Telugu Virat - anilvaranasi/indianlanguages GitHub Wiki

లం మూలం: స్టెఫాన్‌ త్ప్యైక్‌ .. నం ఎ ఎాస్వేచ్భానువాదం: పొనుగోటి కృష్ణారెడ్డి. _.-. హాకీ య్‌. వ. |! ల యో టు చో జడా త సు ను నం గాస్‌? యయ " ఆయను స పం కాత యాం త.

న వాయు మాన్‌ ఇ /| స లోల. ర్‌ న్యా గ. ర వ | |) హో (ే సు | షో వ చ టు కాం మ వ త్ర ల్‌ లోట న న. యాల ల్ల న జ చన ఖా స ఎ | శొంష్న

విరాట్‌ మూలం: స్టెఫాన్‌ ల్స్వెక్‌ | / స్వేచ్చానువాదం: పొనుగోటి కృష్ణారెడ్డి

శళి[-౯2203 |! “ప మూలం: స్టైెఫాన్‌ త్ర్వైక్‌ స్వేచ్చానువాదం: ల పొనుగోటి కృష్ణారెడ్డి ల / ల్‌ 12 డిసెంబర్‌, 1999 యా (గ్రంధాలద్యు హా ళ్‌ రా న. ప్యా స ం" ప్రతులకు : జయంతి పబ్లికేషన్స్‌ ఏలూరు రోడ్‌ విజయవాడ ముద్రణ ఏ. అనుపమ ప్రింటర్స్‌ హైదరాబాద్‌ స

మా అబ్బాయి విరాట్‌కు -కృష్ణారెడ్డి 12.12.1999 డొ

ఎందుకీ అనువాదం? నేను పదో తరగతి చదివే రోజుల్లో 'విరాటో చదివాను. నాకు ఎంతగా నచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వంద సార్లయినా చదివుంటాను. విరాట్‌ పాత్ర నా జీవిత దృక్పథం మీద, జీవన విధానం మీద చాలా ప్రభావం చూపింది. విరాట్‌ నవలికను చాలా మంది చేత చదివించాను. కొందరు అడిగితే ఫొటోస్టాట్‌ కాపీలు తీసి ఇచ్చాను. చదివిన వాళ్ళందరిదీ ఒకటే అభిప్రాయం, సబ్బక్ట్‌ అద్భుతంగా వుంది. అనువాదం ఇంకొంచం బావుంటే బావుండేది అని. రమేష్‌ అనే అతను 1964లో దీన్ని అనువదించాడు. అతన్ని కలిసి వాక్య నిర్మాణం అంక క్లిష్టంగా లేకుండా సరళమైన తెలుగులోకి తిరిగరాయిద్దాం అనుకున్నాను. కాని అతన్ని గురించి గాని, ఆ పబ్లిషర్‌ గురించి గాని ఎంత ప్రయత్నించినా వివరాలు తెలియలేదు. ఆ ప్రయత్నం మానుకున్నాను. విరాట్‌ రచయిత 'స్టెఫానత్స్య్వైక్‌ గురించి, అతని ఇతర రచనలు గురించి నాకు తెలిసిన సాహితీ ప్రియుల్ని అడిగాను. ఆయన గురించి తెలియదని చెప్పారు. గురువుగారు శ్రీనండూరి రామమోహనరావుగారు, శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు త్ర్వైక్‌ గురించి చాలా వివరాలు చెప్పారు. ఛాయాదేవి గారు త్స్వ్వైక్‌ కథలు కొన్నింటిని '50 ప్రాంతాల్లో అనువదించారు. అవీ కావ్య భాషలో వున్నాయి. ఆమె దగ్గర తీసుకుని వాటిని చదివాను. వాటిలో నాకు నచ్చిన విరాట్‌ గాని, నండూరి గారికి ఇష్టమైన “ది రాయల్‌ గేమ్‌' గాని లేవు, అయినా ఆ కథల్ని సంస్కరించి ప్రచురిస్తే బావుంటుందని కోరాను. ఆమె కూడ అదే ప్రయత్నంలో వున్నట్టున్నారు. కొద్ది రోజుల తరువాత ఆ కథల్ని ఆధునిక ప్రమాణ భాషలోకి మార్చి పునర్ముద్రించారు. అందులో నాకు బాగ నచ్చిన కధ ' అపరిచిత లేఖ." ఒకసారి పాత పుస్తకాల షాపులో వెతుకుతుంటే - నా అదృష్టం కొద్దీ స్టెఫాన్‌ త్చ్వైక్‌ కథల సంపుటి దొరికింది. అందులో విరాట్‌తో పాటు నేను చదవాలనుకున్న కథలు కూడ వున్నాయి. విరాట్‌ నవలికను ఇంగ్లీషులో చదివాక ఇంకా చాలా బాగ నచ్చింది. ఎవరిచేతనైనా అనువాదం చేయించి ప్రచురించాలనుకున్నాను. సాధ్యం కాలేదు. మిత్రుల సలహాపై ధైర్యం చేసి మొట్టమొదటిసారిగా ఈ అనువాదం చేశాను. విరాట్‌ని కథగా పేర్కొన్నారు కాని ఆ రచనలోని సంఘటనలు, సన్నివేశాలు, పాత్ర చిత్రణ, వాతావరణంలోని విస్తృతిని బట్టి దాన్ని నేను నవలికగా భావిస్తున్నాను. ఈ నవలికను పచురించముని ప్రోత్సహించిన శ్రీ నండూరి రావువోోహనరావు గారికి, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికి, కేతు విశ్వనాధరెడ్డి గారికి, శీలా వీర్రాజు గారికి, ఎల్లూరి శివారెడ్డి గారికి దుత్తా దుర్గాప్రసాద్‌ గారికి, కె. ఆర్‌.కె. గారికి కృతజ్ఞతలు, (ప్రచురించవుని ప్రోత్సహించడంతో పాటు కవర్‌ పేజీకి కావలసిన ఫొటోలను కూడ అందించి కవర్‌ పేజీని సూచించిన శ్రీ కె. నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. _పొనుగోటి కృష్ణారెడ్డి ళో

విరాట్‌

మిద్ధ భగవానుడు ఈ భూమి మీద అవతరించడానికి కొద్ది రోజుల ముందు వీరవాఘ రాజ్యంలో ఒక మహోన్నత వ్యక్తి జీవించాడు. అతని పేరు విరాట్‌. గొప్ప యోధుడు. కత్తి యుద్ధంలో అసమాన ప్రతిభాశాలి, గురితప్పని విలుకాడు, వజ సమానమైన బాహుబలుడు, అంతులేని ధైర్యశాలి. గంభీరమైన విగ్రహం, భీతి ఎరుగని చూపు ఆయనవి. ఆయన నిండు కుండలా తొణకని మనిషి సత్యనిష్ట గలవాడు; పవిత్రుడు; శాంత స్వభావుడు. అయన ఆవేశపడగా, కోపంగా మాట్లాడగా ఎవరూ చూడలేదు.

ఆయనకు రాజంటే గౌరవం, భక్తి. విరాట్‌ పరిచయం వున్న వ్యక్తులకు ఆయనంటే పూజ్యభావం. ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా గౌరవ సూచకంగా తలవంచుకు వెళ్ళేవాళ్ళు, పనిపిల్లలు మెరుస్తున్న ఆయన కళ్ళను చూసి చిరునవ్వులు చిందించే వాళ్ళు. వుధ్యవర్తిగా ఆయన చెప్పే తీర్పుల్ని ఆ ప్రాంత వాసులంతా శిరోధార్యంగా భావించేవాళ్ళు.

ఉన్నట్టుండి ఒకరోజు రాజుగారికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. రాజ ప్రతినిధిగా, వీరవాఘ రాజ్యంలో సగభాగాన్ని పరిపాలిస్తున్న రాజుగారి బావమరిదికి రాజ్యం మొత్తాన్ని ఆ[క్రమించాలన్న అత్యాశ వుట్టింది. రాజుగారి సైన్యంలోని మెరికల్లాంటి యోధులకు లంచాలిచ్చి తనవైపు తిప్పుకున్నాడు. పూజారులనూ లోబరుచుకున్నాడు. ఆ రాజ్యానికి పవిత్ర రాజ చిహ్నంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి రాజసరోవరంలో వుంటున్న హంసల్ని రాత్రికి రాడ్రే పూజారుల ద్వారా తరలించేశాడు. తనకు అందుబాట్లో వున్న ఏనుగుల్ని సేకరించుకున్నాడు. రాజు పట్ల కోపంగా వున్న పర్వతవాసుల్ని చేరదీసి తన సైన్యంలో కలుపుకుని రాజధాని మీదికి దండెత్తాడు. ॥

రాజాజ్ఞ మేరకు కోట ప్రాకారాలపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా నగారాలు మోగించారు. గంటలు కొట్టారు. రాత్రి కాగానే కోట గోడ గోపురాలపై పెద్ద కాగడాలు వెలిగించారు. ఆమంటలపై చేపల పొలుసులు చల్గారు. ఈ పొలుసులు మంటపై పడగానే పసుపు రంగు వెలుతురు వచ్చేది. అది ప్రమాద సంకేతం. కోటకు ప్రమాదం ఏర్సడింది, రండి అని ప్రజలకు పిలుపు. అయితే ప్రజలు ఎక్కువగా శాలేదు. వాళ్ళూ భయపడిపోయారు. కారణం ఏమిటంటే రాజహంసలు దొంగిలింపబడ్డాయన్న విషయం రాజ్యం నలువైపులా తెలిసిపోయింది. సైన్యంలో రాజుగారికి ఎంతో విశ్వాసపాత్రులుగా పేరుపొందిన గజదళాధిపతి, "సేనాధిపతి కూడ శత్రువులతో కలిసిపోయారు. దాంతో మిగిలిన కొద్దిమంది సర్ద్టార్షు రూడ లోలోపలే ఒణికిపోతున్నారు.

నౌకర్లు, బానిసలు మందలు, వుందలుగా వున్నారు తప్ప కోట రక్షణ బాధ్యత

లే

అప్పగిద్దామంటే విశ్వాసపాత్రుడైన సర్టార్‌ ఒక్కడు కూడా కనిపించలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రాజుగారి వ్యవహార్ణైలి. ఆయన కఠిన హృదయుడు. చిన్న తప్పులు చేసినా పెద్ద శిక్షలు విధించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాడు. సామంత రాజుల నుంచి కప్పం వసూలు చేయడంలో నిర్ణయగా వ్యవహరిస్తాడు. అందువల్ల ఆయన ఇలాంటి ఆపద సమయంలో మిత్రుల సాయమర్ధించి భంగపడ్డాడు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తనను ఆదుకోగల వాళ్ళు ఎవరు? అని ఆలోచిస్తూ వుండగా రాజుగారికి తన పట్ట అచంచల భక్తివిశ్వాసాలు గల విరాట్‌ గుర్తొచ్చాడు. వెంటనే పల్లకీ ఎక్కి విరాట్‌ ఇంటికి వెళ్ళాడు. రాజుగారు పల్లకి దిగగానే విరాట్‌ సావ్టాంగ నమస్కారం చేశాడు. కాని విరాట్‌ ముందు రాజుగారు దీనంగా, యాచకుడిలా కనిపించాడు. తన సైన్యానికి నాయకత్వం వహించి శత్రువును ఎదుర్కోవలసిందిగా కోరాడు. విరాట్‌రాజుగారికి ప్రణామం చేసి “మీ ఆజ్ఞ శిరోధార్యం. విద్రోహాగ్నిని అణిచిగాని తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టను” అని ప్రతిజ్ఞ చేశాడు.

వెంటనే విరాట్‌తను కొడుకుల్ని, స్వజనుల్సి బానిసల్సి మిగిలిన 'సైనికుల్సి రాజభక్తుల్ని సమీకరించి శ(త్రువృపైకి యుద్ధానికి బయలుదేరాడు. అడవిగుండా ప్రయాణించి సూర్యాస్తమయ సమయానికి ఒక నదీ తీరానికి చేరుకున్నారు.

సరిగ్గా ఆ నది ఆవలి తీరాన్నే అసంఖ్యాకమైన శత్రుసేన విడిది చేసి వుంది. తమ సంఖ్యాబలం, వీరాధివీరులైన యోధులు కొందరు తమ సైన్యంలో వుండడంతో తమకు ఎదురులేదు, విజయం తమదేనన్న ధైర్యంతో వున్నారు. అందుకే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని మరునాటి ఉదయం నదిని దాటి కోటపై దాడి చేయవచ్చనే ఉద్దేశంతో వున్నారు. కొద్దిమంది మాత్రం మరునాడు నదిని దాటడానికి వీలుగా పెద్ద పెద్ద చెట్లను నరికి నదిపై వంతెన నిర్మిస్తున్నారు.

ఈవలి తీరాన విరాట్‌ సైన్యం మకాం వేసింది. విరాట్‌ ఒక పులిని వేటాడుతూ నదీ తీంాన్నే కొంత దూరం పోయినప్పుడు అక్కడ ఒక రేవు వున్నట్టు గుర్తించాడు. వెంటనే వచ్చి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. అర్థరాత్రి కాగానే తన సైన్యాన్ని తీసుకుని రేవు దాటి హఠాత్తుగా శత్రు సేనలపైకి విజృంభించాడు. విరాట్‌ సైనికులు మండుతున్న కాగడాల్లో ఏనుగుల్ని భయపెట్టి చెల్హాచెదురు చేశారు. అర్ధరాత్రి వేళ ఏనుగులు గందరగోళంగా పరుగిత్తడంతో నిద్ర నుంచి లేచిన శత్రువులు ఎవరి దారిన వాళ్ళు పరుగులు తీశారు.

రాజ్య కాంక్షతో యుద్దానికి సిద్ధపడ్డ రాజుగారి బావమరిది గుడారంలో వున్నాడు. అందరికన్నా ముందుగా విరాట్‌ ఆ గుడారంలోకి ప్రవేశించాడు. లోపలికి అడుగుపెట్టి పెట్టగానే ఇద్దరిని యనుపురికి పంపించాడు. మూడవవాడు ఆయుధం అందుకునేలోపే వాడిని తెగనరికాడు. ఆ చీకటిలోనే మరో ఇద్దరితో పోరాడి ఒకడి శిరస్సు ఖండించాడు. మరొకడిని బల్లెంతో పొడిచి పరలోకానికి పంపాడు. వాళ్ళంతా నిర్జీవులై కుప్పకూలాక్క, ఆ గుడొరంలో వున్న పవిత్ర రాజచిహ్నాలైన హంసల్ని ఎవరూ దొంగిలించుకుపోకుండా విరాట్‌ ఆ గుడారం

ర

వాకిలి దగ్గరే కాపలా కాశాడు. అయితే ఎవరూ రాలేదు. విజయోత్సాహంతో విరాట్‌ సైనికులు శత్రువుల్ని తరుముకువెళ్ళారు. కొద్ది "సేపటికి ఆ రణగొణ ధ్వని సద్దుమణిగింది. విరాట్‌ ఖడ్గం చేతబూన్సి తనతో వచ్చిన యోధుల కోసం నిరీక్షిస్తూ ప్రశాంతంగా గుడారం వాకిలి దగ్గర కూర్చున్నాడు.

కొంతసేపటికి అరుణోదయమయింది. సూర్యుడి నునులేత కిరణాలకు తాటిచెట్ల ఆకులు పసిడి ఎరువుతో ప్రకాశిస్తున్నాయి. నదిలో వాటి ప్రతిబింబాలు వెలుగుతున్న కాగడాల్తా అగుపిస్తున్నాయి. తూర్పున ఆకాశంపై పెద్ద గాయంలా, రక్తపు ముద్దలా కనిపిస్తున్నాడు సూర్యుడు. సూర్యోదయం కావడంతో విరాట్‌ అక్కడి నుంచి లేచి నది వద్దకు వెళ్ళాడు. తన దుస్తుల్ని తీరాన వుంచి నీళ్ళల్లోకి దిగాడు. చేతికి, ఒంటికి అయిన రక్తాన్ని నీళ్ళతో కడుక్కున్నాడు. చేతులు చాపి భగవంతుణ్ణి ప్రార్ధించాడు. ప్రభాత సంధ్య ధవళ కాంతిలో ఒడ్డుకుచేర్కి దుస్తులు ధరించాడు. రాత్రి చీకట్లో జరిగిన యుద్ధంలో ఎవరెవరు చనిపోయిందీ గమనించడానికి విరాట్‌ గుడారం వద్దకు వెళ్ళాడు,

అక్కడ దృశ్యం బీభత్సంగా వుంది. శవాల కళ్ళు తెరుచుకుని వున్నాయి. ముఖాలు భయంతో బెదెరిపోయినట్లున్నాయి. రాజుగారి బావమరిది తల ఒకచోట తెగి పడివుంది. మరోపక్కన వీరవాఘ సేనాపతిగా వుండి శత్రువుతో చేతులు కలిపిన రాజద్రోహి, గుండెల్లో కత్తిపోటుతో చచ్చి పడివున్నాడు. విరాట్‌ ఆ శవాల కళ్ళను మూశాడు. రాత్రి తాను చంపిన మిలిగినవాళ్ళ శవాలను చూడడానికి ముందుకు నడిచాడు. కొన్ని శవాల ముఖాల మీద దుస్తులు పడి వాటిని గుర్తించడం కొంచెం కష్టమయింది. రెండు శవాల్ని విరాట్‌ గుర్తించలేకపోయాడు. వాళ్ళు అపరిచితులు. బహుశా వాళ్ళు విద్రోహి బానిసలై వుండవచ్చు.

ఆ శవాలను చూస్తూ ముందుకు సాగుతున్న విరాట్‌ చివరన పడివున్న శవాన్ని చూసి న్ఫోస్టుడిపోయాడు. విరాట్‌ కళ్ళు మసకలు బారాయి. శరీరం అదుపు దప్పింది. స్పృహ తప్పినంత పనయింది. ఆ శనం తన అన్న బేలంగర్‌ది. అతనాక పర్వతరాజు, ఆ విద్రోహికి

యుద్ధంలో సాయపడటానికి వచ్చాడు. చీకట్లో అన్నని గుర్తించలేక చంపేశాడు. కొన వూపిరితో వున్నాడేమో రక్షించుకుందామని వంగి గుండె కొట్టుకుంటుందేమోనని చూశాడు. కాని అది శాశ్వతంగా ఆగిపోయింది. అతని ప్రాణవాయువులెప్పుడో గాలిలో కలిసిపోయాయి. కాని అతని నల్లని మెరుస్తున్న నేత్రాలు విరాట్‌ హృదయాన్ని చీలుస్తున్నట్టు చూస్తున్నాయి. విరాట్‌ అతి కష్టంమీద ఊపిరి పీల్చుకోగలిగాడు. నీరసంగా ఆ శవాల మధ్య కూలబడ్డాడు. ఆ శవాల మధ్య తానూ ఒక శవంలా అనిపించిందతనికి. తనను అపరాధిలా, హంతకుడిలా నిలదీస్తున్న తన అన్న చూపులను తట్టుకోలేక తన దృష్టి మరోవెపుకు మళ్ళించాడు.

