Telugu aadu magaadu - anilvaranasi/indianlanguages GitHub Wiki
రటు గాటు స్త్రీవాద కవితా సంపుటి (నూరవ అంతర్జాతీయ మహిళా సంనళ్షరం సందర్థంగ్రా వ క్ స్టే ను. యాసలళ్రు సూర్వారొవు
రాటు టగాటు స్త్రీవాద కవితా సంపుటి వ్ , (నూరవ అంతర్జాతీయ మహిళా సంవళ్ళరం సందర్థంగా) శ్వ /3 20 ఇతి న '్గ | న. కాన్న బ్ సా ల యాసలవు సూర్యారాశు
తీగీరిఆ గీగీడగగి0ిల (౧౦౯49) ఠి గ్గ రా ౪గికడిగంి౦ క0గాణ గగ౦ ౫ ర టు ౮ వ య్ర్ గ గ యల. గె త్ర 0165 : 1000 0 (1 గ 0 1200౧1 - 2010 (0 (౮ న ది/109 : ౧౩. 20/- ౪/19! “ష5గ[ఓ%ింనిల క0ణాగఉంగం 5ఖ% 5520౧0! ౧౦0౪౧) 0.౫౦.2-12-18. ౪4౧2041ఖ0/4 నిం11 ని౬౦రగం౮నికగ! - 533 437 560 061: 9491439012 [50 000165" 7 గ్మిపగ్నీ[ గిరి 506గాగగిగం *విగి[గిిగి 5ష1011]| 200% 0౮5౬ 1-1-187/11/2 011161640041౬౬| ౧౦౬౧4840 & గ 81౬411010153 0651 & ౧౧196 26 జీడి, 54స4గం?. 0684-2320454
విషయసూచిక స్రీ చైతన్యాన్ని రగిలించే కవిత్వం - డా॥ అద్దేపల్లి రామమోవానరాను క అబలల తరఫున అక్షర స్వరం - నత్యాజీ 11 నామాట 16 మృగాళ్ళు 19 తూకపు రాళ్ళు 20 ఆడు మగాడు 21 విషపు కళ్ళు 24 తార 25 కారణం 25 అమ్మ 26 అమ్మకం 26 ప్రమాణం 27 అడది 27 వేశ్యలు 28 చీకటి 28 స్తీ 29 స్త్రీ 29 వీలునామా 30
అమ్మ 31 అగ్ని పూలు 32 పశువు 33 (ప్రేమ 34 కాముకుడు 84 కలియుగ కుంతి 35 అంగడి బొమ్మ 36 గురజాడ సజీవ శిల్పాలు 37 అలి-కాళి 38 ఈ నేరం ఎవ్వరిది? 39 నేటి సీత 40 అసలైన మొగుడు శ] కొంతమంది మహిళలు 42 తేడా! 43 జీతం 43 ఇంకిన్నాళ్ళు? శశీ అంతర్వీదన 47 కుసుమం 51
స్త్రీ చైతన్యాన్ని రగిలించే కవిత్వం ప్రజాకవి, సాహితీ విమర్శకులు డా॥ అద్దేపల్లి రామమోహనరావు ఈ సమాజంలో మహిళల పరిస్థితి అత్యంత చింతనీయం. ప్యూడల్ నీతి శాసించిన కాలంలో గాని, ఇప్పుడు పెట్టుబడిదారీ విషసంస్కృతి వేళ్ళూను కుంటున్న దశలోగాని, స్త్రీకి ఆవేదన అంతులేకుండా ఉంది. స్రీవాదం ప్రచలితంగా ఉన్న కాలంలో, వ్యక్తి స్వేచ్చా సిద్ధాంతం కోసం గోడలు పడగొట్టవలసి వచ్చింది. ఇప్పుడు వ్యక్తిస్వేచ్చ హద్దులు మీరి, వ్యాపార సంస్కృతి రోజు రోజుకీ బలవత్తర మౌతోంది. అటు అస్వతంత్ర దశ, ఇటు మార్కెట్ దశ రెండూ మహిళకు 'ప్రమాదకరంగానే పరిణమించడం ఒక గొప్ప విషాదం. ఎక్కడ హింసాత్మకతకు అవకాశం ఉందో అక్కడికి వెంటనే చేరుకుని, స్వార్థాన్ని ప్రబలం చేసుకునే దుర్మార్గం మగవాడికే ఉంటుంది. అటువంటి మగవాణ్ణి దృష్టిలో పెట్టుకుని, స్త్రీ హింసకు దారితీసే సందర్భాన్ని నిరసిస్తూ, తిరుగుబాటుతత్వాన్ని ప్రబోధించడానికి, సామాజిక బాధ్యత కల మగవారు కూడా కవితలు