Telugu Wallstre muttadi - anilvaranasi/indianlanguages GitHub Wiki

వ. క యును. నయా ఉదార ప కాల, ల్‌ జ్‌ బసు ప. _ _ ఏ. న ఎం. కోటేశ్వరావు 1 మ కుం 1 ₹ బశక్తి బుక్‌హౌస్‌ వ (

4 న

ట్రి గ్‌ వాల్‌ప్రట్‌ ముట్టడి నో లా నయా ఉదార విధానాలకు వినూత్న ప్రతిఘటన ప్రజాశక్తి బుక్‌హౌన్‌ ఎమ్‌హిచ్‌ భనన్‌, స్లాటొనెం. 27/1, అజామాబాద్‌ ఆర్‌టినీ కళ్యాణ మండపం దగ్గర వ్రాదరాబాద్‌ 20 ఫోన్‌ 040 - 27660073

తి త కటా 1111111111] 69864 టా (్‌ ళ్‌ భ్‌ ళ్తయ్య 'గ్రంధాలంై న్‌స్టై కై న్నుకడడ౭డ డ్‌ ప్రచురణ సంజ్య 1230 ప్రథమ ముద్రణ' ఫిబ్రవరి "2012 వెల ₹20 ప్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 1-1-187/1/2 చిక్కడపల్లి హైదరాబాద్‌ -20 ఫోన్‌ 27608107 బ్రాంజీలు హైదరాబాద్‌, విజయవాద, విశాఖపట్నం తిరుపతి, బమ్మం, హన్మకొండ, నల్గొండ, గుంటూరు ఒంగోలు ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌

ముందుమాట

వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ! 2007 సంవత్సరం చివరి నుంచి పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ఆవరించి అతలాకుతలం గావిస్తున్న ఆర్థిక సంక్షోభం అనేక తరగతుల వారిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తున్నది సంక్షోభం మాంద్యంగా మారిన అమెరికాలో ప్రారంభమైన ముట్టడి ఉద్యమం సమ్మెలు, సాధారణ సమ్మెలంటే ఎలా జరుగుతాయో, అర్ధాలు కూడా తెలియని యువతీ యువకులను జెండాలు, బ్యానర్లు పట్టించి వీధులకు ఎక్కించింది 'కైస్తవ మతాధికారులతో చర్చలలో (ప్రార్ధనలతో పాటు ఆర్థికశా[స్త పారాలు, సంస్కరణల గురించి మాట్లాడించింది దేవుడిని లెక్కచేయనివారితో కలిసి మీరు ఆందోళనల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించిన గోముఖ వ్యాఘ్రాలకు ఏసు అందరినీ కలిసి రమ్మన్నాడని కడుపుమండిన సామాన్యులతో సమాధానాలు చెప్పించింది మైకు పట్టుకున్న ప్రతివారూ సోషలిజం గురించి మాట్లాడతారు, అది నాకు నచ్చదుగాని ముట్టడి ఉద్యమం బ్యాంకుల గురించి చెప్పినదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తా అన్నవారెందరో ! పాలపొంగులా వచ్చిన ఈ ఉద్యమం గురించి మూడునెలల తరువాత మీడియా విస్మరించింది కొంతమంది వ్యాఖ్యానిస్తున్నట్లు ఉద్యమం చల్లబడిందా? రెండవ దశ ఉద్యమానికి జనం సిద్ధమౌతున్నారా?

గతంలో ప్రపంచంలోని అనేక దేశాలలో యాదృచ్చికంగా అనేక ఉద్యమాలు తలెత్తాయి

చినుకు చుక్కలతో ప్రారంభమై మహా నదులుగా మారిన మాదిరి అనేక ఉద్యమాలను చూశాము అవి దేనికవే ప్రత్యేకత గలిగి ఉన్నాయి ప్రపంచ పెట్టుబడిదారీ కుంభస్థలమైన న్యూయార్క్‌లోని వాల్‌స్టీట్‌ పరిసర ప్రాంతవాసులు సేద తీరేందుకు, మధ్యాహ్న సమయాల్లో కొద్ది సేపు గడిపే సమీప కార్యాలయాల్లో పని చేసే వారికి తప్ప మిగతావారెప్పుడూ

వినని జుకొట్టి పార్కు ఇప్పుడు ప్రపంచ సుప్రసిద్ధం అక్కడ ప్రారంభమైన 'వాల్‌స్టీట్‌ ముట్టడి ఒక్క అమెరికానే కాదు, యావత్‌ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపివేసింది ప్రజాతంత్ర, అభ్యుదయ, కమ్యూనిస్టు శ్రేణులను సహజంగానే ఇది ఆకట్టుకుంది ఇది ఎలాంటి పర్యవసానాలకు దారితీయిస్తుందో అని పెట్టుబడిదారీ శక్తులకు దద పుట్టించింది అసలు ఇలాంటి డిమాండ్‌ ముందుకు ఎలా వచ్చిందని దోపిడీశక్తి ఆశ్చర్యపోతున్నది జనాన్ని ఎలా సమాధాన పరచాలా అని మధనపడుతున్నది ఆందోళనలు, సమ్మెలకు దూరంగా ఉండే అమెరికాలో ఇలాంటి ఉద్యమం రావటం ఏమిటి? అదీ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ కేంద్రమైన వాల్‌స్టీట్‌నే లక్ష్యంగా చేసుకొని, కార్పొరేట్‌ శక్తులకు ఎలాంటి రాయితీలు ఇవ్వరాదని ఉద్యమించటానికి దారి తీసిన కారణాలేమిటి?” అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వాములా? తెల్లవారు, నల్లవారూ కలిసి పాల్గొంటున్నారా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి అసలు ఈ ఉద్యమ స్వభావం ఏమిటి? ఇప్పుడున్న వ్యవస్థను సంపూర్ణంగా మార్చాలని కోరుతున్నారా లేక దానిని ఇలాగే కొనసాగిస్తూ కేవలం సంస్కరణలు మాత్రమే అమలు జరపాలని వాంఛిస్తున్నారా? ఉద్దీపన పథకాలు వాల్‌స్టీట్‌కు కాదు మెయిన్‌ ప్టీట్‌కు అమలు జరపాలి అంటే కేవలం బడ్జెట్‌ కేటాయింపుల మార్చ్పుకే పరిమితం అవుతున్నారా? వాటితోనే సంతృప్తి చెందుతారా? కొన్ని సంస్కరణలు అమలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యా ఇది? దశాబ్దాల తరబడి పేరుకు పోతున్న అసంతృప్తి ఆగ్రహ ప్రదర్శనా? కొందరు విశ్లేషకులు దీనిని విష్లవంగా వర్ణించారు ప్రపంచ చరిత్రలో ప్రతి విప్లవంలో ముందు పీరీన ఉండే కార్మికులు ఇంతవరకు ఒక్క సమ్మెను కూడా ఎందుకు చేయలేదు? సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలకు కూడా వివిధ రంగుల విప్లవాలని పేరు పెట్టారు అందుకే అసలు విప్లవమంటే ఏమిటి? ప్రపంచంలో అనేక దేశాలలో తలెత్తిన విప్లవాలను అణచివేసిన అమెరికా స్వయంగా తన గడ్డపై వచ్చిన విప్లవాన్ని ఎలా సహిస్తుంది? ప్రతి ఉద్యమం విప్లవం అవుతుందా? ఒక విప్లవం జయప్రదం కావాలంటే అందుకు అనువైన పరిస్థితులు ఉందాలి సన్నద్ధమైన జనాన్ని నడిపేందుకు ఉక్కు క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన మాత్రమే ఇంతవరకు ప్రపంచంలో విప్లవాలు వచ్చాయి అవే సమాజంలో మౌలిక మార్పులు తెచ్చాయి మిగతా చోట్ల తలెత్తిన ఆందోళనలకు విప్లవాలని పేరు పెట్టినా అలాంటి మౌలిక మార్పులు లేవు కొంతమంది చెప్పినట్లు అమెరికాలో విప్లవ పరిస్థితులు ఏర్పడితే

జనాన్ని నడిపించేది ఎవరు? వాల్‌స్ట్రీట్‌ కొమ్ముకాసే డెమోక్రాట్‌ రిపబ్లికన్‌ పాలకవర్గ పార్టీలా లేక కమ్యూనిస్టుపార్టీనా? అమెరికా కమ్యూనిస్టు పార్టీకి అంతశక్తి ఉందా? ఉంటే అధ్యక్ష ఎన్నికలలో కూడా ఎందుకు పోటీ చేయటం లేదు? మరి విప్లవాన్ని ఎవరు తీసుకువస్తారు?

మూడునెలల పాటు విరామం లేకుండా సాగిన ఉద్యమం నవంబరు 15 తరువాత చల్లబడింది దానికి ఒక ప్రధాన కారణం అమెరికాలో చలి ముదరటం, రెండవది క్రమంగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకోవటం, కార్పొరేట్‌ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ఉద్యమకారులు తదుపరి కార్యాచరణ గురించి ఒక నిర్ధారణకు రాకపోవటం, ఉద్యమంలో ప్రధానంగా మధ్యతరగతి మాత్రమే ముందుండటం వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి మీడియాలో కనిపించనంత మాత్రాన ఉద్యమం వెనుక పట్టు పట్టిందనటం సరికాదని కొందరు అభ్యంతరం చెబుతున్నారు నిజానికి జుకొట్టి పార్కు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యమకారులను బలవంతంగా తొలగించగానే ఉద్ధృతి తగ్గింది తప్ప ఉద్యమం ఆగలేదు అనేక చోట్ల ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది వేలానికి వచ్చిన ఇళ్లను ఆక్రమించుకోవటం, వేలాన్ని ప్రతిఘటించి ఆక్రమణదారులకు మద్దతుగా నిలవటం, విద్యార్థులు తమ రుణభారాన్ని తగ్గించాలని కోరుతూ పదిలక్షల సంతకాల ఉద్యమాన్ని చేపట్టటం, అన్నింటి కంటే ఎన్నికలలో అధికార ప్రతి పక్ష అభ్యర్థుల ఎన్నిక సందర్భంగా ఉద్యమకారులు రెండు పార్టీల వారిని నిలదీయటం, వారి సభలు, కార్యాలయాల వద్ద తిష్టేయటం వంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఏ ఉద్యమానికైనా విరామాలు తప్పవు తొలి రోజుల్లో చూసీ చూడనట్లు ఉన్న పోలీసులు రెండు నెలలు గడిచిన తరువాత అవసరం ఉన్నా లేకపోయినా అరెస్టులు, మిరియపు రసం చిమ్మటాలను ఎక్కువ చేశారు దాదాపు అన్ని కాంపులను ఎత్తివేసి కొత్త వాటిని ఏర్పాటు చేయకుండా ముందస్తుగానే అడ్డుకుంటున్నారు అందువలన ఉద్యమకారులు కూడా కొత్త మార్గాలను ఎంచుకోవాల్సి ఉంది

ఉద్యమకారులు రెండవ దశ ఉద్యమంగా వర్టిస్తున్న ఆందోళనలో భాగంగా నూతన సంవత్సరపు తొలి పార్లమెంట్‌ సమావేశ సందర్భంగా జనవరి 17న అక్క్యుపై కాంగ్రెస్‌ (పార్లమెంట్‌ ముట్టడి) పేరుతో వేలాది మంది వాషింగ్ట్‌న్‌ నగరానికి తరలి రావాలని పిలుపు నిచ్చారు వివిధ కార్యాలయాల ముట్టడి సందర్భంగా పార్లమెంట్‌ ముందు తమడిమాండ్లను ఉంచిన తరువాత కోర్టుల ముట్టడి జరపాలని కూడా నిర్ణయించారు డాక్టర్‌ మార్చిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ జన్మదినం సందర్భంగా జనవరి 16న '“ఆక్యుపై

ద డ్రీమ్‌ * పేరుతో ఉద్యమం (ప్రారంభించాలని (క్రైస్తవ పాదరీలు పిలుపు నిచ్చారు ఆఫ్రికన్‌-అమెరికన్లను ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములను గావించే ప్రయత్నం ఇదని వేరే చెప్పనవసరం లేదు అదే రోజున ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు కార్యాలయాలున్న పది నగరాలలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమకారులు ఆందోళన చేపట్టనున్నారు అక్యుపై (డ్రీమ్‌ ఉద్యమకారులు ఏప్రిల్‌ 4-? తేదీలలో వాషింగ్ట్‌న్‌ డిసిలో భారీ జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో అమెరికాలో కార్మిక వర్గం అనేక చారిత్రాత్మక ఉద్యమాలు నడిపింది ఎన్నో విజయాలు సాధించింది అవి ప్రపంచానికి అనేక పారాలు నేర్చాయి అమెరికాలో కూడా అనేక మార్పులకు నాంది పలికాయి వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం ఎలా ప్రారంభమైంది, ఎలా సాగుతోంది? దీని భవిష్యత్‌ ఏమిటి? పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పటం అంత తేలిక కాదు, ఇప్పటికిప్పుడు సాధ్యమూ కాదు ప్రజలు పాల్గొన్న ప్రతి ఉద్యమం అది సంఘటితమైనా అసంఘటితమైనదైనా అసలేమీ సాధించదా? వాల్‌స్ట్రీట్‌ ముట్టడి అక్కడ తలెత్తిన సామాజికోద్యమ ఆరంభం మాత్రమే

  • రచయిత

చరిత్రలో అనేక ఆసక్తికర అంశాలున్నాయి. భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్‌ దారి తెలియక లేదా దారి తప్పి అమెరికా ఖండంలో అడుగు పెట్టాడు అది ప్రపంచగతిని ఒక పెద్ద మలుపు తిప్పింది ఆ తరువాత ఐరోపా నుంచి వలస వెళ్లిన వారు అక్కడి స్థానిక జాతులను(రెడ్‌ ఇండియన్లను) మారణహోమంతో మట్టుపెట్టారు తమ గనులు, పొలాల్లో చాకిరీ చేసేందుకు ఆఫ్రికా నుంచి బానిసలను తెచ్చిన దుర్మార్గ చరిత్ర కూడా తెలిసిందే అదే బానిస యజమానులు పారిశ్రామికవేత్తలుగా మారిన తరువాత వారికి వ్యతిరేకంగా ఐరోపా నుంచి బతుకు తెరువుకు వలస వెళ్లిన సామాన్య కార్మికులు, వారి వారసులు మహత్తర పోరాటాలు సాగించి నెత్తురు చిందించిన మేడే వ పు మ ల (| క. న్న న క (శ. న. త ల క్‌ న! (. న | _

ఉదంతం కూడా అక్కడే జరిగింది గత చరిత్రలో అమెరికాలో జరిగిన కొన్ని పోరాటాలు ప్రపంచంపై ప్రభావం చూపొయి వాటి నుంచి ఎన్నో అనుభవాలు వచ్చాయి మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అన్నట్లుగా యజమానులు సంక్షోభ సమయంలోనే కాదు సంతోష సమయంలో కూడా కార్మికులు, ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందేందుకు ప్రయత్నిస్తారు అమెరికా, ఐరోపాలో తాజాగా కొనసాగుతున్న సంక్షోభం, మాంద్యం మొదటిదీ, చివరిదీ కాదు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభం నుంచి ఒక విషపషలయంలా సంక్షోభాలు, మాంద్యాలూ తలెత్తుతూనే ఉన్నాయి అవి అనేక ఉద్యమాలు, పర్యవసానాలకు నాంది పలికాయి ఈ సందర్భంగా అలాంటి కొన్ని ఉద్యమాల గురించి క్షుష్తంగా పరిచయం చేయటం అవసరం లోవెల్‌ మిల్లు మహిళా కార్మికుల పోరాటం(1834-36) లోవెల్‌ ఫ్యాక్టరీలలో పనిచేస్తే మంచి వేతనాలు ఇస్తారనే ప్రచారంతో అనేక మంది యువతులు కార్మికులుగా చేరారు అయితే ఆర్ధిక వ్యవస్థలో సంక్షోభం రావటంతో లోవెల్‌ మిల్లు యజమానులు కార్మికుల వేతనాల్లో 15శాతం కోత విధించారు యాజమాన్యం మోసం చేసిందని యువతులు ఆగ్రహించారు 1834 ఫిబ్రవరిలో యాజమాన్యం చేసిన ప్రకటన ప్రకారం మార్చి ఒకటి నుంచి వేతనాల కోత అమలులోకి వచ్చింది దాంతో అనేక సమావేశాల తరువాత మహిళా కార్మికులు యంత్రాలను వదలి బయటికి వచ్చి కోత పెట్టిన వేతనాలను చెల్లిస్తే తప్ప పనికి వచ్చేది లేదని భీష్మించారు అయితే ఆ అందోళన కొద్ది రోజుల్లోనే విఫలమైంది. రెండు సంవత్సరాల తరువాత పరిస్థితులు మరింతగా దిగజూరాయి కార్మికులకు యజమానులు ఇచ్చిన ఇళ్ల అద్దెలను విపరీతంగా పెంచారు దాంతో 1886లో మహిళా కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు ఈసారి చుట్టుపక్కల నివశించే వివిధ తరగతుల వారి మద్దతు కూడగట్టారు తొలిసారిగా మహిళలు వీధుల్లోకి వచ్చి తమ సమస్యలపై గళమెత్తారు ఈ ఆందోళన సమయంలోనే తమ పొదుపు ఖాతాలను యజమానుల ఆధీనంలోని బ్యాంకుల నుంచి ఉపసంహరించి వేరే బ్యాంకులకు మార్చి తమ నిరసన తెలిపారు ( వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమ సందర్భంగా కూడా కార్పొరేట్‌ బ్యాంకుల నుంచి తమ ఖాతాలను ఉపసంహరించి అనేక మంది చిన్న సహకారబ్యాంకులలో తెరవటానికి ఈ ఉద్యమమే స్ఫూర్తి) ఈ సమ్మెతో వచ్చిన అనుభవంతో తరువాత లోవెల్‌ మిల్లు కార్మికులు పదిగంటల పని విధానాన్ని అమలు జరపాలని కోరుతూ ఒక అసోసియేషన్‌ కూడా ఏర్పాటు చేశారు వావ కతత

రైల్వే కార్మికుల సమ్మె(1877

1870వ దశకంలో ఐరోపాలో వచ్చిన ఆర్ధిక సంక్షోభం అమెరికాకు పాకింది దాన్నుంచి బయట పడేందుకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం రైలు మార్దాల నిర్మాణాన్ని ప్రోత్సహించి పెట్టుబడిదారులను ఆదుకొనేందుకు నిర్ణయించింది అనేక రైలు మార్గాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టిన జే కోక్‌ అనే బ్యాంక్‌, కంపెనీ దివాళాతీసింది మొత్తం 864 రైలు కంపెనీలలో 89 దివాళా తీశాయి ఉనికిలో ఉన్న కంపెనీలలో కొన్ని ఏడాదిలో రెందుసార్లు 4రశాతం వేతన కోత విధించాయి నిరుద్యోగం 14శాతానికి చేరటంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెగింది అనేక చోట్ల సమ్మెలకు దిగారు సుప్రీంకోర్టు వాటిని అక్రమం అని ప్రకటించింది సమ్మెను అణచివేయటానికి మిలిటరీ, పారామిలిటరీ, పోలీసు బలగాలను పెద్ద ఎత్తున దించి &5 రోజుల సమ్మెను అణచివేశారు మార్చిస్టు ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌మెన్‌ అసోసియేషన్‌కు అనుబంధంగా ఏర్పడిన వర్కింగ్‌ మెన్‌ పార్టీ అమెరికా చరిత్రలో తొలిసారిగా రైల్వే కార్మిక సమ్మె సందర్భంగా సెయింట్‌ లూయీస్‌ పట్టణంలో సాధారణ సమ్మె నిర్వహించింది ఈ సందర్భంగానే ఎనిమిది గంటల పనిదినం, బాలకార్మికుల నిషేధం వంటి డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి మేడే, చికాగో కార్మికుల వీరోచిత పోరాటం (1884-86)

1884 అక్టోబరులో చికాగోలో సమావేశమైన ట్రేడ్‌, లేబర్‌ యూనియన్ల ప్రతినిధులు 1886 మేఒకటి నుంచి అమెరికాలో ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని తీర్మానించారు యజమానుల మొండి వైఖరి కారణంగా 1886 మే ఒకటవ తేదీన అమెరికా అంతటా కార్మికుల సమ్మెలు జరిగాయి మూడవ తేదీన చికాగో నగర కార్మికులు మెక్‌కోర్మిక్‌ అనే కంపెనీ వద్ద సమావేశం కావాలని నిర్ణయించారు ఆరోజున పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఫ్యాక్టరీ కార్మికులు మరణించారు అయితే ఆరుగురు మరణించినట్లు మరుసటి రోజు కొన్ని పత్రికలు రాశాయి ఎనిమిది గంటల పని డిమాండ్‌ను అణచివేసేందుకే పోలీసులు ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తరువాత జరిగిన విచారణలో కార్మికనేత స్పైస్‌ చెప్పారు పోలీసు కాల్పులకు నిరసనగా స్థానిక కార్యకర్తలు కరపత్రాలు వేసి 'హే' మార్కెట్‌ ప్రాంతంలో నాలుగవ తేదీన ప్రదర్శన, సభకు పిలుపునిచ్చారు రాత్రి 10 30 సమయంలో చివరి వక్త ప్రసంగం ముగింపులో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి న్‌ క్రి

ఉండగా పోలీసులు ్రవేశించి సభను ముగించాలంటూ వివాదానికి దిగారు వెంటనే వేదిక వద్ద ఉన్న నాయకులవైపు దూసుకుపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక బాంబు పేలింది ఒకపోలీసు మరణించాడు వెంటనే పోలీసుల కాల్పులు ప్రారంభించారు ఐదునిమిషాల పాటు సాగాయి తరువాత విచారణలో బాంబు పేలుడు కంటే కాల్పుల కారణంగా పోలీసులు ఎక్కువ మంది గాయపడినట్లు తేలింది చీకట్లో పోలీసులే కంగారులో ఒకరిపై ఒకరు కాల్చుకున్నట్లు తేలింది ఒక పోలీసు అధికారే ఈ విషయం చెప్పినట్లు చికాగో ట్రిబ్యూన్‌ పత్రిక వార్తలు రాసింది ఎనిమిది మంది పోలీసులు, నలుగురు కార్మికులు ఈ ఉదంతంలో మరణించారు ఇంకా అనేక మంది మరణించారుగాని వారి వివరాలు లేకుండా చేశారు పుల్‌మాన్‌ సమ్మె (1894)

1898లో అమెరికాలో మరోసారి మాంద్య పరిస్థితులు తలెత్తాయి. రైలు పెట్టెలను తయారు చేసే పుల్‌మాన్‌ పాలెస్‌ కార్‌ కంపెనీ ఆదాయం పడిపోవటంతో కార్మికుల వేతనాలను తగ్గిస్తామని యజమాని జార్జి పుల్‌మాన్‌ ఏకపక్షంగా ప్రకటించాడు దానికి వ్యతిరేకంగా 1894 జూన్‌ 26న పుల్‌మాన్‌ కంపెనీ బోగీలతో నడిచే రైళ్లను బహిష్కరించాలని రైల్వే యూనియన్‌ ప్రకటించింది అనూహ్యంగా నాలుగురోజుల్లో 29 మార్గాల్లో లక్షా 25వేల మంది కార్మికులు ఈ నమ్మెలో పాల్గొన్నారు అయితే ఆహ్రో-అమెరికన్‌ కార్మికులు, శ్వేతజాతి కార్మికుల మధ్య జాత్యహంకార వివక్ష సమస్య ఉండటంతో యాజమాన్యాలు దీనిని ఉపయోగించుకొని కార్మికులను చీల్చాయి మరోవైపున ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించి సమ్మెను అణచివేసింది జాతి, రంగు విభేదాలతో నిమిత్తం లేకుండా కార్మికుల మధ్య ఐక్యత ఉండాల్సిన అంశాన్ని ఈ సమ్మె గుణపారంగా నేర్చింది 10 ఎం కోటేశ్వరరావు

ర అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు ఎలాంటి ఉద్యమాలకు నాంది పలికాయో స్టూలంగా చూశాము ప్రనతం కొనసాగుతున్న సంక్షోభం అందుకు మినహాయింపు కాదని వాల్‌స్టీట్‌ ఉద్యమం నిరూపించింది 'గణించటానికి వీలులేని రాజకీయ పర్యవసానాలతో కూడిన మరో మహా సంక్షోభం వైపు ద్రవ్యమార్శెట్లు ప్రపంచాన్ని నెడుతున్నాయి పరిస్థితిపై ముఖ్యంగా ఐరోపా అధికారులు తమ అదుపును కోల్పోయారు వారు తిరిగి వెంటనే పట్టు సాధించాలి” 2011 సెప్టెంబరు15, న్యూయార్క్‌ టైమ్స్‌ పుస్తక సమీక్షలో 'డజ్‌ ద యూరో హావ్‌ ఏ ప్యూచర్‌ ?* అనే గ్రంధంపై అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడిదారు జార్జి సోరస్‌ చేసిన వ్యాఖ్య ఇది 'ద్రవ్య సంక్షోభం స్వేచ్భా మార్కెట్‌ వ్యవస్థ వైఫల్యం కాదు ప్రభుత్వ జోక్యం అన్నింటికీ పరిష్కారం కాదు” 2008 నవంబరు 18న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్యు బుష్‌ చేసిన వ్యాఖ్యలివి గతానికి వెళితే “ఆందోళన చెందటానికి ఎలాంటి కారణం లేదు సంపదల ఉధృత ప్రవాహం కొనసాగటం ఖాయం ” 1929 సెప్టెంబరులో అప్పటి ఆర్థిక సంక్షోభంపై నాటి అమెరికా ఆర్ధిక మంత్రి ఆండ్రూ డబ్యు మెల్లన్‌ వెల్లడించిన భరోసా ఇది. అమెరికా మూడవ అధ్యక్షుడిగా పనిచేసిన థామస్‌ జఫర్సన్‌(1748- 1826) ఒక సందర్భంగా ఇలా చెప్పారు “ఎల్లవేళలా దాడులకు సిద్ధంగా ఉండే శాశ్వత సైన్యం కంటే మన స్వేచ్చ, స్వాతం త్ర్యాలకు బ్యాంకింగ్‌ వ్యవస్థలు ఎక్కువ ప్రమాదకరమైనవని నేను నమ్ముతాను వాటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ధిక్కరించి ఇప్పటికే ధన నియంతలుగా ఎదిగాయి. నగదు జారీ అధికారాన్ని వాటినుంచి తీసుకొని నిజంగా స్వంతదారులైన పొరులకే(ప్రభుత్వానికే) అప్పగించాలి ” బ్యాంకులతో వచ్చే ముప్పు గురించి రెండు వందల సంవత్సరాల క్రితమే హెచ్చరించిన తీరు జఫర్సన్‌ పరిశీలనా శక్తిని వెల్లడిస్తోంది వాల్‌స్ట్రీట్‌ ముట్టడి క్షే

