Telugu Vyasa Rachana Shilpam - anilvaranasi/indianlanguages GitHub Wiki
దం నన ల వ. నన టం మ న ప చ వ న ౌ స (| సన తన నే ట్ స న న. ్ గ న సో న వ వ స పు లు న. య వ . న. . మ న న. ను ల... . వ వ సన స మో యేస మను ట్ట స్లో న ప ప ణ్ వ వ. న వ . హా స మ మ. మ | వ చ య వ మ. న! న ము వలు కూ. వ న న ల చ స రా మ: న . మ. ము భర్త. న నో న ప. న? ర మన న. . నం. మా చే ర న మ వ _ _ వ వ. నన న. వ మ న. నం న. న? న. నన మ సళ నరము! (ర ర స్ వ వ న. న. మ. ా న న ను న. న న వ మ్ న లా. న మా! క వ వ వ వ. స్త వ [న న. మ. న మ. కో న న్ న. న్ ను న్ న నన సన స ము మ మం న సస రా ద /! న ను గ ర స చ న న. న ప న షర న! న క్ కు సస సు న సై . వ న వ న వ _ యన యల స న? లో / ను ప స్టో తో నష న న షు మ వ వ వ ణీ స చ చన స! ్. న సు న వ వ య. _ _ వ. న న రట న వ ప. న న. స్. గ న న య మ. 1 1 వ న న ము ర య స్మ ము కోటా “తగ న రష నర చ ధ్ మ న న సో + న. గే న శన మ. ప వ 1 స వ. న్! న ల్ స న్ గర తళ, మ టే మ నం షన ద ప న. ో ర! పమ | . త్ మ. [ మ. ప గ్ గస ॥ న్ు మ న్ వ. న స య: [| .... న న మ. స న వి. వ్ న నై! లీ భో పై / యు టి సు! న గ. న కం . ప న య రు నతన టు! న . మ వ. న ప య నే సు గల
వ్యాస రచనా శిల్పం వి. చెంచయ్య
విప్లవ రచయితల సంఘం నెల్లూరు జిల్లా శాఖ.
స రచనా శిల్పం ల న్య చయ్య న్ ఇ?6- వాంగ చెం ల విరనం నెల్లూరు జిల్లా శాఖ (ప్రచురణ ం2చళావ్యాణర శొలిముద్రణ : 1, జనవరి, 2009 కాపీలు వ 1000 (ప్రతులకు వ వి. చెంచయ్య సాహితీ నిలయం య 10-40-15 ఎ/1, జనతాపేట నార్త్ న కావలి - 524 201, న్న నెల్లూరు జిల్లా. (ఆం.(వ్ర.) ౬ (రి 08626- 242277; 0611 : 94406 38035 (/ మ్న్ వెల వ 20రూఃలు సాం రాం క గ మ! జ(' ఉాంటర0) ఉదయగిరి పైసా ల కావలి. వాట్ [౧0 బా 2 08629 - 243345 | న. తావీలు ఈ షార్రలలో కూడా బొరుదతాయి నవోదయ బుక్ వొస్, హైదరాబాద్. మడి బుక్‌స్టాల్ నెల్లూరు.
ననన నన న్ ననన ననన ననన న ననన న ను చదివిన ఒక మంచి వ్వానం
చెంచయ్య శ్రియాళీల వ్యక్తిగా నాకు బాలా కాలంగా తెలును. నను వూర్చుం తఆరమగా మద్రాను మీదుగా బ్రయాణం వేనేటన్చుడు కావలిలో ఉగ కెవి ఆదొ్నూ చెంచబణ్యునూ చూనీ పోతుందేవాదిని ఆ రోజుల్లో మద్రాను యూనివర్చిటీక్స్ అన్హామ్నలై యానివర్సటీకీ ఆటగా వెళ్టే ఆవనరాలు వన్తుండ్తోేని కావలిలో దన్న వీర్మోడూ విరనం కాధ్దక్తర్తలు మాత్రమే కాదు మంది వందితులు వీరితో నంఖావణ చేయడం ఒక మంబి మేధానుభవం,
జోలి శరింబి రానీనా దాని లోతుల్లోకి వెళ్ళడం చెంచబ్యుడు అలవాటు. అందుకు ఇవ్చుటి బ్రువోద్ద్యానం మరో జఉదావోరణ. ఎన్చుడు వ్వానం చదివినా దో మేధానుఖవం న్వానం వచన భ్రత్రియలలో ఒకటి ఆని చెబుతూ గద్దుం వచనం అనో మాటల వట్టుతార్వోత్తరాల్లోక్ వెళ్ళాడు. వాటిని వాడ్వుల నుండీ ఆధునికుల వరకు వ న అర్ధాలలో వాడోరో వివరించాడు
తెలుగులో కూడా ట్రీను థావల్లోలాగా వ్యానం 26న అతాబ్రాంలో ప్రారంభిమైనదని జృష్తాంతాలు బూవీంచాడు. వివరజణాత్దుకత వినయ బోధకత తొలినాటి న్వాన లక్షణాలుగా నిడూవించాదు. తెలుథలో చాలాకాలం శ్రీతమే వ్యాన భశ్రియ ఆరంభమైన్నా వ్వానం అనో మాూజు తొలినాటి నుండీ వాడలేదు. తరువాత వీరేళలింగంగాడు వ్యానం, ఉవన్వానం అని వాడాడు. గురజాడ ఆవ్పారావగాడు తొలిసారిగా వ్యానం అనో మాటను వాబీనట్లు ఆధారాలు చూనించాడు.
వ్వానం ఎలా ఉండాలి ఆనదాన్నివై నందొమ్బిదవ శతాట్రాం నుంది విద్వామ్తేల అభ్యీపాయాలను వివరించాడు. నియమాలను డల్లంచించవచ్చుననలీ తృడూ అల్హమయ్యేట్లు దందాలన్తీ భందోవిద్రంగా ఉందకాదదన్త వివరణాత్తుకంగా ఉందాలన్సీ వకవివయ నూబకంగా జండాలనీ వారు ఖావించాడు. వ్వానరబనలో శైలీ భోద్దాలు ఉందాలని కొందడు ఖావించినట్లు రెందవ అధ్వాయంలో వివరించాడు క్లువ్తల వ్వాన లక్షణం కాదనీ వావ్టు లక్షణమనీ తన అభిప్రాయం చెప్పాడు,
బిన్నయనూరి శ్రాంభికంలో రాశాడని అన్నాడు. కాని బిన్నయనూరి రబన గ్రాంథికంగా కనవీంచిన్నా వ్వానవోరికానికి నమీవంగా జంటుంది. వాక్ట్రాలు చిన్నవిగా ఉంటాయి. అట్లాగేమూడవ ఆధ్వాయంలో చిన్హయనూరి కరిన (గ్రాంధికంలో రాశాడని అన్నాడు. నిజానికి ఆయన రానింది వత్తి గ్రాంధీకం కాదు. కఠినం అంతకంటో కాదు. నేను వ్హత్తి వదకోళంలో వని చోనేటన్దుడు నెల్లూరు జిల్లాలోని ఒక ఊల్లో ఒక్సరైతు - 969 (ప్రాంతం - బిన్నయనూరి నీతిచంట్రికను భావయుక్తంగా బజివాడ. ఒక సామాన్ఫరైతు చిన్నయనూరి వచనాన్ని నోటికి అవుజెప్పాడంటో దానికి ఆ నచనంలోని వాడుక భొప్తా లక్షణమే కారణాం అని అవ్టుడు నాకు తోచింది
లాలా లాలా ః
వ్యాన రచనా శిల్పం టాం వ్యానం వంట్సీ ధాని లక్షజాలోంట్తి వ్యాన న్వడూవ న్వజానాలేంట్ అనో విషయాలను తంంది వ్వానరబన - మ్యరదర్ధుక నూత్రాలు” ఆనే అధ్వాయంలో వివరించాడు. వ్యాన లక్షణాలను రించి ఇంగ్లీవములో జరిగినంత చర్చ తెలుగులో జరగలేదని చెంచయ్య ఆ వనికి వూనువొన్నాడు. వ్యాన నిర్జాణానికి ట్రత్చేళ నియమాలు, వద్ధతులు ఉందవనీ వైలిద్దుం ఉంటుందనీ అభ్యిపాయవడ్డాడు. తావానికి తన థాషా_౭ైలి గతెతార్జికో ద్ధుక్టుధం, వివయ వివరణ ఎట్లా ఉందాలో వివరించాడు వ్యాన ళిల్పుం శరింబి చెముతూ వఛనడ్డుక్తి దోక్తం కాదని ఆన్నాడు. శ్రీశ్రీ, కుటుంబరావు పానుగంటి లక్ష్మీనరనింవోరావ్సు ర్వా్లిన్లై అనంతక్టున్ధళర్చు వ్రరనో?ి మభునూదనరావు గాల్లశలీ విశేషాలను కూడా వివరించాడు. ఆది ధద్రయాగం ఎట్లా ళిల్చు సౌందర్బాన్ని చూవ్రతుందో సోదావారణంగా “చెప్పాడు రవనా విధానాన్ని ఐర్జి ీల్పం వైవిద్రభరెతంగా ఉంటుందని వివరించాడు ఈ అధ్యాయంలో చెంచయ్య కవితా ్రైలి బయటవదుతుంది. చూదంది - భావ మేముం అయిత శైలి మెడువ భావ అరేరం అయితే లి ప్రొదాం న్వాసానికి భావ _శైలి రెండు కళ్లు వ్వాన నిర్జాణాలు అనో బినరి ఉధ్వాయంలో వ్యాసానికి నిర్దాణాలు వంటాయన్సి అని వినయ వంధిని వళ్రి మాడతంటాయని నూవించాడు. చెంబు వ్యాసాల్ని చిన్న వ్యానం, నమగవ్వానం, వ్వానళకలం అని మూడు భాగాలుగా విభంచాడు. విన్న వ్యాసానికి నంజీనదోవ్ ఏది దత్తమ కళా అనో వ్వాసాన్నీ ననగ వ్యాసానికి టిభరనోని మధునూదనరావు మద్దయగంలో తలుత సొపొత్పం?” ఆనే వ్వాసాన్లీ బ్రపొంచాడు వ్యాన శకలానిక్ కుటుందిరావు వ్రావవోరిక ఖాన అనో వ్వానంతో పొటు మరికొన్నింటిని కూడా తీరుకొాని వివరించాడు. " గొచ్బు వ్వానక్త్తులు అనునరించే వ్వవోలు ఎత్తగదలు తాలియవోయదంతోపాటు, ఇటీవలి వాలంలో నమగ్ర వ్యాసాలు తక్కువై పోతున్నాయని విదారం వెలిబుచ్చాడు వ్యాన యుత ఆమవదితో పారవలకు మేలు ఎడుగుతుందని నూచించాడు. ఇటీవలి కాలంలో నేను చదివిన మంచి వంళోధన వ్యానం ఇది. నాటు తెలియని ఎన్లో విషయాలు తొలునుకున్నాను. చెంచద్యు విద్వానంతుడని తెలున్సు ఇంత వందీతుడని నాము తెలియదు. అందుకు చెంచయ్యకు అభినందనలు వ్రుత్టుతలు. నంతోవం. వ్రాదరావాద్ = చోకూడి రామారావు వగ-22-2006 న యు
లలో రో యాోయి నామాడి
వ్యానరచనవై ఈ వ్యాసాలు రాయడానికి 2007 జూన్ ౧౮౨౩ తోదీలలో మర్చాలణాడలో వ్యానరబనవై విరనం నిర్వువొంచిన వర్స్ పాత (వేయు. ఆ నందర్ధుంగా బ్రకియగా వ్యానం" వేడుతో శేనిబ్చిన డఉవన్వానం చివరకు ఈ ఐదు వ్యాసాలుగా దూవుదిద్దుకున్నది.
కోవిత్తుం, కళ నవల్క నాథకం మొద్లైన నావొత్తు వకియల గురించి - అవి ఎలా రాయల్యో వాజిలోని లిల్బం ఎలావుంటుందో మొదోన విషయాల గురించి ఇంత నరవ బాలా మంది రానేవున్నారు. వ్యాన ట్రక్రీయ చెతన్తూ వికాసాన్డీ వివరించిన వాడూ శన్నాడు దా* కొలికబూరి ఇనాక్ వ్యాన మిదామం' ఈ విషయంలో చొప్టుకోడగంది. ఆయితోవ్యాసాలు రాయదబ్టుకన్లు వారికీ ఉవయోగవడే విధంగా వ్వాసారవనా శిల్పం గురించి ఎవడూ రానీనట్టు కనవిదదు. ఆ ట్రయత్నంలో భాగమే ఈ విను వ్తన్రకం.
దేనికైనా నియమాలు వర్చురదదం మనకొక అలవాటు. ఆ నియమాలు వొలభక్రమంలో నంకెళ్ళుగా మారడం మొడా చూన్తూనే ఛన్నాం. నియమాల వివయంలో ఇలా వండాలి అని గొక ఇలా వన్నది' అని చెవ్పే వ్ధాతిని నోరనునరించాను. ఎందుకంటో ఇలాంటి విషయాల్లో వదీ తది నయం వాదు. తుది నిర్ణయం ఉంటుందనుకోవడం వరిజామనూత్రానికో గొబ్జలివెట్టు వందామం అనేది ద్రర్ధుతి నూభం దానికనుగుడాంగానే సామాజిక వికానం వుంటుంది. సామాజిక నోవట్టుంలో వచ్చే వ సాపొత్సు దకీడుకెనా నరిణామం ఆనివాడ్దం. ఆ నరిణామంలో వరోశమయనం కూడా వుంటుంది.
మన వాళ్లు వద్వాలక వద్దరబిన లక్షణాల గురించి వివరిన్తూ కొడవటిగంటి కుటుందరావ చెవ్పీన మాటి ఆలోబించదగంది. ఆ నియమాలు ఆనమరడ్ధులతు ఉవయోగవదకపోగ్కా ననుడ్డులడు ఉద్రం వస్తాయని ఆయనంటాడు వైగా డూసానికీ నందింధించిన ఆ నియమాలతో ౬డిగేదోమీ లేదు డూవం అనేది రబా విధానానికీ శిల్పానికీ నంబంధించింది. ఈ వనవయంలో ఎవడూ ఎవరినీ నియంత్రంచలేడు నియంభ్రించిన్నా రభయితలు అతికమన్తూనో ఛంటాడు రచనా విధానంలోగానీ శిల్చుంలోగానీ ఎవతి వదతి వార్దిగా దందదమే నుంచిటి. దాని వల్లి వైవిద్రుం వస్తుంది. ఆ వైవిద్దాం వొరకలడ అన్తక్షదాయకంగా వందుంది.