రాస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖమైన వరసలో ఉంటారు యాసలపు సూర్యారావు. స్త్రీకి సంబంధించిన అనేక సమస్యల్ని ఈ కవితల్లో సూర్యారావు సూటిగానూ, బలంగానూ, అవేదనతోనూ, ఆగ్రహంతోనూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దుర్మార్గులైన మగవారు, తమ కాముకత కోసం స్త్రీని బలితీసుకునే వ్యవస్థను చాలా కవితల్లో నిరసించారు. కామానికి “పేమ” అనే పూతపూసి మోసంచేసే దారుణ పరిస్థితి ఈ కవిని కలచివేసింది. మొదటి కవితయైన 'మృగాళ్ళు' లో ఇలా అంటారు. “పేమ అనే విషవలయంలో సమిధ అందమైన అడపిల్ల 'ప్రేమనేది పదార్థమా? చైతన్యమా? అనేది పక్కన పెడితే అడు మగాడు య్
ప్రమాదమో ప్రమోదమో
అనేది సమాజానికి వదిలేస్తే
అది మగోన్మాదమా? మృగోన్మాదమా? అని ప్రశ్నిస్తారు. 'ప్రమోదం' కావలసిన (్రేమ “ప్రమాదం' అయ్యే కామాన్ని వ్యతిరేకించారు. ప్రమోదానికీ, ప్రమాదానికీ ఒక్క పొల్లు మాత్రమే తేడా. ఆ పొల్లు మారడమే స్త్రీని బలితీసుకుంటోంది. ఈ రెండు పదాల్నీ ప్రయోగించి, రెంటికీ తేడా తెలియని “మృగోన్మాదాన్ని' ఖండించారు.
ఈ కాముకత ఎంతగా హద్దుల్ని చెరిపేస్తుందో చాలా కవితల్లో బలంగా చెప్పారు సూర్యారావు.
ఒక చోట, స్త్రీని ఎలా అంగడొ సరుకుగా భావిస్తాడో యిలా చెప్తాడు.
“వాత్సల్యం ఎముకలు విరిచేసి
అభిమతాల హద్దులు చెరిపేసి
ఆ ఒక్క క్షణం ఒక యుగమనుకుంటాడు
నీ జీవితం జీవితమే కాదనుకుంటాడు...
బాల్యానికీ యౌవనానికీ వృద్ధాప్యానికీ మధ్య
హద్దుల్ని చెరిపేస్తాడు
అడికి నువ్వు మగాడివి కాదు అని అనిపిస్తే చాలు
ఐదూ, పదీ, వందా, వెయ్యి
ఎంతయినా సరే............”
అంగడి సరుకైన స్త్రీ జీవితం ఈ కవిని ఎంతో ఆవేదనతో నింపింది. “అగ్నిపూలు' కవితలో, కవితాత్మక రీతిలో వారి విషాదాన్ని రూపొందించిన రీతి ప్రశంసనీయంగా ఉంది.
“చీకటి అరల్లో అప్పుడప్పుడు
కోర్కెల కలలు పురుడు పోసుకుంటాయి
ఆ కలలకు రెక్కలుండవు, రూపముండదు
అంతా ధ్వంసమయం......
ఇక్కడ స్త్రీ మైనపు ముద్దగా మిగిలిపోవలసిందే ఈ లాలా. యాసలపు సూర్యారావు
తోడేళ్ళు గోళ్ళతో రక్కినా
పళ్ళతో కొరికినా
అదో రసమయ రాక్షస క్రీడా పర్వమే...”
కవిత ముగింపులో ఇలాటి బీభత్స సన్నివేశాలకి మూలాన్ని గూర్చి చెప్తాడు.
“ఇక్కడ కోర్కెలకు అందమైన సమాధులు నిర్మిస్తారు
పరిమళ ద్రవ్యాలను పూస్తారు
మనసారా పరితపిస్తారు
అహంకార పతాకాన్ని ఆవిష్కరిస్తారు
ఈ పతాకాన్ని ధ్వంసించినా కలలు
అగ్నిపూలు పూస్తాయి”
సర్వమూ మగవాడిలోని మగతనపు '“అహంకారం' అన్నది గొప్పమాట. ఈ అహంకారమే ఎటువంటి దుర్మార్లానికైనా పురిగొల్పుతుంది. పదవి, డబ్బు, మదం యిలాటివన్నీ 'అహంకారం'లోంచి పుట్టినవే. అటువంటి వాడే “స్రీ హింసలో (ప్రథమస్థానం పొందుతాడు.
