంవత్సరము నుండే వచ్చిందని చెప్పకున్నా అంతకు పూర్వమే ఈ ధోరణి ఉంది అంటూ విమర్శకులు చెబుతున్నారు. పరిశోధకులయితే 1960 నుండే దళిత కవిత ప్రారంభమైనదని చెప్పారు. అయితే కంచికచర్ల కోటేశు అనే దళితుడ్ని ఆగ వర్ణము వారు హత్య చేస్తే, దాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చిన దిగంబర కవులు ఉండనే ఉన్నారు. కానీ జాషువా గబ్బిలము తదితర పద్య కావ్యాల్లో దళితులు ఆత్మ వేదనను వినిపిస్తూనే వచ్చారు. ఆ తరువాత కొందరు వచన కవులు కూదా దళితుల వేదనను, కవిత్వీకరించారు. 1980 సంవత్సరమే దళిత కవిత్వానికి ల్యాండ్ మార్స్గా గుర్తించి ఆమోదించారు. కీర్తి శేషులు త్రిపురనేని శ్రీనివాస్, శ్రీ లక్ష్మినర్సయ్యల కృషితో విడి విడిగా ఉన్న దళిత కవిత్వం ఒక దగ్గరికి వచ్చి సంకలన రూపం తీసుకుంది. వీరి సంపాదకత్వంలో వచ్చిన పుస్తకము “చిక్కనవుతున్న పాట-దళిత కవిత్వం” 1995 జనవరిలో వెలుగు చూసింది. ఇది తెలుగు సాహితీ రంగాన్ని కొత్త మలుపు తిప్పింది. దళిత కవులకు (ప్రేరణను ఇచ్చింది. కవితా రంగమంతా దళిత కవితా రంగంగా మారి పోయింది. దీనితో దళిత కవితా సంకలనాలు, సంపుటాలు విరివిగా వచ్చాయి.
కవితా సంకలనాలు ; చిక్నవుతున్న పాట (1995), నిశాని (1995), గుండె డప్ప (1995), దళిత మ్యానిఫెస్టో (1995), బహువచనము (1996), పదునెక్కినపాట (1996), మేమే (1996), దండోర (1996), చిత్తర్వు (1997), మాదిగ చైతన్యం (1997), కాస్త సిగ్గుపడుదాం (1997), జీహద్ (1997), విడి ఆకాశము (1999), మాదిగ చైతన్యం. తదితర కవిత్వ సంకలనాలు దళిత కవిత్వ విసృతిని చూపుతాయి.
దీర్ధ కవితా సంపుటాలు : పాదముత్ర (1994), నాన్న సైకిలు (1995), తల్లి కోడి హెచ్చరిక (1995), రచ్చబండ (1996), హిందూ మహాసముద్రము (క్యాసెట్లు) (1996), నిప్పుకణిక (తెలుగు-ఆంగ్రము-1998). ఊరువాడ (1999)
కవితా సంపుటాలు; పోయేదేమి లేని వాళ్ళం (1992), వర్తమానం (1992), పంచమ వేదం (1995), గురి తప్పిన పద్యం (1995), ఏదీ కాదు (1995), వాళ్ళు కడుక్కుందాం రండి (1995), చండాల చాటింపు (1996), మాలకాకి (1996), అల్పపీడనం (1996), దేశం డైరీ (1996), నల్ల కలువ (1996), ఎంగిలి (1997, పునాది రాయి 0. ఫత్వా (1998), కల నేత (1999), అవేధ (1999).
తమ కవిత్వాన్ని పుస్తక రూపములోకి తేలేని కవులు అనేక మంది ఉన్నారు.
88 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం పై పుస్తకాలను పరిశీలిస్తే దళిత కవిత్వము వస్తు వైవిధ్యమున్న కవిత్వంగా తెలుస్తుంది. దళిత కవులు స్వీకరించిన వస్తువులు ఏ తెలుగు కవి ముట్టనివి. ఇంకా చెప్పాలంటే సభ్య సమాజమంటూ సాంఘిక ముసుగు వేసుకున్న వర్గాలు వీటిని చూసి అసహించుకున్నా ఆశ్చర్యము లేదు. అయితే ఈ వస్తువులు దళిత జీవితములోనివే. వారి జీవితము ఎంత వికారంగా ఉంటే వస్తువులు అంత వికారంగా ఉండడము సహజమే. దళిత జీవిశంను వికారంగా మార్చింది ఎవరు? దళిత కవుల భాష కూడా అభ్యంతరకరంగా ఉందంటూ ఆక్షేపించిన వర్గాలు లేక పోలేదు. భాషకు కుల మానాలుంటాయా అని ఆశ్చర్యపోయిన ఆచార్యులూ ఉన్నారు. దళితుల జీవితాలు మోటుగా ఉంటాయి. వారి మాటకు మోటు తనమే ఉంటుంది. తప్ప నాజూకు తనము ఎలా వస్తుంది అనేది ప్రశ్న దానికి దళితులు తమకు జరిగిన అవమానాలకన్నా తమపై జరిగిన అత్యాచారాల కన్నా అఘాయిత్యాల కన్నా మానభంగాల కన్నా దళిత భాష అసహ్యంగా ఉందా అని దళిత కవులూ అంటున్నారు. మాటకు ముందు కులాన్నీ తల్లినీ, చెల్లినీ అడ్డము పెట్టుకొని తిట్టే సభ్య కవులు ఉన్న సమాజంలో దళితులు వాడుతున్న భాష అసభ్యమైనది కాదు. అభ్యంతర పెట్టాల్సింది. కాదు అని గుర్తించాలి అంటున్నారు. దళిత కవిత్వోద్యమ ప్రారంభంలో ఇలాంటి భాష వచ్చింది. కానీ దళిత ఉద్యమము, కవిత్వం విసృతమవుతున్నా కొద్ది భాషలో మార్పు వచ్చింది. దళిత నుడికారాన్ని, పలుకుబడిని దళిత కవులు శక్తివంతంగానే వాడుకున్నారు. దళిత కవిత్వం - తాత్విక భూమిక; వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన వారందరు దళిత కవితకు తాత్విక నేపథ్యంగా ఉన్నవారే. సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలను క్రింది వర్గాల కోణం నుంచి చూసి ఆయా వర్గాలను ప్రభావితం చేసిన వారంత దళిత కవితకు బలమైన తాత్విక పునాదిని అందించిన వాళ్ళే. మానవతా వాదాన్ని ఉపాసించిన భక్త కవులు, చార్వాకులు, లోకాయత్తులు, గౌతమ బుద్ధుడు, సాహు మహారాజ్స్ ఫూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, దళిత పాంథర్స్ ఉద్యమము, బ్లాక్ పాంథర్స్-ఇలాంటి వ్యక్తుల ఉద్యమాల చైతన్యమే దళిత కవిత్వానికి తాత్విక బలాన్నిచ్చాయి.