కొద్దిసేపటికి దగ్గరలో సైనికుల కేకలు వినిపించాయి. వాళ్ళ హృదయాల్లో ఆనందం ఉప్పాంగుతోంది. దోచుకున్న సంపదతో వాళ్ళు పక్తుల్లా ఎగిరి గంతులేస్తున్నారు. విద్రోహి, అతని అనుచరులు హతమై, రాజహంసలు క్షేమంగా లభించినందుకు ఆనందంతో విరాట్‌

7

దుస్తుల్ని ముద్దుపెట్టుకున్నారు. సంతోషంతో నృత్యం చేశారు. విరాట్‌ లాంటి యోధుడు లేడని, వీరాధివీరుడని జయజయ ధ్వానాలు చేశారు. సైనికులంతా తిరిగి రాగానే వాళ్ళు దోచుకున్న సంపద నంతటినీ బళ్ళపై పేర్చించారు. ఆ బరువుకు బళ్ళ చక్రాలు నేలలోకి కుంగిపోయాయి. ఈ బళ్ళను లాగడానికి అదనంగా మరికొన్ని దున్నల్ని కట్టారు. రాజుగారికి ఈ విజయవార్త అందజేయడానికి ఒక వార్తాహరుణ్ణి ముందుగా పంపారు. మిగిలిన వాళ్ళంతా విజయోత్సాహంతో ఈ బళ్ళ వెంట నడిచారు. అందరూ ఆనంద పరవశులై వుంటే విరాట్‌ వూ(త్రం నిర్లిప్తంగా, కళ్ళ వముందు జరుగుతున్నదంతా స్వప్పంలా చూస్తూ కూర్చున్నాడు. సైనికులు శవాల దుస్తులు తొలగించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం పెదవి విప్పాడు. వద్దని వారించాడు. శవాలను దహనం చేయడానికి చితులు 'పేర్చవలసిందిగా కోరాడు. శత్రువుల శరీరాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దబకు వెయ్యాల్సిందిపోయి, వాళ్ళ పట్ల ఆయన దయ చూపిస్తున్నందుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పినట్టు చేశారు. విరాట్‌స్వయంగా ఆ చితులకు అగ్ని సంస్కారం గావించాడు. చితులు పూర్తిగా మండి, నిప్పు కణికలు బూడిదై నేలమీద కలిసిపోయేదాకా తల వంచుకుని విరాట్‌ అక్కడే నిలబడిపోయాడు. ఈలోగా విరాట్‌ సైనికులు, నిన్న శత్రు సైనికులు సగం నిర్మించిన వంతెనను పూర్తిచేశారు. మొదట కొంతమంది యోధులు వంతెన దాటారు. తరువాత బానిసలు, ఆ తరువాత ఆశ్వికదళ సర్దారులు వంతెన దోటారు. అంతకు ముందే విరాట్‌ చాలా మంది సైనికుల్ని పంపేశాడు. వాళ్ళ కేఠలకి, పాటలకి విరాట్‌ మానసిక స్థితికి పొత్తు కుదరలేదు. వంతెన మధ్య నిలబడి నదీ ప్రవాహాన్ని చాలాసేపు గవునించాడు. నదిని దాటిన వాళ్ళు, దాటుతున్న వాళ్ళు, దాటబోయేవాళ్ళు అంతా విరాట్‌ వంక ఆశ్చర్యంగా చూశారు. స్వర్షాన్ని సవాల్‌ చేస్తున్నాడా అన్నట్టు ఖడ్నాన్ని పైకెత్తాడు. కాని చెయ్యి కిందికి దించుతున్నప్పుడు చేతి వేళ్ళ పట్టు తప్పి ఖడ్గం నీళ్ళల్లో పడిపోయింది. పారపాటున ఖడ్గం నీటిలో జారిపడిందని, దాన్ని తీసుకురావడానికి నది ఇరు తీరాల నుంచి ఇద్దరు నీటిలోకి దూకారు. దాన్ని వెతికే ప్రయత్నం చేస్తుండగా విరాట్‌ వద్దని సైగచేసి వుందాుకు సౌగాడు. చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇళ్ళకు వెళుతున్నామన్న ఆనందంలో అంతా తలమునకలవుతుంటే విరాట్‌ మాత్రం అంతులేని వ్యధతో ఎవ్వరితోనూ పెదవి విప్పి మాట్లాడలేదు. వీరవాఘ సింహద్వారం ఇంకా చూపుకందని దూరంలో వుండగానే తెల్లని ధూళి మేఘాలు ముందుకు తరలి రావడం కనిపించింది. రాను రాను ధూళిమేఘాలు తెరిపినబడ్డాయి. ముందు పరుగున వస్తున్న సైనికులు, ఆశ్వికదళం కనిపించింది. సైన్యాన్ని చూడగానే వాళ్ళు ఆగారు. రహదారి మీద తివాచీలు పరిచారు. రాజుగారు దిగబోతున్నారు అనే దానికి ఇదో నిదర్శనం. జన్మించింది మొదలు మరణించేదాకా రాజుగారు జే

మట్టిపై పాదం మోపకూడదు. అందుకే తివాచీలు పరిచారు. కొద్దిసేపటికి గజారూఢుడై రాజుగారు వేంచేశారు. సైన్యం ముందుకు వచ్చి ఆ గజరాజు వంగాడు. రాజుగారు ఏనుగు అంబారీ పైనుంచి దిగి తివాచీ మీద నిలబడ్డారు. రాజుగారికి ప్రణమిల్లే ఉద్దేశంతో విరాట్‌ ముందుకు రాగానే రాజుగారే ముందుకు వెళ్ళి విరాట్‌ను ఆలింగనం చేసుకున్నారు. తక్కువస్థాయి వాళ్ళివరికీ ఇంతకు ముందు ఇలాంటి గౌరవం ఎప్పుడూ జరగలేదు. విరాట్‌ రాజహంసల్ని మహారాజుగారి ముందుకు తెప్పించాడు. ఆ హంసలు తమ తెల్లని రెక్కల్ని విదిలించే సరికి ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఆశబ్బాలకు గుర్రాలు బెదిరి వెనుక కాళ్ళమీద నిలబడ్డాయి. ఏనుగుల్ని అదుపులో వుంచడం మావటి వాళ్ళకు కష్టమైంది. ఈ విజయోత్సాహం మధ్య రాజుగారు విరాట్‌ను మరోసారి కౌగిలించుకున్నాడు.

తరువాత తమ పూర్వీకుల ఖడ్గాన్ని మోసుకువచ్చిన సైనికుణ్ణి పిలిచారు. అతని దగ్గర నుంచి రాజుగారు ఆ నిలువైన ఖడ్యాన్ని అందుకున్నారు. అది తము వంశ ప్రథమ రాజపుత్ర వీరుని ఖడ్గం. ఏడు వందల సంవత్సరాల నుంచి ఆ ఖడ్నాన్ని రాజుగారి ఖజానాలో భద్రంగా వుంచారు. వజ్రాలతో పొదిగిన దాని పిడి మిరిమిట్టుగొల్బుతున్నది. దాని అంచున విజయ సంకేత మంగళ వాక్యాలను సువర్గాక్షరాలతో లిభించారు. వాటిని సిద్దులు, మహాపండితులు మాత్రమే చదవగలరు. అలాంటి విశిష్ట ఖడ్నాన్ని విరాట్‌ పట్ల కృతజ్ఞతా సూచకంగా, ఇకనుంచి తన సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగిస్తున్నదానికి గుర్తుగా విరాట్‌కు బహూకరించబోయారు.

కాని విరాట్‌ వినయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ “మహారాజా తమరు అత్యంత దయామయులు. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరవచ్చా?'' అని అడిగాడు.

“ఆ కోరిక ఏమిటో చెప్పక ముందే దాన్ని అను[గ్రహిస్తున్నాను. నువ్వు కోరుకుంటే నా అర్ధరాజ్యం ఇవ్వడానికైనా సిద్ధమే'' అన్నారు.

“అయితే మహారాజా ఈ ఖడ్నాన్ని తిరిగి ఖజానాకు పంపండి. ఈ యుద్ధంలో నా సొంత అన్ననే చేజేతులా చంపుకున్నాను. చూ తల్లికి మేమిద్దరమే బిడ్డలం. నాతోపాటే అతన్నీ పెంచింది మా అమ్మ. అతన్ని చంపేశాను. అతను నా అన్న అని తెలిశాక జీవితంలో ఇక ఎప్పుడూ కత్తి పట్టనని మనస్సాక్షి గా ప్రమాణం చేశాను” అని వినయంగా చెప్పాడు విరాట్‌.

మహారాజుగారు ఆశ్చర్యంగా విరాట్‌ వైపు చూసి “అలాగే. నువ్వు యుద్ధం చేయనవసరం లేకుండానే నా సేనాధిపతిగా వుండు. నువ్వు వున్నంత కాలం శత్రువుల నుంచి నాకు ఎలాంటి భయమూ వుండదు. నువ్వు కొబట్టే ఇంత తక్కువ సైన్యంతో నీ తెలివితేటల నుపయోగించి అంత బలమైన శత్రువుని జయించగలిగావు. నా ఆజ్ఞను మన్నించి ఈ ఖడ్నాన్ని తీసుకో. ఇది అధికారానికి చిహ్నం. నా గుర్రాన్ని కూడా నువ్వు తీసుకో. ఈ ఈటెను తీసుకో. దీని ద్వారా నువ్వు సర్జారులందరికీ సర్దారువనేది అర్థమవుతుంది" అన్నారు.

“మహారాజా నా సోదరుణ్ణి చంపాక ఏదో అదృశ్య శక్తి నా హృదయంలో ఓ ఆలోచనను శేపింది. ఇక నుంచి ఎవరిని చంపబోయినా నా సోదరుడి లాంటి వాణ్ణి చంపుతున్నాననే భావం

శ

నాలో కలుగుతుంది. ఇక నుంచి నేను యుద్ధాలు చెయ్యలేను. ఖడ్గం బలానికి చిహ్నం. బలం సత్యానికి విరోధి. ఇతరుల్ని భయపెట్టాలన్న కాంక్ష నాకు లేదు. ఇతరుల్ని భయపెట్టి విలాసంగా బతికేకన్నా భిక్షమెత్తుకుని బ్రతకడం మంచిదని నేను భావిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. మిగిలిన ఈ శేష జీవితాన్ని చెడుకు దూరంగా గడపాలని కోరికి* అని ఎంతో వినయంగా విన్నవించుకున్నాడు విరాట్‌.

అది విన్న మహారాజు ముఖం కళావిహీనమై, చిన్నబోయింది. రాజుగారి మనసులో విజయోత్సాహం స్టానంలో తెలియని భీతి ఆవహించింది. తన పూర్వీకుల కాలం నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏ యోధుడూ యుద్దాన్ని త్యజించలేదు. ఎవ్వరూ మహారాజుగారి బహుమానాన్ని ఇలా తిరస్కరించలేదు. ఏం చెయ్యాలో రాజుగారికి పాలుపోలేదు.

శత్రువుల నుంచి విరాట్‌ కాపాడి తీసుకువచ్చిన రాజహంసల్ని చూశాడు. విజయ చిహ్నమైన వీటిని చూడగానే రాజుగారి ముఖంలో వెలుగొచ్చింది.

“శత్రువులతో పోరాడడంలో నువ్వు వీఠాధివీరుడివని గుర్తించాను. ఇక నుంచి యుద్దానికి నీ సహాయ సహకారాలు లభించకపోయినా ఫరవాలేదు. నీవంటి నమ్మకస్తులైన ప్రభుభక్తులు రాజ్యంలో ఎవ్వరూ లేరు. నీ సేవలు నాకు కావాలి. నీవు ధర్మబద్భుడవు. చెడుజోలికి పోవు. చెడును గుర్తించగలవు. చెడును నిర్మూలించ గలవు. కాబట్టీ ఇకనుంచి నువ్వు న్యాయాధికారులందరిపై ప్రధాన న్యాయాధికార్షివై నా రాజభవనంలోనే వుండి న్యాయ నిర్ణయం చేస్తూ వుండు. నీ నేతృత్వంలో నా రాజ్యంలో సత్యం వెలుగొందుతుంది. ప్రజలు న్యాయబద్ధంగా నడుచుకుంటారు”' అని అన్నారు మహారాజు.

దానికి విరాట్‌ అంగకార పూర్వకంగా భక్తితో శిరస్సు వంచాడు. రాజుగారు సంతోషించి విరాట్‌ను రాచ ఏనుగు నెక్కవలసిందిగా ఆదేశించారు. విరాట్‌తో కలసి రాజుగారు తన అర్వవై స్తంభాల నగరంలోకి ప్రవేశించాడు. అప్పుడు తుఫాను సమయాన సముద్ర ఘోషలాగా విజయ నినాదాలు, హర్షధ్వానాలు వినిపించాయి.

శర 3

ఆరోజు నుంచి విరాట్‌ ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తవ్వుయం దాక రాజభవనంలోని తన న్యాయపీఠం నుంచి రాజుగారి పేరిట న్యాయ నిర్ణయం చేయసాగాడు. ఆయన తీర్పులు ధర్మకాటాతో తూచినట్లు వుండేవి. వైపూ మొగ్గకుండా త్రాసు సమంగా వున్నట్లు వుండేవి, మెరుస్తున్న ఆయన కళ్ళు ముద్దాయి ఆత్మను లోతుగా శోధించేవి ఆయన

వేసే ప్రశ్చలు అపరాధపు మూలాల దాకా చొచ్చుకుపోయేవి ఆయన విధించే శిక్షలు కరినంగా

వుండేవి, కానీ ఎప్పుడూ విచారణ రోజే తీర్చు చెప్పేవాడు కాదు. ప్రశాంతంగా అలోచించడానికి

ఒకరోజు సమయం తీసుకునేవాడు. ఏ విషయంపైన అయినా ఆరోజు తీర్పు చెప్పదలుచుకుంటే

ఆరోజు తెల్లవారు రూమునే నిద్ర లేచేవాడు. మనసును ప్రశాంతంగా వుంచుకుని మేడ ళల

మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ తను చెప్పబోయే తీర్చు అన్నివిధాలా న్యాయబద్ధమైనదా కాదా, సమంజసమైనదా కాదా అని పలు విధాలుగా ఆలోచించేవాడు. ఆయన మేడమీద నడుస్తూ వుంటే ఆయన పాద ధ్వని ఇంట్లోని వాళ్ళకు వినిపించేది. తీర్పు చెప్పే ముందు భావావేశానికి లోను కాకుండా వుండడం కోసం మరోసారి చేతులు, కాళ్ళు చల్లని నీళ్ళతో కడుక్కునేవాడు. తీర్పు చెప్పాక తన తీర్పు సమంజసంగా వుందా లేదా చెప్పమని ముద్దాయిని అడిగేవాడు. నూటికో కోటికో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆయన తీర్చును శిరసావహించేవారు. న్యాయపీఠం మెట్లను ముద్దుపెట్టుకుని, ఆ తీర్పును దైవ నిర్ణయంగా స్వీకరించేవాళ్ళు. విరాట్‌ ఎప్పుడూ, ఎవరికీ మరణశిక్ష విధించలేదు. ముద్దాయి ఎంత (క్రూరుడైనాా ఎంత పెద్ద నేరం చేసినా మరణ దండన మాత్రం విధించేవాడు కాదు. తన జీవితాన్ని రక్తసిక్తం చేసుకోవాలంటే భయపడేవాడు. విరాట్‌ న్యాయాధికారి కొక పూర్వం ఆ రాజ్యపు వభ్యస్థలిలో వున్న బండలన్నీ మరణదండనకు గురైన వ్యక్తుల రక్తంతో నలుపెక్కాయి. విరాట్‌ న్యాయాధికారి అయ్యాక ఒక్క మరణశిక్షా లేక వర్షాలకు ఆ రక్తపు చారికలు కొట్టుకుపోయి బండలు తెలుపెళ్కాయి. మరణశిక్షలు మానేసిన తర్వాత నేరాల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. నేరస్తుల్ని భూగర్భంలో తొలిచిన కారాగారానికి పంపేవాడు. లేదా కొండల మీదికి పంపి వాళ్ళ చేత తోటల ప్రహరీలకు కావలసిన రాళ్ళను కొట్టించేవాడు. మరికొందరిని నధీ తీరాల్లో వున్న బియ్యం మరల్లో ఏనుగుల జతన కట్టి చక్రాలను తిప్పించేవాడు. మానవ జీవితాన్ని ఆయన గౌరవించేవాడు. ప్రజలు ఆయన్ని గౌరవ భావంతో చూసేవారు. ఆయన తీర్పులెప్పుడూ అధర్మంగా లేకపోవడం కూడ దీనికొక కారణం. సత్యాన్వేషణలో ఆయనెప్పుడూ అలిసిపోయేవాడు కాదు. ఆయన పలుకులెప్పుడూ పరుషంగా వుండేవి కాదు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతులు తమ తగాదాల్ని పరిష్కరించుకోవడానికి విరాట్‌ దగ్గరకు వచ్చేవాళ్ళు. పూజారులు కూడ ఆయన ఆజ్ఞల్ని శిరసావహించే వారు. మహారాజు సైతం విరాట్‌ సలహాలు తీసుకునేవారు. పోనుపోను విరాట్‌ ఖ్యాతి రాజ్యమంతా వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ఆయన వీరుడు, అసమాన యోధుడు అని తాము పొగిడిన విషయం ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో ఆయన ఇప్పుడు యోధుడు కాదు, ఉత్తమ న్యాయాధికారి. ధర్మదేవత లాంటి న్యాయమూర్తిగా పేరు పాందాడు. విరాట్‌ న్యాయాధికారిగా నియమితుడై ఆరేళ్ళు అయింది. ఒకరోజు కొంతవుంది (గ్రామీణులు ఒక కొాండజాతి యువకుణ్ణి తాళ్ళతో బంధించి విరాట్‌ముందుకు లాక్కొచ్చారు. ఈ కొండజాతి వాళ్ళు పర్వతాలకు అవతలివైపున వుండేవాళ్ళు. వాళ్ళు పూజించే దేవుళ్ళు వేరు. ఈ యువకుడి కాళ్ళు రక్తసిక్తంగా వున్నాయి. ఆ గామీణులు ఇతన్ని బంధించి మైళ్ళకు మైళ్ళు నడిపించినట్టున్నారు. అతనిది కండరాలు తిరిగిన ఒళ్ళు. చాలా బలిష్టంగా వున్నాడు, 7

అతని కళ్ళు నిప్పులు కురిపిస్తూ వున్నాయి. బలమైన అతని బాహువుల్ని తాళ్ళతో గట్టిగా బిగించి కట్టేశారు. లేకపోతే అతన్ని అదుపులో వుంచడం వాళ్ళ వల్ల కాదు. ఆ యువకుణ్ణి వాళ్ళు న్యాయపీఠం ముందుకు తోసి బలవంతం మీద అతను మోకరిల్లేలా చేశారు. ఆ తరువాత వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. న్యాయాన్ని అర్ధించడానికి వచ్చాం అన్నట్టుగా చేతులు జోడించి నిలబడ్డారు. విరాట్‌ ఆ అపరిచితుల వంక ప్రశ్నార్థకంగా చూసి, అడిగాడు “సోదరులారా మీరెవరు? చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మీరు బంధించి తెచ్చిన ఈ వ్యక్తి ఎవరు?” వచ్చిన వాళ్ళల్లో పెద్దతను ముందుకు వచ్చి చేతులు జోడించి '" ప్రభూ, మేము మందలు మేపుకునే వాళ్ళం. ప్రశాంతంగా బతికే తూర్పు ప్రాంత నివాసులం, మేం మీ ముందుకు తెచ్చిన ఈ యువకుడు దుష్టుల్లోకెల్ల మహాదుష్టుడు. మహాసాపి. వేళ్ళమీద లెక్కపెట్టలేనంత మందిని అతను హత్యచేశాడు. మా [గ్రామంలోని ఒక అమ్మాయిని తనకిచ్చి పెళ్ళిచేయవలసిందిగా కోరాడు. అందుకు ఆ అమ్మాయి తండ్రి అంగీకరించలేదు. దానికి కారణం వీళ్ళ జాతి నీతి నియమాలు, ఆచారాలు. వీళ్ళు గోవుల్ని వధిస్తారు. కుక్క మాంసం తింటారు. అందువల్ల తన కూతుర్ని ఇతనికి ఇవ్వకుండా లోయపస్రాంత వ్యాపారి ఒకతనికి ఇచ్చి పెళ్ళిచేశాడు, ఆ కోపంతో ఇతను మా గ్రామ పశువులెన్నింటినో తోలుకుపోయాడు. ఒకరోజు రాత్రి వచ్చి ఆ అమ్మాయి తండ్రిని, ఆయన ముగ్గురు కొడుకుల్ని చంపేశాడు. ఆరోజు నుంచి ఆ కుటుంబంలో వాళ్ళు గాని, మా గ్రామంలో వాళ్ళు గాని పశువులు మేపుకోడానికి పర్వత ప్రాంతానికి వెళితే పట్టుకుని చంపేసేవాడు. అలా ఇప్పటికి పదకొండు మందిని చంపేశాడు. చివరకు మేమంతా కలిని వెంటాడి ఎంతో కష్టపడి ఇతన్ని పట్టుకోగలిగాం. ఎంతో శ్రమకోర్చి మీ సమక్షానికి తెచ్చాం. ఓ ధర్మదాతా ఈ హంతకుడి బారినుంచి మమ్మల్మీ మా (గ్రామాన్నీ రక్షించండి” అన్నాడు వినయంగా. విరాట్‌ తల ఎత్తి ఆ యువకుని వైపు చూశాడు. “వాళ్ళు నీ గురించి చెప్పింది నిజమేనా” అని ప్రశ్నించాడు. “ఎవరు నువ్వు? మహారాజువా?” “నా పేరు విరాట్‌: రాజుగారికి న్యాయానికి 'సేవకుణ్ణి. నా పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సత్యాన్ని అసత్యం నుంచి వేరు చేయాలని నా కోరిక.” ముద్దాయి ఒక్క క్షణం మౌనంగా వుండి, తరువాత విరాట్‌ వైపు తీక్షణంగా చూశాడు. “ఎక్కడో దూరంగా న్యాయపీఠం మీద కూర్చుని ఏది నిజమో, ఏది అబద్ధమో నువ్వెలా తెలుసుకుంటావ్‌. ఇక్కడికి వచ్చినవాళ్ళు చెప్పినదాన్ని బట్టేగా నీకు తెలిసేది?” “వాళ్ళ ఆరోపణలకు నీ సమాధానమేమిటో చెప్పు. మీరు ఇద్దరూ చెప్పిన దాన్ని బట్టి నిజమేదో నేను గ్రహిస్తాను.”' 7జి

ధిక్కార ధోరణిలో ఆ యువకుడు కనుబొములెగరేశాడు.

