Telugu aadhivasulapai yudham - anilvaranasi/indianlanguages GitHub Wiki
న | క షు ౧ 1. న షష న్మ య...” ॥. న టం. క కలా! శ్ క యు . ని హ్ క నట్టు [ను వహుంటయం.. (| జ్ న లం టట సవిత... హో న్స టా టన మనల... నం న న్ న యయ 1 నళ తలా. ఎ న టం ప. న పు క్త. 2 నక స. మ ర రు వ మాచ ము వా రల కు ౯ మాం లం క స్ న. క స న నం న టు కోట్లాది కోపోద్రిక్త ప్రజల్ని మ. అణిచేందుకు ఎన్ని లక్షల సైనికులు కావాలి? క న మజ సగ / షం. స ” త. . టి మీ య. వై లే స్ 022.2 కతు సు, త చ్. సళ సు. క వవ టక నటు టవ
ఆదివాసులపై యుద్ధం చిదంబర రహస్యం కోట్లాది కోపోద్రిక్త ప్రజల్ని అణిచేందుకు ఎన్ని లక్షల సైనికులు కావాలి? అరుంధతీ రాయ్ [క వ అ విస్థాపన్ విరోధి జన వికాస్ ఆందోళన్
ఆదివాసులపై యుద్ధం చిదంబర రహస్యం కోట్లాది కోపోద్రిక్త ప్రజల్ని అణిచేందుకు ఎన్ని లక్షల సైనికులు కావాలి? ఆంగ్ల మూలం: 6 అ ౦0106 గి ౧౦౦4 ం!5 తలి తీ [260 6665600: ం* 02%) 901601ల3 ౪/21 1286 (0 000011 116 0000102 426 0 [48641669 0101110109 01 ౨600167 0 తురుంర126 షం ల దల ణే లూ తెలుగు అనువాదం: ప్రభాకర్ న గ న ్
ప్రథమ ముద్రజ: నవంబర్ 2009 ం న ట్
ప వెలు రూ. 10/- శె బ్రో కా ప్రచురణ : విస్థాపన్ విరోధి జన వికాస్ ఆందోళన్ తరపున ఎం. శ్రీనివాస్ ప్రతులకు : దిశ పుస్తక కేంద్రం, సహచర
నవోదయ బుక్‌హౌస్ కంర 46 : కంయు కకకనన్ గ2యంషరడ6, క0తీలయ02డ. 52.+901]1-040-64543411 ఈం! : ౦600200608 %0(0%111.00%
దక్షిణ ఒరిస్సాలో తక్కవ ఎత్తులో ఐల్లపరువుగా వందే కొండలు - భారతదేశం అనబదే దేశం గానీ ఒరిస్సా అనబదే రాష్ట్రం గానీ వర్పదక ముందునుంచే దోంగ్రియా కోంధ్లకు మాత్చభూమిగా వుంటూ వస్తున్నాయి. వాటిని కోంధ్ల కొందలుగానే పరిగణిస్తారు. కోంధ్‌లు వాటీని సజీవ దేవతలుగా కొలుస్తారు. అలాంటి కొందల్ని ఇప్పుడు బాక్సైట్ ఖనిజం కోసం అమ్మిపారేశారు. ఆ కొందల్ని అమ్మదం అంటే కోంధ్ల దేవుడ్ని అమ్మేాయదమే. అది తమ దేవుడు కాకుందా వ రాముడ్తో రహీమో, వనుక్రీస్తో అయితే ఇట్లా అమ్మేనేవారా? అని కోంధ్‌లు ఆడ్రోళిస్తున్నారు.
అయితే 'నియమ్ రాజా (కోంధ్ల న్యాయ దేవత) నివాసప్రాంతమైన 'నియమగిరొ కొండను 'వేదాంత' అనే పేరున్న కంపెనీకి అమ్మినందుకు కోంధ్‌లు కొంతవరకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే హిందూ తత్వశాస్త్రంలో వేదాంతం అంటే సర్వోత్కృష్టమైన జ్ఞానం కదా మరి. లండన్‌లో అలనాటి ఇరాన్ షా నివసించిన రాజప్రాసాదంలో నివసిస్తున్న అనిల్ అగర్వాల్ అనే భారతీయ శతకోటీశ్వరుడికి చెందిన ఆ 'వేదాంతో సంస్థ ప్రపంచ మైనింగ్ కార్పోరేషన్లలోనే అతి పెద్దది.
ఆ ఐల్ల పరుపు కొండల్ని తవ్వితే వాటితో పాటు అక్కడి అరణ్యాలన్నీ సర్వనాశనమైైపోతాయి. అట్లాగే, ఆ కొండల మీదుగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతూవెళ్లి దిగువ మైదాన ప్రాంత పొలాలను తడుపుతున్న నదులూ, వాగులూ అన్నీ అంతర్థానమైపోతాయి. డోంగ్రియా కోంధ్లకూ అదే గతి పడుతుంది. భారతదేశ ప్రధాన అటవీ ప్రాంతాలలో నివసించే వందలాది, వేలాది ఆదివాసీలందరికీ కూడా అదే గతి పడుతుంది.
8
“అయితే ఏంటట? అభివృద్ధికోసం ఎవరో ఒకరు మూల్యం చెల్లించక తప్పదుకదా?” అంటూ మన పొగచూరిన, క్రిక్కిరిసిన నగరాల్లోని కొందరు మహానుభావులు తలలెగరేస్తూ ప్రశ్నిస్తారు. “అభివృద్ధిచెందాలంటే మనం ఈ నష్టాలని ఎదుర్మోక తప్పదు. కాకపోతే ఇప్పుడు వాళ్ల వంతొచ్చింది అంతే. అభివృద్ధిచెందిన ఏ దేశాన్నైనా తీసుకోండి ...ఐరోపా, అమెరికా, ఆస్టేలియా _.. అంతటా గతంలో ఇట్లాగే జరిగింది. వాళ్లు ఇలాగే చేశారు. మరి మనం మాత్రం ఎందుకు చేయకూడదు?” అని వాదిస్తారు.
మధ్య భారత దండకారణ్యాలను కేంద్రంగా చేసుకుని ఉద్యమిస్తున్న మావోయిస్టు తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అని పైకి ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఈ ఆలోచనలతోనే “ఆపరేషన్ గ్రీన్ హంటొను మొదలుపెడుతోంది. నిజానికి ఇవాళ దేశంలో కేవలం మావోయిస్టులు మాత్రమే తిరగబడటం లేదు. అన్యాయాలను దేశవ్యాప్తంగా అనేకమంది ప్రతిఘటిస్తున్నారు. భూమిలేని వాళ్లు, ఇండ్లు లేనివాళ్లు, దళితులు, కార్మికులు, కర్షకులు, నేతన్నలు అందరూ తిరుగబడుతున్నారు. ప్రజల భూములూ, వనరులూ అన్నీ కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ఉద్దేశించిన విధానాలకూ, అన్ని రకాల అన్యాయాలకూ, అక్రమాలకూ వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం టం ర్ న. అతిపెద్ద ప్రమాదమంటూ మావోయిస్టులను . మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారిని న్డ్ క సం న. క్రిందటే... పరిస్థితులు ఇప్పుడున్నంత య్. ॥ దారుణంగా లేని సమయంలోనే ... ప్రధాన వపు .. మంత్రి “మన దేశ అంతర్గత భద్రతక్తు ఏకైక | క. ఖా .. స. అతిపెద్ద ముప్పు మావోయిస్టులు” అని. = న అభివర్ణించారు. బహుశ ఆయన సెలవిచ్చిన | య. వ. అనేక మాటల్లో ఇకనుంచి ఇదే అత్యంత వ తం జనవరి 8న ముఖ్య మంత్రుల సమావేశంలో | కలో ఓ ఆదివానీ మహిళ
రా
ఆయనే “మావోయిస్టుల సామర్థ్యం పరిమితమైనది” అనడంలో మాత్రం అంత తీవ్రత ధ్వనించలేదు. అయితే 2009 జూన్ 18న ప్రభుత్వం మనసులోని అసలు ఆందోళన గురించి పార్లమెంటుకు ఈవిధంగా చెప్పారు: “ప్రకృతి సహజవనరులున్న ప్రాంతాల్లో వామవక్ష తీవ్రవాదం గనక ఇట్లాగే వర్ధిల్లుతూ పోతున్నట్టయితే పెట్టుబడులుపెట్టే పరిస్థితి మీద కచ్చితంగా తీవ్ర ప్రభావం పడుతుంది.” మావోయిస్టులు ఎవరు? వాళ్లు నిషేధిత భారత కమ్యూనిసు పార్టీ (యావోయిన్సు) సభ్యులు, 1967 నక్సల్బరీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్సపొంచిన భారత కమ్యూనిన్తు సాక్టీ (మూర్చిన్సు-లెనినిస్టు) పార్టీకి చెందిన అనేక పాయల్లో అదొకటి. ఆ ఉద్యమాన్ని భారత ప్రభుత్వం ఆ తదనంతరకాలంలో బలహీనపరిచింది. భారత ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడే, సాయుధపోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే భారత సమాజంలోని వ్యవస్థీకృత అసమానతలు అంతరిస్తాయని మావోయిస్టులు విశ్వసిస్తారు. అంతకు ముందు వారు జార్ధండ్, బీహార్ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) గా, ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్యుజి)గా విశేష ప్రజామద్దతును పొందినవారు. (2004లో నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు వరంగల్‌లో వారు నిర్వహించిన ఊరేగింపులో 15 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు). కాగా ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వారి ప్రాభవం బాగా దెబ్బతిన్నది. తమ హింసాత్మక చర్యల ద్వారా వాళ్లు తమ బలమైన మద్దతుదారులను కోల్పోయారు. మరెందరో వారికి ప్రత్యర్థులుగా కూడా మారారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకూ- మావోయిస్టులకూ మధ్య ప్రతీకార ధోరణితో సాగిన హత్యలు, దాడులు, ఎదురుదాడుల కారణంగా పిడబ్యుజి బాగా క్షీణించిపోయింది. ప్రాణాలతో మిగిలిన సభ్యులు ఎలాగోలా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడి పొరుగురాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లో ఆశ్రయం పొందారు. అక్కడి కీకారణ్యాల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ సహచరులతో కలిసిపోయారు. అరణ్యాల్లోని మావోయిస్టు ఉద్యమం అసలు స్వభావం గురించి ఎక్కువ మంది “బయటి వ్యక్తులకు” ప్రత్యక్షంగా తెలియదు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన కామ్రేడ్ గణపతి ఇటీవల ఓపెన్ మాగజైన్కు యిచ్చిన ఇంటర్వ్యూలో కూడా మావోయిస్టులను కరడుగట్టిన, నియంతృత్వ దృక్పథం వున్న విమర్శలను సహించలేని పార్టీ సభ్యులు అని వ్యవహరించడాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. వా
మావోయిస్టులు ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా, కుల వ్యవస్థ కారణంగా అస్తవ్యస్తమైన భారతీయ సమాజాన్ని సరిదిద్దే సామర్థ్యం వారికి వుందా అనే విషయం గురించి కూడా కామ్రేడ్ గణపతి ఏమీ ప్రస్తావించలేదు. కానీ శ్రీలంక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్ (ఎల్‌టిటిఇ)కు యదాలాపంగా సంఘీభావం తెలపడం మాత్రం పెను సంచలనమే సృష్టిచింది. ఎందుకంటే ఎల్‌టిటిఇ తను కొనసాగించిన యుద్ధంలో అతి కిరాతకమైన పద్ధతులను అనుసరించడమే కాక, ఇన్నాళ్లుగా ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునేదో, ఎవరిపట్లనైతే కొన్ని బాధ్యతలను కూడా నిర్వహిస్తూ వచ్చిందో - ఆ శ్రీలంక తమిళ ప్రజల వెన్నును తన హింసాత్మక విషాదాంతం ద్వారా విరిచేసింది.
