Telugu Yoghavashistam - anilvaranasi/indianlanguages GitHub Wiki
సం తు తై 2 వ. న జం మం! షె నా ఎ కుల లోన్? న. క్ హీ నా. శా నా ఖీ వ అదా. నం? ల ర య్ మళ తీ క మ జ మ భం న టు క్ టు అట ల క స్త మ మి న్న
క న సా ల | న. యాం మూల .
మ ష్ కఏ్ మజ ఇళరించిని న. నం వ్ | సహాజె ల ద చుకువతో సేకరి క్రోసం య. వ్ | ॥ , ్న దరయ్యపి ము ంసునొాం షష చు! 1 | శ సుం యాంరలి స్తు 1 ఉపవా పులీ; | సందంతో బహ లకుటుంబం (|. న. టీ అస _ చులెమౌల * ర న. ర య. త్తాత్రి వి తీ టై చు శే 1. ర యమం ప్ క.
| | ః శన నం | క్ . ల. _
షు ను. బు ఇట స ని. రా. టో ప బు. య్ క్షు" గీ పంత త్ర యల 1 ఖై యు మ మ! ళల రాన రో న శం
యోళవాసిష్టం ప్రకరణాలు సాహిత్య శరోమజీ సముద్రాల లక్ష్మణయ్య,ఎం.ఎ తిరుపతి 2002
యోగవాసిష్టం-ప్రథమ, ద్వితీయ, తృతీయ ్రకరణాలు రచన: నముగూల లక్ష్మణయ్య ల్రరం- / త్తం హోగ అవా 1998 ప్రథమ ముద్రణ: 1100 ప్రతులు 2002 ద్వితీయ ముద్రణ:1000 ప్రతులు (రె సర్వస్వామ్యములు గ్రంథకర్తవి వెల: రూ.80-00 న. ననా నా భాయయనుమా. న నీ న. స్ శస్తననం లజ అందము ర్ 18-1-84, కపిలతీర్థం రోడ్, | (టో తిరుపతి-517 507 ఈ. నంద్రుణు శ్రీ పారాశర్య ముద్రజాలయం శ్రీవ్యాసాశ్రమం, ఏర్పేడు చిత్తూరు జిల్లా-5్17 621
నివేదనం అ(త్రాహారార్టం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాహారం ప్రాణసంధారణారమ్ ॥ ప్రాణాస్పంధార్యాస్తత్త్వ జిజ్ఞాసనార్ధం తత్త్వం జిజ్ఞాస్యం యేన భూయో న జన్మ ॥ (యోగవాసిష్టం - నిర్వాణ ప్రకరణం) “ఆహారం కొరకు నిందితం కాని కర్మ చేయాలి. ప్రాణసంధారణ కొరకు ఆహారం స్వీకరించాలి. తత్త్వం తెలిసికోవడానికై (ప్రాణాలు నిలుపుకోవాలి. జన్మరహితస్టితికొరకు తత్త్వం తెలిసికోవాలి”. తత్తజ్హానం ద్వారి మోక్షం పాందడమే జీవితలత్ష్య మని భారతీయుల దృఢవిశ్వాసం. తత్త్వవేత్తకు దా; (బ్రహ్మాజ్జ్ఞున కున్న గౌరవం ఈ దేశంలో మరొకడికి లేదు. విద్యలలో అధ్యాత్మ విద్యకే అగ్రతాంబూలం. '' అధ్యాత్మవిద్యా విద్యానాం? “విద్యలలో నే నధ్యాత్మవిద్యను'' అని భగవంతుడు గీతలో పలికాడు. ఆధ్యాత్మికతత్తా వన్ని విపులంగానూ, హృుదయంగమంగానూ వివరించిన మహోత్తమ గ్రంథం 'యోగవాసిష్టం'. ఇందులో ముప్పదిరెండు వేల శ్లోకాలున్నాయి. దీనిని “వాసిష్టరామాయణం' అని కూడా వ్యవహరిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి తత్త్వబోధ చేసినట్లే ఇందులో వసిష్టుడు శ్రీరామచంద్రునికి ఆత్మతత్త్వం ఉపదేశిస్తాడు. వైరాగ్య ప్రకరణం, ముముక్షువ్యవహార ప్రకరణం, ఉత్పత్తి (ప్రకరణం, స్థితి (ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం అని యోగవాసిష్టంలో ఆరు ప్రకరణా లున్నాయి. దీని కర్త వాల్మీకి మహర్షి. శ్రీ రామ తర్జీస్వామి ఈ గగ్రంథరాజాన్ని గూర్చి ప్రస్తావిస్తూ- *0౧6 01౧6 ౪41661 00016, ౧6 గం౩! *౦గిర౭గం! &ఉం00161౧0 10 గా౭ ఈ/౭ ౪7116౧ ౪౧౮౭౯66 5౮౧, 8 ₹004/891504" అని ప్రశంసించారు. ప్రపంచంలో వెలువడిన మహోత్తమ గ్రంథాలలో అత్యద్భుతమైన (గగ్రంథరాజం యోగవాసిష్టమని వారి అభిప్రాయం.
క!
ఈ గ్రంధాన్ని సమగ్రంగా తెలుగు తాత్ప్సర్యంతో మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాములవారు శ్రీ వ్యాసాశ్రమం తరఫున ప్రచురించారు. అది బహుళ (ప్రచారంలో వున్నది. నేను ఆధునిక పాఠకలోకాన్ని దృష్టిలో వుంచుకొని సరళ వ్యావహారిక శైలిలో ఈ అనువాదం సాగించాను. ప్రకృతం వైరాగ్యముముక్షువ్యవహార ఉత్పత్తి ప్రకరణాలు మా(త్రమే ఈ గ్రంథరూపం తాల్తాయి.
రామచంద్రుడు బాల్యంలో త్మీరయా డత్రలు చేస్తాడు. లోకాన్నంతా పరిశీలిస్తాడు. (ప్రపంచమంతా దుఃఖభూయిష్ట మని గ్రహిస్తాడు. అతనికి తీ వ్రవైరాగ్యం కలుగుతుంది. ఏ పని చేయాలన్నా మనసు రాదు. కడకు అన్నపానాదుల మీద గూడా ఆసక్తి తొలగిపోతుంది. దినదినానికీ అతడు తీవ్రచింతతో కృశించిపోతాడు. ఈసందర్భంలోనే విశ్వామిత్ర మహర్షి దచశరథమహారాజు చెంతకు వస్తాడు. రాజు మునీం(ద్రుణ్మి ఉచితరీతిని సత్కరించి వచ్చిన పని యేమిటో సెలవిండని అడుగుతాడు
రాశ్షసులను జయించి తన యాగాన్ని రక్షించడాన్ని శ్రీరాముళ్లీ తనతో గూడా పంపమని విశ్వామిత్రుడు దళరథుణ్లి అర్దిస్తాడు. దశరథుడు పుత్రుణ్ణి ఘోర రాక్షసులతో యుద్దం చేయటానికి పంపలేనంటాడు. అది విని విశ్వామిత్రుడు క్రోధోద్లీస్తు డవుతాడు. వసిష్టమహర్షి రాముని గొప్పతనాన్నీ, విశ్వామిత్రుని చరాహాత్మ్యాన్నీ వివరించి రావఎణ్ణీ పంపడానికీ దశరథ వువహారాజును సమ్మతింపజేస్తాడు. |
విరక్తుడై చింతతో చిక్కి సగమై వున్న రామచంద్రుడు తండ్రి ఆనతి ననుసరించి ఆస్ట్రానానికి వచ్చి పెద్దలకు నమస్కరిస్తాడు. విషాదానికి హేతువేమిటో చెప్పమని విశ్వామిత్ర మునీంద్రుడు రాముళ్లీ అడుగుతాడు. తీర్రయాత్రా కాలం నుండీ తనలో కల్గిన అభిప్రాయాలను రాముడు వివరిస్తాడు. అశాశ్వతమైన (ప్రపంచస్థితినీ,
అహంకారం, మనస్సు, ఆళ మొదలైన వాటి స్వరూప స్వభావాలనూ, జీవితము యొక్క క్షణభంగురత్వాన్నీ, దైవ దుర్విలాసాన్నీ పూసగ్రుచ్చినట్ట్లు రాముడు విస్త్రృతంగా వర్ణిస్తాడు. కడకు దుఃఖ బహుళమైన ఈ సంసారంలో దుఃఖాతీతంగా జీవించడానికి తగిన ఉపాయ మేమిచో దయతో ఉపదేశంచవలసిందిగా ప్రార్రిస్తాడు.
పరమ విరక్తితో రాముడు చెప్పిన ఆవేదనతో కూడిన వచనాలు విన్న వాళ్లందరూ విస్మాయపడి అతని వాక్యసరణినీ, లోకానుభవాన్నీ, తత్త వుజిజ్ఞాసనూ వేనోళ్ళ
క్
కానియాడుతారు. రాముని ప్రశ్నకు మును లేమి సమాధానం చెబుతారో వినాలన్న కుతూహలంతో గగనచారులైన సిద్రపురుషులు గూడా అయోధ్యకు వచ్చి సభలో (ప్రవేశిస్తారు. వాళ్లందరికీ యథోచినమైన సత్కారాలు జరుగుతాయి.
ఇది వాసిష్ట రావాయణ వుందలి వైరాగ్య ప్రకరణంలోని విషయం. ముముక్షువ్యవహార ప్రకరణంలో మోశ్షాపేక్షగల మనుజుల స్వభావం వర్షింపబడింది తరువాతి ప్రకరణాలలో వసిష్టుడు శ్రీరామచంద్రునికి తత్త్వోపదేళం చేస్తాడు.
శ్రీ వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు, పూజ్యపాదులు శ్రీ విద్యానందగిరి స్వాములవారు ఈ గ్రంథరచనకు నన్ను మిక్కిలి 'ప్రోత్సాహించారు. వారు దయతో ఇచ్చిన సంస్కృత వ్యాఖ్యాసహితమైన యోగవాసిష్టం నాకెంతో సాయపడింది. శ్రీస్వాములవారు ఈ అనువాదాన్ని 1979 సెప్టెంబరు మాసంనుండి 'యథ్యార్ధ భారతి' మాసపత్రికలో (క్రమంగా ప్రచురింప జేసి నాకృషికి సాఫల్యంచేకూర్చారు. ఇంతే కాక ఈ కృతికి అమోఘమైన తమ పరిచయ వాక్యాలు ప్రసాదించి నన్ను కృతార్చుణ్లీ కావించారు. ఈ విధంగా నాపై అనుగ్రహం చూపిన శ్రీవిద్యానందగిరి స్వాముల వారికి భక్తిపూర్వకప్రణామాలు అర్పించుకాంటున్నాను.
శ్రీకాళహస్తి శ్రీశుక బ్రహ్మాశ్రమస్టాపకులు, భగవద్గీతతో పాటు యోగవాసిష్టానికి అనన్య సామాన్యమైన (ప్రచారం కలిగిస్తున్నవారూ ఐన పూజ్యపాదులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు ప్రేమతో ఈ రచనపై తమ అమూల్యాభిప్రాయం (ప్రసాదించి నన్ను ధన్యుణ్లో చేశారు. వారికి నా హృదయ పూర్వక నమోవాకాలు.
గండిత్షేత్ర శ్రీ భూమానందాశ్రమాధిపతులు, గీతావాణి సంపాదకులు, పూజ్యపాదులు శ్రీ, రామకృష్ణానందస్వాములవారు నామీది వాత్యల్యంతో ఈ గ్రంథాన్ని సమగ్రంగా సమీక్షించి నన్ను కృతకృత్యుల్లో కావించారు. వారికి నా వినతి పూర్వక కృతజ్ఞతాంజలులు.
ఈ రచనను పరీశిలించి తగు సలహా లివ్వడమే కాక (ప్రశంసాప్రసూనాలు వర్షించిన మాన్యులు శ్రీముదివర్తి కొండమాచార్యులవారికి నానమస్కృతులు.
శ్రీ వ్యాసాశ్రవు స్థాపకులు, వుద్గురు దేవులు (బ్రహ్మీభూత వుహర్షి శ్రీమలయాళ స్వాములవారి దివ్య పాదారవిందాలకు ఈ కృతిని భక్తీ పురస్సరంగా సమర్పించుకుంటున్నాను.
సముద్రాల లక్మణయ్య
పరిచయము పూజ్యశ్రీ, విద్యానవ్రగిరి స్వాములవారు శ్రీవ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు (శ్రీ) వాసిష్టం మహాశా,స్త్రం బ్రహ్మతత్త్వ ప్రబోధకమ్ | తస్యానువాద మకరో న్మనోజ్ఞం వ్యావహార్కే ॥ ఆం ధ్రే సులలితే (శ్రీమా౯ లక్ష్మణః సండితోత్తమః | తదేతత్సజ్జనాః సర్వే పఠస్తు ప్రీతిపూర్వకమ్ ॥ పరిశుద్దాత్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా 1 శ్రీయోగవాసిస్టము ఆధ్యాత్మిక జగత్తులో సమున్నత స్థానము నలంకరించిన మహోత్క్బృష్టమగు (గ్రంథరాజము. అధికారులకు బ్రహ్మాత్మ విజ్ఞానమును అనాయాసముగా ప్రసాదించి మోక్షప్రదమగుటలో దాని కదియే సాటి. మహర్షిసత్తముడు, ఆదికవి, శ్రీమద్రామాయణ రచయిత అయిన శ్రీవాల్మీకి భగవంతుడే యీ అఖిండ మాయణ కర్తయు ననుట విశేషము. ఆ భగవంతుడు తన శిష్యుడైన భరద్వాజునికి ఉపదేశించినట్టుగా రాజేంద్రుడైన అరిష్టనేమికి ప్రబోధించిన గ్రంథ మిది. " దీనియందు 32 వేలు శ్లోకములు, ఆరు ్రకరణములు గలవు. వైరాగ్యము, ముముక్షు వ్యవహారము, ఉత్పత్తి, స్థితి ఉపశమము, నిర్వాణము అనునవి ఆ 'ప్రకరణముల నామములు. దీనికి సంస్కృతమున ఒక వ్యాఖ్యానము కలదు. మరియు హిందీ, తెలుగు వెందలగు వానిలో భాషాంతరీకరణవు లున్నవి, అనగా తెనుగున “శ్రీయోగవాసిష్టము”* అనెడి నామముతో ప్రతిశ్ళోకమునకు ఆంధ్ర తాత్పర్యముగల సంపూర్ణ (గ్రంథ మొకటి కలదు. 'శ్రీ వసిష్టగీత* అనే నామ ధేయముతో శ్రీ యోగవాసిష్టము యొక్క విశేష వర్షనల కొంత తగ్గించి సంక్షిప్తముగా శ్లోక తాత్సర్యములతో ప్రకటింపబడినది మటీ యొకటి యున్నది. 'జ్ఞానవాసిష్టము” 1 శ్రీ వ్యాసాశ్రమమువారి ప్రచురణ. 2 శ్రీ శుకబ్రహ్మాశ్రమము వారి ప్రచురణ 3 శ్రీ వానళ్లవారి ప్రచురణ
7
అను పేరుతో ఆ పిశేషవర్ధనల మిక్కిలి తీసి వేసి శ్లోకతాత్పర్యములతో ప్రకటితమైనది
- ఇంకొకటి కనిపించు చున్నది. ఇవి యన్నియు గ్రాంథిక భాషతో గూడినవే.
(ప్రస్తుతము శ్రీ వ్యాసాశ్రమ (ప్రేరణచే చేయబడుచున్న నూతనాం(ధ్రానువాద మొకటి సముద్భవించుచున్నది. ఇది సరళము. మనోహరమునై బాలబాలికలకు సైతము అర్హమగు లాగున ద్రాక్షాపాకముతో, వ్యావహారిక శ్రైలితో గద్యాత్మకముగా నున్నది. మరియు ఇది అన్యూనము, అనతిరక్తమునై యుండును. మూలమున గల సుదీర్హములగు వర్ణనల యథాతథముగా (గగ్రహించినచో పాఠకులు కొంత గందరగోళము జెందుట కవకాశముండును. అట్లని ఆ వర్ధనల మిగుల వదలినచో గ్రంథము న్యూనమై సువ్యక్తము గాక పోవును. అందుచే ఉక్తరీతిగా అందరికిని బాగుగా బోధపడులాగున ఇది అనువదింపబడుచున్నది. ఇంత వరకు వైరాగ్య ముముక్షు వ్యవహార (ప్రకరణములు అనూదితములై 'యథార్ధ భారతి* లో ధారావాహికముగా ప్రచురితమైనవి.
ఇంతకును ఈ అనువాద కర్త ఎవరు | వారే ప్రీయాత్మ సోదరుడు శ్రీమా౯ సవలటు(ద్రాల లక్మణయ్య చవుహోదయుడు. ఆయున బాల్యమున శ్రీ వ్యాసాశ్రమమునందు శ్రీ వేంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలలో ఉన్నతవిద్య నధ్యయనము చేసి మహర్షి శ్రీ మలయాళ సద్గురు దేవుల కృపకు పాత్రుడైన ఉత్తమ విద్యార్ది. ఆంధ్ర గీర్వాణ భాషలలో పరిణితి నందిన పండితోత్తముడు. కాకలు తీరిన కవితల్లజుడు. ఆర్లుములో సముచిత చాతుర్యము గల చతురుడు. తిరుమల తిరుపతి దేవస్టానముల హిందూ ధర్మరక్షణ సంఫ్టకు కార్యదర్శి. హార్షిక భక్తీ భావముతో ' మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వామి జీవిత చరిత్ర అనెడి ఉద్లంథమును ఆం(ధ్రమున గద్యవయముగా, శ్రీ మలయాళ సద్గురు స్తుతిని ఆంధగీర్వాణములలో పద్యమయముగా రచియించిన పరమభక్తుడు. మరియు బాలబాలికలకు నీతి నియమములు, వినయ విధేయతలు, భక్తి శ్రద్దలు పట్టువడుటకై సావిత్రి, మదాలస, భర్తృహరి నీతిశతకమునకు వచనాను వాదము ఇత్యాదులను స్వయముగాను, శ్రీవేంకటేశ్వరుడు, హిందూధర్మపరిచయములను విద్వా౯ శ్రీ, ముదివర్తి కొండవూచార్యుల వారి సహాయువఎతోను విరచించిన పరోపకారి. (ప్రవచనపటుత్వము, ఉపన్యాస కుశలత గలిగిన వివేకశాలి.
ఈ గ్రంథము గురుదేవులు మహర్షి శ్రీ మలయా ళ యతీంద్రులకు సభక్తికముగ
8
సమర్పితమైనది. ఆధ్యాత్మిక విద్యావ్యాప్తికి, విశేంచి యోగివాసిష్టమునకు ఎన లేని ప్రచారము గావించిన ఆ మహర్షికి తత్కృపాపా త్రుడైన శ్రీ లక్మణయ్య దీని నంకితము గాఏంచుట ఎంతేని సముచితము గదా !
ఇట్టి వీరిని భక్తవత్సలుడు, భగవంతుడు నైన శ్రీవేంకటేశ్వరుడు శిష్యవత్సలుడు, తాపసోత్తముడైన మహర్షి శ్రీ మలయాళసద్దురుస్వాములవారును కరుణతో అనుగ్రహింతురు గాక !
శ్రీయోగవాసిష్టముయొక్క ఇతర ప్రకరణములను గూడ అనువదించి “స్వయం తీర్త్వా పరాంస్తారయతి' అన్నట్టు రచయిత ఈ సంసార సాగరమును తాను దాటి ఇతరులు దాటుటకు సహాయపడు గాక |
ఈ గ్రంథమును జనులు (ప్రేమతో పఠించి విషయవిరక్తులు, భవదనురక్తులునై (బ్రహ్మాత్మైక్యవిజ్ఞానము నార్హించి (బ్రహ్మానందముతో విరాజిల్దుదురు గాక |
ఓమ్ ఓం లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు ఓం శాన్తి శ్చాన్తి శాన్తిః ఓం తత్సత్ ఓమ్.
అభినందనము పూజ్య,శ్రీ, విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు శ్రీ శుక్రహ్మాశ్రమాధిపతులు శ్రీ కాళహస్తి అధ్యాత్మవాజయమున యోగవాసిష్ట మహాగ్రంథము సాక్షాత్ మకుటము వంటిది. శ్రీ, వసిష్ట మహర్షి శ్రీరామచం ద్రునకు బోధించిన దివ్యపరమార్ధబోధయే అది. అనేకదృషస్టాంతములతోను, ఉపమానములతోను, కథలతోను గూడి సాధన పద్దతులను పెక్కింటిని తెలుపుచు ఆ గ్రంథము ముముక్షువులకు ఎన లేని సహాయము చేయుచున్నది. అట్టి మహాగ్రంథములోని అమూల్య విషయములను, ధర్మ రహస్యములను జనసావూన్యవఎటనకు అందజేయుటకై శ్రీ సముద్రాల లక్మణయ్య గారు కృతనిశ్చయులైరి. వారా గ్రంథమును సులభ్టైలిలో, తెలుగు భాషలో వచన రూపముగ (వ్రాయుచు, దానిని 'యథార్చభారతి' వరాసప(్రికలో ధారావాహినిగా 'ప్రకటించుచుండిరి. అందు మొదటి రెండు ప్రకరణములు పూర్తి అయినందున అయ్యది గగ్రంథరూపముగ వెలువడినది. శ్రీ లక్మణయ్యగారు ఉత్తమరచయిత, వక్త, అధ్యాత్మ వాజయమునందు వీరు సెక్కురచనలు గావించిరి. శ్రీ వుహర్షి సద్గురు వులయాళ స్వాములవారి జీవితచరిత్రను గగాడ వీరు విపులవటగ (వ్రాసయున్నారు. అద్దానిని శ్రీవ్యాసా శ్రవువువారు గ్రంథరూపముగ (ప్రకటించియుండిరి. వీరిభాష సులభగ్రాహ్యముగ నుండుట వలన పాఠకులకు భావము వెను వెంటనే సుబోధక మగుచుండును. శ్రీవసిష్ట వాణిని ఇవ్విధముగ లోకమునకు అంద జేయుచు శ్రీ లక్మణయ్య గారు మహత్తర ఆధ్యాత్మిక సేవను సలుపుచున్నారు. భగవత్కృపచే ఈ గ్రంథము బహుళప్రచారము గలదై జనులకు పారమౌర్చిక ఆనందానుభూతిని కలుగజేయగలదని నిశ్వసించుచున్నాము. ఓన్
శిషపరిచయము పూజ్య,శ్రీ/ రామకృమ్ణానంద స్వాములవారు *“గీతావాణి' సంపాదకులు, గండిక్షేత్రం శ్రీ సముద్రాల లత్మణయ్యగారు భావుకుడు. భక్తుడు, కవి, పండితుడు, అంతకుమించి ఆధ్యాత్మికరసికుడు. శ్రీ వ్యాసాశ్రమంవారు ఒకప్పుడు ప్రకటించిన ఒక సంచికలో శ్రీ సద్గురు మలయాళస్వాముల వారిని గురించిన (ప్రశంసాపద్యాలు వీరివి చదివాను. నా భావద్చశ్యంలో చెళ్లపిళ్ల వేంకటశా స్త్రిగారు పా టకరించారు. ఆ పద్యాలు, ఆ నడక, ఆ శయ్య, ఆధార గాఢంగా నన్నాకర్షించాయి. బహుశా వారెంత వృద్దులో అనుకొన్నాను, కానీ తీరా వారిని చూచాక వయోవృద్ధులు కారు, సంస్కారవృద్దులనే యథార్దం సాక్షాత్కరించింది. పద్యకవిత్వంలోనే కాక గద్యకవిత్యంలోనూ వీరి వైదుష్యం విస్తరించడం ఈమధ్య నేను చూస్తూన్నాను. శ్రీమలయాళ సద్గురు స్వాములవారి జీవితచరిత్రను వీరు సరళగ్రాంథికంలో రచించారు. 'యథార్హభారతి' లోని, 'సద్గురువాణి' లోని వీరి శిష్ట వ్యావహారిక వచన రచనలు పాఠక లోకానికి సుపరిచితాలు. కంఠంలోని మాధుర్యం కలంలో కూడా జాలువారింది. ఇది యోగవాసిష్టంలోని మొదటి రెండు (ప్రకరణాలకు వ్యావహారిక వచన రచన. ఈ రచనలో సరసవతి యైన సరస్వతి తన వీణాగానం యొక్క శ్రావ్యతను చవిచూపింది. వాల్మీకి నుహర్షి శ్రీవుద్రావాయణాన్ని రచించాడు. అది పూర్వ రామాయణమని చెప్పబడింది. ఆ వాల్మీకీ వుహర్షియే యీ యోగవాసిష్ట రామాయణానికి ప్రణేత. దీనిని ఉత్తర రామాయణ మన్నారు. పూర్వరామాయణంలో బాల- అయోధ్యా- అరణ్య- కిష్కింధా- సుందర- యుద్దకాండలని ఆరు కాండలున్నాయి. అట్లే ఈ ఉత్తర రామాయణంలోనూ వైరాగ్య- ముముక్షు- ఉత్పత్తి- ఫ్రితి- ఉపశమ- నిర్వాణములని ఆరు (ప్రకరణాలున్నాయి. ఫపూర్వరామాయణంలోని చరిత్రను పఠించి హృదయంగమం గావించుకొని, తదుక్త శీల- ధర్మ- నీతి నియమాలతో జీఎత నిర్మాణం చేసుకొని చిత్తనిర్మలత్వం
11 పాంది ఆత్మసిద్రిని అపేక్షించే జిజ్ఞాసువుల కొరకై ఈ గ్రంథం చెప్పబడింది.
“+ దేహమే నేను అన్న గొఢమైన అజ్ఞానం లేనివాడూ, సమగ్రమైన తత్త్వజ్డానం కలుగనివాడూ, ' బద్దుడనైన నేను తప్పకమోక్షం పొంది తీరాలి అనే దృఢ నిశ్చయం కలవాడూ ఈ శాస్త్రం చదవడానికి అర్హుడు.” _
ఈ యోగవాసీష్టం వేదాంతముయొక్క అంతిమ సిద్దాంతమైన అద్వైతాన్ని (ప్రతిపాదించే అపూర్వమహా గ్రంథం. దీనిలో ఆజాతవాదమూ, దృష్టిస్పష్టి వాదమూ రమ్యమైన కావ్యభాషలో (ప్రతిపాదింపబడ్డాయి. జటిలమైన దార్శనికసిద్దాంతాన్ని ఉపమానాలతో, అలంకారాలతో, ఉపాఖ్యానాలతో, యుక్తులతో విస్తరించిన మహాగ్రంథ మిది.
ఈ గ్రంథాన్ని నిష్టతో పఠించినవారికి అద్వితీయ (బ్రహ్మాత్మ సాఖ్షత్కారం: అవళ్యం కలుగుతుందంటూ శ్రీ, రామతీర్టస్వాములవారు సెలవిచ్చారు.
మహాభారత టీకాకారుడు శ్రీ, నీలకంఠాచార్యులవారు ఈ గగ్రంథముయొక్క గౌరవాన్ని పెక్కు స్టలాల్లో పేర్కొన్నారు. శ్రీ, సులేశ్వరాచార్యులవారి మానసోల్లాసము, విద్యారణ్యులవారి జీవన్ముక్తివివేకము, (ప్రకాశాత్మయతి యొక్క వేదాంతసిద్దాంత ముక్తావళి, హఠయోగ(ప్రదీపీక, ఇంకా అనేకములైన మైనరు ఉపనిషత్తులు ఈయోగవాసిష్టము యొక్క ప్రభావానికి విశేషంగా లోబడి వున్నాయి.
““యోగవాసిష్టంలో శ్రుతి ప్రమాణం ఇవ్వబడి వుండలేదు. యుక్తి, అనుభవం మాత్రం ప్రమాణంగా తీసుకొనడం జరిగింది. అందువల్లనే జైనమతస్టులకు గూడా ఇది అభిమాన పాత్రమైవుంది. శ్రీమత్ రామచం(ద్రజీవారు మవాత్మాగాంధీవారిని ఈ గ్రంథపఠనానికి ప్రోత్సహించినారు''. ఈ మాటలు శ్రీ మాధవతీర్ధ స్వాముల వారు తమ లఘుయోగవాసిష్ట సారమనే గ్రంథంలో పేర్కొన్నారు.
ఈ (గ్రంథానికి సంక్షిప్త సంస్కరణవఎలు ఎన్నో వెలువడినాయి. లఘుయోగవాసిష్టమని, యోగవాసిష్టసారమని, అఘుయోగవాసిష్టసారమని, యోగవాసిష్టదర్శనమని, వసిష్టుగీత యని ఆయా దేశ భాషానువాదాలతో సహా 'ప్రకటింపబడ్డాయి.
సామాన్యంగా అన్ని వేదాంత (గ్రంథాలలో ఉపయోగింపబడే ''సవిశేషము, నిర్విశేషము, అధ్యాసము, ఉపాధి, బాధ'' ఇత్యాది పారిభాషికళబ్దాల ప్రయోగం ఇందులో లేదు. జగత్స్వరూపాన్ని నిరూపిస్తూ ''స్పందనము, స్పురణము,
శత న్ విద్య లన్నిట అధ్యాత్మ విద్య మిన్న తద్రహస్యంబు దెలిసిన ధన్యులెల్ల రైహికా ముష్మీక సుఖంబు లందజేయు నమృత తత్త్వంబునే కొనియాడుచుంద్రు. 6 (ప్రాచేతసమునికృతమై (ప్రాచుర్యము గన్న యోగవాసిస్ట కృతి౯ మోచాఫల మధురమ్ముగ ధీచతురుడు లక్ముణుండు తెనుగుం జేసెల. 7 వకుళసుమవిసర పేశల మకరందమయోక్తులన్ గ్రమంబుగ నిట్లే యకలంక(ప్రజ్ఞాడు తా (ప్రకటించుత శిష్ట యోగవాసిష్టమ్మున్. 8 భుక్తిముక్తు లొసంగని బొల్లి కథల జదువ నేమగు ? తత్త్వజిజ్ఞాసువులకు గీత యెట్టిదా వాసిష్టగీత యట్టి దిట్టి గ్రంథమ్ము జూడని పుట్టు వేల? 9 రమ్యగుణశీలు డగు సము(ద్రాలవంశ లక్ష్మణకవీంద్రు బుధచం(ద్రు అచ్చిమగడు శేషగిరినాయకుండు విశేషవిభవ చిరతరాయుర్యశశీకు బేయు గాక
విషయసూచిక
వైరాగ్య ప్రకరణం
-
మంగళాచరణం ఎం శ | 31. రాఘవుని ప్రళ్నే 67
-
అవతారిక ఇం... 2 | 32. భేచరులసాధువాదం. ..... 68
-
శ్రీరాముని తీరయాత్ర ....... 8 | ౩౩. భేదర భూచర సమ్మేళనం. .... 70 4 శ్రీరాముని దినచర్య లం 10
-
కృళత్వ నివేదనం 10 | ముముక్షు వ్యవహార ప్రకరణం
-
విశ్వామిత్రుని రాక క!
-
విశ్వామిత్రునిపలుకులు ...... 15 1. శకనిర్వాణం ల 73
-
దశరథుని వచనాలు 4... 16 | 2. విశ్వామిత్ర వాక్యం 76
-
వసిష్టుని ఓదార్పు ఎల... కేర్ | 3, సర్గపరంపరానువర్ధనం ...... 78
-
రామువి విషాదము ల 20. పొరుష ప్రశంస 81 11 అస్టానమునకు రాముని రాక ...... 23 ప్రైరుషన్తాపనం 82
-
ప్రథమపరితాపం ల 25 |" పౌరుష .
-
లక్ష్మీ నిరాకరణ ల. 27 | క దైవనిరకరణం =... 85
-
జీవిత గ్హుణ ఇ. 28 | 7. పౌరుష ప్రాధాన్యం ల 87
-
అహంకార జుగుప్స ఎ. 30 | 8. దైవ నిరాకరణం యయ 89
-
మనోదుస్ప్వభావం _..... 3ఓ| 9. కర్మ విచారం ల. 92
-
తృష్ణైభంగం “లల. 33 | 10. జ్ఞానావతరణం కిక
-
శరీర జుగుప్పు ల 36
-
బాల్యజాగుప్ప 40 | 11 వక్తృష్పచ్చకలకణం. ..... 97
-
యౌవన జుగుప్ప ఎ. 42 | 12. తత్పమాహాత్మ్యవర్దనం .... 101 21 స్తీ జుగుప్స ఎం. 45 | 13. శమనిరూపణం ల. 103
-
వారక జుగుప్సు లల 47 | 14 విచారనిరూపణం 108 23 కాలనింద ౨. 560 | (5, సంతోషనిరూపణం. ..... 112
-
కాల విలాసం 4 52
-
సదాచారనిరూపణం .... 113
-
కృతాంత విలాసం 4 వ్3 26 దైవ దుర్విలాసం కర్ | 17 గంథసంఖ్యాదివర్లనం ..... 115
-
విపర్యాసప్రతిపాదనం .... 61 | 19 ప్రమాణనిరూపణం 121
-
ప్రయోజన కథనం ఎ. 65 లాం
_ రపు నుల... | | శై గే న్! శ /" వై / / సుఖ _ న ల న్ / గ్ న్న త్య * లె న్. (| గా లీల ళ్ విం న , ఖం టి యై ఇ ల వ ఖై క న శ గ -
- షు జా“ సీ క శి జ్య ల అతనా. గ్ జ | ఠి | ( |
క లల యోగవా సిప్టం జి వైరాగ్య ప్రకరణం మంగకాచరణం యతః సర్వాణి భూతాని 'ప్రతిభాన్తి స్రీతానిచ యతైవోపళమం యాన్తి తస్మై సత్యాత్మనే నమః సమస్త భూతాలూ ఎందుండీ ఉద్భవిస్తున్నవో, ఎందులో ఉనికి గలిగి వున్నవో, ఎందులో లయ మవుతున్నవో అట్టి సత్యస్వరూపుడైన పరబ్రహ్మకు నమస్కారం. జ్ఞాతా జ్ఞానం తథా జ్రేయం దద్రష్టై దర్శన దృళ్ళభూ; కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్రస్త్యాత్మనే నమః ॥ జ్ఞాత, జ్ఞానము, జేయము; (ద్రష్ట దర్శనము దృశ్యము; కర్త, కారణము, కౌర్యము- అనేవి ఎందుండి స్ఫురిస్తున్నవో అట్టి జ్ఞస్తీస్వరూపుడైన పర(బ్రహ్మకు వమోవాకం.
స్ఫురన్తి శీకరా యస్మాదానందస్యాంబరే2_వనౌ
సర్వేషాం జీవనం తస్మై (బ్రహ్మానందాత్మనే నమః ।
ఏ మహానంద సాగరంనుండి ఉదయించిన విషయానందబిందునవులు సమస్త జీవులలో గో రిస్తున్నవో ఏది సర్వప్రాణులకు జీవనవోూ అట్ట (దబహ్మోానందస్యరూపుడైన పర(బ్రహ్మాకు ప్రణామం బి2
2 యోగవాసిష్టం అవతారిక
పూర్వం సుతీక్టుడు అనే ఒక బ్రాహ్మణు డుండేవాడు. అతడి కొక పెద్ద సందేహం కలిగింది. వెంటనే అతడు అగస్తి మునీంద్రుని ఆశ్రమానికి వెళ్ళి వినయంతో ఆయనను ఇలా (ప్రశ్నించాడు -
*“మునీంద్రా! మీరు తత్త్వజ్ఞులు. సమస్త శా(స్తాలూ మీకు క్షుల్లుంగా తెలుసు. నాకొక పెద్ద సంశయం కలిగింది. దయచేసి దాన్ని తీర్చండి ! మోక్షానికి కారణం కర్మా ? లేక జ్ఞూనమా ? లేదా కర్మ జ్ఞానాలు రెండూ కారణాలా ? ఈ వషయం కచ్చితంగా తేల్చి చెప్పి నన్ను అనుగ్రహించండి 1”'
అగస్తి మునీంద్రుడు అతనికి ఇలా సమాధానం చెప్పాడు
“విప్రోత్తమా ! ఆకసంలో ఎగిరే పక్షులకు రెండు రెక్కలూ సాధనాలే, ఒక రెక్కతో అవి ఎగరలేవు కదా ! అలాగే కర్మజ్ఞానాలు రెండూ మోశ్షునికి కారణాలు గాని అందులో ఒకటి మాత్రం కారణం కానేరదు.
దీనికి సంబంధించిన ఒక పురాతనమైన ఇతిహాసం వుంది; అది చెబుతా విను:-
పూర్వం అగ్ని వేశ్యుని పుత్రుడు 'కారుణ్యుడు' అనే విఫ్రుడుండేవాడు. అతడు గురుకులంలో వేదాలూ, వేదాంగాలూ, శాస్త్రాలూ సమగ్రంగా చదువుకొన్నాడు. చదువు పూర్తి కాగానే ఇంటికి తిరిగి వచ్చాడు అతడికి కర్మకాండపై సందేహం కలిగింది. ఏ పనీ చేయకుండా ఊరక కూర్చున్నాడు.
అగ్నివేశ్య్ళుడు కుమారుని వాలకం గమనించాడు. ఒకనాడు అతలణ్లో ద్యూరికి పిలిచి “నాయనా | స్వకర్మలను అనుష్టించకుండా ఊరకున్నా వెందుకు ? కర్మలు వదలి ఎలా సిద్ది పొందాలనుకున్నావు ? అసలు కర్మలు ఎందుకు విడిచావో చెప్పు" అని ప్రశ్నించాడు
కారుణ్యుడు తండ్రితో ఇలా అన్నాడు - “తండ్రీ ! బ్రదికినంత కాలం అగ్ని కార్యం చేయాలనీ, నిత్యమూ సంధ్యను ఉపాసించాలనీ (శ్రుతులూ, స్మృతులూ చెబుతున్నాయి. ఈ ధర్మం ప్రవృత్తి రూపమైనది 'ధనంవల్లా కర్మలవల్లా, సంతానంవల్లా మోక్షం లభించదు. త్యాగంచేత మా త్రమే అమృతత్వం సిద్దిస్తుంది" అని కూడా శ్రుతి ఘోషించింది ఇది నివృత్తిమార్గం (ప్రవృత్తి నివృత్తి రూపాలైన ఈ రెండు (శ్రుతులలో దేనిని అనుసరించాలో నాకు తెలియడం లేదు. అందుకే ఆనుమానంతో కర్మలు వదలి ఊరికున్నాను *'
వైరాగ్య ప్రకరణం త్రి
ఇలా చెప్పి కారుణ్యుడు మౌనం వహించాడు అప్పుడు అగ్నివేళశ్యుడు కొడుకుతో ఈ విధంగా అన్నాడు
““అబ్బాయీ ! ఈ సందర్భంలో నీకొక కథ చెబుతా విను. ఇది చక్కగా విచారించి తర్వాత నీకెలా తోస్తే అలా చెయ్యి.
పూర్వం అప్పురసలలో మేటి యైన 'సురుచి అనే ఒక స్త్రీ వుండేది ఆమె ఒకనాడు పవిత్రమైన ఆకాళగంగా (ప్రవాహం చెంత కిన్నరులు కాంతలతో విలాసంగా విహరించే హీమాలయ శిఖరం పైన కూర్చొని వుండింది. అప్పుడు ఆకసంలో పోతూవున్న ఇం(ద్రదూత ఆమెకు అగుపించాడు,
““ ఓ దేవదూతా ! ఎక్కడనుండి వస్తున్నావు ? ఎక్కడికి పోతున్నావు ? దయచేసి కాస్త చెప్పు” అని ఆమె అతళ్లీ అడిగింది
దేవదూత :- సురుచీ ! మంచి (ప్రశ్నే వేశావు. విషయం చెబుతా విను. “అరిష్టనేమి” అనే ఒక రాజర్షి వున్నాడు ఆయన రాజ్యభారం కుమారుడి కప్పగించి తపస్సు చేయటానికి వెళ్ళాడు ఇప్పు డాయన గంధమాదనపర్వతంలో తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు నన్ను ఆ రాజర్షి దగ్గరికి వెళ్ళి రమ్మన్నాడు నేనాయన దగ్గరికి పోయాను. అక్కడి వృత్తాంతం ఇంద్రుడికి నివేదించడానికి తిరిగి వెళ్తున్నాను
సురుచి :- అక్కడి వృత్తాంత మేమిటో నాకు వివరించకూడదా? -
దేవదూత *- తప్పక వివరిస్తాను, విను. అరిష్ట నేమి అరణ్యంలో కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇం(ద్రుడు నన్ను పిలిచి మనోహరమైన విమాన మిచ్చి తపోనిస్యృడై వున్న రాజును దానిపై ఎక్కించుకొని స్వర్గసుఖాలు అనుభవించడాన్ల అమరావతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆయన ఆనతి (ప్రకారం విమానంతో సహా నేను గంధమాదనానికి వెళ్ళాను. రాజుకు దేవేంద్రుని సందేశం వినిపించాను
అది వింటూనే రాజు కొక సంశయం కలిగింది 'ఆయన నాతో '“స్వర్గంలోని గుణదోషాలు వివరించు. విషయం తెలుసుకొన్న తర్వాత నా యిష్టం వచ్చినట్టు చేస్తాను” అని అన్నాడు
“స్వర్గంలో పుణ్యాత్ములు సుఖాలనుభవిస్తారు ఉత్తవుపుణ్యంవల్ల ఉత్తమస్వర్గలోక(ప్రాప్తి కల్గుతుంది. అట్లే మధ్యమ పుణ్యంవల్ల మధ్యమస్వర్గమూ, కనిష్టపుణ్యంవల్ల కనిష్టస్వర్లమూ లభిస్తాయి పుణ్యం త్షీణించే వరకూ అక్కడివాళ్లు దాని కనుగుణమైన భోగాలనుభవిస్తారు కొని వాళ్లకు తవుకంటే ఎక్కువ
త యోగవాసిష్టం భోగాలనుభవించేవా్లిపై అసూయా, తమతో సమానులపట్ల స్పర్డా, తక్కువ స్థితిలో ఉండేవాళ్ళను చూస్తే సంతోషమూ కల్గుతాయి. పుణ్యం క్షయం కాగానే తిరిగి అందరూ మర్త్యలోకంలో జన్మిస్తారు. స్వర్గంలోని గుణదోషాలు ఇవి" అని నేను చెప్పాను.
అప్పుడు రాజా - “నాకు స్వర్గం అక్కర లేదు. ఇంకా తీవ్రమైన తపస్సు చేసి పాము కుబుసం వదలినట్టు ఈ శరీరం వదలివేస్తాను. విమానంతో నీవు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్ళు. నీ కొక్క నమస్కారం''* అని అన్నాడు.
నేను తిరిగి వెళ్ళి ఆయన చెప్పిన మాటలను ఇంద్రుడికి మనవి చేశాను. ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై మళ్ళీ నాతో మృదువుగా ఇలా అన్నాడు.
““దూతా ! మళ్ళీ నీవు అరిష్ట నేమి వద్దకు వెళ్ళి ఆ రాజును వాల్మీకి మహర్షి ఆశ్రమానికి తీసుకుపో. వాల్మీకితో నామాటలుగా ఇలా నివేదించు - “మహర్షీ 1 ఈ రాజు మిక్కిలి వినీతుఢు. ఈయనకు స్వర్గసుఖాలపై కోరిక లేదు. సంసార దుఃఖపీడితుడైన ఈయనకు దయచేసి మీరు తత్త్వబోధ చేయండి 1 మీ అనుగ్రహంతో ఈయనకు ముక్తి లభిస్తుంది 1?
దేవేం(ద్రున్సి ఆనతి (ప్రకారం నేను అరిష్ట నేమిని వాల్మీకి ముని ఆశ్రమానికి తోడ్కొానిపోయాను. ఆ మహర్షికి మహేం(ద్రుని సందేశం అందజేశాను. ఆయన రాజును కుశలమడిగాడు,.
రాజు :- మునీం(ద్రా! మీరు ధర్మతత్త్వజ్ఞులు, జ్ఞానసంపన్నులలో అగ్రణ్యులు. మీ దర్శనంతో నేను కృతార్జుణ్లీ అయ్యాను. ఇంతకంటే నాకింక కుళల మేమున్నది? భోవానుడా ! మిమ్మల్ని ఒక్క విషయం అడగా లనుకొన్నాను. దయచేసి నా సందేహం తీర్చండి ! సంసార దుఃఖంనుండి ఎలా విముక్తి చేకూరుతుందో సెల వియ్యండి 1
వాల్మీకి :- రాజూ! నీ ప్రశ్నకు సమాధానంగా అభిండమైన రామాయణం చెబుతాను. వసిష్ట రామ సంవాదమైన ఈ కధ శుభప్రద మైనది. మోక్ష హేతువైన ఈ కథను శ్రద్దగా విని అర్ధం చేసుకో. నీవు జీవన్ముక్తుడ వవుతావు.
రాజు :- తత్త్వజ్ఞులలో (శ్రష్టుడవైన ఓ మునీం(ద్రా! రాముడంటే ఎవడు ? ఆత డెలాంటివాడు ? ఎవరివాడు? బద్దుడా ? ముక్తుడా ? దయచేసి వివరించండి!
వాల్మీకి :- రాజూ ! నీ యిష్టదైవమయిన శ్రీమన్నారాయణుడే శాపం వ్ర రాజవేషం ధరించి రాము డయ్యాడు. తెచ్చిపెట్టుకొన్న అజ్జానంతో భూలోకంలో
వైరాగ్య ప్రకరణం క్ కొంతకాలం అల్పజ్ఞానిలా ప్రకాశించాడు.
రాజు :- రాముడు చిదానందస్వరూపుడు ఆయన చైతన్యమూర్తి. ఆయనకు శాపం ఎలా వచ్చింది ? శపీించినవా రెవరు ?
వాల్మీకి :- నిషాముడైన సనత్కుమారుడు బబ్రహ్మలోకంలో వుండగా ఒకసారి విష్ణువు వైకుంఠం నుండి అక్కడికి పోయాడు. (బ్రహ్మతో సహా సత్యలోకంలోని వారందరూ ఆయనను యథావిధిగా పూజించారు. కాని సనత్కుమారుడు మాత్రం ఏ విధమైన సత్కారమూ చేయ లేదు.
అతళణ్లీ చూచి విష్ణువు '' ఓయీ! సనత్కుమౌారా ! నిష్కాముడ నన్న గర్భంతో నీవు యుక్తాయుక్త పరిజ్ఞానం లేకుండా కొయ్యబారి పాయ్యావు. అందువల్ల కుమారస్వామి వై జన్మించి కామపీడితుడివి అగుదువు గాక'*! అని శపించాడు.
అందుకు సనత్కుమారుడు కోపించి '' నీవు కూడా నీ సర్వజ్ఞత్వం కోల్పోయి, అజ్ఞానివై కొంత కాలం వుండు”' అని శ్రీహరిని శపించాడు.
ఇది గాక ఆయనకు మరి మూడు శాపాలు వచ్చాయి.
భృగుమహర్షి భార్య ' ఖ్యాతి" అనే సాధ్వీమణి నారాయణుని శరీరంలో లీనమై పోవాలని కోరుకుంది. భగవంతు డామె కోర్కెను సఫలం చేశాడు. విష్ణువు తన భార్యను సంహరించాడని భ్రమించి క్రోధావిష్టుడైన భృగువు 'నాకు కల్లినటే నీక్షు గూడా భార్యావియోగం కలుగు గాక'' | అని శపించాడు. ఇది రెండవ శాపం.
జలంధరుడవనే దానవు డున్నాడు. అతని భార్య 'బృంద'. విష్ణువు కపటోపాయంతో ఆమె పాతి(వ్రత్యాన్ని భంగపరచి తద్ద్వారా ఆరక్కసుణ్లో సంహరించాడు. విష్ణువు తన్ను మోసగించాడని గ్రహించిన బృంద ''నీవు సతీవియోగంతో బాధపడుదువు గాక!” అని శాపం పెట్టింది. ఇది మూడవ శాపం.
ఇక నాల్లవ శాపం ఎలా వచ్చిందో చెబుతాను. ఒకసారి దేవదత్తుని భార్య పయోష్ష్రీనదీతీరంలో సంచరిస్తూ నరసింవావతారంలో వున్న శ్రీమన్నారాయణుని చూచి భయపడి ప్రాణాలు వదలింది. పత్నీవిరహంతో దుఃఖాకులుడైన దేవదత్తుడు “నీకు గూడా భార్యా వియోగం కలుగుగాక !** అని ఆ దేవదేవుని శపీంచాడు.
ఈ విధంగా సనత్కుమారుడు, భృగువు, బృంద, దేవదత్తుడు - ఈ నలువురి
*“శాపంవల్ల విష్ణువు మనుష్యుడై పుట్టాడు. ₹ పకారణాలు వివరించాను ఇప్పుడు మోక్షదాయకమైన వాస్సృరా మాయణం
6 యోగవాసిం వినిపిస్తాను. సావధానంగా ఆలకించు.
దివి భూమౌ తధా౬_౬కాశే బహీ రంతళ్ళ మే విభుః |
యో విభా త్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః !
దివిలోను, భువిలోను అంతరిక్షంలోను, బహిరంతరాలలోను ఏ నా విభుడు అవభాసస్వరూపుడై వెలుగొందుతున్నాడో అట్టి సర్వాత్మకునకు అభివాదం.
వాల్మీకి అరిష్ట నేమితో ఇలా అన్నాడు :-
““రాజేంద్రా! దేహమే నేను అన్న గాఢమైన అజ్ఞానం లేని వాడూ, సమగ్రమైన తత్త్వజ్ఞానం కలుగనివాడూ, బద్దుడనైన నేను తప్పక మోక్షం పాంది తీరాలి అనే దృఢనిశ్చయం కలవాడూ ఈ శాస్త్రం చదవడానికి అర్హుడు.
ముందు కధారూపమైన రామాయణకావ్యం చదివి తర్వాత ఈ శాస్త్రంలో చెప్పబడిన మోక్షోపాయాలను చక్కగా విచారించే ప్రాజ్ఞుడు భవబంధంనుండి విముక్తు డవుతాడు.
నేను ముందు కధారూపమైన రామాయణకావ్యం రచించి వినయ వివేక సంపన్నుడైన భరద్వాజుడనే శిష్యుడికి బోధించాను. అతడు మేరుపర్వతారణ్యానికి వెళ్ళి ఆ కథను బ్రహ్మదేవుడికి వినిపించాడు. అది విని ఆనందించిన (బ్రహ్మ అతళ్ల్తో నీ కిష్టమైన వరం కోరుకొమ్మన్నాడు (ప్రజలు దుఃఖసాగరంనుండి విముక్తులు కావడానికి తగిన ఉపాయం చెప్పమనీ, అదే తన కిష్టమైన వరమనీ భరద్వాజుడు పరమేష్టిని ప్రార్ధించాడు.
అప్పుడు బ్రహ్మ అతనితో ఇలా అన్నాడు. ““నీవు వాల్మీకి చెంతకు వెళ్ళి ఆయనను ఈ విషయమై అడుగు ఆయన ఇప్పుడు (ప్రారంభించిన రామాయణం విను. అది విన్నవారు సేతువుమీద సముద్రాన్ని దాటినట్లే మోహసాగరాన్ని అనాయాసంగా తరిస్తారు.”
పిమ్మట పితామహుడు భరద్వాజుడితో గూడా నా ఆశ్రమానికి వచ్చాడు. నేను భక్తితో అర్హ్యపాద్యాదులిచ్చి ఆయనను పూజించాను.
ఆ మీదట చతుర్ముఖుడు నాతో మునీంద్రా! ఇప్పుడు నీవు ప్రారంభించిన రామచరిత్ర ప్రయాసకరమని మధ్యలో వదలవద్దు. నావతో సముద్రాన్ని దాటినట్లే జనులు ఈ గ్రంధసహాయంతో త్వరగా సంసారసంకటంనుండి తరిస్తారు. ఈ విషయం
నీతో చెప్పడానికే నే నిక్కడికి వచ్చాను లోకహితార్టమై ఈ శాస్త్రాన్ని సమగ్రంగా రచించు" అని చెప్పాడు
వైరాగ్య ప్రకరణం 7
ఈ విధంగా చెప్పి బ్రహ్మ నీటిలో అలలాగా ఆ(శ్రమంనుండి క్షణంలో అంతర్జానమై పోయాడు నేను ఆళ్ళిర్య చకితుడనయ్యాను. కొంతసేపటికి విస్మయంనుండి తేరుకొని బ్రహ్మదేవుని అభిప్రాయ మేమిటో వివరంగా చెప్పమని భరద్వాజుళ్లో అడిగాను.
అందు కతడు- ''లోకహితార్హమై సంసారసాగరంనుండి తరింపజేసే రామాయణాన్ని సమగ్రంగా రచింపవలసిందని (బ్రహ్మదేవుడు మీతో చెప్పాడు. శ్రీరాముడూ, ఆయనను అనుసరించిన భరతుడు, లక్ష్మణుడు మొదలైన వారు సంసారసంకటంనుండి ఎలా తప్పించుకొని దుఃఖరహితులయ్యారో స్పష్టంగా వివరించండి. అది విని నాతో పాటు ఇతర జనులు గూడా తరిస్తారు" అని అన్నాడు.
రాజేంద్రా! భరద్వాజుని కోరిక ప్రకారం పితామహుని ఆనతి శిరసావహించి నేను అతనితో ఇలా చెప్పటం ప్రారంభించాను.
“వత్సా 1 భరద్వాజా 1 నీ వడిగిన విషయం పూర్తిగా వివరిస్తాను. (శద్రతో విను. ఇది వించే నీమోహం నశిస్తుంది శ్రీరాముడు అన్నిటా నిర్లిప్తుడై ఈ లోకంలో ఎలా సుఖంగా వ్యవహరించాడో అలాగే నీవూ వ్యవహరించడం నేర్చుకో.
లక్మణుడూ, భరతుడూ, శత్రుఘ్నుడూ, కౌసల్యా, సుమిత్రా, సీతా, వసిష్టవామదేవాదులూ, ధృష్టి మొదలైన ఎనిమిదిమంది మంత్రులూ రాముణ్ణ అనుసరించి ప్రవర్తించారు. అందువల్లనే వాళ్ళందరూ జ్ఞానం పొంది సమదృష్టిని అలవరుచుకొన్నారు. విరక్తులై జీవన్ముక్తులైనారు. వాళ్ళు చేసినట్లే హోమదానాది పవి[త్రకార్యాలు చేస్తే నీవు కూడా సంకటం లేకుండా ముక్తుడ వవుతావు.
అపారమైన సంసారసము(ద్రంలో మునిగికూడా పరమయోగాన్ని శీలించి ఉత్క్పష్ట జ్ఞానం పాందిన మానవుడు శోకదైన్యాలకు లోనుగాడు. అట్టివాడు ఆహంకారం వదలి నిత్యతృప్పుడై వుంటాడు.
భరద్వాజుడు :- బ్రహ్మజ్ఞాడవైన వాల్మీకిమహర్డీ ! శ్రీరామునిలా జీవన్ముక్తిని పాందాలంటే ఏ మేమి చేయాలో నాకు (క్రమంగా చెప్పండి. నేను అలా చేసి శాశ్వతసుఖం పొందుతాను.
వాల్మీకి - సాధుశీలుడవైన భరద్వాజా ! ఆకాశానికి రూపం లేదు. అయినా అది నీలంగా వున్నట్టు మనకు (భ్రమ కలుగుతుంది అలాగే ఈ జగత్తుకు ఉనికి లేదు అయినా ఇది ఉన్నట్టు తోస్తుంది ఈ (భ్రమను తొలగించు కోవడమే ముక్తి
8 యోగవాసిష్టం కనబడే వస్తువులకు అస్తిత్వం లేదన్న దృఢజ్ఞానం కలిగితే తప్ప ఎన్నటికీ, ఎవరికీ ముక్తి అనుభవానికి రాదు. అందువల్ల ఆత్మజ్ఞానాన్నై (ప్రయత్నించాలి. ఈ శాస్త్రాన్ని శ్రద్దగా వింటే తత్త్వజ్ఞుడ వవుతావు. తత్త వ్రజ్లానానికి ఇది తప్ప మరొక ఉపాయం లేదు. ఆకసానికి రంగులేదన్న సంగతి పరిశీలిస్తేనే తెలుస్తుంది. అలాగే కనిపించే జగత్తుకు ఉనికి లేదన్న విషయం విచారణతోనే అనుభవానికి వస్తుంది. మనస్సునుండి దృశ్యాన్ని పూర్తిగా తాలగించినప్పుడే నిర్వాణస్థితికి సంబంధించిన పరమానందం లభిస్తుంది. అలా చేయకుండా శా స్ర్రాలనే గుంటలలో పడి పార్ణాడే అజ్ఞానులకు ఎన్ని యుగాలు గడచినా ముక్తి లభించదు. వాసనలను పూర్తిగా త్యజించడవే. మోక్షం. శీతకాలం ముగియగానే మంచుబిందువులు అంతరించిపోతాయి. అలాగే వాసనా క్షయం కాగానే మనస్సు* లయమై పోతుంది. దారం ముత్యాలను ధరించిన రీతిగా వాసనాబలం భూతపంజరమైన ఈ శరీరాన్ని ధరిస్తున్నది. శుద్దవునీ, నులినవునీ వాసన రెండు విధాలు. మలిన వాసన జన్మకు కారణమవుతుంది. శుద్రవాసన జన్మను నశింపజేస్తుంది. అజ్జానంతోనూ, అహంకారంతోనూ వృద్దిపొంది మలినవాసన పఫునర్హన్మను కరిగిస్తుంది. తత్త్వజ్ఞానంతో కూడిన శుద్రవాసన వేగిన గింజవంటిది. అందులో ఫునర్హన్మ అనే అంకురానికి అవకాళం లేదు. జీవన్ముక్తులయిన వారిలో జన్మహేతువు కాని శుద్రవాసన కుండ తయారయిన పిదప పూర్వ వేగంతో తిరిగే కుమ్మరిసారెను పోలి వుంటుంది. శుద్రవాసనాబలంతో ఫునర్హన్మరహితు లయిన తత్త్వజ్ఞాలే జీవన్ముక్తు లనబడుతున్నారు. శ్రీ రామువి తీర్థయాత్ర రాముడు జీవన్ముక్తుడు. అతని కాస్టితి ఎలా కలిగిందో వివరిస్తాను. ఇది వింటే నీకిక జరామరణాలు కలగవు. మహామతివైన ఓ భరద్వాజా ! శుభప్రదమైన ఈ రామచరిత్రను శ్రద్దతో విను. ఇది తెరిసికొంటే నీవు సర్వజ్ఞుడ వవుతావు. శ్రీరాముడు విద్యాభ్యాసం పూరి కాగానే గురుకులంనుండి ఇంటికి వచ్చి €
వైరాగ్య ప్రకరణం 9 విలాసవినోదాలతో హాయిగా కొన్నాళ్ళు గడిపాడు. దశరథ మహారాజుపరిపాలనలో ఏ ఉప([ద్రవమూ లేకుండా ప్రజలు సుఖంగా జీవిస్తున్న రోజు లవి. ఇలా ఉండగా ఒకనాడు శ్రీరాముడికి తీర్హప్టలాలనూ, పవిత్రాశ్రమాలనూ సందర్శించాలనే కోరికగలిగింది. వెంటనే అతడు తండ్రి చెంతకు వెళ్ళాడు. ఆయన పాదాలు స్పృశించి- ''నాన్నా! తీర్చాలూ, దేవలయాలూ, తపోవనాలుూ చూడాలని నాకు చాలా ఉత్కంఠగా వున్నది. నా యీ మొదటి కోరికను మన్నించి నన్ను అనుగ్రహించండి ! ఇంత వరకూ మీరు ఎవరి కోరికనూ నిరాకరించలేదు గదా?” అని ప్రార్ధించాడు. దశరథుడు వసిష్టవహర్షితో ఆలోచించి శ్రీరావుని తీర్ణయా'(త్ర కంగీకరించాడు. శుభనక్షత్రంతో కూడిన ఒక మంచి దినాన లక్ష్మణ శత్రుఘ్నులతో సవా రాముడు తీరయా త్రకు సిద్రమైనాడు. వి'ఫ్రులు స్వస్తివచనాలు పలికారు. కొందరు రాజకుమారులూ, శా,స్త్రృజ్ఞాలైన కొందరు బ్రాహ్మణులూ ఆయన వెంట బయలు దేరారు. తల్టులు ఆశీర్వదించారు. రాముడు ప్రయాణం కాగానే పౌరులు బాకాలు ఊదారు. పుర,స్త్రీలు అతల్లి ఆప్యాయతతో చూచారు. జనపద కాంతలు అతనిపై లాజులు చల్చారు. భూసురులకు దక్షిణ లిస్తూ, ప్రజల దీవనలు వింటూ, దిగంతాలను అవలోకిస్తూ రాముడు ముందుకు సాగిపోయాడు. స్వదేశమైన కోసలమండలంనుండి రాముని యా(త్ర ప్రారంభమయింది. స్నానం, దానం, తపస్సు, ధ్యానం మొదలైనవి అనుష్టిస్తూ అతడు పయనించాడు. పవిత్రనదీతీరాలు, అరణ్యాలు, పర్వత (ప్రదేశాలు, ఆశ్రమాలు, గంగ, కాళింది, సరస్వతి, చంద్రభాగ, ఇరావతి, కృష్ణవేణి మొదలైన నదులూ అతడు సందర్శించాడు. ప్రయాగ, నైమిశం, ధర్మారణ్యం, గయ, కాశి, శ్రీశైలం, చ|క్రతీర్హం మొదలైన పావన (ప్రదేశాలను సేవించాడు. అలాగే కార్తికేయస్వామినీ, సాలగ్రామహరినీ; హరిహరుల అరువదినాలుగు స్టానాలనూ, చతుస్సము(ద్రతీరాలనూ, సప్తకుల పర్వతాలనూ, ముఖ్యులైన రాజర్ములు, (బ్రహ్మర్జులు నివసించే ప్రదేశాలనరా చరౌచాడు. చతుర్దిగంతాలతో సవా సమస్త భూఖండాన్నీ సోదరులతో కూడా పర్యటించాడు. సురనరకిన్నరులు తన్ను పూజించగా సకలభూవలయాన్నీ సందర్శించి. శివలోకానికి వెళ్లే పరమ శవునిలాగా శ్రీరాముడు తిరిగి తన పట్టణానికి వెళ్ళాడు. తోపు
10 యోగాసిష్థం శ్రీరాముని దినచర్య
తీరయా(త్ర ముగించుకొని తిరిగివచ్చిన రాముడికీ పౌరులు పుష్పాంజలులు సమర్పించారు. ఇం(ద్రసుతు డయిన జయంతుడు స్వర్గం ప్రవేశించినట్లు రాముడు రాజభవనం ప్రవేశించాడు.
అక్కడ తండ్రికీ, వసిషుడికీ, జ్ఞాతి సోదరులకూ, బంధువులకూ, కులవృద్దులకూ నమస్కరించాడు. తల్లిదండ్రులూ, మిత్రులూ, ద్విజులూ సంతోషాతిశయంతో అతణ్ణి కొగలించుకొన్నారు. రాముని ఆనందానికి అవధి లేకుండా పోయింది. ప్రియమైన అతనిమాటలు వేణునాదంలాగా రాజగృహంలోనివారి నందరినీ ఆనందింపబేశాయి.
రామునిరాకను పురస్కరించుకొని నగరంలో ఎనిమిది రోజులు ఉత్సవం 'ప్రకటింపబడింది. ఆనందంతో చిందులాడే ప్రజల కోలాహలం మిన్ను ముట్టింది. అప్పటినుండీ వివిధ దేశాచారాలను అనుయాయులకు వివరిస్తూ రాముడు హాయిగా ఇంటివద్దనే ఉండిపోయాడు.
అతడు ఉదయం లేచి సంధ్యావందనాది నిత్యకృత్యాలు నెరవేర్చి ఇంద్రతుల్యుడై కొలువుదీరి వున్న జనకుని సందర్శించేవాడు. అక్కడ వసిషాదులతో గూడి జ్ఞానచర్చ గావిస్తూ మొదటిజాము గడిపేవాడు. పిమ్మట తండ్రి అనుమతితో సైన్యాన్ని వెంటబెట్టుకొని వేటకు వెళ్లేవాడు. వేటనుండి తిరిగివచ్చి స్నానాదికృత్యాలు చేసి మిత్రులతో, బంధువులతో గూడి భుజించి రాత్రి గడిపేవాడు. తీరయాత్రనుండి తిరిగి వచ్చిన తర్వాత పై జె్పేనరీతిగా నిత్యకృత్యాలు నెరవేరుస్తూ సోదరులతో సహా అతడు పీతృగృహంలో నివసించాడు.
తోటి రాజకుమారులతో కలిసి మెలిసి మెలగుతూ సజ్జనుల మనస్సులను రంజింపచేసే మధురాతిమధురమైన వెన్నెలవంటి (ప్రవర్తన గలిగి శ్రీరాముడు దినాలు గడపసాగాడు.
కృశత్వనివేదనం
అప్పటికి రాముని వయస్సు పదునై దేండ్లు. లక్ష్మణుడూ, శత్రుఘ్నుడూ సదా అతడి వెంట ఉండేవారు. భరతుడు మాతామహుని యింటనే సుఖంగా కాలం గడుపుతున్నాడు. దశరథ మహారాజు చక్కగా భూవలయాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు పుత్రుల వివాహ సంబంధాలనుగూర్చి మం (త్రులతో ఆలోచించడం మొదలు
: పెట్టాడు.
వైరాగ్య ప్రకరణం 11
తీరయాత్రలనుండి తిరిగి వచ్చిన తర్వాత రామునిలో ఒక పెద్ద మార్పు గోచరించింది. శరత్కాలంలో మడుగులాగా అతడు రోజు రోజుకూ శ్షీణించి పోసాగాడు. విశాలనేత్రాలు గల ఆ రాకుమారుని ముఖం పాలిపోయి తుమ్మెదలతో గూడి వాడిన తెల్ల తామరపువ్వులా అయిపోయింది. అతడు చింతా(క్రాంతు డయ్యాడు. పద్మాసనస్టుడై చెక్కిలిపై చేయి చేర్చి ఏ పనీ చెయ్యకుండా ఊరక వుండేవాడు. చింతవల్ల చిక్కిపోయి విమనస్కుడై ఎవ్వరితోనూ ఏమీ మాటలాడక చిత్రంలో బొమ్మలాగా వుండిపోయేవాడు. సేవకులు మాటిమాటికీ బతిమాలగా దినకృత్యాలను ఎంతో కష్టంతో నెరవేర్చేవాడు.
గుణసము(ద్రుడైన శ్రీరాముడు అలా దురవస్థకు గురికావడం చూచి అతడి సోదరు లిద్దరూ అలాంటి దుద్దశనే పొందారు. కుమారులు ముగ్గురూ దుఃఖంతో శుష్కించి పోవడం చూచి దశరథుడూ, ఆయన రాణులూ గూడా విచారానికి లోనయ్యారు.
దశరథుడు పలుసార్లు రాముణ్లీ ఒడిలో కూర్పబెట్టుకొని ''నాయనా! ఎందు కిలా చింతిస్తున్నావో చెప్పు? అని ప్రియమైన మాటలతో అడిగాడు. అయినా రాము డేమీ సమాధానం చెప్పలేదు. “తండ్రీ ! నాకు ఏ దుఃఖమూ లేదూ” అని మౌత్రం
' చెప్పీ ఊరకుండేవాడ్డు
పిమ్మట “రాము డెందు కిలా దుఃఖానికి గురి అయ్యాడు ?** అని దశరథుడు ఒకనాడు సర్వజ్ఞుడైన వసిష్టమహర్షిని ప్రశ్నించాడు. ఆ మునీం'ద్రుడు ఒక్క క్షణం ఆలోచించి రాజుతో ఇలా అన్నాడు. -
“మహారాజా 1! ఇందుకు తగిన కారణం లేకపోలేదు. ఈ విషయమై నీవు దుఃఖించవద్దు. తగిన కారణం లేకుండా ధీరులైన వాళ్ళకు కోపమూ, విషాదమూ, మిక్కిలి సంతోషమూ కలుగవు. సృష్టి ప్రభావమో, లేక ప్రళభయవేగమో లేనప్పుడు పృథివ్యాది పంచమహాభూతాలు వికారం పాందుతాయా?
వసిష్టమహర్షి మాటలు విని సంశయదుఃఖాలు పెనగొన్న చిత్తంతో దశరథుడు కొంతక్షాంం మౌనం వహించాడు. అంతఃపురంలోని రాణు లందరూ దుఃఖంతో రాముని నడవడిపై దృష్టి పెట్టి సావధానంగా పరికిస్తూ వుండిపోయారు.
12 ోగూపిష్టం
ఇంతలో సు ప్రసిద్దుడైన విశ్వామిత్రమహర్షి అయోధ్యాధిపతి అయిన దశరథుణ్లి చూడటానికి వచ్చాడు. మాయాబలంతో ఉన్మత్తులైన రాక్షసులు ధర్మకార్య నిరతుడైన విశ్వామిత్రుని యజ్ఞానికి అవరోధం కలిగించారు. అందువల్ల ఆయన నిర్విఘ్నంగా తన యాగం నెరవేర్చ లేక పోయాడు. రాజసహాయంతో రాక్షసులను నశింపజేసి యజ్ఞాన్ని సంరక్షించుకోవాలని అయోధ్యకు వచ్చాడు.
ఆ మునీంద్రుడు రాజమందిర ద్వారాన్ని సమీపించి '“గాధినందనుడు రాజదర్శనానికి వచ్చాడు”' అని భూపాలునికి తెలియపరచవలసిందిగా ద్వారపాలకులను హెచ్చరించాడు. ఆ మాట వింటూనే సంభ్రోంతచిత్తులైన ద్వారపాలకు లందరూ ఆయన రాకను తెలియపరచడానికి రాజగ్భహంలో నికి వెళ్తారు.
అక్కడ సావంంత రాజపరివేష్టితుడ్డై వున్న దశర థవంహారాజుతో ద్వారపాలకులలో ముఖ్యుడైన యాష్టీకుడు ఇలా విన్నవించాడు-
““దేవా! బాలసూర్వునిలా ప్రకాశించే ఒక మహాతేజస్వి ద్వారదేశంలో వున్నాడు. ఆయన జడలు అగ్నిశిఖలలాగా ఎజ్టుగా మెరుస్తున్నాయి. ఆయన తేజస్సు సోకి మన గజాశ్వరథాదులన్నీ బంగారు రంగు దాల్పాయి.:?"
అంతట దళరథుడు య్యీకునివైపు దృష్టి మరలించాడు. యాష్టీకుడు వినయంతో “మహారాజా 1 విశ్వామిత్రమహర్షుల వారు తమ దర్శనం కోసం వచ్చి ద్వారదేశం వద వున్నారు*' అని విన్నవించాడు.
ఆమాట వింటూనే రాజు మంత్రి సామంతులతో గూడా బంగారుగద్దెనుండి లేచాడు. సామంతనరపతులు తన్ను స్తుతిస్తూ వుండగా, వసిష్టవామదేవులూ, ఇతర పరివారమూ వెంట రాగా అతడు కాలినడకతో ద్వారభూమికి వెళ్తాడు. అక్కడ ఏ కారణంతోనో భూతలానికి దిగివచ్చిన సూర్యునిలా (బ్రాహ్మక్షాత్ర తేజస్సులతో ప్రకాశిస్తూ వున్న విశ్వామిత్ర మహామునిని సందర్శించాడు.
వార్హక్యంవల్ల నెరసిపోయి తపస్సువల్ల బిరుసెక్కిన యెజ్ఞుని జడలు సాయంకాల మేఘాలు పర్వతాన్ని కప్పినట్టు ఆ మునీం(ద్రుని భుజస్కంధాన్ని కప్పి వున్నాయి. (ప్రశాంతమూ, దీప్తిమంతమూ అయిన ఆయన శరీరం ప్రసన్న గంభీర మయిన నిండు తేజస్సులను విరజిమ్ముతున్నది. చేతదాల్సిన కమండలువు తప్ప ఇంకెవరూ ఆయనకు తోడు లేరు. మనస్సులో దయా, మాటలలో తియ్యందనమూ, చూపులలో అమృతమూ వొలకబోస్తూ ఆ మునీంద్రుడు ప్రజలకు ఆహ్లాదం
వైరాగ్య ప్రకరణం 13 కలిగిస్తూ వున్నాడు. యజ్ఞోపవీతం ధరించి ఎత్తైన తెల్లని కనుబొమ్మలు మిలమిల మెరుస్తూ వుండగా అక్కడికి వచ్చిన ఆయనను చూచిన వారందరూ ఆళ్ళర్యచకితు “అయ్యారు.
విశ్వామి(త్రుణ్లి చూచి దూరంనుండే దశరథ మహారాజు అవనత శరీరుడై తలవంచి నమస్కరించాడు. మునీంద్రుడు కూడా సూర్యుడు ఇంద్రుడికి చేసినట్టు ఆదరపూర్వకమైన మధురవచనాలతో రాజుకు ప్రత్యభివాదం చేశాడు. ఆ పైన వసిష్టుడు మున్నగు ద్విజులందరూ స్వాగతం పలికి యథోచిత సపర్యలతో కౌశికుణ్లో పూజించారు.
తరువాత దశరథుడు మునీంద్రునితో వినయపూర్వకంగా ఇలా అన్నాడు. -
“*సాధుఫుంగవా | సూర్యుని రాకతో పద్మాకరాల లాగా అనుకోకుండా కల్గిన మీదర్శనంచేత మేము అనుగ్రహింపబడ్డాము. ఆద్యంత రహితమైన అనంత సుఖం మీదర్శనంవల్ల మాకు కలిగింది. మీ అనుగ్రహంచేత మేము ధన్యాతిధన్యుల '
దశరథుని లాగానే విశ్వామి(త్రుణ్లో ప్రశంసిస్తూ ఇతర రాజులూ, మహర్షులూ సభాస్ట్రానం ప్రవేశించారు. తపోనిధి అయిన మునిపట్లు ఏమి అపచారం కలుగుతుందో అని ఒక వంక భయపడుతూనే చాలా అణకువ చూపుతూ రాజు నగుమోముతో ఆయనకు అర్యం సమర్పించాడు. శాస్రోక్త రీతిగా అర్హ్య మిచ్చి ప్రదక్షిణం చేస్తున్న రాజును విశ్వామిత్రుడు మిక్కిలిగా ప్రశంసించాడు. తనకు జరిగిన సత్కారంవల్ల 'ప్రసన్నముఖుడై ఆయన వసిష్టుణ్లీ, దళరథుణ్ణీ ఉచితరీతిని గౌరవించి కుశల మడిగాడు.
ఇలా పరస్పరం పూజాసత్కారాలు చేసుకోవడం పూర్తి కాగానే అందరూ సంతుష్టమనస్కులై రాజభవనంలో సుఖాసీనులయ్యారు.
కౌశిక్రమునికి భూరిఠక్షిణలు సమర్పించి చేతులు జోడించుకొని నృపాలుడు ప్రీతితో ఇలా అన్నాడు.- '
“మహామునీ ! మరణించేవానికి అమృతం దొరకినట్టూ, కరవులో వాన కురిసినట్టూ, గ్రుడ్డివానికి చూపు వచ్చినట్యూ మీ దర్శనం మాకు లభించింది. సంతతి లేనివానికి ఇష్టకళత్ర సంపర్భంతో పుత్రుడు కలిగిన రీతిగానూ, కలలో కనిపించిన వస్తువు చేతికి చిక్కిన విధంగానూ, ఈప్సితార్దం సిద్దించినట్టుగానూ,
[త యోగవాసిష్టం ఇష్టు లయినవాళ్లు ఇంటికి వచ్చిన మాదిరిగానూ, పోగొట్టుక్న్న వస్తువు దొరకిన తీరుగానూ అపూర్వమయిన మీ ఆగమనం మాకు ఆనంద కారణ మవుతున్నది. మరణించినవాడు ఆకాశయానంతో తిరి గివచ్చినప్పుడు కలిగినంత హర్షం మీ రాక వల్ల మాకు కలిగింది. మీ కిదే స్వాగతం 1 మీ సాన్నిధ్యంవల్ల మే మిప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నట్టు ఆనందిస్తున్నాము. మునీంద్రా! ఇది ముఖప్రీతై చెప్పే మాటగాదు. నిజంగా చెబుతున్నాను. మీకోరిక ఏమిటో సెల వియ్యండి ! మీకొజకు నేను ఏమి చెయ్యాలో చెప్పండి! మీరు పరమధార్శికులు, నాకు మిక్కిలి దానపాత్రులు, భగవన్! మీరు ముందు రాజర్లులై తర్వాత తపోదీప్తీవల్ల (బ్రహ్మర్షిత్వం పొందిన మహానుభావులు 1 మా కెంతో పూజనీయులు 1 గంగాస్నానం చేత తాపం శమించినట్సే మీ దర్శనంతో నా అంతఃకరణం చల్లబడింది. (బ్రహ్మర్షీ! మీకు కోరిక భయం, కోపం అనేవి లేవు. మీరు వీత రాగులు,. నిరామయులు, అయినా మీరు నా దగ్గరకు రావడం ఆశ్చర్యకరం ! తత్త్వవేత్తలలో (శ్రేష్టడవైన ఓ మహర్షీ! మీ రాకతో మాయిల్టు పావన మయింది. నేను పాపరహితుళ్లే అయ్యాను. అమృత మయమైన చంద్రబింబంలో తేలియాడే వానిలా నాలో నేను ఆనందిస్తున్నాను. మీ రాక సాక్షాత్తూ చతుర్ముఖబ్రహ్మరాకతో సమానమైనదిగా భావిస్తున్నాను. నేనెంతో పవిత్రుణ్లి అయ్యాను. నా జన్మ సఫల మయింది. నా జీవితం సార్ధక మయింది. చంద్రుణ్ణి చూచి సముద్రం ఉప్పాంగినట్టు మిమ్మల్ని చూచి ఆనందంతో ఉప్పొంగి పోతున్నాను. మునిఫుంగవా ! మీరు ఏ పనిమీద ఇక్కడికి వచ్చారో ఆ పని నెరవేరినట్టు భావించండి! మీరు సదా మాకు మాన్యులు గదా ! మీ ఆగమన (ప్రయోజన మేమిటో నిస్సంకోచంగా సెల వియ్యండి ! మీకు ఇవ్వదగని దంటూ ఏమైనా ఉన్నదా ? మాకు మీరు పరమ దైవతస్వరూపులు. మీ కార్యం నెరవేర్చే భారం నాది. ఈ విషయంలో మీకు ఏలాంటి సందేహ మక్కర లేదు.* ఇలా వినయంతో దశరథుడు చెప్పిన చెవుల కీంపైన మధురవచనాలు విని విశ్వామిత్రమునీంద్రుడు చాలా సంతోషించాడు.
ట్రైతాగ్య ప్రకరణం 15 రాజసింహుడైన దశరథుని మాటలు విని పులకితగాత్రుడై విశ్వామత్రు డతనితో ఇలా అన్నాడు- "
““రాజేంద్రా! గొప్ప వంశంలో పుట్టి వసిష్టుని ఆనతి ననుసరించి ప్రవర్తిస్తున్న నీ కొక్కడ్కే ఇలాంటి బౌదార్యం చెల్లుతుంది. నా అభిప్రాయం నీతో చెబుతాను. అది విని కర్తవ్యం నిర్ణయించి ధర్మాన్ని రక్షించవలసిన భారం నీది.
నేను సిద్ది నపేక్షించి యజ్ఞం చేయబూనుకొన్నప్పుడు కందరు ఘోరరాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. దేవతల నుద్దేశించి నేను యజ్ఞం చేస్తుంటే రక్కసులు వచ్చి దాన్ని పాడుచేస్తున్నారు. ఎన్నో సార్గు ప్రయత్నం చేశాను. కాని ఆ దుర్మార్గులు రక్తమాంసాలు యజ్ఞభూమిపై చల్లి నా ప్రయత్నాలను వమ్ము చేశారు. కడకు నేను నిరుత్సాహపడి ఇప్పుడు నీవద్దకు వచ్చాను. శాపంతో నిశాచరులను నశింప జేయవచ్చు. కాని (క్రతుసమయంలో కోపశాపాలు పనికిరావు. అందువల్ల నీ సహాయంతో యాగం పూర్తిచేసి ఫలం పాందాలనుకొన్నాను. శరణార్థి నైన నన్ను రక్షించడం నీ ధర్మం. సజ్జనులు అర్జులను నిరసించరు కదా !
నృపథ్రేష్టా ! నీ కొడుకు శ్రీరాముడు పులివంటి పరా[క్రవముం కలవాడు; మహేం(ద్రునితో సమానమైనవాడు; అతడు రక్కసులను అవలీలగా జయించగలడు. సత్యపరా[క్రముడూ, కాకపక్షధరుడూ, మహాశూరుడూ అయిన నీ జ్యేష్ట పుత్రుణ్ణి నా వెంట పంపు. నా రక్షణ క్రింద అతడు రాక్షసులను నిర్మూలిస్తాడు. అతనికి నేనెంతో శ్రేయస్సు చేకూరుస్తాను. అందువల్ల అతడు (త్రిలోకపూజ్యు డవుతాడు. కోపించిన సింహం ముందర లేళ్లు నిలబడ లేనట్టు రాముడి ముందు రక్కసులు నిలువలేరు. ఏనుగును ఎదుర్కోవటానికి సింహం తప్పు ఇతరమృగాలు ముందుకు రావు. అలాగే రాముడు తప్ప రాక్షసులతో పోరాడటానికి ఇంకెవరూ ఉత్సాహపడరు.
బలగర్వితు లయిన రక్కసులు మహాపాపాత్ములు. వాళ్ళు కాలకూటంతో సమానులు. ఖరదూషణభృత్యులైన ఆ దైత్యులు రణరంగంలో కోపించిన యమునిల వుంటారు. అయినా ధూళి వర్షధారలను సహించలేనట్టు వాళ్ళు శ్రీరాముని బాణపరంపరకు తట్టుకోలేరు. పుత్రస్నేహంతో నాకోరికను తిరస్కరించవద్దు. మహాత్ములకు ఈ ప్రపంచంలో ఈయదగని దేమీ లేదు. రాముడు నాతో వస్తే రాక్షసులు చచ్చినచ్లే అనుకో 1 ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేది.
16 యోగవాసిష్టం నీ కుమారుని ప్రభావం నాకు తెలుసు. దీర్ద దృష్టిగల వసిష్టుడు మొదలైన వారికందరికీ రాముని గొప్పతనం తెలిసిందే. ధర్మం, మహత్త్వం, కీర్తి- వీటిపైన నీకు మనసుంచే నేను కోరినట్టు రాముణ్ణి పంపించు. నా యజ్ఞం పదిరోజులలో పూర్తి అవుతుంది. యజ వినాశకులను రాముడు సంహరిస్తాడు. వసివ్పాదుల అనుమతి గూడా తీసుకొని రాముణ్లీ నాతో పంపే ఏర్పాటు చేయించు. సమయం మించి పోకుండా త్వరగా ఈ పని నెరవేర్చు. నీకు శుభమగు గాక రాముణ్లీ పంపవలసివచ్చిందే అని విచారపడవద్దు. తగిన సమయంలో కొంచెం మేలు చేసీనా అది మహోపకారమే అవుతుంది. సమయం మించిన తర్వాత చేసేది ఎంత గొప్ప సహాయమైనా అది ఉపకార మనిపించుకోదు.:?: ధర్మాత్ముడు, మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు ఇలా చెప్పి దశరథుని సమాధానం కోసం ప్రతీక్షిస్తూ వూరకుండి పోయాడు. ఆయనకు తగిన ప్రత్యుత్తరం ఆలోచిస్తూ కొంతసేపు రాజు కూడా మౌనం వహించాడు. అభీష్టం నెరవేరని = బుద్దిమంతుడు యుక్తియుక్తమైన మాటలు చెప్పకపోతే తృప్తిచెందడు గదా | దశరథుని వచనాలు విశ్వామిత్రుని పలుకులు విని దశరథమహారాజు క్షణకాలం న్మ్చోష్టు డయ్యాడు. తరువాత దైన్యంతో ఇలా అన్నాడు. - “మునీంద్రా ! పద్మనేత్రుడైన రాముడి వయస్సు పదునైదేండ్లే. ఇప్పుడు రక్కసులతో పోరాడగల సామర్ధ్యం అతడికి వున్నదని నే ననుకోను. నిండైన ఒక అక్షౌహిణి సేనకు నేను అధిపతిని. ఈ సైన్యంతో వచ్చి నేనే దానవులతో యుద్దం చేస్తాను. శూరులైన మా సైనికులు మంచి యుక్తిపరులు; మహాపరా[క్రమవంతులు. ధనుర్దారినై రణరంగంలో నిలబడి వీరికి నేను రక్షణగా వుంటాను. సింహం మదపు టేనుగుల నెదుర్కొన్నట్టు మహేంద్రునివంటి మహావీరులనైనా సరే నేను సమరభూమిలో ఎదుర్కొంటాను. రాముడు బాలుడు. అతనికి సైన్యాల బలాబలాలు తెలియవు. అంతఃపురంలో వినోదార్ధం కల్పింపబడ్డ రణరంగం తప్ప అతడు వేరే యుద్రభూమిని చూచినవాడు కాడు. అస్త్రశస్రాలతో అతనికి పరిచయం లేదు. యుద్దంలో నేర్పరి కాడు. శూరులైన శత్రువులతో ఎలా పోరాడాలో తెలియనివాడు వితులతో గూడి
వైరాగ్య ప్రకరణం 17 ఉద్యానవనాలలోనూ, పూలు పరచిన ('ప్రాంగణాలలోనూ ఏలాసంగా విహరించడమే అతడికి తెలుసు. అంతేకాదు. మహర్షీ ! నా దురదృష్ట్రంవల్ల ఇటీవల రాముడు మంచుకు తడిసిన పద్మంలాగా శోభావిహీనుడై పాలిపోయి ఎంత్ కృశించిపోయాడు. సరిగా అన్నం తినడు. ఇంటిలో గూడా ఇటూ అటూ విహ రించలేక పోతున్నాడు. మనస్సులో ఎప్పుడూ ఎదో విచారపడుతూ ఊరక వుంటున్నాడు. మునీశ్వరా |! అందువల్ల నేనూ, నా భార్యలూ, నా పరివారమూ రాముడీ దుఃస్టితి చూచి శరత్కాలంలో మబ్బులలాగా సారహీనులమయ్యాము. ఇలా మనోవ్యాధికి లోనైన ఈ కు(ర్రవాళ్లి రాక్షసులతో యుద్దం చేయడానికి ఎలా పంపేది? ఓ మహామతీ! బాలాంగనాసంగంకంటే, సుధారసంకంచే, రాజ్యంకంటే గూడా పుత్రస్నేహం ఎక్కువ సుఖప్రదమైనది. సజ్జనులు గూడా పుత్రస్నేహానికి లొంగి ఏమాత్రం సందేహించకుండా దురంతాలకు పాల్పడుతూ వుంటారు. ముని శ్రేష్థా! మానవులు ధనాన్నీ, సుఖాన్నీ, భార్యనూ, తుదకు (ప్రాణాలను గూడు వదుల్తారు. కాని కన్నకొడుకును వదలలేరు. ఇది (ప్రాణుల స్వభావం. దైత్యులు వుహా(కూరకర్ములు. కూటయుడ్దంలో ఆరితేరిన ఆమాయావులతో రాముడు యుద్దం చేయడ మనేది ఏమాత్రం పాసగని సంగతి. రాముళ్లో వదలి నేనాక్క క్షణమైనా మనలేను. అతళ్లో మీరు తీసుకుపోవడం తగదు. సంతానం లేదని పెక్కు సంవత్సరాలు చింతించి తుదకు ఎంతో కష్టంమీద ఈ నలుగురు బిడ్డలనూ కన్నాను. వీరిలో రాముడు చాలా ముఖ్యుడు. అతడు లేకుండా తక్కిన ముగ్గురు గూడా ప్రాణాలతో వుండలేరు. అలాంటి రాముళణ్లీ మీరు నిజంగా యుద్దానికి తీసుకు పోవడమే జరిగితే నేను పు త్రహీనుణ్ణై మరణించినట్లే అనుకోండి. నలుగురు కొడుకుల్లోనూ నాకు రాముడంటే మిక్కిలి యిష్టం. బ్యేష్టుడూ, ధర్మమయుడూ అయిన రాముళ్లీ మీరు తీసుకపోవద్దు. మునీంద్రా! అసురసైన్యాన్ని హతమౌార్భడమే గదా మీకు కావలసింది ? అయితే చతురంగబలాలతో నన్నే రణరంగానికి రానీయండి ! ఇంతకూ ఆ రాక్షసుల బలం ఎలాంటిదో, వాళ్లు ఎవరి కొడుకులో, ఎంతమంది వుంటారో, ఎవరెవరో దయచేసి స్పష్టంగా వివరించండి! రాముడైనా, నా యితర ఫుత్రులైనా, నేనైనా ఆ మాయావులను ఎలా ఎదుర్కోవాలి ? రాక్షసులు బలగర్వితులు గదా ! యుద్రభూమిలో వాళ్ళతో తలపద్దప్పుడు ఎలా మెలగాలో తెలియ జెప్పండి ! ౯3
18 యయోగవాసిస్టం
వైశవణున సోదరుడూ, విశ్రవసుని పుత్రుడూ అయిన రావణుడనే వాడూ. మహాపరా[క్రమవంతుడని వింటున్నాము. ఆ దురాత్ముడేనా మీ యజ్ఞానికి విఘ్నం కల్గిస్తున్నది ? అయితే వాడి విషయంలో మేము చేయగలిగిందేమీ లేదు. అతడితో మేము పోరాడలేము. భగవన్ ! ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిలో బలసంపదలు వృద్దిపాందుతూ వుంటాయి. వుళ్ళీ కాలాంతరంలో నశిస్తూ వుంటాయి. ఈకాలంలో రావణాదుల ముందు నిలబడగల శక్తి మాకు లేదు. ఇది దైవనిశ్చయం.
ధర్మజ్ఞుడవైన ఓ మునీంద్రా! నా ఫు(త్రుని మీదా, మందభాగ్యుడనైన నా మీదా దయజూపండి ! మాపాలిటి పరదేవతలు మీరే కదా 1 దేవ దానవ గంధర్వాదులలో ఎవరూ రావణుడితో సంగ్రామం సల్పలేరు. ఇక మానవులను గురించి చెప్పవలెనా? మహాపరాక్రమ వంతులయిన ఇం'(ద్రాదులనే వాడు ఓడించాడు. అతడితో పోరాడటం మాకే సాధ్యం కాని పని. ఇక ఈ బాలకులు ఏం చేస్తారు ?
ఇప్పుడు కాలం ఎంతో మారిపోయింది. సజ్జనులు దుర్ధలులైపోయిన కాలమిది. నేను సుప్రసిద్రమైన రఘువంళంలో పుట్టినా వార్దక్యంవల్ల శక్తి హీనుల్లి అయ్యానః మునీంద్రా! ఒక వేళ మీ యజ్ఞం పాడు చేసేవాడు రావణుడు కాక మధుపుత్రుడైన లవణాసురుడైనా నేను నా పుత్రుణ్మి మీతో పంపలేను. యవఎనివంటి సుందోపసుందుల పుత్రులైనా నా కుమారుణ్ణి పంపజాలను.
(బ్రహ్మర్లీ ! ఒకవేళ రాముళ్లి మీరు తీసుకుపోవడం తప్పనిసరే అయితే నేను మరణించినట్లే భావించండి! ఆఫ్రితిలో నాకు మరణం తప్ప మరొక శరణం లేదు.”
రఘుకుల శ్రేస్టుడైన దశరథుడు ఇలా మృదువుగా చెప్పి విశ్వామిత్ర మునీంద్రుని కోరిక ఎలా తీర్చాలో తెలియక సంశయ కల్గ్లోలంలో మునిగిపోయాడు. ఉత్తుంగ తరంగాలతో గూడిన సాగరంలో బడిన వానిలా ఎటూ నిశ్చయించలేక దిక్కుతో చనివాడయ్యాడు.
వసిష్టువి ఓదార్పు
పుత్రస్నేహం వల్ల కలత జొందిన కనులతో దశరథుడు చెప్పిన మాటలు విని కౌశికుడు మిక్కిలి కోపించి రాజు నుద్దేశించి ఇలా అన్నాడు. -
“రాజా ! మీ పని నెరవేరుస్తాను అని ముందు మాట యిచ్చావు. మళ్ళీ నీ (ప్రతిజ్ఞను నీవే భంగపరుస్తున్నావు. వయందు సింహమై తర్వాత లేడి కాగోరుతున్నట్టున్నది నీ ప్రవర్తన ! కులవిరుద్దమైన ఈ పని రఘుకులంలో
వైరాగ్య ప్రకరణం 19 జన్మించినవాళ్ళకు ఎంత మూత్రం తగదు. చం(ద్రుడినుండి వేడికిరణాలు 'ప్రసరిస్తాయా? రాజా ! ఈ పని నీవల్ల కాని పక్షంలో నేను వచ్చిన దారినే తిరిగి వెళతాను. మాట తప్పిన ఓ కాకుత్చుడా! నీవు నీ బంధువులతో సుఖంగా వుండు."
మహాత్ముడైన విశ్వామిత్రు డలా క్రోధావిష్టుడు కాగానే భూమండలమంతా గడగడ వణకింది. దేవతలు భయపడ్డారు. కౌశికుడు కక్రోధోద్లీప్పుడైనాడని గుర్తించి ధృతిమంతుడూ, ధీమంతుడూ, సువ్రతుడూ అయిన వసిష్ట మునీంద్రుడు దశరథునితో ఇలా అన్నాడు.-
“మహారాజా! నీవు సాక్షాత్తూ ఇత్చా;కు వంశంలో జన్మించిన ధర్మమూరర్తివి; సద్గుణ సంపన్నుడవు, ధీరుడవు, సువ్రతుడవు. ధర్మంతోనూ, కీర్తితోనూ ముల్లోకాలలో విఖ్యాతి చెందావు. అట్టి నీవు మాట తప్పడం ఏమాత్రం తగదు సుమా!
స్వధర్మం పాలించు. ధర్మం వదలవద్దు, లోకపూజ్యుడైన ఈ మునీం ద్రుని వూట శిరసా వహించు. ఆడి తప్పావంటే యజ్జ్ఞయాగాదులవల్హా, కూపఖననాదులవల్హా నీ వార్చించిన పుణ్యం నశిస్తుంది. కాబట్టి రాముణ్జో మునితోకూడా పంపు. ఇత్వాకు వంశంలో పుట్టీ, దశరథ మహారాజువై యుండీ, నీవే ఆడిన మాట తప్పితే ఇక మాట నిలబెట్టుకొనేవా డెవడు ? మీలాంటివాళ్ళ ఆచరణను బట్టే జనులు శాస్త్ర మర్యాదకు లోబడి వ్యవహరిస్తున్నారు. ఆ మర్యాద నతిక్రమించడం నీకు పాడిగాదు.
రాముడు యుద్దంలో నిఫపుణుడైనా, కాకపోయినా, అగ్నిరక్షణలో ఉన్న అమృతం లాగా పురుషశ్రేష్టుడైన ఈ మునీం(ద్రుడి రక్షణలో వుంచే అతణ్ణి రాక్షసులు చెనక లేరు. ఈ మునీశ్వరుడు రూపుదాల్చిన ధర్మం. అంతేకాదు, మహాతపోనిధి. తపోబలంలో గానీ, బుద్దిబలంలో గానీ ఈయనను మించినవారెవరూ లేరు. ఈయనకు తెలిసినన్ని అస్త్రాలు తెలిసినవారుగాని, తెలుసుకోగలవారు గానీ
ముజ్జగాలలో ఎవరూ లేరు. దేవతలూ, బుషులూ, రాక్షసులూ, యక్షులూ, గంధర్వులూ ఒక్కటిగా కలిసినా ఈ మునీశ్వరునికి సాటి రాజాలరు సుమా | పూర్వం ఈయన రాజ్యాధిపత్యం స్వీకరించినప్పుడు ఇతరులకు అజేయాలైన అస్త్రాలను కృశాళశ్వుడు ఈయనకు (ప్రసాదించాడు. కృళశాశ్వుూనిబిడ్డ లూ, మహాతేజస్సంపన్నులూ, రుద్రునితో సమానులూ అయిన నూరుమంది అస్త్ర
20 యోగవాసిష్టం దేవతలు నాటినుండీ ఈ మునీం(ద్రుణ్లీ విడువక సేవిస్తున్నారు. వాళ్ళు కృశాశ్వుడు చేపట్టిన జయ, సుప్రభ అనే దక్షుని పుత్రికలకు చెరి ఏబైమంది చొప్పున పుట్టారు. అందులో కామచారులైన జయాఫపుదత్రులు అసురులను సంహరించడంలో మిక్కిలి సమర్హులు. దుద్దర్షులనబడే సు(ప్రభసుతులు మహాబలవంతులు, అజేయులు, భీకరాకారులు.
విశ్వామిత్రమహర్షికి ఇంత పెద్ద బలం ఉన్నది. ఈయనతో కూడా పంపితే రాముడికి ఏమవుతుందో అనే చింత నీకు వద్దు. మహాసత్తుుడైన ఈ మహనీయుడు అండగా వుంచే మృత్యువు సమీపించిన వాడికి కూడా అమరత్వం సిద్రిస్తుంది. ఈ విషయంలో మూఢునిలా నీవు దీనుడివి కావద్దు. '*
రామువి విషాదం
వసిష్టుడలా చెప్పేసరికి దశరథుడు సంతుష్టు డయ్యాడు. పిమ్మట ద్వారపాలకుళణ్లీ చూచి సత్యపరా(క్రముడైన రాముణ్లి లక్ష్మణునితో గూడ అక్కడికీ తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.
దౌవారికుడు అంతఃపురానికి వెళ్ళి కణంలో తిరిగివచ్చి రాజుతో ఇలా విన్నవించాడు. -
“దేవా ! రా(త్రివేళ పద్మంలోని తుమ్మెదలాగా రాముడు తన యింటిలో విచారగ్రస్తుడై వున్నాడు. మీరు పిలుస్తున్నారని చెప్పగా '“ఇప్పుడే వస్తున్నాను పది' అని అంటూనే చింతా(క్రాంతుడైనాడు. ఖిన్నుడైన మీపుత్రుడు ఎవరిచెంత వుండటానికీ ఇష్టపడటం లేదు.” -
అది విని దశరథుడు ద్వారపాలకుని వెంట వచ్చిన రాముని సేవకులను చూచి “రాము డెలా వున్నాడు ?*' అని ప్రశ్నించాడు.
విషల్లులైన రామానుచరులు నరపాలకునితో ఇలా చెప్పారు. -
*“దేవా! మీ కుమారుడు దుఃఖంతో కృశించిపోయాడు. అది చూచి మేమూ చింతతోచిక్కి సగమై ఎలాగో ఈ శరీరాలను నిల్పుకొని వున్నాము. తీర్రయా త్రనుండి తిరిగి వచ్చినప్పటినుండీ రాముడు దుఃఖానికి గుటీ అయ్యాడు. మేము ఎంతగానో 'ప్రార్దిస్తే నిత్యకృత్యాలను ఒక్కొక్కసారి చేస్తాడు. ఒక్కొక్కసారి మానేస్తాడు. స్నానం, దేవతార్చన మొదలైన పనులమీద గూడా అతనికి మనసు లేదు. మేమెంత బతిమా లినా తనివి దీర అన్నంకూడా తినడం లేదు.
వైరాగ్య ప్రకరణం 21
అంతఃపుర కాంతలతో విలాస్రీడలు సల్పడు. పతనం సమీపించిన వాడికి స్వర్గం సుఖ(ప్రదం కానట్లే కేయూర కటకాదులైన ఆభరణాలు అతడి కానందం కల్గించడం లేదు. పూలగాలులు వీచే లతాగృహాలలో వున్నప్పుడు గూడా విషాదంతోనే కనిపిస్తాడు. సుఖావహాలూ, మనోహరాలూ అయిన భోగ్యపదార్జాలను చూస్తూ దుఃఖంతో కన్నీరు కారుస్తాడు. ఉజ్జ్వలమైన వేషంతో హావభావాలు ఒలికిస్తూ నృత్యం చేసే అంగనలను చూచి “' దుఃఖదాయినులైన వీళ్ళతో నాకేమి పని ?** అని నిందిస్తాడు. పిచ్చివానిలా స్నానభో జనాదులను ఈసడీంచుకొంటాడు.
“సంపదలూ, అపదలూ, ఇళ్ళూ, వాకిళ్ళూ, కోర్కెలూ- అశాశ్వతాలైన వీటితో నాకేమి పని ?*” అంటూ ఒంటరిగా కూర్చుంటాడు. పరిహాస (ప్రసంగాలలో పాల్గొనడు. భోగాలపై ఏమా(త్రం ఆసక్తి చూపడు. ఏపనీ చేయకుండా మౌనంగా ఉంటాడు. అడవులలోనూ, నదీతీరాలలోనూ ఏకాంతంగా వుండటానికి ఇష్టపడుతూ సన్నాాసిలాగా ప్రవర్తిస్తున్నాడు. -
మహారాజా! విజన ప్రదేశంలో పద్మాసనస్టుడై ఎడమ చేత చెక్కిలి వుంచుకొని రాముడు శూన్యమనస్కుడై వుంటాడు. అతడి కభిమానం లేదు. రాజు కావాలన్న కాంక్ష లేదు. సుఖానికి పొంగడం, దుఃఖానికి (క్రుంగడం అనేవి లేవు. అతడు ఏమి ఆలోచిస్తుంటాడో, ఏమి చేస్తాడో, ఎందుకు తిరుగుతాడో, ఏమి వెదుకుతుంటాడో మాకు బొత్తిగా అంతుచిక్కడం లేదు. దినదినానికీ విరక్తుడై శిశిర బుతువులో చెట్టు లాగా పాలిపోతున్నాడు. అది చూచి లక్మణ శత్రుఘ్నులు గూడా అతని ప్రతిబింబాలలాగే తయారయ్యారు.
సేవకులూ, సామంతనరపతులూ, తల్టులూ- ఎవరైనా ''ఈ విచారానికి కారణ మేమిటి ?”* అని ఎన్నిసార్లు అడిగినా '' ఏమీ లేదు?” అని చెప్పి వూరకుంటాడే గాని సరైన సమాధానం చెప్పడు.
అంతేగాదు. తన చెంతనున్న మిత్రులకు 'ఈ భోగాలన్నీ ఆపాతరమణీయాలు; వీటిపై మనస్సు పెట్టువద్దు'” అని ఉపదేశిస్తున్నాడు. '“మోక్షానికి ఉపయోగపడని నిరర్ధకమైన చేష్టలతో ఆయుస్సు గడచిపోతున్నది''. అంటూ మాటి మాటికీ మృదుమధురమైన స్వరంతో గానం చేస్తూవుంటాడు. ప్రక్కనవున్న అనుచరులెవరైనా ''స(మ్రాట్టువై సుఖించు"” అని చెప్పితే వాళ్ళను పిచ్చివాళ్ళ క్రింద జమకట్టి అన్యమనస్కుడై నవ్వుకొంటాడు.
22 యోగవాసిష్టం అతడు ఇతరులు చెప్పేది వినడు. ఎదురుగావున్న వస్తువులను కనడు. అది ఎంత మంచి వస్తువైనా సరే, దానిపట్ల తిరస్కారదృష్టి తోనే వ్యవహరిస్తాడు. మనస్సూ అది చేసే కల్పనలూ గగనకుసుమాల వంటి వని భావించి రాముడు దేనికీ ఆళ్ళర్యపడడు. జలధారలు పెద్దబండను భేదించలేనట్టు కామినుల మధ్యవున్నా రాముళ్ణో మదనబాణాలు భేదించలే కున్నాయి. ధనం ఆపదలకు పుట్టిల్లని తలంచి సొమ్మంతా యాచకులపాలు చేస్తున్నాడు. '“ఇది ఆపద, ఇది సంపది' అనే యీలాటి భావాలన్నీ మనస్సులో కల్పితమైన మోహమే అని ఏవేవో శోకాలు పాడుకుంటూ వుంటాడు. “అయ్యో ! హతమైపోయాను, అనాథుణ్లీ అయ్యాను” అని ఒకప్రక్క ఏడుస్తూ గూడా జనులు విరక్తి చెందరే ! ఇది ఎంత వింత'' అని అనుకుంటూ" వుంటాడు. రఘుకుల (శ్రేష్ఫుడైన రాముడిలా అయ్యే సరికి వేవుంతా చింతా(క్రాంతుల మయ్యాము. మహారాజా ! ఇలాంటి రాముడితో ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు. ఇక మీరే మొకు గతి | ఎవరైనా తనకు హితం చెప్పడానికి వస్తే వాళ్ళను తిరస్కరిస్తాడు. ఈ జగమంతా మిథ్య అని భావిస్తున్నాడు. శత్రుమి(త్రులనూ, కష్టసుఖాలనూ, రాజ్యూన్నీ తుదకు తన శరీరాన్ని గూడా అతడు లక్ష్య పెట్టడం లేదు. రాముడికి దేనిపైనా ఇచ్చలేదు. మనశ్శాంతి గూడా కజవై పోయింది. అతడు మూఢధుడూ కాడు, ముక్తుడూ కాడు. అందువల్ల మేమంతా ఎంతో చింతిస్తున్నాము. ధనమూ, రాజ్యమూ, కోరికలూ వీటితో తనకేమీ పని లేదని నిశ్ళ్చియించుక్"ని తుదకు అతడు (ప్రాణత్యాగానికి గూడా సిద్దమై వున్నాడు. అనానృష్టి చాతకపక్షీకి ఉద్వేగకరమైనట్టు రాజ్యభోగాలూ, తల్లిదండ్రులూ, కడకు తన జీవితం గూడా అతడికి ఉద్వేగ హేతువు లయ్యాయి. మహాప్రభూ 1 మీ పుత్రుడి కింత ఆపద వాటిల్లింది. అది నానాటికీ శాఖోపశాఖలుగా పెరుగుతున్నది. దయచేసి దాన్ని తొలగించటానికి ప్రయత్నించండి. దేవా! ఐశ్వర్యసంపన్నమైన ఈ సంసారాన్ని రాముడు విషంలా భాఏస్తున్నాడు. అతడి మనస్సును ఈ దుఃస్రితినుండి మామూలు పరిస్టితికి మళ్ళించగల మహామహు లెవరు? భాస్కరుడు చీకటిని సోగొట్టి తన పేరు సార్హకం చేసుకొన్నట్లు రాముడి మోహాన్ని తొలగించి తమ సాధుత్వాన్ని సఫలం చేసుకోగల మహానుభావు లెవరైనా ఉన్నారా?”
వైరాగ్య ప్రకరణం 23 ఆస్థానమునకు రాముని రాక
రాముని పరిఫ్రితి విన్న విశ్వామిత్ర మహర్షి అప్పుడు ఇలా అన్నాడు. -
4“ ప్రాజ్ఞులారా ! అలా అయితే మీరు వెంటనే వెళ్ళి లేళ్ళు తమ నాయకుడైన లేడిని తీసుకువచ్చినట్లు రాముణ్ణి ఇక్కడికి తీసుకురండి ! ఈ ఫ్రితి అతడికి ఆపదవల్ల గానీ, రాగంవల్ల గానీ, కలిగింది కాదు. వివేక వైరాగ్యాలవల్ల ఏర్పడ్డ మోహ మది. రాముణ్లీ ఇప్పుడే ఇక్కడికి పిలుచుకు రండి 1 గాలి కొండమీది వుబ్బును ఎగురగొట్టినట్టు మేము క్షణంలో అతని మోహాన్ని తొలగిస్తాము. అది తొలగిపోతే రఘునందనుడు మాలాగానే నిర్విచారంగా ఆనందంతో వుంటాడు. అమృతం (త్రాగిన వానిలా తాపం తీరి తష్టినీ, ఫుష్టినీ, (ప్రజ్ఞనూ, శరీర లావణ్యాన్నీ చేకూర్చుకొంటాడు. అప్పు డతడు నిండు మనస్సుతో నిర్విఘ్నంగా నిజ ధర్మం నిర్వహించుకొంటాడు. మహాసత్తుడై సృష్టి తత్త్వం గ్రహించి సుఖదుఃఖాల కతీతుడై సర్వత్రా సమదృష్టి కలవాడవుతాడు.”” చా
మునివర్యుని మాటకు సంతసించి దశరథుడు రాముణ్ణి పిలుచుకురండని మళ్ళీ దూతలను పంపాడు.
ఇంతలో తండ్రి చెంతకు పోవడానికై రాము డక్కడ ఉదయాదద్రి నుండి సూర్యుడు లేచినట్టు ఆసనం నుండి పైకి లేచాడు. లక్మణ శత్రుఘ్నులూ, కొందరు సేవకులూ వెంటరాగా అతడు స్వర్గతుల్యమైన జనకుని సభాస్ట్రానానికీ వచ్చాడు.
అక్కడ దేవతల మధ్య కొలువుదీరిన ఇంద్రునిలా రాజమండల పరివేస్టేతుడై వున్న మహారాజును దూరంనుండే చూచాడు. నరపతికి ఇరుప్రక్కలా వసిష్ట విశ్వామిత్రులు కూర్చొని వున్నారు. అఖిల శా(స్తాలలోనూ ఆరి తేరిన అమాత్యులు ఆయనచుట్టూ చేరివున్నారు. రూపుదాల్చిన దిక్కులలాగా యథోచచితస్టానాలలో నిలబడి చామరాలు చేతబూని కాంతలు ఆయనను సేవిస్తున్నారు.
వసిష్టుడూ, విశ్వామి(త్రుడూ, దశరథుడూ తదితరులూ తమ చెంతకు వస్తున్న కుమారస్వామివంటి రాముణ్లీ దూరం నుండే చూచారు. అతడు సహజ శ్రైత్యంతో కూడిన హిమాలయంలాగా సహజసత్త్వం తోనూ, సహజూంభీర్యంతోనూ విలసిల్దుతున్నాడు. అతని ఆకారం సౌమ్యంగానూ, శుభంగానూ, సుందరంగానూ వుంది. మనస్సులో వినయౌదార్యాలు తొణికిసలాడుతున్నాయి.
రాము డప్పుడు యౌవనం అంకురించే ప్రాయంలో వున్నాడు. అయినా '
24 యోగవాసిస్టం వృద్దులలో వుండవలసిన ప్రశాంతత అతనిలో గోచరిస్తున్నది. ఉద్వేగమూ, ఆనందమూ, కోరికలూ అతనికి లేవు. సద్గుణ లన్నీ అతణ్హే ఆశ్రయించాయి. సంసారగతిని గూర్చే అతడు అహర్నిశం ఆలోచిస్తున్నాడు. అన్నివిధాలా ఉదాత్త చరిత్రుడైన అతని అంతఃకరణంలో తత్త్వబోధ లేని లోటుమౌత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అట్టి సద్గుణాలు గల రాముడు చిరునవ్వులా తెల్లనైన వస్తా భరణాలతో శోభిల్దుతూ వచ్చి మణిభూషణాలతో మేరు పర్వతంలాగా విరాజిల్లే శిరస్సు వంచి తం'డ్రిపాదాలకు నమస్కరించాడు. పిమ్మట (క్రమంగా వసిష్ట విశ్వామిత్రులకూ, విఫ్రులకూ, బంధువులకూ, తక్కిన పెద్దలకూ (ప్రణామం చేశాడు. ఆపై తనకు వెోకరిల్దుతున్న సామంత రాజులను చూపులతోనూ, శిరఃకంపంతోనూ, మాటలతోనూ అభినందించాడు.
వసిష్ట విశ్వామి'త్రులు రాముళ్లి ఆశీర్వదించారు. పిదప అతడు పూజ్యాడైన తండ్రి చెంతకు చేరాడు. మహావీరుడైన దశరథుడు ముందు రాముణ్లీ, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులనూ కౌగలించుకొని, శిరసు మూర్కొని రాజహంస పద్మాలను చుంబించినట్టు పలుసార్లు ముద్దుపెట్టు కొన్నాడు. తన ఒడిలో కూర్చోమని తండ్రి చెప్పినా రొముడు రాజసేవకులు నేలపై పరచిన వస్త్రం మీదనే కూర్చున్నాడు.
తర్వాత రాజు రాముళ్లో చూచి ఇలా అన్నాడు.
“కుమారా ! నీవు వివేకివి శుభగుణ సంపన్నుడివి. మూఢునిలా బుద్ది గోల్పోయి ఖేదానికి గురి కావద్దు. నీలాంటివాళ్ళు పెద్దలు చెప్పినట్లు నడచుకొంటే ఉత్తమస్థితికి వస్తారు. మోహానికి వశమైతే సద్గతి పొందలేరు. మోహానికి నీవు దూరంగా వున్నంతవరకే ఆపదలు గూడా నీకు దూరంగా వుంటాయి.”"
పిదప వసిష్ట మునీంద్రుడు రామునితో ఈ విధంగా చెప్పాడు-
““రాజకువరూరా 1! నీవు వుహాశూరుడమవు. జయింప వీలుగాని విషయశ'త్రువులను సైతం నీవు అనాయాసంగా జయించావు. అయినా మూఢునిలా నీవెందుకు జ్ఞానహీనులు మునుగదగిన వ్యామోహసము(ద్రంలో మునుగుతున్నావు??!
పిమ్మట విశ్వామిత్ర మహర్షి రామునితో ఇలా అన్నాడు-
'““అనఖఘా 1 మనో ఎకారంవల్ల నీ చూపులలో నిలుకడ లేకుండా వున్నది ఈ చెత్త చాంవళ్యం వదిలి నీ మోహానికి చూతువేవో చెప్పు ఎలుకలు ఇంటిని
వైరాగ్య ప్రకరణం 25 పాడుచేసినట్టు నీ మనస్సును కలవరపెడుతున్న పరిఫ్రితు లేవో ? అవి ఎలా కలిగాయో? ఎలా తాలగిపోతాయో వివరించు. నీకిలా వింతించడం ఎంత మాత్రం తగదు. మీతం'డ్రీ పరిపాలనలో నీకు ఏవిధమైన చిక్కులూ లేవు కదా ? అలాంటప్పుడు నీకీ వింత ఎందుకు? నీ అభీష్ట మేమిటో చెప్పు. అది తప్పక సిద్దిస్తుంది. ఆ తరువాత నీవిలా చింతపడవలసిన అవసరం ఉండదు.”
మహామతి యైన విశ్వామిత్ర మునీంద్రుని మాట విని తన అభీష్టం నెర వేరుతుందని తలంచి మేఘగర్హన విన్న నెమలి లాగా రాముడు సంతోషించాడు.
ప్రథమ పరితాపం
విశ్వామిత్రుని ప్రశ్నలతో ఊరడిల్లి రాముడు అర్ధవంతంగా, మధురంగా, మెల్లగా ఇలా చెప్పసాగాడు- '“భోవ౯! దయచేసి మీరు అడిగారు కాబట్టి నేను అజ్ఞుడవైనా ఉన్న దున్నట్టు మీకు వివరిస్తాను. సజ్జనుల మాటను ఎవడు దాటగలడు ?
నేను ఈ మా పితృగృహంలో ఫుట్టి పెరిగాను. విద్య నభ్యసించాను. పిమ్మట సదాచారం పాటిస్తూ తీరయాగ్రకై వెళ్ళి భూమండలమంతా సంచరించాను. అప్పుడు సంసారంపై ఆసక్తిని తొలగిస్తూ నా మనస్సులో ఒక విచారం కలిగింది. భోగేన్చ వర్షించి వివేకవంతుడనై నాలో నేనే ఇలా విచారణ చేసుకొన్నాను-
“ఈ సంసార ప్రవాహం ఏమిటి? ఇందులో నిజంగా సుఖం ఉన్నదా ? లోకులు చావడానికి పుడుతున్నారు. మళ్లీ పుట్టడానికి చస్తున్నారు. ఈ చరాచర ప్రపంచానికి చెందిన భోగపదార్జాలన్నీ అశాశ్వతాలే. పైగా ఇవి ఆపదలకూ, పాపాలకూ కారణా లవుతున్నాయి. భోగ్యవస్తువులన్నీ ఇనుపచువ్వల లాగా పరస్పర సంబంధం లేకుండా విడివిడిగానే వున్నాయి. అయినా మనఃకల్పనవల్ల అవి ఒకటి కొకటి అతికినట్టు గోచరిస్తున్నాయి. అంతేకాదు. ఈ జగత్తుయొక్క స్పష్టిస్టితి లయాలు కూడా మనస్సు చేత కల్పింప బడినవే. నిజంగా ఆలోచిస్తే మనస్సుకే ఉనికి లేదు. అలాంటప్పుడు మేము ఎందుకు మోహితులమవుతున్నామో అర్ధం కావడం లేదు.
ఎండమావులలో నీళ్ళు త్రాగడానికి పరుగులు తీసీ అడవిజింకల లాగా మూఢులమైన మేము అస్తిత్వంలేని పదార్దాల వెంట పరుగులు తీస్తున్నాము. ఇదంతా మాయ అని తెలిసికూడా మేము ఎవరికో అమ్ముడుపోయిన వాళ్లలాగా పరవశులమై పోయాము.
భోగా లంటే ఏమిటి ? అలా కనిపించి ఇలా మాయమయ్యే ఇవి కేవలం
26 యోగవాసిష్టం దౌర్భాగ్యరూపాలు. మోహాతిశయంవల్ల భావనలోనే వీటితో వ్యర్హంగా బద్దుల వంయ్యావల. అడవి వృృగాలు గోతిలో చిక్కుకొన్నట్సు వేవలు సంసారవ్యామోహంలో తగుల్కొని వున్నామని ఎంతోకాలం గడచిన పిమ్మట ఇప్పటికి తెలిసికోగలిగాము. నేనెవ్వణ్లి ? ఈ దృశ్యజగత్తు ఎక్కడిది ? దీని స్వరూపమేమిటి ? ఈ రాజ్యంతోనూ, భోగాలతోనూ నాకేమి పని ? మిథ్యాజగత్తు మిథ్య గానే ఉండనీ! దానివల్ల ఎవరి కేమి నష్టం ? బ్రహ్మర్షీ ! ఈ రీతిగా భావించడంవల్ల బాటసారికి మరుభూమిపై విరక్తి కల్గినట్టు నాకు భోగాలన్నిటిమీదా విరక్తి కలిగింది. భగవ౯! ఇప్పుడు చెప్పండి ? ఈ దృశ్యజగత్తు ఎందుకు నశిస్తున్నది ? మళ్లీ ఎందుకు పుడుతున్నది ? ఎందుకు "పెరుగుతున్నది ? ఇదంతా ఎలా జరుగుతున్నది ? జన్మజరామరణాలూ, సంపదలూ, ఆపదలూ, వీటి రాకపోకలూ నిరంతరాయంగా సాగిపోతున్నాయి. వడగాడ్సులకు మోడువారిన వెట్లలాగా అనుభవించిన తుచ్చమైన భోగాలనే అనుభవించి మే మెంతగా శిథిలమై పోయామో చూడండి! జడపదార్జాలను బోలిన ఈ జనులు గాలికి ధ్వనించే వెదురు బొౌంగులులాగా 'ప్రాణవాయువుల ప్రేరణతో వ్యర్థమైన (ప్రలాపాలు చేస్తున్నారు. తార్రలోని నిప్పువల్ల కాలిపోయే జ్నీర్ధ వృక్షం లాగా ఈ దుఃఖం ఎలా శమిస్తుందా _ అన్న చింతతో నేను పరితపించి పోతున్నాను. నా హృదయబిలం సంసారదుఃఖాలనే --పాషాణాలతో నిండి బండబారి పోయింది. అయినా మా వాళ్లు ఏమనుకొంటారో అని నేను కన్నీరు కార్చి గట్టిగా ఏడవడం లేదు. ఈ స్థితిలో నేను పైపైకి చేస్తున్న కృత్రిమచేష్టలన్నీ నీరసాలే. ఈ సంగతి నా హృదయంలోని వివేకం తప్ప ఇతరు లెవరూ (గ్రహించడం లేదు. కనిపిస్తూనే నశించిపోయే ఈ ప్రపంచస్థ్రితిని స్మరించుకొని హఠాత్తుగా దారిద్ర్యం పాందిన ధనికునిలా నేను తీవ్రమోహానికి గురి అవుతున్నాను. ఏమాత్రం నిలుకడ లేని ఈ సంపదలు వానోవృత్తిని వెాహింపజీస్తున్నాయి; సద్గుణాలను నశింపజేస్తున్నాయి. దుఃఖపరంపరను తెచ్చిపెడుతున్నాయి. అసలే ఘోరమైన ఆపదలోవున్న దరిద్రుడికి భార్య ప్రసవించిందని తెలిస్తే తన యిళ్లే సుఖకరం కానట్టు చింతలతో చేర్చి పెట్టబడిన ఈ సంపదలు నాకు ఏ మాత్రం ఆనందం కలిగించడం లేదు. బంధింపబడిన అడవి యేనుగుకు సుఖం
వైరాగ్య బ్రకరణం 27 దూరమైనట్లే పలుదోషాలతో గూడిన ఈ ప్రపంచస్రితినిగూర్చి ఆలోచిస్తున్న నాకు మనశ్శాంతి కరవై పోయింది. అజ్ఞాన మనే రాత్రిలో మోహ మనే మంచు క్రమ్ముకొన్నది. జ్ఞాన మనే వెలుగు నశించింది. ఈ అదను చూచి విషయా లనే దొంగలు వివేక మనే రత్నాన్ని దొంగిలించడానికి నలుదిక్కులా సంచరిస్తున్నారు. తత్త్వజ్ఞులకు దప్పు వాళ్ళను ఎదుర్కొని హతమార్చటానికి ఇతరులకు వీలవుతుందా ? లక్ష్మీనిరాకరణ మునీంద్రా ! సంసారాన్ని అంటిపెట్టుక్ని పైకి సుఖహేతువుగా కనిపిస్తున్న లత్ష్మిని మూఢులు చాలా గొప్పగా భావిస్తున్నారు. నిజానికి పెక్కు అనర్జాలకు దారితీస్తున్న ఈ లక్ష్మీ మోహకారణమే గాని సుఖ కారణం కాదు. వర్దాకాలపు నది పైపైకి లేచిపడే మలినమైన అలలతో ప్రవహించినట్టు లేనిపోని కోరికలతో త్రుళ్లిపడే మూర్చులను లక్ష్మీ తన చెంతకు ఆకర్షించుకొంటుంది. నదిలో అలలు ఫుట్లినట్లే లక్ష్మీకి దుష్టచేష్టలు గల చింతలు అనే చపలపు త్రికలు చాలామంది అవతరిస్తున్నారు. కాలు కాలినదానిలా ఒక చోట వుండక లక్ష్మి ఇటూ అటూ పరుగులు దీస్తూ వుంటుంది. ముట్టుకొంటే కాలి, చేతికి మసి అంటించే దీపం లాగా ఖర్చు చేస్తే తాపం కలిగించి వినాశానికి హేతువవుతున్నది. మంచిచెడ్డలు విచారించకుండా రాజ ప్రకృతిలా మూఢురాలైన లక్ష్మి ఎవడు ప్రక్కన వుంటే వాణ్లీ ఆశ్రయిస్తుంది. పెనుబాములవంటి దోషాలను పెంపొందించే యుద్దం, జూదం, వ్యాపారం లాంటి దుష్కర్మలతోనే అది వృద్ది పొందుతుంది. గాలికి మంచు ఆరిపోయినట్టు లశ్షీస్పర్శ తగలగానే దయాదాక్షిణ్యాది గుణాలు శుష్కించిపోతాయి. మురికిచెయ్యి స్వచ్చమైన మణులను పాడుచేసినట్లే శూరులూ, కృతజ్ఞులూ, మృదుస్వభావులూ అయిన వారిని లక్ష్మీ పాడుచేస్తుంది. భగవ౯ | సీరివల్ల కలిగేది దుఃఖవేం కాని సుఖం కాదు. విషలతను పంచుకొన్నవానికి దానివల్ల మరణం తప్పనట్టు సిరిని కూడబెబ్టుకన్న వానికి వినాశం తప్పదు. లోకనిందకు గురికాని శ్రీమంతుడూ, తన్ను తాను పాగడుకోని వీరుడూ, పక్షసాతం లేని ప్రభువూ - ఈ ముగ్గురూ దుర్తభులే,
28 యోగవాసిష్టం లక్ష్మి ఆపదలనే పాములకు పుట్టు, మోహాలనే ఏనుగులకు వింధ్యపర్వతం, మంచిపనులనే తామరలకు రాత్రి, దుఃఖాలనే కలువలకు వన్నెల; పరమార్దదృష్టి అనే దివ్వెకు పెనుగాలి; కోర్కెలనే అలలకు నది; భయ(భ్రాంతులనే మబ్బులకు మొదలిబాట; విషాదమనే విషానికి నెలవు; వికల్సాలనే పంటలుపండే పాలం; ఖేదాన్ని కల్గించే భీకరమైన పెనుబాము; వైరాగ్యలతలకు మంచు; కామాది వికారాలనే గ్రుడ్ర గూబలకు రాత్రి, వివేకమనే చం(ద్రుడిపాలిటికి రాహువు; మంచితనమనే తామరకు వెన్నెల, రంగురంగుల ఇం(ద్రధనుస్సులాగా నానావిధాలైన రాగాది వికారాలతో లక్ష్మి మనోజ్ఞంగా కన్పిస్తుంది. మెజపు తీవలా అలా ఇలా కన్పించి మాయ మవుతుంది. పైగా ఇది మూర్చులనే ఆ'శ్రయిస్తుంది. చాపల్యంలో అడవి ముంగిసనూ, మోసంలో ఎండమావినీ మించిపోయింది. ఏమాత్రం కుదురుపాటు లేక దీపంకొసలా చంచలమైన దీని వునికి తెలుసుకోవడం చాలా కష్టం. యుద్దానికి సిద్దపడే రాజులు అనే ఏనుగులను ఈ లక్ష్మీ ఆడుసింహంలా హతమారుస్తుంది. ఇది ఇడ్గధారలాగా చల్లగానూ, తీక్షం గానూ వుంటుంది. 'క్రూరులనే ఆశ్రయించి, వంచనతోనే వృద్దిపొంది, దుశ్చింతలకు నెలవైన ఈ లక్ష్మీవల్ల ఆవంతకూడా సుఖం లేదు. దారిద్రమనే సవతి తన్ను ఏమగవాడినుండి తరిమి కొట్టిందో ఆ మగవాణ్ణే మళ్ళీ ఈ లక్ష్మీ సిగ్గువిడిచి ప్రేమతో కౌగిలించుకొంటుంది. దుస్సాహసాలైన చర్యలతో లభించే క్షణభంగురమైన ఈ లక్ష్మి పాములు చుట్టుకొన్న పాడుబొౌందలోని పూదీగలాగా మనస్సును ఆకర్షిస్తుంది. జీవితగర్హణ మునీంద్రా! చిగురుటాకు కొసను (్రేలాడే మంచు బిందువులా ఆయుస్సు తృణభంగురం. అది పిచ్చివానిలా ఎప్పుడో ఈ శరీరాన్ని హఠాత్తుగా వదలిపోతుంది. విషయాలనే విషసర్పాల తాకిడితో చితికిపోయిన వివేకరహితులకు ఆయుస్సు ఆయాసకరమే కాని సుఖకరం కాదు. తత్త్వజ్ఞులై బ్రాహ్మీఫ్టితి పొంది లాభాలాభాది ద్వంద్వాలలో సమద్బష్టి కలిగి వుండే వాళ్ళకు మాత్రమే జీవితం సుఖప్రదం. మేము ఈ పరిమితమైన శరీరమే ఆత్మ అని భావిస్తున్నాము. అంచేత సంసార మేఘంలో మెజపులావున్న ఈ జీవితంలో మాకు సుఖం లేదు.
వైరాగ్య ప్రకరణం 29 గాలినైనా ముడివేయవచ్చు, ఆకసాన్నైనా తునకలు చేయవచ్చు, అలనైనా చేర్చి పట్టుకోవచ్చు, కాని ఆయువును మాత్రం నమ్మలేము. శరదృతువులోని మబ్బు లాగా, చమురులేని దివ్వె లాగా జీవితం నిస్సార మయింది. అలలాగా చంచల మైన ఈ జీవితాన్ని ఉన్నదనుకోవడంకంటే గతించిందని భావించడమే మంచిది. అలనూ, చం(ద్రప్రతిబింబాన్నీ, మెజపునూ, ఆకాశ కమలాన్నీ పట్టి పెట్టడాన్ని నమ్మవచ్చు గాని అస్టిరమయిన ఆయువును మాత్రం నమ్మలేము. కంచరగాడిద గర్భం కోరినట్టు మూఢులు దుఃఖం అనుభవించడానికే దీర్ణ జీవితం అభిలషిస్తారు. సంసారంలో సం(భ్రమించటానికి ఉపయోగపడే ఈ శరీరలత సృష్టిసాగరంలో నురుగులాంటిది. (బ్రహ్మ౯1 ఇంత అశాశ్వతమైన ఈ జీవితం నాకు రుచించడం లేదు. దేనివల్ల పరమ ప్రాష్యమైన మోక్షం లభిస్తుందో, మళ్ళీ శోకించ వలసిన దుర్గతి ఏర్పడదో, ఏది పరమ నిర్వాణానికి స్టానమో అది నిజమైన జీవితం. వ చెట్టూ చేమలూ జీవిస్తున్నాయి. పశువులూ, పక్షులూ బ్రదుకుతున్నాయి. అలాంటి జీవితంవల్ల ప్రయోజన మేమున్నది ? ఎవడి మనస్సు తత్త్వజ్ఞానంవల్ల లయమైపోతుందో, వాడి జీవితమే జీవితం ! మళ్ళీ ఎవరికి పుట్టుక అనేది లేదో అట్టి వారి జీవితమే జీవితం ! తక్కిన వాళ్ళంతా ముసలిగాడిదలవలె వ్యర్ధజీవులే. వివేకం లేనివాడికి శాస్త్రం బరువు; వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు; శాంతి లేని వాడికి మనస్సు బరువు, అలాగే ఆత్మజ్ఞానం లేనివాడికి శరీరమే బరువు. మోసేవాడికీ బరువు దుఃఖకారణ మవుతుంది. అలాగే దుర్మతులకు రూపం, ఆయుస్సు, మనస్సు, బుద్ది, అహంకారం, ప్రయత్నం మొదలైన వన్నీ దుఃఖాన్నే కలిగిస్తాయి. అశాంతికీ, అతృప్తీకీ, ఆపదలకూ, ఆయాసాలకూ ఆయువే కారణం. రోగాలనే పక్షులకు గూడు కూడా అదే. ఎలుకలు విసుగు లేకుండా కలుగు త్రవ్వినట్లే కాలం సదా ఆయుస్సును హరిస్తున్నది. విషసర్పాలు అడవిగాలిని గ్రోలినట్లే శరీరబిలంలో దాగిన భీకరమైన రోగాలు ఆయుస్సును పీల్చుకొంటున్నాయి. పురుగులు ఎండువారిన (మైడును తొలచినట్లే రోగాదిదుఃఖాలు శరీరాన్ని తొలచి వేస్తున్నాయి. పిల్లి ఎలుక కోసంపాంచి వున్నట్లే మృత్యువు జీవితాన్ని కబళించడానికి వేచివున్నది తిండిపోతు మితిమీరి తిని అరిగించుకొన్నట్లే వార్దక్యం జీవుల్లో జీర్ణం చేసికొంటున్నది. సుజనుడు దుర్హనుణ్లి పరిహరించినట్లే యౌవనం పఫురుషుళ్లీ శీఘ్రంగా వదలిపెట్టి వెళ్తుంది. విటుడు అందం
30 యోగవాపిష్టం కోరినట్లే జరావురణాలకు చెలికాడ్డైన యముడు ఆయుస్సును హరించ గోరుతున్నాడు. అందువల్ల ఆయుస్సులాగా సుఖహీనవమూ, చంచలవూ, తుచ్చమూ, గుణరహితమూ, మరణశీలమూ అయిన పదార్ధం మరొకటి లేనే లేదు. అహంకారజుగుప్ప మునివర్యా ! వ్యర్థంగా మోహంనుండి పుట్టి పెరుగుతున్న దురహంకారమనే శత్రువంచే నాకు భయం వేస్తున్నది. విషయలంపటులై, దీనాతిదీనులైన సంసారులు అహంకారం వల్లనే రాగద్వేషాదిదోషాలకు లోనవుతున్నారు. ఆధులూ, వ్యాధులూ, కోర్కెలూ- అన్నీ అహంకారం వల్లనే కలుగుతున్నాయి. నన్ను పట్టి పీడిస్తున్న రోగమిదే. ద్వీర్ణ కాల శత్రువైన అహంకారానికి లొంగి నేను అన్న పానాలు కూడ మానివేశాను. ఇక భోగా లెలా అనుభవిస్తాను ? కిరాతుడు వల పన్నినట్టు అహంకారం మనస్సులో సుదీర్హమైన మాయను పన్నింది. కొండనుండి చండడ్రచెట్లు పుట్టినట్టు ప్రబలమైన దుఃఖాలన్నీ అహంకారంనుండే పుడుతున్నాయి. శమ మనే చంద్రునిపాలిటి రాహువూ, గుణమనే పద్మం పాలిటి మంచూ, సమభావమనే మేఘం పాలిటి శరత్కాలమూ అయిన అహంకారాన్ని వదిలివేస్తున్నాను. నేను రాముణ్ణి కాను. నాకు దేనిమీదా కోర్కె లేదు. బుద్దునిలా శాంతచిత్తంతో (ప్రాణులన్నిటా ఆత్మావలోకన దృష్టి గలిగి వుండిపోవా అనుకొంటున్నాను. అహంకారంతో ఏమి చేసినా అదంతా నిస్సారమే. అహంకారత్యాగమే సారమైనది. (బ్రహ్మర్తీ! ఆహంకార మున్నంతవరకూ దుఃఖమే. అది నశించినప్పుడే సుఖం. అహంకారం వదలి నేను శాంతుడనై ఉద్వేగం లేకుండా ఉంటాను. క్షణభంగురమైన భోగాల నాశించే వాడికి ఈ స్రితి కలదు. మునీంద్రా ! అహంకార మేఘాలు (క్రమ్మినంతసేపూ ఆళశలనే కొండమళ్లెలు వికసిస్తూనే వుంటాయి. అహంకార మేఘం తాలగగానే ఆళ అనే మెటపు తీగ దీపం ఆరినట్టు త్రుటిలో మాయ మవుతుంది. అహంకారమనే వింధ్యపర్వతంలో మనస్సనే మదపుటేనుగు ఉజీమే మబ్బులా ఉత్సాహంతో ఉజ్జృంభిస్తుంది. శరీర మనే అరణ్యంలో వున్న అహంకార మనే సింహంనుండే ఈ జగత్తు విస్తరిల్హుతున్నది. ఆశ అనే సూద్రంతో గ్రుచ్చబడిన జన్మ పరంపర అనే ముత్యాల మాలను అహంకారమనే విటుడు విలాసంగా మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. అహంకారనునే శత్రువే తప్పించుకోవటానికి వీలు లేని కళత్రాది రూపమైన వలపన్ని జీవులనుోబంధిస్తున్నాడు. అహంకారాన్ని అరికడితే
వైరాగ్య ప్రకరణం వ! "ఆ- బాధలన్నీ మంచు విరిసినట్టు క్షణంలో. మాయ మవుతాయి. మహానుభావా ! ఆపదలకు నిలయమూ, సద్గుణవర్షితమూ, దుఃఖప్రదమూశ్ అయిన అహంకారాన్ని నేనిప్పుడు ప్రయత్నంతో వదిలించుకొన్నాను. అయినా అజ్ఞాన జన్యమైన శోకానికి గురి అవుతున్నాను. ఈ స్థితిలో ఉచితమైన తత్త్వ మేదో దయతో ఉపదేశించి నన్ను అనుగ్రహించండి 1 మనోదుస్స్ప్వభావం ముముక్షువుల కవసరమైన పెద్దలసేవ వదలి మనస్సు దోష్షాలపాలై బలహీన మవుతున్నది. గాలిలో నెమలి పింఛపుకొస లాగా అది సదా చలిస్తూనే వుంటుంది. పని ఏమీ లేకున్నా అది ఊరకుక్కలాగా అటా యిటూ పరుగులు దీస్తూ వుంటుంది. నీటితో వెదురుబుట్ట నిండనట్లే ఎంతధనం లభించినా దీని కడుపు నిండదు. మందకు దూరమై వలలో దగుల్కొన్న జింకలాగా ఆశకు వశపడిన మనస్సు శాంతి పాందలేదు. అలలాగా చలిస్తూ వుండే ఈ చిత్తం దేహ(భ్రాంతి వీడి హృదయంలో ఒక్క క్షణం గూడా స్టీరంగా ఉండదు. మందరపర్వతంతో మథింపబడ్డ శ్షీరసాగర జలంలాగా విషయచింతతో కలత పడ్డ మనస్సు పది దిక్కులకూ పరుగులు దీస్తుంది. చిత్త వృత్తు లనే సుడిగుండాలతోనూ, పరవంచన లనే మొసళ్ళతోనూ నిండిన మనస్సనే మహాసముద్రాన్ని అరికట్ట లేకపోతున్నాను. మనస్సనే. లేడి నరక మనే గుంటలో పడిపోతాననే ఆలోచన లేకుండా భోగా లనే పచ్చిగడ్డి మొలకలకై ఎంతో దూరం పరగులు తీస్తుంది. సము(ద్రం కదలిక వదలనట్లే వ్యాకులమైన నా మనస్సు దేహభభ్రాంతి వీడలేకున్నది. బోనులోని సింహంలా చింతాచంచలమైన చిత్తానికి ఎక్కడా కుదురుపా టన్నది లేదు. హంస నీటినుండి పాలను వేరుచేసినట్సు మోహగ్రస్తమైన మనస్సు శరీరంనుండి సమరసత్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని దూ-౦౨ వేస్తున్నది. మునీం(ద్రా ! అనేక కల్పనలు అనే పడక మీద పరుండిన చిత్త వృత్తులు నేను ఎంతగా బోధించినా వేల్కాంచడం లేదు. అందువల్ల నేను ఎంతగానో చారిస్తున్నాను. బ్రహ్మర్షీ ! వేటగాడు ఒడ్డిన వలలో పక్షి తగులు కొన్నట్టు మనస్సు పన్నిన ఎశాజాలంలో నేను తగులుకొని వున్నాను. రోషమినే పాగతోనూ, వింతలనే
32 యోగవాసిష్టం ముంటలతోనూ కూడిన నిప్పువంటి చిత్తం ఎండుగడ్డిని కాల్చినట్టు నన్ను కాల్ఫివేస్తున్నది. ఆడుకుక్కతో గూడి మగకుక్క శవాన్ని పీక్కుతిన్నట్టు తృప్ట అనే భార్యను అనుసరిస్తున్న క్రూరమైన మనస్సు అజ్జానోపహతుడనైన నన్ను భక్షిస్తున్నది. ఉదతమైన నదీప్రవాహం గట్టున వున్న చెట్టును పెకలించుకు పోయినట్టు చంచలమైన చిత్తం నన్నెక్కడికో తరలించుకు పోతున్నది. సుడిగాలి గడ్డిపరకను ఎక్కడో పడవేయడానికో, లేదా శూన్యంలో (త్రిప్పడానికో తీసుకుపోయినట్ల్టు చిత్తం నన్ను స్వర్గాదిభోగాలను అనుభవింప జేయడానికో, లేదా సుఖహీనమైన క్షు ద్రజన్మలలో పరి(భ్రమింప జేయడానికో తీసుకుపోతున్నది.
ఈ సంసార సముద్రము నుండి తరించడానికి ప్రయత్నిస్తున్నాను గాని, సేతువు జల(ప్రవాహాన్ని అరికట్టినట్టు నన్ను దుష్టచిత్తం ఇక్కడనుండి కదలనీకుండా బంధిస్తున్నది. చేత్రాడు రాట్నాన్ని పై నుండి క్రిందికీ, క్రిందినుండి పెకీ త్రిప్పినట్టు నన్ను ఈ దుష్షచిత్తం ఊర్ద్వలోకంనుండి అధోలోకానికీ, అధోలోకంనుండి ఊంద్హ్రులోకానికీ గిల్టున త్రిప్పుతున్నది. విచారించి చూస్తే శూన్యమే అయినా పైకి భీకరాకారంతో కనిపించే బేతాళం బాలకుణ్లీ పట్టుకొన్నట్టు ఈ దుష్టచిత్తం అజ్ఞాడనైన నన్ను పట్టుకన్నది.
(బ్రహ్మర్తీ! నిగ్రూంచటానికి వీలుగాని ఈ మనస్సనే పిశాచి వజ్రం కంటే గట్టిగా, అగ్ని కంచే వేడిగా, పర్వతంకంటే కూడా దుర్గమంగా వున్నది. పక్షీ మాంసంపై 'వ్రాలినట్టు అది క్షణంలో విషయాలపై వ్రాలుతున్నది. బాలుడు ఆటల మీది ఆసక్తితో చదువు వదలినట్టు అది సత్కార్యాలను క్షణంలో వదలివేస్తున్నది. వృత్తులనే సుడిగుండాలతోనూ, కామాదులనే పాములతోనూ కూడిన మనస్సనే సముద్రం నన్ను ఎక్కడికో నెట్టిపారవేస్తున్నది.
సాధుపుంగవా ! సముద్రాన్ని త్రాగడంకంచే, మేరువును పెకలించడంకంచే, అగ్నిని భక్షించడంకంటే మనస్సును ని(గగ్రహించడం కష్టతరం. అన్ని విషయాలకూ ఆదికారణం చిత్తమే. చిత్త ముంటేనే మూడులోకాలు వుంటున్నాయి. అది నశిస్తే ఈ లోకాలు గూడా నశిస్తాయి. అందువల్ల రోగం లాంటి మనస్సుకు ముందు చికిత్స చేయాలి.
మునీంద్రా! కొండనుండి అడవులు పుట్టినట్టు మనస్సునుండే సుఖదుఃఖాలు పుడుతున్నాయి. వివేకంతో మనస్సును లయింపజేసి కొంచే ఈ సుఖదుఃఖాలు
వైరాగ్య ప్రకరణం 3 గూడా లయమై పోతాయి. ముముత్షువులైన మహాత్ములు దేనిని జయించి సత్తా;ది గంణవఎంయువైన అవిద్యను నిగ్రహించి, సకలసద్శుణసంపన్నులై ఆనందింపగోరుతున్నారో అట్టి చిత్తమనే శత్రువును జయించడానికి నేను ఈ జన్మలోనే సిద్ద మవుతున్నాను. జలంతో మలినమైన మేఘలేఖను చంద్రుడు కోరడు. అలాగే విరక్తుడనైన నేను అజ్ఞానులకు మా(త్రవేం విలాసము చేకూర్చే ఈ లక్ష్మిని అభిలషించడం లేదు. తృష్ణాభంగం
మునీంద్రా! ఆళ వివేకాన్ని మరుగుపరిచే కాళరాత్రి. దాన్ని పరిహరించడం చాలా కష్టం. దాని ప్రభావంవల్లనే జీవు డనే ఆకసంలో రాగాదిదోషా లనే గ్రుడగూబలు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి.
ఎండకు ఎండిపోయే బురదలాగా హృదయతాపం కలిగించే చిత్తంవల్ల నాలోని స్నహదయాదిగుణాలు శుష్కించిపోయాయి. విచారానికి దూరమై వ్యామోహ మనే చీకటి వ్యాపించిన నామనస్సనే అరణ్యంలో ఆశ అనే పిశాచి విలయతాండవం చేస్తున్నది. బంగార మనే ఉద్యానంలో విలాసవచనా లనే మంచు బిందువులు సోకటం వల్ల చింతలనే సెనగ మొగ్గలు వికసిస్తున్నాయి.
(బహ్మ౯ ! చలించే అలలు సముద్రంలో సుడిగుండాలను సృష్టించినట్టు చిత్తవోభకారణమైన తృష్ల జీవునిలో ధనార్హనాది భ్రమలను కలిగిస్తున్నది. ఈ శరీరమనే పర్వతంలో తృష్ట అనే నది ప్రవృత్తు లనే అలలతో గలగలా శబ్దిస్తూ (ప్రవహిస్తున్నది. గాలికి కొట్టుకుపోయే ఎండుగడ్డి పణకలాగా ఆశకు వశమైన నా మనస్సనే చాతకపశ్షీ ఏవూటత్రం నిలుకడలేకుండా ఎక్కడెక్కడికో పోయి వాలుతున్నది. ఎలుక వీణతీగలను కొటికినట్లే ఆశ నా సద్గుణాల నన్నింటినీ ఛేదిస్తున్నది.
మునీశ్వరా | సుడిగుండంలో ఎండుటాకులా, సుడిగాలిలో గడ్డిపరకలా , ఆకసంలో శరత్కాలపుమబ్బులా నేను చింతా చ(క్రములో తగులుకొని దిక్కు తెలియక పరి(భమిస్తున్నాను. కుంఠిత బుద్దులమైన వేము వలలో పడ్డ పక్షులలాగా స్వస్వరూప ప్రాప్తి పొందలేక చింతాజాలంలో పడి మోహానికి గురి అవుతున్నాము
తండ్రీ 1! తృష్ణ అనే అగ్నిజ్వాలలో పడి నేను కాలిపోతున్నాను. అమృతం లభించినా ఈ తాపం తీరుతుందనే నమ్మకం నాకు లేదు. ఆళ అనే గుజ్జు స్వస్థానంనుండి దిగంతాలకు పరుగులు తీస్తుంది. మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ
[4
పతీ యోగవాస్టుం దూరదూరంగా పయనిస్తుంది. ఘటీయం'(త్రంలోని దారంలాగా జడసంసర్గం కల తృష్ట సదా చలిస్తూ పైకీ క్రిందికీ రాకపోకలు సాగిస్తున్నది.
ముకుద్రాడు వేసిన గిత్త లాగా తెంప వీలుగాని తృష్ణా సూత్రంతో బంధింపబడ్డ మనిషి వ్యర్థంగా ఐహికాముష్మిక ఫలరూపమైన భారం మోస్తున్నాడు. కీరాతుని భార్య పతక్తులనంు పట్టుడానికి వల పన్నినట్సే తృష్మ జీవులను బంధించటానికి ఫు'త్రమిత్రకళత్రాది రూపమైన వల పన్నుతున్నది.
(బ్రహ్మర్షీ ! చీకటిరాత్రి నంటి ఈ త్పషు ధీరుణ్ణ్లీ అయినా నన్ను భయపెడుతున్నది. కళ్ళున్నా నన్ను గ్రుడ్డివాణ్ణే చేస్తున్నది. ఆనంద రూఫుణ్లీ అయినా నాకు దుఃఖం కలిగిస్తున్నది.
వంకర నడకా, మెత్తని స్పర్శా, విషవైషమ్యమూ (ప్రకటించే నల్లత్రాచువంటి ఈ తృష్ట ఏమాత్రం తాకినా కాటువేస్తుంది. దౌర్భాగ్యహేతువైన నల్లరక్కసిని పోలిన తృప మాయామయ(ప్రపంచాన్ని కల్పించి జీవుల హృదయాలను భేదిస్తున్నది.
మునివర్యా | నాడీవలయంతో కూడిన ఈ దేహాన్ని అంటిపెట్టుక్నివున్న తృష్ణ పాత గిల్లి తీగలు తెగి పాడుపడ్డ వీణతో సవూనవ్వెనది. ఆ. వీణ ఉత్సవ సవంయుంలో ఆనందించడానికి ఉపయెోోాగపడనట్లే ఈ త్పష్ట ఆత్మానందానుభూతికి ఉపకరించదు.
హృదయగుహలో పుట్టి ఏపుగా పెరిగిన ఆశాలత చాలా మలినమైనది. దానివల్ల కలిగే ఉన్మాదం అవసానదళలో దుఃఖంగా పరిణమిస్తుంది. వాడిపోయిన మొగ్గల గుత్తిలాగా నీరసమూ, నిష్టలమూ, అమంగళకరమూ అయిన ఆశవల్ల ఇసుమంత కూడా ఆనందం లేదు. వృద్ద వేళ్ళ లాగా మనస్సును ఆకట్టుకోలేకున్నా ఆళ అందరివెంటా వ్యర్థంగా పరుగులు దీస్తున్నది. శోకమోహాదులతో కూడిన సంసార మనే నవరసభరితమైన నాట్యశాలలో ఆళ వృద్దనర్తకి లా నీరసమైన నృత్యం చేస్తున్నది. ఈ విశాలమైన సంసార మనే అరణ్యంలో వార్దక్య మనే పుష్పాలతోనూ, హెచ్చుతగ్లు లనే ఫలాలతోనూ కూడి ఆశ అనే విషలత వ్యాపించివుంది.
భగవ€ ! వర్షాగమం వంటి మోహం ఆవరించినప్పుడు ఆళశ మయూరిలాగా నాట్యం చేస్తుంది. ఆ నెమలి దుర్గప్రదేశంలో గూడు కట్టుకొన్నట్లే ఆశ అసాధ్య విషయాలపై ఆసక్తి పెంచుకొంటుంది. శరదృతువు రాగానే నెమలి ఆట కట్టినట్లే వివేకోదయం కాగానే ఆశ శమిస్తుంది.
వైరాన్య ప్రకరణం 35
వర్షాకాలంలో మాత్రమే సాయే నదిలాగా ఆశ క్షణకాలమే అజ్జానతరంగాలతో పరవళ్ళు త్రాక్కుతుంది ఆకలిగొన్న పిల్లు పండ్లులేని చెట్టును ఎదలి మరొక చెట్టుపై వ్రాలినట్లే తృష్ణ ఒక పురుషుణ్ణి వదలి మరాకళ్లి పట్టుక్'ంటుంది. చపల మర్చటాన్ని పోలిన తృష్ణ ఒక చోట నిలవక పోరానిచోట్లుకు పోతూ వుంటుంది. ఎంత అనుభవించినా దీనికి తనివి లేదు. ఒక మంచిపని (ప్రారంభించి అది పూర్తి కాకుండానే ఈ తృష్ష మరొక చెడుపనికి సిద్ద మవుతుంది. జీవుల కర్మగతి లాగా అది శభాశుభఫలాలకై ఎప్పుడూ (్రాకులాడుతూ వుంటుంది.
హృదయకమలంలో తుమ్మెదను పోలిన ఈ తృష్ణ ఒక షణం పాతాళానికీ, మటొకత్షణం ఆకసానికీ, ఇంకొక క్షణం దిగంతాలకూ పరుగులు తీస్తూ వుంటుంది. సంసారదోషా లన్నింటిలోనూ ద్వీరదుఃఖం కలిగించేది ఇది ఒక్కటే. అంతఃపురంలో సుఖంగా వున్నవాళ్లీ కూడా ఇది ఏదో ఒకరకంగా మభ్యపెట్టి అతిసంకట ప్రదేశాలకు లాక్కుపోతుంది.
మోహమనే మంచుతో నిండిన తృష్ట అనే మేఘమాల జాడ్యం కలిగించి ఆత్మజ్డానమనే సూర్యుణ్లో కప్పివేస్తుందె. పెక్కు పశువుల మెడ పలుపులను మరొక పెద్ద త్రాటికి కట్టివేసినట్లే సంసారుల మనస్సు లన్నీ ఆశాపాశంతో బంధింపబడి వున్నాయి. ఇం(ద్రధనుస్సు లాగా చిత్రవిచిత్రమూ, గుణహీనమూ, సుదీర్షమూ అయిన ఆశశూన్యంలో కల్సింపబడి భాసిస్తున్నది.
ఈ ఆళ సుగుణాలనే పైర్లకు పిడుగు; ఆపదలనే పంటలకు శరదృతువు; జ్ఞాన మనే పద్మాలకు మంచు; అజ్ఞాన మనే లీకట్లకు హేమంత రాత్రి; సంసార మనే నాటకంలో నటి; ప్రవృత్తి అనే గూటిలో పక్షి మనస్సనే అరణ్యంలో జింక, కోర్కెలనే సంగీతానికి వీణ. ఇది ప్రాపంచిక వ్యవహారమనే సముద్రానికి అల; మోహమనే ఏనుగుపాలిటి గొలుసు; సంసారమనే వట వృక్షానికి ఊడ, దుఃఖాలనే కలువలకు
, నెన్నెల; జరామరణాది వ్యథలకూ, ఆధివ్యాధి విలాసాలకూ నిలయం. ఆశ అనే ఆకాశంలో ఒక క్షణం వివేక మనే వెలుగు (ప్రసరిస్తుంది. మరొక కణం అవివేకమనే చీకటి అలముకొంటుంది. ఇంకొక క్షణం మోహ మనే మంచు ఎ వరిస్తుంది. కాళరాత్రి ముగియగానే రక్కసుల మూక సారిపోయినట్టు తృష్ట నశంచగానే జన్మజరామరణాత్మకమైన సంసారబంధం తెగిపోతుంది. తృప్ట అనే కలరా కినంతివరకే జీవులు వ్యాకుల చిత్తంతో మోహ గ్రస్తుల పడి వుంచారు చింఠాత్యాగమే
36 యోగనాసిస్టం ఈ వ్యాధికి తగిన మందు. చింతకు దూరమైనవాడు దుఃఖానికి దూర మవుతాడు.
మాంసమనే భమతో తృణపాషాణాదులను కజుచి కజుచి చివరికి గాలంలో తగులుకొని చచ్చే చేపవంటిది ఈ తృష్ణ. సూర్యకిరణాలు పద్మాన్ని ఊర్హ్వవికసితం చేసినట్లే రోగపీడా, స్త్రీవాంఛా ధీరుణ్లి కూడా అధీరుణ్లే చేస్తాయి. వెదురుబొంగులాగా కంటకప్రాయమూ, సారహీనమూ అయిన తృష్ణ ముత్యాలపై ఎక్కువ మక్కువ చూపుతుంది.
ముని శ్రేష్టా! ఏమి ఆళ్చీర్యం | తెంచటానికి వీలుగాని ఈ గట్టి తృప్పను గూడా బుద్దిమంతులు వివేకమనే వాడికత్తితో తెంచివేస్తున్నారు.
('బ్రహ్మ౯ ! హృదయంలో కుదురుకొన్న తృష్ణ కత్తి కొనకంటే, వజ్రంకంటే, కాలుతున్న ఇనుషగుండుకంటే గూడా తీవ్రాతితీవ్రమైనది. ఇది దీపజ్వాలలాగా మధ్యలో (యౌవనావస్టలో) ఉజ్జ్వలంగానూ, చివరిదశలో (వార్హకంలో) మలినమై త్మీక్షంగానూ, మమకారమనే స్నేహం ఉన్నంతవరకూ కొనసాగేదిగానూ వుంటూ ముట్టుకొంటే ప్రమాదం కల్లిస్తున్నది.
వేరుపర్వతంలాంటి ధీరుడూ, శూరుడూ, బుద్దివుంతుడరా_ దృఢవ్రతుడూ, అయిన పురుష్రేష్టుళ్లి కూడా తృష్ట ఒక్క నిముసంలో దైన్యం కలిగించి గడ్డిపజకలా చేస్తుంది.
సాహసకార్యాలనే అడవులతోనూ, బంధహేతువయిన రజోగుణవానే లతాధూళితోనూ, అంధకారమైన తమోగుణమనే మంచుతోనూ కూడిన తృష్ట వింధ్యపర్వత భూమిలా భయంకరంగావుంది.
కూపనదీ తటాకాదులలోని జలా లన్నిటా ఒకే మాధుర్యశ్త్తి వివిధభేదాలతో వ్యాపించి వున్నట్టు దేహగతమైన ఈ ఒక్కతృష్లే ప్రపంచమంతటా కామక్టోధాది రూపాలతో గుర్తింప వీలు గాకుండా వ్యాపించివుంది.
శరీరజుగుప్ప
మునీం(ద్రా! మలమూత్రాలకు నిలయాలైన ప్రేగులతోనూ, నాడులతోనూ కూడి షడ్భావవికారాలకు లోనై కడకు మరణశీలమైన ఈశళశరీరం దుఃఖకారణమే కాని సుఖహేతువు గాదు. ఈ దేహం జడమైనా ఆత్మ సంసర్గంవల్ల చేతనములా భాసిస్తున్నది. అమంగళకరమైనా సంసార సాగర తరణానికి సాధన మవుతున్నది. అంచేత ఇది అటు జడమూ, ఇటు చేతనమూ కాకుండా వున్నది. ఇది జడమా లేక
వైరాగ్య ప్రకరణం 37 చేతనవూ? అనే సందేహంతో ఊగిసలాడే అవివేకి తుదకు వెోహాన్నే పొందుతున్నాడు. కొద్దిపాటి అన్నపానాదులు లభించినా ఈ శరీరం సంతోషిస్తుంది. ఏవూ(త్రం శీతాతపాది కమ్టాలు సోకినా దుఃఖిస్తుంది. దీనిలాగా నీచవూ, గుణహీనమూ, శోచనీయమూ అయిన వస్తువు మరొకటి లేదు.
ఈ దేహం ఒక చెట్టులాంటిది. ఇది సంసారమనే అరణ్యంలో మొలకెత్తింది. నవ్వులనే పువ్వులూ, దంతాలనే కేసరాలూ దీన్ని అలంకరిస్తున్నాయి. జానువులే దీన మొదళ్ళు; బాహువులే దీని కొమ్ములు; అవయవా లనే చివుళ్ళతోనూ, చింత నే మొగ్గలతోనూ గూడిన ఈ చెట్టును దుఃఖాలనే పురుగులు తొలిచివేస్తున్నాయి. ఆళ అనే పామూ, కోపమనే కాకీ, ఇంద్రియాలనే పక్షులూ ఈ వృత్షాన్ని ఆశ్రయించి జీవిస్తున్నాయి. అహంకార మనే గ్రద్ద దీనిలో గూడు కట్టుకొని వుంది. రోగా లనే తీగలు దీన్ని పెనవేసుకొని వున్నాయి. జీవేశ్వరులనే రెండు పిట్టులూ ఇందులోనే నివసిస్తున్నాయి.
కాంతి అనే నీడతో గూడిన ఈ చెట్టు కాము డనే బాటసారికి విశ్రాంతి స్టానమై వుంది. మనస్సనే కోతి దీనిపై కెక్కి గంతులేస్తున్నది. ఇది శుభాశుభాలనే ఫలాలను 'ప్రసవిస్తున్నది. ఈ దేహవృత్షాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా నరకవచ్చు. దీనివల్ల సుఖమన్నది కాస్త కూడా నాకు కనిపించడం లేదు. ఇలాంటి శరీరం ఎవరికి బంధువు ? ఎవరికి శత్రువు ? దీనిపై ఎవర్కైనా ప్రేమ కానీ, ద్వేషం కానీ ఎందుకు ?
మునీశ్వరా ! నదిని దాటడానికి నౌక లొగా సంసార సాగరాన్ని తరించటానికి స్వేకరించబడ్డ ఈ దేహలత మీద ఆత్మభావన ఎవడికీ కల్గుతుంది ? నవరం(ధ్రాలనే గౌతులతోనూ, రోమాలనే లెక్కకు మించిన చెట్టతోనూ కూడిన శరీరమనే జాన్యారణ్యంలో బహుకాలం నివసించగలనని ఎవడు విశ్వసిస్తాడు ? పాతబడి శిథిలమై
నాయించటానికి పనికి రాని డోలులో దూరుకొన్న పిల్లిలాగా మాంసమూ, నరాలూ , *ముకలతో నిర్మించబడ్డ ఈ జీర్దశరీరంలో నేను తగుల్కొని వున్నాను.
(బ్రహ్మర్షీ! అహంకార మనే గృహస్టుడు కాపురం చేస్తున్న ఈ శరీరగ్భహం ఉంటే
నేమ? ఊడితే నేమి ? దీనితో నా కేమి పని ? ఇంద్రియా లనే పశువులకూ, తొస్న
- అనేగృహిణికీ నివాసమై కొర్కెలనే ముగ్గులతో అంంకరంపబడివున్న దేహమనే గృహం
1 ౮ కక్కర లేదు. వెన్నెముకలనే కర్రిలతను", గ్రైను న ద్ర చ్చితొనూ ఏలబడ్డ
38 యోగసిష్థం గుడిసెలాంది శరీరంపై నాకు ప్రీతి లేదు. నెత్తుటిబురదతో సండి వార్దక్యమనే సున్నంలో నెల్ల వేయ బడ్డ ఈ దేహ మనే గృహం నాకు వద్దు. మనస్సనే బంటు చేస్తున్న ఎడతెగని ఊడిగంవల్ర ఇది నిలబడి వుంది. అనృతమూ, అజ్ఞ్జానమూ దీని కాధార స్తంభాలు. ఇలాంటి దేహ నుందిరంపై నాకు మక్కువ లేదు. శరీర మనే యింటిలో దుఃఖ మనే పిల్లవాని యేడ్పు లొకవంక వినిపిస్తుంటాయి. సుఖ మనే పాన్సులతో ఇది మరొకప్రక్క మనోహరంగా వుంటుంది. దుళ్చేష్ట లనే దాసీజనం ఇందులో ఇటూ అటూ తిరుగుతుంటారు. దోషాలనే (ద్రవ్యాలతో నిండిన విషయా లనే భాండాలు ఈ యింటి నిండా కుదురుకొని వున్నాయి. బాహువులనే దూలాలతో నిర్మింపబడ్డ ఈ దేహగృహం వీలమండలనే దిమ్మెలపై కుదుర్కొన్న పిక్కలనే ఆధార స్తంభాలపై నిలబడి వుంది. ఇలాంటి శరీరభవనం నా కెందుకు ? (బ్రహ్మ౯ ! ఈ దేహగ్భహంలో బుద్ది అనే గృహిణి చింత అనే కుమార్తెలతో గూడి జ్ఞానేంద్రియా లనే గవాక్షాల చెంత ఆడుకుంటూ వుంది. శిరోజూలనే కప్పుతోనూ, కుండల శోభితాలైన చెవు లనే చంద్రశాలలతోనూ, (నళ్ళనే బొమ్మలతోనూ కూడిన ఈ శరీర మనే యిల్టు నాకు సమ్మతం కాదు. అవయశ్నా లనేగోడలతోనూ, రోమా లనే గడ్డీ పోచలతోనూ, పొట్టు అనే వివరంతోనూ కూడి ॥ వున్న శరీర గృహాన్ని నేనాశించను. దేహగ్భహంలో దూరి ఆకలి అనే ఆడు కుక్క ఆకులపాటు కలిగిస్తున్నది. భాంకారళబ్దంతో ప్రాణవాయువు ఇందులోకి రాకపోకలు సాగిస్తున్నది. వదన మనే ముఖద్వారంలో నాలుక అనే కోతి భీకరంగా పొంచుకొని వుంది. దాని (ప్రక్కనే :దంతాలనే అస్థి శకలాలు కనిపిస్తున్నాయి. చర్మవునే సున్నపు పూతతో నిగనిగలాడుతూ, సంధి బంధాలనే యం త్రసహాయంతో సంచరిస్తున్న ఈ శరీర గృహంలో మనస్సనే ఎలుక సదా కన్నం (త్రవ్వుతున్నది. చిరునవ్వులనే దీపాలతో కొంతసేపు ప్రకాశించి, అజ్ఞానమనే అంధకారంతో మరికొంతసేపు ఆవరించబడివున్న ఈ దేహమందిరం నా కిష్టం కాదు. రోగాలకు ఉనికిపట్టూ, ముడుతలు పడ్డ చర్మానికీ, నెరసిన వెండ్రుకలకూ నిలయమూ, మనోవ్యాధులకు మహాదుర్గమూ అయిన ఈ శరీరగ్సహం నాకు వద్దు. మునీశ్వరా | ఇం[ద్రియాలనే ఎలుగుబంట్లతో భీకరమెై, అజ్ఞానవునే వీకటిపాదలతో నిండివున్న ఈ శరీరారణ్యంపై నాకు ప్రీతి లేదు. బురదలో
పం కూరుకుపోయిన ఏనుగును అల్పసత్తుడు పైకి లేప లేనట్లే నేను ఈ శరీరగ్భహాన్ని మోయిలేకున్నాను. సంపదలూ, రాజ్యమూ, శరీరమూ, కోరికలూ- వీటివల్ల ప్రయోజనం శూన్యం. కొద్ది రోజులలోనే మృత్యువు అన్నింటినీ తుదముట్టిస్తుంది కదా 1 ఈ శరీరం లోపలా, వెలుపలా అంతటా రక్తమాంసమయం. చివరి కిది నశించక తప్పుదు. ఇక దీనిలో అందమేమిచో మీరే వెప్పండి ! ఎంత ప్రియంగా పెంచినా ఈ శరీరం మరణసమయంలో జీవుని వెంట రాదు. ఈ కృతఘ్న శరీరంపై బుద్దిమంతుడికి నిశ్వాస మెలా వుంటుంది ? దేహం ఏనుగు చెని కొస లాగా చంచలం. క్రిందికి జారే నీటిబొట్టు లాగా నిలకడ లేనిది. ఇది నన్ను విడిచిపెట్టక మునుపే నేనే దీన్ని విడిచిపెడతాను. శరీరమనే చిగురుటాకు ప్రాణవాయువువల్ల స్పందిస్తున్నది. జర్హరమూ, క్షుద్రమూ, నీరసమూ అయిన దీనిపై నాకు ప్రేమ లేదు. చిరకాలం తిని త్రాగి వృద్దిపొందిన ఈ దేహం చివరికి నీరసించి కృశించి నశించి పోతుంది. ఈ పొవుర శరీరానికి కొంచెం కూడా సిగ్గు లేదు. ఇది అనుభవించిన సుఖదుఃఖాలనే మళ్ళీ మళ్ళీ అనుభవించ గోరుతున్నది. ఎంత కాలం దొరతనం , చేసినా, ఎన్ని భోగా లనుభవించినా ఈ దేహానికి ఎలాంటి గొప్పతనమూ రాదు. ఇది ఎన్నటికీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు దీన్ని పోషించి లాభమేమిటి ? అది ధనికుడి శరీరమైనా, దరిద్రుడిదైనా వయసు ముదిరినప్పుడు వార్షక్యాన్నీ, అవసానకాలంలో మరణాన్నీ సమానంగానే పొంధుతున్నది. సంసారమనే సాగరం లోపలి తృష్ట అనే కలుగులో శరీరమనే తాబేలు తరించాలనే కోరిక లేకుండా ఊరక నిద్రిస్తున్నది. తగలబెట్టుడానికి పనికివచ్చే శరీరా లనే కట్టెలు సంసారసాగరంలో తేలుతున్నాయి. వటిలో కొన్నింటినే మానవ శరీరా లంటున్నాము. దుర్మార్గమనే వలయమూ-, మరిణమనే ఫలమూ గల ఈ శరీరలతవల్ల వివేకవంతుడికీి ఇసుముంతకు- ౬ ప్రయోజనం లేదు. విషయాలనే బురదగుంటల్లో బడుతూ తృటిలో ముసలితనం 3 ఎవుతున్న దేహమనే కప్ప ఏ క్షణంలో, ఎక్కడికి, ఎలా గెంతుతుందో తెలియద: *3దు. రజో మార్గంలో పయునిస్తున్న ఈ శరీరాలనే చంచల వాయువులు చినలి కేమవుతాయో ఎవరూ గుర్తించలే కున్నారు.
4౮ యోగవాసిస్టం భగవ౯! గాలి, దీపం, మనస్సు- వీటి రాకపోకలనైనా గమనించ వచ్చును గొని శరీరం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో గమనించలేము. ఇలాంటి శరీరాలనూ, జగత్తునూ నమ్ముకున్న మూఢుల జీవితం వ్యర్థం. ముసీశ్వరా ! “ఈ దేహానికీ, నాకూ ఎలాంటి సంబంధమూ లేదు; ఈ దేహం నేను కాదు అని గ్రహించి శాంత చిత్తులైన వాళ్ళే పురుష్తోత్తములు. శరీరమే తానని నమ్మిన మూఢమానవుళ్లీ మానావమానాలకూ, వివిధ (భ్రాంతులకూ నిలయమైన అజ్ఞానశక్తి మృత్యువశం చేస్తుంది. శరీరమనే బిలంలో శయనించివున్న అహంకార మనే సిశాచి నిస్పారమైన సంసారభ్రమ కల్పించి మమ్మల్ని మోసగిస్తున్నది. దేహాత్మ (భ్రాంతికి మూలహేతువైన మిథ్యాజ్ఞానమనే రాక్షసి వివేకసహాయం లేకుండా దీనంగా పడివున్న సద్బుద్రిని వంచిస్తున్నది.
ఈ దృశ్య జగత్తులో సత్యం ఇసుమంతకూడా లేదు. ఐనా ఉనికి లేని యీ పాడు శరీరం ఎంతగానో జీవులను వంచనకు గురి చేస్తున్నది. ఈ శరీర పల్లవం సెలయేటిలోని నీటిబిందువులా కొద్దిరోజులలోనే శుష్కమై క్రిందికి పడిపోతుంది. సాగరంలోని నీటిబుడగలాగా క్షణంలో చిట్లిపోయే ఈ శరీరం వ్యర్ధంగా సంసారకాయ్య లనే సుడిగుండాలలో తిరుగుతున్నది.
ద్విజవర్యా ! మిథ్యాజ్ఞాన వికారమైన ఈ దేహం స్వప్నంలో కనిపించే నగరంలాంటిది. దీని ఉనికి క్షణకాలమే. అందువల్ల దీనిపైన నాకు నమ్మకం లేదు
ఎవడు మెటఫు తీగలనూ, శరన్మేఘాలనూ, గంధర్వ నగరాలనూ ఫ్రీరమని నమ్ముతాడో అట్టి మూఢుడే ఈ శరీరాన్ని శాశ్వతమని నమ్ముగాక! క్షణంలో కనిపించి మాయమయ్యే విద్యలో ఈ శరీరం మెజపు తీగలవంటి పదార్హాలనుగూడా మించిపోతున్నది. ప్రబలదోష భూయిష్టమైన దీన్ని తృణీకరించి నాలో నేను సుఖంగా , వున్నాను.
బాల్యజుగుపష్ప వలునీం[దా ! బహుకార్య భారాలనే అలలతో చంచలవ్వెన ఈ సంసారసముద్రంలో జన్మించడం దుఃఖహేతువు. అందులోనూ బాల్యం మరీ దుఃఖ భూయిష్టం. శక్తిహీనతా, ఆపదలూ, ఆశా, మూగతనమూ, మూఢత్వమూ ఆటలపై ఆసక్తీ, చాపల్యమూ, దైన్యమూ - ఇవన్నీ బాల్యదశలోనే సంప్రాప్తిస్తాయి. స్తంభానికి కట్టువడ్త ఏనుగులాగా బాల్యదశలో వున్నవాడు చీటికి మాటికీ రోషం,
. 41 శోకం మొదలైన దురవస్టలకు లోనవుతాడు బాల్యంలో హృదయాన్ని పీడించినన్ని చింతలు యౌవనంలో గానీ, వార్దకంలో గానీ, రోగం కలిగినప్పుడు గానీ, చివరికి మరణించే సమయంలో గానీ కలగవు. చావుకంటే గూడా బాల్యమే ఎక్కువ దుఃఖప్రదం.
పళుపత్యాదుల ననుకరించే చంచలమైన బాల్యచేష్టలను అందరూ తిరస్కరిస్తారు. వ్యర్ధమైన వివిధసంకల్పాలవల్ల పేలవమై అజ్జానమయమైన శైశవంలో మనస్సు విక్షేపాలకు నిలయమై పటుత్వం కోల్పోతుంది. అలాంటి దశలో సుఖపడే వాడెవడు ?
నీరు, నిప్పు, గాలి - వీటివల్ల బాలురకు కలిగే భయం చాలా తీవ్రమైనది. ఎలాంటి ఆపదలోవున్నా అంత భయం ఇతరులకు కలగదు. ఆటలు, చిలిపిచేష్టలు, లేనిపోని వ్యామోవోలు - వీటికి లోనై బాలుడు అజ్ఞానంతో మునిగిపోతాడు, పనికిమాలిన దుడుకుపనులు చేసి మాటిమాటికి పెద్దలు విధించే శిక్షలకు గురి అయ్యే శ్రైశవావస్టలో శాంతి ఎక్కడిది ? (గ్రుడ్డగూబలు వీకటి గుహను ఆ(శ్రయించినట్టు దోషాలూ, దురాచారాలూ, వునోవ్యాధులూ బాలురను ఆవహిస్తాయి. (బ్రహ్మర్షీ ! ఇలాంటి భాల్యం రమణీయమని భావించే మూర్చులకు ధిక్కారం |
మునీంద్రా! సదా చంచలమై ఊగిసలాడే చిత్తానికి నెలవైన శ్రైెళశవం తుష్టి నెలా కలిగిస్తుంది ? ప్రాణు లందరికీ అన్ని అవఫ్టల కంటే పదిరెటుగా బాల్యావప్టలోనే మనస్సు చాంచల్యానికి గురి అవుతుంది. మనస్సు సహజంగానే చపలం. బాల్యదశ అంతకంటే ఎక్కువ చపలమైనది. ఇక ఈ రెంటి కలయిక వల్ల ఏర్పడే చాపల్య ప్రమాదంనుండి రక్షించేవా డెవడు ? స్త్రీల నేత్రాలూ, మెఆపుతీగలూ, అగ్ని జ్యూలలూ, అలలూ, చాపల్యం బాలురనుండే నేర్చుకొన్నాయి. సహజ చంచల లైన బాల్యమూ, మనస్సూ అన్ని విషయాలలోనూ అన్నదమ్ముల్లా వున్నాయి.
సంపన్నుల్లి ఆశ్రయించి ఇతర జనులు జీవించినట్టు దుఃఖాలూ, దోషాలూ, పీడలూ, బాలుణ్లి ఆశ్రయించే జీవిస్తున్నాయి. (ప్రతిదినమూ క్రొత్త క్రొత్త వస్తువులు తనకు దొరకకపోతే బాలుడు విషం సోకినవానిలా మనోవికారం పొందుతాడు. అలడు కుక్క లాగా అల్పానికే సంతసిస్తాడు; అల్పానికే దుఃఖిస్తాడు: అమేధ్యంలో శ్రీడిస్తాడు. బాగా కాలి వానకు తడిసీన నేల లాగా బాలుడు ఎప్పుడూ బాష్ప్రజలం కారుస్తూ
ఆరా యోగవాసెస్ట్రం మలిన శరీరుడై జడాశయుడై వుంటాడు. భయం, ఆహారవాంఛ, దైన్యం కనిపించే దానిమీద కనిపించని దానిమీద కోరిక, బుద్దిచాపల్యం - ఇవి బాల్యధర్మాలు. వీటివల్ల కలిగేదంతా దుఃఖమే, కోరినవన్నీ దారకలేదన్న చింతతో గుండె (బ్రద్రలయ్యేటట్టు బాలుడు విలపిస్తాడు. దుడుకు చేష్టలవల్లా, వంచనోపాయాలవల్లా బాలుడికి కలిగినన్ని దుఃఖాలు లోకంలో ఇంకెవరికీ కలగవు. (గ్రీష్మ తాపంతో వనభూమి తపించినట్లే బాలుడు కోరికలకు వశమైన మనస్సుతో పరితపిస్తాడు. బంధింపబడిన ఏనుగు లాగా బడికి వెళ్ళిన బాలుడు పలుబాధలకు గురి అవుతాడు. పలుకోర్కెలకూ, బూటకపు కల్పనలకూ, నిస్పారమైన ఆశయాలకూ నిలయమైన బాల్యానికి ద్వీర్ద దుఃఖమే ఫలం. జగత్తునంతా మింగివేయాలనీ, ఆకసంలోని చందమామను తన గుప్పిట్సోకి తెచ్చుకోవాలనీ కోరే మూఢత్వ దశలో సుఖం ఎలా కల్గుతుంది ? మహామతీ | శీతాతప పీడలను నివారించుకొనే శక్తి చెట్టుకు లేనట్లే బాలుడికి కూడా లేదు. భయం కల్లినా, ఆకలి కల్గినా బాలురు పక్షులలాగా చేతులు పైకీ చాపి ఎగరా లనుకొంటారు. గురువన్నా, తల్లిదం(డ్రులన్నా, పెద్రపిల్లలన్నా, (క్రొత్తవాళ్ళన్నా బాలురకు భయం. అసలు బాల్యమే భయానికి నిలయం. మహామునీ ! సమస్త దోషాలవల్టా బాల్యంలో మనస్సు కలుషిత మవుతుంది. అది అవివేకానికి ఆటపట్టు. అలాంటి బాల్యదశలో సుఖపడేవా డెవ్వడూ లేడు. యౌవనజుగుష్ప తర్వాత దుఃఖబహుళ్ళమైన బాల్యాన్ని వదలి భోగాల మీద కోరికతో చిత్తం కలుషితం కాగా మానవుడు పతనం చెందడానికే యౌవనాన్ని అధిరోహిస్తాడు. జడుడైన యువకుడు చేస్టాబహుళమూ, చంచలమూ అయిన మనస్సుయొక్క రాగద్వేషాది పరిణామాలకు లోనై దుఃఖపరంపరను అనుభవిస్తాడు. హృదయబిలంలో నివసిస్తూ వివిధ భయభ్రాంతులను కల్గిస్తున్న కామపిశాచం అతళ్లి వివేక హీనుళ్ల చేసి పరాభవిస్తుంది. వశం తప్పిన చిత్తం యువతులలాగా అత్యంత చపలమైన పెక్కు చింతలను కల్లించి సిద్దాంజనం లాగా భోగ్యపదార్దాలను మాత్రమే కనిపింపచేస్తుంది. మునీంద్రా! చింతావివశుడైన పురుషుళ్లి యౌ వనంలో స్త్రీ ద్యూత కలహాది వ్యసనాలకు లోను గావించే రాగలోభాది దోషాలు ఒక్కుమ్మడిగా మట్టుముట్జి
దైూగ్బ ప్రకంణం తప పాడు చేస్తాయి. మహానరక బీజమూ, సంతత భ్రాంతి హేతువూ ఆయిన ఈ యౌవనంవల్ల చెడిపోని వాళ్ళు ఇక దేనివల్గా చెడిపోరు. నానారసమయమూ, చిత్రవృత్తాంత పూరితమూ, భీకరమూ అయిన యౌవనమనే దుర్గమాటవిని _ దాటినవాడే ధీరు డనబడతాడు. శి (బ్రహ్మర్షీ! మెజపులాగా క్షణకాలం ఉజ్జ్వలంగా భాసించేదీ, ఉజుములవంటి అభిమానోక్తులతో కూడినదీ. అమంగళకరమూ అయిన యౌవనం నాకు రుచించదు. ఇది అనుభవించేటప్పుడు మధురంగా వుండి కడపట కటువుగా పరిణమించే కల్చువంటిది. దోషాలకు మేటి అయిన ఈ యౌవనంపై నాకు ఆళ లేదు. నిజం కాకపోయినా నిజంలా కనిపించి క్షణంలో మోసగించే యౌవనం కలలోని కాంతాసంగముం వంటిది. క్షణికవమూ, క్షణకాల వునోహరమూ, గంధర్వ నగరసదృశమూ అయిన యౌవనంపై నాకు ్రీతి లేదు. వింటినుండి వెలువడిన బాణం అవ్య్యాన్ని భేదించుట కెంత కాలం పడుతుందో, అంతసేపు మాత్రమే సుఖం కల్గించి తరువాత బహుకాలం దుఃఖాన్నీ, దాహదోషాన్నీ పెంపొందించే ఈ యౌవనం నా కభిమతం కాదు. వెలయాలి పాత్తులాగా పైకి “రమణీయమూ, లోన సద్భావ శళూన్యమూ అయిన యౌవనం నాకెందుకు ? (ప్రళయ కాలంలో ఉత్పాతాలన్నీ గుమిగూడి వచ్చినట్టు దుఃఖం కలిగించే సమారంభాలన్నీ యౌవనావస్టలోనే దగ్గణకు చేరుకొంటాయి. హృదయాన్ని అంధకార బంధురం చేసే యౌవన దశలోని అజ్డాన మనే కాళరాత్రి భైరవస్వరూపం దాల్చిన భగవంతుళణ్లి కూడా భయగ్రస్తుణ్లి చేస్తుంది. యౌవన మోహం సదాచారాన్ని మరపింపజేసి బుద్దిని మందగింపజేసే భ్రాంతిని తెచ్చిపెడుతుంది. దావాగ్ని వృక్షాన్ని దహించినట్టు యౌవనంలో కాంతావియోగంవల్ల కలిగే మదనతాపం మౌనవుణ్లే కార్చివేస్తుంది. సహజంగా నిర్మలమూ, విశాలమూ, పవిత్రమూ అయిన బుద్ది సైతం యౌవనదశలో వర్ణాకాలపు నది లాగా కలుషిత మవుతుంది. పెద్ద పెద్ద కెరటాలతో భీకరమైన నదినైనా దాటవచ్చుగాని తారుణ్యంతోనూ, భోగాపేక్షలతోనూ చంచలమైవ ఎత్తవృత్తిని అతి'క్రమించడం సాధ్యం కాదు. 'ఆ కాంతా, ఆ వక్షోజాలూ, ఆ ఎల్జాసాలూ, ఆ ముఖమూ” - ఇలాంటి చింతలతో యువకుడు చివికి జ్నీర్సమై శళడు. చపలమైన 'భోగతృష్షను వశమై ఆర్తి నొందే యువకుణ్లి సాధుజనులు ఎండిన
గ, యోగవాసిస్టం గడ్డీ పరకలాగా అవజ్ఞతో చూస్తారు. అభిమాన మదమత్తుడై వి(ర్రవీగే యువకుడనే మదగజాన్ని, నిరంతరం బంధించి ఉంచే స్తంభం యౌవనమే. వమనస్సులనే వ్రైళ్ళతోనూ, దోషాలనే విషసర్ప్సాలతోనూ గూడిన శోషరోదనా లనే వృక్షాలు యౌవన మనే అడవిలో ఏపుగా పెరుగుతాయి. రాగాదు లనే కేసరాలతోనూ, కువికల్పా లనే రేకులతోనూ కూడిన యౌవన మనే పద్మం దుళ్ళింతలనే తుమ్మెదలను ఆకర్షిస్తుంది. పుణ్యపాపా లనే రెక్కలతో హృదయ మనే మడుగు గట్టున సంచరించే ఆధివ్యాధు లనే పక్షులకు గూడు నవయౌవనమే. మితిమీరిన వికల్పాలనే తరంగాలు నూత్న యౌవన మనే మహాసముద్రంలోనే చెలరేుతాయి. దుమ్ములు రేపుతూ వీచే పెనుగాలి సాలోళోళ్ళను పాడుచేసినట్లే రజస్తమోదూషితమైన యౌవనం సమస్తసద్గుణాలనూ ధ్వంసంచేస్తుంది. ఇం(ద్రియ చాపల్య ప్రభావంతో పైజగసీ యౌవన మనే పెను ధూళి సోకి మనుజుల ముఖాలు తెల్లబడీపోతాయి. దుష్క్కృత లక్ష్మీకి విలాసమైన యౌవనోల్లాసం దోషరాశిని పెంచుతుంది. గుణ పుంజాన్ని తెంచుతుంది. యౌవన మనే చం(ద్రుడు మనస్సనే భృంగాన్ని శరీర మనే పద్మం లోనే బంధించి 'మోహింప జేస్తున్నాడు. శరీర మనే పాదరింటిలో పుట్టి పెరిగిన యౌవన మనే రమ్యమైన "ఫుష్పమంజరి మనస్సనే భ్రమరాన్ని మోహానికి గురిచేస్తున్నది. మనస్సనే జింక శరీర మనే ఎడారిలో కామతాపానికి లోనై యౌవన మనే ఎండమావివైపు పరుగులు దీసి చివరికి విషయా లనే గుంటలలో పడిపోతుంది. మునీంద్రా! శరీర మనే రాత్రికి వెన్నెలా, చిత్త మనే సింహానికి జూలూ, జీవిత మనే సాగరానికి తరంగమూ అయిన యౌవనం నాకు సంతోషం కలిగించడం లేదు. దేహ మనే అడవిలో యౌవన మనే శరదృతువు శో భిల్లేది కొన్ని దినాలు మా్రమే. దానిని విశ్వసించడం తగదు. దురదృష్టవంతుడికి చేతినుండి చింతామణి క్షణంలో జారిపోయినట్టు ఈ శరీరంనుండి యౌవన మనే పక్షి త్రుటిలో తుర్రుమని ఎగిరి పోతుంది. యౌవనం ముదిరే కొలదీ మనిషిని తాపానికి గురిచేసే కోరికలు గూడా చెలరేగి చెలరేగి చివరి కతణ్లీ హతమారుస్తాయి. యౌవన మనే రాత్రిలోనే రాగద్వేషా అనే పిశాచాలు స్వైరవిహారం చేస్తాయి. మరణించే కొడుకు పట్లు దయ జూపినట్లే ఎ౨ధ చిత్త వికారాలకు నెలవూ
వైరాగ్య ప్రకరణం శక్ క్షణభంగురమూ అయిన యౌవనం పట్ల గూడా దయ జూపాలి. క్షణంలో త్షీణించిపోయే యౌచనాన్ని చూచుకొని మురిసిపోయే మూర్చుడు ద్విపాదపశువే. అభిమాన మోహానికి వశపడి ఎవడు మదోన్మత్తమైన యౌవనాన్ని అభిలపిస్తాడో, అలాంటి దుర్మతి త్వరలో పశ్వాత్తాపానికి గురి అవుతాడు.
