Telugu Vignana Vikramadityuni Kathalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

క్ట స్ట్‌ సల క విజ్లాన విక్రమాదిత్యుని ”. ణ్‌ ము మ్‌. లం , 1 ళం! చే . న వ గళ గో ళు టి నప . . టీ స స. నన స ష్‌ (; గ “ప సుం. " స స్‌ ఖ్‌ సా. " |. ల ల గ | ని . స్‌ క్‌, వ్‌! / గ. స | న సా నో న్‌ / ! ట్‌ " ౧ స్‌ స లల శ శై జై ఫే. ప్రజాశక్తి బుక్‌హాస్‌్‌ ' ౨.౨:

అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు

వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు తెలుగు; ఎజి యతిరాజులు ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఎమ్‌హెచ్‌ భవన్‌, ష్లాట్‌ నెం. 21/1. అజామాబాద్‌, ఆర్‌టిసి కళళ్యాణమందపం దగ్గర హైదరాబాద్‌ -20. ఫోన్‌ : 040 - 27660013

1111111111 569766 గె (ద్రా ల స ౧00 ఢి ల ం/ [్‌ జ( (8646 1 ] ల యా */ సాల యల "న్‌ వా లొ జరగన శగపం2 ప్రథమ ముద్రణ : జూన్‌, 2013 వెల: ళ్‌ 45 ప్రతులకు ప్రజాశక్తి బుకిహౌస్‌ 1-1-187/1/2,. చిక్కదపల్లి, హైదరాబాద్‌ -20. ఫోన్‌ : 27608107 బ్రాంజ్‌లు హవ్మకొంద, నల్గొండ, గుంటూరు, ఒంగోలు ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌

విషయసూచిక

ప్రచురణ కర్తల మాటి........2.000006066066 006600 2200602 06066620 00086624566260642. 2

  1. చక్కెర చినగుందయ్య కథంంంంంంంంంంంంంంంంంంంంంవంంంుటజలం కి
  2. కుక్కకాటు నందివర్ముడి కథ ...,.0404240000000200002000002000040000000440 తది 4 మలేరియా మంగ కథ .....404404426006040060602200000060060600002000000220 జేట్టి ర. గుండెపోటు గుర్నాధం కథం.ంంంంంం002000000200000000000000004004444004442 ద్‌తి
  3. రక్తక్యాన్సర్‌ రహీంభాయ్‌ కథ ....040220402004606626060260400000000200440000= 60 7 ఎయిడ్స్‌ ఏకనాధుడి కథ ..0020002000000000020066200200000000000000000002 థితి & గాయాల లక్ష్మీపతి కథ........022000000020220000020220205050050650626600640. 77

న ప్రచురణకర్తల మాట

నాకెందుకు ఈ రోగం వచ్చింది? దీన్ని నయం చేసుకోవడమెలా?.... జబ్బు పడిన మనిషి వేసుకునే ప్రశ్నలివి. వీటికి సమాధానం కోసం అతడు పడిన తపన మానవజాతి చరిత్ర పొడవునా మనకు కనిపిస్తుంది. తనకు సమాధానం తెలియని అనేక విషయాలకు మాదిరిగానే ఆ వ్యాధులకు కూడా ఏ దేవుడో, దయ్యమో కారణం అనుకున్నాడు. ఆ దేవుడిని దయ్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తనకు తోచిన రీతిలో ప్రయత్నించాడు. అంతటితో అతడు సరిపెట్టుకోలేదు. ఆలోచన తన నైజం అయిన మానవుడు ఈ జబ్బులకు కారణాలు అన్వేషించాడు. మూఢ నమ్మకాలను పెంచి పోషించిన మతాన్ని అధిగమించాడు. ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు, చికిత్సలు కనిపెట్టారు. అయితే 21వ శతాబ్దం వచ్చినా ఆనాటి మూఢవిశ్వాసాలు ఇంకా అంతరించిపోలేదు. ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధ విశ్వాసాలు వ్యాపింపజేస్తూనే ఉన్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక (ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

“చక్కెర చినగుండయ్యా కథలో ఈ పుస్తక రచయిత పేర్కొన్నట్లు, వ్యాధి అనేది మనిషి పాపాలు చేసినందువల్లో, పూర్వజన్మ ఫలితంగానో వచ్చేది కాదు. చక్కెర వ్యాధి అంటే ఏమిటో, వైద్య శాస్త్రవేత్తలు దానికి ఎలా చికిత్స కనిపెట్టారో ఆర్‌. నటరాజన్‌ చక్కగా వివరించారు. అలాగే కరకాలుడి కథలో, “మవామూర్ధ బేతాళుడా! రాను రాను నీ గుడ్డి నమ్మకాలకు అంతే లేకుండా పోతోంది” అంటూ, తల్లి గర్భంలో ఉండగా ఆవు తన్నడానికి, ఆమె కుమారుడు అవిటి వాడు కావటానికి సంబంధం లేదని, పోలియో వైద్యరగఅద్భుకాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు 7

జ్వరం సోకడం వల్లే కరకాలుడనే వాడు అలా అయ్యాడని విక్రమాదిత్యుడు పాత్రతో చెప్పిస్తాడు. ఈ కరకాలుడి కథలో పోలియో వ్యాధి గురించి, దానికి వ్యాక్సిన్‌ కనిపెట్టిన తీరు గురించి సవివరంగా ఉంది. ఇలాగే మరి కొన్ని వ్యాధులను, వాటికి మందులు కనిపెట్టిన వైనాన్ని భేతాళ కథల రూపంలో రచయిత ఆసక్తికరంగా తెలియజెప్పారు. “వైద్య రంగ అద్భుతాల”తో కూడిన ఈ “విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు” ఆయా వ్యాధులపై సమ(గ్రమైన శాప్రీయ అవగాహన కల్పిస్తాయి. పాఠకులు ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం.

ప్రజాశక్తి బుక్‌హౌస్‌ తేది: 18-6-2013 హైదరాబాద్‌ తి ఆర్‌. నటరాజన్‌

చక్కర చినగుండయ్య కథ క మీరు విక్రమాదిత్యుడ్ని చిత్రపటాలలో చూసివుంటారు. పొడవైన ఖడ్గం, మెలేసిన మీసాలు, అయికే అతడు ఒక చక్రవర్తి. అతని భుజంపై పయనించే భేతాళుడు మాత్రమే అతడి ఏకైక నేస్తం. కానీ పాపం, విక్రమాదిత్యుడు శాపగ్రస్థుడు. తన సుపరిపాలనతో ప్రజల మనస్సులను ఆకట్టుకున్నవాడు అతడు. విక్రమాదిత్యుడు రాత్రివేళల్లో తన సహచరుదైన భేతాళుడితో శృశానాల్లో తిరుగుతుండేవాడు. అక్కడ అతడి రాజ్యం ఈనాటికీ కొనసాగుతోంది. మనలో ఎవరూ భేతాళుడ్ని చూచి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విక్రమాదిత్యుడు పక్కన ఉన్నంతవరకు అతడు మనల్ని ఏమీ చేయలేడు. చక్రవర్తి మౌనంగా ఉన్నప్పుడు అతని నియంత్రణలో భేతాళుడు కూడా తన ప్రయాణం కొనసాగిస్తాడు. ఒకొకృప్పుడు భేతాళుడు విక్రమాదిత్యునిపై కోపగించుకొని, ఎత్తెన చెట్టు కొమ్మలలో వెళ్ళి తిష్ట వేసేస్తాడు. మునగచెట్టు పైనో లేదా శృశానంలోని చిరతచెట్టు పైనో భేతాళుడు ఎక్సివెళ్ళేటప్పుడు, తనతోపాటు అక్కడ సగం కాలిన ఒక శవాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆనాడు కూడా అలాగే జరిగింది. గుడ్లగూబలు భయంకరంగా అరుస్తున్న ఆ కటిక చీకటిలో మానవ కపాలాలు రావిచెట్టు తొర్రలలో నుంచి నవ్వుతున్నాయి. భేతాళుడు శవంతోపాటు రావిచెట్టు కొమ్మనుంచి వేలాడుళున్నాడు. అప్పుడు చక్రవర్తి విక్రమాదిత్యుడు తన ఖడ్గంతో శవాన్ని బిగించి కట్టిన తాడును తెగ్గోశాడు. ఆ శవాన్ని పూర్తిగా కాబ్చివేసేందుకు కిందికి తీసుకొచ్చాడు. అతడి కాళ్ళకింద ఎముకలు పెళపెళమని విరిగిపోతున్నాయి. వాటినేమీ లక్ష్యపెట్టకుందా విక్రమాదిత్యుడు తన పనిలో నిమగ్నమయ్యేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి సమయంలో భేతాళుడు ఆ శవం నుంచే మాట్లాడసాగాడు. 10 ఆర్‌. నటరాజన్‌

“మహారాజా! ఎన్నో శతాబ్దాలుగా నీవీ పనిని నిజాయితీగా, అలసటలేకుండా చేస్తూరావటాన్ని నేను ప్రశంసిస్తున్నాను. ఇలాంటి పనులు నీవు చేసేంతవరకు నీకు మరణమనేది ఉండదు. ఇన్ని శతాబ్దాలలో ఈ ప్రపంచంలో ఎన్నెన్నో సంఘటనలు జరిగి పోయాయి. నీవిప్పుడు మోసుకెళ్తున్న వాడి పేరు “చక్కెర చినగుండయ్యా. అతడి కథను ఇప్పుడు నీవు వింటావ్‌.

2

సింహాచలం అనే ఊరికి దగ్గర తుమ్మలపాళెం అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో ఒక భూస్వామి ఉన్నాడు. అతడి పేరు గజ్జెల పెదగుండయ్య. ఆయన తన భార్యతోనూ, కుమారుడు చినగుండయ్యతోనూ ఉండేవాడు. చినగుండయ్య వారికి ఏకైక పుత్రుడు. చిన్నప్పటినుంచే వాడు తిండిబోతు రామన్న మనం ఎప్పుడు చూచినా, వాడు ఏదో ఒకటి తింటూనే ఉండేవాడు. అప్పుడే వాడు ఒకేసారి రెండు లీటర్ల పాలు తాగేసేవాదు. కాస్త పెద్ద పిల్లవాదైన తర్వాత ఒక డజన్‌ ఇడ్లీలను ఒకేసారి గుటకాయస్వాహా చేసేసేవాడు. వాడి తిండిబోతుతనం చూసి గ్రామస్థులు అసహ్యించుకున్నా, వాడి తల్లికి మాత్రం వాడంటే మహాముద్దు. అందువల్ల ఎంతైనా వాడికోసం వండి, వారుస్తూ ఉండేది.

బడికి వెళ్లిన మన చినగుండయ్య పాఠాలు ఏం చదివాడోగానీ, ఇంట్లో తినివచ్చింది వాడికి చాలేదే లేదు. అందువల్ల బడిలోని ఇతర పిల్లలు తెచ్చుకునే టిఫిన్‌ బాక్సులను వారికి తెలియకుండా తెరచి, వాటిలో ఉన్నదంతా తినేసేవాడు. ఆ పిల్లలు మధ్యాహ్నం బడి వదిలిన తర్వాత తమ టిఫిన్‌ బాక్సులు తెరచి చూస్తే అవి ఖాళీగా ఉండేవి. కొన్ని రోజులిలాగే గడిచి పోయాయి. అన్నం దొంగిలించే దొంగను పట్టుకోవాలని వారు మాటు వేశారు. ఒక రోజు చినగుండయ్య దొంగన్నం తింటూ వారికి దొరికిపోయాడు. ఉపాధ్యాయులు వాడికెంతో చెప్పిచూశారు, కొట్టిచూశారు, భయపెట్టి చూశారు, అయితే వాడు కొన్నాళ్ళకు పిల్లల టిఫిన్‌ బాక్సులే కాకుండా, టీచర్ల టిఫిన్‌ బాక్సులు కూడా దోచుకోవడం ప్రారంభించాడు. ఆ పాఠశాలలో పెద్ద గగ్గోలు పుట్టింది. ఆ ఊరి స్త్రీలు మన గుండయ్యను శాపనార్థాలు పెట్టారు.

“మా బిడ్డల అన్నమంతా దొంగిలించి తినే వీడు బాగువడతాడా? నాశనమైపోతాడు”

“వీడిలా ఊరినంతా మేస్తే చక్కెర రోగం వచ్చి పోతాడు వైద్యరంగఅద్భుకాలు విజ్ఞాన విక్రమాదెత్యుస్‌ కథలు క్షేషే

ళన | . వ వా స “గుండయ్య తల్లి కూడా ఒక స్రీయే కదా! బిడ్డను అదుపులో పెట్టాలి కదా!” ఇలా అందరూ తలా ఒక మాట అన్నారు. ఒకనాడు అందరూ ఒక్కటై పెదగుండయ్య దగ్గరకెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే అతడు కూడా పెద్దగా సమస్యను పరిష్కరించలేదు. చినగుండయ్య అఘాయిత్యాలు భరించలేక ఇతర విద్యార్థుల ప్రతి తల్లీ, బా రా నాలక. నటరాజన్‌

గుండయ్య కోసం కూడా ఒక ప్రత్యేక టిఫిన్‌బాక్స్‌ ఇచ్చి పంపించనారంభించారు. అలాగైనా తమ బిడ్డకు మధ్యాహ్న భోజనం దక్కుతుందనుకున్నారు. ఇలా ఊరోళ్ళ ఆహారపదార్థాలు తినే చినగుండయ్య పెరిగి, పెద్దవాడైపోయాడు. కుటుంబం ధనిక కుటుంబం కనుక, అతడు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేకుండాపోయింది. అందువల్ల శరీరం లావెక్కింది, పొట్ట ముందుకొచ్చేసింది. అతడిలాగే బాగా లావుగావున్న శ్రీపురంలోని “కూష్మాండవతి” నిచ్చి అతడికి పెళ్లి చేశారు. వధువు తండ్రి అక్కడ సెద్ద వర్తకుడు. మొత్తంలో ఈ ఇద్దరి జంట కనులనిండుగా ఉంది. పెళ్లి రోజే వధూవరులు ఆరగించిన తర్వాత, మిగిలిన ఆహార పదార్థాలు ఓ పదిమందికి కూడా సరిపోలేదు. కొంతకాలానికి చినగుండయ్య ఒకరోజు ఉన్నట్లుండి అనారోగ్యం పాలై మంచం పట్టాడు. కొన్నాళ్ళకే గుర్తుపట్టలేనంత సన్నబడిపోయాడు. గ్రామవైద్యుడు బాబుకు చక్కెర వ్యాధి వచ్చిందన్నాడు. చక్కెర వ్యాధికి చక్మెరే మందు అనుకొన్న కూష్మాండవతి భర్తకు కిలోల లెక్కన చక్కెర తినిపించింది. అంతే పాపం, ఒకరోజు గుండయ్య మరణించాడు. అప్పటికీ కొంతకాలం ప్రాణాలతో మంచం మీదే పడున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని కాలిలో గాయంతగిలి, అందులో చీము నిండిపోయింది. డాక్టర్లు అతడి కాలిని తీసేశారు. ప్రతిరోజూ నాలుగు ఇంజెక్షన్లు అతనికి వేశారు. గుండయ్యకు మాత్రం ఇంజెక్సన్లకన్నా మాత్రలే బాగా నచ్చాయి. ఇలా భేతాళుడు కథను వివరించి, “మహారాజా! నీవు చాలా వివేకవంతుడివి కదా. మరి ఈ గుండయ్య ఎలా చనిపోయాడు? ఇతరుల ఆహారాన్ని దొంగిలించి తిన్న పాపొనికా? లేక వాడు చేసుకున్న కర్మ వాడిని చిన్న వయసులోనే చంపేసిందా? లేదా డాక్టర్లు చెప్పినట్లు రోజుకు నాలుగు ఇంజెక్షన్లు వేసుకోకపోవడం వల్లనా? మాత్రలు వాడిని ఎందుకు బ్రతికించలేకపోయాయి?” అని ప్రశ్నలు సంధించి, భేతాళుడు “ఈ ప్రశ్నలకు నీవు జవాబులు తెలిసినా, చెప్పక మౌనంగా ఉన్నావంటే నీ శిరస్సు వెయ్యి ముక్కలైపోతుంది” అని చెప్పాడు. అయితే విక్రమాదిత్యుడు భేతాళుడి అన్ని ప్రశ్నలకు సరియైన జవాబు చెప్పసాగాడు. 3 “మూర్థ భేతాళుడా! ఇన్ని శతాబ్దాలు గడిచి, 21వ శతాబ్దం వచ్చేసినా, ఇంకా నీకు తెలివి రాలేదు. నీ జ్ఞానం ఎక్కడో ఆగిపోయింది. వ్యాధి అనేది మనిషి పాపాలు చేసినందువల్లో, పూర్వ జన్మ ఫలితంగానో వచ్చేది కాదు. సైన్సుపరంగా ఆలోచిస్తే అలా వైద్యరగలద్భుకాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు 113

అనుకోవడం తెలివైన విషయం కాదు. చక్కెర వ్యాధి అంటే ఏమిటో వివరిస్తాను. (శ్రద్దగా విన అన్నాడు విక్రమాదిత్యుడు.

“ఒక మనిషి బతికి ఉండేందుకు “గ్లూకోజ్‌” అనబడే చక్కెర పోషకం అత్యవసరమైంది. మనం తీసుకునే ఆహారం తియ్యగా ఉంటేనే అందులో చక్కెర పోషకం ఉందనుకోరాదు. బంగాళాదుంపలనుంచి బాదం గింజలవరకు అన్నీ గ్లూకోజ్‌ నిండివున్నవే. మన రక్తంలో కలిసిపోయే చక్కెర, మన నిత్యజీవనానికి శక్తిగా ఉంటుంది. కొందరు మనుషుల రక్తంలో కరిగిపోయే చక్కెర, శక్తిగా మారి అదృశ్యమైపోకుండా అలాగే ఉండిపోతుంది. ఇందువల్ల గుండెకు సంబంధించిన ఇబ్బంది, మూత్రపిండాల సమస్య వచ్చే అవకాశం ఉంది. రక్తంలోని చక్కెర పూర్తిగా కరిగిపోయి, కనుమరుగుచేసే వస్తువేదో చాలా కాలం దాకా మానవులకు తెలియకుండానే పోయింది. అందువల్ల చక్కెర వ్యాధి (మధుమేహం) సోకగానే మరణం తప్పనిసరి అని అనుకున్నారు మన పూర్వీకులు. అయితే ఈ పరిస్థితిని మార్చివేసినవారు గొప్ప శాస్త్రవేత్త ఫెడరిక్‌ పాంటింగ్‌. భేతాళుడా! ఆయన కథ నీకు తెలిసి ఉంటే, తెలివిలేకుండా ఇలా వదరి ఉండవు. ఆ వివరమేదో చెబుతాను, వినుకో.

ఈనాడు కోట్లాది ప్రజలు డయాబెటిస్‌ అనే చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరూ ఫెడరిక్‌ పాంటింగ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆయనే ఆ వ్యాధి కారణాన్ని దానిని నివారించేందుకు “ఇన్సులిన్‌” అనే హార్మోన్‌ బెషధాన్ని కనుగొన్నవారు. ఆయన దానిని కనుగొన్న విధమే నీ చక్కెర చినగుండయ్య కథ కన్నా పసందైనది.

'ఫెడరిక్‌ గ్రాండ్‌ పాంటింగ్‌ 1891వ సంవత్సరం, నవంబర్‌ 14న కెనడాలో జన్మించారు. ఆయన ఒక భూస్వామి ముద్దుల కుమారుడు. ఆ దేశంలోని టొరొంటొ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ.లో (ప్రవేశించిన ఆయన త్వరలోనే వైద్యవద్యకు మారిపోయారు. 1916లో పాంటింగ్‌ డాక్టరైన వేళ మొదటి ప్రపంచ మహాయుద్ధం (ప్రారంభమైపోయింది. ఆయన కెనడా సైన్యంలో మిలిటరీ సర్వీసులో చేరిపోయాడు. ఆయన సేవలను చూచి ఇంగ్లండులోను, ఫ్రాన్స్‌లోను ఆయనకు “మిలిటరీ క్రాస్‌లు” (బిరుదులు) ప్రదానం చేశారు.

అయితే మానవాళికి ఏదో ఒక మంచి పని చేసితీరాలనే పట్టుదల గలవారు ఏనాటికీ సంతృప్తి చెందరు. నిరంతరం అందుకోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. సైన్సు ప్రపంచం అత్యంత విచిత్రమైనది, ఆశ్చర్య పరిచేది. ఆ రంగంలో పనిచేసే వారికి సూక్ష్మ పరిజ్ఞానం, గట్టి ఆసక్తి, దృఢమైన పట్టుదల ఉంటే చాలు. ప్రారంభంలో పాంటింగ్‌

సత్త ఎ ఆర్‌, నటరాజన్‌

| (ట్‌ ో స రే సం నై 1/1: . యూ ట (లేల

ఆంటారియో విశ్వవిద్యాలయంలో ఉపన్యానకులుగా ఉద్యోగం చేసినా, త్వరలోనే అక్కడినుంచి విరమించుకున్నారు. మొదటీ ప్రపంచయుద్ధ కాలంలో ఇంగ్లండులోనూ, ఫ్రాన్స్‌లోనూ చక్కెర వ్యాధిగ్రస్థులు పడుతున్న పాట్లనుచూసి, ఆయన మనస్సు ద్రవించింది. 1921న టొరొంటొ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన పాంటింగ్‌ అక్కడే మధుమేహరోగానికి సంబంధించిన పరిశోధనలు ప్రారంభించారు. మనిషి శరీరంలో, రక్తంలో చక్కెర ఉండాల్సిన వివరాలను ఆయన పరిశీలించారు. భోంచేయకమునుపు మనిషి రక్తంలో చక్కెర 80 మి.గ్రా. నుంచి 110 మి.గ్రా. వరకు ఉండొచ్చు. ఈ సంఖ్య దాటితేనే ప్రమాదం. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత ఒకటిన్నర గంటల అనంతరం మనం తీసుకున్న ఆహారంలోని చక్కెర నేరుగా రక్తంలో కరిగిపోతుంది. అప్పుడు 120 మి.గ్రా. నుంచి 140 మి.గ్రా. వరకు ఉండటం సురక్షితమైనదిగా ఉంటుంది. ఆ సంఖ్యను మభంగంర్భుకాల విజ్ఞానవిక్రమాదిత్యునికధలు కర్‌

టాం. 4 1 నాం. పిస య? లో . 2 గ

16 - ఆర్‌. నటరాజన్‌

దాటితే రక్షప్రసరణ కఠినమైపోతుంది. రక్తనాళాలు విస్తరించి, బరువైనవైపోతాయి. అందువల్ల విపరీతమైన బడలిక వచ్చేస్తుందనే విషయాన్ని ఆయనే మొట్టమొదట కనుగొన్నారు.