ఇకఈ థ్తవ్రకంలోని మంచిచెక్టల్లి చెప్పాల్సింది పౌరవలూ లిమర్ధతులూ. నిర్జానుమాదీంగా అభిప్రాయాలు తెలియజోన్టే నా లోపాలను నరిదిద్దుకోడానికి నోనెన్టుడూ నీర్ధమే కావలి 27-22-2006 వి చెంచయ్య
చాయలో యాలాల
శిల్పం యయా యోయో యాయ యోయో. న రచనా చ్యూ విషయ సూచిక వ ర శ్ న ఎంఎం 6 ు తాలు ........ వ - 22 టట న. న అహ న భాదల బల చాప శశాభి ళీ క చితితి == టైర్ లి వర్చ్షాప్.... రచనపై తొ వ్యాస
లోయ మ చెంచయ్య
- వ్యాస ప్రక్రియ పుట్టు పూర్వోత్తరాలు రచనా ప్రక్రియలలో వ్యాసం ఒకటి. కథ, నవల, నాటకం, వచన కవితలలాగే వ్యానం కూడా ఆధునిక కాలంలో వుట్టిందే. ప్రాచీన కాలంలో తెలుగు రచనలు ప్రధానంగా పద్యరూపంలో ఉండేవి. ఇవి కేవలం పద్య కావ్యాలు, పద్యం గద్యం కలిసిన చంపూ కావ్యాలు అని రెండు రకాలుగా ఉండేవి. చంపూ కావ్యాలలో అక్కడక్కడా కొంత గద్యం ఉన్నా అది ఛందస్సు లేని పద్యం వంటిదే. తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణం లాంటి కేవలం పద్యకావ్యాలు ఒకటీ అరా మాత్రమే ఉన్నాయి. ప్రాబీన తెలుగు సాహిత్యం అంటే ప్రధానంగా చంపూ కావ్యాలే. వీటన్నిటినీ కలిపి స్థూలంగా పద్య కావ్యాలంటున్నాం. కవిత్వమే గాక అలంకార శాస్త్ర (గ్రంథాలు కూడా పద్యరూపంలో ఉండడం అనాటి విశేషం. ఇక ఆధునిక కాలంలో కధ, నవల, నాటకం, వ్యాసం మొదలైన వచన ్రక్రియలు తెలుగులో వచ్చాయి. ఆధునిక యుగం ప్రధానంగా వచన యుగం కావడం వల్ల కవిత్వం కూడా వచనంలోకి మారిపోయింది. దీన్నే “వచన కవితి అంటున్నాం. అచ్చు యంత్రం రావడం, వ్రజాస్వామ్య భావాలు తలెత్తడం, సంఘ సంన్మరణ కార్యకలాపాలు ప్రారంభం కావడం, ఆంగ్ల భాషా ప్రభావం, చదువుకునే వారి సంఖ్య పెరగడం, వత్రికలు పుట్టుకు రావడం - ఈ మొత్తం నేపథ్యం తెలుగులో వచనానికి నాంది పలికింది. ప్రాచీన కాలపు వద్య సాహిత్యం సామాన్యులకు అందుబాటులో లేదు. సామాన్యులకు సైతం. అందుబాటులో ఉండేది వచనం. కాబట్టి ఆధునిక జాలంలో వచనం మహావృక్షంలా ఎదిగి, శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రాచీన సాహిత్యంలో వచనం, గద్యం అనే మాటలు ప్రసిద్ధి చెందినవే. ఈ మాటలకు ఇవాళ ఉన్న అర్థాల కంటే అప్పట్లో కొంచెం భిన్నార్ధాలుండేవి. చంపూ కావ్యాలలో పద్యాలలో కలిసి ఉండే గద్యాలు ఒక రకం. కావ్యాలలో ప్రతి ఆశ్వాసం చివర ఒక వచనం ఉంటుంది. ఇలాంటి వాటిని ఆశ్వాసాంత గద్యలు అంటారు. ఒకటి గద్యం, మరొకటి గద్య, ఇక వచనాలు ఒక సాహితీ ప్రక్రియ - వెంకటేశ్వర వచనాలు, సింహగిరి వచనాలు మొదలయినవి. వీటిన్సిటిలో న ఉచ ౧
వ్యాన రచనా శిల్పం టాం యు అంతర్లీనంగా ఉన్న ఒక సామాన్య లక్షణం పద్యాలలో లాగా గణాలు, యతిప్రాసలు లేని వచనం కావడం. గణాలు, యతి'ప్రానలు లేకపోయినా, శబ్ద సౌందర్యం, ఒక రకమైన లయ ఉండవచ్చు. ఇక ఆధునిక కాలంలో గద్యం అనే మాటకు పెద్దగా వినియోగం లేదు. వచనం అనే మాటే (ప్రాచుర్యంలో ఉంది. తెలుగులో తొలి దశలో వచ్చిన నవలను వచన ప్రబంధం అన్నారే గాని, గద్య (ప్రబంధం అనలేదు. ఈ చర్చంతా దేనికంటే గద్యం, వచనం అనే రెండిటికీ రూపంలో పోలిక ఉన్నా స్వభావంలో ముఖ్యమైన తేడా ఉందని చెప్పడానికే. పద్యం వాసన ఉన్నది గద్యం. ఆ వాసనను వూర్తిగా వదిలించుకున్నది వచనం. అందుకే ఆధునిక తెలుగు సాహిత్యంలో వచనం అనే మాటే ప్రచారంలో ఉన్నది, పద్యం వానన లేని వచనం సామాన్యులకు దగ్గరయ్యే స్వభావాన్ని కలిగి ఉండడం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఆధునిక కాలంలో వచ్చిన ఈ వచన ప్రక్రియల్లో ఒకటి వ్యాసం. ఇది ముఖ్యమైన వ్రక్రియే కాదు వచనంలో తొలి ప్రక్రియ కూడా. వచన (వ్రక్రియలలో బాగా విస్తరించిందీ వ్యాసమే. వ్యాసం పుట్టుక గురించే కాదు, ఏ గ్రక్రియ పుట్టుక గురించైనా ఖచ్చితంగా తేదీ చెప్పడం కష్టం. ఆ పుట్టుకకూ ఒక చరిత్ర ఉంటుంది. పాఠాత్తుగా ఏదీ పుట్టదు. మానవుల పుట్టుక సమయం నిమిషాలు సెకండ్లతో సహా చెబుతున్నా గర్భంలో ఉన్న తొమ్మిది నెలల సంగతీ మర్చిపోతున్నాం. వుట్టాక కూడా పేరు పెట్టడానికి మరికొంత సమయం పదుతుంది. అలాగే దేని పుట్టుకయినా. తెలుగులో “వ్యాసం” అనే మాట మొదటగా కనిపిస్తున్నది సి.పి. బ్రౌన్ నిఘంటువులో. తెలుగు పరిశోధకులు చాలామంది '2:52 అనే పదానికి “వ్యాసం” అని బ్రౌను అర్దం ఇచ్చినట్టుగా రాశారు. బ్రౌను తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు, ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు రెండూ తయారు చేశాడు. మొదటిది 1852లో, రెండోది 1853లో వెలువడాయి. బ్రౌను '53౪ఖ్లో అనే వదానికి ఎందుకోగాని వ్యాసం అనే అర్ధం ఇవ్వలేదు. యత్నము, ప్రయత్నము, హితోపదేశము, నీతి శాస్త్రమును గురించిన చిన్న గ్రంథము, జ్ఞాన (ప్రదీపిక అనే అర్జ్భాలిచ్చాడు. "503బగంళ్ అనే వదానికి గ్రంథకర్త, ఒక విషయమును ఉవన్యసించి చిన్న గ్రంధము రచించేవాడు అనే . అర్భాలిచ్చాడు. అయితే తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో మాత్రం “వ్యాసము' అనే వదానికి విరివి, ఏ విషయము నైనను విరివిగా (వ్రాయుట అనే అర్ధాలతో బాటు గ 2553) అని కూడా ఇచ్చాడు. వ్యాసం అనే మాట లిఖితంగా అచ్చు రూవంలో 1852లో మొదట కనిపించినా, నిఘంటు నిర్మాణ కృషి కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది గనక బ్రౌన్ రాసుకున్న నోట్సులో అంతకు ముందే ఉండి ఉంటుంది. అయితే ఆంధ్రదేశంలో ఈ మాట 1852 నాటికి (ప్రచారంలో లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు పండితులు బ్రౌనుకు “వ్యాసం' అనే మాటను నూచించి ఉండవచ్చని ఊహించడానికి అవకాశం ఉంది. అయితే 1852 నాటికి తెలుగులో వచ్చిన వ్యాసాలకు ఆ పేరు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. (ప్రపంచంలోనే తొలి వ్యాసకర్తగా (ఫ్రాన్స్‌కు చెందిన, 16వ శతాబ్దం నాటి మైకల్ డిమాంటేన్ను పరిశోధకులు గుర్తించారు. ఇతను స్వీయ జీవితం గురించి కొన్ని వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత
న న న నయము వి. చెంచయ్య 1597లో ఇంగ్లాందుకు-చెందిన బేకన్ కొన్ని వ్యాసాలు ప్రకటించాడు. వ్యాసం (౩0) అనే పేరు ఆధునికమే అయినా ప్రక్రియ పాతదే అని బేకన్ అభిప్రాయపడ్డాడు. ఆంగ్లంలో వ్యాస (ప్రక్రియకు అద్యుడుగా గుర్తింపబడ్డాడు. ఆంగ్రభాషపై ఉన్న చిన్నచూపు వల్లా, లాటిన్ భాషపై ఉన్న గౌరవం వల్లా ఇతను మొదట లాటిన్ భాషలోనే వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత తానే వాటిని ఆంగ్రంలోకి అనువాదం చేశాడు. ఆంగ్లంలోని వ్యాసాల వల్లనే బేకన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పురాణాల నుండి కొన్ని భాగాలను వేరు చేసి వ్యాసాలుగా ప్రచురించే సంప్రదాయం కూడా ఒకటుండేది. వివిధ భాషలలోని ప్రాచీన సాహిత్యంలో వ్యాసాలుగా ఉన్నవాటిని "68ఇ౯ూఆాజ ౦ట్ 11264003" అనే పేరుతో ఎఫ్.ఎ. ప్రిచ్చర్డ్ వెలువరించిన సంకలనం దీనికొక మంచి ఉదాహరణ. 1913లో నెల్లూరు సనాతన నంఘం వారు ్రకటించిన “ఆర్యోవన్యాన చం'దికూ కూడా ఇలాంటిదేనని వ్యాస పరిణామం అనే పరిశోధన గ్రంథంలో డాక్టర్ కొలకలూరి ఇనాక్ 'పేర్మొన్నారు. విశ్వనాథ 'వేయిపడగలు' నవలలోని వెన్నెల వర్ణనను ఒక వ్యాసంగా 'సారస్వత వ్యాసములు అనే వ్యాన సంపుటిలో వేశారు. దీని సంపాదకుడు మునిమాణిక్యం నరసింవోరావు. తెలుగులో కూడా 16వ శతాబ్దంలోనే వ్యాస రచనలాంటిది ప్రారంభమైంది. ప్రతావరుద్ర చరిత్రము, రాయవాచకం, వివేక చింతామణి మొదలయిన [గ్రంధాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రతాపరుద్ర చరిత్రము చరిత్ర గ్రంధం. రాయవాచకం కృష్ణదేవరాయల దినచర్యను తెలిపే గ్రంధం. వివేక చింతామణి తాత్విక రచన. దీని రచయిత వరమానందయతి. ఈ (గ్రంథం 19692 లో తంజావూరు సరస్వతీ మహాల్ గ్రంథాలయం (ప్రచురణగా వెలువడింది. ఇందులోని వచనం వివరణాత్మకంగా, విషయ బోధకంగా కనిపిస్తుంది. ఉదాహరణకు నాలుగు వాక్యాలు. “మరియు అజ్ఞాన సంశయ విపరీతంబులు ముక్తికి విఘ్న ప్రయంబులు. అందు "నేను (బ్రవ్మాంబు గౌదనుట యజ్ఞానంబనంబడు. నేను (బ్రవ్మాం బౌదునో కానో యనుట సంశయంబనంబడు. (శ్రుతియక్తులచే నేను బ్రవ్మమైతే యీ కల్గిన జీవి భావమేమగును అనుటయే విపరీతంబనంబడును”.
సరళ గ్రాంథికంలో సొగిన ఈ రచనలో విషయాన్ని వివరించే తీరు ఎంత సరళంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది 16వ శతాబ్దం నాటి వ్యానరచన అని గుర్తుంచుకుంటే దీని ప్రాధాన్యం అర్థమవుతుంది.
తెలుగు సాహిత్యం గురించిన మొదటి వ్యాసం 1839 లో సి.పి. బౌన్ ఆంగ్లంలో రాసింది. చానిపేరు- "కుంఖ్లా ౦ ఈల 1టుల్రళడ్టుం ఖ14 1106100 05రం1[010664"-
1852 లోనే బ్రౌన్ వ్యాసం అనే మాటను తన నిఘంటువులో ఉపయోగించినా, ఆ తర్వాత వచ్చిన వ్యాసాలకు కూడా వ్యాన రచయితలు ఆ పేరు పెట్టలేదు. స్వామినీన ముద్ద నారసింహానాయుడు 1862 లో తన వ్యాసానికి 'ప్రమేయము' అని 'పేరు పెట్టాడు. ఛందోబద్ధమైన /0ధఐకంటే 'వాక్య గ్రంథములు' రాయాలనీ, ఇవి పండిత పామరులకిద్దరికీ అర్ధమయ్యే రీతిలో ఉండాలనీ అన్నాదు. ఇతను వాక్య గ్రంధం అనే మాటను కూడా (ప్రమేయానికి పర్యాయ వదంగా వాడినట్టు కనిపిస్తుంది. ఈ (ప్రమేయాలలో సులభంగానున్నూ, త్వరితంగానున్నూ లాంటి ఆనాటి వ్యావహారిక శైలీ ప్రయోగాలు కనిపిస్తాయి.
న ౨
"1872లో పరవస్తు వేంకటరంగాచార్యులు తన వ్యాసానికి “సంగ్రహము” అని పేరు పెట్టాడు. అవతార సంగ్రహము, ముక్తి సంగ్రహము, పునర్వివాహ సంగ్రహము మొదలయిన పేర్లతో ఉన్న ఈ వ్యాసాలు నరళ గ్రాంధికంలో ఉన్నాయి.
_ 1876 లో జియ్యరు నూరి “స్రీ కళా కల్లోలిని' అనే గ్రంథాన్ని ప్రకటించాడు. ఇదీ వ్యాసరూప రచనే. దీన్ని గ్రంథం అనీ, వచన కావ్యం అనీ పేర్కొన్నాడు. చిన్నయసూరి కఠిన గ్రాంథికంలో రాస్తున్న సమయంలో ఇతను సులభశైలిలో రాశాడు. భాష సరళ గగ్రాంథికంలో ఉన్నా, శైలి వ్యావహారికం. ఇతని రచనలో స్పష్టతతోబాటు రచయ్యిత్మ అవేదన కూడా కనిపిస్తుంది. “స్త్రీలకు విద్య అవశ్యకము”, “చదివిన వారికిని, చదువని వారికిని గల భేదము” మొదలయిన విధంగా వ్యాసాలకు శీర్షికలు పెట్టాడు.
(ప్రమేయం అనే పదానికి నిఘంటువులో ఉన్న అర్థం 'యధార్థంగా ఎబుగదగినది' అని. అలాగే సంగ్రహము అన్న వదానికి నమ్యగ్రహజము, నంక్షివ్త గ్రంథము అనే అర్థాలున్నాయి. సంస్కృతంలో వ్యానం అనే శబ్దానికి విస్తారం, విగ్రహం అనే. అర్ధాలున్నాయి. విస్తారము = విశేషముగా కప్పుకొనుట, విగ్రహము = విశేషముగా (గ్రహించుట వీటన్నిటినీ క్రోడీకరించి భాషా సమితి విజ్ఞాన నర్వన్వంలో “వ్యానము” అనే వదానికి “ఏ విషయమునైనను తెలిసికొని, దాని యందలి యంశములను విభజించి, వివరించి చెప్పుట వ్యానమని చెప్పవచ్చును అనే అర్థం ఇచ్చారు.
కందుకూరి వేశలింగం (1848-1919) ఉపన్యానం, వ్యాసం అనే రెండు పదాలనూ ఉపయోగించాడు. కందుకూరి ఉపన్యాసాలు వ్యాసాలుగా కూడా అచ్చయ్యాయి. ఆయన వ్యాసాలు కూడా ఉపన్యాస శైలీలో రాయడం ఒక నంద్రదాయంగా ఉంది. జియ్యరు నూరి నయా ఉంటుంది. “తల్లి యనియు పెందామనియు, శుద్ధ మనియు అశుద్ధమనియు భేదము తెలియక ఇల్లు విడిచి, వాకిలి విడిచి, గొద్డులు విడిచి, సొమ్ములు విడిచి, సొత్తులు విడిచి, మానముసెడి, మరియాదయు జెడి, మతి చెడి, గతి చెడి......... (త్రాగుబోతుల మహిమనేమని చెప్పవచ్చును” ఇలా సాగుతూంది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు “సాక్షి వ్యాసాలు ఈ శైలిలోనే ఉన్నాయి.
ఆ రోజులలో నిక్తీ ొం కాబట్టీ వ్యాసానికీ, ఉపన్యాసానికీ పెద్ద తేదా లేనట్టగా కొందరు వ్యానరచన చెయ్యడం గమనించవచ్చు. (బ్రౌను తన ఇంగ్లీషు, తెలుగు నిఘంటువులో 2:3%136అనే పదానికి “ఒక విషయమును ఉపన్యసించి చిన్న గ్రంథము రచించేవాడు” అని వివరణ ఇవ్వడంలో వ్యాసానికి, ఉపన్యాసానికి ఉన్న సంబంధం అర్థమవుతుంది. కందుకూరి తన ఉపన్యాసాలనూ, వ్యాసాలనూ సాంఘిక చైతన్వాన్ని కలిగించడానికి ఉపయోగించుకున్నాడు.
కందుకూరి వీరేశలింగానికి ముందు కొందరు వ్యాసాలు రాసినా వాటికి వ్యాసం అనే పేరు పెట్టలేదు. (బౌను వ్యానం అనే మాటను తన నిఘంటువులో ఇచ్చినా దాన్నెవరూ వట్టించుకోలేదు. ప్రమేయం, సంగ్రహం అనే మాటల తర్వాత వీరేశలింగం ద్వారా ఉపన్యానం, వ్యాసం అనే పేర్లు (ప్రచారంలోకి వచ్చాయి. స్వీయ చరిత్రలో ఆయన ఈ రెండు వదాలనూ ప్రయోగించాడు. 1881- 90 మధ్యకాంలో తాను చేసిన రచనల గురించి తెలుపుతూ, “ఇవిగాక "పెక్కు ఉపన్యాసములు
వ్రాసి ప్రచురించితిని” అని అన్నాడు. 1893 జనవరి 14 నాటి 'ఆంధ్రప్రవేశికి అనే పత్రిక తన
గురించి రాసిన ఒక వ్యాసాన్ని స్వీయ చరిత్రలో ఉదహరించాడు. ఆ వ్వాసకర్త కూడా 'కొఖా' ని ఉపన్యాసంగానే పేర్కొన్నాడు. ఆ వాక్యం ఇలా ఉంది- “ఆయన తెలుగు భాషయందు వచన కావ్యములు, పద్యకావ్యములు, నాటకములు, ఉపన్యాసములు (1530) శాస్త్రములు మొదలగునవి సుమారు 80 గ్రంథముల వరకును చేసిరి”,
“నా వాగ్రూపములైన ఉపన్యాసములు నా లిఖితోపన్యాసములంత శక్తి మంతములుగా నుండక పోవుట సత్యమే” అని కూడా స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. వీరేశలింగం స్వయంగా 'ప్రచురించుకున్న తన వ్యాసాలకు “వ్యాససంపుటి" అని పేరు పెట్టలేదు. ఉవన్యాసమంజరి పేరుతో ఒక సంపుటం, సతీహితబోధిని పేరుతో మరొక సంపుటం, వివేకవర్ధని పేరుతో మూడునంపుటాలు వచ్చాయి. వీటన్నిటిలో ఆయన ఉపన్యాసాలు వ్యాసాలే ఉన్నాయి.
1910 లో వచ్చిన కన్యాశుల్కం నాటకంలో కూడా గురజాడ వ్యాసాన్ని ఉవన్యానమనే అన్నాడు. గిరీశం తన శిష్యుదయిన వెంకటేశంతో - “నీ తండ్రి అగ్గిరావుండోయ్, మో యింట్లో యవళ్ళకీ అతజ్జి లాంగదీసే యలొక్వెన్సు లేదు. నా దెబ్బచూడు, యివాళేం చేస్తానో! వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయమై రాసిన ఉపన్యాసం పెకి తీయ్... కత్తీ కరారీ నూరాలి” అని అంటాడు.
వీటన్నిటినీ బట్టి చూస్తే 1910 వరకు కూదా ఉపన్యానమనే పేరే ఉనికిలో ఉన్నట్టు తెలుసోంది. వీలేశలింగం స్వీయచరిత్ర మొదటిభాగం 1910 డిసెంబకీలో వెలువడింది. రెండో భగం 1915 ఏట్రిల్లో వెలువడింది. రెండో భాగంలో కూడా ఉపన్యానం, వ్యానం అనే రెండు మాటలూ కనిపిస్తున్నాయి. వీరేశలింగం కూడా 1910 తర్వాతనే వ్యానం అనే మాట వాడినట్టు తెలుస్తోంది.
గురజాడ తన వ్యాసాలలో మాత్రం ఉవన్యాసం అనిగాక వ్యాసం అనే ప్రయోగించినట్టా
కనిపిస్తోంది. ఆయన వ్యాసాల నంవుటి పేరు “వ్యాన చంద్రిక. అయితే ఇది చాలా కాలం తద్వాత మమారు 1950 లలో పుస్తక రూవంలో వల్చింది. అందులో ఉన్న “విశ్వవిద్యాలయాలు: _ సంన్కృత భాషలు” అనే వ్యాసంలో “1912 అక్టోబరు నెలలో వెలువడిన ఏషియాటిక్ క్వార్టర్లీలో నొక రచయిత ఈజిన్సలో అరబిక్ భాషల స్థితిని గురించి బహుచక్కని వ్యాసం రాశాడు” అని వ్యానం అనే మాటను మొదట (ప్రయోగించాడు. ఇది 1912 తర్వాతనే అని తెలుస్తోంది. ఆ తర్వాత ఆంధ్ర వత్రిక మొదలయిన వ(్రికలు కూడా వ్యాసాన్ని వ్యానం అని పేర్మొనడం (ప్రారంభించాయి.
మొత్తం మీద తెలుగు వ్యాస ప్రక్రియకు బీజాలు 16వ శతాబ్దంలో పడి, ఆ తర్వాత ప్రమేయం. సంగ్రహం, ఉపన్యాసం మొదలయిన పేర్లతో పెరిగి పెద్దదయి, 20వ శతాబ్దం ప్రారంభం నాటికి వ్యాసం అనే పేరుతో స్థిరపడింది. వీరేశలింగం దాకా వ్యాసాలలో ఇతర విషయాలు కొన్ని ఉన్నాా అవి ప్రధానంగా సంఘ సంన్మరణకే ఉపయోగపడ్డాయి.
ఒటనలనం ాయలాయాలాలాం్ర్రైాాంాాలలాాాాాాోా
వ్యాస రచనా శిల్పం టాటా యోయో ౨2. వ్యాసం ఎలా ఉందాలి? కొన్ని అభిప్రాయాలు “అఖిల లోకోవకారార్థ మట్టి ధర్మ వాక్యతతి తెల్గుభాషనే బల్కబడియె గాన నన్నయ సూత్ర నంస్కారములను విడిచి పెట్టటదోషమై వెలయదచటా”
ఈ పద్యం వఠ్యం వానుదేన పరబ్రహ్మశాస్తులు 1851లో వెలువరించిన 'వ్యవహార దర్పణము" అనే గ్రంథంలోనిది. ఈ గ్రంథంలో వ్యాసాల లాంటివి కొన్ని భాగాలున్నాయి. అప్పటికి ఈనాటి స్వరూనంలో వ్యాస ప్రక్రియ ప్రారంభం కాలేదు. వ్యానం అనే మాట కూడా పుట్టలేదు. వ్యాసాల లాంటి రచనలు కొన్ని ఉన్నాయి. ఆనాటి వ్యావహారిక భాష శైలి చాలా వరకు వాటిలో కనిపిస్తాయి. ఆ వ్యాసాల లాంటి రచనలను దృష్టిలో పెట్టుకొని రాసిన పద్యం ఇది. ప్రజల ఉపయోగం కోసం అలాంటి వాక్య రచన తెలుగు భాషలో ఏర్పదుతున్నదనీ, భాష విషయంలో నన్నయ పాటించిన నియమాలను వదిలి పెట్టడం దోషం కాదనీ పై పద్యం సారాంశం.
ముందు ముందు స్పష్టమైన రూపాన్ని సంతరించుకోబోయే వ్యాస ప్రక్రియకు సంబంధించి భాష విషయంలో ఎలాంటి దృష్టి ఉండాలో స్థూలంగా నిద్దేశీస్తోంది ఈ పద్యం. తెలుగు భాషకు
సంబంధించి తొలి వ్యాకరణ [గ్రంథం “ఆంధ్ర శబ్ద చింతామణి” సంస్కృతంలో వచ్చింది. దీన్ని రాసింది నన్నయ అని ఒక అభిప్రాయం ఉంది. ఇది 12వ శతాబ్దంలో రావడం, అదే సమయంలో తెలుగులోకి నన్నయ భారతానువాదం చెయ్యడం, అది సంస్కృత పదాలతో నిండి గ్రాంథిక భాషలో ఉండదం, ఆంధ్ర శబ్ద చింతామణి అటువంటి [గ్రాంథిక భాషా నియమాలను చెప్పడం, కాన్ని అతిక్రమణలు ఉన్నప్పటికీ దాదాపు కవులందరూ శతాబ్దాల తరబడి ఆ భాషనే ప్రయోగిస్తూ రావడం అనే నేపధ్యంలో పరబ్రహ్మశాస్తులు వ్యాసం లాంటి రచనలోని భాష గురించి మాట్లాడిన సందర్భం అది. వ్యాస ప్రక్రియ పుట్టుకకున్న నేపధ్యంలో పరభబ్రహ్మశాస్త్రులు భాష గురించి వెలిబుచ్చిన అభిప్రాయం చాలా విలువైనది. వ్యాసంలో భాష ఎలా ఉండాలో శాస్త్రులు చేసిన సూచనలు
లాయ లాాలాాాాలాాాాోాం
యోయో వి, చెంచయ్య తర్వాతి కాలంలో వ్యాసకర్తలు గ్రహించడం చూస్తే ఆయన ముందుచూపు తెలుస్తుంది.