స్రీ పట్ట బాధ్యతారహ్యిం, ప్రేమరాహిత్యం అనేక కుటుంబాల్లో ప్రీ హత్యలకు దారితీస్తోంది. హిమాయత్ నగర్లో తండ్రి కొడుకులు కలిసి, తమ ఇంట్లోని నలుగురు అడబిడ్డల్ని చంపిన హృదయవిదారక సంఘటన ఈ కవిని కలచివేసింది. 'ఈ నేరం ఎవ్వరిది?' అనే కవితలోని స్పందన, ప్రతి అక్షరంలో రగులుతుంది. కుటుంబ వ్యవస్థలోని అనుబంధాల్ని కూడా నాశనం చేసే హింసాత్మకత గూర్చి బలంగా చెప్పారు.
కన్నవారి బాధల్ని
తమ శరీరాలకు దుస్తులుగా చుట్టుకున్నారు
అక్కరలేని ఆడంబరాలకు
అగ(రులు చాచలేదు
జడలో రిబ్బన్లకోసమైనా
ఏనాడూ అమ్మవచేతి దెబ్బలు తినలేదు
మగబిడ్డల్ని మహారాజుల్లా చూసీ
ఆడబిడ్డల్ని అరిష్టాలుగొా తలచే ఈడు నుగాడ్య బాలల ల లాలా. లా
సంస్కారహీన సమాజంలో
తోబుట్టువులే తలారులయ్యారు
పెంచిన చేతులే పీకనులిమి చంపాయి
సమాజంలో ధనిక దరిద్ర భేదాల్ని ఆకాశమంతగా పెంచే, ప్రపంచీకరణ దుష్పరిణామాలు ఇలాటి సంఘటనలకు పరోక్ష హేతువులు కావడాన్ని కూడా ఈ కవి స్పష్టంగా గమనించాడు. అందుకే కవిత ముగింపులో ఇలా అన్నాడు.
“పైవేటీకరణ యజ్ఞవాటికలో
ప్రజలు సమిధలు కావడం మొదలైంది
బహుళజాతి కంపెనీల లాభాల నరమేధానికి
వేదిక అన్నపూర్ణ ఆంధ్రయే!'
దారిద్యాన్ని కూడా సహనంతో భరించి, ఒకరినొకరు ఇంకా ఎక్కువగా (ప్రేమించే సన్నివేశాలు నశించిపోయి, పేదతనాన్ని భరించలేక, అనుబంధాల్ని కూడా చంపుకునే, ఒకరినొకరు హింసించుకునే, దుర్మార్గం పెరిగిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం, ధనదాహాన్ని పెంచే ప్రపంచీకరణయే. మగవాడి దౌష్ట్య్రం
ఎజ్
ఒక హేతువుకాగా, ఆ దౌష్ట్యాన్ని పెంచే వ్యవస్థది మరింత బలమైన హేతువు.
అడుగడుగనా మగవాడి దురహంకారం, మగత్వం, ఆధిపత్యం ఈ కవితా సంపుటిలో వ్యక్తంకావడం ఈ సంపుటిలోని ఏక సూత్రతకు బాగా సహకరిస్తుంది. స్త్రీ మాటల్లోనే 'అంతర్వేదన' కవితలో ఇలా అంటాడు.
“ఓయ్! మగాడా!
నువ్వు నాపై చూపేది
అనురాగపు పంట కాదు
నీ కంటే ముందునేనే కాటికేగితే
నీ అందం ఆనందం సదా మామూలే...”
అంతేగాక, ఈ కవి, స్రీలలోని వ్యక్తిత్వవికాసాన్నీ ప్రతిఘటన తత్వాన్నీ కూడా కవితల్లో స్పష్టంగా చెప్పడం సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది.
“ఎంతయినా నువ్వు మగాడివి!
అలాగని ఎల్లకాలం త ఆాలలలలరాడాలలాలడాలాలాలాా. యాసంవు సూర్వారావు
ఆడది ఆజన్మ బానిసకాదు
అనూహ్య చైతన్యంతో
నీ అహంభావాన్ని అంతమొందించే
అంకుశంగా మారుతుంది!