“నేనేమి చేశానో నీకెలా తెలుస్తుంది. వీళ్ళతో నాకు విరోధం లేదు. కోపం హద్దులు దాటినప్పుడు నా చేతులు ఏం చేస్తాయో నాకే తెలియదు. కూతురి డబ్బు కోసం అమ్మేసిన ఆ తండ్రీ పట్ల, అతని పిల్లల పట్ట, ఆతని నౌకర్ల పట్ట న్యాయంగానే నేను చెయ్యాల్సింది చేశాను. అది నేరంగ్కా నన్ను నేరస్తుడిగా వీళ్ళు ఆరోపించదలుచుకుంటే ఆరోపించనీ. వాళ్ళనీ, నీ తీర్చునీ నేను ద్వేషిస్తాను”.

అపరాధి ఇంత గొప్ప న్యాయాధికారి సమక్షంలోనే ఎంతో అహంకారంతో ప్రవద్దించడం చూసి ఆ గ్రామీణులు కోషంతో ఊగిపోయారు. బంట్రోతు కొరడా రుళిసించాడు. విరాట్‌

సైగలతో అందరినీ శాంతపరచి, మళ్ళీ ప్రష్టెంచొడు. వాళ్ళు ఒక్కో నేరాన్ని చెప్పినప్పుడల్లా విరాట్‌ ముద్దాయిని సంజుయిషీ అడిగేవాడు. ముద్దాయి దేనికీ సమాధానం చెప్పకుండా పళ్ళు పట పట కొరికి మౌనం వహించేవాడు. ఒకే ఒక్కసారి చూత్రం అతను నోరు విప్పి “' ఇతరుల చమూటబు విని నీవెలా న్యాయాన్ని తెలుసుకుంటావా” అని ప్రళ్చించాడు. మిట్ట మధ్యాహ్నానికి నేరం వూర్వాపరాలు వినడం ముగిసింది. విరాట్‌ న్యాయపీఠం నుంచి లేస్తూ “నేను ఇంటికి వెళుతున్నాను. తీర్చు రేపు చెబుతాను” అన్నాడు. అందుకు (గ్రామీణులు చేతులు జోడించి “ప్రభూ, తము దయా భిక్ష కోసం ఇక్కడికి ఛావడానికి ఏడు రోజులు ఎడజెగని ప్రయాణం చేశాం. తిరిగి వెళ్ళడానికి మురో ఏడు రోజులు పడుతుంది. ఆలన పొలన లేక మా పశువులు దప్పికలో అలమటించి పోతుంటాయి. పాలాలు చుక్కులు దున్నుకోవాలీ మా యెడల దయబేని తీర్పును రేసటిదాకా వాయిదా వెయ్యకుండా ఇప్పుడే చెప్పండి” అని వేడుకున్నారు. వాళ్ళు చెప్పింది విని విరాట్‌ ఆలోచిస్తూ కొద్దిసేపు అలా మౌనంగా కూర్చున్నాడు, పెద్ద బరువు నెత్తిన ఎత్తుకున్న వాడిలా కనుబొములు వాలిపోయి వున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా, భయం అంటే తెలియని వాడిని, క్షమాభిక్ష కోరని వాడని శిక్షంచాల్సిన అవసరం విరాట్‌కి ఏనాడూ రాటేదు. చాలాసేపు అబోచనల్లో ముగినిపోయాడు. సమయం గడిచేకొద్దీ ఆయనకు విచారం ఎక్కువ కొసాగింది. తన తీర్చు, తన మాటలు ఆవేశంగా వుండకూడదని టేచి సెలయేటి దగ్గరకు వెళ్ళి చల్లటి నీళ్ళతో ముఖం, కాళ్ళు కడుక్కున్నాడు. ప్రశాంతంగా వచ్చి న్యాయసీఠరం మీద కూర్చున్నాడు. “నా తీర్పు న్యాయసమ్మతంగా వుండేట్లు భగవంతుడు అను(గ్రహించు గాక! పదశొండు మంది చమునుషుల ప్రాణాలు తీసిన మహాపాపం ఈ ముద్దాయిని చుట్టుకుంది. సుమూరు సంవత్సరం పాటు మానవ జీవితం తల్లి గర్భంలో పోషింపబడుతుంది. ఇతను పదకొండు మందిని చంపాడు. ఒక్కొక్కరి కోసం ఒక్కో సంవత్సరం వంతున ఇతను పదకొండు సంవత్సరాలు భూగర్భపు అంధకారంలో వుండాలి. పదకొండు మందిని హత్యచేశాడు గనుక తొ

ప్రతి సంవత్సరం పదకొండుసార్లు ప్రతిసారీ వంద కొరడాదెబ్బలు కొట్టవలసిందిగా శిక్ష విధిస్తున్నాను. దీని ద్వారా ఇతను తను చేసిన పొపానికి ప్రాయళ్చిత్తం చేసుకోగలుగుతాడు. కాన్ని జీవించే హక్కును మాత్రం కోల్పోడు. జీవితం భగవంతుని అనుగ్రహం. దానిపై మానవుడికి అధికారం లేదు. ఇతని అపరాధానికి తగిన విధంగా నేను ప్రకటించిన ఈ తీర్చు న్యాయబద్ధం అయ్యేట్టు భగవంతుడను(గ్రహించుగాకి' అన్నాడు.

తీర్పు వినగానే (గ్రామీణులు న్యాయపీరం మెట్లను ముద్దుపెట్టుకున్నారు. ముద్దాయి మాత్రం మౌనం వహించాడు.

“చూడు, నీమీద ఆరోపించబడిన నేరాలకు నీ సంజాయిషీ ఇచ్చుకోవలసిందిగా కోరాను. నువ్వు పెదవి విప్పలేదు. నీ శిక్షను తగ్గించే అవకాశాన్ని నువ్వివ్వలేదు. ఒకవేళ నా తీర్పులో ఏదైనా దోషం వుంటే, నీకు అన్యాయం జరిగితే పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడి ముందు అదినా తప్పు కాదని, నీ మౌనం తాలూకు దోషమని చెప్పు. నీపట్ల నేను కొంత దయ చూపించాను. అదే నాకు సంతోషం.”

ముద్దాయి అప్పుడు నోరు విప్పాడు. “నీ దయ నాకు అక్కరలేదు. ఒక్క క్షణంలో నా నుంచి నా జీవితాన్ని నువ్వు హరిస్తున్న దానితో పోలిస్తే నువ్వు చూపగలిగే దయ ఏపాటిది?”

“నేను నీ జీవితాన్ని హరించడం లేదు.”

“నిజంగానే నువ్వు నా జీవితాన్ని హరిస్తున్నావ్‌. అడవి మనుషులని పిలిచే చూ జాతి వాళ్ళకన్నా నువ్వు నిర్ణయగా ప్రవర్తిస్తున్నావు నేను వాళ్ళను చంపాను. నువ్వూ నన్ను చంపెయ్‌.

కాని నువ్వు నన్ను ఒక్కసారిగా చంపవు. శవప్రాయంగా నన్ను అంధకార భూగృహంలో పాతిపెడతావు. ఏళ్ళకు ఏళ్ళు నేనక్కడ కుళ్ళిపోతూ వుండాలి. ఎందుకలా చేస్తావు? నీ పిరికి హృదయం రక్తపాతాన్ని తట్టుకోలేదు. అందుకే ఇలాంటి తీర్పులు ఇస్తున్నావు. నీ తీర్పులకు ప్రజలు బలి అవుతున్నారు. నీ చట్టం కూడ మోసం, నేను హత్య చేశాను గనుక నువ్వు కూడ నన్ను హత్య చెయ్‌” అన్నాడతను ఆవేశంగా,

“నేను నీకు సరెన శిక్షే విధించాను.”

““స్టైనదా? దేని ప్రకారం స్రైనది? ఓ న్యాయమూర్తీ, ఏ ప్రమాణాలతో నువ్వు న్యాయాన్ని నిర్ణయిస్తున్నావో ఆ ప్రమాణాలకు ప్రమాణం ఏమిటి? కొలబద్ద ఏమిటి? కొరడా దెబ్బల్ని శిక్షగా విధించావు. కొరడా దెబ్బ ఎలా వుంటుందో నీకు తెలుసా? నువ్వెష్పుడన్నా కొరడా దెబ్బ తిన్నావా?

వెలుపల వెలుగులో, మారే ప్రపంచంలో మారుతున్న కాలంతో పాటు పదకొండు సంవత్సరాలని వేళ్ళపై లెక్కిస్తూ గడపగలిగినట్టు భూగృహపు చెరసాలలో అంధకారంలో, ఒంటరిగా, ప్రకృతికి వెలుగుకి దూరంగా, కాలం తెలియకుండా జీవచ్చవంలా గడపగలవా? నా జీవితంలో ఎన్ని మధుర వసంతాల్ని హరిస్తున్నావో తెలియడానికి నీవెప్పుడైనా చెరసాల జీవితం గడిపావా? నీవు అజ్ఞానివి. దెబ్బతిన్నవాడే దెబ్బ బాధ ఏమిటో తెలుసుకోగలడు. దెబ్బలు

నే

కొద్దేవాడికి, దెబ్బలు తినేవాడి కష్టాలు తెలియవు. బాధలు పడ్డవాడికే బాధ విలువ తెలుస్తుంది.

అపరాధికి సరెన శిక్ష విధించానని నువ్వు గర్విస్తున్నావు. కాని అపరాధులందరి కన్నా నువ్వే పెద్ద అపరాధివి. నేను ఆవేశంలో హత్యలు చేశాను. అప్పుడు నన్ను ఒళ్ళు తెలియని ఆవేశ పిశాచం అవరించి వుంది. కానీ నువ్వో! ప్రశాంతంగా వుండి నా ప్రాణాల్ని హరిస్తున్నావు. దాని ఫలితాన్ని నువ్వెప్పుడూ అనుభనించలేదు. తలకిందులై పడిపోకముందే నువ్వు న్యాయపీఠం నుంచి దిగిపో! తెలిసిన దాన్ని బట్టి నిర్ణయాలు చేసేవాడు పరమ నీచుడు. న్యాయమంటే ఏమిటో తనకు తెలుసనుకునే వ్యక్తి కూడ దుష్టుడే. ఓ అజ్ఞానీ! ఆ న్యాయపీఠం నుంచి దిగు. ఒక్క మాటతో జీవితాల్సి హరించే తీర్పులు చెప్పబోకు.”” దోషి కోపంతో కంపించి పోయాడు.

చుట్టూ వున్నవాళ్ళు కోపంతో దోషి మీద విరుచుకు పడబోయారు. విరాట్‌ వాళ్ళను శాంతింపజేసి, దోషి వైపు నుంచి దృష్టి పక్కకు మళ్ళించి “ఇచ్చిన తీర్చును రద్దుచేసే హక్కు నాకు లేదు. నా నిర్ణయం సరైనదేనని నేను నమ్ముతున్నాను” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళేందుకు లేచి నిలబడ్డాడు. వాళ్ళు ఖైదీని గట్టిగా పట్టుకున్నారు. బంధనాల్లోంచి అతను గుంజుకోసాగాడు.

విరాట్‌ కొద్ది అడుగులు ముందుకు నడిచి, ఆగాడు. అగి అతనివైపు చూశాడు. అతడు క్రోధంతో విరాట్‌ వైపు చూస్తున్నాడు. ఆ చూపులకు విరాట్‌ చలించి పోయాడు. అ కళ్ళు సరిగ్గా తన సోదరుడి కళ్ళలాగే వున్నాయి. ద్రోహుల శిబిరంలో తన చేత చంపబడ్డ అన్న కళ్ళు ఎలా క్రోధంగా తన వైవు చూశాయో, అలాగే తన చేత శిక్షింపబడిన ఈ ఖైదీ కళ్ళు క్రోధంతో తనను చూస్తున్నాయి. విరాట్‌ మనసు వికలమైపోయింది.

ఆరోజు సాయంత్రం ఎవరితో ఏం మాట్టాడలేదు. ఆ ఖైదీ చూవులు అగ్ని బాణాల్తాగా విరాట్‌ హృదయాన్ని దహించివేస్తూ వున్నాయి. రాత్రంతా ఆయన నిద్రపోనేలేదు. తూర్పు దిక్కు ఎ(ర్రబారే దాకా రాత్రంతా మేడ మీద ఆయన పచార్లు చేస్తూనే వున్నాడు. ఆయన పాదాల చప్పుడు రాత్రంతా వినిపిస్తూనే వుంది.

సూర్యోదయం కాగానే, దేవాలయపు కోనేరులో విరాట్‌ నిత్యకర్మలు ముగించాడు. అనంతరం సూర్యుని వైపు తిరిగి ప్రార్ధన చేసి, ఇంటికి వచ్చాడు, ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే పసుపు పచ్చని దుస్తులు ధరించాడు. కుటుంబ సభ్యులందరికీ అభివందనాలు తెలియజేశాడు. ఈ కొత్త ఆచారాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కాని ఏమిటిదని అడిగే సాహసం ఎవరికీ లేదు. తరువాత విరాట్‌ ఒంటరిగా రాజభవనానికి వెళ్ళాడు. రాత్రింబవళ్ళు ఎప్పుడైనా రాజభవనంలోకి ప్రవేశించడానికి ఆయనకు అనుమతి వుంది.

రాజుగారి దగ్గరకు వెళ్ళగానే విరాట్‌, వినయంగా శిరస్సు వంచి రాజుగారి దుస్తుల్ని తొకాడు. ఆయనేదో కోరుకోబోతున్నాడనడానికి అది గుర్తు. మహారాజుగారు ఆత్మీయంగా విరాట్‌వైపు చూసి “నీవేదో కోరడానికి నా దుస్తుల్ని తాకాను. నీవు అడగక ముందే నీ కోరికను నేను అంగీకరిస్తున్నాను” అన్నాడు.

నే

విరాట్‌ తలవంచుకుని అలా నిలబడే వృండి “న్యాయా ధికారులపై ప్రధాన న్యాయాధికారిగా తమరు నన్ను నియమించారు. ఆరు సంవత్సరాల నుంచి తమరి పేరు మీద నేను న్యాయ నిర్ణయం చేస్తూ వచ్చాను. నేను సరైన న్యాయ నిర్ణయాలు చేశానో లేదో నాకు తెలియదు. సత్య మార్గాన్ని అన్వేషించేందుకు వీలుగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు గాను నాకొకనెల రోజులు సెలవు ఇప్పించండి. మీ నుంచి, ఇతరుల నుంచి నా సాంత అభిప్రాయాలు కాపాడుకునేందుకు అనుమతినివ్వండి. నేను అన్యాయ రహితమైన పనులు చేయాలనుకుంటున్నాను. పాపానికి దూరంగా బతకాలనుకుంటున్నాను”” అన్నాడు.

మహారాజు ఆశ్చర్యచకితుడైనాడు.

“ఈనాటి నుంచినా రాజ్యం న్యాయం లేక అనాధ అవుతుంది. నువ్వు ఏ మార్గాన్ని అనుసరించ దలుచుకున్నావు? అని కూడ నిన్ను అడగను, ఆ మార్గంలో నీకు సత్యదర్శనం కావాలని మాత్రం కోరుకుంటాను” అన్నాడు.

విరాట్‌ కృతజ్ఞతతో రాజసింహాసనాన్ని ముద్దాడి తలవంచుకుని వినయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

నే రే + అవతల నధ లార్యా బిడ్డల్ని దగ్గరకు పిలిచి '' ఒకనెల రోజులపాటు నేను మీకు వదిలి ఎటు వళుతి న అని నన్ను ప్రశ్నించకుండా నాకు వీడ్కోలివ్వండి. నేను ఇల్లు తలుపులు వేస్తుకోల వై కు తెలియకుండా వుండేందుకు మీరు మీమీ గదులకు వెళ్ళి

  • ఒక నెల రోజులు గడిచేదాకా నా ఉనికిని తెలుసుకునేందుకు ప్రయత్నించకండి” అన్నాడు.

లంతా మౌనంగా ఆయన చెప్పినట్టు చేశారు. బయలుదేరాడు. పెద్ద కొండ దగ్గర. గ్రవరుచుకున్నాడు. చీకటి పడగానే ఇంటి నుంచి వెళ్ళి తలుపు కొట్టాడు విరాట్‌ చెరు ల్భాడు, ఆ కొండ అడుగునే చెరసాల వుంది, అక్కడికి

నను విరాట ా వే ల అధికారి నిద్ర లేచి “ఎవరూ?' అంటూ వచ్చాడు.

“భూ గు యూన 'న్యయాధికారిని నిన్న పంపిన ఖైదీని కలుసుకోవడానికి వచ్చాను". అక్కడికి తీసుకువెళ్ళముంటారా?” అన పొలౌళంలో వున్నట్టు వుంది. మిమ్మల్ని

ప ఇముంటారా? అన్నాడు వినయంగా,

వద్దు. ఆ స్ధలం నాకు తెలుసు. తాళం చెవి నాకివ్వు. నువ్వెళ్ళి నిద్రపో. రేపు ఉదయం నీ

ద్వారం చెంత ఈ తాళం చెవి నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నన్ను నువ్విక్కడ చూసినట్లు

ఎవ్వరితోనూ చెప్పకు,” స్ట

చెరసొల అధికారి విరాట్‌కు తాళం చెవి, ఒక దీపం తెచ్చిఇచ్చాడు. విరాట్‌ సైగ చేయడంతో నే

చెరసాల అధికారి వెళ్ళిపోయాడు. విరాట్‌ గుహ ద్వారం తెరిచి లోపలికి ప్రవేశించాడు.

ఒక శతాబ్దం క్రితం నుంచి రాజపుత్ర రాజులు ఖైదీలను ఈ కొండ గుహల్లో బంధించడం ప్రారంభించారు. ఈ బందీలు తర్వాత రాబోయే బందీల కోసం కొత్త గదుల్ని తొాలుస్తూ వుంటారు.

విరాట్‌ చివరిసారిగా ఒక్కసారి ఆకాశం వైపు చూశాడు. మినుకు మినుకు మనే నక్షత్రాలు, తెల్లనిమేఘాలు, నిర్మలమైన ఆకాశం కనిపించాయి. విరాట్‌ ముందుకు నడిచాడు. ద్వారాన్ని మూసివేశాడు. నలువైపులా గాఢాంధకారం. ఆ చీకటిలో దీపం వెలుగు కొద్ది దూరం మా(తం 'ప్రసరిస్తోంది. గాలికి చెట్ల కదలికల ధ్వని, కోతుల కిచకిచలు వినిపిస్తూనే వున్నాయి. మొదటి గుహ దాటి క్రిందికి పోగానే చెట్ల కదలికలు, బయటి శబ్బాలు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వినిపించినట్టుగా కొద్దిగా వినిపించాయి. మరిక్షొంచం క్రిందికి పోగానే అంతా నిశ్శబ్దంగా, చల్లగా వుంది. ఇంకొంచం కిందికి పోగానే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినట్టనిపించింది. భయంకరమైన నిశ్శబ్దం. రాళ్ళ నుంచి మాగుడు వాసన. ఇంకా కిందికి వెళుతున్న కొద్దీ ఆ నిశ్శబ్దంలో ఆయన అడుగుల చప్పుడు ఆయనకే కరోరంగా వినిపిస్తోంది.