శరీరంలోని చక్కెరను వూర్తిగా ఉపయోగించుకోలేనప్పుడు, శరీరం సన్నబడిపోతుంది, బరువు కూడా తగ్గిపోతుంది. శరీర కణాలు ఎండిపోవడం వల్ల దాహం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆహారమండలం (జీర్ణమండలం) దెబ్బతినేదానివల్ల అకలి కలిగించేవి అత్యంత తీవ్రమైపోతాయి. అప్పుడు ఎంత తిన్నా, వెంటవెంటనే ఆకలేస్తుంది. అయితే నీవు చెప్పినట్టు చక్కెర గుందయ్య లాగా ఎవరూ అలా రాశులు రాశులుగా తినలేరు. కాలక్రమేణ శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుండడం వల్ల దెబ్బలు తగిలినపుడు గాయాలు త్వరగా మానిపోపు. కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గడంవల్ల అవి స్పర్శ కోల్పోతుంటాయి. మనకు ఏదైనా దెబ్బ తగిలితే కూడా తెలియకుండానే పోతుంది.

శ

మధుమేహ వ్యాధి భారిన పడ్డవారు శారీరక శక్తిని కలిగించుకునేందుకు ఎక్కువగా వ్యాయామం చేయాలి. అలా చెమటలు పట్టేట్లు వ్యాయామాలు చేసినప్పుడే శరీరంలోని చక్కెర పరిమాణం తగ్గుతుంది. అయితే ఇందుకు ఏదో ఒక అవయవం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూవచ్చారు. చక్కెర నిండిన ఆహార వదార్థాలను తాకనేరాదన్నారు వారు.

1889వ సంవత్సరం దాకా చక్కెర వ్యాధి ఎందుకు వస్తుందనేది సరిగ్గా అర్థం కాలేదు. అప్పటివరకు కూడా (ప్రజలు ఆ వ్యాధి సోకితే చావు తప్పదనే భావిస్తూవచ్చారు. అయితే ఆ సంవత్సరం వైద్య రంగంలో ఒక గొప్ప విప్లవమే జరిగిందనాలి. ఇంగ్లండ్‌లో శునకాల శరీరాల్లో జీర్ణప్రక్రియపై విజ్ఞానులు పరిశోధనలు చేయసాగారు. వాటి శరీరాల నుండి జఠర రసగ్రంథి అనే ఒక వినాళగ్రంథిని తొలగించివేస్తే, వాటికి వెంటనే చక్కెరవ్యాధి సోకడాన్ని విజ్ఞానులు కనుగొన్నారు.

ఆ శాస్త్రవేత్తల్లో ఒకరైన ఎడ్వర్డ్‌ స్మాఫర్‌ జరరరస గ్రంథినుంచి స్రవించే ఏదోఒక ఉత్తేజక (స్రావం (హార్మోన్‌) రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తోందని తెలుసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు ఆయన చేయలేక పోయాడు. ఎందుకంటే జఠరరనో [గ్రంథి ఒక జీర్దావయవం. రక్తానికీ, దానికీ మధ్యవున్న సంబంధాన్ని అర్ధంచేసుకోవడం చాలా కఠినంగా ఉండినది. అందువల్ల సెలైన్‌ అనే ఈ హార్మోన్ను ఆ కాలం శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. వైద్యరంగఅద్భుకాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు క7

కానీ వారి పరిశోధనలను కొనసాగించాలని మన గ్రైడరిక్‌ పాంటింగ్‌ నిశ్చయించుకున్నారు. ఆ అంతఃస్రావాన్ని విడిగా తీసుకోగలిగితే, దానినుపయోగించి చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చునని ఆయన విశ్వసించారు. అందుకోసం శునకాల జఠర రసగ్రంథులను పచ్చిగానూ, ఉడికించి రోగులకు తినిపించారు. అయితే అందువల్ల విపరీత ఫలితాలొచ్చాయి. అదేగాక వారి చక్కెర పరిమితిని కూడా తగ్గించలేక పోయింది. అంతస్రావానికి ఆయన “ఇన్సులిన్‌” అని నామకరణం చేశారు. తర్వాత ఆయన మరో శాస్త్రవేత్త జె.ఆర్‌.మెక్ష్లీయానాను సహాయమందించాలని కోరారు. ఆ మెక్షీయానా సెలవుల్లో స్కాట్‌లండ్‌ వెళుతూ తన ల్యాబారేటరీని పాంటింగ్‌కు అప్పగించి, సహాయమందించేందుకు చార్లెస్‌ బెస్ట్‌ అనే యువ విజ్ఞానిని కూడా నియమించారు. పాంటింగ్‌, తాను ఆలోచించినట్లే శునకం జఠర రసగ్రంథి నుంచి ఆరే రోజుల్లో ఇన్సులిన్‌ను వేరుపరచి తీసుకున్నారు. దానిని చక్కెర వ్యాధితో బాధపడే మరో శునకానికి ఎక్కించినపుడు, అది కొన్ని గంటల్లోనే స్వస్థత చెంది, లేచి నిలబడి తోకాడించింది. దాని రక్తంలో చక్కెర పరిమాణం చాలావరకు తగ్గి ఉండటాన్ని కూడా పాంటింగ్‌ (గ్రహించుకున్నారు. మరో మూడు రోజుల్లో అప్పుడే ఈనిన దూడల నుంచి ఇన్సులిన్‌ తీసుకునే పద్ధతిని కూడా ఆయనా, ఆయన సహాయకుడు బెస్ట్‌ - ఇద్దరూ తెలుసుకున్నారు. 1922, జనవరి 16వ తేదీ. ప్రపంచం ఆ రోజును మరువజాలదు. టొరొంటొ ప్రధాన ఆసుపత్రిలో రెండోశ్రేణి చక్కెర వ్యాధితో పోరాడుతున్న ఒక బాలుడు. వాడిపేరు లియోనార్డో థామ్సన్‌. భేతాళుడా! నీవు చెప్పే చక్కెర వ్యాధిగ్రస్తులైన “పాపాత్ములలో” వాడు కూడా ఒకడు. వైద్యులందరూ ఇంక వాడు బ్రతుకలేదని చెప్పేశారు. ఆ సమయంలో పొంటింగ్‌ తాను కనుగొన్న ఇన్సులిన్‌ను వాడికెక్కించారు. వెంటనే వాడి రక్తంలో చక్కెర పరిమాణం తగ్గనారంభించి, మెల్లగా ఉత్సాహం సంపాదించుకొని, ఆ పిల్లవాడు లేచి తిరిగాడు. వాడిని చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్‌ అంతః(స్రావాన్ని తమ శరీరంలోకి ఎక్కించుకుంటే, అది వారి ప్రాణాలను రక్షిస్తుందనే విషయాన్ని ప్రపంచం (గ్రహించింది. 1928వ సంవత్సరంలో పాంటింగ్‌ తన 32వ ఏటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్‌ బహుమతి పొందారు. అప్పటి ఇంగ్లండ్‌ చక్రవర్తిణటైన 5వ జార్డ్‌ (ఆయనకు కూడా పాపం, చక్కెర వ్యాధి ఉండినది) పాంటింగ్‌ను “సరొ బిరుదునిచ్చి సత్కరించారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాంటింగ్‌ మరలా మిలిటరీ సర్వీసులో చేరారు. 1941వ సంవత్సరంలో ఆయన ప్రాణరక్షణ చై ననా అరే, నటరాజన్‌

య ట్‌ య్‌

. న | (క్ష [/ బెషధాలను తీసుకొని, యుద్ధరంగానికి విమానంలో వెళుతున్నప్పుడు, ఆ విమానం కూలిపోయి, ఆయన కూడా మరణించారు.

భేతాళుడా! చక్కెర చినగుండయ్య ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ చేసుకోకపోవడమే వాడు చేసిన పొరబాటు. ఇన్సులిన్‌ అనేది మాత్రల రూపంలో మింగే హార్మోన్‌ కాదు. ఎందుకంటే మాత్రలు మింగితే, వాటిని జీర్ణ్షమండలంలోని స్రావాలు నిర్వీర్యం చేసివేస్తాయి. దానిని ఇంజెక్షన్‌గా తీసుకోవడమే సురక్షితమైనది. ఈ కారణం చేతే గుండయ్య చనిపోయాడే గానీ అతడు చేసిన పాపాల వల్లేమీ కాదు”.

విక్రమాదిత్య చక్రవర్తి వివరించిన ఈ సరియైన జవాబుతో ఆయన మౌనం భంగమైంది. భేతాళుడు పెద్దగా నవ్వి, ఇదే తగిన సమయమని విక్రమాదిత్యుడి భుజం నుంచి తప్పించుకొని, చెట్టువైపుకు దూకాడు. 20. ఆర్‌ నటూాపె్‌

ఆహార పెద్దలకు పెద్దలకు 18-15 ర్‌ పళ్ల పదార్థాలు (పురుషులు) (మహిళలు) వయస్సు పిల్లలు బాలబాలికలు ధాన్యాలు (బియ్యం, గోధుమలు మొగ1వి) 520 440 శ్తీం0 270 పప్పు దినుసులు (వేరుశెనగ, కొబ్బరికి బదులుగా) ళ్‌0 శీర్‌ శీర్‌ తర్‌ తాజా కూరగాయలు, ఆకుకూరలు త్త 100 50 ర్‌0 ఇతర కూరగాయలు (పచ్చివి, వండినవి) 70 40 50 ర్‌0 దుంపలు, కాడలు 60 ర్‌0 30 20 పాలు, 200 150 250 250 క్రొవ్వు నూనెలు శీర్‌ 2 త్తం లగ చక్కెర, బెల్లం 85 లం శ్తీర్‌ 40 గమనిక : మాంసొహారులు పప్పు దినుసులకు బదులుగా 2 కోడిగ్రుడ్డు, 50 (గ్రాములు మాంసం, చేపల్లు లా ఖ్‌ వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు న్‌ టాల్‌ నై ళ్‌ క్ష + | గ్‌ చ ఆరితటక న ॥

నిత్యావసరాలైన పోషక పదార్థాలు

వయస్సు కార్సో మాంస మొత్తం పమితి హైడ్రేట్లు కత్తులు క్రొవ్వు లవణాణ విటమిన్లు క్యాలరీలు 12-15 సం॥ 800 గ్రా 25 కిగ్రా విటమిన్‌ ఎ 2200 నయస్సు గల నుండి ప్రతి కీగ్రా 1 మి.గ్రా బాలిక 820 గ్రా శరీర 80 గ్రా 10మిగ్రా విటమిన్‌ వీ

వరకు దిరువుకు 12-15 సం॥ వయస్సు గల 800గ్రా 50 గ్రా 80మిగ్రా విటమిన్‌ సి 2500 బాలుడు నుండి 820 గ్రా॥ 50 మి.గ్రా.

' ఈ పరిమితులకు మించి ఆహారం తీసుకోవడం ప్రమాదహేతువు. అయితే ఈ పరిమితి గల ఆహారం కూడా లభించని బాలలే మన దేశంలో అత్యంత ఎక్కువమంది.

  • చక్కెర వ్యాధిగ్రస్తులు బియ్యం, గోధుమలవంటి ధాన్యాలను సగానికి సగం తగ్గించుకుని, కార్బోహైడ్రేట్లను కూడా 200 గ్రాముల వరకు తగ్గించి ఆహారం స్వీకరించడమే మంచిది. పప్పు దినుసులు ఎక్కువగా తినవచ్చు.

శా మధుమేహరోగులు క్రొవ్వు పదార్థాలను 15 గగ్రాములవరకు తీసుకోవచ్చు. ఇవిగాక మిగతా అన్ని ఆహార పదార్థాలు భుజించవచ్చు.

శ చక్కెర కన్నా బెల్లమే శ్రేష్టం. శరీరారోగ్యానికి మంచిది. అందులో ఇనుము కూడా ఉంది.

ఇలా నూ నా నా లర్‌, నటంజన్‌

|. తం భో టే. . _ గ్‌ 1 స్య న న్ని ల | ( 'ఖ్ర్రై శ వ ల నటం = స్లద్యతుగ రద్భకాలు విజ్ఞాన వ నని జ్ఞాన విక్రమాదిళ్యుని కథలు

కరకాలుడి కథ శ శ్మశానం చిమ్మ చీకటిగా ఉంది. అప్పుడప్పుడు ఎక్కడో దూరంలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపులు చెట్ల తొర్రలలో పడివున్న కపాలాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. చక్రవర్తి విక్రమాదిత్యుడు తన ఖద్గంతోనూ, మహారాజ దుస్తులతోనూ భయమో, సంకోచమో లేక ఆ శ్మశానం ఉత్తరపు దిశనుంచి వచ్చాడు. నెలవంక వర్షపు మేఘం వెనుక అద్భృశ్యమైపోయింది. గాలీవాన పెద్ద శబ్దంతో కురుస్తోంది. శవాలను కాల్చిన బూడిద శృశానమంతటా వ్యాపిస్తోంది. అప్పుడు గుడ్లగూబలు అరుస్తున్న చెట్టుమీదికి విక్రమాదిత్యుడు ఎగబ్రాకాడు. అక్కడ పై కొమ్మ ఒకదానిలో (వేలాడుతున్న శవాన్ని క్రిందికి తీసుకొచ్చి, నేలపై పడుకోబెట్టాడు. అతడి కాళ్ళక్రింద శృశానంలోని ఎముకలు, ఆకులు, అలములు నలిగిపోతున్నాయి. కపాలాలు కూడా పాొడిపొడి అయిపోతున్నాయి. విక్రమాదిత్యుడు నేలపై ఉన్న శవాన్ని తన భుజంపై వేసుకొని, దహన వేదిక వైపు బయలుదేరాడు. అతడి చూపంతా దహనవేదిక పైనే ఉంది. అతడి మనసంతా ఎన్నో శతాబ్దాలుగా తాను వదలకుండా నిర్వర్తిస్తున్న తన కర్తవ్యం గురించే ఆలోచిస్తోంది. కాసేపట్లో భయంకరమైన వర్షం వచ్చే సూచనలు బాగా కనబడుతున్నాయి. అయినా అతడు తన కర్తవ్యం నుంచి కొంచెం కూడా తొలగిపోయేందుకు సిద్ధంగా లేడు. విక్రమాదిత్యుడి భుజంపైనున్న శవంలోకి భేతాళుడు ప్రవేశించి, బిగ్గరగా నవ్వాడు. ఒక నిమిషం చక్రవర్తి అలాగే నిలిచిపోయి, మళ్లీ నిస్సంకోచంగా దహనవేదికను సమీపించాడు. ఆ శవాన్ని కాల్చివేస్తే, భేతాళుడు అ రోజు వేరే శవంలోకి ప్రవేశించేందుకు, అనాడు వేరే ఏ శవమూ ఆ శృశానానికి రాలేదు. అప్పుడు భేతాళుడు చక్రవర్తితో చెప్పాడు “విక్రమాదిత్య మహారాజా, పట్టువదలని నీ కర్తవ్యనిర్వహణను మెచ్చుకుంటున్నా, నీ నిజాయితీ వేనోళ్ళ కొనియాడదగినది. నీవు ఇత న ఎ ఆర్‌ నటరాజన్‌

ణు భా ల్‌ ళా ॥

  1. ా గి ణో లు మ థ్‌ న వ్రద్యంగలద్భకాల వష్ణాన విక్రమాద్‌త్యునికథలు 25

నీ ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారమే ఈనాటికీ నడుచుకుంటున్నావ్‌. గుడ్తగూబలు భయంకరంగా అరిచే రాత్రి వేళల్లో కూడా శృశానాలకు వచ్చి, నీ బాధ్యతను నెరవేరుస్తున్నావు. ఇప్పుడు నీవు తీసుకెళ్తున్న శవం “కరకాలుడు” అనే వాడిది. నీ అలసట తగ్గేందుకు వాడి కథను చెబుతాను, వింటావు కదూ!” విక్రమాదిత్యుడు, భేతాళుడి మనస్సు నెరిగినవాడు కనుక, చిన్నగా నవ్వుకున్నాడు. తన దారికడ్డంగా పాకుతూపోతున్న పామును క్రొక్కకుండా, జాగ్రత్తగా, చిన్నగా నడుస్తూ భేతాళుడి కథ వినేందుకు సిద్ధమయ్యాడు. 2 తొగటూరుకు ప్రక్కన దక్షిణ తిరుమల అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో తరతరాలుగా ఒక కుటుంబం పశువులను మేపుతూ, వాటి పాలను పితికి వ్యాపారం చేస్తోంది. ఆ కుటుంబ యజమాని పేరు గోపాలయ్య. అతని భార్య రుక్మిణమ్మ. వారికి మొత్తం 17 ఆవులు, గేదెలున్నాయి. గోపాలయ్య తన భార్య సహకారంతో ఉదయమూ, సాయంత్రమూ పాలు పితికి, ఆ ఊరి వారందరికి అమ్ముకునేవాడు. వారి ఇంటి పాలు తాగే ఆ (గ్రామంలోని పిల్లలందరూ పెరిగి, పెద్దవారౌతారు. అయితే వారికి సంతాన ప్రాప్తి లేదు. అందువల్ల రుక్మిణమ్మ దూడలనే తన సొంత బిడ్డలుగా భావించి పెంచుకునేది. ఆ దంపతులు మధ్యమధ్య ఎన్నో తీర్ధయాత్రలు చేశారు, ఎందరో దేవతలను వేదుకున్నారు, ముడుపులు చెల్లించుకున్నారు. కొంతకాలానికి రుక్కిణమ్మ గర్భవతైంది. గర్భవతిగా వున్నా ఆమె దూడలను ముద్దుచేయడం మానుకోలేదు. వాటితో ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. ఒక రోజు అలా పశువుల పాలు పితుకుతున్నప్పుడు ఎకృడ్చుంచో ఉన్నట్లుండి ఒక పంది అక్కడికి దూసుకొచ్చింది. దానిని చూచిన అవు భయపడి, రుక్కిణమ్మ పాలు పితుకుతూవున్నప్పుడు ఆమె కడుపును తన్ని పారిపోయింది. దాంతో ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ సంఘటన జరిగిన మూడు గంటల్లోనే, ఆమె నెలలు నింధకనే ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే వచ్చిన ప్రమాదం ఒక ప్రక్మనున్నాా కన్నబిడ్డను చూచి ఆ దంపతులిద్దరూ మహానందభరితులయ్యారు. సంతోషంతో ఆ బిడ్డకు సంపత్‌కుమార్‌ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అయితే వారి ఆనందం చాలా కాలం కొనసాగలేదు. రుక్కిణమ్మ ఆ బిడ్డను ఒక్క క్షణం వదలి ఉండలేదు. దూడల, ఆవుల పోషణను పూర్తిగా వదిలేసింది. అవి రుక్సిణమ్మ వాత్సల్యం లభించక దుఃఖించాయి. గోపొాలయ్య ఒక్కడే తన కుటుంబ వృత్తిని 24 నాన న నానన నా ఆర్‌, నటరాజన్‌

కొనసాగిస్తూ, బాబును ఇద్దరూ పెంచుకుంటూ వచ్చారు. ఆ పరిస్థితిలో ఒక రోజు అకస్మాత్తుగా సంపత్‌కుమార్‌కు తీవ్రమైన జ్వరం వచ్చేసింది, స్పృహ కోల్పోయాడు. వమనాలయ్యి బిడ్డ కళ్ళు మూతలు పడుతున్నాయి. వాడి రెండు కాళ్ళు నిస్సత్తువుగా మారిపోయాయి, ఈడ్పు లాంటిది వాడిని కమ్మేసింది. ఇల్లంతా హాయిగా తిరుగుతుండిన సంపత్‌కుమార్‌, ఇప్పుడు కదలక, మెదలక ఒకేచోట పరుండిపోయాడు.

ఇప్పుడు వాడు బాగా నడవలేక, కాళ్ళను లాక్కుంటూ లాక్కుంటూ (గ్రామం చుట్టివచ్చాడు. అందువల్ల ఊరివాళ్ళు వాడిని “కరకాలుడు.. కరకాలుడు” అని పిలువనారంభించారు. చివరివరకు వాడి కాళ్ళు మునుపటిలాగా కాలేకపోయాయి. సంపత్‌కుమార్‌కు పెళ్లీడు కూడా వచ్చేసింది. గోపాలయ్య-రుక్కిణమ్మలు తమ వారసుడికోసం, ఆస్తి సంరక్షణ కోసం వాడికి పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూడా జరిగిపోయింది.

ఇప్పుడు సంపత్‌కుమార్‌ టైసైకిల్లో ఊరంతా చుట్టివచ్చినా, తన భార్య గర్బవతి అనే విషయం తెలిసి సంతోషించలేదు. తమ బిడ్డ కూడా తన లాగే అవిటివాదుగా పుడకాడేమోనని అతడు భయపడ్డాడు. తన తల్లి తనను గర్భంలో మోస్తున్నప్పుడు ఆవు తన్ని తానిలా అయ్యానని అతడు భావించాడు. అందువల్లే తాను అవిటివాడినయ్యానని అనుకున్నాడు. అయితే అతడి భార్యమాత్రం ఇలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా, తన మామూలు పనులు చేసుకుంటూ ఉంది.

సంపత్‌కుమార్‌ భయపడుతున్న ఆరోజు వచ్చేసింది. అతడి భార్య ఒక మగళిశు వుకు జన్మనిచ్చింది. శిశువు చేతులు, కాళ్ళు బాగానే ఉండడం చూచి గ్రామస్థులంతా కూడా ఆశ్చర్యపోయారు. గోపాలయ్య తాతయ్య అయ్యాడు. మనవద్ని చూసుకుంటూ మురిసిపోయాడు. ఆ బిడ్డకు 10-12 సంవత్సరాలైనా కూడా, ఎలాంటి అంగవైకల్యం లేకపోవడాన్ని చూచి అందరూ ఆనందించారు".