ఈ ఆశ ఆశయం ఈ కవిని బాధ్యతగలవానిగా నిరూపిస్తుంది.
ఈ కవితా సంపుటిలో చాలా మినీ కవితలున్నై. మినీ కవితా ఉద్యమ సమయం నుండి, తన మినీ కవితలతో సామాజికతను నింపిన కలం సూర్యారావుది. ఈ సంపుటిలోని మినీకవితలన్నీ మంచి మినీకవితా శిల్ప పరిణతితో కూడుకున్నవే. (పేమ అనే మినీకవితలో ఇలా అంటారు.
“మావారు నన్నెప్పుడూ
బంగారంలా చూసుకుంటారు
మా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారం
నా వంటి నిండా ఉందని
ఇలా వ్యంగ్యంతో కూడిన మినీ కవితలు రాయడంలో యాసలపు సూర్యారావు దిట్ట.
సూర్యారావు కాకినాడలోని ఒక కవితాగోష్టిలో 'అడు మగాడు' అనే కవిత చదివినప్పుడు, అనుహ్యమైన స్పందన వచ్చింది. విన్నవాళ్ళందరికీ తర్వాత “ఆడు మగాడు' అనేది ఒక వాడుక పదమైంది. 'అడు' అనే పదంలోని వ్యంగ్యం అందర్నీ ఆకట్టుకుంది.
“నువ్వు వీధిలో నిలబడకూడదు
అడికి తప్ప పరులకి అందంగా కనిపించకూడదు
పదిమందిలో నీ పవిట పొరపాటున పక్కకు జారితే
తన పరువు పదింతలుపోయిందంటాడు
పరస్త్రీ పైటజారితే
కళ్ళూ, ఒళ్ళూ వదిలేసి
కామంతో కాటేయ జూస్తాడు
ఆఅడుమగాడు" ఆడు మగాడ లాలి
ఆడుమగాడు - అనే పల్లవిని అనేక రీతులుగా పునరుక్తం చేసి, వ్యంగ్యాన్ని సాధించిన విధానం ప్రశంసనీయం.
మహిళలపై, మానసిక, శారీరక హింసను అనేకానేక కోణాల్లో ఈ సంపుటిలోని కవితలన్నీ వ్యక్తంచేస్తై. మగవాడి దౌష్ట్యాన్ని నిరసించి నిలదీస్తై. సామాజిక వైరుధ్య విశ్లషణయేగాక, ప్రతిఘటన కూడా శక్తివంతంగా రాయడం, యాసలపు సూర్యారావు నిబద్ధతకు నిదర్శనం. సూర్యారావుని అభినందిస్తూ, ఇంకా అనేక కవిశా సంపుటాలు వెలవరించమని కోరుతున్నాను 26-01-2010 జ అద్దేపల్లి రామమోహనరావు శం ఆలలలలలలలాలడాాలాలాలాా. యాసలఫు సూర్యారావు
లట అటి అబలల తరఫున అక్షర స్వరం
- సత్యాజీ కవి, కథకుడు, విమర్శకుడు 1 కవిత్వం కవి మనో నంవుర్షణల వ్యక్తీకరణ. ఒక అన్యాయాన్ని సహించలేకో, అగక్రమాన్ని భరించలేకో, అంతరాన్ని దిగమింగలేకో కవి అంతర్మథనం చెందుతాడు. ఆలోచనలతో సంఘర్షిస్తాడు. కవిత్వంగా అల్లుకున్న అక్షరాలను ప్రసవిస్తాడు. సామాజిక చింతనా, అంతఃసంఘర్షణా ఉన్న కవిత్వం కేవలం ఆవేదనగానో, అభివ్యక్తిగానో మిగలదు. ఏ చిన్న కదలికతోనైనా ఆత్మావలోకనం కలిగిస్తుంది. చైతన్యం రగిలిస్తుంది. అభ్యుదయ కవి తాను ద్వేషించిన భౌతిక పరిస్థితిపై వర్ణనకే పరిమితం కాకుండా - ఆశించే మార్పుపై అవగాహనా, చేతనా ప్రతిపాదిస్తాడు. సామాజిక ప్రయోజనం ఉన్న కవిత్వం నిండా ప్రవహించే దృక్పధం ఇదే! మిత్రుడు యాసలపు