మధ్య భారతంలోని ప్రస్తుత మావోయిస్టు గెరిల్లా సైన్యం దాదాపు పూర్తిగా- సబ్‌సహారన్ ఆఫ్రికన్ దేశాల్లో మాదిరి కరువు కోరల్లో చిక్కుకుని, ఆకలి దప్పులతో అలమటిస్తున్న, నిరాశానిస్పృహలతో కుంగిపోతున్న ఆదివాసీ జనంతో నిండివుంది. భారత దేశానికి ఘనమైన స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినా ఆ ఆదివాసీలకు చదువుకునే అవకాశాలు, వైద్య సౌకర్యాలు, న్యాయ సహాయం ఏవీ అందుబాటులో లేవు. చిన్నతరహా వర్తకులు, వడ్డీవ్యాపారులు వారిని దశాబ్దాల నుంచీ నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు. ఆదివాసీ మహిళలపై పోలీసులూ, అటవీశాఖ సిబ్బంది యధేచ్చగా అత్యాచారాలు చేస్తున్నారు. అనేక అటవీ ప్రాంతాల్లో సుదీర్హకాలం నుంచీ మావోయిస్టు క్యాడర్ ఆదివాసీలతో కలిసి జీవిస్తున్న కలిసి పనిచేస్తున్న కారణంగా వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం చిగురిస్తోంది.
ఆదివాసీలు ఆయుధాలు చేపడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వం వారికి హింసను తప్ప ఏమీ ఇవ్వక పోవడమే కాదు, ఇప్పుడు వాళ్ల భూముల్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తుండటమే. వారి ప్రాంతాన్ని “అభివృద్ధి” చేయడానికే ఆ పనిచేస్తున్నా మంటూ ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి కబుర్లను వాళ్లు ఏమాత్రం నమ్మడం లేదు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ తమ అడవుల గుండా విమానాలు దిగే రన్‌వేలను పోలిన సువిశాలమైన రోడ్లను నిర్మిస్తున్నది ఆదివాసీ పిల్లలు వాటిమీద హాయిగా నడుచుకుంటూ స్ఫూళ్లకు వెళ్లేందుకే అని వాళ్లు విశ్వసించడంలేదు. తాము గనక తమ భూముల కోసం పోరాడకపోతే తమను సమూలంగా నిర్మూలించడం ఖాయమనీ వారు భావిస్తున్నారు. అందుకే వాళ్లు ఆయుధాలు పట్టుకుంటున్నారు.
6
మావోయిస్టు ఉద్యమ లక్ష్యం భారత ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాధికారాన్ని చేపట్టడమే అయినప్పటికీ ప్రస్తుతం వారి చింకిపాతల, సరైన తిండి కూడా లేని సైన్యంలోని అత్యధికులు కేవలం మనుగడకోసమే పోరాడుతున్నారు, వాళ్లలో చాలా మంది తమ జీవితంలో ఇంతవరకు రైలుబండిని గానీ, బస్సును గానీ, ఓ చిన్న పట్టణాన్ని గానీ చూసి ఎరగరు. ఈ సంగతి మావోయిస్టులకు తెలుసు.
ప్రణాళికా సంఘం నియమించిన నిపుణుల కమిటీ 2008లో “తీవ్రవాద ప్రభావం వున్న ప్రాంతాల్లో అభివృద్ధి-సవాళ్లు” అనే పేరుతో ఒక నివేదికను సమర్పించింది. “నక్సలైట్ (మావోయిస్టు) ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా చూడాలనీ, ఆ ఉద్యమానికి భూమిలేని పేద రైతాంగంలో, ఆదివాసీల్లో గట్టి పట్టు వుందనీ” ఆ నివేదికలో పేర్ళొన్నారు. విశాల ప్రజానీకంలో భాగమైన అనేకమంది సామాన్యుల అనుభవాల, సామాజిక పరిస్థితుల ప్రాతిపదికన ఆ ఉద్యమ ఆవిర్భావాన్నీ, అభివృద్ధినీ అంచనా వేయాల్సి వుంటుంది. ప్రభుత్వ విధానాలకూ వాటి ఆచరణకూ మధ్య వున్న అగాధమే ఈ పరిస్థితికి మూలం. దీర్హకాలిక సైద్ధాంతిక ప్రణాళిక ప్రకారం బలవంతంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే తన లక్ష్యమని మావోయిస్టు ఉద్యమం ప్రకటించుకున్నప్పటికీ, రోజువారీ కార్యాచరణల రీత్యా దానిని ప్రధానంగా సామాజిక న్యాయం, సమానత్వం, రక్షణ, భద్రత, స్థానిక ప్రగతి కోసం చేసే పోరాటంగానే చూడాల్సి వుంటుంది. “దేశ అంతర్గత భద్రతకున్న ఏకైక ముప్పు” అని వాపోవడం అర్ధరహితం. మావోయిస్టు తిరుగుబాటు ఈ వారం వంటకంలా అయింది. అత్యంత సుకుమారులు మొదలుకుని, అత్యధికంగా అమ్ముడుపోయే దీనపటత్రిక తాలూకు నిరాశాపూరిత సంపాదకుని వరకు అందరూ హఠాత్తుగా ఆ ఉద్యమాన్ని దశాబ్దాల అన్యాయం ఫలితమని అంగీకరించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే, ఆ సమస్యను పరిష్కరించేందుకు - అంటే 21వ శతాబ్దపు గోల్డ్రష్కు (సంపదకోసం సాగే వేటకు) పగ్గాలు వేసేందుకు కాకుండా చర్చను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు “ఉగ్రవాదం” మీద పవిత్రమైన ఆ(గ్రవోన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే వాళ్లు కేవలం తమలో తామే మాట్లాడుకుంటున్నారు.
ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డ ప్రజలు మాత్రం రోజంతా టీవీలను చూస్తూ (లేదా వాటికోసం నటిస్తూ)నో, పత్రికలు చదువుకుంటూనో, అనుదిన
7
నీతిశాస్త్ర ప్రశ్నలకు ఎస్ఎంఎస్లు పంపించుకుంటూనో కూచోడం లేదు. (హింస మంచిదా, చెడ్దదా?” మీ సమాధానం అవును అయికే ....). ప్రజలు పోరాడుతున్నారు. తమ ఇళ్లనూ, తమ భూములనూ రక్షించుకోవడం తమ జన్మహక్మని నమ్ముతున్నారు, న్యాయం తమ పక్షాన వుందని వాళ్లు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఈ [వ్రమాదకరమైన (ప్రజల నుంచి మిగతా అన్నివిధాలుగా వన్న (వజుల్ని దూరంగా వుంచేందుకే ప్రభుత్వం వారి మీద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో విజయ సాధనకు మూడు నుంచి ఐదేళ్ల నమయం పదుతుందని చెప్తున్నారు. వింతగా అనివీంచదంలేదూ,
26/11 ముంబాయి దాడుల తర్వాత కూడా మన ప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా వుంది. చైనాతో కూడా చర్చలకు సిద్ధం అయిపోతోంది. కానీ పేద ప్రజలపై జరిపే యుద్ధం దగ్గరకు వచ్చే సరికి మాత్రం కఠినాతికఠినంగా వ్యవహరిస్తోంది. గ్రేహౌండ్స్ (వేటకుక్కలు), కోబ్రాస్ (త్రాచుపాములు), స్మార్పియాన్స్ (తేళ్లు) వంటి సాంప్రదాయిక పేర్లతో కూడిన ప్రత్యేక పోలీసు దళాలు “చంపేందుకు లైసెన్సు” పొంది అరణ్యాల మీద పడ్డా సరిపోదు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), మారుమూల అడవుల్లో విధ్వంసాన్ని అత్యాచారాలని కొనసాగించడంలో ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతులున్న నాగా బెటాలియన్ ఇవేవీ కూడా చాలవు. ప్రభుత్వ మద్దతుతో, ప్రభుత్వ మిచ్చిన ఆయుధాలతో రూపుదిద్దుకున్న “సాల్వా జుడుం” 'ప్రజలసైన్యం () కూడా చాలదు. అది దంతెవాడ అడవుల్లో తనకు ఎదురొచ్చిన వాళ్లని చంపడంలో, అత్యాచారాలు చేయదంలో , మనుషుల్ని నిలువునా తగులబెట్టడంలో ఎంతో పేరుమోసింది. మూడు లక్షల మంది ప్రజలకు నిలువ నీడలేకుండా చేసింది.
ఇప్పుడిక ప్రభుత్వం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్‌లను, వందలు వేల పారా మిలిటరీ బలగాలను అక్కడికి తరలిస్తోంది. బిలాస్పూర్లో ఒక బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్నే నిర్మిద్దామని (ప్రణాళికలు రచిస్తోంది. (దాని వల్ల తొమ్మిది (గ్రామాలు నేలమట్టమవుతాయి). రాజ్‌నంద్‌గావ్‌లో విమానాల రాకపోకలకు ఒక ఎయిర్ బేస్‌ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది. (దానివల్ల మరో ఏడు గ్రామాలు
8
మటుమాయమవుతాయి). ఈ నిర్ణయాలు ఈమధ్యనే తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. సర్వేలు పూర్తయ్యాయి. స్థలాల ఎంపిక సైతం జరిగిపోయింది. ఆసక్తిగా వుంది కదూ. మరికొద్ది రోజుల్లో మవాయుద్ధం మొదలవుతుంది. భారత వైమానిక దళ విమానాలకు “ఆత్మ రక్షణకోసం” కాల్పులు జరిపేందుకు అనుమతిని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అట్లాంటి హక్కును అత్యంత నిరుపేద జనానికి ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వ తిరస్మరిస్తోంది.
ఎవరి మీద కాల్పులు జరుపుతారు? సైనికులకు భయపడి అడవుల్లో పరుగు లంకించుకునే సామాన్య పౌరుడినీ, మావోయిస్టునీ ఎట్లా వేరుచేసి గుర్తిస్తారో? కాస్త చెప్తారా? శతాబ్దాలుగా ఆదివానీలు అడవుల్లో విల్లంబులు ధరించి సంచరిస్తున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ మావోయిస్టులుగానే పరిగణిస్తారా? యుద్ధంలో పాల్గొనని మావోయిస్టు సానుభూతి పరులను కూడా మీరు లక్ష్యంగా చేసుకుంటారా? నేను దంతెవాడకు వెళ్లినప్పుడు పోలీసు సూపరింటెండెంట్ తన “పోలీసు జవాన్లూ” మట్టుపెట్టిన 19 మంది మావోయిస్టుల ఫొటోలు చూపించారు. “వీళ్లంతా మావోయిస్టులని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు?” అని నేను ఆయనను అడిగాను. “చూడండి మేడమ్! వీళ్ల దగ్గర మలేరియా మందులున్నాయి. డెట్టాల్ సీసాలున్నాయి. ఇవన్నీ బయటినుంచి వచ్చినవే కదా?” అన్నాడు.
ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట జరుగబోయే యుద్ధం ఎట్లాంటి యుద్ధం? మనకేమైనా తెలుసా? అడవుల్లోంచి పెద్దగా వార్తలేమీ రావు. పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్‌ను సైనిక మయం చేశారు. అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించేవారిని కొడ్డున్నారు, నిర్చంధిస్తున్నారు. మావోయిస్టులని ముద్ర వేస్తున్నారు. దంతెవాడలో “వనవాసి చేతనాశ్రమం” అనే గాంధేయాశ్రమం వుండేది. పొమాంశు కుమార్ అనే గాంధేయవాది దానిని నిర్వహించేవాడు. _ పోలీసులు దానిని కొద్ది గంటల్లోనే బుల్డోజర్లతో నామరూపాల్లేకుండా చేసిపారేశారు. ఈ వార్ జోన్ వర్చడక ముందు ఆ ఆశ్రమం చిట్ట చివరి బెట్పోస్ట్లా వుండేది. తమ పనులపై ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు, నిజ నిర్ధారణ బృందాల సభ్యులు మొదలైన వాళ్లంతా అందులోనే ఆశయం పొందేవారు. అక్కడ నుంచే తమ పనులు పూర్తిచేసుకుని వెళ్లేవారు.
9
ఈమధ్యనే భారత పాలకవర్దం తన అమ్ములపొదిలోంచి అత్యంత సునిశితమైన ఆయుధాన్ని తీసి ప్రయోగించింది. దాంతో రాత్రికి రాత్రే మన మీడియా మిత్రులు “ఇస్లామిక్ ఉగ్రవాదం” స్థానంలో “ఎర్ర ఉగ్రవాదం” మీద తిరుగులేని కథనాలు రాయడం మొదలుపెట్టేశారు. ఇదిలా వుండగానే దిగువ స్థాయిలో నిశ్శబ్దం చోటుచేసుకునేలా అన్ని మడతా బిగిస్తున్నారు. “శ్రీలంక పరిష్కారం” ఇప్పుడు ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా ఉవ్విళ్లూరిస్తోంది. తమిళ టైగర్లకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ విచారణ జరగాలని ఐక్యరాజ్య సమితిలో ఒక యూరోపియన్ చేసిన ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం అడ్డుకోవడం వెనక ఏమీ లేదనలేం.
దేశంలో వివిధ రూపాల్లో సాగుతున్న ప్రతిఘటనా పోరాటాలనన్నింటినీ ఒకే గాటన కట్టి వాటికి వ్యతిరేకంగా జార్జి బుష్ మాదిరి విషప్రచారాన్ని మొదలుపెట్టడం ఆ దిశలో తీసుకున్న మొదటి చర్య, “మీరు మాతో వుందకపోతే మావోయిన్తులతో వున్నట్టే లెక్సగా మావోయిస్టు ప్రమాదంపై ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం “మిలిటరీకరణ”ను సమర్థ్ధించు కునేందుకు ఎంతగానో తోద్బడుతుంది. (మావోయిస్టులకు ఆ ప్రచారం కచ్చితంగా ఎలాంటి హానీ చేయదు. ప్రభుత్వం తమను ఏకాకిని చేసి అంత గొప్ప గుర్తింపును ఆపాదిస్తుంటే ఏ రాజకీయ పార్టీ సంతోషించదుగనక?) ఉగ్రవాదం మీద యుద్ధం అనే పేరుతో సరికొత్త వ్యూహంతో సర్వశక్తులు వెచ్చిస్తున్న ప్రభుత్వం వందలాది ఇతర ప్రతిఘటనోద్యమాలను తుడిచి పెట్టేందుకు ఆ మిలిటరీ ఆపరేషన్లను వినియోగించుకుంటుంది. వాటన్నింటి పై మావోయిస్టు సానుభూతిపరులనే ముద్రవేసేస్తుంది. నేను భవిష్యత్మాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను కానీ ఇప్పటికే ఈ ప్రక్రియ జరిగిపోతోంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నందిగ్రామ్, సింగూర్‌లలో ఈ విధానాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నించి విఫలమయింది. ప్రస్తుతం లాల్‌గఢ్‌లో “పలిషీ సంత్రాష్ బిరోధి జనసాధారాణేర్ కమిటీ” (పోలీసు అత్యాచారాల ప్రతిఘటనా సంఘం) విషయంలో ఇది కొనసాగుతోంది. మావోయిస్టుల పట్ల దానికి సానుభూతి వుండొచ్చు. కానీ అదొక ప్రజా ఉద్యమం. దానిపై మావోయిస్టుల లీగల్ సంస్థ అని ఆరోపిస్తూ తరచుగా దాడి చేస్తున్నారు. దాని నాయకుడైన ఛత్రధర్ మహతోను
10
ఈమధ్యనే అరెస్ట్ చేశారు. బెయిల్ ఇవ్వకుండా జైల్లో నిర్బంధించారు. ఆయనను పదేపదే “మావోయిస్టు నేత” అంటూ సంబోధిస్తున్నారు. ప్రముఖ వైద్యుడూ, పౌర హక్కుల కార్యకర్త అయిన డాక్టర్ బినాయక్ సేన్ కథ మనందరికీ తెలిసిందే. ఆయనపై మావోయిస్టుల కొరియర్ అనే తప్పుడు ఆరోపణలు చేసి రెండు సంవత్సరాలపాటు అక్రమంగా నిర్బంధించారు.
దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆవరేషన్ గ్రీన్ హంట్ కొనసాగుతున్నప్పుడే యుద్ధ క్షేత్రానికి దూరంగా వున్న ఇతర ప్రాంతాలలోని పేదల, కార్మికుల, భూమిలేనివాళ్ల హక్కుల మీద దాడులను ఉధృతం చేస్తారు. ప్రజా ప్రయోజనాల పేరిట పేదల భూముల్ని స్వాధీనం చేసుకునే కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతాయి. పేదల కష్టాలు మరింతగా పెరుగుతాయి. వారి గోడు వినిపించుకునే నాథుడుండడు. ఒకసారి యుద్ధం మొదలయిందంటే అది ఇతర యుద్ధాల మాదిరిగానే విసృతమవుతుంది. దాని తర్మం, దాని ఆర్థిక లెక్కలు దానికుంటాయి. అదొక జీవన విధానంగా మారిపోతుంది. వెనక్కి మళ్లడం అనేది దాదాపుగా వుండదు. పోలీసులు సైన్యంలా ప్రవర్తించాలనీ, విచక్షణారహితంగా హత్యలు చేసే యంత్రాల్లా మారిపోవాలని ఆశిస్తారు. పారామిలిటరీ దళాలు పోలీసుల్లా లంచగొండుల్లా, బలిసిన పాలక శక్తుల్లా మారాలని భావిస్తారు. నాగాలాండ్‌లో, మణిపూర్‌లో, కాశ్మీర్లో ఇలా జరగడం మనం చూశాం. తేడా ఏమిటంటే ఈ కీలక ప్రాంతం చాలా వేగంగా భద్రతా దళాల గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. పోరాదే ప్రజలకు మాదిరిగా వాళ్లు పెద్దగా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వుండదు. వున్నా చాలా తక్కువ.
(ప్రజలకూ, చట్టాన్ని అమలు చేసే వాళ్లకూ మధ్య అగాధం ఏర్పడుతుంది. తుపొకులు, ఇతర ఆయుధాల అమ్మకాలూ, కొనుగోళ్లూ సాగుతాయి. నిజానికి అది ఇప్పటికే జరుగుతోంది. ఈ సంపన్న ప్రజల యుద్ధంలో భద్రతా దళాల్లో మావోయిస్టుల్లో లేదా పోరుతో నిమిత్తంలేని సామాన్యుల్లో అన్ని వైపులా మరణించేది కచ్చితంగా పేద ప్రజానీకం నుంచి వచ్చిన వారే. ఈ యుద్ధం ప్రభావం మా మీద పడదని భావించే వాళ్లు మరో సారి ఆలోచించుకుంటే మంచిది. ఈ యుద్ధం అనేక వనరులను స్వాహా చేస్తుంది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుబడుతుంది.
11
ఈ ఉపద్రవాన్ని అడ్డుకునేందుకు, ఈ యుద్దాన్ని నివారించేందుకు ఏం చేయాలి? అనే అంశంపై గత వారం ఢిల్లీలో అనేక సదస్సులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పార హక్కుల కార్యకర్త డాక్టర్ బాలగోపాల్ లేని లోటు ఆ సదస్సుల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన ఈ మధ్యనే అర్థాంతరంగా మరణించారు. బాలగోపాల్ మన కాలపు సాహసో పేతుడైన, తెలివైన రాజకీయ మేధావి. మనకు ఎంతో అవసరం వున్న సమయంలో ఆయన లేకుండాపోవడం బాధగా వుంది. ఆయన వుండి వుంటే సదస్సులోని ప్రతి వక్త ప్రసంగాన్ని దృక్పథాన్ని, లోతైన అనుభవాన్ని జ్ఞానాన్ని, రాజకీయ పదునునూ నిశితంగా సమీక్షించి వుండేవాడు. అన్నింటికీ మించి కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇంకా భారతదేశంలో పౌర హక్కులకోసం పాటుపడుతున్న అనేకమందికి ఎంతో భరోసా యిచ్చేవాడు. టీవీ స్టూడియోలలో జిగేల్మనిపించే లైట్లకు వెలుపల, మీడియా హిస్టీరియా హోరుకు దూరంగా, చివరికి భారత మధ్యతరగతి జనంలో కూడా ఇంకా మానవ హృదయం స్పందిస్తోందని రాజధానిలో వీరందరి ఉనికి చాటిచెప్పింది. ఈ జనాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర హోంశాఖామాత్యులవారు ఇటీవల “ఉగ్రవాదానికి” ఊతమిచ్చే “మేధో వాతావరణాన్ని” సృష్టిస్తున్నారు అని వాపోయారు. జనాన్ని భయపెట్టడానికే, లొంగదీసుకోడానికే ఆయన ఆ ఆరోపణ చేసివుంటే కచ్చితంగా అందుకు వ్యతిరేక ప్రభావం పడుతుంది.
సదస్సులోని ఉపన్యాసకులు ఉదారవాద అభిప్రాయాలు మొదలుకుని వామపక్ష రాడికల్ అభిప్రాయాల వరకు అనేకం వెలిబుచ్చారు. ఎవరూ కూడా తమను తాము మావోయిస్టులుగా అభివర్జించుకోకపోయినప్పటికీ కొందరు మాత్రం సూత్రప్రాయంగా తమను తాము కాపాడుకునేందుకు ప్రభుత్వ హింసను ప్రతిఘటించే హక్కుప్రజలకు వుంటుందన్న ఆలోచనను వ్యతిరేకించారు. అలాగే చాలామంది మావోయిస్టుల హింస పట్లా అంతిమ తీర్పులు వెలువరించే 'ప్రజాకోర్డులపట్లా, ఆధిపత్యధోరణిపట్లా, సాయుధపోరాటం విజృంభించి నిరాయుధ పోరాటాలను వెనక్కి నెట్టడంపట్లా అసహనం వ్యక్తం చేశారు. అయితే భారత దేశంలోని కోర్టులు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని కారణంగానే 'ప్రజాకోర్టులు ముందుకొస్తు న్నాయనీ, ప్రజలకు అన్ని ప్రత్యామ్నాయాలు మూసుకు పోయిన తరువాతే సాయుధ పోరాటం చివరి అవకాశం అయ్యిందే తప్ప అదే మొదటి ఆప్షన్ కాదని చాలామంది అర్ధం
12
స్థాయికి చేరిన పరిస్థితి మధ్య చిన్న చిన్న వ్యక్తిగత సంఘటనలను ప | షో పట్లించుకుంటూ కాలయాపన క్షీ. బా నిన చేయడం ప్రమాదమని వారు ప. మ క్ష గుర్తించారు. ప్రభుత్వం సాగించే న క పి స్స ణీ వ్యవషకృత హింసకూ, సాయధ క [య ప్రతిఘటనా హింసకూ మధ్య వున్న టాటానారితో ఎంఓయూ కుదుర్చుకున్న కొద్ధి వం వాయ వన ఇప్పటికే స్పష్టమైన అవగాహన వుంది. వ్యవస్థలో జరుగుతున్న దారుణమైన అన్యాయాలపై శ్రద్ధ వహించేలా ప్రభుత్వ మెడలు వంచినందుకు రిటైర్డ్ జస్టిస్ పి.బి.సావంత్ మావోయిస్టులకు బాహాటంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన హరగోపాల్ పౌర హక్కుల కార్యకర్తగా తన రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిన కాలం నాటి అనుభవాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల రక్తాధిపత్యం కొనసాగిన మొత్తం కాలంలో చేసిన హత్యల కంటే కూడా గుజరాత్లో 2002 సంవత్సరంలో బజరంగ్ దళ్స్ విశ్వహిందూ పరిషత్‌ల నాయకత్వంలో హిందూ మూకలు కేవలం కొద్ది రోజుల్ల చేసిన హత్యలు చాలా ఎక్కువ అని ఆయన పేర్మొన్నారు.
యుద్ధ (ొంతాలనుంచి లాల్గధ్ జూర్ధంద్సొ చత్రీన్ఘర్ ఒరిన్సా రాన్హాల నుంచి వచ్చిన వాళ్లు పోలీసు అణిచివేత అరెస్టులు, చిత్రపొంనల్సు వాత్వలు, అవినీతి శరించి వివరించారు.