డా. బఐన్న అయిలయ్య 89 దళిత కవిత్వంలో ప్రధానంగా కనిపించే అంశాలు; అస్తిత్వ అన్వేషణ : వర్ణ వ్యవస్థలో దళితుల అస్తిత్వం ప్రశ్నగా మారింది. కఠిన నియమాలతో దళితులను అవమానించడం. హత్య చేయడం శతాబ్దాల తరబడి జరుగుతుంది. దీన్నే కవులు తమ కవిత్వంలో చిత్రీకరించారు. “నా మొలకు తాటాకు చుట్టి నా నోటికి ఉమ్మిముంత కట్టి నన్ను నలుగురిలో అసహ్య మానవ జంతువుని చేసిన మనువు నా నల్లటి నుదిటి మీద బలవంతంగా నిషిద్ధముద్ర వేసినప్పడే నా జాతంతా (క్రమ క్రమంగా హత్య చేయబడింది” దళితుల పట్ల మనువు శాసనాలు ఇలా పరిణమించాయి. ఈ దేశంలో పుట్టడమే నేరమవుతుంది. మనషిని మనిషిగా కాక జంతువుగా చూడడం వర్ణ వివక్ష పద్ధతి. అందుకే ప్రతితరం తమ తండ్రులు తరాన్ని ఒక ప్రశ్న వేస్తుంది. “నాన్నా నేనెప్పడు పుట్టాలి అని అంటే పుట్టినా జంతువుగా బ్రతకాలి, ఆత్మాభిమానం కోల్పోయి జీవించాలి, లేదా అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకోవాలి. అందుకే దళితులు ఈ వర్ణ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. మా స్థానము ఇదా అంటున్నారు. “ఇంత్రకి ఎవరము మేం మా ఉనికి ఏమిటి మేదస్యులము. మేం శూద్రులం మేం పంచములం. మేం అంత్యజులం మేం అవర్డులము. మేం కువర్గ్ణులము మేం అనార్యులం. మా ఉనికి ఏమిటి?” ఇలా దళితుల అస్థిత్వం ప్రశ్నార్ధకంగా మారింది. సామాజికంగా దళితులు అట్టడుగున ఉన్నవారు. అట్టడుగు వారికి సంఘంలో లభించే గౌరవం కూడా అదే స్థాయిలో ఉంటుంది ఈ అగౌరవనీయమైన స్థాయి
980 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం ప్రాప్తించదానికి కారణం మనుషులందరూ ఆదిపురుషుడిగా శరీరాంగాల నుండి 'ప్రాదుర్భవించారని వ్రాకుచ్చడమే కారణం. ఉత్తమాంగం నుండి పుట్టిన వాళ్ళు ఉత్తములుగా. పాదాల నుండి పుట్టిన వాళ్ళు నీచులుగా పరిగణించడం కుల వ్యవస్థలో పరిపాటి అయింది. అయితే వర్ణవ్యవస్థ పరిధిలోకే రాని కులాలున్నాయి. అవి మరింత అగౌరవ నీయమైనవి. అయితే వర్ణ వ్యవస్థలోకి రాక పోవటమే గౌరవంగా ఉందని దళిత కవుల అభిప్రాయం.
“దేవుడి నాలుగు శరీరాలు మార్మాలూ
అశ్లీల భావ చిత్రాల్లా కన్చించేవి
నాజన్మ శాస్తం మీ శాస్తత్లో రాయనందుకు
నేనెప్పుడు కృతజ్ఞణ్నే
నన్నేవగించుకోవటానికి మీ నిఘంటువుల్లో
శాపనార్థాలు దొరకనప్పుడల్లా
నా తల్లి మాటే మీ నోట్లో రాలుతుండేది
పోనిలెండి, దూషణ లోనైనా నా తల్లికే నేను
పుట్టానని ఖరారు చేస్తారు
ముమ్మాటికి మేం తల్లికే పుట్టిన బిడ్డలం”
దేవుళ్లకు, మనుష్యులు పుట్టారననటం అసంబద్ధం. తల్లికే మనుష్యులు పుట్టారనటం సత్యం. సత్యం నుంచే గౌరవం లభిస్తుంది. దళితుల పుట్టుక గౌరవ ప్రదమైనదే అంటూ తమ అస్తిత్వాన్ని దళితులు కాపాడుకున్నారు. అస్పృశ్యతను వ్యతిరేకించడం: అస్పృశ్యతే దళితుల ఆత్మాభిమానానికి గొడ్డలి పెట్టు. అస్పృశ్యత పాటించడం
నేరమని రాజ్యాంగం చెప్తతున్నా అదొక ఆదర్భ వాక్కుగానే మిగులుళుంది కానీ ఆచరణలో శూన్యం.
మేం
నడుస్తున్న పాకిదిబ్బలం కాకపోయినా
చచ్చిగబ్బు కొడుతున్న శవాలం కాకపోయినా
మేం నడుస్తుంటేనే
డా. బన్న అయిలయ్య ర! పూట కూళ్ళ ఇళ్ళు కూడా గబా గబా తలుపులు మూసుకొని ముక్కు మూసుకొని ముడ్డీ మూసుకొని కూసుంటాయి. గొంతు తడవకుందా నీళ్ళు తాగుతున్న మనుషుల్ని ఎక్కడైనా చూసారా కుక్కలకీ, పశువులకీ లాగా మనుషులకీ రెండు వేరు వేరు గలాసులుండటం ఎన్సడైనా . . . . ఎక్కడైనా. . . . ఎప్పుడైనా చూసారా!” (గ్రామాల్లో అస్పృశ్యత కచ్చితంగా అమలు జరుగుతుంది. హోటళ్ళలో ఇది మరింత కొట్టవస్తుంది. ఒకే హోటల్లో అగ్రవర్ణం వాళ్ళకి, నిమ్నజులకి వేరు వేరు గ్లాసులుంచి టీ, నీళ్ళను వారి వారికి కేటాయించిన గ్లాసుల్లోనే ఇస్తారు. నిమ్న ప్రజలు ఆ గ్లాసులను వాదుకున్నాక వాళ్ళే వాటిని శుభ్రం చేసి హోటల్లో ఒక ప్రక్కన పెట్టాలి. ఇది ప్రజాస్వామిక దేశంలో కొనసాగుతున్న సౌభ్రాతృత్వం. ఈ లోకంలో మనిషి రక్తం తాగిన నర రూప రాక్షసులున్నారు మనిషి మాంసం తినే మేన్ ఈటర్స్ ఉన్నారు కానీ మనిషి మలాన్ని మరొక మనిషి చేత తినిపించిన మనుషులు మాత్రం లేరు రెండు కళ్ళూ - రెండు కాళ్ళూ రెండు చెవులూ - రెండు చేతులూ ఒక మూక్కూ - మనసూ కలిగిన అచ్చం నీ లాగా - నీలాగా
92 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం ఒక అమ్మా బాబుకు పుట్టిన మనిషి అక్షరాల మనిషేరా వాడు మలం తిన్నాడు”. కర్ణాటకలో ఒక దళితుడు ఆలయ ప్రవేశం చేసాడని సవర్హులు అతనికి శిక్షగా మనిషి మలం తిన్పించినప్పడు దళిత కవి ప్రతిస్పందనే పై కవిత. ఇది అస్పృశ్యతకు వర్ణవ్యవస్థకు పరాకాష్ట అమానవీయతకు చిట్ట చివరి హద్దు. సాంస్కృతిక రంగంలోని వివక్షను నిరసించడము: ప్రతిభ పేరుతో అగ్ర వర్ణం వారు చేస్తున్న నానాయాగిని దళిత కవులు అడ్డుకుంటున్నారు. దేన్ని ప్రతిభ అంటున్నాం. ప్రాధమిక అవసరాలు తీరి విలాసవంతమైన జీవితం గడుపుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి (ఫైవేటు విద్యా సంస్థల్లో చేరి, సర్టిఫికేట్లు సంపాదించడం ప్రతిభ అవుతుందా? లేకుంటే ఆరుగాలం కష్ట పడుతూ మట్టిలో బ్రతుకుతూ మాణిక్యాలు తీసి ఈ దేశానికి పిడికెడు మెతుకులను దానం చేస్తున్న మట్టి మనుషులది ప్రతిభ కాకుండా ఏమవుతుంది! “మట్టి నా ప్రతిభ మట్టిలోంచి పుట్టిన మెరుపు సారం నా ప్రతిభ మట్టి బొమిడికం దాల్చిన మనిషి నా ప్రతిభ” ఆంటూ ప్రతిభకు నిర్వచనం మారాల్సి ఉందని దళిత కవులు కోరుతున్నారు. “నా కాళ్ళు నేలలో నాటితేనేరా ఇదొక సస్యశ్యామల దేశమయింది. నేను రాల్చిన చెమట చుక్కల ఆవిరేరా ఆకాశానికో నీలి బొట్టును దిద్దింది”. తేరగో వచ్చిన సంపదల్ని తింటూ ప్రతిభ గురించి మాట్లాడే వాళ్లకు పై కవిత సమాధానం, శ్రమ చేయడం దళిత సంస్కృతి. ఈ దేశం అనుభవిస్తున్న అనేక సౌకర్యాలకు కారకులు దళితులు; వారి నిరంతర శ్రమ మాత్రమే. చదువు చెప్పని గురువు శిష్యుడి వద్ద గురు దక్షిణ అడగటం ఎంత అన్యామో దళిత కవులు ప్రశ్చిస్తున్నారు. అది ఎంత నీచమో కూడా గుర్తించాలంటున్నారు. ద్రోణుడు ఏకలవ్యుని బొటన వేలు నరుక్కొని పోయి గురు పరంపరకు అగౌరవాన్ని చేకూర్చాడంటున్నారు. శంభూకుడు తపస్సు చేసుకుంటుంటే రాముడు ఆతని తల నరికి వేయటం కింది కులాలను సాంస్కృతిక రంగం ఛాయలకే రాకుండా చేయటానికి
డా. బన్న అయిలయ్య 03 జరిగిన (ప్రయత్నమే. వీరబాహుడు, వాలి, బలి ఇతర పౌరాణిక వీరుల్ని హింసించడం, అవమానించడం, చంపడం, త్యాగం పేరు చెప్పి వాళ్ళని నిజ జీవితానికి దూరం చేయడం జరిగిందని దళిత కవుల ప్రధాన ఆరోపణ. దశావతారాలు బూటకమని ఆర్యులు దళితులపై పది సార్లు కొనసాగించిన హింసా కాండే దశావతారాలుగా అగ్రవర్ణం వాళ్ళు చిత్రించారని సాంస్కృతిక రంగమంతా కుట్రలతో నిర్మితమైందని దళిత కవులు అంటున్నారు.