సూర్యారావు అభ్యుదయ కవి, ప్రజా ఉద్యమ కార్యకర్త. సామాజిక చింతన, ప్రజాపక్ష తపనా లేకుండా ఆయన కవిత్వం ఉండదు. సామాజిక అంతరాల పట్ల అంతులేని కోపమూ, బాధా; సామాజిక మార్పు పట్ల అనంతమైన ఆశా, ఆచరణా ఉన్న కవి. ఆయన కవిత్వం సానుభూతి చూపటానికో, అవేదన చల్గార్చుకోవటానికో కాదు. కవిత్వం ఆయనకు ఉద్యమ అవసరం. అక్షరం ప్రజాపక్ష ఆయుధం. అన్యాయానికి బలైనవాళ్ల పక్షాన, వివక్షకు గురైనవాళ్ల తరపున పోరాడడమే ఆయన పని. ఆ ఆచరణాత్మక అవసరంలోంచి, అనుభవాత్మక ఆవేదనలోంచి సూర్యారావు కవిత్వం పుడుతుంది. అందుకనే అది వాస్తవంలోంచి ప్రతిధ్వనించి, చైతన్యం వైపు ప్రస్థానిస్తోంది. ఈడు నుగాడు వనాల... శక
2
నేటి ఆధునిక కాలంలో అనేక మార్చులు వచ్చినా - అదే స్థాయిలో అంతరాలూ కొనసాగుతున్నాయి. పేద ధనికుల ముధ్య వ్యత్యానం అంతకంతకూ పెరుగుతోంది. ఆధునిక సదుపాయాలూ, సౌకర్యాలూ పెరిగేకొద్దీ డబ్బు విలువా, దాని సంపాదనా ప్రాధాన్యం సంతరించుకొంది. “ఎలాగైనా ఎదగాలన్న కాంక్ష రోజురోజుకీ ప్రబలుతోంది. ఇప్పటి సామాజిక ఉత్పత్తి సంబంధాల ద్వారా సర్వజనాభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో సామాజికంగా, కౌటుంబికంగా లింగవివక్ష ఎదుర్కొంటున్న స్రీ - ఆర్థిక కోణంలోనూ అణచివేతకూ, వేధింపులకూ గురవుతోంది. సాంప్రదాయంగా చలామణీ అవుతున్న వరకట్న దురాచారం ఇవ్పుడు బహురూపాలుగా విస్తరించింది. చాలా సందర్భాల్లో మహిళల పట్ట యమపాశంగా పరిణమిస్తోంది. ఆడపిల్లకు పెళ్లి, పెట్టుపోతలూ తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. దీంతో “ఆడపిల్ల” అనగానే 'మైనస్' అనే అనాగరిక పరిభాష వ్యాప్తిలోకి వచ్చింది. ఈ పరిస్థితి ఆడపిల్లల వికాసానికీ మనుగడకూ గొడ్డలి పెట్టులా మారింది. దీనికి తోడు ఆధునిక కాలపు వ్యాపార వినృతి మహిళనాక మార్కెట్టు సరుకుగా మార్చివేసింది. సినిమాలూ, ప్రకటనలూ యావత్తూ ఆవెనాక అటబొమ్మను చేశాయి. సౌందర్యాన్ని ప్రతిభకు, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా ప్రమోట్ చేస్తూ, కాముక దృష్టిలోంచి పురుష ప్రపంచానికి పరిచయం చేన్తున్నాయి. బలవంతపు (ప్రేమలూ, నిరాకరిస్తే యాసిడ్ దాడులూ, హత్యలూ, అత్యాచారాలూ..... ఈ నీచ సంస్కృతికి ప్రతిఫలాలుగా పెచ్చరిల్లుతున్నాయి.
అభ్యుదయ ఉద్యమ కార్యకర్త సూర్యారావు గారిని సహజంగానే ఈ పరిస్థితి తీవ్రంగా కలచివేసి ఉంటుంది. అంతులేని అవేదనకీ, అవేశానికీ గురిచేసి ఉంటుంది. అలాంటి అంతర్మథనంలోంచి వచ్చినవే ఈ సంపుటిలోని కవితలన్నీ.