పోలీసులు నేరుగా మైనింగ్ కంపెనీ అధికారుల నుంచే ఆదేశాలను తీసుకుంటున్నట్టుందని చెప్పారు. ఎయిడ్ ఏజెన్సీల నుంచి నిధులు పొందుతున్న కొన్ని స్వచ్చంద సంస్థలు గోడమీది పిల్లుల్లా మోసపూరితంగా వ్యవహరించడం, కార్పొరేట్ సంస్థలు మరింత బలపడేందుకు దోహదపడటం గురించి కొందరు చెప్పారు. జార్ధంద్, ఛత్తీస్‌గఢ్ కార్యకర్తలైతే తమ ప్రాంతంలో ఏ వ్యక్తెనా కాస్త భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే చాలు అతని మీద మావోయిస్టు ముద్రవేయడం, నో
జైల్లోకి తోయడం వంటి దారుణాలు జరుగుతన్న ప్ర తున్నాయని చాలా ఆవేశంగా వివరించారు. న న అన్నింటికంటే ఈ కారణం వల్లనే చాలామందికి మ. న గ. ఆయుధాలు పట్టడం, మావోయిస్టులతో చేతులు ప. న ప్ ఫె కలపడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి . న్ త. టో ఏర్ప్చడుతోందన్నారు. చ . చై ల [గ టో
అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చిపడినందువల్ల జ్జ ఫ్ న్! (1 నిరాశ్రయులైన యాఖై మిలియన్లలోపు ప్రజలకు నత్త 4. న వ్ గూడు కల్పించడంలో నిస్సహాయత వ్యక్తం చేసిన | దల ఖీ క. న ప్రభుత్వం 300కు పైగా ఎస్ఇజద్ -సెజ్ ల వ. ప న సా(మాజ్యాల) కోసం పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు చూస్తుండగానే 1,40,000 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయని వాళ్లు ఆగ్రహంతో ప్రశ్నించారు. ప్రైవేటు కార్బొరేషన్లకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాలొపేరిట బలవంతంగా భూసేకరణ జరుపుతోందని తెలిసికూడా భూ సేకరణ చట్టం లోని ఈ “ప్రజా ప్రయోజనం” అనే మాటను నిర్వచించమని కోరినప్పుడు అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఏ తరహా న్యాయాన్ని అనుసరిస్తున్నట్టు అని వారు నిలదీస్తున్నారు. “ప్రభుత్వ ఆదేశాలు పాటించి తీరాలి” అంటోంది ప్రభుత్వం. అంటే పోలీసు స్టేషన్లు మాత్రమే సజావుగా వుండాలని అర్ధమా అని అడుగుతున్నారు. మా ప్రాంతంలో పాఠశాలలు, వైద్య కేంద్రాలు ఏవీ పనిచేయవు, మాకు ఇండ్లుండవు, తాగడానికి రక్షిత మంచినీరు దొరకదు, అటవీ ఉత్పత్తులకు సరైన ధర లభించదు, కనీసం మమ్మల్ని పోలీసుల భయం లేకుందా శాంతంగా బతకడానికి కూడా అనుమతించరు అని వాపోయారు. “ప్రభుత్వ ఆదేశాల పాలన” పరిధిలో న్యాయాన్ని ఎందుకు చేర్చరు అని నిలదీశారు.
దాదాపు పదేళ్ల కిందట ఇట్లాంటి సమావేశాల్లో “నూతన ' ఆర్థిక విధానంలో అభివృద్ధి నమూనా" గురించి జనం ఆసక్తిగా చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ నమూనాను మొత్తంగా తిరస్కరిస్తున్నారు. గాంధీయిస్టులు
వ.
మొదలుకుని మావోయిస్టుల వరకు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని మట్టుబెట్టేందుకు ఏ పద్ధతిని అనుసరించాలి అన్నదే అందరి ముందు వున్న కైక ప్రశ్న
కార్పొరేట్ ప్రపంచంలో చెప్పుకోదగ్గ గుర్తింపు వున్న ఒక మిత్రుడి పొత కాలేజి మిత్రుడొకాయన తనకు బొత్తిగా పరిచయం లేని ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో చూద్దాం అనే ఉద్దేశంతో ఈ సమావేశానికి వచ్చాడు. అతను సాదా సీదా దుస్తులు ధరించి వచ్చినప్పటికీ తన సంపన్న నేపథ్యాన్ని దాయలేకపోయాడు. సమావేశం జరుగుతుండగా నా వంక తిరిగి ఇట్లా గుసగుసగా అన్నాడు: “ఇంత ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వీళ్లకి ఎవరైనా చెప్తే బాగుంటుంది. ఈ యుద్దాన్ని వాళ్లు చచ్చినా గెలవలేరు. అసలు దేనిని వ్యతిరేకిస్తున్నారో వాళ్లకే స్పష్టంగా తెలియదు. అక్కడ పెడుతున్న భారీ పెట్టుబడులను చూడండి. ఆ కంపెనీలు మంత్రుల్నీ మీడియా సామ్రాట్లనూ, విధానకర్తలనూ... ఎవరినైనా కొనగలవు. స్వయంగా స్వచ్చంద సంస్థలను నదపగలవు, సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోగలవు, మొత్తం ప్రభుత్వాలనే కొనిపడేయగలవు. ఆ మాటకొస్తే మావోయిస్టులను కూడా అవి కొనేస్తాయి. కాబట్టి ఈ మహానుభావులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మరేదైనా 'మంచి పని చూసుకుంటే మంచిది.”
ప్రజల్ని అనాగరికంగా తొక్కివేస్తున్నప్పుడు వాళ్లకు తిరగబడటం కంటే వేరే చేయదగ్గ మంచిపని ఏం వుంటుంది? అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 1,80,000 మంది రైతుల మాదిరిగా ఆత్మహత్య చేసుకోవాలా వద్దా అన్న విషయంలో తప్ప ఇతరత్రా ఏం చేయాలో ఎంచుకునే అవకాశాన్ని వారికి ఎవరు కల్పిస్తారు? (బీద ప్రజానీకానికి తిరగబడాలన్న ఆలోచన కంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎక్కువగా రావడం పట్ల భారత సర్మారు, మీడియాలోని దాని ప్రతినిధులు సంతృప్తికరంగానే వున్నారా, నేనొక్కదాన్నే వేరేగా ఆలోచిస్తున్నానా?)
గత అనేక సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్, ఒరిస్సా, జార్ధండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో ప్రజలు (వారిలో చాలా కొద్దిమందే మావోయిస్టులు) భారీ కార్పొరేషన్లను
అనిలువరించగలిగారు. ఇప్పుడు వారి పోరాటాన్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎలా 15
మార్చబోతోంది అన్నది ప్రశ్న ఈ (ప్రజలు అసలు దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు?
చారిత్రకంగా చూస్తే స్థానిక ప్రజానీకం మీద ప్రతిసారీ మైనింగ్ కంపెనీలే విజయం సాధిస్తూ వస్తున్నాయనేది వాస్తవమే. ఆయుధాలను తయారుచేసే సంస్థలను పక్కనపెట్టండి అన్ని కార్పొరేషన్లకూ చాలా దుర్మార్గమైన గత చరిత్రే వుంది. వాళ్లు మహా స్వార్థపరులు, విషప్రచారంలో ఆరితేరినవాళ్లు. ప్రజలు “మేం (ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూములను మాత్రం ఇవ్వం” (జాన్ దేంగే పర్ జమీన్ నహీ దేంగే) అని నినదిస్తే వాళ్లు కూడా అదే నినాదాన్ని తిరగేసి చెప్పగలరు. బాంబుల నిల్వమీద పిడుగు పాటులా మరీ నినాదాలు చేయగలరు. వాళ్లు ఇట్లాంటి నినాదాలను వివిధ భాషల్లో, విభిన్న దేశాల్లో కొన్ని వందలసార్లు విని వుంటారు.
ఇప్పుడు వాళ్లలో చాలా మంది ఇండియాలో మొదటితరగతి ప్రయాణికుల విశ్రాంతి గదుల్లో కాక్టైల్స్ సేవిస్తూ, అరమోడ్పు కన్నులతో, కడుపునిండిన క్రూర జంతువుల మాదిరి బద్ధకంతో కూచుని వున్నారు. చాలా కాలం క్రిందట... ఎప్పుడో 2005లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కరెన్సీ నోట్లవర్నాన్ని కురిపించే సమయం ఇంకా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఎంత సహనశీలురకైనా, ఎంత మొదటి తరగతి విశ్రాంతి గదుల్లోనైనా ... నాలుగు సంవత్సరాలు ఎదురుచూస్తూ కూచోవడం అంటే చికాకే కదా. ఇంకా ఎక్కువ సమయం వెచ్చించేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదో ప్రజాస్వామిక పద్ధతులను, సాంప్రదాయాలను పాటించడానికని, ప్రజల అభిప్రాయాలు (వంచించి) వినడానికి, (తప్పుడు) పర్యావరణ ప్రభావ అంచనాలను రూపొందించడానికి, వివిధ మంత్రిత్వ శాఖల అనుమతులు పొందడానికి (కొనుగోలు చేయడానికి), సుదీర్హ కోర్టు కేసుల పరిష్కారానికి తప్పక కొంత సమయం కావాల్సివుంటుంది. కానీ పారిశ్రామిక వేత్తలకు టైమ్ ఈజ్ మనీ కదా మరి.