ఆ ఖైదీ వున్న గది భూమి అడుగున వుంది. పైనుంచి పొడవాటి తాటి చెట్టు కన్నా ఇంకా లోతులో వుందా గది. ఆ అంధకారంలో విరాట్‌ దీపం పట్టుకుని ఆ గది దగ్గరకు వెళ్ళాడు. ఆవెలుగులో గుట్టగా పడివున్న ఒక ఆకారం కనిపించింది. ఈ వెలుగుకు కదిలినట్టనివించింది. ఆ తరువాత సంకెళ్ళ చప్పుడయింది.

విరాట్‌ ౪ ఆకారం మీదకు వంగి “నువ్వు నన్ను గృురించావా?'' అని ప్రల్చించాడు.

“మర్చిపోతేగా? నిన్నేగా ప్రజలు నా జాతక నిర్దేతను చేశారు. నా భవిష్యత్‌ను నీ కాళ్ళ కింద నలిపివేశావు గదా? నిన్నెట్లా మర్చిపోతాను.”

“నేను ప్రభువునుకాను. మహారాజుకు, న్యాయానికి సేవకుణ్ణు. న్యాయానికి పేవ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను.”

ఖెదీ విషాదంగా విరాట్‌వైపే చూస్తూ “నా నుంచి ఏం కోరుకుంటున్నాన్‌? '' అని అడిగాడు.

విరాట్‌ చాలా సేపుమౌనంగా వుండి “నా తీర్చు నిన్ను బాధించింది. అలాగే నువ్వు నీ పరుషమైన మాటలతో నా హృదయాన్ని గాయపరిచావు. నా తీర్చు సరైనదో కాదో నాకు తెలియదు. కానీ నీ మాటల్లో కూడా సత్యం వుంది. తనకు అనుభవం కాని శిక్షను ఇతరులకు విధించకూడదు. ఆ విషయంలో ఇంతవరకు నేను అజ్జానినే. సంతోషంగా ఇప్పుడది అనుభవం ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్ని వందల మందికి ఈ అంధకారవాస శిక్ష విధించి వుండవచ్చు. ఈ శిక్షలో వున్న బాధ ఏమిటో నాకు తెలియకుండా నేను చాలా మందికి ఈ శిక్ష విధించాను. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోగలనని నా ఆశ, దొని ద్వారా నా పాపం నుంచి నేను విముక్తిని పొందుతాను" అన్నాడు.

ఖైదీ ఆశ్చర్యంతో మౌనంగా వుండిపోయాడు. అతని సంకెళ్ళ ధ్వని తప్ప మరేమీ 77

వినిపించలేదు.

““నిన్ను శిక్షించాలని ఇక్కడికి పంపాను. ఆ శిక్ష ఎలా వృంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కొరడా దెబ్బ ఎంత బాధ కలిగిస్తుందో తెలుసుకోవడం కోసం నేనే స్వయంగా కొరడా దెబ్బలు తినాలనుకుంటున్నాను. చెరసాల జీవితం ఎలా వుంటుందో నేను స్వయంగా అనుభవించాలనుకుంటున్నాను.

ఒక నెల రోజులు నీకు బదులుగా నేను ఇక్కడ వుంటాను అప్పుడే నా తీర్పుల ద్వారా ఇతరులకు నేనెంత బాధ కలిగించానో అర్థం చేసుకోగలను. ఆ తరువాత నుంచి మాత్రమే మళ్ళీ న్యాయపీరం ఎక్కి తీర్పులిస్తాను. నా నిర్ణయంలో ఎంత బలముందో నాకప్పుడు అర్థమవుతుంది.

ఈలోగా నువ్వు స్వేచ్చగా బయటకు వెళ్ళు. నీకు తాళం బెవి ఇస్తాను. దాంతో నువ్వు ఈ కారాగారం నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఈ గాఢాంధకారం నుంచి బయటపడి వెలుగును చూడొచ్చు. ఒకనెల రోజులు నేను నీకు స్వేచ్చనిస్తున్నాను. నెల తరువాత నువ్వు తప్పక తిరిగి వస్తావని నాకు ప్రమాణం చెయ్‌. నువ్వు వస్తేనే నాకు ఈ పాతాళ అంధకారం నుంచి విముక్తి, నా జీవితానికి వెలుగు వస్తాయి” అన్నాడు విరాట్‌,

ఖైదీ న్చోష్టుడై శిలాష్రతిమలా నిలబడిపోయాడు. సంకెళ్ళ శబ్దం కూడ అతనికిప్పూడు వినిపించడంలేదు. “నువ్వు నాకు ప్రమాణం చెయ్‌. ఈనెల రోజులపాటు మౌనంగా వుంటానని, ఎలాంటి దుష్పృత్యాలకు పాల్పడనని నాకు మాటివ్వు, భగవంతుడు అన్నీ గమనిస్తూ వుంటాడని చుర్చిపోక్సు

నీకు నా దుస్తులు, తాళం చెవి ఇస్తాను. ఈ తాళం చెవిని చెరసాల అధికారి ద్వారం చెంత వదిలి వెళ్ళు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు పూర్తికాగానే ఈ ఉత్తరాన్ని మహారాజుగారిక్రివ్వు అప్పుడు నేను బంధవిముక్తుడనవుతాను ఇంకా సరైన తీర్చులిస్తాను. నా మాట ప్రకారం నడుచుకుంటానని నువ్వు పూజించే దేవుని పేరిట ప్రమాణం చెయ్యి అన్నాడు విరాట్‌

ఖైదీ ప్రమాణం చేశాడు. ఖైదీ గొంతు పూడుకుపోయి మాట సరిగ్గా పెగల్లేదు. అతనికంటో వింతగా వుంది, విరాట్‌ అతణ్ణి బంధ విముక్తుణ్ణి చేస్తి తన దుస్తులు అతనికి ఇచ్చి “ఈ దుస్తులు వేసుకో. నీ దుస్తులు నాకివ్వు, ముఖం కనబడనివ్వకు. చెరసాల అధికారి నిన్ను నేననుకుంటాడు. న్ను ఎవ్వరూ గుర్తించకుండా వుండేలా నా గడ్డం, జుట్టు కత్తిరించు.” అ ఖైదీ వణుకుతూ, అయిష్టంగా విరాట్‌ చెప్పినట్టు చేశాడు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేశాక్ష ఆయన పాదాల మీద పడి, పాగిలి పాగిలి ఏడ్చాడు. ప్రభూ నా బదులుగా మీరు శిక్ష అనుభవించడం నేను భరించలేను. నేను హంతకుణ్లే: పాపం చేశాన్ను, మీ తీర్చు సమంజసమైందే.”” /&

న్ని పనిచూచి శిక్టను ఇర్చింగా నిర్ణయించలేము. ఈ విషయంలో త్వ కోజున ఈ ఉత్తరాన్ని ఫారన్‌ ఉఅంపంసు. చసన 'ప్రదూణాన్ని నెరవేర్చు. వచ్చే పొళ్టము ఈజు ఆలీ యాబను సేను ఆయన నన్ను బంధనిముక్తుణ్ణి చేస్తాడు. ఈలోగా బా నిర్ణయాల్లో న్యాయాన్యాం రుత గుక్తించగలుగుతాను. అప్పటీ నుంచి నా కిర్పులు వొష్టయానికి దూరం కావు. ఇ ట్‌ బయలుదేరు.” న చెందు ఖైదీ మోకరిల్లి భూమిని ముద్దాడి బయలుదేరాడు. తరువాత వును న్‌ ననా సాదంగం గుడా షేవంవెలుగు చుచొళకపార గోడలపై పడింది. మిగివిన ర్యా ఉడి సవావయింం ఉదయం బహిరంగంగా విశాటిను వండ కొరడా దెబ్బలు కాచ్యారు, అయననెవరూ గుర్తించలేదు, జద్భాదనలేని వీవు మీద మొదటే కొరడాదెబ్బ పడినప్పుడు మాత్రం బాధతో అరిదాడు. తరువాతి దెబ్బల్నీ పళ్ళబిగువన భరించాడు. దెబ్బయ్యవ కొరడా దెబ్బ పడే సమయానికి స్పృహాదప్పి పడిపోయాడు. వంద దెబ్బలూ ముగిశాక చచ్చిన జంతువ్సను శఈక్పుకుపోయివట్టు విచాటిను అక్కడి నుంచి ఉీసుకువెళ్ళి అతని గద్రిత్రో పడేశార్సు, పెరాటీక్సి స్పృహ వచ్చేసకికి తన షెరసాల గదతో పడుకుని చున్నాడు. ఎర్రటి సెప్తు కణికలపై సడుకున్నట్టుగా అనిసించిందతనిక్ష ఫాదిభాగం చల్లగా వుంది మూచికల వాసన వచ్చింది శళ్ళు కొంచం ఈపిచి ూవాడు చెరసాచ అధికాచే భాచ్య ఆతని ప్రక్శన వృంది. ముఖం మీద సేళ్ళు చిబకపిస్తోంది. అమె కళ్ళళ్లో రొణికసటాడుతున్న జాతిని దయను గమనించాడు, కొడీరకంగా బాధను అశుభివిస్తున్న ఉక కహషుభలో కూడా ఎదుట మునిషితో కచుఇాను కళగెంచడంలోస్తే కఫ్పుస్తిక్తి సాఫల్యం నందన విరాట్‌ గమనించాడు. ఇఆమె వైవు యూస్సి చిచునవ్వు నవ్వాడు. తన బొధ మర్చిపోయాడు. రండవ రోజుకి వనంతట కాను లేవగలిగ్న శఢవ్రగల్లిగన పఓేప్‌క వచ్చింది. ఒక్కో అడుగు వేస్తుంటే ప్రతి ఆడుగు కింద ఒక నూతన ప్రపంద వద్యాలులి జరుగుతున్నట్టుగా అవిపించించి. మూడవ ధోజ్లుక్ష గాయాలు కోడ్డిగా వొప్పి తగ్గాయి, శారీరకవగానూ మానసికంగాన్లూ కాస్త పుంజుకున్నాడ్తు, తరువాత శర్తువాశ పెద్దగా కడిబకుంద మౌనంగా కూచ్చునేవాడ్సు రాతి పైకప్పు నుదచి పడే నీట బొట్టు ఆధారంగా గడుస్తున్న కాలాన అొక్కించేవాడు. ఒక మహా సిళ్ధట్దం అసంఖ్యాక కజాలుగ్యా లిప్పలుగా వెడిపోతుంది. అవన్నీ కవన రాత్రీ సగలుగా అవతడిస్తార్పు చుసిషి శేవిత్రవ్ర్యు అందే? పేత్రాడ్ష రా పగళ్ళతో జీవితం గేడీచిమత్చురన్షి వృద్ధాష్యం వచ్చిస్తుంద్రి విరాట్టు మాట్చుడడ్రాన్సక్షి ఎనరూ రాలేదు ముట్టు వున్న గొాదధక్రాదం అత్మ్యుర్తు క్రూ అవరించినట్టయింది. అయినా జయనజో ఇసేక్ల క్థాపకాల సెబయేళ్ళు వహించు బ్‌ో

మొదలయింది. ఆ సెలయేళ్ళ నిర్మల జలంతో నిండిన గతస్మ్కృతుల సరోవరంలో అతని జీవితం అంతా ప్రతిబింబించింది. జీవిత సారం అవగతమైంది. అప్పుడప్పుడు శకలాలు శకలాలుగా అనుభవంలోకి వచ్చిన జీవిత సత్యాలు అన్నీ ఏకమై ఒక్కసారిగా సాక్షాత్కరించినట్టయింది. ఈ గాంఢాంధకారంలో, ఒంటరిగా అలౌకికమైన స్థితిలో రాగద్వేషాలు, మమతానురాగాలు, నా అనే భావనకు దూరంగా సమాజాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడూ లేనంతగా నిర్మలమైపోయింది విరాట్‌ మనసు. రోజురోజుకూ జీవితం పట్ట ఆయన దృక్పథం స్పష్టం కాజొచ్చింది, ఆ అంధకారంలోనే అనేక విషయాలు స్పష్టమైన రూపు తొాడగసాగాయి. ఆయన ఆత్మదృష్టి ముందు వాటి అసలు రూపాలు ఆవిషృతమవసాగాయి. ఆత్మావలోకనంతో ఆయనకు చాలా అనందం కలిగింది. ఆ అంధకారంలో, ఏకాంతంలో తనను తాను మరిచిపోయి, వివిధ రూపాల్లో విశ్వమంతా వ్యాపించి వున్న పరమాత్మ విశ్వరూపాన్ని లోతుగా అర్థం చేసుకోసాగాడు. రోజు రోజుకు విరాట్‌ దృష్టి మరింత స్పష్టమవుతున్నది. ఆ అంధకారంలోనే అన్ని విషయాలూ వాటంతట అవే కొత్త రూపాలు ధరించి విరాట్‌ జ్ఞాన దృష్టికి దర్శనమిస్తున్నాయి. ఆయన అంతరంగంలోని అన్ని విషయాలూ మరింత స్పష్టం కాజొచ్చాయి. ఆత్మావలోకనంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది. చీకటిలో, తన స్వభావానికి తెలియని ఒంటరితనంలో మానవ సంబంధాలకు దూరంగా వుండడంతో ఆయన అనంతరూపాలు కలిగిన దివ్యత్వం శక్తి ఏమిటో మరింత బాగా తెలుసుకోగలిగారు. ఊహాకల్పిత నిర్మాణాల మధ్య ఆయన స్వేచ్ళగా, స్వతంత్రంగా విహరించగలుగుతున్నారు. అయితే కొత్త చిగుళ్ళు వేయలేని మోడులాగ గంటలకు గంటలు తాను గాఢాంధకారంలోకి, భూగర్భంలోని నల్లటి రాతి పారల్లోకి కూరుకుపోతున్నట్టు ఆయనకు అనిపించింది. విరాట్‌ ఇలా పద్దెనిమిది రోజులు తన ఇచ్చా ప్రపంచం నుంచి విడివడి, ఆత్మావలోకనపు అలౌకికానందంలో మునకలు వేశాడు. తన తప్పిదాలకు ప్రాయన్చిత్తంగా తాను చేపట్టిన ఖైదీ జీవితం ఆయనకు ఆనందదాయకంగా అనిపించింది. దివ్యజ్ఞానానికి సంబంధించిన శాశ్వత చైతన్యం ముందు పాపాలు, పరిహారాలు, ఊహా కల్పితాలు, స్వాప్నిక దృశ్యాలూ అనిపించింది. కాని పందొమ్మిదవ రోజు రాత్రి వచ్చిన ఒక ఆలోచన అంకుశం పోటుతో విలవిలలాడుతూ నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఆయన దేహం భయంతో వణికిపోయింది వాయు ప్రభంజనంలో కొట్టుకునే ఆకుల్గాగా ఆయన చేతి వేళ్ళు వణికిపోయాయి. ఆయనను అంతగా వణికించిన ఆ ఆలోచన ఏమంటే - ఒకవేళ ఆ ఖైదీ తనను మోసం చేసి నెల తరువాత తిరిగి రాకపోతే? 'సమాణాలకు కట్టుబడకపోతే? అసలు తనను మర్చిపోతే? సంవత్సరాల తరబడి తన శరీరంలో రక్తమాంసాలు ఉడిగిపోయే వరకు తన నాలుక పిడచగట్టుకు పోయే వరకు ఇక్కడే, ఈ కారాగారంలోనే వుండిపోవాల్సి వస్తుందేమో! ఈ అలోచన కలగడంతో ఆయనలో బతకాలన్న కోరిక నాగుపాము వలే పడగవిప్పి, లల

అప్పటిదాకా తనను కమ్మిన పారలన్నింటినీ బద్దలు చేసుకుని బయటకు వచ్చింది. కాలానికి సంబంధించిన చైతన్య ప్రవాహం ఆయన ఆత్మలో ప్రవేశించడం ప్రారంభమయింది. దానితోపాటే భయాలు, ఆశలు. ఐహిక ప్రపంచానికి సంబంధించిన అన్ని ఈతి బాధలు ఆయన ఆత్మను ఆవహించుకోనారంభించాయి. అనంతరూపాల్లో వ్యాప్తమైవున్న భగవంతునిపై కూడ దృష్టిని నిలపలేకపోతున్నాడు. తను తన గురించి మాత్రమే ఆలోచించ గలుగుతున్నాడు. ఆయన కళ్ళు వెలుగు కోసం, సూర్యోదయం కోసం తపించిపోతున్నాయి. ఆ చీకటి గుహలో ఇంతవరకు కుంచించుకుపోయి వున్న ఆయన శరీరానికి ఇప్పుడు పరుగెత్తాలని, గంతులు వేయాలని అనిపిస్తోంది. తన భార్య, పిల్లలు, తన ఇల్లు, ఆస్తులు, ఇంకా అనుభవించి ఆనందించవలసిన ప్రాపంచిక ఆకర్షణలకు సంబంధించిన ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది.

నిశ్చలంగా వున్న చెరువు నీటిలోకి మురికి నీళ్ళు ప్రవేశించినట్టు, జీవితాంతం చెరసాలలోనే మగ్గాల్సి వస్తుందేమో అన్న ఆలోచన ప్రశాంతంగా గడిచిపోతున్న కాలాన్ని క్షణమొక యుగంలా గడిచేలా చేసింది. చెరసాల పైకప్పు నుంచి పడుతున్న నీటి బిందువులు ఇప్పుడు చాలా అలస్యంగా, భారంగా పడుతున్నట్టు అనిపించసాగాయి.

ఆయన ఆ గుహలో ధైర్యంగా వుండలేకపోతున్నాడు. అ కొండజాతి మనిషి తనను మర్చిపోయి, తాను శాశ్వతంగా ఇక్కడే, ఈ నిశ్శబ్దంలోనే వుండిపోవలసి వస్తుందేమోననే ఆలోచన ఆయనలో అశాంతిని రేపింది. పంజరంలో పక్షిలాగా ఆ చిన్న గదిలో అటూ ఇటూ వెర్రిగా తిరిగేవాడు. ఎటూ కదలలేని తనం ఆయనను తీవ్రంగా బాధించేది. ఆ గుహ గోడల్ని తిట్టేవాడు. శపించేవాడు. తనను తాను తిట్టుకునేవాడు. దేవుళ్ళని, మహారాజుని దూషించేవాడు. రక్తం కారుతున్న వేళ్ళతో బండరాళ్ళను బద్దలుకొట్టే ప్రయత్నం చేసేవాడు. తలవంచి పరుగున వెళ్ళి చెరసాల ద్వారానికి తలతో ఢీకొట్టేవాడు. స్పృహ లేకుండా పడిపోయేదాకా అలా మోదుతూనే వుండేవాడు. మళ్ళీ స్పృహ రాగానే లేచి నిలబడి మళ్ళి అదేపని చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేశాడో లెక్కలేదు.

పద్దెనిమిదో రోజు నుంచి పౌర్ణమి వచ్చేదాకా విరాట్‌ జీవితం భయంకరంగా గడిచింది. ఆహార పానీయాలను సరిగా తీసుకోలేకపోయాడు. ఆయన దేహం ఉద్వేగంతో దహించుకుపోయింది. నీటి బిలీదువు జారి పడినప్పుడల్లా కాలాన్ని లెక్కించేవాడు. ఆయన దృష్టంతా ఈరోజు గడిచి మరో రోజు రావడం మీదనే. ఈ ధ్యాసలో పడి కనుబామ్మలపై వెంట్రుకలు తెల్లబడడం లాంటి విషయాన్ని ఆయన గమనించలేదు.