“మేం కొత్త మనుషులం
బోధి వృక్షాల వేర్లలోంచి
గయల గాయల్లోంచి
నీలి గబ్బిలాల దండై ఎగిరొస్తున్నాం
భూమధ్య రేఖా ప్రాంతపు మధ్యాహ్న సూర్యబింబాల్లా
మా కళ్ళు తెరిచేశాం”.
ప్రత్యామ్నాయ సంస్కృతిని స్పష్టించుకోవటంలో దళితులు నిమగ్నులు కావటం, అస్తిత్వంలో ఉన్న సంస్కృతిని నిరసించడం నేటి కవితా రంగంలో ప్రధానంగా కన్పిస్తుంది. ముస్లీం మైనార్టీ కవిత్వం : హిందు వ్యవస్థలో నాలుగు వర్దాలతో పాటు ఐదో వర్ణం కన్పిస్తుంది. అయితే
ఆరో వర్ణం కూడా ఉంది అనేది మరో కన్పించని సత్యం. అదే ముస్లీం మైనార్టీలు. ఐదో వర్ణం వాళ్ళమత వ్యవస్థ ఎంత ఇబ్బందికి గురి చేసిందో ముస్తీంలను కూడా అంతే ఇబ్బందికి గురి చేసిందనే మైనార్టీ కవులు గుర్తించారు. దళిత కవిత్వ చైతన్యం తెచ్చిన మరొక కవిత్వ పాయ ముస్లీం మైనారిటీ కవిత్వం.
“మొన్న తాటాకు వీపుకు వేలాడదీసుకొని
మోకాళ్ళ మీద పాక్కుంటూ బతికిన నాలుగవ రంగుని
నిన్న ఊరిబయటనే గాలి పీలుస్తూ
వేదాలు విన్నందుకు చెవుల్లో సీసం
కరిగించి పోయించుకున్న ఐదో రంగుని
ఇవాళ గూటి ప్రమిదల్లో నా నెత్తురే తైలమై
మండుతున్న ఆరో రంగుని”
94 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం హిందువుల్లోనే భాగమైన శూద్ర, నిమ్నజులనే సాంస్కృతికంగా దూరం కొట్టిన మత ఛాందసులు వేరే మతస్సులైన ముస్లింలను మాత్రం సహిస్తారా? సహించరని చరిత్ర చెబుతుంది. అందుకే తమని ఆరో వర్షంగా హిందూ మతం చూస్తుందని ముస్లీంలు ఆరోపిస్తున్నారు. స్వాతంత్రోద్యమ కాలం నుండి హిందూ, ముస్లింల గొడవ ఈ దేశంలో ఉంది. తరువాత భారత్-పాకిస్తాన్‌లు రెండు దేశాలుగా విడిపోయాయి. ఈ దేశంపై అభిమానంతో కొందరు ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు. మత మౌధ్యం కల వీరాభిమానులు ముస్లింలను పాకిస్తానీయులగానే భావిస్తూ వాళ్ల దేశభక్తిని శంకిస్తున్నారు. సెక్యులర్ స్టేట్ అయిన భారతంలో ముస్లింల మత స్వేచ్చని హిందువులు అంగీకరించలేక పోతున్నారు. ఈ దేశంలోని ముస్లిం ప్రజలు హిందువులు చెప్పినట్టే నడుచుకోవాలని హిందువులు కర్ర పెత్తనం చేస్తున్నారు. “తల్లి పేరు చివర తడియారని నెత్తుటి బొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం “హందీ-హిందూ-హిందుస్తాన్ ముస్లీం జావో పాకిస్తాన్ “'ముసల్మాన్కే దోహిస్టాన్ పాకిస్తాన్ యా ఖబర్‌స్తాన్ నినాదాల నర్తనశాలలో నన్ను నిస్సహాయుణ్ణి చేస్తుంది వర్తమానం”. అంటూ ఈ దేశం మట్టిలో పుట్టిన ముస్లీం కవి. ఈ దేశ ముస్షింల తరుపున తన గొంతు విన్సిస్తున్నాడు. రాజ్యాంగం, చట్టం, పాలకులు కూడా ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని ఈ కవులు ఘోపషిస్తున్నారు. దళిత స్త్రీ వాదం: దళిత స్త్రీలు కవిత్వం రాయకముందు స్రీ వాదాన్ని సైద్ధాతికంగా మాత్రమే విభజించారు. దళిత స్త్రీ కలం పట్టాక జనరల్ స్త్రీ వాదులు, దళిత స్రీ వాదులు అని విడగొట్టాల్సి వస్తుంది. పురుష స్వామ్య వ్యవస్థలో స్రీ అస్తిత్వంను, హక్కులను, ఆత్యాచారాలను తమ కవిత్వంలో స్త్రీ వాదులు ప్రతి ఫలింప చేసారు. వీటితో పాటు అదనంగా కుల పీడనను కూడా దళిత స్త్రీ ఎదుర్కొంటుంది. అగ్ర వర్ణం అనే భావన
దా. బన్న అయిలయ్య 95 పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉంది అని దళిత స్రీ అనుభవం. ఈ అనుభవాలను దళిత కవిత్వంలో స్త్రీలు ప్రతిభావంతంగా చిత్రించారు.
“అమ్మా ! అటు చూడు!
పెద్దింటి ఆడపడుచులంతా
మగమృగాలతో సమానత్వం కోసం
పట్నంలో సమరం చేస్తున్నారంట
వాళ్ళ నిప్పు నినాదాలు
ఊళ్లో చివర మన వాడకు విన్పిస్తున్నాయి.
