Telugu aanandani ponde margam - anilvaranasi/indianlanguages GitHub Wiki

  • వ సం
  • క్రఫళ్లే.... అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం రేం . ఆనందాన్ని పొందే మార్గం స సార్థక జీవనానికి కరదీపిక .. “1౦వ | క వార్షికోత్సవ టు! ము. ముద్రణ . ( లు 1౨0 ( న దర్రైి-౪నయ్‌... పరమపావన 1,౨ 214 దలైలామా హోవర్ట్‌ సి. కట్లర్‌ (1 2 (1051600 | ₹బలం తగ ఉ౧/600౧//యా-ా 4 4602400004 /07 47002 /

ఆనందాన్ని పొందే మార్గం సార్ధక జీవనానికి కరదీపిక పరమపావన దలైలామా హోవర్డ్‌ సి. కట్టర్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి మంజుల్‌ పబ్లిషింగ్‌ హౌస్‌

తగిలిందో 2 607 ల (ల గిగ్య(6 వ్ల టం) 41 91190218 0156 ౮౭౫౫౫ 424 420040 0గ్రణ ధ్ర * 2 2007 [1 క606౯ ౧౦౯౨|ల 42 క4జర్స2 282% 9000231 462 003 - 1౧6412 ర. ఈ | అ 7/32, (౯౦౮౧4 21006 మగమయగ కండర, 3%3210), లా అం) 110 002 = 06411 షక ౭035106: ఇాగాధంషరులటంయ3.6000 (0 అిసహగాలతదంా ౧లా౧౬ ఛై ర గముంం610464, 3ం0820గు, సం, కం104, ౧౧౮౧1 షే రై కరలషరరే, టం సల అలు, 06 నీ యో ంగ్రాగలైై0ం అ 1998 9156, ఉం 0114 202 206 రెంజయిరే 6. యకం 34. ౧ జ ల 10 ఈం 10 కూంాందం/ ₹46ంం అ 2009 9 2, ఈం 93121 జు2. కరంగళంగంం 90 ఈం 10 ఉంయాంం30” 8401600 ం00గ్ర)గో206 ఠ 2009 6 0౪26 6. యళేం6 గ. 00 లుంలు€£ం0 “కపల్‌? ₹59ది తలడి 2207గల్ళా బలల గటబాం సనక లర 020202 ఏ [0 రుం కలా లల! తనల ర42౮లాయాాా , వో స... అమ ఉం 0011) 02 ఖో సథ కన్‌ గ శ్‌ ౧0 న న్లీ " లంకు రము!3రం౧ 05 ల” (్రీ 2 ్తట ఈ గంటు 4 24000627 మబాస్యా - 20 డజంలాదాలాా? కాం, గో ల జో న్‌. ఇటా గరు జ5447 227222 4624 0777 6 6౫౯- జం ల వు! లంట ంళ స యకం 55 04013లీంత 10 2016 ” మ్న్‌ వ ర్తం క్రైరంం[ [0 ం[0టు, కం 022 [2021 104 ం+ష/6 ౦. కలు 1.0. 00 06 10606గంగ జ లం తంటింద ౦౯౪413 106. 1550! 978-81-8322-728-5 402600 0) మ 510613 తటంరే2గ వెగం ఒ6 రింయి6 1 [0611 0 వశ 20021 60180108్రట 106, స. న! గరైఏ కరా హైం కింక ౧4014600 93) 06 60800606, 80/64 1౧ 01 15060004 1000 2 గరా! 9506గ్పా 0౯ రజరణరంర 10 20 ణు, 0౯ 0 20 యు (తయ0210 న. [0000001089 [000408 0౯౦టిలాపల) ౪10౪6౯ 46 వ[0 ఇగరంగ ల౫ము10౧ 0౯46 020000ల తీర ౧6౧౪౦1 శం డేంబ జ్యూ” 0240062664 146 12 90100 0 యు 6916౦0 ౫౪” 66 12016 6 6౫1౧21 క200య06012 2064 ద యు ఓ! 1ము28ల.

పొఠకుదికీ అంకితం. మీకు అనందం లభించుగాక

విషయసూచిక 10వ వార్షికోత్సవ (ప్రచురణకి ముందుమాట 9 10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం 18 రచయిత ముందుమాట గ 1 ఆనందాన్ని పొందే మార్గం అధ్యాయం 1: ఆనందాన్ని పొందే మార్గం 31 అధ్యాయం 2; ఆనందానికి మూల కారణాలు తర్‌ అధ్యాయం 8: ఆనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం త్తం అధ్యాయం 4: ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం 59 2. మానవుల్లో (పేమ, సానుభూతి అధ్యాయం 5: అన్యోన్యతకి కొత్త నమూనా గై అధ్యాయం. 6: ఇతరులతో లోతైన సంబంధాలు వర్చరచుకోవడం 85 అధ్యాయం 7: సొనుభూతి తాలూకు విలువా, లాభాలూ 105

  1. దుఃఖోపశమనం అధ్యాయం 8: బాధలని ఎదుర్కోవడం 119 అధ్యాయం 9: స్వయంగా సృష్టించుకునే కష్టాలు 131 అధ్యాయం 10: దృష్టికోణాన్ని మార్చుకోవడం క్షశ్త/ అధ్యాయం 11; భాధలూ కష్టాలూ సార్ధకమైనవే 167
  2. అడ్డంకులను అధిగమించడం

అధ్యాయం 12: మార్పు తీసుకురావడం 181 అధ్యాయం 13: క్రోధాన్నీ, ద్వేషాన్నీ ఎదుర్కోవడం 191 అధ్యాయం. 14: ఆందోళనని అదుపులో పెట్టుకుని

అత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం 203

ల్‌. అధ్యాత్మిక జీవితాన్ని గదపడం గురించి కొన్ని పునరాలోచనలు కృతజ్ఞతలు 2డ1

10వ వార్షికోత్సవ ప్రచురణకి ముందుమాట పరమపావన దలైలామా

నా చిరకాల స్నేహితుడు, అమెరికన్‌ మనస్తత్వశాస్త్రజ్డుడు హోవర్డ్‌ కట్లర్‌లో కలిసి నేను

రాసిన “ఆనందాన్ని పొందే మార్గం” పుస్తకం పదవ ్రచురణని ప్రచురణకర్తలు వెలుగులోకి తెస్తున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. హోవర్డ్‌ వర్తమాన శాస్త్రీయ దృక్పథంతోనూ, నేను బౌద్ధమత దృక్పథంతోనూ మానసిక ఆరోగ్యాన్ని గురించీ మానవుల సంక్షేమం గురించీ గంటలకి గంటలు చర్చించుకుని ఈ పుస్తకాన్ని రాశామని ఇదివరకు దీన్ని చదివినవారు గ్రహించగలుగుతారు. ఈ పుస్తకం మంచి జనాదరణ పొందడం చూసి, మానవులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మా ఇద్దరి శ్రమా దోహదం చేసిందన్న సంతోషం కలిగింది. ఈ పుస్తకాన్ని రాసిన మేమిద్దరమూ వేర్వేరు నేపథ్యాలకి చెందినవారమైనప్పటికీ, ఎప్పుడూ మానవతావాదాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకునే మా చర్చలని జరిపాము. మానవతావాదాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నప్పుడు మానవుల మధ్య స్త్రీపురుషులు, జాతి, మతం, సంస్కృతి, భాష వంటి భేదాలు మాయమైపోతాయి. ప్రాథమిక స్థాయిలో మనమందరం ఒకటే. ప్రతి ఒక్కరూ ఆనందం పొందడానికే అర్రులు చాస్తారు, ఎవరికీ కూడా బాధలు పడాలని ఉండదు. ఇదే అన్నిటికన్నా ప్రధానమైన వాస్తవం. ఈ స్థాయినుంచి ఆలోచిస్తే మానవులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారని అర్ధమవుతుంది. ఈ నమ్మకంతోనే, నాకు జనంతో మాట్లాడే అవకాశం చిక్కినప్పుడల్లా మానవులందరిలోనూ ఉండే సమానత్వాన్నీ మనందరినీ ఏకసూత్రంతో కలిపి ఉంటే అస్తిత్వాన్నీ మన సంక్షేమాన్నీ గురించే మాట్లాడతాను. ఈ అతిముఖ్యమైన, సరళమైన యథార్థాలని గుర్తించి మానవులుగా మనమందరం మన చుట్టూ ఉండే ప్రపంచంతోనూ, పరస్పరం ఇతరులతోనూ ప్రవర్తించాలని నేను నమ్ముతాను.

“ఆర్ట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ (ఆనందాన్ని పొందే మార్గం) ్రచురితమై పదేళ్లయిన ఈ సందర్భంలో మానవుడి ఆనందం అనే విషయం మరింతమంది దృష్టిని అకర్షిస్తోందనీ,

9

10+ ఆనందాన్ని పొందే మార్గం ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారనీ, శాస్త్రవేత్తలు గంభీరమైన పరిశోధనలు చేస్తున్నారనీ తెలిసి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. విస్తృతమైన జనసమూహాలలో దీనికి మరింత గుర్తింపు కలుగుతోంది. అలాగే, మన మనస్థితికీ, మన ఆనందానికీ మధ్య దగ్గర సంబంధం ఉందని అనడానికి శాస్రీయమైన రుజువులు అధికంగా కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం నేను ఈ వాక్యాలు రాశాను, “ఇతరులు ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్టయితే, మరింత సానుభూతిని అలవరచుకోండి. మీరు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నా సానుభూతిని అలవరచుకోండి.” ప్రపంచంలోని ఇతర గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయా ల్లాగే బౌద్ధసంప్రదాయం కూడా మనని సానుభూతితో జీవించమని చెపుతుంది. ఈ అధ్యాత్మిక సంప్రదాయాలు ఇతరులతో, మనం జీవిస్తున్న ఈ లోకంతో సంబంధం కలిగి ఉండమని బోధిస్తాయి. ఇతరులకి సేవ చెయ్యడం అనేదాన్ని అత్యుత్తమమైన గుణంగా భావిస్తాయి.

ఈనాడు పెరుగుతున్న శాస్త్రీయ జ్ఞానం ఈ విషయాన్నే నొక్కి వక్కాణిస్తుంది. ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నవారిలో కనిపించే ముఖ్యమైన లక్షణం సానుభూతితో ఇతరులకి సేవచెయ్యడమే అనే విషయాన్ని పరిశోధకులు (ధ్రువ పరిచారు. నాకు ఇది పూర్తిగా నిజమే అనిపిస్తుంది. ఇతరులకి సాయం చేసినప్పుడు మన మనసు వైశాల్యం పెరుగుతుంది, సాయం చెయ్యడం మీద మనం దృష్టి కేంద్రీకరించి నప్పుడు మనకున్న చిన్న చిన్న సమస్యలని సరైన పరిమాణంలో చూడగలుగుతాం. అవి ఎంత చిన్నవో తెలుసుకోగలుగుతాం. అంతకుమునుపు భయపెట్టేవిగా, భరించ శక్యం కానివిగా కనిపించిన సమస్యల తీవ్రత తగ్గిపోతుంది. నిజానికి ఆ సమస్యలు అంత భయంకరమైనవీ, భరించలేనివీ కానేకావు.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే : ఎక్కువ సానుభూతి కనబరిచేట్టుగా మనని మనం తీర్చిదిద్దుకోగలమా? అది సాధ్యమే అయితే మనమేం చెయ్యాలి? ఈ ప్రశ్నకి మనం మళ్లీ పాత సమాధానమే చెప్పుకోవాలి - అది ప్రాథమికంగా మానవజాతి మొత్తానికీ గల సామ్యం, మానవసంక్షేమం ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్న విషయం అనే అవగాహనా అక్కడ అతిముఖ్యమైనదన్న విషయం. ఇతరులతో మీకు సంబంధం ఉంది అని అనిపించినప్పుడు మీరు మీ హృదయద్వారాలని తెరిచి ఉంచుతారు - నేను తరచు దీన్ని 'అంతర్‌ద్వారాలు అంటూ ఉంటాను. ఇతరులకి స్నేహహస్తాన్ని అందిస్తారు. అలా చేసినప్పుడు మీకు గొప్ప భద్రతాభావం కలుగుతుంది, నమ్మకం, స్వేచ్చ లభించినట్టు అనిపిస్తుంది. ఈ ప్రక్రియలోని కీలకమైన అంశం మన మనస్థితి గురించి అవగాహనని పెంచటం, ముఖ్యంగా మన మనసులో కలిగే భావోద్వేగాలని తెలియజెయ్యటం. ఇలాంటి అభ్యాసాలతో మీలో మీరు ఒక గట్టి పునాదిని నిర్మించుకోగలుగుతారు. మీ మనసు చెదరకుండా స్థిరంగా ఉండేందుకు నావని కదలకుండా ఉంచే లంగరులాగ ఇది పనిచేస్తుంది. మనసుకి అసలైన ఆనందం కలగాలంటే, నిజమైన ఆహ్లాదం పెల్లుబకాలంటే దానికి ఇదే మూలం. సానుభూతినీ, ఆనందానికీ గల సహజమైన సంబంధాన్ని చూసి పరిశోధకులు తరచు ఆశ్చర్యపోతూ ఉంటారు. “సానుభూతిపరులు ఎక్కువ ఆనందంగా

10వ వార్షికోత్సవ ప్రచురణకి ముందుమాట + [1 ఉంటారా? లేక ఆనందంగా ఉండడంవల్ల మనుషులు సానుభూతి చూపించగలుగుతారా?” అన్నది వాళ్ల ప్రశ్న వ్యావహారికంగా చూస్తే ఏది ముందు అనేది నిజానికి ముఖ్యం కాదని నా ఉద్దేశం. అసలు విషయం ఏమిటంటే ఈ రెంటినీ మనం అలవరచుకోవచ్చు. బౌద్ధ సంప్రదాయంలో, రకరకాల మానసికమైన శిక్షణ ద్వారా సానుభూతినీ, సంక్షేమాన్నీ పద్దతి ప్రకారం అలవరచుకోవడం నేర్పుతారు. నాడీవిజ్ఞానరంగంలో ఈనాడు తెలియవస్తున్న కొత్త విషయాలు - ముఖ్యంగా మస్రిష్కానికి ఉన్న మృదుత్వం గురించి - తెలుసుకున్నాక అది మార్పులకీ, అనుకరించడానికీ అనుగుణంగా ఉంటుందనీ, దెబ్బెయవ దశకానికి చేరుకున్న వృద్ధులకి కూడా అది సాధ్యమేననీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. గౌరవనీయులైన పదమూడవ శతాబ్దపు టిబెట్‌ దేశపు జ్ఞాని, శాక్య పండితుడు ఒకచోట ఇలా అంటారు : "రేపే చనిపోతావని తెలిసినా కొత్త విషయాలు నేర్చుకో.”

“ఆనందాన్ని పొందే మార్గంలో జీవితంలో ఎదురయే అనివార్యమైన కష్టాలని అధిగమించి ఒక క్రమపద్ధతిలో ఆనందాన్ని ఎలా సంపాదించుకోవచ్వ చెప్పేందుకు ప్రయత్నించాం. ఈ పద్ధతిలో వీలైనంత చక్కగా ప్రాచ్య, పాశ్చాత్య జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం, అంటే పాశ్చాత్య దేశాలలోని విజ్ఞానం, మనస్తత్వశాస్త్రం ఒకపక్కా మరోపక్క బౌద్ధ సిద్ధాంతాలూ, ఆచరణలూ ఉండేట్టు దీన్ని రూపొందించాం. మన జీవితాలలో ఇంకా ఎక్కున ఆనందం ఉంది అనే విశ్వాసాన్ని పాఠకులతో పంచుకోవాలన్నదే మా లక్ష్యం. ఇంకా ప్రధానంగా మేము అనుకున్నది, మనలో ఒక్కొక్కరిలోనూ అంతర్గతంగా ఉన్న అద్భుతమైన శక్తివైపు దృష్టి ఆకర్షించాలని. ఈ ముఖ్యోద్దేశాలతో ఒక వ్యక్తి దృష్టికోణంనుంచి జీవితంలో అత్యధికమైన ఆనందాన్నీ, ఆహ్షాదాన్నీ పొందే మార్గాలని అన్వేషించడమే మేము ఈ పుస్తకంలో చెయ్యడానికి ప్రయత్నించాం.

గత పది సంవత్సరాలుగా హోవర్డ్‌, నేనూ చర్చలని కొనసాగిస్తూనే ఉన్నాం. మా చర్చలో మరింత విస్తృతమైన సమాజానికి సంబంధించిన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. మన ఆనందం మీద బాహ్యకారణాల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము చర్చిస్తున్నాం. ఒక వ్యక్తి తన ఆనందం కోసం చేసే వెతుకులాటలో ముఖ్యమైన సిద్ధాంకాలనీ, ఆచరణలనీ మేము పరిశీలించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే, సమాజపరంగా ఈ సిద్ధాంతాలనీ, ఆచరణలనీ ఎవరైనా ఎలా అమలు చెయ్యగలరు అనే అతిముఖ్యమైన, క్లిష్టమైన ప్రశ్నలకి సమాధానాలకోసం సమయాన్ని వెచ్చించాం. సమస్యలతో నిండిన ఈనాటి జటిలమైన పరిస్థితుల్లో ఎవరైనా ఆనందంగా ఎలా ఉండగలరు? ప్రపంచంలోని సమస్యలతోనూ, బాధలతోనూ సంఘర్పిస్తూ, 'ఆనందాన్ని పొందే మార్గంలోని సిద్ధాంతాలని ఎవరైనా ఎలా అమలు చెయ్యగలరు? సామాజిక స్థాయిలోనూ, వ్యక్తిగత స్థాయిలోనూ హింసకి మూలకారణాలు ఏవి? ఈ హింసకి సంబంధించిన మూలాలని నిర్వీర్యం చేసేందుకు ఏం చెయ్యాలి? మనిషి ఎదుర్కొంటున్న హింసనీ, బాధలనీ చూస్తూ కూడా ఎవరైనా ఆనందాన్ని ఎలా ఆశించగలరు? మా చర్చలలో ఇలాంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం కోసం ప్రయత్నించాం. ఈ పది సంవత్సరాలలో నేను శాస్రజ్ఞులతో, నాడీవిజ్ఞానం, మనస్తత్వశాస్త్రం మనకి తెలియజేసే

12 + ఆనందాన్ని పొందే మార్గం

విషయాల గురించి సంభాషణ కొనసాగిస్తూ, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికీ, ప్రాచీన బౌద్ధ సంప్రదాయంలోని జ్ఞానానికీ మధ్య మరింత పటిష్టమైన సంబంధాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ అన్వేషణకి సంబంధించిన ఫలితాలూ, హోవర్డ్‌తో నేను కొనసాగిస్తున్న చర్చలూ ఒక కొత్త పుస్తకాన్ని సృష్టిస్తాయనీ, నాకు ఎంతో విలువైనవని అనిపించిన ఈ ఫలితాలు చదివే పాఠకులకి కూడా ఉపయోగపడతాయనీ ఆశిస్తున్నాను.

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం ఆనందాన్ని పొందే మార్గం : గతం, భవిష్యత్తు హోవర్డ్‌ కట్లర్‌, ఎమ్‌.డి. ప్రారంభం

6ర్తైం్త నందాన్ని పొందే మార్గం (ఆర్ట్‌ ఆఫ్‌ హాపీనెస్‌) మొదటి ముద్రణకి పది

సంవత్సరాలు పూర్తయాయి. ఈ పుస్తకం ముద్రించబడిన సందర్భాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఆనందం గురించి దలైలామాతో కలిసి ఒక పుస్తకం రాయాలని తొంభటైయవ దశకంలో నాకు ఆలోచన రావడం గుర్తొస్తుంది. అప్పటికి అమెరికాలో దాదాపు అందరికీ దలైలామా పేరు సుపరిచితం అయిపోయింది. కానీ బౌద్దులకి తప్ప మిగతావారికి ఆయన ఒక రక్తమాంసాలున్న నిజమైన వ్యక్తి అనే అవగాహన లేదు. జనం దృష్టిలో ఆయన ఒక హాస్య చిత్రం, అంతే: ఎప్పుడూ పళ్లు కనిపించేట్టు నవ్వుతూ ఉండే ఒక బౌద్ధ భిక్షువు “బౌద్ధ మతానికి పోప్‌లాంటివాడు”, “టిబెట్‌ దేశానికి దేవుడులాంటి రాజు. అసలు ఆరోజుల్లో దలైలామా పేరు ఎవరైనా, ఉచ్చరిస్తే సగటు అమెరికన్‌ మనసులో క్యాడీషాక్‌ అనే సినిమాలో గోల్ఫ్‌కోర్సుల ఆటగాళ్లకి సహాయం చేసే కార్త్‌ 'స్పెక్‌లర్‌ అనే వడిలిపోయిన వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ పాత్ర తను ఒకసారి దలైలామాకి క్యాడీగా కొద్దిసేపు పనిచేశానని అంటాడు:...” మేము పద్ధెనిమిదవది పూర్తిచేశాం. అప్పుడు ఆయనతో నేను "హే లామా! హే, ఏదో కొంత మీకు తెలుసు, మనం చేసిన ప్రయత్నానికి...” అంటూండగా ఆయన జవాబిచ్చారు: “అక్కడ డబ్బేం వుండదు, కాని మరణశయ్య మీద వున్నప్పుడు నువ్వు పూర్తిగా స్పృహలోనే వుంటావు, చివరకి మంచి లాభమే దక్కింది నాకు.”

అయినప్పటికీ కొందరి మనసుల్లో దలైలామా ఊహాచిత్రాలు చక్కగానే ఉన్నాయి- ఆయన నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నాడనీ, మానవహక్కుల కోసం అలుపు అనేది లేకుండా పోరాడతాడనీ, చైనా సేనలు టిబెట్‌ని క్రూరంగా ఆక్రమించినప్పుడు, యాభై

13

[గ + ఆనందాన్ని పొందే మార్గం

సంవత్సరాలు దేశ బహిష్కరణకి గురై కూదా ఆయన అహింసావాదానికే కట్టుబడి ఉన్నాదనీ గుర్తించారు. అయినప్పటికీ ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఆయన వ్యక్తిత్వంలో ఏదో ఒక పార్య్వాన్ని మాత్రమే చూడగలిగారు - కొందరు ఆయన్ని రాజకీయ వేత్తగా గుర్తించారు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌద్ధమత గురువుగా, లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం గల పండితుడిగా ఆయనలోని ప్రతిభని వారు గుర్తించలేదు. పైగా ఆ రోజుల్లో ఆయన తాను ఒక ప్రపంచనేతగా కాక ఒక బౌద్ధసన్యాసిగా గుర్తింపబడేందుకు ఇష్టపడేవాడని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోయి. ఉండేవారు. ఆయన దినచర్య చాలా సరళంగా ఉంటుంది. ఉదయం 3-80 కల్లా నిద్రలేచి నాలుగైదు గంటలు ప్రార్ధన చేస్తూనో, ధ్యానం చేస్తూనో గడపడం ఆయనకి అలవాటు.

1990 ఆరంభంలో ఆయన గురించి జనానికి ఉన్న ఈ అపోహలని పోగొట్టి అందరి మనసుల్లో ఉందే ఒక కార్టూన్‌లాంటి ఆయన రూపానికి కాస్త ప్రాణం పోసేందుకు ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన నా మనసులో తలెత్తింది. కానీ ఈ పుస్తకం ముఖ్యోద్దేశం అది కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందం ఎలా పొందాలి అన్న విషయంలో ఆయనకి ఉన్న అభిప్రాయాలని ఈ పుస్తకం ద్వారా అందరికీ అందజేయాలన్నదే నా ప్రధాన లక్ష్యం,

ప్రచురణ ఈ పుస్తకం రాయాలన్న ఆలోచనని నేను మొదటిసారి తెలియజేసేందుకు దలైలామను కలుసుకున్న సందర్భం నాకింకా కళ్లకి కట్టినట్టే ఉంది. ఆయన్ని కలిసి మాట్లాడేందుకు చాలా జంకాను. ఆయన ఇటువంటి ఆలోచనలని ఎంత నేర్పుగా తిరస్కరిస్తూ వచ్చారో ఎన్న్నో ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాను. అందుకే నా కోరికని ఆయన తిరస్మరిస్తారేమోనని భయపడుతూ, అన్నిటికీ సిద్ధమై, నా వాదనని వినిపించేందుకు సన్నద్ధుణ్జై ఆయన్ని కలిసేందుకు వెళ్లాను.

“యువర్‌ హోలినెస్‌, మీరింత వరకూ దాదాపు పాతిక పుస్తకాలు ప్రచురించారని నాకు తెలుసు. కానీ ఈ పుస్తకం చాలా విభిన్నమైనది. ఇందులో మీరు జీవితంలో పాటించే ముఖ్యమైన సిద్ధాంతాల సారాన్ని పొందుపరచాలనుకుంటున్నాను. ఆ సిద్ధాంతాల ద్వారానే మీరు జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతున్నారు. మీరు పాటించే సిద్దాంతాల మూలాలు బౌద్ధమతానికి చెందినవే అయినప్పటికీ, వాటిని ఎవరైనా, ఎలాంటి సంప్రదాయాన్ని పాటించేవారైనా పాటించగలందులకు, వీటిని తమ రోజువారీ జీవితాల్లో అమలుచేసి మరింత ఆనందంగా జీవించేందుకు మార్గాన్ని సూచించాలన్నది నా ఆలోచన...” అన్నాను నా లక్ష్యాలకి ఒక ఉపోద్దాతంగా.

“ఓ చాలా బావుంది!” అన్నారాయన ఉత్సాహంగా. “అ తరవాత ఒక మనస్తత్వవేత్తగా, నా దృష్టికోణం నుంచి, మీరు దేన్నెతే అనందం అంటున్నారో దాన్ని పరీక్షించాలని అనుకుంటున్నాను. జీవితానికి సార్ధకత కూర్చేవి ఏది?

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం శ 15 పాశ్చాత్య మనస్తత్వశాస్త్రం దృష్ట్యా, మీ దృష్టికోణాన్ని సమర్ధించే శాప్రీయ నిరూపణల కోసం వెతకాలన్నది నా ఉద్దేశం,” అన్నాను.

“అలాగే, సరే!” అన్నారు దలైలామా నా ప్రస్తావనకి తల ఊపుతూ తన అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేస్తూ.

ఆయన అంత సులభంగా అంగీకరిస్తారని అనుకోకపోవడం వల్ల అతిఉత్సాహంతో ఊపిరి కూడా పీల్చుకోకుండా మాట్లాడుతూ పోయాను. ఆయన్ని ఒప్పించడం మీదే నా దృష్టి మొత్తం కేంద్రీకరించి, నా వాదనలతో ఆయన్ని నిర్భాంతపోయేట్టు చెయ్యాలన్న అత్రుతతో ఆయన ఏమంటున్నారో, నా మాటలకి ఏమని జవాబు చెపుతున్నారో కూడా పట్టించుకోలేదు.

నా మాటలు అర్థం కానట్టు నావైపు అయోమయంగా చూస్తూ నన్ను మధ్యలో అద్దుకున్నారాయన,

“హోవర్డ్‌ నేను అంగీకరించాను కదా? ఇంకా ఎందుకు నీ వాదనలని కొనసాగి స్తున్నావు?” అన్నారు నవ్వుతూ.

చివరికి నా ప్రస్తావనకి ఆయన అంగీకరించారన్న జ్ఞానోదయం అయింది నాకు. నాలో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ పుస్తకాన్ని రాయాలన్న ఆలోచన వెనక నా స్వార్థం కూడా ఉందన్న సంగతి ఆయనకి చెప్పకుండా వదిలేశాను. ఇంకా ఆనందాన్ని ఎలా పొందవచ్చో ఆయన దగ్గర నేను నేర్చుకోవాలన్నది కూడా ఈ పుస్తక రచన వెనక నా మనసులో ఉన్న ఒక కోరికే.

1993లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాం. అప్పుడు నేను అరిజోనాలో నివసిస్తున్నాను. దలైలామా అరిజోనాకి వచ్చారు. పద్ధెనిమిదో శతాబ్దానికి చెందిన శాంతిదేవ అనే బౌద్ద పండితుడు రాసిన గొప్ప ఉద్ధంథం మీద ఆయన ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చెయ్యబోతున్నారనీ, ఆ వారం రోజులూ అక్కడి ప్రజలకి బోధించే కార్యక్రమం ఉందసీ నాకు తెలిసింది. ప్రతిరోజూ సుదీర్హమైన బోధనా తరగతులని నిర్వహిస్తున్నప్పటికీ, మేమిద్దరం కలుసుకునేందుకు ఎలాగో వీలు కల్పించుకోగలిగాం. ఆయన జనానికి బోధించే చోటనే ఆయన బస చేస్తున్నారన్నది మాకు సులభతరం చేసింది. టక్సన్‌కి దూరంగా ఉన్న సౌనోరన్‌ దెజర్ట్‌లోని ఒక హోటల్లో ఆయనకి బస ఏర్పాటు చేశారు. అందుచేత ప్రతి ఉదయం ఫలహారం అయాకో లేక మధ్యాన్నం భోజనానంతరమో ఆయన ఉంటున్న హోటల్‌ గదిలో ఇద్దరం కలుసుకునేవాళ్లం. నేను వరసగా జీవితం గురించీ, జీవితానికి సార్ధకత చేకూర్చే నిజమైన విషయాల గురించీ, మానవుడి ఆనందానికీ, బాధలకీ సంబంధించిన అతిముఖ్యమైన ప్రశ్నలు అడిగేవాణ్డి.

మా సంభాషణలు ప్రారంభం అవకముందు కొన్నినెలలపాటు నేను బోలెడన్ని ప్రశ్నలని ఒక జాబితాగా తయారుచేసేందుకు చాలా సమయాన్ని వెచ్చించాను. వాటిని జాగ్రత్తగా, వరుసక్రమంలో నాకు కావల్సిన విధంగా అమర్చి ఒక లావాటి ఫైల్‌లో పెట్టాను. నేను మొదటిసారి దలైలామాని కలిసేందుకు వెళ్లినప్పుడు, నా దగ్గర ప్రశ్నలు

ర + ఆనందాన్ని పొందే మార్గం

సిద్ధంగా ఉన్నాయి. మా ఇద్దరి సంభాషణనీ నేనే నడిపిస్తాననీ, నాకు కావల్సినట్టుగానే అది సాగుతుందనీ అనుకున్నాను, కానీ కొన్ని నిమిషాలలోనే దలైలామా నా ఆ భ్రమని పటాపంచలు చేసేశారు. నేను ముందుగా సిద్ధం చేసుకున్న విషయక్రమంలోనే మా (ప్రశ్చోత్తరాలు సాగాలని అనుకున్నాను, దామినోస్‌ని ఒకటొకటిగా పడదోసినట్టు ఒక్కొక్క ప్రశ్ననే సంధించి సమాధానం రాబట్టాలని అనుకున్నాను. కానీ నా పద్ధతిని అనుసరించ వలసిన అవసరం గాని, అగత్యం గాని ఆయనకి లేదన్న విషయం త్వరగానే తెలుసు కున్నాను. నా ప్రశ్నలకి ఆయన ఇచ్చే సమాధానాలు తరచు ఎదురుచూడని విధంగా ఉండేవి. మా సంభాషణని హఠాత్తుగా మరో దిశగా కొనసాగించేవారు. నేను ఒక ధోరణిలో నా ఆలోచనలని కొనసాగిస్తూ ఉండగా ఆయన నా ఆలోచనల బండిని పట్టాలు మళ్లించి ఒక కొత్త మలుపు తిప్పేవారు. అందుకే ఒక్కోసారి మా సంభాషణలు నాకు సవాలులాగ అనిపించేవి. కానీ అదే సమయంలో దలైలామాలోని మెరుపులాంటి తెలివి తేటలూ, గొప్ప పహాస్యధోరణీ మా సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయని అనిపించేట్టు చేసేవి. నా దృష్టిని ఆయన మాటలమీదే కేంద్రీకరించేట్టు చేసేవి,

ఆ సంభాషణల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాల్లోని విషయాలు దొల్లేవి. అవి ఈ పుస్తకానికి అవసరమైన ముఖ్యమైన విషయాలని అందించాయి. ఆ తరవాత ఇండియాలో ఆయన ఇంట్లో మేము కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్న విషయాలని అదనంగా జోడించాం. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచనలో పూర్తిగా మునిగిపోయి డాక్టర్‌గా నా ప్రాక్టీసుని కొన్నాళ్లు పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాను. నా ధ్యాసని పూర్తిగా మానవుల అనందం మీద కేంద్రీకరించి, ప్రాచ్య, పాశ్చాత్య దేశాలని కలిపే ఒక వంతెనగా దాన్ని మలచాలని అనుకున్నాను. ఈ పుస్తకం రాసేందుకు కనీసం ఆరునెలల కాలం పడుతుందని అంచనా వేశాను. దీనికి దలైలామా సహరచయిత అని ప్రకటిస్తే ప్రచురణకరన్సి వెతుక్కోవటం సులభం అవుతుందని అనిపించింది. న్‌

కానీ నేను అనుకున్నది తప్పని రుజువైంది. ఐదేళ్లు గడిచిపోయాయి కానీ ఇంక్షా రాయడం పూర్తికాలేదు. నా బల్లమీద ఉత్తరాల కట్టలు పెరిగిపోసాగాయి, అన్నీ పుస్తక ప్రచురణ చెయ్యటం సాధ్యంకాదని తిరస్మ్కరించినవే. రోజుల్లో ప్రచురణకరలక్తి తెలివితేటలు బొత్తిగా లేవని తెలిపే నిదర్శనాలు ఆ ఉత్తరాలు. వాళ్ల దృష్టిలో ఎక్కువమంది పాఠకులని దలైలామా రాసిన పుస్తకాలు ఆకట్టుకోవు అనే నమ్మకం ఉండింది. అంతే కాకుండా జనానికి ఆనందం అనే విషయం మీద అట్టే ఆసక్తి లేదని కూడా వాళ్తు నిర్ధారించారు. ష్‌

1998 నాటికి, కొన్ని ఏళ్లపాటు ప్రచురణకర్తలనుంచి తిరస్మారాన్ని ఎదుర్శొన్నాక్ర,

నా దగ్గరున్న అఆర్థికవనరులన్నీ అడుగంటాక, ఇక నాకు దాన్ని ప్రచురించేందుకు అవకాశాలు కనిపించలేదు. అయినప్పటికీ కొత్తగా పుస్తకాలు చదవటం ప్రారంభించిన పాఠకులు దలైలామా వివేకం వల్ల లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో, పదవీవిరమణ చేసిన తరవాత నేను దాచుకున్న కాస్త డబ్బుతో కనీసం కొన్ని కాపీలైనా అచ్చువెయ్యాలని నిర్ణయించుకున్నాను.

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం త [7 అప్పుదే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. న్యూయార్క్‌ సబ్‌వే రైల్వేస్టేషన్‌లో నా సన్నిహిత మిత్రుడి తల్లి ఒక అపరిచితుడితో ఆషామాషీగా ఒక మాట అంది. ఆ వ్యక్తి ప్రచురణారంగంలో ఉన్నాడు. అలా అలా అతని ద్వారా ప్రచురణకర్తల్లో పేరున్న ఒకరితోనూ, సాహిత్యాన్ని ప్రోత్సహించే ఒక ఏజెంట్‌తోనూ నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఎక్కువ ఫలితాలు ఎదురుచూడకుండా, కొన్ని కాపీలు మాత్రమే ప్రచురించటం ఆ విధంగా సాధ్యమైంది. చివరికి ఎలాగైతేనేం పుస్తకం అచ్చయింది. ఆశించని విజయం ఇది పదేళ్లక్రితం మాట. ఆ తరవాత జరిగిన సంఘటనలని దలైలామా కాని, నేను కాని, ప్రచురణకర్త కాని కలలో కూడా ఊహించి ఉండం. అఆ పుస్తకం గురించి చాలా త్వరగా పాఠకుల్లో అవగాహన పెరిగింది. ప్రకటనలూ, ప్రచారం సాయం లేకుండా, కేవలం నోటిమాట ద్వారా పుస్తకం గురించి అందరికీ తెలియవచ్చింది. అంత పెద్దెత్తున దానికి ఆదరణ లభిస్తుందని నేను ఎదురుచూడలేదు. చాలా త్వరగా న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్స్‌ జాబితాలో ఈ పుస్తకం చోటుచేసుకోవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాదు, రెండేళ్లపాటు అత్యధికంగా అమ్ముడయే పుస్తకాల జాబితాలో దాని పేరు ఉండిపోయింది. త్వరలోనే ఆ పుస్తకం అమెరికా ప్రజల సంస్కృతిలో భాగంగా మారుతోందన్న రుజువులు మాకు కనిపించాయి, టీవీ సీరియల్స్‌లో, గేమ్స్‌ షోలలో, చివరికి ఎమ్‌.టి.విలో కూదా ఈ పుస్తకం ప్రస్తావన రాసాగింది. ఆ కాలంలో అమెరికాలో ఎక్కువ పేరుపొంది సంస్కృతికి తార్మాణంగా నిలిచిన (ఫెండ్స్‌, నెక్స్‌ అండ్‌ ద నిటీ, జిపార్టీ మా వాంట్ల్‌ టు బి ఎ మిలియనీర్‌ ఎమ్‌టివి క్రిబ్స్‌లోనూ, చివరికి మండే నైట్‌ ఫుట్‌బాల్‌ అనే అప్పుడే ప్రారంభమైన మొదటి గేమ్‌లోనూ ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. ఆ ఆటలో క్వార్టర్‌ బ్యాక్‌గా ఆడుతున్న ఒక ఆటగాడు, ఇంతకుముందు తను ఆటలో గెలవటానికి కొంతవరకూ 'ది ఆర్ట్‌ ఆఫ్‌ వ్యోపినెస్‌' అనే పుస్తకం చదవటమే కారణం అని చెప్పాడు. దలైలామా ఇచ్చిన ప్రధాన సందేశం సార్వజనీనమైనదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అవును ఆనందం సాధ్యమే, నిజం చెప్పాలంటే ఇతర కళలలో, నైవుణ్యాలలో దేన్నైనా అఖ్బనించినట్టుగానే మనం ఆనందం పొందటం కూడా అభ్యాసం ద్వారా సాధించవచ్చు. ప్రయత్నించి, అభ్యసించి దాన్ని సులభంగా అలవరచుకోవచ్చు. మన ఆలోచనా ధోరణులకి కొత్తరూపం ఇచ్చి, మన దృష్టికోణాన్ని మార్చుకుని ఆనందాన్ని ఏ విధంగా పొందవచ్చో దలైలామా వివరిస్తారు. ఆనందద్వారాలు తెరిచే తాళంచెవులు మన చేతిలోనే ఉన్నాయని అంటారాయన. ఆనందం పొందేందుకు ఇక అదృష్టాన్నీ విధినీ నమ్ముకోనకృళ్తేదనీ, బాహ్య పరిస్థితులన్నీ చక్కబడేరోజుకోసం ఎదురుచూస్తూ కూర్చోనక్మళ్లేదనీ అంటారు. ఏదో ఒకనాడు మనం బరువు తగ్గుతామనీ, ధనవంతులం అవుతామనీ, పెళ్లి చేసుకుంటామనీ, విడాకులు పొందుతామనీ, లేదా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ గొప్ప పదవిని సంపాదించుకుంటామనీ ఏమీ చెయ్యకుండా భారమంతా దేవుడిమీద వేసి కూర్చోనకృల్లేదు.

18+ ఆనందాన్ని పొందే మార్గం

ఆయన ప్రధానంగా ఇచ్చే సందేశం - ఆశావాదం. అది మనుషుల మనసులోతుల్లోని ఏదో ఒక తంత్రిని తాకి ప్రతిధ్వనించింది. అది కేవలం అమెరికన్ల మనసులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషుల మనసుల్లో ప్రతిస్పందించింది. వాళ్లు విభిన్న నేపథ్యాలకి చెందినవారు, కానీ అందరికీ ఉన్న ఒకే ఒక ముఖ్యమైన కోరిక ఆనందాన్ని పొందటం, జీవితంలో మరింత మెరుగైన పరిస్థితులు నెలకొనాలని తహతహలాదటం. చివరికి ఈ పుస్తకం యాఖై భాషల్లోకి అనువదించబడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి స్ఫూర్తి కలిగించింది.

ఆనంద విప్లవం

ఆనందం అనే భావనని అందుకోవడం సాధ్యమే. అభ్యాసంతో, ప్రయత్నించి చేరుకోగల ఒక లక్ష్యం అది. బౌద్ధమతం దృష్టిలో ఆనందం అనేది ఒక ప్రాథమిక సిద్ధాంతం. శతాబ్దాల నుంచీ మనసుని ఆనందం పొందేందుకు సంసిద్ధం చెయ్యడం అనేది, దానికి అటువంటి శిక్షణ ఇవ్వటం అనేది ముఖ్యోద్దేశంగా ఉంటూ వస్తోంది. 'ది ఆర్ట్‌ ఆఫ్‌ వ్యాపినెస్‌ ప్రచురితమైన తరవాత మరో దిశగా అదే ఆలోచన సమాజంలో నెలకొనడం మొదలుపెట్టింది, కానీ అది ఒక 'కొత్త' శాస్త్రీయ ఆవిష్కారంలాగ మారి ఎంతో మందికి అంతవరకూ ఆనందం గురించి ఉన్న అవగాహనలో పూర్తి మార్పుని తీసుకువచ్చింది.

1990 ప్రారంభంలో ఈ పుస్తకం రాసే పని నేను చేపట్టినప్పుడు ఆనందం గురించి శాస్త్రీయమైన అధ్యయనాలు తక్కువగా ఉన్నాయనీ, అసలు సానుకూల ఆలోచనల గురించి కూడా చాలా తక్కువ సమాచారం ఉందనీ తెలుసుకున్నాను. పరిశోధనా రంగంలో ఈ విషయాలకి ప్రాముఖ్యం లేదు. కొద్దిమంది పరిశోధకులు మానవుని ఆనందం, సానుకూల భావాల గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకునే స్వతంత్రులు. కానీ అంతలో హఠాత్తుగా శాస్త్రవేత్తలకి ఆనందం ఒక ఆసక్తికరమైన విషయంగా మారింది. జనం కూడా దాన్ని గురించే తీవ్రంగా ఆలోచించసాగారు. ఆనందం గురించి తమకి అంతవరకూ ఉన్న అభిప్రాయం - అది భ్రమింపచేసేది, అర్థం కానిది, ఇదమిత్ళమని నిర్ణయించలేనిది అనేది. ఇప్పుడు దీనిని వదిలేసి, ఆనందాన్ని శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించడం, పరిశీలించడం సాధ్యమే అనే దృష్టికోణాన్ని అలవరచుకున్నారు. గత పదేళ్లుగా ఆనందం మన బాహ్య పరిస్థితుల కారణంగా లభించేదన్న ఆలోచనని ఇంకా ఎక్కువమంది తిరస్కరించి, ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకోగల విషయమని గ్రహించటం మొదలుపెట్టినప్పట్నించీ ఒక కొత్త ఉద్యమం దినదిన ప్రవరద్ధమానం అవడం మనం ప్రత్యక్షంగా చూశాం - అదే ఆనంద విష్ణవం.

మానవుని ఆనందాన్ని అధ్యయనం చేసే ఒక కొత్త మనస్తత్వశాఖ నెలకొల్పబడినప్పుడు ఈ కొత్త ఉద్యమం ఉద్భవించింది. 1998లో ఈ శాఖని క్రమబద్ధీకరించారు. గొప్ప పేరుప్రతిష్టలున్న మనస్తత్వవేత్త డా. మార్టిన్‌ సెలిగ్‌ మాన్‌ ఈ కొత్త శాఖకి అధ్యక్షుడిగా

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం అ 16 తన సేవలని అందిస్తానని అంగీకరించాడు. అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌కి కొత్తగా అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఆయన. ఈ కొత్త శాఖకి ఆయన “పాజిటివ్‌ సైకాలజీ” (సానుకూల మనస్తత్వం) అని నామకరణం చేశాడు. గత అర్ధ శతాబ్దంగా వైద్యరంగం మనస్తత్వశాస్త్రం కేవలం మానసికరోగాలకీ, మనిషిలోని దౌర్చల్యాలకీ, మానసిక వికారాలకీ మాత్రమే పరిమితమై ఉండిపోయిందన్న వాస్తవాన్ని తెలియజేస్తూ, మనస్తత్వ శాస్త్ర అధ్యయనంలో సానుకూలమైన భావాలకీ, మనిషిలోని బలాలకీ, “జీవితానికి సార్ధకతని ఇచ్చే విషయాలకీ” స్థానం కల్పించమని తన సహోద్యోగులకి సూచించాడాయన.

సెలిగ్‌మాన్‌ మరో ప్రతిభావంతుడైన పరిశోధకుడు మిహే చీక్‌సెంట్‌మహై (091109201౯240౧) తో కలిసి ఈ కొత్త రంగానికి పునాది వేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. త్వరలోనే ఆమెరికా, యూరప్‌ దేశాలలోని ముఖ్య పరిశోధకుల బృందం ఒకటి వీరితో కలిసింది. పాజిటివ్‌ సైకాలజీ వెంటనే అతివేగవంతంగా ప్రారంభం కావించబడింది. మానవచరిత్రలో మొట్టమొదటిసారి, శాస్రీయ అధ్వయనంలో భాగంగా ఆనందం శాస్ర సమ్మతమైన స్థానాన్ని నంపొదించుకుంది.

