Telugu Vyaasabhoomika - anilvaranasi/indianlanguages GitHub Wiki
. ల! కైన. జీ లి ఆల, నై 1 వ. న్న మ సళ చ టా న! షీ గ, 1 | న్ చ శ | . . సళ్ళు మం నలి | శ్ చ య ల మ క్. ఖు క 9 య | | స నా శరటారవిశిరోమణి ర్ట రా ఆచార్య రావికంటి వసునం౦ందన్
9111 | మె న 56266 31012 ౦౯ ౩రల20%26 981 5511 ని?ంగా!ఆ! ౬25 ఓ02గ౧5 న ర 52౪7165 £|!15 5821 ౬2/౧ కశ 6116౯ ౮ [౬ ఫి! ననే 76*ట౯౧5 ౦౯౧ ౯0౯ 1056 ౦1 21-40 5౯ఐ1!.15 *₹.1౧65 ౪౯5 0₹ 266 ౨ |1|0౧6౧౩/6౪|69 * ఉష10గ౧౭60 5౪/660 1101110/ ౨ |౧16/95[ 0౧ ర&1/ 0412౧06. ॥ ల్ న 0౭02! [1204986 0[0060606 1146 06౧%౧264/0, = 8/0%100 1/0 20౮6 ఉీ58గీ 6౧౮౭౧ ౧6856 54౪/1009 శీ౦ం౦606౧(5 దఃని!0[06 3 *ఆగ౦016 స్ అపై 0 52౧51౧0. 02: 1800 425 4055 య వన అ 5119 '6|1[115 10 9000 222 444 ఈకాళడాాందిలంంాడ వ/7౧0/6. వి౭ంంట/6. 6౮౦/౧౪/౨౧/6/౧౬ 110. ౯/౧౧4౬/56, 0౦౬180 10-05-201 1
వ్యాసభూమిక [టైంలో కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్
'722520[100౧31162
0 గ౭౪//:5/౧//0గ4౧/
౦1 ౧4471640౧0 “౪2540౧2౧;య24౧
అ ౪/16!
౯౧౦. 22౪162౧6 72964౧4౧6౮
0౧8.౧. ఉగ౧౦66:౭” ౦౧౪౧౫ ఆగ౧౫౭౧9౧/
౧౦6 10.46, ౮౪౦166 111119, (౫/6౮6/20246-33.
౮8౭11; 9849852182
౯191 ౬040౧: 2011 నా సభా
లం నలల 00౪6! 068100: 1. ౧42౧౧650 సస ల శ్ 00౧169: 1000 , లే శీ
౧106; [8.60/ " ( స్ సంజం12%2 1 / 0/ 6౦౧/85. &ీ॥! 5౯02౧01695 ౦01 ౪5౧212౧6౧౧
౧౧/6౮ 2౧
౪1012 ౦౦౧౧౧౯౧16౯ 567/1068 |
(06౩౧౬౧౦౧ 4& |/64/4/00/04/ అగ/౭౧ ౧౧౧/౧
*1-8-7254/1/4, 8812 8౧29/2౧౭94౧4౧0(5.
- గ౪66/(208&6 - 500 044.
౧౧.: 2767 6910, 2767 7076
సాహిత్యసౌహిత్యసౌజన్యమూర్తి ప్రతిభాప్రేమవిస్స్పూర్తి మాన్యమిత్రులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు . న. ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారికి అరువది రెండవ జన్మదినోత్ళవం ఆనందసందర్భంలో = వసునందన్ ॥ 03.06.2011 కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 5
ఉమ పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మ గ౧౦771| 51411౮౬౮ 16666౪ ౮౫౪౬౯౧౩ (సతు (౭112 గ౭|14 గంగం12గ౫ గ౧౮౦||6 62/ర6౧5 5౧౦ 4. 8181001141411 (1/౮6/2020 - 500 004 (4.౧౧) ౪105-044%105.[0 తేది; 29-04-201] స్వీకృతి చిరమిత్రులు కవిశిరోమణి ఆచార్య రావికంటి వసుసందన్గారు అవిశ్రాంత సాహితీ తపస్వి, మరో శ్వాసలేని ఈ తపోధ్యాస - సృజన విమర్శలనే రెండంచులతో ఊర్ధ్వగామిగా వెలిగే ఒక జ్యోతి. 60 పైగా ప్రకటితమైన ఆయన సుకృతి కాంతులే అందుకు సాక్ష్యం. వాటిలో దేని విలక్షణత దానిదే. ఇలాంటి ఈ మంచి సాహితీ మీక్రుడు అత్యంతాదరంతో ఈ వ్యాసభూమిక ను నాకు అంకితం చేస్తానంటే కాదనలేకపోయాను. ఇందులోని తొమ్మిది వ్యాసాలూ ఇంతకు ముందే వివిధ పత్రికల్లో ప్రచురితమైన వైనా, నన్నయ నుండి నారాయణరెడ్డిదాకా, వాటి విన్యాసవైఖరిని బట్టి అవి నవంనవధాన్యాలు. విషయాన్ని బట్టీ, రచనా కాలాన్ని బట్టీ, అప్పటప్పటి వసునందన్ గారి మనోగతులను బట్టీ ఈ కృతిలో కనిపిస్తున్న శైలీ వైవిధ్యం - ప్రతిభావంతుడైన ఒకే రచయిత విభిన్న శైలులనూ విధేయం చేసుకోగలడనే విశేషాంశాన్నీ ప్రతిపాదిస్తున్నది. అన్యధా ప్రభావితం కాని వీటి సృజనాత్మక విమర్శ లక్షణం - విమర్శకుడికి కవి అనే అభిధానాన్నీ అన్వర్ధం చేస్తున్నది. సద్విమర్భ, తాత్త్వికత, లోతులు ముట్టే నైపుణ్యం, చదివించే గుణం ్రత్యక్షర నిదర్శనంగా ప్రత్యక్షం చేస్తున్నాయి ఈ వ్యాసాలు. ఆచార్య వసునందన్గారి సాహిత్య సృజనానైరంతర్యాన్ని అభినందిస్తున్నాను. వ్యాసభూమిక ను నాకు అంకితమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతము కవిళిరోముణి ఆచార్వ రావికంటి వనునందన్ € 7
ఆచార్య రానికంటి వనసునందన్ నఖ జననం ఏ 04.05. 1949 న ్.. జన్మస్థలం 2: కమాన్‌పూర్ రోలు కరీంనగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ | తల్లిదండ్రులు: కీ.శే. శ్రీమతి జగ్గమాంబ, శ్రీ కిష్టయ్య విద్య : ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి ఉద్యోగం : తెలుగు ప్రొఫెసర్ (రిటైర్) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, యు.జి.సి. మేజర్ రీసర్చ్ ప్రాజెక్ట్ దా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాదు. రచనణు కథా కావ్యోలు రతీప్రద్యుమ్నము (గద్య కథాకావ్యం - 1971) గురుకులము (విమర్శనాత్మక గద్య కథాకావ్యం - 1978) భారతం (పద్య కథాకావ్యం - 1980 - డా॥ దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారకపురస్మ్కారం పొందిన కృతి) బలి (గేయ కథాకావ్యం - 1981) కృష్ణం కలయ... (పద్య కథాకావ్యం - 2009) అష్టాక్షరి (పద్య కథాకావ్యం - 2009) కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ పద్యరత్నావళి (2009) పంచాక్షరి (పద్యకథాకావ్యం - 2010) కవిశిరోమణి ఆచార్వ రావికంటి వనునందన్ € 9
దీర్చకావ్యాలు
త్రయి (1982)
మనస్సు (2004)
పిల్లలమళ్జీ (2006)
మట్టిముద్దలు (2007)
ఆయుధం కవిత్వం (2007)
ప్రవాహిని (2008)
భక్తి (2009)
భావగతం (2010)
గేయ కావ్యాలు
శ్రీరామ చరితామృతమ్ (పాటల్లో రామాయణం - 1992)
శ్రీవేంకటేశ్వర తారావళి (సంకీర్తనలు-2005)
ఎందరో మహానుభావులు (జీవిత చరిత్రలు = 2006)
భక్తశిఖామణులు (పాటల పేటిక - 2010)
సాహితీ విమర్శ - పరిశోధన
భావదీపికలు (సాహిత్య వ్యాససంపుటి - 1980)
భూమిక - ఒక సమ(గ్ర పరిశీలనం (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం - 1985)
అష్టాక్షరి (సినారె కృతులపై సాహిత్య వ్యాసాలు - 1987)
ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత (పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం - 1990)
సాహితీ వసునందనం (షష్టిపూర్తి మహోత్సవ విశేష సంచిక-2009)
వ్యాసభూమిక (వ్యాససంపుటి-2011)
బాలసాహిత్యం
బాలజ్యోతులు (పిల్లల కథలు-2007)
బాలబ్రహ్మం (దీర్ణకావ్యం-2008)
భారతనారీమణులు (పిల్లల కథలు-2009)
10 € వ్యాకభూమిక
వచన కవితలు
సాధన (కవితా సంపుటి - 1981)
కలం కదిలితే... (కవితాసంపుటి - 2003)
మెరుపు మెరిస్తే... (కవితా సంపుటి-2004)
వాన కురిస్తే... (కవితా సంపుటి-2005)
నేల నవ్వితే... (కవితా సంపుటి-2006)
మనసు నిండితే... (కవికా సంపుటి-2006)
సింగిణీ మొలిస్తే... (కవితా సంపుటి-2006)
నెమలి ఆడితే... (కవితా సంపుటి-2008)
గుండె పొంగితే... (కవితా సంపుటి-2009)
అరవై పండితే... (కవితా సంపుటి-2010)
వివిధ కృతులు
వేణీ సంగమం (గేయం, పద్యం - 1975)
ప్రజావిజయం (రేడియోరూపకం - 1990)
ప్రయోజన దండకాలు (దండకాలు - 1993)
జైగణేశ్స్ బాలాజీ (భక్తిపాటల ఆడియో క్యాసెట్స్ - 1994)
లోవెలుగు (ముక్తకాలు - 2004)
రావికన్నులు (సంక్షిప్త కవితలు-2006)
అనుయోగం (త్రిపదులు - 2009)
అడుగదుగునా! (సంక్షిప్త కవితలు-2009)
అనువాదాలు
దౌడ్ (హిందీ అనువాదం) డా.ఎం.రంగయ్య (2006)
రెసొల్యూట్ మైండ్ (ఇంగ్లీష్ అనువాదం) డా.బి.రామచంద్రయ్య (2006)
విరాట్ ఏకతా వట్ (హిందీ అనువాదం) డా. ఎం. రంగయ్య (2008) కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ ఈ 11
ముద్రణలో త్రీచరణశరణాగతి (దీర్ధక్షావ్యం) మనతెలంగాణ (దీర్ధక్రావ్యం) చంపుడుగుళ్ళు (దీర్జకావ్యం)
త్యురనెర్కదాలు ఎపి.ఎఎయు.యస్. సమాఖ్య కడప స్వర్ణపతక పురస్కారం (1982) డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం, హైదరాబాద్ (1982) శ్రీ జమిలి నమ్మాళ్వార్ స్మారక పురస్కారం, హైదరాబాద్ (1990) శ్రీ తేరాల జగదీశ్వర్ స్మారక పురస్కారం, హైదరాబాద్ (1998) శిల్పా ఆర్ట్ క్రియేషన్స్ ఉత్తమ విద్యావేత్త పురస్కృతి, హైదరాబాద్ (1993) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కృతి, హైదరాబాద్ (2002) డా. వానమామలై వరదాచార్య సాహిత్య పురస్కారం, కోరుట్ల (20039) కవిశిరోమణి బిరుదప్రదానం - భారతీ సాహిత్య సమితి, కోరుట్ల (2003) డా,జె.ఆర్.ఇ.టి, రజతోత్సవస్వర్ణపతక, స్వర్ణకంకణపురస్కారం,జగిత్యాల (2003) వానమామలై జగన్నాథాచార్య సాహిత్య పురస్కారం, కఠరింనగర్ (2004) ఆంధ్రఫ్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, హైదరాబాద్ (2004) పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ధర్మనిధిపురస్మారం, హైదరాబాద్ (2004) ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం - భాషావేత్త పురస్కారం, రంగారెడ్డి (2006) శ్రీ దోమా వేంకటస్వామిగుప్త సాహిత్య పురస్కారం, కడప (2007) తేజ ఆర్ట్ క్రియేషన్స్, సాహితీ పురస్కారం, హైదరాబాద్ (2007) భారత పర్యావరణ పరిరక్షణ గవాక్షం - రంగారెడ్డి జిల్లా పురస్కృతి (2008) తేజ ఆర్ట్ క్రియేషన్స్-ఆచార్య తిరుమల సాహితీ పురస్కారం, హైదరాబాద్ (2008) కౌముది ప్రతిభా పురస్కారం, హైదరాబాద్ (2009) సాహితీ మేఖల పురస్మారం, నల్గొండ (2009) అభినవపోతన వానమామలై అవార్డు, అల్కా హైదరాబాద్ (2010) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశేష పురస్కారం-2009, హైదరాబాద్
(ప్రదానం: 22-12-2010)
12 అ వ్యానభూమిక
విషయసూచిక
- ప్రాచీన కవిత్వం-సామాజిక నేపథ్యం............ 00000 కేర్
- ఆంధ్రమహాకవిత్వోదయం .........౨౨౨౨౦౦౦౦ లవ వవటవలవలతవలలలవటలటం లల కత్తి
- శకుంతల - నన్నయ... బడీ 4 పోతన వామన చరిత్రం - ధ్వని... రిక
- తిమ్మన పాత్ర చిత్రణము - సత్యభామ ..........౨౨౨౦౦లల 40
- సూక్తినిధి - అన్నమయ్య............. లలల డీకీ
- చైతన్యతేజం 'విశ్వంభరి ........౨.౨౨౨౨ ౨౦౦౦ల లంంంలలవవతదవలలరలటమంటంం 66
కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ €9 13
ప్రాచీన కవిత్వం-సామాజిక నేపథ్యం
కవిత్వం సమాజ సంస్కృతికి ప్రతిబింబం. ఏ కవిత్వమైనా సమకాలీన మానవుల జీవనరీతులనూ, చిత్త వృత్తులనూ, సంస్కార ప్రవృత్తులనూ పట్టి చూపు తుంది. ఈ లక్షణాన్ని తమ కవితా జీవధారగా చేసుకొని పరిపూర్ణంగా పోషించారు మన పూర్వ మహాకవులు.
నన్నయ కాలం నాడు సామాన్య జనానీకం సంప్రదాయసిద్ధమైన ప్రశాంత జీవనాన్ని కొనసాగించిందని ఆయన కవిత్వ విధానాన్ని బట్టి తెలుస్తుంది. వేద వేదాంగ పఠనం, “పరమవివేక సౌరభ విభాసిత సద్దుణపుంజ” పరిపూర్ణములైన “సత్సభాంతర సరసీవనముూల యెడ అనురక్తి అనాటి ప్రజల చిత్తవృత్తులు. కులమత భేదాలు ఉన్నా, వాటిని పట్టించుకోని సంఘం అది. అందుకే నన్నయ తన కావ్యోప దేశంగా-
ఎయుక గలవారి చరితలు
గఅచుచు సజ్జనుల గోష్టి గదలక ధర్భుం
బెజుగుచు నెఖిగిన దానిని
మణున కనుష్టించునది నమంజుస బుద్ధిన్ అని ప్రబోధించాడు. ఆయన తర్వాత వచ్చిన ఎజ్జిన కూడా,
ఎదవపక వాజ్ఞునః క్రియల నేరికి పొంసయొనర్ప బూన రె
య్యెదలను దీనులం గరుణ యేర్చడ (బోవన చూతు రిచ్చుబో
గదమ నడంగ నీకెదిరి కాంక్షితముల్ దుదిముట్టదీర్తు రె
కుడు మది గూర్తు ర్యాళితులకున్ వినుమిన్నియు నార్వధర్భముల్, అని తన సమాజాన్ని ప్రతిబింబిస్తూ సహనం, సర్వమత మానవతాగుణం, పరోపకార
కవిళిరోమణి ఆచార్య రావికంటి ననునందన్ € 15
బుద్ధీ, సజ్జన సాంగత్యం నిర్దేశించాడు. తిక్కన కాలంనాటికి ప్రధాన హైందవ మతాలైన శైవవైష్ణవాల విజ్బంభణ పొడసూపింది. మతభేదాలు మానవతను సంక్షుబ్ధం చేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ మవాత్ముడూ, మహాకవీ సర్వజన హితార్థంగా శివకేశవాద్వెత మతాన్ని హరి హరాత్మకంగా సంన్థాపించాడు. శ్రీయన గౌరినా బరగు చెల్వ్పకు జిత్తము వల్లవింప భ (ద్రాయత మూర్తియై వారివారంబగు రూపము దాల్చి విమ్లు రూ పాయ నమళ్ళివాయ యనివల్ఫెడు భక్తజనంబు వైదిక ధ్వాయిత కిచ్చమెచ్చు వరతత్వము గొల్పెద నిష్ట సిద్ధకిన్ అంటూ సర్వమత సమాన భావమే వైదిక మత పరమార్ధమనీ దాని సమ్యక్సంసిద్ధియే- తన ఇష్టసిద్ధి అనీ సూచించాడు. ధర్మాధర్మ విచక్షణలో విభిన్న మత ప్రాతిపదికగా తన కాలం కయ్యానికి దిగింది కాబట్టే మతమేదైనా, విశ్వాసమేదైనా 'ఒరులను" నొప్పించకుండా ఉండడమే పరమ ధర్మమనీ, దీనికి వివాదం ఎందుకనీ ,ఘోషించాడు - ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబున కగు దా నొరులకు నవి సేయకునికి వరాయణము సకలధర్భ్థు పథముల కెల్లన్ - అనే వద్యం ద్వారా. మత విభేద బుద్ధి మానవ మనస్తత్వంలో పగను పెంచుతుంది. వినాశహేతు వౌతుంది. కాబట్టి పగను జయించడమే మానవుని ప్రథమకర్తవ్యమని ప్రబోధించాడు. వగయ కలిగెనేని పామున్న ఇంటిలో నున్న యట్ల కాక యూజదీల్లి యుందనెట్లు చిత్తమొక మాటు గావున నలవదధిక దీర్ణవైరనృత్తి అంటూ మానవతా భావమే మహిత లక్షణమన్నాడు. ఈ సద్దుణ పుంజాన్ని సామాజికు లైన సర్వసమర్భులు పరిపోషించాలనీ, సంరక్షించాలనీ కూడా ప్రబోధించాడు. 16 ఆ వ్యానభూమిక
సారపు ధర్శమున్ విమలనతృము భావముచేత్క బొంకుచే
సారము పొందలేక చెడబాజీనదైన యనస్థ దక్షులె
వ్వారలుపేక్ష చేతురది వారల చేటగు గాన్మి ధర్డ ని
స్తారకమయ్యు సత్వ శుభదాయకమయ్యును దైవముందెదిన్ అంటూ ధర్మం పట్ల ఉపేక్ష ఎంతటి సమర్థులనైనా నాశనం చేస్తుందని కూడా హెచ్చరించాడు.
పోతన - సర్వమత సమానత్వం, సమగ్ర మానవత్వం మూర్తీభవించిన మహోన్నత భక్తకవీంద్రుడు. ఈయన కాలంనాటికి శివకేశవ మతభేదాలతో రక్తపు టేరులు పారటమేకాక, ముస్లిం దండయాత్రలతో దేవాలయ విధ్వంసాది కార్యకలా పాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇవన్నీ చూసి ఆ సౌజన్యరాశి సంక్షోభించాడు.
చేతులారంగ శివని వూబజింవదేని
నోరు నొవ్వంగ వారిక్తీర్తి నుదువదేని -
దయయు నత్వంబు లోనుగా దలపదేని -
కలుగ నేటికి తల్లుల కదువుచేటు అంటూ తన తీవ్ర నిరసననూ, మత విభేదాలపట్ల అసహ్యభావాన్స్న్సీ జుగుప్పనూ పరమవాచ్యంగా ప్రతిపాదించాడు. పోతన్న శ్రైవమత సంభవుడై ఉండీ; విష్ణుపారమ్య మైన శ్రీ మహాభాగవత గ్రంథాన్ని తెనుగు చేసి, శ్రీ రామచంద్రునికి అంకితంచేసిన మహాభక్త శిఖామణి. మత సహనానికి తన పవిత్ర జీవన విధానాన్నే నిరూపణగా చేసి చూపిన మధుర మానవతామూర్తి. శబ్దంలో, భావంలో మృదుత్వమే తప్ప ఏ కోశానా కాఠిన్యం కనబరచని మహాకవి.
అలాంటి వాడు ఇంత తీవ్రంగా మతభఖేదాలను నిరసించాడంటే - ఆయన కాలం మతకలహాలతో ఎంత సంక్షోభించి ఉంటుందో ఊహించవచ్చు. అందుకే ఆ మహాతపస్వి తన కావ్య పరిశ్రమ ఫలంగా
నీపాదకనుల సేనయు
నీ పాదార్భకులతోది నెయ్యమును, నితాం
తాపార భూతదయయును,
తావసమందార/ నాకు దయచేయగదే?
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ 6 క్షే”
అంటూ సర్వేశ్వరుణ్ణి కోరుకున్నాడు. మానవత్వం లేని మతం లేదని, అలాంటి సహనశీలమైన అభిమతం లేని మనిషి మనిషే కాడని ప్రతిపాదించాడు. మతవిభేదాలు తన మానసాన్ని కలిచివేయగా, వేమన్న -
ఇటుబెట్టీన అటుబెట్టిన ఇటుబెట్టక ముక్తీలేదు అని శివకేశవ మత చిహ్నాలైన భస్మాలనూ, నామాలనూ మానవతా పూర్వకాలు కావాలని నిర్దేశించాడు.
ఈ విధంగా మనపూర్వ మహాకవులంతా భగవంతుని మీది అచంచల విశ్వాసంతో, సంప్రదాయసిద్ధితో, కవిత్వమే భవతారకమన్న పరమ(్రమాణ బుద్ధితో సృజనా వ్యాపారం కొనసాగించారు. సామాజిక సంక్షేమాన్ని అభిలషిస్తూ - సర్వమత సహనాన్న్సీ సర్వమానవ సమానత్వాన్నీ భూతదయనూ, పరోపకార బుద్ధివంటి ఉత్తమ మానవగుణాలనూ ప్రతిపాదించారు. ఆ మహోన్నతగుణ పుంజ సమీకరణమే తమ కవిత్వ పరమార్ధమనీ, సమున్నత భారతీయ సంస్కార, సంస్కృతులకు ప్రతిబింబమే తమ కళారాధన అనీ ప్రబోధించారు.