1862లో స్వామీనీన ముద్దు నరసింహనాయుడు వెలువరించిన 'హితసూచని (గ్రంథంలోని “విద్యా ప్రమేయము అనే రచనలో వ్యక్తం చేసిన అభిప్రాయం గుర్తింపదగింది. “ఏ గ్రంథమైనా చదువుకునే వారికి నులభంగానున్నూ త్వరితంగానున్నూ సందేహములు లేకుందానున్నూ. బోధపడేలాగున నుండవలసినది ఆవశ్యకమై యున్నది” అని అన్నాడు. ఇక్కడ గ్రంథం, ప్రమేయం అనే మాటలు వ్యాసం వంటి రచనను ఉద్దేశించినవే. విషయం సులభంగా, త్వరితంగా, సందేహాలు లేకుండా అర్థం గావడం ముఖ్యమని నరసింవానాయుడు అభిప్రాయం. ఈ మూడు లక్షణాలూ విషయాన్ని వివరించే తీరునేగాక భాషా సొలభ్యానికీ సంబంధించినవి.
నరసింహనాయుడు ఛందోబద్ధమైన (గ్రంధాల కంటే వాక్య గ్రంథాలు రాయాలని, అవి:
వండితులకూ, పామరులకూ ఇద్దరికీ వనికొచ్చేవిగా ఉండాలనీ అభిప్రాయవడ్డారు. ఈ అభిప్రాయంలో ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. ఛందోబద్ధమైన రచన వ్యాసానికి పనికి రాదనడం ఆ విషయం. మనకు అన్ని రచనలనూ వద్యాలలో రాయడమనే నంవ్రదాయం ఒకటుంది. మన పురాణాలూ, ఇతివోసాలూ, ప్రబంధాల్తూ, చివరకు కొన్ని వ్యాకరణ (గ్రంథాలూ అన్నీ పద్యాలలో ఉండడం తెలిసిందే. కానీ ఛందోబద్ధమైన రచనలు గాకుండా, ఛందస్సులేని రచనా ప్రక్రియ ఒకటి అవనరకున్న ఆలోచన నరసింహనాయుడు మాటలలో కనిపిస్తుంది. అవ్పటికే కొన్ని వచన రచనలు ఉన్నా అవి వ్యావహారిక శైలిలో ఉన్నా నాటి విషయంలో అనంత్పృప్తి ఉండడం సహజం.
జియ్యరు సూరి 1870 లలో 'స్త్రీ కళా కల్లోలిని అనే గ్రంథం ప్రకటించారు. ఈయన బెంగుళూరులో ఒక బాలికా వారశాలలో ఉపాధ్యాయుడు. తన గ్రంథాన్ని వచన కావ్యం అని కూడా పేర్మొన్నాడు. వచనకావ్యం అనే మాటను నూరి వ్యాసానికి ఉపయోగిస్తే, ఆ తర్వాత కందుకూరి వీేశలింగం పంతులు తన నవలకు వచన (ప్రబంధం అనే పేరు పెట్టుకున్నాడు. ఇవాళ వచన కావ్యం అనే మాటను వచన కవిత రూవంలో ఉన్న కావ్యానికి ఉపయోగిస్తున్నాం. (ఉదాహరణకు కళ్యాణరావు రాసిన కాలం” ఒక వచన కావ్యం) వచన కావ్యమనే మాట మొదట వ్యాసొనికే ఉపయోగించినా, ఇవాళ కవిత్వానికే రూఢి అయింది.
“స్త్రీ కళా కల్గోభిని' మూడు భాగాల గ్రంధం. వాటిలో రెండో భాగం పేరు స్తీ విద్యామణి. ఇందులో 69 వ్యాసాలున్నాయి. జియ్యరు సూరి సరళ (గ్రాంధికంలో రాశాడు. ఇతని వ్యాసాలలో స్పష్టతః సంక్షిష్తత ఉన్నాయి. విషయం పట్ల రచయిత మనసులో ఉన్న తపన, ఆవేదన ఆయన భాషా శైలిలో వ్యక్తమవుతాయి. చిన్నయ సూరి వీర గ్రాంధికంలో రాస్తున్న కాలంలో సరళ (గ్రాంథికంలో, వ్యావహారిక శైలిలో రాయడం జియ్యరు సూరి ప్రత్యేకత. విషయ వివరణ తీరులో గానీ, భాషా (ప్రయోగంలో గానీ స్పష్టత, సరళత ఉండాలనేది జియ్యరు సూరి అభిప్రాయం. లాయలాయలాాాాటంై్రైాాాలా లాలా
వ్యాస రచనా శిల్చం టాం యు “బక్ర విషయమును గురించి విస్తరించి వ్రాయుట వ్యాస లేఖనమనబడును” అని వావిలకాలను నుబ్బరాయకవి తన “సులభ వ్యాకరణము” అనే గ్రంథంలో వ్యాసపరిచ్చేదంలో పేర్కొన్నాడు. అంటే.వ్యాసంలో ఒకే విషయాన్ని వివరంగా చర్చించాలని ఈయన అభిప్రాయం. అప్పుడే స్పష్టత వన్తుందని, అనేక విషయాలను ఒకే వ్యాసంలో వివరించడానికి పూనుకుంటే పాఠకులలో. గందరగోళం ఏర్పడుతుందని ఇతని అభిప్రాయం కావచ్చు. 60116624 ఖున్ అనే వ్యాస సంకలనానికి ముందుమాట రాస్తూ ఆల్డస్ హక్స్లీ అనే ప్రసిద్ధ వ్యాసకర్త ఇలా అన్నాడు. వ్యాసం అనేది ఒక చిన్న రచన 'అనీ, అందులో అన్ని విషయాలూ వివరించడం అసాధ్యమనీ ఆతని అభిప్రాయం. ఒకే విషయాన్ని వివరించిన వ్యాసం ఎంత పెద్దదయినా ఇబ్బంది ఉండదు. నిజానికి వ్యాసాలు రాసిన వారు ఈ నియమాన్ని పాటించకపోవచ్చుగానీ, అలా వ్యాసం రాస్తే మాత్రం అది పాఠకులకు విషయాన్ని సుబోధకం చేస్తుంది. వ్యాసం మొదలు, పెంవు, తుది అనే మూడు భాగాలను కలిగి, ఒక వింత శిల్పంతో ఒప్పారుతుందని మునిమాజిక్యం నరసింవోరావు తన “సాహిత్య వ్యాసములు” అన్న (గ్రంథంలో అభిప్రాయపడ్డారు. వ్యాసానికి అనువుగాని అంశాలు లేవంటూ దా॥ ముదిగొండ వీరభద్రశాస్త్రి తన 'పానుగంటి వారి సాహిత్య సృష్టిలో ఎద్రేన్సిన్సి గూర్చి వ్రాసినను కావలసినదెల్ల రచయిత తన భావవథముల వెంబడి తర్క రథమున సుఖముగా పాఠకులను ఆశీనులజేసికొని పోవుటయే” అని ఆలంకారికంగా చెప్పాడు. పాఠకులకు ఇబ్బంది కలగకుండా, హేతుబద్ధంగా విషయాన్ని విశ్లేషిన్తూ తన అభిప్రాయాన్ని పాఠకుల మనసులో నాటుకొనేటట్లు చేసే విధంగా వ్యాసరచన ఉండాలని ఈ వ్యాసకర్త అభిప్రాయం. పింగళి లక్ష్మీకాంతం తన “సాహిత్య శిల్ప సమీక్షలో వ్యాసాన్ని గురించి చెబుతూ వ్యానం వటుత్వం, సౌందర్యం వల్ల కావ్యమండలిలో చేరుతుందని అన్నాడు. అంటే వ్యాసంలోని విషయం ఏదైనా రచనా విధానం వల్ల అది కూడా సాహిత్యంలో భాగమే అవుతుందని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే “కాల్వికముగా విషయ వాలనమొనర్చి పటుత్వముగల భాషలో సోపవత్రికమైన సిద్ధాంతము చేయు వ్యానములే పరనయోగ్యములు" అన్నాడు. తాల్వికంగా విషయాన్ని వివరించడం, భాషలో వటుత్వం (శక్తి) ఉండడం, ఆధారాలతో తన అభిప్రాయాల్ని నమర్ధించుకోవడం అనేవి మంచి వ్యాసానికి లక్షణాలని బక్ష్మీకాంతం ఉద్దేశం. ఈ వ్యానకర్త భాషలో (గ్రాంథిక ఛాయలనూ, విషయంలో గూఢతనూ కోరుకుంటునట్లు కనిపిస్తుంది. వ్యానం తేలికగా అనిపించక బరువుగా ఉండాలన్నట్లు అనిపిస్తుంది. నంజీవదేవ్ తన “రనరేఖలు' అనే వ్యాస సంపుటిలో “విజ్ఞావానికి తోడు వినోదాన్ని కూదా (వ్రసాదించేలాగా వ్రాస్తేనే వ్యానరచనలో భోగట్టాకు తోడు ఆనందం దొరికేది” అన్నాడు. వ్యానం నమాచారాన్ని అందించేది మాత్రమే కాదనీ, దానివల్ల ఆనందం కూడా కలగాలనీ సంజీవదేవ్
అభిప్రాయపడుతున్నాడు. ఈయన వ్యాసాలలో ఈ ఆనందం దొరుకుతుంది. తాను చెప్పిన నిర్వచనానికి అనుగుణంగానే వ్యాసాలు రాశాడు. లేదా తన వ్యాసాలలోని లక్షణాన్ని వ్యాస లక్షణంగా సాధారణీకరించి చెప్పాడు.
శ్రీశ్రీ వ్యాసాల గురించి చెబుతూ కొలకలూరి ఇనాక్ “ఈ రచయిత అభివ్యక్తి బాణం కంటే తిన్నగా, ఖద్దం కంటే పదునుగా, జీవితం కంటే స్పష్టంగా, గుండె కంటే క్లుప్తంగా ఉంటుంది” అంటాడు. శ్రీశ్రీ కవి కాబట్టి, కొన్ని కవితా లక్షణాలు కూడా ఆయన వ్యాసాలలో ఉండడం సహజం. తిన్నగా, పదునుగా, న్పష్టంగా ఉండడం వ్యాసానికి మంచిదేగాని, క్లుప్తంగా ఉందడం చాలా సందర్భాలలో పనికిరాదు. అది ప్రధానంగా కవితా లక్షణం. వ్యాసానికి వివరణ చాలా అవసరం.
నిజానికి తెలుగులో వ్యాసాలు పైన చెప్పిన నియమాలకు పరిమితమై మాత్రమే లేవు. ఎన్ని రకాల లక్షణాలున్నాయో, అంతకంటే ఎక్కువ రకాల వ్యాసాలున్నాయి. ఎన్ని లక్షణాలున్నా వ్యాసానికి స్పష్టత, వివరణ, చదివించే గుణం ఉంటేనే వ్యాసానికున్న ప్రయోజనం నెరవేరుతుంది.
కవిత్వం, కధ, నవల, నాటకం మొదలయిన సాహితీ ప్రక్రియలలో పారకుల ఊవాకు వదలదగిన విషయాలు కొన్ని ఉంటాయి. కానీ పారకుల ఊహలోకి రాని విషయాలను కూడా వ్యాసకర్త వివరించవలసి ఉంటుంది.
వంకన
అల్లో తి. వ్యాసరచన - కొన్ని మార్గదర్శక సూత్రాలు “కష్టంగా రాయడమంత సులభమైన వని లేనట్టే సులభంగా రాయడమంత కష్టమైన పని కూడా లేదు” - శ్రీశ్రీ వ్యాస రచన నులభంగా రాయడమంత కష్టమైన పనిగా ఉండాలి గాని, కష్టంగా రాయడమంత సులభమైన పనిగా ఉండకూడదు. అంటే వ్యాసకర్త కష్టపడితే పాఠకులు సుఖపడతారు, వ్యాసకర్త (థమ పడకపోతే ఆ మేరకు పాఠకులు (శ్రమపడాల్సి వస్తుంది. ఆనందం కోనం కథనూ, నవలనూ, కవిత్వాన్నీ నాటకాన్నీ చదువుకుంటారు. ఆనందం కోనం ఎవరూ వ్యాసాన్ని చదవరు. వ్యాసాన్ని చదివేది విషయాన్ని తెలుసుకోవడం కోసం, తెలిసిన విషయాన్ని మెరుగుపర్చుకోవడం కోసం, అవగాహనను పెంచుకోవడం కోసం. అయితే వ్యాసాన్ని చదవడం వల్లకూడా ఎవరైనా అనందాన్ని పొందితే పొందవచ్చు. అందుకోసం మాత్రమే వ్యాసాన్ని చదవరు. కథ, కవిత్వం మొదలయిన వాటిని చదివితే కొత్త విషయాలు తెలుసుకోవడం జరగదా, అవగాహన పెరగదా అనే చర్చ ప్రస్తుతం అప్రస్తుత విషయం. మంచి వ్యాసం ఎలా ఉంటుంది? అసలు మంచి వ్యాసం అంటే ఏమిటి? దానికేమయినా లక్షణాలున్నాయా? అనలు వ్యాసానికున్న స్వరూప స్వభావాలేమిటి? వ్యాస ప్రయోజనం ఎలా ఉంటుంది? ఈ (ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే వ్యాసం అంటే ఏమిటో చాలా వరకు అర్ధమవుతుంది. అలాగే వ్యాన లక్షణాల్ని చెప్పుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దానికీ లక్షణాలూ, నియమాలూ చెప్పుకోవడం మనకొక అలవాటుగా వస్తోంది. చాలా సందర్భాల్లో అవి అవసరం కూడా. అయితే అవి మన అవసరాల్ని తీరుస్తూ, విశ్చంఖలత్వాన్ని నివారిస్తూ, ఒక (క్రమశిక్షణను నేర్చేవిగా ఉందాలేగాని, మన సృజనాత్మక శక్తికీ, ఆలోచనకూ సంకెళ్లు వేసేవిగా ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోకపోతే వాటివల్ల ఉపయోగం కన్నా నష్టం సంభవించే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. ప్రాచీన కాలంలో ఏర్పడిన కావ్య నియమాలు చాలా వరకు ఈ (ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
వ్యాస లక్షణాల గురించీ, దాని నిర్మాణం గురించీ ఆంగ్ల భాషలో జరిగినంత విశ్లేషణ తెలుగులో జరగలేదు. వ్యాస ప్రక్రియ తెలుగులో శాఖోవశాఖలుగా విస్తరించి అభివృద్ధి చెందిందేగాని, దాని నియమాల గురించి అంత చర్చ జరగలేదు. ఆధునిక తెలుగు సాపొత్య ప్రక్రియలలో దేనికీ అంత ఖచ్చితమైన నియమాలు చెప్పి ఒప్పించలేం. సృజనాత్మకతా, ఆలోచనా ఉండే ఏ విషయంలోనూ ఖచ్చితమైన నియమాలు ఉండడం కష్టం. కాకుంటే కొన్ని మార్గదర్శక సూత్రాల లాంటివి ఉండవచ్చు. అలాంటి వాటి గురించి ఆలోచించడమే ప్రస్తుత వ్యాసం ఉద్దేశం. సృజనాత్మక ప్రక్రియలో కంటే స్పష్టత, సూటిదనం వ్యాసంలో చాలా అవసరం. కొందరు రచయితలు వ్యాసాన్ని కూడా ఒకానొక సృజనాత్మక ప్రక్రియగానే భావించి, ఇందులో కూడా ఆ లక్షణాలు కొంతవరకైనా ఉండాలని అంటారు. ముఖ్యంగా సాహిత్య విమర్శ వ్యాసాల విషయంలో ఈ అభిప్రాయం వినిపిస్తుంటుంది. విమర్శ కళా, శాస్త్రమా అనే చర్చ చేసి విమర్శ కూడా కళే అని నిర్ధారణకు వస్తుంటారు. విమర్శను శాస్త్రం కాదనీ, కళే అనీ తమ వాదం ద్వారా నిరూపించామని తృప్తి పడుతుంటారు. సాహిత్యానికి సంబంధించిన విమర్శ అయినంత మాత్రాన కధ, కవిత్వం, నాటకం మొదలైన సాహిత్య ప్రక్రియలకు ఉండే లక్షణాలుండనక్కర లేదు. కథలోని కథనం, కవిత్వంలోని ఉద్వేగ స్వభావం, నాటకంలోని సస్సెన్సు వగైరా లక్షణాలు వ్యాసానికి అనవసరం. కథకులు, కవులు, నాటక రచయితలు వ్యానకర్తలైతే వ్యాసాలు కూడా కధలు, కవితలు, నాటకాల లాగా తయారయ్యే అవకాశం కొంత ఉండవచ్చు. అయితే కథకులు, కవులు, నాటకకర్తలు అందరూ వ్యాసకర్తలు కాలేరనుకోవడం పొరబాటు. కథా, నవలా రచయిత కాదవగంటి కుటుంబరావు గొప్ప వ్యాసకర్త. మవాకవి శ్రీశ్రీ మంచి వ్యాస రచయిత. వారిలో సృజనాత్మక రచయితతోబాటు వ్యాసకర్త కూడా ఉన్నాడు. తెలుగులో ఎందరో నృజనాత్మక రచయితలు వ్యాసాలు రాసినవారున్నారు. వారి వ్యాసాలలో వారి సృజనాత్మక రచనల ప్రభావం తవ్పక ఉంటుంది. శ్రీశ్రీ వ్యాసాలు ఆయన “గుండెచప్పుళ్ళు” అని కొలకలూరి ఇనాక్ అనడంలో వ్యాసాలలో కవితాత్మక వ్యక్తీకరణ ఉన్నదని చెప్పడమే. శ్రీశ్రీ వ్యాసాలలో కవితాత్మక వ్యక్తీకరణ ఉందని చెప్పడానికి ఇనాక్ అనుసరించిన పద్ధతి కూడా అలాగే ఉంది. “హృదయంలో కల్లోలం ల్గి, ఆలోచనతో తరంగాలు పేట్రేగినపుడు ఈ వ్యాసాలు జన్మించాయి” అని కవిత్వ పద్దతిలోనే వివరించాడు. “గుండెచప్పుళ్ళు” అనే మాట ప్రధానంగా కవిత్వానికి సరిపదేమాట, గుండెకు రక్త ప్రసరణ శక్తి తప్ప, అనుభూతి చెందే శక్తి లేదనే చర్చ జోలికి పోవడం లేదుగాని, ఆ మాట అనుభూతికి సంకేతమయినంతగా ఆలోచనకు కాదు. వ్యాసంలో విషయ సందర్భాన్ని బట్టి అనుభూతి కొంత చోటు చేసుకున్నా ఆలోచన, విశ్లేషణ, విషయ వివరణ ముఖ్యమైనవి. వీటిని చెబ్బతియ్యనంత వరకు.వ్యాసంలో “గుండె చప్పుళ్ళు” లాంటివి చోటు చేసుకోవచ్చు. శ న ఖు.