అప్పటినుంచీ ఆనంద విప్లవం సమాజంలో అన్ని రకాల వర్గాలమీదా తన (ప్రభావాన్ని పెంచుకుంటూ పోతూనే ఉంది. మీడియాలో అనందం అనే విషయం మీద కోకొల్లలుగా కథనాలు వెలువడ్డాయి. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కాలేజీల్లో పాజిటివ్‌ సైకాలజీ కోర్సులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకి హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఇంతవరకూ అత్యధిక ప్రాచుర్యం పొందిన 'ఇంట్రాడక్టరీ ఎకనామిక్స్‌” కోర్సు స్థానాన్ని “ది హ్యాపినెస్‌ కోర్స్‌” ఆక్రమించింది. ప్రతి సెమిస్టర్‌లోనూ విద్యార్థుల సంఖ్య 1,400 కన్నా ఎక్కువకి చేరుకుంటోంది. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాల మీద సైతం దీని (ప్రభావం కనిపిస్తోంది. ఉదాహరణకి జిడిపి (60%) ని అంతవరకూ దేశసాఫల్యానికి అతిముఖ్యమైన కాలతగా ఉపయోగిస్తున్న భూటాన్‌లో ఇప్పుడు జిఎన్‌హెచ్‌ (6౧03 1440041 [120018ట3) దేశవ్యాప్తంగా ఉండే ఆనందాన్ని అన్నిటికన్నా ప్రధానమైన కొలతగా భావిస్తున్నారు. అనేక దేశాలలో ప్రభుత్వ విధానాలను రూపొందించే నిపుణులు ఈ ఆనందం తాలూకు పరిశోధనల ఆధారంగా ప్రజలకి అవసరమైన విధానాలని రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నారు, దానికి మార్గాలు వెతుకుతున్నారు. స్మాట్‌లాండ్‌ లోని ఒక ప్రభుత్వ అధికారి దీనికి అత్యధికంగా స్పందిస్తూ, “వసం ఈ సానుకూల మనస్తత్వం అనే కొత్త శాస్త్రాన్ని సొంతం చేసుకోగలిగినట్టయితే, కొత్త జ్ఞానాన్ని సృష్టించే అవకాశాన్ని సంపాదించుకోగలుగుతాం,” అన్నాడు.

ఆనందం వల్ల కలిగే లాభాలు

ఈ ఆనందం అనే విప్లవానికి ఆజ్యం పోస్తున్న కారణాలలో ఒకటి - ఆనందం వల్ల కలిగే లాభాలని వెలికితీసిన పరిశోధనలు. గత పదేళ్లుగా జరుగుతున్న ఈ అద్భుతమైన పరిశోధనలు, ఆనందంవల్ల మనకి కేవలం హాయిగా ఉన్నట్టు అనిపించడమే కాక

20+ అనందాన్ని పొందే మార్గం ఇంకా చాలా లాభాలు ఉన్నాయని తెలియజేశాయి. జీవితంలోని విభిన్నమైన ముఖ్యమైన రంగాలలో అధిక సాఫల్యం సాధించాలని అనుకునేవారికి ఎక్కువ ఆనందాన్ని పొందే మార్గాన్ని అలవరచుకోవటం ఒక్కటే సరిపోతుంది. ఆనందంగా ఉండేవారు తన జోడీని ఆకర్షించగలుగుతారనీ, వివాహబంధాన్ని మరింత దృఢపరచుకుని, సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడుపుతారనీ, మెరుగైన తలిదండ్రులుగా పిల్లలని పెంచుతారనీ శాస్త్రీయ అధ్యయనాలవల్ల తెలిసింది. ఆనందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటారు, వారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది, గుండెకి సంబంధించిన వ్యాధులు తక్కువగా వస్తాయి. జీవితంలో ఆనందం కొరవడినవారికన్నా, ఆనందాన్ని అనుభవించేవారు దాదాపు పదేళ్లు ఎక్కువకాలం జీవిస్తారన్న విషయం కూడా నిరూపించబడింది. అంతేకాక అనందం మానసికారోగ్యాన్నీ లాఘవాన్నీ కలిగిస్తుంది, జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితులనీ, తీవ్రమైన మనస్తాపాలనీ ఎదుర్శానే శక్తిని పెంచుతుంది.

ఆనందంగా ఉండేవాళ్లు దేనిగురించీ పట్టించుకోరనీ, బుద్దిలేనివారనీ కొందరు అనుకుంటారు. ఈ అభిప్రాయం (ఫ్రెంచి నవలాకారుడు గుస్తావ్‌ ఫ్లాబర్ట్‌కి కూడా ఉండేది, ఒకచోట ఆయన ఇలా రాస్తాడు, “మూర్థంగానూ, స్వార్ధంతోనూ, మంచి ఆరోగ్యంతోనూ ఉండడం సంతోషంగా ఉండేందుకు అవసరమైన మూడు విషయాలు. అయినా మూర్ధత్వం లేనట్టయితే అన్నీ పూర్తిగా కోల్పోయినట్టే.” ఈ మధ్య జరిగిన పరిశోధనలలో త్త అభిప్రాయం తప్పు అని తేలింది. ఆనందం మరింత గొప్ప సృజనాత్మకశక్తికీ, మానసికంగా మరింత మెరుగ్గా పనిచేసేందుకూ దోహదం చేస్తుందని తెలిసింది.

ఆనందంవల్ల కలిగే లాభాలు ఉద్యోగం చేసేచోటకూడా కనిపిస్తాయి. ఆనందంగా ఉన్న వ్యక్తులు పనులు బాగా చెయ్యటమేకాక వ్యక్తిగతంగా కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఎక్కువ డబ్బు కూడా సంపాదించగలుగుతారు. నిజానికి ఒక వ్యక్తి అధిక ఆదాయం పొందడం అనేది అతని చదువుసంధ్యల స్థాయి కన్నా అతని ఆనందం న్థాయికే ద్యోతకమని అధ్యయనాలవల్ల వెల్లడి అయింది. సంతోషంగా ఉండే ఉద్యోగులు ఎంత ఎక్కువమంది ఉంటే ఆ సంస్థ అంత గొప్ప ఫలితాలని సాధించగలదని మరిన్ని విస్తృతమైన పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ఆ సంస్థలు నిరంతరం అధిక లాభాలని చూపిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. సంతోషంగా ఉండే ఉద్యోగులు ఉత్పాదకతని మరింత పెంచుతారు, సంస్థపట్ల విశ్వాసపాక్రులై ఉంటారు, తక్కువ సెలవలు తీసుకుంటారు, విడవకుండా కార్యాలయానికి వస్తారు, తోటిపనివారితో తక్కువ ఘర్షణ పడతారు, ఎప్పుడోగాని తమ ఉద్యోగాలని వదిలిపోరు, ఖాతాదారులకి ఎక్కువ సంతృప్తిని కలిగిస్తారు.

అందుచేత ఆనందం అద్భుతమైన వ్యక్తిగత ఫలితాలనీ, విజయాలనీ కలిగిస్తుం దనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ మరో అతిముఖ్యమైన విషయాన్ని కూడా మీ దృష్టికి తేవాలి, ఎక్కువ ఆనందాన్ని పొందే ప్రయత్నం ఒక వ్యక్తికి మాత్రమే కాక్క అతని కుటుంబానిక్తీ బంధుమిత్రులకీ నమాజానికీ కూదా మంచి లాభాలు కలగజేస్తుంది. నిజానికి ఆనందాన్ని పొందే మార్గం” అనే సిద్ధాంతాన్ని బలపరుస్తున్న శాస్త్రీయ నిరూపణల

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం ఈ 2] వెనుక ఉన్న కీలకమైన సూత్రాలలో ఇది కూడా ఒకటి. ఉదాహరణకి ఈ మధ్యనే జరిపిన ఒక అధ్యయనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆనందానికి ఒకరినుంచి ఒకరికి సంక్రమించే గుణం ఉంటుందనీ, ఒక వైరస్‌లా సామాజిక చట్రంలో అది విస్తరిస్తుందనీ ఈ అధ్యయనం వల్ల తేలింది. మరో దిశగా సాగిన అధ్యయనాలు మరికొన్ని ఫలితాలని తెలిపాయి. ఆనందం, సానుకూలభావాలూ పక్షపొతానికి విరుగుడులాగ పనిచేసి, మనకి భిన్నంగా ఉన్నారని అనుకుని, వారిపట్ల మన మనసులో సహజంగానే కలిగే పక్షపాత భావాన్ని మార్చివేస్తాయి. చివరికి వారికీ, మనకీ మధ్య ఉన్న అడ్డుగోడలని కూల్చివేస్తాయి! ఆనందంవల్ల కలిగే సత్ఫలితాలు సమాజం నలుదిక్కులకీ విస్తరిస్తాయి. ప్రజలలో ఆనందం తాలూకు సగటు స్థాయిని పెంచితే ఆ దేశంలో స్వేచ్చా, ప్రజాస్వామ్యమూ తాలూకు స్థాయి కూడా పెరుగుతుందని మరో అధ్యయనంవల్ల తెలిసింది!

ఆనంద విప్లవం వల్ల ఎక్కువమంది ఆనందాన్ని ఒక క్రమపద్ధతిలో, సూటిగా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సానుకూల మనస్తత్వశాస్తాన్నీ అది ప్రారంభించిన ఉద్యమాన్నీ విమర్శించేవాళ్లు కూడ కొందరున్నారు. కానీ వాళ్లు చేసే ప్రయత్నాలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే భోగం తప్ప మరేమీ కాదు. తమని తాము తృప్తిపరచుకునే ప్రయత్నం అది. పైన ఉదహరించిన నిరూపణని బట్టి, ఇతరుల సంక్షేమాన్ని పట్టించుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని అనుకుంటే ఆనందంగా ఉండడం, లేదా మీరు మరింత ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడం మీ కర్తవ్యం అనేది వాదనకి పనికివచ్చే అంశం. బౌద్ధుల జ్ఞానం - ఆధునిక విజ్ఞానం : ప్రాచ్య పాశ్చాత్య దేశాలకి వారధి

ఇరవయ్యవ శతాబ్ధంలో జరిగిన అతిముఖ్యమైన నంఘటన అవాుశా

పాశ్చాత్య దేశాలలో బౌద్ధమతం ్రనేశించటమే కావచ్చు.

  • ప్రభావశీలుడైన బ్రిటిషు చరిత్రకారుడు, ఆర్నాల్డ్‌ జె. టోన్సీ “ఆనందాన్ని పొందే మార్గం” పుస్తకానికి గల ఉద్దేశాలలో ఒకటి ప్రాచ్య పాశ్చాత్య దేశాలలోని మేలైన ఆలోచనలని మేళవించి మానవ జీవితంలో ఆనందాన్ని సాధించడం. ఇందుకోసం బౌద్ధ మతంలోని జ్ఞానాన్నీ పాశ్చాత్య విజ్ఞానాన్నీ సమగ్రమైన దృష్టితో పరిశీలించాం. ఈ మధ్యనే ఈ రకమైన ప్రయోగం గురించి నేను మాట్లాడేటప్పుడు శోతల్లో ఒకరు ఇలా ప్రశ్నించారు:

“విజ్ఞానపరమైన పరిశోధనలూ, అధ్యయనాలూ ఆనందాన్ని పొందడం ఎలాగో నిరూపించిన తరవాత ఇక బౌద్ద్భుల సిద్ధాంతాలూ, దలైలామా అభిప్రాయాలూ తెలుసుకోవలసిన అవసరం మనకేముంది? శాస్త్రీయ నిరూపణలు సరిపోవా?”

22 ఆనందాన్ని పొందే మార్గం

మంచి ప్రశ్నే ఆనందాన్ని పొందేందుకు శాస్త్రీయ మార్దాన్ని అనుసరించడానికి అమితంగా ఇష్టపడే నేను, శాస్త్రీయపద్ధతులు సామాన్యంగా నమ్మకమైన, ఉపయోగకరమైన ఫలితాలని ఇస్తాయని చెప్పడానికి వెనకాడను. కానీ అదే సమయంలో శాస్త్రీయపద్ధతి ద్వారా తెలుసుకున్నవన్నీ తిరుగులేని సత్యాలనీ, శాశ్వతమైన నియమాలనీ కూడా చెప్పలేం. శాస్త్రీయ జ్ఞానం శక్తివంతమైనది, సజీవమైనది - శాస్త్రీయ సిద్ధాంతాలు నిరంతరం పరిష్కరింపబడుతూ ఉంటాయి, వాటికి మార్పులూ చేర్చులూ చెయ్యబడుతూ ఉంటాయి, కొత్త సమాచారం దొరికినప్పుడల్లా వాటికి పునశ్చరణ జరుగుతూ ఉంటుంది. ఇక ఏ అధ్యయనమైనా ఎంతవరకూ సమంజసమైనది అని మూల్యాంకనం చేసేప్పుడు ఎప్పుడూ కూడా చేసే విధానంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది, ప్రయోగ నిర్మాణంలో లోటుపాట్లు ఉంటాయి, సంఖ్యాపరమైన విశ్లేషణ సవ్యంగా ఉండదు. ఇటు వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందరు వ్యక్తులమీద ఈ అధ్యయనం జరిగింది, ఆ అధ్యయనానికి నకళ్లు ఉన్నాయా అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఈ విషయాలని దృష్టిలో ఉంచుకుని, మానవుల ఆనందం గురించి శాస్త్రీయంగా జరిగే అధ్యయనాలు ఇంకా ్రారంభదశలోనే ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. మనం తెలుసుకున్నది చాలానే ఉన్నప్పటికీ, తెలియనిది ఇంకా ఎంతో ఉంది.

కీలకమైన ప్రశ్న ఏమిటంటే : ఆనందం గురించి జరుగుతున్న పరిశోధనలకి బౌద్ధుల తాళ్వికదృష్టి ఏవిధంగానైనా సహాయపడగలదా? అన్నది.

ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బౌద్ధమతం సాంప్రదాయక దృష్టితో చూస్తే మతవిశ్వాసం కాదు. నిజానికి, బుద్ధుడు మొదట్లో ఉపదేశించటం ప్రారంభించినప్పుడు అంధవిశ్వాసంతో తను బోధించేవన్నీ నమ్మవద్దని తన శిష్యులకి సలహా ఇచ్చాడు. తను చెప్పే అంశాల గురించి స్వయంగా శోధించి, పరీక్షించుకోమని చెప్పాడు. అనుభవం ద్వారా శోధించడం, సత్యంపట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉండడం, వాస్తవాన్ని కనుగొనేందుకు పూర్తిగా అంకితభావంతో పనిచెయ్యడం అనేవి బౌద్భులకీ, శాస్త్రజ్ఞులకీ ఉండే గుణాలు. దలైలామా వీటిపట్ల తనకున్న నిబద్ధతని ప్రదర్శించారనే అనాలి. ఈ సిద్ధాంతాల గురించి ఆయన ఇలా అంటారు, “బౌద్ధమత (గ్రంథాలలో, లేదా ముఖ్యమైన బౌద్ధమత విశ్వాసాలలో ఏవైనా అసత్యాలు ఉన్నాయని తిరుగులేని రుజువులు విజ్ఞానం చూపించగలిగినట్టయితే ఆ గ్రంథాలలోనూ, విశ్వాసాలలోనూ మార్పులు చెయ్యాల్సి ఉంటుంది.” ఈ ప్రపంచంలోని ఏ ఇతర మతాచార్యుడి నోటా దిగ్భ్రాంతి కలిగించే ఇటువంటి మాటలు రావటాన్ని దాదాపు ఊహించలేమనే అనాలి!

2,500 సంవత్సరాలుగా బౌద్ధులు తమలోని వనరులని వికసింపజేసేందుకు “మనసుకి శిక్షణ” ఇవ్వటం అనే అభ్యాసాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. రెండు శతాబ్దాల కన్నా ఎక్కువ కాలం గడిచిపోయిన తరవాత, ఫలితాలను ఇవ్వని పద్ధతులని వాళ్లు ఎప్పుడో వదిలేసి ఉంటారనీ, ఫలితాలు ఇవ్వగల పద్ధతులూ, నమ్మకమైన పద్ధతులూ మాత్రమే ఈనాటికీ కొనసాగుతున్నాయనీ మనం అనుకోవచ్చు. అందుకే మనం ఆనందాన్ని అర్థం చేసుకునేందుకూ, దీన్ని సంపాదించుకునే మార్గాన్ని అర్ధం చేసుకునేందుకూ

10వ వార్షికోత్సవ (ప్రచురణకి పరిచయం + 23 బౌద్ధమతం మనకి సాయపడగలదని అనుకోవటం సమంజసమే అనిపిస్తుంది. ఈ మధ్య జరిగిన కొన్ని విశేషమైన పరిణామాలు ఈ మాట నిజమని రుజువు చేస్తాయి. “ఆనందాన్ని పొందే మార్గం) మొదటిసారి ప్రచురింపబడ్డప్పుడు, మనిషి జీవితంలోని ఆనందం గురించి దలైలామా వెలిబుచ్చిన అభిప్రాయాలకి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు ఎక్కువగా అందుబాటులో లేవు. ఆ తరవాత ఆనందం గురించి పరిశోధనలు వెల్లువెత్తడం చూసి నేను చాలా సంతోషించాను. ఈ పుస్తకంలో దలైలామా వెలిబుచ్చిన అభిప్రాయాలని నిరంతరం ముందుకి సాగుతున్న పరిశోధనల పరంపర సమర్ధించడం చూస్తే నాకు మరింత సంతృప్తి కలుగుతోంది. ఈ కింద ఉదహరించిన పరిశోధనని చూడండి. ఆనందం, సానుభూతి గురించి ఇందులో చర్చించడం జరిగింది.

మాడిసన్‌లోని విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్న విఖ్యాత నాడీవ్యవస్థ శాస్త్రనిపుణుడు, డా. రిచర్డ్‌ డేవిడ్‌సన్‌ జరిపిన అత్యాధునిక పరిశోధనల ద్వారా కూడా అద్భుతమైన రుజువులు కనిపించాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డా. డేవిడ్‌సన్‌, ఆయనతో కలిసి పరిశోధనలు జరిపిన ఇతర శాస్త్రజ్డులూ, మెదడు ముందు భాగంలోని పొరలో ఆనందాన్ని కలగజేసే ఒక ప్రత్యేక స్థలం ఉందని కనుగొన్నారు. ఆ తరవాత డా, డేవిడ్‌సన్‌ ఈ “ఆనంది (ప్రవేశంలో సగటు పరిమాణంలో జరిగే చలనాలని కొలిచాడు. ఆమెరికాలో ఉండే సామాన్య జనంలోనుంచి ఒక పెద్ద సమూహాన్ని ఎంచుకుని ఈ పరిశోధనని వాళ్లమీద జరిపాడు. తరవాత కొందరు బౌద్ధ భిక్షువులని తన 'ప్రయోగశాలకి పిలిపించి వారిమీద కూడా అవే పరిశోధనలు జరిపాడు. బౌద్ధభిక్షువుల “ఆనంద” ప్రదేశంలో విపరీతమైన చలనశీలత ఉండడం, ఇంకెవరిలోనూ అటువంటి చలనశీలత ఇంతకుముందు తనకి కనబడకపోవడం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయాడు. ఈ తేడా ఎంత ఎక్కువగా ఉందంటే - ఆ కొలతలు అసలు వివరణపత్రంలో ఇమడక బైటికి విస్తరించాయి! అయినా అంతమాత్రాన ఇది దేనికీ రుజువు అని చెప్పలేం. కానీ ఇటువంటి అసాధారణమైన ఫలితాలు వ్యక్తిగతమైన ఆనందాన్ని మరింత ఎక్కువ పొందడానికి బొద్దులు చేసే అభ్యాసాలలో ఎంతో కొంత సార్థకత ఉందనే సూచిస్తాయి.

దయ, సానుభూతి, ఆనందాన్వేషణ

“ఆనందాన్ని పొందే మార్గం'లో మానవుల ఆనందానికి విశేషంగా దోహదం చెయ్యగల సంభావ్యత ఉన్న మూలసిద్ధాంతం ఏదైనా ఉందా అంటే అది ఇదే!

దయ, సానుభూతి, ఇతరుల నుంచి గురించి పట్టించుకోవడం అనే విషయాలకీ, ఒక వ్యక్తి ఆనందంగా ఉండడానికీ విడదీయరాని బంధం ఒకటి ఉంది. ఈ దారి రెండు వైపులా తెరుచుకుంటుంది ; ఆనందం ఎక్కువైతే మనిషిలోని సానుభూతి పెరుగుతుంది, సానుభూతి పెరగడంవల్ల మరింత ఆనందాన్ని పొందడం సాధ్యమవుతుంది.

ఇంకోలా చెప్పాలంటే, ఆనందంగా ఉండేవాళ్లు అవతలివారిని గురించి ఎక్కువ పట్టించుకుంటారనీ, వారికి సాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారనే

రత్న అనందాన్ని పొందే మార్గం కాక, దయనీ, సానుభూతినీ పెంపొందించుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఎక్కువ ఆనందాన్ని పొందగలడని కూడా ఈ అధ్యయనాలవల్ల వెల్లడయింది. ఒక సమాజంలో నివసించేవాళ్లు ఇటువంటి సిద్దాంతాలని విస్తృతంగా అనుసరిస్తే సమాజంమీద దాని ప్రభావం ఎంత గాఢంగా ఉంటుందో మనం సులభంగా తెలుసు కోవచ్చు. కానీ పాశ్చాత్యదేశాలలోని అధికసంఖ్యాకులు బౌద్ధమతాన్ని స్వీకరించి తమ మతం మార్చుకునే అవకాశం లేదు కనుక, ఈ సిద్ధాంతాలని పాశ్చాత్య దేశాలలో విసృతంగా అవలంబించాలంటే, వీటిని మతప్రసక్తి లేకుండా, శాస్త్రీయ దృష్టికోణం నుంచి పరిశీలించి వారికి అందించవలసి ఉంటుంది. ఇక రాబోయే పేజీల్లో ఆనందంగా ఉండేవాళ్లు ఎక్కువ దయతోనూ, సానుభూతితోనూ ్రవర్తిస్తారన్న నిజాన్ని ప్రయోగాల ద్వారా నిరూపించబడటాన్ని మీరు చూస్తారు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఎక్కువ సానుభూతిని అలవరచుకున్నవాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటారన్న విషయాన్ని తెలియజేసే పరిశోధనలేవీ నాకు కనబడలేదు. ఇది దలైలామాకి అత్యంత ప్రీతిపాత్రమైన విశ్వాసాలలో ఒకటి. కానీ ఈరోజు దీనికి రుజువులు ఉన్నాయి. దయ, సానుభూతి అలవరచుకుంటే మన ఆనందం ఇనుమడిస్తుందని ఆ పరిశోధనలు నిరూపించాయి. నాకు చాలా ఇష్టమైన ప్రయోగాలలో డా. డేవిడ్‌సన్‌ చేసినది ఒకటుంది. సానుభూతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఆయన ఒక ఫ్రెంచి టిబెటన్‌ బౌద్ధ భిక్షువును తన ప్రయోగశాలకి పిలిపించాడు. ఆ భిక్షువు గొప్ప శిక్షణ పొందిన నిపుణుడు. హిమాలయ ప్రాంతాలలో సానుభూతి గురించి చాలాకాలం ధ్యానం చేసినవాడు. (అంతేకాదు ఆ ప్రాంతంలో దాతృత్వ కార్యాల కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన సానుభూతిపరుడు). ఆ భిక్షువుని విశ్రాంతి తీసుకోమని, ఆ స్థితిలో అతని మెదడు పనిచేసే విధానాన్ని డేవిడ్‌సన్‌ గమనించాడు. ఆ స్థితిలో అతని మెదడు మూలాధార (019611౧0) క్రియాశీలతని కొలిచాక, ఆ తరవాత సానుభూతి గురించి ధ్యానం చెయ్యమని అతన్ని కోరాడు. అలా అతను ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు నాటకీయంగా మెదడు ముందుభాగంలో ఎడమపక్కకి చలనశీలత మారి 'ఆనందం అందించే స్థలంలో ప్రకాశం కనబడింది. ఆ ప్రయోగ ఫలితాలని డేవిడ్‌సన్‌ ఈ విధంగా తెలియజేశారు : “ఇతరులు సుఖసౌఖ్యాలతో జీవించాలన్న కోరిక మనలోకూడా సుఖసంతోషాలని కలగజేస్తాయి.” వ్యక్తిగతమైన అనందానికీ, సానుభూతికీ గల సంబంధాన్ని నిరూపించేందుకు ఇంతకన్నా మంచి రుజువు ఏముంటుంది? ప్రయోగశాలలో కాక బైట “వాస్తవ ప్రపంచంలో జరిపిన మరో అధ్యయనం ఉంది. డా. సోన్యా లైబోమర్‌స్కీ (0౯ 50% ణ90ణ'క్సి0 అనే రివర్‌సైడ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేసే సైకాలజీ ప్రొఫెసర్‌ కొందర్ని ఎంచుకుని వారంలో వదో ఒకరోజున “దయచూపించేందుకు” ఏవైనా ఐదు పనులు చెయ్యమని చెప్పింది. ఆరువారాలు గడిచాక ఆ అధ్యయనంలో పాల్గొన్న వారందరికీ తాము మొత్తం మీద ఎక్కువ ఆనందంగానూ, సంతృప్తిగానూ ఉన్నామన్న భావన కలిగింది.

10వ వార్షికోత్సవ ప్రచురణకి పరిచయం అ 2 “ఆనందాన్ని పొందే మార్గం” యొక్క భవిష్యత్తు

నామటుకు నాకు, ఈ పుస్తకం విజయం సాధించడంవల్ల కలిగిన మేలైన ఫలితం - దలైలామా చెప్పిన మాటలు తమకి ఏ విధంగా సాయపడ్డాయో, “అనందాన్ని పొందే మార్గం” తమ జీవితాలమీద ఎటువంటి సానుకూల ్రభావాలని చూపిందో తెలియజేస్తూ ఎందరో పాఠకులు అద్భుతమైన, భావుకతతో కూడిన ఉత్తరాల ద్వారా నాకు చెప్పడం. కొందరు పాఠకులు ఈ పుస్తకం తరవాత దీని కొనసాగింపుగా మరో పుస్తకం రాయమని సూచిస్తూ, ఇందులో రాయని మరికొన్ని అంశాలతో మరో పుస్తకం రాస్తే బావుంటుందన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. మొదటి పుస్తకం కొందరు పాఠకులకి ఎంత లాభకరంగా ఉందో తెలిశాక దలైలామా మరో పుస్తకం రాయడానికి సహకరిస్తానని ఒప్పుకున్నారు; అందుచేత పాఠకుల అభ్యర్థనలన్నీ పరిశీలించిన తరవాత నేనొక జాబితా తయారుచేశారు. మేమిద్దరం కూర్చుని ఆలోచించాక పాఠకులు సూచించిన విషయాలన్నీ రాయడానికి ఒక పుస్తకం సరిపోదన్న సంగతి తెలిసింది. అప్పుడు ఆ విషయాలని ఎక్కువ పుస్తకాలలో పొందుపరిచేందుకు వాటిని విభజించాం. మా రెండో పుస్తకం 'పనిచేసేచోట ఆనందం అనే కళ శీర్షికతో 2003లో ప్రచురింపబడింది. మొదటి పుస్తకంలాగే అది కూడా పాఠకాదరణ పొంది అత్యధికంగా అమ్ముడుపోయింది - అంతేకాదు, ఆ పుస్తకంవల్ల తాము పనిచేసేచోట అది చాలా ఉపయోగకరంగాఉందనీ, మేలుకుని ఉన్నప్పుడు ఎక్కువ సమయం పనిచేస్తూనే గదుపుతాము కనుక, పనిలో మరింత ఆనందాన్ని పొందేందుకు అది ఒక కరదీపికలా ఉపయోగపడిందనీ పాఠకుల స్పందన మాకు తెలియజేసింది. అంతర్గత వికాసం అనే విషయం మీద దృష్టి కేంద్రీకరించి రాసిన మొదటి రెండు పుస్తకాలూ ప్రముఖంగా వ్యక్తులకోసం రాసినవి. వ్యక్తులు శూన్యంలో నివసించరని మేము గ్రపించాం - ఒక సముదాయంగా, సమాజంలో, ఈ ప్రపంచంలో పరస్పరం సంబంధం కలిగి ఉంటాం. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి : హింస, ఉగ్రవాదం, యుద్దాలు, ఈర్ష్యా ద్వేషం, పక్షపాతం, దారిద్ర్యం - ఈ జాబితా సుదీర్చ మైనది. అప్పుడు ఒక ప్రశ్న మాముందుకొచ్చింది. ఇటువంటి కష్టాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తూ కూడా మనం అనందంగా ఎలా ఉండగలం? ఈ (బ్రహ్మాండమైన సమస్యలని అధిగమించేందుకు ఒక ఒంటరి వ్యక్తి ఎలా ప్రయత్నించగలడు? ఏం చెయ్యగలడు? "కష్టాలతో నిండిన ప్రపంచంలో ఆనందాన్ని పొందే మార్గం” శీర్చికతో

మేము మా తరవాతి (గ్రంథంలో ఈ ప్రశ్నలకి సమాధానాలకోసం అన్వేషించాం. పది సంవత్సరాల క్రితం మొదటిసారి ప్రచురింపబడ్డప్పుడు ఈ “ఆనందాన్ని పొందే మార్గం” ఎంత సందర్భోచితంగా ఉందో ఈనాడు కూడా ఇందులోని ప్రతి వాక్యమూ అంతే ప్రాసంగికత కలిగి వుంది. ఈ మధ్యకాలంలో మనిషి ఆనందానికి సంబంధించిన విజ్ఞానంలో నాటకీయమైన వికాసం చోటుచేసుకోవడం చూశాం. పరిశోధనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బౌద్ధమత సిద్ధాంతాలు చాలా విధాలుగా పాశ్చాత్య విజ్ఞానంతో కలిసిపోయి కేంద్రీకృతమవుతున్నట్టు తోస్తోంది. తరువాతి పుటల్లో ఆనందాన్ని పొందే

26 +* ఆనందాన్ని పొందే మార్గం

విధానం బౌద్ధుల జ్ఞానం అనే దృష్టితో చూసినా, ఆధునిక విజ్ఞాన పరిశోధనల దృష్టితో చూసినా - దానీ ప్రయోజనం మాత్రం ఒకటే : ఈ పుస్తకంలో మీ ముందు ఉంచిన ఆలోచనలని మీ జీవితాలకి అలా అన్వ్నయించుకోవడం ద్వారా జీవితంలోని బాధలనీ, కష్టాలనీ అధిగమించి అసలుసిసలైన శాశ్వతానందాన్ని వెతుక్కోగలరన్న ఆశ.

రచయిత ముందుమాట

ఈ పుస్తకంలో దలైలామాతో నేను జరిపిన అనేకమైన సంభాషణలని పొందుపరచడ మైంది. అరిజోనాలోనూ, భారతదేశంలోనూ మేమిద్దరం ఏకాంతంగా కలుసుకుని చర్చించుకోవడం ఈ పుస్తకానికి ఆధారమైంది. మరింత ఆనందంగా జీవించడం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుని, ఒక పాశ్చాత్య దేశపు మనస్తత్వవేత్తగా నేను గమనించిన విషయాలని సమన్వయపరచి పుస్తకరూపంలో తీసుకురావాలన్నదే మా చర్చల ముఖ్యోద్దేశం. తన అభిప్రాయాలనీ, ఆలోచనలనీ వీలైనంత బాగా వెలిబుచ్చేందుకు నేను ఈ పుస్తకాన్ని నాకిష్టమైన విధంగా రూపొందించుకోవచ్చని దలైలామా పెద్దమనసుతో ఒప్పుకున్నారు. సంభాషణల రూపంలో రాస్తే ఈ పుస్తకం చదివేందుకు మరింత ఆసక్తికరంగా ఉంటుందనీ, అదే సమయంలో దలైలామా తన ఆలోచనలని దైనందిన జీవితంలో ఎలా అమలుపరుచుకుంటారో కూడా పాఠకులు అర్ధం చేసుకోగలుగుతారనీ నాకనిపించింది. దలైలామా అంగీకారంతో నేనీ పుస్తకాన్ని విషయానుగుణంగా పొందు పరిచాను. ఒక్కొక్కసారి వేర్వేరు సందర్భాల్లో చర్చించుకున్న విషయాలని సమగ్రంగా ఉండేట్టు ఒకేచోట కలిపి మీముందుంచాను. అలాగే విషయాన్ని ఎక్కువ స్పష్టంగా చెప్పగలిగేందుకు, నేను అవసరమని అనుకున్నచోట, అరిజోనాలో ఆయన ఇచ్చిన బహిరంగోపన్యాసాలనుంచి కొంత విషయాన్ని తీసుకుని ఆయన అనుమతితో జోడించాను. దలైలామాకి దుబాసీగా పనిచేసిన డా. తుప్తెన్‌ జిన్‌పా ఆఖరి రాతప్రతిని సమీక్షించి, సంపాదకత్వం చేసేప్పుడు దలైలామా ఆలోచనలని నేను వివరించడంలో ఎక్కడా

పొరపాట్లు దొర్లకుండా దయతో సాయం చేశారు. చర్చించుకున్న అంశాలని వివరించేందుకు ఎన్నో సందర్భాలనీ, వ్యక్తిగత అనుభవాలనీ ఉదహరించాం. ఆంతరంగికమైన వివరాలనీ, వ్యక్తిగతమైన అనుభవాలనీ గోప్యంగా ఉంచేందుకు ఉదాహరణలు ఇచ్చిన ప్రతి సందర్భంలోనూ నేను పేర్లనీ, వివరాలనీ ఫలానా

వ్యక్తి అని గుర్తించగల లక్షణాలనీ మార్చి రాశాను. హోవర్డ్‌ సి. కట్లర్‌ ఎమ్‌.డి.

27

భాగం 1 ఆనందాన్ని పొందే మార్గం ఖ్‌

అధ్యాయం 1 ఆనందాన్ని పొందే మార్గం గ్‌

ళయ్సు న జీవితానికి నిజమైన ప్రయోజనం ఆనందం కోసం ప్రయత్నించడమేనని నా

నమ్మకం. అది చాలా స్పష్టంగా చెప్పగలను. ఒక వ్యక్తికి మతంలో నమ్మకం ఉన్నా లేకపోయినా, అతను ఏ మతాన్ని నమ్మేవాడయినా - మనందరం జీవితంలో మరింత మెరుగైనదానికోసమే ప్రయత్నిస్తున్నాం. అందుచేత నా ఉద్దేశం, మన జీవితం పయనించేది ఆనందంవైపే...”

అరిజోనాలో చాలామంది శ్రోతలున్న సభలో దలైలామా ఈ మాటలతో తాను చెప్ప దల్పుకున్న విషయం లోతులని స్పృశించారు. కానీ జీవితానికి ఆనందమే అసలు ప్రయోజనమని ఆయన అన్న మాటలు నా మనసులో ఒక ప్రశ్చని రేకెత్తించాయి. ఆ ఉపన్యాసం ముగిశాక, మేమిద్దరమే ఉన్నప్పుడు “మీరు ఆనందంగా ఉన్నారా?” అని అడిగాను.

“ఉన్నాను; అని ఒక్క క్షణం ఆగి, “అవును...కచ్చితంగా,” అన్నారు. ఆయన ప్రశాంతంగా, నిజాయితీగా ఆ మాట అన్న తీరు ఆ అనుమానాన్ని పూర్తిగా తొలగించి వేసింది. ఆ మాటలలోని నిజాయితీ ఆయన ముఖంలోనూ, కళ్లలోనూ ్రతిఫలించడం నాకు కనబడింది.

“కానీ మనలో ఎక్కువ మందికి ఆనందం సరైన లక్ష్యమేనంటారా? అది నిజంగా సాధ్యమేనా?” అని అడిగాను.

“అవును. మనసుకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆనందాన్ని సాధించవచ్చని నేను నమ్ముతాను.”

ఒక మనిషిగా ఆలోచిస్తే ఆనందం సాధించటాన్ని ఒక లక్ష్యంగా అనుకోవడాన్ని నేను కాదనలేకపోయాను. కానీ ఒక మనస్తత్వవేత్తగా ఆలోచించినప్పుడు నా మనసు మీద (ఫ్రాయిడ్‌ సిద్ధాంతాల ప్రభావం అద్దుపడింది. 'మనిషి “ఆనందంగా” ఉండాలని అనుకోవడం

ప్రే

32 ఆనందాన్ని పొందే మార్గం

ఈ “సృష్టి” ప్రణాళికలో ఒక భాగం కాదని అనవలసి వస్తుంది,” అంటాడు ్రాయిడ్‌. నా వృత్తిలో ఉండే చాలామంది మనస్తత్వవేత్తలుగా పొందిన శిక్షణ మా ఆలోచనలని భయంకరంగా తయారుచేసింది. “మతిస్థిమితం కలిగించేంత దుఃఖాన్నుంచి కోలుకున్న మనిషి కేవలం సామాన్యమైన దుఃఖాన్ని మాత్రమే అనుభవించే స్థితికి చేరుకోగలడు,' అనే ఆశకన్నా ఎక్కువ ఆశించడం సాధ్యం కాదని మా నమ్మకం. అటువంటి అభిప్రాయం గల నేను, ఆనందం పొందేందుకు ఒక స్పష్టమైన, సూటిఐన దారి ఉంది అనే ఆలోచనని జీర్ణించుకోలేకపోయాను. అది నా నమ్మకాలని సమూలంగా మార్చివేసేదిగా అనిపించింది. ఎన్నో ఏళ్లు మనస్తత్వశాస్త్రంలో శిక్షణ పొందిన నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, మా చికిత్సలో “ఆనందం” అనే మాటని ఒక లక్ష్యంగా ఉపయోగించినట్టు ఎంత మాత్రం జ్ఞాపకం రాలేదు. రోగి నిస్పృహనీ, చింతనీ తొలగించే విషయం గురించీ, మనసులోని సంఘర్షణలనీ, మానవ సంబంధాలలో గల సమస్యలనీ పరిష్కరించడం గురించీ బోలెడంత చర్చ ఉంది, కానీ ఎక్కడా కూడా ఆనందం అనే లక్ష్యాన్ని సాధించాలన్న స్పష్టమైన ఉద్దేశం మాత్రం లేదు.

నిజమైన ఆనందాన్ని సంపాదించుకోవటం అనే భావన పాశ్చాత్య దేశాలలో ఎప్పుడూ అస్పష్టంగా, పట్టు దొరకనిదిగా, అంతుపట్టనిదిగానే కనిపించేది. 'వ్యాపీ” అనే ఆంగ్లపదం కూడా ఐస్‌లాండ్‌కి చెందిన “'హ్యాప్‌” అనే పదం నుంచి పుట్టింది. “హ్యాప్‌ అంటే అదృష్టంకొద్దీ, యాదృచ్చికంగా లభించేదని అర్ధం. మనలో చాలామందికి ఆనందం ఒక అంతుపట్టని విషయమనే అభిప్రాయం ఉంది. జీవితంలో ఆహ్షాదాన్ని అందించే క్షణాలు వచ్చినప్పుడు ఆ ఆనందం ఆకాశంనుంచి ఊడిపడినట్టు అనిపిస్తుంది మనకి. పాశ్చాత్య దేశంలో పుట్టిన నా బుద్ధికి ఆనందాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచన తట్టలేదు. అభ్యాసం, శిక్షణ ద్వారా దాన్నీ నిలిపి ఉంచుకోవచ్చనీ, మనసుని ఆ విధంగా మలుచుకోవచ్చనీ కూడా నేను అనుకోలేదు.

దలైలామా చెప్పిన ఆ మాటని నేను అంగీకరించకపోయేసరికి ఆయన వెంటనే దాన్ని ఇలా వివరించారు, 'బుద్ధికి శిక్షణ ఇవ్వవచ్చు అని అన్నప్పుడు నేను ఒక మనిషిలో ఉండే తెలివితేటల గురించీ, మేధస్సు గురించీ మాట్లాడడం లేదు. టిబెట్‌ భాషలో *సెమ్‌” అనే ఒక పదం ఉంది. దాని అర్థం విసృతమైనది. 'మనస్సు”, 'ఆత్మ అనే అర్ధంలో నేను “బుద్ధి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. అందులో మేధస్సు, భావనలూ, మనసు, బుద్ధి అన్నీ కలిసిపోయి ఉంటాయి. మనలో ఉండే క్రమశిక్షణని వెలికితీసి మన స్వభావాన్ని మార్చుకోవడం సాధ్యమే. జీవితంపట్ల మనకి ఉన్న దృష్టికోణాన్నీ ధోరణినీ పూర్తిగా మార్చుకోగలుగుతాం.

“మనలోని ఈ క్రమశిక్షణ గురించి మాట్లాడుకునేప్పుడు, అందులో ఇంకా ఎన్నో విషయాలూ, పద్ధతులూ ఉన్నాయన్నది గుర్తుంచుకోవాలి. కానీ స్థూలంగా చూసినప్పుడు మనం గుర్తించవలసినది - ఆ (క్రమశిక్షణ మనని ఆనందంవైపు తీసుకెళ్లే కారణాలనీ, బాధలవైపు తీసుకెళ్లే కారణాలనీ. ఆ పని చేశాక బాధలవైపు తీసుకెళ్లే కారణాలని ఒకటొకటిగా తొలగించాలి, అనందమార్గంలో ముందుకి నడిపే కారణాలని వికసింప జేసుకోవాలి. అదే సరైన పద్ధతి.”

ఆనందాన్ని పొందే మార్గం + ౩3 తనకి వ్యక్తిగతంగా కొంత ఆనందం లభించిందని అంటారు దలైలామా. అరిజోనాలో ఆయన ఉన్న ఆ వారం రోజులూ ఆయన్ని గమనించి ఆ వ్యక్తిగతమైన ఆనందం కొద్ది క్షణాల పరిచయంలోనే ఇతరులకి స్నేహహస్తాన్ని అందించడంలోనూ, మనుషులమధ్య సాన్నిహిత్యమూ, సౌహార్దభావమూ సృష్టించడంలోనూ ఎలా సాయపడుతుందో తెలుసుకున్నాను.

ఒకరోజు ఉదయం (శ్రోతల ముందు ఉపన్యాసం ఇచ్చిన తరవాత తను బసచేసిన హోటల్‌కి దలైలామా తన అనుయాయులతో కలిసి నడిచి వెళ్తున్నారు. హోటల్లో పనిచేసే ఒక మహిళ లిఫ్ట్‌ దగ్గర నిలబడి ఉండడం చూసి ఆయన అగి, “మీది ఏ ప్రాంతం?” అని అడిగారు. ముదురు ఎరుపు రంగు దుస్తులు తొడుక్కున్న ఒక విదేశీయుడినీ, ఆయన పట్ల ఎంతో గౌరవభావంతో ప్రవర్తిస్తున్న ఆయన శిష్యబృ్బందాన్నీ చూసి ముందు ఆమె కొద్దిగా జంకింది. తరవాత చిరునవ్వు నవ్వుతూ, “మెక్సికో,” అని చెప్పింది. ఆమెతో కబుర్లు చెప్పేందుకు కొద్దిసేపు అక్కడే ఆగి ఆయన ముందుకి సాగారు. ఆయన వెళ్లిపోయాక కూడా అమె ముఖం ఉత్సాహంతో, సంతోషంతో మెరిసిపోతూనే ఉంది. మర్నాడు ఉదయం ఆమె మళ్లీ అదే సమయానికి, అక్కడికి వచ్చింది. ఈసారి ఆమెవెంట మరో మహిళ కూడా ఉంది. ఆయన లిఫ్ట్‌లోకి వెళ్తూ ఉంటే వాళ్లిద్దరూ చాలా ఆప్యాయంగా ఆయన్ని పలకరించారు. వాళ్ల మధ్య సంభాషణ చాలా క్లుప్తంగా నడిచింది, కానీ మళ్ళీ తమ పనులు చేసుకునేందుకు వెళ్లేప్పుడు ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఆ తరవాత ప్రతిరోజూ అదే సమయానికి అదేచోట మరింతమంది సిబ్బంది ఆయనకోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. వారంరోజులూ ముగిసే సమయానికి ఆయన లిస్ట్‌ దాకా నడిచివచ్చే దారిలో హోటల్లో పనిచేసే స్త్రీలు ఎంతోమంది గంజిపెట్టిన తెలుపు, మబ్బురంగు యూనిఫారాలు వేసుకుని వరసగా ఆయనకి స్వాగతం పలికేందుకు నిలబడి ఉండడం కనిపించింది. మనం జీవించి ఉండేది కొంతకాలమే. ఈ క్షణాన ఎన్నోవేలమంది ఈ (ప్రపంచంలో పుడుతున్నారు. కొందరు కొన్ని రోజులో, కొన్ని వారాలో మాత్రమే జీవించి వ్యాధి[గ్రస్తులయో, మరో కారణాలవల్లో చనిపోవడం గొప్ప విషాదం. ఇంకా కొందరు ఒక శతాబ్దం వరకూ జీవితకాలాన్ని పొడిగించగలుగుతారు - ఇంకా దాన్ని కూడా దాటేస్తారేమో! తమ జీవితం అందించే విజయాలనీ, నిరాశలనీ, ఆనందాన్నీ ద్వేషాన్నీ (ప్రేమనీ పూర్తిగా ఆస్వాదించ గలుగుతారు వాళ్లు. ఆ విషయం మనకి ఎప్పటికీ తెలీదు. కానీ మనం ఒక్కరోజు జీవించినా, వందేళ్లు జీవించినా అసలు ్రశ్న ఎప్పుడూ మనల్ని సవాలు చేస్తూనే ఉంటుంది; మన జీవితానికి ప్రయోజనం ఏమిటి? జీవితానికి సార్ధకత చేకూర్చేది ఏమిటి?