3
నమాజ అంతర్ బపార్గత నిర్మాణమంతా పురుష (ప్రపంచానికి అనురూలంగా ఉంది. సమాజంలోని అర్థిక అంతరాలు, అవకాశ తారతమ్యాల 12. ాాలాాలాలలాలాలలాాలారాలరాడాలాాలాారారాలానాలాలాలా. యానలఫు సూర్యారావు
ప్రభావం స్త్రీ పురుషులిద్దరిపైనా ఉన్నప్పటికీ - దాని తీవ్రత మహిళలపై ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా వివక్ష ఎదుర్కోవల్సి వస్తోంది. మగాడు ఎక్కడైనా దర్జాగా నెగ్గుకురాగలడన్న నమ్మకం, ఎలాగైనా ఉండొచ్చన్న భావం సమాజంలో నాటుకుపోయాయి. ఆ నమ్మకంలోంచే '“వాడికేం....వాడు మగాడు” అన్న రాజముద్ర మగాడి పుట్టుకతోనే పడిపోతుంది. ఆ భావమిచ్చే భరోసాకు మగాడి బతుకునూ, అర్థిక స్థితినీ దివ్యంగా మార్చే శక్తి లేనప్పటికీ - మహిళలపై పెత్తనానికీ, దౌర్జాన్యానికీ మాత్రం ఊతం ఇస్తోంది. ఈ పరిస్థితిపై ఆవేదనా, ఆగ్రహమూ కలగలిపిన వ్యంగ్యీకరణే ఈ కవితా సంపుటి శీర్షిక 'ఆడు మగాడు" ఇందులో చిన్నా పెద్ద కలిపి 34 కవితలు ఉన్నాయి. అన్నీ స్రీల తరపున, స్రీలకోసం మోగించిన చైతన్యభేరీలే!
పురుషాధిక్యపు కోణాలన్నింటినీ ఆవిష్కరించిన కవిత ఆడు మగాడు: తాళి కట్టిన నాటినుంచే మగాడు తన భార్యను తన ఇచ్చానుసారం నడిపించటానికి ఎన్ని అంక్షలు పెడతాడో, ఎన్ని అవమానాలకు గురిచేస్తాడో కవి వివరిస్తాడు. యధాతధ స్థితిని వివరించి ఊరుకుంటే ప్రయోజనం ఉండదు. పరిష్కారానికి ఓ దారి చూపించాలి. బయటపడే (ప్రేరణ, ధైర్యం ఇవ్వాలి. ఇక్కడ కవి ఆ పనే చేశాడు. “ఈ పురుష అహంకార వ్యవస్థపై ఇంకా ఎందుకు చెల్లీ సహనం! అన్న ఒక్క మాట ద్వారా ఆలోచన రేకెత్తించాడు. 'అంతర్వేదన, 'ఇంకెన్నాళ్ళు?? కవితల్గోనూ ఇలాంటి చైతన్యమే ప్రజ్వలిస్తోంది.
“ఆడది ఆజన్మ బానిస కాదు / అనూహ్య చైతన్యంతో / నీ అహంకారాన్ని అంతమొందించే అంకుశం (అంతర్వేదన;)
“అయినా, ఈ ఆధిపత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు? / కన్నీళ్లలోంచే కర్తవ్యం పుడుతోంది / పిడికిలి బిగిస్తోంది / చైతన్యం వెల్డువెత్తుతోంది / కాలం కొత్త చరిత్ర లిఖిస్తోంది' (ఇంకెన్నాళ్ళు?) - అని ఆధునికకాలపు చైతన్య స్త్రీని ఆవిష్కరించాడు. మహిళ నేడు ఎదుర్కొంటున్న వివక్షకూ, వేదనకూ మూలం ఎక్కడుంది? ఆ వాస్తవాన్వేషణ చేస్తేనే కర్తవ్యాన్ని చేపట్టటం సాధ్యమవుతుంది. కవి ప్రీ సాధకబాధకాలను వివరిస్తూనే-
“...అందుకు బీజాక్షరాలు/ రూపు దిద్దుకోవడానికి / వ్యవస్థీకరించబడ్డ / ఈదు నుగాడు టంట (3
లక్షోపలక్షల కార్యాచరణ / నంబంధ బాంధవ్యాలు / అంతస్సారాన్ని ప్రస్ఫుటీకరించడం / ఇక్కడ మిగిలి ఉన్న మనుషుల బాధ్యత, కర్తవ్యం' అని పేర్కొన్నాడు. ఇక్కడ “మిగిలి ఉన్న మనుషుల బాధ్యత అనడంలోనూ మనిషిలోని అమానుష్యాన్ని ఎద్దేవా చేయడం స్పష్టంగా వినిపిస్తోంది.