- వైళ్ళ దబోధిని, సెప్టెంబరు, 2997 సౌజన్యంతో... 18 అ వ్యానభూమిక
ఆంధ్రమహాకవిత్వోదయం
ఏ భాషలోనైనా మహాకవే మొట్టమొదట ఉదయిస్తాడని డా. విశ్వనాథ సత్యనారాయణ గారాకసారన్నారు. ప్రపంచ పరివ్యాప్త ప్రఖ్యాతిగాంచిన సంస్కృత భాషలో ఆదికవితే మహాకవితగా విలసిల్లడం గమనార్హం.
తెలుగులో కూడా అదే జరిగింది. వాగనుశాసనుడు, ఆదికవి నన్నయకు పూర్వం ఏవో కొన్ని జానపద గీతాలూ, శాసనకవితలూ ఉండేవి. ఒక్క తెలుగులోనే కాక ప్రాకృత భాషాదుల్లో కూడా - తెలుగు గడ్డమీద కవిత్వం పారాడుతున్నాా వాటన్నింటికీ శిరాయమానం సంస్కృత సాహిత్యం. తెలుగువాడు తన సారస్వత మిదీ! అని తలెత్తుకొని చెప్పుకోగల పరిస్థితి ఆనాడు లేదు. ఇది సంక్షిప్తంగా క్రీశ, 11వ శతాబ్దినాటి పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో పంచమ వేదాన్ని తెనిగించమని రాజరాజు కోరడం, నన్నయ నడుముకట్టడం జరిగింది. అది తన వంశకథ అనీ, తన్మననం తన జీవనరాజీవమనీ రాజరాజు కోరినా - నన్నయ దానిని జగద్ధితంగా రచించినానని చెప్పుకొన్నాడు. నన్నయ సృష్టికి ఆంధ్ర మహా కవిత్వావతరణాకాంక్ష వైదికధర్మ ప్రతిష్టాపన దీక్ష మూల కారణాలు. ఆయనకా దృష్టి కలగడానికి పైన చెప్పుకున్న సారస్వత సాంఘిక పరిస్థితులు (ప్రేరకాలు. ఈ రకంగా ప్రథమాంధ్ర మహాకవి దేశానికీ (భాషకూ), దైవానికీ (ధర్మానిక్రీఅనన్య సేవచేసి ఇహపర సాధనతో జన్మ సార్ధక్యాన్ని పొందినారు.
ఆ సాహిత్యానికీ చరిత్రకూ సంబంధాన్ని కొంచెం చర్చించడం ఇక్కడ సమంజసమేమో! నన్నయ్యా నారాయణభట్టూ ఆంధ్ర మహాభారతానికి బొమ్మా బొరుసుల వంటివారు.
కవిళిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ ఊ 19
నన్నయ భట్టారకుడు రాజరాజ నరేంద్రుని పురోహితుడు - పాత్రుడు. నాటి రాజాస్టానాల్లో సంధివిగ్రహి, పాత్రులనే ప్రధానోద్యోగులుండేవారు. వారు నేటి రాయబారుల వంటివారు. రాజరాజు జీవితాంతం కంటినిండా కునుకులేని జీవి. ఆయన రాజ్యకాలం 40 ఏండ్లలో ఎప్పుడూ కలతలూ కల్లోలాలే. తండ్రి పోయిన మూడేండ్లకు గాని 1022లో ఆయనకు సింహాసనం దొరకలేదు. పదేందడ్లకుగాని కుదురుకోలేదు. ఇంతలోనే 1030లో సవతి తమ్ముడు విజయాదిత్యునిచే పరాజితుదై, ఏడేండ్లు చోళరాజ్య ప్రవాసం చేయవలసి వచ్చింది. 1037 ప్రాంతాల్లో తిరిగి రాజ్యం దొరికినా, 1046 దాకా దినదిన గండంగా గడిచింది. 1046-58 నడుమ ఆయన జీవితంలో కొంత మంచికాలం.
ఇదంతా చెప్పడం ఎందుకంటే, ఇన్ని కష్టాల్లో బ్రతికినా రాజరాజు రసపిపాసి, సాహితీమనస్వి, జన శుభాకాంక్షి కాబట్టే భారతాంధ్రీకరణకు నన్నయను (ప్రోత్సహిం చడం జరిగింది. రాజరాజు రాజ్యారంభకాలంలో వేంగికి బెజవాడ రాజధాని. భారత రచన నాటికి కర్ణాటక చాళుక్యుదైన త్రైలోక్య మల్లునితో (1050) సంధి జరిగిన తర్వాతనే రాజధాని రాణ్మహేంద్రవరానికి మారింది. తైలోక్య మల్లుని ఆస్థానంలో ఉన్న మహాపండితుడు నారాయణభట్టూ, నన్నయభట్టూ సవాధ్యాయులు. ఆప్తమిత్రులు. పై సంధి కుదరడంలో నన్నయ పాత్ర చాలా ఉన్నది. సంధి తర్వాత నారాయణ భట్టు రాజరాజాస్థానంలో చేరినాడు. నారాయణభట్టు కర్దాట ప్రాకృతాంధ్ర పైశాచీ భాషలు నేర్చిన మహాపండితుడు. అష్టాదశావధారణ చక్రవర్తి. రాజరాజాయ నకు నందంపూడిని దానం చేసినాడు. ఈ నారాయణభట్టు తోడుగా నన్నయ భారతాంధ్రీకరణమున కారంభించినాడు. నన్నయ నారాయణభట్టుల కలయిక, రాజరాజు మనస్తత్వం, ఆంధ్ర భారతావతరణం వీటి వెనుక నున్న చరిత్ర యిది,
సాహిత్య కోణానికి వస్తే, నన్నయ కృష్ణద్వెపాయన మునివృషభాభిహిత మహాభారతబద్ధనిరూపితార్ధ 'మేర్చడ' జయము నాంధ్రీకరింతు నన్నాడు. పైమాట వ్యాసునకు తన కావ్యం యథానువాదం కాదనే విషయాన్ని తెలుపడమలా ఉండగా తన కవితను “ఏర్పడన్” (సుస్పష్టముగా) ఎట్లు రచించునో తర్వాతి పద్యంలో చెప్పబోతూ పై పద్యాన్ని వ్రాసినాడు. స్పష్టత కవితా ప్రథమ లక్షణం కాబట్టి తన కవిత “ఏర్పడుటకు” సాధనాలుగా 'సారమతిన్ కవీంద్రులు' అనే పద్యంలో 1.ప్రసన్న ౨౦6 వ్యానభూమిక
కథా కవితార్ధయుక్తి, 2.అక్షర రమ్యత, 3.నానారుచిరార్థసూక్తి నిధిత్వం మున్నగు వానిని చెప్పినాడు. చెప్పుటేకాక ప్రతి పద్య స్ఫురద్రసంగా కావ్యాద్యంతం దాన్ని పాటించినాడు. నన్నయ స్వభావాన్ని కూడా కొంత మననం చేయడం సమంజసం కాబట్టి ఈ (ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసింది ప్రథమాంధ్ర కవిత్వ ప్రసూతికి ఆదికవి గుండె పడిన పురిటినొప్పులు. నాడు రాజభాష సంస్కృతం. తెలుగు పరిమిత జన వ్యవహార భాష, సాంస్కృతికుల దృష్టిలో తెలుగు అత్యల్ప సంఖ్యాక శబ్దాలు గలిగిన ఒక దేశ భాష. ఇటు రాజకీయంగా గాని, అటు సాహితీపరంగా గాని తెలుగుకు గుర్తింపే లేదు. ఇట్టి స్థితిలో రాజరాజు తెలుగు కావ్యం రాయమనడం, నన్నయ అంగీకరించడం దుస్సాహసాలు. గొప్ప విప్లవాలు. అందులోనూ భారతమంటే సప్తసముద్రాల సంగమస్థలి. ఆ భయమే నన్నయ నోట “అమలినతారకా సముదయంబుల నెన్నను ఇత్యాది మాటలను పలికించింది. “అయినను దేవా! నీ యనుమతంబున, విద్వజ్ఞనంబుల యనుగ్రహంబునంజేసి నా నేర్చు విధంబున నిక్మావ్యంబు రచియించెద”నని తాంబూలము (గ్రహించినాడు. పై వచనంలో చెప్పిన “విద్వజ్ఞన” శబ్దం నన్నయకే కాదు, నాటి కవులందరికీ సింహస్వప్నం. నాటి సారస్వత పరిషత్తుల ఆమోద ముద్ర పడనిదే అది కావ్యం కాదు. ఆ పరిషత్తులు సంస్కృతకావ్యాలనామోదించడమే కష్టంగా ఉన్నకాలలలో - తెలుగనేది భాషేకాదన్న పరిస్థితి ఉన్న సమయంలో తెలుగు కావ్యం వ్రాసి పండిత శార్ట్జూలాల పంజాదెబ్బలనుండి బ్రతికి బయటపడటం దుష్కరం. దీనికై నన్నయ రెండుపాయా లాలోచించినాడు. మొదటి ఉపాయంగా “పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణపుంజ వారిజోత్మర రుచిరంబులై” ఇత్యాది మాటలచే పండితసభల నుతించినాడు. రెండవ ఉపాయంగా తనకు సహాధ్యాయీ, వివిధభాషా శాస్త్రవేత్తా, నాటి పండితులకూ సభలకూ మూర్ధన్యమానుడూ ఐన నారాయణ భట్టును భారత రచనలో ఇరికించినాడు. “పాయక పాకశాసనికి” అనే తన పద్యంలో నరునకు భారతరణంలో నారాయణుడు తోడ్చడినట్టుగా, భారత రచనలో నారాయణభట్టు తనకు సహాయ పడినాడని లోకానికి చాటినాడు. అంటే - నారాయణభట్టు. తనకు జంటకవి అని నన్నయ భావం కాదు, యుద్ధం చేయకుండానే సంకటస్థితుల్లో కవిళశిరోమణీ ఆచార్య రావికంటి వనునందన్ € 21
వాసవిని వాసుదేవుడెలా రక్షించాడో; అలాగే రచనంలో పాల్గొనకుందానే విద్వత్సభల్లో తన కావ్యం గురించి ఏదైనా అపోహగాని, చులకనభావంగాని ఏర్పడితే ఆ సంశయ విచ్చేదానికి నారాయణభట్టు పూటకాపై నిలుస్తాడు. అంతటి తార్మికుడూ, పండితుడూ ఒక విషయాన్ని ఇదీ అని నిర్ధారిస్తే కాదనగల పరిస్థితి దేశంలో ఉండదు. సహృదయుల నుండి నన్నయ కల్పించుకున్న రక్షణ యిది. ఇది నన్నయలోని మహాలోకజ్ఞత,
ఇన్ని చేసినా పండితులు తన కావ్యం వినాలంటే సంస్కృత చందన చర్చతో (ప్రారంభించడం నన్నయకు తప్పలేదు. దాని ఫలితమే “శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ” అన్న తెలుగు ఆదికవి ఆదిశ్లోకం.
పై శ్లోకంలో శ్రీ వాణీ గిరిజలను వక్షోముఖాంగముల ధరించిన “పురుషోత్త మాంబుజ భవ శ్రీకంధరులు” లోకానికి శుభం చేకూర్చాలని; భారత రచన ఒక్కరితో పూర్తి కాబోవడం లేదు కాబట్టి మహర్షియైన నన్నయ ఆది పద్యములో పురుషోత్త ముడైన తనతో పాటుగా కవిబ్రహ్మ (అంబుజభవుడు) తిక్కన; ప్రబంధ పరమేశ్వరుడు (శ్రీకంధరుడు) ఎర్రనలను స్ఫురింపజేసినాడని సుజనవాక్యం. “బుషీనాం పునరాద్యా నాం వాచమర్థోనుధావతి”. కాబట్టి అది నిజమే. కాని ఒక్కటే విచిత్రం! ఆ పద్యం క్రింది వచనంలో వెంటనే వరుసమార్చి నన్నయ-*హరిహర హిరణ్యగర్భుల”ని 'ప్రయోగించినాడు. అంటే ఎర్రన కంటే ముందు పుట్టిన తిక్కన వెనుక పడుతున్నా డన్నమాట. నిజంగా అతడు వెనుకపడే ఉన్నాడు. ఎందుకంటే అరణ్య పర్వ శేషాన్ని చేసింది ఎర్రన కదా! కాబట్టి మొదట చెప్పిన వరుస కాలానికీ, రెండవ వరుస కావ్యానిక్తీ సంబంధించినవి. నన్నయ వాక్సిద్ధి యిట్టిది. .
ఇవన్నీ ఇలా ఉండగా కావ్యానికీ భాషకూ సంబంధించి మరో రెండు బాధలున్నాయి నన్నయకు. భారతం చూడబోతే సకలార్దవ సమీకరణం. దాన్ని పౌరాణిక దృష్టితో మతదృష్టితో రాసినవాడు వ్యాసుడు. తానేమో కథా కథన దృష్టితో కాంతాసమ్మిత సంస్కారోపదేశ దృష్టితో వ్రాయబూనుకున్నాడు. భారతం “ధర్మతత్వ జ్ఞులకు ధర్మశాస్త్రమై, వేదాంతులకు వేదాంతమై, ఎవరి సంస్కారానికి అదై బహురూపి మైన గ్రంథం. అలాంటప్పుడు మూలాన్నెంతవరకనుసరించాలి? మౌలిక శాబ్టీక ప్రయోగాలనెంతవరకు స్వీకరించాలి? సంస్కృత దేశిచ్చందాల నెలా సమీకరించాలి? 22 € వ్వాసభూమిక
అతి విస్తృతంగా ఉన్న ఉపాఖ్యానాల నెంతవరకు సంక్షేపించాలి? మూలంలోలేక, జనవ్యవహారంలో నున్న భారత సంబంధి గాథలు పరిత్యాజ్యాలా? పరిగ్రాహ్యాలా? ఇతర భాషా కవుల పరిష్కారాలెలా ఉన్నాయి? ఇవన్నీ ప్రశ్నలు. “అధిక ధీయుక్తి మెయిన్ మహాభారత బద్ధ నిరూపితార్ధ మేర్ప్చడ” తెనుగుసేతకు పూనుకొన్న మహాకవికీ సందేహాలన్నీ కలుగుతాయి, కలగాలి. కాని తన మహాప్రతిభ చేత నన్నయ వీటన్నిటినీ పరిష్కరించినాడు. నన్నయ రెండో బాధ భాషకు సంబంధించింది. నాటి తెలుగు భాషకు కను ముక్కుతీరేలేదు. దీన్ని పరిష్కరించడానికి ఆయన మొట్టమొదటి 'వాగనుశాసనుడు' కావలసి వచ్చింది. తత్సలమే “ఆంధ్ర శబ్ద చింతామణి”. ఇన్నీ పురిటి నొప్పులు పడి నన్నయ్యకన్న చిన్నారి పొన్నారి కానుపు ఆంధ్ర మహాభారతం. అది తెలుగువారి కోటి కోటి జన్మ పుణ్యఫలం. నన్నయ పడిన మహాకష్టాన్ని గుర్తించినవారు కాబట్టే తిక్కన, ఎర్రనలు ఆఅదికవిని - “ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు, అబ్బాసన కల్పుడు” ఇత్యాదిగా వేనోళ్ళ కీర్తించుటే కాక, పెక్కుచోట్ల ఆయన పద్యాలనూ, శిల్పాన్నీ అనుసరించి తమ భక్తి చెల్లించుకున్నారు.
- తెలుగు తేజము, 2602. 2980 సౌజన్యంతో... కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ఈ 23
శకుంతల - నన్నయ
శ్రీ మహాభారత శకుంతలోపాఖ్యానమును పెంచి వ్రాసినవారు ముఖ్యముగా నిరువురు. ఒకడు కాళిదాసు. రెండవవాడు నన్నయ. ఈయన యాయన కర్వాచీనుడు. నిజమునకు శకుంతల కథ బహుజన వ్యాప్రమగుటకు కారణము కాళిదాసు, వ్యాసుడు కాదు. కాళిదాసా కథను సహస్ర విధముల భావించి, సర్వశక్తుల నేకీకృత మొనర్చి తీర్చిదిద్దెను. మరియొక డెవ్వడును దానిని ముట్టుకొనుటకు వీలులేనట్లు చేసెను. కాని భారతము నాంధ్రీకరింప బూనిన నన్నయకది తప్పదు. నన్నయ వ్యాసుని కథలన్నిటికిని తన “ప్రసన్న కథా కవితార్థయుక్తి వలన మెరుగులు దిద్దినవాడు. వ్యాసుని కథను యథామూలముగా ననువదించుటకు మనసొప్పుకొనలేదు. ఆయన మిక్కిలి మథనపడినాడు. ఏమి చేయవలె? ఆ తపస్సు నుండి ఆయన కొక చక్కని మార్గము దొరికినది. కాళిదాసు కథాదృష్టితో గాక, రసదృష్టితో “అభిజ్ఞాన” సృష్టిచేసి (దుర్వాసశాప, అంగుళీయాదిక వృత్తాంతములతో) విభావానుభావాదులను చక్మగా పోషించి, శకుంతల పాత్రను రసవత్తరముగా దిద్ది తీర్చెను. కావున నన్నయ కథాదృష్టితో అమె పాత్రను తీర్చదలచెను. పైగా నన్నయ స్తీ పాత్రల చిత్రించుటలో అందెవేసిన చేయి. అసలిది శకుంతల కథ - దుష్యంతుని కథకాదు. నన్నయగారి పట్టు ఇక్కడ నున్నది.
నన్నయ తన కవితాగుణముగా మొట్టమొదట చెప్పిన “ప్రసన్న కథా కవితార్థయుక్తి”కి శకుంతలోపాఖ్యానము చక్కని నిదర్శనము.
దుష్యంతుడు తన బాల్యమున “బాలహరిణముల బట్టెడు లీలను విషమాటవీ చలితకేసరి శార్జూలేభ శరభముల” చెవులు బట్టి ఈడ్చుకొని వచ్చువాడని నన్నయ చెప్పెను. ఆయన వర్ణనలన్నియును ధ్వనిమంతములు. సాభిప్రాయములు. “ఆత్నావై 24 6 వ్యాసభూమ్క
పుత్రనామాసి” యను నార్షవాక్యము వలన భరతుడు “అమితోగ్రాటవిలోన గ్రుమ్మరు వరాహవ్యాళ శార్జూల ఖడ్గ మదేభాదుల” బట్టి తెచ్చుట దుష్యంత వర్దనము నందలిపై పద్యమునకు ప్రతిఫలం.
దుష్యంతుని పరిచయము జేయుచు “ఆ దుష్యంతుడనంత సత్వుడ”ని వర్ణించెను. ఇందలి సత్వము భుజబలము కాదు. ఐనచో అది అనంతమగుటకు వీలులేదు. కావున ఇచ్చటి సత్వశబ్బమునకు మనోబలమని, సత్వగుణాధిక్యత యని నన్నయగారి యర్థము. ఈ సత్వము మనిషి పెరిగినకొలదియును ఇమ్మడిముమ్మడిగా పెరుగునది. నన్నయ వేసెడి విశేషణములిట్లే యుండును. అట్టి అనంత సత్వము గలవాడు కావుననే దుష్యంతుని 'నేలి - “సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృత” మైనది. “బాహువీర్యంబునన్” దుష్యంతుడిట్టి నేల నేలినాడని అదే పద్యాంతమున వ్రాయబడుటయును పై విధమైన సత్వార్ధమునకు బలము నిచ్చుచున్నది. మహాకవులు వ్యర్ధపద ప్రయోగములు (పునరుక్తులు) చేయరుకదా!
అట్టి దుష్యంతుడు మృగయా వినోదియై వనముజొచ్చి “అతిదూరంబున కరిగిన నాతని రథవేగంబు ననుగమింపనోపక నధిక క్షుత్పిపానా పరవశమయి పరివారము అయ్యయి ప్రదేశముల విశ్రమింప-నతండు కతిపయ “మంత్రి పురోహిత సహితుండై” కొంతవడి జని యెదురనొక్క ఆశ్రమ వనము గాంచెను.
ఆ వనమెట్లున్నది? ఇంద్రుని ఖాండవమువలె, కుబేరుని చైత్ర రథము (ఉద్యానము) వలె నున్నది. ఇందలి ఇంద్రస్ఫూర్తి ముందు జరుగబోవు శృంగారమున కాలంబనము. తర్వాత జెప్పిన 'చంపకము'నందలి “మృదులా విలాసవర్డిత కుసుమాక్షతావళులు” పై భావమునకు పరిపోషకములు. తర్వాత జేసిన “మానినీ” వృత్తము (ఏచి తనర్చి తలర్చిన) నందలి వర్జనము పై రెంటికి నిదర్శనం. ఆ వనమును మానినియందు జెప్పుట 'ముద్రాలంకారము”. ఈ మూడు పద్యముల వెనుకగాని నన్నయ “చని చని ముందట నాజ్యహవిర్ధృత” అను కవిరాజవిరాజిత ముతో కణ్వాశ్రమ మహత్వ వర్జనమునకు బూనుకొనలేదు. శకుంతల కథ యంతయు నిందు ధ్వనితము. మొదట శృంగారము -తర్వాత పావిత్ర్యం. వనము ఖాండవమని
- చైత్రరథమని చెప్పుట యెందులకనగా ఇందలి శృంగారము ఖాండవము వలె మొదట దహనము నందునది. తర్వాత శకుంతలా పావిత్ర్యంతో చైత్రరథమై విలసిల్లునది - నన్నయ యనగా నిది!