ఇలా చెప్పి భేతాళుడు కథను ఆపాడు. కాసేపటి తర్వాత “విక్రమాదిత్య మహారాజా! రుక్మిణమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కడుపును అవు తన్నినందువల్లే కరకాలుడు (సంపత్‌కుమార్‌) అవిటివాదుగా పుట్టాడా? అందువల్లే అతడి కాళ్ళు సన్నబడిపోయాయా? అదే నిజమై వుంటే ఆ ఆవు రుక్కిణమ్మను ఎందుకు తన్నాలి? - ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలిసీ నీవు వివరించకపోతే నీ తల వెయ్యి బద్దలైపోతుంది!” అని భేతాళుడు హెచ్చరించాడు. ఇత న ఆర్‌. నటరాజన్‌

వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు 29

విక్రమాదిత్యుడు భేతాళుడి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు ముందుకొచ్చి ఇలా చెప్పసాగాడు. 3 “మహామూర్థ భేతాళుడా! రానురానూ నీ గుడ్డి నమ్మకాలకు అంతే లేకుండా పోతోంది. మొదట నీవు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే రుక్కిణమ్మను ఆవు తన్నిందానికీ, కరకాలుడు అవిటివాడైనదానికీ ఎలాంటి సంబంధమూలేదు. వాడికి సోకిన వ్యాధిపేరు “పోలియో”. అది ఒక రకమైన జ్వరం. ఆ జ్వరం తీవ్రతకు కాళ్ళు సన్నబడిపోతాయి. ఆ వ్యాధి విషపూరిత క్రిములద్వారా (వైరస్‌ల ద్వారా) వ్యాపిస్తుంది. ఇప్పుడు నీవు దీనిని తెలుసుకోవాలి. 1840వ సంవత్సరం జర్మనీ దేశానికి చెందిన జాకబ్‌ వాన్‌వైనీ అనే అతనే ఆ రోగానికి “పోలియో” అని పేరుపెట్టాడు. ఈ పోలియో జ్వరం మూడు రకాల వైరస్‌ల ద్వారా వ్యాపిస్తుంది - బర్న్‌హైడ్‌, లోన్సింగ్‌, లియాన్‌. ఈ వ్యాధి 5-10 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్‌లు ముక్కు నోరు, శ్వాస ద్వారా పిల్లల శరీరాల్లోకి (ప్రవేశిస్తాయి. ఇవి శరీరం లోపలికి ప్రవేశించగానే స్నాయు మండలాన్ని (ప్రభావితం చేస్తాయి. నరాలకణాలలో ఈ వైరస్‌లు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతాయి. అందువల్ల నరాల కణాలు నశించిపోతాయి. ఈ కారణంగా ఆ పిల్లలు బాల పక్షవాతానికి బలౌతారు లేదా అవిటివారౌతారు. కరకాలుడికి మొదట సంభవించినట్లే సృ తప్పిపోవడం, స్పందన లేకపోవడం, తీవ్రమైన జ్వరం మొదలగునవి వైరస్‌ సోకిన అందరికీ వస్తాయి. ఇలా వైరస్‌లు నరాలకణాలను పూర్తిగా నాశనం చేసినపుడు, అన్నిటికన్నా ముందుగా కాళ్ళే సన్నబడిపోతాయి. అయితే భేతాళా, ఇలా కాళ్ళు పనిచేయకపోయినా, వాటిని సరిదిద్దేందుకు ఇప్పుడు ఎన్నో రకాల “ఫిజియోథెరఫి” అనబడే వ్యాయామాలు చేయిస్తున్నారు. కానీ, వీటిని ఆది నుంచే ప్రారంభించేయాలి. ఈ ఫిజియోథెరఫి చికిత్సా విధానాన్ని ఆస్ట్రేలియాకు చెందిన “కెన్నీ” అనే నర్సు ఆవిష్కరించింది. ఆమె పూర్తిపేరు కెన్నీ ఎలిజబెత్‌. ఆమె వద్ద నడక శిక్షణ పొందిన వారు ఈనాటికీ ఎందరో వేగంగానూ నడవగలుగుతున్నారు, మెల్లమెల్లగానూ నడవగలుగుతున్నారు. పోలియో సోకిన పిల్లలు ధరించే బూట్స్‌ను కూడా ఈమే రూపొందించింది. తం లా కే నటాబన్‌

వైద్యరంగఅద్భుతాలు బిజ్ఞాన విక్రమాదిత్యునికథలు ప1

నయా గం మో ప... ప్రస్తుతం పోలియోను ప్రపంచం నుంచే తరిమేసేందుకు అన్ని దేశాలు సీ సంసిద్ధమయ్యాయి. ఈ వ్యాధి ఉష్ణదేశాల్లోనూ, సమశీతోష్ణ దేశాల్లోనే ఎక్కువగా వస్తోంది. ఒక్క 1921వ సంవత్సరంలోనే అమెరికాతో సహా ఐరోపా దేశాలలో మూడు లక్షల మంది పిల్లలపై ఈ వైరస్‌లు దాడిచేశాయి. ఆ దేశాల ప్రభుత్వాలన్నీ దీంతో బెంబేలెత్తి పోయాయి. 1980వ దశకంలో పోలియో పిల్లలకు మాత్రమేకాక, పెద్దలకు కూడా సోకనారంభించింది. ఆనాటీ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్‌ కూడా పోలియో వాతపడ్డ్దారు. దాంతో ప్రపంచమంతా పోలియోతో భయభ్రాంతమైంది. శ నేడు పోలియో చుక్కల మందు తెలియని వారంటూ ఎవరూ లేరు. ఈ మందు ఒక రోగ నిరోధక బెషధం. రెండేరెండు చుక్కలు మూడు రకాల వైరస్‌లను టీ టే న! నియంటత్రించగలవు. ఈ రెండు చుక్కలను దివ్యామృతమనీ, సర్వశక్తి సంపన్నమనీ, సర్వలోక మోక్ష్మప్రదాయినీ అనీ ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సులభ పద్దతిలో నోటిలో వేసే ఈ రెండు చుక్కల బెషధం ఎంతో చక్కగా పనిచేస్తుంది. అత్యంత

థం! ల ల న్‌. తక్కువ పరిమాణంలో తీసుకున్నా, సుదీర్ధక్షాలం జయప్రదంగా పనిచేసే మందు ఇదే. ఈ బెపధాన్ని కనిపెట్టిన వారు ఆల్బర్ట్‌ బ్రూస్‌ సాబిన్‌. ఎప్పుడూ నీవే నాకు కథ చెప్పాలా? ఇప్పుడు నేను నీకు సాబిన్‌ కథ చెబుతాను. మొట్టమొదట పోలియో నైరస్‌ను ల్యాబరేటరీలో జాన్‌ ఫ్రాంక్లిన్‌ సృష్టించి చూపారు. ప్రపంచంలో రోగాలు వచ్చిన తర్వాత గాక, అవి రాకముందే రోగనిరోధక ప్రయత్నాలు ఎలా చేస్తారో నీకు వివరించి చెబుతాను. ఏ వైరస్‌, బ్యాక్టీరియా వ్యాధిని కలిగిస్తుందో, ఆ వైరస్‌లోని చిన్ని భాగాన్ని మన శరీరంలోకి ప్రవేశింపజేస్తే, వ్యాధి నయమౌతుంది. అయితే చిన్ని భాగం అనేది అత్యంత ప్రధానం. అందువల్ల ప్రమాదమేమీ జరగదు. ఆల్బర్ట్‌ బ్రూస్‌ సాబిన్‌ పోలండ్‌లో జన్మించారు. అక్కడ 1906వ సంవత్సరంలో మతకలహాలు విజృంభించినపుడు, ఆయన తండ్రి తన కుటుంబాన్ని అమెరికాకు తీసుకెళ్ళిపోయారు. అక్కడి న్యూజెర్సీ రాష్ట్రంలో వస్త్రపరిశ్రమలో ఆయన పనిచేస్తూ వచ్చాడు. వ్రైథ్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు 3

సాబిన్‌ చిన్నాన్న ఒక దంత వైద్యుడు. ఆయన తన అన్న కుమారుడ్ని దంతవైద్య కళాశాలలో చేర్చించారు. అయితే సొబిన్‌ దంత వైద్యుడు కాలేదు. సామాన్య వైద్య శాస్త్రానికి మరుసటి సంవత్సరమే ఆయన మారిపోయాడు. ప్రభుత్వ ఉపకార వేతనాలతోనే ఆయన తన చదువును ముగించారు. 1981వ సంవత్సరంలో ఎం.డి. పట్టాతో సాబిన్‌ వైద్యకళాశాల నుంచి వచ్చారు. అయికే ఆయన రోగులకు చికిత్స చేయడంతోనే ఆగలేదు. వైద్యశాస్త్ర పరిశోధనలవైపు తన దృష్టిని సారించారు. ఓహియో నగరంలో ప్రభుత్వ పిల్లల వైద్యశాలలో డాక్టరుగా ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ కాలంలోనే రెండవ ప్రపంచ మహాయుద్ద్ధం కూడా ప్రారంభమై పోయింది.

ఆ సమయంలో సాబిన్‌ అమెరికా సైన్యంలో ఒక డాక్టరుగా చేరారు. అక్కడే రోగనిరోధక శక్తి గురించి ఆయన ఆలోచించడం ప్రారంభించారు. అమెరికన్‌ సోల్డర్లు యుద్ధరంగంలో - ముఖ్యంగా పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో - ఎన్నో రకాల జ్వరాలకు గురౌతూవచ్చారు. ఎందరో చనిపోయారు కూడా. రాత్రింపగళ్ళు పరిశోధనల్లో మునిగిపోయిన డాక్టర్‌ సాబిన్‌, సైన్యంలో ఉన్నప్పుడే డెంగ్యూ జ్వరానికీ, మెదడువాపు వ్యాధికీ రోగనిరోధక బెషధాలను కనుగొన్నారు.

1946వ సంవత్సరం ఆల్బర్ట్‌ సాబిన్‌ సిన్సినాటీ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు, అక్కడాయన పిల్లల వైద్యశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిజేశారు. ఆ సమయంలోనే పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో జోన్‌సాల్క్‌ కూడా పిల్లల వైద్యశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వారిద్దరి మధ్య పోటాపోటీగా వైద్య శాస్త్రానికి సంబంధించిన చర్చోపచర్చలు సాగాయి

ర్‌

భేతాళా, ఒక్క 1952వ సంవత్సరంలోనే ఒక్క అమెరికాలోనే 3 వేల మంది బాలలు పోలియోజ్వరంతో చనిపోయారు. 58 వేల మంది పిల్లలు పోలియోతో అంగవైకల్యం పొందారు.

దీంతో సాబిన్‌, సాల్క్‌- ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ప్రారంభమైంది. అదివరకే ఫ్లూ జ్వరానికి రోగనిరోధక టీకా ఉండినది. అలాంటి ఒక రోగ నిరోధక టీకా తిక ఆర్‌. నటరాజన్‌

చం -

పోలియోకు కూడా ఉండాలని సాల్క్‌ భావించారు. పోలియోను కలిగించే మూడు రకాల వైరస్‌లకు ఒకటే బెషధంగాక, మూడు రకాల వైరస్‌లను నిరోధించే మందులను సాల్క్‌ ప్రతిపాదించారు. ఆయన చికిత్సాపద్ధతులను, మూడు రకాల రోగనిరోధక మందులను అమెరికా ప్రభుత్వం వెంటనే అంగీకరించాల్సి వచ్చింది. అయితే వాటి ధర చాలా ఎక్కువగా ఉండినది. ఆ మందులను అత్యధిక రోజులు సురక్షితంగా ఉంచడం కూడా కష్టమైంది. అయినా సాల్క్‌ ఇంజెక్షన్లను 1950లలో అమెరికా దేశమంతా పిల్లలకు వేశారు. పోలియో ప్రభావం తగ్గిన మాట నిజమే గానీ, పేద దేశాల్లో ఆ మందులను వాడడం వీలుపడే విషయం కాదు.

సాబిన్‌ అత్యంత సహనశీలుడు. ఆయన తాను కనుగొనే రోగనిరోధక బెషధం ప్రపంచమంతా ఉపయోగించదగినదిగా ఉండాలని కోరుకున్నారు. 1855లో ఆయన వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు కె

పోలియో వైరస్‌లను నిర్వీర్యం చేసే నిరోధక మందును కనుగొన్నారు. మూడు రకాల వైరస్‌లను నిరోధించగలిగే ఆ చుక్కల మందును ఆయన తన నోటిలోనూ, తన పిల్లల నోళ్ళలోనూ వేసి పరిశీలించారు. సాల్క్‌ జెషధం కన్నా సాబిన్‌ పోలియో చుక్కలు వెంటనే పనిచేయనారంభించాయి.

సావీన్‌ ఆవిష్కరించిన నూతన జెషధాన్ని అమెరికా ప్రభుత్వం తన జైళ్ళలో ఖైదీలపై ప్రయోగించి, పరిశోధించింది. సాల్మ్‌కు లభించిన గౌరవం సాబిన్‌కు లభించలేదు. పెద్దపెద్ద సంస్థలు ఆయనకు ఆర్థిక సహకారం అందించలేదు. అయితే సాల్క్‌ ఇంజెక్షన్‌ను 100 మందికి వేయగలిగే ఖర్చులో సాబిన్‌ పోలియో చుక్కలను 5,000 మందికి వేయవచ్చుననే విషయం తెలిసినపుడు ప్రపంచమే విస్మయం చెందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దానిని వెంటనే సోవియెట్‌ యూనియన్‌, జపాన్‌, ఆస్టేలియా దేశాలకుపంపి 1958లో పోలియో నిరోధక ఉద్యమం ప్రారంభించింది.

తదనంతరం ఆ ఉద్యమాన్ని ప్రపంచ దేశాలు స్వీకరించుకున్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వంద కోట్ల ప్రజలకు సరిపోయే చుక్కల మందును తయారుచేసి అందించింది. 1989వ సంవత్సరంలో ఆసియా ఖండంలో మాత్రమే 80 వేల మంది పిల్లలు పోలియోతో బాధపడ్డారు. అయితే ఈనాడు ఆసియా ఖండమంతా కూడా పోలియోగ్రస్థ పిల్లలు 89 మంది మాత్రమే లెక్కకు వచ్చారు. దాదాపు పోలియో వ్యాధి అదృశ్యమైపోయే వాతావరణం ఈరోజు ఉంది. అందుకు సాబిన్‌ అవిష్కరించిన చౌకయైన, మూడు రకాల వైరస్‌లను నశింపజేసే చుక్కలమందే కారణం.

భేతాళాా ఈ విషయాలన్నీ నీకు తెలియవు కదా! కరకాలుడికి పుట్టిన బిడ్డ అంగవైకల్యం లేకుండా జన్మించిన దానికి కారణం ఇప్పుడు తెలుసుకున్నావా? పోలియో అనేది వారసత్వంగా వచ్చే జబ్బు కాదు. కరకాలుడి ఊరిలో అతడే ఆ జబ్బుకి గురైన చివరి వాడుగా కూడా ఉండవచ్చు” అని విక్రమాదిత్యుడు వివరించాడు.

చక్రవర్తికి మౌన భంగం కావడంతో ఖేతాళుడు పెద్దగా నవ్వాడు. తర్వాత మరో శవం తీసుకొని మునగచెట్టెక్కి కూర్చున్నాడు. విక్రమాదిత్యుడు మరలా తన నిత్య కార్యంలాగే నిరాశ చెందక ఖడ్జాన్ని చేతబట్టి భేతాళుడ్ని వెంబడించాడు. తళ లాడ ాాడాాాాాాాలక్‌ నటరాపన్‌

తాజావార్త : ప్రజాశక్తి దినపత్రిక 15-04-2013

ఫిలడెల్ఫియా (అమెరికా) : పోలియో వ్యాధికి వ్యాక్సిన్‌ను రూపొందించిన తొలి శాస్త్రవేత్త దాక్టర్‌ హిలరీ కోస్రోవస్కీ (96) 14-04-2018 ఆదివారం కన్నుమూశారు. సజీవ పోలియో వైరస్‌ను ఉపయోగించి ఆయన నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ను తయారుచేశారు. మానవులకు దీనిని 1950లో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. తన తండ్రి రూపొందించిన వ్యాక్సిన్‌ వైద్యపరంగా మొట్టమొదటిసారిగా విజయం సాధించిందని కోప్రోవ్‌స్కీ కుమారుడు క్రిస్టోఫర్‌ తెలియజేశారు. ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు అమెరికాలో మొట్టమొదటిసారిగా ఆల్బర్ట్‌ సాబిన్‌ లైసెన్సు పొందారు. పేరు ప్రఖ్యాతలు గాంచిన సహపరిశోధక శాస్త్రవేత్తల ప్రమేయంలేకుండా గుర్తింపు పొందినందుకు తన తండ్రి ఎంతో సంతోషించేవారని అన్నారు. కోప్రోవ్‌స్కీ వ్యాక్సిన్‌ రూపొందించిన రెండేళ్ళ తర్వాత ఇంజెక్షన్‌ రూపంలో పోలియో మందును జోన్‌ సాల్క్‌ రూపొందించారు. ప్రద్యంగలడ్యకాలు బిడ్టాన విక్రమాదెళ్యునకథలు క?

(౧ ఈ. ఖం క ౩ న _ య్‌ ల్‌. తద లా డౌ. ఆర్‌, నటరాజన్‌

కుక్కకాటు నందివర్హ్ముడి కథ

ఎన్నో శతాబ్దాలు గడచిపోయినా, విక్రమాదిత్యుడు కొంచెం కూడా అలసట, విసుగు చెందక తన ప్రజలకోసం శ్శృశానాలు తిరుగుతూనే ఉన్నాడు. చిమ్మచీకట్లో ఒకరోజు రాత్రి, చేత ఖడ్గం పట్టి శ్మశానంలో ప్రవేశించాడు. అక్కడ చిందరవందరగా పడివున్న ఎముకలు అతని కాళ్ళకు తగులుతున్నా, వాటిని అతడు లక్ష్యపెట్టలేదు. ఆ వాతావరణంలో గుడ్లగూబలు అరుస్తున్నా ఒక రావిచెట్టు దగ్గరికి అతడు చేరుకున్నాడు. రావిచెట్టు కొమ్మల్లో వ్రేలాడుతున్న ఒక శవాన్ని తన భుజంపై వేసుకున్నాడు. తర్వాత దానిని కాల్చ్బడమా, పూడ్చిపెట్టడమా అని ఆలోచిస్తూ దహన వేదికవైపు అడుగులేశాడు.

విక్రమాదిత్యుడలా ఆలోచనలో మునిగివుండటం భేతాళుడికి ఆనందం కలిగించింది. ఆ శవంలోనే దాగివున్న భేతాళుడు బిగ్గరగా నవ్వి, మాట్లాడసాగాడు.

“విక్రమాదిత్య మహారాజా! నీ కర్తవ్యనిర్వహణను మెచ్చుకుంటున్నా! ఎన్నో వందల సంవత్సరాలు గడచిపోయినా, నీవు మాత్రం మారనే లేదు. అయితే ఇప్పుడు నీవు చేస్తున్న పని నాకు నచ్చలేదు.

నీ కర్తవ్యం అనుకొని నీవిప్పుడు మోసుకెళ్తున్న ఈ నిర్జీవ శరీరపువాడు “నందివర్శుదు”. నిజానికి వాడు కుక్క బతుకు బతికినవాడు. వాడి కథ చెబుతా, విను!

మధురానగరానికి ప్రక్కనున్న రత్నప్రురిలో ఉన్న ఒక వర్తకుడి కుమారుడుగా ఈ నందివర్ముడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో రకాల సమస్యలు వాడిని చుట్టుముట్టుతూ ఉందేవి. ఆ ఊర్లో చాలా పలుకుబడి ఉన్న వాడి తండ్రి, కుమారుడ్ని అల్లారుముద్దుగా పెంచాడు. ఇతర పిల్లల్లాగానే చిన్నతనంలో ఇంటికే పరిమితమై ఉండిన నందివర్ముడు, కొంచెం పెద్దవాడైన తర్వాత వీధుల్లో ఇతర పిల్లలతో ఆటల్లో మునిగిపోయాడు. వైద్యరంగఅద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు 39

బాల్యం నుంచే వాడికి కుక్కలంటే మహాద్వేషం. వీధిలో కుక్కలు కనబడగానే, వాటిని రాళ్ళతో కొట్టి తరమడం వాడికి అలవాటు. కొంతకాలానికి వాడెక్కడ కనబడినా కుక్కలు కుంయ్‌.. కుంయ్‌ మంటూ పరుగులు తీసేవి. వాడు కుక్కపిల్లలను చూస్తే, వాటి రెండు చెవులను పట్టుకొని దూరంగా విసిరికొట్టేవాడు. నిద్రపోతున్న కుక్కలను కర్రలతో బాదుతుండేవాడు. ఏదైనా తింటూవుండే కుక్కలను వేడినీళ్ళు కొట్టి తరిమేసేవాడు. వాడొకృడే కాదు, వాడి స్నేహితులందరూ కూడా ఇలాగే కుక్కలను వేధిస్తూవుందేవారు. అందువల్లే వాడికి మరణం కానుకగా లభించింది.

  • స్కూల్లో చివరి తరగతి చదువుతున్నప్పుడు నందివర్ముడు ఒకరోజు సాయంత్రం ఎగురుతూ, గంతులేస్తూ ఇంటికి తిరిగివస్తున్నాడు. తాను తింటున్న బిస్కెట్‌ను చెట్టుమీదున్న కాకికి విసరివేశాడు. అయితే కిందపడుకొని ఉన్న ఒక కుక్కను చూడలేకపోయాడు. ఆ కుక్కను బలంగా తొక్కేశాడు. అదేమో సాధారణమైన కుక్క కాదు. అప్పటికే దానికి పిచ్చి పట్టివుంది. అందువల్ల, వెంటనే ఆ కుక్క నందివర్శుడి కాలిని గట్టిగా కరిచేసింది.