ఆనందాన్ని సాధించడమే మన మనుగడకి ప్రయోజనం. ఇది ప్రపంచజ్ఞానానికి సంబంధించిన విషయం. గ్రీకు వేదాంతి అరిస్టాటిల్‌ నుంచి అమెరికన్‌ వేదాంతి విలియమ్‌ జేమ్స్‌ దాకా ఈ ఆలోచనని అంగీకరించారు. కానీ వ్యక్తిగత ఆనందాన్ని ప్రయత్నించేవారి జీవితం స్వార్థంతోనూ, తమ ఇష్టప్రకారం అన్నీ ఉండాలని అనుకునేవారి

పతీ + ఆనందాన్ని పొందే మార్గం తోనూ నిండినది అనిపించుకోదా? కానక్కర్లేదు. నిజానికి ఎన్నో సర్వేలు చేసిన తరవాత అనంత్బవ్తితో జీవించేవారే ఎప్పుడూ తమగురించే ఆలోచిస్తూ ఉంటారనీ, అందరితో కలవరనీ, దిగులుగానూ, ఎదురుతిరిగే స్వభావం గలవారనీ స్పష్టమైంది. దీనికి వ్యతిరేకంగా, సంతోషంగా ఉండేవాళ్లు సామాన్యంగా స్నేహభావంతో, సృజనాత్మకంగా, సర్జుకుపోయేవారుగా ఉంటారు. అసంతృప్తితో జీవించేవారికన్నా వీళ్లు జీవితంలో ఎదురయే నిరాశా నిస్పృహలను సులభంగా భరిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం - అసంతృప్తిగా, అనందం అనుభవించకుండా జీవించేవారికన్నా వీళ్లు ఎక్కువ 'పేమగానూ, క్షమాగుణం ఉన్నవారిగానూ కనిపిస్తారు.

ఆనందంగా ఉండేవాళ్లు మనసువిప్పి మాట్లాడతారనీ, ఇతరులకి సాయం చెయ్యడానికి ఎప్పుడూ ముందుకొస్తారనీ తెలిపేందుకు పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన ప్రయోగాలను చేపట్టారు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి హఠాత్తుగా ఫోన్‌ బూత్‌లో డబ్బు దొరికేట్టు చేసి అతనికి ఆనందాన్ని కలిగించడంలో కృతకృత్యులయారు. ఒక ప్రయోక్త అటుగా వెళ్తున్న వాడిలా నటిస్తూ ఒక కాయితాల కట్టని జారవిడిచాడు. డబ్బు అనుకోకుండా దొరికిన ఆ వ్యక్తి అతనికి సాయం చేస్తాడా లేదా అని ప్రయోగం చేసేవారు. రహస్యంగా గమనించారు. మరో ప్రయోగంలో కొందరికి హాస్యరసప్రధానమైన పాటలు వినిపించారు, వాళ్లలో ఉల్లాసం పెరిగాక (ప్రయోక్తలతో ముందే అనుకున్న ప్రకారం) ఒక వ్యక్తి సాయం కోసం వారి దగ్గరకి వెళ్లి డబ్బు అప్పు ఇమ్మని అడిగాడు. ఆనందంగా ఉన్న వ్యక్తులు సాయం చేసేందుకు ముందుకొచ్చారనీ, ఆహ్లాదానికి గురికాని మరో “బృందం” అటువంటి అవకాశం వచ్చినప్పటికీ స్పందించలేదనీ ఆ ప్రయోగం చేసినవారు తెలుసుకున్నారు.

ఇటువంటి ప్రయోగాలవల్ల సంతోషంగా ఉండాలని ప్రయత్నించే మనుషులు స్వార్థంతోనూ, తమ ఇష్టప్రకారమూ ్రవర్తిస్తారన్న అభిప్రాయాన్ని పటాపంచలు చెయ్యడం సాధ్యమవుతుంది. ఇటువంటి ప్రయోగాలని మనం రోజువారీ జీవితాన్నే ఒక ప్రయోగ శాలగా మార్చుకుని మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఉదాహరణకి, మనం ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నామనుకోండి. ఒక ఇరవై నిమిషాలతరవాత వాహనాలు చాలా నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తాయనుకుందాం. పక్క లేన్‌లో ఉన్న ఒక మహిళ మన లేన్‌లోకి వచ్చి, మనకన్నా ముందుకి పోవాలని ఉందని సైగ చేస్తుంది. మన మనసు సంతోషంగా ఉంటే మనం కారు వేగాన్ని తగ్గించి ఆమెకి దారి ఇస్తాం. కానీ మనం దుఃఖంలో ఉంటే కారు వేగం పెంచి, ఆమెకి దారి ఇవ్వం, మనమే ఆ ఖాళీలోకి కారుని తీసుకెళ్తాం. “ఇంత సేపటినుంచీ నేను కూడా ఇక్కడ ఇరుక్కుపోలేదా, తనకి మాత్రం ఏమిటి తొందర? అనుకుంటాం.

మన జీవితానికి ప్రయోజనం ఆనందాన్వేషణ అనే ప్రాథమిక అంశంతో ప్రారంభిద్దాం. అ లక్ష్యం వాస్తవమైనదీ, మనకి కళ్లముందు కనిపించేదీ, దాన్ని చేరుకునేందుకు సానుకూలమైన ప్రయత్నాలు మనం చెయ్యాలని అనుకుందాం. మరింత ఆనందాన్నిచ్చే జీవితాన్ని అందుకునేందుకు అవసరమైన కారణాలని మనం గుర్తించడం మొదలుపెట్టాక, ఆనందాన్వేషణ ఒక వ్యక్తికే కాక, అతని కుటుంబానికీ, మొత్తం సమాజానికీ ఎలాంటి ప్రయోజనాలు సమకూర్చిపెట్టగలదో మనం నేర్చుకుంటాం.

అధ్యాయం 2 ఆనందానికి మూలకారణాలు

రె 0౦ డేళ్లక్రితం నా స్నేహితురాలు ఒకామెకి అనుకోకుండా గొప్ప అదృష్టం కలిసొచ్చింది.

అంతకు పద్ధెనిమిది నెలల ముందు, తన స్పేహితులిద్దరు చిన్న హెల్త్‌కేర్‌ కంపెనీ ప్రారంభిస్తూ ఉంటే తన నర్సు ఉద్యోగానికి స్వస్తి చెప్పి వాళ్లకి సాయం చేసేందుకు దానిలో చేరింది. ఆ కంపెనీ గొప్ప విజయం సాధించింది. పద్ధెనిమిది నెలల్లో ఆ కంపెనీని మరొకరు పెద్దమొత్తం చెల్లించి తమ కంపెనీతో కలిపేసుకున్నారు. పాత కంపెనీలో కింది స్థాయిలో ఉద్యోగం సంపాదించుకున్న నా స్నేహితురాలు, దీనివల్ల కొత్త కంపెనీలో ఎన్నో షేర్షని సాంతం చేసుకోగలిగింది. ముప్ఫెరెందేళ్ల వయసులోనే పదవీవిరమణ చేసేందుకు సిదభయేంత డబ్బు ఆమె సంపాదించింది. ఈ మధ్యనే ఆమెని కలుసుకున్నప్పుడు జీవితం సంతోషంగా గడుస్తోందా, అని అడిగాను. “ఊం, ఇష్టమైన ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యడం, ఎన్నో రోజులుగా చెయ్యాలనుకుంటున్న పనులు చెయ్యగలగడం బాగానే ఉంది. కానీ, ఒకటి మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది; అంత పెద్ద మొత్తం సంపాదించుకున్నందుకు మొదట్లో ఉండిన ఉత్సాహం తగ్గిపోయాక మళ్లీ జీవితం మామూలుగానే ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే కొన్ని మార్పులు రాలేదని కాదు, కొత్త ఇల్లు కొనుక్కున్నాను, ఇంకా సుఖంగా జీవించేందుకు అన్నీ అమర్చుకున్నాను, కానీ మొత్తం మీద మునుపటికన్నా అనందంగా జీవిస్తున్నానని మాత్రం అనిపించడం లేదు,” అంది అమె.

ఈ స్నేహితురాలు ఇలా లాభాలు గడించి జీవితాన్ని మరింత సుఖంగా గడిపే అదే సమయంలో అదే వయసున్న నా మరో మిత్రుడు తనకి హెచ్‌ఐవి ఉందని తెలుసుకున్నాడు. ఆ పరిస్థితిని ఎలా తట్టుకుంటున్నావని అడిగాను, “మొదట నేను విపరీతంగా కుంగి పోయాను. నాలో ఈ వైరస్‌ ఉందన్న విషయాన్ని అంగీకరించేందుకు నాకు ఒక ఏడాది పట్టింది. కానీ గడిచిన ఈ ఏడాదిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ప్రతిరోజునీ నేను పూర్తిగా గడపడానికి ప్రయత్నిస్తున్నాను, ప్రతి క్షణం

35

36 + ఆనందాన్ని పొందే మార్గం

విలువైనదిగా అనిపిస్తోంది. ఇంతకుమునుపు ఎన్నడూ లేనంత ఆనందంగా జీవిస్తున్నాను. నాకు లభించినవాటిపట్ల సంతోషం కలుగుతోంది. ఇంతవరకూ నాలో ఎయిడ్స్‌ వ్యాధి లక్షణాలు రానందుకు సంతోషిస్తున్నాను. నా దగ్గరున్న వాటిని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను. హెచ్‌ఐవి వైరస్‌ నా శరీరంలో ఉండకుండా ఉంటే బావుండునని అనిపిస్తుంది, నిజమే. కానీ అది నా జీవితాన్ని మార్చేసిందని మాత్రం చెప్పగలను... సానుకూలంగా మలిచింది...” అన్నాడతను.

“ఎలా?” అన్నాను.

“ఉదాహరణకి, ఎప్పుడూ కూడా నేను భౌతికవాదినని నీకు తెలుసు. కానీ గత ఏడాదిగా నేను చావుకి దగ్గరపడ్డానన్న వాస్తవాన్ని అంగీకరించే క్రమంలో నాముందు ఒక కొత్త ప్రపంచపు ద్వారాలు తెరుచుకున్నాయి. జీవితంలో మొదటిసారి ఆధ్యాత్మిక విషయాలతో ప్రయోగం చేస్తున్నాను. ఆధ్యాత్మికత గురించి పుస్తకాలు చదువుతున్నాను, ఇతరులతో చర్చలు చేస్తున్నాను... ఇంతక్రితం ఎప్పుడూ అసలు నేను ఆలోచించని ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాను. ఉదయం నిద్రలేచి ఆరోజు నాకు అందించబోయే జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించడమే నాలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.”

ఈ ఇద్దరి ఉదాహరణల ద్వారా మనకి అర్థమయేది ఏమిటంటే, బావ్వా సంఘటనల కన్నా ఒక మనిషి మాననికస్థితి ఎలా ఉంది అన్నదే అతను అనుభవించే ఆనందాన్ని నిర్జారిస్తుంది. విజయం తాత్కాలికంగా మన మనసుని పొంగిపోయేట్టు చెయ్యచ్చు, విషాదం కొంతకాలం మనని అగాధంలోకి నెట్టచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మనలోని ఆనందం తాలూకు సగటు స్థాయి మామూలు దశకి తిరిగివస్తుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు దీన్ని అనుసరణీయత (1610240౧) అంటారు. ఈ సిద్ధాంతం మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం; జీతం పెరుగుదల, కొత్త కారు, లేక మన తోటివారిలో గుర్తింపు పొందడం కొంతకాలం మనకి ఉల్లాసాన్ని కలిగించవచ్చు, కానీ త్వరలోనే మనం మనకి అలవాటైన స్థితికి చేరుకుని మునుపు ఉన్నంత సంతోషాన్నే అనుభవిస్తాం. అదే విధంగా, ఒక మిత్రుడితో వాదన, కారు మరమ్మతు చేయించాల్సి రావడం, లేక చిన్న గాయం తగలడం మనకి చికాకు కలిగించవచ్చు. కానీ కొద్ది రోజుల్లోనే మనలో ఉత్సాహం మళ్లీ పుంజుకుంటుంది. -్‌ ర

ఇటువంటి ధోరణి చిన్న చిన్న దైనందిన విషయాలలోనే కాదు, తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉంటుంది - ఆ తీవ పరిస్థితి విజయాలదే కావచ్చు, విధ్వంసాలదే కావచ్చు. ఉదాహరణకి, అమెరికాలోని ఇల్లినాయ్‌ రాష్ట్రంలో లాటరీలు గెలుచుకున్నవారినీ, బ్రిటిష్‌ పూల్‌ ఆటలో విజేతలైన వారినీ పరీక్షించిన పర్యవేక్షకులు, వారిలో ఇనుమడించిన ఉత్సాహం, అనందం కొంతసేపటికి తగ్గిపోయి, క్షణం క్షణం జీవితంలో పొందే ఆనందం స్థాయికి చేరుకున్నారని గమనించారు. క్యాన్సర్‌, అంధత్వం, పక్షవాతం వంటి వ్యాధులకి గురై నిస్బృహలో కూరుకున్నవారు సైతం ఎప్పుడో ఒకప్పుడు తమ రోజువారీ జీవితంలో దొరికే మామూలు ఆనందాన్ని అనుభవించగలరని ఇంకో రకమైన అధ్యయనాల వల్ల

అనందానికి మూల కారణాలు త ప తెలిసింది. ఆ నిస్ఫృహకీ, సామాన్యస్థాయి ఆనందానికీ మధ్య పరిస్థితులకి సర్దుకునే కాలం అనేది కొన్నాళ్లు ఉంటుంది.

అలాంటప్పుడు, బాహ్యపరిస్టితులు ఎలాటివైనప్పటికీ ఒక వ్యక్తి తాను సామాన్యంగా ఆనందాన్ని అనుభవించే మునుపటి స్థితికి చేరుకోగలడు అనేదే నిజమైతే, అ సామాన్య స్థాయిని నిర్ణయించేది ఏది? ఇంకా ముఖ్యమైన ప్రశ్చ, దాన్ని మార్చుకోవడం సాధ్యమేనా? ఇంకా పై స్థాయికి తీసుకెళ్లలలమా? ఒక వ్యక్తికి స్వభావసిద్ధంగా ఉండే ఆనందమూ, సుఖంగా ఉన్నానన్న భావనా నిర్ణయించేది కొంతవరకూ జన్యువులని కొందరు ఈ మధ్య ఒక వాదనని లేవదీశారు. ఒకే పోలికలో పుట్టిన కవలపిల్లలు (ఒకే రకమైన జన్యు నిర్మాణం గలవారు) కలిసి ఒకేచోట పెరిగినా, విడిగా పెరిగినా వారిలో సుఖంగా ఉన్నానన్న భావన ఒకే స్థాయిలో ఉంటుందని ఇటువంటి అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఆ రకంగా ఈ పరీక్షలు ఆనందాన్ని జన్యువుతో ముడిపెట్టి, పుట్టుకతోనే మెదడు నిర్మాణానికి సంబంధించిన విషయమన్న మూలసూత్రాన్ని నమ్మేట్టు చేశాయి. ఒకవేళ నిజంగానే ఆనందం అనుభవించడం అనే విషయంలో జన్యునిర్మాణం పాత్ర పోషిస్తున్నా - ఆ పాత్ర ఎంత పెద్దది అనే విషయం మీద ఇంకా ఎవరూ సరైన నిర్ధారణకి రాలేదు. మనకి పుట్టుకతోనే సహజంగా లభించిన ఆనందం స్థాయిని పెంచుకునేందుకు కొన్ని మార్చాలని అవలంబించే అవకాశం ఉందనేది మనస్తత్వవేత్తలందరూ అంగీకరించే విషయం, మనసుకి శిక్షణ ఇవ్వడం ద్వారా అది సాధ్యమేనంటారు వీళ్లు. ఎప్పటికప్పుడు మనం అనుభవించే ఆనందం మన దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఏదో ఒక క్షణంలో మనం ఆనందంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా అనేది తరచు మన పరిస్థితి మొత్తం ఎలా ఉందన్న దానిమీద ఆధారపడదు. మన వరిస్థితిని మనం ఎలా చూన్తున్నాం, మనకి ఉన్నదాని గురించి ఎంత తృప్తిని అనుభవిస్తున్నాం అనే దానిమీదే మన ఆనందం న్థాయి ఆధారపడి ఉంటుంది. పోల్చి చూసే మానసిక ధోరణి

మన దృష్టికోణాన్నీ సంతృప్తి స్థాయినీ రూపొందించేది ఏది? పోల్చి చూసుకోవడం అనే ధోరణి మన సంత్బవ్రి స్థాయిని నిర్ధారిన్తుంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిని గతంతో పోల్చుకుని ఇప్పుడే మనం హాయిగా ఉన్నామని అనుకుంటే మనకి ఎక్కువ అనందం కలుగుతుంది. మన ఆదాయం ఏడాదికి 20,000 డాలర్లనుంచి 30,000 డాలర్లకి హఠాత్తుగా పెరిగితే ఇటువంటి ఆనందాన్నే అనుభవిస్తాం. నిజానికి మనకి అనందాన్నిచ్చేది పెరిగిన ఆ మొత్తం కాదు, ఎందుకంటే ఈ కొత్త ఆదాయానికి అలవాటు పడిపోయిన తరవాత ఏటా 40,000 డాలర్లు వస్తేగాని మనం తృప్తి చెందమన్న విషయం తెలుసు కుంటాం. అంతేకాదు, మన చుట్టూ ఉన్న వాళ్లతో పోల్చి చూసుకుంటూ ఉంటాం. మనకి ఎంత ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ, మన పొరుగువాడు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నట్లయితే మనం అసంతృప్తికి గురవుతాం. క్రీడారంగంలో ఉన్నవారు

38 + అనందాన్ని పొందే మార్గం ఏదాదికి 1, 2, ౩ మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నా సంతృప్తి చెందరు. తమ జట్టులో ఉన్న మరొకరు ఇంకా ఎక్కువ సంపాదించడమే తమ అసంతృప్తికి కారణమని అంటారు. ఈ ధోరణి అమెరికన్‌ విద్యావంతుడు హెచ్‌. ఎల్‌.మెన్‌కెన్‌ ధనవంతుడంటే 'తన తోడల్లుడి కన్నా ఏడాదికి 100 డాలర్లు ఎక్కువ సంపాదించేవాడు,” అనే నిర్వచనాన్ని సమర్ధిస్తున్నట్టు తోస్తుంది.

మనని మనం ఎవరితో పోల్చి చూసుకుంటున్నాం అనేదానిమీదే మనం జీవితంలో పొందే సంతృప్తి ఆధారపడి ఉంటుందని అనిపేస్తుంది. ఒక్క ఆదాయమే కాక ఇతర విషయాలలో కూడా మనం పోల్చుకుంటూనే ఉంటాం. మనకన్నా తెలివైనవారితో, అందమైనవారితో, జీవితంలో పైకి వచ్చినవారితో నిరంతరం పోల్చుకోవడం వల్ల అసూయ, నిస్పృహ, దుఃఖం కలుగుతాయి. కానీ ఇదే సూత్రాన్ని మనం సానుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు; మనకన్నా దురదృష్టవంతుల జీవితాలలోని లోటుతో పోల్చుకుని మనకి ఉన్నవాటినన్నిటిని గురించీ ఆలోచించి జీవితంలో సంతృప్తి పొందవచ్చు.

ఒక వ్యక్తి తన జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకుని, జీవితం ఇంకా ఎంత దుర్భరంగా ఉండవచ్చో అనుకుని జీవితంలో సంతృప్తి స్థాయిని పెంచుకోవచ్చు అనే విషయాన్ని పరిశోధకులు ఎన్నో ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఒక అధ్యయనంలో మిల్‌వాకీలోని విస్మాన్‌సిన్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న మహిళలకి ఈ శతాబ్బారంభంలో మిల్‌వాకీలోని ప్రజలు ఎంత దుర్భరమైన జీవితాలని గడిపారో చూపించారు. లేదా తమ జీవితాలలో శరీరం కాలిపోవడం, అంగవైకల్యానికి గురికావడం వంటి భయంకరమైన విషాద సంఘటనలు జరిగితే ఏమనిపిస్తుందో ఊహించి తమ భావాలకి అక్షరరూపం ఇవ్వమని అడిగారు. ఈ ప్రయోగాలవల్ల ఆ స్త్రీలకి తమ జీవితాలు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నాయన్న భావన కలిగింది. బఫెలోలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో మరో (ప్రయోగం చేశారు. కొందరు వ్యక్తులకి ఒక వాక్యం ఇచ్చి దాన్ని పూరించమని చెప్పారు. ఆ వాక్యం, 'నేను. . . కానందుకు నాకు ఆనందంగా ఉంది.” ఐదుసార్లు ఇదే (ప్రయోగాన్ని మళ్లీ మళ్లీ చేశాక, ఆ వ్యక్తులకి తమ జీవితాల్లో సంతృప్తి ఎక్కువయినట్టు అనిపించింది. ఇంకొక బృందాన్ని 'నేను . . . అయితే బావుండు, అనే వాక్యంలో ఖాళీజాగాని పూరించమని కోరారు. ఈ ప్రయోగంవల్ల ఆ బృందంలోని వ్యక్తులు ఎక్కువ అసంతృప్తిని అనుభవించారు.

మన దృష్టికోణాన్ని మార్చుకుని జీవితంలో సంతృప్తిని పెంచుకోనూవచ్చు, తగ్గించు కోనూవచ్చని ఈ ప్రయోగంవల్ల స్పష్టమవుతోంది. ఒక వ్యక్తి ఆనందంగా జీవించేందుకు అతని మానసిక ధోరణే కారణమనీ తెలుస్తోంది.

దలైలామా ఇలా అంటారు : “ఆనందం పొందడం సులభమేకానీ అది అంత సరళమైన భావన కాదు. అది ఎన్నో స్థాయిలని దాటివస్తేకాని లభించదు. ఉదాహరణకి బౌద్ధమతంలో సంతృప్తినీ, ఆనందాన్నీ కలిగించే నాలుగు కారకాలు ఉన్నాయి : సంపద, లౌకిక సంతృప్తి, ఆధ్యాత్మికత, జ్ఞానసముపార్దన. ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి ఆనందాన్వేషణకి దోహదం చేస్తాయి.

ఆనందానికి మూల కారణాలు + 39

“ప్రస్తుతానికి మనం మతసంబంధమైన ఆధ్యాత్మికతకి సంబంధించిన నిర్చష్టత, జ్ఞానం సాధించాలన్న అభిలాషలని పక్మనపెట్టి లౌకిక అర్థంలో, దైనందిన జీవితంలో మనం దేన్నెతే అనందం అంటున్నామో దాని గురించి ఆలోచిద్దాం ఈ సందర్భంలో ఆవమ్లాదాన్నీ ఆనందాన్నీ కలిగించే కొన్ని కీలక జఐంశాలని మనం సామాన్యంగా ఒప్పుకుంటాం. ఉదాహరణకి, ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలని అనుకుంటాం. అనందాన్ని అందించే మరో వస్తువు భౌతిక సౌకర్యాలసీ, మనం పోగుచేసిన సంపద అనీ అభిప్రాయపడతాం. అదనంగా మనం భావించే కారణం స్నేహం, తోడు. సంతృప్తిగా జీవించేందుకు మనకి కొందరు మిత్రులు ఉండాలనీ, వారితో మన భావాలు కలవాలనీ, నమ్మదగ్గ వ్యక్తులుగా ఉండాలనీ అనుకుంటాం.

“ఈ కారకాలన్నీ నిజానికీ ఆనందానికి మూలాధారాలే. కానీ ఒక వ్యక్తికి ఆనందంగా, తృప్తిగా జీవించాలన్నదే జీవితలక్ష్యంగా ఉన్నప్పుడు వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించు కోవాలంటే దానికి అన్నిటికన్నా ముఖ్యమైనది మాననికస్థితి. అదే కీలకాంశం.

“మనకున్న ఆరోగ్యం, సంపద లాంటి సానుకూల వరిస్థితులని సవ్యంగా ఉపయోగించుకుని, ఇతరులకి సాయం చెయ్యగలిగితే మరింత ఆనందంగా జీవించేందుకు అవి దోహదం చేస్తాయి. అంతేకాదు, మన భౌతిక సౌకర్యాలు, విజయాలు లాంటివాటివబ్ల మనకి కూడా అనందం లభిస్తుంది. కానీ సరైన మానసిక ధోరణి లేనప్పుడు, మానసిక కారణాలమీద ధ్యాస ఉంచనప్పుడు, ఇవి మనకి ఎంతోకాలం ఇనందాన్ని అందించలేవు, ఉదాహరణకి మీ మనసు లోతుల్లో ద్వేషంతో నిండిన ఆలోచనలూ, తీవ్రమైన అగ్రహం ఉన్నట్టయితే అది మీ ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తుంది; ఆ రకంగా ఆనందానికి కారకాలైన ఒకదాన్నీ నాశనం చేస్తుంది. అలాగే మీరు మానసికంగా బాధపడుతూ, నిరాశగా ఉంటే భౌతిక సుఖాలవల్ల ప్రయోజనం అంతగా ఉండదు. కానీ అదే మీరు శాంతంగా ఉంటూ, మనశ్శాంతిని పొందగలిగితే, మీ ఆరోగ్యం అంత బాగా లేకపోయినా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. లేక, మీ దగ్గర అద్భుతమైన సొంత ఆస్తులు ఉన్నప్పటికీ తీవ్రమైన క్రోధానికీ, ద్వేషానికీ మనసులో తావిస్తే ఆ క్షణాన వాటిని పారవెయ్యాలనీ, ధ్వంసం చెయ్యాలనీ అనీపిస్తుంది. ఆ క్షణాన మీ దగ్గరున్నవి ఎందుకూ పనికిరానివిగా కనిపిస్తాయి. ఈనాడు భౌతికంగా గొప్ప వికాసాన్ని సాధించిన సమాజాలు ఉన్నాయి, కానీ ఆ సమాజంలో భాగమైన చాలామంది ఆనందంగా లేరు. ఆంత అందమైన ఐశ్వర్యం కింద ఒక రకమైన మానసిక అశాంతి ఉంది, దానినల్ల నిస్పృహా, అనవసరమైన పోట్లాటలూ, మద్యం, మత్తుపదార్థాల సేవనం, అన్నిటికన్నా ఘోరమైన అత్మహత్యలూ విరివిగా ఉంటున్నాయి. అందుచేత మీరు ఆశించే ఆహ్హాదమూ, సంతోషమూ కేవలం సంపదవల్లే సాధ్యం అని కచ్చితంగా చెప్పలేం. మీ స్నేపొతులకి కూడా ఇదే వర్తిస్తుంది. తీవ్రమైన ద్వేషానికీ, ఆగ్రవానికీ గురై ఉన్నప్పుడు మీ మనసుకి మీ ప్రాణస్నేహితుడు సైతం మిమ్మల్ని (ప్రేమించటం జేదనీ, దూరదూరంగా ఉంటున్నాడనీ, మీకు చికాకు కలిగిస్తున్నా డనీ అనిపిస్తుంది.

“మన దైనందిన జీవితంలోని అనుభవాల మీద మన మానసికస్థితి తాలూకు

40+ ఆనందాన్ని పొందే మార్గం ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో పైన చెప్పిన ఉదాహరణలు తెలియజేస్తాయి. అందుచేత మనం ఆ కారకాల గురించి లోతుగా ఆలోచించడం అవసరమే కదా!”

“ఆధ్యాల్మిక అభ్యాసాలని పక్కన పెట్టి, లౌకికంగా ఆలోచించినా, మనం జీవిత కాలంలో (ప్రతిరోజూ ఆనందంగా, ఉల్లాసంగా గడపాలని అశించినట్టయితే, మన మనసు ఎంత శాంతంగా ఉంటే, మనకి అంత ఎక్కువ మనశ్శాంతి లభిస్తుంది. దానివల్ల జీవితాన్ని మరింత ఆనందంగా గడపడం సాధ్యమవుతుంది.”

తను అంతవరకూ చెప్పిన విషయాలు వినేవాళ్ల మనసుల్లోకి ఇంకేందుకా అన్నట్టు దలైలామా కొద్దిసేపు మాట్లాడడం ఆపారు. మళ్లీ ఇలా అన్నారు : “మనం శాంతంగా ఉండదే మనసు, మనశ్శాంతి అనే మాటలు ఉపయోగించినప్పుడు, పూర్తిగా ఇతరుల బాధలని పట్టించుకోని, స్పందనలులేని మనసు గురించి మాట్లాడుతున్నామని అపోహ పడకూడదు. మనశ్శాంతితో ఉండడమంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న వాటిని పట్టించుకోమనీ, మన మనసులో భావాలేవీ లేకుండా పోతాయనీ అర్ధం కాదు. అసలు మనశ్శాంతికి మూలం సానుభూతీ, ఆప్యాయతా. ఆ స్థితిలో మనలోని భావనలు చాలా సున్నితంగా స్పందిస్తాయి.”

చివరికి తను చెప్పిన విషయాలన్నిటినీ క్రోడీకరించి ఆయన ఇలా అన్నారు : “మీలో అంతర్గతంగా మనశ్శాంతికి దోహదం చేసే క్రమశిక్షణ లేనంతకాలం, మీకు ఎన్ని బాహ్య సౌకర్యాలూ, పరిస్థితులూ ఉన్నప్పటికీ, మీరు అన్వేషించే ఉల్లాసాన్నీ ఆనందాన్నీ అవేవీ కల్ప్చించలేవు. మరోపక్క మీలో అంతర్గతంగా ఇటువంటి గుణాలు ఉన్నట్టయితే - మనసు శాంతంగా ఉండడం, కొంత మనఃస్టైర్యం ఉంటే మీ జీవితంలో మీరు ఆనందం పొందడానికి అవసరమని అనుకునే ఎటువంటి భౌతిక సౌకర్యాలూ లేనప్పటికీ, సంతోషంగా, ఉల్లాసంగా జీవించడం సాధ్యమే.”

అంతర్గత సంతృప్తి

ఒకరోజు మధ్యాన్నం పూట దలైలామాని కలిసేందుకు హోటల్‌కి వెళ్లి అక్కడి పార్కింగ్‌ ప్రదేశం గుండా నడుస్తూ ఒక కొత్త టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ని ప్రశంసాదృష్టితో చూశాను. చాలాకాలంగా అలాంటి కారు కొనాలన్న కోరిక ఉంది నాకు. దలైలామాతో మాట్లాడడం (ప్రారంభించాక కూడా ఆ కారు గురించిన ఆలోచన నన్ను వదల్లేదు. “మా పాశ్చాత్య సంస్కృతి పూర్తిగా భౌతికమైన వస్తువులని సంపాదించడం మీదే ఆధారపడి ఉందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది నాకు; మా చుట్టూ, ఇరవైనాలుగ్గంటలూ ప్రకటనల హోరు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వస్తువులని కొనమని మా మనసులమీద ఆక్రమణ చేస్తూ ఉంటాయవి. ఉదాహరణకి, ఒక కొత్తకారు తయారుచేస్తే దాని గురించి అదేపనిగా (ప్రచారం చేస్తారు. వాటి ప్రభావంనుంచి తప్పించుకోవడం కష్టం. మేము కోరుకునే వస్తువులు, సొంతం చేసుకోవాలని అనుకునేవి లెక్కలేనన్ని ఉంటాయి. వాటికి అంతూ పొంతూ ఉన్నట్టు తోచదు. ఈ కోరికల గురించి మీరేమైనా చెప్పగలుగుతారా?” అని

ఆనందానికి మూల కారణాలు శ వ దలైలామాని అడిగాను.

దలైలామా సమాధానం చెప్పారు : “నా ఉద్దేశంలో కోరికలు రెండు రకాలు. కొన్ని సానుకూలమైన కోరికలు. ఆనందం పొందాలన్న కోరిక. అది పూర్తిగా సవ్యమైనదే. శాంతి కావాలని కోరుకోవడం, ప్రపంచంలో మరింత సామరస్యం నెలకొనాలన్న కోరిక, స్నేహ పూరితమైన ప్రపంచాన్ని కోరుకోవడం లాంటి కొన్ని కోరికలు చాలా ఉపయోగకరమైనవి.

“కానీ ఏదో ఒక స్థితిలో కోరికలు అర్ధంలేనివిగా తయారవుతాయి. దానివల్ల సమస్య తలెత్తుతుంది. ఉదాహరణకి, నేను అప్పుడప్పుడూ సూపర్‌మార్కెట్లకి వెళ్తూ ఉంటాను. నాకు అక్కడికి వెళ్లటం ఇష్టం, ఎందుకంటే అక్కడ నాకు ఎన్నో అందమైన వస్తువులు కనిపిస్తాయి. ఇలా రకరకాల వస్తువులని చూసినప్పుడు నాలో కోరిక పుడుతుంది, నాకు వచ్చే మొట్టమొదటి ఆలోచన, 'అబ్బ, నాకిది కావాలి; అది కూడా కావాలి,” అనేది. ఆ తరవాత వచ్చే ఆలోచన నా మనసులో ఒక ప్రశ్నని లేవనెత్తుతుంది, “నాకిది నిజంగా అవసరమా?” దానికి సాధారణంగా 'కాదు” అనే సమాధానం చెప్పుకుంటాను. మొదటిసారి కలిగిన కోరికకి, ఆ ప్రతిక్రియకి లాంగిపోతే మీ జేబులు ఖాళీ అయిపోతాయి. కానీ ఈ కోరికలకి మరోస్థాయి ఉంది, అది మనిషికి కావలసిన కనీసావసరాలు, తిండీ, బట్టా, తల దాచుకునేందుకు చోటూ. అవి కావాలని కోరుకోవడం సబబే.

“ఒక్కోసారి మీవి గొంతెమ్మ కోరికలా, వ్యతిరేకమైన కోరికలా అనేది మీ పరిస్థితుల మీదా, మీరు ఉండే సమాజంమీదా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, మీరు సమృద్ధి వంతమైన సమాజంలో ఉంటూ, మీరు రోజూ చేసే పనులకి కారు అవసరం అయినప్పుడు కారు కావాలని కోరుకోవడం తప్పుకాదు. అదే మీరు ఇండియాలోని ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉంటూ, కారు లేకుండా కూడా అన్ని పనులూ చేసుకోగలిగినా కారు కావాలని కోరుకుంటున్నారంటే, దాన్ని కొనేందుకు మీ దగ్గర డబ్బు కూడా లేకపోతే, ఆ కోరికవల్ల మీకు సమస్యలే ఎదురవుతాయి. మీ ఇరుగుపారుగువాళ్లకి దానివల్ల ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ మీరు డబ్బుగలవారైకే, మీదగ్గర ఒక కారు ఉన్నా ఇంకా ఖరీదైన కారు కావాలని కోరుకుంటూ ఉన్నట్టయితే, అది కూడా అలాంటి సమస్యలకే దారితీస్తుంది,” అన్నారు.

“కానీ, ఒక వ్యక్తి దగ్గర తగినంత డబ్బు ఉన్నప్పుడు ఇంకా ఖరీదైన కారు కొనాలని అనుకోవడం సమస్య ఎలా సృష్టిస్తుందో నాకర్థం కావడంలేదు. తన పొరుగునున్నవాడి కన్నా ఎక్కువ ఖరీదైన కారు కొనుక్కోవాలని అనుకోవడం సమస్య కావచ్చు - వాళ్లకి అసూయగా ఉండి ఉండవచ్చు - కానీ కొత్తకారు కొనుక్కోవడంవల్ల తృప్తీ, ఆనందమూ దొరుకుతాయి కదా?” అన్నాను వాదనకి దిగుతూ.

దలైలామా తల అడ్డంగా ఆడించి దృఢంగా ఇలా అన్నారు, “లేదు... ఒక కోరిక గాని చర్యగాని సానుకూలమైనదా, వ్యతిరేకమైనదా అనేది ఆత్మతృప్తి నిర్ణయించలేదు. ఒక హంతకుడు హత్య చేస్తున్నప్పుడు ఆత్మతృప్తిని అనుభవించవచ్చు, అంతమాత్రాన అతను చేసిన పని సరైనదే అనలేం. అన్ని రకాల అన్యాయాలు-అబద్ధమాడడం, దొంగి లించడం, లైంగిక దురాచారాలూ, వంటివి - చేసేవాళ్లకీ ఆ పనిచేసే క్షణంలో సంతృప్తిని

టై + ఆనందాన్ని పొందే మార్గం

ఇవ్వవచ్చు. సానుకూలమైన పనులకీ, వ్యతిరేకమైన పనులకీ ఉన్న తేదాని నిర్ణయించేది అది వెంటనే ఆ వ్యక్తికి సంతృప్తిని కలిగిస్తోందా అనేది కాదు, దాని పర్యవసానం ఒక మనిషికి సానుకూలమైన ఫలితాలని అందజేస్తోందా లేక వ్యతిరేకమైన ఫలితాలని అంద జేస్తోందా అనేదే ముఖ్యం. ఉదాహరణకి, ఇంకా ఖరీదైన వస్తువులు సంపాదించుకోవాలని అనుకోవడం, ఇంకా ఇంకా కావాలని అనుకునే మానసిక ధోరణికి సంబంధించినదైతే, ఎప్పుడో ఒకప్పుడు అ కోరికలకి అంతం కనిపిస్తుంది; ఇక కోరుకునేందుకు ఏమీ లేవని (గ్రహించాక మీరు వాస్తవస్థితిని ఎదుర్కొంటారు. ఆ చివరి హద్దుని చేరుకున్నాక మీలో ఉన్న ఆశ పూర్తిగా అణిగిపోయి మీరు నిస్బృహలో కూరుకుపోతారు. అటువంటి కోరిక కోరడంలో ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

“అందుకని ఇటువంటి అత్యాశవల్ల మనసులో లోభం తలెత్తుతుంది. ఆ లోభం వల్ల మితిమీరిన ఆశల వలలో చిక్కి మీరు నిస్పృహకీ, నిరాశకీ, బోలెడంత అయో మయానికీ గురవుతారు. లోభగుణంలో ఉన్న లక్షణం ఏమిటంటే, ఏదో కావాలని కోరుకోవడంవళల్లే అది మీ మనసులో చోటుచేసుకున్నప్పటికీ, కోరుకున్నది పొందాక కూడా మీకు తృప్తి కలగదు. అందుచేత దానికి అంతులేకుండా పోతుంది, దాని లోతు తెలుసుకోలేక మీరు చిక్కుల్లో పడతారు. లోభానికి నిజమైన విరుగుడు నంత్ఫప్తే. మీలో సంతృప్తి అనే భావన బలంగా ఉంటే మీరు ఒక వస్తువుని పొందారా లేదా అనేది ముఖ్యం కాదు; పొందినా, పొందకపోయినా మీరు సంతృప్తి చెందుతారు.” అయితే మనకి మానసికమైన తృప్తి ఎలా లభిస్తుంది? దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, మనం కోరుకున్నవన్నీ పొందడం - డబ్బు, ఇళ్లూ, కార్లూ, మనకి నచ్చిన, అనుకూలమైన జీవిత భాగస్వామి, అందమైన శరీరాకృతి. ఇటువంటి ధోరణివల్ల కలిగే నష్టాల గురించి దలైలామా ఇంతకుముందే చెప్పారు; మన కోరికలనీ, అవసరాలనీ అదుపులో ఉంచుకోకపోతే, ఎప్పుడో ఒకప్పుడు మనం కోరుకునే వస్తువుని పొందలేని స్థితికి చేరుకుంటాం. రెండు, మనం కోరుకున్నది పొందాలని అర్రులు చాచకుండా, మనకున్నదానితో తృప్తిపడి, అది చాలని అనుకోవడం మొదటిదానికన్నా ఈ రెండో పద్ధతే నమ్మదగినది.

కొన్నాళ్లక్రితం నేను టీవీలో క్రిస్టఫర్‌ రీవ్‌తో జరిపిన ఒక ఇంటర్వ్యూ చూశాను. 1994లో గుర్రమీదనుంచి పడిపోయిన ఆ నటుడికి వెన్నెముక దెబ్బతిన్నది. దానివల్ల మెడ కిందినుంచి మొత్తం శరీరం పక్షవాతానికి గురై చివరికి ఊపిరి తీసుకునేందుకు కూడా వెంటిలేటర్‌ యంత్రం సాయం అవసరమైంది. ఈ (ప్రమాదానికి గురైన తరవాత అతను ఈ అంగవైకల్యాన్ని ఎలా ఎదుర్కోగలిగాడని అతన్ని అడిగినప్పుడు, కొద్దికాలం తను విపరీతమైన దుఃఖం అనుభవించాననీ, అప్పుడు తను ఆస్పత్రిలో ఐసియులో ఉన్నాననీ చెప్పాడు. కానీ ఆ దుఃఖం, నిసృహ నుంచి చాలా త్వరగా బైటపడ్డానని అంటూ ప్రస్తుతం తాను ఎంత 'అదృష్టవంతుడో' గ్రహించానని అన్నాడు. తనని అమితంగా (ప్రేమించే భార్యా, పిల్లలూ వరప్రసాదంలా దొరికారనీ, అంతేకాక ఆధునిక వైద్య

ఆనందానికి మూల కారణాలు శత రంగంలో వేగంగా జరుగుతున్న ప్రగతికి తాను కృతజ్ఞుడై ఉంటాననీ చెప్పాడు. (వెన్నుపూస దెబ్బతింటే దానికి అవసరమయే చికిత్సని వైద్యరంగం త్వరలోనే కనిపెడుతుందని నమ్ముతానని అన్నాడు), ఈ ప్రమాదమే కొన్నేళ్లక్రితం జరిగి ఉంటే తాను చనిపోయి ఉండేవాడినని అన్నాడు. పక్షవాతానికి గురైన తరవాత దానికి అలవాటుపడి ఆ పరిస్థితిని అంగీకరించడానికి ఎంత ప్రయాసపడ్డాడో చెపుతూ, “నిస్పృహ త్వరగానే తగ్గిపోయింది కానీ మొదట్లో యథాలాపంగా ఎవరైనా, 'నేను పైకి పరిగెత్తి దాన్ని తీసుకొస్తాను, అనే మాటకు కూడా ఈర్య్య కలిగి, మనసు చివుక్కుమనేది. ఇటువంటి భావాలని భరిస్తూ, వాటిని మనసులోనుంచి తొలగించేందుకు, నాకు ఉన్నవాటికి సంతోషిస్తూ చెయ్యగల పనులకి అనందిస్తూ జీవించడం తప్ప మరో మార్గం లేదని (గ్రహించాను; నా విషయంలో అదృ్భష్టంకొద్దీ నా మెదడు దెబ్బతినలేదు, ఉపయోగించుకునేందుకు నాదగ్గర మెదడు ఉంది,” అన్నాడు. తన దగ్గరున్నవాటిమీదే దృష్టి కేంద్రీకరించి, వెన్నుపూస దెబ్బతినడం గురించి జనానికి అవగాహన పెంచేందుకు తన తెలివితేటలని వాడుకున్నాడు రీవ్‌ ఇతరులకి సాయం చేశాడు. ఇంకా ఇలా ఉపన్యాసాలు ఇవ్వాలనీ, సినిమాలకి రాయడం, దర్శకత్వం లాంటి పనులు చేపట్టాలనీ అతను అనుకుంటున్నాడు.

అంతర్గత విలువలు

సంపద, పదవి చివరికి శరీరారోగ్యం కన్నా కూడా మన మానసిక దృష్టికోణాన్ని తగిన రీతిలో మలుచుకోవడం ఆనందం పొందేందుకు ఎలా సాయపడుతుందో చూశాం. మనసు తృప్తి చెందడం అనే మనలోపలి భావనకి తోడుగా మన విలువని మనం తెలుసుకోవటం, ఆత్మగౌరవం కూడా ఆనందాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునేందుకు అన్నిటికన్నా నమ్మదగిన మార్గం గురించి చెపుతూ దలైలామా ఇలా అంటారు, “నా విషయమే తీసుకోండి, నాలో ఒక మనిషికి ఉండవలసిన భావాలు లోతుగా లేకపోయుంటే, ఇతరులతో స్నేహం చేసే సామర్ధ్యం లేకపోయుంటే, నా దేశం నుంచి నన్ను బహిష్కరించి, నా రాజకీయ జీవితాన్నీ ఆఅధిపత్యాన్నీ అంతం చేసినప్పుడు ఒక కాందిశీకుడిగా మారడం చాలా కష్టం అనిపించి ఉండేది. నేను టిబెట్‌లో ఉన్నప్పుడు రాజకీయవ్యవస్థ పొందుపరిచిన పద్దతిలో దలైలామా పదవికి ఎంతో కొంత గౌరవం లభించేది. నామీద నిజంగా ఆప్యాయత ఉన్నా, లేకపోయినా జనం నా పదవికి అనుగుణంగా నాతో సంబంధం కలిగి ఉండేవారు. కానీ జనానికీ నాకూ మధ్య సంబంధం ఏర్పరచినది అదొక్కటే అయితే దేశ బహిష్పరణ శిక్ష విధించినప్పుడు నాకు చాలా కష్టం అనిపించేది. కానీ తోటివారితో సంబంధం పెట్టు కోవడానికి గౌరవాన్నీ మన్నననీ పొందేందుకు మరో మార్గం ఉంది. ఏ స్థితిలో ఉన్నా ఒక మనిషిగా మీకు వారితో నంబంధం ఉంటుంది, మీరు కూదా మానవనమాజంలో భాగమే. ఆ బంధం మివ్శల్నీ తోటివారినీ కలువుతుంది. మానవులతో నంబంధం కలిగి ఉందడం అనేది చాలు మీ గౌరవాన్నీ, మర్యాదనీ నిలివీ ఉంచేందుకు. అన్నిటినీ కోల్పోయినా ఈ నంబంధం నిలిచి ఉన్నట్టయితే అదే మీకు ఓదార్పు ఇవ్వగలుగుతుంది”

ట్తగీ + ఆనందాన్ని పొందే మార్గం

అని దలైలామా ఆగారు. టీ ఒక్క గుక్క తాగి, తల అడ్డంగా ఆడిస్తూ చెప్పడం కొనసాగించారు, “దురదృష్టవశాత్తూ, చరిత్రపుటలు తిరగేస్తే చక్రవర్తులూ, రాజులూ రాజకీయ సంక్షోభం వల్ల తమ పదవులని కోల్పోయారనీ, తమ దేశం వదిలి వెళ్లక తప్పని పరిస్థితి వారికి ఎదురైందనీ తెలుస్తుంది. కానీ ఆ తరవాత వారి జీవితగాథ అంత సానుకూలంగా కొనసాగలేదు. తోటి మానవులతో ఆప్యాయమైన సంబంధాలు లేనివారికి జీవితం దుర్భరంగా తయారవుతుంది.