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ఆ 25
ఇట్టి వనముగాంచి “వలయు నమాత్యులం దగినవారల” నిలువ నాజ్ఞాపించి, ధారుణీశ్వరుడొక్కరుడే కణ్వాశమము (ప్రవేశించెను. ఇది రెండు విధముల కథను నడిపించినది. ఒకటి - శకుంతలా సమాగమమున నవరోధముకలుగకుండుట. రెండు- తర్వాతి కథలో దుష్యంతుడు శకుంతలను తాను పదిణయమగుట తనకు వలయువారు, తగినవారు నెవ్వరు నెరుంగమిచే ఆమె పావిత్యమును (బ్రకాశింపజేయు టకై ముందు నిరాకరించితినని చెప్పుటకు వీలిచ్చుట. ఆ శకుంతల యొట్టిది? “వయోజదళాయతాక్షి- సంకుల మిళితాళినీల పరికుంచిత కోమల కుంతల” ఒకటి పద్మము, ఒకటి భృంగము-సర్వమును శృంగారము. అట్టి శకుంతల “సౌందర్యముచే నందరను బరాభవించువాని (జయంతుని బోని) దుష్యంతునెరింగినదట. ఎట్లెరింగినదనగా వెనుకటి విశేషణములలోనే నన్నయ సూచించెను. “పద్మ దళాయతాక్షముల” విష్పార్చి చూచి, సిగ్గున నవనత వదనకాగా దుష్యంతునకు 'అళినీల పరికుంచిత కోమల కుంతలి సౌందర్యము భాసించినది. అట్లామె ఎరింగినదని తెలిసికొన్నవాడు కావుననే తనకును ఆమెకును డ్రేమ 'పెరుగుచున్నదని (శకుంతల చెప్పకపోయినను) “నీకును నాకును నెమ్మి బరస్పర (ప్రేమంబు గాముండు పెంపదొడగె”అను సీసపాదమున దుష్యంతుడు నిష్కర్షగా చెప్పగలిగెను. వర్దనముతో కథ నడుపుటకు తిక్కనను చెప్పుదుము - అదెకవిలో మాత్రమదిలేదా? అట్టి శకుంతలను జూచి సంచలిత హృదయుదైన దుష్యంతునకు ఆమె “మనోజ రాజ్యలక్ష్మి” యనిపించినది. అంతవరకును దుష్యంత మనోజరాజ్యమున లక్ష్మీప్రాప్తి లేమిచే అది ప్రకాశమానము కాలేదు. ఇప్పుడైనది! లోకము (చూపు)లో ఒక విషయము ప్రకాశమానమైన వెనుక కదా, అది యున్నదని తెలియునది. నన్నయ “రుచిరార్ధ నిధిత్వమిట్టిది. శకుంతల మాతాపిత్చ పరిత్యాజ్య. కరుణామూర్తియైన కణ్వమహర్షి చేత పెంపబడినది. ఎప్పుడో ఎవరికో తన కధ నాయన చెప్పగా వినినది. ఆయన మహా(పేమను సంభావించి ఆయనయందు అమిత భక్తిగారవముల బెంచుకొనినది. అంతరాంతరములలో నెక్కడనో మాతాపితృ [్రేమ వీరహితులు దీనులన్న భావమొకటి కలది. తనవలె తన కొడుకు వంశమునకు దూరుడు కాగూడదను మహామాతృ 26 అ వ్యానభూమిక
(ప్రేమభావ పూర్ణహృదయ ఈ సర్వభావములను స్మృతియందుంచుకొని నన్నయ శకుంతల నతి సున్నితముగా 'నాగవల్లి' వలె దిద్ది తీర్చెను. నాగవల్లీ దళమెంత లలితమో అంత ప్రయోజనకారి. సర్వాహారమును జీర్ణ మొనరించి తనువునకు జీవశక్తి నిచ్చునది - శకుంతల యిట్టిది. ఆమె యందలి లాలిత్యము, ధార్మికశక్తి ఆమె పలికిన ప్రతి మాటయందును నన్నయ పప్రక్షిప్తము చేసెను.
నీవెవ్వరవనియడిగిన దుష్యంతునకు “ఏనత్యగణిత ధర్మస్వరూపుడైన” కణ్వాత్మ జనని శకుంతల సమాధానించెను. కణ్వుడు సర్వధర్మ స్వరూపుడనియును-దీన రక్షణము, కరుణమే సర్వధర్మ స్వరూపమనియును ఆమె భావము. తన జన్మప్రకార మును జెప్పుచు విశ్వామిత్రుని “తపళ్శక్తిమై అనఘడై బ్రహ్మర్షి భావమును బడసిన వాడని” చెప్పెనే గాని కణ్వుని వలె “సర్వధర్మ స్వరూపులని"గాని, “కరుణా నిరతులు, ధర్మస్వరూపులని” గాని చెప్పలేదు. ఇందలి రహస్యమేమనగా - తపస్సు వలన పాపములు నశించును. ఐనను తపస్సు ధర్మమున నొక భాగమే కాని, తానే ధర్మువు కాజాలదు. ధర్మువేదనగా “ప్రేమ స్వరూపమైన కరుణము. త్యాగస్వరూపమైన దీనరక్షణము” గాయపడిన శకుంతల లేతమనసు ధర్మసూక్ష్మమునిట్లు నిర్ధారించినది. నన్నయ శకుంతల పాత్ర నింత లలితముగా, ఇంత గంభీరముగా చిత్రించెను.
శకుంతలను చూసి మోహవశుడైన దుష్యంతుడు ఆమెను మునికన్యయని భావించి, ఐనచో ధర్మాత్మకమైన తన వృదయమామె యెడ లగ్నమగుటెట్లని శంకించి ఆమె వృత్తాంతము నడుగును. దీనిని కాళిదాసు తన (దృశ్య) కావ్యమున “అసంశయం క్షత్ర పరిగ్రహక్షమాయదేతస్యామభిలాషమే మనః సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ్రవృత్తయఃళో అని తాను సత్పురుషుడగుటచే తన యంతః కరణము అధార్మిక ప్రవృత్తి మగ్నముకానిది కావున నామె క్షత్ర పరిగ్రహ యోగ్యయని నిర్ణయించు కొనెనని - వాచ్యముగ చెప్పివైచెను. ఆయన తర్వాతివాడు కావున నన్నయ భట్టారకుడు- “ఇది మునికన్యయేని మరియేలొకొ ఈ లలితాంగి యందు నా హృదయము దద్దయుందవిలె - ఇప్పటికింకను నమ్మనేరనయ్యెద” అని మాత్రము చెప్పి వదిలి, కాళిదాస భావమునంతయును ధ్వనించెను.
ఆమె తాను మేనకా - విశ్వామిత్రులకు బుట్టినదని చెప్పిన వెనుక సంతుష్టుడై దుష్యంతుడు “నా హృదయము - ఆళిపాత వికంపిత పంకజాకృతిన్ - మదనబాణ
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 27
పరంపర కాస్పదమయి సంచలించెననుకొనును. ధర్మసంశయమున బడిన దుష్యంత హృదయా వేగమును - “ఇది మునికన్యయేని” అనుపద్యముతో మొదలిడి “ఇది మునినాథ కన్యయని అను పద్యముతో నన్నయ ఉపశమింపజేసెను. ఈ రెండు పద్యముల యందు పోలికలెక్కువగా నున్నవి. రెండును అందమైన, ప్రసిద్ధమైన చంపకములు.
సంశయనివృత్తి యైనంతనే ఆమె భావము నెరింగినవాడు కావున దుష్యంతుడు- గాంధర్వ రాక్షసములు క్షత్రియోచిత వివాహములని; తనకు తానే చుట్టముగా, దానకర్తగా జేయు సమర్పణము గాంధర్వవిధి సమ్మతమని, అది యమంత్రకమని - కావున గాంధర్వవిధి పరిణయ మగుదమని యామె నర్ధించును. అప్పుడామె ఒక వరమడిగెను. తనకుదయించినవానినే “మహీ గురుతర యౌవ రాజ్యమునకున్, దయతో నఖభిషిక్తుజేయ గావలెనని” ఆ వరము. ఇది ప్రలోభ ప్రభావితమైన మాట కాదు. తాను తన వంశమునకు దూరమైనది. తల్లిదండ్రులు లేనిదైనది. తన సుతుడట్లగుటకు వీలులేదు. వంశమున నుండుటయే కాదు. తన సూనుడు వంశవర్ధ నుడు కావలెను - ఇది శకుంతల మాతృ హృదయము. శకుంతల మాతా పితృ విరహితనను నొక దైన్యభావము గలదను మాటను దుష్యంతుడు తిరస్కరించిన వెనుక - “తడయక పుట్టిన నాడ తల్లిచే దండ్రిచే విడువబడితి” నను మధ్యాక్కరలో నన్నయ వాచ్యముగనే చెప్పెను.
అనిన విని “శకుంతల కెంతయు సంతోషంబుగా(న్) దాని కోరిన వరంబిచ్చి” దుష్యంతుడు గాంధర్వవిధి నభిమత సుఖంబులనుభవించి, ఆమెను దోడ్మొనిరా నుచిత పరివారము నంపెదనని వీడ్శొని నిజపురంబునకు జనియెను.
ఆపైన కణుదాశ్రమమున కరుదెంచి లజ్ఞావిశషయగు శకుంతలంగని, విషయము నంతయు దివ్యదృష్టి నెరింగి, ఆమె కుద్భృవించెడు పుత్రుడు దీర్చాయు రారోగ్యెశ్వర్య యుక్తుండును, వంశకర్తయు నగునని దీవించెను.
వర్షత్రయము మోసి “అమితోగ్రాటవిలోన గ్రుమ్మరు వరాహవ్యాళ శార్జూల ఖడ్గ మదేభాదుల బట్టి తెచ్చు “శాకుంతలుని” శకుంతల కనెను. సర్వ క్రూరసత్వముల దమించుట జేసి అతడు 'సర్వదమను'డయ్యెను. అతని పేరు భరతుడు.
ఎంతకాలము గడిచినను దుష్యంతుడు మనుష్యుల బంపమి, వివాహిత 8 8 వ్యాసభూమిక
పుట్టింటనుండుట ధర్మము కాదని మహాతపస్వులైన కొందరు శిష్యుల దోడిచ్చి కణ్యుడామెను దుష్యంతుని యొద్ద కనుపును.
శకుంతల పతియే ప్రీకి సర్వస్వమని యెంచి “దౌప్యంతుం” దోడ్మాని రాజుపాలి కేతెంచును. మునుపు శాకుంతలుడు, ఇప్పుడు దౌప్యంతుడు - నన్నయ వేసెడి పదము లిట్లుందడును.
“బాలార్మ తేజుడగు నీ బాలుడు” నీ కొడుకని శకుంతల భరతుని దుష్యంతు ముందటం బెట్టును. దుష్యంతునిది చంద్రవంశము. దానికి వెలుగునీయగల బాలుడు “బాలార్క తేజుడు” భరతుడు - ఇది శకుంతల భావము.
ఆయన నిరాకరించెను. నీవు నా భార్యవు కాదనెను. నేను నిన్నెరుగనే యెరుగను పొమ్మనెను. ఆమె “వేదములును, పంచభూతములను, ధర్మువును, సంధ్యలును, అంతరాత్మయును, యమచంద్ర సూర్యులును, అహోరాత్రములును, పురుష వృత్తమునకు సాక్షు"లని చెప్పి, జనులెవ్వరెరుగనంత మాత్రమున పున్నామ నరకమును దప్పించెడి వంశవర్ధనుని పరిత్యజింపవలదని పరిపరి విధముల జెప్పును. పుట్టిననాడే తల్లియు దండ్రియు విడిచిరని, నేడు భర్త విడిచెనని విలపించును. ఎన్నో రీతుల ్రార్ధించును. ఆయన వినడు.
పురాణ కాలమునందలి రాజులు నిరంకుశులు కారు. విద్వద్దార్మిక పరిషత్తు లకు బద్దులు. మోహావేశముచే జీవలక్షణమైన కామమునకు లొంగి దుష్యంతుడు శకుంతలను పరిణయమయ్యెనే కాని, దాని నన్యులెరుగరు. పరిణయ మగుటయే గాక, ఆమె పుత్రుని రాజును జేతుననియెను. పురమునకు వచ్చిన వెనుక దుష్యంతుని తెలివి పని జేయజొచ్చెను. తమ వివాహమును తక్కిన రాణులును, ధార్మిక పరిషత్తు లును అంగీకరించినచో కదా తానామెను పరి[గ్రహించుటయు, తత్పుక్రుని రాజునొ నర్చుటయు. ఎరుగనిదానిని వారను మతింతురో లేదో? సంశయాత్మకమైన విషయ మును బయల్ప్బరచి వారనుమతింపనిచో తానేమి చేయవలెను? రాజ్యమును పరిత్య జింపవలెనా? గద్దె నెక్కునాడు తాను చేసిన ప్రమాణముల నప్రమాణముల గావించి అధార్మికుడు కావలెనా? వ్యక్తి ధర్మమును పాటింపవలెనా? సంఘధర్మమునా? ఆత్మద్రోహి కావలెనా? వంశద్రోహి కావలెనా? ఇన్ని బాధలలోబడి దుష్యంతుడు సమస్యను కాలమునకు వదలి శకుంతలను రప్పించక మిన్నక్షుండెను. రప్పింపనివాడు
కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ € 29
ఇప్పుడాకస్మికముగా నిండుసభలో ఆమె తన భార్యయని, ఆ బాలుడు భావిసమ్రాట్టని ఎట్లంగీకరించును? నిజమునకు, జరిగినది ఇప్పుడైనను కణ్వునంతటి మహర్షి వచ్చినచో, చెప్పినచో ధర్మపరిషత్తులు మిన్నకుండును కావున తాను నిరాకరించి యుండకపోవును. ఇట్టి సంకటస్టితిలో నున్న దుష్యంతుడేమి చేయవలెను? రామునివలె ఎరిగి ఎరిగి ఆమెసతీత్వము నామె పాతివ్రత్య మహిమపై వదలివేసెను. అగ్నివంటి క్షోభకు గురిచేసెను. ఆమె పాతివ్రత్యమామెను రక్షించినచో తానామెను పరిగ్రహించుట కభ్యంతరము లడ్డు రాజాలవు - ఇది దుష్యంతుని నిర్ణయము.
రసదృష్టితో వ్రాసిన కాళిదాసు ఈ విధానమును భరించలేకనే - రసభంగకారి యగునని 'అభిజ్ఞానతిను కల్పించి దుష్యంతుని రక్షించెను. కాని, మహర్షియై ఉన్నదున్నట్లు వ్రాసిన వ్యాసునకును, కథా దృష్టితో వ్రాసిన నన్నయకును ఆ యవసరమేమి?
ఎన్ని చెప్పినను వినని దుష్యంతునితో శకుంతల నీవీ బాలుని కౌగిలించుకొను మనియు, ఆ కౌగిలి “ముత్యముల పేటవలె, కర్పూరపు పూతవలె, చందనమువలె, వెన్నెలవలో” చల్లదనము గలిగించినచో అట్టి గుణములు గలది కేవలము పుత్రస్పర్మయే కావున,అది ధర్మాత్ములకట్లు తోచును కావున - ఆ కౌగిలి వీని నీకు సుతునిగాదెలియ జేయునని పల్నును. ఇది మిక్కిలి ప్రసిద్ధమైన పద్యము. “విపరీత ప్రతిభాష లేమిటికి” అను నీ పద్యము ఎల్లరకు నభిమాన పాత్రము.
కాని దుష్యంతుడు - ఆ బాలుడెవరో తెలియకున్నచో కదా కౌగిలించు కొనుటయు, తెలిసికొనుటయు, అతనికి కావలసిన విషయము దాని నితరు లెరుంగుట. తన కౌగిలి పరులకా విషయము నెట్లు తెలుపును? కావున నతడు భరతుని చేరదీయనేలేదు.
ఇవి యన్నియు నీ కథలో నున్న మెలికలు. వాని నెల్లను నన్నయ ధ్వనిమంత ముల జేసెనే కాని విప్పి చెప్పలేదు. ఇది మహాకవి చేయుపని.
నిరాశయై శకుంతల మరలిపోనుండగా నశరీరవాణి శకుంతల మహా పతివ్రత యనియు, భరతుడు దుష్యంత పుత్రుడనియు “సభాసదులెల్లరు” వినబలుకును. ఇంత జరిగిన వెనుక ఆమె యస్తిత్వము నే ధర్మపరిషత్తు నిరాకరించును. కావున, ఆమె పాతివ్రత్య నిరూపణమునకే తానీ నాటకమాడితినని తెలిపి దుష్యంతుడు 3౦ 6 వ్యానభూమిక
“శకుంతలా మహాదేవి'ని అతి ప్రణయ గౌరవమున సంభావించి, యౌవరాజ్యమునకు భరతునభిషిక్తు జేసెను. దీనివలన నాటి ధార్మిక పరిషత్తుల ప్రభావము కొంత తెలిసినది. సంఘ వ్యవస్థ కొంత తెలిసినది. రాజుల స్వాతంత్రాస్వాతంత్ర్యములు కొంత తెలిసినవి. జీవుల మనోదౌర్భల్య నైశ్చల్యములు కొంత తెలిసినవి. శకుంతల యెడ నన్నయకుగల మహాగౌరవాదరములును తెలిసినవి. ఇన్ని మెలికలు తిరిగి, ఇన్ని పోకలు పోయిన కథను ప్రసన్న గంభీరముగా చెప్పగలుగుటయే నన్నయయందలి “ప్రసన్న కథా కవితార్ధయుక్తి” రస దృష్టితో శకుంతలను కాళిదాసెట్లు తీర్చెనో - కథాదృష్టితో, పాత్ర చిత్రణ దృష్టితో నన్నయ అంతదిద్దెను. ఆ రెండు విషయములలో మరియొకడు వ్రేలు పెట్టుటకు వీలు లేదు.
- తెలుగు తేజము 06/02 £2 1980 సౌజున్వంతో... కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ € 31
పోతన వామన చరిత్రం - ధ్వని బమ్మెర పోతన కవిత్వం మహాకావ్య లక్షణ రత్పపేటి. మాధుర్య గుణరాజ సింహపీఠి. ఆయన అవతరణ తెలుగుజాతికి ఎనలేని పెన్నిధి. అమృతరస ప్రవాహ సన్నిధి. ఆయన కవితలలో ఒకటి, రెండని కాదు తవ్వగలిగే కొద్దీ తరగని జీవనిధులు. విహంగాలోకంగానైనా ఆయన కవితా లక్షణాలను ఒకచోట చెప్పగలగడం సాధ్య మయ్యే పనికాదు. అనుప్రాసకు, సుందర పదబంధానికి, వర్ణనావైచిత్రికి, అంతర్లయకు ఆస్పదమైన పోతన కవిత్వంలోని “ధ్వని” - వామన చరిత్రం ప్రస్తుతాంశం. “యత్రార్థశ్ళబ్దోవా తమర్ధముపసర్దనీ కృత స్వార్ధ వ్యక్తః - కావ్య విశేషః సధ్వనిర్తీతి సూరిఖిః కథితః” ఇది ఆనందవర్ధనునికి అభినవ గుప్తుని వ్యాఖ్య. ఎక్కడైతే అర్థమూ శబ్దమూ తననూ, తన అర్జాన్నీ (ప్రధానంగా చేసి అర్జాంతరాన్ని వ్యక్తం చేస్తాయో అలాంటి కావ్యవిశేషం ధ్వని అని పై వాక్యానికర్థం. ఈ ధ్వనే కావ్యాత్మ అని ఆఅనందవర్ధన సిద్ధాంతం. ధ్వనిని 5,304 భేదాలుగా పండితులు గుర్తించారు. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగినవి, క్షే వివక్షితాన్యపరవాచ్యం (వాచ్యార్థం పొసగింతర్వాత అర్జాంతరాన్నిచ్చేది) 2 అవివక్షిత వాచ్యం (అర్జ్భాంతరమే వర్తిస్తుంది) 8. వర్ణ (శక్తిమూలక) ధ్వని 4 శబ్ద (శక్తిమూలక) ధ్వని 5. _ అర్థ (శక్తిమూలక) ధ్వని 6, ఉభయ (శబ్దార్ధశక్తిమూలక) ధ్వని 32 ౪ వ్యాసభూమిక
లా వాక్య (శక్తిమూలక) ధ్వని 8 వస్తుధ్వని
9, అలంకార ధ్వని
- రస ధ్వని
ధ్వని కావ్యాన్ని రాయడం నిజంగా చాలా కష్టం. అందుకే ధ్వని కావ్యముత్తమ మని దోషజ్ఞుల ఏకాభిప్రాయం. అందులోనూ ధ్వని కావ్యాన్ని సుందరంగా, ప్రసన్నంగా రాయడం మరీ కష్టం. తెలుగు కవిత్వంలో ఈ పని చేసినవాడు పోతనా మాత్యుడు. కావ్యం నిండా అవకాశమున్న చోటల్లా ధ్వని వైభవం వెలార్చిన పోతనలో వామన థుట్టంలో అది వరాకాష్ట నందింది. ఎందుకంటే భగవంతుడు అబద్ధమాడకూడదు. బలిని మోసగించాలి. ఈ రెండూ కావ్య శిల్పానికి కొట్టు రాకుండా పోషింపబడాలంటే ధ్వనిమార్గమే శరణ్యం. అందుకే వామన చరిత్ర మంతా ధ్వని విలసితమైంది.
స్వస్తి! జగ్య(తయీభువన శాసనకర్తక్కు వోసనూత్ర వి
ధ్వస్త నిలింప భర్తకు, నుదారవద వ్యవహార్తకున్ మునీం
(దన్తుత మంగళాధ్వర విధాన వివార్తకు, నిర్ధరీగళ
న్యస్త నువర్హ నూత్ర వరివార్తకు, దాననలోక భర్తకున్
ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. బలిని వామనుడిలా దీవిస్తాడు. పోతన కావ్య శిల్చంలో వామన ఘట్టం మోసాన్నాశయించింది (బలింఛలయతే). కాబట్టి దీవనలోనే శాపం.
ఈ కథలోని ఛలాన్ని కొంత ప్రస్తరించడం యుక్తం. సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వ; సర్వ వ్యాపకత్వాలు గల శ్రీహరి వామనుడై బలినెందుకు యాచించాడు? బలిలోని మహాగుణం పరమ ధార్మికత, దాని కారణంగా అతన్నెదిరించి గెలవడం ఎవ్వరికీ సాధ్యం కానిపని. భగవంతునీకి కూడానా? అంటే, నిస్సంశయంగా అతనికి కూడా చేతకాదు. ధర్మకవచాన్ని ఛేదించడం దేవుని తరం కూడా కాదు. ఎందుకంటే సృష్టిలో ఒక్కసారి విధించబడిన కట్టుబాట్లకు జీవుడేమి దేవుడేమి ఎవరైనా లొంగి నడుచుకోవలసిందే. దేవావన తత్పురుడైన నారాయణుడిప్పుడేం చెయ్యాలి? వంచన నాశ్రయించాలి. లోకంలో వంచన దేన్నాశయిస్తుంది? ఎదుటివానికి దేనిమీద
కవిళిరోమణి ఆచార్వ రావికంటి వనునందన్ € 33
(పేమాధిక్యమో, దేనియందు వాడు ధృఢ ్రతిజ్ఞుడై ఉంటాడో, దాన్నాశయించి, దాన్ని దెబ్బతీసి వంచన గెలుస్తుంది. ఇప్పుడు బలి మహావదాన్యుడు. మహా సత్యనిష్టుడు, మహా ధార్మికుడు, కాబట్టి ఈ గుణాలను ఆశ్రయించే బలిని వంచించాలి. ఇదీ వామన ఘట్టంలోని పట్టు!
వామనుడు వంచించడానికి రావడం వేరు-అందుకే వచ్చానని వస్తూనే చెప్పివేశాడు. ఎలా?
పై పద్యంలోని మొదటి పాదంలో
8 ర్ 6 7 జ తార య భ
వర్దాలు ఆయా స్టానాల్లో ప్రయోగించబడ్డాయి.
-
ఉత్తమ గండచ్చందం - 'యి వర్జాన్ని ఆరింట వాడకూడదు.
-
అనంతుని ఛందం - 'తి కారాని ఐదింట వాడవద్దు.
-
అనంతుని ఛందం - 'భి వర్జాన్నేడింట వాడరాదు.
-
మూడవ “జి కారం.