అమ్మా !
మనూళ్లో రావి చెట్టు కింద రచ్చ బండ లాగే
అక్కడ ప్రెస్ క్షబ్లనీ, రవీంద్ర భారతిలనీ
వ్యవహారాలు మాట్లడటానికి కుంటాయిలే. ...
అక్కడి బాబ్జ్హీర్ ఉద్యమాలల్లో
స్లీవ్ లెస్ స్పీచ్‌ల్లో
నీ అద్దే పిల్లి అరవయ్మో నెంబర్ కోక
బిక్క మొకం వేలాడేస్తుంది.
అమ్మా !
ఆనాటి సూర్చనఖ నుంచీ
చలకుర్తి ముత్తవ్వ మీదుగా
సజ్జలగూడెం మహాదేవమ్మ వరకు
పరభవాల పరంపరలే”.
పై కవితలో దళిత స్రీని ముఖ్యంగా పల్లెల్లోని దళిత స్త్రీని జనరల్ స్రీ వాదం పట్టించుకున్నట్లు లేదని కన్పిస్తుంది. పట్టణ ప్రాంతం స్త్రీల సమస్యలు వేరు. పల్లెల్లోని దళిత స్త్రీల సమస్యలు వేరు. పల్లెల్లోని దళిత స్త్రీలు తిండి లేక ఒంటికి దై స న లేక, చదువు లేక ఇంకా అనేక అవస సమస గ సరాలు తీరక సమస్యలతో సతమతమవుతుంటారు
96 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం పట్టణ స్త్రీలు విద్యావంతులు, నాగరికులు ప్రధాన అవసరాలు తీరి ఉన్నవారు. ఇక వాళ్ళకున్న సమస్యలు తమ ఉనికిని. చాటు కోవటం దాని కోసం ఉద్యమం, ఉపన్యాసాలను ఆశ్రయిస్తారు. తద్వారా చర్చల్లోకి వస్తారు. వెలుగులో నిలుస్తారు. కానీ గ్రామీణ ప్రాంతలలో దళిత స్త్రీలపై జరుగుతున్న అత్యాచారం ఉదాహరణకు ముత్తవ్వ, మహా రేపమ్మలకు జరిగిన పరాభవం ఈ జసరల్ స్రీ వాదులకు పట్టినట్లు లేదు. దళిత స్త్రీ కులాంతర వివాహం వలన కూడా సమస్యలను ఎదుర్కొంటుంది. భర్తలో ఉన్న పురుష, అగ్ర వర్ణ అహంకారం సమ్మిళితమై ఆమెను పనికి రాని వస్తువుగా అతని ముందు నిలబెడ్తున్నాయి. కులాంతర వివాహం వలన అగ వర్ణం పురుషుడు ప్రభుత్వ ఉద్యోగం పొంది సుఖ పడుతున్నాడు, కానీ నిమ్నవర్డ్ణ స్త్రీని కట్టుకున్నందుకని అవమానించడం మాత్రం మానటం లేదు. ఈ అవమానాలు పెద్ద కులపోల్లకే ఫిర్యాదు చేస్తున్న దళిత స్రీ ఈ క్రింది కవితలో కన్పిస్తుంది. “అయ్యా ! కుల పెద్దలారా ! మా వొల్లంత సెండాలపోల్లయితే నేను ఇల్లాలు పిల్లనే కాకపోతే ఈడు నన్నుందుకు కట్టుకున్నాడో అడగండి పేపర్లో ఎందుకు పడ్డాదో గోరుమెంటు నవకరెట్టా సేత్తండో ఇప్పడిట్టా అడ్డం దిరిగి ఎట్టా మాట్టడతండో ఆ గాలికి బుట్టినోడ్ని అడగండి సోమో ! నేను నక్కంట వాడు నాగలోకమంట మంచీ సెబ్బర తెలియని నాతో ఇంకెన్నాళ్ళో కలిసి బతక లేదంట నేను మాదిగ దాన్నని ఇప్పుడు తెల్సిందా ! నా సక్కదనమంతా జారి పోయి ! జాడపోయి నేనిప్పడు పొదిది పంది లాగుందానంటి,
డా. బన్న అయిలయ్య 87 వయస్సు పొంగులో దళిత స్త్రీతో ప్రేమ పేరుతో జత కట్టి, వర్ణాంతర వివాహాల వల్ల లాభం పొంది, కొన్నేళ్ళ తరువాత ఆ స్త్రీని కులం పేరుతో భర్తే దూషిస్తే ఇక ఆ స్త్రీ పరిస్థితి ఎంత విషాదమో ఈ కవిత ద్వారా తెలుస్తుంది. దళిత స్రీవాద కవిత్వాన్ని దళిత కవులు కూడా రాసారు. దళిత పురుషుడు ప్రీ సమస్యలపై కవిత్వం రాసినా పురుషాధిక్యం కన్పిస్తుంటుంది. అందుకే స్రీలు రాసిందే స్త్రీ వాదంగా చూడటం ఇప్పటి సాహితీ నీతి. దళిత స్త్రీ వాద కవిత్వంలో పదును, దళిత పలుకుబడి మెందుగానే ఉంది. తెలుగు సాహిత్యంలోకి దళిత కవిత్వం రావటంతోనే సాహిత్యంవిలువలు తారుమారైనాయి. అభ్యుదయ, విప్లవ, స్త్రీ వాదాల సంకుచిత పరిధుల్ని దళిత కవిత్వం గుర్తించి ఎత్తి చూపింది. కుల స్వభావమే వ్యవస్థ లక్షణమైనప్పడు దీనిలోంచి పుట్టిన ప్రతి కవికి కవయిత్రికి వర్ణం ఏదో విధంగా అంతరంగంలో కుల స్వభావం తప్పక ఉంటుందని దళిత కవిత్వం నిరూపించింది. సిద్ధాంతాల పేరుతో మర్యాదల పేరుతో ఇంత కాలం దళిత కవుల నోళ్ళు మూయించిన అగ్ర వర్ణం కవులు/కవయిత్రులు తమ తప్పిదం గుర్తించారు. కొన్ని సైద్ధాంతిక సంస్థలయితే తమ మ్యానిఫెస్తోలని మార్చుకున్నాయి. అంటే దళిత కవిత ఒక చారిత్రక బాధ్యతను పోషించిందని గుర్తించాలి. ఇప్పడు సాహిత్య చరిత్ర పునర్నిర్మించాల్సిన వాళ్ళు అనివార్యంగా దళిత కవితకు స్థానమివ్వక తప్పదు. కొత్త విలువల ఆవిష్కరణ : దళితులు యుగాల తరబడి దయనీయమైన పరిస్థితుల్లోకి మగ్గటానికి కారణాలు అగ్ర వర్ణ సంస్కృతి భావ జాలమే. ఈ భావజాలంపైనా పూర్వం నుంచి నేటి వరకు సమాజం నిర్మితమైంది. దీన్ని గుర్తించి కూల్చివేస్తేనే దళితులకు మనుగడ ఉంది. “శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో రాముణ్ణి వధిస్తున్నాడు ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును గొడ్డలితో నరుకుతున్నాడు. బలి, తన చిరు పాదాలతో వామనుణ్ణి పాతాళానికి తొక్కేస్తున్నాడు
98 ఆధునిక తెలుగు కవిత - దళిత కవిత్వం మనువు కళ్ళల్లో సూదులు గుచ్చుకొని నాలిక తెగ్గోసుకోని చెవిలో సీసం పోసుకొని స్మశానంలో దొర్గాడుతున్నాడు. కాలం కసాయి కత్తి మీద నిలబడి గర్జిస్తున్న ఛండాలుడు శంకరునిపైకి నాలుగు వేట కుక్కల్ని ఉసి గొల్పుతున్నాడు”, రామాయణ కాలం నుండి దళితులు ఇక్కట్లకు గురవుతున్నారు. పురాణ కాలంలో దళితులను శిక్షించిన వాళ్ళనంతా నడుస్తున్న చరిత్రలో దోషులుగా గుర్తించారు. గతంలో అ(గ్రవర్ణం వాళ్ళు దళితులకు విధించిన శిక్షనే, నేడు దళితులు అ(గ్రవర్జం వాళ్ళకు విధిస్తున్నారు. దళిత కవిత్వం పశువుల చర్మాల నుంచి సాకి రేవు బండల నుంచీ మాల మాదిగ వాడల కదుముల గట్టిన అవమానాల్నించి కొండ మంగలి కత్తుల నించీ కల్లుగీతల్నించీ గొర్రెల మందల అరుపుల్నించి నూలు వడికే చేతుల్నించి ఎరుకల యానాది కలుగుల్నించి సాయిబుల ఆదృశ్యగాయాల్నించి నిప్పలు చిమ్ముకుంటూ వస్తున్న సాహిత్య లావా ఇవ్వాళ ప్రధాన సాహిత్య స్రవంతి అయింది”. అంటూ దళిత కవిత్వాన్ని గురించి జి. లక్ష్మీనర్సయ్య చేసిన వాఖ్య అక్షర సత్యం.