వ్యాన రచనా శిల్పం టాటాలో వ్యాసంలో భాషగాని, విషయంగాని బరువుగా, సంక్షిష్టంగా ఉండాలన్న అభిప్రాయం కొంతమందిలో ఉన్నట్టు కనిపిస్తుంది. తేలిక పదాలతో ఉండి, చదవగానే తెలిసిపోయే విషయం ఉంటే ఆ వ్యాసం కూడా తేలిపోతుందనే ఆలోచన నుండి వుట్టిన అభిప్రాయం అది. కష్టపడి చదివి అర్థం చేసుకుంటే అది గొవ్చ వ్యాసంగా భావిస్తారు. ఇది ఒక బ్రమ నుండి పుట్టిన అభిప్రాయం. కష్టమైన పనులే గొప్ప పనులు అనుకునే మనస్తత్వం నుండి ఏర్పడిన ఆలోచన. కష్టానికీ, గొవ్పదనానికీ ఉండే విభజన రేఖను గుర్తించాలి. కష్టమైన పనులు కొన్ని గొప్పవి ఉండొచ్చు. కాని కష్టమైన వనులు మాత్రమే గొప్పవి కావు. పైగా ఇక్కడ మనం ఆలోచిస్తున్నది రచయిత కష్టం గురించి కాదు, పాఠకుడి కష్టం గురించి. రచయిత ఎంత కష్టమైనా పడొచ్చు. కానీ పాఠకుడు కూడా అంత కష్టం పడనక్మరలేదు - ముఖ్యంగా వ్యాసం విషయంలో. సాహిత్య కళారూపాల విషయంలో కూడా ఆనందాన్ని అనుభవించడంలో, విషయాన్ని అవగాహన చేసుకోవడంలో, వైతన్య స్ఫూర్తిని పొందడంలో ఈ “కష్టం” పాత్ర ప్రతికూల అంశంగానే ఉంటుంది. ఒక కథ రాయడానికి కథా రచయిత పడే పాట్లన్నీ పాఠకుడు పడక్కరలేదు. రచనలకు సంబంధించి ఈ కష్టం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భాషాపరమైన కాఠిన్యం అయితే, మరొకటి భావపరమైన కాఠిన్యం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా పారకుడు దాని జోలికి మళ్ళీ రాదు. ప్రాచీన తెలుగు కావ్యాలలో భాషాపరమైన కాఠిన్యం ఉంది. ఆధునిక యుగంలో కొందరి వచన కవితలలో భావపరమైన కాఠిన్యాన్ని చూడగలం. అందువల్ల పరిశోధకులు తప్ప, పాఠకులు.వాటీ దారిదాపులకు వెళ్ళరు. అర్ధం కానిదని చెప్పడానికి 'మోడర్నీ ఆర్ట్ అనే ప్రయోగం ఒక జాతీయంగా నూరిపోయిన విషయం తెలిసిందే. ఆధునిక చిత్రకారులు వేసిన కాన్ని బొమ్మలు తలదిద్దలు కొట్టుకున్నా అర్థంగాకపోవడమే దీనికి కారణం. వ్యాన నిర్మాణం గురించీ, లక్షజాల గురించీ సాధారణంగా చెప్పుకునే విషయాల జోలికి నేను పోవడం లేదు. వ్యాసంలో ఇన్ని భాగాలుంటాయనీ, పేరాల వారీగా ఆయా విషయాలు వివరించాలనీ, (ప్రారంభం, విషయ వివరణ, ముగింపు మొదలయిన వ్యాస నిర్మాణ లక్షణాల గురించీ నేను చర్చించడం లేదు. ఎందుకంటే దాదాపు 'వ్యాసకర్తలందరూ అలాంటి నియమాల (ప్రకారం వ్యాసాలు రాయడం లేదు. విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పారకులను బట్టి, రచయిత వ్యక్తిత్వాన్ని బట్టి, అభిరుచులను బట్టి వ్యాస నిర్మాణ పద్ధతులు మారిపోతుంటాయి. అలా మారిపోతుండడం వ్యాస నిర్మాణాన్నీ, లక్షణాల్ని వివరించడానికి ఇబ్బందికరం అయితే కావచ్చుగానీ, వ్యానం మూస వద్ధతిలో గాక, వైవిధ్యంతో కూడి పాఠకులలో పరనాసక్తిని కనిపించే
న న న ఖం కలిగించడానికి ఉపయోగపడుతుంది. వ్యాసరచనలో ఈ వైవిధ్యాన్ని అంగీకరిస్తూనే, విషయ స్పష్టత, గతితార్మిక వివరణ, భావానికి తగిన భాషా శైలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిదని నేననుకుంటున్నాను.
వ్యాసంలో స్పష్టత లోపించడానికి ఎన్నో కారణాలుండొచ్చు. కొన్ని విషయాలను నున్నితంగా సూచించాలనుకోవడం, నంక్షిప్తంగా చెప్పాలనుకోవడం, పాఠకులకు కొన్ని విషయాలు తెలినుంటాయని వాటిని వదిలేయడం, వ్యానకర్తకు కూడా కొన్ని విషయాలు తెలిని ఉండకపోవడం, పారకుల స్థాయిని దృష్టిలో పెట్టుకోకపోవడం, పద ప్రయోగ విషయంలో అజాగ్రత్తగా ఉండడం, సాంకేతిక వదాల్ని వివరించకపోవడం, తన పాండిత్యాన్నంతా ప్రదర్శించాలనుకోవడం వ్యాసంలో అన్బష్టతకు కొన్ని ముఖ్య కారణాలు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం భావంలో స్పష్టత ఉంటే భావప్రకటనలో కూడా స్పష్టత ఉంటుందని గుర్తించడం. ముఖ్యంగా గుర్తించవలసిందీ, చాలామంది గుర్తించనిదీ ఇదే. కాస్తో కూస్తో వ్యాసరచనలో అనుభవం ఉన్నవాళ్ళకు ఇవి తెలియని విషయాలేం కాదు. కాకుంటే వ్యాసరచన సమయంలో వీటిని దృష్టిలో పెట్టుకునే ఓపిక, తీరిక లేకపోవడమో, నిర్లక్ష్యంగా ఉండడమో జరుగుతుంటుంది. గొవ్పగొప్ప వ్యాసకర్తలలో కూడా ఒక్కోసారి అస్పష్టత కనిపించడానికి ఇవే కారణాలవుతుంటాయి.
వ్యాన రచనలో మరో ముఖ్య విషయం గతితార్మిక విషయ వివరణ. మార్క్సిన్తు సిద్ధాంతంలో గతితర్భం అనేది ఒక ప్రధానమైన అంశం. తార్మికం, హేతుబద్దం, అర్ధవంతం, సమంజనం మొదలైన మాటలకు అర్ధాలు వేరైనా, చాలామంది సందర్భానుసారంగా గతితర్మం అనే అర్థంలో కూడా వాడుతుంటారు. గతి తర్మం గురించి తెలియని వాళ్లందరూ అన్ని నందర్భాల్లో గతితర్మ విరుద్ధంగా రాస్తారని కాదు గాని, ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సాపొత్యానికీ, రాజకీయాలకూ సంబంధం ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళకు గతితర్మం తెలియదనే అనుకోవచ్చు. మార్మిఎన్సు సిద్దాంతాన్ని చదివిన వాళ్లందరూ అన్ని సందర్భాల్లోనూ గతితార్మికంగానే అఆలోచించకపోవచ్చు. ఆలోచన, అధ్యయనం, విశ్లేషణ, సిద్ధాంత అన్వయం యాంత్రికంగా జరిగేవి కొవు సిద్ధాంతం తెలియడం ఒక అంశమయితే, దాన్ని అన్వయించడం మరో అంశం. ఈ రెండూ తెలిసిన వాళ్ళే గతితార్మికంగా ఆలోచించగలరు. భిన్న వస్తువులుగా కనిపించే వాటి మధ్య పరస్పర సంబంధం ఉంటుందని గుర్తించడం, వైరుధ్యాలను గుర్తించి వాటికి కారణాలను, పరిష్కారాలను అర్ధం చేసుకోవడం, ఒక సంఘటనకు పూర్వాపరాల్ని గ్రహించడం, మార్పులో ఉండే దశలను గుర్తించడం మొదలైనవి గతితార్మిక సూత్రాలు. ఇవేవీ పట్టించుకోకుండా పైకి లాలాాాాాలలాాడప్రులాలాలాంలాంలాంలా
వాటిని మాత్రమే చూసి, విశ్లేషించడానికి పూనుకోవడం కేవలం తార్మికం అవుతుంది. చిన్న తవ్పునీ, పెద్ద తవ్వునీ ఒకే విధంగా చూడడం గతితర్మం కాదు. ఆ తప్పులు జరగడానికి గల వరిస్థితులను ఆధారంగా విశ్లేషణ చెయ్యడం గతితర్మం అవుతుంది. అశాస్రీయంగా ఆలోచించే వాళ్ళలో కూడా తర్మం ఉండొచ్చు. తర్మం అన్ని సందర్భాల్లో గతితర్యం కాదు. ఎదుటి వాళ్లను నోరు మూయించడానికి తర్కం పనికిరావచ్చు. విషయాన్ని వివరించి ఒప్పించే ప్రయత్నం చెయ్యకుండా, నోరు మూయించే ప్రయత్నమే గతితర్మ విరుద్ధం. “త్రర్మశాస్త్రము నోరు మూసినను, హృదయమును మూయజాలదు” అని మార్కిజంతో సంబంధం లేని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అన్నమాట తర్మం స్వభావాన్ని సరిగ్గా చెబుతుంది. ఆయన పరిభాషలోనే మాట్లాడితే వృదయాన్ని కూడా ముయ్యగలిగింది తర్భాన్ని మించిన వాస్తవమవుతుంది. మార్క్సిస్టు పరిభాషలో అదే గతి తర్మం. వ్యాసంలో పాఠకుల ఆమోదం పొందే విధంగా విషయాన్ని విశ్లేషించడానికి ఈ గతితార్మిక పద్ధతి బాగా ఉపకరిస్తుంది. సామాజిక పరిశీలన, బహు శాన్త్ర వరిచయం, అనుభవం మొదలైన వాటితో బాటు మార్క్సిస్టు పరిజ్ఞానం కూడా ఉంటే విషయ విశ్లేషణ శాస్త్రీయంగా ఉంటుంది. ఇక మూదోది భాషాశైలి. ఇందులో రెండున్నాయి - ఒకటి భాష, రెండు శైలి. భావ (ప్రకటనకు (ప్రధాన సాధనం భాష. సైగలు, చేష్టలు, చూపుల వంటి భాషేతరమైన భావప్రకటన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి గాని, అవి రచనలో ఉపకరించేవి కావు. భావ ప్రకటనకుపయోగపడేది భాష ఆయితే, ఆ భావాన్నీ అందంగా, పటిష్టంగా, శక్తిమంతంగా ప్రకటించడానికుయోగపడదేది తైలి. భాషలో పెద్ద తేడాలు లేకపోయినా, శైలిలో వ్యక్తికీ వ్యక్తికీ తేడాలుంటాయి. వ్యాసానికి సంబంధించి ఇాష సరళంగా ఉండాలి. శైలి చదివించేదిగా ఉండాలి. భాష ఇలా ఉండాలనీ, ఇలా ఉంటుందనీ చెప్పాచ్చుగాని, శైలి ఇలా ఉంటుందని చెప్పలేం. ఎవరి శైలి వారిదే. భాష ద్వారా రచయిత భావాలు మాత్రమే వ్యక్తం అవుతాయి. శైలి ద్వారా రచయిత వ్యక్తిత్వం కూడా వ్యక్తం అవుతుంది. భాష మేఘం అయితే శైలి మెరువు. భాష శకీరం అయితే శైలి ప్రాణం. వ్యాసానికి భాష శైలి రెండు కళ్ళు. వాటి ద్వారానే వ్యానంలోని విషయాన్ని సరిగ్గా చూడగలం. భాష దెబ్బతిన్నా, శైలి బలహీనంగా ఉన్నా చూవు దెబ్బతిని పాఠకుల మనసుకు విషయం ఎక్కదు. శైలి ద్వారా రచయిత వ్యక్తిత్వం వ్యక్తమయినట్లే. రచయిత వ్యక్తిత్వం అతని సామాజిక దృకృథం, సామాజిక ఆచరణల మీద ఆధారవడి ఉంటుంది. ఈ నందర్భంలో చలాన్ని గుర్తు చేనుకోవడం అవసరం. తన అభిప్రాయాల నుండి తన శైలిని విడదీసి చూసే వాళ్ళపైన చలం కోపాన్ని అతో రాయాలో
నన యన న న న న న య ల +. చెంచయ్య (ప్రదర్శిస్తాడు. తన రచనల వల్ల పొందిన ఆనందాన్ని శైలికీ, రచనల వల్ల కలిగిన బాధని తన అభిప్రాయాలకూ ఆరోపిస్తారని అంటాడు. అంటే భావాలు రచయిత శైలిని వ్రభావితం చేస్తాయన్నమాట. ఈ భావాలే రచయిత వ్యక్తిత్వాన్ని కూడా నిర్ణయిస్తాయి. శైలిలో విస్యం, వ్యంగ్యం, క్రోథం, (పేమ అన్నీ కనిపిస్తాయి. విషయం, సందర్భం, ప్రయోజనం మొదలయిన వాటిని బట్టి శైలిలో వైవిధ్యం ఉన్నా స్థూలంగా ఒక రచయిత శైలి ఒకే రకంగా ఉండే అవకాశమే ఎక్కువ. అందుకే రాళ్లపల్లి, విశ్వనాథ, చలం, కుటుంబరావు, శ్రీశ్రీ, కె.వి.ఆర్, (త్రిపురనేని మధుసూదనరావు మొదలయిన వారి శైలుల్ని స్పష్టంగా గుర్తించవచ్చు. భాష గ్రాంథికంలో ఉన్నా వ్యావహారికంలో ఉన్నా ఆ ఖేదాలు శైలిని ప్రభావితం చేసినట్టు కనబడవు. కఠినమైన (గ్రాంథిక భాషలో రాసిన చిన్నయనూరీ, సరళగ్రాంథిక భాషలో రాసిన రాళ్ళపల్లి అనంతకృష్ణళర్మా తమ తమ శైలీ. విన్యాసాలతో పాఠకుల్ని ఆకర్షిస్తారు. వ్యావవారిక భాషలో రాసిన చలం, కుటుంబరావు, శ్రీశ్రీ, సంజీవదేవ్, మధుసూదనరావు మొదలయిన వాళ్ళు తమ శైలీ భేదాలతో పాఠకుల్ని తమవైపు తిప్పుకుంటారు. తాము చెప్పే విషయాన్ని వినేటట్టు చేస్తారు. అందమైన భాషకు పాఠకులు అనందిస్తారుగానీ, శక్తిమంతమైన శైలి రచయిత భావాల్ని పాఠకుల చేత ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల వ్యాసరచనలో భాషాశైలులకు అంత ప్రాధాన్యం ఉంటుంది. తనకు తెలిసిన విషయాన్ని తెలియజెప్పేవాడు వ్యానకర్త. తనకు తెలియని విషయాన్ని తెలునుకునే ప్రయత్నం చేసేవాడు పాఠకుడు. ఈ రెందు విషయాల్ని మననులో పెట్టుకోవలసిన వాడు వ్యానకర్తే, హతా లావ్యాన్ట్నా క 6౦ ౪ఇ€రి స్ న వ అతల చవక ంభ్్ లలో లో
వ్యాన రచనా శిల్పం టాటాలో 4 వ్యాసరచనా శిల్పం వ్యాసం అనేది ఏ భాషలోనైనా గొప్ప ప్రయోజనకరమైన (ప్రక్రియ. ఎటువంటి విషయాన్నైనా అన్ని రకాల పాఠకులకూ సులభంగా వివరించడానికి ఉపయోగపడే ఏకైక ప్రక్రియ. కధలు రాసినా, నవలలు రాసినా, నాటకాలు రాసినా, కవిత్వం రాసినా, వాటన్నిటి గురించి వ్యాసంలో చెప్పదగిన విషయాలు కొన్ని తప్పక ఉంటాయి. అదే వ్యాసం (ప్రత్యేకత. అందుకే ప్రత్యేకంగా వ్యాసాలు రాసిన వ్యాస రచయితల్ని అలా ఉంచితే, కవులూ, నాటకకర్తలూ, కధానవలా రచయితలూ కూడా చాలామంది వ్యాసాలు రాసినవారే. వ్వాస ప్రక్రియను సుసంపన్నం చేసిన శిల్పం అనే మాటను సాధారణంగా కవితా శిల్పం, కధా శిల్చ్బం, నవలా శిల్పం, నాటక శిల్పం అని సృజనాత్మక ప్రక్రియలకే ఉపయోగిస్తాం. విమర్శనా శిల్పం అని కూడా ఒక పుస్తకం (వల్లంపాటి వెంకట సుబ్బయ్య) వచ్చింది. కానీ వ్యాస శిల్చం అని ఎవరూ రాసినట్టు లేరు. శిల్పం అనేది కొన్నిటికే పరిమితమా? అన్నిటికీ సంబంధించింది కాదా? అసలు శిల్పం అంటే ఏమిటి? ఇవే ప్రస్తుత వ్యాసంలో చర్చనీయాంశాలు. రచనలలో విషయాన్ని చెప్పే తీరునే శిల్పం అనొచ్చు. చెప్పే విషయం వదైనా, చెప్పే తీరు బాగా లేకపోతే అది పాఠకుల మనసుకెక్కదు. మనసు కెక్కించడానికి ఉపయోగపడేది ఏదైనా శిల్చ్పమే అవుతుంది. చెప్పే తీరు ఆసక్తికరంగా ఉండడానికి అందరు రచయితలూ ఒకే రకమైన శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించరు. ఎవరి శిల్ప నైపుణ్యం వారిదే. ఒకే రచయిత కూడా తన శిల్ప నైపుణ్యాన్ని మార్చుకుంటూ, పెంచుకుంటూ పోవచ్చు. విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి, పాఠకులను బట్టి కూడా అవసరమైన శిల్ప పద్ధతిని ఎంచుకోవచ్చు. కాబట్టి శిల్చం అనేది ఒక ముద్ద కాదు, ఒక మూస కాదు. శిల్పంలో ఎంత వైవిధ్యం అయినా ఉండొచ్చు కొన్ని రచనలలో అసలు శిల్పం ఉన్నట్టే కనబడదు. కాని ఆ రచనలు పారకులకు ఆసక్తికరంగానే ఉండొచ్చు. అదొక రకమైన శిల్పం. ఇంగ్లీషులో "%్క+1ట 19 న న అని ఒక మాట ఉంది. ఇక్కడ జఃఅనే మాట శిల్పం అనే అర్ధంలో ప్రయోగించబడింది. అంటే శిల్పాన్ని పైకి కనబడనీయకుండా దాచి ఉంచడంలోనే అసలు శిల్చ్బం ఉందని అర్ధం. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం దీనికి మంచి ఉదావారణ. ఒక రచన చదివింతర్వాత “ఎంత బాగా ాయలలాలాాాాాాడ్త్రైాలాాాలాా
న య య య య ఖ్ చెంచయ్య చెప్పాడు” అని అనిపిస్తే అక్కడ శిల్పం పైకి కూడా కనిపిస్తున్నట్టు లెక్క “ఎంత మంచి విషయం చెప్పాడు” అని అనిపిస్తే అక్కడ శిల్పం పైకి కనిపించకుండా దాగి ఉన్నట్టు లెక్క శిల్పం శిల్పం కోసం కాదు, విషయం కోసం. పారకుడి మనసును విషయం మీద కేంద్రీకరింపజెయ్యడమే శిల్పం ప్రయోజనం. నాటకం చూస్తున్నప్పుడు డైలాగులు బాగున్నాయనో, డైరక్షన్ అద్భుతంగా ఉందనో, నటన ఎక్స్లెంట్ అనో అనిపించిందంటే నాటక శిల్పం కొట్టొచ్చినట్టు కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందనుకోవాలి. అంతేగొని, ఆ అన్ని రకాల నైవుణ్యాలూ విషయాన్ని (ప్రేక్షకుల మనను కెక్కేటట్టు చెయ్యలేకపోయాయనే అర్థం. అయితే అందరూ అన్ని సందర్భాలలో ఇటువంటి శిల్పాన్ని తమ రచనలలో చొప్పించడం అంత తేలికయిన పనికాదు.
రచన అన్నప్పుడు కథ, నవల, కవిత, నాటకం వగైరాలే కాదు, వ్యాసం కూడా ఆ వరిధిలోకి వస్తుంది. కాబట్టి వ్యానసరచనలో కూడా శిల్పం ఉంటుందన్న మాట. తెలుగులో వ్యాసరచన బాగా అభివృద్ధి చెందుతున్న దశలో ముని మాణిక్యం నరసింహారావుగారు “ఇవుడు ఆంధ్రవాజ్మయ (ప్రపంచమున వ్యాస రచనా శిల్పము క్రొత్త క్రొత్త కళలతో తళుకొత్తుచున్నదనుట నిర్వివాదాంశము' అని వ్యాసరచనా శిల్పం అనే మాటను ప్రయోగించాడు.