“స్తూలంగా చెప్పాలంటే మనుషుల్లో రెండు రకాలైనవారు ఉంటారు. ఒకవైపు ధనవంతులై, జీవితంలో సాఫల్యం సాధించినవారుంటారు. వారిచుట్టూ బంధువులు ఎప్పుడూ ఉంటారు. ఆ మనిషికి లభించే గౌరవం, మర్యాదా ధనంవల్లనే అయితే అది ఉన్నంతకాలం మాత్రమే అతనికి భద్రత ఉన్నట్టు అనిపించవచ్చు. ఆ అదృష్టం చేజారిన మరుక్షణం అతనికి ఇంక ఎటువంటి రక్షణా లేకపోవడంవల్ల అతను కష్టాలు అనుభవిస్తాడు. మరోవైపు మరో మనిషి ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటూ, జీవితంలో విజయాలని సాధించినవాదైనప్పటికీ, అతను ఇతరులతో ఆప్యాయంగా, 'పేమగా ఉంటూ సానుభూతి పరుడై ఉన్నాడనుకోండి, అతన్ని అందరూ గౌరవించడానికి కారణం భిన్నంగా ఉంటుంది. అందరి మన్ననా పొందడానికి కారణం అతని ఆర్థిక పరిస్థితి కాక అతనిలో ఉండే ఈ గుణాలే అవుతాయి. అలాంటి వ్యక్తి ఆర్ధిక పరిస్థితి ఒకవేళ దెబ్బతిన్నా అతను నిస్పృహతో కుంగిపోడు. ఇటువంటి తర్మంతో మనిషిలోని ఆప్యాయతనీ, (ప్రేమనీ మీరు చూడగలుగు తారు. వాటివళ్లే అతని వ్యక్తిత్వం విలువైనదిగా కనిపిస్తుంది.”

అనందమూ - ఆహ్హాదమూ

దలైలామా అరిజోనాలో ఉపన్యసించిన ఎన్నో నెలల తరవాత నేను ధర్మశాలలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లాను. జూలై నెలలో ఆ మధ్యాహ్నం పూట వాతావరణం వేడిగా, ఉకృపోతతో నిండి ఉంది. ఊరినుంచి కొద్దిదూరంలో ఉందే ఆయన ఇంటికి చేరుకునే సరికి నేను చెమటతో తడిసి ముద్దయాను. పొడి వాతావరణం ఉండే దేశంనుంచి వచ్చిన నాకు ఆరోజు ఆ వాతావరణం భరించరానిదిగా అనిపించింది. నాకు చికాగ్గా ఉంది, ఇద్దరం మాట్లాడుకునేందుకు కూర్చున్నామేగాని నాకు యింకా ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఆయనలో మాత్రం గొప్ప ఉత్సాహం కనిపించింది నాకు. కొంతసేపు మాట్లాడుకున్నాక మా సంభాషణ ఆహ్లాదంవైపు మళ్లింది. మా చర్చల్లో ఒకచోట ఆయన చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు :

“కౌంతమంది ఆనందం, ఆహ్లాదం ఒకటేనని అపోహపడతారు. ఉదాహరణకి, ఈ మధ్యనే రాజ్‌పూర్‌లో భారతీయ (శోతలముందు నేను ఉపన్యసించాను. జీవిత ప్రయోజనం ఆనందమేనని నేను అనగానే, శ్రోతల్లో ఒకరు రజనీష్‌ ప్రసక్తి తెస్తూ, లైంగికచర్యవల్లే మనకి అన్నిటికన్నా ఎక్కువ ఆనందం లభిస్తుందని ఆయన చెపుతారని అన్నాడు. లైంగికత ద్వారానే అత్యధికమైన ఆనందం పొందవచ్చు అని ఆ శ్రోత అభిప్రాయం” అన్నారు.

ఆనందానికి మూల కారణాలు ఈ 45 దలైలామా హాయిగా నవ్వేస్తూ, తన సంభాషణ కొనసాగిస్తూ, “ఆ విషయం గురించి ఆలోచించాను. నా దృష్టికోణం నుంచి ఆ శ్రోతకి సమాధానం చెప్పాను. విముక్తి అన్నిటి కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనీ, ఆ స్థితికి చేరుకున్నవారికి ఇక బాధలంటూ ఏవీ ఉండవనీ అన్నాను. అదే నిజమైన, శాశ్వతమైన ఆనందం. నిజమైన ఆనందం బుద్దికీ, మనసుకీ సంబంధించింది. కేవలం శారీరక సుఖంమీదే ఆధారపడే ఆనందం నిలకడగా ఉండదు; ఈరోజు ఉండేది, మరోరోజు ఉండకపోవచ్చు,” అన్నారు. పైపైన చూస్తే ఇది చాలా అర్ధవంతమైన వ్యాఖ్యలాగే అనిపించింది; ఎందుకంటే ఆనందం వేరు ఆహ్లాదం వేరు. అయినప్పటికీ మనం రెండిటినీ అర్ధం చేసుకోవడంలో పొరపడతాం. నేను మా దేశానికి వెనక్కివచ్చిన కొన్నాళ్లకి, ఒక రోగికి చికిత్స చేస్తూండగా, ఎంతో సరళంగా గ్రహించగల ఆ తేడా ఎంత బలమైనదో సోదాహరణంగా తెలిసివచ్చింది.

హెదర్‌ ఫీనిక్స్‌లో కౌన్సెలర్‌గా పనిచేస్తున్న ఒక యువతికి సమస్యల్లో ఉన్న యుక్త వయస్కులకి సలహాలిచ్చే తన ఉద్యోగం అంటే ఇష్టమే. కానీ కొన్నాళ్లుగా ఫీనిక్స్‌లో ఉండడం ఆమెకి ఎంతమాత్రం నచ్చడంలేదు. అక్కడ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, ఎండాకాలంలో ఊపిరాడకుండా చేసే వేడి గురించీ ఆమె విసుక్కుంటూనే ఉంది. కొండ ప్రాంతంలో ఉండే ఒక అందమైన చిన్న ఊరిలో ఆమెకి ఉద్యోగం ఇస్తామన్నారు. నిజానికి, ఆ ఊరికి ఆమె ఇంతక్రితం ఎన్నోసార్లు వెళ్లింది. అక్కడికి మారిపోవాలని కలలు కన్నది. ఆ ఊరు ఆమెకి చాలా బావుందనిపించింది. ఒక్కటే సమస్య, అక్కడ ఆమె దగ్గరకి సమస్యలతో వచ్చేవాళ్లు వయోజనులు. ఎన్నో వారాలపాటు ఆ కొత్త ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించాలా వద్దా అని తర్జనభర్జన పడింది. ఎటూ నిర్ణయించుకోలేక పోయిందామె. వెళ్లడంవల్ల కలిగే లాభనష్టాల జాబితా కూడా తయారుచేసింది, కానీ ఆ జాబితా ఆమెకి మరింత చికాకు కలిగించింది.

“ఇక్కడ ఈ ఉద్యోగంలో పొందుతున్నంత ఆనందం అక్కడ నాకు దొరక్కపోవచ్చని నాకు తెలుసు, కానీ ఆ ఊళ్లో ఉండడం అనే సుఖం ఆ లోటుని భర్తీచేస్తుందనే నా నమ్మకం. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఉంటే చాలు నాకదే ఆనందం. ఇక్కడ వేడిని భరించీ భరించీ విసిగిపోయాను. ఏం చెయ్యాలో అసలు పాలుపోవడం లేదు నాకు,” అని తన పరిస్థితిని వివరించిందామె.

అమె 'సుఖం' అనగానే నాకు దలైలామా మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఇంకొంచెం తెలుసుకోవాలనిపించి, “అక్కడికి వెళ్లడంవల్ల మీకు ఎక్కువ ఆనందం దొరుకుతుందా, ఎక్కువ సుఖంగా ఉంటుందా?” అని అడిగాను.

ఆ ప్రశ్న అర్ధం కానట్టు కాసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. చివరికి, “నాకు తెలీదు. బహుశా ఆనందంకన్నా సుఖమే ఎక్కువ దొరుకుతుందని అనుకుంటున్నాను... ఎంతైనా అక్కడి పెద్దవాళ్ల సమస్యలని పరిష్కరించడం నాకు ఎక్కున ఆనందాన్నిస్తుందని అనుకోను. ఇక్కడ ఈ చిన్నపిల్లలతో పనిచెయ్యడం నాకు చాలా తృప్తిగా ఉంటుంది...” అంది.

“నాకు అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా?” అని తనని తాను ప్రశ్నించుకోవడం

డేగ + ఆనందాన్ని పొందే మార్గం వల్ల ఆమెకి స్పష్టమైన జవాబు దొరికింది. మరుక్షణం నిర్ణయం తీసుకోవడం ఆమెకి చాలా సులభమనిపించింది. ఆమె ఫీనిక్స్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకుంది. కానీ వేసవికాలంలో వేడి గురించి ఇంకా విసుక్కుంటూనే ఉంది. కానీ తన మనసు కోరుకున్న దాన్ని బట్టీ అక్కదే ఉండిపోవాలన్న నిర్ణయం తీసుకోవడంవల్ల ఏదో రకంగా ఆమెకి ఎక్కువ ఆనందం లభించి, ఆ వేడిని కూడా భరించే శక్తిని అందించింది. (ప్రతిరోజూ నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితులు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా 'మనకి మంచి” చెయ్యగల విషయాలనే ఎంచుకోవడం తరచు సాధ్యం కాదు. సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం అనేదే దీనికి కొంతవరకూ కారణం. సరైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు మన సంతోషాన్ని కొంత త్యాగం చెయ్యాల్సి వస్తుంది. ప్రతి శతాబ్దంలోనూ మన జీవితాల్లో ఆహ్లాదం పోషించవలసిన పాత్ర గురించి స్త్రీ పురుషులెందరో సరైన నిర్వచనం కోసం అవస్థ పడ్డారు - తాత్వికులూ, వేదాంతులూ, మనస్తత్వ శాస్ర్రజ్ఞులూ అందరూ మనకీ, ఆహ్హాదానికీ గల సంబంధం గురించి అన్వేషణలు జరిపారు. క్రీ.పూ. మూడో శతాబ్దంలో ఎపిక్యురస్‌ అనే గ్రీకు తత్వవేత్త “జీవితం [ప్రారంభ మయేదీ, ముగిసేదీ ఆహ్లాదంతోటే' అని ధైర్యంగా తన నీతిసూత్రాన్ని చెప్పాడు. కానీ ఎపిక్యురస్‌ సైతం లోకజ్ఞానం, పరిమితి ముఖ్యమని ఒప్పుకుంటూ నిగ్రహం పాటించని ఇంద్రియసంబంధమైన సుఖాలు కొన్నిసార్లు బాధాకరంగానే ముగుస్తాయని అన్నాడు. పంతొమ్మిదో శతాబ్ది ఆఖర్లో ప్రాయిడ్‌ ఆహ్షాదం, సుఖం గురించి సిద్ధాంతాలని రూపొందించే పనిలో మునిగి ఉన్నాడు. మనస్తత్వానికి సంబంధించిన అంశాలన్నిటినీ (ప్రేరేపించే శక్తులు స్వాభావికంగా మనలో ఉండే కోరికలు నెరవేరకపోవడంవల్ల కలిగిన ఒత్తిడిని తొలగించేందుకే పనిచేస్తాయి, ఇంకో రకంగా చెప్పాలంటే, మనలో అంతర్గతంగా ఉందే ముఖ్యమైన కోరిక సుఖాన్ని అన్వేషించడం. ఇరవయ్యో శతాబ్దంలో ఎంతోమంది పరిశోధకులు తాత్విక ఆలోచనలనుంచి తమ మార్గాన్ని పక్కకి తప్పించారు. వారికి బదులు నాడీవ్యవస్థ నిర్మాణ శాస్త్రజ్ఞులు ఎలెక్టోడ్డ సాయంతో మెదడులోని హైపోథాలమస్‌ (కింది భాగం)నీ, మెదడు అంచు భాగాలనీ పొడిచి, విద్యుత్తుతో (ప్రేరేపించినప్పుడు ఆహ్లాదాన్ని కలిగించే స్థలాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఏనాడో కాలం చేసిన గ్రీకు తత్వవేత్తలు మనకిప్పుడు అకృళ్తేదు. ఆహ్హాదాన్న్సీ సుఖాన్నీ అర్ధం చేసుకునేందుకు పంకొమ్మిదో శతాబ్దపు మనోవిశ్లేషడులూ, లేదా ఇరవయ్యో శతాబ్దం శాస్త్రవేత్తల సాయం అవసరం లేదు. దాన్ని ఎప్పుడు అనుభవిస్తే అప్పుడే మనకి తెలుస్తుంది. మన అత్మీయులు మనని తాకినప్పుడూ, మనని చూసి చిరునవ్వు నవ్వినప్పుడూ, చలిగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేసినప్పుడూ, అందమైన సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు అదేమిటో మనకి తెలుస్తుంది. కానీ మనలో చాలామంది నల్లమందు సేవించినప్పుడు ఆ మత్తు తలకెక్కితే కలిగే వెర్రి ఆనందాన్ని కూడా అనుభవించే ఉంటారు. హెరోయిన్‌ అనే మత్తుపదార్థంవల్ల కలిగే అలౌకికమైన సుఖం, మద్యం తాగడంవల్ల కలిగే

ఆనందానికి మూల కారణాలు శ త్త అత్యుత్సాహం, విచ్చలవిడిగా లైంగిక అనుభవాలని పొందడం, లాస్‌వేగస్‌లో జూదంలో గెలవడంవల్ల కలిగే అత్యధికమైన ఉల్లాసం, ఇవన్నీ కూడా నిజమైన సుఖాలే. మన సమాజంలో చాలామంది అంగీకరించక తప్పని సుఖాలు ఇవి. మనిషి జీవితాన్ని నాశనం చేసే ఈ సుఖాలని నివారించడానికి సులభమైన పరిష్కారాలు లేనప్పటికీ, అదృష్టవశాత్తూ మనం ప్రారంభించేందుకు ఒక చోటంటూ ఉంది ; అదే మనం జీవితంలో కోరుకుంటున్నది ఆనందం అని గుర్తుచేసుకోవడం! దలైలామా చెప్పినట్టు అది తిరుగులేని వాస్తవం. ఆ విషయం గుర్తుంచుకుని జీవితంలో మార్గాలని ఎంచుకున్నట్టయితే, మనకి ఎప్పుడో ఒకప్పుడు హానిచేసే అంశాలని వదిలెయ్యడం సులభమే, అవి మనకి క్షణిక సుఖాలని అందించేవే అయినా సరే. “వద్దు అనడం ఎందుకంత కష్టమో తెలిపే పదం 'వద్దు” అనేదే; దేన్నైనా నిరాకరించడం అనే ధోరణికి సంబంధించిన పదం అది, ఇష్టమైనదాన్ని వదిలెయ్యడం, మనకి దాన్ని లేకుందా చేసుకోవడం. కానీ ఈ పరిస్థితిని ఇంతకన్నా బాగా ఎదుర్కోవచ్చు : మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 'ఇది నాకు ఆనందాన్ని అందిస్తుందా? అని ్రశ్నించుకోవడం. ఆ చిన్న ప్రశ్న జీవితంలో అన్ని విషయాలనీ నేర్పుగా నిర్వహించుకునేందుకు మనకి తోద్చడే శక్తివంతమైన ఉపకరణం. మత్తుపదార్థాలు సీవించడం వరకో, అరటిపండు కేక్‌ మూడో ముక్క తినాలా వద్దా అనే మీమాంస వరకో ఇది పరిమితం కాదు. ఇది వస్తువులని కొత్త కోణంలో మనముందు ఉంచుతుంది. మనం రోజూ తీసుకునే నిర్ణయాలు ఈ ప్రశ్నని మనసులో ఉంచుకుని తీసుకున్నట్లయితే మనం కోల్పోయేది కాకుండా మనం పొందాలనుకునేదాని మీద మన దృష్టి కేంద్రీకృతమవుతుంది - అదే అంతిమ ధ్యేయమనే ఆనందం. దలైలామా నిర్వచించిన స్థిరమైన, శాశ్వతమైన ఆనందం. జీవితంలోని ఒడిదుడుకులనీ, మన మానసికస్టితిలోని ఎగుడుదిగుడులనీ తట్టుకుని నిలబడగల ఆనందం. మన అణువణువులోనూ కలిసిపోయి, అదే మన ఆస్తిత్వంగా మారే ఆనందం. ఈ దృష్టిని అలవరచుకుంటే 'సరైన నిర్ణయం” తీసుకోవడం సులభమవుతుంది, ఎందుకంటే మనం దేన్నీ నిరాకరించడం లేదు, మనకోసం ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాం

  • అంటే ఒక వస్తువునుంచి దూరంగా పోవడం కాదు, దగ్గరకి చేరేందుకు ప్రయత్నించడం, జీవితాన్ని ఆప్యాయంగా కౌగలించుకోవడం, దాన్ని నిరాకరించడం కాదు. ఆనందం వైపు కదలడం అనే అంతర్గతమైన భావన చాలా లోతైన ప్రభావం చూపుతుంది; మనం దేనికైనా మరింత సానుకూలంగా స్పందిస్తాం, జీవితం అందించే ఆనందాన్ని మనసారా అనుభవించేందుకు సిద్ధంగా ఉంటాం.

అధ్యాయం 8 ఆనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం అనందం పొందే మార్గం

8 నందం పొందేందుకు అతిముఖ్యమైన కారకం ఒక వ్యక్తి మానసికస్థితి అని గుర్తించి

నంత మాత్రాన తిండీ, బట్టా, ఉండడానికి తలమీద ఒక కప్పు అనే ప్రాథమిక భౌతిక అవసరాలని కాదనుకోవడం అని అనుకోకూడదు. కానీ ఈ కనీసావసరాలు తీరిన తరవాత మనకి అందే సందేశం స్పష్టంగా ఇది : మనకి ఇంకా ఎక్కువ డబ్బు అక్కర్లేదు, ఎకువ విజయాలూ, పేరువ్రతిష్టలూ అవనరం లేదు, అవయవ సౌష్టవంతో అందమైన శరీరం, మనకి నరిగ్లా నరిపోయే జీవిత భాగస్వామి కూదా అక్టుర్లేదు - (ప్రస్తుతం, ఈ క్షణాన మనకీ ఒక మననుంది. నంవూర్హమైన ఆనందాన్ని సొంతం చేసుకునేందుకు ఆ వరికరం ఒక్కటి నరిపోతుంది.

మనసుకి అభ్యాసం ఇవ్వడమనే పద్ధతిని మనముందుంచుతూ దలైలామా ఇలా చెప్పడం ప్రారంభించారు : “మనం “మనసు”, “చేతన” అనే పదాలు వాడుతుంటాం. వాటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. బాహ్యా పరిస్థితులు, వస్తువుల్లాగానే వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, కొన్ని చాలా హాని చేసేవి, కొన్నిటిని పట్టించుకోనవసరం లేదు. అందుచేత కంటికి కనిపించే వస్తువుల విషయంలో వీటిలో ఏ పదార్థాలు, లేదా రసాయనాలు ఉపయోగించదగ్గవి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే అలాంటివాటినే ఉత్పత్తిచేసి, ఎక్కువ మోతాదులో తయారుచేసి వాడుకుంటాం. ఇక మనకి వానిచేసే పదార్థాలని వదిలించుకుంటాం. అదే విధంగా మనసు గురించి మాట్లాడేప్పుడు, కొన్ని వేల రకాల ఆలోచనలు, లేదా వేర్వేరు “మనసులు” ఉంటాయి. వాటిలో కొన్ని చాలా సహాయం చేస్తాయి, మనం వాటినే స్వీకరించి పోషించాలి. కొన్ని వ్యతిరేకత కలిగి ఉంటాయి. అవి చాలా హని చేస్తాయి; వాటిని వీలైనంత తగ్గించుకునేందుకు మనం ప్రయత్నించాలి.”

న!

50 + అనందాన్ని పొందే మార్గం

“అందుచేత ఆనందాన్వేషణలో నేర్చుకోవడం మొదటిమెట్టు. వ్యతిరేక భావనలూ, (ప్రవర్తనా మనకి ఏ రకంగా హాని చేస్తాయో ముందు తెలుసుకోవాలి. అలాగే సానుకూల భావాలు మనకి ఎలా సాయం చేస్తాయో కూడా (గ్రహించాలి. ఈ వ్యతిరేక భావనలు వ్యక్తిగతంగా ఎంతో చెడ్డవీ, హానికరమైనవే కాక సమాజానికీ, ఈ ప్రపంచ భవిష్యత్తుకీ కూడా హానికరమైనవి అని అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోగలిగితే మనం దృధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని ఎదుర్శొని అధిగమించగలుగుతాం. అదే విధంగా సానుకూల భావాలవల్లా, ప్రవర్తనవల్లా ఒనగూడే లాభాలని కూదా గుర్తించాలి. ఒకసారి అలా గుర్తించాక ఎంత కష్టమైనప్పటికీ ఆ సానుకూల భావాలని కాపాడుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ఉండాలని నిశ్చయించుకుంటాం. మనసులోపలినుంచి అనాయాసంగానే ఆ పని చెయ్యాలన్న కోరిక కలుగుతుంది. ఇక ఈ రకంగా ఏ ఆలోచనలూ, భావాలూ మంచి చేస్తాయి, ఏవి హానిచేస్తాయి అని విశ్లేషించడం నేర్చుకున్నాక నెమ్మదినెమ్మదిగా మనలో మార్పు వస్తుంది, “ఇక నా ఆనందం, నా మంచి భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు!” అని గట్టిగా నిశ్చయించుకోగలుగుతాం.

“బౌద్ధమతంలో కార్యకారణభావం (6021521190 అనే సూత్రాన్ని సహజ నియమంగా అంగీకరిస్తాం. వాస్తవ ప్రపంచంతో వ్యవహరించేప్పుడు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఉదాహరణకి దైనందిన అనుభవాలకి సంబంధించిన విషయాలలో మీకు కొన్ని రకాల సంఘటనలు జరగడం ఇష్టం ఉండదు. అటువంటి సంఘటన ఏదీ జరగకుందా జాగ్రత్త పడాలంటే ఒకటే మార్గం. సామాన్యంగా అటువంటి సంఘటనలకి దారితీసే కారణాలు, లేదా పరిస్థితులు జీవితంలో తలెత్తుకోకుండా చూసుకోవడమే. అదే విధంగా ఏదైనా సంఘటన గాని, అనుభవం గాని మీ జీవితంలో చోటుచేసుకోవాలని మీరు కోరుకుంటే, దానికి తగిన కారణాలనీ, పరిస్థితులనీ కల్పించుకోవడం ఒక్కటే మార్గం.

“మానసిక స్టితికీ, అనుభవాలకీకూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటే దానికి తగిన కారణాలు వెతుక్కోండి. అలాగే దుఃఖాలు, కష్టాలూ వద్దనుకున్నా వాటికి తావిచ్చే కారణాలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఈ కార్యకారణ భావాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

“ఆనందాన్ని సాధించేందుకు మానసికమైన కారణాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడిక మనకి కలిగే రకరకాల మానసిక స్లితులు ఎలాంటివో తెలుసుకోవలసి ఉంది. విభిన్నమైన మానసిక స్థితులని గుర్తించి, వాటిని విడదీసి, అవి ఆనందం దిశగా మనని తీసుకువెళ్లేవి అవునా కావా అని తెలుసుకుని వర్గీకరించాలి.”

“ఆ రకరకాల మానసిక స్థితులేమిటో, వాటిని ఎలా వర్టీకరిస్తారో సోదాహరణంగా వివరించగలరా?” అన్నాను.

అప్పుడు దలైలామా ఇలా వివరించారు : “ఉదాహరణకి, ఈర, ద్వేషం, క్రోధం మొదలైనవి హానికరమైనవి. వాటిని వ్యతిరేకమైన మానసిక స్థితులని అంటాం, ఎందుకంటే అవి మన మానసికానందాన్ని నాశనం చేస్తాయి; ఎవరిపట్లనైనా మీలో ద్వేషంలాంటి

అనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం ఈశ ౨] భావాలు తలెత్తితే అప్పుడు ఆ వ్యక్తి కూడా మీకు శత్రువులాగే కనిపిస్తాడు. తత్ఫలితంగా మీలో కోపం, జంకు, సంకోచం, అభ(ద్రతాభావం బాగా పెరిగిపోతాయి. ఈ లోకమంతా మీకు ఎదురుతిరిగిందన్న భావనతో మీరు ఒంటరివారైపోయినట్టు అనిపిస్తుంది. ఈ వ్యతిరేక భావాలన్నీ తలెత్తేది ద్వేషం వల్లనే. మరోవైపు, దయ, సానుభూతివంటి సాను కూలమైన భావాలు తప్పకుండా మీకు మంచే చేస్తాయి...”

“నాదొక సందేహం,” అంటూ ఆయన మాటలకి అద్దు తగిలాను. “మీరు కొన్ని వేల రకాల మానసిక స్థితులు ఉంటాయని అన్నారు. అలాంటప్పుడు మనస్తత్వశాస్త్రం దృష్ట్యా ఆరోగ్యకరమైన మానసిక ధోరణి ఉన్న వ్యక్తిని, బాహ్య పరిస్థితులకి చక్కగా సర్జుకుపోగల వ్యక్తిని మీరు ఎలా నిర్వచిస్తారు? ఆ నిర్వచనాన్ని బట్టి ఎటువంటి మానసిక స్థితిని పెంపొందించుకోవాలో, దేన్ని వదిలించుకోవాలో నిర్ణయించుకునేందుకు మాకొక మార్గనిర్దేశం దొరుకుతుంది,” అన్నాను నా సందేహాన్ని వివరంగా ఆయన ముందుంచుతూ.

ఆయన నవ్వి తన స్వభావంలో ఉన్న వినయాన్ని ప్రదర్శిస్తూ, “ఆరోగ్యకరమైన మానసికస్థితిలో ఉందే వ్యక్తికి ఒక మనస్తత్వవేత్తగా మీరే ఇంకా మంచి నిర్వచనం ఇవ్వగలరేమో!” అన్నారు.

“కానీ, నాకు మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది,” అన్నాను.

“అలాగైతే దయగల, సానుభూతిపరుడైన, (ప్రేమించే స్వభావం గల వ్యక్తి మానసికంగా ఆరోగ్యవంతుడని అంటాను. సానుభూతి కలిగి, అందర్నీ (ప్రేమించే దయగల వ్రాదయం ఉంటే మీలో ఏవో ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. వాటి గుందా మీరు ఇతరులతో ఇంకా నులభంగా నంవర్శం పెట్టుకోగలుగుతారు, నంభాషించగలుగుతారు. అటువంటి ఆప్వాయత మనుమలమధ్యనున్న గోడలని వడగొడుతుంది. మననువివ్సి మాట్లాడుకోవడానికి సాయవడదుతుంది. మానవులందరూ మీలాంటొవారే అని (గపాొంచగలిగాక వారితో నులభంగా నంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలుగుతారు. ” అది స్నేహభావానికి స్ఫూర్తినిస్తుంది. అప్పుడిక ఏదీ దాచుకోవలసిన అవసరం కనిపించదు. తత్ఫలితంగా భయం, ఆత్మవిశ్వాసం లోపించడం, అభద్రతాభావం వాటంతటవే తొలగి పోతాయి. అంతేకాదు, ఇతరులకి మీమీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే, ఒక వ్యక్తి సమర్భుడని తెలిసి అతని సామర్ధ్యం మీద మీకు నమ్మకం కలుగుతుందనుకుందాం. కానీ అంతలో అతనిలో దయాగుణం లేదని మీకు తెలిస్తే మనసువిప్పి అతనితో అన్ని విషయాలూ మాట్లాడలేరు. 'ఆ మనిషి ఎన్నో పనులు చెయ్యగలడని నాకు తెలుసు, కానీ అతన్ని నమ్మవచ్చా?” అనే అనుమానం కలుగుతుంది. ఆ తరవాత అతనితో వ్యవహరించినప్పుడల్లా మీ మనసులో ఏ మూలో కాస్త బెదురు ఉన్నట్టనిపిస్తుంది, దానివల్ల అతనికి మీరు దగ్గర కాలేరు.

“అందుచేత దయ, సానుభూతి వంటి సానుకూలమైన మానసిక స్థితులని పెంపొందించుకోవడం కచ్చితంగా మానసిక _ళ్తర్లోక్యయాషాానలద్లరం పొందేందుకు మార్గాలన్నది నా అభిప్రాయం.”

చ న.

వం 4 ఆనందాన్ని పొందే మార్గం

మానసిక క్రమశిక్షణ దలైలామా అలా మాట్లాడుళూంటే, ఆనందాన్ని పొందేందుకు ఆయన సూచించే మార్గం చాలా ఆకర్షణీయంగా ఉన్నట్టనిపించింది నాకు. అది పూర్తిగా వ్యావహారికమైనదీ, సహేతుకమైనదీ అనిపించింది : సానుకూలమైన మానసిక స్థితులని గుర్తించి వాటిని పెంపొందించుకోవడం; వ్యతిరేకమైన మానసికస్థితులని గుర్తించి వాటిని తొలగించు కోవడం. మొదట్లో ఆయన ఇచ్చిన సలహా నాకు అంతగా నచ్చలేదు. మనం అనుభవించే రకరకాల మానసిక స్థితులను పద్ధతి ప్రకారం విశ్లేషించుకోవడం అనేది మనసుకి ఆహ్హాదం కలిగించేదిలా అనిపించలేదు. కానీ ఆయన తర్మమూ, వాదనలూ విని ఆయనతో ఏకీభవించకుండా ఉండడం సాధ్యం కాలేదు. “లోభమనేది మహాపాపం,” “ద్వేషం చెడ్డది” అనే నీతివాక్యాలు బైటినుంచి మనమనసుమీద ప్రభావం చూపేందుకు ఎవరో చెప్పే మాటలు. ఇలాంటి వాటిమీద ఆధారపడి కాకుండా మన భావనలనీ, కోరికలనీ, చివరికి వాటివల్ల మనకి ఆనందం దక్కుతుందా బాధ కలుగుతుంది అనే ఆలోచనతో సానుకూలమైనవిగానూ, వ్యతిరేకమైనవిగానూ వర్గీకరించడం బావుందని నాకు అనిపించింది. మర్నాడు మధ్యాన్నం మళ్లీ మేమిద్దరం మా సంభాషణని కొనసాగించినప్పుడు “ఆనందం అంటే కేవలం దయ, సానుభూతి వంటి సానుకూలమైన మానసికన్నితిని పెంపొందించుకోవడమే అయితే ఇంతమంది దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు?” అని అడిగాను.

“నిజమైన ఆనందాన్ని పొందడానికి ఒక వ్యక్తి దృష్టికోణాన్నీ ఆలోచనావిధానాన్నీ పూర్తిగా మార్చుకోవలసి ఉంటుంది. అది అంత తేలిగ్గా సాధ్యం కాదు. ఎన్న్నో విధాలుగా, రకరకాలుగా ఈ మార్పులకి దోహదం చేసే అంశాలని జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఉదాహరణకి, ఒకే ఒక కీలక రహస్యం తెలుసుకుని దాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే చాలు అంతా సర్దుకుంటుంది అనుకోకూడదు. శరీరానికి పోషణ, రక్షణ ఇచ్చినట్టుగా నే ఇదీ ఒకటో, రెండో కాదు, మీకు రకరకాల విటమిన్లు, పోషకాలు అందితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా ఆనందాన్ని పొందాలంటే ఎన్నోరకాలుగా, ఎన్నో కోణాలనుంచి పాటుపడుతూ క్లిష్టమైన ఎన్నో వ్యతిరేక మానసికస్థితులని అధిగమించ వలసి ఉంటుంది. కొన్ని రకాల వ్యతిరేకమైన ఆలోచనల్లోంచి బైటపడాలని మీరు ప్రయత్నిస్తున్నట్టయితే, ఒకటి రెండుసార్లు ఏదో ఆలోచనని ఎంచుకుని, లేదా ఒక పద్ధతిని అభ్యసించనంత మాత్రాన ఫలితాలని పొందలేరు. మార్పు రావడానికి సమయం పడుతుంది. శరీరంలో మార్పురావాలన్నా సమయం పడుతుంది. ఉదాహరణకి ఒక వాతావరణం నుంచి మరో వాతావరణానికి మారినప్పుడు, ఆ వాతావరణానికి తగ్గట్టు శరీరం సర్జుకోవాలంటే దానికి కొంత సమయం అవసరం. అదే విధంగా మీ మనసుని మార్చుకునేందుకు కూడా కొంత వ్యవధి అవసరమవుతుంది. ఎన్నో రకాల వ్యతిరేకమైన మానసిక స్థితులు ఉంటాయి, వాటిలో ఒక్కొక్కదాన్నీ ఎంచుకుని, అడ్డుకుని మనసులో

ఆనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం శక్ర నుంచి తాలగించవలసి ఉంటుంది. అది అంత సులభం కాదు. రకరకాల పద్ధతులని మళ్లీమళ్లీ ఉపయోగించుకోవాలి, ఆ అభ్యాసాలు మీకు అలవదేదాకా వేచి ఉండాలి. ఇది ఒక రకంగా కొత్త విషయం నేర్చుకున్నట్టే ఉంటుంది.

“కానీ కాలం గడిచినకొద్దీ మనం సానుకూలమైన మార్పులు చేసుకోగలమనే నా ఉద్దేశం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మీరు మనస్ఫూర్తిగా సానుకూలమైన (శ్రేరణ పొందేందుకు ప్రయత్నిస్తూ ఇలా అనుకోండి, 'ఈ రోజుని ఇంకా మంచిపనులకోసం ఉపయోగించుకుంటాను. ఈ రోజుని వ్యర్థంగా గడపకూడదు.” తరవాత రాత్రి పడుకోబోయే ముందు మీరు చేసిన పనులని బేరీజువేసుకుని ఇలా ప్రశ్నించుకోండి, 'నేను అనుకున్నట్టుగా ఈ రోజుని ఉపయోగించుకున్నానా?”' మీరు అనుకున్నట్టే గడిపి ఉంటే మీరు బాగా సంతోషించవచ్చు. కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే మీరు చేసిన పనులకి నొచ్చుకుని ఆ రోజుని సూక్ష్మంగా విమర్శించుకోండి. ఈ రకమైన పద్ధతులని అనుసరిస్తూ మీరు నెమ్మదినెమ్మదిగా మనసులోని సానుకూలమైన అంశాలని బలపరుచుకోవచ్చు.

“ఉదాహరణకి నన్నే తీసుకోండి, నేనొక బౌద్ధ భిక్షువుని. బౌద్ధమతాన్ని నమ్ముతాను. ఈ బౌద్ధమతోపదేశాలూ, ఆచారాలూ నాకు చాలా సాయం చేశాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయినప్పటికీ, అలవాటుకొద్దీ కొంతా, ఇంతకుముందు ఎన్నో జన్మలెత్తి ఉండడంవల్లనూ, క్రోధం, మమకారంలాంటి కొన్ని భావాలు మనసులో తలెత్తవచ్చు. అందుచేత నేను మొదట ఏం చేస్తానంటే, బౌద్ధమతం బోధించే ఆచారాలలోని సానుకూలమైన అంశాలని నేర్చుకుంటాను. ఆ తరవాత నిశ్చయాన్ని ఐలపరుచుకుంటాను, అప్పుడు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను. మొదట్లో సానుకూలమైన విషయాల ఆచరణ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, అందుచేత వ్యతిరేక అంశాల ప్రభావం ఇంకా చాలా బలంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు సానుకూలమైన ఆచరణని క్రమక్రమంగా పెంచుకుంటూ పోయినట్టయితే, వ్యతిరేకమైన ప్రవర్తన దానంతట అదే తగ్గిపోత్తూ వస్తుంది. అందుచేత ధర్మాచరణ అనేది నిజానికి నిరంతరం జరిగే అంతస్సంఘర్షణ. అది పాతబడిన వ్యతిరేక ధోరణులనీ, అలవాట్లనీ తొలగించి వాటి న్థానంలో కొత్త సానుకూల ధోరణులని ప్రవేశపెడుతుంది.”

తను మాట్లాడడం కొనసాగిస్తూ దలైలామా ఇలా అన్నారు : “మనం ఎటువంటి చర్యలని ఆచరిస్తున్నా నిరంతరం దాన్నే అంటిపెట్టుకుని, శిక్షణ పొందడం కన్నా సులభమైనది మరొకటి లేదు. శిక్షణ ద్వారా మనం మారడం సాధ్యం; మనని మనం పూర్తిగా మార్చుకోగలుగుతాం. బౌద్ధమత ఆచారాలలో ఆందోళన కలిగించే సంఘటన జరిగినప్పటికీ మనసుని శాంతంగా ఉంచుకోవడం సాధ్యం చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులని క్రమం తప్పకుండా అభ్యసించినట్టయితే, ఆందోళనకరమైన సంఘటనలవల్ల మనసు చెదిరినప్పటికీ, దాని వ్యతిరేక ప్రభావం మనసు లోతులని తాకదు - సముద్రంలో అలలు లేచి పడినప్పటికీ అవి సముద్రపు లోతుల్లో ఎటువంటి (ప్రభావాన్నీ సృష్టించనట్టే. నా అనుభవం చాలా తక్కువే అయినప్పటికీ నేను ఆచరించిన చిన్న పరిధిలో ఇది నిజమేనని గ్రహించాను. నాకు ఏదైనా విషాదవార్త అందినప్పుడు

కశ ఈ ఆనందాన్ని పొందే మార్గం ఆ క్షణంలో మనసు అందోళన పడుతుంది, కానీ త్వరగానే అది అణిగిపోతుంది. ఒక్కోసారి నాకు చికాకు కలిగించే విషయాలు కోపం తెప్పిస్తాయి, కానీ అది కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. మనసు లోతుల్ని అది తాకదు. ద్వేషం అనేది ఉండదు. ఇది క్రమం తప్పకుండా చేసిన అభ్యాసంవళ్లే సాధ్యం అయింది; రాత్రికి రాత్రి ఈ మార్పు నాలో రాలేదు.”

ఆయన అన్నది అక్షరాలా నిజం. దలైలామా నాలుగేళ్లవాడిగా ఉన్నప్పట్నించీ తన మనసుకి శిక్షణ ఇస్తూనే ఉన్నారు. మనసుకి ఒక క్రమపద్ధతిలో శిక్షణనివ్వడం - ఆనందాన్ని పెంపొందించుకోవడం సొనుకూలమైన మనఃస్థితులని బుద్ధిపూర్వకంగా ఎంచుకుని, వ్యతిరేక మనస్తత్వంతో సంఘర్షిస్తూ వాటిమీద దృష్టిపెడుతూ నిజమైన అంతర్రవర్తనని సాధించడం సాధ్యమే. ఎందుకంటే మన మెదడు నిర్మాణం, పనితీరు దీనికి అనువుగానే ఉంది. పుట్టినప్పుడే మన మెదడులో కొన్ని ప్రవర్తనా వైఖరులు సహజంగానే శాశ్వతంగా నిర్మితమై ఉంటాయి; మానసికంగా, భావాత్మకంగా, శారీరకంగా మన చుట్టూ ఉన్న వాతావరణానికి మన మనుగడకి అవసరమైన రీతిలో స్పందిస్తాం - ఇది ఒక సహజడక్రియ. ఈ మౌలికమైన సమాచారం లెక్కలేనన్ని నాడీకణజాలాల్లో పొందుపరచి ఉంటుంటి. ఒక సంఘటనకి గాని, అనుభవానికి గాని, ఆలోచనకి గాని స్పందించడం అనేది మెదడులోని కణాలు పరస్పరం స్పందించడం వల్ల తలెత్తుతుంది. కానీ మన మెదడులోని ఈ కణజాల వ్యవస్థ నిశ్చలంగా ఉండదు. మార్చుకోలేనంత దృఢంగా పాతుకుపోయి ఉండదు. మన మెదడు కూడా మార్చుకి అనుకూలంగానే ఉంటుంది. నాడీశాస్త్రజ్ఞులు మెదడు కొత్త నమూనాలని సృష్టించగలదన్న విషయాలని నమోదు చేశారు. నాడీకణాలని పరస్పరం కొత్తగా కలపడం ద్వారా న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ (నాడీకణాలలో ఒకదాన్నుంచి మరోదానికి సమాచారం అందించే రసాయనాలు) ద్వారా కొత్తగా అందిన సమాచారానికి మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకున్నారు. నిజానికి మన మెదడు మృదువుగా, సాగేగుణం గలదిగా ఉంటుంది. కొత్త ఆలోచనలకీ, అనుభవాలకీ తగ్గట్టు ఎప్పటికప్పుడు మారుతూ, కొత్తగా రూపొందుతూ ఉంటుంది. నేర్చుకోవడంవల్ల నాడీకణాలు ఒక్కొక్కటీ మార్పుకి లోనై, తమలోని విద్యుత్సంకేతాలు మరింత త్వరగా ప్రవహించేందుకు సాయపడతాయి. మెదడులో

ర్పు చెందేందుకు అంతగ్గతంగా ఉం 4 క

న్‌ ఏ చెంందు! ర్గ దేఈ సామర్థ్యాన్ని శాస్త్రజ్ఞులు ష్లాస్టిసిటీ (సాగే

మెదడు తంత్రులలో మార్పుకి లొంగే ఈ సామర్థ్యం, కొత్త కణజాల సంధానాలని ఉత్పత్తి చెయ్యడం వంటి ప్రయోగాలు డా. అవి కర్టి, డా. లెస్లీ అండర్‌లైడర్‌ లాంటి పరిశోధకులు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో చేసి చూపించారు. ఆ పరిశోధనల్లో, కొందరికి తమ శరీరంతో చిన్నచిన్న పనులు చెయ్యమని చెప్పారు వాళ్లు- వేళ్లతో దేనిమీదనైనా తట్టడంలాంటివి. ఎమ్‌ఆర్‌ఐ (రేడియాలజీ పరీక్ష) సాయంతో మెదడుని తనిఖీ చేసి పనులు చేసేందుకు మెదడులోని ఏ భాగాలు వాదబడుతున్నాయో

ఆనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం శి 55 తెలుసుకున్నారు. ఆ వ్యక్తులు నాలుగువారాలపాటు వేళ్లతో తట్టడం అనే పనిని ప్రతిరోజూ చేశారు. క్రమక్రమంగా ఆ పనిని వాళ్లు మరింత నేర్చుగా, వేగంగా చెయ్యడం మొదలుపెట్టారు. నాలుగువారాలూ గడిచిపోయాక, మళ్లీ మెదడుని స్మాన్‌ చెయ్యడం ద్వారా ఆ చర్యని ప్రేరేపించే మెదడుభాగం కొంత వ్యాకోచించిందని గమనించారు; క్రమం తప్పకుండా ఒకే పనిని చెయ్యడం, అభ్యసించడం వల్ల ప్రారంభంలో ఉండిన నాడీకణాల సంధానం మారిందనీ, ఆ పనికోసం మెదడు కొత్త కణజాలాన్ని నియమించిందనీ ఈ ప్రయోగంవల్ల తెలిసింది.

మన మనసుల్లో గొప్ప మార్చు తీసుకురాగల ఈ అసాధారణమైన లక్షణం మెదడులో ముందే నిర్మితమై ఉందని అనిపిస్తుంది. మన ఆలోచనలకి చలనం కలిగించి, కొత్త దిశగా వాటిని మళ్లించడం అభ్యసిస్తే, మన మెదడులోని నాడీకణాల ఆకారాన్ని పునర్చిర్మించుకుని, మెదడు పనితీరుని కూడా మార్చుకోగలుగుతాం. మనసులోని ఆలోచనల్లో మార్పు రావడానికి నేర్చుకోవడం అనే అభిప్రాయానికి కూడా ఇదే ఆధారం. కొత్త విషయాలని మెదడులో ప్రవేశపెట్టి 'వ్యతిరేకమైన ఆలోచనలని” క్రమక్రమంగా తొలగించే క్రమశిక్షణ దీనివల్లే అలవాటవుతుంది. ప్రస్తుతం మన నాడీకణాలు పనిచేసే విధానాన్ని మార్చుకుని కొత్త నాడీకణాలని రూపొందించుకుని 'సానుకూలమైన ఆలోచనలని” పెంపొందించు కోవచ్చు. ఈ రకంగా మనసుకి ఆనందం పొందడానికి శిక్షణ ఇవ్వడం అనేది నిజంగా సాధ్యమే అని మనం అనుకోవచ్చు.

నైతిక క్రమశిక్షణ

ఆ తరవాత దలైలామాతో ఆనందం పొందేందుకు మనసుకు శిక్షణ ఇవ్వడం గురించి చర్చకు కూర్చున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, “ఇంకా ఎక్కువ ఆనందంగా జీవించేందుకు నైతిక ప్రవర్తన అనేది మనసుకి ఇవ్వవలసిన శిక్షణలో భాగమని నాకు తోస్తుంది. దీన్ని మనం నైతిక క్రమశిక్షణ అనవచ్చు. బుద్ధుడిలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు మనని నైతికమైన పనులే చెయ్యమనీ, అనైతికంగా ప్రవర్తించవద్దనీ బోధిస్తారు. ఇక మనం చేసే పనులు నైతికమైనవి అవునా కాదా అనేది మన మనస్థితి క్రమశిక్షణ గలదా కాదా అనేదానిమీద అధారపడి ఉంటుంది. క్రమశిక్షణగల మనసు ఆనందానికి దారి తీస్తుందనీ, అలా లేనిది కష్టాలు కలగజేస్తుందనీ అంటాడు బుద్దుడు. వ్యక్తి తన మనసులో క్రమశిక్షణ సృష్టించుకోవాలనేదే నిజానికి ఆయన బోధనలలోని సారం.

“నేను మాట్లాడే క్రమశిక్షణ అనేది ఎవరికివారు సృష్టించుకునే క్రమశిక్షణ, ఎవరో బలవంతంగా మీకు విధించేది కాదు అనేది. అలాగే మీలోని వ్యతిరేకమైన గుణాలని అధిగమించేందుకు ఉపయోగపడేదే నేను చెప్పే క్రమశిక్షణ. ఒక నేరస్థుల ముఠాకి దొంగతనం చేసి తప్పించుకునేందుకు క్రమశిక్షణ కావాలి, కాని అటువంటి క్రమశిక్షణ నిరుపయోగమైనది.”