సాధుపుంగవా ! ఎన రీయౌవన సంకటాన్నుండి సుఖంగా బయట పడతారో - వాళ్ళే పూజ్యులు; వాళ్ళే మహాత్ములు; వాళ్ళే పురుషులు.
భీకరమైన మొసళ్ళతో నిండిన సము(ద్రాన్నైనా సుఖంగా దాటవచ్చు గాని రాగాది దోషాలకు నెలవైన పాడు యౌవనాన్ని మాత్రం అనాయాసంగా దాటలేము.
వినయ భూషితమూ, ఆర్యజనులకు శాంతిధామమూ, కరుణోజ్జ్వలమూ; సద్గుణోపేతమూ అయిన మంచి యౌవనం గగనంలోని నందనవనం లాగా ఈ లోకంలో దుర్తభం గదా 1
స్త్రీజాగుప్ప
యంత్రంలా చలించే స్త్రీ శరీరపంజరం నరాలతో, ఎముకలతో చేయబడ్డ మాంసపు బొమ్మ. అందులో శోభావహమైన దేమున్నది ?
చర్మం, మాంసం, కళ్ళూ, కన్నీళ్ళూ - ఇలా శరీర భాగాలను విభజించి చూడు! అందంగా ఉంటే ప్రేమించు 1! వ్యర్ధంగా ఎందుకు మోహగ్రస్తుడ వవుతావు ? వెం(డ్రుకలూ, రక్తమూ మొదలైన పదార్దాలతో కూడిన స్త్రీ శరీరంవల్ల బుద్రిమంతుడికి (ప్రయోజన మేమిటి ?
మేలివస్తాలతోనూ, మైపూతలతోనూ చిరకాలం లాలింపబడ్డ మానవుల అవయవాలు చివరికి కుక్కల నక్కల పాలవుతున్నాయి. మేరుపర్వతశిఖరంపై జాలువారే మందాకినీజలధార లాగా ఏ స్తనంపై ముత్యాలహారం కనులపండువు చేస్తుందో ఆ లలనాస్తనమే కాలవశాన కుక్కల నోటి కడి అయిపోతుంది. అడవిలో తిరుగులాడే ఒంటె అవయవాల వంటివే రక్తమాంసాస్టులతో గూడీన కామిని అవయవాలు గూడా. అలాంటి వాటిపై ఆళ ఎందుకు ?
మునీంద్రా! స్త్రీలలో కనిపించేవి మోహకారణమైన పైపై మెటుగులే. నిజానికి వాళ్ళలో ఎలాంటి అందచందాలూ లేవని నా భావన. పైకి ఉల్లాసం కలిగించి మత్తెక్కించే మద్యానికీ, మగువకూ తేడా యేమిటి ? కామిను లనే కట్టుకంబాలకు వశపడిన పురుషు అనే ఏనుగులకు శమ మనే దృఢమైన అంకుశపు పోట్లు తగిలనా
వ! యోగవాసం వివేకం కల్లడం లేదు. కేశకజ్ఞలాలు ధరించి స్ప్రశింప వీలుగాక కంటికింపుగా కనిపించే దుష్క్రృతాన్నిజ్వాలలైన స్త్రీలు చెంతకు వచ్చిన పుర'షులను గడ్డిపరకల లాగా దహించి వేస్తారు. పైకి సరసంగా కన్పిస్తున్నా నిజానికి నీరసలైన స్త్రీలే సుదూరంలోవున్న నరకాగ్నులను సైతం ప్రజ్వలింపజేసే ఇంధనాలు. కేశపాశాలనే చీకట్లతోనూ, చంచలనే(త్రాలనే నక్షత్రాలతోనూ, ముఖవమనే ఫ్యూర్ణచంద్రునితోనూ, నవ్వులనే ఫువ్వులతోనూ విలసిల్లే కామిని అనే ద్లీర్ణయామిని పురుషుల బుద్దిని మాహగ్రస్తం కావించి వాళ్ళను ధర్మ కార్యాలనుండి విముఖులను చేస్తున్నది. చివుళ్ళువంటి చేతులూ, తుమ్మెదలవంటి కన్నులూ, పూగుత్తుల వంటి స్తనాలూ కల్లి విషలతను బోలిన కాంత చెంతచేరిన వాళ్ళను ఉన్మాదంతో వివశులను చేస్తున్నది. శ్వాసతో కలుగులోని పామును వెలికీలాగే ఎలుగుబంటులాగా విలాస చేష్టలతో కాంత విటులను తనవైపు ఆకర్షించుకొంటుంది. కాము డనే కిరాతుడు మోహగ్రస్తులైన నరు లనే పక్షులను పట్టుకోవటానికి వనిత లనే వలలు పన్నుతున్నాడు. బ్రహ్మ౯ ! రతి అనే గొలుసుతో వనిత అనే స్తంభానికి కట్టుబడిన మనస్సనే మదగజం మూగదానిలా పడివున్నది. దుర్వాసన లనే గాలపు దారాలకు గ్రుచ్చబడ్డః కాంత లనే ఎజ్జులు సంసార మనే బొందలోని చిత్త మనే బురదనీటిలో తిరుగులాడే " పురుషు లనే చేపలను ఆకర్షిస్తున్నాయి. గు(ర్రాలకు శాలలూ, ఏనుగులకు స్తంభాలూ, పాములకు మంత్రాలూ బంధా లైనట్లే పురుషులకు స్త్రీలు బంధా లవుతున్నారు. మునీంద్రా! శోకమోహాది వివిధ రసాలతో గూడిన యీ భోగమయ ప్రపంచం స్త్రీలను ఆశ్రయించడం వల్లనే స్టిరరూపం ధరించింది. సమస్త దోషాలకు నిలయమూ, దుఃఖాలకు సంకెలా అయిన స్త్రీ నా కక్కరలేదు. కేవలమాంసమయా లయిన మగువల అవయవాలతో నేను చేసే దేమున్నది ?
(బ్రహ్మర్షీ! క్రమాంసాదిపదార్దాల ముద్ద అయిన రమణి కొన్ని దినాలకు శిథిలమై జీర్ణమై పోతుంది. ఒకనాడు మందబుద్దులైన పురుషులను ఎంతో ప్రియంగా లాలించిన తరుణులే ఈనాడు చెదరిపోయిన అవయవాలతో శ్మశాన భూమిలోపడి నిద్రిస్తున్నారు. ప్రియులు మిక్కిలి (ప్రేమతో గోరో చన చందనాదులతో తిలకరచనలు కావించి అలంకరించిన వనితల వెోూవులు శ్మశానాటవులలో శుష్కించి పోతున్నాయి. వాళ్ళ వెండ్రుకలు అక్కడి చెట్లకు తగుల్కొని చామరాలలాగా ఊగులాడుతున్నాయి. ఎవలటుకలు వెల్టాచెదరై నేలమీదిపడి నక్షత్రాలలాగా
“వైరాగ్య ప్రకరణం 47 కన్పిస్తున్నాయి. రక్తం దుమ్ములో కలిసిపోతున్నది. మాంసం (గ్రద్దల పాలవుతున్నది. (ప్రాణవాయువులు ఆకసంలో లీనమై పోతున్నాయి. వనితల అవయవాలకు ఇలాంటి దుఃఫ్రితి త్వరలోనే సిద్రిస్తుంది. ఇక ఇంద్ర భ్రమపడట మెందుకు ? పంచభూతాల సంఘాతమాత్రమైన స్త్రీమూర్తిపై బుద్రిమంతుడికి ఎలా అనురక్తి జనిస్తుంది ?
కాంతల ననుసరించిన చింత సుతాలలత లాగా శాఖోపశాఖలుగా పెరిగి కడకు పూల్రగా, చేదుగా అనుభవానికి వచ్చే ఇహపర ఫలాలను ప్రసాదిస్తుంది. మందనుండి తప్పిపోయిన మృగం లాగా కామపరవళమైన చిత్తం గమ్యం తప్పి దిక్కుతొచక పోహానికి గురి అవుతుంది. ఆడు ఏనుగుపై వలపుగొన్న వుదపుటేనుగ వింధ్యపర్వతంలో త్రవ్విన గోతిలో కూలినట్టు యువతీసక్తుడైన యువకుడు దుఃఖకూపంలో కూలిపోతాడు. చెంత స్త్రీ వున్న వానికే భోగేచ్చ కల్గుతుంది. స్త్రీ రహితుడికి భోగాని కవకాశ మెక్కడున్నది ? స్త్రీని త్యజాస్తే జగత్తును త్యబించినచ్సే. జగత్తును త్యజించినవాడు నిజంగా సుఖపడతాడు. (బ్రహ్మర్లీ ! జరామరణరోగాదుల భయంవల్ల ఆపాతరవుణీయాలూ, తుమ్మెద రెక్కల లాగా చంచలాలూ, దురతిక్రమణీయాలూ అయిన భోగాలపై నాకు ఆసక్తి కల్లడం లేదు. నేను 'ఉపరతి' నవలంబించి పరమపద ప్రాప్తికి ప్రయత్నిస్తాను.
వార్థకజుగుప్ప
మునీం(ద్రా! ఆటపాటలమీది కోరికలు తీరకమునుపే బాల్యాన్ని యౌవనం కబళించి వేస్తుంది. తర్వాత భోగాలపై ఆశలు తీరకముందే యౌవనాన్ని వార్దక్యం (మింగివేస్తుంది. ఇలా ఇవి ఒకచొకటీ ఎంత (క్రూరంగా ప్రవర్తిస్తున్నాయో చూడండి!
మంచు పద్మాన్నీ, పెనుగాలి శరత్కాల మేఘాన్నీ, నది గట్టు మీది చెట్టునూ నశింపబేసినట్లే ముసలితనం శరీరాన్ని నశింపజేస్తుంది. విషం త్రాగివవాని దేహం లాగా ముదిమి సోకినవాని శరీరం కూడా శిథిలమైన అవయవాలతో వికృతరూపం పొందుతుంది.
జరాజీర్ణాంగుడైన పురుషుణ్లి ఒంటెను చూచినట్టు కామినులు ఏవగింపుతో. మౌస్తారు. అవలీలగా దైన్యం ఆపాదించే ముసలితనం పైబడగానే సవతిచేత దెబ్బలు ఆన్ని వనితలాగా ప్రజ మానవుల్లో విడిచి పారిపోతుంది. సేవకులూ, కొడుకులు", భార్యా, బంధువులూ, మిత్రులూ వణకే ముసలివాణ్ణీ పిచ్చివాణ్లోీలా చూచి సరిహసిస్తారు
48 యోగాసిష్టం ఎండి మైడువారిన చెట్టుమీద (గ్రద్ద వ్రాలినట్లే జరాజీర్లుడైన వాణ్తీ లోభం ఆక్రమిస్తుంది. కామం ఆపదలకు నెప్చైలి. అది వార్రక్యంలో బాగా వృద్రిపాంది దైన్యాన్నీ, హృదయతాపాన్నీ పెంపొందించుతుంది. ఆదశలో మానవుడు “'నేనేమి చేయాలి? పరలోకంలో ఎంత దారుణమైన బాధ అనుభవిస్తానో?' అని మిక్కిలి భయపడుతాడు. ““తుచ్చుడనైన నేను ఏమి చేయగలను ? ఎలా చేయగలను ? కదలక మెదలక ఇలా ఎంత కాలం వూరక కూర్చొని వుండగలను ?'* అనే దైన్యంతో కూడిన తలపోతలు అతనితో కొల్లలుగా పాడచూపుతాయి. “నాకు రుచికరమైన భోజనం ఎలా లభిస్తుంది ? ఎప్పుడు లభిస్తుంది ? ఎవరు తెచ్చిపెడతారు ?*” అన్న చింత వృద్దుడి చిత్తాన్ని దహించివేస్తుంది. ఆ స్థితిలో అనుభవించాలనే కోరిక తీవ్రంగా వుంటుంది గాని అనుభవించే శక్తి వుండదు. ఈదౌర్చల్యంవల్ల హృదయం నిజంగా దహించుకుపోతుంది.
మునీంద్రా ! శరీరమనే చెట్టుపై వ్రాలిన వార్హక మనే ముసలికొంగ రోగ మనే పాము చేత కబళింపబడి ఆ(క్రందనం చేస్తుంది. ఇంతలో ఎక్కడ నుండో మరణ మనే గ్రుడ్లగూబ వచ్చి దానిపై వ్రాలుతుంది. సాయంసంధ్యను చీకటి వెంబడించినట్లే . వార్రక్యాన్ని మృత్యువు వెంబడిస్తుంది. దేహ మనే చెట్టుపై జర అనే కుసుమం వికసించగానే మరణ మనే కోతి దానిపైకి దూకుతుంది.
(ప్రజలు లేని ననరమూ, తీగలు లేని వృక్షమూ, వర్షాలు లేని దేశమూ - ఇవైనా ప్రకాశిస్తాయి గాని జరాశిథిలమైన శరీరం మాత్రం శోభిల్లదు. కూతపెడ్డ్తున్న (గ్రద్ర 'మింగడానికే మాంసాన్ని గ్రహించినట్లు దగ్గుతో గూడిన ముదిమి క్షణంలో కబళించి వేయడానికే మనుజుళ్లీ ఆక్రమిస్తుంది. బాలిక జొత్సుక్యంతో కలువపూవును తలలో ముడుచుకొని మళ్ళీ వెంటనే (త్రుంచి పారవేసినట్లే జర శరీరాన్ని గ్రహించి క్షణకాలంలో హతమారుస్తుంది.
దుమ్ములు రేపుతూ వీచే పెనుగాలికి చెట్టచివుళ్ళు చిరిగిపోయినట్లే జర ఆక్రమించూనే శరీరాలు శిథిలమైపోతాయి. జరాక్రాంతమైన శరీరం మంచుకు తడిసిన తామర పువ్వులా జర్హరితమైపోతుంది. శిరస్సనే శఖరంపై ఉదయించిన వార్షక్యమనే వెన్నెల వాతకాసాది రోగాలనే కలువలను వికసింపజేస్తుంది. ముదిమి అనే బూడిద అలముకొన్న శరస్సనే గుమ్మడికాయ పరిపక్వమైనదని భావించి కాలు డనే (ప్రభువు భికిస్తాడు.
వైరాగ్య బ్రకరణం ష్ ఆయుస్సనే ప్రవాహ వేగం గల జర అనే గంగానది శరీరమనే తీరవృ్చవ్నాన్ని త్రుటిలో సమూలంగా పెకలించివేస్తుంది. వార్రకమనే పిల్లి ముందు యౌవన మనే ఎలుకను భక్షించి పిదప ఎంతో వుబలాటంతో శరీరమనే మాంసంకొరకు వేచివుంటుంది. దేహమనే అరణ్యంలో ముదిమి అనే నక్క వంటి అమంగళకరమైనది మరొకటి లేదు. శ్వాసకాసలనే చిటపట ధ్వనులతోనూ, దుఃఖమనే ధూమంతోనూ వ్యాపించే జర అనే అగ్నిజ్వాలలో ప్రతివాడూ ద్చమై పోతాడు. తెల్లని పువ్వుల బరువుతో వంగిపోయే తీగలాగా పాలిపోయిన అవయవాలతో వార్దక్యంలో శరీరం వంగిపోతుంది. మునీంద్రా! వార్హక్యమనే కర్బూరంతో తెల్లబడిన శరీరమనే కర్ఫూరవృక్షాన్ని మృత్యువనే ఏనుగు క్షణంలో కబళించి వేస్తుంది. జర అనే ధవళ చామరంతో మృత్యువు అనే రాజు బయలు దేరినప్పుడు అతనికి ముందే ఆధివ్యాధులనే సేనలు బారులు దీరి నడుస్తాయి. కొండగుహలో దూరిన వారిని శత్రువులు జయించలేరు; కాని వాళ్ళను కూడా జర అనే రాక్షసి నిముసంలో పరాజితులను చేస్తుంది. జర అనే పొగమంచు వ్యాపించిన శరీరమనే గృహమధ్యంలో చిక్కుకొన్న ఇం(ద్రియా లనే శిశువులు అటూ ఇటూ ఏమాత్రం కద్లేరు. జర అనే నర్తకి దండమనే మూడవకాలిని వూతగా గొని కాసశ్వాసలనే మద్దెలలు ధ్వనిస్తుండగా పడుతూ లేస్తూ నృత్యం చేస్తుంది. సంసార మనే రాజు విషయభోగా లనుభవించే దేహమనే ఇంటి పై భాగంలో జర అనే వింజామర (వ్రేలాడుతూ వుంటుంది. మునీంద్రా ! శరీరమనే నగరంలో జర అనే చంద్రోదయం కాగానే మరణమనే కలువ వికసిస్తుంది. వార్దక్యమనే సున్నంతో వెల్లవేయబడ్డ శరీరమనే అంతఃపురంలో అశక్తి, ఆర్తి, ఆపద అనే అంగనలు ముగ్గురు సుఖంగా నివసిస్తూంటారు. జరాగ్రస్తమై చివరకు మృత్యువు పాలబడే ఈ శరీరంపై నాకు విశ్వాసం ఎలా కలుగుతుంది ? తండ్రీ! లోకంలో జరను జయించిన వారెవరూ లేరు. అది ఎవరికీ ఏకోరికనూ నెరవేరనీయదు. అలాంటి వార్దక్యం పైబడి నిలువెల్లా పీడిస్తున్నా ఇంకా జీవించాలనే దురాశ ఎందుకు ? క్5్
50 యోగవాసిస్టం కాలనింద లేనిపోని మనోవికల్పాలు కల్పించుకొని ఎడతెగని అసంబద్ర ప్రలాపాలు చేసే అల్పబుద్దులు, రాగద్వేషాది భేదాలు పెంపాందించుకొని కడలేని సంసార గహూరంలో పడి పరి(భ్రమిస్తున్నారు. విషయసుఖాలనే పంజరంలో (ప్రవేశించాలనే కోరిక వివేకవంతులకు ఎలా కల్గుతుంది ? అద్దంలో (ప్రతిఫలించిన పండును తినాలనే అభిలాష బాలురకే కదా కలిగేది 1 ఇలాంటి సంసారంలో సైతం ఎవర్కైనా కుద్రమైన సుఖభావన వుంచే, ఎలుక దారాన్ని కత్తిరించినట్టు కాలం దాన్ని కత్తిరించి వేస్తుంది. పాంగులువారే సముద్రాన్ని బడబాగ్ని కబళించినట్టు సమస్త జగత్తునూ కాలం (మ్రింగివేస్తుంది. కాలపురుషుని నోట పడకుండా తప్పిపోయే పదార్దం యేదీ లేదు. ప్రళయరుద్ర స్వరూపుడైన కాలుడు సమస్త దృశ్య జగత్తునూ దిగ(మ్రింగడానికి సన్నద్దుడై వున్నాడు. ఎంతగొప్ప వారినైనా అతడు అక్ష్యుపెట్టుడు. అగోచర స్వరూపుడైన కాలుడు కల్పాలూ, యుగాలూ, సంవత్సరాలూ అనే ఉపాధులతో తనరూపం కొంచెం ప్రకటించి సమస్త విశ్వాన్నీ వశపరచు కొంటున్నాడు. గరుడుడు పాములను (మింగినట్టు మనోహరముళలై, శుభారంభం కలిగి, మేరుగిరిలాగా దృఢములైన పదార్దాలను గూడా కాలుడు (మింగివేస్తాడు. దయాహీనుడూ, కఠినుడూ, క్రూరుడూ, కృపణుడూ, అధముడూ అయిన కాలుని బారిను6€ * తప్పించుకొన్న వారు ఎవరూ లేరు. ఆతడి కెంత తిన్నా ఇంకా తినాలనే కోరిక దప్ప తృప్తి అన్నది లేనే లేదు. నటుని లాగా నానారూపాలతో సంసార నృత్యం చేసే కాలుడు సమస్త లోకాలనూ సంహరిస్తాడు. మళ్ళీ సృష్టిస్తాడు. మళ్ళీ భక్షిస్తాడు. చిలుక దానిమ్మ పండును చీల్చి గింజలను దిన్నట్టు అతడు జగత్తును సంహరించి అందలి ప్రాణులను ఆరగిస్తున్నాడు. కాలుడనే మత్తగజం శుభాశుభ కర్మలనే దంతాలతో జీవు లనే చిగురుటాకులను చిదిమివేస్తూ సంసారారణ్యంలో ఎదురు లేకుండా సంచరిస్తున్నది. (బహ్మవటాలకమైన ఈ (బ్రహ్మాండవునే వుహావృక్షం కాలపురుషుని గర్భకుహరంలోనే ఉత్పత్తి ఫ్టితి వినాశాలను పొందుతున్నది. రా(త్రులనే తుమ్మెదలతోనూ, పవళ్ళనే పూగుత్తులతోనూ గూడిన సంవత్సరం, కల్పం మొదిలైన లతలను విసుగు లేకుండా కాలుడు అల్లబెడుతూ వుంటాడు.
రాం ఎంరాలయి )్యా
యల ప!
గగ కాం) *
సనా వైర్?
మునీంద్రా ! ధూర్తశిఖామణి అ న(కార్యరూపంలో) భ్మూడైనా, ద్దుడైనా, కంటికి కనిపించినా (కారణరూపంలో ) భంగాదిదోషాలు లేనివాడై వుంటాడు. అతడు ఒకనిముసంలో ఒక వస్తువును సృష్టిస్తాడు; మరొక వస్తువున రూపుమాఫుతాడు. అతడు దేహంతో తాదాత్మ్యం పొందిన అజ్ఞ్జానులను దుర్విలాస విలసితాలైన తన చేష్టలతో స్వర్గనరకాలలో తిప్పుతూ వుంటాడు. ఈ కుక్షింభరుడు తృణం మొదలు మేరుపర్వతం వరకూ సమస్తవిశ్వాన్నీ దిగమింగడానికి సిద్దంగా వున్నాడు. క్రార్యం, లౌభ్యం, దౌర్బాగ్యం, చాపల్యం - ఈ దుర్గుణపుంజాన్న అతనిలోనే సమగ్రంగా చూడవచ్చు. బాలుడు ఇంటిముంగిట బంతులు విసురుతూ ఆటలాడినట్లే కాలుడు
ఆకసంలో సూర్యచంద్రులతో శ్రీడిస్తున్నాడు. అతడు యుగాంతంలో సమస్త జీవులనూ నిర్మూలించి వారి పునుకలకు దండలుగా ఆపాదవాుస్తకం అలంకరించుకొంటాడు. కల్పాంతంలో నిరంకుళుడైన అతని శరీరంనుండి వెలువడే గాడ్పులకు మేరుశైలం భూర్తప(త్రంలాగా తునాతునకలై గగనంలో తేలిపోతుంది. రుద్రుడుగా, మహేంద్రుడుగా, పితామహుడుగా రూపాందేదీ, రూపరహితుడై వెలుగొందేదీ కూడా ఈ కాల పురుషుడే. సము(ద్రం సదా అలలను సృష్టించి తనలో లయించుకొన్నట్లే అతడు నానావిధ భూత (ప్రపంచాన్ని సృజిస్తూ తనలో ఐక్యం చేసుకుంటూ వుంటాడు.
" అతడు మహాకల్పాలనే చెట్టునుండి దేవాసురులనే పండ్లను రాలుస్తూ వుంటాడు. కాలపురుషుడనే ఉదుంబర వృక్షమునుండి జీవులనే దోవులతో నిండిన (బ్రహ్మాండాలనే మేడిపండ్డ్లు రాలి పడుతూ వుంటాయి.
శ్రీయ అనే (ప్రేయసితో గూడి కాలపురుషుడు చిజ్ఞూత్స్న వల్ల వికసించిన సత్త అనే కలువపువ్వులతో తన శరీరాన్ని అలంకరించుకొంటున్నాడు. నంహాపర్వతంలాగా ఆద్యంతాలు లేని వుహాశరీరంతో కాలుడు (ప్రబలుడ్డె అత డొక చోట కారుచీకటిలా నల్లగానూ, మరొక చోట మహాకాంతితోగు డి ఉజ్జ్వలంగానూ, ఇంకోచోట ఏ రంగూ లేని వాడుగానూ తనస్వరూపం ఛక్రీకరింపబేస్తున్నాడు. ప్రాణిజాలం లయించిన తర్వాత భారం మాత్రం మిగిలిన వామి లాగా కాలుడు సత్తామాత్రావశిష్టుడై వుంటాడు. వందిలక్ లది మవాకల 3౮:
652 యోగవాసిష్టం గడచినా, కాలపురుషుడికి ఖేద మోదాలు, రాకపోకలు, ఊదయాస్తమయాలు లనేఎ లేవు. అత డనాయాసంగా జగదారంభలీలలో నిమగ్నుడై నిరహంకారంగా తన్ను తానే పాలించుకొంటున్నాడు. రాత్రి అనే పంకంలో మొలచిన పవళ్ళు అనే చెంగలువలు మేఘా లనే తుమ్మెదలు పై(వ్రాలగా కాలుడనే మడుగులో వికసిస్తున్నాయి. కాలుడనే కృపణుడు రాత్రి అనే చీపురుతో వేంరుగిరి చుట్టూ సూర్యకి రణాలనే బంగారాన్ని (ప్రోగుచేస్తున్నాడు. సూర్యుడనే దీసాన్ని క్రియ అనే (వ్రేలితో ఎగద్రోసి జగత్తు అనే గృహంలో ఏ మూల ఏమున్నదా అని పరీక్షిస్తున్నాడు. అతడు సూర్యుడనే నేత్రం తెరచి చూచి జగత్తు అనే జీర్ణారణ్యంలోని లోకపాలకులు అనే పక్వఫలాలను భక్షిస్తున్నాడు. అతడు జగత్తు అనే జ్నీర్షకుటీరంలో ఎడనెడా పడివున్న గుణవంతులనే మణులను (క్రమంగా ఏరి మృత్యువనే బుట్టలో వేస్తున్నాడు. ఆ మణులతో మాలలల్లి మెడలో వేసుకొని మళ్ళీ వాటిని త్రెంపివేస్తున్నాడు. పవళ్ళనే హంసలు వెన్నంటి రాగా తారకలనే కేసరాలతో విలసిల్టుతున్న రాత్రులనే నల్లకలువల దండను చపలుడైన కాలపురుషుడు ధరిస్తున్నాడు. కొండలు, సముద్రాలు, స్వర్గోకం, భూలోకం అనే నాల్గు కొమ్ముల తోడి జగత్తనే మేషాన్ని హింసిస్తూ కాలుడు నత్షత్రాలనే నెత్తుటి చుక్కలను ఆస్వాదిస్తూన్నాడు. అతడు యౌవనమనే పద్మానికి చంద్రుడు; ఆయుస్సు అనే గజానికి సింహం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతిదీ అతని నోటికి కబళమై పోతున్నది. (ప్రళభయవేళలో సర్వప్రాణులనూ సంహరించి అతడు స్వాధివ్థాన రూపమైన పరబ్రహ్మంలో విశ్రాంతి గైకొంటాడు. మళ్ళీ సృష్టికాలంలో అతడే విశ్వానికి కర్తగా, భోక్తగా, సంహర్తగా, స్మర్తగా, సర్వవిధ స్వరూపాలనూ వహిస్తున్నాడు స్వరూపంతోనూ, విరూపంతోనూ వెలుగుతూ మళ్ళీ కనుమరుగైపో తున్న ఆకాలఫపురుషుని నిజరూపం ఎవరికీ ఊహకందడం లేదు. అతని బలాలిశయం సుప్రసిద్దమే కదా ! కాలవిలాసం పరబ్రహ్మమనే రాజుకు మాయ అనే రాణియందు జన్మించిన కాలుచనే రాజపుత్రుని లీలలు అత్యద్భుతాలు. వాని పరాక్రమం ఊహాతీతం.
వైరాగ్య ప్రకరణం 53 అతడు జగత్తనే జీర్ణారణ్యంలో దీనులూ, మూఢులూ అయిన ప్రాణు లనే మృగాలను వేటాడుతుంటాడు. ఆ (ప్రపంచారణ్యంలో బడబాగ్ని అనే పద్మంతో కూడిన మహాసము(ద్రమే అతడికి (క్రీడాసరోవరం. అతడు కల్పాంతకాలంలో దధిక్షీరసాగరాలతో పర్యుషితం చేయబడ్డ జగత్తు అనే చలిది అన్నమును ప్రాణు లనే కారం, పులుపు, వగరు పచ్చళ్ళను నంజుకుంటూ భుజిస్తున్నాడు. మాతృగణ సమేతంగా సంసారగహనంలో పెద్దపులిలాగా సంచరిస్తూ సర్వభూత సంతతినీ పాట్టబెట్టుకొంటున్న కాళరాత్రియే అతని (ప్రేయసి. సకలరసాలకు కుదురై కలువలు, తావురలు వెచయదలైన పూలతావితో కూడి ఈ భూతలవే కాలపురుషుని “కరతలమందలి పానపాత్ర. అతని భుజపంజరంలో భీకరుడైన నరసింహమూర్తి క్షుద్రపక్షుల వంటి రాక్షసులను వధించే డేగ లాగా వున్నాడు. వీణవలె మధురస్వరం కలవాడూ, శరద(భ్రంవలె ప్రకాశించేవాడూ అయిన కాలభైరవుడు అతనికి క్రీడాకోకిలబాలకుడు. సదా శబ్దిస్తూ దుఃఖాలనే శరపరంపరను గుప్పిస్తున్న సంహార నామకమైన కాలుని కోదండం నలువైపులా విలయతాండవం చేస్తున్నది. అనుత్తవుడా, మహావిలాసపండితుడూ, వేటకాండ్రలో మేటి అయిన కాలుడనే రాకుమారుడు సంసారారణ్యంలో నిరాఘాటంగా సంచరిస్తూ వేటాడుతున్నాడు. కృతాంతవిలాసం మునీంద్రా! దుర్విలాసశిఖామణి అయిన మరొక కాలుడు (మహాకాలునికి ఉపాధిభూతుడైన ఖండకాలుడు) లోకాలను సృష్టించి సంహరిస్తున్నాడు. ఇతడు అవస్టాభేదాన్ని బట్టీ దైవమని, కాలమని వ్యవహరింపబడుతున్నాడు. కర్మలకు ఫలాలను (ప్రసాదించడమే క్రియాస్వరూపుడైన కాలుని కర్తవ్యం. అది తప్పు అతనికి మరొక రూపం కానీ, అభిలొషకానీ లేవు. ఇతడు క్రియాకాలుడు. ఎండ మంచును సమయింప జేసినట్సే ఇతడు పేలవములైన ప్రాణికోట్లను నశింపబేస్తున్నాడు. కంటికి కనిపించే ఈ విశాలజగన్మండల మంతా అతనికి నృత్యశాల. ఇందులో అతడు ఎల్ల వేళలా వికట తాండవం చేస్తూవుంటాడు. దైవవునబడే మరొక కాలుడు దారుణమైన కాపాలిక వేషంలో నృత్యం శేస్తన్నాడు. మునీంద్రా ! మిక్కిలి అనురక్తునిలా కనిపిస్తున్న ఈ కృతాంతునకు *“నియతి' అనే కాంతపై వల్లమాలిన వ్యామోహం. చం గ్రక ష్రౌగా తెల్లనయిన
క్4ీ యోగవాసం శేషుడూ, గంగా ప్రవాహమూ ఈ రెండూ సంసారమనబడే అతని వక్షష్టులంమీది రెండు జందెపు పోగులు. సూర్యుచంద్రు అతనికి హస్తభూషణాలు. మేరుపర్వత మతనికి రీలాకమలం. నక్షత్రా లనే బుటాలతోనూ; పుష్కురావర్తక మేఘా లనే అంచులతోనరా కూడిన ప్రళయకాలవుహాసవు(ద్ర జలాలతో ఉతకబడే అనంతాకాశమే అతడు ధరించే వస్త్రం.
ఇలాంటి కాలుని ఎదుట జీవుల రాకపోకలతో కలకలంగావున్న జగద్రంగప్టలంలో అతని నిత్యకామిని అయిన నియతికాంత సావూజికులను రంజింపజేస్తూ నృత్యమాడుతున్నది. దేవలోకం మొదలైన లోకాంతరాలన్నీ ఆమెకు ఆభరణాలు. పాతాళంవరకూ వ్యాపించివున్న నీలాకాశం ఆమె కేశపాశం. దుష్కృతాలనే సూత్రాలతో కట్టుబడి, రోదన ధ్వనులతో కూడియున్న నరకలోకాలే ఆమె కాలి గిలుకుటందెలు. క్రియ యనే చెలికత్తె యము డనే ఆమె ఫాలతలంలో చి(త్రగుప్పుడనే కస్తూరికాతిలకాన్ని తీర్చి దిద్దింది.
కాలుని అభిప్రాయాన్ని అతని కనుసన్నలతోనే గ్రహించి ఆ దేవి (ప్రళయవేళలలో (బ్రద్రలవుతున్న పర్వతాల ధ్వనులతో భీకరనృత్యం చేస్తున్నది. సర్వసంహారకారిణి అయిన నియతి భీషణ నృత్యంచేసే సమయంలో వెనుక ప్రక్క కుమారస్వామికి చెందిన మృతమయూరాలు ఊగుతూ (వ్రేలాడుతుంటాయి. ఆమె కంఠంలోని హరకపాలమాల భీకరధ్వానం చేస్తూ వుంటుంది. మందారపుష్పాలతో విలసిళ్లే గౌరీదేవి కచభరమే ఆమెకు చామరంగా భాసిస్తుంది. పర్వతాకారుడైన భైరవుని ఉదరమే ఆమెకు కమండలు వౌతుంది. సహ స్రాక్షుడైన ఇంద్రుని కంకాళమే ఆమెకు భిక్షాపాత్ర; శుష్కమైన వెన్నెముకే ఆమె చేతికర్ర. తాండవ సమయంలో వివిధాకృతులతో ఇటూ అటూ చలించే మస్తకాలనే పద్మమాలతో ఆమె శోభిల్దుతూ వుంటుంది. తనకే భయం కొల్పుతున్న ఈ రూపంతో ''నియతి'' నృత్యం చేస్తున్నది.
ఆ ప్రళయసమయంలో చెలరేగిన పుష్కలావర్తక మేఘాలనే డమరుకముల శబ్దం విని తుంబురుడు మొదలైన గంధర్వులు పారిపోతూ వుంటారు. 'నియతి తోపాటు ఆనర్హనశాలలో నృత్యం చేస్తూ వున్న కృతాంతునికి చుక్కలతోనూ, వెన్నెలతోనూ సాబగారు గగనతలమే శిఖాపింఛ మవుతుంది.
అతడు ఒక చెవిలో హీోమాలయమనే అస్రిముద్రికనూ, మరొక చెవిలో మేరువనే కనకకుండలాన్నీ ధరించి వుంటాడు. సూర్యచం(ద్రులే అతని కపోలములలో
వైరాగ్య ప్రకరణం క్క్ మరొకరక్ం కర్షకుండలాలుగా వెలుగుతుంటారు. చ(క్రవాళపర్వతమే అతని మొలనూలు. గాలికి చలిస్తున్న మెరుగులతోడి మేఘమండలమే చి(త్రవర్ధసుందరమైన అతని ఉత్తరీయిం. పూర్వపూర్వ కల్పాలు వెళ్ళ గ్రక్కిన మృత్యువుల వంటి ముద్గర ముసలాద్యాయుధాలు జీవులనే మృగాలను బంధించడానికి కాలపురుషుడు విసరిన పాశాలకు గుచ్చబడి అతని గళసీమలో తళతళ మెరుస్తుంటాయి. జీవులనే మకరికలతో వెల్గే సప్త సము(ద్రాలనే కంకణాలు అతనికి భుజాభరణాలు. శాస్త్రీయాలు, స్వాభావికాలు అయిన వ్యవహారాలే అతని శరీరంలోని సుళ్ళు. వాటివల్ల కలిగే రజస్తమో మయ సుఖదుఃఖాలే అతని శరీరం మీది రోమాలు. ఇలాంటి కృతాంతుడు కల్పాంతంలో తాండవం ముగించి విశ్రాంతి గైకొంటాడు. మళ్ళీ బ్రహ్మాదులతో గూడిన ఈ జగత్తు నంతటినీ సృష్టించి జరామరణదుఃఖఇమయమైన హాస్యం ప్రవర్తింపజేస్తాడు. బాలుడు మట్టితో బొమ్మలు చేసినట్లేకాలుడు భువనాలను, వనాంతరాలను, లోకాంతరాలను, ఆచారవిచారాలను, కృతాదియుగ ధర్మాలను విసుగులేకుండా మళ్ళీ మళ్ళీ కల్పిస్తూవుంటాడు. దైవదుర్విలాసం
మహామునీ! కాలాదులకు లీలారంగమైన ఈ సంసారంలో మా బోటివాళ్ళకు ఆస్ట యేమున్నది ? మీరే చెప్పండి ! మునీంద్రా ! శబ్బాదివిషయమోహితులమైన మేము అడవిమృగాల మాదిరి దైవాదులకు అమ్ముడు పోయినట్టైనాము.
అనార్యవర్తనుడై సమస్తమూ దిగ(మ్రింగడానికి సిద్రమైన యీ కాలుడు లోకులను నిరంతరమూ ఆపత్సముద్రంలో పడవేస్తున్నాడు. అగ్ని మంటలతో లోకాన్ని మాడ్చినట్టు అతడు దురాళలతో లోకులను దహించి వేస్తున్నాడు. ఆ కాలయముని (ప్రేయసి అయిన నియతి సహజ స్త్రీ చాపలంతో సమాధినిష్టులైన మునుల ధైర్యాన్ని గూడా చెదర గొడుతున్నది.
'క్రూరాచారుడైన కృతాంతుడు తరుణ శరీరాలను జరాజర్దరితాలు చేసి పాము గాలిని (మింగినట్టు భూతకోటిని సదా కబళిస్తున్నాడు. అతినిద్రయుడైన ఆ యముడు ఆర్హుని పజ గూడా కృప జూపడు. సర్వభూత దయాపరులైన జనులు అంతటా
“ కజవైపోయీరు. మునీంద్రా! ఈ భోగ భూము లన్నీ కడకు దారుణమైన దుఃఖం కరిగించేవే ఈ ప్రాణికోట్లు ఐశ్వర్యాలన్నీ కడకు తుచ్చాలే.
స్ం యోగూసుం ఆయువు అతిచపలం. మృత్యువు మహాకర్కశం. యౌవనం పరమ చంచలం. బాల్యం అజ్జానోపహతం. లోకమంతా విషయవాసనా దూషితం. బంధువు లందరూ భవబంధనాలు. భోగాలే భవరోగాలు. సుఖతృష్టలే మృగత్నష్టలు. ఇం(ద్రియాలే పరమశ్రువులు. సత్యం అసత్యమై పోయింది. తనమనస్సే తనకు విరోధిరయ్టై ఆత్మను బాధిస్తున్నది. అహంకారం కళంకం కల్లిస్తున్నది. బుద్దులు దిటవు తప్పాయి. చేసే పనులన్నీ దుష్ఫలితా లిస్తున్నాయి. మనోవిలాసాలన్నీ మదవతుల కంకిత మైనాయి. కోరికలు విషయాలవైపు పరుగులు తీస్తున్నాయి. ఆత్మానందం అడుగంటింది. నెలతలు దొసగులకు నెలవు లయ్యారు. రసాలు నీరసా అయ్యాయి. వస్తువు అవస్తువుగా భాసిస్తోంది. చిత్తం అహంకారానికి దత్తమైపోయింది. కనిపించే పదార్జాలన్నీ క్షణంలో నశిస్తున్నాయి. ఆత్మ అలభ్యమై పోయింది. సాధుపుంగవా ! మది వ్యాకులత్వం చెంది తపిస్తున్నది. రాగమనే రోగం విజృంభిస్తున్నది. విరాగం కఅవైపోతున్నది. రజోగుణం దృష్టిని కప్పివేస్తుంది. తమోగుణం పెరిగిపోయింది. సత్త్వగుణం దుర్లభమయింది. తత్త్వజ్ఞానం ఎంతో దూరమైపోయింది. “జు జీవితం క్షణభంగురం. చావు దాపురిస్తున్నది. ధృతి చెడిపోతున్నది. తుచ్చపదార్జాలపై రతి నానాటికీ దృఢమవుతున్నది. మతి మాంద్యంతో మలిన మయింది. శరీరం నేలగూలడానికి సంసిద్దంగా వుంది. మండే మంటల్లాగా జర శరీరాన్ని క్రమ్ముకొంటున్నది. పాపం పరవళ్ళు త్రాక్కుతున్నది. యౌవనం పట్టుకొన్నా జారిపోతున్నది. సత్యం యెక్కడా తలెత్తడం లేదు. ఇంక గతి యేముంది ? మనస్సు మోహ గ్రస్త మయింది. ఆనందం దవ్వైపోయింది. దయ పాడచూపడం లేదు. నైచ్యం వెతుక్కుంటూ సమీపిస్తున్నది. ధీరత్వం ధైర్యం కోల్పోయింది. జీవులు జననమరణ చ(క్రంలో తగుల్కొని పరి(భమిస్తున్నారు. దుర్జనులతో పాత్తు సులభ వుయింది. సత్సాంగత్యం దుర్లభ వుయింది దృశ్యపదార్జాలన్నీ రాకపోకలు సాగిస్తున్నాయి. వాసనలు జీవులను సంసారంలో బంధిస్తున్నాయి. కాలుడు జీవకోటిని నిత్యమూ ఎక్కడికో తరలించుకుపోతున్నాడు దిక్కులే కనిపించకుండా పోతున్నాయి. దేశాలు తారుమారవుతున్నాయి. కొందరే పండి అవుతున్నాయి. ఇక మాలాటివారి గతి ఏమి కావాలి ? సముద్రాలు వట్టిపోతున్నాయి. నక్షత్రాలు జారిపడుతున్నాయి. సిద్దులు
వైరాగ్య ప్రకరణం 57 స్థానభ్రష్టు లవుతున్నారు. దానవులు నశిస్తున్నారు. (ధివుని జీవితము కూడి అ(ధ్రువమే. అమరులు సైతం మరణిస్తున్నారు. ఇక మమ్మల్ని గురించి చెప్పే దేముంది?
ఇం(దుడు గూడా మిత్తివాత పడుతున్నాడు. యువలుడు గాడా నియమింపబడుతున్నాడు. వాయువు 'ప్రాణహీను డవుతున్నాడు. చం(ద్రుడు క్షయిస్తున్నాడు. సూర్యుడు ముక్కలై పోతున్నాడు. అగ్ని చల్లబడుతున్నది. బ్రహ్మ పరిసమాప్తి పొందుతున్నాడు. హరి హరింపబడుతున్నాడు. భవుడు అభావమై పోతున్నాడు. కాలుడు కాలధర్మం చెందుతున్నాడు. నియతి విలయం పాందుతున్నది. ఆకాళం నళిస్తున్నది. ఇక మాకు దిక్కేమున్నది ?
(శవణాదీం(ద్రియాలకు గోచరం కానివాడూ, సూక్మరూపుడూ అయిన ఒక పరమపురుషుడు ఈభువనాలను మాయా'్రభావంతో అనలో సృష్టిస్తున్నాడు. అఆహంకారరూపంతో అత ఉంతటా వ్యాపించి వున్నాడు. త్రిలోకాలలో అతని (ప్రభావానికి గురి కానిది ఏదీ లేదు. అతని ప్రేరణకు లోనై రథాధిష్టితుడైన రవి (ప్రవాహశ్తికి లోబడిన పాషాణశకలం లాగా శిలాశ్రైలవ(ప్రాది ప్రదేశాలలో అస్వతం ్రుడై పరి(భ్రమిస్తున్నాడు. అకోట ఫలాన్ని తోలు కప్పివున్నట్లు సురాసురగణాలకు నెలవైన ఈ నేలను జ్యోతిళ్చ క్రం పరివేష్టించి వున్నది. దివిలో దేవతలు, భువిలో మనుజులు, పాతాళంలో నాగులు ఆ పరమపురుషుని సంకల్పమా్రాన పుట్టి గిట్టుతున్నారు.
ఆయననుండే బలం పుంజుకొన్న మన్మథుడు అ(క్రమంగా లోకాన్ని ఆక్రమించి విక్రమం ప్రదర్శిస్తున్నాడు. వసంతుడనే మదపుటేనుగు పూల వాన అనే మదధారలను వర్షిస్తూ సువాసనలతో దిజ్మండలాన్ని నింపి చిత్తానికి చాంచల్యం కల్లిస్తున్నది. వివేకవంతులు గూడ చపలాక్షుల (క్రీగంటి చూపులకు లోనైన చిత్తాన్ని చక్కబెట్టుకోలేకున్నారు.
పరోహార పరాయణుడూ, పరపీడాపరితప్పుడూ, బోధపరిపూర్లుడూ అయిన మహాత్సు డాకడే ధన్యుడు.
జీవితమనే సాగరంలో లేస్తూ, పడుతూ కాలమనే బడబాగ్నికి వశమౌతున్న ఈ కల్టీలాల పరంపరను ఎవడు లెక్కించ గలడు ? సంసారమనే అరణ్యంలో దోషాలనే పాదలవెంట సంచరించే వూనవు లనే లేళ్ళు దురాశాపాశాలతో బంధింపపబడుతున్నాయి. జన్మపరంపరకు లోనై జనులు దుష్క్రత్యాలు ఆచరిస్తూ
గరి యోగవాపిష్టం ఆయువును వ్యర్థం చేసుకొంటున్నారు. గగనలతా పాశాలవంటి ఆ కర్మఫలాల స్వరూపం ఎంతటి వేత్తలకైనా అంతు చిక్కకుండా వుంది. "ఇప్పుడు ఈ బుతువు. ఈ దిన మీ పండుగ. ఈ ప్రొద్దు ఈ యాత్ర. వీరు మా చుట్టాలు. ఇది మా భోగం. అది మా సుఖం'' - ఇలా వ్యర్ధ కల్పనలతో లోకులు కాలం వెళ్ళ బుచ్చుతూ నళించి పోతున్నారు. ల అనిత్యతా ప్రతిపాదనం తండ్రీ ! అంతమాత్రమే కాదు. పైకి మనోహరంగా కన్పిస్తున్న ఈకుత్సిత (ప్రపంచంలో నిజంగా మనస్సుకు శాంతి సమకూర్చే పదార్ధ మొక్కటిీ లేదు. బాల్యం ఆటపాటలతో గడచిపోతున్నది. యౌవనంలో మనస్సనే మృగం కళత్రమనే గుహలో దూరి కృశిస్తున్నది. వార్తకంలో శరీరం చివికి జీర్ణమై పోతున్నది. ఇలా లోకం శోక హత మవుతున్నది. ముసలి తన మనే మంచు పైబడగానే తను వనే తామర తీగ వడలిపోతుంది. అంతట (ప్రాణ మనే తుమ్మెద ఎగిరి పోతుంది. అప్పుడు సంసార మనే సరోవరం వట్టిపోతుంది. దేహ మనే లత ముదిమితో (మగ్గి పరిపక్వావప్టకు వస్తున్న కొద్దీ మృత్యువుకు దానిపై వ్యామోహం పెరుగుతుంది. * గట్టున వున్న సంతోషమనే చెట్టును పెకలించడంలో నేర్పుగల తృష్ట అనే నది సమస్త పదార్దాలనూ తన పాట్ట పెట్టుకొని (ప్రవహిస్తున్నది. సంసారమనే సాగరంలో ' పయనిస్తున్న శరీర మనే చర్మబద్దమైన పడవ పంచేం(ద్రియా అనే మొసళ్ళ తాకిడికి ఊగిసలాడుతూ మునిగి పోవటానికి సిద్దంగా వున్నది. మనస్సనే కోతి తృప అనే అడవిలో కోరికలనే చెట్లపై పరిభ్రమిస్తూ కాలక్షేపం చేస్తున్నది; కాని దానికి ఫలం మాత్రం దొరకడం లేదు. విపత్తులక' (క్రుంగక, సంపదలకు పాంగక సుందరీమణులను చూచి చలింపక ఉండగల మహాత్ములు అరుదై పోయారు. గజఘట లనే అలలతో కూడిన యుద్ర మనే సాగలాన్ని దాటే వారు శూరులు కారు. మనోవృత్తు లనే తరంగాలతో చలించే ఈ దేహేంద్రియసంఘాత మనే సవుదద్రాన్ని తరించే వారే నిజమైన శూరులని వా అభిప్రాయం. దురాశాపీడితుడైన మానవుడికి శాంతి చేకూర్చగల క్షేశరహిత కార్యం ఒక్కటీ కనిపించడం లేదు. కీర్తితో జగత్తునూ, (పతాపంతో దిక్కులనూ, సంపదలతో యాచకుల గృవాన్నీ, సత్త్వబలంతో లవ్మినీ నింపగల ధీరచిత్తులైన మహాత్ములు
వైరాగ్య ప్రకరణం 59 లోకంలో కరవైపోయారు.
పర్వతగుహలో ప్రవేశించినా, వజ్రనిర్మితహర్మ్యంలో ఉన్నా సంపదలూ, ఆపదలూ అదృస్టానుసారం మనుజూణ్లి వెన్నాడుతూనే వుంటాయి.
మునిపుంగవా ! ఐళ్వర్యాన్నీ, ఆలుబిడ్డలనూ రసాయనతుల్య మని జనులు (భ్రమిస్తున్నారు. కాని సమస్త భోగాలూ విష్మప్రాయంగా తోచే తుది గడియలలో అవేవీ సాయపడవు. అవసానసమయంలో శోకవిహ్వలుడై విషమావస్ట పొంది తా నొనర్చిన అధర్మకార్యాలను తలంచుకొని జీవుడు లోలోపలనే కుమిలిపోతాడు. అర్ధకామాల మీదనే దృష్టి పెట్టి, ధర్మాన్ని వెనక్కు నెట్టి రోజులన్నీ వెళ్లబుచ్చినవానికి నెమలిపింఛంలాగా చంచలమైన మనస్సు ఎలా నిలకడ పొందుతుంది ?
దైవవశాన లభించే క్రియాఫలాలు గూడా నదిలోని అలల లాగా క్షణభంగురాలు, భిన్నరుచులైన అజ్ఞానులు అవే శాళ్వతా లని నమ్మి మోసపోతున్నారు గదా 1
“ఈ పను లిప్పుడే చేయాలి, ఆ పను అప్పుడు చేయాలి'* అనుకొంటూ కడకు దుఃఖం కల్గించే కార్యాలే చేస్తూ భార్యనూ, బంధుజనాన్నీ సంతోషపెట్టుడాన్నొ పడే పాటతో కాలం వ్యర్దమైపోతున్నది. ఇంతలో ముదిమి పైకొనడంతో వివేకం నశిస్తున్నది. చెట్లలో చిగిర్బిన ఆకులు (క్రమంగా పండి, ఎండి రాలిపోయినట్లే వివేకహీనులైన జనులు ఈ లోకంలో పుట్టి పెరిగి కొలదిరోజుల్లోనే కాలగర్భంలో కలిసీపోతున్నారు.
వివేకవంతుల నాశ్రయించి సత్కర్మలు చేయకుండా షగలంతా ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారి సాయంసమయానికి గూడు చేరేవాడికి నిద్ర ఎలా పడుతుంది ?
ఒకడు ఎంతో కష్టంమీద శత్రువులను జయిస్తాడు. ఎంతో సంపద గడిస్తాడు. ఇక సుఖభోగాలను అనుభవించాలనుకొంటాడు. ఇంతలో ఎక్కడినుండో మృత్యువు అమాంతంగా వచ్చి పైబడుతుంది. క్షణంలో కనిపించి నశంచిపోయే తుచ్చమైన ప్రాపంచిక విషయాల వలయంలో చిక్కుకొన్న మూఢమానవులు చెంతనే పాంచుకొని వున్న మృత్యువును పసికట్టులేక పోతున్నారు. వివేకహీనులై శరీరాన్ని మా(త్రం పెంచుకొన్న నర పళువులు కర్మపాశబద్దులై చివరికి కాలుని వశమై పోతారు. వారెంతో ప్రియంగా చూచుకొన్న ప్రాణాలే తుదకు వారి పాలిటి *త్రువు లవుతున్నాయి. ॥
క్షణభంగురమైన కెరటాలుగా ఈ జనా నీకం సదా ఎక్కడ నుండో త్వరత్వరగా
60 యోగవాష్త్యుల వస్తున్నది. మళ్ళీ ఎక్కడికో త్వరత్వరగానే వెళ్ళిపోతున్నది. విషవ్ఫతాలకు (వ్రేలాడే లతలవంటి లలనలు ఎ(ర్రని పెదవులతోనూ, తుమ్మెదలవంటి కళ్ళతోనూ పైకి మనోహరంగా కనిపిస్తూనే పురుషుల ప్రాణాలు తోడివేస్తున్నారు. ఉత్సవసమయాలలో నలువైపులనుండీ వచ్చి ఒకచోట గుమిగూడిన జనులు మళ్ళీ ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు; ఈ సంసారంలో మాయామయమైన కళత్రపు త్రాదుల వ్యవహారం గూడా యింతే. దశాభుక్తి, స్నేహనిబంధనము, చాంచల్యము కలిగి ఆరిపోవడానికి సిద్ధమైన దీపం మాదిరిగా వున్న ఈ సంసారంలో సారమేమిచో ఎవరికీ అంతుపట్టుడం లేదు, వానకాలపు నీటి బుడగలాగా నిలకడలేని సంసారచక్రప్రవృత్తి మూఢమానవుడికి మాత్రం చిరస్టాయి అనే (భ్రాంతి కలిగిస్తున్నది. హేమంతంలో శోభావిహీనమై గంధరహితమైన పద్మంలాగా వార్దక్యంలో మనుజుడు కాంతిహీనుడూ, గుణరహితుడూ అవుతాడు. అప్పుడిక అతనికి ఊరట అనేది అసంభవం. విధివశాత్తూ పుట్టి పెరిగి ఛాయాపుష్పుఫలాదులతో లోకానికి ఎంతో వుపకరించిన చెట్లే చివరికి గొడ్డలి పెట్టులకు కూలిపోతున్నది. ఇలాంటి జగత్తులో మానవుని మనస్సుకు ఊరట ఎలా కల్గుతుంది ? ఇంపుగా వున్నా మిక్కిలి దోషభూయిష్టమై లోలోపల వినాళానికి దారితీసే జనసంసర్గం విషవృక్షంతోడి పాత్తు వంటిది. దాని ఫలం చివరికి మోహమే. అతీతాలూ, అనాగతాలూ అయిన కల్పాల సంఖ్య అనంతం. (బ్రహ్మాదిదేవతలు గూడా కల్పవానే పేరుగల ఒక కణం మాత్రం జీవిస్తున్నారు. అందుచేత క్షణముహూర్త కల్పితమైన కాలచక్రంలో హెచ్చు తక్కువ అనే భావన గూడా అసత్యమే. దోషాలంటని చూపులూ, దుఃఖదాహం లేని దిక్కులూ, వినాశానికి గురికాని ప్రజలూ, మాయకు లోనుగాని క్రియలూ ఎక్కడా కనిపించడం లేదు. కాండలన్నీ బండలే; భూమి అంతా మట్టే; చెట్లన్నీ కట్టెల), మనుజు లందరూ మాంసపిండాలే. ఇవన్నీ వ్యవహారం కొరకు పెట్టుకొన్న పేళ్ళు. ఇందులో వికారానికి లోనుగొని క్రాత్తవస్తు వంటూ ఏదైనా వున్నదా ? జౌరా ! ఈ జగత్తు పృథివ్యాది సంచభూతవికారమే. దీనిని అవివేకులు మాత్రమే ఘటపటాది పదార్హదృష్టితో చూస్తున్నారు. వివేకికి పంచభూతాలు తప్పు ఇందులో మరేమీ కనిపించదు.
వైరాగ్య ప్రకరణం 61 సొధువర్యా 1! కలలో కనిపించే పదార్దాలు గూడా సుఖదు?ఖాలు కల్షించి మానవులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంటాయి. ఇక ఈ జగిత్తు లోని పదార్ధజాతం బుద్దిమంతులకు గూడా భ్రాంతి కల్లించడంలో వింత యేమున్నది ? భోగకల్పనలన్నీ గగనలతాఫలాల వంటివే. ఐనా ఆశోపహతులైన వాళ్ళకు వాటిపై ఆసక్తి తగ్గడం లేదు. ముదిమి పైబడినా వాళ్ళదృష్టి పరమాత్మ వైపు ప్రసరించడం లేదు. పచ్చి తీగలు మేయాలని ఎగబ్రాకిన పసరం కొండ చరియనుండి క్రిందికి పడిపోయినట్లే భోగానుభవకాంక్షతో అ(ర్రులు చాచే లోకులు స్వదో 'షంతోనే అధఃపతితు లవుతున్నారు. దుర్గమస్ట్రానంలో వున్న చెట్ల ఆకులు, పూలు, పండ్డు ఎవరికీ అక్కరకు రానట్లే మాఢమౌనవుల సంపదల్లుగూడా ఇతరులకు అక్కరకు రావడం లేదు. మెత్తనిచోట్లా, కటిక(ప్రదేశాలలోనూ సంచరించే జింకలలాగా మానవులు ఒక్కొక్కచోట మృదువుగానూ, మరొకచోట కర్కళశంగానూ ప్రవర్తిస్తూ వుంటారు. ఆపాతరమణీయాలూ, పరిణామంలో భయంకరాలూ అయిన విధాత వించచేష్టలు చూచి విస్మయంచెందని వారెవరు ?
కామాసక్తుడైన మానవుడు ఎన్నో కుతంటత్రాలు చేస్తున్నాడు. ఇప్పుడు సజ్జను డన్నవాడు కలలోకూడా కనిపించడం లేదు. చేసే పనులన్నీ దుఃఖమిశశ్రితాలే. ఈకష్టభూయిష్టమైన జీవితయా త్ర ఎలా సాగించాలో నాకు తెలియడం లేదు.
విపర్యాస ప్రతిపాదనం
(బ్రహ్మ౯! ఈ కనిపించే స్థావరజంగ మాత్మకమైన సర్వజగత్తూ స్వప్నసంగమం లాగా అఫ్టిరం.
ఈ దినం వట్టిపోయిన వారిధిలా కనిపించే అఖాతం రేపు మేఘావృతమైన మహాపర్వతంగా మారుతుంది. ఆకసమంటే మహారణ్యం కొద్దిదినాలలో నేలమట్టమై పోతుంది. లేదా అఖాతంగా పరిణమిస్తుంది. నేడు పట్టుపుట్టాలతో, పూలమాలలతో, మైపూతలతో అలంకృతమైన శరీరం రేపటికి దిగంబరంగా దూరంలోవున్న పాడుగుంటలో త్రోసవేయబడుతుంది. ఇప్పుడు మహాతేజస్సుతో మండలాధిపతిగా వెలిగే వ్యక్తి అల్పదినాలలోనే బూడిద కుప్పుగా మారిపోతాడు. మునిపుంగవా ! భయంకరంగా కనిపించే ఒక మహారణ్యం కొద్ది రోజుల్లోనే గగనమంచే పతాకలతోడి మహానగరంగా పరిణమిస్తుంది. లేదా మహామరుభూమిగానైనా మారిపోతుంది. నేడు
62 యోగవాసిష్టం చిత్రవిచిత్రంగా వున్న మహాపట్టణమే రేపు నిర్హనారణ్య మవుతుంది. నేల నీరుగా, నీరు నేలగా మార్పు చెందుతుంది. ఇలా సకల జగత్తూ పరివర్తనశీలమే.
బాల్యం, యౌవనం, శరీరం, ధనసంపద - అంతా అనిత్యమే. నీటి తరగల్దాగా ఇవన్నీ రకరకాలుగా మార్పులకు లోనవుతుంటాయి. జీవితం గాలిలోని దీపశిఖ లాగా చంచలం. త్రిలోకాలలోని వస్తువిలాసాలన్నీ మెజపులవంటివే. బీజ రాశిలాగా భూతకోటి మాటిమాటికీ మార్పు చెందుతున్నది.
ఈసంసారరచన నర్తకిలా పలుకరాల అభినయం చేస్తున్నది; ఇది మనస్సనే గాలికి పైకెగిరి జీవు లనే ధూళినే వస్త్రంగా ధరించి మెఆపులవంచి చూపులతో నటిస్తూ లోకాన్ని బ్రమింపజేస్తున్నది.
ఆ రోజులు, ఆ మహాపురుషులు, ఆ సంపదలు, ఆ పనులు - అన్నీ ఈనాడు “'స్కృతిపథంలో మెదలుతున్నాయి. మనమూ క్షణంలో ఇలాగే అయిపోతాము. ఈ పాడు సంసారం రోజూ నశిస్తూ వుంటుంది. మళ్ళీ రోజురోజూ పుడుతూనే వుంటుంది. దీనికి అంత మంటూ కనిపించడం లేదు. పశువులు మానవులుగా, మానవులు పళశువులుగా మారుతున్నారు. దేవతలు దేవతలు కాకుండా పోతున్నారుః' ఇక ఈ లోకంలో స్టిరమైన దేముంది ?
కాలరూపుడైన సూర్యుడు తన కిరణాలతో మాటి మాటికీ రేయింబవళ్ళను సృష్టిస్తూ వినాశావధికై నిరీక్షిస్తున్నాడు. నీళ్ళు బడబానలం పాలైనట్లే 'త్రిముర్తులూ, ఇతర ప్రాణికోట్లూ వినాశోన్ముఖులవుతున్నారు. స్వర్గము, భూమి, వాయువు, ఆకాశము, కొండలు, నదులు, దిక్కులు - అన్నీ వినాశమనే కార్చిచ్చుకు ఎండుకటె లవుతున్నాయి.- సంపదలు, బంధువులు, మి(త్రులు, భృత్యులు - ఎవరూ మృత్యు భయగ్రస్తుడికి ప్రీతి కలిగించలేరు. మృత్యువనే రాక్షసుడు వుదిలో మెదలకుండా వుండేంతవరకే ఇవన్నీ రుచిస్తాయి.
దరిద్రుడు ధనికుడుగా, ధనికుడు దరిద్రుడుగా, రోగి ఆరోగ్యవంతుడుగొ, ఆరోగ్యవంతుడు రోగిగా - క్షణంలో పరివర్తన చెందుతున్నారు. అనుక్షణమూ (భ్రాంతి కల్పించే ఈ పాడు జగద్ర్రృమకు లోను గాని వివేకవంతు లేరి ?
ఆకసంలో ఒక తక్షణం చీకట్టు 'క్రమ్ముకొంటాయి. మరొక త్షణం కనక కాంతులు (ప్రసరిస్తాయి. ఇంకొక క్షణం మేఘాలనే నీలిపద్మాలు వికసిస్తాయి. ఒకప్పుడు భీకరద్వనులు వినిపిస్తాయి. మరాకప్పుడు నిళ్శబ్దత తాండవిస్తుంది. ఒకసారి
వైరాగ్య ప్రకరణం 63 చుక్కలు మిలమిల మెరుస్తాయి. వేరొకసారి సూర్యుడు దేదీష్యవానంగా వెలిగిపోతాడు. ఇంకొకసారి చందమామ ఆహ్లాదకరంగా విహరిస్తాడు. మరొకప్పుఢు ఏమీ కనిపించదు. ఇలా రాకపోకలు సాగిస్తూ క్షణంవుండి మరుక్షణంలో నళించే ఈ సంసారంలో భీతి చెందని ధీరుడేడి ? క్షణంలో ఆపదలు, క్షణంలో సంపదలూ
- క్షణంలో పుట్టుక, క్షణంలో చావూ - మునీంద్రా! ఇక క్షణీకం కాని దేముంటుంది?
భగవ౯ ! పూర్వం ఒకరకంగా వుండిన మానవుడు కొన్నిదినాల లోనే మరొకరకంగా అయిపోతాడు. ఘటం పట మవుతున్నది. పటం ఘట మవుతున్నది. సంసారంలో మార్పు చెందని దంటూ ఏదీ కనిపించదు. వృద్ది, పరివర్తన, అపక్షయం, వినాళం, ఫపునర్హన్మ - ఇవి రేయింబవళ్ళ వలె మానవుళ్లి సదా వెన్నాడుతూనే వున్నాయి.
బలహీనుని చేతిలో బలవంతుడు మరణిస్తున్నాడు. ఒక్కడు నూరుమందిని హతమారుస్తున్నాడు. పామరులు (ప్రభువు అవుతున్నారు. జలస్పర్శకు అలలలాగా జడపదార్జాల తాకిడికి జనానీకం త్రోపుడుపడుతున్నది.
బాల్యం, యౌవనం, వార్దకం - ఇలా కొద్దిరోజులలో శరీరావస్టలు మార్పు చెందుతున్నాయి. ఈ శరీరం గతే ఇలావుంటే ఇక బాహ్యవస్తువులను గూర్చి ఏమి చెప్పాలి?
మనస్సు నటునిలాగా క్షణంలో ఆనందానికీ, విషాదానికీ, సౌమ్యుత్వానికీ, కాఠిన్యానికీ గురి అవుతున్నది.
ఆటలాడే బాలునిలా వివిధవస్తువులను సృష్టిస్తున్న విధాతకు అలసట అనేది కలగటం లేదు. సృష్టిస్టితలయాలు నిరంతరాయంగా జరిగిపోతున్నాయి. చావు పుట్టుకలకు సంతతం లోనవుతూ సంసారంలో పరి(భ్రమిస్తున్న మానవుడికి సంపత్తులూ, విపత్తులూ గూడా అఫ్టిరాలే. చతురులైన వాళ్లను గూడా వలింపజేస్తూ ఆపదలో సమస్తాన్నీ పడవేస్తూ కాలుడు ్రీడిస్తున్నాడు.
దినదినవవూ ఈ సంసారవునే విశాల వృక్షంనుండి ముల్గ్లోకాలలోని ప్రాణికోటులనే ఫలాలు - పండినవీ పండనివీ కాలవాయువు సోకి పటపట రాలిపోతున్నాయి.
64 యోగవాసిష్టం | అనాస్తా ప్రతిపాదనం మునీంద్రా ! ఇలాంటి దోషాలనే దావానలంతో దగ్ధమైన నా చిత్తంలో మడుగులో ఎండమావి లాగా భోగాభిలాష జనించడం లేదు. రోజులు గడచేకొద్దీ ఈ సంసారస్టితి వేప మొలకమాదిరి చేదై పోతున్నది. ముళ్ల చెట్టులాగా కర్కళమైన మానవుల హృదయంలో దిన దినానికీ దౌర్హన్యం పెరిగిపోతున్నది. సౌజన్యం తరిగి పోతున్నది. ఎండిన మినపకాయలాగా సడీ చప్పుడూ చెయ్యకుండానే మర్యాద (త్రుటిలో భగ్నమవుతున్నది. మునీశ్వరా చింతలతో నిండిన ఈ రాజ్యాలకంచే, భోగాలకంచే ఏ చింతలూ లేని ఏకాంతమే మేలని భావిస్తున్నాను. ఉద్యానవనాలూ, రమణీమణులూ, ధనాశా
- ఇవేవీ నాకు సంతసం కలిగించడం లేదు. నేను మనశ్శాంతినే కోరుకొంటున్నాను. తండ్రీ 1 లోకం అనిత్యం. ఇందులో సుఖం లేదు. తృష్ణను జయించడం తేలైన పని కాదు. మనస్సు మిక్కిలి చంచలం. ఇక నాకు శాంతి ఎలా కలుగుతుంది ? మరణాన్ని గానీ, జీవితాన్ని గానీ నేను కోరడం లేదు. చీకూ చింతా లేకుండా ఉన్నవాడు ఉన్నట్టుండే స్థితి నేను అభిలషిస్తున్నాను. రాజ్యమూ, భోగమూ, విత్తమూ, కోరికలూ - వీటివల్ల నాకేమి లాభం ? ఇవన్నీ అహంకారంతో ముడిపడి వున్నాయి. ఆ అహంకారం నాకు దూరమయింది. జన్మపరంపర అనే త్రాటితో గట్టిగా ముడివేయబడీన ఇం(ద్రియ (గ్రంథులను విడదీయడానికి ప్రయత్నించేవారే ఉత్తములు. ఏనుగు తామరపూలను కాళ్లతో నలిపివేసినట్లే మన్మథుడు పురుషుల చిత్తాలను (స్త్రీలచేత నులిమి వేయిస్తున్నాడు. మునిపుంగవా ! స్వచ్చమైన బుద్దితో ఇప్పుడే మనస్సుకు చికిత్స చేయాలి. అలా చేయకపోతే ఇంకెపుడు వీలవుతుంది ? విషం నిజానికి విషం కాదు. విషయవైషమ్యుమే విషం. విషం ఈ దేహాన్ని మాత్రమే చంపుతుంది. విషయాలు జన్మాంతరాలను గూడా ధ్వంసం చేస్తాయి. సుఖదుఃఖాలు, బంధుమి(త్రులు, చావు(బదుకులు - ఇవేవీ జ్ఞానిని బంధించలేవు. బ్రహ్మణ ! తత్త జ్ఞ శ్రేష్యా 1 శోకం, భయం, ఆయాసం తొలగి నేను తత్త్వజ్ఞుడ నయ్యేటట్టు నాకు ఇప్పుడే ఉపదేశం చేయండి! వాసనాజాలంతో జటిలమై దుఃఖాలనే కంటకాలతో సంకులమై ఒడుదుడుకులతో నిండిన అజ్ఞానమనే అరణ్యం మహాభయంకరంగా వుంది. మునీశ్వరా 1! నేను అంపపుకోతనైనా సహిస్తాను గాని సంసారవ్యవహారంలో కలిగే ఆశావిషయాల కోతను మాత్రం సహించలేను. ఇది లేదు,
వైరాగ్య ప్రకరణం 65 అది వున్నది అనే వ్యావహారికభ్రమ గాలి ధూళిని రేపినట్టు చిత్తాన్ని చలింపజేస్తుంది. తృష్ణ అనే దారంతోనూ, జీవులనే వముత్యాలతోనూ, చిత్త వునే మధ్యమణితోనూ కూడిన సంసారమనే హారం కాలునికి విభూషణమై వుంది. సింహం వలను త్రెంచినట్సే నేనీ హారాన్ని వైరాగ్యంతో టత్రెంచి వేయగోరుతున్నానా. బ్రహ్మవిద్వరేణ్యా ? నా హృదయమనే వనంలో వ్యాపించిన అజ్ఞాన మనే తిమిరాన్ని విజ్ఞాన మనే దీపంతో భేదించి నన్ను అనుగ్రహించండి ? మహాత్మా! చంద్రోదయంతో చీకటి నశించినట్లే ఉత్తమ పురుష సాంగత్యంతో మానసికమైన జాడ్య మంతా పటాపంచ లవుతుంది. గాలి తాకిడికి కదిలే మబ్బునుండి (వేలాడే నీటిబొట్టులాగా ఆయువు . క్షణభంగురం. మేఘాల నడుమ మెటసే మెటఫు లాగా భోగాలు చంచలాలు. జల ప్రవాహాల వలె యౌవనవిలాసాలు అఫ్టిరాలు. ఇదంతా ఆలోచించి వీటిపై భ్రాంతి వీడి నేను మనస్సులో శాంతికై దృఢమైన ము(ద్రవేశాను. 7 ట్రయోజన కథనం ఇలా అనర్ధ పరంపరతో నిండిన సంసార సంకటమనే కోటరంలో పడివున్న జగుత్తును చాచి నా వునస్సు (భమిస్తున్నది. సం(భవుం కల్గుతున్నది. ఎండుటాకుల్లాగా నా యింద్రియాలు కంపిస్తున్నాయి. సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఆలంబనంగా పొందలేక బుద్ది బలహీనుడైన భర్తను పొందిన బాలిక లాగా భయపడుతున్నది. లేళ్లు పచ్చికకై పరువిడి గోతిలో పడినట్టు మనోవృత్తులు తుచ్చవిషయాలకై (ప్రాకులాడి దుఃఖాల పాలవుతున్నాయి. అవివేకి నాశ్రయించి చక్రురాదీంద్రియాలు అంధకూపంలో పడ్డ మూఢునిలాగా కష్ట్రాలపా లవుతున్నాయి. జీవుడనే (ప్రభుని కధీనమైన చింత అత్తగారి యింట క్రొత్తకోడలు లాగా ఒకచోట స్పిమితంగా వుండలేదు; కోరిన వస్తువులనూ పొందలేదు. పాజుటాకులు రాల్చి కొత్తచివుళ్లు తొడిగే తీగలాగా ధైర్యం కొన్ని వస్తువులను త్యజిస్తూ మరికొన్నింటిని స్వీకరిస్తుంది. చిత్తచాంచల్యంవల్ల నేను సకల సుఖాలకూ దూరవుయ్యాను. ఈ సంసారం నన్ను విడీచీ విడవకుండా బాధిస్తున్నది. తత్త్వనిశ్చయం లేని నా బుద్ది మళ్లీ చివుళ్లు దొడిగే ఖండిత వృక్షాన్ని అనుకరిస్తున్నది, చంచలమైన నా చిత్తం భోగాభిలాషతో త్రిలోకాలలో పరి(భ్రమిస్తున్నది. దేవతలు తమ విమానాలను వదలనట్టు మనస్సు సం(భమాన్ని వదలడం లేదు. సాధుపుంగవా 1! ఉత్తమమూ, ఆయాసరహితమూ, ఉపాధి వర్హితమూ, క్6
66 యోగవాసిష్థం (భ్రాంతిహీనమూ-. శోకనిర్ముక్తమూ అయిన స్టాన మేదో నాకు దయచేసి సెల వివ్వండి! కర్మ నిరతులైన జనకాదిసజ్జనులు వ్యవహారపరులై వుండి కూడా ఎలా ఉత్తమస్థితి నందుకున్నారు ? సంసారమనే బురదలో దిగికూడా దాని నంటకుండా వుండడ మెలాసాధ్యం ? మీలాంటి జీవన్ముక్తులయిన మహాశయులు, మహాత్ములు ఎలాంటి దృష్టి నవలంబించి ఈ సంసార క్షేత్రంలో కల్మష మంటకుండా మెలగ గల్లుతున్నారు? కుటిలాలూ, భయావహాలూ అయిన విషయాలనే విషసర్పాలు ఎలా శుభప్రదాలు కాగలవు ? మోహమనే ఏనుగు చీకాకుపరచటంతో మలినమైపోయిన బుద్ది అనే మడుగు ఎలా నిర్మలమవుతుంది ? సంసారంలో వ్యవహరిస్తున్నా మానవుడు తొమరాకుపై నీటిబొట్టులాగా నిర్లిప్పుడై వుండడ మెలా సాధ్యం ? కామాదు లయిన దుర్వృత్తులను స్పృశించకుండా సమస్త విశ్వాన్నీ బాహ్యదృష్టితో తృణంలాగా, అంతర్హృష్టితో ఆత్మలాగా చూస్తూ పరమపదం పొందే వుపాయవ్ముమిటి ? సంసారసాగరపారం ముట్టిన ఏ మహాపురుషుని ఆచరణ ననుసరిస్తే మానవుడు దుఃఖం నుండి తప్పించుకోగలడు ? నాకు శ్రేయస్కరమైన దేది ? సాధించదగిన (ప్రయోజన మేది ? అసమంజసమైన ఈ సంసారంలో ఎలా ప్రవర్తించాలి ? ప్రభూ 1 విధాత సృష్టించిన అశాశ్వతమైన జగత్తుయొక్క పూర్వాపరాలకు సంబంధించిన తత్త్వ మేమిచో దయచేసి నాకు తెలియపటచండి | బ్రహ్మ౯ ! నాహృదయాకాశంలోని చైతన్య చం(ద్రుణ్లి అంటివున్న కళంకం తొాలగిపోయేటట్టు నా కిపుడు సదుపదేశం చేయండి! ఈ (ప్రపంచంలో గ్రాహ్య మేది? త్యాజ్యమేది ? చపలమైన చిత్తం కొండలాగా కదలిక లేని స్రితిని ఎలా పొందుతుంది? పెక్కు బాధలు కలిగించే ఈ సంసారమనే విషూచివ్యాధి ఏ పవిత్రమైన మంత్రంతో శమిస్తుందో తెలపండి ! ఫున్నమినాటి చంద్రునిలాగా నిండుచల్లదనాన్నీ, హృదయానందాన్నీ నేను ఎలా పొందగలనో సెల వివ్వండి! మీరు తత్త్వజ్ఞులు, మహాపురుషులు, నేడు పరిప్లూర్లస్టితిని పాంది మళ్లీ దుఃఖానికి గురి కాకుండావుండే స్రీతి నెలా చేరుకోగలనో, అలాంటి (ప్రబోధం చేయండి ! వుహాత్మా ! ముహోత్తవుమైన ఆనందస్రితిలో విశ్రాంతి పాందని వాళ్లో చిత్తవృత్తులు అడవిలో కుక్కలు అల్పజీవులను పీడించినట్టు పీడిస్తాయి.
వైరాగ్య ప్రకరణం 67 రాఘవుని ప్రశ్న శివుని శిరసుమీద నెలవంకలా అత్యల్స మైన ఆయువు ఎత్తైన వెట్టుపై కదిలే ఆకుకొననుండి జారే నీటిబొట్టులాగా క్షణభంగురం. శరీరం వరిమజ్లలో అరిచే కప్పుగొంతు కింది చర్మం వాదిరి అస్థిరం. బంధుమి(త్రుంలతోడి పాత్తు ఉరిత్రాడులాంటిది. పూర్వవాసన అనే గాడ్పులకు చలిస్తూ, దురాశ అనే మెజపు మెటుస్తుండగా మోహ మనే మేఘం గర్రిస్తున్నది. లోభ మనే నెమలి ప్రచండంగా నృత్యం చేస్తున్నది అనర్ధ మనే కుటజవ్పక్షం మొగ్గలు తొడుగుతున్నది జీవు లనే మూషికము లన్నింటిని భక్షించడానికి 'క్రూరుడైన కృతాంతు డనే మార్చాలం ఎక్కడినుండో వరదలాగా అమాంతంగా వచ్చి పై బడుతున్నది. ఈ స్థితిలో ఉపాయ మేమిటి ? గతి ఏమిటి ? దేన్ని గూర్చి చింతించాలి ? దేన్ని ఆశ్రయించాలి ? ఈ జీవితారణ్యం ఎలా శుభోదర్భంగా పరిణమిస్తుంది ? మీలాంటి మహనీయులు మంగళకరంగా మార్చలేని తుచ్చ పదార్థ మంటూ భూలోకంలో గాని, దేవలోకంలో గాని ఏదీ లేదు. సదా పీడకరమూ, నీరసమూ అయిన ఈ పాడు సంసారం ఎలా ఆస్వాదయోగ్య మవుతుంది ? వసంతాగమంతో వసుంధర సౌందార్యాన్ని సంతరించుకొన్నట్టు సంతృప్తి అనే త్నీరస్నానంతో సంసారం సుభగ సుందర మయ్యే విధానమేదో దయచేసి వివరించండి. కామమనే కళంకం
- సోకిన మనస్సనే చంద్రుడు ఏ ఉపాయం అవలంబిస్తే నిర్మలంగా భాసీస్తాడు ? దురమాహమైన ఈ సంసారాతిని అర్ధం చేసుకొని ఐహికాముష్మికభోగాలకు అతీతంగా వ్యవహరించవలసిన తీ రేదో సెల వివ్వండి ! రాగ ద్వేషా లనే మహారోగాలూ, భోగాలూ సంసార సాగరంలో సంచరించే ప్రాణిని బాధించకుండా వుండాలంటే ఏమి చేయాలి? ధీరాగ్రణీ ? అగ్నిలో బడ్డా దర్రంకాని రసవంతమైన పాదరసంలాగా సంసారానలంలో పడికూడా జీవుళ్లి తాపానికి గురికాకుండా కాపాడే జ్ఞానామృతం ఎలా లభిస్తుంది? సము(ద్రంలో పడినవాడికి నీరు అంటకుండా వుండదు. అలాగే సంసారంలో వున్న వాడు వ్యవహార [క్రియలకు అతీతంగా వుండలేడు. అగ్నికి దాహకశక్తిలేని జ్వాల లేనట్లే రాగ ద్వేషాలూ, సుఖదుఃఖాలూ అంటని సత్కార్య వుంటూ ఏద్రీ ఈజగత్తులో లేదు. మనస్సు క్షయిస్తే కాని జగము నశించదు. మనోవిలయం కలిగించే తత్త్వం నాకు ఉపదేశంచండి. నేను ఏ యోగాన్ని ఆ(శ్రయిస్తై
68 యోగవాస్టం జగద్వ్యవహారంలో వున్నా నాకు దుఃఖ మంటదో, ఆ ఉత్తమ యోగాన్ని కరుణతో బోధించండి. భవ౯! ఏయే మహాత్ములు ఎప్పుడెప్పుడు ఏయే ఉపాయంతో మనో విశ్రాంతిని సాధించి సంసార దుఃఖం నుండి తరించారో, మీకు తెలియనిది కాదు. అది నాకు తెలిపి నన్ను మోహవిముక్తుణ్ణి చేయండి. 'బ్రహ్మ౯ 1! ఒక వేళ అలాంటి యోగమంటూ ఒకటి లేనిపక్షంలో , లేక ఉండికూడా నాకెవరూ దానిని వివరించని పక్షంలో, లేక నా ప్రయత్నంతో నేనే ఆ మహోత్తమమైన చిత్తశాంతిని సాధించలేని పక్షంలో - నేను జీవించడం దేనికి ? అప్పుడు కోర్కెలన్నింటినీ వర్హించి అహంకార రహితుడనై ఇలాగే వుండిపోతాను. అన్నం తినను; నీరు త్రాగను; వస్త్రాలు ధరించను. స్నానదాన పూజాదికాలైన ఏ పనులూ చేయను. సంపదలు వచ్చినా లేక ఆపదలు పై కొన్నా నేనేమీ ప్రతి ్రీయలు చేయక ఊరక వుండిపోతాను. ఈ ఫ్రితిలో దేహాన్ని త్యజించడం కంటే ఇక నాకు ఆశించ దగిన దేమీ లేదు. సందేహం, మమకారం, మాత్సర్యం వంటి వాటి నన్నిటినీ వదలి చిత్రంలోని బొమ్మలాగా మౌనం వహించి వుంటాను. ఆపై క్రమంగా ఉచ్చా వస నిశ్చాసాలనూ, ప్రజనూ వదలిపెట్టి దేహమని పిలువబడే అవయవసంస్పానరూపమైన ఈ అనర్జాన్ని పరిత్యజిస్తాను. ఈ దేహానికీ నాకు ఎలాంటే సంబంధమూ లేదు. ఇతరులతో గూడా నాకు ఏవిధమైన పొత్తూ లేదు. నేను సమస్తమూ విడనాడి తుదకు ఈ శరీరాన్ని గూడా విసర్జించి చమురు లేని దివ్వెలాగా శమించిపోతాను”?. వాల్మీకి : - మహత్తరమైన విచారంతో వికసించిన చిత్తం కలవాడూ, నిర్మలుడైన చంద్రునిలా మనోహరుడూ అయిన రాముడు పెద్దలయెదుట ఈ విధంగా చెప్పి మేఘాల ఎదుట కేకారవం చేసి అలసి పోయిన మయూరం లాగా మౌనం వహించాడు. ఖేచరుల సాధువాదం పద్మాక్షుడైన ఆ రాకుమారుడు మనోమోహాన్ని తొలగించే ఇలాంటి మాటలు చెప్పేసరికి అక్కడ చేరివున్న వారందరి కళ్ళు విషయంతో ఒక్కుమ్మడిగా విప్పారాయి. వాళ్ళు పులకితశరీరు లయ్యారు. వైరాగ్యవాసన సోకి వాళ్ళ సంసారవాసన లన్నీ తొలగిపోయాయి. ఆనందంతో ఉప్పాంగిన శోతలందరూ చిత్తరువుల్లోని బొమ్మల్లాగా నిశ్చేష్టులై రామభద్రుని మాటలు ఆలకించారు. సుధాసాగరవీలీ పరంపరలలో తేలియాడినట్లే సంతోష పరవశులయ్యారు. సభలో వున్న వసిష్ట విశ్వామిత్రాది మునులూ, జయంతుడూ, దృష్టి మున్నగు
వైరాగ్య ప్రకరణం 69 నుంత్రులూ, దశరథుడు మొదలైన రాజులూ అనేక దేశాల పౌరులూ, సామంత రాజపుత్రులూ, (బ్రహ్మవాదులైన (బ్రాహ్మణులూ, భృత్యులూ, అమాత్యులూ శ్రీరామచంద్రుని ఉదార వచనాలు విన్నారు.
కౌసల్య మొదలైన అంతఃపురకాంతలు కిటికీలవద్ద సమావేశమై భూషణాల సవ్వడి కలుగకుండా ఆపలుకు లాకర్షించారు. నిశ్చలమైన క్రీడా వృగాలూ, నెమరుమౌనిన గుర్రాలూ, ఉెక్కలల్లార్పని పక్షులూ, ఆ మాట లాలకించాయి. సిద్దులు, గంధర్వులు, కిన్నరులు మున్నగు గగనచారులు, నారద, వ్యాసాది మునిపుంగవులు, విద్యాధరులు, పన్నగులు విచిత్రార్జాలు కల శ్రీరాముని వచనాలు విన్నారు.
రఘుకులమనే ఆకాశానికి చంద్రుడూ, రాజీవ నేత్రుడూ అయిన రాముడు మౌనం వహించేసరికి సిద్దులు సాధువాదాలతో గగనమునుండి పుష్ప్రవర్షం కురియించారు. రాలుతున్న ఆ పూలు 'చాందినీ'లా కనిపించాయి. అక్కడి తుమ్మెదల జంటలు రుంకారం చేశాయి. మధురాతి మధురమైన ఆ కుసుమ సౌరభం ఆ(ఘాణీంచి మానవులు ఆనంద వివశులయ్యారు.
గాలితాకిడికి నేలవ్రాలే నక్షత్రాల రీతిగానూ, ధరాతలం పై ప్రసరిస్తున్న దేవతా స్త్రీల వోసకాంతిలాగానూ, రాలుతున్న మబ్బు తునకల మాదిరిగానూ, విసరివేసిన వెన్నవలుడ్దల పోల్కిగానతా, జారిన ముత్యాల హారాల వూదిరిగానూ, మంచుబిందువుల వానలాగానూ, చం(ద్రకిరణాల చందాననూ, విస్తరించిన పాలకడలి తరగలతీరుగానూ అగోచరులైన సిద్దుల హస్తాలనుండి కురిసిన ఆ ప్రసూనవర్హం శోభావహమై కనిపించింది.
కింజల్కాలతోడి పద్మాలూ, ఇటూ అటూ తిరగే భృంగాలూ, వికసించే కలువలూ, జారిపడుతున్న వెఎల్లలూ, వినీలాకాశంనుండి రాలిన వివిధ కుసుమాలూ ఆగృహాంగణాన్నీ, దానిపై కప్పునూ, ఆ పరిసర ప్రదేశాల నన్నింటినీ కప్పీవేశాయి. నగరవాసులైన స్త్ర, పురుషులు ఆళర్యంతో మెడలు పైకెత్తి అపూర్వమైన ఆ సుందర దృశ్యాన్ని తిలకించారు.
అలా సభాఫ్టలాన్నీ, సభ్యులనూ అర్హఘటికాకాలం ముంచివేసిన పూలవాన (క్రమంగా వెలిసింది. ఆపై సిద్దులు పరస్పరం ఇలా సంభాషించు కొంటూ వుండటం సభాసదులు విన్నారు-
““కల్పారంభింనుండి స్వర్శంలోనా, సిద్దగణాలవంధ్యననా వనం
70 యోగవాసిష్టం సంచరిస్తున్నాము. కాని ఈనాడు విన్న (శ్రుతి రసాయనమైన (వేదసారమైన) ఈపలుకులు ఇంతకుముందెన్నడూ మనం విని వుండలేదు. పరమవైరాగ్యంతో ఈరఘుకుల చం(ద్రుడు చెప్పిన ఉదార వచనాలు బృహస్పతికి గూడా గోచరించేవి కావు. ఆహా! మనం ఎంత పుణ్యం చేశామో ! బుద్దికి మహా హ్లాదం కలిగించే ఈ రామచంద్రుని వాక్యాలను చెవులారా వినగలిగాము గదా |! అత్యుత్తవుమూ, ఉపశమావృతమూ అయిన రఘునందనుని పలుకులు మనకు మహోద్బోధం కలిగించాయి. ఖేచర భూచర సమ్మేళనం
పావనమైన ఈ రామచంద్రుని ప్రశ్నకు మహర్షులు ఏమి సమాధాన మిస్తారో వినవలసివుంది. నారదవ్యాసాది మునిఫుంగవులారా ! మీ రందరూ త్వరగా రండి | పద్మిని చుట్టూ తుమ్మెదలు మూగినట్టు కనక కాంతులు విరబోమ్మే ఈ దశరథుని ఒడ్డోలగంలో మనం (వ్రాలుదాము”'.
ఇలా అంటూ గగనచారులైన ఆ దివ్యమును లందరూ ఒక్కుమ్మడిగా ఆ సభ కరుదెంచారు. ఆ మునివర్గానికి ముందు వీణ మీటుతున్న నారదుడూ, వెనుక నీలమేఘశ్యాముడైన వ్యాసుడూ, మధ్యలో భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు
మొదలైనవారు ఉండినారు. ఒకరినొకరు త్రోసుకుంటూ రావడంవల్ల వాళ్ళ కృష్ణాజినాలు చెదరిపోయాయి. జపమాలలు చలించాయి.
ఆ వలునులందరి చేతుల్లోనరా కవుండలా లున్నాయి. వాళ్ళు తేజోవ_తిశయంవల్ల నక్షత్రాలలాగా విలసిల్లారు. దీప్తి మంతమైన వదనాలతో భానుల వలె భాసించారు. రత్నాలరీతిగా వివిధ వర్ణాలతో వెలుగొందారు. ముత్యాలమాదిరి పరస్పరం శోభిల్హారు. వాళ్ళ రాక అపూర్వమైన వెన్నెలవాక లాగా, అసాధారణమైన అర్భమండలి లాగా శోభావహమై కన్పట్టింది. వాళ్ళ కలయిక అనేక పూరి చం(ద్రమండలాలు ఒక్కవోట సాక్షాత్కరించిన ట్లయింది.
ఆ తపోనిధుల మధ్య వ్యాసనారద మహర్షు లిద్దరూ చుక్కల నడుమ మేఘుడు, చంద్రుడు ఉన్నట్టు విరాజిల్లారు. పులస్త్యాంగిరసు లిద్దరూ దేవతల నడుమ ఇం(ద్రుడు, సూర్యుడు నిలిచినట్టు ప్రకాశించారు.
సిద్రసమూహం దివినుండి భువికి దిగుతుండగా దశరథుని సభలోని వసిష్టుడు మొదలైన వారంతా లేచి నిలిచారు. ఒకచో కలుసుకొన్న ఆ ఖీచర భూచరులు ఒండొరులను మించిన తమ తమ తేజస్సులతో దళదిశలనూ వెలిగించారు.
వైరాగ్య ప్రకరణం 71
వాళ్లు వేణుదండాలనూ, లీలాకవులాలనూ చేతబూనినారు. సిగలో దూర్వాంకురాలనూ, చూడామణులనూ ధరించినారు. కపిల జటలతో గూడిన తలలచుట్టూ పుష్పుమాలలు చుట్టుకొన్నారు. ముంజేతులలో అక్షమాలలూ, మళల్లెైదండలూ ఉంచుకొన్నారు. నారచీరలూ, పట్టుపీతాంబరాలూ కట్టుకొన్నారు. వాళ్ల మొలట్రాళ్ళూ, ముత్యాల మాలలూ చలిస్తూ వుండినాయి.
భువి కవతరించిన గగనచారుల నందరినీ వసిష్ట విశ్వామిత్రంలు అర్హ్యపాద్యాలతోను, మధురవచనాలతోనూ పూజించారు. నభళ్చరులుకూడా ఆదరంతో వసిష్టనిశ్వామిత్రులను అర్జ్యాదులతో యథావిధిగా సత్కరించారు. దశరథ మహారాజు మిక్కిలి ప్రీతితో సిద్రవర్గాన్ని అర్చించాడు. సిద్దులుకూడా రాజును కుశల 'పశ్నలతోనూ, తత్కాలో చితమైన సంభాషణలతోనూ తృప్తీపరచారు. ఇలా ఒకరి నాకరు సత్కరించుకొని వాళ్లందరూ ఆసనాలలో ఉపవిష్టు లయ్యారు.
పిమ్మట తమముందట ప్రణమిల్దుతూ నిలబడ్డ రాముళ్లీ ప్రశంసా పూర్వకమైన మృదువచనాలతోనూ, పుష్ప్రవర్షంతోనూ సిద్దులు సత్కరించారు. వాళ్ళ అనుమతితో రాముడు ఉపవిష్టు డయ్యాడు.
విశ్వామిత్రుడు, వసిష్టుడు, వామదేవుడు, నారదుడు, వ్యాసుడు, మరీచి, దుర్వాసుడు, ఆంగిరసుడు, (క్రతువు, పులస్తుడు, పులహుడు, శరలోముడు, వాత్స్యాయనుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఉద్దాలకుడు, బువీకుడు, శర్యాతి, చ్యవనుడు, ఇంకా తత్త్వజ్ఞులు, వేదవేదాంగ పారంగతులైన ముని శ్రేష్టులు, మంత్రులు అక్కడ సమాసీను లయ్యారు.
వసిష్ట విశ్వామిత్రాదులూ, నారదాదిమహర్హులూ నత శిరస్కుడైన రాముణ్లే ఉద్దేశించి ఇలా అన్నారు. -
“*రూర్రా | కువూరుడైన రాముడు శుభ(ప్రదాలు, పరవెాాదారాలు, వైరాగ్యరసగర్చితాలు అయిన వాక్కులు చెప్పాడు. చక్కని విచారంతో కూడినవీ, వస్తుతత్తాాన్ని ఉన్నదున్నట్లు తెలిపేవీ, సభ్యమైనవీ, ప్రియ మైనవీ, ఆర్యజనులకు సమ్మత మైనవీ, చాపల్యదోషం లేనివీ, చక్కగా అర్ధమయ్యేవీ, సంస్కార సంపన్న మైనవీ, హీతకర మైనవీ, తుష్టి చేకూర్చేవీ అయిన రాఘవుని మాటలు ఎవరికీ ఆళ్చర్యం కలిగించవు ?
సర్వోత్కృష్టమైన చమత్కారం కలిగి, చెప్పదలచిన విషయాన్ని సూటిగా స్పష్టం
72 యోగవాసిష్టం చేయగిల వాక్సాతుర్యం నూటికొక్కడికే అబ్బుతుంది. వివేక ఫలంతో కూడిన (ప్రజ్ఞాలత రామునిలో తప్ప ఇంకెవరిల్ో ఇలా పూర్ణ వికాసం పాందగలదు ? ఇతని హృదయంలోవలె ఎవరి హృదయంలో ప్రజ్ఞాదీపజ్వాల అసమానమైన కాంతులతో ప్రజ్వరిల్టుతుందో, అతడే పురుషుడు. రక్త మాంసాస్టియం త్రాలైన దేహాలమీదనే ఆత్మబుద్ది కలిగి శబ్దా దివిషయసుఖా లనుభవించే వాళ్లందరూ జడ(ప్రాయులే. వాళ్లలో చైతన్యం కలవా డొక్కడూ లేడు. మోహవశులైన ఈ సశుప్రాయులు మాటిమాటికీ జన్మ మృత్యుజరాదుఃఖాలను అనుభవిస్తారే కాని సంసార స్వరూపాన్ని విమర్శించరు. రామునిలాగా ముందు వెనుకలు విచారించగల విమలాశయుడు ఎక్కడో ఒకచోట ఒకానొకదే కనిపిస్తాడు. ఉత్తమ ఫలాలతో గూడిన తియ్యమామిడిచెట్టు అరుదైనట్లే తత్త్వజ్ఞులైన (శ్రేష్టపురుషులు గూడా అరుదుగానే వుంటారు. చిరుతప్రాయంలోనే లోకానుభవమూ, ఆత్మ వివేకమూ బుద్ర్లి మంతుడైన ఈ రామునిలో గోచరిస్తున్నాయి. ఫలపల్లవాదులతో గూడి చూడ చక్కనైన వెట్టెన్నో దేశమంతటా వుంటాయి కాని విశిష్టమైన చందన వృక్షాలు, లవంగతీగలు ఎక్కడ బడితే అక్కడ లభించవు. చంఢద్రునినుండి చల్లని వెన్నెలలాగా, వుంజులతరువు నుండి కుసువు మంజరిలాగా, పూవునుండి నెత్తావిలాగా రామునినోటినుండి మంచి మాటలు విన్నాము. ద్విజ (శ్రేష్టులారా! అతి[క్రూరమైన దైవం సృష్టించిన ఈ పాడు సంసారంలో తత్త్వసార మేమిటో గ్రహించడం చాలా కష్టం. ధీమంతులైన ఏ కీర్తిమంతులు తత్త్వ(ప్రాహ్హై ప్రయత్నిస్తారో, వాళ్లనే పుణ్యాత్ములుగా, పురుష్తోత్తములుగా సజ్జనులు సంభావిస్తారు. రామునివంటి వివేకి, ఉదారాశయుడు ఏ లోకంలోనూ ఇంతవరకూ లేడు. ఇక ముందుగూడా ఉండబోడనే మా అభి[ప్రాయరి. తత్త్వజిజ్హాసతో లోకాల నన్నింటినీ రాముడు ఆనందింపజేశాడు. ఇతని ప్రశ్నలకు సరి అయిన సమాధానం అందజేయాలి. అలా చేయక పోతే మునుల మైన మన వివేకం నిష్ఫులమే కదా ! వైరాగ్య ప్రకరణం సమాప్తం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్సణమస్తు ! ఓం తత్సత్ - ఓమ్.
క యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం శుకనిర్వాణం
వాల్మీకీ అరిష్ట నేమితో ఇలా అన్నాడు -
అలా సభాసదులందరూ బిగ్గరగా రామ (ప్రశంస చేసేసరికి విశ్వామిత్రమహర్షి ఎదుట వున్న రాముణ్లి చూచి ప్రీతితో ఇట్టన్నాడు-
““జ్ఞానులలో శ్రేష్టుడవైన ఓ రామచంద్రా ! నీవు నీ సూక్మ బుద్దితో అంతా తెలుసుకొన్నావు. ఇంక నీవు తెలుసుకోవలసింది ఏమి లేదు. నీ బుద్రిదర్ప్చణం సహజంగా స్వచ్చమైనది. దానికి కాస్త వెరుగుపెట్టడం మాత్రమే ఇప్పుడు చేయవలసివుంది. వ్యాసపుత్రుడైన శుకుని బుద్ది లాగా నీ బుద్ది సైతం తత్త్వాన్ని గ్రహించినా కొంత అంతశ్శాంతిని మాత్రమే అభిలషిస్తున్నది. ”'
అది విని రాముడు విశ్వామి(త్ర మునీం(ద్రుణ్లీ ఇలా ప్రశ్నించాడు-
*“భగవ౯ 1 వ్యాససుతుడైన శుకుడు జ్ఞానసంపన్నుడై కూడా ఎందుకు ఆత్మశాంతిని పొందలేదు ? అతడికీ చివరి కెలా శాంతి కలిగింది ?''
అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా సమాధాన మిచ్చాడు
“రామా 1! ఇప్పుడు నేను చెప్పబోతున్న శుకుని చరిత్ర నీ చరిత్ర వంటిదే.
74 యోగవాసిష్టం మోక్షప్రదమైన ఈ వృత్తాంతం విను. ఇదిగో నీ తండ్రి దగ్గర న్యాసభగవానుడు బంగారుగద్దెపై కాటుక కొండవలె కూర్చొని సూర్యసమదీప్తితో వెలుగాందుతున్నాడు. ఈయన కుమారుడే శుకుడు. అతడు మహా(్రాజ్ఞుడు, చంద్రవదనుడు, నీతిశాస్త్ర పారంగతుడు, రూపుదాల్చిన యజ్ఞం లాగా వున్నాడు. ఈ లోకయాత్రను గురించి శుకుడు నిశితంగా మనస్సులో ఆలోచించాడు. అందువల్ల నీకు లాగే అతనికీ వివేకం ఉదయించింది. ఆ బుద్రిమంతుడు తనలో తానే బహుకాలం తీ(వ్రవిచారం చేశాడు. తుదకు సత్యమూ, సుందరమూ అయిన తత్త్వాన్ని అవగతం చేసుకొన్నాడు. స్వప్రయత్నంతోనే అతనికి సత్యవస్తువు సాక్షాత్కరించింది. అయినా మనశ్శాంతి మాత్రం కలగలేదు. *' వస్తు తత్త్వం ఇదే” అన్న దృఢవిశ్వాసం అతని హృదయంలో నెలకొనలేదు. చాతకపక్షి నదీజలాలను అపేక్షించదు గదా 1 అలాగే నిశ్చలమైన అతని చిత్తం త్షణభంగురాలైన భోగాలనుండి నివృత్తి పొందింది.
విమల బుద్లి అయిన ఆ శుకుడు ఒకనాడు మేరుపర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఏకాంతంలో వున్న తన తండ్రీ వ్యాసమునీం ద్రుణ్లి భక్తితో ఇలా అడిగాడు-
“మునీంద్రా ! ఈ సంసారాడంబరం ఎలా ఉద్భవించింది ? ఏ విధంగా శమిస్తుంది ? ఇది ఎవరికి సంబంధించినది ? ఎంత కాల ముంటుంది ??*
ఈ రీతిగా పుడత్రుడు ప్రళ్నించేసరికి ఆత్మజ్ఞుడైన వ్యాసభగవానుడు అతనికి యథోచితమైన సమాధానం సమగ్రంగా చెప్పాడు.
అది విని శుకుడు ఈ విషయాలన్నీ తా నింతకు ముందే తెలుసుకొనివున్నా ననుకొని ఆ మాటలమీద పెద్దగా ఆదరం చూపలేదు. వ్యాసుడు పుత్రుని ఆశయం గ్రహించి ఇలా అన్నాడు-
““నాయనా ! ఇంతకంచే ఎక్కువ నాకు తెలియదు. భూతలంలో జనకుడనే భూపాలు డున్నాడు. అతడు అన్ని విషయాలూ యథాతథంగా గ్రహించినవాడు. ఆయన దగ్గణకు వెళ్ళు. తత్త్వమంతా నీకు అవగత మవుతుంది.
వెంటనే శుకుడు సుమేరు పర్వతం దిగి భూమండలంలోని విదేహ నగరానికి వెళ్ళాడు. అది జనకవుహారాజు ఏలుబడిలో వున్న నగరం. ద్వారపాలకులు ““వ్యాసపుత్రుడైన శుకయోగి ద్వారం వద్ద ఉన్నాడు” అని మహనీయుడైన జనక మహారాజుకు విన్నవించారు. శుకుని పరీక్షింపదలచి ఆ చక్రవర్తి '' ఉంచే ఉండనీ"
ముముకు వ్యవహార ప్రకరణం 75 అని అలక్ష్యంగా పలికి మౌనం వహించాడు. ఇలా ఏడు రోజులు గడచిపోయాయి.
ఆపైన రాజు శుకుల్లో గృహ(ప్రాంగణంలోకి ప్రవేశింపజేశాడు. తత్తబిజ్ఞాసువైన శుకుడు రాజు చూపిన అనాదరాన్ని గణించకుండా మళ్ళీ ఏడు దినాలు ఆ సౌధాంగణంలోనే వుండిపోయాడు.
పిమ్మట జనకు డతళణ్లీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. అక్కడ మళ్ళీ ఏడు దినాలవరకు రాజదర్శనం లభించదని తెలియవచ్చింది. చంద్రముఖుడైన శుకుడికి రాజాజ్ఞ మేరకు అక్కడ ఇష్టమృష్టాన్నాలతో, వివిధ భోగాలతో, మదమత్తలైన కాంతలతో పలువిధాలైన పరిచర్యలు సమకూడాయి. వచ్చిన వెంటనే తనకు సత్కారం జరగ లేదన్న దుఃఖం గానీ, ఈ సుఖభోగాలు కానీ దఢమూలమైన పర్వతాన్ని మందమారుతం కదిలింపలేనట్టు శుకుని చిత్తాన్ని చలింపజేయ లేకపోయాయి. అతడు సంతుష్టమనస్కుడై అక్కడ సమభావంతో మౌనం వహించి నిండు చంద్రునిలా వుండిపోయాడు.
అప్పటికి శుకుని స్వభావం జనక మహారాజుకు అర్ధమయింది. వెంటనే అతళ్లో తనవద్దకు పిలిపించాడు. స్వాగతం పలికి *“మునీంద్రా ! నీవు లౌకిక కర్తవ్యాలన్నీ నెరవేర్పావు. నీ మనోరథాలన్నీ సిద్దించాయి. నీవు కృతకృత్యుడవు. నీ అభీప్పిత మేమిటో చెప్పు” అని అడిగాడు.
అందుకు శుకు డిలా అన్నాడు-
“గురూ ! ఈ సంసారాడంబరం ఎలా వుదయించింది ? ఎలా శమిస్తుంది ? దీని తత్త్వమేమిచో నాకు బోధించండి” '.
అంతట జనకుడు శుకునితో పూర్వం అతని తండ్రి చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్పాడు; అప్పుడు శుకుడు ఇట్లన్నాడు-
““వాగ్మివర్యా ! ఈ విషయం వివేకంతో నేను ముందే గ్రహించాను. నేనడిగినప్పుడు మా తండ్రి గూడా నాకు ఇదే సమాధాన మిచ్చాడు. మీరు ఆ సంగతినే ఇప్పుడు వివరించారు. శాస్త్రాలలో కనిపించే విషయం కూడా ఇదే ? *' నిస్సారమైన ఈ పాడు సంసారం అజ్జానంవల్ల కలిగింది. అజ్జానం నశ్స్తే ఇదీ నశిస్తుంది. ఇందులో సందేహం లేదు” అన్న విషయాన్నే అందరూ చెబుతున్నారు.
మహాబాహూ ! ఇందలి సత్యమేమిటో నాకు విడమరచి చెప్పండి 1! (భ్రమకు లోనైన నా చిత్తానికి విశ్రాంతి చేకూర్చండి.
76 యోగూసిం. " అప్పుడు జనకుడు ఈ రీతిగా అన్నాడు-
““మునీ! నీవు ఇప్పుడు చెప్పినదే తత్త్వన్నిర్ణయం. ఇంతకు మించినది మరేదీ లేదు. ఈ సంగతి నీయంతట నీవే గ్రహించావు. మళ్ళీ మీ తం డ్రివద్ద కూడా ఎన్నావు. అఖండవైతన్యస్వరూపుడైన పురుషు డొక్కడే వున్నాడు. ఆ పురుషునికంటే అన్యమైన దేదీ లేదు. అతడు తన సంకల్పాలవల్లనే బద్దు డవుతున్నాడు. ఆ సంకల్పాలు నశించినప్పుడు ముక్తు డవుతున్నాడు.
మహాత్ముడవైన నీకు భోగానుభవానికి ముందే దృశ్య'ప్రపంచం మీద విరక్తి జనించింది. అందువల్ల నీకు తత్త్వం స్ఫుటంగా బోధపడింది. మహాధీరుడవైన నీకు చిన్ననాటనే ద్వీర్దరోగాలవంటి భోగాలపై వైరాగ్యం కలిగింది. ఇక నీవు వినవలసిన దేమున్నది ? మహాతపోనిధీ, సర్వజ్ఞాననిధీ అయిన మీ తండ్రికి కూడ నీకు సిద్రించిన పరిప్తూర్ణత సిద్రించలేదు. నేను వేదవ్యాసునికంటే గొప్పవాళ్లో. నీవు వ్యాసునికి పుత్రుడివే కాక శిష్యుడివి కూడా. భోగేచ్చ లేనివాడివి కావడంవల్ల నీవు నాకంటే గొప్పవాడివి.
(బ్రహ్మన్! పూర్ణ చేతస్కుడవైన నీవు పొాందవలసినదంతా పాందావు. దృశ్యంలో తగుల్కొనకుండా తప్పుకొన్నావు. నీవు ముక్తుడవే. భ్రాంతి వదలిపెట్టు.'
ఈ విధంగా మహనీయుడైన జనకుడు బోధించేసరికి శుకుడు మౌనం వహించి స్వచ్చమైన పరతత్త్వంలో లీనమై వుండిపోయాడు. పిమ్మట శోకం, భయం, ఆయాసం వదలి కోరికలూ, సంశయాలూ లేనివాడై సమాధినిష్టకె ప్రశాంతమైన మేరుపర్వత శిఖరానికి వెళ్ళాడు. అక్కడ పదివేలేండ్లు నిర్వికల్పసమాధి నాశ్రయించి తైలం లేని దీపం లాగా నిర్వాణస్రితి పొందాడు.
మేఘసంబంధం వీడి జలబిందువు సాగరంలో కలిసినట్టు అజ్జానకళంకంనుండి విముక్తుడూ, వాసనారహితుడూ, మహాత్ముడూ అయిన శుకుడు పరమపావనమైన పరమాత్మలో విలీనుడయ్యాడు.
విశ్వామిత్ర వాక్యం
విశ్వామిత్రుడు మళ్ళీ ఇలా అన్నాడు : -
““రామచంద్రా 1! వ్యాసుని కుమారునకు ఎలా ఒకింత మెరుగు మాత్రం అవసరమయిందో, అలాగే నీకూ అవసరమై వుంది.
మునీళశ్వరులారా 1! బుద్దిమంతుడైన ఈ రాముడు భోగాలను రోగాల్టాగా
ముముషు వ్యవహార ప్రకరణం 77 భావిస్తున్నాడు. కాబట్టి తెలియదగిన దంతా ఇతడు సాకల్యంగా తెలుసుకొన్నాడు. తత్త్వజ్ఞుడైనవానికి ముఖ్యలక్షణం భోగాలపై అరుచి కల్గడమే. భోగాభిలాషవల్ల సంసారబంధం దృఢపడుతుంది. భోగచింత ఉపళమించేకొలదీ ఆబంధం సడలిపోతూ వుంటుంది.
రావూ 1 వాసనాక్షయం ముక్తి అనీ, వాసనావృద్ది బంధవునీ విజ్ఞులు చెబుతున్నారు. ఆత్మతత్తాాన్ని గూర్చిన ఆపాతజ్ఞానం సాధారణంగా మానవులకు కలుగుతుంది. కాని విషయాలమీద అరుచి ఎంతో కష్టపడితే గాని కలగదు. సమ్యక్ జ్ఞానం కలవాడే తత్త్వజ్ఞుడైన పండితుడు. అలాంటి మహాత్ముడికి భోగాలు రుచించనవు. కీర్తి మొదలైన ఏకారణమూ లేకుండా నిర్వ్యాజంగా భోగాలపై విరతి పొందినవాడే జీవన్ముక్తుడనబడతాడు. తత్త్వజ్డానం కలగనంతవరకూ మరుభూమిలో తీగలాగా విషయాలపై అరుచి జనించదు. అందువల్లనే రమ్యమైన విషయ సుఖాలపై కాంక్షలేని రఘురాముడు తత్త్వజ్డాన సంపన్నుడని గ్రహించాలి. /
మునీంద్రులారా 1 తనకు తెలిసినది సత్యమే అని రాముడు పెద్దల ద్వారా వినాలి. అప్పుడతనికి తప్పక చిత్త విశ్రాంతి కలుగుతుంది. శర్లత్మీ నిర్మలాకాశాన్ని అపేక్షీంచినట్టు రాముని బుద్ది ద్వైతనిరాస పూర్వకమైన కైవల్యశాంతి నపేక్షిస్తున్నది.
ఇతనికి చిత్తశాంతి కల్లడానికి వసిష్ట భగవానుడు యుక్తినుపదేశించు గాక ! ఈ వసిష్ట
మహర్షి యువంశస్టులందరికీ ప్రభువు, కులగురువు, ఈయన సర్వజ్ఞుడు, సర్వసాత్షి (త్రికాలజ్ఞాడు.
వసిష్టమునీంద్రా ! పూర్వం మన వైరం శాంతించడానికీ, మహామతులైన బుషుల (శ్రేయస్సు నుద్దేశించీ నిషధా(ద్రి సాను ప్రదేశంలో బ్రహ్మదేవుడు ఉపదేశించిన తత్త్వం గుర్తున్నదా ? ఆ ఉపదేశం వింటే సూర్యుని రాకతో చీకటి నశించినట్టు సంసార వాసన లన్నీ పటాపంచలవుతాయి. (బ్రహ్మన్! శిష్యుడైన రాముడికి ఆ తత్త్వం ఇప్పుడు ఉపదేశించండి ! దానివల్ల ఇతడు చిత్తశాంతి పొందగలడు. మీ ఉపదేశం నిరర్ధకం కాదు. రాముడు పాపరహితుడు. నిర్మలమైన ముకురంలో ముఖం అప్రయత్నంగా ప్రతిబింబించినట్టు ఇతనికి చేసిన ఉపదేశం సార్థక మవుతుంది. సాధుపుంగవా 1! విరక్తుడైన సచ్చిష్యుడి కుపదేశించినదే జ్ఞానం. అదే శాస్తార్ధం, అనిందితమైన పాండిత్యం కూడా అదే. శిష్యుడు కాని వాడికీ, వైరాగ్యం లేని వాడికీ చేసిన ఉపదేశం తోలుసంచిలో పోసిన గోత్షీరం లాగా అపవిత్రమై పోతుంది. రాగం,
78 యోగవాస్టం భయం, క్రోధం, దురభిమానం లేనివారూ, కల్మష రహితులూ అయిన మీబోటి పెద్దలు కావించిన ఉపదేశం వించే బుద్ది వెంటనే విశ్రాంతి పొందుతుంది.
విశ్వామిత్రుడు ఈవిధంగా చెప్పేసరికి వ్యాసుడు, నారదుడు మొదలయిన మునులందరూ ఆయనను సమర్థిస్తూ సాధువాదాలతో ప్రశంసించారు. పిమ్మట దశరథ మహారాజు చెంత ఉపవిష్టుడైన మహాతేజస్వీ, బ్రహ్మనందనుడూ, (బ్రహ్మతో సమానుడూ అయిన వసిష్ట భగవానుడు ఇలా అన్నాడు -
““విశ్వామిత్ర మునీంద్రా ! మీ ఆదేశాన్ని నేను నిర్విఘ్నంగా నెరవేరుస్తాను. ఎంత సమర్దుడైతే మాత్రం సజ్జనుల మాటను కాదన గల సామర్ధ్యం ఎవరి కున్నది? దీపంతో చీకటిని తాలగించినట్టు నేనిప్పుడు రాకువవారులైన రావూదుల మానసికతమస్సును జ్ఞానోపదేశంతో నశింపజేస్తాను. నాడు నిషధ పర్వతంలో సంసార (భ్రమ నివృత్తక్రై పద్మసంభవుడు చెప్పినదంతా ఇప్పుడు సమగ్రంగా స్మరిస్తున్నాను.''
ఈవిధంగా ప్రతిజ్ఞ చేసి మహాత్ముడైన వసిష్టుడు (ప్రవచనానికి కావలసిన సామ(గ్రినంతా సమకూర్చుకొన్నాడు. అజ్ఞాన శాంత్ైై పరతత్త్వ ప్రబో ధకమైన ఈ శాస్త్రాన్ని చెప్పటాని కుపక్రమించాడు.
సర్గ పరంపరానువర్ణ్గనం
వసిష్టుడు : - సృష్ట్టాదిలో లోకశాంతికొజకై బ్రహ్మదేవుడు కావించిన జ్ఞానబోధను నేనిప్పుడు చెబుతున్నాను.
రాముడు : - భగవ౯ ! విపులమైన మోత్షశా(స్రాన్ని వివరించే ముందు నాకు గలిగిన ఈ సందేహాన్ని నివారించండి ! సర్వజ్ఞుడూ, మహామతీ అయిన శుకుని తండ్రీ వ్యాసమహర్షి విదేహముక్తిని ఎందుకు పొందలేదు ? అతని కుమారుడు ఎలా పాందగలిగాడు ?
వసిష్టుడు : - పరమాత్ముని వైతన్యశక్తిలో ఇంతవరకూ సంభవించి లయించి పోయిన బ్రహ్మాండ కోట్టు అసంఖ్యాకాలు. ప్రస్తుతం వున్న కోట్లకొలది త్రిభువనాలను గూడా ఎవరూ లెక్కింప లేరు. అదే రీతిగా రానున్న కాలంలో ఉత్పన్నం కానున్న జగత్సృష్ట్రులను సైతం లెక్కించడ మనేది సాధ్యం కాని పని.
రాముడు : - జరిగిపోయిన, జరుగనున్న జగత్సృష్టి పరంపరలను గూర్చిన విచారణ యుక్తమే. వాటితో పోల్చి చూచినప్పుడు వర్తమానజగత్సృష్టులు ఒక లెక్కులోనివి కావు గదా 1
ముముక్షు వ్యవహార ప్రకరణం 79
వసిష్టుడు : - పశుపక్షి మనుష్య దేవతాదులలో ఏ జీవియైనా మరణించగానే సూత్మళరీరం ధరిస్తుంది. అది తన హృదయాకాళశం లోనే వాసనామయాలైన (త్రిలోకాలనూ చూస్తుంది. నిజానికి చిదాకాశ స్వరూపుడైన ఆ జీవుడికి జననమరణాదివికారాలు లేవు. ఇలా (ప్రాణికోట్లున్నీ మరణానికి గురి అవుతున్నాయి. మరణకాలంలో తమలో నెలకొన్న అనుభవాల కనుగుణమైన ఫలాలను పొందుతూనే వున్నాయి.
మానస పూజాదులలో సంకల్ప మాత్రంతో నిర్మించుకొన్న మేడల లాగానూ, మనో రాజ్య విలాసంవలెనూ, ఐంద్రజాలికుడు సృష్టించిన మాల రీతిగానూ, కథ వింటున్నప్పుడు తోచే విషయాల చందాననూ, వాతరోగంలో కలో భూకంప (భ్రమ మాదిరిగానూ, బాలుళ్లీ భయపెట్టడానికి కల్పించే పిశాచం వలెనూ, నిర్మలాకాశంలో కనిపించే ముత్యాల మాలలాగానూ, పడవలో పయనించేవాడికి కనిపించే చెట్లు కదలిక మాదిరిగానూ, కలలో కనబడే పట్టుణం రీతిగానూ, చిత్తంలో కల్పించుకొన్న ఆకాళకుసుమం లాగానూ ప్రపంచ సృష్టి భ్రమసిద్దం. మరణించిన జీవుడు తనలో ఈ తత్త్వాన్ని గ్రహిస్తాడు.
మరణ కాలంలో అనుభవానికీ వచ్చే వాసనాప్రపంచమే చిరపరిచయం వల్ల దృఢమై 'ఇహలోక* మనే పేరుతో జీవాకాశంలో ప్రకాశిస్తుంది. ఇహలోకంలో మళ్ళీ జీవుడు పుట్టుక, జీవించాలనే ఆశ చావు - వీటి అనుభవాలు గలిగివుంటాడు. మరణానంతరం తిరిగిఅలాంటి లోకాన్నే కల్పించుకొంటాడు.
అరటిబోదెలోని పట్టుల లాగా వాసనా(ప్రపంచంలో పొరలు పొరలుగా అనేక దేహాలు భాసిస్తాయి. అలా భాసించడాన్నే సంసార మంటారు. మరణించినవారికి పృథివి మొదలైన పంచభూతాలతోడి సంబంధం, లోక్షవ్యవహారం లేవు. ఐనా వారికి జగ(ద్రృమ మాత్రం అలాగే వుంటుంది.
రావూ | అవిద్యకు అంతం లేదు. దానిలో నుండే వివిధ కార్యాలు ఉద్భవిస్తున్నాయి. సృష్టి పరంపరలనే అలలతో నిత్యమూ చలించే అవిద్య అనే మహానదిని మూఢులు తరించలేరు. సువిశాలమైన పరబ్రహ్మమనే సాగరంలో సృష్టు లనే తరంగాలు లెక్కకు మిక్కిలిగా ఉద్భవిస్తున్నాయి. ఈ సృష్టిలో గోచరించే దేహాలు కొన్ని కులక్రమ, మనోగుణాలను బట్టి సమానంగా వుంటాయి. మరొకప్పుడు విభిన్నంగా వుంటాయి.
80 యోగవాసిష్టం వ్యాస సృష్టి పరంపరలో ఈ వ్యాసమునిని నేను ముప్పది రెండవ వానినిగా స్మరిస్తున్నాను. అందులో మొదటి పన్నిద్దరు వ్యాసులు కులంలోనూ, ఆకారంలోనూ, చేష్టలలోనూ సమాములు. కాని వారందరూ అల్పజ్ఞులు. తర్వాత పదిమంది ఆకారంలో మాత్రమే సమానులు. తక్కినవారు కులంచేత విలక్షణులు.
ఇంకా ఎందరో వ్యాస వాల్మీకులు, భృగువులు, అంగిరసులు, పులస్త్యులు తదితరులు పుట్టనున్నారు. వారిలో కొందరు సమానాకారులు, విలక్షణాకారులు వుంటారు. నరులు, దేవబుషులు, దేవతా గణాలు ఒక్కువ్శుడిగానూ, విడివిడిగానూ అలా పుట్టి గిట్టుతూ వుంటారు.
ఈ (బహ్మకల్పంలో ఇది డెబ్బదిరెండవ త్రేతాయుగం. ఇలాంటి యుగాలెన్నో మున్ను గతించాయి. ఇకమీదట ఎన్నో రానున్నాయి. నీవూ, నేనూ, ఇతరులూ ఇంతకు ముందుమాదిరి గానూ, అంతకంటే విలక్షణంగానూ జన్మిస్తూ వుంటాము.
అద్భుత కర్ముడూ, ద్వీర్దదర్శీ అయిన ఈ వ్యాస మునీంద్రుని విలక్షణమైన దశమావతారం ఇప్పుడు గోచరిస్తున్నది. వ్యాస వాల్మీకులతో కూడి మనం ఎన్నోసార్లు
“ఇంతకుముందు జన్మించాము. విడి విడిగా గూడా అవతరించాము. మనతో పాటు
జ్ఞాననిధులైన వీరు గూడా సమౌన శరీరాలతో ఉద్భవించారు. భిన్న భిన్న శరీరాలతో పుట్టినప్పుడు గూడా వాళ్ళ ఆశయాలు సమానంగానే వుండేవి. ఈ వ్యాసమునీంద్రు డింకా ఎనిమిదిసార్లు జన్మించ నున్నాడు. ఆయా జన్మల్లో భారతేతిహాసాన్ని రచించ నున్నాడు. ఇతడు ముందు లాగానే మన్లీ వేదాలను విభజిస్తాడు. భరతవంశానికి కీర్తి కల్షిస్తాడు. తర్వాత హిరణ్యగర్పాధికారం పొందుతాడు. ఆపై విదేహముక్తిని చూరగొంటాడు. ఈ వ్యాసు డిప్పుడు జీవన్ముక్తుడు. ఈయనకు శోకభయాలు లేవు. అహంకారమమకారాలు లేవు. ఈయన శాంతుడు, మోహరూతుడు, మనస్సును జయించినవాడు.
సంపద, బంధువులు, వయస్సు, ప్రయత్నం, విద్య, విజ్ఞానము, చేష్టలు ఒక్కొక్కసారి ప్రాణులలో సమంగా వుంటాయి. మరాొకప్పుడు భిన్నభిన్నంగా వుంటాయి. ఇదంతా మాయ. దీని కంతం లేదు.
ధాన్యపు గింజల రాశి కొలిచేటప్పుడు కక్రిందు మీదైనట్టు (ప్రాణి పరంపర సృష్టిక్రమంలో వివిధరూపాలు పొందుతుంది. కాలమనే సాగరంలోని సృష్టి పరంపరలనే అలలు ఒక్కొక్కసారి ఒకే రూపంతోనూ, మరాకప్పుడు భిన్నరూపంతోనూ
ముముక్రు వ్యవహార ప్రకరణం 81 (ప్రకిటితమవుతూ వుంటాయి. తత్త్వ్వజ్ఞానికీ చిత్తం సమాహితమై వుంటుంది. వికల్పాలు శమిస్తాయి. పరమశాంతి అనే అమృతంతో అతడు సంత్పసప్తు డవుతాడు. అతడు మాయ అనే ఆవరణం లేనివాడై స్వస్వరూపంలో వెలుగొందుతాడు. పారుష ప్రశంస ఓ సౌమ్యుడా | సము(ద్రంలో నీరు అలలరూపంలో ఉండవచ్చు. లేదా చలనములేని జలరూపంలో ఉండవచ్చు. ఎలా వున్నా అది నీరేగాని మరేమీ కాదు. అలాగే మునులు జీవన్ముక్తులైనా, విదేహముక్తులైనా ముక్తి ఒకటే కాని వేరు గాదు. జీవన్ముక్తి గానీ, నిర్వాణమ్యుక్తి గానీ విషయ సుఖాలపై ఆధారపడి వుండవు. విషయాలపై అనాసక్తుడై ఒక్క ఆత్మను మాత్రమే చూచే వాడికి నిజంగా భోగానుభవాలు లేవు. జీవన్ముక్తుడైన ఈ వ్యాసమునీంద్రుని మనం ఘటపటాదులైన ఇతర పదార్దాల లాగానే చూస్తున్నాము. దేహరహితాత్మకమైన అతని అంతర్నిశ్చియం మనకు తెలియదు. జీవన్ముక్తికీ, విదేహముక్తికీ భేదం లేదు. వీచినా వీచకపోయినా గాలి గాలే కదా! నాకు గానీ, వ్యాసునికి గానీ ద్వైతం లేని ఆత్మైకత్వమే లత్యం. అంతేకాని సదేహ విదేహముక్తులను గూర్చిన చర్చ ప్రధానం కాదు. ఆందువల్ల శ్రవణ భూషణమూ, అజ్ఞాన నాశకమూ అయిన నా ఈ ఉపదేశం విను. రఘునంగనా ! ఈ లోకంలో ప్రతివాడూ తన పౌరుషాన్ని చక్కగా వినియోగిస్తేనే అభీష్టమైన వస్తువును పాందగలడు. నిష్కామ కర్మవల్ల చిత్తశుద్ది కల్గుతుంది. చిత్తశుద్ది వల్ల జ్ఞానం సిద్దిస్తుంది. చంద్రునినుండి చల్లదనమూ, ఆమ్లీాదమూ లభించినట్టు జ్ఞానంవల్ల కామాదిసంతాపాలను తొ లగించే జీవన్ముక్తిసుఖం (ప్రాప్తిస్తుంది. దీనికంతా మూలం పురుషప్రయత్నమే. ఫురుషప్రయత్నం వల్లనే మానవుడు ఆయాకర్మలు చేసి తగిన ఫలాలు పొందుతున్నాడు. ఇది ప్రత్యక్ష సిద్దం. అంతేగాని, దైవమంటూ ఏదీ లేదు. అది మూఢుల కల్పన మాత్రమే. పెద్దల ఉపదేశా న్ననుసరించి మనోవాక్కాయ కర్మలను (ప్రవర్తింప జేయడమే పౌరుషం. అదే ఫలాన్ని కలిగించేది. తక్కిన దంతా ఉన్మత్త చేష్ణ్టమా (త్రమే. ఎవడు దేనిని అభిలపిస్తాడో , అందుక్ జై క్రమం తప్పక తుదముటణ్మా ౯7
82 యోగా 'శ్రమిస్తాడో వాడు తప్పక ఆ ఫలం పొందుతాడు. ఒక జీవుడు పురుషకారం వల్లనే ఇంద్ర పదవి నధిష్టించి ముల్లోకాలకూ అధిపతి అయ్యాడు. మరొక జీవుడు పురుషప్రయత్నం వల్లనే పద్మాసన మధిరోహించి (బ్రహ్మదేవు డయ్యాడు. ఇంకొక జీవుడు తన పొరుషబలం వల్లనే పురుషోత్తముడ్డె గరుడద్వజుడైన విష్ణువుగా రూపొందాడు వేరొక జీవుడు పురుషప్రయత్నం కారణంగానే అర్దనారీశ్వరుడైన చం(ద్రశేఖరు డయ్యాడు. పూర్వజన్మకృతమనీ, ఇహజన్మకృతమనీ పౌరుషం రెండు రకాలు. అందు మొదటిది ్రాక్షన మనీ, రెండవది ఐహిక మనీ చెప్పబడుతున్నది. ఐహికపురుష కారంతో, (ప్రాక్తనపురుషకారాన్ది జయించవచ్చు. దృఢాభ్యాసం కలవారూ, (ప్రజ్ఞావంతులూ, ఉత్సాహశీలురూ అయిన ప్రయత్నపరులు మేరుపర్వతాన్ని సైతం (మింగివేయగలరు. అలాంటి వారికి (ప్రాక్తనపౌరుషం ఒక లెక్కా ? శా స్రోక్తమైన పద్దతిలో పురుషకారం కొనసాగితే తప్పక అది అభిమతఫలాన్ని వేకూరుస్తుంది. శాస్త్రమర్యాద నతి'క్రమిస్తే అనర్హం తప్పదు. శాస్త్ర, విధి ననుసరించి ('ప్రయత్నించకపోతే దుస్రితి సంభవిస్తుంది. ఆస్రితిలో మానవుణ్ణి దారిద్ర్యం, రోగం మొదలైన విపత్తులు పైకొంటాయి...శరీరావయవాలు స్వాధీనంలో వుండవు. పుడిసిలీ పట్టటం కూడా సాధ్యం కాని ఆడళలో నీటిబొట్టు కూడా కజవై పోతుంది. అప్పు డతనికా జలబిందువే ఎంతో అపురూపమైన దొడ్డవస్తువులా కనిపిస్తుదది. శాస్త్ర విధిని పాటించి ప్రయత్న పరుడైనవాడు సమస్త భూమండలానికీ అధిపతి అవుతాడు. పఫు్రాదులకు తన సంపద నంతా పంచి పెడతాడు. అప్పుడు సువిశాలమైన ఈ మహీమండలం సైతం అతనిదృష్టికి గొప్పుగా గోచరించదు. కాబట్టి శుభాశుభ ఫలాలు ప్రయత్నం మీదనే ఆధారపడి వుంటాయి. పారుష స్థాపనం పలురకాల రంగుల అభివ్యక్తికి వెలుగు సాధనమైనట్టు శాస్త్ర మర్యాదను పాటించేవారి ఫలసిద్దికి ప్రవృత్తి సాధన మవుతున్నది. శాస్త్రవిధిని అనుసరించకుండా అభీష్టఫలసిద్దికై చేసే ప్రయత్నం ఉన్మత్త చేష్ట మాత్రమే. ధానివల్ల ప్రయోజనం శూన్యం. ఎవడు ఎలాంటి ప్రయత్నం చేస్తాడో, అతడు అలాంటి ఫలాన్నే అనుభవిస్తాడు. అందులో అదృష్టమంటూ ఏదీ లేదు.
ముముక్షు వ్యవహార ప్రకరణం 83 పురుషకారం ఉచ్చాస్త్రవునీ, శాస్త్రితవునీ రెండు విధాలు. శాస్త్రానికి విరుద్దమైనది ఉచ్చాస్త్రుమనీ, అనుకూలమైనది శాస్త్రితమనీ చెప్పబడుతుంది. శాస్త్రవిరుద్రమైన కర్మవల్ల అనర్ధం కలుగుతుంది. శా(స్రోచితమైన కర్మ పరమార్చాన్ని (ప్రాప్తింపబేస్తుంది. . పూర్వకర్మ, ఇప్పటికర్మ - ఇవి రెండూ రెండు పొట్టేళ్ళలాగా సమ విషమ బలాలతో పరస్పరం ఢీకొంటూ వుంటాయి. అందులో బలహీనవ్వైనది ఓడిపోతుంది. అందుచేత వూనవుడు పూర్వకర్మలను శమింపజేసే శాస్త్రవిహితసత్కర్మలను ఈ జన్మలో ఎక్కువగా అనుష్టించాలి. ఇతరులు కలిగించే విఘ్నాలను అతి క్రమించాలన్నా తాను చేసే కర్మ బలవత్తరమైనదిగా ఉండాలి. శాస్త్రవిహిత కర్మలు చేసినా ఒక్కొక్కసారి అనర్ధం కలగవచ్చు. అప్పుడు అన ర్హహితువైన తన దుష్కర్మ (ప్రబలంగా వున్నదని (గ్రహించుకోవాలి. మహాపొరుషంతో పండ్లు పటపట కొరుకుతూ శుభకర్మలతో అశుభకర్మలను జయించాలి.
“నా పూర్వకర్మ నన్ను ఈ విధంగా చేయిస్తున్నది'” అనే భావాన్ని మనస్సులోనికి రానీయకూడదు. అట్టి భావం ప్రత్యక్షకర్మకంచే బలమైనది కాజాలదు. పాపకర్మలు సమూలంగా నశించే వరకూ ప్రయత్నపూర్వకంగా సత్కర్మలు చేస్తూనే వుండాలి. నిన్నటి తప్పులను నేటి ఒప్పులతో సరిదిద్దుకోవచ్చు. ఇందులో సందేహం లేదు. చురుకైన బుద్దితో దురదృష్టైన్ని దూరం చేసుకోవాలి. సంసారాన్ని తరించటానికనువైన శమదమాది సాధనసంపత్తిని సమకూర్చుకోవాలి.
('శ్రియాశూన్యులైన సోమరులు గార్దభాల వంటివారు. వాళ్లతో పొత్తు పనికిరాదు. 'ప్రయత్నపరుడైన వాడీకే ఇహపరాలు రెండూ సిద్దిస్తాయి. సింహం పంజరం నుండీ వెలువడి నట్టు పురుషకారంతో సంసారకుహరం నుండి బయటపడాలి. శరీరం నశ్వరమని భావించాలి. పశుతుల్యమైన మూఢత్వాన్ని పరిత్యజించాలి. సజ్జనుల
మార్గాన్ని అనుసరించాలి. పుండుమీద యీగలాగా అన్న పొనాది భోగాలను ఆస్వాదిస్తూ అమూల్యమైన వయస్సును బూది చేసుకోరాదు. సత్కర్మకు సతృలమూ, దుష్కర్మకు దుష్ఫలమూ' తప్పవు. ఇక దైవ మనేది ఎక్కడ వుంది ?, (ప్రత్యక్షప్రమాణాన్ని కాదని అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయించేవాడు తన భుజాలనే[ పాములని అవుమానించి పారిపోయేవానితో సమానుడు. '“దైవం నన్నిలా
రత యోగవాసిష్టం ఆడిస్తున్నది. నేనేమి చేసేది ?'” అనే బుద్లిహీనుల ముఖం చూచి లక్ష్మి దూరంగా తొలగిపోతుంది. అందువల పురుషకారంతో వివేకి కావాలి. ఆత్మ జ్ఞాన హేతువులైన శాస్త్రాలను పరిశీలించాలి. శాస్రోచితమైన మార్గంలో అభీష్టాన్ని సాధించుకోలేని మూఢుల భోగవాంఛలకు ధిక్కారం ! పౌరుషం అవధి లేనిది కాదు. దానికీ ఒక పరిమితి అంటూ వున్నది. ఎంత ప్రయత్నించినా రాతినుండి రత్నాన్ని పొందలేము కదా! ఘటానిక్తీ, పటానికీ పరిమితి ఉన్నట్లే పురుషకారానికి కూడా పరిమితి వున్నది. అది ఫలప్రాప్తి వరకే కొనసాగుతుంది. సదాచారాన్ని పాటిస్తేనే పురుషప్రయత్నం ఫల (ప్రదమవుతుంది. పౌరుషము యొక్క స్వభావమే అలాంటిది. ఆ సంగతి గ్రహించి వ్యవహరించేవాని యత్నం ఎన్నటికీ వ్యర్థం కాదు. దైన్యానీకీ, దారిద్ర్రదుఃఖానికీ గురి అయిన మహాపురుషు లనేకులు మళ్ళీ పురుషప్రయత్నం వల్లనే దేవేంద్రునితో సమానులయ్యారు. బాల్యమునుండి అభ్యసించిన శాస్త్రచర్చ, సత్సాంగత్యం మొదలైన సద్గుణాలతోనే కోరినఫలం లభిస్తుంది. ఇది ప్రత్యక్ష సిద్దమైన అనుభవం. దీనిని '“అద్నష్టంి" అని భావించే మూఢులు మృత'ప్రాయులు. అనర్ధహేతువైన సోమరితనమే లేకుంటే లోకంలో (ప్రతివాడూ మహాధనికుడో, మహాపండితుడో అయివుండేవాడు. సోమరితనం వల్లనే చతుస్పాగరపరివేష్టితమైన ఈధరాతలం మూర్చులతోనూ, దరి(ద్రులతోనూ నిండిపోయింది. బాల్యం ఆటలతో గడచిపోతుంది. ఆపైన శరీరానికి పాటవం కలిగించే యౌవనం వస్తుంది. అప్పటినుండి ప్రయత్నంతో సత్సాంగత్యాన్ని అలవర్చుక్"ని పదపదార్ధ విజ్ఞానాన్నీ, యుక్తాయుక్త పరిజ్ఞానాన్నీ పాందాలి. తన దోషాలను తానే చక్కగా విచారించుకోవాలి.!* మునీంద్రుడు ఈ విధంగా చెప్పేసరికి సాయంసమయ మయింది. సూర్యుడు అస్తమించాడు. సభాసదు అందరూ మునికి నమస్కరించి స్నానాది విధుల్టై వెళ్ళారు. తెల్లవారగానే మళ్లీ సభాస్ట్రలికి విచ్చేశారు. (మొదటి దినం)
చుముక్షు వ్యచనార ప్రకరణం 85 దైవ నిరాకరణం
వసీష్టడు :- తన పూర్వకర్మకంటే అన్యంగా దైవమంటూ ఏదీ లేదు. అందుచేత 'దైవం' “దైవం అంటూ ఊరక కూర్చోక సాధుసంగమంతోనూ, సచ్చాస్త్ర, పరిశీలనతోనూ ప్రయత్నపూర్వకంగా జీవుణ్ణి సంసారం నుండి ఉద్దరించాలి. (ప్రయత్నాన్ని బట్టే ఫలం కూడా ఉంటుంది. ఇందులో ఉన్నదంతా పురుషకారమే. దాన్ని 'దైవ* మనుకుంటే అభ్యంతరం లేదు. పూర్వకర్మలకు ఫలంగా దుఃఖం కలిగ్లైనపుడు “వా కష్టమా 1' అంటాము. అలాగే ఒక్కొక్కసారి 'వా దైవమా 1 "అని కూడా అంటాము. రెండు మాటలకూ అర్ధం ఒక్కచే.
బలవంతుడైన పురుషుడు బాలుళణ్లీ జయించినట్లే పూర్వకర్మ రూపమైన దైవాన్ని అద్యతనకర్మతో అనాయాసంగా జయించవచ్చు. నిన్నటి దురాచారాన్ని నేటి సదాచారంతో రూపువాపినట్టు వెనుకటి దుష్కర్మను నేటి సత్కర్మతో నిర్మూలించవచ్చు. దీనులూ, ప్రాకృతులూ అయిన మూఢజనులు మాత్రమే లేశమా(త్రమయిన విషయసుఖాలకు లోబడి దైవాన్ని జయించడాని కుపక్రమించక ఊరక పడివుంటారు. ఈ జన్మలో పురుషకారం విఫలమైతే దైవవునబడే పూర్వజన్మలోని పురుషకారం బలవత్తరమైనదని (గ్రహించాలి.
ఒకే గుత్తిలోని రెండు షళ్లలో ఒకటి తొజ్జుపండైతే అందుకు కారణం ఆ ఫలభోక్త యొక్క కర్మవిశేషమే కాని మరేమీ కాదు. జగత్తులోని సుప్రసిద్ద పదార్జాలన్నీ కాలక్రమంలో క్ష్షయమైపోతున్నాయి. క్షయకర్త యొక్క (ప్రయత్నబలాతిశయమే అందుకు హేతువు. దంతంతో అన్నాన్ని చూర్తం చేసినట్టు పురుషకారబలంతో దైవాన్ని చూర్లం చేయవచ్చు. ప్రయత్న శాలురైన పెద్దలకు (ప్రయత్నహీనులు భృత్యులౌతున్నారు. మట్టి ముద్దలలాగా అణగిమణగి పడివుంటూ వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు.
సవార్చుడైన వ్యక్తి యెొుక్క పురుషకారం పైకి కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. మూఢుడు మూా(త్రం దాన్ని 'దైవం' అని విశ్వసిస్తాడు. బలవంతమైన (ప్రాణులలో ఏది ఎక్కువ బలం కలదో, అదే ఇతర(ప్రాణులను నియమిస్తున్నది. ఇది ప్రాణికోటి కంతా విదితమే కదా ? ఇక దైవానికీ వోచెక్కడ ?
భద్రగజం దేశానికి బిచ్చగాల్లీ రాజుగా చేస్తుంది. అలా వాడు రాజు కావడానికీ అక్కడి మంత్రులు, (ప్రజలు ఆగజము చేసిన ప్రయత్నమే హేతువు. శాస్త్రము,
తిని యోగాస్టం అమాత్యులు మొదలైనవారి వికల్పరహే తమైన స్వభావబుద్ది బిచ్చగానికి రాజ్యం (ప్రసాదించింది. ప్రజలను పాలించేది గూడా అదే. లేదా బిచ్చగాడు రాజు కావడానికి పూర్వజన్మలో అతడు చేసిన బలమైన పురుషకారమే హేతువు కావచ్చు.
సంవత్సర మంతా కష్టపడి పండించిన పంట కొన్ని నిముషాలలో వానదెబ్బకు పాడైపోతుంది. దీనికి కారణం మేఘుని ప్రయత్నబలమే. అధిక ప్రయత్నపరుడు తప్పక విజయవంతు డవుతాడు. శ్రమపడి సాధించిన విత్తమంతా ఒక్కొక్కసారి క్షణంలో నశించిపోతుంది. అయినా మళ్ళీ ఆర్షించటానికి ప్రయత్నించాలే కాని శోకించరాదు. మన బలానికి సామర్ధ్యం చాలనప్పుడు దుఃఖించినందువల్ల ప్రయోజన మేమున్నది? దేన్ని సాధించటానికి మనకు శక్తి చాలదో దానికొఆకై దుఃఖించడం తగదు. అలా దుఃఖించవలసి వస్తే మనలను వెన్నాడుతున్న మృత్యువు విషయంలో అనుక్షణమూ దుఃఖించవలసినదే కదా 1
జగత్తులోని పదార్జాలన్నీ దేశ కాల (క్రియా (ద్రవ్యాల ననుసరించి స్పురిస్తూ వుంటాయి. వీటిలో అత్యధిక (ప్రయత్న శాలి అయినది తప్పుక విజయం సాధిస్తుంది. అందువల్ల ప్రయత్నపరుడై శాస్త్రవిచారంతోనూ, సజ్జన సాంగత్యంతోనూ బుద్దిని నిర్మలం చేసుకొని సంసార సాగరాన్ని తరించాలి.
(ప్రాచీన నవీన పురుషకారాలు రెండూ పురుషు డనే అరణ్యంలో పుట్టిన రెండు ఫలవృత్షాలు. అందులో బలవత్తరమైనది బలహీనమైనదాన్ని అణచివేస్తుంది దుష్కర్మలను శుభప్రయత్నంతో హతమార్చలేని అజ్జుడు తన సుఖదుఃఖాలమీర అదుపు కలిగి వుండలేడు. పళుతుల్యుడైన ఆ పరాధీనుడు, ఈశ్వర ప్రేరితుడ్డె స్వర్గనరకాలకు రాకపోకలు సాగిస్తూ వుంటాడు. సదాచారము, సద్విచారము, సదత్రయత్నం కలవాడు సింహం పంజరం నుండి వెలువడినట్టు జగన్మాయనుండి విముక్తు డవుతాడు. స్వ(షప్రయత్నం విడనాడి “ఎవరో నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారు' అనే అన్రకల్పనతో కాలక్షేపం చేసేవాడు అధముడు. వాళ్లి దూరంగా తరిమి వేయాలి
జీవితంలో నిత్యమూ వేలకొలది వ్యవహారాలు వస్తూ పోతూ వుంటాయి వాటిపై రాగ ద్వేషాలు పూనక శాస్త్రాన్ని అనుసరించి (ప్రవర్తించాలి. సముద్రుని చెంత రత్నాలు చేరినట్టు శా స్రానుసారం తన మర్యాదను కాపాడుకొనే వానివద్ద అభీష్టవస్తువు లన్నీ చేరుతాయి.
ఇష్టైర్దాన్ని సాధించరానికి తదేకదీక్షతో కొనసాగించే తీవ్రప్రయత్నాన్నే పండితులు ““పారుషు' మని పేర్కొన్నారు. అది స్త్రవిధి ననుసరిస్తే తప్పక సిద్ది కలిగిస్తుంది
ముముక్షు వ్యవవోార ప్రకరణం 87 సాధుసంగమ సచ్చాస్త్ర పరిచయాలనల్ల చురుకుదనం అలవరచుకొన్న బుద్దితో స్వప్రయత్నపరుడై శ్రవణమననాదులు చేసే వాడు ఆత్మోన్నతిని పొంది తీరుతాడు. సర్వసమభావం చేత కలే అనంతమైన ఆనందాన్నే పండితులు పరమార్ధ మన్నారు. దాన్ని ప్రసాదించే శా(స్తాలనూ, సాధువులనూ నిత్యం సేవించాలి.
ఉభయలోకాలకు హితమైన పురుషకారంలో దేవలోకంలో అనుభవించగా మిగిలిన భాగం ఈ లోకంలోకి మళ్ళీ జీవుణ్ణి అనుసరించి వస్తుంది. దాన్నే దైవమని పేర్కాంటున్నారు. ఇది యుక్తమే. ఇందులో సందేహం లేదు. దీన్ని మేము కాదనడం లేదు. మూఢులు కల్పించిన దైవాన్నీ, దాన్ని విశ్వసించే వాళ్లను మాత్రమే మేము తూలనాడుతున్నాము.
నిజపొరుషబలం చేత మాత్రమే ఇహపర లోకాలలో (శ్రేయస్సు కలుగుతుంది. ఎవడు కార్యశూరుడో, వాడు అరచేతి ఉసిరిక లాగా ఫలాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు. 'ప్రత్యక్షాన్ని వదలి మూఢుడు దైవమనే మోహంలో మునిగిపోతాడు."
శుభాశయుడవైన ఓ రామచంద్రా! కార్యకారణాలు లేనిదీ, మిథ్యారూపమూ అయిన దైవాన్ని అపేక్షించవధ్దు. నీ పౌరుషాన్నే నీవు ఆశ్రయించు. శా(స్రాలవల్థా, సదాచారాలతో వెలుగొందే దేశధర్మాలవల్లా చిత్తశుద్రి, జ్ఞానము అనే చిర ప్రసిద్ర ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాల మీది కాంక్షతో చేసే మానసిక శారీరక ప్రయత్నమే పౌరుష మనబడు తున్నది. మానవుడై జన్మించినందుకు మోక్షరూపమైన పురుష్ణార్ధమే పరమ ప్రయోజన మని గ్రమించాలి. ఆత్మప్రాప్తికై ప్రయత్నించాలి. సాధువులనూ, శాస్రాలనూ ఉపాసించడం ద్వారా ఆ ప్రయత్నాన్ని సఫలం చేసికోవాలి. |
ఇలా దైవ పౌరుషాల స్వరూపాలను చక్కగా విచారించాలి. పౌరుషమే జయిస్తుందని నిశ్చయించాలి. (శ్రవణవుననాదులతో ఆర్యజనులను సేవిస్తూ ఆత్మ ప్రాప్తికై పాటు పడాలి. ఐహిక పొరుషాన్నే పరమార్ధ (ప్రాప్తికి ఉపాయంగా అవలంబించాలి. ఉత్క్పప్ష పండితసేవ అనే పరమౌషధంతో జన్మపరంపరా రూపమైన సంసారరోగాన్ని శాంతింపజేసుకోవాలి.
పారుషప్రాధావ్యం
ఆరోగ్యవంతమైన శరీరం లభించిన జీవుడు మళ్లీ పుట్టకుండా వుండటానికి తగిన దృఢ నిశ్చయం కలిగివుండాలి. పురుషకారంతో దైవాన్ని నివారించడానికి తలపెట్టినవాడు ఇహపరలోకాలు రెండిటా ఇష్షసిద్రిని పొందుతాడు. ప్రయత్నం వదిలి
88 యోగవాసం దైవంపై ఆధారపడిన ఆత్మశ (శత్రువులు ధర్మార్హకావూలను చేతులారా నశింపజేసుకొంటారు. తత్త్వస్ఫురణ, మనఃసంకల్పం, ఇంద్రియ ప్రవృత్తి - అనేవే పౌ రుషముయొక్క రూపాలు. వీటి నుండే ఫలం సిద్దిస్తుంది. తత్త్వస్సురణ కమగుణంగా మనస్సు సంకల్పిస్తుంది. సంకల్పాన్ని అనుసరించి ఇం(ద్రియాలు (ప్రవర్తిస్తాయి. దాని కనుగుణమైన ఫలం వునకు లభిస్తుంది. ఫలం పారుషాధీన వున్న సత్యం ఆబాలగోపాలం అందరికీ అనుభవసిద్దం. ఇందులో దైవం వునికి ఎక్కడా కనిపించరు. బృహస్పతి దేవతలకు గురు వయ్యా డన్నా, శుక్రుడు దైత్యులకు ఆచార్యత్వం వహించాడన్నా అందుకు కారణం వాళ్ళ పురుష కారవేం. సాధుమూర్తి వైన ఓరామచంద్రా! దీనులూ, దరిద్రులూ, దుఃఖార్తులూ అయిన నరశ్రేష్టులు కొందరు తమ ప్రయత్నం వల్లనే దేవేంద్రుడితో సమానులయ్యారు. అలాగే బలాధికులూ, సంపన్నులూ, భోగపురుషులూ అయిన వార నేకులు ప్రయత్న దోషం చేత నరకం పాలయ్యారు. సంపదలు, ఆపదలు మొదలైన పెక్కు అవస్థలకు ప్రాణికోట్టు గురి కావడం వారి వారి పౌరుషాన్ని అనుసరించే జరుగుతున్నది. శాస్త్రపరిశీలన గురూపదేశం, స్వప్రయత్నం - ఈ మూడు కారణాలవల్ల పురుషకారం ఫలస్రద మవుతుంది. దైవంతో దీనికి సంబంధం లేదు. అపమార్లాన వెళ్లే మనస్సును 'ప్రయళశ్నంతో మంచి దారికి మళ్ళించా లనేదే సర్వశా(స్తాల సారాంశం. శ్రేయస్కరమూ, సత్యమూ, నిత్యమూ అయిన కర్మను ఆచరించా లనేదే పెద్దల ఉపదేశం. కార్యసిద్ది పౌరుషాధీనం కాబట్టి బుద్రిమంతులు పురుషకారాన్ని ఆచరిస్తారు. దైవ మనేది కష్ట కాలంలో మూర్చులను ఓదార్చడానికి ప్రయోగించే మాట మాత్రమే. ప్రత్యక్షాది (ప్రమాణాలు కూడా పౌరుషమే ఫలవంత మని నిరూపిస్తున్నాయి. భుజించేవానికే తృప్తీ గాని భుజించనివానికి లేదు. నడిచే వాడు గమ్యం చేరుతాడు గాని నడవనివాడు చేర లేడు. మాటాడే వాడు చెప్పగలడు గాని మాట్టాడని వాడు చెప్పలేడు. అందువల్ల పారుషమే ఫలప్రద మని తేలుతున్నది. బుద్దిమంతులు పౌరుషం వల్లనే దురంతమైన సంకటాలను దాటుతున్నారు. దైవాన్ని నమ్మి ఊరక కూర్చున్న వారు దాటలేరు. ఎవడు దేనికొ అకు యత్నిస్తాడో, వాడు ఆ ఫలం పాందుతాడు. ఊరకున్న వాడికి ఏ ఫలమూ లేదు. రామచంద్రా! శుభప్రయత్నంతో శుభఫలం సిద్దిస్తుంది. అశుభ (ప్రయత్నంవల్ల కలిగేది అశుభ ఫలమే ఇది వస్తుస్రితి
ముముక్షు వ్యవహార ప్రకరణం 89 ఇక నీ ఇచ్చ వచ్చినట్టు (ప్రవర్తించు.
పురుషక్రారాన్ని అనుసరించి, దేశకాలాలను బట్టి ఆలస్యంగా కానీ, శీఘ్రంగా కానీ కలిగే ఫలప్రాఫ్తీనే దైెవమన్నారు. అది కంటికి కనిపించదు. లోకాంతరంలో లేదు. స్వర్గలోకంలో అనుభవానికి వచ్చే కర్మఫలాన్నే దైవమని వ్యవహరిస్తున్నారు.
పురుషుడు లోకంలో జన్మిస్తున్నాడు, పెరుగుతున్నాడు, జీర్లమై పోతున్నాడు. వానిలో జరా యౌవన బాల్యాలు కనిపించినట్టు దైవం కనిపించడం లేదు. పరమార్ధ (ప్రాప్తికె పట్టుదలతో కొనసాగించే ప్రయత్నాన్నే పండితులు పౌరుష మనే శబ్దంతో పేర్కొన్నారు. దానివల్ల అభీస్ట్రై అన్నీ నెరవేరుతాయి. ఒక చోటి నుండి మరొక చోటికి పోవడం, చేతులతో (ద్రవ్యాలను ధరించడం, తక్కిన అవయవాలతో చేసే పనులు ఇవన్నీ పురుషకారంవల్ల జరుగుతున్నాయి. కాని దైవం వల్ల కాదు.
అనర్ధం కల్గించే ప్రయత్నాన్ని పిచ్చిచేష్ట అంటారు. దాని వల్ల ఏవిధమైన మేలూ కల్లదు. సత్సంగం తోనూ, సచ్చాస్త్ర పరిశీలనతోనూ బుద్ది తీక్షమవుతుంది. అట్టి బుద్దితో ఆలోచించి చేసే ప్రయత్నం సత్ర్రయోజనాన్ని సమకూరుస్తుంది. సర్వ సమభావం వల్ల సిద్రించే అనంతమైన ఆత్మానందమే పరమ పురుషార్ధం. దాన్ని ప్రసాదించే శాస్రాలనూ, సాధువులనూ సేవించాలి. .
సరస్సు వల్ల తామరలూ, తామరలవల్ల సరస్ఫూ పరస్పర శోభను ఇనుమడింప జేసుకొంటాయి. అలాగే బుద్రివల్ల సచ్చా(స్తాదులూ, సచ్చా(స్తాదుల వల్ల బుద్ది అన్యోన్యం వృద్ది పాందుతాయి. బాల్యం నుండీ సత్సంగమూ, శా(స్త్రాభ్యాసమూ కల్లి పురుష (ప్రయత్నం ఆచరిస్తే మోక్షరూపమైన ప్రయోజనం సిద్దిస్తుంది. విష్ణుమూర్తి పౌరుషంతోనే దైత్యులను జయించాడు. లోకాలను సృష్టించి రక్షిస్తున్నాడు. అంతేకాని దైవబలంతో కాదు. రఘునాథా ! జగత్తులో ప్రతిదానికి పురుషకారమే మూలం. అందుచేత సందేహం వదలిపెట్టు. చెట్టు, పాములు మొదలైనవాటి దుఃస్రితి నీకు కలగకుండా వుండేటట్లు తీవ్రప్రయత్నపరుడవు కమ్ము.
దైవ విరాకరణ
ఆకారమూ, కర్మా, కదలికా, పరా[క్రమమూ ఏమీ లేక మిథ్యాజ్ఞానం లాగా రూఢమైన దైవాన్ని గూర్చి చెప్పే దేమున్నది ?.
చేసిన కర్మకు ఫలం (ప్రాప్తించినప్పుడు ''ఇది ఇలా జరిగింది, ఈ కర్మకు + ఫలం లభించింది"' అని చెప్పుకొంటాము. అలా చెప్పుకోవడాన్ని బట్లే దైవమనే
90 యోగవాసిష్టం వ్యవహారం ప్రసిద్ది పొందింది. ఆ్రసిద్రిని బట్టే మూఢులు అజ్ఞానంతో 'దైవం' అనేది ఒకటి వుందని నిశ్చయించారు. ఇది త్రాడును చూచి పొమని నిర్ణయించి నట్టున్నది.
నిన్నటి దుష్కర్మ నేటి.పత్కర్మతో చక్కబడుతుంది. అలాగే ఇప్పటి సత్కర్మతో (ప్రాక్తన దుష్కర్మల నన్నిటినీ దూరీకరించవచ్చు. అందువల్ల ప్రయత్నంతో సత్కార్యాలు చేయాలి. .
మూఢజనుడు అనుమాన (ప్రమాణంతో సాధించిన దైవంపై గట్టి నమ్మక మున్నవాడు 'దైవబలంవల్ల అగ్ని నన్ను దహింపదు' అని నిశ్చయించి అగ్నిప్రవేశం చేయాలి. దైవమే అన్నిటికీ కర్త అయ్యే పక్షంలో అసలు పురుషుని ప్రయత్నం ఎందుకు? స్నానం, దానం, ఆసనం, జపం మొదలైన పనులన్నీ దైవమే చేస్తుంది కదా ! అంతేకాదు. అప్పుడు శాస్త్రాలు చేసే ఉపదేశం గూడ నిరుపయోగమే. దైవం నడిపించినట్లే నరులు నడుస్తున్నప్పుడు శాస్త్రాలు ఎవరికి ఉపదేశించాలి ? ఏమని ఉపదేశించాలి ?
ఒక్క శవం తప్ప జీవంతో వున్న ప్రతి (ప్రాణీ ఓదో ఒక ప్రయత్నంతో స్పందిస్తూనే ఉన్నది. (ప్రయత్నాన్ని అనుసరించే ఫలం లభిస్తున్నది. అందువల్ల దైవం నిష్రయోజనం. ఆకృతి లేని దైవం ఆకృతిగల పురుషునికి సహకరించడ మనేది కల్ల. అందువల్ల దైవం నిరర్హకం. అవయవా లుండబట్టే వునుజుడు పని చేయగల్గుతున్నాడు. అది గూడా ఒక పని తర్వాత మరొక పని చేస్తున్నాడు. పక్షవాతాదిరోగాలతో కాలు చేతులు పడిపోయినప్పుడు దైవం ఏమైనా చేయించ గల్గుతుందా ?
పండితులనుండి పామరులవరకూ అందరికి మనోబుద్దులు అనుభవానికి వస్తున్నాయి. దైవం అలా ఎవరికీ అనుభవానికి రావడం లేదు. అందుచేత దైవానికి ఉనికి లేదు. కార్యకారి అయిన బుద్దికంటే దైవం వేరు అనే పక్షంలో అలాంటి దైవంతో మనకు పని లేదు. అవి రెండూ ఒకటే అనే పక్షంలో దైవానికి ఉనికి లేదనడం స్పష్టం. ఇక ఫల ప్రాప్తి ననుసరించి దైవాన్ని కల్స్పించవలసిన అవసర ముందంటావా ? నిజానికి దైవమంటూ ఏదీ లేదు. అది మూఢుల కల్పన మాత్రమే. దానికి బదులు పౌరుషాన్నే కల్పించుకోవచ్చు గదా |
ఆకృతి లేని ఆకసంతో ఆకృతిగల పదార్జానికి సంగం లేదు. అలాగే
ముముషు వ్యవహార ప్రకరణం ర] రూపరహితమైన దైవానికి కారణాంతరంతో కలయిక లేదు. మూర్తిమంతమైన రెండు పదార్జాలే అన్యోన్యం కలుసుకోగలుగుతాయి. అందు చేత దైవం పురుషునికి సహకరించడ మనేది కుదరదు.
'ప్రాణికోట్ల కన్నిటికీ నియోజకమైన దైవం వేరుగా ఉన్నట్టయితే - ముల్టోకాలలోని ప్రాణుల నందరినీ కదలక మెదలక పరుండనీ 1! దైవమే అంతా చేస్తుంది! “దైవం నన్నిలా ప్రేరేసిస్తున్నది. అందువల నేనిలా చేస్తున్నాను అనే మాట ఊరడింపు మా(్రమే. దాన్ని నమ్ముకొన్నవారు నశించిపోతారు. (ప్రాజ్ఞులు పౌరుషంతో ఉత్తమ పదాన్ని అధిష్టిస్తారు. లోకంలో శూరులు, పరాక్రమవంతులు, (ప్రాజ్జులు, పండీతులు అయిన వారు దైవంకొఆకు కాచుకు కూర్చుంటున్నారా ?
రాఘవా ! దైవజ్ఞులు ఎవణ్లీ చిరంజీవి అని న్నిర్ణయిస్తారో వాడు తల నరికివేసిన పిమ్మట గూడా జీవిస్తే దైవ మనేది ఉన్నదనీ, అది చాలా గొప్పదనీ విశ్వసించాలి. దైవజ్ఞులు ఎవల్లో మహాపండితుడవుతాడని నిశ్చయిస్తారో, వాడు అక్షరాభ్యాసం చేయకనే మహావిద్వాంసు డయ్యే పక్షంలో దైవమే అన్నింటికంటే శ్ర మైనదని నిర్ణయించాలి.
రామచం(ద్రా ! ఈ విశ్వామిత్ర మునీంద్రుడు దైవాన్ని దూరంగా నెట్టి పౌరుషంతోనే బ్రాహ్మణ్యాన్ని సాధించాడు. మేము కూడా పురుషకారాన్ని ఆశ్రయించే మునుల మయ్యాము. ఆకసంలో సంచరించే శక్తిని సంపాదించాము.
రాక్షసాధీశ్వరులు పురుష ప్రయత్నంతోనే దేవతలను వెడలగొట్టి ముల్లోకాలలో తమ ఆధిపత్యాన్ని స్టాపించారు. దేవతలు సైతం పురుషకారబలంతోనే శత్రువులను నురుమాడి వారినుండి మళ్ళీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ వెదురు బుట్టలో నీళ్ళు నిలిచాయంచే దానికి కారణం / అలకడం వంటి) పురుష ప్రయత్నమే కొని దైవం కాదు సుమా |
రామా! కుటుంబపోషణ, రాజ్యసంపాదన, శత్రుని గ్రహం భోగవిలాసాల వంటి (శ్రమ సాధ్యమైన పనులన్నీ ప్రయత్నంతో సమకూరుతున్నాయే కాని దైవం వల్ల కాదు. పైగా ఆయా పనులు సాధించే టప్పుడు సహకరించే మణి మంత్రౌషధాదులలో ఉన్న శక్తి గూడా దైవంలో అసలే కనిపించదు.
శుభాశయుడవైన ఓ రామచంద్రా ! కారణకార్యరహీతమూ, కేవల(భ్రాంతి కల్పితమూ, ఉనికి లేనిదీ అయిన దైవాన్ని నీవు అపేక్షీంచవద్దు. ఉత్తమమైన పౌరుషిన్నే నీవు ఆశ్రయించు.
92 యోగవాసిస్టం కర్మవిచారం రాముడు : (బ్రహ్మన్! లోకంలో 'దైవం దైవం" అని (ప్రసిద్ది కెక్కిన దేదో దాని స్వరూపం విశదంగా నిరూపించండి ! వసిష్టుడు : రామచంద్రా! పనులన్నీ నెరవేర్చే కర్త పురుషకారమే గాని మరేమీ కాదు. ఫలం అనుభవించేది కూడా అదే. ఇందులో దైవానికి ఏవిధమైన (ప్రసక్తీ లేదు దైవం చేసేదీ, శెందేదీ ఏమీ లేదు. అసలు దానికి ఉనికే లేదు. దాని నెవరూ ఆదరించరు. అది కల్పన మాత్రమే. పౌరుషబలంతో సిద్రించే శుభాశుభఫలాలనే దైవ మనే శబ్దంతో వ్యవహరిస్తున్నారు. పురుషకారం వల్ల ఒకప్పుడు ఇష్టఫలమూ, మరొకప్పుడు అనిష్టఫలమూ కలుగుతుంటాయి. పురుష్సార్థంవల్ల తప్పని సరిగా కల్లో ఫలానికి 'దైవి మనేది మారు పేరు మాత్రమే. రాఘవా ! దైవం ఆకాశంవంటిది దానివల్ల లోకానికి ఒరగే దేమీ లేదు. కర్మఫలం ప్రాప్తించినప్పుడు 'నాకిలాంటి బుద్ది పుట్టింది, నేనిలా నిశ్చయించుకొన్నాను' అని అనుకోవడం కద్దు. అలా అనుకోవడమే దైవీమునబడుతుంది. . శ్రీరాముడు: సమస్త ధర్మాలు తెలిసిన భగవానుడా | పూర్వ కర్మల సంచితమే దైవమని ముందు సెలవిచ్చారు. మళ్ళీ దైవ మనేది లేనే లేదని అంటున్నారు. ఏమిటిది? వసిష్పుడు : రామచంద్రా! ఈ విషయం ఇంకా విశదంగా వివరించి చెబుతాను. ఇది చక్కగా వింటే 'దైవ మనేది లేదు? అన్న ఫ్టిర నిశ్చయం నీకు కల్గుతుంది. పూర్వ పూర్వ జన్మలలోని మనోవాసనలే కర్మలుగా పరిణమిస్తాయి. వాసనల ననుసరించే బీవుడు కర్మలు చేస్తాడు. మనోభావాలకూ, కర్మలకూ ఎప్పుడూ వైరుధ్య మనేది లేదు. గ్రామానికి పోయేవాడు గ్రామాన్నే చేరుకుంటాడు. పట్టణానికి పయనించేవాడు పట్టుణం (ప్రవేశిస్తాడు. ఎవరెవరికి ఏ యేవాసనలుంటాయో, వారు వారు ఆ విధమైన “ ప్రయత్నమే చేస్తారు. తీవ్రమైన పట్టుదలతో మున్ను చేసిన కర్మనే దైవమంటారు. కర్తలు చేసే కర్మలన్నీ ఇలాగే వుంటాయి. బాగా బలపడిన వాసనే కర్మ. వాసన మనస్సుకంటే వేరుగాదు. దైవమే కర్మ, కర్మే మనస్సు, మనస్సే పురుషుడు. ఇప్పుడు దైవమనేది ఎక్కడ వున్నది ? జీవుడు మనోరూపుడై ఏ యే ప్రయత్నం చేస్తాడో ఆయా ఫలాన్ని స్వయంగానే పొందుతాడు. మనస్సు, చిత్తం, వాసన, కర్మ, దైవ అనేం నిశ్చయింప వీలుగాని మనస్సుకు మారు పేళ్ళు మాత్రమే. ఇలాంటి పురుషుడి దాఢమైన భావనాబలంతో ఎలా ప్రయత్నిస్తాడో, అలాంటి ఫలమే పొందుతాడు
ముముతు వ్యవహార ప్రకరణం 93
రఘుశ్రేషా ! ఈ విధంగా పరిశీలించినప్పుడు పురుషక్షారంతోనే అభిష్టై లన్నీ" నెరవేరుతున్నాయని స్పష్ట మవుతుంది. ఈ పురుషక్రారం నీకు శుభం కలిగించుగాక! "
శ్రీరాముడు : - మునీంద్రా! పూర్వవాసనలు నన్నెలా నియమిస్తున్నాయో, అలా నేను నడుచుకొంటున్నాను. అస్వతంత్రుడ నైన నేను ఏమి చేయగలను ?
వసిష్ముడు : - రామా 1! ప్రయత్నంతో నీవు కొనసాగించే పురుషకారంతోనే నీకు శాశ్వతమైన శ్రేయస్సు కలుగుతుంది. మరొక రీతిగా కల్లదు.
శుభమనీ, అశుభమనీ వాసనాజాలం రెండు విధాలు. ఇవి రెండూ లేదా వీటిలో ఏదో ఒకటి నీకు ఉన్నాయి. శుభవాసనలు నిన్ను ప్రేరేపిస్తే నీవు శాశ్వతమైన శుభస్థ్రానం పాందుతావు. ఒకవేళ తాల్లిటి అశుభవాసనలు నిన్ను కష్టాల పాలు చేయడానికి (ప్రయత్నిస్తే నేటి శుభప్రయత్నంతో వాటిని నిర్మూలించు.
నీవు (ప్రాజ్ఞుడవు, చిన్మాత్ర స్వరూపుడవు. నీవు జడమైన దేహయకాదు సుమా! అందుచేత మరొక రెవరో నిన్ను భాసింపజేస్తున్నా రన్నది కల్ల. నిన్ను భాసింపజేసీవాడు మరొకడు వుంచే, వాళ్లో భాసింపజేసేవాడు ఇంకొకడు, వాళ్లీ భాసింపజేసీవాడు వేరొకడు ఉండాలి. అనవస్టకు దారితీసే ఈ స్థితి వాస్తవానికి విరుద్దం.
వాసనా ప్రవాహం శుభాశుభాలనే రెండు మార్గాలలో ప్రవహిస్తూవుంటుంది. ఫురుషప్రయత్నంతో దాన్ని శుభమార్గంలోకి మళ్ళించాలి. ఓ బలిష్ట ్ర్వా! నీ మనస్సు చెడుదారిలో ప్రవేశిస్తే పురుషకారబలంతో దాన్ని మంచి దారికి త్రిప్పు. చిత్తం శిశువులాంటింది. దాన్ని అశుభం నుండి మళ్ళిస్తే శుభానికి పోతుంది. శుభంనుండి మళ్ళిస్తే అశుభానికి పోతుంది. అందువల్ల పౌరుషబలంతో దాన్ని అశుభమార్గం నుండి తరలించాలి.
చిత్తవునే బాలకుణ్ణో హఠాత్తుగా నిరోధించకూడదు. వెల్ల వెల్లగా పురుషక్రారమనే ఉపాయంతో అతళ్లి స్వస్వరూపస్రితిలో నిలిచేటట్టు చేయాలి. నీవింతకు ముందు శుభవాసనలనో, లేక అశుభ వాసనలనో అభ్యాసంతో గట్టి పరచుకొన్నావు. ఇప్పుడు శుభవాసనలను మాత్రమే గట్టిపరచుకో. అభ్యాసంవల్లనే నీవాసనలు గట్టిపడ్డాయి. అభ్యాసం ఎన్నటికీ వ్యర్ధం కాదు. దాని వల్ల ఇప్పుడు నీ శుభవాసనలు దృఢమయ్యేటట్టు ప్రయత్నించు. వాసనలు పూర్వం అభ్యాసం వల్ల దృఢపడలేదనేది నీ స్వానుభవ మయ్యే పక్షంలో ఇప్పుడు గూడా అవి దృఢపడవు? అందువల్ల చింతించ పని లేదు
రశ యోగవాసిష్టం ఏది ఎట్టున్నా శుభవాసనలను అభ్యసించడం ఎందుకైనా మంచిది. దానివల్ల శీడూ వుండదు. ఎవడు దేని నభ్యసిస్తాడో వాడు ఆ రూపంగానే మారిపోతాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇందులో సందేహం లేదు. రామచంద్రా ! నీవు పౌరుషవంతుడవై శుభవాసనల నాశ్రయించి పంచేంద్రియాలను ని(గ్రహించు. నీక్సు (శ్రేయస్సు కల్గుతుంది. నీకు తత్త్వజ్ఞానం కలేగ[ేటంతవరకూ గురువు, శాస్త్రము, యుక్తి, అనుభవము - వీటిచే నిర్ణయింపబడినట్లు సత్కర్మల నాచరించు. అప్పుడు నీలోని రాగాది దోషాలు నశిస్తాయి. ఆత్మవస్తువు గోచరిస్తుంది. దుఃఖాలు దూర మవుతాయి. ఆపై శుభవాసనలనుగూడ వదలి వేయ వచ్చు. అందువల్ల నీవు ముందు శుభవాసనా సంపన్నుడవై ఆర్యులు అనుసరించే శుభమార్లాన్ని ఆశ్రయించు. శోకరహితమైన పరమార్హ వస్తువును సాక్షాత్కరించుకో 1! ఆ పిమ్మట శుభవాసనలను గూడా పరిత్యజించి స్వస్వరూపంలో హాయిగా వుండిపో ! జ్ఞానావతరణం (బహ్మతత్త్వం సచ్చిదానంద స్వరూపమై అంతటా సమంగా (ప్రకాళిస్తున్నది. దానికి చెందిన సమస్త పదార్దాల వునికినే భవిష్యత్కాల సంబంధంతో “నియతి' అంటున్నాము. కారణంలో నియామకంగానూ, కార్యంలో నియమ్యంగానూ భాసించేది గూడా అదే. రామా 1! అందువల్ల నా మాటు విను. నిత్యబంధువైన చిత్తాన్ని పొరుషంతో ఏకాగ్రం కొవించు. నీకు శ్రేయస్సు కల్గుతుంది. కోరికల పాలైన ఇం(ద్రియాలు ముక్తి (ప్రతిబంధకాలు. వాటిని ప్రయత్నంతో నిగ్రహించి మనస్సుతో సమస్థితిని పొందించు. ఇప్పుడు మోక్షహేతువై పురుష్కార్ధఫలాన్ని (ప్రసాదించే సారభూతమైన సంహితను నీకు వివరిస్తాను. ఇది ఇహపరలోకాలు రెండిటా జ్ఞానసిద్లి కలిగిస్తుంది. రామచంద్ర! మళ్ళీ దానిజోలికి పోకుండా వుండేటట్టు సంసార వాసనను వదలిపెట్టు. ఉదారబుద్దితో సంపూర్ణంగా శవుసంతోషాలను పరిగ్రహించు. వేదంలోని పూర్వాపరవాక్యాల అరం చక్కగా విచారించి విషయాలకు లొంగని చిత్తాన్ని సమరసం చేసి ఆత్మతో అనుసంధించు. సుఖదుఃఖాది ద్వంద్వాలను నశింపజేసి శాశ్వతానందాన్ని (ప్రసాదించే మోత్షోపాయం నేను చెబుతాను. దీన్ని సావధానంగా విను. వివేకులతో గూడి ఈ మోక్షకథను వించే దుఃఖరహితమైన అక్షయపదం చేరుకుంటావు. సమస్త
ముముక్షు వ్యవహార ప్రకరణం 95 దుఃఖాలూ పోగొట్టి మనస్సుకు శాంతి సమకూర్చే ఈ కథను కల్పాదిలో పరమేష్టి అయిన (బ్రహ్మ వచించాడు.
రాముడు : - మునీంద్రా! పూర్వం (బ్రహ్మ ఈ కథను ఎందుకు చెప్పాడు ? ఇది మీకెలా తెలిసింది ? ప్రభూ! ఈ సంగతి వివరించండి 1
వసిష్టుడు : - రాఘవా! సర్వ'ప్రాణులలోనూ ప్రత్యక్చిద్రూపమై అవినాశి అయిన ఆత్మ వ్యాపించివున్నది. చిదాకాశరూపమైన ఆ ఆత్మతత్త్వం అనంత విలాసాలకు నిలయమై సర్వానికి ఆధారంగా వున్నది.
రసప్రవాహ రూపమైన సము(ద్రంనుండి తరంగం జనించినట్టు నిర్వికారమైన ఆత్మతత్తంనుండి విష్టువుద్ధవించాడు. మేరు పర్వతం కర్లికగా, దిక్కులు రేకులుగా, నక్షత్రాలు కేసరాలుగా వున్న ఆవెన్నుని హృదయ పద్మంనుండి బ్రహ్మ ఉదయించాడు.
ఆ (బ్రహ్మదేవుడు వేదాలు, వేదార్దాలు చక్కగా తెలిసినవాడు. దేవతలు, మునులు ఆయనను సదా ఉపాసిస్తూ వుంటారు, మనస్సు అనంత వికల్పాలను సృష్టించినట్టు పద్మసంభవుడు సకల ప్రాణులనూ సృష్టించాడు.
అతడు జంబూద్వీపములో ఒక వమూలనున్న ఈ భారత వర్షంలో ఆధివ్యాధులతో గూడిన జనా నీకాన్ని సృజించాడు. లాభనష్ట్రది ద్వంద్వాలకు లోబడి ఏడుస్తూ పుట్టకలకు లోనవుతూ, నానా వ్యసనాలకు గురిఅవుతున్న (ప్రజల కష్టదళచూచి పుత్ర,దుఃఖం చూచిన తండ్రిలాగా సకలలోక(స్రష్ట అయిన విధాత దయగాన్నాడు.
““హతాళులైన ఈ అల్పాయుష్కుల దుఃఖం అంతమయ్యే ఉపాయ మేమిటి?” అని ఆయన క్షణకాలం ఏకాగ్రతతో ధ్యానించాడు. ప్రజాజేమం కోరి అలా ధ్యానించి ఆపరమేష్టి తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్చాలు అనే శుద్ది సాధనాలను సృష్టించాడు.
తర్వాత ఆయన మళ్ళీ ఇలా అనుకొన్నాడు. "“ వీటివల్ల ప్రజల దుఃఖం సమగ్రంగా నశించదు. జననమరణరహితమైన నిర్వాణ సుఖం జ్ఞానం వల్లనే లభిస్తుంది. సంసారతరణోపాయం జ్ఞాన మొక్కటే కాని తపోదానాదులు కావు. జనులను దుఃఖవిముక్తులను చేసే దృఢమైన సంతరణోపాయాన్ని త్వరలో ప్రకటిస్తాను.”
ఈ రీతిగా ఆలోచించి కమలాసనుడు నన్ను సృష్టించాడు. హఠాత్తుగా ఉద్భవించిన నేను వెంటనే అల అలను చేరుకొన్నట్టు నా తం డ్రిచెంతకు చేరుక్"న్నాను.
96 యోగవాసిష్టం జపమాలా కమండలాలతో శోభిల్లే బ్రహ్మకు జపమా లాకమండలు ధారినైన నేను విన్యముడనై అభివాదం చేశాను. శుక్త మేఘం చం ద్రుణ్లో చేరదీసినట్టు '“ఇలా రా నాయనా*' అంటూ ఆయన నన్ను చేరదీసి తన కమలాసనం ఉత్తరదళం మీది కూర్పోబెట్టాడు.
కృష్ణాజినం ధరించిన మా తండ్రి కృష్ణాజిన ధారినైన నాతో హంస సారసంతో అన్నట్టు ఇలా అన్నాడు. ““పుత్రా! కోతి లాగా చంచలమైన నీ మనస్సులో చం(ద్రునిలో మచ్చలాగా కొంతసేపు అజ్జానం (ప్రవేశించుగొక 1"
ఈ రీతిగా సంకల్పించి ఆయన శపించగానే నేను నా నిర్మలస్వరూపం మరచిపోయి దీనుడ నయ్యాను. నా బుద్ది మందగించింది. సర్వస్వం పోగొట్టుకొని దరిద్రుడైనవానిలా దుఃఖతప్తుడ నయ్యాను. '“జొరా 1 ఈ సంసార మనే దోషం నాకు ఎలా వచ్చింది ?!' అని చింతిస్తూ మౌనంగా ఉండిపోయాను. అంతట జనకుడు నాతో నాయనా 1 ''ఎందుకు దుఃఖిస్తున్నావు ? దుఃఖనివారణోపాయం నన్నడుగు, నీకు సుఖం కల్గుతుంది" అని అన్నాడు.
స్వర్గకవుల దళంపై కూర్చున్న నేను జగత్కర్తను చూచి *' ప్రభూ ! మహాదుఃఖమయమైన ఈ సంసౌరం ఎలా వచ్చింది ? ఇది ఎలా తొలగుతుంది ?”!
“అని భవరోగం శమింపజేసే బొషధాన్ని గూర్చి అడిగాను.
అప్పుడాయన విస్తృతమైన తత్త్వజ్ఞానం నాకు ఉపదేశించాడు. అది గ్రహించిన నేను ఆ తత్త్యబోధలాగానే నిర్మల స్వరూపుడ నయ్యాను. స్వరూపస్రితిలో వున్న నన్ను చూచి చతుర్ముఖుడు ఇలా అన్నాడు.
““కృమారా! అధికారులైన జను లందరికీ ఈ జ్ఞానసారం వినియోగపడాలి. ఈ ఉద్దేశంతోనే నేను నిన్ను అజ్జుడవయ్యేటట్టు శపీంచాను. నన్ను ప్రశ్నించేటట్టు చేశాను. ఇప్పుడు నీకు శాపం తొలగిపోయింది. తత్త్వస్సురణ కలిగింది. శుద్ది పొందిన బంగారంలో మురికి తొలగినట్టు నీలోని అజ్ఞానం తొలగింది. నీవు నావలె ఏకాత్ముడ వయ్యావు. సాధూ 1 ఇప్పుడు నీవు లోకానుగ్రహం కొజకై భూవలయం లోని జంబూద్వీపంలో వున్న భారత వర్షానికి వెళ్ళు. అక్కడ కర్మ పరులైన వారికి కర్మకాండ (కమం బోధించు. విరక్తులు, విచార పరులు, మహా ప్రాజ్ఞులైనవారికి ఆనంద ప్రదమైన తత్త్వజ్ఞ్డానాన్ని ఉపదేశించు.