న 1 య ౧౫౬5. శో న స న ౧. ం౯౦గగ. వాఖ్యలు లా య. అటయ్బిి 0 టా. అద్దంర్వి రిం భాం వళ (1. లం రం షార్‌ 64. వ యానేగంటోద్మిం ఆంచల్‌ గాం 4... సన్ని ఓట ష్‌. లము గాలిని నో అమెరికాలో సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రభావితమైన కార్మికులు, ఉద్యోగులు అనేక డిమాండ్లను ముందుకు తెచ్చారు ప్రభుత్వం వాల్‌స్టీట్‌ను కాదు మెయిన్‌ ప్ర్టీట్‌ను పట్టించుకోవాలని ప్రదర్శనల సందర్భంగా నినాదాలు చేశారు 'యాడ్‌ బస్టర్స్‌” అనే కెనడా నుంచి ప్రచురితమయ్యే ఒక ప్రచారాందోళన పత్రిక 2011 జూలై నెలలో మెజారిటీ ప్రజానీకాన్ని సంక్షోభంలో ముంచిన వాల్‌స్ట్రీట్‌ పనిబట్టాలి అని రాసిన అంశం అచిర కాలంలోనే వాస్తవ రూపం ధరించటం మొత్తం పశ్చిమ దేశాల్లోనే ఒక ముఖ్య చారిత్రక ఘట్టం అని వర్ణించవచ్చు నడి సముద్రంలో చిక్కుకు పోయిన వారికి వేగుచుక్క ఆశ కలిగించినట్లుగా ఆర్థిక సంక్షోభం, ద్రవ్య సంస్థల తప్పుడు విధానాల కారణంగా ప్రభావితులై ఏం చేయాలో దిక్కుతోచని వారికి ఇదేదో బాగుందనిపించటం, ఎవరికి వారు తోటివారితో సం్రదించుకొని 2011 సెప్టెంబరు 17న కొన్ని వందల మందే అయినప్పటికీ న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌ సమీపంలో ఉన్న జుకొట్టి పార్ము(దానికే లిబర్టీ ప్లాజా(స్వేచ్చా మైదానం) అని పేరు పెట్టారు)కు చేరుకొని ముట్టడి పేరుతో వేసిన గుడారాలు, చేసిన ఎస ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తుందని అమెరికన్‌ పాలకవర్గం కలలో కూడా ఊహించి ఉండదు 2... ఎం కోటేశ్వరావు

“మేము 99శాతంగా ఉన్న సకల జనులం, రాజకీయ అనుబంధాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా సమాజంలో ఒకశాతంగా ఉంది ఆర్ధిక పరాన్న భుక్కులుగా ఉన్నవారిని వ్యతిరేకించటం లేదా ముట్టడించటంపై మేమంతా ఐక్యంగా ఉన్నాం పొలకులు చెబుతున్న విధానాలు ధనికులకు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వం బ్యాంకులను ఆదుకుంటున్నది మన రాజకీయ వ్యవస్థను ధనం ప్రభావితం చేస్తున్నది” అని ఆందోళనకారులు సూటిగా చెప్పారు ఎలాంటి కల్మషం లేని, నిజాయితీతో కూడిన ఈ మాటలతో విభేదించే వారెవరు ఉంటారు ముట్టడి అన్న నినాదం పలువురిని అకర్షించింది అంతకు ముందే మధ్యప్రాచ్యంలోని అరబ్బు దేశాలలో సాగిన ప్రదర్శనలు, వాటి తీరుతెన్నులు అమెరికన్లను నిస్సందేహంగా ఉత్తేజ పరిచాయి జుకొట్టి పార్కుకు లిబర్టీ ప్లాజా అని పేరు పెట్టారంటే అదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు ఈజిప్టు నియంత హోస్ని ముబారక్‌ గద్దె దిగాలని కోరుతూ ముట్టడించిన తహ్రిర్‌ (విముక్తి మైదానం) కు ప్రతి ధ్వని నిజానికి ముట్టడి లేదా ఆక్రమణ అన్న పదం ప్రజాస్వామిక డిక్షనరీ లోనిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పరాన్న భుక్కులైన కుబేరులు, డబ్బు జలగలు వాల్‌స్టీట్‌ను ఆక్రమించాయి కనుక వాటికి ఉద్దీపనల పేరుతో ఎలాంటి ప్రభుత్వ సాయం చేయనవసరం లేదనటం జనస్వామ్యబద్దమని నిరసనకారులతో పాటు యావత్‌ పీడిత ప్రపంచం ముట్టడిని ఆమోదించింది అయితే అనూహ్యమైన ఈ పరిణామాన్ని అనేక మంది పరిశీలకులు ముఖ్యంగా బడా కార్పొరేట్‌ మీడియాకు చెందిన జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు తొలి రోజుల్లో విస్మరించారు లేదా తిట్టిపోశారు పార్కులో నిరసన తెలుపుతున్నవారు అరాచకవాదులని, పని చేయటానికి ఇచ్చగించని పోరంబోకులని వర్ణించారు నిరసనకారులు ఆగ్రహంతో చేసిన నినాదాలు, చప్పట్లు, మాటలు వారికి సహజంగానే కర్టకరోరంగా అనిపించాయి. అలాంటి వారిని పోలీసులు అరెస్టు చేయక ఏం చేస్తారు లెమ్మని పోలీసుల దౌర్జన్యాలను చూడలేకపోయారు యాదృచ్చిక ఉద్యమాలకు ప్రేరణనిచ్చే ఉదంతాలు కొన్ని సందర్భాలలో చాలా చిన్నవిగానే ఉన్నప్పటికీ అంతకు ముందు గూడుకట్టుకున్న అసంతృప్తితో వాటికి పెద్ద ప్రాధాన్యత వస్తుంది అరబ్‌ విఫ్లవంగా వర్ణిస్తున్న పరిణామాలకు ట్యునీసియా నాంది పలికింది సిడీ బౌజిడ్‌ అనే పట్టణంలో విశ్వవిద్యాలయ డిగ్రీ కలిగి ఉండి ఉద్యోగం దొరక్క పండ్లు అమ్ముకొంటున్న మహమ్మద్‌ బొజిజి అనే యువకుడి ఆత్మాహుతి టునీసియన్లలో ఆగ్రహ జ్వాలలను రగిలించింది అక్కడి ఉద్యమానికి ఈ ఘటనే నాంది ఆ యువకుడు అనుమతి లేకుండా రోడ్డుపై పంద్లమ్ముతున్నాడని పోలీసులు అడ్డుపడ్డారు దాంతో నిరాశతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు అతని మరణంతో దేశమంతటా (ప్రదర్శనలు జరిగాయి వాటిని నిరంకుశంగా అణచివేసేందుకు వాల్‌స్టీేట్‌ముట్టడి. ౨౨. కలి

ప్రయత్నించారు అదే సమయంలో దేశాధ్యక్షుడు బెన్‌ అలీ అవినీతి అక్రమాల గురించి వికీలీక్స్‌ వెల్లడించిన సమాచారం ఆజ్యం పోసింది తరువాత ఏం జరిగిందో, బెన్‌ అలీ దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి గురించి తెలిసిందే అయితే అమెరికాలో తలెత్తిన వాల్‌ప్రీట్‌ ముట్టడి ఉద్యమానికి (పైరణ ఏమిటన్నది ప్రశ్న 2007 చివరిలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం (ప్రారంభమైన తరువాత కార్పారేట్‌లు తప్ప మిగిలిన మొత్తం అమెరికన్‌ సమాజం దానికి ప్రభావితమైంది లక్షలాది మంది దివాళాతీసి 70 లక్షలకు పైగా ఇళ్లూ, ఉద్యోగాలు పోగొట్టుకోవటం, ప్రభుత్వం తమను దివాళా తీయించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలనే ఉద్దీపనల పేరుతో ఆదుకోవటం, అంతకు ముందే పరిశ్రమల యజమానులు అంతర్జాతీయ పోటీలో అమెరికా ముందుండాలనే పేరుతో వేతనాలకోత వంటి చర్యలకు పాల్పడటంతో గూడు కట్టుకున్న అసంతృప్తికి అరబ్బు, ఐరోపా ధనిక దేశాలలో జనం వీధుల్లోకి రావటం ఉద్యమానికి ప్రేరణగా పనిచేసిందని చెప్పవచ్చు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమ కారణాల గురించి అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ప్రపంచవ్యాపితంగా ఉన్న బ్యాంకింగ్‌ సంస్థ సిటీగ్రూప్‌ ఇంటర్నేషనల్‌లో మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ కార్యాలయ మాజీ డైరెక్టర్‌ పీటర్‌ ఒర్‌జాగ్‌ తనదైన భాష్యం చెప్పారు దానిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి '“అర్ధశతాబ్దం క్రితం అమెరికాలోని అర్థశాస్త్ర విద్యార్థులు కేంబ్రిడ్జ్‌ ఆర్థికవేత్త నికోలస్‌ కలడదోర్స్‌ రూపొందించిన అంశాలతో కూడిన “కలడోర్స్‌ పాఠాలు చదువుకున్నారు వాటిలో మొదటి అంశమేమంటే జాతీయ ఆదాయంలో కార్మికులు, పెట్టుబడిదారులు పొందే వాటాలు స్థిరంగా ఉంటాయని చెప్పారు ఇప్పుడు ఆ పారం అసంగతంగా మారింది ఇటీవల కాలంలో ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచీ అమెరికాతో సవో ప్రపంచంలోని అనేక దేశాలలో కార్మికుల వాటా దిగజారటం తప్ప ఎక్కడా కలడోర్స్‌ పారాలకు అనుగుణంగా లేదు ' అమెరికా గజాంక శాఖ సమాచారం ప్రకారం ప్రయివేటు రంగంలో 1990 దశకంలో , వాణిజ్యం ద్వాగా వచ్చిన ఆదాయంలో కార్మికుల వాటాగా వేతనాలు, ఇతర ్రతిఫలాల మొత్తం ఈ8ళాతంగా ఉంది. ఈ మొత్తం 2005 నాటికి 61 2011 మధ్య కాలానికి 58కాళానికి సదిసోయింది. దీన్ని సులభ పదజాలంలో చెప్పాలంటే 1990-2011 మధ్య తగ్గిన ఐదు శాతం పాయింట్ల విలువ ఏదాదికి 500 బిలియన్‌ దాలర్లు. అంటే కార్మిక్తుబ వాటా పడిపోకుందా ఉండి ఉంటే ఈ వీదాది 6500 బిలియన్‌ డాలర్లు వారికి అదనంగా వచ్చి ఉందేవి ఇది ఒక్క అమెరికాలో జరిగిన పరిణామమే అనుకుంటే , పొరపాటు 1995-2011 మధ్య జపాన్‌, ఆ్టేలియాల్లో అరు శాతం, జర్మన్మీఫ్రాన్స్‌లో నాలుగ్గుశాతం చొప్పున కార్మికుల వాటా పడిపోయింది తరతమ తేడాలతో పెట్టుబడిదారీ వ్యవస్థలున్న దేశాలన్నింటా ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి కనిపించింది కశ్త ఎం కోటేశ్వరరావు

న మ 1. క ఎందుకని? కొంతమంది ఏం చెప్పారంటే అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలున్న దేశాలలో కొన్ని సేవల్లో, ఆధునిక ఉత్పాదక పద్ధతుల కారణంగా కార్మికుల వాటా తగ్గుతోందన్నారు ఇది సంపూర్ణ వివరణ కాదు 1980-2005 మధ్య ప్రపంచం మరింత ఏకీకృతమైంది ప్రపంచ ప్రాతిపదికన కార్మిక సరఫరా 100 నుంచి 800 శాతానికి పెరిగింది దీంతో పెరిగిన పోటీ పారిశ్రామిక దేశాలలో కార్మికుల వాటా తగ్గటానికి దారితీసింది సాంకేతిక మార్పుల ప్రభావం ఎంతో నిగూఢమైంది యాంత్రీకరణ కార్మికుల డిమాండ్‌ను తగ్గించినపుడు ప్రారంభంలో వారి వాటా పడిపోతుంది కానీ నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకున్నపుడు తరచుగా ఈ ప్రభావం తిరోగమనంలో ఉంటుంది అమెరికా, బ్రిటన్‌, ఆస్టేలియా, కెనడాలలో కార్మికుల ఆడాయవాటా తగ్గిపోవటానికి గల కారణాలను వివరించేందుకు 2007లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు ఫ్లోరెన్స్‌ జామొటె, ఇరినా టైటెల్‌ సమర్పించిన ఒక వత్రంలో వివిధ కారణాలను పేర్కొన్నారు కార్మికుల వాటా తగ్గటానికి కార్మిక ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులు రెండూ సమాన పాత్ర వహించాయని వారు పేర్కొన్నారు జపొన్‌,ఐరోపా దేశాలలో కార్మిక ప్రపంచీకరణ కంటే సాంకేతిక మార్పులు గణనీయమైన (ప్రభావం చూపాయి అయిజే యూనియన్లు, ప్రయివేటీకరణ ధోరణులు కూడా ప్రభావం చూపినట్లు కనిపించినప్పటికీ కార్మిక ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులే ప్రముఖంగా ఉన్నాయని వారు చెప్పారు వచ్చే దశాబ్దిలో వివిధ కారణాలతో (ప్రపంచ వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 15

కార్మిక సమూహం మరింతగా వేగంగా విస్తరించనుంది ఉదాహరణకు చైనాలో ఎక్కువ మంది కార్మికులు ఆధునిక విద్యను పొందిన కారణంగా కోస్తా ప్రాంతాలకు వారు వలసపోతారు అమెరికా ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటే కార్మికుల వాటాలో ఎగుడుదిగుళ్లు వుండవచ్చు. అమెరికన్లు తమంతట తాముగా ప్రపంచం నుంచి తెగతెంపులు చేసుకోకపోతే కార్మికుల వాటా తగ్గుతున్న ధోరణి కొనసాగుతుంది ఈ వాస్తవాన్ని అధిగమించాలంటే మరింత మంచి విద్య, కార్మికులకు మంచి శిక్షణ, పరిశోధన మరియు అభివృద్ధి, మౌలిక సౌకర్యాలకు మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అయితే ఇందుకు సమయం పదుతుంది అది జరిగిన తరువాత కూడా తగ్గుదల శేటు తగ్గవచ్చేమోగాని మౌలిక మార్పులు జరగవు వాల్‌ష్టీట్‌ నిరసనకారులు నిర్ధిష్ట ప్రతిపాదనలు చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది మనం ఏటా ఐదువందల బిలియన్‌ డాలర్ల వేతనాలను కోల్పోతున్నాం ఎవరూ ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకొనేందుకు అవసరమైన సూచనలు చేయటం లేదు ” ఇదీ పీటర్‌ ఒర్‌జాగ్‌ వాదన, ఆయన అభ్యుదయవాదా అంటే కాదు సాంప్రదాయ పెట్టుబడిదారీ అర్థిక విధాన సిద్దాంతాలు విఫలం చెందుతున్నాయని బాధపడే ఆ వర్గ ప్రతినిధిగా చెప్పవచ్చు అమెరికాలో అసమానతల కారణంగా ఎక్కువ నష్టపోతున్నది శ్వేత జాలేతరులే అన్నది స్పష్టమే ప్రారంభంలో ఈ ఉద్యమంలో వారు పెద్దగా పాల్గొన లేదు వారు లేకపోతే ఉద్యమం వెనుక పట్టు పడుతుందా అని ఆవేదన పడినవారు కూడా లేకపోలేదు కార్పొరేట్‌ మీడియా ఈ సమస్యను లేవనెత్తి అంకెల గందరగోళంతో ఉద్యమానికి ఆ(ఫ్రో-అమెరికన్లు, లాటినోస్‌, ఆసియన్లను దూరంగా ఉంచేందుకు నానా గడ్డి కరిచింది రెచ్చగొట్టేందుకు, అనుమానాలను కలిగించేందుకు (ప్రయత్నించింది సాధారణంగా ఉద్యమాలకు దూరంగా ఉండే తెల్లవారు వారి ఏకైక ప్రతినిధిగా చెప్పుకొనే రిపబ్లికన్‌ పార్టీ సంపూర్ణ మద్దతు పొందే కార్పొరేట్‌ శక్తులపై ధ్వజమెత్తుతూ జండాలు పట్టుకొని ముందుకు రావటం, అందునా మధ్యతరగతి అమెరికాలో విశేషమే అక్కడ జాతుల మధ్య ఉన్న తీవ్ర వివక్ష పూర్వరంగంలో తెల్లవారితో కలిసి ఉద్యమించేందుకు ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచించే మాట నిజమే అయినప్పటికీ వారు ఉద్యమానికి దూరంగా లేరు గణనీయంగానే పాల్గొంటున్నారని అనేక స్థానిక వార్తలు తెలుపుతున్నాయి ఆఫ్రో-అమెరికన్లు ప్రధానంగా డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు రానున్న ఎన్నికలలో తిరిగి ఒబామాను గెలిపించేందుకు వారు సిద్దం అవుతున్నారు ఇటువంటి స్థితిలో ముట్టడి ఉద్యమంలో పాల్గొంటే అది ఒబామా అవకాశాలను దెబ్బతీస్తుందని కూడా వారు భావిస్తున్నారని చెప్పేవారు లేకపోలేదు శేధ ఎం కోటేశ్వరరావు

3

సంక్షోభానికి గురైనపుడల్లా దాని నుంచి బయట పడటానికి పెట్టుబడిదారీ విధానం అనేక ఆయుధాలను రూపొందించుకుంది వాటిలో ప్రపంచీకరణ, ఉదార, సరళీకరణ విధానాలు ఇప్పుడు ప్రయోగంలో ఉన్నాయి వాటి వలన ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్‌ కంపెనీలు, సమాజంలోని కొందరు దనికులు మరింత లాభపడగా పేదలు మరింత పేదలయ్యారు అంతరాలను విపరీతంగా పెంచాయి. అందుకు పేద దేశాలే కాదు, ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమైన అమెరికాలో కూడా అదే జరిగింది ఆర్థిక మాంద్యాలు ఎన్నివచ్చినా, సంక్షోభాలెన్ని ఎదురైనా ధనికులు, కార్పారేట్‌ కంపెనీ ఒక్కటంటే ఒక్కటి కూడా దివాళా తీయలేదు ఎక్కడైనా దెబ్బతిన్నా వాటిలో తీవ్రంగా నష్టపోయింది సామాన్యమదుపుదార్లు తప్ప ధనికులు కాదు "ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు నంటిది) వెల్లడించిన సమాచాళం (ప్రకారం 2007 నుంచి అమెరికన్లు కోల్పోయిన సంపద విలువ 85లక్షల కోట్ల డాలర్లు రియలెస్టేట్‌ రంగంలో థరలు పడిపోయిన కారణంగా ఈ₹లక్షల కోట్ల దొట్లర్లు కోల్పోయారు ఉడాహరణకు ఆరిజోనా రాష్ట్రంలో సగం మంది గృహా యజమానులు నివసిస్తున్న గృహాల విలువ వారు కొనుగోలు చేసినదానికంటే నగానికిపైగా పడిపోయింది. పెన్షన్‌ సొమ్మును స్టాక్‌మార్కెట్‌లో పెట్టిన వారు అక్కడి పరిణామాలను చూసి వణికిపోతున్నారు. ఇమెరికాలోని ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఇద్ధరు సామాజిక ఖోద్రతా పధక్తాలపైనే ఆధార పదుతున్నారు. అరవై అయిదు సంవత్సరాల పైబడిన వారి వార్షిక సగటు ఆదాయం 18,500 డాలర్లు అల్లితే దానిలో సగం ఇఖృద్రతా పథకాల ధ్వారా వచ్చిందే

అమెరికాలో 1960 నుంచి సామాన్య జన జీవన ప్రమాణాలు చాలా వేగంగా పడిపోయాయి. గత ఐదు దశాబ్దాలుగా అమెరికా సర్మారు జన జీవన ప్రమాణాలలో వాల్‌స్టీట్‌ముట్టడి. 2

వచ్చిన మార్పులను అధికారికంగా నమోదు చేసింది తాజాగా వచ్చిన ఆర్థిక సంక్షోభం ఒక ఏడాదిలోనే ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది అయినప్పటికీ అమెరికన్‌ పౌరుల సగటు వార్షికాదాయం అంతకు ముందున్నదాని కంటే 1,315 డాలర్లు తగ్గిపోయింది దీని అర్ధం సినిమాలు, షికార్లు, వారాంతంలో హోటళ్లలో విందులు, సెలవులో విహారయాత్రలు, ఇళ్ళలో ప్రతి ఏటా చేసే కార్పెట్ల మార్పిళ్లు బంద్‌ అయినట్లే తాజా ఆర్థిక మాంద్యం(2008) ప్రారంభమైన తరువాత 2011 జూన్‌ నాటికి పౌరుల నిజ ఆదాయం 9 8శాతం పడిపోయినట్లు అనాపోలిస్‌ పట్టణ కేంద్రంగా ఉన్న సెంటియ్‌ వరిశోధనా కేంద్రం దేశ జనాభా గణాంకాలను విశ్లేషించి తెలిపింది ఇళ్ల, ఉద్యోగవిరమణకోసం దాచుకున్న మొత్తాల విలువలు కూడా పడిపోయాయి. ద్రవ్యోల్బణం కారణంగా వినియోగవస్తువుల ధరల పెరుగుదల వలన 2008 జూన్‌ నుంచి పొరుల కొనుగోలు శక్తి 3 25శాతం వంతున పడిపోతోంది క్రియాశీలక ఆర్ధిక వ్యవస్థలో అమెరికన్ల ఆదాయాలు పెరుగుతాయని ఎవరైనా అనుకుంటారు, కానీ అవి దిగువస్థాయికి పడిపోయాయని న్యూయార్క్‌లోని ఫ్యాక్ట్‌ అండ్‌ ఓపీనియన్‌ ఎకనమిక్స్‌ అర్థికవేత్త బాబ్‌ (బ్రుస్మ్కా వ్యాఖ్యానించారు అయితే సంక్షోభం అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేసిందా అంటే లేదు తక్కువ నైపుణ్యం, ఉన్నత విద్యలేని అమెరికన్లనే ఎక్కువగా దెబ్బతీసిందని మూడీస్‌ ఎకానమీ డాట్‌ కామ్‌ ప్రధాన ఆర్థికవేత్త మార్క్‌ జండీ వ్యాఖ్యానించాడు కంపెనీలు తమ పరిశ్రమల ఉత్పత్తిని విదేశాలలో జరపటం లేదా మానవశక్తిని తొలగించే ఆధునిక యంత్రాల ప్రవేశం వంటివి ఆదాయాన్ని బాగా దెబ్బతీశాయి. 1930దశకం తరువాత చదువు సంధ్యలు తక్కువగా ఉన్న కుటుంబాలకు ఇంతటి కష్ట కాలం ఎప్పుడూ రాలేదని జండీ పేర్కొన్నాడు 2008 వసంత రుతు సమయంలో తలసరి ఆదాయం 88,794 డాలర్లు ఉంది 2011 జూన్‌ నాటికి నాలుగుశాతం తగ్గి 32,479 దాలర్లకు పడిపోయింది తలసరి ఆదాయం (క్రమంగా పెరుగుతూ ఉన్నట్లయితే వాస్తవానికి ఈ మొత్తం 84,000 డాలర్లకు పెరిగేది ఇరాన్‌లో అయాతుల్లా భౌమైనీ అధికారానికి వచ్చిన తరువాత చమురు ధరలు పెరిగి అమెరికా చిన్న పాటి ఆర్థిక మాంద్యానికి గురై 1983నాటికి కోలుకుంది నాటితో పోల్చుకుంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇప్పుడు గరిష్టంగా ఉంది మారిస్టు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ ఓపీనియన్‌ అనే సంస్థ 2011 సెప్టెంబరులో ఒక సర్వే చేసింది తాము కనీసం ఒకసారైనా కుటుంబఖర్చులకు సొమ్ము ఇవ్వలేని వరిన్ధితిని ఎదుర్కొన్నట్లు 64శాతం మంది చెవ్చటం ఆదాయాలు పడిపోతున్నదానికి నిదర్శనంగా ఆ సర్వే పేర్కొన్నది తట్టలోని సంసారాలు బుట్టలోకి వచ్చిన వారెందరో కద ఎం కోటిశ్వరరావ

ఆర్ధిక ఇబ్బందులనుంచి అమెరికాను బయట పడవేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలు తమ వంతు కృషి చేయటం లేదని “వాల్‌స్ట్రీట్‌ జర్నలొ పత్రిక 2011 ఏప్రిల్‌ 19న రాసింది గత దశాబ్ది కాలంలో అమెరికాలో 29లక్షల మంది కార్మికులను తగ్గించిన కార్పొరేట్‌ కంపెనీలు ఇదే నమయుంలో విదేశాల్లో 24లక్షల మందిని నియమించుకున్నాయని తెలిపింది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్శొనే క్రమంలో గతేడాది కాలంలో 57శాతం కంపెనీలు పొరుగుసేవలను ఎక్కువ చేశాయి. తొమ్మిది శాతం కంపెనీలు ఉద్యోగులను తొలగించి పొరుగుసేవల ఏర్పాట్లు చేసుకోగా మరో 34శాతం కంపెనీలు సర్దుబాటు, పునర్వస్టీకరణ తదితర పేర్లతో సిబ్బందిని తగ్గించి పొరుగుసేవల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉదాహరణకు సిస్కో సిస్టమ్స్‌ కంపెనీ దశాబ్దక్రితం విదేశాల్లో కేవలం 26 శాతం మాత్రమే ఉద్యోగులను కలిగి ఉండగా ఇప్పుడు 46శాతానికి పెరిగారు ఇలాంటి కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలను విదేశాలకు తరలించటమేగాక విదేశాల నుంచి తెచ్చుకున్న లాభాలపై పన్ను తగ్గించి రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి అయితే 2004లో అలాంటి పన్నురాయితీలు పొందిన తరువాత కంపెనీలన్నీ విదేశాలలో తమ కార్యకలాపాలను ఎక్కువ చేశాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వాపోయింది ప్రపంచ స్టాయి శక్తి సామర్భ్ధాల కోసం పొరుగుసేవలను ఎంచుకున్నట్లు కేవలం 12శాతం కంపెనీలే తమ సర్వేలో పేర్కొన్నాయని, దాన్ని బట్టి అత్యధిక కంపెనీలు లాభాలకోసమే పొరుగుసేవలకు మళ్లినట్లు కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది మూడు సంవత్సరాల క్రితం 2008లో శాంతాక్రజ్‌ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం. ఒక సర్వే చేసింది ఒకసారి ఉద్యోగం పోయిందంటే అదిశాశ్వతంగా పోయినట్లే అని దానిలో తేలింది ముఖ్యంగా వస్తుతయారీ పరిశ్రమలను అది పరిశీలించింది. వస్త్ర తోలు, చెప్పుల పరిశ్రమల్లో 20 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు రద్దు కావటమే శప్ప కొత్తగా వచ్చింది లేదు. ఉద్యోగాలు పోయిన వారిలో మూఢోవంళు మందికి మూడు సంవత్సరాల వరకు మరో ఉద్యోగం దొరకలేదు ఉద్యోగాలు దొరికినవారికి తగినంత అనుభవం ఉన్నప్పటికీ అంతకు ముందు. పొందిన వేతనాల్లో సగటున15శాతం కోతకు అంగీకరిస్తేనే ఉపాధి దొరికింది ఇది కేవలం. దిగువ తరగతులుగా ఉన్న కార్మికులకే పరిమితం కాలేదు. మధ్యతరగతిగా ఉన్నవారి పరిస్థితి కూగా పొరుగుసేవలతో దిగజారింది.