దలైలామా ఒక్క క్షణం మాట్లాడడం ఆపి ఏదో దీర్చాలోచనలో మునిగినట్టు

55 + ఆనందాన్ని పొందే మార్గం

కనిపించారు. లేకపోతే అంగ్లంలో సరైన పదం కోసం వెతుక్కుంటున్నారో తెలీదు. ఆయన అలా మౌనంగా ఉండిపోయేసరికి అంతవరకూ మేము మాట్లాడుకున్న విషయాల గురించి ఆలోచించసాగాను. నిజమైన ఆనందం, ఆధ్యాత్మిక వికాసం, లోపలినుంచి పరిపూర్ణంగా పరివర్తన చెందడం లాంటి ఉన్నతమైన లక్ష్యాలని వదిలి నేర్చుకోవడం, క్రమశిక్షణ లాంటి విషయాల ప్రాధాన్యం గురించి మాట్లాడడం విసుగు పుట్టిస్తోందని అనిపించింది నాకు. ఆనందాన్ని అన్వేషించడం అనేది అప్రయత్నంగా, దానంతట అదే జరగవలసిన పనిగా తోచింది.

ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ నేనిలా అన్నాను, “వ్యతిరేకమైన భావాలూ, ప్రవర్తనా “అనైతికమైనవి' అనీ, సానుకూలమైన భావాలూ, ప్రవర్తనా 'నైతికమైనవి" అనీ మీరు వివరిస్తున్నారు. ఆ తరవాత శిక్షణ పొందని, క్రమశిక్షణ లభించని మనసు సాధారణంగా అనైతికమైన, వ్యతిరేకమైన (ప్రవర్తనకి దారితీస్తుందని కూడా అన్నారు. అందుచేత మనం సానుకూలమైన ప్రవర్తనని నేర్చుకుని, మనకి మనం శిక్షణ ఇవ్వగలిగితే దాన్నీ పొందగలమని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది.

“నాకు అర్ధంకాని విషయం, వ్యతిరేకమైన, అనైతికమైన ్రవర్తనలంటే కష్టాలు కొనితెచ్చేవని మీ నిర్వచనం. నైతిక ప్రవర్తన ఆనందానికి దారితీస్తుందని కూదా అంటున్నారు. అదే విధంగా (ప్రాణులన్నీ సహజంగానే బాధని తప్పించుకుని, ఆనందాన్ని పొందాలనుకుంటాయన్న ప్రాథమికాంశంతో ప్రారంభిస్తున్నారు. ఆ కోరిక ప్రాణులకి అంతర్జతంగా ఉంటుందనీ నేర్చుకోనక్కల్లేదనీ అంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే: బాధ నివారించడం మనలోని సహజ లక్షణం అయినట్టయితే, మనకి వయసు పెరిగే కొద్దీ అప్రయత్నంగా, స్వభావసిద్ధంగా వ్యతిరేకమైన, అనైతికమైన ప్రవర్తనని ఎందుకు అసహ్యించుకోవడం లేదు? ఇక ఆనందం పొందాలని కోరుకోవడం కూడా మన సహజ లక్షణం అయికే, నైతిక ప్రవర్తన పట్ల అప్రయత్నంగా, స్వభావసిద్ధంగా ఆకర్షితులమై జీవితం ముందుకి సాగినకొద్దీ ఎక్కువ ఆనందాన్ని ఎందుకు పొందడం లేదు? నైతిక (ప్రవర్తన సహజంగానే ఆనందంవైపు తీసుకెళ్లేదే అయితే, మనకి ఆనందం పొందాలన్న కోరికే ఉంటే, అది ఒక సహజక్రియగా జరిగిపోవాలి కదా? మనకి ఇంత విద్య, శిక్షణ, క్రమళిక్షణ ఎందుకు అవసరం?”

తల అడ్డంగా అడిస్తూ దలైలామా ఇలా సమాధానం చెప్పారు, “సాంప్రదాయకమైన భాషలో చెప్పాలన్నా మన దైనందిన జీవితంలో, సాఫల్యం సాధించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా విద్య చాలా ముఖ్యమైన విషయం అని అనుకుంటాం. జ్ఞానం దానంతట అదే రాదు. దానికి శిక్షణ పొందాలి; ఒక క్రమపద్ధతిలో శిక్షణ పొందితేనే అది అలవడుతుంది. సాంప్రదాయకమైన విద్యా, శిక్షజా చాలా కష్టమైనవని అనుకుంటాం; లేకపోతే విద్యార్థులు సెలవలకోసం అంత ఆత్రుతగా ఎందుకు ఎదురుచూస్తారు? అయినప్పటికీ, మన జీవితాలు ఆనందంగా, విజయాలని సాధిస్తూ ముందుకి సాగాలంటే ఇటువంటి విద్య ఎంతో అవసరమని మనకి తెలుసు.

“అదే విధంగా, నైతిక ప్రవర్తన సహజంగా అలవడకపోవచ్చు, మనమే దాన్ని శిక్షణ

ఆనందం కోసం మనసుకి శిక్షణ ఇవ్వడం శ 7 ద్వారా సాధించాలి. ఆధునిక సమాజంలో ఇది ఇంకా అవసరం, ఎందుకంటే నైతిక ప్రవర్తన, అనైతిక ప్రవర్తన - అంటే ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో - అనేవి మతం పరిధిలోకి వచ్చే విషయాలని మన ఉద్దేశం. సంప్రదాయాన్ని అనుసరించి ఏది నైతికత, ఏది కాదు అనేది నిర్ధారించడం మతం బాధ్యత, కానీ ఈనాటి సమాజంలో మతం తన గౌరవస్థానాన్ని కోల్పోయింది, కొంతవరకూ దాని ప్రభావం తగ్గింది. కానీ దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయంగా మతాతీతమైన నీతి మన దగ్గర లేదు. అందుచేత నైతికంగా జీవించాలని అనుకోవడం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవాలని అనుకోవడం లేదు. అందుకే మనం ఈ దిశగా విశేషమైన ప్రయత్నం చేసి, అటువంటి జ్ఞానాన్ని పొందేందుకు కృషి చెయ్యవలసి ఉంటుంది. ఉదాహరణకి, మానవస్వభావం దయతోనూ, సానుభూతితోనూ సహజంగా నిండి ఉంటుందన్నది నా వ్యక్తిగత విశ్వాసం. కానీ మనలో ఈ స్వభావం సహజంగా ఉన్నంతమాత్రాన సరిపోదు; ఆ వాస్తవాన్ని మనం హించి తెలునుకుని మరింత అభివృద్ధి చేసుకోవలనీ ఉంటుంది. మనని మనం ఎలా అర్ధం చేసుకుంటున్నాం అనే విషయం తెలునుకుని, విద్యా అవగాహాన సాయంతో మనం ఇతరులతో ఎలా ట్రవర్తిస్తున్నాం, రోజువారీ జీవితాన్ని ఏ విధంగా గడువుతున్నాం అనే విషయాలలో కూడా అవసరమైతే మార్పులు చేసుకోవలనీ వస్తుంది. ”

ఆయన చెప్పినదానికి అడ్డంగా వాదిస్తూ, “మీరింకా సాంప్రదాయకమైన విద్యా విధానాన్ని గురించీ, శిక్షణ గురించీ మాట్లాడుతున్నారు. అది వేరు. కానీ మీరు నైతిక మైనవీ, సానుకూలమైనవీ అని చెప్పే ప్రవర్తన ఆనందానికి దారితీస్తుందనీ, అలా కానివి కష్టాలపాలు చేస్తాయనీ అనేటట్టయితే, వాటిని గుర్తించేందుకు ఇంత నేర్చుకోవడం ఎందుకు? సానుకూలమైన ప్రవర్తనని అనుసరించేందుకూ, వ్యతిరేకమైన ప్రవర్తనని నివారించేందుకూ ఇంత శిక్షణ అవసరమా? నేననేది, మీ చేతిని నిప్పులో పెడితే అది కాలుతుంది. చెయ్యి వెనక్కి తీసేసుకుంటారు, మరుక్షణం ఆ ప్రవర్తన మీకు కష్టం కలిగించిందని అద్ధమవుతుంది. మళ్లీ నిప్పుని ముట్టుకోకుండా ఉండేందుకు మీకు విస్తృతమైన విద్యా, శిక్షణా అవసరం లేదు.

“కష్టాలను కొనితెచ్చే అన్ని రకాల ప్రవర్తనా లేదా భావాలూ అలా ఎందుకుండవు? ఉదాహరణకి, క్రోధం, ద్వేషం స్పష్టంగా వ్యతిరేక భావాలే అనీ, చివరికి వాటివల్ల బాధే మిగులుతుందనీ మీరు అంటున్నారు. కానీ వాటిని తొలగించుకునేందుకు, వాటివల్ల కలిగే హాని గురించి నేర్చుకోవడం ఎందుకు? క్రోధం వెనువెంటనే మనసుకి ఇబ్బంది కలిగిస్తుంది, దాన్ని మనం సూటిగా అనుభవించగలం, అలాంటప్పుడు భవిష్యత్తులో అలాంటి భావన తలెత్తకుండా సహజంగానే, ఆప్రయత్నంగానే ఎవరైనా దాన్ని నివారించ వచ్చు కదా?”

నా వాదనలని దలైలామా చాలా (శ్రద్ధగా విన్నారు. తెలివైన ఆయన కళ్లు కొద్దిగా పెద్దవయాయి. ఆ కళ్లలో ఆశ్చర్యం, నేను అమాయకంగా వేసిన ప్రశ్నల గురించి ఆయన మనసులో నవ్వుకుంటున్నట్టూ అనిపించింది. తరవాత ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతూ, ఎంతో సహృదయంగా ఇలా అన్నారు, “స్వేచ్చకి దారితీసే జ్ఞానాన్ని గురించీ, సమస్యలని

58 + ఆనందాన్ని పొందే మార్గం

పరిష్కరించడం గురించీ మాట్లాడేటప్పుడు, అందులో ఎన్నో స్థాయీభేదాలు ఉంటాయన్న విషయం మీరు అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకి,రాతియుగపు మానవులకి మాంసం వండడం తెలీకపోయినప్పటికీ తినాలి అనే శారీరకావసరం వాళ్లకి ఉండింది, అందుచేత వాళ్లు అడవిమృగాల్లాగే తిన్నారు. మానవులు పురోగతి సాధించినకొద్దీ వాళ్లు వండడం నేర్చుకున్నారు, ఆహారాన్ని మరింత రుచికరంగా వండేందుకు సుగంధద్రవ్యాలు వాడడం ప్రారంభించి రకరకాల పదార్థాలు తయారుచెయ్యడం నేర్చుకున్నారు. ఈనాటికీ మనం ఏదైనా ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే, మన బాధకి ఫలానా ఆహారపదార్ధం పడదు అని తెలుసుకుంటే, దాన్ని తినాలని ఎంత కోరికగా ఉన్నా నిగ్రహించుకుంటాం. అంటే మన జ్ఞానం మెరుగైనకొద్దీ మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వ్యవహరించడంలో మనం ఎక్కువ కృతకృత్యులవుతాం.

“మీ ప్రవర్తనవల్ల కలిగే దీర్హకాల ఫలితాల గురించీ, తాత్కాలిక ఫలితాల గురించీ కూడా తెలుసుకునే సామర్ధ్యం మీలో ఉండాలి. ఆ రెంటినీ బేరీజు వేసుకునే తెలివితేటలు అవసరం. ఉదాహరణకి క్రోధాన్ని జయించడం విషయమే తీసుకోండి, జంతువులకి కూడా కోపం వస్తుంది, కానీ అది హానిచేస్తుందని అవి అర్ధం చేసుకోలేవు. మనిషి విషయంలో దీని స్థాయి విభిన్నంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అది మిమ్మల్ని బాధపెడుతోందని స్వయంగా తెలుసుకుని, దాన్ని గురించి ఆలోచించడం, దాన్ని గమనించడం మీకు సాధ్యం. అందుచేత క్రోధం హానికరమైనదని మీరు తెలుసుకోగలరు. దాన్ని మీరు ముందుగానే ఊహించగలగాలి. అందుచేత అది నిప్పులో చెయ్యిపెట్టడం, ఆ తరవాత చెయ్యి కాల్చుకుని భవిష్యత్తులో ఎప్పుడూ అటువంటి పని చెయ్యకూడదు అని నిశ్చయించుకోవడమంత తేలికైన విషయం కాదు. మీ విద్య స్థాయి, జ్ఞానం మెరుగైన కొద్దీ, ఏది ఆనందాన్నిస్తుంది, ఏది కష్టాలని కొనితెస్తుంది అనే విషయం తెలుసుకున్నకొద్దీ మీరు ఆనందాన్ని పొందడంలో సాఫల్యం సాధిస్తారు. అందుచేత, ఈ కారణంగానే విద్యా, జ్ఞానమూ మనకి అవసరం అని నేను అనుకుంటాను.”

మామూలు విద్య మనిషిలో అంతర్గత మార్పుకి దారితీస్తుందన్న విషయాన్ని నేను ఒప్పుకోవడం లేదని (గ్రహించినట్టున్నారు, మళ్లీ ఇలా అన్నారు, “మన వర్తమాన సమాజానికి ఒక సమస్య ఉంది. విద్య అంటే మనని ఇంకా తెలివైనవారిగా, సూక్ష్మబుద్ది గలవారిగా తయారుచేసేది అనే ఆలోచనాధోరణి కనిపిస్తుంది. ఒక్కోసారి ఎక్కువ చదువు సంధ్యలు లేనివారూ, విద్యకి సంబంధించి ఎక్కున తెలివితేటలు సంపాదించుకోనివారూ ఎక్కువ అమాయకంగానూ, నిజాయితీగానూ ఉంటారని అనిపిస్తుంది. మన సమాజం ఈ విషయాన్ని నొక్కి వక్కాణించకపోయినప్పటికీ, విద్య, జ్ఞానం అనేది మరింత నైతికమైన పనులు చేసి మనసులో మరింత క్రమశిక్షణని ప్రవేశపెట్టేందుకు ఉపయోగపడేవిగా ఉండాలని తెలుసుకుని వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలి. మన తెలివితేటలనీ, జ్ఞానాన్నీ సవ్యంగా ఉపయోగించుకోవడం అంటే - సహృదయాన్ని వికసింపచేసేందుకు మనసు లోతులనుంచి మార్పుని సృష్టించడం.”

అధ్యాయం ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం మన సహజ స్వభావం

కళ మ 9 ఆనందాన్ని అన్వేషించాలని తెలుసుకున్నాం, ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత,

సానుభూతిలాంటి భావాలు ఆనందాన్ని అందిస్తాయన్న విషయం స్పష్టంగా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఆనందంగా ఉండేందుకు ఆధారమైన కారణం ఉంది, ఆనందాన్ని అందించే ప్రేమతోనూ, సానుభూతితోనూ నిండిన మానసిక స్థితిని పొందగలిగితే అనందాన్ని అందుకోగలుగుతాం” అని దలైలామా బల్లగుద్ది చెపుతారు. “నిజం చెప్పాలంటే, మనలో సానుభూతి అనే భావన సహజంగానే ఉంటుందని నేను నమ్ముతాను. మానవుల స్వభావంలో ముఖ్యమైన ఆధారంగా ఉందే భావం సున్నితత్వం, మృదుత్వం” అని దలైలామా నమ్మబలుకుతారు.

“కానీ ఈ నమ్మకాన్ని మీరు ఎలా నిరూపిస్తారు?” అని అడిగాను.

“ “బుద్ధుడి స్వభావం” అనే బౌద్ధమత సిద్ధాంతం ఈ నమ్మకానికి ఆధారం. ప్రాణులన్నిటిలోనూ ప్రధానంగా కలహానికి కాలుదువ్వే స్వభావం ఉండదనీ, ప్రాణులన్నీ సాధుస్వభావం గలవే అనీ ఈ సిద్దాంతం బోధిస్తుంది. కానీ ఈ బౌద్ధమత సిద్ధాంతంతో సంబంధం లేకుండా కూదా ఎవరైనా ఈ దృష్టికోణాన్ని స్వీకరించవచ్చు. ఈ నమ్మకానికి ఇంకా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మనిషిలోని ప్రేమభావన, సానుభూతి అనేవి కేవలం మతసంబంధమైన విషయాలు కావు; ఒక వ్యక్తి దైనందిన జీవితంలో అవి అనివార్యమైన ఒక భాగం,

  • ఈ సిద్దాంతం మనసు తాలూకు అతిముఖ్యమైన, సూక్ష్మ స్వభావం గురించి చెపుతుంది. ఈ మానసిక స్థితి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. వ్యతిరేక భావాలూ, ఆలోచనలూ దీన్ని ఎంతమాత్రం మలినపరచలేవు.

క్‌

60+ ఆనందాన్ని పొందే మార్గం

“అందుచేత పుట్టుకనుంచి మరణించేదాకా మన మనుగడ సాగించే విధానాన్ని చూసినప్పుడు, ఇతరుల (ప్రేమాభిమానాలు మనని ఎలా పెంచి పోషించాయో తెలుస్తుంది. ఇది పుట్టిన వెంటనే ప్రారంభమవుతుంది. పుట్టిన మరుక్షణం మనం చేసే పని తల్లి దగ్గర గాని, మరో స్త్రీ దగ్గరగాని స్తన్యం తాగడం. అది (ప్రేమనీ, సానుభూతినీ ప్రదర్శించే ఒక చర్య, ఆ చర్య లేనిదే మనం బతకలేం. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆ పని పరీపూర్ణంగా జరగాలంటే తల్లికీ, శిశువుకీ మధ్య (ప్రమ అనే భావన ఉండాలి. శిశువువైపు నుంచి చూసినప్పుడు స్తన్యం ఇచ్చే స్రీ మీద ప్రేమ, మమకారం లేనట్టయితే ఆ శిశువు పాలు తాగకపోవచ్చు. అలాగే తల్లికీ, పాలుపట్టే మరో స్త్రీకీ శిశువుపట్ల (క్రేమ లేకపోతే పాలు ధారగా వెలికి రాకపోవచ్చు. అదే జీవితం. అదే నిజం.

“ఆ తరవాత మన శరీర నిర్మాణం ప్రేమ, సానుభూతి అనే భావాలకి తగినట్టు జరిగిందని అనిపిస్తుంది. ఆరోగ్యంగా, శరీరస్థితి సవ్యంగా ఉండాలంటే శాంతం, (ప్రేమ, నైతికతతో కూడిన మనసు ఆ దిశగా మనకి ఎంత ప్రయోజనాన్ని కలిగిస్తుందో అర్ధం చేసుకోగలం. దీనికి విరుద్ధంగా నిస్పృహ, భయం, ఆందోళన, క్రోధం వంటి భావాలు మన ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తాయనీ [గ్రహిస్తాం.

“డ్రేమ, అభిమానం వంటి భావాలు మన మానసిక ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. ఎవరైనా మనతో ఆప్యాయంగా, (్రేమగా ప్రవర్తిస్తే మనకి ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచిస్తే ఇది అర్ధమవుతుంది. అంతేకాదు, మనం ఇతరులతో ప్రేమగా, ఆప్యాయంగా ఉన్నప్పుడు మన మనసుమీద దాని ప్రభావం ఎలా ఉంటుందో, మనకి ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచించి చూడండి. అప్రయత్నంగా, సహజంగా మన మనసుకి ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన భావాలూ, వాటివల్ల తలెత్తే సానుకూలమైన ప్రవర్తనా సంతోషకరమైన కుటుంబ జీవితానికీ, సామాజిక జీవితానికీ కారణమవుతాయి.

“అందుచేత మానవులలో సహజంగా ఉండే స్వభావం మృదువైనది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే నిజమైతే, ఈ మృదుస్వభావానికి అనుగుణంగా మనం జీవితాలని మలుచుకోవడానికి ప్రయత్నించడంలో అర్ధముందని అనిపిస్తుంది.”

“మన స్వభావానికి గల ప్రధాన లక్షణం మృదుత్వం అయితే, మనచుట్టూ ఇన్ని ఘర్షణలూ, కలహాలూ, జరుగుతూ ఉండడానికి మీరు ఎలాంటి కారణాలు చూపిస్తారు?” అని అడిగాను.

దలైలామా దీర్జాలోచనలో ఉన్నట్టు తల పంకించి ఇలా జవాబు చెప్పారు, “ఘర్షణలూ, ఒత్తిళ్లూ లేవని అనలేం, నిజమే. అవి ఒక వ్యక్తి మనసులోనే కాదు, కుటుంబంలో, సమాజంలో ఇతరులతో వ్యవహరించేప్పుడు, దేశస్థాయిలో, వ్రపంచ స్థాయిలో కూడా అవి తప్పకుండా ఉంటాయి. వీటన్నిటినీ చూసి మనుషుల సహజ స్వభావం కలహానికి కొలుదువ్వేదని కొందరు అనుకుంటారు. దీనికి నిదర్శనంగా వాళ్లు మానవ చరిత్రని చూపిస్తూ మిగతా జంతువులతో పోలిస్తే మనిషి ప్రవర్తన ఎక్కువ

ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం శః. పోరాడేదిగా ఉంటుందన్న తీర్మానానికి వస్తారు. లేదా వాళ్లు, 'అవును, సానుభూతి మనలో ఉందే ఒక భావమే, కానీ క్రోధం కూడా అలాంటిదే. రెందూ మన స్వభావంలో సమానంగానే ఉంటాయి; దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయి,” అంటారు. అయినప్పటికీ, అంటూ ఆయన కుర్చీలో ముందుకి వంగి, అప్రమత్తంగా, దృఢంగా ఇలా అన్నారు, “మానవన్వభావం (వ్రధానంగా సొనుభూతితోనూ, దయతోనూ నిండి నున్నితంగా ఉంటుందనేది నా దృఢ విశ్వానం. మానవన్వభావంలో అది ఒక (్రబలమైన అంళం, క్రోధం, హింస, కలహటప్రియత్వం తప్పకుండా అందులో భాగమే, కానీ వాటి స్థానం రెండవదీ, తాత్మాలికమైనదీ అనే అనుకుంటాను. అంటే, మనలో నిస్పృహ, నిరాశ చోటు చేసుకున్నప్పుడు, ముఖ్యంగా (పేమ, ఆప్యాయతా పొందలేక మనసు కుంగిపోయినప్పుడు అవి తలెత్తుతాయి. అంతేకాని అవి మన స్వభావంలో ప్రధానమైన భాగం కావు.

“అందుకని, ఘర్షణలు తలెత్తినా, వాటికి ప్రధానకారణం మానవ స్వభావం కాదు, మానవమేధే అని నా ఉద్దేశం - సమతూకం లేని మానవుని తెలివితేటలు, వాటిని దురుపయోగం చెయ్యడం, మన ఊవాశక్తిని సవ్యంగా ఉపయోగించుకోకపోవడం. ఇక మానవజాతి పరిణామాన్ని చూసినట్టయితే, మిగతా జంతువులతో పోలిస్తే మానవ శరీరం చాలా బలహీనంగా ఉన్నట్టు తోస్తుంది నాకు. కానీ, మనిషి మెదడు వికాసం చెంది ఉండడంవల్ల ఎన్నో పరికరాలని ఉపయోగించడం, ప్రతికూలంగా ఉన్న వాతావరణం పరిస్థితులని అధిగమించేందుకు ఉపాయాలు కనుక్కోవడంలాంటివి చెయ్యగలిగాం. మానవ సమాజం, వాతావరణ స్థితిగతులూ క్లిష్టంగా మారినకొద్దీ, మన తెలివితేటలనీ, అవగాహనా సామర్భ్యాన్నీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకుని ఆ క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావలసి వచ్చింది. అందుకని మనలో మొదట్లో సహజంగా ఉన్నది సానుభూతి, దయేననీ, తెలివితేటలు తరవాత పరిణామక్రమంలో చోటు చేసుకున్నాయనీ నా నమ్మకం. ఆ సామర్థ్యం, ఆ తెలివితేటలు మనిషిలో సమతూకంగా వికాసం చెందనట్టయితే, వాటితో సమానంగా సానుభూతి వంటి భావనలు వృద్ధి చెందక పోయినట్టయితే, అవి వినాశనానికీ, విధ్వంసానికీ దారితీస్తాయి.

“కానీ ఒక విషయం అర్ధం చేసుకోవాలి, మనుషుల మధ్య ఘర్షణలు ఏర్పడడానికి తెలివితేటలని సవ్యంగా ఉపయోగించుకోకపోవడమే కారణం అయినట్టయితే, అవే తెలివితేటలని సవ్యంగా ఉపయోగించుకుని ఈ ఘర్షణలు ఏర్పడకుండా నివారించవచ్చు. తెలివితేటలనీ, మనిషిలోని మంచితనాన్నీ లేదా ఆప్యాయతనీ కలిపి ఉపయోగించు కున్నప్పుడు మనిషి చేసే పనులన్నీ నిర్మాణాత్మకమైనవిగా ఉంటాయి. (ప్రేమించే హృదయానికి జ్ఞానాన్నీ విద్యనీ జోడిస్తే ఇతరుల అభిప్రాయాలనీ, హక్కులనీ గౌరవించడం ప్రారంభిస్తాం. దీన్ని పునాదిగా చేసుకుని మనం రాజీపడడం నేర్చుకుంటాం, ఆ తరవాత మాటిమాటికీ ఘర్షణ పడడం, పోట్లాడడం మానేస్తాం.”

దలైలామా ఆగి చేతిగడియారం వైపు చూసుకున్నారు. “చెప్పాచ్చేదేమిటంటే, మనం జీవితంలో ఎంత హింసనీ, ఎంత చెడునీ ఎదుర్మోవలసివచ్చినప్పటికీ, మన ఘర్షణలకి- అవి ప్రపంచానికి సంబంధించినవైనా, మన మనసులో తలెత్తేవే అయినా - పరిష్కారం,

62 * అనందాన్ని పొందే మార్గం పుట్టుకతో మనకి అబ్బిన సాధుస్వభావాన్ని తిరిగి సంపాదించుకోవడమే,” అన్నారు. మళ్లీ ఒకసారి చేతిగడియారాన్ని చూసుకుని స్నేహంగా నవ్వుతూ, “అయితే ఇంతటితో ఆపేద్దాం... ఈరోజు చాలా దీర్ధంగా చర్చించుకున్నాం!” అంటూ మాట్లాడు కునేప్పుడు విప్పేసి పక్కన పెట్టిన జోళ్లని తొడుక్కుని తన గదిలోకి వెళ్లిపోయారు దలైలామా. మానవస్వభావం మనుషుల్లో ఉండే సహజ లక్షణం సానుభూతి అని దలైలామా వెలిబుచ్చే అభిప్రాయం గత కొన్ని దశాబ్దాలుగా పాశ్చాత్యదేశాలలో వేళ్లూనడం ప్రారంభించినట్టు తోస్తుంది. కానీ దీనికి చాలా సంఘర్షణ చెయ్యాల్సి వచ్చింది. మనిషి స్వతహాగా అహంకారి, ప్రధానంగా మనం చేసే పనులన్నీ స్వార్ధపూరితమైనవే అనే అభిప్రాయం పాశ్చాత్యుల మనసుల్లో లోతుగా పాతుకుపోయి ఉంది. మనం స్వార్థపరులం మాత్రమే కాదు, పోట్లాడడం, శత్రుభావం మన స్వభావంలో ప్రధాన భాగమన్న అభిప్రాయం పాశ్చాత్య సంస్కృతిలో కొన్ని శతాబ్దాలపాటు బలంగా ఉండిపోయింది. చరిత్ర తిరగేస్తే దీనికి భిన్నమైన వ్యక్తులు కనిపిస్తారన్నది కూడా నిజమే. ఉదాహరణకి పదిహేడవ శతాబ్ది మధ్యభాగంలో డేవిడ్‌ హ్యూమ్‌ అనే స్మాట్‌లాండ్‌కి చెందిన తత్వవేత్త మనిషిలోని 'సహజ దయాగుణం గురించి చాలా రాశాడు. ఒక శతాబ్దం గడిచాక చార్లెస్‌ డార్విన్‌ స్వయంగా “సానుభూతి అనే సహజగుణం' మానవజాతికి ఆపాదించాడు. కానీ ఎందుకో తెలీదు, పొశ్చాత్య సంస్కృతిలో మానవజాతి గురించి నిరాశావాద దృక్పథమే ఎక్కువగా చోటుచేసుకుంది. కనీసం పదిహేడో శతాచ్దినుంచీ, థామస్‌ హోబ్స్‌ లాంటి బ్రిటిష్‌ తత్వవేత్తలు మానవజాతి గురించి చాలా ఘోరమైన అభిప్రాయాలు వెలిబుచ్చడంవల్ల ఆ ప్రభావానికి గురైనట్టు కనిపిస్తుంది. హోబ్స్‌ దృష్టిలో మానవజాతి లక్షణాలు, హింస, పోటీతత్వం, నిరంతరం ఘర్షణ పడడం, ఎప్పుడూ స్వార్థం గురించే ఆలోచించడం. మనిషి స్వభావంలో దయాగుణం ఎంతమాత్రం లేదన్న అభిప్రాయానికి పేరుపడ్డ హోబ్స్‌ ఒకసారి వీధిలో ముష్టివాడికి దబ్బు ఇస్తూ కనిపించాడు. ఆయనలో కనిపించిన ఆ బెదార్యం గురించి ఎవరో అడిగేసరికి, “ఈ పని నేను అతనికి సాయం చేసేందుకు కాదు, అతని పేదరికాన్ని చూసి నేను పడ్డ బాధకి ఉపశమనంగా అతనికి డబ్బులిచ్చాను,” అన్నాడు. అదే విధంగా ఈ శతాబ్ది ప్రారంభంలో స్పెయిన్‌లో జన్మించిన జార్జి సంటాయన అనే తత్వవేత్త ఒకచోట ఇలా అంటాడు, “ఉదారస్వభావం, సాయంచేసే మనసు ఉంటే ఉందచ్చుగాక, కానీ ఆ భావాలు అంత బలంగా శాశ్వతంగా ఉండవు. మానవ స్వభావంలో అవి పైపైన కనిపించే భావాలు. కానీ ఆ పై పొరని కొద్దిగా ఛేదించి లోతుకి వెళ్లి చూస్తే క్రూరమైన, అత్యంత స్వార్ధపరుదైన మొండి మనిషి కనిపిస్తాడు.” దురదృష్టవశాత్తూ పాశ్చాత్యవిజ్ఞానం, మనస్తత్వశాస్త్రం ఇటువంటి ఆలోచనలని వెంటనే అంగీకరించాయి, ఆ తరవాత వాటిని ఆమోదించి ఇటువంటి అహంకార

ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం + గ్ర

పూరితమైన అభిప్రాయాన్ని ప్రోత్సపించేదాకా వెళ్లాయి. ఆధునిక మనస్తత్వశాస్త్రం ప్రారంభమైనప్పటినుంచీ, మనిషి ఏ పనిచేసినా స్వార్ధంతోనే చేస్తాడనీ, తనకి లాభం చేకూర్చే విషయాలనే తప్ప ఇక దేనినీ పట్టించుకోడన్న ఆలోచనని ఆధారం చేసుకుని వృద్ధి చెందింది.

తిరుగులేని ఈ సిద్ధాంతాన్ని అంగీకరించిన తరవాత ఎంతోమంది పేరుపొందిన శాస్త్రజ్ఞులు గత వంద సంవత్సరాలలో మనిషి స్వభావం ప్రధానంగా క్రూరమైనదన్న నమ్మకానికి అదనంగా ఎంతో సమాచారాన్ని జోడించారు. ఫ్రాయిడ్‌, 'కలహప్రియత్వం మనిషి స్వభావంలో స్వతహాగా ఉన్న స్వాభావికమైన గుణం,” అంటాడు. ఈ శతాబ్ది చివరి సగభాగంలో రాబర్ట్‌ ఆర్‌డ్రీ, కాన్‌రాడ్‌లోరెంజ్‌ అనే ఇద్దరు రచయితలు జంతువుల ప్రవర్తనలోని లక్షణాలని అధ్యయనం చేశారు. విశేషంగా వేటాడి చంపే జంతుజాతి గురించి అధ్యయనం చేసి వారు వెలిబుచ్చిన అభిప్రాయం; మానవులు కూడా ప్రధానంగా వేటాడి చంపే జంతువుల్లాంటివారే, తమ ప్రాంతాన్ని (16511000 గురించి పోరాడే తత్వం వారి స్వభావంలో జీర్ణించుకుపోయి. ఉంటుంది.

కానీ ఈ మధ్య మానవజాతి గురించి ఉండిన ఈ దృష్టికోణంలోని నిరాశావాదం పూర్తిగా మార్పుచెందుతున్నట్టు కనిపిస్తోంది. దలైలామా చెప్పిన సానుభూతితో నిండిన సాధుస్వభావమే మనిషి అసలు స్వభావం అనే అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా కొన్నివందల శాస్త్రీయమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. కలహప్రియత్వం మనిషిలో సహజంగా ఉండదనీ, అటువంటి ప్రవర్తనని ప్రేరేపించే కారణాలు శరీరనిర్మాణానికీ, సమాజానికీ, పరిస్థితులకీ, వాతావరణానికీ సంబంధించిన అనేక రకాలైన కారణాల ప్రోద్బలంవల్ల తలెత్తుకాయనీ నిర్ధారించారు. ఇటీవల జరిగిన పరిశోధనల సారాన్ని సమగ్రంగా తెలిపిన ఫలితాలు బహుశా 1986లో వెలువడ్డాయని చెప్పవచ్చు. హింస గురించి సర్‌విల్‌ స్టేట్‌మెంట్‌ అనే వివరణ దీన్ని తెలియజేసింది. దానిమీద ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన ఇరవైమంది శాస్త్రవేత్తలు సంతకాలు చేశారు. ఆ పత్రంలో వాళ్లు హింసతో కూడిన ప్రవర్తన తప్పనిసరిగా ఉంటుందని అంగీకరించారు. అంతమాత్రాన వుట్టుకతోనే యుద్దాలు చెయ్యాలనీ, పొంనతో కూడిన వనులు చెయ్యాలనీ (పేరేవించే లక్షణాలు మనలో ఉంటాయనడం విజ్ఞానళాస్రం దృష్టా తవ్దు. ఇది జన్యు సంబంధమైన విషయం కాదు. మనిషి న్వృభావంలో నవాజంగా వుట్టుకతోనే వచ్చే లక్షణం కాదు అని నిర్దారించారు. మన నాడీవ్యవస్థ మనలో పొంసాత్మకమైన (ప్రవర్తనని కలిగించినప్పటికీ, అది దానంతట అదే జరిగేది కాదు. మన శరీరంలోని నాడీవ్యవస్థలో హింసాత్మకంగా ప్రవర్తించమని మనని బలవంతపెట్టే అంశాలు ఏవీ లేవు. మనిషి సహజ స్వభావాన్ని పరిశీలించినప్పుడు, ఈ రంగంలోని అధికశాతం శాస్త్రజ్ఞులు, మనలో స్వతహాగా ఉండే నైజంవల్ల మనం సాధుస్వభావాన్నీ, సానుభూతినీ ప్రదర్శించవచ్చు, లేదా కలహప్రియుల్లా హింసకి కూడా దిగవచ్చు. ఈ రెండు రకాల ్రవర్తనలూ మన స్వభావంలోనే ఉన్నాయి; వీటిలో ఏది ఎక్కువ బలంగా తన ప్రభావాన్ని చూపుతుంది అనేది శిక్షణమీద ఆధారపడి ఉంటుంది అని అంటారు.

64 + అనందాన్ని పొందే మార్గం

సమకాలీన పరిశోధకులు మనిషిలో అంతర్గతంగా కలహప్రియత్వం ఉంటుందనే అభిప్రాయాన్ని ఖండించడమే కాకుండా మనిషి స్వభావరీత్యా స్వార్ధపరుడనీ, అహంకారి అనీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా అంగీకరించలేదు. అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సి.డేనియల్‌ బోస్టన్‌, నాన్సీ ఐసన్‌బర్గ్‌ గత కొన్నేళ్లలో అనేకమైన పరిశోధనలు జరిపి మనిషి స్వతహాగా ఇతరుల హితమే కోరుకుంటాడనీ, అదే అతని సహజ స్వభావమనీ తెలియజేశారు. సమాజశాస్త్రం బోధించే డా. లిండా విల్సన్‌ వంటి శాస్త్రజ్డులు, ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మన మనుగడకి సంబంధించిన ప్రాథమిక లక్షణంగా ఆమె ఇతరుల హితాన్ని కోరుకునే గుణాన్ని వర్ణిస్తుంది. ఈమె ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఇంతక్రితం కొందరు తత్వవేత్తల అభిప్రాయానికి పూర్తిగా భిన్నమైనది. వాళ్లు ప్రతిపాదించిన సిద్దాంతం ప్రకారం ప్రతికూలత, కలహప్రియత్వం మన మనుగడకి అత్యంత ముఖ్యమైన లక్షణాలు.

ఒక వంద ప్రకృతి విధ్వంసాలని పరీక్షించి డా. విల్సన్‌, ఆ విధ్వంసంలో దెబ్బతిన్న మనుషుల్లో ఇతరులకి సాయపడాలన్న ప్రయత్నాన్ని చూసింది. ఆ ప్రయత్నంవల్లే ఎక్కువ మంది కోలుకోగలిగారని కూడా గమనించింది. అందరూ కలిసికట్టుగా, ఒకరికొకరు సాయం చేసుకోవడంవల్ల, ఆ తరవాత మనస్తత్వానికి సంబంధించిన సమస్యలేవీ వారిని బాధించలేదనీ, అదే కనక జరగకపోతే ఆ విధ్వంసాల ఘోర పరిణామాలని వాళ్లు తట్టుకోలేకపోయేవారనీ ఆమె వెల్లడించింది.

ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, తనకోసమేకాక ఇంకొకరి మంచికోసం కూడా పనిచెయ్యడం, అనే లక్షణాలు మానవస్వభావంలో లోతుగా పాతుకుపోయి. ఉన్నట్టు తోస్తుంది. ఈ లక్షణం గతంలో ఆదిమానవులు తమ మనుగదడని పరిరక్షించుకునేందుకు గుంపులు గుంపులుగా కలిసి ఉండడం దగ్గర్నించీ మనిషి స్వభావంలో భాగంగా కొనసాగుతూ వస్తోందని అనిపిస్తుంది. సామాజికంగా ఒకరితో ఒకరు కలిసి ఉండాలన్న ఈ ధోరణి ఈనాటికీ అలాగే ఉంది. దా. ల్యారీ షెర్‌విట్ట్‌ లాంటివారు అధ్యయనాలు చేపట్టి, గుండెలోని ధమనులకి సంబంధించిన వ్యాధికి కారణాలని పరీక్షించినప్పుడు, ఎప్పుడూ తమగురించే ఆలోచించే (ఇంటర్వ్యూలలో నేను, 'నా' వంటి మాటలు ఎక్కువగా ఉపయోగించే) వాళ్లు ఇటువంటి హృద్రోగాలకి ఎక్కువగా గురవుతారనీ, అనారోగ్యానికి కారణమైన ఇతర రోగాలన్నీ అదుపులో ఉన్నప్పటికీ, ఈ పరిణామం కనిపిస్తుందనీ తెలుసుకున్నారు. సామాజికస్థాయిలో ఇతరులతో దగ్గరి సంబంధాలు లేనివాళ్లు అనారోగ్యానికి గురవుతారనీ, తీవ్రమైన అసంతృప్తికి లోనవుతారనీ, ఒత్తిడికి మరింత సులభంగా గురవుతారనీ శాస్త్రజ్ఞులు తెలుసుకుంటున్నారు.

ఇతరులకి సాయాన్ని అందించడం అనేది ఒకరితో ఒకరు మాటల ద్వారానో, చేతల ద్వారానో సంపర్కం పెట్టుకోవడమంత సహజంగా మన స్వభావంలో ఇమిడిపోయి ఉంటుంది. ఇక్కడ భాషావికాసాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనిషికి మాత్రమే లభించిన అద్భుతమైన వరం ఇది సానుభూతి, ఇతరులకి సాయం చెయ్యడం కూడా మనలో సహజంగా ఉండే గుణాలే. మెదడులో కొని భాగాలు భాషకోసమే ఉద్దేశించి

ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం ఈ గ్ర నిర్మించబద్దాయి. వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నట్టయితే, అంటే సమాజంలో మాట్లాదేవాళ్లు ఎక్కువగా ఉన్నట్టయితే, అప్పుడు మెదడులో దాగిఉన్న ఆ భాగాలు వికాసం చెంది, పరిపక్వమై మన భాషాపటిమ పెంపొందుతుంది. అదే విధంగా మనుషులందరిలోనూ 'సానుభూతి బీజం” నిక్షిప్తంగా ఉండవచ్చు. సరైన వాతావరణం లభించినప్పుడు - అది ఇంట్లో, విసృత సమాజంలో, తరవాత మనమే కావాలని ప్రయత్నించినప్పుడు కావచ్చు - ఆ '“బీజం' మొలకెత్తి వికసిస్తుంది. ఈ ఉద్దేశంతోనే పరిశోధకులు ఆ సరైన వాతావరణం ఎలాంటిదోనని వెతుకుతూ, ఎటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లల్లో ఆ బీజం పరిపక్వతని సాధించి వారిలో ఇతరులపట్ల ఆదరణాభావాన్నీ సానుభూతినీ పెంపొందించేందుకు వీలవుతుందో అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లకి ఎన్నో అంశాలు కనిపించాయి: తమ భావోద్రేకాలని నిగ్రహించుకోగల తలిదండ్రులు, సాయంచేసే స్వభావం కలిగి ఉండి పిల్లలకి ఉదాహరణగా నిలవగలవాళ్లు, పిల్లల ప్రవర్తనని సరైన మార్గాన పెడుతూ అవసరమైనప్పుడు సరిదిద్దేవాళ్లు, తమ ప్రవర్తనకి తామే బాధ్యులని పిల్లలకి తెలియజేసే తలిదండ్రులు, పిల్లల భావాలనీ, ఇతరుల మీద వాళ్ల ప్రవర్తన కలిగించే ప్రభావాన్నీ సరైన రీతిలో, వాళ్లతో చర్చిస్తూ, మార్గనిర్దేశం చేసేది వాళ్ల తలిదండ్రులే అని గుర్తించారు. మనిషిలోని సహజస్వభావం గురించి మనకి ఉన్న ఊహలని ఒకసారి పునశ్చరణ చేసుకుని, వాళ్లు కలహ్రియులు కారు, పరోపకార గుణం గలవారని సరిదిద్దుకున్నట్టయితే, ఒక కొత్త కోణం మనముందు (ప్రత్యక్షమవుతుంది. మనిషి ప్రవర్తన మొత్తం 'స్వార్ధ చింతనితో కూడుకున్నదే అన్న అభిప్రాయంతో ఆలోచించడం మొదలుపెడితే దానికి సరియైన ఉదాహరణగా మనకి కనిపించేది అప్పుడే పుట్టిన శిశువు. పుట్టగానే శిశువుల్లో సహజంగా కనిపించే ఒకే ఒక లక్షణం, తమ అవసరాలు తీర్చుకోవాలన్న కోరిక - ఆహారం, శారీరక సుఖం, మొదలైనవి. కానీ అహంకారంతో నిండిన ఆ అభిప్రాయాన్ని వదిలేశామంటే ఒక పూర్తి కొత్త చిత్రం మనముందు రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుదే పుట్టిన శిశువు ఒకే ఒక ప్రయోజనాన్ని నెరవేరుస్తుందన్న విషయాన్ని మనం సులభంగా చూడగలుగుతాం : ఇతరులకి నంతోషాన్నీ, ఆవ్లోదాన్నీ కలిగించే వయోజనం, సామర్ధ్యం ఒక శిశువు వుట్టుకలో ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న ఒక శిశువుని గమనిస్తే మనిషిలో స్వభావరీత్యా ఉండే మృదుత్వాన్ని కాదనడం సాధ్యం కాదు. ఈ కొత్త కోణం నుంచి చూసినప్పుడు, ఇతరులకి, లేదా శిశువు పోషణ బాధ్యత వహించేవారికి సంతోషాన్ని అందించడం అనే లక్షణం జన్మతః అబ్బేదే అనే నిర్ణయానికి రాగలుగుతాం. ఉదాహరణకి, ఎదిగిన మనిషితో పోలిస్తే, అప్పుడే పుట్టిన శిశువులో ఘ్రాణశక్తి బహుశా 5 శాతంకన్నా ఎక్కువ ఉండదు. రుచి తెలియడం అనేది కూడా చాలా తక్కువే ఉంటుంది. ఆ శిశువులో ఉండదే కాస్తంత శక్తీ తల్లిపాల వాసనా, రుచీ పసిగట్టడానికే వినియోగింప బడుతుంది. శిశువుకి స్తన్యం ఇవ్వడం అనే క్రియ దానికి పోషణ అందించేందుకే కాక, స్తనంలోని ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా చూస్తే ఒక

66+ ఆనందాన్ని పొందే మార్గం శిశువు పుట్టుక తల్లికి స్తనాల్లో ఒత్తిడి తగ్గించి సంతోషాన్ని కలిగించేందుకే జరుగుతుందని అనుకోవచ్చు, ఆ శక్తి పుట్టుకతోనే ఆ శిశువులో ఉంటుంది.

ముఖాలని గుర్తుపట్టి ప్రతిస్పందించడం అనే లక్షణం కూడా శిశువుకి జన్మతః అబ్బే లక్షణమే. ఒక పసివాడో, పసిపిల్లో మీ ముఖంలోకి, మీ కళ్లలోకి సూటిగా చూస్తూ నవ్వినప్పుడు, సంతోషంతో పొంగిపోకుండా ఉండలేరు. దీన్ని మానవప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు కొందరు సిద్ధాంతపరంగా చెప్పారు : ఒక శిశువు తన సంరక్షకుని కళ్లల్లోకి సూటిగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ జీవశాస్త్ర ప్రణాళికకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. అది సహజంగానే సంరక్షకుడి నుంచి మృదువైన, సున్నితమైన సంరక్షణాభావాన్ని రాబట్టుతుంది. మానవస్వభావాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న పరిశోధకులు శిశువు తిండీ, నిద్రా కోరుకునే స్వార్ధపూరిత ప్రాణి కాదన్న నిజాన్ని గుర్తించారు. ఇతరులకి ఆనందం కలిగించే స్వభావం సహజసిద్ధంగా శిశువులో వుంది. అయితే శిశువులోవున్న స్వాభావిక కరుణాబీజం మొలకెత్తి అభివృద్ధి చెందటానికి సరైన పరిసరాల అవసరం వుందని అంటారు.