రామా! కమల సంభవుడి ఆనతిమేరకు నేను భారతవర్షం చేరాను. జిజ్ఞాసగల
ముము వ్యవహార ప్రకరణం 97 జను లున్నంతవరకు ఇక్కడే వుంటాను. నాకిక్కడ మరొక కర్తవ్య మేదీ లేదు "అవున స్కుడనై ఇక్కడ ఉండాలని ఉంటున్నాను. (ప్రశాంత వలా, అభిమానరహితమూ అయిన చిత్తంతో యథా ప్రాప్తమైన కార్యాలు చేస్తూ వుంటాను. అహంకారంలేని వాళ్లో కాబట్టి నేను ఏమి చేసినా ఏమీ చెయ్యనివాడనే | వక్సృషృచ్ళక లక్షణం రామచం(ద్రా ! భూలోకంలో జ్ఞానావతరణం, నా పుట్టుక, బ్రహ్మదేవుని (ప్రయత్నం మొదలైన విషయాలు నీకు వివరించాను. అనఘా | గొప్ప పుణ్యపరిపాకం వల్ల పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని గ్రహించడానికి ఇప్పుడు నీ మనస్సు ఎంతో ఉత్సుకమై వున్నది. శ్రీరాముడు : - (బ్రహ్మన్ ! లోకాలను సృష్టించిన తర్వాత జ్ఞునాన్ని అవతరింపబేయా లనే బుద్ది బ్రహ్మదేవునికి ఎలా కలిగింది ? వసిష్టుడు : - సాగరంలో తరంగం లాగా పరబ్రహ్మంలో (బ్రహ్మ స్వభావంతోనే క్రియాశక్తి సంపన్నుడై ఉద్భవించాడు. జన్మ జరామరణాదులతో దుఃఖమయమైన సృష్టిని పరిశీలించాడు. భూత భవిష్యద్వర్తమాన పరిస్థితులను పర్యాలోచించాడు. సదాచరణ యోగ్యమైన కృతాదియుగాలు గడచిసోగానే జనులు మోహపరవశులు కానున్నారని గ్రహించాడు. ఇదంతా గమనించి లోకులపై దయగాన్నాడు. ఆపై నన్ను సృష్టించాడు. నాకు జ్ఞానోపదేశం చేశాడు. లోకంలో అజ్ఞానాన్ని శమింపజేయడానికి నన్ను భూలోకానికి పంపాడు. అలాగే సనత్కుమారుడు, నారదుడు మొదలైన ఇతర మహర్షులనుగూడ కర్మజ్ఞానోపదేశాలతో మోహ గ్రస్తులైన జీవుల నుద్రరించడానికి పంపాడు. కృతయుగం గడవగానే ధార్మిక కర్మక్రమం క్షీణించిపోయింది. అప్పుడు ఆయా మహర్షులు ధర్మాన్ని ఉద్దరించడానికీ, శాస్త్రమర్యాదను కాపాడడానికీ పూనుకొన్నారు. దేశాన్ని వేరు వేరు మండలాలుగా విభజించి భూపాలకులను ఏర్పాటు చేశారు. ఆ మీదట త్రివిధ పురుష్తార్జాలను సాధించడానికై తగిన స్మృతులను, శా(స్తాలను రచించారు. కాలచ(క్రం గిర్రున తిరిగింది. ధర్మచక్రం నశించింది. జనులు భోగపరు లయ్యారు. రాజులు రాజ్యకాంకతో పరస్పరం కలహించుక్"న్నారు. (ప్రజలు పలు నేరాలు చేసి దండనార్ద్హు లయ్యారు. యుద్దాలు లేకుండా రాజ్యాలు పాలించే శక్తి జ!
98 యోగవాసిష్టం రాజులకు నశించింది. ప్రజలతో పాటు పరిపాలకులు గూడా దీనులయ్యారు. _
రాజులలో నెలకొన్న దైన్యం తొలగించడానిక్తీ, వాళ్ళకు సమ్యగ్షృష్టి కల్లించడానికో మాబోంట్లు ఆత్మతత్త్య ప్రచారం చేశారు. మొదట ఈ అధ్యాత్మవిద్య రాజులకే బోధింపబడింది. తర్వాత లోకంలో పస్తరించింది. అందుకే దానిని రాజవిద్య అంటారు.
రాఘవా! అత్యుత్తమమైన రా జవిద్యారహస్యాన్ని (గ్రహించి రాజులు దుఃఖరహితు లయ్యారు. నిర్మల కీర్తులైన అనేక నరపతులు గతించారు. ఇప్పుడు వారి వంశంలో దశరథుని కుమారుడవై నీవు జన్మించావు.
శత్రునాశకా ! మిక్కిలి ప్రసన్నమైన నీ మనస్సులో అకారణంగానే పవిత్రమైన వైరాగ్యం కలిగింది. ఎంత వివేక్సికైనా, ఎంత సజ్జనుడికైనా ఏదో ఒక కారణంతో కలే వైరాగ్యాన్ని రాజస వైరాగ్య మంటారు. వివేక (ప్రభావంవల్ల నీకు నిష్కారణంగానే వైరాగ్యం ఏర్పడింది. ఇది అపూర్వం. సజ్జనులు దీనికి ఆళ్ళర్యపడ్డారు. దీనికి సాత్త్విక వైరాగ్యమని పేరు. బీభత్స విషయాన్ని చూచినప్పుడు ఎవడు విరక్తుడు కాడు ? కాని వివేకంవల్ల సహజంగా సజ్జనులకు కలిగేదే ఉత్తమ వైరాగ్యం. ఎవరు నిర్నిమిత్తంగా విరక్తు లవుతారో, వాళ్ళే మహా ప్రాజ్ఞులు. వాళ్ళ మనస్సు నిర్మలమైనది. మేలైన మాలవన్ల మనుజుడు ప్రకాశిస్తాడు. వివేకంతో సంసారగతిని విచారించి విరక్తులయ్యేవారే పురుషోత్తములు.
మౌటిమాటికీ విచారించి ఇంద్రజాలంవంటి ఈ దృశ్య (ప్రపంచాన్ని బాహ్యంగానే కాక ఆంతరంగికంగా కూడా పరిత్యబించాలి.
శ్మశానం చూచినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దైన్యం తటపఫ్రించినప్పుడు విర్తీ పాందనివాడెవడు ? కాని స్వభావసిద్దంగా కలిగేదే నిజమైన వైరాగ్యం. నీ వైరాగ్యం కృదత్రిమం కాదు. అందువల్ల మహత్త్వం పాందావు. మెత్తటి నేల విత్తడానికి అనుకూల మైనట్టు ఆత్మజ్ఞానోపదేశానికి నీవు యోగ్యుడ వయ్యావు. పరవేశ్వరుని అనుగ్రహంవల్ల నీలాంటివాని బుద్ది వివేకవంత మవుతున్నది. యజ్ఞ దానాది 'క్రీయలవల్ల, మహాతపస్సువల్ల పాపం క్షయిస్తుంది. వివేకం ఉదయిస్తుంది. అప్పుడు కాకతాళీయంగా మానవుని బుద్రి పరమార్ధ విచారణలో ప్రవర్తిస్తుంది.
పరమపద దర్శనం కలిగేటంతవరకూ (్రియాపరులైన జనులు చ|క్రంలాగా తిరుగుతూ ఈ లోకంలో పరిభ్రమిస్తూనే వుంటారు. సంసారం నిస్పారమని గ్రహించి
ముముక్షు వ్యవహార ప్రకరణం రం అందుండి బుద్ది నరల్సినవారు కట్టుక్"య్యనుండి నిడివడ్డ ఏనుగుల లాగా స్వతం'త్రులై పరమపదం చేరుకొంటారు.
రావూ 1 విషవుమైన యీ సంసారగతికి అంతవుంటూ లేనే లేదు. దేహబంధంలో తగులుకొన్న జంతు'ప్రాయుడైన మానవుడు జ్ఞానం లేకపోతే దేని తత్త్వం తెలుసుకోలేడు. రఘుకుల తిలకా | దాటవీలుగాని యీ సంసార సాగరాన్ని బుద్లిమంతులు జ్ఞానమనే తెప్పతోనే క్షణంలో దాటుకొన్నారు. సంసారాంబుధిని దాటించే ఈ జ్ఞానయోగాన్ని సావధానుడవై విను.
లౌకిక దుఃఖాలకు అంతమంటూ లేదు. జ్ఞానం లేకపోతే ఇవి లోలోపలే మానవుణ్ణి కాల్చి వేస్తాయి. జ్ఞూననిష్ట లేకపోతే సజ్జనులు శీతోస్లాది ద్వంద్వదుఃఖాలను ఎలా సహించుకోగల్లుతున్నారు ? ఈ దుఃఖచింతలు మూఢునికి అడుగడుగునా ఎదురవుతాయి. అగ్ని గడ్డీని దహించినట్లు అనుక్షణం దహించివేస్తాయి. తత్త్యం తెలిసినవాడు, సమ్యగ్షృష్టి కలవాడు అయిన ప్రాజ్ఞుళ్లి మనోవ్యాధులు తపీంప జేయలేవు. వానకు తడిసిన అడవిని అగ్నిజ్వాలలు కాల్చలేవు గదా 1
సంసారవునే వురుభూమిలో ఆధివ్యాధులనే సుడిగాలులు వీస్తున్నా తత్త్వజ్ఞుడైనవాడు కల్పవృత్షం లాగా చలించకుండా వుండగలడు. అందువల్ల తత్తజిజ్ఞాస కలవాడు 'ప్రామాణికుడు, (ప్రబుద్దాత్ముడు అయిన వ్యక్తిని సవినయంగా సమీపించి (ప్రేమపూర్వకముగా ప్రశ్నించాలి. అతడిచ్చే సమాధానాన్ని చక్కగా గ్రహించాలి. తత్త$ం తెలియనివాళ్లి ప్రశ్నించే వానికంచే మూర్చుడు మరొకడుండడు. అలాగే ప్రామాణికుడైన తత్త్వజ్ఞుడు కావించే ఉపదేశాన్ని ఆచరించనివానికంటే అధముడు మరొకడుండడు.
వక్త అజ్ఞుడా ? విజ్ఞుడా ? అని ముందే వ్యవహారజ్ఞానంతో నిర్ణయించుకొని (ప్రళ్నించేవాడే బుద్దిమంతుడు. అలా న్మిర్ణయం లేకుండా ప్రశ్నించేవాడు అధముడు. వానికి ప్రయోజనం శూన్యం. ప్రాజ్ఞుడైన వక్త పూర్వాపరాలు విచారించి అర్ధనిరయం చేయగల సజ్జనుడు అడిగితే సమాధానం చెప్పాలి గాని పశుస్వభావుడైన అధమునికి చెప్పరాదు. అడిగేవాని యోగ్యతాయోగ్యతలు విచారించకుండా ఉపదేశించేవాడు మూఢు డని పెద్దల మాట. రఘునందనా 1 పచ్చకుడవైన నీవు గుణజ్ఞుడవు. నీ 'ప్రళ్నీకు ఏమి జవాబు చెప్పాలో నాకు తెలుసు. మనయిద్దరి కలయిక చక్కగా కుదిరింది.
“100 యోగవాస్మిం శబ్దార్ధ విజ్ఞాడవైన శ్రీరామా ! నేను చెప్పే విషయం సావధానంగా విని ఇది “తత్త్వమని నిర్ణయించుకొని నీ హృదయంలో నిలుపుకో ! నీవు విరక్తుడవు. వస్తు
స్వరూపం నీకు అవగతమై వున్నది. అన్ని విధాలా యోగ్యుడవు. కొత్త వస్త్రానికి రంగు పట్టినట్టు ఉపదేశం నీ హృదయంలో నాటుకొంటుంది. చెప్పినది విని పరమార్దాన్ని విచారించే నీప్రజ్ఞ సూర్యకాంతి నీటిలో ప్రవేశించినట్లు తత్త్వంలో (ప్రవేశించగలదు. నా ఉపదేశం (శ్రద్దగా విని ప్రయత్నంతో హృదయంలో నిల్పుకో. అలా చేయనప్పుడు నన్ను నీవు అడుగవలసిన పనే లేదు.
రామా | మనస్సు చాలా చంచలం. అది సంసారమనే అడవిలో తిరగే కోతి, దానిని దృఢంగా నిగ్రహించి పరమార్జాన్ని జగరూకతతో వినాలి. అవివేకులు, అజ్ఞానులు, దుర్దనులతోడి పొత్తు దూరంగా వర్రించాలి. సాధువులను పూజించాలి, నిరంతర సత్సాంగత్యంవల్ల వివేకం కలుగుతుంది. భోగమోక్షాలు రెండూ వివేక వృక్షం కాచిన పండ్లే.
శమం, విచారం, సంతోషం, సాధు సంగమం అనే ఈ నాలుగు మోక్ష ద్వారంలో వుండే నలుగురు ద్వారపాలకులు. ఈ నాల్లింటిని లేదా వీటిలో మూడింటిని, లేదా రెండింటినైనా తప్పక సేవించాలి. ఇవి మోక్షసౌధద్వారం తెరుస్తాయి. వీటిలో కనీసం ఒక్క గుణాన్ని ప్రాణాలకు తెగించైనా వశం చేసుకోవాలి. ఒకటి వశమైతే తక్కినవన్నీ వళమవుతాయి.
శాస్త్రం, జ్ఞానం, తపస్సు, శ్రుతి - వీటికి వివేకవంతుడే పాత్రుడవుతాడు. తేజోవంతులలో సూర్యునిలాగా ప్రజలలో అలాంటి వాడే ఆదరింపబడతాడు. చలికి నీరు గడ్డ కట్టినట్లే బుద్రిహీనుల మూర్జత్వం అభేద్యమై మొద్దుబారిపోతుంది.
రాఘవా! సూర్యోదయకాలంలో కమలంలాగా సౌజన్యంవల్ల, సద్గుణాలవల్ల శాస్త్రదృష్టివల్ల నీ హృదయం వికసించింది. సన్మతీ 1 చెవులు నిక్కపాడుచుకొని మృగం వీణానాదం విన్నట్టు నీవు నా ఉపదేశం విని గ్రహించగలవు. అభ్యాస వైరాగ్యాలతో తరుగులేని సౌజన్య సంపదను ఆర్షించుకో ! శాస్రాలతోనూ, సజ్జనులతోనూ సంసర్గంకల్లి తపస్సు చేసి ఇంద్రియాలను ని గ్రహించుక్*నిస్తంసారముక్తి కొరకై పాటు పడాలి. ఇందుకు మొదట ్రజ్ఞాశక్తిని వృద్ది చేసుకోవాలి. సంస్కార సంపన్నమైన బుద్దీతో ఈ శా స్రాన్ని అభ్యసించాలి మూర్థత్వాని కిదే పరమౌషధం. ఈ సంసార ఏషవుక్షం ఆపదలకు నిలయం. ఇది అజ్ఞుణ్లో మోహింపబేస్తుంది. ఆందువభ్ర
ముముము వ్యవహార ప్రకరణం 101 (ప్రయత్నంతో మూర్ణత్వాన్ని నశింపజేసుకోవాలి. దురాశతో సర్పంలాగా కుటిలంగా చరించే మూర్జత్వం బలపడితే నిప్పులో వేసిన చర్మంలాగా హృదయం సంకుచిత మవుతుంది. మబ్బు తెర లేని నిండు చంద్రునిపట్లు దృష్టి ప్రసన్నమైనట్టు (ప్రాజ్ఞునియందు మాత్రమే సూత్మబుద్ది (బ్రవ్మాభిన్నమై భాసిస్తుంది. పూర్వాపర విచారశీలమైన చాతుర్యంతో ఎవని బుద్ది వికసిస్తుందో వాడే పురుషు డనబడతాడు. రామచంద్రా ! వీకటిని పోకార్భేవాడు, చల్లనివాడు, నిర్మలుడు అయిన చంద్రునితో ఆకసం శోభిల్లినట్టు తమోరహితమూ, పరిశుద్దవూ, విచారశీలమూ, గుణవంతమూ అయిన హృదయంతో నీవు శోభిల్హుతున్నావు. . తత్త్వమాహాత్మ్య వర్గనం రాఘవా! నీవు నిండుమనస్సు కలవాడవు. మాన్యుడవు. ఎలా 'ప్రశ్నించాలో నీకు తెలుసు. చెప్పింది గ్రహించగలవు. అందువల్లనే ఆదరంతో చెప్పడానికి ఉద్యుక్తుడ నవుతున్నాను. రజస్తమోగుణాలకు దూరమై శుద్రసత్త్వాన్ని అనుసరించే బుద్దిని ఆత్మలో నిలిపి తత్త్వం వినడానికి సిద్రపడు. సాగరంలో రత్నసంపద సంపూర్ణంగా వున్నట్టు పృచ్చకుడికి కావలసిన గుణా లన్నీ నీలో వున్నాయి. వక్తకు కావలసిన గుణా లన్నీ నాలో వున్నాయి. వత్సా! వివేకంవల్దా, అనాసక్తివల్లా నీలో వైరాగ్యం కలిగింది. చం(ద్రకిరణస్పర్శతో చం(ద్రకాంతమణి ఆ(ర్ర్రమైనట్టు విరక్తితో నీహృదయం ఆర్ర్రమయింది. పద్మం పరిమళాది గుణాలతో భరితమైనట్టు బాల్యంనుండి నీవు విమలగుణాలతో విరాజిల్టుతున్నావు. అందువల్ల నేను చెప్పే కథ విను. ఇది వినడానికి నీవే అర్హుడవు. చంద్రుడు లేకపోతే కలువతీగ వికసించదు గదా 1 ఆడంబరాలు, హడావిడులు, దృష్టిభేదాలు పరవుపదదర్శనం కాగొనే సంపూర్లంగా శమిస్తాయి. భవ్యమనస్కునికీ జ్ఞానంవల్ల విశ్రాంతి అభిస్తుంది. లభించకపోతే వివేకియైనవాడు ఈ సంసారంలో చింతామౌఢ్యాన్ని ఎంతకాలం సహించగలడు ? ప్రళభయాంతంలో సూర్యమండల సంపర్కంతో కులగిరులు అణగారిపోతాయి. అలాగే పరతత్త్వం ప్రాప్తించగానే మనోవృత్తులన్నీ నశిస్తాయి.
1౮౬ యోవాసిం
రామచంద్రా ! దుస్సహమైన సంసారవిషావేశ మునే ఈ వషూ చెవ్యాధి (బ్రహ్మైక్యబోధ మనే పావనమైన గారుడమం(త్రంతోనే ఉపశమిస్తుంది. సజ్జనులతో చేరి శాస్త్రచర్భ్చచేయడంవల్ల పరమాత్మజ్ఞానం తప్పక లభిస్తుంది. తత్త్వ పిచారం వల్లనే సకలదుఃఖాలు నశిస్తాయి. అందుచేత విచారపరులను వెక్కి రించకూడదు. విచారశీలుడూ, సమ్యగ్బ్చర్థునం కలవాడూ అయిన పురుషుడు పాము కుబుసం వదలినట్టు ఆధిపంజరాన్ని వదలివేస్తాడు. ఆందోళన లేకుండా చల్లని అంతఃకరణంతో సమస్త జగత్తునూ ఇంద్రజాలంలా చూస్తాడు. సమ్యగ్షర్శనం లేని వానికి జీవిత మంతా దుఃఖిమయమే.
సంసారాసక్తి చాలా విషమమైనది. అనర్జాన్ని శంకించకుండా విషయాలలో దగుల్కొన్న వారిని అది పాము లాగా కాటువేస్తుంది. కత్తి లాగా ఖండిస్తుంది. బల్లెం లాగా బాధిస్తుంది. పాశం లాగా బంధిస్తుంది. అగ్గి లాగా బుగ్గి చేస్తుంది. రాత్రి లాగా గ్రుడ్దివారిని చేస్తుంది. నెత్తిపైబడ్డ బండ లాగా మూర్చితులను కావిస్తుంది. వివేకదృష్టిని హరిస్తుంది. మర్యాదను మంటగలుపుతుంది. మోహ మనే అంధకూపంలో కూల్చివేస్తుంది. తృష్ట జీవులను గుల్ల చేస్తుంది. సంసారి పొందని దుఃఖమంటూ మరేదీ లేదు. దురంతమైన ఈ విషయ విషూచికకు సకాలంలో తగిన చికిత్స చేయాలి. లేకపోతే అది అంతులేని నరకయాతన కల్గిస్తుంది.
ఆ నరకంలో రాళ్లతిండి, కత్తికోత, కొండనుండి దొర్లడం, రాళ్లదెబ్బలు, నిప్పులో కాలడం, మంచులో తడవడం, అవయవ ఖండనం, గంధపుచెక్కలా అరుగుడు బడడం, అసిపత్ర తరువుల మధ్య పరుగులు తీయడం, కొయ్యల మధ్య బిగింపు, కాలిన సంకెళ్లతో బంధించజడిడం, ఒళ్లంతా ముళ్లగీతలు, అగ్నితప్త బాణపాతం, మండుటెండలో మాడడం, నీటిధారలక్రింద నిలవడం, శిరళ్చేదం, నిద్రలేమి, శ్వాస ఆడకుండా మూతీ ముక్కూ బిగింపు, అవయవాల ఎగుడు దిగుడుతనం, శరీరం వాచిపోవడం - ఇలాంటి అనేక బాధలను అనుభవించవలసి వుంటుంది.
రాఘవా! ఇట్టి కష్టాలతో గూడిన ఈ సంసారయం(త్రం మహాదారుణ మయింది దీనిని చులకనగా చూడరాదు. శాస్త్ర, విచారం ద్వారా ఎలా శ్రేయస్సు కల్గుతుందో అలా ఆలోచించి తత్త్వం తెలుసుకోవాలి.
రఘుకులచంద్రా ! ఇంతేకాదు. ఈ మహామునులు, మహర్షులు, ఎల్లలు
ముముతు వ్యవహార ప్రకరణం 103 రాజులు ప్టానకవచంతో శరీరాలను కప్పుకొని వున్నారు. దుఃఖం వాళ్లను అంటదు. శ్లేళకరమైన సంసార పీడను అనుభివిస్తున్నా వాళ్లు నిరంతరం సంతోషంతోనే వున్నారు. ఎందుకంటే హరిహర (బ్రహ్మాదులెలా కౌతుకవలా, విత్షేపవలూ లేక విరాజిల్దుతుంటారో, అలాగే ఆత్మదీపం చేపట్టిన మూవవోత్తములు గూడా విశుద్దబుద్రితో వెలుగొందుతూ వుంటారు. ఆర్యులతో జేరి వస్తుతత్త్వం విచారించినవారికి దేహాభివవానం తాలగిపోతుంది. శ్రవణం వల్ల గోచరించిన తత్త్వం మననంవల్ల దృఢపడుతుంది. నిదిధ్యాసనంవల్ల విపరీతభా వనారహితమైన బుద్దికి బ్రహ్మభావం సాక్షాత్కరిస్తుంది. మోహం నిరస్త మవుతుంది. భ్రాంతి జ్ఞానమనే మబ్బు వీడిపోతుంది. అప్పుడు ఈ జగత్ర్రవృత్తి ఒక ఆటగా మాత్రమే అగుసిస్తుంది. రఘుఫుంగవా ! ఇంకా విను. ఆత్మ ప్రసన్నం కాగానే శాంతి లభిస్తుంది. బుద్రివృత్తు లన్నీ శమిస్తాయి. (బ్రహ్మరసాన్ని ఆస్వాదించిన అంతఃకరణ వ్యాపారం సమభావం పొందుతుంది. ఆస్తితిలో ఈ జగద్వ్యవహార మంతా ఒక క్రీడగా మాత్రమే గోచరిస్తుంది. అంతేకాదు, *' జడమైన ఈ శరీరమే ఒక రథం, ఇం(ద్రియాలేగుర్రాలు, మనస్సే పగ్గం. ఇందులో రథికుడైన ఆత్మ అనే నేను జగత్తులో హాయిగా విహరిస్తున్నాను''. అని భావించ గల్లితే లోకవ్యవహారమంతా ఒక క్రీడ మాగ్రమే. శమనిరూపణుం రామచంద్రా! బుద్రిమంతులు ఆత్మను సాక్షాత్కరించుక్ని మహాభ్యుదయం పాందినవారిలా ఉన్నతులై చరిస్తారు. వారు దేనికీ శోకింపరు, దేనినీ కోరరు, శుభాశుభాల నర్దించరు. అన్నీ చేసున్నా ఏదీ చేయనివారిలా ఉంటారు. వారు పవిత్ర వర్తనులై శా స్రోక్త కర్మలే చేస్తారు. ఆత్మ నిష్టులైన వీరికి “ఇది హేయం ఇది ఉపాదేయం'' అనే భేదదృష్టి వుండదు. వారు రాకపోకలు చేస్తున్నా చేయనివారే. కర్మపరులైనా కర్మ రహితులే. మాట్లాడుతున్నా మౌనులే. పరమపదం అధిష్టించిన పీదప అలాంటివారు చేసే ప్రయత్నాలు, ఊహించే ఊహలు ఉనికి లేనివైపోతాయి. కోరికలన్నీ వదలి శాంతవృత్తితో కూడిన చిత్తం చం(ద్రబింబంలో వున్న దానిలా సర్వత్రా సుఖాన్నే చూరగాంటుంది. ప్యూర్ణచం ద్రునిలో అమృతం మితి మించినట్టు ఎషయచింతన కౌతుకాదులు లేక వికేసరహితమైన చిత్తంలో సుఖం మేర మీరుతుంది
104 యోగూష్టం ఆ చిత్తం ఇంద్రజాలాలు చేయదు. వాసనల ననుసరించదు. బాల్యచాపల్యం వదలి అనాదిసిద్దమైన పరమాత్మ సుఖంలోనే రమిస్తుంది. ఇట్ట స్టీితి ఆత్మతత్తా వలో కనంవల్ల కల్గుతుందే కాని మరొక విధంగా కలుగదు అందువల్ల జీవించినంత కాలం విచారశీలుడై 'శవణాదులతో ఆత్మనే అన్వేషించాలి, ఉపాసీంచాలి, తెలిసికోవాలి. ఇతర విషయాలు పట్టించుకోకూడదు. ఎవడు ఎడతెగని శ్రవణ మననాదుల అభ్యాసంతో స్వానుభవాన్ని, శాస్త్రవాక్యాన్ని, గురూపదేశాన్ని ఏకరూపంగా నిశ్చయించుకోగలడో వాడు మాత్రమే ఆత్మను అవలోకించగలడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా శా స్రార్జాన్ని హేళన చేస్తూ పెద్దలను అవమానించే మూఢుల స్లాయికి దిగజారకూడదు. మానవులను తమ మూర్ధత్వం బాధించినంతగా ఆధులు, వ్యాధులు, విషం మొదలైనవి బాధించవు. కొంత సంస్కారం కలవారికి ఈ శాస్త్రం లాగా మూర్చత్వాన్ని తొలగించేశాస్త్రం మరొకటి లేదు. పరమాత్మతత్త$0 తెలుసుకోగోరేవాడు విననింపై పలుదృష్టింతాలతో మనోజ్జమై సుఖావహమైన ఈ శాస్త్రాన్ని సమగ్రంగా వినాలి. దుస్తరమైన ఆపదలు, నీచమైన జన్మలు కవిరిచెట్టునుండి ముళ్ళు పుట్టినట్లు మూర్చత్వంనుండే పుట్టుకొస్తున్నాయి. రామచంద్రా ! మూర్చుడై బ్రతకడంకంటె మూకుడు చేపట్టి చండాలవీథిలో బిచ్చమెత్తుకోవడం మేలు. అతిదుఃఖకరమైన ఈ మూర్ధతకంటే చీకటి నూతులలోనో, చెట్టు తాగర్రలలోనో ఒంటరిగా గ్రుడ్డి పుర్లూ బ్రతకడం మేలు. వెళాక్ష సాధనవ్వైన ఈ శాస్తజ్టానవునే వెలుగు చరాచినవాడు వోహతవుస్సులోపడి వుళ్ళీ (గ్రుడ్డితనానికి గురికాడు. వివేక సూర్యుని విమలకాంతులు ప్రసరించనంతవరకే తృష్ట మానవు డనే పద్మాన్ని వికాసహీనం చేయగల్లుతుంది. రాఘవా 1! సంసారదుఃఖంనుండి విడుదలకై మావంటి హీతులతో గూడీ గురుశాస్త్ర ప్రమాణాలతో ఆత్మస్వరూపం తెలుసుకో ! ఆత్మజ్జుడవైన పిదప హరిహరాదులు, ఇతర (బ్రహ్మర్షులు జీవన్ముక్తులై చరించినట్టు నీవు గూడా విహరించు. ఈ సంసారంలో దుఃఖాలకు అవధి లేదు. సుఖం తుణమాత్రమే. అందువల్ల దుఖానుబంధాలైన సుఖాలపై దృష్టి వుంచకు. విజ్ఞుడైనవాడు పరమ ఫులుషారసిద్దిని గరి అనంతమూ, ఆయాసరహితమూ అయిన ఆ మహోన్నతపదవిని ప్రయత్నంతో
ముముక్షు వ్యవహార ప్రకరణం 105 సాధించాలి. ఎవరి చిత్తం చింతాహీనమై మోక్షపదాన్ని ఆలంబనం చేసికొంటుందో, అట్టి పురుష శ్రేష్టులే పురుషార్టసిద్రి పొందగలరు.
ఎవరు దుష్షచిత్తులై రాజ్యూది సుఖాలలో పడి భోగభోజనాదులతో మాత్రమే సంతుష్టు లవుతారో, వారు గ్రుడ్డి కప్పలతో సమౌానులని గ్రహించుకో. మోసగాళ్ళు, పాపకర్ములు, మిత్రరూపంలో వున్న శత్రువులు. భోగ్రైకపరులు అయిన వారిపట్ల అనురక్తులైన మందబుద్దులు మితి లేని దుఃఖాలను, భయాలను, నరకాలను పాందుతారు.
రామా 1 ఒకదానివెంట ఒకటి వచ్చే ఈ సుఖదుఃఖావఫ్టలు మెరపు తీగలవలె క్షణభంగురాలు. వీటికి లోనయినవాడు ఎప్పుడూ (శ్రేయస్సును పాందజాలడు. నీవలె విరక్తులు, వివేకులు అయిన మహాత్ములు మాత్రమే భోగమోక్షాల కర్షులై వందనీయు లవుతారు. వివేకవంతుడై వైరాగ్యాభ్యాసాలతో భీకరమైన ఈ సంసార నది అనే ఆపదను దాటుకోవాలి. వివేక విజ్ఞానాలు కలవాడు మోహకారణాలైన ఈ సంసార మాయల్లో పడీ ని(ద్రించరాదు. సంసారంలో పడి జాగరూకత లేనివాడు తగలబడే యింటిలో ఎత్తయిన గడ్డి పాన్పుపై పరుండినవానితో సమానుడు.
పునరావృత్తి లేనిదీ, శోకమంటనిదీ అయిన మోక్షపదం ఉన్నదనడంలో సందేహం లేదు. అది జ్ఞానంవల్లనే లభిస్తుంది. బ్రహ్మపదం అనేది లేకపోయినా దాన్ని గూర్చి విచారించినందువల్ల దోషం లేదు. అది వుండే పక్షంలో విచారణవల్ల సంసారసాగరాన్ని తరిస్తారు గదా 1
మోశతోపాయ విచారణలో ప్రవృత్తి కలిగినప్పుడే పురుషుడు '“మోక్షభాగి” అని చెప్పబడుతాడు. మోక్షంకంటే అపాయ రహితము, శంకాశూన్యము, సుఖప్రదము, (భమహీనము అయినది ఈ ముల్గ్లోకాలలోనూ మరొకటి లేదు. ఆత్మ విచార్ణ కల్గినప్పుడు క్రైవల్య'ప్రాప్తిలో ఏ విధమైన క్లేశమూ లేదు. ధనం, మిత్రులు, బంధువులు, నమస్కారాది కర్మలు, తీరయా(త్రలు, ఉపవాసాదులు, వ్షేత్రనివాసాలు - ఇవేవీ మోత్ష్రాప్తీకి ఉపకరించవు. కేవల (శ్రవణ మననాది ఫురుషప్రయత్నంతో, (బ్రహ్మైక నిష్టతో ద్వైత రూపమైన మనస్సును జయించినప్పుడే ఆ మహోత్తమ పదం సిద్దిస్తుంది.
రామచంద్రా ! ఆ (బ్రహ్మపదం విచారమూ, ఏకాగ్రత వీటితో మాత్రమే నిశ్చయించటానికి వీలవుతుంది. శరీరాదులకంచే ఆత్మ వేరనే వివేకంతోనే దాన్న
106 యోగవాస్టం సాధించాలి. దుఃఖాలను దూరం చేసుకొన్నవాడు మాత్రమే దాన్ని పాందగలడు. సుఖాసనంలో - ఆసీనుడై స్వయం విచారణ చేసేవాడు మాత్రమే డాన్ని సాధించగలడు. అతనికి పునర్హన్మ లేదు. సాధుజనులు దానిని సమస్తసుఖాలకూ పరమావధి అనీ, మహోత్తమ మైన దనీ, పరమరసాయన మనీ భావిస్తారు. సమస్త పదార్దాలూ చివరికి నశించేవే. అందువల్ల ఎండమావిలో నీరు లేనట్టు స్వర్గమర్త్యలోకాలలో ఎక్కడా సుఖ మనేది లేదు. శమ సంతోషాలకు సాధనమైన మనోజయాన్ని గూర్చి చింతించాలి. మనో జయం వల్లనే ఏకరస స్వరూపమైన ఆనందం లభిస్తుంది. శమమనే పువ్వు పూచిన వివేకమనే మహావృక్షానికి ఫలం ఆపరమ సుఖమే. అది మనస్సును జయిస్తేనే ప్రాప్త మవుతుంది. దేవుడైనా, దానవుడైనా, మానవుడైనా, ఉన్నచోటవుండే వాడైనా, నడిచేవాడైనా, పడేవాడైనా, పరి(భ్రమించేవాడైనా - ఎవడైనా సరే మనోవిజేత అయిన (ప్రతివాడూ దానిని పాందగలడు. చిత్తాన్ని జయించినవాడు వ్యవహార పరుడైనా కర్మసంబంధం వీడి ఆకసంలో సూర్యునిలాగా అంటీ అంటక వుంటాడు. (ప్రశాంతమైన చిత్తం నిర్మలమై విశ్రాంతి పొంది వుంటుంది. దానికి భ్రమలు, కోరికలు వుండవు. అది దేనినీ వదలదు. దేనినీ కావా లనదు. రామా ! మోక్షద్వారంలో వున్న ద్వారపాలకుల గురించి ఇప్పుడు (క్రమంగా వివరిస్తాను విను. వీటిలో ఏ ఒక్కదాని నా శ్రయించినా మోత్షసౌధాన్ని ప్రవేశించవచ్చు. సుఖతృష్ట అనే దాహదోషంతో దీర్శవై దాట వీలుగానిద్దైన ఈ సంసారమరుభూమి వెన్నెిలవంటి శమంవల్లనే చల్లబడుతుంది. శమం వల్లనే (శ్రేయస్సు కల్గుతుంది. శమమే పరమపదం. భ్రాంతిని నివారించేది కూడా శమమే. శమమే మంగళం. శమమే శాంతి. శమాలంకృత చిత్తుడై, తృప్తి పరుడై, చల్లని స్వచ్చమైన స్వభావం కలవానికి శత్రువు కూడ మిత్రు డవుతాడు. శమమనే చంద్రునితో శోభిల్లే చిత్తం కలవారు క్షీరసము[ద్రంలాగా పరమపరిశుద్దులై వుంటారు. ఎవరి హృదయపద్మంలో శమమనే కమలం వికసిస్తుందో, అలాంటి సజ్జనులు రెండు హృదయ పద్మాలు గలిగి శ్రీహరితో సమానులై భాసిస్తారు. ఎవరి ముఖ చంద్రునిలో శమసంపద శోభిల్డుతుందో అట్టి కుల ్రేష్టలు సౌందర్యంతో చం ద్రుణ్లే మించిపోయి అందరికీ వందనీయు లౌతారు. శమవిభూతులు ప్రసాదించే ఆనందాన్ని
ముముక్షు వ్యవహార ప్రకరణం 107 ముల్లోకాలలోని ఐశ్వర్యాలన్నీ కలిసి కూడా ఇవ్వ లేవు. దుఃఖాలు, తృష్టలు దుస్సహమైన ఆధులు - ఇవన్నీ సూర్యునిముందు వీకటేలాగా శాంతచిత్తులలో అణగారిపోతాయి. సమస్త జీవులకు శాంతచిత్తమే ఆనందాన్ని ప్రసాదిస్తుంది. చంద్రుడు కూడా అలాంటి ఆత్మానందాన్ని సమకూర్చలేడు. శమ సంపన్నుడై సర్వప్రాణుల యెడల సౌహార్దం కల సజ్జనునిలో పరతత్త్వం అనాయాసంగా భాసిస్తుంది. క్రూరస్వభావులు, సాధుస్వభావులు అయిన ప్రాణులన్నీ శమశాలి యైనవానివద్ల తల్లి చెంత వున్నట్టు విశ్వాసంతో (ప్రవర్తిస్తాయి. శమంవల్ల లభించే సుఖం ఇం(ద్రపదవిలోవుండి రసాయనాన్ని పానం చేసినా, విష్ణుపదంలోవుండి వవాలక్ష్మిని కౌగలించుకొన్నా కలుగదు. రాఘవా | అధివ్యాధులతో కలుషితమై తృష్టాపాశంతో ఆకర్షింపబడే మనస్సును శమ మనే అమృతం చిలుకరించి శాంతింపజేసుకో. నాయనా! శమసంపన్నమైన బుద్దితో నీవు ఏది చేస్తావో, దేన్ని భుజిస్తావో అదంతా మధురాతిమధురంగా వుంటుంది. మరేదీ ఆప్యాయత కలిగించదు. రామచంద్రా ! శమమనే అమృతరసంతో ఆఫ్లావితమైన మనస్సు ఏ పరమ సుఖాన్ని కల్షిస్తుందో ఆ సుఖంవల్ల ఛేదింపబడిన అవయవాలు కూడా మళ్ళీ చిగురిస్తాయని నేను అనుకొంటున్నాను. పిశాచాలు, రాక్షసులు, దైత్యులు, శత్రువులు, పాములు, పులులు - ఇవేవీ శమశాలిని ద్వేషించవు. బాణాలు వ(జ్రశిలను భేదించలేనట్లే శాంతి అనే అమృత కవచం చక్కగా కప్పుకొన్నవాణ్లి దుఃఖాలు పీడించలేవు. సమము, నిర్మలము, శమశీలము అయిన బుద్దితో పురుషుడు శో భించినట్టు అంతఃపురంలో ఉండే రాజు గూడా శోభించలేడు. శమసంపన్నుణ్లీ చూచినప్పుడు కలే శాంతి సంతోషాలు (ప్రాణాల కంటే ప్రియమైన మిత్రుణ్లే చూచినప్పుడు గూడా కలుగవు. సమదృష్టి శమవృత్తి కలిగి సాధువర్తనుడైన వాని జీవితమే సఫలం. తదితరుల (బ్రతుకు వ్యర్దం. వినీతుడు, శాంతాత్ముడు అయిన సజ్జనుడు చేసే పనులన్నింటినీ జీవులందరూ (ప్రళంసిస్తారు. ప్రియాప్రియాలను విన్నా, తాకినా, చూచినా, అనుభవించినా, ఆ(ఘ్రాణించినా ఎవడు హర్షవిషాదాలను పొందడో అతడే శాంతుడు. ఎవడు సర్వభూతసముడో, జితేంద్రియుడో, ప్రాప్తా ప్రాప్తాల పట్ట రాగద్వేషాలు లేనివాడో అట్టివాల్లే శాంతు డంటారు. ఎట్టి వికారానికీ లోనుగాక స్వచ్చమైన బుద్దితో బహిరంతరాలలో పవిత్ర వర్తనుడై మోక్షాని కుపకరించే సత్కార్యాలను చేసేవాడే
108 “యోగాసిం శాంతుడు. గౌఢని(ద్రా ము(ద్రితునిలాగా ఏ పరిస్టితిలోనూ హర్ష కోపాలకు గురికాక స్వస్టచిత్తుడైనవాళ్లో శాంతుడని వ్యవహరిస్తారు.
మరణకాలంలో' గాని, ఉత్సవ వేళ గాని యుద్రి సమయంలో గానీ ఎవని మనస్సు కలత లేక చంద్రబింబంలా చల్లగా వుంటుందో వాడే శాంతుడు. ఎవని చూపు ట్రీతితో సకల బీవులపైనా అమృత (ప్రవాహం లాగా సుఖ ప్రదమై ప్రవర్తిస్తుందో వాడే శాంతుడు. చల్లని అంతఃకరణం కలిగి వ్యవహారపరుడై కూడా మూఢుడు కాక విషయాసక్తి వీడి చరించేవాడే శాంతుడని చెప్పబడతాడు. ఎడతెగని ఆపదలు వచ్చినా మహా(ప్రళయ సమయంలోనైనా ఎవని చిత్తం తుచ్చమైన కోరికలు లేనిదై దేహాత్మబుద్ది వర్షితమై విరాజిల్టుతుందో వాడే శాంతుడు. వ్యవహార దశలో వున్నా ఎవని చిత్తం కళంక మంటక ఆకసంలా స్వచ్చమై వుంటుందో అతడే శాంతుడు. తపస్వులు, బహుజ్ఞులు, యాజకులు, రాజులు, బలవంతులు, గుణవంతులు అయిన వుహాత్ముల చిత్తంనుండి చంద్రునినుండి వెన్నెలలాగా పరమానందం ఉదయిస్తుంది. సంకట సమయంలోనూ, భయంకర పరిస్టితిలోనూ గుణపుంజాలకు పరమావధి, పౌరుషానికి (ప్రథమాలంకారము అయిన శమమే శ్రీమంతమై విరాజిల్లుతుంది.
రఘునందనా | ఈ శమామృతాన్ని ఎవరూ హరించలేరు. ఆర్యులు దీన్ని సురక్షితంగా వుంచారు. పూర్వం మహానుభావు లందరూ దీన్ని ఆశ్రయించే ఉత్తమగతిని పొందారు. కార్యసిద్దికై నీవు కూడా ఇదే క్రమాన్ని పాటించు.
విదార నిరూపణం
శాస్త్రవిజ్ఞానంచేత నిర్మలమై; పరమపవిత్రమైన బుద్దితో కారణజ్ఞుడైన వ్యక్తి సదా ఆత్మ విచారం చేయాలి. విచారంవల్ల బుద్రి త్మీక్షమై పరమపదాన్ని దర్శిస్తుంది. దీర్చమెన సంసారరోగానికి విచారమే మహొషధం. అంతులేని కోరికలనే చివుళ్ళతో గుబుర్కొన్న ఆపదలనే అడవిని విచారమనే రంపంతో తరిగివేయాలి. అలా చేస్తే మళ్ళీ అది చిగురించదు.
వుహా(ప్రాజ్జుడవైన ఓ రావుచంద్రా ! బాంధవులు గతించినప్పుడు, ఇతరసంకటాలు అలముకొన్నప్పుడు మోహం ఆవరిస్తుంది. అట్టి స్టితిలో సజ్జనులకు విచారమే గతి. విద్వాంసులకు ఎచారాన్ని మించిన వేరొక ఉపాయం లేదు. దానివల్ల బుద్ది అశుభాన్ని పరిత్యజించి శుభాన్ని ఆశ్రయిస్తుంది. ధీమంతులకు విచారంవల్లనే బలము, బుద్ది, తేజస్సు, సమయోచిత సూర్తి, క్రియానుష్తానం, అందుకు తగిన
ముముక్షు వ్యవహార ప్రకరణం 109 ఫలాలు లభిస్తాయి. విపులమైన విచారం ఉచితానుచిత పరిజ్ఞానం కల్లిస్తుంది. అభీష్టాలను అందిస్తుంది. దాన్ని ఆశ్రయించే సంసారసాగరాన్ని దాటుకోవాలి. వివేక మనే కమలవనాన్ని విధ్వంసం చేసే మోహ మనే మత్తగజాలను విశుద్రమైన విచార మనే సింహం చీల్చి చెండాడుతుంది. మూఢులు కాలక్రమాన వివేకవంతులై పరమపదప్రాప్తిని పొందుతారు. అందుకు కారణం విచార మనే దివ్వె విరజొమ్మే వెలుగే. రాఘవా! రాజ్యాలు, సంపదలు, భోగాలు, శాశ్వతమైన మోక్షం ఇవన్నీ విచార మనే కల్పతరువు కాచిన ఫలాలే సుమా! వివేకంతో వికసించిన మహాత్ముల మతులు ఎండు సారకాయలు నీటిలో మునగనట్లే విపత్తులలో నిమగ్నం కావు. విచార బుద్దితో వ్యవహరించే విజ్ఞులు మహోత్తమ ఫల ప్రాప్తిని పడయగల్లుతారు. మో్షుపేక్ష అనే దిశలను అడ్డగిస్తూ మూర్చుల హృదయాలనే అరణ్యాలలో ఏపుగా పెరిగిన అవిచారమనే గచ్చపోదలు పూచిన పూగుత్తులే సుమా దుఃఖాలు 1 రాఘవా! కాటుకలా కల్మషమై కల్టులాగా కైపు గూర్చే అవిచారమనశే నిదుర నిన్ను అంటకుండు గాక 1! సదాచారపరుడైనవాడు, సూర్యుడు చీకటిలో చిక్కుపడనట్టు ఆపదలచే దీర్హమైన మోహంలో మునగడు. ఎవరి స్వచ్చమైన మానస సరస్సులో విచార మనే కమలాలు వికసిస్తాయో వారు హీమవంతునిలా విరాజిల్టుతారు. బాలుని యెదుట భేతాళం పుట్టుకవచ్చినట్టు విచారహీనుడైన మంద ప్రజ్ఞాని ముందు* చంద్రునినుంచే పిడుగు రాలుతుంది. రామా ! వివేకహినుడు సుఖదుఃఖబీజాలకు పాతరవంటివాడు. ఆపదలనే క్రొాంగొత్త తీవలకు అతడు వసంతబుతువు. అలాంటి నరాధముణ్ణి దూరంగా తరిమివేయాలి. చీకటివల్ల బేతాళాలు ఉప్పతిల్లినట్లు విచారం లేకపోవడంవల్ల చెడుచేష్టలు, దుష్టైచారాలు, మనోవ్యాధులు ఎదురవుతాయి. రఘు్ర్య్యె! నిర్హనష్టలంలోని వృక్షంలాగా సత్కార్యాలకు క"రగాని విచారహీనుణ్ణీ దూరంగా ఉంచు. ఆశకు వశపడక, వివేకంతో కూడిన మానవుని మనస్సు నిండు జాబిల్లినిచూచినట్టుగా పరమానందంతో కందళిస్తుంది. వెన్నెల భూవలయాన్ని చల్లబరుస్తుంది. అలరిస్తుందికూడా. అలాగే వివేకం ఆందరికీ చల్లదనం (ప్రసాదించి సంతృప్తిని సమకూరుస్తుంది. పరమార్ధమనే రాజపదవి ప్రాప్తించిన వాడికీ శుద్దబుద్రియే పతాక, సద్విచారమే ధవళచామరం. రాత్రికి చందమామవలె అతని శుద్దబుద్దికి సద్విచారం శోభ
110 యోగవాసిష్టం కలిగిస్తుంది. ఆత్మవిచారంతో జీవన్ముక్తులైనవారు (ప్రాణుల భవభయ మనే తమస్సును పారదోలుతూ భాస్కరునిలాగా పది దిక్కులూ వెలిగిస్తారు. రాత్రివేళ బాలుడు వునో వూహంతో ప్రాణాలు తీసు బూచిని కల్సించుకుంటాడు. తీరా పరికించిచూస్తే ఆ బేతాళం అదృశ్యమై పొతుంది. అలాగే (ప్రపంచంలోని పదార్జాలన్నీ విచారించి చూడనంత వరకే వునోహరాలు. పరామర్శించినపుడు వాటికి ఉనికి లేనే లేదు. పురుషుడు తన మనోమోహంతో సంసారమనే బేతాళాన్ని కల్పించుకున్నాడు. అది తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నది. కాని విచారంతో అది లయమై పోతుంది. సమమూ, సుఖ'ప్రదమూ, బాధారహితమూ, అనంతమూ, స్వతంత్రమూ అయిన కైవల్యం విచారమనే సమున్నతపాదపం కాచిన ఫలమే అని గ్రహించు. చం(ద్రుడినుంచి చల్లదనం పొడమినట్లే వచారధారవల్ల నిశ్చలమూ, ఉదారమూ అయిన నిష్కామత్వం నివ్వటిల్లుతుంది. ఉత్తమత్వాన్ని (ప్రసాదించే విచారమనే పరమౌషధాన్ని సేవించిన సిద్రపురుషుడు కృతకృత్యుడు. అతడు దేనినీ వాంఛించడు. దేనినీ వదలడు. బ్రహ్మపదం ఆలంబనం చేసుకొన్న చిత్తం సువిశాల మవుతుంది. సర్వవ్యాపియైైన ఆకసానికివలె దానికి ఉదయాస్తమయా లనేవి ఉండవు. అపుడు జీవుడు ఈవిశాలవిశ్వాన్ని కేవలం సాక్షీలా వీశ్షిస్తుంటాడు. "ఆదశలో ఆతనికి ఇచ్చిపుచ్చుకోవడాలు, పొంగు(క్రుంగుదలలూ ఉండవు. అతడు లోపలా ఇమడ లేడు, వెలుపలా ఉండజాలడు. కర్మలో తగుల్కోడు. నైష్కర్మ్యాన్ని అవలంబించడు. గతించిన దాన్ని గూర్చి చింతించడు: వచ్చినదానితో తృప్తిపడతాడు. సుఖదుఃఖాలకు అతీతుడై నిండుసము(ద్రంలా నిశ్చలంగా వుంటాడు. ఇలా నిండు మనస్సుగల మహాత్ములు, యోగులు, జీవన్ముక్తులై ఈ జగత్తులో విహరిస్తుంటారు. తమ ఇచ్చ వచ్చినంతకాలం ఆధీరపురుషులు ఈలోకంలో ఉండి కడపట ఉపాధిని వర్షించి విదేహ ముక్తి పొందుతారు. ధీమంతుడు విపత్సమయంలో కూడ 'నేనెవళ్లి ? ఈసంసారం ఎవరికి చెందినది ?' అని విచారించి ప్రయత్నంతో ప్రతీకారం చెయ్యాలి. రాఘవా 1! ఒక రాజు సంకట కార్యాలలో సందేహం కల్లినప్పుడు 'ఇది సఫల మవునా ? నిష్పలమనవునా ?' అని విచారించే నిర్ణయానికి వస్తాడు గాని మరొకవిధంగా రాడుకదా! రాత్రివేళ దీపంవల్ల నేలను చూస్తాము. అలాగే పురుషుడు విచారంతోనే వేదవేదాంత సిద్దాంతాలైన కర్మబ్రహ్మ తత్తా ;లను తెలుసుకుంటాడు. ,
ముముత్షు వ్యవవోర ప్రకరణం 111
విచారమనే అందమైన కన్ను కారు చీకటిలో గూడా కనగల్లుతుంది. మహాతేజస్సు ముందటగూడ మిరుమిట్టుగొనదు. సుదూరం లోని విషయాన్నికూడా సందర్శిస్తుంది. వివేకాంధుడే పుట్టుగ్రుడ్డి. అతడి స్థితి అందరికీ శోచనీయం. వివేకసంపన్నుడే దివ్యనేత్రుడు. అత డన్నిటా విజయశిఖరాన్నే అధిరోహిస్తాడు. పరమాత్మమయమూ, మాన్యమూ, మహానందదాయకమూ అయిన ఈ విచార చమత్కారాన్ని ఒక క్షణం కూడా వదల రాదు.
విచార సమర్దుడైనవాడు మగ్గిన మామిడిపండులా మహాత్ములకు కూడా ఇష్ట డవుతాడు. విచారంతో మెరుగెక్కిన బుద్దికల్గి గమ్యుస్టానం (త్రోవ తెలిసినవాడు మాటిమాటికీ దుఃఖాలనే గుంటలలో కూలిపోడు. విచారహీనుడైన అజ్ఞుడు వేదనకు గురి అయినంతగా, రోగి కానీ, అనర్ధ పరంపరలతో జర్హరితుడైన వాడు కానీ గురికాడు. విచారహీనుడుగా (బ్రతకడంకంటె బురదలో కప్పగానో, మలములో కీటకంగానో, చీకటిగుహలో పాముగానో (బతకడం మంచిది.
అనర్జా అన్నింటికీ నిలయువచూ, సజ్జ్ఞనులందరిచేత గర్జితవూ, ఎల్లదుర్గతులకూ పరాకాష్ట అయిన విచార రాహిత్యాన్ని పరిత్యబించాలి. మహాత్ముడైనవాడు నిత్యం విచారశీలుడై వుండాలి. రాగద్వేషము లనే అంధకూపంలో పడ్డవానికి విచారమే పట్టుకొమ్మ. విచారబలంతో తన్ను తాను నిలద్రొక్కుకొని తన మనోమృగాన్ని సంసార మోహ మనే సాగరం నుండి దాటించాలి.
“నే నెవణ్లీ ? ఈ సంసార దోషం నాకెలా వచ్చింది” అని శాస్త్ర, పద్దతిలో పరామర్శించడమే విచార మంటారు. విచార శీలుడు కాని దుర్మతియొక్క హృదయం పాషాణం వంటింది. అజ్ఞానాంధకారంతో గ్రుడ్డిదైన ఆ హృదయం కలకాలం దుఃఖాలు అనుభవించడానికే సృష్టించబడింది.
రామా! సత్యాన్ని పరిగ్రహించి అసత్యాన్ని పరిత్యజించ గోరేవారికి తత్త్వం బోధపడాలంటే విచారాన్ని మించిన సాధనం మరి లేదు. విచారంనుంచే తత్త్వం బోధపడుతుంది. తత్త్వజ్ఞానం కల్గితేనే ఆత్మ విశ్రాంతి లభిస్తుంది. ఆ పైన మనశ్శాంతి కుదురుతుంది. మనశ్శాంతి ఒదవినపుడే దుఃఖాలన్నీ సమసిపోతాయి.
రామచంద్రా! స్పష్టమైన విచారదృష్టి కలిగినప్పుడే చేసే పనులన్నీ ఉత్తమ ఫలాలను ప్రసాదిస్తాయి. ఆత్మతత్త్వజ్ఞానం సమకూడుతుంది. అందువల్ల శమవంతుడవైన నీకు కూడా ఈ విచార మార్గం రుచించుగాక 1
112 యోగవాసిష్టం సంతోష విరూపణం శత్రు వినాశకుడవైన ఓ రామచంద్రా! సంతోషమే పరమ శ్రేయస్సు; సంతోషమే సుఖం, సంతుష్టుడే మోక్షం పొందగలడు. సంతోషమనే ఐశ్వర్యంతో సుఖిస్తూ విశ్రాంతచిత్తులైన శాంతాత్ములకు మహాసామ్రాజ్యం సైతం గడ్డిపరకలా తుచ్చంగా కనిపిస్తుంది. రామా! సంతుష్టుని బుద్ది సంసారంలో సంకట పరిస్ట్రితు లేర్పడినప్పటికీ ఉద్వేగం చెందదు. తన స్టితిని కోల్పోదు. సంతోషామృతంలో స్నానమాడి సంతృప్తిన్ందిన శాంతమనస్కులు భోగ సంపదలను విషతుల్యంగా భావిస్తారు. దోషనాశకమై మధురాతిమధురమైన సంతోషంవల్ల కలిగే సౌఖ్యం అమృతరస తరంగాలలో ఓలలాడినా కలగదు. ప్రాప్తించని వాటిపై కోరికలు పెట్టుకోక, ప్రాప్తమైన వాటి విషయంలో సమత్వం వహించి సుఖదుఃఖాలకు లోనుగాని వాడే సంతుష్టు డనిపించుకుంటాడు. మనస్సు తనలో తాను సంతోషం పొందనంతవరకు, ఆ మనోబిలం నుంచి ఆపదలనే లతలు పుడుతూనే వుంటాయి. భాను కిరణాలతో పద్మం వికసించినట్టు సంతోషంతో చల్ల వడ్డ చిత్తం శుద్రవిజ్ఞాన దృష్టితో వికసిస్తుంది. సంతోషమనే సూర్యుడు ఉదయించినపుడు అజ్ఞానమనే చీకటి రేయివల్త మౌనవుడనే కమలం ముకుళించదు. మలినమైన అద్దంలో ముఖం ప్రతిబింబించదు. అలాగే ఆశావివళమూ, సంతోషరహితమూ అయిన హృదయంలో జ్ఞానం 'ప్రతిఫలించదు. ఎవని మనస్సు ఆధివ్యాధులు లేక సంతుష్టమై వుంటుందో అట్టివాడు నిరుపేద అయినా సామ్రాజ్య సుఖం అనుభవిస్తాడు. రాని దానిని కోరక, వచ్చినడానివి సమచిత్తంతో అనుభవించే సౌమ్యాచారపరుడు సంతుష్టు డని చెప్పబడతాడు. సంతుష్టుడై నిండుమనస్సుతో వున్న మహాత్ముని వదనంలో శ్షీరసాగరంలోలాగా లక్ష్మి తాండవిస్తుంది. తనలో తాను పరిపూర్చుడై పురుష ప్రయత్నంతో సర్వత్రా తృష్టను వర్హించాలి. చంద్రునిలాగా సంతోషమనే అమృతంతో నిండిన వాని చిత్తం శాంతశీతలమైన బుద్దిబలంతో స్ట్రైర్యం పొందుతుంది. రాజువద్ద సేవకులు చేరినట్టు సంతుష్ట చిత్తునివద్ద సంపదలన్నీ చేరుతాయి. వర్షాకాలంలో ధూళి అణగినట్టే సంతోషంతో స్వస్టచిత్తుడైన వాని మనోవ్యాధులన్నీ తమంత తామే అణగారిషపోతాయి.
ముముత్తు వ్యవహార ప్రకరణం 113 రామా! కళంకరహితము, శీతలము, పరిశుద్దము అయిన విత్తవుతి కలవాడు ఫున్నమి చందమామలా ప్రకాశిస్తాడు. సంతుష్ట మానవుని సమతాసుందిరపైన ముఖం చూస్తూ సంతసించినట్టు లోకులు ధనసంచయంతో సంతసించరు. రబునందనా | సద్గుణవంతు లభిలషించే సమభావంతో అలంకరింపబడిన పురుషుని యెదుట దేవతలు, మహామునులు కూడా మోకరిల్దుతారు. సదాచార నిరూపణం మహామతీ | సాధుసంగమం సంసారం నుండి తరింఎడానికి మానవులకు అన్నివిధాలా తోడ్పడుతుంది ఏమహాత్ములు సాధుసంగమనే చె ట్టు పూచిన వివేకమనే పుచ్చెన్ని రకిస్తారో, వారు మోక్షసల ప్రాప్తికి అర్హులవుతారు. విద్వజ్ఞమలతో సమాగమం వల్ల శూన్య'ప్రదేశం కూడా జనాక్షీర్ధ మవుతుంది. మరణం కూడా ఉత్సవ మవుతుంది. ఆపద కూడా సంపదలా భాసిస్తుంది. సజ్జన సమాగమం ఆపదలనే తామరతీగకు మంచు, మోహమనే ముంచుకు గాలి. ఈ జగత్తులో సర్వోత్కృష్టమైన వస్తువదే. అది బుద్దిని వృద్ది పొందిస్తురడి-- అజ్ఞాన వృక్షాన్ని ఛేదిస్తుంది. మనోవ్యాధులను తొలగిస్తుంది. పూదోటకు నీరు చల్లడం వల్ల పూగుత్తులు పూచినట్టు సాధుసంగమంవల్ల మనోహరము, ఉజ్జ్వలము అయిన వివేకమనే పరమ దీపం ్రభవిస్తుంది. సాధుసంగం అనే సంపద అపాయరహితము, బాధారహితము, దినదిన ప్రవర్షమానము, నిరతిశయము అయిన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నికష్టాలు ప్రాప్తించినా మానవులు ఒకక్షణం కూడా సాధుసాంగత్యాన్ని మానరాదు. సజ్జన పాంగత్యం సన్మార్గానికి దీపం. అది జ్ఞాన భాస్కర తేజమై హృదయంలోని అజ్జానాంధకారాన్ని హరిస్తుంది. స్వచ్చము, శాంతిప్రదము అయిన సాధుసాంగత్య మనే గంగలో మునిగినవానికి దానాలతో, తీర్జాలతో, తపస్సులతో, యాగాలతో పనిలేదు. రాగశూన్యులు, సందేహ రహితులు, గ్రంథి విముక్తులు అయిన సాధువులు వున్నప్పుడు తపస్సులు, తీరయాత్రలు - వీటితో ఏమి పని ? దరిద్రుడు మణులన వెదకినట్టు శాంతచిత్తులు, ధన్యులు అయిన సాధువులను మహాప్రయత్నంత్ అన్వేషించాలి. అప్పరసలలో వెన్నునితో కూడిన లక్ష్మీ లాగా ధీమంతుల బుద్ది సజ్జన సంగమంతో సౌందర్యవంతమై సదా శోభిల్దుతుంది. సాధు సాంగత్యం వీడని ధన్యుడు ౯ం
114 యోగవాసిస్టం విమలవిచార లభ్యమైన బ్రహ్మపదాన్ని చూరగింటాడు. బంధరహితులు, తత్త్వజ్ఞులు, సకలజన సమ్మతులైన సాధువులను అన్నివిధాలా సేవించాలి. భవసాగరం తరించడానికి ఉపాయభూతులు వాళ్ళే. నరకాగ్నుల పాలిటి మేఘాలు సజ్జనులే. వాళ్ళను తిరస్కరించే వారు ఆ అనలజ్వాలలకు ఇంధనాలై పోతారు. దారి[ద్రమరణ దుఃఖములనే సన్నిపాతరోగం సాధు సంగమనే బొషధంతో పూర్తిగా శమిస్తుంది. సంతోషం, సత్సంగం, విచారం, శవుం అనేవే నరులకు భవాబ్చి తరణోపాయాలు. సంతోషమే పరమలాభం, సత్సంగమే పరమగతి, విచారమే పరమజ్ఞానం, శమమే పరమసుఖం. ఈనాలుగు ఉపాయాలను అభ్యసించినవారు మోహమనే జలంతో నిండిన భవార్ణవాన్ని తరిస్తారు. వీటిలో ఏ ఒక్కదాన్నైనా అభ్యసిస్తే తక్కిన వాటినికూడా అభ్యసించినచ్చే. ఇందులో ఒక్కొక్కటీ తక్కిన వాటినన్నిటినీ (ప్రసవిస్తుంది. అందువల్ల అన్నీ సిద్దించాలంచే ప్రయత్నంతో ఒక్కదాన్ని గట్టిగా ఆశ్రయించాలి. ఓడలు సరుకులతో సాగరం చేరినట్టు శమవంతుడైన వాని కడకు విచార సంతోష సత్సమాగమాలు చేరుతాయి. కల్పతరువు నాశ్రయించిన వానివద్ద సంపదలు చేరినట్లు సత్సాంగత్యం కలవాని చెంత శమసంతోషవిచారాలు చేరుతాయి. ప్యూర్ణచం[ద్రునిలో సౌందర్యాది గుణాలు చేరినట్టు సంతోషవంతుడైన వానిని విచార శమసత్సంగాలు ఆ(శ్రయిస్తాయి. వుంథత్రి శ్రేష్టులు గల రాజును జయులథ్న్మీ వరించునట్ను విచారవంతుడైన వాళ్ల శమ సంతోష సత్సంగాలు వరిస్తాయి. రఘునందనా | అందువల్ల పౌరుషంతో మనస్సును జయించి ప్రయత్నంతో వీటిలో ఏ ఒక్కగుణాన్నైనా అవలంబించాలి. పురుషకారంతో చిత్తమనే మత్తేభాన్ని జయించి వీటిలో ఒక గుణాన్నైనా స్వాధీనం చేసుకోకపోతే ఉత్తమగతి' లేదు. రామా! నీమనస్సు గుణసంపాదనక్రై ఉన్ముఖం కానిపకంలో పౌరుషంతో పండ్లు పటపట గొరుకుతూ అంద కై ఉద్యమించు. మహాభుజా | నీవు దేవతవో, యక్షుడవో, పురుషుడవో లేక ఏ చెట్టువో అగుదువుగాక 1! పై గుణాలను మాత్రం ఆర్షించకపోతే నీకు ఉత్తమగతి లేదు. ఫల(్రదమైన ఏ ఒక్కగుణం నీలో బలపడినా చాలు. వెంటనే చపల చిత్తంలోని దోషాలన్నీ నశిస్తాయి. ఒక్కగుణం పెంపాందితే దోషవినాశకమైన తక్కిన గుణాలన్నీ
ముముకు వ్యవహార ప్రకరణం 115 పెంపొందుతాయి. ఒక్కదోషం బలపడితే, గుణవినాశకమైన మిగతా దోషాలన్నీ బలపడతాయి. ప్రాణుల మనస్సనే మోహాటవిలో శుభాశుభాలనే గట్టుల మధ్య వాసన అనే నది మహావేగంతో నిత్యం ప్రవహిస్తున్నది. దాన్ని స్వప్రయత్నంతో ఏగట్టువైపు మళ్లిస్తే ఆగట్టు వైపే ప్రవహిస్తుంది. ఇది గ్రహించి నీయిష్టం వచ్చినట్టు మసలుకో 1 శుద్ర బుద్దివైన రావచంద్రా 1! చిత్తారణ్యంలో వాసన అనే వుహానదిని (క్రవుంగా పొరుషబలంతో శుభతీరాభిముఖంగా మళ్ళించు. అలా చేస్తే నీవు అశుభ ప్రవాహంలో పడి కొట్టుకపోవు. ంథ సంఖ్యాది వర్షనం రాఘవా ! పై జ్వోన రీతిగా వివేకవంతుడైనవాడు మాత్రమే నీతిశాస్త్రం వినడానికి రాజు అర్జుడైనట్టు ఈ జ్ఞానగర్భితమైన వాక్యాల వినడానికి అర్హు డవుతున్నాడు. శరచ్చంద్రునికి మబ్బులు లేని ఆకాశం విహార యోగ్యమైనట్టు మూర్చులతో చెలిమిలేని నిర్మలుడైన మహాశయుడు మూత్రమే ఆత్మవిచారానికి యోగ్యుడవుతాడు. నీకు ఇలాంటి గుణ సంపత్తి నిండుగా ఉన్నది. అందువల్ల మనోమోహాన్ని తొలగించే ఈ నా మాటలు విను. ఎవని పుణ్య మనే వృక్షం ఫలభారంతో వంగుతుందో అలాంటి వానికే మోక్షహేతువైన ఈ శాస్త్రం వినాలనే కోరిక గలుగుతుంది. పావనమూ, ఉదారమూ, పరతత్త్వ(ప్రబోధకమూ అయిన ఉపదేశానికి గుణవంతుడైన భవ్యచరి త్రుడే అర్హుడు కాని అధముడు కాడు. సారార్థపూర్లమైన ఈ సంహిత మోతోపాయం వివరిస్తున్నది. ఇందులో ముప్పదిరెండువేల శ్లోకాలున్నాయి. దీన్ని చక్కగా గ్రహిస్తే నిర్వాణం కరతలామలక మవుతుంది. మేలుకొన్నవాడు తాను కోరుకోకున్నా వెలిగే దీపం అతనిపై వెలుగును (ప్రసరింపజేస్తుంది కదా 1 అలాగే ఈ సంహితను విన్నవానికి అనాయాసంగా మోక్షసాధనమైన జ్ఞానం సమకూరుతుంది. స్వయంగా చదివినా, ఇతరులు చదువగా విని గ్రహించినా ఈ సంహిత (భ్రాంతిని శమింపజేసి భా గీరథి వలె అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. త్రాడును చూచినవానికీ సర్సభ్రమ సమసినట్లే ఈ శాస్త్రం అవగతమైతే సంసారదుఃఖం శమిస్తుంది. ఆరు 'ప్రకరణాలు గల ఈ గ్రంథంలో యుక్తియుక్తాలైన అర్జాలతో కూడిన
116 యోగవాసిష్టం వాక్యాలు, ఉత్తమ దృష్టాంతాలతో నిండిన ఆఖ్యాయికలు ఎన్నో వున్నాయి. మొదటిది వైరాగ్యప్రకరణం. ఇది పదునైదు వందల శ్లోకాలతో కూడినది మరుభూమిలో నీరు పోస్తే చెట్టు పెరిగినట్టు దీన్ని పఠిస్తే వైరాగ్యం వృద్రిపాందుతుంది. మెరుగుపెట్టిన మణిలో మాలిన్యం తొలగినట్టు ఈ (ప్రకరణాన్ని చక్కగా విచారిస్తే విషయ దోష పరిజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం తొలగుతుంది. బుద్రి శుద్ర మవుతుంది. రెండవది ముముక్షు వ్యవహార (ప్రకరణం. ఇందలి శ్ఞోక సంఖ్య వేయి. యుక్తియుక్తాలైన ఉపదేశాలతో కూడిన ఈ ప్రకరణంలో మోవత్షాపేక్ష గల మనుజుల స్వభావం చిత్రించబడింది. తరువాతిది ఉత్పత్తిప్రకరణం. అనేక దృష్టాంతాలు, పెక్కు ఆఖ్యాయికలు ఇందున్నాయి. ఏడువేల శ్లోకాలు గల ఈ ప్రకరణం విజ్ఞాన ప్రతిపాదక మైనది. నేను, నీవు అనే ద్రష్ష్రృ దృశ్యాలు నిజానికి ఉత్పన్నం కాకున్నా ఉత్పన్నమైనట్టు భాసిస్తాయని ఇందులో నిరూపించబడింది. నాలుగవది స్థితిప్రకరణం. ఇందలి శ్లోకసంఖ్య మూడువేలు. పరమార్దాన్ని వివరించే ఈ భాగంలో ఎన్నో కథోపకథ లున్నాయి. అహంభావరూపంతో ఉనికిని సంతరించుకున్న ఈ జగత్తులోని ద్రష్టృ దృశ్య'క్రమం ఇక్కడ వరించబడింది. పది దిక్కులతో భాసురమై కనిపించే భ్రమాత్మకమైన ఈజగత్తు ఎలా వృద్ది పొందిందో ఈ గ్రంథభాగం చక్కగా వివరిస్తుంది. ఆవలిది ఉపశమ (ప్రకరణం. ఇందులో ఐదువేల శ్ఞోకాలున్నాయి. పవిత్రమైన ఈ ప్రకరణంలో అనేక యుక్తులు రమణీయంగా ప్రతిపాదింపబడ్డాయి. ఈ జగత్తు, నీవు, నేను, అతడు - అనే ఈ విధమైన (భ్రాంతి ఎలా శమిస్తుందో ఈ భాగం నిరూపిస్తుంది. ఉపశమ ్రకరణాన్ని సావధానంగా వింటే సంసారతాపం శాంతిస్తుంది. ఆరవది నిర్వాణప్రకరణం. ముప్పది రెండు వేల శ్లోకాలలో కడమ గ్రంథ మంతా ఈ ప్రకరణం లోనిదే. ఇది అవగతమైతే (శ్రేయస్సు సిద్దిస్తుంది. కల్పనలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రకరణం ఆలించినవాడు విజ్ఞానాత్ముడుగా, నిరామయుడుగా, ఆకాళం వలె నిర్మలుడుగా, సమస్త (భమలు తొలగినవాడుగా వెలుగొందుతాడు. అతడు దేహవంతుడైనా విదేహుడే. సంసారంలో ఉన్నా సంసారరహితుడే. అహంకారపిశాచం అతణి వీడుతుంది. పరమాత్మ స్వరూపుడైన అతని రోమఫు కొనలో మహామేరుపర్వతంలో ఒక పువ్వులోని తుమ్మెదలాగా ఈ జగల్లవ్మీ
ముముత్రు వ్యవహార ప్రకరణం 117 అధివసిస్తుంది. తన హృదయచిదాకాశకోటరరలో ప్రతిపరమాణువునా వేలకొలది జగల్లక్ములను కల్పించి అతడు దర్శించ గలుగుతాడు.
జీవన్ముక్తుడైన మహాత్ముని హృదయం మహానిస్తృత మైనది. లక్షలకొాలది హరిహరాదుల్సు కూడా ధానితో తుల దూగ లేరు. వాస్తవంగా అది అట్టిది.
దృష్టాంత నిరూపణం
సారవంతమైన నేలలో పాతిన మంచి విత్తనం తప్పక ఫలం చేకూర్చినట్ట్లు ఈ సంహితను పఠిస్తే జ్ఞానం అవశ్యం లభిస్తుంది. యుక్తులతో తత్త్యం నిర్ణయించే శాస్త్రం మానవరచితమైనా గ్రాహ్యమే. అలా కాని శాస్త్రం ఆర్హమైనా పరిత్యాజ్యమే. బాలుని మాటైనా యుక్తియుక్తంగా వుంచే గ్రహించాలి. యుక్తిహినమైన మాట (బ్రహ్మదేవుడు చెప్పినా త్రోసిపుచ్చాలి. ఎదుట గంగొజలర (ప్రవహిస్తున్నా వదలి పెట్టి 'ఇది మా నాన్న (త్రవ్విన నూరు' అని నూతినీరు శత్రాగేవారికి ఎవడు ఉపదేశించగలడు ?
ఉషుకాలం కాగానే వెలుతురు ప్రసరించినట్ను ఈ (గ్రంథం పఠించగానే వివేకం ఉదయిస్తుంది. ప్రాజ్ఞుడైన వానినుండి దీన్ని పూర్తిగా విన్నా, లేక స్వయంగా గ్రహించినా మెల్ల మెల్లగా విచారబలం వల్ల బుద్దిలో సంస్కారం పాడసూపుతుంది. పిదప సుపరిష్కృతమైన వాక్కు వశ మవుతుంది. అఆవాణి అందంగా అల్దుకొన్న లతలాగా స్తభాస్ట్రానాన్ని అలంకరిస్తుంది. రాజులనే కాక దేవతలను సైతం స్నేహవశులను కావించే మహత్తరమైన చాతుర్యం సిద్రిస్తుంది. ల్
కన్నులున్న వాడు దివ్వె చేపట్టి పదార్డా లన్నిటినీ పరిశీలింప గల్గుతాడు. అలాగే బుద్రివుంతుడు ఈ శాస్త్రజ్ఞానంతో సకలపదార్హ తత్తాాలను సాకల్యంగా (గగ్రహించగలడు. శరదృతువు రాగానే దిక్కులనుండి మంచు విరిసినట్టు ఈ శాస్త్రి అవగతం కాగానే బుద్ది నుండి లోభమోహాదిదోషాలు తొలగిపోతాయి.
రామచంద్రా 1 ఇప్పుడు నీబుద్లికి వివేకాభ్యాస మొక్కటే కావాలి. అభ్యాసం లేని క్రియ ఫలప్రదం కాజాలదు. ఈ శాస్త్రజ్ఞానంవల్ల మనస్సు శరత్కాలంలో సరోవరం లాగా నిర్మల మవుతుంది. మందరపర్వతసంబంధం తొలగిన సాగరం లాగా సమస్రితిని పాందుతుంది. మసిలేనిదై చీకటిని పోకార్చి వెలుగొందే రత్న దీపశిఖలాగా ప్రజ్ఞ అజ్జానాన్ని తొలగించి ఆత్మానాత్మ వివేకంతో భాసిస్తుంది. కవచం తొడిగినవాణ్లి బాణాలు కొట్టులేవు. అలాగే దైన్యదారి[ద్యదోషదూషితమైన దృష్టి ఈశా,స్త్రవేత్తను భేదించజాలదు. శరాలు మహాశిలను భేదించలేవు. అట్లే ప్రాజ్ఞుడు
118 యోగవాస్మిం ఎదురుగా వున్నా అతళ్లి సంసారభీతి చెనకజాలదు.
జన్మకర్మలు, దైవపౌరుషాలు ఎలా ఏర్పడ్డాయి ? వీటిలో ఏది ముందటిది ? ఏది వెనుకటిది ? అనే ఈలాటి సందేహాలన్నీ షగటి పూట చీకటిలాగా తత్త్వజ్ఞునిలో శమిస్తాయి. సూర్య తేజం ్రసరించగానే రాత్రి తాలగిపోయినట్టు ప్రజ్ఞా(ప్రకాశం ఉదయించగానే సమస్తవస్తువులపట్లు రాగద్వేషాలు నశిస్తాయి. విచారశీలు డయిన తత్త్వజ్ఞుడికి సము(ద్రంవంటి గాంభీర్యం, మేరువువంటి ధైర్యం సమకూడుతాయి. చం(ద్రునిలాగే అతని చిత్తం చల్లనై వుంటుంది. భేదదృష్టి నశించి క్రమంగా జీవన్ముక్తుడైన వాని ప్రశాంత స్రితిని వర్షించడానికి మాటలు చాలవు. శరత్కాలంలోని వెన్నెల లాగా శాంతమూ, శుద్రమూ అయిన అతనిబుద్రి ('ప్రకాశవంతమై పరమాత్మ దర్శనం కలిగిస్తుంది.
హృదయ మనే ఆకసంలో శమ మనే వెలుగుతో వివేక మనే సూర్యుడు వెలిగితే అనర్జావహమైన కామాదు లనే తోకచుక్కలు తలసూపవు. శరత్తులోని మేఘ మాలికలలాగా జీవన్ముక్తులు తృష్ట వీడి ఉన్నతస్హానంలో (ప్రశాంతంగానూ, పరిశుద్రంగానూ, సౌమ్యం గానూ వుంటారు.
షగటిపూట పిశాచలీల అంతరించినట్లే జ్ఞానోదయం కాగానే పరులపై విద్వేషం రెచ్చగొట్టే అసభ్యవచనాలు అణగారిపోతాయి. గాలి చిత్రంలోని తీగను కదల్బ లేదు. అలాగే ధర్మ మనే గోడకు గట్టిగా తగిలించిన ధైర్యవంతమైన బుద్రిని మనోవ్యాధులు చలింపబేయ లేవు.
తత్త్వజ్ఞుడు విషయాసక్తి అనే మోహగర్తంలో పడడు. దారి తెలిసినవాడు బొందలో పడడానికి పరుగులు దీస్తాడా ? అంతఃపురంలోని సాధ్వీమణి లాగా అతని బుద్ది శా,స్త్రవిహితమైన సదాచారంలోనే ప్రవర్తిస్తుంది.
కోట్లకొలది (బహ్మాండాలలో ఎన్నో పరవూణువు లున్నాయి. ఆ పరమాణువులలో ఒక్కొక్క దానిలోనూ అనేక సృష్టిపరంపరలను అసంగబుద్ది అయిన తత్త్వవేత్త దర్శింషగలడు. సముద్రంలో అలల్లాగా ప్రతి పరమాణువులోనూ ఆవిర్భవిస్తూ, అంతరిస్తూ వున్న అసంఖ్యాకమైన బబ్రహ్మాండాలు అతనికి గోచరిస్తాయి.
ఈ శాస్త్రం పఠించి మోక్ష్షోపాయాలు గ్రహించి చిత్తశుద్ది పాందినవానికి భోగాలు సుఖదుఃఖాలు కలిగించలేవు. ఇష్టానిస్ట్రాల పట్లు అతనికి రాగద్వేషాలు కలగవు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఒకవెల్టులాగా అతదు ఉదాసీనంగా ఉంటాడు. అతడు
ముముతు వ్యవహార ప్రకరణం 119 సామాన్య మనుజుని లాగానే (ప్రాప్త్రమయినదాన్ని అనుభవిస్తాడు. ఇస్టానిస్టాలు ఏవి కలిగినా మనసులో ఏమాత్రం కలత చెందడు. ఈశాస్త్రృం సమగ్రంగా చదివి అర్జాన్ని చక్కగా పర్యాలోచించాలి. వట్టి మాట లని దీన్ని తిరస్కరించరాదు. బ్రహ్మాదుల వరాలు, శాపాలు ఫలించి నట్లే ఈ శాస్త్రం కూడా తప్పక అనుభవానికి వస్తుంది. అలంకారభూషితమై చక్కని దృష్టాంతాలతో రసమయంగా తీర్చి దిద్రబడ్డ శాస్త్రమిది. కావ్యరూపమైన ఈ సంహిత సులభంగా అర్ధమవుతుంది. కాస్త పదపదార్ధ పరిజ్ఞానం కలవాడు దీన్ని చదివి స్వయంగా అర్ధం చేసుకోగలడు. అది లేని వాడు పండితునినుండి గ్రహించాలి. (శ్రవణ మననాలతో ఈ శాస్త్రం చక్కగా అవగత మయితే మోక్షానిక్రై మళ్లీ జపతపోధ్యానాలు చేయవలసింది లేదు. దీనిని లెస్సగా అభ్యసించి మాటిమాటికీ పరిశీలించడం వల్ల చిత్తసంస్కార పూర్వకమైన అపూర్వపాండిత్యం లభిస్తుంది. ఆ " సూర్యోదయం కాగానే పిశాచం మాయమవుతుంది. కలలో కనిపించింది మేల్కోగానే అంతర్జాన మవుతుంది. అలాగే ఈ శాస్త్రం గ్రహించగానే “నేను - (ప్రపంచం' అనే దృష్ట దృశ్యభేదం తనకు తానుగా ఉపశమిస్తుంది. (భ్రవు తొలగిపోతుంది. సంకల్పంతో సృష్టించుకొన్న నగరంలోని సంఘటనలు సుఖదుఃఖాలు కలిగించలేవు. చిత్రంలోని పాము నిజం తెలిసినవాళ్లీ భయపెట్టుదు. అదే రీతిగా దృళ్యమైన జగత్తుయొక్క నిజస్వరూపం అర్రమైతే హర్షవిషాదాలు కలగవు. చిగురునో, పువ్వునో చీల్పాలంటే అవయవ చాలనం వంటి కొంత ప్రయత్నం అవసరం. పరమార్ధ ప్రాప్తికి ఆమా త్రం యత్నం కూడా అక్కరలేదు. బుద్దిని నిరోధిస్తే చాలు.” సుఖాసనంలో కూర్చోవాలి. లభించిన భోగానుభవంతో తృప్తి పడాలి. సదాచారానికి విరుద్దంగా ప్రవర్తించరాదు. సత్సంగం చేయాలి. ఈ శా(స్తాన్నో లేక మోతోపాయ ప్రతిపాదకమైన మరొక గ్రంథాన్నో పఠించాలి. అలా చేస్తే సంసారతాపాన్ని శమింపజేసీ అపరిచ్చిన్నమైన పరమాత్మానుభవం కలుగుతుంది. మళ్లీ గర్భవాసం చేయవలసిన యాతన తప్పుతుంది. ఇంతమా త్రం కూడా చేయలేక భోగెకలాలసులైన పాపాత్ములు మాతృమలంలోని పురుగులే. ఆఅధముల పేరు కూడా తలచకూడదు. రాఘవా | ఇప్పుడు నేను చెప్పబోయే ఆత్మళ్సత్త్వ 'ప్రతిపాదకమైన ఈ శాస్త్రం విను. దీన్ని వినడానికీ, అవగతం! చేసుకోవటానికీ ఉపకరించే ఉప[క్రమోపసంహారాలతో కూడిన ప్రక్రియను వివరిస్తాను ఆలకించు. అనుభవంలో
120 యోగవాస్మెం లేని విషయం అవగతం కావటొనికి అనుభవంలో ఉన్న విషయం ద్వారా బోధించడం జర్గుగుతుంది. అలా బోధకు ఉపకరించే దానినే దృష్టంత మంటారు. రామచంద్రా ! రాత్రివేళ దీపం లేకపోతే ఇంటిలోని వస్తువులు గోచరించవు. దృష్టాంతం చెప్పక పోతే క్రొత్తవిషయం అర్ధం కాదు. బోధ సమయంలో నేను చెప్పే దృష్టెంతాలన్నీ కారణాలతో కూడే (అనగా, ఉత్పత్తి కలవిగానే) ఉంటాయి. ప్రాప్యమైన సద్వస్తువు ఒక్కటే కారణరహితమైనది ( నిత్యమైనది.) ఒక్క పరబ్రహ్మం తప్ప తక్కిన ఉపమానోపమేయ పరార్జాలన్నిటికీ కార్యకారణభావం ఉండనే వున్నది. ఈ బ్రహ్మో పదేశ విషయంలో నిరూపింపబడే దృష్టాంతం పరబ్రహ్మ యొక్క ఏకదేశంతో మాత్రమే సాధర్మ్యం కలిగి వుంటుంది. ఇక్కడి దృష్టాంతాలన్నీ కనిపించే వస్తువుల వలె మిథ్యాజగత్తుకు సంబంధించినవే కాని వాస్తవాలు కావు. అందువల్లనే “నిరాకారమైన బ్రహ్మవిషయంలో సాకారమైన వస్తువు ఎలా దృష్టాంత మవుతుంది?! అన్న యూర్చుల వికల్ప వచనాలకు ఇక్కడ తావు లేదు. జగత్తు స్వప్పతుల్యం కాబట్టి తార్కి కులు చూపే హేత్వాభాస దోషాలు కూడా పర(బ్రహ్మాన్ని బాధించవు.-ఉత్పత్తికి ముందూ, వినాశానికి తరువాతా లేని వస్తువు చక్కగా విచారిస్తే వర్తమానంలో కూడా లేనిదే. అందువల్ల జా(గ్రదవస్టలోనూ, స్వప్నావప్రలోనూ కనిపించే వస్తువులకు తేడా లేదు. ఈ అవస్టలు రెండూ మిథ్యలే. బాల్యంనుండీ ఈ భ్రమ మనల్ని ఆవహించే వుంది. స్వప్నంలో సంభవించే సంకల్పం, ధ్యానం, వరం, శాపం, జౌషధం మొదలైనవి కూడా జాగ్రద్దశలో ఫల (ప్రదా అవుతున్నాయి. అందువల్ల స్వష్నావస్టకూ, జూ గ్రదవస్ట్రకూ భేదం లేదు. వెళాక్షోపాయాన్ని (ప్రతిపాదించే ఈ గ్రంథకర్త రచించిన పూర్వరామాయణాదులైన ఇతర (గ్రంథాలలో కూడా దృష్టాంత నిరూపణలో సరిపడినంత వరకే పోలిక పాటింపబడింది. జగత్తును సత్యమని భ్రమించే శ్రోతలకు ఈ శాస్త్రం విన్న వెంటనే ఇది స్వపష్నతుల్యమనే బోధ కలుగుతుందని చెప్పలేము. సంస్కారము ననుసరించి వాక్యబోధ [క్రమంగా జరుగవలసివుంది కదా 1 స్వప్నసంకల్పాదులతో-కల్పించుకొన్న నగరంవంటిదే ఈ జగత్తు. అందువల్ల స్వప్నాదులే ఇక్కడ దృష్టైంతాలు. ఇతర దృష్టాంతాలు లేవు. పరిణామరహితమైన (బ్రహ్మానికి పరిణామ సహితమైన స్వర్ణాదులను ఉపమానంగా చెప్పినప్పుడు ఉపమాన ధర్మాలన్నీ ఆ పరబ్రహ్మకు అన్యయించవు. ఏకాంశంలోనే సాధర్మ్యం వుంటుంది.
ముముఖు వ్యవహార ఎకరణం 121 తత్త్వబోధకై బుద్దిమంతుడు నిర్విఖాదంగా దీన్ని గ్రహించాలి.
వస్తువులను చూడటానికి దీపకాంతి ఒక్కచే తోడ్పడుతుంది. సెమ్మె, నూనె, వత్తి మొదలైనవి కొంచెంకూడా ఉపయోగపడవు. దీపం కాంతితో మాత్రమే వస్తుద్యోతకమైన ట్టు ఉపమూనర. ఏకదేళంతో ఎరాత్రవే ఉపవేయాన్ని బోధపరుస్తుంది. అందువల్ల 'అహఠ (బ్రహ్మాస్మి' ఇత్యాది మహావాక్యాల అర్జాన్ని నిశ్చయిస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అపవిత్రమైన వికల్పాలతో వట్టి కుతర్కాలు చేసి ఆత్మప్రబోధానికి విఘాతం కలిగించరాదు.
రామచంద్రా! పైకి ప్రతికూలంగా తోచే మూటలు బాగా విచారిస్తే అనుభవంలో పరమానందాన్ని కలిగిస్తున్నాయి. తత్త్య విరుద్రమైన మాటలు ప్రియురాలి పలుకుల్లాగా తియ్యగా ఉండవచ్చు. అవి వట్టి ప్రలాపాలే కాని ప్రమాణాలు కాజూలవు.
మనకు శుభప్రదమైన మతి వున్నది. దానితో పరవఃార్జాన్ని (ప్రసాదించే సర్వశాస్త్రసమన్వయాత్మకమైన మహావాక్యార్ధం సిద్దిస్తుంది. కేవల కుతర్కబలంతో (ప్రతిపాదింపబడే సిద్దాంతాలకు ప్రామాణ్యం లేదు. మహావాక్యాలు ఆ సిద్దాంతాలను సమర్థించవు. అందువల్ల ఇదే సమ్మతమైన మతం.
(ప్రమాణ నిరూపణం
ఉపమానాలలో విశేషాంశమే సమానధర్మంగా పరిగణింపబడుతుంది. అన్ని అంళాలలోనూ సాదృళ్యం వుండాలంటే ఇక ఉపవూానోపవేయాలకు భేద వేమున్నది? దృష్టాంతం అవగతమైతే ఏకాత్మజ్ఞూనం కలిగించే శాస్రార్థం బోధపడుతుంది. మహావాక్యార్ధ బోధవల్ల అజ్ఞానం శమిస్తుంది. అదే నిర్వాణం. అందువల్ల ఉపమానోపమేయాలను గురించి లేనిపోని వికల్పాలు పెట్టుకోవద్దు. ఏ యుక్తితో నైనా మహావాక్యార్దాన్ని ఆశ్రయించాలి.
శాంతే పరవు(శ్రేయస్సు. దాన్ని పాందడానికి ప్రయత్నించు. అన్నం లభించినప్పుడు తినాలేగాని “ఎవరు వండారు ? ఎలా వండారు ?* ఇత్యాది వికల్సాలు ఎందుకు ? ఉపమానోపమేయాలకు ఎంతో భేదమున్నా ఏక దేశసాదృళ్యంతో పోలిక చెప్పబడుతున్నది.
రాతిలో పుట్టిన గ్రుడ్డిగోదురు కప్పలాగా వివేకం వీడీ భోగలాలసుడు కావడం మానవునికి తగదు. ప్రయత్నంతో శా(స్రార్టం ఏచారించి పరమపదం పొందాలి.
122 యోగవాసిం శా(స్రోపదేశం, సౌజన్యం, ప్రజ్ఞ, ఆత్మజ్జులతో సమాగమం - వీటిని ఆశ్రయించి ధర్మార్జాలను ఉపార్షించాలి. ఆపై తురీయపద మనబడే నాశరహితమైన ఆత్మశాంతి లభించేంతవరకూ విచార పరాయణుడు కావాలి. భవసాగరం దాటి తురీయపదంలో విశ్రమించినవాడు గృహస్ట్సుడైనా, సన్న్యాసి అయినా కృతాకృత కర్మలకు చెందిన ఐహికాముష్మీక ఫలాలు అతళణ్లీ అంటవు. శ్రవణ మననరూప మనో విత్షేపాలు అతని కుండవు. మందరా(ద్రి తొలగిన సము(ద్రునిలా అతడు నిశ్చలుడై వుంటాడు. బుద్రితో తత్త్వం గ్రహించాలి. పరమతదూషణ కుపయోగించే మాటలవల్ల (ప్రయోజనం లేదు. వాదోవాదాలకు దిగేవారు యుక్తాయుక్తాలను గ్రహించలేరు. ఏయుక్తితోనైనా తత్త్వం గ్రహించడమే ముఖ్యం. బుద్దిగుహలో అనుభవరూపంగా విశ్రమించి వున్న (బ్రహ్మతత్త్వంలో అనర్హకల్పన కావించేవాళ్లీ బోధచంచువు అంటారు. మబ్బు ఆకసాన్ని మలినం చేసినట్లు అజ్ఞుడు బ్రహ్మభావంలో అభిమాన వికల్పాలను సృష్టించి ఆత్మబోధను మలినం చేస్తాడు. నీటికి సాగయమే వునికిపట్టు. అలాగే ప్రమాణాల కన్నిటికీ ప్రత్యక్షమే ఆధారం. దాన్ని వివరిస్తాను, విను. - త్రిపుటీ ప్రత్యయ సిద్దమైన అపరోక్షానుభవమే ప్రత్యక్షం. అనుభూతి, వేదన, ప్రతిపత్తి - వీటితో కూడిన సాక్షివైతన్యాన్నే ప్రత్యక్ష మంటారు. మన మతంలో ఆ చైతన్యమే జీవుడు. అతడే వృత్తుపాధితో కూడినప్పుడు 'సంవి'త్తనీ, అహం (ప్రత్యయంతో కూడినప్పుడు ' ప్రమాత అనీ, విషయాకారవృత్తితో కూడినప్పుడు “విషయం' అనీ చెప్పబడుతున్నాడు. నీరు అలలు మొదలైన పెక్కు రూపాలతో (ప్రకాశించునట్టు ఈ చైతన్యమే సంకల్ప వికల్పాది (భ్రాంతులతో జగద్రూపంలో స్పురిస్తున్నది. మొదటి సృష్టికి కారణం కాని సాక్షి వైతన్యం తానే సృష్టిగా రూపొందింది. స్నష్షికి కారణమైనట్టు ప్రకాశిస్తున్నది. నిజానికి చైతన్యంలో కార్యకారణత్వాలు లేవు. అవిచారదశలో అజ్ఞానికి అవి ఉన్నట్టు భాసిస్తాయి. అందువల్లనే జగద్రూపం వ్యక్తమవు తున్నది. చక్కగా విచారిస్తే జగ్యద్రూపం నశించి అపరిచ్చిన్నమైన పరవు పురుషార్హస్వరయాపం అనుభవానికి వస్తుంది. తత్త్వవిచారపరుడు ఆత్మను గ్రహించినప్పుడు విచారాతీతమైన బ్రహ్మగా మారిపోతాడు. ఇలా (ప్రపంచం బాధితమైనప్పుడు మనస్సు బుద్దీంద్రియకర్మలతో సవో
ముముతు వ్యవనోర ప్రకరణం 123 శాంతిస్తుంది. అప్పుడు జ్ఞానేంద్రియాలు తమ పనులు చేసినా కర్మఫల మంటదు. చేయకున్నా నష్టంలేదు. నడపకపోతే యింత్రం నడవదు. అలాగే మనస్సు శాంతిస్తే కర్మేంద్రియాలు కర్మలలో ప్రవర్తించవు కొయ్య మేకను కదల్బటానికి దాని క్రింది దారాన్ని లాగాలి. అలొగే మనోయంత్రాన్ని నడపటానికి వేదన (విషయవాసనలు) కావాలి. గాలిలో చలనశక్తి నిహితమై వున్నట్టు భోగాలకూ, చింతలకూ నిలయమైన జగత్తు విషయ వాసనల్గో సంస్కారరూపంతో వుంది.
(ప్రాణుల కర్మ పరిపక్వమైనప్పుడు సర్వాత్ముడైన ఈశ్వరునిలో సత్త్వగుణ 'ప్రధానమైన వాసన ఉదయిస్తుంది. ఆ వాసనే దిక్కులుగా, కాలంగా, బాహ్యాంతర పదార్జాలుగా భాసిస్తుంది. సర్వాత్ముడు దేహాదిదృశ్యపదార్జాలను నిజస్వరూపంగా భావించి జీవు డవుతాడు. భావానుగుణమైన రూపం కల్లి వుంటాడు. వస్తుస్వ్తరూపం తన అభి(ప్రాయానికి అనుగుణంగా భాసిస్తుంది కదా !
(ద్రష్ట అయిన పరమాత్ముడు సర్వస్వరూపుడు కావడంవల్ల దృశ్యం కూడా కావచ్చు. (ద్రష్ట, వున్నప్పుడే దృశ్యానికి వునికి సిద్దిస్తుంది. కాని (ద్రష్షకు దృశ్యత్వం వాస్తవం కాదు. అందుచేత బ్రహ్మ కారణరహితమైనదని సిద్దించింది. ప్రత్యక్ష ప్రమాణంతోనే దాని ఉనికి నిరూపితమయింది. అనుమానాది ప్రమాణాలు (ప్రత్యశ్షానికి అంశాలు మా(త్రమే. బ్రహ్మమే సకల ప్రమాణ సిద్రమైన తత్త్వం.
ఉపాసకుడు ఇంద్రియాలను నిగ్రహించి దైవాన్ని నిరసించి పొరుషంతోనే ఉత్తమపదాన్ని అధిష్టీస్తాడు. హృదయంలోనే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. రోమచంద్రా ! నీవు నీ బుద్రిబలంతోనే బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలి. ఆ ఫ్ర్రీతి కఠిగేటంతవరకూ ఆచార్యులు బోధించే ప్రమాణసిద్ద సత్యమతాన్ని అనుసరించి తత్త్వవిచారం సాగించు.
సదాబదార విరూపణం
మొదట సత్సాంగత్యం చేసి (ప్రజ్ఞను పెంపాందించుకోవాలి. పీదప మహాపురుష లక్షణాలను అలవరచుకొని మహాపురుషత్వాన్ని సాధించాలి. ఎవరెవరిలో ఏయే గొప్ప గుణం వుంటుందో, ఆయా గుణాన్ని గ్రహించి బుద్దిని వృద్ది చేసుకోవాలి.
రామా! శమాదిగుణాలతో కూడిన ప్రజ్ఞాశాలిత్వమే మహాపురుష లక్షణం సమ్యక్ జ్ఞానం లేకపోతే అది సిద్దించదు. వర్షంవభ్ల క్ర్ త్త అంకురాలు వృద్ది పొంది
124 యోగవాసిష్టం ఫల(ప్రదాలవుతాయి. అలాగే జ్ఞానం వల్ల శీమదమాదులు పెంపొంది ఆత్మసుఖం అన్నాత్మకమైన యజ్ఞాలవల్ల వర్షం, వర్షం వల్ల పంటలూ వృద్రి పొందినట్టు జ్ఞానంవల్ల శమాదులూ, శమాదులవల్ల జ్ఞానమూ వృద్ది పొందుతాయి. తామరల వల్ల మడుగు, మడుగువల్ల తా .రలు శో భిల్లినట్లు శమాదులవల్ల జ్ఞానం, జ్ఞానంవల్ల శమాదులు శో భిల్లుతాయి. జ్ఞాన సదాచారాలు కూడా ఇలాగే ఒకదాని కొకటి వికాసం కల్గించుకొంటాయి. ధీమంతుడు ప్రయత్నంతో జ్ఞానసదాచారాలను అభ్యసించాలి. నాయనా 1 జ్ఞానసదోచారాలను ఏకకాలంలో అభ్యసించకపోతే వాటిలో ఏదీ పట్టువడదు. వ్వేత్రపాలిక పాటలు పాడుతూ, చప్పట్లు చరుస్తూ పక్షులను తోలి గీతానందాన్ని సాధిస్తుంది. అలాగే నిస్స్పృహుడూ, కర్తృత్వరహితుడూ అయినవాడు జ్ఞాన సదాచారాలతో (భమ [ప్రమాదాది విఘ్నాలను దూరీకరించి పరమపదం పొందుతాడు. రఘునందనా ! ఇంతవరకూ సదాచార [క్రమం చెప్పాను. ఇక జ్ఞాన క్రమాన్ని గూర్చి చెబుతాను. కీర్తికరము, ఆయుఃప్రదము, మోక్షప్రదాయకము అయిన సచ్చాస్త్రమిది. బుద్రిమంతుడు దీన్ని ఆప్పుడయిన తత్త్వజ్ఞునివద్ద ఆకర్షించాలి. మురికినీరు చిల్లగింజలవల్ల తేరుకొంటుంది. అట్లే ఈ శాస్త్రం వినడం వల్ల నిర్మలబుద్లివై నీవు పరమపదం పాందగలవు. ఈ తత్త$ం అవగతమైనప్పుడు సాధకుని మనస్సుకు అప్రయత్నంగా పరమపదం లభిస్తుంది. అజ్జానవినాశకము, ఉత్తమము “అయిన ఆ సిద్ది కలిగిన పిదప అంతఃకరణం మళ్లీ దానిని ఎన్నటికీ విడువజాలదు. ముముక్షు వ్యవహార (ప్రకరణం సమాప్తం. శ్రీ సద్గురు పరబ్రహ్మార్హణమస్తు. ఓం తత్సత్ ఓమ్. త్త
యోగవాసిష్పం - ఉత్పత్తి ప్రకరణం ఖీ ప్రథమ భాగం - విషయసూచిక
- బంధకారణం . క్షే
- మొదటి సృష్టికర్త లం డే 3౩. బంధహేతువు . 8ి
- ఉత్పత్తిప్రకరణార్హకల్పనం . 10
- మూలఠఅకారణమైన దేవుని స్వరూపం ల. కైక
- ముముక్షుప్రయత్నోపదేశం ల 16
- ఉనికి లేని దృశ్యం ల కే
- సచ్చాస్త్ర నిరూపణం . 20
- పరమ కారణ వర్ణనం లం 22
- మహాకల్పాంతంలో శేషించిన పరమభావం 26
- పరమార్ధవర్షనం 30
- జగదుత్పత్తి 32
- స్వయంభూత్పత్తి లం... 34
- బ్రహ్మప్రతిపాదనం న. 36
- లీలోపాఖ్యానం ఎం 40
- రాజవర్లనం . శే
- రాజ్జీపరిదేవనం ..
- సందేహరాష్ట్రవర్హనం వ.
- జగద్భ్రాంతి 46
- మండపాఖ్యానం న. త్రి
- బ్రాహ్మణ మరణం . తం
- పరమార్ధ ప్రతిపాదనం ఎస్1
- విశ్రాంత్యుపదేశం ల... వడ
- విజ్ఞానాభ్యాసం ఎ ర9
- జ్ఞానదేహాల ఆకాళశగమనం . 6!
- గగన వర్షనం 0 62
- భూలోక వర్ణనం 64
1! 28. సిద్ద దర్శన హేతువు న. 65 29. జన్మాంతర వర్ణనం . 68 30. గిరిగ్రామం ల. 72 31. పరమాకాళం . 73 32. విచిత్ర బ్రహ్మాండ వర్ణనం లలల 76 33. యుద్ద (పేళ్షీకాఫ్టితాకాశవర్దనం న. 78 34. యుద్ధప్రారంభం య. 79 35. యుద్రప్రేక్షకుల వచనాలు ఎం 80 36. యుద్ద వర్ణనం వ. 82 37. సమరానంతర సంస్మరణం వ. 84 38. (భ్రాంతి విచారం . 88 39. స్వప్నపురుష సత్యత్వ నిరూపణం లలలం ౦ 40. అగ్నిదద్ధ నగరం న. రిక 41. జగద్ర్రహ్మ వర్లనం ఎం. 95 42. సత్య కామ, సత్య సంకల్పాలు వ. 98 43. విదూరథుని నిర్గమనం ల 100 44. విధూరథ సింధు సమాగమం ల 101 45, ఆయుధ వర్ణనం లం 102 46. తృతీయా్త్ర యుద్దం ల. 103 47. విధూరథుని మరణం లం. 104 48. సింధు రాష్ట్ర వర్ణనం ఎలి. [05 49. మరణానంతర దేహప్రతిభ ఎల. 106 50, సంసార విదిత వేద్యం ల. 109 51. మరణ విచారం లం కేసే! 52. సంసార మరణావఫ్ట లట క్రేపేడీ 53. మరణానంతర ప్రేతవ్యవప ఎం క19 54. స్వష్నార్దవిచారం ఎం. కే2ై! 55. పద్మజీవనం లు. 124 56. పద్మ నిర్వాణం ఎంఎం 126 57. ప్రయోజన వర్ణనం ౯
స్తం ప్ర ఒడి యోాగవా సిష్టం ఉత్పతి ప్రకరణం (టగ్రథమ ఖాగం బంధకారణం
మహావాక్య (ప్రబోధంవల్ల కలిగే ఆత్మ(ప్రకాశంతో బ్రహ్మవేత్త బ్రహ్మమై భాసిస్తాడు. ఈ దృళశ్య(ప్రపంచం ప్రత్యగాత్మలో స్వపష్నంలా తోస్తుంది. ఎవడు (శ్రవణాదులైన ఉపాయాలతో బ్రహ్మ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు గ్రహిస్తాడో, అట్టి బ్రహ్మవేత్త మోక్షఫలాన్ని జీవించివుండగానే అనుభవిస్తాడు.
దీన్ని బట్టి అధిష్థానంకంటే అధ్యస్తం వేరుగా లేదని తేలుతున్నది. ఈ న్యాయాన్ననుసరించి సృష్టిని (బ్రహ్మంగానే భావించాలి, అప్పుడు ఈ స్పష్టి ఏమిటి? ఇది ఎలా పుట్టింది? ఎవరిలో ఉన్నది? ఎలా పరిణమిస్తున్నది? చివరి కెలా నశిస్తుంది? అనే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం లేదు.
ఓ బుద్దివుంతుడా! నేనిప్పుడు వస్తుతత్త్వాన్ని ప్రావూణికంగానూ, 'క్రమంగానూ, సమగ్రంగానూ వివరిస్తాను విను.
ఆకసం వలె నిరాకారమైన వైతన్యమే జీవరూపమై జగత్తును స్వప్పతుల్యంగా చూస్తున్నది, నీవు, నేను - అని వివిధ రూపాలతో కనిపించే ప్రపంచ స్వరూపం నిజంగా కలలోని సంసారంవంటిది.
ముముక్షు వ్యవహార ప్రకరణం ముగిసింది. తర్వాత ఉత్పత్తి ప్రకరణం
2 యోగవాసిష్టం నిరూపిస్తాను. దృశ్యం ఉండడం వల్లనే బంధం ఏర్పడింది. అది లేకపోతే బంధం లేదు. దృశ్యం తొలగిపోయే పద్రతి యిప్పుడు వివరిస్తాను. జగత్తులో ఏది పుడుతుందో, అదే పెరుగుతుంది. మోక్షం, స్వర్గనరకాలు పొందేది గూడా అదే. నీకు బంధవినాశకమైన స్వరూప జ్ఞానం కల్లడాని కవసరమైన (ప్రబోధం చేస్తాను. సంసారదశలో మాత్రమే ఉత్పత్తి వినాశాదులు గోచరిస్తాయి. కాని ఆత్మకు నిజంగా ఉత్పత్తివినాశాదివికారాలు లేవు. రాఘవా! ఈ ప్రకరణార్జాన్ని ఇప్పుడు సంత్షేపంగా విను. తర్వాత దీనిని విస్తృతంగా విశదీకరిస్తామ. ఈ కనిపించే స్పావర జంగమౌాత్మకమైన జగత్తంతా సుషుప్తిలో స్వప్నంలాగా కల్పాంతంలో నశిస్తుంది. అప్పుడు శేషించిన సత్పదార్హం నామరూపరహితం. అది చీకటీ క్సాదు, వెలుగూ కాదు. అది క్రియాహీనం, అపరిచ్చిన్నం. వ్యవహారం కొరకు పండితులు దానికి '“బుతం, ఆత్మ, పరం, (బ్రహ్మ, సత్యం” ఇత్యాదినామాలు కల్పించారు. చిత్స్వభావంతో ఉంటూనే ఆత్మ మోహవశాన జడరూపంతో స్ఫురిస్తూ కుత్సితమైన జీవత్వాన్ని పాందినదానిలా గోచరిస్తుంది. పిదప ఆ చైతన్యం (ప్రాణధారణం వల్ల చంచల మవుతుంది. భౌతికమైన ఆకృతి దాలుస్తుంది. మననంతో మాంద్యం వహించి మనస్సుగా పరిణమిస్తుంది. సాగరం నుండి పొడచూపే అలలాగా సుస్థిరమైన పరమాత్మనుండి సంకల్ప వికల్పాత్మకమైన మనోధర్మం (ప్రకటిత మవుతుంది. హిరణ్యగర్భాఖ్యమైన ఆ చైతన్యమే తన సంకల్ప శక్తితో ఈ ప్రపంచ మనే ఇంద్రజాలాన్ని విస్తరింపజేస్తున్నది. స్వర్ధ కటకం స్వర్థంకంటిె వేరు కాదు. అలాగే జగత్తు బ్రహ్మంకంటె వేరు కాదు. జగత్తు ఉనికి బ్రహ్మంలోనే పర్యవసిత మవుతుంది. ఎండమావిలోని అలలాగా ఉనికి లేనిదైనా ఈ జగత్తు ఉన్నట్టు తోస్తున్నది. అందుకే తత్త్వం తెలిసిన పండితులు ఈ జగుత్తును ' అవిద్య, సంసారం, బంధం, మాయ, మోహం, మహత్తు, తమస్సు” అనే పేళ్ళతో వ్యవహరించారు. చంద్ర వదనుడవైన ఓ రామచంద్రా! మొదట బంధ స్వరూపం ఎలాంటిదో వివరిస్తాను, విను. తర్వాత మోక్ష స్వరూపం తెలిసికోగలవు. నాయనా! దృశ్యము యొక్క ఉనికి (ద్రష్టకు బంధమని చెప్పబడుతున్నది. దృశ్యబలం వల్ల (ద్రష్ట బంధింపబడుతున్నాడు. దృశ్యం తొలగితే అతడు విముక్తు
ఉత్పత్తి ప్రకరణం 3 డవుతాడు. జగుత్తు, నీవు, నేను- అని ఈ రీతిగా మిథ్యా కల్పనలతో కూడిన జగస్వుకే దృశ్యమని పేరు. ఆది ఉన్నంత వరకూ మోక్షం సిద్దించదు.
“ఇది లేదు, ఇది లేదు' అనే సంకల్ప జనకమైన వ్యర్థ ప్రలాపాలతో ద్రశ్యవ్యాధి పెరుగుతుందే కాని శమించదు. తర్క వితర్కాల వల్హా, తీర్ణయాత్రాది నియమౌలఎల్లా మరొక దృశ్యజగత్తును స్నష్టించుకోగలమే కాని ఉన్న దృశ్యాన్ని రూపుమాపలేము. దృళ్యజగత్తు వాస్తవంగా ఉనికిగలదే అయితే అది ఎన్నటికీ శమించదు. లేనిదానికి ఉనికి లేదు. ఉన్నదానికి లేమి లేదు. అగోచర చిద్రూపాత్ముడైన (ద్రష్టకు తానున్న ప్రతిచోటా, పరమాణువులో సైతం దృళశ్యస్తూర్తి కలుగుతూనే వుంటుంది. అందువల్ల నేను జగత్తుయొక్క అస్తిత్వభ్రమను సురాపాన తృప్తిని తొలగించుక న్నట్టు తాలగించుకొన్నాను.
రామా! పరమాణూదరంలో లాగానే చిదాదర్శంలో కూడా దృళ్ళ ప్రతిబింబం పడే తీరుతుంది. అద్దం ఎక్కడున్నా - అక్కడి కొండలు, సముద్రాలు, భూమి, నదీజలం దానిలో ప్రతిబింబిస్తాయి. అలాగే చిదాదర్శంలో కూడా దృళ్యం ప్రతిబింబిస్తుంది. అందువల్లనే జన్మ జరామరణాది దుఃఖాలు, జాగ్రదాద్యవప్టలు మొదలైనవి చిత్స్వరూపమైన ఆత్మకు కలుగుతున్నాయి.
సవికల్ప సమాధి సమయంలో 'నేను దృశ్యాన్ని తుడిచివైచాను' అనే సంస్కార ముంటుంది. ఈ సంస్కారవే. సంసార స్మరణకు తగిన అక్షయ బీజం. ఆబీజమున్నంత వరకు నిర్వికల్పసమాధి సిద్దించదు. నిర్వికల్ప సమాధిలో మాత్రమే చేతనత్వాన్ని, తురీయస్టితిని పొందగలము. నిద్రనుండి మేల్కొన్నవానికి పూర్వజ్ఞానం స్పురించినట్టు సమాధినుండి లేవగానే దుఃఖరూపమైన జగత్తు ఉన్నదున్నట్టు భాసిస్తుంది.
రామచంద్రా! మళ్లీ ముందటి దుఃఖమే అనుభవానికి వచ్చే స్టితిలో ఈ సమాధుల వల్ల లాభమేమి? క్షణకాలం కళ్లి నశించే సమత్వసుఖం ఒక సుఖమా? ఒక వేళ అక్షయసుషుప్తీ వంటి నిర్వికల్ప సమాధిలో ఉండడమే బ్రహ్మపదప్రాప్తి అనుకొందామా? మూల దృళ్యం మనస్సులో ఉన్నంతవరకూ దృశ్యం పూర్తిగా నశించదు. చిత్తం ప్రవేశంచిన ప్రతిచోటా జగ(ద్ర్రమ కలిగే తీరుతుంది.
ఒకవేళ (ద్రష్ష సమాధిలో తన్ను పొషాణస్వరూపుడనని భావించుకొన్నా ఆభావననుండి తేరుకోగానే దృళ్యం స్పురిస్తుంది. అంతే కాదు, పాషాణ తుల్యమైన
౯10
క! యోగవాసిష్టం నిర్వికల్ప సమాధి సుస్రిరంగా ఎవరికీ కల్లదనేది అనుభవసిద్దమైన విషయం. అలాంటి సమాధి సిద్దించినా, అది అనాది, అక్షయము, శాంతము అయిన చి'ద్రూపముక్తిగా పరిణమిస్తుందనేది కల్ల. దృశ్యం సత్యమే ఐతే, అది ఎన్నటికీ నశించదు. తపోజపధ్యానాలతో దృశ్యం శమిస్తుందనుకోవడం అజ్ఞాల కల్పన మాత్రమే. అంకురించబోయే తీగను అంతర్భవించుకొన్న బీజం పద్మంలో ఉన్నట్టు (ద్రష్షలో దృళ్యబుద్ది సంస్కారరూపంలో దాగి వుంటుంది. వస్తువుల్లో రసం, తిలాదుల్లో తైలం, పూలలో వాసన లాగా (ద్రష్టలో దృశ్యబుద్ది ఇమిడి వుంటుంది. కర్పూరాది పదార్దాలు ఎక్కడ ఉన్నా సుగంధాన్ని వెదజల్టుతాయి. అదేరీతిగా చిదాత్మ ఎక్కడ ఉన్నా దానిలో దృశ్యజగత్తు ఉదయిస్తూ వుంటుంది. స్వప్నసంకల్పమనో రాజ్యాదులు హృదయంలో ఉన్నట్లే దృశ్యపదార్హం కూడా హృదయగతమే అని స్వానుభవంతో గ్రహించు. ఊహల్లో ఉదయించిన పిశాచం బాలుళ్లీ హతమార్చినట్టు దృశ్యపిశాచి ద్రష్షను పారిగొంటున్నది. బీజంలోని అంకురం అనుకూల దేశకాలాలు తటస్ట్రించగానే పాడచూపినట్టు హృదయంలోని దృశ్యబుద్ది తగినకాలంలో తన్ను వ్యక్తం చేసుకొంటుంది. మొలకను వెలువరించే శక్తి బీజద్రవ్యంలోనే దాగివున్నట్టు దృళ్యజగత్తు చిన్మాత్రస్వరూపుడైన ఆత్మలోనే ఇమిడివున్నది. మొదటి సృష్టికర్త
రాఘవా! ఇప్పుడు నేను చెప్పబోయే ఆకాళజుని చరిత్ర విను. ఇది వెవులకింపైనది. దీనివల్ల ఉత్పత్తి ప్రకరణారం నీకు చక్కగా బోధపడుతుంది.
ఆకాళశజుడనే పరమ ధార్మికుడైన ద్విజుడు ఒకడుండేవాడు. అతడు సదా ధ్యాననిష్టుడై ప్రజలకు హితం చేసేవాడు. అతడు చిరకాలం జీవించడం చూచి మృత్యుదేవత ఇలా అనుకొన్నది-
“నాకు నాశం లేదు. నేను (క్రమంగా 'ప్రాణు లన్నింటినీ భక్షిస్తున్నాను. కాని ఎందుకో ఈ వి'ఫ్రుణ్లి భక్షించలేకున్నాను. రాయిని కత్తి భేదింపజాలనట్లే ఇతని విషయంలో నా శక్తి వ్యర్ధమవుతున్నది.
ఈ విధంగా ఆలో చించి మృత్యువు అతళ్లీ చంపాలన్న దృఢ నిశ్చయంతో అతడు నివసించే నగరానికి వెళ్ళింది. ఉద్యమపరులు ఆశయం నెరవేరేదాకా తమ పనులు
ఉత్పత్తి ప్రకరణం క్ వదలరు కదా!
అతని యింట ప్రవేశించగానే ప్రళయకాలాగ్నిని బోలిన మంటలు మృత్యువును చుట్టుముట్టి దహింపజ్చ్చాయి. అయినా వెనుదీయకుండా అగ్నిజ్వాలావలయాన్ని శేదించుకొని మృత్యువు లోనికి ప్రవేశించింది. ప్రయత్నపూర్వకంగా ఆ ద్విజుణ్లి చేతులతో పట్టుకోవా లనుకొన్నది. కాని సంకల్పంత' కల్పించుకొన్న పురుషుని పట్టుకో జూలనట్లే వేయిచేతులు గల బలశాలి అయిన ఆ మృత్యుదేవత ఎట్టు యెదుట కన్పిస్తున్న ఆ వి(ఫ్రుళ్లీ పట్టుకోలేక పోయింది.
తరువాత యముని వద్దకు తిరిగి వచ్చి '' ప్రభూ! ఆకాళజుళ్లి నేను ఎందుకు భక్షింపలేకపోతున్నాను?'' అని ప్రశ్నించింది.
సంళయనివారకుడైన యమధర్మరాజు ఇలా అన్నాడు-
““మృత్యువా! నీవు ఇతర సహాయం లేకుండా బలప్రయోగంతో ఎవరినీ చంపలేవు. వారి వారి కర్మలే ఆయా జీవుల చావుకు కారణాలు. నీ అశక్తతకు కారణం కర్మ సహాయం లేకపోవడమే కాని వేరేమీ కాదు. అందువల్ల అతణ్లో చంపదలిస్తే అతని కర్మలకై అన్వేషించు. వాటి తోడ్పాటుతో మాత్రమే నీ వతళ్లో (మింగగలవు.
పిదప మృత్యువు ఆకాళజుని కర్మలను వెదకసాగింది. దిక్కులు, దిగంతాలు, అడవులు, మడుగులు, కొండలు, కోనలు, సాగరతీరాలు, గ్రామాలు, పట్టణాలు, రాష్టైలు - ఇలా భూమండలమంతా పరి(భ్రమించింది. ఎంత వెదకినా అతని కర్మలు దాని కంటబడలేదు. వంధ్యాపు త్రుణ్లీ, సంకల్పకల్పిత పర్వతాన్నీ అన్వేషించే ప్రాజ్ఞుని (ప్రయత్నం వ్యర్హమైనట్లే మృత్యుదేవత ఉద్యమం నిష్పులమయింది.
మళ్ళీ సర్వజ్ఞుడైన యముని చెంతకు వచ్చి ఆకాళశజుని కర్మలు ఎక్కడ దాగి వున్నవో చెప్పమని ప్రశ్నించింది. ఆయన చాలసేపు ఆలోచించి ఇలా అన్నాడు-
““వృత్యువా! ఆకాళశజునికి ఎలాంటి కర్మలూ లేవు. అతడు కేవలాకాశం నుండి జన్మించాడు. అందువల్ల ఆకాశస్వరూపుడే కాని వేరు కాడు. అలాంటి వానికి సహకారి కర్మలు ఉండవు. గొ(డ్రాలి బిడ్డకు (ప్రాక్హనకర్మ లేదుగదా! అలాగే పూర్వకర్మలతో అతనికి ఏవూత్రం సంబంధం లేదు. ఆకసంలో పెను(వ్రూకు లుండవు. అలాగే కారణరహితుడైన ఆకాశరూఫునికి పూర్వ కర్మలుండవు అందువల్ల అతని విత్తంలో చాంచల్యానికి చోటు లేదు. ఈ జన్మలో అనుభవయోగ్యాలైన ప్రారబ్బకర్మలతోటి సంబంధం కూడా అతనికి లేదు. అతడు నిత్యుడు, ఎజ్జానాకాశస్వరూపుడై
6 యోగవాసిష్టం వుంటాడు. అతనిలో మనకు కనిపించే (ప్రాణస్పందం (భ్రమ మాత్రమే. అతనికి దానిలో కర్మబుద్ది లేదు. స్తంభంలో చెక్కిన బొమ్మ స్తంభం కంటే వేరుకాదు. అయినా మనకు వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే చిదాకాశరూపమైన పరతత్త్వం నుండి ప్రభవించిన ఈ విప్రుడు విప్రరూపంతో కన్పిస్తున్నా పరతత్త్వం కంటే వేరు కాడు సుమా! నీటిలో (ద్రవత్వం, ఆకసంలో శూన్యత్వం, గాలిలో చలనం సహజంగా వుంటాయి. అదేరీతిగా ఇతడు పరమపదంలో సహజంగా వున్నాడు. ఇతనికి సంచిత (ప్రారబ్ద కర్మలు లేవు అందుకే ఇతడు సంసారానికి వశపడలేదు. సహకారి కారణాలు లేకుండా పుట్టే వస్తువు స్వకారణం కంటే భిన్నంగా వుండదు. ఇది అనుభవసిద్దం. కారణరహితుడవటం వల్లనే ఇతడు 'స్వయంభువు' అనబడుతున్నాడు. ఇతనికి కర్తృత్వం లేదు. ఇలాంటివాళ్లో నీవెలా ఆ(క్రమించగలవు? ఎవడు “నేను మరణిస్తాను అని బుద్దితో కల్పన చేసుకొంటాడో, "నేను పంచభూత వికారుడను' అని నిశ్చయించుకొంటాడో, వాడే పార్టివు డవుతాడు. అలాంటి వాళ్లీ మాత్రమే నీవు పట్టుకోగలవు. ఈ వి'ఫ్రునికి పంచభూతాలతో సంబంధంలేదు. ఇతడు రూపరహితుడు. ఆకసాన్ని గత్రాటితో కట్టగలమా? అలాగే నీ వితణ్లి పట్టుకో జూలవు”' అప్పుడు మృత్యువు ఇలా అన్నది- '“భగవన్! ఆకాశం శూన్యం. అందుండి ఇతడెలా పుట్టాడు? పృథివ్యాది పంచభూతాలు ఒకప్పుడు ఉండడం, మరొకప్పుడు లేకపోవడం ఎలా సంభవిస్తుంది? ఇది వివరించండి!
అందుకు యముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు -
“ఈ వి'ఫ్రుడు ఎప్పుడూ పుట్టలేదు. అతడు లేని సమయమూ లేదు. కేవల విజ్ఞాన స్వరూపుడై అతడలాగే ఉంటున్నాడు. మహాప్రళయం వచ్చినప్పుడు ఏమీ మిగలదు. శాంతం, అజరం, అనంతం, శూన్యం, సూక్ష్మం, నిరుపాధికం, నిత్య(ప్రకాశం - అయిన బ్రహ్మ మాత్రమే మిగిలి వుంటుంది.
పిదప స్పష్టాదిలో ఈ పరబ్రహ్మంవద్ద తేజో మయమైన విరాట్స్పురుషుని కొండవంటి శరీరం దేహభావంతో కొంచెంగా స్ఫురిస్తుంది. అప్పుడు కాకతాళీయంగా మిథ్యారూపమైన ఆకారం (భాంతులైన వున బోంట్లకు గోచరిస్తుంది. ఆ విరాట్పురుషుడే ఈ విప్రుడు. స్పష్టి ప్రారంభంలో పరమాకాశంలో నిర్వికల్పుడై, చిదాకాశస్వరూపంతో ఇతడుంటాడు. ఇతనికి దేహం లేదు, కర్మలు లేవు, కర్తృత్వం
ఉత్పత్తి ప్రకరణం 7 లేదు ఇతడు శుద్రచిదాకాశస్వరూ పుడై, ఎజ్ఞానఘనుడై ప్రకాశిస్తాడు. ఇతనికి తాల్లించి వాసన లేవీ ఉండవు. బహి ర్ముఖమైని చిత్రవృత్తి నశించగానే ఇతని ప్రాతిభాసికరూఫం కూడా అంతరిస్తుంది. అధిష్టానతత్త్వం అవగతమైైతే బహిర్ముఖ (ప్రవృత్తులు సైతం సమసిపోతాయి.
వృాత్యువా! ఇలాంటివానికి ప్పథివ్యాది భూతాలతో సంబంధం ఎలా వుంటుంది? ఇతణ్లీ పట్టుకోవటానికి ప్రయత్నించవద్దు. ఆకసాన్ని ఎవడైనా పట్టుకోగలడా?'*
అది విని మృత్యుదేవత ఆశ్చర్యపడి తన నివాసానికి తరలిపోయింది.
శ్రీరాముడు : - భగవన్! మీరు నిర్దేశించిన విప్రుడు నా ప్రపితామహుడైన (బ్రహ్మదేవుడే అని నే ననుకాంటున్నాను. అతడు స్వయంభువు, ఏకాత్ముడు, బీవసమ్మ్టిరూపుడు.
వసిష్ట మహర్షి : - రామా! ఇది నిజం, నీకు నేను బ్రహ్మదేవుని గూర్సే చెప్పాను. అతణ్జో గురించే పూర్వం వృత్యువు యవునితో సంవాదం చేసింది. మన్వంతరకాలంలో అది అందరినీ భక్షిస్తూ బ్రహ్మను కూడా భక్షించడానికి (ప్రయత్నించింది. ఎప్పుడూ చేసేపనిమీద సహజంగా (ప్రవృత్తి కలుగుతుంది కదా! అప్పుడు యమధర్మరాజు మృత్యువు నుద్దేశించి ఈ ఉపదేశం చేశాడు.
ఆకాశ శరీరుడైన బ్రహ్మను మృత్యువెలా ఆ(క్రమించగలదు? మనోమా్రుడు, సంకల్పరూపుడు, చిదాకాశుడు, కారణరహితుడు - అయినవానికి కార్యకారణభావాలు లేవు. సంకల్ప పురుషుని లాగానే స్వయంభువు అయిన బ్రహ్మ పంచభూత సంబంధం లేకుండా (ప్రకాశిస్తున్నాడు. ం
నిర్మలాకాళంలో వముత్యాలున్నట్టూ, సంకల్పంలోనూ, కలలోనూ పట్టుణమున్నట్టూ కనిపిస్తుంది. అదేవిధంగా ప్పథివ్యాది సంబంధం లేకపోయినా ఈ స్వయంభువు సంబంధం కలవానిలా భాసిస్తున్నాడు.
కేవల పరమాత్మలో దృశ్యత్వ - (ద్రష్ష్రత్వాలు లేవు. అయినా అతడు చిత్స్వ్వభావుడై ప్రకాశిస్తున్నాడు. సంకల్పాత్మకమైన వునస్సునే బ్రహ్మదేవు డంటున్నారు. ఇతనికి పృథివ్యాది సంబంధంలేదు. చి'త్రికారుని మనస్సులో ఆకృతిరేని చిత్ర ప్రతిమ స్పురిస్తుంది. అదేరీతిగా విదాకాశము యొక్క స్వచ్చమైన మనస్సే ('ప్రజాపతిరూపంలో సాక్షాత్చరిస్తున్నది. ఆది మధ్యాంతరహితమైన కేవలచిదాకాశమే
8 యోగవాసష్టం 'బ్రహ్మరూపంతో భాసిస్తున్నది. చిత్తప్రభావం వల్ర ఆకారవంతుడైన పురుషుని లాగా ఆ స్వయంభువు తోస్తున్నాడు కాని గ్ డ్రాలి బిడ్డకు లాగానే నిజానికి అతనికి శరీరం లేనే లేదు.
బంధహేతువు శ్రీరాముడు : - బ్రహ్మన్! పృథివ్యాదిభూత సంబంధంలేని శుద్రమనస్సును మీరు బ్రహ్మ అని చెప్పారు. కాని నాకూ, మీకూ, ఇతర ప్రాణులకూ శరీరం ధరించడానికి ప్రాక్తనస్మృతి కారణమవుతున్నది. అలాగే బ్రహ్మకు కూడా ఆ స్మృతి ఎందుకు కారణం కాదు? ఇది వివరించండి! వసిష్టుడు : - రామా! పూర్వకర్మతో కూడిన పూర్వ దేహమున్న వారికి మాత్రమే సంసారస్టితికి పూర్వస్మృతి కారణమవుతుంది. బ్రహ్మకు పూర్వ కర్మలు లేవు. ఇక పూర్వస్మృతి ఎలా కలుగుతుంది? అందువల్ల అతని శరీరానికి కారణమంటూ ఏదీ లేదు. అందుకే అతనికి స్త్వయంభువని పేరు. అతని దేహం ఆతివాహికమే (సూత్మమే) కాని ఆధిభాతికం (స్టూలం) కాదు. శ్రీరాముడు : - సమస్త ప్రాణులకూ ఆతివాహికమనీ, ఆధిభౌతికమనీ రెండు శరీరా లుంటాయి. బ్రహ్మకుమా(త్రం ఆతివాహిక శరీరం ఒక్కటే ఉండటానికి కారణ మేమి? వసిష్టుడు : - 'పప్రాణులందరూ పంచభూతాది కారణాలతో కూడినవారే. అందువల్ల వాళ్లకు పై రెండు దేహాలూ ఉంటాయి. బ్రహ్మ కారణరహితుడు. పైగా ప్రాణుల కందరికీ కారణమైన వాడతడే. అందుచేత అతనికి ఆతివాహిక దేహం ఒక్కచే వుంటుంది. ఆద్యప్రజాపతికి భౌతిక దేహం లేదు. ఆతివాహిక దేహంతో అతడు చిదాకాళ స్వరూపుడై భాసిస్తున్నాడు. సంకల్పమాతత్ర శరీరుడై ప్రజలను సృష్టిస్తున్నాడు. 'ప్రజలుకూడా చిదాకాశ స్వరూపులే. ఏది దేని నుండి జన్మిస్తుందో అది దానికంటే వేరు కాదన్న సంగతి అందరికీ అనుభవసిద్దమే కదా! పురుషుడు నిర్వాణమాద్రుడు, పరమ బోధస్వరూపుడు. అతడెప్పటికీ విదాకాశరూపుడే కాని భౌతికరూపుడు కాజాలడు. సంసార వ్యవహారులైన జీవులందరికీ మొదటి కారణ మతడే. అహంకారం అతని నుండే ఉదయించింది.
ఉత్పత్తి ప్రకరణం రి
గాలి నుండీ చలనం కల్లినట్లే మొట్టమొదటి ప్రతిస్పందమైన బ్రహ్మనుండి అదే లక్షణాలతో కూడిన ఈ (ప్రజాసృష్టి జరిగింది. చిన్మాత్రాకారుడైన బ్రహ్మ నుండి కల్లిన ఈ సృష్టి కూడా చిన్మాత్ర స్వరూపమే. అయినా అచి(ద్రూపంతో సత్యమైనల్లు ఇది మనకు గోచరిస్తున్నది.
కలలో కళల్లిన స్తీ సంగమం అసత్యమే. అయినా ధాతుక్షయాదుల ద్వారా కార్యకారి కావటం వల్ల అది సత్యమైనట్టు స్ఫురిస్తుంది. ఈ సృష్టి సత్యమనే భావన కూడా ఇలాంటిదే. దేహరహితుడై, ఆకాశ స్వరూపుడైన స్వయంభువు మన భ్రాంతి వల్ల దేహం కలవానిలా భాసిస్తున్నాడు. నిజానికి అతనికి ఉదయాస్తమయాలు లేవు. అతడు సంకల్పమా(త్రుడు. ముల్లోకాల ఉనికికి కారణ మతడే. సంకల్పంతో కల్పించుకొన్న కొండ సంకల్పానుగుణమైన రూపంతోనే స్పురిస్తుంది. అలాగే ఆకాళస్వరూపుడైన స్వయంభువు సంకల్పానుగుణరూపంతో భాసిస్తాడు.
మిక్కిలి దృఢమైన విస్మరణ శక్తి వల్ల జీవులు తమ ఆతివాహిక రూపాన్ని మరచి పిశాచాల్జాగా ఆధిభౌతిక శరీరాలతో (ప్రకాశిస్తున్నారు. తమోరహితుడై, శుద్ద సంవిత్స్వరూపుడైన బ్రహ్మవా(్రం ఆతివాహిక రూపాన్ని విస్మరించడు. ఎండమావితా మిథ్యారూపమైన సంకల్పానుగుణరూపంతో భాసిస్తాడు.
(బ్రహ్మ వునోమవూ(త్రుడు. కాబట్ట్షి అతని నుండి కల్గిన విశ్వం కూడా మనోమాత్రమే కాని పాంచభౌతికం కాదు. కార్యకారణాలకు భేదం లేదు కదా! (బ్రహ్మకు సహకారి కారణాలు లేవు. అందుచేత అతని నుండి జనించిన జగత్తుకు కూడా అవి లేవు. కారణ మెట్టిదో కార్యం కూడా అలాంటిదే. పరబ్రహ్మ మెలాంటిదో ముల్లోకాలూ అలాంటివే.
(బ్రహ్మ మనోభావం పాంది జగత్తును సృష్టిస్తున్నాడు. నీటి నుండి (ద్రవత్వం వేరు కానట్లే ఆవిశుద్రతత్త్వం నుండి జగత్తు వేరు కాదు. సంకల్పనగర గంధర్వపురాల లాగానే ఈ మిథ్యా ప్రపంచమంతా మనఃకల్పితమే.
(తాడులో సర్పత్వం లేనట్లే నిజానికీ ఈ జగత్తులోనే ఆధిభౌతికత్వం లేదు. ఇక తత్తజ్ఞులైన బ్రహ్మాదుల దేహాలలో అది ఎలా వుంటుంది? వాస్తవానికి తత్త్వజ్ఞానికి ఆతివాహిక దేహమే లేదు. ఇక ఆధిభౌతిక దేహానికి (ప్రసక్తి యేది ?
ఈ జగత్తు విరించిరూపంతో వున్న మనస్సనే మనుష్యుని మనోరాజ్యం మాత్రమే. ఐనా ఇది సత్యమైన దానిలా మూఢులకు తోస్తున్నది. మనస్సే బ్రహ్మ,
10 యోగవాసిష్టం అది సంకల్పాత్మకం. సంకల్పరూపమైన తన శరీరాన్ని విస్తరింపజేయడం ద్వారా వునోరూపుడైన (బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు. వునోరూపవే (బ్రహ్మ. (బహ్మరూపమే మనస్సు. ఇందులో ప్రథివ్యాదులు లేవు. పృథివ్యాదులను కల్పించేది మనస్సే. పద్మబీజంలో పద్మలత ఇమిడివున్నట్లే హృదయంలో దృశ్వమంతా ఇమిడి వున్నది. మనస్సు, దృశ్యదర్శనము ఇవి రెండూ వేరు వేరని చెప్పడానికి ఎప్పుడూ ఎవరికీ వీలు కాదు. స్వానుభవంలో స్వప్నం, సంకల్పం, మనో రాజ్యం గోచరించినట్లే దృశ్యజగత్తు గూడా మనస్సులో గోచరిస్తున్నది. మనస్సులో కల్పించుక్న్న పిశాచం బాలకుణ్ణి హతమారుస్తుంది. అలాగే దృళ్ళపిశాచి ద్రష్టను నశింపజేస్తుంది. బీజంలోని అంకురం దేశకాలాలు అనుకూలించినప్పుడు వృద్ది పొందుతుంది. అలాగే మనస్సు తనలో ఇమిడివున్న దృశ్య జగత్తును అనుకూలపరిస్రితులు సమకూడగానే భాసింపజేస్తుంది. దృశ్యం వాస్తవమే అయితే దానివల్ల కలో దుఃఖం ఎన్నటికీ శమించదు. దృళ్యం లేకుంటే బోద్దలో బోద్హ్రత్వం కూడా వుండదు. బోధ్య బోద్హ్రృ భావాలు శమించడమే మోక్షం. (ఇది రెండవ దినం) ఉత్పత్తి ఫ్రకరణార్ధ కల్పనం వసిష్టమునీంద్రుడు అలా చెబుతుండగా జనులందరూ ఏకాగ్ర మనస్కులై నిశ్శబ్దంగా వింటూవున్నారు. ఇంతలో సాయం సమయమయింది. సూర్యుడు అస్తాద్రి చేరుకొన్నాడు. ద్వారపాలకుడు రాజుముందరికి వచ్చి '“దేవా! స్నానాది విధులు కావించే సమయం అతి'క్రమిస్తున్నది?' అని విన్నవించాడు. వెంటనే వసిష్టుడు ప్రవచనం ఉపసంహరిస్తూ '"“మహారాజా! ఈ దినం ఇంతవరకు విన్నారు. రేపు తక్కిన విషయాలు చెబుతాను*' అని వౌనం వహించాడు. దశరథుడు అందుకు సమ్మతించాడు. పిమ్మట శుభాభిలాషతో మహారాజు దేవర్హులను, మునులను, విప్రులను యథోచితంగా ఆదరించి పూజించాడు. మునీంద్రుని ఉపదేశం వింటూ ఇం(ద్రియ వ్యాపారాలు మాని నిశ్చలంగా ఉన్న సభాసదులందరూ ఒక్కుమ్మడిగా లేచారు. ఎవరి నివాసం వారు చేరుకొని దినకృత్యాలు నెరవేర్చారు.
ఉత్పత్తి ప్రకరణం 11 ఇంతలో రాత్రివేళ సమాసన్నమయింది తారలతో కూడిన సంధ్య వికసించిన మోదుగులతోడి వసంతలవ్మిలా భాసించింది. పక్షులు గూళ్ళలో విశ్రమించాయి. మూర్తీభవించిన బేతాళాలలాగా చీకట్టు నలుదెసలా క్రమ్ముకున్నాయి. చల్లని పిల్లగాలులు వీచాయి. ముల్లోకాలను వెన్నెల అనే పాలవెల్లువతో ముంచుతూ చంద్రుడు గగనాంగణంపై కాలుమోపాడు. చీకట్టు పలాయనం చిత్తగించాయి. ప్రజలందరూ తమ తమ నెలవులలో విశ్రమించారు. రాత్రి గడచిపోయింది. మరునాడు ప్రభాత సమయం కాగానే గాలికి కొట్టుకు పోయిన పూలలాగా చుక్కలు మాయమయ్యాయి. ఉదయాదద్రిపై భానుబింబం పాడసూపింది. ఖేచరులూ, భూచరులూ వెనుకటి దినం చేసినట్లే తమతమ ప్రాతః కృత్యాలు పూర్తి చేసికొని సభాఫ్ట్రలం చేరుకొన్నారు. గాలి తాకిడి లేని పద్మిని లాగా నిళ్ళ్చలంగానూ, నిళ్శ్ళబ్దంగానూ నిండుసభ విరాజిల్లింది. అపుడు వసిష్ట మహర్షినుద్దేశించి మధురమైన మాటలతో రాముడిలా అన్నాడు- ““భగవన్! ఈ లోకాన్నంతా ్రకాశింపజేస్తున్న మనస్సు యొక్క రూపం ఎలాంటిదో స్పష్టంగా వివరించండి? వసిష్కడు : - రామా! ఆకసానికి లాగానే మనస్సుకు కూడా పేరు తప్ప రూపమంటూ ఏదీ లేదు. లోపలా వెలుపలా రూపం లేకున్నా ఇది ఆకాళం వలె సర్వత్రా వ్యాపించివున్నది. ఎండమావిలోని నీటిని పోలిన ఈ జగత్తు మనస్సు నుండే పుట్టింది. రెండవ చం(ద్రుని దర్శనం లాగా సంకల్ప మాత్రాన కలిగే దీని రూపం (భ్రమ మౌత్రమే. సద్వస్తువులు, లేదా అసద్వస్తువుల రూపంలో భాసించేది మనస్సే కాని మరేమీ కాదు. నిరాకారమైన చిత్తు వివిధవస్తువుల రూపంలో తోచటమే మనస్సు. సంకల్పమే మనస్సు. ద్రవత్వం కంటే జలమూ, చలనం కంటే గాలీ భిన్నంగా లేవు. అలాగే సంకల్పం కంటే మనస్సు వేరుగా లేదు. సంకల్పం ఉన్నచోట మనస్సు వుంటుంది. అవి రెండూ ఎన్నడూ భిన్న వస్తువులు కావు. వస్తువు భాసించడం నిజం కావచ్చు, కాక పోవచ్చు. అదంతా మనోవిలాసమే. మనస్సమష్షిరూప వైతన్యమే సృష్టికర్త అయిన ఫీతా మహుడు. ఆతివాహిక దేహాత్మకమైన మనస్సు ఆధిభౌతికమయిన బుద్దిని సృష్టిస్తుంది అంటే చిరకాలం కలసివుండిన
12 యోగవాసిస్టం సూక్ష్మభూతాలు పంచీకరణం పొంది స్టూలభూతాలై దృశ్య జగత్తుగా పరిణమిస్తాయన్న మౌట. అవిద్య, సంసారం, చిత్తం, మనస్సు, బంధం, మలం, తమస్సు ఇవన్నీ దృశ్వజగత్తుకు మారు పేళ్ళని పండితులకు తెలుసు. దృశ్యం కంటె వేరుగా మనస్సుకు రూపం లేదు. దృశ్యానికి అసలు పుట్టుకే లేదని నేను తర్వాత నిరూపిస్తాను. పద్మబీజంలో తామరతీగ ఇమిడి వున్నట్లే విత్స్చరమాణువులో ఈ దృశ్యజగత్తు ఇమిడీ వున్నది. ప్రకాశవంతమైన పదార్దాలలో కాంతి, గాలిలో కదలిక, నీటిలో 'ద్రవత్వం వున్నట్లే అవిద్యా సంపన్నుడైన ద్రష్టలో (చూచేవానిలో) దృశ్యత్వం వుంటుంది. బంగారులో అభరణం లాగా, ఎండమావిలో నీరులాగా, స్వప్న నగరంలో గోడలాగా (ద్రప్రలో దృశ్యబుద్ది కూడా అసత్యమే. (ద్రష్టలో అనన్యంగా లీనమైవున్న ఈ దృశ్యత్వమనే మాలిన్యాన్ని నీ మనస్సనే అద్దం నుండి నేను త్వరలో తాలగించి వేస్తాను. దృశ్యం (ద్రష్టకంటే వేరు కానప్పుడు దృశ్యానికి ఉనికి లేదు, దానివల్ల (ద్రష్ట అ(ద్రష్టగా మారిపోతాడు. అసద్రూపమైన దృశ్యం తొలగిపోగానే ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అదే కైవల్యమని తెలుసుకో. గాలి వీచినప్పుడు తరు అతాదులు చలించవు. అలాగే చిత్తానికి కైవల్యం సిద్దించగానే రాగద్వేషాది వాసన లన్నీ శమిస్తాయి. దిక్కులు, భూమి, ఆకాశం మొదలైన ప్రకాళ్ళ పదార్దాలన్నీ అసంభవాలైనప్పుడు (ప్రకాశ మొక్కటే నిర్మలమై వెలుగొందుతుంది. అదే రీతిగా ముల్లోకాలు, నీవు, నేను- అనే ఈ దృశ్యమంతా ఉనికి లేనిదైపోతే ద్రష్ట ఒక్కడే విమలాత్ముడై కైవల్యం పొందుతాడు. కొండలు, కోనలు మొదలయిన వస్తువులు తనలో (ప్రతిబింబించక పోతే అద్దం నిర్మలమైన అద్దంగానే మిగిలి పోతుంది. అదే రీతిగా నీవు, నేను, జగత్తు మొదలైన దృశ్యం శమిస్తే దష్ష.కేవల (ద్రష్టగా మా త్రమే శేపెస్తాడు. శ్రీరాముడు : - బ్రహ్మన్! ఉన్న వస్తువు లేకుండా పోదు. ఉనికి గల దానికి లేమి లేదుగదా! దోషప్రదమైన ఈ దృశ్యంలో నాకు లేమి గోచరించడం లేదు. చిత్తభ్రాంతినీ, దుఃఖ పరంపరనూ కల్షించే ఈ దృశ్య విషూచిక ఎలా శమిస్తుందో చెప్పుండి! వసిష్కడు : - రామా! ఈ దృశ్య పిశాచాన్ని పూర్తిగా నశింపజేసే మంత్రం చెబుతాను, విను.
ఉత్పత్తి ప్రకరణం 13
ఉనికి గల పదార్ధం ఎన్నటికీ నశించదు. అందువల్ల దృళ్యథి నశించినా హృదయంలో అది బీజభూతమై వుంటుంది. ' చిదాకాశంలో స్మృతి అనే బీజంనుండి మొలకెత్తి దృళ్ళ బుద్ది లోక పర్వతాకాశాదికమైన జగద్రూపదోషంగా పరిణమిస్తున్నది'
- అని ఇలా అంగీకరిస్తే మోక్షమనేదే లేకుండా పోవలసి వస్తుంది. కాని మోక్షరాహిత్య మనేది అసంభవం. ఎందుకంటే దేవర్షులు, మునులు అనేకులు జీవన్ముక్తులైన వారు కనిపిస్తూనే వున్నారు. జగత్తు అనేది నిజంగా వుంటే ఏ ఒక్కడికీ దానినుండి మోత్షం కలగకూడదు. దృశ్యానికి వునికే నిజమైతే వెలుపల వున్నా, హృదయంలో వున్నా అది మోక్ష నాశానికే దారితీస్తుంది.
రాఘవా! అందువల్ల అతిభీషణమైన ఈ ప్రతిజ్ఞను విను. ఈ విషయం తర్వాత నీకు స్పష్టంగా బోధపడుతుంది. జగత్తు అనే శబ్జానికి ఆకాశభూతాది రూపము, నేను, నీవు - అనే ఏ అర్జాన్ని మనం గ్రహిస్తున్నామో, ఆ అర్ధం అసలు లేనే లేదు. మన ఎదుట కనిపించే ఈ దృశ్య జగత్తంతా అజరమూ, అమరమూ, అవయమూ అయిన పరబ్రహ్మమే.
పూర్ణంలో పూర్హమూ, శాంతంలో శాంతమూ, ఆకాశంలో ఆకాశమూ, (బ్రహ్మంలో బ్రహ్మమూ నెలకొని వున్నాయి. సద్రూపమైన దృళ్యం లేదు, ద్రష్టలేడు, దర్శనం లేదు, ళూన్యం లేదు. జడం లేదు, బుద్ది ప్రతిబింబ వైతన్యమూ లేదు. ఇదంతా శాంతమే.
అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా చెప్పాడు - “ప్రభూ! గొడ్రాలి కొడుకు కొండను పిండి చేశాడు. కుందేటి కొమ్ము పొడుతున్నది. బండ చేతులు చాచి తాండవం చేస్తున్నది. ఇసుక తైలం (్రవిస్తున్నది. రాతి బొమ్మలు చదువుతున్నవి, చిత్రంలోని మబ్బులు ఉరుముతున్నవి - అన్నట్లే వున్నవి మీ మాటలు కూడా. జరామరణ దుఃఖాదులు, కొండలు, ఆకాశం మొదలయిన జగత్తు - లేవు అని మీరు గూడా నాతో చెబుతున్నారా!
(బ్రహ్మన్! ఈ విశ్వం లేదు, ఇది పుట్లులేదు అనడానికి ప్రమాణమేమి? ఈ మాటను ఎలా నమ్మేది? ఈ విషయంలో నిశ్చితమయిన జ్ఞానం కలిగేటట్టు నాకు వివరించి చెప్పుండి!” ”
ఆపై వసిష్కుడు ఇలా బోధించాడు - '“రఘునందనా! నామాట అసంబద్దం కాదు. అల్లరి చేసే వంధ్యా పుత్రుని లాగా ఈ జగత్తు ఉనికి లేనిదే. ఇది అసలు
14 యోగవాసిష్టం ఉత్పన్నమే కాలేదు. కాబట్టి దానికి ఉనికి కూడా లేదు. స్వప్నంలోని నగరం లాగ్గా ఇది మనస్సు నుండి భాసిస్తున్నది. మనస్సుకు ఉత్పత్తి, ఆకృతి లేవు. ఇది నీకు అనుభవానికి వచ్చే విధంగా వివరిస్తాను, విను. స్వప్నం మరొక స్వప్నాన్ని కనిపింప జేసినట్లే, ఉనికి లేని మనస్సు దృశ్యమనే దోషాన్ని ఉన్నట్టు భాసింపజేస్తున్నది. అది ఉనికి లేనిదైనా తన భావనాబలంతో ఒక శరీరాన్ని కల్పించుకొంటున్నది. దాని వల్ల ఈ యిం(ద్రజాలమంతా జరిగి పోతున్నది. చాంచల్య శక్తి సంపన్నమైన మనస్సే స్ఫురిస్తున్నది, గంతులు వేస్తున్నది, నడుస్తున్నది, యాచిస్తున్నది, (భ్రమిస్తున్నది, సంసారంలో మునకలు వేస్తున్నది. సంహారం చేస్తున్నది. సంసారరూపమైన అపకర్షాన్నీ, కైవల్యరూపమైన ఉత్కర్జాన్నీ కూడా పాందుతున్నది..' మూలకారణమైన దేవుని స్వరూపం శ్రీరాముడు : - భగవన్! ముని ్రేష్టా! (భ్రవమమూలకమైన మునస్సుకు మూలకారణం ఏమిటి? మాయామయమైన ఈ మనస్సు ఎక్కడనుండి పుట్టింది? ప్రభూ! వాగ్మి వర్యా! ఈ సంగతి ముందు చెప్పండి! తక్కిన విషయాలు తర్వాత చెప్పుదురు. వసిష్టుడు : - మహాప్రళభయంలో జగత్తంతా లయమైపోతుంది. తరువాత జరగబోయే దృశ్యసృష్టికి ముందు విశ్షేపరహితమైన (బ్రహ్మ వస్తు వాక్కటి మాత్రమే శేషేంచివుంటుంది. తేజో మయమైన పరబ్రహ్మ అస్తమించదు. దానికి పుట్టుక లేదు. అది నిరామయం. ఎల్ల వేళలా సర్వ స్వరూపమై, మహేశ్వరుడై అది భాసిస్తూ వుంటుంది. మాటలతో దాన్ని వర్ణించలేము. జీవన్ముక్తులకు మా(త్రమే అది గోచరమవుతుంది. '' ఆత్మ'”' మొదలైన అనేక సంజ్ఞలతో మనం దాన్ని వ్యవహరిస్తాము. అవి కల్పిత సంజ్ఞలే కాని వాస్తవాలు కావు. దాన్ని సాంఖ్యులు పురుషుడనీ, వేదాంతులు (బ్రహ్మమనీ, విజ్ఞాన వేత్తలు క్షణిక విజ్ఞానమనీ, శూన్యవాదులు శూన్యమనీ పేర్కొంటున్నారు. సూర్యుణ్లి భాసింపజేసేది అదే. వక్త మంత, బుతం, భోక్త, (ద్రష్ట కర్త - ఈ స్వరూపాలతో విరాబిల్లేది గూడ అదే. అది సత్తు అయికూడా"పామరుల దృష్టికి అసత్తే. దేహంలో వున్నా అవిద్యావంతులకు దూరములో వున్నదే. సూర్యునినుండి వెలుగులాగా దానినుండి చిత్రుకాశం వెలువడుతున్నది.
ఉత్పత్తి ప్రకరణం 15 రవినుండి కిరణాలలాగా వివ్ల్వైది దేవతలు దాని నుండే వెలువడ్డారు. సముద్రం నుండి బుడగల్లాగా అనంతమైన జగత్తులు దానినుండే ఉద్భవించాయి. జలమంతా సముద్రాన్ని చేరినట్టు దృశ్య పదార్జాలన్నీ దానివైపే పయనిస్తున్నాయి. అది దీపంలాగా తన్నూూ, ఇతర పదార్జాలనూ భాసింప జేస్తున్నది. ఆకాశంలో, శరీరంలో, రాళ్లలో, నీళ్లలో, తీగలలో, ధూళిలో, కొండలలో, గాలిలో, పాతాళంలో, అంతటా అది నెలకొని వున్నది.
సూక్ష్మ్మశరీరాన్ని ఇటూ అటూ ఆడించేది అదే. శిలలు ధ్యానం చేస్తూన్నాయా అన్నట్లు మూగలై పడివుండేది కూడా దాని వల్లనే. ఆకసానికి శూన్యత్వాన్నీ, పర్వతాలకు ఘనత్వాన్నీ, నీటికి ద్రవత్వాన్నీ, సూర్యునికి దీపత్వాన్నీ అదే కల్పించింది.
సజలజలదాలనుండి వానలు కురిసినట్టు అక్షయావ్చుత పూర్ణమైన పరబ్రహ్మంనుండి చిత్ర విచిత్రాలైన సంసారాలనే నిస్సారమైన జడివానలు కురుస్తున్నాయి. ఎడారిలో ఎండమావులలాగా అతి విస్తృతమైన ఆ బ్రహ్మమునందే పుడుతూ, నశిస్తూ ముల్టోకాలనే అలలు స్ఫురిస్తున్నాయి. నళిస్తున్నల్టు కనిపించినా అవినాశియ్డై అది సర్వ'ప్రాణాలలోనూ వున్నది. సర్వపదార్దాలలోనూ మహత్తమం కావటం వల్ల అతిరిక్తమై వుండికూడా సూత్మతమం కావడం చేత అది గుప్పమైవున్నది.
చిదాకాళశంలో ఆవిర్చవించిన ప్రకృతి అనే తీగకు చిత్తమే మొదలు, ఇంద్రియాలే ఆకులు, (బ్రహ్మాండాలే ఫలాలు. (బ్రహ్మమనే గాలి సోకి ఆతీగ నృత్యం చేస్తున్నది. దేహమనే బుట్టులో అది చిన్మణిగా ప్రకాశిస్తున్నది. చంద్రుని పోలిన దానినుండి జగజ్ఞాలమనే కిరణాలు వెలువడుతున్నాయి. అమృతాన్ని వర్షించే చిత్తనే మేఘంలో ధారాజలాలనే భూతాలు, స్పష్షులనే మెజుపులు స్ఫురిస్తున్నాయి. దాని ప్రభావంవల్ల వస్తువులు విచిత్ర కార్యాలు చేస్తున్నాయి.
అసత్తుకు అసత్తా;న్నీ, సత్తుకు సత్త్వాన్నీ అదే కలిగించింది. అసంగమూ, ఇచ్చారహితమూ అయిన దాని సన్నిధిలో జడమైన కాయం చలిస్తున్నది. సర్వ సత్తలను అతి(క్రమించిన దానివల్ల నియతి, దేశం, కాలం, చలనం మొదలైనవి ఉనికిని సంతరించుకొన్నాయి. శుద్ద సంవి(ద్రూపమైన ఆ (బ్రహ్మం ఆకాశాన్ని భావించి ఆకాళంగా, పదార్దాలను భావించి పదార్జాలుగా రూపాందుతున్నది. ఉదయాస్తవయాలు లేక నిర్వికారమై సదా సంవిద్రూపమై ఆ (బ్రహ్మం తన స్వరూపంల్" తానాక్కటే అద్వితీయమై వెలుగొందుతున్నది. అనంతకోటి
16 యోగవాసిష్టం మహాజగత్తులను స్పష్టిస్తున్నా, విచిత్ర లీలలను చేస్తున్నా అది ఏమీ చేయడం లేదు. ముముక్షు ప్రయత్నోపదేశం
దేవాది దేవుడు, పరమాత్మ అయిన ఈ పరబ్రహ్మం జ్ఞానం వల్లనే సిద్దిస్తుంది. అనువ్వెనదుఃఖంతో సిద్రించదు. ఇక్కడ జ్ఞాన మొక్కటే అనువ్యానం, వేరే అనుష్టానాలు వెళ్లవు. ఎండమావిలో నీరున్నదన్న (భ్రాంతి శాంతించటానికి జ్ఞానం తప్ప వేరే ఉపాయం లేదని నిరూపించబడింది కదా!
ఈ పరబ్రహ్మ దూరంలోనూ లేదు, సమీపంలోనూ లేదు. ఇది సులభమూకాదు, దుర్రభమూ కాదు. స్వానంద ప్రకాశమై ఈ (బ్రహ్మం తన శరీరం నుండే లభిస్తుంది.
తపోదాన (వ్రతాదులు ఇక్కడ ఏమాత్రం ఉపయోగపడవు. స్వస్వరూపంలో నిలవడం తప్ప ఇందుకు మరొక సాధనం లేదు. సాధుసాంగత్యం, సచ్చాస్త్ర పరత్వం ఇవి రెండే అజ్ఞాననివర్తకమైన నిత్యసిద్ద (బ్రహ్మజ్ఞానాన్ని (ప్రాప్తింప జేస్తాయి. “ఈ (బ్రహ్మమే ఆ పరమాత్ముడు” అన్న పరిజ్ఞానం కలగగానే సాధకుడు దుఃఖానికి దూరమవుతాడు. అతడు జీవన్ముక్తిని చూరగొంటాడు.
శ్రీరాముడు : - పరమాత్మ జ్ఞానం కలిగిన వాళ్లి మళ్లీ మరణాది దోషాలు బాధింపవు గదా! మరి ఆ పరమాత్మను త్వరలో పొందటానికి ఎలాంటి తీ వ్రతపస్సు చేయాలి? ఏ విధంగా శ్రమించాలి? దయచేసి సెల వివ్వండి!
వసిష్టుడు : - రామా! తన పౌరుష ప్రయత్నంతోనూ, వివేక బలంతోనూ ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. అందుకు తపస్సు, స్నానం మొదలైన కర్మలతో పని లేదు.
రాగం, ద్వేషం, తమస్సు, క్రోధం, మదం, మాత్సర్యం - వీటిని వదలకుండా చేసే తపోదానాదులుక్లేశకరాలే గాని వాస్తవ సాధనాలు కావు. రాగ ద్వేష భూయిష్టమైన చిత్తంతో ఇతరులను మోసగించి ఆర్హించిన ధనాన్ని దానం చేస్తే ఆ ధనం ఎవరిదో వార్కే ఆ దానఫలం దక్కుతుంది! రాగాదిదోషాలకు నెలవైన చిత్తంతో వ్రతాదులు చేయడం దంభ మనబడుతుంది. దానికి ఏ కొంచెం ఫలం కూడా ఉండదు.
అందువల్ల ప్రయత్నంతో సంసార వ్యాధిని నశింపజేసే సజ్జన సాంగత్యం, సచ్చాస్త్రం అనే ముఖ్యౌషధాలనే పరిగ్రహించాలి. దుఃఖాన్ని తొలగించు కోవడంలో
ఉత్పత్తి ప్రకరణం 17 పురుష ప్రయత్నం తప్ప మరొక ఉపాయం లేనే లేదు. రామా! రాగద్వేషాలనే విషూచివ్యాధిని పూర్తిగా శమింపజేసే ఆత్మజ్ఞానం పొందటానికి ఎలాటి పౌరుషం అవశ్యకమో చెబుతాను, విను. బిజ్ఞాసువైన వాడు లోకళాస్త్ర, విరుద్దం కాని యథాసంభవమైన వృత్తితో సంతుష్పచిత్తుడై వుండాలి. భోగాభినివేశాన్ని పరిత్యజించాలి. ఉద్వేగం లేని హృదయంతో మొదట సత్సాంగత్య సచ్చా(స్తాలను ఆశ్రయించాలి. లభించిన దానితో సంతసించాలి. నిషిద్ర కర్మల జోలికి పోరాదు. ఈ రీతిగా సాధుసంగమ సచ్చా'స్త్రాలను ఆ'శ్రయించినవాడు త్వరలో ముక్తుడవుతాడు. విచారంతో స్వస్వరూపాన్ని తెలుసుకొన్న బుద్రిమంతునికి బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైనవారు దయనీయు అవుతున్నారు. మంచి స్వభావం కల ప్రజలు జ్ఞాన వైరాగ్యాదిగుణ విశిష్టుడయిన ఎవళ్లో సజ్జను డంటారో, అతడే సొధువు. అలాంటి మహనీయుణ్లి ప్రయత్నంతో ఆ(శ్రయించాలి. విద్యలలో అధ్యాత్మవిద్య ప్రధానమైనది. దాన్ని బోధించే శాస్త్రమే సచ్చాస్త్రం. ఆళాస్తాన్ని విచారించే వాడు ముక్తు డవుతాడు. చిల్లగింజతో నీటిలోని కాలుష్యమూ, యోగంతో మతిలోని మాలిన్యమూ తొలగుతాయి. అలాగే సచ్చాస్త్ర, - సజ్జనసాంగత్యాల వల్ల కలోే వివేకంతో అవిద్య నశిస్తుంది. ఉనికి లేని దృశ్యం శ్రీరాముడు: - బ్రహ్మన్! ఎవళ్లో బ్రహ్మాదులకు కారణభూతుడయిన దేవుడని మీరంటున్నారో, ఎవళ్లి తెలుసుకొంటే ముక్తి సిద్రిస్తుందో - అతడు ఎక్కడ ఉన్నాడు? నేను ఆ దేవుణ్ణే ఎలా పాందగలను? వసిష్టుడు : - రామా! నేను చెప్పిన దేవుడు దూరంలో లేడు. అతడు చిన్మాత్రుడుగా ప్రసిద్ది పొంది నిత్యం మన శరీరంలోనే వున్నాడు. అంతే కాదు, ఈ విశ్వమంతా అతడే. దృళ్యవిశ్వం మాత్రమే కాదు, అంతటికీ అధిష్టానమై అంతటా వ్యాపించి వున్న వాడు కూడా ఆ దేవుడే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, సూర్యుడు - అందరూ ఆ చిన్మయ స్వరూపులే. శ్రీరాముడు : - బాలురుకూడా ఈ విశ్వాన్ని చేతన మా(త్రమని చెప్పవచ్చు.
16 యోగవాసిస్టం ఇందులో గ్రహింపదగిన ఉపదేశ మేమున్నది?
వసిష్టుడు : - ఈ విశ్వం చేతన మాత్రమని తెలుసుకొన్నంత మాత్రాన సరిపోదు. అందువల్ల సంసార నాళకమైన విజ్ఞానం లభించదు. బహీర్ముఖుడ్డై విషయసుఖాలే ముఖ్యమని భావించే చేతనజీవుడు పశు వనబడుతున్నాడు. జరామరణ భయాలు అతనినుండే కలుగుతున్నాయి.
స్టూలళరీరం లేకున్నా సూక్మకారణశరీరాలతో కూడి అజ్జుడయిన జీవుడు దుఃఖానిక్షేపాత్రు డవుతాడు. దృశ్యస్టితినుండి విడివడి దృశ్యరహిత ఫ్రీతికి ఉన్ముఖుడు కావడమే తత్త్వజ్ఞానావస్ట. ఆ అవస్థను పొందినవాడు మళ్లీ దుఃఖానికి గురికాడు. మూలాజ్ఞానం తొలగడం ద్వారా పరతత్త్య దర్శనం కలగగానే హృదయ గ్రంథి నశిస్తుంది. సంశయాలు విడిపోతాయి. కర్మలన్నీ పటాపంచ లవుతాయి. దృశ్యం జ్ఞానంతో మాత్రమే నిరోధింపబడుతుంది. స్వరూప సమాధికీ, ముక్తికీ ప్రధాన కారణం జ్ఞానమే.
శ్రీరాముడు : - ఏ జీవుణ్ణి తెలుసుకోవడం వల్ల సంసారం శమించదో, అట్టి అకాశరూపుడూ, పళశువూ, అజ్జుడూ అయిన జీవుడు సంసారకో టికి చెందినవాడా? లేక ఆత్మ కోటికి చెందినవాడా? జీవుడు సంసారకోటిలోని వాడైతే అతణ్లో సంసారసాగరం నుండి సత్పాంగత్యంతోనూ, సచ్చాస్త్రంతోనూ తరింపజేసే ఆ పరమాత్మ ఎలాంటివాడు ? బ్రహ్మజ్ఞా! ఈ విషయాన్ని దయతో వివరించండి.
వసిష్టుడు : - సంసారారణ్యంలో పడిన జీవుణ్ణి ఆత్మ అని తలంచేవారు పండితులైనా అజ్ఞులే. జీవుడే సంసారం. దుఃఖసంతానమే చేతన. అది తెలిసినంత మా(్రాన ఏమీ తెలిసినట్టుకాదు. రామా! విషావేశం శాంతిస్తేనే విషూచిక శమిస్తుంది. అలాగే పరమాత్మను తెలుసుకొంటేనే దుఃఖపరంపర ఉపళమిస్తుంది.
శ్రీరాముడు : - బ్రహ్మన్! ఏ పరమాత్మదర్శనం వల్ల మనస్సు పూర్తిగా మోహాలను దాటగలదో, ఆ పరమాత్ముని స్వరూపాన్ని ఉన్నదున్నట్టు బోధించండి!
వసిష్టుడు : - ఒక్క నిముషంలో ఒకచోట నుండి మరొక చోటికి పయనించే నిర్విషయాపరోక్ష జ్ఞానము యొక్క స్వరూపమే పరమాత్మరూపం. దేని విజ్ఞానం వల్ల ఈ సంసారం బొత్తుగా ఉనికిలేనిదై పోతున్నదో అదే పరమాత్మ రూపం. ఎక్కడ (ద్రష్ప్రృదృళ్యక్రమం లేకున్నాఉన్నట్టు తోస్తున్నదో, ఏది ఆకాశం కాని ఆకాశమో అదే పరమాత్మ రూపం.
ఉత్పత్తి ప్రకరణం 19 జగుత్తు శూన్వమై వుండి కూడా. శూన్యం కాని దానిలాగా దేనివల్ల భాసిస్తున్నదో, అదే పరమాత్మ రూపం. ఏది చిన్నయమై కూడా పెద్ద బండలాగా జడమై కనిపిస్తున్నదో అదే పరమాత్మ రూపం. ఏది బాహ్యాభ్యంతరాలలో అన్నిటా వ్యాపించి స్వరూప స్రీతిని పొంది వున్నదో అదే పరమాత్మ రూపం. ప్రకాశించే వస్తువులలో వెలుగు, ఆకాశంలో శూన్యత్వం ఉన్నట్టు ఇదంతా దేనిలో భాసిస్తున్నదో అదే పరమాత్మ రూపం. శ్రీరాముడు : - పరమాత్మ సద్రూప మనీ, దృళ్యరూపమైన ఈ విశాల జగత్తు ఉనికి లేనిదనీ ఎలా తెలుసు కోవాలి ? వసిష్టుడు : - ఆకసానికి రూపం లేదు. అయినా అది నీలంగా వున్నట్టు తోస్తుంది. అదేరీతిగా జగత్తు ఉనికి లేనిదైనా ఉన్నట్టు కన్పిస్తుంది. ఈ సత్యం దృఢంగా బోధపడితే బ్రహ్మస్వరూపం తెలుస్తుంది. మరాక విధంగా తెలియదు. దృశ్యం మిథ్య అని గోచరిస్తే ఇక మిగిలేది పరమార్ధమే. అదే తెలుసుకొనదగిన ఆత్మ. ప్రతిబింబం లేకుండా అద్దం ఉండదు. అలాగే ద్వైత ప్రతిబింబం లేకుండా బుద్ది ఉండదు. అలాంటి బుద్దిలో బ్రహ్మం ్రతిబింబించదు. జగత్తు మిథ్య అనే నిర్ణయం కలగకపోతే ఎవడూ పరతత్త్వం గ్రహించలేడు. శ్రీరాముడు : - మునీ(ర్రదా! దృశ్యమైన ఈ (బ్రహ్మాండజగత్తు మిథ్య ఎలా అవుతుంది ? పరమసూత్మమైన (బ్రహ్మములో ఈ విశాల స్థూలజగత్తు ఎలా అధ్యసింపబడుతుంది ? ఆవగింజలో మేరుపర్వతం ఎలా ఉంటుంది ? వసిష్టుడు : - రామా! కొన్ని దినాలు సత్సాంగత్యం కలిగి సచ్చాస్త్ర, విచారం చేస్తూ ఉద్వేగం లేని బుద్దితో వుండు. అప్పుడు నేను నీ చిత్తం నుండి దృశ్యాన్ని తుడిచివేస్తాను. ఎండమావి యొక్క నిజరూపం తెలుసుకొంటే జల(భ్రాంతి తొలగిపోతుంది. దృశ్యం నళిస్తే ద్రష్ట కూడా మిగలడు. అప్పుడు జ్ఞాన మొక్కటే మిగులుతుంది. దృశ్య ముంటేనే ద్రష్ట ఉంటాడు. (ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యం గోచరిస్తుంది. రెండుంటే ఒక్కటి గూడా వుంటుంది. ఒకట్టు రెండు కలిస్తేనే రెండు సిద్రించేది. ఒకటి లేకపోతే రెండూ లేనట్టే. కాబట్టి ఏకత్వం, ద్విత్వం, (ద్రష్పృత్వం - ఇవన్నీ క్షయిస్తే ఇక మిగిలేది సద్వస్తు వొక్కటే. నీ మనస్సనే అద్దంనుండి అహంకారాదికమైన దృశ్యజగత్తు అనే మాలిన్యాన్ని క్41
20 యోగవాసిష్థం నేను కడిగివేస్తాను. లేని దానికి ఉనికిలేదు. ఉన్న దానికి లేమి లేదు. సహజంగానే ఏది లేదో, దాన్ని తొలగించడంలో కష్ట మేమున్నది?
జగత్తుకు ఉత్పత్తి లేదు. మనకు కనిపించే దృశ్య జాత మంతా బ్రహ్మంలో కల్పితం మాత్రమే. బంగారులో గాజులు మొదలైన ఆభరణాలవలె కేవలం కల్పితమైన జగత్తును తొలగించడంలో క్లేశ మేమీ లేదు. ఇదంతా విస్తరంగా అనేక యుక్తులతో నీకు అనుభవానికి వచ్చేటట్టు వివరిస్తాను.
అసలే పుట్టుక లేని దానికి ఉనికి ఎలా వుంటుంది? మరుభూమిలో మడు గెక్కడిది? రెండవ చం(ద్రు డున్నాడనే పట్టుదల ఎందుకు? గొడ్రాలికి బిడ్డ, మరుభూమిలో జలం, ఆకసంలో చెట్టు ఇవి లేనే లేవు. అదే విధంగా జగత్తు కూడా లేనే లేదు. ఉన్నట్టు తోచడం (భమ మాత్రమే. రామా! ఈ కనిపించే దంతా నిరామయమైన (బ్రహ్మమే సుమా! ఈ సంగతి పైన నీకు మాటలతో కాక యుక్తులతో నిరూపిస్తాను.
ఉదారమతి! తత్త్వజ్ఞులు యుక్తి యుక్తంగా నిరూపించే విషయంలో అవహేళన తగదు. యుక్తి యుక్తమైన దాన్ని తిరస్కరించి దురాగ్రహం (ప్రదర్శించే మూర్చుణ్ల పెద్దలు అజ్ఞుడనే భావిస్తారు.
సద్భాస్త విరూపణం
శ్రీరాముడు : - మునీంద్రా ! ఏయుక్తితో ఈ (బ్రహ్మం తెలుసుకోవటానికి వీలవుతుంది ? అది ఎలా సిద్దిస్తుంది ? దయచేసి వివరించండి! అది అనుభవానికి వస్తే మళ్లీ నేను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు కదా!
వసిష్టుడు : - రామా! “జగత్తు' అనబడే ఈ మిథ్యాజ్ఞాన రోగం చాలా కాలం నుండి పాతుకొని వున్నది. తత్త్వజ్ఞానం తప్పు మరొక ఉపాయంతో అది శమించదు.
సాధూ! నీకు బోధ కలగడాన్టై నేను కొన్ని కథలు చెబుతాను. అవి కడ వరకూ బుద్దిమంతుడవై వింటే నీవు ముక్తి పొందుతావు. అలా కాక ఉద్వేగంతో సగం విని మధ్యలో లేచి వెళ్ళావా ! అప్పుడు సచ్చాస్త్ర శ్రవణయోగ్యత లేని పశుతుల్యుడవైన నీకు ఏమీ లభించదు. ఎవడు దేన్ని సాధించా లనుక్ంటాడో, వాడు దానికొఆ్టై నిర్విరామంగా కృషి చేయాలి. మధ్యలో శ్రమ యని ప్రయత్నం మానకుండా
ఉత్పత్తి ప్రకరణం 21 కొనసాగించేవాడు తప్పక అభిలషితార్థం సాధిస్తాడు.
రామా! నీవు సజ్జన సాంగత్యం, సచ్చాస్త, పరిశీలన కలిగివున్నావంటే,
మాసాలలో కాదు, కొన్ని దినాలలోనే పరమపదం పొందగలవు.
శ్రీరాముడు : - శాస్త్ర వేత్తలలో శ్రేష్కడవైన మునీశ్వరా! దేనిని తెలుసుకొంటే
మనుజుడు శోకాన్ని దాటగలడో, అట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శాస్రాలలో ఏది ప్రధానమైనది?
వసిష్టుడు : - మహామతీ! ఆత్మజ్ఞానం ప్రసాదించే శా స్రాలన్నింటిలోనూ ఈ మహారామాయణమే శుభప్రదమైనది. అన్ని ఇతిహాసాలలోనూ సారభూతమైన దిది. ఉత్తమమైన ఈ యితిహాసం వింటే తత్త్వజ్ఞానం కలుగుతుంది. ఈ రామాయణం వింటే అక్షయమైన జీవన్ముక్తి తనకు తానుగా స్వాధీన మవుతుంది. అందువల్ల ఇదే మిక్కిలి పవిత్రమైన శాస్త్రం. కలగన్నవాడు “ఇది కల' అని తెలుసుకోగానే కలలో కనిపించిన పదార్దాలు మాయ మవుతాయి. అలాగే ఈ శాస్త్రాన్ని అనుసరించి తత్త్వ విచారణ చేస్తే కనిపించే జగత్తు ఉన్నదున్నట్లే మాయ మవుతుంది.
ఈ శాస్త్రంలో ఏది వున్నదో, అదే ఇతర శా స్తాలలోనూ వున్నది. ఇందులో లేనిది ఎందులోనూ వుండదు. పండితులు దీనిని సమస్త విజ్ఞానశాస్త్రుకోశ మని గ్రహించారు. నిత్యమూ ఎవడు దీనిని వింటాడో, అతని బుద్ది గ్రంథాంతర పరిశీలనవల్ల కలో జ్ఞానంకంచే మహోత్కృష్టమైన జ్ఞానాన్ని పొందుతుంది. ఇందులో సందేహం లేదు.
దురదృష్టం వల్ల ఈ శాస్త్రం రుచించనివాడు మరొక మంచి శాస్త్రాన్ని చదువుకోవచ్చు. మంచి మందు పుచ్చుకొంటే రోగం నయమవుతుంది. అదే రీతిగా ఈ శాస్త్రం వింటే జీవన్ముక్తి స్వానుభవానికి వస్తుంది. ఈ శాస్త్రం విన్న శోత ఆత్మ తత్త్వాన్ని ప్రత్యక్షంగా గ్రహించగలడు. మేము చెప్పేమాట వరంలాగా, లేదా శాపం లాగా యథార్ధమై వుంటుందే కాని మరొక రీతిగా వుండదు.
రామా! స్వాత్మ విచారణతో కూడిన ఈ శాస్త్రం వల్లనే నీ సంసారదుఃఖం నశిస్తుంది. అంతే కాని ధనదాన తపస్సులతో నశించదు. ద్వైతశాస్త్ర, శ్రవణం వల్ల నశించదు. వేదంలోని కర్మ కాండ పఠనంవల్ల, అందులో చెప్పబడిన యాగ హోమాది 'ప్రయత్నశతం వల్ల కూడా నశించదు.
22 యోగవాషిష్టం పరమ కారణ వర్గనం వసిష్టుడు : - ఆత్మనిష్టులు నిత్యమూ ఆత్మయందే చిత్తం నిల్పుతారు. ఆత్మగత (ప్రాణులై వుంటారు. పరస్పరం ఆత్మను గురించే చెప్పుకుంటూ ఆనందిస్తారు. జ్ఞానైక నిష్టులై, ఆత్మవిచారపరులైన వారికి జీవన్ముక్తి లభిస్తుంది. దేహత్యాగానంతరం దానినే విదేహముక్తి అంటారు. శ్రీరాముడు : - బ్రహ్మన్! విదేహవముక్త - జీవన్ముక్తుల లక్షణాన్ని వివరించండి. అది గ్రహించి శాస్త్రదృష్టితో వికసించిన బుద్దితో నే నాఫ్ట్రితికై ప్రయత్నిస్తాను. వసిష్టుడు : - ఎవడు వ్యావహారిక దశలో వుండి కూడా ఈ విశ్వాన్ని ఆకాశంవలె శూన్యంగా చూస్తాడో వాడే జీవన్ముక్తుడు. జా గ్రద్రశలో వుంటూనే గాఢనిద్రలో వున్న వానిలా ఎవడు నిర్వికారుడై వుంటాడో వాడే జీవన్ముక్తుడు. ఎవడు సుఖం వచ్చినప్పుడు పాంగడో, దుఃఖం వచ్చినప్పుడు [క్రుంగడో వాడే జీవన్నుక్తుడు. విషయసుఖానుభవంలో ని(ద్రాళువై ఎవడు ఆత్మ విషయములో జాగరూకుడై వాసనారహితమైన (ప్రజ్ఞ కల్గివుంటాడో వాడే జీవన్ముక్తుడు.
జీవన్ముక్తుడు పైకి రాగద్వేషభయాదులు నటించినా లోపల ఆకసంలాగా నిర్మలుడై, నిరావరణాత్మ నిషుడై వుంటాడు. కర్మలు చేస్తున్నా, చేయకున్నా అతని భావంలో అహంకారం పాడచూపదు. అతని బుద్దికి అభిమాన మనే మాలిన్యం అంటదు. అతడు చిదాత్మపై, ఆవరణం ఉన్నప్పుడు లోక సృష్టినీ, ఆ ఆవరణం తొలగగానే లోకప్రళయాన్నీ దర్శిస్తాడు. వ్యవహారంలో వున్నా అతళణ్లి రాగాదులంటవు. అంతటా అతడు పరిపూర్ణమైన ఆత్మనే దర్శిస్తాడు.
(ప్రారబ్దం నశించి దేహం పతన మైనప్పుడు జీవన్ముక్తుడే చలన ముడిగిన గాలి లాగా విదేహముక్తు డవుతున్నాడు. అప్పుడిక వానికి వృద్ది కయాలు, సదసద్భావాలు, స్వపరభేదం మున్నగు ద్వంద్వాలు వుండవు.
అతడు సూర్యుడై తపిస్తాడు. అజుడై సర్వాన్నీ సృష్టిస్తాడు విష్ణువై ముల్గోకాలనూ పాలిస్తాడు. రుద్రుడై అంతటినీ సంహరిస్తాడు. ఆకసమై పవనస్కంధాన్ని ధరిస్తాడు. కులాచలగతుడై లోకపాలకులకూ, దేవతలకూ నిలయమవుతాడు. భూమియై లోక ఫ్టితిని వహిస్తాడు. తృణగుల్మలతారూపుడై ఫలాలను (ప్రసాదిస్తాడు. అనలమై జ్వలిస్తాడు. జలమై (ద్రవిస్తాడు. వంద్రుడై అమృతం (స్రవిస్తాడు. హాలాహాల విషమై
ఉత్పత్తి ప్రకరణం 23 మరణం విధిస్తాడు. తేజమై దిక్కులను వెలువరిస్తాడు. చీకటై అంధత్వాన్ని విస్తరింపబేస్తాడు. శూన్యమై ఆకాశ మవుతాడు. పర్వతమై నిరోధిస్తాడు. వైతన్యమై జంగమ ప్రాణులను కల్పిస్తాడు. స్ట్రావరమై స్టావరాలను సృష్టిస్తాడు. సాగరమై భూవనితను వలయంలా చుట్టుకొంటాడు. ఆవరణం లేని చిదాత్ముడై జగత్రయాన్ని విస్తరింపజేసి కూడా తాను శాంతుడై వుంటాడు. ఇన్ని మాట లెందుకు? భూత భవిష్యద్వర్హమానాలలో భాసించిన, భాసిస్తున్న, భాసింపనున్న సమస్తమూ అతడే. శ్రీరాముడు : - (బ్రహ్మ విద్వరిష్టా! నా దృష్టి విషమమైనది. మీరు బోధించిన ఈ సర్వాత్మకదృష్టి నాకెంతో దుర్లభంగా తోస్తున్నది. అదెలా లభిస్తుందో, లభించినా చేజారి పోకుండా నిలుస్తుందో చెప్పండి! వసిష్టుడు : - రామా! ఈ సర్వాత్మదృష్టినే ముక్తి, బ్రహ్మం, నిర్వాణం అని వ్యవహరిస్తారు. అది ఎలా లభిస్తుందో చెబుతాను విను. '“నీవు - నేను! అనే భేదబుద్దితో కూడి కనిపించే ఈ దృశ్యజగత్తుకు గ్ డ్రాలి బిడ్డకు వలె పుట్టుక లేదు అన్న దృఢమైన జ్ఞానంతోనే ముక్తి లభిస్తుంది. శ్రీరాముడు : - తత్త్వజ్ఞు! విదేహముక్తులే త్రిలోకాల రూపాలలో వున్నారని మీరు చెప్పారు. అలా అయితే వారే ఈ జగత్సృష్టి రూపమైన సంసారంగా పరిణమించినారని నేను భావిస్తున్నాను. వసిష్టుడు : - త్రిలోకస్పష్టి అనేది ఒకటి నిజంగావుంచే విదేహముక్తులే అలా మారినారని భావించవచ్చు. కాని ''త్రిలోకాలు'' అనబడే పదార్రమే లేదు. అందుచేత (బ్రహ్మమే త్రిలోకాలుగా రూపాందింది అనే భావనకు అవకాశమే లేదు. కాబట్టి “*జగత్తు'' అనే శబ్దానికి అర్జాన్ని కల్పించడమే అసంభవం. అద్వయము, శాంతము, ఆకాశంలాగా నిర్మలము, ఆభాసమా(త్రము అయిన బ్రహ్మమే తప్ప సద్వస్తువును గ్రహించినవారికి జగత్తంటూ వేరే లేదు. నేను ఎంతగానో విచారించి చూచాను. నాకు బంగారు కడియంలో నిర్మలమైన బంగారం తప్పు కడియం కనిపించలేదు. అలలో నీరు, గాలిలో కదలిక తప్ప మరేమీ గోచరించలేదు. ఆకాశంలో శూన్యత్వం తప్ప మరేమీ పాడసూపలేదు. మరుభూమిలో నీరుగా భాసించింది తాపమే కాని నీరు కాదు. అలాగే ఈ జగత్రయ రూపంలో కనిపించేది బ్రహ్మమే కాని మరేమీ కాదు.
ల! యోగవాసిష్టం
శ్రీరాముడు: - మునీంద్రా! దృశ్యజగత్తు యొక్క అత్యంతాభావం ఏయుక్తితో గోచరిస్తుందో, ఆ ఉత్తమమైన యుక్తిని నాకు ఉపదేశించండి! (ద్రష్ట దృశ్యం - అనేఏ రెండూ అంతరించినప్తుడు మిగిలేది నిర్వాణ మొక్కటే. అది సిద్దిస్తే ఇక సాధించవలసిన దేమీ ఉండదు కదా! కాబట్టి ఉన్నది బ్రహ్మ మొక్కటే అన్న దృఢజ్ఞానం సిద్దించే ఉపాయం నాకు బోధించండి!