కుక్కకాటుకు గురైన వాడు ఇంటికెళ్లిన తర్వాత తండ్రికి చెబితే, తననే కొడతాడేమోనని భయపడి, ఏమీ జరగనట్లుండిపోయాదు. ఇంట్లో ఎవరికీ కూడా ఈ విషయం తెలియజేయలేదు. అయితే కొన్నాళ్ళ తర్వాత వాడిలో మార్పులు కనబడ్డాయి. రాత్రి వేళల్లో వాడు నిద్రించలేకపోయాడు. మొదట స్వల్పంగా మూర్చ రానారంభించింది. తర్వాత కుక్క కరచిన చోట పెద్ద గాయమైంది. ఒక రోజైతే నందివర్ముడు కుక్కగానే మారిపోయాడు. ఊరంతా దిగ్భ్రాంతి చెందింది. వాడిని కరచిన కుక్క రెండు రోజుల్లోనే చచ్చిపోయింది. నడిరాత్రి వాడు తన ఇంట్లో కుక్కలాగానే ప్రవర్తించనారంభించాడు. వాడిని ఒక గదిలో బంధించివుంచి, తల్లిదండ్రులు ఎన్నో వైద్యాలు చేశారు. నీళ్ళంటేనే వాడికి భయం కలిగింది. దాహమేసినా నీళ్ళు తాగలేక పోయాడు. వాడికి ఆహారం కూడా తినాలనిపించలేదు. గదిలో బంధింపబడివున్న నందివర్శుడ్ని చూసినవారు, వాడు కుక్కలాగానే మారిపోయాడన్నారు. వాడి కాళ్ళు, చేతులను గొలుసులతో బంధించి ఉంచారు. రెండు వారాల్లోపలే వాడు చనిపోయాడు. వాడి ఎదుటకు వెళ్ళడం ప్రమాదకరమైనదని గ్రామస్థులందరూ దూరదూరంగానే ఉండిపోయారు. వాడి ఎంగిలి పడితేనే చావు మూడుతుందని ఎవరూ దగ్గరికే రాకపోయారు. గ్రామవైద్యుడు వాడికెన్నో కషాయాలు తాగించాడు, ఎన్నో పూతమందులు వాడాడు. అయినా నందివర్శుడు ఎందుకు బ్రతకలేదు? వాదెందుకు కుక్కగా మారిపోయాడు? దీనిని తలరాత అందామా? వాడి కర్మ అందామా? శం ఎ. ఆర్‌, నటరాజన్‌

ఈ (ప్రశ్నలకు జవాబులు తెలిసీ, నీవు చెప్పకపోతే విక్రమాదిత్యా! నీ తల వెయ్యి బద్దలైపోతుంది” అని భేతాళుడు చెప్పాడు.

భేతాళుడు చెప్పిన కథను విన్న విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వి, భుజం పైనున్న శవాన్ని జారిపోకుండా గట్టిగా పట్టుకొని, ఆ శ్మశానంలో నడుస్తూనే ఇలా చెప్పసాగాడు.

“మూర్ధ శిఖామణి భేతాళుడా! నీ అంధవిశ్వాసాలకు అంతే లేకుండా పోతోంది. ఒకడ్ని ఒక కుక్క కరిచేసిందంటే, అది ప్రమాదమౌతుందేకానీ, వాది కర్మ ఎలా అవుతుంది? కుక్క కాటు వల్ల వచ్చే జబ్బును “హైడద్రోఫోబియా” అంటారు. ఇప్పుడు కుక్కకాటుకు ఉత్తమ చికిత్స ఉంది. నందివర్ముడు చేసిన పొరబాటేమిటో తరువాత చెబుతానుగానీ, ఇప్పుడు పిచ్చికుక్క కాటుకు సరియైన రోగనిరోధక మందును కనుగొన్న మహాపురుషుడి వృత్తాంతం చెబుతాను, సావధానంగా విను.

ఫ్రాన్స్‌ దేశంలోని జురా అనే పర్వత ప్రాంతంలో ట్రంకుపెట్టెలు తయారుచేసే ఒకతని కుమారుడుగా 1822వ సంవత్సరం డిసెంబర్‌ 27న లూయిస్‌ పాశ్చర్‌ జన్మించాడు. ప్రాథమిక విద్యను పాశ్చర్‌ అర్జాయిస్‌ పట్టణంలో పూర్తిచేసినా, ఎప్పుడూ అతడు బొమ్మలు వేస్తూ ఉండేవాడు. అంటే మంచి చిత్రకారుడయ్యే లక్షణం కనబడుతుండేది. కానీ అతడి తండ్రికేమో తన కుమారుడు ఉపాధ్యాయుడు కావాలనే కోరిక ఉండేది. అందువల్ల లూయిస్‌ పాశ్చర్‌ ప్యారిస్‌ నగరంలోని ఎక్కోల్‌ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో రసాయనిక శాస్రోపాధ్యాయుడయ్యేందుకు శిక్షణ పొందాడు.

అతనికి రసాయనిక శాస్తమంటే చాలా ఇష్టం. అందులో అతడి సామర్థ్యం, ప్రతిభను చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. అతడు ఉపాధ్యాయ శిక్షణతోపాటు రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ కూడా పొందాడు. కానీ, పాశ్చర్‌ ఉపాధ్యాయవృత్తిని స్వీకరించలేదు. రసాయనిక శాస్త్రవేత్తగా 1848వ సంవత్సరంలో అనేక పరిశోధనలు చేయనారంభించారు. ఫ్రాన్స్‌లో ప్రసిద్ధిచెందిన “థ్రైంచ్‌ అకాడమీ”కి చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్తల ఎదుట తన పరిశోధనా ప్రయోగాలను చేసి చూపే అవకాశం పొందారు.

తెలివిలేని భేతాళుడా, ఈ విషయం కూడా విను! ఆయన క్రిస్టల్‌ శిలల (స్ఫటిక రాళ్ళు) గురించి పరిశోధనలు చేశారు. అందువల్ల ఆయనకు ఫ్రాన్స్‌లోని రెండు విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పదవులు కూడా దక్కాయి. చివరకు తన పాత ఉపాధ్యాయ శిక్షణా కళాశాలకే ప్రొపెనర్‌గా తిరిగివచ్చారు. అక్కడ తన వరిశోధనలు కొనసాగించేటప్పుడు, ముఖ్యంగా ఆహారపదార్థాలను చాలా రోజులవరకు చెడకుండా బైద్యదంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు నాళ

1 ర న లో రూ యయా రా ల సురక్షితంగా ఉంచడానికి సంబంధించిన పరిశోధనటే ఆయన చేశారు. పాలు పెరుగుగా మారడం, చక్కెర తయారీ ప్రక్రియలో ఆల్కహాల్‌ (సారా) వెలువడడం - ఇవన్నీ ఆయన్ను విస్మిళుడిగా చేశాయి. వీటికంతా ఏదో ఒక రసాయనిక కారణముంటుందని ప్రపంచ శాస్త్రవేత్తలు భావిస్తున్న ఆ కాలంలో, ఆ మార్పులు మనకంటికి కనబడని “ఈస్ట్‌” లాంటి సూక్ష్మజీవుల వల్లనే సంభవిస్తాయని లూయిస్‌ పాశ్చర్‌ తన ప్రయోగాలతో నిరూపించారు. ప్రపంచమంతా ఆయన ప్రయోగాలను చూచి, ఓ కొత్త విషయం తెలిసిన ఆనందం అనుభవించింది. అందువల్లే ఈనాడు కూడా నీటిని మరగకాచి తాగాలి, పాలను మరగకాచి తాగాలి అని మనమందరం భావిస్తున్నాం. అప్పుడే రకరకాల సూక్ష్మజీవులు వల్ల కలిగే రోగాల నుంచి తప్పించుకోగలం. సామాన్య విజ్ఞాన శాస్త్రాన్ని మానవులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దిన ప్రపంచ శాస్త్రవేత్తలు చాలా కొద్ది మందే. వారందర్లో లూయీస్‌ పాశ్చర్‌నే మొదటివాడిగా ప్రశంసిస్తారు. దానికి కారణమూ ఉంది. ఆయన ప్యారిస్‌ ప్రయోగశాలలో అత్యంత స్వల్ప జీతానికే దీర్ధకాలం పనిచేశారు. రాత్రింపగళ్ళు ప్రయోగశాలలోనే పడి న్‌ ఆర్‌. నటరాజన్‌

ఉండేవారు. తాను చేసే ప్రయోగాలు సత్ఫలితాలిచ్చేంతవరకు విశ్రాంతి తీసుకునేవాడు కాదు. మానవ జీవితాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించేందుకు అవసరమైన నూతన విషయాలను ఆయన కనుగొన్నారు. డాక్టర్లు ఉపయోగించే శస్త్రచికిత్సా సాధనాలను, ఇంజెక్షన్‌ చేసే సిరంజిలను, మరగకాచిన నీటిలో వేసి శుభ్రపరిస్తే మనకు కొత్తగా సోకే సూక్ష్మక్రిముల నుండి తప్పించుకోవచ్చనే విషయం ఈనాడు అందరూ అంగీకరించేదే! అయితే దీనిని మొట్టమొదట కనుగొన్నవారు లూయిస్‌ పాశ్చరే. దీనిని “స్టెరిలైజేషన్‌” (క్రిమిసంహారం) అంటారు. పక్షులకు, జంతువులకు, మనుషులకు వచ్చే రోగాలగురించి ఆయన అత్యంత (శద్ధతో పరిశోధనలు చేశారు. రోగకారక “ఆంధ్రాక్స్‌” క్రిములను పూర్తిగా నాశనం చేసిన మహావిజ్ఞాని లూయిస్‌ పాశ్చర్‌. ఇందుకు రోగనిరోధక టీకాలను ఎడ్వర్డ్‌ జెన్నర్‌ అనే శాస్త్రవేత్త ఆవిష్కరించారు. పాశ్చర్‌ చివరి విజయం “ర్యాబిస్‌” వ్యాధికి మందు తయారుచేయడమే. ఎల్లప్పుడూ పాత విషయాలను మననం చేసుకుంటూ, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పులను గ్రహించకుండా, మూఢ విశ్వాసాల్లోనే మునిగితేలే మూర్ధ భేతాళు డా! నీ కట్టుకథలకు ఒక హద్దే లేదా! నందివర్శుడ్ని కరిచిన కుక్క అదివరకే ర్యాబిస్‌ ఉన్న పిచ్చికుక్కగా ఉండివుంటుంది. పిచ్చికుక్కలకు ర్యాబిన్‌ రోగం ఉంటుంది. సామాన్యంగా పెంపుడు కుక్కలు కరిస్తే 99.5% మనుషులకు ర్యాబిస్‌ వ్యాధి సోకదు. కుక్కలే కాదు, ఇతర జంతువులు కూడా కరిచినా, ఆ రోగం వచ్చే ప్రమాదం ఉంది. పిల్లి కాటు, కోతికాటు, గుర్రం కాటైనా కూడా ర్యాబిస్‌ వ్యాధి రాగలదు. కనుక అలాంటి ఏ జంతువు మనల్ని కరచినా, వెంటనే వైద్యుడు దగ్గరికి మనం పరుగులు తీయాలి. నందివర్శ్ముడు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే, కుక్క తనను కరచిందనే విషయం ఇంట్లో చెప్పకపోవడమే! ఆ కాలంలో కుక్కకాటుకు నాటు వైద్యులు కషాయాలు తాగించేవారు, మూలికలవైద్యం చేసేవారు. అయితే వందకు ఒకరు మాత్రమే స్వస్థత పొందేవారు. మిగతా 99 మంది మరణించేవారు. ఎందుకంటే అది “హైడ్రోఫోబియా” అనే భయంకరమైన రోగం. పిచ్చికుక్క కరిచినవారు నీటిని చూడగానే దూరంగా పరుగెత్తిపోతారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటారు, శరీరమంతా దురదేస్తుంది, పెద్దగా కేకలు పెడుతుంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు రోగులను రక్షించడం చాలా కష్టం. కుక్కలేదా ఇతర జంతువులు మనల్ని కరచినపుడు, వాటి ఎంగిలిద్వారా మన శరీరంలోకి ప్రవేశించే వైరసే ర్యాబిస్‌. నైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిళ్యునికథలు డూ డం 48

అది 2-8 వారాల్లోపల మన శరీరమంతా వ్యాపించి, మన స్నాయు మండలాన్ని నిర్వీర్యం చేసి వేస్తుంది. లూయిస్‌ పాశ్చర్‌ ఆవిష్కరించిన ర్యాబిస్‌ నిరోధక ఇంజెక్షన్‌ చేసుకోకపోతే మరణం తప్పదు.

మొదటి రెండువారాలు కుక్క కరచిన చోట మంటగా ఉంటుంది. దాని చుట్టూ కండరాలు స్పందన కోల్పోతాయి. ఇలాగే క్రమక్రమంగా అది మన మెదడుపై దాడిచేస్తుంది. ఇందువల్ల మనస్సు ్రాంతిచెందుతుంది. రోగి ఎప్పుడూ ఒత్తిడికి లోనైవుంటాడు. చివరకు మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. రోగికి కూడా పిచ్చిపట్టిపోతుంది. కొన్నాళ్ళకు గొంతుక నాళాలు కూడా ఉబ్బిపోవడంవల్ల నోటిని తెరవలేక, మూయలేకపోతాదు. వీటితోపాటు మూర్భ్చరోగం కూడా వచ్చేస్తుంది.

విపరీతమైన దాహం... అయితే నీటిని చూడగానే భయంతో పారిపోతాడు. కొందరైతే మనం “నీళ్ళు” అని చెప్పగానే మనల్ని కరవడానికి కూడా దూకుతారు. ర్యాబిస్‌ వ్యాధి లక్షణాలను “శాపాలిని చెప్పడం అజ్ఞానమౌతుంది.

ర్యాబిస్‌ వ్యాధి జంతువులకు వచ్చి, వాటినుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. ఈ రోగులను ఇతరులతో కలవనివ్వక, ఒక గదిలో బంధించి వుంచడం, ఆ రోగం ఇతరులకు వ్యాపించకుండా నియంత్రించేందుకే.

1880వ సంవత్సరం నుంచి ఐదేళ్ళదాకా ఈ వ్యాధి గురించి లూయిస్‌ పాశ్చర్‌ తన ప్రయోగశాలలో పరిశోధనలు చేశారు. ఆయన ప్రయోగశాలలో ర్యాబిస్‌ వ్యాధి సోకిన కుందేళ్ళ వెన్నెముక నుంచి, ఒక విధమైన అంతః స్రావాన్ని వెలికితీసి, దానిని రోగనిరోధక బెషధంగా మార్చేందుకు ప్రయత్నించారు.

1885 జూలై 6వ తేదీని వైద్యశాస్త్ర చరిత్రలో స్వర్దాక్షరాలలో లిఖించాలి. అనాడే పాశ్చర్‌ తాను కనుగొన్న రోగనిరోధక బౌషధాన్ని జంతువులకు వేస్తున్నప్పుడు, ఒక మహిళ తన కుమారుడ్ని తీసుకొచ్చి, ఆయన ముందు పడుకోబెట్టింది. వాడిని ఒక పిచ్చికుక్క ఒళ్ళంతా కరిచి గాయాలైవుంది.

“అయ్యా, ఎలాగైనా నా బిడ్డను కాపాడండీగ” అంటూ ఆ తల్లి పాశ్చర్‌ కాళ్ళపై పడింది. ఆయన ఆమె బాధను చూడలేకపోయాడు. అప్పుడే తయారుచేసివున్న తన ర్యాబిస్‌ నిరోధక మందును ఆ బాలుడికి మొట్టమొదటిసారిగా వేశారు.

ఆ బాలుడిపేరు జోసెఫ్‌ ఫీస్టర్‌. పాశ్చర్‌ ఆ బాలుడికి మనస్ఫూర్తిగాకాక అనుమానంతోనే ఆ బెషధం ఎక్కించారు. అయితే ఆశ్చర్యకరంగా పిల్లవాడు మరణంనుంచి తశ నాననా ఆర్‌, నటరాజన్‌

తప్పించుకున్నాడు, త్వరలోనే ఆరోగ్యవంతుడయ్యాడు. అనాటి నుంచి ప్రపంచం మొత్తంలో

కుక్కకాటుకు, రోగి బొడ్డుచుట్టూ 16 ఇంజెక్సన్లు డాక్టర్లు వేస్తున్నారు. ఇది సురక్షితమైనది.

వాటిని వేసుకోనందువళ్లే నందివర్ముడు చనిపోయాడు గానీ, ఇంకేదో కారణం కాదు” అంటూ విక్రమాదిత్యుడు తన మౌనం వీడి భేతాళుడికి వివరించాడు. భేతాళుడు మరలా మరో శవాన్ని తీసుకొని చింత చెట్టు ఎక్కేశాడు.

ర్యాబిస్‌ వ్యాధి సోకిన కుక్క రెండు రకాలుగా పరిణామం చెందుతుంది.

  1. మనుషులను ఉన్నాదంతో కరవడం, 2. ఎప్పుడూ పడుకొనే ఉండి నిర్వీర్యమైపోవడం.

ఈ రెండు దశలు కూడా ప్రమాదకరమైనవే!

కుక్కకరిస్తే ఏం చేయాలి?

  1. కరిచిన చోటును గోరువెచ్చని నీటితో బాగా శుభ్రపరచాలి.

  2. వీలైనంత త్వరగా (కుటుంబ సభ్యులకు తెలియజేసి) కొన్ని గంటల్లోనే డాక్టరు వద్దకు వెళ్ళిపోవాలి.

  3. కరిచిన కుక్క పిచ్చికుక్క కాదనీ, అందువల్ల ఇంజెక్షన్‌ చేసుకోవల్సిన అవసరం లేదని కొందరు చెబుతుంటారు. వారి మాటలు నమ్మి ఊరుకోరాదు. కుక్కశరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్‌ మన శరీరంలో ప్రవేశించగానే తీవ్రంగా పనిచేసే అవకాశం ఉంది.

4 _ ఇంజెక్షన్లు వేసుకునే సమయంలో వైద్యుడి సలహా ప్రకారం ఆహారం, పానీయాలు తీసుకోవాలి.

కుక్కకు లాగానే పిల్లి, ఎలుక, గుర్రం, కోతులు కూడా ర్యాబిస్‌ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ జంతువు మనల్ని కరచినా, వెంటనే చికిత్స పొందడం అత్యంత అవసరం!

వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిళ్యునికథలు ర్‌

శన గ్య త్ర నం క | టో ([/// కే ఈ గే న నం గె న. షు. తి ళు లో రక స్ట మ సె భారా లాలా కుక్‌

మలేరియా మంగ కథ

వర్షపు మేఘాలు దట్టంగా వ్యాపించి, చంద్రుడి వెలుగును మసకబారుస్తున్న చీకటి రాత్రి అది. తుఫాన్‌ లాగానే చలిగాలి గట్టిగా వీస్తోంది. రాత్రి నేశ్రాలలాగా ఆకాశంలో మెరుపులు అప్పుడప్పుడూ మెరుస్తున్నాయి. అక్కడి దృశ్యాలు చూచి చెట్ల తొర్రలలో దాగివున్న గుడ్లగూబలు ఆశ్చర్యం చెందాయి. ఇవి వేటినీ గమనించకుండా విక్రమాదిత్యుడు తన కర్తవ్య నిర్వహణలోనే నిమగ్బుడై, ఆ శృశానంలో నడుస్తున్నాడు. అతడి కాళ్ళక్రింద ఎండుటాకులు నలిగిపోతున్నాయి. ఒరనుంచి ఖడ్గం చేతబట్టి, భేతాళుడు దాచివుంచిన శవాన్ని చెట్టుపైనుంచి తన భుజంపై వేసుకొని, కిందికి దిగాడు. తర్వాత శృశానవేదిక వైపుగా నడిచాడు. ఈ దృశ్యాన్ని చూచిన ఒక పాము భయపడి పారిపోయింది. ఆ సమయంలో భేతాళుడు శవం లోపలి నుంచి భయంకరంగా నవ్వి, మాట్లాడసాగాడు.

“విక్రమాదిత్యా, ఈ భయంకర వాతావరణంలో కూడా నీవు నీ కర్తవ్యం నిర్వర్తించడం చూచి, నిన్నెంతగానో మెచ్చుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా నిన్ను వేనోళ్ళ పొగడుతోంది. నీ ప్రజల కోసం శ్మశానంలో కూడా నీవు సేవలు చేస్తున్నావు. అయితే ఇప్పుడు నీవు మోసుకెళ్తున్న శవానికి చెందిన యువతి మాత్రం నీ సేవలకు అర్జురాలు కాదు. ఈమె పేరు మలేరియా మంగ. ఈమె కథ చెబుతాను, విన్న తర్వాత నీ ఇష్ట ప్రకారమేమైనా చేసుకో!” అంటూ కథ ప్రారంభించాడు.

“తెనాలి పట్టణం దగ్గర అమృతలూరు అని ఒక (గ్రామం. అక్కడ వెంకటసుబ్బయ్య అనే ఒక సామాన్య రైతు. అతనికి ఎనిమిదో సంతానంగా పుట్టింది ఈ మంగ. మంగ తల్లిదండ్రులకు అందరూ ఆడపిల్లలే. (ప్రతిసారీ రాబోయే బిడ్డ మగవబిడ్డగా పుడతాడని నమ్మి వారు మోసపోయారు. ఎనిమిది మంది ఆడపిల్లలను పెంచి, పెద్ద చేసి, వారికి పెళ్ళిళ్ళు, పేరంటాలు చేయడంలోనే ఆ రైతు కుటుంబ జీవితం గడిచిపోయింది. వైద్యరంగఅద్భుకాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు నం ఎ ఉ7

అయితే చివరి అమ్మాయిగా ఉన్నందువల్ల మంగను తల్లిదండ్రులు, అక్కలు అందరూ అత్యంత ఆప్యాయంగా పెంచారు. లేని మగబిడ్డకు సమానంగా ఆ అమ్మాయిని పెంచి, పెద్దచేశారు. పొలం పనులు కూడా అక్మలే చేసేవారు, మంగను పొలం దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. ఈ చిన్నమ్మాయిని అందరూ ముద్దుగా పాఠశాలకు పంపి చదివించారు. పక్కనున్న పెద్దగ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివింది మంగ. ఆమె అక్కలందరికీ ఆ తల్లిదండ్రులు తమ శక్తిమేరకు పెళ్ళిళ్ళు చేసి, అత్తవారిళ్ళకు పంపించేశారు. కొద్దికాలానికే వారింట మనవళ్ళు, మనవరాళ్ళు కూడా కోలాహలం చేయనారంఖించారు. అయితే మంగ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లే ఆ తల్లిదండ్రులకు పెద్ద సమస్యె కూర్చుంది. మంగకు తగిన వరుడు లభించలేదు. ఒక వేళ లభించినా, మంగ ఏదో ఒక సాక్షు చెప్పి ఆ సంబంధాన్ని నిరాకరిస్తూవుందేది. ఇలా పెళ్లి కాకుండానే కొన్నేళ్ళు గడచిపోయాయి. కానీ మంగ ఊరుకోలేదు. తన (గ్రామంలోని పిల్లలందర్నీ సాయంత్రం వేళ తన ఇంటికే రప్పించి, వారికి పాఠాలు చెప్పేది. చదువులో వారికున్న సందేహాలను తీర్చుతూ ఉండేది. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ యువతి అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. తన జీవితమంతా ఒక్క రోజుకూడా పొలానికెళ్లి పనిచేయని కారణంగానూ, తల్లిదండ్రులు తెచ్చిన పెళ్లిసంబంధాలన్నిటినీ ఏదో ఒక వంక చెప్పి నిరాకరించిన పాపానికి ఉచితమైన దండనగా మంగకు ప్రాణాంతక వ్యాధి సోకింది. తీవ్రమైన జ్వరంతో ఆమె మంచం పట్టింది. తదనంతరం వ్యాధి ముదిరి, మెదడుకు సోకి, తెలివి తప్పిపోయి, కొన్ని మాసాల తర్వాత చనిపోయింది. చనిపోయేందుకు మునుపు ఒకరోజు తండ్రితో చెప్పింది “నాన్నా! నేను కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోతే, ముసలివారైన మిమ్మల్ని చూసేవారెవరు? అందువల్లే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయాను, అయితే నా దురదృష్టం ఈ జబ్బువచ్చి మీకు కూడా ఏమీ సేవ చేయలేకపోయాను” అంటూ పెద్దగా రోదించింది. అయినా కూడా ఆమె పరిస్థితిని చూచి ఆ గ్రామంలో ఎవరూ బాధపడలేదు. “అయ్యో”యని అనిన వారెవ్వరూ లేరు. అందుకు కారణం ఆమెకొచ్చిన రోగం తల్లిదండ్రులకు కూడా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు విక్రమాదిత్యా, ఇలా తాను బతకని, ఇతరులను బితికించని మంగ ప్రవర్తనను నీవు సమర్థిస్తావా? తనకేగాక తన తల్లిదండ్రులకు కూడా తన రోగాన్ని మంగ సంక్రమింపజేసింది కదా, దీనిని ఆమె కర్మ అంటావా? ఆమె తల్లిదండ్రుల కర్మ అంటావా? లేదా మంగే తన తల్లిదండ్రులపై కక్ష సాధించుకుందంటావా- ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలిసీ, నీవు చెప్పలేకపోతే నీ తల వెయ్యి బద్దలైపోతుంది” అని భేతాళుడు చెప్పి అట్టహాసంగా నవ్వాడు. శత నా సా ఆర్‌, నటరాజన్‌

మంగ శవాన్ని మోసుకొంటూ వెళుతూ, కాళ్ళకు తగిలిన కపాలాలను దూరంగా తోసివేస్తూ, విక్రమాదిత్యుడు భేతాళుడి ప్రశ్నలకు జవాబులు చెప్పసాగాడు.