ఈ నంప్పుటిలోని మినీ కవితలు చాలావి వురుషాధిత్యపు చెంవ చెళ్లమనిపించేలా ఉన్నాయి. మగాడి ద్వంద్వనీతిని, దమనరీతిని బహిరంగ పరిచాయి. “విషపు కళ్లు, “పశువు, “చీకటి, “ప్రమాణం' కవితలు చిన్నవైనా వాటిలోని మెరుపు చదువరిని ఆకట్టుకుంటుంది.
కన్నెగా కన్నవారింట్లో ఉంటే
కట్టుకోవడానికి
కట్నం తెమ్మంటాడు
వేశ్యగా అంగట్లో ఉంటే
వెలపెట్టి కొంటాడు (తేడా)
పొట్టకూటికి
ఆడది ఒళ్లమ్ముకుంటే
అది వ్యభిచారం!
మగాడు
కట్నానికి అమ్ముడైపోతే
అది............? (అమ్మకం)
మగాధిపత్యంపై ఇలాంటి ్రశ్నాస్తాలు సూటిగా దాడి చేస్తాయనడం నిస్సందేహం.
నలుగురు ఆడబిడ్డలను తండ్రీ అన్నదమ్ములూ కలిసి పీకనులిమి చంపివేసిన నిజ సంఘటనపై 'నేరం ఎవ్వరిది?” అన్న కవి స్పందన మనల్ని కదిలిస్తుంది. “దారిద్ర్యం మృత్యువును ప్రేమిస్తుంది / మృత్యువూ దారి(ద్యాన్నే ప్రేమిస్తుంది" అన్న మాట పేదరిక విషాదాన్ని కళ్లకు కడుతుంది. ఇలాంటి దారుణాలకు కారణభూతమవుతున్న డ్రైవేటీకరణను ప్రస్తావించి, అందులో సమిధలవుతున్న జనం గురించి ఆవేదన చెందడంలో సమకాలీన సామాజిక శత లలల రంలంలలాాడాయాలా- యాసలపు సూర్యారావు
స్పృహ కనిపిస్తోంది. (ప్రైవేటీకరణ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో దారిద్ర్యం పెచ్చరిల్లి, అది లెంగవివక్షను ఎలా వికృతీకరిస్తుందో చెప్పటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. సమాజంలోకి చొచ్చుకొచ్చే ఆర్థిక, రాజకీయ పరిణామాలను క్షుఖ్బంగా పరిశీలించినప్పుడే కవులు మరింత స్పష్టంగా చూడడం, కవిత్వీకరించడం సాధ్యమవుతుంది. ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యుం వహించే సూర్యారావు గారి కవిత్వం నిండా ఆ దూరదృష్టి పరుచుకొని ఉంది. ఆయన అభ్యసించింది ప్రాధమిక విద్యే అయినప్పటికీ - విన్మతమైన నమాజ అధ్యయనం ప్రయోజనకరమైన కవిత్వ నృజనకు దోహదపడుతుంది. ఇప్పటికే కొన్ని నాటికలు, కధలు, అభ్యుదయ గీతాల సంకలనాలు వెలువరించారు. ఆయన కృషి అభినందనీయం. డీ
పీకి తారసిల్లే ప్రతి అకృత్యం, అమానుషం ఈ కవిత్వంలో బట్టబయలు కావడం మనం చూస్తాం. ఢ్రేమ పేరిట ఉన్మాద దాడులు, కరకట్సు వేధింపులు హత్యలూ, భూస్వామ్య భావజాలపు దౌర్జ్ణన్యమూ, దుర్నీతి, ఆడపిల్లల పట్ల వివక్ష, నిరాకరణ; పడుపువృత్తిలో బతుకులీడ్చే అభాగ్యుల పట్ట కర్కశం, కాఠిన్యం... ఇలాంటి అమానుషాలన్నిటిపైనా ఈ కవి ఆవేదన చెందుతాడు. ప్రతి భావోద్వేగం చివరా అనంతమైన ఆశ కల్పించే భరోసా వినిపిస్తాడు. బాధను పంటి బిగువున పట్టుకొని వెలుగుతీరంవైపు, విముక్తిమార్గం వైపూ నడిచి వెళ్లే శక్తినీ, చైతన్యాన్నీ రగిలిస్తాడు.