శ రే న్‌

పౌర్ణమి రోజున బయట నుంచి పెద్ద శబ్దాలు వినిపించి, కొద్ది సేపటికి సద్దుమణిగాయి. ఆ తరువాత మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో వచ్చి తలుపు తెరిచారు. గదిలోకి కొద్దిగా వెలుగు వచ్చింది. విరాట్‌ లేచి చూశాడు. ఆయన ముందు మహారాజు

జగ

గారు నిలబడి వున్నారు. రాజుగారు విరాట్‌ను ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయంగా. “మీరు చేసిన పని నాకు తెలిసింది. మా పూర్వీకుల కాలం నాటి చరిత్రలో పేర్కొన్న గొప్ప విషయాల కంటే మీరు చేసిన ఈ పని మహత్తరమైంది. ఈ మహత్కార్యం మా జీవితాల్లో ఒక ధృవతారగా వెలుగుచూపుతుంది. బయటకు రండి. సూర్యభగవానుడు మిమ్మల్ని తేజోమయుణ్ణి చేస్తాడు. మహోన్నతులైన మిమ్మల్ని దర్శించుకోవడానికి ప్రజలు బయట ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు” అన్నాడు మహారాజు. మహారాజుతో కలిసి ముందుకు నడిచాడు విరాట్‌. నెల రోజుల నుంచివెలుతురు ముఖం చూడనందువల్ల ఒక్కసారిగా సూర్యకాంతి ముఖం మీద పడేసరికి తట్టుకోలేకపోయాడు. కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. సరిగ్గా నడవలేకపోయాడు. తాగిన వాడిలాగా తూలుతూ నడిచాడు. నౌకర్లు ఆసరా ఇచ్చారు. ప్రజల ముందుకు పోకముందే విరాట్‌ రాజుతో “మహారాజా మీరు నన్ను గొప్ప న్యాయమూర్తి అన్నారు. కాని, ఒకరి జీవితంలో మంచి చెడ్డల్ని మరొకరు బేరీజు వేయడం, ఇతరుల గురించి న్యాయ నిర్ణయం చేయడం అన్యాయమని, భయంకరమైన పారపాటని నాకిప్పుడు అర్థమయింది. నా తీర్పుల వల్ల అనేక మంది దురదృష్టవంతులు ఇంకా ఈ పాతాళ గృహంలో మగ్గుతున్నారు. వాళ్ళింత బాధలు పడుతున్నారో మొదటిసారిగా నేనిప్పుడు గ్రహించాను. ప్రతీకార ధోరణిలో శిక్షలు అమలుచేసే ఈ చట్టాలే దుర్మార్గమైనవని నేనిప్పుడు గ్రహించాను. ఈ ఖైదీలను విడిచిపెట్టండి. ఆ ప్రజల్ని వెళ్ళిపామ్మని చెప్పండి, నన్ను కీర్తిస్తూ వాళ్ళు చేసే జయ జయ ధ్వానాలు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నాయి. దోషినైన నన్ను వాళ్ళు కీర్తించడం చాలా బాధాకరంగా వుంది” అన్నాడు. మహారాజుగారు సైగ చేయడంతో సేవకులు ప్రజల్ని దూరంగా పంపేశారు. మళ్ళీ అంతా నిశ్శబ్దం. అప్పుడు మహారాజుగారు విరాట్‌ నుద్దేశించి “ఇంతవరకు నీవు అధిష్టించిన న్యాయపీరం రాజప్రసాదపు మెట్టచెంత వుంది. కాని బాధల అనుభవంతో, సత్యాన్వేషణలో నువ్వు పొందిన జ్ఞానంతో పూర్వంకన్నా నువ్విప్పుడు గొప్ప న్యాయమూర్తివి, కాబట్టి ఇకనుంచి నీ స్థానం నా సింహాసనం ప్రక్కనే. నీ చెంత కూర్చున్నందువల్ల నీ మాటలు విని, నీ తీర్పులు గమనించి మరింత జ్ఞానం పొందుతాను” అన్నాడు. మహారాజు గారిని ఏదో అభ్యర్థించబోతున్నందుకు గుర్తుగా రాజుగారి మోకాళ్ళను తాకాడు విరాట్‌ ““వుహారాజాా దయచేసి ఆ ప్రధాన న్యాయాధికారి పదవి నుంచి నాకు విముక్తి ప్రసాదించండి. ఒకళ్ళ గురించి న్యాయ నిర్ణయం చేసే అధికారం మరొకరికి లేదని తెలుసుకున్న తర్వాత ఇక తీర్పులు చెప్పలేను. శిక్షించే అధికారం భగవంతుడిది, మనుషులది కాదు. విధి చేయాల్సిన పనిలో జోక్యం చేసుకునే వాళ్ళెవరైనా నేరం చేస్తున్నట్టే. ఈ పాపాలకు దూరంగా నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను"” అన్నాడు. తజ

“సరే అలాగే చేద్దాం. ప్రధాన న్యాయాధికారి బదులుగా నాకు ప్రధాన సలహాదారుగా వుండు. యుద్ధం, శాంతి భద్రతలు, పన్నులు మొదలైన విషయాల్లో సలహాలివ్వు. నీ తెలివి తేటలతో, జ్ఞానంతో నాకు మార్గ నిర్దేశం చెయ్యి.”

విరాట్‌ మళ్ళీ మహారాజు గారి మోకాళ్ళను తాకాడు.

“దయచేసి మళ్ళీ నాకు అధికారం ఇవ్వాద్దు. అధికారం క్రియను కోరుతుంది. ఏ క్రియ న్యాయమైంది? విధి నిర్ణయించినదాన్ని ఏ క్రియ ఎదుర్కొంటుంది? నేను యుద్ధ మంత్రాంగం చేయడమంటే మృత్యుబిజాలను నాటడమే. నేను ఏది పలికితే అది కార్యరూపం దాలుస్తుంది. నేను చేసే ప్రతి పనికి ఒక ప్రాముఖ్యం వుంటుంది. దాని పరిణామం ఏమిటో నాకే తెలియకపోవచ్చు. అన్ని కర్మల నుంచి విముక్తుడై, ఒంటరిగా వుండేవాడే న్యాయబద్ధంగా, ను జ్ఞానిగాను వుండగలడు.

ఈ ఏకాంత వాసంలో ఒంటరిగా వున్నప్పుడే పాపాలకు దూరంగాను, జ్ఞానానికి చేరువగాను వున్నాను. నేను ఆనందంగా, నా ఇంట్లోనే వుండిపోయేందుకు అనుమతినివ్వండి. భగవంతుడికి సేవలు చేయడం తప్ప ఇతరులకు సేవలు చెయ్యాల్సిన అనవసరం లేకుండా, పాపవిముక్తుడిగా

('బ్రతకనివ్వండి"” అన్నాడు వినయంగా.

“మి సేవలను వదులుకోవడం నాకు బాధాకరమే. కాని జ్ఞానులతో వాదించే సాహసం ఎవరు చేస్తారు? ఉన్నత వ్యక్తుల అభీష్పాలకు విరుద్ధంగా ఎవరేం చెయ్యగలరు? మీ ఇష్టప్రకారం బ్రతకడం అత్యుత్తమం. మీ వంటి పాప విముక్తుడైన ఒక వ్యక్తి నా రాజ్యంలో వుంటున్నాడనే విషయమే నాకు గర్వకారణం" అన్నారు మహారాజు.

కారాగార ముఖద్వారం వద్ద వాళ్ళిద్దరూ నెలవు తీసుకున్నారు. సూర్యకాంతి సోకీన గా లి పరిమళాన్ని ఆస్వాదిస్తూ విరాట్‌ ఒంటరిగా ఇంటివైపు నడిచాడు. అన్ని బాధ్యతల నుంచ విముక్తుడు కావడంతో మనసు ఎప్పుడూ లేనంత తేలికగా వుంది. తను నడుస్తూ వుంటే వెనుక ఎవరిదో పాదాల చప్పుడు వినిపించింది. వెనుదిరిగి చూశాడు. ఆ కొండజూతి యువకుడే.

అతని శళ్లే తను అనుభవించింది. ఆ యువకుడు విరాట్‌ పాదము(్రలు పడినచో ట భూమిని ముద్దుపెట్టుకుని భయం భయంగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు. విరాట్‌ చిరునవ్వు నవ్వాడు. చనిపోయిన తన సోదరుడి కళ్ళను చూసినప్పటి నుంచి విరాట్‌ నవ్వడం ఇదే మొదటిసారి. ప్రసన్న హృదయంతో ఇంట్లోకి ప్రవేశించాడు. శరర ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి విరాట్‌ జీవితం సంతోషంగా గడిచిపోతూ వుంది. ఎప్పుడూ భగవధ్యానంలో గడిపేవాడు. '“ఓ భగవంతుడా నాకు స్వర్గ ఛాయలను గాక స్వర్గపు వెలుగును ప్రసాదించు. నాకీ ప్రపంచంలోని సమస్త ఆనందకర విషయాలను చూపించు. ప్రకృతి తాలూకు మధురమైన అనుభవాల్ని, మధుర జీవన సంగీతాన్ని వినిపించు'' అని ప్రార్థించేవాడు. కే

పవిత్ర ప్రేమతో తన శరీరాన్ని తానే తడుముకునేవాడు. తన భార్య మృదువైన దేహాన్ని తన పిల్లల బలిష్టమైన చేతుల్ని నిమిరేవాడు. భగవంతుని ప్రతి రూపం ఆయనకు అందరిలో కనిపించేది.

తన హద్దులు దాటి ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం రానందుకు ఎంతో ఆనందించేవాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా విజ్ఞాన (గ్రంధాల్ని పఠించేవాడు. ధ్యానం, ఆత్మతో ఐక్యం కావడం, దీనుల పట్ట దయ, త్యాగదీక్ష మొదలైన పలురకాల భక్తిమార్గాల్ని ఆచరించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా వుండేవాడు. నౌకర్లతో కూడా చాలా సౌమ్యంగ్యా, ఆత్మీయంగా మాట్టాడేవాడు. ఇంట్లో వుండేవాళ్ళంతా విరాట్‌తో ఇప్పుడు అంతకు ముందుకన్నా ఎక్కువ వినయంగా వుండసాగారు. ఆయన కష్టాల్లో వున్నవాళ్ళకి సాయపడి ఆదుకునేవాడు. బాధల్లో వున్న వాళ్ళని ఓదార్చేవాడు. ప్రజలు కూడా ఆయన శుభాన్ని కోరుకునేవాళ్ళు.

ఇప్పుడాయన్ను ఎవరూ మహా యోధుడని అనుకోవడం లేదు. గొప్ప న్యాయమూర్తి అని భావించడం లేదు. ఇప్పుడాయన అందరికీ ఉత్తమ సలహాదారు. ఇరుగు పొరుగు వాళ్ళే గాకుండా ఇతరులు ఎంతోమంది ఆయన సలహా కోసం వచ్చేవాళ్ళు. ఆ రాజ్యపు న్యాయాధికారి కాకపోయినా ఆపరిచితులెందరో తమ మధ్య వివాదాల్ని పరిష్కరించుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. నిస్సంకోచంగా ఆయన సలహాలను పాటించేవాళ్ళు. ఇలా చేయడం ఆయనకు సంతృప్తికరంగా వుంది. ఆదేశించడం కన్నా సలహాలివ్వడం, తీర్చు చెప్పడం, శిక్షలు వేయడం కన్నా సమస్యను సామరస్యంగా పరిష్కరించడం, రాజీ చేయడం చాలా గొప్పవని ఆయన ఉద్దేశం. పైగా ఇప్పుడు ఒకరి జీవితం మీద పెత్తనం చెయ్యడంగాని, అనేక మంది అదృష్ట దురదృష్టాలను, సుఖదుఃఖాలని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడంగాని ఆయన పని కాదు. జీవితంలోని అమూల్య క్షణాలను ఈవిధంగా సంతోషంగా గడుపుతున్నాడు.

అలా కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిచాయి. ఏ ఒడుదుడుకులు లేకుండా సంతోషంగా గడవడం వల్ల చాలా త్వరగా కాలం గడిచినట్టు అనిపించింది.

జీవిత సంకుచితత్వాల నుంచి పూర్తిగా బయటపడ్డాడు విరాట్‌. కొందరు తగాదా పడి తీర్పుకోసం వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోతుంటాడు. జీవనావకాశాలు ఈ ప్రపంచంలో ఇంత విసృతంగా వుండగా, మనుషుల మధ్య ఇన్ని ఘర్షణలెందుకో! అధికారం, పెత్తనం కోసం మనుషులు ఈర్ష్యలతో ఒకర్నొకరు ఎందుకు హతమార్చుకుంటున్నారో ఆయనకు అంతుపట్టేది కాదు. ఆయనకు ఇతరుల పట్ట గాని, ఇతరులకు ఆయన పట్ల గాని ఈర్ష్యలేదు. ఆయన నివాసం జీవిత సాగరం మధ్యన ఒక ప్రశాంతమైన దీవిలాగా వుంది. కోర్కెల అలలుగాని, తృష్ట ప్రవాహాలు గాని దానిని తాకడం లేదు.

శర 3 లే

ఆరు సంవత్సరాలు అలా ప్రశాంతంగా గడిచాక ఒకరోజు సాయంత్రం - ఆయన పడుకుని వున్నప్పుడు పెద్దగా అరుపులు, కొరడా దెబ్బల శబ్దం, ఒక మనిషి ఆక్రందన వినిపించాయి. విరాట్‌ లేచి చూశాడు. తన కుమారుడు ఒక బానిసను కొరడాతో కొడుతున్నాడు. బానిసను బలవంతంగా మోకాళ్ళమీద కూర్చోబెట్టి కొరడాతో కొడుతుంటే ఆ దెబ్బలకు బానిస శరీరం రక్తం చిమ్ముతోంది. ఆ బానిస విరాట్‌వైపు చూశాడు. తను హత్య చేసిన తన సోదరుడి కళ్ళు తనను చూస్తున్నట్టు అనిపించింది. త్వరగా ముందుకు వచ్చి కొరడాతో కొట్టబోతున్న కొడుకు చేతిని పట్టుకుని అపొడు. ఎందుకు కాడుతున్నావని ప్రశ్నించాడు.

వాళ్ళు చెప్పిన దానిని బట్టి విరాట్‌కి అర్ధం అయింది ఏమిటంటే ఈ బానిస రోజూ కొండ చెలమనుంచి కాయ్యబక్కెట్ల కావిడితో నీళ్ళు మోసుకొచ్చి, ఇంట్లో నీళ్ళతొట్లు నింపాలి. రోజంతా అదే పని అతనికి. అయితే మిట్ట మధ్యాహ్నం వేళ వడదెబ్బకు తట్టుకోలేక అలిసిపోయి చాలా ఆలస్యంగా నీళ్ళకావిడి మోసుకొచ్చేవాడు. అట్టా ఆలస్యంగా వచ్చినప్పుడల్లా అతన్ని దండించేవాళ్ళు. అయితే నిన్న ఆలస్యంగా వచ్చాడని విపరీతంగా కొట్టడం వల్ల అతను ఇంటీ నుంచి పారిపోయాడు. పారిపోయిన విషయం తెలుసుకున్న విరాట్‌ కొడుకులు గు(ర్రాల మీద చెంటాడి నది దగ్గర అతన్ని పట్టుకోగలిగారు. అ బానిసను తాళ్ళతో కట్టేసి ఆ తాడుని ఒక గుర్రపు జీనుకు కట్టి ఈడ్చుకు వచ్చారు. అతని కాళ్ళంతా రక్తం కారుతోంది. ఆ బానిస మళ్ళీ పారిపోయే ప్రయత్నం చెయ్యకుండా, ఈ బానిసను చూసి మిగిలిన బానినలు అలాంటి పని చేయకుండా అందరికీ భితిగొలిపేలాగా కఠినంగా శిక్తిస్తున్నారతన్ని.

విరాట్‌ ఆ బానిస వంక చూశాడు. బలిపశువు కసాయివాడి వైపు దీనంగా చూసినట్టు వుందా చూపు. తను ఒకప్పుడు ఎదుర్కొన్న భయానక పరిస్థితే అది.

““ఆ మనిషిని వదిలేయండి, శిక్షించింది చాలు” అన్నాడు కొడుకులతో.

ఆ బానిస విరాట్‌ ముందుకొచ్చి అతని పాదాల దగ్గర భూమిని ముద్దుపెట్టుకున్నాడు.

జీవితంలో మొదటిసారిగా విరాట్‌ కొడుకులు వాళ్ళ తండ్రి మీద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విరాట్‌ కూడ తన గదికి వచ్చేశాడు. చల్లని నీళ్ళతో ముఖం, కాళ్ళు కడుక్కున్నాడు. చల్లటి నీటి స్పర్శ తగలగానే తానేమి చేస్తున్నదీ అకస్మాత్తుగా బోధపడింది విరాట్‌కు. చెరసాల నుంచి విడుదలయిన తర్వాత మొట్టమొదటిసారి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని తీర్పు ఇచ్చాడు. ఆ రాత్రి విరాట్‌కు నిద్రపట్టలేదు. ఈ ఆరు సంవత్సరాల్లో ఆయనకు నిద్ర దూరమైన రాత్రి అదే. ఆ చీకట్లో ఆయన అలా కళ్ళు తెరిచి పడుకుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూనే వున్నాడు. ఆ చీకటిలోనే విరాట్‌కు బానిస బెదురు చూపులు, తన చేతిలో చనిపోయిన అన్న (క్రోధవు చూపులు, కొడుకుల ద్వేషపు చూపులు కళ్ళముందు కనిపించాయి.

తన కొడుకులు ఆ బానిస పట్ట అంత అన్యాయంగా ఎట్టా ప్రవర్తించగలిగారని పదే పదే తనను తాను ప్రశ్నించుకున్నాడు. పనిని నిర్లక్ష్యం చేశాడనే నెపంతో బానిస రక్తం చిందించి

లే

ఇంటిని అపవిత్రం చేశారు. చిన్న పారపాటు చేసినందుకు సాటి వ్యక్తిని అంత [క్రూరంగా ఎలా కొట్టగలిగారు? తన ఇంట్లో జరిగిన ఈ తప్పుకి కొరడా దెబ్బలు తిన్నదానికన్నా ఎక్కువ బాధ కలిగింది విరాట్‌కు.

ఆరోజు సాయంత్రం జరిగిన సంఘటనలో శిక్షింపబడింది ఉన్నత వంశస్తుడు కాదు. ఒక బానిస. రాజ శాసనం ప్రకారం పుట్టుక నుంచి ఎవరో ఒక యజమాని ఆధీనంలో వుండే ఒక జీవమున్న శరీరం పేరే బానిస, మనుషులంతా భగవంతుని (్రతిరూపాలయితే, కొందరు మనుషుల్ని బానిసల్ని చేసే రాజశాసనం భగవంతుని దృష్టిలో సమంజసమైందా? ఒక మనిషి శరీరం మరొకరి ఆధీనంలో వుండడం అ భగవంతుని దృష్టిలో న్యాయసమ్మతమేనా? ఒక బానిసని హింసించినవాడు, అతని జీవితాన్ని నాశనం చేసినవాడు భగవంతుని ముందు నిర్దోషి కాగలడా?

దీన్ని గురించి రుషులు ఏమైనా చెప్పారేమో చూద్దామని పక్కమీద నుంచి లేచి దీపం వెలిగించాడు. తాళపత్ర గ్రంధాలు ముందేసుకున్నాడు. కులం, సంపదల కారణంగా మనిషికి మనిషికి మధ్య భేదాలుండటం ఆ (గ్రంథాల్లో కనిసించింది. చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. ఆ తరువాత దేవుని ముందు మోకరిల్లి “వివిధ రూపాలలో జగమంతటా వ్యాపించి వున్న ఓ భగవంతుడా, ఎప్పటికప్పుడు నా తప్పుల్ని ఎత్తిచూప్‌, సన్మార్గాన నడిపించడానికి, నీ దూతలు వినిధ రూపాల్లో నా జీవన మార్గంలో ఎదురవుతున్నారు. చనిపోయిన నా సోదరుని కళ్ళల్లో నీ దూతను గుర్తించగల శక్తిని నాకు ప్రసాదించు. నేను నా జీవితాన్ని పవిత్రం చేసుకుని, పాపాలకు దూరంగా బతికేలా చెయ్యి” అని ప్రార్ధించాడు.