వ్యాస రచనా శిల్పాన్ని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది వ్యాసరచనలో విషయాన్ని వివరించే తీరు. ఇది మళ్ళీ అనేక రకాలుగా ఉంటుంది. భాష శైలి, పదబంధాలు. జాతీయాలు, సామెతలు, ఆలంకారిక వ్రయోగం, వాక్య విన్యాసం మొదలైనవి ఈ వస్తాయి. వీటిని ప్రయోగించడంలో కూడా మళ్ళీ ఎవరి పద్ధతి వారిదే. ఎవరి శక్తియుక్తులు వారివే. ఇక రెండోది మొత్తం వ్యాసానికి సంబంధించింది. వ్యానంలోని విషయం చెవ్పడాని వ్యాసకర్త అనుసరించే వ్యూహం, ఎత్తుగడ, నిర్మాణం మొదలైనవి ఇందులో భాగాలు. ఈ విషయాన్ని మరో వ్యాసంలో పరిశీలిద్దాం. మళ్ళించే
మొదటే చెప్పుకున్నట్టుగా ఇవన్నీ ఉండీ, లేనట్టుగా కనిపిస్తూ, విషయంపైకి దం వ పద్ధతి ఉత్తమ వ్యాస రచనా శిల్పం అవుతుంది. అది ఎవరికో, ఎక్కడో గొని సార కాన్ని ఉన్నా నూటికి నూరుపాళ్ళు నెరవేరాలంటే ఆదర్శప్రాయమే అవుతుంది. పై లక్షణాల రచయిత కొన్ని ఆ వ్యాసాలను మనం గొప్ప వ్యాసాలుగా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క వో సు ఒక్కో కొన్ని లక్షణాలను తనకు నచ్చిన వద్ధతిలో అనుసరించడం వల్ల ఓ నన్ తక / పద్ధతిలో ఆసక్తిని కలిగిస్తూ వైవిధ్యంతో కూడి ఉంటున్నాయి. ఒక్కోసారి శ లక్ష గలే నవ న్ శ విషయం క్లిష్టంగా ఉన్నప్పుడు, ఆది అర్ధమయ్యే రీతిలో సులభశైలిలో చెప్ప
ఈ ఎమి ర్రయలన్ట పారకులలో ఉండి, చదవగానే
వ్యాసం కావచ్చు. విషయం అర్థం చేనుకోవడం కష్టమైనదనే ఆలోచన పదో కస్టమైనడిన్ని అర్థమయ్యేటట్టయితే, అర్ధం గావడమే అక్కడ అసక్తి కఠిగించే అంశం అ మం సులభతరం చెయ్యగలిగిన భాషాశైలి కూడా అ వ్యాసంలో గొప్ప శిల్పం అవుతుం! ల కుండీ వ్యాసరచనా శిల్చం ఇలా ఉంటుంది, ఇలా ఉందాలి అని ఖచ్చితంగా చెప్పడం *కా! ఏ వ్యాసకర్త ఏ వ్యానంలో ఏ రకమైన శిల్పాన్ని ప్రయోగించాదో వివరించవచ్చు.
వ్యాసరచనలోని కొన్ని శిల్ప రీతులను పరిశీలిద్దాం. సాధారణంగా ప్రనరుక్తిని దోషంగా చెబుతారు. ఒకే వదాన్ని అనేకస్తార్లు (ప్రయోగించడం వునరుక్తి అయితే దోషంగా భావించె ఈ పునరుక్తిని కూడా ఒక శిల్ప చాతుర్యంగా ఉపయోగించవచ్చు. “ఉత్తమ వాక్యం ఉత్తమ శైలికి వట
వ్యాన రచనా శిల్పం టాం టాం ఉత్తమ సోపానం” అని కొలకలూరి ఇనాక్ తన 'తెలుగు వ్యాస పరిణామం” (గ్రంధంలో అన్నాడు. ఈ వాక్యంలో “ఉత్తమ అనే మాట మూడుసార్లు వచ్చింది. అయితే అది ఇక్కడ దోషంగా అనిపించదు. ఒక వింత వాక్య విన్యాసంగా కనిపిస్తుంది. 'ఈ సమాజంలో బతకాలంటే కావలసినవి మూడు - ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు డబ్బు అనే వాక్యంలో కూడా పునరుక్తి ఉంది. డబ్బే ప్రధానం అనుకునే వ్యక్తి ఆ భావాన్ని శక్తిమంతంగా చెప్పిన పద్ధతి ఇందులో కనిపిస్తుంది. ఈ టెక్నిక్‌ను అనేక సందర్భాల్లో వాడుకోవచ్చు. “మంచి వ్యక్తిగా బతకాలంటే కావలసినవి మూడు. ఒకటి నిజాయితీ, రెండు నిజాయితీ, మూడు నిజాయితి అని కూడా అనొచ్చు. మామూలు మాటలలోనే ఒక్కోసారి అనుభూతి ప్రధానంగా, ఆర్ధంగా చెప్పొచ్చు. “అక్కడికి నేను మొదటిసారి మా తాతయ్యగారితో వెళ్లాను. అతనకృ్కడే ఉండి పోయాడు. నేను స్నానం చేసి తిరిగి వచ్చాను.” ఇవి శ్రీశ్రీ మాటలు. తాతకు శృశానంలో అంత్యక్రియలు జరిపి వచ్చిన సందర్భాన్ని శ్రీశ్రీ చెప్పిన తీరు వృదయాన్ని కదిలిస్తుంది. ము ర లయ నషయాన్ని అపాచే. ఆ తర్వాతి రెండు చిన్న వాక్యాలలో విషయం అర్ధంగావడమే గాక గుండె బరువెక్కుతుంది. “పెల్లల కోసం సినిమాలు ప్రత్యేకంగా తియ్యాలని అంటుంటారు. మనవాళ్ళు తీస్తున్న సినిమాలన్నీ పిల్లల సినిమాలే గదా!” ఇవి కొడవటిగంటి కుటుంబరావు మాటలు. చదవగానే మొదట షాక్‌కు గురవుతాం. ఆ వెంటనే విషయం అర్ధమై మనం ఊహించని కోణం నుండి రచయిత చేసిన ఆలోచనకు ఆశ్చర్యపడతాం. పిల్లల కోసం సినిమాలు తీయాలని చాలామంది అనడం మనకు తెలిసిన విషయమే. మరి తీస్తున్న సినిమాలన్నీ పిల్లల సినిమాలే అనడంలో ఆంతర్యం ఏమిటి? పెద్దల సినిమాలకూ, పిల్లల సినిమాలకూ ఉన్న తేడా విషయంలో కుటుంబరావు దృక్పథమే వేరు. మన సినిమాలలో హీరో సర్వశక్తిమంతుడు. అన్ని మంచి లక్షణాలూ ఆయనలోనే ఉంటాయి. విలన్ పరమ దుర్మార్గుడు. అన్ని అవలక్షణాలూ అతనిలోనే ఉంటాయి. చివరకు విలన్ ఓడిపోయి హీరో గెలుస్తాడు. నూటికి తాంభై తొమ్మిది సినిమాలలో ఇదే వరస. మంచి చెడ్డలు స్పష్టంగా వేరువేరుగా ఉండడం, చివరకు మంచి గెలవడం - ఇవి పిల్లల కథల్లో, సినిమాల్లో ఉండవలసిన లక్షణాలు, సైకి మంచిగా ఉంటూ, లోపల్లోపల కుట్రలు పన్నడం లాంటి సంక్లిష్ట మనస్తత్వాల్ని అర్ధం చేసుకోవడం పిల్లలకు కష్టం. అందుకని హీరో మంచికి సంకేతంగా, విలన్ చెడ్డకు ప్రతీకగా ఉండాలి. ఈ సమాజంల నిజాయితీగా బతకాలనుకున్న వాడికి అడుగడుగునా కష్టాలే. సమాజాన్ని దోచుకుంటున్న వాళ్ళు సుఖ భోగాలతో ఉంటారు. అనేక సందర్భాల్లో న్యాయం ఓడిపోతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు పిల్లలకు నిరాశా నిన్నృవాల్ని కలిగిస్తాయి. కాబట్టి మంచి, న్యాయం గెలిచి తీరాలి. మనవాళ్ళు తీసే సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పిల్లల సినిమాలే అని కుటుంబరావు చమత్కారం. నిజానికి పిల్లల సినిమాలు ఇలాగే ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఇవి పెద్దల సినిమాలు మాత్రం కావనేది ఆయన అభిప్రాయం. రెండు వాక్యాలలోనే ఇంత భావాన్ని ఇమద్బడం, మన మెదళ్లకు పదును బెట్టడం కుటుంబరావు చెప్పే తీరులోని ప్రత్యేకత, శశేపు సూర్యుడు పడమట పొడిచి, శ్రీశ్రీకి జ్ఞానపీఠం వారు లక్ష రూపాయలు బమూకరించినా, ఆ బవూక్ళృతి కన్నా శ్రీశ్రీ యే ఎత్తున ఉంటాడు. ఇందులో సందేహం లేదు. శ్రీశ్రీ కన్నా మిన్న ఏదన్నా ఉంటే అది శ్రీశ్రీ కవిత.” ఇవి కూడా కుటుంబరావు మాటలే. చాలా సహజంగా,
న న న న న య బి +. చెంచయ్య అలవోకగా చెప్పినట్టున్న ఈ వాక్యాలలో ఎంతో అర్ధం ఉంది. శ్రీశ్రీకి జ్ఞానపీఠం అవార్డు రావడమనేది సూర్యుడు పడమటి దిక్కున ఉదయించడమంత అవాస్తవం. ఒకవేళ వచ్చినా అది శ్రీశ్రీ కంటే గొప్పది కాదు. శ్రీశ్రీ కంటే గొప్పది ఒక్కటే, అది శ్రీశ్రీ కవిత్వం. శ్రీశ్రీ కమ్యూనిస్టు కవి కాబట్టి ఆ అవార్డు శ్రీశ్రీకి ఇవ్వరు. సంప్రదాయ కవి కాబట్టి విశ్వనాధ సత్యనారాయణకు ఇచ్చారు. అవకాశవాద కవి కాబట్టి ఆ తర్వాత సినారేకూ ఇచ్చారు. వ్యక్తిగా శ్రీశ్రీలో ఎన్నో బలహీనతలున్నాయి. అందువల్ల శ్రీశ్రీ కంటే శ్రీశ్రీ కవిత్వం చాలా గొవ్పది. ఆ మూడు వాక్యాలలో ఇంత అర్ధం ఉంది. సూర్యుడు పడమటి దిక్కున పాడవడం అనే ఒక అసాధ్యమైన విషయంతో ప్రారంభమైన వాక్య నిర్మాణం ఇక్కడ గుర్తించదగింది. ఈ వాక్య నిర్మాణాన్ని మార్చి అదే విషయాన్ని చప్పగా చెప్పొచ్చు.
(గ్రాంధిక భాషలో రాసినా, అద్భుతమైన వాక్య విన్యానం ఉన్న వ్యాన రచయిత రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. '“సారస్వతా లోకము, 'వేమన' అన్నవి వీరి ప్రసిద్ధ వ్యాస సంపుటాలు. సారస్వతా_ లోకంలో ఒక వ్యాసం చూడండి. - “నాచన సోమనాథుని కవిత్వ మంత యుత్తమ జాతికిం జేరదని చె సావాసించి పలువురు వండితుల మనను నొప్పించిన యపరాధిని నన్నే మీరీనాడు అతని జయంత్యుత్సవములో అధ్యక్షునిగా నెన్నుకొని సాహిత్య (ప్రపంచమందు మీకు గల స్వాతంటత్ర్య రసికతను వెల్లడించితిరొ. వాక్య నిర్మాణం ఎంత వయ్యారంగా ఉండవచ్చునో ఇదొక ఉదావారణ. వాక్యం పెద్దదయినా, ఎంత అందంగా, ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. చాలామంది పండితులు నాచన సోమన గొప్పదనాన్ని పొగిడారు. చిన్నయనూరి “అలికంబున నక్షిని డాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాధుస్తుతి యొనరింతున్” అన్నాడు. “ఒకడు నాచన సోమన..” అన్న వ్యాసంలో విశ్వనాథ సత్యనారాయణ సోమన కథా సంవిధానాన్నీ, ఇతర విశేషాలనూ తెలియజేశాడు. అలా పండితుల చేత ప్రశంసలందుకొన్న సోమన గురించి చెబుతూ ఆయన రాసిన ఉత్తర వారివంశం” కావ్యం ఎర్రన రాసిన హరీవంశానికి అనుకరణ అని రాళ్ళపల్లి తేల్చేశాడు. పందితాభిప్రాయానికి భిన్నంగా చెప్పడం సొవానమే. అయినా నాచన సోమన జయంతి నభకు తననే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, ఎన్నుకొన్న వారి 'స్వాళంత్ర్య రసికత అవుతుందేగాని తన గొప్పదనం కాదట! నిజానికది తన గొప్పదనమనే చెప్పుకోవడం. ఆత్మస్తుతి ఉన్నా అది లనట్టు కనిపించేంత మర్యాదపూర్వకమైన వాక్య విన్యానం.
పానుగంటి లక్ష్మీనరసింవారావు సాక్షి వ్యాసాలలోని శిల్చ రహస్యం అధ్ధిక్టేవం - స్త హాస్యం, వ్యంగ్యం, ఆవేదన అన్నీ కలినుంటాయి. తెలుగువాడయ్యుండి తెలుగులో మౌట్లా చి ఆంగ్లంలో మాట్లాడిన సందర్భాన్ని అధిక్షేప పద్ధతిలో విమర్శనాత్మకంగా చెబుతాడు. నస్వభాష ర్ వ్యాసంలోనివి ఈ వాక్యాలు : “వీర లాంధ్రమున మాటలాడ లేకపోవుట యేమి? లేకపోవుటయ: ననగా నాకేమో బోధపడలేదు మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన నుండునా? కిచకిచలాద స కోతిని మీరెచ్చటనైన జూచితిరా? ఈత రాని కప్ప యే దేశమందైన నుండునా? వుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదునుటకేమైన నందేహమా? ఆంధ్రదేశమున బుట్టిన పక్షులైన ననవరత శవణమున నాంధ్రమున మాటలాడుచుందగా - అయ్యయ్యో! మనుజుడ్తి అంత మనుజుడే - ఆంధ్ర మాతాపితలకు బుబ్లిన వాడే - ఆంధ్ర దేశీయ వాయు నీరాహార పారణ మొనర్చిన వాడే _ అధమాధమ మారు సంవత్సరముల యీడు వజకైన నాంధ్రమున మాటలాడినవాడే - అట్టి వాడాంగ్లేయ భాష సభ్యసించినంత మాత్రమున నిప్పుడాంధ్రమున మాటలాడ లేకుండునా? అయయాాయాోాాం్రైాాాాాాాలాలాాోా
ఆశ్చర్యము. అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున నాతనిని మాటలాడకుండా జేసినది అశక్తికాదు. అనిష్టత - అసవ్యాత..”. ఇదీ పానుగంటి వ్యాస రచనా శైలి. ఈ సాక్షి వ్యాసాలలో శైలీ శిల్పం గమనించదగింది. వోస్య వ్యంగ్యాలతో బాటు, ఆవేదన, అవేశం ఆయన భావాలకు ఊవునిస్తాయి. ఒకే భావాన్ని చెప్పడానికి అనేక రకాల పోలికలు తీసుకురావడం, ఒకే అర్భాన్నిచ్చే అనేక పదాలనుపయోగించడం ఇందులో ప్రత్యేకతలు. ఏ విషయాన్నైనా వోస్య ధోరణిలో రాయగల శక్తి కొందరి సొత్తు. భమిడిపాటి కామేశ్వరరావు వ్యాసాలు ఇందుకుదాహరణ, ఉదాహరణకు రెండు వాక్యాలు. “ఆయనకి స్థిరాస్తి భార్య, చరాస్తి తనే.” “కావలసినంత బలం ఉంది రైలుకి, అన్ని పుట్ల ఇనప సామగ్రి కూడా ఒక్క నరమానవుడు ఎల్లా చెబితే అల్లా వంది.” మొదటి వాక్యంలో చెప్పదల్చుకున్న విషయం ఆయనకి అస్తిపాస్తులేవీ లేవని, ఉన్నది భార్యా, తనేనని, ఆమె ఇంట్లో నుంచి బయటకు రాదని. మనుషుల్ని ఆస్తులుగా మార్చి చెప్పడం వల్ల వాన్యం పుట్టింది. రెండో వాక్యంలో ఇలాంటిదేమీ లేదు. రైలును ఇనుప పదార్ధంగానే, శ్రర్ను మనిషిగానే చెప్పి చమత్మారాన్ని సాధించాడు. అయితే ఈ ధోరణి ఎక్కువగా వ్యాసాలలో కంటే కథల్లో, నవలల్లో ఉపయోగపడుతుంది. వ్యాసాలలో ఒక విషయాన్ని వివరించిం తర్వాత దానికి సమర్థనగా జనరల్ స్టేట్మెంట్ల లాంటీ వాటిని చేర్చడంతో ఆ విషయానికి విలువ పెరుగుతుంది. ఇలాంటి వాక్యాలు రాయడంలో ఆధునిక విమర్శకులలో రాళ్ళపల్లి, విష్లవ విమర్శకులలో త్రిపురనేని మధుసూదనరావు ముఖ్యులు. “అల్ప్బత్వమునకు రసికుల బ్రతుకులో చోటు లేదు.” “వరదూవషణము పందలపాలిటి బ్రవ్మాస్తము.” “దక్షత మనము చేతులార సంపాదించవలసిన వస్తువుగాని పుట్టుకచే వచ్చునది కాదు.” ఇవి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ “సారస్వతాలోకము” వ్యాస సంపుటిలోని వాక్యాలు. “విష్లవం అంటే మార్చు అని అర్థం.” “ప్రజలంటే ఎవరు? ఎవరికి చైతన్యం ఉందో వారే ప్రజలు.” “వ్రజల వక్షాన నిలబడి విమర్శకుడు కవిని పరిశీలిస్తాడు. కవి పక్షాన నిలబడి ప్రజలకు కవి వృదయాన్ని పరిచయం చేస్తాడు.” ల కాని నిలబం) ట్రజల ఇవి (త్రిపురనేని మధుసూదనరావు “కవిత్వం - చైతన్యం” వ్యాససంపుటిలోని వాక్యాలు. ఇవి నూటికి నూరుపాళ్ళు వూర్తి సత్యాలు కాకపోవచ్చు. కానీ ఆయా సందర్భాలలో ఇలాంటి వాక్యాలు వ్యాసంలోని విషయానికి బలాన్ని కలిగిస్తాయి. సాధారణంగా భాషలో ఏ ప్రయోగాలు సహజమైనవి కావనుకుంటామో, ఒక్కోసారి ఆ ప్రయోగాలు భావప్రకటనా శక్తికి నిదర్శనాలవుతాయి. దీనికి మంచి ఉదాహరణ కర్మణి ప్రయోగం. అంటే కర్మ వ్రధాన వాక్యాలలో “బడు” (క్రియాపదాన్ని ప్రయోగించడం. “ఇది నా చేత రాయబడింది లాంటి వాక్యాలు. ఈ 'బడూ ప్రయోగం తెలుగుభాషకు సహజమైనది కాదు. సంస్కృతంలో, ఇంగ్రీషులో ఇది చాలా నహజం. తెలుగు నుడికారాన్ని చంపే వాటిలో ఇదొకటి. దీని గురించి
న య య న య య + చెంచయ్య రంగనాయకమ్మ, చేకూరి రామారావు లాంటి వాళ్ళు చాలా చర్చ చేశారు. బడు ప్రయోగం చేసేవాళ్ళు బడుద్దాయిలని ఒకరు. బడు ప్రయోగం తెలియని వాళ్ళే బడుద్దాయిలని మరొకరు అనడం వరకూ వెళ్ళాయి ఆ చర్చలు. అయితే ఎలాంటి సందర్భంలోనూ 'ఐడు” ప్రయోగం
వనికి రాదనడం సరైంది కాదనే అనిపిస్తుంది. 1970 జులై 10న వెంపటాపు సత్యాన్ని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపినపవుడు ఒక రచయిత అన్న మాటలు - “సత్యం చావలేదు, చంపబడ్డాడు.” అని. ఇక్కడ “ఐడు” (ప్రయోగం ఎంత శక్తిమంతంగా ఉందో వివరించనక్కరలేదు.
ఈ వాక్యాన్నే - “నత్యం చావలేదు. బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు.” అని రాస్తే భావ ప్రకటన ఎంత బలహీనపడుతుందో తెలుస్తుంది.
తెలుగులో “అటి (ప్రయోగం ఒకటుంది. వ్యంగ్యంగా తీవ్ర విమర్శ చేసేటవుడు ఇది బాగా వనికొన్తుంది. కొన్నేళ్ళ క్రితం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేసినపుడు, ఆందోళనలు శాంతియుతంగా చేనుకొండని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సమాధానంగా ఒక పత్రికలో రాసిన వాక్యాలు - “ఆందోళనల వల్ల శాంతి భద్రతల నమస్య ఉత్పన్నమవుతున్నదట. అందువల్ల అందోళనలు విరమించుకోవాలట. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆందోళన చేనుకోవాలట. అంతేగాని ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం తగ్గించదట.”
వ్రశ్నల వరంవర కూడా భావాన్ని పాఠకుల మననుల్లోకి బలంగా ఎక్కించడానికి ఉవయోగపడుతుంది. ఈ వాక్యాలు చూడండి.