ఏ రకం మనీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం? సమరేంద్ర దాస్, ఫెలిక్స్ పడల్లు రాసిన త్వరలో ప్రచురణకానున్న “జెట్ ఆఫ్ దిస్ ఎర్త్: ఈస్ట్ ఇండియా ఆదివాసీస్ అర్సిడ్ అల్యూమినియమ్ కార్చెలో అనే కీలక గ్రంథంలో ఈ విషయం వివరించారు. ఓరిస్సాలోని బాక్సైట్ నిక్షేపాల మొత్తం విలువ 2.27 ట్రిలియన్ *
16
డాలర్లట! (ట్రిలియన్ అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి). ఇది మొత్తం భారత దేశ దేశీయోత్పత్తి (జిడిపి) కంటే రెండు రెట్లు ఎక్కువ. 2004 నాటి ధరలతో చేసిన గణాంకాలివి. ఈనాటి ధరలతో చూస్తే సదరు నిక్షేపాల విలువ నాలుగు ట్రిలియన్ డాలర్లు దాటుతుంది.
ఇందులో అధికారికంగా ప్రభుత్వానికి దక్కే రాయల్టీ కేవలం 7 శాతం కంటే కూడా తక్కువే. మైనింగ్ కంపెనీ మనకు తెలిసిందీ, బాగా పేరున్నదీ అయితే ఖనిజం ఇంకా కొండ గర్భంలో వుండగానే భవిష్యత్తు మార్కెట్లో అమ్మేయడం జరిగిపోతుంటుంది. కాబట్టి ఇంకా ఆ కొండ ఆదివానీల దేవుడిగా కొలువులందుకుంటున్నప్పటికీ, ఇంకా ఆ కొండ ఆ ప్రాంత పర్యావరణాన్ని ప్రజల విశ్వాసాన్ని రక్షిస్తూనే వున్నప్పటికీ మైనింగ్ కార్పోరేషన్ దృష్టిలో మాత్రం అదెప్పుడో ఓ స్టోరేజి కేంద్రంగా మారిపోయింది. ఆ స్టోరేజీలో దేవుళ్లు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో వుంటారు. కార్పొరేషన్ దృక్సథం ప్రకారం బాక్సైట్ నిక్షేపాలు కొండ గర్భంలోంచి బయటకు రావలసిందే. దానిని శాంతియుతంగా బయటకు తీసుకురావడానికి వీలు కాకపోతే హింసాయుతంగానైనా తీసుకొస్తారు. స్వేచ్చా మార్కెట్ ఒత్తిళ్లు, అవసరాలు అట్లాగే వుంటాయిమరి.
ఇదంతా కేవలం ఒరిస్సాలోని బాక్సైట్ నిక్షేపాలకు సంబంధించిన కథ. ఆ నాలుగు ట్రిలియన్ డాలర్ల లెక్క ఆధారంగా చత్తీస్‌గఢ్, జార్ధండ్లలోని లక్షల టన్నుల అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజం లెక్కలు వేయండి. ఇనుప ఖనిజమే కాదు ఇంకో 28 రకాల విలువైన ఖనిజాలున్నాయి. యురేనియమ్, లైమ్స్ట్రోన్, డోలోమైట్, బొగ్గు, తగరం, గ్రానైట్ పాలరాయి, రాగి, డైమండ్, బంగారం, క్వార్ట్జైట్, కోరండమ్, బెరైల్, అసెజాన్ట్రైట్, సిలికా, ఫ్లోరైట్, గార్నెట్ మొదలైనవి. వీటికి ఇంకా విద్యుదుత్పత్తి కేంద్రాలూ, డ్యాములూ, హైవేలూ, స్టీలూ సిమెంట్ ఫాక్టరీలూ, అల్యూమినియమ్ శుద్ధికేంద్రాలూ, తత్సంబంధ రక రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులూ అన్నీ కూడా ఒప్పందం కిందకే వస్తాయి. ఈమేరకు వందలాది ఎంఓయూల్లో సంతకాలు జరిగిపోయాయి. (ఒక్క జార్థండ్లోనే 90 ఒప్పందాలు కుదిరాయి). దీనిని బట్టి ఈ ఆపరేషన్ ఏ స్తాయిలో వుండబోతోందో, భాగస్వాముల ప్రతిస్తుజజ్ రు త్ వుండబోతోందో అంచనా వేసుకోవచ్చు ళా లే
శ లో
దండకారణ్యంగా పిలువబడే ఈ అడవి పశ్చిమ బెంగాల్ నుంచి జార్ధంద్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి వుంది. లక్షలాది భారతదేశ ఆదివాసీలకు ఇది తరతరాలుగా నివాసంగా వుంటూ వస్తోంది. మీడియా వారు దీనిని ఇప్పుడు “రెడ్ కారిడార్ అని లేదా “మావోయిస్టు కారిడార్” అని సంబోధించడం మొదలుపెట్టారు. నిజానికి దీనిని “ఎంఓయుయిస్ట్ కారిడార్” అంటే సబబుగా వుంటుంది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ఆదివాసీలకు రక్షణ కల్పిస్తోంది, వారి భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధిస్తోంది. కానీ దానిని ఎవరూ కూసింతైనా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆ క్లాజు కేవలం రాజ్యాంగం అందచందాలను తీర్చిదిద్దేందుకు, నలుగురికీ గొప్పగా కనిపించేందుకు ఉద్దేశించిన క్లాజులా వుంది. ముక్కూ మొహం తెలియని కంపెనీలు మొదలుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీల వరకు ఎన్నో కంపెనీలు ఆదివాసీల మాతృభూమిని ఆక్రమించుకునేందుకు బారులు తీరి ఆవురావురు మంటున్నాయి. వాటిలో మిత్తల్స్, జిందాల్ టాటా, ఎస్సార్, పోస్కో రియోటింటో, విహెచ్పి విల్లిటన్, వేదాంత వంటివి వున్నాయి.
ప్రతి పర్వతం, ప్రతి నదీ, ప్రతి అటవీ స్ధలం మీద ఒక పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరిపోయింది. మనమేమో సామాజిక, పర్యావరణ పరిరక్షణ గురించి గొంతులు చించుకుంటున్నాం. ఇందులో చాలా భాగం గుంభనంగా వుంది. ఇది (ప్రజలకు సంబంధించిన వ్యవహారంగా లేదు. కోపెన్ హేగన్‌లో త్వరలో జరుగనున్న క్రైమేట్ ఛేంజ్ కాన్సరెన్స్ (వాతావరణ మార్చు సదస్సు)లో వనాటినుంచో (ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ అరణ్యాన్నీ జీవావరజాన్నీ ధ్వంసం చేయబోతున్న ప్రణాళికల గురించీ, ఇక్కడ నివసించే ప్రజల గురించీ చర్చ జరుగుతుందో లేదో. మన 24 గంటల వార్తా ఛానళ్లన్నీ మావోయిస్టు హింసకు సంబంధించిన కథనాల వేటలో తలమున్మలై వున్నాయి. ప్రసారం చేసే సరుకు దౌరకనప్పుడు అవి వాటిని బయటకు తీస్తాయి. అసలు వాటికి ఈ సమస్య మీద ఎందుకు ఆసక్తి లేదు? నాకు చాలా అశ్చర్య మనిపిస్తోంది.
బహుశ అభివృద్ధి లాబీకి మీడియావాళ్లు తొత్తుల్లా మారడం, మైనింగ్ పరిశ్రమ వల్ల దేశీయోత్పత్తి నాటకీయంగా పెరిగిపోతుందనీ, వాళ్లు తమ వల్ల నిర్వాసితులుగా
నో
మారిన వాళ్లందరికీ ఉపాధి కల్పిస్తారనీ చెప్పే మాటలు నిజమేనని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. పర్యావరణ వినాశనం వల్ల కలిగే నష్టాలు, ఖర్చులు ఇక్కడ లెక్కలోకే తీసుకోలేదు. అయినా పై మాటలు కూడా పచ్చి అబద్దాలు. ఇక్కడి ఆదాయంలో అధికభాగం మైనింగ్ కార్పొరేషన్ల బొక్కసాల్లోకే చేరుతుంది. 10 శాతం కంటే తక్కువ మొత్తం మాత్రమే ప్రభుత్వానికి వస్తుంది. కేవలం వేళ్ల మీద లెక్కృపెట్టేంతమంది నిర్వాసితులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. వాళ్లైనా బానిసవేతనాలకోసం నడుములు విరిగేలా అవమానకరంగా చాకిరీ చేస్తుండాల్సిందే. ఈ దురాశాపూరిత కార్యక్రమాలను ఆకాశానికెత్తుతూ మన జీవావరణాన్ని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకు ధారాదత్తం చేస్తున్నాం.