విరాట్‌ ముఖంలో మళ్ళీ వెలుగొచ్చింది. ఆయన కళ్ళల్లోని విచారం తొలగిపోయింది. ఆకాశంలో మినుకు మినుకుముంటూ ప్రకాశిస్తూ ఆహ్వానించే నక్షత్రాల్ని, తొలి సంధ్యకు ముందు వీచే పరిశుద్ధ పవనాల్గోని తాజాదనపు ఆనందాన్ని అనుభవించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తోటగుండా ప్రయాణించి నది వద్దకు చేరుకున్నాడు. సూర్యోదయం కాగానే పవిత్ర నదీ ప్రవాహంలో మునకలేశాడు. స్నానం అయ్యాక ఉదయం జరిగే దైన ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు అందరితో కలిసి పాల్గొనడానికి త్వరగా ఇంటికి బయలుదేరాడు. చిరునవ్వుతో అందర్నీ పలకరించాడు. స్త్రీలను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని సైగ చేశాడు. ఆ తరువాత కొడుకుల్లో చెప్పాడు.

“పవిత్రంగా, పాపాలకు దూరంగా జీవితాన్ని గడపడానికి ఇన్నేళ్ళ నుంచి నేను తాపత్రయ పడుతున్న విషయం మీకు తెలుసు. నేను వుంటున్న ఈ ఇంటి నేల మీద నిన్న రక్తం చిందింది. ఆ రక్తం ఒక సజీవ వ్యక్తిది. ఆ రక్తం చిందిన అపరాధం నుంచి నేను బయటపడాలని, నా ఇంట్లో జరిగిన దారుణానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను. చిన్న అపరాధానికి (క్రూరంగా దండన పొందిన ఆ బానిస ఈక్షణం నుంచి బంధవిముక్తుడవుతాడు. భగవంతుడి ముందు జరిగే పాపపుణ్యాల విచారణలో మీపై, నాపై నేరారోపణ చేయకుండా వుండేంద్దుకైనా అతన్ని వదిలేయండి. తనకు ఇష్టమున్న చోటికి అతను పోతాడు” అన్నాడు,

జ్‌

కొడుకులంతా మౌనంగా వుండిపోయారు. అది నిరసనతో కూడిన మౌనం అని విరాట్‌కి అర్థం అయింది. “మీరు సమాధానం చెప్పడంలేదు. మీరేం చెబుతారో వినకుండా, మీ అభీష్టానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.”

““మీరాక అపరాధికి స్వేచ్చ ఇవ్వాలనుకుంటున్నారు. శిక్తించడానికి బదులు బహూకరించాలనుకుంటున్నారు. మన ఇంట్లో చాలా మంది సేవకులున్నారు. కాబట్టి ఒకడు పోతే నష్టమేంలేదు. కాని వాణ్ణి చూసి రేపు ఇంకొకడు పారిపోతాడు. మిగిలిన వాళ్ళు కూడా పోతామంటే ఎలా ఆపగలం?'" అన్నాడు పెద్దకొడుకు.

“వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే నేను అడ్డుపడను. వాళ్ళను వెళ్ళనిస్తాను. నేను మరొకరి జీవిత నిర్దేతను కాను. మరొకరి జీవితాలను నిర్దేశించేవాడు అపరాధి.”

“మీరు రాజ శాసన నిబంధనల్ని బలహీన పరుస్తున్నారు. ఈ భూమి మనదైనట్టు, ఈ భూమిపై పెరిగే చెట్లు మనవైనట్టు, వాటికి కాసే కాయలు మనవైనట్టు ఈ బానిసలు మన అస్తి. వాళ్ళు మీకు సేవ చేసినంతకాలం వాళ్ళు మీకు చెందుతారు. మీరు వాళ్ళకు చెందుతారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్న సంప్రదాయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు. బానిస అతని సొంత జీవితానికి యజమాని కాడు. మరో యజమానికి అతను సేవకుడు” అన్నాడు రెండవ కుమారుడు.

“భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక హక్కు జీవించడం. ఆ ఆధికారం అందరికీ వుంది. మీరు నాకు బాగానే బోధించారు. నేను పాపాల నుంచి దూరంగా బతుకుతున్నాననే (భమలో వున్నాను. కాని నేను ఇన్ని సంవత్సరాలుగా ఇతరుల జీవితాల్ని శాసిస్తూనే వున్నాను. ఇప్పుడు నాకు చక్కగా అర్థం అవుతోంది. స్టైన వ్యక్తి ఎవరూ మనుషుల్ని మృగాలుగా మార్చడు. నేను బానిసలందరినీ విడుదల చేస్తాను. వాళ్ళ విషయంలో పాపానికి దూరంగా వుంటాను.

కొడుకుల కనుబొమలు కోపంతో ముడిపడ్డాయి.

“వాలాలు ఎండిపోకుండా నీళ్ళెవరు పెడతారు? పశువుల్ని ఎవరు పోయి మేవుకొస్తారు? మీ పిచ్చి ఆలోచనల వల్ల మేము ఇకనుంచి సేవకులుగా మారాలా? మీ జీవితంలో ఏనాడైనా ఇంట్లో చిన్న పనైనా చేశారా? అటు వస్తువు తీసి ఇటు పెట్టారా? ఇతరుల శ్రమ మీద ఆధారపడే మీ జీవితం ఇంత సుఖంగా నడుస్తుందని మీరు ఏనాడూ ఆలోచించలేదు. మీరు పడుకునే మంచాలు, పరుపులు ఇతరులు తయారు చేసినవే. మీరు నిద్రపోయే వరకు మీకు పంకా విసిరేదీ ఒక బానిసే. ఈరోజు మీరు అకస్మాత్తుగా బానిసలందర్నీ పంపించేస్తున్నారంటే మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకులు ఆ పనులన్నీ చెయ్యాలనేగా? ఆ ఎద్దులను కూడా వదిలేయండి. వాటికి మాత్రం నొప్పి కలిగించడం ఎందుకు? వాటికి బదులుగా మేమే కాడి లాగి పొలం దున్నుతాం. మనుషులకు మాదిరే మాటలు రాని ఈ పశువులకు కూడా భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు కదా! మీరొకటి గుర్తుంచుకోండి. ప్రపంచం బలప్రయోగం మీద ఆధారపడి నడుస్తుంది. భూమిపై కూడా బలప్రయోగం చెయ్యకపోతే అంటే దున్నకపోతే

త్‌

భూమి కూడా పంటల నివ్వదు. బలప్రయోగం మీద ఆధారపడే లోకం నడుస్తోంది. మనం దానికి దూరంగా వుండలేము”' అంటూ పెద్ద కొడుకు గట్టిగా వాదించాడు.

““కానీనేను దూరంగా వుంటాను. బలం ఏ రకంగానూ సరైంది కాదు. నేను నా జీవితాన్ని ధర్మపథంలో నడుపుకుంటాను.”

““నాది అని దేని గురించి అయినా చెప్పుకున్నారంటే అది మీ బలం వల్లనే మీదిగా వుంది. మనిషి కావచ్చు, పశువు కావచ్చు, భూమి కావచ్చు. వీటిపై అధికారం వల్లనే మీకు బలం లభిస్తుంది. మీరు యజమాని అయినప్పుడు మీరు బలం కలిగి వుండడం కూడ అవసరం. చేతిలో అధికారం వున్నవాడు మనుషుల విధికి లోబడే వుంటాడు.'”

“కాని పాపం చెయ్యాల్సిన అవసరం కలిగించే అన్నింటి నుంచి నేను దూరంగా వుంటాను. అందుకే బానిసలందర్నీ విముక్తుల్ని చెయ్యండి. మీకు అవసరమైన పనులన్నీ మీరే స్వయంగా చేసుకోండి.”

కొడుకులు కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నారు. పెద్దకొడుకు వుళ్ళీ అందుకున్నాడు. “మీరే చెప్పారు. ఇతరుల అభీష్టాలపై ఆంక్షలు పెట్టనని. పాపం చుట్టుకుంటుందని భయపడి బానిసల్ని శాసించరు. మరి అది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని మమ్మల్నెందుకు శాసిస్తున్నారు? మా జీవితాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మానవ దృష్టిలో గాని, భగవంతుని దృష్టిలో గాని మీరు చేసేది ఏవిధంగా సమంజసమో చెప్పండి?”

విరాట్‌ చాలా సేపు మౌనం వహించాడు. తల పైకెత్తి కొడుకుల వంక చూశాడు. వాళ్ళ కళ్ళల్లో అత్యాశ తాణికిసలాడుతోంది. విరాట్‌ మనసు ఆ(ర్షమయింది. సున్నితంగా చెప్పాడు.

“మీరు నాకు పాఠం నేర్పారు. మిమ్మల్ని ఏదో విధంగా అడ్డుకోవడం నా ఉద్దేశం కాదు. ఇంటిని, సంపదను మీరే తీసుకోండి. ఎవరెవరికి ఏవేవి అవసరమో ఆ విధంగా పంచుకోండి. వాటిలో నాకేం భాగమూ వద్దు. వాటితో వచ్చే పాసమూ వద్దు. శాసించేవాడు ఇతరుల స్వాతం త్ర్యాన్ని ఆజిచేస్తాడని మీరు చెప్పింది నిజమే. కాని తన ఆత్మనే బానిసను చేసుకోవడమనేది అన్నింటికన్నా నీచమైనది. పాపాలకు దూరంగా ఎవరు బతకాలనుకుంటారో వాళ్ళు ఇంటి యాజమాన్యం నుంచి ఇతరుల జీవితాల్ని నడిపించే బాధ్యతల నుంచి దూరంగా వుండాలి. ఇతరుల శ్రమపై ఆధారపడి బతకరకూడదు. స్త్రీలతో భోగవిలాసాలకు, ఆనందంతో వచ్చే సోమరితనానికి దూరంగా వుండాలి. ఒంటరిగా బతికే వ్యక్తే, భగవంతుడికి దగ్గరగా వుంటాడు. మించే వాడికే భగవంతుని ఉనికి తెలుస్తుంది. పేదరికానికే భగవంతుని విశ్వరూపం గోచరిస్తుంది. కనిపించే ఈ ఆస్తిపాస్తుల కంటే కనిపించని ఆ భగవంతుడికి దగ్గరగా వుండడమే నాకిష్టం. పాపాలకు దూరంగా బతకాలనేదే నా కోరిక. ఆస్తిపాస్తులు అన్నీ తీసుకోండి. శాంతియుతంగా వాటిని పంచుకోండి'” అంటూ విరాట్‌ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆయన కొడుకులందరూ ఆశ్చర్యంతో అలాగే స్ఫోష్టులై చూస్తూ వుండిపోయారు. వాళ్ళ ఆశ నెరవేరినందుకు చాలా సంతోషంగా వుంది. కాని లోలోపల చాలా సిగ్గుపడ్డారు.

న

చీకటి పడగానే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఒక చేతికర్ర, భిక్షాపాత్ర, చెట్లు కొట్టే గొడ్డలి, తినడానికి కొద్దిగా పళ్ళు, సిద్దుల సూక్తులున్న తాళపత్ర గ్రంథాలు కొన్ని సర్దుకున్నాడు. ధోవతిని మోకాళ్ళపైకి ఎగగట్టాడు.

భార్యతో, కొడుకులతో, కుటుంబ సభ్యులెవరితోనూ చెప్పకుండానే, వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకోకుండానే బయలుదేరాడు. రాత్రంతా నడిచాడు. తెల్లవారు రూముకి ఒక నద్‌ తీరానికి చేరుకున్నాడు. సోదరుని హత్యతో భీతిల్లి నదిలో ఖడ్లాన్ని ఒదిలేసిన ప్రదేశమది. కొంత కాలం ముందు విరాట్‌లో సత్యాన్వేషణా బీజాన్ని నాటిన నదీ తీరమది. ఆ రేవు దాటి నదికి ఆవలి తీరాన్నే కొంత దూరం ముందుకు నడిచాడు. అక్కడ మనిషి మసలని, ఎప్పుడూ సాగులోకి రాని నిర్జన ప్రదేశం కనిపించింది.

సూర్యోదయమటయ్యేసరికి ఒక చోటుకి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు పీడుగుపడి కాలిపోయి వుంది. ఆ మంటకు ఆ చెట్టు చుట్టుపట్ల కొంతమేర అడవి కూడ కాలిపోయి తెరిపిగా వుంది. అక్కడ నదీ ప్రవాహం కాస్త ఒంపు తిరిగి ప్రశాంతంగా ప్రవహిస్తోందె. పక్షులు అసంఖ్యాకంగా ఆ నదిలో నిర్భయంగా నీళ్ళు తాగుతున్నాయి.

ఎదురుగా సుందర నదీ ప్రవాహం, వెనక దట్టమైన చెట్ల చల్లని నీడ. పిడుగుపాటుకు కాలిపోయిన చోట చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. వంనోహరంగా వృన్న ఆ (ప్రాంతాన్ని చూసి విరాట్‌ అక్కడ ఒక కుటీ రాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. తన శేష జీవితాన్ని తనవాళ్ళకు దూరంగా, పాప విముక్తుడై ధ్యానంలో గడుపుకోవాలని నిశ్చయించుకున్నాడు.

థమ చెయ్యడం అంతకు ముందు అలవాటు లేనందువల్ల కుటీరం నిర్మించుకోవడానికి ఐదు రోజులు పట్టింది. కుటీరం నిర్మించుకున్నాక కూడ ఆయనకు రోజంతా పని వుండేది. తినడానికి పండ్లు, ఫలాలు వెతుక్కోవాల్సి వచ్చేది. కుటీరం చుట్టూతా పుట్టుకొచ్చే గడ్డి మొక్కల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. ఆకలిగొన్న చిరుత పులులు రాత్రులు అడవిలో తిరుగుతూ వుంటాయి. వాటి నుంచి రక్షణ పొందడం కోసం కుటీరం చుట్టూతా ముళ్ళకంచె ఏర్పాటు చేసుకున్నాడు. |

విరాట్‌ అడవిలోకి వచ్చాక మరో మనిషి మాట కూడ వినపడలేదు. ఆయన ఏకాగ్రతకు భంగం కలగలేదు. నదీ ప్రవాహం లాగా కాలం కూడ ప్రశాంతంగా గడిచిపోతూ వుంది.

కొత్తగా వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకుపోవడం చూసి, ఆయన వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించాయి అక్కడి పక్షులు. కొద్ది రోజుల్లోనే విరాట్‌ కుటీరం కప్పుపై పక్షులు నిర్భయంగా తమ గూళ్ళు కట్టుకోసాగాయి. వాటికి అప్పుడప్పుడు బాగా పండిన పళ్ళు, గింజలు ఆహారంగా పెడుతుండేవాడు. నెమ్మదిగా విరాట్‌కు పక్షులకు మధ్య స్నేహం కుదిరింది. ఆయన పిలిస్తే చాలు ఎక్కడెక్కడి చెట్ల నుంచి వచ్చి ఆయన ముంగిట వాలేవి. విరాట్‌ వాటితో ఆడుకునేవాడు. అవి కూడా భయపడకుండా ఆయనకు దొరికేవి.

జో

అడవిలో ఒకరోజు ఒక కోతిపిల్ల కాలు విరగ్గొట్టుకుని పసిబిడ్డలాగా రోదిస్తూ వుండటం చూశాడు. దాన్ని ఎత్తుకుని కుటీరానికి తీసుకువచ్చాడు. దాని బాగోగులు చూస్తూ త్వరలో నయం అయ్యేలా చేశాడు. ఆ తరువాత అది పెంపుడు జంతువులా కుటీరంలో వుండిపోయింది. సరదాగా విరాట్‌ని అనుకరించేది. ఆయన ఏ పని చేస్తే అదీ అలా చేసేది. విరాట్‌పట్ల చాలా విశ్వాసపాత్రంగా మెలిగేది. అలా అలా ఆయన చుట్టూ పశుపక్ష్యాదులు చాలా చేరాయి.

అయితే జంతువుల్లో మనుషుల్లోకన్నా ఎక్కువగా హింసా ప్రవృత్తి, చెడు వుంటాయన్న విషయం ఆయనెప్పుడూ మళ్చిపోలేదు. మొసళ్ళు పోట్టాడుకుని ఒకదాన్నాకటి క్రోధంతో ఎలా తరుముకుంటాయో చూశాడు. పక్షులు నదిలో చేపలు వేటాడే పద్ధతి, వాములు చుట్టలు చుట్టుకొని పడుకుని వుండి హఠాత్తుగా పక్షుల్ని ఎలా పట్టుకుంటాయో చూశాడు. ఇలాంటివన్నీ ఆయన నిత్యం గమనిస్తూ వుండేవాడు. ప్రకృతి ప్రళభయశక్తి ప్రపంచాన్ని విధ్వంసకర సంకెళ్ళ (కమంతో బంధించింది. ఈ నియమంలోని సత్యాన్ని ఆయన అంగీకరించాడు. కాని తానా సంఘర్షణల్లో పాల్గొనక పపేళ్లకుడిగా వుండిపోవడం ఆయనకు సంతోషం కలిగించింది. విరాట్‌ మరో మనిషి ముఖం చూసి దాదాపు రెండు సంవత్సరాలైంది. ఒకరోజు ఓ వేటగాడు ఏనుగును తరుముకుంటూ, నదికి ఆవలి ఒడ్డున అది నీళ్ళు తాగుతున్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడొక అద్భుత దృశ్యం ఆ వేటగాని కళ్ళబడింది.

అది సూర్యాస్తమయ సమయం, ఒక గడ్డం నెరిసిన మనిషి కుటీరం ముందు కూర్చుని వున్నాడు. సూర్యుని పసిడి కిరణాల కాంతి అతని శరీరం మీద పడి మెరుస్తోంది. పక్తులు ఆయన తలమీద, భుజాలమీద వాలుతూ లేస్తూ ఆయనతో ఆడుకుంటున్నాయి. ఒక కోతి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని రాయితో కాయలు పగలగొట్టి గింజలు ఆయనకు అందిస్తోంది. కాని ఆయన మాత్రం రంగు రంగుల చిలకలు చెట్ల కొమ్మల్లో ఆడుకోవడం చూస్తున్నాడు. ఆయన సైగ చేయగానే అవన్నీ పసిడి మేఘాకారంలో నాట్యం చేస్తున్నట్టు ఎగిరి వచ్చి ఆయన చేతుల మీద వాలాయి.

తానొక మహాత్ముబ్ది దర్శించినట్టుగా వేటగాడు భావించాడు. ఆ దృశ్యం చూశాక ఆయనతో పశువులు మానవ భాషలో మాట్లాడతాయి. ఆయన పాదాల కింద పుష్పాలు వికసిస్తాయి. ఆయన పెదాలతో నక్షత్రాలను తెంపగలడు. ఒక్క ఊదు ఊది చంద్రుణ్ణి ఆకాశం నుంచి ఎగరగొట్టగలడు అనిపించిందతనికి. తాను వచ్చిన పని మర్చిపోయి, తాను చూసింది పట్నంలో వాళ్ళందరకు చెప్పడం కోసం వేటగాడు పట్నం వైపు పరుగుతీశాడు.

మరునాటి ఉదయం నుంచే ఈ వింతను చూసేందుకు నది అవతలి గట్టుకు జనం గుంపులు గుంపులుగా రాసాగారు. పోనుపోను గుంపు పెరగసాగింది. చివరికి గుంపులో ఒకతను విరాట్‌ని గుర్తించాడు. త్వరలోనే ఈ వార్త విసృతంగా వ్యాపించింది. విరాట్‌ లాంటి సహాయకుణ్ణీ కోల్పోయినందుకు చింతిస్తున్న రాజు గారికి కూడా ళు వార్త తెలిసింది.

మహారాజుగారు వెంటనే పరివారంతో సహా బయలుదేరాడు. విరాట్‌ కుటీరాన్ని చేరుకోగానే

తాలి

రాజుగారు దిగడానికి తివాచీ పరిచారు. ఆయన దిగి తపన్విలా వున్న విరాట్‌ దగ్గరకు వెళ్ళాడు. పద్దెనిమిది మాసాలుగా విరాట్‌ మనిషి మాట విని ఎరగడు, తను మాట్టాడనూ లేదు. అతి కష్టంమీద రాజుగారిని అభినందించాడు. ప్రజలు రాజుగారికి ఎలా నమస్కరిస్తారో కూడా అయన మర్చిపోయాడు.