“పాత్ర పద్దతుల్లోనే ఆలోచించే మూర్ధ భేతాళుడా! ప్రపంచం ఎంతో ముందుకు పోయిందని నీవింకా తెలుసుకోనేలేదు. అందువల్లే నీ నోటికొచ్చినట్లు వదరుతున్నావు. ఇన్ని శతాబ్దాలు గడిచిపోయినా, నీవు మాత్రం కాస్త కూడా మారలేదు. ఆడపిల్లగా పుట్టడమే పాపం. మగపిల్లాడే ప్రయోజకుడు అని ఆలోచించే కాలం ఎప్పుడో పోయింది. దేశాన్ని, ప్రపంచాన్నే పాలించే మహిళలు ఈరోజు ్రధానవ్యక్తులు. నీవింతవరకు చెప్పుకొచ్చిన మంగ కూడా వారిలో ఒక యువతే! ఆమె గురించి చెప్పుకునే ముందు మలేరియా వ్యాధి అంటే ఏమిటి? అది ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలను ఇంచుమించు తన (ప్రాణాలను పణంగాపెట్టి కనుగొన్న “రొనాల్డ్‌రాస్‌” అనే ఆయన కథను చెబుతాను, సావధానంగా విను,

రానాల్డ్‌రాస్‌ హిమాలయ పర్వతప్రాంతాల్లో భారతదేశంలో అప్పుడున్న ఒక బ్రిటిష్‌ సైనిక కేంద్రంలో, 1857న ఒక బ్రిటిష్‌ సైనికాధికారి కుమారుడుగా జన్మించారు. చాలా కాలం గడచిన తర్వాత కూడా మలేరియా వ్యాధికి సరియైన పరిష్కారం కనిపెట్టేందుకు ఆయన స్వదేశం నుంచి మరలా భారతదేశానికే వచ్చారు. రాస్‌ చిన్నప్పటి నుంచే సాహిత్యంలో అభిరుచి గలవారు. అయితే ఆయన తండ్రి రాస్‌ను ఒక డాక్టర్‌గా చూడాలని ఉవ్విళ్ళూరాడు. సైన్యంలో తన కుమారుడు డాక్టర్‌గా సేవచేయాలని ఆ అధికారి ఆకాంక్షించాడు. దీని ఫలితంగా రాస్‌ లండన్‌లోని సెయింట్‌ బార్జోల్‌ వైద్య కళాశాలలో 1880 వరకు అభ్యసించి, డాక్టర్‌ పట్టా తీసుకొని, భారతదేశ సైన్యంలో ఒక వైద్యాధికారిగా చేరారు. మన దేశంలోని ఇంచుమించు అన్ని చోట్లా ఆయన తన వైద్య సేవలందించారు. 1889లో బ్యాక్టీరియాలను సూక్ష్మంగా పరిశోధించగలిగే మైక్రోస్యోప్‌ను నేర్చేందుకు మరలా ఇంగ్లండ్‌ వెళ్ళారు.

అదివరకే ఆయనకు భారతదేశంలో అనేక ప్రాంతాల ప్రజలు మలేరియా జ్వరంతో బాధపడుతున్నారనే విషయం తెలిసి ఉన్నందువల్ల, త్వరగానే ఇంగ్లండునుంచి తిరిగి వచ్చేశారు. ఆయనకు మునుపే సూక్ష్మజీవులవల్ల వ్యాపించే వ్యాధుల గురించి దాక్టర్‌ వ్యాట్రిక్‌ మేన్సన్‌ ఎన్నో పరిశోధనలు గావించారు. ఆయన్ను రొనాల్డ్‌రాస్‌ కలుసుకున్నారు.

1876లో ప్యాట్రిక్‌ మేన్సన్‌ బోదకాలు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో పరిశోధించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో అలాంటి ఎన్నో వ్యాధులు వ్యాపిస్తుంటాయి. అవన్నీ కూడా సూక్ష్మజీవులవల్లే వ్యాపిస్తాయని రాస్‌ అభిప్రాయం. వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు శం

14 . ఖ్‌ (| క. న.

భారతదేశానికి తిరిగివచ్చిన రాస్‌, తన పై అధికారులను తనను మలేరియా వ్యాపించిన ప్రాంతాల్లో సేవలందించేందుకు పంపాలని వేడుకున్నారు. ఆ ప్రాంతాల్లో రాత్రింపగళ్ళు నిరంతర పరిశోధనలు సాగించారు. మలేరియా వ్యాధి “ప్రోటోజోవ” అనే ఏక కణజీవి వల్ల వ్యాపిస్తుందనే విషయం ఆయన తెలుసుకున్నారు. ఆ ఏకకణజీవి మొదట మన రక్తంలో కలసిపోయి, పెద్దప్రేగును చేరి, అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరలా రక్తంలో తిరిగి కలిసిపోతుంది.

దోమలు మానవరక్తాన్ని పీల్చేటప్పుడు ఇదివరకే మలేరియా రోగగ్రస్థుడైన ఒకరినుంచి ఇతరులకు ఆ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. వాస్తవానికి దోమ పొట్టభాగంలో ఆ క్రిమి తన ఉమ్మితో కలసి ఉండటాన్ని మైక్రోస్కోప్‌ (సూక్ష్మదర్శిని) ద్వారా రొనాల్డ్‌రాస్‌ చూశారు.

మూర్ధ భేతాళుడా! మలేరియాను వ్యాపింపజేసే ప్రత్యేకమైన దోమలు ఒక ఊర్లో ఎవరినుంచి ఎవరినైనా కుట్టి, ఆ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. మంగ ఖాలీగా ఉండటమెందుకని, తన గ్రామంలోని పిల్లలందరికీ చదువుచెప్పడం 'ప్రశంసింపదగిన కార్యమే కదా! అయితే ఆ పిల్లల్లో ఎవరో ఒకరు మలేరియా సోకిన వారు ఉండివుంటారు, వారి ద్వారానే మంగకు ఆ జబ్బు వచ్చి ఉండొచ్చు.

మలేరియా రోగం చివరి దశలో అది మెదడుపై దాడిచేస్తుంది. అప్పుడు రోగి కోమాలోకి వెళ్లిపోతాడు. స్పృహ కోల్పోతాడు.

మూర్ధ భేతాళుడా! అందరూ ఆడపిల్లలనే కన్న తల్లిదండ్రులను వదలి తాను కూడా వెళ్లిపోతే, ఆ వృద్ధులను చూసుకునే వారుండరనే అభిప్రాయంతో, వారికి అంతిమ దశలో సేవలు చేయాలనే మహోన్నతాశయంతో మంగ పెళ్లే చేసుకోకుండా ఉండటం గొప్ప విషయం కాదా! అయినా నీవు మంగనే తప్పుపట్టావు.

రొనాల్డ్‌రాస్‌ మలేరియా క్రిములను సంహరించే పద్ధతులను కనుగొన్నందుకు ఆయనకు నోబెల్‌ పురస్కారాన్నిచ్చి సన్మానించారు. దోమల నిర్మూలనకు మనం ఎన్నో పద్ధతులను అవలంబిస్తున్నాం. వైద్యమూ, ఆరోగ్యమూ ఒకరిస్తే మరొకరు తీసుకునే వస్తువులు కావు. నీలాంటి పాత పంచాంగాలు చెప్పేటట్లు అవి పాపఫలాలో, కర్మలో, శాపాలో కావు. రయ గాధ్యా వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు హ్‌ ల. చ ఇ

(ట్‌ ం[£€4క తనన ఈ షై కాడ్‌ 561 ౧1 శ్ర

ఆరోగ్య కార్యక్రమాలను ఒకవ్యక్తిచేస్తే ప్రయోజనం ఉండదు. ఒక (ప్రాంతంలోని ప్రజలందరూ మూకుమ్మడిగా ఆరోగ్య సంరక్షణకు, పర్యావరణ శుభ్రతకు చర్యలు తీసుకున్నప్పుడే అవి జయ'ప్రదమౌతాయి, అప్పుడే మలేరియా లాంటి రోగాలను నయం చేసుకోగలుగుతారు”.

విక్రమాదిత్యుడి ఈ సుదీర్హ జవాబులు ముగియగానే అతడి మౌనం తీరిపోయిందని, భేతాళుడు వెంటనే ఒక మునగవెట్టెక్కేశాడు. మలేరియా రోగలక్షణాలేమిటి?

  • ప్రతీరోజూ సాయంత్రం వేళల్లో జ్వరం, అదీ తీవ్రమైన జ్వరం. దానితోపాటు అత్యధిక

విరేచనాలు.

  • తలనొప్పి లేదా స్పృహతప్పడం.
  • సాధారణ శారీరక బడలిక. మలేరియా - కొన్ని అంశాలు

బైటిష్‌ పాలనలో 1900 - 1910 సంవత్సరాల్లో భారతదేశంలో మలేరియా కారణంగా సుమారు 10 లక్షల మంది మరణించారు. సమశీతోష్ణ దేశాల్లో ఈనాటికీ ప్రతి సంవత్సరం సరియైన చికిత్సా సదుపాయం లేక, మలేరియా దోమల కారణంగా 26 వేల మంది సరాసరిన చనిపోతూనే ఉన్నారు.

దోమల నిర్మూలనకు డి.డి.టి క్రిమిసంహారక మందును ఉపయోగించడం వల్ల అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీన్తుంది. దాంతోపాటే దోమల నిరోధక శక్తిని అధికరించేస్తుంది. ఎక్కడా నిలువనీరు లేకుండా చూసుకోవడమే దోమల నిర్మూలనకు అత్యంత ఉత్తమ ఉపాయం.

తల నానా ఆర్‌, నటూజన్‌

స క . | సం లూ (క్ర సం గ సే ( 117 మక ల వైద్యరంగ అద్భుతాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు రం

గుండెపోటు గుర్నాధం కథ ఆ రోజు అమావాస్య. కటిక చీకట్లో ఎక్కడో దూరం నుంచి మెరుపు ఆకాశాన్ని చీలుస్తోంది. గుడ్లగూబలు ఒకే సారిగా అరుస్తున్న ఆ అర్ధరాత్రిలో, నల్లగా కమ్ముకొచ్చిన మేఘాలు నక్షత్రాలను కప్పేశాయి. నక్క బలంగా అరిచింది. విక్రమాదిత్య మహారాజు తన దృఢమైన దేహంతో, చేతిలో పొడవాటి ఖడ్గంతో, అక్కడి సమాధులను దాటివెళ్ళి అటువైపు ఉన్న పెద్ద చెట్టు కిందకు వచ్చాడు. ఆ చెట్టు తొర్రలలోనుంచి గుడ్డగూబలు పారిపోయాయి. అవన్నీ పట్టించుకోకుండా విక్రమాదిత్యుడు చెట్టుపైకెక్కి అక్కడ వేలాడుతున్న శవాన్ని కిందికి పడదోశాడు. మెల్లగా కిందికి దిగి, శవాన్ని భుజాన వేసుకొని, దహనమండపం వైపుగా నడిచాడు. ఆ శవంలోపల దాగివున్న భేతాళుడు అక్కడ్నుంచే మాట్లాడడం ప్రారంభించాడు. “విక్రమాదిత్య మహారాజా! ఎన్నో శతాబ్దాలు గడచిపోయినా, నీవు మాత్రం నీ (ప్రజలను మరువక శ్శశానంలో కూడా వారికి సేవలు చేస్తున్నావు. ఏ ఒక్క శవం కూడా అనాధశవంగా కుళ్ళిపోకుండా దానిని దహనం చేస్తున్నావు. అయితే నీవిప్పుడు మోసుకెళ్తున్న గుర్నాధం శవం నీ సేవలకు అర్హమైనది కాదు. అతడి వృత్తాంతం విన్నావంటే నీవిప్పుడీపని చేయలేవు. రాజమహేంద్రం నగరానికిటువైపు, గోదావరి నదికి ఈవల కొవ్వూరులో సర్పంచ్‌ కుమారులుగా జన్మించిన ఇద్దరిలో ఈ గుర్నాధం చిన్నవాడు. చిన్నప్పుడే వాడిని వాడి అమ్మమ్మ ఊరికి పంపించేశారు. వారు సంపన్నులు. వారింట్లో వేరే ఎవరూ చిన్నపిల్లలు లేకపోయేసరికి గుర్నాధ్రాన్ని అమ్మమ్మ, తాతయ్యలు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అయితే వారు ఎక్కువ ముద్దు చేసినందువల్ల, గుర్నాధం పనికిరానివాడుగా తయారయ్యాడు. వాడికెలాంటి కొరతా లేదు. పంచభక్షసరమాన్నాలు, పట్టు పీతాంబరాలు, ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్‌ రిక్నా లేదా ఆటోరిక్నా బడికి కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదు. క్రమక్రమంగా సోమరిపోతుగా, అమ్మమ్మ ఇచ్చే డబ్బులను వృథా ఖర్చులు చేసేవాడిగా, శశ నానన డా డాలర్‌, నటరాజన్‌

పనికిరాని స్నేహితులు చుట్టుముట్టివుండగా గ్రామంలో పోకిరీపనులు చేసేవాడుగా గుర్నాధం మారిపోయాడు. ఎప్పుడు చూసినా పేకాట్లో మునిగివుందేవాడు. మిత్రులతో బార్‌లలోనూ, రెస్టారెంట్లలోనూ తాగి తందనాలాడు తుండేవాడు.

ఒకసారి అతడు జబ్బుపడ్డాడు. అతడ్ని డాక్టరువద్దకు తీసుకెళ్లారు. అక్కడ చేసిన పరిశోధనలో రక్తపోటు, గుండెపోటు ఉన్నట్లు డాక్టర్‌ నిర్ధారించాడు. అతడి శరీరంలో క్రొవ్వు ఎక్కువగా ఉందని ఆయనన్నాడు. అందుకు కొన్ని మందులిచ్చి తన దురలవాట్లను మానుకోవాలని ఆయన చెప్పాడు. అయితే గుర్నాధం కాస్త స్వస్థత చెంది, ఇంటికి తిరిగివచ్చిన తర్వాత మరలా యథాప్రకారం తాగుడుకు బానిసైపోయాడు. వాడికో పెళ్లి చేసేస్తే బాగుపడతాడని పెద్దలు భావించి, అందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గుర్నాధానికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. “ఏం? పేకాటలో ఒక చెయ్యి తగ్గిందా, అందుకే పెళ్లి చేసుకుంటున్నాడా” అంటూ అందరూ పరిహసించారు.

గుర్నాధం గుండె పూర్తిగా దెబ్బ తినేసింది. వేరేమార్గం లేదనుకున్నప్పుడు అతడ్ని నగరంలోని పెద్దాసుపత్రిలో చేర్చి, మంచి చికిత్స చేయించాలని తీసుకెళ్లారు. అయితే దారిలోనే గుండెపోటువచ్చి అతడు చనిపోయాడు. సోమరిపోతైన, దుబారా ఖర్చు చేసేవాడైన, తాగుబోతైన యువకుడుగా ఉన్న గుర్నాధానికి లభించిన దండన చూశావా? ధనికులకు వచ్చే గుండెపోటు, వాడికీ వచ్చి మరణించేలాచేసింది. ఊరికంతా పనికిరానివాడుగా తయారైన అలాంటి వాడికి, నీవు నీ చేతులారా దహనక్రియలు చేయడం సబబా? వాడి చావు వాడి దుష్రవర్తనాఫలితమే కదా! రక్షించగలిగివుంటే డాక్టర్లు వాడ్ని రక్షించి ఉంటారు కదా! వారు కూడా గుర్చాధాన్ని ఎందుకు బతికించలేకపోయారు? - ఈ ప్రశ్నలకు నీవు జవాబులు తెలిసినా చెప్పలేకపోతే నీ తల వెయ్యి బద్ధలు కాగలదని” భేతాళుడు బిగ్గరగా నవ్వాడు.

భేతాళుడి ప్రవర్తన విక్రమాదిత్యుడికి ఆగ్రహం తెప్పించినా, దాన్ని వ్యక్తం చేయక, సహనంతో తన పనిలోనే అతడు నిమగ్నమైవున్నాడు. అలాగే భేతాళుడికి తన జవాబులను కూడా ఇలా చెప్పాడు.

“అతి తెలివిగా మాట్లాడుతున్నానని అనుకొని నాతో మాట్లాడుతున్న భేతాళు డా, అరిగిపోయిన రికార్టులాగా, వైరస్‌ సోకిన కంప్యూటర్‌లాగా చెప్పినదాన్నే మరలామరలా చెబుతూవున్న నీవు, కాలానుగుణంగా వస్తున్న మార్పులని గ్రహించనేలేదు. పాతకాలపు పంచాంగం లాగానే పనికిరాని విషయాలను మరలామరలా చెబుతున్న తెలివిలేని భేతాళు దా! వ్రైద్యరంగ అచ్భుకాలు విజ్ఞాన వక్రమాదిత్యునికథలు డాక్‌

మొదట నీవు తెలుసుకోవల్సింది గుండెనొప్పి అనే వ్యాధి ధనికులకు మాత్రమే వస్తుందని ఏమీ లేదు. ఈనాడు అది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వస్తోంది. శరీరంలోని రక్తాన్ని అన్ని అవయవాలకు పంపి, ఆ రక్తాన్ని శుభ్రపరిచే యంత్రంలాగా పనిచేసేదే గుండె. గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ఒకదారి, శుభ్రపరచబడిన రక్తాన్ని అక్కడ్నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకుపోయే మరో దారి రక్తనాళాలరూపంలో ఉంటాయి. మొదటి దారిని సిరలు అంటారు. రెందవదానిని ధమనులు అంటారు.

పుట్టుకలోనే గుండెలో లోపాలతో పుట్టే బిడ్డలుంటారు. దీనిని వారి కర్మ అని సులభంగా చెప్పేయవచ్చు. అయితే వాటిని కూడా చికిత్స చేసి సరిచేసే ఆధునిక వైద్య విధానాన్ని సైన్సు ఆవిష్కరించింది. ఈ విషయం 21వ శతాబ్దంలో కూడా నీవు తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరం. గుండెవాల్వులో రంధ్రం ఉంటే, ఆ శిశువును “బ్లూ బేవొ అంటారు.

సామాన్యంగా రక్తపోటు 120/80 మిల్లీమీటర్‌ ఉంటే అది సగటు పరిమాణం. 120 మి.మీ అనేది గుండె నుంచి ప్రవహించే రక్తపు వేగం. 80 మి.మీ అనేది గుండె వైపుకు ప్రవహించే రక్తపు వేగం. ఇది ఎక్కువైనా, తక్కువైనా, గుండె పనిచేయడంలో తోపం ఉందని అర్ధం. కొన్ని సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనం పరుగెత్తినప్పుడు, వేగంగా వ్యాయామం ేనినప్పుడు, భయభ్రాంతులైనప్పుడు - రక్తపోటులో మార్పులు కలుగవచ్చు. ఆ సందర్భాల్లో కొంత సమయానంతరం రక్తపోటును లెక్కించి, సగటు వేగాన్ని నిర్ధారిస్తారు.

గుండెలో సమస్య ఏర్పడ్డానికి రెండు కారణాలుంటాయి. మూర్ధ భేతాళుదా, దానినీ చెబుతాను. మొదటి కారణం, మనం భుజించే ఆహారంలోని క్రొవ్వులు రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. ప్రవావావేగాన్ని తగ్గిస్తాయి. ఇందువల్ల గుండె ఆగిపోయే ప్రమాదముంది.

సామాన్యంగా వ్యక్తిగత కారణాలవల్ల కూదా, వృద్దాప్యం కారణంగా కూడా గుండె వాపుచ నన రెండో కారణం. రక్త న్లో ల్‌ ధమనులు లాంటి ప్రధానమైన అవయవాల్లో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డగించే కొవ్వును తీసివేసేందుకు ఒక విధమైన శస్త్రచికిత్స అవసరమౌతుంది. దెబ్బతిన్న గుండెకు బదులు, వేరే ఒక మంచి గుండెను అమర్చి “గుండె మార్పిడి శస్త్రచికిత్స” చేసి కూడా రోగికి స్త్‌ చేకూర్చవచ్చును. కొంతవరకు సరిగ్గా వనిచేయని గుండెను విద్యుత్‌తో పనిచెసే “పేస్‌మేకరొతో పనిచేయిస్తున్నారు. *

మొట్టమొదట గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన క్రిస్టియన్‌ బెర్బార్ట్‌ కథను చెబుతాను, వినుకో! ఇళ లా డా... ఆర్‌, నటరాజన్‌

. ధు ౮1 నం గ యం. ళన. . క్‌ ర్‌ వాచం వద్చాన వశ్రమదత్యుళ కధలా?