అమెరికాలో ఉద్యోగంలేని వ్యక్తులు ఇళ్లు కొనుగోలు చేయలేరు, డబ్బు ఖర్చు చేయలేరు కొనుగోలుదార్లు లేకపోతే వాటిని తయారు చేసేవారు కూడా ఉత్పత్తి చేయరు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 9

పొరుగుసేవలను పొందిన కంపెనీల ద్వారా స్థానిక, రాష్ట్ర ఫెడరల్‌ ప్రభుత్వానికి రావాల్సిన పలురకాల పన్ను ఆదాయం, సామాజిక సంక్షేమ పధకాలు, వైద్యబీమా పధకానికి కార్మికులు చెల్లించే వాటా కూడా తగ్గిపోతోంది

నిజానికి పొరుగు సేవలను పొందటం చరిత్రలో కొత్త కాదు ఉదాహరణకు బ్రిటన్‌ 19వ శతాబ్ది ప్రారంభంలో అమెరికా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ముడి పత్తి దిగుమతి చేసుకొని వస్త్రాలను తయారు చేసి ఎక్కువ ధరలకు తిరిగి ఆ దేశాలకే ఎగుమతి చేసి రెండు విధాలా లబ్ది పొందేది అయితే లాభాలను రుచి చూసిన మిల్లు యజమానులు పత్తిని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవటం భారత్‌ వంటి దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేయటం ఎందుకు అసలు భారత్‌లోనే పత్తి సాగును ప్రోత్సహించి, అక్కడే మిల్లులు పెడితే లాభాలు ఇంకా ఎక్కువ వస్తాయని భావించి అదే పని చేశారు రవాణా, వేతన ఖర్చులు గణనీయంగా తగ్గించుకున్నారు అయితే వచ్చిన లాభాల్లో కేవలం 15శాతమే (బ్రిటన్‌కు తరలించిన కారణంగా కొన్ని సంవత్సరాలకు బ్రిటన్‌లో నిరుద్యోగం ప్రబలి సామాజిక అశాంతికి దారితీసింది ఇప్పుడు అమెరికా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది కంపెనీలు పొరుగుసేవలను పొందుతున్న కారణంగా నిపుణులైన కార్మికులు అక్కడ తగ్గిపోతున్నారు ఉత్పాదకరంగం మాదిరి సేవారంగంలోని ఉద్యోగాలకు వేతనాలు ఎక్కువ ఉండవు అమెరికాలోని ఉత్పాదక పరిశ్రమలను మూసివేసి విదేశాలకు తరలించటం లేదా కొత్త పరిశ్రమలను విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే దీనివలన అక్కడ ఆర్థికవ్యవస్థ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి సేవారంగానికి భారీ పెట్టుబడులు, శిక్షణ పెద్దగా అవసరం లేదు

పారుగు సేవలను పొందుతున్న పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొనేందుకు కొన్ని వాదనలు ముందుకు తెచ్చాయి తాత్కాలికంగా అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గినా స్వేచ్చా వాణిజ్య విధానాల వలన తక్కువ వేతనాలున్న దేశాలలో వినియోగం పెరిగి దీర్ధక్రాలంలో అమెరికా కార్మికులకు మంచి జరుగుతుందని అరచేతిలో స్వర్ణం చూపారు ఏడాదికి రెండులక్షల అమెరికన్‌ ఉద్యోగాలు పొరుగుసేవల కారణంగా విదేశాలకు తరలిపోతాయని 20156 నాటికి అలాంటి ఉద్యోగాల మొత్తం 38లక్షలు ఉంటాయని అంచనా వేశారు అయితే మూడు సంవత్సరాల ముందే ఆ సంఖ్యకు చేరినట్లు వాల్‌ష్టీట్‌ కథనం తెలిపింది అంటే పొరుగుసేవలు పొందే వేగం అంచనాకంటే ఎక్కువగా ఉందన్నది స్పష్టం అయితే 2000 సంవత్సరానికి ముందు నాలుగు దశాబ్దాలలో మొత్తం 70 లక్షల ఉద్యోగాలు అమెరికా నుంచి బయటకు వెళ్లినప్పటికీ 2 లా ఎ ఎం కోటేశ్వరరావు

న న న. ఇవ మ మ మ ప డ్డ అ. ము న నలా జే రే శీ నే కా పళళు 1 / . సుపష యయ లం మ ల న ల. ల్లగ న ఆలీ డ్త మ ॥ ప భూ లీ త్‌ అంతే సంఖ్యలో స్థానికంగా ఉద్యోగాలను కల్పించారు కనుక జనం కడుపులో చల్ల కదలకుండా ఉన్నారు గత దశాబ్దం నుంచి తరలి పోతున్న ఉద్యోగాలు ఎక్కువై ఇస్తున్న ఉద్యోగాలు తగ్గి పోయాయి వేగంగా పెరుగుతున్న వ్యత్యాసం

1979 తరువాత పేదల ఆదాయాల కంటే ధనికుల మొత్తం 15 రెట్లు పెరిగిందని 2011 అక్టోబరులో (ప్రభుత్వ సమాచారం వెల్లడించింది అధ్యక్ష ఎన్నికల(2012)కు ఒక ఏడాది ముందు బయటకు వచ్చిన ఈ అంశాలు సహజంగానే ఆసక్తిని రేకెత్తించాయి. ధనికులు ఇప్పటికే అధిక పన్నులు చెల్లిస్తున్నందున వారిపై భారం తగ్గించాలని రిపబ్లికన్‌ పార్టీ గట్టిగా డిమాండ్‌ చేసిన తరుణంలో ఆదాయంలో అంతరాల వివరాలను (ప్రభుత్వం వెల్లడించింది ఒబామా సర్కార్‌ తనపై వత్తిడిని తగ్గించుకొనేందుకే ఈ పని చేసిందని చెప్పవచ్చు. సమాజంలోని ఎగువ 20 శాతం మంది మొత్తం సంపదల్లో 80శాతం కలిగి ఉన్నారన్నది వాటి సారాంశం వాల్‌ఫ్టీట్‌ ముట్టడి ఖై

'డ్రన్గిక్సుళుగ్తా, ఉన్న జక, గ్లాతం మర్గిది 19292907 మధ్య, జాతీయాదాయంలో తమ అదాయన్ని ఎనిమిద్‌, సారి “1 /ఇతవికి షెంత్తుకున్నారని. పార్షమెంట్‌ ఐడ్జెటీ రాటం వ్రడుదలతెపన నివేదక్ల పేర్సొన్నది: మీనపాయింపులు, 'పస్నుల తరువాత్‌ తత్త స పరుగుదీల శత్తం ఇంకా ఎక్కున ఉంటుందని,ఈ కాలంలో ప్రభుత్వ విధాసిం చు న ర య క్‌ ఈ నివేదిక విడుదలైన సమయానికి న్యూయార్క్‌ టైమ్స్‌, సిబిఎస్‌ న్యూస్‌ నిర్వహించిన సర్వేలో తమ ఆర్థిక వ్యవస్థ గిడసబారి పోవటమో, లేదా మరింతదిగజారటమో జరగనుందని అమెరికన్లు భయాందోళన వ్యక్తం చేసినట్లు వెల్లదైైంది మూడింట రెండువంతుల మంది దేశ సంపదలు మరింత సమంగా పంవిణీ జరగాలని అభిప్రాయపడ్డారు ఒబామా తానెంత పేదల పక్షపాతినని చెప్పుకున్నా మూడు సంవత్సరాల ఆయన ఆచరణను చూసి కేవలం 17శాతం మందే పేదలకు అనుకూలంగా ఉన్నారని చెప్పటం గమనించాల్సిన అంశం అదే రిపబ్లికన్‌ పార్టీ గురించి కేవలం రెండుశాతమే పేదలకు అనుకూలమని చెప్పారు ఈ సమాచారం వాల్‌స్ట్రీట్‌ ముట్టడి నిరసనకారులకు మరింత ఊపునిచ్చిందని వేరే చెప్పనవసరం లేదు అమెరికాలో సంపదల వ్యత్యాసం కేవలం పేద, ధనికుల మధ్యనే కాదు, యువతరం-వృద్ధుల మధ్య కూడా ఎక్కున అవుతున్నట్లు వెల్లడైంది. ఆర్థిక సంక్షోభంతో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక ఉన్న ఇళ్లూ పోతున్నాయి. విద్య కొనుగోలుకు చేసిన రుణాల భారం తడిసి మోపెడవుతోంది అరవై అయిదు సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధుడి పెత్తనంలోని కుటుంబ స్థిరాస్తి ఒక 85 సంవత్సరాల లోప యువకుడి కుటుంబ ఆస్తి కంటే 47 రెట్లు ఎక్కువగా ఉందని 2011 జనాభా లెక్కల విశ్లేషణ వెల్లడించింది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే పాతికేళ్ల క్రితం పదిరెట్లు ఎక్కువగా ఉంది యువతరం ఆదాయాన్ని ఆర్థిక సంక్షోభం దారుణంగా దెబ్బతీసిందని ప్యూ పరిశోధనా కేంద్రం పేర్కొన్నది కళాశాల లేదా ఆపై చదువులకోసం అప్పుచేసిన వారు ఉద్యోగ మార్కెట్‌ కోలుకోవటం కోసం ఎదురు చూస్తుండగా ఇతరులు ఇళ్ల రుణవాయిదాలు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్నరేటు కంటే ఇళ్ల ధరలు ఇప్పుడు తగ్గిపోయాయని విశ్లేషణ తెలిపింది పార్లమెంట్‌ (ప్రత్యేక కమిటీ రానున్న పది సంవత్సరాలలో లక్షా 20వేల కోట్ల మేరకు బడ్జెట్‌ కోతలకు ప్రతిపాదించటానికి ముందు ఈ నివేదిక వెలువడింది 2 నూ ఏం కోటేశ్వరరావు

పొరుగు సేవలకు తరలింది కేవలం ప్రయివేటు సంస్థలే కాదు పొదుపు పేరుతో ప్రభుత్వ శాఖలు కూడా అదే పని చేశాయి 1990 దశకంలో పర్సనల్‌ కంప్యూటర్ల విడిభాగాలను పొరుగుసేవల ద్వారా పొందిన అమెరికన్‌ కంపెనీలు కంప్యూటర్ల ధరలను 10 నుంచి 30శాతం వరకు తగ్గించాయి ఈ లావాదేవీల్లో అమెరికన్‌ మదుపుదార్లు, కంపెనీల వాటాదార్హు, వినియోగదార్లు లబ్ది పొందిన మాట నిజం అయితే అది అమెరికన్‌ కార్మికుల ఉద్యోగాలు, వేతనాలను పణంగా పెట్టి అన్నది గమనించాలి అభివృద్ది చెందని దేశాల నుంచి పొరుగుసేవలను పొందటం ద్వారా వాటిని అభివృద్ధి చేయటం, అమెరికన్‌ ఉత్పత్తులకు మార్కెట్లను, అమెరికానుంచి తీసుకున్న రుణాలను చెల్లించే సామర్ధాన్ని కూడా పెంచవచ్చని పొరుగు సేవల సమర్థకులు చెప్పారు ఆచరణలో అమెరికన్లే చైనా వంటి దేశాలనుంచి చౌకగా దిగుమతులు చేసుకుంటుంటే ధర ఎక్కువ ఉన్న అమెరికానుంచి వస్తువులను కొనుగోలు చేసే పిచ్చి వాళ్లెవరైనా ఉంటారా? వాణిజ్య బప్పందాల ప్రభావం

అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, సామాజిక అశాంతికి వివిధ దేశాలతో

కుదుర్చుకున్న స్వేఛ్భావాణిజ్య ఒప్పందాలు కూడా దోహదం చేశాయా? వీటిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్యుటిఓ) ఉనికిలో ఉన్నప్పటికీ దానిని తోసి రాజని అమెరికా, ఐరోపా యూనియన్‌ వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఈ ఒప్పందాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి దోహదం చేస్తాయని వాటిని సమర్ధించేవారు పేర్కొంటారు 2011 అక్టోబరులో పార్లమెంట్‌ సభ్యులు, బడావాణిజ్యవేత్తలతో సమావేశమైన బరాక్‌ ఒబామా ఈ ఒప్పందాల వలన ప్రతి ఏడాది అమెరికా నుంచి 13బిలియన్‌ డాలర్ల విలువగల నూతన ఎగుమతులకు అవకాశం లభిస్తోందని, ఒక్క దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్లనే 70వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు ఒబామా రాజకీయ నాయకుడు,2012 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయదలచాడు గనుక ప్రతి చిన్న అంశాన్ని బూతద్దంలో చూపటం సహజం డార్ట్‌ మౌత్‌ విశ్వవిద్యాలయ ్రొఫెసర్‌ డగ్లస్‌ ఇర్విన్‌ మాట్లాడుతూ “ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు ఉపయోగపడతాయని అధికార యంత్రాంగం చెప్పవచ్చు. పన్నులు తగ్గిన కారణంగా మనం కొన్నింటిని అదనంగా అమ్ముకోవచ్చు, కానీ అది మన నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఏమూలకూ చాలదు,చాలా చిన్న పరిమాణంలో ఉంటుందని నేను భావిస్తాను * అన్నాడు నిజానికి అమెరికాతో నిమిత్తం లేకుండానే దక్షిణ కొరియా ఇతర దేశాలతో కూడా యయ.

స్వేచ్భావాణిజ్య ఒప్పందాలు చేసుకుంది మనం అనుకుంటున్నట్లుగా ప్రపంచానికి అమెరికాతో పనిలేదు, ఒక దేశంగా మనం అమెరికాలోని కంపెనీల నూతన వాణిజ్యానికి అవసరమైన పెట్టుబడుల కోసం చురుకుగా సంప్రదింపులు జరపకపోతే మనం చాలా వెనుకబడతామని గుర్తించాలని ఇర్విన్‌ అనే ఆర్థికవేత్త పేర్కొన్నాడు స్వేచ్భావాణిజ్య ఒప్పందాలకు ఉన్న పరిమితులను కూడా కొందరు అపహాస్యం చేశారు పనామా, కొలంబియాలతో జరిగిన ఒప్పందాల విషయాలకు వస్తే అవి మన సమస్యలను పరిష్మరించగలిగినంత పెద్ద దేశాలేమీ కాదు మన ఉద్యోగాలకు అనుకూలంగా ఏదైనా జరిగిందని చెబితే వాటిని చూడటానికి బూతద్దాలను ఉపయోగిస్తే తప్ప కనపడనంత చిన్నవిగా ఉంటాయి దక్షిణకొరియాతో 1994లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అతి పెద్దదిగా అమెరికన్లు కొందరు వర్దిస్తారు దక్షిణ కొరియా, కొలంబియా, పనామా నాయకులు ఒప్పందాలను హర్షించటానికి కారణం అంతకు ముందు కంటే అవి దిగుమతి చేసుకొనే అమెరికన్‌ వస్తువులపై పన్ను మొత్తాలను తగ్గించటమే అటుగాని ఇటుగాని వినియోగజారులు చౌకగా వస్తువులు పొందారు తప్ప ఇతర ఉపయోగాలేమున్నాయని కొలంబియన్‌ రాడార్‌ మార్కెటింగ్‌ పరిశోధనా సంస్థ అధ్యక్షుడు కామిలో హరేరా ప్రశ్నించాడు ఒప్పందం తమ విజయంగా పనామా అధ్యక్షుడు వర్ణించాడు అయితే ఇలాంటి ప్రకటనలు పనామాలోని విమర్శకుల నోరు మూయించటానికి కూడా చేయవచ్చు అమెరికాలోని అతి పెద్ద కార్మిక సంఘం ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ) అనువుగాని సమయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయమని దక్షిణకారియాతో ఒప్పందంపై విమర్శించింది కొరియాతో చేసుకున్న ఒప్పందం వలన కొన్ని ఆటోవిడిభాగాలను అక్కడ తయారు చేయిస్తారని దీని వలన అమెరికాలో లక్షా 60వేల ఉద్యోగాలు పోతాయని పేర్మొన్నది అమేకికొతో చతొంటి సంక్షోభ ప్రభావానికి గురికాని వారు కేవలం కార్పొరేట్‌ సంస్థలే కాస్త పతీ కసుసన్నలలో మెలిగే చట్ట సభల సభ్యులు కూడా ఉన్నారు అమెరికన్‌ మార్లేమంట్‌ సభ్యులు నీఖకీ ఆస్తులు 2008-10 మధ్య నాలుగోవంతు పెరిగాయి. ఇదే సమయంలో మొత్తం అమెరికా కుటుంబాల నిఖర ఆస్థుల పెరుగుదల కేవలం 12శాతం మాత్రమే ఉంది మన సభ్యుల మాదిరి చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కేవలం పాక్షికంగా తమ ఆస్తుల వివరాలనే వారు కూడా పార్లమంట్‌కు అందచేసిన ప్రకారం 2010లో అమెరికన్‌ పార్లమెంట్‌ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ 200 కోట్ల 'గాలర్లు రెందు సంవత్సరాలలో 60 మంది శ్రనిక సభ్యుల అస్తుకే గణనీయంగా పెరిగాయి. పార్లమెంట్‌లోని ప్రజాప్రతినిధుల సభ్యుల మొత్తం అస్థి 2008 వివరా (ట్రకొారం వంద కోట్ల దొలర్లు కాగ్కా సెనెట్‌ సభ్యుల అస్తి 651కోట్ల డాలర్లు ఇవి శెంచు సంవత్సరాల తరువాత 126, 78కకోట్లుగొ ఉన్నట్లు పేర్కొన్నారు జ్తశ న డై“ ఎం కోటిశ్వరరావు

ఆస్థుల విషయంలో అధికార డెమోక్రాట్లు సెనెట్‌లోని వారు, ప్రతి పక్ష రిపబ్లికన్లు ప్రజా ప్రతినిధుల సభలోని వారు అత్యధికంగా ఆస్థులు కలిగి ఉన్నారు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమ కారులు కొద్ది మంది వద్ద సంపదలు పోగుపడటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అలాంటి ధోరణి పార్లమెంట్‌ సభ్యులలో కూడా ఉండటం గమనార్హం అమెరికన్‌ ఎంటర్‌పైజస్‌ ఇనిస్టిట్యూట్‌ పండితుడు మార్క్‌ పెన్నీ పోలిక ఎలా ఉందో చెప్పారు యాఖై మంది ధనిక సభ్యుల ఆస్థి 2008లో పైన పేర్కొన్న 165 కోట్ల డాలర్లలో 129 కోట్లుగా ఉంది అదే 2010 నాటికి 163 కోట్లకు చేరింది పెరుగుదల రేటు 78 నుంచి 80శాతానికి చేరింది ఈ మొత్తాలలో వారికున్న ఇళ్లు, ఇతర ఆస్థుల విలువను కలపలేదు మిలియన్‌ డాలర్లకు తక్కువ ఉన్నవారెవరూ కనపడటం లేదు దారెల్‌ ఇసా అనే రిపబ్లికన్‌ ఎంపీ తనకు 29 56కోట్ల డాలర్ల ఆస్థి ఉన్నట్లు 2010లో తెలిపాడు ఒక ఏడాదికి ముందు కంటే ఇది రెట్టింపు 2009లో ఒక ఖాతాలో ఉన్న ఆస్థి విలువను ఐదు కోట్ల డాలర్లుగా చూపిన ఇసా 2010 నాటికి అది రెండున్నరకోట్లకు తగ్గినట్లు పేర్కొన్నాడు అయితే మరో పదకొండు ఖాతాలకు చెందిన 3 82కోట్లను అదనంగా 2010లో చూపాడు ధనికులకే కాదు అవినీతి పరులకూ అందలమే |

అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా ధనికులకు అనుకూలమైన విధానాలే

కాదు, ఆ వర్షానికి చెందిన అవినీతి పరులను కూడా అందల మెక్కించటంలో రెండు పార్టీలు ఎలాంటి పక్షపాతం చూపలేదు ఏదైనా ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడి, అదీ (ప్రభుత్వ కాంటాక్టులో శిక్షకు గురైతే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించటం సాధారణ అంశం అయితే 2011 అక్టోబరులో వెల్లడైన రక్షణశాఖ నివేదికను చూస్తే 2001 నుంచి అలాంటి అక్రమాల కంపెనీలకు 1 1లక్షల కోట్ల డాలర్ల మిలిటరీ కాంట్రాక్టులను ప్రభుత్వం కట్టబెట్టినట్లు తేలింది ఈ కంపెనీలు చిన్నవేమీ కాదు బోయింగ్‌, లాక్‌హీద్‌ మార్చిన్‌, సిస్కోసిస్టమ్స్‌, ఐబిఎం, హెచ్‌పి, హనీవెల్‌, డైనమిక్స్‌ రీసర్చ్‌, మోటరోలా, యునిసిస్‌ ఇలా అన్నీ పెద్ద కంపెనీలే తప్పుడు ఇన్వాయిస్‌లు సమర్పించిన అక్రమకేసు నుంచి బయట పడేందుకు లాక్‌హీడ్‌ మార్చిన్‌ కంపెనీ 2008లో 1 5కోట్ల డాలర్లను చెల్లించింది అయినా దానికి కౌత్త కాంట్రాక్టులు ఇవ్వటంలో రక్షణ శాఖకు ఎలాంటి అభ్యంతరం లేకపోయింది మరుసటి ఏడాది 3002 కోట్ల డాలర్ల కాంట్రాక్టును అప్పగించింది మిలిటరీ వ్యవహారాలను పొరుగుసేవలకు అప్పగించిన ఫలితమే ఇదని పార్లమెంట్‌ సభ్యులు మొత్తుకుంటున్నా వినిపించుకొనే వారెవరు? వాల్‌స్ట్రీట్‌ ముట్టడి బగ్ర

జబామా హయాంలో కూడా అన్యాయమే జరిగిందా?” అమెరికా చరిత్రలో ఒక ఆ్రో-అమెరికన్‌ అధ్యక్షుడు కావటం నిజంగా

అనూహ్యమే తమ దోపిడీని కొనసాగించటానికి పాలకవర్గానికి దోహద పడేవారు ఏ రంగు వారైనా, పొట్టి వారైనా పొడుగువారైనా ఆడా మగా తేడా చూడకుండా తన ప్రతినిధులుగా ఎన్నుకుంటుంది అమెరికాలో ధనవంతులైన కొద్ది మంది నల్లవారి తీరుతెన్నులను చూస్తే వారేమీ శ్వేతజాతీయుల కంటే దోపిడీ విషయంలో భిన్నంగా లేరు అందువల్లనే బరాక్‌ ఒబామాను కార్పొరేట్‌ ప్రపంచం అనుమతించింది మార్పునా తీర్చు అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన ఒబామా ఆచరణలో పాతవిధానాలనే కౌనసాగించాడు యుద్దాలను ఆపలేదు, ఇరాన్‌పై కొత్త యుద్ధరంగం తెరవటానికి పాలకవర్గం చేస్తున్న యత్నాలను కొనసాగనిస్తున్నాడు వడ్డించేవాడు మనవాదైతే కడబంతిలో ఉన్నా ఇబ్బంది లేదన్న సుప్రసిద్ధ సామెత తెలిసిందే అమెరికాలో కార్పొరేట్ల పరిస్థితి కూడా అంతే ఏనుగు పార్టీ(డెమోక్రాట్స్‌) గాడిద పార్టీ(రిపబ్లికన్లు) ఎవరు అధికారంలోకి వచ్చినా వడ్డించేది కార్పొరేట్లకే అయితే మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన బరాక్‌ ఒబామా జన పక్షం ఉన్నాడా” అంటే ఆయన కూడా ఆ తానులో ముక్కలాగే వ్యవహరించాడని తేలింది రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమకారుల సానుభూతి, ఓట్లు పొందేందుకు ఓట్ల కోసం చేసిన ప్రసంగాలలో “'గబలిసిన బ్యాంకర్లని పేర్ళొన్నాడు ఆయన నాలుగేళ్ల పాలనా కాలంలో ఒక్క బ్యాంకు బలుపును కూడా తగ్గించలేకపోయాడు

మ. న - స వ న? రే చప అస్తవ్యస్త అయనా భక్తు రార కంపం కూదా నసవలయు దాన ఆధికారాన్‌క శాకవమందు, 2008 ద తు పుట దద అరకన మ రో న! నీ [స న. సో స జసు క మ నక ల న కం లం. నాల నారా లం అం శామ్లూ! పదవిలో ఉన్న (ల ఆంచసుర ౫ -వత్సరాలలనే: మంచి లోఖాలు వద్చాయి మ యు స సను. సస వస న సం. స స్త! | స్‌. మ | స న స్‌ త? న. స కచ మ; టో సగనో ప్‌ వన, వభ సగ తు. ఉండ సట బా వాదం యంత తదపి. నం స ల సనం నన మూ రసా అసం నో ల లకన్‌ కస న వన ఛి సు నునన మ సన వసతు యు ల తగ్గనుందా ఎటయో' బావ సాగింవాడు. 26 బం కోటేశ్వరరావు