ఇందులో భాదీ స్థాయిలో డబ్బు వెచ్చించడం జరుగుతుంది. వాటాదార్లను గుర్తించడం అంత సులభమేమీ కాదు. ఒకపక్క ప్రైవేట్ జెట్లలో సీఈఓలు, మరోపక్క “ప్రజా” మిలిటరీ రూపంలో నికృష్ణ ఆదివాసీ స్పెషల్ పోలీసు అధికార్లు ... ముష్టి డబ్బు నెలకు కొన్ని వేలు మొవోన కొడితే చాలు తమ జాతి మీదనే విరుచుకుపడడానికీ, అత్యాచారాలు చేయడానికీ, హత్యలు చేయడానికీ, గ్రామాలకు (గ్రామాలనే తగులబెట్టడానికీ ముందుకు దూకుతారు. మైనింగ్ సత్వరమే ప్రారంభం కావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. వాటాదార్లు ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ శ్రేణుల్లో ప్రపంచ వ్యాప్తంగా వుంటారు. వీళ్లెవరూ తమ ప్రయోజనాలను ప్రకటించరు కానీ తమ హోదాలను ఉపయోగించుకుని ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగేందుకు అనుమతిస్తారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏ పార్టీకి, ఏయే మంత్రులకు, ఏయే ఎంపీలకు, ఏయే రాజకీయ నాయకులకు, ఏయే న్యాయవాదులకు, ఏయే స్వచ్చంద సంస్థలకు, ఏయే ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీలకు, ఏయే పోలీసు అధికార్లకు ఈ అంతుబట్టని వ్యాపారంతో సంబంధాలున్నాయో మనకు ఎప్పటికైనా ఎలా తెలుస్తుంది? ఏ వార్తా పత్రిక తాజా మావోయిస్టు దురాగతాల మీద ఏమని రిపోర్టు చేస్తోందో ఎలా తెలుస్తుంది? ఏ టీవీ ఛానల్ * గ్రౌండ్ జీరో నుంచి నేరుగా ప్రత్యక్ష ప్రసారాలు” చేస్తుందో లేక ఇంకా స్పష్టంగా (గ్రౌండ్ జీరో నుంచి ప్రసారాలు చేయకూడదని నిర్ణయించుకుందో లేక ఇంకా ఇంకా స్పష్టంగా (గ్రౌండ్ జీరో నుంచి అబద్ధాలను (ప్రసారం చేస్తుందో ఎలా తెలుస్తుంది? వీళ్లంతా ఈ వ్యవహారంలో భాగస్వాములేనని ఎలా తెలుస్తుంది?
నో
భారత పౌరుల నుంచి రహస్యంగా గుంజుకోబడి స్విస్ బ్యాంకుకు చేరుతున్న కోటాను కోట్ల డాలర్ల (చాలా సందర్భాల్లో ఈ మొత్తం భారత దేశీయోత్పత్తి కంటే ఎక్కువగా వుంటోంది)కు మూలమేమిటి? గత సాధారణ ఎన్నికలలో ఖర్చు చేసిన రెండు బిలియన్ డాలర్లు ఎక్కడినుంచి వచ్చిపడ్డాయి? (ఇటీవల పి. సాయినాథ్ రాసినట్టు ఎలక్షన్ల ముందు కవరేజి ప్యాకేజీలకీ, ప్రచారాలకీ గాను రాజకీయ పార్టీలు మీడియాకు సమర్చించుకుంటున్న లక్షలకు లక్షల డబ్బు ఎక్కడినుంచి వస్తోంది? ఈసారెప్పుడైనా నిశితంగా చూడండి స్టుడియోకి వచ్చిన నోరువాయి లేని అతిథితో జరిపే చర్చలో “అసలు ఈ మావోయిస్టులు ఎవరైతే వున్నారో వాళ్లు ఎన్నికల్లో ఎందుకు నిలబడరండీ...?” అంటూ టీవీ యాంకర్ ప్రశ్నించడం కనిపిస్తుంది. వీక్షకులను తమ సమాధానాలను ఎస్ఎంఎస్ చేయమని కూడా అడగొచ్చు. “వాళ్లు ఎన్నికల్లో ఎందుకు పాల్గొనరంటే మీ రేట్లు భరించే శక్తిలేక!*).
కేంద్ర హోం మంత్రి ఆపరేషన్ గ్రీన్ హంట్ సీఈఓ అయిన పి. చిదంబరం గారు పూర్వాశ్రమంలో కార్పొరేట్ లాయర్‌గా అనేక మైనింగ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించి వుండడాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? “వేదాంతో సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో వున్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి మరీ 2004లో ఆర్థిక మంత్రి పీఠాన్ని అధిష్టించడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి? ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే మారిషస్ బేస్ట్ కంపెనీ అయిన “ట్విన్ స్టార్ హోర్టింగ్స్కు' ఎఫ్‌డిఐ క్షియరెన్స్ని, వేదాంత గ్రూప్ కంపెనీల్లో అంతర్భాగమైన “స్టెర్లైట్ షేర్లను అది కొనేందుకు అనుమతిని ప్రసాదించడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?
ఒరిస్సాకు చెందిన కొందరు కార్యకర్తలు 'వేదాంతి కంపెనీ ప్రభుత్వ మార్గదర్శకాలను అతిక్రమిస్తోందనీ, పర్యావరణానికి తీరని హాని చేస్తోందనీ, మానవహక్ములను ఉల్లంఘిస్తోందనీ అందుకే నార్వేజియన్ పెన్షన్ ఫండ్ ఆ కంపెనీ లోంచి తన పెట్టుబడులను ఉపసంహ రించుకుందని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినప్పుడు- జస్టిస్ కపాడియా 'వేదాంతో స్థానంలో అదే (గ్రూపులోని దాని సోదర సంస్థ ఐన 'స్టెర్లైట్‌కు' స్థానం కల్పించాలని సూచించడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి? పైగా ఆతరువాత ఆయన నిండు
20
న్యాయస్థానంలో తనకు కూడా స్టైర్లైట్లో వాటాలు వున్నాయని ఉల్లాసంగా చెప్పడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?
అటవీ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదనీ, దాని వల్ల అడవులూ, నీటి వనరులూ, పర్యావరణం సర్వనాశనమైపోతాయనీ, వేలాది ఆదివాసీల జీవనోపాధి దెబ్బతింటుందనీ సర్వోన్నత న్యాయస్థానపు సొంత నిపుణుల కమిటీ విస్పష్టంగా పేర్కొనివున్నప్పటికీ ఆయన సదరు కంపెనీకి అటవీ అనుమతులు ఇచ్చేశారు. సుప్రీం కోర్టు సొంత కమిటీ సిఫారసులను తుంగలో తొక్కి మరీ జస్టిస్ కపాడియా ఈ క్లియరెన్స్ జారీ చేశారు.
టాటాలతో పరస్పర అవగాహనా పత్రం (ఎంఒయు) మీద సంతకాలు జరిగిన కొద్ది రోజులకే, 2005లో దంతెవాడలో అతి కిరాతకంగా జనాల్ని జనావాసాలనుంచి ఖాళీ చేయించడంలో దిట్ట అయిన, మిలిటెంట్ స్వచ్చంద సంస్థ అన్న ముసుగు వేసుకున్న “సల్వాజుడుం” అనే సంస్థ ప్రారంభించబడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అలాగే మరికొద్ది రోజులకే బస్తర్ జిల్లాలో 'జంగిల్ వార్ఫేర్ టైనింగ్ స్కూలో ప్రారంభించబడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
రెండు వారాల క్రిందట 12 అక్టోబర్ 2009నాడు లోహాండిగూడ, దంతెవాడలో రూ. 10,000 కోట్ల రూపాయల భారీ ఉక్కు కర్మాగారానికి సంబంధించి చట్టబద్ధంగా జరపాల్సి వున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని - కలెక్టరేట్లోని ఓ చిన్న హాలులో, దిట్టమైన పోలీసుబలగాల పహారామధ్య, బస్తర్ గ్రామం నుంచి ప్రభుత్వ వాహనాల్లో కిరాయికి తీసుకొచ్చిన 50 మంది ఆదివాసీలతో నిర్వహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మావోయిస్టులే మన దేశ అంతర్గత భద్రతకున్న ఏకైక ముప్పు అని (ప్రభుత్వం మావోయిస్టుల పని పట్టడానికి సిద్ధపడుతోందనడానికి ఇదొక సంకేతం) ప్రకటించిన కాసేపటికే అనేక మైనింగ్ కంపెనీల షేర్ల ధరలు ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
మైనింగ్ కంపెనీలకు ఈ “యుద్ధం” తప్పనిసరిగా అవసరం. ఇది చాలా పాత వ్యూహం. ఇళ్లల్లోంచి వెళ్లగొట్టాలని చూసినప్పుడల్లా సంఘటితంగా ప్రతిఘటిస్తూ
21
వస్తున్న ప్రజల మీద ఈ యుద్ధం ప్రభావం బలంగా వుంటుందని వాటి ఆశ. అయితే అట్లా జరుగుతుందో లేక మావోయిస్టు శ్రేణులే మరింత బలపడతాయో వేచి చూడాలి.