మొత్తానికి మాటలు కూర్చుకుని '' మహారాజా, మీ రాక శుభప్రదమవుగాక!”” అన్నాడు.

మహారాజు గారు ఆయన్ను తన హృదయానికి హత్తుకున్నాడు.

“మీరు పరిపూర్ణ మానవుడిగా రూపొందుతున్న క్రమాన్ని అనేక సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. మీలోని అసాధారణ, అద్భుత ధర్మ పరాయణత్వాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. మహోన్నత వ్యక్తి ఎలా జీవిస్తారో నేను కూడ నేర్చుకుంటాను” అన్నాడు.

విరాట్‌ నమస్కరించాడు.

“ఏకాంత వాసం చేసేవాడు తనకు తాను తప్ప ఇతరులకేం బోధించలేడు. నేను చేస్తున్న పని వివేకమయిందో కాదో నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది ఆనందమో కాదో కూడా నాకు తెలియదు. నేనేం సలహాలివ్వలేను. నేనేం బోధించనూ లేను. అఆత్మజ్ఞానానికి, ప్రపంచ జ్ఞానానికి చాలా తేడా వుంది.” *

“జ్ఞాని ఎలా జీవిస్తాడో గమనిస్తే దీనిని బట్టి కొంత నేర్చుకోవచ్చు. మిమ్మల్ని చూస్తున్నప్పటి నుంచీ ఒక అలౌకికమైన ఆనందంతో నా మనసు నిండిపోయింది. అంతకన్నా నాకేం అక్కరలేదు.

నా రాజ్యంలో మీ కోసం నేను చెయ్యాల్సింది ఏమైనా వుందా? మీ వాళ్ళకేమైనా సందేశం పంపుతారా?” దరి

“మహారాజా “నా' అనేది ప్రత్యేకంగా నాకేమీ లేదు. లేదా ఈ ప్రపంచమంతా నాదే అం దరి ఇళ్ళతోపాటు నాకూ ఒక ఇల్లుందని, అందరి పిల్లలతోపాటు నాకూ పిల్లలున్నారనే పనురున్న నేను మర్చిపోయాను. ఇల్లు లేనివాడికి ప్రపంచమంతా తన ఇల్లే. జీవిత బంధనాల్ని తె వాడికే నిజమైన జీవితం లభిస్తుంది. నిష్కపటికి అంతా శాంతే. ఈ భూమి మీద నా జీవితాన్నా

పాపాలకు దూరంగా గడపాలనేదే నా ఏకైక కోరిక అన్నాడు విరాట్‌: ప్ర మహారాజు

“సెలవు తీసుకుంటాను. నీ ప్రార్ధనలో నన్ను కూడ తలుచుకో” అన్నా ఏను హాంావ

“నేను భగవంతుణ్ణి తలుచుకుంటాను. ఆవిధంగానే మిన్నుల్ని, ఈ భూమి స్తున్న పరమాత్మ స్వరూపులైన వాళ్ళందర్నీ తలుచుకుంటాను'

మహారాజుగారు పరివారంతో బయలుదేరారు.

విరాట్‌ పేరు ప్రతిష్టలు మళ్ళీ రాజ్యమంతా పాకిపోయాయి. కుగ్రామాలకు, సముట్రి తీరాన గుడిసెలు వేసుకుని వుందే వాళ్ళకు కూడా ఇంటిని విడిచి, సర్వ సంపదలను త్య ర్‌ ధ్యానంతో జీవితాన్ని గడుపుతున్న ఈ తపస్వి గురించి తెలిసిపోయింది. 'ఏకొంతవాస ధృవతాల అనే పేరుతో ఆయన ఖ్యాతి దశ దిశల వ్యాపించింది. దేవాలయాల్లో పూజారులు కూడా విరా కీర్తించేవాళ్ళు. మహారాజు గారు కూడా తన సేవకులతో విరాట్‌ బెన్నత్యం గురించి చెప్పేవాడు.

త్‌

న్యాయాధికారులు తీర్పులు చెప్పేముందు ““ భగవంతునికి జీవితం అంకితం చేసిన సర్వజ్ఞాని విరాట్‌ తీర్చువలే నా తీర్పూ వుండేలా భగవంతుడు అనుగ్రహించుగాక” అనేవారు.

కాలం గడిచేకొద్దీ తమ జీవన విధానం సక్రమంగా లేదని భావించినవాళ్ళ్లు, రోజువారీ జీవితంలో తాము చేస్తున్న పాపకర్మలకు పశ్చాత్తాపపడిన వాళ్లు, జీవితం నిస్సారంగా తోచినవాళ్ళు విరాట్‌ని ఆదర్శంగా తీసుకుని ఇల్లూ వాకిలి వదిలి సంపదలను త్యజించి శేష జీవితాన్ని భగవంతుని'సేవలో గడపడానికి అడవుల కొచ్చి విరాట్‌లాగా కుటీరాలు నిర్మించుకోసాగారు. స్వయంగా ఆచరించి చూపడం అంత ఉత్తమమైన పని ఈ భూమి మీద మరొకటి లేదు. ప్రతి మంచి పని ఇతరులతో తామూ మంచి పనులు చేయాలనే కోర్కెను రేకెత్తిస్తుంది. ఆ కోర్కె ఇప్పుడు కలల నుంచి తట్టి లేపి కార్యాచరణకు పురికొల్పింది. ఈ జ్ఞానోదయం కలిగిన వాళ్ళందరికీ తామెంత నిస్సారంగా జీవితాలను గడుపుతున్నామో అర్ధం అయింది. తమ చేతులొంత రక్తసిక్త్షవుయ్యాయో, పాపాలతో తవు ఆత్మలెలా కళంకితవుయ్యాయో అవగతమయింది.

వాళ్ళంతా ఏకాంత వాసానికి పోసాగారు. జీవించడానికి కావలసిన పళ్ళు, నీళ్ళు లాంటివి లభిస్తే తృప్తిపడసాగారు. వీళ్ళు పండ్ల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు మరో సర్వసంగ పరిత్యాగి ఎదురైనా పలకరించుకునే వాళ్ళు కాదు. దాని వల్ల కొత్త బంధాలు ఏర్పడతాయేమోనని భయపడేవాళ్ళు, అయిజే హృదయపూర్వకంగా చిరునవ్వు నవ్వే వాళ్ళు. వాళ్ళ హృదయాలు ౌంతంగా అభినందించుకునేవి. ఆ అడవిని గురించి ప్రజలు మాట్లాడుకునేటప్పుడు అక్కడ సాధువులు, వుహాత్ములు వుంటారని చెప్పుకునేవాళ్ళు. వేటతో ఆ పవిత్ర ప్రాంతం కలుషితమవుతుందనే భయంతో వేటగాళ్ళెవరూ ఆ దరిదాపులకు కూడా వచ్చేవాళ్ళు కాదు.

శల రోల

ఒకరోజు ఉదయం విరాట్‌ తన కుటీరం వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు అచేతనంగా పడివున్న ఒక సాధువు శరీరం కనిపించింది. అతన్ని లేపి, కూర్చోబెట్టాలని ప్రయత్నించాడు. కాని అది ప్రాణంలేని శరీరమని తెలిసింది. విరాట్‌ ఆ సాధువు కళ్ళు మూసేశాడు. ఏదో ప్రార్ధన చేశాడు. ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి అంత్యక్రియలు సక్రమంగా జరిపించాలని భావించాడు. ఆ శవాన్ని రెండు చేతుల్లోకి ఎత్తుకోవాలని చూశాడు. కాని లేపలేక పోయాడు, చాలా కాలం నుంచి సరైన తిండిలేక పండ్లు, ఫలాలతో సరిపెట్టకోవడం వల్ల శక్తి ఉడిగి పోయింది. సహాయం కోసం నది దాటి దగ్గరలో వున్న (గ్రామానికి బయలుదేరాడు.

ఏకాంతవాస ధృవతార అని తాము భక్తితో పిలుచుకునే సాధువు తమ ఊళ్ళోకే రావడం చూసి ప్రజలు అచ్బెరువాందారు. ఆయన చుట్టూతా పెద్ద గుంపుగా చేరారు. ఆయన వచ్చిన పని చెప్పాడు. ఆయనకు సాయపడడానికి నేనంటే నేనని చాలా మంది ముందుకొచ్చారు.

విరాట్‌ తిరిగి వెళుతూ వుంటే ప్రతిచోటా స్త్రీలు ఆయనకు భక్తితో నమస్కరించారు. పురుషులు ఆయనకు ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదం కోరుతూ ఆయాన బట్టల్ని

నడ

ముద్దుపెట్టుకున్నారు. భక్తిప్రపత్తులతో స్వాగతం పలుకుతున్న ప్రజల మధ్య నుంచి సంతృప్తితో కూడిన చిరునవ్వుతో విరాట్‌ ముందుకు నడిచాడు. వీళ్ళతో ఏవిధమైన అనుబంధం లేకపోయినా వీళ్ళ పట్ల విరాట్‌కు ఎంతో నిర్మలమైన, ఆత్మీయతతో కూడిన (ప్రేమ కలిగింది.

ప్రజల హృదయపూర్వక నమస్కారాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళుతున్న విరాట్‌కు ఒక ఇంట్లో నుంచి ఒక స్త్రీ ద్వేషంగా తనవైపు చూడడం గమనించి ఆగాడు. తను పొరపాటు పడ్డానేమో ఆమె అలా చూసి వుండదేమోనని భావించి మళ్ళీ ఆమె వైపు చూశాడు. ద్వేషంతో, నిప్పులు కక్కుతున్నట్లుగా విరాట్‌ వైపు చూస్తున్నాయి ఆమె కళ్ళు. విరాట్‌ భయంతో ఒణికిపోయాడు. ఆమె కళ్ళు చూస్తే తను హత్య చేసిన తన సోదరుని కళ్ళు గుర్తుకొచ్చాయి, ఆ కొండజాతి యువకుడి కళ్ళు జ్ఞాపకం వచ్చాయి. తను అడవిలోకి వచ్చి ఏకాంతవాసం చేయసాగాక ఆ పీడ జ్ఞాపకాల్ని మర్చిపోయాడు. తాపసిగా మారాక ఇతరుల కోపం, ద్వేషం ఎలా వుంటాయో మర్చిపోయాడు.

ఆమె తనను తప్పుగా అర్ధం చేసుకుందేమో! ఎవరోఅనుకుని నా పట్ల విద్వేషంతో వ్యవహరిస్తుందేవో[! ఆమెతోనే మాట్టాడుదామనుకుని విరాట్‌ ఆమె వైపు కదిలాడు. చిరుతపులిలా ఆమె విరాట్‌ వైపు చూసి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులేసుకుంది. విరాట్‌ ఆశ్చర్యపోయాడు.

“ఆమె ఎవరు? తనెప్పుడూ చూడలేదు. పరిచయం అయ్యే అవకాశం కూడ లేదు. వయసులో ఆమె చాలా చిన్నది. తన జీవితంలో ఏవిధంగానూ, ఎప్పుడూ తటస్తపడే అవకాశం కూడ లేదు. అలాంటప్పుడు ఆమెను నేనెలా బాధించి వుంటాను? తనలో తానే మధనపడ్డాడు. “ఎక్కడో ఏదో లోపం వుంది. కనుక్కోవాలి అనుకుని ఆమె ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. సమాధానం లేదు. ఆ అపరిచిత స్రీ తనను ఇంకా ద్వేషిస్తూనే వుంది అనిపించింది. చాలా సహనంగా మరోసారి తలుపుకొట్టాడు. అయినా ఆమె తలుపు తియ్యలేదు. క ద్దిసేపు ఆగి భిక్షగాడి లాగా మళ్ళీ తలుపు కొట్టాడు. కొంత సేపటికి ఆమె సంకోచిస్తూనే తలుపు తీసి ద్వారబంధం దగ్గరకొచ్చి నిలబడింది. ఇంకా ఆమె విరాట్‌ వైపు ద్వేషంతో చూస్తూనే వుంది.

“ఇంకా నా నుంచి ఏం కావాలి మీకు?” కోపంతో ఊగిపోతూ ప్రల్నించింది. ఆమె కోపంలో ఊగిపోయిన తీరుకి కింద పడిపోయేది. అయితే ద్వార బంధం పట్టుకుని పడకుండా తమాయించుకుంది.

ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాక విరాట్‌ మనసు కాస్త కుదుట పడింది. ఆమెను అంతకు ముందు ఎప్పుడూ చూడలేదని దృఢమైన నమ్మకమేర్చడింది. ఆమె వయసు దృష్ట్యా కూడా తన జీనిత యాత్రలో ఆమె ఎక్కడా తటస్థపడే అవకాశం కూడ లేదనిపించింది. అందుకే ఆమెనే అడిగాడు.

“మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. మీరు నావైపు అంత ద్వేషంగా ఎందుకు చూస్తున్నారో అర్ధం కావడం లేదు. నేను మీకు శత్రువునా? మీకేమైనా అపకారం చేశానా?”

నే

““నువ్వు నాకేం హాని చేశావ్‌? '” వ్యంగ్యంగా నవ్వింది. '' అవును నువ్వు నాకేం హాని చేశావ్‌? కొద్దిగా చేశావు. కొద్దిగా హాని చేశావు. నా ఇల్లు కళకళలాడుతుండేది. దాన్ని శూన్యం చేశావు. నా భర్తను నా నుంచి దూరం చేశావు. నా జీవితాన్ని చిదిమేసి మృత్యుముఖంలో పడేశావు. నీ ముఖం నాకు చూపించకు, నా కోపాన్ని దిగమింగుకోలేను. వెంటనే నువ్విక్కడ నుంచి వెళ్ళిపో” అంది ఆవేశంగా.

విరాట్‌ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు చింత నిషప్పాల్లా వున్నాయి. ఆమె కోపంతో రగులుకుపోతూ వుంది.

“మీరు నన్ను ఎవరో అనుకుని ద్వేషిస్తున్నారు. నేను మనుషులకు చాలా దూరంగా బతుకుతున్నాను. ఎవరి జీవితాలతోనూ నాకు (ప్రవేయం లేదు. మీరు పారపాటు పడుతున్నారు”' అని చెప్పి, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరాడు.

ఆమె కోపంగా మండిపడింది. “నువ్వు నాకు తెలుసు. అందరిలాగే నేనూ గుర్తించగలను నిన్ను. నువ్వు విరాట్‌వి! అందరూ పిలిచే 'ఏకాంతవాస ధృవతారవి.' ప్రజలందరి చేత విశిష్ట గుణాలు ఆపాదింపబడిన వ్యక్తివి. నేను మాత్రం నిన్ను కీర్తించను. నా ఆరోపణ భగవంతుడు ఆలకించేదాకా నేను నిన్ను దూషిస్తూనే వుంటాను, ర౮| అడుగుతున్నావు గనుక నువ్వు నాకు ఏం కీడు చేశావో చూపిస్తాను.”

ఆశ్చర్యంగా నిలబడిపోయి వున్న విరాట్‌ చేయి పట్టుకుని అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. లోపలి గది తలుపు తీసింది. గదంతా చీకటిగా వుంది. ఆ గదిలో ఒకమూలకు తీసుకువెళ్ళింది. అక్కడ చాపమీద చలనం లేని ఒకశరీరం పడి వుంది. విరాట్‌ వంగి చూడాలనుకుని భయంతో వెనక్కి తగ్గాడు. ఆ శరీరం చనిపోయిన ఆమె కొడుకుది. ఆ అబ్బాయి కళ్ళు విరాట్‌ను దోషిలా చూస్తున్నాయి. ఆ కళ్ళు చూస్తే విరాట్‌కు చనిపోయిన తన అన్న కళ్ళు గుర్తొచ్చాయి.

ఆ అబ్బాయి పక్కన ఆమె జీవచ్చవంలా నిలబడి వుంది. ఆమె దుఃఖంతో “వీడు మా మూడోవాడు. నా చిట్టచివరి సంతానం. మిగిలిన ఇద్దరిలాగే వీణ్ణీ నీ పొట్టన పెట్టుకున్నావు. జనాలంతా నిన్ను తాపసివనిి దేవదూతవని ఆంటారు. కాని నువ్వు హంతకుడివి ఆమె ఆవేశానికి అంతులేకుండా పోయింది.

విరాట్‌ ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆమె విరాట్‌ నూటలకి అడ్డుతగిలింది.

“ఈ మగ్గంచూడు. ఖాళీగా వున్న ఆ ముక్కాలి పీట చూడు. అక్కడ కూర్చునే నా పెనిమిటి రోజూ బట్టలు నేసేవాడు. ఆయనతో సమానమైన నేతగాడు ఈ ప్రాంతంలోనే లేడు. ఆయన చేత బట్టలు నేయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేవాళ్ళు. ఆయన వృత్తే మా కుటుంబానికి జీవనాధారం, మా జీవితాలు చాలా ఆనందంగా గడిచిపోతుండేవి, మా ఆయన దయాళువు, శ్రమజీవి. చెడు స్నేహాలకు, దుర్మార్గులకు దూరంగా వుండేవాడు. మాకు ముగ్గురు బిడ్డలు కలిగారు. మేము వాళ్ళను జాగ్రత్తగా పెంచాం. చక్కగా పెరిగి వాళ్ళు తండ్రి అంతటి వాళ్ళు అవుతారని ఆశలు పెట్టుకున్నాం.

ననే

ఒకరోజు ఒక వేటగాడు మా ఊరికి వచ్చాడు. అంతకు ముందెన్నడూ అతన్ని మేం చూడలేదు. ఒక మనిషి సర్వమూ త్యజించి, అడవిలో కుటీరం నిర్మించుకుని భగవంతుని సేవలో జీవితం గడిపేస్తున్నాడనీ, ఆయనే భగవంతుని పప్రతిరూపంలా వున్నాడనీ, ఆ వేటగాడు చెబుతుంటే నా భర్త కూడా తెలుసుకున్నాడు. అప్పటి నుంచి నా భర్త కూడ క్రమేణా మాకు దూరవముయ్యాడు. కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా మాటాడకుండా వీలైనంత ఎక్కువసేపు మౌనంగా వుండేవాడు. సాయంత్రాలు ఎక్కువసేపు ధ్యానం చేసేవాడు. కమేణా వృత్తి మానేస్తూ ఎక్కువసేపు భగవధ్యానంలో గడిపేవాడు. వున్నట్లుండి ఒకరోజు రాత్రి మాకెవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. భగవంతుని సేవలో జీవితాన్ని గడపడం కోసం నువ్వు వుంటున్న అడవికే - సాధువులు, మహాత్ములు నివశించే ప్రదేశమని నీవల్ల పేరొచ్చిన అడవికి - వెళ్ళిపోయాడు.

ఆయన జీవితాన్ని ఆయన చూసుకున్నాడు; ఆయన స్వార్ధాన్ని ఆయన చూసుకున్నాడు.

మమ్మల్ని గాలికి వదిలేశాడు. మా పరిస్థితి ఏమిటి? ఆయన మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళం కదా! ఆయన వెళ్ళిపోగానే మాకు జీవనాధారం పోయింది. ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఏల్లలకు తిండి లేకుండా పోయింది. ఒకళ్ళ తరువాత మరొకళ్ళు చనిపోయారు. ఈరోజే చివరివాడు చచ్చిపోయాడు. ఇదంతా నీవల్లే జరిగింది. నీవేనా భర్తను నీ మార్గంలోకి అకర్షించావు. నువ్వు భగవంతునికి దగ్గర కావడం కోసం నా బిడ్డల్పి నాకు దూరం చేశావు. నా పిల్లల్ని మట్టిపాలు చేశావు.

కుటుంబంతో హాయిగా గడుపుతూ, కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తుల్ని సంసార బంధనాలు మిధ్య అనే (భ్రమ కల్పించావు. ఏకాంతవాసంతో భగవంతునికి దగ్గర కావచ్చని నువ్వే ఒక ఉదాహరణగా వీళ్ళందర్నీ అడవులకు ఆహ్వానించావు. వీళ్ళమీద ఆధారపడ్డ సంసారాలన్నీ ఏం కావాలనుకున్నావు? ఇవన్నీ నీకు తెలిసే చేసి వుండక పోవచ్చు. నీవల్లే పోషించే నాథుడు కరవై ఎన్నో సంసారాలు కుప్పకూలిపోయాయి.