గుండె మార్చిడి శస్త్రచికిత్స లేనందువల్ల తరతరాలుగా లక్షలాది ప్రజలు చనిపోతున్నారు. దీనికి ముగింపు పలికినవారు డాక్టర్‌ క్రిస్టియన్‌ బెర్నార్డ్‌. ఆయన దక్షిణాఫ్రికాలోని పశ్చిమ బీఫోర్డ్‌ రాష్ట్రంలో 1922వ సంవత్సరంలో జన్మించారు. ప్రాథమిక విద్యను ముగించి, తదనంతరం వైద్యశాస్త్రం అభ్యసించేందుకు కేప్‌టౌన్‌ నగరానికి వెళ్ళారు. అక్కడి క్రూట్సర్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యశాస్త్రం అభ్యసించి, డాక్టరుగా కేరస్‌ అనే గ్రామంలో తన సేవలను ప్రారంభించారు. చాలా సంవత్సరాలక్కడ గ్రామీణ ప్రజలకు తన సేవలందించిన క్రిస్టియన్‌ బెర్నార్డ్‌ 1951న మరలా కేప్‌టౌన్‌ విశ్వవిద్యాలయంలో శస్త్రచికిత్సలో ఎం.డి ఉన్నత విద్యను అభ్యసించారు. అప్పుడు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆయన సేవలను, కృషిని గుర్తించి, 1956వ సంవత్సరంలో గుండెమార్చిడి శస్త్రచికిత్సను లోతుగా అధ్యయనం చేసేందుకు అమెరికాకు పంపించింది. ఒక మనిషికి చింపాంజీ వానరం గుండెను గుందెమార్చిడి చికిత్సలో జయప్రదంగా అమర్చిన డాక్టర్‌ నార్మన్‌ షామ్వేను, బెర్బార్డ్‌ మొట్టమొదటిసారిగా అక్కడే కలుసుకున్నారు. ఆ గుండెమార్చడి శస్త్రచికిత్స ఏడు గంటలు మాత్రమే సఫలమైనా, షామ్వేని దానికి సంబంధించిన అన్ని వివరాలను బెర్నార్డ్‌ అడిగి తెలుసుకున్నారు. 1959వ సంవత్సరంలో క్రిస్టియన్‌ బెర్నార్డ్‌ తన మొట్టమొదటి మూత్ర పిండాల మార్చిడి శస్త్ర చికిత్సను దక్షిణాఫ్రికాలో జయప్రదంగా నిర్వహించారు. అందువల్ల ప్రపంచం ఆయన్ను ఆశ్చర్యంతో చూచింది. అయితే తన గుండెనొప్పి రోగులు మాత్రం ఎంతగా. చికిళ్స అందించినా చనిపోతూవుండడం ఆయన్ను కలవరపరిచింది. దాంతో ఆయన నిరాశా నిస్సృహలకు కూడా గురయ్యారు. అయితే త్వరలోనే కోల్కొని ఎలాగైనా సరే, ఈ విషయంలో విజయం సాధించే తీరాలని దృఢనిశ్చయం చేసుకున్నారు. ఇందుకు క్రిన్టియన్‌ బెర్నార్డ్‌ మొట్టమొదట శునకాల గుండెలను పరిశోధించసాగారు. దాదాపు 50 శునీకాలకు ఆయన గుండె మార్పిడి శస్రచికిత్సలు చేశారు. ఇలాగే మనుషులకు గుండె మార్చిడి శస్త్రచికిత్సలు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం ఆయనకు 1967లో లభించింది. పాత విషయాలనే ఎల్లప్పుడూ వర్ణిస్తున్న భేతాళుడా! మానవ (ప్రయత్నం ఎదుట నీవు చెప్పే కర్మ తలరాత ఏవీ పనిచేయవు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రపంచంలో రుజువైంది. ఇప్పుడు మరో విజయాన్ని కూడా నీకు తెలియజేస్తాను. 1967, డిసెంబర్‌ ౩వ తేది నువ్వు చెప్పే తలరాత ప్రకారం వాష్‌కాన్సీ అనే 55 సంవత్సరాల మనిషి చనిపోయి ఉండాలి. అయితే ఆయనే ప్రపంచంలోకల్లా మొట్టమొదటి గుండెమార్చిడి శస్త్రచికిత్స చేసుకొని పునర్జీవం పొందాడు. అతడ్ని డాక్టర్‌ బెర్నార్డ్‌ వద్దకు తీసుకొచ్చినప్పుడు తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నాడు. ఆ చక్కెరవ్యాధి దెబ్బకు ఏ క్షణమైనా వాష్‌కాన్స్సీ గుండె ఆగిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. కత నాడూ ఆర్‌ నటరాజన్‌

అ రోజే ఒక రహదారి ప్రమాదంలో డెనిస్‌ డార్వాన్‌ అనే యువతి చనిపోగా, ఆమె గుండెను వాష్‌కాన్స్సీకి అమర్చాలని డాక్టర్‌ బెర్నార్డ్‌ నిర్ణయించారు. ఆరు గంటల సుదీర్ణ సమయంలో చారిత్రాత్మకమైన ఆ గుండెమార్చిడి శస్త్రచికిత్సను బెరార్డ్‌ జయప్రదంగా చేశారు. ఆ మార్పిడి చేసిన గుండె అద్భుతంగా పనిచేయనారంభించింది. మానవత్వం జయించింది, కర్మ ఓడిపోయింది.

అప్పటికీ ప్రపంచంలో చాలామంది బెర్ఫార్డ్‌ శస్రచికిత్సను సందేహిస్తూనేవచ్చారు. వారి సందేహం పటాపంచలయ్యేటట్టు మరో గుండెమార్సిడి శస్త్రచికిత్సను డాక్టర్‌ బెర్బార్డ్‌ 1969లో చేయగలిగారు. అప్పుడాయన డొరోతి ఫిషర్‌ అనే మహిళకు ఆ శస్త్రచికిత్స చేశారు. ఇతరుల గుండెతోనే ఆమె మరో 24 సంవత్సరాలు హాయిగా జీవించింది. ఆ విధంగా ఎవరైనా గుండెమార్చిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చని బెర్బార్ట్‌ నిరూపించాడు.

భేతాళుడా, గుర్నాధం చేసిన పొరబాటు ఏమిటంటే, అత్యధిక క్రొవ్వుగల ఆహారం ఆరగించడం, రాత్రింవగళ్ళు మద్యపానం సేవించడం మాత్రమే! అలాంటివారికీ, పొగత్రాగేవారికీ ప్రస్తుతం గుండెపోటు రావడం అత్యంత సాధారణమైపోయింది. ఆహారపు అలవాట్లను మార్చుకొని ప్రతిరోజూ వ్యాయామం చేస్తే శరీర ఆరోగ్యం రక్షించుకొని, తలరాతను కూడా తిరస్కరించవచ్చు”.

విక్రమాదిత్యుడికి ఈ విధంగా మౌనభంగం కలిగించిన భేతాళుడు తక్షణం దగ్గర్లో వున్న చింతచెట్టెక్కిపోయాడు. గుండెనొప్పి లక్షణాలు ;

  • గుండెపోటప్పుడు గుండెనొప్పి వస్తున్నందువల్ల గందరగోళానికి గురౌతాం.

౫ వీపు మధ్యన, భుజాలలో దురద.

  • . శ్వాసప్రక్రియ కష్టతరమౌతుంది - ఇవి గుండెపోటుకు సూచనలు.
  1. సాధారణంగా రక్తపోటు (టి.పి), చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నప్పుడు ఇలాంటి సూచనలు తెలియగానే, వెంటనే చికిత్స (ప్రారంభించాలి.

గుండెపోటు - ప్రథమ చికిత్స :

  • మొదట షర్ట్‌ బటన్లు తీసేయాలి. రోగి మెల్లగా గాలిని పీల్చి, వదులుతుండాలి.

  • శ్రాట్రుపాటుకు గురికాకుండా నెమ్మదిగా ఒక ఆప్రిన్‌ మాత్రను రోగి నాలుక కింద ఉంచి చప్పరించాలి. ఇందువల్ల రక్తనాళాలు వ్యాకోచం చెంది ఉపశమనం

కలిగిస్తుంది. ,

  • పది నిమిషాల్లోపల రోగిని డాక్టర్‌వద్దకు తీసుకెళ్లాలి.

శ. నేడు ప్రపంచ మరణాలలో ఏడింట ఒకటి గుండెపోటువల్లే సంభవిస్తోంది.

  • అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదింట ఒకటి గుండెపోటు మరణమే! వైద్యరంగఅద్భుకాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు 59

న. ళం పం లో . ప . | . _ . టల . ల ఈ గగానాని వ 1. నాం. న త్తు వి? చ్చి మా. న ల 0 యశ. టు! ట్‌! ఉన క్‌ | యా (వణ శన నో? దయ యు “శత , సా. చాలా,

రక్త క్యాన్సర్‌ రహీంభాయ్‌ కథ

లోకమంతా గాధనిద్రలో మునిగివున్న ఆ చిమ్మచీకటి వేళలో అకస్మాత్తుగా కుక్కలు భయంతో మొరగనారంభించాయి. ఎక్కడో గడియారం 12 సార్లు మోగి, నడిరాత్రి అయిన విషయాన్ని ప్రపంచానికి చాటింది. అయినా, ఎన్నో శతాబ్దాలు గడచిపోయినా, ఎలాంటి మార్పులకు గురికాకుండా, తన ప్రజలకోసం విక్రమాదిత్య మహారాజు శ్మశానంలో సేవలు చేస్తూనే ఉన్నాడు. దిక్కులేని శవాలను దహనం చేయడమే తన కర్తవ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మహారాజుకు తగిన వస్త్రాలు, దీర్ధమైన ఖడ్గం, మొరటు పాదరక్షలు | ధరించిన విక్రమాదిత్యుడు చిరునవ్వు చిందిస్తూనేవున్నాడు. శృశానంలో అతడు నడచివెళ్ళేటప్పుడు కాళ్ళకింద కపాలాలు చిట్లిపోతున్నాయి. కుక్కల అరుపులను, గుద్లగూబల కేకలను లెక్కచేయకుండా కర్తవ్యనిర్వహణే లక్ష్యంగా వెళ్తున్నాడు.

అక్కడ వందలకొలది సంవత్సరాలుగా ఒక మొండి రావిచెట్టు ఉంది. ఆ చెట్టుపైన ఒక శవం వేలాడుతూవుంది. విక్రమాదిత్యుడు తన కాళ్ళకింద దహనక్రియలకు ఉపయోగించిన మట్టిపాత్రలు పెళపెళమని పగిలిపోతుండగా, ఆ చెట్టుపైకెక్కి శవాన్ని కిందికి దించాడు. తర్వాత దాన్ని భుజంపై వేసుకొని, నిస్సంకోచంగా దహనమండపం వైపు నడిచాడు.

అప్పుడు గుడ్లగూబలు ఎగురుతుండగా భేతాళుడు అట్టహాసంగా నవ్వడం చక్రవర్తి విన్నాడు. అతడికి కోపం వచ్చినా, దాన్ని అణచుకొనే పరిపక్వత అతనికుంది. కాసేపు గట్టిగా నవ్వుకొని సంతృప్తిచెందిన తర్వాత, భేతాళుడు శవం లోపలి నుంచి మాట్లాడటం ప్రారంభించాడు.

“ఒక్క నాటికీ కర్తవ్య నిర్వహణ నుంచి తొలగిపోని విక్రమాదిత్యా, నీ ప్రజలు నిన్ను చక్రవర్తిగా స్వీకరించినందుకు, ఎన్నో శతాబ్దాలుగా వారికీసేవచేస్తున్నావ్‌. అయితే, ఇప్పుడు నీవు మోసుకెళ్తున్న శవానికి చెందిన వాడి నిజగాథను విన్నావంటే, ఈ శవాన్ని ఇక్కడే పారవేసి నీ దారిని నువ్వు చూసుకుంటావ్‌. వ్రషుగంచ్భతు విజ్దాన వశ్రమాదిత్యునకథలు లు

వీడి పేరు రక్త క్యాన్సర్‌ రహీంభాయ. ప్రతాపరుద్రుడు పరిపాలించిన ఓరుగల్లు నగరం పక్కనున్న హన్మకొండలో సుమారు 700 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. వారిలో ఒకరి కుమారుడిగా జన్మించిన రహీం చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అతడి పూర్వీకులు ఇంతక్రితం నిజాం నవాబు సేవకులుగా ఉండేవారు. ఇప్పుడు వారందరూ బీడీలుచుట్టి బతుకుబండిని సాగిస్తున్నారు. నిజాం కాలంలో హాయిగా బతికిన ఈ కుటుంబాలన్నీ ప్రస్తుతం రాత్రింపగళ్ళు బీడీలు చుట్టీ,చుట్టీ చాలీచాలని కూలీలతో, ఆకలితో జీవిస్తున్నారు. అయినా ఏదోఒకవిధంగా బతికిపోతున్న వీరి జీవితాలకు కూడా మన రహీం భాయ్‌వల్లే ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. రహీం తండ్రి కొన్నాళ్ళకు రెండో పెళ్లి చేసుకున్నాడు. అందుకు తల్లిలేని బిడ్డను పెంచేందుకు ఆదదిక్కు ఉండాలని చెప్పుకున్నాడు. రహీం కొంత పెద్దవాదైన తర్వాత, కుటుంబంలోని ముగ్గురూ ఇంట్లోని ఒక్కొక్క స్తంభాన్నానుకొని కూర్చొని ఒళ్ళో చేటలో వీడీఆకులు, పొగాకుపాొడి ఉంచుకొని, ఒళ్ళువంచి బీడీలు చుట్టేవారు. అయినా వారికి ఏనాడూ కడుపు నిండలేదు. బాలుడుగావున్న రహీం బీడీలు చుట్టేటప్పుడే, వాటిని కాల్చితాగితే ఎలా ఉంటుందోనని ఉబలాటం చెందాడు. కొన్నాళ్లకు వాడు బీడీలను దొంగలించి, ఎవరికీ తెలియకుండా పొగ త్రాగడం ఆరంభించాడు. మరికొన్నాళ్లకు ఒకచేతిలో కాలుతున్న బీడీతో, మరో చేతితో చీడీలు చుట్టేవాడు. 24 గంటలూ బీడీలు ఊదీఊదీ రహీంభాయ్‌, చూస్తున్న వారందరికీ ఆగ్రహం కలిగించేవాడు. ఇలా నిరంతరం ఫొగతాగే వాడి ఆరోగ్యం రోజురోజుకూ దిగజారింది. వీడికెవరో బాణామతి చేసేశారని, అందువల్లే జబ్బులతో కరిగిపోతున్నాడని చెప్పుకున్నారు. వాడి తండ్రి ఎవరో మంత్రగాడిని రప్పించి విరుగుడు మంత్రాలు కూడా చేయించాడు. అయినా, రహీంభాయ్‌ కొన్నాళ్లకు రోగం ముదిరి రక్తపువాంతులు చేసుకోసాగాడు. వాడి పరిస్థితిచూసి చుట్టుప్రక్కలున్న వారంతా రకరకాలుగా చెప్పుకున్నారు. “అల్లా” మెచ్చని పొగతాగడం వల్లే వీడికీగతి పట్టింది అని కొందరు, రాత్రింపగళ్ళు బీడీలు చుట్టుతూ ఉండడంవల్లే ఈ జబ్బు వచ్చిందని మరికొందరు ప్రచారం చేసి, హన్మకొండలో చాలామంది ముస్లిం ప్రజలు బీడీలు చుట్టే వృత్తినే మానుకున్నారు. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా రహీంభాయ్‌ పొగ తాగడాన్ని మాత్రం మానుకోనేలేదు. రక్తపు వాంతులతోనే ఒకరోజు వాడు చనిపోయాడు. వాడు బాణామతితోనే ఉనా. ఆర్‌, నటరాజన్‌

చనిపోయాడా? వాడి మరణానికి కారణమేమిటి? అల్లా శాపమా? వాడి కర్మా? - ఈ ప్రశ్నలకు నీకు జవాబులు తెలిసీ, నీవు చెప్పకపోతే నీ తల వెయ్యి బద్దలైపోతుంది” అని భేతాళుడు బెదిరించి కథను ముగించేందుకు గట్టిగా నవ్వాడు.

“మూర్ధ భేతాళుడా! ప్రపంచంలో ప్రతి ప్రశ్నకూ జవాబు తప్పకుండా ఉంటుంది. మనం ఆలోచించి, అన్వేషించి, ఆ జవాబును తెలుసుకోవాలి. ఈ 21వ శతాబ్దంలో సైతం నీవు బాణామతి అనీ, పూర్వజన్మ పాపమనీ, తలరాతనీ భావించడం అసహ్యంగా ఉంది కదా! రహీంభాయ్‌ పొగతాగే దురలవాటును నిదానంగా, శాస్త్రబద్ధంగా మాన్పించి ఉండవచ్చు. ఈనాడు మనస్తత్వశాస్త్రంలో కూడా వైద్యశాస్త్రం ఎంతో ప్రగతిని సాధించివుంది. అయితే దానిగురించి వివరించేందుకు మునుపు ఖేతాళుడా, ఒక విషయం మనం తెలుసుకోవాలి. క్యాన్సర్‌ వ్యాధి పొగత్రాగడంవల్ల సోకుతుందని మొట్టమొదటిసారిగా కనుగొని, ప్రపంచంలో లక్షలాదిమందిని దాని బారినుంచి రక్షించిన ఒక మహిళాశాస్త్రవేత్త గురించి ఇప్పుడు చెబుతాను, సావధానంగా విను!

పొగాకు ఉపయోగించే అలవాటు మాత్రమే కాదు, క్యాన్సర్‌కు ఇంకా అనేక కారణాలున్నాయని కనిపెట్టిన ఆ మహిళామణి పేరు జెర్ట్‌రూట్‌ బిల్లీ ఎలియాన్‌. ఆమె తండ్రి పోలండ్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లినవాదు. ఆమె తల్లి లిథువేనియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన మహిళ. వీరికి న్యూయార్క్‌ నగర శివార్లలోని ఒక శరణార్థుల శిబిరంలో 1918వ సంవత్సరం జెర్ట్‌రూట్‌ బిల్లీ ఎలియాన్‌ జన్మించారు.

ఇప్పటికీ తలరాతను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్న అజ్ఞాన భేతాళుడా, బడికి పంపలేని పేద కుటుంబంలో ఎలియాన్‌ జన్మించి, బాగుపడేందుకు ఎన్ని రకాల కృషి చేసివుంటుంది? ఎన్ని విధాల కష్టాలనుభవించివుంటుంది అనే విషయం మనం అర్ధం చేసుకోవాలి.

1988లో ఎలియాన్‌ స్కూల్‌ ఫైనల్‌ విద్యను ముగించింది. ఆ సంవత్సరమే ఆమె తాతయ్య విరేచనాలతో చనిపోయారు. ఆయన పడ్డ బాధను చూచి కరిగిపోయిన ఎలియాన్‌, తాను ఒక డాక్టరై ఇతరుల ప్రాణాలను కాపాడాలనుకున్నారు. న్యూయార్క్‌ నగరంలోని వాండర్‌ కళాశాలలో ఒక వెసులుబాటు ఉండేది. పేద విద్యార్థులు ఏ ఫీజూ చెల్లించకుండా ఉచితంగా తరగతిలో కూర్చొని పాఠాలు వినవచ్చుగానీ, పరీక్షలకు మాత్రం ఫీజులు చెల్లిస్తేనే అనుమతించేవారు. ఎలియాన్‌ ఆ కళాశాల ప్రయోగశాలలో పాక్షిక ఉపాధ్యాయినిగా పనిచేసి, ఆ డబ్బుతో పరీక్ష ఫీజు చెల్లించి, పరీక్ష వ్రాసి 1987లో వైద్వరంగఅద్భుకాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు 68

రసాయనిక శాస్త్ర పట్టభద్రురాలయ్యారు. దీన్నుండి ఏం తెలుస్తోంది భేతాకుడా, తలరాతను బుద్ధిబలంతోనూ, కఠోరశమతోనూ జయించవచ్చని తెలియడం లేదూ! ఇలాగే 1941న ఆమె వైద్యశాస్త్రంలో ఉన్నత విద్యను కూడా పాక్షిక ఉద్యోగాలు చేసుకుంటూనే పూర్తి చేశారు. అయితే ఆనాడు అమెరికాలో కూడా వ్యాపించివున్న మహిళా వివక్షత కారణంగా ఆమెకు ప్రయోగశాలల్లోనూ, వేరెక్కడా మంచి ఉద్యోగం లభించలేదు. వైద్యరంగానికి సంబంధించిన ఉన్నత స్థానాల్లో పురుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది. అయితే త్వరలోనే ఆమెను ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎలా అంటావా? రెండో ప్రపంచ మహాయుద్ధం అప్పుడే ప్రారంభమైంది. ఆ యుద్ధంలో అమెరికా కూడా పాలుపంచుకోగా, అమెరికన్‌ సైన్యంలో పనిచేసేందుకు పురుషులందర్నీ తప్పనిసరిగా యుద్ధరంగాలకు పంపివేశారు, వారి స్థానాల్లో మహిళలను నియమించారు. అలా ఎలియాన్‌కు కూడా ఉద్యోగం లభించింది. ఖ్రూవోస్‌ వెల్మమ్‌ అనే బెషధ పరిశ్రమలో, దాని ప్రయోగశాలలో ఎలియాన్‌కు ఉద్యోగం లభించింది. అనాటి నుంచే ప్రపంచ వైద్యరంగం ఒక మూలమలుపు తిరిగిందని చెప్పవచ్చు. అదివరకు బెషధ పరిశ్రమలో తయారయ్యే మాత్రలన్నీ అరకార పరిశోధనలతోనూ, చాలీచాలని పరీక్షలతోనూ మాత్రమే మార్కెట్‌కు పంపుతూవచ్చారు. వాటివల్ల రోగులక్షు ఎన్నో ప్రతికూల ఫలితాలు కూడా సంభవిస్తూవుండేవి. అయితే మన ఎలియాన్‌ ఆ వెల్కమ్‌ బెషధ పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత ఒక నూతన పద్ధతిని ఏర్మరచారు. మందుల ఫ్యాక్టరీనుంచి మార్కెట్‌కు వెళ్ళే మాత్రల ప్యాకెట్లపైన, ఆ మాత్రలు వయే మూలపదార్థాలతో తయారయ్యాయి, తయారైన తారీఖు, ఆ మాత్రలకున్న గడువు, గరిష్ట ధర మొదలగు వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలనే పద్ధతిని ఎలియాన్‌ ప్రవేశపెట్టారు. ఇది ఒక మహత్తరమైన మార్పు కదా! జెర్ట్‌రూట్‌ బిల్లీ ఎలియాన్‌ వైద్యరంగంలో ్రవేశించకముందే క్యాన్సర్‌ కారణాల గురించి తెలుసుకునేందుకు కొందరు కఠిన పరిశ్రమ చేశారు. వారి కృషి కొనసాగింపుగా ఎలియాన్‌ కూదా క్యాన్సర్‌కు సంబంధించిన నూతన వివరాలను వెలువరించి, ప్రపంచాన్ని ఆశ్చర్యం చెందేటట్లు చేశారు. క్యాన్సర్‌ అనేది తన కణవిభజనను నియంత్రించుకోలేక, జీవాణువుల విపరీతమైన అభివృద్ధిని చెందించి, రక్తం గడ్డ కట్టుకోవడం వల్ల వర్చడే రుగ్మత అని మొట్టమొదట ప్రకటించిన వారు ఎలియానే. పొగ త్రాగడంవల్ల నోరు, ఊపిరితిత్తులు మొదలగు వాటిలో క్యాన్సర్‌ వస్తుందని ఆమె చేసిన పరిశోధనలు నిరూపించిన తర్వాతే, సిగరెట్‌ ప్యాకెట్లపైన “పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం” అనే ప్రకటన తప్పకుందా ప్రచురించాలని ప్రతి దేశం ప్రకటించింది. ఉత్తాన ఆర్‌, నటూజన్‌