వినియోగదారులకు రుణాల మొత్తాన్ని పెంచాలని ఏ ఒక్కరూ బ్యాంకులను వత్తిడి చేయలేదు అమెరికాలో వినియోగం పెరిగి తద్వారా అభివృద్ది జరగాలంటే ప్రతిదానికీ అప్పులు ఇవ్వటం సర్వసాధారణం కనీసం వాల్‌స్టీట్‌ దాన్ని కొనసాగించినా కొంతమేరకు మెయిన్‌ష్టీట్‌ సమస్యలు తీరేవన్నది కొందరి అభిప్రాయం ఉద్దీపన పథకం పేరుతో ప్రజల సొమ్మును అప్పనంగా పొందిన బ్యాంకులు ఎలా వినియోగించాయో చూద్దామంటూ ఇద్దరు మిచిగాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు ఉద్దీపన తరువాత బ్యాంకులు ఇచ్చిన అప్పులు నామమాత్రం బాండ్లను కొనుగోలు చేశాయి ఆ విధంగా పదిశాతం లాభం పొందినట్లు తేలింది వినియోగదారులకు వడ్డీకి ఇవ్వటం లాభదాయకం కాదని బ్యాంకులు భావించటమే దీనికి కారణమని ఒక ప్రొఫెసర్‌ పేర్కొన్నాడు నిరుద్యోగం పెరగటం, నిరుద్యోగ భృతి ఎక్కువ రోజులు చెల్లించటం కూడా బ్యాంకులకు లాభాలు తెచ్చిపెట్టాయి. భృతి మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే డెబిట్‌ కార్డు అవసరం అందుకు ప్రతి నిరుద్యోగి నుంచి బ్యాంకులు కొంత మొత్తం వసూలు చేసి సొమ్ము చేసుకున్నాయి. సంక్షోభం కారణంగా రాష్ట్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. వాటి నుంచి తప్పించుకొనేందుకు కొత్తగా చేరిన ఉద్యోగుల పెన్సన్‌ ఖాతాలను ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలకు బదులు వాల్‌స్టీట్‌ సంస్థలలో తెరిచాయి పెన్షన్‌నిధి నిర్వహణ ఖర్చు పేరుతో ఉద్యోగులనుంచి ఫీజులు వసూలు చేసి బాగు పడ్డాయి బ్యాంకుల కంటే బాండ్ల వ్యాపారం చేసే సంస్థలు విపరీతంగా లాభాలు పోగేసుకున్నాయి జూనియర్‌ బుష్‌ ఎనిమిదేళ్ల పాలనలో 77 బిలియన్‌ దాలర్ల లాభం పొందిన సంస్థలు ఒబామా తొలి రెండున్నర సంవత్సరాల కాలంలోనే 88 బిలియన్‌ డాలర్ల లాభం పొందాయి ఈ కారణంగానే ఈ సంస్థలలో పని చేసే సిబ్బందికి 2010లో వేతనాలు, బోనస్‌లు కూడా గణనీయంగా పెరిగాయి న్యూయార్క్‌లోని ప్రయివేటు రంగ కార్మికుడి కంటే వాల్‌స్ట్రీట్‌ ఆర్థిక సంస్థల ఉద్యోగుల వేతనాలు ఐదురెట్లు(16 1శాతం) పెరిగాయి. దేశవ్యాపితంగా ముట్టడి ఉద్యమాలు ఊపందుకోవటానికి, సామాన్యులు ఆగ్రహం చెందటానికి ఇలాంటి అంశాలెన్నో దోహదం చేశాయి ఉద్యమించకుండా మూడు సంవత్సరాలు ఎందుకు ఆలశ్యం చేశారు”

కార్పొరేట్‌ సంస్థలు తెచ్చిన ఆర్థిక సంక్షోభంపై స్పందించటానికి, వాల్‌స్ట్రీట్‌

ముట్టడి ఉద్యమ ప్రారంభానికి అమెరికన్లు ఇంతకాలం ఎందుకు ముందుకు రాలేదు అన్నది కొందరు లేవనెత్తిన ప్రశ్న దీన్ని గురించి అభిప్రాయాలు వెలువడుతున్నాయి అయితే పాక్షిక సమాధానం మాత్రమే మనకు వాటి నుంచి దొరుకుతోంది డేవిడ్‌ మేయర్‌ అనే సోషియాలజీ ప్రొఫెసర్‌ 2011 ఆగస్టు నెలలో వాషింగ్ట్‌న్‌ పోస్ట్‌ పత్రికలో 'అమెరికాలో వాల్‌స్టీట్‌ ముట్టడి ఓ

సామాజికోద్యమాలు' అనే శీర్షికతో తన విశ్లేషణ రాశారు దానిలో ప్రస్తుతం అమెరికాలో 'టీ పార్టీ పేరుతో బలమైన సామాజికోద్యమం ఉందని, అది ప్రభుత్వ పాత్ర ఎంత తక్కున ఉంటే అంతమంచిదని కోరుకుంటోందని పేర్కొన్నారు. అరబ్బు విప్లవాల వంటి నిరసనోద్యమాలవైపు వెళ్లకుండా దిగువ స్థాయి కార్యకర్తలను టీ పార్టీ మళ్లించిందన్నారు అంతేకాదు తాము నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని దానికి బదులు తాము కోరుకున్నది కావాలంటే పనిచేసి సాధించుకోవచ్చని అమెరికన్లు విశ్వసించే విధంగా అమెరికా రాజకీయ వ్యవస్థ తయారు చేసిందని కూడా ఫ్రొఫెసర్‌ పేర్కొన్నారు ఈ అభిప్రాయాన్ని స్థూలంగా బలపరిచేదిగా మరొక ఒక అధ్యయనం ఉంది తామున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ నిష్టాక్షికం, న్యాయమైనదని నమ్మే విధంగా జనాన్ని తయారు చేశారు అందుకే వాల్‌స్ట్రీట్‌ ఉద్దీపన పధకానికి నిరసన తెలుపకుండా జనం ఉండిపోయారని న్యూయార్స్క్‌ విశ్వవిద్యాలయ సైకాలజిస్ట్‌ జాన్‌ జోస్ట్‌ చెప్పారు “మా రాజకీయ లేదా ఆర్థిక వ్యవస్థ స్వభావ సిద్ధంగానే అవినీతికరమైనదని నమ్మేందుకు మాలో చాలా మందికి ఎంతో కష్టంగా ఉంటుంది తీవ్రమైన,మౌలిక సమస్యలు కళ్లముందు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలనే భావన నాటుకుపోయింది ” అన్నారు కార్పొరేట్‌ ఎదురుదాడి

ముట్టడి ఉద్యమాలు అమెరికన్‌ సాంప్రదాయం కాదంటూ కార్పొరేట్‌ల తరపున మితవాదులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు వారి వాదనల సారాంశం ఇలా ఉంది బరాక్‌ ఒబామాతో సహా అనేక మంది నాయకులు వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి మద్దతు పలకవచ్చు కానీ మన చరిత్రను ఆ ఉద్యమ మద్దతుదార్లు తెలుసుకోవాలి జేమ్స్‌టౌన్‌ సెటిలర్లు అవకాశాల స్వేచ్చకోసమే ఇక్కడికి వచ్చారు భక్తులు తమ మతాన్ని స్వేచ్చగా ఆచరించేందుకు వచ్చారు కష్టకాలం, చివరకు మరణం కూడా ఎదురు కావచ్చని సెటిలర్లకు తెలుసు, అయినా వచ్చారు అలాంటి వారి వారసులు, వారి మాదిరే వచ్చిన తొలి వలసదారులు అనేక ఆటంకాలను ఎదుర్కొని అమెరికన్లుగా మారారు మన పూర్వీకులు మన దేశాన్ని కాపాడేందుకు నిలబడ్డారు అలాంటీవారితో వాల్‌స్ట్రీట్‌ ప్రదర్శనకారులను పోల్చటం పూర్వీకులను అవమానపరచటమే. వారు స్వేచ్చ కోసం తమ ప్రాణాలను వణంగా పెట్టారు కోరుకున్న విధంగా పూజించుకొనేందుకు స్వేచ్చను కోరారు అనుచితమైన పన్నుల నుంచి స్వేచ్చ కావాలని కోరారు వాటికోసం వారు ప్రభుత్వంపై ఆధారపడలేదు వారంతటవారే, వారికోసమే ఇదంతా చేసుకున్నారు వారు (ప్రభుత్వాన్ని న న న

విశ్వసించలేదు వారు దాన్ని తప్పనిసరైన శత్రువుగా చూశారంతే అందువలన వాల్‌స్ట్రీట్‌ నిరసనకారులు తమ సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వం గురించి ఆలోచించాల్సింది పోయి మన నిత్య జీవితాలను కూడా అదుపు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు మెజారిటీ ప్రదర్శకుల డిమాండ్లు చూస్తే ఒక బృందాన్ని వేరుగా చూసేందుకు, ఒక బృందానికి ప్రత్యేక సత్మారాలు చేసే విధంగా ప్రభుత్వ అధికారాన్ని మరింత ప్రమాదకరంగా విస్తరించాలని కోరుతున్నారు ఇది విడదీయటం తప్ప వేరు కాదు మార్టిన్‌ నెయిమోలర్‌ ప్రఖ్యాత వ్యాఖ్య ముందుగా వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, కానీ నేను కమ్యూనిస్టును కాదు గనుక నేను మాట్లాడలేదు. ” అనేది ఇక్కడ కూడా మనకు వర్తిస్తుంది వాల్‌స్ట్రీట్‌ నిరసనకారులు అమెరికన్‌ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏది చేయదలచుకుంటే అది చేసే అధికారాలను వారు ఇమ్మంటున్నారు అటువంటి అధికారాలను ఇచ్చి ఇతరులను నమ్మితే వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి ఉంటుందని చరిత్ర అ | క వాల్‌స్టేట్‌ముట్టడి. 29

చూపుతోంది ఇప్పుడు ప్రభుత్వం పరహితత్వంతో, సమర్ధవంతంగా, న్యాయంగా ఉందని నువ్వు నమ్మినప్పటికీ భవిష్యత్‌లో (ప్రభుత్వాలన్నీ అన్నివేళలా అదే విధంగా ఉంటాయని చెప్పలేము అమెరికా రాజ్యాన్ని ఏర్పాటు చేసినవారు వ్యక్తులపై (ప్రభుత్వానికి తక్కువ అధికారాలుండే వ్యవస్థను ఇచ్చారు దశబ్బాలు గడిచిన తరువాత 1980 దశకంలో న్యూడీల్‌తో ప్రారంభమై తరచూ భద్రతను ప్రమాదంలో పదవేస్తూ ప్రభుత్వానికి అమెరికన్లు మరిన్ని అధికారాలను ఇచ్చారు మనల్ని అదెక్కడికి తీసుకు వెళ్లిందో చూడండి అసలైన టీ పార్టీలో పాల్గొన్నవారెవరైనా ఉంటే మనం చెల్లించే పన్నులను చూసి షాక్‌ తింటారు (ప్రభుత్వం మన జీవితాలను అదుపు చేయటాన్ని చూసి మన పూర్వీకులు బిత్తర పోతారు హెల్మెట్‌ లేకుండా ఒక కౌబాయ్‌ ప్రయాణిస్తుంటే పోలీసు జరిమానా వేయకుండా ఉండటాన్ని నీవు ఊపాంచగలవా? జనం తెలివితక్కువ (ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు, బుద్దితక్కువ పనులను చేస్తారని గ్యారంటీగా చెప్పవచ్చు తప్పులు చేయనివారెవరు?

వాల్‌స్ట్రీట్‌ అమీర్లు మేం కూడా జనంలో భాగంగా కాదా అంటూ చికాగో నగరంలో కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ, తమకు సంపాదించుకొనే హక్కుందని దబాయించారు చికాగో ముట్టడి ఉద్యమకారుల మధ్య వాటిని పంచారు ' మేం వాల్‌స్టీట్‌ వారిమే, మా పని డబ్బు సంపాదించటమే” అని సమర్థనకు పూనుకున్నారు వాల్‌స్టీట్‌ వ్యతిరేకుల ముట్టడికి పోటీగా వాల్‌స్ట్రీట్‌ తమకు అనుకూలంగా కూడా కొందరితో అక్కడక్కడా ప్రదర్శనలు చేయించింది తమకు కూడా (గ్రాంట్‌ పార్కులో స్థలం కేటాయించాలని చికాగోలోని వాల్‌స్ట్రీట్‌ అనుకూల ఆందోళన కారులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు

రివల్లికన్‌ పార్టీ నాయకులు పెరుగుతున్న 99శాతపు శక్తి గురించి గంగమె[ర్రులెత్తుతున్నారు. వాల్‌స్ట్రీట్‌ వ్యతిరేకతను పెంచే యత్నం చూసి నాకెంతో అందోళనగా ఉంది, చస్తానన్నంతగా భయపడుతున్నా అని రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు ఫ్రాంక్‌ అంటిజ్‌ వ్యాఖ్యానించాడు అంతేకాదు ఆ పెద్దమనిషి 99శాతం మంది ఉద్యమాన్ని ఎలా ఎదుర్మోవాలా అని రిపల్లికన్లకు శిక్షణా అన్నట్లు ఒక సభను కూడా నిర్వహించాడు అందులో చెప్పిన కొన్ని చిట్కాల సారాంశం ఇలా ఉంది మొదటి అంశం "కాపిటలిజం అనే మాటను మనం అసలు ఉపయోగించకూడదన్నాడు జనం ఇప్పటికీ కాపిటలిజం నుంచి సోషలిజం కావాలని కోరుకుంటున్నారు కాపిటలిజం అనైతికమైనదని గ్‌ ఎం కోటేశ్వరరావు

భావిస్తున్నారు అందువలన ఆ పదానికి బదులు “ఆర్థిక స్వేచ్చ లేదా స్వేచ్చా మార్కెట్‌ అని చెప్పాలి మనం కాపిటలిజున్ని బలపరిచేవారిగా కనిపిస్తే సమస్వను కొని తెచ్చుకున్నట్లే. రెండవది ప్రభుత్వం ధనికులపై పన్ను విధిస్తున్నదని కూడా చెప్పవద్దు దాని ఐదులు ధనికుల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న మొత్తం అనాలి ఎందుకంటే ధనికులపై పన్ను గురించి మాట్లాడితే పెంచాల్సిందే అని జనం మద్దతిస్తారు అలాగాక కష్టపడి సంపాదించేవారి నుంచి ప్రభుత్వం దబ్బు వసూలు చేస్తున్నదని చెప్పండి తీసుకోవటానికి వీల్లేదంటారు మూడవది మధ్యతరగతిపై గెలవాలనుకోవటాన్ని రిపబ్లికన్లు మరిచిపోండి వారిని కష్టపడి పన్ను చెల్లించేవారని పిలవండి ఒక శాతం అంటే నిజంగా ఉద్యోగాలు కల్పించేవారిగా వర్ణించండి ఉద్యోగాలు కల్పించేవారిని పన్నులు వేసి శిక్షించవద్దని చెప్పండి ఇలా సాగింది పెంటగాన్‌ ఆక్రమణకు సిద్దమౌతున్న వాల్‌స్ట్రీట్‌

కార్పొరేట్‌ భూతం వాల్‌స్ట్రీట్‌ పని బట్టాలని జనం ఒకవైపు ఉద్యమిస్తుంటే వాల్‌స్ట్రీట్‌ ఏకంగా పెంటగాన్‌(అమెరికా రక్షణశాఖ భవనం) ముట్టడి పథకంతో గత పదేళ్లుగా ముందుకు పోతున్నదని బయట పడింది పది సంవత్సరాల క్రితం మిలిటరీలో పొదుపు చర్యలకోసం 21 మందితో ఏర్పాటు చేసిన రక్షణ వాణిజ్య వ్యవహారాల బోర్డులో ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిన బడా కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు వారికి మిలిటరీ గురించి పెద్దగా తెలియదు ఆయుధాలు, ఇతర దేశాల ఆక్రమణల నివారణ ద్వారా సైనిక ఖర్చు తగ్గించాలని సలహా ఇస్తారని ఆశించిన వారు ఆశాభంగం చెందారు సైనికుల పెన్షన్లు, ఇతర ఖర్చులను ఎలా తగ్గించాలో బోర్డు చెబుతున్నది 2011 అక్టోబరులో మిలిటరీ ఉద్యోగవిరమణ అంశాల గురించి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సాధారణ ఉద్యోగులు, కార్మికులకు మాదిరే తక్కువ పెన్నన్లు వచ్చే 401(3) తరహా పధకాన్ని మిలిటరీ మాత్రం ఎందుకు అమలు జరపకూడదని పార్లమెంట్‌ సభ్యుడు ఆస్టిన్‌ స్కాట్‌ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు కార్పారేట్లతో నిండిన సలహా బోర్డు ప్రతిపాదించిన ఇతర అంశాలలో పెన్షన్ల తగ్గింపుతో పాటు వాటిని కూడా ప్రయివేటీకరించాలని, ఆ నిధులను చమురు ముందస్తు మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టాలని, మిలిటరీలోని ఉన్నత్రాధికారులు, మిలిటరీ కమిటీలలో నియమితులైన రాజకీయ ప్రతినిధుల ప్రతిఫలాలను గణనీయంగా పెంచాలని సూచించింది అంతేకాదు మిలిటరీలోని ఉద్యోగులు, అధికారులను ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు తొలగించే, వాల్‌స్టీట్‌ముట్టడి. తే

నియమించుకొనే విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నది ఇదంతా చూస్తుంటే దేశంలో ఇతర పౌర ఉద్యోగులు, కార్మికుల పట్ల అనుసరిస్తున్నవిధానాలనే మిలిటరీకి కూడా వర్తింపచేయాలన్నది స్పష్టమౌతున్నదని బాల్టిమోర్‌ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ చార్లెస్‌ బైఫర్‌ వ్యాఖ్యానించారు దేశబడ్జెట్‌ కోత వివాదం తీవ్రమైన జూలై నెలలో బోర్జు ఒక నివేదిక ఇచ్చింది ఇరవై సంవత్సరాల పాటు మిలిటరీలో పనిచేసిన వారికి 60 సంవత్సరాల పాటు పెన్షన్లు చెల్లించటం భారంగా మారిందని వ్యాఖ్యానించింది ఇప్పుడు మిలిటరీ సిబ్బందికి అమలు జరుపుతున్న పెన్షన్‌ విధానాన్ని మార్చాలని సూచించింది దాని సారాంశం వమంటే ప్రయివేటు రంగానికి మరిన్ని నిధులు అందుబాటులోకి తేవటమే మిగతా సిఫార్సుల ప్రకారం మిలిటరీ సర్వీసులో ఉన్నవారి వేతనాల్లో 16 5శాతం మొత్తాన్ని మినహాయించి వేరే ఖాతాల్లో వేసి ఆ మొత్తాన్ని స్టాక్‌, బాండ్‌ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టాలి (ఇదే గనుక జరిగితే ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితులను బట్టి పెన్షన్‌ చెల్లింపులకు ఆ ఖాతాల్లో ఇక మిగిలేదేమీ ఉండదు) ఆ బోర్డులో పెన్షన్‌ సంస్కరణల విభాగపు అధిపతిగా ఉన్న రిచర్డ్‌ స్పెన్సర్‌ మాజీ సైనికుడు ఇళ్ల రుణాల కుంభకోణానికి పాల్పడి సంక్షోభానికి కారణమైన గోల్డ్‌ మాన్‌ శాచస్‌, మెరిల్‌ లించ్‌,బియర్‌ స్టెర్న్‌ కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నతాధికారిగా 15 ఏళ్లు పనిచేశాడు అతగాడి స్వంత కంపెనీ వస్తువుల ముందస్తు ధరల లావాదేవీలలో పాల్పడిన అక్రమాలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది మరో పెద్దమనిషి డెనిస్‌ బోవిన్‌ ఇతగాడు బియర్‌ స్టెరన్‌ బ్యాంక్‌ పెట్టుబడిదారు చమురు కంపెనీలైన బిపి, షెల్‌ కంపెనీలతో సంప్రదించిన తరువాత మిలిటరీ నిధులను చమురు ముందస్తు మార్కెట్లో పెట్టబడులుగా పెట్టాలని నివేదించాడు ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ కూడా ఇలాంటి పెట్టుబడులు పెట్టలేదు అయినా ప్రభుత్వం మరో నివేదిక ఇవ్వాలని 2011 జనవరిలో బోవిన్‌కు బాధ్యత అప్పగించింది గత పది సంవత్సరాలుగా అమెరికన్‌ మిలిటరీకి ఇరాక్‌, ఆస్థనిస్తాన్లో ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఈ కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడింది ఇప్పుడు కార్పొరేట్ల వత్తిడి ఎక్కువైనందున ఎన్నికల తరువాత అమలుకు పూనుకోవచ్చు యుద్ధ పరిశ్రమల కార్పొరేట్‌ లాభాలు తగ్గకుండా రానున్న పది సంవత్సరాలలో అనుసరించే పెంటగాన్‌ వ్యూహాన్ని బరాక్‌ ఒబామా 2012 జనవరి ఐదున విడుదల చేశాడు మీడియా పాత్ర

అమెరికన్‌ మీడియా మొత్తంగా ఒక శాతం కార్పొరేట్‌ చేతిలో ఉన్నది వారి అవసరాలు, ప్రయోజనాలకు దెబ్బతగలనంతవరకు ఏమైనా రాయవచ్చు, ఏదైనా బై డా వం కోటెశ్వరరాన

చూపవచ్చు జనం మెదళ్లను ఖరాబు చేసే అపరిమిత స్వేచ్చ అక్కడి మీడియాకు ఉంది అధ్యక్షుడి మొదలు సామాన్య రాజకీయ నాయకుడు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మంచి చెడ్డలను చీల్చి చెండాడి యజమానులకు లబ్బి చేకూర్చటానికి మీడియా స్వేచ్చకు హద్దులు లేవు కట్టుకధలు, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు రాసినా, చూపినా ఎలాంటి ఆంక్షలు ఉండవు కానీ వాల్‌ప్రీట్‌ ముట్టడి ఉద్యమ విషయానికి వస్తే మీడియా తన వర్గపాత్రను స్పష్టంగా పోషించింది ఉద్యమ ఉధృతిని మూసీపెట్టటం ' ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టమైన తరుషాత 'కోర్వారేట్‌'మీడియో తన, కుటిల నీతిని, (్రదర్శంచింది 'తామే తుమ్మి శామే తథాస్తు అనుకున్నట్లుగౌ వ్యవహరించింది. “వొల్‌స్ట్రీట్‌ నిరననకారుల గురించి పట్టించుకున్నపోరు పరిమితమే. అనీ ఒక సంస్థ తన; సర్వేకు శీర్షిక ఇచ్చింది దానిని ఉపషయోగించుకొనీ ఉద్దుము వ్యతిరేక మీదీయా' విజృంభించింది లేని దానికంటే ఎక్కువ ప్రజోరం; జరిగిందనీ ఇకరు, మతవాదుల టీ పార్టీ 'సభలకంటే జనం తక్కువ వచ్చారని మరొకరు (ఇథే మీడీయా 2009:లో టీ పార్టీ సభలకు వచ్చిన షది మందిని వంధనుందిగా ప్రభారం చేసింది వాల్‌స్ట్రీట్‌ ఉద్యమాన్ని తక్కువ, చేసి చూపేందుకు అప్పుడు కూదా తక్కున మంధి వచ్చారని' ఇప్పుడు పరోక్షంగా చెప్పటం గమనించాల్సిన అంశం) ఒక ఉద్యమాన్ని; కించపరిచేందుకు మీడియా ఎంతగా (ప్రయత్నిస్తే అది అంతగా ప్రజాధరణ కలిగి ఉందటం, ప్రపంచానుభవం

అయితే టైమ్‌ పత్రిక స్వభావరీత్యా కార్పొరేట్లకే అనుకూలమైనప్పటికీ ముట్టడి ఉద్యమాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు వాస్తవాలను ప్రకటించకతప్పలేదు వాల్‌స్టీట్‌ లాబీయిస్టులు(మన దేశంలో పేరు మోసిన నీరారాడియా లాంటి వారు) వాషింగ్ట్‌న్‌ను మరీ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారని 86శాతం మంది, దేశంలో పేదలు ధనికుల మధ్య తేదా చాలా ఎక్కువగా పెరిగిందని 79శాతం, 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులే కారకులు, వారిని శిక్షించాలంటూ 71శాతం మంది, మిలియనీర్లపై పన్నురేట్లు పెంచాలని 73శాతం అభిప్రాయ పడినట్లు తెలిపింది అంతేకాదు రాజధాని వాషింగ్టన్‌, మీడియాలో జరుగుతున్న రాజకీయ చర్చలు ప్రజల ఆందోళనలను ప్రతిబింబించటం లేదని 60శాతం మంది చెప్పగా కేవలం నాలుగుశాతం మంది మాత్రమే దేశంలో ఉన్న పరిస్థితి పట్ల సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నది కుడి ఎడమల తేడా తప్ప రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రాట్స్‌, రిపబ్లికన్లను కూడా జనం అభిమానించటం లేదని తెలిపింది వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 88

ఉద్యమం ఒక నెలరోజులు గడిచిన తరువాత రాయిటర్స్‌ వార్తా సంస్థ( ఇది కూడా ఉద్యమంపై దుమ్ము చల్లేందుకు తన వంతు పొత్ర పోషించింది) వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి మీడియాలో తగిన చోటు లభించటం లేదని పేర్కొంటూ ఒక విశ్లేషణను వదిలింది. అంటే ఉద్యమం చల్లారిపోతున్నదని పరోక్షంగా చెప్పటమే ఇది. ఉద్యమాన్ని ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా విస్తరించే (ప్రయత్నం జరుగుతున్నదని పేర్ళొన్నది. మీడియాలో ఎక్కువ ప్రచారం వస్తే ఉద్యమంలో జనం మరింతగా పొల్గొంటారనే భయంతోనే కార్పొరేట్‌ త లప. ముం! కాలస్య త ఎతిత య ర, చ ష్‌బ్ట్సు , స కా మా టను న్‌ కసె మాం! లా ప్రశ న న ౮ ! నం. గ్‌ క ౧. సా. వా కట ర్ట కన? 0 గ! భు బూ న. సే మీడియా కవరేజ్‌ తగ్గించిందని వేరే చెప్పనవసరం లేదు. అయితే దాన్ని మూసిపెట్టేందుకు “ఉద్యమం ఇంకా సవాలు చేసే స్థితిలో లేని కారణంగా, చలి పెరుగుతున్న కారణంగా జనం తగ్గిపోతున్నందున మీడియా పట్టించుకోవటం మానుకుందని కొందరు విశ్లేషించారు." ప్రాణవాయువు, మంటపెట్టేందుకు ఇంథనం లేని కారణంగా ఉద్యమం అసంగతమయ్యే ప్రమాదంలో పడిందని గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సంస్థ చైర్మన్‌ డేనియల్‌ వ్యాఖ్యానించాడు. అయితే 'జనానికి అసలు కథేంటో తెలుసు, వారు(మీడియా) ఇతర కథనాలవైపు మళ్లుతున్నారని నేను అనుకుంటున్నానని” కొలంబియా విశ్వవిద్యాలయంలో చేస్తున్న పరిశోధనకు అంతరాయమిచ్చి ఉద్యమంలో పాల్గొంటున్న సేనియా బారగన్‌ అనే యువతి వ్యాఖ్యానించింది. తత వం. కోటేశ్వరరావు

మీడియా, కార్బారేట్‌ లాబీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ అమెరికన్‌ సాధారణ ప్రజానీకం ఈ ఉద్యమానికి మొత్తం మీద సానుభూతి తెలిపింది ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మరింత మందిని సమీకరించేందుకు దోహదం చేయనుంది ఒక సర్వే ప్రకారం 82శాతం మంది ఈ ఉద్యమం గురించి విన్నట్లు తేలింది యాఖై శాతం మంది తమకు బాగా తెలుసని చెప్పారు ఒక ఉద్యమం (ప్రజాబాహుళ్య్ళంలోకి వెళ్లిందని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు కనిష్ట-గరిష్ట అంచనాల ప్రకారం 11 నుంచి 16కోట్ల మంది వరకు ఉద్యమానికి మద్దతు ఇచ్చారని చెప్పవచ్చు. వీరిలో కేవలం ఒక్కశాతం మంది చురుకైన పాత్ర వహించినప్పటికీ అమెరికాలో గతంలో జరిగిన అన్ని ఉద్యమాలకంటే పెద్దదే అవుతుంది