మనిషి స్వభావం ప్రధానంగా సానుభూతితో కూడినదే తప్ప కలవానికి కాలుదువ్వేది కాదు అని నిర్ణయించిన మరుక్షణం మనచుట్టూ ఉండే ప్రపంచంతో మన సంబంధంలో పెద్ద మార్పు చోటుచేసుకుంటుంది. ఎదుటివారు సానుభూతిపరులు, మనకి శత్రువులు కాదు, స్వార్ధపరులు కారు అనే విషయం అర్ధం చేసుకుంటే మనకి ఉపశమనం, నమ్మకం కలిగి జీవితం సరళంగా సాగుతుంది. మనం మరింత ఆనందాన్ని అనుభవిస్తాం.

జీవిత పరమార్ధం గురించి ధ్యానించడం

ఆ వారంరోజులపాటు దలైలామా అరిజోనా ఎడారిలో మానవ స్వభావాన్నీ మనిషి మానసిక ధోరణినీ ఒక శాస్త్రజ్డుడిలా సూక్ష్మంగా పరీక్షిస్తూ ఉండిపోయారు. మా ఇద్దరి సంభాషణలలోనూ ఒక సాధారణమైన వాస్తవం ్రకాశించి మాచుట్టూ వెలుగులు నింపినట్టు అనిపించింది : మన జీవిత వరమార్థం ఆనందమే. జీవితంలోని దైనందిన సమస్యలని తప్పించుకుంటూ ముందుకి సాగేందుకు సామాన్యంగా ఉన్నట్టు తోచే అ వాక్యం ఒక శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడుతుంది. ఆ దృష్టికోణం నుంచి చూసినప్పుడు కష్టాలని సృష్టించే విషయాలని వదిలిపెట్టి ఆనందాన్ని పొందేందుకు అవసరమైన విషయాలని పోగుచేసుకునే మార్గం మనకి కనిపిస్తుంది. ఈ పద్ధతి, రోజువారి అభ్యాసం, క్రమక్రమంగా మనని ముందుకు తీసుకెళ్లి నిజంగా ఆనందం పొందేందుకు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియజేస్తుంది.

జీవితం మరీ చిక్కులతో నిండిపోతే, ఏం చెయ్యాలో మనకి తెలీని అయోమయంలో పడిపోతే, తరచు ఆగిపోయి మన జీవితానికి అసలు కావలసింది ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాలి, మన లక్ష్యం ఏమిటని ఆలోచించుకోవాలి. ఎటూ పోలేని స్టితి వర్చడినప్పుడు, ఏదీ పాలుపోని పరిస్థితి ఎదురైనప్పుడు ఒక గంటో, ఒక పూటో, కొన్ని రోజులో అన్ని

ఆనందం అనే మానసిక స్థితిని మళ్లీ పొందటం + ర్ర7

పనులూ ఆపేసి మనకి నిజమైన ఆనందాన్ని అందించేది ఏది అని ఆలోచించడం మంచిది. ఆ తరవాత దాన్నిబట్టి మనం చెయ్యవలసిన పనులకి ప్రాముఖ్యం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే మన జీవితం మళ్లీ ఒక గాడిన పడుతుంది, కొత్తగా ప్రయత్నాలని ప్రారంభించేందుకు ఒక కొత్తచూపు దొరుకుతుంది, ఏ దిశగా ముందుకి సాగాలో అర్ధమవుతుంది.

జీవితంలో అప్పుడప్పుడూ మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు వస్తాయి, అవి మన జీవితగమనం మీద పూర్తి ప్రభావం చూపేవిగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి, పెళ్లి చేసుకోవాలన్‌, పిల్లల్ని కనాలనీ, న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా స్థిరపడాలనీ, ఏదైనా కళలో నిష్టాతులవాలనీ, ఏదైనా ఒక వృత్తి నేర్చుకోవాలనీ లాంటి నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఆనందంగా ఉండాలన్న దృథ నిశ్చయం - ఆనందంవైపు తీసుకెళ్లే మార్గాన్ని గురించి తెలుసుకుని, మరింత ఆనందంతో నిండిన జీవితాన్ని నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలని అనుసరించడం - కూడా ఇటువంటి కీలకమైన నిర్ణయమేనని అనుకోవచ్చు. ఆనందం ఒక సమంజసమైన లక్ష్యంగా ఆనుకుని దానివైపు మళ్లడం, పద్ధతి ప్రకారం ఆనందాన్ని సంపాదించుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం మన జీవితాలని పూర్తిగా మార్చివేస్తాయి.

చివరికి అనందం దగ్గరకి చేర్చే కారకాలని దలైలామా అర్ధం చేసుకున్న విధానం ఆయన తన మనసుని జీవితాంతం పరీక్షిస్తూ ఉండడం అనే దానిమీద ఆధారపడింది. అంతేకాక, ఆయన మనిషి జీవితంలోని పరిస్థితులని పరిశీలించి, రెండువేల ఐదువందల ఏళ్లక్రితం మొట్టమొదట బుద్ధుడు స్థాపించిన విధానానికి కట్టుబడి ఆ విషయాన్ని పరీక్షించారు. ఆ నేపథ్యంనుంచి వచ్చిన దలైలామా ఏ చర్యలూ, ఆలోచనలూ ఎక్కువ ప్రయోజనకరమైనవి అనే విషయాన్ని గురించి స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. ఈ కింది వాక్యాల్లో ఆయన తన విశ్వాసం తాలూకు సారాన్ని తెలిపారు. దీన్ని ఒక ధ్యానంలా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. “కొన్నిసార్లు నేను నా పాత స్నేహితులని కలుసుకున్నప్పుడు, కాలం ఎంత వేగంగా గడిచిపోయిందోనని అనిపిస్తూ ఉంటుంది. మనం ఈ గడిచిన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నామా లేదా అనే ఆలోచనలో పడిపోతాం. సమయాన్ని సవ్యంగా ఉపయోగించు కోవడం అనేది చాలా ముఖ్యం. మన దగ్గర ఈ శరీరం ఉన్నంతవరకూ, ముఖ్యంగా అద్భుతమైన ఈ మెదడు ఉన్నంతవరకూ, మనకి అందుబాటులో ఉన్న ఒక్కొక్క నిమిషమూ ఎంతో విలువైనది. మన దైనందిన జీవితం ఆశ అనే భావన వల్లే సజీవంగా ఉంది, కానీ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. రేపు ఈ సమయానికి మనం ఈ లోకంలో ఉంటామో లేదో కచ్చితంగా చెప్పలేం. అయినా భవిష్యత్తు మీద ఆశతోనే మనం పనిచేస్తాం. అందుకే మనకి దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం అనేది నా ఉద్దేశంలో ఇలా జరగాలి : వీలైతే ఇతరులకి సేవ చెయ్యండి, అన్ని ప్రాణులకీ సాయం చెయ్యండి. అది మీవల్ల కాకపోతే, కనీసం ఎవరికీ హాని చెయ్యకండి. నేను బోధించే విషయాలన్నిటి సారమూ అదే.

68+ ఆనందాన్ని పొందే మార్గం

“ఇప్పుడు జీవితంలో నిజంగా విలువైనది ఏమిటో, మన జీవితాలకి అర్ధం చేకూర్చే దేమిటో ఆలోచించి మనకి ఏవి ప్రధానమో నిర్ణయించుకుందాం. మన జీవన ప్రయోజనం సానుకూలమైనదిగా ఉండాలి. మనం పుట్టింది ఇతరులకి బాధ కలిగించేందుకు కాదు. అవళతలివారికి వోని చెయ్యడం జీవితానికి సరైన ప్రయోజనం కాదు. మన జీవితం విలువైనదిగా ఉండాలంటే మనం మంచి మానవీయ గుణాలని అలవరచుకోవాలి - ఆప్యాయత, దయ, సానుభూతి. అప్పుడే మన జీవితం సార్ధ్థకమవుతుంది, జీవితంలో శాంతి నెలకొంటుంది - ఎక్కువ ఆనందంగా జీవించగలుగుతాం.”

భాగం 2 మానవుల్లో ప్రేమ, సానుభూతి ఖ్‌

అధ్యాయం 5 అన్యోన్యతకి కొత్త నమూనా అటో ఒంటరితనం, బాంధవ్యం ద లైలామా బస చేసిన హోటల్‌కి వెళ్లి ఆయన గదికి చేరుకున్నాను. నన్ను కూర్చోమని సైగ చేశారాయన. కప్పుల్లో టీ పోస్తూ ఉండగా ఆయన తనకాళ్లకున్న చెప్పులు వదిలేసి పెద్ద కుర్చీలో సుఖంగా కూర్చున్నారు.

“ఊం, ఏమిటి విశేషాలు?” అన్నారు. ఆ గొంతు మామూలుగానే ఉన్నప్పటికీ, 'నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను" అన్న ధ్వని వినిపించింది నాకు. చిరునవ్వుతో, నా సమాధానం కోసం మౌనంగా ఎదురుచూస్తూ ఉండిపోయారు.

అంతకు కొన్నిక్షణాలక్రితం ఆయన కోసం హోటల్‌ లాబీలో వేచిఉండి, నేను యథా లాపంగా అక్కడ ఉన్న వార్తాపత్రికని చేతిలోకి తీసుకున్నాను. అది “వ్యక్తిగత సంబంధాలు" పేజీలో మడిచిపెట్టి ఉంది. దాన్నిందా కిక్కిరిసినట్టు ఉన్న ప్రకటనలని ఒక్కొక్క పేజీ తిప్పుతూ చూస్తూ ఉంటే, జనం ఇంకొకరితో సంబంధం వర్పరచుకోవడానికి తపన పడడం కనిపించింది. ఇంకా ఆ ప్రకటనల గురించే ఆలోచిస్తూ దలైలామాతో నేను మాట్లాడవలసిన విషయాలను మననం చేసుకోసాగాను. కానీ ఆయన్ని కలుసుకోగానే నేను ముందే అనుకున్న ప్రశ్నలన్నిటినీ పక్కన పెట్టి, “మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నానన్న భావన కలుగుతుందా?” అని అడిగాను.

“లేదు,” అని సమాధానం చెప్పి ఊరుకున్నారాయన. అలాంటి జవాబు వినేందుకు నేను సిద్ధంగా లేను. ఆయన చెప్పే సమాధానం ఇలా ఉంటుందని అనుకున్నాను, “ఎందుకు అనిపించదు? ఎవరినైనా ఎప్పుడో ఒకప్పుడు ఒంటరితనం బాధిస్తుంది...”. ఆయన అలా జవాబు చెపితే దాన్ని ఎలా ఎదుర్కొంటారని అడగాలని అనుకున్నాను. ఏనాడూ ఒంటరితనం అనుభవించని మనిషిని కలుసుకుంటానని నేను అనుకోనే లేదు.

“లేదా?” అన్నాను మళ్లీ నమ్మకం కుదరనట్టు.

71

72 ఈ ఆనందాన్ని పొందే మార్గం

“లేదు.”

“అలా అనిపించకపోవడానికి కారణం ఏమిటని అనుకుంటున్నారు?”

ఒక్క క్షణం ఆలోచించి, “ఒక కారణం ఏమిటంటే ఏ మనిషినైనా నేను సాను కూలమైన దృష్టితోనే చూస్తాను; వారిలో మంచి లక్షణాలకోసం వెతుకుతాను. ఈ ధోరణి వల్ల వెంటనే సాన్నిహిత్యం, ఒక రకమైన బాంధవ్యం నెలకొంటుంది.”

“కొంతవరకూ నా స్వభావం కూడా దానికి కారణం కావచ్చు, నేను చేసే పనివల్ల అవతలి వ్యక్తికి నామీద గౌరవం పోతుందనో, నన్ను ఒక విచిత్రమైన మనిషి కింద జమకడతాడనో నాకు భయం గాని, ఆందోళన గాని తక్కువగానే ఉంటాయి. అటువంటి భయం, ఆందోళనా సామాన్యంగా నాలో ఉండవు కాబట్టి నా ప్రవర్తనలో దాపరికం ఉండదు. అదే అన్నిటికన్నా ప్రధానమైన కారణమని అనుకుంటాను,” అన్నారు దలైలామా.

అటువంటి వైఖరిని అలవరచుకోవడానికి ఎంత కష్టపడాలో, అది ఎలా సాధ్యమో అర్ధం చేసుకునేందుకు ప్రయాసపడుతూ ఇలా అడిగాను, “కానీ ఎదుటివారితో ఏ ఇబ్బందీ లేకుండా వ్యవహరించగల సామర్చాన్ని పొందాలంటే ఎలాటి ప్రయత్నం చెయ్యాలంటారు? ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడరేమో, మీలో లోపాలు వెతుకుతారేమో అనే భయాం దోళనలు లేకుండా ఉందాలంటే ఏం చెయ్యాలి? ఒక సగటు మనిషి ఈ ధోరణిని అలవరచుకోవాలంటే దానికి నిర్దుష్టమైన మార్గాలేవైనా ఉన్నాయా?”

“నేను ముఖ్యంగా నమ్మేది సానుభూతిని. అది ఎంత ఉపయోగకరమైనదో ముందు (గ్రహించాలి. అదే ప్రధానం. సానుభూతి అనేది పిల్ల చేష్ట భావుకతకి చిహ్నం అని అనుకోకూడదు. సానుభూతి అనేది నిజంగానే ఉపయోగకరమని అర్థం చేసుకుని, దాని విలువ ఎంత లోకైనదో (గ్రహించిన తరవాత, అది తక్షణం మీకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించి దాన్ని అలవరచుకోవాలని అనిపిస్తుంది,

“అలా సానుభూతి అనే భావాన్ని ప్రోత్సపాస్తే ఆ భావన క్రియాశీలంగా మారితే, ఎదుటివారిపట్ల మీ ధోరణి కూడా దానంతట అదే మారిపోతుంది. ఎదుటివారిని సానుభూతితో పలకరిస్తే భయం దానంతట అదే తగ్గిపోయి వారితో మనసువిప్పి మాట్లాడగలుగుతారు. దానివల్ల సానుకూలమైన, స్నేహపూరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆ ధోరణితో మీరు వారితో సంబంధం ఏర్చరచుకుని, వారినుంచి స్నేహాన్నీ సానుకూలమైన ్రవర్తననీ పొందేందుకు తగిన వాతావరణాన్ని మీరే సృష్టించుకుంటారు. అలాంటి ధోరణి మీలో ఉంటే అవతలి వ్యక్తి మీకు సానుకూలంగా స్పందించకపోయినా, మీతో స్నేహంగా మెలగకపోయినా, కనీసం మీరు అతనితో స్నేహం చెయ్యాలని ప్రయత్నించారన్న భావన, పరిస్థితికి అనుగుణంగా మీ ధోరణిని మార్చుకునే స్వేచ్ళని మీకు కల్పిస్తుంది. మీకు మనసువిప్పి వారితో ఉపయోగకరమైన సంభాషణ చేసేందుకు అవకాశం లభిస్తుంది. అదే, అటువంటి సానుభూతితో నిండిన ధోరణి మీలో లేనట్టయితే, మీకు చికాకుగానూ, ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం లేకుండానూ ఉన్నట్టయితే, మిమ్మల్ని కలుసుకునేందుకు మీ దగ్గరకి మీ ఆప్తమిత్రుడు

అన్యోన్యతకి కొత్త నమూనా త 7 వచ్చినా మీకు ఇబ్బందిగానే అనిపిస్తుంది.

“చాలా సందర్భాల్లో అవతలివ్యక్తే మనపట్ల ముందుగా సానుకూలమైన ప్రవర్తనని కనబరచాలని మనం అనుకుంటాం. మనమే ముందు ఆ ప్రయత్నం చేసి అటువంటి అవకాశాన్ని కలిగిద్దామని అనుకోం. అది తప్పని నా ఉద్దేశం; అది సమస్యలకి దారి తీస్తుంది. ఇద్దరు వ్యక్తులమధ్య అడ్డుగోడ లేచి ఒంటరితనాన్ని సృష్టిస్తుంది. మనలో ప్రధానంగా ఉందే వైఖరివల్ల గొప్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. సానుభూతితో ఇతరులతో వ్యవహరించడం అనేది ఈ మార్పుకి దోహదం చేస్తుంది” అన్నారు దలైలామా. దలైలామా ఎన్నడూ ఒంటరితనాన్ని ఎదుర్మోలేదని అనడం విని నేను అమెరికన్‌ సమాజంలో అంతటా విస్తరించి ఉన్న ఒంటరితనంతో దాన్ని పోల్చి చూసుకుని ఆశ్చర్య పోయాను. మా సమాజంలో ఒంటరితనం అంతటా ఉందన్న నమ్మకం నేను ఒంటరివాడిని అవడంవల్ల మాత్రమే కలిగింది కాదు. మనస్తత్వవేత్తగా నేను వైద్యం చేస్తున్న వారందరి లోనూ ఈ ఒంటరితనం అంతఃసూత్రంగా ఉండడం గమనించాను కనుకే నాకీ నమ్మకం ఏర్పడింది. గత ఇరవైఏళ్లలో మనస్తత్వవేత్తలు ఒంటరితనం అనే వ్యాధిని శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎన్నో పరిశోధనలూ, పరిశీలనలూ జరుపుతున్నారు. ఈ అధ్యయనాలవల్ల కొట్టొచ్చినట్టు కనబడిన ఫలితాలలో ఒకటి, అందరూ వర్తమానంలోనో గతంలోనో తాము ఒంటరితనంతో బాధపడుతున్నామని చెప్పడం. ఒక పెద్ద సర్వేలో అమెరికాలో వయస్కులైన వాళ్లలో నాలుగోవంతు గత రెండు వారాలలో కనీసం ఒకసారైనా తాము విపరీతమైన ఒంటరితనంతో బాధపడ్డామని చెప్పారు. నిరంతరం ఒంటరితనం అనుభవించడం అనే వ్యాధి ఒకటుందనీ, ముఖ్యంగా వయసు పైబడ్డవారిలో ఇది ఎక్కువగా ఉంటుందనీ మనం తరచు అనుకుంటాం. వాళ్లు ఖాళీ అపార్ట్‌మెంట్లలోనో, నర్సింగ్‌ హోమ్‌ల వార్డుల్లోనో ఉంటారని అభిప్రాయపడతాం. కానీ యుక్తవయసులో ఉన్నవారికి కూడా వృద్ధులకిలాగే ఒంటరితనం అనేది ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి.

ఒంటరితనం కలిగించే రకరకాల క్లిష్ట పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు పరీక్షలు జరపడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇది సమాజమంతటా విరివిగా విస్తరించి ఉంది. ఉదాహరణకి, ఒంటరిగా ఉండే వ్యక్తులు తరచు మనసువిప్పి ఏమీ చెప్పరనీ, ఇతరులతో మాట్లాడడానికి ఇబ్బంది పడతారనీ, అవతలివ్యక్తి చెప్పేది వినడం కూడా వారికి చేతకాదనీ, నలుగురితో మాట్లాడుతున్నప్పుడు హావభావాలని (అంటే తల ఆడించడం, సరైన జవాబు చెప్పడం, లేదా ఏమీ మాట్లాడకుండా వినడం) సరైన రీతిలో వెలిబుచ్చలేరనీ తెలుసుకున్నారు. ఒంటరితనాన్ని జయించేందుకు ఇటువంటి సామాజిక (ప్రవర్తనని మెరుగుపరచుకోవడం ఒక మార్గమని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాన్సీ దలైలామా చెప్పిన ఉపాయం సామాజిక (్రవర్రనని మార్చుకోవడాన్నీ భాహ్య కారణాలనీ లెక్టులోకి తీనుకోదు. ఆయన చెప్పేది నూటిగా వదయాన్ని తాకదం గురించి.

74 4 ఆనందాన్ని పొందే మార్గం భావనలని మెరుగువరచుకుంటే సానుభూతిని అలవరచుకోవచ్చునని అంటారాయన,

మొదట్లో ఆయన మాటలు విని నేను ఆశ్చర్యపోయినప్పటికీ, ఆయన అంత అత్మ విశ్వాసంతో తాను ఎన్నడూ ఒంటరితనాన్ని అనుభవించలేదని అంటూ అంటే నాకు కూడా ఆ మాటల్లో బాగా నమ్మకం కలిగింది. ఆయన అంత దృఢంగా చెప్పిన మాటకి రుజువు కూడా కనిపించింది. చాలాసార్లు అపరిచిత వ్యక్తులతో ఆయన మాట్లాడడం విన్నాను. ప్రతిసారీ అది ఎంతో సానుకూలంగా ఉన్నట్టు కనిపించింది. ఇటువంటి సొనుకూల ప్రవర్తన సహజంగా స్నేహస్వభావం కలిగిఉండడంవల్ల కాదనీ, యథాలాపంగా జరుగు తున్నది కాదనీ నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను. ఆయన బోలెడంత సమయాన్ని సానుభూతి గురించి ఆలోచించేందుకూ, దాన్ని అలవరచుకునేందుకూ వెచ్చించారని అర్థమైంది. అటువంటి ధోరణిని తన దైనందిన అనుభవంలో ఉపయోగించుకుంటూ, దాన్ని మరింత మృదువుగా, సారవంతంగా తయారుచేసుకుంటూ ఇతరులనుంచి సానుకూలమైన స్పందనలని అందుకుంటున్నారనీ - నిజానికి ఒంటరితనం అనుభవిస్తున్న వారెవరైనా ఆ పద్ధతిని ఉపయోగించుకోవచ్చనీ - గ్రహించాను.

ఇతరులమీద ఆధారపడడం - ఆత్మవిశ్వాసం

“ఏ పనైనా నిర్జుష్టంగా చెయ్యాలనేది అన్ని ప్రాణులకీ ఉండే ఒక లక్షణం. ఆ లక్షణాన్ని ఆచరణలో పెట్టాలంటే మన హృదయాలలోనూ, మస్తిష్కాలలోనూ ఉన్న సానుభూతి సాయం అవసరం...” చీమ చిటుక్కుమంటే వినపదేంత నిశ్శబ్దంగా ఉన్న సభలో దలైలామా తన ఉపన్యాసాన్ని ఈ వాక్యాలతో ప్రారంభించారు. పదిహేనువందలమంది హాజరైన ఆ సభని ఉద్దేశించి ఆయన సానుభూతి గురించి ప్రసంగించారు. శోతలలో ఎక్కువమంది బౌద్ధమతాన్ని అనుసరించే విద్యార్థులు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ 'పుణ్యక్షేతం? (016140%)4ల%0 అనే బౌద్ధమత సిద్ధాంతం గురించి చర్చించడం ప్రారంభించారు.

బౌద్ధమతానుసారం '“ధ్యానఫలలి (14610 అంటే మనసుమీద పదే సానుకూలమైన ముద్ర లేదా సానుకూల చర్యలవల్ల 'మనసులో కొనసాగుతూ ఉండే' ఒక భావం, దలైలామా 'పుణ్యక్షేత్రం” గురించి మాట్లాడుతూ దాన్ని ఆధారం చేసుకుని ఎవరైనా సరే పుణ్యాన్ని పోగుచేసుకోవచ్చని చెప్పారు. బౌద్ధమతానుసారం, మనిషి ఎంత పుణ్యాన్ని పోగుచేసుకోగలిగాడనేదాన్నిబట్టి, పునర్జన్మకి తగిన పరిస్థితులు ఏర్పడతాయి. బుద్దుడి బోధనలు రెండురకాల పుణ్యక్షేత్రాల గురించి పేర్కొంటాయి. - బుద్ద్ధులక్షేత్రం, ఇతర ప్రాణులకి సంబంధించిన క్షేత్రం. పుణ్యాన్ని సంపాదించుకునేందుకు ఒక మార్గం, బుద్ధులలో అంటే జ్ఞానాన్ని పొందినవారిలో, నమ్మకం, గౌరవం, విశ్వాసం ఉండడం. రెండవమార్గం, దయతో వ్యవహరించడం, జెదార్యం, సహనం, వంటి గుణాలకీ, హత్య చెయ్యడం, దొంగతనం, అబద్ధమాడడం వంటి వ్యతిరేక భావాలని మనసులోకి రాకుండా అద్దుకోదానికీ సంబంధించిన మార్గం. ఈ రెండో మార్గం అవలంబించాలంటే ఇతరులతో

అన్యోన్యతకి కొత్త నమూనా శ 765 సంబంధాలు పెట్టుకోవాలే తప్ప బుద్ధులతో కాదు. ఆ ప్రాతిపదికమీద పుణ్యం సంపా దించుకునేందుకు ఎదుటివారు మనకి ఎంతో సాయం చెయ్యగలరనే దలైలామా సూచించారు.

ఇతరులని పుణ్యక్షేత్రానికి ప్రతీకగా దలైలామా వర్ణించినప్పుడు, అందులో అందం, గేయాత్మకతా కనిపించాయి. అది వింటున్నవారి కళ్లముందు అద్భుతమైన చిత్రాలని 'ప్రదర్శించినట్టు అనిపించింది. ఎంతో వివరంగా తన మాటలని తర్కంతో, నమ్మకంతో పలకడంవల్ల ఆరోజు ఆయన ఉపన్యాసం బలమైన ప్రభావాన్ని చూపింది. హాలుని కలయజూశాను, ఎంతోమంది శ్రోతలు ఆయన మాటలకి కదిలిపోయినట్టు కనిపించారు. నామటుకు నాకు ఆయన మాటలు అంత అద్భుతమైనవిగా అనిపించలేదు. ఎందుకంటే ఆయనతో ఎన్నోసార్లు ఇదివరకే ఈ విషయాలన్నీ చర్చించాను, సానుభూతి గురించి ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో కొద్దోగొప్పో తెలిసినవాడిని నేను. అయినప్పటికీ, ఏళ్లతరబడి హేతువాద దృష్టితో, ఒక శాస్త్రజ్ఞుడిగా శిక్షణ పొందిన నామీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉండింది. అందుకే దయ, సొనుభూతి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు అది మరీ భావుకతతో నిండి ఉందని అనిపించి నాకు రుచించేది కాదు. ఆయన మాటలు వినకుండా నా మనసు ఎటో వెళ్లిపోయింది. ప్రసిద్ధలైనవారుగాని, ఆసక్తికరమైన వ్యక్తిత్వం గలవారుగాని ఎవరైనా కనిపిస్తారేమోనని కుతూహలంగా గది మొత్తం పరికించి చూడ సాగాను. ఉపన్యాసం వినేందుకు వచ్చేముందు కడుపునిండా భోజనం చేసి ఉండడం వల్ల నాకు నిద్ర ముంచుకురాసాగింది. మధ్యమధ్యలో కునుకుతూ ఆయన చెప్పేది వింటూ కూర్చున్నాను. ఒకసారి ఉలిక్కిపడి లేచినప్పుడు ఆయన ఇలా చెప్పడం వినిపించింది, “*.. ఆనందంగా, ఆహ్లాదంగా ఎలా జీవించవచ్చో, దానికి కావలసినదేమిటో మీకు మొన్ననే చెప్పాను. అవి, మంచి ఆరోగ్యం, భౌతికావసరాలూ, స్పేహితులూ మొదలైనవి. మీరు పరీక్షగా వెతికితే, ఇవన్నీ కూడా పొందాలంటే ఇతరులమీద ఆధారపడవలసి ఉంటుందని అర్ధం అవుతుంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే ఎవరో తయారు చేసిన మందులమీదా, ఇతరులు అందించే వైద్యసంబంధమైన సేవలమీదా ఆధారపడాల్సి ఉంటుంది. జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చే భౌతికమైన అవసరాలు, సౌకర్యాలు, వీటిలో ఇతరులతో సంబంధం లేనివి అంటూ ఏవీ ఉండవని గ్రహించగలుగుతారు. ప్రత్యక్షం గానో, పరోక్షంగానో ఎవరో చేసిన ప్రయత్నాల ఫలితాలే ఇవి అని తెలుసుకుంటారు. వాటిని సాధ్యం చేసేందుకు ఎందరో సాయం చేస్తారు. ఇక మంచి స్నేహితుల గురించి చెప్పేప్పుడు, సంతోషంగా జీవించేందుకు అలాంటి స్పేహితులూ, సహచరులూ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాక, ఇతర ప్రాణులతో, మనుషులతో సంబంధాలు కలిగి ఉండడమే ఆనందంగా జీవించేందుకు తోద్చడుతుందన్న విషయం కూడా స్పష్టమవుతుంది.

“ఇవన్నీ ఇతరుల ప్రయాసతోనూ, సహకారంతోనూ విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయనే అనాలి. మన జీవితంలో ఇంకొకరి అవసరం అనివార్యం, అందుచేత ఇతరులతో సంబంధాలు కొనసాగించడం, నిలుపుకోవడం ఎంత కష్టమైనా, వాగ్వివాదాలు

765 + అనందాన్ని పొందే మార్గం ఎన్ని ఎదురైనా, తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టడం అందులో భాగమే అయినా, మనం ఇతరులతో స్నేహంగానే మెలగాలి. ఆనందంగా జీవించాలంటే ఇతరులతో జీవితాన్ని పంచుకోక తప్పదు” అన్నారు దలైలామా.

ఆయన అలా మాట్లాడుతూ ఉంటే దాన్ని అంగీకరించలేనన్న భావన నాకు సహజంగానే కలిగింది. నా కుటుంబంతోనూ, స్పేహితులతోనూ నాకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ, నేను స్వతందత్రుణ్జి అనే భావమే నాలో ఎప్పుడూ ఉండింది. ఆత్మవిశ్వాసం గల మనిషినన్న గర్వం ప్రధానంగా ఉండింది. మనసులో ఏ మూలో ఇతరులమీద ఆధారపడేవాళ్లంటే చులకనభావం ఉండి, అది వాళ్ల బలహీనతకి చిహ్నం అని అనుకునే వాదిని.

అయినా ఆరోజు దలైలామా మాటలు వింటున్నప్పుడు నాలో ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది. *“ఇతరుల మీద ఆధారపడడం' అనేది నాకు ప్రియమైన విషయం కాదు కాబట్టి నా మనసు ఆయన మాటలమీద కేంద్రీకృతం కాకుండా ఎటో వెళ్లిపోయింది. ఏదో ఆలోచిస్తూ నా షర్ట్‌ చేతికున్న ఒక దారాన్ని తీసివెయ్యసాగాను. ఒక్క క్షణం ఆయన మాటలు విందామని చెవి ఒగ్గాను, భౌతికావసరాలు సమకూర్చుకునేందుకు మనం ఎంతమంది మీద ఆధారపడుతున్నామో చెపుతున్నారు దలైలామా. అది వినగానే నేను తొడుక్కున్న చాక్కా తయారుచేసేందుకు ఎంతమంది పనిచేసి ఉంటారో కదా అనే ఆలోచన మనసులో మెదిలింది. ముందు పత్తి పండించిన రైతు గురించి ఆలోచించాను. తరవాత భూమి దున్నేందుకు ఆ రైతుకి ట్రాక్టర్‌ అమ్మిన అమ్మకందారు గుర్తొచ్చాడు. అప్పుడు ఆ ట్రాక్టర్‌ని తయారుచేసేందుకు ఎన్నివందలమంది, బహుశా వేలమంది కావచ్చు, తమ (శ్రమని దానం చేసి ఉంటారో గుర్తొచ్చింది. తరవాత ముడిలోహాన్ని గనుల్లోంచి తవ్వి తీసినవాళ్లు, ట్రాక్టర్‌లోని ఒక్కొక్క భాగాన్నీ నిర్మించి చివరికి దానికి ఒక రూపాన్ని ఇచ్చిన వాళ్లూ, మరోపక్క దూదిని ఏకినవాళ్లు, వస్త్రాన్ని నేసినవాళ్లు, దాన్ని కత్తిరించినవాళ్లు, రంగులద్దినవాళ్లు, చొక్కాగా కుట్టినవాళ్లు. చొక్కాలని పెట్టెల్లోపెట్టి లారీల్లోకి మోసినవాళ్లు, దుకాణాలకి చేరవేసిన లారీ (డైవర్లు చివరగా నాకు దీన్ని అమ్మిన అమ్మకందారు గుర్తొచ్చారు. నా జీవితంలోని ప్రతి అంశమూ ఇంకొకరి సాయంవల్లే సాధ్యమైందని అర్ధం అయింది వాకు. ఇంతకాలం ఎంతో విలువైన ఆస్తిలా కాపాడుకుంటున్న “ఆత్మవిశ్వాసం' కేవలం ్రమేనని తెలిసిపోయింది. ఇది అర్ధం అవగానే తోటి మానవులందరితోనూ సంబంధం ఉందనీ, ఎంతోమంది మీద ఆధారపడి బతుకుతున్నాననీ గ్రహించి ఉక్కిరి బిక్కిరి అయాను. లోపల ఏదో మెత్తదనం రూపుదిద్దుకుంటున్నట్టు తోచి నాకు ఏడుపొచ్చింది.

అన్యోన్యత

ఇతరులతో మనకి అవసరం ఉందన్న భావనలో ఒక మెలిక ఉంది. అమెరికన్‌ సంస్కృతిలో ఒకపక్క తీవ్రమైన స్వేచ్భావాదాన్ని సాధించామని విర్రవీగుతూనే, మరోపక్క తమని ్రేమించేవాళ్లకోసం, అన్యోన్యతకోసం తహతహలాడడం కూడా ఇక్కడి మనుషుల్లో

అన్యోన్యతకి కొత్త నమూనా వ కనిపిస్తుంది. తమ ఒంటరితనాన్ని పోగొట్టే ఒకే ఒక వ్యక్తికోసం శక్తినంతా ఉపయోగించి వెతుకుతారు వాళ్లు. అయినా తాము స్వేచ్భాజీవులమన్న భ్రమ ఉండుండి తలెత్తుతూనే ఉంటుంది. ఇటువంటి బాంధవ్యం ఏ ఒక్క వ్యక్తితోనైనా పెట్టుకోవడం కష్టమే అయి నప్పటికీ, అటువంటి అన్యోన్యత ఒకరితో కాదు, ఎంతోమందితో కలిగి ఉండడం సాధ్యమేనని దలైలామా అంటారు. నిజానికి ఆయన ధ్యేయం అందరితోనూ సంబంధం కలిగి ఉండడమే.

' ఒకరోజు సాయంత్రం అవుతూ ఉండగా అరిజోనాలో ఆయన ఉన్న హోటల్‌కి ఆయన్ని కలుసుకునేందుకు వెళ్లాను. “నిన్న మీరు ఇచ్చిన ఉపన్యాసంలో ఇతరుల (ప్రాముఖ్యం గురించి మాట్లాడుతూ వాళ్లని పుణ్యక్షేత్రమని వర్ణించారు. కానీ ఇతరులతో మనకి ఉన్న సంబంధాలని పరీక్షించి చూసినప్పుడు, మనం ఎన్నో విధాలుగా ఒకరితో ఒకరం సంబంధం పెట్టుకోవచ్చనీ, సంబంధాలు రకరకాలుగా ఉంటాయనీ అనిపిస్తుంది...” అన్నాను.

“మీరన్నది నిజం,” అన్నారు దలైలామా.

“ఉదాహరణకి ఒక రకమైన సంబంధానికి పాశ్చాత్య దేశాలలో చాలా ఎక్కువ విలువిస్తారు. అటువంటి సంబంధంలో ఇద్దరు మనుషుల మధ్య లోతైన అన్యోన్యత ఉంటుంది. ఆ వ్యక్తితో మీ మనసులోతుల్లో ఉండే భావనలనీ, భయాలనీ పంచుకోవడం సాధ్యమవుతుంది. ఇటువంటి అన్యోన్యమైన సంబంధం లేనివాళ్లు తాము జీవితంలో దేన్నో కోల్పోళున్నామని అనుకుంటారు... నిజం చెప్పాలంటే ఇటువంటివారికి మనోచికిత్స ద్వారా అన్యోన్యమైన సంబంధాలు ఎలా పెట్టుకోవాలో నేర్చి, వారికి సాయం చేస్తాం...”

“అవును అటువంటి అన్యోన్యమైన బాంధవ్యం సానుకూలంగా ఉంటుందని నేను (గ్రహించాను. అటువంటి బాంధవ్యాలు లేనివాళ్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది...” అన్నారు దలైలామా.

“అయితే నాదొక సందేహం, మీరు టిబెట్‌లో ఉండగా పెరిగి పెద్దవారవుతున్నప్పుడు మిమ్మల్ని ఒక రాజుగానే గాక, దైవంగా భావించేవారు. జనం మీపట్ల భయభక్తులతో మెలిగేవారు, మీ ఎదుటికి రావడానికి సైతం భయపదేవారనుకుంటాను. మరి అలాంటప్పుడు మీకూ వారికీ మధ్య భావాత్మకమైన దూరం ఏర్పడలేదా? అప్పుడు మీకు ఒంటరితనం అనిపించలేదా? అంతేకాకుందా, మీ కుటుంబాన్నుంచి విడిపోయి చిన్నతనంనుంచే ఒక సన్యాసిగా పెరిగారు, వివాహం చేసుకోలేదు - మరి ఇలాంటివన్నీ మిమ్మల్ని మిగతావారి నుంచి వేరుచేసినట్టు అనిపించలేదా? ఇతరులతోగాని, ప్రత్యేకమైన ఒక వ్యక్తితోగాని, ఉదాహరణకి జీవితభాగస్వామితోగాని గాధమైన సంబంధం లేకపోవడం ఒక లోటుగా మీకెప్పుడూ తోచలేదా?” అని అడిగాను.

ఏమాత్రం తొట్రుపాటు లేకుండా దలైలామా నాకిలా జవాబు చెప్పారు, “లేదు, ఇతరులతో అన్యోన్యభావం లేదని నాకెప్పుడూ అనిపించలేదు. మా తండ్రి చాలాఏళ్ల క్రితమే మరణించారు, కానీ మా అమ్మతో, నా గురువులతో, నాకు శిక్షణనిచ్చినవారితో,

78 + ఆనందాన్ని పొందే మార్గం ఇంకా ఎంతోమందితో నేను అన్యోన్యంగా ఉండేవాడిని. వీళ్లలో చాలామందితో నా ఆంతరంగిక విషయాలు చెప్పుకునేవాడిని, నా భయాందోళనలని వారితో పంచుకునే వాడిని. నేను టిబెట్‌లో ఉండగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ కొన్ని నియమనిబంధనలని పాటించవలసి వచ్చేది, కానీ ఎప్పుడూ అటువంటి పరిస్థితే ఉండేది కాదు. మిగతా సందర్భాలలో, ఉదాహరణకి నేను తరచు వంటఇంట్లో సమయం గడిపేటప్పుడు అక్కడ ఉండే వంటవాళ్లతో స్నేహం కలిసింది. మేము హాస్యాలాడుకునేవాళ్లం, కబుర్లు చెప్పుకునేవాళ్లం, అక్కడ ఎటువంటి దూరమూ, పరిమితులూ ఉందేవి కావు, కాబట్టి హాయిగా, స్వేచ్చగా ఉన్నట్లు అనిపించేది. “అందుచేత టిబెట్‌లో ఉన్నప్పుడైనా, దాన్ని వదిలి కాందిశీకుడిగా వలసవెళ్లవలసి వచ్చినప్పుడైనా, నా మనసులోని ఆలోచనలనీ, భావాలనీ పంచుకునేందుకు ఎవరూ లేరని నాకెప్పుడూ అనిపించలేదు. దీనికి ప్రధానకారణం నా స్వభావమే అనుకుంటాను. ఇతరులతో అన్నీ పంచుకోవడం నాకు సులభమనే అనిపిస్తుంది - కానీ రహస్యాలు దాచడంలో నాకు అంత నేర్చు లేదు!” అంటూ నవ్వేసి, మళ్లీ “ఒక్కోసారి, ఇది వ్యతిరేకమైన లక్షణం అయే ప్రమాదముంది. ఉదాహరణకి, కషగ్‌*లో కొన్ని ఆంతరంగిక విషయాలమీద చర్చ జరిగిందనుకుందాం, నేను వెంటనే దాన్ని గురించి అందరికీ చెప్పేస్తాను. కానీ వ్యక్తిగతంగా, మనసువిప్పి మాట్లాడడం, ఆలోచనలనీ, భావాలనీ ఇతరులతో పంచుకోవడంవల్ల ఎన్నో లాభాలుంటాయి. నాలో ఇలాంటి స్వభావం ఉండడంవల్ల ఎవరితోనైనా త్వరగా స్నేహం చెయ్యగలుగుతాను. అది కేవలం పైపై స్నేహం, లోకాఖభి రామాయణం మాట్లాడుకోవడం కాదు, నా మనసుని పట్టి పీడించే సమస్యల గురించీ, నన్ను తీవ్రంగా బాధపెట్టే విషయాల గురించీ చెప్పుకుంటాను. అదే విధంగా మంచివార్త విన్నప్పుడు కూడా దాన్ని వెంటనే ఎదుటివారికి చెపుతాను. అందుకే నా స్నేహితులతో నాకు అన్యోన్యమైన సంబంధం ఉందని అనిపిస్తుంది. ఎదుటివారికి 'దలైలామా,, 'వరమపావనుడు దలైలామా'కి తమ సంతోషం గురించీ, కష్టాల గురించీ చెప్పుకోవడంవల్ల ఆనందం లభిస్తుంది కాబట్టి కూడా ఇతరులతో ఇలా సంబంధాలు ఏర్పరచుకోవడం నాకు సులభమవుతుంది,” అని ఆయన మళ్లీ నవ్వుతూ తనకి ఉన్న బిరుదు గురించి హాస్యమాదారు. కాసేపాగి మళ్లీ, “ఏది ఏమైనా, ఎదుటివారితో ఇలాంటి బాంధవ్యం పంచుకోవడం నాకు ఉందని అనిపిస్తుంది. ఉదాహరణకి, గతంలో టిబెట్‌ ప్రభుత్వ విధానం నాకు నిరాశ) బాధా కలిగించినప్పుడు, లేదా ఇంకేవైనా సమస్యలు చుట్టు ముట్టినప్పుడు, చైనా ఆక్రమణ చేస్తుందన్న బెదిరింపు విన్నప్పుడు కూడా, నేను నా గదికి వెళ్లిపోయి, నా గది ఊడ్చే మనిషితో ఆ విషయం గురించి మాట్లాడేవాడిని. కొందరికి ఇది ఎబ్బెట్టుగా ఉందని అనిపించవచ్చు. టిబెట్‌ ప్రభుత్వ అధినేత, దలైలామా లాంటి వ్యక్తి జాతీయ, అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు, వాటి గురించి గది ఊడ్చే మనిషికి చెప్పుకుంటాడా? అని అనుకోవచ్చు,” అంటూ ఆయన మళ్లీ నవ్వి, “కానీ నా అనుభవంతో, అలాంటి పనిచెయ్యడంవల్ల చాలా లాభం ఉందని అంటాను. ఎందుకంటే

  • ప్రవాసంలో వున్న టిబెట్‌ ప్రభుత్వ మంత్రివర్గం

అన్యోన్యతకి కొత్త నమూనా శ 79 సమస్య గురించి చెప్పిన వెంటనే ఎదుటి వ్యక్తి ఏదో ఒకటి అంటాడు, ఆ సమస్యనీ, బాధనీ ఇద్దరూ కలిసి ఎదుర్కోవడం వీలవుతుంది,” అన్నారు.

అన్యోన్యతకి విస్తృతమైన నిర్వచనం

అన్యోన్యత అనేది మానవసంబంధాలన్నిటికీ కేంద్రం వంటిది అని దాదాపు ఆ రంగంలో పరిశోధనలు చేసేవారందరూ ఒప్పుకుంటారు. అదే మన ఉనికికి అన్నిటికన్నా ముఖ్యమైనది. బ్రిటిష్‌ మనస్తత్వ విశ్లేషకుడు జాన్‌ బౌల్‌బీ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ఇలా రాశాడు, “ఒక వ్యక్తి జీవితం అన్యోన్యమైన బాంధవ్యాలు అనే ఇరుసు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది... ఈ సంబంధాలనుంచే జీవించేందుకు అవసరమయే శక్తినీ, ఆహ్లాదాన్నీ మనిషి పొందుతాడు. అలా పొందిన వ్యక్తి ఇతరులకి కూడా ఆ శక్తినీ, అహ్లాదాన్నీ అందించగలుగుతాడు. ఈ విషయాల గురించి ఆధునిక విజ్ఞానానిదీ, సంప్రదాయ సిద్ధమైన జ్ఞానానిదీ ఒకటే అభిప్రాయం.”