వసిష్టుడు : - రావా! ఈ మిథ్యాజ్ఞున వనే విషూచివ్యాధి ఎంతో కాలమునుండి నాటుకొని వున్నది. ఒక్క విచార మంత్రంతో మౌత్రమే అది నిర్మూల మవుతుంది. ఒక్క క్షణంలో దాన్ని తాలగించడం సాధ్యం కాదు. సమోన్నతమైన కొండను ఒకే సమయంలో ఎక్కడం, దిగడం సాధ్యం కాదుగదా! అందువల్ల అభ్యాసయోగంతో, యుక్తితో, న్యాయోపపత్తులతో జగద్ర్రృమ శమించే విధానం చెబుతాను, విను.
ఈ విషయంలో నీకు బోధ కల్లడానికి నేనొక కథ చెబుతాను. దాన్ని (శ్రద్దతో వింటే నీవు ప్రజ్ఞావంతుడవై ముక్తి పొందగలవు. పిదప జగదుత్పత్తి (క్రమం వివరిస్తాను. దానివల్ల ఉత్పన్నమైన ప్రతి పదార్రమూ బంధరహిత మైనదే అని గోచర మవుతుంది.
ఆకాశానికి జన్మ లేనట్లే జగత్తుకు జన్మలేదు. అయినా అది జన్మించినట్టు బ్రమ కల్గుతున్న దన్న విషయాన్ని ఉత్పత్తి ప్రకరణంలో విశదీకరిస్తాను.
స్తావరజంగమాత్మకమైన ఈ కనిపించే జగత్తంతా మహా ప్రళయం రాగానే ఉనికి లేనిదై నశించిపోతున్నది. అప్పుడు వెలుగూ కాక, చీకటీ కాక నామరూపాలు లేని ఒక సత్త మాత్రమే మిగిలివుంటుంది. అది సాకారం కాదు. నిరాకారం కాదు. దృశ్యం కాదు. దర్శనం కాదు. భూతపదార్ధం కాదు. దాని కంతం లేదు. అది సత్తుకాదు, అసత్తుకాదు, సదసత్తు కాదు, అది భావం కాదు. అభావం కాదు. అది పూర్ణం కంటే పూర్ణమై వుంటుంది. అది '“పలానా”' అని చెప్ప వీలుకాదు. అది చిన్మాత్రం, అజరం, శివం, ఆదిమధ్యాంతరహితం, నిరామయం, కారణ రహితం.
ముత్యాలతో రూపుదిద్దుకున్న హంసల్' నిజానికి హంస లేదు. ఐనా వున్నట్లు తోస్తుంది. అలాగే బ్రహ్మంలో జగత్తు లేదు. అయినా అది వున్నట్టు స్ఫురిస్తుంది. అధ్యారోప దృష్టితో చూస్తే బ్రహ్మమే జగత్తు. అపవాదదృష్టితో చూస్తే బ్రహ్మం జగత్తు కాదు. కాన వ్యక్తావ్యక్త్రములైన రెండవస్టలలోనూ అది వున్నది.
ఉల్పత్తి ప్రకరణం 25
అది చెవులు లేనిదైనా వింటుంది. నాలుక లేనిదైనా ఆస్వాదిస్తుంది. ముక్కు లేకున్నా మూర్కొంటుంది. చర్మం లేకున్నా స్ప్పశిస్తుంది. కనులు లేకున్నా చూస్తుంది.
సదసద్రూపమైన ఈ విచిత్ర సృష్టిని అజ్ఞానదశలో కనిపింప జేసీ చిదాలోకం కూడా ఆ (బ్రహ్మమే. అజ్ఞానం తాలగగానే ఆద్యన్త రహితమైన స్వస్వరూపమై గోచరించేది కూడా అదే. సర్వవ్యాపియైన ఆ (బ్రవ్మోనికి కుందేటి కొమ్ములాగా కారణం లేదు. నీటి నుండి అలలు పుట్టినట్టు కారణమైన ఆ (బ్రహ్మంనుండే ఈ జగత్తనే కార్యం పుట్టింది.
చిత్తంలో సదా జాజ్వల్యమానమై వెలుగొందే ఆ చిన్మాత్ర దీపము యొక్క కాంతిలోనే ఈ ముల్లోకాలూ భాసిస్తున్నాయి. అది లేకపోతే సూర్యుడు మొదలైన వెలుగులన్నీ కారుచీకట్లతో సమానమే అవుతాయి. అది వుండబళచ్లే జగత్రయమనే ఎండమావులు కనిపిస్తున్నాయి.
కొరవికట్టి త్రిప్పగా చక్రం పాడ సూపినట్టు అది స్పందించినప్పుడే జగల్లవ్న్మీ కనిపిస్తుంది. దాని స్పందనం ఆగిపోగానే జగత్తు కూడా అంతరిస్తుంది. నిర్మలము, అక్షయము, స్పందాస్పందాత్మకమైన దాని స్వభావమే సృష్టి స్రితిలయ విలాసమై భాసిస్తున్నది. దాని సత్తగాలి లాగా సర్వవ్యాష్తమైనది. అది వ్యవహారాన్ని అనుసరించి నామతః భిన్నమే కాని వస్తుతః భిన్నం కాదు.
అది సదా వేల్కాంచి వుంటుంది. ((ప్రబుద్దుని దృష్టిలో). సదా ని(ద్రిస్తుంటుంది. ( అజ్ఞాని దృష్టిలో). దానికి జా గ్రన్నిద్రావఫ్టలు ఎన్నడూ, ఎక్కడా లేవు. (ముక్తుని దృష్టిలో). పూలలో తావి లాగా అది అన్నిటికీ సారమై వున్నది. వస్తువులన్నీ నశిస్తున్నా అది నశించదు. తెల్లని వస్త్రంలో తెలుపులాగా ప్రత్యక్షంగా వున్నా అది గ్రహింప వీలు గొదు. +
అది మూగలా వున్నా మాట్లాడుతుంది. బండలా వున్నా ఆలోచిస్తుంది. నిత్యతృప్తి కలదైనా భుజిస్తుంది. చేయదగినపని లేనిదైనా కర్తృత్వం కల్లి వుంటుంది. అంగ రహితమైనా సమస్తాంగాలు కల్లివున్నది. ఆకృతి లేనిదైనా విశ్వమంతా వ్యాపించి వున్నది. ఇం(ద్రియబలం లేనిదైనా అన్ని యిం(దద్రియాల పనులు చేస్తున్నది. మననం లేనిదైనా ఈ జగ(ద్రూపాలన్నీ దాని మనోనిర్మాణ రీతులే,
దాని దర్శనం కలగనంత వరకు (భ్రమా, సంసారసర్పభయమూ తప్పవు. దాని దర్శనం కాగానే సమస్తములైన ఆశలూ, భయాలూ పలాయనం చిత్తగిస్తాయి.
26 యోగూసిష్టం దీప మున్నప్త్పుడు పనులు జరిగినట్లే అది సాత్షివమాత్రమై వున్నప్పుడే స్పందపూర్వకమైన మౌనసిక చేష్టలన్నీ జరుగుతాయి. సముద్రం నుండి అలలు బయలు దేరినట్లే దాని నుండే ఘటపటాది పదార్హాలన్నీ కలుగుతున్నాయి. బంగార మొక్కటే కటకాంగదాదులైన వివిధాభరణాలైనట్టు అదొక్కటే జడ ప్రపంచరూపమైన నానాపదార్జాలుగా రూపొందుతున్నది. జ్ఞానం కలిగితే నీకూ, నాకూ, ఈ జనుల కందరికీ ఆత్మ ఏకరూపమై భాసిస్తుంది. జ్ఞానం కలగకపోతే ఎవరికీ ఏకాత్మభావన కలగదు. కాల వికారాలు, దృశ్యము యొక్క దృశ్యత్వం, మనో వ్యాపారం - ఇవన్నీ దాని విలాసాలే. క్రియ, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, చేతనం - వీటిని గ్రహించే శక్తీ ఆ బ్రహ్మమే. గ్రహించడానికి సాధనమైనది కూడా అదే. (ద్రషృ దర్శనం, దృశ్యం
- ఈ త్రిపుటిలో దర్శనమైవున్నది నీ ఆత్మ స్వరూపమే అని సావధానుడవైతే (గ్రహింపగలవు. ః అదే బ్రహ్మం. దానికి పుట్టుక, వార్దక్యం, ప్రారంభ మనేవి లేవు. అది శాశ్వతం, నిత్యం, నిర్మలం, అమోఘం, మంగళస్వరూపం, వందనీయం, పవిత్రం. ఏవిధమైన ఆగంతుక ధర్మాలు అందులో లేవు. అది కారణాల కన్నిటికీ కారణమై వున్నది. అది అజ్టేయము, అనుభవైకవేద్యము, జ్ఞానైకగమ్యమై విరాజిల్టుతున్నది. మహాకల్పాంతంలో శేషించిన పరమభావం శ్రీరాముడు : - మునీంద్రా! మహాప్రళయం సంభవించినప్పుడు ఏది మిగిలి వుంటుందో, అధి ఆకారం లేనిది అనడంలో నాకు ఎలాంటి సంశయమూ లేదు. కాని ''అది శూన్యం కాదు, (ప్రకాశం కాదు; తమో రూపంకాదు, భాస్వరం కాదు; చిద్రూపం కాదు, జీవుడు కాదు; బుద్రైతత్త్వం కాదు, మనస్సు కాదు; అది ఏదీ కాదు, అయినా అన్నీ అదే'* అని మీరు చెప్పారు. ఈ మీ మాటల వల్ల నాకు మోహం కల్గుతున్నది. దయచేసి దీన్ని వివరంగా తెలియజేయండి. వసిష్టుడు : - రామా! ఈ నీ ప్రశ్న ఎంతో విషమమైనది. అయినా సూర్యుడు ఏకటిని పోగొట్రినట్టు అనాయాసంగా నేను నీ సంశియాన్న తొలగిస్తాను. మహా(్రళయ కాలంలో మిగిలి వుండేది ఒకే ఒక సద్విస్తువు. అది ఎలా శూన్యం కాదో చెబుతాను, ఏను.
ఉత్పత్తి ప్రకరణం 27
స్తంభంలో చెక్కిన తర్వాత కనిపించే బొమ్మ చెక్కడానికి ముందు కూడా అందులోనే అవ్యక్తంగా వుంటుంది. అలాగే సృష్టికి పూర్వం కూడా ఈ విశ్వం ఆ సద్వస్తువులో వుంటుంది, అందువల్ల ఆ సద్వస్తువు శూన్యం కాదు. ఈ సువిశాలమైన జగత్తు సత్యమైనా కానీ, లేక అసత్యమైనా కానీ, దాని కధిష్టానమైన వస్తువు మాత్రం ఎన్నటికీ శూన్యం కాజాలదు. చెక్కడానికి ముందు స్తంభంలో బొమ్మ లేకుండా పోలేదు. అదే రీతిగా జగత్తు వ్యక్తం కాక పూర్వం బ్రహ్మంలో లేకుండా పోలేదు. అందువల్ల బ్రహ్మం శూన్యం కానేరదు. నిశ్చలమైన నీటిలో లీనమైన అల ఉన్నదని కానీ లేదని కానీ చెప్పలేవు. అదే విధంగా బబహ్మంలో జగత్తుకూడా అనిర్వచనీయస్రితిలో వున్నది.
స్తంభగతమైన బొమ్మవిషయంలో దేశకాలాది సామశగ్రి కనిపించడం వల్ల సందేహం కలగదు. కాని త్రివిధపరిచ్చేద శూన్యమైన (బ్రహ్మ విషయంలో ఆ సామగ్రి కనిపించదు కాబట్టి సందేహం కల్గుతుంది. అందువల్లనే స్తంభంలోని బొమ్మకూ, (బ్రహ్మంలోని జగత్తుకూ పోలిక ఏకదేశంలో సరిపడుతుంది కాని అన్ని విధాలా సరిపడదు.
నిజానికి బ్రహ్మము నుండి జగత్తు ఎన్నడూ ఉదయించనూ లేదు, అస్తమించనూ లేదు. సద్రూపమైన కేవల బ్రహ్మమై అది స్వస్వరూపంలోనే వున్నది. అందుచేత పరస్పర సాపేక్ష కల్పనలైన శూన్యతా శూన్యతలు ఆ పరబ్రహ్మ విషయంలో సంభవించజాలవు.
సూర్యాగ్ని చంద్ర నక్షత్రాదులు అవ్యయమైన బ్రహ్మాన్ని (ప్రకాశింప జేయలేవు. సూర్యాది మహాభూతాల వెలుగులేక పోవడాన్నే తమస్సంటారు. ఆలాంటి తమస్సు స్వప్రకాశమైన (బ్రహ్మంలో ఎక్కడా లేదు: బుద్ది గుహలో స్వయం (ప్రకాశమైవున్న (బ్రహ్మాన్ని ప్రకాశింపజేయడానికి ఇతర పదార్దాలతో పని లేదు.
పరబ్రహ్మం చీకటి వెలుగులకు అతీతమైనది. అది జగత్తు యొక్క ఉనికికి నెలవైనది.
మారేడు పండుకూ, ఆ పండులోని గుజ్జుకూ భేదం లేదు. అలాగే (బ్రహ్మానికీ, అందలి జగత్తుకూ తేడా లేదు. నీటిలో అలలాగా, మట్టిలో కుండలాగా బ్రహ్మంలో జగత్తు ఉన్నది. అలాంటి బ్రహ్మం శూన్య మెలా అవుతుంది?
నీరు, మట్టి ఆకారం కలవి. వీటితో నిరాకార బ్రహ్మానికి పోలిక సరి అయినది
28 యోగూసిష్టం _ కాదు. నిరాకారమైన (బ్రహ్మములో విలీనమైన జగత్తు కూడా నిరాకారమే. ఆకాశం కంటే నిర్మలమైన చిదాకాశం ఎలాంటిదో, అందలి జగద్వస్తువు గూడా అలాంటిదే.
ఆస్వాదించేవాడు లేకపోతే మిరియపు గింజలో తీక్షత గోచరించదు. చేత్యకళ లేకపోతే చిదాకాశంలో చిద్రూపత్వం సంభవించదు. అందువల్ల చేత్యశూన్యమైన పరబ్రహ్మాన్ని చిద్రూపమనడం భావ్యం కాదు.
కదలిక లేని నీటిలో పెద్ద అలలు దాగివున్నట్టు నిరాకారమైన (బ్రహ్మంలో విశ్వం అణగివున్నది.
పూర్ణమైన (బ్రహ్మంనుండి జీవభావంతో (ప్రసరించేది కూడా వాస్తవస్థితిలో పూర్ణమే. ఏది ప్లూర్ణమో, అది ఆకార రహితమై వుంటుంది. కాబట్టి ఉత్ప్సన్నమైనట్టు తోస్తున్న ఈ విశ్వం ఉత్పన్నం కానిదే. దృశ్యం సత్యంలా కనిపించినా అసత్యమే. (ప్రతిబింబం ఉన్నట్టు గోచరించినా బింబంకంటే వేరుగా లేదు కదా!
(బ్రహ్మం పరమాణువు కంటె సూక్ష్మమైనది, పరిశుద్రమైనది. అది ఆకాశగర్భం కంటె శాంతమైనది. దిక్కు, కాలం మొదలైన వాటిచే అది అవచ్చిన్నం కాదు. కాబట్టి అది చాలా విశాలమైనది. దానికి ఆద్యంతాలు లేవు. అది స్వతః ప్రకాశమానమైనది.
చిద్రూపవే పాడసూపని ఆ బ్రహ్మంలో జీవత్వం ఎలా వుంటుంది? చిద్రూపం కాదు కాబట్లే జీవత్వం, బుద్రిత్వం, చిత్తత్వం, ఇం(ద్రియత్వం, వాసనలు అనేవి ఏవీ అందులో లేవు. ఈ విధంగా అది మహారంభం కలదై వున్నా మా దృష్టికి శాంతంగానూ, ఆకాశం కంటే కూడ శూన్యంగానూ గోచరిస్తున్నది.
శ్రీరాముడు : - మునీంద్రా! అనంత చిదాకారమైన ఆ పరమార్ధం యొక్క రూపం ఎలాంటిదో, నాకు స్పుటంగా బోధపడేటట్టు ఉపదేశించండి.
వసిష్టుడు : - మనా(ప్రళయ కాలంలో అన్ని కారణాలకూ కారణమైన పరబ్రహ్మం మాత్రమే మిగిలివుంటుంది. దానిని వర్షిస్తాను విను.
సమాధి ఫ్రీితిలో మనోవృత్తులు పూర్తిగా క్షయమైనప్పుడు ఇద మిళ్హమని చెప్పరాని ఏ స్వ(ప్రకాశసద్రూపం మిగిలివుంటుందో అదే పరమాత్మరూపం. 'సమాధ్యారంభంలో (ద్రష్ట, దృశ్యం, దర్శనం అనే త్రిపుటి లయమైన దశలో ఏది సాక్షిరూపమై భాసిస్తుందో అదే పరమాత్మరూపం. సమాధి నుండి లేచే స్థితికి ముందు ఛ్యేత్య విముఖమైన జీవ చైతన్యము యొక్క నిర్మల చిన్మాత్రశరీరమే దాని రూపం.
ఉత్పత్తి ప్రకరణం 29 శరీరానికి గాలి మొదలైనవి తగిలినా స్పర్శాదుల వల్ల వికారం పొందని యోగారూఢుని చిత్తస్వరూపమే పరమాత్మరూపం. స్వపష్నరహితమూ, అనంతమూ, అజడమూ అయిన దీరసుషుప్త్యవస్టలోని చిత్తము యొక్క రూపమే [ప్రళయకాలంలో పరమాత్మ రూపంగా మిగిలివుంటుంది. ఆకాశ హృదయమైన శూన్యత్వం, శిలాహృదయమైన ఘనత్వం, వాయుహృదయమైన అంతర్చహిః ప్లూర్ణత్వం, చేత్య సంబంధం లేని చిదాకాశం - వీటి రూపమే పరమాత్మరూపం. ఇంతెందుకు? జీవుని యొక్క (ప్రశాంతమూ, సహజసిద్దవమూ అయిన అమనస్క స్రీతియే ఆ పరమాత్మరూపం. చిత్ర్రకాశం- ఆదిత్య (ప్రకాశం- ఆకాళం- చాక్షుషాది వృత్తిరూపదర్శనం- వీటి మధ్య ఆనంద సచ్చిద్రూపమై భాసించేదే బ్రహ్మరూపం. బుద్రివృత్తికీ, అర్హస్పూర్తికీ, విషయానికీ, అజ్జానానికీ సాక్షిభూతమైవున్న ఆద్యంత రహితమైన వేదనమే పరమాత్మ రూపం. ఉదయించకపోయినా దేనినుండి ఉదయించినట్టు ఈ జగత్తు కనిపిస్తున్నదో, దేనికంటె వేరుగాని దైనా వేరైనట్ను తోస్తున్నదో, అదే పరమాత్మరూపం. వ్యవహారాలన్నీ చేస్తున్నా ఏది బండలా కదలక వున్నదో, అవకాశం లేనిదైనా ఏది జగత్తుకు అవకాశమిస్తున్నదో, అదే పరమాత్మరూపం. వేద్యం, వేదనం, వేత్త - ఈ (త్రిపుటీ రూపం ఎందులో ఉదయించి అస్తమిస్తున్నదో అదే పరమాత్మరూపం. బుద్రిమయం కాని ఏ మహాదర్పణంలో వేద్య వేదన వేతృత్వాలు (ప్రతిబింబిస్తున్నవో అదే పరవాత్మ రూపం. స్వప్నజా గ్రదవస్రలు లేక సుషుష్త్రాత్మకమైన ఆ మహావైతన్య మనోరూపమే చరాచర విశ్వంలో ప్రళయకాలంలో మిగిలి వుంటుంది. వానస్సు - బుద్ది మొదలైనవి లేని స్పావర వస్తువుల అచలస్వరూపం బోధమయంగా రూపొందితే - దానిని పరమాత్మతో పోల్చవచ్చు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, సూర్యుడు, ఇంద్రుడు, సదాశివుడు మొదలైన దేవతలందరూ లయమైన పిదప పరమ శివము, ఉపాధులన్ని తొలగడం వల్ల వికల్పరహితమూ, విశ్వసంగవిహీనమూ, వైతన్యమా[త్రమూ అయిన ఒకే ఒక స్వరూపం మిగిలి వుంటుంది. అదే పరబ్రహ్మం.
30 యోగవాసిస్టం పరమార్ధ వర్షనం శ్రీరాముడు : - (బ్రహ్మన్! సృష్టి సమయంలో అతి విస్త్రృతమై కనిపించే ఈ నామ రూపాత్మక జగత్తు ప్రళయ కాలంలో ఎక్కడ దాగివుంటుంది? వసిషుడు : - గొడ్రాలికొడుకు ఎక్కడినుండి వస్తాడు? ఎలా వుంటాడు? ఎక్కడికి పోతాడు? ఆకాశారణ్యం ఎక్కడనుండి వస్తుంది?. ఎక్కడికి పోతుంది? చెప్పు. శ్రీరాముడు : - గొడ్రాలి కొడుకు, ఆకసంలో అడవి అనేవి ఇప్పటికి లేవు. ఇక వుండబోవు. కాబట్టి అవి రావడం పోవడ మనేవి అసంభవాలు. వసిష్టుడు : - వంధ్యాపుత్రుడు, ఆకాశారణ్యం అనేవి ఎప్పుడూ ఎలా లేవో, అలాగే ఈ దృశ్య జగత్తు కూడా ఎప్పుడూ లేదు. దానికి ఉత్పత్తి వినాశాలు లేవు. ఏది అసలే లేదో, దానికి పుట్టుక ఎక్కడిది? అది నశించడ మెలా? శ్రీరాముడు : - వంధ్యాపుత్ర - ఆకాశారణ్యాలు లేకున్నా వాటి కల్పన వున్నది కదా! ఆ కల్పనకు ఉత్పత్తి వినాశాలున్నట్లే ఈ జగత్తుకు కూడా ఉండవచ్చు కదా! వసిష్కుడు : - రామా! ఉపమానవస్తువు ఉపమేయకోటిలో (ప్రవేశించని దైనప్పుడే బౌపమ్యం పొసగుతుంది. ఆకోటిలో ప్రవేశించే వస్తువుతో చెప్పేపోలిక అనన్వయం క్రిందికి వస్తుంది. కాబట్టి ఉనికి లేని జగత్తుకు, ఉనికి లేని వంధ్యాపుత్రాదులే తగిన ఉపమానాలు. బంగారు కడియంలో కటకత్వం, ఆకసంలో శూన్యత్వం విడిగా కనిపించవు. అలాగే బ్రహ్మంలో జగత్త్యం వేరుగా లభించదు. కాటుక కంటె వేరుగా నలుపు, మంచు కంటె విడిగా చల్లదనం స్ఫురింపవు. అదేరీతిగా పరమాత్మ కంటె వేరుగా సృష్టి స్ఫురించడం లేదు. ఉన్నట్టు కనిపించినా ఎండమావిలో నీరు లేదు. రెండవ చంద్రునిలో చం ద్రత్వం లేదు. ఆ విధంగానే నిర్మలాత్మలో జగత్తు లేదు. కారణం లేకపోవటం వల్ల పూర్వమే ఏది లేదో అది ఇప్పుడు కూడా లేనిదే. ఇక దానికి నాశం ఎలా సంభవిస్తుంది? నీడకు ఎండ కారణం కాదు. అట్లే జడమైన జగత్తుకు చైతన్య రూపమయిన (బ్రహ్మం కారణం కాజాలదు. జగత్తుకూ, బ్రహ్మానికీ కార్యకారణభావం కుదరదు. ఆదికారణవ్వైెన బబహ్మవేం జగ(ద్రూపంల్ో గోచరిస్తున్నది. అజ్ఞానవేం
ఉత్పత్తి ప్రకరణం 31 సంవిదాభాసమైవుంది. స్వప్నంలో కనిపించే వస్తువు లాగా జగత్తు కూడా వాస్తవంగా లేదు.
ఈ కనిపించే జగత్తంతా పరవూత్మలో ఎప్పుడూ వుండేదే. దానికి ఉదయాస్తమయాలు లేవు. జలమే (ద్రవం, వాయువే స్పందనం. ప్రకాశమే ఆభాసం. అదేరీతిగా బ్రహ్మము జగ(త్రయమై వున్నది. స్వప్న(ద్రష్ష్రయొక్క చైతన్యమే స్వపష్ననగరమైనట్టు తన ఆత్మే పరమాత్మలో జగత్తులా భాసిస్తున్నది.
శ్రీరాముడు : - బ్రహ్మర్షీ! ఈ దృళ్య జగత్తంతా స్వ్పపష్నానుభవంలాగా మిథ్య అయితే దీనిపై యింత విశ్వాసం ఎలా ఏర్పడింది? దృశ్యముంటే ద్రష్ట ఉంటాడు. ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యం వుంటుంది. ఒకటి వుంచే రెండూ ఉన్నట్లే. ఒకటి నశించినప్పుడే రెండూ లేని వవుతాయి. దృళ్యం అత్యంతాసంభవం అయ్యేవరకూ 'ర్రష్టలో అది కనిపిస్తూనే వుంటుంది. ఆ స్థితిలో మోక్షజ్ఞానం లభించనే లభించదు కదా!
దృశ్యం మొదట వుండి తరువాత నశించినా దృళ్యస్మరణ రూపమైన అనర్జమనే బంధం శమించదు. అద్దం ఎక్కడ ఉన్నా అందులో ప్రతిబింబం పడుతుంది. అలాగే చిదాదర్శంలో సర్వస్మరణలూ ప్రతిఫలిస్తాయి. దృశ్యం ఉత్పన్నం కాలేదనే అనుభవం కలగనప్పుడు దృశ్యస్వభావుడైన (ద్రష్టకు మోక్షం ఎలా సంభవిస్తుంది?
ఆత్మవిద్వరేణ్యా! అందువల్ల ముక్తికి ప్రతిబంధకమైన దృశ్య జ్ఞానం తాలిగే విధానం నాకు తగిన యుక్తులతో బోధించండి!
వసిష్టుడు : - రామా! లేనిదైనా ఉన్నట్టు భాసించే ఈ జగత్స్వరూపాన్ని ఒక కథతో నీకు వివరిస్తాను, విను. ఈ కథ సావధానంగా వింటే నీ హృదయంలో దృశ్యబుద్ది నుడుగుపై బడిన ధూళిలాగా అణగారిపోతుంది. అప్పుడు ఈజగత్సృప్టికి సంబంధించిన ఫ్టీతి అత్యంతాభావమైనదని గ్రహించి ఆ పరబ్రహ్మమునే ధ్యానిస్తూ నీవు వ్యవహరించగలవు. వంహాపర్వతాన్ని బాణాలు భేదించ లేనట్టు వివిధవ్యవహారదృష్టులు నిన్నప్పుడు వేధించజాలవు.
రాఘవా! ఉన్నది ఒకే ఆత్మ. రెండవ కల్పన లేనే లేదు. అందులో జగత్తు ఎలా జన్మించిందో నీకు వివరి_ను. ఆ ఆత్మ నుండే సమస్త విజృంభణలూ కల్లుతున్నాయి. ఈ సమస్తమూ ఆ మహాత్మయే. రూపదర్శనం, మనోమననం మొదలైన వాటికి నెలవై అది తనకు తానే ఉదయిస్తున్నది, విలయమూ పొందుతున్నది.
12 యోగవాసిష్టం జగదుత్పత్తి
వసిష్టుడు : - పరమ శాంతమూ, పరమ పావనమూ అయిన (బ్రహ్మపదం నుండీ ఈ విశ్వం ఎలా ఉదయించిందో చెబుతాను, విను.
సుషుప్తిలో ఆత్మరూపహమే స్వప్నంగా భాసిస్తుంది. అలాగే ప్రతివ్యక్తికీ బ్రహ్మమే సృష్టిగా స్ఫురిస్తున్నది. ఆ బ్రహ్మం సర్వాత్మకం కాబట్టి స్పష్టిపై దృఢవిశ్వాసం కల్గుతున్నది. స్వప్నం ఒక వ్యక్తి యొక్క వాసనామాత్రకార్యం కావడం వల్ల దానిపై అంతటి విశ్వాసం ఏర్పడదు.
అనంత(ప్రకాశరూప మయిన చిన్మణికి దాని సత్తామా త్రమైన ఈ విశ్వం చేత్యమై భాసిస్తున్నది. ఆకాశంకంటే సూత్మ్మమూ, శుద్దమూ అయిన జ్ఞానంలో సర్వస్నష్టికీ సంబంధించిన నావు రూపాల అనుసంధానం జరుగుతుంది. ఈ రీతిగా పరమాత్మసత్తే భావనాబలం వల్ల సంసారాభిముఖిగా రూపొందింది. త్రాడులో పాములాగా ఆ పరమాత్మ సత్తలోనే బీవసత్త కూడా పొడసూపింది.
రామచంద్రా! ఇక మహాభూతాల స్పష్టి (క్రమాన్ని వివరిస్తాను, విను.
జీవసత్త ఉదయించిన వెంటనే శూన్యతా ప్రాయమైన ఆకాశసత్త ఉదయించింది. అది శబ్దాది గుణాలకు బీజమై తరువాత ఆకాశాది వ్యవహారాలకు పాత్ర మయింది. ఆ పైన అహంకార సత్తతో కూడిన కాలసత్త జనించింది. అదే ముఖ్యమయిన జగత్తు యొక్క స్థితికి బీజమయింది.
ఈ విధంగా హిరణ్య గర్భ వేషంతో కూడిన పరమాత్మ సత్తవల్లనే ఆకాశం, అహంకారం, కాలం సృష్టించబడ్డాయి. అసద్రూపమైన ఈ జగత్తు దానిమండి ఉత్పన్నమై సద్రూపంతో భాసిస్తున్నది.
ఈ విధమైన సంవేదనమే సంకల్ప వృక్షానికి బీజం. ఆ అహంకారము యొక్క ఏకదేశమే చలన శక్తి ప్రధానమై వాయు వవుతున్నది. పరమాత్మ సత్తనుండే శబ్ద తన్మాత్ర భావనవల్ల అతిసూక్మమైన ఆకాశభావం నుండి కొంచెం ఘనీభవించిన శబ్ద తన్మాత్ర ఉదయించింది. శబ్దసంచయ వునే వృశ్షానికి ఆ శబ్ద తన్మాత్రే బీజమయింది. పద వాక్య ప్రమాణాఖ్యమైన వేదాదిశబ్ద విశేషాలు అందులో నుండే వికసించాయి. ఆ శబ్దాలు పదార్దాలను కల్పించాయి. ఇలా వేదభావం పాందిన పరమాత్మ నుండే ఈజగత్సంపద జనించింది.
ఉత్పత్తి ప్రకరణం 33
ఇట్టి పరివారంతో కూడిన చిత్తే జీవళ బ్దంతో వ్యవహరింపబడుతున్నది. సర్వమూర్తుల ఆకారాలకూ హేతువదే. పదునాల్లు భువనాలలోని ప్రాణి జాత మంతా ఆ ప్రాణవాయువును నిమిత్తంగా చేసుకొనే బ్రహ్మాండోదరాలలో సంచరిస్తున్నది.
వాయుత్వాభిమానంతోడి వైతన్యమే స్పర్శ తన్మాత్రమై స్పర్శ వృళనికి బీజమయింది. అది ఆవహం, ప్రవహం మొదలైన నలువది తొమ్మిది పవనస్కంధ విభాగాలతో కూడి వృన్నది. సర్వభూతాల చలనకార్యం దానివల్లనే నిర్వర్తింపబడుతున్నది.
(ప్రకాశాత్మకత్వ భావన గల ఆ చైతన్యం నుండి రూపతన్మాత్ర ఆవిర్చవించింది. అది అగ్ని నామానికి ఆశయమై సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, విద్యుత్తు మొదలైన తేజః పదార్జాలకు బీజమయింది. పిదప రూపవిభేదం ద్వారా దాని నుండే సంసారం విస్తరిల్లింది. ల
పిమ్మట ఆ తేజోరూపమైన ఆత్మ జలళరీరంగా తన్ను భావించి జలంగా రూపొందింది. అందలి రసాస్వాదం రసతన్మాత్రమై రసవృక్షానికి బీజమయింది. భావిజల సంజకు ఆశ్రయమదే. విషయేంద్రియాల సంయోగంతో అది సంసారాన్ని పెంచింది.
అలా జలభావం పొందిన పరమాత్మ “నేను పృథివిని' అని సంకల్పించుకొని భావిభూగోళమైన పృథ్విగా రూపొందింది. గంధతన్మాత్రభావం పాందింది. మనుష్యాదుల ఆకారవృక్షానికి బీజమదే. సర్వాధారమైన దానినుండి సంసారం
ఈ విధంగా చిద్భావనాబలంతో (బ్రహ్మాండాకృతిగా భావింపబడిన భూతతన్మాత్రలు మహాభూతత్వం పాంది పరస్పర సమ్మిశ్రితాలై నీటిలో ఏర్పడిన బుడగలలాగా బ్రహ్మాండరూపాలుగా పరిణమించాయి. మహాప్రళయ కాలం వరకూ ఆ భూతాలు అలా పరస్పరం కలిసేవుంటాయి కాని విడివిడిగా కనిపించవు.
ఒక్క వు(రిగింజలో ఎన్నో వం(రి చెట్టు ఉన్నట్లే సృష్టికి వముందు భూతస్పష్టులన్నీ అవ్యాకృతాకాశంలో సంవిదాత్మకంగా వుంటాయి. కలలో విశాలవిశ్వం కనిపిస్తుంది గదా! అలాగే మాయా ప్రభావం వళ్ల పరమాణు గర్భంలోనే ఈ జగత్తులు అంకురించడం, ళతళాఖలతో (ప్రకాశించడం వెచుదలైనవి జరుగుతుంటాయి. పైకీ స్టూలంగా కనిపించినా అవి చిదనువిద్దాలు కాబట్టి
34 యోగవాసిష్టం సూక్ష్మరూపాలే. అయినా క్షణంలో పిండీకరణం పాందుతాయి. ఈ రీతిగా సంకల్పాత్మక మయిన చిత్తే తన్మాత్రగణ మయింది.
ఈ అయిదు తన్మాత్రలే జగత్తుకు బీజం. పరమాత్మతో కూడి వున్న మాయా శక్తియే తన్మాత్రలకు వవూలం. మాయ తొలగినప్పుడు కేవల పరమాత్మే మిగిలిపోతుంది. కాన అజమూ, శుద్దమూ అయిన (బ్రహ్మమే జగదాకృతిని ధరించివున్నది.
స్వ్తయంభూత్స్పత్తి రామా! చిదాత్మకమయిన పరబ్రహ్మం ఒక్కటే ఉనికి గలది. పుట్టుకే లేనివైన ఆకాశాదుల ఉనికికి మూలమదే.
తొలుత చిదాత్మలో చేత్యత్వ కలనం కలిగింది. పిదప చిచ్చక్తి వల్ల చిత్తకల్పన జనించింది. చిచ్చేత్యాల కలయిక జీవత్వ కల్పనకు హేతు వయింది. చేత్యైక పరమైన చిత్తునుండి అహంభావం ఉదయించింది. అహంభావ పరిణామంవల్ల బుదైత్వ కల్పన రూపొందింది. బుద్లి శబ్దాదితన్మాత్రల మననంవల్ల మనోరూపం పొందింది. తన్న్మాత్రల పరస్పర సమ్మేళనం ( పంచీకరణం) వల్ల మహాభూతాలు ఉదయించాయి. ఆ భూతాలనుండి జగత్తు ప్రభవించింది.
ఈరీతిగా కలలో కనిపించే నగరం లాగా చిదాకాశమనే అడవిలో ఈ విశాలవిశ్వ మనేపాద కల్పితమై మాటిమాటికీ పాడసూపి నశిస్తున్నది. చిదాత్మ అనే బీజంనుండే జగత్తులనే పులిగోరుచెట్టు పొదలు ప్రబలుతున్నాయి. ఇవి మొలకెత్తడానికి నేల, నీరు వంటి పదార్దాల సహాయం అక్కరలేదు.
స్వప్న ద్రష్ట కలలో నగరాన్ని సృష్టించుకొన్నట్లే చిద్రూపమైన పరతత్త్వ్యం పృథివ్యాది భూతాలను సృష్టించింది. జగత్తులనే మొలకలను కలిగించే శక్తి దానికున్నది. జగత్తుకు బీజం పంచతన్మాత్రలు. తన్మాత్రలకు బీజం అక్షయమైన చైతన్యం. బీజం ఫలంకంటే వేరు కాదు. కావున జగమంతా బ్రహ్మమయమే.
సృష్ట్యాదిలో చిచ్చక్తివల్ల ప్రభవించిన తన్మాత్రలు కల్పితాలే కాని సత్యాలు కావు. అవి ఒకటికొకటి కలయిక చెంది సూల జగత్తుగా పరిణమించాయి. అందుచేత జగత్తుయొక్క ఉనికి ఆత్మసత్తను ఆధారం చేసుకొని వున్నది. సిద్రం కాని దానినుండి సాధింపబడేది ఏదీ ఉండదు. తన్మాత్రలే ఉనికి లేని నయినప్పుడు వాటినుండి పుల్లన
ఉత్పత్తి ప్రకరణం 35 జగత్తుకు ఉనికి ఎలా సిద్దిస్తుంది?
తన్మాత్రాపంచకం బ్రహ్మకార్యం కాన బ్రహ్మమే. ఆ తన్మార్రల నుండి జనించిన జగత్తు కూడా బ్రహ్మమే కాని వేరు కాజూలదు. ముందు వెనుకల నాధారం చేసుకొని కార్యకారణభావం వ్యవహారం లోకి వచ్చింది కాని ఉన్నది ఒక్కటే. కాబట్టి జగత్తు ఉత్పన్నం కాలేదని తేలింది.
స్వప్నంలోని పట్టణంలాగా (బ్రహ్మాకాశ రూపవుయిన పరవూత్మలో జీవాకాశత్వం లేనిదైనా ఉన్నట్టు తోస్తున్నది. ఆకాశంలో ఆకాశరూపం లాగా (బ్రవ్మోకాశంలో జీవాకాశం ఉదయిస్తుంది. అదే జీవుడని వ్యవహరింపబడుతున్నది. ఆ జీవునికి దేహమెలా ప్రాఫ్తించిందో చెబుతాను విను.
జీవుడు తన్ను మొదట అణతేజఃకణంగా భావించుకొంటాడు. తరువాత తన స్వరూపం వృద్దిపాందినట్టు తనలో తానే తలంచుకొంటాడు. ఒకే జీవుడు భావనాబలంతో (ద్రష్షగానూ, దృశ్యంగానూ స్సురిస్తాడు. కలలో తనతో పాటు తన చావు గూడా గోచరించినట్లే ఒకే జీవునికి ద్రష్ప్రత్వంతో పాటు దృశ్యత్వం గూడా గోచరిస్తుంది. పీమ్మట ఆ ఆత్మభావనా బలంతో తారకాసాదృళ్యం పొంది కొంచెం స్టూలంగా రూపొందుతుంది. అదే లింగశరీరం.
అద్దంలో కొండలాగా, బావినీళ్లలో ప్రతిఫలించిన శరీరం లాగా, సంపుటిలో నిరోధింపబడిన ధ్వనిలాగా ఆత్మ సర్వవ్యాపీ అయినా దేహవునే తొ(రలో (ప్రవేశించినట్టు భావిస్తుంది.
- కలగనేవాడు తనలో బాహ్యప్రపంచాన్ని చూచినట్లే జీవుడు తన సూత్మ శరీరంలో సమస్త వ్యవహారాన్నీ కల్పించుకొని చూస్తాడు. పిదప భావనాబలం వల్లనే అతనికి జ్ఞానకర్మేంద్రియాలతో కూడిన స్టూలశరీరం గూడా ప్రాప్తిస్తుంది. చూచేది కన్నుగా, తాకేది త్వక్కుగా, వినేది శ్రవణంగా, మూచూచేది ఘ్రూణంగా, రుచి చూచేది రసనగా, స్పందించేది ప్రాణవాయువుగా, పనిచేసేవి కర్మేంద్రియాలుగా రూపొందుతాయి. ఈవిధంగా అసత్యమయినా సత్యంలా తోచే కల్పనను బట్టి బ్రహ్మం జీవత్వాన్ని గ్రహించింది. ఆతివాహిక దేహస్వరరూపమైన (బ్రహ్మం చిత్త దేహాంబరాకారం పొంది నీటిలోని అండంగా రూపొందింది. అదే బ్రహ్మాండంగా మారింది.
౯12
36 యోగవాసిష్టం ఆ త్ లి జీవుడు చిత్తసంకల్పంతోనే దేశకాల క్రియా (ద్రవ్య కల్పనలను భావించి శబ్బనిర్మాణం చేస్తాడు. కల్పిత శబ్దాలతో అర్జాలను బంధిస్తాడు. కలలో మనుజుడు ఆకాశంలో ఎగిరిపోయినట్టు ఆతివాహిక దేహుడయిన అజుడు జగద్రవులో సంచరిస్తాడు. ఈవిధంగా స్వయంభువు ఫుట్టకనే పుట్టివవాడయ్యాడు. ఈ'(బ్రహ్మండాకారమైన భ్రమలో పుల్టినదంటూ ఏదీ లేదు. బ్రహ్మాకాశం అనంతమైన బ్రహ్మంగానే వున్నది. 'వ్రాయబడని చిత్రంలాగా, సంకల్ప నగరంలాగా జగత్తు ఉన్నట్లు తోస్తున్నా లేనిదే. పూర్వకల్పంలోని (బ్రహ్మాదులు మహా(ప్రళభయంలో విముక్తులయ్యారు. అందుచేత ఇప్పటి బ్రహ్మకు పూర్వష్మృతి ఉన్నదనటానికి అవకాశం లేదు. పూర్వసంస్కారం జగన్నిర్మాణానికి హేతు వయిందనడానికి వీలు లేదు. (బ్రహ్మకు కారణం లేదు. బ్రహ్మ సృష్టించే జగత్తుకు కూడా కారణం లేదు, సృష్టికర్త ఎలాంటివాడో, సృష్టి కూడా అట్టిదే. ఈ జగత్తు స్వప్నం వంటిది. నీటిలో ద్రవత్వం వేరుగా లేదు. అలాగే పరమాత్మలో సృష్టి విడిగా లేదు. దృశ్యజగత్తు బ్రహ్మంలాగా ప్రశాంతమూ, నిరాధారమూ, నిరాధేయమూ, అద్వయమూ అయివున్నది. ఉన్నది బ్రహ్మమొక్కటే. నీరు సుడులను కల్పించుక్న్నట్టు బ్రహ్మమే జగత్తును కల్పించుకొన్నది, (ద్రష్ట దృశ్యం, బ్రహ్మాండం, బ్రహ్మ - ఇత్యాదులేవీ అందులో లేవు. కలలో తన చావు తనకు తోచినట్లే లేని జగత్తు ఉన్నట్టు తోస్తున్నది. ఉన్నదంతా అనాది, అనంతము, జ్ఞానమా(త్రమైన (బ్రహ్మం మాత్రమే. పరమాకాశంలో శూన్యరూపుడై వెలసిన ప్రథమ ప్రజాపతి ఆతివాహిక శరీరుడే కాని పాంచభౌతిక దేహధారి కాడు. అతని నుండి వచ్చిన పృథివ్యాదులు కూడా సత్తులు కావు. బ్రహ్మ ప్రతిపాదనం రామా! జగత్తు మొదలైన దృశ్యజాతం ఏదీ లేదు. అది పుట్టుకే లేనిది కాబట్టి ఉనికి లేనిదే. ఉనికి కలది పరతత్త్వం ఒక్కటే. నిశ్చలమైన సము(ద్రగర్భములోని జలం చలనంపాందినణ్లే పరాకాళం తన స్వరూపం వదలక్షనే జీవభావం పొందింది. తనలో చిద్వృత్తి ఏర్పడగానే పరమాత్మ యొక్క విరాట్స్వరూపం ఏర్పడింది. ఆ విరాడ్డేహం ఆతివాహికవే కాని పాంచభౌతికం కాదు. అది కలలో కనిుంచే కొండవంటిది. స్తంభంలో చెక్కబడని బొమ్మలాంచిది.
ఉత్పత్తి ప్రకంణం 37
ప్రథమ ప్రజాపతి కారణం లేకనే కలిగాడు. అందువల్ల "స్వయంభువు అని (ప్రసిద్ది చెందాడు. అతని స్వరూపం అద్దంలో కనిపించే గోడలాగా దృళ్యమైనా అదృశ్యమే. అతడు దృళ్యం కాడు, (ద్రష్షకాడు. దర్శనమూ కాడు. ఒక దీపం నుండి అనేక దీపాలు ఉదయించినట్టు. అతని నుండే జీవలోకం ఉద్భవించింది. ఒక కలనుండి మరొక కల ఉదయించినట్లే ఒక సంకల్పం నుండే మరొక సంకల్పం కలుగుతుంది. విరాట్ఫరీరంనుండి ఏ విధమైన సహకారికారణాలు లేకుండనే ఈ జీవులందరూ ఉదయించారు. కాబట్టి వీరు విరాట్టుకంటే వేరు కారు. సహకారికారణాలేవీ లేనప్పుడు కార్యకారణాలకు భేదం ఉండరాదు.
ఆదిబ్రహ్మయే విరాట్టు. స్పష్టి అంతా విరాట్స్వరూపమే. జీవాకాశం కూడా అదే. అందులో పృథివ్యాది భూతాలకు ఉనికి లేనే లేదు.
శ్రీరాముడు : - భగవన్! ఆ జీవుడు పరిమిత స్వరూపుడా? లేక అపరిమిత స్వరూపుడా? బీవు డొక్కడా? లేక అనేకులా? లేక పెదకొండవలె జీవపిండం అంతం లేనిదా? మబ్బునుండి జలధారల వలె సముద్రం నుండి నీటి తుంపురుల్లాగా, కాలిన ఇనుప గుండునుండి అగ్నికణాలరీతిగా ఈ జీవులు దేనినుండి పుడుతున్నారు? ఈ జీవజాల నిర్ణయాన్ని ఇంకా నాకు స్పష్టంగా వివరించండి.
వసిష్టుడు : - రామా! జీవుడంటూ ఏ ఒక్కడూ లేడు. ఇక జీవరాసులెలా వస్తాయి? కుందేటి కొమ్ము ఎగిరిపోతున్నది అన్నట్టున్నది నీ మాట. జీవుడు, జీవరాశి, జీవపిండం ఇవేవీ లేవు. శుద్దచిన్మాత్రమైన బ్రహ్మం ఒక్కటే ఉన్నది. అది సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్నం. అది అనంత కల్పనా కౌశలంతో విలసిల్టుతున్నది. ఆ కల్పనా బలంతో అది నానారూపాలు పొందుతుంది. జీవుడు, విశ్వం, క్రియ, స్పందం, వునస్సు, ఏకత్వం, ద్విత్వం ఇలా ఇన్ని రూపాలతో అది తన ఉనికినే స్పురింపజేస్తున్నది.
తత్త్వం తెలియకపోతే జీవుడు మొదలైన పైపదార్జాలన్నీ విడివిడిగా ఉన్నట్టు తోస్తాయి. తెలిస్తే అంతా (బ్రహ్మం తప్పు వేరేమీ లేదు. దీపంతో చీకటి పోతుంది. కాని చీకటి స్వరూపం ఎట్టిదో తెలియదు. జ్ఞానంతో అజ్ఞానం నశిస్తుంది. కాని అజ్ఞాన స్వరూపం ఎలాంటిదో గోచరించదు.
ఈ రీతిగా (బ్రహ్మమే జీవాత్మ అని తేలింది. దానిలో వీభాగాలు, విభేదాలు లేవు. అది అనాది, అనంతం, సర్వశక్తి సంపన్నం, చైతన్యస్వరూపం, కనబడేదంతా అనుభవంలో (బ్రహ్మమే కాని మరేమీ కాదు.
3రి యోగవాసిస్థం శ్రీరాముడు : - బ్రహ్మర్షీ! జీవులందరూ సమష్టి మహాజీవస్వరూపులే అయితే ఒక జీవునికి కల్ళిన కోరికే అందరికీ కలగవడ్దా? ఆది జీవుని వలె అందరూ సత్యసంకల్పులు కావద్దా? వసిష్టుడు: - సర్వశక్తి మయాత్మకమైన (బ్రహ్మం ఆదిజీవుడుగా రూపొందింది. అప్పుడది జగన్నిర్మాణ వ్యవప్టను సంకల్పించింది. దాని సంకల్పం తిరుగులేనిది. ఆ సంకల్పబలంతోనే అది వ్యష్టి జీవుల్లో కూడా కల్పించింది. వ్యష్టిజీవులు సత్య సంక ల్పులు కాకూడదు అనేది కూడా దాని సంకల్పమే. స్పష్టి క్రీయా(క్రమమంతా దాని సంకల్పాధీనమే. వ్యష్టి జీవుని ఇచ్చ ఫలించడం కూడా ఆదిజీవుని సంకల్పాన్ని అనుసరించే జరుగుతుంది. ఈ నియమం లేకపోతే వ్యష్టి జీవుల కర్మకు ఫలం కూడ సిత్రించదు. కాబట్టి బ్రహ్మమే మహాజీవుడుగా, కోట్లకొలది వ్యష్టిబీవులుగా గూడా రూపొందుతున్నది. (బ్రహ్మం చేత్య సంవేదనం వల్ల జీవు డవుతున్నది. సంసారం పొందుతున్నది. ఆ సంవేదనం లేనప్పుడు సమస్వరూపమై వుంటుంది, రాగి బంగారమైనట్లు కనిష్టజీవులు (క్రమంగా జ్యేష్టత్వం పొందిగాని, లేక సాక్షాత్తుగా గాని (బ్రహ్మభావం పొందుతారు. చిచ్చమత్కారదళలో మహాకాశ స్వరూపమైన ఆత్మ యందు ఉనికి లేని జగత్తు ఉనికిగలదిగా తోస్తుంది. చిచ్చమత్కారమే భవిష్యన్నామరూపాలను ధరిస్తుంది. దీనినే అహంకార మని విజ్ఞులు (గ్రహిస్తారు. ఆత్మలో అనంతభువనాలుగా (ప్రతిఫలించేది గూడా ఆచమత్కాయే. ఆ రీతిగా ప్రతిఫలించిన చైతన్యాన్నే పరిణామమని, వికారమనీ అంటున్నాము. చిత్తు, చేత్యము, 'ప్రకాశము- ఇవి అభిన్నంగా అనుభవానికి రావడమే జగత్తు. చిత్తుయొక్క శక్తి ఆకసంకంటే సూత్మమైనది. అది స్వభావంతోనే అహంభావ దర్శనం కల్గివున్నది. చిత్తు తనలో దర్శించే చమత్కారమే జగత్తు అనబడుతున్నది. రాఘవా! చిత్తు యొక్క చేత్యమే అహంకారం. అది కల్పనా మాత్రమే. కాబట్టీ తన్మాత్రలు మొదలైన జగత్తంతా చిత్తే కాని మరేమీ కాదు. ఉన్నదంతా ఒక్క చిద్రూపమైన ఆత్మే అయినప్పుడు ఇక ద్విత్వం, ఏకత్వం అనేవి ఎక్కడ ఉన్నాయి? కాబట్టే నీవు కల్పిత పదార్దాలను కడకు నెట్టివేయి. 'నీవు - నేను' అనే భేదభావం కూడా వదలిపెట్టు. అప్పుడు నీకు సత్యాసత్యాలలో సత్య మొక్కటే మిగులుతుంది.
ఉత్పత్తి ప్రకరణం 39 ఆత్మ సత్తలో ఎప్పుడూ, ఏవిధమైన మార్పూ లేదు. మబ్బులు తొలగితే ఆక్షాళ స్వరూపం గోచరిస్తుంది. అట్లే దృశ్యం తాలగితే ఆత్మస్వరూపం స్పురిస్తుంది.
చిచ్చవుత్కార రూపాలైన స్టూలజగత్తు, సూత్మ జగత్తు, దేవలోకం మొదలైనవన్నీ శూన్యాలే. విత్తుకంటె వేరైన దేమీ లేదుగదా! ఏది దేనినుండి వచ్చిందో, అది దానికంటె వేరు కాదు. సావయవ వస్తువుల ఫ్రీతే ఇలా వున్నది. ఇక నిరవయవ పదార్దాల విషయం చెప్పాలా?
చిత్తు నామరూపరహితం. దాని స్ఫురణ మాత్రమైన జగత్తు కూడా అట్టిదే. మనస్సు, బుద్ది, అహంకారం, పంచభూతాలు, కొండలు, దిక్కులు - ఇత్యాదులన్నీ చిత్తుయొక్క రచనలే. చిత్తత్త్వమే జగత్తత్త్వం. జగద్భావం తొలగినప్పుడు చిత్తు చిత్తుగానే మిగిలిపోతుంది. చిత్తు జగద్రూపంలో స్పురిస్తే జగత్తు కనిపిస్తుంది. అలా స్ఫురింపకపోతే జగత్తు కనుమరుగవుతుంది. భేదం దాని స్పూర్తిలోవే వున్నది. కాని జగత్తంటూ వేరుగా ఏమీ లేదు. చిత్తులోని శక్తీ జీవులుగా, తన్మాత్రాది జగత్తుగా తోస్తున్నది.
చిత్తు కర్త, స్పందనం కర్మ, చిత్తు యొక్క పరిస్పందమే జీవుడు. కర్తృ కర్మలకు భేదం లేదు. అందువల్ల చిత్తు, జీవుడు ఒక్కటే గాని రెండు కావు. మనస్సు ఇం(ద్రియరూపంలో ప్రకటితమై నానావిధాలుగా తోస్తున్నది. నిర్విశేషమైన చిత్ర్రకాశమే జగత్తు. ఇంతకంటె వేరుగా ఇందులో కార్యకారణభావ మేదీ లేదు.
చిద్రూపుడైన ఆత్మను నరకడం, కాల్బడం, తడపడం, ఎండబెట్టడం- అనేవి అసంభవాలు. అది నిత్యం, సర్వగతం, స్టాణువు, అచలం అయి వున్నది. ఈ విషయంలో (భ్రమకు లోనైనవారు వ్యర్జవాదాలు చేస్తున్నారు. ఇతరులకు కూడ (భమ కల్గిస్తున్నారు. మాకు మాత్రం (భ్రమ తొలగిపోయింది. సాకారమైన దృశ్యజగత్తు, దానికి సంబంధించిన వికారాలు ఆజ్ఞానికి సత్యాలు, తత్త్వజ్ఞుని దృష్టిలో అవి అసత్యాలు.
చిత్తు అనే చెట్టు చేత్యమనే జలంతో వృద్ది పొందింది. చిచ్చక్తి అనే వసంతం దానిలో కాలాదులనే ఫపూగుత్తులను కల్లిస్తున్నది. ఆకాళం, వాయువు, అగ్ని, జలం, సూర్యుడు, చం(ద్రుడు, నక్షత్రాలు, జూగ్రత్స్వప్న సుషుష్త్యవస్రలు- ఇవన్నీ ఆ చిద్రూపమైన బ్రహ్మమే. ఆకాశంలో మాలిన్యం లాగా భేదవికారాదులన్నీ (భమ వల్ల ఏర్భడినవే. స్పటికంలో ప్రతిబింబం లాగా (బబ్రహ్మంలో మిథ్యా జగత్తు ప్రతిఫలిస్తున్నది.
త0 యోగాస్టు గాలి మొదలైన భూతాల సంపర్కం స్టూలాకాశంలోనే లేదు. ఇక చిదాకాశంలో ఎలా వుంటుంది? చిగురుటాకు ఈనెలను దాల్చినట్ను బ్రహ్మం జగత్తును దాల్చివున్నది. కారణాల కన్నింటికి కారణమైన (బ్రహ్మమే మిథ్యామయమైన ఈ జగత్తును ధరించివున్నది. విత్తనం మొలక అయినట్టు ఉన్నదేదో అదే ఉదయిస్తుంది. చిత్తు అనుభవైకళమ్యం. జగత్తు అసిద్రం కాబట్టి చిత్తుకూడా అసిద్రమే అని చెప్పరాదు. వత్సా! ఈ వహాచిదాకాళంలో కనిపించే (త్రిభువనాలు భేదరహితమైన బ్రహ్మస్వరూపాలే. దృశ్యమంతా బ్రహ్మమయమే అన్న నిశ్చయం కల్లివుండు. మునీం ద్రుడలా చెప్పేసరికి సాయం సమయ మయింది. సూర్యుడస్తమించాడు. సభాసదు లందరూ మునులకు నమస్కరించి స్నానాది విధులకై వెళ్ళారు. తెల్లవారూనే మళ్లీ సభాఫ్తలికి విచ్చేశారు. ( ఇది మూడవ దినం) లీలోపాఖ్యానం
వసిష్టుడు రామచం(ద్రునితో ఇలా అన్నాడు-
“రామా! నిర్మలాకాశములో ముత్యం ఉన్నట్టు (భ్రాన్తి కలుగుతుంది కదా! అలాగే చిదాకాశంలో జగ(ద్ర్రమ కలుగుతున్నది. చిత్తు అనే స్తంభంలో ముల్లోకాలు అనే సాలభంజిక చెక్కబడకనే చెక్కినట్లు కనిపిస్తున్నది. దాన్ని చెక్కిన శిల్పి ఎవడూ లేడు. సాగరములో అల లాగా పరబ్రహ్మంలో దృశ్యజత్తు ప్రతీత మవుతున్నది.
గవాక్షరం(ధంలోని సూర్యకాంతిలో కనిపించే అణువుల కంటె సాక్షిచిత్రకాళంలో కనిపించే ఈ జగత్తు మిక్కిలి సూత్మమైనది. అయితే పైసూర్యకాంతి కంటె భిన్నంగా అణువులు భాసిస్తాయి, కాని బ్రహ్మంకంటె జగత్తు భిన్నంగా భాసించడం లేదు.
కలలోనూ, సంకల్పంలోనూ గోచరించే వస్తువులన్నీ కల్పితాలే. అదే రీతిగా చిదాకాశంలోని పృథివి మొదలైన ఈ జగత్తులన్నీ ఉన్నట్టు అనుభవానికి వస్తున్నా, ఉనికి లేనివే. మరుభూమిలో జల ముండదు. అలాగే చిదాకాశరూపమైన ఈ జగత్తులో మూర్తత్వం లేదు. ఇది సంకల్పనగరం వంటిది. మరుభూమిలో నది లాగా జగత్తులో దృశ్యత్వ మనేది (భ్రాంతిమా'(త్రమే.
నిద్రనుండి మేల్కొన్నప్పుడు కలలో ని వస్తువులన్నీ శూన్యాలై పోతాయి. అటే
ఉత్పత్తి ప్రకరణం త సాక్షిచైతన్య దృష్టికి జగత్తంతా శూన్యమై ఒక్క బ్రహ్మం మాత్రమే గోచరిస్తుంది. అవివేకులు మాత్రమే బ్రహ్మళబ్దానికి, జగచ్చబ్బానికీ వేటువేటు అర్జాలు గ్రహిస్తారు. తత్త్వజ్ఞుల దృష్టిలో ఆ రెండు శబ్బాలకూ అ్రిం ఒక్కచే. జగత్తు, చిదాకాశము - ఇవి రెండూ పర్యాయపదాలు. అందుచే జగత్తు అనే దృళ్యపదార్హమేదీ పుట్టనేలేదు. అది సంకల్పనగరం లాగా నిరాకారమైనది. ఆకసంలోని ఆకాశమయచిత్రం లాగా స్వచ్చమై వున్నది. రామా! ఈ విషయం నీ మనస్సులో నిస్సందేహంగా స్టిరపడటాన్టా నేను మండపాఖ్యానం ( లీలోపాఖ్యానం) వివరిస్తాను. చెవులకింపైన ఈ కథను విను. శ్రీరాముడు :- బ్రహ్మన్! జ్ఞానాన్ని పెంపాందించే మండపాఖ్యానాన్ని సమగ్రంగా నాకు ఇప్పుడే బోధించండి! రాజవర్గనం వసిష్మడు : - ఈ భూవలయంలో పూర్వం పద్ముడు అనే ఒక శ్రీమంతుడయిన రాజు ఉండేవాడు. అతడు వివేకవంతుడు, మర్యాద పాటించేవాడు. సకల శత్రువులను ఆ భూపాలుడు రణరంగంలో హతమార్చాడు. అతని కీర్తి దళదిశలా వ్యాపించింది. సమస్త విద్యలలోనూ ఆరితేరిన ఆ నృపాలుడు నర్వ సద్గుణాలకూ నిలయమై వుండేవాడు. అతని భార్య లీల. భూలోకంలో అవతరించిన లక్ష్మీ లాగా ఆమె జగదేక సౌందర్యంతో శోభిల్లింది. సౌశీల్యం మూర్తీభవించిందా అన్నట్టున్న లీల సకల సౌభాగ్యాలతో తులదూగుతూ వుండేది. భూలోక మన్మథుడయిన భర్తకు పరిచర్య కావించడానికి ఆవతరించిన రతీదేవి లాగా ఆమె భాసించింది. అతడు ఉద్వేగం పొందితే ఆమె ఉద్వేగం సాందేది. ఆతడు సంతోషిస్తే ఆమె సంతోషించేది. అతడు కలత చెందినప్పుడు ఆమె కలత పడేది, ఇంతెందుకు? ఆమె అతని కన్నివిధాలా ప్రతిబింబంలా వుండేది. అతడు కోపించినప్పుడు మాత్రమే ఆమె భయానికి గురి అయ్యేది. రాజ్టీపరిదేవనం దివినుండి భువికి దిగిన అప్సరసలా వున్న అ కాంతతో కూడి పద్మనరపం అక్పతిను ప్రేమరసెన్ని ఆస్వాదించాడు. ఆ దంపతులు మనోవ రమైన ఉగ్యానాలలో,
తం యోగవాసిష్టం లతామండపాలలో, సరోవరాలలో, క్రీడాపర్వతాలలో స్వేచ్చగా విహరించేవారు. వివిధ విలాసవిహారాలతో వినోదంగా కాలం వెళ్లబుచ్చేవారు. సంగీత సాహిత్యాది సమస్త కళలలోనూ ఆరితేరిన వారి జీవితం కళాత్మకమై నిత్యకళ్యాణం - పచ్చతోరణ మన్నట్టు విలసిల్లింది. సర్వసంపదలతో తులదూగుతూ, దిన దిన ప్రవర్రమానమైన అనురాగంతో వారు చిరకాలం సుఖించారు.
ఆ రీతిగా సుఖభోగాలలో ఓలలాడిన రాజపత్ని లీలాదేవి ఒకనాడు ఇలా చింతించింది. “నా భర్తనాకు ప్రాణం కంచే ఎక్కువ ప్రీయమైనవాడు. శ్రీమంతుడు, యౌవన విలాసి అయిన ఈ రాజు జరామరణాలు లేని వాడుగా ఇలోగే వుండి పోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇతనితో నేను వందలకొలది యుగాలు (ప్రాయం తరగకుండా కుసుమ కుంజాలలో స్వైరవిహారం చేయడం ఎలా వీలవుతుంది?
జపం, తపం, యవు నియవమూాదులు అనునీంచి నా ప్రాణనాథుడీకీ జరామరణాలు సోకకుండా వుండేటట్లు చేయడానికి నేను (ప్రయత్నిస్తాను. మానవులకు వరణం రాకుండా వుండే వుపాయవేమిటో జ్ఞునవృద్దులు తపోవృద్దులు, విద్యావృద్దులు అయిన వారిని అడిగి తెలుసుకొంటాను.
ఈ విధంగా ఆలోచించి ఆమె అభిజ్ఞు లయిన ద్విజులను ఆహ్వానించింది. వారిని తగువిధంగా పూజించింది. “అమరత్వం ఎలా సిద్రిస్తుందో దయచేసి చెప్పుండి!' అని సవినయంగా మాటి మాటికీ ప్రశ్నించింది.
“దేవీ! తపోజప నియమాదులతో సిద్దులన్నీ కలుగుతాయి. కాని అమరత్వం మాత్రం లభించదు” అని వారు చెప్పారు.
ఆమాట విని ప్రియ వియోగానికి భయపడి మళ్లీ తన బుద్రిబలంతోనే ఇలొ ఆలోచించింది. ''దైవ వశాన భర్తకంటె ముందే నేను మరణిస్తే నాకు ఏ దుఃఖాలూ వుండవు. ఒకవేళ వెయ్యేండ్లు గడచినా నాకంటే భర్త ముందు మరణిస్తే ఆ జీవుడు ఇల్లు వదలి పోకుండా వుండేటట్లు చేస్తాను. అంతపురంలోనే భర్తు జీవుడు తిరుగుతూ నన్ను చూస్తూవుంటే నేను సుఖంగా కాలం గడుపుతాను. నా సంకల్పసిద్రికె ఈ దినమే ప్రారంభించి సరస్వతీ దేవిని జపోపవాసాది వ్రతాలతో ఆరాధిస్తాను”.
ఇలా నిశ్చయించి లీల భర్తతో చెప్పకనే శాస్తానుసారంగా కఠిననియమాలు ఆచరించడానికి పూనుకొన్నది. నిత్యం దేవతలను, ద్విజులను, గురుదేవులను, (ప్రాజ్ఞులను, విద్వాంసులను పూజించేది. మూడు మూడు రాత్రుల కొకసారి పారణ
ఉత్పత్తి ప్రకరణం త్ర చేసేది. స్నానం, దానం, తపస్సు, ధ్యానం మొదలైన కార్యాలతో శరీరానికి క్లేశం కల్గించేది. సమస్త సదాచారాలనూ పాటించేది. సమయానుసారంగా భర్తను అలరించేది. తన స్టితి అతడికి తెలియకుండా జాగరూకత వహించేది.
ఈ రీతిగా ఆమె సదా తపోనిష్టతో సరస్వతి నారాధించింది. త్రిరాత్ర శతవ్రతం పూర్తికాగానే వ్టేవి (ప్రసన్నురాలై ఆమె యెదుట సాక్షాత్కరించి ఇలా అన్నది-
“బిడ్డా! ఎడతెగని నీ తపస్సుకూ, భర్తృ భక్తికీ సంతోషించాను. నీక్తిష్ణమైన వరం కోరుకో!"
అప్పుడు రాజమహిషి '' జన్మ జరాది దాహదోషాలను శమింపజేసీ చంద్రకాంతి వైన తల్లీ! నీకు జయము! అజ్ఞానాంధకారాన్ని నివారించే సూర్యకాంతివైన మాతా! నీకు జయము! జగన్మాతా! ఈ దీనురాలిని కాపాడు! నేను కోరే ఈ రెండు వరాలూ నాకనుగ్రహించు. అమ్మా! నా పతి మరణించిన పీదప ఆయన జీవుడు ఈ అంతఃపురమండపం వదలి పోకూడదు. ఇదొక వరం. నేను ఎప్పుడెప్పుడు నిన్ను (ప్రాల్టిస్తానో, అప్పుడు నాక్సు నీ దర్శనం ప్రసాదించు! ఇది రెండవ వరం," అని ప్రార్రించింది.
ఆమె ప్రార్ధన విని 'అట్లే అగుగాక!” అని జగన్మాత అనుగ్రహించింది. తరువాత సాగరంలో లేచిన తరంగంలాగా ఆ దేవి అంతర్జానమై పోయింది. ఇష్టదేవత ప్రసన్నురాలైనందుకు రాజపత్ని మధురగీతం విన్న లేడి లాగా ఆనందించింది. కాలచక్రం గి(ర్రున తిరిగింది.
ఆపై కొంతకాలానికి పద్మనృపాలుడు రణరంగంలో తీవశరాఘాతాలకు గురి అయ్యాడు. యుద్రభూమి నుండి వచ్చి అంతపురమండపంలో అసువులు బాశాడు. (ప్రత్యక్షప్రాయమైన అతని వైతన్యం లింగ శరీరంలో ఎండుటాకులోని రసంలాగా అంతర్జానమైపోయింది.
పతి ప్రాణహీనుడు కావడం చూచి లీలాదేవి నీరు లేని తావురలాగా వాడిపోయింది. శర(ప్రహారానికి లోనైన లేడీ వలె నిట్టూర్పులు విడుస్తూ ఆమె మరణదశను పొంది నట్టుయింది. దీపం ఆరిపోగానే గృహలత్ష్మిని చీకటి ఆవరించినట్టు భర్త మరణించానే ఆమెను తమస్సు (క్రమ్ముకొన్నది. ప్రవాహం శ్షీణించగానే చవుడువారి శుష్కించిన నదిలాగా ఆమె నీరసించి కృశించి పోయింది. ఒక్కొక్కసారి ఎలుగెత్తి ఏడుస్తూ, మరుక్షణంలో మౌనం వహిస్తూ వియోగం పొందిన చ(క్రవాకి వలె ఆమె మరణోన్ముఖురాలయింది.
త్వ యోగవాస్మిం
అంతట ఎండిన చెరువులో తపించే చేపను తొలకరి జల్లు కరుణించినట్లు మిక్కిలి పరితపిస్తున్న లీలపై జూలిగొని ఆమెను ఓదారుస్తూ ఆకాశవాణి ఇలా పలికింది-
సందేహరాష్ట్ర వర్ణనం
“బిడ్డా! శవమైన నీ భర్తను పుష్పురాశితో కప్పి వుంచు. అతడు మళ్ళీ నీక్షు లభిస్తాడు. పూలు వాడవు. నీ నాథుడు నశించడు. త్వరలో నీ మగడు నీ ముందు సాఇాత్కరిస్తాడు. ఆకాశంలా నిర్మలమైన అతని జీవాత్మ ఈ మండపం వదలి పోదు.
ఈ మాటలు విని లీలాదేవి కొంత ఊరట చెందింది. బంధువులామె నోదార్చారు. పతి శరీరాన్ని పూలతో కప్పి ధనరాశిని దాచిన పేదరాలి వలె ఆమె ఆ మండపంలోనే వుండిపోయింది.
అది నాటి అర్దరాత్రి సమయం, అంతఃపురంలో పరిజను అందరూ నిద్రిస్తూ వున్నారు. అప్పుడు లీల ఆర్తితో జ్ఞప్తి రూపిణియైన సరస్వతీదేవిని ధ్యానించింది. దేవి ప్రత్యక్షమై ఇలా అన్నది -
“బిడ్డా! నన్ను ఎందుకు స్మరించావు? ఎందు కిలా శోకిస్తున్నావు? సంసారభ్రమ లన్నీ ఎండమావిలోని నీరులాగా (భ్రమలే సుమా 1”
లీల :- దేవీ! నా భర్త ఇప్పుడు ఎక్కడ వున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఎలా వున్నాడు? నేను ఒంటరిగా ఇక్కడ (బ్రదుకలేను. దయచేసి నన్ను ఆయన సన్నిధికి తీసుకుపో!
సరస్వతి 2- వరాననా! చిత్తాకాళం, చిదాకాశం, ఆకాశం - అని ఆకాశాలు మూడు రకాలు, ఇందులో మొదటిది వాసనామయమైన చిత్తాకాళం. లోకవ్యవహార (ప్రసిద్రమైన ఆకాశం మూడవది. ఈ రెండింటి మధ్య ఉభయళూన్యమై విరాబిల్లేది చిదాకాళం. నీ భర్త ఆత్మ ఇప్పుడా చిదాకాశంలో వున్నది. ఏకాగ్రతతో చిదాకాశాన్ని ధ్యానిస్తే నీవు దానిని దర్శించగలవు, అనుభవానికి కూడా తెచ్చుకోగలవు.
కణంలో ఒకవోటీనుండి మరోచోటికి పయనించే ( ఒక విషయం నుండి మరొక విషయానికి సంక్రమించే) చిత్తము యొక్క మధ్యకాలీనస్థితినే (ఉభయ విషయ శూన్యస్థితినే) చిదాకాశమంటారు. చిత్తవృత్తు లన్నింటినీ త్యజించి నిస్సంకల్పప్టేతిలో నిలకడ గల దానవైనప్పుడు నీ వాచిదాకాశ రూపమయిన సర్వాత్మక (బ్రహ్మపదం
ఉత్పత్తి ప్రకరణం కేర్ పొందగలవు. సుందరీ! తత్త్వజ్ఞానంతో అవిద్య నశించి జగత్తు అత్యంతా భావమైన- దన్న జ్ఞానం దృఢ పడినప్పుడు మాత్రమే ఈ స్థితి నీకు లభిస్తుంది. మరొాకరకంగా లభించదు. నా వరంతో నీకిది త్వరలో సిద్దిస్తుంది.
ఇలా చెప్పి సరస్వతీదేవి తిరిగి తన దివ్యస్ట్రానానికి వెళ్లింది. ఆ దేవి అనుగ్రహం వల్ల శ్రమలేకనే లీల నిర్వికల్ప సమాధిలో (ప్రవేశించింది.
పిదప ఉఊప్పపాటులో ఆమెగూడు విడిచి ఆకసానికెగిరిన పక్షీలాగా అంతఃకరణ సవేతవైన తన శరీరం వదలి చిదాకాళంలోకి దూసుకుపోయింది. ఆ ఆలయాకాశంలోనే అనేక నరపతులు సమావేశమై వున్న ఆ స్టానంలో సింహాసనాసీనుడై వున్న తన భర్తను చూచింది. అతడున్న రాజధానీ నగరం వివిధ పతాకలతో శోభిల్దుతున్నది. అందలి (ప్రధానగృహం అత్యంత మనోహరంగా వున్నది. దాని పూర్వద్వారంలో మునులూ, వి(ఫ్రులూ, బుషులూ; దక్షిణద్వారంలో రాజులూ, మహారాజులూ; పళ్చిమద్వారంలో సుందరీమణులూ: ఉత్తరద్వారంలో రథాలూ, గు(ర్రాలూ, ఏనుగులూ లెక్కకు మిక్కిలిగా ఉండడాన్ని ఆమె గమనించింది. వివిధ దిక్కులనుండి, సాగర తీరాలనుండీ వచ్చిన భటులు ఆయా ప్రాంతాలలోని విశేషాలను మహారాజుకు విన్నవిస్తూ వున్నారు. యజవాటికలో విప్రులు వాద్యనినాదాన్ని మించిన రవంతో వేదాలు పఠిస్తున్నారు. వంది మాగధులు కావించే కోలాహలాలకు ఏనుగులు (ప్రతిధ్వనులు కావిస్తున్నవి. గేయవాద్యాల ధ్వనితో గగనం మారు (మైోగుతున్నది. రాజులు నానారాజ్యకార్య వ్యగ్రులై వున్నారు. శిల్పులు నానా నగర నిర్మాణ కార్యంలో తల మునకలై కనిపించారు.
ఆకాశరూపిణి అయిన లీలాదేవి ఆకాశమయమైన ఆ సభలో ప్రవేశించింది. అక్కడ అటూ, ఇటూ సంచరించింది. సంకల్పమా(త్రంతో రూపొందిన కామినిని పురుషులు చూడలేరు కదా! అలాగే అక్కడివారెవరూ ఆమె ఉనికిని పసిగట్టు లేక పోయారు.
ఆ సభాస్టలిలోనూ, రాజ్యంలోనూ కనిపించిన రాజులూ, భృత్యులూ, బాలకులూ, స్త్రీలూ, పండితులూ, మిత్రులూ, తక్కిన పౌరులూ - అందరూ పూర్వం పద్మ నరపాలుని రాజ్యానికి చెందినవారే. క్రొత్తవారెవరూ లేరు. వాళ్లు ఒక పట్టుణం నుండి మరొక పట్టణానికి వలస వచ్చిన వాళ్లలాగా వున్నారు. వాళ్ల ఆచార వ్యవహారాలు గూడా మునుపటిలాగే వున్నాయి. మధ్యాహ్న సమయంలో చెట్టూ,
తరి యోగాసిష్టం చేవులూ, నదులూ, కొండలూ, గుహలూ - మొదలైనవి కూడా ఆమెకు యథాతథంగానే స్పురించాయి.
ఒక్క పద్మ మహారాజు మౌొత్రవేనశుడుపలితనం వదలి పదునారేండ్ర ప్రాయం కల్లి రాజ్యం పాలిస్తున్నాడు. తక్కిన వాళ్ళందరూ ముందటిలాగే వున్నారు.
లీలాదేవి వారిని చూచి '' ఏమిది? ఆ నగరంలోని వాళ్తందరూ మరణించారా ఏమి?”* అని చింతా పరవశురాలయింది.
ఇలా చింతిస్తూనే సరస్వతీ ప్రబోధంతో ఆమె నిర్వికల్ప సమాధిస్టితి నుండి పూర్వస్థితికి వచ్చింది. అంతఃపురంలో అర్దరాత్రివేళ ఎప్పటిలాగే నిద్రిస్తున్న వెలికత్తెలనూ, పరిజనులనూ చూచింది. వారిని మేల్కొల్పి '“నాకు చాలా బాధగా వున్నది, రాజాస్ల్రానానికి నన్ను తీసుకుపోండి! అక్కడ నా భర్త సింహాసనం వద్ద నిల్చి సభ్యులందరినీ చూస్తే నేను బీవిస్తాను. లేకపోతే జీవింపలేను”' అని చెప్పింది.
పరిజనులందరూ నిద్రనుండి లేచారు. పురవాసులందరికీ ఈ సంగతి తెలిపారు. సభలో అందరూ అప్పుడే సమావేశం కావటానికి తగిన ఏర్పాట్టు చేశారు. ఆ స్టానం దీపాల కాంతితో శోభిల్లింది. జనులందరూ సభాఫ్తలం చేరుకున్నారు. లోకపాలకులు తమ తమ దిక్కుల నాక్రమించినట్టు మంత్రులూ, సామంతులూ తమ తమ ఆసనాలు అధిష్టించారు. ద్వారపాలకులు శ్ళుక్షవ(స్తాలు ధరించి ద్వారాల వద్ద నిలిచారు. పద్మభూపాలుని అనుయాయు లందరూ రాజాస్టానం ఆలంకరించారు.
సింహాసనానికి సమీపంలో ఏర్పాటు చేయబడ్డ కొంగ్రత్త స్వర్ణ చిత్రాసనం మీద లీలాదేవి కూర్చున్నది. అక్కడ వున్న రాజులను, మంత్రులను, సభ్యులను, మిత్రులను, బంధువులను - అందరనీ ఆమె కళ్ళారా చూచింది. వాళ్ళందరూ పూర్వంలాగే సజీవంగా వుండడం చూచి ఎంతగానో సంతసించింది. పిదప '-ఈరీతిగా దుఃఖప్రదమైన నా మనస్సును వినోదింపజేస్తున్నాను ' అని అభిప్రాయాన్ని సూచించే చేష్టలతో సభాసదులకు తెలియపరచి లీలాదేవి సభనుండి లేచింది. అక్కడనుండి అంతఃపురానికి వెళ్లింది. అక్కడ పూలతో కప్పి వున్న భర్త శరీరం వద్ద కూర్చొని ఇలా తలపోసింది-
జగద్భాంతి
“ఏమి ఈ విచిత్రమయిన మాయ! మూ పురజనులందరూ ఈ లోకంలో
వున్నట్లే అక్కడ గూడా వున్నారే! వివధ వృక్షాలతో విలసిల్లే ఈ పర్వతాలు సైతం
ఉత్పత్తి ప్రకరణం శ? అక్కడా ఇక్కడా ఒకేరీతిగా ఉన్నాయే! ఈ వూయ చాలా గొప్పుది! కొండ అద్రంలోనూ, అద్దానికి వెలుపలా కనిపించినట్లే ఈ సృష్టి చిదాకాశంలోపలా, వెలుపలా గోచరిస్తున్నది, ఇందులో ఏది నిజం? ఏది భ్రమ? ఆ సరస్వతీదేవినే అడిగి ఈ సందేహం తీర్చుకుంటాను.”
ఇలా నిశ్చయించి ఆమె వేవిని పూజించింది. అంతట కుమారీ రూపంలో సాక్షాత్కరించిన వాగధిదేవత భ(ద్రాసనస్టురాలు కాగా ఆమె ఎదుట నేలపై కూర్చొని లీల ఇలా ్రళ్నించింది-
““దేవీ! కరుణించు. దయనీయుల విషయంలో ఉత్తములు ఉద్వేగం పొందరు. సృమ్టాదిలో ఈ వుర్యాదను నెలకొల్పింది నీవే. సవినయంగా (ప్రణమిల్లి అడుగుతున్నాను, నా సంశయం తీర్చి నన్ను అనుగ్రహించు.
చిత్తు అనే దర్భణం ఆకాళం కంటే నిర్మలమైనది. కోట్లకొలది ఆకాశ యోజనాలు అందలి ఒక స్వల్పావయవం మౌద్రమే. అది ప్రజ్ఞానఘనమైై, మెత్తనిదై, చల్లనిదై, ఆవరణ లేనిదై, అన్ని వ్యవహారాలలోనూ అగ్రగామియై భాసీస్తున్నది. దిక్కులు, కాలం, ఆకాశం - ఇత్యాదులన్నీ ఎంతో పరిణామం పొంది ఆత్మ దర్భణంలో (ప్రతిబింబంలా స్ఫురిస్తున్నవి. ముల్గోకాలు అనే (ప్రతిబింబలత్ష్న్మీ చిదాదర్శం వెలుపలా, లోపలా కూడా ఏకరూపంగా నెలకొని వున్నది. ఇందులో ఏది కృత్రిమం? ఏది అకృత్రిమం?
దేవి : - సుందరీ! సృష్టిలో కృత్రిమత్వం అంటే ఏమిచో, అకృదత్రిమత్వం అంటే ఏమిటో నీ అభిప్రాయం చెప్పు.
లీల: - అమ్మా! నేనిక్కడ వున్నాను. నీవు నా యెదుట వున్నావు. ఇలా వుండే సృష్టిని అకృత్రిమమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నా భర్త ఏ లోకంలో వున్నాడో, ఆ లోకసృష్టి కృత్రిమ మని నా అభిప్రాయం. అది శూన్యం కాబట్టి, దేశకాలాది పరిచ్చిన్నం కాదు కాబట్టి నేనలా ఊహిస్తున్నాను.
దేవి : - అకృ(త్రిమమైన సృష్టినుండి కృత్రిమమైన సృష్టి ఎప్పుడూ కలగదు. కారణం నుండి దానికంచే భిన్నలక్షణం కల కార్యం పుట్టదు కదా!
లీల : - అమ్మా! కారణం కంటే విలక్షణమైన కార్యం పుట్టడం చూస్తూనే వున్నాము. మట్టి నీటిని పట్టుకోలేదు. కాని ఆ మట్టి నుండి పుట్టిన కుండ నీటిని గ్రహిస్తున్నది కదా!
తతి యోగవాస్టం
దేవి : - ముఖ్యకారణం నుండి సహకారికారణాల సాయంతో ఏ కార్యం పుడుతుందో, అందులో కొంత విలక్షణత్వం కనిపిస్తుంది. కాని చిదాకాశంలోని వీ భర్తృ సృష్టికి పృథివ్యాదులలో ఏది కారణమో చెప్పగలవా? ఈ భూమండలంనుండి పుట్టే పదార్దాల లాగానే ఆ భూమండలం నుండి కూడా పదార్దాలు పుడుతున్నాయి.
ఈ భూమండలమే చిదాకాశంలోకి ఎగిరి పోయివుంటుందంటావా? అయితే మళ్లీ ఇక్కడ ఈ భూమండలం ఎలా వుంటుంది? పైగా ఇందులో సహకారి కారణాలేవి? కారణాలు లేకున్నా సహకారం ఉన్నదంచే అది పూర్వకారణంకంటే వేరు కాదని అందరికీ అనుభవంలో వున్న విషయమే కదా!
లీల : - దేవీ! నా భర్త సృష్టికి పూర్వస్మ్పృతే కారణమని నేను గ్రహిస్తున్నాను.
దేవి : - అబలా! స్మృతి ఆకాశంలాగా శూన్యమైనది. అందులోంచి పుట్టే వన్నీ అలాంటివే. భర్తృసృష్టి నీ ఆఅనభవానికి గోచరించినా, అది ఆకాశమయమే అని తెలుసుకో.
లీల : - అమ్మా! స్కృతి జన్య మయిన వా భర్తృ సృష్టి ఎలా ఆకాశమయమో, అలాగే ఈ కనిపించే సృష్టి కూడా ఆకాశచుయమే. (శూన్యమే) అని వేను అనుకుంటున్నాను.
దేవి: - బిడ్డా! నీవు చెప్పింది నిజం. నీ భర్తృసృష్టి, ఉనికి లేని దయినట్లే ఈ సృష్టిగూడా ఉనికి లేనిదిగానే నాకు గోచరిస్తున్నది.
లీల : - తల్లీ! ఈ శూన్యమైన సృష్టినుండి భ్రమాత్మకమయిన నా భర్తృసృష్టి ఎలా కల్లిందో విపులంగా వివరించి వా జగద్భ్రుమను తొలగించు.
దేవి: - పూర్వస్మృతి నుండి (భ్రమాత్మకమైన ఈ సృష్టి ఎలా ఉదయించిందో చెబుతాను, విను.
మండపాఖ్యానం
పువిశాల చిదాకాశంలో ఒకమూల సంసారమనే మండపం వున్నది. గాజు పెంకులాగా నీలమైన ఆకాశం దాన్ని ఆచ్చాదించి వున్నది. మేరుపర్వతమే దాని స్తంభం. ఆ స్తంభంలో లోకపాలకులు వారి దేవేరులతో సహా ప్రతిమలై భాసిస్తున్నారు.
ఆ మండపంలో పదునాల్లు లోకా లనే గదులున్నాయి. సూర్యుడే అందలి దీపం. బహు సంతానం కల వృద్ద ప్రజాపతి అనే ఒక బ్రాహ్మణుడక్కడ
ఉత్పత్తి ప్రకరణం శం కాపురముంటున్నాడు. జీవకోట్టు అనే కోశకారక్రిములు అక్కడ తమను తామే బంధించుకొంటున్నాయి. ఆకసంలో విహరించే సిద్దులే అక్కడ రొద చేసే దోమలు. అక్కడి వాతాయన మనే వెదుళ్లలో వైమానికు లనే కీటకాలు పారాడుతున్నాయి. ఆడుతున్న సురాసురబాలకుల కలకలంతో ఆ మండపం ధ్వనిస్తున్నది. లోకాలు, నగరాలు, గ్రామాలు అందలి దొంతికుండలు. సరస్సాగరాలనే చెరువులలోని నీరు అందలి నేలను తడుపుతున్నది. పాతాళం, భూతలం, స్వర్గం - అనే మూడు గృహకోటరాలు అందులో వున్నాయి.
ఆ మండపంలో ఒకమూల కొండలనే మట్టి పెళ్లల క్రింద ఒక కుగ్రామ మున్నది. నదులు, కొండలు, అడవులూ నిండిన ఆ ప్రదేశంలో అగ్ని హోత్రి, ఆరోగ్యవంతుడూ అయిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి భార్య, బిడ్డలున్నారు. గోసంపదకు, పొడిపంటలకు అతనికి కొదువ లేదు. రాజభయం అత డెరుగడు. అతిథు లందరికీ పరిచర్యలు చేస్తూ ధర్మపరాయణుడై అతడక్కడ జీవిస్తుండేవాడు.
ట్రాప్కాణ మరణం
ఆ విప్రుని పేరు వసిష్టుడు. అతడు వయోవేష విద్యా విభవాదులలో వసిషుని పోలి వుండేవాడు. అతని భార్య పేరు అరుంధతి. ఆమె కూడా భూలోకారుంధతిగా ప్రసిద్ది పొందింది. అకృ(త్రిమమైన (ప్రేమ గల ఆ సుందరి అతని సంసార సర్వస్వమై భాసించింది.
ఒకనాడు ఆ (బ్రాహ్మణుడు పచ్చికతో పచ్చనైన అక్కడి క్ండచరియపై కూర్చుండి క్రిందివైపు చూపు సారించాడు. ఒక భూపాలుడు సపరివారంగా పెద్ర సైన్యంతో వేటకు పయనమై పోతున్న దృశ్యం అతని కంటబడింది. ఆ నరపాలుని చామరాలూ, పతాకలూ అక్కడి లతావనంపై వెన్నెలలు వెదజల్టుతున్నాయి. తెల్ల గొడుగులు ఆకసంలో వెండి మేడల్లా వెలుగొందాయి. గుర్రాల గిట్టల తాకిడికి లేచిన ధూళి గానాన్ని కప్పివేసింది. ఎండనూ, గాలినీ నిరోధించే ఏనుగు అంబారీలో రాజు పయనిస్తున్నాడు. సైనికుల కోలాహలంతో దిక్కులు పిక్కటిల్టుతున్నాయి. ఆ ధ్వనికి దిగమజెంది అక్కడి మృగాది (ప్రాణులు సుడిలాగా గిరగిర తిరుగుతున్నాయి. మణిఖచితమైన హారకేయూరాది సువర్ణాభరణాలతో ప్రకాశిస్తున్న ఆ రాజును చూచి (బ్రాహ్మణు డిలా అనుకొన్నాడు -
50 యోగాసిస్టం
*“'అవురా! సకల సౌభాగ్యాలతో విలసిల్లే రాచరికం ఎంత మనోజ్జమైనది! రథాలూ, గజాలూ, తురగాలూ, పదాతులూ, ఛత్రాలూ, చామరాలూ దశదిశలా వ్యాపించగా నేను గూడా అతని లాగా రాజునై ఎప్పుడు రాణీంచగలను? కుసుమవాసనలతో గుబాళించే గాలి రతిశ్రమవల్ల నా అంతఃపుర కాంతలకు కల్గిన స్వేదబిందువులను ఎప్పుడు పోగొట్టగలదు? కాంతాముఖాలను కర్పూరమిశ్రమైన చందనంతోనూ, దిజ్ముఖాలను కీర్తితోనూ నేను ఎప్పుడు తెల్లగా చేయగలను?”
ఇలా ఆ రాజును చూచినప్పటినుండి వి(ఫ్రునికి తాను కూడా రాజు కావాలన్న సంకల్పం కల్గింది. నిత్యం తన ధర్మాలు నెరవేరుస్తూనే (బ్రతికినంతవరకూ సదా ఆసంకల్పం మాత్రం వదలకుండా అతడు కాలం గడిపాడు.
తామరను (క్రమ్ముకొనే మంచులాగా కాల(క్రమంలో వార్షక్యం అతళణ్ల పైకొన్నది. తుదకు మరణం కూడా ఆసన్నమయింది. (గ్రీష్మబుతుభితితో వాడిపోయే తీగలాగా అతని భార్య పతి అవసానదశను గమనించి దీనురాలై కాంతి కోల్పోయింది.
ఆస్థితిలో ఆమె అమరత్వం అసాధ్యమని గ్రహించి నీలాగానే నన్ను ఆరాధించి '*దేవీ! నా భర్త మరణించిన పిదప ఆ జీవుడు నా మండపం నుండి వెళ్లకుండా ఇక్కడే ఉండేటట్టు అనుగ్రహించు” అని వరం కోరింది. నేను ఆమె కోరినట్లే వరం 'ప్రసాదించాను.
తరువాత ఆ విప్రుడు కాలవశాన మరణించాడు. అతని జీవచవైతన్యం మాత్రం ఆ గృహాకాశంలోనే నివసించింది. పూర్వ సంకల్ప (ప్రభావం వల్ల అతడు అక్కడ మహాశక్తి మంతుడైన మహీపాలుడుగా రూపొందాడు. తన ప్రభావంతో భూలోకాన్ని జయించాడు. (ప్రతాపంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. కృపతో పాతాళాన్ని పరిపాలించాడు. ఇలా మూడు లోకాలపైనా తిరుగులేని విజయం సాధించాడు. అప్రతిహత పరాక్రమంతో శత్రువులను పరిమార్చాడు. స్త్రీలోకానికి మన్మథుడై చెలువొందాడు. సాధులోకానికి సంతసం కలిగించాడు. యాచకుల పాలిటికీ కల్పవృకమై భాసీంచాడు.
ఆ రీతిగా ఆకాశ శరీరుడయిన ద్విజుని భౌతికళరీరం శవం కాగానే అతని భార్య శోకంతో క్రుంగి కృశించి పోయింది, ఎండిన మినపకాడలాగా ఆమె హృదయం రెండు (వ్రక్కలయింది. తుదకు ఆమె కూడా భౌతికళరీరం విసర్దించింది. పరలోక గమన యోగ్యమయిన మానస శరీరంతో భర్త చెంతకు వెళ్లింది. నది నిమ్న భూమిని చేరినట్లే
ఉత్పత్తి ప్రకరణం క్]
ఆమె భర్తను చేరి శోకరహితురా లయింది. వసంతంలో చిగిర్చిన లేత కొమ్మలాగా
శోభిల్లింది. ఆ (బ్రాహ్మణుడు మరణించి నేటి కెనిమిది దినాలు గడచాయి. అతని
గృహాలు, పాలాలు మొదలయిన సంపదలన్నీ అక్కడ యథాతథంగానే వున్నాయి,
అతని జీవవైతన్యం కూడా ఆ గిరి గ్రామమందలి మండపంలోనే వున్నది. పరమార్ధ ప్రతిపాదనం
లీలా! ఆ రీతిగా మరణించిన ఆ (బ్రాహ్మణుడే రాజుగా మారి నీకు భర్త అయ్యాడు. ఆ అరుంధతి నీవే. భువిలో అవతరించిన పార్వతీ పరమేశ్వరుల లాగా వుంచి దంపతులయిన మీరు చక్కగ్గా రాజ్యపాలన చేశారు. మీ పూర్వ సంసార(క్రమాన్న నేనిప్పుడు వివరించాను.
(బ్రహ్మాకాళమే భ్రాంతికిలోనై జీవస్వరూపం ధరించింది. ఆ బ్రమే చిదాకాశంలో ప్రతిబింబించింది. ఇది స్వదృష్టితో అసత్యమైనా అధివ్యాన దృష్టితో-సత్యమై మీకు భవభంగాన్ని కలిగించింది. ఇక ఇందులో భ్రాంతి సహితమైన దేది? (భ్రాంతియహితమైన దేది? అంతా అప్రతిహతమైన అనర్హబోధమే తప్ప అంతకంటే వేరుగా సృష్టి అన్నది లేనే లేదు
దేవి చెప్పిన ఈ మాటలు విని లీల ఆళ్చేర్యపడింది. విప్పారిన కన్నులతో దేవిని చూస్తూ ఆమె మృదువైన మాటలతో ఇలా అన్నది-
లీల : - దేవీ! నీమాటలు నిజమా? అయితే ఇది ఎలా జరిగింది? తన గృహాకాశంలో వుండే ఆ వి'ప్రజీవుడెక్కడ? ఈ విశాల దేశంలో వున్న మేమెక్కడ? నా భర్త ఇప్పుడు ఏలోకంలో వున్నాడో, ఆ లోకం, ఆ భూమి, ఆ కొండలు, ఆ దిక్కులు ఈ గృహంలో ఎలా భాసిస్తాయి? “మదించిన ఐరావతం ఆవగింజలో బంధింపబడింది. దోమ సింహసమూహాలతో అణుగహ్వరంలో పోరాడుతున్నది. పద్మబీజంలో ఉంచిన వేరుపర్వతాన్ని చిరుతుమ్మెద మింగివేసింది. కలలో మేఘగర్హనం విని నెమళ్ళు చిత్రంగా నృత్యం చేస్తున్నవి” అనే ఈ మాటలు ఎలా
అసమంజసాలో, అలాగే ఒక చిన్న గృహంలో భూమి, కొండలు మొదలైనవి వున్న వనడం కూడా అసమంజసమని నేను భావిస్తున్నాను.
దేవీ! సర్వేశ్వరేశ్వరీ! ఇదంతా ఎలా సాధ్యమో యథాతథంగా నాకు వివరించు. నేనిలా ప్రశ్నిస్తున్నానని అన్యథా భావించవద్దు. తమ అనుగ్రహానికి పాత్రులయిన వారిపట్ల పెద్దలు ఆ(్రహింపరు గదా! క్
52 యోగూసం
జేవి : - సుందరీ! నేను అసత్యం చెప్పడం లేదు. వూవంటి వారు వేదనియమాలను ఉల్లంఘించరు. ఇతరులు మర్యాదకు భంగంకల్లించే టప్పుడు ఆ మర్యాదను నిలపడమే నా కర్తవ్యం. అట్టి నేనే మర్యాద నతి'క్రమిస్తే ఇక దాన్ని పాటించే దెవరు? -
ఆ గ్రామంలోని బ్రాహ్మణుని జీవాత్మ రాజవాసనగల చిదాకాశ రూపంపాంది తన గృవాకాశంలోనే ఈ మహారాజ్యాన్ని చూస్తున్నది. మేల్కాంచియున్నప్పటి స్మృతి కలలో లోపించినట్లే నాటి మీ యిద్దరి స్మృతి లోపించి ఇప్పుడు మరొక రూపంతో ఉదయించింది. మరణమంటే ఇదే.
కలలో, లేదా సంకల్పంలో ముల్లోకాలు కనిపించినట్టూ, కథలో యుద్దం జరిగినరీతిగానూ, మరుభూమిలో నీరు కనిపించిన విధంగానూ ఆ (బ్రాహ్మణుని యింటిలోనే కొండలూ, అడవులూ, పట్టణాలతో కూడిన భూవలయమంతా భాసిస్తున్నది. సంకల్పంలోనూ, అద్దంలోనూ తోచిన సృష్టిలాగానే, చిదాకాశమనే తొర్రలో కనిపించే అలకూడా ఉనికిలేనిదైనట్టు అసత్యం నుండి స్మృతి ప్రభావంతో ఉదయించేది కూడా అసత్యమే.
ఆ ద్విజుని గృహాకాశకోళంలోనే ఈ నీయిల్టు ఉన్నది. నీవూ, నేనూ, ఈ సర్వమూ ఆ చిదాకాశమే కాని మరేమీ కాదు. వస్తు విజ్ఞానానికి దీపం ప్రమాణ మవుతున్నది. అలాగే జగత్తు మిథ్య అనటానికి స్వప్నం, సంకల్పం, స్వానుభవాలు మొదలైనవి ప్రమాణాలవుతున్నాయి. పద్మంలో తుమ్మెద ఉన్నట్టు బ్రాహ్మణుని యింటిలోని చిదాకాశంలోనే అతని జీవాత్మ, సముద్రాలు - అడవులతో కూడిన భూమికూడా ఉన్నాయి. ఆ భూమి యొక్క ఒక కోణంలో ఈ పట్టణం, ఇందలి శరీరాదులు వినీలాకాశంలో వెండ్రుక చుట్టులాగా లేకున్నా ఉన్నట్టు తోస్తున్నవి.
విఫ్రుని గృహంలో పట్టణం ఉదయించినా ఆ గృహానికి వినాశం లేదు. ఒక్క త్రసరేణువులో అనేక లోకాలున్నట్టు ఆ సదనంలోనే ఇదంతా ఇమిడివున్నది. బిడ్డా! చిద్రూపమైన ప్రతిపరమాణువులోనూ అనేకలోకాలు ఉన్నాయనడంలో సందేహ మెందుకు?
లీల : - పరమేశ్వరీ! ఆ బ్రాహ్మణుడు మరణించి నేటికి ఎనిమిది దినాలే కదా! మాకేమో ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి. తల్లీ! ఇది ఎలా సంభవం?
ఉత్పత్తి ప్రకరణం క్3 దేవి: - అంగనా! దేశానికి లాగానే కాలానికి గూడా నిడుపులేదు. ఈ విషయం వివరిస్తాను విను.
ఈ జగత్తుయొక్క సృష్టి ఎలా ప్రతిభామాత్రమో, అలాగే కాలగతమైన క్షణకల్పాలు గూడా ్రతిభామాత్రాలే. ఇవన్నీ జన్మ(భ్రమ గల జీవులకు ఏరీతిగా (ప్రతిభామాథ్రా లవుతున్నవో విశదీకరిస్తాను. జీవుడు క్షణకాలం మిథ్యా మరణం అనుభవించి (ప్రాచీన సంస్కారాలను విస్మరిస్తాడు. (క్రొత్త (ప్రపంచాన్ని చూస్తాడు. చిదాకాళంలో చిదాకాళశరూపుడైన జీవుడు ఇలా భావిస్తాడు.
'“జీవుడనైన నేను ఆధేయం. నేనీ దేహవునే ఆధారంపై వున్నాను. కరచరణాదులు గల ఈ దేహం నాది. దేహానికి చెందినదంతా నాకు సంబంధించినదే, ఈ తండ్రికి నేను కొడుకును. నాకు ఇన్ని సంవత్సరాల వయస్సుంది. వీరునా ప్రియబంధువులు. ఇది నా మనోజ్ఞమైన ఇల్టు. నేను పుట్టినప్పుడు బాలుడనై వుండి (క్రమంగా పెరిగి పెద్ద్రవాడనయ్యాను. నా చుట్టాలందరూ పూర్వం లాగే చరిస్తున్నారు''.
దేహభావం పొందిన చిత్తమూ, ఆత్మాకాశమూ ఒక్కచే అన్న (భ్రమవల్ల ఆత్మకు ఏ విధంగానూ సంబంధంలేని బంధువులు మొదలైన వారు సంబంధం కలవారుగా కనిపిస్తారు. దేహభావం పొందిన చిత్తంలో అలా సంసారం ఉదయించినా, నిజంగా ఏమీ ఉదయించనే లేదు. చిదాకాశం ఎప్పటిలాగా నిర్మలంగానే వున్నది. స్వప్నంలో లాగా ద్రష్ట దృశ్యం - అనేవి చిత్స్వభావాలేకాని మరేమీ కాదు. ఇహలోకం, పరలోకం అనేవి కూడా అంతే, అంచేత నీటికీ, అలలకూ భేదంలేనట్లే స్వప్నలోక - పరలోక - ఇహలోకాలకు ఏ మాత్రం భేదం లేదు.
అందువల్ల ఈ విశ్వం పుట్టనేలేదు, పుట్టలేదు కాబట్టి దీనికి స్వరూప - వినాశాలు కూడా లేవు. పరమాక్షాశం లాగా చిదాకాశం కూడా చేత్యరహితమే. నీటికంటె అల వేరు కానట్టు చిత్తు కంచె చేత్యం భిన్నం కాదు. కుందేటి కొమ్ములేనట్లే జలంలో తరంగత్వం లేదు. చిత్తు తన స్వభావం కోల్పోకుండా చేత్యంలా భాసిస్తున్నది, అందుచే దృశ్యపదార్హమంటూ ఏదీ లేదు. ఇక (ద్రష్ర్రదృశ్యబుద్రి మాత్రం ఎక్కడిది?
జీవుడు మరణి ౦చిన పిదప వెంటనే త్రిలోకాత్మకమైన దృశ్యసృష్టి ఆయా దేశకాలాదులకు అనుగుణంగా భాసిస్తుంది. తాను పుట్టుక పోయినా పుట్టినట్టు చిచ్చరీరుడైన జీవుడు భావిస్తాడు. '“ఇది నా తల్లి, ఇతడు నా తండ్రి నేను బాలుడనైతిని”' ఇత్యాదిగా స్మరణ(క్రమం పుష్పెనికి ఫలం కల్షినట్టు అతనికి కల్గుతుంది.
ర్కీ యోగపి్టం ఒక్కనిమిషంలొ యుగం గ డచినట్టు ఆనుభవం ప్రాప్తిస్తుంది. హరిళ్ళండద్రుడికి ఒక్కరాత్రి పం(డైండు సంవత్సరాలుగో తోచింది కదా! కాంతా వియోగులకు ఒక్కదినం ఒక్క సంవత్సర కాలంగా భాసిస్తుంది కదా!
కలలో అన్నం తినకపోయినా తిన్నట్లు (భ్రమ కల్లినట్లే తనకు జనన మరణాలు
లేకున్నా ' “నేను చచ్చి ఫుట్టినాను. నా తండ్రి మరొకడు*” అనే భ్రమ జీవునికి కల్గుతుంది.
మత్తెక్కినప్పుడూ, కల వచ్చినప్పుడూ శూన్యం జనాక్షీర్ణంలా తోస్తుంది. ఆపడ
సంపదలా కనిపిస్తుంది. మోసం లాభంలో గోచరిస్తుంది కదా! మిరియపు గింజలో
కారం, స్తంభంలో చెక్కబడని బొమ్మ ఉన్నట్లే చిద్రూపమైన ఆత్మలోనే దృశ్యం
ఉన్నది. ఇక అలాంటి ఆత్మకు బంధమోక్షాలు ఎలా వస్తాయి? విశాంత్యుపదేశం
కళ్లు తెరచి చూస్తే అనేక రూపాలు కనిపిస్తాయి. అలాగే మరణించిన వెంటనే జీవునికి వివిధ దృశ్య జగత్తులు గోచరిస్తాయి. దిక్కులు, కాలం, ఆకాళం, ధర్మం, కర్మం వీటితో కూడిన లోకాలు, కల్పాంతం వరకూ ఫ్రిరంగా వుండే పృథివ్యాదులూ అతనికి స్ఫురిస్తాయి. కలలో తన చావు తనకు గోచరించినట్లే తాను అంతకు ముందు అనుభవించనివి, చూడనివి, చేయనివి కూడా అప్పుడు తనకు స్పురణకు వస్తాయి. ఈ (భాంతికి అంతం లేదు. ఇది చిదాకాశానికి చెందిన వూయాకాళంలో కల్పితనగరంలాగా జగద్రూపంలో భాసిస్తుంది. నానాభ్రమాత్మకమై విబృంభిస్తుంది.
అనుభవించిన, అనుభవించని రెండు రకాల స్మృతులు పూర్వకారణం లేకుండానే చిద్రూపాలై ప్రవర్తిస్తాయి. కలలోనూ, భ్రమకల్లినప్పుడూ తండడ్రికాని వాని యందు తండ్రి అనే భ్రాంతి కల్గినట్లే అనుభవించని విషయాలు అనుభవించినట్టు సంవేదన కల్గుతుంది.
(ప్రజాపతి యొక్క ప్రథమ సృష్టికాలంలో అది స్మృతిగా కాక అనుభవ మాత్రంగా తోచి ఆయా స్మృతిరూపాలు దాలుస్తుంది. విశ్వాన్ని పూర్తిగా విస్మరించడమే మోత్షమనబడుతుంది. ఆ స్రీతిలో ప్రియా ప్రియాలనేవి ఏవీ లేవు. అహంతకూ, జగత్తుకూ మూలమైన అవిద్య పూర్తిగా లేకుండా పోతే తప్పు విముక్తి కల్లనే కల్లదు.
(త్రాడులో 'సర్స' మనే భావన పూర్తిగా అసంభవమన్న జ్ఞానం కలగాలి. లేకపోతే సర్ప(భ్రమ శాంతించదు. సమాధియోగంలో జగద్రృమ కొంత శాంతినిస్తుంది కాని
ఉత్పత్తి ప్రకరణం ర్ పూర్తిగా శమించదు. యోగం నుండి లేవగానే మళ్లీ భ్రమ నిండుగా ఆవరిస్తుంది. మతి లేని వాళ్లో ఒకదయ్యం వదలినా మరాక దయ్యం పట్టుకొంటుంది గదా! అవిద్య అనే కారణం తాలగినప్పుడే ఈ విశ్వం పరబ్రహ్మమే అన్న నిశ్చాయజ్ఞానం కల్గుతుంది. లీల: - దేవీ! సంస్మరణ రూహమైన పూర్వసంస్కారమే సృష్టికి కారణమంటివి. ఐతే బ్రాహ్మణీ బ్రాహ్మణుల సృష్టికి కారణమైన సంస్కారం ఎలా కలిగింది? దానికి స్మృతి హేతువైన పూర్వానుభవం లేదు కదా! దేవి : - అందుకు కారణం సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుని భావ్యర్హస్మృతే. తాల్లిటి (బ్రహ్మదేవుడు మోక్షం పొందాడు కాబట్టి దీనికి పూర్వస్మృతి కారణమనడానికి వీలు లేదు. తొల్లిటి వైతన్యం మళ్లీ క్రొత్త బ్రహ్మరూపాన్ని పొందుతుంది. నేను ' ప్రజాపతి నయ్యాను' అనే ప్రతిభ ఆ (బ్రహ్మదేవునికి కాకళాళీయంగా కల్గుతుంది. ఆ రీతిగా ప్రజాపతి, అతని సృష్టీ - కేవలం (ప్రతిభామయాలే కావటం వల్ల ఈలోకం ఉదయించినట్టు తోస్తున్నా ఉదయించలేదు. చిదాకాళమొక్కటే ఉన్నది. పూర్వానుభవం వల్ల కలో స్మృతీ, - అలా కలగని స్మృతీ - ఈ రెండు రకాల స్మృతులకూ కారణం మాయాశబల (బ్రహ్మమే. శుద్ద బ్రహ్మంలో కార్యకారణాది భేదం లేదు. స్మరణం కూడా మహాచి(ద్రూపమే. అందువల్ల కార్యకారణత్వం అనేది మాటల్లో వున్నదే కాని వాస్తవంగా లేదు. చిదాకాళంలో దృశ్య జగత్తు ఏదీ ఉత్పన్నం కాలేదు. చిదాకాశమొక్కటే స్వస్వరూపంతో భాసిస్తున్నది. " లీల :- దేవీ! నాకు దివ్యద్నష్టిననుగ్రహించావు. సూర్యకాంతితో జగద్రూపాన్ని దర్శించినట్టు ఈ దివ్య దృష్టితో వాస్తవం గ్రహించగల్లుతున్నాను. ఈ దృష్టిలో నేను పరిణతి చెందక ముందే నాకు కల్గిన ఈ ఉత్కంఠను తొలగించు. ఆబ్రాహ్మణితో సహా బ్రాహ్మణుడు నివసించిన గిరిగ్రామానికి నన్ను తీసుకు పో. నేను అతళ్లో చూస్తాను. దేవి :- నీవు పరమపావనమూ, చిద్రూపమా అయిన దృష్టి నవలంబించు. ఈ స్టూలదేహాన్ని పరిత్యజించు. నిర్మల స్వరూపీణివి కమ్ము! అప్పుడు భూమిపైనున్న నరుని సంకల్పం గగనంలోని అంతపురాని కెగిరిపోయినట్న్టు నీవు చిదాకాశంలో వున్న అసృష్టి వద్దకు పోగలవు, అప్పుడు నిరాటంకంగా అ విఫ్రనికి సంబంధించిన సృష్టిని మనం చూడగలం. దాన్ని చూడటానికి ఈ స్టూలశరీరం ప్రతిబంధకం సుమా!
56 యోగవస్విం లీల : - దేవీ! ఈ దేహంతో మరొక లోకానికి ఏల పోరాదు? ఇందుక్సు కారణ మేమో దయచేసి నాకు వివరించు.
దేవి :; - మాయామయాలైన ఈ జగత్తులకు ఆకృతి లేదు. బంగారును ఉంగరమని భావించినట్లే ఆకృతి లేని లోకాలను మీరు ఆకృతి కలవిగా మిథ్యాజ్డానంతో భావిస్తున్నారు. బంగారు ఉంగరంరూపం పాందినా, అందులో ఉంగరం లేదు. అలాగే బ్రహ్మం జగద్రూపం పొందినా అందులో జగత్తు లేదు.
ఈ జగత్తు శూన్యాకాశమే. బ్రహ్మమే ఇలా కనిపిస్తున్నది. ధూళి వుండడానికి వీలులేని సముద్రంలో (ప్రతిబింబ ధూళిలాగా ఈ (బ్రహ్మంలో మాయామయ (ప్రపంచం తోస్తున్నది.
ఈ (ప్రపంచం మిథ్య. 'అద్వయ (బ్రహ్మమే నేను అన్న జ్ఞానమొక్కటే సత్యం, వేదాంతం,గురువులు, అనుభవం - ఇందుకు ప్రమాణాలు. 1బహ్మమే (బ్రహ్మాన్ని చూస్తుంది. బ్రహ్మం కానిది బ్రహ్మాన్ని చూడలేదు. బ్రహ్మస్వభావమే సృష్టి మొదలైన పేరుతో ప్రసిద్రి వహిస్తున్నది. సహకారికారణాలు లేవు కాబట్టి జగత్తుకూ, (బ్రహ్మకూ కార్యకారణభావం లేదు. అభ్యాస యోగంతో నీకు భేదబుద్ది నశించేంత వరకూ నీవు బ్రహ్మను చూడలేవు. మాబోటివారు అభ్యాసబలంతో దృఢజ్ఞానం సంపాదించి ఆ బ్రహ్మస్వరూపం చూడగల్లుతున్నారు.
నాళరీరం శుద్రచిత్తాకాశమయం. నేనీ దేహంలో కూడా ఆ బ్రహ్మమునే చూస్తున్నాను. (బ్రహ్మాది దేవతల శరీరాలు కూడా విశుద్ర్ద జ్ఞానమయాలే. అందుచేత వారు కూడా జగత్తును బ్రహ్మంగానే చూస్తున్నారు.
అభ్యాసం లేక పోవటం వల్ల నీదేహం (బ్రహ్మత్వం పొందలేదు. అందుచే చిదాభాసరూపాత్మవైన నీవు ఆగిరి గ్రామాన్ని గానీ, (బ్రవాన్ని గానీ చూడలేవు. తన సంకల్పనగరాన్నే తన శరీరం చూడజాలదు. ఇక ఇతరుల సంకల్పనగరాన్ని తన దేహం ఎలా చూడగలదు? కాబట్టి ఈదేహాన్ని వదలి చిదాకాశరూపిణి వైతే నీవా గ్రామాన్ని చూడగలవు. వెంటనే అందుకు సిద్దపడు. సృష్ట్యాదిలో ఈశ్వరేచ్చవల్ల జగ(ర్ర్రృమ ఎలా నెలకాన్నదో, అలాగే అప్పటినుండి అది దృఢపడుతున్నది.
లీల :- దేవీ ! మన మిరుపురం కలిసి ఆద్విజదంపతులుండిన గ్రామానికి పోదామన్నావు. అమ్మా! అక్కడికెలా పోవాలో చెప్పు. ఈ దేహాన్ని వర్షించి శుద్ర సత్త్వస్వరూపమైన చిత్తంతో అక్కడికి నేను వెళ్తాను. నీవెలా పోతావో చెప్పు.
ఉత్పత్తి ప్రకరణం క్7
దేవి : - సంకల్పం వల్ల కలిగిన ఆకాశవృత్షం వాస్తవానికి శూన్యమే. గోడవలె అది ఆకృతి కలది కాదు. గోడ దాన్ని నిరోధించదు. అది గోడను భేదించలేదు. ఈ శరీరం శుద్రసత్త్వంతో నిర్మింపబడింది. ఇది చిద్రూప'ప్రతి భానమే కాని వేరు కాదు. అందుచేత ఇది పరబ్రహ్మంకంచే భిన్నం కాదు.
-నాళరీరం ఇలాంటిది కాబట్టి దీన్ని నేను విడిచి పెట్టి పోవలసిన పని లేదు. గాలి గంధాన్ని చేరినట్టు ఈ శరీరంతోనే నేను ఆ దేశం చేరగలను. నీరు నీటితో, నిప్పు నిప్పుతో, గాలీ గాలితో కలిసినట్టు నాదేహం మనోమయాలయిన అన్యదేహాలతోనూ, ఇతరపదార్జాలతోనూ కలసిపోతుంది. పృథివీ వికారమైనదన్న భావనగల నీశరీరం చిన్మాత్రభావనగల నాశరీరంతో కలవదు. కల్సితమైన కొండ నిజమైన కొండతో ఎలా ఢథీకొంటుంది?
నీ శరీరంకూడా ఆతివాహికమే (మనోమయమే) .కాని చిరకాలభావనా బలంవల్ల మీ బోటివారు దాన్ని అధిభౌతికమని భావిస్తున్నారు. కల, ద్వీర్సకాలధ్యానం, (భ్రమ, సంకల్పం, గంధర్వ నగరం- అనేవి వాటికి సంబంధించిన భావన క్షీణించినప్పుడు తావు కూడా తశ్షీణిస్తాయి. అదేరీతిగా సమాధ్యభ్యాసంతో నీలోని వాసన క్షీణించినప్పుడు నీ శరీరం ఆధిభౌతకమనే భావన తొలగి ఆతివాహిక మనే నిశ్చయం కల్గుతుంది. ॥
లీల :- సమాధ్యభ్యాసంతో ఆతివాహికదేహత్వజ్డూనం దృఢమైనప్పుడు ఈ దేహం ఆస్ట్రితినే పాందుతుందా? లేక నశించిపోతుందా?
దేవి:- ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడే, అది వశించడం లేదా నశించకపోవడం అనేది సంభవిస్తుంది. అసలే ఉనికిలేని వస్తువుకు నాశం ఎలా కలుగుతుంది? త్రాడును చూచినప్పుడు 'అది పాము" అనే (భ్రాంతి కల్గుతుంది. నిజం తెలియగానే ఆ భ్రాంతి నశిస్తుంది. అప్పుడు “'పాము ఏమైనది? అది చచ్చినదా? లేక బ్రతికినదా? *' అనే (ప్రశ్నే ఉదయిస్తుందా? సత్యం గోచరించగానే త్రాడులోని పాము తొలగిపోతుంది. అలాగే ఆతివాహికత్వనిమిత్తమైన (బ్రహ్మజ్ఞునం కలగగానే ఆధిభౌతికభావన నివృత్తమవుతుంది. కల్పించిన వస్తువు ఏప్పటికైనా నశించేదే, లేని బండ లేనిదే కాని ఎన్నడూ ఉన్నది కాదుగదా!
ఈ దేహాదులన్నీ పర(బ్రహ్మంలో పరిపూర్ణమై వున్నాయి. ఈ సత్యం మాకు నిరాటంకంగా గోచరిస్తున్నది. నీకు గోచరించడం లేదు. ఆదిసృష్టిలో చిత్తుకు చిత్తం
58 యోనాష్టు అనే ధర్మం పుంటుంది. పంచీకరణ క ల్పనచేత సూల రూపం కల్పింపబడినప్పుటినుండి ఆ ఏకత్త్వమే భాంతితో దృశ్యంగా గ్ర్రైంపబడుతున్నది. లీల : - దిక్కు, కాలం మొదలైన విభాగాలు లేని ఆపరతత్త్వం ఒక్కటే అయినప్పుడు, అందులో కల్పన ఎలా సంభవించింది? దేవి: - స్వర్ణంలో కటకత్వం, జలంలో తరంగత్వం, సంక ల్పనగరాదుల్లో సత్యత్వం లేనే లేవు. అలాగే విశుద్దమైన (బ్రహ్మంలో ఎలాంటి కల్పనలూ లేవు. ఆకాళంలో ధూళి లేదు. అలాగే పరతత్త్వంలో రూపం లేదు. అరి విషయరహితమూ, ఏకమూ, శాంతమూ, జననరహితమూ అయివున్నది అందులో భాసించేది ఏదయినా గాజుపూసలోని తళతళలాగా ఉనికి లేనిదే. లీల : - దేవీ ! అలా అయితే ఇంత కాలం వేంము దేని వల్ల ఈ ద్రైతాద్వైతవికల్పనలవల్ల (భ్రమకు లోనయ్యాము? దేవి: - చపలా! విచారం లేక పోవడం వల్ల ఇంతకాలం (భ్రాంతికి లోనయ్యావు. సహజంగా కల్షిన అవిచారం విచారంవల్ల నశిస్తుంది. అవిచారమూలకమమైన అవిద్యగూడా ఉనికి లేనిదే. అది బ్రహ్మసత్తకంటే వేరు గాదు.-” అందువల్ల నిజానికి అవిచారం, అవిద్య, బంధం, మోక్షం- అనేవి ఏవీ లేవు. ఈ జగత్తు కేవలం శుద్రబోధమే. ఇంతకాలం నీవీ విషయం ఆలోచించలేదు కాబట్టి నీకు ప్రబోధం కలగలేదు. (భ్రాంతితో కలత చెందాపు. నేటినుండి నీవు నిజం గ్రహించడం వల్ల విముక్తురాల వయ్యావు. నీకు వివేకం కల్గింది. నీ చిత్తంలో వాసనాక్షయ మనే బీజం పడింది. ఈ సంసారమనే దృశ్యం అసలు పుట్టనే లేదు. ఇక దానికి చెందిన వాసన మాత్రం ఎలా కల్గుతుంది? నిర్వికల్ప సమాధిలో ద్రష్ట, దర్శనం, దృళ్యం-అనే త్రిపుటి పూర్తిగా నశించిపోతుంది. హృదయంలో వాసనాక్షయం అనే గింజ అంకురిస్తుంది. అప్పుడు రాగద్వేషాది భావాలు పాడచూపవు. ఈ సంసారం కూడా నిర్మూలింపబడుతుంది. అప్పుడు నిర్వికల్పసమాధినిష్ట చక్కగా ప్రతిష్టింపబడుతుంది. ఆ నిష్టతో సర్వానికీ అధిష్టానమైన ఆత్మను అవలంబిచడం వల్ల (భ్రాంతి మయమైన సంసారకల్పన అనే మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు సమస్తమైన కార్యకారణభావాలు నశిస్తాయి. అంతట నీవే నిర్మలాకాశంలాగా పరిశుద్రపరమపురుష్పార్ధమవై భాసిస్తావు.
ఉత్పత్తి ప్రకరణం 59 విజ్ఞానాభ్యాసం
కలలో కనిపించిన శరీరం ఇది కల అని తెలియగానే వాస్తవం కాదని స్పష్టమవుతుంది, అదే రీతిగా వాసనలు క్షీణిస్తే ఈ స్థూల దేహం కూడా ఉనికిలేని దని బోధపడుతుంది. అప్పుడు స్వప్న దేహం మాయమయినట్లే జా గ్రద్దేహం కూడా అంతరిస్తుంది. కలలో గానీ, సంకల్పంలోగానీ తోచిన శరీరం తాలగిపోగానే ఈ స్థూల శరీరం గోచరిస్తుంది. అలాగే 'స్టూలదేహం నేను అన్న భావన తాలగినంతనే ఆతివాహికదేహం ఉదయిస్తుంది.
స్వప్నవాసనలు పొడ చూపని సవుయంలో సుషుప్తి ఉదయించినట్ను జాగ్రద్వాసనలు పూర్తిగా నశించినప్పుడు ముక్తి లభిస్తుంది. జీవన్నుక్తులైన మహనీయుల వాసన వాసన కాదు. అది శుద్ర్దసత్త్వ మనబడే సత్తాసామాన్యం మాత్రమే.
నిద్రలో వాసనలు పొడచూపని స్టితిని సుషుప్తి అంటారు. జాగ్రత్తలో వాసనలు అణగారిన దశను మూర్చ అంటారు. వాసనలు పూర్తిగా నశించినప్పటి ని(ద్ర తురీయమని పేర్కొనబడుతుంది. జా గ్రద్రశలో కూడా పరతత్త్యం గోచరించినప్పుడు ఈ ఫ్టితి కల్గుతుంది. వాసనారహితమైన జీవుల జీవనస్రితినే జీవన్ముక్తి అంటారు. దీన్ని బద్రజీవులు గ్రహించలేరు.
మంచు వేడికి నీరుగా మారినట్లే వాసనారహితమైన చిత్తం అభ్యాసబలంతో శుద్ద సత్త్వంలో స్టిరంగా నెలకొన్నద్దై ఆతివాహకంగా వూరుతుంది. ఆత్మప్రబోధపూర్ణమైన చిత్తం మాత్రమే సృష్ట్య్రంతర - జన్మాంతరాలలోని ఇతర చిత్తాలతోనూ, దేవయోగ్యాది ళరీరాలతోనూ సమ్మేళనం పొందుతుంది. అభ్యాసంతో నీ దేహాభిమానం శమించినప్పుడే దృశ్యం నశించి నీకు సువిశాలమైన స్వాభావిక చిద్రూపత్వం లభిస్తుంది. ఆతివాహిక జ్ఞానం శాశ్వతమైనప్పుడే నీవు సంకల్ప దూషితాలు కాని పవిత్రలోకాలను చూడగలవు. అందువల్ల నీవు వాసనలను నశింపజేయటానైై ప్రయత్నించు. వాసనలు పూర్తిగా నళొస్తే నీవు జీవన్ముక్తురాల వవుతావు.
చల్లని జ్ఞాన చంద్రుడు వృద్రి పాందనంతవరకూ ఈ సూలదేవాన్ని ఇక్కడే వుంచి నీవు లోకాంతరాలు చూడు. మాంసదేహం వ్యవహారాలలో మాంసదేహంతో కలుస్తుందే కాని చిత్తశరీరంతో కలవదు. నా అనుభవం ఉన్నది ఉన్నట్టు వివరించాను.
60 యోగవాష్మిం బాలురనుండి సిద్దుల వరకూ ఇది అందరి అనుభవంలోనూ ఉన్న విషయమే. వరం, శాపం లాగా ఇది సిద్రిబలంతో జర్గే పని కాదు. జ్ఞానాభ్యాసబలంతో సంసారవాసన నశించే సరికి ఈ దేహమే చిత్త ( ఆతివాహిక్ర' శరీరంగా మారుతుంధి. జనులు మరణించే శరీరాన్ని చూస్తారే కాని మరణకాలంలో ఉదయించే చిత్త శరీరాన్ని చూడలేరు. బిడ్డా! ఈ దేహానికి కూడా చావుపుట్టుక లనేవి లేవు. స్వప్నం లాగా, సంకల్పం లాగా అవి (భ్రాంతి మాత్రమే. సంకల్పపురుషుని జనన మరణాల లాగా ఈ శరీరానికి చెందిన జనన మరణాలు సైతం అసత్యాలే. లీల : - దేవీ! దృశ్య విషూచికను నశింపజేసే నిర్మలమైన జ్ఞూనాన్ని నీవు నాకు ఉపదేశించావు. అభ్యాసమంటే ఏమిటి? అది ఎలాంటిది? అది ఎలా వృద్ది పొందుతుంది? వృద్ది పొందితే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి? ఈ విషయాలు నాక్షు వివరించి చెప్పి నన్ను అనుగ్రహించు. దేవి: - ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తాడో, అదంతా అభ్యాసం లేకపోతే ఎప్పుడూ సిద్రించదు. దానిని గూర్చే చింతించడం, చెప్పుకోవడం, పరస్పరం (ప్రబోధించుకోవడం, తదేకపరంగా ఉండడమే అభ్యాసమని పెద్దలు చెబుతారు. ఏ మహాత్ములు విరక్తులై ముక్తి కోరి విషయవాసనాక్షయాన్ని సాధిస్తారో, వారే లోకంలో సర్వోత్కృష్టులై రాణిస్తారు. ఎవరి బుద్ది వైరాగ్యరసరంబితమై ఆనందంతో స్పందిస్తుందో, వారే శ్రేష్టులైన సాధకులు. శాస్తాలతోనూ, యుక్తులతోనూ జ్ఞాత్నజ్టేయ రూపమైన వస్తువు యొక్క అత్యంతాభావం కొరకై యత్నించేవారే బ్రహ్మాభ్యాసులు. అసలు సృష్ట్ర్యాదిలోనే దృశ్యం ఉద్భవించలేదు, దృశ్యానికి ఉనికి లేనే లేదు. “జగత్తు లేదు, నేను లేను అన్న జ్ఞానమే అభ్యాసం. దృశ్యం లేదని గ్రహించగానే రాగద్వేషాదులు తొలగిపోతాయి. అప్పుడు పరమాత్మపై కలో ఆసక్తినే బ్రహ్మాభ్యాసమంటారు. దృశ్యం అసంభవం అన్న జ్ఞానం కలగకుండా ద్వేషాదులను తొలగించటానికి చేసే తపస్సు దుఃఖాన్నే కల్గిస్తుంది. దృళ్ళం అసంభవం అన్న జ్ఞానమే నిర్వాణాన్ని కల్గిస్తుంది. అభ్యాసానికి ఫలమదే. వునసులోని సంసార మనే గాఢనిద్ర వివేకవిజ్ఞానా లనే జలసేకంతో శరత్కాలంలో మంచు నశించినట్టు పూర్తిగా నశించిపోతుంది. మునీంద్రుడు ఈ విధంగా చెప్పేసరికి సాయం సమయమయింది. సూర్యుడు
ఉత్పత్తి ప్రకరణం 61 అస్తమించాడు. సభాసదులు నమస్కరించి స్నానాదివిధులు నిర్వర్తించడానికై వెళ్ళారు. తెల్లవారగానే తిరిగి సభాఫ్ట్రలికి విచ్చేశారు. (ఇది నాల్గవ దినం) జ్ఞానదేహాల ఆకాశగమనం
వసిష్టుడు : - ఈరీతిగా లీల, సరస్వతీదేవి ఆరాత్రి మాట్టాడుకున్నారు. అప్పుడు తలుపులు, కిటికీలు మూసి పరిజనులు అంతఃపురంలో ని(ద్రిస్తున్నారు.
పద్మనరపతి శరీరం వాడని పూలతో కప్పబడివున్నది. ఆపూల తావి మండప మంతా (ప్రసరించింది. వారిద్దరూ పూర్ణ్షచం(ద్రుని బోలిన వదనకాంతితో ఆ పరిసరాలను (ప్రకాశింపజేస్తూ భూపాలుని శవం చెంత నిలబడి సమాధిఫ్రితిలోకి వెళ్ళారు. రత్నస్తంభంలో చెక్కిన బొమ్మల్లాగా, గోడపై గీసిన చిత్రాలలాగా నిశ్చలంగా వుండిపోయారు. సాయం సమయంలో సంకోచం పొందే పద్మినులవలి ఇం(ద్రియాలను విషయాలనుండి మరలించి సకలచింతలూ వదలిపెట్లారు. శరదృతువులో గాలి లేనప్పుడు కొండపై వాలిన మేఘమాలికల లాగా శుద్ద శాంతాత్మలై కదలికలేని వారయ్యారు. (క్రొత్త బుతువు రాగానే పూర్వ బుతురసాన్ని పరిత్యజించిన కల్పలతల్లాగా వారు నిర్వికల్ప సమాధి లోకి వెళ్లి బాహ్యజ్ఞానాన్ని పరిత్యబించారు. “వేను - ఈ జగత్తు' అనే భ్రాంతిదృశ్యం పుట్టనే లేదని ఎప్పుడు వారు గ్రహించారో, అప్పుడే దృశ్యపిశాచం వారినుండి తొలగిపోయింది.
కుందేటి కొమ్ము ల్తాగా లేని వస్తువు ఎప్పుడూ లేనిదే. ముందు లేనిది ఇప్పుడూ లేనిదే. ఉన్నట్టు భాసించడం ఎండమావిలోని నీరు లాగానే కాని నిజంగా వుండి కాదు.
సూర్యచంద్రాది పదార్డ్హాలు తొలగిన గగనం లాగా ఆస్త్రీలు ఇద్దరూ శాంతలై కేవలస్వభావంలో నిలబడి పోయారు. సరస్వతీదేవి జ్ఞానదేహంతో చరించగా, లీలాదేవి ధ్యానజ్ఞానానురూపమైన శరీరంతో వరించింది. పరిమితమైన ఆగ్భహంలోనే వారు చిదాకాశరూపం ధరించి ఆకాళశగమనాకృతిగలవారయ్యారు. లలితలోచనలయిన ఆలలన లిరువురూ విషయానురూపమైన వ్యవహారకల్పనతో చాలాదూరం పయనించారు. ఆగృహంలో వుండేవారు చిద్వత్తి బలంతో కోటియోజన విస్తీర్లమైన నభజ్ధులానికెగిరి దూర దేశంలో విహరించారు.
62 యోగాషం
ఆ సఖీమణులు ఆకాశమయ శరీరాలు గలవారైనా పూర్వసంకల్ప స్వభావంవల్ల పరస్పరాకృతులు చూచుకొంటూ స్నేహంతో ప్రవర్తించారు.
గగన వర్ణనం
అలా వాళ్ళు చేయి చేయి కలుపుకొని సుదూరం పైకెగిరి చాలా ఎత్తైన చోటికి వెళ్ళి ఆకాశం వైపు చూచారు. విస్త్ప్రతమూ, గంభీరమూ, నిర్మలమూ, కోమలమూ అయిన ఆకాశం ఒక మహాసము(ద్రంలా వాళ్ళకు గోచరించింది. అది సజ్జనుని హృదయం కంచే (ప్రసన్నతరమై భాసించింది.
ఎడనెడా మేర్వాది పర్వత శిఖరాలలోని సౌధాలలో వి'శ్రమిస్తూ పోయి పోయి వాళ్లు చంద్రమండలం దాటారు. సిద్దులూ, గంధర్వులూ ధరించిన మందారమాలల వాసనలతో వానోజ్జవైన చల్లనిగాలిలో విహరించారు. జలపూర్ణవ్వెన వేఘవుండలంలో వుడుగులో లాగా స్నానం చేశారు. భూతలాలలోని మహాపర్వతాలు తామర గడ్డలపై మొలచిన అంకురాల రీతిగా కనిపిస్తుండగా సరస్సుల్లో తిరగే తుమ్మెదల లాగా దిక్కులలో స్వేచ్చగా పరి(భ్రమించారు.
ఆ పైస్వశ్తితో శూన్యంలో సంచరిస్తూ వాళ్లు అదృష్ట పూర్వమూ, అనేక భువన నిర్మాణాలతో సంక్షిష్రమూ అయిన వ్యోమమండలం వైపు చూపు సారించారు. కోట్ల కొలది జగత్తులు కూడా ఆ శూన్యాన్ని పూరించలేకపోయాయి. ఆనభోమండలంలో చిత్రవిచిత్రాలయిన భూతలాలు పైపైన వ్యాపించి వున్నాయి. వాయువేగాన్ని జయించిన మనోవేగంతో చరించే సిద్దులు అక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. విమాన గృహాలలోని దేవతా, స్త్రీల గేయవాద్యాల ఘుమఘుమ ధ్వని అంతటా వ్యాపిస్తున్నది. ఒకరి సంచారం మరొకరికి తెలియకుండా అక్కడ సురాసురులు సంచరిస్తున్నారు. వాయు్రవాహాల తాకిడికి లోనై వైమానికులు మిక్కిలి వేగంతో పయనిస్తున్నారు. ఇటూ అటూ తిరిగే వివూనాల ధ్వనిలో వేఘధ్వని వినిపించడం లేదా. లోకపాలకులూ, అచ్చరలూ సందడిగా నలువైపులా సంచరించడం వల్లి వియన్మండలమంతా చంచలమై కనిపిస్తున్నది. కాకులూ, (గ్రుడ్రగూబలూ మొదలైన పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. సముద్రంలో అలల్లాగా నభస్తలంలో డాకినీగణం నృత్యం చేస్తున్నది. యోగినీగణం వందలకొలది యోజనాలు వ్యర్థంగా తిరిగి తిరిగి మరలా బయలుదేరిన చోటికే వచ్చి చేరుతున్నది.
ఉత్పత్తి ప్రకరణం 63
మేఘమందిరాలలో సిద్దంధర్వ మిథునాలు సురతోత్సవం చేసుకొంటున్నారు. స్వర్గంలో వినిపిస్తున్న గేయాలు వియద్వీథిలో పోయేవారిని కామపరవళులను చేస్తున్నాయి. వాయుచ(క్ర ప్రభావంతో ఏర్పడిన సుడిగుండాలలో గంగాజలం (ప్రవహిస్తున్నది. సురబాలకులు ఆ దృళ్యం వద్ద ఆళ్ళర్యసందర్శనా భిలాషతో సంచరిస్తున్నారు.
ఒకచోట మవామేఘాలు విలయతాండవం చేస్తున్నాయి. మరొకచోట ఉరుములులేని మబ్బులు చిత్రంలోని బొమ్మల్టా కనిపిస్తున్నాయి. వేరొకచోట కాటుక కొండలవంటి జలదాలు పైపైకీ పోతున్నాయి. ఇంకొక చోట సంధ్యాకాలపు మేఘాలు కనక ప్రవాహంలా గోచరిస్తున్నాయి. ఒకచోట యోగినీగణం మద్యపానంతో మత్తెక్కీవున్నది. మరొకచోట మునులు శాంతసమాధిలో వి'శ్రమించివున్నారు. ఇంకొకచోట ఏ సంరంభమూలేని సాధువులు ప్రసన్నచిత్తులై వున్నారు. వేరొకచోట కిన్నరులు, గంధర్వులు, దేవవనితలు గానం చేస్తున్నారు.
ఒకచోట కదలికలేని నగరాలు, మరొకచోట కదలిపోతున్న పట్టణాలు కనిపించాయి. ఒకచోట రుద్రపఫురం, మరొకచోట బ్రహ్మనగరం, ఇంకొకచోట మాయాపట్టుణం, వేరొకచోట భవిష్యన్నగరమూ నెలకొని వున్నాయి. ఒకవోట చంద్రు డుదయిస్తున్నాడు. మరొకచోట సూర్యోదయ మవుతున్నది. ఇంకొకచోట గాఢతమస్సు వ్యాపించివున్నది. వేరాకవోట సంధ్యారాగం గోచరిస్తున్నది. ఒకచోట మబ్బులు మంచులా తెల్లగా వున్నాయి. మరొకచోట మేఘాలు వర్షిస్తున్నాయి. ఇంకొకవోట నేలపై విశ్రమించినట్టు లోకపాలకులు ఆకాశం లోనే విశ్రమించివున్నారు. ఒకచోట లక్షలకొలది యోజనాలు కొండలే వ్యాపించి వున్నాయి. మరొకచోట కారుచీకట్టుకమ్మినచోట్టు కొండగుహల్లా గోచరిస్తున్నాయి. ఒకచోట రక్కసులు దేవతానగరాలను ధ్వంసం చేస్తున్నారు. మరొకచోట కక్రిందపడే వైమానికులు ఉల్కపాతంలా కన్పిస్తున్నారు. ఒకచోట వందలకొలది ధూమకేతువులు పరస్పరం ఢీకొంటున్నాయి. మరొకచోట శుభగ్రహాలు వున్నత స్టానంలో శోభిల్దుతున్నాయి.
ఒకచోట కప్పలు బెకబెకలాడుతున్నాయి. ఇంకొకదోట ఆకాశవాసుల వ్షేత్రాలను శూన్యత్వమనే జలం ముంచివేస్తున్నది. ఒకవోట కుమారస్వామి వాహనాలైన నెమళ్లు నృత్యం చేస్తున్నాయి. మరొకచోట అగ్నికి వాహనాలైన చిలుకల గుంపులు పచ్చిక బయళ్లలా కనిపిస్తున్నాయి. ఇంకొకచోట యముని వాహనమైన మహిషం ముందు
64 యోగవాసి్టం మబ్బులు పాట్టివిగా గోచరిస్తున్నాయి. మరొకచోట గుజ్టాలు గడ్డీ అనుకొని నీలమేఘాలను నమలుతున్నాయి.
ఒకచోట కులపర్వతాన్ని పో లిన భైరవుడూ, ఇంకొకచోట రెక్కల కొండవంటి గరుడుడూ నృత్యం కావిస్తున్నారు. ఒకచోట చంద్రకిరణాలతో చల్లబడిన గాలీ వీస్తున్నది. మరొకచోట సురాసురులకు భీకరమైన పోరాటం జరుగుతున్నది.
పాతాళానికి చేరిన సూర్యునివల్ల ఏర్పడిన భూమినీడ కారణంగా ఒకచోట సూర్యగ్రహణవబూ, వురొకచోట చం(ద్రగ్రహణవచూ ఏర్పడుతున్నాయి. వేడిపండులోని దోవులలాగా (త్రిలోకాలలోని పప్రాణికోట్టు కనిపిస్తున్నారు. ఆవిశాలాకాశంలో పై వింతలన్నీ చూస్తూ పయనించిన ఆ వనిత లిరువురూ మళ్లీ భూతలానికి పోవటానికి కుపక్రమించారు.
భూలోక వర్గనం
ఆకాశం నుండి గిరి గ్రామానీకి పయనిస్తూ ఆ వనిత లిద్దరూ జ్ఞప్తిదేవి లీలకు చూపించదలచుకున్న భూతలం వైపు చూచారు.
(బ్రహ్మాండమనే మనుజుని హృదయపద్మమే ఆ భూతలం. అష్టదిక్కులే దాని దళాలు. కొండలే దాని కేసరాలు. అది తన సౌరభంతో మనోజ్ఞమై విరాజిల్దుతున్నది. రాత్రి అనే ఆడుతుమ్మెద ఆ పద్మం చూట్టూ పరిభ్రమిస్తున్నది. జీవజాలమనే దోమలు దానిపై మూగి వున్నాయి. రసాద్దమైన ఆ పద్మం చుట్టూ సూర్యుడనే హంస పరి(భ్రమిస్తున్నది. రాత్రివేళ ఆ సరోజం సంకోచం పొందుతున్నది. పాతాళమనే బురదలో ఉన్న నాగరాజే దానికి నాళం.
సము(ద్రమే ఆ భూతలమనే కమలానికి స్టానం. సాగరం చలించి నప్పుడు దిక్కులనే దాని దళాలు కూడా కదలుతున్నాయి. ఆ పద్మం మధ్య జంబూద్వీపమనే విశాలమైన దుద్దు ఉన్నది. అందు సప్త కులపర్వతాలనే బీజాలు ఉన్నాయి. అక్కడ మేరుపర్వతమనే బీజం నభఃస్తలాన్ని ఆక్రమించి వున్నది. మడుగులే ఆ పద్మం మీది మంచు బిందువులు. అడవులే ధూళి. ప్రతి పూర్ణిమకు ఉప్పాలే నాలుగు సముద్రాలనే (భ్రమరాలు దానిచుట్టు మూగివున్నాయి.
తొమ్మిది మంది రాజసోదరులు ఆ జంబూద్వీపాన్ని తొమ్మిది భాగాలుగొ విభజించారు. దాని వైశాల్యం లక్షయోజనాలు. అనేక గ్రామాలనే చెదరిపోని
ఉత్పత్తి ప్రకరణం 65 హిమబిందువులు దాన్ని క్రమ్ముకొని వున్నాయి.
ఆ ద్వీపాన్ని అంతకంటె రెండు రెట్లు పెద్దదైన లవణ సవఎు(ద్రం చుట్టుకొనివున్నది. ఆ సముద్రాన్ని అంతకంటె కుళద్వీపం, దధిసము(ద్రం, 'క్రాంచద్వీపం, ఘృతసాగరం, శాల్మలీద్వీపం, సురాసముద్రం, ఫ్లక్షద్వీపం, ఇక్తుసాగరం, పుష్కరద్వీపం, మంచినీటి సముద్రం (క్రమంగా ఒకదాని కంచె ఒకటి రెండింతలు పెద్దవై ముందు పేర్కొన్న వాటిని వెనుక పేర్కొన్నవి చుట్టు ముట్టి వున్నాయి.
ఆ పిమ్మట పై మంచినీటి సముద్రం కంచె పదిరెట్టు పైద్దదై పాతాళం వరకూ వ్యాపించిన ఒక బిలం వున్నది. అక్కడ లోకాలోక పర్వతాలు కనిపిస్తున్నాయి. తరువాత పై బీలం కంచె పదిరెట్టు పెద్దదైన అరణ్యం ఉన్నది. అందులో ప్రాణిసంచారం లేదు. ఆ పైన అంతకంటె పదిరెట్టు పెద్దదైన ఆగాధ జలరాశి ఆకాశంలా వ్యాపించివున్నది. తరువాత అంతకంటె పదిరెట్టు పెద్దవైన అగ్నిజ్వాలలు భాసిస్తున్నాయి. అవి మేర్వాది పర్వతాలను సైతం కరిగించేటట్టు ప్రజ్వలిస్తున్నాయి.
దానిపై అంతకంటె పదిరెట్టు పెద్దదైన వాయు(ప్రవాహం వున్నది. అది మహాపర్వతాలను కూడా తృణంలా హరించగలదు. కాని అది శూన్య'ప్రదేశం కావటం వల్ల నిళ్ళబ్రంగా వున్నది. ఆ పైన దానికంటె పదిరెట్టు పెద్దదైన శూన్యాకాశం వ్యాపించివున్నది. ఆ తరువాత శతకోటి యోజనాలు విస్తరించిన స్వర్ణమయమైన (బ్రహ్మాండకుడ్యం విరాజిల్హుతున్నది.
ఈ రీతిగా లీలాదేవి సము(ద్రాలు, కొండలు, లోకపాలకులు, దేవతానగరాలు, ఆకాశము, భూతలము - వీటితో కూడిన సువిశాల జగత్తును చూచింది. ఆ భూతలంలోని గిరి గ్రామాన్ని కూడా విలోకించింది.
సిద్ద దర్శన హేతువు
ఈ రీతిగా ఆ ఉత్తమవనిత లిరువురూ పద్మభూపాలునికి ఆధారమైన (బ్రహ్మాండవుండలాన్ని దాటి వురొక (బ్రహ్మాండవుండలంలోని గిరిగ్రావుం చేరుకొన్నారు. అక్కడ అదృశ్యరూపంతో వెళ్ళి విప్రుని గృహం చూచారు. ఆ ఇంటిలోని దాసీజనులు చింతా క్రాంతులై వున్నారు. స్త్రీల వదనాలు కన్నీటి ధారలతో తడిసి శుష్కించిన కమలాల వలె కళావిహీనమై వున్నాయి. ఆ గృహం ఉత్సవంలేని నగరంలాగానూ,; అగస్త్యుడు పానంచేసిన సాగరంవలెనూ, (గ్రీష్మద్టమైన ఉద్యానవనం
686 యోగవాసిష్టం మాదిరిగానూ, పిడుగుపాటుకు కాలిన చెట్టురీతిగానూ శోభావిహీనమై కనిపించింది.
పీదప చిరాభ్యాసబలంతో నిర్మలజ్ఞానం పాందిన లీలాదేవి దేవతల వలె సత్యసంకల్పురా లయింది. '“నా బంధువులు నన్ను, ఈ దేవిని సామాన్య స్త్రీల వలె చూతురు గాక! అని సంకల్పించింది.
వెంటనే ఆ యింటివారు లక్ష్మీపార్వతుల వలె భాసిస్తూ ఇంటికి శోభచేకూర్చిన అంగన లిద్దరినీ చూచారు. ఆపాదమస్తకం పూమాలలు దాల్చిన ఆ వనితలు వసంత లక్ష్ములలాగా కనిపించారు. ఓషధులనూ, వనాలనూ అమృత(ప్రాయమైన వెన్నెలతో నింపుతూ చల్లదనాన్నీ, సంతోషాన్నీ ప్రసాదించే చంద్రు లిర్వురు ఉదయించినట్టు వారు పొడచూపారు. వారి వీక్షణామృతం శుష్కించిన చెట్టును సైతం చిగిరింప జేసింది.
“వనదేవతలకు నవుస్కారం' అంటూ పెద్దకువూరుడైన జ్యేష్టళర్మ ఇంటీవారితో కలిసి వారికి పుష్పాంజలి సమర్పించాడు.
పిదప జ్యేష్టశర్మ మున్నగువారు వారితో ఇలా అన్నారు-
“దేవ వనితలారా! మీకు జయవుగుగాక! మీరు వరా దంఃఖాన్ని శమింపజేయడాన్లో విచ్చేశారు. సాధారణంగా సాధుజనులు చేసే పని పరపరిరక్షణమే కదా!
ఆ మాట విని ''మీ దుఃఖానికి కారణమేమిటో చెప్పండి!” అని వారు ఆదరంతో (ప్రశ్నించారు. అంతట జ్యేష్టశర్మాదులు ఇలా చెప్పారు-
““దేవతలారా। ఇక్కడ మా కులకర్తలూ, అతిథి పూజకులూ, బ్రాహ్మణ వుర్యాదను నిలబెట్టినవారూ అయిన వి(ప్రదంపతు లుండేవారు. వారేవా తల్లిదండ్రులు. వాడు పుత్రులనూ, బంధువులనూ, పశువులనూ, ఇంటినీ వదలి స్వర్గానికి వెళ్లారు. అందువల్ల ముల్లోకాలూ మాకు శూన్యమైపోయాయి.
వారు గతించడం వల్ల మా పెంపుడు పక్షులు ఇంటిపైకెగిరి ళూన్యంలో రెక్కలాడిస్తూ మధురస్వరంతో ఏడుస్తున్నవి. ఈ (ప్రక్కనే వున్న కొండ సెలయే రనే అశ్రుధారలొలికిస్తూ గుహలనుండి వెలువడే గురుగురు ధ్వనితో రోదిస్తున్నది. ఊరి వారందరూ నేలబడి పారలుతూ బిగ్గరగా ఏడుస్తూ ఆహారం మాని మరణించడానికి సిద్దమై వున్నారు. వృత్షాలు మంచుబిందువు లనే కన్నీరు కారుస్తున్నవి. తాపంతో తపేంచిన సెలయేళ్లు తమ్ము చ్మూర్ణం చేసుకోహాలని రాళ్లతో నిండిన గుంటల్లో పడుతున్నాయి. విలాసానికి దూరమై వమూగవోయిన గృహాలు అడవులుగౌ
ఉత్పత్తి ప్రకరణం 67 మారిపోయాయి. ఉద్యానపుష్పాలు భ్రమర ధ్వనులతో రోదనం చేస్తున్నవి. నదులు కలకలారావంతో సాగరంలో దూకటానికి పరుగిడుతున్నాయి. దయచేసి మీరు మా యీ దుఃఖాన్ని నివారించండి!
పెద్దల దర్శనం ఎప్పుడూ నిష్ఫలం కాదుగదా!”
ఇలా చెప్పిన పుత్రుని శిరస్సును లీలాదేవి చేతితో పద్మిని చివురుతో మూలగ్రంథిని స్పృశించినట్టు స్పృశించింది. వర్దాకాలమేఘస్పర్శతో (గ్రీష్మతాపం వదలించుకొన్న కొండలాగా ఆ స్పర్శతో జ్యేష్టశర్మ దుఃఖవిముక్తు డయ్యాడు. ఇంటివారందరూ వారి సందర్శనంతో అమృతపానం చేసినవారి వలె శోకనిర్ముక్తులై శోభిల్లారు.
శ్రీరాముడు : - మునీం(ద్రా! లీలాదేవి కుమూరునకు మాతృరూపంతో ఎందుకు కనిపించలేదు? ఈ సంశయం తీర్భండి!
వసిష్టుడు : - రామా! పృథివి మొదలైన మిథ్యా భూతాలను ఎవడు అజ్జానంతో నిజమైన పదార్డాలుగా భావిస్తాడో, వానికి చిదాకాశమే ఆ పద్భారరూపంలో గోచరిస్తుంది. అలా భావన చేయని తత్త్వజ్ఞుడికి అది చిదాకాశంగానే తోస్తుంది.
కలలో అనేక పదార్దాలు కనిపిస్తాయి. "ఇది కల' అని తెలియగానే అవన్నీ మాయమైపోతాయి. జాగ్రదవఫ్రలో గూడా జ్ఞానం కల్గిన వెంటనే వస్తువులు వస్తుత్వాన్ని కోల్పోతాయి. పైత్యం 'ప్రకోపించిన వానికి పృథివ్యాదులు ఆకాళంగా కనిపిస్తాయి. మూర్చాగ్రస్తుడు పరలోకాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు. కలలో కనిపించిన స్తీ ఉనికిలేనిదే అయినా కార్యకారిణి అవుతుంది. అట్లే శూన్యం సైతం భావనాబలంతో ప్పథివ్యాదులుగా గోచరిస్తుంది.
బాలుడు శూన్యంలో బేతాళాన్ని చూస్తాడు. మరణించేవాడు ఆకాశంలో అరణ్యాన్ని దర్శిస్తాడు. నేత్రరోగులు గగనంలో వెం(డ్రుకల చుట్టనూ, ముత్యాలనూ విలోకిస్తారు. భయపడినవారు, మత్తెక్కినవారు, సగం నిద్రలో ఉన్నవారు, పడవలో పయనించేవారు శూన్యంలో అడవులు, చెట్టు మొదలైన వింతవింత వస్తువులను చూచి పరుగిడడం మున్నగు పనులు చేస్తూ వుంటారు. కాబట్టి భావన ననుసరించి పదార్దాలు రూఫపుదాలుస్తాయి. నిజంగా వాటికి ఒక రూపమంటూ లేదు.
లీలాదేవి పృథివ్యాది వస్తువులను ఉనికిలేని వానినిగా గ్రహించింది. భావనాబలంతో ఈ మిథ్యా ప్రపంచం తోస్తున్నదని ఆమెకు తెలుసు. (ఆమెకు ఫుత్రుని
కత
68 యోగాాసం మీద ఫుత్రభావం లేదు. అందుచేతనే ఆమె పూర్వశరీరం ధరించలేదు. )
సర్వత్రా బ్రహ్మాత్మైకభావనగల మునికి పుత్ర మిత్ర కళత్రాదులు ఏవి? ఎక్కడివి? ఎలా వుంటాయి? అసలు దృశ్యమన్నది పుట్టనే లేదు. ఉన్నట్టు తోచేదంతా నిజానికి ఉనికి లేనిదే. అందుచేతనే సమ్యక్జ్ఞానం కలవానికి రాగద్వేషాలు ఉండవు. లీలాదేవి పుత్రుని శిరస్సుపై చేయి వుంచడం అతనికి భవిష్యత్తులో శుభం కలగడానిక్తే, అది అతని పూర్వ పుణ్యఫలం.
రాఘవా! తత్త్వజ్ఞానం కలగగానే ఆకాళం కంటే సూక్ష్మమైన శుద్ద బ్రహ్మమే అంతటా భాసిస్తుంది. కలలోనూ, సంకల్పిత పట్టణంలోనూ ఈ విషయం అనుభవసిద్దమే కదా!
జన్మాంతర వర్గనం
ఆ గిరిగ్రామంలోని బ్రాహ్మణుని గృహంనుండే ఆ వనిత లిద్రరూ అంతర్జానమై పోయారు. *'“వనదేవతలు మమ్మల్ని అనుగ్రహించారు” అని భావించి ఆ యింటి వారందరూ వారి వారి పనుల్లో నిమగ్నులయ్యారు.
మండపాకాశంలో ఆకాశరూపంతో లయం పొంది ఆళ్ళిర్యంతో లీలాదేవి మౌనం వహించింది, ఆమెతో ఆకాశరూపిణి అయిన సరస్వతీదేవి ఈ క్రింది విధంగా చెప్పింది. వారిద్రరి సంభాషణ స్వప్నంలోనూ, సంకల్పంలోనూ జర్గే పరస్పర సంభాషణ లాగానే కార్యరూపం దాల్ఫింది. పృథివ్యాది భూతాలూ, నాడీప్రాణాదులు లేకున్నా స్వప్న సంకల్పాలలో కల్లినట్లే వారికి సంభాషణ రూపమైన సంవేదన ఉదయించింది,
సరస్వతి : - తెలుసుకోదగిన దానిని నీవు పూర్తిగా తెలుసుకొన్నావు. చూడదగినవాటిని కూడా చూచావు. బ్రహ్మసత్త అనేది ఇలా వుంటుంది. ఇంకా ఏమి అడగదలచావో చెప్పు,
లీల : - అమ్మా! మరణించిన నా భర్త యొక్క జీవుడు రాజ్యం చేస్తున్నవోట జనులు నన్ను చూడలేకపోయారు. నా కుమారుడు మాత్రం నన్ను చూడగలిగాడు. ఇందుకు కారణమేమి?
సరస్వతి : - బిడ్డా! అభ్యాసం లేకపోవడం వల్ల అప్పుడు నీకు ద్వైత నిశ్చయం, అంటే ఈ ప్రపంచం సత్యమనే భావన నశించలేదు. అద్వైతంలో ఫ్టిరపడని వాడు
ఉత్పత్తి ప్రకరణం 69 సత్య సంకల్పం మొదలైన అద్వైత కర్మల ప్రయోజనాన్ని ఎలా పాందగలడు? ఎండలో వుండే వ్యక్తికి నీడలోని చల్లదనం ఎలా అనుభవానికి వస్తుంది? అభ్యాసం లేకపోవడం మూలాన ఎంతవరకూ నీకు ““నేను లీలను అన్న భావం నశించలేదో, అంతవరకూ సత్య సంకల్పం సిద్రించలేదు. ఇప్పుడు నీవు సత్య సంకల్పురాలవయ్యావు. అందువల్లనే ““నన్ను కుమారుడు చూచుగాక[** అన్న నీ సంకల్పం ఫలించింది. ఇప్పుడు నీవు నీ భర్త వద్దకు వెళ్లినా పూర్వం లాగానే నీ వతనితో వ్యవహరించగలవు.
లీల: - ఈ మందిరంలోని ఆకాశంలోనే నా భర్త అయిన విప్రుడు ఉండినాడు. ఇక్కడే. అతడు వురణీంచి రాజుగా రూపాందాడు. ఇక్కడే ఆ భూమండలాంతరంలోని రాజధానీ నగరంలో అతనికి నేను పట్టు మహిషీ నయ్యాను. ఇక్కడే అంతః పురంలో నా రాజు ప్రాణాలు వదలాడు. ఈ అంతః పురాకాశంలోనే ఆయన నానా జనపదాలకు పప్రభువయ్యాడు. ఈ రీతిగా ఈ మండపాకాళంలోనే ఈ వ్యవహార మంతా కొనసాగింది.
బుట్టలో ఆవాల వలె ఈ గృహాకాశంలోనే సమస్తమైన బ్రహ్మాండాలూ ఉన్నాయని నేను భావిస్తున్నాను. నా భర్త ఇప్పుడున్న భూమండలం కూడా ఇక్కడనే ఉన్నదని నేను అనుకుంటున్నాను. దేవీ! నాకు ఆ మండపం చూపించి నన్ను అనుగ్రహించు.
సరస్వతి : - బిడ్డా! భూతలారుంధతీ! నీకు సన్నిహితు లయిన భర్తలు ముగ్గురే. కాని నీ భర్తలు వందలకొలది ఉన్నారు. నీకు దగ్గరి వారైన ముగ్నరిలోనూ మొదటివాడైన విప్రుడు కాలి బూడిద అయ్యాడు. రెండవ వాడైన పద్ముడు శవరూపంతో అంతః పురంలో పూలతో కప్పబడి వున్నాడు. ఇక మూడవవాడైన భూపాలుడు మాసంసారసాగరంలో పడి (భ్రాంతుడై వున్నాడు. అతడక్కడ భోగాలనే అలల్లో చిక్కుకున్నాడు. అతని చిత్తం మలినమై పోయింది. అందలి చిద్వృత్తి కూడా శిథిలమయింది. చిత్రవిచి(త్రాలైన రాజు కార్యాలలో మునిగి అతడు జడుడైపోయాడు. “నేను ప్రభువును, నేను భోగిని, నేను సిద్దుడను, నేను బలవంతుడను, నేను సుఖవంతుడను”' అన్న అనర్థ మహాపాశంతో బంధింపబడి అతడు స్వతంత్రత కోల్పోయాడు.
వరవర్షినీ! గాలి గంధాన్ని ఒక వనం నుండి మరొక వనానికి తీసుకుపోయినట్టు నిన్ను నేనిప్పుడు ఏ భర్త వద్దకు తీసుకుపోవాలో చెప్పు.
ఈ సంసారపు తీరువేరు. ఆ బ్రహ్మాండ మండపం పద్రతి వేరు. అక్కడి వ్యవహార
70 యోగవాష్మం ధోరణులు కూడా భిన్నభిన్నంగానే వుంటాయి. ఈ సంసారమండలాలు జ్ఞాన దృష్టితో చూస్తే ప్రక్కనే వుంటాయి. కాని సంసార దృష్టితో పరికిస్తే వాటి మధ్య కోటికోట్ల యోజనాల దూరం వుంటుంది.
ఇవన్నీ ఆకాశస్వరూపాలే. కాని వీటిలోనే కోట్లకొలది మేరుమందర పర్వతాలు నెలకొని వున్నాయి. కిటికీ గుండా ప్రసరించే సూర్య కిరణాలలో త్రసరేణువుల్లాగా (పతి పరవూణువులోనూ అనంతకోటి సృష్టులు స్ఫురిస్తున్నాయి. ఈ (బ్రహ్మాండాలన్నీ మహారంభంకల పెద్ద పెద్ద వస్తువులే. అయినా పరమార్ధ దృష్టితో పరిశీల్తే మ(ర్రిగింజలకు కూడా సరిపోలవు. వివిధ రత్నాల (ప్రకాశం ఆకాశంలో వనంలా కనిపిస్తుంది గదా! అలాగే పృథివి మొదలైన భూతాలు లేకున్నా అవిద్యాబలంతో చిత్తే జగద్రూపంలో గోచరిస్తుంది. అంతే కాని సృష్ట్యాదిలో సైతం పృథివ్యాదిపదార్ధా లనేవి లేనే లేవు.
మడుగులో అలలు మాటిమాటికీ కనిపించి అందులోనే లీనమవుతాయి. అదే రీతిగా జ్ఞప్తిలో చిత్రవిచిత్రాలైన ఆ కృతులతో దేశాలు, కాల విభాగాలు స్పురించి మళ్ళీ అందే మాయమవుతుంటాయి.
రీల: - తల్లీ! నీవు చెప్పింది నిజం. ఈ జగత్తు ఇలాంటిదే. నా యీ జన్మ రాజసమైనదని నేనిప్పుడు స్మరిస్తున్నాను. ఇది తామసమూ కాదు. సాత్తికమూ కాదు. బ్రహ్మనుండి అవతరించిన నాకు ఇప్పటికి రకరకాల జన్మలు ఎనిమిది వందలు గడచిపోయాయి. ఇప్పుడు అవన్నీ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేవీ! నేను పూర్వం ఒక సంసారమండలంలో విద్యాధర వనితనై జన్మించాను. పిదప మానవస్త్రీగా పుట్టాను. ఆ పై దుర్వాసనల ప్రభావం వల్ల మరొక సంసార మండలంలో నాగరాజుకు పత్నినయ్యాను. ఆ పిమ్మట ఆకులే వస్తాలుగా ధరించే బోయతనై కదంబాది వృక్షాలతో దట్టమైన అడవిలో నివసించాను. అప్పట్లో ధర్మ మర్యాద దెలియక మిక్కిలి గర్వంతో వి(ర్రవీగాను.
పిదప ఒక పుణ్యాశ్రమంలో తీగనై జన్మించాను. మునీశ్వరుని సాంగత్యం వళ్ల పవిదత్రురాలనయ్యాను. తరువాత వనాగ్నిలో కాలిపోయి ఆ మునీశ్వరునికే కుమార్తెవై ఉద్భవించాను.
ఆ పై కొంతకాలానికి పురుషుల కనువైన భోగాలను ప్రసాదించే కర్మల పరిణామంవల్ల సురాష్ట్రదేశంలో శ్రీమంతుడైన రాజుగా జన్మపొందాను. అప్పుడు
ఉత్పత్తి ప్రకరణం 71 నూరు సంవత్సరాలు రాజ్యపాలన చేశాను. రాచరికం నెరపుతూ చేసిన దుష్కృత్యాల వల్ల ఒక తాటితోపులో ముంగిసనై పుట్టి తొమ్మిది సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు నా శరీరానికి కుష్టవ్యాధి సోకింది. దానివల్ల శరీరం చివికి పోయింది.
ఆ పై సురాష్ట్రదేశంలోనే గోవుగా సంభవించాను. దుష్టులైన గోపబాలకుల ఆజ్ఞలకు లోబడి ఎనిమిది సంవత్సరాలు గడపాను. తదుపరి ఒక పశినై పుట్టి బోయవాడు పన్నిన వలలో తగుల్కొన్నాను. ఎంతో కష్టపడి అధమ వాసనలను ఛేదించినట్టు వలను ఛేదించ గలిగాను. పిమ్మట ఆడు తుమ్మెదనై పుట్టి మగతుమ్మెదతో గూడి పద్మకోశాలలో విశ్రమించాను. తరువాత లేడినై జన్మించి కొండకోనలలో గంతులు వేస్తూ ఒక కిరాతుని దెబ్బ మర్మస్టలంలో తగులగా ప్రాణాలు కోల్పోయాను. అనంతరం చేషనై పుట్టి అలలలో కొట్టు కొంటూ దిగ్ర్రమకులోనై పోయి పోయి ఒక జాలరి చెంతకు వెళ్లాను. దైవ యోగంతో అతని దెబ్బ తప్పించుకొన్నాను.
ఆ పైన చర్మణ్వతీ నదీ తీరంలో కిరాతినై జన్మించాను. కమ్మనిగాత్రంతో పాటలు పాడుతూ కొబ్బరి కల్టు (త్రాగుతూ స్వేచ్చగా విహరించాను. తదుపరి సారస పశ్షీనై మధుర స్వరంతోనూ, సురత క్రీడలతోనూ సారసేశ్వరుణ్లి రంజింపజేశాను. తమాలవృక్షాల పాదలలో చంచలమైన చూపులతో ప్రియుణ్లీ చూస్తూ కొంతకాలం గడిపాను. పిమ్మట బంగారు కాంతులనీనే అవయవాల అందచందాలతో స్వర్గంలో అప్పరసనై పుట్టాను. ఎందరో దేవతలకు అధరసుధ నందించి ఆనందం కల్లించాను. మేరు పర్వతంలోని కల్ప వృక్ష వనంలో రత్నాలతో అలంకరించిన (ప్రదేశంలో ఒక యువకునితో రతి॥్రీడలు సలిపాను. మరొక జన్మలో అలలు తాకే సముద్ర తీర గుహలలోని తీగలల్టుకొన్న (ప్రదేశంలో చాలాకాలం తాబేలునై వుండిపోయాను.
జన్మాంతరంలో ఎగసిపడే అలలు గల సరస్తీరాలలో రాజహంసనై తుమ్మెదలు నాపై వ్రాలి ఉయ్యాల లూగుతుండగా కొంతకాలం వెళ్లబుచ్చాను. బూరుగు చెట్టు ఆకులపై ఊగులాడే దోమలను చూచి ఆ సంస్కార (ప్రభావంతో నేనూ దోమనై జన్మించి దీనదశకు లోనయ్యాను. తదుపరి కొండ వాగులలో వేతసలతనై పుట్టి చలించే అలలను చుంబిస్తూ ఉండిపోయాను. ఆ తరువాత ఒక జన్మలో విద్యాధరివై ఉద్భవించాను. గంధమాదన గిరిపై మందార తరువులు గల మందిరాలలో ఎందరో విద్యాధరకుమారకులు నా పాదాలపై బడ్డారు. చం'ద్రమండలంపై వెన్నెల లాగా కర్పూర తల్పం పై పరుండి కూడా విరహవేదనతో తాపం పొందాను.
ఇలా వివిధ దుః ఖాలకు నెలవులైన అనేక యోనులలో జన్మించాను. సంసార
72 యోగవాసి్థం మనే నదిలోని అలనై చలించాను. పెనుగాలికి బెదరిన లేడి లాగా ఆకులపాటుతో (భ్రమించాను. పెక్కు పాట్టు పడ్డాన్యు
గిరిగ్రామం
శ్రీరాముడు : - మునీంద్రా ! వజ్రంలాగా దృఢమై యోజనాలు వ్యాపించి వున్న బ్రహ్మాండకుడ్యాన్ని ఆ అబలలు ఎలా భేదించుకొని వెళ్లగలిగారు?
వసిష్టుడు : - రామా! బ్రహ్మాండ కుడ్యం ఎక్కడ? వ(జకాఠిన్యం ఎక్కడ? ఆ వనిత లిద్దరూ వాస్తవానికి అంతః పురాకాశంలోనే కదా ఉన్నారు!
ఆ గిరి గ్రామంలోనే గృహాకాశంలోనే వసిష్టనామకుడైన విప్రుడు ఇప్పుడు రాచరికం వెలయిస్తున్నాడు. నాలుగు సముద్రాల వరకూ వ్యాపించిన భూతలాన్ని ళూన్యవుయిన ఆ వుండపాకాశంలోనే అతడు పూర్వం పద్మభూపాలుడ్డె అనుభవించాడు. అరుంధతి కూడా అతనితో అక్కడే రాజభోగా లనుభివించింది.
ఆమె లీలాదేవిగా రూపాంది సరస్వతి నారాధించింది. సరస్వతీ దేవి తో సహా అద్భుతావహమైన ఆకాశమండలాన్ని లంఘించింది. వారు ఆ గృహాకాశంలోనే మరొక (బ్రహ్మాండానికి పయనించి గిరి గ్రామాన్ని సందర్శించారు.
ఇదంతా పడకమీద పరున్నవాడు ఒక కలనుండి మరొక కలకు మరలినట్లే ఉన్నది. వాడు ఉన్నచోటనే అనేక దృశ్యాలను చూస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అంతే. ఇదంతా భ్రాంతి మాత్రమే. శూన్యాకాశం తప్ప మరేమీ లేదు. బ్రహ్మాండం, సంసారం, దూరం మొదలైనవేవీ నిజానికి లేనే లేవు. అంతా మిథ్యే. వాసనా ప్రభావం వల్ల వారి చిత్తంలో ఈ రవుణీయదృశ్యాలు స్పురించాయి. అనంతమూ, ఆవరణరహితమూ అయిన ఆకాశమే కల్పనా ప్రభావంతో అలా తోచింది.
చిదాకాశం సదా శాంతమై వుంటుంది. కాని భావనాబలంతో తనకు తానే జగద్రూపంతో భాసిస్తుంది. ఈ రహస్యం గ్రహించినవానికి అది ఆకాశంకంటే ళూన్యమే. గ్రహించనివానికి అది వజ్రపర్వతంలాగా ఘనమై స్పురిస్తుంది.
మరుభూమిలో జలమూ, బంగారులో కటకమూ లేనివైనా ఉన్నట్టు కనిపిస్తాయి.
అలాగే ఆత్మలో దృశ్య ప్రపంచం కూడా ఉనికి లేనిదైనా ఉన్నట్టు కానవస్తుంది. సుందరాకృతులయిన ఆ లలన లిరువురూ అలా మాట్లాడుకుంటూ
మందగమనంతో ఇంటి వెలుపలికి వెళ్లారు. ఆ గ్రామస్టులకు వారు కనిపించలేదు.
ఉల్పత్తి ప్రకరణం 73
ఆకాళ కుహరాన్నీ, సూర్యమండలాన్నీ స్పృశిస్తూ వున్న ఒక పర్వతాన్ని వారు ముందువైపు చూచారు. అందలి చెట్లు రకరకాల పూలతో శోభిల్లుతున్నాయి. పక్షుల కిలకీలారవాలు మనోజ్ఞంగా వినిపిస్తున్నాయి. అల్లిబిల్లిగా అల్టుకొన్న అచ్చటి తీగలలో తగులుకొన్న గాలి విచ్చల విడిగా ప్రసరించలేకపోతున్నది. కుసుమించిన వృత్షశాఖలు మేఘమండలాన్ని కప్పివేశాయి. క్రింద పడే జలధారల నుండి ఎగిరే జలబిందువులు ముత్యాలవలె నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెట్టనీడలు చల్లదనం
పిమ్మట వారిద్దరూ అక్కడ దివినుండి భువికి జారిపడిన స్వర్గఖండంలా వున్న గిరిగ్రామాన్ని చూచారు. అక్కడ బావులనుండి గిలకలతో నీరుతోడే ధ్వని వినిపిస్తున్నది. పక్షుల కిచకిచ శబ్దాలు వ్యాపీస్తున్నాయి. బయళ్ళన్నీ పచ్చికలతో నిండివున్నాయి. గృహాంగణాలలో కుసుమించి, ఫలించిన చెట్టు, పూలు, పండ్లు కానుకలుగా తెచ్చినవా అన్నట్టున్నాయి.
అందలి సౌధాల గవాక్షలద్వారా మేఘాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ మబ్బుల మెరపులు దీపాలకు పనిలేకుండా చేస్తున్నాయి. నడబావులలో వికసించిన తెల్లదామరలు ఫున్నమి చందమామల్లాగా కళకళలాడుతున్నాయి. ఉపవనాల శోభతో, సెలయేళ్ళ ధ్వనులతో, యువతీ యువకుల విలాసాలతో అలరారే ఆ గిరిగ్రావాల అందచందాలను ఎవరు వర్ణించగలరు?
పరమాకాశం
శమ దమాది సాధన సంపన్నుడై, ఆత్మజ్ఞుడైన పురుషుణ్ణి భోగమోక్ష్రీలు సమీపించినట్లే ఆ రమణులు చల్లగావున్న ఆ గ్రామాన్ని చేరుకున్నారు. అప్పటికి జ్ఞ్హానమయ దేహురాలైన లీలాదేవికి అభ్యాసబలంతో (త్రికాలాలనూ దర్శించగల పామ్సర్థ్యం కలిగింది. ఆమె తన పూర్వజన్మవృత్తాంతాలనూ, సంసార గతులనూ స్మరిస్తూ ఇలా అన్నది -
లీల : - దేవీ! నీ అనుగ్రహం వల్ల ఈ ప్రదేశాన్ని చూచి నా తొల్లిటి చేష్టలను గుర్తుకు దెచ్చుకొంటున్నాను. ఇక్కడ నేను పూర్వం బ్రాహ్మణ వనితనై జన్మించాను. అప్పుడునా శరీరం బక్కచిక్కి సన్నగా వుండేది. దర్భలను చీల్చి చీల్చి నా అరచేతులు మొద్దుబారి వుండేవి. దేవతలనూ, ద్విజులనూ, సాధువులనూ, బంధువులనూ,
74 యోగవసి్థం అతిథులనూ సేవిస్తూ గృహకృత్యాలు నిర్వర్తించాను. పెక్కుమంది బిడ్డలను కని భర్తృకులాన్ని పెంపాందించాను. రేయింబవళ్లు ఇంటిపనులు చేసుకుంటూ దాసీజనాన్ని పెక్కు పనులకు ఫురమాయిస్తూ వుండినాను. అపుడు నాకు “నేనెవరు? ఈ సంసారమంటే ఏమిటి?”* అనే ఆలోచన కలగనే లేదు. శ్రోత్రియ మూఢుడైన నా భర్తకూడా నాలాగే సంసారంలో నివుగ్నుడై వుండేవాడు. అలా వుండగా కొంతకాలానికి నా శరీరం ఎండుటాకులా శుష్కించింది. వార్టక్యభారంతో ఒడలంతా వడవడ వణక జొచ్చింది.
ఇలా చెబుతూ లీలాదేవి సరస్వతికి గిరిగ్రామంలోని విశేషాలన్నీ చూపి మళీ ఈ రీతిగా చెప్పింది.
““ఇది నా పుష్పువాటిక. అది నా అశోకవనం. ఇదినా పుష్కరిణి. ఈమె నా పరిచారిక. నా వియోగంతో ఈ యెనిమిదవ దినాన కూడా ఈమె కన్నీరు కారుస్తూ శోక్సిస్తున్నది. ఇక్కడ నేను భుజించేదాన్ని, ఇక్కడ ని(ద్రించేదాన్ని, ఇక్కడ విహరించేదాన్ని, ఇడుగో, జ్యేష్టశర్మ అనే ఈ నా కువూరుడు ఇంటిలో విలపిస్తున్నాడు. నా గృహాంగణం ఇప్పుడు కళావిహీనమై కనిపిస్తున్నది. నా బంధువులంతా నగలు పరిత్యజించి శోకచిహ్నమైన రుద్రాక్షలు ధరించి వున్నారు. ఏడ్చి ఏడ్చి వీరి కనులు ఎ(ర్రబడ్డాయి.
ఈ గృహ మండపంలో నా భర్త జీవాకాశరూపంలో వున్నాడు. ఇప్పు డతడు నాల్గు సముద్రాలను మొలనూలుగా ధరించిన భూమికి అధిపతి. పూర్వం ఇతడు ““నేను రాజు నగుదును గాక!” అని కోరుకున్నాడు. నాకా సంగతి ఇప్పుడు జప్తీకి వస్తున్నది.
పరమేశ్వరీ! ఎనిమిది దినాలలోనే అతడు సకల విధాలా సంపన్నమైన రాజ్యం పాందాడు. అతడు రాజై బహుకాలం గడచినట్ట్లు గోచరిస్తున్నది. ఆకసంలో గాలి, గాలిలో సుగంధం వున్నట్లు ఈ గృహాకాశంలోనే నా భర్హ్రజీవుడు అదృశ్యంగా వున్నాడు. అంగుష్టమా(త్ర పరిమితమైన (ప్రదేశంలోనే నా భర్త రాజ్యం కోటియోజనాల దూరం వ్యాపించినట్టు కనిపిస్తున్నది.
ఈశ్వరీ! మనమిద్దరం ఆకాశరూపులమే. వేలకొలది కొండలతో నిండిన నా భర్తృరాజ్యం సైతం ఈ ఆకాశంలోనే వున్నది. ఆహా! ఏమి ఈ మాయ! దేవీ! మళ్లీ నా భర్తృనగరానికి వెళ్ళాలని నాకు కోరికగా వున్నది. అక్కడికే పోదాం పద.
ఉత్పత్తి ప్రకరణం 75 'ప్రయత్నపరులకు దూరం ఏమున్నది??'
ఇలా అంటూ లీల సరస్వతీ దేవికి మోకరిల్లింది. ఆమెతో కూడా మండపంలోకి (ప్రవేశించి పక్షిలాగా ఆకాశమండలంలోకి ఎగిరిపోయింది. అలా ఎగిరి వారు మేఘాలు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, (ధ్రువుడు, సాధ్యులు, సిద్దులు చరించే మార్గాలను దాటిపోయారు. స్వర్గ మండలాన్నీ, బ్రహ్మలోకాన్నీ, వైకుంఠపురాన్నీ అతి(క్రమించారు. గోలోక, శివలోకాలనూ, విదేహులకూ, సదేహులకూ సంబంధించిన లోకాలనూ దాటి దూర దూర ప్రదేశాలు చేరుకున్నారు.
అంతట తాము దాటివచ్చిన విశాలాకాశం వైపు ఒకసారి వెనుదిరిగి చూచారు. అక్కడికి సూర్య చంద్ర నక్షత్రాదులు కనిపించలేదు. దట్టమైన పెనుచీకటి మాత్రం ఒక మహా సము(ద్రంలా గోచరించింది.
లీల : - దేవీ! సూర్యచం(ద్రాదుల తేజస్సు ఏమయిందో చెప్పు. పిడికిట బట్టుదగిన ఈ గాఢాంధకారం ఎక్కడిది?
దేవి :- ఓహో! సూర్యాది తేజస్సులు కూడా కనిపించనంత దూరానికి వచ్చాము. లోతైన బావిలో ఎక్కడో వున్న మిణుగురు పురుగు ఎలా కనిపించదో, అలాగే ఇక్కడికి సూర్యుడు కనిపించడం లేదు.
లీల :- ఆశ్చర్యం! సూర్యుడు కూడా కనిపించనంత దూరానికి వచ్చావా? దేవీ! ఇక ఇక్కడనుండి మనం పోవలసిన దారి యేది? అది ఎలాంటిది?
దేవి :- ఇకపైన (బ్రవ్మాండ కర్పరం గోచరిస్తుంది. ఆ సూర్యచం(ద్రాదులు ఇక్కడనుండి లేచిన ధూళికణాలే.
వసిష్కడు :- అలా భాషించుకొంటూ వారు తుమ్మెదలు కొండగోడను చేరినట్టు మిక్కిలి దట్టమైన బ్రహ్మాండకర్పరం చేరుకున్నారు. శూన్య ప్రదేశాన్ని దాటినట్లే వారు ఈ బ్రవ్మాండాన్ని సులభంగా అతి(క్రమించారు. సత్యబుద్ది సోకిన వస్తువే వ(జం లాగా కఠినమై వుంటుంది కాని ఇతర వస్తువు అలా వుండదు గదా!
ఆ బ్రవ్మాండాని కావల దానికంటె పదిరెట్లు పెద్దదైన జలావరణం కనిపించింది. ఆ పై దానికంటె క్రమంగా పది పది రెట్లు పెద్దవైన అగ్నినీ, వాయువునూ, ఆకాశాన్నీ వారు చూచారు. ఆ పై ఆదిమధ్యాంత రహితమైన చిదాకాశం వారికీ స్సురించింది. అది సువిశాలమై, శాంతమై, అవిద్యాది (భ్రమలు లేనిదై ఆత్మలోనే నెలకొని వున్నది.
రామా! ఆ పరమాకాశంలో ఒక బలమైన శల పైనుండి కల్ఫొాంతం వరకూ
76 యోగాషి్టం క్రిందికి పడుతున్నదనుకో! గరుత్మంతుడు క్రింది నుండి మహాబలంతో కల్పాంతం వరకూ పై కెగురుతున్నాడనుకో! వారి మధ్యనుండి ఇరువైపులకూ (ప్రచండ వేగంతో గాలి వీస్తున్నదనుకో! అయినా ఆగాలి ఆ శిలనూ, గరుత్మంతునీ ఎన్నటికీ చేరజాలదు! ఇక ఆ పరమాకాశపుటంచును అది స్పృశించగలదా? విచ్శిత బహ్య్మాండ వర్ణనం
వారిద్దరూ క్షణంలో పృథివ్యాది పంచభూతాల ఆవరణలు దాటి అ ప్రమేయమైన పరమాకాశాన్ని చూచారు. అందులో వారికి బ్రహ్మాండాత్మకమైన ఈ జగత్తంతా అండమాత్రమై గోచరించింది. ఆ పరమాకాశంలో కోట్లు కొలది పాంచభౌతిక జగత్తులు ఎండలో (త్రస రేణువుల్దాగా భాసించాయి.
అవిద్య అనే నీటితో నిండిన మహాకాళ మనే సముద్రంలో మహాచిత్తు అనే (ద్రవత్వం నుండి జగత్తు లనే బుడగలు లెక్కకు మిక్కిలిగా ఉద్భవిస్తున్నాయి. వాటిలో కొన్ని (క్రిందికి వస్తున్నాయి. కొన్ని పైకి పోతున్నాయి. ఇంక కొన్ని అడ్డంగా పయనిస్తున్నాయి. మటిీకొన్ని కదలకుండా ఉన్న చోటనే ఉన్నాయి. ఆయా జీవుల (ప్రాక్తన వాసనలను అనుసరించే ఈ దృశ్యాలన్నీ ఏర్పడుతున్నాయి.
ఎవరెవరిలో ఏయే వాసనలు ఉన్నాయో, వారి వారికి ఆయా వాసనలకు అనుగుణమైన రూపాలే స్ఫురిస్తాయి. అంతేకాని వాస్తవానికి ఆ చిదాకాశంలో గానీ, (బ్రహ్మాండ దేశంలో గానీ క్రింది మీదులు, రాకపోకలు ఇత్యాదులేవీ లేనేలేవు. అవాజ్మానస గోచరమయిన ఆ బ్రహ్మపదం అన్నివిధాలా ద్వైతరహితమైనది. అజ్ఞుల దృష్టిననుసరించి మాత్రమే ఈ (బ్రహ్మాండాలను అలా వర్ణించడమయింది. బాలుర సంకల్పంలో లాగానే అజ్ఞానుల సంకల్పంలో గూడా అవిద్యా ప్రభావంతో వాసనలే (బ్రహ్మాండాలుగా రూపొంది మళ్ళీ అంతరించిపోతూ వుంటాయి.
రాముడు :- మునీంద్రా! అధిష్థానమైన పరబ్రహ్మంలో లేని క్రిందిమీదులు అందులో కల్పితమయిన (బ్రహ్మాండంలో ఎలా ఏర్పడ్డాయి?