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా పెరగనివ్వటం ఎందుకన్నట్లుగా ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచి వేయటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. గతంలో పోన్టాఫీసుల్లో పోలీసు ఏజంట్లు ఉండి లేఖలను రహస్యంగా చదివేవారు తరువాత ఫోన్లను దొంగచాటుగా వినటం తెలిసినదే ఇప్పుడు ఇమెయిల్స్‌ను కూడా మధ్యలో అద్దుకొని ఉద్యమకారుల్లో ఎవరు చురుకుగా ఉన్నారు? ఎలాంటి సమాచారాన్ని మెయిల్స్‌లో పంపుతున్నారు? వంటి అంశాలను చదువుతున్నారు ఉద్యమాన్ని వ్యతిరేకించే మితవాద శక్తులు లేదా పోలీసు ఏజంట్లు వాల్‌స్ట్రీట్‌ ఉద్యమకారుల్లో ఒక బృందం సమాచారాన్ని రహస్యంగా తస్మరించి న్యూయార్క్‌ పోలీసులు, ఎఫ్‌బిఐకి అందించారు ఉద్యమకారుల్లోకి పోలీసు ఏజంట్లను చొప్పించటం పాత పద్దతి పోలీసులకు కన్సల్టెంట్‌గా ఉన్న థామస్‌ రేయాన్‌ అనే పెద్దమనిషి రోజూ ఉద్యమకారుల వద్దకు రావటం బహిరంగ రహస్యం సెష్టెంబరు 17 చర్చల పేరుతో దొంగతనంగా సంపాదించిన వేలాది ఇ మెయిళ్లను రేయాన్‌ బహిరంగ పరిచాడు వాటిని పోలీసులు, మీడియాకు అందచేశాడు తనది స్వచ్చంద సంస్థ అని వాల్‌స్ట్రీట్‌ ఉద్యమంపై అందరిలో ఆసక్తి ఉన్నందున వారికి తెలిపేందుకు గాను తాను సంపాదించిన ఈ మెయిల్స్‌ను అందరికీ పంపినట్లు గుండెలు తీసిన ఆ బంటు చెప్పుకున్నాడు వాటిలో ఉన్న కొన్ని అభిప్రాయాలను తీసుకొని అరాచకవాదుల ఉద్యమం అని చిత్రించేందుకు కొందరు నిపుణులు రంగంలోకి దిగారు

ఎంఎస్‌ఎన్‌బీసి అనేక ఆన్‌లైన్‌ ఇమెయిళ్లను ప్రచురించింది జర్నలిస్టు డైలాన్‌ రాటిగాన్‌ మెయిల్‌ చేస్తున్నవారిని హెచ్చరిస్తూ ముట్టడిదార్లు డిమాండ్లను ముందుకు తేరాదని, అందరూ ఆమోదించే అంశాలనే ముందుకు తెచ్చినపుడే అనూహ్యమైన బలం ఉద్యమానికి వస్తుందని ఉచిత సలహా ఇచ్చాడు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కాలమిస్టు బిల్‌ కిల్లర్‌ తన వాల్‌స్టీట్‌ ముట్టడి రక్‌

తెలివితేటలకు పదును బెట్టాడు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఉద్యమానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఒక పారకుడు ఉత్తరం రాశాడు దానిపై కిల్లర్‌కు కోపం వచ్చింది తమ పత్రిక తన కర్తవ్య నిర్వహణలో ఉందని పేర్కొంటూ ఇలా రాశాడు ' మన ప్రభుత్వంతో సహా దేశంలోని అనేక (ప్రధాన వ్యవస్థలు దేశంలో పెరుగుతున్న అసమానతలు, అధికార సమతూకాన్ని కాపాడటంలో జవాబుదారీ తనంతో ఉండాల్సినవి వైఫల్యం చెందటాన్ని ముట్టడి ఉద్యమకారులు దేశం దృష్టికి తెచ్చారని నేనూ అంగీకరిస్తున్నా లేదా వారికి స్పష్టత లేకుండా లోపొలను సరిదిద్దటానికి పదిపాయింట్ల ప్రణాళికను ముందుకు తేవటాన్ని కూడా నేను తప్పు పట్టటం లేదు అయితే వారిని ప్రశ్నించటం సరైనదే ఇప్పుడేమిటి? దీని తదుపరి ముందుకు వచ్చే వాస్తవ పర్యవసానాలేమిటి?”' అంటూ ప్రశ్నించి బిల్‌ కిల్లర్‌ తన అసలు రంగు బయట పెట్టుకున్నాడు 'మనం ఇటీవల రాజకీయ ఉద్యమాన్ని నడిపిన టీ పార్టీని మన ఆదర్శంగా తీసుకుంటే( కార్పొరేట్లకు మరిన్ని వరాలివ్వాలని డిమాండ్‌ చేసిన ఆందోళనకు టీ పార్టీ వేదికైంది) ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నా దాని ప్రారంభాన్ని గుర్తుకు తెచ్చుకుంటే పురోగామి మీడియా దానిని ముందు అపహాస్యం చేస్తూ వార్తలను ఇచ్చింది ప్రధాన స్రవంతి మీడియా పెద్దగా పట్టించుకోలేదు వారి డిమాండ్లపై తొలి రోజుల్లో పెద్ద చర్చ జరిగింది వాటిని ప్రధాన ్రవంతి మీడియా సీరియస్‌గా తీసుకొని తదుపరి ప్రాధ్యాన్యత ఇవ్వాల్సి వచ్చింది అది దానికి ఎంతో దోహద పడింది * అని కిల్లర్‌ పేర్కొన్నాడు కార్మికులు, రైతులు, ఇతర కష్టజీవులు ఉద్యమాలు నిర్వహించే సమయంలో వారితో చేరి అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేవారి గురించి మనకు తెలిసిందే మామూలుగా పోలీసు లేదా యాజమాన్య ఏజంట్లు అటువంటి పాత్రధారులుగా ఉంటారు ఈ ఉద్యమాన్ని తొలుత పూర్తిగా తొక్కి పెట్టిన మీడియా “సంచలనాత్మక వార్తల కోసం తమ ఏజంట్లను ఉద్యమకారుల ముసుగులో మందిలో చేర్చి కొట్లాటల సృష్టికి ఉద్యమకారులను నిందించేందుకు కూడా ప్రయత్నించింది వాషింగ్ట్‌న్‌ డిసిలోని నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మూజియం ముందు 'స్టాప్‌ మెషిన్‌” అనే సంస్థ ఆధ్వర్యంలో యుద్ధాలను నిలిపివేయాలని, ధనికులపై పన్ను విధించాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శన జరిగింది “అమెరికన్‌ స్పెక్టేటర్‌' అనే పత్రిక విలేకరి పాట్రిక్‌ హౌలే ఆ ప్రదర్శనకారులతో చేరాడు నిరసనకారులు, వారిని అడ్డగిస్తున్న మ్యూజియం గార్జులను రెచ్చగొట్టటంతో వారు మంటపుట్టించే మిరియపు రసాన్ని విరజిమ్మారు అక్కడ ఏదైనా అనుకోని ఉదంతం జరిగితే సంచలనాత్మక ప్రత్యేక కధనం రాసేందుకే తానీ కథ ఏం కోటెశ్వరూవు

శ న గ ధీ % భో ల ల (చలో | య లాంటి

మ స న అజ టం | సల | న చు వని చేసినట్లు అతను పేర్కొనటం గమనించాల్సిన అంశం నిరసనకారులకు అధికారులతో ప్రతిఘటనకు దిగే దమ్ములేనందున తానీ పనికి పూనుకున్నట్లు, అమెరికాలో ఏదైనా జరగాలంటే ఇప్పుడు పోలీసులతో గొడవకు దిగాల్సి ఉంటుందని కూడా చెప్పాడు ఈ ఉదంతం బయటకు రావటంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించించారు తప్ప ఇతర వివరాలు మాట్లాడేందుకు యాజమాన్యం సిద్ధ పడలేదు మీడియాలో పెరుగుతున్న అవాంఛనీయ ధోరణులకు ఇది ఉదాహరణ హౌలే చర్య 2009 మీడియా డాన్‌ రూపర్ట్‌మర్జోక్‌ ఆధీనంలోని 'ఫాక్స్‌” టీవీ ఛానల్‌ సృష్టించిన నకిలీ వీడియో టేపుల ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది “అకోరన్‌' అనే ఒక స్వచ్చంద సంస్థ పేదవారైన యువదంపతులను చేరదీసి నేరస్థ చర్యలకు పాల్పడేట్లుగా రెచ్చగొడుతున్నట్లు చూపే వీడియోలను ఫాక్స్‌ టీవీ ప్రసారం చేసింది ఈ వీడియోలతో 'అకోరన్‌' సంస్థకు చెడ్డపేరు వచ్చి చివరకు మూతపడింది ఆ తరువాత ఆ వీడియోలు నకిలీ అని తేలింది ఆ వీడియో సూత్రధారి, పాత్రధారి జేమ్స్‌ ఓ కీఫీ న్యూయార్క్‌లోని “వాల్‌్టీట్‌ ఆక్రమణ” ఉద్యమకారుల మధ్య తచ్చాడినట్లు గుర్తించారు వాతష్టేటముట్టడి త?

“యాహూ' సెన్సార్‌

ఇంటర్నెట్‌ రంగంలో ఐడాకంపెనీలలో ఒకటైన 'యాహూ' ఈ ఉద్యమానికి సంబంధించిన సమాచారం ఉన్న ఇమెయిళ్లను మధ్యలో అడ్డుకుంది అలాంటి సమాచారం పంపిన వర్తమానాలను “అనుమానాస్పద కార్యకలాపం'గా భావించి నిలిపివేసినట్లు తన వెబ్‌సైట్‌లో ఒక సందేశాన్ని పెట్టింది వివిధ ఇమెయిల్‌ చిరునామాల నుంచి సందేశాలను, వీడియో చిత్రాలను పంపినప్పటికీ వాటిని మాత్రమే అడ్డుకోవటాన్ని ఉద్యమ నిర్వాహకులు గమనించారు యాహూ దిగువ విధంగా మెసేజ్‌ పెట్టి మెయిల్‌ను పంపలేదని పేర్మొన్నది

  • మీ వర్తమానాన్ని పంపలేదు మీ ఖాతా నుంచి అనుమానాస్పద కార్యకలాపాలు నడుస్తున్నట్లు గుర్తించాము మీ ఖాతాను రక్షించేందుకు మీ వర్తమానాన్ని పంపలేదు ఒక వేళ ఇదే కొనసాగితే సహాయం కొరకు దయచేసి యాహూ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించండి అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాము ”

ఈ మెసేజ్‌ను చూసిన తరువాత 'థింక్‌ ప్రోగ్రెస్‌ అనే సంస్థ మరింత సమాచారం పంపాల్సిందిగా కోరుతూ యాహూకు మెయిల్‌ పంపింది “వాల్‌స్ట్రీట్‌ ముట్టడి' సమాచారం ఉన్న ఇ మెయిళ్లను నిరోధిస్తున్నట్లు యాహూ కస్టమర్‌ కేర్‌ ట్విటర్‌ ఖాతా అంగీకరించింది అయితే అది ఉద్ధేశ్యపూర్వకంగా చేసింది కాదని సమర్ధించుకుంటూ ఇలా పేర్శొన్నది ' అక్యుపై వాల్‌ఫ్టీట్‌ ఓఆర్‌జిని నిరోధించినందుకు మేము క్షంతవ్యులం మా స్పామ్‌ ఫిల్దర్లు నిరోధించాయి తప్ప. ఇది కావాలని చేసింది కాదు దీనిని పరిష్మరించాము ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వర్తమానాలు ఆలశ్యంగా చేరవచ్చు.” అని పేర్మొానగా యాహూ ప్రధాన ట్విటర్‌ ఖాతాలో ఇలా రాశారు ' యాహూ మెయిల్‌ వినియోగదారులు మరియు థింక్‌ ప్రోగ్రెస్‌ సంస్థ వారు సమస్యను పట్టుకున్నందుకు కృతజ్ఞతలు లోపాన్ని సరిచేశాము ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వర్తమానాలు ఆలశ్యంగా చేరవచ్చు ”

వాల్‌స్ట్రీట్‌ ఆందోళన వార్తలు, దృశ్యాలను అద్దుకోవటాన్ని సుప్రసిద్ధ నటుడు, దర్శక, నిర్మాత మైఖేల్‌ మూర్‌ విమర్శించారు. “మితవాద టీపార్డీ సభలతో పోల్చితే వామపక్షాల కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ పర్యావరణ సమస్యపై కొద్ది వారాల క్రితం వెయ్యి మంది అరెస్టయితే ఏమాత్రం కవర్‌ చేయలేదు అదే టీపార్టీ( అమెరికా ప్రతిపక్షం రిపబ్లికన్‌ పార్టీ సంస్థ) వారు వెయ్యిమంది అరెస్టయితే అది రోజంతా ముఖ్యమైన వార్త అయి ఉండేది ఇప్పుడు వాల్‌స్టీట్‌ ముట్టడి ఆందోళన గురించి కూడా ఒక్క వార్త ఉండటం లేదు అన్నారు వాల్‌స్రీట్‌కు చేరిన నిరసనకారుల గురించి తై వం కోటేశ్వరరావ

“హాక్టివిస్ట్‌ బృందం రహస్యంగా బయటి ప్రపంచానికి తెలియచేయాల్సి వచ్చిందని “'యాడ్‌బస్టర్స్‌'అనే పత్రిక సీనియర్‌ ఎడిటర్‌ మికా వైట్‌ వ్యాఖ్యానించాడు కార్బొరేట్‌ మీడియా తన అసలు రంగును బయట పెట్టుకుంటోందని పేర్ళొన్నాడు రష్యన్‌ ఆర్‌టి ఛానల్‌ ఈ ఆందోళనకు విసృత ప్రచారం కల్పించింది ఆ తరువాతే అమెరికన్‌ మీడియాకు కాక పుట్టిందని చెప్పవచ్చు ధనవంతులు, వాణిజ్యవార్తలను మాత్రమే రాసే 'ఫోర్స్స్‌ పత్రిక ఆశించినంత మంది “ముట్టడికి రాలేదని తన అక్కసును వెళ్లగక్కింది జనం లేని కారణంగా ముట్టడిని వక్షణంలో అయినా విరమించవచ్చు. అని కూడా దానిలో రాశారు అయితే ఈ వార్తలోని అంశాలు తమ పత్రికకు చెందినవి కాదని రాసిన విలేకరి అభిప్రాయాలుగా పరిగణించాలని పేర్కొన్నది

అమెరికా మీడియా చివరకు జీసస్‌ను కూడా తన చర్చల్లోకి లాగింది సిఎన్‌ఎన్‌ న్యూస్‌రూమ్‌ కార్యక్రమంలో వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా ఉన్న ప్రతినిధి కరోల్‌ కాస్టెల్లో 'వాల్‌స్టీట్‌ ముట్టడి ఉద్యమకారుల గురించి ఏసుక్రీస్తు ఏమని భావించి ఉండేవారని వీక్షకులను అడుగుతూ ప్రశ్నేమిటంటే జీసస్‌ వాల్‌స్టీట్‌ను ఆక్రమించేవారా? ఇది చాలా ఆసక్తికరమైన (ప్రశ్న అన్నారామె ఆక్లాండ్‌ ముట్టడిదారులు పోలీసులపై రంగు చల్లితే పోలీసులు భాప్పవాయువు ప్రయోగించారు ఆ సమయంలో ఏసుక్రీస్తు అక్కడ ఉండి ఉంటే ఏం చేసేవారని ఆమె ప్రశ్నించారు “నిజానికి కైస్తవులే కాదు, న్యూయార్క్‌లో ఇతర మతవిశ్వాసులు కూడా ముట్టడి ఉద్యమంలో చేరుతున్నారన్నారామె జుకొట్టి పార్కు (పీపుల్స్‌ ప్లాజా)లో ముస్లింలు నమాజు చేస్తే కొందరు యూదులు యోమ్‌ కిప్పూర్‌ (యూదు సంవత్సరంలో ముఖ్యమైన రోజు)ను జరుపుకున్నారంటూ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవాలనే వాంఛను జీసస్‌ తిరస్కరించాడు, పేదలు, అశక్తుల సంక్షేమాన్ని చూడాలని చెప్పాడు అయితే ఒకరికొకరు సాయం చేసుకొనే పౌరసమాజంపై ఏసుకు విశ్వాసం ఉంది తప్ప (ప్రభుత్వంపై లేదు అందువలన నిజంగా ఇప్పుడు ఏసు ఉండి ఉంటే నిరసనకారులతో కలిసి నడిచి ఉండేవాడు అని ఆమె ముగించారు మతాన్ని ఎలా ప్రభావితం చేసింది?

ఈ ఉద్యమం మతాన్ని కూడా కుదిపివేసింది పరిస్థితులు మరింత ముదరకుండా జనం వామపక్ష భావజాలంవైపు చూడకుండా క్రైస్తవ మతం (ప్రజల జీవితాలపై (ప్రభావం చూపే పరిజామాలపై వ్యాఖ్యలు, ప్రభావితం చేసేందుకు ప్రయత్నించటం చరిత్రలో అనేకసార్లు జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతోంది వాత్టితముట్టక రా

ప్రపంచ (ద్రవ్య వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించేందుకు రాజకీయ అధికార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని 2011 అక్టోబరు 24న వాటికన్‌ మతసాధికారుల మండలి పిలుపు నిచ్చిందంటే దానికి తగిలిన సెగ తీవ్రతకు అద్దం పడుతున్నది వాటికన్‌లో ఉన్న వివిధ మండళ్లలో ఒకటైన న్యాయం, శాంతి కమిటీ ఈ ప్రకటన చేసింది ఏ విధంగా అయినా సరే లాభం సంపాదించాలన్న వైఖరి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిందని పోప్‌ 26వ బెండిక్ట్‌ 2009లో ఒక ప్రకటన చేశారు సంస్కరణల క్రమం ఐక్యరాజ్యసమితి నుంచే ప్రారంభం కావాలని కూడా తాజా ప్రకటనలో వాటికన్‌ పేర్కొన్నది (ఈ ప్రకటన వెలుగులో అన్ని దేశాలలోని మతాధికారులు రంగంలోకి దిగి తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనటమే దీని లక్ష్యమని చెప్పనవసరం లేదు ) ద్రవ్య,ఆర్థిక విధానాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచవని, ప్రపంచ సంపదల పంపిణీ న్యాయంగా ఉంటుందనే హామీని సంస్కరణలు ఇవ్వాలని కూడా వాటికన్‌ పేర్కొన్నది పెట్టుబడి కదలికలపై అన్ని ఆంక్షలను ఎత్తివేయటాన్ని విమర్శిస్తూ ప్రపంచ ద్రవ్యమార్కెట్‌ను అజమాయిషీ చేసేందుకు కనీస నిబంధనలు ఉండాలని పేర్కొన్నది (గతంలో నిరాటంక పెట్టుబడిదారీ విధానాన్ని ఖండించిన వాటికన్‌ ఇప్పుడు నిబంధనలు, ఆంక్షలను తిరస్కరించే ఆర్థిక ఉదారవాదాన్ని కూడా విమర్శించింది ) వ్యక్తులుగా తమకేమి లాభం అనే ఉపయోగితావాద ఆలోచన ఎల్లవేళలా సమాజ హితానికి మంచిది కాదని పేర్కొన్నది ఈ పూర్వరంగంలోనే వాల్‌స్ట్రీట్‌ ఉద్యమ కేంద్రాలకు ఏసుక్రీస్తు కూడా వస్తారా అని మీడియాలో కొందరు చర్చ చేశారు వాటికన్‌ ప్రకటనపై కొందరు తమవైన వ్యాఖ్యానాలు, భాష్యాలు చెప్పారు ఆర్థిక వ్యవస్థపై అదుపును వ్యతిరేకించే వారిని విమర్శించిందని కొందరు, సమాజ హితం రాజకీయ ప్రాధమిక లక్ష్యంగా ఉండాలని, లావాదేవీల పన్ను విధించాలని వాటికన్‌ చెప్పిందని కొందరు అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న ప్రదర్శనలకు సూటి ప్రతిస్పందనగా తమ ప్రకటనను చూడరాదని మతాధికారుల మండలి కార్యదర్శి బిషప్‌ మారియో టోజో వ్యాఖ్యానించారు మేం కొన్ని అభిప్రాయాలను వెల్లడించటం యాదృచ్చికం మాత్రమే, అయినా ఈ ్రతిపాదనలన్నీ సహేతుకత ప్రాతిపదికన చేసినవే అన్నారు తాము 99శాతపు జన కార్యకర్తలమని వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమకారులు చెప్పింది సరైనవే అని పరోక్షంగా వాటికన్‌ అంగీకరించటమే ఇది అంత మాత్రాన ఇదేదో ఉద్యమ సానుకూల ప్రకటన అనుకోరాదు పక్కా వ్యూహంతో విడుదల చేసింది టా వం కోటిళ్ళావు

వాటికన్‌ (ప్రకటన పచ్చి మితవాదులకు నిరుత్సాహం కలిగించింది ఎందుకంటే అది తమ మాదిరి ప్రపంచీకరణను ఏకపక్షంగా భుజానికి ఎత్తుకోలేదు చేదుమాత్రకు పంచదారను పూని మింగించేందుకు యత్నించిన మాదిరి అది ఉంది అయితే ప్రపంచీకరణ విధానాలను విమర్శించటాన్ని మాత్రమే జనం స్వీకరిస్తే ప్రమాదం అని భయపడి దాని ప్రాధాన్యతను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జార్జి వెయ్‌గెల్‌ అనే కాధలిక్‌ రచయిత నేషనల్‌ రివ్యూ పేరుతో నిర్వహించే తన బ్లాగ్‌లో వాటికన్‌ మండలిపై మండి పడ్డాడు మతాధికారుల మండలి వాటికన్‌ అధికారిక వ్యవస్థలోని అనేక భవనాలలో ఒక చిన్న గది వంటిది దాని (ప్రకటన పోప్‌ చేసిందిగా పరిగణించనవసరం లేదు వాటికన్‌ తరఫున, కాథలిక్‌ చర్చ్‌ తరఫునగానీ మాట్లాడేందుకు దానికి అధికారం లేదు అందువలన వాల్‌స్ట్రీట్‌ ముట్టడి గురించి వారు ప్రవచించజాలరు దాని గురించి చెప్పేవారు పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిగాని లేదా బాధ్యతా రహితంగా మాట్లాడే ధోరణి గలవారైనా అయి ఉండాలి” అని నిందించాడు అయితే ఉదారవాదులైన కాథలిక్‌ రచయితలు కూడా తమ గళం విప్పి మితవాదులను ఎదుర్కొన్నారు కాథలిక్‌ సామాజిక బోధనలు ఏ ప్రమాణంతో చూసినా 'పురోగామి” అంశాలే మతాధికారుల మండలి చిన్న కార్యాలయం కాదు అనేక సంవత్సరాలుగా న్యాయం, సౌహార్దతలపై కాధలిక్‌ ఆలోచనా ధోరణిని ప్రతిబింబించటంలో ముందు పీరీన ఉంది అది ప్రకటించిన పత్రం పోప్‌జాన్‌-23, పాల్‌-6, జాన్‌పాల్‌-2 చెప్పిన అంశాలు, పోప్‌బెండిక్ట్‌ 2009లో చేసిన (ప్రకటన మూలాలు దీనిలో ఉన్నాయని” పేర్మాన్నారు

అయితే సానుకూల దృక్పథంతో చూసే వారికి ఈ దృశ్యం కనపడుతుంది నిజానికి మతాధికారుల మండలి ప్రకటన ప్రపంచీకరణ, దాని దుష్ఫలితాలను జనం చేత అంగీకరింపచేయించేందుకు ప్రయత్నించింది 'సహేతుకమైన నిబంధనలూ “నామమాత్ర అధికారాలు” ఇస్తే పెట్టుబడి సులభంగా వేగంగా ప్రయాణిస్తుందని ఆ పత్రంలో పేర్కొన్నారు ప్రపంచీకరణ వలన జరిగే వాని గురించి తక్కువగా చెబుతూ లాభాల గురించి ఎంతో వర్ణించింది బహుళజాతి సంస్థల వ్యవస్థలను నెలకొల్పటం కూడా సులభసాధ్యమే అని ఎలాంటి మొహమాటం లేకుండా వాటిపై తన మోజును వెల్లడించింది కొద్ది మందితో కూడిన 'ప్రపంచాధికార వ్యవస్థకు బదులు “భాగస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామిక చట్టబద్దత' వంటి తియ్యటి మాటల మాటున “బలహీనులపై పెత్తనం చేసే ప్రస్తుత అధికార బలాబలాలను అస్థిరం గావించేవే కావచ్చు కూడా, అయినా నూతన ఆలోచనలను ్రతి వాల్‌స్ట్రీట్‌ ముట్టడి న్‌ నన న నగా!