అన్యోన్యత శారీరక ఆరోగ్యాన్నీ మానసిక సంతృప్తినీ కలిగిస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇటువంటి స్నేహపూరిత సంబంధాలవల్ల కలిగే లాభాలని గమనించినప్పుడు, వైద్యరంగంలో పరిశోధనలు చేసేవారు ఈ కింది విషయాలని కనిపెట్టారు : స్నేహసంబంధాలు గల మనుషులు, సమర్ధనకోసం, సానుభూతి, అప్యాయత కోసం ఒక వ్యక్తి ఆసరా దొరికినవాళ్లు, గుండె జబ్బులనీ, ఇతర పెద్దపెద్ద ఆపరేషన్లనీ ఎదుర్కొన్నవాళ్లు, క్యాన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధిలాంటి రోగాల బారిన తక్కువగా పడతారని తేల్చారు. ఉదాహరణకి, డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌లో జరిగిన ఒక అధ్యయనంలో హృద్రోగంతో బాధపడేవారికి జీవిత భాగస్వామి గాని, తమ బాధ చెప్పుకునేందుకు ఎవరైనా దగ్గర స్నేహితులుగాని లేకపోయినట్టయితే, వాళ్ల జీవితం ఐదు సంవత్సరాలలో ముగిసిపోయేదనీ, కానీ భార్య/భర్త ఉన్న రోగి, మంచి 'స్నేహితులున్న రోగి త్వరగా కోలుకునేవాడని తెలిసింది. కాలిఫోర్నియాలో అలమెడా కౌంటీలో కొన్నివేల మంది మీద తొమ్మిది సంవత్సరాలపాటు సుదీర్థమైన పరిశోధన జరిగింది. సామాజిక జీవితం, అన్యోన్యమైన సంబంధాలూ గలవారు మొత్తంమీద ఎక్కువకాలం జీవించారనీ, క్యాన్సర్‌ వ్యాధికి తక్కువగా గురయారనీ ఆ పరిశోధనలో వెల్లడయింది. యూనివర్సిటీ ఆఫ్‌ నెభ్రాస్కా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఎంతోమంది వృద్ధులమీద పరిశోధన చేసి, ఇతరులతో అన్యోన్యంగా ఉన్నవారిలో రోగనిరోధకశక్తి బలంగా ఉండి, కొలెస్టరాల్‌ స్థాయి తక్కువగా ఉందని కనుక్కున్నారు. గత ఎన్నో ఏళ్లుగా ఎందరో పరిశోధకులు విడివిడిగా, పెద్దెత్తున ఒక అరడజను పరిశోధనలు చేశారు. అన్యోన్యత, ఆరోగ్యం, ఈ రెంటికీగల సంబంధం గురించే వారంతా పరిశోధించారు. కొన్నివేలమందిని ఇంటర్వ్యూచేసిన తరవాత పరిశోధకులందరూ ఒకే నిర్ధారణకి వచ్చారు : 'స్నేహసంబంధాలు తప్పకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మెరుగైన మానసికారోగ్యానికి కూడా అన్యోన్యంగా ఉండడం అంతే అవసరం,

20+ ఆనందాన్ని పొందే మార్గం మానసిక విశ్లేషకుడు, సామాజిక తత్వవేత్త ఎరిక్‌ఫ్రోమ్‌ మనిషికి ఉన్న భయాలలో రైళ్ల అతి పెద్ద భయం మనుషులనుండి తాను విడిపోతానేమో ననేదే, అంటాడు. అలా విడ ఖ్‌ బడడం అనేది శైశవంలో మొదటిసారి అనుభవంలోకి వస్తుందంటాడాయన. అదే మ మానవజాతి మానసికాందోళనకి మూలకారణమనిి అంటాడు. జాన్‌ బౌల్‌బీ కూడా ఆ అభ మాయంతో ఏకీభవించాడు. అంతేకాదు, తమ సంరక్షణ బాధ్యత వహించేవారినుంచి సామాన్యంగా తల్లీ, తండ్రీ ఈ బాధ్యత తీసుకుంటారు = సంవత్సరం నిండని పసివా థు విడిపోతే, వారిలో భయం, విచారం చోటుచేసుకుంటాయన్స్నది పూర్తి నిజమని ఆయ షై నికీ పరిశోధనలూ, (ప్రయోగాల ద్వారా నిరూపించాడు. మనిషి భయాలకీ, విచారానిక విషాదానికీ మూలకారణాలు విడిపోవడం, లేదా దగ్గరివారిని కోల్పోవడం అని ఆయన ఉద్దేశం. అందుచేత అన్యోన్య సంబంధాలు ఎంత ముఖ్యమో తెలుసుకున్న తరవాత, మన దైనందిన జీవితంలో వాట్రిని సాధించుకోడానికి ఏం చెయ్యాలి? ఇంతక్రితం విభాగం దలైలామా చెప్పిన పద్ధతిని పాటించడమా? దాన్ని అర్ధం చేసుకుని ప్రారంభించడమే తెలివైన పనా? అన్యోన్యం అనే మాటకి వ్యావహారిక్రమైన నిర్వచనాన్ని వెతుక్కుని ఒక నమూనాని తయారుచేస్తుక్రోవడ్రం మంచిదా? ద్రీన్సిక్రి సమాధానం కోసం విజ్ఞాన శాస్త్ర సాయం కోరిత్తే, సార్వజనీనంగా అందరు పరిశోధక్రుల్తూ అన్యోన్య సంబంధాల ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నప్పృట్రిక్షీ అక్కడితో ఆ ఆమోదం ఆగిపోయింది. అన్యోన్యత అంటే ఏమిటి అనేదానికి రకరకాల నిర్వ్యచనాలూ, సిద్ధాంతాలూ ప్రతిపాదించారు అనేది దాన్నిగురించి జరిగిన ఇన్ని వైవిధ్యభరితమైన అధ్యయనాల్లోనూ, ప్రరిశ్రోధనలోనూ కొట్టొచ్చినట్టు కనిపించే అంశం, గ శా గ ఈ వరసలో అత్యంత పటిష్టమైన స్థానంలో ఉన్నది రచయిత దెస్‌మండ్‌ మోరిస్‌. శ మనమాజ శాస్త్రంలో శిక్షణ పొందిన ఒక జంతుశాస్త్ర నివ్పుబుడిగా ఆయన తనదైన న్టస్టితో అన్యోన్య సంబంధాల గురించి రాస్తాడు, “ఇంటిమేట్‌ బిహేవియర్‌” అనే పుస్తకంలో వ త నే శి ఉనన నీ ఇలా నిర్వచనం చెప్పుతారు అన్యోన్యంగా ఉండడం అంటే దగ్గరగ ల న్నానన్న భావన... ఇద్దరు వ్యక్తులు శారీరకంగా ప సంబంధం ఎర్చడుతుందని న్లే చగ్గరయినప్పుడు అన్యోన్య సం స్పడుతుం, నంటాన్ను * అన్యోన్యత్రక్రి క్వ రచనం అని చెప్పాక మనుష ఎన్నీ 6 ల౦ శారీరకంగా కలవడమే ని ఏ న వాటిలో ఏ న్ని రకాలుగా శారీరకంగా దగ్గర అవుత్రారో వివరిస్తాదాయని న్ను తట్టడం న్సర్చ మైథునందా (0 రట సుఖం పొందే క్ర వాహకంగా పరి చని. స్పర్శ అనేది మనం ఊ డం ద్వారా మనుషులమర వర్ష ల బెంచి చేతులు పట్టుకోవడం, క్రాగలించుకోవ ల ఎవరూ ద్రగ్గర్రక్షాభ్రేన్సి పరిస్థిత్సల్రో పర్లపైంాం /రెంచి చెప్పాడు. అలా ప్రత్యక్షం మరోమనిషి స్పర్శని పొందవచ్చని అంటాడు న్స్‌గోళు _కరంచుకోవడం ద్యారా గూ

  1. శ్రా ను గః మనం వాడుక్తునై వస్తువులూ “. సిగాట్త రకమైన అన్యోన్యత్రకి ప్రత్యామ్నాయం + సిద్ధాంతం. గొ లాంటివి - ప్రనిక్రివస్తాయన్నది ఆయ కానీ ఎక్షువ్షమద్రి పరిశో న ధకులు ఇంత "ఏష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోతున్నారు'

అన్యోన్యతకి కొత్త నమూనా అ ప్రి|

అయినప్పటికీ కేవలం శారీరకంగా దగ్గరవడం అన్యోన్యతకి చిహ్నం కాదని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. అసలు ఇంటిమసీ (అన్యోన్యత) అనే పదానికి మూలార్ధం ఏమిటని చూసినప్పుడు, అది 'ఇంటిమా' అనే లాటిన్‌ పదంనుంచి వచ్చిందనీ, లాటిన్‌లో ఆ పదానికి అర్ధం “అంతర్గత, లేక 'అంతరంగ' అనీ, ఇంటిమసీ అనే ఆ పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇవ్వదానికి ఇష్టపడతారు. అన్యోన్యత అనే విషయం మీద ఎన్నో పుస్తకాలు రాసిన డా. దాన్‌ మెక్‌ ఆడమ్స్‌ ప్రతిపాదించిన నిర్వచనం : అన్యోన్యత" కోరుకోవడమంటే ఒక వ్యక్తి అంతర్గతంగా, అంతరంగికంగా మరో వ్యక్తితో పూర్తిగా మమేకమవడం.'

కానీ అన్యోన్యతకి సంబంధించిన నిర్వచనాలు అక్కడితో ఆగిపోవడం లేదు. డెస్‌మండ్‌ మోరిస్‌ ఒకవైపు ఉంటే ఆ వరసలో మరో చివర డా. థామస్‌ పాట్రిక్‌ మెలోన్‌, పాట్రిక్‌ థామస్‌ మెలోన్‌ అనే తండ్రీకొడుకులు ఉన్నారు. వీరిద్దరూ మనస్తత్వశాస్త్రంలో గొప్ప నిపుణులు. 'ది ఆర్ట్‌ ఆఫ్‌ ఇంటిమసీ' అనే పుస్తకంలో వాళ్లు అన్యోన్యతని, “ఇంకొకరితో సంబంధం పెట్లుకోవడం అనే అనుభవం” అని నిర్వచించారు. ఇతరులతో మనం ఎంతవరకూ సంబంధాలు కలిగి ఉన్నాం అనే విషయాన్ని పరీక్షించడంతో వాళ్లు అన్యోన్యతని అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తారు, కానీ ఆ సంబంధాలు వాళ్ల దృష్టిలో మనుషులకే పరిమితమై ఉండవు. వాళ్ల నిర్వచనం ఎంత విస్సృతమైనదంటే, మనకి ప్రియమైన వస్తువులకి కూడా అది విస్తరిస్తుంది - చెట్లు, నక్షత్రాలు, ౩05 చెప్పాలంటే అంతరిక్షం వరకూ.

ఆదర్శవంతమైన అన్యోన్యత గురించిన అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా, చరిత్రని బట్టీ మారుతూ ఉంటాయి. “ఒకే ఒక ప్రశ్యేకమైన వ్యక్తితో అన్యోన్యమైన, (ప్రేమ సంబంధం పెట్టుకోవడం అనే రొమాంటిక్‌ ఆలోచన ఈ కాలానికి చెందినది, వర్తమాన సంస్కృతిలో పుట్టిసది. కానీ అన్యోన్యత తాలూకు ఈ ఉదాహరణకి సార్వజనీనమైన ఆమోదం లభించదు. ఉదాహరణకి, జపాన్‌ దేశస్థులు అన్యోన్యతకి స్నేహంమీదే ఎక్కువ ఆధారపడు కున్నట్టు కనిపిస్తుంది అదే అమెరికన్లయితే (ఫ్రేమించిన అబ్బాయితోనో, అమ్మాయితోనో, దేవిత్ర భాగస్వామితోనో రొమాంటిక్‌ సంబంధం కలిగి ఉండడం అన్యోన్యత అనుకుంటారు. దీన్ని గమనించిన పరిశోధకులు ఇలాటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ః వ్యక్తిగత భావాలకి అంత ప్రాధాన్యం ఇవ్వని అసియావాసులు సామాజిక సంబంధాలలోని వ్యావహారిక తంశాలక్రి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే సంబంధాలు తెగిపోవదానికి కారణమైన భ్రమల పౌరినప్తడ్రి వాళ్లు కుంగిపోరు.

ఇలా సంస్కృతులలో ఖేదాలేకాక, కాలొన్నిబట్సీ కూడా అన్యోన్యతకి నిర్వచనాలు నొటక్రీయ్యంగ్లా మారిపోయాయి. అమెరికాలో ని వలసప్రాంతాల్లో శారీరక సామీష్యం, అన్యోన్యత ఈనాటికన్నా ఎక్కువగా ఉండేది. కుటుంబ సభ్యులూ, చివరికి పరాయివాళ్లు కూదా కలిసిమెలిసి ఒకేచోట ఉంటూ, ఒకే గదిలో పడుకుంటూ, స్నానాలగదిని సైతం కలిసే వాడుకునేవార. భోజనం, నిద్రపోవడం కూడా కలిని చేసేవారు. కానీ ఈనాటితో మ్‌వ్పిస్ట భార్యాభర్తల మధ్య సంభాషణలో ఆల్మీయత తక్కువగా ఉండేది - ఈరోజు

82 + ఆనందాన్ని పొందే మార్గం అపరిచితులతో, పక్కింటివారితో మాట్లాడినట్టే. ఒక శతాబ్దం తరవాతే, (శ్రేమ, పెళ్లి అనేవి అద్భుతమైన కాల్పనిక కథల్లోలాగ తయారై, ఎటువంటి (ప్రమసంబంధంలోనైనా అన్యోన్యత, ఆంతరంగికమైన విషయాలని మనసువిప్పి చెప్పుకోవడం ఒక భాగమన్న అభిప్రాయం నెలకొంది.

ఆంతరంగికమైన, అన్యోన్యమైన ప్రవర్తన గురించి అభిప్రాయాలు కూడా కాలం వెంబడి మారుతూ వచ్చాయి. పదిహేడవ శతాబ్దంలో ఉదాహరణకి జర్మనీలో కొత్తగా పెళ్లైన దంపతులు సాక్షులు మోసుకెళ్లే మంచంమీద శోభనం జరుపుకోవాలన్న నియమం ఉండేది. ఎందుకంటే, వారిద్దరూ భార్యాభర్తలేనని ఆ సాక్షులు సాక్ష్యం చెపితేనే ఆ వివాహానికి ఆమోదం లభిస్తుంది.

జనం తమ భావోద్రేకాలని ప్రదర్శించే విధానంలో కూడా మార్చు వచ్చింది. మధ్య యుగంలో తీవ్రమైన భావోద్వేగాలని, ఏ అరమరికలూ లేకుండా బావాటంగా ప్రదర్శించదాన్ని ఎబ్బెట్టుగా చూసేవారు కాదు. సంతోషం, ఆగ్రహం, భయం, పవిత్రత, చివరికి శత్రువులని చిత్రహింసలు పెట్టి చంపడం కూడా అందరూ చూస్తూండగా ప్రదర్శించేవారు. పిచ్చిపట్టినట్టు అట్టహాసం చెయ్యడం, భోరుమని వడవడం, కోపంతో రెచ్చిపోవడంలాంటి ఈనాటి సమాజం ఆమోదించని పనులు, జంకూగొంకూ లేకుండా జరిగేవి. అయినా ఈ భావోద్రేక ప్రదర్శనల్లో ఇద్దరు వ్యక్తులు మానసికంగా దగ్గరవడం అనేది సాధ్యం అయేది కాదు; ఒక మనిషి అనాలోచితంగా, బాహాటంగా అన్ని భావాలనీ ప్రదర్శించేప్పుడు, ప్రత్యేకంగా కొద్దిమందిపట్ల ఆంతరంగిక భావాలని ప్రదర్శించే అవకాశం లేకుండా పోతుంది.

అంటే అన్యోన్యత గురించి మనకున్న అభిప్రాయాలు సార్వజనీనమైనవి కావని స్పష్టంగా తెలుస్తోంది. కాలంతోపాటు అవి మారతాయి. తరచు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు దానిమీద ప్రభావం చూపుతాయి. పాశ్చాత్యులు అన్యోన్యతని నిర్వచించడంలో రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చదంవల్ల అవి అయోమయాన్ని సృష్టించడం చాలా సులభం. ఆ నిర్వచనాలు క్షారం చేయించుకోవడం దగ్గర్నించి నెప్‌ట్యూన్‌ గ్రహాన్ని చుట్టివచ్చే చంద్రుళ్ల దాకా, అన్నిటినీ లెక్కలోకి తీసుకుంటాయి. మరయితే, అన్యోన్యత అంటే ఏమిటి అని మనం తెలుసుకోగోరుతున్నప్పుడు మనమేం చెయ్యాలి? దీని అంతరార్థం స్పష్టంగానే ఉందని అనుకుంటాను ; మానవ జీవితంలో నమ్మశక్యం కానంత భిన్నత్వం ఉంది. అన్యోన్య సంబంధాల గురించి మనుషులు ఏమని అనుకుంటున్నారు అనే విషయంలో అంతులేనన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయి. దీన్ని అర్ధం చేసుకుంటే మనకి గొప్ప అవకాశాలు లభిస్తాయి. అంటే, ఈ క్షణాన అన్యోన్యత గురించి విస్తృతమైన సమాచారం మనకి అందుబాటులో ఉంది. అన్యోన్యత మన చుట్టూనే ఉంది.

ఈనాడు మనలో చాలామంది జీవితంలో ఏదో లోటుందన్న విచారంలో మునిగి పోతున్నాం, అన్యోన్యత లేని కారణంగా తీవ్ర మనస్తాపాన్ని అనుభవిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఎవరితోనైనా రొమాంటిక్‌ సంబంధం లేకపోయినా, లేక సంబంధం తెగిపోయినా,

అన్యోన్యతకి కొత్త నమూనా + [3 అలా జీవించవలసి రావడం తప్పనిసరి అయినప్పుడు ఇది వాస్తవమేనని అనిపిస్తుంది. తీవ్రమైన (ేమ సంబంధం యువతీయువకుల మధ్య ఉన్నప్పుడే గాఢమైన అన్యోన్యత సాధించగలం అనే అభిప్రాయం మన సంస్కృతిలో బాగా ప్రచారంలో ఉంది - ఒకే ఒక ప్రత్యేకమైన వ్యక్తి - ఆ వ్యక్తి మిగతా అందరికన్నా వేరు. ఈ అభిప్రాయం చాలా సంకుచితమైనది అయే '్రమాదం ఉంది. దీనివల్ల మనం మరెన్నో అన్యోన్యమైన సంబంధాలని కోల్పోవచ్చు. ఆ ప్రత్యేకమైన వ్యక్తి మనం ఆశించినట్టు ఎక్కడా దొరక్కపోతే ఇక జీవితంలో దుఃఖమూ, బాధా తప్ప ఇంకేమీ మిగలవు.

కానీ ఇలాంటి పరిస్టితి రాకుండా నివారించే శక్తి మనలోనే ఉంది; రోజూ మన చుట్టూ ఉండే మనుషులతో అటువంటి అన్యోన్యతని పెంపొందించుకునేందుకు థైర్యం చెయ్యాలి. అన్యోన్యత గురించి మనకి తెలిసిన నిర్వచనాన్ని విస్తృతం చేసుకున్నట్టయితే, ఇతరులతో సంబంధాలు నెలకొల్చేందుకు ఎన్నో కొత్త, సంతృప్తికరమైన మార్గాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ మళ్లీ ఒకసారి ఒంటరితనం గురించి దలైలామాతో నేను జరిపిన చర్చల ప్రస్తావన తీసుకురావాలి. ఒక దినపత్రికలో “పర్సనల్స్‌” కాలమ్‌లో అప్రయత్నంగా చూసిన ఒక అంశం ఆ చర్చకి దారితీసింది. నాకు అనిపిస్తుంది, ఆ ప్రకటన తయారు చేస్తున్నప్పుడు, తమ జీవితాల్లో రొమాంటిక్‌ (పేమని ఆవ్వానించేందుకు, ఒంటరితనాన్ని పోగొట్టేందుకు సరైన మాటలకోసం తడుముకుంటున్నప్పుడు, తమ చుట్టూ ఆసరికే కుటుంబసభ్యులూ, స్నేహితులూ, పరిచయస్థులూ ఉన్నారని తెలుసుకోలేదా? అటువంటి వారితో అన్యోన్యమైన సంబంధాలు పెట్టుకుని సంతృప్తిగా, సంతోషంగా జీవించడం సాధ్యమేనన్న ఆలోచన రాలేదా? అలాంటివారు ఎంతోమంది ఉందే ఉంటారని అనుకుంటాను. మనం జీవితంలో ఆశించేది ఆనందమే అయితే, మరింత అనందంగా జీవించాలంటే జీవితంలో అన్యోన్యమైన సంబంధాలు ఉండాలి అనేదీ ముఖ్యమే. అయితే, ఎంత ఎక్కువ మందితో వీలైతే అంతమందితో అన్యోన్యమైన బాంధవ్యాలు, రకరకాలుగా పెట్టుకోవచ్చు. దలైలామా చెప్పే అన్యోన్యత ఇతరులతో మనసువిప్పి మాట్లాడడం, దాపరికం లేకుండా ్రవర్తించడంవల్ల లభిస్తుంది. ఆ ఇతరులు కుటుంబసభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చివరికి అపరిచితులు కూడా కావచ్చు. అందరిలోనూ ఉందే సమాన గుణం, మానవత్వం. అందుకే నిజాయితీతో, గాఢమైన అనుబంధాలని ఏర్పరచుకోవచ్చు.

అధ్యాయం 6 ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం

ర కరోజు మధ్యాన్నం దలైలామా బహిరంగోపన్యాసం విన్న తరవాత, ప్రతిరోజూలాగే

ఆయన్ని కలుసుకునేందుకు హోటల్‌కి వెళ్లాను. నేను కొన్ని నిమిషాలు ముందుగా అక్కడికి చేరుకున్నాను. ఆయన అనుచరుల్లో ఒకరు నన్ను హాలులోకి తీసుకెళ్లి, దలైలామా ఎవరితోనో మాట్లాడుతున్నారనీ, ఇంకా కొన్ని నిమిషాలు నేను వేచి ఉండవలసి వస్తుందనీ చెప్పాడు. నేను ఆయనకోసం ఎదురుచూస్తూ ఎప్పటిలాగే ఆయన గది ముందున్న కుర్చీలో కూర్చుని నేను రాసుకున్న వివరాలని మళ్లీ ఒకసారి చూసుకోసాగాను. అక్కడున్న సెక్యూరిటీగార్జు నావైపు అనుమానంగా చూడడం గమనించాను. ఆ చూపు హైస్కూలు పిల్లలు సూపర్‌మార్కెట్లో పత్రికలు ఉన్న విభాగంలో అటూ ఇటూ ఊరికే తిరగడం చూసి వాళ్లని అనుమానించే దుకాణదారు చూపులా ఉంది.

కొద్దిక్షణాల్లో దలైలామా గది తలుపు తెరుచుకుంది. ఖరీదైన బట్టలు వేసుకున్న ఒక జంట బైటికి వచ్చింది. వాళ్లని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కొన్నిరోజులక్రితం నాకు వాళ్లని ఎవరో పరిచయం చేశారు. ఆ స్రీ మంచి ఆస్తిపరురాలు, ఆమె భర్త కూడా మన్‌హాటన్‌లో గొప్ప ధనవంతుడూ, పేరుప్రతిస్టలుగల లాయరూ. అప్పుడు పరిచయ మైన కొద్దిసేపట్లో మేం మాట్లాడుకున్నది తక్కువే గానీ, వాళ్లిద్దరికీ విపరీతమైన అహంకారం ఉందన్న విషయాన్ని మాత్రం గమనించాను. ఇప్పుడు దలైలామాని కలిసి బైటికి వచ్చిన అదే మనుషుల్లో నాకు ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. పొగరూ, అహంకారం వాళ్ల మొహాల్లో మచ్చుకైనా లేవు, వాటి స్థానంలో ఒకరకమైన మృదుత్వం, స్పందన కనిపించాయి. ఇద్దరూ నా కళ్లకి చిన్నపిల్లల్లా కనిపించారు. ఇద్దరి కళ్లనుంచీ కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. దలైలామా (ప్రభావం అందరిమీదా అంత నాటకీయంగా కనిపించదు కాని, ఆయనతో మాట్లాడిన తరవాత ్రతి ఒక్కరి భావాల్లోనూ ఏదో ఒక తేడా రావడం నేను గమనించాను. ఆయన ఇతరులతో ఎంత త్వరగా కలిసిపోతారో చూసి నేను చాలా

ట్‌

86 * అనందాన్ని పొందే మార్గం కాలం క్రితమే అచ్చెరువొందాను. అవతలి వ్యక్తి ఏ రంగంలో పనిచేసేవాడైనా సరే ఆయనతో భావాత్మకంగా చాలా త్వరగా దగ్గరై, బాంధవ్యం ఏర్పరచుకోవడం చూశాను. సానుభూతిని నిలుపుకోవడం

మనుషుల మధ్య ఆప్యాయతల గురించీ, అనుభూతి గురించీ దలైలామా అరిజోనాలో ఉండగా మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నప్పటికీ, వాటి గురించి మరింత వివరంగా మాట్లాడుకునే అవకాశం కొన్ని నెలల తరవాత ధర్శ్మశాలలోని ఆయన ఇంటికి వెళ్లి కలిసినప్పుడుగాని దొరకలేదు నాకు. ఆసరికి ఆయన ఎదుటివారితో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ఉపయోగించుకునే విధానాలలో ఏవైనా ప్రధానసూత్రాలు ఉన్నాయా అని పరిశీలించేందుకు సాధ్యమవుతుందా అని ప్రయత్నించసాగాను. ఎటువంటి సంబంధాన్నెనా మెరుగుపరచగల సూత్రాలు - అవి అపరిచితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో కావచ్చు లేదా (క్రేమికులతో కావచ్చు - మొదలుపెట్టేందుకు అత్రుతపదుతూ తక్షణం ఆ విషయం ప్రస్తావిస్తూ ఇలా అడిగాను, “మానవ సంబంధాల విషయం తీసుకుంటే... ఇతరులతో ఘర్షణ పదకుండా ఉందేందుకూ, సత్సంబంధాలు కలిగి ఉందేందుకూ పనికివచ్చే అత్యుత్తమమైన పద్ధతి మీ దృష్టిలో ఏదంటారు?”

ఆయన నావైపు ఒక్కక్షణం తదేకంగా చూశారు. ఆ చూపులో కోపం, కాఠిన్యం లేవు గాని, చంద్రుడిమీదినుంచి తెచ్చిన ధూళిలో ఉండే రసాయన పదార్థాల మిశ్రమం ఏమిటో చెప్పమని నేను అడిగినట్టు ఉందా చూపు.

రెండు క్షణాలాగి ఆయన ఇలా అన్నారు, “ఇతరులతో వ్యవహరించడం చాలా చిక్కులతో కూడుకున్న విషయం. అన్ని సమస్యలకీ ఒకే పరిష్కారం సూచించడం సాధ్యం కాదు. ఇది వంట చెయ్యడం లాంటిది. చాలా రుచికరమైన పదార్ధాలు ప్రత్యేకంగా వండాలంటే వంట ఒక్క బిగిన చెయ్యడం సాధ్యం కాదు, దానికి సమయం పడుతుంది. కూరలన్నిటినీ ముందు విడిగా ఉడికించాలి, తరవాత పోపులో వేసి, మసాలాదినుసులు కలపాలి. అంతా చెయ్యడం అయిపోయాక అది ఒక రుచికరమైన కూరగా రూపం దాలుస్తుంది. అదే విధంగా, ఇతరులతో వ్యవహరించే నేర్చు సంపాదించుకునేందుకు మీరు ఎన్నో విషయాలని లెక్కలోకి తీసుకోవాలి. ఊరికే, “ఇదీ పద్ధతి," 'ఇదే మార్గం! అని అనలేరు.”

నేను ఎదురు చూసిన సమాధానం అది కాదు, ఆయన నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడనీ, ఇంకా సరైన జవాబు ఆయన దగ్గర ఉండే ఉంటుందనీ అనుకున్నాను. నేను అంతటితో వదలకుండా, “సరే, సంబంధాలని మెరుగు పరుచుకునేందుకు ఒకేఒక పరిష్కారమార్గం లేదనే అనుకుందాం, కానీ దానికి ఉపయోగ పడే వేరే మార్గనిర్దేశాలేవైనా వున్నాయా?” అని అడిగాను.

సమాధానం చెప్పేముందు ఒక్క క్షణం ఆలోచించి దలైలామా ఇలా అన్నారు, “ఉన్నాయి. ఇంతకుముందు మనసులో సానుభూతితో ఇతరులని పలకరించాలన్న

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం + ర్ర7 విషయం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. అది చాలా ముఖ్యం. కానీ అవతలి వ్యక్తితో, “ఎక్కువ సానుభూతిని ప్రదర్శించడం ముఖ్యం, అవతలి వ్యక్తి మీద మరింత (ప్రేమ చూపించాలి, అంటే సరిపోదు. అది సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఒక వ్యక్తికి ఆప్యాయత, సానుభూతి గురించీ, వాటి ప్రాముఖ్యత గురించీ, వాటి విలువలూ, నిజజీవితంలో వాటివల్ల ఒనగూడే ప్రయోజనం గురించీ తెలియజెప్పి నేర్చుకునేట్టు చెయ్యడం ఒక పద్ధతి. అలాగే ఎవరైనా వారిపట్ల దయతో ప్రవర్తిస్తే వాళ్లకి ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచించి చూసుకోమని కూడా చెప్పవచ్చు. ఒకరకంగా ఇది వాళ్లని సిద్ధం చేస్తుంది. ఆ తరవాత ఎక్కువ సొనుభూతి చూపించేందుకు వారిని ప్రేరేపిస్తుంది.

“ఇక సానుభూతిని పెంపొందించుకునేందుకు పనికివచ్చే రకరకాల పద్ధతులు ఏవి అని చూసినప్పుడు, అవతలి వ్యక్తి భావాలతో తాదాత్యం చెందడం అవతలి వ్యక్తి కష్టాలని అర్ధం చేసుకోవడం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు అనినా అభిప్రాయం. నిజానికి బౌద్ధ సంప్రదాయంలో సానుభూతిని పెంచేందుకు కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకి బాధితుని పరిస్టితిని ఊహించుకోవాలి - కసాయివాడి వేటుకి గురయీందుకు సిద్ధంగా ఉన్న గొర్రెని తీసుకుందాం. అప్పుడు ఆ గొరైె మనసు ఎంత తీవ్రమైన బాధకి గురి అవుతోందో ఊహించుకోవాలి... ఇలాంటివే ఏవైనా...”

ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగి, దలైలామా తన చేతిలోని జపమాలని పరధ్యానంగా వేళ్లతో తిప్పసాగారు. “అవతలి వ్యక్తిలో ఏమాత్రం స్పందనలు లేకపోయినా, మనని పట్టించుకోనట్టు ఉన్నా ఈ పద్ధతి పని చెయ్యదేమోనని నా అనుమానం. ఒక కసాయిని ఇలా ఊహించుకోమని చెపితే ఎలా ఉంటుంది? కసాయివాడి మనసు పాషాణంలా కఠినంగా ఉంటుంది, తను చేసే పనికి పూర్తిగా అలవాటు పడిపోతాడతను, అందుచేత మన మాటల ప్రభావం అతనిమీద ఇసుమంతైనా ఉండదు. అందుచేత ఇటువంటి పద్ధతిని కొందరు పాశ్చాత్యుల మీద కూడా ప్రయోగించడం సాధ్యం కాదు, వినోదం కోసం వేటాడడం, చేపలు పట్టడం కొందరికి బాగా అలవాటు...” అన్నారు.

“మరి అలాంటప్పుడు ఒక వేటగాడిని తాను చంపబోయే జంతువు బాధని ఊహించుకోమనడం నిష్ప్రయోజనమే కదా? కానీ అదే సమయంలో ఆ వేటగాడి దగ్గర ఉందే వేటకుక్క ఉచ్చులో ఇరుక్కుని, బాధతో మూలుగుతూ, అరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్పి అతనిలో సానుభూతి తల ఎత్తేట్టు చెయ్యవచ్చేమో?” అన్నాను.

“అవును, సరిగ్గా చెప్పారు. పరిస్థితులని బట్టి ఆ పద్ధతిలో మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. ఉదాహరణకి, జంతువులపట్ల ఒక వ్యక్తికి సానుభూతి ఉండకపోవచ్చు, కానీ కనీసం ఆప్తమిత్రుడి పట్లో, కుటుంబ సభ్యుల పట్లో ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు తన ఆప్తలెవరో కష్టాల పాలై బాధాకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు ఊహించుకుని, అలాంటప్పుడు తను ఎలా ్రతిస్పందిస్తాడో అని ఆలోచించవచ్చు. ఇంకొక వ్యక్తి భావాలతో, అనుభవాలతో తాదాత్యం చెందడం ద్వారా సానుభూతిని అలవరచుకోవచ్చు,” అన్నారు దలైలామా.

88 * ఆనందాన్ని పొందే మార్గం

మళ్లీ తనే ఇలా అన్నారు, “తాదాత్యం చెందడం సానుభూతిని పెంచుకునేందుకే కాక, సాధారణంగా ఏ పరిస్థితిలోనైనా ఇతరులతో మనం వ్యవహరించేప్పుడు మీకు ఏవైనా అడ్డంకులు వస్తే, అప్పుడు ఆ అవతలి వ్యక్తి స్థానంలో మీరు ఉన్నట్టు ఊహించు కుని, ఆ పరిస్థితిలో మీరైతే ఏం చేస్తారు అని ఆలోచించుకున్నట్టయితే, అది మీకు చాలా సాయపడుతుంది. ఆ వ్యక్తి అనుభవం లాంటిది మీకు ఉండి ఉండకపోయినా, లేదా మీ జీవనవిధానం వేరుగా ఉన్నా ఊహించుకోవడం వల్ల ఈ పని మీకు సాధ్యం అవుతుంది. మీలో కొంత సృజనాత్మకత ఉండడం అవసరం. ఈ పద్ధతిలో మీ దృక్కోణాన్ని తాత్మాలికంగా పక్కకి తప్పించి, అతని స్థానంలో మీరు ఉంటే ఏమనిపిస్తుంది అనేది అతని దృక్కోణం నుంచి చూసేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల అవతలి వ్యక్తి భావాలని అవగాహన చేసుకోవడం, గౌరవించడం సాధ్యమవుతుంది, అవతలివారితో విభేదాలనీ, వాటివల్ల తలెత్తే సమస్యలనీ ఈ రకంగా నివారించుకోవచ్చు.” ఆరోజు మా సంభాషణ త్వరగా ముగిసిపోయింది. ఆఖరి నిమిషంలో నాకు దలైలామాతో కొంతసేపు గడిపే అవకాశం దొరికింది. ఆయన క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మేము చాలాసార్లు కలుసుకున్నట్టే బాగా పొద్దుపోయాక కలుసుకోగలిగాం. బైట సూర్యుడు అస్తమించబోతున్నాడు, గదంతా చీకటివెలుగులు తమాషాగా పరుచు కున్నాయి. లేత పసుపురంగు గోడలు బంగారు రంగుకి మారాయి, గదిలోని బౌద్ధ శిల్పాలు బంగారురంగు అద్దినట్టు మెరిసిపోసాగాయి. దలైలామా అనుచరుడు ఒకతను నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించాడు. నన్ను సంభాషణ ముగించమని చెప్పేందుకే అతను అలా వచ్చాడని నాకర్ధం అయింది. చివరిగా దలైలామాని ఇలా అడిగాను, “ఇక ఈ సంభాషణ ముగించాలని నాకు తెలుసు, కానీ ఇతరులతో తాదాత్మ్యం చెందేందుకు ఏవైనా సలహాలూ, మార్గాలూ సూచిస్తారా?”

ఎన్నో నెలలక్రితం అరిజోనాలో తమ చెప్పిన మాటలనే మళ్లీ చెపుతూ ఎంతో మృదువుగా, సరళంగా ఆయన ఇలా అన్నారు, “నేను ఎప్పుడు ఎవరిని కలుసుకున్నా అవతలి వ్యక్తికీ, నాకూ గల సామ్యాలని, ప్రధానమైన లక్షణాలని దృష్టిలో పెట్టుకుంటాను. మా ఇద్దరికీ ఒక ఆకారం, ఒక శరీరం ఉంది, మనసూ, భావనలూ ఉన్నాయి. అందరం ఒకేలా జన్మిస్తాం, అందరం చనిపోతాం. మనందరికీ సంతోషంగా, ఆనందంగా జీవించాలనే ఉంటుంది తప్ప బాధపడాలని ఉండదు. ముఖ్యమైన ఈ సామ్యాలని వదిలేసి, అంత ప్రాముఖ్యం లేని అంశాలని, అంటే నేను టిబెట్‌ దేశస్థుడిననీ, అతను కాదనీ, మా ఇద్దరి శరీరం రంగు, మతం, సంస్కృతి వేరనీ, అలాంటి వాటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం సరికాదు. నాలాంటి మరో మనిషినే కలుసుకున్నానన్న భావన నాలో రావడం అన్నిటికన్నా ముఖ్యం. మరొకరితో ఇలా పరిచయం ప్రారంభిస్తే వాళ్లతో సంబంధం పెట్టుకోవడం, మాట్లాడడం ఇంకా సులభం అనిపిస్తుంది.” తను చెప్పేది అయిపోయినట్టు తెలియజేస్తూ ఆయన చిరునవ్వుతో నావైపు చూస్తూ లేచి నిలబడ్డారు. నాతో కరచాలనం చేసి విశ్రాంతి తీసుకునేందుకు లోపలికి వెళ్లిపోయారు.

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం అ ప్రత్త మర్నాడు ఉదయం దలైలామా ఇంట్లో మా చర్చలని కొనసాగించాం.

“మానవ సంబంధాలలో సానుభూతికి గల ప్రాధాన్యం గురించి అరిజోనాలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం ఒకరితో ఒకరం తాదాత్యం చెందేందుకు ఏం చెయ్యాలన్న విషయం నిన్న చర్చించాం...”

“అవును,” అంటూ దలైలామా తల పంకించారు.

“ఇది కాకుండా మీరు ఇంకేమైనా ప్రత్యేకమైన మార్గాలు, విధానాలూ చెప్పగలరా? వాటిని ఉపయోగించుకుని ఇతరులతో ఇంకా బాగా ఎలా వ్యవహరించవచ్చో తెలుసు కోవాలని ఉంది.”

“నిన్న చెప్పినట్టే, ఏ ఒకటో రెండో మార్గాల సాయంతో ఈ సమస్యని పరిష్కరించడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఇతరులతో నేర్పుగా వ్యవహరించేందుకు ఇంకా ఒకటి రెండు ఉపాయాలు లేకపోలేదు. మొదట మీరు ఏ వ్యక్తితో వ్యవహరించాలనుకుంటారో వారి నేపథ్యం కొంత తెలుసుకుంటే దానివల్ల మీ మార్గం సుగమమవుతుంది. అంతేకాక, ఇతరులతో నిజాయితీగా, దాపరికం లేకుండా ్రవర్తించడంవల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.”

ఇంకా ఏమైనా చెపుతారేమోనని వేచి చూశాను, కానీ ఆయన ఇంకేమీ అనలేదు.

“మనుషుల మధ్య సంబంధాలని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే ఇంకేవైనా పద్ధతులు ఉన్నాయా?”

ఒక్క క్షణం ఆలోచించి దలైలామా *"లేవు” అని నవ్వారు.

ఆయన చెప్పిన విషయాలు మరీ తేలికైనవిగా, సాధారణమైనవిగా కనిపించాయి నాకు. కానీ ఆ విషయం గురించి ఆయన ఇంకేమీ చెప్పదల్పుకోలేదు కాబట్టి మేము మిగతా విషయాల చర్చలో పడిపోయాం. ఆరోజు రాత్రి ధర్మశాలలోని కొందరు టిబెట్‌ స్నేహితులు తమ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. వాళ్లు ఆ సాయంకాలాన్ని చాలా ఆహ్లాదకరంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు, నేనూ చాలా సంతోషంగా గడిపాను. భోజనం (బ్రహ్మాండంగా ఉంది, ఎన్నోరకాల పదార్థాలూ, అన్నిటికన్నా మిన్నగా టిబెటన్‌ మో మోలూ వడ్డించారు. (మో మోలు మాంసం, కూరలు, చీజ్‌ లాంటివి మైదాలో కూరి ఆవిరిలో ఉడికించే ఒక వంటకం), భోజనం చేస్తూ చేస్తూ ఉండగానే సంభాషణ కూడా ఊపందుకుంది. తాగుడు మైకంలో తాము చేసిన సిగ్గుమాలిన పనులగురించి ఒక్కొక్కరే కథలు కథలుగా చెప్పసాగారు. ఆ విందుకి చాలామందే వచ్చారు. వారిలో ఒక జర్మన్‌ జంట కూడా ఉంది. భార్య ఆర్కిటెక్ట్‌, భర్త రచయిత. ఆయన అప్పటికే పన్నెండు పుస్తకాలు రాసి ప్రచురించాడు.

పుస్తకాలంటే ఆసక్తి ఉండడంచేత నేను ఆయన దగ్గరకెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆయన రాసిన పుస్తకాల గురించి అడిగాను. ఆయన క్లుప్తంగా, ముక్తసరిగా జవాబులు

904 ఆనందాన్ని పొందే మార్గం చెప్పాడు. ఆయన ధోరణి కూడా పొగరుగా “నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్టు ముభావంగా ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా గర్విష్టి అనీ, స్నేహభావం లేనివాడనీ వెంటనే అతనిమీద అయిష్టం కలిగింది. కనీసం నేనే వెళ్లి ఆయన్ని పలకరించి పరిచయం చేసుకున్నాను, అని నన్ను నేను ఓదార్చుకున్నాను. ఆయనతో మాట్లాడితే నాకేం ఒరుగు తుందిలే అనుకుని మిగతావారితో కబుర్లలో పడ్డాను.

మర్నాడు ఆ ఊళ్లోని రెస్టారెంటుకి వెళ్తే అనుకోకుండా అక్కడ ఒక స్నేహితుడు కనిపించాడు. టీ తాగుతూ క్రితం రోజు డిన్నర్‌ గురించి అతనికి వివరంగా చెప్పసాగాను.

“.. అందరూ చాలా బాగా కలిసిపోయారు, సరదాగా గడిచింది, ఒక్క రాల్ఫ్‌, అదే ఆ రచయిత తప్ప... చాలా అహంకారిలా ఉన్నాడు... స్నేహంగా పలకరించడం కూడా చాతకాని మనిషి..”

“అతన్ని నేను చాలా ఏళ్లుగా ఎదుగుదును. అతని (ప్రవర్తన అలాగే అనిపిస్తుంది, కానీ అసలు కారణం అతనికి జంకు ఎక్కువ, పరిచయం అయిన కొత్తలో ఎక్కువ కలుపుగోలుతనం చూపించడు. కానీ బాగా పరిచయం అయాకే అతనెంత అద్భుతమైన వాడో తెలుస్తుంది,” అన్నాడు నా స్నేహితుడు. నాకు నమ్మకం కుదరకపోయేసరికి నా స్నేహితుడు ఇలా చెప్పుకుపోయాడు, *... అతను బాగా పేరు తెచ్చుకున్న రచయితే అయినప్పటికీ జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. రాల్ఫ్‌ నిజంగానే ఎన్నో బాధలు అనుభవించాడు. రెండో (ప్రపంచయుద్ధ సమయంలో అతని కుటుంబం నాజీల చేతుల్లో భయంకరమైన బాధలు అనుభవించింది. అతనికి ఇద్దరు పిల్లలు. వాళ్లిద్దరంటే అతనికి పంచప్రాణాలూ కానీ ఇద్దరూ కూడా పుట్టుకతోనే సంక్రమించిన ఏదో వ్యాధితో శారీరకంగానూ, మానసికంగానూ విపరీతంగా దెబ్బతిన్నారు. ఆ అనుభవం అతని స్వభావంలో నిరాశా నిసృహలని నింపలేదు, అలాగని తన జీవితం నాశనమైందని ఇతరులనుంచి జాలినీ ఎదురుచూడలేదు, తన పిల్లల్లాగే వికలాంగులైనవారికి సేవ చేస్తూ, సాయం అందిస్తూ ఎన్నో ఏళ్లు వాళ్లతో గడిపాడు. అతనితో బాగా పరిచయం అయితే అతనెంత ్రత్యేకతగలవాడో నీకే తెలుస్తుంది,” అన్నాడు నా మిత్రుడు.

కొన్ని రోజులు గడిచాక నేను రాల్ఫ్‌నీీ ఆయన భార్యనీ మళ్లీ కలుసుకునే అవకాశం దొరికింది. ఒక చిన్న మైదానాన్ని స్థానిక ఎయిర్‌పోర్ట్‌గా వాడుకుంటున్న స్థలంలో వాళ్లని కలిశాను. వాళ్లూ, నేనూ ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లవలసి ఉంది, కానీ అది కాస్తా రద్దయింది. చాలారోజులదాకా మళ్లీ ఢిల్లీకి వెళ్లేందుకు విమానం లేదు, అందుకని "అందరం కలిసి ఢిల్లీకి కారులో వెళ్లాలని నిర్ణయించాం. కారులో పదిగంటలపాటు కదల కుండా కూర్చుని (ప్రయాణం చెయ్యడం కష్టమే. రాల్ఫ్‌ గురించి నా స్నేహితుడు చెప్పిన ఆ కొన్ని వివరాలు అతనిపట్ల నా అభిప్రాయాన్ని మార్చేశాయి. ఢిల్లీ వరకూ చేసిన ఆ దూర(ప్రయాణంలో అతనితో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే అతనితో సంభాషణ కొనసాగించేందుకు ప్రయత్నించాను. మొదట అతను మునుపటిలాగే ఎక్కువ మాట్లాడలేదు. కానీ నేను స్నేహంగా, వదలకుండా మాట్లాడుతూనే ఉందేసరికి, నా స్నేహితుడు చెప్పినట్టు అతను ముభావంగా ఉండడానికి కారణం అతని అహంకారం

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం + 9] కాదనీ, సంకోచమేననీ నాకు అర్ధమయింది. ఉక్కపోత, దుమ్ముధూళితో నిండిన ఉత్తర భారతదేశపు (గ్రామాల గుండా ప్రయాణం చేస్తూ, కబుర్రలో ఇంకా ఎక్కువగా మునిగి పోయాం. అతను చాలా నిజాయితీ ఉన్నవాడనీ, ఆప్యాయంగా మాట్లాడతాడనీ ఆ అనుభవంవల్ల తెలుసుకున్నాను. అతనితో కలిసి ప్రయాణం చెయ్యడం అద్భుతమని అనిపించింది నాకు.