-
ఐదవ '“రి కారం - అనంతుని ప్రకారమే నిషిద్ధం.
-
ముఖ్యంగా “జ-ర-భ” వర్జాలు నిషిద్ధ స్థానాల్లో, ప్రథమ పాదంలో అసలే
వాడరాదు.
వాడితే కృతిపతి (ఉద్దేశింపబడినవాని) కి కష్టనష్టాలు కలుగుతాయి. చూడు చూడుమని వామనుడు వానినే ప్రయోగించడం వంచనలో మొదటి ఘట్టమైన వర్ద ధ్వని. అంటే నేను నీకు కీడు చేయడానికే వచ్చానని అర్ధమన్నమాట. ఎదుటివాడు తెలివిగల వాడైతే తెలుస్తుంది.
'స్వస్తి అనే మాటకు పోతన నాటికే 'ఉద్వాసన' అనే అర్ధం ప్రారంభించిందేమో! ఇది శబ్ద ధ్వని. “దానవ లోక భర్తకున్” అనడంలో బలికి కేవల సుతలాధిపత్యాన్నే, వామనుడు నిర్దేశిస్తున్నాడు. ఇది శబ్దార్ధ ఉభయ ధ్వని.
ఈ పద్యంలో పోతన జీవలక్షణమైన అనుప్రాసం అంచులు దిద్దుకొని కన్పిస్తూనే ఉంది. అది వట్టి అనుప్రాస మాత్రం కాదు. ఆయన ఆపాత మధురమైన తన శక్తిచేత పామరుడైన పాఠకుని చేత కూడా కావ్యం చదివిస్తాడే కాని, దానిలోని 34 ఊ వ్యానభూమిక
అర్ధగాంభీర్యం తెలియడం ప్రారంభిస్తే గుండెలు బ్రద్దలు కావాలి. ఈ గుణం భాగవతమంతటా ఉన్నది. ఆయన భావం చుట్టలు చుట్టుకొన్న అనంతుని వలె కొస మొదలు దొరకనీయనిది. వైనతేయుని వలె క్షణ సహ(స్రభాగ కాలంలో గ్రహమండలాన్ని దాటిపోయ్ వేగం గలది. తక్కిన కవులు మహానదుల్లాంటి వారు. కొంత ఈతగాదైతే మునిగి నీటిక్రింది ఇసుక కనుల జూడడానికి అవకాశమున్నది. కాని ఈ నది పర్వతశయ్యల్లో ప్రవహించే (బ్రహ్మపుత్రలాంటి హిమవన్నది. పైన కనపడేవన్నీ హిమ శిలాతలాలే. ఎక్కడ ఎంత లోతున్నదో మునిగిన తర్వాత కానీ తెలియదు. ఆ మునుకలో కనపడేది ఇసుక కాదు - వాసుకి! శేషుడు! పోతన్న అంటే ఇది.
పోతన ప్రయోగించే అలంకారాలు కూడా అలంకార మాత్రాలు కావు. వామనుని జూచి ప్రజలు “శంభుండో హరియో పయోజ భవుడో' (అనుమానం) ఇత్యాదిగా భావిస్తారు. వామనుడు మొదట బలి సర్వస్వాన్నీ హరిస్తాడు. వరాలనిచ్చి రక్షిస్తాడు. సూర్య సావర్ణి మన్వంతరంలో అతన్ని ఇంద్రునిగా సృష్టిస్తాడు. లయ స్థితి సృష్టికర్తలను పై వరుసలో చెప్పడం వస్తుధ్వని. వామనుడు త్రిమూర్త్యాత్మకుడని కూడా ధ్వని.
“బుడి బుడి నదకలు నడచుచు; కొందరితో జర్చించుచు” ఇత్యాదిగా ప్రవేశించి, ఆశీర్వదించిన తీరు చూసి బలిచక్రవర్తికి అనుమానం కలిగింది. “వదుగా! ఎవ్వరి వాడ?” వన్న బలిప్రశ్నకు - “ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు, ఒక చోటనక నెందు నుండనేర్త ఈ మొదలైన మాటలతో సమాధానమిస్తాడు వామనుడు. తనకు పేరు, నెలవు, రీతి ఏవీ లేవు, ఇదంతా నిజమే. కాని, దాన్ని వటుధర్మాని కన్వయించి చెప్పి బలిని మోసగించదానికి యత్నించడంతో ఇది రసధ్వనిగా రూపొందింది. ఈ సమాధానంతో బలి అనుమానం బలపడింది.
నీకేం కావాలని అడిగిన బలిని, వామనుడు నీవింతవాడవంతవాడవని పదమూడు పద్యాల్లో ఉబ్బవేస్తాడు. అందులో వంశప్రసక్తి తెచ్చి, నీ తాత (హిరణ్య కశ్యపుడు) శ్రీహరినే మూడు చెరువుల నీరు త్రాగించాడంటాడు. తాతనే పొగడదలిస్తే సకల కళ్యాణ గుణఖని ప్రహ్ష్హాదుడు లేడా? ఇది కూడా ఛలంలో ఒక భాగం. ఈ పొగడ్తలన్నీ విని బలి ఉబ్బిపోతాడేమో చూద్దామని వామన మతం, ఇలా పొగడి,
కవిళరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 35
పొగడి చివరకు-
ఒంటివాద నేను యొకటి రెందదుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్డెదీర (బ్రన్హూ కూకటి ముట్టెద
దానకుతుక సాంద్ర ॥ దానవేంద్ర / అంటాడు.
దీనిలోని ఒకటి రెండడుగులు - తక్కువలో తక్కున అని. ఒకటి, రెందు- రెండడుగులతోనే నీ పని సరిపుత్తునని, కోర్మెదీర బ్రహ్మ కూకటి ముట్టెద అనడంలో ఏం చేస్తాడో స్పష్టంగానే చెపుతున్నాడు. ఇది వివక్షితాన్యపర వాచ్యం.
అది విని బలి “వసుధాఖండమో, గజాశ్వములో, యువతులో, ఏదో మరొకటి కోరుకొమ్మనీ, నీవు వామనుడవైనా దాత పెంపుసొంపు తలపవలదా? అనీ ప్రలోభపెడ తాడు. కాని ముల్లోకాలను (మింగదలచిన వానికి అవన్నీ ఎందుకు? “గొడుగో, జన్నిదమో, కమండలువొ” కావాలిగాని, ఇవన్నీ నాకెందుకంటాడు. అంటూ -
న్యావ్తీం జెందక వగవక్క,
ప్రాస్తంబగు లేశమైన వదివేలనుచున్
తృప్తీం జెందని మనుజుడు
నత్త ద్వీపములనైన చకంబదునే? అని ఒకనీతిని ఉపదేశిస్తాడు. కాని, దాన్ని తాను మాత్రం ఆచరించడు. ఎందుకంటే తాను 'మనుజుడు కాడుగదా! వామనుని ఛలమిట్టిది. ఇలా అన్నీ చెప్పి “మదాకాంక్షామితంబైన (ఆకాంక్షా+మితంబైన; ఆకాంక్షా+అమితంబైన) మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయ 'బ్రహ్మాండంబు నా పాలికిన్ అంటాడు. ఇది ప్రత్యక్షర సత్యమే! దీంతో బలి అనుమానం పూర్తిగా తీరింది. ఇది అవివక్షిత వాచ్యం.
శుక్రుడు వామనుడెవ్వడో చెప్పి బలిని దాన ప్రయత్నం నుండి మరలించదానికి ప్రయత్నిస్తాడు. కాని బథియందలి మహాధార్శ్మికత, సత్యనిష్ట దాన్ని సాగనీయవు. బలి వేదాంతోపన్యాసం చేస్తాడు. దీన్ని భక్తికి అంగంగా వెలయిస్తాడు పోతన్న ఇంతకూ బలికి వచ్చిన వాడెవడో తెలియకపోతే కదా? ఉపదేశాలు వినడం!
జీదుగని క్రతువుల (నతముల
బొడగన జననట్టి పొడవు పొదవున కురువై 36 € వ్యానభూమిక
యదిగెటినట ననుబోటికి
నిదరాదె మవోనుభావ ॥ ఇవ్చాద్దంబుల్ అని శుక్రుని తిరస్మరించడమే కాకుండా, వామనుని పట్ల కొంచెం పరిహాసాన్ని కూడా వెల్లడిస్తాడు బలి. పైవిధమైన గుణరూపాలతో, అంత పొడవైన హరి- అంత పొడవునా రాగలడా? అలా వచ్చి అడిగినా, అడిగింది తానిస్తాదు కదా! అలాంటప్పుడు పొట్టియె రావడమెందుకు? అంత పొడవున వచ్చినా, యాచన చేత పొట్టివాడౌతాడు కదా, కాబట్టే మొదటనే పొట్టిగా రావడం, చిన్న చిన్న పద్యాల్లో కూడా పోతన ఎంత చమత్మారం చేస్తాడో చూడండి.
వుట్టి నేర్చుకొనెనా పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధులిట్టి పొట్టి వదుగు
వొట్టనున్న వెల్ల బూమెలునని - నవ్వి
యెలమి ధరణి దానమిచ్చెనతదు అనడంలో బలి వామనున్ని పరిహసించడమే కాకుండా, వానికి పుట్టువు లేదని ఎరిగిన తనాన్నీ ప్రేమతో దానమిచ్చినతనాన్నీ ప్రస్ఫుటం చేస్తారు పోతన్న
రెండు పాదాలతో లోకాలన్నిటినీ కొలుచుకొని మూడవ దానికై స్థలమడిగితే బలి తన తల చూపుతాడు. దీనిలోని రహస్యమేమంటే - సర్వజ్ఞత్వ, సర్వ శక్తిమత్వ, సర్వ వ్యాపకత్వాలు వామనుని మూడు పాదాలు. సర్వ శక్తిమత్వంతో అతడు బలి అన్న మయ, ప్రాణామయ కోశాల్సీ సర్వ వ్యాపకత్వంతో సర్వేంద్రియ సంపుటీకరణ మైన మనోమయకోశాన్నీ ఆక్రమించాడు. ఆ మూడుకోశాలూ భగవన్మయాలైన తర్వాత విజ్ఞానమయకోశం (సహఫ్రారం)లో వాని పదం (నామం/స్మృతి) అచ్యుతమై నిలుస్తుంది. ఇది భక్తియోగ పరమ పరిజామ దశ. అప్పుడివన్నీ ఆనందమయకోశంలో లీనమౌతాయి. పదునాల్గు లోకాలతో తన తల సరిపోతుందని భావించి (కథకోసం) బలి మూడవ పాదానికి దాన్ని చూపాడు. ఆ భావాన్నంగీకరించి వామనుడు కొలుచుకొన్నాడు. దానికదీ దీనికిదీ రెండూ సరిపోయాయి.
పోతన వర్ణనలూ కేవల వర్ణనామాత్రాలు కావు. వామనుడు త్రివిక్రముదై అనంతంగా పెరిగిపోతున్నాడు. అది చెప్పడానికి సూర్యమండలం ఒక కొలబద్దగా తీసుకొన్నారు పోతన్నగ్లారు. అప్పుడా సూర్యమండలం క్రమంగా త్రివిక్రమునికి -
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 3/
- ఛత్రమై 2. శిరోరత్నమై, 3. గళాభరణమై, 4. కేయూరమై, 5. కంకణమై,
- పదనూపురమై, 7. చరణపీఠంగా మారిందని ఉపమిస్తాడు పోతన్న. కాని ఆయన చెప్పిన ఉపమానాలన్నీ రాజాభరణాలు. త్రివిక్రముదడనే సర్వలోక పాలకునికి అవి సహజాలు. కాబట్టి ఇంత గొప్ప ఉపమాలంకారమూ అలంకార ధ్వనిగా మారి స్వభావోక్తిలో లీనమౌతున్నది. సరే! ఇదంతా ఇలాఉండనీయండి. బలి మహాధార్శికుడు కదా! సత్యప్రతిజ్ఞుడు కదా! ధర్మ స్వరూపి ఐన భగవంతుడు అతని సర్వస్వాన్ని హరింప వచ్చునా?
నిజానికి తన దానవీరంతో బలి పోగొట్టుకున్న దానికన్నా పొందిందే ఎక్కువ. దిక్సాలకుల అధికారం చెల్లని సుతలాధిపత్యమూ, జరామరణ బాధితాలు కాని దివ్యదేహాలు గల ప్రజా, శత్రు నిరాసానికై ఇంద్రునికైనా లభించని సుదర్భనమూ, సూర్యసావర్ణిమను కాలంలో ఇంద్రత్వమూ అతనికి లభించాయి. చివరికి హరి తానే స్వయంగా బలికి రక్షకుడై నిలిచాడు. అదితికీ, ఇంద్రునికీ దొరికిందేమిటి? పయోభక్షణ వ్రతఫలమైన స్వర్గం. ఇంద్రుడూ బలీ పొందిన ఫలితాల్లో ఎంత భేదమున్నది? చేసుకున్న వారికి చేసుకున్నంత!
వామన చరిత్రారంభంలో పోతనగారీ పద్యాన్ని వ్రాస్తారు.
అర్భుల్ వేడరు - దాతలుం జెడరు - సర్వారంభముల్ పండు - ప్ర
త్యర్భల్ లేరు - మహోత్సవంబులను దేవాగారముల్ పొల్పు - పూ
ర్థార్థుల్ విప్రులు - వర్షముల్ గురియు కాలార్దంబులై - ధాత్రికిన్
సార్ధంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్
దీంతో బలి మహాధార్మికత, మహా ప్రభు లక్షణం మొదటనే స్థాపించబడ్డాయి. ఇది వాక్య ధ్వని. వట్టి వాక్య ధ్వని కాదు. మహా వాక్యార్థ నిర్ణయం. మహా వాక్యార్థ నిర్ణయమంటే ఒక కావ్యంలోని ముఖ్య లక్షణాన్ని చెప్పే వాక్యంలోని శబ్ద సముదాయం. . భారత, భాగవత, రామాయణాల్లాంటి బృహత్మావ్యాల్లో మహాకవులు ఎక్కడికక్కడికీ ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క ప్రబంధంగా తీర్చిదిద్దారు. ఆ దృష్టితో వామనచరిత్రమనే ('ప్రబంధానికి పై పద్యం మహావాక్యార్ధ నిర్ణయం. ఎలాగో చూడండి -
అర్జుల్ వేడరు (శ్రీహరి లేక యాచనకు రాలేదు)
-
దాతలుం జెడరు (ఇచ్చిన బలి చెడలేదు) 38 9 వ్యానభూమిక
-
సర్వారంభముల్ పండు (బలి - వామనుల ఇద్దరి యత్నాలూ ఫలించాయి)
-
ప్రత్యర్థుల్ లేరు (సత్ర్రయత్నానికి అడ్డుపడే శుక్రుని వంటి వామాచార (ప్రత్యర్థులు క్షీణిస్తారు)
-
మహోత్సవంబులను దేవాగారముల్ పొల్చు (సదాచార స్థితి)
-
పూర్చార్భుల్ విప్రులు (వామనుడు తృప్తడు)
-
వర్షముల్ గురియు కాలార్డంబులై
-
ధాక్రికిన్ సార్ధంబయ్యె వసుంధరాత్వము (మకర సంక్రమణ వేళలో భూమి సస్వాధ్యయై ఉండడానికి - ఆ దినాల్లో బలి సుతలాన్నుండి భూమిని చూడరావడమే కారణమని అనూచానంగా పెద్దలు చెపుతున్నారు) ఇలాంటివాడు బలి చక్రవర్తంటే! వ్యాసం మొదట్లో ధ్వని ఖేదాల్లో పదింటిని ప్రముఖాలని విన్నవించుకున్నాను. పదింటినీ పోతన గారి కవితలో చర్చించి చూపాను. వామన ఘట్టం ఉత్తమ ధ్వని కవితకు అక్షరాక్ళతి. _ తెలుగు విశేషసంచిక-తెలుగు అకొదమి హైదరాబాద్-202% సౌజన్యంతో... కవిళిరోమణి ఆచార్వ రావికంటి వసునందన్ € 39
తిమ్మన పాత్ర చిత్రణము - సత్యభామ
సత్యభామయందలి ముఖ్య గుణములు రెండు. ఒకటి మానినీత్వము. మరియొకటి శ్రీకృష్ణుని యందలి మహాప్రేమ. అతనిపట్ల గల సత్యభామా ప్రణయ మెంతటి గాఢమైన దనగా చివరకతడు దక్షిణ నాయకుడను విషయమునే మరపించి, ఆమె మనమును భ్రమ ప్రమాదములకు లోను జేసినది. దాని కాతని మెరమెచ్చులును, నీవొక్కతివే నాకు ప్రేయసి వనిపించెడు నంతటి వలపు క్రుమ్మరింతలును కొంతవరకు కారణములు. ఆమె యమాయకత సైతము కారణమని చెప్పవలయును.
కులాభిమానము, రూపాభిమానము, ఐశ్వర్యాఖిమానము, భర్తృ ప్రణయాఖి మానము మున్నగునవి సత్యామానినీత్వమునందలి యంశములు. మగడు దక్షిణ నాయకుడాయెను! ఐబయుండియు తనకొక్కతెకే తాను పతిననియెడు నంత భ్రమ కలిగించు వాడైనచో, వాని యందే మహా ప్రణయభావ సర్వస్వము నిలిపియున్న యమాయకయైన సత్యభామవంటి మానినికి తద్విశ్వాసము నందలి తీవ్రత సడలెదు పరిస్థితి ఏదైన సంభవించినచో - మానినీ సహజమైన, మానవ సహజమైన ఈర్మ్యాసూయాక్రోధాది భావములు పొడసూపుట వింతకాదు. ఈర్ష్య ఈర్చ్యయే. కోపము కోపమే. ప్రణయము ప్రణయమే. మరల వీటన్నింటికిని మూలకందము అట్టి స్త్రీయందు పతిపట్ల నున్న మహా (ప్రేమ గుణము. సజ్జనుడైన పతి భార్యకు తనయందుగల (ప్రేమ భావమునే తొలుత గణింపవలెను. పరమేశ్వరుడు (క్రేమకే లొంగిపోవలెను. ఈ రెండును తానైన శ్రీకృష్ణుడేమి చేయవలెను? సత్యభామ యాగడమంతయు ఏ మహాప్రేమ గుణము నుండి పుట్టినదో ఆ ప్రణయ భావమునకు తలవంచవలెను. పారిజాతాపహరణమున నదియే జరిగినది. మానవ మనస్తత్వ పరిజ్ఞాతయై మహాకవి యగుటచే తిమ్మనార్యుడీ కీలకము నెరిగి సత్యభామ పాత్ర 40 అ వ్వానభూమిళ
ననన్య సామాన్యముగా చిత్రించెను. ఈ విషయము నెరుంగనిచో పాఠకుని బుద్ధి సత్యామానినీత్వమున గాక, ఆమె “గయ్యాళితనము”న సుప్రతిష్టితమగును.
ఆరివేరంపు తపసి రుక్మిణీ సౌధమున నెరపిన మతకములు, మురాంతకుని చేష్టలు, రుక్మిణీ నటనలు చిలువలు పలువలుగా గల్పించి చెలికత్తె చెప్పినంతనే. (వ్రేటుపడ్డ యురగాంగనవలె, నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీలవలె సత్య చెలరేగినది. పై రెంటిలో ఉరగాంగనయన్న విశేషణమామె సౌందర్యాతిశయ మునకును, రెండవదామెకు కలిగిన కోపాతిశయమునకును అభివ్యంజకములు. ఆమె కనుదోయిని కెంపు హెచ్చినది. అనగా ఆమె సహజముగా కొంత ఎరుపైన కన్నులు గలదని భావము. ఇది లక్షీత్వమును, సౌందర్య విభవమును ప్రదర్శించెడి సాముద్రిక శుభలక్షణము. మొత్తముమీద ఆమె మదిరాక్షియన్నమాట.
చెలి రాకముందు సత్యభామ క్రీడోద్యానమున గూర్చుండి పతి గుణానుసం ధానము చేయుచున్నది. ఎవని దాను పొగడిపోయుచుందెనో వాని కారణముననే తన కింతటి యవమానము సంఘటిల్లేననగా ఆమె మానినీత్వ ములికి పడగా నామె మండిపడెను. ఇట్టి పరిస్థితిలో సత్యకాక వేరొకతె యుండినచో నామెను కోపము కాక దైన్యమావరించి యుండును. ఇంతటి పని జరుగగా కోపమెవరికి వచ్చును? పరిపూర్ణ మానినీత్వము గలవారికి. సత్యా ప్రజయగుణ సమూద్భూతము లైన అప్పటి గుణములన్నిటిలో కోపమునే తిమ్మన ప్రధానమైనదానినిగా చిత్రించెను. మాటి మాటి కామెను “కోపన” యని సంబోధించెను. తద్వారా తన్మానినీత్వమునకు మెరుగులు దిద్దెను.
అంతటి కోపమునను ఆమె పెరవారిని నిందించలేదు. ముళ్ళమాటలే సహజగుణమైన ముని ఏమి సేయునన్నది. రుక్మిణిని లెక్కింప పనిలేదన్నది. తప్పంతయు ధూర్తగోపాలుని దన్నది. అతడు లీలామానుష విగ్రహుడు కదా - ధూర్త (మోసపు) గోపాలు డనుటలో సత్యయందసత్యమేమియును లేదు. (ప్రాణమైన మగడిట్లగుట తన మనమెరియుటకు కారణమన్నది. తన మనస్సున బుట్టెడు ఏ గుణమునకైనను ఆలంబనము శ్రీకృష్ణుడే. వేరొకరు కాదు.
శరదంబుద చలచిత్తులైన పురుషుల నమ్మరాదన్నది. అతని నమ్మి మహాభిమా నమున నుండుట చేతగదా నేడు తనకీ పాటు గలిగినది? ఇన్ని దినముల నుండియు
కవిళిరోమణి ఆచార్య రానికంటి వసునందన్ € 41
పతి తనను కన్నుల గప్పుకొనగా మసలి, నేడా వన్నెయు వాసియు దొరగ “సవతులలో” తాను తలయెత్తుకొని యెట్లు తిరుగగలదు. “ప్రాణము లెంత తీపియో” యని వాపోయినది. “కలలోననైన నవ్వులకైన నా మాట జవదాటవెరచునో చంద్రవదనొ, “నా మొగమోటకై వలసి నాటకముల్ ఘటియించి” మున్నగు పద్యముల తనను వల్లవీ కింకరుడెట్లు నమ్మించి మోసగించెనో తలచుకొని పరితపించినది.