- వర్తమాన కల్లోల కవిత - ఏదీకాదు,
దళిత కవిత్వం ప్రారంభమైన ఒక దశాబ్ది తరువాత ప్రసేన్ 'ఏదీకాదు” అనే ఒక కవిత్వం సంపుటి కవితాలోకంలోకి వచ్చింది. “ఏదీకాదు అనే పేరుని సంపుటికి పేరు పెట్టటమే దేన్నీ అంగీకరించని ఒక నిరసన కవి గొంతు నుండి వినిపించినట్లు పాఠకుడు ఫీలుకాక తప్పదు. “ఏదీకాదు' పుస్తకరూపంలోకి వచ్చేసరికి, అప్పటికే “చిక్షనవుతున్న పాటి కవిత సంకలనం జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాసుల సంయుక్త సంపాద కవిత్వంలో వెలువడి మూదేళ్లు దాటింది. అంతేకాదు. “చిక్కనవుతున్న పాటి సంపాదకీయంలో లక్ష్మీనరసయ్య ప్రతిపాదించిన “దేశీయ మార్చిజం” అన్న అంశం మీద వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. దళిత కవిత్వం - దృక్పథం, తాత్త్వికత అన్న అంశాల మీద కూడా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్నాయి.
ఇటువంటి కీలక సందర్భంలో ఒక తెలుగుకవి తన కవిత్వ సంపుటికి 'ఏదీకాదు' అని పేరుపెట్టడం చాలామందిని విస్మయపరిచింది. ఏదీ “ఏదీకాదు" అని ప్రతీదాన్ని 169219 చేస్తూ సంపుటికి పేరుపెట్టడం సాహసమే. కవిగా ప్రసేన్ తన కాలిక స్పృహతో ఈ సంపుటికి ఇటువంటి పేరుపెట్టదాన్ని దాదాపు ఎవరు సానుకూలంగా స్వీకరించినట్లు కనిపించదు.
ఇప్పటిదాకా తెలుగు కవిత్వంలో ౦౪ [40606/౧15గ 80ల తర్వాత మొదలైనదని ఒక ప్రారంభ బిందువుగా పేర్కొంటూ వస్తూఉండడం పరిపాటి అయ్యింది. నిజానికి పోస్ట్ మాడర్న్ కవిత్వం “ఏదీకాదు” భావంలోంచి ఉత్పన్నమైనదని చెప్పడం సమంజసం. “ఏదీకాదు” అన్నది ఒక తిరస్కారం. పూర్వభావనలకు చరమగీతం. ఈ దృష్ట్యా ప్రసేన్ 'ఏదీకాదు” తెలుగులో తొలి ౧౦51 [40667౧ కవితా సంపుటి. దీన్ని అంగీకరించటానికి అభ్యంతర పడేటట్రైలే భారతదేశంలో నూతన ఆర్థిక సరళీకరణాల (క్రమం మొదలుకావడంతోటే భారతీయ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో పోస్ట్ మాడర్న్ దశ మొదలయినట్లుగా భావించాలి.
100 వర్తమాన కల్లోల కవిత - ఏదీకాదు ప్రసేన్ “ఏదీకాదు కవిత్వం సంపుటి ఈ దశలో మొదటిది. ప్రసేన్ కవిత్వం అప్పటిదాకా సాగివస్తున్న కవిత్వ దృక్పధాన్ని గానీ, కవిత్వ వస్తురూపాలను గానీ, ఆమోదించలేదు. అలాగని 1995నాటి దృక్పథాన్ని వస్తురూపాలను సమ్మతించలేదు. పైగా వాటిని సందేహించాడు. వీలైనచోట వాటిని ప్రశ్నించాడు. కవిత్వంలో తరువాత ఏదేళ్ళలో రానున్న పరిణామాలను ఆనాడే రేఖామాత్రంగా స్పృశించాడు. కేవల దళితవాదం, కేవల వామపక్ష దృక్పథం, కేవల వామపక్ష వ్యతిరేక వాదం, కేవల బ్రాహ్మణీయ భావజాల వ్యతిరేక వాదం, కేవల కవిత్వ కళావాదం, సాధించేది ఏదీలేదని నిష్మర్హగా తన కవిత్వ సంపుటిలో పేర్కొన్నాడు. ఈ సారాంశమే “ఏదీకాదు” కు మూలసూత్రం. అందుకే ఏదీకాదు సంపుటి వెనుక పేజీపై ఆ ఇద్దరిలో ఒకరు పేరుతో రాసిన పరిచయంలో “ఏదీకాదు” వస్తున్న సందర్భాన్ని ఇలా పేర్కొన్నారు. “ఇదొక [0౪1 106611 ౧౪౮102016౧. సందేహపడేట్లయితే 20వ శతాబ్బ్దాన్నీ దాని అంతిమ దశాబ్దాన్నీ ఒక చివరి చూపు చూడండి. మీ క్కూడా “ఏదీకాదు అనే వినబడుతుంది. [ఆ ఇద్దరిలో ఒకరు “ఏదీకాదు” (కవిత్వ సంపుటి), పుట: పుస్తకం చివరిపేజి.] ప్రసేన్ కులరీత్యా దళితుడు. ప్రసేన్ మైనారిటీ. ప్రసేన్ స్రీవాది. ప్రసేన్ ఆర్థిక సరళీకరణులకు బాధితుడు. ్రసేన్ అనంత సంవేదనల సంపుటి. ప్రసేన్ బహుజనుడు-ప్రసేన్ వ్యక్తికాదు. ప్రసేన్ సమిష్టి, ప్రసేన్ మానవుడు, అనేక కోణాలనుంచి అనేకనేక సత్యాలు ఆవిషృతమౌతుండగా, అర్ధసత్యాలను, అనర్ధ సత్యాలను ఆపద్దర్మ సిద్ధాంతాలను విశ్వసించడం కన్నా విశ్వసించినట్లు నటించడం కన్నా వాటిపట్ల మహాఅవిశ్వాసాన్ని ప్రకటించడమే మేలని భావించి ఏదీకాదని అనగలిగారు. ఏదీకాదులో మొదటపేర్కొనవలసింది ఆర్థిక సరళీకరణ. దీనిలో భాగంగా మొదలైన రాజకీయ విధానాల తంతును విమర్శకు పెట్టడం 'దొంగసంతకం' కవిత దీనికి సరైన ఉదాహరణ. “దొంగ సంతకం' కవితలో ప్రసేన్ చేసిన పని నీతిబాహ్య రాజకీయ నాయకుల నిర్ణయాలలో పారదర్శకత లేకపోవటాన్ని నిర్ధాక్షిణ్యంగా ప్రజా సంక్షేమాన్ని వదిలివేయడాన్ని తీవ్రంగా గర్జించడం.