ర య = నో [| ॥ టి ం (11 య ను స ను | య | వ | // గ్గ గ ప్రష్యంగంచ్భకాణ వజ్చాన విక్రమాదిత్యునకథలు 65

1945వ సంవత్సరం జపాన్‌కు చెందిన హిరోషిమా నగరంపై అమెరికా ఆటంబాంబు ప్రయోగించి, లక్షలాది ప్రజలను పొట్టనబెట్టుకొంది. అంతవరకు అస్పెస్టాస్‌ పదార్ధం వల్లే క్యాన్సర్‌ వస్తుందనుకున్న ప్రజలకు, అణుబాంబు నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలవల్ల కూడా, సూర్యుడి అతినీలలోహిత కిరణాలవల్ల కూడా క్యాన్సర్‌ రావచ్చునని ఎలియాన్‌ నిరూపించారు. మన ఎలియాన్‌ శాస్త్రవేత్త మాత్రమేకాదు, గొప్ప మానవతావాది కూడా. అణుబాంబు ప్రయోగంతో తల్లడిల్లిన హిరోషిమానగరానికి ఆమె తక్షణం బయలుదేరి వెళ్లి, అణుధార్మిక కిరణాలతో బాధపడుతున్న వేలకొలది పిల్లల ఆరోగ్య సంరక్షణకు నడుంబిగించారు. తాను ఆవిష్కరించిన ఎం.బి. అనే బెషధంతో ఆ పిల్లల బాధలను తగ్గించేందుకు రాశ్రింపగళ్ళు కృషిచేశారు. దాంతో ఎన్నో మంచి ఫలితాలను సాధించారు. ప్రస్తుతం ఈ అంశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇదేగాక ఎలియాన్‌ తన సహచర శాస్త్రవేత్త అయిన ఇచ్చింగ్స్‌ కలసి, క్యాన్సర్‌ చికిత్సకు అత్యంత ముఖ్యమైన “కీమోథెరఫీ”ని కూడా కనుగొన్నారు. ఇది ఒక విధమైన ఎక్స్‌రే కిరణ ప్రయోగ చికిత్స. ఈనాడు అత్యధిక క్యాన్సర్‌ రోగులకు ఇదే ప్రాణదాతగా ఉంది. ఇందుకోసం ఎలియాన్‌కు 1988న నోబెల్‌ బహుమతి కూడా ప్రదానం చేశారు. భేతాళుడా, రహీంభాయ్‌ పొగత్రాగడాన్ని నియంత్రించుకొని ఉండాలి. పొగాకులో

నికోటిన్‌ అనే రసాయనిక పదార్థం ఉంది. అది పొగ టత్రాగేకొద్దీ మరింత మత్తును కలిగిస్తుంది. అదీగాక, ఆ నికోటిన్‌ విషపదార్థం రక్తంలో కలసిపోతుంది. పొగత్రాగేవారికి మాత్రమేగాక, వారు వదిలివేసిన పొగను, దగ్గర్లోనుండి పీల్చేవారికి కూడా ఎంతో కీడు చేస్తుంది. పొగత్రాగే అలవాటు మానుకోలేనివారు. మనస్తత్వ వైద్యులవద్ద చికిత్స తీసుకోవడం మంచిది. ఆ పని చేయక శాపం అనీ, తలరాత అనీ, బాణామతి అనీ నీలాంటి వారు ఏవేవో చెప్పుకుంటారు". విక్రమాదిత్యుడు ఇలా చెప్పి తన మౌనాన్ని వీడినందువల్ల అదే సమయమని భేతాళుడు మెరుపు వేగంతో సమీపంలోవున్న మునగచెట్టెక్కేశాడు.

క్యాన్సర్‌ లక్షణాలు

  • సాధారణంగా జలుబు, గల్ల, మూత్రద్వారంలో రక్తస్రావం.

  • భరించలేనంతగా నొప్పి, దీర్టాల నోటిపుందు.

66 నానా డా అర్‌ నటరాజన్‌

౫ శరీరంలోని భాగాలు స్పందన కోల్పోయినట్లు అనిపించడం. శరీరంలో ఎక్కడైనా అదనంగా కండరం పెరిగితే జాగ్రత్త పడాలి.

  • తరచుగా స్పృహ కోల్పోవడం, మెదడు లోని కంతి ప్రభావం వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం, బడలిక, రక్త వమనాలు - వీటిని కుటుంబ సభ్యులకు వెంటనే చెప్పి చికిత్స చేయించుకోవాలి.

  • 20 రోజులు వరుసగా దగ్గు వస్తూవుంటే, అదికూడా క్యాన్సర్‌ లక్షణంగా ఉండవచ్చు.

క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన కొన్ని వివరాలు

పాలిథిన్‌ కవర్లను కాల్చడం, మోటారు టైర్లు కాల్చడం, ప్లాస్టిక్‌, రబ్బర్‌ వస్తువులు కాల్చడం - ఇవి కూడా క్యాన్సర్‌ను కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

నేటి ఆధునిక చికిత్సా పద్దతులద్వారా, నూతన ఉత్తమ జెషథాలద్వారా క్యాన్సర్‌ సోకిన ఒక వ్యక్తి ఆయుష్షు కూడా 10 సంవత్సరాలవరకు పొడిగించవచ్చునని నిరూపితమైంది (ఇది క్యాన్సర్‌ రకం, దాని పరిమాణానికి సంబంధించి ఉంటుంది).

ప్రద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు డా ర?

ర ట్తానాలా

త

శు | తన న న న

ఎయిడ్స్‌ ఏపకనాధుడి కథ

ఆకాశంలో నల్లటి మబ్బులు కాసింత వెలుతురును కూడా పూర్తిగా కమ్మేశాయి. కటిక చీకటి మరింత చిక్కబడిపోయింది. అటువంటి చీకటి రాత్రిలో గాలి, మెరుపులు అల్లిబిల్లి తిరుగుతుండగా, గుడ్లగూబలు భయంకరంగా అరుస్తున్నాయి. అయినా అలాంటి వాతావరణంలో కూడా విక్రమాదిత్య మహారాజు తన కర్తవ్య నిర్వహణను మరువలేదు. అతడి కాళ్ళకు కపాలాలు తగులుతున్నాా వాటిని లెక్కచేయక, చేత కరవాలంపట్టి ఆ శ్మశానంలో గంభీరంగా నడుస్తున్నాడు. ఇతడిని చూచి ఒక నాగుపాము పడగవిప్పి నిటారుగా నిలిచింది. తన తొర్రలో ఎన్నో మానవ కపాలాలను దాచి ఉంచుకున్న పెద్ద రావిచెట్టు కిందికెళ్లి, విక్రమాదిత్యుడు ఆ చెట్టు కొమ్మపై వేలాడుతున్న శవాన్ని కిందికి తెచ్చాడు.

గాలీవాన తుఫానుగా మారి మట్టిని పైకెగజల్లుతోంది. ఆ చీకటి వేళలో దేనిని చూచీ భయపడని విక్రమాదిత్యుడు ఆ శవంతో దహనవేదిక వైపుగా నడిచాడు. అప్పుడు శవంలోని భేతాళుడు కేక వేశాడు. “విక్రమాదిత్యా ఆగు! నీ కర్తవ్య నిర్వహణను చూచి నాకెంతో ఆశ్చర్యమేస్తోంది. ఎన్నో శతాబ్దాలుగా నీవు నీ ప్రజలకు ఇలా సేవచేస్తున్నావ్‌. దీన్నుంచి నిన్ను విరమింవజేయాలని నేనెంతగానో ప్రయత్నించినా నవలం చెందలేకపోతున్నాను. నీ మంచి గుణమే ఎల్లప్పుడూ జయిస్తోంది. అయితే ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ పని మాత్రం సరియైనదికాదు. ఈ శవానికి చెందిన వాడిని గురించి నీకు తెలిస్తే తర్వాతి కాలంలో నీవెంతో పశ్చాత్తాపం చెందుతావు.

ఇప్పుడు నీవు మోస్తున్న వీడి పేరు ఏకనాధుడు. వీడు నీ సేవకు అర్హుడు కాడు. భయంకరమైన ఎయిడ్స్‌ వ్యాధితో మరణించినవాడు వీడు. ఆ వ్యాధి సోకగానే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరూ వీడ్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు. వైద్యరంగఅద్భుకాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు 49

చివరకు అనాధగా చనిపోయాడు. అయితే వీడి అదృష్టం, చక్రవర్తి విక్రమాదిత్యుడి చేతులమీదుగా అంతిమయాత్ర చేస్తున్నాడు. వీడి వృత్తాంతం చెబుతాను. విన్న తర్వాత నువ్వే ఒక నిర్ణయం చేసుకో. మహారాజా! మనుషులు స్వార్ధపరులు. కృతజ్ఞతే లేని ఒక జీవి ఈ లోకంలో ఉంది అంటే ఆ జీవి మనిషే తన స్వార్థం కోసం మనిషి ఎదుటి వాడి ప్రాజాలను సైతం హరించేందుకు సంకోచించడు. తన భోగలాలసతే తనకు ముఖ్యమని భావించేవాడు మనిషి అందుకు అడ్డుపడే వాడెవదైనా సరే, అతడ్ని మట్టుపెట్టేందుకు వెనుకంజ వేసేవాడు కాడు మనిషి కృష్ణానది నీరు ప్రవహించే గుంటూరు జిల్లాలో మంగళగిరి ఒక పెద్ద చేనేత కేంద్రం. వేలమంది చేనేత కార్మికులు అక్కడ నేతలు నేస్తూ జీవిస్తున్నారు. అలాంటి ఒక కుటుంబ యజమాని పశుపతి. ఆయన ముగ్గురు కుమారుల్లో చివరివాడు ఈ ఏకనాధుడు. వీడు పుట్టిన సమయమే మంచిది కాదు. పుట్టగానే తన తాతయ్యను పరలోకం పంపించేశాడు. కొన్ని రోజులకు జబ్బుపడ్డ అతడి తండ్రి కూడా త్వరలోనే వైకుంఠ పదవినలంకరించేశాడు. పశుపతి పెద్దకుమారుడే మగ్గాలు నిర్వహించుకుంటూ కుటుంబ భారం కూడా మోస్తున్నాడు. తన చిన్న తమ్ముడు ఏకనాధుడ్ని బాగా చదివించాలని ఆకాంక్షించాడు. అయితే వకనాధుడు ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే తుంటరి అని పేరు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడే ముదిరిపోయాడు. సిగరెట్‌ తాగడం, తరగతులు ఎగ్గొట్టడం, ఉపాధ్యాయులపై తిరగబడడం, స్నేహితులను ముఠాగా తయారుచేసుకోవడం, చదువుసంధ్యల్లేక ఊరంతా మిత్రులతో బలాదూర్‌గా తిరగడం - ఇలా రోజురోజుకూ తప్పుదారి పడుతూ వచ్చాడు. పెద్దన్నయ్య వాడికెంతో నచ్చజెప్పాడు, భయపెట్టాడు. అయినా వాడిలో కాసింతకూడా మార్చు రాలేదు. అయితే తలరాతను ఎవరు తప్పించుకోగలరు విక్రమాదిత్యా? ఏకనాధుడు పుట్టిన ఘడియ వాడికి దుష్ట సాంగత్యం అలవరిచింది. యువకుడైన తర్వాత వాడు నిరంతరం మద్యపాన(వ్రియుడుగా మారాడు. అమ్మాయిలతో చెడుస్నేహం చేయనారంభించాడు, మత్తుమందులకు బానిసయ్యాడు. డిగ్రీ చదివేందుకు గుంటూరు వెళ్లిన అతడు మరింతగా చెడిపోయాడు. తమ చిన్న తమ్ముడు ఉన్నత విద్యనభ్యసించి, కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనుకున్న అన్నయ్యకు ఒకరోజు దిగ్భాంతికరమైన వార్త చేరింది. 70 నా డా ఆర్‌ నటరాజన్‌

ఉన్నట్లుండి తీవ్రమైన జ్వరం, అత్యధిక అలసట అని ప్రారంభమైన వకనాధుడి అనారోగ్యం వాడ్ని పడకన పడేసింది. అన్నయ్య పరుగుపరుగున గుంటూరు చేరుకొని, ఓ మంచి డాక్టరు దగ్గరికి తమ్ముడ్ని తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్‌ గారు ఏకనాధుడద్ని ఆమూలాగ్రంగా పరీక్షించి, వాడికి ఎయిడ్స్‌ రోగం వచ్చిందని నిర్ధారించాడు. ఆ రోగం అత్యంత భయంకరమైనదనీ, దానికి చికిత్స, మందులు కూడా లేవనీ అందరూ చెప్పుకుంటున్నారు. చూశావా విక్రమాదిత్యా, ఏకనాధుడు జన్మించిన క్షణం సరియైనది కానందువల్లే వాడి జీవితం ఇలా కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయింది కదా! వాడు తాకినా, వాడు పీల్చి వదిలిన గాలిని మనం పీల్చినా ప్రమాదకరమని అందరూ దూర దూరంగా తొలగిపోయారు. ఇందుకు కారణం వాడు మత్తుమందును సేవించడమా? మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగించడమా? వాడి మిక్రుల్లో ఒకరికి కూడా రాని ఈ ఎయిడ్స్‌ వ్యాధి వీడికి మాత్రం ఎందుకు రావాలి?

ఈ ప్రశ్నలకు జవాబులు నీకు తెలిసినా నీవు చెప్పకపోతే నీ తల వెయ్యి బద్దలైపోతుంది” అని భేతాళుడు చెప్పి, ఆ చీకటిని చీల్చేవిధంగా పెద్దగా అట్టహాసం చేశాడు. తన వివరణతో విక్రమాదిత్యుడు ఆ శవాన్ని అక్కడే పడేసివెళ్ళి పోతాడనుకున్న ఖేతాళుడికి నిరాశే మిగిలింది. ఆ మహారాజు శవాన్ని తన భుజంపైనే అలాగే మోస్తూ, శ్మశాన వేదికవైపు నడుస్తూ భేతాళుడి ప్రశ్నలకు జవాబులు చెబుతూ పోయాడు.

“మూర్ధ భేతాకుడా! ఒక వ్యక్తి పుట్టిన ఘడియకు, వాడి భవిష్యత్‌ జీవితానికి ఎలాంటి సంబంధమూ లేదు. మనం పుట్టిన వేళ బాగా లేదని జీవితమంతా బాధపడుతూ గడపడం తెలివిలేనితనం. ఎందుకంటే అందులో చింతాకంతకూడా నిజం లేదు. ఈనాడు మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టేశాడు. అంగారక గ్రహాన్ని అంతరిక్షాన్ని తన కృత్రిమ ఉపగ్రహంలో చుట్టివస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఘడియ అనీ, సుముహూర్తమనీ, దుర్ముహూర్తమనీ, శకునమనీ, జాతకమనీ, యోగమనీ చెబుతూ కాలం గడపడం వృథా పని. సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు కూడా ఒక సమయంలో కాలేయం రోగం వచ్చింది. అయితే ఈ రోజు ఆ వ్యాధికి కూడా సరైన వైద్యం, మందులు వచ్చేశాయి. ప్రతి రోజూ వైద్యరంగంలో ఏదోఒక నూతన అవిష్కరణ జరుగుతూనే ఉంది. మనిషి యముడిని కూడా జయించేసే రోజు దగ్గర్లోనే ఉంది. అయితే నీవు ఇప్పటికీ పాత భావాలనే గట్టిగా పట్టుకొని వేలాడుతున్నావు. ఇంకా తలరాత, పుట్టిన వేళ అంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావు. వైద్యరంగఅద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు ౯1

మానవ శరీరంలో రోగాలను గట్టిగా ఎదుర్కొని పోరాడే అసంఖ్యాక శ్వేత రక్తకణాలు ఉన్నాయి. అవి కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఈ తెల్ల రక్తకణాల గురించి నీకేమైనా తెలుసా మూర్ధ భేతాళా? ఇవి వెలుపలినుంచి వచ్చి దాడి చేసే, రోగాలను కలిగించే సూక్ష్మజీవులైన వైరస్‌లను, బ్యాక్టీరియాలను ఎదిరించి, తీవ్రంగా సైనికుల్లాగా పోరాడి మానవ శరీరాన్ని కాపాడుతాయి.

మనుషులు తమకొచ్చిన జబ్బులు ఎక్కువైనప్పుడే, భరించలేని పరిస్థితి వచ్చినప్పుడే వైద్యులవద్దకు వెళ్తారు. ఈ వైద్యులిచ్చే బెషధాలే శ్వేత రక్త కణాల సైనికులకందించే ఆయుధాలు. శ్వేత కణాలను బలపరిచినప్పుడు రోగతీవ్రత తగ్గిపోతుంది. అనగా రోగకారక 'క్రిములైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు నశించి, శత్రుసైన్యం ఓడిపోతుంది.

మాంటేగ్నర్‌ కనుగొన్నది ఏమిటి? అదివరకు వివరించజాలని ఎయిడ్స్‌ మహమ్మారిగా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. దీనికి కారణమేమిటి? ఆఫ్రికా, అమెరికాల్లోని ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు ఎంతగా రోగనిరోధక బెషధాలందించినా ఎలాంటి ప్రయోజనం కనబడలేదెందుకు? - ఈ విషయాలపై మాంటేగ్నర్‌ దృష్టిసారించి, అనేక పరిశోధనలు సాగించి, ప్రపంచానికి తెలియజేశారు.

మొదటిది ఏమిటంటే, ఈ వ్యాధిలో శరీరంలోని ఏ అవయవమూ దెబ్బతినడం లేదు. దెబ్బ తినేవన్నీ నశించేవన్నీ తెల్ల కణాలు మాత్రమే. అందువల్ల రోగ నిరోధక మందులవల్ల ఎలాంటి లాభం లేదు. ఇలాంటి రోగాన్ని కలిగించేది ఒక రకమైన వైరస్‌. అయితే ఈ వైరస్‌ సాధారణ వైరస్‌కన్నా ఎన్నో వందల రెట్లు చిన్నదిగా ఉంటుంది. దీన్ని సాధారణ సూక్ష్మదర్శినిలో కూడా మనం చూడలేము. దీనినే రెట్రో వైరస్‌ అంటారు. హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్‌ (హెచ్‌.ఐ.వి) ఈ తరగతిలోకే వస్తుంది.

ఈ భయంకరమైన వ్యాధి ఎలా సోకుతుందని మాంటేగ్నర్‌ పరిశీలించగా కొన్ని జవాబులు ఆయనకు లభించాయి. ఈ వ్యాధి సోకిన రోగికి వేసిన ఇంజెక్షన్‌ సూదిని మరిగిన నీళ్ళలో ఉడకబెట్టక, ఆ సూదితోనే మరో రోగికి ఇంజెక్షన్‌ చేసినప్పుడు, ఆ రెండవ రోగికి హెచ్‌.ఐ.వి. సోక్రుళ్సుంది. సెలూన్లలో క్షురకులు ఉపయోగించే కత్తులు, కత్తెరల ద్వారా ఒకరి గాయం నుంచి వెలువడిన రక్తం ఇంకొరికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇదేగాక, స్రీ-పురుషుల అక్రమ సంబంధాలవల్ల కూడా ఈ భయంకర రోగం సోకే ప్రమాదముంది. అయితే లాలాజలంలోనూ, కన్నీటిలోనూ ఈ ప్రమాదకరమైన వైరస్‌ లేదు. పైన చెప్పిన విధంగా హెచ్‌.ఐ.వి వైరస్‌లు ఇతరుల శరీరంలోకి క న నా

ప్రవేశించినప్పుడు, అవి అక్కడ ఉన్న తెల్లకణాలలాగానే ఉండటంవల్ల శరీరంలోని తెల్లకణాలు వీటిని గుర్తుపట్టలేక పోతాయి. అందువల్ల వైరస్‌లు రోజురోజుకు విపరీతంగా వృద్ధిచెంది చివరకు రోగిని చంపివేస్తాయి. ఇది రోగంలోని మొదటి దశ,

రెండవ దశలో తెల్ల కణాలే పూర్తిగా నశించిపోవడం వల్ల, ఏ రోగం వచ్చినా, దాన్నెదిరించి పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది. ఈ రోగాల్లో జలుబు, దగ్గు కూడా ఉంటాయి. ఈ రెండో దశను “అక్సెర్డ్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్‌” (ఎయిడ్స్‌) అని అంటారు. మొదటి దశలో హెచ్‌.ఐ.వి వైరస్‌లు వృద్ధి చెందడాన్ని నిరోధించి, జీవిత కాలాన్ని కాస్త పొడిగిస్తారు. తల్లికి హెచ్‌.ఐ.వి ఉంటే, అది గర్భస్థ శిశువుకు సోకకుందా నిరోధిస్తారు.