కాని ఈ పరితాపమెంతసేపు? క్షణమాత్రము. ఆ వెనుక నైజాభిమానము తరుముకొని రాగా - మేలుగీళ్ళకు పూనుకొని వర్తించు వారిని లోకమెరుగదో, నరకాసుర దమనుడెరుగడో, భోజకన్య తానెరుగదో అన్నది. ఇచ్చటి “భోజకన్య” రుక్మిణియెడ వెక్కిరింత- రాక్షస వివాహమున కొడబడినదని. శ్రీకృష్ణుడు నరకాసుర దనును డెట్లయ్యెనో నేదు మరిచి పోలేదు గదాయని దెప్పి పొడుపు. ప్రాణ సదృశ బంధువైన పతి మేరదప్పిన సతులకు వేరుగతి కలదాయని జనితామర్నమున వగల బొగులుచు కోపగ్భహము జేరినది. అట్లు పోయెడు సత్య నాగతరుణియట. కోపమును, చెలువమును చెట్టపట్టాలు వేసికొన్నవని తిమ్మనయభి'ప్రాయము.
ఇక్కడ రంగమంతయు సిద్ధమైన తర్వాత జగన్నాటక సూత్రధారి ప్రవేశించి సత్యావపుఃకీలిత పంచసాయక శిఖిని దరికాల్పుచున్నట్లు వీవసాగినాడు. అతనితో కొంత పారిజాత వాసన వచ్చెను గదా! దానికి విస్మయమంది సత్య ముసుగుదీసి యదుకుల పారిజాతమును గని ముసుగిడి దుఃఖింప నారంభించినది. మానవతి యిట్లు మానని “మాన క్రోధములచే” కుమారిలి యుండగా గోపాలదేవుడామె ననునయింప నారంభించి నాడు. నీకంటె నాకు ప్రేయసులెవ్వరన్నాడు. నీవు కరుణించి దరిదీయనిచో నా గతి ఏమి కావలెనన్నాడు. నా మనమరయుటకై ఈ మార్గము పన్ని నన్ను పరీక్షించుచుంటివా? అన్నాడు. ఏమన్నను, ఎట్లు బ్రతిమాలినను సత్య యులకదు పలకదు. ఇక లాభము లేదనుకొని సత్యా పద పద్మద్వయీ పాటల కాంతి తన మౌళి మణిపంక్తికి వన్నియ వెట్టగా 'మొక్కినాదు. ,
(మొక్కిన వెంటనే “జలజాతాసన వాసవాది సురసేవా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదముతో తొలగద్రోసినది” నాథులు నేరములు సేయ నిట్ల యగునని తిమ్మన అర్భాంతరన్యాసముచే పై చర్యను సమర్థించినాడు. 42 అ వ్యానభూమిక
ఇచ్చట పెద్ద వవాదము. సత్య తన్నెనని, తన్నలేదని! తన్నెనను వారు - ప్రణయ కోపనా పదతాడనము శాస్త్ర సమ్మతమే కావున దోషము లేదని వాదింతురు. కాని జాగ్రత్తగా చూచినచో - దానికి సంబంధించి ఇచ్చట వరుసగా మూడు పద్యములున్నవి. “జలజాతాసన; కోపన పదహతి; నను భవదీయదాసుని అను నీ మూటిలో తాపునకు సంబంధించిన పదబంధములు ముఖ్యముగా నాలుగున్నవి.
- వామపాదంబునం దొలగం దోచె.
- తాచినయది నాకు మన్ననయ. ౩. తాకిన నొచ్చునంచు.
- కోపన పదహతి. సత్యభామ కంకటి కడపై ఓసరిలి పండుకొనియున్నది. అప్పుడీ మహాను భావుడు ప్రణమిల్లినాడు. సత్యభామ వామపార్వమే మీదివైపున్నది కావున నతని శిరమునకు వామ పదస్పర్శ కలిగినది. మనకిష్టము కానివారు ముట్టుకొనినచో నేమి చేసెదము? వారల చేతిని దూరముగా (తోసి వేసెదము, లేనిచో దూరముగా జరిగిపోదుము. కృష్ణుడన్నచో నా సమయమున నామెకు పట్టరానంత కోపమున్నది. కావున నాతని స్పర్శ నోర్చుకొనలేక, తాను తప్పించుకొనుటకు మార్గము లేక; కిరీటపు తలబరువు మోయలేక కాలు లాగికొన్నది. ఆ లాగికొనుటలో శ్రోయుట ఎట్లును తప్పదు. ఇది అసహిష్టుతాభావ సంజనితమైన యసంకల్పిత ప్రతీకారచర్య, “తలను తొలగునట్లుగా త్రోయుట” త్రోసివేయుట తాదన మెట్లగును? అది తన్నుటకాదని యెరుగును కావుననే శ్రీకృష్ణ పరంధాముడు “భవదీయ దాసుడనైన నన్ను తాచినను (భవిష్యదర్ధకము) నాకు మన్ననయే” అన్నాడు. కాని నీ పదపల్లవము నా శరీరమందలి పులక కంటకముల “తాకిన నొచ్చు”నంచు నేననియెద నన్నాడు. వీనిలో మొదటిదైన “తాకిన” చేదర్ధకము. “నొచ్చును” తద్ధర్మార్ధ్థకము. మరల రెండును గలిసి “తొకినచో నొచ్చును” అన్న భవిష్యదర్ధకమునకు దారితీయుచున్నవి. నిజముగా నామె తన్ని యుండినచో “నన్ను తన్నినను నా కిష్టమే. కాని నీకాలు నొచ్చునేమో” అని ఆ తాపు వలన నామెకు కలుగు కష్టనష్టముల కుహనా గోపాలుడుపన్యసించవలసిన పనియేమున్నది? కావున కవిళశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ 9 43
నామె చేసినపని అసహ్యముతో విదలించుకొనుటయే కాని 'తన్నుట” కాదు. తప్పేదైన నున్నచో మొక్కిన కృష్ణునిలో నున్నది. అది యాతనికి సరసమైనచో మనకభ్యంతరము లేదు! ఇక మిగిలినది “కోపన పదహతి”. ఇచ్చట హతి యనగా పైవాని బలముచే కేవల స్పర్ట్మయనియే గ్రహించవలెను. లక్షణార్థమే వర్తించును. ఆ స్పర్శచే శ్రీకృష్ణుడు ద్దీపిత మన్మథరాజ్య ప్రాపితుడయ్యెను. కావున నిది శృంగార శాస్త్ర సమ్మతము. దూప్యముకాదు. గడుసువాదైన కవి చిన్ని చిన్ని మాటలసైతము భావము నిట్లు మెలికలు త్రిప్పి ప్రవర్తిల్లజేయును. నిజమునకు అంతటి పతి ప్రణమిల్లెగదా యని సత్యలేచి యతని ననునయించ వలసినది. అంతటి కోపములో పాపమామెకు మర్యాదలు స్ఫురించలేదు. ఆ కోపమైనను “శ్రీకృష్ణ ప్రణయజనిత మహాభిమాన విఘాతము” చే కలిగినది కదా! సర్వాంతర్యామి కావున నామె మనస్సెరిగి శ్రీకృష్ణుడే ఆమె ననునయించినాదు. కాని సత్యభామ చెలరేగి “నీ మాయమాటలు నాకు చెప్పవలదన్నది. నీ (ప్రేయసియైన రుక్కిణికే చెప్పుము. ఆమె ప్రియోక్తులు వినిన చెవులకు నా పరుష వాక్యములు వినవలసి వచ్చెను గదా యన్నది. సిన్ను నమ్మిన ఫలమిదే కలిగినది. ఇంకనేమిటికి మోసగింతువన్నది. నిజమునకు నీ విక్కడికి వచ్చుట పారిజాత వాసన (ప్రకటించి నన్ను నెకసక్కెము చేయుటకు గాని నామీది ప్రేమతో కాదన్నది. మానమె 'ప్రాణాధికమైన మానినులకు మానరహితమైన బ్రతుకేల యన్నది. ఇట్లెన్నియో యని “నను నెవ్వతెగా జూచితి వన్నది.” అని గద్దద కంఠియై మాటరాక మోమున చేల చెరంగిడి బాలపల్లవ [గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూ కలకాకలీ ధ్వనితో నేడ్చినది. ఆమె మానినీత్వమున కిది పరాకాష్ట కాని ఒక్కటే విచిత్రము. ఎంతసేపును -
- పతిమేర దప్పిన, కులకాంతలకు వేరుగతి కలదే? 2, మనవచ్చునె?
- మానరహితమైన (బ్రతుకు మానినికేలా?
- పంతమలరంగ నిన్ను మెప్పింతుగాన ఇట్టి మాటలే పలుకును గాని, 'చత్తునని' చచ్చినను పలుకదు. సత్యభామా 44 లై వ్యానభూమిక
మానినీత్వమును పోషించుటలో తిమ్మన వెలయించిన యొక గడుసుదన మిది. చత్తునని యెవరందురు? పిరికి గుండె గలవారు, అభిమానము లేని యసహనపరు లట్లు వాచా బయటపడెదరు. సత్యవంటి మానినీ తిలకము తన భావముల వాచ్యము చేయునా? చేసినచో దర్పమునకు లోపము కాదా? ఇట్లు అడుగడుగునను తిమ్మన సత్య ఠీవిని, విలాసమును, దర్పమును, మానినీత్వమును గడుసుగా పోషించెను. ఆంధ్ర కావ్యలోకమున నాక యుత్తమ “స్వాధీనపతికొను అక్షరాకృతిగ జెక్కివైచెను. సత్యభామ యొక విలక్షణమైన సృష్టి, ఇంత చేసినను పరమాత్మునిచే నంత మన్నన వడయుట కామె హృదయ మెంతటి (ప్రేమామృత పూరమో! ఆ మన్ననకై ఆమె యెన్ని నోములు నోచినదో?
- తెలుగు తేజము, ౨808. 2979/ ౧5 24 1979 సౌజన్యంతో... కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 45
అ సూక్తినిధి - అన్నమయ్య
ఎన్నీ ఏళ్లకిందటనే “బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే” “తందనాన అహ్ తందనాన పురే - తందనాన భళా తందనాన” అని ఎలుగెత్తి వర్ద వర్గ కుల మత విభేదాలకు, చివరికి ప్రాణి భేదాలకు కూడా స్వస్తి పలికి; ఉత్తమ సామాజికవేత్తగా నిలిచిన అన్నమయ్య - మహాభక్తుడే కాక గొప్ప సూక్తినిధి కూదా. ఆయన కృతుల్లో భక్తి, వేదాంత, మనస్సంబంధ, స్త్రీ పురుష సంబంధ, సమాజ సంబంధ సూక్తులు కోకొల్లలు. విలక్షణమైన భాష, స్వరలయగతులకు పరీమళం పూసే పదాలు ఆ సూక్తులకు పెట్టని సొమ్ములు, పుట్టువన్నెలు. వాటిలో కొన్నిటిని పరామర్శిస్తాను.
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనం, సంకీర్తనం ఉచ్చ్వాస నిశ్వాసలుగా జీవించిన అన్నమయ్య కృతుల్లోని అనేక పల్లవులకు పల్లవులే సూక్తులుగా కనిపిస్తాయి. “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి - ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?” (ముఖారి రాగం) అనే కృతిలోని పల్లవి మొత్తానికి మొత్తమే మనసుకు హత్తుకునే ఒక సూక్తి, ఇలాంటి భక్తి సూక్తుల్లో వటపత్ర శాయిని అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు! అంటాడు అన్నమయ్య.
“పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా!” అనే కీర్తనలో (శంకరాభరణం) “పెద్దలిచ్చిన నిధానము” అని శ్రీ వేంకటేశ్వర స్వామిని సంభావిస్తాడు.
జీవునికి భగవంతుని మీది భక్తే సర్వస్వమనే దృష్టితో -
(వ్మాము తానె నీ పాదము * 2. అబ్బురంవు శిళువు ఆకుమీది శిళువు
దొబ్బుడు రోల శిశువు (ల్పువి (త్సువి (త్పువి - మంగళ కొళిక రాగం
౨2 (బ్రహ్మా కడిగిన పాదము - (బ్రవ్హాము తానె నీ పాదము - ముఖారి రాగం 48 6 వ్యానభూమిక
వలుకే మంత్రము *
శైవల్బమునకంటిె కెంకర్యమెక్కుడు *
ఇవామే కాని ఇక వరమే కాని
ఐబముళమై వారి నీపై భక్తే చాలు * అంటూ సూక్తిపరంపర శరపరంపరగా గుప్పిస్తాడు వివిధ కీర్తనల్లో. వీటిలో స్మరణం, కీర్తనం, సేవనం, సర్వ సమర్పణం వంటి భక్తి భావాలున్నాయి. ఆ దృష్టితోనే “నానా భక్తులివి నరుల మార్గములు” అంటాడు సూక్తిప్రాయంగా మరో కీర్తనలో.
“హరి నామములే అన్ని మంత్రములు” అని నమ్మిన అన్నమయ్య - ఆ భక్తి బలానికి సాటి సృష్టిలో మరేదీ లేదని - వినరో భాగ్యము విష్ణుకథ (దేవగాంధారి రాగం) అనే కృతిలో “పెనుబలమిదివో విష్ణుకథ” అని ప్రకటిస్తాడు. చివరికి ఆ భక్తే, ఆ సంకీర్తనమే ఇలకు దిగిన భగవంతుడు, పరబ్రహ్మము అనే ప్రగాఢ విశ్వాసాన్ని “చాలదా బ్రహ్మమిది సంకీర్తనము మీకు” అనే పల్లవిలో ఘంటాపథంగా చాటుతాడు.
సూక్తి అంటే రమణీయార్థం లేదా సుందరోక్తి అనే భావానికి అన్నమయ్య పదబంధాలనేకం నిదర్శనం. ఆయన కవితలోని స్త్రీ సంబంధ సూక్తులకు వస్తే అతివేల శృంగారం పిక్కటిల్లే పదగ్రథనాలు ఎన్నెన్నో వాటిని కొంచెం పక్కకు పెట్టినా -
తీగె మెజుగులు తెజవ చూపులు
మదను బందారము మగువమేను
వయసే కల్పవ్టుక్షము వనితలకు
ఇంతిమోవి కెంవులింద గోవములు ౩. నిత్వవూజు లవివో నేరిచిన నోవో (వ్రతృక్షమైనట్టి నరమాత్మునికి - మాళవగౌళరాగం శ. కైవల్స్వమున కంటె క్రైంకర్యమెక్కుడు -శ్రీవిభుదవు నీవు మాకు జిక్టేనర్జుమిది-రాగం దేసాళం 8 అలితరాగం & నానా భక్తులివి నరుల మార్గములు ఏనెపాననైనా నాతడియ్యకొనుభక్తి - సాళంగరాగం 7 భావములోన బావ్వామునందును గోవింద గోవిందయని కొలువవో మనసా!- శుద్ధ ధన్యాని & (అ) చన్నులు బలినితేను జవ్వనమునకు మేలు (౪) వీఖుదెంత బటువైనా పెద్దబికమే
(ఇ) చన్నులెంత గనమైనా సాగుబలిమి (ఈ రతియే సామ్రాజ్యము రమణులకు (ఉ) కామిని నరసములే కామధేనువులు గావా! కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ € 4/7
ఓరుపే నోరుపందురు వువిదలకు
చెలులకిందరికిని నిగ్లే మూల ధనము
నేరుపే నిధానము నెలతలకు
మగువల చలములు మానువరాదు
సిగ్గులే మూలధనము చెలులకెల్లా
వలబిన దానికెందు వాదు చెల్లదు” వంటివి కోకొల్లలు. భక్తి జ్ఞాన తత్వ సాగరాలకు వతాములెత్తే అన్నమయ్య కీర్తనల్లో ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన అనేక కీర్తనలున్నాయి. వాటిలో స్త్రీ సౌందర్యం, నడవడి, వయసు, ప్రేమ వంటి అంశాలకు సంబంధించిన సూక్తులు ప్రధానంగా కనిపిస్తాయి.
పురుషాధిక్య సమాజం నడుస్తున్న ఆ కాలంలోనే అన్నమయ్య స్త్రీలపట్ల పురుషుల వైఖరిని, చాపల్యాన్ని ఖండిస్తూ, స్రీ మనస్తత్వానికీ జీవితానికీ (ప్రాధాన్యాన్ని కల్పిస్తూ అనేక సూక్తి రత్నాలు విరజిమ్మాడు. ప్రీ పురుష సమానత్వాన్ని ప్రబోధించాడు.
“అప్పుడే మరతురా అంగన చేసిన మేలు అంటూ ప్రారంభించి తరతరాలుగా స్త్రీ జాతికి అప్పుపడ్డ పురుషులకు మేలుకొలుపుగా ఎన్నో సూక్తులు వడ్డించాడు.
కన్నచోట నెల్లాను కాంతను దూరకుమీ
కపటాలు వద్దుగాక కాంతలతోను
కోపము వనికి రాదు కొవ్యుల ఎదను
జవరాలు తననెంత చలము సాదించినాను
అవుగాదనని వాదే అందవు రమణుడు
తప్పులు పట్టగనేల తరుణులను
తలపాొక్షుటైనవాదు దాటదు మాట
నిలకదైనవాదు నెట్టుకొని పొందుసేను
మగవాడ్రైతేనే నర్లు మానవలెనా?
మగవానికలుకేల మగువలతో 48 6 వ్యాసభూమిక
మన్నించనోపీన వాడు మర్ణములంటు
తరుణికిచ్చిన బాస తవ్పగరాదు అని ఎన్నో విధాల పురుషులకు మంచి మాటలుచెబుతూ చివరగా “చిత్తాన బెట్టుకోవయ్యా సేసిన నా విన్నపము” అంటూ సముదాయిస్తాడు కూడా అన్నమయ్య.
అన్నమయ్య తన సంకీర్తనల్లో నాయికా నాయకులైన శ్రీమదలర్మేల్మంగా శ్రీనివాసులను ఆలంబనంగా స్వీకరించి స్రీ పురుష సంబంధ సూక్తులు ఎన్నో వెలయించాడు. నిజానికి అన్నమయ్య క్తీర్తనల్లోని శృంగారమంతా స్వామి సంసారానికి సంబంధించిందే కదా? అలాంటి సూక్తులు కొన్ని :
చెప్పినట్టు సేయవయ్య చెలియ చిత్రమురాను
చెలియ భావము నీవు చిత్తగించవయ్యా
కొలువు సేయుట పాడి కూరిమి చల్లుట పాడి
కలికియైన చెలికి కాంతునితోను
చలనట్టిన వానితో సరసమాదుటకంటో
కెలని రాలు గరిగించుటే మేలు
వతికిని నతికిని పాయదు చుట్టరికము
నీ చిత్తము చెలిభాగ్యము
మచ్చరమే నద్దుగాని మాటలన్నీ నాడవచ్చు.
ఈ విధంగా సతీపతుల మధ్య అనురాగం, పరస్పర అవగాహన, దాంపత్య సిద్ధి ప్రబోధిస్తూ అన్నమయ్య స్త్రీ పురుషులిరువురికీ తన కీర్తనల్లో సుద్దులు చెప్పాడు. తననాటి పురుషాధిక్య సమాజంలో పురుషుని పరంగా ప్రవర్తనలో ఉన్న లోటుపాట్లను సవరించి, స్త్రీతో అభేద ప్రతిపత్తి కలిగించే ప్రయత్నం చేసి కుటుంబ వ్యవస్థను సుసంపన్నం చేసే సూక్తులు వెలయించాడు.
“మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో” అన్నట్లుగా మనిషి పతనానికీ ప్రగతికీ, సృష్టి వినిర్మాణానికీ విధ్వంసానికీ, మంచికీ చెడుకూ అన్నిటికీ
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ ఆ వృ
మనస్సే కారణం. ఆ మనస్సు ఉతషంచలం. అతివేగం. అత్యంతశక్తిమంతం. దాన్ని లొంగదీసుకుంటే మనిషికి అసాధ్యమేదీ లేదు. ఇహశోధనమైనా పరసాధనమైనా మనస్పంయమనం మీదనే ఆధారపడిన అంశాలు. మానసిక ఏకాగ్రతకు సాటివచ్చే దివ్యశక్తి మరోటి లేదు. ఈ మాటలన్నిటికీ ప్రమాణ భూతాలుగా అన్నమయ్య మనస్సంబంధ సూక్తులు ఎన్నో తన కీర్తనల్లో పొందుపరిచాడు.
“మనసు నిల్చ నలవి కాదు” అంటూ దాని శక్తితో ప్రారంభించి - “మనసు నిర్మలమైతే మాట విననింపౌను” అని తన సూక్తులు చెవికెక్కే ప్రవిమల పథాన్ని నిర్దేశించాడు.
మనసాక్టుటైలేను మాటలూ నొక్టుటో యాను
మరిగినదెప్పుడును మనసు విరుచుకోదు
మరువకు జీవుడా మనను చుట్టము గాదు
మాటలేల మనిషి మనసే సాక్షి
మాటలాదవచ్చు గాని మనను పట్టరాదు
విడిచితే నిటులానే కడకు బారు మనను
వివేకించితే మనసే ఎంత సొమ్ముగాదా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు
చంచలబచిత్తునకు నిశ్చయమే లేదు
మట్టుపెట్టరానిది మననులో తలపోత
మనసునమ్ము నేర్పితే మనుజుడే దేవుదౌను
ఇట్టె నదిలితేను ఎంత్రెనా బారు మనను
ఈ విధంగా మానవ జీవితంలోని వివిధ కోణాలు పరామర్శిస్తూ సూక్తి ముక్తావళి రాశిపోశాడు అన్నమయ్య,
-“అన్నమాచార్వ సాపొత్వం” చర్చావేదికలో చేసిన వ్యతనమర్పణ, 2006 అన్నమాచార్య (ప్రాజెక్టు, తిరువతి, పోతన విజ్ఞానవీఠం, వరంగల్ సౌజన్యంతో... 50 అ వ్యానసభూమీక
ః షంనో భో ల! పోతన చరిత్రము - మధురభక్తి
“వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ స్రీన్ పునాతియః
వక్తారం పృచ్ళకం శోత్యాన్ తత్పాద సలిలం యథా” అని భాగవతము.
వాసుదేవుని (సర్వజగన్మయుని) కథలు ఆయన పాదతీర్థమైన త్రిపథగామినివలె స్త్రీలనక పురుషులనక చెప్పువారిని, అడుగువారిని, వినువారిని పునీతుల నొనరించు నని శ్రీ శుకులవారు చెప్పిరి.
చెప్పుట, అడుగుట, వినుట అను నీ క్రియాత్రయ సమాహారులైన కవులు జగద్ధితముగా వాసుదేవ కథలను లోకమున కవిత్వమున వెలయింతురు. ఆ కవిత వేదంతముగా, భక్తితత్వముగా, బ్రహ్మవిద్యగా ప్రపంచకమున అనాదిగా సరసులను ప్రభావితులను చేయుచున్నది. అట్టి సంప్రదాయమునకు చెందినది పోతన చరిత్రము.