ఢిల్లీ చేరుకునే లోపల దలైలామా అన్నమాటలు స్పష్టంగా అర్థమయాయి. “అవతలి వ్యక్తి నేపథ్యాన్ని అర్ధం చేసుకోవాలి” అని ఆయన చెప్పిన మాట అంత తేలికైనదీ, ఆషామాషీగా అన్నదీ కాదని నాకు అప్పటికి తెలిసివచ్చింది. ఆ సూచనని ఆచరణలో పెట్టడం తేలికేకాని అది తీసివేయవలసిన విషయం మాత్రం కాదు. ఒక్కోసారి ఇతరులతో మాట్లాడడానికి అన్నిటికన్నా చక్కగా ఉపయోగపడే సలహా, మరీ సామాన్యంగా ఉందనీ, సూటిగా ఉందనీ, పనికిరాదనుకునీ మనం వదిలివేస్తూ ఉంటాం, కానీ అది సరికాదు. చాలారోజుల తరవాత మా దేశానికి వెళ్తూ మధ్యలో ఢిల్లీలో రెండురోజులు ఆగాను. ధర్మశాలనుంచి ఢిల్లీకి రావడం, అక్కడి వాతావరణం నాకెంతమాత్రం నచ్చలేదు, చాలా చికాకుగా అనిపించింది. ఉక్కిరిబిక్కిరి చేసే వేడీ, కాలుష్యం, విపరీతమైన జనం. పేవ్‌మెంట్ల మీద నగరాల్లో అమాయకులని మోసంచేసి తమ జేబులు నింపుకునేవాళ్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. మండే ఎండలో ఢిల్లీ రోడ్లమీద నడవడం నరకమే. విదేశీయుణ్ణి, అందులో పాశ్చాత్యదేశస్థుణ్జి ఆ మోసగాళ్లు వదుల్తారా? అదుగడుక్కీ అరడజనుమంది చుట్టుముట్టి వేధించడం! నా మొహంమీద 'దద్దమ్మ' అని రాసి ఉన్నట్టు అనిపించి నీరసం వచ్చింది.

ఆరోజు ఉదయం వీధిలో వెళ్తూండగా ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు. ఇద్దరిలో ఒకడు నా కళ్లు కప్పి నా జోళ్లమీద ఎర్రరంగు పోశాడు. కొంతదూరం వెళ్లాక అమాయకంగా, బూట్‌పాలిష్‌ చేసేవాడిలా కనిపిస్తున్న ఇంకో కుర్రాడు నా జోళ్లమీద రంగు పడిందని చెప్పి, మామూలుగా అందరూ చెల్లించే ధరకే నా జోళ్లు పాలిష్‌ చేస్తానని అన్నాడు. వీళ్లిద్దరూ తోడుదొంగలే. నిమిషాల్లో నా జోళ్లు అద్దంలా మెరిసేట్టు తుడిచి పాలిష్‌ చేశాడు రెండోవాడు. పని పూర్తయాక పెద్దమొత్తం - ఢిల్లీలో చాలామంది తెచ్చుకునే రెండునెలల జీతానికి సమానం - ఇమ్మని అడిగాడు. నేను వెనకాడడం చూసి, ఎక్కడైనా అదే రేటని బుకాయించాడు. ఇవ్వనని అన్నాను, అంతే వాడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, దాంతో జనం మూగారు. ఒప్పుకున్నధర పని ముగించాక ఇవ్వనంటున్నా నని అరవసాగాడు. ఆ తరవాత ఇలాంటి మోసాలు యాత్రికులకి జరగడం మామూలే అని నాకు తెలిసింది; పెద్ద మొత్తం ఇమ్మని అడిగాక, ఈ బూట్‌పొలిష్‌ కుర్రాళ్లు కావాలనే పెద్దగొడవ చేస్తారు, జనం మూగేసరికి, అందరిముందూ రగడ ఎందుకులే అని, దాన్నించి తప్పించుకునేందుకు టూరిస్టులు డబ్బు ఇచ్చేస్తారు. ఇదీ వీళ్ల యుక్తి,

ఆరోజు మధ్యాన్నం నా సహోద్యోగితో కలిసి నేను బసచేసిన హోటల్లో భోజనం చేశాను. పొద్దుటి ఉదంతం త్వరగానే మర్చిపోయాను, నా కొలీగ్‌ దలైలామాని నేను చేసిన

92 4 ఆనందాన్ని పొందే మార్గం

ఇంటర్వ్యూ వివరాల గురించి అడిగింది. వెంటనే ఇద్దరం దలైలామా అభిప్రాయాల గురించి చర్చించుకోవడంలో మునిగిపోయాం. సానుభూతి, తాదాత్మ్యం గురించీ, అవతలివ్యక్తి దృక్కోణాన్ని అర్ధం చేసుకోవడం గురించీ ఆయన చెప్పినదంతా ఆమెకి తెలియజేశాను. భోజనం చేశాక ఇద్దరం ఒక టాక్సీ చేసుకుని మా ఇద్దరికీ తెలిసిన మిత్రులని కలిసేందుకు బైలుదేరాం. టాక్సీ కదలగానే నాకు మళ్లీ ఆ బూట్‌పాలిష్‌ కుర్రాడూ, వాడు చేసిన మోసం జ్ఞాపకం వచ్చాయి. మనసు పాడైంది. వెంటనే టాక్సీ మీటర్‌వైపు చూశాను.

“టాక్స్‌, ఆపు!” అని కేకపెట్టాను. నేనలా అరిచేసరికి నా కొలీగ్‌ ఉలిక్కిపడింది. టాక్సీ (డైవర్‌ అద్దంలోంచి నావైపు గుర్రుగా చూశాడు, కానీ టాక్సీ ఆపలేదు.

“రోద్డువార టాక్సీ ఆపు!” అన్నాను. హిస్టీరియా రోగిలా నా గొంతులో కాస్తంత వణుకు. నా స్పేహితురాలు నిర్భాంతపోయింది. టాక్సీ ఆగింది. వేలితో గాలిని పాడుస్తున్నట్టు మీటర్‌వైపు చూపిస్తూ, “మేం ఎక్కినప్పుడు మీటర్‌ తిప్పి మళ్లీ వెయ్యలేదు! ఇప్పటికే అది ఇరవైరూపాయలకన్నా ఎక్కువ చూపిస్తోంది!” అన్నాను మండిపడుతూ.

“సారీ, సార్‌... మర్చిపోయాను... ఇప్పుడు మళ్లీ వేస్తాను...” అన్నాడతను ఏమీ జరగనట్టు.

“నువ్వేమీ వెయ్యకృర్లేదు. మీటర్‌లని త్వరగా తిరిగేట్టు చెయ్యడం, అదే దారిన గుండ్రంగా తిప్పడం, డబ్బు గుంజేందుకు ఇంకా ఏవేవో మోసాలు చెయ్యడం... నేనింక భరించను... నాకు ఓర్చు... ఇక ఓర్చుకునేది లేదు...” అంటూ కోపంతో, ఆవేశంతో రొప్పసాగాను. నా స్నేహితురాలికి నా ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపించింది నాకు. టాక్సీ డైవర్‌ అదే నిర్లక్ష్యభావంతో నావైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపు తరచు ఢిల్లీ రోడ్ల మీద వాహనాలకి అడ్డంగా వచ్చి నిలబడే గోమాత చూపులా ఉంది. నేను కోపంగా అరవడం అతనికి విసుగ్గా ఉన్నట్టు మొహం పెట్టాడు. ముందు సీట్లోకి కొన్ని రూపాయలు విసిరేసి, ఇంకేమీ అనకుండా నా స్నేహితురాలి వైపున్న కారు తలుపు తీశాను. ఇద్దరం ముందుకి నడవడం ప్రారంభించాం.

త్వరగానే మాకు ఇంకొక టాక్సీ దొరికింది. ఎక్కి కూర్చున్నాం, కానీ నా కోపం ఇంకా తగ్గలేదు. ఢిల్లీ వీధుల్లో వెళ్తూ అక్కడి జన స మై

గ్గ 7, వెళ్తూ అక్కడి జనం ఎంత మోసగాళ్లో, పైవాళ్లు ఎవరైనా అక్కడికి వస్తే వలవేసి మరీ ఎలా పట్టకుని దోచుకుంటారో అంటూ గొణుగుతూనే ఉన్నాను. నేనలా కోపం వెళ్లగక్కుతున్నంతసేపూ నా స్నేహితురాలు మౌనంగా వింటూ ఉండిపోయింది. చివరికి, “ఇరవై రూపాయలంటే డాలర్లలో మహా అయితే ఇరవై ఐదు సెంట్లు, దానికోసం అంత కోపం ఎందుకు?” అంది.

నాకు ఇంకా కోపం వచ్చింది. “అసలు అలాంటి పనులే తప్పని అంటున్నాను. మీరు అంత శాంతంగా ఎలా ఉన్నారో నాకు అర్ధం కావడం లేదు. అడుగడుగునా ఇలాంటి మోసాలు ఎదురవుతూ ఉంటే మీకేమీ అనిపించడం లేదా? అన్నాను నా బాధనంతా వెళ్లగక్కుతూ.

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం + 03

“నిజమే, ఒక్క క్షణం కోపం వచ్చింది, కానీ మధ్యాన్నం భోజనం చేస్తున్నప్పుడు మనిద్దరం మాట్లాడుకున్న విషయాలని ఒకసారి మననం చేసుకున్నాను, ఇంకొకరి దృక్కోణం నుంచి చూడమని దలైలామా సలహా ఇచ్చారని చెప్పారు మీరు. మీరు కోపంతో రెచ్చిపోతూ ఉంటే, నేను ఆ టాక్సీ దైవర్‌కీ నాకూ ఉన్న సామ్యం ఏమిటన్న ఆలోచనలో పడ్డాను. మా ఇద్దరికీ తినడానికి మంచి తిండి కావాలి, సుఖంగా నిద్రపోవాలి, హాయిగా బతకాలి, ఇంకొకరి (ప్రేమ కావాలి... ఇలాంటివే మరెన్నో తరవాత అతని స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను. రోజంతా ఏసీ కూడా లేని ఈ టాక్సీలో గడపాలి. బహుశా డబ్బున్న విదేశీయులని చూసి నేను అసూయపడచ్చు... ఇక నాకు “న్యాయం జరగాలంటే ఒకటే మార్గం. అవతలి వారి దగ్గరున్న డబ్బు మోసం చేసి దోచుకుంటే కొంతలో కొంత ఆనందం దొరుకుతుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే, నా పాచిక పారి అమాయకంగా నన్ను నమ్మిన యాత్రీకుల దగ్గర్నించి కొంత డబ్బు అదనంగా కొట్టేసినా, జీవితం సంతృప్తికరంగా, ఆనందంగా సాగుతుందని అనుకోను... చెప్పొచ్చేదేమిటంటే, అతనితో నన్ను పోల్చి చూసుకున్న కొద్దీ అతని మీద నాకు కోపం రావడం తగ్గిపోయింది. అతని జీవితం ఆనందంగా లేదని అనిపించింది... అంటే అతను చేసిన మోసాన్ని సమర్థిస్తున్నానని కాదు, ఆ టాక్సీ ఆపించి దిగిపోవడం కూడా సరైన పనే, కానీ అతన్ని ద్వేషించేంతగా అతని మీద కోపం తెచ్చుకోలేకపోయాను...” అంది ఆమె నింపాదిగా.

నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు నాకు దిగ్భాంతిని కలిగించాయి. దలైలామా చెప్పిన మాటల్లోని సారాన్ని నేనెంత తక్కున గ్రహించానా అని నా మీద నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను ఆయన సలహాలు జీవితంలో ఎంత బాగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని అర్ధం చేసుకోవడం ప్రారంభించాను. “అవతలి వ్యక్తి నేపథ్యాన్ని అర్ధం చేసుకోవడం” లాంటి విషయాలని ఆయన ఉదాహరణలతో వీవరించినప్పుడు తను వాటిని ఎలా పాటిస్తున్నాడో చూసి నేను గొప్ప ప్రేరణ పొందాను. కానీ మేమిద్దరం చర్చించుకున్న ఎన్నో విషయాలని వెనక్కితిరిగి చూసుకున్నప్పుడు, అరిజోనాలో మొదలుపెట్టి ఇండియాలో కూడా కొనసాగించిన మా సంభాషణలని గుర్తుచేసుకున్నప్పుడు మొదటినుంచీ మా చర్చలు ఏదో వ్యాధికి సంబంధించిన చికిత్స గురించి సాగినట్టే తోచాయి. నేను ఆయన్ని మానవ శరీర నిర్మాణం గురించి అడిగినట్టు... ఒకటే తేడా నా ప్రశ్నలన్నీ మనిషి మనసుకీ, ఆత్నకీ సంబంధించినవి. ఎందుకోగాని ఆ క్షణం వరకూ ఆయన ఆలోచనలని నా జీవితానికి అన్వయించుకోవాలన్న ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా, నాకు ఎక్కువ తీరిక ఉన్నప్పుడు దాన్ని గురించి ఆలోచిస్తాను అనే అనుకుంటూ వచ్చాను.

మానవ సంబంధాల మూలాధారాలని పరిశీలించడం

అరిజోనాలో దలైలామాతో మొదట నేను చర్చించిన విషయాలు ఆనందాన్ని పొందే మార్గాల గురించినవి. ఆయన ఒక సన్యాసిలా జీవించాలని నిశ్చయించుకున్నారు. అయినా అధ్యయనాలు వివాహం చేసుకోవడం వల్ల ఆనందాన్ని పొందవచ్చనీ, ఆరోగ్యాన్నీ,

94 + ఆనందాన్ని పొందే మార్గం సంతృప్తినీ పొందే ఆత్మీయత వివాహంలో లభిస్తుందనీ నిరూపిస్తున్నాయి. అమెరికన్ల మీదా, యూరోపియన్ల మీదా వేలకొద్దీ అధ్యయనాలు జరిపారు. ఒంటరిగా జీవించినవారు, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న వారి కన్నా వివాహితులు ఎక్కువ ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆనందం లేకుండా జీవిస్తున్నవారు జీవిత భాగస్వామిని విడిచిపెట్టో, లేక విడాకులు తీసుకునో విడిగా ఉండేవారు. ఒక సర్వేలో తమ వివాహ జీవితం *చాలా ఆనందంగా గడుస్తోందని చెప్పిన అరవై శాతం అమెరికన్లు తమ జీవితం కూడా మొత్తం మీద “చాలా అనందంగా” గడుస్తోందనే చెప్పారు. మానవ సంబంధాల గురించి దలైలామాతో చర్చించేప్పుడు అందరూ సామాన్యంగా ఆనందాన్ని అనుభవించే ఆ సంబంధం (ప్రస్తావన తీసుకురావడం ముఖ్యమని నాకు అనిపించింది. దలైలామాని కలుసుకోబోయేందుకు హోటల్‌కి వెళ్లాను. ఇంటర్వ్యూకి కొద్ది నిమిషాల ముందు ఒక స్నేహితుడితో హోటల్‌ టక్సన్‌ ఆవరణలో కూర్చుని చల్లని పానీయాన్ని ఆస్వాదించసాగాను. ఇంటర్వ్యూలో నేను ప్రస్తావించదల్చిన విషయాలు, ప్రేమ-పెళ్లి గురించి నా మిత్రుడికి చెప్పాను. ఇద్దరం ఒంటరిగా ఉన్న వ్యక్తుల గురించి సానుభూతితో మాట్లాడుకోసాగాం. అదే సమయంలో ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న ఒక జంట - బహుశా గోల్ఫ్‌ ఆడేందుకు వచ్చి ఉంటారు - మా బల్ల దగ్గరే ఉన్న మరో బల్ల దగ్గర కూర్చున్నారు. ఇద్దరూ చాలా ఆనందంగా సెలవుల్ని గడుపుకునేందుకు వచ్చినట్టు కనిపించారు. వాళ్లకి పెళ్లయి కొన్నేళ్లు గడిచినట్టు అనిపించింది. హనీమూన్‌కి వచ్చిన వాళ్లలా లేరు. కానీ ఇంకా మంచి వయసులో ఉన్నవారిలా, ్రేమికుల్లాగే ఉన్నారు. అలా అందరూ ఉంటే ఎంత బావుంటుందో అనుకున్నాను.

అలా కూర్చున్నారో లేదో ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు.

“... నేను ముందే చెప్పాను ఆలస్యమయిందని!” అంది ఆమె కరవొచ్చినట్టు. ఆమె గొంతు ఎలుగురాసుకుపోయినట్టు గరగరమంది. ఏళ్లతరబడి సిగరెట్టూ, తాగుదూ తాగడం వల్ల ఏర్పడిన గరగర అది. “మనకిప్పుడు ఏమైనా తినేందుకు కూడా సమయం లేదు. సుఖంగా తిండి తినేందుకు లేదు నాకు” అంది విసుక్కుంటూ.

“... నువ్వు తయారయేందుకు అంతసేపు తీసుకోకుండా ఉండాల్సింది...” అని మాటకి మాట జవాబిచ్చాడు భర్త. అతను ఆ మాటలని ఎంతో నెమ్మదిగా అన్నా ఒక్కొక్క అక్షరంలోనూ విపరీతమైన ద్వేషం, విసుగూ ధ్వనించాయి.

మళ్లీ ఆమె ఎదురు జవాబిచ్చింది. “అరగంట క్రితమే నేను రెడీ అయాను. నువ్వే వార్తాపత్రిక చదవడం అయేవరకూ కదల్లేదు...”

అలా వాళ్లు వాదించుకుంటూనే ఉన్నారు. గ్రీకు నాటకకర్త యూరిపిడిస్‌ అన్నట్టు, “వివాహం చేసుకో, అది బాగానే ఉండచ్చు. కానీ వివాహంలో సమస్యలు తలెత్తినప్పుడు పెళ్లయిన వాళ్లు ఇంట్లోనే నరకం చూస్తారు.

వాళ్ల వాగ్వివాదం క్షణం క్షణం పెరిగిపోసాగింది. దాంతో ఒంటరి వ్యక్తుల గురించి బాధపడుతూ ఏమేమో అంటున్న మా నోళ్లు మూత పడ్డాయి. నా మిత్రుడు గుడ్లు

ఇతరులతో లోతైన సంబంధాలు వర్పరచుకోవడం జ్‌ లో మిటకరించాడు, సైన్‌ఫెల్స్‌ టీవీ సీరియల్‌ లోంచి ఒక వాక్యాన్ని ఉటంకిస్తూ, *౬, తప్పకుండా త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది నాకు!” అన్నాడు. కొద్ది క్షణాల క్రితం వరకూ, ఈసారి దలైలామాతో (ప్రేమ, పెళ్లిలోని మాధుర్యాన్సీ గుణ గణాలనీ గురించి మాట్లాడుతూ మా సంభాషణని ప్రారంభించాలని అనుకున్నాను. కానీ ఆయనని కలుసుకోగానే ఇంకా కూర్చునేందుకు కూడా ప్రయత్నించకుండా, “వివాహ సంబంధాల్లో తరచు సమస్యలు ఎత్తడానికి కారణాలు ఎటువంటివని మీ అభిప్రాయం?” అన్నాను.

“సమస్యలతో తలపడడం చాలా క్లిష్టమైన పరిస్థితే అనాలి. వాటికి ఎన్నో కారణాలుంటాయి. అందుచేత, సంబంధాలలో తలెత్తే నమన్వలని ఆర్ధం చేసుకునేందుకు ట్రయళల్నించే (క్రమంలో, ముందుగా మనం ఆలోచించవలనింది, ఈ నంబింధానికి అసలు మూలకారణం పమిటి అనేది?

“ముందుగా మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. సంబంధాలు రకరకాలుగా ఉంటాయి. వాటిలోని తేడాలని అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకి, ఒక్క క్షణం వివాహం అనే విషయాన్ని పక్కన పెట్టి, మామూలుగా మనం చేసే స్నేహాలలో కూడా తేడాలుండడం మనం గమనించవచ్చు. కొన్ని స్నేహాలు డబ్బు, అధికారం, పదవి వంటి వాటిమీద ఆధారపడతాయి. అలాంటి స్నేహాలు ఆ డబ్బు, అధికారం, పదవి ఉన్నంతవరకే కొనసాగుతాయి. అవి పోగానే స్నేహం కూడా మాయమైపోతుంది. కానీ మరోవైపు ఇటువంటి లౌకిక విషయాలు కాకుండా మనిషి భావాలకి సంబంధించిన స్నేహం అనేది కూడా ఒకటుంది. ఆత్మీయ సంబంధం, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగల, అన్నీ పంచుకోగల స్నేహసంబంధం. దీన్నే నేను నిఖార్సయిన సంబంధం అంటాను. ఎందుకంటే ఈ స్నేహం మనిషిని మనిషిగానే తప్ప అతని ధనసంపదనో, వోదానో, పదవినో చూడదు. నిజమైన స్నేహం నిలిచి ఉండాలంటే ఆత్మీయత ఉండాలి. అది లేకపోతే స్నేహం నిలవదు. ఇవన్నీ ముందే చెప్పుకున్నవే, కానీ మానవ సంబంధాలలో సమస్యలు తలెత్తినప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి చూసుకుని ఆ సంబంధానికి నిజమైన ఆధారం, మూల కారణం ఏమిటని ఒకసారి పరీక్షించుకుంటే మంచిది.

“అదే విధంగా జీవిత భాగస్వామి విషయంలో ఎవరికైనా సమస్య వస్తే కూడా ఆ ఇద్దరి మధ్యా దాంపత్య సంబంధం ఏర్పడడానికి అసలు కారణాలని ఒకసారి తరచి చూసుకుంటే దానివల్ల లాభం ఉండవచ్చు. ఉదాహరణకి, చూడగానే ఒక జంటకి ఒకరి మీద ఒకరికి ఏర్పడే ఆకర్షణ వివాహ సంబంధానికి దారితీస్తుంది. కొత్తగా కలుసుకున్న ఒక జంట ఒకరి విషయం ఇంకొకరికి ఎక్కువగా తెలిసే అవకాశం లేనప్పుడు కూడా ఆకర్షణ వల్ల ప్రేమ పిచ్చిలో పడి తాము చాలా ఆనందంగా ఉన్నామని అనుకుంటారు,” అంటూ నవ్వి మళ్లీ ఇలా చెప్పడం కొనసాగించారు, “కానీ అటువంటి క్షణంలో వివాహం చేసుకోవాలన్న నిర్ణయం దృఢంగా ఉండలేదు. తీవ్రమైన క్రోధానికీ, ద్వేషానికీ గురైన వ్యక్తి

96 + ఆనందాన్ని పొందే మార్గం

ఎలా ప్రవర్తిస్తాడో వీళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అది క్షణికమైన ఆవేశం, కామం, కోరిక. అది మనిషిని పిచ్చివాణ్ణి చెయ్యగలదు. ఒక్కోసారి, 'నా బాయ(ఫెండ్‌/గర్స్‌ఫెండ్‌ స్వభావం మంచిది కాదు. ఏమాత్రం దయా జాలీ లేవు, అయినా నాకు అతనిమీద / ఆమెమీద ఆకర్షణ ఏమాత్రం తగ్గదు! అని అనిపించే పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. అందుచేత అటువంటి క్షణికాకర్షణ ఆధారంగా ఏర్పడిన సంబంధాలు దృఢంగా ఉండవు, అవి నమ్మదగినవి కావు. ఆ ఆకర్షణ అనే భావన తాత్మాలికమైనది, కొంత కాలానికి అది మాయమవుతుంది,” అంటూ చిటికెలు వేశారు దలైలామా. ఒక్క క్షణం ఆగి, “అందుచేత అలాంటి సంబంధాలు, వివాహాలు చిక్కుల్లో పడడంలో ఆశ్చర్యమేమీ లేదు... మీ అభిప్రాయం ఏమిటి?” అన్నారు దలైలామా.

“అవును, ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఎంత గొప్పగా (్రేమించి, అభిమానించినా ఒక వ్యక్తి మీద మొదట్లో ఉన్న మోహం చివరికి చల్లారిపోవలసిందే. తమ సంబంధం మొదట పిచ్చి డ్రేమతోనూ, రొమాన్సుతోనూ ప్రారంభం అవడం చాలా అవసరం అనుకునేవాళ్ల జీవితాలు ఆ భ్రమ నుంచి బైటపడడంతోనో, విడాకులు తీసుకోడంతోనో ముగుస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాలో పనిచేసే సామాజిక మనస్తత్వవేత్త ఎలన్‌ బర్‌పైైడ్‌ అనుకుంటాను, ఈ సమస్యని పరిశీలించి అంత తీవ్రమైన (పేమా, మోహం తాత్కాలికమేనని అర్ధం చేసుకోకపోవడం వల్లే సంబంధాలు దెబ్బతింటాయనే నిర్ణయానికి వచ్చింది. ఆమే, ఆమె తోటి ప్రాఫెసర్లూ గత ఇరవై ఏళ్లలో విడాకులు తీసుకున్న జంటలని అధ్యయనం చేసి, రొమాంటిక్‌ (పేమ లాంటి సానుకూలమైన విషయాలకి తమ జీవితంలో అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వడమే ఆ విదాకులకి కారణమని తెలుసుకున్నారు. అటువంటి అనుభవాలని ఎక్కువకాలం అంతే తీవ్రతతో నిలుపుకోవడం కష్టం...”

“ఇది ముమ్మాటికీ నిజమే అనిపిస్తుంది. అందుకే సంబంధాలు ఏర్పరచుకునే ముందే ఆ సంబంధం ఏర్పరచుకునేందుకు మూలకారణాలు ఏవి అని ఒకసారి పరీక్షించి చూసుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి సమస్యలని చూస్తే అర్థమవుతుంది.

“కొన్ని సంబంధాలకి యువతీ యువకుల మధ్య తక్షణం ఏర్పడే లైంగిక ఆకర్షణ కారణమవుతుంది. అదే సమయంలో ఆ ఇద్దరి మధ్యా ఇంకా ఎన్నో రకాల సంబంధాలు ఉంటాయి. తాను ప్రేమించే అబ్బాయి గాని, అమ్మాయి గాని చూపులకి అంత అందంగా, ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు కానీ వాళ్లు చాలా మంచి మనసున్న వాళ్లు కావచ్చు. ఇటువంటి గుణాలని చూసి ఇష్టపడి కలుపుకునే సంబంధాలు ఇంకా ఎక్కువకాలం నిలిచి ఉంటాయి. ఇద్దరి మధ్యా పంచుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. మానవత్వం దృష్ట్యా ఇద్దరిదీ ఒకే రకమైన మనస్తత్వం అయి ఉంటుంది...”

కాసేపు ఆ సమస్యని గురించే ఆలోచిస్తూ ఉన్నట్టు దలైలామా ఒక్క క్షణం ఆగి ఇలా అన్నారు, “అన్నట్టు లైంగిక ఆకర్షణ ఉన్నా కూడా ఇద్దరి మధ్య మంచి, ఆరోగ్యకరమైన సంబంధం కొనసాగచ్చు అనే విషయాన్ని కూడా ఒప్పుకోవాలి. లైంగిక ఆకర్షణ ఆధారంగా వర్పడే సంబంధాలు రెండు రకాలుగా ఉంటాయని అనిపిస్తుంది. ఒకటి కేవలం లైంగిక

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం శ ధ్ర7 కోరిక ఉన్నది. ఇందుల్లో ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని కలిగించేది తాత్యాలికమైన కోరిక తీర్చుకోవాలన్న ఆరాటం. ఇటువంటి సంబంధంలో వ్యక్తులు ఒకర్నాకరు మనుషులుగా కాక్క, తమ కోరిక తీర్చే వస్తువులుగా పరిగణిస్తారు. ఇలాంటి సంబంధం పటిష్టంగా ఉండదు. పరస్పరం గౌరవించుకోలేని వారి మధ్య ఏర్పడే శారీరకమైన సంబంధం దాదాపు వ్యభిచారంలాంటిదే. లైంగిక కోరిక ఆధారంగా ఏర్పరచుకునే సంబంధం మంచుదిమ్మల పునాది మీద కట్టిన ఇల్లులాంటిది;ి మంచు కరగగానే కట్టడం కూలిపోతుంది.

“లైంగిక అకర్షణ ఆధారంగా ఏర్పడే మరో రకమైన సంబంధం కూడా ఉంది, కానీ అందులో శారీరక ఆకర్షణ ఆ సంబంధానికి మూలకారణం కాదు. అవతలి వ్యక్తి సహృదయతనీ, సున్నిత మనస్తత్వాన్నీ మంచితనాన్నీ అర్ధం చేసుకుని, అతని విలువని గుర్తించి అతన్ని గౌరవించడం ఈ రకమైన సంబంధంలో (ప్రధానంగా ఉంటుంది. ఇటువంటి అంశాలని ఆధారం చేసుకుని ఏర్పరచుకునే సంబంధం ఎక్కువకాలం కొనసాగుతుంది, నమ్మదగినది. ఇదే సరైనది. ఇటువంటి సంబంధం కలిగి ఉందాలంటే ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతూ, అర్ధం చేసుకోవాలి. ఇద్దరిలోనూ ప్రధానంగా ఉండే గుణాలేమిటో, వారి స్వభావం ఎటువంటిదో బాగా తెలుసుకోవాలి.

“అందుకే నా మిత్రులు తమ వివాహం గురించి నన్ను సలహో కోరినప్పుడు, మీరిద్దరికీ ఎన్నాళ్లుగా పరిచయం అని అడుగుతాను. కొన్ని నెలలుగా అని వాళ్లు అంటే, “ఓ, అది చాలా తక్కువ సమయం,” అంటాను. కొన్నేళ్లుగా పరిచయం ఉందని అంటే అది కాస్త మంచిది అంటాను. అలాంటివాళ్లకి ముఖపరిచయం, చూసేందుకు ఎలా ఉంటారు అనే విషయాలే కాకుండా అవతలి వ్యక్తి స్వభావం కూడా లోతుగా తెలిసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం...”

“మీరు చెప్పేది వింటుంటే నాకు మార్క్‌ ట్వెన్‌ మాటలు గుర్తొస్తున్నాయి. “హాత్తిక్షేళ్లు వైవాహిక జీవితం గడిపాక గాని ఏ స్త్రీకి గానీ పురుషుడికి గాని శ్రేమ అంటే ఏమిటో తెలీదు; అంటాడాయన,

దలైలామా తల పంకించి ఇలా అన్నారు, “అవును... చాలా సమస్యలకి కారణం ఇద్దరూ ఒకర్నొకరు తెలుసుకునేందుకు తగినంత సమయాన్ని వెచ్చించకపోవడమే. ఎవరైనా నంత్భనవ్తీకరమైన సంబంధాన్ని వర్చరుచుకునేందుకు (్రయత్నిస్తున్నట్టయితే, అవతలి వ్యక్తి స్వభావాన్ని లోతుగా అర్ధం చేనుకోవదం, ఆ తరవాత ఆ న్వభావం గల మనిషితో తాను ఎక్షువకాలం సంబంధం కొనసాగించగలనా లేదా అని తేల్చుకోవడం ముఖ్యం. అంతేగాని పైపై మెరుగులు చూనీ ఆకర్షితులవడం నరైన వద్ధతి కాదు. ఇక అర్ధం చేసుకున్నాక ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఇద్దరి మధ్యా నిజమైన సానుభూతి చోటుచేసుకుంటుంది.

“చాలామంది, మా ఇద్దరిదీ కేవలం లైంగిక సంబంధం కాదు, దానికి ఇంకా లోతైన అర్ధం ఉంది అని అంటూ ఉంటారు. ఇద్దరు మనుషులు వివాహం చేసుకోవడం అంటే వాళ్ల జీవితాలు ముడిపడతాయనీ, జీవితంలో ఒడిదుడుకులన్నిటినీ కలిసి అనుభవిస్తారనీ,

గ్ర 4 ఆనందాన్ని పొందే మార్గం ఇద్దరిమధ్యా ఆత్మీయమైన బంధం ఉంటుందనీ అంటారు. అదే నిజమైతే, ఒక సంబంధం ఏర్పరచుకోడానికి అంతకన్నా మంచి పునాది మరొకటి లేదని నా నమ్మకం. ఆరోగ్య కరమైన సంబంధంలో బాధ్యత, నిబద్ధత ఉంటాయి. ఇద్దరిమధ్యా ఉండే లైంగిక అనుభవం వారిద్దరినీ మరింత దగ్గరకి చేర్చి, సంతృప్తిని ఇస్తుంది, మనసుకి శాంతిని ప్రసాదిస్తుంది, దాన్ని కాదనేందుకు లేదు. కానీ జీవశాస్త్రం ప్రకారం చూస్తే లైంగిక చర్య అనేది కేవలం పునరుత్పత్తి కోసమే జరుగుతుంది. దాన్ని సాధించాలంటే సంతానంపట్ల నిబద్దత ఉండాలి, అప్పుడే వాళ్లు చక్కగా పెరిగి మనుగడ సాగిస్తారు. అందుకే బాధ్యత, నిబద్ధత అనే గుణాలని వికసింపజేసుకోవడం చాలా ముఖ్యం. అవే లేకపోతే ఆ సంబంధం తాత్కాలికమైన సంతృప్తినే ఇవ్వగలుగుతుంది. అది కేవలం సరదాకోసం చేసే పనే అవుతుంది,” అంటూ నవ్వారాయన. మనిషి ప్రవర్తనకి గల విస్తృతిని చూసి విస్మయం చెందినట్టుగా ఉంది ఆయన నవ్వు ప్రణయం మీద ఆధారపడ్డ బాంధవ్యాలు

జీవితమంతా (బ్రవ్మచారిగా గడిపిన అరవైఏళ్ల దలైలామాతో లైంగిక సంబంధాలూ, వివాహం గురించి మాట్లాడడం అదోలా అనిపించింది నాకు. కానీ ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఆయనకి ఎటువంటి అభ్యంతరమూ ఉన్నట్టు కనిపించలేదు. అయినా ఆయన మాటల్లో ఒక రకమైన ఉదాసీనత మాత్రం ధ్వనించింది.

ఆరోజు సాయంత్రం మేము మాట్లాడుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సంబంధాల గురించి మరో ముఖ్యమైన విషయం ఇంకా చర్చించుకోవలసి ఉందని అనిపించింది. దాన్ని గురించి దలైలామా అభిప్రాయం తెలుసుకోవాలన్న కుతూహలంతో మర్నాడు ఆయన్ని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించాను.

“నిన్న మనం మానవ సంబంధాల గురించీ, వివాహంలాంటి ఆత్మీయమైన సంబంధాన్ని కేవలం లైంగిక సంబంధంగా మాత్రమే అనుకోకూడదన్న విషయం గురించీ చర్చించుకున్నాం. కానీ పాశ్చాత్య సంస్కృతిలో అది కేవలం శారీరక సంబంధమే కాదు ప్రేమలో పడడం, భాగస్వామిని గాధంగా ఢ్రేమించడం అంటే రొమాన్స్‌ వంటి భావాలు చాలా ముఖ్యమైనవి. సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ ఇటువంటి రొమాంటిక్‌ ప్రేమకి పెద్దపీట వేస్తారు. దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి” అని అడిగాను.

ఏమాత్రం తడుముకోకుండా దలైలామా ఇలా జవాబు చెప్పారు, “ఎడతెగకుండా రొమాంటిక్‌ (ప్రేమకోసం పాకులాడడం మనలోని ఆధ్యాత్మిక వికాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని పక్కన పెట్టి, జీవితాన్ని సంప్రదాయ పద్ధతిలో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించినా, రొమాంటిక్‌ ప్రేమకి అంత (ప్రాధాన్యం ఇచ్చి, అదేదో పెద్ద ఆదర్శం అన్నట్టు ప్రవర్తించడం విపరీతధోరణి అనే అనిపించుకుంటుంది. అవతలి వ్యక్తి మంచి కోరడం, ఆప్యాయత మీద దృష్టి ఉంచే సంబంధాల విషయం వేరు. మీరు చెప్పే రొమాంటిక్‌ (ప్రేమ సానుకూలమైనదిగా తోచదు. అది కాల్చనిక లోకంలోని విషయం,

ఇతరులతో లోతైన సంబంధాలు ఏర్పరచుకోవడం * పం

సులభంగా అందనిది, అందుకే చివరికి అది నిస్పృహనే మిగులుస్తుంది. ఆ దృష్టితో చూస్తే అది సానుకూలమైన ధోరణి కాదు,” అని దృఢంగా అన్నారు.

దలైలామా గొంతులో తాను చెప్పేదానికి తిరుగులేదన్న భావం పలికింది. ఇక ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నట్టు అనిపించింది నాకు. మా సంస్కృతి రొమాన్సుకి ఇచ్చే అసాధారణమైన ప్రాధాన్యం దృష్టితో చూస్తే, ఆయన రొమాంటిక్‌ (ప్రేమ తాలూకు ఆకర్షణని మరీ తేలిగ్గా తీసిపారేస్తున్నారని అనిపించింది. రొమాన్స్‌ ఎంత ఆహ్హాదాన్ని ఇస్తుందో ఆయన అర్ధం చేసుకోలేదని కూడా అనిపించి, ఇక విషయం గురించి ఆయన్ని ఏం అడిగినా ఏమీ లాభం ఉండదనీ - అది పార్కింగ్‌ లాట్‌కి ఆయన్ని వెంటపెట్టుకుని వెళ్లి నా కారులో ఉన్న ట్రాన్స్‌మిషన్‌ ఎందుకు పనిచెయ్యడంలేదో చెప్పమని అడిగినట్టే ఉంటుందనీ - అనుకున్నాను. కొద్దిగా నిరాశ చెంది, నా నోట్స్‌ని అటూఇటూ తిరగేసి, కొన్ని నిమిషాల తరవాత మరో విషయం వైపు మా సంభాషణని మళ్లించాను. రొమాన్స్‌కి అంత ఆకర్షణని ఆపాదించేది ఏమిటి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే కామం- లైంగిక, మోహపూరితమైన రొమాంటిక్‌ పేమ - పారవశ్యానికి పరాకాష్ట సాంస్కృతిక, జీవశాస్త్ర, మనస్తత్వశాస్త్రాల మిశ్రమం. అది చాలా శక్తిమంతమైన మిళ్రమం. పాశ్చాత్య దేశాలలో రెండువందల ఏళ్లక్రితం రొమాంటిసిజమ్‌ అనే ఒక ఆలోచనాసరళి ప్రారంభమైంది. (లౌకిక జీవితాన్ని వదిలేసి కల్చ్పనాలోకంలో విహరింపజేసే ధోరణి అది.) దాని ప్రభావం వల్ల ప్రేమ అనే భావనని అలౌకికమైన విషయంగా ఊహించుకోవడం పాశ్చాత్యులకి అలవాటయింది. అంతకు క్రితం జ్ఞానానికీ, తర్మానికీ ఉండిన ప్రాధాన్యం దీనివల్ల తగ్గిపోతూ వచ్చింది. ఈ కొత్త ధోరణి భావోద్రేకాలకీ, తీవ్రమైన మోవానికీ, అంతః(క్రేరణకీ ప్రాముఖ్యం ఇచ్చింది. ఇంద్రియాలకీ, వ్యక్తికి కలిగే అనుభవాలకీ ప్రాధాన్యం ఇచ్చి ఎక్కడా లేని ఒక అలౌకిక ప్రపంచంలో, ఊహాలోకంలో విహరింపజేసింది. గతాన్ని ఒక ఆదర్భ్శంగానూ, భవిష్యత్తుని అలౌకికమైన ఒక ప్రదేశంగానూ ఊహించుకోమంది. ఈ వైఖరి కళలమీదా, సాహిత్యంమీదే కాక రాజకీయాలమీదా, ఆధునిక పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన అన్ని పార్య్వాలమీదా తన ప్రభావాన్ని చూపింది.

ప్రేమలో పడడం అనే భావన రొమాన్స్‌ని సంపాదించుకోవాలన్న కోరికలో అన్నిటికన్నా బలమైన ఒక అంశం, ఈ భావన కలిగించడం వెనక ఎన్నో బలమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కేవలం సంస్కృతికి సంబంధించిన ఒక అంశంగా దాన్ని సొంతం చేసుకోవడంతో కథ ముగిసిపోదు. పుట్టుకతోనే మన జన్యువులలో ఇటువంటి శక్తులు నిక్షిప్తమై ఉంటాయని చాలామంది పరిశోధకుల అభిప్రాయం. (ప్రేమలో పడడం అనేదానితో లైంగిక ఆకర్షణ అనివార్యంగా ముడిపడి ఉంటుంది. మైథునానికి అవసరమైన ప్రవర్తనలో ఇది జన్యుపరంగా ఏర్పాటయిన సహజ లక్షణం అయి ఉండవచ్చు. పరిణామ క్రమం దృష్టితో చూస్తే ప్రాణి ప్రప్రథమంగా చెయ్యవలసిన పని ప్రాణాలతో ఉండడం, పునరుకృత్తి చెయ్యడం, తన జాతి నిరంతరం కొనసాగేట్టు జాగ్రత్త పడడం. నిజంగా (ప్రేమలో పడడం అనేది పుట్టుకతో వచ్చే లక్షణమే అయితే అది జాతి కొనసాగేందుకే;

100 + ఆనందాన్ని పొందే మార్గం ఆడా మగా మైథునం ద్వారా పునరుత్పత్తి చెయ్యడం అనేది జరగడానికి ఇది దోహదం చేస్తుంది. కొన్ని రకాల బాహ్యడ్రేరణలు పొంది మన మెదడు కొన్ని రసాయనాలని తయారుచేసి, విడుదలచేసి, ఉల్లాసస్థితిని కలగజేస్తుంది. ఆ తీవ్రమైన ఉల్లాసానికీ, “పేమలో పడడానికీ' సంబంధం ఉంది. మన మెదళ్లలో ఈ రసాయనాలు ఊరుతూ ఉన్నప్పుడు మనసులో భావాలు ఉప్పొంగుతూ ఒక్కోసారి ఇంకేమీ కనబడకుండా చేస్తాయి. “పేమలో పడ్డాం, అనే భావనని పొందమని మనని శారీరక శక్తులే కాదు, మానసిక శక్తులు కూడా వెంటపడి తరుముతాయి. ప్లేటో 'సింపోజియమ్‌'లో ఎరస్టా ఫనీజ్‌ అనే కాల్చనిక కథని సోక్రటిస్‌ చెపుతాడు. లైంగిక (్రేమ అనేది ఎలా మొదలైంది అన్నదే ఆ కథలోని ఇతివృత్తం. ఈ కల్పితకథ ప్రకారం ఈ భూమిమీద మొట్టమొదట పుట్టిన ఆదివాసులు గుండ్రంగా ఉండేవారు. వారికి నాలుగు చేతులూ, నాలుగు పొదాలూ ఉండేవి. వీపూ, శరీరం పక్క భాగాలుగా కలిసి గుండ్రని ఆకారం ఉందేది ఎవరిమీదా ఆధారపడకుండా జీవించే ఈ ప్రాణులు చాలా అహంకారంతో నిండి ఉండి, ఎప్పుడూ దేవతలమీద దాడి చేస్తూ ఉండేవి. వాటిని శిక్షించేందుకు దేవతల రాజు జూస్‌ పిడుగుల వర్షం కురిపించి వాటిని రెండుగా చీల్చాడు. అలా ఒక్కొక్క ప్రాణీ రెండుగా మారింది. రెండూ ఒకదానితో మరొకటి ఏకం అయేందుకు తహతహలాడసాగాయి. శృంగారం, లేక కామభావన అనే మోహం, రొమాంటిక్‌ ఢేమ, ఈ ప్రాచీనకాలంలో రెండో సగంతో కలిసిపోవాలన్న కోరికకే మరో రూపమని అనుకోవచ్చు. ఇది మనుషులందరికీ సార్వజనీనమైన, అసంకల్పిత అవసరం. ఈ భావనలో ఇంకౌకరితో పూర్తిగా మమేకం అవాలన్న కోరిక ఉంటుంది. అన్ని హద్దులనీ చెరిపివెయ్యాలనీ, (ప్రేమించిన మనిషితో ఏకం కావాలనీ అనిపిస్తుంది. మనస్తత్వవేత్తలు దీన్ని అహంకారపు హద్దులు కూలిపోవడం అంటారు. కొందరు ఈ ్రక్రియ మనలో ప్రప్రథమంగా కలిగే అనుభవంనుంచి మొలకెత్తుతుందని అంటారు. శిశువులుగా మనం అనుభవించినదాన్ని పునఃసృష్టి చెయ్యాలని మనం చేసే అసంకల్పిత ప్రయత్నం అంటారు. శిశువు తన తల్లితోనో, తనని సాకే వ్యక్తితోనో పూర్తిగా మమేకం అయే ఆదిమస్థితి అది. పసిపిల్లలు తమకీ ఈ ప్రపంచానికీ ఉండే తేడాని తెలుసుకోలేరని నిరూపించబడింది. తమకి ప్రత్యేకమైన ఉనికి ఉందని వాళ్లకి తెలీదు, వాళ్లకి గుర్తింపు దారికేది తల్లితోనూ, ఇతరులతోనూ, తమ చుట్టూ ఉండే అన్ని వస్తువులతోనూ మాత్రమే. “నేను” అనేది ఎక్కడ ముగిసిపోతుందో 'వాళ్ళు' అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో వాళ్లు ఎరగరు. వాళ్ల చిన్న పరిధిలో ఏదీ శాశ్వతంగా వాళ్లది కాదు : వస్తువులకి తమకంటూ ఉనికి ఉండదు. ఒక వస్తువుతో వాళ్లకి సంబంధం లేనట్టయితే అది తన ఉనికిని కోల్పోయినట్టే. ఉదాహరణకి, ఒక శిశువు చేతిలో గిలక ఉందనుకుందాం, ఆ శిశువు ఆ గిలక తన శరీరంలో భాగంలాగే గుర్తిస్తుంది. ఆ గిలకని తీసి దాచేస్తే ఇక ఆ శిశువు దృష్టిలో ఆ గిలక ఎక్కడా లేనట్టే. పుట్టినప్పుడు మెదడు పూర్తిగా పరిపక్వమై ఉండదు. పిల్లలు ఎదిగేకొద్దీ మెదడు కూడా ఎదిగి ప్రపంచంతో వాళ్ల సంబంధం మరింత మెరుగై తమ ఉనికిని గుర్తించడం మొదలుపెడతారు. “వాళ్లు, “నేను కి గల తేడాని తెలుసుకుంటారు. దీనితోపాటు తను