దా. బన్న అయిలయ్య 302
హైదరాబాద్‌లో ఆల్విన్ మూతపడినా, రిపబ్లిక్ ఫోర్ట్ కంపెనీ గేట్లకు తాళాలు పడినా, దేశరాజధానిలో పార్లమెంట్ సాక్షిగా 'బాల్కొ కంపెనీ (పైవేటు పెట్టుబడులకు అమ్మివేయబడినా వీటన్నీటి వెనకాల ఎవరిదో ఒక “దొంగ సంతకం” తప్పక ఉండనే ఉంటుంది.
కాబట్టే కవి “అయినా నేనేనాడో నా ప్రియతమ దళారికి అమ్ముడుపోయా. ఇక స్టానిక పన్నులు అదనం అనడం అబద్ధం. అన్నీ విదేశీ నిజాలే. నేనొక దుకాణాన్ని... ఇదంగా సంతకాలమాయ. ఒప్పందాల కుతంత్రం......దేశ ప్రజలందరి వేలిముద్రలను ఒక్కడే నొక్కేయడం. నేనిప్పడు దొంగ సంతకాన్ని” అంటూ ఎలుగెత్తాడు. ఇకముందు రానున్ను ఇప్పటికే వస్తూ ఉన్న తృతీయ ప్రపంచదేశాల చైతన్య కవిత్వానికి ఈ కవి “దొంగ సంతకం” అనే కవిత తొలి (ప్రవేశద్వారమైందన్న అంశాన్ని తెలుకు కవిత్వం ఇంకా గుర్తించినట్టులేదు. ఈ కవిత ఒక తిరస్కార తీర్మానం ఆర్థిక సరళీకరణలు, వ్యవస్థాగత సర్దుబాట్లు, మార్కెట్ స్నేహ పెట్టుబడుల, పెట్టుబడుల ఉపసంహరణల ఆర్థిక సుడిగుండాల పెను తుఫాన్లకు, ప్రళయాలకు వ్యతిరేకంగా రాసిన మహావిద్వేషగీతం.
ఒక దేశపు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పాలక వర్గాలే ప్రత్యక్షంగా బలహీనం చేసేంతగా గ్లోబలైజేషన్, పైవేటైజేషన్, లిబరలైజేషన్, అనే మూడు భావనలకు లొంగి పోయినప్పడు కవికి కలిగిన వ్యధేయిది. అయితే ఈ దేశపు నయాక్లాసికల్ ఆర్థిక వేత్తలు, వాటిని గుడ్డిగా అనుసరించిన విధాన నిర్దేతలలో ఒక గందరగోళం తప్పకుండా ఏర్పడిందని ఆర్థిక సరళికరణల తొలిదశ గడిచాక మనం గ్రహించగలుగుతున్నాం. అయితే పొలక వర్ణాలు మాత్రం అభివృద్ది సాధనకు మార్కెట్ ఆధార పెట్టుబడులు చక్కటి మార్గమనే ఆలోచనా ధోరణితో ముందుకు నడుస్తున్నాయి. (ప్రభుత్వ విధానాలన్నిటా దీనికి నిదర్శనలు అనేకం కనిపిస్తాయి. అసలు (ద్రవ్యబాధ్యతా రాహిత్యంలోనే యిది మొదలవుతుంది. ప్రభుత్వ రంగాన్ని అత్యంత కారు చౌకకు అమ్మేయడంతో శిఖరస్థాయికి చేరుకున్న “దొంగ సంతకాల” ప్రహసనాన్ని ప్రసేన్ ప్రతిఘటిస్తున్నాడు.
ఈ ప్రతిఘటన దళిత దృక్కోణం నుంచి వస్తున్నందున ఈ కవి దళిత కవులలో ఒకడుగా పేర్కొనవచ్చు.
“సంతకాలను నిరసిన్తూ కవిత్వమే రాస్తాను. వేలిముద్రల భాషలోనే మాట్లాడుతాను. నా హక్కుల మీద హక్కులన్నీ నావే. ఇప్పద్తతాడచ్వర నేలని
102 వర్తమాన కల్లోల కవిత - ఏదీకాదు నాదేశ (ప్రజలందరి పేర్లుంటాయి తొంఖైకోట్ల సంతకాలుంటాయి తాంభైకోట్ల వేలి ముద్రలుంటాయి ' మాధిక్కారం పేటెంట్ మాదే” యిందులో కవి పేర్కొన్న “వేలిముద్రలు” దళిత బహుజన సమాజాని వేనని గుర్తించడం పెద్దకష్టమేమీ కాదు. సాంఘిక అసమానతల మీద పూర్తిగా దృష్టినిలిపి దళిత కవిత్వం పరిణామాల పర్యవసానాలను పూర్తిగా విస్మరించింది. దళిత కవిత్వం ఒకే తరహా వస్తువును కవిత్వ వస్తువుగా స్వీకరించి ముందుకు పోలేక ఆగిపోయిందన్న విమర్శను కూడా ఇటువంటి కవుల కవిత్వం బలంగా తిప్పికొట్ట గలుగుతుంది. ఈః కవి ఒక మూడో (ప్రపంచ యుద్ధాన్ని కలగనడం లేదు. విచ్చిన్న వాస్తవికతలోని 'మూడో ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో చూపించగలిగాడు. “రణరంగాలలోకి మనల్నెవరు నెట్టారో మనకు తెలీదు/యున చేతిలో ఆయుధం ఎలా మొలిచిందో కూడా తెలీదూ అనడంలో తృతీయ 'ప్రపంచదేశ వాసుల ప్రమేయ రహితంగానే యుద్ధంలోకి అడుగు పెట్టారనే స్ఫురణను ఇస్తున్నాడు. తెరముందు సాగే నాటకాలు కాదు - ప్రసేన్ చూపించింది. తెరవెనుక సాగే నాటకాలని ప్రతి మూడో ప్రపంచ పౌరుడూ ఇప్పడు * నా విడి భాగాలను ఒక్కొక్కటిగా పోగుచేస్తున్నాను/ఇంకా కొన్ని చితుకులు దొరకాల్సివుంది” అనే భావించే స్థితిలోనే ఉన్నాడు. తృతీయ ప్రపంచ చైతన్యం తరువాత ప్రసేన్లో కనిపించే బలమైనకోణం దళిత దృక్పథం. దళిత వర్గంలో ఒకడిగా తనను గుర్తించుకొని తన “మాతృభాష మారువేషం” విప్పిచూపేందుకు సాహసించాడు. దళిత కవిత్వానికి తగిన భాష ఏదీ అన్న ప్రశ్న దళిత కవిత్వంలో తలెత్తుతున్న సందర్భంలో “ఏ భాష ఏ యాస / ఏ గ్రాంథికం /ఏ గమ్యం /నాకిపుడు సందేహాల్లేనే లేవు.” అని ప్రకటించడమే కాకుండా తనది కాని భాషను నేర్చుకునే సాంస్కృతిక, విద్యావాతావరణాన్ని ఆ భావజాలాన్ని చిత్రించి దానిని అంతిమంగా వ్యతిరేకిస్తాడు. సంస్కృతీకరణకు ఎంత తొందరగా క్రింది కులాలు లొంగిపోయి, తమ సాంస్కృతిక మూలాలను మరిచిపోతాయో మన అనుభవాలలో లేని విషయమేమీ కాదు. ఒక్కసారి ఈ నంస్కృతీకరణ (క్రమానికి లొంగిపోయిన తరువాత రెండు పరిణామాలు
డా. బన్న అయిలయ్య 03 సంభవిస్తాయి. ఒకటి మనమూ ఆధిపత్య సంస్కృతికి దాసులు కావడం. రెందోది సాంస్కృతికంగా న్యూనత గురికావడం ఇదొక మానసిక సంఘర్షణ. బాహ్య వాస్తవం. ఒక విధంగా, ఆంతరిక వాస్తవం. మరొక విధంగా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఈ రెండు పార్వ్వాలను ప్రసేన్ బలంగా ఆవిష్కరించాడు.