పాదించటానికి మనం భయపడరాదు అవి భూమిలో విత్తనాలు చల్లటం వంటివి అవి మొలకెత్తి త్వరగా ఫలాలను ఇస్తాయని మనం ఆశిద్దాం మన మతనాయకులు మమ్మల్ని సవాలు చేయకుండా ఉంటే ఒక మాట, కారుణ్యాన్ని ప్రేమించటం, న్యాయం చేయటం మనంగాకపోతే ఎవరు చేస్తారు? అని కూడా ఆ పత్రం ప్రశ్నించింది దారిదనిర్మూలన వంటి సామాజిక అంశాలను పేర్కొంటూ ఓటర్లకు మార్గదర్శక సూత్రాల పేరుతో 2012 అధ్యక్ష ఎన్నికలకోసం అమెరికా రోమన్‌ కాధలిక్‌ బిషప్పులు ఒక ప్రకటన చేశారు “ఇది బాధ్యతకు సంబంధించిన ఒక కసరత్తు మాత్రమే కాదు దానికి అతీతంగా భవిష్యత్‌ తరాల కోసం ఉద్దేశించింది కనుక మానవుల గొప్పతనం, మంచికోసం పాటు పడే సామర్థ్యం ఎన్నడూ అంతరించిపోదనే మంచి భవిష్యత్‌పై ఆశ, విశ్వాసం ఉంచండి ” అని పేర్ళొన్నారు వామపక్ష క్రైస్తవ వాయకుడిగా పరిగణించబడే జిమ్‌ వాలిస్‌ “శాంతికోసం ప్రార్థన మరియు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం వద్ద ఏసుకోసం ఎదురు చూపు పేరుతో ఒక వ్యోసం రాసీ పరోక్షంగా తన మద్దతు తెలిపాడు * నూతన ఉద్యమంగా పిలవబడుతున్న వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఇప్పుడు రాజకీయ, ఆర్థిక శక్తుల పీరాలతో సహా పెద్ద నగరాల నుంచి శివారు ప్రాంతాలు, చిన్న పట్టణాల వరకు దేశమంతటా వ్యాపించింది ప్రతి ఉీదంతంలోనూ గాయపదిన పౌరుల మనోభావాలను మన జాతీయ రాజకీయ, ఆర్థిక నాయకులు వమ్ము చేశారన్నది స్పష్టం పౌరులు తమ గోదు ఏనాాలని కోరుకుంటున్నారు నిరసన అన్నతరువాత ఉత్తేజం కలిగించేశక్తులు ఉంటాయి అది ఇతరులకు బాధ, కలిగించవచ్చు అది సహజం ఉద్యమం జరుపుతున్న నిరసనకారుల గురించి * ఎప్పుడైతే పేదల పక్షాలన ఉంటారో వారు జీసస్‌తో ఉన్నట్లే, ఎప్పుడైతే అన్నార్తులతో ఉంటారో అప్పుడూ వసుతో ఉన్నట్లే ఇల్లు, ఉద్యోగంలేని వారీ కోసం ఎవరైతే నిలబడతారో పోరు కూడా: జీసస్‌తో ఉన్నళ్లే ప్రస్తుత సమస్యలకు బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలదే బాధ్యతని ఎవరు మాట్లాడతారో వారధి మూటలు ఏసు మాదిరి నాకు ధ్వనిస్తాయి, బైబిల్‌ ప్రవక్తలు. నా ముందున్నట్లే భావిస్తాను " అని జిమ్‌ వాలిస్‌ పేర్కొన్నాడు ఇంకా ఇలా రాశాడు * లక్షలడాలర్ల అప్పులతో ఉన్న కాలేజీ విద్యార్థులకు ఉద్యోగం దొరకటం లేదు రుణవాయిదాలు చెల్లించలేని వారి ఇళ్లను బ్యాంకులు వేలం వేసిన కారణంగా అనేక కుటుంబాలు కొంపాగోడు కోల్పోయాయి. ఉద్యోగాలు ఉన్నప్పటికీ కోట్ల మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు ప్రభుత్వమైనా వాణిజ్య సంస్థలైనా ప్రజలకే సేవచేయటానికి నిజంగా శై |. ఎం కోటేశ్వరరావు

ఉద్దేశించినవి అయితే, చూస్తుంటే కనీసం మానవ దయ కూడా కనిపించటం లేదు, ఏమాత్రం జవాబుదారీతనం లేకుందా ఉంది ఎన్నడూ లేని విధంగా సమాజంలోని అ(గ్రస్థానంలో ఉన్న ఒక శాతం మంది దిగువన ఉన్న 99శాతం మంది మొత్తం సంపదలకంటే ఎక్కువ కలిగి ఉండటం సామాజిక స్థిరత్వం, శాంతికి ముప్పు కలిగిస్తుంది కారుణ్యం కలిగిన క్రైస్తవులు నిరసనకారులకు మద్దతు తెలపాఠి చర్చ్‌ నిర్వాహకులు వారితో మాట్లాడండి, వారికి అవసరమైన ఆతిధ్యాన్ని పవిత్రమైన కానుకలుగా ఇవ్వండి, వారితో ఉండండి, స్నేహం చేయండి ముట్టడికారులు మార్పును కోరుతున్నారు, ఏదోఒకటి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, అది మనందరకు ఉత్తేజం కలిగించాలి అన్నాడు ఆ(ఫ్రో-అమెరికన్‌ అయిన టిమ్‌ కింగ్‌ సామాజిక సేవకుడిగా గుర్తింపు

పొందారు ఆయన క్రైస్తవ భక్తుడు ముట్టడి ఉద్యమకారులతో కలసి రాత్రుళ్లు పార్కుల్లో ఉన్నారు తన అనుభవాలను రాశారు 'ఈ ఉద్యమంలో దేవుడ్ని చూడాలన్నదే నా ఒక లక్ష్యం వనాల్లో కంటే వీధుల్లో దేవుడిని కనుగొనటం సులభం అని నేను ఎల్లవేళలా నమ్ముతాను మనం దేవుడ్ని కొలిస్తే అవసరం అయినవారికోసం మార్గం చూపుతాడు, అలాంటివారికోసం నిలబడినవారితో ఆయన ఉంటాడు అనేక మంది నిరసనకారులకు మతంతో చెడ్డ అనుభవాలున్నాయి. అయితే మతం చేసినదానిని విభిన్నంగా చూసేందుకు వారు నిజంగానే సిద్దంగా ఉన్నారు * అని టిమ్‌ కింగ్‌ పేర్ళొన్నారు విద్యార్థి రుణ ముట్టడి ఉద్యమానికి నాంది

ఈ ఉద్యమాన్ని తొలుత ఉపేక్షించి తొక్కి పెట్టిన ఐడా పత్రికల్లో న్యూయార్క్‌ టైమ్స్‌ ఒకటి అది రెండున్నర నెలల తరువాత ఒక సమీక్ష రాసింది దానిలో మిగతా విషయాలెలా ఉన్నా కొన్ని అంశాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి దాని కథనం ప్రకారం వాల్‌ప్రీట్‌ ఉద్యమం తాము 99శాతం మందిలో ఉన్నామని విద్యార్థుల మదిలో నాటింది సెప్టెంబరు-అక్టోబరు మధ్య 99శాతం మంది ఉద్యమం గురించి సమాచారం కోసం వెతికే వారు ఏడు రెట్లు పెరగటం అత్యంత ముఖ్యమైన అంశం ఒక శాతం, 99శాతం అనే పదాలు డిక్షనరీలో చేరాయని న్యూయార్క్‌లోని సిటీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జుడిత్‌ స్టెయిన్‌ పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యార్థులెందుకు ఉద్యమంలోకి దూకటం లేదని అనేక మందికి సందేహం కలిగింది, వాల్‌ష్టేట్‌ముట్టడి. ఉరి

కొంత మంది ఆ ప్రశ్శను కూడా లేవనెత్తారు. సెప్టెంబరు 17న వాల్‌స్టీట్‌ ఉద్యమం ప్రారంభమైన న్యూయార్క్‌లోని జుకొట్టి పార్కులోనే నవంబరు 21న విద్యార్థి నాయకులు సమావేశమై “విద్యార్థి రుణ ముట్టడి(నిరాకరణ) జాతీయ ఉద్యమానికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞను కూడా రూపొందించారు. దానిపై దేశ వ్యాపితంగా కనీసంగా పదిలక్షల మంది విద్యార్థులు సంతకాలు చేసిన తరువాత అప్పులు చెల్లించటాన్ని నిలిపివేయాలని కోరాలని నిర్ణయించారు. 'ముట్టడి ఉద్యమం ప్రారంభం నుంచి రుణ(గ్రస్తులైన విద్యార్థుల వ్యధా పూరిత, అవమానాలపాలైన గాధలు ఎన్నో విన్నాము తమ జీవిత కాలంలో ఆ రుణాలను తీర్చలేమన్నది వారి అభిప్రాయం, అందుకే ఈ ఉద్యమానికి పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని” న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఆండ్రూ రోస్‌ ప్రకటించారు ముట్టడి ఉద్యమంలో విద్య, సాధికార బృందంలో ఆయన చురుకైన కార్యకర్తగా ఉన్నారు

సంతకాల సేకరణ సందర్భంగా కళాశాల విద్య యువతను ఎలా రుణ ఊబిలో దించుతోందో వివరించాలని, ఉన్నత విద్యకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని తెలియ చెప్పాలని, వడ్డీలేని విద్యారుణాలకు డిమాండ్‌ చేయాలని కూడా నిర్ణయించారు ప్రయివేటు సంస్థలు తమ ఆర్ధిక వివరాలను బహిరంగ పరచాలని, రుణం తీసుకున్నవారితో పాటు వారికి మద్దతుగా ఇతరులతో కూడా 'ప్రతిజ్ఞపై సంతకాలు చేయిస్తున్నారు. ఇప్పుడున్న అప్పులను పూర్తిగా రద్దు చేయాలని కూడా తాము కోరటం లేదని చెప్పాలని పేర్కొన్నారు తీసుకున్న అప్పును తీర్చాలనే నైతిక సూత్రాన్ని అమెరికన్లు బలంగా నమ్ముతున్నందున అప్పులను మొత్తంగా రద్దు చేయాలన్న డిమాండ్‌కు ప్రజల నుంచి మద్దతు రాదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు సగటున అండర్‌ గ్రాడ్యుయేట్‌ రుణం 86వేల డాలర్లు ఉంటుందన్న ప్రొఫెసర్‌ రోస్‌ విద్యా రుణాల గురించి ఇంతనరకు ఎన్నో విషయాలు మాట్లాడటం తప్ప కార్యాచరణ లేదన్నారు. విద్యార్థులకు వడ్డీలేని రుజాలు ఇవ్వాలి, ఇప్పుడున్న అప్పులను రద్ద చేయాలి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు 70బిలియన్‌ డాలర్లను (గ్రాంటుగా ఇవ్వాలి, పౌర తనిఖీలకు ప్రయివేటు విద్యాసంస్థలు తమ ఖాతాలను అందుబాటులో ఉంచాలి అనే డిమాండ్లను తాము ముందుకు తెచ్చినట్లు రోస్‌ చెప్పారు పరిస్థితులు సజావుగా ఉన్నపుడు కూడా దశాబ్దాల తరబడి విద్యా రుణాలను చెల్లించటం ఇబ్బందే అన్నారు ఇప్పుడు ఎడతెగని నిరుద్యోగం నెలకొన్నందున అప్పులు చెల్లించాల్సిందే అంటే నైతికంగా ఎలా సమర్థించాలని ప్రశ్నించారు తాము సంపూర్ణమైన రాజకీయ మార్చును కూడా కోరుతున్నందున ఉమ్మడిగా శ లా సా ఎం కోటేశ్వరరావు

బేరసారాలాడే ఒక సాధనంగా ఉద్యమంలో ఎలా పనిచేయాలో విద్యార్థులు నేర్చుకుంటారని ముట్టడి ఉద్యమ మరో కార్యకర్త డాసన్‌ చెప్పారు విద్యకు ముఖ్యంగా ఉన్నత విద్యకు అమెరికాలో చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది హైస్కూలు డిప్లోమా, కళాశాల పట్టా ఏది పుచ్చుకున్నా నానాటికీ శ్రమ మార్కెట్లో వాటి విలువ పడిపోతోంది కళాశాలలకు వెళ్లే అమెరికన్లు మూడు విధాలుగా నష్టపోతున్నారు. పన్ను చెల్లింపుదార్లుగా విద్యాబడ్జెట్‌ భారాలను మోయటం. ఒకటి విద్యను కొనుగోలు చేసి చదువుకున్నందుకు గాను ఏడాదికి వినియోగదారు రూపంలో 17వేల డాలర్లు చెల్లించాల్సి రావటం, ప్రతి ఒక్కరికీ కనీస విద్యారుణం 28వేల డాలర్లు ఉందటం రెండవదైతే ఒక కార్మికుడిగా తగినంత ప్రతిఫలం పొందలేకపోవటం మూడవది 1970 దశకంలో ప్రతి పదకొండు మంది విద్యావంతులలో డిగ్రీ ఉన్నవారు ఒకరు ఉందే వారు, ఇప్పుడు ప్రతి పదిమందిలో ముగ్గురు ఉన్నారు స్కూలు డిప్లోమా, కళాశాల, విశ్వవిద్యాలయ డిగ్రీ ఉన్నా వారి జీవితాలు గొర్రైతోక బతుకుల్లాగే ఉంటున్నాయి అమెరికాలో ఒక అంచనా ప్రకారం విద్యారుణాల బకాయిల మొత్తం ఒక లక్ష కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో 51లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఈ మొత్తం అమెరికాలోని క్రెడిట్‌ కార్డుల ద్వారా పౌరులు తీసుకున్న అప్పులకు సమానమని యుఎస్‌ఏ టుడే పత్రిక వర్జీంచింది సగటున తొమ్మిదిశాతం విద్యార్థులు గతేడాది అప్పులు చెల్లించలేక చేతులెత్తేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు 2009లో అలాంటి వారు కేవలం రెండుశాతమే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవారిలో గ్రాడ్యుయేట్లే ఎక్కువ మంది ఉన్నారు ఇదే ముట్టడి ఉద్యమానికి వారిని పురికొల్చిందని వేరే చెప్పనవసరం లేదు విద్యార్థులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి వినూత్న పోరాట రూపాలను ముందుకు తెస్తున్నారు. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఫీజుల సమస్యలపై ఉద్యమిస్తున్న విద్యార్థులు సాయుధ పోలీసుల వద్దకు వెళ్లి వారి హెల్మెట్లను ముద్దాడటం, రక్షణ షీల్డులను శుభ్రపరచటం, పుష్పాలను అందించటం వాటిలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఉదంతాలు కూడా విద్యార్థులను వీధుల్లోకి రప్పిస్తున్నాయి డేవిస్‌ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ లిండా కటేహీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ 84వేల మంది విద్యార్థులు ఒక పిటీషన్‌పై సంతకాలు చేశారు అహింసాయుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై చర్యకు పోలీసులను రప్పించినందుకు నిరసనగా ఛాన్సలర్‌ రాజీనామా డిమాండ్‌ చేశారు నవంబరు 18న విశ్వవిద్యాలయ మైదానంలో కూర్చొని ఒకరి వాల్‌స్ట్రీట్‌ ముట్టడి శీర్‌

చేతులొకరు పట్టుకొని తలలు వంచుకున్న విద్యార్థులపై అకారణంగా ఒక పోలీసు మిరియపు రసాన్ని చిమ్మాడు విద్యార్థుల నుంచి హెల్మెట్లు ధరించిన పోలీసులకు ఏ రకమైన వాని ఉంటుందని ఛాన్సలర్‌ భావించారని ఆ పిటీషన్‌లో విద్యార్థులు ప్రశ్నించారు డేవిస్‌ విద్యార్థులు చేసిన నేరమల్లా ముట్టడి ఉద్యమ కారులకు మద్దతు తెలపటమే ముట్టడి ఉద్యమకారులను, వారికి మద్దతు ఇచ్చేవారిని ఉపేక్షించేది లేదని, విద్యార్థులను భయపెట్టేందుకే ఈ దాడి జరిగిందన్నది స్పష్టం అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు మేయర్లుగా ఉన్న అన్ని చోట్లా ఉద్యమకారులపై బల ప్రయోగం జరుగుతోంది ఇలాంటి చర్యలు కూడా విద్యార్థులను ఉద్యమాలకు పురికొల్పుతున్నాయి అమెరికా రాజకీయ తరగతి ప్రజానుకూల చర్యలకు ధైర్యం చేయకుండా లోటుబడ్జెట్‌పై చర్చలు జరపటం, పోరాడేవారిని దేశవ్యతిరేకులుగా చిత్రించటం, విద్యార్థుల రుణగ్రస్తతను తమ లాభాల బంగారు గనిగా భావిస్తున్నారని ప్రొఫెసర్‌ రోస్‌ చెప్పారు బ్యాంకులకు వ్యతిరేకంగా అన్ని తరగతులనుంచి వ్యక్తమౌతున్న ఆగ్రహం 1890, 1980 దశకాల్లో మాదిరి గొప్ప ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి దారితీయిస్తుందని అన్నారు అమెరికా విద్యార్థులు ఈ విధంగా ఉద్యమించటానికి ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు దానికి గత కొన్ని దశాబ్దాలుగా ముదిరిన పరిస్థితులే దారి తీయించాయి చిలీ, కొలంబియాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులు కూడా వారికి స్పూర్తి నిచ్చి ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు (ప్రారంభించిన ఉద్యమ సెగ ప్రభుత్వానికి తగిలింది విద్యామంత్రి అర్నే డంకన్‌ నవంబరు నెలాఖరులో అధికారులను సమావేశ పరచి విద్యా ఖర్చు, విద్యార్థుల రుణ భారాన్ని తగ్గించేందుకు చర్యలను సూచించాలని కోరినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది నాలుగింట ముగ్గురు అమెరికన్లు కళాశాల విద్య భరించలేమని భావిస్తున్నారని మంత్రి అన్నారు ఒబామా సర్కార్‌ విద్యార్థులను బుజ్జగించేందుకు కొన్ని తాయిలాలను ప్రకటించింది ఆదాయ ప్రాతిపదికన రుణాలు చెల్లించే వెసులుబాటు, కొద్దిగా వడ్డీ రాయితీ వాటిలో ఉన్నాయి వాల్‌స్ట్రీట్‌ ముట్టడి-ఉపాధ్యాయులు ఇంతటి ఉద్యమం జరుగుతుంటే గణనీయమైన సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఉద్యమంపై ఏ వైఖరి తీసుకున్నారన్నది సహజంగానే తలెత్తే ప్రశ్న అమెరికాలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఒప్పందాలు మనమాదిరిగా ఉండవు శ | వెం కోటెశ్వరూవు

తమకు సంబంధించిన అంశాలపై చట్ట ప్రకారం సమ్మె హక్షును ఉద్యోగులు ఒప్పందాలలో అట్టి పెట్టుకుంటారు ఇతర అంశాలపై తాము సమ్మెలకు దూరంగా ఉంటామని ప్రత్యేకంగా యాజమాన్యాలు బలవంతంగా పట్టుబట్టి మరీ రాయించుకుంటాయి అందుకే ఒక తరగతి సమ్మె చేస్తే మరొకరు దూరంగా ఉంటారు ఇప్పుడు కూడా ఆ ఒప్పందాలే అడ్డం వస్తున్నాయి. అయితే ప్రజా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లినపుడు అలాంటి నిర్బంధాలు, నిరంకుశ ఒప్పందాలు గాలికి ఎగిరిపోతాయన్నది వేరే విషయం అధికారికంగా యూనియన్లు ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ, 98శాతంలో తామూ భాగమే అని భావిస్తున్న టీచర్హు విద్యార్థులు. ఖాలీ సమయాల్లో ముట్టడి కేంద్రాలు ప్రదర్శనలకు హాజరై తమ సంఘీభావం తెలిపారు ఉద్యమం గురించి విద్యార్థులకు వివరించాలని, ఉద్యమ వార్తలను అందించే వెబొసైట్లు, పత్రికలను: ఖాలీ సమయాల్లో చదవాలని టీచర్లు చెప్పాలని యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు ; పార్ట్‌బైమ్‌ టీచర్లుగా ఉన్న అనేక మంది ఖాళీ సమయాల్లో ఉద్యమ కార్యకర్తలుగా ఉన్నారు

న్యూయార్క్‌లో పారశాలలను తెరిచే ముందు ప్రభుత్వ అధికారులు టీచర్లు తల్లిదండ్రులతో సమావేశాలు జరిపి సమస్యలను తెలుసుకోవటం ఆనవాయితీ అలాంటి సమావేశం 2011 అక్టోబరు చివరి వారంలో జరిగింది దానికి హాజరైన టీచర్లు తమ సమస్యలను సామూహికంగా ఏకరువు పెట్టటంతో సభ రసాభాస అయింది విద్యారంగంలో ప్రజాస్వామిక విధానాలు పాటించాలని, టీచర్ల భాగస్వామ్యం పెరగాలని డిమాండ్‌ చేశారు మన దెశంలో మాదిరే అక్కడి విద్యాశాఖలో కూడా ఆచరణతో సంబంధంలేని విద్యా విధానాలను రుద్దటాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు తరగతిలో ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య, టీచర్ల తొలగింపు, విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి టీచర్లకు గ్రేడు నిర్ణయించటం వంటి అంశాలు టీచర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి స్కూళ్ల ఛాన్సలర్‌, నగర మేయర్‌ సమాజంలోని ఒక శాతానికి ప్రతినిధుల వంటి వారైతే తాము, విద్యార్థులు, తల్లిదండ్రులు 99శాతంలోని వారిమని ఒక టీచరు చెప్పారు మొత్తం మీద వాల్‌స్ట్రీట్‌ ముట్టడిని తలపించే విధంగా అనేక చోట్ల ఇలాంటి సమావేశాలు ముగిశాయి అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ అధ్యక్షుడు రాండీ వెయిన్‌గార్జెన్‌ తరచూ న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌ ముట్టడి కేంద్రాన్ని సందర్శించి మద్దతు తెలిపారు ఇటీవల ఫెడరేషన్‌ తన లక్ష్యాల డాక్యుమెంట్‌ను నవీకరించింది దానిలో ఒకశాతంగా ఉన్న ధనికుల గురించిన (ప్రస్తావన చేర్చారు తాము కూడా దేశంలోని ఆర్థిక అసమానతల గురించి ఆలోచిస్తున్నామని వెయిన్‌ గార్టెన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 47

ఇళ్ల ముట్టడి-సమస్య తీవ్రత అమెరికా ఆర్థిక సంక్షోభం సామాన్యులను వీధుల్లోక్షి దప్పించటంలో అనేక అంశాలు ప్రభావితం చేశాయి, డాటిళో ఒకటి రుణ వాయిదాలు చెల్లించలేని వాధి ఇళ్లను బ్యాంకులు వేలం వేయటం, అమ్ముడుపోని వాటిని స్నాదీనం జేసుకోవటం. అలాంటి బాధితులకు బాసటగా వేలాన్ని అద్గుకోవటంళతో పౌట్లు బ్యాంకులు స్వారీనం జేసుక్తున్న ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు పూర్వపు యజమానుజకు తోద్సడేందుకు ముట్టడి ఉద్యమకారులు ముందుకు వచ్చారు అమెరికా అర్థిక సంక్షోభం అసలు ఈ సమస్యతోనే ప్రారంభమైంది,ప్రభుత్వం రుణాల వసూఖుకు గట్టి చర్యలు తీసుకోవటంలేదని తాజాగా ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు అధికారులు చిర్రుబుర్రులాడుతున్నారు ఒక నివేదిక ప్రకారం 2006కు ముందు గృహరంగంలో ఏడులక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉండగా ఇప్పుడు వాటిలో సగం పోయింది తాజా అంచనా ప్రకారం తనఖా(రుణం తీసుకొని కొనుగోలు చేసిన) ఇళ్లలో 29శాతం ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోయాయి 2007 నుంచి కనీసం కోటీ 40లక్షల ఇళ్లు వేలానికి వచ్చాయని అవి ప్రతినాలుగింటిలో ఒకటని మరొక నిపుణుడి అంచనా ఇళ్ల ధరలు మరో 20శాతం పడిపోతాయని ఫెడరల్‌ రిజర్వు అంచనా ఇళ్ల సమస్య సామాజికాంశంగా మారనుందని, ముట్టడి ఉద్యమం మరింత పెరగవచ్చని కొందరు హెచ్చరించారు ఈ పూర్వరంగంలో స్వ శా నా ఖు పస్‌ జ లో గ్ల సల. మా భో | ల / ఎ ల గ | (. చి స ఎం కోటేశ్వరరావు

వేలానికి వచ్చి తన ఆధీనంలో ఉన్న ఇళ్లను అద్దెకు ఇవ్వాలని (ప్రభుత్వం ఆలోచిస్తోంది త్వరలో ఒక పైలట్‌ పధకాన్ని ప్రారంభించాలని తలపెట్టింది కొంత మేరకైనా పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవటానికి ఇదొక మార్గమని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ బెన్‌ బెర్నాన్‌కే సూచించాడు ఇంకా స్వాధీనం చేయని గృహాలు మరో 20లక్షలు ఉన్నాయని, వాటిని మార్కెట్‌ విలువ కంటే తక్కువకు అమ్మితే సమస్య మరింత దిగజారుతుందని ఆందోళన పడుతున్నారు కమ్యూనిస్టు, వామపక్ష ప్రజాతంత్ర మేథావుల స్పందన ఎలా ఉంది? ముట్టడి ఉద్యమంపై అమెరికా కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు శామ్‌ వెబ్‌

పార్టీ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో తన విశ్లేషణ రాశారు దానిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి ' ఇదొక అనిశ్చిత ఉద్యమం అమెరికాలో వర్గపోరాటం తీవ్రమౌతున్నది ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది ఒకవైపున మెజారిటీ అమెరికన్లు, మరోవైపు ఒకశాతంలో ఉన్న బడా బహుళజాతి కార్పొరేషన్లు కొంతకాలంగా ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ, ఎన్‌ఏఏసిపి, జాబ్స్‌విత్‌ జస్టిస్‌, మువ్‌ఆన్‌ తదితర సంస్థలు పని చేస్తున్నాయి. రీబిల్డ్‌ ద డ్రీమ్‌, ఆక్యుపై ఉద్యమం, బాటమ్‌లైన్‌ వంటివి కొత్త ఉద్యమాలు ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తాయనేదే సమస్య వాల్‌స్టీట్‌ ముట్టడి ఉద్యమం పోరాటాన్ని వేగవంతం చేసే అత్యంత నాటకీయ పరిణామం దాని రాజకీయాలు శుద్ధమైన ఏ రాజకీయ తరగతిలోనూ ఇమిడేవికాదు, దాని నిర్మాణ పద్దతులు సాంప్రదాయ ఉద్యమాలకు భిన్నం ఏ ఒక్క 'ఇజం” లేదు దానిలో పాల్గొనేవారందరూ తమను తాము అభ్యుదయకర, వామపక్షం వైపు అని ముద్రవేసుకోకపోవచ్చు గాని అత్యధికులు ఆ తరగతివారే

ముట్టడి ఉద్యమకారులు నిర్ధిష్టమైన రాజకీయ డిమాండ్లను రూపొందించలేదు. వారు

వాల్‌స్ట్రీట్‌ వాషింగ్ట్‌న్‌పై అదుపున్న (గగ్రవ్య ప్రభువులపై అసంతృప్తి చెందినవారు

కొంతమంది దీనిని పెద్ద లోపంగా చూస్తున్నారు. కానీ నేను అలా చెప్పను ఈ ఉద్యమం

ప్రారంభదశలో ఉంది, విభిన్న రాజకీయ భావాలు కలిగిన వారిని దగ్గరకు చేర్చింది

దాని చర్యలద్వారా వాల్‌స్టీటొను వెలుగులోకి తేవటం ద్వారా మితవాదుల (టీ పార్టీ)