భక్తి తత్వమును నిరూపించుచు నారద భగవానులు అమృతమయత్వము దాని లక్షణముగా పేర్శొనిరి. (అమృత స్వరూపాచ 1-3) అట్టి భక్తిగల జీవులను సిద్దులుగా, అమృత రూపులుగా, తృప్తులుగా, మత్తులుగా, స్తబ్బులుగా, ఆత్మారాములుగా సిద్ధాంతీకరించిరి. (యల్లబ్ధాపుమాన్ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తోభవతి, 1- శ యత్జ్ఞాత్వా మత్తోభవతి, స్త్వబ్బోభవతి, ఆత్మారామోభవతి 1-6) అట్టి వారెవరైన గలరా యని విచారించి బృందావన గోపీ బృందమును అట్ట లక్షణములు గలదాన్గా చెప్పిరి (యథా వ్రజ గోపికానాం 1-21) జీవేశ్వర భావాద్వెతరూపమై, జీవుని నిర్భరత్వము లక్షణముగా గల గోపీకృష్ణ సంబంధమును మధుర భక్తిగా పెద్దలు నిరూపించిరి. అట్టి మధుర భక్తిని పోతన చరిత్రకర్త, అభినవపోతన, మద్దురు వరేణ్యులు, దా. వానమామలై వరదాచార్యుల వారు తమ కవితలోనెట్లు వికసింప జేసిరో పరిశీలింతము.
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 51
జాల గరిగించు మురలీ స్వరంవు సొంవు
గాన మాలింపజాలు (నేకాంతలెల్ల
నుదధి సంగమ మెదగోరు నదులబోలి
వరువిదుదురే నిరోధమ్ము సరకుగొనక (22-140)
గోపాల వైణవికుని మధుర గానమును విని గోపికఠెల్లరును సముద్రుని గలియ బాలు నదులవలె నౌదురట.
మద్దుణ (శ్రుతి మాశ్రేణ మయి నర్వగుణాశయే
మనోగతి రవిబ్ళిన్నా యథా గంగాంభసోంబుధా
లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్వ వ్వుదావ్భాతం
అహైతుక్క వృవవొతా యా భక్తిః వురుషోత్తమే
(కపిలుడు -భాగవతం - 8-29-222)
అనంత కల్యాణ గుణరూపియైన పరమాత్ముని గుణములు వినినంతనే భక్తులు ఫలాభిసంధి శూన్యముగ, భేద దర్శన రహితముగ, గంగ సముద్రునివైపువలె తామవిచ్శిన్నముగా, నిరోధముల సరకు గొనక భగవంతునివైపు పరువిడుదురట. ఇచ్చట తద్దుణములు వినుట యనగా వానిని భావించుట. ఆ భావస్స్ఫూర్తిని మనస్స నుభవించుట - లేనిచో అది వినుటయే కాదు! అనగా తద్దుణములు వినుట లేక తెలిసి కొనుట చేయునది మనస్సని యర్థము. కాని విషయములను తెలిసికొనునది బుద్ధికదా! మనస్సు తెలుసుకొనుట యేమి? తెలుసుకొనుట మూడు విధములుగా జీవలక్షణమున నున్నది. కేవలము బుద్ధితో తెలునుకొనిన దానినే జీవుడు చెప్పగలుగుచున్నాడ్రు, మనస్సుతో తెలుసుకొనిన దానిని అనిర్వాచ్యము, అనుభవైక వేద్యమనుచున్నాడు. ఆత్మతో తెలిసికొన్నదానిని ఏమియు ననలేడు. ఈ మూడును ఒకదాని కంటె నొకటి యుత్తమ తమములు, ఈ మార్గములకు వరుసగా జ్ఞానము, సంస్కారము, జీవలక్షణము భూమికలు. భగవంతుని విషయమున సాధకునకు ఎక్కువగా తోడ్పడునది మనస్సు - సంస్కారము. బుద్ధిజన్య జ్ఞాన సహాయమున పొందిన అనుభూతి మనోగతమై, సంస్కార రూపమై జీవేశ్వర సంగమమునకు తోద్బడుచున్నది. అనగా జీవుడు దేవుని పై రెండు విధముల తెలుసుకొను చున్నాడు. ఎట్లు తెలిసినను తెలిసినట్లే! పై రెండును ఆత్మతో తెలిసికొనుటకు తోడ్పడు చున్నవి, ఆత్మతో తెలుసుకొనిన పిదప వినుటలేదు, చెప్పుటలేదు, తెలుసుకొనుట లేదు - అక్కడ నున్నది “ఏకమేవాద్వితీయం బ్రహ్మ”. 52 € వ్యానభూమిక
బుద్ధిచేే మనస్సుచే దానిని పూర్తిగా తెలుసుకొనెనా యన్నచో అది ఇంద్రియ గోచరము కాని విషయము. కావున ఆ తెలివి సగము తెలివి, చాకలి తెలివి. చాకలి తెలివి యెట్లనగా - వస్త్రశుద్ధికై అన్య పదార్థము లనేకములు పనిచేయు చుండగా, తానే శుద్ధినాసర్చితి ననుకొనెడి తెలివి. ఈ తెలివికే అహంకారమని పేరు. అది చిక్కిన గాని బ్రహ్మము చిక్కదు. ఐనచో ఇందరిన్ని విధములుగా చెప్పుచున్న తెలుసుకొనుట యేమి? ఆ తెలుసుకొనుట - పర్పతములో పరమాణులేశమును బుద్ధితో, లేక మనస్సుతో భావించుట. ఈ తెలివి జీవుని సాధనలో నిరంతరము తోద్చడి ఆత్మతో తెలుసుకొనుటకు కారణభూత మగుచున్నది.
మరి పై పద్యమున గోపికలు వేణుగాన పరవశలై వచ్చిరి కదా, గుణాకర్ణ నముచే కాదుగదా? అని ప్రశ్న ఆ గానము జూలగరిగించునది. ఓంకారమయము. సర్వదేవ నామ రూప గుణ సమీకరణము. ఈ గోపికలు దాని సొంపు నాలింప జాలువారు. వినుట యనగా నేమో పైన చర్చించితిమిగదా. గోపికలు చదువను, వ్రాయను నేర్చినవారు గారు కావున బుద్ధితోగాక మనస్సుతో తద్దుణానుభవము చేయుచు, సముద్ర సంగమము గోరు నదులవలె ఏ నిరోధముల సరకు గొనక వానివైపు పరువులు పెట్టిరి. నది ఫలాభిసంధి శూన్యముగ సముద్రుని జేరుచున్నది. అట్లే గోపికలని సూచించి కవి పై కపిలుని శ్లోకమును తన చిన్న పద్దెమున ధ్వనింపజేసెను.
ఇక భేద దర్శన రహితముగా చిత్తవృత్తి పరగునను మాటకు -
శ్రీ గోవింద వదారవింద యుగళీ సేవామృతాస్వాదనా
ఖోగాయళత్త నిమత్తో చిత్తబయి తామున్ గోపివాడూపముల్
నా గేవామ్మిది నా సుతుందితడు నా నాథుండు నా బాంధవుల్
నా గోవ్రాతము నా శరీరమను నానాత్పమ్మునే యేమరెన్ (22-14) అను పద్యమున వారి నిర్గణత్వమును ప్రదర్శించెను. వారికి కలిగిన నీరోధములను-
(క్రొత్త మీ చర్వలని మగల్ కోతవెట్ట
అత్రలును నుకువాదాల నణవిపెట్ట
చేడియల చిత్తములు వారిన్ బిక్కువదెను
అంధుతతి శౌరి గననీని బంధమిదెను (12-147) అను పద్యమున వర్ధించెను.
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 53
అక్రూరుడు బలరామ కృష్ణుల గొంపోవ వ్రేపల్లె కరుదెంచిన వాని గాంచి గోపికలిట్లు విలపించిరి. -
నారిసేవయె జీవనమా
నారి విరవహామె మరణమనెడి యబలల నిటు శ్రీ
వారికి నెదబావీ బ్రదుకుల
వారియించుట లుచితమగునె యక్రూరునకున్
వచ్చినవాడక్రూరుడట. చేయుపని యుచితముగాదట. ప్రాపంచిక కామ నిరోధము గలిగి గోవిందు నర్చించెడి బృందావన సుందరీ బృందమునకు వాని విరహమే మరణమట. ఎవ్వడో యొక క్రూరుడక్రూరుడై వారి (బ్రదుకుల హరింప విచ్చేసెను. బ్రదుకుట యనగా తమ దారి తమదిగా, తమ భావములు తమవిగా, తమ (ప్రేమలు తమవిగా, తమ సాధనలు తమవిగా జీవయాత్ర సాగించుట యని యర్థము. అట్లు కాని రూపమును జీవచ్చవ మందుము. ఒకనికి మహాకష్టమైనది మరియొకనికిష్టమగును. జీవలక్షణముల నెవడు నియమించగలడు? అట్టి జీవస్వాతంత్ర్యము నిప్పుడీ అక్రూరుడు హరించుచున్నాడు. బ్రదుకుల హరించుట యనగా ప్రాణములగొనుట కాదు. జీవునకు చావెక్కడిది? తదన్య కామరహితలై అనన్యభక్తితో తదేకప్రాణజముగా భగవాను నర్చించెడి జీవులను వాని కెడబాపుటయని గోపికల భావము. అది మంచికా చెడుకా యనునది ఆపైన జరుగు విచారణ. ఒక మార్గమునబడి పోవుచున్న జీవ సంస్కారమునకు నిరోధ స్వరూపముగా నిలుచుటయే ఇచ్చటి చంపుట. జీవునకు మిగులునది సంస్కారమే కదా! “సా నకామయమానా నిరోధరూపత్వాత్” అను లక్షమున కీ కృతి యందాకృతి యమరినది.
అక్రూరుడు బృంద కేతెంచినప్పుడు కనుగొన్న పరిస్థితులివి. అచటి తల్లులు కృష్ణ కథలచే బాలుర కడుపు నింతురు. కృష్ణుని పేర్లను పేరులుగా నచటి యతివలు ధరింతురు. అచటి వృద్ధులు దారిజనుచు కృష్ణునకిడు దండము నూతగా గొందురు. అచటి తండ్రులు సంతానమునకు కృష్ణవద (వదవీ) నన్నిధి నానంగి సంతోషపెట్టుదురు.
ఉరక వేయననేల యవ్హురిని భూమి
నరుగు బీమలున్ కృన్ణు చిత్తరువు దీయు 54 అ వ్యానభూమిక
వదిగ నాకాశమున బాలు పక్షులేని గతుల కృష్ణ నామాక్షర గతినె వ్రాయు. (౧2-290) అచ్చటి ప్రకృతియంతయు కృష్ణమయము. అచ్చటి చెట్టుచెట్టు, పుట్టపుట్ట, పిట్టపిట్ట తదావేశభరితము. అచ్చట నివసింపనోచిన చరా చరముల తపోబల మెంత గొప్పదియో, అదెన్ని జన్మల పున్నెమో, అచ్చటి జ్ఞానాజ్ఞాన 'ప్రకృతుల సర్వకర్శలును భగవన్మయములు, లౌకిక వ్యాపార విరోధములు. “విరోధస్తు లోకవేద వ్యాపార న్యాసవొ అను లక్షణమీ పద్యమందలి యక్షరాక్షరమున ప్రత్యక్షమగుటలేదా? పాలు గొట్పుమన గోపాలు గొల్పెదనని వరవశయగు గోవతరుణి యొకతె వెన్న నమ్ముమన నే వెన్ను నమ్ముదునని యొదలెరుంగని గొల్ల వదుచొకర్తు గోవిందు రాకుండ నావంక గనుమన గోవిందు గననను గోవి యొకతె దధి జిల్భుమున నందుదధిశాయి దర్భించి (పేను జిల్హవెయను లేమ యెకతె బాన నింది ్రవించినన్ భామ యొకతె పాలు వీదుకుచునే భూమి పాలొనర్బు వెన్న వదినను (ద్రచ్చుచు వెలది యొకతె కాచుటేమరి వారిరాక గాచుచుందు. (12-148) ఇది యేమి తన్మయత! ఇట్టి పారవశ్యము కలుగుట కెన్ని జన్మల సాధన కావలయును? మొదటి నాలుగు పాదములలో క్రమ క్రమముగా భక్తి పరిణతి సూచింపబడినది. గోపాలుని కొల్తుననుట, వానిని నమ్ముదుననుట, వానిని కనలేనని తాపపడుట, దధియందుదధిశాయిని దర్శించుట అని వేరు వేరుగా చెప్పిన వీనియందు పరవశత సామాన్యము. సంకల్చము-(ప్రయత్నము -విఘాతము-ఫలసిద్ధి వరుసగా సూచ్యములు తర్వాత నున్న గీతము -భక్తిరస దుగ్గముచే శరీర భాండము నిండిపోయి నను ఆ పాలను పిదుకుచునే భూమిపాలానర్చెనట. పిదుకుట యనగా పైన చెప్పిన భావములనే పునఃపునర్మననావృత్తి గావించుట. లోకమున నన్నేమి పిండెదవురా కవిళశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 55
యందురు. అనగా చెప్పినదానినే చెప్పి, చేసినదానినే చేసి వేధించుట యని. ఇట్లు చేసెడి గోపికలు వెన్న పడినను గమనించక దధిని మధించుచునే యుందురట. దధి కల్మషమునకు, పాపమునకు సంకేతము. దానిని వారు మథించి జ్ఞాన స్వరూపమైన భగవానుని (వెన్నను) పడయుదురు. పాలు భూమి పాలొనర్హురనగా పుణ్య శ్లోకుని మనన సౌభాగ్యమును మరి మరి కలుగజేయుచు సత్పురుష లక్షణముగా భూమియందలి జనుల పాలొనర్హురు. ఐనచో వెన్న పడినను గమనించక తఅచుట దేనికి లక్షణమనగా నది పరాభక్తికి తార్మాణము. పరాభక్తి యొక్క పరమావస్థలో భగవంతుడు ముందు నిలిచినను వాడు వచ్చెనను జ్ఞానము జీవునకుండదు. హరి రాలేదనుకొని వానిరాకకై నిరీక్షించుచుండును. ఆ స్థితిలో చివరకు భగవంతుడే విసిగి నేను వచ్చితినిరా యని జీవుని మేల్కొలుపవలసిన పరిస్థితి. వాడెవడో వీడెవడో తెలుసుకొనలేని అయోమయస్థితి. మరియొకటి యున్నది-జ్ఞాన సముదృవము కలిగినను దానిని కాచుట (రక్షించుట) యందుపేక్ష వహించి వారలు హరి రాకకై
- నిరీక్షించెదరు. “సర్వధర్మాన్ పరిత్యజ్య” అనినట్లు ఇది సర్వసమర్పణమునకు లక్ష్యము. కలిగిన జ్ఞానమును తాము తమదని రక్షింప బూనినచో నహంకారము దరిచేరును. అది యెంత దగ్గరగా వచ్చిన వాడంత దూరమగును. కావున అహంకారము, (ప్రయత్నము, ఫలసిద్ధి ఈ మొదలుగాగల సర్వభావములను గోపికలు కృష్ణునియందే సమర్పించిన విధానమీ పద్యము. అట్టి స్థితిలో - యత్ర యత్ర మనోదేపీ ధారయేత్సకలం ధియా స్నేవోద్దేషాద్భయాద్వావి యాతి తత్తత్స్వరూవతామ్ అను భగవద్వాక్యము ననుసరించి గోపికలు సారూప్యముక్తిని పొందిరనుటకు సందియమేల? గోపికలు కృష్ణుని పొందిన విధమిట్టిది. లోకసామాన్య కాముక వ్యాపారమైన పొందును దీనితో కలుపుట మృగతృష్ణకు విష్ణుపాదోద్భృవతో నభేదమును భావించుట వంటిది. ఇట్టి యలౌకిక భక్తిని వర్చించి ఈ పద్యము “తస్మిన్ననన్యతా, తద్విరోధీషూదాసీనతా” అను మహావాక్యమునకు నిదర్శనమై నిలిచినది. మబ్చిత్తా మద్గత (ప్రాణా బోధయంతః వరస్పరమ్ కథయంతళ్చువూం నిత్పాం తుప్పుంతిచ రమంతిచ 56 € వ్యానభూమిక
ఈ సర్వలక్షణములీ పద్యములయందు సర్వాంగ సుందరముగా సాక్షాత్మరించినవి. శ్రీమదాచార్యులవారు ధన్యజీవులు. జీవన్ముక్తులు. కవితయందు ఏ భావమైనను సాక్షాత్కరించవలెనన్న తత్మర్త దాని నెంతయో మననము చేయవలెను. మథనము చేయవలెను. అప్పుడు గదా కవితయందు భావన సాక్షాత్కరించునది. శ్రీ మదాచార్య పృాదయమెంతటి కృష్ణభక్తి భావనా సంభరితమో, పోతన వెనుక మరల నంతటి కవిత వెలయించిరి. ఈ కవితయందలి 'పదములన్నియును సాంకేతికములు, ధ్వనిమంతములు. ధ్వని కావ్యాత్మయని, ధ్వని కావ్యముత్తమమని పెద్దలు చెప్పెడి గొప్పదనము మనకీ కవితలో నగుపడును. ఇట్టి కవిత చదువునప్పుడు పఠిత - స్తీ యన్నను, పురుషుడన్నను, జీవుడన్నను, భక్తుడన్నను ఆత్మయనియే గుర్తుపెట్టుకొన వలయును. అప్పుడే వీనియందలి వేదాంత మర్మములు చక్కగా నవగాహనమగును. ఆనందమయ బ్రహ్మ సాక్షాత్మారమగును. ఆలోచనామృతమైన కవిత యనగా నిట్టిది. ఇట్టి కవితను వెలయించిన జీవుడు మహాకవి. మహర్షి _ తెలుగు తేజము, 2622 & 2878 సౌజన్యంతో... కవిశిరోమణి ఆచార్వ రావికంటి వనునందన్ € 5/
భూమిక
ఏది? ఎక్కడ? ఎందుకు?
అన్న మూడు మాటలే అనాదిగా సృష్టికి పరీవాహకాలు. పురాణోపనిషన్నిగ మాది సకల విజ్ఞాన సంచయానికీ, సర్వకళలకూ పై మాటలే మూలకందాలైనట్లుగా (బ్రహ్మానంద సహోదరమైన కవితా వ్యాపారానికీ తచ్చటబ్ద (త్రయమే (ప్రాతిపదిక. ఆ భూమికపై ఒక మహాకవి లోచూపు వెలుగు కురిసినప్పుడు, ఒక మనీషి పులకరించిన గుండె పొంగులెత్తి రసగంగ వెలికురికించినప్పుడు మధుకోశమై వెలసిన గేయకావ్యం భూమిక. అష్టాదశ సంఖ్య భారతీయులకొక పవిత్ర సంకేతం. ఆస్తికతా (మానవతా) రమణీయులైన మద్గురువరేణ్యులు, డా. సి.నారాయణరెడ్డిగారి భూమిక కూడా అష్టాదశ పుంస్మలకంఠ కలకంఠాలతో కవితావేదాన్ని గానం చేసింది. సముజులమై (ప్రజ్వలించిన ధిషణాశిఖీ, మహామానవ తామృత రసధునియై ప్రసరించిన. సహృదయోద్వేగ సరస్వతీ-భూమికకు రెండం చులు. రెడ్డిగారి శబ్దం ఆపాతమధురం. అర్ధం ఆలోచనామృతం. కవితా తపస్సులో మనస్సు తమస్సును వీడకపోతే, కవితారస పీయూషంలో గుండె మాగకపోతే భూమికవంటి కృతిరాదు.
కథను విడిచిన కవి ప్రతిభ ముడిబంగారం వంటిది. ఆభరణం కాకపోయినా ఆ ముద్దబంగారంలోనే పరీమళాలు పండించిన కాళిదాసాది పూర్వ మహాకవులు లేకపోలేదు. కథాకావ్యమైతేనే కాలప్రవాహాని కెదురీది మనగలుగుతుందని రెడ్డిగారే స్వయంగా వ్రాసుకున్నా (కర్పూరవసంతరాయలు) ఆ అభిప్రాయం వారి భూమికకు వర్తించదేమో! అన్ని విధాలా గుందెకుదుళ్ళనంటి చక్కిలిగింతలుపెట్టే భూమిక మేఘ దూతాదుల వలెనే నిలుస్తుంది. గెలుస్తుంది. కావ్య చిర జీవితానికి కవి మహా తపస్సే కాని తక్కినవంతగా కారణాలు కావనిపిస్తుంది. 58 అ వ్యానభూమిక
ఒక్కొక్క విషయంగా పలకరిస్తూపోతే భూమికలో పరామర్శించ వలసిన్మ అంశాలివి.
- కావ్యాద్యంతాలు. 2, అలంక్రియ.
- వ్యాక్రియ-ఛందం. త, అక్షరరమ్యత-సమాసగ్రథనం
- పలుకుబడి.
- లోకజ్ఞత.
- వ్యావహారిక పద సమాదరణం
- (తివిధ ధ్వనులు.
- ఆత్మీయత-ఉపదేశం.
- కావ్యాద్యంతాలు కవితాశిల్పంలో కావ్యప్రారంభానికీ, ముగింపుకూ ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆఅ రెంటిలో బింబ ప్రతిబింబ భావం (ప్రతిఫలిస్తే అది మహాకవితలో ఒక భాగంగా లెక్క భూమికలోని మొదటి ఖండిక - ఆది ఉందా ఈ జగత్తుకు ఆది ఉందా (వతిసరిత్తుకు ఆద ఉందా ఓం క్రియామయ నాద బిందు కలా వియత్తుకు అని మిథగతీలో ప్రారంభించింది. సృష్టి నైకభావ మిశ్రితమని ఇందలి ఛందోధ్వని. జగత్తు మృణ్మయం. సరిత్తు జలమయం. నాదం ఆకాశమయం. జలంలో అగ్నీ వాటన్నిటి లో జగథత్రాణమైన వాయువూ. పంచభూతాలను (వాచ్యంగా) చెప్పక పోయినా చెప్పినట్లే. సృష్టిలయ సమన్విత పాంచభౌతిక ప్రపంచస్థితి వివేచనాపూర్వక సమతాదృష్టి ప్రసరించే విధానమిదే. విశేషమేమంటే ఈ అక్షరాల్లో ఎక్కువగో ఉన్నవి రెడ్డిగారు వాచ్యంగా చెప్పిన భూజలాకాశ బీజాక్షరాలే, భూ = ఉద,ఓ,జ,గ. ఉదక -ళ. ఆకాశ - నమ. కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 59
అంతేకాదు ప్రణవం (అ+ఉ+మ)లోని మొదటి బీజంతో ప్రారంభించిన ఈ ప్రణవాక్షర మైత్రి చివరకు ఓం కృతిలోనే పర్యవసించింది. ఈ అక్షరాలను చూసి వేస్తే గొప్పే! తూచి వేసినట్లుగా లేవు కాబట్టి అంతకంటే గొప్ప. కావ్యాంతంలో - అ మనిషే (అనుక్షణం చచ్చి బ్రతికేటి స్వయంభువుడు) పల్లవి ఈ గీతికి ఆరిపోని వరిణామజ్యోతికి ఆ చైతన్యమె ఆకృతి ఈ వృృతికీ అది భూమిక సకల జీన సంస్థ్యృతిక్తీ అన్నమాటల్లో ప్రతిదానికీ పరస్పరాన్వయమున్నది. కావ్యారంభంలో “కోన్నస్మిన్ సాంప్రతంలోకే” అన్నట్లుగా ప్రారంభమైన ప్రశ్నా పరంపరకివి సమాధానాలు.