“ద్విత్రాలు దంత్యాలు తాలవ్యాలు తేడా పలకలేను నిజమే. వత్తులూ యాసలో విరిగిపోతాయి. నిజమే.
“మ్రార్ములు రాని మాతృభాష నాది
ఇప్పుడు ఏ అక్షరాన్ని దిద్దాలి
ఏ మాండలికాన్ని దిద్దాలి
ఏ సమాధానం అప్పజెప్పాలి” - అన్న (ప్రశ్నను ఒక వైపు సంధించి మరోవైపు
ఇప్పుడైతే నా కిక
అచ్చరం రూపంతో పనిలేదు
మాట సబ్దంతో పనిలేనేలేదు
భావంతో కదా నా వివాదం
ఇప్పుడు నాకెంతో / పొగరుగా వుంది........అని తేలుస్తాడు. భాష ద్వారా సంక్రమిస్తున్న సంస్కృతీకరణను వదిలించుకునే ప్రయత్నం బలంగా చేసాడు కవి.
ప్రసేన్ 'ఏదీకాదు' ఒక్కొక్క కవిత ఒక్కో వస్తువుతో, భావంతో, దృక్పథంతో రచింపబడింది.
దళితుల మీద అతిక్రూరంగా జరిగే దాడులను దళితుల ప్రాణహరణ క్రమాన్ని అగ్రవర్థాలు అవిచ్చిన్నంగా సొగిస్తున్నప్పుడు ఆ వార్తలను (ప్రపంచానికి అందకముందే చూసే / చదివే అవకాశం పత్రికల్లో ఉపసంపాదకుడిగా పని చేస్తున్నందున ఆయనకు ఉంటుంది. ఆయనే పేర్కొన్నట్లు “వృత్తిలో భాగంగా చుండూరు వార్తను అంటీ ముట్టనట్టు రాసిన తరువాత” తనలో మిగిలిన బాధ, మానవీయ స్పందనను, సింగిల్ కాలం వార్త అంటూ కవితగా రాశారు.
20 వర్తమాన కల్లోల కవిత - వద్రీక్రాద్దు
జర్నలిస్టుగా వార్తను ఏ అభిప్రాయమూ, ౪184 లేకుండా అందించవలసి వస్తుంది. లేదంటే పత్రికా యాజమాన్యానికి ఉన్న ౪1643 (ప్రకారమే అందించాల్సి ఉంటుంది. మరి మనిషిగా, కవిగా తానేం చేయాలి? చుండూరు సంఘటన మీద ప్రసేన్ ఆక్రోశం చూడండి!
“తలలో కవిత్వమూ లేదు తోకలో రాజముద్రా లేగ
ఇది వార్తీకాదు విశేషమేమీ లేదు
గుణింతాలను నేమరేస్తుంది మత గ్రంథం”
అంటూ ప్రారంభించి “అన్నీ ఆన్ డ్యూటీ హత్యలే / ఇది లెక్కలేనన్నవ అనుభవం కదా” అంటాడు. దళితుల హక్కుల పరిరక్షణకు, లెక్కలేనన్ని చట్టాలుంటాయి. కానీ ఏ చట్టం కాపాడాలో ఆ చట్టం మద్దతుతోనే నిరాఘాటంగా దళితులు హత్య చేయబడతారు. అగ్రవర్ణాల కొమ్ముల్ని రాజ్యమూ, రాజ్య యంత్రాంగమూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండడం వల్ల అవి మరింత బలాన్ని పదునునీ పెంచుకుంటాయి. ఈ స్థితినే కవి నిరసిస్తాడు. ఇట్లాంటివి రాజ్యం సాక్షిగా జరుగుతాయి. కనుక తన గురిని రాజ్యం బాధ్యత వహించటం మీదనే నిలిపాడు. ఇటువంటి సామాజిక సంఘటనలు జరిగినపుడు తక్షణమే రాజకీయాలు తమ సానుభూతితోనూ, చేతుల్లో ఎక్స్‌గ్రేషియా చెక్కులతోనూ 'ప్రత్యక్షకావటం సహజం. పోయిన ప్రాణాలను ఏ రాజకీయ నాయకుడూ తనవెంట తేలేడు. అందుకే 'ప్రసేన్ అంటాడు.
“పరిహారము కన్నీళ్ళు వచ్చేవుంటాయి పల్లకీల్లో
దళారీ తలారులు తడిలేని ఉప్పునీళ్ళు చల్లారు
చితిమీద
ఊరు చిటపటలాడోంది
ఐనా ఇది వార్త కానేకాదు”
“ఏదీకాదులో “సెకండ్ కమింగ్, మాలవాడలో గుణితం' 'హరిజన్వాలా-బాగ్' 'అంటరానిపాదం” లాంటి కవితలు దళిత కవిత్వం దృక్పథ పరంగా, వస్తు రూపంగా విలక్షణంగా ఉండవచ్చో నిరూపిస్తాయి. ఈ కవితలు ఒక్కొక్కటి ఒక్కోరూప సంవిధానంలో సాగుతాయి. ప్రసేన్‌ను తక్కిన దళిత కవుల నుంచి విడదీసి విలక్షణంగా చూపుతాయి. కవిభావాన్ని రూపంతో నియంత్రించగల నేర్పును ప్రదర్శిస్తాడు. దళిత కవిత్వంగానీ,
డా. బన్న అయిలయ్య శే౦ిల్ దళిత అనుభవం కానీ, అనివార్యంగా అగ్రవర్ణ కుల తత్త్వాన్ని అహంకారాన్ని తీవ్రపదజాలంతో దూషించనకృర్లేదనే విషయాన్ని ఈ కవితలు గుర్తుచేస్తాయి. పట్టలేనంత ఆ(గ్రహం వచ్చినప్పుడు బెచిత్యం చెడకుండా భావస్ఫూర్తి కోసం ఎక్కడైనా ఒక దూషణ వాక్యం ఉండటంలో తప్పులేదేమో |
1992 డిసెంబత్ 6 భారతీయ సామాజిక చరిత్రలో ఒక దుర్దినం. ఒక బ్లాక్‌డే. భిన్న మతాల, భిన్న సంస్కృతుల శాంతియుత సహజీవన విధానంలో మత విద్వేషం విధ్వంస రచన సాగించిన రోజు, బాబ్రీమనీదు కూల్చివేత ఘట్టం ఒక కట్టడాన్ని మాత్రమే కూల్చలేదు. మొత్తం మానవ బెనత్యాన్నే కూల్చింది; ఈ దేశాన్ని రెండు మతాలుగా రెండోసారి విడదీసిన రోజు అది. భారతీయ ముస్లింల అస్తిత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడిన రోజు. మసీదు కూల్చివేత విషయంగా ముస్లిం మైనారిటీ కవులు ఏమీ పలకలేనీ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు, ముస్లిం కవులు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయ సందేహాలలో ఉన్నప్పుడు ప్రసేన్ కవిత “క్రీ.పూ. 1992 డిసెంబర్ 6 కవితతో నిశ్శబ్దాన్ని చేదించాడు. శీర్షికలోనే భారతదేశం ఎంత ఆదిమ యుగంలోకి చరిత్రలో తనని నిలబెట్టుకుందో చూపాడు. సామాజిక, రాజకీయ సంఘటనలను కవిత్వీకరించేటప్పుడు కవులు వస్తువు మీద కాక దృక్పథం మీద భావజాలం మీద తీవ్రస్థాయిలో గళమెత్తాల్సి ఉంటుంది. ఆపనే చేశాడు ప్రసేన్.