ప్రభుత్వ వ్యతిరేక కబుర్ల నుంచి జాతీయ చర్చను మళ్లించింది. ద్రవ్య పెట్టుబడులకు

వ్యతిరేక పోరాటం ఏదో వామపక్ష సమస్య అని గాక అందరి సమస్య అని పోరాటాన్ని

మలుపుతిప్పింది

వాళష్టటమట్టద క

ముట్టడి ఆందోళనలు ఆకస్మికంగా తలెత్తినట్లు కనిపించవచ్చుగాని వాస్తవం కాదు ప్రపంచస్థాయిలో కైరో నుంచి ఏథెన్స్‌ ఇంకా అనేక చోట్ల ప్రపంచ స్థాయిలో వర్గ, (ప్రజాస్వామిక ఉద్యమాలు గత కొద్ది నెలలుగా జరగటాన్ని చూస్తున్నాము మన స్వంత పెరడులో(అమెరికాలో) విస్‌కాన్సిన్‌, ఇండియానా, ఓహియో తదితర చోట్ల పెద్ద ఆందోళనలు వచ్చిన విషయం తెలిసినదే ముట్టడి ఉద్యమం ఈ విధంగా దేశీయ, అంతర్జాతీయ ఉద్యమాల నుంచి పెరిగి స్ఫూర్తి పొందింది దీనిలో అత్యధికులు యువకులు వారీ ఉద్యమాన్ని శక్తివంతం గావించటంతో పాటు కొత్తగాలి, తాజాదనాన్ని అందించారు వారు బ్యాంకుల అధికారాలను కుదించమనటమే కాదు, మన రాజకీయాలను 'ప్రజాస్వామ్యబద్దం కావించాలని కోరుతున్నారు అంతేకాదు తమ జీవితాలను మార్చుకోవాలనుకుంటున్నారు. వారు కోరుకుంటున్నవి కొన్నింటిని చూస్తే అధికార వాస్తవాలకు దూరంగా ఉండవచ్చుగాని మన పరిమిత సాంస్కృతిక, రాజకీయ ఊహలను వారు వెల్లడిస్తున్నారనవచ్చు విశాల యువజనోద్యమ నిర్మాణానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది 1960 దశకంలో సంభవించిన యువజన తిరుగుబాటును మరిపించగలదు ఆ ఉద్యమం మన రాజకీయాలు, సంస్కృతిపై పెద్ద ముద్ర వేస్తుంది తమ భవిష్యత్‌ శూన్యంగా ఉన్న మిగతా యువతను ఉద్వమంలో భాగస్వాములను గావించి మరింత శక్తివంతం గావించటం ఒక తక్షణ సవాలు ఇప్పుడు గాని తరువాత గానీ గణనీయమైన విజయం సాధించగలమనే ఏదైనా ఆశ ఉంటేన వారు పాల్గొనటం ఆధార పడి ఉంటుంది వారంటే కళాశాల విద్యార్థులు కూదా, వారింకా విశాల స్థాయిలో ఉద్యమంలోకి దూకలేదు నిరుద్యోగం, విద్యారుణాల వంటి సమస్యలున్న వారు ఉద్యోగం, సమానత్వం, శాంతి కోసం ఉద్యమాల్లోకి వచ్చే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్నాయని ఎవరైనా అనుకోవచ్చు. అది దానంతటకదే జరగదు అవే పరిస్థితులు వ్యక్తిగతమైన అవకాశాలను సొంతం చేసుకోవాలనే సంకుచిత ధోరణులకు కూడా దోహదం చేయవచ్చు తమ ప్రత్యేక ఆందోళన, పద్దతులను వ్యక్తం చేయటానికి తమవైన పద్దతుల్లో సంఘనిర్మాణం చేసుకొనేందుకు అవసరమైన మద్దతును విశాల ఉద్యమం అందించటం వంటి అనేక అంశాలు యువత ఉద్యమంలోకి వచ్చే అవకాశాలను ప్రభావితం చేస్తాయి ముట్టడి ఉద్యమం సవాళ్లను ఎదుర్కోవటం తప్పదు చిన్నవైనా స్పష్టంగా డిమాండ్లను రూపొందించే రూపంలో కూదా అవి ఉండవచ్చు యువతలో ఉద్యమాన్ని విస్తరించటం ఎలా అన్నదే పెద్ద సమస్య ఇతర కీలకమైన శక్తులను ముఖ్యంగా కార్మికులతో సౌహార్ధ సంబంధాలను పెంపొందించుకోవటం, వాల్‌స్టీట్‌ దోపిడీ అంశం పక్కదారి పట్టకుండా తళ ననా ఎం కోటేశ్వరరావు

పోలీసులతో అనవసరమైన ఘర్షణలను నివారించటం ఎలా, ఇతర రంగు యువతను, యువతులకు ఉద్యమం దగ్గర కావటం, 2012 ఎన్నికలపై ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది సమస్యలుగా ఉంటాయి ముట్టడి ఉద్యమకారులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలుగా ఉన్న మనం నిర్మాణాత్మక పద్దతుల్లో ఈ సవాళ్లను ఎదుర్శొనేందుకు మన దృష్టిని కేంద్రీకరించాలి స్థానిక సంస్థలు బహిరంగ ప్రదేశాల నుంచి ముట్టడి ఉద్యమకారులను తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మొత్తం అభ్యుదయ, ప్రజాస్వామిక శక్తులు గట్టిగా ప్రతి స్పందించటం కూడా మన ముందున్న సవాళ్ళలో భాగమే నోమ్‌ చోమ్‌స్కీ మంచి భవిష్యత్‌ కావాలని కోరుకొనేట్లయితే ఇక్కడి, మన చుట్టూ ప్రపంచంలో ఉన్న ఉద్యమం మరింతగా పెరగాలని సుప్రసిద్ద అమెరికన్‌ వామపక్ష మేధావి నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు ఆయన ముట్టడి ఉద్యమకారుల మధ్యే ఒక స్మారక ఉపన్యాసం చేశారు దానిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి “ముట్టడి ఉద్యమం నిజంగా ఒక ఉద్విగ్పత కలిగించే పరిణామం నిజానికి ఇది అద్భుతమైనది, అసాధారణమైనది, నాకు తెలిసినంతవరకు ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదు ఈ మహత్తర పరిణామాలలో ఇప్పుడు ఏర్చడిన ఐంధాలు అనుబంధాలు, దీర్ధక్షాలం నిలిచి ఉండాలి, కష్టకాలం ముందుంది, ఎందుకంటే విజయాలు అంత త్వరగా రావు అమెరికా చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టంగా మారనుంది ఇప్పుడు జరుగుతున్న ప్రదర్శనలు అపూర్వం, పూర్తిగా అభినందించదగినవి ఇదొక అసాధారణ యుగం-కేవలం ఈ ఉద్యమం కారణంగానే కాదు- వాస్తవంగా 1970 దశకం నుంచి జరుగుతున్నదాని గురించి చెబుతున్నా విపత్మర సమయాల్లో కూడా ఇలాగే ముందుకు సాగుతామనే అందమైన ఆశలతో సమాజం ఉంది సర్వత్రా వ్యాపించిన ఒక నిరాశాస్థితి లేదా ఒక విధమైన నిర్వేదంలో ఇప్పుడు జనం ఉన్నారు వాస్తవ ప్రాతిపదికతో చూస్తే అమెరికన్‌ చరిత్రలో ఇది పూర్తిగా నూతన పరిస్థితి అనుకుంటున్నాను పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని 1930 దశకంలో నిరుద్యోగులైన కార్మికులు నిజంగానే ఆశతో ఉండేవారు 1970 దశకానికి ముందు బ్యాంకులంటే బ్యాంకులే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అవి చేయాల్సిన పనులను బ్యాంకులు చేసేవి అంటే మీ బ్యాంకు ఖాతాలో వినియోగం కాకుండా ఉన్న నిధులను ఉపయోగపడే అవసరాలకు బదలాయించేవి అంటే ఒక ఇల్లు కొనుగోలు న వాల్‌ప్టీట్‌ ముట్టడి చమయ్యు శ్రాతాపు న్న ప్‌ 1 లో 4 (ంఆం్యా ల/ పు 7 య రో

య నం ఉమ ౧౯ సం. నా టో. . వం న జాం న్స రా న. . చ య న చేయటమో, పిల్లలను కాలేజీకి పంపేందుకో వినియోగించేవి ద్రవ్య సంక్షోభాలు లేవు 1970 దశకంలో పారిశ్రామికీకరణలో పెద్ద మార్పు జరిగి ఉత్పత్తిని బయట చేయించటం ప్రారంభమైంది ద్రవ్య సంస్థలను తరలించటం అనూహ్యంగా పెరిగిపోయింది 1950,60 దశకాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఐటి విప్లవాలతో జరిగిన అభివృద్ది హైటెక్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చివేసింది ఇదంతా (ప్రభుత్వరంగంలో గణనీయంగా జరిగింది ఇది జరగటానికి ఎన్నో దశాబ్దాల పూర్వరంగం ఉంది ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగ పడని ద్రవ్య రంగం చేతుల్లోకి సంపద కేంద్రీకృతం అయిన ఒక విషవలయం 1970 దశకంలో ప్రారంభమైంది సంపదల కేంద్రీకరణ రాజకీయ అధికార కేంద్రీకరణకు దారితీసింది అది ఈ విషవలయాన్ని మరింత వేగవంతంగా చేయటానికి దారితీసింది వాషింగ్ట్‌న్‌లో ప్రతివారూ బడ్జెట్‌ కోతలపై కేంద్రీకరించి మాట్లాడుతున్నారు. జనానికి బడ్జెట్‌ కోత ఒక సమస్య కాదు సమస్య బడ్జెట్‌ లోటు కాదు నిరుద్యోగం ఇపుడు లోటు సమస్యపై ఒక కమిషన్‌ ఉంది కానీ నిరుద్యోగ నమన్య వరిష్కార కమిషన్‌ లేదు లోటు నమన్యపై మీరు కేంద్రీకరించాలనుకుంటే జనంలో ఎన్నో అభిప్రాయాలున్నాయి అనేక సర్వేలను చూడండి, స్థంభన కాలంలో గణనీయంగా తగ్గిపోయిన ధనవంతుల పన్ను మొత్తాలను క్ర2 |... ఎం కోటేశ్వరరావు

'పెంచాలనటానికి అత్యధికులు మద్దతిస్తున్నారు పరిమితంగా ఉన్న సామాజిక లబ్బులను నిలబెట్టటానికి ధనికులపై పన్ను పెంచాలని జనం కోరుతున్నారు లోటు బడ్జెట్‌ కమిషన్‌ తుది నిర్ణయం దీనికి భిన్నంగా రాబోతున్నది లేదా వారు ఒక ఒప్పందానికి రావచ్చు, అదేమంటే జనం కోరుకున్నదానికి వ్యతిరేకంగా లేదా వాటిని ఆటోమాటిక్‌గా అమలు జరిపే విధానాన్ని అనుసరించవచ్చు. చాలా త్వరగా అలాంటిదేదో జరగబోతున్నది లోటు బడ్జెట్‌ కమిషన్‌ కొద్ది వారాలలో తన నిర్ణయాలతో రానుంది దేశపు గుండెలో దిగనున్న బాకు, అది కలిగించే ప్రతికూల ప్రభావాలను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్న ముట్టడి ఉద్యమాలు ్రజాపునాదిని ఏర్పాటు చేస్తాయి. పెద్దగా వివరాల్లోకి పోకుండా చెప్పాలంటే గత 30 సంవత్సరాలుగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు వ్యక్తం చేసిన భయాందోళనలు నిజం అయ్యాయి సాధారణ ప్రజానీకం విషయం చూస్తే ముట్టడి ఉద్యమంలో 99శాతం మంది ఉన్నారన్న ఊహ ఇది నిజంగా కరినం, మరింత కరినంగా ఉండబోతున్నది పతనాన్ని ఇది ఆపలేని సమయం కావచ్చు సమాజంలోని ఒక శాతం మందికి ఇది ఎంతో అనువైనది వారు గట్టుమీద ఉన్నారు, ధనవంతులు, ప్రజలతో నిమిత్తం లేకుండా రాజకీయ వ్యవస్థను గతంలో ఎన్నడూ లేని విధంగా అదుపు చేయగలిగిన శక్తివంతులు సిటీ గ్రూప్‌ను తీసుకోండి దశాబ్దాల తరబడి అత్యంత అవినీతికి పాల్పడిన ఒక పెద్ద పెట్టుబడి బ్యాంకింగ్‌ సంస్థలలో ఒకటి రీగన్‌ తొలి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రజాధనంతో అనేక సార్లు దాన్ని ఒడ్డున పడవేశారు. అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ ఆయనను “సెయింట్‌ అలాన్‌ గా పరిగణిస్తున్నపుడు అన్ని సమయాలకు తగిన గొప్ప ఆర్థికవేత్తలలో ఒకడిగా కీర్తికిరీటాలు పెట్టిన సమయంలో (ఇదంతా ఆర్థిక సంక్షోభానికి ముందు, దానికి ఆయనే ప్రధాన బాధ్యుడు) అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతాల గురించి వివరిస్తూ క్లింటన్‌ హయాంలో అమెరికా పార్లమెంట్‌ ముందు మాట్లాడారు దేశ ఆర్ధిక వ్యవస్థలో ఎక్కువ భాగం కార్మికుల అభ(దత” ప్రాతిపదికమీదే ఉంది కార్మికులు అభద్రతా భావంలో, అపాయకరమైన స్థితిలో జీవిస్తుంటే అప్పుడు వారు ఎలాంటి డిమాండ్లు చేయలేరు వేతనాలను పెంచుకోలేరు, ఎలాంటి లబ్బులను సాందలేరు మనం అవసరం లేదనుకున్నపుడు వారిని ఉద్యోగాల నుంచి బయటకు గెంటివేయవచ్చు. అటువంటి స్థితి ఆర్ధికవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మంచిది సాంకేతికంగా ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ అని పిలువ వచ్చు అని చెప్పాడు ఇలా చెప్పినందుకు ఆయనను ఎంతగానో పొగిడారు ఇప్పుడు నిజంగానే ప్రపంచం ధనికుల కేంద్రీకరణగా, అపాయకరంగా విభజితమౌతోంది అది ముట్టడి ఉద్యమంలో ఒక శాతం, 99శాతంగా మనకు కనిపిస్తుంది ముట్టడి ఉద్యమం పెద్ద ప్రజా ప్రతిస్పందన ఇది దీర్హకాలం సాగే, కరినతరమైన పరిస్థితులను అనివార్యంగా ఎదుర్కొన బోతున్నది తెల్లవారేసరికి మీకు విజయాలు దక్కవు కష్టకాలంలో కూడా తట్టుకొని కొనసాగే నిర్మాణాలను మీరు చేయవలసి ఉంటుంది” వాల్‌స్టీట్‌ ముట్టడి ప ఖా

ఆ ఉపన్యాసం తరువాత ఉద్యమకారులు ఆయనను అనేక ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు అవి కూడా వాల్‌ప్టీట్‌ ఉద్యమంపై అవగాహనకు తోద్చడేవిగా ఉన్నాయి కొన్ని ప్రశ్చలు-జవాబులు ఇలా సాగాయి

ప్ర అమెరికా పాలకవర్గం గురించి ఏమి చెబుతారు అది ఇక్కడ బహిరంగ ఫాసిస్టు వ్యవస్థకు ఎలా వెళుతుంది? నిర్మొవామాటంగా చెప్పాలంటే అలాంటిదిక్కడ జరగదని నేను అనుకుంటున్నాను ఇంకేమాత్రం పౌరులను బలప్రయోగంతో అదుపు చేయలేమని ఒక శతాబ్ది క్రితం ప్రపంచంలో స్వేచ్చా దేశాలుగా ఉన్న బ్రిటన్‌, అమెరికాలలోని ఆధిపత్య తరగతుల వారు అవగాహనకు వచ్చారు ఇలాంటి పోరాటాల ద్వారా మరీ ఎక్కువ స్వేచ్చ పొందామని వారు గుర్తించారు వారి రచనలలో ఈ విషయాలను చర్చించారు కర్ర పెత్తనం బదులు జనం ధోరణులు, విశ్వాసాలను అదుపు చేసే ఎత్తుగడలవైపు మళ్లుతున్నట్లు కూడా వారు గుర్తించారు అది ఇంతకు ముందుమాదిరి వ్యవహరిస్తే జరగదు ఆలోచనా ధోరణులు, విశ్వాసాలను ముందుగా అదుపు చేయాలి ఆ మేరకే ప్రజా సంబంధాలు కూడా మార్పు చెందటం ప్రారంభించాయ ముందు అమెరికా, (బైిటన్లలో ప్రారంభమైంది స్వేచ్చా దేశాలలో వస్తు వినిమయతత్వాన్ని పెంచటం, ఏం జరిగినా పట్టించుకోవద్దని, నిర్లక్ష్య భావన, పక్కదారి పట్టే విధంగా విధంగా చూడాలని నిర్ణయించారు అయిజే ఇది సులభం కాదు కానీ నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టటం కంటే ఇదెంతో సులభం మనం నేడు పిలుస్తున్న ఫాసిజం వంటిదాన్ని రుద్దటానికి పరిస్థితులెంతో దూరంగా ఉన్నాయని నేను అనుకోవటం లేదు

ప్ర మీరు ఇంతకు ముందు ఉపన్యాసంలో పరిశ్రమలను స్వాధీనం చేసుకొని నడపటానికి ముందు బైరాయింపు సమ్మెలు చేశారని చెప్పారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి సాధారణ సమ్మెను ఒక ఎత్తుగడగా సూచిస్తారా?

మీరు నాయకులు వద్దని అంటున్నారు మీ అంతట మీరే చేయాలని కోరుకుంటున్నారు మనకు ప్రతినిధులు ఉండాలి, అందుకని వారిని మీరే ఎంచుకోండి వారిని అవసరమైతే వెనక్కు పిలిచే విధంగా ఉండాలి సాధారణ సమ్మె అనేది ఇతర మార్గాల వంటిదే మీరు ఆలోచించాలి, ఇది సాధ్యమయ్యే ఆలోచనేనా? జనం అందుకు సిద్దంగా ఉన్నారా అని? వెంటనే మనం ఇక్కడ కూర్చొని సాధారణ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించలేము జనాభాలోని గణనీయమైన ప్రజానీకం దానిలో భాగస్వాములయ్యేందుకు, చిక్కులను ఎదుర్శొనేందుకు అంగీకారంతో ఉన్నారా అని ముందు వారి అనుమతి తీసుకోవాలి అది నిర్మాణాన్ని, చైతన్యాన్ని, చురుకుదనాన్ని కలిగిస్తుంది చైతన్యం అంటే గడ... ఎం కోటేశ్వరరావు

మనం నమ్ముతున్నదానిని జనానికి చెబితేనే కలిగేది కాదు దానర్ధం ఎవరికి వారు అధ్యయనం చేయాలి కారల్‌ మార్క్‌ ఇలా చెప్పారు * మన కర్తవ్యం కేవలం ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటం కాదు, దాన్ని ఎలా మార్చాలో చూడాలి” మనం దేన్ని మనసులో పెట్టకోవాలనే దానిపై తేడాలుండవచ్చు * మీరు ఒక మార్గంలో ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు దాన్ని అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నించటం మంచిది" అర్ధం చేసుకోవటం అంటే ఒక ఉపన్యాసాన్ని వినటం, ఒక పుస్తకాన్ని చదవటం కాదు అది సహాయకారి కావచ్చు అది చదవటం ద్వారానే వస్తుంది చదవటం భాగస్వామి కావటం నుంచి ప్రారంభమౌతుంది నువ్వు ఇతరులనుంచి నేర్చుకోవచ్చు నువ్వు సంఘటిత పరచాలనుకొనే జనం నుంచి నువ్వు నేర్చుకో దాని ద్వారా అనుభం, అవగాహన కలుగుతుంది అప్పుడు అమలు సాధ్యమయ్యే ఆలోచనలను ఎత్తుగడలుగా అమలు జరపవచ్చు అందుకు ఎంతో దూరం ప్రయాణించాలి అది చేయి పిడికిలి బిగించగానే జరగదు అంకితమైన పనితో దీర్హ్షాలంలో జరుగుతుంది అనేక విధాలుగా ఆలోచిస్తే ఆత్యంత ఉద్విగ్నత కలిగించే అంశమేమంటే ముట్టడి ఉద్యమాలు దేశవ్యాపితంగా నిర్మాణం అవుతున్న అనుబంధాలు, బంధాలు ఇవి అవి నిలిస్తే ఏం జరుగుతుందో తెలియని గణనీయమైన జనాభాలో వాటిని విస్తరించవచ్చు అది జరిగితే ఆ తరువాత ఇలాంటి ఎత్తుగడల సమస్యల గురించి చర్చించవచ్చు అది ఎక్కడో ఒకచోట తగిన విధంగా ఉంటుంది ముట్టడి ఉద్యమాన్ని విప్లవంగా వర్దించేవారేమంటున్నారు?”

సీనియర్‌ జర్నలిస్టు క్రిస్‌ హెడ్టెస్‌ జుకొట్టి పార్కు నుంచి నవంబరు 15న ఉద్యమకారుల తొలగింపు సందర్భంగా ఇలా వ్యాఖ్యానించారు “విఫ్లవానికి స్వాగతం మన కార్పొరేట్‌ శక్తి తమ పోలీసులతో వచ్చి పోర్ట్‌లాంద్‌, ఓక్‌లాండ్‌, న్యూయార్క్‌లో ఏం చేయగలదో ప్రదర్శించింది ఎల్లవేళలా 'వ్యక్తిగత పరిశుభ్రత, పౌర భద్రత వంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ మనల్ని ముట్టడి ఉద్యమం నుంచి కనుమరుగుకావించి “గందరగోళాన్ని! శుద్ది చేయగలమని వారు అనుకుంటున్నారు మనమంతా ఇళ్లకు వెళ్లి వారి కార్పొరేట్‌ పాలనను ఆమోదించాలి మీ గూళ్లలోకి మీరు వెళ్లండని వారు మనకు చెబుతున్నారు టీవిలలో రోజంతా పచ్చి అబద్దాలు, అవాస్తవాలు, అసంగతాలు, పేరు మాసినవారి పోసుకోలు కబుర్లను చూడమంటున్నారు మీ ఆవేశ శక్తిని ప్రజాబాహుళ్య వినోద కార్యక్రమాలకు వెచ్చించమని, క్రెడిట్‌ కార్డులతో అప్పులు చేయటం, చెల్లించటమే పనిగా పెట్టుకోండంటున్నారు మనం ఎంచుకున్న తుక్కు జీవితం పట్ల కృతజ్ఞులుగా ఉండమంటున్నారు మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండన్నట్లు వాల్‌స్టీట్‌ ముట్టడి 55

ప్రజాస్వామ్యం, దాని గొప్పతనం, స్వాతంత్ర్యం గురించి చెప్పుకున్న సుభాషితాలను పునచ్చరణ చేసి వేనోళ్ల పాగడమంటున్నారు అమెరికాలో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా సొమ్ము చేసుకొని తమ సంపదలను మరింత పెంచుకొనే అవకాశం తిరిగి వచ్చిందని వారు అనుకుంటున్నారు అయితే వారి చుట్టూ ఏమి జరుగుతోందనే ఎలాంటి అవగాహనా వారికి లేదు తమ సామ్రాజ్యాలు కూలిపోతున్నాయని చివరి వరకు ఎందుకు (గ్రహించలేకపోయామో ఎప్పటికీ అర్ధం చేసుకోలేని స్థితికి లోనైన వర్సెయిల్స్‌ లేదా ఫోర్‌బిడెన్‌ సిటీలోని రాజరికవాదుల్లా ఈ తిరుగుబాట్లు ఎందుకు జరుగుతున్నాయో అర్ధంగాని మంచుతెరలో ఉన్నారు. ఎలాంటి అడ్డూఅదుపు లేని వాల్‌(్టీటిలో సంపాదించి బిలియనీరుగా తయారైన న్యూయార్క్‌ సగర మేయర్‌కు రెండునెలల పాటు జనం పార్కుల్లో ఎందుకు నిద్రచేసి తిష్టవేశారు, సముద్రతీరంలో ఎందుకు ప్రదర్శనలు జరుపుతున్నారో అర్ధం కావటం కష్టం ఇళ్లు కోల్పోయినవారు, ఉద్యోగాలు లేనివారు తమ బాధను వ్యక్తం చేయటానికి చేస్తున్న ప్రదర్శనలు, ముట్టడి ఉద్యమాలు తిన్నదరక్క వేసుకొనే "భేది మందు”(విరేచనకారి) 'వినోదంకలిగించేవిగా తనకు అర్ధం అయినట్లు చెబుతున్నారు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌, ఇతర పార్టీల మేయరు, వారి పార్టీలు మనల్ని తెగనమ్మాయి అయితే ఇది వారి అంతానికి ఆరంభం

“అనాటమీ ఆఫ్‌ రివల్యూషన్‌ * అనే పుస్తకంలో చరిత్రకారుడు క్రేన్‌ బ్రిన్‌టన్‌ విప్లవానికి ఉమ్మడి మార్గాన్ని వేశారు విప్లవ విజయానికి ముందుండాల్సిన పరిస్థితుల గురించి బ్రింటన్‌ ఏం చెప్పారంటే అన్ని సామాజిక తరగతులను ప్రభావితం చేసే అసంతృప్తి, తమను బోనులో పెట్టారన్న విసృత భావనలు, నిరాశా, ఆశాభంగం చెందటం, ఒక చిన్న పాలకవర్గానికి వ్యతిరేకంగా మద్దతు తెలపటం, పాలకవర్గ చర్యలను సమర్ధించేందుకు మేథావులు, పండితులు తిరస్కరించటం, పౌరుల ప్రాధమిక అవసరాలకు కూడా ప్రభుత్వం స్పందించే శక్తికోల్పోవటం, పాలకవర్గం కూడా క్రమంగా మనోధైర్యం కోల్పోయి, అంతర్గతంగా ఫిరాయింపులు, ఒంటరిప్తాటైన అధికారశక్తులకు బయట మిత్రులు లేదా సమర్థకులు లేకపోవటం, అంతిమంగా ఆర్ధికంగా సంక్షోభం తలెత్తటం బ్రింటన్‌ అవగాహన ప్రకారం మన కార్పొరేట్‌ పెద్దలు పైన పేర్కొన్న పరిస్థితులను పూర్తిగా వర్చరిచారు అయితే బ్రింటన్‌ తరువాత ఏం చెప్పారన్నది ముఖ్యమైన అంశం వివ్లవాలెప్పుడూ అసాధ్యమైన డిమాండ్లతోనే ప్రారంభమౌతాయి. వాటిని ప్రభుత్వం నెరవేర్చిందంటే అర్ధం పూర్వపు అధికారం అంతమైనట్లే మనం ఇప్పుడు రెండవ దశలో ప్రవేశించాం అశాంతి, అసంతృప్తిని అధికారంలో ఉన్న పెద్దలు భౌతిక అణచివేతద్వారా చల్తార్చేందుకు విఫలయత్నం చేస్తున్నారు నిరంకుశ పాలకులందరూ అక్రమాలు, బలప్రయోగంతోనే పరిపాలిస్తారని జార్జి ఆర్వెల్‌ రాశారు అయితే ఒకసారి అక్రమం వెల్లడైన 56 ఎం కోటేశ్వరావు