“పం చేశారని నక్సలైట్లను చంవుతున్నారు? వాళ్ళు అక్రమంగా కోట్లు సంపాదించుకున్నారా? సేదల్ని దోచుకుంటున్నారా? స్రీలపై ఆత్యాచారాలు చేస్తున్నారా? దేశాన్ని విదేశాలకు అమ్మేస్తున్నారా?”
నిజానికి ఈ వనులన్నీ దోపిడీదారులు, పాలక వర్ణాలు చేసే పనులు. అలాంటి పనులు నక్సలైట్లు చేస్తున్నారా అని ప్రశ్ళించడం వల్ల ఇక్కడ భావావేశం కలుగుతుంది. అంతేగాదు, పాలక వర్గాలు చేసే వనుల వల్లనే నక్సలైట్లు పోరాటాలు చెయ్యవలసి వస్తోందని సాధారణ పాఠకుల చేతకూడా ఆమోదింవజేసినట్టవుతుంది.
ఈ విధంగా రచనా శిల్చ్బం అనేది ఎన్ని విధాలుగానైనా ఉంటుంది. వీటన్నింటినీ ఒకే రచయిత ఒకే వ్యానంలో ప్రయోగించడు. వ్యాసంలోని విషయాన్నిబట్టీ, సందర్భాన్ని బట్టీ, దాని పాఠకులను బట్టీ' శిల్పరీతులు మారతాయి. సూటిగా, సులభంగా, బలంగా, ఆకర్షతీయంగా భావ ప్రకటన చెయ్యదానికి వీటిని సందర్భోచితంగా వ్యాసకర్తలు ఉపయోగించుకోవడం అవసరం. ఇవేకాదు, ఇంకా ఎన్నో రకాల టెకిక్కులను ఉపయోగించుకోవచ్చు.
బాగా రాయడం అంళతేలికయిన పనికాదు. అంత మాత్రాన అది అసాధ్యమైనదీ కాదు. సాధనవల్ల రచనాస్తాయిని పెంచుకోవచ్చు. వ్యాన రచనా పౌధాన్ని నిర్మించడంలో శ్రమ ఉంది. అయితే ఆ (తమలో ఆనందం, తృప్తి ఉంటాయి.
ఇప్పటికే వ్యాన ప్రపంచంలో ఉన్న వ్యాస రచనా శిల్చు రీతులను తెలుసుకుని తన వ్యాసరచనలో ఉపయోగించుకునే వాడు మంచి వ్యాసకర్త. ఈ శిల్పరీతులను స్వయంగా సృష్టించుకోగలిగిన వాడు అంతకంటే గొప్ప వ్యానకర్త,
వినననను లాయ
వ్యాన రచనా శిల్చం టాటా 5. వ్యాస నిర్మాణాలు వ్యాసం పైన వ్యాసపరంపరలో ఇది చివరిది. వ్యాస నిర్మాణంలో వ్యాసకర్త వ్యూహం, ఎత్తుగడలు, చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం మొదలైనవి ఇందులో చర్చించబోయే అంశాలు. వ్యాసానికి ఒక నిర్మాణం ఉంటుంది. అయితే అది అన్ని వ్యాసాలకూ ఒకే రకంగా ఉండదు. విషయ పరిధిని బట్టి అది మారుతుంది. అందువల్ల వ్యాస నిర్మాణం అనే కంటే వ్యాన నిర్మాణాలు అనడం సరైనది. విషయ పరిధిని బట్టి అవగాహన సౌకర్యం కోసం వ్యాసాన్ని స్థూలంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి - చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం. ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి వరిశీలించి నంక్షి్తంగా రాస్తే దాన్ని చిన్న వ్యాసం అనొచ్చు. ఒక విషయాన్ని పూర్వాపరాలతో, చారిత్రక అంశాలతో, సోదాహరణంగా, సమ(గ్ర సమాచారంతో వివరంగా రాస్తే దాన్ని సమగ్ర వ్యాసం అనొచ్చు. ఒక విషయంలోని ఒకటి రెండు లేదా కొన్ని అంశాలను మాత్రమే సంక్షిప్తంగా సందర్భానుసారంగా రాస్తే దాన్ని వ్యాస శకలం అనొచ్చు. ఇది స్టూల విభజన మాత్రమే. ఈ మూడు రకాల వ్యాసాలలో ఒక్కొక్కదానిలో మళ్ళీ అనేక ఉపభేదాలుండొచ్చు, ఉంటాయి కూడా. వీటికి ఈ పేర్లే పెట్టాలన్న నియమం వఏిదీ లేదు, ఇంతకంటే మంచి పేర్లు, తగిన పేర్లు స్ఫురిస్తే వాటినే వాడుకోవచ్చు. ఈ మూడు రకాల వ్యాసాలనూ సోదాహరణంగా చూద్దాం, చిన్న వ్యాసానికి సంజీవదేవ్ “ఏది ఉత్తమ కళా అన్నది ఒక మంచి ఉదాహరణ, ఇందులో చర్చించిన విషయం ఒక్కటే లు ఉత్తమ కళ అంటే ఏమిటన్నది. ఆధునిక విమర్శకులు కొందరు చర్చించినట్టుగా అయిదు లలిత కళల్లో - సాపొత్వ్య, సంగీత, శిల్ప, చిత్రలేఖన, నాట్యాలలో ఏది ఉత్తమమైనది అని కాదు నంజీవదేవ్ చర్చించింది, ఏ కళలోనైనా ఉత్తమమైనదేది అని. ఆరు పేజీల ఈ చిన్న వ్యాసంలో చర్చించిన విషయం ఒక సంపూర్ణతను సాధించినట్టు కనిపిస్తుంది. మొదట సత్యాలు రెండు రకాలనీ, అవి వ్యక్తిగత సత్యాలు, వస్తుగత సత్యాలనీ. వ్యక్తిగత సత్యాలకు నిర్వచనాలు అపరిమితంగా ఉంటాయనీ, కళ అపరిమిత నిర్వచనాలతో
అయోల వి చెంచయ్య కూడుకున్న వ్యక్తిగత సత్యానికి సంబంధించిందనీ వివరిస్తాడు. కళను నిర్వచించేటప్పుడు మంచి చెడ్డలతో సంబంధం ఉండదని మంచి చెడ్డల గూర్చి చర్చిస్తాడు. సంఘానికి కీడు చేసేవి వినాశాత్మక కళలయితే, మేలు చేసేవి కల్యాణాత్మక కళలని చెబుతాడు. మొత్తం మీద మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ఈ రెండు 'రకాలూ కళలే అవుతాయంటాడు. రచనా సంవిధానం, విషయ వస్తువూ - ఈ రెండు మిళితమయితేనే కళా సృష్టి జరుగుతుందంటాడు. ఆ తర్వాత కళ కొరకే కళ అనే శుద్ధ కళావాదుల గూర్చీ, సంఘ శ్రేయస్సు కౌరకే కళ అనే నైతిక కళావాదుల గూర్చీ వివరిస్తాడు. శుద్ధ కళావాదులు రూవ సౌందర్యానికే ప్రాధాన్యం ఇస్తారనీ, నైతిక కళావాదులు విషయ వన్తువుకే (ప్రాధాన్యం ఇస్తారనీ అంటాడు. వీరిద్దరి వాదాలూ ఉత్తమ కళకు నిర్వచనాలు కావని సంజీవదేవ్ అభిప్రాయం.
ఉత్తమ కళ ఏదో వివరించడానికి ఆయన ఒక చిత్రకళా ప్రదర్భలోని నాలుగు చిత్రాలను ఆధారం చేనుకున్నాడు. అవి - ధ్యానీబుద్ధ, కసాయి అంగడి, వ్యభిచార గృహం, దేవాలయ ద్వారంలో అనేవి. ఈ చిత్రాలలోని విషయ వస్తువును వక్కన బెడితే, మొదటి రెందు చిత్రాలు అద్భుతమైన కళాపొందర్యంతోనూ, చివరి రెండు చిత్రాలు కళావిహీనంగానూ ఉంటాయి. ఆ ప్రదర్శనశాలలోకి నంజీవ్దేవ్ ఒక శుద్ధ కళావాదినీ, ఒక నైతిక కళావాదినీ వ్రవేశపెడతాదు. శుద్ధ కళావాది విషయాన్ని పట్టించుకోకుండా ధ్యానీబుద్ధ, కసాయి అంగడి అనే చిత్రాలను మెచ్చుకుంటాడు. నైతిక కళావాది కళా సౌందర్యాన్ని పట్టించుకోకుండా ధ్యానీబుద్ధ, దేవాలయ ద్వారంలో అనే చిత్రాలను మెచ్చుకుంటాడు. ఇద్దరూ మెచ్చుకున్నది ధ్యానీబుద్ధ చిత్రం. ఇద్దరికీ నచ్చనిది వ్యభిచార గృవాంలో అనే చిత్రం. మిగతా రెండు చిత్రాలూ చెరొకటి నచ్చాయి. వీరిద్దరి అభిప్రాయాలను విశ్లేషించుకోవడం ద్వారా ఏది ఉత్తమ కళో సంజీవదేవ్ వివరిస్తాడు. ధ్యానీబుద్ద చిత్రంలో విషయం, కళావ్యక్తీకరణ - రెండూ బాగుందడం వల్ల శుద్ధ, నైతిక కళావాదులిద్దరికీ నచ్చిందని, అందువల్ల అదే ఉత్తమ కళకు ఉదాహరణ అనీ అంటాడు. అవినీతివంతమైన రసానందం కంటే నీతివంతమైన రసానందం (ప్రేక్షకులపై సత్ఫలితాన్ని కలగ జేస్తుందని అంటాడు. ఉతమ పానీయాన్ని మురికి పాత్రలో పోసుకుని తాగలేమనీ, ఉత్తమ పానీయాన్ని ఉత్తమ పాత్రలో పోసుకొని తాగితేనే అది ఉత్తమ పానీయమవుతుందనీ పోలిక చెప్పి వివరిస్తాడు. కాబట్టి ఉత్తమ రచనా సంవిధానం ద్వారా ఉత్తమ విషయ వస్తువుతో సృష్టింపబడితేనే అది ఉత్తమ కళ అవుతుందని నిర్ధారిస్తాడు. _
వ్యాన నిర్మాణ పద్ధతుల్ని ఆధారంగా చేసుకొని మాత్రమే “ఏది ఉత్తమ కళ?” అనే సంజీవదేవ్ వ్యాసాన్ని చిన్న వ్యాసానికి ఒక మంచి ఉదాహరణగా నేనెంచుకున్నాను. అంతేగాని అందులోని అభిప్రాయాలన్నిటితో ఏకీభవించి మాత్రం కాదు. ఉత్తమ వస్తువు, ఉత్తమ రచనా విధానం రెండూ కలిస్తేనే ఉత్తమ కళ అవుతుందనే అభిప్రాయంతో పేచీ లేదు. అయితే “ఉత్తమా అనే మాటను ఆయన వివరించలేదు. వివరించి ఉంటే బహుశ అందులో భేదాఫిప్రాయాలుండొచ్చు.
వ్యాన రచనా శిల్పం టాటా కళ అంతిమ లక్ష్యం నీతినిగాని, అవినీతినిగాని ప్రచారం చెయ్యటం కాదనీ, వ్యక్తులకు రసానందాన్ని అందించడం మాత్రమేననీ సంజీవదేవ్ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఖచ్చితంగా విఖేదిస్తాను. ఇక్కడ మసం గమనించవలసింది ఆయన అనుసరించిన వ్యాస నిర్మాణ పద్ధతినే. ఒక విషయాన్ని వివరించడంలో ఎంచుకున్న ఉదాహరణలు వివరించే తీరు, స్పష్టత, సూటిదనం, అలోచన పక్కదారులు పట్టకుండా ఉండడం, ఆసక్తిదాయకంగా ఉండడం, సరళత్వం మొదలయిన అన్ని అంశాలకూ ఇదొక నమూనాగా నిలుస్తుంది. సంక్షిప్తంగా రాస్తూనే సమగ్రతను సాధించడం ఇందులో చూడొచ్చు. చిన్న వ్యాసానికి ప్రధాన లక్షణం ఇదే.
సమగ్ర వ్యాసానికి త్రిపురనేని మధుసూదనరావు “మధ్య యుగంలో తెలుగు సాహిత్యం”. అనే వ్యానం ఒక మంచి నమూనా. సమగ్ర వ్యాసానికున్న పరిధి చిన్న వ్యాసానికుండే పరిధి కంటే చాలా పెద్దది. ఆ విన్ఫత పరిధిలో చెప్పవలసిన విషయాన్ని నిర్భ్ధారించుకోవడం చాలా జాగ్రత్తతో చెయ్యవలనలిన వని, తానెంచుకున్న శీర్షికకు నంబంధించిన నమాచారాన్ని క్రోడీకరించుకోవడం, ఆధికారికంగా చెప్పడానికి అవసరమైన ఆధారాల్ని సేకరించుకోవడం అవసరం. సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత సంబంధమైన నేపథ్యాన్ని అవసరమైన మేరకు చారిత్రకంగా వరిశీలించాలి. వీటన్నిటి కంటె ముఖ్యంగా ఆ వ్యానంలో చెప్పదల్చుకున్న సారభూతమైన విషయం గురించి న్పష్టత ఉండాలి. ఈ అన్ని లక్షణాలూ ఉన్న వ్యాసం “మధ్యయుగంలో తెలుగు సాహిత్యం”.
ఈ వ్యాస్తంలో ్రతి అంశాన్ని వ్యాసకర్త స్పష్టమైన అవగాహనతో కూలంకషంగా చర్చిస్తాడు. వ్యానం మొదట్లోనే సాహిత్యానికీ, సామాజిక శాస్త్రాలకూ శాశ్వత సూత్రాలు ఉండవనీ, చలన సూత్రాలు మాత్రమే ఉంటాయనీ చెప్పి, ఈ స్పృహ రచయితలకు నిరంతరం ఉండాలంటాడు. తర్వాత చరిత్రలో యుగం, సాహిత్య చరిత్రలో యుగం అంటే ఏమిటో వివరిస్తాడు. ఇంగ్లీషు సాహిత్య చరిత్రర్ని చదివి, ఆ ప్రభావంతో తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలించడం అశాస్త్రీయం అంటాడు. తెలుగు సమాజ క్రమాన్ని అధ్యయనం చేసి, మొదట్నుండీ తెలుగు భాష మాట్లాడిన ప్రాంతాల్లోని రాజ్యాల్నీ, రాజవంశాల్నీ, సాంఘిక జీవితాన్నీ, మతాచారాల్నీ, తాత్విక సంప్రదాయాల్నీ, అర్థిక పరిస్థితుల్నీ, సాహిత్య కళారంగాల్నీ పరిశించాలంటాడు. చరిత్రలో యుగానికీ, సాహిత్య చరిత్రలో యుగానికీ ఉండే తేడాను వివరిస్తాడు. రాజవంశాల్ని బట్టో, కాలాన్ని బట్టో, ప్రక్రియలను బట్టో, సాహిత్య చరిత్రలో యుగ విభజన చెయ్యడం కుదరదంటారు. తెలుగు సాహిత్య చరిత్రలో యుగం అనేది ఒక సంకీర్ణ (ప్రవాహం అంటాడు. ఇలా 'యుగం” అంటే ఏమిటో ఒక స్పష్టమైన అవగావానకు వచ్చింతర్వాతనే ఆ యుగంలో సాహిత్యం గురించి పరిశీలిస్తాడు. అసలు యుగ విభజన పద్ధతికి ఆధునిక భూగర్భ శాస్త్రం ఆధారమని మూలాల్లోకి వెళ్ళి పరిశోధిస్తాడు. తెలుగు
భూభాగంలో ఆ యుగంలో వర్ధిల్లిన రాజకీయ, సాంఘిక, మత, దార్భనిక శక్తుల్ని వివరిస్తాడు. తెలుగు సాపొత్య చరిత్రలో ఆర్యీకరణం, సంస్కృతీకరణం నిర్వహించిన పాత్రని ప్రస్తావిస్తాడు.
నంస్కృతం రాని తెలుగు కవుల్ని రాజులు పోషించకపోవడం వల్ల ఆ కవులకు సాహిత్య చరిత్రలో స్థానం లేకుండా పోయిందంటాడు. నిజమయిన తెలుగు సంన్యతి కింది ప్రజల సంస్కృతిగా మిగిలిపోయిందని చెబుతాడు. చరిత్రలో ఉత్తర మధ్య యుగంగా చెప్పబడ్డ 14 - 18 శతాబ్దాల మధ్య కాలాన్ని తెలుగు సాహిత్యంలో మధ్య యుగంగా స్వీకరిస్తాడు. ఈ యుగ వ్రక్రియలైన ప్రబంధం, యక్షగానం, వచనం అనే వాటిని విశ్లేషించడం ద్వారా తెలుగు సమాజంలో వచ్చిన మార్పులు తెలుగు సాహిత్య స్వరూవ న్వభావాల్ని ఎలా నిర్హయించాయో వివరిస్తాడు. ప్రబంధం గురించి ఆధునిక సాహిత్య విమర్శకులు చెప్పిన లక్షణాలను పక్కన బెట్టి, ఆ యుగంలో ప్రధాన పాత్ర వహించిన రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతం వెలుగులో వ్రబంధాల్ని పరిశీలిస్తాడు. వచన వ్రక్రియ అభివృద్ధికీ, తెలుగు సాహిత్యంలో మధ్య యుగానికీ ఉన్న నంబంధాన్ని తైలియజేస్తాడు. ఆ యుగ జీవితాన్ని యక్షగానం ఎలా ప్రతిబింబించిందో వివరిస్తాడు. ఈ విధంగా అ యుగ సామాజిక జీవితానికీ, సాహిత్యానికీ ఉన్న నంబంధాన్ని వివరంగా చర్చించడం వల్ల దీన్ని సమ(గ్ర వ్యాసానికి తగిన ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇక వ్యాసశకలం. వ్యాసాన్ని అయిదారు ముక్కలు చేస్తే అందులో ఒక ముక్క అని అర్థం, అంటే వ్యానంలో ఒక చిన్న భాగం అన్న మాట. ఒక విషయానికి సంబంధించి ఒక అంశాన్నోో రెండు అంశాలనో న్పృళశించి సంక్షిప్తంగా వివరించడం. ఇది సందర్భానుసారంగా వెంటనే స్పందించి చెప్పాల్సిన విషయంగా కూడా ఉండొచ్చు. ఇవాళ దిన పత్రికలలో వచ్చే చాలా వ్యాసాలు ఇలాంటివే. కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాలలో ఇలాంటీ వ్యాన శకలాలు చాలా దొరుకుతాయి. అయితే కుటుంబరావు వ్యాన శకలాలు చాలామంది ఇతరులు రాసిన వ్యాన శకలాల కంటే చాలా విలువైనవి.
కుటుంబరావు సాహిత్య వ్యాసాలు (కొ.కు.వ్యాస ప్రపంచం-5) అనే సంపుటంలో భాషా విభాగంలో “వ్యావవోరిక భాష” అని రెండు పేజీల చిన్న వ్యాసం ఉంది. ఆ నంవుటంలోని అనేక వ్యాన శకలాలలో ఇదొకటి. నిజానికి “వ్యావహారిక భాషా అనే శీర్షికతో వ్యాన శకలమే కాదు, ఒక నమగ్ర వ్యాసమే రాయొచ్చు. శీర్షిక అలా ఉన్నా అందులో ఒక చిన్న అంశాన్నే వ్యానకర్త చెప్పాడు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక మిత్రుడు మరొక మిత్రుడికి వ్యావవోరిక భావలో ఉత్తరం రాయాలని (ప్రయత్నించి, వ్యావహారికంలో రాయడం చాతకాదని తెలునుకుని అశ్చర్యపోయాడట. గ్రాంధికంలో అయితే ఆ ఉత్తరం అవలీలగా రాసి ఉండేవాడట. ఇదీ సందర్భం. ఇది గుర్తుకు రాగానే కుటుంబరావు ఈ వ్యాస శకలాన్ని రాసేశాడు.
మనలో చాలా మందికి వ్యావవోరిక భాష కూడా సరిగా రాదని గుర్తించిన వ్యాసకర్త, దానికి కారణాలేమిటా అని ఆలోచిస్తూ రాసిన వ్యాసం ఇది. మన విద్యా విధానంలో గ్రాంధిక భాషనూ, వ్యావహారిక భాషనూ, దేన్నీ సరిగ్గా నేర్పడం లేదనే సత్యాన్ని గుర్తించాడు. సాధారణ విద్యార్ధికి కూడా కవిత్రయం భాషను నేర్పాలని ప్రయత్నించి రెంటికి చెడ్డ రేవడిగా తయారు లాాాాాాాాచడ్ర్రైాాలాలాలాలాలాాోాం
వ్యాన రచనా శిల్పం టాటాలు చేస్తున్నామని ఆయన అభిప్రాయం. మాతృభాషలో ఉత్తరం రాయడం చేతగానివాడు ఎన్ని డాక్టరేట్లు చేసినా అతడు నిరక్షరాస్యుడే అంటాడు. మాతృభాష అంటే గ్రాంథిక భాష కాదు, వ్యావవిరిక భాష- మాతృభాషలో విద్యాబోధన మంచిదేగాని, ముందు మాతృభాషను సక్రమంగా నేర్పాలని అంటాడు. ఈ వ్యాన శకలంలో విషయం ఇది.