ఒకపని చేసేముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, దీని పరిణామాలెలా వుంటాయో అని ఆలోచించని వాడివి నువ్వేం మహాత్ముడివి.''

విరాట్‌ భయంతో కంపించి పోయాడు. అతని పెదవులు వణికాయి. “నన్ను చూసి ప్రజలు ఇలా అనుకరిస్తారని అనంకోలేదం. నేన ఎన్నుకున్న చరార్గంలో నేనొక్కడినే నడుచుకోవాలనుకున్నాను'' అన్నాడు.

“ఓ మున్నీ నీ జ్ఞానం ఏమయిందయ్యా? పసిపిల్లలకు కూడా అర్ధం అయ్యే ఈ చిన్న విషయం నీకు అర్ధం కాలేదా? ప్రపంచంలోని సమస్త కార్యాలు భగవత్‌ కార్యాలే. ఏ మనిషి కూడా తన ఇష్టప్రకారం ఆ పనుల నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే వీలు లేదు. నీ బుద్ధికి అహంకారం పట్టింది. నీ కర్మలకు నీవే కర్తవు కాగలననుకున్నావు. ఈ విషయాన్ని ఇతరులకు బోధించగలననుకున్నావు. నీకు అమృతమైన విషయం నాకు విషమైంది. నీ

తాల్‌

జీవితాదర్శం కారణంగా నా బిడ్డలు బలైనారు.”

విరాట్‌ కొంచంసేపు ఆలోచించి ఆమె మాటల్ని అంగీకరించి, తలవంచుకున్నాడు.

“మీరు చెప్పింది నిజమే. మునుల ఏకాంత వాసంలో కంటే, కర్తవ్య నిర్వహణలో ఒంటరిగా క్రోభ ననుభవించే వ్యక్తిలోనే ఎక్కువ సత్యదర్శనం అవుతుంది. నేను నేర్చుకున్నదేమైనా వుంటే అది దురదృష్టవంతుల్ని చూసి నేర్చుకున్నదే. బాధితుల చూపుల్లో కనిపించే నా అన్న చూపుల్ని చూసి (గ్రహించిందే. నేను ఊహించుకున్నంతగా భగవంతుని ఎదుట విన చుణ్బీ కాలేకపోయాను. పైగా అహంకారినయ్యాను. నేను ఈ క్షణాన అనుభవిస్తున్న బాధ వల్లే నాకీ జ్ఞానోదయవనంంంుంది. సంసార బంధనాలకు దూరంగా కార్యశూనర్యడంగా (బ్రతుకుతున్నాననుకునే వ్యక్తి కూడా తెలిసో తెలియకో ఏదో ఒక కర్మ ఆచరిస్తూనే వుంటాడు. దానికతడు ఈ భూమిమీద బాధ్యుడనేది సత్యం.

నేను మిమ్మల్ని క్షమాభిక్ష వేడుకుంటున్నాను. నేను అడవి నుంచి, ఆ ఏకాంత వాసం నుంచి తిరిగి వస్తాను. నీ భర్త కూడా నావలే తిరిగి వచ్చి మీకొళ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ మీకు సంతానం కలుగుతుందని నా ఆశ, దాంతో మీకు కొంత ఊరట కలుగుతుంది” అన్నాడు.

విరాట్‌ ముందుకు వంగి గౌరవ సూచకంగా ఆమె చీర కొంగును కళ్ళకు అద్దుకున్నాడు. అమె మనసులో వున్న శ్రోధమంతా తుడిచి పెట్టుకుపోయింది. వెళ్ళిపోతున్న విరాట్‌ వెపు ఆమె ఆశ్చర్యంగా అలా చూస్తూ వుండిపోయింది.

రేం ర

విరాట్‌ అరోజు రాత్రి తన కుటీరంలోనే గడిపాడు. ఆ రాత్రి మెరిసే నక్షత్రాలను చాలాసేపు తదేకంగా చూశాడు. సూర్యోదయం కాగానే కాంతులీనే నక్షత్రాలు కనుమర్వుగై పోవడం గమనించాడు. పక్షుల్ని ఆహ్వానించాడు. వాటికి ఆహారం పెట్టి ఆప్యాయంగా వాటిని నిమిరాడు. ఆ తరువాత నెమ్మదిగా కొన్ని సంవత్సరాల క్రితం తనతో అడవికి తీసుకువచ్చిన కర్ర భిక్షాపాత్ర తీసుకుని పట్టణం వైపు బయలుదేరాడు. అడవిలో వున్న తపస్వి తన కుటీరాన్ని వదిలి మళ్ళీ నగర ప్రవేశం చేశాడన్న వార్త క్షణాల్లో దశదిశలా వ్యాపించింది. ప్రజలు ఈ వింతైన సన్నివేశాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. దాదాపు దేవునిలో ఐక్యమయ్యేంతగా భగవదారాధనలో గడిపిన తాపసి, అవన్నీ వదిలేసి మళ్ళీ ప్రజాజీవితంలోకి రావడం వల్ల లోకానికి కీడేదో జరుగుతుందని కాందరు భయపడ్డారు. మార్గానికి ఇరువైపులా భక్తిభావంతో నిలబడివున్న (ప్రజల్ని అభినందించే ప్రయత్నంలో చిరునవ్వుతో ముందుకు నడిచాడు. కాని నవ్వడం కూడ కష్టంగా అనిపించింది. నవ్వడానికి కూడా మనసు రావడంలేదు. ఆయన కళ్ళు గంభీరంగా వున్నాయి. పెదాలు విడివడీ విడవడకుండా వున్నాయి.

చివరికాయన రాజభవనానికి చేరుకున్నాడు. రాజుగారి కొలువు ముగిసింది. ఆయన

చార

ఒంటరిగా వున్నాడు. విరాట్‌ లోపలికి వచ్చాడు. రాజుగారు విరాట్‌ని ఆలింగనం చేసుకునేందుకు తన పీఠం నుంచి లేచారు. కాని ఈలోగానే విరాట్‌ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏదో కోరబోతున్నాననే దానికి గుర్తుగా రాజుగారి దుస్తుల్ని తాకాడు. చెప్పకముందే మీ కోరికను మన్నిస్తున్నాం. ఒక మహానుభావుడికి, ఒక సాధువుకు "సేవ చేసే అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను'” అన్నారు మహారాజు, నన్ను సాధువు అని పిలవకండి. ఇప్పటివరకు గడిచిన నా జీవన మార్గం స్తరైంది కాదు. ఇప్పటివరకు నేను కాలచగ్రంలో పడి దిక్కుతోచక తిరుగుతున్నాను. నేనిప్పుడు. మీముందు కార్యార్థినై నిలబడ్డాను. పాపభీతితో ఇవ్చటివరకు సమస్త కార్యాలకు దూరంగా వుండిపోయాను. కాని అదో (భమ. నావల్ల ఇతరులు కూడా ఆ భ్రమలో చిక్కుకుంటున్నారు.”” , మీ మాటలు నాకు నమ్మళక్యం కాకుండా వున్నాయి. మనుషులకు దూరంగా బికాంతవాసం గడుపుతూ వాళ్ళకు ఏ హాని చేయగలరు? నిరంతరం దెవచింతనలో వుంటూ పాప పంకిలంలో పడిపోయానంటే ఎట్లా?” /

“నేను కావాలని, తెలిసి తప్పాచేయలేదు. నేను పాపాల నుంచి దూరంగా వెళ్ళాను. కాని మన కాళ్ళు ఈ భూమితో బంధింపబడి వున్నాయి. వమన కర్మలన్నీ నిత్యనియమాలతో పెనవేసుకుని వున్నాయి. నిష్కర్మ కూడ ఒక కర్మ, చనిపోయిన నా సోదరుని చూపుల నుంచి నేను తప్పించుకోలేకపోయాను.

నేను అనేకసార్గు అపరాధాలు చేశాను. పరమాత్మ నుంచి దూరంగా పారిపోయాను. మానవసేవకు దూరమయ్యాను. నా జీవితం వ్యర్థమయింది. ఇతరులకు సేవ చేయడానికి బదులు నా జీవితాన్ని నేను పోషించుకుంటూ వ్యర్థంగా గడిపాను. ఇప్పుడు నేను సేవ చేద్దామనుకుంటున్నాను.”

“మీ మాటలు నాకు చాలా కొత్తగా వున్నాయి విరాట్‌: నా అవగాహనకు ఆందడం లేదు. మీ కోరిక ఏమిటో చెప్పండి. నేను నెరవేరుస్తాను.

“ఇక నుంచి పనిలేకుండా ఖాళీగా వుండదలుచుకోలేదు. అన్ని బంధాలకు దూరంగా, స్వేచ్చగా వున్నాననుకుంటున్న వ్యక్తి నిజంగా స్వేచ్భగా లేడు. కర్మలకు దూరంగా వుండే వ్యక్తి కూడా పాపాల నుంచి దూరంగా వుండలేడు. సేవ చేసేవాడు, తన మనణ్శక్తిని ఇతరులకు అందించగలిగిన వాడు, తన శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసేవాడు, తర్కించక కార్యాచరణకు సిద్ధపడేవాడు మాత్రమే నిజమైన స్వతంత్రుడు. ఒక పనిని నిర్వర్తించడమే మన పని. దాని ప్రారంభం, ముగింపు, దాని ప్రభావం, దాని ఫలితం అన్నీ భగవంతుని చేతిలో వున్నాయి. నా అభీపష్టాన్నుంచి నాకు 'స్వేచ్చనివ్వండి. ఇష్టపడటము అనేది ఒక గందరగోళం. సేవ చేయడం అనేది జ్ఞానం."

“నువ్వు చెప్పేదేమీ నాకు అర్ధం కావడంలేదు. ఒకవైపు ఈ బంధనాల నుంచి దూరంగా వుంచమంటావు. మరోవైపు సేవ చేసే అవకాళం కల్పించనుంటావు. ఇతరులకు సేవ చేసేవాడే

తా

స్వతంత్రుడని నీ అర్థమా? సేవ చేయించుకునేవాడు. నీ దృష్టిలో స్వతంత్రుడు కాదన్నమాట. నువ్వు చెప్పేది నాకు అవగాహన కావడం లేదు.”

“అదంతే మహారాజా. మీ హృదయంతో ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేరు. ఇది మీకు బోధపడితే మహారాజుగా ఎలా కొనసాగుతారు? ఇతరులనెలా ఆదేశించగలుగుతారు?”'

మహారాజు ముఖం క్రోధంతో నల్లబడింది. “అంటే నువ్వు చెప్పేదాన్నిబట్టి భగవంతుని దృష్టిలో 'సేవకుడికన్నా మహారాజు అల్పుడనే కదా!”

“ భగవంతుని దృష్టిలో ఏవరు ఎవరికన్నా అల్పులూ కారు, అధికులూ కారు. ఇతరులకు సేవ చేసేవాడు, తర్కించక కోర్కెలను అదుపులో వుంచుకునేవాడు మాత్రమే తన బాధ్యతల నుంచి విముక్తుడు కాగలడు. పరమాత్మకు అంకితం కాగలడు. కాని కోర్కెలున్నవాడు, జ్ఞానంతో వాటిని జయించగలననుకుంటాడు. దురాకర్షణకు లోనై పాపాలలో పడిపోతాడు."

మహారాజు గారికి కోపం ఎక్కువయింది. “ అయితే అన్ని సేవలూ ఒకటేనంటావు, మనిషి దృష్టిలోనూ, భగవంతుని దృష్టిలోనూ ఉన్నత సేవ, అల్ప్బసేవ అనేవి లేవంటానవ్స”

“మనుషుల దృష్టిలో ఒక 'సేవకంటే ఇంకొకటి గొప్పగా కనిపించవచ్చు. కాని భగవంతుడి దృష్టిలో మాత్రం అన్ని సేవలూ సమానమే.'”

చుహారాజుగారు చాలాసేపు కోపం, దిగులు మిళితమైన దృష్టితో విరాట్‌ను చూస్తూ వుండిపోయాడు. ఆయన ఆత్మాభిమానానికి గట్టి దెబ్బ తగిలింది. అలిసిపోయి వున్న విరాట్‌ ముఖాన్ని ముడుతలు పడిన నుదుటిపై పడుతున్న తెల్లటి జుట్టుని చూస్తూ ఈ ముసలివాడికి పీచ్చెక్కిందేమోనన్న అనుమానం వచ్చింది మహారాజుకి. అనుమానం దేనికి పరీక్షిస్తే సరిపోతుంది కదా అనుకుని “అయితే నువ్వు మా కోటలో వేట కుక్కల సంరక్షకుడ్తిగా పనిచేస్తావా?'* అని అడిగాడు.

విరాట్‌ శిరస్సు వంచి కృతజ్ఞతా పూర్వకంగా సింహాసనాన్ని ముద్దుపెట్టుకున్నాడు. నాలుగు ఉత్తమ గుణాలతో ఆ రాజ్యమంతా పేరుపొందిన ఆ వృద్దుడు రాజభవనం ప్రక్కనే వున్న కుక్కల చావిడిలో కుక్కల సంరక్షకుని హోదాలో సాధారణ నౌకర్లతోపాటు ఆ గదుల్లోనే నివశించసాగాడు, ఆయన కొడుకులకి ఆయన వల్ల తల కొట్టేసినట్టయింది. వాళ్ళు ఎప్పుడైనా కుక్కల చావిడి మార్గంలో వెళ్ళవలసి వచ్చినా అటు వెళ్ళకుండా ఎంత దూరమైనా తిరిగి వేరే మార్గం గుండా వెళ్ళేవాళ్ళు. ఆయన ముఖం చూడడమే వాళ్ళకు ఇష్టంలేదు. ఆయన మా తండ్రీ అని ఇతరులకు చెప్పుకోవడం కూడ వాళ్ళకు ఇష్టంలేదు. పూజారులు ఆయన్ను పనికిమాలిన వాడని నిరసించేవాళ్ళు, విరాట్‌ కుక్కల సంరక్షకుడుగా చేరిన కొత్తల్లో ఆయన కుక్కలకు కట్టిన తాళ్ళు పట్టుకుని వాటిని బయట తిప్పడానికి తీసుకృవెళుత్సుంటే అందరూ ఆయన్ను ఆశ్చర్యంగా ఆగి మరీ చూసివెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు న్వుహారాజు గారికి అత్యంత ముఖ్యుడుగా వుండిన అతను కుక్కలు వ్‌

కాయడం అందరికీ వింతగా వుండేది విరాట్‌ అదేమీ పట్టించుకునేవాడు కాదు. చూసి చూసి జనాలకు ఆ దృశ్యం మావమూలయింది విరాట్‌ గురించి వాళ్ళు ఆలోచించడం తూడా మానేశారు. ప్రధాన న్యాయాధికారి పదవిని ఎంత గౌరవంగా భావించాడో తుత్చు ల నంలస్రయడి పదవినీ అంతే గౌరవంగా భావించాడు. విరాట్‌ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా తన విధి నిర్వహణలో నిమగ్పమై వుండేవాడు. కుక్కల్ని శుభ్రంగా తోమేవాడు. వాటి వస్తువుల్నీ శుభ్రంగా వుంచేవాడు, వాటికి భోజనం పెట్టడం, వాటి విశ్రాంతికి ఏర్పాట్లు చెయ్యడం, వాటి ముల మూత్రాదులను శుభ్రపరచడం మొదలైన పనుల్ని చాలా ఆత్మీయంగా, బాధ్యతగా చేసేవాడు, కొద్ది రోజుల్లోనే రాజభవనంలోని జనంకన్నా కుక్కలు ఆయన్ను అమితంగా ్రేమించసాగాయి. దీనికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. నే పెద్ద మార్పులేమీ లేకుండానే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. విరాట్‌ చాలా ముసలివాడ్రైపోయాడు. పళ్ళు కూడా వూడిపోయాయి. ఎప్పుడోగాని మాట్టాడేవాడు కాదు. సమాధానంగా చిరునవ్వు నవ్వేవాడు. ఈలోపు మహారాజు గారు కూడా చనిపోయారు. మరో కొత్త రాజుగారు వచ్చారు. కొని వారికి విరాట్‌ ఎవరు? ఏమిటి అనేది తెలియదు ఒకసారి రాజుగారు వెళుతుంటే వారిని చూసి కుక్క మొరిగినందుకు కోపంతో కుక్కల సంరక్షకుడైన విరాట్‌ని పిలిచి బెత్తంతో ఒక దెబ్బ కొట్టాడు. సమయం గడిచేకొద్దీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఆయనను మర్చిపోయారు. కొంత కాలానికి ఆయన మరణించినప్పుడు బానిసలను దహనం చేసే శ్మశానంలోనే అనాధ 'ప్రేతాలను దహనం చేసేవాళ్ళే ఆయననూ దహనం చేశారు. నాలుగు ఉత్తమ గుణాలతో రాజ్యవుంతా పేరుగాంచిన ఆయననా అప్పటికి అంతా వురిచిపోయారు. ఆయ కొడుకులెవరూ ఆయన దరిదాపులకు రాలేదు. ఆయన కర్మకాండలు జరపడానికి పూజారులు ఎవరూ రాలేదు కుక్కలు మాత్రం రెండు రోజులపాటు తిండి తిప్పలు మానేస్‌ రాత్రింబవళ్ళు మొరిగాయి. ఆ తరువాత అవి కూడ యజమానిని మర్చిపోయాయి ఆయనను గురిం యోధుల చరిత్రలో గాని, మహాత్ముల గ్రంధాల్లోగాని ఎక్కడా ఒక్క మాట కూడ రాయ [క్రై స్త హో తళా

న 2. ఈ 'విరాటో నవలిక రచయిత స్టెఫాన్‌ త్య్వైక్‌ (516120 2461) . సన్ను. ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. కథకుడుగా, వ్యాసకర్తగా ౨. సలా. నొటక రచయితగా, కవిగా సాహిత్యంలో ఆయన స్థానం " మ. చిరస్మరణీయమైంది. సువూరు 40 భాషల్లోకి 'విరటొ పస న్న న. అనువదించబడింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయి... -| టై... స్టెఫానత్చ్యైక్‌ 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికివచ్చారు. ౨.

న భారతీయ తత్వశాస్త్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. మన వేదాల్ని, స " | ప్న వ. ఉపనిషత్తుల్ని, పురాణాల్ని భగవద్గీతని అధ్యయనం చేశారు. న. . కనన. భగవద్గీత సూక్తుల ఆధారంగా ఈ “విరాటో నవలికను వ్రాశారు. |... ననన. ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప మధురానుభూతి. వ.

బన. స్టెఫాన్‌ త్వ్వైక్‌ 1881 నవంబర్‌ 28వ తేదీన వియన్నా ౧... వ. (ఆస్టియా)లో జన్మించారు. ఆస్టేలియా, ఫ్రాన్స్‌, జర్మనీలలో ఎం * నవటన.. విద్యాభ్యాసం చేశారు. జర్మన్‌ రచయిత. క్రీర్తికాంక్షఏమాత్రంలేని ౩... షాని. నిరాడంబర వ్యక్తి, గొప్ప అత్మాభిమాని. పదవులకు, బిరుదులకుు ౫... చు అధ్యక్షతలకు, సభ్యత్వాలకు, సన్మానాలకు జీవితాంతం చాలా స ఎ స వ. దూరంగా వున్నారు. " న్‌ స ననా... ఆయన 'యూదు' కావడం వల్ల నాజీల నిరంకుశత్వానికి ౨... సనా. అణచివేతకు గురైనారు. నాజీ పోలీసులు ఈయన పుస్తకాల్ని వెతికి న “లన. వెతికి తగలబెట్టారు. అక్కడ నుంచి తప్పించుకుని భార్యతో సహా ౧౧... “వసన. మొదట ఇంగ్లండ్‌కు, తరువాత ట్రెజిల్‌కు పారిపోయారు. చివరికి ౯... ని. 1942 ఫీబ్రవరి 22వ తేదీన తన 61వ ఏట భార్యతోపాటు | నుట... అత్మహత్య చేసుకున్నారు. న. చలల. మైక్‌ రచనల్లో 'విరాటో అపూర్వ కళాఖండం. వ.