వసిష్టుడు :- రామా! దృష్టిదోషం కలవానికి ఆకసంలో వెం(డ్రుకల చుట్టు కన్పిస్తుంది. అదే రీతిగా తత్త్వదర్శనం లేనివానికి బ్రహ్మాండాలు కనిపిస్తాయి. ఈ మాయామయ(ప్రపంచంలో అలా కనిపించడం వింత కాదు. (బబ్రవ్మాండంలోని పదార్డా లన్నీ స్వతంత్రత లేనివై ఈశ్వరేచ్చానుసారంగా పరుగులు తీస్తున్నాయి. ఇందులో
ఉత్పత్తి ప్రకరణం 77 పృథివీరూపమైన భాగానికి క్రిందిభాగమనీ, తక్కిన ఆకాళభాగానికి పైభాగమనీ వ్యవహారం ఏర్పడింది. ఒకగుం డ్రని మట్టీముద్దపై దళదిశలలోనూ చీమలున్నప్పుడు వాటి కాళ్ళు క్రిందిభాగంలో ఉన్నల్టు వీపు పైభాగంలో వున్నట్టూ గ్రహించాలి.
కొన్ని ('బ్రహ్మాండాలలో చెట్టు, పుట్టులు మూా(త్రమే ఉన్నాయి. మరికొన్ని (బ్రవ్మాండాలు నాలుగు రకాల (ప్రాణులతో కూడానే ఉత్పన్నవువుతున్నాయి. విశాలమైన వింధ్యవనంలో ఎడనెడా ఏనుగులు స్ఫురించినట్లే పరమాత్మ యొక్క మాయామయమైన సంస్ట్రానంలో బ్రహ్మాండాలనే త్రసరేణువులు కనిపిస్తాయి.
ఇదంతా చిదాకాశంలోనే వున్నది. అందుండే పుడుతున్నది. తిరిగి అందులోనే లయమవుతున్నది. శుద్ద బోధమయమైన ఆ చిదాకాశమనే సము(ద్రంలో ఎల్లవేళలా (బ్రహ్మాండా లనే అలలు పాటవారించి పాటవారించి లయవువుతున్నాయి. సంకల్పాలు క్షయం కావటం వల్ల కొన్ని (బ్రహ్మాండాలు అవ్యాకృతాలై ఇంకా చిదాకాశంలోనే అణగివున్నాయి.
కొన్ని బ్రహ్మాండాలలో కల్పాంత ధ్వనులు విషయ వ్యామోహితుల చెవులకు వినిపించడం లేదు. తడిసిన విత్తనాలనుండి వెలువడే మొలకల్లాగా కొన్ని బ్రహ్మాండాలు ఇప్పుడిప్పుడే అంకురిస్తున్నాయి. మహాప్రళయం వచ్చేసరికి భువనాన్ని బూడిదచేసి సూర్యమండలాలు తుదకు తాము కూడా కనుమరుగవుతున్నాయి.
కొన్ని బ్రహ్మాండాలు ఆధారం లభించక పోవటం నల్ల కల్పాంతంలో రూపు మాసిపోయే వరకూ క్రిందికి పడుతూనే వుంటాయి. మరికొన్ని ఆకాశం లోనే వెం(డ్రుకల చుట్టులాగా స్తబ్దంగా వున్నాయి.
కొన్ని బ్రహ్మాండాలకు చతుర్ముఖ'బ్రహ్మ ఆది పురుషుడు. మరికొన్నిటికి విష్ణువు (ప్రధానుడై వున్నాడు. ఇంక కొన్నింటికి ఇంద్రాదులు (ప్రాధాన్యం వహిస్తున్నారు. కొన్ని విచిత్రమైన సర్గపాలకుల అధీనంలో వున్నాయి.
- కొన్ని కేవలం సముద్రమయాలు, మరికొన్నింట ప్రాణులు లేనే లేరు. కొన్నింట వట్టికొండలు, బండలు మాత్రమే వున్నాయి. కొన్నింట దేవతలు మా(త్రమే నివసిస్తున్నారు. మరికొన్ని (బ్రహ్మాండాలలో క్రిమి కీటకాలు తప్పు మరేమీ లేదు. ఇంక కొన్నిటిలో వూనవులు వూత్రవే వున్నారు. కొన్ని చిత్త చీకటితో నిండివున్నాయి. అక్కడ ఆ చీకటి కలవాటుపడ్డ ప్రాణులే సంచరిస్తున్నాయి. మరిక్"న్ని (బ్రహ్మాండాలలో సదా(ప్రకాశమూ, ఆ (ప్రకాశానికి అలవడిన జీవులూ వుంటున్నారు.
78 యోగవాసిష్టం
కొన్ని మేడిపండ్రలాగా దోమలతో నిండి వున్నాయి. మరికొన్ని శూన్యంగా వున్నాయి. ఇంక కొన్ని చలనం లేని (ప్రాణులు గలిగివున్నాయి. కొన్ని (బ్రహ్మాండ సృష్టులు యోగుల ఊహలకు సైతం గోచరించడం లేదు. విష్ణువు మొదలయిన దేవతలు కూడా జీవితాంతం వరకూ పరుగు లిడినా వాటి అంతు కనుగొనజాలకున్నారు. స్నర్ణకటకంలో పొదివిన రత్నాలలాగా ప్రతి అండోళంలోనూ భూతాకర్షణశక్తి పరివ్యాప్తమై వున్నది.
మహామతీ! నాబుద్దికి గోచరించినంతవరకూ ఈ జగద్వైభవాన్ని వివరించాను. ఇంతకంటే నాకు ఏమీ స్పురించడం లేదు. అందువల్ల దీన్ని వర్షించేశక్తి నాకు లేదు. అంధకారబంధురవమూ, సువిశాలవమూ అయిన మహారణ్యంలో ఉన్మత్తులై ఒకరినొకరు చూడకుండా నృత్యంచేసే యక్షులమాదిరిగా అవిద్యచే ఆవరించబడిన ('బ్రహ్మంలో మహాజగత్తులు లెక్కకు మిక్కిలిగా నటిస్తున్నాయి.
యుద్ధ ప్రేక్షికా స్థితాకాశ వర్ణనం
ఆ విధంగా సృష్టి వైచిత్రాన్ని పరికిస్తూ లీల తన పూర్వజన్మతో ముడివడిన లోకం నుండి వెలువడి సరస్వతితో గూడా మళ్ళీ తన అంతఃపురానికి వెళ్ళింది. అక్కడ పద్మభూపాలుని శవం పూలతో కప్పబడి వున్నది. ఆ (ప్రక్కనే లీలా శరీరం సమాధిఫ్టితిలో వున్నది. అక్కడ ధూప చందనాదుల పరిమళం నలువైపులా వ్యాపిస్తున్నది. శోకాకులమైన అక్కడి జనానీకానికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
పిమ్మట లీలకు తన భర్త యొక్క మరొక సంసారాన్ని చూడాలనే కోరిక కల్గింది. ఆమె వెంటనే సంకల్ప శరీరంతో అక్కడినుండి ఆకాశాని కెగిరింది. బ్రహ్మాండ కర్పరాన్నీ, సంసారావరణాన్నీ భేదించుకొని ఆమె సరస్వతితో సవా భర్తయొక్క సంకల్ప సంసారాన్ని సమీపించింది.
చీకటి అలవఎకొన్న గుహలో సింవోలు ప్రవేశించినట్టు, వెంత్తని మౌారేడుపండులో చీమలు దూరినట్లు వారిరువురూ బురదగుంటలా వున్న పద్ముని సంకల్ప జగత్తులో (ప్రవేశించారు. లోకాంతరాలూ, అంతరిక్షమూ దాటిపోయి జంబూద్వీపంలోని భారతవర్షంలో పద్ముని తరువాత జన్మ అయిన విదూరథుని రాజ్యంలో వారు అడుగుపెట్టారు.
ఇంతలో సింధుదేశాన్ని పాలించే రాజు కొంతమంది సామంతరాజులతో కూడి
ఉత్పత్తి ప్రకరణం 79 ఉద్దతుడై లీలానాథుడైన విదూరథుని రాజ్యంపై దండయాత్ర కావించాడు. ఇరుపతాలూ పోరాటానికి సిద్ద్రమయ్యాయి. ఆ యుద్రసంరంభం చూడటానికి విచ్చేసిన త్రిలో కవాసులతో గగనతలం కిక్కిరిసి పోయింది. సిద్దులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు మొదలైనవారు ఆకసంనుండి యుద్దభూమివైపు చూపులు సారించారు. అప్సరసలు వీరులను వరించటానికి ముందుకు వచ్చారు. రక్తమాంసాలను అపేక్షించిన పిశాచరాక్షసాదిగణాలు ఆ పరిసర ప్రాంతాలలో నెలకొన్నాయి. వీరమరణం పొందిన శూరులకు స్వాగతం చెప్పడానికి, వాళ్ళను సన్మానించడానికి దేవలోకంలో ఏర్పాట్టు జరిగాయి.
శ్రీరాముడు :- భగవ౯। ఎలాంటి భటుళణ్లీ శూరుడంటారు? స్వర్గాన్ని అలంకరించేవాడు ఎవడు? డింభాహవుడు అంటే ఎవడు?
వసిష్టుడు :- రామా! శాస్త్రమర్యాద పాటించే ప్రభువుకోసం, సజ్జ్ఞనరక్షణ కోసం ఎవడు ధర్మయుద్రంలో మరణిస్తాడో, లేక విజయం సాధిస్తాడో వాళ్ల శూరు డంటారు. అలాంటివాడు స్వర్గలోకం చూరగొంటాడు. శాస్త్రవిరుద్రంగా ప్రవర్తిస్తూ, (ప్రజలకు ఉప(ద్రవం కల్గించే ప్రభువుకొరకై పోరాడేవాడు డింభాహవుడు. అట్టివాడు నరకానికి పోతాడు. యుద్దంలో మృతిచెందిన వారందరూ స్వర్గానికి పోతారనే మాట నిజంకాదు. ధర్మ యుద్దంలో పాల్గొన్నవారికి మాత్రమే స్వర్గంలో ప్రవేశముంటుంది.
రెండు పకాలూ యుద్దానికి సిద్దంకాగానే గగనంలో దేవతల విమానాలు వరుసగా వచ్చి నిలిచాయి. విద్యాధర, స్త్రీలు గానం చేశారు. దేవకాంతలు శూరులమెడలో వేయడాని కవసరమైన మందారమాలలు గ్రుచ్చడానికి ఉప[క్రమించారు.
యుద్ధ ప్రారంభం
లీలా సరస్వతు లిరువురూ ఆకసంలో తమ సంకల్ప బలంతో కల్పించుకొన్న విమానాలలో ఉంటూ యుద్రభూమివైపు వీక్షించారు.
అది ఒక విశాలమైన అరణ్యం. అక్కడ ఉభయ సైన్యాలూ రెండు సముద్రాలవలె విస్తరించి వున్నాయి. యుద్రసన్నద్దమైన ఆ దృశ్యం ధగధగ మండే అగ్నివ్షేత్రం లాగా కనిపించింది. నానా విధాలైన ఆయుధాలు చేపట్టి ఎదురెదురుగా నిల్చివున్న భీకర సైనికులు ఒకరినొకరు క్రోధో(దిక్తులై చూచుకుంటున్నారు. ప్రాణత్యాగానికి సిద్రమైన అసంఖ్యాకమైన భట శ్రేష్టులతో రణభూమి కిటకిటలాడింది. మొదటిదెబ్బ ఎప్పుడు ఎక్కడ పడుతుందో అన్న కాతుకంతో యోధులందరూ ఇరువైపులా పరికిస్తున్నారు.
80 యోగవాసిష్టం ఈటెలు, రోకళ్ళు, కత్తులు, గదలు, గుదియలు, గొడ్డళ్ళు మున్నగు ఆయుధాలనుండి నీలకాంతులు నలువైపులా ప్రసరించడం వల్ల ఆ భూభాగమంతా సముద్ర జల ప్రవాహంతో నిండిపోయిందా అన్నట్టు గోచరించింది. ఇంతలో ప్రతిపక్షం నుండి నిర్భయంగా తమపై దెబ్బదీయటానికి ముందుకు వస్తున్న ఒక భటుళ్లీ విదూరథుడు చూచాడు. వాని దాడిని సహింపనివాడై అతని వత్షః స్థలంపై కొండచరియపై బండను ప్రయోగించినట్టు విదూరథుడొక ఇనుప గుదియను ప్రయోగించాడు. దానితో ఉభయపళ్షాలలోనూ ఘోరమైన పోరు (ప్రారంభమయింది. కత్తుల తళతళలతో గగనతలం మెరసిపోయింది. నిప్పులు గ్రక్కే శస్త్ర సంపాతం మొదలయింది. ధనుష్టంకారాలూ, వీరుల హుంకారాలూ మేఘగర్హనల్లాగా నలుగడలా వ్యాపించాయి. పరస్పరం ఢీకొన్న ఇడ్లాది యుద్రసాధనాల ఖణసణ ధ్వనులు మిన్ను ముట్టాయి. తాకిడికి విరిగి మింటి కెగిరిన శస్త్రశకలాలు పక్షుల గుంపుల్లా భాసించాయి. అత్యంత భీకరమైన ఆ సమరంలో పదునైన బాణాలు శూరుల శిరస్సులను నేలకూలాయి. తెగిపడిన కరచరణాద్యవయవాలూ, ఆయుధ ఇండాలూ యుద్దభూమిని కప్పివేశాయి. గుజ్జాలూ, ఏనుగులూ పీనుగు పెంటలయ్యాంి. రక్తధారలు ఏరులై పారాయి. మృత్యుదేవత విలయ తాండవం చేసింది. ఛిన్నాంగులై పడి మరణింపనున్న యోధుల ఆ(క్రందనాలతో దిక్కులు మారు(మోగాయి. యుద్దమనే రోటిలో బడి భటులనే తండులాలు పిండి పిండి అయిపోయాయి. అగ్ని కుంభప్రయోగంతో కొందరు సైనికులు కాలిపోయారు. మరికొందరు విషజలప్రయోగంతో మరణించారు. వీరు లనే మేఘాలనుండి బాణా లనే వర్షం కురిసింది. మొండా లనే నెమళ్ళు నృత్యం చేశాయి. ఏనుగు లనే కొండలు ఇటూ అటూ పరుగులు దీశాయి. ఈ రీతిగా ఆ సంగ్రామ సంరంభం ప్రళయకాలంలా భయంకరమై పాడకట్టింది. యుద్గప్రేక్షకుల వచనాలు లోక భీకరమైన ఆ యుద్దంలో పాల్గాంటున్న రాజులూ, భటులూ, వంం(తులూ, పైనుండి చూస్తున్న (ప్రేక్షకులూ తవులో తావు ఇలా మాట్లాడుకొన్నారు.
ఉత్పత్తి ప్రకరణం 81 “ఎగిరి పడుతున్న శూరుల శిరస్సులతో నిండిన ఈ ఆకాళం కదిలే పద్మాలతోనూ, ఎగిరే పక్షులతోనూ కూడిన మడుగులా కనిపిస్తున్నది. మిది! ఆకాశమంతా వరిగడ్డి పరచినట్టున్నదే! ఇది వరిగడ్డి కాదు. వీరులు ప్రయోగిస్తున్న శరజాలం. యుద్రభూమిలో ఎన్ని ధూళికణాలు రక్తంతో తడుస్తాయో, అన్ని వేల సంవత్సరాలు భటులు స్వర్గంలో నివసిస్తారు. భయపడకు, ఇవి కత్తుల తళతళలుకావు. వీరవరులను చూస్తున్న విజయలక్న్మీ నేత్రవిలాసాలు. శూరులను కౌగిలించుకొనగోరే దేవకాంతల మొలనూళ్ళను సడలించడానికి మన్మథుడు (ప్రయత్నిస్తున్నాడు. నందన వనంలో సురవనితలు నీకోసం ఎదురు చూస్తూ మధురగానం చేస్తూ నృత్యం కావిస్తున్నారు. కాలివరకు (వేలాడే గొలుసుకు తగిలించిన చిత్రదండం అనే చక్రయంత్రాన్ని మహావేగంగా త్రిప్పుతూ ఆ యోధుడు దక్షిణ దిళశనుండి యముని లాగా ఇచే వస్తున్నాడు. మనం వచ్చిన త్రోవనే తిరిగి వెళదాం, పద. అడుగో! ఆ భటుడు మత్స్య మకర వ్యూహాలతోడి సేనలను సముద్రుడు నదులను (మింగినట్టు మింగివేస్తున్నాడు. గజాల గండస్టలాలపై బడే శరధారలు గిరిశిఖరంపై కురిసే వర్షధారల్దా వున్నాయి. మూఢులారా। ముందుకు పోయి యుద్దం చేయండి! సగం చచ్చి పడివున్నవారిని దూరంగా తొలగించండి! మీ వాళ్ళనలా కాళ్ళతో త్రాక్కకండి! చీమలు కొండల్లో దాగినట్టూ, స్త్రీలు పురుషుల యెదలపై ఒదిగినట్టూ పిరికివాళ్ళు ఏనుగుల శవాల నడువు దాక్కాంటున్నారు. నర, గజ, తురగాదులనుండి స్రవించే రక్తం సెలయేళ్ళలా ప్రవహిస్తున్నది. ఆ రక్త బిందువులతో తడిసిన గా లివల్ల దిక్కులు ఎ(ర్రబడ్డాయి. రక్తసిక్తమైన ఆయుధాల ముక్కలతో నిండిన రణభూమి అగ్నిగోళమా అన్నట్టున్నది. యోధులు ప్రయోగించిన కత్తులు, శూలాలు, రోకళ్ళు మొదలైన ఆయుధాలు పరస్పరం ఢీకొని ఛిన్నా భిన్నమై కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. ఈ రణధ్వనులు రణభఖభైరవుని గానం లాగా వినిపిస్తున్నవి. మిత్రమా! ఇది నాల్లవ జాము. యమసమయ మిది. మండే మంటలాగా వడిగా ప్రసరించే ఈ బాణాలు మన అంగాలను ఖండించకముందే ఇక్కడనుండి "తొలగి పోదాం పద!
82 యోగవాసిష్టం యుద్గవర్గనం
ఆ సంగ్రామ రంగం సాగరంలాగా భయంకరమై తోచింది. అది తురంగాలనే తరంగాలతో నిండిపోయింది. మదపుటేనుగులే అందలి కులపర్వతాలు. సంచరించే సేనలే తిమింగిలాలు. తునకలై ఎగిరిపడే తలలే జలబిందువులు. ఇటూ అటూ తిరగే గజతురగాలే జలజంతువులు.
(ప్రళయ వేళలాగా చూచేవారికి ఆ సమరభూమి భయం కలిగించింది. (క్రిందపడి వెలుగులు విరజిమ్మే అస్త్రశస్తాలు సూర్యునిలా భాసించాయి. విరిగిపడిన రథాలు, గొడుగులు, పతాకలూ ధ్వంసమైన నగరంలాగా కనిపించాయి. రక్తపుటేరులలో చిక్కుకున్న ఏనుగుల ఘీంకారాలు నలుదెసలా వినిపించాయి. శరవర్హాలు భూతలంలోని కొండలను కప్పివేశాయి. ఉవ్వెత్తుగా పొంగిన సైన్యమనే సాగరం లోకానికి ఉపద్రవం కలిగించింది. గగనతలంలో ఢీకొంటున్న వివిధాయుధాలు (ప్రళయవాయువుల తాకిడికి పైకి లేచిన పదార్దాల ననుకరించాయి.
బాణరాసులు పర్వత శిఖరాల లాగా తోచాయి. భీరుజనులు దళశదిశలకూ పారిపోయారు. ఏనుగుల శవాలపై మబ్బులు విశ్రమించాయి. రక్షోగణాలు, పిశాచ బృందాలు రక్త సముద్రంలో క్రీడించాయి. ధర్మనిష్టులు, శీల సంపన్నులు అయిన వీరులు ఉరిమే మేఘాల రీతిగా హుంకరిస్తూ ద్వంద్వయుద్దాలకు తలపడ్డారు. ఏనుగులు ఏనుగులతోనూ, కొండలు కొండలతోనూ ఢీకొన్నట్టు వారు ఒకరితో ఒకరు కలబడ్డారు. చక్రధారులు చ(క్రధారులతో, ధానుష్కులు ధానుష్కులతో, ఖడ్గహస్తులు ఖడ్గహస్తులతో, ముసలాయుధులు ముసలాయుధులతో, గదాపాణులు గదాపాణులతో - ఇలా ఆయా వీరులు తమతమ సమస్కంధులతో హోరాహోరిగా పోరాడారు.
ఆ సంగరంలో లీలానాథుడైన విదూరథుని పక్షంలో నిలబడి పోరాడటానికి తూర్పుదిక్కునుండి కోసల - కాశీ - మగధాది దేశాలకు చెందిన రాజులు అనేకులు వచ్చారు. అలాగే ఆగ్నేయ దిశనుండి అంగ, వంగ, కళింగాది దేశాల నరపతులు, దక్షిణం నుండి ఆంధ్ర కర్ణాటాది భూపాలకులు, నైరుతి దిశనుండి సింధు, సౌవీర, (ద్రవిడాది దేశస్టులు విచ్చేశారు. మధ్యదేశం నుండి వచ్చిన శూరసేనాది దేశపాలకులు గూడా ఆపక్షంలో వున్నారు.
అచుత్తి ప్రకరణం 83
ఇక సింధురాజు పక్షంలో పోరాడటానికి పల్చిమదిక్కునుండి పంచజనులు,
ధర్మహీనులైన మ్లేచ్చజాతులు. వాయవ్యం నుండి వేణుపతి మున్నగు దేశాలవారు, _ ఉత్తరం నుండి హిమాలయ ప్రాంతాల జనులు, ఈశాన్య దిళశనుండి కాలూత (బ్రహ్మపుత్రాదులు వచ్చారు. పై రాజులందరూ నేను ముందు, నేను ముందు అని రణరంగంలో ముందుకురికి అగ్నిలో బడిన మిడుతల్హాగా వూడిపోయారు. రామా! ఆ యుద్రక్రమాన్ని ఎంతని వర్ణించేది? రెండువేల నాల్కలు గల శేషుడు కూడా దాన్ని వర్షించలేడు.
అలా సమరం సాగుతుండగానే సాయం సవయవుయింది. అప్పుడు ఉభయసేనల అధిపతులూ పోరాటం నిలపవలసిందిగా దూతల ద్వారా ప్రతిపక్షాలను కోరారు. యోధు లందరూ అలసిపోయి వుండడంవల్ల యుద్దాన్ని ఆపడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి.
అంతట ఉభయ సేనలలోనూ ఇద్దరు యోధులు రథపతాకాస్తంభాలు ఎక్కి యుద్దం నిలపవలసిందిగా సూచిస్తూ తెల్లజెండాలు ఊపారు. వెంటనే దుందుభులు (మోగాయి. సైన్యాలు రెండూ సమరభూ మినుండి తొలగిపోవడం (ప్రారంభించాయి. మందర పర్వతాన్ని వెలికితీసిన తర్వాత క్షీరసాగరం శాంతించినట్లే సైన్యాల సం(భ్రమం శమెంచింది. (క్రమంగా రణభూమి శూన్యమయింది.
ఆ ప్రదేశమంతా శవోల గుట్టులతో, రక్తనదులతో నిండిపోయింది. సగం చచ్చి పడివున్నవారి ఆక్రందనలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. కుక్కలు, నక్కలు శవాలను పీక్కుతినడం వెలందలుబొట్టాయి. రత్షః పిశాచాలు రక్తపానానికీ ఉద్యమించాయి. మరణించినవారి చుట్టూ చేరి బంధువులు విలపించసాగారు. మాంసం తినడానికి వచ్చిన ప్రాణులు తమలో తాము పోట్లాటకు దిగాయి. క్షత శరీరాలనుండి (ప్రసరించే రక్తనదులతోనూ, రక్తసిక్తమై చిగిర్చిన ఆయుధాలతోనూ కూడిన ఆ రణభూమి మృత్యుదేవత విహరించే ఉద్యానం అయింది.
అంతట రక్ష - సిక్తాంగుడైన వీరునిలాగా ప్రతాపరహితుడై ఎర్రబడిన సూర్యుడు పడమటి సము(ద్రంలో (ప్రవేశించాడు. క్షణంలో సంధ్యారాగం అలముకొన్నది గూళ్ళుచేరి మెడలెత్తి చూస్తున్న పక్షులు శవశరీరాలలో గ్రుచ్చుకొన్న ఆయుధాల లాగా కనిపించాయి. తామరలు ముకుళించాయి. ఆకస మనే మడుగులో చుక్క
[15
84 యోగవాసిష్టం లనే కలువలు వికసించాయి. రణభూమిలో చెల్లాచెదరై పడివున్న శవాలనూ, శవఖండాలనూ పీశాచాలు ఏరుకొని తినసాగాయి. ఆకాశమూ, కొండలూ, గుహలూ, పాదలూ చిమ్మవీకట్ట్లతో నిండిపోయాయి. ప్రళయవాయువుల తాకిడికి ఊగిసలాడే (బ్రహ్మాండంలా భూత బేతాళాల పరుగులతో రణరంగం దద్దరిల్లింది.
సమరానంతరసంస్కరణం
ఈ రీతిగా నిశాచరులు, యమదూతలు, పిశాచాలు చరించే ఆ యుద్రభూమి భయంకరంగా వున్నది. గాఢాంధకారం ఆవరించిన ఆ ప్రదేశంలో భూత సంఘాలు ఇష్టమైన ఆవోరం తిని స్వేచ్చగా (క్రీడించసాగాయి.
అప్పుడు నగరంలోని (ప్రజలందరూ నిద్రలో మువిగివున్నారు. లీలానాథుడు కొంచెం ఖిన్నుడై కనిపించాడు. అతడు మరునాటి ఉదయం చేయవలసిన పనిని గురించి మంత్రులతో ఆలోచించాడు. పిమ్మట మంచులాగా చల్లనైన శయనగ్భృహంలో కనుదమ్ములు మూసుకొని కొంతసేపు నిద్రించాడు.
లీలా సరస్వతులు ఆకాశం నుండి దిగి గాలి తామర మొగ్గలో ప్రవేశించినట్టు సూక్ష్మరంధ్రాల ద్వారా ఆ యింట ప్రవేశించారు.
శ్రీరాముడు : - ప్రభూ! ఇంత పొడవైన ఈ సూల శరీరం దారం లాగా సూక్ష్మమైన రంధ్రం ద్వారా ఎలా ఇంటిలోనికి ప్రవేశించింది?
వసిష్టుడు : - అనఘా! ఎవడు '' ఆధిభౌతికదేహమే నేను” అన్న మతి(భ్రమతో వుంటాడో వాని శరీరం సూక్ష్మరంధ్రం ద్వారా ప్రవేశించలేదు. “నేను దీనిలో అడ్డగింపబడ్డాను, ఇందులో పట్టును" అని భావించేవానికి అందులో (ప్రవేశం దుర్తభమే. కాని ఎవనికి ''స్టూలదేహమే నేను? అన్న భావన లేదో, వాడు సూక్ష్మ ప్రదేశంలో గూడా నిరాటంకంగా పయనం సాగించగలడు. -
నీరు పైకి పారదు, అగ్నిజ్వాలలు క్రిందికి ప్రసరించవు. ఏ వస్తువూ తన సహజ స్వభావం వదలదు. పరతత్త్వ సాక్షాత్కారం కలిగిన వానికి మరొక విషయం అనుభవానికి రాదు. నీడలో కూర్చున్నవానికి ఎండ ఎలా తగులుతుంది? సహజ సంవేదననను అనుసరించే ప్రతివాని చిత్తమూ ప్రవర్తిస్తుంది. ఒక రకంగా వున్న సంవేదనను యోగాభ్యాసం మొదలైన మహాప్రయత్నంతో మాత్రమే మరొక ఫ్రితికి తీసుకుపోగలము. మసక చీకటిలో త్రాడును చూస్తే '“ఇది పాము'” అన్న జ్ఞానం
ఉత్పత్తి ప్రకరణం 8ి5్ కల్గుతుంది. “అది పాము కాదు, తత్రాడే' అన్న దృఢమైన జ్ఞానం కల్షినప్పుడే పూర్వజ్ఞానం తొలగుతుంది. లేకపోతే అది అలాగే వుంటుంది.
సంవేదన ననుసరించి చిత్తమూ, చిత్తాన్ని అనుసరించి చేస్టై ప్రవర్తిస్తాయి. ఈ సంగతి బాలుడికి గూడా తెలుసు. ఆతివాహికమైన చిత్త శరీరం ఆకాశరూపమై వుంటుంది. దాని రాకపోకలను అడ్డుకొనేది ఏదీ లేదు. (ప్రతివాని శరీరమూ చిత్తం మాథ్రమే. జ్ఞానబంంతో భౌతిక శరీరాన్ని చిత్తశరీరంగా గోచరింపజేసుకోవడం సాధ్యమవుతుంది. పరమాత్మ యొక్క చిత్త వృత్తి ననుసరించే భూతాలు పుట్టుడం, గిట్టడం జరుగుతుంటుంది. సృష్ట్యాదిలో పంచీకరణానికి కారణం అజ్ఞానమే. చిత్తాకాళం, చిదాకాళం, ఆకాళం - ఇవి మూడూ ఒక్కటే. అధిష్టాన సత్త కంటే భిన్నంగా అవి స్పురించవు.
చిత్తశరీరం సర్వ గతమైనది. సంవేదనను బట్టి అది ప్రవర్తిస్తుందే కాని బాహ్యవస్తువుల ననుసరించి ప్రవర్తించదు. స్టూల శరీరం బాహ్య పదార్దాల ననుసరించి నిరోధానికి గురి అవుతుంది. చిత్త శరీరం అలా కాదు. దానికి నిరోధం లేదు.
ఈ చిత్తదేహం త్రసరేణువు మధ్య ఉంటుంది. ఆకసంలోనూ అంత్త్తైత మవుతుంది. అంకురకోశాలలో లీన మవుతుంది. చిగురుటాకులో రసమవుతుంది. నీటిలో అలగా మారుతుంది. రాతి నడుమ నృత్యం చేస్తుంది. మేఘమై వరిస్తుంది. శిలగా మారి నిలుస్తుంది. ఇచ్చ వచ్చినట్టు గగనతలంలో పయనిస్తుంది. కొండగుహలో దూరుతుంది. పరమాణువుగా గూడా భాసిస్తుంది. అది భూమిని మోసే కొండగా మౌరి, ఆకాశ మనే శిరస్సుతోనూ, అడవు లనే రోమాలతోనూ విరాజిల్దుతుంది.
సముద్రంలోని అనంతమైన సుడిగుండాలు సముద్ర స్వరూపం కంటే వేరైనవి
" కావు. అలాగే ఈ కోట్ల కొలది బ్రహ్మాండాలు చిత్త శరీరం కంచే భిన్నమైనవి కావు. స్పష్ట్యెదిలో ఈ చిత్త దేహం కర్మాను గుణమైన ప్రబోధంతో వుంటుంది. క్రమంగా ఆకాశాది రూపాలు పాంది బ్రహ్మాండంగా రూపొందుతుంది. (ప్రారబ్ద కర్మకు అనుగుణమైన (ప్రవృత్తిని (గ్రహిస్తుంది. మరుభూమిలో నీరు లేదు. అయినా మన బుద్ది కక్కడ నీరు ఉన్నట్టు తోస్తుంది. కలలో “ఇతడు గొడ్రాలి కొడుకు' అన్న భ్రాంతి కళ్ళినట్లే ఇది కూడా కల్గుతున్నది.
శ్రీరాముడు : - మునీంద్రా! మాలానీటి వారి చిత్తానికి గూడా ఇలాంటి శక్తి వుంటుందా? ఉంటే ప్రతివాని చిత్తానికి భిన్నభిన్నమైన జగద్రూపం గోచరించా లి
686 యోగవాసిష్టం కదా 1 ఆశక్తి లేసు పక్షంలో చిత్తం నుండి పుట్టని జగద్రూపం చిత్తం కంటే వేరుగా ఎందుకు ఉండదు? ఆ స్థితిలో జ్ఞానం వల్ల చిత్తం నశించినప్పటికీ జగత్తు ఉండవే ఉంటుంది కదా! ఈ సంశయం తీర్చండి! వసిష్టుడు : - ప్రతి చిత్తానికీ ఇలాంటి శక్తి ఉన్నది. ప్రతిచిత్తంలోనూ జగద్హ్రమ ప్రత్యేకంగా కలుగుతూనే వుంటుంది. క్షణ కల్పాలయిన జగత్సంఘాలు వారివారి చిత్త వృత్తుల నన్గుసరించి ఉదయిస్తూ, నళిస్తూ వుంటాయి. మరణమయమైన మూర్చను ప్రతివాడూ అనుభవిస్తాడు. అదే వాని పాలిటికి ('ప్రళభయరాత్రి అని తెలుసుకో. ఆ ప్రళయం గడవగానే ప్రతివ్యక్తీ వేరు వేరుగా సృష్టిని కల్పించుకొంటాడు. మహాప్రళభయరాతత్రి గడవగానే హిరణ్యగర్భుడెలా సృష్టికి ఉప్రమిస్తాడో, అలాగే ప్రతివాడూ మరణానంతరం తన తన సంకల్ప జగత్తులను సృష్టించుకొంటాడు. శ్రీరాముడు : - వమురణానంతరం సృష్టి పూర్వస్మృతివల్ల అనుభవ గోచరమవుతుంది. అనాది కాలంనుండీ ఈ సం ప్రదాయం ఇలాగే కొనసాగుతున్నది. అందువల్ల ఈ విశ్వం (బ్రహ్మం కంచె భిన్నమైన కారణం లేనిది కాదు. వసిష్టుడు : - రామా! మహాప్రళయంలో హరిహరాదు లందరూ విదేహముక్తు లవుతారు. ఇక పూర్వస్మృతికి అవకాశం ఎక్కడ ఉన్నది? తత్త్వజ్ఞాలైన నాలాంటివారే ముక్తు లవుతున్నారు. ఇక విదేహు లయిన (బ్రహ్మాదులు ముక్తులు కాకుండా వుంటారా? ఇతర జీవులకు మాత్రం మోక్షం లేదు కాబట్టి వారి చావుపుట్టుకలకు స్మృతి కారణ మవుతుంది. నురణ వానే వూర్చకు తర్వాత జీవుడు అవ్యక్తంగా ఉన్న స్టితినే 'ప్రధానమంటారు. దానికే అవ్యక్తం, జడాజడం, వ్యోమ ప్రకృతి అని కూడా వ్యవహారం ఉన్నది. ఆ మహత్తత్త్వం (ప్రబుద్ర్దమై అహంకారంగా పరిణమించగానే ఆకాశం నుండి దిక్కులు, క్రియాభూతాదులు ఉదయిస్తాయి. అదే ఇంకా కొంచెం విస్తరించి ఐం(ద్రియాలుగా రూపాందుతుంది. ఆతివాహిక దేహమంటచే అదే. చిరకాల (ప్రత్యయం వల్ల అది (క్రమంగా వృద్ది పొంది స్థూలదేహాహంభావాన్ని పొందుతుంది. ఆ స్టూలదేహాన్ని ఆధారం చేసుకొని ఆయా పదార్జాలు ఉదయించకున్నా ఉదయించినట్టు తోస్తాయి. ఈ భువనథ్రాంతి ఉనికి లేనిదైనా ఇలాగే పెరిగి పెరిగి కలలోని స్త్రీ సంగమం లాగా అనుభవగోచర మవుతుంది.
ఉత్పత్తి ప్రకరణం 87
ప్రాణి ఎక్కడ మరణీస్తుందో, అక్కడే మాయామయమైన ఈ జగత్తును వెంటనే చూస్తుంది. ఆకాళశరూపుడైన జీవుడు తెచ్చిపెట్టుకొన్న దేహాదులతో ఆత్మవంతుడైనట్టు స్వచ్చమైన ఆకాశమే ““నేను, ఈ జగత్తు! ఇత్యాది భ్రమలను అనుభవిస్తుంది.
దేవతలు, స్వర్గం, మేరుపర్వతం, సూర్యుడు, నక్షత్రాలు - వీటితో కూడి ఈ (భ్రమ అందంగా కనిపిస్తుంది. జరామరణ వ్యాధి సంకటాలు ఇందలి ఛిద్రాలు. స్టూలమూ, సూకత్మమూ అయిన చరాచరజగత్తు అనుకూల సంపాదనలోనూ, ప్రతికూల నివారణలోనూ నిమగ్నమై వుంటుంది. సము(ద్రాలు, నదులు, కొండలు, భూమి, రేయింబవళ్ళు - వీటితో అది కూడివుంటుంది.
అంతేకాక ఆ (భ్రాంతి ఈ విధంగా వుంటుంది - “నేను ఈ తండ్రికి పుట్టాను. ఈమె నా తల్లి. ఇది నా ధనం. ఇది నా పాపం. ఇది నా పుణ్యం. నేను వూర్వం బాలుడనై వుంటిని. ఇప్పుడు యువకుడ నయ్యాను.”' ఇలాంటి కల్పనలు హృదయంలో
ఈ సంసార వనఖండ(భ్రాంతి ప్రతివానికీ ఉదయిస్తుంది. దీనికి నక్షత్రాలే పూలు. నీలమేఘాలే కదిలే చిగుళ్లు. నరు అనే మృగాలు అందులో సంచరిస్తాయి. సురాసురులే ఇందలి పత్షులు. వెలుగుతో గూడిన పవళ్లే పుప్పాడి. రాత్రులే లతాగ్భహాలు. సము4ద్రాలే మడుగులు. మేర్వాది పర్వతాలే మట్టి పెళ్లలు. చిత్త మనే పద్మబీజంలో అనుభవ వునే మొలక అక్కడ లీనమై వుంటుంది. జీవుడు మరణించిన వెంటనే ఈ లాంటి సంసారవనఖండాన్ని సందర్శిస్తాడు.
అందులో కోట్లకొలది (బబ్రహ్మరు(ద్రేంద్రాదులు ఉదయించి గతించారు. ఉనికిలేనివైన ఈ రూపాలు ఎన్ని గతించాయో, ఎన్ని గతించనున్నవో, ఎన్ని గతిస్తున్నవో ఎవరు లెక్కించగలరు? అంతా మనస్సంకల్పరూపమైన మననమే తప్పు స్థూలమైన విశ్వం లేనే లేదు. మనస్సు ననుసరించి ఆ విశ్వం చలించినట్టు కన్పిస్తున్నది.
చిదాకాశమే మననం. చిదాకాశమే పరమపదం, నీరే సుడి. నీటికంటే సుడి వేరుకాదు. దద్రష్టే దృళ్యమై వున్నాడు. దృశ్యం అతని కంటే వేరుగా లేదు. అసత్యమైన మాయాకాశంలో జీవభావంతో ఏది స్పురిస్తున్నదో, అదే నామ రూపాత్మకంగా పరిణమించి *““జగత్తు'' అనబడుతున్నది.
జగత్రుమాత అధిష్పానచిన్మాత్రస్వభావుడే కాని ఆరోపిత జీవస్వభావుడు కాడు.
88 యోగవాసిం అందువల్ల లీలా సరస్వతులు ఆకాశశరీరలై సర్వత్రా నిరాటంకంగా సంచరించగలిగారు. వారు తమ కోరిక మేరకు ఆకాశంలో ఎలా సంచరించారో, అలాగే విదూరథుని గృహంలోగూడా ప్రవేశించారు. . చిదాకాశం సర్వత్రా వ్యాపించివున్నది. అదే ఇక్కడ మనస్సులోని విషయాలన నిశ్చయించే వరకూ వ్యాపించి యథార్రజ్ఞానమై వున్నది. అదే సూత్మమైన ఆతివాహిక శరీరం. దానిని ఎవరు ఎలా అడ్డుకోగలరు? ॥ (భాంతి విచారం
వారిద్దరూ ప్రవేశించగానే విదూరథుని గృహం అక్కడ ఇద్దరు చంద్రు లుదయించినట్టుగా ధవళకాంతులతో శోభిల్లింది. మందార సుమగంధముతో నిండిన మందమారుతం వీచింది. వారి మహిమ వల్ల అప్పుడు ఆ యింటిలో రాజా తప్ప తక్కినవారందరూ గాఢని(ద్రలో మునిగిపోయారు.
చం(ద్రకాంతివలె చల్లనైన వారి దేహ(ప్రభ ప్రసరించగానే అమృత సిక్తుడైనవానిలా రాజు నిద్రనుండి మేల్కొన్నాడు. రెండు మేరుశిఖరాలపై ఉదయించిన చం(ద్రుల జంటలా రెండాసనాలపై విశ్రమించి వున్న అచ్చర లిద్దరినీ చూచాడు.
విస్మితచిత్తుడై క్షణం ఆలో చించి శేషశయ్యనుండి లేవిన విష్ణుని లాగా పడకనుండి లేచాడు. కట్టుబట్టునూ, కంఠహారాలనూ సవరించుకొన్నాడు. తలగడకడ వున్న ఫుష్ప్రపాత్రనుండి పూలు దీసుకొని దోసిట నింపుకున్నాడు. నేలపై పద్మాసనస్టుడై కూర్చొని నమస్కరించి ఇలా అన్నాడు -
““జన్మమనే దాహదోషాన్ని శమింపజేసే చం (ద్రకాంతులైన దేవతలారా ! మీకు జయమగుగాక ! వెలుపల, లోపల అలముకొన్న చీకటిని పారదోలే సూర్యకాంతులైన దేవతలారా! మీకు జయమగుగాక !? అలా చెప్పి గట్టున వున్న చెట్టు మడుగులోని పద్మాలపై పూలు రాల్చినట్టు వారి పాదాలపై పుమ్చెంజలి సమర్పించాడు.
అప్పుడు సరస్వతి లీలకు భూపాలుని జన్మవృత్తాంతం తెలపాలని ప్రక్కనే నిద్రిస్తున్న మంత్రిని తన సంకల్పబలంతో మేల్కొలిపింది. అతడు మేల్కాంచి అచ్చరలను చూచి ప్రణామం చేశాడు. వారి పాదాలపై కుసుమాంజలి సమర్పించి యెదుట కూర్చున్నాడు,
అంతట సరస్వతి '“ఓ రాజా ! నీవెవరు ? ఎవని కుమారుడవు ? ఇక్కడి
ఉల్పత్తి ప్రకరణం 69 ఎప్పుడు జన్మించావు?”” ఆని ప్రశ్నించింది. అది విని మంత్రి ఇలా సమాధానం చెప్పాడు.
“దేవవనితలారా! మీ ముందట మాటలాడే శక్తి నాకు మీ అనుగ్రహం వల్లనే కల్గింది. మా (ప్రభువు జన్మ వృత్తాంతం చెబుతాను వినండి!
పూర్వం ఇత్వుకు వంశంలో కుందరథుడనే రాజు ఉండినాడు. అతడు బాహుబలంతో పృథివీముండలమంతా జయించాడు. అతనికి భద్రరథుడనే కుమారుడు జన్మించాడు. ఆ వంశంలో [క్రమంగా విశ్వరథుడు, బృహ(ద్రథుడు, సింధురథుడు, శ్రైలరథుడు, కామరథుడు, మహారథుడు, విష్ణురథుడు, నభోరథుడు అనే వారు జన్మించారు. నభోరథుని కుమారుడే మా (ప్రభువు. ఈయన పేరు విదూరథుడు. ఈయన తల్లి పేరు సుమి(త్ర. పదవయేటనే తండ్రి ఈయనకు రాజ్యం సమర్పించి అరణ్యానికి వెళ్ళాడు. ల
నాటినుండి మా రాజు ధర్మంగా రాజ్యపాలన కావిస్తున్నాడు. మా సుకృత వృక్షం ఫలించి మీరిరువురూ నేడు మాకు ప్రత్యక్షమయ్యారు. ద్వీర్సకాలం తపస్సు చేసినా మీ దర్శనం మాకు లభించదు. మీ అనుగ్రహం వల్ల నేడు మా రాజు పవిత్రు డయ్యాడు." .
ఈ విధంగా చెప్పి మంత్రి మౌనం వహించాడు. రాజు పద్మాసనంలోనే వుండీ అంజలి గావిస్తూ శిరసు వంచి మోకరిల్లాడు.
అప్పుడు సరస్వతి ''రాజా! వివేకంతో నీ పూర్వజన్మను స్మరించుకో'' అని చెప్పి అతని తలను తనచేతితో స్పృశించింది. ఆ స్పర్శతో అతని హృదయాన్ని ఆవరించివుండిన తమస్సు తొలగిపోయింది. అతని చిత్తం వికసించింది. అతడు పూర్వజన్మ వృత్తాంతం స్మరించాడు. తొలి జన్మలో తన రాజ్యం, లీలావిలాసం మొదలైనవన్నీ గుర్తుకు రాగానే సాగరతరంగాలలో తేలిపోతున్నవానిలా అయ్యాడు. ““అవురా! ఈ సంసారమాయ ఎంత విచిత్రమైనది? ఈ దేవతల అనుగ్రహంవల్ల నాకు ఇప్పుడిది గోచరిస్తున్నది*' అని అనుకున్నాడు. పీదప వారిని చూచి ఇలా అన్నాడు-
“ఓ దేవతలారా! ఏమిది? గత జన్మలో నేను మరణించి ఇప్పటికి ఒక్కదినం మాత్రమే గడచింది. కాని యీ జన్మలో నాకు డెబ్బదియేండ్త వయస్సు వచ్చింది. నేనిప్పుడు గతించిన పెక్కు పనులు స్మరిస్తున్నాను. నా వుఎుత్తాతనా,
90 యోగవాసష్థం బాల్యయౌవనాలనూ, మిదత్రులనూ, బంధువులనూ, పరివారాన్నీ గుర్తుక్సు దెచ్చుకొంటున్నాను. ఏ మాళ్చీర్య మిది?”
సరస్వతి : - '““రాజూ! వురణవలార్భానంతరం వవూయావరణతో కప్పిీవేయబడిన గిరిగ్రామంలో ని విష్రగృహం సర్వానికీ అధిష్పానమైన చిదాకాశంలోనే వున్నది. పద్మనరపతికి చెందిన రాజగ్భహం కూడా అందులోనే వున్నది. ఈ (బ్రహ్మాండమండపం కూడా అక్కడనే వున్నది.
(బాహ్మణ గృహంలో వున్నప్పుడు నీవు నాకు భక్తుడవై వుంటివి. పద్మరాజువైనప్పటే నీ సంసారం కూడా అక్కడే వున్నది. వ్యవహార(భ్రమతో నిండిన ఇప్పుటి నీ యిల్దు కూడా అందులోనే వున్నది. ఈ మూడు ్రపంచాలూ నీ చిత్తవికారాలే కాని మరేమీ కాదు. నీ వ్యవహారభ్రమ ఎలాంటిదో విను.
“నేను రాజ కుమారుడనై పుట్టాను. పదేండ్త ప్రాయంలో నా తండ్రి నాకు రాజ్యం అప్పగించాడు. నేను శత్రువులను జయించి మంత్రులతో గూడి రాజ్యం పాలిస్తున్నాను. నాకిప్పుడు డైబ్బై ఏండ్ల ప్రాయం వచ్చింది. ఇప్పుడు నా పై శత్రువులు దండెత్తివచ్చారు. వారితో దారుణమైన యుద్దం జరిగింది. యుద్దానంతరం యింటికి వచ్చి విశ్రమించాను. ఈ దేవతలు నా యింటికి వచ్చారు. వీరిని నేను పూజించాను. వీరిలో ఒక దేవత నాకు పూర్వజన్మస్కృతి గల్గించింది. ఇప్పుడు నేను కృతకృత్యుడ నయ్యాను. నా సంశయం తాలగింది. ఇప్పుడు సుఖంగా వున్నాను.
ఈ రీతిగా నీకు విస్తృతమైన (భ్రమ కల్గింది. నీవు పూర్వం మరణించినప్పుడే నీలో ఈ భావనలు ఉదయించాయి. నదీ ప్రవాహం ఒక సుడిగుండాన్ని విడిచి మరొక సుడిగుండాన్ని ఆ(శ్రయించినట్లే జ్ఞాన ప్రవాహం ఒక (భ్రమను విడిచి మరొక (భ్రమను ఆశ్రయిస్తుంది. ఒక సుడి మరొక సుడిలో కలిసిపోయినట్లే స్పష్టికూడా జా గ్రద్దశలో ఇతర జీవులతో సంసర్గం కల్గివుంటుంది. స్వప్నంలో ఆ సంసర్గం వుండదు. నీ చిద్రూప సూర్యుని ముందు భాసించిన ఈ జగజ్ఞ్జాలమంతా నిజానికి ఉనికి లేనిదే.
కలలో ఒక నిముసంలోనే నూరు సంవత్సరాలు గడచిపోయినట్లు తోస్తుంది. సంకల్పంవల్ల జనన మరణాలు కల్లినట్టు గోచరిస్తాయి. గంధర్వనగరంలో గోడ లున్నట్టు కానవస్తాయి. పడవలో పయనించేటప్పుడు చెట్టు కదలిపోతున్నట్టు కనిపిస్తాయి. ధాతువులు ప్రకోపిస్తే కొండలు నాట్యమాడినట్టు భావన కల్గుతుంది. కలలో తన తల తెగి పడినట్టు గోచరమవుతుంది. ఇదంతా మిథ్యే. అలాగే నీకు కలిగిన ఈ (భ్రాంతిమయ (ప్రపంచదృశ్యం కూడా మిథ్యే.
ఉత్పత్తి ప్రకరణం 91 వాస్తవానికి నీకు జనన మరణాలు లేవు. నీవు శుద్ద విజ్ఞాన స్వరూపుడవై శాంతమైన పరమాత్మలో వున్నావు. నీవీ జగత్తును చూస్తున్నా చూడని వాడవే. నీవు సర్వాత్మకుడవు కొన నీయంతట నీవే ప్రకాశిస్తున్నావు. ఈ భూమీ, గిరులూ, గ్రామాలూ, అడవులూ, నదులూ, సముద్రాలూ, మనమూ - అంతా మిథ్యే, అంతా నిర్మలమైన (బ్రహ్మమే కాని మరేమీ లేదు. విదూరథుడు : - దేవీ! అలా అయితే నావలె జీవించివున్న ఈ నా అనుచరులు సత్స్వభావులే కదా! జగత్తు స్పష్నంవంటిదైతే వారు సత్యస్వరూపులు ఎలా అవుతారు? వారి సత్స్వభావం నిజమా ? కాదా? సరస్వతి : - రాజూ। తత్త్వజ్ఞాలు, శుద్రబోధైకరూపులు, చిదాకాశాత్మకులూ అయినవారికి జగత్సత్యత్వ మనేది లేనే లేదు. శుద్ద బోధస్వరూపునికి జగద్ర్రమ ఎలా కలుగుతుంది? త్రాడునందు ఏర్పడిన సర్ప(భ్రమ శాంతించిన తర్వాత మళ్ళీ సర్ప(భ్రాంతి ఎలా వుంటుంది? జగత్తు అసత్యమని తెలిసిన తర్వాత జగదుమ ఎలా కలుగుతుంది? ఇది ఎండమావి అని తెలిసిన తర్వాత అందులో జలబుద్ది ఎలా పాడమ్రుతుంది? కలనుండి మేల్కొన్న తర్వాత కలలో సంభవించిన చావు నిజం ఎలా అవుతుంది? కలలో చనిపోయానన్న భయం బ్రతికి వున్నవానికే కదా కలిగేది! బాబూ! అజ్ఞ దృష్టితో నీ అనుచరుల సత్యత్వాన్ని గూర్చి నీవు ప్రశ్నిస్తున్నావంటే ఆ సత్యత్వం నీలో కూడా లేదు. నీ ప్రళ్నీ తత్త్వదృష్టితో అడిగినదైతే నీవలే నీ అనుచరులు గూడా సత్యస్వరూపఫులే. కాబజ్టి శుద్రబుద్ర స్వరూపుడైన నిర్మలాశయునకు అజ్ఞాని దృష్టిలో ప్రసిద్దమైన "నేను ఈ జగత్తు'' అనే శబ్దాలకు అర్ధమే లేదు. అది వాచారంభణం మాత్రమే. మునీం(ద్రుడు ఈ విధంగా చెప్పేసరికి సాయం సమయమయింది. సూర్యుడు అస్తమించాడు. సభాసదులందరూ మునికి నమస్కరించి స్నానాది విధులకై వెళ్ళారు. తెల్లవారగానే మళ్లీ సభాఫ్త్రలికి విచ్చేశారు. (ఐదవదినము) స్వపష్నపురుష సత్యత్వ విరూపణం వసిష్టుడు : - రామౌ! ఉనికి లేనిదైన ఈ జగత్తు బోధరహితుడైన మూఢునికి వ(జ్రం లాగా దృఢంగా వున్నట్టు భాసిస్తుంది. బాలునికి బేతాళం మరణపర్యన్తం
92 యోగాస్టిం దుఃఖం కలిగిస్తుంది. అలాగే మూఢమతికి అసత్తెన జగత్తు సత్తుగా కనిపిస్తూ పీడాకర మవుతుంది. ఎండమావి మృగాలకు జల(భాంతిని కలిగించినట్లే అసత్యమైన జగత్తు అజ్ఞులకు సత్య భ్రాంతిని కలిగిస్తుంది. కలలో సంభవించిన చావు శోకహేతువయినట్లే ఉనికి లేవి జగత్తు మందమతులకు దుఃఖకారణ మవుతున్నది.
బంగారును గూర్చిన పరిజ్ఞానం లేని వానికి బంగారుగాజులో గాజును గూర్చిన జ్ఞానమే తప్ప బంగారును గూర్చిన జ్ఞానం కలుగదు. అదే రీతిగా అజ్ఞ్జానికి జగత్తులో నగరగ్భహాది దృళ్య జ్ఞానమే తప్ప సర్వాత్మక బ్రహ్మజ్ఞానం కలగదు. దృష్టి దోషం కలవానికి ఆకసంలో ముత్యాలహారం, పింఛం, కేశపాళశం మొదలైన లేని వస్తువులు కనిపిస్తాయి. అదే విధంగా పరమార్ధ దృష్టిలేని వానికి లేని జగత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. "
ఈ విశ్వమే ఒక ద్వీర్ణ స్వప్నం. ఇందులో కనిపించే వారి సత్యత్వాన్ని గూర్చి వివరిస్తాను విను.
సర్వాధిష్థానమూ, శాంతమూ, పరమార్ధ ఘనమూ, శుద్ద్రమూ, చిన్మాత్ర శరీరమూ అయిన ఒక పరమాకాశం ఉన్నది. అది మాయాబలంతో అంతటా వ్యాపించి, అన్ని శక్తులతో, అన్ని రూపాలతో విలసిల్దుతూ అంతా తానే అయివున్నది. అది స్వప్ననగరంలో వున్నవారిని నరులని భావిస్తే వారు నరులుగానే రూపొందుతారు. స్వప్నదష్ట యొక్క చిత్స్వ్వరూపం అతని చిత్తవాసనల ననుసరించి వివృత్తి పొందుతుంది. స్వష్నావస్టలోనూ, జా గ్రదవస్టలోనూ వైతన్యం ఒకటే. అందువల్ల ఆత్మలో నరత్వ బోధ కలుగుతున్నది. చిద్బలం వల్ల స్వప్న జాగ్రదవస్టలు రెండూ సత్యాలుగానే గోచరిస్తాయి.
శ్రీరాముడు : - మునీంద్రా! మాయామా(త్రమైన కలలో కనిపించే స్వప్ష
. పురుషులు నిజం కారు అనుకుంటే వచ్చే దోష మేమిటి?
వసిష్టుడు : - కలలో కనిపించేవారు వాస్తవానికి ఉన్నవారు కారు అని మాత్రం చెప్పవచ్చు. అంతే కాని పూర్తిగా ఉనికి లేనివారని చెప్పరాదు. ఇందుకు ప్రత్యక్షమే (ప్రమాణం. సృష్ట్యాదిలో బ్రహ్మ స్వప్నతుల్యానుభవస్వరూపుడై భాసిస్తాడు. అతని సంకల్ప ఫలమైన విశ్వం కూడా స్వప్నతుల్యమే. ఇలా ఈ విశ్వమే ఒక స్వప్నం.
శత్పత్తి ప్రకరణం 93 ఇందులో నీవు నా దృష్టికి సత్యం. నీలాగే ఇతరులు కూడా నీ దృష్టికీ నా దృష్టికీ సత్యరూపులే. ఇతరులకు కూడా వారి వారి అనుభవాన్ని అనుసరించి. స్వప్పసత్యత్వం సిద్రిస్తుంది. స్వప్నంలో నగర వాసులు సత్యం కాకపోతే స్వప్నం వంటి విశ్వంలోని నరులు సైతం సత్యం కాజాలరు. సంసారమనే విశాలస్వప్నంలో నీకు నేను నిజమైనట్లే నీవూ నాకు నిజమే. అన్ని స్వప్నాల సంగతీ ఇంతే.
శ్రీరావుడు : - భగవ౯! మీ వూటలను బట్టీ కలగన్నవాడు మేల్కొాన్నప్పుడు కలలో కనిపించిన పట్టణం సద్రూపహమే కాబట్టి అది అలాగే ఉండిపోతుందని నేను భావిస్తున్నాను.
వసిష్టుడు : - నిజమే. స్వప్న(ద్రష్ష, మేల్కొన్నా అధిష్టాన సన్మాత్ర స్వభావమైన స్వప్నపట్టుణం సత్యం కావటం వల్ల అలాగే వుంటుంది. అది అలా వుండనీ!
స్వప్నజగత్తు జా గ్రద్దశలో ని దేశకాలాదులలో లేదు కాబట్టి అది అసత్యమని నీవు భావిస్తున్నావా? అయితే నీవు దేన్ని జూగ్రద్రశగా భావిస్తున్నావో అది కూడా స్వష్నానికి చెందిన దేశకాలాదులలో లేదు కాబట్టి స్వప్నమే అని తెలుసుకో! ఇలా నిజం కాకున్నా ఇవన్నీ నిజంగా భాసీస్తున్నాయి. మిథ్య అయిన కలలోని స్తీ సంగమంలాగా రంజింపజేస్తున్నాయి. ..
శరీరానికి లోపలా, వెలుపలా, అంతటా అన్ని దేశకాలాలలో వైతన్యం అనేది ఉన్నది. మాయాబలంవల్ల అన్ని రూపాలతోనూ భాసించే సామర్ధ్యం దానికున్నది. ధనాగారంలోని ధనం (ద్రష్టకు లభ్యమవుతుంది. అలాగే చిదాకాశంలోని చైతన్యం చిత్స్వరూపుడయిన వానికే లభిస్తుంది.
రామా | సరస్వతీదేవి జ్ఞానామృతం చిలకరించి వివేక మనే అంకురాన్ని కలిగించి పిదప విదూరథునితో ఇలా అన్నది. .
సరస్వతి: - రాజూ! లీలకొర్టై ఇదంతా నీకు వివరించాను. నీకు శుభమగుగాక! మేము పోయి వస్తాం ! మండపంలో (బ్రహ్మాండకల్పన వంటి దృష్టెంతాల దర్శనం లీలకు కలిగింది.
ఇలా మధురంగా భాషించిన సరస్వతితో బుద్రిమంతుడైన విదూ రథ మహారాజు ఇలా అన్నాడు.
“+దేవీ! సామాన్యుడనైన నా దర్శనం సైతం యాచకుని పట్లు వ్యర్ధం కాదు. ఇక మహాఫల ప్రదమైన నీదర్శనం నిరర్ధకం అవుతుందా? స్వప్పంనుండి మరొక స్వప్నానికి
రత యోగవాసిష్టం పయనించినటే నేనీ దేహం వదలి నాకు చెందిన పూర్వలోకానికి వెళతాను. తల్లీ! నేను మీకు శరణాగతుడను. నన్ను అనుగ్రహించు. పెద్దలకు భక్తులపట్లు హేళన తగదు. నే నే దేశానికి వెళతానో, ఆ దేశానికే ఈ నా మంత్రి, నా పుత్రిక వత్తురుగాక! ఈ వరం ప్రసాదించి నన్ను కనికరించు!
సరస్వతి : - రాజా! నీవు కోరినట్లే నిస్సందేహంగా నీ పూర్వజన్మకు చెందిన అర్హ సంపన్నమైన మనోహర రాజ్యానికి రా! అర్హి జనుల కోర్కెల నిరాకరించడ మనేది మా విషయంలో ఎన్నడూ లేదని గ్రహించు.
అగ్ని దగ్గనగరం
““రాజా! ఈ యుద్దంలో నీ విప్పుడు మరణిస్తావు. పిమ్మట నీ పూర్వరాజ్యం పొందుతావు. నీ పుత్రికతో, మంత్రితో కూడి నాటి నీ పట్టణం చేరుకుంటావు. శవమై పడివున్న నీ శరీరంలో ప్రవేశిస్తావు.
మేము ఎలా వచ్చామో, అలాగే అక్కడికి తిరిగి వెళతాము. నీవు ఈ యిద్రరితో
. సహా వాయురూపంతో ఆ దేశానికి చేరాలి. గుర్రం నడక వేరు, ఒంటె ఛడక వేరు. మదమత్తమైన గజేం(ద్రం నడక తీరు వేరే కదా!”
అలా వారిద్దరూ ప్రియంగా మాట్లాడుతూ వుండగానే మేడపై నుండి దిక్కులు పరికిస్తున్న పురుషుడు సం(భ్రాంతుడై పరుగిడి దిగివచ్చి ఇలా అన్నాడు -
“దేవా! బాణాలూ, చక్రాలూ, గదలూ మొదలైన ఆయుధాలతో గూడీన మహా శత్రుసైన్యం ఉప్పాంగిన సాగరం లాగా పైకి వస్తున్నది. (ప్రళయవేళలో కులపర్వతాలు శిలలు వర్షించినట్లే ఆ సైన్యం గదా శక్త్ర్యాదుల వర్షం కురియిస్తున్నది. నగరమంతా అగ్ని దగ్రమై కూలి పోతున్నది. ఛటచ్చట శబ్దాలతో మంటలు వ్యాపిస్తున్నాయి. 'ప్రళయమేఘాల వంటి పాగకొండలు ఆకసంలో గ్రద్దల గుంపుల్లాగా 'పైకెగురుతున్నాయి.?”
వసిష్కుడు : - ఆ ఫురుషు డలా చెబుతుండగానే వెలుపల దిక్కుల నావరిస్తూ మహాకోలాహలంతో కూడిన పరుషమైన ధ్వని వినిపించింది. శరాలను వర్షించే విండ్ర('మైోతలు, మదించిన ఏనుగుల ఘీంకారాలు, నగరాన్ని కాల్చివేస్తున్న మంటల ఛటచ్చట శబ్దాలు, పౌరుల ఆ(క్రందనలు శ్రవణగోచర మయ్యాయి.
లీలా సరస్వతులు, రాజు, మంత్రి ఆ రాత్రివేళ హాహాకారాలతో కూడిన నగరాన్ని
ఉత్పత్తి ప్రకరణం 95 గవాక్షం నుండి చూచారు. ప్రళయాగ్నిచే తోభజెందిన సప్తసాగరాలూ ఒక్కటై వచ్చాయా అన్నట్టు శత్రుసైన్యం నగరం పైకి వచ్చింది. ఆకసమంటే అగ్నిజ్వాలలకు పట్టణం ఆహుతి అవుతున్నది. ఆ మంటలలో బడి మాడిపోతున్న స్త్రీ పురుషుల రోదన ధ్వనులు మిన్నుముట్టాయి. జగదృష్మా వర్ణనం
ఇంతలో లక్ష్మీ పద్మ కోటరం ప్రవేశించినట్లు రాజమహిషి ఆ రాజగ్భృహం (ప్రవేశించింది. భయ(భ్రాంతురాలైన ఆమె వెంట చెలికత్తెలు గూడా వచ్చారు. నిండు జవ్వనంతో శోభిల్లే ఆ రాణి ధరించిన వస్త్ర, మాల్యాభరణాలు చెదరివున్నాయి. చంద్రుని వంటి వదనమూ, స్వచ్చమైన శరీరమూ, శ్వాసతో చలించే పయోధరాలూ, తారకలవంటి దంతాలూ కల ఆ పట్టుపురాణి రూపు దాల్ఫిన ఆకాళం లాగా భాసించింది.
అచ్చరకాంత అమరేం(ద్రునికి విన్నవించినట్లే ఒక చెలికత్తె రాజుతో ఇలా నివేదించింది. '“దేవా! పెనుగాలికి ఊగులాడే తీగ చెట్టును చుట్టుకొన్నట్లే రాణి మాతో కూడా పరుగిడి వచ్చి మిమ్ముల్ని శరణు జొచ్చింది. మవారాజూ! సముద్రపు టలలు గట్టున వున్న వెట్లు తీగలను హరించినట్లే ఆయుధపాణులైన శత్రువులు మీ భార్యలను హరించుకు పోయారు. హఠాత్తుగా వచ్చిన పెనుతుఫాను చెట్లనూ, చేమలనూ ధ్వంసం చేసినట్లే ఉద్దతులైన విరోధులు అంతఃపురపరిపాలకులను హతమార్చారు.
వరదలు తామరలను పెకలించుకు పోయినట్లే దూరం నుండి వచ్చిన అరివీరులు మన నగరాన్ని దోచుకున్నారు. పట్టుణ మంతా అగ్గి పాలయింది. ఎక్కడ చూచినా శత్రువులు స్వైరవిహారం చేస్తున్నారు. బోయలు పక్షులనూ, మృగాలనూ పట్టుకు పోయినట్టే వైరులు అంతఃపురకాంతలను, వెం(డ్రుకలు పట్టి ఈడ్చుకుపోయారు. ఈ విపత్తు నుండి మమ్ము రక్షించడానికి మీరొక్కరే సమర్డులు”!
ఆ పలుకులు విని రాజు దేవకాంతల వైపు చూచి “'క్షమించండి! నేనిప్పుడు సమరభూమికి వెళ్తున్నాను. ఈమె నా భార్య. మీ పాదపద్మాల వద్ద సురక్షితంగా
_ వుంటుంది” అని చెప్పాడు. తరువాత మదించిన ఏనుగులు అడవిని ధ్వంసం చేస్తుండగా గుహనుండి
96 యోగవాసిష్టం వెలువడే సింహం లాగా కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో రాజు రాజగ్బృహంనుండి వెలుపలికి నడిచాడు.
అప్పుడు లీల అడ్డంలోని తన ప్రతిబింబవూ అన్నట్టున్న లీలను (రాజమహిషిని) చూచింది. చూచి సరస్వతితో ఇలా అన్నది -
'ప్రబుద్రలీల : - దేవీ! ఏమిటిది? ఈమె అచ్చం నాలాగే ఉన్నదే! మంత్రులూ, యోధులూ, పౌరులూ - అందరూ పూర్వం మౌ డాజ్యంలో ఉన్నట్లే ఉన్నారు. వీరందరూ అద్దంలోపలా, వెలుపలా ఉండే బింబ ప్రతిబింబాలలాగా అక్కడా, ఇక్కడా ఎలా ఉండగలుగుతున్నారు? వీరు చైతన్యం కలవారేనా?
దేవి: - హృదయంలో జ్ఞప్తి ననుసరించి అనుభవం కూడా కల్గుతుంది. మనస్సు జాగ్రత్కాలంలో అనుభవించిన అర్జాల ఆకృతిని కలలో పొందినట్లే చిత్తు అధ్యాసంతో చేత్యాకారాన్ని పొందుతుంది. సంస్కారాత్మకమైన జగద్రూపం ఏ ఆకృతిని కల్షివుంటుందో, అదే, ఆకారంతో చిత్తంలోనూ, చిత్తులోనూ ఉదయిస్తుంది. దేశ కాలాలలోని ద్నీర్హత్వం, అల్పత్వం, విపులత్వం మొదలైన వైచి త్రాలు చిచ్చక్తివల్ల కలోవే కాని పదార్దాల వల్ల కలవి కావు. చైతన్యంలో అధ్యస్తం కావటంవల్ల ఆంతరమైనజగత్తు బాహ్యజగత్తు లాగా కనిపిస్తుంది. ఇందుకు స్వప్నములో కనిపించే జగత్తే నిదర్శనం. చిరకాలాభ్యాసం వల్ల వ్యక్తమై అది సత్యంలా తోస్తుంది.
నీ భర్త అప్పు డాపట్టణంలో ఎట్టి వాసనతో మరణించాడో, ఆ వాసన ననుసరించి మళ్లీ ఆ స్థితినే పాందాడు. ఈ మంత్రులు మొదలైన జీవులు ఆకారంలో సామ్యం కలవారైనా వారికంటే వీరు వేరైనవారే.
జాగ్రద్దశలో ఒక వస్తువు అందరికీ సమానంగా భాసిస్తుంది. స్వప్నంలో అలా భాసించదు. అంత మౌటత్రాన జా గ్రదవస్టలో కనిపించిన పదార్డాలన్నీ సత్యాలు కానేరవు. అలా అయ్యే పక్షంలో ఇంద్రజాలంలో సర్వసాధారణంగా కనిపించేవి కూడా సత్యాలు కావాలి కదా?
స్వప్నంలో కనిపించేవి తరువాత నశిస్తాయి. కాబట్టి అసత్యాలంటావా? అయితే
జాగ్రద్దశలో కనిపించేవి కూడా నశించేవే కదా! స్వప్నంలో జా గ్రద్దశకు ఉనికి లేదు. అలాగే జా గ్రద్దశలో స్వష్నానికి కూడా ఉనికి లేదు. అందువల్ల జా గ్రద్దశలో కనిపించే వస్తువులు స్వప్నంలో అస్తిత్వం లేనివై బాధింపబడుతున్నాయి. జననకాలంలో మరణానికి ఉనికి లేదు. మరణదశలో జననం కూడా ఉనికి లేనిదే. వినాశకాలంలో అవయవాలు విచ్చిన్నం కావడం ద్వారా ద్రవ్యం నశిస్తుంది. బాధకాలంలో అనుభవ
ఉత్పత్తి ప్రకరణం 97 బలంతో ద్రవ్యం నశిస్తున్నది. అంచేత కారణంలో భేదమున్నా కార్యంలో భేదం లేదు.
అందువల ఈ జగత్తు ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. ఇది వటి భ్రాంతి మాత్రమే. మహాప్రళయ కాలంలోనూ, సృష్టికాలంలోనూ జగత్తనేది జగద్రూపంతో లేదు. ఉన్నది అధిష్థానమైన బ్రహ్మం మాత్రమే. ఆ బ్రహ్మమే ఈ జగత్తు. సృష్టిరూపమైన (భమలన్నీ ఆ (బబ్రహ్మంలో భాసించేవే. ఆకసంలోని వెండ్రుకల చుట్టులాగా అవి ఉనికి లేనివే. అలలు సము(ద్రం కంటే వేరుగా లేవు. అదే రీతిగా బ్రహ్మం కంచే భిన్నంగా జగత్తులు లేవు. .
పెనుగాలిలో రజో రేణువుల్లాగా నీవు - నేను అనే మిథ్యా విభాగంతో కూడీన ఆత్మలో జగత్తులు పుట్టి పుట్టి లయ మవుతున్నాయి. ఎండమావిలో నీట్టై ఆశ ఎందుకు? కాలిపోయిన గుడ్డవంటి ప్రపంచం పై మోహం ఎందుకు?
(భాంతులు కూడా బ్రహ్మకంచే భిన్నమైనవి కావు. కటిక చీకటిలో బాలునికి యక్ష భ్రాంతి కల్గుతుంది. యక్షుడు చీకటికంటే వేరుగా లేడు. అందువల్ల ఈ జనన మరణాలనేవి వ్యామోహం మాత్రమే. జగత్తంతా దానివల్ల ఏర్పడినదే. అంతా శమించిన తరువాత ఏది మిగిలి వుంటుందో అదే బ్రహ్మం. దానికంటే వేరైన సత్యం మరొకటి లేదు. ఒకే వస్తువులో సత్యాసత్యత్వ రూపమైన రెండు విరుద్రధర్మాలు ఉండజాలవు. అందుచేత సత్యమైనది బ్రహ్మ మొక్కే.
సూర్యు డుదయించినప్పుడు ఇంటిలో త్రసరే ణువులు (భ్రమించడాన్ని చరాడవచ్చు. అలాగే పరవతాకాశంలో (బ్రహ్మాండాలనే త్రసరేణువులు పరి(భ్రమిస్తున్నాయి. గాలిలో చలనమూ, సుగంధమూ, ఆకాశంలో శూన్యత్వమూ ఉన్నట్లే పరబ్రహ్మంలో ఈ విశ్వం ఉన్నది. అవయవరహితమైన (బ్రహ్మంలో స్టూలసూత్ష్మ చరాచతాది విభాగాలన్నీ కల్సితాలే. సాకారమైన ఈ విశ్వం ఆత్మకంటే భిన్నం కాదు. కాబట్టి నిరాకారమే అని తెలుసుకో. నిజభావనా బలంతో ప్రభవించిన ఈ ప్రపంచం ప్యూర్ణబ్రహ్మంలో ప్రతిస్టితమై వున్నది. అంచేత అది రజ్జుసర్స భ్రమలాగా సత్యమూ కాదు, అసత్యమూ కాదు. అందుకే దానిని అనిర్వచనీయ నున్నారు.
(భ్రాంతిజ్ఞానం వల్ల అనుభినానికి వచ్చేది ఎన్నడూ సత్యం కాదు. అలాగే వస్తుతత్త్యాన్ని పరీక్షించే బాధకజ్ఞానం ఉన్న సత్యాన్ని కప్పిపుచ్చనూ లేదు. దీనికంతా ముఖ్యక రణం నూయకు రోనైన జీవత్వమే. ఈ కనిపించే సంసారం సత్యమైైనా, ఆసత్యమైనా దీనికి జీవుల భోగాభిలాషాయూతువు కాని మర్ క హేతువు రేదు.
98 యోగవాసష్థం
సంసారంలో అనుభవానికి వచ్చేవి కొన్ని ఫూర్వానుభవంతో సమానంగా వుంటాయి. మరి కొన్ని క్రొత్తవిగా వుంటాయి. ఇంక కొన్ని పూర్వానుభవంతో ఏ మాత్రం తేడా లేకుండా అచ్చం అలాగే వుంటాయి. వేరు కొన్ని సగం పోలిక కలిగి వుంటాయి. ఈ అనుభూతులన్నీ అసత్యాలే. ఐనా అవి సత్యంగా భాసిస్తాయి.
ఇప్పుడు నీకు కనిపించే ఈ మంటత్రులూ, పౌరులూ పరమార్ధ దృష్టితో చూస్తే పూర్వజన్మలో నివారే. వీరందరూ సత్యస్వరూపులే. అధ్యస్తదృష్టితో దేశకాలాదులను అనుసరించి చూస్తే కులాచార జన్మాదులలో వారికీ, వీరికీ పోలిక మాత్రం కనిపిస్తుంది. వైతన్యఫ్టితి సర్వత్రా ఇలాగే వుంటుంది.
ఈ భూపాలుని ఆత్మలో సర్వసాధారణ సత్యార్ధమైన ప్రతిభ ఉదయించినట్రే అంతకు ముందే అవ్యాకృతాకాళ స్వరూపుడైన ఈశ్వరునిలో సత్యసంకల్ప రూపమైన ప్రతిభ ఉదయించింది. జీవునిలో అంతర్యామిగా వున్న ఈశ్వరుని ప్రతిభ బాహ్యంగా వస్తువులను (ప్రతిబింబింప జేస్తుంది. అంచేతనే నీ కులశీలాదులతో సమానమైన కులశీలాదులు గల మరొక లీల ఉద్భవించింది.
రీలా! ఈ ఆకాశం, ఇందలి భువనం, ఇందలి భూమి, ఇందలి నీవూ, నేనూ, ఈ రాజూ - ఇదంతా చిన్మాత్ర స్వభావమైన 'ప్రత్యగ్రూహమే. తత్త్వజ్ఞులు దీన్ని అలాగే గుర్తించారు. నీవు కూడా అలాగే దీన్ని తెలుసుకో. తెలుసుకొని నీ నిజస్వరూపంలో ఏ విధమైన విశ్షేపం లేకుండా ప్రశాంతంగా వుండు !
- సత్యకామ సత్యసంకల్పాలు
నీ భర్తఈ విదూరథుడు యుద్దంలో మరణించి పూర్వజన్మకు చెందిన అంతఃపురం చేరుకొంటాడు. అక్కడ మళ్ళీ పద్మభూపాలుడుగా రూపొందుతాడు.
వసిష్మడు :- ఈ రీతిగా దేవి చెప్పిన మాటలు విని ఆమె యెదుట భక్తితో శిరసు వంచి అంజలి ఘటించి నిలబడి రెండవ లీల యిలా అన్నది -
రెండవ లీల :- దేవీ ! నేను సరస్వతీదేవిని నిత్యమూ అర్చించే దాన్ని. ఆమె నాకు రాత్రి వేళల్లో కలలో దర్శనం ఇచ్చేది. అమ్మా ! నీవు అచ్చం ఆ దేవిలాగే వున్నావు.
అందువల్ల దయచేసి నాకు వరం (ప్రసాదించు. వసిష్టుడు :- అప్పుడు సరస్వతి ఆమె పూర్వం భక్తితో కావించిన పూజలను స్మరించి (ప్రసన్నురాలై ఆమెతో ఇలా చెప్పింది -
ఉత్పత్తి ప్రకరణం ౦9
సరస్వతి :- బిడ్డా! బ్రతికినంత కాలం అనన్యమైన దృధభకితో నన్ను నీవు సేవించావు. నీ భక్తికి నేనెంతో సంతోషించాను. నీ కిష్టమైన వరం కోరుకో 1
రెండవ లీల :- అమ్మా! ఈ రణరంగంలో మరణించిన నా భర్త ఎక్కడికి వెళతాడో, అక్కడికే నేను కూడా ఈ శరీరంతో సవా వెళ్ళి ఆయనకు భార్యగా వుండేటట్టు వరం అనుగ్రహించు!
సరస్వతి :- వత్సా! అసాధారణమైన భక్తితో నీవు నన్ను చిరకాలం పూజించావు. అందువల్ల నీ అభీష్టం నెరవేరుగాక 1
వసిష్టుడు :- దేవి వరం అనుగ్రహించగానే రెండఎ లీల ముఖం సంతసంతో వికసించింది. అప్పుడు మొదటి లీల సందేహంతో దేవి నిలా (ప్రశ్నించింది -
మొదటి లీల :- దేవీ! సత్యకాములూ, సత్య సంకల్పులూ, (బ్రహ్మ స్వరూపులూ అయిన మీ బోటి వారి అఖభీస్టైలన్నీ త్వరలో నెరవేరుతాయి. ఈమెను నీవు ఈ శరీరంతోనే ఆ లోకానికి వెళ్ళేటట్టు అనుగ్రహించావు. నీ సత్య కామత్వబలంతో ఈ లోకానికి నా పూర్వ శరీరంతోనే నన్నెందుకు తీసుకు రాలేదో చెప్పు.
సరస్వతి :- వరవర్షినీ ! నేను నా సలకల్పబలంతో ఎవరికీ ఏమీ చేయను. ప్రతి జీవీ తన సంకల్ప ఫలాన్నే తాను పొందడం జరుగుతుంది. ప్రతి జీవికీ పూర్వ కర్మ వాసనతో కూడిన జీవశక్తి స్వరూపిణి అయిన చిచ్చక్తి ఉంటుంది. ఏ జీవునిలో ఎలాంటి చిచ్చక్తి కల్గుతుందో, ఆ జీవునికి అలాంటి ఫలమే లభిస్తుంది. సంవిదధి దేవతనైన నేను (ప్రాణులు కోరిన భావిశుభాన్ని మాత్రమే వరదానంతో బహిర్గతం చేస్తాను. పూర్వం నన్ను ఆరాధించే సమయంలో “నేను ముక్తి పాందుదును గాక!* అన్న జీవశక్తి నీలో కలిగింది. దాని కనుగుణంగా నేను నీకు ప్రబోధం కలిగించాను. అందువల్ల నీవు నిర్మలభావం పొందావు. మోత్షం కావాలన్న నీ భావనే నీకు మోక్షం (ప్రసాదించింది.
ఫలం పురుష ప్రయత్నాధీనం. ప్రతివానికీ తన విచ్చక్తే తపస్సు గానో, దేవతగానో రూపొంది ఆకాశఫలం వంటి మిథ్యాఫలాన్ని ప్రసాదిస్తుంది. తన చిత్రయత్నం తప్ప ఫలప్రదమైనది మరొకటి లేదు. నీ కోరిక ప్రకారం నీ ప్రయత్నం కొనసాగించు. సర్వత్రా ఈ చిద్భావ మొక్కే వ్యాపించి వున్నది. ఫలం దాని ననుసరించే వుంటుంది. అందుచేత నీవు మంచి చెడ్డలను వచారించుకో. ఏది మంచి దిని భా ఏస్తావో దాన్నే అనుష్టించు.
క్16
100 యోగాసం విదూరథుని నిరమనం శ్రీరాముడు :- ఇంటిలో వీరిలా మాటాడుతూ వుండగా కోపంతో గృహంనుండి బయలుదేరిన విదూరథుడు ఏమి చేశాడు ? వసిష్టుడు :- విదూరథుడు చుక్కలతో గూడిన చం(ద్రునిలాగా పరివారంతో సహా ఇంటినుండి బయలుదేరాడు. హోరాది భూషణాలు ధరించి జయ జయధ్వనులతో అతడు ఇంద్రుని లాగా ముందుకు సాగాడు. తన సేనల పరిస్టితి వింటూ, యోధులకు తగిన ఆదేశా లిస్తూ, వీరులను పరికిస్తూ ఆ భూపాలుడు రథం అధిష్టించాడు, గిరి శిఖరంలా సమున్నతమై మణిదీప్తులతో జాజ్వల్యమానంగా మెరసి పోతున్న ఆ రథం రెహెపలాడేఐదు పతాకలతో శోభిల్లింది. దేవ విమానాన్ని పోలిన ఆ రథాన్ని వాయుమేాన్ని మించిన వేగం గల ప్రశస్తమైన ఎనిమిది గుజ్టాలు యుద్రభూమి వైపు లాక్కువెళ్ళాయి ఇంతలో దారుణమైన దుందుభిధ్వని కొండగుహలనుండి వెలువడే ప్రతిధ్వనితో సహా నలుదెసలా వ్యాపించింది. మదించిన సైనికులు పోరాటానికి సిద్దమయ్యారు. ఆయుధాల ఘర్హణ ధ్వనులతో, యుద్రభటుల పరస్పరాహ్వానాలతో, ఆర్హుల ఆ|క్రందనలతో (బ్రహ్మాండకుహరం అంతా శిల వలె ఘనీభవించిన ట్లయింది. పిమ్మట దట్టమైన ధూళి సూర్యుని త్రోవను నిరోధిస్తూ ఆకసాని కెగబ్రాకింది. యౌవనంలో మూఢత్వం ఆవరించినట్టు దశదిశలా చీకట్లు క్రమ్ముకొన్నాయి. పగటివేళ నత్షత్రాలలాగా దీపాలు రూపుమాసిపోయాయి. నిశాచరగణం బలపడింది. దేవి ప్రసాదించిన దివ్యదృష్టితో ఇరువురు లీలలూ, రాకుమారీ మిక్కిలి భీకరమైన ఆ మహాయుద్దం చూచారు. విదూరథుడు నగరంనుండి వెలువడగానే అతని పట్టణాన్ని దోచుకొంటున్న దోపిడి దొంగల కలకలం శమించింది. ఆ రాజు తన బలానిక్తీ, శత్రుబలానికీ గల తారతమ్యం గ్రహించలేదు. మేరు పర్వతం ప్రళయ సాగరంలో ప్రవేశించినట్లు అతడు తన సేనను వెంటబెట్టుకొని శత్రుసైన్యంలో (ప్రవేశించాడు. వెనువెంటనే రణభూమిలో ధనుష్టంకారాలు (ప్రారం భవుయ్యాయి వివిధాయుధాలనే పక్షులు విహీయసంలో స్వైరవిహారం చేశాయి. అసస్తాలు శత్రువుల (ప్రాణాలను హరించాయి. వీరు లనే మేఘాలు శరపరంపర లనే వర్షం కురియిస్తూ గర్రించాయి. పెనుగాలికి రాలిన ఎండుటాకుల్లాగా శవాలు గుట్టులు గుట్టులై పడ్డాయి. నెత్తుటేళ్ళు ప్రవహించడంలో ధూళి శమించింది. శస్త్రజ్వాలల దీప్తితో చీకట్లు
ఉత్పత్తి ప్రకరణం 101 తొలగిపోయాయి. భటులు యుద్దం మీదనే వునస్సు నిల్పడం వల్త మాటలు నిలిచిపోయాయి. గాలి తాకిడిలేని వాన లాగా కొంతసేపు *బ్దరహితమైన కేవలయుద్దం జరిగింది. వివధాయుధ ప్రయోగాలతో భయంకరమైన ఆ సంగ్రామం భీరువులకు దుస్తరమై తోచింది.
- విదూరథ సింధుసమాగమం
అక్కడ ఘోరమైన యుద్దం అలా జరుగుతూ వుండగానే లీలలిద్దరూ సరస్వతీదేవితో ఇలా అన్నారు -
లీలలు :- దేవీ! నీ అనుగ్రహం మాపై ఉండికూడా ఈ యుద్దంలో మా భర్త జయించకపోవటానికి కారణ మేమి?
సరస్వతి :- ఈ విదూరథుని శత్రువు విజయం కోరి నన్ను చిరకాలం ఆరాధించాడు. మీ భర్త నన్ను అలా ఆరాధించలేదు. అందుచేత ఇప్పుడు సింధురాజే జయిస్తాడు. విదూరథుడు పరాజయం పాందుతాడు.
నేను సమస్త ప్రాణుల చిత్తంలో సంవేదననై వున్నాను. నన్ను ఎవడు దేన్లో (ప్రేరేసిస్తాడో,
వానికి ఆ కోరికను నేను ప్రసాదిస్తాను. ఆయాజీవుల కామకర్మవాసనాబలమే వారి వారికి ఆయా ఫలాలుగా పరిణమిస్తుంది. అలా పరిణమించడమేనా స్వభావం, అగ్నికి సహజమైన వేడిమిలో మార్పు తేనట్లేనా స్వభావంలో కూడా మార్పు ఉండదు. ఈ విధూరథుడు “నేను ముక్తుళ్లీ కావాలి' అన్న కాంక్షతో నన్ను భావించాడు. అందువల్ల అతడు ముక్తు డవుతాడు. ఇతని శత్రువైన సింధురాజు “యుద్దంలో నేను జయించాలి”! అన్న భావనతో నన్ను పూజించాడు. అందువల్ల విదూరథుడు పూర్వదేహం పాంది మీ యిద్దరితో కూడి కాలక్రమంలో ముక్తి పొందుతాడు. సింధురాజు ఇతల్లీ హతమార్చి రాజ్యానికి రాజవుళాడు.
వసిష్టుడు -:- దేవి ఇలా చెబుతూండగానే ఇరుసైన్యాల పోరాటం చూడటానికే అన్నట్టు సూర్యుడు ఉదయపర్వతం మీదికి వచ్చాడు.
(క్రమంగా వీకలట్టు చెదరి పోయాయి. నీలాకాశమూ, కొండలూ మెలమెల్లగా దృష్టికి గోచరించాయి. యుద్దభూ మలో శూరుల శరీరాల్పై రక్రచ్చలలు విందినట్లే బంగారు కాంతు లీనే సూర్యకింగా లు పర్వతాలపై ప్రసరించాయి. యుద్దంలో శస్త్ర సంఘటల్టునం వల్ల ఏర్పడిన నిప్పులు పూష్ఫింఎన అశో కవనాన్న స్పురింపజేశాయి.
102 యోగవాసిస్థం రక్తప్రవాహంలో కొన్ని శవాలు పురుష భ్రాంతిని కలిగించాయి. తెగిపడిన అవయవాలు చెల్టా చెదరై కనిపించాయి. ఉభయ పక్షాలకూ చెందిన యోధు లనేకులు పరస్పరయుద్దంలో హతులై పోవడంతో రణాంగణంలో ముందు భాగం శూన్యమయింది. అప్పుడు పద్మ నరపతి - సింధురాజుల రథాలు గగనంలోని సూర్య చంద్రులలాగా యుద్రభూమిలో ముందుకు సాగాయి. ఆ రథాలు చక్రశూలాదులైన వివిధాయుధాలతో నిండివున్నాయి. ఒక్కొక్క రథం చుట్టూ వెయ్యిమంది చొప్పున వీరులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు రెండూ అడ్డు వచ్చిన వారిని చక్రాల క్రింద నలిపి వేశాయి. అవి వుద గజాలలాగా నెత్తుటేళ్ళను దాటుకుంటూ అ(ప్రతిహతంగా వలందుకు సాగిపోయాయి. శత్రుసేనలపై శరధారలను వర్షించాయి. మేఘసాగరాల లాగా పరస్పరం ఆ రథాలనుండి రాజు లిద్దరూ ప్రయోగించిన ఇడ్గముఖాలు, ముద్గరముఖాలు, చ([క్రముఖాలు, పరశుముఖాలు, శక్తి ముఖాలూ, త్రిశళూలముఖాలూ ఇలా రక రకాల బాణాలు ఆకాశమంతటా దట్టంగా వ్యాపించాయి. అవి (ప్రళభయవాయుప్రేరితాలైన శిలల్దాగా నలుదెసలా పడ్డాయి. ఆ భూపాలుర పోరాటం కల్పాంత కాలంలో పరస్పరం విజృంభించిన రెండు సముద్రాల కలయిక లాగా భీకరమై కనిపించింది. " ఆయుధ వర్గనం ఎదురుగా వచ్చిన సింధురాజును చూచి విదూరథుడు కోపోద్ల్దీపితు డయ్యాడు. 'ప్రళయభానుడు కిరణాలను వెదజల్లినట్టు శర పరంపరల నతనిపై ప్రయోగించాడు. అతని ధనుస్సు నుండి వెలువడే బాణం ఒక్కటే ఆకసంలో పయనిస్తూ వెయ్యి బాణాలుగా, లవ్యాన్ని ఛేధించేటప్పుడు లక్ష బాణాలుగా విస్తరించింది. సింధునరపతి కూడా యుద్ర్దనైపుణ్యంలో విదూరథునికి ఏ మాత్రం తీసిపోలేదు. విష్టువర ప్రభావం వల్లనే వారిద్దరికీ ధనుర్యుద్దకౌశలం అలవడింది. ఇతువురి ధనుర్ద్వని వింటూ, యుద్ద వైపుణ్యం చూస్తూ ఉభయ సైన్యాలూ శాంతించిన సము(ద్రాలలాగా మూగవోయాయి. ఆకాళగంగా ప్రవాహం లాగా తెంపులేని శరధారలను విదూరథుడు సింధురాజుపై ప్రయోగిస్తున్నాడు. ఆ పట్టణానికి చెందిన రెండవ లీల కిటికీ నుండి ఆ దృశ్యం చూచింది. ౨మె తన భర్తకే జయం కల్గుతుందని భావించి ఆనందంతో ఇలా అన్నది -
ఉత్పత్తి ప్రకరణం 103
“దేవీ ! చూడు. మా నాథుడు తప్పక జయిస్తాడు. ఆయన ప్రయోగించే బాణ పరంపరకు మేరువైనా చూర్ణం కాక తప్పదు.*!
భర్త) స్నేహానికి లోనై అలా అంటున్న అ(ప్రబుద్దలీల మాటలకు దేవి, మొదటి లీల లోలోపల నవ్వుకొన్నారు ఇంతలో జహ్నుమహర్షి మందాకినిని పానం చేసినట్టు సింధురాజనే బడబాగ్ని విదూరథుడు (ప్రయోగించిన శరపరంపర లనే సాగరాన్ని త్రాగివేసింది. ఆ బాణాలన్నీ ధూళిగా మారి ఆకాశమనే సముద్రంలో లీనమయ్యాయి.
ఆరిపోయిన దీపం ఎలా పోతుందో తెలియదు. అలాగే విదూరధుని బాణాలు ఏమయ్యాయో తెలియకుండా పోయాయి. మళ్లీ అతడు బాణాలను గుప్పించాడు. ఇద్దరూ ఒకరి శరాలను మరొకరు వ్యర్దం కావిస్తూ ఒక జూము సేపు పోరాడారు. తరువాత సింధురాజు గంధర్వదత్తమైన మోహనా స్త్రం ప్రయోగించాడు. దానితో రిపుసైన్యంలో విదూరథుడు తప్ప తక్కిన వారందరూ మరణించిన వారిలాగా సమ్మోహితులై పడిపోయారు.
తరువాత విదూరథుడు ప్రబోధాస్త్రం ప్రయోగించి తన వారికి మోహవిముక్తి కలిగించాడు. ఆపై అతడు శత్రువు ప్రయోగించిన నాగా స్త్రాన్ని గరుడాస్త్రంతోనూ, తవెా౬_(స్తాన్ని సూర్యాస్త్రంతోనూ, రాక్షసాస్తాన్ని. నారాయణా స్త్రంతోనూ, ఆగ్నేయా స్తాన్ని వారుణాస్త్రంతోనూ , శోషణా స్రాన్ని పర్తన్యాస్త్రంతోనూ శమింపజేశాడు.
తరువాత సింధుభూపాలుడు వాయవ్యాస్త్రం ప్రయోగించేసరికి ప్రళయవాయునవులు భీకరంగా నలువైపులా వీచాయి.
తృతీయాస్త యుద్ధం .
విదూరథుడు పార్వతాస్త్రం ప్రయోగించి వాయవ్యాస్తాన్ని నిరోధించాడు. సింధురాజు వజ్రాస్త్రం ప్రయోగించగా బ్రవ్మోస్త్రంతో దాన్ని శమింపజేశాడు పిమ్మట సింధురాజు పేశాచాస్త్రం ప్రయోగించే సరికి తండోపతండాలుగా బయలుదేరిన పిశాచాలు విదూరథుని సైన్యాన్ని పెక్కు నిధాల భయ(భ్రాంతం చేశాయి. విదూరథుడు మాయాబలఅంతో పిశాచాలను స్వాధీనం చేసుకొని వాటిని శత్రుసైన్యం మీదికే ఫురికొల్పాడు. అంతేకాక రోషంతో రూసికా స్రాన్ని గూడా ప్రయోగించాడు. దానితో ఎకుతమైన ఆకితిగిల రకరకాల పూతనలు ఉద్బవించి పశాచాంతో కూడి ఏకమై సింధిరాజు సైన్యం పైకి లంఘంచాయి.
104 యోగవాసిష్థం
మాయా సంచారంలో నేర్పరి అయిన సింభునరపతి మళ్ళీ వాటినన్నింటినీ విదూరథుని సేనపైకి మళ్ళించి అందుకు తోడుగా బేతాళాస్రాన్నిగూడా ప్రయోగించాడు. దానితో శవాలు పైకి లేచి ఉజ్బుంభించాయి. ఈ రీతిగా పిశాచాలూ, బేతాళాలూ, పూతనలూ, శవాలూ కలిసి సమస్త భూతాలనూ (మింగడానికి పూనుకొన్నాయి. తరువాత విదూరథుడు గూడా వూయావిత్వం (ప్రదర్శిస్తూ రాక్షసాస్త్రం ప్రయోగించాడు. వెంటనే కొండలవంటి రక్కసులు లెక్కకు మిక్కిలిగా ఉద్భవించారు. రణక్వేత్రం సురాసురులకు సైతం భీతిగా ల్పేటటప్లై పొడకట్టింది.
విదూరధుని మరణం
ఆ ఘోర సమరంలో శత్రువులను హతమార్చి తన బలాన్ని కాపాడుకోవడానికి సింధురాజు సమంత్రకంగా వైష్ణహస్త్రం ప్రయోగించాడు. అందులో నుండి పుట్టిన వివిధాయుధాలు ఆకసాని కెగిరాయి. విదూరథుడు కూడా దానికి ప్రతిగా వైష్ణవా స్రాన్నే (ప్రయోగించాడు. ఉభయా స్త్రాలనుండి ఉదయించిన ఆయుధపంక్తులు పరస్పరం ఢీకొని శక్తి విీహీనాలు కాసాగాయి.
అప్పుడు సింధురాజు “ఇతడు నేను ప్రయోగించిన అ(స్తాలను నివారిస్తూ కాలయాపన చేస్తున్నాడు. నా ముందు ఇతని బలం ఎంత ?** అని అహంకరించాడు. వైష్ణవాస్తాలు ఒకదాని నొకటి శమింపజేశాయి.
ఇంతలో విదూరథుడు సింధురాజుపై అగ్నేయా'స్త్ర ప్రయోగం చేశాడు. దానివల్ల సింధుభూపాలుని రథం భస్మమై పోయింది. వారుణాస్త్రంతో శత్రువు ప్రయోగించిన అస్ర్తాన్ని శమింపజేకి సింధురాజు నేలపై నిలిచాడు. ఖడ్గం చేపట్టి రెప్పపాటులో విదూరభుని రథాశ్వాల గిట్టులను నరికివేశాడు. విరథుడైన విదూరథుడు గూడా కత్తి చేతబూని పోరాటానికి ఉప(క్రమించాడు. తరువాత కొంతసేపటికి కత్తి వదలిపెట్టి అతడు సింధురాజు వక్షష్టలం పైకి శక్తిని విసిరాడు. ఆ శక్తి ఘాతానికి అతడు మరణించలేదు. ఏనుగునుండీ మదజలం ్రవించినట్టు అతనినుండి రక్తం మాత్రమే (స్రవించింది.
అప్పుడు రెండవ లీల మొదటి లీలతో ఇలా అన్నది - ''దేవీ చూడు. మన భర్త శత్రువుపై శక్తి ప్రయోగంతో దెబ్బదీశాడు. అతని శరీరం నుండి నెత్తురు బాట బొట కారుతున్నది. అయ్యయ్యో ! సింధురాజు తనకై తెచ్చిన మరొక రథం అధిస్టిస్తున్నాడు. చూడు చూడు 1! మన నాథుడు ముద్గరంతో ఆ రధాన్ని చూర్ణం చేసి తనకై వచ్చిన
ఉత్తుత్తి ప్రకరణం 105 మరొక రథిం అధిష్టించబోతున్నాడు. అయ్యో! క్షం! ఇంతలోనే సింధురాజు ముసలం ప్రయోగించాడు. ఆహా! మన ప్రాణేశ్వరుడు ఆ ఆయుధవేగాన్ని తప్పించుకొని రథం అధిష్టించాడు.
అయ్యయ్యో! సింధురాజు శరవృష్టితో ఆర్యపు త్రుణ్లి బాధిస్తున్నాడు. వ'జ్రసద్బశమైన బాణాలతో మననాథుని రథాన్నీ, వాహనాలనూ, సారథినీ భగ్నంచేసి ఆయనను నేలగూలేటట్లు చేశాడు.
బలే। ఆర్యపుత్రుడు మరాక రథం ఎక్కబోతున్నాడు. అయ్యో ! అయ్యయ్యో! ఆయన స్కంధంపై కత్తి(వ్రేటు పడింది గమనించావా ? దెబ్బకు రక్తం ధారలై ప్రవహిస్తున్నది. అమ్మో! ఇంకేముంది! ఆ దుర్మార్గుడు ఖడ్గంతో ఆర్యపుత్రుని పిక్కలను నరికివేశాడు. ఆయన మోకాళ్లు రెండూ తామర తూళ్ళలాగా తెగిపోయాయి. ''వా! హో! హతా౬స్మి! మృతా£._స్మి!”” అలా అంటూ రెండవలీల గొడ్డలి (వేటుకు తెగిన తీగలాగా మూర్చపాంది నేల (వ్రాలింది.
మోకాళ్ళు తెగిన విదూరథుడు రథం నుండి నేలపై బడబోతుండగా సూతుడు
' ఆయనను అలా పడనీకుండా నిలిపి రథాన్ని నగరం వైపు త్రిప్పాడు. ఇంతలో శత్రువు వేసిన కత్తి(వ్రేటుకు విదూరథుని మెడ సగం తెగిపోయింది. సింధురాజు నగరం వైపు వెళ్తున్న రథాన్ని వెంబడించాడు. రథం విదూరథుని గృహం (ప్రవేశించింది. సరస్వతీదేవి (ప్రభావంతో సింధురాజు ఆ యింటిల్' ప్రవేశంపలేక వెనక్కు మళ్లాడు. మరణ శయ్యపై వున్న విదూరథుళణ్లి సూతుడు సరస్వతీదేవి చెంతకు తెచ్చి వదలి పెట్టాడు. సింధురాష్ట్ర వర్ణనం
విదూరథుడు శత్రువు చేబిక్సి మరణించినాడన్న వార్త వ్యాపించగానే రాష్ట్రమంతా భయాకుల మయింది. స్త్రీల ఆక్రందన ధ్వనులు నలుదిక్కులా వ్యాపించాయి. నగర వాసులు దిక్కు తోచక అటూ ఇటూ పరుగెత్తారు. దొంగలు విచ్చల విడిగా సంచరిస్తూ పట్టణాన్ని దోచుకున్నారు. శత్రుసైనికులు నగరంలో ప్రవేశించి నానాబీభత్సం సృష్టించారు. యువకులు యువతుల కేశపాశాలు పట్టుకొని ఈడ్చుకుపోయారు. కోశాగారపు తలుపులు ఏరిగిపడుతున్న భయానక ధ్వనులు మిన్ను ముల్టాయి. పామరజనులు రాజగ్సహంలో దూరి రాజభోజనాలు ఆరగించారు. పరుగిడుతున్న దొంగల చేతులనుండి జారిపోయిన రత్నాలు వీళులల్ో చెల్లాదెదరై పడ్డాయి.
106 యోగవాసిష్టం
ఇంతరో సింధుభా పాలుని పుంద్రులు ఆంని కువూరుణ్లి ఆ రాజ్యంలో అభిషేకించడా నికి తగిన ప్రయత్నాయి చేశారు వగిరంలోనే కాక 3దూ రథున ఏలుబడిలో వుండిన ఇతర జనపదాలలో కూడా అరా ఎకం ప్రబలింది. మరణించినవారి బంధువుల ఏడ్పులవర్ధా, గజ తురగ రథాల కదలక ఎల్టా కలిగిన శబ్దాలు నలుదెసలకూ- విస్తరించి ఘనీభవంచినట్టు తో వాయి.
ఆ తర్వాత ' ఏకచ్చ(త్ర మండలాధీశ్వరుడు సింధురాజుకు జై అన్న ఉద్దోషంతో పాటు భేరీనినాదం ప్రతి నగరంలోనూ శ్రవణగోచరమయింది. పుత్రుణ్ణి వదూరథ రాజ్యంలో పట్టా భిషిక్తుళ్లీ చేసి సింధురాజు తన రాజధానికి తిరిగి వెళ్ళాడు.
పిమ్మట రత్నాలు సముద్రంలో (ప్రవేశింఛినట్టు గజాలు, తురగాల రూపంలో దశదిశలనుండీ వచ్చిన కప్పాలు సింధునరపతి పట్టణం చేరుకొన్నాయి. అతని మంత్రులు రాజ్యవంతటా రాజనామాంకితమైన "చిహ్నాలనూ, చట్టాలనూ, నిబంధనాలనూ నెలకొల్ప జేశారు. అత్యంత కఠోరమైన ఆ శాసనాలు వెంటనే అమలులోకి వచ్చాయి. తుఫాను నిల్చిపోగానే పదార్దాల కదిలిక ఉపళశమించినట్టు ఆ తరువాత దేశంలో ఉపద్రవాలన్నీ శాంతించాయి. మందం పర్వతం తొలగిన తర్వాత క్షీర సాగరం శమించినట్లే దేశం (ప్రశాంత మయింది.
సింధు స్త్రీల ముఖ కమలాలపై ఉన్న ముంగురులనే తుమ్మెదలను కదిలిస్తూ, వారి స్వేదజలకణస్పర్శంతో చల్లబడిన వాయువులు సంతాపం మొదలైన అమంగళ గుణాలను దూరీకరింపజేస్తున్నవా అన్నట్టు వీచాయి. -
మరణానంతర దేహప్రతిభ
ఇంతలో శ్వాసమాత్రం మిగిలి మూర్చితుడై వున్న భర్తను చూచి ప్రబుద్ద లీల సరస్వతితో - “'అమ్మా! నా భర్త శరీర పరిత్యాగం చేయడానికి సిద్దంగా వున్నాడు'” అని చెప్పింది.
అప్పుడు సరస్వతీదేవి ఇలా అన్నది -
““రీలా! ఈ మహాయుద్దం, రాష్ట్ర పప్టవం జరిగినట్టు తోస్తున్నా జరిగినవి కావు. ఈ రాష్ట్రైనికీ, భూతంానికీ ఉనికి లేదు ఈ జగత్తు స్వప్ప్నాత్మకమైనది.
ఈ* భూరాష్ట్రం పద్మనరపతి శవం వెంత వున్న గుహాకాశంలో భాసిస్తున్నది. ఆ గృహాకాశం వింధ్య పర్వత సమీపంలో వున్న అసిష్టుని గృహాకాశింలో వున్నది. మూడు
ఉల్పత్తి ప్రకరణం 107 లోకాలకు చెందిన ఈ (భ్రము, నీవు, నేను, ఈ లీల, ఎదూంథుడు, సాగరపరివృతమైన ఈ భూమండలం - ఇదింతా ఆ గిరి గ్రామంలోని గృహాకాశంలోనిదే.
తన ఆత్మే ఒక్కౌక్కసారి అర్దరహితమై ఈ రీరిగా భాసిస్తుంది. ఒక్కొక్కసారి ఏ విధమైన భావమూ లేకుండా కేవలాత్మగా వుండి పోతుంది. దానికి ఉత్పత్తి వినాశాలు లేవు. అది అనామయమూ, శాంతమూ అయిన సరమ పదం. మండస గృహాలలో అలా వ్యక్తమయింది ఆ ఆత్మే. మండపాల మధ్య వున్నది ఛళూన్యాకాళశమే కాని జగత్తు లేదు. అది ఉన్నట్టు తోచడం (భ్రమ మౌత్రమే.
(భమను చూచేవారు లేకుంటే భ్రమ ఎలా ఉదయిస్తుంది ? (భమకు ఉనికి లేనే లేదు. ఉన్నది పరమపద మొక్కటే.
దృశ్యానికి చెందిన భమ సత్యం కానేరదు. ద్రష్టకు దృశ్యత్వం ఎలా కల్గుతుంది? కర్రే కర్మగా గూడా వుండడానికి వీలు లేదు కదా ! (ద్రష్ట లేనప్పుడు దృశ్యానికి స్రితి లేదు. అందుచేత ఆ సహజపదం అద్వయ మైనదే.
మండప గృహాలలో వుండే జనులు వారివారి స్వభావాల కనుగుణంగా స్సురించిన ఆత్మలోనే తమ తమ వ్యవహారాల కనుగుణమైన దేశకాలాది వ్యవస్థలతో విహరిస్తున్నారు. అందులో జగత్తుగాని, స్పష్టిగాని తత్త్వజ్ఞులైేన వారి అనుభవానికి గోచరించడం లేదు. అందువల్ల ఈ కనిపించే జగిత్తు ఆకాశరూపమైన పరబ్రహ్మం కంటే వేరు కానే కాదు. కలలో కనిపించే పట్టణంలాగా మేరువు మొదలైన పర్వతాలలో కూడిన ఈ జగజ్ఞాల మంతా శూన్యాత్మ స్వరూప జ్ఞాన మాత్రమే కాని మరేమీ కాదు.
కలలో హృదయ మధ్యగతమైన సూత్ష్మాకాశంలోనే వజకఠినమైన లక్షలకొలది జగత్తులు తోస్తున్నాయి. ఒక్క అణువులోనే అనేక జగత్తులు అరటి చివుళ్ల లాగా సంభవిస్తాయి. చిద్రూపమైన అణువులోనే ముల్లోకాలూ వుంటాయి. ఆ లోకాలలో మళ్లీ చిదణువులు ఉంటాయి. ఆ అణువుల్లో మళ్లీ జగత్తు వుంటుంది.
నీ సవతి అయిన లీల ఇప్పుడు ఏ జగత్తులో పద్మరాజు శవమై వున్నాడో, ఆ జగత్తును " చేరుకున్నది. నీ ముందర ఈ లీల ఎప్పుడ మూర్స్చిల్లిందో, అప్పుడే అతని శవం చెంతకు వెళ్లింది.
లీల :- దేవీ! ఇంతలోనే ఆమె అక్కద ఎలా దేహం ధరించింది ? నాకెలా అమె సవతి కాగలిగింది ? ఆ యింటిలో వున్నవారు ఆమెను ఏ విధంగ్శా చూస్తున్నారు? మంటున్నారు ? దయాేసి ఈ* సంగితి వరించు
108 యోగవాసిస్టం
దేవి: - లీలా ! నీ వడిగిన ఏషయం వివరంగా చెబుతాను. నిజానికి మరొక లీలగా రూపొందిన నీ వృత్తాంతమే ఇది దీన్ని ఏంచే మరణం, పరలోక గమనం మొదలైన దుర్దశలన్నీ స్పష్టంగా గోచరిస్తాయి.
విదూరథుడుగా రూపొందిన నీ భర్త పద్మనరపాలుడు తన శవం నెలకొని వున్న ఆ గృహంలోనే ఈ జగద్భ్రాంతి నంతా చూస్తున్నాడు. ఈ యుద్దం, ఈ లీల, ఈ మరణం- ఇదంతా భ్రమాత్మకమే. ఈ సంసార మంతా (భ్రాంతే. ఆ కారణం వల్లనే అతనికి లీల భార్య అయింది నీవు, ఆమె - ఇదంతా స్వప్న మాత్రమే. అతనికి మీరు స్వప్నమైనట్లే, మీకు అతడు కూడా స్వప్నమే. చివరికి నేను గూడా స్వప్పమే.
ఈ జగత్తు ఇలా భాసించడాన్నే దృశ్య మంటారు. తత్త్వం తెలిస్తే దీని దృశ్వత్వం మాయమై పోతుంది.
ఈ లీల, నీవు, రాజు, నేను - మనమంతా సర్వాత్మకమైన ఆత్మ స్వరూపులం. ఆత్మ దృష్టితో చూచినప్పుడు సత్యస్వరూపులం. సర్వాత్మకమైన ఆ చిత్స్వరూపం నుండే మిథ్యాకల్పనా(ప్రభావం వల్ల మనం ఉదయించాము. అదే రీతిగా నీ భర్త నిన్ను మనస్సులో సంకల్పించడం వల్లనే నవ యౌవన శాలిని, మధురభాషిణి, ఉత్పల పద్రనేత్ర, కాంచన గౌరాంగి అయిన ఈ లీల అచ్చం నీ పోలికతోనే ఇక్కడ రాణిగా ఆవిర్భవించింది. నీభర్త మరణించిన తత్షణమే నిన్నతడు సంకల్పించడంవల్ల అతని ముందట ఆమె అలా సాక్షాత్కరించింది.
చిత్తంలో వాసనాప్రభావం వల్ల ఆధిభౌతికభావం అనుభవానికి రాగానే దృశ్యం సత్యంగా భాసిస్తుంది. వివేకంతో ఆధిభౌతిక భావం నిజం కాదని గ్రహించినప్పుడు అది అసత్యమై పోతుంది. మరణ సంవేదనానంతరం పునర్హన్మ (భ్రమ కలగగానే నిన్ను సంకల్సించుకొని నీ భర్త మరొక లీలగా రూపొందిన నీ తోనే అక్కడికి వెళ్ళాడు.
విదాత్మ సర్వవ్యాపి క-వడం వల్ల నీవు అతగీ, అతడు నిన్నూ వాసనామయ స్వరూపంతోనే చూచుకొన్నారు. బ్రహ్మ సర్వగతం. అందుచేత విక్షేప శక్తితో వాసనాను గుణంగా ఉదయించే పదార్దాలను జీవుడు చూడగల్లుతున్నాడు.
ఆత్మ సర్వ శక్టీ సంపన్నమైనది. అందువల్ల దృఢాభినివేశ వాసనతో ఎక్కడ, ఏ భావన కల్లుతుందో , అక్కడ అది ఆ రూపంతో భాసిస్తూ వుంటుంది మరణమోహానికీ గురి అయిన వెంటనే దంపతులైన వారిద్దరూ హుదయంలో వాసనోద్వ్చోధం వల్ల ఇలా భాంంచారు -
ఉత్పత్తి ప్రకరణం 109
““వీరు మన తల్లి దండ్రులు, ఇది మన దేశం. ఇది మన ధనం. ఇది మనం పూర్వం చేసిన పని. మనం ఇద్దరం పెండ్లి చేసుకొని ఒక్కటయ్యాము”'
వారి దృష్టికి అక్కడ ఉన్న ఇతర జనులు కూడా సత్యంగానే తోచారు. లీలా! దీని కంతా (ప్రత్యక్షమైన చక్కని దృష్టాంతం స్వప్న వేదనమే. ఈ లీల నేను ''విధవను కాకుందునుగాక !** అని (ప్రార్ధించి నన్ను పూజించింది. నే నామె కలాగే వరమిచ్చాను. అందుచేతనే భర్తకంచే ముందే ఆమె మరణించింది. వ్యష్టి చేతనాంశాలైన మీకు సమప్టిచేతన ధర్మిణి నైన నేను సదా పూజింపదగిన కులదేవతను. మీకు నాపై భక్తి కలిగేటట్టు నేనే చేస్తుంటాను.
అంగుష్ట మాత్ర పరిమితమైన ఈమె జీవం ప్రాణవాయు రూపం ధరించి మనస్సంకల్పానుగుణంగా కదలి నాడీమార్గంలో దేహంనుండి వెలువడింది. ఈ గృహంలోనే మరణ మూర్చానంతరం తన భావన కనుగుణమైన రూపం పొందింది.
సిమ్మట పూర్వ స్మరణ వల్ల త్వరగా భర్తను కలుసుకోవడాన్గో రవికిరణ స్పర్థగల పద్మిని లాగా వాసనావికాసం కలదై సర్వాంగసుందరిగా రూపాందింది. పద్మభూపాలుని గృహమండపం చేరుకొన్నది.
సంసార విదిత వేద్యం
సరస్వతీదేవి అనుగ్రహించిన వరంవల్ల లీల అవాసనావుయ శరీరంతోనే ఆకాశమార్గంలో పతిని చేరుకోవటానికి వెళ్ళింది. పతి చెంతకు పోతున్నానన్న ఉత్సాహంతో ఆనందంగా ఆమె పక్షిలాగా గగనంలో తేలికగా ఎగిరిపోయింది. సరస్వతి పంషగా అక్కడ తనకంచే ముందే చేరుకొని తనకై ఎదురుచూస్తున్న కుమార్తెను చూచింది. ఆ కుమారి తల్లికి స్వాగతం పలికింది.
లీల ఆమెను *' నీ తండ్రి చెంతకు నన్ను తీసుకుపో'' అని కోరింది. *ర 1 అక్కడికే పోదాం”' అని చెప్పి ఆ కుమారి ముందు నిలబడి తల్లికి దారి చూపింది. ఆమెననుసరించి పయనిస్తూ లీల అంబరతలం ప్రవేశించింది. ఆపై వారు మేఘమార్గం, వాయుమండలం, సూర్యపథం, తారామార్గం, ఇంద్రాది దేవతల లోకాలూ, (బ్రహ్మాది (త్రిమూర్తుల భువనాలూ దాటారు. పగిలిపోని కుండనుండి మంచు చల్లదనం వెలికి వచ్చినట్టు (బ్రహ్మాండ కర్స్పరంనుండి వెలుపలికీ వచ్చారు చిత్తమాత్ర శరీరం కలిగిన లీం తన సంకల్పం వల్లనే కల్షిన ఈ ఎ(భ్రమా"ల నన్నింటిని తనలో తానే అనుభపించింది.
110 యోగవాసిష్టం
ఈ రీతిగా అన్ని ఆవరణలూ అతి|క్రమంచి మహావేగంతో పయనించి లీల శతకోటి కల్పాలు పరుగిడినా గరుత్మంతుడు సైతం అంతు చూడలేని మాయాసంవలితమైన చిదాకాళశం చేరుకొన్నది అక్కడ మహావనంలో లెక్కకు మిక్కిలిగా పంద్లున్నట్లే లక్షలకొలది (బ్రహ్మాండా లున్నాయి. రేగిపండులో క్రిమి ప్రవేశించినట్లు ఎదురుగా ఉన్న ఒకానొక (బ్రహ్మాండంలో ఛిద్రం చేసుకొని లీల అందులో ప్రవేశించింది.
అక్కడ తారా పథంనుండి క్రిందికి దిగి భూమండలం చేరి పద్మ భూపాలుని నగరం చేరుక్ న్నది. ఆ నగరంలోని మండపంలో పూలతో కప్పబడి వున్న నరపాలుని శవం దగ్గలు నిలిచింది
ఇంతలో ఆ లీలకు తన కుమార్తె కనిపించకుండా పోయింది. ఎజుక గల్గినప్పుడు మాయ మాయమైనట్లే ఆ కుమారి ఎక్కడికో వెళ్ళిపోయింది
ఆపై శవరూపుడై ఉన్న తన భర్త ముఖం చూచి లీల తనలో తాను ఇలా ఊహించుకొన్నది - ' యుద్దంలో సింధురాజుచేత ఎ౨రణించిన నా భర్త ఇతడే ఈ వీరలోకానికి వచ్చి ఇక్కడ సుఖంగా శయనించి వున్నాడు. నేను దేవి అనుగ్రహం వ్ల పతి చెంతకు చేరుకొన్నాను నేనెంతో ధన్యురాలను. నాతో సాటి రాగల వారెవరూ లేరు.” ఇలా అనుకొంటూ ఆమె రమణీయమైన చామరం చేతపట్టుకొని వీచింది.
(ప్రబుద్రలీల - - దేవీ! ఆ భృత్యులూ, అక్కడి దాసీజనమూ, ప్రబుద్దుడైన రాజూ ఆ లీలను చూచి ఏమనుకొన్నారు ? ఆ సంగతి వివరించు
దేవి - అందరిలో వున్న చిదాకాశం ఒకటే కావడంవల్టా, మన ప్రభావం వలా, (బ్రహ్మవచైతన్య ప్రతిభాసం వర్గా, ఈశ్వర సంక్షల్పంవల్లా ఆరాజూ ఆ భృత్యులూ అందరూ ఈమె నా భార్య ఈమె నా నెచ్చెలి, ఈమె నా రాణి, ఇతడు నా భృత్యుడు అని ఈ రీతిగా అనుకొన్నారు నీకూ, నాకూ, ఆ లీలకూ - మనకు మాత్రమే నిజంగా ఏమి జరిగిందో తెలుసు ఇతరుల కెవ్వరికీ ఏమీ తెలియదు.
'ప్రబుద్దలీల - దేవీ! నీ వర ప్రభావంతో ఆ లీల తన స్టూల శరీరంతోనే ఎందుకు పతి వద్దకు పోలేదు ?
దేవి - నీడ ఎండను సమీపించజాలనబ్టు ఆత్మ(ప్రబోధం లేనివారు పుణ్యంనల్ల సం ్రాప్తమైన సిద్దిల్ కాలను స్వశరీంంతో చేరుకోలేరు సష్ట్యాదిలోనే సత్యం అసత్యంతో కలఎదను ప్రబుద్దులైన ౪ రణ్యగర్చుడు మొదలైనవారు నర్లయించ వున్నారు
బేతా చుడు _న్నాదన్న దధ సంకల్ఫం కల బాలునకి ' బేతా ఖుదు లేడు' అన్న ఎశ్చయిం
ఉత్పత్తి ప్రకరణం 111 ఎలా కలుగుతుంది ? అవివేక మనే జ్వరంవల్ల ఏర్పడిన వేడి ఉన్నంతకాలం వివేక మనే చల్లదనం ఉదయించదు కదా |! ఎవడు ““నా శరీరం పంచ భూతాత్మక మైనది నాకు ఆకాళగవునం లేదు*' అనే నిశ్చయంతో వుంటాడో, వాడు ఆకాశంలో ఎలా పయనించగలడు ? అందువల్ల జ్ఞానంతో, పుణ్యంతో, వర ప్రభావంతో మాత్రమే నీ దేహంవంటి దేహంతో జనులు పరలోకానికి వెళ్ళగలరు,
ఎండుటాకు నిప్పులో పడిన వెంటనే కాలిపోతుంది. అలాగే ఆతివాహిక దేహం లభించగానే స్థూల శరీరం నశించిపోతుంది. వరం, శాపం అనేవి కూడా పూర్వవాసనల ననుసరించే సంభవిస్తాయి.
(త్రాడును చూచినపుడు 'ఇది పాము' అనే భ్రాంతి కలిగినా ఆ త్రాడు సర్పంలాగా పనిచేయదు. స్వస్వరూపమే లేనిదానికి కార్యకారిత్వం ఎలా సిద్దిస్తుంది ?
“ఇది మరణించింది? - అన్న మిధ్యాభావం కూడా పూర్వాభ్యాస విజంభణమే. జగజ్ఞాలం స్వానుభవానికీ వచ్చినపుడు ఇలాంటి సంసార (భమలు కలుగుతూ వుంటాయి. అంతే కాని ఇవి ఎ హిరణ్యగర్భుడో, ఈశ్వరుడో కల్పించినవి కావు. సృష్ట్యాదినుండి ఈ అభ్యాసం ఇలాగే వున్నది. “
అజ్ఞానులైన వారికి బాహ్యభూతాలకు చెందిన ఈ సంసార (భాంతులు కలుగుతాయి అవి రెండవ చంద్రబింబంలాగా హృదయాంతరాళంలో కల్ప్సింపబడుతూ వుంటాయి.
మరణ విచారం
అందువల్ల తత్త్వం తెలిసినవారూ, యోగా భ్యాసాత్మకమైన ధర్మాన్ని ఆ(శ్రయించినవారూ మాత్రమే ఆతివాహిక లోకాలను చేరగలరు ఇతరులు చేరలేరు.
ఆధిభౌతిక దేహం మిధ్య మాత్రమే దానికి సత్యంలో నిలకడ ఎలా కలుగుతుంది? ఎండలో నీడ ఎలా వుంటుంది ? లీల తత్త్వజ్ఞురాలు కాదు యోగజమైన ధర్మం కూడా ఆమెలో లేదు. అందుచేత ఆమె భర్తృ నగరాన్ని మాత్రమే చేరుకోగల్లింది
'ప్రబుద్రలీల్ల - అమ్మా! అది సరే! అదుగో నా భర్త ప్రాణత్యాగానికి ప్రవృత్తుదైనాడు. ఇప్పుడు కర్తవ్యమేమి ? దేహాదులకు సుఖదుఃఖాది విషయాలలో నియతిగాని, అనియతి గాని ఎలా ఏర్పడ్డాయి ? ఘటాది పదార్దాల ఉనికి ఎలా సిద్రిస్తుంది? మంచుకు చల్లదనం అగ్నికి వేడి ఇత్యాది స్వభావాలు ఏ రీతిగా కలిగాయి? వాస్తవ పదార్దాల స్థూంత్వం,
112 యోగవాసష్టం ఇం(ద్రియాదులకు సూత్షుత్వం - అనేఎ ఏ విధంగా రూ పొందుతున్నాయి
దేవి :- మహాప్రళభయంలో పదార్హాలన్నీ నశిస్తాయి అనంతమూ శాంతమూ అయిన స(ద్ర్రహ్మమొక్కటే మిగిలి ఉంటుంది చిద్రూ పమైన ఆ బ్రహ్మానికి * నేను తేజఃకణాన్ని అనే అనుభవం కలుగుతుంది వెంటనే ఆది తేజుకణంగా మారి స్టూలత్వం పొంది (బ్రహ్మాండంగా రూపొందుతుంది ఉనికి లేనిదై కూడా ఆ బ్రహ్మాండం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ (బ్రహ్మాండంలో హిరణ్యగర్చ్భుడనే బ్ర్మూ ' నేను బ్రహ్మను అని గ్రహీస్తాడు పీదప అతడు తన మనోరాజ్యాన్ని విస్తరింపజేస్తాడు ఆ మనోరాజ్యమే ఈ జగత్తు ఆ సృష్ట్యాదిలో సంకల్ప వృత్తులకు సంబంధించిన నియతి, అనియతి ఎలా భాసించాయో, అవినేటికీ అలాగే వున్నాయి.
చిత్త స్ఫూర్తి ననుసరించే ఆత్మ చైతన్యం స్సురిస్తుంది. అందుచేత నియతికీ లోబడని కార్య మేదీ జరగదు. విశ్వరూపికి ప్రళయకాలంలో గూడా సర్వవస్తు శూన్యత్వం అనేది సంభవించదు. కటకాద్యాకారాన్ని వదలి స్వర్ణం ఎలా ఉండగలదు ?
సృష్ట్యాదిలో చిత్తు మంచు, నిప్పు మున్నగు రూపాలతో ఎలా ఆవిర్భవించిందో, అలాగే ఇప్పుడు కూడా ఉన్నది. మాయాళబలమైన (బ్రహ్మం అధిష్టాన సత్తను వదలి ఉండజాలదు. నియతికి కూడా నాళం లేదు. అందుకు నిదర్శనం ఫ్టీరంగా వున్న ఈ ప్పథివ్యాదులే
పరమార్ధ దృష్టితో చూస్తే ఈ జగత్తు ఉత్పన్నం కానేలేదు. అలా ఉత్పన్నం కాకుండానే అనుభవానికి వస్తున్న ఈ జగత్తు స్వప్డ స్త్రీ సంగమం లాంటిది ఇది స్వభావస్థితి జనన మరణాద్యనుభవాలు కూడా ఇలాంటివే.
సృష్ట్యాదిలో స్టిరపడీన సంవేదన ఇప్పటికీ నిశ్ళిలంగా వుండడమే 'నియతి" అనబడుతున్నది స్వపష్న(ద్రష్ష దృశ్యాన్ని తనలోనే కల్పించుకొంటాడు అలాగే చిదాకాశం పాంచభౌతిక (ప్రపంచాన్ని తనలో కల్పించుకోన్నది అది ఆకాశ సంవేదనను గ్రహించి ఆకాళంగా పరిణమించింది. కాలసంవేదినను గ్రహించి కాలంగా మారింది జలం, అగ్ని, వాయువు ఇత్యాదులు గూడా ఇలా ఏర్పడినవే. మాయా చాతుర్యంవల్ల లేనిదే ఉన్నట్టు ఊహింపబడుతున్నది
ఇక మరణానంతరం ఫలానుభివం ఎలా వుంటయిందో చెబుతాను ఏను
సృష్ట్యాదిలో మానవుల ఆయు*పరిమితి క్రమంగా కృతాది యుగాలలో నాల్లు వందలు వటాడు వందలు రెండు ఎందలు ఒక్క నంద సంవత్సరాలుగా
ఉత్పత్తి ప్రకరణం 113 కల్సింపబడింది ఈ పరిణతిలో మార్పులు కల్లడానికి కారణం చూనవులు చేసే కర్మలలోని గుణ దోషాలే శా(స్రానుసారంగా ధర్మాన్ని పాటించేవాడు శాన్త నిర్దిష్టమైన ఆయుస్సు కల్లి వుంటాడు. కర్మానుసారంగా ప్రాణి అవసానదశను పొందుతుంది. అప్పుడు మర్మచ్చేదకమైన వేదన కలుగుతుంది.
('ప్రబుద్దలీల :- చం(ద్రముఖీ ! మరణాన్ని గురించి నాకు సంగ్రహంగా వివరించు మరణావస్టలో అనుభవానికి వచ్చేది సుఖమా ? లేక దుఃఖమా ? మరణానంతరం ఎమి జరుగుతుంది ?
దేవి:- మరణించే మానవులు మూర్చుడు, ధారణాభ్యాసి యోగి- అని మూడు రకాలుగా వుంటారు. (ప్రాణాన్నీ, మనస్సునూ ధారణ చేయడంలో అభ్యాసం కలవాడు ధారణాభ్యాసి పరకాయ ్రవేశాదులలో నేర్పుగలవాడు యోగి. వీరిద్దరూ దేహం పరిత్యంజించిన పిమ్మట సుఖం అనుభవిస్తారు.
ధారణ కానీ యోగం కానీ లేని మూర్చుడు మరణకాలంలో దుఃఖం పొందుతాడు. విషయవాసన వివశుడైన ఆ మూఢుడు త్రుంచివేసిన తామర పూవులాగా దీనుడై పోతాడు. సదాచార హీనుడూ, దుర్హన సాంగత్యం కలవాడూ నిప్పులో పడిన వానిలాగా దాహ దుఃఖానికి గురి అవుతాడు. వానికి ఆకాశం భూమిగా, భూమి ఆకాళశంగా కనిపిస్తుంది. పైకెగిరిపోతున్నట్టు, లేదా క్రిందికి పడిపోతున్నట్టు వానికి భ్రమ కల్గుతుంది. ఇం(ద్రియ పాటవం నశించడంవల్ల అతని బాధలు మరీ ఎక్కువ అవుతాయి. మోహాతిరేకంవల్ల చివరి కతడు పాషాణంలాగా జడత్వం పాందుతాడు.
'ప్రబుద్దలీల .- శిరస్సు మొదలైన అస్ట్రాంగాలతో!' కూడి వుండీ కూడా ఈ దేహం మోహాన్నీ (భ్రాంతినీ, వ్యాధినీ, జడత్వాన్నీ ఎలా పొందుతుంది ?
డేవి స్పష్టాదిలో క్రియాశ్తి ప్రధానుడైన ఈశ్వరుడు 'ఆయా కాలాలలో జీవుడు కర్మఫలం అనుభవించుగాక !** అని సంకల్పిస్తాడు అందుచేత చిత్త విజ్బంభణంవల్ల కలిగిన ఆయా ఫలాలను జీవుడనుభవిస్తాడు అంతేకాని ఇందుకు వేరే కారణం లేదు
శరీరంలోని నాడులు పిత్తప్రకోపంవల్ల సంకోచ వికాసాలు పొందుతాయి ఆఫ్రీతిలో అన్నరసాన్ని గగ్రహించడంలో విషమస్థితి ఏర్పడుతుంది అప్పుడు సమానవాయువు నిజస్టితిని కోల్పోతుంది నాడులలో ప్రవేశించిన వాయివు వెలికి రాకున్నా, వెలుపలి [. శిరస్సు, చేతులు, కొళ్ళు, గుహ్యం, వాభి, హృదయం, మొదలగున్నవి అష్టాంగాలు.
శే14 యోగవాసిష్టం వాయువు లోపలికి ప్రవేశింపకుండా నాడీ వ్యాపారం స్తంభించి పోతుంది ఇంద్రియజ్ఞానం నశిస్తుంది ఒక్క స్మృతి మాత్రం మిగిలి వుంటుంది
ప్రాణాపాన వాయువుల సంచారం ఆగిపోగానే మనుజుడు వమరణించినాడు అంటారు. “ఇంతకాలానికి నేను మరణిస్తాను" అని ముందు చేసుకొన్న సంకల్పమే మ్యుతికి హేతువు అవుతుంది. సృష్ట్యాదిలో కలిగిన సంకల్పం ఎన్నటికీ వ్యర్ధం కాదు. జనన మరణాలనేవి స్వభావ సంవేదనలే కాని వేరు కావు.
నదిలో నీరు ఒకచోట నిర్మలంగా, మరొకచోట కలుషితంగా ఉంటుంది. అట్లే జీవన ధర్మంకూడా ఒకసారి సౌమ్యంగా, మరొకసారి రాగద్వేషాదులచే కలుషితంగా వుంటుంది. పాడవైన తీగకు మధ్యలో గణుపులున్నట్లే చేతన సత్తుకు జనన మరణాలు వుంటాయి. పరమార్దదృష్టితో చూస్తే చేతన పురుషునికి జనన మరణా లనేవి లేవు. అతడు స్వస్నాన్ని చూచినట్లే ఈ సంఘటలను చూస్తూ వుంటాడు చేతనామా క్రుడే పురుషుడు అతడు నశించడం అసంభవం చైతన్యం లేనివాడు పురుషుడు కాజాలడు. చేతను డెన్నడైనా నిజంగా మరణించివుంటే చెప్పు లక్షలకొలది శరీరాలు మరణిస్తాయి కాని చేతనం అత్షయమై వుంటుంది అది మరణించడం జరిగితే తక్కినదంతా మరణించినట్లే
జీవనంలో అనుభవానికి వచ్చే వాసనావై చిత్రానికే చావు పుట్టుకలని పేరు పెట్టడం జరిగింది అందుచేత జీవుడు పుట్టడు, చావడు వాసనలు అనే సుడిగందాలలో పడి పారుతూ వుంటాడు దృశ్యానికి వునికి లేనే లేదు. అందువల్ల చక్కగా విచారించి చూస్తే వాసన అనేది కూడా లేదు అని బోధపడుతుంది
అందుచేత జీవుడు సమ్యగ్విచారంతోనూ వైరాగ్యాది సాధనతోనూ ఈ జగత్తును ఉనికి లేనిదిగా గ్రహిస్తాడు అప్పుడు వాసనారహితుడై భవభయం నుండి విముక్తు దవుతాడు అలా విముక్తి పొందిన ఆత్మ ఒక్కటే సత్యం కాని మరేదీ సత్యం కాదు
సంసార మరణావస్థ
ప్రబుద్రిరీల :- దేవీ ! ప్రాణి ఎలా మరణిస్తుందో మళ్లీ ఎలా జన్న్మిస్తుందో బోధపడేటల్టు నాకు స్పష్టంగా చెప్పు
దేఎ - నాడి కదలిక నిరిచపోగనే (వై ణవాయిస్పందనం ఆగిపోతుంది అప్పుదు జీవుని చైతన్యం శయించినట్టు తోస్తుంది జానకి అత్యమైన చైతన్యానికి అత్సలి ఎనాళ ఎ
ఉత్పత్తి ప్రకరణం 115 లేవు అది స్టావరాలూ, జంగమాలూ అయిన అన్ని పదార్దాలలోనూ ఆకాశాదులలోనూ ఉన్నది వాయునిరోధం వల్ల కదలిక శమించగానే జడమైన శరీరం మరణించిందని చెప్పడం జరుగుతుంది దేహం శవమై ప్రాణవాయువు మహావాయువులో లీనం కాగానే వాసనాసహితుడైన జీవుడు పరమాత్మ భావంలో వుంటాడు. వాసనతో కూడిన అణువునే బీవు డంటారు. అది శవం పడివున్న గృహంలోని ఆకాశస్థానంలోనే వుంటుంది వ్యవహార వేత్తలు దానినే (ప్రేతమంటారు. గాలి గంధంతో కూడి వున్నట్లే చైతన్యం వాసనలతో కూడి వుంటుంది. జీవుడు ఎప్పుడు ఈ దేహదృశ్యాన్ని వదలి మరొక దేహదృశ్యాన్ని చూస్తాడో, అప్పుడు కలలో లాగా అతనికి స్వవాసనామయాలైన నానావిధాకారాలు ఏర్పడతాయి. ఆ (ప్రదేశములోనే అతడు పూర్వజన్మలో మాదిరిగా జన్మాంతరస్మృతి కలిగి వుంటాడు. మరణమనే మూర్చను దాటగానే అతడు మరొక శరీరాన్ని దర్శిస్తాడు. మృతుని ఆత్మలో భూమ్యాకాశాలతో కూడిన ఈ విశ్వమంతా గోచరిస్తూ వుంటుంది. ఇతరులకు అక్కడ గృహాకాశం తప్ప మరేమీ గోచరించదు. సామాన్య పాపులు, మధ్యమ పాపులు, స్టూల పాపులు, సామాన్య ధర్ములు, మధ్య ధర్ములు ఉత్తమ ధర్ములు - అని ప్రేత జీవులు ఆరు రకాలుగా వుంటారు. అందులో ఒక్కొక్కరికీ రెండు, లేక మూడు అవస్ట్రాభేదాలు కూడా కలుగవచ్చు మహాపాపి పాషాణం లాగా జడుడై ఒక సంవత్సరకాలం స్మృతి కోల్పోయి వుంటాడు. పీదప కాలక్రమంలో 'ప్రబుద్దుడై వాసనలవల్ల కల్గిన నరకదుఃఖాలను బహుకాలం అనుభవిస్తాడు. అనేక జన్మలు పొందుతాడు. చివరికి ఒకనాటికి వానికి ఈ సంసార (భ్రమలో పాపఫలం అనుభవించే దళ ముగుస్తుంది. లేదా మరణానంతరం దుఃఖమయమైన జడవృక్షాది భావాలను వాడు హృదయంలోనే అనుభవిస్తాడు తరువాత వాసనలకు తగిన పెక్కు నరకబాధ అనుభవించి చాలాకాలానికి భూతలంలోని నానా(ప్రాణుల గర్భాలలో జన్మిస్తాడు. వుధ్యవు పాపులు మరణానంతరం శిలవంటి జడత్వాన్ని కొంచెం కాలం అనుభవిస్తారు తరువాత (ప్రబుద్దులై పశుపతాది జన్మలను పొంది సంసారంలో చిక్కుకుంటారు. సామాన్య పాపులు మరణించిన వెంటనే తమ వాసన కనుగుణమైన దేహాన్ని మరల పొందుతారు. కలలో లాగా పై జెప్పిన జనన మరణాదుల ననుభపస్తారు [17
116 యోగవాసిం
_మహాపుణ్యాత్ములు మరణం తర్వాత తమ పుణ్య వాసనలకు తిగిన స్యర్గాదులను చేరుకొంటారు. అక్కడ భోగాలనుభివిస్తారు ఆపై ఇతర లోకాలలో గూడా కర్మానుగుణములైన ఫలాల ననుభవిస్తారు. తరువాత సంపన్నులకూ, గుణవంతులకూ నిలయమైన కుటుంబంలో జన్మిస్తారు.
మధ్యమ ధర్మాత్ములు మరణించగానే ఆకాశ వాయువుచేత ఆకర్షింపబడి నందనం చైత్రరధం మొదలైన సుందర'ప్రదేశాలను అందుకు తగిన శరీరాలతో చేరుకుంటారు అక్కడ పుణ్యఫలాల ననుభవిస్తారు. పిమ్మట మానవహృదయాలను పొంది తద్ద్వారా మనుజగర్చంల్ జన్మిస్తారు (సామాన్య ధర్మాత్ముల ఫ్రితిని కూడా దీనిని బట్టి మనం ఊహించుకొవాలి). మృతజీవులు వాసనానురూపమైన ఈ వ్యవస్థను క్రమంగా కానీ, (క్రమం విడిచిగానీ పాందుతూ వుంటారు
మృతులైనవారు మొదట మేము మరణించాము' అని భావిస్తారు ఆపై బంధువులు పీండాది ప్రదానాలు కావించగానే మన్లీ శరీర ధారుల మయ్యాము అని అనుకొంటారు యమభటులు కాలపాశంతో మమ్మల్ని యమలోకానికి తీసుకుపోతున్నారని తలపోస్తారు పుణ్యాత్ములు సుందరమైన దివ్యోద్యానాలు, దివ్య విమానాలు పొందినట్టు భావన చేస్తారు పాపాత్ములు కంటకమయ భూములు, గుంటలు, అసిప(దత్రవనాలూ ప్రాప్తించినట్టు తలపోస్తారు.
మధ్యమ పుణ్యాత్ములు మాదారి పచ్చిక బయళ్ళతో నిండి చల్లగా వున్నది ఇది సుఖంగా నడవడానికి తగి వున్నది అని అనుకొంటారు. ఇప్పుడు '“నేన యమ పట్టుణానికి వచ్చాను ఈయన యముడు ఇక్కడ కర్మ విచారం జరుగుతున్నది?” అన్న అనుభూతి కలిగివుంటారు
ఈ రీతిగా సువిశాలమైన సంసారఖండం ఆయా జీవులకు భిన్న భిన్నమైన అనుభవాలు కలిగిస్తుంది. వివిధ పదార్దాలతో , ఆచారాలతో అర్ధ (క్రియలతో కూడిన సంసారాన్ని అందరూ సత్యమనే విశ్వసిస్తారు. ఇది దేశకాల (క్రియలతో కూడినట్లు భాసించినా నిజానికి ఈ ప్రసంచం ఏ ఆరోపమూ లేని ఆత్మ మా త్రమే
' నా కర్మఫలం అనుభనించటానికి యము డాదేశించాడు. నేనిక్కడనుండి స్వర్గానికో నరకానికో పోతాను ఇంత వరకూ నే ననుభఏంచింది స్వర్గం ఇది నరకం నేను అనేక జన్మ లెల్తాను మళ్లీ మానవ సంసారంలో పుల్దబోతున్నాను నేను ధాన్యాంకుర మయ్యాను ఫంంగా సరిణయంచాను అన ఈరీతిగా జీవుడు శ్రుతిురాగా దుం నుండి
ఉత్పత్తి ప్రకరణం 117
అంతఃకరణం సుప్తమైన ఆ దళలో ఆ ధాన్యాంకురం బీజంగా పరిణమించి మౌనవునికి ఆహారమవుతుంది. తరువాత అది రేతోరూపం ధరించి మాత్సగర్భం (ప్రవేశిస్తుంది పూర్వకర్మానుసారంగా ఆ గర్భం శిశువుగా జన్మిస్తుంది. ఆ పుట్లే బాలుడు మంచివాడుగనో, చెడ్డవాడుగనో తయారవుతాడు. (క్రమంగా ఇంపైన యౌవనం అనుభవిస్తాడు. పిమ్మట వార్టక్యాన్ని పొందుతాడు తామరపూవు నావరించిన మంచులాగా అతణ్లీ వ్యాధి మరణాలు ఆక్రమిస్తాయి మళ్లీ పీండ'ప్రదానాదులతో కలవంటి దేవాన్ని పాంది సంసార చక్రంలో పరి(భమిస్తాడు మోక్షం కలో వరకూ ఇలా ఆకాశంలోనే ఆకాశరూపుడై విహరించి పరివర్తనం చెందుతూ వుంటాడు.
ప్రబుద్రలీల :- దేవీ! అసలు సృష్ట్యాదిలో ఈ (భమ ఎలా ఏర్పడింది ? నాకు తెలిసేటట్టు దయచేసి వివరించు
దేవి:- ఈ కొండలూ, చెట్టూ, భూమి ఆకాశం - పరమార్చ ఘనమైనవి. అంటే విశుద్ర చైతన్య స్వరూపాలు ఆ చైతన్యం ఇన్ని రూపాలుగా వివర్తనం చెంది భాసిస్తున్నది.
చేతనామయుడైన ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించి వున్నాడు. ఆ ఈశ్వరుడే సృష్ట్యాదిలో జీవసమష్టి స్వరూపుడైన మొదటి ప్రజాపతిగా మారి స్వప్న ఫురుషునిలాగా ఎలా వివర్తం చెంది భాసించాడో, ఇప్పటికీ ఆ భాసించడమనేది అలాగే వున్నది సంకల్పితవైన ఈ పదార్థాల (ప్రతిస్పందన వెొందట ఎలా కలిగిందో. అదే (ప్రతిబింబభావంతో ఇప్పటికీ అలాగే వుంది. వాయువు దేహంలోని రంధ్రాల ద్వారా లోనికి వెళ్లి అవయవాలకు చలనం కలిగించినప్పుడు ప్రాణి జీవించివున్నా డంటారు సృష్ట్ర్యైదిలో జంగమ (ప్రాణులస్థితి ఇలా వుండింది చైతన్యంకలిగి కూడా చలనం లేని వృక్షాలను స్టావరా లంటారు. ల
చిదాకాశమే చైతన్యంవల్ల కలిగే ఈ జీవాంశాన్ని నిర్మిస్తున్నది. ఉపాధిభేదాన్ని బట్టి చిత్తూ, జడమూ అనే భేదాలూ కలుగుతాయి బుద్దిని (ప్రవేశించిన ఆ చిదాకాశమే మానవళరీరమనే నగరాన్ని పాంచుతుంది బుద్దిని చక్షురాదీంద్రియ స్టానాలకు తీసుకుపోయి తద్ద్వారా బాహ్య పదార్జాలను (ప్రకాశింపజేస్తున్నది. అంతేకాని చక్షరాదీం(ద్రియాలు స్వయంగా చేతనాలు కావు. ఆ చిత్సంకల్పమే సంకల్పానుగుణంగా ఆకాళ భూజలాది రూపాలను పొందుతున్నది ఇలా సర్వత్రా చరాచర రూపాలుగా పరిణమించేది అదే
జడమనీ చేతనమనీ విడివిడిగా రెండు పదార్జాలు లేవు అనగా స్పష్ట్యాదిలో ఏ
118 యోగవాసిష్టం విధమైన భేదమూ లేదు. ఎప్పుడు కూడా ఉన్నది ఒక చైతన్యం మాత్రమే. జడమనే విభాగం మిధ్యా మాత్రమే ఈ చెట్టూ, బండలూ మొదలైనవి కూడా చిద్రూపాలే. వాటికీ జడత్వ కల్పన బుద్ది కల్పితం మాత్రమే. ఆ వస్తువులలో ఉన్న బుద్రి తమను ఆ రూపంలోనే భావిస్తూ వుండడంవల్ల అవి అదే రీతిగా వ్యవహరింపబడుతున్నాయి. (క్రిమికీటకాదులలోని బుద్దులు కూడా ఇట్టివే.
ఉత్తర సము(ద్రతీరంలోని వారు దక్షిణ సము(ద్ర తీరంలోని వారిని గురించి తెలిసికోలేరు అలాగే స్ట్థావరజంగమాలు తమ తమ వైతన్యవలయంలో తగులుకొని ఇతరుల బుద్రికల్పనలు తెలిసికోలేకున్నవి రాతిలోని కప్పకూ, వెలుపలి కప్పకూ పరస్పర వేదనం లేదు. అదేరీతిగా లోకంలోని పదార్దాలు కూడా పరస్పర సంవేదనం లేకుండా వున్నాయి.
(ప్రళయకాలంలో మాయలో లీనమైన సమష్టిచిత్తం సృష్ట్యాదిలో ప్రత్యక్పైతన్య చిదాకాశంగా భాసించింది. అది నేటికీ అలాగే వున్నది. సృష్ట్యైదిలో స్పందనరూపమైన వాయువు ఇప్పుడూ అలాగే వున్నది అవకాశరూపంగా భావింపబడీన ఛి'ద్రమే ఆకాశంగా రూపొందింది. స్థావర జంగమాలు రెండింటిలోనూ సమపష్టిచిత్తం సమానంగానే వ్యాపించివున్నది వాయుస్పందనంలో భేదాన్ని బట్టి మాత్రమే అని స్టావరాలంగా, జంగమాలుగా విడిపోయాయి.
ఇలా (భాంతి మయమైన ఈ విశ్వంలో చైతన్యాంశమైన పదార్దాలు మొదట ఎలా వెలువడ్డాయో అలాగే అవి నేటికీ వున్నాయి ఈ విశ్వపదార్హ విజృంభణం అసత్యమైనప్పటికీ సత్యంలా తోస్తున్నది. ఈ సంగతి ముందు నీకు వివరించి వున్నాను.
ఈ విదూరధమహారాజు మృత ప్రాయు డయ్యాడు. చూడు. ఇక్కడిప్పుడు పూలతో కప్పబడిన నీ భర్త పద్మనరపతి హృదయగతవైన పద్మ కోశాన్ని (ప్రవేశించనున్నాడు.
'ప్రబుద్రలీల :- దేవీ ! ఇతడు ఏ మార్గం ద్వారా శవం ఉన్నచోటికి పోతాడో, ఇతళ్లీ చూస్తూ మనమూ ఆ మార్గంలోనే పోదాం పద.
దేవి - '*నేను లోకాంతరానికి వెళ్లుతున్నాను”' అని భావిస్తూ పద్ముని హృదయంలోని అహంవాసన కనుగుణవైోన మార్గాన్ని అనుసరించి నీ భర్త పోతున్నాడు. నీ కిష్టమైన ఈ మార్గంలోనే మనమూ పోదాం రా ఇచ్చకు విచ్చేదం కల్గితే మైత్రి చెడుతుంది కదా |
ఉత్పత్తి ప్రకరణం 119
వసిష్టుడు .- దేవి చెప్పిన ఈ మాటలు వినగానే లీల శోకం శమించింది ఆమెలో
జ్ఞానమనే భాను డుదయించాడు ఇంతలో విదూరధుడు వైతన్యరహితు డయ్యాడు. మరణానంతర ప్రేత వ్యవస్థ
వసిష్టుడు :- విదూరధుని ముఖకాంతి పాలిపోయింది పెదవులు ఎండిపోయాయి. ఇం(ద్రియ వ్యాపారం స్తంభించిపోయింది. అవయవాలన్నీ కదలిక లేని వయ్యాయి అతడు శిలా ప్రతిమలాగా చలనం లేనివాడయ్యాడు చిత్రంలోని బొమ్మవలె విచేతను డయ్యాడు పడిపోయే చెట్టును వదలిన పశ్షిలాగా ప్రాణం అతని శరీరాన్ని వదలిపోయింది
లీలా సరస్వతులు దివ్యదృష్టితో ఆకాశుతుడైన ఆ బీవుళ్లీ చూచారు. ఆ జీవవైతన్యం గగనంలో ఆతివాహిక ప్రాణంతో కలసి వాసన ననుసరించి సుదూరం వెళ్ళడానికి పూనుకొన్నది తుమ్మెదలు గాలిలోని గంధాన్ని అనుసరించి పోయినట్టు వనిత లిద్దరూ ఆ జీవచైతన్యం వెంబడే పోసాగారు.
వాసనామయమైన శరీరం దాల్చిన ఆ జీవవైతన్యానికి ఈ క్రింది రీతిగా అనుభవం కలిగింది.
బంధువులు పీిండ(ప్రదానం చేయడంవల్ల ఆ జీవునికొక శరీరం ఏర్పడింది. యమదూత లాదేహాన్ని యమపురికి తీసుకుపోయారు. అక్కడ అనేక ప్రాణులు తమ కర్మఫలాల ననుభవిస్తున్నారు.
అప్పుడు యము డతళ్లి చూచి భటుల నిలా ఆదేశించాడు -
““ఇత డెప్తుడూ పాప కర్మలు చేయలేదు. పవిత్రమైన పనులే చేశాడు సరస్వతీదేవి వరంతో ఇతడు వర్దిల్లాడు. అతని ఫూర్వశరీరం శవమై పూలతో కప్పబడి వున్నది. ఇతల్లో వదలివేయండి. ఇతడు తన పూర్వ శరీరంలో ప్రవేశించుగాక 1%
యముడలా ఆనతి ఈగానే భటులు అతణ్ణీ వదిలేశారు యంధత్రంచే విసరివేయబడిన రాయిలాగా అతని జీవకళ రివ్వునపోయి ఆకాళంలో ప్రవేశించింది. లీలా సరస్వతులు దాని ననుసరించి పయనించారు అయితే ఆ జీవకళకు వారు కనిపించలేదు. దానిని వెంబడించి పోతూ వారు లోకాంతరాలు దాటారు ఒక బ్రహ్మాండం అతి(క్రమించి మరొక (బ్రహ్మాండం (ప్రవేశించారు భూవుండలం చేరుకున్నారు. పద్మభూపాలుని నగరంలోకి వెళ్ళారు గాలి పద్మంలో దూరినట్టు అక్కడ స్వేచ్చగా అంతఃపురమండపం లోకి వెళ్ళారు
120 యోగవాసిష్టం శ్రీరాముడు .- బ్రహ్మణ! విదూరధుని జీవ చైతన్యం శవం ఉన్న గృహాన్ని ఎలా చేరింది ? మరణించిన వానికి ఆ మార్గం ఎలా తెలిసింది ? వసిష్పుడు :- రాఘవా 1! అతని వాసనలో ఆ శవం ఉండనే ఉన్నది దానికి సంబంధించిన పరిజ్ఞానమంతా అతని హృదయంలో ఉన్నది. ఇక అతడెందుకు ఆ గృహం చేరుకోలేడు ? (భ్రాంతిమయమై లెక్కకు మిక్కిలిగా వున్న ఈ జగజ్ఞాల మంతా వటబీజంలో వృక్షంలాగా జీవకణంలో ఉన్నది ఆ బీజం తనలోని అంకురాన్ని చూడగల్లినట్లే జీవ చైతన్యం తన అంతఃకరణంలో వాసనారూపంలో ఉన్న త్రిలోకాలనూ చూడగలదు. ఒక మౌనవుడు ఎంతో దూరంలో ఉన్న తన నిధిని మనస్సులో భావనాబలంతో చూస్తున్నాడు అట్లే జీవుడు ఎన్ని జన్మలు గడచినా ఎన్ని (భ్రమలకు లోనైనా తన వాసనలో దాగివున్న అభీస్ట్రాన్ని స్పష్టంగా చూడగలడు. శ్రీరాముడు .- భగవ౯! ఏ జీవునికి బంధువులు పిండప్రదానం చేయరో వానికా వాసన ఉండదు కదా! అలాంటి జీవునికి శరీరం ఎలా సిద్దిస్తుంది ? వసిష్టుడు "- పిండప్రదానం చేసినా చేయకున్నా “నాకు పిండం ఇవ్వబడింది అన్న వాసన హృదయంలో గట్టిగా వుంటే చాలు అట్టివాడు పిండ ప్రదాన ఫలమైన శరీరాన్ని పొందుతాడు ప్రతి ప్రాణీ తన చిత్తాన్ని అనుసరించే రూపొందుతుంది ఇది అనుభవంవల్ల తేలిన సత్యం. వారు (బ్రతికిన వారైనా కావచ్చు. లేక మరణించిన వారైనా కావచ్చు. ఈ సత్యానికి మాత్రం మార్పు లేదు. పిండం లేనివాడు కూడా ““నేను పిండం కలవాడను”” అనుకుంటే పిండం కలవాడే అవుతాడు. పిండం కలవాడు కూడా నేను “పిండ రహితుడను"' అని భావిస్తే పిండ రహితుడే అవుతాడు పదార్దాల ఉనికి మన భావన ననుసరించే వుంటుంది భావన కూడా కారణమైన పదార్జాలనుండే ఉదయిస్తుంది. వాసనా బలంవల్లనే గరుడోపాసకునికి విషం అమృత మవుతుంది. అలాగే అసత్యం సైతం భావనాబలం వల్ల సత్యంగా పరిణమిస్తుంది. ఎవనికీ ఎప్పుడూ కారణం లేకుండా ఏ విధమైన భావన గానీ కలుగదు ఒక్క పరబ్రహ్మం మాత్రమే కారణం లేని వస్తువు అదొక్కటి తప్ప మరాక కారణంలేని కార్యాన్ని ఎప్పుడూ కనీ వినీ ఎజుగము జీవచెతన్యమే వాసనా రూపంలో కలలో లాగా పద్యారరూపం పాందుతున్నది కార్యకారణ రూపమైన ఈ జగత్తుగా పరిణమిస్తుంది
ఉత్పత్తి ప్రకరణం 121
శ్రీరాముడు *- ఏ ప్రీతం *నాకు ధర్మం లేదు" అన్న వాసన కలిగివుంటుందో, అతని బంధువులు అతని పేర అనేక ధర్మాలు చేస్తారనుకోండి ! అప్పుడు ఆ ధర్మమంతా నష్టమైనట్లా ? కాదా ? బంధువాసన ననుసరించి సత్యమూ, అతని వాసన ననుసరించి అసత్యమూ అయిన రెండు భావన లలో దేని బలం గొప్పది?
వసిష్టుడు .- రామా! దేశకాల క్రియా (ద్రవ్యసంపత్తి వల్ల భావన కలుగుతుంది. అలా ఉదయించిన శాస్త్ర, ప్రామాణ్యం కల భావన కేవలం లౌకికమైన (ప్రేత భావన కంటే బలవత్తరమై ఉంటుంది (ప్రీతబుద్ది నాస్తికత్వాది భావనచేత అశుభం కానప్పుడు దానిని ధర్మవాసన జయిస్తుంది శుభాశుభ భావనలు రెండింటిలో ఏది బలవత్తరమో దానికే జయం కల్గుతుంది. అందువల్ల శుభప్రయత్నంతో శుభాభ్యాసాన్ని పాటించాలి.
శ్రీరాముడు :- బ్రహ్మ౯ ! దేశ కాలాదులవల్ల వాసన కల్లే పక్షంలో స్పష్ట్యాదిలో దేశకాలాదు లెక్కడివి ? ప్రధమస్న్పష్టికి కారణమైన వాసన ఎలా ఉద్భవించింది ? సహకారి కారణాలు లేకపోతే వాసన ఎలా కల్గుతుంది ?
వసిష్టుడు .- మహాబాహూ ! నీవు చెప్పింది నిజం. సర్గాదిలో దేశ కాలాలు లేవు. సహకారి కారణాలు లేనప్పుడు దృశ్వబుద్రి ఉదయించదు దృశ్యమే అసంభవం కాబట్టే మనకు కనిపించేదంతా చిద్రూపమైన బ్రహ్మమే కానీ మరేమీ కాదు ఈ విషయాన్నే అనేక యుక్తులతో పైన నిరూపించబోతున్నాను. ఈ ప్రయత్నమంతా ఇందుకే కదా |
ఇక (ప్రస్తుత కథను విను. లీలా "సరస్వతులు పుష్పబహుళమైన వసంతం లాగా సుందరమైన వుందిరం చూచారు. అక్కడ పూల నడుమ శవం ఉన్నది ఆ వెంతనే పఫ్యూర్ణకుంభాది మంగ“ " వ్యాలన్నీ ఉన్నాయి. మందిరం తలుపులూ, కిటికీలూ దృఢంగా బంధింపబడి వున్నాయి దీపకాంతి తరిగిపోతూ వుండడంవల్ల తెల్లని గోడలు నల్లబడుతున్నట్టు కనిపించాయి. అక్కడ పరుండిన వారందరూ గు(ర్రువెట్టి నిద్రిస్తున్నారు.
ఆ మందిరం వెలుపలిభాగం ప్లూర్ణచం ద్రుని వెన్నెలలో మనోహరమై వున్నది లోపలి భాగం (బ్రహ్మకు ఉత్పత్తి స్థానమైన భగవానుని నాభికపుల ముకుళం లాగా శోభిస్తున్నది. చంద్రునిలాగా మనోజ్ఞమై ఆ భవనం నిళ్ళబ్దంగా ప్రశాంతంగా వున్నది.
స్వప్నార్ధ విచారం
తరువాత వారిద్దరూ తమకంటే ముందే అక్కడకి వచ్చి శవశయ్య (ప్రక్కనే వున్న
లీలను మూచారు. ఆమె ఆకారం వనేషభూ షిదులూ అన్నీ మునుపటిలాగే వున్నాయి
122 యోగవాస్కుం భర్తృముఖంపై దృష్టినిల్సి ఆమె మౌనం వహించి వున్నది. వాడిన వదనంతో ఆమె వన్నెదరిగిన చంద్రుని తోడి రా(త్రిలాగా కనిపించింది సత్యసంకల్పలైన వారిరువురూ ఆమెను చూచారు కాని ఆమెకు మాత్రం వారు కనిపించలేదు
శ్రీరాముడు - ప్రభూ ! మొదటి లీల ఆ మండపంలోనే తన శరీరం ఉంచి ధ్యానబలంతో సరస్వతీదేవితో సహా అక్కడ నుంచి వెళ్ళిపోయిందని ముందు చెప్పారు ఆ శరీరం ఎమయిందో తెలియజేయండి.
వసిష్టుడు .- రామా! ఆ లీలకు శరీర మనేది ఎక్కడ ఉన్నది ? ఆ శరీరం సత్యమైతే కదా ? మరుభూమిలో జలబుద్దిలాగా అది భమ మాత్రమే ఈ జగత్తంతా ఆత్మే ఇందులో దేహాదుల కల్పన ఎక్కడిది ? నీవు చూచేదంతా చిదానంద స్వరూపమైన (బ్రహ్మమే ఆ లీలకు జ్ఞానోదయం కాగానే ఆమె శరీరం మంచులాగా కరిగి బ్రహ్మములో లీనమైపోయింది.
నిజంగా ఆలోచిస్తే ఆధిభౌతికరూపంలో కనిపిస్తున్న భూమి మొదలైన ఈ పదార్దాలకు ఉనికి లేనే లేదు అవి శబ్దతః కానీ, అర్హతః కానీ సత్యం కావు. అవి కుందేటి కొమ్మువంటివి
కలలో “*నేను లేడిని” అనుకొన్నవాడు కలనుండి తేరుకోగానే తన మృగస్వరూపంకోసం అన్వేషిస్తాడా ? త్రాడులో కల్గిన సర్ప(భ్రమ ( భ్రాంతి) నశించిన పిమ్మట వుంటుందా ? కాబట్టి ఆధిభౌతిక ప్రపంచ మంతా అ(ప్రబుద్ర్ద మనస్కులు తమ మనస్సులో కల్పించుకొన్న మిధ్య మా(త్రమే
చాలా సేపు భూమిపై గిరగిర తిరిగిన బాలుడు భూమి పరి(భ్రమిస్తున్నదని భావిస్తాడు. అలాగే జననమరణాలకు లోనై అజ్ఞుదైన ప్రతిమనుజుడూ స్వపష్నంతో సమానమైన ఈ సృష్టిని అనుభవిస్తున్నాడు.
శ్రీరాముడు - బ్రహ్మళ౯! జీవించివున్నప్పుడుగానీ, లేక మరణించిన తర్వాతగానీ ఆతివాహికస్థితిని పొందిన యోగి దేహం లోకులకు ఎలా కనిపిస్తుంది ?
వసిష్టుడు - 'ప్రారబ్బానుభవం కోసమై ఐచ్చికంగా వివిధ దేహాలను కల్పించుకొని యోగికి మరణదశలో కలలో లాగా దేహాంతర కల్పన అనిత్యమై వుంటుంది ప్రారబ్దమంత నశించిన పిదప విదేహకైవల్యం పొందే దశలో యోగి శరీరం శరత్కాలంలోని మబ్బుతున! లాగా, ఎండలో మంచుబొట్టు లాగా ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది వెనువెంటు ఈ శరీరం నళంచునుగాక! * అన్న సత్యసంకల్పం కల యోగుం శరీరాన్ని ఇతర యోగుల
ఉత్పత్తి ప్రకరణం 123 కూడా చూడలేరు ''తన శరీరాన్ని ఇతరులు చూతురుగాక! అన్న సంకల్పం యోగికి ఉంటే తప్ప, ఇతరు లెవరూ ఆయన శరీరాన్ని చూడజాలరు.
అజ్జ జనులు తమతమ వాసనల ననుసరించి యోగుల శరీరం భౌతికమనీ, అది మరణించినదనీ భావించవచ్చు. కొందరి దృష్టిలో మరణించినాడని భావించబడిన యోగి మరికొందరి దృష్టిలో జీవించి వుండవచ్చు నిజం తెలిస్తే త్రాడులో సర్పబుద్ది నశిస్తుంది ఆ రీతిగానే జ్ఞానం కలగగానే యోగులకు భ్రాంతిరూపమైన దేహబుద్ది నశిస్తుంది.
అసలు దేహమంటే ఏమిటి ? దేనికి ఉనికి ? దేనికి నాశం ? నిజంగా ఉన్నదేదో ఉండనే వుంటుంది ? తొలగిపోయేది అజ్ఞానమొక్కటే
శ్రీరాముడు :- ప్రభూ 1 ఆధి భౌతికదేహవే. యోగికి ఆతివాహికంగా మారుతుందా ? లేక అలా మారేది మరొకటా ?
వసిష్టుడు : - ఈ విషయం అనేక విధాల ఇంతకుముందే చెప్పాను ఇంకా ఏల (్రహించకున్నావు ? ఉన్నది ఆతివాహికమే కాని ఆధిభౌతికమనేది లేనే లేదు. అధ్యాసంవల్ల అది అధిభౌతికంగా తోస్తుంది. అధ్యాసం శమిస్తే మళ్ళీ తొల్లింటి ఆతివాహికమతి కల్గుతుంది. కలనుండి మేలుకొన్న వానికి కలలో చూచిన వస్తువు యొక్క గురుత్వ - కఠినత్వాదులు తొలగిపోతాయి. అలాగే జ్ఞానం కలగగానే శరీరగురుత్వాదులు శమిస్తాయి ఆతివాహిక జ్ఞానంకల యోగుల శరీరం దూది పింజలాగా తేలిక అవుతుంది.
శ్రీరాముడు *- ఆ నగరంలోని ప్రజలు పప్రబుద్దలీలను చూచి ఆమె సత్యసంకల్ప ప్రభావంవల్ల ఆమెను గుర్తించగలిగారా ?
వసిష్కడు *- వాళ్ళు ఇలా భావించారు - *' ఈ లీల మారాణి ఈ రెండవ స్త్రీ ఈమె చెలికత్తె. ఈమె ఎక్కడినుండో వచ్చింది" అవివేకులు పశువులేకదా 1 వారు తము దృష్టికి వచ్చిన పదార్దాలను గురించి తమకు తోచినట్టు భావిస్తారు వారికి విచారణజ్డానం శూన్యం
శ్రీరాముడు "- భగవ౯ 1 కలలో కానవచ్చిన కొండ మేల్కొన్న తర్వాత ఎక్కడి! పోతుంది?
వసిష్టుడు - కలలోని వస్తువులన్నీ కదలికలు గాలిలో కలిసిపోయినట్లే వైతన్యంల్' కలిసిపోతాయి స్వప్నపదార్ధరూపంలో భాసించేది చైతన్యమే కాని మరేమీ కాదు నీచికంటె (ద్రవత్వం వేరు కాదు గదా ? అవి వేరైనట్టు కనిపించడమే అజ్ఞానం. అదే సంసారం మిధ్యాజ్ఞానం వల్ల అది ఏర్పడుతుంది జాగ్రత్ర్రపంచం కూడా స్వప్పతుల్యమే స్వప్నంలో
124 యోగవాసిస్టం తోచే నగరం అసత్తు సృష్ట్యాదిలో భాసించే జగత్తు కూడా అసత్తే చైతన్య మొక్కటే నిత్య సత్యం స్వప్న పర్వతం త్రుటిలో శూన్యమైనట్లే ఆధి భౌతికజగత్తు కూడా జ్ఞానోదయమైతే క్షణంలో మాయమవుతుంది.
ఈ ద్వైత దృష్టులన్నీ మోహ దృష్టులు. అవి మిథ్యా దృష్టులు. స్వప్నంలో కలిగే అనుభవాలన్నీ అర్హరహితాలేకదా ! భేద(భ్రవుగలవానికి మరణదళలో గోచరించే స్వప్నానుభూతి వంటి దృష్టులు కేవలం మనోగతాలే అయినా అవి మృగతృష్టా ('ప్రవాహాలలాగా వెలుపల ఉన్నట్టు భాసిస్తాయి
పదృజీవనం
ఇంతలో సరస్వతీదేవి సంకల్పంతో చిత్తప్పత్తిని నిరోధించినట్టు విదూరథుని జీవుణ్ణి శవళరీరంలోకి (ప్రవేశించకుండా నిరోధించింది.
లీల :- దేవీ! భూపాలుడు శవమై వుండగా నేను సమాధిలో లీనమై పోయాను. ఆ ఫ్టితిలో ఎంతకాలం గడచిందో చెప్పు |
సరస్వతి - ఒక మాసం గడచింది. నీ పరిచారిక లిరువురూ ఈ గృహంలో శవాన్ని రక్షిస్తూ ఇక్కడే వున్నారు
వరవర్షినీ ! ఈ కాలంలో నీ శరీరమేమయిందో చెబుతాను విను. అది పదునైదు దినాలు శుష్కించి బాప్ప్రభావం పొందింది తదుపరి నిర్హీవమై ఎండుటాకులాగ్గా నేలపై (వ్రాలింది. మంచులాగా చల్లబడిపోయింది కొయ్య మాదిరి బిగుసుకుపోయింది.
మంత్రులు ఆ శరీరస్టితి చూచి నీవ మరణించినావని నిశ్చయించినారు. నీ శరీరాన్ని
గృహం నుండి తొలగించారు. చందనూప్పాలతో చితిపేర్చి దానిపై నీ దేహాన్ని భస్మం చేశారు. తరువాత పరిజను లందరూ రాణి మరణించిందని ఏడుస్తూ నీకు జౌర్ద్వదైహిక క్రియలు నిర్వర్తించారు.
ఇప్పుడు సశరీరంగా వచ్చిన నిన్ను చూస్తే పరలోకంనుండి వచ్చినా వని వారందరూ
ఎంతో ఆళశ్చర్యపడతారు బిడ్డా! నీవు నీ పూర్వ దేహానికి చెందిన ఏ వాసనతో వుంటివో, ఆ వాసనకు అనుగుణమైన రూపమే నీకు లభించింది (ప్రతివాడూ తన వాసన కనుగుణంగానే సమస్తాన్నీ చూస్తాడు. ఇందుకు దృష్టాంతం బాలుని బేతాళ దర్శనమే నీ కిప్పుడు ఆతివాహిక దేహం లభించింది నీవు సిద్ద సుందరి వయ్యావు పూర్వ శరీరాన్ని మరచిపోయావు,
ఉత్పత్తి ప్రకరణం 125
ఆతివాహికదృష్టి బలపడినవానికి ఆధిభౌతికశరీరం శరత్కాలంలోని మేఘంలాగా కనిపిస్తూనే కనిపించకుండా పోతుంది ఆతివాహికభావం దృథఢపడితే శరీరాలన్నీ నీరులేని వేఘాలలాగా వాసనలేని పూలలాగా నావువూ (త్రావశేషాలవుతాయి. అప్పుడు యౌవనంలో వున్నవాడు తన గర్శప్ట దశను విస్మరించినట్లే మానవుడు దేహాన్ని విస్మరిస్తాడు.
ఇది ముప్పై ఒకటవ రోజు ఈ దినం ఉదయం మనం ఇక్కడికి వచ్చాము నేను నీ పరిచారికలను నిద్రామోహితులను చేశాను
లీలా! మనం సంకల్ప ప్రభావంతో ఈ రెండవ లీలకు మన స్వరూపం చూపుదాం రా! ఇప్పుడు జరిగేదేదో జరగనీ 1?
వసిష్పుడు - పీదప''ఈ లీల మనల్ని చూచుగాక!* అని సరస్వతి సంకల్పించింది. వెంటనే వారిద్దరూ దేదీప్యమానంగా కనిపించసాగారు
రెండవ లీల వారి తేజోవ్యాప్తితో వెలిగిపోతున్న ఆ ఇంటిని ఆకులమైన చూపులతో చూచింది. ఆపై లీలా సరస్వతులను గూడా అవలోకించింది. వెంటనే సంభమంతో లేచి వారి పాదాలపై పడి 'అమ్మా! మీరు నాకు శుభం కల్లించడానిక్రై వచ్చారు. నేను మీ కంటే ముందు మీ మార్గాన్ని సుగమం చేస్తూ ఇక్కడికి వచ్చాను”. అని చెప్పింది - అంతట వారు ఉత్తమాసనాలపై కూర్చున్నారు.
సరస్వతి :- '“పుత్రీ ! నీవు మాకంటె ముందు ఇక్కడికి ఎలా వచ్చావు ? నీ వృత్తాంత మేమిటి ? దారిలో ఏమేమి చూచావో చెప్పు !
ద్వితీయలీల .- దేవీ! అక్కడ అప్పుడు మీ యెదుటనే మూర్చపొందాను. నాకు మంచి చెడ్డలేవీ గోచరించలేదు తరువాత కళ్లు మూసుకొన్నాను. మరణమూర్చానంతరం మళ్ళీ కళ్ళు దెరచి చూచేసరికి ప్రాణ వాయురధం అధిరోహించి ఆకసంలో పయనిస్తున్నాను. చివరికి ఆ రధం నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది.
ఇక్కడ నా యజమానునితో కూడివున్న ఈ ఉత్తమగ్భహాన్ని చూచాను. విదూరధ మహారాజు పఫుష్ప్రగుప్పుడై వున్నాడు యుద్దంలో అలసిపోయి నిద్రిస్తున్నాడని తలచి నేనితని నిద్రకు భంగం కలిగించలేదు. ఇంతలో మీరిరువురూ ఇక్కడికి ఏచ్చేశారు నా అనుభూన్ని నేను మీకు వివరించాను.?”
సరస్వతి .- ' ఓ లలితలోచనలైన లీలలారా 1 ఇప్పుడు మనం శవతల్పం నుండి ఈ రాజును లేపుదాము.'”'
అలా అంటూ జైఫ్రీదేవి విదూరధుని జీవాన్ని విడిచిపెట్టింది ఆ జీవుడు అతని
126 యోగూూసిస్టం నాసికా సమీపం చేరుకొన్నాడు. గాలి వేణురం(ధ్రంలో ప్రవేశించినట్లు నాసారంధ్రంలో ప్రవేశించాడు
జీవుడు (ప్రవేశించగానే రాజముఖం కాంతిమంతమయింది. (క్రమంగా అతని
అవయవాలన్నీ సరసంగా ప్రకాశించాయి. ఫున్నమినాటి చం(ద్రునిలాగా అతడు కలాపూర్లుడై భాసించాడు. వసంతుడు చివుళ్ళను కదలించిన రీతిగా అతడు అవయవాలన్నింటినీ కదలించినాడు. జగత్తు సూర్యచంద్రులను భాసింపజేసినట్లే అతడు తన రెండు నేత్రాలనూ విప్పి చూచాడు.
పిమ్మట వృద్ది నొందిన వింధ్యపర్వతం లాగా పాన్సునుండి లేచాడు. 'ఎవరక్కడ?' అంటూ గంభీరధ్వనితో ప్రళ్నించాడు. *
అంతట ఇద్దరు లీలలూ ' ఆజ్ఞాపించండి 1** అంటూ అతని ముందట విన(మ్రలై నిలిచారు. ఆచారం, ఆకారం, మాట మొదలయిన అన్ని విషయాలూ సమంగా వున్న వారిద్దరినీ చూచి రాజు ''నీ వెవరు ? ఈమె ఎవరు ? ఈమె ఎక్కడిది?*” అని (ప్రళ్నించాడు. అప్పుడు 'నేను చెప్పేది వినండి” అంటూ ('ప్రథమలీల ఇలా చెప్పీంది
““నేను నీ లీలను. నీ పూర్వ సహధర్మచారిణిని. నీ కార్రై నాప్రతిబింబింలా వున్న ఈ రెండవ లీలను నేనే సంపాదించాను శిరోభాగం వైపున స్వర్థసింహాసనంపై కూర్చొని వున్న ఈమె త్రిలోకజనని సరస్వతి. మన పుణ్యం వల్ల మనకు సాక్షాత్కరించింది పరలోకంనుండి మనల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఈ దేవియే.
ఆమాట విని రాజు సంభమంతో లేవి వచ్చి సరస్వతీదేవి పాదాలపై వాలాడు “దేవీ! నీకు నమస్కారం. నీవు సర్వహిత ప్రదాయినివి. మేధనూ, దీర్హాయువునూ, +సంపదనూ ప్రసాదించు" అంటూ ప్రార్ధించాడు. దేవి అతణ్ణే చేతితో స్పృశించి అనుగ్రహించి ఇలా అన్నది -
“పుత్రా ! నీవు అభివుతార్దాలతో సహా ఈ భవనంలో నివసించు నీకు సర్వాపదలూ, సకల దుష్కృతాలూ శమించుగాక! సమస్త సుఖాలూ సిద్రించుగాక! నీ రాష్ట్రంలో జనులు నిత్యసంతుష్టు లగుదురుగాక ! సంపదలు స్టిరంగా వుండుగాక!!1*
పద్మ నిర్వాణం
అలా చెప్పి సరస్వతీదేవి ఆ రాజగృహంలోనే అంతర్జానమయింది. రేయి గడచి తెల్లవారగానే పద్మాలతోపాటు (ప్రజలు కూడా 'ప్రబుద్దులైనారు మరణించి మరలా
ఉత్పత్తి ప్రకరణం 127 జీవించిన రాజును లీల లిరువురూ సంతోషాతిశయంతో కౌగలించుకున్నారు.
ఆ రాజగ్భహ మంతా అప్పుడు ఆనందడోలికలలో ఊగసాగింది జయఘోషలూ, వుంగళవాద్యాలూ చూరు(వైూగాయి సిడ్డులూ, విద్యాధరులూ పూలవాన కురియించారు. ఏనుగులు తొండాలు పైకెత్తి ఘీంకరించాయి. అంగనలు ఆనందనృత్యం చేశారు. వనితల వదనా లనే వేలకొలది చంద్రులతో ఆ గృహ ప్రాంగణం భాసించింది. .
“లీలాదేవి రాజునూ క్రొత్తరాణినీ పరలోకంనుండి తీసుకువచ్చింది? అనే అర్ధం కల పాట లల్టుకొని ప్రజలందరూ పాడసాగారు.
పద్మనరపతి గడచిన వృత్తాంతాన్నంతా సంగ్రహంగా విన్నాడు. విప్రులూ, మంత్రులూ, రాజులూ నాలుగు సము(దద్రాలనుండి తెచ్చిన జలాలతో రాజుకు అభిషేకం గావించారు. జీవన్ముక్తబుద్ది గల ఇద్దరు లీలలూ, రాజూ గతవృత్తాంతం చెప్పుకొంటూ ఆమందానందం పొందారు. |
ఈ రీతిగా తన (ప్రయత్నంతోనూ దేవి అనుగ్రహంతోనూ పద్మరాజు పఠమ(శ్రేయస్సు పొందాడు. తత్త్వజ్ఞాడైన ఆ భూపాలుడు లీల లిరువురితో కూడి బహుకాలం ప్రజాహితకరంగా రాజ్యపాలన గావించాడు తర్వాత ఆ దంపతులు జ్ఞానసద్దులై విదేహముక్తి పొందారు.
ప్రయోజన వర్షనం
వసిష్టుడు :- రామా | దృశ్యదోషం తొలగడానికై నీకు లీలోపాఖ్యానం చెప్పాను. ఈ జగత్తు సత్యమనే భావన వదలిపెట్టు దృశ్యసత్త శమించే వున్నది మళ్లీ దానికి శమనం అవసరం లేదు. ఉన్నదానిని తొలగించడం క్లేశంగాని లేనిదానిని తొలగించడంలో కష్ట, మేమున్నది ? జ్ఞాని దృశ్ళం ఆకాళం వంటిదని గ్రహించి తానూ ఆకాశసముడై వుంటాడు.
పృథివ్యాది భూత సంబంధం లేనివాడూ, చిన్మాత్ర స్వరూపుడూ అయిన స్వయంభువు దీనినంతా తనలో తాను కల్పించుకొన్నాడు ఆతని చైతన్యంలో జీవసంవిత్తు ఏకదేశం మాత్రమే అది ఏ ప్రవృత్తితో ఎలా ప్రయత్నిస్తుందో అలాగే అవస్రితమై వుంటుంది. ఈ జగత్తు చిదాకాశ ప్రకాశమే. ఇది బుద్ది పరిచ్చిన్నుడైన బీవునిలోనే వున్నది. అందుచేత జీవుడు తన ప్రయత్నంతో ఈ దృశ్యాన్ని రూపుమాపవచ్చు. ఇలాంటి వ్యర్ట(భ్రాంతికి ఉనికి, వాసన, స్టైర్యం నియతి, అవళశ్యంభావిత్వం ఎలా ఉంటాయి ? ఇదంతా మాయాకార్యమే. అసలు మాయకే ఉనికీ లేదు కదా 1
128 యోగూసి్థం 4
శ్రీరాముడు - భగవ౯! మీరు నాకు పరమార్దదృష్టిని ప్రసాదించారు. దావాగ్నిలో కాలిపోయిన తృణాలకు చంద్రకళ మళ్లీ అంకురించే శక్తి కల్గిస్తుంది అలాగే మీరు (ప్రసాదించిన దృష్టి సంసారతాప పీడితులకు శాంతి చేకూరుస్తుంది
ఆళ్చిర్యం 1! చాలాకాలానికి ఇది ఏమిటో ? ఎలాంటిదో తెలిసికోదగింది ఏదో, వీ అను([గ్రహంవల్ల తెలుసుకోగలిగాను. మీరు చెప్పిన ఆఖ్యానం, వ్యాఖ్యానం విని పరమశాంతినీ పరమ నిర్వాణాన్నీ పాందినట్టు ఆనందిస్తూన్నాను చెవులనే పాత్రలతో మీవాక్యామృతం ఎంత (త్రాగినా తృప్తి కలగడంలేదు సర్వజ్ఞా ! ఈ నా సంశయం తొలగించండి! *
లీలా భర్తకు చెందిన మూడు జన్మలలోనూ కాలస్వభావం ఎలాంటిది ? అది ఒకచోట అహోరా(త్రాత్మకమా ? మరొకచోట మాసాత్మకమా ? ఇంకొక చోట అనేక సంవత్సరాలా ? ఒకనికి కడు ద్వీరమూ ? మరొకనికి క్ష్షణికమూ ? ఒకే కాలానికి దేశలోకాదులవల్ల ఇలాంటి భేదం ఏర్పడుతుందా ? అనుగ్రహంతో ఇందలి తత్త్వం బోధించండి ఎండిన మట్టి పెళ్లపై బడిన జలబిందువులాగా ఒకసారి విన్నమా త్రాన ఈ విషయం స్మ్కృతిపధంలో నిలవడం లేదు.
వసిష్రుడు :- అనఘా | ఎవడు ఎప్పుడు ఏ ప్రతీతిని పాందుతాడో, వానికి అప్పుడు ఆ ప్రతీతికి చెందిన అనుభవమే ఏర్పడుతుంది. అమృతభావన వల్ల విషం అమృతంగా మారుతుంది మిత్రభావన వల్ల శత్రువు మిత్రుడవుతాడు. చిత్సంకల్పాన్ని అనుసరించి వివిధపదార్జాలు ఆకారం తాల్సి ఆయాపనులు చేస్తున్నాయి.
ఒక్క నిమిషాన్నే పెక్కు కల్పాలుగా భావిస్తే కల్పమవుతుంది కల్పాన్ని నిమిషంగా భావించినా జరోది అంతే ఇందులో సందేహం లేదు దుఃఖితునికి రాత్రి ఒక యుగంగా తోస్తుంది సుఖవంతునికి అదే ఒక క్షణంగా భాసిస్తుంది కలలో-క్షణం యుగంగా, యుగం క్షణంగా తోచడం కద్దు
కలలో ఒకనికి “నేను మరణించి మరల పుట్టాను యువకుడ నయ్యాను నూరు యోజనాలు నడిచాను” అనే అనుభవం కలుగుతుంది కదా ! పూర్వం హరిళ్ళింద్రుడు ఒక రాత్రిని పన్నెండు సంవత్సరాలుగా గడిపాడు అవణుడు ఒక రాత్రిలోనే నూరు సంవత్సరాల ఆయుస్సు అనుభవించాడు (ప్రజాపతికి ఒక ముహూర్తకాలం మనువుకు ఒక జీవిత కాల మవుతున్నది (బ్రహ్మకు ఒక జీవితకాలం విష్ణువుకు ఒక దినమవుతుంది విష్ణువుకు ఒక జీవితకాలం శివునికి ఒక దినం మాత్రమే నిర్వికల్పసమాధిల్ో చిత్తం
ఉత్పత్తి ప్రకరణం 129 నశించిన యోగికి రాత్రింబవళ్లు అనేవి లేనే లేవు
యోగికి ఆత్మ తప్పు మరొకటి లేదు. తీయని పదార్ధం కూడా అప్రియమై పోతుంది. అభ్యాసం లేని వానికి శాస్త్ర పాఠాదులు కఠినంగా ఉంటాయి. అభ్యాస బలంతో అవే తేలికవుతాయి.