అదే నంపుటంలో సాహిత్య విమర్శ విభాగంలో “సమిష్టిగా సాహిత్య పఠనం” అనే మరో వ్యాస శకలం ఉంది. సాహిత్యం సమిష్టిగా మనుషుల్ని (ప్రభావితం చెయ్యడం మన నంవ్రదాయంలోనే ఉన్నదనీ, దానివల్లనే సనాతన సంస్కృతి నిలిచి ఉన్నదనీ, అభ్యుదయ, వి్లవవాదులు సమిష్టి పఠనాన్ని ప్రోత్సహిస్తే సామాన్యులు కూడా రెండు నెలల కాలంలో తమ రాజకీయాలను తాము శాసించగల రాజకీయ విజ్ఞతను సాధించగలరనీ చెప్పడం ఇందులోని విషయం. పుస్తకాల విలువ రాయడంలో కన్నా చదవడంలోనే ఎక్కువగా ఉంటుందన్న వాక్యంతో (ప్రారంభించి, సాహిత్య వఠనానికి సంఘాలు అవనరం అనే సూచనతో ఈ వ్యాసాన్ని ముగిస్తాడు. రెండు పేజీల ఈ వ్యాస శకలంలో సమిష్టిగా సాహిత్య వఠనం అన్న ఒక్క అంశమే చర్చించబడింది.
చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం అనే రూపాలలో వ్యాస నిర్మాణాలు ఈ
మూడు రకాలన్నది స్థూలంగా మాత్రమే. ఈ మూడు రకాల వ్యాసాలూ ముప్పై రకాల వ్యాసాల లాగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే పైన పేర్కొన్నట్లు ఈ మూడు రకాల నిర్మాజాలలోనే తు.చ. తప్పకుండా వ్యాసకర్తలందరూ వ్యాసాలు రాయడం ఆచరణలో జరిగే పని కాదు. కొన్ని వ్యాసాలను ఈ మూడు రకాలలో దేనికి సంబంధించిందో చెప్పడం కూడా కష్టం కావచ్చు. దీనిక్కారణం కొందరు వ్యానకర్తలు ఈ మూడు రకాల వ్యాస నిర్మాణాలలోని లక్షణాలను కలగా పులగం చేసి వ్యాసాలు రాయడమే. చాలామంది వ్యానకర్తలకు వ్యాసరచనకూ ఒక (ప్రణాళిక ఉంటుందన్న స్పృహ ఉండదు, తాను చెప్పదల్చుకున్న విషయాలను లేదా తనకు తెలిసిన విషయాలను వరసబెట్టి చెప్పుకుపోవడమే వ్యాసం అనుకుంటారు. కవిత్వం ఎలా రాయాలి, కథ ఎలా రాయాలి, నవల ఎలా రాయాలి అనే ప్రశ్నలు వేసుకున్నట్టుగా వ్యాసం ఎలా రాయాలి అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. వ్యాన నిర్మాణ సూత్రాలకు కట్టుబడి రాసిన వ్యాసం చదవడంలో పాఠకులకు ఒక సౌలభ్యం ఉంటుంది. ఇంతకూ వ్యాసకర్త, ఈ వ్యాసంలో ఏం చెప్పాడు అనే ప్రశ్న పాఠకుడు వేనుకోవలసి వస్తే వ్యాస నిర్మాణంలో కూడా లోపాలున్నాయనుకోవచ్చు. వ్యాసంలో చెప్పదల్చుకున్న విషయం ఏమిటి అన్నది ఒక అంశం అయితే, దాన్ని పాఠకుల మనసులకెలా ఎక్కించాలన్నది మరో అంశం.
ఈ వ్యాసం ప్రారంభంలో వ్యూహం, ఎత్తుగడలు అనే మాటల్ని వాడాను. ఏ పనిలోనయినా ఇవి నహజం. కవిత్వం, కథ, నవల, నాటకం మొదలయిన సృజనాత్మక (ప్రక్రియల్లోనూ ఇవి ఉంటాయి. ఇక వ్యాన రచనలో అయితే తప్పనిసరి. అంటే వ్యాస రచనకు ఒక ప్రణాళికను తయారు చేసుకోవడంలో భాగాలే ఇవి. పైన చెప్పిన మూడు రకాల వ్యాసాలకూ దేని ప్రణాళిక లాలా
దానికుంటుంది. చెప్పవలసిన విషయాన్ని ఏ వద్ధతిలో చెప్పాలి, ఏ మేరకు చెప్పాలి, ఉన్న సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎన్ని పేజీలలో వ్యాసం రాయాలి, ఏ రకమైన వ్యాన నిర్మాణాన్ని ఉపయోగించాలి మొదలయినవన్నీ వ్యూవాంలో భాగం. చెప్పవలసిన విషయాన్ని సులభంగా, సరళంగా, ఆసక్తికరంగా చెప్పడానికి వ్యాసకర్త ఉపయోగించే వద్ధతుల్ని లేదా టెక్సిక్కుల్ని ఎత్తుగడలు అనొచ్చు. వ్యాసానికి సంబంధించిన వ్యూవాం వస్తుగతం (00661౪69) అయితే, ఎత్తుగడలు వ్యక్తిగతం (56060౪76) అవుతాయి. అందుచేతనే వ్యాన నిర్మాణాలు రకరకాలుగా కనిపిస్తాయి. వ్యూహం, ఏత్తుగడలు లోపించినప్పుడు వ్యాసానికి నిర్మాణమే ఉన్నట్టు కనిపించక గందరగోళంగా ఉంటుఐది.
చిన్న వ్యాసానికీ, సమగ్ర వ్యాసానికీ వ్యూహం చాలా ప్రధానమైంది, వ్యాన శకలంలో వ్యూవోనికి అంత (ప్రాధాన్యం ఉండదు. ఈ మూడింటిలో ఎత్తుగడల అవసరం ఉన్నా వ్యాన శకలంలో మరింత అవసరం ఉంటుంది. కుటుంబరావు వ్యాస శకలాలలో ఈ ఎత్తుగడల్ని బాగా చూడొచ్చు. పైన పేర్యాన్న “వ్యావవారిక భాష అనే వ్యానం కూడా ఇందుకొక నిదర్శనంగా నిలున్తుంది. ఒక మిత్రుడు మరొక మిత్రుడికి వ్యావహారిక భాషలో ఉత్తరం రాయాలని ప్రయత్నించి విఫలం కావడమనే ఒక ఉదాహరణతో వ్యాసాన్ని ప్రారంభించడం కుటుంబరావు ఎత్తుగడ. మన మాతృభాష ఏది అంటే “తెలుగు” అంటాం. కుటుంబరావు దృష్టిలో ఇది అన్నష్ట సమాధానం. నన్నయ తెలుగు మన మాతృభాష కాదనీ, మనం మాట్లాడే మన వ్యావహారిక భాషే మన మాతృభాష అనీ అవగావాన కలిగిస్తాడు. సాధారణంగా అందరూ చూసే కోణం నుండి గాక మరో ఊహించని కోజం నుండి చూడడం కుటుంబరావు ఎత్తుగడల్లో భాగమే. విషయాన్ని వివరిస్తూ మధ్యలో హఠాత్తుగా ఒక స్టేట్మెంట్ లాంటిది చెబుతాడు. అది పాఠకుల ఆలోచనకు పదునుపెడుతుంది. సాహిత్యాభిలాష అనే వ్యానంలో విమర్శనా శక్తి పెరిగితేనేగాని సాహి త్యాఛిలాష పెరగదని చెబుతూ, “చదవడానికి మాత్రమే వనికి వచ్చి నలుగురిలో చర్చించటానికి వనికిరాని పుస్తకం ఏమంత చెప్పుకోదగిన పుస్తకం కాదు” అనంటాడు. పాఠకులకు ఏదో కొంత నమాదారాస్ట్త అందించడం మాత్రమే కాదు వ్యానం ప్రయోజనం, వారి ఆలోచనా శక్తిని పెంచడం అం ముఖ్యమైన ప్రయోజనం.
మరో వ్యానంలో సాహిత్యం నిర్వహించవలసిన సాంఘిక ప్రయోజనం గురించి విపరిసా అసలు సాహిత్యం నిర్వహించవలసిన సాంఘిక పాత్రను గురించి నరైన అవగాహాన లెని జాతి! మనది అంటాడు. సాహిత్య ప్రయోజనాన్ని వివరించడం కంటే ముందు, సాహిత్యానికి సాంఘిక: పాత్ర ఒకటుంటుందనే అవగావానను కలిగించాలంటాడు. పాఠకుల మెదళ్ళను పదునెక్కించే. ఇలాంటి స్టేట్మెంట్స్ చెయ్యడం కుటుంబరావు వ్యాసాల్లోని ఒకరకమైన ఎత్తుగడ.
మనుషుల్లో సాధారణంగా ఉండే స్వార్ధదృష్టిని కుటుంబరావు “గుడ్డి కన్నుతో పోలుస్తాడు. పరాయివాళ్ళు లంచాలు తీనుకుంటే అది అవినీతిగానూ, మన కుటుంబ సభ్యుడు లంచాలా లయోలా
వ్యాస రచనా శిల్పం టాటా ద్వారా లక్షలు గడిస్తే అది ప్రయోజకత్వంగాను కనిపిస్తుందని చెబుతూ, ఇలాగే ఎవరి గుడ్డి కన్ను వారికుంటుందని అంటాడు. అంతేకాదు, కళాకారుడైన వాడు జీవితాన్ని “మంచి కంటితో చూడడమేగాక దాన్ని మనకు ఎరువిస్తాడని కూడా అంటాడు. ఇలా పద (ప్రయోగంలోగానీ, వాక్య విన్యాసంలోగానీ, నిర్వచనాలు (స్టేట్మెంట్స్) ఇవ్వడంలో గానీ కుటుంబరావు అనుసరించే పద్ధతులు వ్యాసరచనలో ఆయన ఎత్తుగడలకు నిదర్శనం. ఇలా ప్రతి గొప్ప వ్యాసకర్తకూ వారనుసరించే వ్యూహాలూ, ఎత్తుగడలూ వారి వ్యాస రచనా వద్దతిని తెలియజేయడంతోబాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా పట్టిస్తాయి. విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పాఠకుల్ని బట్టి చిన్న వ్యాసం రాయాలా, సమగ్ర వ్యాసం రాయాలా అనేది వ్యాసకర్త నిర్ణయించుకోవాలి. ఇటీవలి కాలంలో సమగ్ర వ్యాసాలు రావలసిన స్థాయిలో రావడం లేదు. పత్రికా రంగం విస్తరించడంతో, పత్రికలలో చోటు పరిమితంగా ఉండడం వల్ల చిన్న వ్యాసాలకూ, వ్యాస శకలాలకూ ఎక్కువగా అవకాశం ఉంటోంది. పత్రీకలలో వస్తే ప్రచారం బాగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయిదారు పేజీలకు మించకుండా వ్యాసాలు వంపందని పత్రికలు నోట్ పెట్టడం సహజమైపోయింది. పెద్ద వ్యాసాలు అచ్చు వేసే పట్రికలు చాలా తక్కువ. వాటికి సర్ములేషన్ కూడా తక్కువగానే ఉంటుంది. చిన్న వ్యాసాల (ప్రయోజనం ఎంత ఉందో, సమగ్ర వ్యాసాల ప్రయోజనం కూడా అంతే ఉంది. సమగ్ర వ్యాసాలు రాయడానికి పరిశోధన దృష్టి కూడా అవసరమౌతుంది. సమాచార సేకరణకు సమయం పదుతుంది. ఓపిక, తీరిక కావాలి. ఇవి తగ్గిపోవడానికి పరిస్థితులు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వీటికి ఎదురీది సమగ్ర వ్యాసాలు రాయవలసిన అవసరం అయితే ఉంది. విషయం పట్ల సీరియస్‌నెస్ పెరగడానికీ, సమగ్రమైన అవగాహన కలగడానికీ సమగ్ర వ్యాసాలు అవసరం. చిన్న వ్యాసం టిఫిన్ లాంటిదయితే, సమగ్ర వ్యాసం షడ్రసోపేత భోజనం లాంటిది. వ్యాస శకలం చిరుతిండి లాంటిది. దేని (ప్రాధాన్యం దానికుంది. చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం అని విడివిడిగా ఇలా పేర్లు పెట్టుకున్నా స్థూలంగా అన్నిటినీ కలిపి వ్యాసాలే అంటున్నాం. పాఠకులకు ఈ పారిభాషిక పదాలతో అవసరం లేదు. వ్యాస నిర్మాణాలతో, శిల్పంతో అవసరం లేదు. వీటి అవసరం వ్యాస రచయితలకు మాత్రమే. ప్రతి వ్యానకర్త తమ వ్యాసాలను పాఠకులు చదవాలని కోరుకుంటారు కాబట్టి వ్యాసరచనా పద్ధతుల్ని వ్యానకర్త దృష్టిలో పెట్టుకోవడం అవసరం. న అన్ని పనుల్లోలాగే రచన విషయంలో కూడా (శ్రమ లేకుండా ఫలితాన్ని ఆశించడం న్యాయం కాదు గదా! ఇన
ాాంాయాయాటాాాయాాా వి. చెంచయ్య తనువింధం వ్యాసరచన పై తొలి వర్క్‌షాప్
“వ్యాసరచన” పై విరనం నిర్వహించిన వర్క్‌షాపు విశిష్టమైనది. 2007 జూన్ 7, 8 9, తేదీలలో మిర్యాలగూడలో ఇది జరిగింది. ఇందులో 15 మంది విరసం సభ్యులు, ముగ్గురు స్థానిక సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. విరసం కార్యదర్శి వి. చెంచయ్య, విరసం కార్యవర్గ నభ్యులు ఎన్. వేణుగోపాల్, పాణి, సి.యస్. ఆర్. ప్రసాద్, చలసాని (వ్రసాద్లు అధ్యాపకులుగా వ్యవహరించారు. విరసం వ్యాసరచనపై వర్క్‌షాపు నిర్వహించడం ఇదే మొదలు. 37 సంవత్సరాల విరసం చరిత్రలో కథపైనా, కవిత్వం పైనా, సాహిత్య విమర్శపైనా, స్రీట్ష్లే మొదలయిన ప్రజా కళారూపాలపైనా 12 దాకా వర్న్షాపులు జరిగాయి. వ్యాసరచనపై వర్క్‌షాపు మాత్రం ' ఇదే మొదటిది. విష్లవ రచయితల సంఘమే కాదు, ఏ ఇతర రచయితల సంఘాలుగానీ, సాహిత్య సంస్థలు గానీ వ్యాస రచనపై వర్క్‌షాపులు నిర్వహించిన దాఖలాలు కనిపించవు. ఆ విధంగా చూస్తే తెలుగు సాహిత్య రంగంలోనే 'వ్యానరచన' పై ఇదే మొదటి వర్క్‌షాపు కావచ్చు.
ఆధునిక కాలంలో వచన రచనలు బాగా పెరిగాక కథ, నవలా ప్రక్రియలకు వమాత్రం తీసిపోకుండా వ్యానవ్రక్రియ బాగానే అభివృద్ధి చెందింది. అధునిక తెలుగు సాపొత్యానికి వైతాళికులనదగిన కందుకూరి, గురజాడలే వ్యాస ప్రక్రియను (ప్రారంభించారు. వ్యాసాలు రాయని (ప్రసిద్ధ రచయితలు లేరంటే అతిశయోక్తి కాదు. వ్యాన ప్రక్రియ ఇంతగా పెరిగినా, వ్యాస రచనా విధానంపై రచనలుగాని, సదస్సులు గాని, వర్క్‌షాపులు గాని లేవు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. కథా శిల్పం గురించీ, నవలా శిల్పం గురించీ, విమర్శా శిల్పం గురించీ వుస్తకాలే రాసిన వల్లంపాటి వెంకటనుబ్బయ్యగారు కూడా వ్యాన శిల్పం గురించి రాయలేదు. ఇలా ఏవిధమైన మార్గ నిర్దేశక సూత్రాలు లేని నేవథ్యంలో వినం ఈ వ్యాస రచనా వర్క్‌షాపును నిర్వహించింది.
ఈ వర్శ్షావును మూడురోజులపాటు ఎలా నిర్వహించాలనే విషయంలో అధ్యాపకులకూ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. వర్క్షావులో పాల్గొనే వారికి ఒక కార్యక్రమాన్ని ఇవ్వాలి. అందుకోనం స్థూలంగా ఇలా అనుకున్నాం. ఇందులో పాల్గొనే వారందరిచేత వ్యాసప్రక్రియతో ాాాలాాలాయచాడయ్రాాలాాలాాలాలోాాాోా
వ్యాస రచనా శిల్చం లోయ యయ. ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడించాలన్నది ఒక అంశం. దీనికి *నేను - వ్యాసం' అని పేరు పెట్టాం. తర్వాత “ప్రక్రియగా వ్యాసం” అనే అంశంపై వి. చెంచయ్య మాట్లాడాలని నిర్ణయం. వర్క్‌షాపులో విద్యార్థులుగా పాల్గొనే వాళ్ళు “సామాజిక న్యాయం - రిజర్వేషన్లు అనే అంశంపై ఒక వ్యానం రాయాలనీ, 2006 అరుణతార సంచికల్లో వచ్చిన కథలపై కూడా ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాయాలనీ నిర్ణయించాం. పీటిపై చర్చతోబాటు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కె.వి.ఆర్, త్రివురనేని మధుసూదనరావు రాసిన వ్యాసాల్లోంచి ఒక్కొక్కటి ఎంచుకొని వాటిపై కూడా చర్చించాలని అనుకున్నాం. చివర్లో వర్క్షావుపై నమీక్ష స్థూలంగా ఇదీ కార్యక్రమం. 7వ తేదీ ఉదయం పూట 'నేను - వ్యాసం” అనే విషయంపైన అందరూ మాట్లాడారు. కొందరు తమ మొదటి వ్యాసం ఎలా రాశారో వివరించారు. కొందరు తమకిష్టమైన వ్రక్రియ వ్యాసమే అన్నారు. వత్రికలకు మొదట ఉత్తరాలు రాయడం ద్వారా వ్యాసాలు రాయడానికి అలవాటుపడ్డామన్నారు. గ్రామాలకు తరలండి క్యాంపెయిన్‌లో పాల్గొన్నప్పుడు వచ్చిన అనుభవాలను వ్యాసాలుగా రాశామన్నారు. పాఠశాల, కళాశాలల మ్యాగడైన్లలో తొలి వ్యాసాలు అచ్చయ్యాయన్నారు. అవసరం కొద్దీ కరవత్రాలు, రిపోర్టులు రాయవలసి రావడం వల్ల వ్యాసాల వైపు మొగ్గు చూపిన వారున్నారు. రెసిడెన్నియల్ స్కూల్లో తోటి విద్యార్థులకు వార్తలు చదివి వినిపించే బాధ్యత వల్ల వ్యాసాలు కూడా చదివే అలవాటు అయిందనీ, తద్వారా వ్యాసాలు రాయడం తేలికనే అభిప్రాయం ఉండేదనీ, రాయడం ప్రారంభించాక అన్నిటికంటే వ్యానం రాయడమే కష్టమనిపించిందనీ వ్యాసరచనలో తమ అనుభవాన్ని వివరించారు. విద్యార్థి దశలో అరెస్టయినపుడు పోలీనులు మహావ్రస్థానం తెలుసా అనీ, వరవరరావు తెలుసా అనీ ్రశ్నించారనీ, తర్వాత వరవరరావు ద్వారా మవిో్రన్థానం గురించి, సాహిత్యం గురంచీ తెలుసుకొని వ్యాసాలపై అభిమానం పెంచుకున్నాననీ అన్నారు. వ్యాసం అవసరం కోసమనీ, ఫిక్షన్ (కధ, నవల) ఆనందం కోసమనీ ఒక అభిప్రాయం బలంగా ఉండేదనీ, కుటుంబరావు వ్యాసాలు చదివింతర్వాత వ్యాసాలు చదివి కూడా ఆనందించవచ్చని అర్ధమయిందనీ అన్నారు. వ్యాసాలు రాయడానికి స్పష్టమైన ఆలోచన ఉండాలన్నారు. వూర్వం వ్యాస రచయితలు బాగా డ్డ తీసుకొని రాసేవారనీ, జర్చలిజం పెరిగింతర్వాత వ్యాసరచనను చెడగొట్టిందనీ అభిప్రాయపడ్డారు. కుటుంబరావు, గోపీచంద్, సంజీవదేవ్, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, బాలగోపాల్, సి.వి.సుబ్బారావుల వ్యాసాల (ప్రభావంతో సంబంధాలు వర్పడడం కూడా వ్యానరచనకు ఉపయోగపడిందన్నారు. ఇలా అందరూ వ్యాస పఠనంలోనూ, వ్యాసరచనలోనూ తమ తమ అనుభవాలను మనను విప్పి మాట్లాడిన వద్ధతిలో వివరించారు. ఈ ప్రారంభ సమావేశమే “వ్యాసరచన పై వర్క్‌షాప్ పట్ల మంచి అసక్తిని రేకెత్తించింది. 7వ తేదీ మధ్యాహ్నం చెంచయ్య “ప్రక్రియగా వ్యాసం" అన్న విషయంపై ఉపన్యసించారు. వ్యాస ప్రక్రియ పుట్టు వూర్వోత్తరాలను వివరించారు. వ్యాసం అనే పేరు స్థిరపడక ముందు
న య య య న న ననన ఖల పస “=: చయ్య కూడా వ్యాస రచన ఉందనీ, తొలుత వ్యాసం అనే మాట ప్రయోగించింది బ్రౌన్ అనీ, ప్రక్రియగా వ్యాసం మొదలయింది గురజాడ వ్యాసాలతోననీ వివరించాడు. వ్యాసం అనే పేరు స్థిరపడక ముందు ప్రమేయం, సంగ్రహం, గ్రంథం, వచన కావ్యం, ఉపన్వాసం అని రకరకాల పేర్లతో వ్యాసాలుండేవన్నారు, ఆ పేరుతో కాకపోయినా క్రీ.శ. 16వ శతాబ్దం నుంచి తెలుగులో వ్యాసరచన కూడా బాగా పెరిగిందన్నారు. ప్రముఖ వ్యాస రచయితలను పేర్కొంటూ వ్యాసం శాఖోవశాఖలుగా విస్తరించిన విధానాన్ని వివరించారు. విషయ స్పష్టత, విషయ వివరణలో గతితార్మిక పద్ధతి, భావానికి తగిన భాషా శైలి వ్యాసరచనలో ముఖ్యంగా గుర్తించవలసిన అంశాలని పేర్కొన్నారు.