- స్వయంభువుడైన మానవుడు - జగత్తుకాది.
- _ఆరిపోని పరిణామజ్యోతి, సరసాకృతి - సరిదాకృతి (తేజో గర్భం) 8 చైతన్యం, సకల జీవసంస్కృతీ భూమిక - శబ్దగుణకమైన ఓం క్రియ. పై మాటల్లో వరునగా “వల్లవి-జ్యోతి-చైతన్యం” పాదుకొన్నాయి. కావ్యారంభంలో చివరగా చెప్పిన ఓంక్రియ నందు కొని అంతంలో (ప్రారంభించిన 'పల్లవి నాదానికీ, గేయానికీ సంకేతమై-రెడ్డిగారి శబ్దం సంగీతాత్మకమనే విషయాన్ని ధ్వనిస్తున్నడె. ఆ సంగీతానికి ప్రాణం ఆరిపోని ఆవేశమనీ (జ్యోతి) ఆత్మ అనంత జీవశక్తి (చైతన్యం) అనీ స్పష్టమే కదా.
- అలంక్రియ
- పోతనగారి వలెనే రెడ్డిగారికి కూడా అనుప్రాసం మీద అభిరుచీ, అధికారమూ మెండు. దానికి ఉదాహరణలనవసరం. చెప్పవలసిందేమిటంటే, అది కేవలానుప్రాసం మాత్రం కాదు. అందులో కవితావైచిత్రి వదో ఒకటుంటుంది, సరసులాలోచించి చూడాలి. పరాపశ్యంతీ మధ్యమా వైఖరీగతులు భూమికలుగాగల శబ్దం అనుప్రాసాని కనుగుణ్యంగా నడవాలంటే ఆ కవి శ్వాసలు సమస్థితిలో ప్రసరించాలి. (నా వ్యాసం- శ్రీ మదాందధ్రభాగవతావతారికను బట్టి పోతన మతము-అముద్రితం) వివరిస్తూ పోతే అదో పెద్ద కథ. 60 అ వ్వాసభూమిక
నిజానికి రెడ్డిగారి కావ్య ప్రణాళిక అలంక్రియ కక్కువగా ఎడమీయదు. ఐనా అది మహాకవి గుండె కాబట్టి వద్దని వారించినా కొన్ని చోటు చేసుకున్నాయి. అనుప్రాసాన్ని విడిస్తే - ఎ) ఉపమ - ఒక కేక పిచ్చుకంత దయామయంగా, బి) శ్లేష - కొంచె పిట్టలలోన ఒకటి కూల్చినాడంట అకటికి సి విరోధాభాసం - తన విషమ రక్తాక్షిలోన సమ రాగ ముదయించెనట డి) సందేహం - ఏమవి వాగార్థాలా హైమవతీ పరమేశ్వర కామితయోగోస్టిత పరమార్థాలా. మొదలైనవి కృతిని సమలంకరిస్తున్నాయి. 3౩. వ్యాక్రియ-ఛందం శబ్దం కావ్యకన్యకు త్వజ్మాంసాదులుగానైన సుందరదేహమైతే వ్యాకృతిదానికి ఎముకల గూడు. అది శబ్దానికి ముకుత్రాడు. అది చేతిలో వున్నది కాబట్టి రెడ్డిగారు వంచినట్లుగా శబ్దం మైనమై వంగిపోతున్నది. ఎ) కవీనుండు - ్రేస్టకావాచకం 'ఈనటొ డుజ్లు. వి నైస్పృహ్యాం - తద్ధిత రూపం " సి) అనుభవీయం/శంసనీయం - అనీయర్ ప్రత్యయం - (అర్దార్ధకం) డి) 'ప్రణవ్యత/ప్రణాదం - రకారసామీస్యం. ఇలాంటివెన్నో గుండె పొలిమేరలు దాటి కవిత ఉరకలు వేయాలిగాని ఛందం బంధంకాక అందమే బెతుంది. భూమిక పైమాటకొక తారకాణ. ఇందులో గేయం అన్ని పోకడలూ పోయింది. సమగతి : క్ష సృష్టికి + ఆవే + శం ఒక + భూమిక-చతురశ 2. అది వుందా + ఈ జగత్తుకు - మిశ్ర 8 ఒకనాడు + తానూని + షాదుడే - ఖండ త్తే మబ్బు + కుమన + సున్న + దనీ - తిళత కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ € 61
విషమగతి : నే ఎంత + మోహం + ఒలికి + పోదు - 3+4+3+3 ల ఉపని + షత్తులు + గోవు + లటమధు - 3+4+3+4 తి. కార్కొన్నమ + హాంధకార - 6+6 శ్శ్రీ ఆ వైత + న్యమె ఆకృతి + ఈకృతికి - 6+6+5 5. _ ఎవడు + విశ్వవి + జేత + ఎవడు - 3+4+8+38 6. లోక +వృత్తం + లోతు + ముట్టిన ఓక + వీనీ + వెవరి + వో& (తిశ చతురశలు - చివరి అక్షరం ఒక్కటే 4 మాత్రలు) ఇలా లెక్క పెడుతూనే ఉండిపోవాలని పిస్తుంది.
- సమాస [గ్రథనం - అక్షర రమ్యత అక్షరాలను హృద్యంగా అనవద్యంగా ఏర్చి కూర్చడంలో రెడ్డిగారు మెలిదిరిగిన చేయి. సమాస (గ్రథనం పట్ల సంస్కృతాంధ్ర పదాలు వారి కవితాకన్య పదాల నంటి నేను నేనంటూ సేవ లొనరించ, నడుంకట్టి నిలుస్తాయి.
- స్వరంగా అక్షరంగా బుగ్వరంగా.
- గర్జన్మేఘపంక్తి తె. జలదపుత్రిక. త్శ గిరి శిఖర శిరం.
- మాతృకా పుత్రికలు పలికే మాతృభాష కవిత్వ ఘోష. ఢి సత్యదర్శన మంగళంగా, సర్వసుందరతోజ్వ్వలంగా - (సత్యం శివం సుందరం) మొదలైన వెన్నో కావ్య లావణ్యానికి మెచ్చుతునుకలు.
- పలుకుబడి మాటలను పొదిగే చమత్+కృతి కావ్య జీవితమని విశ్యనాథాలంకారికుడు నిర్వచించి పలుకుబడికి ప్రాధాన్యత నిచ్చినాడు. అది రెడ్డిగారిలో పుష్కలంగా ఉండి 62 ఆ వ్యాసభూమిక
వారి కావ్యాన్ని అనన్యం చేసింది. భావాన్ని తమ మాటల్లో చెప్పడంలో వారి చాతుర్యం అగణ్యం. 1 మోసులెత్తిన పుత్తడుల పుప్పాడుల జడులు. లి జగాయెత్తులు. 8 పుడిసిలించిన ఉదయరాగం. ల్తే ఉక్కు పిలుపు ర్, తలపండు 6. గోరానని చిగురాకు (కకిసలయమలూనం) గా పిచ్చిగా విరబూసి ఒరిగిన పచ్చి వెన్నెల. 6. లోకజ్ఞత కవికి 'లోకశాస్తాద్యవేక్షణ' ముఖ్యమని పూర్వాలంకారికులు ముక్తకంఠంతో ప్రవచించినారు. కావ్యమే లోకం. కవి ప్రజాపతి. కాబట్టి అది అవసరమే. రెడ్డిగారిలో పండిపోయిన లౌకికానుభూతి అలవోకగా వారి కృతిలో జాలువారింది.
- కవిత లొంగదు ఏ వికట పరీక్షలకైన కత్తి కోతలకైన కాల్చివేతలకైన
- తెలివి పంచని యోగమెందుకు కలిమి పంచని భోగమెందుకు. ౩. అసహాయులు నిట్టూర్చ్పులు ప్రసరిస్తే నినదించును అక్కడ కన్నీటి కవిత.
- నరభోక్తలు మానవతను నంజుకు తింటున్నప్పుడు - నౌకర్లను పాలేర్లను ఉరిమించే తిరుగుబాటులో కవితా స్వరముద్రికలున్నవి. ఇత్యాదులు.
- వ్యావహారిక పద సమాదరణం కవిత సహృదయుని కోసం కాబట్టి, సహ్బదయ వ్యవహారంలో నున్న శబ్దాలను అనాదిగా కవులు తమ కవితల్లో ప్రయోగిస్తూ వస్తున్నారు. ఒక విధంగా ఇది కూడా లోకజ్జతలో ఒక భాగమే. ఐనా తద్భిన్నమై కావ్య పుష్టికి తోడ్పడుతుంది. ఈ విషయాన్ని పరిగణించి రెడ్డిగారు 'ఉందా, కాస్తా, నవ్వేసె, బేరీజు, లాధీ, అలా కాదు” మున్నగు వాటిని ప్రయోగించినారు. 8& త్రివిధ ధ్వనులు ధ్వని కావ్యాత్మ. అది వస్త్వలంకార రసపరంగా త్రివిధమైంది. ధ్వని అనేక విధాల పుడుతున్నా ఎక్కువగా అర్ధచ్భాయ (90469 0౧6 ౧6౭౧1౧౦) నాథయించే కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 63
ప్రవర్తిస్తుంది. రసానికి ధ్వనికీ చాలా దగ్గరి చుట్టరికం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కావ్యాని కదొక వైపు, ఇదొకవైపు. అందుకే ధ్వనికావ్యముత్తమమన్నారు. వస్తు ధ్వని:
అది తమస, అది తామన విదారణాంచుమన్సుదులోర్థుకా చరిత
తమసను విశ్లేషిస్తూ ఆ అజ్ఞాన నిరాకరణమని చెప్పడంలో, కటిక - కవిగా మారడం, అక్కడ జరుగనున్న సర్వకథా ధ్వనించింది. అలంకార ధ్వని;
సొంనలో ఒక పరమ వాంన జనియించెనట
అనుప్రాసంతో ఆదికవి జీవితంలోని రెండు ఘట్టాలను సూటిగా ధ్వనించడం. రసధ్వని:
బీరబొలిచిన మోరకత్ప్వం బీరలిచ్చిన శ్రీకరత్వం
ఒక్క గువ్చీట వట్టిచూవీన ఊవాశాలిత్స క్తి చతురత
సాత్విక తేజం - దాని పరమధర్శ్మమైన “పరిత్రాణాయ సాధూనాం. వినాశా యచ దుష్కృతామ్” అన్నమాట నాశ్రయించిన ధర్మవీరం - ఆ రసాన్ని ధ్వనించడానికి పై ఖండిక. రి, ఆత్మీయత -ఉపదేశం
కవి సర్వసముడు. అన్యాయ నిరాకరణం, న్యాయ సమీకరణం అతని కర్మలు. సృష్టి విషమం. అనేక విషయాలనేక విధాలుగా ఉండటం దాని ప్రథమ లక్షణం. మంచి చెడుగుల వివరిస్తూ, భిన్నతలోని ఏకతను స్టాపిస్తూ, కాంతా సమ్మితంగా తన భావాలను చెప్పడం కవి స్వభావం. పద్దెనిమిది ఖండాల పైనున్న పీఠికవంటి “భూమికలో రెడ్డిగారి ఆత్మీయమైన ఉపదేశం ఇది:
“మబ్బుకు భూమిక ఆవిరి” - కలిసికట్టుగా నున్న ఆవిరే మేఘం. జలదం. ఒకటి లేక మరొకటి లేదు. దేన్నీ నిరాకరించరాదు. కలిసి ఉండాలని ఉపదేశం. విషమత్వంలో సమత్వం:
“అగ్నికి భూమిక ఏదీ అనిలం” - గాలీ నిప్పూ ఒకటికావు. చిరుదీపమైతే 64 € వ్యానభూమిక
సుడిగాలి ఊదేస్తుంది. అదే తీవ్రానిలం సహచరమై దవానలాన్ని మరింతగా మండిస్తుంది. అవసరాన్ని బట్టి, అర్హతను బట్టీ సృష్టిలో విషమత్వంలోనే సమత్వం ఉద్భవిస్తుందని ఉపదేశం. 'వాయోరగ్న అని (శ్రుతి కూడా చెప్పింది కదా. నైకతలో ఐక్యత: “అఖిల జగద్భూమిక చైతన్యం” - అన్నిటి వెనుకా నిలిచి, ఆడించేది ఒక్కటే. ఆయా భావాలు పారస్పరిక పోషకాలనీ (౧౭౦1౧౦61 00౧10440౧9), అవి అలా ఉన్నప్పుడే సృష్టి సవ్యంగా నడుస్తుందనీ ఉపదేశిస్తూనే రెడ్డిగారు - సృష్టికి ఆవేశం ఒక భూమిక దృష్టికి ఆలోచన మొక భూమిక అంటూ తమ 'మెలకువిను ప్రదర్శిస్తున్నారు. సృష్టికి ఆవేశంతోపాటు 'ఆచరణం* దృష్టికి ఆలోచనంతోపాటు “అనుసరణం' కూడా భూమికలే కదా. ఏ విషయాన్నైనా పాక్షికంగా, ఒకే కోణం నుండి చూడరాదనే 'త్మీయతా ముద్ర (౧0858100 01 ౧6౧౪౦౧౭11౧) పై మాటల్లో సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇది నైతిక సాంఘికాధ్యాత్మి కాది విషయాల్లో కూడా ప్రవర్తించి కృతిలో నెలకొన్నది. ఇలా సాగిన “భూమిక' ఖండకావ్య ప్రపంచంలో ఒక క్రొత్త వెలుగు. దాని పోకడ దానిదే. ఇలాంటి ఖండకృతి తెలుగులో ఇంతవరకూ రాలేదు. ఇది పరిశోధ నాత్మకం, సృజనాత్మకం,. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
- గ్రవంతి సెప్టెంబరు, 18729 సౌజన్యంతో... కవిశిరోమణి ఆచార్య రావికంటి వనునందన్ అ 65
వైతన్యతేజం 'విశ్వంభర'
నిరంతర సాధనలో ఉన్న 'మనిషి విశ్వంభర కావ్య నాయకుడు. అతడు ఎప్పుడు సిద్ధుడౌతాడనే విషయం చెప్పే ప్రయత్నం “విశ్వంభర” చేయదు.
లోక వృత్తానుకరణమే కావ్యం చేసే పని కాబట్టి అ అనుకరణలోనే ఆనందోపదేశాలు అందించే ప్రయత్నమే అనాదిగా కవిలోకం చేస్తున్న పని, డా. సి.నారాయణరెడ్డిగారి ప్రస్తుత కావ్యమూ ఆ సనాతన మార్గాన్నే పట్టింది.
అందరి మార్గమూ సనాతనమే ఐనప్పుడు కవిలోకంలో వైవిధ్యం ఎందుకు ఏర్చడిందన్నది (ప్రశ్న ఈ ప్రశ్నలోనే 'నవ్యతి అన్న శబ్దం పుడుతుంది. ఏమిటా నవ్యత? అని తిరిగి ప్రశ్నించుకుంటే ఉద్దిష్టకావ్య “వస్తు విన్యాసంలోని నవ్యతే నవ్యతొ అని సమాధానం. అనాదిగా మానవేతిహాసాన్ని కవులు కావ్య వస్తువుగౌ నవంనవ మార్గాల్లో విన్యసిస్తూ వస్తున్నారు. అందుకే సాహిత్యంలో ప్రత్యేక నవ్య కావ్యాలు వస్తున్నాయే తప్ప '“నవ్యత' 'కాలవాబి' కాదని కూడా నిర్ణయించవచ్చు. లోక వృత్తాన్ని అనుసరించడంలో సామూహికంగా ప్రాచీనతా, వస్తు విన్యాస విశేషంతో వైయక్తిక నవ్యతా కవిలోకంలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్మడా కనిపిస్తున్న అంశాలు.
సంప్రదాయం యిలా సాగుతున్న పరిస్థితిలో మానవేతిహాసాన్ని కాక, మానవత్వేతిహాసాన్ని కావ్యవస్తువుగా వెలయించడం '“విశ్వంభర'లో తలయెత్తిన కొత్త చూపు? దాన్నే డా. రెడ్డిగారు “ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనీషి కథ” అన్నమాటలలో (ప్రస్తావన) సూచిస్తున్నారు. ఆదమ్ అండ్ ఈవ్. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీసు, బుద్ధుడు, లింకన్, లెనిన్, గాంధి, మిల్టన్, మార్క్ ఇలా ఎందరో మహాపురుషుల మానవత్వేతిహాసాన్నిి కాలాతిశాయి'గా వర్ణించి తన ప్రతిజ్ఞను ప్రత్వక్షరం పాటించింది “విశ్వంభర. ఈ 65 € వ్యానభణూమిక
దృష్టినే ఇంకొంచెం పొడిగిస్తే మావత్వేతిహాస రూపంలో అనంత మానవ చైతన్యాన్ని వస్తువుగా “విశ్వంభర” అంగీకరించిందని ప్రతిపాదించవచ్చు.
తాను సృష్టించని పాంచభౌతిక ప్రపంచాన్ని శాసిస్తున్నాడు మనిషి ఆ ప్రపంచాన్ని మనిషి నృష్టించలేదనే సత్యాన్ని -
నేను వుట్టకముందే నెత్తిమీద నీలితెర కాళ్లకింద ధూలిపొర అన్న మాటలతో కావ్య ప్రారంభంలోనే అంగీకరించింది “విశ్వంభర. ఈ "నేను అన్నమాటకు అర్ధం “అనంత మానవత్వం” సాధారణీకరణ దృష్టిలో, విశ్వంభర కావ్యకళా సృష్టిలో “అనంత కవితాతత్వం” అవుతుంది కూడా. కాబట్టీ “విశ్వంభర కవితాపద్ధతి వాస్తవికమూ (00)601/6) ఆత్మాశయమూ (5౪40)6081౪/6) రెందూను.
అనంత మానవచైతన్యం ప్రస్తుత కావ్య వస్తువు అనుకున్నాం కదా! ఆ చైతన్య స్వరూపాన్ని ఇలా నిర్వచిస్తారు రెడ్డిగారు కావ్యాంతంలో.
అణువునుంది అంతరిక్షానికి
అంభిరం నుండి అవనీతలానికి
అనుభూతి నుండి ఆకృతికి
అద్ధుచ్చుం నుంది అఖభివ్వక్తికి
జరుగుతున్న అవిరళ శోధనమిది
జూరివదుతున్నా మెట్టు మెట్టుగా
అరోపొస్తున్న సాధన మిది
తాను సృష్టించని ప్రపంచాన్ని సాధించే మానవుడు ఈ కావ్యనాయకుడనీ, ఆ సాధన నిరంతరమనీ, సిద్ధిని 'విశ్వంభర' నిర్దేశించదనీ ఇంతకు ముందే అనుకున్న దానికి పై కవితాభాగం నిరూపకం. వస్తు స్వామ్యం లేని, పరిపూర్ణ సిద్ధి స్వరూపం తెలియని, కేవల పారిశ్రామికుడు భాగస్వామ్యానికై చేసే పోరాటంలోని చైతన్యాన్ని విశ్వంభర ్రతిపాదిస్తున్నది. కొద్దిపాటిలో ఇది కర్మాగారంలోని కార్మికుడు యజమానిని “వాటా” అడిగినట్లు అన్యాయమేమీ లేదుకదా! ఇదే “విశ్వంభర' వస్తువులోని లోకవృత్తానుకరణం.
కర్మాగారంలోని కార్మికుడికి పరిపూర్ణ సిద్ధి స్వరూపం తెలియకపోయినా తానెంతవరకు సాధించాడో తెలుసు. ఇంకా సాధించాలని ఉన్నదనీ తెలుసు. ఆ
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 6/7
తెలివే 'అహరంికారమై, యజమానిని తన *వాటా” ఇమ్మని అడుగుతుంది. “విశ్వంభర' లోని 'మనిషి అహంకారమూ, అజ్ఞాతశక్తి మీది తిరుగుబాటూ ఇలాంటివే.
ఈ విప్లవమూ సనాతనమే. 'అహం్రహ్మాస్మి' అనే అద్వెత తత్వమూ, “అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే” అంటూ రాముని ముందు నడచిన లక్ష్మణుని మానుషత్వమూ పై విప్లవరూపాలే. ఐతే, ఇవి అజ్ఞాత శక్తికి అనుకూలిస్తూనే చాపకింద నీరులా వచ్చే విప్లవాలు. “విశ్వంభరిలోని విష్తవం ప్రతికూలం. ఇదీ నవ్యతలోని అంశమే. ఆ మనిషి “విప్లవమే అజ్ఞాతశక్తి మీద విజయం” కూదా.
వద్దని గిరిగీసిన పందుమీద
వాలాలని లేకపోలేదు
శాననం ఉరిమితే చల్లారదు కాంక్ష
అది నురింత రగులుతుంది వుట. ? అన్న,పంక్తుల్లో ఆ విప్లవం పొడసూపింది.
తెలుసా! శాసన ధిక్కారానికి ఫలితం?
తేలును - మట్టిలా మొలకెత్తే మరో జీవితం
ఆ జీవితానికీ అనుక్షణం మృత్యుభయం
ఆ నృుత్వువు కోరలతో ఆదుకోవదం మాకు వ్రియం
అయితే వెళ్ళిపో మట్టి మనిక్షీ ! ఆ మట్టిలోకి
అలాగే వెళ్లి పొంగిస్తాను ఆ మట్టిని నింగీ పైకి
అందాకా నచ్చిందా నీ అవాంకృతి
అక్కదే మొదలవుతుంది మానవ నంస్కృతి వుట 8 అన్న పంక్తుల్లో కావ్య ప్రారంభంలోనే, ఆది మిథునం నిషిద్ధ ఫలభక్షణకు పూనుకున్న ఘట్టంలోనే అజ్ఞాత శక్తిపై మనిషి జరిసిన విప్లవం - విజయమై కూర్చుంది.
వృత్వువు కోరలతో ఆదుకుంటూ
(కోరకు ఎదురు ఖడ్గధార) వుట. 17
వుట్టీని నింగిపైకీ ....
(నదక నుంటి రోదసీ నౌక దాక్ర వుట. 82 68 € వ్వాసభూమిక
సాగిపోతాడు కాంతి లవారిలా
వ్రైతన్వ కేతనుదు మానవుడు వుట, 82
నిరంతర సాధనలో
ఎక్సిన శిఖరాలే అవి
ఇప్పుదు మూల్గుతున్నాయి లోయల్లా వుట, 79 అనుకున్న అపజయాలున్నాయి
నానీద నన్నే వెక్సిరిన్తున్నది
నా శవం నా వైపే నడిచి వస్తున్నది వుట 74 అనుకున్న అపజయాల గుర్తింపులున్నాయి.