పడవలో పయనించేవాడికి తీరభూమి తిరిగినట్టుంటుంది. భావనా బలం వల్ల కలలో మాదిరిగా శూన్యం పూర్ణమై కనిపిస్తుంది. భావనాదోషం వల్ల పచ్చరంగు తెల్లగానో, నల్లగానో అగుపిస్తుంది.
మోహానికి గురి అయిన బాలుడు ఉత్సవకాలంలో సైతం ఆపత్కాలంలో లాగా దుఃఖిస్తాడు. విచారహీనుడు గోడను శూన్యంగా తలపోస్తాడు ఉనికి లేని యక్షుడు మూఢుల [ప్రాణులను కూడా హరిస్తాడు. కలలోని కాంత జాగ్రత్తలోని వనితలాగా రతి కల్గిస్తుంది. కాబట్టీ భావన ననుసరించి పరిస్టితులు మారుతుంటాయి.
ఈ జగత్తు మిధ్య. మేఘచ్చాయలో కన్పించే మిథ్యానటుని వృత్తం లాగా అది చిదాత్మలో భాసిస్తున్నది. ఇది గగనంలో కల్పించుకొన్న మానసిక స్పందనమే కాని మరేమీ కాదు. ఇది మేలుకొన్న వానికి కలో అపూర్వ స్వప్నం. స్వర్గంలో (ద్రవత్వం దాగి ఉన్నట్లే పరమ పదంలో ఈ సృష్టి మిళితమై వున్నది. అంగ సన్నివేశం ఆత్మ కంటే వేరు కానట్లే జగత్తు బ్రహ్మ కంటే వేరుకాదు. ఈ జగత్తు హిరణ్య గర్భుల స్మృతిజ్ఞప్పుల నుండి కల్గుతున్నది అందువల్ల ఇది జ్రిప్తి మాత్రమే కాని వాస్తవం కాదు.
_ శ్రీరాముడు :- విదూరథుని కుల[క్రమం పౌరులకు, మంత్రులకూ, అందరికీ ఒకే రీతిగా ఎలా కన్పించింది ?
వసిష్టుడు :- స్వల్పమైన సుడిగాలి పెద్దసుడిగాలిని అనుసరించినట్లే జీవుల సంవేదనలన్నీ ముఖ్యచిత్తాన్ని అనుసరించి వుంటాయి అందువల్ల అందరికీ విదూరథుని వంశపరంపర ఒకే తీరుగా తోచింది ఈ రాజు పలానా కులంలో పుట్టాడు, ఇతడు మావాడు అన్న భావం ఆ పౌరులకు కల్గింది ఇందుకు కారణాన్ని అన్వేషించ బనిలేదు. మహామణి యొక్క కాంతులు ఇతరత్ర భొసించడం లేదా ?
ఈ కులంలో నేను రాజుగా జన్మిస్తానన్న వాసనా బలం వల్లనే విదూరధుడు జన్మించాడు. జీవవైతన్యం సర్వవ్యాపి కాబట్టి సృష్టిలోని ప్రాణులన్నీ పరస్పరసామ్యం కల్గివున్నాయి. అందులో ఎవని సంవేదనకు మోక్షం పొందాలనే తీవ్రవేగం ఉంటుందో, అతడు మాత్రమే ముక్తి పాందగలడు సముద్రం వైపు పయనించే మహానది ఇతర నదులను
130 యోగవాపిష్టం తనతో తీసుకు పోయినట్లే సత్యసంవేదన ఇతర జ్ఞానాలను తనలో లీనం చేసుకొంటుంది.
దృఢంగా (ప్రయత్నించే అధికారి తప్పక బ్రహ్మంగా పరిణమిస్తాడు ఈ రీతిగా పుడుతూ, పెరుగుతూ, నశిస్తూ వుండే వేలకొలది సృష్టులలో ఏ జీవునికీ ఏదీ లభించడం లేదు. అంతా శూన్యమే. అంతా శాంతమే చిదాకాళ మొక్కటే ఉన్నది. బ్రహ్మ సొక్షాత్కార్యం కల్గే వరకూ ఈ నిద్ర లేని స్వప్నం పునరావృత్తం అవుతూనే వుంటుంది అయినా అది మిధ్యే.
ఒకే చెట్టు పత్రంగా, పుష్పంగా ఫలంగా, అనేక విధాలుగా పరిణమించినట్లే బ్రహ్మ మొక్కటే అనంతశ్ర్తితో, అనేక రూపాలుగా పరిణమిస్తున్నది. ఒక్కసారి ఈ బ్రహ్మ తత్త్వం అనుభవానికి వస్తే మళ్ళీ దానిని విస్మరించడం జరగదు.
ఆత్మలో ఉదయాస్తవుయాలు లేవు. అది ఆదివుధ్యాంతరహితము, ఏకమా(త్రము. నిశ్చలంగా వున్నా, అలలతో చలిస్తున్నా నీరు నీరే కదా!
సంకల్ప వికల్పాత్మకమైన మనసునుండి నీవు, నేను అనే భావం కల జగత్తు భాసించినట్టు తోస్తుంది. అది శుద్ర బోధ స్వరూపమైన బ్రహ్మమే. ఆకాశం శూన్యమైనా అందులో భ్రాంతుని దృష్టికి ముత్యాలు మొదలైన ఎవేవో పదార్దాలు గోచరిస్తాయి. అలాగే (భ్రాంతి గలవానికి బ్రహ్మంలో ఈ! జగత్తు గోచరిస్తున్నది.
ఉత్పత్తి (ప్రకరణం - ప్రధమభాగం సమాప్తం. శ్రీ సద్గురు పరబ్రహ్మార్చణమస్తు
యోగవాసిష్టం - ఉత్పత్నిపకరణం ద్వితీయభాగం - విషయసూచిక క జగత్స్వరూపం 131 రే _ దైవ శబ్దార్థ నిరూపణం ం 133 శ చిత్తవికారం ల 135 4 _ బీజాంకుర యోగనిర్ణయం వుం కేకేర్ 5 _బీవవిచారం ఎం 1138 6 సంసృతి పరమ యోగం ం 139 7 సత్యోపదేశం లం కేడీ! 8. కర్కట్యుపాఖ్యానం - రాక్షసీ వర్ణనం ల... 147 ఈ. విషూచికా మంత్రకధనం లం. కే4కీ 10... సూచీ వ్యవహారం ఎం. 150 11. సూచికా పరిదేవనం ఎంట. కర్3ే 11. సూచీ తపప్రభావం ఎంటి. కేర్ఫ్ [3 సూచీ తపో వర్ణనం కక? 14. తపఃపరిపాకం లి. కఫం 15... సూచీ శరీర లాభం ఎం 161 16.. అన్యాయ బాధికం లం 162 17. కర్కటీ విచారం లం. 163 18... రాశ్షసీ వర్ణనం ఆం. 164 19... రాశసీ ప్రశ్నలు 16? 20 ప్రళ్నీ భేదనం ఎ శ$20 21... పరమార్ధ పిండీకరణం ఎం. కడ 72. రాతసీ సౌహార్దం య. 23 కందరా పూజనం ఎం 185 24 మనో£_౦కురోత్పత్తి లం 186 25. ఐందవోపాఖ్యానం - బ్రహ్మాదిత్యుల కలయిక 189 26. ఐందవ సమాధానం 1౮] 27. జగద్వర్థనం 194 28 ఐందవ నిశ్చయం కేప్రిగ్ 29 _ కృత్రిమేంద్రుని వచనం 196
£ 30. జీవావతరణ క్రమం ల. 200 31. మనోమూహాత్మ్యం ఎం. 204 32 ఉత్పత్తి దర్శనం ఎం. 206 33. _(బ్రహ్మనుండి సర్యోత్పత్తి ల. 208 34. కర్మ పురుషుల ఏకత్వం లల. 209 35. మనఃసంజ్డా ఎచారం ఎం. 212 36. చిదాకాశమాహాత్మ్యం ఎం. 216 37. చిత్తోపాఖ్యానం ఎం. 218 38. _చిత్తచికిత్సా పూర్వకచితోత్పత్తి లు... 223 39. బాలకాఖ్యాయిక లలల... 225 40. ఉపదేశకరణం ల. 228 41. చిత్తమాహాత్మ్యం ఎం... 231 42. ఇంద్రజాలోపాఖ్యానం - రాజవ్యామోహం లు... 232 43. రాజావబోధం ఎ... 23క5్ 44, చాండాలీ వివాహం ల. 236 45. ఆపద్వర్హనం ఎం... 241 46. అకాండ దుర్చిక్షం న! 47. చండాలత్వ వ్యషగమం ల... 246 48. చిత్త వర్షనం లం... 24కి 49. చిత్త చికిత్స టం... 252 50. ఉపదేశాంశం లం... 255 51. అవిద్యా వర్ధనం ఎం. 257 52. దోషపరిహారోపదేశం ల... 262 53. _సుఖదుఃఖ భోక్పృత్వం ల. 266 54. సాధక జన్మావతారం ఎం. 269 55. అజ్ఞాన భూమికలు ఎం. 271 56. జ్ఞాన భూమికలు ల... 2723 57. _బర్షారం - ఉంగరం = ఉపదేశం యం... 275 58. చండాలీశోకం ల... 227 59. _చిత్తాభావ (ప్రతిపాదనం 280 60 స్వరూప నిరూపణం ఎ. 283
కో ల అడి యోగవాసిష్పం ఉత్పత్తి ప్రకరణం అతి ద్వితీయభాగం
శ్రీ రాముడు : - బ్రహ్మన్! "నేను - జగత్తు" అనే భ్రాంతి కారణం లేకుండానే ఎలా కలుగుతుందో దయచేసి మళ్ళీ వివరించండి.
వసిష్కుడు :- సమస్త భ్రాంతులూ స్వరూపచైతన్యములో నివే కాని వెలుపలివి కావు. సర్వాత్మకవూ, జన్మరహితవమూ అయిన బ్రహ్మమొక్కటే ఉనికి గలిగివున్నది. శబ్బాలవల్లా, అర్జాలవల్లా మనకు కలో జ్ఞానాలన్నీ బ్రహ్మమే. అవి (బ్రహ్మంకంటే వేరుగా లేవు. వాటికి రూపం లేదు. మనకు నిత్యం అనుభవానికి వచ్చే రూపభేదాలు వృత్తికి సంబంధించినవే కాని చిత్తులోనివి కావు.
స్వర్ణంకంచే కటకత్వం, జలంకంటే తరంగత్వం వేరుగా లేవు కదా! అలాగే ఈశ్వరునికంటే జగత్తు వేరుగా లేదు. ఈశ్వరుడే జగద్రూపంగా వున్నాడు. అంతే కాని ఈశ్వీరునిలో జగద్రూపం లేదు. కటక కుండలాదులుగా కనిపించేది బంగారమే. కాని ఇంగారంలో కటకత్వాదులు లేవు గదా! ఆవయవిరూపం పెక్కు అవయవాలతో
132 యోగవాసిం కూడివుంటుంది. అదే రీతిగా అవయవరహితమైన చిద్వస్తువు సర్వాత్మకమై నానారూపాలతో భాసిస్తున్నది.
సర్వజీవులలోని బ్రహ్మమాత్రస్వరూపానికి చెందిన అజ్జూనమే “' జగత్తు-నేను?' అన్న రూపంలో ప్రకాశిస్తున్నది. స్పటికశిలలోని ప్రతిబింబాలు అభిన్నాలైనా భిన్నమై వున్నట్టు తోస్తాయి. అలాగే బ్రహ్మంలో ' జగత్తు-నేను' అనే భావం కూడా వేరు కాకున్నా వరైనట్టు తోస్తుంది. నీటిలో ఆరిల్భాగా పరబ్రహ్మంలో సృష్టులు అంతర్లీనమై వుంటాయి. పరమార్ధ చిద్రూపమైన (బ్రహ్మం అవిద్యలో ప్రతిఫలించిన తన సంవేదనచేత ఈ చిత్రమైన జగత్తును కల్పించుకొంటున్నది. ఈ కల్పన వల్లనే ఆకాళం, వాయువ్ను. త్తేజప్పు, జలల్ని, పృద్విలఅనే పంచ భూతాలు ఏర్పడుతున్నాయి. 5 న్నష్టి పరంపళాల8తీ సళ నిపొషేంలోని లకవవంతు కాలంలోనే సంభవిస్తుంది”
శుద్దమూ, నిత్య(వ్రభాళమూ, ఉనానుయమఘూ్నూ చ్యయాస్తమయ రహితమూ అయిన బ్రహ్మం ఏ ఆధారమూ లేకనే తనకు తానుగా వుంటున్నది. సృష్టి ప్రళయాలు అందులో అంతర్ల్గతాలై వుల్లత్తోయ్సా అరిణే ల్తక్షానావస్టలో మాత్రమే ఆ సృష్ట్యైదులు కనిపిస్తాయి. ప్రబుద్దావఫ్రలో మోక్షం తప్ప మరేమీ వుండదు.
చిద్రూపమైన బ్రహ్మను తనాఆత్యలోబివడెలా గ్రహిస్తాడో, వాని కది అలాగే ప్రతిఫలిస్తుంది. దాని మాయాశ్త్తీ అలాంటిది. చిద్విలాస దృష్టితో చూస్తే ఈ జు్తే (బ్రహ్మం - బహిర్ముఖమైన ఇంద్రియద్నృష్టితో చూస్తే బ్రహ్మమే జగత్తు. బ్రహ్మమూ, జగత్తూ భేదదృష్టికి భిన్నంగా, అభీదదృప్టికి అభిన్నంగా గోచరిస్తాయి. ”
తయారుచేయడానికి ముందు కూడా మట్టిలోనూ, కర్రలోనూ బొమ్మ గూఢంగా వుంటుంది. ఆలాగే సృష్టికి పూర్వం కూడా జగత్తు (బ్రహ్మంలో గుప్తంగా వుంటుంది. పరబ్రహ్మ మనే ఎడారిలో ముల్లోకా లనే ఎండమావులు అసత్యాలయినా సత్యాలుగా కనిపిస్తాయి. బీజంనుండి మొలక లాగా చిన్న్మయమైన బ్రహ్మంనుండి సృష్టి అంకురిస్తున్నది. "
పాలలో తీపు, మిరియంలో కారం; నీటిలో (ద్రచత్వం, గాలిలో చలనం విడివిడిగా లేవు. . అదే రీతిగా పరమాత్మకంటే. జగత్తు అన్యంగా లీదు. (బ్రహ్మమనే రత్నంనుండి జుగత్తనే వెలుగు కారణం లేకనే వెలువడుతున్నది. ఆ వెలుగు (బహ్మముకంటే చేరైనది కాదు. -
ఉత్పత్తి ప్రకరణం 133
వాసనలు, చిత్తం, జీవుడు మొదలయినవి మనస్సునుండే పుడుతున్నాయి. ప్రయత్నంతో జ్ఞానయోగాన్ని దృఢంగా అభ్యసిస్తే మనస్సు నశిస్తుంది. మనోనాళం కాగానే వాసనాదులు కుడా నశిస్తాయి.
జ్ఞానయోగమంటే ఏమిటి ? అంతా శాంతమైన (బ్రహ్మమే. అది శిలవలె ఘనమైనది. అందులో దేనికీ ఉదయాస్తమయాలు లేవు. చిత్తభ్రాంతి వల్ల ఒక్క పరమాణువులోనే అనేక సృష్టి పరంపరలు భాసిస్తున్నాయి. వాటెకి నిజంగా ఉనికి లేదు. జీవుని లోని జాగ్రదాద్యవస్రలు నీటిలోని అలల్టాగా వెలువడుతూ, అంతరిస్తూ వుంటాయి.
ప్రాణికి భోగాలపట్ల కొంచమయినా విరక్తి కలిగిందంటే అతడు ఉన్నతస్థితి పాందుతాడని (శ్రుతి చెబుతున్నది. దేనిపట్ట విరక్తి కల్గితే దానినుండి విముక్తి సిద్దిస్తుంది. దేహాత్మ బుద్ది లేనివారికి జననమరణ (భ్రాంతి కూడ ఉండదు. ఎవరు నామరూపరహిత చిత్స్వరూపాన్ని గ్రహిస్తారో వారు తరిస్తారు. ఈశ్వర వైత న్యంకంటె జీవవైతన్యం వేరు కాదు. వూయాతుయమైన ఈ జగత్తు సదసద్విలక్షణమైనది.
అహంభావంతో కూడిన చతుర్ముఖ (బ్రహ్మయొక్క అంతర్ముఖభావన తన సంకల్ప భేదాన్ని అనుసరించి ఈ విశ్వాన్ని వెలువడబేసింది. అది విష్ణుభగవానుని నిమేషంలోని కోట్యంశకాలంలోనే (ప్రళయం పొందుతుంది. మాయా్రభావం అలాంటిది!
దైవశబ్దార్థ నిరూపణం
ఒక పరమాణువు యొక్క లక్షాంశంలో వేలకొలది జగత్తులు, ఒక నిమేషం యొక్క లఖాంశంలో వేలకొలది కల్పాలు నిజంగా ఉన్నట్టు తోస్తాయి. మళ్ళీ అందులో ఒక్కొక్క దానిలోనూ కల్పనలు సంభవిస్తాయి. జౌరా! ఈ (భ్రాంతికి అంతమనేది లేదు. భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన ఈ సృష్టి పరంపరలు సుడిగుండాలతో గూడిన జల(ప్రవావాల లాగా పరి(భ్రమిస్తూనే వుంటాయి. వురుభూమిలో కల్పించుకొన్న నదిలాగా ఈ సృష్టి మిథ్య. కలలోనూ, ఇం(ద్రజాలంలోనూ కనిపించే పట్టణం లాగా ఇద్ర(భమ మాత్రమే.
-... శ్రీరాముడు: - జ్ఞానులలో (శ్రేష్టుడవైన ఓ వసిస్టమునీం'ద్రా! సమ్యగ్విచారంతో
134 యోగాసిష్టం నిర్వికల్పమైన ఏకాత్మక పరమాత్మ విజ్ఞానం కలిగిన తత్త్వజ్ఞులకు కూడా దైవప్రభావానికి లోబడినాయా అన్నట్టు ఈ శరీరాలు ఎలా నిలిచివున్నాయి? తత్త$వేత్తల పట్ల కూడా దైవప్రభావం ప్రసరిస్తుందా? ఆ దైవం ఎలాంటిది?
వసిష్టుడు: - రామా! సర్వ జగద్వ్యవహాలరూపిణి అయిన ఒక చిచ్చక్తి ఉన్నది. అది బ్రాహ్మామయశ్తి. అదే ఈశ్వరసంకల్పమైన నియతి. అది సకలకల్పాలలోనూ అనువర్తిస్తూ వుంటుంది. అది సృష్ట్రాదిలోనే అగ్ని మొదలైన ఆయా పదార్థాల . స్వరూపం ''ఇలా వుండాలి” అని నియమిస్తుంది.
ఈ నియతినే మహాసత్త, మహాచితి, మహాశక్తి, మహాదృష్టి మహాక్రియ, మహోద్భవం, మహాస్పందం - ఇత్యాదిగా నానావిధాల వ్యవహరిస్తారు. దానివల్లనే గడ్డిపోచల వంటి జగత్తులు ఇలా ఉదయిస్తూ, అంతరిస్తూ వున్నాయి. దైత్యులు, దేవతలు, నాగులు, కొండలు మొదలైన వాటి స్థితి కల్పొాంతం వరకూ “ఇలాగే ఉండాలి అని నియతి కట్టుడ కావించింది.
(బ్రహ్మం లేదని అనుమానించవచ్చు. ఆకసంలో చిత్రాన్ని ఊహించవచ్చు. కాని నియతికి మాత్రం మార్పును భావించలేము. (బ్రహ్మానికి మారు పేరైన ఈ నియతినే తత్త్వజ్ఞులు తెలియని వారికి తెలియజొప్పడానికై "సృష్టి అన్న పేరుతో వ్యవహరించారు. ఆదిమధ్యాంతరహితమై, అచలమైన (బ్రహ్మమే అజ్ఞుల దృష్టికి చంచలమైన సృష్టిగా తోస్తుంది.
నియతినే దైవమంటారు. ఇదే సకల కాఠాలలోనూ, సకల వస్తువుల్లోనూ వ్యాపించి వున్నది. ఇది శుద్దమైన ఈశ్వర సంకల్ప వైతన్యమై జగద్రూపంలో భాసిస్తున్నది. తృణగుల్మాదులు, సర్వభూతాలు, జగత్కొాలక్రియాదులు - అంళా ఈ నియతే. పురుషుని అదృష్టం నియతిపైనా, నియతి పౌరుషం పైనా ఆధారపడి వున్నాయి. ఈ స్థితి కూడా నియతి వల్ల ఏర్పడినదే. ముల్లోకా లున్నంతవరకూ ఇవి ఇలాగే వుంటాయి. (ప్రళయకాలంలో ఇవి రెండూ ఒక్కటై పోతాయి.
మానవుని పురుషకారము ననుసరించే నియతి పౌరుషాలు ప్రవర్తిస్తాయి. ఇంతెందుకు? రామా! నీవు నన్ను దైవ పౌరుష నిర్ణయాన్ని గురించి అడగాలనీ, నేను చెప్పినల్టు నీవు పారుషం పాటించాలనీ నియతే విధించింది. ఒకడు దైవ పరాయణుడై. దైవమే నాకు అన్నం పెడుతుంది అని ఊరక వుంటాడు. అది కూడా నయతి నిర్ణయమే. పురుషకా రాన్ని అమసరించే వ్యవహారం అంతా కల్పాంతం
ఉత్పత్తి ప్రకరణం 135 వరకూ జరగాలనేది నియతి విధించిన నియమం. 'ఇది ఇలా జరిగి తీరాలి” అనే నియతిని రుద్రాదుల బుద్దులు కూడా అతి[క్రమింప జాలవు.
అయితే బుద్రిమంతుడైనవాడు నియతిపై మనసుంచి పౌరుషం వదలరాదు. ఎందుకంటే, నియతి పురుషకార రూపంతోనే కర్మలు నిర్వహిస్తున్నది. సంకల్పరూపంలో ఉన్న నియతి సృష్టి రూపంతో వచ్చినప్పుడు పురుషకారం అవుతున్నది. పురుషకారంగా పరిణమించని నియతి వ్యర్థం. పురుషకార రూపం పొందిన నియతి సార్టకం. అందుచేత పురుషార్ధ ప్రాప్తికి పౌరుషమే కారణ మవుతున్నది.
ఒకడు నియతి నాశ్రయించి ఏ పనీ చేయక ఊరకుంటాడు. అయినా వాని (ప్రాణవాయు చలనం ఎక్కడికి పోతుంది? మరొకడు (ప్రాణ క్రియను సైతం నిరోధించి నిర్వికల్పసమాధిలో వుంటాడు. అతడు ముక్తాత్ముడు. అతని ముక్తి కూడా ఫురుషకార ఫలమే. పురుష్రార రహితమైన ఫలమంటూ ఏదీ లేదు. అందువల్ల పురుషకారమే (శ్రేయస్కరం. ఫలరూపమైన ముక్తి కూడా (శ్రేయస్కరమే. ఇందులోన”గా మహాత్ముల దుఃఖరహితమైన ఫ్రితే బలవత్తరమైనది. ఆ స్రితి పరిణతి పాందితే పరాగతి సిద్దించినచ్చే.
భూమిలోని జలవే తృణ - లతా - వృష్షాదులుగా ప్రకాశించినట్టు సర్వగతమైన (బ్రహ్మమే నియతి మొదలైన విలాసాలతో భాసిస్తున్నది.
చిత్త వికారం
ఈ (బ్రహ్మతత్త్వం అన్ని విధాలా, అన్ని వైపులా, అన్ని ఆకృతులలోనూ సర్వశక్తీిమంతమై, సర్వమై ప్రకాశిస్తున్నది. అది అంతటికీ ప్రభువై వున్నది. ఈ ఆత్మ సర్వశక్తిమంతం కావడంవల్ల ఒకచోట చిచ్చక్తిని ప్రకటిస్తుంది. మరొకచోట శాంతిని, ఇంకొకచోట జడశక్తిని, వేజాకచోట రాగద్వేషాదులనూ ప్రకాశింప జేస్తుంది. ఒకచోట దేనినీ ప్రకాశింపజేయదు.
ఇది ఎప్పుడు, ఎక్కడ, దేనిని ఎలా భావిస్తుందో, అప్పుడు, అక్కడ, దానిని అలాగే చూస్తుంది. దాని శక్తి ఏ రూపంలో ఉదయిస్తుందో, ఆ రూపంలోనే వ్యాపిస్తుంది. అది నానా విధాల వ్యవహరింపబడుతుంది. కాని అన్ని శక్తులూ ఆత్మే. ధీమంతులు న్యవహారం కొరకు ఈ వికల్పాలను కల్పించుకొన్నారు. కాని ఆత్మలో భేదం లేదు. సముద్రంలో ఊర్ములు, తరంగాలు, నీరు అనే విభాగం మిథ్య.
136 యోగవాసిష్టం బంగారంలో కటకం, అంగదం, కేయూరం అనే విభాగం మిథ్య. అదే రీత్రిగా అవయవికీ, అవయవాలకూ భేదర కల్పితమే కాని వాస్తవం కాదు.
మనం బుద్దితో దేనిని ఎలా భావిస్తామో, అది అలాగే బాహ్యదృష్టికి గోచరిస్తుంది. కాని బహిరంతరాలలో నిజంగా అది అలా ఉదయించదు. ఈ (బ్రహ్మం సర్వాత్మకం కాబట్టి సర్వసాధారణమైన సాక్షీ వైతన్యమై (భాంతి వల్ల ఎక్కడో దేనినో దర్శిస్తుంది. అది సర్వాకారమయమైన (బ్రహ్మమే కాని మరేమీకాదు. (భ్రమకు లోనైన వారు తవా మిథ్యాజ్జునంతో అందులో కల్పించుకొన్న అవయవావయవిభేదాలు పారమార్ధికాలు కావు.
అది నిజం కానీ, కాక పోనీ! విథ్యా జ్ఞానం కల చిత్తు దేని నెలా సంకల్పిస్తుందో, దానికొరకై అలాగే ఉద్యమిస్తుంది. ఉద్యమానికి తగిన ఫలం పొందుతుంది. ఆ సద్రూపమైన (బ్రహ్మమే చిద్రూపమై ఇలా భాసిస్తున్నది కాని మరేమీ కాదు.
బీజాంకుర యోగనిర్ణయం
పరమాత్ముడు సర్వవ్యాపి. నిర్మలమైనవాడు, ఆనందస్వరూపుడు, ఆద్యంతాలు లేనివాడు, శుద్దచిన్మాత్ర స్వరూపుడైన ఆ పరమాత్మ నుండి చిత్తయుక్తుడైన (బ్రహ్మ అనే జీవుడు ఉదయిస్తున్నాడు. ఆ జీవుడే చిత్తం అనబడుతున్నాడు. ఆ చిత్తం నుండీ జగత్తు కల్గుతున్నది.
శ్రీరాముడు : - వీక మాత్రమూ, స్వానుభవ ప్రమాణమూ, అఖండమూ అయిన (బ్రహ్మము నుండి అల్పు డయిన జీవుడెలా ఉద్భవిస్తాడు?
వసిష్టుడు : - ఈ బ్రహ్మం నిర్మలం, సర్వగతం, ఆనందమయం. ఇందులో ర్వైతం లేదు. సువిశాలమైన దీని చిదాకారం అనాత్మయోగులకు భయం కల్గిస్తుంది. దానిలో మిథ్యామయమైన ద్వైతభావం అవిద్యా సంస్కారం వల్ల కలుగుతుంది. పరిప్యూర్ణమూ, సత్త్వమయమూ, శుద్రమూ అయిన దీనిని పండితుడు కూడా “ఇదమిళ్చం' అని నిర్దేశింపలేడు. అది శాంతమైన పరమ పదం.
అదే ఉపాధితో కూడి సంవిత్స్వరూపమై చలనశక్తి రూపమైన ప్రాణం ధరిస్తే జీవు డనబడుతుంది. మోక్షం కలోటంత వరకూ ఆ జీవత్వం ఉంటుంది. చిదాకాళ స్వరూపమైన ఆ పరమాదర్శంలో లెక్కింపరానన్ని అనుభవాత్మకమైన జగత్తులు
ఉబ్చత్తి ప్రకకణం 127
ప్రతిబింబిస్తాయి.
రామా! గాలిలేని సముద్రంలోనూ, నిర్వాత ప్రదేశంలోని దీపంలోనూ కలిగే చలనం వంటి చలనం బ్రహ్మలో కలిగితే, ఆ చలనాన్నే జీవ్రడంటారు. వత్సా! స్వచ్చమైన (బ్రహ్మములో శాంతత్వం తాలగిపోగా కొద్దిగా సంవేదనాత్మకమై స్వాభావికంగా కలిగే స్పురణమే జీవుడు. గాలికి చలనం, అగ్నికి వేడిమి, మంచుకు చల్లదనం లాగా ఆత్మకు బీవత్వం కూడా స్వాభావికమై వుంటుంది. చిద్రూపమైన ఆత్మ తత్త్వంలో అజ్ఞానం వల్ల కలిగే స్వల్పషంవేదనమే జీవుడు.
నిప్పురవ్వ కట్టె లెక్కువయ్యే కొద్దీ ఎక్కువగా ప్రకాశించినట్లే పరిచ్చిన్నమయిన జీవభావం వాసనలు బలపడే కొలదీ అహంభావాన్ని పొందుతుంది. ఆకసంలో నీలిరంగులాగా జీవునిలో అహంభావం లేకున్నా ఉన్నట్లు తోస్తుంది.
ఈ అహంభావం దేశకాల పరిచ్చేదాలు కల్గిస్తుంది. సంకల్పాను గుణమైన ఆకారాలు ధరించి గాలిలోని కదలికలాగా స్ఫురిస్తుంది. సంకలోోన్ముఖమైన ఈ అహంకారమే చిత్తము, జీవుడు, వమునస్సు, మాయ, ప్రకృతి అనే పేర్లతో వ్యవహరింపబడుతుంది. ఈ సంకల్పాత్మకమ్చైన చిత్తమే పంచభూతాల తన్మాత్రలను కల్గిస్తుంది. జడత్వం పొందుతుంద్. ఆపై ఆకసంలో అవ్యక్తంగా సుదూరంలో ఉన్న నక్షత్రం లాగా ఒక తేజఃకణంగా మారిపోతుంది. -
“-. ఈ తేజఃకణమే తనలో బ్రహ్మ ప్రకాశిస్తూ వుండగా నీరు గడ్డగట్లినట్టు అండంగా మారుతుంది. ఆ తేజః కణాలలో ఒకటి తన సంకల్ప ప్రభావంతో (భాంతికి లోనై దేవాది దేహభావం పొంది అమరావతి మొదలైన నగరాలు చేరుకొంటుండి. మరొకటి స్టావరంగా మారుతుంది. ఇంకొకటి జంగముంగా రూపొందుతుంది. వేరొకటి పశిగా, మరొకటి చేహూ మారడంతో - నానారూపాలు ఏర్పడతాయి.
సృష్ట్యాదిలో సంకల్పం వల్ల కలిగిన జీవుడే చతుర్ముఖ (బ్రహ్మగా రూపాంది జగన్నిర్మాణం చేస్తాడు. అతడు దేవినెలా సంకల్పిస్తాడో అది అలాంటి స్వభావంతోనే ఉత్పన్న మయ్యేటట్టు చూస్తాడు. చిత్స్వభావం వలి సర్వకారణమైన (బ్రహ్మగా రూపాొంధి అతడు జగత్తుకు కారణమవుతున్నాడు. ఆ పై చలనాత్మకమైన కర్మలు కల్లిస్తున్నాడు.
నీటినుండి నురుగులాగా చిత్తునుండి ప్వుభావంతోనే చిత్తం ఉదయించింది.
138 యోగూస్టం ఆ పై త్రాళ్ళు నురుగును బంధించినట్లే కర్మలు చిత్తాన్ని బంధిస్తాయి. కాని అవి చిదాత్మను బంధించలేవు.
అంతటికీ సంకల్పమే బీజం. జీవుడు కూడా సంకల్పస్వరూపుడే. అతడు
(క్రియారహితమైన ఆత్మనుండి సంభవించి నానాక్రియలు నిర్వహిస్తున్నాడు. బీజంలోని జీవం అంకురించి పెరిగి పత్రపుష్పాదులతో విస్తరిస్తుంది. అలాగే హిరణ్యగర్భుడు కూడా [క్రమంగా నానావిధాల విస్తరిస్తాడు. ఇతర జీవులు కూడా ఈ రీతిగానే తవులో వాసనారూపంతో దాగి వుండిన తకృతులు దాల్చి భూతాశ్రయఫ్రితిని పొందుతారు. పిమ్మట జననమరణాదులకు కారణమైన కర్మలతోనే ఊర్ద్వలోకాలకూ, అధోలోకాలకూ పయనిస్తారు.
కాబట్టీ చిత్తుయొక్క స్పందనమే కర్మ. అదే దైవం, అదే చిత్తం, అదే శుభం, అదే అశుభం. వృక్షంలో పూర్వం గూఢంగా వుండిన శాఖాపుష్పాదులు మళ్ళీ ఉదయించినట్లే, ఆదికారణమైన చిత్తు యొక్క చలనాత్మకమైన కర్మమునుండి వివిధ
ప్రాణులతో కూడిన ఈ జగత్తులు మళ్ళీ మళ్ళీ ఉదయిస్తున్నాయి. జీవ విచారం
మొదట పరమకారణమైన చిత్తునుండే మనస్సు ఉదయించింది. దానిలోనే ఫ్రీరపడింది. '“ఇది ఇలా వుంటుంది, ఇలా వుండదు” అనే భావాభావాల మధ్య అది ఊగిసలాడుతున్నది. పూర్వం అనుభవించిన గంధాన్ని స్మరణతో మళ్ళీ గుర్తుకు దెచ్చుకొన్నట్లే అది సదసదాత్మకమైన ఈ సృష్టిని చూస్తున్నది.
(బ్రహ్మ, జీవుడు, మనస్సు, మాయ, కర్త కర్మ, జగత్తు - వీటికి భేదం మనస్సు వల్ల కల్పితవే కాని వాస్తవంగా లేదు. చిదేక సముద్రమైన ఆత్మ ఒక్కటే విజృంభిస్తున్నది. అందులో అతి విస్తారమైన సంవేదనలనే జలాలు అటూ, ఇటూ చలిస్తున్నవి, అఫ్రిరం గాబట్టి అసత్యంగానూ, భాసిస్తున్నది కాబట్టి సత్యంగానూ, ఈ జగత్తు కలలో లాగా కనిపిస్తున్నది. అందుకే దీనిని సదసదాత్మక మన్నారు.
చిత్తం కూడా అలాంటిదే. ఈ జగత్తు ఏనాడూ ఉదయించలేదు. ఐంద్రజాలికుని మాయకు లోబడ్డ సామాబికుల బుద్దికి తోచే ఇంద్రజాలం లాగా ఇది రూపు దాల్చి వున్నది.
మనోబలంవల్ల సంసారం ఒక దీర్టస్వస్నంగా స్రిరపడి పోయింది. స్టాణువును
ఉత్పత్తి ప్రకరణం 139 చూచి పురుషు డనుకొన్నట్లు సమ్మగ్టర్శనం లేకపోవడం వల్ల ఈ (భ్రమ కల్గుతున్నది. బాలుడు బేతాళాన్ని ఊహించుకొని భయపడతాడు. భయానికి కారణమైన తన అజ్ఞానాన్ని గురించి అలోచించడు. అదే రీతిగా చిత్తం ఆత్మావలోకనం చేయకపోవడం వల్ల ఈ సంసారాన్ని చూస్తున్నది. అలా చూడడానికి కారణం తన చిత్తత్వమే అని అది గ్రహింపలేకున్నది.
ఆత్మ నుండి చిత్తం, చిత్తం నుండి జీవత్వం, దానినుండి అహంభావం, దానినుండి విషయ తన్మాత్రలు, వాటినుండి ఇంద్రియాలు, అందుండి దేహాది (భ్రమలు, స్వర్గ్షనరకాలు, బంధ మోక్షాలు బీజూంకుర న్యాయానుసారంగా కల్గుతున్నాయి. చిదాత్మునికీ, జీవునికీ భేదం లేనట్లే జీవునికీ, చిత్తానికీ భేదం లేదు. అలాగే దేహానికీ, కర్మకూ భేదం లేదు. కర్మే దేహం, దేహమే చిత్తం, చిత్తమే అహంభావంతో కూడిన జీవుడు. జీవుడే ఈశ్వరుడు. అతడే ఆత్మ. అతడే శివుడు. అతడే సర్వం. ఒకే ఒక మాటతో చెప్పదగిన సత్యం ఇదే.
సంసృతి పరమయోగం
రామా! పై జ్వ్పేన రీతిగా ఒక దీపం నుండి అనేక దీపాలు పుట్టినట్లు ఒకే పరతత్త్యం నుండి నానావిధ వస్తువులు కలిగాయి. ( ఉపాధి భేదాన్ని బట్టి చిత్తు కూడా నానాత్వం పొందింది. ) విచారం వల్గా, తత్త్వబో ధవల్గా ద్రైతం నశిస్తుంది. నామరూప శూన్యమైన ఆత్మ స్వరూపం గోచరిస్తుంది. అంతటితో శోకం అంతరిస్తుంది.
జీవుడంటే చిత్తమే. చిత్తం నశస్తే జగత్తంతా శమిస్తుంది. కాలికి చెప్పులు దొడుక్కున్న వానికి భూమి అంతా చర్మంతో కప్పబడినట్లే కదా! ఆకులూ, పట్టలూ తొలగించివేస్తే అరటిచెట్టు మొత్తం శూన్యమవుతుంది. అలాగే భ్రమ తొలగితే జగత్తు ఉనికి లేని దవుతుంది.
పుట్టడం, బాల్యం, యౌవనం, వార్టక్యం, మరణం, స్వర్గం, నరకం- ఇదంతా చిత్తం (భ్రమకు లోనై కావించే నృత్యమే. కల్టు త్రాగినవాడు శూన్యాకాళంలో చిత్ర విచిత్రమైన బుడగలను చూస్తాడు. అదేరీతిగా చిత్తం సంసారంలో చి త్రవిచి(త్రాలైన (బ్రవ్మాండాలనే దృశ్యాలను కనిపింపజేస్తుంది. రోగగ్రస్తమైన కన్ను చంద్రుడు మొద లైన వాటీని రెండు రెండుగా చూస్తుంది. అలాగే చిత్తవానే రోగం వల్ల జీవుడు పరమాత్మలో గ్వైతభ్రాంతి కల్లి ఉంటాడు. సురాపానంతో మత్తెక్కినవాడు చెట్టు
140 యోగవాసిం నడుస్తున్నట్టు భావిస్తాడు. అట్లే చేతన విక్షుబ్రమైన చిత్తు వివిధ సంసారాలమ చూస్తుంది. విలాసార్హం గిరగిర తిరగే బాలురకు కుమ్మరి చ(క్రంలాగా జగత్తు (భమిస్తున్నట్ల కన్పిస్తుంది. అలాగే చిత్తం (భ్రాంతికి లోనైనప్పుడు దృశ్య జగత్తును చూస్తున్నది.
చిత్తుకంచె వ్యతిరిక్తమైనది ఏదీలేదు అన్న జ్ఞానం దృఢమైనప్పుడు మాత్రమే చిత్తం శమిస్తుంది. చిదేక స్వరూపుడై నిశ్చలంగా వున్నవాడు సమాధిలో వున్నా, వ్యవహారంలో వున్నా “శాంతుడు' అనే పేర్కొనబడతాడు...
కల్టు త్రాగి కొద్దిగా చుత్తెక్కినవాడు క్షోభకు గురి అవుతాడు. పూర్తిగా మత్తెక్కినవాడు కదలకుండా పడివుంటాడు. అదే రీతిగా కొద్ది చైతన్యం కలవాడు దృశ్వప్రపంచాన్ని చూస్తాడు. సంపూర్ణ చైతన్యం కలవాడు దేనినీ చూడడు. చిద్దనమై, పరమపదంలో (ప్రతిష్టింపబడిన చిత్తం స్వరూప శూన్యమనవీ, నిర్విషయమైనదనీ చెప్పబడుతుంది. నేను పుట్టాను, జీవిస్తున్నాను చూస్తున్నాను, సంసారంలో (భ్రమిస్తున్నాను అని యీ విధంగా లేనిపోని (మకు మావవుడు చిత్తప్రభావం వల్లనే గురి అవుతున్నాడు.
గాలికంటే వేరుగా స్పందనం లేదు. స్వభావం కంటే భిన్నంగా చిత్తానికి స్వరూపం లేదు. మిథ్యాజ్ఞానంతో సర్ప(భ్రమ కలిగినట్లే చిత్త ప్రభావం వల్ల విషయ(భ్రమ కల్గుతుంది. సంసారమనే రోగానికి ఆత్మజ్డూన మొక్కటే చికిత్స. ఈ విషయంలో సంరంభం అవసరం లేదు. ల
రామా! అంతా వదలి వాసనామయమైన చిత్తం లేనివాడవై ఉండగలిగావంటే ఈ నిమిషంలోనే నీవు ముక్తుడవు. ఇందులో సందేహం లేదు. రజ్ఞుజ్ఞానంతో సర్పభాంతి వశిస్తుంది. అలాగే ఆత్మజ్ఞానంతో సంసారభ్రాంతి తొలగిపోతుంది. వత్సా! దేనిమీద నీకు కోరిక కల్గుతుందో, దానిని వదలి నీవు ఉండగల్లితే మోక్షం రిభించినట్లే. అందులో కష్ట మేమున్నది?
ఈ లోకంలో వుహాశయులు (ప్రాణాలను సైతం తృణంలాగా పరిత్యజిస్తున్నారు. ఇక అభిలషించిన పదాశ్చాలను త్యజించడంలో కృపణత్వం ఎందుకు ? అందువల్ల వేటిని అభిలషిస్తున్నావో, వాటిని వదలి తమంత తాముగా వచ్చిన వాటిని మాత్రమే (గ్రహిస్తూ, నశించిన దానిని స్మరించకుండా ఉండిపో! అలా చేసేవానికీ చేతిలోని మారేడు పండులాగా, ఎదుటవున్న కొండలాగా, ఆత్మ
ఉత్పత్తి ప్రకరణం శత] యొక్క జన్మ క్రియాది శూన్యత్వం (ప్రత్యక్ష మవుతుంది.
కల్పాంతంలో సముద్రం మహోత్తుంగమైన అనేక తరంగాలతో వివిధంగా కనిపించినట్లే ఆత్మే జగత్తుగా కనిపిస్తున్నది. దానిని తెలుసుకొంటే మోక్షం. తెలుసుకోకపోతే బంధం.
సత్యోపదేశం
- శ్రీరాముడు : - మనస్సుతో తాదాత్మ్యం పాందిన ఈ జీవుడు పరమాత్మకు
ఏవువుతాడు? ఇతడు పరవూత్మనుండి ఎలా ఉదయించాడు? ఇతని స్వరూపమేమి? దయచేసి వివరించండి.
వసిష్టుడు : - సర్వసమర్ధమూ, సమస్తశక్తి సంపన్నమూ అయిన (బ్రహ్మం ఏ శ్తీతో స్ఫురిస్తుందో, ఆ జ్తీగలదిగానే సదా తన్ను భావించుకొంటుంది. సర్వాత్మకమైన (బ్రహ్మం చిరకాలంనుండీ తన్ను ఏ చేతనరూపమైన శక్తిగా గ్రహిస్తున్నదో, ఆ శే బీవుడని వ్యవహరింపబడుతున్నది. సంకల్పాలను కలిగించేది అదే.
చిచ్చక్తి తొలుత తన స్వభావబలంతో ద్వైతభావాన్ని కల్పించుకొంటుంది. ఈ సంసార (ప్రవృత్తికి ముఖ్యకారణం అదే. పూర్వసంకల్పవాసనా వాసితమైన జీవచైతన్యం తరువాత జరగే జననమరణాదులైన వైచిత్రాలకు హేతు వవుతుంది.
శ్రీరాముడు : - ముని(శ్రేష్టా! జీవస్వరూపం ఇలాంటిదైతే ఇక దైవం, కర్మ, కారణం అనే మాటలకు అర్ర మేమి ? .. వసిష్మడు : - చిత్తు రజఃప్రధానమైన మాయతో కూడినప్పుడు సృష్టికి ఉప[క్రమిస్తుంది. మాయతో కూడక శుద్రంగా వున్నప్పుడు గాలిలేని చోటు లాగా అంతా (ప్రశాంతంగా వుంటుంది. చిత్తు అవిద్యా ప్రభావంతో చిత్తస్వరూపం పొందడాన్ని 'స్పందన' మంటారు. అలా పొందకపోవడమే అస్పందం.
స్పందం వల్ల చిత్తే ప్రపంచంగా స్పురిస్తున్నది. స్పందం లేనప్పుడు శాశ్వత (బ్రహ్మం ఒక్కటే మిగిలి ఉంటుంది. చిత్తుకు చెందిన ఈ స్పందమే “జీవుడు, కారణం, కర్మ' ఇత్యాది శబ్దాలతో వ్యవహరింపబడుతున్నది. అనుభవాత్మకమైన ఈ చిత్తుయొక్క స్పందమే సంసారానికి బీజం. దీనివల్లనే కర్మానుగుణమైన శరీరాన్నీ, సంకల్పానుగుణమైన పదార్హత్వాన్నీ జీవుడు పాందుతున్నాడు. ఉత్తమాధికారి ఒక్క జన్మలోనే ఈ స్పందనం నుండి విడుధల పాందుతాడు.
142 యోగవాసిష్టం మందాధికారికి విముక్తి కల్లడానికి వేలకొలది జన్మలు కావాలి.
చిత్తు స్వభావంతోనే దేహజన్మకారణాలయిన అన్నరసాదులతోనూ, తద్ద్వారా పిత్రాది శరీరాలతోనూ ఐక్యం పొందుతుంది. ఆ పై స్వర్గనరక మోక్షాదులకు 'హీతువులైన శరీరాలను ఆ(శ్రయిస్తుంది. జీవులలో కనిపించే భేదం ఉపాధులవల్ల ఏర్పడినదే కాని చైతన్యం వల్ల ఏర్పడినది కాదు.
బంగారం ఒక్కటే కటకాదులై, అనేక రూపాలు పాందినట్టు చైతన్యమొక్కటే జడమైన దేహంలోని జన్మాది భావవికారాలుగా రూపొందుతున్నది. మనో (భ్రమవల్లనే తనకు పుట్టుక లేకున్నా పుట్టిన ట్లు, మరణం లేకున్నా మరణించినట్టు భావన కల్గుతున్నది. పరమార్ధం గోచరించకపోవడం వల్దా, ఆశకు వశం కావడం వల్లా “నేను, నాది' అనే భేదకల్పనలు ఉద్భవిస్తున్నాయి.
మధురను పాలించే రాజుకు తాను 'చండాలుడ' ననే (భమ కల్లినట్లే చిత్తానికి జగ(ద్ర్రృమ కల్గుతున్నది. అంతా మనోభ్రాంతి విజ్బంభణమే. రామా! నీటిలోని అలలాగా ఇది జగద్రూపంలో స్పురిస్తున్నది. చిత్తు చేత్యోన్ముఖం కాగా శాంతమైన ఆదికారణం నుండి ఈ సృష్టి సముద్రం నుండి చిన్న అలలాగా ఉదయిస్తున్నది. చిత్తు అనే జలంతో నిండిన బ్రహ్మ మనే సముద్రంలో జీవు లనే సుళ్ళు, చిత్తా లనే అలలు, సృష్టు లనే బుడగలూ ఉద్భవిస్తున్నాయి.
సింహం వంటి మహాశక్తి గల బ్రహ్మం మాయతో విజృంభించడమే జీవుడు, విషయరూపంలో ఉండేది కూడా అదే కాని మరేమీ కాదు. సంవేదన వల్లనే చిత్తు జీవుడైనాడు. సంకల్పంవల్ల మనస్సుగా మారినాడు. అధ్యవసాయం వల్ల బుద్దిగా, స్మరణవల్ల చిత్తంగా, అభిమానం వల్ల అహంకారంగా, విశేపం వల్ల మాయగా రూపొంది ఉపాధిభేదంతో నానావిధ నామాలు పొందాడు.
మనస్సు తన్మాత్ర కల్పనవల్ల గంధర్వ నగరం లాగా ఉనికిలేనిదైన ఈ జగత్తును ఉన్నట్టుగా విస్తరింపజేస్తున్నది. శూన్యాకాశంలో ముత్యాలు కనిపించడం, కలలో (భ్రమ కల్గ్లడం ఎలాంటిదో, చిత్తానికి సంసారం గోచరిండం కూడా అలాంటిదే. శుద్దమై, శాంతమై, సదా తృప్తితో కూడినదైన ఆత్మ చిత్తమనే స్వప్ష(భ్రమను నిజానికి చూడకున్నా చూచిన ట్పున్నది. ఆ చిత్తం ఇంద్రియాల ద్వారా వెలుపలికి (ప్రసరించడమే జాగ్రదవస్ట. అహంభావంతో కూడి హృదయం నుండి కంఠం వరకూ వ్యాపించడమే స్వప్నం. స్మృతికి బీజమైన వాసనామా త్రంగా హృదయంలో వుండడమే
ఉత్పత్తి ప్రకరణం 143 సుషుప్తి. దానిని దాటి కేవల చిత్తుగా వుండడమే తురీయావస్ట. అత్యంత శుద్రమూ, సన్మాత్రమూ, పరిణామనిరామయమూ అయినదే తురీయాతీతమైన పరమపదం. ఆ ఫ్టితినందుకొన్నవాడు చురల దుఃఖానికి గురి కాడు.
ఈ జగత్తంతా ఆ (బబ్రహ్మంలోనే ఉదయిస్తున్నది. అందులోనే లీనమవుతున్నది. కాని ఇది ఆ (బ్రహ్మం కాదు. ఇది అందులో లేదు. ఆకాశం ముత్యాలమాలకు ఆధారం కానట్టు జగత్తుకు బ్రహ్మం అధిష్టానం కాదు. చెట్టు పెరుగుదలను ఆకాశం అడ్డుకోదు. అందువల్ల పెరుగుదల కది హేతువు కాకున్నా ఐనట్ల్లే భావింపబడుతుంది. ఆలాగే బ్రహ్మం మాయామయమైన జగత్తుయొక్క ఉనికికి కర్తృత్వం లేనిదైనా కర్త అయినట్టు వ్యవహరింపబడుతుంది.
వస్తువుకు దగ్గజగా ఉండడం వల్లనే ఆ వస్తువు తనలో (ప్రతిబింబించడానికి అద్దం కారణం అని చెప్పబడుతున్నది. అట్లే చైతన్యం జగత్తు యొక్క స్పురణకు హేతువని చెప్పడం జరుగుతున్నది.
విత్తనం వెలులక, ఆకులు వెందలైనవాటి యోగం ద్వారా ఫలంగా పరిణమిస్తున్నది. అదేరీతిగా కేవలచిత్తు చిత్తజీవాదుల యోగం ద్వారా మనస్సుగా పరిణమిస్తున్నది. జీవంతో కూడిన వర్షజలబిందువు వృతాదులలో ప్రవేశించి మళ్లీ బీజంగా పరిణమిస్తున్నది. అలాగే చిత్తు కూడా జీవవాసనావాసితమై జగత్తుగా రూపొందుతున్నది. -
అయితే ఇందులో ఒక్క భేదం గమనించాలి. బీజానికంటే వృక్షం భిన్నం కాదు అన్న జ్ఞానం కలిగినప్పటికీ బీజంలోని వృక్షజననశ్త్తి నశించదు. కాని ' బ్రహ్మం కంటే జగత్తు వేరు కాదు' అన్న జ్ఞానం కల్గిన తర్వాత ఈ విశ్వం బ్రహ్మంకంచె భిన్నంగా గోచరించదు. దీపంతో రూపజ్ఞానం కలిగినట్లే బ్రహ్మబోధంతో తత్త్వ స్వరూపం గోచరిస్తుంది.
భూమిలో ఎక్కడెక్కడ (తవ్విచాచినా అక్కడక్కడ ఆకాళం గోచరమవుతుంది. అలాగే పటాది పదార్దాలను చక్కగా విచారించి చూస్తే అధిష్టాన సత్త ఒక్కటే స్పురిస్తుంది.
స్పటిక శిలలో గోచరించే ప్రతిబింబ సన్నివేశం నిజానికి అందులో లేదు. అయినా అజ్ఞానంతో ఉన్నట్టు తోస్తుంది. అలాగే శుద్దమైన (బ్రహ్మంలో నానాత్వంతో కూడిన జగత్తు లేనిదైనా ఉన్నట్టు కనిపిస్తుంది. తనలో (ప్రతిబింబించే వృక్షలతాదుల
గ్శ9
144 యోగవాస్టం రూపంతో భాసించే స్ఫటిక ఖఇండంలాగా అఖండ (బ్రహ్మమే ఈ సమస్త జగద్రూపంతో భాసిస్తున్నది.
శ్రీరాముడు : - కారా! ఆళ్ళర్యం! ఈ జగత్తు లేకున్నా ఉన్నట్టు భాసిస్తున్నది! ఇది ఎంత స్థూలమో, ఎంత సూక్ష్మమో, ఎంత స్వచ్చమో ఊహకందడం లేదు. తన్మాత్ర గుణాల గోళమైన ఈ జగత్తు ఒక మంచు బిందువు లాగా భాసిస్తూ బ్రహ్మంలో ఎలా స్ఫురిస్తున్నదో, విన్నాను. ప్రభూ! ఇది ఏవిధంగా సమష్టివ్యష్టి స్టూలదేహాలుగా రూపాందుతుందో, ఆత్మ వస్తువునుండి విశ్వవైశ్వానరాత్మకంగా ఉద్భవిస్తుందో వివరించండి.
వసిష్టుడు : - బాలుని హృదయంలో బేతాళం రూపం లేనిదైనా, అనుభూతం కానిదైనా, రూపం కలదిగా, అనుభవానికి వచ్చినట్టుగా గోచరిస్తుంది. అలాగే పరబ్రహ్మంలో ఉనికి లేనిదైనా జీవత్వం స్పురిస్తున్నది. జీవత్వకల్పనవల్ల (బ్రహ్మం జీవుడైనట్లే మననవేదనం వల్ల జీవుడు మనస్సుగా అవుతున్నాడు. మనస్సు తన్మాత్రలను చింతించి తన్మాత్ర స్వరూపంగా మారుతుంది. ఈ తన్మాశ్రాత్మ అతిసూక్మమై ఎడతెగని దృగ్రూపమై స్వతః 'ప్రకాశమానమైన చిదాకాశంలో సంవేదనాత్మక మవుతుంది. సృష్టికాలంలో పంచీకరణం ద్వారా ఉత్పన్నమైన మనుష్యాది దేహరూపాన్ని బ్రహ్మాండరూపాన్ని తనలోనే చూస్తుంది. మొదట దానికి “తానెవరు?' అన్న జ్ఞానం గోచరం కాదు, [క్రమంగా పురుషార్ధ విచారంతో కూడిన జగత్తత్త్వ జ్ఞానం దానికి కలుగుతుంది, పిండంలో స్పుటంగా అహంభావజ్ఞానం కలిగిన పిమ్మట జిహ్వాదులైన ఇం(ద్రియాలచేత రసాదులను అనుభవించే ఫ్రీతి ఏర్పడుతుంది. ఈ విధంగా జీవాత్మ పూర్వవాసనాకల్పితమైన విశిష్ర సన్నివేశ దశను అనుభవానికి తెచ్చుకొంటుంది. ఆ సన్నివేశం ఉనికి లేనిదైనా ఉన్నట్టు తోస్తుంది. శ్రోత్రం మొదలైన ఇంద్రియాలతో శబ్దం మొదలైన విషయాలను అనుభవించడం వల్ల ఆయా ఇంద్రియాలతో తాదాళ్మ్యం ఏర్పడుతుంది.
రామా! ఇలా సమష్టి రూపుడూ, వ్యష్టి రూపుడూ అయిన జీవునికి ఆతివాహికదేహం ఉద్సవిస్తున్నది. బ్రహ్మమును గూర్చిన అజ్ఞానం ఉన్నంతవరకూ ఈ ఆతివాహిక దేహిత్వం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కల్లగానే ఆ దేహభావం తొలగిపోతుంది. తెలుసుకొంచే మాతృమేయ ప్రమాణాదులన్నీ బ్రహ్మమే. ఇక ఆతివాహిక దేహాదులు మాత్రం బ్రహ్మం కంటె భిన్నంగా ఎలా వుంటాయి? (బ్రహ్మం
ఉత్పత్తి ప్రకరణం 145 కంటె అన్యంగా భావిస్తే ఆతివాహికం అన్యంగా భాసిస్తుంది. బ్రహ్మమే అని భావిస్తే అది బ్రహ్మమే అవుతుంది. కాని బ్రహ్మ జ్ఞానం ఒక్కటి మాత్రం (భ్రాంతి వల్ల కలిగేది కాదు. అది సత్యమైనది. శ్రీరాముడు : - ఐతే ఉన్నది బ్రహ్మమొక్కటే. అందులో అజ్ఞాన కల్పనకూ, బీవాది భేద కల్పనకూ అవకాళం లేనే లేదు కదా! ఇక మోత్షమంచే ఏమిటి? ఆ మోక్ష ప్రాప్తికి విచారించడ మెందుకు? ఈ భేదవికల్పన లన్నీ నిరుపయోగాలే కదా! వసిష్టుడు : - రామా! నీ ప్రశ్నే సిద్దాంతకాలంలో మాత్రమే శోభిస్తుంది. అక్షాలంలో విలసిల్లిన పుష్పమాల చూడటానికి అందంగా ఉన్నా శోభిల్లదు. అది అనర్హహేతువైనట్లే ' అజ్ఞాని మానవుని నోట వెలువడిన ఈ మాట కూడా అనర్ధహేతువే అవుతుంది. ప్రతివస్తువూ ఉచితమైన కాలంలోనే శోభిల్టుతుంది సుమా! పదార్దాలన్నీ కాలంతోనే ఫలయోగం పొందుతున్నాయి. ప్రాతికూల్యమైనా, ఆనుకూల్యమైనా కాలంనుండే సం'ప్రాప్తమవుతుంది. అందువల్ల జీవాత్మే కాల(ప్రభావం వల్ల తనలో పీతామహత్వం అనుభవించి స్వప్న సమసష్ట్ర్యాత్మగా ఆవిర్చవిస్తుంది. దానినే హిరణ్యగర్భుడంటారు. ఆ హిరణ్య గర్భుడు (ప్రణవోచ్చారణ గావించి ప్రణవార్హ జ్ఞానం పొంది వమనోరాజ్యూన్ని విస్తరింపబేస్తాడు. సర్వ(ప్రపంచాన్నీ సృష్టిస్తాడు. ఆకాళంలో కల్పింబడిన తలమలినత్వాదులు ఉనికి లేనివి. అలాగే జగదాకాశంలో కల్పింపబడిన పర్వతాదుల విజృంభణం కూడా ఉనికి లేనిదే. ఈ లోకంలో ఏదీ పుట్టడంలేదు. ఏదీ నశించడం లేదు. గంధర్వ నగరప్రాయమైన జగద్రూపంతో భాసించేది బ్రహ్మమొక్కటే కాని మరేమీ కాదు. (బ్రహ్మాది జీవుల ఉనికిలాగా సరీస్పపం మొదలు దేవతల వరకూ గల జీవుల ఉనికి గూడా విచారించి చూస్తే హుళక్కే అవుతుంది. ఇదంతా సంవేదనా సంభ్రమం మాత్రమే. యథార్హజ్ఞానం కలిగినప్పుడు (బ్రహ్మ మొదలు కీటం వరకూ ఉండే జీవకోటి ఉనికిలేని దవుతుంది. బ్రహ్మ ఉదృ్భవించినట్లే కీటకం కూడా ఉద్బ్భవిస్తున్నది. అయితే కీటక చిత్తంలో మాలిన్యం అధికంగా వుండడం వల్ల అది తృుద్రకర్మగలదవుతున్నది. సుకృతఫలం బ్రహ్మత్వమైతే, దుష్కృతఫలం కీటకత్వం అవుతున్నది. అజ్ఞానంతో కల్గిన ఈ ద్వైత(భ్రాంతి జ్ఞానంతో సమసిపోతుంది. మౌాతృమాన (ప్రమేయాలు కూడా చిన్మాత్రమే కానివేరుకావు. అందువల్ల ద్వైతం,
146 యోగవాసష్టం ఐక్యం అనేవి (క్రముంగా సిద్రిస్తాయనే వాదంకూడా కుందేటి కొమ్ములాగా, గగనకుసుమం రీతిగా పస లేనిదే. కోశూార కీటకం తన లాలాజలంతోనే తాను బంధనం అనుభవిస్తుంది. అలాగే (బ్రహ్మానందస్వరూపమైన ఆత్మకూడా బంధహేతువైన తన ప్రపంచ భావనవళ్లనే (భ్రాంతి ననుభవిస్తున్నది. సమస్త చిత్త సమష్టి స్వరూపుడైన బ్రహ్మ వారి వారి కర్మల ననుసరించి ఏ ఏ వస్తువు ఎలా వుండాలని భావిస్తాడో, ఆయా వస్తువు అలాగే ఆయా జీవుల దృష్టికి గోచరిస్తుంది. ఇది నియతి యొక్క నిశ్చయం. ఏ వస్తువు ఎలా వుదయించాలో, అది అలాగే వుదయిస్తుంది. ఏది ఎంతకాలం వుండాలో, అది అంతకాలమే వుంటుంది. ఇది నియతి నిశ్చయం. ఈ జగత్తు ఉదయించడం మిథ్య. ఇది వృద్ది పొందడం మిథ్య, భోక్తలకిది రుచించడం మిథ్య. దీని నిలయం కూడా మిథ్యే, శుద్దమూ, సర్వగతమూ, అనంతమూ, అద్వితీయమూ అయిన (బ్రహ్మం (భ్రాంతివల్ల అళుద్దంగా, అసత్తుగా, పరిమితంగా, అనేకంగా గ్రహించబడుతున్నది. జలం వేరు, అల వేరు అన్నది బాలుర కల్పన. అలాగే భేద కల్పనలన్నీ అవాస్తవాలే. అవి తత్త్వవేత్తలు కానివారు కల్పించినవే. త్రాడులో పాములాగా, ఒకే (బ్రహ్మంలో ఈ భేదాభేదశక్తులు సంభవిస్తున్నాయి. ఇవి ఒకే వ్యక్తిలోని శత్రుత్వ మి(త్రత్వాల లాగా గోచరిస్తున్నాయి. నీటిలో తరంగ కల్పనలాగా, స్వర్థంలో కటక కల్పన రీతిగా అద్వితీయాత్మలో ద్విత్వం కల్పితమయింది. ఆత్మలో మొదట నిర్వికల్పజగత్తుకు చెందిన స్పూర్తి కల్గింది. అది సవికల్పంగా మారి మనోరూపం పొందింది. తద్ద్వారా అహంభావం కల్పించబడింది, నిర్వికల్ప 'ప్రత్యక్షరూపమైన మనస్సు అహం శబ్దార్ధ భావన వల్ల అహంభావ విశిష్టమయింది. ఆ పై మనోహంకారాల వల్ల స్మృతి కలిగింది. ఈ మూటి వల్ల భూత తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రలలో జీవుడు బ్రహ్మమనే ఉపాదానకారణం నుండి కల్పింపబడిన ఈ సన్నివేశాన్ని చూస్తున్నాడు. ఇలా మనస్సు దేన్ని కల్పించుకొంటుందో, దాన్నే దర్శిస్తుంది. అది సత్తు కానీ, అసత్తు గానీ, చిత్తం చిరకాల భావనా బలంతో దేన్ని కల్పిస్తుందో, దాన్నే చూస్తుంది. అప్పుడు అది అసత్తెైనా సద్రతాపంగా భాసించి వ్యవహార యోగ్యమవుతుంది.
ఉత్పత్తి ప్రకరణం 147 కర్కట్యుపాఖ్యానం - రాక్షసీ వర్ణనం
వసిష్కడు : - రామా! ఈ సందర్భంలో ఒక ప్రాచీనమైన ఇతిహాసం ఉదాహరిస్తుంటారు. అందులో ఒక రాక్షసి అడిగిన జగద్విమర్శనాత్మకమయిన మహా'ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఆ ఇతిహాసం చెబుతాను, విను.
హిమాలాయానికి ఉత్తరదిశలో కర్కటి అనే ఒక రక్కసి వుండేది. అది కాటుకతో నిర్మించిన ప్రతిమ లాగా నల్లగానూ, మిక్కిలి భీకరంగానూ కనిపించేది. దానికి'“విషూచిక, అన్యాయబాధిక' అని అదనంగా రెండు పేర్లు ఉండేవి. ఆరాక్షసి శుష్కించిన వింధ్యాటవి లాగా కృశించిన శరీరం కల్లివుండేది. నల్లనివ(స్తాలు ధరించి కాళరాత్రి లాగా భూమ్యాకాశాల మధ్యభాగమంతా వ్యాపీంచివుండేది. కారు చీకటిని పోలిన దాని వెండ్రుకలు ఎప్పుడూ పైకి రేగి వుండేవి. కళ్లు స్టిరపడిన మెజపుతీవల్లుగా భాసించేవి. మంచు అనే చీర ధరించిన ఆ రాక్షసితలపై మేఘమాలికే ఉత్తరీయంగా విలసిల్లేది. దాని గోళ్ళు వైడూర్య నిర్మితమైన చేటల చివరలను పోలి వుండేవి.
ఆ కర్కటి మానవకంకాళాలను ఫపూలమాలగా ధరించేది. అది బేతాళాలతో కలిసి వికటనృత్యం చేసేటప్పుడు పైకి లేచిన దాని చేతులు సూర్యుణ్ణో పట్టుకోబోతున్నాయా అనిపించేవి. ఆ రక్కసి శరీరం చాలా పెద్దది. అందుచేత దానికి ఎప్పుడూ సరిపడినంత తిండి దొరికేది కాదు. దాని జఠరాగ్ని బడబాగ్ని లాగా సదా తృప్తిలేకుండా మండుతూ వుండేది.
ఆ మహోదరి ఆకలితో అలమటిస్తూ ఒకనాడు ఇలా తలపోసింది-
““సవట(ద్రం సవుస్త నదీజలాలనరా గ్రహించిన విధంగా నేను ఈ జంబూద్వీపంలోని ప్రాణుల నన్నింటినీ ఒక్కసారిగా (మింగితే నా ఆకలి తీరుతుంది. ఆపదలో జీవించేవారికి ఏ ఉపాయమైనా సమ్మతమే కదా! అయితే మంత్రాలు, బౌషధాలు, దేవపూజలు మొదలైనవాటితో రక్షింపబడివున్న ఈ జనానీకాన్నంతటినీ ఒకే తడవ [మింగడం ఎలా సాధ్యం ? అంచేత దృఢమైన చిత్తంతో తీవ్రమైన తపస్సు చేస్తాను. ఉగ్రమైన తపస్సుతో సాధ్యం కాని పని యేమున్నది?''
అలా అనుకొని సమస్త జంతుజాలాన్నీ భక్షించాలన్న కోరికతో ఆ రక్కసి దేహధారిణీ అయిన మేఘమాలిక లాగా దుర్గవుమైన హిమాలయ శిఖరం చేరుకొన్నది. అక్కడ స్నానం చేసి ఒంటికాలిపై నిలిచి తపస్సుకు ఉపక్రమించింది.
145 యోగవాసిష్టం అప్పుడు దాని నేత్రాలు నిశ్చలమైన సూర్యచం ద్రుల్జా భాసించాయి. శీతతాపాలక్రు చలించకుండా శైలఖండం లాగా నిలబడి ఆ రాతసీ తపస్సు చేస్తుండగా ఎన్నో షగళ్హు పత్తాలు, మాసాలు, బుతువులు గడచిపోయాయి. పైకి లేచిన దాని నల్లని వెండ్రుకలు ఆకసాన్ని (మింగివేస్తాయా అనిపించింది.
గాలి తాకిడికి దొని శరీరం జర్హరితమయింది. (వ్రేలాడే చర్మమే వస్త్రంగా రూపొందింది. పైకెగసీన కేశాలతో తారలనే ముత్యాలు ధరించివున్న ఆ కర్కటిని బ్రహ్మ చూచాడు. వరప్రదానం చేయడానికి ఆయన దాని చెంతకు వచ్చాడు.
విషూచికామంత్ర కథనం
కర్కటి కావించిన వెయ్యి సంవత్సరాల తపస్సుకు మెచ్చి బ్రహ్మ దాని ముందు (ప్రత్యక్ష మయ్యాడు. తపస్సుకు సాధ్యం కానిదేమున్నది? ఆ రాక్షసి తాను ఉన్న స్రీతిలోనే ఉంటూ విధాతకు మనస్సుతోనే నమస్కరించింది. ఆ పిమ్మట తనలో తాను ఇలా అనుకొన్నది -
“ఇప్పుడు నేను ఏమి వరం కోరుకోవాలి? ఆం స్మరణకు వచ్చింది! ఇనుముతో చేసిన సూచి (సూది) గానూ, లోహసంబంధం లేని రోగకారకమైన విషూచి (కలరా) గానూ నన్ను రూపొందించమని ్రారిస్తాను. ఈయన వరంతో నేను రెండు విధాల 'సూచి" గా తయారై సమస్త ప్రాణుల హృదయాలలోనూ శ్వాసతోడి సుగంధం లాగా ప్రవేశిస్తాను. తరువాత సకల జగత్తునూ (మింగివేస్తాను. దానితో నా ఆకలి తీరుతుంది. ఆకలి తీర్చుకోవడం కంటె పెద్ద సుఖ మేమున్నది?”
ఆ రీతిగా తపస్విజనులకు విరుద్దమైన పద్దతిలో ఆలోచిస్తున్న రక్కసిని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు ఆ
“పుత్రీ! రాక్షసకులమనే కొండమీది మేఘమాలిక వైన ఓ కర్కటీ! లెమ్ము! నీ తపస్సుకు మెచ్చాను. నీకిష్టమైన వరం ఇస్తాను. కోరుకో!””.
అప్పుడు కర్కటి ఇలా అన్నది -
““భగవ€! భూతభవ్యేశ్వరా! నేను అయోవమయమైన సూచిగానూ, అయోమయం కాని విషూచిగానూ అయ్యేటట్టు వరంనాకు ప్రసాదించు!”
అంతట బ్రహ్మ '' అలాగే అగుగాక!*' అని అది కోరిన వరం అనుగ్రహించాడు. మళ్ళీ ఇలా అన్నాడు - *“నీవు సూచిక గానూ, విషూచిక గానూ అవుతావు.
ఉత్పత్తి ప్రకరణం 149 సూక్ష్మమైన మాయతో సర్వలోకాన్నీ హింసిస్తావు. దుష్ట భోజనాలు చేసేవారూ, దుష్కార్యరతులైన మూర్చులూ, శాస్త్ర, విరుద్ర మార్గంలో చరించేవారూ, దుష్టమైన దేశంలో నివసించేవారూ - అయిన దుర్హనులు నీ హింసకు గురి అవుతారు. వాయులేఖా రూపిణివైన నీవు ప్రాణుల హృదయంలో (ప్రవేశించి వారి అవయవాలను బాధించే విషూచికగా అవుతావు. గుణవంతుడు, గుణహీనుడు అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తావు.'*
ఈ విధంగా చెప్పే బ్రహ్మ మళ్ళీ ఇలా అన్నాడు - '“వ్యాధికి గురి అయిన గుణవంతుల చికిత్సకై ఈ (క్రింది మంత్రం చెబుతున్నాను'! -
“హిమాద్రికి ఉత్తరాన కర్కటి అనే రాక్షసి ఉన్నది. దానిని విషూచిక, అన్యాయబాధిక అని కూడా అంటారు - దానికి మందత్రం -
“ఓం హ్రీం హ్రాంరీం రాం విష్టు శక్తయే నమః । ఓం నమో భగవతి! విష్ణుశక్తి మేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరే కురు! స్వాహా!
హిమవంతం గచ్చ!
జీవ! సః సః సః చంద్రమండలగతో౬_సి స్వావో!'
[ మంత్రార్ధం - ఓం ఇత్యాది బీజరూపమైైన విష్ణుశక్తేకి నమస్కారం. భగవతీ! విష్ణుళ్తో!, నీ యంశమైన ఈ విషూచికను హరించు హరించు! తీసుకుపో తీసుకుపో! ఉడికించు ఉడికించు! మథించు మధించు! తొలగించు! దూరీకరించు! స్వాహా.
ఓ రోగళ్తీ! హిమవత్స్పర్వతానికి వెళ్ళిపో!
ఓ జీవుడా! నీవు మృతులను ఉజ్జీవింపజేయగల చంద్రమండలం చేరుకున్నావు. స్వాహా 1]
అని మాంత్రికుడు ఈ మహామంళత్రాన్ని ఎడమచేతిపై వ్రాసి రోగి శరీరాన్ని ఆచేతితో తుడవాలి. రోగశక్తి హిమాలయానికి పారిపోయిందని భావించాలి. రోగి జరామరణ రహితుడై, సర్వవ్యాధి నిర్ముక్తుడై చంద్రమండలంలో రసాయన హృదయగతుడైనట్టు చింతించాలి. మంత్ర సాధకుడు శుచిమంతుడై, ఏకాగ్ర చిత్తంతో ఆచమనం చేసి ఇలా అనుస్టిస్తే విషూచికాపీడ పూర్తిగా నశిస్తుంది.
త్రిలోక ప్రభువైన (బ్రహ్మ ఇలా చెప్పి గన గతుడయ్యాడు. ఆకసంలోని సిద్దులు ఆయన చెప్పిన మంత్రాన్ని గ్రహించారు. అప్పు డక్కడికి వచ్చిన ఇం(ద్రుడు తనకు
150 యోగవాసిష్థం నమస్కరిస్తూ వుండగా బ్రహ్మ ఉజ్జ్వలమైన వైభవంతో అక్షయ మాయామయమైన తన సత్యలోకానికి వెళ్ళాడు.
సూచీ వ్యవహారం
తరువాత పర్వత శిఖరం వంటి ఆ నల్లని రక్కసి నీలమేఘలేఖ లాగా సన్నబడజొచ్చింది. పెద్ద మబ్బును పోలిన ఆ కర్కటి క్రమక్రమంగా సన్నబడుతూ చెట్టుకొమ్మ, మనుష్యుడు, హస్తము, జుత్తిలి, (వేలు, పెసరకాయ వంటి ప్రమాణం కలదిగా రూపాందింది. చివరికి సూదిగా మారిపోయింది. పర్వతం వంటి ఆ రాశీ సంకల్పపర్వతంలాగా అణుపరిమాణంతో భాసించింది. ఇనుప సూదిగానే కాక జీవసూచిగా కూడా తయారై సూక్ష్మశరీరంతోపాటు చలిస్తూ ఆకాశంలో విహరించసాగింది.
అది యిప్పుడు సూదిలాగా వున్నదే కాని అందులో ఇనుము లేదు. అనేకానేకమైన (భ్రమలలో దాని స్వరూపం సైతం ఒక (భమ మాత్రమే. పొడవైన దీపశిఖలాగా అది కాస్తా ముకుళించిన నేత్రాలతో మాత్రవే చూడడానికి వీలయింది. అప్పుడే స్నానం చేసిన బాలుని కేశం లాగా విలసిల్లింది. బయట తిరాలనే కౌతుకంతో తామరతూడునుండి వెలికివచ్చిన తంతువు లాగా తోచింది. (బ్రహ్మరం(ధ్రం నుండి వెలువడి సూర్యవుండలానికి అభిముఖంగా ఉన్న సుషుమ్నానాడీ లాగా భాసించింది. బౌద్దుల, తార్కికుల విజ్ఞానంలాగా పరులకు తెలియవీలుగానిదై ప్రవర్తించింది.
అదృశ్యమైన జీవసూచి దానిని సదా అనుసరించే వుంటూ వచ్చింది. కేవల వాసనామయమైన ఆ సూచిక క్షీణించిన దీపశిఖలాగా కంటికి కనిపించకున్నా, తీళ్షమై వుండేది.
ఆ కర్కటి లోకాన్నంతా [మ్రింగదలంచి సూదిగా వూరింది. కాని దేహరహితమైన ఆ స్టితిలో అది ఎలా తన కోర్కె తీర్చుకోగలదు? ఈ సంగతి అది విచారించలేదు. దాని మూర్ణత్వం అలాంటిది ? అది తిండిని గూర్చి ఆలోచించిందే కాని తుచ్చమైన సూచీరూపాన్ని గురించి పరిశీలించలేదు. నిరర్టకమైన బుద్దిగల మూఢులకు ముందువెనుకలు స్పురించవు గదా! నిట్టూర్పుగాలి తాకిడికి అద్దంలాగా స్వార్దం పెచ్చు పెరిగితే స్వచ్చమైన బుద్ది కూడా కలుషితమైపోతుంది. స్థూల శరీరం వదలి సూది లాగా మారిపోయిన ఆ రక్కసికి చావుగూడా సుఖంగానే తోచింది.
ఉత్పత్తి ప్రకరణం 151 ఒక వస్తువుపై అత్యధికమైన ఆసక్తి గలవారి గతి చాలా విషమంగా వుంటుంది. ఆ రాక్షసి అందుకోసం దేహాన్ని సైతం తృణంగా పరిత్యజించింది కదా! రెండవ జీవసూచిక ఆకారం లేనిదై లింగ శరీరం ధరించి జీవులను వివిధ రోగాలతో బాధించే విషూచిగా రూపు దాల్చింది. పరుల ప్రాణాలను బలిగొనడమే పరమార్థంగా భావించిన ఆ రక్కసి మనోవృత్తే అలా విషూచికారూపంతో సాక్షాత్కరించింది. సూక్ష్మమైన ఆ రెండు సూచీశరీరాలతోనూ అది మనుజుల హృదయంలో ప్రవేశించి వేధిస్తూ దశదిశలా పరిభ్రమించింది. ప్రతివాడూ తన సంకల్పం వల్లనే అల్పుడుగానో, ఘనుడుగానో రూపాందుతాడు. ఆ కర్కటి తన సంకల్పం ప్రకారమే ఉగ్రశరీరం వదలి సూదిగా ఉండడానికి ఇష్టపడింది కదా! నీచులు తుచ్చమైన పదార్దాన్నే ఘనంగా భావించి అందుకై (ప్రాకులాడుతారు. ఆ రాక్షసి అంత పెద్ద తపస్సు చేసి చివరికి సూచీపిశాచిగా మారలేదా? పై అది దిగంతాలలో పరి(భ్రమించడం [ప్రారంభించగానే అవిద్యాకల్పితమైన దాని తొల్లిటి స్టూలశరీరం పెనుగాలి తాకిడికి శరత్కాల మేఘం లాగా విశ్శీర్మముయింది. అది అస్వస్టులైనవారి శరీరంలో అతివిషూచికా రూపంతో (ప్రవేశించి వారిని బాధించింది. ఆరోగ్యవంతులనూ, బుద్దివుంతులనూ సైతం వదలక పీడించసాగింది. అది ఒక్కొక్కచోట తన స్ట్వైరవిహారంతో తృప్తి చెందేది. ఒక్కొక్క చోట మణి మంత్రౌషధాదుల ద్వారా పరిహరింపబడేది. అలా అది రెండు శరీరాలతో పర్యటిస్తుండగా, చాలా సంవత్సరాలు గడచిపోయాయి. అది నరాలలో, గ్రామాలలో రాకపోకలు సాగించి అలసిపోయేది. చేతినుండి జారిపోతే ఎక్కడో విశ్రాంతి కోరిన దానిలాగా కనిపించకుండా దాగుకొనేది. అది జీవసూచికతో గూడి వృద్దురాలి ఆశలాగా సర్వత్రా సంచరించింది. గాలి కెగిరిన పొట్టులాగా అది సంసరణ రూపమైన అంతఃకరణ (ప్రేరణతో దిగంతాలకు ఎగ(బ్రాకింది. ఇతరులు తనలోకి ప్రవేశపెట్టిన సన్నని నూలుపోగులు భక్షిస్తూ అది పాట్ట నింపుకొనేది. అది ఒక్కొక్కసారి తన క్షీణించిన రూపాన్ని తలచుకొని చాలా పరితపించేది. కాని తన స్వభావాన్ని అనుసరించి ప్రాణులను బాధించడానికే మళ్లీ పూనుకొనేది. దీర్హమైన వాసనాతంతువు శరీరాలలో వైతన్యాన్ని ప్రవేశింపజేసినట్లే అది వస్త్రాలలో దారాన్ని ప్రవేశింపజేసింది. దుష్టులు ముఖం కప్పుకొని దుష్కృత్యం
152 యోగవాష్టం చేసినట్టు, అది వస్త్రం క్రింద దాగి కుట్టుపని నిర్వర్తించేది. అది సన్నని బట్టలోనూ, ముతక బట్టులోనూ సమంగా ప్రవేశించేది. మంద బుద్దులకు గుణదోష విచారణ ఉండదు గదా! (వేళ్ల మధ్య తగులుకొని ద్వీర్రమైన సూత్రాన్ని ధరించినప్పుడు అది తన పొట్టులో పట్టని (ప్రేగులను వెడల గ్రక్కుతున్నదా అన్నట్టు కనిపించేది.
(ప్రాణాపాన వాయువులు (ప్రవహించే ప్రాణుల హృదయపద్మంలో దుఃఖ ప్రదమైన కర్మశక్తే జీవశక్తి రూపమైన సూచికగా ఆవిర్భవించినట్టు తోచింది. ఈ జీవసూచిక వ్యానవాయువులో దూరి అనేక రోగాలు కలిగించేది. దేహాన్ని వికారంగానూ, దుర్చలంగానూ చేసేది.
లోహసూచిక ఒక్కొక్కసారి బాలుర వ్రేళ్ళను బాధించడానికి పూనుకొంటుంది. పూలవూాలలు (గ్రుచ్చే సవుయంలో పూలనే భక్షించి తుచ్చభోజనంతో తృప్తి వహిస్తుంది. దానికి క్రార్యమే స్వభావం. ఇతరులను వేధించడమే కార్యం.
దరి(ద్రుడికి ఒక్క గవ్వ దొరికితే, అదే పదివేలుగా భావిస్తాడు. అలాగే అది ఒక రక్తబిందువుతోనే సంతోషపడసాగింది. దాని రాక్షసప్రవృత్తి అలాంటిది. రెండురకాల సూచికా రూపంతో గర్వించి అది వవానవుల వురణాన్నే ఊహించసాగింది. ఉపయోగించకుండా ఊరక ఉంచిన సూది కత్రుప్పు పడుతుంది. అదేరీతిగా ఇతరులకు అపకారం చేయకపోతే దానికి దుఃఖం కలిగేది. దైవిక చేష్టలాగా జీవ సూచిక అదృశ్యరూపంలో జీవులను (క్రూరంగా వేధించేది.
ఆ సూచిక బురదలో మునుగుతుంది. ఆకసంలో ఎగురుతుంది. గాలితో కూడి దిక్కులలో విహరిస్తుంది. అంతః పురంలో పట్టైెమంచంపై శయనించినట్లే ధూళిలో విశ్రమిస్తుంది. అడవిలో మేను వాల్చుతుంది. మానవుల చేతిలోనూ, చెవిలోనూ, గొర్రె బొచ్చులోనూ విశ్రాంతి తీసుకొంటుంది. కొయ్య, గోడ మొదలైన వాటి రం(ధ్రాలలో ప్రవేశిస్తుంది. మాయావిలాగా తన దద్రవ్యాత్మ శ్తీతో అది సర్వత్రా అలా యథేచ్చగా విహరించసాగింది.
వాల్మీకి: - మునీంద్రుడు ఈ విధంగా చెప్పేసరికి సాయం సమయమయింది. సూర్యుడు అస్తమించాడు. సభాసదులందరూ మునికి నమస్కరించి స్నానాది విథ్గులై వెళ్తారు. తెల్లవారగానే మళ్లీ సభాఫ్త్రలికి విచ్చేశారు.
(ఆథీవ రోజు ముగిసింది.)
ఉత్పత్తి ప్రకరణం 153 సూచికా పరిదేవనం
ఆ కర్కటి అలా నరమాంస భక్షణచేస్తూ చాలా కాలం గడపింది. కాని దానికి తృప్తి కలుగలేదు. నిజంగా సూది ఆకలి తీరడానికి ఒక్క రక్తబిందువే చాలు. కాని తృష్ట అనే సూదికి తృప్తి కల్లించడం చాలా కష్టం!
ఆ కర్కటి తనలో తాను ఇలా చింతించింది - “అయ్యో! కష్టం! నేనెందుకిలా సూదిగా మారిపోయాను? ఎంతో సన్నబడిపోయాను. నా శక్తి నశించింది. నాలో ఒక్క కబళం కూడా పట్టుడం లేదు.
ఆనా విశాలమైన అవయవా లెక్కడికి పోయాయి? కాల మేఘం లాగా పెద్దవైన నా అంగాలు అడవిలో రాలిన ఆకుల్లాగా శిధిలవై పోయాయి. నేను మందభాగ్యురాలను. ఇప్పుడు రుచికరమైన మాంసాహారం ఇసుమంత కూడానా, పొట్టులో ఇమడడం లేదు.
నేను బురదలో కూరుకుపోతున్నాను. నేలపై పడిపోతున్నాను. ప్రజల కాలితన్నులకు గురి అవుతున్నాను. నేను దిక్కులేని దానినయ్యాను. ఒక దుఃఖం నుండి మరొక దుః ఖంలోకి ప్రవేశిస్తున్నాను. చెలికత్తె, దాసి, తల్లి, తండ్రి, సోదరుడు, సుతుడు, బంధువులు మొదలుగా నా అనే వారెవరూ నాకు లేకుండా పోయారు.
నాకు అసలు శరీరమే లేకుండా పోయింది. ఆశ్రయం కరువయింది. నిలువ నీడలేని దానినై గాలికి కొట్టుకుపోయే ఎండుటాకులా ఇటూ, అటూ తిరుగుతున్నాను. ఆపదల్లో చిక్కుకున్నాను. చచ్చిపోతే బాగుండు ననుకంటున్నాను. కాని ఆ చావుగూడా నాకు రావడం లేదు.
గాజుముక్కకారకై చేతనున్న చింతామణిని పారవేసుకన్న మూఢునిలాగా నేనునా దేహాన్ని పరిత్యజించినాను. చిత్తం మోహ గ్రస్తమైతే దుర్చుద్ది పుడుతుంది. తర్వాత అది అనధద్ధ్ర పరంపరా రూపంలో విజృంభిస్తుంది.
ఒకప్పుడు పాగలో కొట్టుమిట్టాడుతున్నాను, వురొకసారి దారిలో పారలాడుతున్నాను. ఇంకోసారి గడ్డిపరకలోకి నెట్టివేయబడుతున్నాను. అయ్యో! నా దుఃఖపరంపరను ఏమని చెప్పుకొనేది?
ఇతరులకు దాస్యం చేస్తూ వారి పంచనబడి (బ్రతుకవలసిన దుఃస్థ్రితి నాకు దాపురించింది. తుచ్చ విషయాలపై (భ్రాంతి పెంచుకొని పరులను వేధించవలసిన
154 యోగవాసిష్టం దౌర్భాగ్యం నాకు కల్గింది. ఒక బేతాళాన్ని శమింపజేయబోతే మరొక పెద్ద బేతాళం పాడసూపిందట. అలాగే ఆత్మోన్నత్తై తపస్సు చేయబోతే నాకు సర్వనాళం సంభవించింది. ఆ విశాలమైన శరీరాన్ని నేను బుద్ది పూర్వకంగా ఎందుకు పరిత్యజించినట్టు? వినాశ కాలంలో విపరీత బుద్ది కల్గకుండా వుంటుందా?
కీటకం కంచె సూక్ష్మమై దారిలోని ధూళిలో పారలాడే నన్ను ఎవడు ఉద్రరిస్తాడు? నా వంటి హతాశయులు మహాశయులైన యోగుల దృష్టికి ఎలా వస్తారు? గ్రామ మార్గంలోని గడ్డి పోచలు కొండపై వుండేవారికి కనిపిస్తాయా? అజ్ఞానసాగరంలో పడివున్న నాకు అభ్యుదయం ఎలా సిద్దిస్తుంది? మిణుగురు పురుగును పట్టుకొన్న గ్రుడ్డివాడికి వస్తుదర్శనం ఎలా కలుగుతుంది?
విపత్తులనే గుంటలలో పడి పారలాడుతూ నేనిలా ఎంతకాలం ఉండిపోవాలో నాకు తెలియడం లేదు.
భూమ్యాకాశాల మధ్య స్తంభంలాగా వుంటూ కాటుకకొండ కన్నబిడ్డను పోలిన మహాశరీరం నాకు ఎప్పుడు కల్గుతుంది? మేఘమాల వంటి భుజాలతో, మెటపువంటి కళ్లతో, ఆకసాన్ని తాకే వెండ్రుకలతో, ఊగిసలాడే చన్నులతో, లంబమానమైన ఉదరంతో భీషణమైన శరీరం నాకు ఎప్పుడు సమకూడుతుంది? నిప్పులు (గ్రక్కే నేత్రాలతో సూర్యమాలను ధరించి ఒక కొండనుండి మరొక కొండకు లంఘిస్తూ నేనెప్పుడు విహరించగలనో? క్రూర రాక్షసులను సైతం తరిమికొట్టుగల చిరునవ్వుతో వుదించి మహారణ్యంలో నేనెప్పుడు నృత్యం చేయగలనో?
మద్యప్లూర్ణ ఘటాలతోనూ, మాంసంతోనూ, ఎముకలతోనూ, నా పొట్టను నేను ఎప్పుడు నింపుకోగలనో ! నెత్తురు త్రాగి మత్తెక్కి నేను సంతసించేదెప్పుడో! ఆ మత్తులో హాయిగా నిద్రించే దెప్పుడో 1
నేనేపాడు తపస్సు అనే అగ్నిలో నా శరీరాన్ని పడవేసి సూదిగా మార్చుకొన్నాను. దిక్కులన్నిటా వ్యాపించిన కాటుక కొండవంటి ఆ శరీరమెక్కడ? సాలెపురుగు కాలి కొనలాగా తృణపేలవమైన ఈ సూచీత్వమెక్కడ ? మూర్చుడు స్వర్థకటకం చేతికి చిక్కినా మట్టి అనుకాని పారవేస్తాడు. నేను సూచీత్వం అపేక్షీంచి భాసుర శరీరాన్ని వదలుకొంటిని కదా! ఓ నా ద్వీర్ణ బాహువులారా! మీరెక్కడికి పోయారు? నేనిప్పుడు దోమ గిట్టుకు సైతం ఊగిపోయే సూదిగా మారిపోయానే? ఆకాశాన్ని
ఉత్పత్తి ప్రకరణం 155 నింపివేసే ఆ నా శరీరమెక్కడ? ఈ సూదిరూపమెక్కడ? రోదోరం(ధ్రల వంటి ఆ నోరెక్కడ? ఈ సూది బెజ్జం ఎక్కడ? బహు మాంస భార బహుళమైన ఆ భోజన మెక్కడ? ఈ జలబిందు భోజన మెక్కడ?
జౌరా! నా వినాశాన్ని నేనే చేతులారా కొని తెచ్చుకొన్నాను?' |||
సూచీ తపః ప్రభావం
ఆ కర్కటి అలా చింతించి మౌనం వహించింది. మళ్ళీ తన పూర్వరూపం పొందడానికి తపస్సు చేయాలనుకొన్నది. ప్రాణులను హింసించడం మానుకాన్నది. ముందు తాను తపస్సు చేసిన హీమగిరి శిఖరానికే తిరిగి బయలుదేరింది. ఆ రాక్షసి తన లోహసూచికా రూపాన్ని జీవసూచికా రూపంతో సమ్మిళితం చేసింది. పిమ్మట (ప్రాణవాయుశరీరంతో (క్రియాశక్తిని పాంది హిమా ద్రిశిఖరం చేరుక"న్నది.
ఆ శిఖరం మీద ఏ ప్రాణులూ నివసించడంలేదు. నలువైపులా దావాగ్ని వ్యాపించి వున్నది. మహాశిలలతో నిండిన ఆ చోటంతా ధూళిధూసరితమై వున్నది. విశాలమైన ఆ మరుభూమిలో హఠాత్తుగా మొలిచిన ఎండుగడ్డీిమొలక లాగా ఆ రక్కసి నిలబడింది.
ఒంటి పాదంపై నిలిచి అది తపస్సు చేయడానికి ఉప[క్రమించింది. పాదతల స్పర్శతో భూమిపైని పరాగ రేణువులకు ఒత్తిడి కల్గించింది. దృష్టిని విషయసుఖాలనుండి పూర్తిగా మరలించింది. ఊర్హ్వముఖిగా నిలిచి తపోనిష్ట కొనసాగించింది.
సూది రూపంతో వున్న దాని ముఖరం(ధ్రం నుండి ప్రసరించిన సూర్యకాంతి ఒక చెలికత్తె లాగా భాసించింది. దాని నీడ మరొక చెలికత్తె వలె వెన్నంటి నిలబడింది. తమ వారెంత నీచులైనా జనులకు వారిపై వాత్సల్యం ఉండకపోదు గదా!
దూరంలో వున్న తీగలు, చెట్టు కూడా ఆ సూచికను చూడడానికి అర్రులు సాచాయి. మవాతపస్వినిని చూడాలన్న ఉత్కంఠ ఎవరికి కల్లదు?
ఫ్టీరమైన పాదబంధంతో తపోవృత్తిలో వున్న ఆ కర్కటికి తరు గుల్మ లతాదులు పుష్ప పరాగపూరితమైన వాయువులను ఆహారంగా పంపాయి. కాని ముఖరం(ధ్రంలో దూరిన ఆ ఫుప్పు పరాగాలను సైతం అది భోజనంగా స్వీకరించడానికి అంగీకరించ లేదు.
156 యోగవాసిస్టం
ఇం(ద్రుడు దాని తపస్సుకు విఘ్నం కల్షించాలని వాయు(్రేరితమైన మాంసకణాలను పంపాడు. అవి దాని ముఖంలో ప్రవేశించినా ఆ సూచిక వాటిని భుబించలేదు. అల్పులు కూడా దృఢనిశ్చయం కలవారైతే ఆత్మబలంతో విఘ్నాలను నివారించగలరు. వాయుదేవుడు దాని నిశ్చయాన్ని చూచి తాను మేరుపర్వతాన్ని పెకలించిన నాటి కంచె ఎక్కువ ఆళ్ళిర్యం పాందాడు.
బురద శిరస్సును కప్పివేసినా, జలప్రవాహాలు తన్ను ముంచివేస్తున్నా, మహావాయువులు ఊగిస్తున్నా, దావాగ్ని కాల్చివేస్తున్నా, పెద్ద పెద్ద వడగండ్డు పైబడుతున్నా, మెజుపులు (భ్రాంతికల్లిస్తున్నా, మబ్బులు ఉరుములతో ఉద్వేగం కల్లించినా, ఆ కర్కటి తన దృఢనిశ్చయం నుండి చలించలేదు. విషమూర్చవల్ల నిద్రించిందా అన్నట్టు కాలికొనను గరొడా కదల్చకుండా తపోదీక్షలోనే వుండిపోయింది.
అది ఏమాత్రం బాహ్యచేష్టలు లేనిదై సత్యమైన ఆత్మనుగూర్చే విచారించింది. దానికి పరావర దర్శనాత్మకమైన జ్ఞానదృష్టి ఉదయించింది. దుష్కృతమంతా క్షయించింది. తెలిసికో దగిన తత్త్వం గోచరించింది. ఆత్మసాక్షాత్కారం లభించింది.
ఏడువేల సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన దాని తపస్సువల్లి పదునాలుగు లోకాలూ సంతాపానికి గురి అయ్యాయి. ప్రళయాగ్నిలాగా భీకరమైన దాని తపస్సు హిమాలయాన్నే ఉడికించివేసింది. జగత్తంతా తీవ్రదాహానికి లోనయింది.
అప్పుడు ఇంద్రుడు నారదుళణ్లి చూచి ''ఈలోకాన్ని ఇలా తపింపజేస్తున్నది ఎవరి తపస్సు?*' అని ప్రశ్నించాడు.
నారదమునీంద్రు డిలా అన్నాడు - ““దేవేంద్రా! సూచీరూపంలో కర్కటి ఏడువేల సంవత్సరాలనుండీ ఘోరమైన తపస్సు చేస్తున్నది. దానివల్ల ఈ లోకమంతా ఇలా జ్వలిత మయింది. ఆ తపః ప్రభావం వల్లనే సర్పాలు శ్వసిస్తున్నవి. కొండలు చలిస్తున్నవి. వైమానికులు క్రిందపడిపోతున్నారు. సముద్రాలూ, మేఘాలూ శుష్కించి పోతున్నాయి. సూర్య సమేతంగా దిక్కులన్నీ మలిన మవుతున్నాయి. దీనికంతటికీ రుద్రుని జగత్సంవారశక్తిని బోలిన ఆ సూచిక యొక్క తహ్సు కారణం.”*'
ఉత్పత్తి ప్రకరణం 157 సూచీ తపోవర్షనం
అప్రియమైన ఆ కర్కటి తపోవృత్తాంతం విని ఇంద్రుడు నారదుణ్లి మళ్లీ కుతూహలంతో ఇలా (ప్రశ్నించాడు -
“మునీంద్ర! జడమతి అయిన ఆ కర్కటి తపస్సుతో జీవసూచీ పిశాచిగా మారి ఏయే భోగాలు అనుభవించింది?"
అప్పుడు నారదుడిలా అన్నాడు -
““దేవేంద్రా! పేలవమైన పీశాచత్వం పొందిన ఆ జీవసూచికి నల్లని ఇనుపసూది ఆశ్రయమయింది. ఒక్కొక్కసారి ఆ సూదిని వదలి అది వాయువనే రథం అధిష్టించి ప్రాణవాయువనే దారిలో పయనించి పాపాత్ముల శరీరాలలో (ప్రవేశించేది. వారి (ప్రేవులు, నాడుల రంధ్రంలో దూరి చెట్టు తొర్రలో దూరిన పక్షిలాగా అక్కడే దాగి వుండేది. రోగవాయువు చేరిన నాడిలో అది శూలబాధ కల్గించేది.
జీవులు భుజించిన భోజనాలతో పాటు ఆ రక్కసి నరమాంసాలు గూడా భుబించింది. వివిధ మాలికలు ధరించి ప్రియులతో రమించే ముగ్రబాలికలలో ప్రవేశించి అది ఆ సుఖంగూడా అనుభవించింది.
అది పక్షుల శరీరంలో దూరి కల్పతరు పుష్పాలకంటే ఎక్కువ సుగంధం కల పద్మవన వీథుల్లో విహరించింది. తుమ్మెదలలో చేరి మందార మకరంద రసాన్ని పానం చేసింది.
యుద్దరంగంలో వీరుల అంగాలను భక్షించే ఖడ్గధారలాగా గ్రద్రలలో ప్రవేశించి అది శవాల అవయవాలను మెసవింది. వాయువులాగా సర్వత్రా పరిభ్రమించింది. సర్వప్రాణుల శరీరా లనే గృహాలలోనూ సంచరించింది.
నీటిలో ద్రవశక్తి లాగా అది ప్రాణుల రక్తంలో విహరించింది. సముద్రంలో సుడీలాగా జీవుల గర్భంలో (భ్రమించింది. ఆదిశేషునిపై విష్ణువు శయనించినట్టే అది జీవుల మేదస్సుపై శయనించింది. అమృతాన్ని ఆస్వాదించిన రీతిగా పానశ్తీతో అంగగంధాన్ని ఆస్వాదించింది. అది వాయురూపంతో తరు లతా గుల్మాదుల రసాలనూ, హింసతో జీవులనుండి లభించిన అపవిత్ర రసాలనూ గ్రోలింది. అలాంటి రక్కసి ఇప్పుడు తన సంకల్పబలంతో తాపసిగా మారింది.
ఆ కర్కటి లోహసూచికను ఆశ్రయించి వున్నప్పుడు ఎదురు లేకుండా అన్ని దిక్కులూ తిరిగింది. అనంతమైన (ప్రాణుల శరీరాలలో చేరి తిని, త్రాగి యథేచ్చగా
158 యోగవాసిష్టం విహరించింది. ఆటలతో పాటలతో స్వేచ్చగా కోలం గడపింది. అదృళశ్యరూపాలతో విహరిస్తూ అప్పుడది చేయని పని అంటూ ఏదీ లేదు.
విషయ భోగానుభవానికి శక్తి చాలని వృద్దునిలాగా అది ఒక్కొక్కసారి అపారమైన మేదోమాంసాలను (మింగలేక ఏడ్చేది. నర్తకి తన ఆభరణాల నాడించినట్లే అది తన పీడకు గురి అయిన అజగజాదిజంతువుల నాడించేది.
మంత్రం, జౌషధం, దేవపూజ మొదలైన వాటివల్ల ఒక్కొక్కసారి దెబ్బతిని కొండవాగులోని అలలొగా అది పరుగెత్తింది. దీపకాంతిలాగా ఎలా పోతున్నరో తెలియకుండా అంతర్జానమై తల్లి ఒడిలో ప్రవేశించినట్టు ఇనుప సూదిలో ప్రవేశించి సుఖించింది. జడుడు ఎక్కడెక్కడ తిరిగినా ఆపత్కాలంలో తిరిగి స్వసానమే చేరుకొంటాడు. జీవసూచి చివరికి లోహసూచికనే ఆశ్రయించలేదా?
ఆ కర్కటి ఇలా దశదిశలూ తిరుగుతూ మానసిక తృప్తి పాందిందే కాని శారీరక తృప్తీ పొందలేదు. శరీరం ఉన్న వారికే శారీరక సుఖం కల్గుతుంది కాని అది లేని వారి కెలా కల్గుతుంది?
తరువాత ఆ రక్కసి తన పూర్వ దేహాన్ని గుర్తుకు దెచ్చుకొని ఉదర పూరణ సుఖం మీది కోరికతో దుఃభించింది. పూర్వ శరీరం కొరకై తపస్సు చేయాలనుకొని ఆకాశంలో పోయే ఒక గ్రద్ద హృదయంలో ప్రవేశించింది. ఆ రక్కసి ప్రేరణతో గ్రద్ద దానికి సహకరించింది.
వాయువు మబ్బును తీసుకుపోయినట్లే ఆగ్రద్ర దానిని హిమాద్రి శిఖరానికి తీసుకుపోయింది. యోగి బుద్లివృత్తిని సంకల్పరహిత స్టానంలో నిల్పినట్లు అది ఆ సూచికను జనశూన్యమైన మహారణ్యంలో నిల్పింది. శిఖరాగ్రంలో (ప్రతిష్టింపబడ్డ దేవతలాగా అక్కడ ఆ సూచిక భాసించింది.
సూక్ష్మాతి సూత్మమైన కాలికొనపై నిలబడి అది మెడ పైకెత్తుకొన్న నెమలీ లాగా విలసిల్లింది. గ్రద్ద నిలబెట్టిన లోహ సూచికను చూచి జీవసూచిక దాని శరీరం నుండి వెలుపలికి వచ్చింది. గ్రద్ద తన బరువు దించుకొని స్వస్త్రానానికి వెళ్లింది.
జీవసూచిక లోహసూచికనే తన తపస్సుకు ఆలంబనంగా పరిగ్రహించింది. వస్తువులు సమాన వస్తువులను ఆ(శ్రయించినప్పుడే కదా రాణిస్తాయి ! ఆకారం లేనివారికి ఆధారం లేకపోతే పనులు జరగవు. అందుకే జీవసూచిక లోహసూచికను ఆశ్రయించి తపోనిష్ట సాగించింది. ఇంద్రా 1! నాటి నుండి ఆ కర్కటి అనేక
ఉత్పత్తి ప్రకరణం 159 సంవత్సరాలు అరణ్యంలో తీవ్ర తపస్సు చేసింది. కర్తవ్యం తెలిసిన నీవు దానికి వరాలిచ్చి శాంతింపజేయి. లేకపోతే దాని ద్వీర్ణ తపస్సు లోకాన్ని దహించివేస్తుంది సుమా! ఈరీతిగా నారదుడు చెప్పిన వూటలు విని ఇంద్రుడు కర్కటిని అన్వేషించడాన్నైై వాయువును నియమించాడు. వాయుదేవుడు దివ్యదృష్టితో దశ దిశలూ పరికించాడు. నభోమార్గం వదలి భూమిపై వడివడిగా సంచరించాడు. వాయుదేవుని జ్ఞానాంశం బ్రహ్మతేజంలాగా సర్వత్రా వ్యాప్త మయింది. అతడు సప్త సాగరాలనూ, సప్తద్వీపాలనూ చూచాడు. చివరికి జంబూద్వీపం చేరి అక్కడ కర్కటి తపస్సు చేస్తున్న గిరి శిఖరం చేరుకొన్నాడు. అక్కడ ప్రాణి సంచారం లేదు. ఆ (ప్రాంతమంతా సంసార నిర్మాణం లాగా రజోవ్యాస్తమై వున్నది. ఎండమావులనే నదులతో నిండిన సము(ద్రం లాగా కన్పిస్తున్నది. లోకపాలకులకు సైతం దాని తుది మొదళ్లు గోచరించవు. సూర్యకిరణా లనే కుంకుమతోనూ, చండద్రకిరణా లనే చందనం తోనూ కూడిన ఆకాళవిలాసిని లాగా ఆ భూమి భాసించింది. సప్త ద్వీపాలతోనూ, సప్త సముద్రాలతోనూ ఆవరింపబడివున్న ఆ భూపీఠం చుట్టూ విహరించి సుదీర్ర ప్రయాణం వల్ల వాయువు అలసిపోయాడు. తుదకు ఆ పర్వత సలిని చేరుకొని అక్కడ విశ్రమించాడు. తపః పరిపాకం మహారణ్యమయమైన ఆ (ప్రదేశంలో పర్వతశిఖరం నడిమి సిగలాగా వున్న ఆ సూచిని వాయువు చూచాడు. అది అక్కడ ఒంటికాలిపై నిలబడీ తపస్సు చేస్తున్నది. తలపై పడుతున్న ఎండ వేడిమికి వాడిపోయింది. ఆహారం తీసుకోకపోవడం వల్లి దాని పాల్లు మీది చర్మం శుష్కించి ముడుచుకుపోయింది. ఎండనూ, గాలినీ ఒక్కసారిగా లోనికి గ్రహించి '“'ఇవినా హుదయంలో ఇవుడవు”” అని అది మళ్ళీ వాటిని పరిత్యజిస్తున్నది. ఆ సూచి ఎండకు శుష్కించింది, అడవిగాలికి జర్హరమయింది, చం(ద్రకిరణాలలో స్నానమాడింది, తాను ఉన్న చోటినుండి కదలకుండా ఉన్నది. దాని మప్తకం ఒక్క రజోరేణువుతోనే కప్పుబడిపోయింది. అందువల్ల మరొక రజోగుణానికి అక్కడ అవకాశం కల్పింపక అది తన క్కతార్దతను (ప్రకటించుకొన్నదా అన్నట్లున్నది. తపః (ప్రారంభ దశలో సన్ననైన ౯26
160 యోగవాసిం ఆ సూచి వుహారణ్యానికి సిగలాగా కనిపించింది. (క్రవుంగా తపస్తేజప్పు రాశీభవించడం వల్ల కొంతకాలానికి దాని కది జటాజూటం లాగా భాసించింది. వాయుదేవుడు ఆ సూచిని చూచి ఆళ్ళర్యచకితుడయ్యాడు. దానికి నమస్కారం చేశాడు. చాలాసేపు దాన్ని పరికించి చూచాడు. ఎంతో భయపడినవావి లాగా మెల్ల వెల్లగా దానిని సమీపించాడు. దాని తపఃప్రభావంతో అతడు పరాజితుడయ్యాడు. అంచేత '“నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు?" అని ప్రశ్నించలేకపోయాడు. '“జౌరా ! భవతి ఈ మహాసూచి మహాతపస్సు”' ! అని మాత్రం మనస్సులో అనుకొన్నాడు. వెంటనే ఆకసాని కెగిరపోయాడు. మేఘ మార్గం దాటాడు. వాయు మండలం అతిక్రమించాడు. సిద సమూహం ఆవలికి వెళ్ళాడు.
- సూర్యపథం చేరుకొన్నాడు. ఇంకా పై పైకి పయనించి చివరికి ఇంద్రుని పట్టణం (ప్రవేశించాడు. - సూచీ దర్శనంతో పావనుడైన పవనుళ్లీ ఇంద్రుడు కౌగలించుకొన్నాడు. అతడు (ప్రశ్నించగానే తాను చూచి వచ్చిన వృత్తాంతమంతా ఇతర దేవతల సమక్షంలో వాయువు ఇలా వివరించాడు -
““జంబూద్వీపంలో హిమవంతమనే ఎత్తైన పర్వతరాజం ఉన్నది. ఆ కొండరి రేనికి అల్జుడు సాక్షాత్తూ చంద్రశేఖరుడే. ఆ కొండకు ఉత్తరాన ఉన్న శిఖరం మీద మవాతేజస్విని, తపస్విని అయిన సూచి తపోనిష్టలో ఉన్నది. పలు మాట లెందుకు? అది గాలిని పైతం భక్షించకుండా ఉండడానికై తన పొట్టును ముద్దగా ఘనీభవింపజేసుకొన్నది. గాలి దూరకుండా వుండాలని అది తన ఠంధధ్రాన్ని ధూళికణంతో మూసివేసికాన్నది. తీవ్రమైన దాని తపస్సు వల్ల హిమా(ద్రి చల్లదనం వదలి అగ్నిమయంగా మారి సేవింపరానిదై పోయింది. అందువల్ల లెండి! మనమంతా వెంటనే పితామహుని చెంతకు పోదాం. దానికి వరమిచ్చి తపస్సు విరమింప జేయవలసిందిగా ఆ దేవుణ్ణి ప్రార్ధించుదాం. లేకపోతే దాని తీ'వ్రతపస్సు వల్ల మనకు అనర్ధం తప్పదు”'.
ఇలా వాయుప్రేరితుడై ఇంద్రుడు దేవతలు వెంటరాగా (బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సంగతి వివరించి సూచి తపస్సు విరమించేటట్లు చేయమని పితా మహుణ్లీ ('ప్రారించాడు. అంతట (బ్రహ్మ “*నేను దానికి వరం ఇవ్వడానికై హిమౌద్రికి పోతున్నాను! అని చెప్పాడు. ఆ మాట విన్న మీదట ఇంద్రుడు తిరిగి స్వర్గం
ఉత్పత్తి ప్రకరణం 161 చేరుకొన్నాడు. ఇంతలో తపస్సుతో స్వర్గోకాన్ని తపింపజేసిన సూచి పరమ పవిత్రాత్మురాలుగా మారిపోయింది. రాఘవా ! ఇప్పు డాకర్కటి ఆత్మ విచారణతో పరమకారణమైన బ్రహ్మ పదార్డాన్ని తెలుసుకొన్నది. విచారణాత్మకమైన మనన పద్రతి ననుసరించడ మొక్కటే దానికి గురువు. దీనికి మించిన మరొక గురువు లేడు. సూచీ శరీర లాభం కర్కటికి జ్ఞానోదయం కల్లిన పిదప వెయ్యి సంవత్సరాలకు (బ్రహ్మదేవుడు దాని వద్దకు వచ్చాడు. ఆకసంలో నిలబడి '“పుత్రీ ! వరం కోరుకో!”' అన్నాడు. ఇప్పుడు ఆ సూచికీ కర్మేంద్రియాలు లేవు. అందువల్ల జీవమా'(త్ర కళ గల ఆ సూచి ఏమీ మాట్లాడకుండా ఇలా తనలో తాను తర్కించుకొన్నది - “ఇప్పుడు నేను పరిపూర్ణురాలను. నాకు సందేహాలు లేవు. నేను శాంతంగా, తృప్తిగా, సుఖంగా వున్నాను. తెలుసుకోదగిన తత్త్వం తెలుసుకొన్నాను. ఆత్మవివేకం వికసించింది. ఇక నాకు మరొక పదార్ధంతో పని ఏమున్నది ? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో, ఇక ముందు గూడా అలాగే వుంటాను. నేను సత్యస్వరూపిణీని. నాకు ఇతర మిథ్యార్దాలతో పనేమి ? బేతాళాన్ని సంకల్పించుకొన్న బాలికలాగా ఇంత కాలం నేను అవివేకంతో ఆరాటం చెందాను. ఆత్మవిచారణ వల్హ అవివేకం శమించింది. , ఇక ఇష్టానిస్టాలతో నాకేమి ప్రయోజనం ?”” ఇలాంటి నిశ్చయంతో కర్మేంద్రియాలు లేక మౌనంగా వుండిపోయిన సూచిని కొంత సేపు బ్రహ్మ చూస్తూ వుండిపోయాడు. తరువాత ఆయన ప్రసన్నుడై విరక్తురాలయిన కర్కటితో ఇలా అన్నాడు '' కుమారీ! వరం తీసుకో! కొంతకాలం ఈ లోకంలో భోగాలను అనుభనించు. ఆ తర్వాత పరమపదం పొందగలవు. ఇది తిరుగులేని నియతి యొక్క నిశ్చయం సుమా 1! ఈ తపస్సు వల్ల నీ సంకల్పం సఫలం అగుగాక! మళ్ళీ నీవు హిమాద్రి కాననంలో బలసిన రక్కసిగా మారిపో | చీజంలో సూత్మరూపంతో వున్న వృక్షం నీరు తగలగానే అంకురించి వృద్రి పాందుతుంది. అలాగే ఈ సూచవీరూపంలో సూత్మంగా దాగివున్న నీ పూర్వ స్టూలరూపాన్ని నీవు పొందుతావు. నీకు తత్త్వం తెలిసింది కాబట్టి ముందులాగా నీవు లోకాన్ని బాధించవు. శరత్కాలంల్ో ని మేఘం వలె పరిశుద్రంగా వుంటావు.
162 యోగవాసష్టం నీవు సదా ధ్యానమగ్గువై వుంటావు. ఒకవేళ సమాధి స్టితినుండి వెలికి వచ్చినా సమస్తాన్నీ ఆత్మ స్వరూపంగా భావిస్తావు. నీవు ధ్యాన ధారణలను అవలంబించి వుంటావు. వాయువు సహజంగా చరించినట్లే నీ శరీరం సహజచేష్టలతో కూడివుంటుంది. ఆ ఫ్రితిలో నీవు రాక్షసులలాగా హింస చేయవు. క్షుద్చాధా నివృత్తకై న్యాయమైన హింస మాత్రం చేస్తావు. నీవు న్యాయవృత్తితో జీవిస్తావు. న్యాయమార్గం అతిక్రమించిన వారినే బాధిస్తావు. జీవన్ముక్తురాలవై వివేకరక్షణలో వుంటావు.
(బ్రహ్మ ఇలా చెప్పి వినువీధినుండి తన లోకానికి వెళ్ళిపోయాడు. అంతట కర్కటి '“ఇందువల్ల నాకు విరోధ మేమున్నది ? బ్రహ్మ మాటను నేనెందుకు కాదనాలి?'' అనుకుంటూ (క్రమంగా తనలో తన పూర్వరూపాన్ని భావించింది.
అలా భావించేసరికి బీజం క్రమంగా విశాలమైన వృక్షంగా రూపాందినట్లే కర్కటి స్థూలస్వరూపం పొందజొచ్చింది. మొదట జుత్తెడు పాడవుతో కనిపించి తర్వాత హస్త ప్రమాణంగా మారింది. ఆ పై పురుష ప్రమాణంగా, చెట్టుకొమ్మను పోలినదిగా పెరుగుతూ చివరికి మేఘమంతటి రూపుతో భాసించింది. అన్ని అవయవాలతోనూ విలసిల్లింది. సూజ్మాకృతితో ఇంతకాలం సూచిలో దాగివుండిన ఆ రక్కసి అవయవాలు పెంపొంది మళ్ళీ శక్తి మంతా లయ్యాయి. ఇంద్రియా లన్నీ పూర్వం లాగానే రూపుదిద్దుకొన్నాయి.
అన్యాయ బాధికం
రామా ! సూక్ష్మ దశనుండి వర్దాకాలంలోని మేఘలేఖ స్టూలత్వం పొందిన రీతిగా అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత ఆ సూచీకర్కటి రాక్షసీగా మారిపోయింది. అయినా జ్ఞానం ఉదయించడం వల్ల స్వస్వరూపానుభవం పాంది కంచుకాన్ని విడిచినట్లే తన రాక్షసభావాన్ని విడిచిపెట్టింది. ఆత్మ ధ్యానం చేసుకొంటూ సంతసించిన ఆ రక్కసి పద్మాసనంలో కూర్చొని శుద్రజ్ఞానాన్ని ఆశ్రయించి పర్వత శిఖరం లాగా స్రిరంగా ఉండి పోయింది.
అలా ఆరు నెలలు గడచిపోయాయి. తరువాత వర్షర్తువులో మేఘ శబ్దానికి ఉద్పోధం పాందిన నెమలి లాగా అది సమాధినుండి లేచింది. దాని కప్పుడు బాహ్యవృత్తి కలిగింది. క్షుద్దాధ గోచరించింది. దేహం ఉన్నంత వరకూ దాని స్వభావం పోదు గదా!
ఉత్పత్తి ప్రకరణం 163 పిమ్మట ఆ కర్కటి ఇలా చింతించింది. '' ఇప్పుడు దేన్ని మింగి నేను ఆకలి తీర్చుకొనేది ? అన్యాయంగా పరజీవులను భక్షించరాదు. ఆర్యనిందితమైనదీ, అన్యాయార్దితమైనదీ అయిన తిండి తినడం కంటే మరణించడం మేలు. న్యాయార్దితమైన భో జనం దొరకనప్పుడు శరీర పరిత్యాగం చేస్తాను. అన్యాయార్లిత భోజనం విషంవంటిది గదా 1! నాకు జననంతో కాని, మరణంతో కాని కలిగే ప్రయోజనం ఏమీలేదు. అలాంటప్పుడు అన్యాయంగా ఎందుకు జీవించాలి ? ఈ దేహం సంకల్పం మాత్రమే. ఇది ఆత్మజ్ఞానంతో శూన్యమైపోతుంది. ఇక నాకు దేహదృష్టి, అదేహదృష్టి ఎక్కడ ఉన్నాయి?* అలా అనుకొంటూ మౌనంగా ఉన్న ఆ రాక్షసి తన రాక్షసస్వభావ పరిత్యాగంతో సంతోషించిన వాయుదేవుడు పల్కిన ఈ క్రింది మాటలు విన్నది. '“ఓ కర్కటీ! నీవు వెళ్లి అజ్ఞానులకు జ్ఞానబోధ కావించు. మూఢులను తరింప జేయడమే కదా మహాత్ముల స్వభావం ! నీవు బోధ చేస్తున్నా ఎవడు జ్ఞానం పొందడో, వాడు తన వినాశం కొరకే పుట్టినవాడు. అట్టివాడు నీకు ఆహారం అవుతాడు." ఆమాట విని ''ధన్యురాల నయ్యాను' అనుకొంటూ అది కొండ శిఖరం నుండి లేచింది. క్రమంగా క్రిందికి దిగింది. అక్కడ కిరాతులు నివసించే రాజ్యం చేరుకొన్నది, ఆ రాజ్యంలో అన్నం, పశువులు, పక్షులు, మృగాలు, కందమూలాది (ద్రవ్యాలు సమృద్దిగా వున్నాయి. రాత్రివేళ ఆ నల్లని రక్కసి అంధకారావృతమైన ఆదేశంలో ప్రవేశించింది. కర్కటీ విచారం ఇంతలో ఆ కిరాతక జనమండలంలో దట్టుమైన చీకటి 'క్రమ్ముకన్నది. నల్లని మబ్బులు క్రమ్మడంతో చందమామ కనిపించ లేదు. గవాక్ష రంధ్రాల నుండి కొద్ది కొద్దిగా వెలుగు ప్రసరిస్తున్నది. పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. తక్కిన ప్రాణులన్నీ గాఢని(ద్రలో ఉన్నాయి. గాలి మెల్లగా వీస్తున్నది. మంచు దట్టంగా కురుస్తున్నది. గ్రుడగూబలు అరుస్తున్నాయి. ఉద్యానంలో ఫలపుష్పాలు రాలుతున్నాయి. దొంగలు పడిన ప్రదేశాల్లో (ప్రజలు ఆ క్రందనం చేస్తున్నారు. మూర్తీభవించిన అంధకారంగా ఉన్న ఆనిశీథిని భయంకరమై తోచింది. ఆకాళరాత్రి సమయంలో ఆదేశాన్ని పరిపాలించే రాజు మంత్రితో సహా నగరం
164 యోగవాసష్టం నుండి వెలికి వచ్చాడు. అతని పేరు విక్రముడు. మహావీరుడైన అతడు ధైర్యంతో అరణ్యంలో ప్రవేశించాడు. గ్రామ దేఎత బేతాళాన్ని చూ డాలన్న కుతూహలంతో వచ్చిన వారిరువురినీ ఆ కర్కటి చూచింది. అది ఇలా అనుకొన్నది.
“ఆహా! నాకిప్పుడు భోజనం దొరికింది. ఆత్మజ్ఞానం లేని మూఢులు వీరు, వీరికి దేహమే భారం. మూఢుడు దుఃఖంకొారకే జీవిస్తాడు. ఇలాంటి వారిని ప్రయత్నంతో వధించాలి. ప్రయోజన రహితుల్ని రక్షించి ప్రయోజనం లేదు. ఆత్మజ్ఞాడు కానివానికి జీవితం కంటే మరణమే మేలు. మరణించినవాడు పాపం చేయడు కదా ! ఆత్మజ్ఞాన హీనులైన మూఢులే హింసా స్వభావం కల ప్రాణులకు ఆహారంగా విధాత విధించాడు. అందువల్ల వీరిద్దరినీ నేను ఇప్పుడు భుజిస్తాను. తనంత తానుగా వచ్చిన అర్జాన్ని వదిలి పెట్టేవాడు మూర్చుడే |
ఒకవేళ వీరిద్దరూ గుణవంతులైన మహాశయులేమో ? అలాంటి వారిని వధించడం నాకు సమ్మతం కాదు. వీరిని పరీక్షిస్తాను. గుణవంతులైతే భక్షించను. గుణవంతులను హింసింపరాదు. సుఖాన్నీ, కీర్తిని ఆయుస్సునూ కోరేవాడూ ఇష్టైర్దాలను సమర్పించి గుణవంతులను పూజించాలి. నేను చావనైనా చస్తాను కాని, గుణవంతులను చంపను. సాధువులు జీవితంకంటే మనస్సునే ఎక్కువగా సుఖింప చేస్తారు. ప్రాణమైనా అర్పించి గుణవంతులను పరిరక్షించాలి. గుణవంతులతోడి సాంగత్యంవల్ల వరణం కూడా సుఖావహ వువుతుంది. రాక్షసినైన నేను గుణవంతులను రక్షిస్తే ఇంక ఎవరు వారిని ఆదరింపరు ? ఉదారగుణ సంపన్నులైన మహానుభావులు భూతలంపై చంద్రునివంటివారు. వారి సాంగత్యం చల్లదనాన్ని చేకూరుస్తుంది. గుణవంతుల తిరస్కారమే మృత్యువు. వారి పురస్కారమే జీవితం. స్వర్గం, మోక్షం వంటి ఫలాలు గుణవంతుల సాంగత్యం వల్ల కలిగేవే. అందువల్ల వీరు ఎంత మాత్రం గుణవంతులో (ప్రశ్నించి పరీక్షిస్తాను. ఎదుటి వ్యక్తీ గుణవంతుడో, కాడో చక్కగా పరీక్షించాలి. తనకంటె గుణహీనుడని స్పష్ట మయితేనే దండించారి. అధికగుణవంతు డైతే దండించరాదు."'
రాక్షసీ వర్గనం
తరువాత రాక్షస కులవునే అడవికి పూగుత్తి లాగా వున్న ఆ రక్కసి
అంధకారావృతమైన ఆ ప్రదేశంలో మేఘం లాగా గర్హించింది. ఉరుము పిమ్మట
ఉత్పత్తి ప్రకరణం 165 పడిన వడగండ్ర వాన శబ్దంలాగా హుంకారానంతరం దాని మృుదువచనాలు ఇలా వినిపించాయి.
4“భయంకరారణ్య మనే ఆకసంలోని ఓ సూర్యచంద్రులారా ! అజ్ఞాన పీఠ మనే రాతి తొ(ర్రలోని కీటకములారా 1 మీరెవరు ? ఆత్మ జ్ఞాన సంపన్నులైన బుద్దిమంతులా ? లేక క్షణంలో మృత్యుముఖంలో ప్రవేశింపనున్న బుద్రిహీనులా?*'
అప్పుడు రాజా దానితో ఇలా అన్నాడు -
“ఓ భూతమా ? ఎవరు నీవు ? ఎక్కడ ఉంటావు ? నీ శరీరం చూపు. (భ్రమర రుంకారం వంటి నీ అరుపులకు భయపడేవా రెవరూ ఇక్కడ లేరు సుమా! అద్డార్డులైన వారు సింహంలాగా మహామేంతో వచ్చి అర్ధం మీద పడతారు. నీసంరంభం కట్టిపెట్టు. వట్టి ఆర్భాటం చేయకు. నీ సామర్ధ్య మేదో ప్రదర్శించు. నీకేమి కావాలో అడుగు; ఇస్తాను. నీ బెదరింపు మాటల వల్ల ప్రయోజనమేమి ? మమ్ములను చూచి భయపడుతున్నావా ఏమి ? త్వరగా ఎదుటికి వచ్చి కనిపించు. ఊరక ఆలసించేవారికి ఆత్మవినాశం తప్ప మరేమీ సిద్దించదు'.
రాజు అలా అనే సరికి ''ఇతడు చక్కగా చెప్పాడు” అని కర్కటి అనుకొన్నది. తన ధైర్యం ప్రకటించడానికి మళ్లీ గర్హించి పరిహసించింది. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ అట్టుహాసపు వెలుగులో తన స్వరూపం ప్రకటించిన ఆరాకాసిని వారిద్దరూ చూచారు. ప్రళయకాలంలో వజ్రపాతానికి విరిగిపడిన కొండచరియ లాగా ఆ రాశసి కనిపించింది. దాని కనుచూపులు అంబరంలో వెలుగులను విరజిమ్మాయి. చీకటి సంద్రంలో బడబానలం లాగా అది ప్రకాశిస్తున్నది. పటపటలాడే దాని దంతధ్వని విని భీతిల్లిన నిశాచరులు హాహాకారాలు చేస్తూ చస్తున్నారు. యక్షరక్షు పిశాచాలు సహితం దానిని చూచి భయపడుతున్నాయి. దాని శ్వాసహాయువులు భయంకరమైన భాంకార శబ్దంతో వెలువడుతున్నాయి. అది మూర్తీభవించిన కాళరాత్రిలా కనిపించింది. సూర్యచంద్రులతో పోరాడటానికి రూపు దాల్చిన రాహువులా తోచింది.
ఆ మహావీరులిరువురూ దానిని చూచి ఏ మాత్రం చలించకుండా నిలబడ్డారు. వివేకవంతుని చిత్తానికి విమోహం కల్గించేది ఏమున్నది ?
అప్పుడు మంత్రి ఇలా అన్నాడు -
'“ఓ మహారాశ్షసీ ! ఎందుకు సేకింత కోపం ? చిన్న కార్యాలలో సైతం పెద్ద
166 యోగవాసిష్టం కోపం చూపేవారు అల్సులే కదా ! నీ సంరంభం వదలిపెట్టు. ఇది నీకు తగదు. స్వప్రయోజనం సాధించుకొనే బుద్దిమంతులు నేరుగా పనిలో ప్రవేశిస్తారు కాని అనవసరమైన అర్భాటం చేయరు. మా ధైర్యమనే సుడిగాలికి నీ వంటి వేలకొలది దోమలు ఎండు గడ్డిపోచల్లాగా ఎగిరిపోయాయి. ప్రాజ్ఞుడు సరంభం త్యజించి సమబుద్దితోనూ, యుక్తితోనూ వ్యవహరించి కార్యం సాధిస్తాడు. కార్యం సిద్దించినా, సిద్దించకున్నా సామోపాయం వదలరాదు. అనవసరమైన సంభ్రమం ఎందుకు ? నీ కేమి కావాలో చెప్పు. మా వద్దకు వచ్చిన యాచకు డెవడూ కోరిక తీరకుండా పోయినవాడు రేడు.” అది విని రాక్షసి ఇలా అనుకొన్నది - ““జౌరా |! ఈ పురుష సింహాల సత్త్వబలము | వీరు సామాన్యులు కారు. ఈ చమత్కారం విచిత్రంగా వున్నది. వీరి మాటలు, ముఖము, చూపులే వీరి నిశ్చయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నదుల నీళ్లు అన్యోన్యం కలిసిపోయినట్లే ధీమంతుల ఆశయాలు వాగ్వైఖరితోనూ, ముఖభంగిమతోనూ, చూపులతోనూ కలిసిపోతాయి. వీరి అభిప్రాయర నాకు తెలిసింది. నా అభిప్రాయం కూడా వీరికి తెలిసినట్లే ఉన్నది. వీరు స్వతః వినాశం లేనివారు, కాన వీరిని వధించరాదు. వీరు ఆత్మజ్ఞులని భావిస్తాను. ఆత్మజ్డానులు కాని వారికి భయస్పర్శు లేని బుద్ది ఉండదు. అందువల్ల నా సందేహాలను వీరి నడుగుతాను. ప్రాజ్ఞుడు లభించినప్పుడు అడిగి తెలిసికోనివారే నరాధములు.' ఇలా ఆలోచించి కర్కటి వారిని కొన్ని (ప్రశ్నలు అడగడానికి సిద్రపడింది. అట్టహాసం మౌని వారితో ఇలా అన్నది. “ఓ ధీర మానవులారా ! మీ రెవరు ? నిర్మలచిత్తులైనవారికి దర్శనం తోనే అన్యోన్యమైత్రి ఏర్పడుతుంది. మీ సంగతి తెలియజేయండి 1” అప్పుడు మంత్రి ఇలా అన్నాడు - “'“ఓ రాక్షసీ! ఈయన కిరాతులకు రాజు. నేను ఈయన మంత్రిని. రాత్రులలో ఇలా సంచరిస్తూ మీలాంటి వారిని మేము నిగ్రహిస్తూ వుంటాము. రాత్రింబవళ్ళు
- దుష్టులను ని గ్రహించడమేే రాజులకు ధర్మం. స్వధర్మం పరిత్యజించేవారు వినాశాగ్నికి ఆహుతు లైపోతారు.!' అంతట రాక్షసి రాజుతో ఈ రీతిగా చెప్పింది - “రాజా! నీ మంత్రి దుష్టదుగా వున్నాడు. రాజుకు దుష్టమంత్రి ఉండరాదు.
ఉత్పత్తి ప్రకరణం 167 ఉత్తము డైన మంత్రి కలవాడు నిజమైన రాజు. రాజు వివేకంతో మంచి మంత్రిని నియోగించుకోవాలి. అలా చేసినప్పుడే అతడు రాణిస్తాడు. రాజు ఎలా వుంటాడో, ప్రజలు అలా వుంటారు. అన్ని జ్ఞానాలలోనూ ఆత్మజ్ఞానమే (శ్రేమైనది. ఆజ్ఞానం కలవారే ఉత్తమనృపుడూ, ఉత్తమమం త్రీ అవుతారు. ఆత్మజ్ఞానం వల్ల ప్రభుత్వమూ, సమద్భృష్టీ సిద్దిస్తాయి. అది లేనివాడు రాజూ కాడు, మంత్రీకాడు. మీరు ఆత్మజ్ఞాలైతే మంచిది. మీకు శ్రేయస్సు చేకూరుతుంది. లేక పోతే అనర్ధం తప్పదు. మిమ్మల్ని నేను (మింగివేస్తాను.
నేనడ్గే ప్రశ్నలకు బుద్రిబలంతో చక్కగా విచారించి మీరు తగిన సమాధానా లిస్తేనా ప్రీతికి పాత్రులవుతారు. అప్పుడు నా నుండి తప్పించుకో గలరు. నా ప్రశ్నలు విని తగిన సమాధానాలు చెప్పి నా కోరిక తీర్చండి. దుష్టుడు కానివాడు అంగీకరించిన అర్జాన్ని ఇవ్వకుండా ఎలా ఉండగలడు?”
రాక్షసీ ప్రశ్నలు
ఆ మాటలు విని రాజు రాక్షసితో “నీ ప్రశ్న లేవో అడుగు'' అని చెప్పాడు. అప్పు డాకర్కటేి ఇలా ప్రశ్నించింది -
“సముద్రంలో పెక్కు బుడగల్లాగా అణుస్వరూపమూ, ఏకమాత్రమూ అయిన దేనిలో ఈ లక్షలకొలది (బ్రహ్మాండాలు లీన మవుతున్నాయి ?
ఆకాళం కాని ఆకాశం ఏది ? ఉనికి లేనిదై వుండీ ఉనికి గలది ఏది ? నాలో నీలో “నేను” అనేది ఏది ?
నడుస్తూ కూడా నడవని దేది ? చలిస్తున్నా చలించని దేది ? చేతనమై వుండి కూడా బండబారిన దేది? చిదాకాశంలో చిత్ర విచిత్రాలను సృష్టించేది ఏది ?
రాజా! నిప్పై వుండి కూడా కాల్సే శక్తి లేని దేది ? అగ్ని కాని దేని నుండి సదా అగ్ని ఉద్భవిస్తున్నది ?
సూర్యచంద్రాగ్ని నక్షత్రాలలో ఏదీ కాకున్నా ఎడతెగకుండా (ప్రకాశిస్తూవున్న దేది ? కంటికి కనిపించని దైనా దేనినుండి వెలుగు ఉదయిస్తున్నది?
తరులతాదులకూ, జన్మత: గ్రుడ్డివారికీ, ఇం(ద్రియాలు లేని ఇతర 'ప్రాణులకూ ఉత్తమ ప్రకాశమైన దేది ?
ఆకాశాదులను పుట్టించే దెవరు ? ఉనికి గల పదార్హాలన్నిటిలోనూ ఉనికిని
168 యోగవాసిష్టం కల్షించేది ఏది ? ఈ జగత్తు అనే రత్నానికి ఆశ్రయం ఏది ? ఏ రత్నానికి ఈ జగత్తు కోశమై ఉన్నది ?
చీకటిని ప్రకాశింపజేసే అణువేది ? ఉండీ లేని అణువేది ? దూరంలోనూ, దగ్గరలోనూ ఉన్న అణువేది ? అణువై యుండీ మహాపర్వత మైనది ఏది ?
నిమేషమై యుండీ యుగమైన దేది ? యుగమై యుండీ నిమేష మైన దేది ? (ప్రత్యక్షమై యుండీ రూపం లేని దేది ? చేతనమై యుండీ అచేతన మైన దేది ?
వాయువై కూడా వాయువు కాని దేది ? శబ్బమై వుండీ శబ్దం కాని దేది ? అంతా అయికూడా ఏదీ కాని దేది ? అహంభావంతోనూ, అనహంభావంతోనూ కూడిన దేది ? ॥
పూర్వం పాందబడి కూడా ఇప్పుడు బహు ప్రయత్నాలతో పాందదగిన దేది? లభించినా పూర్ణంగా లభించని దేది ?
స్వస్టమైన జీవితంతో తన్ను తాను నష్ట్రప్రాయం చేసుకొనేది ఏది ? మేరు పర్వతాన్ని తనలో ఇముడ్చుకొన్న అణువేది ? ముల్గోకాలనూ తృణంగా చేస్తున్న దేది?
అణువై యుండి కూడా అనేక శఈతయోజనాలు వ్యాపించివున్న దేది ? నూర్హకొలది యోజనాలలో సైతం ఇమడనిది ఏది ?
దేన్ని చూచిన మాత్రాన ఈ జగత్తు అనే బాలుని నాట్యం ప్రారంభ మవుతుంది? ఈ పర్వతసమూహాలన్నీ ఏ అణువు గర్భంలో దాగివున్నాయి?
తన అణుత్వం వదల కుండానే మేరుపర్వతం కంటే స్టూలతరమైన దేది? ఒక వెండ్రుక కొసలో నూరవభాగ మంతదై యుండి కూడా మహాపర్వత సదృశమైన, దేది ?
చీకటి వెలుగులను ప్రకాశింప జేసీ దీపం ఏది ? సమగ్రమైన జ్ఞానానికి చెంజిన అణువులన్నీ ఏ అణువు గర్భంలో ఉన్నాయి?
రుచి లేని దైనా సదా ఆస్వాదింపబడేది ఏది ? సర్వాన్నీ వర్షించి దేని నా(శ్రయించి ఈ సర్వం భాసిస్తున్నది ?
తన్ను తాను కప్పే వేసుకోలేని ఏ అణువు ఈ జగత్తునంతా కప్పి వేస్తున్నది? లయకాలంలో కనిపించకుండా పోయిన జగత్తు ఏ అణువు యొక్క సత్స్వరూపహమై వుండి మళ్ళీ సృష్టికాలంలో జీవిస్తున్నది ?
ఉత్పత్తి ప్రకరణం 169 అవయవాలు లేనిదై కూడా ఏ అణువు సహ(్రహస్త నేత్రాలు కలదై వున్నది? నిమేషమైనా మహా కల్పమైన దేది ? విత్తనంలో మహావృక్షం లాగా ప్రళయకాలంలో దేనిలో ఈ జగత్తులు దాగివున్నాయి ? సృష్టికాలంలో ఉదయించి కూడా దేనిలో ఇవి ఉదయించనివై ఉన్నాయి ? ప్రళయం దేనిలో దాగి ఉన్నది ? కర్తృత్వం లేకున్నా అన్ని పనులూ చేస్తున్న దేది ? తాను దద్రష్షయై వుండి కూడా తన్ను దృశ్యంగా మార్చుకొని కనులు లేకనే సమస్తాన్నీ దృశ్య దృష్టితో చూస్తున్న దేది ? తనలోని దృశ్యం జారిపోగా దృశ్యరహితమైన తన్ను తాను చూస్తూ ఎదుట ఉన్న దృశ్యాన్ని చూడని దేది? 'దష్ష, దర్శనం, దృశ్యం - అనే త్రిపుటిని దృశ్యం లాగా భాసింపజేస్తున్న దేది? కటకాదులలో స్వర్హం లాగా పై త్రిపుటిలో వ్యాపించి వున్న దేది ? సముద్రంలో అలలాగా దేనికంటే ఈ జగత్తు వేరుగా లేకున్నది ? వేరుగా లేకున్నా అల వేరైనట్టు తోచిన రీతిగానే జగత్తు దేనికంటే వేరుగా లేకున్నా ఉన్నట్టు తోస్తున్నది? దిక్కాలాద్యనవచ్చిన్నమై సదసద్రూపమైన దేనినుండి ద్వైతమైన ఈ జగత్తు సాగరంలో (ద్రవత్వం లాగా వేరుగా లేకున్నది ? త్రిపుటినీ, ముల్లోకాలనూ బీజం లాగా తనలో సదా ఇముడ్డుకొని ఉన్నదేది ? భూత వర్తమాన భవిష్యద్రూపమైన ఈ జగత్తు బీజంలో చెట్టులాగా దేనిలో ఉన్నది+ విత్తనం చెట్టైనట్టు, చెట్టు విత్తనమైనట్టు తన స్వరూపం వదల కుండానే అనేకరూపాల జగద్వికారాలను తనలో ఉదయింప జేస్తున్న దేది ? ఓ రాజా! మహామేరువు దేని వద్ద బిసతంతువు లాగా బలహీన మవుతున్నది? కోట్ల కొలది మేరు మందరాలు దేని గర్భంలో ఉన్నాయి ? అనేక జీవులతో వ్యాప్తమైన ఈ విశ్వాన్ని విస్తరింప బేసిందెవరు ? దేని వల్ల నీవు ఇన్ని రాచకార్యాలు చేయగల్లుతున్నావు ? దేన్ని చూచి నీవు సదా నిర్మల దృష్టి గలవాడవైనావు ? ఆ తత్తా న్ని నా చిత్తశాంత్తై వివరించు. వా చిత్తాన్ని కళంకితం చేస్తున్న సంశయం ఈనాడు తొలగిపోవుగాక ! పూర్త సంశయం తాలగనివాడు పండితుడని చెప్పడానికి యోగ్యుడు కాడుగదొ! మీరునా సంశయాన్ని తొలగింపజాలని పతంలో ఒక్క కణంలో నా జుఠరాగ్నికి ఇంధనమై పోతారు సుమా ! మిమ్మల్ళి (మంగిన తరువాత మీ రాజ్యంలోని ప్రజలను కూడా
170 యోగసం (మింగివేస్తాను. మీ (ప్రజల క్షేమాన్ని మీరు కాపాడుకోండి 1 ఆత్మజ్ఞులు కాని మూర్చుల అతిభోగలాలసత్వం తుదకు వారిని హతమౌరుస్తుంది.?*
మేఘ గంభీర స్వరంతో అలా పలికి మిక్కిలి వికటాకృతియయిన ఆరక్కసి శరత్కాలంలోని శుద్ద మేఘం లాగా పిమ్మట మౌనం వహించింది.
ప్రశ్న భేదనం
వుహారణ్యంలో వముహా రాత్రివేళ అలా (ప్రశ్నించిన ఆవుహారాక్షసికి మహామంత్రి ఇలా సమాధానం చెప్పాడు -
“మబ్బు వంటే ఓ రక్కసీ ! మదించిన గజేంద్రాన్ని సింహం భేదించినట్లు నీ ప్రశ్నలన్నింటినీ నేను భేదిస్తాను, విను. పింగళాత్నీ! నీ ప్రశ్నలన్నీ పరమాత్మకు సంబంధించినవే. ఇంద్రియాలకూ, మనస్సుకూ అగోచరమై, చిన్మాత్రమైన ఆత్మే అణుస్వరూపమైనది. ఆకాళంకంటే సూక్ష్మమైన దదే.
పరమమైన ఆ చిదణువులోనే బీజంలో వృక్షంలాగా సదస(ద్రూప మైన జగత్తంతా స్ఫురిస్తున్నది. అది అన్నిటికీ ఆత్మయై అనుభవానికి గోచరిస్తున్నది. ఆత్మానుభవం నుండే పదార్జాలన్నింటికీ ఉనికి సిద్దిస్తున్నది.
బాహ్యశూన్యం కాబట్టి దానినే ఆకాశమంటారు. చిద్రూపం కాబట్టి అది నిజానికి ఆకాశం కంటే వేరైనది. అది అనంతం. ఇంద్రియాలకు గోచరించదు.
అది సర్వాత్మకం కాబట్టి అన్ని రూపాలూ దానివే. అది దృళశ్యరహితం కావడంవల్ల రూపం లేనిదవుతున్నది. ఒకే స్వర్ధం పలురకాల ఆభరణాలైనట్టు అది ఏకమై కూడా అనేకంగా భాసిస్తున్నది.
సర్వాత్మకమైన ఈ అణువు పరమ సూత్ష్మం కాబట్టి ఇం(ద్రియాతీతమై వున్నది. అది సర్వాత్మకం కావడంవల్ల శూన్యమని చెప్పడానికి వీలు గాదు.
“ఆత్మ ఉన్నది లేదు” అని చెప్పేవాడూ, భావించేవాడూ ఆత్మ కంటే వేరుగా లేడు. ఉన్న దానిని ఏ యుక్తితోనూ లేదని చెప్పజాలము. కర్పూరం సుగంధం ద్వారా వ్యాపించినట్లే అది సర్వత్రా అనుగతమై నిగూఢంగా విస్తరించి వున్నది.
మనస్సుకూ, ఇంద్రియాలకూ, గోచరించే పరిచ్చిన్న పదార్థం కూడా ఆ చిన్మాత్ర మైన అణువే. ఇంద్రియాతీతమై రూపరహితమైన అపరిచ్చిన్న వస్తువు కూడా అదే. ఈ జగత్తు అనే రత్నానికి కోశమై భాసించేది అదే.
ఉత్పత్తి ప్రకరణం 171
చైతన్యమనే మహాసాగరంలో ముల్టోకాలనే అలలు నీటిలో సుళ్లు లాగా వ్యక్త మవుతున్నవి. చిత్తానికీ, ఇం([ద్రియాలకూ గోచరించదు కాన ఆ చైతన్యం శూన్యం అనబడుతున్నది. తన సంవేదనకు గోచరిస్తున్నది కాన అది ఆకాశరూపమైనా శూన్యం కావేరదు.
అద్వైతభావనతో ఆత్మ ఒక్కటే నేనుగా, నీవుగా అవుతున్నది. నిజానికి అది నేనూకాదు, నీవూ కాదు. కేవలజ్ఞాన స్వరూపం మాత్రమే. నీవు, నేను అనే భేదం వీడినప్పుడు మిగిలేది సర్వస్వరూపమైన ఆ పరమాత్మ ఒక్కటే.
“అది అనేక యోజనాల దూరం వ్యాపించి వున్నా చలనం లేనిదే. ఈ యోజనాల కల్పనలన్నీ ఆ అణువులోనే లీనమై వున్నాయి. దేశకాలాలు దానిలోనివే కాన అది పోతూ, వస్తూ వున్నా రాకపోకలు లేనిదై వున్నది.
దేని గమ్యుం తన శరీరంలోనే వున్నదో, అది ఎక్కడికి పోగలదు ? తన వత్షఃస్టలంలో వున్న పుత్రుణ్ణి తల్లి మరొకచోట వెదుకుతుందా ? సమస్త దేశకల్పనలనూ తనలో లీనం చేసుకొని సర్వానికీ కర్తృత్వం వహించే వస్తువు ఎక్కడికి పోగలదు ? కడవ మూతిని బంధించి మరొకచోటికి తీసుకు పోయినా అందలి ఆకాశానికి రాకపోకలు లేవు. అట్లే ఆత్మకు కూడా ఏ సందర్భంలోనూ చలనం లేదు.
చిత్తత్వమూ, జడత్వవవా-రెండూ దాని అనుభవంలోనివే కాబట్టి జడచేతనరూపాలలో రెండు రకాలుగా ఉన్న ఆత్మ ఒక్కటే. అచేతనమైన పాషెణంలో
సత్తారూపంలో ఉన్నది అదే. .
అనాదీ, అనంతమూ అయిన పరమాకాళములో చిన్మాత్రస్వరూపుడైన పరమాత్మ ముల్లోకాలు అనే చిత్రాన్ని కల్పించకనే కల్పించాడు.
జగత్తు అనే ద్రవ్యాన్ని ప్రకాశింపజేసీ ఆత్మ అనే అగ్ని సర్వత్రా వ్యాపించి వున్నది. అయినా అది దేనినీ దహించడం లేదు. జాజ్వల్యమాన మైన నిర్మలాకాళం వంటి ఆత్మనుండే అగ్ని జనిస్తున్నది.
పూర్యుడు మొదలైన పదార్దాలకు సైతం ప్రకాశం చేకూర్చే ఆత్మదీప్తి మహాకల్ప మేఘాలవల్ల కూడా నశించదు.
కంటికి కనిపించనిదీ, అనుభవైక గోచరమైనదీ, హృదయమనే గృహాన్ని ప్రకాశింపజేసేదీ, అన్ని పదార్దాలకూ ఉనికిని 'ప్రసాదించేదీ అయిన ఆ వైతన్యమే అనంతమైన పరమ ప్రకాశమై వెలుగొందుతున్నది. మనలోని అహంకారాది'ప్రకాశం
172 యోగవాసిష్టం దానినుండే ఉదయిస్తున్నది. అందువ కనే వనం దీపాదులు లేకున్నా దేహేం[ద్రియాదులైన దృశ్యచమత్కారాన్ని చూడగల్గుతున్నాము.
అనుభవాత్మకమైన ఆ (ప్రకాశమే ఇంద్రియాలు లేని చెట్టూ, తీగలూ, పొదలూ మొదలైన వాటిని పోషిస్తున్నది. కాలం, ఆకాశం, క్రియ- వీటితో కూడిన జుత్తు వేదనాత్మకమైన ఆత్మలోనే ఉన్నది. అన్నిటికీ ప్రభువు, కర్త తండ్రి, భోక్త అయివుండి కూడా అది పరమార్ధదృష్టితో ఏదీ కాని ఆత్మగా ఉన్నది.
అణుత్వాన్ని వదలని ఆ చిదణువే జగత్తు అనే రత్నానికి పెట్టె. ఆ కేవలాత్మలో (ప్రమాత, ప్రమాణం, ప్రమేయం- అనే త్రిపుటితో కూడిన జగత్తు లేనే లేదు. ఈజగత్తు అనే పెట్టెలో సర్వతోముఖంగా భాసిస్తున్న శ్రేష్టమైన మణి కూడా అదే.
ఇం(ద్రియగోచరం కాక దుర్వోధంగా వుండడంవల్ల దానిని తమస్సు అంటారు. చిన్మాత్రస్వరూపం కావడంవల్ల ప్రకాశం కూడా అదే. సంవేదనా రూపంతో అది వుండికూడా ఇం(ద్రియాతీతం కాబట్టి లేనిదే అవుతున్నది. ఇంద్రియాలకు చిక్కదు కాన అది దూరంలో ఉంది. చిద్రూపం కాబట్టి అది సమీపంలోనే ఉన్నది. అణువై యుండి కూడా అందరికీ అది 'నేను అనే జ్ఞానానికి గోచరం అవుతున్నది కాన కొండవంటిదే.
ఈ కనిపించే జగత్తంతా దాని సంవేదన మాత్రమే. కొండలు మొదలైనవి వాస్తవంగా లేవు. అణువులోనే మేరుత్వం భాసిస్తున్నది. అటి నిమిషమై ప్రకాశిస్తున్నది కాబట్టీ “నిమిషం” అనబడుతున్నది. కల్పంగా కూడా భాసిస్తున్నది కాన “కల్పం” అని కూడా దానిని వ్యవహరిస్తారు.
అనేక కోట్ల యోజనాల విస్త్రృతిగల మహానగరం అణురూపమైన మనస్సులో స్ఫురిస్తున్నది. అట్లే అనేక కల్పాలకు చెందిన క్రియావిలాసాలు నిమిషంలో స్పురిస్తున్నాయి. నిర్మలమైన అద్దంలో మహానగరం (ప్రతిబింబించినట్లే ఒక నిమేషంలోనే కల్పం తోస్తున్నది.
నిమేషం, కల్పం, కొండలు మొదలైనవన్నీ మిథ్యాత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆ సూక్ష్మాణువులో ఉన్నాయికదా ! అలాగే దైవత్వం, ఏకత్వం అనేవి కూడా అందులో ఎందుకు ఉండవు ?
“నేను పూర్వం ఈపని చేశాను! అనే ఏ స్వప్న భ్రాంతి బుద్దిలో ఉదయిస్తున్నదో, అది క్షణకాలం సత్యమై మళ్లీ అసత్యం కావడం లేదా ? అదే దీనికి దృష్టాంతం.
ఉత్పత్తి ప్రకరణం 173 దుఃఖసమయంలో కాలం చాలా నిడివిగా వుంటుంది. అదే సుఖసమయంలో స్వల్పమవుతుంది. హరిళ్ళంద్రుడికి ఒకేరాత్రి పండ్రెండు సంవత్సరాలు కాలేదా ? బంగారులో కటకాదులవలె సత్యాసత్య స్వరూపమైన ఏ నిశ్చయం చిత్తంలో కల్గుతుందో, అదే వైతన్యంలో భాసిస్తుంది.
నిమేషం, కల్పం, దూరం, సామీష్యం- అనేవి నిజానికి లేవు. భిన్న భిన్న వస్తువులుగా అవి తోచడం చిదణువులోని ప్రతి భవల్లనే. ఒకే చిత్తునుండి ఉదయించే చీకటివెలుగులకు, దూరాదూరాలకు, క్షణకల్పాలకు కొంచెం కూడా భేదం లేదు.
ఇంద్రియాలకు గోచరమయ్య్యేది ప్రత్యక్షం. గోచరం కానిది అప్రత్యక్షం. ఏది చూస్తున్నదో, అదే దృశ్యంగా రూపాంది ప్రత్యక్ష మవుతున్నది.
“ఇది కటకం” అనే జ్ఞానం ఉన్నంతకాలం అందలి స్వర్ణత్వం గోచరించదు. దృశ్యత్యం గోచరించినంతవరకూ వాస్తవమైన చిత్స్వరూపం స్పురించదు. బంగారులో కటకత్వం కల్పించకముందూ, కల్పించినా కటకంగా దానిని చూడకపోతే స్వర్ణత్వమే గోచరిస్తుంది. అలాగే దృశ్యత్వబుద్ది తొలగితే నిర్మల మైన శుద్ర బ్రహ్మం ఒకటే మిగులుతుంది. అంతా దాని స్వరూపమే కావడంవల్ల అది సద్రూప మవుతున్నది. మనకు నిష్కృృష్టంగా దాని రూపం గోచరించడం లేదు కాబట్ట అది అస([ద్రూపమవుతున్నది. ॥
అది చేతనాత్మకం కాబట్టి చేతన మవుతున్నది. చేత్యం (విషయం) దానిలో సంభవించదు కాబట్టి అచేతన మవుతున్నది. చిత్తుయొక్క ప్రతిభారూపమై గాలికితూలే చెట్టులాగా అస్టిరమైన ఈ జగత్తులో చిత్తునూ, చేత్యాన్నీ ఎలా కల్పించగలము ? ఎండ తీవ్రమైతే ఎండమావి కనిపిస్తుంది. దృఢా ద్వైత రూపమైన చిత్తు ప్రకాశొస్తే జగత్తు గోచరిస్తుంది.
సూర్యకిరణాల కలయికతో గోచరించే సూత్మువస్తువు ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. బ్రహ్మము స్ఫురించే జగత్తు గూడా ఇట్టీదే. మాయాప్రభావంతో ఆకాశంలో సూర్యకిరణాలసంయోగం కాంచన (భ్రాంతిని క ల్లిస్తుంది. ఈ జగత్తుకూడా అవిద్యాప్రభావంవల్ల కలిగే అలాంటి ఒక (భ్రాంతే. ఇందులో చేతనము, చేత్యమూ అనే భేదానికి తావేది ? కలలో కనిపించే గంధర్వనగరంలో, సంకల్పనగరంల్ గోడ
ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. దీర్ష(భాంతివుయువైన ఈ జగత్తుయొక్క అస్తిత్వ- నాస్తిత్వాలు కూడా అలాంటివే. ఇలాంటి భావన చక్కగా అభ్యసించాలి.
174 యోగవాసిష్థం అప్పుడు నిర్మలత్వం కళ్లి సత్యాన్ని చూడగలం. దీనితో సంసార(భ్రాంతి నశిస్తుంది.
దృశ్యసంవేదనే తప్ప గోడకూ, ఆకసానికీ ఎలాంటి భేదమూ లేదు. బ్రహ్మ మొదలు తృణం వరకూ జీవులందరి అనుభవం ఇట్టిదే. ఏది అనుభవానికి వస్తుందో అదే చివరికి రూఢి అవుతుంది. "
మణి మొదలైనవాటిలో సూర్యకాంతి లాగా చిదాకాశంలో చి(త్ర్రుకాశం వల్ల ఈ లోకాలు ఏర్పడుతున్నాయి. వీటికి వాస్తవమైన ఉనికి లేదు. అందుకే ఇవి అనిర్వచనీయాలై స్ఫురిస్తున్నాయి.
ఆత్మ(్రకాశానికి భిన్నత్వాన్ని (ప్రకటించే శక్తి ఉన్నది. చిత్తుయొక్క చమత్కారంతో అందులో ద్వైతం భాసిస్తుంది. కాని అది చైతన్యంకంచే భిన్నం కాదు. ఆత్మప్రకాశం సర్వాత్మకమైనది. అది బీజంలోని వృక్షం లాగా సర్వత్రా వ్యాప్తమైవున్నది. ఒకే బీజంలో భిన్నంగానూ, అభిన్నంగానూ వృక్షం ఉన్నట్లే ఒకే చిదాకాశకోశంలో లెక్కకు మిక్కుటమైన జగత్తులు వ్యాపించివున్నాయి. లోపల వృక్షం కల్ళివున్న బీజం సూత్మమై ఆకాశం లాగా ఉన్నది. అట్లే లోన జగత్తులు కల్షివున్న బ్రహ్మంకూడా చిద్రూపమై ఉన్నది.
అది శాశ్వతమైనది, జన్మ లేనిది, ఏకమైనది, ఆదిమధ్యాలు లేనిది. అందులో వికల్ఫా లేవీ లేవు. ద్వంద్వాలు లేక శాంతమైనబుద్ద్రిగలవారు మాత్రమే దాన్ని పరిశోధించగలరు. అది అనేకమూ, స్వచ్చమూ, చిన్మాత్రమూ, నిరంకుశమూ అయి భాసిస్తున్నది.
పరమార్ధ పిండీకరణం
మంత్రి చెప్పిన సమాధానం విని రాక్షసి ఇలా అన్నది - ఇప్పుడు ఈ రాజూ మాటాడు గాక 1"
అప్పుడు రాజు ఇలా అన్నాడు -
“జగత్తుకు పంబంధించిన అవస్టాత్రయ వృత్తులన్నీ నశించి తురీయావస్టలో ఉండడమే ఆత్మదర్శన మనబడుతున్నది. సమస్త సంకల్పాలనూ పరిత్యజించడమే ఆత్మ పరిగ్రహణం. పరమాత్మ యొక్క వూయామయమైన సంకోచమే జగత్ర్రళయం. దాని వికాసమే జగత్సపష్టి . అది మాటలకు గోచరించేది కాదు.
ఉల్పత్తి ప్రకరణం 175 సదసత్స్వరూపమైన ఈ చరాచర జగత్తు హిరణ్యగర్భ స్వరూపుడైన ఆ పరమాత్ముని మనోమయ లీల మాత్రమే. అది వివిధ రూపాలతో విశ్వాత్మకమై ఉన్నా దాని అఖండ వస్తుత్వానికి భంగం లేదు. నీవు ప్రళ్నించిన శాశ్వతమూ, సన్మాత్రమూ అయిన (బ్రహ్మం అదే.
వాయుత్వవేదనంవల్ల అది వాయువుగా భాసిస్తున్నది. శబ్దత్వసంవేదనం వల్ల అది శబ్దంగా తోస్తున్నది. నిజానికి అది వాయువూ కాదు, శబ్దమూ కాదు. అది శబ్దార్జానికి కూడా అతీతమై వున్నది.
అణుస్వరు పమైన ఆబ్రహ్మమే సర్వమూ అయివున్నది, ఏదీ కాకుండానూ వున్నది. అహంరూపంతో వున్నదీ అదే ఆరూపం లేనిదీ అదే. సర్వశ్తీ స్వరూపమైన దాని ప్రతిభే ఈైచిత్ర్యాని కంతటికీ కారణం. అనేక ప్రయత్నాలతో ఆత్మ లభిస్తుంది. ఐవా అంతకు ముందే అది లబ్రమైవున్న వస్తువు కాబట్టీ అభించినట్టు కాదు. ఆత్మలాభాన్ని మించిన మరొక లాభం లేదు. మూలాజ్ఞానాన్ని నశింపచేసే జ్ఞానం ఎంతవరకూ ఉదయించదో అంతవరకూ జన్మ లనే వసంతాలలో సంసార మనే తీగ అల్టుకొంటూనే వుంటుంది.
రూపంలేని ఆత్మ రూపం కలదానిలాగా దృశ్యమై ఎండమావిలో నీటి లాగా గోచరిస్తున్నది. అందువల్ల దాని వాస్తవరూపం మర్ష పోతున్నది.
ఈ చిదణువు మేరుపర్వతాన్ని తనలో గుప్తం చేసికొనివున్నది. ముల్లోకాలనూ తృణ('ప్రాయం చేస్తూ వెలుపలికి ప్రసరింపజేస్తున్నది. అది మాయామయమై కవిపిస్తున్నది. ఆ విదణువులో ఏది ఉన్నదో, అదే వెలుపలికి కానవస్తున్నది. కాముకుడు సంకల్పంలో కావించే ప్రియురాలి కౌగిలింతే ఇందుకు దృష్టాంతం.
ఆదిస్పష్టిలో సర్వశక్తిసంపన్నమైన చైతన్యం ఎలా వుదయించిందో, అలాగే సర్వాన్నీ తన సంకల్ప బలంతో (ప్రత్యక్షం కావించుకొంటున్నది. హీరణ్యగర్భుని మనస్సులో ఏది ఎలా భాసిస్తుందో దాని నతడు అలాగే చూస్తాడు. ఇందుకు శిశువు చిత్తమే దృష్టాంతం.
చిన్మాత్రమైన ఈ అణువు దేశ కాలవస్తుకృత పరిచ్చేదాలకు అతీతమై వున్నది. సర్వవ్యాపి, అనాది, రూపరహితమూ అయిన ఈ చిదణువు నూరు యోజనాలలో సైతం ఇమడడం లేదు. ధూర్తుడైన విటుడు వికృతచేష్టలతో ముగ్ర బాలికాజనాన్న మోసగిస్తాడు. అలాగే విత్రకాశం ఈ జగత్తును తన వశం చేసుకొని ఆడిస్తున్నది.
క్21
176 యోగాసనం
తనలోన వున్న మేరు పర్వతాదుల చిత్రాన్ని వస్త్రం చుట్టుకొని వున్నట్లే అనంతరూపమైన ఆ అణువు పర్వతాదులతో కూడిన ఈ విశ్వాన్ని పరివేష్టించి వున్నది. కేశాగ్రము యొక్క నూరవ భాగం లాగా అది సూకత్ష్మమైవున్నా దిక్కా లాది పరిచ్చేదాదులకు అతీతమై మేరువుకంటె పెద్దదై వున్నది. మేరు పర్వతానిక్షీ ఆవగింజకూ పోలిక కుదరదు. అట్లే శుద్రజ్ఞానస్వరూపమైన పరమాత్మకూ, పరమాణువుకూ సామ్యం సిద్దించదు. మాయవల్ల పరమాత్మలో అణుత్వం కల్పిత మయింది. అది బంగారులో కటకత్వంలాగా కల్పితమే కాబట్టి సామ్యానికి నిమిత్తం కాదు.
అనుభవస్వరూపమైన ఈ ఆత్మదీపం నుండే ప్రకాశం సిద్దిస్తున్నది. అది లేకపోతే (ప్రకాశ మన్నదే లేదు. సూర్యాదులతో కూడిన ఈలోక మంతా జడమే అయితే ఇక ప్రకాశం ఎలా వుంటుంది ? ఎక్కడ వుంటుంది ? శుద్రచిన్మాత్ర మైన తనలోని వైతన్యమే వెలుపల ప్రకాశంగా గోచరిస్తున్నది.
సూర్యచంద్రాగ్నుల తేజస్సులు స్వకారణమైన అజ్ఞానంకంటే వేరుగా లేవు. కాకపోతే వాటి రంగుల్లో తెలుపు, నలుపు అనే భేదం మాత్రం ఉన్నది. జాడ్యాంశంలో ఏభేదమూ లేదు.
మంచు నల్లగా కనిపిస్తే మబ్బు అంటాము. చీకటి వెలుగులు మబ్బు మంచుల వంటివి. వాటిలో నిజంగా భేదం లేదు. చిత్చూర్యుడు భాసించినప్పుడే జడములైన ఈ చీకటి వెలుగులు రెండూ భాసిస్తాయి. చిత్సూర్యుడు రేయింబవళ్లు జాగరూకుడై (ప్రకాశిస్తూనే వుంటాడు. అతనికి అస్తమయం, ఉదయం అనేవి లేవు. అతడు లోపలా, వెలుపలా, శిలాదుల్టోకూడా భాసిస్తూనే వుంటాడు. అందువల్లనే తత్త్వజ్ఞునికి ఈ లోకత్రయమూ నానాపదార్జాలతో కూడిన కుటీరంలాగా తోస్తుంది.
చిత్ర్రకాశం తమో దేహానికి వినాశం కల్గించకుండా దానిని జగద్రూపంలో భాసింపజేస్తున్నది. సూర్యుడు పద్మాన్నీ, ఉత్పలాన్నీ వ్యక్తం చేసినట్లే చిద్వస్తువు (ప్రకాశాంధకారాల ఉనికిని ప్రకటీకరిస్తున్నది. సూర్యుడు అహోరాత్రాదులను కల్పించినట్లే చిదణువు సదసత్తులను కల్పించి వాటి ఆకృతిని దర్శింపజేస్తున్నది.
వసంతకాలంలో ని వృత్షరసంలో పత్ర పుప్పఫల సంపదలున్నట్లే విదణువులో అనుభవాణువులన్నీ వున్నాయి. మధుమాసరసం నుండి విచిత్రమైన వన సౌందర్య పరంపరలు ఉదయించినట్లే చిదణువునుండి అనుభవ రూపమైన అణుపరంపరలు
ఉత్పత్తి వ్రకరణం 177 ఉదయిస్తున్నాయి. అతి సూక్ష్మమైన పరమాత్మాణువులో ఏరుచీ లేదు. అయినా అది అన్ని రుచులనూ కల్లిస్తూ ఆస్వాదయోగ్యమై వున్నది. అన్ని రసాలూ జలంలో ఉంటాయి. అద్దం లేకపోతే ప్రతిబింబానికి ఉనికి లేనట్లే ఆత్మ లేకపోతే రసానికి ఉనికే లేదు. చిన్మాత్రమైన పరమాణువు సంవేదన లేనిదైతే జగత్తును వది లేస్తుంది. సంవేదన కల్షివుంటే జగత్తును గ్రహిస్తుంది. చిదణువు తన్ను తాను ఆచ్చాదించుకోజాలదు. కాని అది చాందినీలాగా వ్యాపించి ఈ సమస్త జగుత్తునూ ఆచ్చాదిస్తున్నది. గడ్డిమొలకలు మాత్రమే ఉన్న అడవిలో ఏనుగు తన్ను మరుగుపరుచుకోలేదు. అట్లే ఆకాళశంలా విశాలమైన పరమాత్మ ఒక్క క్షణమైనా, కొద్దిగానైనా తన్ను తాను మరుగు పరుచుకోలేదు. మేల్కొన్న బాలుడు ధాన్యాన్ని రక్షించినట్లే జ్ఞానగోచరమైన ఆత్మ జీవకోటిని రక్షిస్తుంది. దాని మాయాశక్తి ఆళ్ళర్యకరం 1 వసంతం రాగానే వనాలు విచిత్రశోభను సంతరించుకొంటాయి. అట్టే (ప్రళయకాలంలో లీనమై వున్న జగత్తు చిదాలంబనం లభించగానే విత్రరూపంతో వ్యక్తమవుతుంది. చిగుళ్ళుగా, పాదలుగా రూపొందేది వసంతరసమే కదా ! అదేరీతిగా జగత్తుగా రూపాొందేది చైతన్యమే గాని మరేమీ కాదని గ్రహించు. అవయవాలు లేని ఈపరమాణువే అవయవాలు కల సకల '్రాణులకూ ఆత్మభూతమైనది. అందువల్ల అది వేలకొలది హస్త నేత్రాద్యవయవాలు కలదిగా భావింపబడుతున్నది. చిదణువు యొక్క నిమేషాంశమే అనేక కల్పసహస్రాలుగా తోస్తున్నది. కలలో ఒక్క క్షణంలోనే బాల్యంతో పాటు వార్దక్యం కూడా అనుభవానికి వస్తున్నది కదా! ఒకే ప్రతిభ సర్వసత్తా విలాసంతో విజృంభిస్తున్నది. కలలో అన్నం తినకుండా తిన్నట్టు తోచిన రీతిగా నిమేషంలో అనేక కల్పాలు గడచినట్టు గోచరిస్తుంది. ఒకనికి తానుచనిపోకున్నా చనిపోయినట్టు కల వస్తుంది కదా! అలాగే భుజించకున్నా భుజించినట్టు వాసనావిష్టమైన జ్ఞానం కల్గుతుంది. చిదాత్మకమైన పరమాణువులో జగత్తు లన్నీ ఉన్నాయి. అందువల్లనే మనకు జగత్తుకు సంబంధించిన స్పురణలు కల్గుతున్నాయి. దేనిలో ఏది ఉన్నదో, అదే దానినుండి ఉదయిస్తుంది. ఆకారం కల్లిన పదార్జాలలోనే వికారాలు కనిపిస్తాయి.
178 యయోగవాసిష్థం నిర్మలమైన ఆకాశంలో ఏ వికారమూ కనిపించదు.
బీజవఎలో చెట్టు ఉన్నట్లే చిదణువులో భూత - వర్తమాన - భవిష్యత్కాలాలకు చెందిన భూతాలన్నీ ఉన్నాయి. బియ్యపుగింజను పొట్టు కప్పీవున్నట్లే నిమేషకల్పాలను చిద్వస్తువు ఆవరించి వున్నది. నిమేషకల్పాలు చైతన్యానికి చెందిన ఏకదేశాన్ని ఆశ్రయించి వున్నాయి. దైతన్యం భోక్త ఎత్వ - కర్పత్వాదులతో ఏ మాత్రం సంబంధం లేకుండా జగమంతటా ఉదాసీనమైన దానిలా ఉన్నది. శుద్దమైన చిత్చరమాణువునుండే ఈ జగత్తంతా ఉదయించింది. కర్పృత్వ
- భోక్సృత్వాలు పరమాణువులో క్రియా - భోగసంబంధం లేకుండా మాయచే కల్పితాలై వున్నాయి. నిజానికి జగత్తు సృష్టించబడ లేదు. అది విలీన మయ్యేదీ కాదు. మనుష్య వ్యవహారాన్ని అనుసరించి దృశ్యాన్ని లేదనడం జరుగుతున్నది. కాని వాస్తవంగా దృశ్యానికి ఉనికే లేదు.
ఓ రాక్షసీ! అనాది అయిన ఈ చిదాకాశకోళం అంతా ఆత్మాభాస మాగ్రమే. శబ్బమాడత్రంతో దీనిని జగత్తు అని వ్యవహరిస్తున్నాము. చిదణువు దృళ్ళి సిద్ది కొర్టై తనలోని మాయాశక్తినే బాహ్య (ప్రపంచరూపంతో ధరిస్తున్నది. బాహ్యం, ఆన్తరం అనేవి ముల్గోకాలలోని (ప్రాణుల ఉపదేశానిక్రై కల్పింపబడిన శబ్దాలు మాత్రమే. వాస్తవానికి అందులో అవి లేవు. అది చిదేకరూపమే కాని మరేమీ కాదు.
ఆత్మ ద్రష్షగా రూపొందుతున్నది. అది నేత్రం ద్వారా వెలువడిన అంతఃకరణ నాళికగుండా వెలుపలికి పోయి సద్రూపమైన తన స్వరూపాన్నే అస'ద్రూపహమైన ఘట పటాది దృశ్యాలుగా చూస్తున్నది.
(దష ఎన్నటికీ దృళ్యం కాజాలదు. సద్రూపమైన ఆత్మ అస(ద్రూపాన్ని ఎలా పొందగలదు ? నేత్రాలు కూడా ఆత్మ చైతన్యమే. ఆ దృక్ళక్తి వాసనారూపమైన దృశ్యాన్ని వెలుపల కల్పించుకొని తన్ను ద్రష్షగా రూపొందించు కొన్నది. (ద్రష్పుత్వం లేకపోతే దృశ్యానికి ఉనికి లేదు. పుత్రుడు లేనిదే తం(డ్రి ఎలా వుంటాడు? ఏకత్వం లేక పోతే ద్విత్వం ఎలా సిద్దిస్తుంది ? దృశ్యంగా మారింది ద్రష్టే. (ద్రష్ట, లేకుండా దృశ్యం ఉండదు. తండ్రి లేకుండా తనయు డెలా వుంటాడు ? భోక్త లేనిదే భోగ్యత ఎలా సిద్దిస్తుంది ?
కనకానికి కటక నిర్మాణ సామర్ధ్యం ఉన్నది. అలాగే ద్రష్షకు దృళ్యనిర్మాణ సామర్ధ్యం ఉన్నది. దృశ్యం జడం కాబట్టి అది దద్రష్టను నిర్మించలేదు. కటకం కనకాన్ని
ఉత్పత్తి ప్రకరణం 179 నిర్మించగలదా ? చిత్తు నిర్మించే దృశ్య నిర్మాణం సత్యం కాజాలదు. కనకం కల్పించే కటక(భ్రాంతి సత్యమా ? కటకత్వం స్పురించే సమయంలో కనకం స్ఫురించదు. దృశ్యం స్ఫురిస్తూ వుండగా (ద్రష్ట స్ఫురించడు. కటకం స్సురిస్తున్నప్పుడు పూర్వసిద్రమైన కనకమే దాని ఉనికికి హేతువవుతున్నది. అదేరీతిగా దృశ్యం స్పురించే సమయంలో దాని ఉనికికి కారణం దష్టే.
కటకం - కనకం - వీటిలో ఒకటి స్పురించేటప్పుడు రెండవది స్పురించదు. దూరంలో ఉన్న ఒక వస్తువును గూర్చి ' అది పురుషుడు” అన్న జ్ఞానం కల్లితే ' అది పశువు" అన్న మరొక జ్ఞానం కల్లదు కదా ! బహిర్హృష్టితో తన్ను దృశ్యంగా చూచేవాడు అంతర్హుష్టిలో చూడదగిన (ద్రష్టను చూడలేడు. (ద్రష్షకు దృశ్యత్వం కల్లగానే సత్త అసత్తలా అయిపోతుంది. కటకం గోచరించనప్పుడు కనకం కనకమే అయినట్టు జ్ఞూనప్రభావంతో దృళ్యం నశిస్తే ద్రష్ట ద్రష్రగానే గోచరిస్తాడు. దృశ్య ముంచేనే ద్రష్ట ఉంటాడు. (ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యం కూడా ఉంటుంది. జ్ఞానంతో దృళ్యం తాలగిపోతే ద్రష్ష కూడా లేనివాడవుతాడు. గొడుగును తొలగిస్తే నీడ కూడా తొలగి పోతుంది కదా!
శుద్రసంవిన్న్మయమైన స్వరూపంతో ఉన్నది ఉన్నట్టు గ్రహిస్తే మిగిలేది మాటల కందని స్వచ్చస్వరూప మొక్కటే. చిన్మాత్రమైన ఆపరమాణువే దద్రష్ష- దర్శనం - దృళ్యం - అనే (త్రిపుటిని దీపం లాగా (ప్రకాశింప జేస్తున్నది. కనకంలో కటకాన్ని లయం చేసినట్లే పండితుడు మాతృ - మౌన - ప్రమేయాలనబడే త్రిపుటిని ఆత్మలో లయింప జేస్తాడు. పృథివ్యాదులకంటే భిన్నంగా భౌతిక దృశ్యం ఏదీ లేదు. అలాగే స్వభావమైన చిదణువు కంటే వేరుగా ఏమీ లేదు. సర్వత్రా సర్వానుభవరూపం ద్వారా ఏకత్వానుభవం కల్గుతుంది. అది దృఢమైనప్పుడు అంతా ఒకటే అవుతుంది కాని అన్యమైన దేదీ ఉండదు. సముద్రం కంచె వేరుగా అల లేదు. అదే విధంగా ఆత్మేచ్చ కంచే భిన్నంగా ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా సిద్రించేది ఏకార్ధత్వమే.
దిక్కులు, కాలం మొదలైనవాటిచే అవచ్చిన్నుడు కాని పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. అతడు సర్వాత్ముడై, సర్వానుభవస్వరూపుడై వెలుగొందుతున్నాడు. చేతనులకు ఆత్మ అయిన ఆ సద్రూపుడు నేత్రాదులకు గోచరించడు. ఆమహాత్మునిలో లౌకికమైన ద్రైతం, ఐక్యం అనే సద్రూపాలు లేవు కాబట్టి అసత్తు అని వ్యవహరింపబడుతున్నాడు. అంతే కాని వాస్తవానికి ఆతడు సద్రూపుదే.
180 యోగూస్టిం
రెండవ పద్యార్ధం ఒకటి ఉన్నప్పుడే మొదటిది ఒకటిగా పరిగణింపబడుతుంది. ఎండ నీడలవలె ద్వైతం, ఐక్యం అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి వున్నాయి. రెండవది లేనప్పుడు మొదటిదానికి ఏకత్వం ఎలా సిద్దిస్తుంది ? ఏకత్వమే సీద్రించనప్పుడు ద్విత్వైకత్వాలు రెండూ లేనివే. నీటి కంటె ద్రవత్వం వేరుగా లేనట్లు పరమాత్మకంటె ద్వైత - ఏకత్వాలు భిన్నంగా లేవు. సత్త్వ రజస్తమోగుణాల సామ్యావస్ట్రతో కలతనాందని బ్రహ్మములో విత్తనంలో చెట్టులాగా వివిధారంభాలతో కూడిన జగత్తు ఉన్నది. కనకం కంటె కటకత్వం భిన్నం కానట్లే పరమాత్మ కంచె ద్వైతం భిన్నం కాదు. జ్ఞానాత్మకమైన ద్వైతం సైతం సత్తీ కాని వేరు కాదు. నీటి కంటే ద్రవత్వం, గాలి కంటే స్పందనం, ఆకాశం కంటే శూన్యత్వం వేరు కావు, అలాగే పరమాత్మ కంచే ద్వైతం భిన్నం కాదు.
ద్వైతాద్రైతాల ప్రాప్తి ప్రవృత్తి ఫలమైన దుఃఖానికే కారణమవుతుంది. అది నివృత్తికి కారణం కాజాలదు. అందువల్ల ఆ రెండిటినీ లేకుండా చేయడమే (శ్రేయస్కరం. 'ప్రమాత, ప్రమాణం, (ప్రమేయం అనేవి ద్రష్ట దర్శనం, దృళ్ళం అనబడే లౌకిక సాధారణమైన త్రిపుటి మాత్రమే. దీనితో కూడిన ఈ జగత్తంతా దీనికి సాక్షి అయిన చిద్రూపాణువులోనే ఉన్నది.
గాలి తనలో స్పందనాన్ని కల్గిస్తుంది. మళ్లీ లయం చేసుకొంటుంది. అట్టే ఆత్మ అనే సుమేరువు ఈ జగత్తు అనే అణువును మాటిమాటికీ నిర్మిస్తూ మరల తనలో లయం చేసుకొంటూ వుంటుంది.
బారా! ఈ మాయ మహా భీకరమైనది ! జనులను వ్యామోహింప జేయడంలో దీన్ని మించింది మరొకటి లేదు. దీని (ప్రభావం వల్లనే పరమాణువు లోపల ముల్లోకాల పరంపర ఉన్నట్టు తోస్తున్నది. నిజానికి ఆత్మలో మూయ అనేది అసంభవం. అందువల్ల ఈ జగత్తు చిన్మాత్రమైన పరమాణువే కాని మరేమీ కాదు.
లోపల వముహావృత్షాన్ని దాచుకొన్న బీజం కుండలో కదలక వెదలక ఉంటుంది. అదేరీతిగా ఈ జగజ్జాల మంతటినీ తనలో ఇముడ్యుకొన్న ఈ చిదణువు సామ్యం వదలకుండా నిశ్చలంగా వున్నది. బీజంలోనే ఫలషల్లవాదులతో కూడిన వృక్షం ఉంటుంది. అలాగే చిదణువులోనే జగత్తు ఉన్నది. అది బ్రాహ్మీద్బప్టకే గోచరిస్తుంది. బీజాకాశంలో చెట్టును చూచినట్లే ఎవడు చిత్సరమాణువులో జగత్తును చూస్తాడో వాడే ద్రష్ట
ఉత్పత్తి ప్రకరణం 181
నిజానికి ద్రైతమూ లేదు, అద్వైతమూ లేదు. బీజమూ లేదు, అంకురమూ లేదు. స్టూలమూ లేదు, సూక్ష్మమూ లేదు. జాతమూ లేదు, అజాతమూ లేదు. అది ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. సొవ్యుమూ కాదు, క్షుభితమూ కాదు. చిదణువులో ఆకాశవాయ్యాదిజగత్తూ లేదు, జగదభావమూ లేదు. ఉన్నది శుభమైన చిత్తు ఒక్కచే. సర్వాత్మకమైన ఆచిత్తు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉదయిస్తుందో అక్కడ, అప్పుడు, అలా గోచరిస్తుంది. అది నిజానికి ఉదయించకున్నా స్వాత్మరూపమైన సృష్టిప్రతిభాసంతో ఉజ్జంభించి ఉదయించినట్టు భాసిస్తుంది. అది చిదాకాశంలో ఏకాత్మగా ఉంటూనే సమగ్రాత్మగా తోస్తుంది.
చెట్టు తన స్వభావం వదలకనే బీజాలను కల్గిస్తుంది. మళ్లీ భూమిలో బీజరూపంతో ప్రవేశిస్తుంది. అట్లే పరతత్త్వం కూడా నిజస్వభావం వదలకుండానే జగత్తుగా ఉదయిస్తుంది. ఉదయించి జన్మ మరణాది కల్పనలు పొందుతుంది.
అయితే చెట్టు బీజంగా, వృక్షంగా రూపొంది ఉభయవిధవికారాలకు లోనవుతుంది. ఆత్మ ఎన్ని విధాల రూపాలు పొందినా నిర్వికారంగానే ఉంటుంది. పరమాణుదృష్టితో చూస్తే బిసతంతువు కూడా మహామేరువే. తంతువు దృశ్యం, తణువు అదృశ్యం కదా! ఆ చిత్చరమాణు వొక్కటే దృళ్ళ జగత్తు అంతటా వ్యాపించి వున్నది. ఈ జగత్తును సృష్టించింది కూడా అదే. ఆకాళం సృష్టించిన గంధర్వనగరం ఆకాశస్వభావమే అయినట్టు (బ్రహ్మం సృష్టించిన జగత్తు బ్రహ్మైక స్వభావమే.
ఆత్మతత్త్వం గోచరిస్తే ద్వైతం గాఢని[ద్రాతుల్య మవుతుంది. అది తన కాలంలో కూడా తన అధివ్థానాత్మతత్త్వాన్ని వదలదు. రాకపోకలు లేనిదై ఏకత్వం పొందుతుంది. అందువల్ల ఈ త్ష్రుద్రజగత్తు (బ్రహ్మైక స్వభావమే కాని మరేమీ కాదు.”
రాక్షసీ సాహార్దం
ఈ రీతిగొ రాజు చెప్పిన మాటలు విని కర్కటి ఆత్మజ్ఞానం పొందింది. తన వతాత్సర్యాన్ని వదలిపెట్టింది. బాహ్యదృష్టరూపవైన వునస్తాపం శమింపజేసుకొనింది. వర్షాకాలంలోని నెమలి లాగానూ, వెన్నెలతోకూడిన కలువతీగ మాదిరిగానూ శోభిల్లింది. మేఘనాదం విన్న తెల్లకంగ లాగా రాజు మాటలు విన్న రక్కసి అమందానందం సాందింది.