“ది ఫాంటమ్ ఎనిమీ” అన్న వ్యాసంలో పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి డా.అశోక్ మిత్రా 'మావోయిస్టులు వరుసగా జరుపుతున్న కిరాతకమైన హత్యలు ఓ వ్యూహాత్మక ఎత్తుగడ అనీ, గెరిల్లా యుద్ధతంత్ర (గ్రంథాలనుంచి వాళ్లు దీనిని నేర్చుకున్నారనీ” పేర్కొన్నారు. మావోయిస్టులు గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి శిక్షణ యిచ్చారనీ ఇప్పుడది భారత ప్రభుత్వాన్ని ఎదుర్శొనేందుకు సిద్ధంగా వుందని చెబుతూ భారత ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకూ, (ప్రభుత్వం ఆగ్రహించి క్రూరమైన చర్యలు చేపట్టేలా చేసేందుకు మావోయిస్టులు కావాలని అలజడి సృష్టిస్తున్నారనీ, ప్రభుత్వ చర్యలతో ఆదివాసీలు రెచ్చిపోవాలనీ, అప్పుడు ఆదివాసీల కోపాగ్నిని సులువుగా తిరుగుబాటుగా మలుచుకోవాలని ఆశిస్తున్నారనీ అన్నారు. మావోయిస్టులది “దుస్సాహసిక వాదమని' వివిధ వామపక్ష పార్టీలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. తమకు అధికారాన్ని సిద్ధంపజేసే విప్లవం కోసం మావోయిస్టు సిద్ధాంత కర్తలు తాము ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారి వినాశనాన్నే కోరుకుంటున్నారనేది ఆయన చెప్పే మాటల సారాంశం. అశోక్ మిత్రా ఒక వృద్ధ కమ్యూనిస్టు నేత. పశ్చిమ బెంగాల్లో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 80లలో, 70లలో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆయన అభిప్రాయాలను బొత్తిగా కొట్టిపారేయలేం. కానీ ఆదివాసీ జనానికి మావోయిస్టులు పుట్టక ముందునుంచే ఎంతో సుదీర్హమైన, ధీరోదాత్తమైన చరిత్ర వుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ కొద్దిమంది మధ్యతరగతి మావోయిస్టు సిద్ధాంత కర్తలో ఆదివాసీలను తెలివితక్కునవాళ్లు, కీలుబొమ్మలు అనుకుంటున్నట్టయితే అది వారికి తీవ్రమైన అపచారం చేసినట్టే.
బహుశ డాక్టర్ మిత్రా లాల్గఢ్లోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో. ఇప్పటివరకు అక్కడ ఖనిజ సంపద గురించిన ప్రస్తావనే లేదు. (జిందాల్ ఉక్కు కర్మాగారం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడే లాల్‌గఢ్‌లో గొడవ మొదలయిందన్న సంగతిని కాసేపు మరిచిపోదాం. ఉక్కు ఫాక్టరీ వున్న చోటుకు ఇనుప ఖనిజం చాలా దూరంలో వుంటుందా ఏమన్నానా?). ప్రజల
డా
ఆగ్రహావేశాలన్నీ తమ దుర్భర దారిద్ర్యం మూలంగానే. దశాబ్దాలుగా పోలీసులు పెట్టిన బాధలు, గత 30 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌ను ఏలుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టుకి చెందిన సాయుధ గుండాల వేధింపులే వారిని రెచ్చగొట్టాయి.
వందలాది వేలాది పోలీసులూ, పారా మిలిటరీ బలగాలూ లాల్‌గఢ్‌లో ఏం చేస్తున్నాయని మాటవరసకు కూడా అడగకపోయినా, మావోయిస్టులది 'దుస్సాహసిక వాదం” అన్న ఆరోపణని అంగీకరించినా కూడా ఇది పాక్షిక చిత్రణే అవుతుంది.
అసలు సమస్య ఏమిటంటే భారతదేశపు అద్భుత “ప్రగతి” కథ ఇసుకలో దిగబడ్డ నౌకలా కదలలేని స్థితికి చేరుకుంది. భయంకరంగా సామాజిక, పర్యావరణ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నదులు ఎండిపోయి, అరణ్యాలు అంతర్జానమైపోయి, నీటి నిల్వలు అడుగంటుతుండటంతో ప్రజలు ఇన్నాళ్లు తమకు చేసిందేమిటో (గ్రహిస్తున్నారు. పాపం పండుతోంది. దేశ వ్యాప్తంగా అశాంతి, ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రజలు తమ భూములను, తమ వనరులను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వాళ్లిప్పుడు బూటకపు హామీలను నమ్మడం లేదు. హఠాత్తుగా 10 శాతం పెరుగుదల రేటుకూ, ప్రజాస్వామ్యానికీ మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది.
ఈ బల్లపరుపు కొండల నుంచి బాక్సైట్‌ని బయటకు తీయాలంటే... అడవుల గర్భంలోంచి ఇనుప ఖనిజాన్ని తరలించుకు పోవాలంటే... జనం దగ్గర్నుంచి 85 శాతం భూముల్ని స్వాధీనం చేసుకుని వాళ్లు పట్టణాలకు వెళ్లేట్టు చేయాలంటే... (వాళ్లనలా చూడాలని వుందంటాడు చిదంబరం) ఇండియా తప్పనిసరిగా పోలీసు రాజ్యంగా మారాల్సిందే! ప్రభుత్వం సైనికీకరించబడాల్సిందే!! ఆ సైనికీకరణ చర్యను సమర్ధ్థించుకునేందుకు వాళ్లకు అర్జంటుగా ఒక శత్రువు కావాలి! మావోయిస్టులే ఆ శత్రువు! హిందూ ఫండమెంటలిస్టులకు ముస్లింలు ఎలాగో, కార్పొరేట్ ఫండమెంటలిస్టులకు మావోయిస్టులు అలాగన్నమాట! (ఫండమెంటలిస్టుల మధ్య పరస్పర సౌభ్రాతృత్వం వుంటుందంటారా? అందుకేనా ఏమిటి చిదంబరాన్ని ఆర్ఎస్ఎస్ అంత బాహాటంగా అభిమానిస్తోంది!?)
న్
పారామిలిటరీ దళాలు, రాజ్‌నంద్‌గావ్ వైమానిక స్థావరం, బిలాస్పూర్ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్, అన్ లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, (చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం), చత్తీస్‌గఢ్ స్పెషల్ పన్లీక్ సెక్యూరిటీ యాక్ట్, (చత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం), ఆపరేషన్ గ్రీన్ హంట్ వగైరాల నన్నింటినీ సమాయత్తం చేస్తున్నది కేవలం కొన్ని వేలమంది మావోయిస్టులను అడవుల్లోంచి తరిమెయ్యడానికి మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ విషయంలో చిదంబరం ముందడుగువేసి 'బటన్” నొక్కినా నొక్మకపోయినా ఎమర్జెన్సీ పరిస్థితులు ముంచుకు వస్తున్న విషయాన్ని నేను పసికట్టాను. (ఒక చిన్న లెక్కల ప్రశ్న ఇరుకైన కళ్ళీర్ లోయను అదుపుచేయడానికే 6,00,000 సైనికులు అవసరం అయితే దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల్ని అదుపులో పెట్టేందుకు ఎంత మంది సైనికులు కావాలి?)
ఇటీవల అరెస్టు చేసిన మావోయిస్టు నేత కోబాడ్ గాంధీకి నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించడం కంటే ఆయనతో చర్చలు జరపడం మంచి ఆలోచన కదా!
ఈ సంవత్సరాంతంలో కోపెన్‌హాగెన్‌లో జరుగనున్న క్షైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ (వాతావరణ మార్చు సదస్సు)కు వెళ్తున్న వాళ్లెవరైనా అక్కడ ఒకే ఒక్క అర్థవంతమైన ప్రశ్నను అడిగితే బాగుంటుంది: మనం బాక్సైట్‌ని ఆ కొండల్లోనే ఉండనివ్వగలమా?
జామా ల్ క ననన... గ్ పి స!
| ॥ ్ తిరే!1/669౮16౧6] ౪౮ర6[6గ శి శ 67220027 2040042 న్్ | ళో . . గీి0గ0080గ0/ శ దండకారణ్యంగా పిలువబడే ఈ అడవి పశ్చిమ బెంగాల్ నుంచి జార్ధండ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి వుంది. లక్షలాది భారతదేశ ఆదివాసీలకు ఇది తరతరాలుగా నివాసంగా వుంటూ " వస్తోంది. మీడియా వారు దీనిని ఇప్పుడు “రెడ్ కారిడార్” అని లేదా “మావోయిస్టు కారిడార్” అని సంబోధించడం మొదలు పెట్టారు. నిజానికి దీనిని “ఎంఓయుయిస్ట్ కారిడార్ అంటే సబబుగా వుంటుంది. రాజ్యాంగంలోని ఐదవ "షెడ్యూలు ఆదివాసీలకు రక్షణ కల్పిస్తోంది, వారి భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధిస్తోంది. కానీ దానిని ఎవరూ కూసింతైనా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆ క్లాజు కేవలం రాజ్యాంగం - అందచందాలను తీర్చిదిద్దేందుకు, నలుగురికీ గొప్పగా . కనిపించేందుకు ఉద్దేశించిన క్లాజులా వుంది. ముక్కూ మొహం తెలియని కంపెనీలు మొదలుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీల వరకు ఎన్నో కంపెనీలు ఆదివాసీల మాతృభూమిని అశక్రమించుకునేందుకు బారులు తీరి ఆవురావురు మంటున్నాయి. వాటిలో మిత్తల్స్, జిందాల్, టాటా, ఎస్సార్, పోన్మ్కో | రియోటింటో, బిహెచ్పి బిల్లిటన్, వేదాంత వంటివి వున్నాయి. జ్ఞా