దేవోన్ని తివ్పులేని ప్రాణి
నోవాం అంటాదెందుకని
తెర అవతల చూడలేని మనిషి
వపరతత్వం (వ్రస్తావిస్తాదెందుకని వుట.65 అన్న ఆలోచనలున్నాయి.
ఇది నిత్వ(సస్థానం
ఎగుడు దిగుళ్లు తప్పవు
ఇది నిత్వ ప్రయోగం
ఎదురుదెబ్బలు తవ్పువు వుట, 97 అన్న అశ్వాసాలున్నాయి.
అకులు రాలిపోతేనేమి?
చిగురాకులు పుట్టవా?
నీళ్లు ఇగిరిపోతేనేమి?
నీలిమబ్బులు గజ్జె కట్టవా? వుట, 98 అన్న ఆశలూ ఉన్నాయి.
ఈ అన్నిటి క్రోడీకరణమే -
విశ్వంభరా (భ్రమణానికీ మూలం
శాశ్వత చైతన తేజం వుట 56
కవిళిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ € 69
ఈ విధమైన దృఢసంకల్పంతో
అంతశ్చేతన ఆలంబనగా
వురోగమిస్తాదు మనిషి కాబట్టి ఆ విప్లవచైతన్యమే ఆతని విజయం.
కావ్యాంతంలో -
తాను నాటిన వూలమొక్టులెక్టుడ?
తలలు బలిని నిలుచున్నాయి ముళ్ల కంచెలు వుట. 96 అని ఆలోచిస్తూ మనిషి నిలిచిపోయిన పరిస్థితిలో -
మనిషీ! ఎకుడ? నువ్వెక్సద?
మట్టీలోంచి మింటిలోకి బిమ్ముకొస్తున్నావా?
నిర్జంచుకున్న అహాంకారాల (ప్రాకారాలు నేలనుట్టమవుతుంటే -
నిట్టూర్చుల శిథిలాలను
పట్టుకు వేలాదుతున్నావా? వుట, 86 అంటూ ప్రశ్నార్థకంగా అజ్ఞాతశక్తి హుంకరిస్తే -
మనిషి చలించలేదు
మౌనాన్ని వర్షించాడు
వూటల కందని (కతిలో
మనస్సుతో ఘోక్షించాదు వుట, 897
“విప్లవమే విజయం. విజయంతోపాటు అపజయమూ ఉంటుంది. ఎన్ని అపజయాలున్నా ఆ నదక ఆగేది కాదు. కాబట్టీ సమాధానించవలసిన అవసరం లేదనే దృఢ నిశ్చయాన్ని చెప్పక చెప్పుతున్నది ఆ మౌనం” అని తన విస్తృత కావ్యరూపంతో ప్రత్యక్షరంగా నిరూపిస్తున్నది విశ్వంభర.
నిజానికి సాధనే కామమూలకం. ఆ కామం మనోమూలకం. అందుకే హైందవ సంప్రదాయంలో కాముడు మనోజుడు. ఆ మనస్సు అనంత శక్తిమంతం. దాని వికారాలూ అనంతాలే! ఈ మాటలు అన్ని వేదాంతాలూ అంగీకరించినవే. మనోవికారాలతోనే, మనశ్శక్తులతోనే మనిషి త్రిముఖంగా-కళాత్మకంగా, వైజ్ఞాని కంగా, ఆధ్యాత్మికంగా ప్రస్థానం సాగిస్తున్నాడని ప్రస్తావనలో రెడ్డిగారే అన్నారు. మాటలకు అక్షర నిదర్శనాలనూ, కావ్యశిల్పంలో చెక్కి చూపారు. 70 € వ్యానభూమిక
“విశ్వంభర లోని మనిషి సాధనకు వశ్వం కానిది మృత్యువొక్కటే. ఆ మృత్యు వివేచనలో -
ఎందాక ఈ నదక?
ఈ అడుగు నాొగిందాక
ఎన్నాళ్లు సాగుతుందీ అదుగు?
ఎదురుగా లోయ నిలిచేదాక
వమంటుంది ఆ లోయ?
ఈడ్డుకుంటుంది అగాధం దొక
ఏమవుతుంది ఆ పైన?
ఇది [ప్రశ్నగా మిగిలిన వ్రశ్న వుట 68
అనుకుంటాడు మనిషి. ఈ వివేచనలో నాచికేతూపాఖ్యానం తొంగి చూస్తు న్నది. ఈ మథనం “మృత్యువు నుంచి” అన్న సినారె కావ్యంలోనే తల యెత్తింది. ఆ మృత్యుభీతితోనే-
దృష్టీకందని నృష్టి ఉందేమో?
నృష్టికందని దృష్టి ఉందేమో?
వ్వక్తిని ఆవరించే శ్తక్తి ఉందేమో?
శూన్యాన్ని చిత్రించే వైతనృముందేమో?
ఉన్నట్టే ఉంది వుట 76 అనుకుంటూ “విశ్వంభర మనిష సగుణోపాసకుడై అతిలోక శక్తుల సంస్మరణం (పుట 78) చేస్తాడు. కాని ఇదీ ఒక మనో వికారం మాత్రమే. అంతలోనే “నైనం ఛిన్ఫన్తి శస్త్రాణి నైనం దహతి పావకళొ ఇత్యాదిగా గీత ప్రవచించిన ఆత్మ లక్షణాలను పరామర్శించి-
అగ్ని లాంటిది లోన వుంటే
అంటుళుందా ఒంటికి చెదలు?
అమృతత్వం వైన ఉంటే
అవనికుంటుందా చావు దిగులు? వుట. 82 అని నిర్ణయిస్తుంది విశ్వంభర. ఈ భావమే పూర్వకావ్యం 'మృత్యువు నుంచిలో
కవిశిరోమణి ఆచార్వ రావికంటి వనునందన్ ఊఉ 71
దాగి వుంది వృతిలోనే ప్రసూతి
కర్రను కాల్చి వుట్టే చిచ్చులా (వ్యృత్వువు నుంచి-వుట. 89) అంటూ వర్షితమైంది. దాని తర్వాత వచ్చిందే “'విశ్వంభర'. కాబట్టి ఇందులోని “మనిషి జీవిత పరిణామ రూపమే ఐన మృత్యువుకి దడిసే వీలేలేదు.
రెడ్డిగారి మరోకావ్యం 'భూమికలోని
మనిషికి స్వర్థచ్చుతి (స్రతిబంధకమా?
మానవతా నమునేష మూలకమా?
వంచభూతములను పుడినీలించాలని
వంచించే వృత్యువు తలవంచాలని
ప్రగమించే మనిషి నిత్స జీవయాత్ర
అగువించని శక్తులపై దందయా(త వుట. 82 అన్న పంక్తుల్లోనే 'విశ్చంభర' కావ్యానికి విత్తనం పడింది. విప్లవచైతన్యాన్ని ప్రతిపాదించే ఆనాటి ఆ పంక్తుల విసృతరూపమే ఈనాటి “విశ్వంభర. ఈ సత్యాన్నే-
ఆ తేజం విశ్వచరితకు అభినవ భూమిక వుట. 60 అంటూ “విశ్వంభరిలో సూచిస్తున్నారు రెడ్డిగారు.
“విశ్వమానవేతివాసాన్నీ అవధిలేని మనిషి మానసకోశాన్నీ అవగాహన చేసుకొన్న సహృదయులకు ఈ కావ్యం సంతృప్తిని కలిగిస్తుందని నా విశ్వాసం” అని ప్రస్తావనలో రెడ్డిగారు మెత్తగానే అన్నా - ఆ మాటలు పఠిత అధికార స్వరూపాన్ని ఒత్తిపలుకుతున్నాయి. రెడ్డిగారి ప్రతిభాపారావారంలో వెలుగులీనుతున్న పూర్వ కావ్య రత్న సమాహారం ఒక యెత్తు - ఈ “విశ్వంభర” ఒక యెత్తు. రెంటినీ నిష్పాక్షికంగా తూచిచూపే తుల-భూమిక'. నవనవోన్నేష శాలిని ఐన ప్రజ్ఞ డా. సి. నారాయణరెడ్డి గారి తరగని పెన్నిధి. కాబట్టే -
విశ్చ్శంభరను తెరయెత్తి చూవీంది వినూత్నమతి వుట. 24
- ఆంధ్రప్రభ (దినపతిక, మే 9 1982 సౌజన్యంతో... శ డయ్యా . వా [ గె ను టట పల్ల
౧" అ పబాఠరోధంలరసంపంసం *. వ నా పతసయు | శ్రీ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి న టు కను. యస? అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లో వ ఎరోస ర్స) రాష్త్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా కొవసౌగించేందుకు. ముఖ్యమంత్రి | ఉన్నపుడే ప్రగతి సాధ్యపడుతుంది. ఈ శ్రీఎన్. కిరణ్ కుమార్ రెద్ది తాను బాధ్యతలు రాశా విషయాన్నిదృష్టిలో పెట్టుకొని నిరుపేదలకు స్వీకరించిన మరుక్షణమే. విదు జిల్లాలలో ని ర! సైతం నాణ్యమైన వైద్యాన్ని రిందించేందుకు పథకం కాలపరిమితిని పొదిగిస్తూ మీ. వ్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వధకం, అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన మా లక్షబాది మంచి పేదలకు ప్రాణదానం రచ్చబండ కార్యక్రమంలో లదవంగా 463 మట చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజారోగ్య లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీని దాన వధకాలలో నంచలనవం నృష్టిస్తోంది. చేరువచేస్తూ వారికి కార్డులను అందిం- దేశంలోని 21 రాస్ర్రాలు ఈపధకంలమలు చారు. ఇవ్పటీవరకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద శ్రీ ది.ఎల్, రవీంద్రా రెడ్డి కోసం అధ్యయనం చేశాయి. 41 లక్షల మందికి సైగా వైద్య పరీశ్షలమీ. వైద్య లడోగ్యక్త, 10% 104 సేనలు, కురుంల వంక్షేమం, ఇంతటి ప్రాధాన్యత గాల నిర్వహించగా, 9.16 లక్షల మందికి పైగా చెమిమినిసి, వైద్య విద్య శాఖామాత్యులు ఆరోగ్యశ్రీ వథకాన్ని విజయవంతంగా శస్తచికిత్సలనునిచ్వహించారు. క్ న. న ప్రమ ళతా్రపళకోర్కంమావధకంలిళకల: కం? . [1 , ఆ తెల్ల రేషన కార్డే అర్హతగా రెందు కోట్ల కుటుంబాలకు సు శ. 9 రచ్చబందే కార్యక్రమం ద్వారా అదనంగా మరో 4.63 లక్షల (టా! మ్మ వ కుటుయీలకు చేరువైన ఆరోగ్యశ్రీ ౨ ఇప్పటివరకు ఈ పధకానికి చేసిన వ్యయం దాదాపు 6 938 వ్యాధులకు వర్తింపు. ప్రతిపాదనలో మరో 100 వ్యాధుల రూ.2,722 కోట్లు వర్తింపు € రూ.42 కోట్లతో చెవిటి, మూగ పిల్లలకు కాక్షియర్ ౨ రాష్ట్రవ్యాప్తంగా 344 ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసువత్రులలో ఇంష్లాంటీ సర్జరీలు 15.082 ప్రత్యేక పదకల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు లభ్యం నుంది అ కిద్నీవ్వాధిగ్రస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ౨ పథకం పర్యవేక్షణలో 1500 పారామెడికల్ సెబ్టంది ఆసుపత్రులలో 112 హీమో డయాలసిస్ యూనిట్ల స్థాపన [ గా. ళ్ (1. క్ స అ ఆరోగ్యశ్రీ సవలలో 202 (752+50) అంబులెన్స్‌లు | | కన: మా. క. (108 అంబులెన్స్‌లు), 475 సంచార నా ౧ తీ నన లర్ ఆరోగ్య కేంద్రాలు (104 సర్వీసులు) ళల నో నావలా లం సయ రు ్ల్ _ ॥ శీ హం యయ ష్ హా న్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రఫ్ట్ టోల్ ఫ్రీ నెం: 1800-425-7788 క్లూ ల ౯ ౧.౦. సం. 31/506/46/1./2011-12, 0286 16-04-2011 “మాద వహనాన, వాళ వంటుధాం శాం
దాగి వుంది మృతిలోనే వ్రసూతి
కర్రను కాల్చి వుట్టే చిచ్చులా (వృత్వువు నుంచి-వుట. 82) అంటూ వర్ణితమైంది. దాని తర్వాత వచ్చిందే 'విశ్వంభర'. కాబట్టి ఇందులోని “మనిషి జీవిత పరిణామ రూపమే ఐన మృత్యువుకి దడిసే వీలేలేదు.
రెడ్డిగారి మరోకావ్యం 'భూమికిలోని
మనిషికి స్వర్ధచ్చుతి వతిబంధకనూ?
మానవతా సమున్ఫేష మూలకమా?
వంచభూతములను పుదినిలించాలని
వంభించే వృళత్యువు తలవంచాలని
(ప్రగమించే మనిషి నిత్చ జీవయా(త
అగువీంచని శక్తులపై దందయా(త్ర వుట. 8 అన్న పంక్తుల్లోనే “విశ్వంభర కావ్యానికి విత్తనం పడింది. విప్లవచైతన్యాన్ని ప్రతిపాదించే ఆనాటి ఆ పంక్తుల విస్తృతరూపమే ఈనాటి “విశ్వంభర” ఈ సత్యాన్నే-
ఆ తేజం విశ్చచరితకు అభినవ భూమిక వుట. 60 అంటూ '“విశ్వంభరిలో సూచిస్తున్నారు రెడ్డిగారు.
“విశ్చ్వమానవేతిహాసాన్నీ అవధిలేని మనిషి మానసకోశాన్నీ అవగాహన చేసుకొన్న సహృదయులకు ఈ కావ్యం సంతృప్తిని కలిగిస్తుందని నా విశ్వాసం” అని ప్రస్తావనలో రెడ్డిగారు మెత్తగానే అన్నా - ఆ మాటలు పఠిత అధికార స్వరూపాన్ని ఒత్తిపలుకుతున్నాయి. రెడ్డిగారి ప్రతిభాపారావారంలో వెలుగులీనుతున్న పూర్వ కావ్య రత్న సమాహారం ఒక యెత్తు - ఈ “విశ్వంభర” ఒక యెత్తు. రెంటినీ నిష్పాక్షికంగా తూచిచూపే తుల-భూమిక నవనవోన్నేష శాలిని ఐన ప్రజ్ఞ డా. సి. నారాయణరెడ్డి గారి తరగని పెన్నిధి. కాబట్టే -
విశ్చుంభరను తెరయెత్తి చూపింది వినూత్నమతి వుట. 24
- ఆంధ్రవ్రభ(దినపతిక్కు మే 9 1982 సౌజన్యంతో... లో ట్రా. “నా మి చ 72 € వ్యానభూమిక ల్ గ్రా " ల న. సే. 7 1 ను మస మ
ను ర్ ఫ్ సట, గ స పబజారోగలలోపలచలనం (/ సళ అంజక్ ఆథగ ౮ రుగకల అలన! మనమ రెడ్ది సమాన రసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఠరోగ్యంగా కొనసొగించేంచుకు, ముఖ్యమంత్రి " / ఉన్నవుడే ప్రగతి సాధ్యపడుతుంది. ఈ శ్రీఎన్. కిరణ్ కుమూర్ రెడ్ది తాను బాధ్యతలు విషయాన్ని దృష్టలో పెట్టుకొనినిరుపేదలకు. స్వీకరించిన మరుక్షణమే, ఐదు జిల్లాలలో సైతం వాగ్యమైన వైద్వాన్నిలందించేందుకు పథకం కాలపరిమితిని పొడిగిస్తూ (5 అభం ారతు ఆరోగ్యశ్రీ ఫైలుపై తొలిసంతకం చేశారు. | వాటు! ప్ర రాజీవ్ ఆరోగ్యశ్రీ వధకం, అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన త్. లక్షలాది మందీ పేదలకు ప్రాణదానం రచ్చబండ కార్యక్రమంలో అదనంగా 463 = య. చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజారోగ్య లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీని దే వధథకాలలో నంచలనం నృష్టిస్తోంది. చేరువచేస్తూ వారికి కార్టులను అందిం- దేశంలోని 21 రాష్ర్రాలు ఈ పథకంలమలు చారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకం శ్రింద శ్రీ డిఎల్, రవీంద్రా రెడ్డి కోసం అధ్యయనం చేశాయి. 41 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలను వైద్య, అరోగ్యక్తీ, 108, 104 సేవేలు, షలుంబ సంక్షేమం, ఇంతటి ప్రాధాన్యత గల నిర్వహించగా, 9.16 లక్షల మందికి పైగా ఎసివి.వి.సి, వైద్య విద్య శాఖామాత్యులు ఆరోగ్యశ్రీ వధకాన్ని విజయవంతంగా. శేస్త్రచికిత్సలనునిర్వహించారు. (త ై౭తషంమాపంకంతిల్పుకల: శ్, ట్ (దాదావు 7 కోట్ల మందికి) అందుబాటులో కార్బోదేట్ వైద్యం | ళ | జి గ కీ వ్యా 0 రచ్చబంద కార్యక్తనుం ద్వారా అదనంగా మరో 4.63 లక్షల (న [౯ వా! చు చేరువైన ఆరోగ్యశ్రీ 0 ఇప్పటీవరకు ఈ పథకానికి చేసిన వ్యయం దాదాపు ఈ 938 వ్యాధులకు వర్తింపు. ప్రతిపాదనలో మరో 100 వ్యాధుల రూ.2,722 కోట్లు ర్తింపు ౨ రూ.42 కోట్లతో చెవిటి, మూగ పెల్లలకు కాక్షీయర్ 9 రాష్ట్ర వ్యాస్తంగా 344 ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ఇంస్లాంట్ సర్దరీ 15,082 ప్రత్యేక పడకల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు లభ్యం కీ ళ్ ౨ కిద్నవ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 9 పథకం పర్యవేక్షణలో 1600 మందీ పారామెడికల్ సిబ్బంది ల కొసం రాష్త్ర స్థాపన న్ వ్ గ ఉగ | | ॥ 2 ఆరోగ్యశ్రీ సేవలలో 802 (752+50) అంబులెన్స్‌లు 'అభమనంనా వ ర్ట (108 అంబులిన్స్లు), 475 సంచార (|| నీ. ఆరోగ్య కేంద్రాలు (104 సర్వీసులు) క ప న _ క్, . మా , నమన ఏ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ టోల్ ఫ్రీ నెం: 1800-425-7788 శ్ లో బొరీచేపేననారు పెమాచారు పొర పంబంధాల కౌఐ ౧.౦. ౧10. 31/(5064/46౪11/2011-12, 021864 16-04-2011
టీ ప సోన గ ఆ శ చిన్న మొత్తాల్లో పొదుపు , చేయడానికి మరొక న్. గొప్ప కార (ె |. న్న్న ప్ప కారణం గ్ ఠి శ్ పోస్టాఫీస్ నెలసరి ఆదాయ పథకంలో ; పొదుపు చేయండి జ్ క్ [ మెచ్యూంటీపై ఈ బోనస్ పొందండి జ్ అ ఎలాంటి మార్కెట్ రిస్కులేదు అ పెట్టుబడికి సంపూర్ణ భద్రత ( చే: అ ఖచ్చితమైన రాబడులు అ ప్రభుత్వ హామీ శౌ అ అత్యధిక వడ్డీ రేటు ఆ పన్ను లాభాలు 6 సం॥లలో లక్షాధికారి అవడానికి నాలుగు మార్గాలు “న ఫథకం........ | పెట్టుబడి... | పొందేమొత్తం | సొకర్యం ల. క పోస్టాఫీసు రికరింగ్ డిపొజిట్ | ప్రతినెల రూ. 100,108 మీ నెలసరి బడ్జెట్‌కి సులువైన పొదుపు మార్గం ' | రూ. 1.100 ఫ్ / 2 వెలపరి ఆదాయ పథకముతో। ఏక మొత్తంగా | రూ. 104,401 , మీ పెట్టబడి వెనక్కితీసుకున్నా లేదా ఆర్.డి.ఖాతాను - 'చోడించబడిన ఆర్.దీ.భాతా | రూ. 65.000 | ముగించిన, భాతాను/పథకమును కొనసాగించవచ్చు. _జోడించబడివ ఆర్డిభాతా రూ.65,000, | ముగించనా భారాను/పథకమును కొననాగించవచ్చు _ 3. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ | ఏకమొత్తంగా | రూ. 104065 , ఆడాయం పన్ను లాభాలు సెక్షను 80(సిప్రకారం | లర. 600 శ న ప 4. కిపొన్ వికాస్ పర్రాలు ఏక మొత్తంగా . రూ. 1,00,315, 8 సంః 7నెలలలో పెట్టబడి రెట్టింపు/ గడువుకి ముంచే | రూ. 65,000 21/2 సయల తరువాత డబ్బు వెనక్కి తీసుకునే సాకర్యం చిన్న మొత్తాల పొదుపు పథకాలు - వడ్డీ రేట్లు -.. బోడించవిడిన 5 సంఃల రికరింగ్ డిపాజిట్ భాతా బోనస్ 6% న. ల్
- "ఐదు సం॥ల సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం 900% ఐదు సరల రికరింగ్ డిపాజిట్ భారా _ 750% ఆదాయం న్ను లాభాలు పెక్షను 80 (సి) ప్రకారం ఐదు సం॥ల టైం డిపాజిట్ భొాలా 750% సంలదకాళషవరశతా ఆదాయం పన్ను లాభాలు సెక్షను 80 (సి) ప్రకారం 15 సంల (ప్రజా భవ్య వ 80 (1) ప్రకారం | 200%... మూడు సంల టైం డిపాజిట్ భాలా 725%. అదాయం పన్ను లాలాలు పెక్టమ 80 (సి ట్రకరం ౯... శండు సంల టై డపపప్ఫారా 6504 ఆరు సంఃల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్టు | కా స ౮ (8వ విడుదల) ఆదాయం పన్ను లాభాలు సెక్షను 80 (సి) స్రకారం 800% ఇ వ చయ ధాతా ను... 3 సా నా ా.. సివిం్స బ్యాంకు ఫాతా తె50% కిసాన్ వకాస పత్రం 8సంల 7మాసాల్లో పెట్టుబడి రెట్టింపు న క , ననన క. కమీషనర్ చిన్న పు మొత్తాలు చిన్నమొత్తాల పాదుపు, ణధిక ద63బదుణు) తిలక్ రోడ్. ఆబిడ్స్. హైదరాబాద్-1 | నన. +/30 5118: 5[౧౧౫౭||5౪1౧05.200౧1[౧6.0౦౪.|౧