182 యోగవాసిష్టం రాశ్షసి : - ఆళ్చర్యం ! అస్తమించు చెరుగని జ్ఞానభాస్కరునిచే ప్రకాశించే మీబుద్దివైెభవం ఎంతో పవి(త్రమై రాణిస్తున్నది. సమరసమై, నిర్మలమై, చల్లనిదైన మీబుద్ది వెన్నెలలాగా శో భిల్లుతున్నది. అమృత (ప్రాయమైన మీవివేకవాణి ఏన్నాను. మీవంటి వివేకవంతులు జగత్పూజ్యులని భావిస్తున్నాను. చందద్రునివల్ల కలువతీగలాగా సత్సాంగత్యంవల్ల నేను వికాసం పొందాను. ఫూలతోడి కలయికవల్లనే సౌరభం కల్గుతుంది. అర్భసంపర్భం తోనే పద్మాలు వికసిస్తాయి. సాధుసంగమంతోనే జీవులు రాణిస్తారు. మహాత్ములతోడి సాంగత్యం దుఃఖాన్ని తొలగిస్తుంది. దీపం చేపల్తిన వాణ్ణీ చీకటి బాధించగలదా ? భూమిపై భాస్కరుల్టాగా మీరు వెలుగొందుతున్నారు. ఈ అడవికి వచ్చిన మీరు నాకు పూజనీయులు. మీ కోరిక ఏమిటో సెలవియ్యండి ! అది నెరవేర్చి మీకు తృప్తి కల్గిస్తాను. రాజు : - ఓ ఉత్తమరాక్షసీ! ఈ జనపదంలో జనాన్ని ఎప్పుడూ హృదయశూల మిక్కిలిగా బాధిస్తున్నది. ఇక్కడి ప్రజలందరూ విషూచిక తగిలి తపించిపోయారు. అందుకేనేను ఈరాత్రి వేళ ఇక్కడికి వచ్చాను. హృదయ శూల మందులతో నయం కాదు. అందుకని నేను మీవంటివారు ఉపదేశించే మం(త్రం కొరకై బయలుదేరి వచ్చాను. అంతేకాదు. అజ్ఞులను బాధించే నీవంటి వారిని ని[గ్రహించడమే నాడద్రేశం. అది కూడా ఇప్పుడు నెరవేరింది. నేను చెప్పదలచినదింతే. నామాట విను. నీవింక ఎవరి 'ప్రాణాలనూ హింసించకూడదు. రాశ్షసి : - ప్రభూ ! నేటినుండీ మీరు చెప్పినట్లే చేస్తాను. ఇంక నేనెవరినీ హింసించను. రాజు : - కమలాశ్షీ! ఇతరుల శరీరాలే నీకు ఆహారం కదా! నాకోరిక మేరకు నీవు అహింసను పాటిస్తే నీశరీరయా త్ర ఎలా జరుగుతుంది ? రాక్షసి: - రాజా! ఆరునెలలు సమాధిలో ఉండి మేల్కొన్న నాకు ఇప్పుడు భోజనంపై కోరిక కలిగింది. నే నాగిరి శిఖరానికే వెళ్ళి ధ్యానంలో కూర్చొని జీవం గల బొమ్మలాగా నిశ్చలంగా హాయిగా వుండిపోతాను. అముృతాత్మభావనా రూపమైన ధారణతో శరీరాన్ని నిలబెట్టుకొంటాను. కాలక్రమంలో నాయిచ్చానుసారం శరీరాన్ని వదిలేస్తాను. శరీరపరిత్యాగపర్యంతం నేనింక పర'ప్రాణులను హింసించను. ఈ నామాట విను. శారదచం(ద్రికలాగా నిర్మలమైన హిామవంతమనే పర్వత మున్నది. అది ఉత్తరాన తూర్పుసము!(ద్రంనుండి, పడమటి సము(ద్రం ఎరజా
ఉత్పత్తి ప్రకరణం 183 విస్తరించి వున్నది. అక్కడ స్వర్హశిఖరంతో భాసించే దరీగృహంలో మేఘలేఖలాగా నేను నివసిస్తూ వుంటాను. ప్రజలను వధించాలన్న కోరికతో నేనక్కడ (బ్రహ్మను గూర్చి తపస్సు చేశాను. (ప్రాణాలు హరించే విషూచికా రూపాందేటట్లు వరమిమ్మని అదేవుళ్లీ ప్రార్హించాను. (బ్రహ్మ నేను కోరిన వరం ప్రసాదించాడు. పీదప చాలాకాలం జీవులను చంసి వారి శరీరాలు భక్షించాను.
“నీవు గుణవంతులను హింసించరాదు”' అని చెప్పి బ్రహ్మ నియమం కొర్టై నాకు ఒక మంటత్రం అనుగ్ర హించాడు. ఆ మంత్రానికి అధీనురాలనై వున్నాను. ఆమం(త్రం మీకిస్తాను, తీసుకోండి. దానివల్ల అన్నిరకాల హృదయబాధలూ శమిస్తాయి.
నాకు హింసాభిరుచి మెండు. పూర్వం జీవులను ఎంతగానో హింసించాను. అందుచేత వారి నాడులు రక్తహీనమై శుష్కించిపోయాయి. వారికి పుట్టిన బిడ్డలు కూడా అలాగే తయారయ్యారు.
రాజూ 1 ఆ విషూచికామంత్రం మీకు తప్పక సిద్దిస్తుంది. సత్త్వవంతులకు సాధ్యం కానిది ఏమున్నది ? దుర్నాడీకోశాలలో శూలను శమింపజేయడానికి బ్రహ్మ ఉపదేశించిన మంత్రాన్ని వెంటనే గ్రహించండి. మీరిద్దరూ రండి. ఆనది వద్దకు పోదాం పదండి ! ఆచమనం చేసి నియమంతో వున్న మీకు ప్రీతితో నేను మంత్రం ఉపదేశిస్తాను.
వసిష్టుడు : - అలా చెప్పి రావసి నదీతీరానికి బయలుదేరింది. రాజూ, మంత్రీ దానితో కూడా వెళ్ళారు. అన్ని విధాలా ఆరక్కసి సౌహార్దాన్ని గుర్తించి వారిద్దరూ అక్కడ ఆచమనం కావించి శిష్యుల నిలిచారు. కర్కటి జపసిద్ది ప్రదమైన విషూచికా మంత్రాన్ని క్రమంగా వాదికిఉపదేశించింది. తర్వాత రాక్షసి ఆమిత్రులిద్దరినీ వదలి వెళ్ళడానికి సిద్రపడింది. అపుడు రాజు దానితో ఇలా అన్నాడు.
రాజు: - అమ్మా! ఇప్పుడు నీవు మాకు గురు వయ్యావు. స్నేహితురాలివిగా కూడా ఉన్నావు. నిన్ను భోజనానికి ఆహ్వానిస్తున్నాము. మౌ (ప్రేమను నీవు కాదనకూడదు. సజ్జనుల సౌవార్హం దర్శనమాత్రంతో వృద్ది పొందుతుంది కదా నీవు నీ శరీరాన్ని చిన్నదిగా, అలంకార శోభితంగా మార్చుకొని మాయింటికిరా. అక్కడ యథాసుఖంగా వుండు.
రాక్షసి: - రాజా! ముర్రస్తీరూపంతో వున్న నాకు నీవు భోజనం
184 యోగాసిం పెట్టుగలవు. కాని రాక్షసాకృతిగల నాకు ఎలా తృప్తి కల్గిస్తావు ? నాకు రాక్షసాన్నమే తృప్తి కల్గిస్తుంది కాని సామాన్య భోజనం రుచించదు. పూర్వసిద్దమైన స్వభావం దేహపతన పర్యంతం పోదు.
రాజు: - నీవు స్వర్ణాభరణాలు ధరించి మా యింట కొన్ని దినాలు నివసించు. చేను నామండలంనుంది వేలకొలది దొంగలనూ, దుర్హనులనూ తెచ్చి నీకు మంచి భోజనంగా సమర్పిస్తాను. నీవు మరల రాక్షస శరీరంతో వధార్దులైనవారి నందరినీ పరిగ్రహించి హిమవత్సర్వతశిఖరానికి తీసుకుపో. అక్కడ యథేవ్చగా వారిని భక్షించు. అధికంగా భుబించేవారికి ఏకాంతంలో భోజనమే సుఖప్రదం. తనివి దీరా భుజించి కొంతకాలం నిద్రించు. తర్వాత సమాధిలోకి ప్రవేశించు. సమాధినుండి లేచిన పిమ్మట మళ్లీ మాయింటికి రా. వచ్చి వధార్లులైన వారిని తీసుకుపో. అలాంటివారిని చంపడం హింస కాదు. ధర్మపూర్వక మైన హింస గొప్పు దయతో సమానమైనదే. సమాధినుండి లేవగానే నీవు తప్పక రావాలి. దుర్హనులకు సైతం సౌహార్దం బలపడితే మళ్లీ తాలగిపోదు సుమా |! |.
రాక్షసీ : - రాజూ! నీవుచెప్పింది బాగున్నది. నేన అలాగే చేస్తాను. మిదత్రవర్యుని మాట ఎవడు కాదనగలడు ?
వసిష్టుడు : - అలా చెప్పి ఆ రాక్షసి స్త్రీ, రూపిణి అయింది. హారకేయూరాది భూషణాలు ధరించింది. *“*రాజా |! పోదాము పది' అంటూ వారు ముందు నడుస్తుండగా ఆ రాత్రి వారి వెంట వెళ్లింది.
తరువాత వారు రమ్యమైన రాజగ్భహం చేరుకొన్నారు. ఆదరంతో ఆ రాత్రి అక్కడ గడిపారు. తెల్లవారగానే ఆ వనిత అంతఃపురంలో సవిలాసంగా నివసించసాగింది. రాజూ, మంత్రీ తమ తమ పనుల్లో నిమగ్న మయ్యారు.
ఆ పై ఆతుదినాలకు రాజు వధ్యులైన వారిని మూడువేల మందిని పలు (ప్రాంతాలనుండి సమకూర్చి ఆ రాశ్షసి కిచ్చాడు. అది రాత్రివేళ నల్లని ఉగ్ర రూపంతో జలబిందువులను ధరించిన మేఘమాల లాగా వారినందరినీ తన భుజాల మధ్య బంధించింది. రాజును వీడ్కొని హిమగిరి శిఖరం చేరింది. స్వర్లనిధ దొరికిన పేదరాలు లాగా సంతసించి తృప్తిగా వారిని భుజించింది. మూడు దినాలు హాయిగా నిద్రించింది. పిమ్మట సమా ధినిష్టరా లయింది.
ఉత్పత్తి ప్రకరణం 185
సమాధినుండి కర్కటి నాల్లు లేక అయిది సంవత్సరాలకు లేచేది. లేచి మళ్లీ రాజు చెంతకు వెళ్లేది. అక్కడ విశ్వాసపూర్వకమైన మాటలతో కొంత కాలం గడిపేది. తరువాత వధార్దులను పట్టుకొని స్వస్త్రానం చేరేది. రామా ! జీవన్ముక్తురాలైన ఆ కర్కటి ఇప్పుడు కూడా ఆ కొండలోనే నిళ్ళిలధ్యాన నిష్టతో ఉంటున్నది. ఆ రాజు విదేహ ముక్తిని పొందిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్రభువులైన అతని సంతతి వారితో మైత్రి పొందింది. తన భోజనం పూర్వం లాగానే పొందుతూ చాలా కాలంగా అక్కడ నివసిస్తున్నది.
కందరాపూజనం
ఆ కిరాత రాజ్యంలోని భూపతులతో కర్కటికి దృఢమైన మైత్రి ఏర్పడింది. యోగసిద్ది గల ఆ రక్కసి మండలంలోని ఉత్పాతాలనూ, పిశ్లాచాది భయాలనూ, రోగాలనూ నివారించింది.
చిరకాలం ధ్యానంలో ఉండి సమాధినుండి లేవి అది కిరాత రాజ్యానికి వచ్చి వధ్య (ప్రాణులను తీసుకుపోయి భక్షించేది. ఇప్పుడు కూడా అక్కడి రాజు వధార్దులను ఆ రాక్షసికి సమర్పిస్తూనే వున్నాడు. మిత్రులను ఆదరించడానికి ముందుకు రాని వారెవ రుంటారు ?
కర్కటి ద్వీర్రకాలం ధ్యానంలో వున్నప్పుడు రాజ్యంలో దోష్ణాలు శమింప జేయడానికై జనులు “కందరి, 'వుంగళ' అనే పేర్చుగల దాని వమూర్తిని మహోన్నతమైన ఒక మందిరం నిర్మించి అందులో ప్రతిష్టించుకొన్నారు. పూర్వ'ప్రతిమ గతించినప్పుడు మళ్లీ కందరా ప్రతిష్టాకార్యక్రమాన్ని తరువాత వచ్చిన రాజులు కూడా యథావిధిగా నిర్వర్తిస్తున్నారు. ఎవడైనా కందరను ప్రతిష్టించకపోతే అతని రాజ్యంలో అనేకమైన ఉత్పాతాలు కల్గేవి. ఆ మూర్తిని పూజించేవారు సమస్త శుభాలనూ పొందేవారు. పూజించనివారు తమ వాసనల వల్ల దృఢపడిన అనర్జాలకు గురి అయ్యేవారు. వధ్య ప్రాణులను బలి కావించి ప్రజలు ఆ దేవిని పూజించేవారు. అభీష్టాలను ప్రసాదించే ఆ దేవి విగ్రూరూపంలోనూ, చిత్రరూపంలోనూ అక్కడ నెలకొని వున్నది. అందరికీ అన్ని శుభాలూ కల్లిస్తూ వధ్యులను భక్నిస్తూ కిరాతవుండలంలో జ్ఞానవతి అయిన రాక్షసీ దేవతగా వెలసి పూజలందు కాంటున్నది.
186 యోగవాసి్టం మనో£౬_౦కురోత్పత్తి రామా! హిమగిరిలోని కర్కబి అనే రాక్షసి యొక్క ఉత్తమమైన చరిత్రను నేను నీకు ఉన్నది ఉన్నట్టు (క్రమంగా వివరించాను. శ్రీరాముడు : - ప్రభూ |! హిమాలయగుహలో జన్మించిన రక్కసికి నల్లని రూపూ, 'కర్కటి' అనే పేరూ ఎలా వచ్చాయి? వసిష్టుడు ; - రాత్షసుల కులాలు పలురకాలు. అవి వారి వారి స్వభావాన్ని అనుసరించి కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, మరికొన్ని పచ్చగా, ఉజ్జ్వలంగా వుంటాయి. ఒక నల్లని రక్కసుడు కర్కటం (పీత) లాగా పెద్ద పొట్టుతోనూ, పాడవైన చేతులతోనూ ఉండేవాడు. అందువల్ల వాడు 'కర్కటుడు' అని ప్రసిద్ది చెందాడు. వానికి కర్కటాకారంతో పుట్టింది కాబట్టి ఆ కృష్ణరాక్షసికి 'కర్కటి'* అనే పేరు కల్గింది. ఆధ్యాత్మిక ప్రసంగంలో విశ్వరూపాన్ని నిరూపిస్తూ ఉండగా నాకు కర్కటి ప్రశ్నలు గుర్తుకు వచ్చాయి. అందువల్ల నీకు కర్కటి కథ వినిపించాను. (కర్కట్యుపాఖ్యానం సమాప్తం) ఆద్యాంతాలు లేని పరమకారణమైన (బ్రహ్మము నుండి జనించిన ఈ జగత్తు ఉత్పన్నమైనట్టు తోచినా ఉత్పత్తి లేనిదే. నీటిలో కదలే అలలు ఆ నీటికంటె భిన్నంగానూ, అభిన్నంగానూ కనిపిస్తాయి. అలాగే పరతత్త్వంలో తోచే ఈ జగత్తులు దానికంటె అన్యంగానూ, అనన్యంగానూ తోస్తున్నాయి. క ట్లైలలోని అగ్ని జ్వలించకున్నా కోతులు మొదలైన జంతువుల చలిని నివారిస్తున్నది కదా ! అదేరీతిగా బ్రహ్మం తన సమతా సౌమ్యతలను వదలకుండానే అన్నింటికీ కర్త అయిన దానిలా జగత్తులను నిర్మిస్తున్నది. రామా! వట్టి కట్టెలోనే “ఇది బొమ్మ'* అనే సంవేదన కల్గుతున్నది. అట్లే ఈ జగత్తు సృష్టింప బడకున్నా సృష్టింపబడినట్టు కనిపిస్తున్నది. బీజం కంటే ఫలం వేరు కాదు. అయినా అది వేరైనట్టు తోస్తుంది. అలాగే చిద్రూపమైన బ్రహ్మంకంటె చేత్యరూపమైన జగత్తు వేరు కాదు. అయినా అది వేరైనట్టు భాసిస్తుంది. అనుస్యూతమైన ఒకే (ద్రవ్యము యొక్క ఉనికిలో విచ్చేదమనేది లేదు. అంచేత ఫలబీజాలకూ, జలతరంగాలకూ భేదం లేదు. అదే మాదిరి చిత్తుకూ, చేత్యానికీ తేడా లేదు. విచారం లేకపోవడం వల్ల కనిపించే భేదం వాస్తవం కాదు. ఒకవే* ఏ
ఉత్పత్తి ప్రకరణం 187 కారణం చేతనైనా అది తోచినా విచారంతో నశిస్తుంది. రాఘవా ! ఈ భ్రాంతి ఎలా వచ్చిందో, అలాగే పోతుంది. నీవీ భ్రాంతిని పరిత్యబించు. అప్పుడు ప్రబోధం కలిగి ఆ పరతత్తాన్ని గ్రహించగలవు. నా ఉపదేశం వింటే నీలోని భ్రాంతిగ్రంథి విచ్చిన్న మవుతుంది. అప్పుడు నీవు వస్తుస్వ్తరూపం (గ్రహించగలుగుతావు, చిత్తమూ, దానినుండి కలే అనర్హమూ, దానికీ కారణమైన అవిద్యా - అంతా నా ఉపదేశం వింటే శమిస్తాయి. అంతా బ్రహ్మంనుండే పుట్టింది. చివరికి అంతా (బ్రహ్మంలోనే లీనవువుతుంది. నీకు ప్రబోధం కల్లగానే ఈపూర్ణతత్తాాన్ని నీవు తెలుసుకొంటావు. శ్రీరాముడు : - (బ్రహ్మ౯। ““తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశ సంభూతః' ఇత్యాది (శ్రుతిలో పంచమీవిభక్తి వ్యతిరేకార్దంలో ప్రయోగింపబడింది. అందువల్ల బ్రహ్మంకంచె జగత్తు భిన్నమని స్పష్ట మవుతున్నది. ఇక అభిన్నమని ఎలా గ్రహించేది? వసిష్టుడు : - శా(స్తాలలో ఉపదేశం కొరకై భేదకల్పన జరిగింది. అందుచేత దాని కనుగుణమైన శబ్దబ్రయోగం చేయడ మయింది. వ్యవహారంవల్ల భేదం కనిపిస్తుందే కాని అది వాస్తవం కాదు. బాలకుని బేతాళం కార్యార్థం కల్పితమే కాని నిక్కం కాదు గదా | నిజంగా ద్వైతమూ, ఐక్యమూ లేని స్వప్నాదులలో కూడా వాటిని మనం కల్పిస్తూ వుంటాము. ఇక ఉపదేశాదులలో చేసే సంకల్ప వికల్పాదుల వల్ల హాని ఏమున్నది ? కార్యకారణభావమూ, స్వస్వామిలక్షణమూ, హేతు హేతుమద్భావమూ, ' అవయవావయవి'[క్రమమూ, వ్యతిరేకావ్యతిరేకాలూ, పరిణామాదుల విభ్రమమూ, భావవిలాసాదులూ, విద్యా విద్యలూ, సుఖదుంఃఖాలూ, - ఇదంతా మిథ్యామయమైన సంకల్పాలే. అంతే కాని అసలు వస్తువులో భేదం లేదు. అజ్జానదళలో మాత్రమే ఈ ద్వైత వ్యవహారం కల్గుతున్నది. జ్ఞానం కల్లిన పిదప దీనికి ఉనికీ లేదు. అప్పుడు ఏ కల్పనాలేని మౌనం మాత్రమే మిగులుతుంది. కాల (క్రమంలో నీకు ఆత్మబోధ కల్గుతుంది. అప్పుడు నీవు “అంతా ఒకటే, అది అనాది, అనంతం, విభాగరహితం, అఖండం?” అనే సిద్దాంతాన్ని గ్రహిస్తావు. అజ్ఞానులు తవు సంకల్ప విజ్బంభణలవల్ల వివాదాలు చేస్తుంటారు. ఈ వాదాలన్నీ వేదాంతోపదేశానికి ముందే కల్గుతాయి. ఉపదేశఫలమైన జ్ఞానం కల్గిన తర్వాత ద్వైతం లేదు. ద్వైతం లేకుండా వాచ్యవాచక సంబంధం సిద్రించదు. నిజానికి ద్వైత మనేది
188 యోగివాసిష్టం లేదు. అందువల్ల చివరికి మిగిలేది కేవలమౌనమే.
రామచంద్రా! నీవు వచోభేదాన్ని పాటించవద్దు. బుద్దిని మహావాక్యార్ధంలో నిల్పి నేను చెప్పే మాట విను. (భ్రాంతిమా(త్రమైన పుట్టుక గల గంధర్యనగరం వంటి ఈజగత్తును మనస్సు తన విజృంభణతో కల్లిస్తున్నది. మనస్సు ఈ జగన్మాయను ఎలా విస్తరింపజేస్తున్నదో స్పష్టంగా తెలియజేసే దృష్టాంతంతో వివరిస్తాను, విను. రామా ! నేను చెప్పబోయేది (శ్రద్దగా వింటే ఇదంతా (భాంతిమా(త్రమే అని నీకు నీవే నిళశ్చయించుకొంటావు. అప్పుడు వాసనను దూరంగా వదిలేస్తావు.
ఈ ముల్లోకాలూ మనస్సులో మననంవల్ల జర్గే నిర్మాణం మాట్రమే. ఇదంతా వదలి నీవు నీలోనే శాంతాత్ముడవై నివసించగలవు. నా మాటలు సావధానంగా వింటే నీవు వివేకౌషధంతో మనోవ్యాధికి చికిత్సు చేయడానికి ప్రయత్నించగలవు. చిత్తమే జగద్రూపమై విజృంభిస్తున్నది. ఈ శరీరాదులైన పదార్దాలన్నీ ఇసుకలో నూనె లాగా ఉనికి లేనివే. రాగక్షేశాదులచే దూషితమైన చిత్తమే సంసారం. రాగాదులు నశించడమే సంసారనాశ మనబడుతుంది. సాధించదగిన వస్తువు, సిద్దించిన దాని రక్షణ, విచారింపదగిన విషయమూ, చేయదగిన కార్యమూ, ధరించ దగిన భూషణాలూ _ ఇదంతా చిత్తమే. (త్రిలోకాలు అనే దృశ్యాన్ని తనలో చిత్తాకాశమే భరిస్తున్నది. “నేను చేస్తున్నాను అనే అహంభావానికి లోనై కాలానుగుణంగా (ప్రవర్తించేది కూడా చిత్తమే. చిత్తములోని చిద్భాగమే సమస్తమైన అర్జాలకూ బీజమై వున్నది. అందలి జడభాగమే ఈ జగత్తు.
ఆది సృష్టిలో ఉనికిలేని ఈ భూమ్యాదులను ఆకారం లేని అజుడు స్వప్నాన్ని చూచినట్లు చూస్తాడు. అలా చూచినా నిజానికి అతడు చూడనివాడే. అతడు చూచే స్టూల - సూక్ష్మాది దేహాలు శూన్యస్వరూపాలే కాని వాస్తవాలు కావు. నిర్మలమైన జలంలో సూర్యప్రకాశం వ్యాపించినట్లే సర్వవ్యాపి అయిన ఆత్మ చిత్త శరీరాదుల్లో వ్యాపించి వున్నది.
చిత్తము అనే బాలుడు అజ్ఞానంతో జగత్తు అనే బేతాళాన్ని చూస్తున్నాడు. ఆత్మబోధ కల్లితే అతడు నిరామయమైన స్వస్వరూపాన్నే చూస్తాడు. ఆత్మ ద్వైతం, ఐక్యం అనే భమమూలకమైన దృళ్యత్వాన్ని ఎలా సాందుతుందో నేను ఇకపై చెప్పబోయే కథలతో ఎవరిస్తాను, విను. వునోజ్జమైన ఉపవూనాలతో,
ఉత్పత్తి ప్రకరణం 189 మధురోక్తులతో బోధించిన విషయం శ్రోతల హృదయాలలో నీళ్లలో నూనె లాగా వ్యాపిస్తుంది. సందేహాలను నివారిస్తుంది. ఉపమానం లేనిదీ, మనోజ్ఞం కానిదీ, అర్ధం కానిదీ, స్పష్టత లేనిదీ అయిన మాట శ్రోత హృదయానికి ఎక్కదు. బూడీదలో హోమించిన ఆజ్యం లాగా అది వ్యర్ధవమువుతుంది. ఉచిత కోవులాలైన పద బంధాలతో కూడిన ఆఖ్యానకాలూ, కథలూ దృష్ట్రాంత దృష్టితో నిరూపింపబడినప్పుడు సూర్యకాంతిలో లోకం శో భిల్లినల్టు ప్రకాశిస్తాయి. వఐందవోపాఖ్యానం - బహ్మాదిత్యుల కలయిక
రాఘవా | పూర్వం (బ్రహ్మదేవుడు నాకొక కథ చెప్పాడు. నీవడిగిన (ప్రశ్నకు సమాధానంగా ఆ కథ నీకిప్పుడు వివరిస్తాను.
నేను పూర్వం పద్మ సంభవుణ్లీ ''బ్రహ్మణ 1! ఈ సృష్టి పరంపరలు ఎలా కలుగుతున్నాయి ?”* అని (ప్రశ్నించాను. నా ప్రశ్నకు సమాధానంగా పీతామహుడు ఐందవోపాఖ్యానం చెప్పాడు.
(బ్రహ్మ : - మడుగులో చిత్రవిచిత్రాలైన సుడులతో కూడిన జలం లాగా నానా జగద్రూపాలతో కూడి గోచరిస్తున్న ఈ సృష్టి అంతా ఒక్క మనస్సే. పూర్వం ఒకానొక కల్పాదిలో నేను ప్రబుద్దుడనై సృష్టి చేయాలని సంకల్పించాను. అప్పుడు ఏమి జరిగిందో చెబుతాను, విను,
ఒకసారి కల్పాంతకాలంలో సమస్తసృష్టినీ ఉపసంహరించాను. నేనొక్కడనే ఏకాగ్రచిత్తంతో ఆకల్పరా(్రి అంతా (ప్రశాంతంగా గడపాను. తెల్లవారగానే వేల్కొన్నాను. యథావిధిగా సంధ్యోపాసన చేశాను. తరువాత ప్రజలను స్నష్టించాలనుకొని అతివిశాలమైన ఆకాశం వైపు చూపు సారించాను. ఆవిస్త్రృతాకాళం వైపు చూచినప్పుడు నాకక్కడ చీకటీ వెలుగూ లేని అనంతమైన శూన్యమే స్ఫురించింది. సృష్టివేయాలని నిశ్చయించుకొని సూత్మచిత్తంతో సృష్టింపదగిన వస్తువులను గూర్చి ఆలోచించబూనుకొన్నాను. అప్పుడు విపులమైన ఆకాశంలో నా మనోదృష్టికి ప్రతిబంధక మేమీ లేక సువ్యవస్రితంగా ఉన్న (బ్రహ్మాండాలు అనేకం గోచరించాయి. అక్కడ పద్మకోశంపై రాజహంసల నధిష్టించి నాకు ప్రతిరూపాలుగా ఉన్న (బ్రహ్మలు పదిమంది కనిపించారు.
ఆ (బ్రహ్మాండాలలో నాలుగు రకాలైన (ప్రాణులు ఉన్నాయి. సముద్రాల వలె
190 యోగవాసిష్టం 'ఘోషిస్తూ ప్రవహించే నదులున్నాయి. సూర్యులు తపిస్తున్నారు. ఆకసంలో గాలులు వీస్తున్నాయి. స్వర్గంలో దేవతలూ, భూలోకంలో మానవులూ, పాతాళంలో దానవులూ '్రీడిస్తున్నారు. కాలక్రమాన సమస్త బుతువులూ ఫలప్రదాలై భూమి నలంకరిస్తున్నాయి. ఆచారాలు తెలిపే స్క్రతులు పాటింపబడుతున్నాయి. భోగమోక్షాలను కోరే ప్రాణికోట్టు తవు తవు కోరికలు తీర్చుకోవటానికి (ప్రయత్నిస్తున్నారు. ఏడు లోకాలూ, ఏడు ద్వీపాలూ, ఏడు సముద్రాలూ, ఏడు పర్వతాలూ యథాస్థ్రానంలో ఉన్నాయి. చీకటి కొన్ని చోట్లు మసకగానూ, మరికొన్ని చోట్ల దట్టంగానూ, ఇంక కొన్ని చోట్ట వెలుగుతో కలిసి మెలసీ ఉన్నది. ఆకాశ మనే నల్లకలువలో మేఘా లనే తుమ్మెదలు చరిస్తున్నాయి. మిలమిల మెరిసే తారకలు అందలి కింజల్కాల వలె భాసిస్తున్నాయి. హిమాలయంలోని వనకుంజూలలో వుంచు దట్టంగా వ్యాపించింది. లోకాలోక పర్వతాలనే మొలనూలుతోనూ, సముద్రధ్వని అనే భూషణ శబ్రంతోనూ, చీకటి అనే ఇంద్రనీలమణి కాంతితోనూ, తనలోని రత్నాల వెలుగుతోనూ, (ప్రాణుల శబ్దమనే వాగ్విభవంతోనూ కూడినదై పృథివి అనే అంగన భువనాభోగమనే అంతఃపురంలో విరాజిల్హుతున్నది. చం(ద్రకళలాగా నిర్మలమై పైనుండి మూడు (ప్రవాహాలతో (ప్రవహించే గంగ జగత్తు ధరించిన జందెం లాగా భాసిస్తున్నది. మెరుపు లనే పూలతోనూ, మేఘా లనే చివుళ్లతోనూ కూడిన దిక్కు లే తీగలు గాలికి ఇటూ అటూ ఊగుతున్నాయి. సముద్ర భూమ్యాకాశాల పంక్తి గంధర్వ నగరంలోని ఉద్యానలత లాగా మిథ్యగా తోచింది. లోకాంతరాలలోని సురలూ, అసురులూ, నరులూ మేడిపండ్లలో దోమల్లాగా స్పురిస్తున్నారు. యుగాలూ, కల్పాలూ, శణాల వంటి పలువిభాగాలతో కూడిన కాలం సర్వనాశనానై (ప్రతీకిస్తూ గడచిపోతున్నది. శుద్దచిత్తంతో ఈ దృళ్యం చూడగానే నాకు చాలా ఆళ్ళర్యం కల్గింది “' ఏమిది? ఇది ఎలా సంభవించింది ? చర్మ చక్షువులకు ఏమీ గోచరించడం లేదే 1 ఈమాయాజాల మంతటినీ ఆకాశంలో మనస్సుతోనే చూస్తున్నానే 1" అలా మనోనేత్రంతో చాలేపు చూచిచూచి ఆ జగజ్ఞాలంనుండి ఒక సూర్యుణ్లే దగ్గరికి పిలిచి ఇలా అడిగాను. '' భాస్కరా! ఇలారా! నీకు స్వాగతం! నీ వెవడవు? ఈ సృష్టి ఎలా సంభవించింది ? నీకు తెలిసి వుంటే నాకు చెప్పు.”
ఉత్పత్తి ప్రకరణం 191 అప్పుడా సూర్యుడు నన్ను చూచి నేనెవరో గుర్తించాడు. నాకు నమస్కరించి ఇలా అన్నాడు -
“ఈశ్వరా ! ఈ దృశ్య ప్రపంచానికంతటికీ నీవు కారణమై వుండికూడా నిన్ను నీవు ఎందుకు తెలుసుకో లేకున్నావు ? నన్నెందుకు అడుగుతున్నావు ? సర్వవ్యాపివగు ఓదేవా! నా మాటలు వినాలని కుతూహలంగా ఉన్నదా ? అయితే నీ సంకల్పానికి గురికాని నా పుట్టుకను గురించి చెబుతాను, విను. మహాత్మా ! సదసదూూహమై అజ్ఞానానికీ, విమోహానికీ కారణమైన వివిధ నిర్మాణాలతో విలసిల్హుతున్న ఈ సర్వ జగత్తూ మనస్సు యొక్క విలాసం మాత్రమే.
ఐందవ సమాధానం
మహాదేవా ! పూర్వకల్పంలో జంబూద్వీపంలో ఒకమూల వున్న కైలాస శైలానికి చెందిన ఒక సవుతల ప్రదేశంలో సువర్షజటమునే పేరుగల ఒక ('ప్రాంతముండేది. అక్కడ (ప్రజా(స్రష్టలైన నీ కుమారులు ప్రజల నివాసానికి అనుగుణంగా సుఖాస్పదమైన ఒక సుందర మండలం కల్పించారు. ఆ మండలంలో అతిధర్మాత్ముడూ, వేదవేత్తలలో (శ్రేష్టుడూ, శాంతాత్ముడూ అయిన ఒక బ్రాహ్మణ డుండేవాడు. అతని పేరు ఇందువు. అతడు కశ్యపవంళంలో జన్మించాడు.
అతనికీ ప్రాణసమురాలైన ఒక భార్య ఉండేది. కాని మరుభూమిలో తృణం లాగా అతనికి కుమారుడు జన్మించలేదు. అతని సతీమణి తెల్లగా, చక్కగా, పరిశుద్దంగా ఉన్నా ఫలశూన్యమైన రెల్టుకాడలాగా శోభావిహీనగా వుందేది. అందువల్ల విషాదగ్రస్తులై ఆ దంపతు లిరువరూ తపస్సు చేయటానికి కైలాస గిరికి వెళ్ళారు. అక్కడ మొలకెత్తిన క్రొత్త వృజ్షాలలాగా ప్రాణిశూన్యమైన ప్రదేశంలో ఫ్రిరపడ్డారు. నిత్యమూ సాయం సమయంలో ఒకపుడిసెడు నీరు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఘోరమైన తపస్సుకు ఉపక్రమించారు. నిళ్ళిలంగా వృక్షవృత్తితో వుంటూ అక్కడ బహుకాలం వారు తపస్సు కొనసాగించారు. (త్రేతాయుగం, ద్వాపరయుగం గడచిపోయాయి. చం(ద్రకళాధరుడైన శివుడు వారి తపోనిష్టకు సంతసించాడు. ఎండకు కమలిన కలువల చెంతకు చంద్రుడు వచ్చినట్లే తహాపరిపీడితులైన ఆ విప్రదంపతుల వద్దకు పరమేశ్వరుడు వచ్చాడు.
వృషభవాహనంపై పార్వతితో సహా వచ్చిన చంద్రశేఖరుల్లి చూడగానే ఆ ₹22
192 యోగవాసిష్థం దంపతుల ముఖం వికసించింది. పరిపూర్ణ చంద్రునిలా భాసిస్తున్న శివునికి వారు ప్రణామాలు చేశారు.
అప్పుడు శంకరుడు మందస్మితం చిందిస్తూ మృదు స్వరంతో ఇలా అన్నాడు-
“విస్రా ! నీ నిష్టకు మెచ్చాను. వెంటనే నీకభీష్టమైన వరం కోరుకో. వరం పొంది వసంత బుతువులోని వృక్షం లాగా సంతోషించు.
విష్రుడు : - '' మహాదేవా! నీ అనుగ్రహం వల్ల నాకు సద్గుణసంపన్నులైన పదిమంది కొడుకులు కల్లుదురుగాక ! పుత్రులు లేరనే శోకం నన్ను బాధించకుండా నాక్షీవరం అనుగ్రహించు.
సూర్యుడు : - అంతట గంభీరమైన స్వరంతో *'ఏవమస్తు' అని పలికి ఈశ్వరుడు అంత్తర్లితు డయ్యాడు. వర'్రాప్తేతో సంతోషించి దేవతాసదృశులైన ఆ దంపతులు శివపార్వతులు (బ్రహ్మాకాశానికి పోయినట్టు తమ గృహానికి వెళ్ళారు. అక్కడ (బ్రాహ్మణీ గర్భవతి అయింది. నీటితో నిండిన వేంఘలేఖలాగా నిండుచూలాలైన ఆ సాధ్వి కాలక్రవుంలో పాడ్యమి నాటి చంద్రుల వళి సుకుమారులైన పదిమంది కుమారులను ప్రసవించింది. భూమినుండి పుట్టిన క్రొత్త 'మొలకల్టాగా ఆ పిల్లలు శోభిల్లారు. యథోచితంగా వారికి జాతకర్మాది బ్రాహ్మణ సంస్కారం జరిగింది. వారు తేజస్సంపన్నులై వృద్ది పాందారు.
వర్షాకాలంలోని వేఘాలలాగా వృద్దిపాందుతూ స్వల్పకాలంలోనే విద్యావంతులై వారు ఏడేండ్ల (ప్రాయం కలవారయ్యారు. ఆకసంలోని నిర్మలమైన (గ్రహాలవలె తేజోవంతులై విరాజిల్లారు. తరువాత కొంతకాలానికి తత్త్వజ్ఞులైన వారి తల్లిదండ్రులు శరీరపరిత్యాగం చేసి విదేహకైవల్యం పాందారు. తల్లిదండ్రులు లేని ఆపదిమంది సోదరులూ ఖేదంతో ఇల్లు వదలికైలాస శిఖరం చేరుకొన్నారు. అక్కడ ఉద్వేగభరితమైన చిత్తంతో పరస్పరం ఇలా చింతించుకొన్నారు -
“సోదరులారా! ఇక మనకు పరమ(శ్రేయస్సు ఏది ? సముచితమైన కర్తవ్యం ఎలాంటిది ? దుఃఖం తొలో ఉపాయం ఎట్టిది ? ఐళ్ళర్యాన్నీ, మహత్తాన్నీ కల్గించే దేది? గహయజమానులకంటే, గ్రామాధిపతులకంటే మండలాధిపతుల ఐశ్వర్యం గొప్పుది. రాజులు మండలాధిపతులకంచే గొప్పు ఐశ్వర్యవంతులు కదా ! వారి ముందు సామంతుల సంపద ఎంత? సామ్రాట్టు ముందర రాజుల వైభవ మేపాటిది? , (ప్రజాపతి కాలంతో పోల్చుకొని చూస్తే మహేంద్రుని ఐశ్వర్యం కూడా క్షణకాలికమే. కల్పకాలంలో కూడా నశింపని శోభనమైన సంపద ఏమున్నది?”
ఉత్పత్తి ప్రకరణం 193 ఇలా వారు మాట్టాడుకొంటూ వుండగా మహాబుద్దిమంతుడైన జ్యేష్ట సోదరుడు గంభీరంగా ఇలా అన్నాడు -
“ సోదరులారా 1 ఐశ్వర్యాలన్నింటిలోనూ కల్పాంతంవరకూ నశింపని ఐళ్వర్యం బ్రహ్మత్వం ఒక్కటే. దానికి సాటి రాగలది వురొకటి లేదనినా అభిప్రాయం.”
ఆ మాట విని తక్కిన ఐందవు లందరూ 'మంచిది మంచిది' అంటూ అతళల్లీ అభినందించి ఇలా అన్నారు -
“సోదరా ! సమస్త దుఃఖాలనూ తొాలగింషగల జగత్పూజ్యమైన బ్రహ్మ పదవిని పాందడం ఎలాగా ?*'
అప్పు డాబ్యేష్టసోదరుడు '' మీరందరూ నేను చెప్పినట్టు చేయండి 1 '“నేను పద్మాసనాన్ని అధిష్టించిన బ్రహ్మను, నా తేజస్సుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, సంహరిస్తున్నాను”' అని మీరు చిరకాలం ధ్యానించండి.?'
అగ్రజుడు చెప్పేనట్టు వారందరూ ధ్యానం చేయడానికి పూనుకొన్నారు. ధ్యానస్రితులై చిత్రాలలోని బొమ్మల్లాగా ఉంటూ తమలో తాము ఇలా అనుకొన్నారు-
““నేను వికసించిన పద్మకోశమనే ఉన్నతాసనంపై ఉన్న బ్రహ్మను. ఈ జగత్తును స్పష్టించేది నేను. దీనికి కర్తను, భోక్సను అయిన మహేశ్వరుణ్లి నేనే. యజ్ఞమూర్తి నైన నాలో మహర్షులు ఉన్నారు. వేదాలు గూడా నాలోనే ఉన్నాయి. లోకపాలకుల ఏలుబడిలో వుంటూ సిద్దులకు నిలయమై సౌభాగ్యవంతమైన స్వర్గం ఇదే. కొండలు, ద్వీపాలు, సము(ద్రాలు, అడవులచే అలంకరింపబడిన ఈ భూవుండలం త్రిలో క్రీభామినికి కర్ణకుండలమై ఉన్నది. దైత్యులతో నిండీన పాతాళకుహరం ఇదే. దేవతలకూ, అప్పరసలకూ ఆవాసమైన గనకోటర మనే గృహం ఇదే. మహాభుజుడైన ఈ యింద్రుడు ప్రజాపాలకులైన రాజులలో ఉత్తముడు. యజ్ఞభో క యైన ఇతడొకడే ముల్లోకాలనూ పరిపాలిస్తున్నాడు. కిరణాలనే పాశాలచే దిక్కులను బంధించి ఈ ద్వాదశాదిత్యులు [క్రమంగా తమ ప్రతాపం (ప్రదర్శిస్తూ రసగ్రహణం చేస్తున్నారు. గోపకులు గోగణాన్ని పాలించినట్లే పవిత్ర వర్తనులైన యీ లోకపాలకులు గొప్ప మర్యాదతో లోకాలను కాపాడుతున్నారు. నేను ఈ సర్గాన్ని స్పష్టిస్తున్నాను, సంహరిస్తున్నాను. నేను భువనేశ్వరుడను. నేను నాలోనే ఉంటూ పరమశాంతిని అనుభవిస్తున్నాను.
194 యోగూస్మిం
ఈ సంవత్సరం గడచింది. ఈ యుగం దాటిపోయింది. సృష్టినీ, నన్నూ ఉపసంహరించుకోవటానికి ఇది తగిన సమయం. ఈ కల్పం గడచింది. ఇప్పుడు (బ్రహ్మ రాత్రి వ్యాపించింది. నేను పూర్జాత్ముడనైన పరమేశ్వరుడను. నేను నాలోనే ఉన్నాను.” ,
ఈ రీతిగా భావిస్తూ ఆ ఐందవద్విజులు చెక్కిన రాళ్లలాగా నిశ్చలంగా వుండిపోయారు. ఆ పదిమందీ ఇతర తుచ్చభావాలు వదలినవారై బ్రహ్మ పదవి పొంది బహుకాలం విరాబిల్లారు.
జగద్వర్లనం
ఓ పితామహా! ఆ ఉపాసనా పద్రతిలో వారు బ్రహ్మత్వాన్ని భావించారు. బ్రహ్మ చేసే పనులనే మనస్సులో ఊహించుకొంటూ అందులో మిక్కిలి ఆసక్తి గల్లివుండి పోయారు.
అలా వుండగా వారి శరీరాలు తాపంతోనూ, గాలితోనూ శుష్కించి శుష్కించి చివరికి ఎండుటాకుల్లాగా (క్రిందపడిపోయాయి. అలా చెల్లాచెదరుగా పడిన వారి శరీరాలను కోతులు పండ్లను తిన్నట్లే అడవిలోని (క్రూరమృగాలూ, పక్షులూ
భక్షించాయి. బాహ్యవృత్తులు శాంతించగా నాల్గుయుగాల చివర కల్పక్షయం జర్గే వరకూ వారు బ్రహ్మ భావనతో అలాగే వుండిపోయారు.
తరువాత కల్పక్షయం జరిగింది. పెక్కుమంది ఆదిత్యులు ఒక్కసారిగా ఉదయించి తపించారు. ఫుష్కరావర్తక మేఘాలు పెద్దగా గర్దిస్తూ వర్షించాయి. కల్పాంత మహావాయువులు వీచాయి. సమస్తమూ జలమయమై ఏక్సార్ధవ మయింది. (ప్రాణికోట్టన్నీ నశించాయి. ఇంత జరిగినా వారు మాత్రం సృష్టి వ్యాపారంలో నిమగ్నమైన ధ్యాననిష్టతో అలాగే వుండిపోయారు.
ప్రభూ! పిదప బ్రాహ్మీ రాత్రికాలం రాగానే స్నష్టినంతటినీ ఉపసంహరించుకొని నీవు యోగనిద్రలో ప్రవేశించి నీలోనే వుండిపోయావు. వారు మాత్రం అలాగే అక్కడే వుండినారు. ఇప్పుడు నీవా రాత్రినుండి మేల్కొాన్నావు. ('పజాసృష్టి చేయగోరుతున్నావు. వారు మాత్రం పూర్వం లాగానే సుఖంగా ధ్యానమగ్నులై వున్నారు. బ్రహ్మ౯ ! ఆపది మంది బ్రాహ్మణపుత్రులే ఈ (బ్రహ్మలు. ఆ పది (బ్రహ్మాండాలూ వారి చిత్తాకాశంలోనే వున్నాయి. ప్రభూ! వారిలో ఒకని
ఉత్పత్తి ప్రకరణం 195 ఆకాళమందిరంలో ఉండే సూర్యుణ్ణి నేను. నేను కాలకలారూపమైన కర్మలో నియమింపబడీ వున్నాను. పద్మసంభవా ! పది (బ్రహ్మాండాలు ఎలా సంభవించాయో మీకు నివేదించాను. ఈ బ్రహ్మలు ఎలా ఉద్భవించారో తెలిపాను. ఇప్పుడు మీకేది ఉచితమని తోస్తే, అది చేయండి |
ఉత్తమపురుషా! నానావిధాలైన కల్పనలతో కూడి, ఆసక్తివల్ల మోహానికి నెలవై, ఉభయ విధాలైన ఇంద్రియాలనూ బంధిస్తున్న ఈ దృళ్య జగత్తంతా వారి మనో(భ్రాంతే కాని మరేమీ కాదు.
వందవ నిశ్చయం
(బ్రహ్మ: - బ్రహ్మవేత్తలలో (శ్రేష్టుడవైన ఓ వసిష్ట మునీంద్రా! ఆసూర్యుడా రీతిగా బ్రాహ్మణులే బ్రహ్మలుగా రూపాందారని చెప్పి మౌనం వహించాడు. నేను చాలా సేపు నాలోనే ఆలోచించుకొని ''"ఓ భాస్కరా | నేనింక సృష్టించవలసిన దేమున్నది ? నీవు చెప్పు. ఈ పదిలోకాలూ ఉన్నాయి కదా ! మళ్ళీనా సృష్టి వల్ల ప్రయోజన మేమి ?** అని (ప్రశ్నించాను.
అప్పుడు భానుడు బుద్దితో చక్కగా యోచించి యుక్తియుక్తంగా ఇలా అన్నాడు-
“ప్రభూ! నీవు నిరీహుడవు. నీకు కోరికలు లేవు. ఇలాంటి నీకు సృష్టి వల్ల కలో లాభ మేమున్నది ? లోకనాథా ! ఈ సృష్టి అంతా నీకు వినోదం మాత్రమే. సూర్యునినుండి నీటిలోని సూర్య ప్రతిబింబం లాగా నిష్కాముడవైన నీనుండి ఈ జగత్తు జనిస్తున్నది. శరీర సన్నివేశాన్ని త్యబజించడంలోనూ, భజించడంలోనూ నీ భావం నిష్మామమే. భూతేశ్వరా ! సూర్యుడు దినాన్ని ఉపసంహరించి మళ్ళీ సృష్టిస్తున్నాడు. అలాగే నీవు కూడా వినోదం కొరకే నీ సృష్టిని ఉపసంహరించుకొని మళ్ళీ సృష్టిస్తున్నావు. నీవు నిత్యమూ ఆసక్తి లేకుండా ఈ సృష్టి కార్యాన్ని కర్తవ్యంగా భావించి లీలార్టమై చేస్తున్నావు. అంతే కాని ఇందులో నీకు స్వార్ధంతో కూడిన ఉద్యమం లేదు.
మహేశా ! నీవు ఈ సృష్టిని చేయలేదనుకో ! అప్పుడు కర్మ పరిత్యాగం కంటే నీకు కలిగే అపూర్వ మేమున్నది. సజ్జనుడు సంసక్తి వదలి యథా ్రాప్తమైన పని చేస్తూ వుండాలి. నిర్మలమైన అద్దం ప్రతిబింబ (క్రియను చేసినట్లే ఇది సాగిపో ఎ €.
196 యోగవాస్టం ధీమంతులైన వారికి కర్మ చేయడంలో లాగానే, కర్మ వదలడంలో కూడా కామన లేదు. అందువల్ల నిష్మామమూ, సుషుప్తోపమమూ అయిన బుద్దితో నీవు యథాప్రాప్తమైన కర్మ అనుష్టించు. ఈ ఐందవుల స్పష్టివల్ల నీ విప్పుడు సంతోషించావంటే, ఇంక మీదట కూడా వారు నిన్ను ఎన్నో విధాల సంతసింపజేస్తారు. ఇతరులు కావించిన సృష్టిని నీవు వునోనేత్రంతో మా(త్రవే చూడగలవు. చర్మచత్షువులతో చూడలేవు. పరమేశ్వరా ! ఎవడు మనస్సుతో సృష్టిని నిర్మిస్తాడో, వాడు మాత్రమే మాంస నేత్రంతో ఆ సృష్టిని చూడ గలడు. ఇతరులు చూడి జాలరు. పదిమంది (బ్రహ్మలు సృష్టించిన ఈ పది బ్రహ్మాండాలు దృఢంగా వారి చిత్తంలో చిరకాలం నుండీ స్టిరపడి వున్నాయి. వీటినీ, ఈ బ్రహ్మలనూ ఎవడూ నశింపజేయలేడు. కర్మేంద్రియాలతో చేసే పనిని అడ్డుకోవచ్చును గాని మనోనిశ్చయంతో జర్గే పనిని ఎవడూ ఆపజాలడు. ఒక ప్రాణి చిత్తంలో దృఢంగా నెలకొన్న నిశ్చయాన్ని ఆ ప్రాణి తొలగించవలసినదే గాని మరొకడు నివారించలేడు. మనస్సు చిరకాలం దృఢంగా అభ్యసించిన నిశ్చయం శపించినా పోదు. శరీరం నశించినా అది నశించదు. మనస్సులో దృఢంగా నాటుకొన్న దేదో అదే అలా సంకల్పించిన పురుషుడుగా రూపాందుతుంది. కాని మరేమీ కాదు. సంసారాన్ని నివారించడానికి మనః ప్రబోధం తప్ప మరొక ఉపాయం లేదు. ఇతరమైన ఉపాయా లన్నీ బండపై మొలకెత్తాలన్న కోరికతో నీళ్ళు పోసినట్లే నిష్టుల మవుతాయి. కృత్రిమే౦ద్రువి వచనం మనస్సే జగత్తులను సృష్టిస్తున్నది. మనస్సే హిరణ్యగర్భుడు. మనస్సు చేసే కార్యమే కార్యంకాని శరీరం చేసేది కార్యం కాదు. ఐందవులు సామాన్య బ్రాహ్మణులే. అయినా మనోభావనతో బ్రహ్మత్వం పాందగలిగారు కదా ! వమనస్సు ఎంత శక్తిమంతమైనదో చూడు. దేహి మనోభావనవల్లనే దేహత్వం పొందుతున్నాడు. దేహభావన లేని వాళ్లీ జనన మరణాదులైన దేహధర్మాలు బాధించవు. బాహ్యదృష్టి కలవాడు సుఖదుఃఖాలు పొందుతాడు. అంతర్ముఖు డయిన యోగి దేహానికి చెందిన ప్రియా ప్రియాలను తనవిగా భావించడు. అందువల్ల వివిధ విభ్రమాలకు నెలవైన ఈ జగత్తుకు కారణం మనస్సే. అహల్యా సమేతుడైన ఇంద్రుని వృత్తాంతం ఇందుకు
ఉత్పత్తి ప్రకరణం 197 చక్కని నిదర్శనం.
బ్రహ్మ: - భాస్కరా! అహల్య ఎవ్వతె ? ఇంద్రుడు ఎవడు? దృష్టిని పావనం
కావించే వారి చరిత్ర ఎలాంటిది ?
భానుడు : - దేవా! పూర్వం మగధదేశాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు
పరిపాలిస్తూ వుండేవాడు. అతడు పురాణ ప్రసిద్దుడైన ఇం ద్రద్యుమ్నునికి దీచైనవాడు. చంద్రునికి రోహిణి లాగా అతనికి చంద్రబింబం వంటి అహల్య అనే భార్య ఉండేది.
ఆ పట్టణంలోనే జారశిరోమణి అయిన ఒక విప్రకుమారుడు ఉండే వాడు. వాని పేరు ఇంద్రుడు. వాడు విటవిద్యలలో ఆరితేరినవాడు.
రాజపత్ని అహల్య ఒకనాడు ఎక్కడో కథా ప్రసంగంలో '“పూర్వం ఇంద్రునికి అహల్య ఎంతో (ప్రేమపాత్రమై ఉండేది*' అని విన్నది. అలా వినగానే ఆమెకు ఇంద్రునిపై అనురాగం కల్గింది. ““నేనూ అహల్యనే. ఇంద్రుడు నా వద్దకు ఏల రాడు?”' అని జౌత్సుక్యంతో ఆలోచించసాగింది.
ఈ ఆలోచనతో దినదినానికీ ఆమెకు విరహతాపం ఎక్కువ అయింది. తామరతూళ్ళూ, అరటి చివుళ్ళతో ఏర్పరచిన పడకపై ఆమె తెగిపోయిన తీగ లాగా పరితాపం పాందసాగింది. ఎన్ని రాజవైభవాలున్నా ఆమెకు ఖేదమే కాని మోదం కల్లలేదు. ఎండకు కాగిన ప్రదేశంలో చేప లాగా ఆమె ఇటూ అటూ సంతాపంతో పారలజొచ్చింది. '' అడుగో ఇంద్రుడు, ఇదుగో ఇంద్రుడు”' అని ప్రలపిస్తూ చివరికి వివశురాలై ఆమె సిగ్గుగూడా విడిచి పెట్టింది.
ఆ రాజమహిషి పై అమితమైన ప్రీతి కల ఒక చెలికత్తె ఉండేది. ఆమె రాణి దు్టితికి వగచింది. "“ఇం'ద్రుణ్ణి నీ వద్దకు పిలుచుకొని వస్తాను" అని ఆమెతో చెప్పింది. ఆ మాట వినగానే రాణి కన్నులు ఆనందంతో వికసించాయి. ఆమె కృతజ్ఞతతో చెలికత్తె పాదాలపై వ్రాలిపోయింది. ఆ దినం పగలు గడచి రాత్రి రాగానే వెలికత్తె విప్రసుతుడైన ఇంద్రుని చెంతకు వెళ్ళింది. అతనికి జరిగిన వృత్తాంతమంతా చెప్పవలసిన రీతిలో చెప్పింది. అతణ్ణి నాటి రాత్రే అహల్య వద్దకు తీసుకువచ్చింది.
ఆపై సర్వాలంకార భూషితురాలై అహల్య ఒక రహస్య గృహంలో ఆ జారునితో రమించింది. వారాద్యలంకార శోభితుడైన ఆ యువకుడు ఆమెను తన వశం చేసుకొన్నాడు. అతనిపై అనురక్తితో అహల్య జగత్తునంతా ఇం(ద్రమయంగా చూడసాగింది. సర్వగుణ సంపన్నుడైన భర్త ఆమెకు అల్పుడుగా కనిపించాడు.
198 యోగవాసిష్థం ఇం'ద్రుణ్లీ తలపోసే సమయంలో అహల్య ముఖం పున్నవరేయి వికసించిన కలువలాగా శో భిల్లేది. కొంతకాలానికి ఆమె ఇం ద్రునిపై అనురక్తురాలైన సంగతి రాజు గ్రహించాడు.
ఇంద్రుడు కూడా ఆమెపై అత్యధికమైన ఆసక్తి కలవాడయ్యాడు. ఆమె లేకుండా ఒక క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చాడు. వారి (ప్రేమ ముదిరి పాకంలో పడింది. వారి చేష్టలు గుట్టు వదలి (ప్రకటమయ్యాయి. కర్ణ కఠోరమైన వారి దుళ్చీరిత్రను రాజు విన్నాడు. ॥
రాజు వారి భావబంధాన్ని గుర్తించాడు. వారికి అనేకవిధాల దండనలు విధించాడు. హేమంత బుతువులో వారిని చల్లని మడుగులో పడవేశాడు. అక్కడ వారు సంతోషంతో నవ్వినారే కాని దుఃభించలేదు. మడుగు నుండీ వెలికి రప్పించి “మీకెందుకు దుఃఖం కల్లడం లేదు?” అని రాజు వారిని ప్రశ్నించాడు.
“మేము పరస్పర ముఖసౌందర్యాన్ని స్మరించుకొంటూ వున్నాము. ఆ భావనాబలంతో వేవలట మా శరీరాలను వమురచిపోయాము. రాజా! మా మనోబంధం సుదృఢమైనది, సందేహరహితమైనది. అంచేత నీవు విధించే శిక్షలవల్ల మాకు భాధ లేదు. మా అవయవాలను ఛేదించినా మేము దుఃఖించము' అని వారు సమాధానం చెప్పారు. తరువాత రాజు వారిని వుంగలంలో పడవేసి వేయించాడు. ఏనుగుల చేత త్రాక్కించాడు. కొరడాలతో కొట్టించాడు. అనేక విధాల దండించాడు. అయినా వారు బాధపడలేదు. అన్యోన్య స్మరణతో సంతసించి మునుపటి లాగే నవ్వుతూ మాట్టాడారు.
ఇంద్రుడు రాజుతో ఇలా అన్నాడు - '' రాజా ! ఈ జగమంతా నాకు ('ప్రియామయంగా గోచరిస్తున్నది. నీ శిక్షలు నాకు కొంచెమైనా బాధ కల్గించడం లేదు. ఈమె కూడా లోకాన్నంతా నా స్వరూపంగా చూస్తున్నది. ఇతరులు పెట్టే బాధలు మాకు దుఃఖం కల్గించవు. రాజా 1 నేను మనోమాత్రుడను. పురుషు డంటే మన్స్సే కదా! ఈ దేహాన్ని కల్పించింది మన్స్సీ. నీవు ఒక్కుమ్మడిగా విధించే ఈశిక్షలన్నీ ధీరమైన మా మనస్సును ఏ మాత్రం నొప్పించజాలవు. మహారాజు! దృఢనిశ్చయం కల చిత్తాన్ని పీడించే శక్తి ఎవరికున్నది ? ఈ శరీరం వృద్ది పాందనీ, లేక ముక్కలు ముక్కల్ని నశించనీ ! దృఢభావనా బద్దమైన మనస్సు మాత్రం చెక్కు చెదరకుండా పూర్వంలాగే వుంటుంది.
ఉత్పత్తి ప్రకరణం 199 ఇన్టెర్టంపై చిరకాల సంలగ్నమైన చిత్తాన్ని శరీరగతమైన భావాభావాలు బాధించలేవు. దృఢమైన అభినివేశం కల చిత్తంతో దేన్ని భావిస్తామో దానినే చూడగలం. అలాంటి చిత్తాన్ని శారీరకమైన చేష్టలూ, వర శాపాదులూ చలింపజేయజాలవు. మహాపర్వతాన్ని మృగాలు కదిలించగలవా ? దేవాలయంలో దేవిలాగా ఈ అసితేక్షణ నా మనఃకోళశంలో ప్రతిష్టితురాలై ఉన్నది. మేఘమాలికతో కూడిన కొండ (గీష్మతాపానికి గురి కాదు. అలాగే జీవరక్ష అయిన ఈ ప్రియురాలితో కలిసివున్న నేను దుఃఖం పాందను. నేను ఎక్కడ, ఎలా ఉండినా ప్రియురాలి స్తంగం తప్పు మరొకటి నాఅనుభవానికి రావడం లేదు. అహల్యారూపమైన మనస్సు, ఇం(ద్రుడనే మనస్సుతో ఏకీభావం పొందింది. వర శాపాదులు భౌతికశరీరంపై ప్రభావం చూపుతాయేకాని ధీర గంభీరమైన చిత్తాన్ని ఏమీ చేయలేవు. రాజా! శరీరాలు మనస్సుకు కారణాలు కావు. లతా వృత్షాదులకు నీరు లాగా శరీరా లన్నింటికీ మనస్సే కారణం. మహాత్మా । ఆత్మకు మొదటి శరీరం మనస్సు అని గ్రహించు. అదే శరీరా లన్నింటినీ సంకల్పించింది. ఎక్కడెక్కడ అది శరీరం “నేను' అన్న అభిమానంతో ఆవిర్భవిస్తుందో అక్కడక్కడ ఆయా శరీరాలు పురుషునికి వునస్సు ముఖ్యాంకురం. తరుపల్లవాల వంటి శరీరాలు మనస్సునుండి వచ్చాయి. అంకురం నశొస్తే చిగుళ్ళు వుండవు. చిగుళ్ళు నశించినా ముఖ్యాంకురానికి నాశం లేదు. ఒక దేహం నశొస్తే మనస్సు స్వప్న భూమిలో లాగా వివిధ దేహాలను సృష్టిస్తుంది. చిత్తం నశిస్తే దేహం చేయగలిగిందేమీ లేదు. అందువల్ల చిత్తమనే రత్నాన్ని కాపొడుకో ! రాజా ! దిక్కులన్నిటా నేను ఈ మృగాజీనే చూస్తున్నాను. ప్రియ యువతి రూపమైన చిత్తంతో నేను ఆనందిస్తున్నాను. నీపురప్రకృతులలో నాకు దుఃఖం కల్లించగల్లినది ఏదీ నా దృష్టికి గోచరించడం లేదు. ఇం(ద్రు డలా అనేసరికి రాజు ప్రక్కనే ఉన్న భరతుడనే మునితో ఇలా చెప్పాడు- “సర్వధర్మజ్ఞుడవైన ఓ మహాత్మా! ఈ దురాత్ముడు నా భార్య నపహరించాడు. పైగా నోటికి వచ్చినట్టు పరుషోక్తులు పలుకుతున్నాడు. మహామునీ ! ఇప్పుడే వీడి పాపానికి తగిన శాపం ఇవ్వండి. వధింపదగనివాళ్లీ వధిస్తే ఎంత పాపమో, వధింపదగిన వాళ్లో వదలివేస్తే కూడా అంతే పాపం కదా 1?!
200 యోగూసిష్టం
రాజుమాట విని భరతుడు ఆ దురాత్ముని పాపం పరిశీలించాడు. వెంటనే ““ ఓరీ దుర్చుద్దీ ! భర్తకు (ద్రోహం చేసిన ఈ దుష్టురాలితో సహా నశించిపో?” అని శపించాడు.
అప్పుడు ఇం(ద్రాహల్యలు ఇద్దరూ రాజునూ, మునినీ ఉద్దేశించి ఇలా అన్నారు-
“ ఈ శాపప్రదానంతో దుష్కరమైన తపస్సును పాడుచేసుకొన్న మీరే దురాత్ములు. మీ శాపం వల్ల మాకు జరిగే నష్టమేమీ లేదు. దేహం నశిస్తే నశించనీ! మేము మనోరూపులం. మాకు నశించే దేమున్నది ? వివడూ మనస్సును నశింపబేయలేడు. అది సూత్మవమూ, చిన్మయవమూ, దుర్లక్ష్యవటూ అని గ్రహించండి!”
ఆ తరువాత దృఢస్నేహంతో సంబద్దచిత్తులైన వారిద్దరూ శాప ప్రభావం వ్ల చెట్టునుండి రాలిన చివురుటాకుల్లాగా నేలపై పడిపోయారు. పిమ్మట వారు మృగాలుగా పుట్టి పరస్పరం అనురక్తులయ్యారు. ఆ జన్మ గడిచిన పిదప పక్షులుగా జన్మించారు.
ప్రభూ 1! ఆ తరువాత వారే మాసృష్టిలో మహాపుణ్యాత్ములైన బ్రాహ్మణ దంపతులుగా ఉదయించారు. భరతుడిచ్చిన శాపం వారి శరీరాలను మాత్రమే నశింపజేసింది. కాని వారి మనస్సులను నిగ్రహింపలేకపోయింది.
ఇప్పుడు కూడా వారు అన్యోన్యానురాగాన్ని వీడలేదు. ఎక్కడెక్కడ పుట్టినా అక్కడక్కడ దంపతులుగానే రూపాందుతున్నారు. సహజ(ప్రేమ సమృద్దమైన వారి స్నేహాన్ని చూచి చెట్టు కూడా అనురాగ రసభరితాలై శృంగార చేష్టలు చేస్తున్నాయి.
జీవావతరణ క్రమం
భానుడు : - భవ౯! అందుకే చెబుతున్నాను. అతితీ(వ్రమైన శాపాలు కూడా మనస్సును ఏమీ చేయలేవు. దానిని భిన్నం చేయగల శక్తి వాటికి లేదు.
'బ్రహ్మ౯ ! ఐందవుల సృష్టిని నశంపజేయడం సాధ్యం కాని పని. పైగా మహాత్ములయిన మీబోటివారి కది ఉచితం కూడా కాదు. ఈ లోకంలో గానీ. మరి ఏ లోకంలోనైనా మహాత్ముడవైన నీకు దైన్యం కలిగించే దేమున్నది ?
మనస్సే జగత్తులకు కర్త. మనస్సే పురుషుడు. మనోనిశ్చయంవల్ల ఏర్పడిన
ఉత్పత్తి ప్రకరణం 201 దానిని వుణిప్రతిబింబాన్ని వలె ద్రవ్యాలతో, ఓషధులతో, దండంతో నశింపజేయడం సాధ్యం కాదు. అంచేత ఈ ఐందవులు వాళ్ల సృష్టి కార్యంలో వాళ్ళు ప్రవర్తించనీ ! నీకు కర్తవ్యమైన సృష్టిని నీవు చేసుకో |! బుద్ద్యాకాశం అనంతం కదా! చిత్తాకాళం, చిదాకాశం, భూతాకాళం అనే మూడురకాల ఆక్షాశాలను చిదాకాశమే 'పాశింపజేస్తున్నది. అవి మూడూ అనంతాలే.
ఓ జగత్పతీ। ఒకటో, రెండో, మూడో ఇంకా ఎక్కువో ! నీసంకల్పానుసారం నీవు జగత్తులను నిర్మించు, నీలో నీవు స్వేచ్చగా ఉండు! ఈ ఐందవులు నీ నుండి తీసుకుపోయిన దేమున్నది ?
(బ్రహ్మ : - మహామునీ 1! ఐందవజగత్తులను గురించి సూర్యు డావిధంగా చెప్పాడు. నేను చాలసేపు ఆలోచించాను. ఆ పై ఇలా అన్నాను -
““ప్రభాకరా।! నీవు చెప్పింది యుక్తమే. ఆకాశం ఎంతో విశాలమైనది. మనస్సూ, చిదాకాశం కూడా విస్తృతమైనవే. అందువల్ల నేను నా యిచ్చ వచ్చినట్టు సృష్టికార్యం కొనసాగిస్తూ నిత్యకర్మ అనుష్టిస్తాను. భాస్కరా! వెంటనే అనేకమైన భూతజాలాలను కల్సిస్తాను. నీవే నాకు మొదటి మనువుగా కమ్ము! నా ఆనతి ప్రకారం యథేచ్చగా సృష్టికి పూనుకో 1"
మునీంద్రా ! పిమ్మట మహాతపశ్శాలి అయిన భాస్కరుడు నామాట కంగీకరించాడు. తన స్వరూపాన్ని రెండుగా విభజించుకొన్నాడు. అందాక భాగంతో పూర్వం లాగా ఐందవజగత్తులో సూర్యుడై పగళ్ళను కల్పించాడు. రెండవభాగంతో వునువుగా రూపొందాడు. నా అభివాతం ప్రకారం నాకు సృష్టికార్యంలో సహకరించాడు.
వసేష్టమునీ ! మహాశ్త్తి యుక్తమైన మనస్సు యొక్క స్వరూపాన్నీ, సామర్థ్యాన్నీ, సర్వకర్తృత్వాన్నీ గురించి నేనిప్పుడు నీకు వివరించాను. ఈ చిత్తంలో ఏదేది భాసిస్తుందో, అదంతా (ప్రకటమవుతూ, స్థిరత్వాన్నీ, సాఫల్యాన్నీ పొందుతూ వుంటుంది.
సామాన్య (బ్రాహ్మణులై వుండి కూడా ఐందవులు భావనాబలంతో (బ్రహ్మలయ్యారు. ఇక మనళ్ళక్తి ఎలాంటిదో చూడు. ఐందవులకు లాగానే మాకు కూడా చిద్దావప్రభావంతోనే బ్రహ్మత్వం సిద్రించింది. ప్రతిభాసాత్మకమైన చిత్తమే దేహాదిరూపాలతో భాసిస్తున్నది. చిత్తం కంటే వేరుగా దేహాదుల ప్రతీతి లేదు. చిత్తం
202 యోగవాస్మిం చమత్కారాల మయం. అది తనలో తాను మిరియపుగింజ మొద్విన పదార్జాలలాగా తన సంస్కారానికి అనుగుణమైన పనులు చేస్తూ వుంటుంది. చిత్తరూపంలో ఉన్న సూత్మ శరీరమే స్టాల్యభ్రాంతితో స్పూలళరీరంగా భావింపబడుతున్నది. సూక్మవాసనామయమైన ఈ చిత్తమే జీవుడనికూడా చెప్పబడుతున్నది. ఈ దేహ(భ్రమలన్నీ నశిస్తే చివరికి మిగిలేది పరమాత్మ ఒకటే. అంతా చిత్తమే. దానికంటే వేరుగా ఏమీ లేదు. అది అసత్తే అయినా ఐందవుల సంవేదన లాగా సత్తుగా రూపాందుతున్నది. ఐందవుల మనస్సే బ్రహ్మ అయింది. నేను బ్రహ్మను కావడం కూడా అలాగే జరిగింది. నిజానికి ఐందవులు కల్పించిన జగత్తులు కూడా నాచిత్తంలోని కల్పనలే. అంతా సంకల్పాత్మకమే. శుద్ద చిత్సరమార్దరూపమైన ఆత్మయే భావనాబలంతో జీవుడుగా, మనస్సుగా, పరిణమించి తన్ను దేహంగా (భ్రమిస్తున్నది. పరమాత్మే ఐందవుల, సంసారం లాగా ఈ సర్వమూ అయి భాసిస్తున్నది. తన అజ్ఞానం వల్ల కల్లిన సుద్నీర్సస్వస్నం జా గ్రద్రశనే పోలివున్నట్టు ఇదంతా జరిగిపోతున్నది. ఇద్దరు చంద్రుల వలె (భాంతి జన్యమూ, ఐందవుల ఆకాశం వలె రూఢమూ అయినా ఈ సమస్తమూ చిత్తం నుండే ఉదయిస్తున్నది. అది సత్తూ కాదు, అసత్తూ కాదు. సదసత్తులుగా ఉండేది కూడా అదే. అంటే అది మాయికమూ, అనిర్వచనీయమూ అయి వున్నదని గ్రహించాలి. సంకల్పాత్మకమైన పెద్ద శరీరం కల మనస్సు జడమూ, అజడమూ అని కూడా గ్రహించు. అది బ్రహ్మరూపం కాబట్టి అజడం, దృశ్యాత్మకం కాబట్టి జడం. దృశ్యానుభవకాలంలో మనస్సు సత్యంగా భాసిస్తుంది. బ్రహానుభవకాలంలో అలా భాసించదు. బంగారములో కటకత్వం కటకద్నష్టితో చూచినప్పుడే గోచరిస్తుంది. స్వర్ధదృష్టితో చూచినప్పుడు గోచరించదు.
(బ్రహ్మం సర్వాత్మకం. అందువల్ల అంతా చిన్న్మయమే. అంతా జడమే. బాహ్యదృష్టికి బ్రహ్మ మొదలు తృణంవరకూ దాని స్వరూపం నానావిధాల విరుద్రమై గోచరించవచ్చు. కాని పరమార్ధదృష్టితో చూడు. అప్పుడు వైరుధ్యం కనిపించదు. ఇదంతా జడమూ కాదు, చేతనమూ కాదని తెలియవస్తుంది.
మహామరుభూమిలో పదత్రలతాదు లుండవు. అలాగే “ఇదం ఇళ్చం' అని నిర్దేశింప వీలుగానిచోట జడ చేతనాదులకు ఉనికి లేదు. చిత్తులో చేత్య సంబంధం స్పురించడాన్నే ' మనస్సు” అంటారు. అందలి చిదంశం అజడం, చేత్యాంశం జడం.
ఉత్పత్తి ప్రకరణం 203 చిదంశాన్ని విస్మరించడం వల్లనే జీవుడు జగద్ర్రాంతికి గురి అవుతున్నాడు. చాపల్యం అనుభవిస్తున్నాడు. శుద్రమైన చిత్స్వభావమే చిత్తమనీ, జగత్తనీ రెండు విధాలుగా విభజింపబడింది. అంచేత జగమంతా చిదంశళమే. ద్వైతబుదికి లభించేది కూడా చిత్తే కాని మరేమీ కాదు.
వైతన్యం తన్ను అన్యరూపంతో దర్శించి దృళ్యళరీరాన్ని ధరిస్తున్నది. అందులో ఏవిధమైన విభాగాలూ లేకున్నా అది విభక్త మైనదిగా (భ్రమ వల్ల తోస్తున్నది. వాస్తవానికి భ్రమ అంటూ ఏదీ లేదు. భ్రాంతి పొందేవాడూ ఎవడూ లేడనేదే నిశ్చయం. చిద్వస్తువు సర్వస్వరూపమైనది. జూడ్యంలో వున్నది కూడా చిత్తే. అహంభావం, జాడ్యం అనేవి చిదంశంలోనే ఉదయిస్తున్నాయి. జలం కంటే వేరుగా అలలు లేవు. పరతత్త్వం కంటే భిన్నంగా అహంభావాదులు లేవు. అది చిదేక రసం కదా!
ఎండమావిలో నీరు లేదు. అదే రీతిగా అహం ప్రత్యయం నుండి ఉద్భవించే దృశ్యానికి ఉనికి లేదు. ఆత్మవస్తువు నిరామయం. అది అహంభావానికి ఆశ్రయం కాదు. నీరు ఘనీభవిస్తే మంచు అవుతుంది. అత్మ వాసనతో ఏకీభవిస్తే అహంభావంగా రూపొందుతుంది. ఆయా పదార్డాది స్వరూపాలను పొందేది మనస్సే. ఆకాశంలాగా విశదమూ, విశాలమూ అయిన చిత్త శరీరం నానాస్వరూపాలతో విరాజిల్లుతున్నది.
అందువల్ల స్టూలాది శరీరాల స్వరూపాన్ని వదలి చిత్తం తన ్రాతిభాసిక స్వరూపాన్ని చక్కగా విచారించాలి. చిత్తమనే రాగిని శోధిస్తే పరమార్ధమనే సువర్హం లభిస్తుంది. అప్పుడు అకృత్రిమమైన ఆనందం కల్గుతుంది. శిలాఖండాలవంటి ఈ దేహాదులను శోధించి ప్రయోజన మేమి ?
ఉన్న వస్తువేదో, దానినే శోధించాలి. ఆకాళ వృజ్షాలను గూర్చిన పరిశోధన ఎందుకు ? దేహాదులు సత్యాలయితే వాటిని గూర్చిన విచారణ యుక్త మవుతుంది. అవి సత్యాలు కావు గదా ! దేహమనే పేరు గల అసత్యమందే ఆగ్రహం కలవారికి ఉపదేశించేవారు పశుప్రాయులే. మనస్సు ఎలా భావన చేస్తుందో, క్షణంలో అలా పరిణమిస్తుంది. ఇందుకు దృష్టాంతం ఐందవులు, అహల్య, కృత్రిమేం(ద్రుడు వీరి నిశ్చయాలే. నిజానికి దేహానికీ, అహంభావానికీ ఉనికి లేదని గ్రహించు. సర్వదా విజ్ఞాన స్వరూపమైన ఆత్మను తెలుసుకొని ఏ కోరికలూ లేకుండా వుండిపో.
బాలకుడు యక్షుణ్లీ సంకల్పించుకొని భయపడతాడు. యకసంబంధం
204 యోగవాసిస్టం లేనప్పుడు నిర్భయంగా వుంటాడు. అట్లే ఆత్మ తన కల్పనతో దేహాది భావాలను పొందుతుంది. దేహాదులు నశిస్తున్నప్తుడు తాను నశిస్తున్నానని (భ్రమిస్తుంది. అవిద్యాకల్పన తొాలగగానే ఈ (భమగూడా నివృత్త మవుతుంది. అప్పుడు ఆత్మ స్వస్వరూపంతో విరాజిల్టుతుంది''.
మనోమాహాత్మ్యం
రాఘవా ! బ్రహ్మదేవుడు అలా చెప్పే సరికి నేను మళ్లీ ఇలా ప్రళ్నించాను - **భగవ౯ ! శాపమంత్రాది శక్తులు అమోఘాలని మీరే చెప్పారు. వాటినే ఇప్పుడు వ్యర్థమైనవని ఎలా చెప్పుగల్లుతున్నారు ?
ప్రాణుల సవుస్త వునోబుద్దీంద్రియాలూ. శాపంతోనూ, మంత్రప్రభావంతోనూ విమోహానికి గురి కావటం చూస్తున్నాము కదా! వాయువు
- చలనము, తైలము - తిలలు ఎలా అభిన్నాలో, అలాగే మనసూ, దేహము కూడా అభిన్నాలే. ఒకవేళ దేహానికి విడిగా ఉనికి లేదు, అది మనస్సు వల్లనే కలలాగా, ఎండమావివలెతోస్తున్నదంటారా ? అయితే ఒకటి నశిస్తే రెండవది కూడా నశించాలి కదా 1 మనస్సు నశిస్తే దేహనాశం తప్పుదు. అదే రీతిగా దేహం నశిస్తే మనస్సు సైతం నశించాలి కదా! ప్రభూ ! శాపాదిదోషాలకు చిత్తం వశం కావడం, కాకపోవడం అనేది ఎలా జరుగుతున్నదో స్పష్టంగా వివరించండి. *!
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు -
“మంచి పనులు చేసేవారు పరిశుద్రమైన పౌరుషంతో సాధించలేనిది ఈ జగత్తులో ఏదీ లేదు.
(బ్రహ్మ మొదలు స్థావరం వరకూ శరీరధారులైన (ప్రాణులన్నీ రెండు శరీరాలు కల్లివున్నాయి. అందులో ఒకటి మనళ్ళరీరం. అది సదా చంచలమై సత్వరంగా పనులు చేస్తూ వుంటుంది. మాంసనిర్మితమైన శరీరం మరొకటి. అది నిరూపయోగమైనది. మాంసమయమైన స్టూలదేహం అందరికీ గోచరిస్తూ వుంటుంది. దానిని శాపాలూ, శ(స్తాలూ, అభిచారాది విద్యలూ సైకొంటాయి. సామర్హ్యంలేని దీనమైన ఈ స్ఫూలళరీరం క్షణభంగురం. అది తావురాకుపై నీటిలాగా చంచలమైనది. 'ప్రారబ్దకర్మాదుల కధీనమై బాధలకు లోనవుతుంది.
మనోమయమైన రెండవశరీరం దేనికీ లోబడదు. పౌరుషం అవలంబించి ధైర్యంతో వుంటే వునోదేవానికి ఏ దుఃఖాలూ సోకవు. అది ప్రయత్నానికి
ఉత్పత్తి ప్రకరణం 205 అనుగుణమైన రూపం పొందుతూ వుంటుంది. తొననుకొన్న పనులు సాధించ గల్గుతుంది.
స్టూలళరీరం చూపే పౌరుషం వలన ఏదీ ఫలించదు, మనళ్ళరీరం చేసే (ప్రయత్నా లన్నీ ఫలిస్తాయి. మనస్సు పవిత్రమైన చింతన కల్గివుంటే బండపై ప్రయోగించిన బాణాలలాగా దానిపై ప్రయోగించిన శాపాలన్నీ నిరుపయోగా అవుతాయి. శరీరం నీటిలో మునగనీ, లేక నిప్పులో కాలనీ, లేదా బురదలో పడనీ - మనస్సు దేనిని చింతిస్తుందో దానిని క్షణంలో పొందితీరుతుంది.
మునీంద్రా ! పురుష ప్రయత్నం గట్టిదైతే కోరిన ఫలం నిర్విఘ్నంగా చేతికి వస్తుంది. ప్రయత్నం కూడా మనోరూపమే కదా ! నకిలీ ఇంద్రుడు పౌరుషబలంతో చిత్తాన్ని ప్రియామయం చేశాడు. అందువల్లనే అతడు కించిత్తైనా దుఃఖం పాందలేదు. పూర్వం మాండవ్యమహర్షి పురుషప్రయత్నంతో చిత్తాన్ని రాగరహితంగా, నిర్భయంగా చేసుకొని శూలక్షేశాన్ని జయించగలిగాడు.
ద్నీర్ద తపుడనే బుషి తాను అంధకూపంలో పడినా మానసికంగా యజ్ఞాలు చేసి స్వర్గలోకం చేరుకొన్నాడు. ఐందవులు మానవులైనా ప్రయత్నాతిశయంతో కూడిన ధ్యాననిష్టతో (బ్రహ్మత్వం పొందగలిగారు. వారి (బ్రహ్మత్వాన్ని తాలగించే సామర్ధ్యం నాకు కూడా లేక పోయింది. పై చెప్పిన వారే కాక సావధానులైన ధీరులూ, సురలూ, మహర్షులూ అనేకులు ఉపాసనాజ్ఞాననిష్టలను వదలని చిత్తాలతో ఆత్మోన్నతి పొందారు.
తామరపూల దెబ్బలు శిలలను ఖండింప జూలవు. అలాగే అధులూ, వ్యాధులూ, శాపాలూ, రక్షపిశాచాడులూ స్వానుసంధాన పరమైన చిత్తాన్ని ఏమీ చేయలేవు. ఒకవేళ ఎవరైనా శాపాదులకు లోబడివుంటే, వారి పౌరుషానికి బలం చాలదని భావించాలి. సావధానమైన చిత్తం కలవాడెవడూ ఈ లోకంలో కలలో కూడా బాధలకు గురి కాడు. అందువల్ల మానవుడు తన మనస్సుతోనే తన మనస్సును సదా శుభమార్ల్గంలో ప్రవేశ పెట్టాలి.
మునీం(ద్రా ! బాలుడు భావించిన బేతాళంలాగా మనుజుని చిత్తంలో స్పురించిన దేదైనా గట్టిపడి క్షణంలో పెద్దదైపోతుంది. కుమ్మరి పనితనంవల్ల కుండ వుట్టివఎుద్దరూపాన్ని త్యజిస్తుంది. అదే రీతిగా వాసనాబలంతో వునస్పు పూర్వవాసనలను విడిచిపెడుతుంది. ్రేలితో కన్ను నొక్కుకొన్నవాడు ఒకే చం ద్రుల్లి
206 యోగాసిష్టం ఇద్దరు చంద్రులుగా చూస్తాడు. ఆవిధంగానే అనుసంధానబలంతో మనస్సు సూర్యబింబంలో కూడా రాత్రిని చూడగలదు. కేవలం కదలికతో నీరు ఎత్తైన అలగా రూపాందినట్లే కణంలో వునస్సు భావనాబలంతో ఆయా వస్తువులుగా రూపొందుతుంది.
ఈ మనస్సు దేనిని భావిస్తుందో అదిగానే రూపొందుతుంది. ఆ రూపంతోనే హర్షవిషాదాలను అనుభవిస్తుంది. అనుసంధానబలంతో చిత్తం చం(ద్రునిలో సైతం అగ్నిజ్వాలలను చూడగలదు. వాటితో ద్రమై పరితపించగలదు. ఊషరక్ష్నేత్రంలో కూడా రసాయనాన్ని త్రాగి తృప్తీ చెందగలదు. ఆకాశంలో సైతం మహావనాన్ని చూడగలదు. ఆ వనాన్ని సెరికివేసి మరల నాటగలదు.
ఇలా చిత్తం దేనిని సంకల్పిస్తుందో దానిని చూస్తుంది. ఈ జగత్తు సత్తూ కాదు, అసత్తూ కాదు అని చక్కగా గ్రహించి భేదభావనతో పరిచ్చిన్నమైన దృష్టిని పరిత్యజించు.
ఉత్పత్తి దర్శనం
వసిష్టుడు : - రామా 1 ఇలా భగవంతుడైన బ్రహ్మదేవుడు పూర్వం నాకు చెప్పాడు. ఆ విషయమే నీకు నేనిప్పుడు వివరించాను.
మొదట అవ్యాకృతమైన (బబ్రహ్మంనుండి నామసంబంధరహితమైన సూక్ష్మ (ప్రపంచం జనిస్తుంది. పిదప అదే తనకు తానుగా ఘనీభవించి సంకల్ప వికల్పరూపమైన మనస్సుగా రూపొందుతుంది. ఆ మనస్సు సూక్ష్మ భూతకల్పనతో వాసనామయమైన ఫురుషాకారం ధరిస్తుంది. దానినుండి తైజసుడైన పురుషుడు ఉదయిస్తాడు, అతడు 'బ్రహ్మ' అని తనకు పేరు పెట్టుకొంటాడు. రామా 1! అందుచేత ఈ పరమేష్టి ఆమనోరూపుడే అని గ్రహించు.
ఆ బ్రహ్మ సంకల్పమయుడు. అతడు దేనిని సంకల్పిస్తాడో దానినే దర్శిస్తాడు. అతడే అనాత్మయందు ఆత్మాభిమానం కల్గించే అవిద్యను పరికల్పించాడు. తద్ద్వారా కొండలు, కోనలు, సముద్రాలు మొదలైన జగమంతా పరికల్సితమయింది.
ఇలా ఈసృష్టి అంతా క్రమంగా బ్రహ్మతత్త్యంనుండే ఏర్పడింది. కాని కొందరు (ప్రధానం, పరమాణువులు మొదలైన ఇతరకా రణాలవల్ల ఏర్పడినట్లు భావిస్తున్నారు. రామచంద్రా ! సము(ద్రంనుండి అలల్టాగా ముళల్లోకాలలోని సమస్త పదార్దాలు
ఉత్పత్తి ప్రకరణం 207 ('బ్రహ్మంనుండే జనించాయి. ఈ రీతిగా వివర్తమా త్రమైన ఈ జగత్తుకు వాస్తవంగా ఉత్పత్తి అనేది లేదు. మనోరూపిణి అయిన చిత్తు అహంకార సమష్ట్య్యపాధిలో (బ్రహ్మకు ప్రవేశం కలిపించి హిరణ్యగర్భరూపం పొందింది. వ్యష్ట్యహంకారం ఉపాధిగా కల ఇతరమైన చిచ్చక్తులు (చిదాభాసులు) కూడా ఆ సర్వశక్తి స్వరూపమైన (బ్రహ్మంకంటే వేరైనవి కావు. జగత్తు స్థూలత్వం పాందేసరికి అవి పితామహరూపమైన మనస్సుతో భాసిస్తాయి. వేలకొలదిగా ఉన్న ఈచిదాభాసులే జీవులుగా వ్యవహరింపబడుతున్నారు.
ఆజీవరాసులు చిదాకాళం నుండీ వెలువడగానే వాయాకాళశంలోని భూతతన్మాత్రలు వాటిని చుట్టుకొంటాయి. తరువాత పదునాల్లు లోకాలలో వాసనానుగుణమైన కర్మలతో కూడిన జీవులు ఆయాభూతజాతికి చెందిన 'ప్రాణజ్తి ద్వారా స్టావర జంగమాలైన శరీరాలను ప్రవేశిస్తాయి. అక్కడ రేతస్సు, రక్తం మొదలైన బీజరూపాలను పొందుతాయి. ఆపై వివిదటెోోచుల నుండి జనించి వాసనానురూపమైన కర్మఫలాలను పొందుతాయి. తదుపరి వాసనావళితమైన కర్మపాశాలతో బద్రశరీరాలై తిరుగుతూవుంటాయి. ఉత్తమలోకాలకు ఎగురుతూ, ఆధోలోకాలకు పడిపోతూ వుంటాయి.
ఈ భూతజాతు లన్నీ ఇచ్చామా(త్రమే కాని మరేమీ కావు. కొన్ని బీవులు కర్మ వాయువుల (ప్రేరణకు లోనై అడవిలో సుడిగాలికి పరిభ్రమించే ఆకుల్దాగా వేలకొలది జన్మలు పాందుతూ తిరుగుతుంటాయి. చిత్సత్తను తెలియ లేక మరికొన్ని జీవులు మోహానికి లోబడి అనేక కల్పాల కాలం ఈ లోకంలో జన్మిస్తూ వుంటాయి. ఇంక కొన్ని జీవరాసులు మనోహరమైన జన్మలు పొంది శుభకర్మలు చేస్తూ విహరిస్తూ వుంటాయి. ఇలాంటి జీవులకు త్వరలో ముక్తి కలుగుతుంది. మరికొన్ని విజ్ఞాన స్వరూపం తెలుసుకొన్నవై సముద్రంలో గాలి కెగిరిన జలబిందువులు మరల ఆసము(ద్రంలోనే పడినట్టు పరమపదం చేరుకొంటాయి. ఇలా సకల జీవుల ఉత్పత్తి ('బ్రహ్మపదం నుండే కల్గింది.
రామభ(ద్రా ! ఈ సంసారమనే జ్వీర్ణుంత వాసనావిష వైషమ్యం కల్గివున్నది. అంతు లేని సంకటాలకూ, అనర్జాలకూ కారణమై వున్నది. నానాద్లోశాలకూ ఎగటబ్రాకి కొండ గుహల్లో చరిస్తున్నది. తత్త్వ సాక్షాత్కార మనే కుఠారంతో నరికివేస్తే ఈ తీగ మళ్ళీ మొలకెత్తదు.
౯23
208 యోగూపిష్టం టబ్రహ్మనుండి సర్వోత్పత్తి
రాఘవా 1! సత్తాదులైన గుణభేదాలు కారణంగా ఉత్తమౌలు, మధ్యమాలు, అధమాలు అయిన జీవోపాధుల ఉత్పత్తికి చెందిన విభాగాన్ని వివరిస్తాను, విను.
పూర్వకల్పంలోని చివరి జన్మలో శమదమాది గుణసంపన్నుడైన జీవుడు ఏదో ఒక ప్రతిబంధంచేత ముక్తి పాందలేకపోతాడు. అతడు ఈ కల్పంలో మళ్ళీ తొల్లిటి శుభ వాసనలతో ఉత్పన్ను డవుతాడు. అతని ఉత్పత్తి “ఇదం (ప్రథమం' అనబడుతుంది. అట్టివాడు ఈ జన్మలోనే ముక్తు డవుతాడు.
ఈ ఉత్పత్తికి కాస్తా సంసారవాసన కూడా తోడై ముక్తి కొంత దూరమైతే - అట్టి ఉత్పత్తిని 'గుణపీవరి' అంటారు. సుఖదుఃఖాలకు కారణాలైన పుణ్యపాపాలను అనుమానింపజేస్తూ సత్తాతి రేకంవల్ల ముక్తి నూరు జన్మల దూరంలో కలో పరిస్టితి ఏర్పడితే అలాంటి ఉత్పత్తి 'ససత్త్వ'* అనబడుతుంది.
సంసారవాసనతో పాటు కాలుష్యం పాలు ఎక్కుడై వెయ్యి జన్మలకు గానీ ముక్తి పొందడానికి వీలుగాని ఉత్పత్తి 'అధమసత్త్వ' అవుతుంది. లెక్కింప వీలుగానన్ని జన్మల తర్వాత కూడా ముక్తి సంశయాస్పదమైన ఉత్పత్తిని 'అత్యంతతామసి' అంటారు. పూర్వకల్ప వాసనల కనుగుణమై ఈ కల్పొనికి చెందిన మనుష్యాది రూపమైన ఉత్పత్తి ' రాజసి' అని వ్యవహరింపబడుతుంది. ఇందులో కూడా మోతం సంశళశయాస్పదమే.
రాజసదుఃఖానుభవంవల్ల వైరాగ్యం కల్గించి త్వరలో జ్ఞానం సిద్రింప జేసి తద్ద్వారా ముక్తి హేతువైన ఉత్పత్తి 'రాజససాత్త్వికి' అనబడుతుంది. అదే మరికొన్ని జన్మల్లో మోత్షం ఇవ్వగల్లితే 'రాజసరాజసి' అవుతుంది. అదే నూరు జన్మల్లో మోక్షమిస్తే 'రాజ తామసి' అనబడుతుంది. వేల కొలది జన్మల్లో సైతం మోక్షం సంశయాస్వదమైన ఉత్పత్తి 'రాజసాత్యంతతామసి' అనబడుతుంది.
వేలకొలది జన్మల తర్వాత చిరకాలానికి మోక్షం కల్గించే ఉత్పత్తిని మహర్షులు “తామసి' అన్నారు. ప్రహ్లాదాదులకు లాగా తామసమైన మొదటి జన్మలోనే మోక్షం సిద్రిస్తే అది 'తామస సత్త్వ" అవుతుంది. కొన్ని జన్మల తర్వాత ముక్తి చేకూరే పక్షంలో “తమోరాజసి' అనబడుతుంది. వేలకొలది జన్మలు గడచిన పిదప కూడా రానున్న వందలకొలది జన్మల్లో సైతం మోక్షానికి యోగ్యం కాని ఉత్పత్తిని 'తామసతామసి' అంటారు.
ఉత్పత్తి ప్రకరణం 209
ముందు లక్షలకొలది జన్మలు గడచిన ఆపై రానున్న లక్షల కొలది జన్మల పిమ్మట కూడా మోక్షం సంశయాస్పదమైన ఉత్పత్తి 'అత్యంతతామసి' అని పేర్కొన బడుతుంది.
ఇలా ఉత్పన్నమయ్యే ఈ ప్రాణికోట్టన్నీ బ్రహ్మం నుండి కలిగేవే.
చలించే సము(ద్రం నుండీ అలల్లాగా, తేజోవంతమైన దీపం నుండి కిరణాల రీతిగా (బ్రహ్మంనుండే జీవరాసులన్నీ ఉదృవించాయి. జ్వలించే అగ్నినుండి మిణుగురుల వలె చంద్ర బింబంనుండి కిరణాల మాదిరిగా బ్రహ్మంనుండే బీవజాలమూ, దృిశ్ళప్రపంచమూ ఉత్పన్నమయ్యాయి. వృత్షంనుండి కొమ్మల వలె బంగారు నుండి అభరణాలవలె, సెలయేటి నుండి నీటి తుంపురులవల్సె అజుడైన పరమాత్మనుండి జీవపంక్తులు ఉదయించాయి. మహాకాశంనుండే ఘటాకాశం మొదలైనవి ఉత్పన్నమైనట్టు బ్రహ్మ పదంనుండే లోకాలు జనించాయి. సూర్యతేజం కంటే ఎండమావులు వేరు కావు. ద్రష్ట కంటే దృశ్యాలు భిన్నం కావు.
ఈ జీవసంతతి ఏ (బ్రహ్మంనుండి జనిస్తున్నదో, అందులోనే చివరికి లీనమవుతున్నది. అయితే కొందరు జీవులు వేలకొలది జన్మల తర్వాత, మరి కొందరు కొద్దిపాటి జన్మల పిదప అందులో లయమవుతుంటారు. ఇలా ఈశ్వరేచ్చ వల్లనే వివిధ జగత్తులలో చిత్రవిచిత్ర రూపాలైన జీవజాతులు అగ్ని నుండి ఉద్భవించే మిణుగురుల గుంపుల లాగా వస్తూ, పోతూ, పడతూ, లేస్తూ వుంటాయి.
కర్మ పురుషుల ఏకత్వం
రామా! చెట్టు నుండి పూవు, తావి లాగా కర్త, కర్మ అనేవి రెండూ ఒక్కటిగా ఒకే బ్రహ్మం నుండి వెలువడ్డాయి. నిర్మలాకాళంలో కంటికి నీలవర్హం స్ఫురిస్తుంది. అదేరీతిగా సంకల్ప రహితమైన బ్రహ్మమునందు అజ్ఞానికి జీవజాలం గోచరిస్తున్నది. అజ్ఞాను లెకడ ఉంటారో, అక్కడే '“బ్రహ్మంనుండి జీవులు పుట్టారు” అనే మాటలు వినబడతాయి. విజ్తాను లున్నచోట ''బ్రహ్మంనుండి ఇది పుట్టింది, ఇది పుట్టులేదు'' అనే ఈలాటి మాటలు చెల్లవు.
రాఘవా ! ద్వితీయకల్పన అనేది లేకపోతే లోకంలో ఉపదేశ్యోప దేశకభావం (గురుశిష్య భావం) రాణించదు. అందువల్ల వ్యవహారదళశలో శోచనీయమైన ఈ ద్వైత కల్పనను అంగీకరించి '“ఇది బ్రహ్మం, వీరు జీవులు” అని చెప్పక తప్పుదు.
210 యోగవాసిష్టం సంగరహి తమైన (బ్రహ్మంనుండి జగత్తు ఉదయిస్తున్నది. దేనినుండి ఏది పుట్టిందో, ఆ పుట్టిన వస్తువు ఉపాదానం కంటే వేరు కాదు. పుట్టుకకు ముందు ఉపాదానములో ఏది ఉన్నదో, అదే పుట్టిన తర్వాత కార్యరూపంలో ఉంటుంది. అందుచేత భ్రాంతివల్ల కనిపించే ఈ జగత్తు బ్రహ్మమే అన్న జ్ఞానం ఉపదేశంద్వారా (క్రమంగా సిద్దిస్తుంది. మేరు మందర పర్వతాలవంటి పెక్కు జీవకోట్లు ఆ బ్రహ్మమునందే పుట్టి పుట్టి అందులోనే లయమవుతున్నాయి. దశదిశల్లోని చెట్లలో చిగురు టాకుల్లాగా లెక్కకు మిక్కుటమైన ఈ జీవజాలాలు ఇలా ఉదయిస్తూనే వున్నాయి. ఇలా పరమాత్మలో జీవజాలాలు త్రికాలాలలో పుట్టి పెరిగి లయం కావడం జరుగుతూనే వుంది.
రామా ! పుష్పానికి, గంధానికీ లాగా పురుషునికీ, కర్మకూ తేడా లేదు. పరమాత్మ నుండీ పుట్టి అవి అందే లీనమవుతున్నాయి. జగత్తులో దైత్యులు, దేవతలు, నరులూ, ఉరగులూ నిజంగా ఉత్పత్తి లేనివారైనా వాససామయమైన భౌతికోపాధులతో మాటిమాటికీ స్ఫురించడం చూస్తూనే వున్నాము. సాధుశీలుడవైన ఓరామా ! ఈ జీవులంతా ఇలా జన్మపరంపరల్లో పరిభ్రమించడానికి కారణం ఆత్మవిస్మరణమే కాని మరేమీ కాదు.
శ్రీరాముడు : - ధర్మాధర్మ విషయాలలో వీతరాగులూ, ప్రామాణికదృష్టి గలవారూ అయిన మహనీయులు ఏదేది న్మిర్ణయిస్తారో అదే శాస్త్ర మనబడుతుంది, మహాసత్త్వ గుణంకలవారూ, సమదృష్టి సంపన్నులూ, (బబహ్మసాక్షాత్కారం పొందినవారూ అయిన ధీరులు సాధువు లనబడతారు.
సమస్త కర్మ సాధన విషయంలోనూ తత్త్వం తెలియనివారికి పైసాధువుల వర్తనమూ, శాస్త్రమూ అనేవి రెండూ రెండు కన్నుల వంటివి. సదత్ర్రవర్తన విషయంలో శాస్త్రం పాటించనివాణ్లీ అందరూ బహిష్కరిస్తారు.
(ప్రభూ | కర్త, కర్మ - అనేవి ఒకదానివల్ల మరొకటి ఏర్పడుతున్నవనేది లోకవేదసిద్రమైన సత్యం. అంటే కర్మ వల్ల కర్త ఏర్పడుతున్నాడు, కర్త వల్ల కర్మ జరుగుతున్నది. బీజాంకురాలకు లాగానే ఇది లోకవేదసిద్దమైన న్యాయమై వున్నది. విత్తనం నుండి మొలక పుట్టినట్టు కర్మ వల్ల ప్రాణి జన్మిస్తున్నది. మళ్లీ అంకురం నుండి బీజంలాగానే ప్రాణినుండి కర్మ ఏర్పడుతున్నది. జంతువు ఏవాసనతో
ఉల్స్పత్తి ప్రకరణం 211 సంసారవునే పంజరంలో ప్రవేశిస్తున్నదో, ఆవాసనకు తగిన ఫలమే అది అనుభవిస్తున్నది.
ఇది ఇలా వుండగా జన్మకు బీజమైన కర్మలేకుండగనే భూతకోట్టు బ్రహ్మపదంనుండి పుడుతున్నాయని మీరు ఎలా చెప్పగల్లుతున్నారు? భగవ౯! మీ పక్షాన్ని ఆ(శ్రయించి చూస్తే జన్మ కర్మల పరస్పర హేతు సలత్వం తిరస్కరింపబడుతున్నది. కారణ రహితమైన బ్రహ్మంలో ఆకాశం మొదలు, స్టూలదేహం వరకూ భోగాయతనమైన సృష్టి అనే ఫలం ఉన్నదనీ, తతృ్సలమైన (బ్రహ్మాదులలో భోగమూ, దానికవసరమైన సామగ్రి సృష్టి అనే ఫలమున్నదనీ చెప్పేలోక ('ప్రవాదాలు రెండింటినీ మీరు మీ వాదంతో తుడిచివేశారు.
మీరు చెప్పినట్టు కర్మలు ఫల'ప్రదాలు కాకపోతే లోకంలో సంకరం కల్గుతుంది. మౌాత్స్యన్యాయం ప్రబలుతుంది. బలవంతులు బలహీనులను కబళించివేస్తారు. ఇక మిగిలేది వినాశమే 1
తత్త్వజ్ఞాడవగు ఓ (బ్రహ్మర్షీ ! అందువల్ల చేసిన కర్మ ఫల మిస్తుందో లేదో నిష్కర్షగా తేల్చి చెప్పి నా సందేహం తొలగించండి !
వసిష్టుడు : - రాఘవా ! చక్కగా ప్రశ్నించావు. చాలా మంచి 'ప్రళ్ళీ. నీకు జ్ఞానోదయం కలోలా దీన్ని వివరిస్తా, విను.
'శ్రియాకౌశలం ప్రదర్శించే మనో వికాసమే కర్మలకు బీజం. ఫలం కూడా దానికే చెందుతుంది. (బ్రహ్మపదంనుండి వునస్తత్త్వం ఉదయించిన నాడే జంతువులకు కర్మ సిద్దమయింది. జీవుడు దేహభావం కలవాడయ్యాడు. పుష్పానికీ, అందలి సుగంధానికీ భేదం లేనట్లే కర్మకూ, చిత్తానికీ భేదం లేదు. క్రీయాస్పందమే కర్మ అని పండితులంటారు. దానికి మనస్సే మొదటి రూపం. అందువల్ల మనస్సే కర్మ. కొండ, సముద్రం, ఆకాశం, స్వర్గం - ఎక్కడైనా మనం చేసే కర్మలకు ఫలం తప్పదు. ఈ జన్మలో కానీ, లేక పూర్వజన్మలో కానీ మనం సావధానంగా చేసే కర్మే పురుషప్రయత్నం. అది ఎప్పుడూ నిష్పులం కాదు. నలుపుదనం నశించడంతో కాటుక కూడా నశించినట్లే స్పందరూపమైన కర్మ నళిస్తే మనస్సు కూడా నశిస్తుంది. మనోనాళశమంటే అకర్మత్వమే. ఇది ముక్తునికే కల్గుతుంది కాని బద్దునికి కల్లదు. నిప్పూ, వేడిమీ లాగా చిత్తమూ, కర్మా సదా కలిసే వుంటాయి. వాటిలో ఒకటి లేదంటే రెండూ లేనట్లే.
212 యోవాసిష్టం
రామా! చిత్తం స్పందనకు లోనై ధర్మాధర్మ రూపమైన కర్మగా పరిణమిస్తున్నది. కర్మ ఫలానుభవానికి తగిన చిత్తంగా రూపాందుతున్నది. ఈ రీతిగా అవి రెండూ పరస్పరాశ్రయాలు. అవి ధర్మ కర్మ శబ్దాలతో వ్యవహరింపబడుతున్నాయి. ఇక్కడ నామఖేదనే కాని వస్తుభేదం లేదు.
మన:ఃసంజ్ఞా విచారం
మనస్సు భావనామా(త్రమే. చలనరూపమైన భావనే క్రియ అనబడుతుంది. దాని భావిరూపమైన ఫలాన్ని (సతివాడూ అనుభవిస్తూనే వున్నాడు.
శ్రీరాముడు : - బ్రహ్మ౯! జడమైకూడా చేతనాకృతిగల చిత్తము యొక్క సంకల్పాత్మకమైన స్వరూపాన్ని నాకు ఇంకా విశదంగా వివరి. చండి.
వసిష్టుడు : - అనంతమూ, సమస్త శక్తీయుక్తమూ- ఎయిన ఆత్మతత్త్యము యొక్క మొదటిదైన సంకల్పాత్మకరూపవే మనస్సు. సదసత్తుల వుధ్య ఊగిసలాడుతూ ఆ రెండిటినీ స్మరింపజేసే భావానికే మనస్సుని పేరు.
ఆత్మ విషయంలో 'నాకిది తెలియదు” అన్న ప్రతీతి, తాను కర్త కాకున్నా “నేనిది చేస్తున్నాను" అన్న నిశ్చయమూ దేనివల్ల కల్గుతున్నవో, అదే మనస్సు. గుణం లేకుండా గుణి వుండడు. అచే రీతిగా కల్పనామయమైన కర్మశక్తిలేని మనస్సు ఉండదు.
అగ్ని కం-. వేరుగా వేడి లేదు. అట్లే కర్మకంచే, బీవునికంచే భిన్నంగా మనస్సు లేదు. సంకల్పమే శరీరంగా కల్గి నానాఎధాల విస్తరించే స్వభావం కల చిత్తరూషమే కర్మ. అట్టి ర్మ చేతనే కారణరహితమూ, మాయామయమూ, వాసనాకల్పనలచే వ్యాకు. మూ అయిన ఈ విశ్వం విస్తరింపజేయబడింది.
ఎవడు ఏవిధమైన వాసన కల్షివుంటాడో, వాడు ఆవిధమైన ఫలమే పాందుతాడు. వాసనామయమైన వృక్షానికి కర్మే బీజం. చిత్తస్పందమే శరీరం. పలురకాల (క్రియలే కొమ్మలు. దాని ఫలాలు చిత్రవిచిత్రాలు. మనస్సు సంకల్పించిన దానినే కర్మేంద్రియవృత్తులు నిర్వర్తిస్తుంచాయి. అందువల్ల కర్మే మనస్సు.
మనస్సు, బుద్ది, అహంకరం, చిత్తం, కర్మ, కల్పన, సంస్మృతి, వాసన్మ ఎద్య, పస్మ్ట్రత, మలం, ఇంద్రియం, ప్రకృతి మాయ, క్రియ - ఇవీ ఇలాంటివే అయిన "లీ వునస్సుకు నావాంతరాలు. వీటికి కారణం సంసారి భాంతి.
ఉల్పత్తి ప్రకరణం 213 కాకతాళీయంగా స్వరూపవిస్మరణ కల్లడంవల్ల చిద్రూపం వదలి బాహ్యకల్పనల ననుసరించి పయనించే చిత్తుకు పైన పేర్కొనబడినవన్నీ పర్యాయవృత్తులే.
శ్రీరాముడు : - బ్రహ్మ౯! విశుద్రచైతన్యానికి చెందిన ఈ పర్యాయవృత్తులు విచిత్రారకల్పనతో ఎలా రూఢి పొందాయి?
వసిష్టుడు : - రామా ! విశుద్రచైతన్యం అవిద్యచే మలిన మయింది. వివిధ కల్పనలతో నానారూపంగా పరిణమించి *మనస్సు' గా రూపొందింది. అలా వికల్పించిన తర్వాత విశేషభావనా బలంతో ఒక నిళ్ళ్చయానికి వచ్చి వస్తువుల నిజరూపాన్ని గ్రహించగల ఫ్రితిలో ' బుద్ది అయింది. మిథ్యాభావనతో తన్ను దేహాదిలుగా భావించుకొని అహంకరించే తత్త్వాన్ని 'అహంకారూ మంటారు. అవ్ని అనర్హాలూ కల్గించే సంసారబంధానికి కారణ మదే. బాలునిలాగా పూర్వాపరవిచారం లేకుండా అది విడిచి ఇది గ్రహించే సంవేదనను 'చిత్త మంటారు. "
చంన ధర్మం తనపై ఆరోపించుకొన్న కర్తకు చలనఫలాన్ని అందజేసే ప్రక్రియకు “కర్మ' అని పేరు. ఆకస్మికంగా తన పూర్ణస్వరూపం మరచి పరిచ్చిన్నభావం కల్పించుకొంటే అది 'కల్పన' అవుతుంది. తాను పూర్వం చూచినా చూడకున్నా “చూచినాను' అన్న నిశ్చయంతో తనలో కల్లే భావన “స్కృతి' అనబడుతుంది. (మింగిన పదార్దాలలాగా కనిపించకుండా పోయిన పదార్దాల శక్తులు అతిసూవ్మమైన భావనా ప్రపంచంలో నివసించడాన్ని 'వాసన' అంటారు. పరిశుద్రమైన ఆత్మతత్త్వం ఒక్కటే ఉన్నది. అవిద్యవల్ల కల్గిన ఈ (ప్రాపంచిక దృశ్యం సత్యం కాదన్న జ్ఞానమే “విద్య” అవుతుంది.
ఆత్మ వినాశకరమైన మరపే ' విస్కృతి'. దాని ఆవరణశక్తినే 'మల' మంటారు. తాకి, చూచి, తిని, మూర్కొని, విమర్శించి ఇంద్రు డనబడే పరమేశ్వరువికి ఆనందం కల్లించే సాధనం “ఇం(ద్రియ* మవుతుంది. ఉపాదానమూ, కర్తా తానుగానే వుండి ఈదృశ్యజగత్తును పరమాత్మ నిర్మిస్తున్నాడు. అందువల్ల ' ప్రకృతి" అనే వ్యవహారం కల్గింది. ఉన్నదాన్ని లేనిదిగా, లేనిదాన్ని ఉన్నదిగా చేస్తూ కలిమిలేములనే వికల్ఫాలకు హేతువయి*నదే 'మాయి. దర్శనం, శ్రవణం, స్పర్శనం, రసనం, 'ఘాణం మొదలైన కర్మలచే కార్యకారణభావాన్ని పొందేది ' క్రియ”.
విషయదోషం వల్ల మలినమైన స్ఫురద్రూపంపాందిన వైతన్యానికే ఇవన్నీ మారు పేర్డు. చిత్తరూపం పొంది సంసారంలో తగుల్కొాన్న చైతన్యానికి చెందిన ఈ
214 యోగవాసిం నామాంతరాలన్నీ నిజసంకల్పబలంతోనే అలా యోగరూఢిని పొందాయి. అజ్ఞానంవల్దా, లేదా విషయదోషంవల్లా స్వస్వరూపంనుండి ్రష్టమై చైతన్యం వికలమయింది. లోకంలో జీవుడనీ, మనస్సనీ, చిత్తమనీ, బుద్ది అనీ పలురకాలుగా అదే వ్యవహరింపబడుతున్నది. అవిద్యచే మలినమై పరమాత్మ ఫ్రితినుండి జారిన వైతన్యానికి ఈ వ్యవహారాలన్నీ ఆయాసంకల్పాల ననుసరించి యేర్చడినవే. శ్రీరాముడు : - (బ్రహ్మర్షీ! తత్త్యజ్డా ! ఈమనస్సు చేతనమా ? లేక జడమా? ఈవిషయంలో నాకొక నిశ్చయం కల్లడం లేదు. వసిష్టుడు : = రామా! మనస్సు జడమూ కాదు, చేతనమూ కాదు. సంసార దశలో ఉపాధిచేత మలినమైన చైతన్యమే మనస్సు అని చెప్పబడుతుంది అది సదసత్తులకు విలక్షణమైనది. అవిద్యా కళంకితమైన ఆ చిత్తమే ఈ జగత్తు కంతటికీ కారణం. శాశ్వతమూ, ఏకరూపమూ అయిన నిశ్చయం లేని స్రితి కేది కారణమో దానినే చిత్తమన్నారు, ఈ జగత్తు దానినుండే వచ్చింది. అహంకారం, మనస్సు, బుద్ది, జీవుడు మొదలగు ఈ విచిత్రమైన పేర్లన్నీ దానికి చెందినవే. నటుడు నానారూపాలు ధరిస్తాడు, వివిధచేష్టలు చేస్తాడు. అలాగే మనస్సు రకరకాల పేర్లు కలదై పలుక్రియలు చేస్తూ వుంటుంది. ఒకే వ్యక్తి అధికారభేదం వళ్ల అనేకమైన పేర్డు పొందినట్లే మనస్సు కూడా కర్మభేదం వల్ల వివిధ నామాలు పొందుతుంది. రాఘవా ! నేనిప్పుడు చెప్పిన మనస్సుకు చెందిన ఈ పేర్షనే మతవాదులు నానాకల్పనలతో మరాకరీతిగా పేర్కొంటున్నారు. వారివారి స్వభావానికి చెందిన బుద్ది ననుసరించి మనోబుద్ల్దీం[ద్రియాదులకు చిత్ర విచిత్రమైన వ్యవహారాలు కలిగాయి. ఒకడు వునస్సు జడవుంటాడు. వురొకడు జీవునికంటె అది భిన్న మంటాడు. ఇంకొకడు దానినే అహంకార మంటాడు. వేరొకడు బుద్ది ఆంటాడు. రఘునందనా! నేను ఒకే రూపంగా పేర్కొన్న అహంకారం మొదలైన వన్నీ సంకల్పాది వృత్తిభేదాలచే ఏర్పడినవే. వీటిని నైెయాయికు లొకరీతిగా, సాంఖ్యులు వేరొక ఏధంగా, చార్వాకులు మరొక పద్దతిగా ఎవరిందారు. అలాగే జైమినీయులు, అక్హ్ర్హతులు, బౌద్దులు, వైశేషికులు, పాంచరా ('ర్రులు మొదిలైనవారు కడ నానా శిధకిల్పనలు చేశారు.
ఉత్పత్తి ప్రకరణం 215 బాటసారులు ఏ మార్గం అనుసరించినా చివరికి ఒకే (ప్రధాననగరం చేరుకొంటారు. అదే విధంగా పైన పేర్కొన్న వారందరూ ఒకే ఒక పారమార్ధికపదాన్ని చేరవలసివున్నారు., ఆరురుక్షువులైన వీరు పరమార్ధ స్వరూపం తెలియకపోవడం వల్దా, విపరీతజ్ఞానం వల్హా నానావికల్పాలతో వివాదాలు చేసుకొంటున్నారు. పథికులు తాము అనుసరించిన బాటే (శ్రేష్టమన్నట్టు ఈ వాది (ప్రతివాదులు కూడా తమతమ పక్షమే గొప్పదని ప్రకటించుకొంటారు. ఫురుషుడు స్నానం, దానం మొదలైన క్రియలు చేస్తూ భిన్నభిన్న కర్తృత్వం వహిస్తాడు. అలాగే మనస్సు క్రియాభేదంవల్ల పలురకాల కర్తృత్వం పొందుతున్నది. కార్యభేదాన్ని బట్టే నామభేదమూ, కర్తృభేదమూ సిద్దిస్తాయి. మనస్సు, జీవుడు, వాసన, కర్మ మొదలైన పేర్గు ఏర్పడటానికి కారణ మిదే. ఇదంతా చిత్తమే. ఇది ప్రతివాని అనుభవములోనూ ఉన్నది. చిత్తమే లేని మనుజుడు ఈ లోకాన్ని చూచినా చూడనివాడే కదా! మనస్సు కలవాడు మాత్రమే శుభాశుభాలను చూచి, తాకి, విని, తిని, మూర్కొని లోపల హర్ష విషాదాలు పొందుతాడు. రూపాలకు (ప్రకాశం కారణమైనట్లే పదార్జాలకు చిత్తం కారణ మవుతున్నది. బద్దచిత్తుడు బంధాన్నీ, ముక్తచిత్తుడు ముక్తినీ పొందుతాడు. జడుని దృష్టికి మనస్సు జడమే. చైతన్యవంతుడు మనస్సును జిడమని భావింపడు. విచిత్ర సుఖదుఃఖాలు కల ఈ మనస్సు జడమూ కాదు, చేతనమూ కాదు. అది ఉదయించినప్పుడే జగత్తు కూడా ఉదయిస్తున్నది. మనస్సు అద్వితీయ (బ్రహ్మరూపమైతే సంసారాన్ని నశింపజేస్తుంది. కలుపీతమైతే కారణరూపమై (భ్రాంతి గల్లించి జగత్తును గోచరింపజేస్తుంది. జాడ్యం లేని చిత్తం సంసారానికి హేతువు కాదు. రాయివలె జడమైన చిత్తం కూడా సంసారహేతువు కాజాలదు. అందువల్ల అటు చేతనమూ, ఇటు జడమూ కాని మనస్సు రూపాలకు మలిన తేజస్సులాగా సర్వపదార్థ్హాలకూ కారణ మవుతున్నది. చిత్తం లేకపోతే జగత్తు లేదు. చిత్తరహితమైన ప్రాణికోటికి జగమంతా ఉనికిలేని దైపోతుంది. అందువల్ల చిత్తమే జగత్తు. కాలమంతా ఒక్కటే ఐనా బుతుభేదంవలి వివిధ రూపాలు పాందినట్లే ఒకే మనస్సు నానాకర్మల వల్లి వివిధ నామాలు ధరిస్తున్నది. మనస్సుతో పని లేకుండానే అహంకారం, ఇం(ద్రియాలు, క్రియలూ శరీరాన్ని షభింపదేసే పక్షంలో వునస్సుకంటే అవి వేరుగా వున్నాయని
216 యోగాసిం నిర్ణయించవచ్చు. కుతర్కాలతో ఆయామతవాదులు పేర్కొనే భేదాలు వాస్తవాలు కావు. వారు తత్త్వజ్ఞాలూ కారు, తత్త ఫజ్ఞాలనుండి శిక్షణ పాందినవారూ కారు.
శుద్రవైతన్యంలో ఎప్పుడు జడత్వశక్తి ప్రవేశించిందో, అప్పుడే జగద్వైచిత్ర్యం భాసించింది. చేతనమైన సాలీడునుండి జడమైన తంతువు ఉదయిస్తున్నది. అదే'ప్రకారం నిత్య ప్రబుద్రమైన (బ్రహ్మమునుండి మనస్సు జనించింది. అవిద్యా (ప్రభావం వల్ల ఆయా మతవాదులకు భిన్నభిన్న మనోభావాలు కల్గుతున్నాయి. అందువల్ల వారు మనస్సు యొక్క పర్యాయవృత్తులను భిన్నభిన్నంగా భావిస్తారు.
అందుచేత మలినమైన వైతన్యమే జీవుడు, మనస్సు, బుద్ది, అహంకారం అని పేర్గు పొందింది. ఇందులో వివాద మేమీ లేదు.
. చిదాకాశ మాహాత్మ్యం
శ్రీరాముడు: - బ్రహ్మ౯! మీ ఉపదేశంవల్ల బ్రహ్మాండమంతా మనస్సునుండే ఆవిర్భవించిందనీ, అందుచే జగత్తు మానసికమైన క్రియే అనీ తేలింది.
వసిష్టుడు : - రామా 1 ప్రచండమైన ఎండచే ఏర్పడిన ఎండమావిలోని జలం సూర్య తేజాన్ని ఆవరించినట్లే ఆత్మ వైతన్య శక్తిచే ఏర్పడిన మనస్సు ఆత్మ ('పకాశాన్ని కప్పివేస్తున్నది.
(బ్రహ్మాత్మకమైన ఈ జగత్తులో మనస్సే జగదాకారం పొందుతున్నది. అది ఒకచోట మనిషిగా, మరొకచోట దేవతగా, ఇంకొకచోట రాక్షసుడుగా, వేరాకచోట యతక్షుడుగా రూస్రొందుతున్నది. గంధర్వ కిన్నరాదులుగా ఇతరత్రా భాసించేది కూడా అదే. ఆకాళం, థగరాలు, జనపదాలు మొదలైన వివిధాకారాలతో విజృంభించేది మనస్సే. ఇదీ పఠిఫ్రీతి. ఇందులో ఈ శరీరాలు తృణకాష్టలతల వంటివి. వాటి స్వరూపాలను (ప్రత్యేకించి విచారించినందువల్ల ప్రయోజన మేమి ? మనస్సును గూర్చిన విచారణ మౌత్రమే కర్తవ్యం.
ఈ జగత్తంతా మనోమయమే. ఇక దానికంటే భిన్నంగా మిగిలేది ఒక్క పరమాత్మ మాత్రమే. అది సర్వస్థానాలకూ అతీతం. అది సర్వానికీ ఆశ్రయమై సర్వత్రా వ్యాపించి వుంది. దాని అనుగ్రహంతోనే సంసారంలో మనస్సు కుప్పిగంతులు వేస్తున్నది.
ఈ మనస్సు మనస్సు యొక్క కర్మే అని నాభావన. శరీరాలకు కారణ మిదే.
ఉత్పత్తి ప్రకరణం 217 అది పుట్టి గిట్టుతూ వుంటుంది. ఆత్మలో ఇట్టి గుణాలు లేవు. విచారంతో మౌత్రమే మనస్సు నశిస్తుంది. మనస్సు నశించిన మీదటనే, ముక్తి సిద్దిస్తుంది. మనస్సు అనే కర్మ క్షీణిస్తే జీవుడు ముక్తు డనబడతాడు. అట్టివాడు మళ్ళీ జన్మించడు.
శ్రీరాముడు : - భగవః | మీరు జీవుల్లో సాత్తి సక్ - రాజస తామసాలనే మూడు జాతులను పేర్కొన్నారు. వాటికి ముఖ్యకారణం సదసదాత్మకమైన మనస్సే. జగత్కారణమైన మనస్సు బుద్ది రహితమైన శుద్ద వైతన్యం నుండి ఎలా జనించింది?
వసిష్టుడు : - శ్రీరామా 1! ఆకాశాలు మూడు రకాలు. అవి చిత్తాకాశం, చిదాకాశం, భూతాకాళం అని పేర్కొనబడుతున్నాయి. సర్వసామాన్యమైన ఈమూడాకాశాలూ సర్వత్రా ఉన్నాయి. శుద్రవైతన్యం వల్లనే వీటికి ఉనికి ఏర్పడింది. వెలుపలి వస్తువులు, లోపలి బుద్ద్యాదుల యొక్క ఉనికినీ, లేమినీ తెలియజేస్తూ సమస్త (ప్రాణుల్లో వ్యాపించి వుండేది చిదాకాశం. ప్రాణులన్నిటికీ హితమైనదీ, శ్రమైనదీ, కాలకలనాత్మకమైనదీ చిత్తాకాళ మనబడుతుంది. ఈ జగత్తంతా దానినుండే విస్తరించింది. దశదిశలనూ దాటి వ్యాపించినదీ, వాయుమేఘాదులకు నెలవైనదీ భూతాకాశ మనబడుతుంది.
భూతాకాశచిత్తాకాశాలు రెండూ చిదాకాశబలంవల కల్లినవే. పను లన్నిటికీ పగలు కారణమైనట్లే అంతటికీ చిదాకాశంలో ని వైతన్యాంశమే కారణ మవుతున్నది. “నేను జడుడను, జడుడను కాను" అనే చైతన్యము యొక్క మలిన నిశ్చయమే మనస్సు. దానివల్ల ఆకాశాదుల భావన జరుగుతున్నది. అ ప్రబుద్దులైనవారి ఉపదేశం కొరకే ఈ మూడాకాశాలనూ కల్పించడమయింది. (ప్రబుద్దులకు ఈ కల్పనతో పని లేదు. ఒక్క పరబ్రహ్మమే సర్వమూ. అంతటా నిండివున్నదదే. అది నిత్యం, భేదరహితం.
ద్వైతం, అద్వైతం మొదలైన వికల్పాలతోడి మాటలతో అజ్ఞునికే ఉపదేశం జరుగుతుంది. కాని విజ్ఞుడికి కాదు. రామా! నీకు జ్ఞాన ప్రాప్తి ఎంతవరకూ కల్లలేదో, అంతవరకే ఈ ఆకాశత్రయ కల్పన. నీకు జ్ఞానం కల్లడానికే నేనీ ఉపదేశం చేస్తున్నాను.
వురుభూమిలో దావాగ్నితో సమానమైన ఎండనుంజే ఎండవూవు లుత్పన్నమైనచ్చే, మాయాకళంకితమైన చిదాకాశంనుండి భూతాకాళ చిత్తాకాశాలు ఉద్భవించాయి. మాయామలినమైన వైతన్యం చిత్తత్వం పాంది మలినరూపాన్ని సంతరించుకొన్నది. అందువల్ల మూడులోకా లనే ఇంద్రజాలాలను కల్పిస్తున్నది.
218 యోగవాసష్థం మత్తెపుచిప్పలో రజతత్వాన్ని చూచినట్లే అజ్ఞానులు చిదాత్మకమైన తత్త్వంలో చిత్తత్వాన్ని దర్శిస్తారు. జ్ఞానులు అలా చూడరు, మూర్చత్వం వల్లనే బంధం. జ్ఞానబలం వల్ల కలోది మోక్షమే. చితోపాఖ్యానం వసిష్టుడు: - అనఘా! ఎక్కడనుండో అకస్మాత్తుగా ఉదయించిన ఈ చిత్తాన్ని (ప్రయత్నంతో ఆత్మవెోోక్షంకారకే వినియోగించాలి. పరవూత్మలో నియో గింపబడిన చిత్తం పరిశుద్రమై వాసనారహిత మవుతుంది. తర్వాత కల్పనలు లేనిదై ఆత్మగా రూపొందుతుంది. చరాచరాత్మకమైన ఈ జగమంతా చిత్తానికి అధీనమై వున్నది. అంచేత బంధమోక్షాలు కూడా స్పష్టంగా చిత్తానికి అధీనాలే. రామా 1! ఈ సంగతి నిరూపించటానికి పూర్వం బ్రహ్మదేవుడు చెప్పేన చిత్తాఖ్యానాన్ని వివరిస్తాను, సావధానంగా విను. రావుచం(ద్రా ! శూన్యవూ, అతి భయంకరవటా, సువిశాలమూ, శాంతిహీనమూ అయిన ఒక అడవి ఉన్నది. అందులో నూరు యోజనాలు విస్తరించిన నేల ఒక అణుమా(త్రంగానే కనిపిస్తుంది. అక్కడ అనేక హస్తాలూ, పలు నేత్రాలూ కలిగి వ్యాకులచిత్తుడై భీకరాకారుడైన ఒక విశాలకాయుడు ఉండేవాడు. వాడు తన భుజసహ(స్రంతో పెక్కు గుదియలు పట్టుకొని తన వీపును తానే మోదుకుంటూ పరుగెడుతూ ఉండేవాడు. అలా వందలకొలది యోజనాలు ఆక్రందన చేస్తూ పరుగెత్తేవాడు. అతడు చివరికి అలసిపోయి ఛిన్నాభిన్నమైన అవయవాలతో ఒకచోట వళం తప్పి అంధుడై కాళరాత్రి లాగా భీకరమైన అంధకూపంలో పడిపోయాడు. తర్వాత చాలా కాలానికి అంధకూపం నుండి వెలికి వచ్చాడు. మళ్ళీ తన్ను తాను కొట్టుకుంటూ పరుగులు ప్రారంభించాడు. బహుదూరం పరుూగెత్తిపోయి మిడుత అగ్నిలో పడ్డట్టు కంటకావృతమైన పొదలలో పడ్డాడు. మళ్ళీ ఆ పొదనుండి బయటపడి వీప్రూమోదుకుంటూ పరుగు తిశాడు. అలా చాలా దూరం పోయి వెన్నెల వలె చల్లనై మనోజ్ఞమైన ఒక అరటి తోటలో (ప్రవేశించాడు. ఒకత్సటిలో ఆ తోటనుండి వెలువడి తన్నుతాను బాదుకొంటూ పరుగులు తీశాడు. పరూత్రి మళ్ళీ ముందటి అంధకూపంలోనే పడ్డాడు. మళ్ళీ అక్కడనుండి
ఉత్పత్తి ప్రకరణం 219 వెలికి వచ్చి అరటి తోటలో ప్రవేశించాడు. తోటనుండి ముళ్ళ పాదకూ, పాదనుండి కూపానికీ, కూపంనుండి తోటకూ పరిభ్రమణ చేశాడు. ఇలా ప్రవర్తిస్తున్న ఆ మూర్చుళ్లి నేను చాలా సేపు పరిశీలించి చూచాను. చివరికి బలాత్కారంగా పట్టుకొన్నాను. ముందుకు పోనీకుండా క్షణకాలం అడ్డగించాను. “ఎవరు నీవు ? ఏమిటిది ? ఎందుకిలా చేస్తున్నావు ? నీకేమి కావాలి ? ఈ విధంగా ఎందుకు మోహితుడ వయ్యావు ?*' అని ప్రశ్నించాను. అపుడు వాడు నాతో యిలా అన్నాడు. '“ఓ మునీ! నేనెవడినీ కాను. నేనేమీ వేయటం లేదు. నీవు నన్ను చెడగొట్టావు. అయ్యో నీవు నాకు పరమ శత్రువవు. నీకంట పడ్డాను. అటు సుఖమూ, ఇటు దుఃఖమూ లేక నాశనమై పోయాను. ఇలా చెప్పే శిథిలమైన తన అవయవాలను చూచుకొని దీనుడై వర్షించే మబ్బు లాగా కన్నీరు కారుస్తూ కొంత సేపు బిగ్గరగా ఏడ్చాడు. ఒక క్షణంలో ఏడ్పు చాలించాడు. తన అవయవాలను చూచుకొని నవ్వుకొన్నాడు. వికటాట్టహాసం చేశాడు. ఆ తర్వాత నా ఎదుటనే క్రవుంగా తన ఆవనయవాలన్నింటి నీ పరిత్యజించాడు. మొదట పరమ దారుణమైన అతని తల క్రింద పడింది. తర్వాత చేతులూ, వకత్షప్రలమూ, పొట్టా జారిపడి పోయాయి. అలా నియతి ప్రభావంతో అతడు అంగాలను [క్రమంగా వదలి పెట్టి ఎక్కడికో పోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అటు పీమ్మట ఒక ఏకాంత ప్రదేశంలో నేను అలాంటి వాణ్లే మరొకడిని చూచాను. వాడు కూడా తన్ను తాను లావైన చేతులతో కొట్టుకొంటున్నాడు. నిలుపుదల లేకుండ పరుగులు తీస్తున్నాడు, కూపంలో పడుతున్నాడు. మళ్ళీ వెలుపలికి వచ్చి పరగెడుతున్నాడు. ముందటివాని లాగే ఆర్హుడై ఏడుస్తూ, నవ్వుతూ కొట్టుకుంటూ కనిపించాడు. నేను పూర్వం లాగానే వీల్లీకూడా పట్టుక్ న్నాను. అలాగే ప్రళ్నించాను. కానీ వీడు కూడా ఏడుస్తూ, నవ్వుతూ నియతి శక్తిని విచారించినవాడై అంగాలన్నీ విడిపోగా ఎక్కడికో పారిపోయాడు. మళ్ళీ ఏకాంతంలో అలాంటివాణ్లే మరొ కళ్లీ చూచాను. వాడు ముందటి వారి లాగే ప్రవర్తించాడు. పరుగెత్తి పోయి అంధకూపంలో పడ్డాడు. వెలికి వస్తాడేమో అని చూస్తూ నేను అక్కడే చాలా సేపు ఉండిపోయాను. ఎంతకూ వాడు వెలికీ రాలేదు. నేను నాదారిన పోవడానికి సిద్దమయ్యాను. ఇంతలో వాడు కనిపించాడు. ముందటి వారి లాగే ప్రవర్తిస్తున్నాడు. వాళ్ల కూడా పట్టుకొని మునుపటి లాగే
220 యోగవాసిష్టం (ప్రశ్నించాను.
రామా! నా ప్రశ్నలు వానికి అర్ధం కాలేదు. వాడు నావైపు చూచి “మూఢా! నీకేమీ తెలియదు, పాపాత్మా ! దుష్టబ్రాహ్మణా 1!” అని నన్ను నిందిస్తూ తనపని తాను చేసుకుంటూ వెళ్ళాడు.
అలా అడవిలో విహరిస్తూ నేను ఎంతో మంది అలాంటి పురుషులను చూచాను. అందరినీ అలాగే ప్రశ్నించాను. నా ప్రశ్న విని కొందరు బుద్దాత్ములై మిథ్యారూపమైన దేహం వదలి శాంతి పొందారు. కొందరు అంధకూపంలో పడుతూ లేస్తూనే ఉండిపోయారు. మరికొందరు అరటితోటలో దూరి ఎంతో సేపటికి గాని వెలికి వచ్చేవారు కారు. ఇంకొందరు ముళ్ళపాదల్లోనే మాటుమణిగి పోయేవారు. వేరుకొందరు కామ్యకర్మపరులు ఎక్కడా నిలకడ లేకుండా తిర్గేవారు.
"రామా ! ఆ విశాలమైన మహారణ్యం ఇలాంటి దృశ్యాలతో నిండివున్నది. అది యిప్పటికీ అలాగే వున్నది. అందలి పురుషులు ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. నీవు కూడా ఆ అడవిని చూచావు. కానీ నీ బుద్దితత్త్వం లేతది కావడం వల్ల నీవు దానిని స్మరించలేకుండా వున్నావు.
అది అతి భయంకరమైన అడవి. ముళ్ళపాదలతో నిండినది. గాఢ తమస్సుచే వ్యాప్తవైనది. జ్ఞునవిహీనులు అడవిలో (ప్రవేశించి దానినే సుందరమైన ఫుష్పోద్యానంగా భావించి సేవిస్తున్నారు.
శ్రీరాముడు : - బ్రహ్మర్షీ ! ఆ మహారణ్యం ఏది ? నేను దాని నెప్పుడు చూచాను? అక్కడి పురుషు లెవరు ? వారు ఎందు కలా (ప్రవర్తిస్తున్నారు ?
వసిష్టుడు : - రఘునాథా! అదంతా నీకు వివరిస్తాను, విను. ఆ మహారణ్యం కానీ, అక్కడి మనుష్యులు కానీ ఎక్కడో దూరాన లేరు. గంభీరమూ, అపారమూ అయిన ఈ సంసారమే ఆ మహారణ్యం. అది భ్రాంతితో చూస్తే పలు వికారాలు కలదిగా గోచరిస్తుంది. పరమార్ధ దృష్టితో పరికిస్తే శూన్యమై పోతుంది.
“ఒకే వస్తువు అంతటా వ్యాపించి వున్నది, తదితరమైన దేదీ లేదు” అనే విచారమనే వెలుగు ఎప్పుడు గోచర మవుతుందో, అప్పుడే ఆసంసారారణ్యం ఉనికీ లేని దవుతుంది. అక్కడ విశాలకాయులై పరిభ్రమించే పురుషులు దుఃఖంలో మునిగిన మనస్సులే అని తెలుసుకో. వారి పరిస్టితిని దర్శించిన నేనే వివేక మవుతున్నాను. వివేక రూపుడనైన నాకు తప్ప మరెవరికీ వారు కనిపించరు;
ఉత్పత్తి ప్రకరణం 221
సదా ప్రకాశించే సూర్యుడు కమలాలను మేల్కొలుపుతాడు. అలాగే విమలమైన వివేకం మనస్సులకు ప్రబోధం కల్గజేస్తుంది. మహామతీ | వివేకాను గ్రహంవల్ల తత్త్వజ్డూనం కల్గిన మనస్సులు ఉపశాంతి బొంది ముక్తి పాందాయి. మరికొన్ని మనస్సులకు వ్యామోహ ప్రభావం వల్ల నామాటల పట్లు ఆదరం కలగలేదు. అవి నన్ను తిరస్కరించి అంధకూపాలలో పడిపోయాయి. రఘువరా! ఆ అంధకూపాలే నరకాలు. అర టితోటలే స్వర్గాలు. స్వర్గాభిరుచి కల చిత్తాలు ఆ తోటల్లో ప్రవేశిస్తున్నాయి. అంధకూపాలలో పడి మళ్ళీ వెలుపలికి రాని మనస్సులు మహాపాతకంతో కూడినవి. అరటితోటల నుండి వెలికి రాని చిత్తాలు పుణ్యంతో నిండినవి. పులిగోరు పొదలలో దూరి బయటికి రాని మనస్సులు మానవజన్మ పాందినవని గ్రహించు.
రఘునందనా |! ఆమనుష్య జన్మ పొందినవాటిలో కొన్ని చిత్తాలు ప్రబోధం పాంది సంసారబంధంనుండి విడుదలయ్యాయి. మరికొన్ని ఒక జన్మనుండి మరొక జన్మ పొందుతూ పైకీ, క్రిందికీ (స్వర్గనరకాలకు) పరిభ్రమిస్తున్నాయి. మనుష్య జన్మే పులిగోరు పాద. అది దుఃఖాలనే ముళ్ళతో నిండినది. పలుకోరికలతో కూడి వున్నది. కుటుంబస్నేహంతో వృద్రి పొందింది. వునుజులుగా జన్మించి విషయాభిరుచి కల మనస్సులే ఆ పొదలలో దూరుతున్నాయి. చంద్రకిరణాల లె చల్లనిదైన అరటితోటే మనస్సుకు ఆవ్లాదం కల్లించే స్వర్గం.
శాస్త్ర విహితమైన ధారణ అనే ఉపాసనతో కొన్ని మనస్సులు అభ్యుదయ మందుకొని చిరకాలం ఉన్నతస్థితిలో ఉంటాయి. గ్రహాలుగా, సప్తర్హులుగా భాసించేది ఇలాంటి చిత్తాలే. నా మాటను తిరస్కరించిన చిత్తాలు తమ వివేకాన్నే తాము తిరస్కరించుకొన్నాయని (గ్రహించు. “నీ కంటబడీ నశించాను. నీవు నాకు శత్రువవు?" అని నన్ను తూలనాడిన చిత్తం తాను నశిస్తూ అలా యేద్భీందని తెలుసుకో.
రాఘవా! ఆర్తనాదం చేస్తూ ఏడ్చిన మనస్సు భోగజాలాన్ని వదలి పెడుతూ రోదనం చేసిందన్న మాట. సగం వివేకం కల్లి నిర్మలమైన తత్త్వస్థితిని పొందనేరని చిత్తం భోగాలనూ, అవయవాలనూ వదిలే సమయంలో ఎంతగానో పరితపిస్తుంది. కొంచెం వివేకం కల్లి కళత్రపుత్రాదులమీది స్నేహంతో ఏడుస్తూ తన శరీరాన్ని చూచుకొన్న చిత్తం ''అయ్యో కష్టం ! ఈ అవయవాలను వీడి పోవలసి వచ్చిందే?"
222 యోనాసిష్టం అన్న చింతకు లోనయిందని భావించు.
నా ప్రబోధంతో వికసించి హసించిన చిత్తం వివేకం కల్లి ఆనందించిన దన్న మాట. పూర్ణ వివేకం కల్లి సంసారస్థితిని పరిత్యజించిన చిత్తం తన ఉనికిని కోల్పోతున్నప్పుడు ఎంతో ఆనందం పొందుతుంది. ఆనందంతో నవ్వుతూ తన అంగాలను చూచిన పురుషుడు పూర్వం తన్ను మోసగించిన ఆ అవయవాలను చూచి పరిహసిస్తున్నాడని గ్రహించాలి. వివేకవంతమైన చిత్తం బ్రహ్మపదంలో విశ్రమిస్తుంది. అది తొల్లింటి తన దైన్యానికి హేతువులైన విషయాలను చూచి పరిహసిస్తుంది.
నేను బలాత్కారంగా ఒకళ్లి పట్టుకొని ప్రశ్నించానంటే - వివేకం చిత్తాన్ని బలాత్కారంగా గ్రహిస్తుందని భావం. అవయవాలు జర్హరితాలై చూస్తూ వుండగానే మాయమైనాయంటే చిత్తం ఉనికిలేనిది కాగానే అర్జాశ శమిస్తుందని తాత్పర్యం.
ఒకనికి వెయ్యి కళ్ళు. వెయ్యి చేతులు ఉన్నాయంటే - చిత్తం అనంతమైన ఆకారాలు కల్లి వుంటుందని భావం. పురుషుడు తన్నుతాను కొట్టు కొంటున్నాడంటే మనస్సు కుత్సితమైన కల్పనలచే తన్ను తాను బాధంచుకొంటున్నదని తాత్పర్యం. తన్ను తాను కొట్టుకొంటూ ఒకడు పరుగుదీస్తున్నాడంచే తన వాసనల దెబ్బలకు తాళలేక మనస్సు పరుగిడుతున్నదని తెలుసుకోవాలి.
చిత్తం తన్ను తొనే బాధించుకొంటున్నదంటే, తానే అందుకు భరించలేక పరుగిడుతున్నదంటే - ఇక అజ్ఞాన విజ్బంభణం ఎలాంటిదో చూడు! మనస్సులన్నీ (బ్రహ్మపదం పాందాలనుకున్నా, తమ వాసనా ప్రభావంతో తపించి తపించి చివరికి తమకు తామే అలా పరుగులు దీస్తుంటాయి.
ఇలా విస్తృతమైన దుఃఖపరంపరను కల్గించుకొనేది మనస్సే. దాని వల్ల మిక్కిలిగా పరితపించేది మనస్సే. ఆపై పరుగులు దీసేది కూడా అదే. పట్టుపురుగు తన లాలా మయమైన దారాలతోనే బంధింపబడుతుంది. అలాగే మనస్సు తన సంకల్ప సూత్రాలతో తాను బంధనానికి లోనవుతుంది. బాలకుడు కల్లబోయే అనర్థాలు (గ్రహించలేక దుళ్ళేష్టలు చేస్తాడు. అదేరీతిగా చిత్తం అనర్జాలు కల్షించే ఆటలు (ప్రారంభిస్తుంది.
రెండు కొయ్యల సందులో ఉన్న తన వృషణాలను గమనింపక చీలను ఊడ బెరికిన కోతి లాగా చిత్తం తన దుశ్చేష్టలతోనే తాను తపిస్తుంది. చిరకాలం సమాధి
ఉత్పత్తి ప్రకరణం 223 నభ్యిసించి ఆత్మభావం దృథఢపడినప్పుడు మా శ్రమే చిత్తం చాంచల్యం వదలి మళ్ళీ శోకానికి గురి కాకుండా వుంటుంది. మనః ప్రమాదం వల్లనే దుఃఖాలు కొండల లాగా పేరుకుపోతాయి. మళ్ళీ మనస్సు వల్లనే సూర్య తాపానికి మంచులాగా అవి రూపు మాసిపోతాయి. శాస్త్రార్జాలనము చక్కగా గ్రహించగల్లితే చిత్తం సమరప మవుతుంది. రాగాదులలో తగులు పడక ముని లాగా మౌనం వహిస్తుంది. తదుపరి పవి(త్రాతిపవిత్రమైన బ్రహ్మపదం పొందుతుంది. అ స్రితిలో నిలకడ చెందిన వాడు ఎంత పెద్ద ఆపదలు కల్లినా ఛలించక శోకరహితుడై వుంటాడు. . చిత్త చికిత్సా పూర్వక చిత్తోత్పత్తి వసిష్మడు : - సము(ద్రం నుండి అలలాగా పర(బ్రహ్మంనుండి అజ్ఞాన వికాలమూ, శుద్రబ్రహ్మ వివర్తమూ అయిన చిత్తం ఉద్భవించిందే. రామా | జలస్వరూపం తెలిసినవారు ఆలను షముద్రంకంటే వేరుగా చూడరు. అదేరీతిగా జ్ఞూనులు మనస్సును (బ్రహ్మంకంటే భిన్నంగా భావించరు. అజ్ఞానుల చిత్తం సంసారభ్రాంతికి కారణ మవుతున్నది. జలస్వరూపం తెలియనివారు మాత్రమే నీటికంచె అల భిన్నమని భ్రమెస్తారు. - - అజ్ఞులైనవారికి ప్రబోధం కల్లించడానికే వాచ్యవాచక రూపమైన భేద వ్యవహారం కల్పించబడింది. పరబ్రహ్మం సర్వశక్తి సంపన్నమైనది. అది నిత్యమూ, ఫ్లూర్ణమూ, అవ్యయమూ అయివున్నది. సర్వవ్యాపకమైన ఆపరమాత్మలో లేని వస్తువేదీ లేదు. సర్వశ్తిమంతుడైన భగవానుడు తన యిచ్చి వచ్చినట్లు తనలోని శక్తిని కార్యరూపంలో రామా ! పరబ్రహ్మకు చెందిన విచ్చక్తే సకల శరీరాలలోనూ కనిపిస్తున్నది. గాలిలో చలన శక్తిగా, రాతిలో జడశ్తిగా, నీటిలో ద్రవశ్త్తిగా, ఆకాళంలో శూనృత్తోగా, సృష్టిలో భావశక్తిగా ( అస్తిత్వవ్యవహారయోగ్యతగా) కనిపించేది ఆ బ్రహ్మశక్తే. (బ్రహ్మంలోని సర్వశక్తులూ దశదిశల్లోనూ కనిపిస్తున్నాయి. నశించే పద్యార్టలలో నాశక్తీ శోకించే ప్రాణుల్లోని శోకశక్తి, సంతోషించేవారిలో ఆనందశ్తీ, వీరులలో ని వీర్యశ్తి సృష్టులలో సృష్టిక్తి, ప్రళయకాలంలో సంహారజ్తీ ఇలా భాసిందేవన్నీ ఆ బ్రహ్మశక్తులే. పండు, పూలు, తీగలు, ఆకులు, రెమ్మలు, కొమ్మలు మొదలైన వాటితో కూడిన వృక్షం బీజంలో ఉన్నట్టు పైన పేర్కొన్నదంతా ఆ (బ్రహ్మంలోనే ఉన్నది. £్24
224 యోగవాసిష్థం చిత్తజడత్వాల ఎడుమ ఉన్న జీవుడనేవాడు కూడా బ్రహ్మంలోనివాడే. వెట్టు పాదలు, తీగలు, చివుళ్లు, ధాన్యాదులు ఇదంతా నిర్వికల్పక చిన్మాత్రమే. తత్త సం తెలియనప్పుడే ఈ కల్పనంతా జరుగుతుంది.
రాఘవా ! నేను, అని భావించే జీవతత్త్వం (బ్రహ్మమే అని గ్రహించు. అది సర్వవ్యాపి. మననశ్త్తితో కూడిన చైతన్యమే మనస్సు. ఆకసంలో పింఛ(భ్రమ లాగా, నీటిలో సుడిఅనే భ్రాంతి లాగా ఆత్మలో మనోజీవుడు ప్రతిభాస మాత్రమై వున్నాడు. ఆత్మనుండే మననరూపమైన మనస్సు జనించింది. రామా 1! ఇదంతా (బహ్మశ్తీ. అందువల్ల బ్రహ్మాండమంతా బ్రహ్మమే అని భావించు, 'అది, ఇది, నేను అనే ఈ విభాగమంతా ప్రాతిభాసికమే కాని వాస్తవం కాదు. మనస్సుకూ, (బ్రహ్మకూ, భిన్నత్వభ్రాంతికి హేతువైనది కూడా బ్రహ్మశక్తే కాని మరేమీకాదు.
వసంతాది బుతువుల శక్తులు చెట్లలో వున్నట్టు జీవుల మనోరథాలన్నీ (బ్రహ్మంలోనే వున్నాయి. దేశకాలభేదాన్ని బట్టి ఒకే భూమి నానావిధాల పుష్పాలను (ప్రసవిస్తుంది. అలాగే ఒకే బ్రహ్మం వ్యవస్త్రానుగుణంగా నానావిధాలైన చిత్తశక్తులను కల్లిస్తున్నది. అందులో ఒక్కొక్కశళ్తి ఒక్కాక్కచోట (ప్రకటితమవుతూ వుంటుంది. దేళకాల వైచి(త్రాన్ని పురస్కరించుకొని భూమినుండి వివిధ ధాన్యాలు ఉత్పన్నమైనట్లు పరమాత్మనుండి ఆయాశక్తులు ఉద్భవిస్తుంటాయి.
జగత్తులోని వైచిత్రాలన్నీ మనస్సు చేసే కల్పనలే. అవన్నీ (బ్రహ్మంనుండే కల్గుతున్నాయి కాబట్టి బ్రహ్మకంటే భిన్నంకావు. మనస్సుకు చెందిన (ప్రతిభాసం ఎలా ఎలా ప్రవర్తిస్తుంటుందో, అలాగే అంతా జరుగుతూ వుంటుంది. ఇందుకు దృష్టాంతం ఐందవులే.
నిర్మలవలూ, నిశ్చలవమూ అయిన సాగరంనుండి తరంగం లాగా పరమాత్మనుండి సంసారకారణమైన జీవుడు ఉదయిస్తున్నాడు. కల్గ్లోలతరంగాది రూపాలతో వ్యాపించేది ఒక్క జలమే. జ్ఞాని దృష్టిలో ఈ జగమంతా (బ్రహ్మమే. వివిధ తరంగ వ్యాప్తమైన సముద్రంలో జలం కంచే భిన్నంగా మరొక కల్పన లేదు. 'బ్రహ్మంలో నామరూపాత్మకమైన మరొక సత్త లేదు. పుట్టడం, నశించడం, పోవడం, ఉండడం - ఇవన్నీ (బ్రహ్మంలో బ్రహ్మ వల్ల అతాత్త్వికంగా జరగే చర్యలు మాత్రమే. తీక్షమైన ఎండ ఎండమావిలా భాసిస్తుంది, అలాగే నామరూపరహితమైన బ్రహ్మం నామరూపసహితమైన జగత్తుగా గోచరిస్తుంది.
ఉత్పత్తి ప్రకరణం 225
కరణం, కర్మ, కర్త, పుట్టుక, చావు, స్రితి, - అంతా బ్రహ్మమే. అది వినా మరొక కల్పన లేదు. నిజానికి లోభం, మోహం, తృష్పృ ఆసక్తి అనేవి లేవు. ఆత్మకు ఆత్మలో లోభమోహాదు లెలా కల్గుతాయి ?
ఈ జగమంతా ఆత్మే. కల్పనా క్రమమంతా అత్మే. స్వర్ధం ఆభరణాల రూపంలో భాసించినట్లే ఆత్మ మనోరూపంతో ప్రకాశిస్తున్నది. అజ్జానావృతమైన పరతత్తమే జీవు డనబడుతున్నది. బంధువైనా తెలియనప్పుడు బంధువు కాడు కదా! ఆకాళం శూన్యత్వాన్ని (ప్రకటించినట్లు చిన్మయమైన ఆత్మ తన సంకల్పంతో జీవత్వాన్ని వ్యక్తం చేసింది. ఆత్మే అనాత్మరూపజీవుడుగా భాసిస్తూన్నది. చూపు చెడినవానికి ఒక్క చంద్రుడే ఇద్దరు చం(ద్రులుగా గోచరిస్తాడు. అదే రీతిగా అజ్ఞానికి సద్రూపమైన ఒకే బ్రహ్మం సదసత్తులుగా గోచరిస్తున్నది.
వ్యామోహం కల్షిస్తున్న 'బంధం' “మోక్షం”, అనే శబ్దాలు రెండూ మిక్కిలి అసంభవాలు. ఆత్మ ఒక్కటే సత్యం. ఇక ఆత్మకు బంధ మెక్కడ ? మోక్షమెక్కడ? బంధమనేది ఎప్పుడూ సంభవింపనివాడికి “నేను బద్దుడను' అనే కుకల్పన కాల్పనికమే. అతనికి మోత్షం కూడా మిథ్యే కాని వాస్తవం కాదు.
శ్రీరాముడు : - ప్రభూ 1 వునస్సు ఎలా నిశ్చయిస్తుందో అలాగే తయారవుతుంది కదా! ఇక బంధం ఎలా లేకుండా పోతుంది ?
వసిష్టుడు : - మూర్చులు చేసే బంధకల్పన మిథ్య మాత్రమే. అలాగే జ్ఞానుల దృష్టిలో మోక్ష కల్పన కూడా కాల్పనికమే. మహామతీ 1! ఇలా బంధమోక్షాలు రెండూ అజ్ఞానం వల్ల కలిగినవే. నిజానికి బంధమూ లేదు. మోకమూ లేదు. (త్రాడునుచూచి “పాము! అని (భ్రమించిన వానికి తత్త్వం తెలిసిన తర్వాత పాము వాస్తవంకాదు కదా! అలాగే జ్ఞూనికి ఈ కల్పన లన్నీ అవాస్తవాలే. రామా! ప్రాజ్ఞుడైన వానికి బంధమోక్షాది మోహం లేదు. అజ్ఞానులకు మాత్రమే బంధమోత్షిదు లుంటాయి. సుభా ! మొదట మనస్సు, తరువాత బంధం. ఆపై మోక్షం - పీమ్మట భువనమనే ప్రపంచరచన - ఇలా (క్రమంగా ఇది బాలకుళ్లో ఉద్దేశించి చెప్పేన కథ లాగా ఉన్నది.
బాల కాఖ్యాయిక
శ్రీరాముడు : - మునివర్యా ! బాలుణ్లో ఉద్దేశించి చెప్పిన ఆకథాక్రమం
ఎలాంటిది ? మనోవర్థనకు కారణమైన దాన్ని నాకు (క్రమంగా వివరించండి.
226 యోగాష్మిం
వసిష్టుడు : - రామా | ఒకానొక ముగ్రబాలకుడు తన దాదిని “మనస్సును రంజింపజేసే కథ ఒకటి చెప్పు” అని అడిగాడు. ఆబాలుని వినోదం కొరకు ఆమె ప్రసన్నమూ, మధురాక్షరమూ అయిన ఒక కథ నిలా చెప్పింది.
“బాబూ 1! అసలే ఉనికి లేనిదైన ఒక శూన్యనగరం ఉండేది. ఆకసంలోని తారకల్లాగా ఆ పట్టణంలో మహాత్ములూ, ధర్మనిరతులూ, పరా(క్రమవంతులూ అయిన ముగ్గురు రాకుమూరు లుండేవారు. "
వారిలో ఇద్దరు ఇంకా పుట్టునే లేదు. మరొకడు మాతృగర్చ్భంలో ఇంకా (ప్రవేశించనే లేదు. విధివశాన వారు బంధువులందరినీ కోల్పోయారు. ఎంతో ఖిన్ను లయ్యారు. శోకతప్తమైన చిత్తంతో అందరూ కలసి ఉత్తమ లాభం ఆర్రించాలన్న కోరికతో ఆకాశంనుండి బయలువెడలిన బుధశు క్రశనుల్లాగా ఆ శూన్యనగరంనుండి బయలుదేరి వెళ్ళారు. దిరిసనపూవుల్దాగా కోవులమైన అవయవాలుగల ఆరాజకుమూరులు దారిలో ఎండవేడికి తపించిపోయారు. ఇసుకదారిలో వారి పాదపద్మాలు కందిపోయాయి. గుంపునుండి వేరుపడిన బింకల లాగా విలపిస్తూ అలా వారు సాగిపోయారు. వారి కాళ్లకు దర్భ మొక్కలు గ్రుచ్చుకొన్నాయి. ఎండ దెబ్బకు వారు బడలిపోయారు. అలా చాలా దూరం నడిచేసరికి వారి శరీరాలు దుమ్ముతో నిండిపోయాయి.
ఆ రీతిగా నడచి నడచి చివరికి వారు దారిలో ఉన్న మూడు చెట్లను సమీపించారు. ఆ వృత్తాలు తీవలతో, చివుఖ్లతో, పండ్లతో నిండివున్నాయి. మృగాలకూ, పక్షులకూ ఆశ్రయమై వున్నాయి. ఆ మూడు వెట్లలోనూ రెండు ఇంకా మొలవనే లేదు. మూడవదానికి విత్తనమే లేదు. ॥
అలసిపోయిన ఆ ముగ్గురు రాకుమారులూ ఒక చెట్టు క్రింద పారిజాత వృక్షం (క్రింద ఇంద్రవాయుయములలాగా విశ్రమించారు. అక్కడ అమృత తుల్యమైన పండ్లు తిన్నారు. ఆరసం త్రాగారు. పూమాలలు ధరించారు. చాలాసేపు అలా విశ్రమించి ఆపై బయలుదేరారు. +"
మళ్ళీ బహుదూరం నడచి మధ్యాహ్నమయ్యే సరికి అలలతో చలిస్తూ ధ్వనిస్తున్న మూడు నదులను చేరుకొన్నారు. అంచులో ఒకనది పూర్తిగా శుష్కించి వున్నది. తక్కిన రెండునదుల్లో గ్రుడ్డివాని కన్నుల్లో చూపులాగా ఒక చుక్క నీరు కూడా లేదు. త్రిమూర్తులు గంగలో స్నానం చేసినట్లు ఎండిపోయిన ఆవదిలో వారు
ఉత్పత్తి ప్రకరణం 227 ముగ్గురూ ఆదరంతో స్నానం చేశారు. చాలా సేపు జల (క్రీడ లాడారు. క్షీరం వంటి నీరు త్రాగారు. సంతసించిన చిత్తాలతో అక్కడనుండి పయనమైపోయారు.
నాటి సాయంకాలం సూర్యుడస్తమించే సమయానికి వారు ఒక కొంగ్రొత్త భవిష్యన్నగరం చేరుకొన్నారు. ఆనగరంలో కొండల వంటి మేడలున్నాయి. ఆవేడలపై పతాకలు రెపరెప లాడుతున్నాయి. అక్కడ నీలాకాశం వంటి జలాశయాలు ఎడనెడొ కాన వస్తున్నాయి. నాగరకుల పాటలూ, మాటలూ చాలా రూరానిక్తే వినవస్తున్నాయి.
అ పట్టణంలో వారు అందమైన మూడు భవనాలు చూచారు. అందులో రెండు ఇంకా నిర్మించబడలేదు. మరొక భవనానికి గోడలే లేవు. గోడలు లేని సుందర గృహంలో వారు ప్రవేశించారు. అక్కడ కొంత సేపు విశ్రమించారు. ఆపై ఇటూ అటూ విహరిస్తూ మూడు బంగారు పాత్రలను చూచారు. అందులో రెండు కపాలాల రూపంలో వున్నాయి. మరొకటి పాడిపాడి అయివున్నది. చ్లూర్లమైన ఆపాత్రను తీసుకొని వారు అందులో తొంబై తొమ్మిది శేర్ల అన్నం వండారు. శాకపాకాలు తయారు చేశారు. పిదప ముగ్గురు బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించారు. ఆవచ్చిన బ్రాహ్మణుల్లో ఇద్దరికి శరీరాలే లేవు. మరొకనికి ముఖమే లేదు. ముఖం లేని ఆ విప్రుడు అన్నమంతా తిన్నాడు. భుక్తశేషాన్ని రాజపుత్రులు భుజించారు. వారు ఎంతో సంతృప్తి చెందారు. ఇప్పుడు కూడా వారు ఆ భవిష్యన్నగరంలో క్రీడిస్తూ సుఖంగా వున్నారు.
బాలకా ! ఈ అందమైనకథ నీకు నేను చెప్పాను. దీన్ని బాగా గుర్తుంచుకో! నీవు గొప్ప పండితుడ వైపోతావు' '.
రామా! దాది ఇలా ఆబాలకునికి కథ చెప్పింది. శుభప్రదమైన ఆ కథ విని బాలకుడు సంతసించాడు.
కమలనేత్రుడవైన ఓరామా | చిత్తోపాఖ్యాన కథకు ఉదాహరణంగా నేమ నీకీ బాలకాఖ్యాయిక వివరించాను. ఈ సంసారస్నప్టి బాలకాఖ్యాయిక లాగా సంకల్పాలతో నిండి వున్నది. బంధమోత్షాది కల్పనలతో కూడి వున్నది. సంకల్పంతో కలో వివిధ వికల్సాలకు నిలయమై వున్నది. ప్రతిభాసాత్మకమై తోస్తున్నది. సంకల్పం కంచే ఇతరమైన దేదీ లేదు. ఏదైనా ఉండడం, లేక పోవడమనేది సంకల్పం మీదనే
ఆధారపడివున్నది. స్వర్గం, భూమి, వాయువు, ఆకాశం, కొండలు, నదులు, దిక్కులు అంతా స్వప్నం లాగా మన సంకల్పం వల్ల రూపాందినవే.
226 యోగవాషం
భవిష్యన్నగరంలో ముగ్గురు రాజపుదత్రులు, నదులు సంకల్పం వల్లనే రూపాందినట్లు జగత్తు యొక్క ఉనికి గూడా సంకల్పంవల్ల ఏర్పడిందే. సము(ద్రమంతా చలించే జలం మాత్రమే అయినట్టు మనచుట్టూ స్ఫురించేదంతా సంకల్పం మౌ్రమే.
పరమాత్మ సంకల్పంతో ఇది మొదట ఏర్పడింది. దిన కృత్యాలతో షగలు విస్తరించినట్లే ఇది (క్రవము[క్రవుంగా విస్తరించింది. రామా | ఈ జగవుంతా సంకల్పరూషహమే. మనోవిలాసాలూ, చేత్యాలూ - అన్నీ సంకల్ప మాత్రమే. ఈ సంకల్పం పూర్తిగా వదలు. నిస్సం కల్పఫ్టితిని ఆశ్రయించు. నిశ్చయంగా శాంతిని పొందు.
ఉపదేశకరణం
తన సంకల్పంవల్ల మోహం పొందేది మూఢుడు మాత్రమే. పండితుడు పొందడు. అక్షయమైన పరమాత్మ విషయంలో క్షయ సంకల్పంచేసి భయపడేవాడు శిశువే కదా 1
శ్రీరాముడు : - బ్రహ్మవేత్తలలో మేటివైన ఓ మునీంద్రా! ఈ సంకల్పితమైన క్షయం ఎలాంటిది ? కారణం లేకుండూనే ఆత్మకు సంసార (భమ కల్గించే ఆక్షయాన్ని సంకల్పించే వాడెవడు ?
వసిష్టుడు : - బాలుడు బేతాళాన్ని కల్పించుకొన్నట్లే అవిద్యోపహితమూ, అహంకార నామకమూ అయిన పరమాత్మే క్షయాన్ని, అంటే నశ్వరమైన. ఆత్మను పరికల్పించుకొంటున్నది.
ఒకే ఒక పరమాత్మ వస్తువు అంతటా నిండివున్నది. అలా వుండగా ఇక ఆ అహంకార మనేది ఎక్కడనుండి వచ్చింది? ఎలా వచ్చింది? పరమాత్మ భేదరహితం. అందులో నిజానికి అహంకార మనేది లేదు. (భ్రాంతికి గురి అయినవాడు మండుటెండలో ఎండమావిని చూస్తాడు. అలాగే (భ్రాంతుడు పరమాత్మలో అహంకారాన్ని దర్శిస్తున్నాడు. మనస్సు అనే చింతామణి ఆరంభించిన మహాకార్యమే ఈ సంసారం. జలం తనలో తరంగాన్ని సృష్టించుకాన్నట్టు మనస్సు తన సంకల్పంతో తనలో ఈ సంసారాన్ని స్నష్టించుకొన్నది.
రామా 1! అందువల్ల నీవు నిరాధారమైన యీ భ్రాంతిని నిరసించు. ఆధారసహితమూ, సత్యమూ, ఆనందస్వరూపమూ అయిన సమ్మగ్రర్శనాన్ని
ఉత్పత్తి ప్రకరణం 229 ఆశ్రయించు. మోహరహితమైన విచారాత్మక బుద్దితో సత్యాన్ని విచారించు. అసత్యాన్ని పరిత్యజించు. నీకు బంధం లేదు. అయినా బంధింపబడిన వానిలాగా ఎందుకు దుఃఖిన్తావు ? అనంతమైన ఆత్మతత్త్వాన్ని ఎవరు బంధిస్తారు ? ఎలా బంధిస్తారు?
భేదరహితమైన పరమాత్మలో భేదాభేద [భ్రమ సంభవిస్తున్నది. వాస్తవానికి అంతా బ్రహ్మతత్త శ్రమే అయివున్నది. ఇక బంధింపబడేది ? విడుదలపాందే దేది? ఆర్తిలేనివాడు కూడా అంగచ్చేదం కల్లితే ఆర్తి గల వానిలా భాసిస్తున్నాడు. నిజానికి ఆత్మకు భేదాభేదాది వికారా లేవీ లేవు.
దేహం క్షతమైనా ఆత్మకు కలిగే క్షతి ఏమున్నది ? కొలిమి తిత్తి కాలిపోయినా అందలి గాలికి కీడు లేదు కదా ! ఈ దేహం పడనీ లేక లేవనీ ! అందువల్ల మనకు కలిగే వోని ఏమి ? పుష్పుం నశించినా ఆకాశాన్ని ఆశ్రయించిన సుగంధానికి నాశం లేదు కదా!
ఈ శరీరమనే పద్మంలో సుఖదుఃఖాలనే మంచుతుంపరలు పడితే పడనీ ! అందువల్ల గగనంలో ఎగిరే తుమ్మెదలమైన మనకేమి నష్టం ? ఈ శరీరం ఏమైనా/ కానీ! దానికంచే విలక్షణుడ నైన నాకు గలిగే నష్ట మేమీ లేదు.
రాఘవా! శరీరానికీ ఆత్మకూ ఉన్న సంబంధం మేఘానికీ - గాలికీ - పద్మానికీ
- తుమ్మెదకూ ఉన్న సంబంధం వంటిది. రామా! మనస్సు ఈ సమస్త జగత్తుకూ కారణీభూతమైన శక్తి. దానికి పైన చిదాత్మ ఉన్నది. అలాంటి ఆత్మకు నాళం ఎలా సంభవిస్తుంది ? మహాస్రాజ్ఞా! ఆత్మనశించదు. దానికి రాకపోకలు లేవు. ఎందుకు వ్యర్థంగా పరితపిస్తావు ? మబ్బు విడిపోతే గాలి, పద్మం ఎండిపోతే తుమ్మెద అనంతమైన ఆకాశంలోకి వెళ్ళి పోతాయి. అలాగే దేహం నశిస్తే ఆత్మ కూడా అనంతంలో లీన మవుతుంది.
సంసారంలో విహరించే జీవునికి జ్ఞానాగ్ని తోడ్పాటు లేకపోతే మనస్సు కూడా నశించదు. ఇక ఆత్మ నాశాన్ని గూర్చి చెప్పే దేమున్నది ? కుండ పగిలినా అందలి రేగిపండు నశించదు. ఘటం భిన్నమైనా అందలి ఆకాశం నష్టం కాదు. నశించే శరీరానికీ నశించని ఆత్మకూ కల స్థితి కూడా ఇలాంటిదే. కుండ పగిలి పోయినా అందలి పండు చేతికి చిక్కుతుంది. దేహం నశించినా జీవుడు వాసనామయమైన ఆకాశస్వరూపం పొందుతాడు. కడవ పోయినా అందలి ఆకాశం మహాకాశంలో లీనమై వుంటుంది. అలాగే దేహం త్షీణించినా దేహి నిరామయుడై వుంటాడు.
230 యోనాషం (ప్రాణులకు చెందిన మనోమయమైన శరీరం దేశకాలాల మాటున మరణమనే వస్త్రం కప్పుకొని వుంటుంది. ఇంత మాయలాడీ మనస్సుకై పరితపించడ మెందుకు? ఆయా దేశకాలాలలో ఆత్మ మరుగు పడడమే మరణం. దీనికెందుక్సు భయపడతావు? లోకంలో ఎవడూ ఆత్మనాశాన్ని చూచినవాడు లేడు.
రామా! అంచేత నీవు అహం భావరూపంలో మిథ్యామయమై వున్న వాసనను రెక్కలు వచ్చిన పక్షి గ్రుడ్డును వదలినట్టు వదలిపెట్టు.
ఈ మానసత్త్తి ఇష్టైనిస్టైలకు చెందినదై వుంటుంది. దీనివల్ల కలవంటి కల్పన జరుగుతూ వుంటుంది. ఇదే అవిద్య. ఇది దురంతమైనది. ఇది దుఃఖం కొరకే వృద్ది పొందుతుంది. తత్త్వజ్ఞానం లేనప్పుడిది మిథ్యారూపమైన జగత్తును విస్తరింపజేస్తుంది. _ - .
ఈ మౌనస శక్తే గగనంలో ని నీలత్వానికి కన్నులాగా భావనామాటత్రాన జగత్తుకు కర్పృత్వం వహిస్తున్నది. సూర్యుడు మంచుగడ్డను లయింపజేసినట్టు నీవు విచారణతో మానసశక్తి ప్వరూపాన్ని లయింపజేయి. మంచును నశింపజేయాలనుకొన్న సూర్యుడు తన ఉదయంతోనే ఆపని నెరవేరుస్తాడు. అలాగే మనోనాశాన్ని కోరేవాడు తన విచారబలంతో దానిని సాధిస్తాడు. - . -
శంబరాసురుడు ఇం(ద్రజాలంతో బంగారును వర్షింపజేసినట్లే అవిద్య జ్ఞానాభావంతో నావా జగత్తులను సృష్టిస్తున్నది. మనస్సే తన వివాశాన్ని తాను కల్గించుకొంటున్నది. ఇది 'ఆత్మ వధి నాటకంలో నృత్యం చేస్తున్నది. మనస్సు తన వినాళం కొరకే ఆత్మను తాను చూస్తున్నది. కాని. ఆ దుర్చుద్దికి తన అంత్యకాలం దాపురించిందని తెలియదు. మనోవినాశం క్షోరేవారి కిది తన సంకల్ప బలంతోనే దానిని సిద్రింప జేస్తుంది. ఇందులో దాని కేవిధమైన క్షేళశమూ లేదు. వివేకవంతమైన మనస్సు తన సంకల్ప వికల్పాంశాలను విడిచి ఆత్మావబోధనం కలిగి వుంటుంది.
రావా | వునోనాళవే వహోదయం. సర్వదుఃఖాలూ దానివల్లనే తొలగిపోతాయి. అంచేత నీవు మనోనాళానికై ప్రయత్నించు. బాహ్య ప్రవృత్తై (ప్రయత్నం చేయవద్దు. సుభగా 1 సుఖదుఃఖాలనే చెట్లతో నిండినదీ, మృత్యువనే కాలసర్పానికి నెంవైనదీ ఆయిన ఈ సంసారవనాన్ని పరిపాలించేది చిత్తమే.
వివేకరహితమైన ఈ చిత్తమే గొప్పు ఆపదలకు హేతువు సుమా 1”
- మునీంద్రు డలా చెప్పేసరికి సాయం సవుయ వుయింది. సూర్యు
ఉత్పత్తి ప్రకరణం 231 డస్తమించాడు. సభా సదులందరూ మునులకు నమస్కరించి స్నానాది విధులకై వెళ్ళారు. తెల్లవారగానే మళ్ళీ సభా ఫ్టలికి విచ్చేశారు. (ఎనిమిదవ దినం) . చిత్త మాహాత్మ్యం
సముద్రంనుండి లేచిన అలలాగా పరతత్త్వం నుండి ఉదయించిన చిత్తం అతి విశాలమై ఈ జగత్తును విస్తరింపజేస్తున్నది.
ఈ చిత్తం పొట్టీ వస్తువును పాడవైనదిగా, పాడవైవదానిని పొట్టిదిగా. ఆత్మను అనాత్మగా, అనాత్మను ఆత్మగా మార్చి వేస్తున్నది. అది కల్పనాబలంతో (ప్రాదళమా(త్రమైన వస్తువును సైతం వేరుపర్వతముంతటి పరిమాణంలో భాసీంపజేస్తుంది. పరతత్త్వం నుండి ఉదయించి వికాసం పాం్లదిన చిత్తం సుప్రతిస్టితమైంది. అది ఒక్క నిమేషంలో సంసారాలను సృష్టిస్తుంది, మళ్ళీ నశింపజేస్తుంది. మనకు కనిపించే ఈ చరాచరాత్మకమైన సమస్త జగత్తూ చిత్తం నుండి బయతకు వెడలినదే.
దేశం, కాలం, క్రియ, ద్రవ్యం, +క్తి వీటిచేత పర్యాకులమైన మనస్సు మాటిమాటికీ వేషం మార్చే నటుని లాగా ఒక రూపం వదలి మరొక రూపం ధరిస్తూ వుంటుంది. అది ఉన్న దానిని లేనిదిగా, లేని దానిని ఉన్నదిగా రూపొందిస్తుంది. అందు కనుగుణమైన సుఖదుఃఖాలనే గ్రహిస్తుంది.
చంచలమైన మనస్సు కర్మ ్రాప్త్రమైన ఫలాలను అమభవించేటప్పుడు చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలు అందు కనుకూలమైన (క్రియను కల్లి వుంటాయి. తగినకాలంలో దోహద॥్రియ జరిపిన తీగ ఫలాలను ఇచ్చినట్టు ఆ క్రియ చిత్తంలో సంకల్పించిన సుఖదుఃఖాలమ క్షణంలో ఇస్తుంది. - .
రామా 1! ఇంటిలో పిల్లవాడు మట్టితో చిత్రవిచిత్రమైన ఆటబొమ్మలు తయారుచేసి నట్లే మనస్సు జగద్వికల్పాలను సృష్టిస్తున్నది. మనస్సు కొనసాగించే ఈ క్రీడలోని మానవ శరీరాలు మొదలైన మట్టి బొమ్మలలో ఏది సత్యమైనది ? అంతా మిథ్యే కదా ! ఆయా బుతువులకు సంబంధించిన కాలం చెట్ల రూపంలో మార్చు కల్గించెనచ్లే చిత్తం పదార్దాల స్వరూపంలో మౌర్చు కల్గిస్తుంది. మనస్సుకు వెందిన లీలావిలాసాలైన మనోరథాలలో, కలల్లో, సంకల్పాలలో యోజనాల సమూహం గోష్పుదంగా మారుతుంది.
232 యోగసిస్టం
గుణభేదాల ననుసరించి మనస్సులో తీవ్రత్వం, మందత్వం, బహుత్వం, అల్పత్వం మొదలైన తేడాలు ఏర్పడతాయి. వాటి ననుసరించి మనస్సు సంకల్పించే కార్యాలు ఆలస్యంగానో, త్వరగానో సిద్రిస్తుంచాయి. చెట్టు నుండి చివుళ్ళు పుట్టినట్లే మనస్సు నుండి వ్యామోహం, సం(భ్రమం, అనర్హం, దేశకాలాల రాకపోకలు కల్గుతున్నాయి.
సాగర మంతా నీరే. అగ్ని అంతా వేడిమే, అలాగే సంసారానికి చెందిన సంరంభ మంతా చిత్తమే. కర్త, కర్మ, క్రియ, (ద్రప్ర దర్శనం, దృశ్యం, భోక్త, భోగ్యం, భోగం- వీటితో కూడిన సంసార మంతా చిత్తమే కాని మరేమీ కాదు. స్వర్ణకారుడు భుజకీర్తులు, కిరీటాలు, గొజులు మొదలైన భేదకల్పనలు వదలి అందలి కనకాన్నే చూస్తాడు. అలాగే వివేకవంతుడు, జగత్తులు, భువనాలు, వనాంతరాలు అనే తేడాలను విడిచి అదంతా చిత్తమే అని గ్రహిస్తాడు.
ఇంద్రజాలోపాఖ్యానం - రాజవ్యామోహం
రామా! ఈ జగద్రూపంలో ఉన్న ఇంద్రజాల మంతా మనస్సుకు అధీనమై వున్నది. ఈ విషయాన్ని వివరించే ఒక వృత్తాంతం నీకు వినిపిస్తాను విను.
ఈ భూమండలంలో ఉత్తరాపాండవం అనే ఒక మహాజనపదం ఉన్నది. అందులో వివిధ వృక్షాలతో నిండిన అనేక వనాలు ఉన్నాయి. ఆ వనాలలో ముని జనులు విశ్రాంతి గైకొనేవారు. విద్యాధర స్త్రీలు అందలి తీగలను ఊయెలలుగా చేసుకొని ఊశేవారు. గాలికెగిరిన పద్మ పరాగం సమీపంలోని కొండలను కప్పి వేసేది. ఆ అడవులలో వికసించిన పుష్పుగుచ్చాలు నయనానందం కల్లించేవి. అందలి గ్రామాలకు నలువైపులా ఖర్జూరపు చెట్టు దట్టంగా వ్యాపించి వుండేవి. పండిన పంటపాలాలూ, నెమళ్ళ కేకలచే నిండిన అడవులూ, చీకటి చెట్లచే నల్లనైన 'ప్రదేశాలూ, చిత్రవిచిత్రాలైన పక్షుల ధ్వనులూ జనుల చిత్తాన్ని ఎంతగానో ఆకర్షించేవి. ఆ జనపదం స్వర్గం నుండి తేబడిన సౌందర్యంతో నిర్మించబడిందా అన్నట్టు ప్రకాశించింది. అందలి అరటి తోటల మధ్య గంధర్వులూ, కిన్నరులూ గానం చేసేవారు.
లవణుడు అనే ఒకరాజు ఆరాజ్యాన్ని పరిపాలించేవాడు. హరిళ్ళేంద్రుని కులంలో పుట్టిన ఆభూపాలుడు పరమధార్మికుడై సూర్యతేజంతో భాసించేవాడు.
ఉత్పత్తి ప్రకరిణం 233 అతని కీర్తి అనే పూమౌలలు దాల్చిన కొండలు భస్మోద్యుళతాలైన శివమూర్తుల వలె వెలుగొందేవ. అతవి పేరు స్మరించగానే శత్రువులు జ్వంగ్రప్తు లయ్యేవారు. నిశితమైన తవ ఖడ్గంతో ఆతిడు శత్రువులను నిర్యూలించాడు.
ఉదారిమూ, శిష్ట జనరక్షకమూ అయిన ఆన్బపాలువి చరిత్రను ప్రజలు హరిచరిత్ర లాగా స్మరించేవారు. అచ్చరలు మేరుపర్వత శిఖరాలపై ఆవరపాలువి గుణాలను పులకితగా త్రిలై గావం చేసేవారు. ఆగుణగానం వివి బ్రహ్మవాహనాలై న హంసలు ప్రతిధ్వనులు చేసేవి.
రాఘవా ! ఆనరేం(ద్రిని ఉదారచమత్కారం అనన్యసామావ్యమై వుండేది. అతనిలో ఏదోషమూ కవిపించేదికాదు. వినిపించేది కాదు. కౌటిల్యం అతవికి తెలియదు. అవినయం అతనిలో లేదు. బ్రహ్మ జపమాలను ధరించినట్లు ఆతడు ఉదారతమ రరించాడు.
ఆభూపాలుడు ఒకవాడు కొంత ప్రాద్దెక్సిన తర్వాత సభాస్టానంలో సింవోసనం అధిష్టీంచాడు. ఆకాశంలో చంద్రుని లాగా ఆస్టానంలో అతడు కొలువు తిరూవే సామంత సేనలు పం(భ్రమంతో అక్కడ (ప్రవేశించాయి. కాంతలు గానం చేశారు. సామంతరాజులు ఆసనాలు అధిష్టించారు. వీణా వేణుగానం మవోహరంగా వినిపించింది. విలాసవతులు వింజామరలు వీచారు. బృహస్పతివీ, శుశ్రాచార్యులనీ పోలిన మంత్రులు ఆరాజుచెంత సమావేశమయ్యారు. వారు రాజకార్యాలు (ప్రస్తావించారు. వార్తాహరులు దేశవార్తలు ఎరుకపరచారు. వందిమాగధులు స్తోత్రాలు పఠించారు. ఒక వంక పవిత్రమైన ఇతిహాసాన్ని చదువుతున్నారు.
అప్పుడు భూమిపై వ్రాలివ మేఘం లాగా ఒకఐంద్రజాలికుడు పటాచోపంతో సభలో ప్రవేశించాడు. ఫలభరితమైన వృక్షం రమణీయమైన పర్వతానికి ప్రణమిళ్రినట్టు వాడు నృపాలువి ముందు మోకరిల్లాడు. పుష్పుశోభితమూ, ఫలభరితమూ, ఛాయాప్రధానమూ అయిన వృక్షం ముందర వానరం లాగా అతడు భూపాలువి యెదుట కూర్చువ్నాడు. పద్మం చెంత (భ్రవురం ('మోగివట్సు చపలుడూ, అర్ధలంపటుడూ అయిన ఆ ఐంద్ర జూలికుడు రాజుతో ఇలా అన్నాడు -
““ప్రభూ! ఇలా చూడు. ఆకసంలో వున్న చంద్రుడు భూమిని చూచినట్లు సింహాసవం మీద వుంటూనే ఈమిథ్యాక'తుకాన్ని ఏక్షించు."
అరా చెప్పి అతడు, ్రాంతహేతువూ, స్పష్టినారణమూ అయిన పరమాత్ముని
234 యోగవాసిం మౌాయలాగా ఉన్న ఒక పింఛాన్ని అటూ ఇటూ (త్రిప్రాడు. దేవ విమానంలో ఉంటూ దేవేంద్రుడు తన ధనుర్లతను చూచినట్లు ఆరాజు తేజోరేణువులతో విరాజిల్లే ఆపీంఛాన్ని వీక్షీించాడు. అదే సమయంలో తారలనే పరికరాలతో నిండిన ఆకాళవీథిలో ప్రవేశించే మేఘం లాగా ఒక అశ్వపాలుడు ఆ సభలో (ప్రవేశించాడు. ఇం (ద్రుళ్లీ అనుసరించే ఉచ్చైః[శ్రవంలాగా మహావేగవంతమైన ఒక గు[ర్రం ఆ అశ్చపాలుణ్లి అనుసరించి వచ్చింది. ఉచైఃశ్రవంతో కూడిన క్షీరసాగరం ఇంద్రునితో చెప్పినట్లు అతడు అశ్వాన్ని రాజుకు చూపి ఇలా అన్నాడు -
““రాజా! ఈ అశ్వరత్నం ఉచ్చైఃశ్రవంతో సమానమైనది. ఇది ఆకృతి దాళ్ళిన వాయువు లాగా అతివేగంగా పయనిస్తుంది. ప్రభూ ! మా ప్రభువు మీకొరై దీన్ని పంపాడు. ఒక మేలైన వస్తువు శో భిల్లేది మహాత్ములకు సమర్పించినప్పుడే కదా 1*।
అలా అతడు చెప్పుగానే ఉరుము శమించిన పిమ్మట చాతకం మేఘంతో పలికినట్లు ఐంద్రజాలికుడు నరేం(ద్రునితో ఇలా అన్నాడు- -
“ప్రభూ! ప్రతాపంతో భాసిస్తూ సూర్యుడు భూవలయంపై విహరించినట్న ఈ ఉత్తమౌశ్వాన్ని అధిష్టించి మీరు భువనమంతా విహరించండి ! ?'