8వ తేదీ, 9వ తేదీ మధ్యాహ్నం వరకు వ్యాసాల వరనం, వాటిపై చర్చ కొనసాగింది. కొందరు వ్యాసాలు ముందే రాసుకొచ్చారు. కొందరు వ్యాసాలు రాయలేదు. రాయని వాళ్ళ చేత అప్పటికప్పుడు రాయించాలని నిర్ణయం చేశాం. 7వ తేదీ రాత్రి అలా రాశారు. పూర్తి సంతృప్తికరంగా కొకపోయినా ఏదో పద్ధతిలో రాశారు. దాదొవు అందరూ రిజర్వేషన్లు - సామాజిక న్యాయం” అనే అంశంపై రాశారు. కానీ 2006 అరుణతార కథలపైన ముగ్గురు నలుగురే రాశారు. ఆ ఒక్క సంవత్సరం అరుణతారలో ఇన్ని కధలుంటాయని మేం ఊహించలేదు. ఎక్కువ కథలు కావడం వల్ల వాటినన్నింటినీ సమిక్షిస్తూ రాయడంలో ఉన్న అసౌకర్యం వల్ల చాలామంది ఆ కథలపై వ్యాసాలు రాయలేక పోయారనే విషయం అర్ధమయింది. ఇద్దరు మాత్రం ఒకటి రెండు కధలపై రాయడం వల్ల ఆ వ్యాసాలు బాగా ఉన్నాయి. ఒకరిద్దరు 34 కతల గురించీ వ్యాసాలు రాయకపోయినా రాయడానికి అవసరమైన విశ్లేషణ చేసుకొని వచ్చారు. కథలు పాఠకులపై వేసే ప్రభావం ఎటువంటిదో విమర్శ వ్యాసాలలో చర్చించాలనే అభిప్రాయం వచ్చింది.
ఇక వ్యాసాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. భాష శైలి, వాక్యనిర్మాణం, ఖావ ప్రకటన పద్ధతి, సామెతలు, పోలికలు మొదలైన ఎన్నో విషయాలపై నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా జరిగిన చర్చ తాత్కాలికంగా కొందరికి ఇబ్బంది కలిగించినా, అంతిమంగా చర్చ ఇలాగే ఉపయోగకరంగా జరగాలని అందరికీ అనిపించింది. చర్చ జరిగిన తీరులో నిజాయితీ ఉండడం వల్ల తవ్చులు గురించి ఎంత తీవ్రంగా మాట్లాడినా, అలా మాట్లొడిలేనే గదా తప్పులు తెలుసుకునేది అని కఠిన విమర్శను సైతం నంతోషంగా స్వీకరించారు.
ఈ దేశంలో అట్టడుగు వర్ణాల వారు తరతరాలుగా కొన్ని సౌకర్యాలకు దూరమయ్యారని ఒక వ్యాసంలోని వాక్యంపై మంచి చర్చ జరిగింది. దూరమయ్యరా, దూరం చెయ్యబడ్దారా, లేక పాలకులు దూరం చేశారా ఎలా రాస్తే అన్పష్టత లేకుందా నరైన అర్ధం వస్తుందో చర్చ జరిగింది.
“భారతదేశం జాతుల మ్యూజియం” అని మరో వాక్యం. ఇది ఆంగ్లంలో రాసిన వాక్యానికి అనువాదం, “జాతుల మ్యూజియం" అని అనవచ్చునా? ఇతరుల వాక్యాన్ని కోట్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. జాతులను ఎలాాాాాాాాం్రైైాలాలాాలాాాలాాలోాోా
వ్యాస రచనా శిల్పం టాటాలో మ్యూజియంలోని వస్తువులతో పోల్చడం తగదని అందరూ అభిప్రాయపడ్డారు. పైగా భావాల పరంగా పూర్తిగా ఏకీభవించే రచయిత మాటలను కోట్ చేయడం మంచిదనే అభిప్రాయం వచ్చింది. శత్రువు మనకనుకూలమైన మాట చెప్పినా, అతను ఎంత ప్రసిద్ధుడైనా అతన్ని కోట్ చెయ్యడం మంచిది కాదు. భారత దేశంలోని జాతులను గూర్చి చెప్పేటప్పుడు స్మిత్‌ను కాక, కోశాంబిని కోట్ చెయ్యవచ్చు అన్న అభిప్రాయం వచ్చింది.
ఒక వ్యాసాన్ని విన్న తర్వాత కొందరు అది తాత్వికంగా ఉందన్నారు. తాత్వికంగా ఉందంటే
అర్థం కానిదనా? అని కొందరు (ప్రశ్నించారు. తత్వశాస్త్రం మాయాజాలం కాదని చర్చ జరిగింది. ఒక విషయాన్ని తాత్వికంగా చెప్పినా నృష్టత, సూటిదనం ఉండడానికి అవకాశం ఉందనే విషయం చర్చలో సారాంశం. మరొకరు “దళారీల కూటమి” అనే అర్థంలో దళారీల కుంవటి అని వాడారు. “నోచుకోకపోవడం” లాంటి ప్రయోగాలను వీలయినంత వరకు వాదకుండా ఉండడం మంచిదనే సూచన వచ్చింది. “నోములు నోచడం” అనే ఆధ్యాత్మిక వాసన ఆ ప్రయోగంలో కనిపిస్తుంది.
చర్చ జరిగిన తీరుకు ఇవి కాన్ని ఉదాహరణలు మాత్రమే. వాక్యంలో కర్త, కర్మ క్రియలు సక్రమంగా ఉన్నాయా, లేదా అని కూడా నిశితంగా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే అధ్యాపకులుగా వ్యవహరించిన వారే కాకుండా, అందరూ వదప్రయోగాలనూ, వాక్య నిర్మాజాలనూ శల్య పరీక్ష చేశారు.
విద్యార్థులుగా వచ్చినవారి వ్యాసాలే కాకుండా శ్రీశ్రీ, కా.కు., కె.వి.ఆర్, (త్రివురనేని
మధసూదనరావుల వ్యాసాలను కూడా నిర్జాక్షిణజ్యంగా చర్చించినందుకు కొందరు ఆశ్చర్యాన్నీ, కొందరు సంతోషాన్నీ వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ శల్య పరీక్షల వెనుక నేర్చుకోవడం ఉన్నదని అందరూ గుర్తించారు.
ఈ చర్చ మధ్యలో వేణు పంక్చువేషన్ గురించీ, చలసాని ప్రసాద్ శ్రీ శ్రీ వచనం గురించి వివరించారు. తెలుగు రచయితలు పంక్చువేషన్ గురించి పెద్దగా పట్టించుకోరనీ, ఆంగ్ల భాషలో దీనికి చాలా ప్రాధాన్యం ఉందనీ అన్నారు. కామా, కోలన్, సెమికోలన్, హైఫన్, కొటేషన్స్, ఆళ్చర్యార్థకం, ప్రశ్నార్ధకాలు, బ్రాకెట్లు, చుక్కలు, పాదసూచికలు మొదలయిన వాటి గురించి సోదాహరణంగా వివరించారు. చలసాని ప్రసాద్ శ్రీ శ్రీ వచనం గురించి పెద్దగా చెప్పకపోయినా, ఉర్పూ భాష లక్నోలో పుట్టిందనీ, ఇతర భాషా పదాల్ని బాగా ఇముడ్చుకోగల శక్తి తెలుగు భాషకుందనీ, ఫెంచి భాషలో 828 పదాలతో ఒక పెద్ద వాక్యం ఉందనీ, ఇంగ్లీషు, సంస్కృతం రెండూ దొంగ భాషలనీ మొదలైన అనేక విషయాలను వివరించారు. చివరకు శ్రీ శ్రీ వచనంలో బాలన్స్ ఉందనీ, ఆయన వచనం సిస్టమేటిక్‌గా ఉంటుందనీ చెప్పారు.
యయా వి చెంచయ్య
9వ తేదీ మధ్యాహ్నం 2 రోజుల పాటు జరిగిన వర్క్‌షాపు గురించి సమిక్ష జరిగింది. వ్యాసరచనపై వర్క్‌షాపు పెట్టడం చాలా ఉపయోగపడిందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. చర్చలో సూక్ష్మ విశ్లేషణ జరగడం వల్ల రాసే పద్ధతిని తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. హిపోక్రసీ లేకుండా చర్చ జరిగిందన్నారు. రాకపోయి ఉంటే చాలా మిన్సయి ఉండే వాళ్ళమన్నారు. విమర్శలో విస్యంపాలు ఎక్కువయిందని, విమర్శ దాడి పద్ధతిలో కాకుండా కన్విన్సింగ్‌గా చేస్తే బాగుండేదని ఒకరిద్దరన్నారు. ముఖ్యంగా భాష విషయంలో దాడి పద్ధతిలో చర్చ జరిగినా తప్పులేదనీ, నేర్చుకోవడానికి అది అవసరమేననీ మరాకరన్నారు. ఇంతవరకు ఇలా తప్పావ్పులు చెప్పినవారు లేకపోవడం వల్ల నేర్చుకోలేకపోయామన్నారు.
“బడు లాంటి ప్రయోగాల విషయంలో జిడ్దులాగా వట్టుకున్నారనీ, “బడు” వాదే వారిని బెదరగొట్టేశారనీ, భాషా (వ్రయోగంలో అంత ఖచ్చితత్వాన్ని పాటించలేమనీ, వ్యాకరణ నియమాలన్నిటినీ అందరూ పాటిస్తే అందరి వ్యాసాలూ ఒక్కలాగే ఉంటాయనీ ఇంకొకరన్నారు. పద ప్రయోగాల గురించీ, వాక్య నిర్మాణం గురించీ ఎన్నో విషయాలు తెలునుకున్నామనీ, భాషా సమస్యల నుండి బయట పడేశారనీ కొందరు అభిప్రాయవడ్డారు. వ్యాసరచనపై చర్చ జరిగినవి కథా రచనకు కూడా ఉవయోగపడకాయన్నారు. రెండే అంశాలిచ్చి అందరినీ వాటిపైనే రాయమనడం బాగా లేదని మొదట అనిపించినా, ప్రాక్టికల్‌గా చూశాక అదే మంచి వద్ధతిగా అనివించిందన్నారు. ఐలవంతంగా అవృటికవ్వుడు వ్యాసాలు రాయించినా మంచిదే అయిందన్నారు. విద్యార్థలవైపు తవ్పూలు జరిగాయనీ, అందరూ ముందే అన్ని వ్యాసాలూ రానుకొస్తే చర్చ ఇంకా బాగా జరిగేదని కొందరు ఆత్మ విమర్శ కూడా చేనుకున్నారు. ఉపాధ్యాయులుగా వ్యవవారించినవారు బాగా న్పందించారనీ, మంచి నూచనలిచ్చార అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ వర్శ్షాపు వ్యాస రచనపై ఒక అత్మ విశ్వాసాన్ని కలిగించిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌షాపులు ఇంకా జరగాలనీ, యూనిట్లలో కూడా జరిగి మంచిదనీ ఉత్సావోన్ని వ్యక్తం చేశారు. సైలెంట్ స్పె్టేటర్గా పాల్పొన్న స్థానిక సాహిత్యాలేమాని ఒకరు ఈ వర్శ్షావుపై మూడు విషయాలు చెవృదల్బుకున్నానన్నారు. ఈ వర్కె వు ప్రజాస్వామికంగా జరిగింది, (పజాస్వామికంగా జరిగింది, ప్రజాస్వామికంగా జరిగింది అని మూడుసార్లు అని ముగించారు.
చివరగా ఉపాధ్యాయులుగా వ్యవహారించినవారు కూడా సమాక్ష చేశారు. ఇలాంటి వర్క్‌షాపు రాష్ట్రంలో ఇదే మొదటిదనీ, సమిష్టిగా నేర్చుకున్నామనీ అంటూ ఇందులో విద్యార్థులుగా పాల్గొన్న వారందరూ వెంటనే తలా ఒక వ్యాసం రాయాలని సి.యస్.ఆర్. ప్రసార్ సూచించారు.
కొత్తగా రాసేవారి వ్యాసాలలో గాక, ప్రముఖుల వ్యాసాలలో కూడా కొన్ని లోపాలున్నాయంటే వచనం రాయడంలో ఉందే క్లిష్టత అర్ధమవుతుందనీ, ఆ క్లిష్టతను అధిగమించడానికి ఇటువంటి వర్శషాపులు దోవాదం చేస్తాయనీ పాజి అన్నారు. విరసం వర్క్‌షాపులలో బాగా జరిగింది ఇదేననీ,
వ్యాస రచనా ళిల్పం టోటె వ్యాస రచనకు అవసరమైన పరికరాలు అందించే పద్ధతిలో ఇది జరిగిందనీ, వ్యాసాలను విషయం కోసం చదువుతున్నామే గాని, వ్యాస నిర్మాణంలోని మెలకువలను తెలుసుకోవడానికి కూడా చదవాలనీ వేణు అన్నారు. నిజానికి తాను ఉపాధ్యాయ వర్గంలో లేననీ, నలుగురితో కలిసి ఉందామని వచ్చాననీ అంటూ చలసాని ప్రసాద్ విప్లవ రచయితల గురించీ, వ్యాసం గురించీ వెల్చేరు నారాయణరావు నెగటివ్ దృక్సధంతో అన్నమాటను ప్రస్తావించారు. విప్లవ రచయితలారా! మీరు సాహిత్యాన్ని రాజకీయ అవసరాల కోసం పాడు చేస్తున్నారు. వ్యాసాలు రాసుకోండి అని ఆయన వెటకారంగా అన్నా ఇవాళ వ్యాసం రాయడం మనకు చాలా అవసరం అని దానినే పాజిటివ్ అంశంగా భావించి సూచన ఇచ్చారు.
చివరగా విరసం కార్యదర్శి చెంచయ్య ఈ వర్శ్షాపుకు ముగింపు వాక్యాలు పలుకుతూ వ్యాసరచనపై వర్శ్షాపును విరసం (ప్రారంభించడం మనకు గర్వకారణమే అయినా, అది మన బాధ్యత అని కూడా అన్నారు. పాఠకులకు వ్యాసం సుబోధకరంగా ఉండాలంటే వ్యాసరచయిత ఎక్కువ శ్రమపడాలన్నారు. వ్యాసరచయిత ఒక్కడు ఎంతగా కష్టపడితే, వేలాది, లక్షలాది పాఠకులు అంతగా సుఖపడుతారన్నారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను వివరించేది వ్యాసమనీ, రాజకీయ, సామాజిక, ఆర్థిక మొదలైన అన్ని విషయూలకూ సామాన్య పారకులకు కూడా అందించగలిగేది వ్యాసమేననీ, అటువంటి వ్యాస ప్రక్రియపై విరసం సభ్యులందరూ కృషి చెయ్యాలనీ పిలుపునిచ్చారు.
హాజరైన వారందరూ ఆ మూడు రోజులపాటు కార్యక్రమంలో ఎంతగా లీనమయ్యారంటే, అందరం కలిసి కనీసం ఒక్క ఫోటో అయిన తీసుకుందాం అన్న ఆలోచన కూడా రానంతగా.
కంటిన పహద$లొరాష్ట్యా , లా అన. మ ఎ ప్రచా ఎం చఘ యా సక.
్తో న టూ వష న. గం ర, న. ప సో ట్ మ సస న. స! య. ప. మలక టా న మా సు రం స రు న్ు ల్ నాను టన్ యు ప న! ప క స స. లి లి టు స వన్ని న రా! మో కీ గ, 1 ౯ న ల సనా ప కీ. స లి ను. న. 1 లె! ప. (1 వ న! ల స మచెటీ సో! ము కం న సన బగ టు రా రు న్్ న! నసవోదసుష షల వ . నన స ఫై ్తమలడ్ న చసనగ! పు రా. గ్ నా? లు షట న ల క. స ే, న న న చల వహత క తేట సడ జై చలన చు డో ఏ లో నగ స నహి వ్ నమన సే సలు మ క్ న చల గ మ, ర నే గ! వి పు న్ సంలు; న తవం! రం ము స! నం మ! న. వ. సు. ఫ్ ॥ వ మ? ష్ వ హ్ ప సో న సా నన పం స; రాల న ప న న న న. న నో న గ సా గ స్ట్ ననా వాసిని లు వ సట సఫల న! న త ర రం స్ట యు మ హన నో! సనన య! న్ వ [లో ము పోటి టసల కో స్ టట ల్ సో కల్ ట్ టల యయ న స్మ. లం టా గ రమ ల సక , గ ర చిట న? న ల మ! ో మ (న. నా! టప క్ు స. నళ భర సన ॥ రప నే హ్ న హన సు ను న పప మ న 1 డి సం. ల. న! మం నం న గా న ళో ప హుం న స. / /[1 న. స నో? న సం న) న్ మంట న నట భక నం న. న్ న. నూ. నో మ ల (వన సు నే షు, హా మా? ప న! రు ట్ట నా? /'”
- వ నా న స న. సల క న! వం న వ. క్ సా న క షు న మ నో గ - సం! న ల ము లో స! సా! టీ త సవ న న. వున న సు న న సు జ! టు ఖై స నం. టి సు ల నం న్్ క వ్ సను టో! న ను స ల సరం. నటు ము లన అమ్మమ నం న్య షట రు సం మ! న ల్ సన స్ పనన కరన. నటన! టి. లన. సు | వ డో! ర. న వ న! న ష్ మ! గ సం ము! న సనటిట లో వ ల నున రే ప గ సరధ! రాం కన్ న గచ హటుటు సు క య న న్ వ. సు టట న! ను నే పమిట నంట ను లి న! సం? వని రే పసన చహత్టడం ము ర క్ టు ర న... నా ర ర షం సహ గ. లి రస! చును నం వ్య న న గ న. య న్న మ. న్న న. నం న వం ల న ర నక చ వ నో సస పరు పా టి క్ట న సహ మ ననన రే ల ను న. ణ్ శ సం ఫ్లా ల! ల సను లం ? సు! . ను! వ. వ ల ల న ల 1 వ్ క నా ప స్ | ( స న! నర స్య నం టు న సను స్య వత నన చర నోర మనల నా టం. ఏట ర సాల ర! యం స గం నగ. చళ్ల రో న కమర! ననాద చన వ వగ స నో మ! టను ల