సామాజిక అవకరాల మరమ్మతుకు ఉపయోగడడమే అభ్యుదయ కవిత్వపు
ఆంతిమలక్ష్యం. ఆ లక్ష్యాన్ని 'ఆడు మగాడు” స్త్రీ వాద కవిత్వం ద్వారా మిత్రుడు యాసలపు సూర్యారావు సాధించారన్నది నా నమ్మకం,
01-02-2010 ఆ నర్కాళ. ప్రజాశక్తి, లాలా చెరువు ఇండస్ర్టియల్ ఏరియా, స్వరూపనగర్స్ రాజమండ్రి - 6 ఫోను : 94900 99167 ఈడు ముగాడు లావా 45
నామాట
నేటి సమాజంలో స్త్రీలు, ఈ వ్యవస్థ పెంచిపోషిస్తున్న దారిద్ర్య్యంతో పాటు ప్యూడల్ సాంప్రదాయపు చట్రంలో అనునిత్యం అవమానాలను అనుభవిస్తు న్నారు. పురుషాధిక్యత గల సమాజంలో, మన దేశంలో స్త్రీ ద్వితీయ పౌరురాలిగానే మనుగడ సాగిస్తున్నది. తన మానప్రాణాలను సైతం కాపాడుకోలేని నిస్సృహయ స్థితిలో మగ్గుతున్నది. ఈ నేపథ్యంలోనే నా “ఆడు మగాడు” కవితా సంపుటిలోని కవితలు రూపుదిద్దుకున్నాయి. నేటి ఆధునిక సమాజంలో ప్రపంచీకరణ విధానాల దుష్ప్రభావం కారణంగా మగ మానవ మెదళ్ళు వ్యాపారీకరించబడి, విదేశీ విషసంస్కృతిని విచ్చలవిడిగా మార్కెటీకరిస్తున్న టీ.వి. చానళ్ళ ద్వారా భారత స్తీ యొక్క స్వేచ్చ, స్వాతంత్ర్యాలతో పాటు, విజ్ఞాన విశేషాలను సైతం, అణగద్రాక్కడంలోనూ, అవమానించడంలోనూ, పోటీపడుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో స్త్రీలు ఇంకా ఎన్నాళ్ళు ఈ రకమైన దుస్థితిని అనుభవించాలి అన్న ప్రశ్నే నా ఈ కవితా సంపుటిలోని కవితల ఆంతర్యం.
నా ఈ కవితా సంపుటి వెలుగు చూడడానికి, నా శ్రేయోభిలాషులు ఇచ్చిన కొండంత ప్రోత్సాహం, అండా, నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ కవితా సంపుటికి నేను కోరిన వెంటనే ముందుమాట రాసి ఇచ్చి, నా సాహిత్య కృషిని నిరంతరం (ప్రోత్సహిస్తున్న ప్రజాకవి, సాహితీ విమర్శకులు డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రజాశక్తి దినపత్రికలోనూ, ప్రస్థానం సాహిత్య మాసపత్రికలోనూ, నా కవితల్ని ప్రచురించి నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రస్థానం ఎడిటర్స్ తెలకపల్లి రవిగార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను కోరిన వెంటనే ముందు మాట రాసి ఇచ్చి, ప్రయోజనకరమైన సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రజాశక్తి దినపత్రిక ఉభయ గోదావరి జిల్లాల ఎడిషన్ నిర్వాహకులు, కవి, కథకులు అయిన సత్యాజీగార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన అకాష్ ఇండస్ట్రీస్ అధినేత డాక్టర్ పూషాగార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా రాజకీయ, సాహిత్య అభివృద్ధికి నిరంతరం ప్రోత్సహిస్తున్న దడాల శీర్ ాాలాలాలాలలాలలలాాలలాలాాలాలాలలాాా. యాసలఫ్ర సూర్యారావు
సుబ్బారావుగారు, టి.ఎస్. ప్రకాష్గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే సాహిత్యం, కళలు, ప్రజా ఉద్యమాల్లో నాతో కలిసి నహకరిన్తున్న గద్దే పచ్చాలరావు, చల్లా విశ్వనాథం, ఎస్సార్ పృథ్వి, పలివెల వీరబాబు, బి. అనంతరావు గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ వుస్తకం తేవడంలో సహకరించిన శ్రీ దర్భా పద్మనాభ శర్మగారికి, మంగళంపల్లి కృష్ణమూర్తి గార్కి, అలాగే నా పుస్తకం వెలుగు చూడడానికి అర్థిక పరిపుష్టిని కల్పించిన సహచర ఉద్యమనాయకులు కరణం ప్రసాదరావుగారికి, నీలపాల సూరిబాబుగారికి, నా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలుపుకుంటున్నాను.
యాసలపు సూర్యారావు తడు నుగాడు లాట శ7