ఆతడలా అనగానే ఉరిమిన మేఘం వైపు మెడ ఎత్తి చూచేనెమలి లాగా రాజు అశ్వాన్ని తేరి పార చూచాడు. చిద్రం లాగా నిశ్చేష్టుడై రెప్పవాల్బని చూపుతో అతడు దాన్ని అలా చూస్తూ వుండిపోయాడు. అగస్త్య మహర్షి చూపు సోకిన సముద్రం లాగా అతడు క్షోభకు గురి అయ్యాడు. వీత రాగుడైన మునిలాగా అతడు తనలో తాను ధ్యానాసక్తుడై రెండు ముహూర్తాల పాటు అలాగే ఉండిపోయాడు. బుద్దిబలంతో అత డేదో ఆలోచిస్తున్నాడని భావించి ఎవ్వరూ అతణ్ణో పలకరించలేదు. స్తంభించిన చంద్రకిరణాలతోడి రాత్రులవలె చామర గ్రాహిణులు చావురాలను కదిలించకుండా ఊరకుండి పోయారు. సభాసదులందరూ విస్మయంతో కదలికలేని దళాలు గల మట్టితో చేసిన పద్మాలలాగా నిళ్చలు లయ్యారు. వర్దాకాలం గడచిన తర్వాత మేఘగర్హన లాగా సభాస్టలిలో ప్రజల కోలాహలం ఉహామించింది. రక్కసులతోడి యుద్దంలో విష్ణువు విషాదం పొందినప్పుడు దేవతలు చింతకు గురి అయినట్లే సందేహ సాగరంలో మునిగిన మంత్రులు చింతాక్రాంతు లయ్యారు. -
అలా రాజు కనులు మూసుకొని వుండగా జనులు ఆళ్ళర్యచకితులయ్యారు.
ఉత్పత్తి ప్రకరణం 235 భయం, మోహం, విషాదం వారిని పైకొన్నాయి. వారు ముడుచుకొన్న కమలవనం లాగా ఉత్సాహరహితులై ఉండిపోయారు.
శాజావబోధం
వర్షాకాలం తొలగిపోగానే కమలం వికసించినట్లు రెండు ముహూర్తాల కాలం గడవగానే రాజు ప్రబుద్దు డయ్యాడు. శిఖరంతో కూడీన కొండ భూకంపానికి చలించినట్టు భూషణాలచే అలంకృతమైన భూపాలుని శరీరం ఆసనంనుండి కదలీింది. పాతాళదిగ్గజం చలించగానే కైలాస పర్వతం కదలినట్టు సింహాసనంపై ఉన్న రాజా పరికంపితుడయ్యాడు. (ప్రళయ కాలంలో శ్షోభించిన మేరు పర్వతాన్ని కులపర్వతాలు కదలకుండా నిలిపినట్టు ఆసనంనుండి పడిపోబోతున్న రాజును ఎదుటనే ఉన్న మంత్రులు పడనీకుండా పట్టుకున్నారు. ఆ స్టితిలోపర్యాకులచిత్తుడైన నరపతి చం(ద్రోదయానికి చలించిన సము(ద్రునిలా కనిపించాడు.
పద్మకోశంలో తగులుకొన్న (భ్రమరం ధ్వనించినట్టు ఆరాజు అస్పష్టంగా “ఈ ప్రదేశం ఏది? ఈ సభ ఎవరిది ?”' అని ప్రశ్నించాడు.
అప్పుడు సభాసదులు 'దేవా ! ఇదేమిటి ? మీరిలా అయిపోయారే ?" అని అన్నారు. ప్రళయ సంభ్రమం చూచి భయపడిన మార్కండేయుణ్లీ దేవత లడిగినట్టు ఎదుట వున్న మంత్రులు రాజునిలొ అడిగారు -
“ప్రభూ! మీరిలా వుంటే మేము చాలా కలవరపడి పోతున్నాము. అభేద్యమైన చిత్తాన్ని కూడా కారణం లేకుండానే భ్రాంతి భేదిస్తుంది. పైకి రమణీయంగా కనిపించి తుదకు విరసమయ్యే భోగాలలో మీ మనస్సు ఎందుకు తగులుకొన్తోజీ? ఉదాత్తమైన వివేకచర్చలలో పాల్గాని చల్లనైన మీచిత్తం ఎప్పుడూ నిర్మలంగా వుండేది. ఇప్పుడెందు కిలా భయపడుతున్నది ? విషయసుఖాలపై సక్తి గొన్న మనస్సే మోహానికి గురి అవుతుంది. వివేకవంతమైన మనస్సు అలా కాదు. దేహాభిమానంతో కూడినవారిలో ఏ విషయవృత్తి ఉదయిస్తుందో ఆ వృత్తి వైపే మనస్సు పరుగులు దీస్తుంది.
ధీరమూ, ప్రబుద్దమూ, గుణవంతమూ అయిన మీ మనస్సు కూడా ఇలా విచ్చిన్నమైనట్టున్నదే 1! ఏమి చిత్రం ! వివేకం లేని చిత్తం దేశకాలాలకూ, మం(త్రౌషధాలకూ వశమవుతుంది. కాని ఉదార వృత్తి గల మనస్సు అలా వశం కాదు. వాయువు మేరుపర్వతాన్ని కదిలించలేదు. అలాగే వివేకాభ్యాసం కల చిత్తాన్ని విషయాసక్తి చలింపజేయలేదు.”'
236 యోగవాస్టం
అలా తనవారు చెప్పిన ధైర్యోత్సాదకమైన మాటలతో మాసాంతంలో చంద్రునికి పూర్ణత్వం కల్గినట్టు రాజు ముఖానికి వికాసం కల్గింది. శశిరబుతువు గడచిన పిమ్మట వికసించిన పూలతో భాసించే వసంతం లాగా కనులు తెరచి నరపాలుడు సౌమ్యముఖంతో భాసించాడు. తరువాత రాహువును చూచిన చంద్రుని లాగా ఐంద్రజాలికుని చూచి సంభ్రమాళ్ళర్యాలకు లోనయ్యాడు. అతనితో ఇలా అన్నాడు -
“ఓంటా 1! ప్రశాంత సాగరాన్ని క్షణంలో కల్టోలితం చేయగల ఈ మాయాజాలాన్ని నాపై నీవెందుకు ప్రయోగించావు ? వివిధ పదార్డాలకు చెందిన దేవుని చిత్ర శక్తులు చాలా విచిత్రమైనవి. నా చిత్తం వాటివల్ల సమ్మోహిత మయింది.. లోకవ్యవహార నిపుణులమ్రైన వేవెక్కడ ? ఇప్పుడు వాకు కల్గిన మనోమోహదాయకమైన ఈ ఆపద లెక్కడ ? బుద్రివుంతుల చిత్తం ఎంత జ్ఞానాభ్యాసం కలదైనా ఎప్పుడో ఒక్కప్పుడు మోహానికి గురి అవుతుంది. సభాసదులారా ! ఈ ఐంద్రజాలికుడు ముహూర్తకాలం ప్రదర్శించిన ఈ వింత చరిత్ర వినండి ! ఇతనిలో నేను చాలా చిత్రవిచిత్రమైన కార్యదశలను చూచాను.”
అలా చెప్పి సభ్యులందరూ విప్పారిన నేత్రాలతో చూస్తూ విన కుతూహలం ప్రదర్శిస్తుండగా రాజు విసయావహమైన అవృత్తాంతం వినిపించడాని కుద్యుక్తు డయ్యాడు.
“అనేక పదార్దాలు, మడుగులు, నదులు, పట్టుణాలు, కొండలు, కుల పర్వతాలు, సముద్రాలతో పరివ్యాప్తమైవున్న ధరావలయంలో ఈ మన ప్రదేశం ఎంతో వైభవోపేతమై ఉన్నది.
“ చాండాలీ వివాహం
ఈ ప్రదేశం అనేకవనాలతోనూ, పెక్కునదులతోనూ కూడి ఈ భూమండలానికి తమ్ముని లాగా ఉన్నది. దీనికి నేను (ప్రభువును. ఇందలి పౌరులు నా పరిపాలన మెచ్చుకొన్నారు. స్వర్గంలో ఇం(ద్రునిలాగా నేనీ సభనడువు విరాజిల్లుతున్నాను.
రసాతలం నుండి వచ్చిన మాయావి మయునిలాగా ఒక ఐంద్రజాలికుడు ఇంతకు ముందు ఎంతో దూరంనుండి ఇక్కడికి వచ్చాడు. ప్రళయ వాయువువే
ఉత్పత్తి ప్రకరణం 237 ప్రేరితమైన మేఘం ఇంద్రుని ధనుర్లతను కదిలించినట్టు అతడు తళతళలాడే ఒక నెమలి పింఛాన్ని నాయెదుట గిరగిర త్రిప్పాడు.
అతని వెంటనే వచ్చిన గుర్రం ముందు నిలబడి వున్న నేను ఆ పింఛాన్ని చూచి భ్రాంతచిత్తుడ నయ్యాను. ప్రళభయవాయువుచే క్షోభ పొందిన పర్వతాన్ని ఫుష్కరా వర్తక మేఘం అధిష్టించినట్టు నే నాగు(ర్రాన్ని అధిష్టించాను. ప్రళభయవేళలో పొంగిన సముద్రపుటల ఫలించిన భూమిపై కెగబ్రాకినట్టు నేనా గుర్రంపై ఎక్కి ముందుకు సాగిపోయాను. భోగాభ్యాసంతో జడమైన మనస్సు మూర్చుణ్లో పరమాత్మకు దూరం చేసినట్టు వాయువేగంతో పయనించే గుర్రం నన్ను నా స్టానం నుండి అలా చాలా దూరం తీసుకు వెళ్లింది.
అలా పోయిపోయి అలసిపోయిన అశ్వంతో నేనొక మహారణ్యం చేరుకొన్నాను. ఆ అరణ్యం యతీం'ద్రుని మనస్సులాగా శూన్యమై ఉన్నది. స్త్రీ చిత్తం లాగా విషమమై కనిపించింది. విలయకాలంలో తగులబడిన బ్రహ్మాండంవలె భయంకరమై తోచింది. అక్కడ పత్షులు లేవు. చెట్టు లేవు. నీరు లేదు. శీతబాధ సహింపరానిదై ఉన్నది. ఆ అడవికి అంతమే లేదు. ఆ అడవి రెండవ ఆకాశం లాగా, ఎనిమిదవ సము(ద్రం వలెసువిశాలమై ఉన్నది. మూర్చుని మనస్సు రీతిగా దుర్గమమై వున్న ఆ ప్రదేశంలో జన సంచారంలేదు. తృణ పల్లవాలు లేవు.
ఆ అరణ్యం చేరగానే నామనస్సు కూటీకీ, గుడ్డకూ కరవై, ఆలనా పాలనా లేక పేదరికంతో పరితపించే స్త్రీ లాగా దుఃఖానికి గురి అయింది. మృగతృష్ణాజలం మా(త్రమే దొరికే ఆచోట నేను నాటి సూర్యాస్తమయ సమయం వరకూ ఇటూ అటూ సంచరిస్తూ వుండిపోయాను. తరువాత వివేకవంతుడు సంసారాన్ని దాటినట్టు అతివిశాలమైన ఆ అరణ్యాన్ని నేను మిక్కిలి కష్టంతో దాటాను.
ఆకాశయానంతో సూర్యుడు అస్తాద్రిని చేరినట్లు అలసిపోయిన గుర్రంతో నేనక్కడనుండి మరొక అడవిని చేరుకొన్నాను. అక్కడ నేరేడు చెట్టుపైనా, కడిమచెట్ల మీదా మధురంగా గానం చేసే పక్షులు బాటసారులకు బంధువుల్లాగా కనిపించాయి. అన్యాయంగా ధనమార్డించే వాని హృదయంలో ఆనంద వృత్తులవలె అక్కడ కోమల తృణాంకురాలు మిక్కిలి అరుదుగా గోచరించాయి. అయితే నీరసమైన మొదటి అడవితో పోల్చి చూస్తే ఇది కొంచెం సుఖావహమై తోచింది. మిక్కిలి దుఃఖదాయకమైన చావుకంటె రోగం కొంచెం మేలు కదా !
2368 “యోగవాసిస్టం మహాసము[దర్రంలో పరిభ్రమించే మార్కండేయుడు తుదకు వటవ్చక్షం చేరినట్లుగా అక్కడ నేనొక నిమ్మ చెట్టు చేరుకొన్నాను. ఎండకు తపించిన కొండ నల్లని మేఘమాలను పట్టుకొన్నట్టు నేనా చెట్టు కొమ్మకు (వేలాడుతున్న ఒక తీగను పట్టుకొన్నాను. గంగానది నాశ్రయించిన వాళ్లో పాపసంచయం వదలిపోయినట్లు నేను తీగను పట్టుకోగానే ఆ గుర్రం నన్ను వదలి పోయింది. అస్తాద్రి సానువులో కల్పవృక్షం (క్రింద సూర్యుడు వి(శ్రమించినట్టు సుదూరం పయనించి (శ్రమచెందిన నేను ఆ వృక్షం (క్రింద విశ్రమించాను. సంసారవ్యవహారాలన్నీ విరావుం పొందాయి. మెల్లవెల్లగా భువనవుంతా అంధకారం వ్యాపించింది. రాత్రి వ్యవహారాలు (ప్రారంభమయ్యాయి. రెక్కల్లో వముఖం దూర్చి తన గూటిలో నిల్చిన పక్షీలాగా నేను తరుతృణమయమ్పైన ఆ ప్రదేశంలో చాలసేపు కదలకుండా అలాగే ఉండిపోయాను. విషం సోకి, వివేకం కోల్పోయి, స్మృతి తప్పి, స్వతంత్రత లేక అంధకూపంలో కూలిన దీనునిలా అయిపోయాను. సము(ద్రంలో కొట్టుకొని పోతున్న “ూర్కండేయునికి లాగానే నాకారాత్రి ఒక యుగంలా గడచింది. స్నానం, పూజ, భోజనం, ఏమీలేక ఆపన్నుడనైన నాకు ఆ రాత్రి మిక్కిలి వ్యథ కల్గించింది. ని(ద్ర లేక, ధైర్యం కోల్పోయి చివురుటాకులాగా చలించిపోతున్న నాకు ఆ నిశీథం ఎట్టో కష్టం మీద గడచిపోయింది. తరువాత నక్షత్రాలు, చంద్రుడు, కలువలతో సహా చీకటి రేఖలు నాముఖం వాడిపోయినట్లే కళావిహీనమయ్యాయి. బేతాళాల సింహనాదాలు శాంతించాయి. చలికి వణికే ప్రాణుల దంతపంక్తుల టాంకారాలు, సీత్కారాలతో కూడా మద్యపానంతో ఎర్రబడినదా అన్నట్టున్న తూర్పు దిక్కు ఆర్హుడనైన నున్న చూచి పరిహసిస్తున్నట్టు భాసించింది. అజ్ఞాని జ్ఞానాన్నీ, దరిద్రుడు బంగారునూ చూచినట్లు అప్పుడు నేను గజారోహణానికి సిద్దమవుతున్న సూర్యుణ్లీ చూచాను. అంతట సంధ్యానృత్యానికి సిద్దమయ్యే శివుడు గజచర్మాన్ని దులిపినట్టు నేను నాదుప్పుటి దులుపుక్"న్నాను. =. పళయంలో భూతగణాలన్నీ కాలిపోయిన పిమ్మట కాలరుద్రుడు జగత్క్కటీరంలో విహరించిన ట్టు నేను ఆవిశాలవైన అరణ్యస్ట్రలిలో విహరించసాగాను. మూర్చునిలో ఉత్తమమైన గుణంలాగా ఆ విశాలాటవిలో ఒక్క (ప్రాణి కూడా నాకు కనిపించలేదు. పండ్లూ, కాయలూ లేని వనఖండంలో స్వేచ్చగా
ఉత్పత్తి ప్రకరణం 239 కొన్ని పక్షులు మాత్రం 'చీవీ కూచీ” అని శబ్దం చేస్తూ అక్కడ విహరిస్తున్నాయి.
తరువాత కొంత ప్రాద్దెక్కగానే ముంచుకు తడిసిన తీగలపై వుంచు బిందువులన్నీ మాయమయ్యాయి. అప్పుడు అమృతకుంభాన్ని చేతబట్టుకొన్న మోహీనీ దేవత లాగా అన్నపు కడవను చేబూని పోతున్న ఒక కన్యను నేను చూచాను. మిం మిల మెరిసే తారకలు గల నల్లని రాత్రిని చంద్రుడు సమీపించినట్టు చంచలమైన కనులు గల్లి మలినవ'స్రాలు ధరించి వున్న ఆకన్యను నేను సమీపించాను.
““ఓ బాలికా ! నేను చాలా ఆకలితో వున్నాను. నాకీ అన్నం పెట్టు. దీనుల దుఃఖం తొలగిస్తే సంపదలు వృద్ది పొందుతాయి. పాడుబడిన చెట్టు తొర్రలో (ప్రసవించిన కృష్ణసర్పం లాగా నాలో ఆకలి చాలా తీవ్రంగా ఉన్నది'' అని ఆమెను (ప్రార్జించాను.
పాపీకి లక్ష్మీ ధనం (ప్రసాదించదు గదా ! అదే రీతిగా నేనెంత '్రార్దించినా ఆమె నాకేమీ ఇవ్వలేదు. అయినా నేనా అడవిలో ఆమెను నీడలా వెంబడిస్తూ వెళ్ళాను.
అప్పుడామె '“ఓ హారకేయూర ధారీ! నేను చండాల కన్యకను. మనుష్యులనూ, ఏనుగులనూ, గు(ర్రాలనూ భక్షించే (క్రూరరాక్షసి వంటే దానను. రాజా ! నీచుడైన గ్రామీణునిలో మంచితనం లభించదు. అలాగే నన్ను నీవు వెంబడించి వచ్చినా నా వద్ద నీకు ఆహారం దొరకదు*' అని చెప్పింది.
అలా అంటూ, ఎగురుతూ, ఆడుతూ, అటనుండి వెళ్ళుతూ, పొదల్లో దూరుతూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మళ్ళీ ఇలా అన్నది -
“ప్రభూ ! నీవు నాకు భర్తవైతే నేను నీకీ భోజనం పెడతాను. నా వంటి సామాన్యులు ప్రయోజనమేమీ లేకుండా ఇతరులకు ఉపకారం చేయరు. నా తండ్రి శ్మశానంలో బేతాళుని లాగా ధూళి ధూసరిత శరీరుడై ఆకలితో ఇక్కడికి సమీపంలోనే పాలం దున్నుతున్నాడు. ఈ అన్నం ఆయనకు తీసుకుపోతున్నాను. అయినా నీవు
నా భర్తవైతే నీకిస్తాను. (స్త్రీలకు వల్లభులైన పురుషులు ప్రాణాలైనా ఒడ్డి ఆరాధింప దగినవారు కదా 1”!
అప్పుడు నేనామెతో ''సువ్రతా ! నేను నీకు భర్త నవుతాను. అపత్కాలంలో వర్గ ధర్మకులక్రమాలను ఎవడు విచారిస్తాడు ?* అని చెప్పాను.
అంతట ఆమె నాకు ఇం(ద్రునికి మోహిని అమృతంలో అద్దం ఇచ్చినట్టు ఆ అన్నంలో సగం సమర్పించింది. మోహంతో బుద్రిహినుడనైన నేను ఆమె యిచ్చిన
[25
240 యోగవాస్టం నేరేడు పండ్ల బం త్రాగాను. అన్నం తిన్నాను. అక్కడే కొంతసేపు వి[శ్రమించాను. పీదప సూర్యుని వదలి వర్గర్తువు వెడలినట్లు ఆమె నన్నక్కడ విడిచి వెలుపలవున్న నా (ప్రాణాన్ని చేతబట్టు కొని పోయినట్లు వెడలి పోయింది. దుష్టుడు, దుష్కార్య ధురంధరుడు, బలిసిన శరీరం కలవాడూ అయిన తండ్రీ వద్దకు వెళ్ళింది. '“తండ్రీ! అతడు నాకు భర్త కావాలి. దీనికి నీ వంగీకరించు?” అని తుమ్మెద ధ్వనించినట్లు అతని చెవిలో చెప్పింది. అతడు అందుకు సరే అన్నాడు.
ఇంతలో సాయం సమయ మయింది. యముడు కింకరులను విడిచిపెట్టినట్టు అతడు నాగలికి బంధించిన రెండెడ్రనూ వదలాడు. మంచు దిక్కులను ఆవరించింది. బేతాళాలకు నిలయమైన ఆ వనంనుండి మేము ముగ్గురమూ బయలు దేరి వెళ్ళాము. బేతాళాలు మహాళ్ళశానం నుండి మరొక పెద్ద శ్మశానానికి పోయినట్లు ఆ సంధ్యాకాలంలో మేము విశాలమైన ఆ అరణ్యం నుండి వారున్న షళ్లెకు వెళ్ళాము.
ఆ పల్లెలో క్షోతులు, కోళ్ళు, కాకులు ముక్కలు ముక్కలుగా నరకబడి వున్నాయి. నెత్తురు ప్రవహించిన నేలపై ఈగలు మూగుతున్నాయి. ఆరవేసిన తడి (ప్రేగుల మీద పక్షులు తిరుగు లాడుతున్నాయి. గృహారామం లోని నిమ్మ చెట్లపై పిట్టలు ధ్వనిస్తున్నాయి. గృహద్వారంలో ఎండబెట్టబడిన క్రొవ్వు మీద పక్షులు (వ్రాలుతున్నాయి. తడిచర్మాలనుండి నెత్తురు కారుతున్నది. బాలురచేతిలోని పచ్చి మౌంసపు ముక్కలపై దోమలు ముసురుతున్నాయి. పెద్దలైన చండాలురు అల్లరి చేసే పిల్లల్ని బెదరిస్తున్నారు. ప్రళయంలో ప్రాణులన్నీ మరణించినవోట యముని భటులు '్రవేశించినట్టు నాడులతో, (ప్రేవులతో నిండి భీకరమైన ఆచండాల వాటికను మేము ప్రవేశించాము.
ఆ క్రొత్త మామగారి యింట సం(భ్రమంతో తెచ్చి పరచబడిన అరటీ ఆకు ఆసనంపై నేను కూర్చున్నాను. “ఇతడు మన అల్టుడు' అని ఆగ్భహస్టుడు చెప్పగానే రక్త బిందువులు చిందించే కన్నులు గల మా అత్త ఎంతో అభినందించింది. అపై కృష్ణాజినం పై కూర్చుండి కొంత సేపు విశ్రమించాను. సంచితమైన పాపాలను పాఏీ అనుభవించినట్టు ఆచండాలురు పెట్టిన రకరకాల తిండిని ఆరగించాను. అనేక దుఃఖాలకు కారణాలూ, అ(ప్రియాలూ అయిన పెక్కు 'ప్రణయవాక్యాలు విన్నాను.
తరువాత ఆకసంలో మబ్బులూ, నక్షత్రాలూ లేని ఒక శుభదినాన వారు చండాలోచితమైన పద్దతి పాటిస్తూ మద్యమాంసాదులూ, వివాహ యోగ్యమైన
ఉత్పత్తి ప్రకరణం 241 వస్తాదులూ సమకూర్చారు. పాపికి నరకయాతనను సమకూర్చినట్టు నల్లగా, భీకరంగా ఉన్న ఆకన్యను నాకిచ్చి కట్టు బెట్టారు. ఆ వివహమహోత్సవంలో మదిరామదవుత్తు లైన చండాలురు మూర్తీభవించిన పాపరాసులా అన్నట్వ విజృంభించారు. నానావిధ వాద్యాలు (మోగిస్తూ, నలు వైపులా పరుగిడుతూ పెద్దగా నినాదాలు చేశారు.
ఆపద్వర్లనం
ఇంకపలుమాట లెందుకు ? ఆ కల్యాణోత్సవానికి నేను పరవశుడ నయ్యాను. నాటినుండి నేనక్కడ ఒక బలుపెక్కిన చండాలుడనై మెలగాను. వివహమహోత్సవం ఏడు రోజులు జరిగింది, తరువాత ఎనిమిది నెలలు గడవగానే నా భార్య బుతుమతి అయింది. ఆపై గర్భం ధరించింది.
ఆపద దుష్కియను ప్రసవించినట్టు ఆమె దుఃఖదాయిని అయిన ఒక కన్యను (ప్రసవించింది. ఆ బాలిక మూర్చుని చింత లాగా త్వరగా పెరిగి పెద్ద దయింది. పిదప మూడు సంవత్సరాలకు దుర్చుద్ది ఆశాపాళంతో బంధించే అనర్జాన్ని కల్గించినట్టు నా భార్య కుమతి అయిన ఒక కుమారుని కనింది. ఈ 6 -గా అడవిలో సంసారినైన నేను క్రమంగా వృద్దచండాలుడ నయ్యాను.
(బ్రహ్మహత్య చేసినవాడు నరకంలో చింతతో కూడి యాతన లనుభవించిన రీతిగా నేనక్కడ కళత్రంతో కూడి అనేక సంవత్సరాలు చండాల జీవితం అనుభవించాను. ముసలి తాబేలు బురదగుంటలో పొరలాడినట్టు ఆ వనమధ్యంలో చలికీ, గాలికీ, ఎండకూ బాధపడుతూ అలా చాలాకాలం సంచరించాను. కళత్రం మీది చింతతో కాలిపోయిన నా బుద్దికి కష్టమయాలైన దిక్కు లన్నీ కాలిపోయినట్టు గోచరించాయి.
ఆ అడవిలో నేను తలపై గడ్డిచుట్ట బెట్టుకొని వూర్తీ భవించిన దుష్క్కృ్రతంలాగా ఉన్న కట్టెల మోపు మోళశాను. ఈగలు ముసురుతుండగా కంపుగొట్టే ఒక గోదీ పెట్టుకొని అక్కడి చెట్టు క్రింద చాలాకాలం వి(శ్రమంచాను. చలికి గడగడ వణకుతూ జీర్లశరీరుడనై కుటుంబపోషణ చింతతో దురపిల్చుతూ కప్పలాగా ఆ వనమధ్యంలో దాగి వుండీనాను.
మాలో పెక్కు కలహాలు చెలరేగాయి. అ గొడవలకు తపించి కన్నీటి వ్యాజంతో నేత్రాలనుండి నెత్తురుబొట్టు కార్ఫాను. అడవిలో శిలల|క్రింద
242 యోగవాసిష్థం పందిమాంసం తింటూ మబ్బులతో కలుషితమైన రాత్రుల నెలాగో గడిపాను. వర్షాకాలం గడచిపోయింది. మా సంసారంలో కలహాలు ఎక్కువయ్యాయి. ఇక ఆ యింట ఉండలేక దీనుడనైన నేను చిన్న పిల్లలతో సహా పరులయింట కొన్ని సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చాను. ఒకప్రక్క భార్యతో కలహం, మరొక ప్రక్క చండాలుర బెదిరింపులు వీటివుధ్య నలిగిపోయాను. రాహుపీడకు లోనైన చం(ద్రునిలాగా నా ముఖం జర్హరమైపోయింది. నరకలోకంలో అమ్మే త్రాళ్లలాగా వున్న వ్యాఘాది జంతువుల 'ప్రేవులను నమలి తిన్నాను. ఇంతలో శిశిరబుతువు వచ్చింది. మృత్యుదేవత విసరిన బాణాల లాగా వడిగా వీచిన ప్రచండమైన చలిగాలులు కప్పుకో వడానికి గుడ్డ కూడా లేని నా శరీరంలో (గ్రుచ్చుకొన్నాయి. వార్దక్యంలో మూఢుడ నైన నేను క్షీణమైన వృక్షాల మొదళ్లను సుకృతాలను నరకినట్న్లు నరిక్వేశాను. అరణ్యంలో నీచాచారుడనైన నేను మూకుళ్ళలో వండిన మాంసాన్ని భుజించాను. లేళ్ళు, గొ రైల మాంసాన్ని ఇతరుల వద్ద కొన్నాను. ప్రాణుల అంగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఇనుప పాత్రల్లో ఉడికించాను. పాపాన్ని వృద్ది చేసుకొనేటట్టు లాభాపేక్ష్తతో ఆ మాంసాన్ని ఎక్కువ వెలకు అమ్మాను. అలా అమ్మగా మిగిలిన మాంసాన్ని, చండాలగ్భహ వాటికల్లో ఎండబెట్టాను. మాంసార్హనకు ఆటంకం కల్గించే సంధ్యాసమయాన్ని ద్వేషించాను. త్రవ్వకానికీ ఉపయోగపడే కుద్దాలకాన్ని (ప్రేమించాను. రౌరవనరకం నుండి పడినవానిలాగా దుర్దశలో చిక్కుకొని వింధ్యగుహల్లో ని తీగలతో బంధుత్వం పొందాను. జంతువులవల్ల కలిగే ఉపద్రవాలను దండ ప్రహారాలతో నివారించుకొంటూ నికృష్టమైన అన్నంతో భార్యనూ, బిడ్డలనూ పోషించాను. జడివానలో శబ్దంచేసే తాటివెట్ట క్రింద అడవికోతులు తోడుగా చలికి పండ్లు గిటకరించుకొంటూ ఎన్నో రాత్రులు గడిపాను. సూదులను పోలిన రోమాలతో ముత్యాలవంటి వర్షబిందువులు ధరించాను. ఒకసారి ఆకటి పీడకు తట్టుకోలేక ఒక మేక మాంసపు ముక్కకై భార్యతో కలహించాను. అడవిలో పండ్లు పట పట కొరుకుతూ బేతాళునిలా వుండిపోయాను. యుగాంతంలో పాళం చేపట్టిన యముని లాగా గాలం చేపట్టి చేపలక్రై నదీతీరాలలో
ఉత్పత్తి ప్రకరణం 243 పరి(భ్రమించాను. చాలాకాలం ఉపవసీంచడం వల్ల డస్సిపోయిన నేను అప్పుడే కోసిన మృగాల వక్షష్టలంలోని రక్తాన్ని మాతృ స్తన్యం లాగా (త్రాగాను. శృశానంలో ఉంటూ రక్తంపై ఆశకలిగి మలిన భో జనుడనైన నన్ను చూచి బేతాళాలు చండికను చూచినట్లు భయపడి పరుగెత్తి పోయాయి.
ఫుత్రకళత్రాదుల మీద ఆశను విస్తరింప జీసికొన్న విధంగా నేను మృగాలనూ, పక్షులనూ బంధించడానికి వలలను అడవిలో పరచాను. లోకాలలో మాయలాగా నేను పరచిన వలలు అరణ్యమంతటా వ్యాపించాయి. ఆ వలలో చిక్కిన పక్షులను మిక్కిలి (క్రూరంగా హింసించాను. పాపాత్ముడనైన నా మనస్సు ఇంకా ఎన్నో దుష్కృృత్యాలు చేసింది. వర్షాకాలంలోని నది లాగానా ఆళ పెరిగింది. ఎలుగుబంటి తరిమిన పాము లాగా నా బుద్ది ఎక్కడికో పరుగెత్తి పోయింది. పాము కుబుసాన్ని వదలినట్టు నేను దయను వదలి పెట్టాను.
ఎండాకాలం గడచిపోగానే ఆకాశం మబ్బును అంగీకరంచినట్టు నేను క్రార్యాన్ని అంగీకరించాను. పెద్ద గోయి దుర్తతలను భరించినట్టు నేనెన్నో ఆపదలు భరించాను. భీకరమైన నరకభూములలో అజ్ఞానంతో వృద్ది బొంది ఫలించే దుష్క్పత బీజాలను వెదజల్లాను. యముడు స్రాణీకోట్రపై మృత్యువనే వలను విసరినట్లు దయలేకుండా మృగాలను పట్టుడానికై వలలు పన్నాను. శౌరి శేషుని అవయవాలపై శయనించినట్టు వివేకం కోల్పోయి చామరీ కంఠాలపై శిరసుంచి ని(ద్రించాను.
ఆదివరాహం ్రాణికోట్లతో కూడిన భూమిని భరించినట్టు ఈగలువాలి నింద్యమైన ఒక బొంతను (గ్రీష్మర్తువులో నేను నానల్లని శరీరంపై ధరించాను. ('ప్రళయానలంతో జగత్తును దహించే కాలుని లాగా నేను అడవిలోని దావాగ్నిలో అనేక ప్రాణులను కాల్చివేశాను.
వ్యభిచారి రోగాలనూ, దురాగ్రహశీలుడు అనర్జాలనూ పెంపొందించు కొన్నట్టు నా భార్య సుఖదుఃఖ రూపాలైన సంతానాలను ప్రసవించింది. నిర్హుష రాజపుదత్రుడనైన నేను ఇలా అరవై సంవత్సరాలు అరవై కల్పాలలాగా గడీపాను. సభ్యులారా ! కాలాంతరానికి చెందిన ఆ శబరాలయంలో దుర్వాసనలనే శృంఖిలలచే బంధింపబడి (క్రో ధావేశంతో ఇతరులను దూషించాను. ఆపదల్లో ఏడ్చాను. నింద్యాన్నం తిన్నాను. నికృష్టమైన ప్రదేశాలలో నివసించాను.
244 యోగవాసష్టం అకాండ దుర్శిక్షం
కాల(క్రమంలో నేను ముదుసలి నయ్యాను. నా మీసాలు మంచు గప్పిన గడ్డిపరకల్లా తయారయ్యాయి. సుఖంతో కొన్ని దినాలూ, దుఃఖంతో మరికొన్ని దినాలూ కర్మవాయు'ప్రేరితాలై గాల్కెగిరిన పండుటాకుల్దాగా గతించసాగాయి. కలహాలూ, అకార్యాలూ, సుఖాలూ, దుఃఖాలూ యుద్ద భూమిలో బాణాల్లాగా ఎడతెగకుండా వచ్చిపడ్డాయి. నేను వికల్పకల్పనలనే సుడిగుండాలలో చిక్కుకొని పరిభ్రమించాను. సుడిలో తగులు వడ్డ గడ్డిపోచ లాగా చింతలలో తగులుకొన్న నేను కాలమనే సాగరంలో సుదూ రం కొట్టుకుపోయాను.
వింధ్యా[ద్రిలోని అడవిలో ఒక పురుగు లాగా తిండిని గూర్చి మాత్రమే ఆలోచించసాగాను. అలా రెండు చేతుల గాడిదలాగా బ్రదుకుతున్న నాకు కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. మరణించిన వానికి వేగంలాగ నాకు నా రాజత్వం విస్మృతమై పోయింది. రెక్కలు నరికిన కొండలాగా నా చండాలత్వం స్రీరపడిపోయింది.
(ప్రళయం ప్రపంచాన్నీ, దావాగ్ని అరణ్యాన్ని, సముద్రపుటల తీరాన్నీ, పిడుగు శుష్కవృత్షాన్నీ పై కొన్నట్టు ఆవింధ్య పర్వత ప్రాంతంలోని చండాల మండలాన్ని దుర్భిక్షం పై కొన్నది. కనిపించి మాయమయ్యే మబ్బులు వర్షించడం మానివేశాయి. గాలి సూక్ష్మాతి సూత్ష్మమై అగ్ని కణాలతో కూడ పయనిస్తున్నదా అన్నట్టు వేడిగాడ్పులు వీచాయి. ఎండుటాకులతో నిండిన ఆ (ప్రదేశమంతా దావానలంతో వ్యాప్తమైపోయింది. వనభూములన్నీ శూన్యాలయ్యాయి.
హఠాత్తుగ (ప్రారంభమైన ఆ కాటకం పరమ భయంకరంగా పరిణమించింది. ప్రాణుల అవయవాలన్నీ ధూళిధూసరితాలయ్యాయి. జనులందరూ ఆకలితో అలమటించారు. ఆ ప్రాంతంలో ఎక్కడా నీరు, గడ్డి అన్నం లభించని పరిస్థితి ఏర్పడింది. జనపదాలు అరణ్యాలుగా మారాయి.
దున్నలు ఎండమావుల జలాలలో మునగజొచ్చాయి. గాలికి వచ్చే నీటి తుంపురులను సైతం ఆకాశం పరిహరించింది. “నీరు అన్న మాట వినడంతో ప్రజలు ఉత్కంఠితులయ్యారు. మానవులందరూ మండుటెండలలో మలమల మాడిపోయారు. క్షుధా పీడితులైన జనులు ఆకులు, అలములు (మింగడానికి
ఉత్పత్తి ప్రకరణం 245 సిద్దమయ్యారు. అవి కూడా లభించక వారి జీవితాలు గాలిలో కలసిపోయాయి. వాళ్ళ అవయవాలను వాళ్ళే తినే ఫ్రితికి వాళ్ళు దిగజారిపోయారు. జనులు చం(డ్రనిప్పుల కణికలను మాంసఖండాలనీ, పాషాణఖండాలను అన్నపు మెతుకులనీ భావించి తినజ్ొచ్చారు.
తల్లిదం(డ్రులు, బిడ్డలు ఒకరి నొకరు కౌగలించుకొని దుఃఖించసాగారు. గ్రద్దలు గిలగిలలాడే సారికలను పాట్టున పెట్టుకొన్నాయి. ఒకరి నొకరు అంగవిచ్చేదం చేసుకోవడంవల్ల భూతలం రక్హసీక్త మయింది. క్షుద్దాధతో అలమటించిన ఏనుగులు సింవాలనే (మింగటానికి ప్రయత్నించాయి. గుహల్లో ఒకదాని నొకటి భక్షించడానికి (ప్రయత్నించే సింహాలవల్ల వాతావరణం భీషణవుయింది. పరస్పరం హీంసించుకోవటానికి యత్నించిన లోకులు మల్లచరిత్ర సృష్టించారు.
(మైడువారిన చెట్టనుండి వేడి వేడిగాలులు వీచాయి. పిల్టులు నెత్తురనే (భ్రమతో ధాతుమయమైన ప్రదేశాలను నాక సాగాయి. వనవాయువులు అగ్నిజ్వాలామయాల్రై గిరగిర తిరుగుతూ పరి(భ్రమించాయి. చిటపట ధ్వనులతో అగ్ని అరణ్యమంతా వ్యాపించింది. కాలిపోయే కొండచిలువల దేహాలనుండి వెడలిన పాగ పాదలపై 'క్రమ్మింది. అగ్నిజ్వాలలు సంధ్యాకాలపు మేఘాలను పోలి జ్వలించాయి. పై కగసిన భస్మధూలళి క(ర్రలేని గొడుగులాగా భాసించింది. తల్లిదం(డ్రుల ముందు పిల్లల ఆ(క్రందనాలు మిన్నుముట్టాయి.
సం(భ్రాంతులైన జనులు పెద్దపెద్ద వాలను కొరికి తినడం ప్రారంభించారు. ఆ తొందరలో తమ ్రళ్ళనే తాము కొరుక్కొని రక్తం కావించారు. ఛిన్న భిన్నాంగులైన (ప్రాణులను చూచి లోకులు పరూత్త సాగారు. గనగన మండే దావాగ్నుల ఖణత్కార శబ్దాలు హృదయాలను చీల్చివేశాయి. భయపడిన కొండచిలువల పూత్కారాగ్ని జ్వాలలు సోకి మండిన చెట్టు నేల కొరిగాయి. పల్లపు (ప్రాంతాలలోని దావానలం గాలికి నలుదెసలా వ్యాపించింది.
తీవ్రదుర్చిక్ష ప్రభావంతో శుష్కించిన ఆ ప్రదేశం పండ్రెండు మంది సూర్యు లుదయించినప్తుడు కాలిపోయిన జగత్తు లాగా కనిపించింది. మండే అగ్నికి ఆహుతవుతున్న చెట్టునుండి ప్రసరించే గాలికి లోకమంతా ఓఏడిత మయింది. ఆ ఏంధ్యాద్రి ప్రాంతం అగ్ని, సూర్యుడూ, యముడూ (శనీ) క్రీడించే గృహాన్ని పోరి భాసించింది.
246 యోగాష చండాలత్వ వ్యపగమం
ఆ విధంగా అప్పుడక్కడ విధి వక్రించింది. చాలా కష్టకాలం దాపు రించింది. అకాలంలో సంభవించిన ప్రళభయమా అన్నట్టు అందరినీ బాధించే విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది.
ఈ దుఃస్థితికి త ట్టుకోలేక కొంతమంది సకుటుంబంగా శరత్కాలంలో మబ్బులు ఆకాశం విడిచి పోయినట్టు ఉన్నచోటు విడిచి దేశాంతరం వెళ్ళారు. శరీరావయవాలలాగా తమను అంటుకొని వున్న బంధువులను విడువలేక, ఎక్కడికీ పోలేక మరికొంత మంది అక్కడే పడి మృతి చెందారు. రెక్కలు రాని పక్షిసిల్లలు గూడువీడి బైటికి రాగానే డేగల పాలైనట్టు ఇంకకొందరు ఇల్టు వదలి వెలుపలికి వచ్చి 'కూరవ్చుగాలవాత పడ్డారు. వేరుకొందరు మిడుతల్దాగా వంటల్లో బడి మాడిపోయారు. కొండనుండి దొర్లిన గుండురాళ్ల లాగా మరికొందరు గోతుల్లో బడ్డారు.
అప్పుడునేను నామామ మొదలైన బంధువర్గాన్ని అక్కడే వదలి భార్యనూ, బిడ్డలనూ మౌద్రం వెంట దీసుకొన్నాను. ఎంతో వేదనతో అక్కడ నుండి బయలు దేరాను. అగ్ని, వాయువు, (మూరజంతువులు, పొములు వెచుదలైనవాటి బారిబడకుండా ఎలాగో తప్పించుకొని వృత్యు భయంతో ఆ్రదేశంనుండి పయనమయ్యాను.
అలా ఆదేశం దాటిపోయి ఒక తాటిచెట్టు (క్రింద చేరాను. అనర్జాల వలె దాపురించిన పిల్లలను అక్కడ భుజంనుండి క్రిందికి దింపాను. (గ్రీష్మంలో నీరు ఇంకి పోగా శుష్కించిన పద్మంలాగా చాలా అలసి పోయాను. రౌరవ నరకంనుండీ బయటపడీనవాని లాగా అక్కడ కాస్తా విశ్రమించాను.
ఆచెట్టు క్రింద చల్లనినీడలో ఇద్దరు పిల్లల్ని కౌగలించుకొని నాభార్య నిద్రించింది. ప్పృచ్చకుడనే మరొక పిల్లవాడు నా యెదుటనే ఉన్నాడు. వాడు అందరికంటే చిన్న వాడు. అందువల్ల వాడంటే మాకు చాలా ప్రేమ. వాడు ఎంతో దీనుడై కన్నీరు కారుస్తూ '“నాన్నా ! నాకు తినటానికి మాంసం, (త్రాగటానికి రక్తం తెచ్చి పెట్టు. ఇప్పుడే తె్పపెట్లు'” అని మారాం చేశాడు.
వాడలా మాటిమాటికీ నన్ను పీడిస్తూ బిగ్గరగా ఏడ్చాడు. ఆకరఠితో ఆలమటిందచి ప్రాణాంతక దశను చేరుకొన్నాడు. నేను ““బాబూ ! మాంసం
ఉత్పత్తి ప్రకరణం 247 లేదురా!” అని ఎన్నో సార్డు చెప్పాను. అయినా ఆ దుర్చుద్ది ''నాకు మాంసం కావాలి, మాంసం కావాలి'' అని ఒకే పట్టు పట్టాడు. అప్పుడు వాత్సల్య మూఢుడనైన నేను దుఃఖంతో '“బాబూ! నామాంసం ఉడికించి తినరా !** అన్నాను. “అయితే సరే! అదే యివ్వు !'' అని వాడు ఆకటి బాధకు తట్టుకోలేక నన్ని గట్టిగా కౌగలించుకొని నా మాంసం తినటానికి సిద్ద్రపడ్డాడు.
స్నేహానికీ దయకూ పరవళుడనైన నేను ఆ పిల్లవాని బాధ చూచి భరించలేక పోయాను. అలాంటి సందర్భాలలో మి(త్రుడుగా ఉపకరించే మృత్యువును ఆశ్రయించటానికి నిశ్చయించుకొన్నాను.
అక్కడ ఇటూ, అటూ తిరిగి కొన్ని పుల్లలు ఏరి తెచ్చాను. చితి పేర్చి రగిలించాను. నా ప్రాణాల్జై ఎదురుచూస్తున్నదా అన్నట్టు ఆ చితి చటచటా శబ్దంతో మండ జొచ్చింది. నన్ను నేను ఆ చితిలో పడవేయబోయే సరికి ఈ సింహాసనంనుండి ఇప్పు డీలా వేగంగా చలించాను. ఆపై జయ శబ్లాలతో, తూర్యనాదాలతో ప్రబోధితుడ నయ్యాను. ఈ ఐంద్రజాలికుడు నన్ను ఈ రీతిగా మోహపరవళశుళ్లి చేశాడు. అజ్ఞానం జీవునికి అనేక దుర్షళలు కల్లిస్తుంది. అలాగే వీడు నాకీ దురవస్థలు కలిగించాడు'' అని ఆ లవణమహారాజు చెప్పాడు.
ఆ రీతిగా ఆ భూపాలుడు అంటుండగానే శాంబరికుడు క్షణంలో మాయమయ్యాడు.
అప్పుడు ఆళ్ళిర్యంతో విప్పారిన కన్నులు గల సభా సదులు రాజుతో ఇలా
““దేవా ! ఇతనికి ధనాళ లేదు. అందువల్ల ఇతడు ఐంద్రజూలికుడు కాడు. ఇది సంసారస్వరూపాన్ని నీకు బోధించటానికి దేవతలు పన్నిన మాయ లొగా ఉన్నది. దీనివల్ల మనోవిలాసమే సంసార మని తెలుస్తున్నది. ఎందుకంటే, సర్వశక్తి సంపన్నుడైన పరమేశ్వరుని మనోవిలాసమే కదా ఈ జగత్తు ! సకల శక్తిమంతుడైన విధి లీలలు విచిత్రాలు గదా ! ఆ విధి తన మాయతో వివేకవంతుని మనస్సును కూడా మోహింపటేస్తుంది.
రాజా ! లోకవృత్తాంతాలన్నీ తెలిసిన మీరెక్కడ ! సామాన్యుల మనో వృత్తికి తగిన ఈ (భ్రాంతి ఎక్కడ ! ఈ మనోామోహకమైన మాయను కల్పించడం ఐంద్రజాలికుని ఇచ్చ కాదు. శాంబరికులు ధినం క రై ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
248 యోగాసిష్టం అంతేకాని వట్టి భ్రాంతి కల్గించటానికి ఇలా చేయరు. రాజూ! వారు (ప్రయత్నంతో ధనం కొరకై అర్ధిస్తారు. పని పూర్తి అయిన తర్వాత ఇలా హఠాత్తుగా మాయం కారు. ఇదంతా విని మేము సందేహ సముద్రం గట్టు చేరుకొన్నాము'',
వసిష్టుడు : - “రామా ! ఈ వృత్తాంతం సంభవించినప్పుడు నేనా సభలో వున్నాను. ఇది నేను ప్రత్యక్షంగా చూచిందే కాని ఎవరో చెప్పగా విన్నది కాదు. రామా! మనస్సు వివిధ విచిత్ర కల్పనలతో శాఖోపశాఖలుగా పెరిగి పెరిగి బహుకాలంగా విజృంభించి వున్నది. ఈ చిత్తం విచార జ్ఞానంతో వాసనా రహితస్రితిని పొంది పరమాత్మలో లీనం కావాలి. అలా లీనమై అది శమించి నప్పుడు నీవు పరమ పావనమైన మోత్షపదం చేరుకొంటావు.
చిత్త వర్ణనం
తొలుత పరమకారణమైన అజ్ఞానం వల్ల చిత్తు విషయాభిముఖ మయింది. అది ఆయా పదార్ధరూపాలతో భాసించి వివిధ వైచిత్రాలతో కళంకితమయింది. రామౌ ! ఇలాంటి మిథ్యావోాహాల వల్లనే ఈ చైతన్యం తన పూర్ణత్వాన్ని విస్మరించింది. తుచ్చమైన వునోరూపం పొందింది. అనాదికాలం నుండీ జననమరణాది (భ్రమలకు లోనై మోహితమవుతున్నది. ఈ రీతిగా మనోవృత్తి అనేకదోషాలచే మలినమై బాలిక బేతాళాలను విస్తరింపజేసినట్టు దుఃఖాలను విస్తరింపజేస్తున్నది.
వాసనా కళంకంలేని మనోవృత్తి సహజ సద్రూపం కలదై, సూర్య కాంతి చీకటిని నశింపజేసినట్టు క్షణంలో మహాదుఃఖరాశిని నశింపజేస్తుంది. ఈ మనస్సు దూరంలో ఉన్నదాన్ని దగ్గజణ ఉన్నట్టూ, దగ్గజీ పదార్దాన్ని దూరంలో వున్నట్టూ భాసింపజేస్తుంది. బాలుడు చిన్న చిన్న పక్షుల నడుమ క్రీడించినట్టు ఇది జీవుల మధ్య ్రీడిస్తున్నది. వాసనామయమైన అజ్ఞాని చిత్తానికి భయరహితమైన వస్తువు సైతం భయం కల్లిస్తుంది. అజ్ఞుడైన బాటసారికి దూరాన వున్న స్టాణువు పిశాచంగా కనిపిస్తుంది గదా ! మలినమైన మనస్సు మిత్రునిలో శత్రుత్వాన్ని శంకిస్తుంది. వుత్తెక్కిన వుతిగలవాడు భూమి (భ్రమిస్తున్నట్టు చూస్తాడు గదా ! చిత్తం వ్యాకులమైనప్పుడు చంద్రునినుండే వజ్రపాతం కల్గుతుంది. విషమనే భావంతో భుజిస్తే అమృతంకూడా విషమే అవుతుంది.
ఉత్పత్తి ప్రకరణం 249
వాసనలకు వశమైన చిత్తం లేని గంధర్వ నగరాన్ని ఉన్నట్టు చూస్తుంది. మనస్సులోని ప్రబలమైన వాసనలే జీవుణ్లీ మోహానికి గురి చేస్తున్నాయి. అలాంటి వాసనలను ప్రయత్నంతో సమూలంగా ఉన్మూలించాలి.
సంసారమనే వనగుల్మంలో మానవుల మనస్సనే జింక వాసన లనే వలల్లో దగుల్కొని వివశమవుతున్నది. ఎవడు విచారక్త్తితో జ్రేయవాసనను ఛేదిస్తాడో, వాని బుద్ది మబ్బు లేని సూర్యుని వెలుగు లాగా భాసిస్తుంది. రామా! అందువల్ల మనస్సే మనుజుడు కాని ఈ శరీరం కాదని గ్రహించు. శరీరం జడం. మనస్సు జడమూ కాదు, చేతనమూ. కాదు, మనస్సుతో ఏది చేస్తామో, అదే చేసినట్టు గ్రహించు. మనస్సుతో దేన్ని వదల తామో దానిచే వదలినట్టు తెలుసుకో. ఈ జగత్తంతా మనోమా'(త్రమే, భూమి, ఆకాశం, వాయువు, మహత్తు- ఇదంతా మనస్సే.
ఎవని మనస్సు మోహానికి గురి అవుతుందో వాడు మూఢు డనబడతాడు. అంతేకానీ శరీరం మోహానికి గురి అయినప్పుడు శవాన్ని మూఢమని వ్యవహరించం కదా ! మనస్పాక్కటే చూచేటప్పుడు నేత్రమవుతుంది. వినేటప్పుడు చెవి అవుతుంది. స్పృ్రశించేటప్పుడు త్వక్కు అవుతుంది. ఆ(ఘాణించేటప్పుడు (ఘాణవువుతుంది. ఆస్వాదించేటప్పుడు రసన అవుతుంది. నాటకంలో నటునిలాగా దేహంలో మనస్సే ఆయా రూపాలను ధరిస్తుంది. పొట్టి వస్తువును పొడవుగా, ఉన్న దాన్ని లేనిదిగా, మధురపదార్జాన్ని చేదుగా, శత్రువును మిదత్రుడుగా మార్చేది మనస్సే.
వృత్తులలో ఉన్న చిత్తం తాను భాసించే తీరుననుసరించి ఆయా భావాలు (ప్రత్యక్షమవుతాయి. లోకంలో అనుభవం అలాగే ఉన్నది. కలలో వ్యాకులచిత్తుడైన హరిశ్చం(ద్రునికి చిత్త ప్రతిభాసంవల్లనే ఒక్క రాత్రి పం(డ్రైండు సంవత్సరాల కాలంగా తోచింది. చిత్తప్రభావం వల్లనే బ్రహ్మపురంలో వున్న ఇం(ద్రద్యుమ్నునికి ఒక ముహూర్తకాలం యుగమయింది. మనోజ్ఞమైన మనో వృత్తివల్ల రౌ రవనరకం సయితం సుఖంగానే తోస్తుంది. మరునాటి ఉదయం రాజ్యం హస్తగత మవుతుం దను కొనేవాడికి గట్టి బంధం కూడా సుఖ'్రదమే అవుతుంది గదా ! దారం కాలిపోతే ముత్యాలమాల జారిపోయినట్లే. అలాగే మనస్సును జయిస్తే ఇం(ద్రియా లన్నిటినీ జయించినట్లే. ,
రామా! ఆత్మసత్త స్వచ్చమై, నిర్వికారమై, సమమై, సూథ్మమై, సాత్షీభూతమై
250 యోగనాసిం సర్వత్రా వ్యాపించి వున్నది. సర్వక్రియా శూన్యమైన అట్టి ఆత్మకు ఈ మనస్సు శరీరంతో తాదాత్మ్యం కల్షిస్తున్నది. అది అంతఃకరణంలో వుననాదుల రూపంతోనూ, వెలుపల నదీపర్వత సముద్రాదుల రూపంతోనూ భాసించి వ్యర్థమైన (బ్రమ కల్లిస్తున్నది.
వివేకంతో జాగరూకమైన మనస్సు తన కిష్టమైతే తుచ్చమైన వస్తువును సైతం అమృతోపమంగా చేస్తుంది. ఇష్టం కానప్పుడు అమృతానికి కూడా విషత్వాన్ని ఆపాదిస్తుంది. సర్వాత్మభావాన్ని సాక్షాత్క రించుకోలేని అజ్ఞుల మనస్సు మాత్రమే వస్తువులలో అలా తనక్షిష్టమైన ఆకారాన్ని సృష్టిస్తుంది. చేతనశక్తినుండి స్పురించిన చిత్తం చలించే పదార్హాలలో వాయుత్వాన్నీ, వెలుగొందేవాటిలో (ప్రకాశత్వాన్నీ, (ద్రవపదార్జాలలో దద్రవత్వాన్నీ పొందుతున్నది. ఇది పృథ్విలో కఠినత్వాన్నీ, ఆకాశాదుల్లో శూన్యత్వాన్నీ, అంతటా తన కిష్టమైన రూపాన్నీ పొందుతున్నది.
ఈ మనళ్ళిక్తిని చూడు. ఇది దేశకాలాలతో నిమిత్తం లేకుండా తన భావనా మౌత్రంతో తెలుపును నలుపుగా, నలుపును తెలుపుగా చేస్తున్నది. మనస్సు వేరేవోట లగ్నమైనప్పుడు మనం మృష్టాన్నం భుబించినా నాలుకకు రుచి తెలియదు.
మనస్సు దేనిని చూస్తుందో అదే చూడబడిన దవుతుంది. దేనిని చూడదో అది చూడబడనిదే. చీకటిలో నీలరూప కల్పన కావించినట్లే అది ఇంద్రియాలను తనలో నిర్మించుకొంటుంది. ఇంద్రియంతో మనస్సు మనస్సుతో ఇం(ద్రియమూ పరస్పరం ఆకారం కలవిగా రూపొందుతున్నాయి. అయినా మనస్సు ఇం(ద్రియాల కంటే ఉత్కృష్టమైనది. ఇంద్రియాలు మనస్సు నుండి పుట్టాయి గాని మనస్సు ఇం ద్రియాలనుండి పుట్టలేదు.
మూఢుల దృష్టికి మనస్సు, శరీరం వేర్వేరుగా గోచరిస్తాయి. ఏ మహాత్ములు ఈ రెంటిని ఏకంగా చూస్తారో వారే ఆత్మజ్జులు, వారే నమస్కరింపదగినవారు.
కొప్పులో ఫూలు పెట్టుకొని విలాసవంతమైన వీక్షణాలు ప్రసరింపజేసే అంగన స్పృశించినా మనస్సులేని మహాత్ములకు వికారం కలుగదు. మనస్సు ఇతరత్రా లగ్నం కావడం వల్ల అడవిలో వీతరాగుడనే ముని కూరమృగాలచే భక్షించబడీన తన చేతిని గుర్తించలేకపోయాడు. ముని తన భావనా బలంతో దుఃఖాలను సుఖాలుగా, సుఖాలను దుఃఖాలుగా సులభంగా వశారృగలడు. వునస్ఫు అన్యత్రా సంచరించేటప్పుడు (ప్రయత్నంతో చెబుతున్న కథ కూడా గొడ్డలిచే నరికిన తీగలాగా
ఉత్పత్తి ప్రకరణం 251 తెగిపోతుంది.
మనం యింటిలో ఉన్నా కలలో మనస్సు కొండకొాన కెక్కితే అక్కడి మేఘాలు, గుహలు మొదలైన పరిసరాల (భ్రాంతివల్ల దుఃఖం కలుగుతుంది. మనస్సు ఉల్లాసం చెందినప్పుడు హృదయంలోనే విశాలమైన ఆకాశంలో లాగా నగరాలూ, కొండలూ గోచరిస్తాయి.
చలించే సముద్రం తనలో అలలను సృష్టించినట్టు మనస్సు విక్షేపం చెందిన హృదయంలో కొండలనూ, నగరాలనూ విస్తరింపజేస్తుంది. సాగర జలాలనుండి తరంగాలు పుట్టినట్లే దేహాంతర్గతమైన మనస్సునుండి కలలో పర్వతాలు, నరాదులూ ఉత్పన్నమవుతున్నాయి.
అంకురంనుండి ఆకులు, తీగలు, పూలు, పండ్లు కలిగినట్లే మనస్సు నుండి జాగ్రదవస్టకు, స్వప్నావప్టకూ చెందిన విభ్రమాలు కలుగుతున్నాయి. స్వర్హంతో నిర్మింపబడిన స్త్రీ స్న్వర్దంకంటే వేరు కాదు. జా గ్రత్స్వప్నదళలకు చెందిన (క్రియలు చిత్తంకంటే వేరుకావు. వీటినుండి (ప్రవాహం, బిందువులు, అలలు, నురుగూ కలిగినట్లే ఈ వివిధ వైచి త్ర్యాలు చిత్తంనుండే కలుగుతున్నాయి. నటుడు రసావేశంతో నానారూపాలు ధరించినట్టు తన చిత్తవృత్తే జాగ్రత్స్వప్నాలలో కనిపించే వివిధరూపాలు ధరిస్తున్నది.
లవణరాజులో చండాలత్వం చిత్త ప్రతిభాసంవల్లనే కలిగింది. ఈ జగద్విస్తారమంతా మనస్సులోని మననం మాత్రమే. మనస్సు ఏయే రూపాన్ని భావిస్తుందో ఆ రూపాన్నే ధరిస్తుంది. మననంతో తయారైనదే మనస్సు. లవణుడు చండాలుడయినట్లే చిత్తం ప్రతిభాసంవల్ల దేవత్వంనుండి రాక్షసత్వాన్నీ, సర్పత్వంనుండి వృక్షత్వాన్నీ పొందుతున్నది. పితృత్వం నుండి పుత్రత్వమూ, నరత్వము నుండి నారీత్వమూ యిలాగే కలుగుతున్నాయి.
ఈ వునస్సు తన సంకల్పంతో వురణిస్తుంది. సంకల్పంతోనే వుళ్ళీ జన్మిస్తుంది. ఇది ఆకార రహితమైనా, చిరకాలా భ్యాసంవల్ల జీవాకారంతో విలసిల్లుతుంది. మనన సమ్మూఢమైన మనస్సు వాసనలతో నిండి అంతటా విస్తరించి వున్నది. సంకల్పంతోనే అది సుఖదుఃఖాలనూ, భయాలనూ పొందుతున్నది. నువ్వులలో నూనె లాగా సుఖదుఃఖాలూ, భయాభయాలూ మనస్సులోనే ఉన్నాయి. దేశకాలాలను అనుసరించి అవి చిన్నవో పెద్దవో అవుతాయి. నువ్వులను పిండితే
252 యోగవాసిం నూనె వస్తుంది. మనస్సును మననం చేస్తే సుఖదుఃఖాలు వ్యక్తమవుతాయి. రామా ! సంకల్పమే దేశకాలాలనే పేరుతో వ్యవహరించబడుతున్నది. వాటి ఉనికి సంకల్పాధీనమే. సూత్మ శరీరమైన మనస్సంకల్పం వల్లనే స్థూల శరీరం శమిస్తున్నది, శోభిస్తున్నది, సంతసిస్తున్నది, గంతులేస్తున్నది. అంతఈపురంలోని సాధ్వి లాగా చిత్తం తన సంకల్పంతో కల్ప్సించుకొన్న వివిధ సముల్గ్లాసాలతో ఈ దేహంలో నర్తిస్తున్నది. ఎవడు మనస్సులో చాపల్యానికి అవకాశమివ్వడో వాని మనస్సు స్తంభానికి కట్టివేసిన ఏనుగు లాగా నిలబడుతుంది. శస్త్ర స్తంభనానికి గురయిన శత్రువు లాగా ఎవని చిత్తం సద్వస్తు విచార బలముతో కదలక మెదలక నిలుస్తుందో వాడే పురుషుడు. తక్కిన వారంతా బురదలోని పురుగులే. అనఘా |! ఎవని చిత్తం ఏకాగ్రమై వుంటుందో అతడే ధ్యానంతో సర్వోత్తమస్థానం పొందగలడు. మనో ని(గ్రహంవల్లనే సంసార విభ్రమం శమిస్తుంది. మందర పర్వతం కదలకపోతే పాలసముద్రం చలించదు కదా ! భోగసంకల్ప విలాసాలకు చెందిన మనోవృత్తులే సంసారమనే విష వృ్నానికి అంకురాలు. జీవులనే దుష్ట భ్రమరాలు మదమత్తాలై సంసారమనే నదీ(ప్రవాహంలో చపల చిత్త మనే కమలాన్ని ఆశ్రయించి చరిస్తున్నాయి. చివరికి చింతలనెడి సుడిగుండాల చ(క్రభ్రమణంలో పడిపోతున్నాయి. చిత్త చికిత్స రామా ! ఈ చిత్తమనే మహావ్యాధికి ఉత్తమమైన మందు ప్రతి వ్యక్తికీ తన అధీనంలోనే ఉన్నది. శ్రేయోదాయకమూ,, రుచికరమూ, సునిశ్చితమూ అయిన ఆ మందును గురించి వివరిస్తాను విను. బాహ్య విషయాసక్తిని పరిత్యజించి ఆత్మైక నిష్టారూపమైన పురుష (ప్రయత్నంతో చిత్తమనే బేతాళాన్ని వడిగా జయించవచ్చు. అభిమతవస్తువును వదలి ఎవడు రాగాదిమనోదోషాలు లేకుండా ఉంటాడో వాడు బలమైన దంతాలు గల ఏనుగు అవి లేని ఏనుగును జయించినట్టు మనస్సును జయిస్తాడు. ఆత్మనిష్టతో (ప్రయత్నిస్తే చిత్తమనే బాలకుణ్లో రక్షించవచ్చు. అవస్తువునుండి వస్తువువైపు మరలించి వాళ్ల జ్ఞానవంతుళ్లీ చేయవచ్చు. రామా! చింతతో తపించిన మనస్సు అనే లోహాన్ని చింతాతాపం శమించి శాస్త్రసత్సంగాలచే ధైర్యం వహించిన
ఉత్పత్తి ప్రకరణం 253 మనస్సు అనే లోహంతో ఛేదించు. బాలకుణ్లి లాలనాదులైన ఉపాయాలతో ఒక పనినుండి మరోక పనికి సులభంగా మరలించవచ్చు. అలాగే చిత్తాన్ని ఒక భావంనుండి మరొక భావానికి త్రిప్పవచ్చు. ఇందులో దుష్కరమైన దేమున్నది ? ఉత్తమఫలం (ప్రసాదించే ధ్యానాభ్యాసంవంటి మంచిపనిలో మనస్సును నియోగించాలి. ప్రయత్న పూర్వకంగా దానిని చిదాత్మతో సంఘటితం చేయాలి.
అత్యంత హీతమైన విషయత్యాగం మన అధీనంలోనే ఉన్నది. అది ఎవనికి దుష్కరమో ఆ పురుష కీటకానికి ధిక్కారం ! రమణీయం కాని విషయాలను గూడా పరమాథధ్ర బ్రహ్మభావనతో రమణీయంగా భావిస్తే మల్టుడు శిశువును జయించినట్టు అనాయాసంగా చిత్తాన్ని జయించవచ్చు. 'ప్రయత్నపరుడు తృటిలో మనస్సును జయించగలడు. చిత్తరహితుడు సులభంగా బ్రహ్మపదం పొందగలడు. సులభసాధ్యమై తన వళంలోనే ఉన్న మనోనిగ్రహం కూడా చేయజాలని మానవ జంబుకాలకు ధిక్కారం !
ఇష్టవస్తుత్యాగరూపమైన చిత్తనిగ్రహం తప్పు సద్గతికి మరొక ఉపాయం లేదు. ఆత్మసాఇ్షాత్కారంతో సాధ్యవుయే్యే చునోనాళశం వాత్రవే కావౌది శత్రురహితమూ, నిశ్చలమూ, అనాదీ, అనంతమూ, అయిన స్వారాజ్య సుఖాన్ని ఈ జన్మలోనే (ప్రసాదిస్తుంది. బాహ్య ఎషయాత్యాగ పూర్వకవలూ, మోతసుఖసాధకమూ అయిన మనశ్శాంతి లేనప్పుడు గురూపదేశం, శా స్రార్ధవిచారం, మంత్రజపం మొదలైన యుక్తులు తృణప్రాయా లవుతాయి.
నిస్సంకల్పమనే శస్త్రంతో చిత్తాన్ని ఛేదించినప్పుడు జీవుడు సర్వవ్యాపీ సర్వాత్మకమూ, శాంతమూ అయిన (బ్రహ్మంగా రూపొందుతాడు. సంకల్పాలనే అనర్జాలను శాసించే ఆత్మ సాక్షాత్కారంతో జీవన్ముక్తి లభించినప్పుడు మనుజినికీ ఈ శరీరంలో ఇక క్షేశం ఏమున్నది ? మూఢ సంకల్పంతో కల్పితమైన దైవాన్ని... తిరస్కరించు. ఆత్మసాక్షాత్మారరూపమైన పురుషార్ధంతో చిత్తాన్ని ఉనికి లేనిదిగా రూపొందించు. మహోత్తమమైన (బ్రహ్మపదం పాందు. చిత్తాన్ని ఆత్మలో లీనం చేసి పూర్లచిన్మాత్ర స్వరూపుడవుగా రూపాందు.
పరమధీయుక్తుడివై సదా ఆత్మభావన కలిగివుండు, చిత్తాన్ని కబళించివేసిన ఆత్మలోనే నిలకడకలిగి నాశరహితమైన మహాపదవి నధిష్టంచు. ౮మా ! ఏరుద్రమైన సంవేదనను వివేకస్టిరమైన బుద్దితో తొలగించినట్లు పౌరుషంతో మనస్సును సైతం
254 యోగవాసిష్టం త్వరలో గెలవవచ్చు. అనుద్వేగవే సిరికి వవూలం. అనుద్వేగంతో చిత్తాన్ని జయించవచ్చు. తద్ద్వారా ముల్టోకాలపై గెలుపు సులభసాధ్యం.
చిత్త నిగ్రహంలో శస్త్రచ్చేదం, ఊర్హ్వలోకగమనం, అధోలోకస్రాప్తి అనేవి లేవు. అది స్వభావాన్ని మార్చుకోవడం మాత్రమే. ఇందులో కష్ట మేముంది ? తన మనస్సును నిగ్రహించడానికే శక్తి చాలని నరాధములు వ్యవహారదళలో ఎలా నెట్టుకురాగలరు ?
““నేను పురుషుడను, పుట్టినాను, జీవిస్తున్నాను,*' ఇత్యాది కుదృష్టులన్నీ మిథ్యామాత్రమే - అవి చంచలమైన చిత్తానికి చెందినవి. వాటికి ఉనికి లేదు. ఇక్కడ ఫుట్టేవాడు లేడు, చచ్చేవాడు లేడు. మనస్సే తన మరణాన్నీ, లోకాంతర గమనాన్నీ ఊహించుకొంటున్నది. ఇక్కడనుండి పరలోకానికి పోవడం, మరాకరూపంతో స్ఫురించడం లాంటి వ్యవహారాలన్నీ మోక్షం కలిగేవరకూ నడుస్తూనే వుంటాయి. ఇక మరణభయ మెందుకు ? చిత్తం ఈ లోకంలో, లేదా పరలోకంలో చరిస్తే చరించనీ! ఆయా రూపాలతో భాసించేది ఆ చిత్తమే కాని మరేదీ కాదు. మోక్షప్రాప్తి పర్యంతం ఇది ఇలా జరుగుతూనే వుంటుంది. ఈ సంసారానికి మరొక రూపం లేదు.
సోదరుడు, సేవకుడు మొదలైనవారు మరణించినప్పుడు క్షేశానికి లోనయ్యేది వైతన్యంకంటె భిన్నమైన తన చిత్తవే. సర్వహితవమూ, సర్వవ్యాప్తమూ, మాయారహితమూ, వేదబోధితమూ అయిన పరమాత్మలో చిత్తాన్ని లయం చేయడం తప్ప మరొక తరణోపాయం లేనే లేదు. ఇది (త్రిలోకాలలో తత్త్వవేత్తలు విచారించి నిర్ణయించిన సత్యం.
సత్యవలూ, నిర్చోషవమూ, సర్వతోవఎఖివమూ అయిన ఆత్మజ్ఞూనం హృదయంలో భాసించినప్పుడు విశ్రాంతి లభిస్తుంది. రామా ! విశాలమైన హృదయాకాళంలో చిద్రూపమైన చ(క్రధారతో ఏ మాత్రం సందేహించకుండా మనస్సును ఛేదించు. అప్పుడు ఆధులు నిన్ను బాధించవు.
ఆపాతరమణీయాలైన విషయాలను నీవు దోషదృష్టితో వికృతమైనవిగా చూడగలిగావంచే చిత్తానికి చెందిన అంగాలన్నీ ఛేదించినట్లే. '-ఈ దేహమే నేను, ఈ గృహారామాదులు నావి" అన్న భావ (ప్రపంచమే మనస్సు. ఆ భావనను పరిత్యజించగానే శరదృతువులో మబ్బులాగా, మనస్సు రూపుమాసిపోతుంది.
ఉత్పత్తి ప్రకరణం 255
గాలిచే మేఘం నశించినట్లే అసంకల్పంతో మనస్సు నశిస్తుంది. శస్రాలు, నిప్పు, గాలి ఉన్నవోట భయిం కల్లడం సహజం. అంతేకాని స్వాధీనమూ, సుకుమారమూ, నిర్మలమూ అయిన నిస్సంకల్పస్టితిలో భయమేమున్నది ? “ఇది శ్రేయస్సు, ఇది కాదు' అనే సంగతి ఆబాలగోపాలం ప్రసిద్దమే కదా 1
ఫుత్రుణ్లి నియో గించినల్టు ఈ విత్తాన్ని (శ్రేయస్సులో నియోగించాలి. మనస్సు అనే సింహంపై విజయం సాధించడం కష్టమే. ఎవరు దానిని జయిస్తారో వారే సరో '(త్కృష్టులు. వారు ఇతరులకు కూడా నిర్వాణపదం (ప్రసాదించగలరు. మరుభూమిలో ఎండమావుల్లాగా సంకల్పమనే సంగరభూమిలో భయంకరాలైన విపత్తులు సంభవిస్తాయి. కల్పాంతవాయువులు వీచుగాక! సాగరాలన్నీ ఏకమవుగాక! పన్నిద్దరు భాస్కరులూ తపింతురుగాక! అయినా అమనస్కుడికి ఏమాత్రం క్షతి లేదు. సుఖదుఃఖాలూ, శుభాశుభాలూ మనోబీజంనుండే ఉద్భవిస్తాయి. ఈఏడు లోకాలూ సంసారమనే వనఖండం చిగిర్భిన చిగుళ్ళే.
రామా 1 సకలసిద్ది ప్రదమయిన సామ్రాజ్యానికి చెందిన పరమాత్మ పదమనే సింహాసనంపై భద్రంగా నెలకొని వుండు.
- అగ్ని శమించాలని కోరేవానికి కట్టెలు తొలగించిన నిప్పు తాపశాంతి కల్గిస్తుంది అసంకల్పతో క్షయం పొందిన మనస్సు సాధకునికి అమందానందం కల్లిస్తుంది. మనస్సు సంకల్పిస్తే ఒక అణువులో లక్షలకొలది బ్రహ్మాండాలను విడివిడిగా చూడగలదు. సంకల్పబలంతో (బ్రహ్మాండాదులైన అర్జాలనూ, జన్మజరామరణాదులైన అనర్జాలనూ కల్గిస్తున్న ఈ మనస్సును నిస్సంకల్ప రూపమైన సంతోష వైభవంతో జయించి విజయశీలివి కమ్ము.
రావరా 1 పరవుపావనవమా, ఆత్మజ్ఞులకు అభివుతవమూ, సమభావసంపన్నమూ; అహంకారరహితమూ, జన్నాది వికార ళూన్యమూ అయిన ఆత్మపదం నీకు సిద్రించుగాక 1 ఉపదేశాంశం రామా! మనస్సు తీవ్రవేగం కల్గివుంటింది. అది తన అభిష్టైనికి అనుగుణంగా ఏ పదార్దాన్ని ఎలా భావిస్తుందో ఆపదార్జ్హాన్ని అలాగే చూస్తుంది, నీటిలోని బుడగలాగా మనస్సులోని తీవ్రవేగం కూడా ఏ కారణమూ లేకుండానే ఉదయిస్తూ, [26
256 యోగవాష్థం నశిస్తూ వుంటుంది. మంచుకు చల్లదనం, కాటుకకు నలుపురంగు లాగా మనస్సుకు తీవ్రమైన చాంచల్యం సహజగుణం.
శ్రీరాముడు: - బ్రహ్మ౯! అతిచంచలమైన ఈ మనస్సు యొక్క తీవ్రవేగాన్ని బలాత్కారంగా నైనా ఎలా అరికట్టాలో చెప్పండి 1
వసిష్టుడు : - రామా ! చాపల్యం లేని మనస్సు ఎక్కడా లేదు. అగ్నికి వేడిమి లాగా మనస్సుకు చాపల్యం ధర్మమై వున్నది. చంచలమైన చిత్తంలోని ఈ స్పందనజ్తే జగదాడంబరరూపంలో కానవచ్చే మానసశక్తి అని గ్రహించు. స్పందన లేని గాలికి ఉనికి లేనట్లే చాంచల్యం లేని చిత్తానికి అస్తిత్వం లేదు. చాంచల్యం లేని మనస్సు అంటే మరణించిన మనస్సు అని అర్ధం. అట్టి అమనస్కస్టితే తపస్సు అనీ, మోత్షమనీ శాస్త్రం సిద్దాంతీకరించింది. మనస్సు లయించగానే దుఃఖం శమిస్తుంది. మనస్సు మననానికి ఉప క్రమించగానే దుఃఖం ఉదయిస్తుంది. చిత్తం అనే రక్కసుడు విజృంభిస్తే తప్పక దుఃఖం కల్గిస్తాడు. అనంతమైన సుఖం కావాలంటే ఆరాతసుళ్లీ ప్రయత్నంతో మట్టుబెట్టు.
రామా! మనస్సులోని చాంచల్యాన్నే అవిద్య అంటారు. వాసన అనేది కూడా అదే. విచార శ్తితో దాన్ని హతమార్చు. విషయపరిత్యాగంతో చిత్తగతమైన ఈ అవిద్య విలీనం కాగానే పరమ'(శ్రేయస్సు లభిస్తుంది.
రామా! సదసత్తులకూ, జడత్వ చైతన్యాలకూ మధ్యనున్న రూపాన్నే మనస్సు అంటారు. అది ఆ రెండు ఫ్రితుల నడుమూ ఊగిసలాడుతూ వుంటుంది.
_ జడత్వాను సంధానం బలపడే కొలదీ ఆ అభ్యాసబలంతో చిత్తం జడంగానే
రూపొందుతుంది. చిదంళభావన పెంపొందేకొలదీ ఆ అభ్యాసబలంతో మనస్సు చిద్రూపంగానే పరిణమిస్తుంది. చిత్తాన్ని ప్రయత్న పూర్వకంగా దేనిలో (ప్రవేశింపజేస్తామో, అభ్యాసాతిశయంతో అది ఆరూపాన్నే పొందుతుంది.
నీవు పౌరుషంతో చిత్తాన్ని చిత్తంతోనే జయించు. అలా చేసి దుఃఖరహితమైన ఫ్రీతి పొంది సందేహ రహితుడవై ఫ్టిరంగా వుండు. సంసారభావనలో మునిగిపోయిన చిత్తాన్ని ఆత్మ భావన గల మనస్సుతో బలాత్కారంగా లేవదీయాలి. అంతకంటే మరో ఉపాయం లేదు. మనస్సును నిగ్రహించడానికి మనస్సే సమర్ధమవుతుంది. రాజును ని గ్రహించాలంటే రాజు కాని వాని కెలా సాధ్యం ?
సంసార మనే సాగరంలో పడి తృష్ణ అనే మొసలికి విక్కి విషయా లనే సుడులలో
ఉత్పత్తి ప్రకరణం 257 పరిభమించేవారికి వివేకవంతమైన చిత్తమే నౌక, పరమబంధనమైన మనస్సనే పాశాన్ని మనస్సుతోనే చఛేదించాలి. అలాచేసి ఎవడు తన్ను తాను విడిపించుకోడో, వానికి మరొకరంగా విడుదల లేదు.
మనస్సు అనబడే ఈ వాసనలన్నింటినీ ప్రాజ్జుడు ప్రయత్న పూర్వకంగా పరిహరించాలి. దానితో అవిద్య నశిస్తుంది. ముందు భోగవాసనను త్యజించు. ఆపై భేద వాసనను పరిహరించు. ఆపిమ్మట భావాభావాలను గూడా విడిచి ఏ వికల్పమూ లేకసుఖంగా వుండు. ఆత్మ భావనతో సంసారభావనను వదలాలి. అదే వాసనాక్షయం. మనోనాశమన్నా అదే. దాన్నే అవిద్యానాశమని కూడా అంటారు. చిత్తంలో పాడచూపే విషయాను భవాలను నిరో ధించడమే మనోనాశం. అదే నిర్వాణం. విషయ సంవేదనలే దుఃఖానికి కారణాలు. ప్రయత్నంతో విషయ సంవేదనను క్షణంలో దూరం చేసుకోవచ్చు. అలా చేయడంతో ఆత్మానందం కల్గుతుంది. ఇది నిత్యాభ్యాసంలోకి రావాలి.
అ రామా! నీ మనస్సులో ఏయే రాగాదులు ఉదయిస్తున్నవో, అవన్నీ మిథ్య లని గ్రహించు. వాసనా బీజాలతో సహా మనస్సును నిళ్ళేషంగా నిర్మూలించు. తద్ద్వారా పరమతృషప్తి పొంది సుఖదుఃఖాలకు అతీతుడవై వుండు.
అవిద్యావర్షనం
రాఘవా! ఈ వాసన ఉనికి లేనిదైనా ఉదయిస్తున్నది. అంచేత ఇద్దరు చంద్రుల (భ్రాంతివలె ఇది త్యజింపదగినది. ఉనికి లేని ఈఅవిద్య ప్రజ్ఞాహీనులకు నిజంగా ఉన్నట్లే కనిపిస్తుంది. వట్టి పేరుకే గాని వాస్తవంగా దీనికి అస్తిత్వం లేదు. ఇక (ప్రజ్ఞావంతుల కిది సత్య మెలా అవుతుంది ?
రామా! నీవు అజ్జుడవు కావద్దు. ప్రాజ్ఞుడవై వుండు. చక్కగా తత్త్వం విచారించు. ఆకాశంలో రెండవ చంద్రుడు లేనే లేడు. (భ్రాంతి వల్లనే అలా ఉన్నట్టు తోస్తున్నాడు. ఈ ప్రపంచంలో పరమాత్మ తప్పు మరొక వస్తువుగానీ, అవస్తువు గానీ ఏదీ లేదు. విశాల సాగరంలో జల్రవాహం తప్ప మరేమున్నది ? మిథ్యలైన భావాభావాలు మన వికల్పంతో కలిగేవే కాని నిజానికీ లేవు. అలాంటివాటిని నిత్యమూ, బంధరహితమూ, విశాలమూ, పరిశుద్రమూ అయిన ఆత్మయందు
258 యోగాసిం ఆరోపంచవద్దు. నీవు కర్తవు కావు. ఈ క్రియల్లో నీకు మమకారం ఎందుకు ? ఉన్నది ఒకే వస్తువు అయినప్పుడు చేసే దెవడు ? చేయబడే దేమిటి ? ఎలా చేయడం? 'ప్రాజ్ఞుడవైన ఓ రామా ! నీవు అకర్తవు కూడా కావద్దు. అకర్త్రృత్వాభిమానం వల్ల నీవు సాధించే దేమున్నది ? కేవలం స్వస్టుడవై వుండు. రఘుకుల క్రూ | కర్పృత్వాభిమానం లేనప్పుడు నీవు అసక్తుడవు కాబట్టి క్రియలు చేసినా చేయని వాడే. “నేను అకర్తను' అన్న అభిమానం లేనప్పుడు కర్తవు కూడా అగుదువుగాక! అయినా ఆత్మధర్మివైన నీకు అనాత్మజ్ఞుని వలె కర్తృత్వ(భ్రమతో చలించవలసిన అవసర మేమున్నది ? సత్యం స్వీకరింపదగింది. మిథ్య పరిహరింపదగింది. క్రియాఫలం మిథ్య. ఉపాదేయమైన సత్యమునందే ఆసక్తి కల్లినవానికి ఇక కర్మపై ఆసక్తి ఎందుకు? ఏది మొత్తం ఇంద్రజాలమో, మాయామయమో, వస్తువూన్యమో అందులో ఆసక్తిఎలా వుంటుంది ? ఇద హేయం, ఇది ఉపాదేయం అనే దృష్టిఎలా కల్గుతుంది? రామచంద్రా! సంసారానికి బీజమైన ఈ అవిద్య తాను లేనిదైనా తోస్తూ ఎంతగానో విస్తరించింది. ఇది సంసారయం త్రాన్ని త్రిప్పే చక్రం. ఇది చిత్తానికి మోహం కల్గించే వాసు. వెదురు తీగలాగా ఇది లోపల శూన్యమై నిస్పారమై వున్నది. నదిలోని అల లాగా ఇది మాటి మాటికీ భిన్నమైనా నళింపకున్నది. ఇది సెలయేటిలోని అల వలె చేతితో పట్టుకోబోయినా పట్టువడదు. వెత్తగా వున్నా మిక్కిలి పదునైనది. ఇది ఉపకరణాలతో కూడినట్టు కనిపించినా సదర్ర ప్రాప్తికి ఉపకరించదు. పైకి తరంగాలు కలదిగా కనిపించినా ఎండమావి స్నాన పానాదుల కుపకరించే తరంగిణి కాదు గదా! ఈ అవిద్యా ప్రభావం వల్ల కలిగే పదార్దాలు ఒకచోట వ[్రంగా, మరొకచోట పొట్టిగా, ఒకవోట ఫ్రీరంగా, దీర్ణంగా, మరొకచోట చంచలంగా ఉంటూ పరస్పర విరుద్దలక్షణాలు కల్లివుంటాయి. ఈ అవిద్య లోన శూన్యమైనా పైకి సారవంతంగా కనిపిస్తుంది, ఎక్కడా లేనిదైనా అంతటా ఉన్నట్టు తోస్తుంది. జడమైనా చిన్మయి లాగా కనిపిస్తూ మనశ్చాంచల్యం పై ఆధారపడి జీవిస్తుంది. ఒక నిముషం నిలకడ లేనిదైనా స్టిరమైనదా అనే శంకను కల్లిస్తుంది. ఇది సత్త వ్ ప్రభావంతో అగ్నిజ్వాల లాగా శుద్రవ్మర్థం కలదైనా తమః ప్రభావంతో నల్లగా కనిపిస్తుంది. పరమాత్మ ప్రభావంతో విబ్బంభిస్తుంది. పరమాత్మసాక్షాత్కారంతో నశిస్తుంది. ఇది ఆత్మ ప్రకాశం ముందు వాడిపోతుంది. అజ్జానతవుస్సు ముందట శో భిస్తుంది. ఎండమావి లాగా
ఉత్పత్తి ప్రకరణం 259 శుష్క(ప్రాయమై నానావర్ణాలతో విలసిల్టుతుంది.
వ(క్రవూ, విషవువచూ, వృదులమూ, కర్క్మళశమూ, చంచలమూ, లోభపూరితమూ అయిన ఈ అవిద్య కృష్ణసర్పం వంటిది. ఇది తైలం క్షీణించిన దీపశిఖ లాగా రాగం నశించగానే నశిస్తుంది. సిందూర ధూళి లాగా రాగం లేకున్నా రాగవతియ్రై ప్రకాశిస్తుంది.
ఒక క్షణకాలం ్రకాశించేదీ, జడాశయమైనదీ, అమాయకులకు భయం కల్గించేదీ అయిన ఈ అవిద్య మెరపు తీగవంటిది. ఇది విద్యుల్లత లాగా ప్రయత్నంతో పట్టుకొంటే కాలుస్తుంది. కనిపించి కనిపించి మాయమవుతుంది. ఎంత వెదకినా దొరకదు. మిక్కిలి చంచలమైనది. ఇది అకాల పుష్పమాల లాగా కోరకున్నా (ప్రాప్తిస్తుంది. అందంగా ఉన్నా అనం కల్గిస్తుంది. అందువల్ల అభినందనీయం కాదు.
(భమ కలిగించే ఈ అవిద్యను పూర్తిగా విస్మరిస్తేనే మనకు సుఖం. తర్కించే కొద్దీ పీడకల లాగా అది అనర్ధమే కల్గిస్తుంది. ఈ అవిద్య తన ప్రతిభాసంతో సువిశాలవలులైన వలుల్లోకాలనూ క్షణంలో సృష్టించి, ధరించి వుళ్ళీ హతమారుస్తుంది.
ఇది లవణరాజుకు ఒక ముహూర్తకాలాన్ని అనేక సంవత్సరాలుగా మార్చింది. హరిశ్ళం(ద్రునికి ఒకరాత్రిని పండ్రెండు సంవత్సరాలుగా భాసింపబేసింది. దీని (ప్రభావం వల్ల వియోగులకు ఒక రాత్రి సంవత్సర మవుతుంది. సంయోగులకు ఒక సంవత్సరం ఒకే రాత్రిగా మారుతుంది. సుఖించేవానికి అల్పంగానూ, దుఃఖించే వానికి ద్వీర్ణంగానూ కాలాన్ని మార్చి వేయగల చాతుర్యం దీని కున్నది.
(ప్రకాశాది కార్యాలలో దీపానికి గల కర్తృత్వం సాన్నిధ్యం మాత్రమే. ఆయా వృత్తుల్లో అవిద్యకు కూడా అలాంటి కర్తృత్వమే ఉంది కాని వాస్తవమైన కర్పృత్వం లేదు.
పలు అవయవచిహ్నాలతో విలసిల్లే చిత్రంలోని స్త్రీ వాస్తవానికి స్త్రీ కాదు. అది గృహకృత్యాలకు పనికిరాదు కదా! అలాగే వాసనారూపంతో ఒప్పారే ఈ అవిద్య పారమార్ధిక కార్య నిర్వహణకు పనికిరాదు. మనోరాజ్యం లాగా కల్పితమైన ఆకారంతో భాసించే సత్యదూరమైన ఈ అవిద్య సహస్ర శతశాఖలు గలదైనా విజానికి ఉనికి లేనిదే.
ఇది అరణ్యంలోని ఎండవళావి లాగా మిథ్యాడంబరం కలది. ఇది
260 యోగూసష్థం ముగర్రమృగాలను మోహింప జేస్తుందే కాని వివేకవంతులైన మనుజులను మభ్యాపెట్ట జూలదు.ఇది నురుగువలె పుడుతూ, నశిస్తూ చంచలమై, జడమై వుంటుంది. పట్టుకోబోతే చేతికి చిక్కదు. పప్రళభయవాయువు లాగా ఇది భయంకరమై రజః 'ప్రసారంతో ధూసరమై వుంటుంది. భువనాలన్నింటినీ ఆక్రమించి పరి(భ్రమిస్తూ వుంటుంది. ఇది ధూమ్రేణి లాగా అవయవాలకు తగిలితే దాహఖేదాన్ని కల్గిస్తుంది. రసాన్ని (జలాన్నీ, పరమాత్మనూ) గర్భంలో ధరించి జగత్తుల నా క్రమిస్తుంది.
ఇది జలధరధార లాగా జలనిర్మితమైనధి, సుద్సీర్ణమైనది. తృణగణాలతో పెనవేసిన (త్రాడు లాగా ఇది నిస్పారమైన సంసార సంస్కారాలతో కూడి గట్టిపడి వున్నది.ఇది తరంగాల వంటిదనీ, ఉత్పలమాల వంటిదనీ భావుకులైన కవులు కల్పనలతో వర్షించారు. ఇది తామరతూడు లాగా బహురం(ధ్రాలు కల్లివున్నది. బురదలో పుట్టినది, జలా( డా) త్మకమైనది.
జనులు దీన్ని అనుక్షణమూ పెరుగుతున్నట్టు చూస్తారు, కానీ ఇది పెరుగదు. ఇది విషం కలసిన కుడుము లాగా మొదట మధురంగా ఉన్నా చివరికి దారుణ పరిణామం కల్లి వుంటుంది. నశించిన దీపశిఖ లాగా ఇది ఎక్కడికీ పోతుందో తెలియదు. ఎదుటనే కనిపిస్తున్నా మంచుతెరలాగా పట్టుకోబోతే చిక్కదు.
ఇది ధూళిముష్టి లాగా పరమాణుమయమై అంతటా విస్తరిస్తుంది. ఆకసంలో నీలిమ లాగా నిమిత్తం లేకనే కనిపిస్తుంది. ఇద్దరు చంద్రులకు చెందిన మోహం లాగా పాటమరిస్తుంది. స్వప్నం లాగా (భమ పెడుతుంది. పడవలో పయనించే వానికి చెట్ల కదలికలాగా లేనిదైనా ఉన్నట్టు తోస్తుంది. చిత్తం దీనికి లోనైనప్పుడు జనులు వ్యాకులపాటు చెంది సుద్వళ్ణ కాలం సంసారమనే స్వప్నాన్ని చూస్తారు. ఆత్మ దీనిప్రభావానికిగురి అయినప్పుడు సముద్రంలో అలల్లాగా మనస్సులో నానా[భ్రమలు పుడుతూ నశిస్తూ ఉంటాయి.
దీని ప్రభావం వల్ల మనోజ్ఞమైన (బ్రహ్మ అసత్తుగా, అమనోజ్జమైన జగత్తు సత్తుగా కనిపిస్తుంది. పదార్ధరూపం పాందిన భావన అనే ఈ అవిద్య వల పక్షిని బంధించినట్టు మనస్సును నియమిస్తుంది. తల్లి యైన గృహిణీ రూపంతో ఇది కళ్ళలో కరుణనూ, స్తనాలలో పాలనూ (స్రవింపజేసి ఆనందాన్ని పల్లవింపజేస్తుంది. ముల్గోకాలనూ సంతృప్తి పెడుతూ అవ్చుతంతో నిండి వృద్ది పాందిన పూర్ణచంద్రబింబాన్ని కూడా ఇది విషమయం చేస్తుంది. ఈ అవిద్యా (ప్రభావం
ఉత్పత్తి ప్రకరణం 261 వల్ల ఇంద్రియ వ్యాపారాలు లేని స్థాణువులు సైతం మదించిన బేతాళాల వలె నృత్యం చేస్తున్నట్టు తోస్తాయి.
చం(ద్రద్వయ దర్శనంలో ఒకటి రెండుగా కనిపిస్తుంది. స్వప్నంలో దూరాన ఉన్న తన మరణం ద్నూరకు వచ్చినట్టు తోస్తుంది. సుద్నీర్రమైన ప్రళయరాత్రి రుద్రునికి స్వల్పకాలంగా కానవస్తుంది. వియోగులకు క్షణ కాలం సంవత్సరమవుతుంది. ఇదంతా అవిద్యావిలాసమే.
_ రామా! ఈ ప్రపంచంలో ఈ అవిద్య చేయలేని పని ఏదీ లేదు. సత్యవస్తు శూన్యమైన దీని శక్తి ఎంతటిదో చూడు. బుద్దిమంతుడు వివేకంతో అవిద్యా విషయమైన బుద్దిని నిరోధించాలి. ప్రవాహనిరోధం వల్ల నది లాగా విషయబుద్రి నిరోధంతో మనస్సు శుష్కిస్తుంది.
శ్రీరాముడు : - ఆహా! ఏమి చిత్రం ! ఉనికి లేనిదీ, అల్పమైనదీ, తుచ్చమైనదీ అయిన ఈ మిథ్యా భావన జగత్తును గ్రుడ్డిదిగా చేసింది. రంగు, ఆకృతి, చైతన్యం లేని ఈ అవిద్య తాను నశింపక జగత్తును అంధ('ప్రాయం చేస్తున్నది. దుష్కృత్యాలు చేస్తూ జ్ఞాన తేజస్సును సహించనిదై ఒడలు తెలియక ప్రవర్తించే ఈ అవిద్య లోకాన్ని మోహంలో ముంచేసింది. నీచాచారాలు కలిగి పామరులకు ఇంపు గొల్పుతున్న (పామరుని కళత్రం వంటి) అసతీరూపయైన ఈ అవిద్య లోకాన్ని వె(ర్రిదానిని చేసింది. అనంత దుఃఖాలతో వ్యాకులమై, జ్ఞానహీనమై, మృత'ప్రాయమైన ఈ అవిద్య లోకాన్ని చీకాకు పరచింది. కామక్రోధాలనే అవయవాలు కలదీ, అజ్ఞానంతో భీకరమైనదీ, జ్ఞానంతో తొలగేదీ అయిన ఈ అవిద్య లోకాన్ని అంధీకరించింది. అజ్ఞ్జుల హృదయాలలో నివసిస్తూ, జడత్వంతో శిథిలమై, దుఃఖంతో సదా (ప్రలాపించే ఈ అవిద్య లోకాన్ని చీకటితో నింపివేసింది. జౌరా ! ఏమి విచిత్రం !
పురుష సంగిని, రాగవతి, ఆత్మ విచార రహిత అయిన ఈ అవిద్య అనే వనిత పురుషుణ్లి విమోహితుళ్లి చేస్తున్నది. ఆత్మ దర్శనంలో అసమర్హురాలు, ఆవరణ రూప అయిన ఈ అవిద్య అనే అంగన జీవుల్లీ అంధ ప్రాయుణ్లో చేసింది. కించిత్తు కూడా చైతన్యం లేనిదై, నశింపకనే నశిస్తూ, కఠిన స్త్రీ రూపంతో కనిపించే ఈ అవిద్యచేత పురుషుడు గ్రుడ్డివాడయ్యాడు. మునీంద్రా ॥ మనస్సనే గుహలో గూడుకట్టుకొని నివసించే ఈ వాసన విషవువ్పైనది. ఇది అనంతమైన దుష్ట్రభమవిలాసాలను కల్లిస్తున్నది. జనన మరణాది సుఖదుఃఖాల కాకరమై వున్నది.
262 యోగవాసిష్థం ఇలాంటి వాసనారూపమైన ఈ అవిద్య ఎలా తొలగి పోతుందో తెలియ జేయండి। అవిద్య వల్ల కలిగి ఘనీభూతమై పురుషుళణ్లీ ఆవరించిన ఈ అంధత్వం ఎలా నశిస్తుంది? దోష పరిహారోపదేశం
వసిష్టుడు : - రాఘవా! సూర్యుని ప్రకాశంలో మంచుబిందువు క్షణంలో నశిస్తుంది. అలాగే ఆత్మదర్శనమైన మరుక్షణంలోనే అవిద్య అంతమవుతుంది. మోహాన్ని నిర్మూలించే ఆత్మదర్శనేచ్చ అవిద్యను తుదముట్టిస్తుంది. ఆయిచ్చ కల్లనంతవరకూ అది దుఃఖకంటకమయమైన సంసారాలనే కొాండచరియలలో జీవుణ్లీ పడ(ద్రోస్తూనేవుంటుంది. ఎండతోడి సంపర్కంతో నీడ నశించినట్లే పరమాత్మ దర్శనంతో అవిద్య నశిస్తుంది. పన్నిద్దరు సూర్యులు ఒక్కసారిగా అన్ని దిక్కులా ఉదయిస్తే అంధకారం హతవుయినట్లే ఆత్మ జ్ఞానం కలగగానే అవిద్య విలయమొందుతుంది.
రామా | కోరికయే అవిద్య; అది నశించడమే మోక్షం. సంకల్పించడం మానుకుంటే చాలు, మోక్షం కరతలామలక మవుతుంది. మనస్సు అనే ఆకాశంలో కామవాసన అనే రాత్రి క్షయించగానే వైతన్యమనే సూర్యుడు ఉదయిస్తాడు. అంతట అవిద్య అనే ఆవరణం విచ్చిన్నమవుతుంది. భాస్కరుడు ఉదయించూనే రాత్రి ఎక్కడికో పారిపోయినట్టు వివేకం పొడసూపగానే అవిద్య అంతరిస్తుంది. సంధ్యాసమయంలో బాలునికి బేతాళాన్ని గూర్చిన సంకల్పం బలపడినట్టు దృఢమైన వాసనవల్ల మనోబంధం గట్టిపడుతుంది.
శ్రీరాముడు : - బ్రహ్మ౯ దృశ్యరూపమైన అవిద్య ఆత్మ భావనతో అంతరిస్తుందని సెలవిచ్చారు. ఇక ఆత్మ ఎలాంటిదో తెలియజేయండి !
వసిష్టుడు : - విషయసంబంధంలేనిది, అవిద్య అంటనిది. సర్వవ్యాపి, మౌటలకు గోచరించనిదీ అయిన చిత్తత్త్యమే ఆత్మ. అదే పరమేశ్వరుడు.
అనఘా 1 బ్రహ్మ మొదలు తృణం వరకూ ఉన్న జగమంతా సర్వదా ఆత్మే. నిజానికి అవిద్య అనేది లేనేలేదు. ఈ దృశ్యప్రపంచవుంతా చిద్దనమూ, నాశరహితమూ అయిన బ్రహ్మమే. మనస్సు అనే మరొక కల్పన వాస్తవం కాదు. ఈ ముల్లోకాలలో పుట్టేది, గిట్టేది ఏదీ లేదు. పదార్దాల వికారాలకు సైతం ఉనికి
ఉత్పత్తి ప్రకరణం 263 లేదు. అద్వితీయమూ, స్వప్రకాశమూ, సర్వవ్యాపీ, అవినాశీ, విషయ వర్షితమూ అయిన వైతన్య మొక్కటే ఉన్నది.
నిత్యమూ, శుద్రమూ, చిన్మాత్రమూ, ఉపద్రవ రహితమూ, శాంతమూ, సువిశాలమూ, ఏకరూపమూ, నిర్వికారమూ అయిన ఆత్మ తన స్వభావానికి విరుద్దంగా విషయ ప్రపంచాన్ని సంకల్పిస్నున్నది. దాని విజేపళ్తినే మనస్సు అంటారు. సర్వశక్తిమంతమూ, మవాోప్రభావంతమూ అయిన ఈ మనస్సునుండి నీటినుండి అలలాగా విభాగ కల్పనాశక్తి ఉదయించింది. ఉనికీలేని సంసారరూపమైన ఈ అవిద్య సంకల్ప మాత్రాన పరమాత్మలో ఉత్పన్నమయింది. సంకల్పంతో ఫుట్టిన అవిద్య సంకల్పంతో నశిస్తుంది. గాలినుండి పుట్టిన అగ్నిజ్వాల గాలివల్లనే ఆరిపోతుంది కదా! “నేను బ్రహ్మను కాను” అన్న గట్టి సంకల్పంతో మనస్సుకు బంధం కల్గుతుంది, “సర్వం బ్రహ్మమే” అన్న దృఢ సంకల్పంతో మనస్సుకు విముక్తి సిద్రిస్తుంది. సంకల్పమే దృఢమైన బంధం. అసంకల్పమే విముక్తి. రామా ! హృదయంలో సంకల్పాన్ని జయించి తరువాత నీ యిచ్చ వచ్చినట్టు చేయి. ఆకాశంలో బంగారు పద్మాలుపూసే తామరతీగ బాలుని ఊహలో ఉంటుందేకాని వాస్తవంగా ఉండదు. ఈ అవిద్యగూడా అలాంటిదే. బాలుడు తన విలాసానికి కల్పించుకొన్న వికల్పజాలికలాగా లేనిదైనా ఉన్నదివలె ఇది కల్పింపబడుతున్నది. సంసారబంధాన్ని కల్పిస్తున్నది. అజ్ఞాలు సుఖానికి కాక దుఃఖానికే దీన్ని కల్పించుకొంటున్నారు.
“నేను బలహీనుడను, దుఃఖవంతుడను, బద్దుడను, చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలు కలవాడను”” అనే భావన బంధిస్తుంది.
“నాకు దుఃఖం లేదు, దేహం లేదు, ఇక నాకు బంధ మెక్కడిది ?** అనే భావన ముక్తినిస్తుంది.
“నేను మాంసపిండం కాను, ఎముకలు కాను, ఈ దేహంకంచే అన్యమైన చిద్రూపుడను”' అన్న నిశ్చయం కలవాడే అవిద్యారహితుడు.
ఎత్తైన మేరుపర్వతం చివర వైడూర్య శిఖరంనుండి ప్రసరించే కాంతిని, లేదా సూర్యకిరణాలకు సైతం దుర్చేద్యమై సుదూరంలో ఉన్న చీకటిని నేలపై ఉన్నవాడు ఆకాశం యొక్క నలుపు అని తన కల్పన ననుసరించి వ్యవహరిస్తాడు. అదేరీతిగా అప్రబుద్దుడైనవాడు అనాత్మలో ఆత్మభావనా రూపమైన అవిద్యను కల్పిస్తున్నాడు. రాఘవా ! ప్రబుద్దుడలా కల్పించడు.
264 యోగవాసిష్టం
శ్రీరాముడు : - బ్రహ్మ౯! ఆ నలుపు మేరుపర్వతంలోని నీలమణి కాంతి కాదు, చీకటి కూడా కాదు. అలాంటప్పుడు ఆకాశానికి నలుపు ఎలా వచ్చిందో చెప్పండి |
వసిష్టుడు : - రామా! ఈ నీలిమ శూన్యాకాశానికి సంబంధించిన గుణం కాదు. ఇతరరత్న కాంతులు లేని కారణాన మేరుశిఖరకాంతి కూడా కాదు. (బ్రహ్మాండం తేజోమయం. సూర్యకాంతి బ్రహ్మాండమంతటా వ్యాపించి వున్నది. అందుచేత అది చీకటి కూడా కానేరదు. సుభగా |! అదంతా కేవలం దట్టమైన శూన్యత్వమే. అది అవిద్య యొక్క చెలికత్తె లాగా ఉనికి లేనిదైనా ఉన్నట్టు కనిపిస్తున్నది. సుదూరప్రదేశంలో కన్నులు చూచే శక్తి కోల్పోతాయి. అప్పుడు సహజంగా గోచరించే అదర్శనమే ఆకాశనీలిమ లాగా గోచరిస్తుంది. అంతేకాని అది వాస్తవంగా నలుపు కాదు. ఈ నిదర్శనాన్ని బట్టి అవిద్య యొక్క ఉనికి కూడా కల్పితమే అని గ్రహించు.
ఆకసంలో తామర తీవ్ర సంకల్పంలో ఉన్నదే కాని వాస్తవముగా లేదు. ఆ తీగవంటి అవిద్యను నిగ్ర హించడానికి దానిని సంకల్పించకుండా ఉండడమే ఉపాయం. ఈ పని దుష్కరం కాదు. రామా! ఆకాశ నీలిమవంటి ఈ జగ[ద్ర్రమను మళ్లీ స్మరణకు రానీకుండా మరచిపో. కలలో “*నేను నశించిపోయాను'” . అని సంకల్పించినవాడు దుఃఖంతో (క్రుంగిపోతాడు. “నేను మేల్కొన్నాను”' అన్న సంకల్పంతో అతడు ఆ దుఃఖం తొలగి సుఖిస్తాడు. అలాగే మూఢమైన సంకల్పంతో మనస్సు మూఢత్వం పాందుతుంది. ప్రబోధాత్మకమైన ఉత్తమ సంకల్పంతో అది (బ్రహ్మభావం వైపు పయనిస్తుంది. అనాది అయిన ఈ అవిద్య 'నేను అజ్ఞానిని' అని సంకల్పించిన మరుక్షణంలో ఉదయిస్తుంది. అలాగే ఆ సంకల్పవాసనను విడిచిన మరుక్షణమే అది సమూలంగా నశిస్తుంది. అది భావాలన్నింటినీ కల్షిస్తుంది. ('ప్రాణులనందరినీ మోహింపజేస్తుంది. ఆత్మ విస్మరణతో వృద్ది పొందుతుంది. ఆత్మ (ప్రాప్తితో నశిస్తుంది.
రాజాజ్ఞను మంత్రులు అనుసరించినట్లే మనస్సు సంకల్పించిన దానిని ఈ ఇంద్రియాలు క్షణంలో తెచ్చి ముందుంచుతాయి. అందువల్ల ఎవడు 'నేను (బ్రహ్మమును అన్న భావము కల్గివుండి పదార్దాలతో మనస్సును అనుసంధించడో, వాడే శాంతి పొందుతాడు.
ఉత్పత్తి ప్రకరణం 265
ఏది సృష్టికి పూర్వంలేదో, అది ఇప్పుడు కూడా లేనిదే. ఈ సృష్టి రూపంలో భాసించే దంతా శాంతమూ, ఏకమూ, అనిందితమూ అయిన బ్రహ్మమా(త్రమే. ఈ (బ్రహ్మంకంటే మనం చేయదగినవస్తువు మరొకటి ఎప్పుడూ, ఎవనిక్షీ, ఏ విధంగానూ లేనేలేదు. అందుచేత అనాది, అనంతం, నిర్వికారం అయిన (బ్రహ్మమునందే సదా నిలకడ కల్లివుండు. పౌరుష మవలంబించి దృఢ ప్రయత్నంతో భోగాశారూహమైన భావనను చిత్తమునుండి కూకటి గ్రేళ్లతో సహా షెళ్తగించి వేయాలి. పలు ఆశాపాశాలతో కూడి జరామరణాలకు కారణమైన మహామోహం వాసనా విజ్బంభణమే కాని మరొకటి కాదని తెలుసుకో. నా ఫుత్రులు, నా ధనము, నేను, నాది అనే భావనారూపమైన ఇం(ద్రజాలంతో వాసనయే విజృంభిస్తున్నది. గాలిచే నీటిలో అల కల్పింపబడుతుంది. అలాగే ఈ శూన్యశరీరంలో వాసనచే అహంభావమనే పాము కల్పింపబడిీంది.
తత్త్వజ్ఞుడవైన ఓ రామచంద్రా! పరమార్ధదృప్టికి "నేను, నాది” అనే దేదీ లేదు. ఆత్మ కంటె వేరైన దేదీ సత్యంకాదు. దృష్టి సృష్టితోపాటే ఆకాశం, పర్వతం నది మొదలైన పదార్జాలన్నీ జన్మించాయి. అవిద్యయే ఈ రీతిగా మారువేషం ధరించినదానిలా భాసిస్తున్నది. ఈ పరిచ్చిన్నమైన, అవిద్య (త్రాడులో పాము అనే బుద్రిలాగా అజ్ఞానంలో జనిస్తున్నది. జ్ఞానంతో నళిస్తున్నది. రామా ! ఆకాళం మొదలైన రూపాలతో గోచరించే ఈ అవిద్య అజ్ఞానికే కల్లుతున్నది. జ్ఞానికి అది లేదు. ఆతని దృష్టిలో బ్రహ్మమొక్కటే ఇన్ని రూపాలతో తోస్తున్నది. త్రాడు, పాము అనే వికల్పాలను అజ్ఞాని కల్పించుకొంటున్నాడు. జ్ఞానికి సహజసిద్దమైన ఒక (బ్రహ్మదృష్టి మాద్రమే నిశ్చితమై వుంటుంది.
రామా | నీవు అజ్ఞాడవు కావద్దు, ప్రాజ్ఞుడవై వుండు. సంసార వాసనను పరిత్యజించు. అనాత్మలో ఆత్మభావన చేసి అజ్ఞుని లాగా ఎందుకు దుఃఖిస్తావు ? రాఘవా | దేనివల్ల నీవు సుఖదుఃఖాలకులోనై వళం తప్పి అలమటిస్తున్నావో ఆజడమైన ఈ దేహానికీ, నీకూ సంబంధమేమిటి ? పరస్పరం కలిసి వున్నప్పటికీ కట్టెకూ లక్కకూ, కుండకూ అందలి పండుకూ ఎలా ఏకత్వం లేదో, అలాగే దేహానికీ ఆత్మకు కూడా ఏకత్వం లేదు. కొలిమి తిత్తి కాలిపోయినా, అందలి వాయువు కాలదు. దేహం నశించినా ఆత్మ నశించదు. రామా ! "నేను దుఃఖితుడను, నేను సుఖవంతుడను; అనే ఎండమావివంటి (భ్రాంతిని వదలు, సత్యాన్ని ఆశ్రయించు.
266 యోగవాసిష్టం ఆహా! ఏమి ఆశ్చర్యం ! ఏది సత్యమో దానిని మనుజులు మరచిపోయారు. అసత్యమైన అవిద్యను మాత్రం సదా స్మరిస్తున్నారు. రామా! నీవు ఆత్మ విస్కృతికి చోటీయవద్దు, చిత్తం దీనివల్ల దూషితమైతే ఇక దుఃఖసాగరం దాటలేవు. అనర్జాలకు నిలయమై, మననంతో వృద్ది పొంది, దుఃఖాన్నీ మహామోహాన్నీ కల్గిస్తున్న ఈ అవిద్య వల్లనే అమృతసిక్తమైన చం(ద్రబింబంలో కూడా రౌరవ కల్పన జరుగుతున్నది. నరక దుఃఖం అనుభవానికి వస్తున్నది. అలలతో, కలువలతో, చల్లని తుంపురులతో నిండిన మడుగుల్లో కూడా అవిద్య వల్ల ఎండమావులతో నిండిన మరుభూమి గోచరిస్తుంది. అవిద్యాప్రభావం వల్లనే ఆకాశంలో నగర నిర్మాణం, నరకాదుల్లో పతనం, స్వర్గానికి పోవడం మొదలైన చిత్రవిచిత్ర సుఖదుఃఖాలు అనుభవానికి వస్తాయి. అవిద్య చిత్తాన్ని సంసారవాసనలతో నింపకపోతే జా గ్రత్స్వప్నాదులైన సంరంభాలు ఆత్మకు ఆపదను కల్లించగలవా ? మిథ్యాజ్ఞానం వృద్ది పొందితే ఉద్యానభూముల్లో కూడా రౌరవం, అవీచి మొదలైన నరకబాధలు కనిపిస్తాయి. అవిద్యాదూషితమైన చిత్తం తామరతూడులోని దారంలో కూడా ఒకక్షణంలో సమస్త సంసారానికి చెందిన అనర్రవిభ్రమాన్ని చూస్తుంది. చిత్తం అవిద్యకు లోనైతే రాజ్యంలో సుఖంగావుండేవారు కూడా చండాలులకు సైతం అనుభవయోగ్యం కాని దుఃఖాలను అనుభవిస్తారు. రామా! నీవు భవబంధం కల్గించే సర్వరాగమయమైన ఈ వాసనను వదలి శుద్రస్పటికంలాగావుండు. స్పటికం చిత్రవిచిత్రాలైన ప్రతిబింబాలను (గ్రహిస్తున్నా దానికి రంగు అంటదు. అలాగే అన్ని కార్యాలు చేస్తున్నా నీకు రాగరంజన కలుగకుండుగాక ! తత్త్వజ్ఞుల సంసర్గంతో (బ్రహ్మభావన కల్షివున్నావంటే జరామరణాది ప్రాకృతకార్యాలు నిన్నంటవు. నీవు నిత్యముక్తుడవై భాసిస్తావు. అప్పుడు నీకు సాటి రాగలవా రెవరూ వుండరు. సుఖదుఃఖ భోక్తృత్వం వసిష్టుడలా చెప్పగానే పద్మప'(త్రనేత్రుడైన రాముడు ప్రబుద్దుడై భాసించాడు, చీకటిని తొలగిస్తూ సూర్యుడుదయించినప్పుడు పద్మంలాగా అతని అంతఃకరణం వికసించింది. వసిష్టుని ప్రబోధంతో ఆళ్ళ్చిర్యం పాంది చిరునవ్వు చిందిస్తూ
ఉత్పత్తి ప్రకరణం 267 దంతకాంతులు స్పురిస్తుండగా రాముడిలా అన్నాడు -
““ఆవో! ఏ మాళ్చీర్యం ! బిసతంతువులు కొండలను బంధించాయే! ఉనికిలేని అవిద్య అందరినీ వళం చేసికొన్నదే ! తృణప్రాయమైన ఈ అవిద్య వజ్రంలా రూపొందింది. దీనివల్ల లేని సంసారదుఃఖం ఉన్నట్టు భాసిస్తున్నది.
మహాత్మా ! నాపై అనుగ్రహంతో సంసారమాయానదీ స్వరూపాన్ని ఇంకా స్పష్టంగా నాకు బోధపడేటట్టు వివరించండి! నా హృదయంలో మరొక పెద్ద సంశయం ఉన్నది. మహాభాగుడైన లవణమహారాజుకు అంతటి ఆపద ఎలాకల్ళింది? విడదీయరాని విధంగా పరస్పరంకూడి వున్న ఈ దేహాత్మలలో సాంసారిక మైన శుభాశుభ ఫలాలను అనుభివించేది ఏది ? లవణునికి అంతటి విపత్తు కల్గించిన ఐంద్రజాలికుడు చివరికి ఏమయ్యాడు ? ఇంతకూ అతడెవడు ?'*
వసిష్మడు : - అనఘా ! కట్టెనూ, గోడనూ పోలిన ఈ శరీరం జడమైనది. కలలోని వస్తువును వలె దీన్ని చిత్తమే కల్పించింది. సంసార సంరంభంతో కోతిలాగా చపలమైన చిత్తమే చైతన్యశక్తి ప్రభావితమై జీవత్వం పొందింది. అనేక దేహాలు ధరించడం వల్ల ఇది దేహి అయింది. అహంకారం, జీవుడు, మనస్సు అన్న పేర్లతో ఇది వ్యవహరింపబడుతున్నది. కర్మఫలాలను అనుభవిస్తున్నది.
రాఘవా ! ఈ అనంతమైన సుఖదుఃఖాలు అజ్ఞానికే గాని జ్ఞానికి లేవు. ఇవి
శరీరానికి చెందినవి కావు. అప్రబుద్దమైన చిత్తం పెక్కుషేర్లతో నానా కల్పనలు చేస్తుంది. అనేక వృత్తులలో తగులుకొని చిత్ర విచిత్రాకారాలు పొందుతుంది. ప్రబోధం లేనంతవరకూ చిత్తం ని(ద్రించిన దాని'క్రీందే లెక్క . సంభ్రమాలన్నీ కలలోనే కాని మేల్కాన్న తరువాత ఉండవు కదా | అజ్ఞ్జానని[ద్రలో నున్న జీవుడు మేలుకొనే దాకా సాంసారిక విలాసాలు చూస్తూనే వుంటాడు. సూర్యకాంతితో వికసించిన పద్మంలాగా మనస్సు ప్రబోధం పొందూనే అందలి తమస్సంతా నశిస్తుంది. తత్త్వజ్ఞులు దీనిని “చిత్తము, అవిద్య, జీవుడు, వాసన, కర్మ" మొదలైన పేళ్లతో వ్యవహరిస్తున్నారు. సుఖదుఃఖా లనుభవించేది ఆ జీవాత్మే.
జడమైన దేహానికి దుఃఖం లేదు. విచారం లేకపోవడమే దుఃఖానికి కారణం. అవిచారానికి కారణం అజ్ఞానం. అందువల్ల అజ్ఞానమే దుఃఖహేతువు. పట్టుపురుగు తన కోశంలోనే తాను తగుల్కొాన్నట్టు తన అజ్ఞానంతోనే జీవుడు శుభాశుభాలకు లోనవుతున్నాడు. అజ్జానరోగం వల్ల మనస్సు నానావృత్తులుకలదై పెక్కు రూపాలు
268 యోగవాసిష్టం ధరిస్తున్నది. చక్రం లాగా పరి(భ్రమిస్తున్నది. ఈ శరీరంలో మనస్సే ఉదయిస్తున్నది, దుఃఖిస్తున్నది, వధిస్తున్నది, తింటున్నది, నడుస్తున్నది, విజ్బంభిస్తున్నది, నిందిస్తున్నది. శరీరం ఎప్పుడూ ఈ పనులు చేయదు. ఇంటి యజమాని నానావ్యవహారాలు చేస్తాడు. కాని జడమైన ఇల్టు ఏ వ్యవహారమూ చేయదుకదా ! రామా 1! ఈ శరీరంలోని జీవుని వ్యవహారం కూడా ఇలాంటిదే. సవుస్త సుఖదుఃఖాలకూ సర్వకల్పనలకూ మనస్సే కర్త, మనస్సే భోక్త. అంచేత మనస్సే మానవుడు అని గ్రహించు.
లవణమహారాజు మనో భ్రాంతి వల్ల ఎలా చండాలత్వం పొందాడో చెబుతాను... మనస్సు ఎలా కర్మఫలాన్ని అనుభవిస్తుందో వివరిస్తాను. విను. అనఘా ! పూర్వం హరిశ్చంద్రుని కులంలో పుట్టిన లవణుడు ఒకదినం తన ఉద్యానవనంలో ఒకచోట ఏకాంతంగా కూర్చొని మనస్సులో ఇలా చాలా సేపు చింతించాడు -
“నా తాత చాలా గొప్పవాడు. ఆయన రాజసూయయాగం చేశాడు. నేను ఆయన వంశంలో జన్మించాను. నేను కూడా మానసికంగా ఆ యాగం నిర్వహిస్తాను'.
అలా అనుకొని ఆరాజు మనస్సులోనే యాగాని కవసరమైన సంభారాలన్నీ సవముకూర్చుకొన్నాడు. రాజసూయదీక్షలో (ప్రవేశించాడు. బుత్విక్కులను ఆహ్వానించాడు. మునులను పూజించాడు. దేవతలను ఆహ్వానించి అగ్నిని వెలిగించాడు. ఇలా మానసికంగానే యాగం చేస్తుండగా ఒక సంవత్సరకాలం గడచిపోయింది. యాగం పూర్తికాగానే విప్రులు మున్నగు వారి కందరికీ సర్వస్వ దక్షిణ లిచ్చాడు. ఆదినం సాయం సమయం కాగానే తన ఉద్యానం లోనే మానసిక యజ్ఞ[భమనుండి మేల్కొన్నాడు.
ఇలా ఆనరపాలుడు మనస్సులోనే యాగం చేశాడు. మనస్సులోనే ఫలం పొందాడు. అందువల్ల సుఖదుఃఖాలనుభవించే మనస్సే మానవుడు. రామా! నీ మనస్సును సత్యమైన, పవిత్రమైన ఉపాయంలో ్రవేశపెట్టు.
ప్లూర్ణస్ట్రితిలో ఉన్నవాడు ప్యూర్ధుడవుతాడు. నష్టస్టితిలో వుండేవానికి నాశం తప్పదు. “దేహమే నేను' అన్న నిశ్చయంతో వుండే మూఢులతో పనేమి? వివేకంతో మనస్సు వికసిస్తే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. సూర్యకర స్పర్శతో వికసించిన పద్మంలో సంకోచం, జాడ్యం, తిమిరం అనేవి సమసిపోతాయి కదా !
ఉత్పత్తి ప్రకరణం 269 సాధక జన్మావతారం
శ్రీరాముడు : - మునిశ్రేష్య! లవణమహారాజు తన మానసరాజసూయం కారణంగా మాయాజాలంవల్ల అనిష్టమైన ఫలం పాండాడు కదా 1! ఇందుకు ప్రమాణం ఏమిటి ?
వసిష్టుడు : - రామా। ఐంద్రజాలికుడు రాజసభకు వచ్చినప్పుడు నేనక్కడే ఉన్నాను. ఆ సంఘటనను (ప్రత్యక్షంగా చూచాను. ఐంద్రజాలికుడు వెళ్ళిపోయిన తర్వాత సభాసదులు, లవణుడు ' ఏమిటిది?* అని నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను ఆలోచించి యోగబలంతో అంతా (గ్రహించి వారికి వివరించాను. ఐం(ద్రజాలికుని అభిమతమేమో నీకు చెబుతాను, విను.
రాజసూయయాగం చేసినవారు పన్నెండు సంవత్సరాలవరకూ నానా విధాల ఆపదలనూ, దుఃఖాలనూ పొందుతారు. అందుచేత లవణునికి కష్టం కల్షించడానికి ఇంద్రుడు పంషగా వచ్చిన దేవదూతే ఆ ఐం(ద్రజాలికుడు. అతడు రాజుకు ఇలా గొప్ప విపత్తు కల్గించి దేవతలు, సిద్దులు విహరించే ఆకాశమార్గంలో తిరిగి వెళ్ళాడు. (శరీరంతో చేసే రాజసూయానికంటే మనస్సుతో చేసే యాగం ఐదురెట్టు ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టే అరవై సంత్సరాలు రాజు విపత్తును అనుభవించవలసి వచ్చింది.)
రామా 1 ఇది ప్రత్యక్షమైన విషయమే. ఇందులో సందేహం లేదు. మనస్సే విలక్షణమైన కర్మలకు కర్తగానూ, భోక్తగానూ ఉంటున్నది. ఆ చిత్తమనే రత్నానికి హఠయోగంతో సానబెట్టి దాన్ని రాజయోగంతో సంశోధించాలి. అలా చేసి వివేకంతో మనస్సును ఎండలో మంచుబిందువును విలీనంచేసినట్టు నిర్వికల్పసమాధిలో అయం చేయాలి. అలా చేసినప్పుడు తత్త్వసావాత్కారం కల్లి శ్రేయస్సు పొందుతావు.
సర్వజీవులను సమ్మోహితులను చేసే అవిద్య ఈ చిత్తమే. విచిత్రమైన ఇంద్రజాలంతో ఈ జగత్తును అదే సృష్టిస్తున్నది. వృక్క తరు శబ్దాలకు భేదం లేనట్లే “అవిద్య, చిత్తం, జీవుడు, బుద్ది" అనే శబ్దాలకు సైతం భేదం లేదు. ఇది గ్రహించి నీవు చిత్తాన్ని సంకల్పరహితం కావించు. మనో వైర్మల్య మనే సూర్యబింబం ఉదయిస్తే మలిన వికల్బాలవల్ల కల్లే దోషమనే చీకటి నశిస్తుంది. రాఘవా ! సర్వాత్మకమైన స్వాత్మ దర్శనం వల్ల దర్శింపరానిదీ, స్వాధీనంకానిదీ, పరిత్యజింపనిదీ,
270 యోగవాసిస్టం మరణించనిదీ ఏదీ ఉండదు. ఎందుకంటే అంతా ఆత్మీయమే, అంతా పరకీయమే. అది సదా సర్వమై సర్వత్రా ఉన్న దనేదే పరమార్ధం. కాల్చని రకరకాల కుండలన్నీ నీటిలో ముంచితే ఒకే ముద్దగా కలిసిపోతాయి. అదేరీతిగా దృశ్యజగత్తు, దృశ్వజ్ఞానం, బీవజూలం - అంతా బ్రహైక్యం పొందుతాయి.
శ్రీరాముడు : - మహాత్మా ! మనస్సు లయమైతే సకలసుఖ దుఃఖాలూ సమసి పోతాయని మీరంటున్నారు. చపలవృత్తిరూపమైన చిత్తం తన ఉనికిని ఎలా కోల్పోతుంది ?
వసిష్టుడు : - రఘుకులచంద్రా ! మనస్సు ఎలా శమిస్తుందో వివరిస్తాను, విను. ఇది (గ్రహిస్తే నీవు మనస్సును బ్రహ్మలో లీనం చేయగలవు. సాత్త్విక రాజసతామసాలనే మూడు రకాల (ప్రాణులన్నీ బ్రహ్మంనుండే పుడుతున్నాయని నీకు ఇంతకుముందే చెప్పాను. హిరణ్య గర్భరూపమైన మొదటి మనస్సు ““నేను చతుర్ముఖుడ నగుదును గాక?” అని సంకల్పించింది. ఆ సంకల్పంవల్ల బ్రహ్మదేవుడు రూపాందాడు. అతడే ఈ జగ ద్వలయాన్ని కల్పించాడు. జీవుల చావు పుట్టుకలు, సుఖదుఃఖాలు మోహం మొదలైన సంసారాన్ని కల్పించిన కల్పరచన నానా నామరూపాలతో గురుతరమై వుంటుంది. చివరికి ఎండలో మంచుబిందువులాగా తానే విష్ణువులో లయమై పోతుంది. వుళ్ళీ సంకల్పవశాన తగిన కాలంలో వ్యక్తమవుతుంది. మళ్ళీ నశిస్తుంది. ఇలా మాటిమాటికీ జరుగుతుంది.
ఇలా అనంతవైన బబహ్మకోట్టు ఈ (బ్రహ్మాండంలోనూ ఇతర ('బ్రహ్మాండంలోనూ, పుట్టి నశిస్తూ వుంటాయి. ఇంకా లెక్కకు మిక్కి లిగా ఇతరమైన సృష్టులు వున్నాయి. ఈ స్థితి ఇలావుండగా ఈశ్వరునినుండి వచ్చిన జీవుడు ఎలా జీవిస్తున్నాడో, ఎలా విముక్తు డవుతున్నాడో చెబుతాను, విను.
(ప్రళయకాలంలో అవ్యాకృతంలో లీనమైన జీవుల మనళశ్ళక్తి సంస్కార రూపంలో ఉంటుంది. అది శబ్దతన్మత్రాస్వరూపమైన ఆకాశశక్తి ఆవిర్భవించగానే దాని నాలంబనంగా చేసుకొని తానూ ఉదయిస్తుంది. వాయుశక్తి రూపమైన స్పర్శతన్మాత్రజనించగానే చలనలక్షణమైన ఘన సంకల్పత్వాన్ని పొందుతుంది. ఆ పై రసాది తన్మాత్రల క్రమంలో అపంచీకృత పంచభూతత్వం పాంది అంతఈకరణాన్ని రూపొందిస్తుంది. పిమ్మట ఆ మనఃశక్తి పంచీకృత స్టూల ప్రకృతిగా మారుతుంది. ఆ తరువాత వర్ష్హాది జలరూపంపాంది వరి, గోధువు మొదలైన ఓషధుల్లో
ఉత్పత్తి ప్రకరణం 271 ప్రవేశిస్తుంది. ఆపై అన్నమై, రేతస్సై, స్త్రీ గర్భంలో దూరి పిందమై జీవుని ఉత్పత్తికి కారణ మవుతుంది.
అలా పుట్టిన పురుషుడు బాల్యంలోనే విద్యనభ్యసించాలి. అందుకై గురువుల ననుసరించాలి. అలా చేస్తే వానికి నీకు లాగానే సాధనచతుష్టయ సంపద అనే చమత్కారం కల్గుతుంది. పురుషుని చిత్తవృత్తి స్వచ్చమైతే సంసారమనే అనర్ధం వదల దగినదనీ, మోత్షోపాయం గ్రహింపదగినదనీ విచారం కల్గుతుంది. అట్టి సాధన సంపత్తి కలవాడూ, వివేకవంతుడూ, సత్త్వగుణ సంపన్నుడూ అయిన సాధకునిలో మనస్సును ప్రకాశింపజేసే సప్తాత్మిక యోగభూమి క్రమంగా అవతరిస్తుంది. అవతరించి పరమపురుషార్దాన్ని ప్రసాదిస్తుంది.
అజ్ఞాన భూమికలు
శ్రీరాముడు :- భగవ౯ | తత్త జ్ఞ శ్రేష్టా ! మోతసీద్దిని ప్రసాదించే ఏడు యోగభూమిక లేవో సంగ్రహంగా వివరించండి |
వసిష్కుడు : - అజ్జానభూమికలు ఏడు. జ్ఞానభూమికలు కూడా ఏడే. ఇందులో అవాంతరభేదాలు అనేకం ఉన్నాయి. ప్రవృత్తి లక్షణమైన తన ప్రయత్నమూ, విషయాలపై అభిరుచీ- అజ్జానభూమికలకు అసాధారణహేతువులు. (శ్రవణాదుల్లో ప్రయత్నవమూ, వోత్షాపేక్ష జ్ఞానభూమికలకు అసాధారణ కారణాలుగా వున్నాయి. ఆత్మలాభం రెండు వర్గాలకూ సాధారణ హేతువుగా ఉన్నది. ఇందువల్ల ఈ రెండు రకాల భూమికలూ గట్టిపడి (క్రమంగా దుఃఖం, ఆనందం అనే ఫలాలను (ప్రసాదిస్తున్నాయి.
ఇందులో జ్ఞాన భూమికలను తరువాత విందుచు. వటందు అజ్జానభూమిలకలను వివరిస్తాను, విను. స్వరూపంలో నిలకడగల్లి వుండడమే మోక్షం. ఆ స్టీతినుండి జారి బాహ్య విషయాలపై ప్రవృత్తి గల్లి అహంభావం పొందడం అజ్ఞానం. జ్ఞానాజ్ఞానభూమికల లక్షణం ఇదే. ఎవరు రాగద్వేషాలు లేనివారై శుద్రసన్మాత్రసంవేదనారూపమైన స్వరూపం నుండి చలించరో వారికి అజ్ఞానం సంభవించదు. స్వరూపచ్యుతిని మించిన మోహం మరొకటి లేదు.
చిత్తం ఒక విషయంనుండి వురొక విషయానికి పోయేటప్పుడు ఆ మధ్యకాలంలోని మననరహితమైన ఫ్రీతినే స్వరూపఫ్రితి అంటారు. సర్వసంకల్పాలూ
౯27
272 యోగవాసిస్టం శమించి జాడ్యం, నిద్ర సోకని శిలవంటి నిశ్చలమైన స్థ్రితికే స్వరూపస్థితి అనిపేరు. అహంభావం, భేదజ్ఞానం లేని స్వ'ప్రకాశస్థితి అదే.
రామా! అట్టి స్వరూపస్రితిపై ఆరోపించబడినదే అజ్ఞానం. దీనికి చెందిన భూమికలు (1) బీజ జాగ్రత్తు (2) జాగ్రత్తు (3) వుహాజూగ్రత్తు (4) జా(గ్రత్స్వప్నం (5) స్వప్నం (6) స్వప్నజా గ్రత్తు (7) సుషుప్తం అని ఏడు విధాలు. అవి అన్యోన్యం కలిస్తే ఎన్నో భేదాలు ఏర్పడతాయి.
ఇక వీటి లక్షణాలు విను. సృష్ట్యాదిలో చేతన వస్తువునుండి కల్షినదీ, మున్ముందు చిత్తం, జీవుడు మొదలైన పేర్లచే పేర్కొనబడేదీ, జాగ్రదవస్టకు బీజభూతమైనదీ బీజజాగ్రత్తు అనబడుతుంది. ఇది జ్ఞప్తియొక్క కొంగ్రొత్త దశ
“ఈ స్టూల శరీరమే నేను, ఈ పదార్దాలు నావి” అనే ప్రతీతికే జా గ్రత్తు అని పేరు. దృఢమైన అభ్యాసంతో బాగా బలపడిన జూగ్రత్-స్టితి యొక్క అనుభవమే మహాజా గ్రత్తు అనబడుతుంది. అభ్యాసంవల్ల బలపడి, లేక అనభ్యాసంవల్ల బలహీనమైన జాగ్రద్దశలోని మనోరాజ్యమే జా గ్రత్స్వప్నమనబడుతుంది. ఇది నానావిధాలుగా వుంటుంది. ఇద్దరు చంద్రుల దర్శనం, శుక్తికలో రజతత్తా;న్ని చూడడం, ఎండమావి మొదలైనవి ఈ దశకు చెందినవే.
నిద్రలో గోచరించిన దానిని మేల్కొన్న తర్వాత ' దీనిని స్వల్పకాలం మాత్రమే చూచాను, ఇది సత్యం కాదు? అనే అనుభవానికి కారణమైన దశను స్వప్నమంటారు. ఇది మహాజూగ్రద్భూమికి చెంది అజ్ఞాని హృదయంలో కల్గుతుంది. బహుకాలం చూడకపోవడం వల్ల ఇది వికాసరహితమై ఉంటుంది.
దృఢమైన అభినివేశంవల్ల మహాజా గ్రత్ స్టితిని పొందిన స్వప్నమే స్వప్నజా గ్రత్తు అని వ్యవహరింపబడుతుంది. ఇది దేహం నశించినా, నశించకున్నా కల్గుతుంది.
పై ఆరు అవస్టలూ వదలిన తరువాత జీవునికి భవిష్యత్తులో దుఃఖం కల్షించే జడస్టితికి సుషుప్తమని పేరు. ఈ దశలో తృణకాష్ట శిలాదులు పరమాణు ప్రమాణం కల్లివుంటాయి.
రాఘవా ! అజ్ఞానభూమికలు ఇవే. ఇందులో ఒక్కొక్కటీ నూరు శాఖలు గల్లి నానావైభవాలతో ఒప్పారుతుంది. చిరకాలం రూఢిపడిన జా గ్రత్స్వప్నం జాగ్భతిలోనే పర్యవసిత మవుతుంది. ఇందులో మహాజా గ్రద్ద్హశలు చాలా ఉన్నాయి. ఈ దశల్లో దగుల్కొాన్న లోకం సుడిలో దగులుకొన్న పడవలాగా మోహం నుండి మోహానికి భ్రమిస్తూ వుంటుంది.
ఉత్పత్తి ప్రకరణం 273 చక్కని విచారణతో నిర్మలమైన ఆత్మ దర్శనం కల్లితే అనేక భేదాలతో కూడి హీనమైన ఈ అజ్ఞ్జానభూమికల నుండి నీవు విడుదల పొందగలవు. జ్ఞాన భూమికలు అనఘా! ఇక ఏడు జ్ఞానభూమికలను విను. వీటిని అనుభవానికి తెచ్చుకొంటే మళ్లీ వరాహపంకంలో వమునగవు. యోగసాంఖ్యవాదులు పలురకాలుగా యోగభూమికలను వివరిస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే భూమికలే శుభప్రదా లనినా అభిప్రాయం. అజ్ఞానాన్ని నివారించే అవబోధవేం “జ్ఞానం”. అందులో ఏడు భూమికలున్నాయి. ఈ భూమికలకు ఆవలిదైన ముక్తినే “జ్లేయం' అంటారు. సత్యావబోధం, మోక్షం అనేవి పర్యాయనామాలు. సత్యజ్ఞానం పొందినవానికి మళ్లీ పుట్టుక లేదు. శుభేచ్చ, విచారణ, తనుమానస, సత్త్వాపత్తి, అసంసక్తి, పదార్హాభావని, తుర్యగ- అనేవే సప్తజ్ఞాన భూమికలు. ఈ ఏడింటి కావలిదైన ముక్తిని పొందితే ఇక శోకం ఉండదు. ఈ భూమికల నిర్వచనం విను. “నేనింకా మూఢుడనై యున్నానే ! శాస్త్రాలు చదువుతాను. సజ్జనులను దర్శిస్తాను?' అని వైర్తాగ్య పూర్వకంగా కల్లే ఇచ్చను బుషులు 'శుభేచ్చ' అంటారు. శా(స్రాలతోనూ, సజ్జనులతోనూ సంపర్కం పొంది వైరాగ్యం అభ్యసించడంతో పాటు కలోే సదాచార ప్రవృత్తి ' విచారణ” అనబడుతుంది. శుభేచ్చా విచారణల ఫలితంగా విషయాలపై ఆసక్తి లేకపోవడాన్నే 'తనుమానస' అని వ్యవహరిస్తారు. పై మూడు భూమికలను అభ్యసించడం వల్ల చిత్తం విషయ విరక్తి పొంది సత్యమైన శుద్దాత్మలో నిలకడ చెంది యుండడమే ' సత్త్వాపత్తి' అనబడుతుంది. (ఈ ఫ్రీతి పొందినవాడు (బ్రహ్మవిత్తు అనబడతాడు). పై నాలుగవపఫ్టలనూ అనుభవించడం వల్ల విషయుసంగం లేకపోగా సత్త్వచమత్కారం రూఢమైన దశకు 'అసంసక్తి' అని పేరు. (ఈ దళ నందుకొన్న వాడు (బ్రహ్మవిద్వరుడు). పై ఐదు భూమికలనూ అభ్యసించడం వల్ల లోనివీ, వెలుపలివీ అయిన ఏ
274 యోగవాసిం పదార్జాలనూ భా వించక స్వాత్మారాముడై వుంటూ ఇతరుల (ప్రయత్నంతో మాత్రమే ఆయాపదార్జాలను గురించి ఇంచుక భావించే ఫ్రితిని 'పదార్దాభావని' అంటారు. (ఈ స్థితిని పొందినవాడు బ్రహ్మవిద్వరీయుడు).
పై భూమికల నారింటినీ బహుకాలం అభ్యసించడం వల్ల భేదదృష్టి నశించి స్వభావంలోనే నిష్ట కలిగివుండడాన్ని 'తుర్యగూ అంటారు. (ఈ దశను పాందినవాడే (బ్రహ్మవిద్వరిష్కడు).
జీవన్ముక్తులలో ఈ తురీయావస్థ ఉంటుంది. విదేహముక్తికి చెందిన తురీయాతీతస్టితి దీని కావలిది. రామా! ఏ మహానుభావులు ఈ ఏడవ భూమికను చేరుకొంటారో వారే మహాపదవి నధిష్టించిన ఆత్మారాము లవుతున్నారు.
జీవన్ముక్తులు సుఖదుఃఖాలకు చలించరు. శరీరరక్షణకై వారు పనులు చేయవచ్చు, చేయకపోవచ్చు. 'ప్రక్కనున్నవారి ప్రయత్నం వల్ల వీరు (క్రమానుగతమైన ఆచారం పాటిస్తారు.
నిద్రించిన పురుషుణ్ణి అందగత్తెలైన వనితలు సంతోషపెట్టులేరు. అదేరీతిగా ఆత్మారాములైన ఆమహనీయులను ప్రాపంచిక కార్యా లేవీ సంతోషపరచలేవు.
ఈ ఏడుభూమికలూ దీమంతులకే గోచరిస్తాయి. కాని పళశువులకూ, స్టావరాదులకూ, మ్రేచ్చులకూ గోచరించవు. పశుమ్హేచ్చాదులు కూడా ఈ జ్ఞాన దశ పొందినప్పుడు దేహంతో ఉన్నా, లేకున్నా తప్పక ముక్తు లవుతారు. ఇందులో సందేహం లేదు.
గ్రంథివిచ్చేదమే జ్ఞానం. అది కల్గితేనే మోక్షం సిద్దిస్తుంది. ఎండమావిలో జలబుద్రి నశించిన వానిలాగా జ్ఞాని భాసిస్తాడు. మోహాన్ని అతిక్రమించినా పరమ పావనపదం పొందలేక ఈ భూమికల్గో ఉన్నవారు ఆయాఫ్టితికి తగిన ఆత్మానందాన్ని పొంది సుఖిస్తారు. వారి వారి ప్రయత్నాన్ని బట్టి సాధకులు ఒకటి, లేక రెండు, లేక మూడు- ఇలా ఆయా భూమికల నధిరోహిస్తారు. వివేకవంతులు ఈ భూమికలలో చరిస్తూ తాపనివారకమైన ఆత్మనిష్టలో ఉంటారు.
ఈ జ్ఞాన భూమికలు పొంది మనోజయం సాధించినవారే ధీరులు. ఈ విజయంతో పోల్చి చూస్తే దిగ్గజాలపై, వీర సైనికులపై రాజులు సాధించే విజయం తృణప్రాయమైనది. ఈ భూమికల్లో జయశీలురై విహరించే మహనీయులే నమస్కరణీయులు. ఇం(ద్రియాలు అనే శత్రువులను జయించినవారు వారే. చక్రవర్తి,
ఉత్పత్తి ప్రకరణం 275 చతుర్ముఖ(బ్రహ్మగూడా వారి ముందు తృణ'ప్రాయులే. వారి కంటే మహోత్తవమైన విదేహకైవల్య సుఖాన్ని ఈ మహనీయులు పొందుతారు. బంగారం - ఉంగరం - ఉపదేశం బంగారం ఉంగరంగా రూపాందుతున్నది. ఆపై అది తన స్వ్నర్ణత్వాన్ని మరచి “నేను బంగారం కాను అని ఏద్చినట్లే ఆత్మ అహంభావం పొంది తన స్వరూపం విస్మరించి దుఃఖిస్తున్నది. శ్రీరాముడు : - మునీంద్రా! బంగారానికి తాను ఉంగరం అనే జ్ఞానం ఎలా కల్గింది ? ఆత్మకు అహంభావం ఏ రీతిగా కలిగింది ? ఈ సంగతిని ఇంకా స్పష్టంగా వివరించి చెప్పండి. వసిష్టుడు : - రామా ! ఉనికి గల పదార్డానికి చెందిన ఉత్పత్తి వినాశాలను గూర్చి ప్రఖ్నంచాలేకాని, ఉనికి లేని దాన్నిగూర్చి ప్రశ్నించగూడదు. ఉన్న వస్తువులు (బ్రహ్మమూ, బంగారమే. అహంకారం కానీ, అంగుళీయకం గానీ ఏనాడూ ఉన్నవి కావు. అమ్మేవాడు కొనేవాని నుండి బహు మూల్యం గ్రహించి అంగుళీయక రూపంలో ఉన్న బంగారాన్నే ఇస్తాడు. అందువల్ల బంగారమే సత్యమైనది. ఇందులో సందేహం లేదు. శ్రీరాముడు : - బంగారమొక్కటే సత్యమైతే ఇక అంగుళీయకంలోని అంగుళీయకత్వం ఎలాంటిదో చెప్పండి. దాన్ని బట్టి నేను బ్రహ్మ స్వరూపం ఎట్టిదో గ్రహిస్తాను. వసిష్టుడు : - రావూ 1! లేని వస్తువు యొక్క రూపాన్ని నీవు నిరూపించమంటున్నావు. అయితే గొ డ్రాలి బిడ్డ అకారం, గుణాలూ ఎట్టివో నీవు వెప్పు. అంగుళీయకత్వం అనేది వట్టి భ్రాంతి మాత్రమే. అది మాయ. చూడబోతే దావి రూపం కనిపించదు. రూప రాహిత్యమే దాని రూపమని తెలుసుకో. ఎండమావిలో నీరు దొరకదు. ఇద్దరు చం(ద్రులలో ద్విత్వం లేదు. అహంకారంలో ఆకృతి లేదు. ముత్తెపు చిప్పలో వెండిని చూచిన వాడెవడూ అందులో ఒక అణువైనా వెండిని పొందలేదు. తత్త్వవిచారం లేకపోవడం వల్లనే లేని వస్తువు ఉన్నట్టు భాసిస్తుంది. ముత్తెపు చిప్పలో వెండి, ఎండమావిలో నీరు ఇందుకు దృష్టంతం.
276 యోగవాసి్థం
ఏది లేదో, దాని లేమి చక్కగా విచారిస్తేనే గోచరిస్తుంది. లేని వస్తువే ఒక్కొక్కసారి ఉన్నదాని పని చేస్తుంది. బేతాళభ్రమ బాలుర చావుకు కారణం అవుతున్నది కదా !
ఇసుకలో తైలం లాగా స్వరంలో స్వర్ధత్వం తప్పు అంగుళీయకత్వం, కటకత్వం మొదలైనవి లేవు. ప్రయోజనకారి కావడంలో ఇది సత్యమా 1! మిథ్యా ? అనే ప్రశ్నకు (ప్రసక్తి లేదు. దేని నెలా మనం భావిస్తామో అది అలా ప్రయోజనం కల్గిస్తుంది. భావనాబలం వల్ల విషం కూడా అమృతం లాగా పనిచేస్తుంది. సత్యం కానీ, మిథ్య కానీ హృదయంలో రూఢిపడిన విధంగా అర్ధ క్రియను కల్లిస్తుంది.
అనాత్మలో కల్గుతున్న అహంభావమే అవిద్య. అదే మాయ. అదే సంసారం. స్వచ్చమూ, శాంతమూ, పరమూ అయిన (బ్రహ్మంలో అహంభావం అసత్తే కాని సత్యం కాజాలదు.
సనాతనత్వం, (బ్రహ్మత్వం, (బ్రహ్మాండత్వం, పుత్రత్వం, లోకాంతరత్వం, స్వర్గాదిత్వం, మేరుత్వం, అసురత్వం, మనస్త్వం, దేహత్వం, మహాభూతత్వం, కారణత్వం, (త్రికాలత్వం, భావాభావత్వం, తత్త్వం, అహంత్వం, ఆత్మత్వం, సత్త్వం, అసత్త్వం - అనేవి లేవు. ఇందులో రాగం, రంజన, భేదకల్పన ఇత్యాదులకు అవకాళం లేదు.
శాంతం, నిరాలంబం, శాళ్వతం, శివం, అనావుయం, అనాభాసం, అనామకం, అకారణం, సదసద్భిన్నం, ఆదిమధ్యాంతరహితం, మనోవాక్కులకు అగోచరం, ఆకాశం కంచే సూత్మం, సుఖాల కన్నింటికంటే సుఖమైన బ్రహ్మమే అంతా. దాని కంటే వేరైన దేదీ లేదు.
శ్రీరాముడు : - అంతటా సమస్వరూపమైన (బ్రహ్మమే ఉన్నదని మీ ప్రబోధం వల్ల నేను గ్రహించాను. అయినా కూడా ఈ సృష్టి ఎలా గోచరిస్తున్నదో చెప్పండి !
వసిష్టుడు : - పరమశాంతమైన పరతత్త మే ఈ జగద్రూపంలో భాసిస్తున్నది. అది తానున్న స్టితిలోనే సదా వుంటుంది. ఇక్కడ సృష్టి అని పేర్కొనదగిన దేదీ దానికంటే వేరుగా లేదు.
సము(ద్రమంతా జలమే. విశ్వమంతా పరమేశ్వరుడే. జలం [ద్రవం కాబట్టి కదలిక గల్గివుంటుంది. పరతత్త్వానికి చలనం లేదు. సూర్యుని లాగా పరతత్త్వం (ప్రకాశశీలం కాదు. సూర్యాదులకు ప్రకాశం భౌతిక లక్షణం. సరమపదంలో ఆ
ఉత్పత్తి ప్రకరణం 277 లక్షణం లేదు. అది ని'ప్కియమైన స్వయంజ్యోతిస్స్వరూపం.
అల్సజ్ఞానికి జగత్తు పరమాత్మకంచిె భిన్నంగా గోచరిస్తుంది. అందువల్ల వాని దృష్టిలో సృష్టి ఉన్నది. కాని తత్త్వజ్ఞుని దృష్టిలో పరమాత్మకంటే వేరుగా సృష్టి లేదు. పరమాత్మకు మరొక పేరే స్పష్టి, ఆకాశంలో ఇంకొక ఆకాశం ఉండదు. పరమాత్మలో మరొక పరమాత్మ ఉండడు. చిత్తం వల్ల సృష్టి తోస్తుంది. చిత్తనాశంతో అది నశిస్తుంది. చిత్తం శమిస్తే స్పష్టి పరమాత్మే అయిపోతుంది.
ఈ సృష్టి సం[భమమంతా అహంభావంతో కూడిన సంవేదనమే. శిల్పులు తయారు చేసిన మట్టి బొమ్మల సేన సేనగానే కనిపిస్తుంది. కాని అదంతా మట్టే. సమాధినుండి లేచిన జ్ఞానికి సైతం ఇలా ఒకే పరమాత్మలో సృష్టి భేదం గోచరిస్తుంది.
" జ్ఞానుల దృష్టికి ఇదంతా పూర్ణం. దీనికి ఆద్యంతాలు లేవు. ఇది నిర్హుష్టమైనది. పూర్ణమైన పరమాత్మ వ్యాప్తితో నిండిన దీనిలో చివరికి మిగిలేది పూర్ణమే. ఈ సృష్టి బ్రహ్మంలో అంతర్భాగమైన (బ్రహ్మమే. ఇది ఆకాశంలో ఆకాళం లాగా, శాంతంలో శాంతం, శివంలో శివమై ఉన్నది.
అద్దంలో ప్రతిఫలించిన తొమ్మిది యోజనాల నగరంలో దూరాదూరాలు లేవు. బ్రహ్మంలో ఉన్న క్రమం గూడా ఇదే. అద్దంలోని పట్టణాన్నీ, ఎండమావిలోని నీటినీ, ద్విచం(ద్రభ్రాంతినీ పోలిన ఈ సృష్టిలో సత్యత్వం ఎక్కడిది ?
ఐం(ద్రజాలికుడు మాయాచ్యూర్లం చల్లితే ఆకాశంలో నగరభ్రమ కల్గుతుంది. అలాగే చేతన వస్తువులో సత్యాసత్యరూపమైన సంసార(భ్రమ కల్గుతున్నది. విచారమనే అగ్నితో అవిద్య అనే జ్నీర్ణలత సంపూర్ణంగా ఎంతవరకూ ద్రం కాలేదో, అంత వరకూ అది నానావిధాలైన సుఖదుఃఖా లనే కొమ్మలనూ, రెమ్మలనూ ప్రసవిస్తూ వుంటుంది.
చండాలీ శోకం
రామా! బంగారపు టుంగరం లాగా మిథ్య అయిన అవిద్య యొక్క (ప్రభావం ఎట్టేదో చెబుతాను, విను.
లవణుడు ఐంద్రజాలికుడు కల్గించిన ఆ (భ్రమను చూచి మరునాడే ఆ అరణ్యానికి పోవడానికి సిద్దమయ్యాడు. “నేను ఆ అడవిలో మహాదుఃఖం అనుభవించాను. నా చిత్తంలో లగ్నమైన ఆ అరణ్యాన్ని స్మరిస్తున్నాను. వింధ్య పర్వతానికి పోయి వెదికితే అది కనిసించవచ్చు'” అని నిళ్ళియించుకొని మంత్రులతో
278 యోగవాసిష్టం సవా దక్షిణాపథానికి వెళ్లాడు. మళ్లీ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడా అన్నట్టు పోయి పోయి వింధ్యాద్రి చేరుకున్నాడు. ఆకసంలో సూర్యుడు పరి(భ్రమించినట్టు పూర్వ దక్షిణ పశ్చిమ సముద్ర తీరాలలో పర్యటించాడు.
అలా సంచరిస్తూ ఎదురుపడ్డ దుఃఖమా అన్నట్లున్న భయంకరమైన ఆ అడవిని చూచాడు.
అక్కడ విహరిస్తూ రాజు పూర్వం ఆచోట జరిగిన వృత్తాంతాలను గుర్తుకు దెచ్చుకొని ఆశ్చర్య చకితుడయ్యాడు. అక్కడి చండాలుర నందరినీ గుర్తించాడు. సం(భ్రమంతో ఇటూ అటూ తిరిగాడు.
తరువాత ఆ ఆడవిలోనే ధూమధూసరమైన ఒక(ప్రాంతంలో తాను పూర్వం చండాలుడై జీవించిన గ్రామం చేరుకున్నాడు. అక్కడి స్త్రీలనూ, పురుషులనూ, గుడిసెలనూ, జనుల కాధారమైన ్రదేశాలనూ పరికించాడు. కరువు కాలంలో కూలిపోయిన చెట్టనరా, తన సహచరులనూ, బంధువులకు దూరమైన కిరాతులనూ, పుత్రులనూ చూచాడు.
అక్కడ ఒకచోట ఎడతెగకుండా కన్నీరు కారుస్తూ కరువులో కాలిపోయిన ఆ నేలలో ఆర్తనాదం చేస్తూ ఒక వృద్ర స్త్రీ కనిపించింది. ఆమె అకాలంలో తన్ను వదలిపోయిన బంధువులను పేర్కొని ఏడుస్తున్నది. తనలాగే ఏడుస్తున్న ఇతర వృద్ర స్త్రీలతో తన దుఃఖాన్ని ఇలా వివరించి ్రలపిస్తున్నది.
““ఓ బిడ్డా! మూడు దినాలుగా తిండి లేక డస్సిపోయినదానా ! నీ బిడ్డలు నీ శరీరంపైబడి పలవిస్తున్నారే! నీ ప్రాణాలను నీవు ఎక్కడ వదిలావు ? కొండ వంటి ఎత్తెన తాటి చెట్టెక్కి పండుకోసి నోటకరుచుకొని దిగివస్తున్నప్పుడు చేయి జారి హనుమంతుని లాగా ప్రక్కనే వున్న మరాక తాటిచెట్టును పట్టుకొన్న నా అల్బుని సాహసం నాకిప్పుడు గుర్తుకు వస్తున్నది. కడివాచెట్లలో, నిమ్మచెట్లలో, లవంగ-గురివింద తీగల పొదళ్లలో చరించే వ్యాఘ్రాది జంతువులను వధించబోతూ నా అల్టుడు వేసే గంతులను మళ్లీ నే నెప్పుడు చూడగలను ?
మద్యపాన సమయంలో ప్రియురాలి ముఖం నుండి లభించిన మాంస శకలాన్ని భక్షిస్తున్న, చీకటి చెట్టులాగా నల్లనైన గడ్డము గల నా అల్టుని ముఖ శోభ మన్మథునికీ గూడా లేదు. పెనుగాలి పూగుత్తితో సహా తమాలవళల్లికను త్రెంచుకొని పోయినట్టు
ఉత్పత్తి ప్రకరణం 279 యముడు యమునానది వలె నల్లనైన నా కుమార్తెను ఆమె పతితో గూడా హరించుకుపోయాడు. గురి గింజమాల ధరించేనా కూతురా ! ఆకులే వ(స్తాలుగా గలదానా ! రేగు గింజల వంటి పలువరుసతో శోభిల్లే దానా! నీవు ఏమైపోయావే 1
చంద్రుని వలె అందమైన ఓ రాకుమారా |! నీవు నీ అంతఃపురకాంతలను వదలి నా ఫుత్రికను ్రేమించావే | మీ అనుబంధం గట్టిది కాకుండా పోయిందే 1 సంసార మాయా విలాసాన్ని ఏమని చెప్పేది ? దాని ప్రభావంతో చండాలకన్యకను పరిగ్రహించిన నరపాలుడు చేయని దుష్కృత్యం కలదా ?
నా కూతురు భయపడిన బింకవంటి కన్నులు గలది. నా అల్టుడు మదించిన ఫులి వంటి పరాక్రమం కలవాడు. అర్ధంతో సహా ఆశ కూడా నశించినట్టు ఇద్దరూ ఒకేసారి అంతరించి పోయారే! భరృవియోగం, పుత్రీ వియోగం పొంది నేనిప్పుడు దుర్షశల పాలయ్యాను. దుర్దాతిలో పుట్టిన నేను మహాపదలకు గురి అయ్యాను, భయమేనా స్వరూపమయింది.
నీచులు నన్ను అవమానించారు. ఆకటి బాధకు తాళలేని ఆ (శ్రితులను పోషించలేకున్నాను. ఎడతెగని దుఃఖం నన్ను పైకొంటున్నది. అన్ని కష్టైలకూ నిలయమైన అనాథను నేను. దైవోపహతుడు, బంధు రహితుడు, మనోవ్యాధికి గురి అయిన వాడైన మనుజుని కంటె ప్రాణరహితమైన బండరాయి మేలు. వర్దాకాలంలో కొండపైన లెక్కకు మిక్కిలిగా మొలిచే గడ్డి పోచలలాగా స్వజన విహీనులై, దుష్ట ప్రదేశంలో నివసించే వారికి అంతులేని దుఃఖాలు సంభవిస్తాయి?”
ఇలా ఏడుస్తున్న ఆ వృద్ధురాలిని రాజు దాసీజనంచే ఊరడింపబేశాడు. తరువాత “' నీ వెవరు ? నీ వృత్తాంతమేమి ? నీ కుమార్తె ఎవరు? నీఫుత్రు డెవరు?” అని ప్రశ్నించాడు. అప్పుడామె కన్నీరు కారుస్తూ ఇలా చెప్పింది -
“ఇది పుష్కస ఘోషమనే గ్రామం. ఇక్కడ పుష్కసకుడు అనే నాభర్త వుండేవాడు. అతనికి చంద్రరేఖ వంటి ఒక పుత్రిక ఉండేది. ఆమె దైవయోగంతో చంద్రుని వంటి ఒక రాకుమారుడు ఇక్కడికి వస్తే దీన గార్హభి మధుపూరిత ఘటాన్ని పొందినట్టు అతణ్ణి పతిగా చేపట్టింది. ఆమె అతనితో చాలాకాలం సుఖాలు అనుభవించింది. సంతానం పొందింది. చెట్టును పట్టుక్షొన్న సారతిగ లాగా ఈ అడవిలోనే వృద్ది పొందింది.
280 యోగవాసిష్టం చిత్తాభావ ప్రతిపాదనం
రాజా! కొంత కాలానికి ఈ ఊరిలో అతిభీకరమైన అనావృష్టి, ఏర్పడింది. ఆ విపత్తులో ఊరు విడిచి పోయిన వారందరూ మరణించారు. (ప్రభూ! అందువల్లనే దుఃభితులమైన మేము కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాము.*”
ఆ వృద్ద వనిత మాటలు విని రాజు ఆళ్చీర్య చకితుడయ్యాడు. మంత్రుల ముఖాలు చూస్తూ చిత్రంలో బొమ్మలా అయిపోయాడు. ఆ వింతను గూర్చి మళ్లీ మళ్లీ ఆలోచించాడు. పలుసార్లు అడిగి వివరాలు తెలుసుకొని విస్మయం పాందాడు.
తరువాత తగిన దాన సమ్మానాలతో వాళ్ల దుఃఖం సోగొట్టాడు. అక్కడ చాలాసేపు ఉండి దైవతిని విమర్శించాడు. ఆపై తన నగరానికి విచ్చేశాడు. పురజనులు నమస్కరిస్తుండగా స్వగృహం చేరుకొన్నాడు.
మరునాటి ఉదయాన సబాస్టానంలో ఆ రాజు నన్ను చూచి ''మునీం(ద్రా! కల ఎలా ప్రత్యక్షంగా కనిపించింది ?*' అని (ప్రశ్నించాడు. అప్పుడు నేను గాలి ఆకసంనుండి మబ్బులను తొలగించిన విధంగా తగు సమాధానంతో అతని హృదయంనుండి సందేహాలు తొలగించాను.
రామా 1 ఇలా ఈ అవిద్య భ్రమ కల్గిస్తుంది. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్న దాన్ని లేనట్టు చేస్తుంది.
శ్రీరాముడు : - (బ్రహ్మన్! కల ఎలా నిజమయింది ? ఈ విషయం నాకు అంతు చిక్కడం లేదు.
వసిష్పుడు : - రామా! అవిద్యలో ఇదంతా సంభవిస్తుంది. స్వప్న సం(భమంలో ఘటం పటంగా మారుతున్నది గదా ! అవిద్యా ప్రభావం వల్ల అద్దంలో కొండలాగా దూరాన ఉన్నది దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. సుఖ నిద్రలో రా(త్రిలాగా చిరకాలం అల్పకాలమవుతుంది. కలలో తన మరణం లాగా అసంభావ్యమైనది సంభవిస్తుంది. ఆకాశగమనం లాగా లేనిది ఉన్నట్టు తోస్తుంది. గిర గిర తిరిగిన వానికి భూభ్రమణం లాగా ఫ్రిరమైనదే చలిస్తుంది. వస్తువు ఉండవచ్చు, లేకపోవచ్చు. వాసనాక్రాంతమైన చిత్తం దేని నెలా భావిస్తుంధ్రో, అది అలాగే అనుభవానికి వస్తుంది. అవిద్యతోపాటు ఆది మధ్యాంతరహితమైన భ్రాంతి కూడా ఉదయిస్తుంది. (ప్రతిభాసం వల్లనే క్షణం
ఉత్పత్తి ప్రకరణం 281 కల్పంగా, కల్పం క్షణంగా అవుతుంది. మతివిపర్యాసం కలవాడు తన్ను మేకగా భావిస్తాడు. ఈ వాసన వల్లనే మేషం సింహమనవుతుంది. అవిద్య, మోహం, అహంభావం ఇవన్నీ చిత్త పైవరీత్యం కల్లించేవే,
కాకతాళీయంగా చిత్తవాసన వల్ల వ్యవహారాలు పరస్పరం సంవదిస్తుంటాయి.
బోయపళ్లెలో పూర్వం ఒకానొక వ్యక్తికి జరిగిన దంతా లవణరాజు మనస్సులో భాసించింది. ఒకడొక మహాకార్యం చేసి మరచిపోతాడు. ఒక్కొక్కసారి చేసిన పనితోపాటే చేయని పనికి సంబంధించిన స్మృతి కూడా కలుగుతుంటుంది. భుజించిన వాడు కలలో, లేదా దేశాంతరంలో భుజింపలేదని భావిస్తాడు. వింధ్యాద్రిలోని పుష్కస గ్రామంలో జరిగిన వ్యవహారం ఇలాంటిదే. కలలో పూర్వ కథలాగా అది రాజు చిత్తంలో భాసించింది. లేదా లవణరాజు కలలో చూచిన (భ్రమ వింధ్యపర్వతం చెంత ఒక చండాలుని చిత్తంలో స్పురించి వుండవచ్చు. రాజు భావన చండాలునిలో గానీ, చండాలుని భావన రాజులో గానీ (ప్రతిభాసించిందన్న మాట.
అనేక కవుల ఊహలు, మాటలు ఒకే రీతిగా వుండినట్టు స్వప్నంలో దేశకాలక్రియలు
కూడా పెక్కు మందికి సమంగా వుండవచ్చు.
(ప్రతిభాసం వల్లనే వ్యవహారగతికి ఉనికి సిద్రిస్తున్నది. ఏ పదార్డానికీ సంవేదన కంటే వేరుగా ఉనికి లేదు. భూతభవిష్య ద్వర్తమాన ప్రపంచంలో వ్యాప్తమై కూడా నీటిలో అల లాగా, విత్తనంలో చెట్టులాగా సంవేదన తన స్వరూపం కంటే భిన్నంగా తోస్తున్నది. పదార్దాల ఉనికి లేములు (భాంతి సంవేదనకు అధీనమై వున్నాయి.
ఇసుకలో నూనె లేనట్లే అవిద్యక్షు ఉనికి లేదు. కటకంలో బంగారం కంటే భిన్నంగా కటకత్వం ఎక్కడ ఉన్నది ? అవిద్యకూ, ఆత్మకూ సంబంధం లేదు. సమానమైన వస్తువులకే సంబంధం లోకసిద్దంగాని అసమాన వస్తువులకు లేదు గదా! సమ విషమ పదార్దాల సంయోగం అలక్క- కట్టెల సంబంధంలో ఉన్నది గదా అంటే అవి రెండూ అవిద్యలో చేరినవే కాన సమాన వస్తువులుగానే పరిగణీంప బడతాయి.
అంతా పరమార్హమయమే. భావాలన్నీ చిన్మాత్ర సన్మాత్రమయాలే. అవి స్వానుభవాన్ని బట్టి భాసిస్తాయి. సమపదార్ధంతో సమ పదార్ధం క్షణంలో ఏకత్వం పాంది తన రూపాన్ని విశాలం చేసుకోంటుంది. చిత్తు చేత్యంతో కలిసి దృశ్య రూపం పొందుతుంది. జడం జడంతో కలిసి జడ రూపం పొందుతుంది. చిత్తుకూ, జడానికీ ఐక్యం కుదరదు.
282 యోగాాసిష్టం దారు పాషాణాదులు చిదాత్మకాలు కావు. కాప్టాదులు గృహాదులుగా మారినట్లు ఒక పదార్హం మరొక పదార్ధంగా పరిణామం పాందుతుంది. చైతన్యం అలా పరిణమించదు. శిలాదులు నిజానికి జడాలు కావు. చిత్తే శిలాదులుగా రూపొందుతుంది. ఏకీభావం పాంది (దష దృళశ్యాది[భవా కల్షిస్తుంది. కాష్టోపలాదులన్నీ పరమార్హమయాలే. వాటి సంబంధం కల్పిత రూపంలోనే కాని వాస్తవ చిద్రూపంలో కాదు. అనంతమైన చైతన్యమే సర్వస్వరూపాలతో విరాజిల్దుతున్నది. రామా ! ఈ విశ్వమంతా సన్మాత్రమే. మిథ్యా రూపమైన చిచ్చమత్కారం చే విశ్వం కోటి 'భ్రమలతో కూడి విలసిల్లుతున్నది. స్వర్ధ సంవేదనను వదలినప్పుడే కటకత్వ (భ్రమ కల్గుతుంది. భేదజ్ఞానం కల్లినప్పుడే సృష్టికీ, అహంభావానికీ చెందిన (భ్రమ ఏర్పడుతుంది. కటక[భ్రమ కనకంపై ఆధారపడివున్నట్లే, జగత్ ఫ్రితి చైతన్యం పై ఆధారపడివున్నది. స్వర్ణాన్ని వదలితే కటకాదులకు వేరుగా ఉనికి లేదు. అదే రీతిగా దృగ్దర్శనశక్తిని విడిచితే అవిద్య వేరుగా లేదు. మట్టిచే నిర్మించబడిన సైన్యం చిత్ర విచిత్రంగా ఉన్నా మచ్చే. అలాగే వైతన్య నిర్మితమైన ఈ సృష్టి అంతా చైతన్యమే. అలలుగా ఉన్నదంతా జలవేం. బొవ్ములుగా కనిపించేదంతా కర్రే. కుంభాదులుగా ఉన్నదంతా మచే. అదే రీతిగా ఈ (త్రిజగద్ర్రమ అంతా (బ్రహ్మమే. చిత్తం ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లేటప్పుడు ఆ మధ్యకాలంలో ఉన్న చేతోరూపం జాడ్యరహిత శుద్ర స్వరూషహమే. నీవు సదా ఆ స్వరూపంలో వుండు. జా(గ్రత్స్వప్న నిద్రలు లేని నీ సనాతన రూపం అచేతనమూ, (చిత్తవృత్తి రహితము) అజడమూ అయివున్నది. నీవు సదా తన్మయుడవై వుండు. జడత్వాన్ని వదలి నీవు సమాధిలోనో, లేక వ్యవహార దశలోనో చిన్న్మయుడవై వుండు. ప్రపంచంలో ఎవనికీ ఏదీ ఉదయించదు, నశించదు. కాబట్టి నీవు ఏ దశలో వున్నా సుఖంగా స్వస్టుడవై వుండు. దేహంలోని ఆత్మ దేన్నీ కోరదు, దేన్నీ ద్వేషించదు. అందువల్ల నీవు నిస్సందేహంగా స్వస్టుడవై వుండు. దేహ వృత్తులలో తగులుకోవద్దు. భవిష్యత్తులో జరుగబోయే వ్యవహారాలలో ఇప్పుడు నీవు ఎలా ఆసక్తి లేనివాడవై వుంటావో, అలాగే ఇప్పటి వ్యవహారాలలో కూడా వుండు. రాయిలో నీరు లేదు. నీళ్లలో నిప్పు లేదు. అలాగే నీలో చిత్తం లేదు. ఇక పరమాత్మలో అది ఎలా వుంటుంది ? ఆలోచించి చూస్తే చిత్త మనేదే లేదు. అలాంటి చిత్తం చేసిన పని చేయబడనిదే. ఇలా భావించి చిత్తా న్ని అతి'(క్రమించాలి.
ఉత్పత్తి ప్రకరణం 283 అనాత్మ అయిన చిత్తాన్ని అనుసరించేవాడు మ్లేచ్చుళ్లీ ఎందు కనుసరించగూడదు? చిత్త మనే చండాలుళ్లో తిరస్కరించి మట్టిబొమ్మలాగా నీవు స్వష్టుడవై వుండు. “నాకు చిత్తం లేదు. అది చచ్చిపోయింది అని నిశ్చయించుకొని రాతిబొమ్మవలె నిశ్చలంగా వుండు.
ఆత్మ దృష్టిలో చిత్తం లేదు. నిజానికీ నీవు చిత్తరహితుడవు. అలాంటప్పుడు వ్యర్థంగా ఎందుకు దాని వల్ల తపిస్తావు ? ఉనికి లేని చిత్తమనే బేతాళానికి వళమైన మందబుద్దులకు చంద్రుని నుండి వజ్రపాతం సంభవిస్తుంది. ఈ చిత్తాన్ని దూరంగా విడిచిపెట్టి నీవు ఉన్నవాడివున్నట్టు స్థిరంగా వుండు. సంసారభావన వదలి మననశీ€వై ధ్యాన నిమగ్నుడవై విరాజిల్టు.
ఉనికి లేని చిత్తాన్ని అనుసరించేవారు ఆకాశాన్ని చంపడానికి ప్రయత్నించే మూర్చులు. వారికి ధిక్కారం 1! నీవు మహానుభావుడవై మనస్సును వదలిపెట్టు. పీదప తత్త్వబోధంతో నిర్మలాత్ముడవై సంసారసాగరతీరం చేరుకో. ఎంతగా ఆలోచించినా నిర్మలమైన ఆత్మలో నాకు మలినమైన చిత్త మనేది కొంచెం కూడా కనిపించలేదు.
స్వరూప నిరూపణం
జన్మించిన పిమ్మట మనుజుడు వికసించిన బుద్ది గలిగి సత్సంగ తత్పరుడై
వుండాలి. శాస్త్రంతో సజ్జనులతో సంపర్కం లేకపోతే ఎడతెగకుండా (ప్రవహించే " అవిద్యానదిని దాటడం సాధ్యం కాదు. శాస్త్ర సజ్జన సాంగత్యం వల్ల ఏది
పరిగ్రహించాలి, ఏది పరిహరించాలి అన్న విచారం కల్గుతుంది. ఈ విచారం కలవాడు “శుభేచ్చ' అనే భూమికను అధిరోహిస్తాడు. తరువాత విచారంతో “విచారణా' భూమికలో ప్రవేశిస్తాడు. ఉత్తమజ్ఞానంతో నీచ వాసనలను వదలిన వాని మనస్సు సంసారభావనలో కృళత్వం పొందుతుంది. దానితో అతడు 'తనుమానసి అనే వివేక భూమికను చేరుకుంటాడు.
యోగికి సమ్యక్జ్లానో దయం కల్లినప్పుడే 'సత్త్వాపత్తి' సిద్దిస్తుంది. దానివల్ల వాసన క్షీణిస్తుంది. అప్పుడతడు 'అసంసక్తుడు' అనబడతాడు. ఆ స్థితిలో కర్మఫలం అతళ్లీ బంధించదు.
బాహ్య విషయాలకు చెందిన వాసనలు జ్నీణీించడం వల్ల అతని భావన తనుత్వానికి అలవాటుపడుతుంది. అప్పుడు బాహ్యార్ధ విస్మరణ సిద్దిస్తుంది.
284 యోగూసిస్టం సమాధిలో వున్నా, సంసార వ్యవహారంలో వున్నా అతని మనస్సు శ్షీణించే వుంటుంది. అభ్యాసంతో బాహ్యకర్మలు చేస్తున్నా అతడు చూడడు, అనుభవించడు, ధ్యానించడు. కేవలం గాఢనిద్ర నుండి మేల్కొన్న వానిలా, మూఢునిలా కర్తవ్యాలు నిర్వహిస్తాడు. సూక్ష్మతమమైన బ్రహ్మమును మాత్రమే భావిస్తాడు కాని ఇతర పదార్దాలను భావించడు. అందువల్ల అతడు '“పదార్దాభావని” అనే యోగభూమికకు వస్తాడు.
ఇలా అంతర్లీనమనస్కుడై కొన్ని సంవత్సరాలు అభ్యసించి బాహ్యకర్మలు చేస్తున్నప్పటికీ భావనను పూర్తిగా పరిత్యజిస్తాడు. అలా 'తుర్యాత్ము'డై “జీవన్ముక్తుడు' అని వ్యవహరింపబడతాడు. ఆ స్రితిలో అతడు ప్రాప్తించిన దానిని అభినందించడు. రానిదాస్టై శోకించడు. సందేహాలు మాని తనకు తానుగా వచ్చిన దానిని అనువర్తిస్తాడు.
రామా! నీవు తెలుసుకోదగిన ప్రత్యగాత్మతత్త్యం తెలుసుకున్నావు. నీ వాసన సమస్త కార్యాలలోనూ కృశత్వం పొందింది కదా ! నీవు సమాధిలోనో, లేక వ్యవహారంలోనో ఉండు. కాని హర్ష శోకాలు పొందకు. నీవు నిరామయుడవైన ఆత్మవు.
తేజోమయమూ, స్వచ్చమూ, సర్వవ్యాప్తమూ, సదోదితమూ అయిన ఆత్మస్వరూపుడవు నీవు. అట్టి నీలో సుఖదుఃఖాలు, జనన మరణాలు ఎలా సంభవిస్తాయి ? నీకు బంధువులే లేరు. ఇక బంధు దుఃఖానికెందుకు దుఃఖిస్తావు? ఆత్మ అద్వితీయం. ఇక దానికి బంధువు లెక్కడ ఉన్నారు ?
కేవల శరీరములో పరమాణువుల సముదాయం మాత్రమే కనిపిస్తుంది. ఆత్మకు ఉత్పత్తి వినాశాలు లేవు. నీవు నాశరహితుడవై వుండి కూడా నశిస్తానని ఎందుకు శోకిస్తావు ? మృత్యురహితమైన ఆత్మకు నాశ మెక్కడిది ? ఘటం (వక్కలై కపాలంగా మారినా అందలి ఆకాశం నశించదు. శరీరం నష్టమైనా ఆత్మ నశించదు. ఎండమావిలో నీరు నశించినా ఎండ నశించదు గదా ! నీవు అద్వితీయుడవు. ఇక నీకు కోరదగిన ద్వితీయవస్తు వేమున్నది ? రామా 1! ఆత్మకంచె భిన్నంగా విని, తాకి, చూచి, రసించి, మూర్కొని తెలుసుకోదగిన దేదీ లేదు. ఆకసంలో శూన్యత్వం లాగా సర్వ శక్తి సంపన్నమైన ఆత్మలోనే శక్తు లన్నీ ఉన్నాయి.
(త్రిగుణాలతో ఒప్పారి భమగాల్సే ఈ ముల్లోకాలూ చిత్తం నుండే జనించాయి. వాసనా క్షయం అనే మనశ్శాంతి లభించగానే కర్మాదిశక్తులపై ఆధారపడిన ఈ మాయ కూడా నశిస్తుంది. సంసారమనే పిండిమరను నడిపే త్రాడైన ఈ వాసనను ప్రయత్నంతో
ఉత్పత్తి ప్రకరణం 285 తెంచివేయి. దాని స్వరూపం తెలియనంతవరకూ ఈ మాయ మవీమోహం కల్గిస్తుంది. తెలిసిన తర్వాత అదే అనంత సుఖం కల్గిస్తుంది. ఈ మూయ (బ్రహ్మం నుండి పుట్టింది. సంసారం అనుభవించింది. (బ్రహ్మాన్నే స్మరించి మళ్లీ బ్రహ్మంలోనే లీనమవుతుంది. అగ్ని నుండి వెలుగు లాగా శివమూ, రూప రహితమూ, నిరామయమూ అయిన పర(బ్రహ్మంనుండే సమస్త (ప్రాణులూ ఉద్భవించాయి. ఆకులో రేఖల వలె, నీటిలో అలల్లాగా, బంగారంలో గాజు రీతిగా, అగ్నిలో వేడిమి మౌదిరిగా భావనారూపుడైన పరమాత్మలో ముల్లోకాలూ ఏర్పడ్డాయి. అందులోనే ఉన్నాయి. అదే ఇది. సర్వభూతాలకూ ఆత్మ అయిన అదే బ్రహ్మ మనబడుతున్నది. దాన్ని తెలుసుకొంటే జగత్తునంతా తెలుసుకొన్నట్లే. ముల్లోకాలలో జ్ఞాత ఆ పరమాత్మే.
శాస్త్ర వ్యవహారం కొరకు సువిశాలమైన ఆ పరతత్త్యానికీ “చిత్తు, బ్రహ్మ, ఆత్మ' అని తత్త్వజ్ఞులు పేర్లు పెట్టారు. విషయేం[ద్రియాల సంయోగంలో హర్దామర్డాలు లేని జీవన్ముక్తుల శుద్దానుభవమే అవ్యయమైన ఆ చిదాత్మ. ఆకాశం లాగా మిక్కిలి స్వచ్చమైన ఆ చిదాత్మలో దాని స్వరూపమే వేరైన జగత్తుగా ప్రతిబింబిస్తున్నది.
బుద్ది దానికి వ్యతిరేకంగా స్ఫురిస్తుంది. దాని వల్ల లోభమోహాదులు కల్గుతాయి. అవి కూడా చిదాత్మలో ప్రతిబింబించేవే కాన చిదాత్మకాలే. రామా 1 నిర్వికల్ప చిదాకారుడవైన నీకు సిగ్గు, భయం, విషాదాల వల్ల మోహం ఎలా కల్గింది? అదేహుడవైన నీవు దేహం నుండి కల్లే వీటిచేత వికల్పాలచే దుర్చుద్ది లాగా ఎలా ఆ'క్రమించబడుతున్నావు ?
దేహం ఖండించబడినా అఖండ వైతన్యం ఖండించబడదు. ఆ ఫ్టితిలో అజ్జని ఆత్మ సైతం నశించదు. ఇక విజ్ఞుని ఆత్మ ఎలా నశిస్తుంది ? సూర్యుని మార్గంలో కూడా నిరాటంకంగా రాకపోకలు సాగించగల చిత్తమే సంసారి అయిన ఆత్మ. ఈ శరీరం కాదు. శరీరం ఉన్నా, లేకున్నా ముల్గోకాలలోనూ పురుషుడే జ్ఞానిగానో, అజ్ఞానిగానో ఉన్నాడు. దేహం నశించినంత మాత్రాన అతడు నశించడు.
ఈ విచిత్రమైన దుఃఖాలు దేహానికి చెందినవే కాని చిదాత్మకు చెందినవికావు. మనోమార్లాన్ని అతిక్రమించి ఆకాశం వలె సర్వవ్యాప్తమై వున్న చిత్తుకు సుఖదుఃఖా లెలా కల్గుతాయి ? పద్మం నుండి ఎగిరిన తుమ్మెద ఆకాళం చేరినట్టు దేహమనే
286 యోగవాసిష్టం పంజరం నుండి ఎగిరిన ఆత్మ తన స్వస్తానమైన పరమాత్మనే పాందుతుంది. అయితే జ్ఞానం కలిగే వరకూ దానికి ముక్తి లేదు. ఒక వేళ ఆత్మ అనేది లేదనుకో. అప్పుడు దేహపంజరం నశించినప్పుడు నశించే దేమున్నది ? ఎందుకు శోకించాలి ? అంచేత నీవు సత్యంగా ఆలోచించు. మోహాన్ని భావించవద్దు. అనఘమై, ఇచ్చారహితమైన ఆత్మకు కోరికలుండవు. సాక్షిభూతమూ, సమమూ, స్వచ్చమూ, నిర్వికల్పమూ అయిన చిదాత్మలో అద్రంలోలాగా జగత్తులు అనిచ్చాపూర్వకంగా ప్రతిబింబిస్తున్నాయి. మణిలో కాంతుల వలె అందులో జగత్తులు కనిపిస్తున్నాయి. అద్దానికీ, బింబానికీ కోరిక లేకున్నా సంబంధం కల్లినట్టు ఆత్మ జగత్తులకు భేదాభేదాలు కల్గుతున్నాయి. సూర్యసాన్నిధ్యంలో లోకక్రియలు ప్రారంభమవుతాయి. అలాగే చిత్సత్త వళ్ల జగత్తు నిష్పున్నమవుతుంది. రాఘవా ! జగత్తుకు చెందిన ఈ నామరూపాత్మకమైన పిండగ్రహం తాలగిపోగానే నీ మనస్సులో శుద్రవైతన్యం భాసిస్తుంది. దీపపు టునికి వల్ల వెలుగులాగా చిత్సత్తవల్ల జగత్తు ఏర్పడుతున్నది. ఆకాశం శూన్యమైనా అందులో నీలత్వం గోచరిస్తుంది. అదేరీతిగా మొదట పరమాత్మ నుండి మనస్సు జనించింది. అది తన వికల్పశక్తితో జగత్తును కల్గించింది. శరదృతువు రాగానే ఆకాశం నిర్మలమై విలసిల్చుతుంది. అలాగే సంకల్పం క్షయించగనే సంసారమోహమనే మంచు విడిపోతుంది. అప్పుడు చిన్మాత్రం, ఏకం, అజం, అనంతం అయిన పరమాత్మ తత్త్వం గోచరిస్తుంది. మొదట ప్రాణులకు సమష్టి కర్మాత్మకమైన మనస్సు సంభవిస్తుంది. అందుండి (బ్రహ్మ మనువు మొదలైనవారు ఉద్భవిస్తారు. ముర్రబాలుడు బేతాళాన్ని కల్పించినట్లు నానావిధమైన ఈ విచిత్ర జగత్తును వారు కల్పిస్తారు. మహాసముద్రంలో జల వలయాల వలె అధివ్యాన చైతన్యంలో అజ్ఞాన పరిణామమైన మనస్సు జగత్తు అనే శరీరంతో గోచరిస్తుంది. అది లేనిదైనా ఉన్నట్టు తోస్తుంది. అది అందులో లయమై మరల జన్మిస్తుంది. రామా 1! అందువల్ల దృశ్యమంతా అసత్యమే కాన వికృతి లేని పూర్ణ బ్రహ్మం ఒక్కటే సత్యమని గ్రహించాలి. శవా తృతీయ ప్రకరణం సమాప్తం. $5| ౨6 శ్రి న్నీ శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణ మస్తు. ౯ (8 అకులు ఈ, ఓం తత్సత్ - ఓమ్.
క నా న మిం నా నాం స న |. ప న! య. త వ నం. శ ర న న కదరా. స్ో మ... శ ( సమద న. ఉపా నన య నా (లోన సట త ॥ - బా ( మ లంత చ మాలి శ్ న. మ యాల ల్. న ప్రత . ల ప్రయమ్యకయ స్పారునవతచంద్రచూచునునాభలాషి. హాస యల భా న ర స న. య. 17 / న్ ; వ సయం నటు కటట న. ం గ. . ॥ ధం ల నం త ు ం శ / నం? గ ప న. . న క్ష గ గ (. ఆన ల్ లగ్గళ! ల్ 4 జే 1 _ 1 న న సశ జ . మలు వం రం వ న 2. " న య వ ర | శ న టర రన త న చ | వ స! ప (1 న ను నం. హం. / ల ఫు త. ప్ర టం: న. మ మూ. గం యుల ప కత. కం. య తో... , క్ షస స్టే చే పిక _ ఈ ననే . న గో లే...