తరువాత వారు అనివార్యంగా కేవలం బలప్రయోగంపైనే ఆధార పడతారు ఇప్పుడు మనం పూర్తిగా బహిర్గతమైన బలప్రయోగదశలోకి ప్రవేశించాము నిరంకుశ ప్రభుత్వాలు అంతర్గతంగా కుప్పకూలినపుడు లక్షలాది మందిగా ఉన్న అధికార యంత్రాంగంలోని అంతర్గత భద్రత, గూఢచార విభాగాలను ఉ(గ్రవాదాన్ని నిరోధించేందుకు గాక మనలను నిరోధించేందుకే రాజ్యం ప్రయత్నిస్తుంది పొర్కులనుంచి ఖాళీ చేయించమనో, అరెస్టులు, అవసరమైతే ప్రదర్శకులపై కాల్పులు జరపటం వంటి నిర్భంధకాండకు ఆదేశాలిచ్చినపుడు సాధారణ భద్రతాసిబ్బంది ఏమాత్రం వాటిని ఖాతరు చేయదు పాత అధికార వ్యవస్థ వేగంగా కుప్పకూలి పోతుంది ట్యునీసియా బెన్‌ అలీ, ఈజిప్టు హోస్నీ ముబారక్‌ అధికారం కోల్పోయాక భద్రతా దళాలు జనంపై కాల్పులు జరిపేందుకు నిరాకరించాయి ఓక్లాండ్‌ (అమెరికా) ముట్టడి ఉద్యమకారులను తొలగించాలని ఆదేశించినందుకు నిరసనగా ఓక్లాండ్‌ ఉపమేయర్‌ షరోన్‌ కోర్డు న్యాయసలహాదారు, దీర్ధజాలంగా మేయర్‌కు స్నేహితుడిగా ఉన్న దాన్‌ సైగల్‌ తమ పదవులకు రాజీనామా చేయటం అధికార కట్టడపు తొలి పగుళ్లకు చిహ్నం కిస్‌ హెడ్టెస్‌ అవగాహన ప్రకారం, సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలో జరిగిన విప్లవ ప్రతీఘాత, సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలు కూదా విప్లవాలే పాలకవర్గాల గురించి (బ్రమలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది అందువలన ఆయన చెప్పిన ప్రతిదానిని లేదా నోమ్‌స్కీ అభిప్రాయాలనుగానీ అక్కడి పరిస్థితిపై వివిధ ఆలోచనా ్రవంతులు ఎలా ఉన్నాయనే అంశాన్ని తెలుసుకొనేందుకు మాత్రమే ఉపయోగపడతాయి

అమెరికా లో ఏం జరగబోతోంది? ఏం చేయాలి”

2011 అక్టోబరు చివరి వారంలో అమెరికాలోని ప్రధాన పత్రికలన్నీ అక్కడి ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌ గురించి వార్తలు ప్రచురించాయి అయితే అవి సాధారణ అమెరికన్లకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని కూడా పేర్కొన్నాయి మాంద్యం(సంక్షోభం) 2009జూన్‌ తోనే ముగిసిందని అమెరికా సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది సాధారణ గృహస్తు ఆదాయాన్ని ద్రవ్యోల్బణానికి సర్జుబాటు చేసి లెక్కిస్తే అది పడిపోతున్నది సంక్షోభం ప్రారంభం నుంచి ముగిసిందని చెప్పిన సమయంలో ఇంకా వేగంగా పడిపోయింది దీనికి విశ్లేషకుల భాష్యం ఏమంటే అధికంగా ఉన్న నిరుద్యోగం, బలహీనమైన ఆర్థిక ప్రగతి నిజానికి కథలో ఇదొక అంశం మాత్రమే

ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నదని అంగీకరించినప్పటికీ అదెలాంటిదంటే మంచి ఉద్యోగాలను మరింతగా హరిస్తున్నది సంక్షోభ సమయంలో మధ్యతరగతి వేతనాలుండే ఉద్యోగాలు అంటే హెల్త్‌ టెక్సీషియన్లు, బస్‌ (దైవర్లు, కార్యాలయాల్లో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 57

గుమాస్తా ఉద్యోగాలు పోయాయి అక్టోబరు చివరి వారంలో ఉద్యోగమార్కెట్‌ తీరు ఎలా ఉందంటే పైన పేర్కొన్న ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో సగం మాత్రమే ఇచ్చే రిటైల్‌ షాపుల ఉద్యోగులు, స్టాక్‌ నిర్వహించే గుమస్తాలు, హోటల్‌ సిబ్బంది, శిశుకేంద్రాల సిబ్బంది వంటి ఉద్యోగాలు మాత్రమే గతం కంటే అదనంగా చాలా పరిమితంగా దొరికాయి దీన్ని సంక్షోభపు ఉప ఉత్పత్తిగా పరిగణిస్తున్నారు నిర్మాణరంగం, ద్రవ్య, బీమా, రియలెస్టేట్‌ వంటి మంచివేతనాలిచ్చే రంగాలలో ఉద్యోగాలేవీ తిరిగి రావటం కష్టంగా ఉంది ఇవిగాక దీర్ధకాలంగా మంచివేతనాలిచ్చే ఉత్పాదకరంగ, టెలికమ్యూనికేషన్‌ పరిశ్రమలు, ప్రభుత్వ స్థానిక సంస్థల ఉద్యోగాలు తగ్గిపోవటం కూడా కొనసాగుతూనే ఉంది

కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించటం లేదు ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు ఈ స్థితిలో పొదుపు, బడ్జెట్‌ కోత, పన్ను చెల్లింపుదార్లపై భారం తగ్గింపు, వారి చెల్లింపులను సక్రమంగా వినియోగించటం వంటి అందమైన పేర్లతో ఉద్యోగాల రద్దుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన “స్వచ్చంద ఉద్యోగ విరమణ పాకేజీలను ప్రకటిస్తోంది దీంతో అనేక మంది ముందుజా[గ్రత్తగా వాటికోసం దరఖాస్తు చేయటం పెరుగుతోంది ఉదాహరణకు న్యూయార్మ్‌నే చూద్దాం ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఉద్యోగుల ఉమ్మడి ఉద్యోగవిరమణ నిధి కార్యాలయంలో గత రెండు దశాబ్దాలలో ప్రతి ఏటా మామూలుగా 20వేల రిటైర్‌మెంట్‌ దరఖాస్తులను పరిష్కరించే వారు అలాంటిది 2010లో 30,772 దరఖాస్తులు వచ్చాయి వాటిలో పన్నెండు వేలు “రిటైర్‌మెంట్‌ పాకేజొల కోసం చేసుకున్నవే అని అధికారులు బ్రకటించారు ఉదాహరణకు ఆల్‌ హిక్స్‌ అనే బయాలజిస్ట్‌(57) ఇంకా పని చేయగలడు అయినా ప్రభుత్వం ప్రకటించిన (ప్రత్యేక పాకేజ్‌ ప్రకారం వేతనం 65వేల డాలర్లు వస్తుంటే పెన్షన్‌ అంతకంటే 15వేల డాలర్లు మా(త్రమే తక్కువగా ఉండటంతో 34 సంవత్సరాల సర్వీసు తరువాత ఉద్యోగవిరమణకు గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు రానున్న మూడు, నాలుగు సంవత్సరాలలో నాకు పెరగబోయేదేమీ లేదని అర్ధం అయింది, అందుకే నేనీ నిర్ణయానికి వచ్చా అన్నాడు * దేశమంతటా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక పాకేజ్‌ ప్రకారం 25 సంవత్సరాల సర్విసు లేదా 55 ఏళ్ల పైబడిన వారు రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా ఏడాదికి ఒక నెల వేతనం చొప్పున 36నెలల వేతనాన్ని పెన్షన్‌ నిధికి ప్రభుత్వం జమ చేస్తుంది ఇది అదనం కనుక ఇలా చేస్తున్నారని” పెన్షన్‌ నిధి ట్రస్టీ కార్యాలయ ప్రతినిధి ఎరిక్‌ సంబెగ్గ్‌ విశ్లేషించారు

న్యూయార్స్‌ కార్మిక శాఖ సమాచారం (ప్రకారం 2010 సెప్టెంబరుతో పోల్చితే 2011 సెప్టెంబరులో 2,800 పోస్టల్‌ సర్వీసుతో 9,300 ప్రభుత్వ ఉద్యోగాలు క5్‌8 ఎం కోటేశ్వరరావు

తగ్గిపోయాయి. ఇలా వివిధ రాష్ట్రాలు 2010లో 49వేలు, స్థానిక సంస్థలు 2,10,000 ఉద్యోగాలను రద్దు చేశాయి న్యూయార్క్‌ రాష్ట్రంలో టీచర్లకు ప్రత్యేక రిటైర్‌మెంట్‌ విధానం ఉంది వారిలో కూడా ముందస్తు ఉద్యోగ విరమణ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు వివరాలు వెల్లడించాయి. ఒక్క ఏడాదిలోనే ఐదువేల టీచర్‌ పోస్టులు రద్దయ్యాయి రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1946-64 మధ్య అమెరికాలో జనాభా సంఖ్య గణనీయంగా పెరిగింది అప్పుడు పుట్టిన ? 6కోట్ల మంది 47-65 సంవత్సరాల మధ్య ఉన్నారు వారంతా ఇప్పుడు రిటైర్‌ కావటం ప్రారంభమైంది ప్రత్యేక రిటైర్‌మెంట్‌ పాకేజ్‌లు ప్రకటించటం, భవిష్యత్‌ శూన్యంగా కనిపించటంతో 55 సంవత్సరాలు పైబడిన వారంతా రిటైర్‌మెంట్‌కు మొగ్గుచూపుతున్నారు న్యూయార్క్‌ రాష్ట్ర పూర్తికాలపు ప్రభుత్వ ఉద్యోగులు 1990లో గరిష్టంగా 2,30,598 మంది ఉండగా 2010లో 1,85,590కి తగ్గారు ప్రభుత్వం విస్తరిస్తున్నదని జనం అనుకోవచ్చుగాని అంతసీన్‌ లేదని బడ్జెట్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించాడు

వేతనాల విషయానికి వస్తే తక్కువ వేతనాల ఉద్యోగులకు చెల్లిస్తున్న నిజవేతనాలు పడిపోతున్నాయి మూడు సంవత్సరాల తాజా సంక్షోభ సమయంలో 2 ౩3శాతం తగ్గాయి అమెరికాలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది అదేమంటే తక్కువ వేతనాలు(గంటకు 13 దాలర్లలోపు) ఉండే ఉద్యోగాలు లేదా ఎక్కువ వేతనాలు(20 డాలర్లకంటే ఎక్కువ) ఉన్న ఉద్యోగాలే అత్యధిక శాతం ఉన్నాయి మొత్తంలో అధిక వేతనాల ఉద్యోగాలే ఎక్కువ మధ్య స్థాయిలో ఉన్న ఉద్యోగాలు కేవలం ఆరుశాతమే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు 2001-08 మధ్య ఈ పరిణామంపై సర్వేలు జరిగాయి. అన్ని రకాల ఉద్యోగాలను 366 తరగతులుగా విభజించి విశ్లేషించారు

అనూహ్యమైన వాల్‌ఫ్టీట్‌ ముట్టడి ఉద్యమ ప్రారంభదినాల్లో ప్రభుత్వం గొప్ప ప్రజాస్వామిక ఫోజు పెట్టింది న్యూయార్క్‌ మేయర్‌ బ్లూమ్‌బెర్ట్‌ వంటి వారు ముట్టడి ఉద్యమానికి కావాలంటే ఒక జూకొట్టి పార్కేమిటి ఎన్నికొవాలంటే అన్నిచోట్ల అనుమతిస్తాము, ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చేసుకోవచ్చు, అసలు న్యూయార్క్‌ అంటేనే స్వేచ్చకు నిలయం అని ఊదరగొట్టాడు తరువాత పార్కును ఊడ్చే పేరుతో ఉద్యమ కారులను బయటకు నెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు కోర్టు తీర్పును ఆయుధంగా చేసుకౌని నవంబరు 15న ఉద్యమకారులను బలవంతంగా ఖాళీ చేయించాడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉద్యమించేందుకు అనుమతిస్తామని వాల్‌ఫ్టీట్‌ ముట్టడి 5%

భారీ సంఖ్యలో మీడియా జనాల ముందు ప్రకటించిన న్యూయార్క్‌ మేయర్‌ బ్లూమ్‌బెర్ట్‌ నవంబరు 15న జూకొట్టి పార్కులో ఉన్న ఉద్యమకారులను ఖాళీ చేయించేందుకు చడీ చప్పుడు లేకుందా అర్ధరాత్రి భద్రతా బలగాలతో దాడి చేయించాడు అది ఒక మిలిటరీ చర్య మాదిరి ఉంది ఒక హెలికాస్టర్‌ను కూడా రంగంలోకి దించారు ఆ ఉదంతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది ఉన్న చోటు నుంచి బలవంతంగా భాళీ చేయిస్తున్న దృశ్యాలు కనిపించకుండా రెండు బస్సులను అడ్డంగా నిలిపారు విలేకర్ల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అలాంటి వారిలో న్యూయార్క్‌ అబ్బర్వర్‌ రాజకీయ విలేకరి హంటర్‌ వాకర్‌ ఒకరు తనను పార్కు నుంచి బలవంతంగా లాగి పారవేశారని న్యూయార్క్‌ టైమ్స్‌ విలేకరి బైయిన్‌ స్టెల్దర్‌ పేర్కొన్నాడు పోలీసులు హింసాయుతంగా వ్యవహరించారని మదర్‌ జోన్స్‌ విలేకరి జోష్‌ హార్మిన్స్‌న్‌ తెలిపాడు ఉద్యమకారులను బలవంతంగా ఖాళీ చేయించే సమయంలో అరెస్టు అయిన వారిలో విలేకర్లు, ఒక నగర కౌన్సిల్‌ సభ్యుడు కూడా ఉన్నారు మాన్‌హటన్‌ ప్రాంతంలో గగన తలం నుంచి చిత్రించకుండా టీవీ ఛానళ్ల హెలికాష్టర్లు ఎగరటాన్ని నిషేధించారు కిందగుమికూడిన ఉద్యమకారులు, వారిసమీపంలో ఉన్న జర్నలిస్టులపై మిరియపు ద్రవాన్ని పోలీసులు పిచికారి చేశారు పోలీసులు ఉద్యమకారులతో పాటు బేడీలు వేసి అరెస్టు చేసిన వారిలో కనీసం అరడజను మంది జర్నలిస్టులు ఉన్నారు తాము జర్నలిస్టులమని చెబుతున్నా వినకుండా అక్రమంగా వేరేవారి ప్రాంగణంలోకి ప్రవేశించటానికి మీకేమైనా ప్రత్యేక హక్కులున్నాయా అంటూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు కొంతమందిపై చేయి చేసుకున్నారు ఒక మహిళా జర్చలిస్తును దూరంగా తోసివేసిన ఒక పోలీసు పేరు, నంబరు అడిగినందుకు ఆమెను అరెస్టు చేశారు నగర అధికారులు చెప్పినట్లు పార్కును శుభ్రపరిచిన తరువాత నిరసనకారులను తిరిగి అనుమతించాలని న్యాయమూర్తి లూసీ బిల్లింగ్స్‌ ఆదేశించారు అయితే దానికి ఒక మెలిక పెట్టారు పార్కులోకి వచ్చే వారు తమతో పాటు గుడారాలు లేదా స్లీపింగ్‌బ్యాగ్స్‌(నిదురపోవటానికి వీలైన సంచుల వంటివి)ను తీసుకురావటానికి వీలులేదని ఉత్తరువులో పేర్కొన్నారు అంటే ఆచరణలో నిరసనకారులను నిరోధించటమే జర్నలిస్టులు పోలీసుల మధ్యలో ఉన్నపుడు సహజంగానే పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి జర్నలిస్టులను రక్షించేందుకు గాను వారిని దూరంగా ఉంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని మేయర్‌ బ్లూమ్‌బెర్డ్‌ పోలీసు చర్యను సమర్ధించాడు విలేకర్ల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై అనేక వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది 60. ఎం కోటేశ్వరరావు

సెప్టెంబరు 17న ప్రారంభమైన ఉద్యమం మూడవ నెలలోకి ప్రవేశించింది రెండవ నెల మధ్య నుంచి (ప్రభుత్వం ఎక్కడి కక్కడ ఉద్యమకారులను తొలగించేందుకు పూనుకుంది నవంబరు 15 నాటికి వివిధ నగరాలలో దాదాపు నాలుగువేల మందిని అరెస్టు చేశారు ఒక్క న్యూయార్క్‌లోనే 9438 మంది అరెస్టయ్యారు అసలు ముట్టడి క్యాంపులను కొత్తగా ఏర్పాటు చేయకుండా చెదరగొట్టిన ఉదంతాలెన్నో అరెస్టులు మన వంటి తృతీయ ప్రపంచదేశాల ఉద్యమాలతో పోల్చితే తక్కువగా కనిపించవచ్చు గాని పశ్చిమ దేశాలలో ఇది పెద్ద సంఖ్యే ఒకరిద్దరిని అరెస్టు చేసిన ఉదంతాలలో కూడా భారీ ఎత్తున పోలీసులు రావటం, రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయుగోళోలను ప్రయోగించటం చిన్నవిషయం కాదు బెయిల్‌ తీసుకోవటానికి పెద్ద మొత్తంలో చెల్లింపు వంటి అనేక తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటూ కూదా ఉద్యమకారులు అరెస్టులకు ముందుకు వచ్చారు ఆరోగ్య, పౌరరక్షణ సాకులతో ముట్టడిలో ఉన్నవారిని బలవంతంగా లాగివేయటం

సర్వసాధారణంగా మారింది అందుకు స్థానిక, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్దినెన్సులు, చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతున్నారు. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీతో పాటు డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వాలున్న చోట కూడా ఇదే విధంగా జరిగింది

పది సంవత్సరాల క్రితం న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదుల దాడి తరువాత అమెరికాలో ప్రజూస్వామ్య వ్యవస్థకు పడ్డ గండి పెద్దదైంది (ప్రాధమిక హక్కులను కూడా ప్రభుత్వం అనుమతించటం లేదు ్రతివారిపై నిఘావేయటం, రాజకీయ బృందాలపై తప్పుడు కారణాలు చూపి, ఎలాంటి కారణం చూపకుండా నిర్చ్భంధించటం మిలిటరీ-పోలీసు-ఇంటలిజన్స్‌ శాఖల నిత్యకృత్యంగా మారింది వాటి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నారు దీనంతటికి ఉగ్రవాదం పోరు అన్న ముద్దు పేరు తగిలించారు నిజానికి ముట్టడి ఉద్యమం కోట్లాది మంది సాధారణ అమెరికన్లలో ఉన్న ఆగ్రహం, అసంతృప్తికి సాధారణ తొలి రూపం, స్పందన మాత్రమే

పశ్చిమ దేశాలలో చాలా కాలంగా ఉద్యమాలను, అనంతృవ్హలను అణచివేయటానికి భారీ ఎత్తున పోలీసు యంత్రాంగాన్ని వినియోగించటం సర్వ సాధారణమైంది ఉదాహరణకు లండన్‌లో 2011 నవంబరు రెండవ వారంలో ట్యూషన్‌ ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపిన ఎనిమిదివేల మంది విద్యార్థులను చెదరగొట్టటానికి నాలుగువేల మంది పోలీసులను దించారు వారికి ఆకాశంలో హెలికాప్టర్లు భూమి మీద పదిమీటర్ల ఎత్తు ఉన్న బారికేడ్డను ఏర్పాటు చేశారు ఉద్యమకారుల డిమాండ్ల పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పటం తప్ప బరాక్‌ ఒబామా ముట్టడి ఉద్యమానికి మద్దతు ప్రకటించకపోగా వేలాది మందిని అరెస్టు చేయించటానికి చేయాల్సిందంతా చేశాడు వాల్‌స్టీట్‌ ముట్టడి 61

య ల స స ప. 4 స వం దేశ వ్యాపితంగా ఎనిమిది వారాల తరువాత ముట్టడి ఉద్యమకారుల బలవంత తొలగింపు, అరెస్టుల పర్వం ప్రారంభమైంది ఇదే సమయంలో అమెరికాను చలి పులి కమ్మేసింది ఈ తరుణంలో ఉద్యమం ఎటువైపు, ఎలా పయనించాలన్నది చర్చనీయాంశ మైంది ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలో కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు శామ్‌వెబ్‌ వెల్లడించిన విషయాన్ని పైన చూశాము సుప్రసిద్ద వామపక్ష చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన మైఖేల్‌ మూర్‌ నవంబరు మూడవ వారంలో తన అభిప్రాయాలను వెల్లడించారు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి ఉద్యమ లక్ష్యాలు, ఎలా ఉందాలనే అంశంపై వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమకారులతో. నేను నాలుగు గంటల పాటు చర్చలు జరిపాను ఉద్యమకారుల జనరల్‌ అసెంబ్లీకి ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను సమర్పించాలని భావించాము దానిలోని అంశాలివి 1 నిజమైన స్వేచ్చా, ప్రజాస్వామిక, న్యాయబద్దమైన సమాజం ఏర్పడాలి 2 దానిలో వొరులు ఒకదగ్గర చేరి ఏకాభ్యిపాయుం ద్వారా వున నమన్యలను పరిష్కరించుకోవాలి & అక్కడ పౌరులు వ్యక్తిగత, ఉమ్మడి బాధ్యతలు వహించే విధంగా (పోత్సృషాంచబడతారు. నిర్ణయాలలో భాగస్వాములౌతారు 4ఉ ఇతరుల భిన్నాభిప్రాయాలను, ఖిన్న ధోరణులను గౌరవించి, సహించే సూత్రాలకు కట్టుబడి

సామరస్యపూర్వకంగా నివశించటం నేర్చుకోవాలి 5 నిరంకుశ శక్తుల, అన్యాయంగా వ్యవహరించే ప్రభుత్వాల ఉల్లంఘనల నుంచి పౌరృ్వమానవ హక్కులకు భద్రత కల్పిస్తాము 6 కేవలం కొద్ది మందికి గాక పౌరులందరికీ లబ్టి చేకూర్చే. విధంగా రాజకీయ, అర్థిక వ్యవస్థలు పని చేస్తాయి 7 కేవలం ఉద్యోగం కోసం విద్యగాక అందరికీ పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య నందించి మానవులుగా మరింత పరిణితి చెందే విధంగా చేస్తాము 8 ఆర్థిక లబ్బుల కంటే మానవ విలువలకు మేము విలువ నిస్తాము గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాలకు హాని కలిగించని ప్రజాస్వామిక వ్యవస్థకోసం కృషి చేస్తాము 9 భవివ్యత్‌ తరాలకు సురక్షితమైన మంచినీరు, గాలి, ఆహార సరఫరాలకోసం, గతించిన తరాల మాదిరి ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ప్రపంచ పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేస్తాము తరువాత అడుగుగా ముట్టడి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల వాంఛలకు అనుగుణంగా నిర్ధిష్ట లక్ష్యాలు, డిమాండ్లను రూపొందించాలి అందుకు గానునా వ్రతిపాదనలుగా ముట్టడి ఉద్యమకారుల జనరల్‌బాడీలో దిగువ అంశాలను ప్రతిపాదించదలిచాను 1 బుష్‌ హయాంలో ధనికులకు ఇచ్చిన పన్ను రాయితీలను రద్దు చేయాలి వాల్‌స్టీట్‌లో ఇప్పుడు ఎలాంటి పన్ను లేకుండా జరిగే వ్యాపారాలన్నింటిపై పన్నువేయటంతో పాటు కార్పొరేషన్లు, ధనికులపై కొత్త పన్నులు వేసేందుకు చర్యలు తీసుకోవాలి 2 అమెరికాలో ఇప్పటికే లాభాలు సంపాదిస్తూ ఉండి ఇతర దేశాలకు అమెరికన్‌ ఉద్యోగాలను తరలించే ప్రయత్నాలు ఏ కార్పొరేషన్‌ చేసినా దానిపై అపరాధ పన్ను వేసేందుకు పరిశీలించాలి మన ఉద్యోగాలను ముఖ్యమైన జాతీయ సంపదగా పరిగణించి కేవలం ఒకరిద్దరు మరింత డబ్బు సంపాదించేందుకు వాటిని బయటకు తరలించకుండా చూడాలి 8 అమెరికన్‌ పౌరులందరూ తమ ఆదాయాలపై ఒకే రేటుతో సామాజిక భద్రతా పన్ను చెల్లించే చర్యలు తీసుకోవాలి (సాధారణంగా మధ్యతరగతివారు తమ ఆదాయాలపై ఆరుశాతం పన్ను చెల్లిస్తున్నారు కొంత మంది ఏడాది మిలియన్‌ డాలర్లు సంపాదించి కేవలం 0 6శాతం లేదా సగటు జీవి కంటే 90శాతం తక్కువ చెల్లిస్తున్నారు ) వాల్‌స్ట్రీట్‌ ముట్టడి 63

4 _ వాల్‌ఫ్టీట్‌బ్యాంకులు తమ వాజిజ్యాన్ని ఎలా నిర్వహిస్తున్నాయో చూసేందుకు గ్లాస్‌-ప్టీగాల్‌ చట్టంలోని నియమనిబంధనలను పునరుద్ధరించాలి

5 2008లో ఆర్థిక వ్యవస్థ కుష్పకూలటంపై దర్యాప్త జరపాలి, నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి

6 మన జాతీయ ఖర్చు (ప్రాధాన్యతలను తిరిగి రూపొందించాలి (వారానికి రెండువందల కోట్ల డాలర్ల ఖర్చు అవుతున్న అన్ని విదేశీ యుద్ధాలను నిలిపివేయటంతో సహా) ఇది జరిగితే మూత పడిన గగ్రంధాలయాలను తిరిగి తెరవవచ్చు.మన పొరశాలల్లో సంగీతం, చిత్రలేఖనం, పౌరశాస్త్ర పాఠాలను తిరిగి ప్రవేశపెట్టవచ్చు మన జీవితాలను మెరుగు పరిచే శాస్త్ర పరిశోధనలకు, దేశమంతటికీ 21వ శతాబ్దపు ఇంటర్నెట్‌ కనెక్షన్లకు, మన రోడ్డు, వ ంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్ణయించి నిధులు అందచేయాలి

7 ఇతర స్వేచ్చా దేశాలలో మాదిరి అందరికీ, అన్ని వేళలా ఉచిత ఆరోగ్య సేవలను అందించాలి

8 భూతలాన్ని నాశనం చేస్తున్న కార్బన్‌ వాయువులను వెంటనే తగ్గించాలి ఈ శతాబ్ది అంతానికి అడుగంటే చమురుతో నిమిత్తం లేకుండా జీవించేందుకు అవసరమైన మార్దాలను కనుగొనాలి

9 పదివేల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్న కార్పారేషన్లలో సగం మంది బోర్డు డైరెక్టర్లను కార్మికుల నుంచి ఎన్నుకోవాలి తాము పనిచేసే స్థలాలలో ఎక్కువ సేపు గడిపే వారు అక్కదే జరగాలో చెప్పే అవకాశం ఉన్నపుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు

10 ఎన్నికల సంస్కరణలు, కార్పొరేషన్లు పౌరులు కాదని ప్రకటిస్తూ వాటికి పౌరులకు వర్తింప చేసే రాజ్యాంగ బద్ధమైన హక్కులను రద్దు చేస్తూ, విద్య ఉద్యోగం, ఆరోగ్యాలను మానవ హక్కులుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణలు చేయాలి

టు 7౦ లు భు అటాలం 4 స | శ 1 లం న. కీ 64 యె ఎం కోటేశ్వరరావు గ గంటి 2 మా న్న డాం

టై యం మ మ షా న మం శిర ౮. మ లే ల క్ర... ఇ ళల (స న క. | నం సే! . క /

  • , ఎం స నా కర క 4 “ ర 41 న ఆద ము న కంట ల ఓ జి ంం ॥ | " టో ॥ . న | మ్‌ న. వో ॥ న. య. * ( ॥ . ప్రజాశక్తి బున్‌మహాన్‌. '