“మనిషి పుడతాడని మనిషి ఎదుగుతాడని మనిషి దేవుడవుతాడని
అందరూ అబద్దాన్ని నటిస్తున్నారు”
“వెత్రాను పుడతాడని సాతను ఎదుగుతాడని సాతాను
దేవుడౌతాడని నేనిపుడు నిజాన్ని నటిస్తున్నాను.”
దీనిలో మొదటిది ప్రారంభవాక్యం. రెండోది ముగింపు వాక్యం. మొత్తం కవిత ఒక తల కిందులయిన స్థితిని సూచిస్తుంది. మనిషి మతమైపోవడాన్నిి మనిషి మత విద్వేషమై (ప్రజ్వరిల్లదాన్ని ఖండించాడు కవి. డిసెంబర్ 6 విధ్వంసం మీద '్రసేస్ రాసీన కవిత అనంతర కాలంలో ముస్లిం మైనారిటీ కవిత్వం బలంగా రావడానికి ఒక ముఖ్య (ప్రేరణగా కూడా మారిందని చెప్పవచ్చు.
స్రీవాదం ఆధునిక తెలుగు కవిత్వంలోకి వచ్చాక కొన్ని కొత్త అనుభూతి కోణాలకు, వాటి అఖిష్యక్తికి బలమైన పష్తీకరణ రొరికింపి. అత్‌లో షష కష
106 వర్తమాన కల్లోల కవిత - వదీకాదు కొందరు స్త్రీల అనుభవాల సున్నిత పార్య్యాలను కవిత్వ వస్తువులుగా స్వీకరించారు. ఓ 'ప్రీమూర్తి గుండెనిండిన విషాదాన్ని “గుక్క పట్టిన నవ్వుగా ప్రసేన్ అనువదించాడు. గుక్క పట్టిన ఏడుపు అనే మాటనే విన్నాం కాని, నవ్వువెనక దాగిన దుఃఖాన్ని ప్రసేన్ ఆవిష్కరించాడు. “గాయం పరిమళించే విషాదాన్ని / నీలోనే తెలుసుకున్నాన్నేను / నిన్ను తెలిసాకే / నవ్వు గుక్క పట్టడం విషాదాత్రువుల చిరునామాను నవ్వులో వెతికి వెలికి తీసాడు.
ఇదే క్రమంలో ఓ ఇరుకింటి ఇల్లాలి ఆత్మకథ విని “చెవుల సంతలో) కవితను రాశాడు. ఓ ఉమ్మడి కుటుంబంలోని స్త్రీ లైంగిక జీవితం బహిరంగం రహస్యం కావడం బాధను అత్యంత గోప్యంగా ఉంచాలని ఆకాంక్షించిన స్త్రీకి ఇరుకు ఇళ్ళలో సాధ్య పడనందువల్ల కలిగే వ్యధను అద్భుత పద చిత్రాలతో పట్టుకున్నాడు.
ఎవరి అనుభవాలను వారే రాయాలన్న నిబంధన దళితవాదం వచ్చాక ప్రబలింది. ప్రసేన్ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తాడు. కవి స్వీయ అనుభవమే కాదు. పరానుభవం అది స్రీలదైనా, దళితులదైనా రాయాల్సిందేనన్నది ప్రసేన్ అభిమతం.
“* ఈ మంచం / భూమిలోకి కూరుకుపోతే బావుండ్ను
కదలికల్లో / ఒక సిగ్గు ఒక ఇరుకు
దేహమంతా ముడివేసుకుని / ఒకే మూటగా కట్టుకుని
నాపైన ఓ బరువు ఒక అబాధ్యత
ఆపై చెవులు రిక్కిస్తున్న అందరూ” కవులు స్త్రీ పురుష కలయికని, రత్యానాంతరశోభని అనుభూతి పారవశ్యంతో రాసిన సందర్భాలున్నాయి. కానీ, ప్రసేన్ ప్రీ పురుష కలయికకు ఉండే భౌతిక పరిమితులు దృశ్యాన్ని మనముందు స్త్రీ దృష్టికోణంలోంచి చూపెడతారు.
“ఇతనేమిటి...........నా దేహాన్ని శబ్ద దృశ్యం చేసి నన్నాక బహిరంగ తాత్పర్యాన్ని చేసి సిగ్సిగ్లు మనసుకీ దేహానికి” ఇటువంటి పరిస్థితులలో సాగుతున్న సంసార సారాంశాన్ని వెలుగులోకి తెచ్చాడు.
తల్లిపట్ల తన బాధ్యతలను అరకొరగానే నెరవేర్చుతున్న 'ఓ కన్న కొదుకు కన్ఫెషన్ చదివినపుడు కొడుకులంతా తమ తల్లుల్ని తలచుకొని బెంగపడక తప్పని స్థితి కలిగిస్తాడు.
దా. బన్న అయిలయ్య 207
ఓ ప్రసిద్ధ టి.వి. ఛానెల్లో “బాస్టర్డ్ బనియా' అని జాతిపితను ఓ మనిషి నిందించి నప్పుడు కులం పేరిట గాంధీని దూషించడం పట్ల తన అభ్యంతరాన్ని కవిత్వంలో వ్యక్తం చేసాడు.
ఎవ్పగ్గుతో చితికిపోయి శీర్షిక ఖాళీని పూరించలేదు
స్తీలూ-కులమూ-తిట్లూ-నా తాతా
ఈ కవితకు రెండోపేరు
మహాత్ములకీ తల్గులుంటారు
ఆ గర్భాలకే నా నమస్కారం” అంటూ గాంధీని అకారణంగా తిట్టిన వైనాన్ని ......బినియా శీర్షికలో ప్రతిఘటించాడు. 'కులాన్ని కట్టేసి తిట్టినా / తల్లికి కట్టేసి తిట్టినా / రెండో చెంప చూపుదాం” అని గాంధేయ సిద్ధాంతం పట్ల ఒకింత గౌరవాన్ని వెంటనే అసహనాన్ని చూపుతాడు. “నూట పాతిక మరణాలతో కనాలి నిన్ను” మళ్ళీ పుట్టాలి / ఈ సారి కులంలేని తల్లి కనాలి నిన్ను” అని కుల నిర్మూలనా ఆకాంక్షను వ్యక్తపరుస్తాడు.
“అద్దంలో దళితుడి దిగులు లాంటి కవితలు దళిత వాదాన్ని ఆత్మవిమర్శ చేసుకునే దిశగా సాగమని సూచిస్తే, ఓ రెండు సాయంత్రాలు, లాంటి కవితలు కవిభావనా పటిమను పట్టిస్తాయి. “మాజీ మనుషులు స్పానర్ట్ దుఃఖాలు కృత్రిమ విలువలతో జీవించేవారి వాస్తవికతను వెలికి చూపుతాయి.
అందుకే వర్తమాన కల్లోల కవితగా “ఏదీ కాదు'ను సందేహం లేకుందా జ్ పేర్కొనవచ్చు. చఈజలారాల సు
ల ళ్ సైదా అడ్ గ్ర సి ఈ నన్నాడు
. వరంగల్