నీవు చెప్పిన వికనాధుడు పుట్టిన ఘడియ ప్రధానమైనది కాదు. దానికన్నా వాడు పెరిగిన పద్దతి సరిలైనది కాదు. చిన్నతనంలోనే మత్తు పదార్థాలకు బానిస కావడం, మద్యపానాలు సేవించడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం = వీటి ద్వారా మాత్రమే వాడికి హెచ్‌.ఐ.వి వచ్చివుంటుంది. ఎయిడ్స్‌ రోగులను తాకడం వల్లో, వారితో కలసి భోజనం చేయడం వల్లో ఈ ఎయిడ్స్‌ వ్యాధి సోకదు. భయంకరమైన ఎయిడ్స్‌ వ్యాధికి గురైన వారిపట్ల మనం సానుభూతితో ప్రవర్తించాలి. వారిని కూడా సహమానవులుగా భావించాలి. వారి హక్కులను గౌరవించాలి. తెలివిలేని ఖేతాళుడా, ఈనాడు ఎయిడ్స్‌ వ్యాధికి కూడా ఉత్తమ చికిత్స అంది. అయితే అది కొంచెం కఠినమైనది. ఎక్కువ ఖర్చుతో కూడినది.

ఎయిడ్స్‌ వ్యాధి రాకుండా నియంత్రించడం అత్యంత సులభం. మనం ఎలాంటి దురలవాట్లకు బానిస కాకూడదు. అప్పుడే మనం ఉత్తమ జీవితం అనుభవించగలం. భయంకరమైన హెచ్‌.ఐ.వి. నుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచమంతా విజ్ఞానంతో వెల్లివిరుస్తోంది. దేనికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. నీలాగా మూఢనమ్మకాల్లో మునిగిపోయి, ఆత్మ విశ్వాసం లేక నిరాశానిస్సృహలతో బతకడంకన్నా సైన్సును అభ్యసించి, ఆరోగ్యసూత్రాలను పాటించి, ఆత్మవిశ్వాసంతో జీటీంచడం ఉత్తమం” అని విక్రమాదిత్యుడు భేతాళుడి (ప్రశ్చలకు ్రత్యుత్తరమిచ్చాడు.

విక్రమాదిత్యుడి జవాబులు సరిగ్గా ఉండటంతో భేతాళుడు అవమానం భరించలేక దగ్గర్లోనే ఉన్న చింతచెట్టెక్కి దాక్కున్నాడు. వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు గ్‌

ఎయిడ్స్‌ (హెచ్‌.ఐ.వి) వ్యాపించే విధం :

స శ్రుద్ధీకరింపబడని ఇంజెక్షన్‌ సిరంజి ద్వారా

  • అసురక్షితమైన శారీరక సంబంధం వల్ల

  • త్రల్లినుంచి గర్భస్థ శిశువుకు

  • తల్లిపాల ద్వారా

  • క్షురకుల సెలూన్లలోని కత్తి కత్తెర ద్వారా (రక్త గాయమైనప్పుడు మాత్రమే)

  • రక్తదానం చేసేటప్పుడు ఒకరోగికి రక్తం ఎక్కించేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రక్తదాతల రక్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

  • వైద్యశాలల్లో సరియైన జాగ్రత్తలు వహించక ఎక్కించే రక్తం ద్వారా కూడా హెచ్‌.ఐ.వి వ్యాపించే ప్రమాదం ఉంది.

ఏంచేస్తే హెచ్‌.ఐ.వి. వ్యాపించదు?

  • దోమకాటువల్ల హెచ్‌.ఐ.వి వ్యాపించదు. ఎందుకంటే దోమ రక్తాన్ని అలాగే ఇతరులకు అంటించదు.

శ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులతో కలసి ఆహారం తీసుకోవడం వల్లనో, వారి వస్త్రాలను వాడడం వల్లనో, కరచాలనం చేయడం వల్లనో, కౌగిలించుకోవడం వల్లనో హెచ్‌.ఐ.వి వ్యాపించదు.

  • ప్రస్తుతం ప్రపంచంలో హెచ్‌.ఐ.వి ఎంత వేగంగా వ్యాపిస్తోందో మీకు తెలుసా? ఈ ప్రశ్నను మీరు చదివి ముగించే లోపల భారత దేశంలో 12 మందికి, ప్రపంచంలో 130 మందికి అది వ్యాపించి ఉంటుంది.

భత రానా నా ఆర్‌ నటరాజన్‌

వైద్యరంగ తడ్బుతాలు విష్ణాన విశ్రమాదెత్యునికథలు ౮?

గాయాల లక్ష్మీపతి కథ శ అమావాస్య రాగానే శృశానవాసులైన గుద్లగూబలు, గబ్బిలాలు, పాములు, నక్కలు మహదానందం చెందుతాయి. నీడలలాగా అవి చీకటి వ్రపంచ పౌరులుగా విశ్వరూపమెత్తుతాయి. అలాంటి కాళరాడ్రిలో అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపు మెరుస్తోంది. దక్షిణపు దిశలో పెద్దగాలి దుమారం లేపుతోంది. ఆ వాతావరణంలో విక్రమాదిత్య మహారాజు ఆకాశాన్నంటుతున్న చింతచెట్టు వైపు నడచి వచ్చాడు. అతడి ముఖంలో రాజకళ కొట్టినట్టు కనిపిస్తోంది. అద్భుత పరిపాలకుడైన అతడు శాశ్వతత్వం కలిగినవాడు. విక్రమాదిత్యుడు తన ప్రజలకు శృశానంలో సేవలు చేయడాన్ని ఒక తీర్థయాత్రగా భావించేవాడు. అయితే అతడ్ని తన కర్తవ్యం చేయనివ్వకుండా అద్దుకునేవాడే భేతాళుడు. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, దృఢదీక్ష కలగలసిన అద్భుత వ్యక్తే విక్రమాదిత్యుడు. ఆ చింతచెట్టుకింద నిలబడ్డాడు. తలెత్తి చూస్తే ఒక కొమ్మమీద శవం వేలాడుతూవుంది. విక్రమాదిత్య చక్రవర్తితోపాటు ఆ శవానికి ఒక నక్క కూడా పోటీ పడుతోంది. అయితే చక్రవర్తి ఒక్క చూపుతోనే ఆ నక్క అక్కడ్నుంచి భయపడి పారిపోయింది. కానీ పోతూపోతూ అరుస్తూ పారిపోయింది. చెట్ల తొర్రలలో నిండిపోయివున్న కపాలాలను కన్నెత్తి కూడా చూడకుండా విక్రమాదిత్యుడు శవాన్ని కిందికి దించాడు. అక్కడ్నుంచి శృశానంలో గాలికి ఎగురుతున్న బూడిదను కూడా పట్టించుకోకుండా, ఆ శవాన్ని భుజాన వేసుకొని దహన మండపం వైపు నడిచాడు. అప్పుడప్పుడు మెరుపు మెరుస్తూ అతడికి వెలుగునిస్తోంది. విక్రమాదిత్యుడి పట్టుదలను ఆ శవం లోపలినుంచే గమనిస్తున్న భేతాళు డు చీకటిని చీలుస్తూ పెద్దగా నవ్వాడు. ఆ నవ్వుతో గబ్బిలాలు భయపడి దిక్కుకొక్కటిగా చెల్లాచెదురైపోయాయి. కానీ, ఇవేమీ జరగనట్లు చక్రవర్తి దహనమండపం చేరుకున్నాడు. ఆ సమయాన భేతాళుడు మాట్లాడసాగాడు. ఛత్ర ఆర్‌ నటరాజన్‌

“విక్రమాదిత్య మహారాజా! నీ ప్రజలపై నీకున్న (ప్రేమాభిమానాలు, వారికి నీవు చేస్తున్న ఈ శ్మశాన సేవలు ఎంతో పాగడదగినవి. అయితే ఇప్పుడు నీవు మోసుకొచ్చిన ఈ శవానికి చెందిన లక్ష్మీపతి అంత మంచివాడు కాడు. నీ సేవలు పొందే అర్హత వాడికి కొంచెం కూడా లేదు. చీకటి దట్టంగా వ్యాపించిన ఈ రాత్రివేళలో వాడి వృత్తాంతం చెబుతాను, వినుకో” 2

పెన్నా నదీ నీటితో వ్యవసాయాభివృద్ధితో సుసంపన్నమైన నెల్లూరులోని ఒక ప్రసిద్ధ దేవాలయం పూజారి రామాచారి తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నాడు. దేవాలయంలో పూజలు చేయడమేగాక దైవవాక్కు అనే పేరుతో గురి చెప్పడం, జ్యోతిష్యం చెప్పడం, జాతకాలు రాయడం మొదలగు ఎన్నో పనులు చేసి కూడా డబ్బులు సంపాదించేవాడు. అర్జునుడి బాణం గురి తప్పుతుందేమోగానీ, రామాచారి చెప్పిన జ్యోతిష్యం తప్పదని నెల్లూరు ప్రజలందరూ చెప్పుకొనేవారు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉండేవారు. చాలా కాలం తర్వాత అతనికి మగబిడ్డ జన్మించాడు. అందరూ చాలా సంతోషించారు. రామాచారి వాడి జాతకం వ్రాసి, ఆ బిద్గకు లక్ష్మీపతి అని అందమైన పేరు పెట్టాడు. తల్లిదండ్రులు మాత్రమే కాకుండా, ఇద్దరక్కలు కూడా లక్ష్మీపతిని అల్లారుముద్దుగా పెంచుతూవచ్చారు. ఇందుకు మరో కారణమేమిటంటే, ఆ మగళిశువు జన్మించగానే మంత్రసాని చేతుల్లోనుంచి తప్పి కింద పడిపోయాడు. అయినా పూజారి మహాభక్తుడు కనుక బిడ్డ ప్రాణాలతో మిగిలాడు. అందరికీ దైవవాక్కు చెబుతూ వుండిన రామాచారికి ఈ సంఘటన ఎంతో బాధ కల్గించింది.

అందువల్ల అత్యంత జాగరూకతతో లక్ష్మీపతిని చూసుకుంటూ వచ్చారు. అయితే ఆ అబ్బాయికి మొదటి నుంచి నెమ్మదిలేదు. ఎప్పుడూ వేగంగా పరుగెత్తుతూ ఉండేవాడు. అందరితోనూ కొట్లాడేవాడు. మాటిమాటికీ కిందపడిపోయి, ఒళ్ళంతా గాయాలు నిండిపోతుండేవి. పాదాల్లోనూ, మోకాళ్ళలోనూ సదా గజ్జి స్థిరంగా ఉండిపోయింది. అందరికీ ముద్దుబిడ్డ కనుక వాడికి సురక్ష ఉండినదేకాని, క్రమశిక్షణ ఏనాడూ ఉండలేదు. చెట్టెక్కి కాయలు కోయడం, కోనేటిలో దూకి మునిగితేలడం, దేవుడి హుండీలో కూడా చేతివాటం చూపించడం - ఇలా వాడు అందరికీ ఇబ్బంది కల్గిస్తూవున్నాడు. గుడిమెట్లపై ఎప్పుడూ పడుకొని గురకలు పెడుతుందేవాడు. అలా నిద్రపోతున్నప్పుడు చాలాసార్లు ఆ మెట్లపైనుంచి కిందపడిపోయి శరీరంలో గాయాలు చేసుకున్నాడు. మాంచృంం వద్దానవతమాదళునతతద భక

ల పోటో టీ . న్‌్‌ కం | లా ఎబనలు “చ జీ. .

_ త గళ పా యై ట్ల యు. మ "టి! మ ౧ భీ జడి మహో నా్‌ శ... అరల హహహోాళకా!(౫/ న్‌ ల] | ! ం / ( /. (8 నాయాటలో నజంయాచజాంయు. పా వీ న్‌ కా స. + " |. శో . ళో, గాగ భ్‌ కీ .

80 అర్‌. నటరాజన్‌

ఒక రోజు తనలాంటి దుష్టమిత్రులతో కలసి ఒక ప్రహరీగోడలేని మేడపై డబ్బులు పెట్టి గోలీలాడుతున్నాడు. ఆ సమయంలో ఎలాగో పైన్నుంచి నేలపై పడిపోయాడు. పెద్ద అరుపుతో లక్ష్మీపతి అందర్నీ అక్కడికి రప్పించేశాడు. ఆ రోజునుంచి లక్ష్మీపతికి ఒక బిరుదు తగులుకుంది. అది “గాయాల లక్ష్మీపతి” అయ్యింది. ఊర్లోని వైద్యులు వాడి గాయాలకు కట్లు కట్టారు, ఎన్నో మందులు తాగించారు. అయితే గాయాలు మానటానికి బదులు రోజురోజుకూ అవి పెద్దవైపోతున్నాయి. గాయాల్లో చీముపట్టి వాడు చాలా బాధపడసాగాడు. అప్పటికే వయస్సు పైబడిన కారణంగా వాడికి తల్లిదండ్రులు పెళ్ళి నిశ్చయించారు. అయితే ముహూర్తపు రోజే లక్ష్మీపతి తన తీవ్రమైన గాయాలతో మృతి చెందాడు. వాడి మరణం చూచి ఊరంతా దిగ్ర్భాంతి చెందింది. దేవుడి ఆగ్రహం వల్లే వాదు చనిపోయాడని అందరూ అన్నారు. పాపం రామాచారి, పుత్రశోకంతో ఆరోజు నుంచే దైవవాక్కనే పేరుతో గురిచెప్పడం మానేశాడు. జ్యోతిషం, జాతకాలు కూడా వదిలేశాడు. విక్రమాదిత్యా, ఏదైనా గాయమైతే మానాలికదా, మరి లక్ష్మీపతి గాయాలు ఎందుకు మానలేదు? తల్లిదండ్రులు వాడికెన్నో వైద్యాలు కూడా చేయించారు కదా! మరెందుకు చనిపోయాడు?

రామాచారి వ్రాసుకున్న లక్ష్మీపతి జాతకంలో ప్రమాదం విషయం కూడా ఉండీ, పెద్దలు ఎంతో జాగ్రత్తగా వాడ్ని చూసుకుంటూ వచ్చీ, చివరకు వాడెందుకు చనిపోయాడు?

మేడపైనుంచి కిందకు పడినా, బతికిపోయిన లక్ష్మీపతి చివరకు గాయాలతో చనిపోవడమెందుకు?” అని భేతాళుడు కాసేపు కథచెప్పడం ఆపి “విక్రమాదిత్య మహారాజా, ఈ ప్రశ్నలకు జవాబులు తెలిసీ చెప్పకపోతే, నీ తల వెయ్యి బద్దలైపోతుంది” అని హెచ్చరించాడు.

కానీ, భఖేతాళుడి మాటలు విక్రమాదిత్యుడికి భయం కలిగించలేదు, దానికి బదులు చిరునవ్వుతో తన గొంతు సవరించుకొని చెప్పాడు. “వైజ్ఞానిక ప్రపంచంలో రోజురోజుకూ జరుగుతున్న అద్బుతాలు తెలియని భేతాళుడా, లక్ష్మీపతి చావుకూ, జ్యోతిషానికీ ఎలాంటి సంబంధమూ లేదు. జ్యోతిషం అనేది ఊహాబలంపై ఆధారపడి చెప్పేదే. అలా కావచ్చు, ఇలా కావచ్చు, ఏమీ కాకపోవచ్చు అంటూ అన్నిటికీ అవకాశాలు ఉండేవిధంగా జ్యోతిష్కులు చెబుతూవుంటారు. వారు చెప్పే 20 మాటల్లో 1, 2 మనకు తప్పకుండా అన్వయించేవిగా ఉంటాయి. వారు చెప్పిన ఒకటీ రెండు విషయాలు భవిష్యత్‌లో నిజం కూడా కావచ్చు. అయితే నూటికి నూరు ఎప్పుడూ నిజం కావు. వైద్యరంగ అద్భుతాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు 91

ఓ జ || జ కీ జీ ఎము ణి భా ) స్మి | | . క్‌ | 1 ళ్‌ న త్రై ఆర్‌. నటరాజన్‌

కానీ లక్ష్మీపతి కూడా మృతిచెందక, బతికి ఉండవచ్చు. వాడు చనిపోవడానికి సరియైన వైద్యం చేయించుకోకపోవడమే కారణం. గాయాలలో చీముపట్టిందంటే, వాటిలో సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాలు ప్రవేశించి, వాటిని నాశనం చేస్తున్నాయని అర్ధం. దీన్నుంచి తప్పించుకునేందుకు “పెన్సిలిన్‌” లాంటి విరుద్ధ సూక్ష్మ జీవులతో కూడిన బెషధమైన యాంటీబయాటిక్‌ అవసరం. అలాంటి అద్భుతమైన మందును కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. ఆయన వృత్తాంతం చెబుతాను, సావధానంగా విను” అంటూ విక్రమాదిత్యుడు చెప్పసాగాడు. ప

“క్ర ప్రపంచంలో చాలామందికి అనేక రకాలైన గాయాలు అవుతూనే వుంటాయి. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ఒక చిన్న గాయం కూడా తగలని వారు ఎక్కడా ఉండరు. ఖేతాళుడా! దేశం కోసం యుద్ధంచేసే సైనికుడైనా సరే, కుటుంది పోషణ కోసం నిరంతరం పనీపొట్లు చేసే పౌరుడైనా సరే, వ్యవసాయం చేసే రైతైనా సరే, అందరికీ గాయాలు తగలడమనేది అత్యంత సహజం. రకరకాల గాయాలున్నాయని వైద్యశాస్త్రం చెబుతోంది. (ప్రాచీన కాలంలో ఎలావున్నాా గత కొన్ని శతాబ్దాల్లో జరిగినన్ని వైజ్ఞానిక అద్బుతాలు, చికిత్సా పద్ధతులు ఎప్పుడూ జరగలేదు. గత శతాబ్దంలోనే ప్రపంచంలో ఎందరో మేధావులు జన్మించి, మానవుల జీవిత కాలాన్ని పొడిగించగలిగే శాస్త్రీయ కృషి సాగించారు. నిజానికి వారు మన ఆయుష్నునే పెంచేశారు. అలాంటి వారిలో ఒకరు మన అలెగ్జాండర్‌ స్లెమింగ్‌.

పాతకాలంలో మనుషులకు ఎలాంటి గాయాలు తగిలినా, వాటిని మాన్చడానికి ఆ కాలపు నాటువైద్యులు ఆకులు, అలములతో చికిత్స చేసేవారు. అందువల్ల తాత్కాలికంగా గాయాలపాలైన వ్యక్తి నొప్పి కాస్త తగ్గుతుందే గానీ, ఆ గాయాలను, వారి మందులు లోతుకెళ్ళి నయం చేయలేవు. దీని కొరకు వైద్యులు చాలాకాలం ప్రయత్నిస్తూ వచ్చారు. చివరకు అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌ “పెన్సిలిన్‌” జౌషధాన్ని కనుగొన్న తర్వాతే, గాయాలలో తిష్టవేసే బ్యాక్టీరియాలను పెన్సిలిన్‌ వెదికివెదికి వేటాడసాగింది.

“గాయం” అనేది చర్మం కోసుకుపోయి, శరీరంలోని రక్తనాళాలతో సహా లోపలవున్న కణజాలాన్ని తెరవడం. తెరచిన ఆ కణజాలంలోకి, గాలిలో సంచరించే సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాలు ప్రవేశించేస్తాయి. అక్కడ బ్యాక్టీరియాలు అత్యంత వేగంగా వృద్ధిచెంది, కణాలను నాశనం చేస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తినిచ్చే శ్వేతరక్తకణాలు వైద్యరంగఅద్భుకాలు విజ్ఞానవిక్రమాదిత్యునికథలు 83

ప్రశ డాలర్‌ నటరాజన్‌

అదృశ్యమైపోతాయి. ఈ కారణంగా గాయాల పరిమాణాలను బట్టి మరణం సంభవిస్తుంది. దానినెదిరించి పోరాడేదే యాంటీబయాటిక్‌. ప్రపంచంలోని మొదటి యాంటీబయాటిక్‌ పెన్సిలిన్‌. దీనిని కనుగొని, మానవాళిని రక్షించినవాడే స్లెమింగ్‌. న్‌!

అలెగ్జాండర్‌ స్లెమింగ్‌ 1881వ సంవత్సరం స్మాట్లండ్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గొర్రెల పెంపకందార్లు. ఆ పేద కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో పాటు ఫ్లెమింగ్‌ జన్మించారు. ఆయన పేదరికం కారణంగా ప్రాథమిక విద్యను మాత్రమే చదవగలిగారు. 1894వ సంవత్సరం ఆయన స్మాట్లండ్‌ నుండి లండన్‌కు వలసవెళ్లి అక్కడి ఓడరేవులో బాలకార్మికుడుగా పనిచేశారు. ఆ సంపాదనను ఒక్కాక్క పైసాగా చేర్చి ఒక బంధువు సహాయంతో లండన్‌లోని సెయింట్‌ మేరిస్‌ వైద్య విద్యాలయంలో చేరారు. తిండికి కూడా కరువైన అలెగ్జాండర్‌ ప్రభుత్వ ఉపకార వేతనాలతోనే తన విద్యను కొనసాగించారు. చివరకు ప్రవేశ పరీక్షలో ప్రథముడుగా ఉత్తీర్డుడైనందువల్ల లండన్‌ విశ్వవిద్యాలయం ఉపకారవేతనం కూడా ఆయనకు లభించింది. 1906లో బంగారు పతకంతోపాటు డాక్టర్‌ పట్టా కూడా ఆయన పొందారు.

మొదటి ప్రపంచ మహాయుద్ధం 1914లో ప్రారంభమైంది. అంతవరకు 'స్లెమింగ్‌ అక్కడే కళాశాలలో వైద్యోపన్యాసకులుగా పనిచేస్తూవచ్చారు. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంతో పాటు ఆయన్ను కూడా ప్రభుత్వం ఫ్రాన్స్‌కు పంపింది. అక్కడే ఆయనకు పరీక్షాకాలం ఎదురైంది. యుద్ధరంగంలో క్షతగాత్రులైన ఎందరో సైనికులు, బ్యాక్టీరియాల కారణంగా వారి గాయాలు రణాలై కొన్ని గంటలలోపే మృతిచెందుతూవచ్చారు. ఆ పరిస్థితి చూచి అలెగ్జాండర్‌ స్లెమింగ్‌ అత్యంత చింతాక్రాంతులయ్యారు. అప్పటికి ఉన్న బెషధాలు బ్యాక్టీరియాలను పైపైన మాత్రమే నాశనం చేసి, గాయాలు మానిపోయినట్లే కనబడి, లోలోపల మాత్రం రణాలౌతూ వచ్చాయి. ఆ లోపలి రణాలను ఎవరూ ఏమీ చేయ లేకపోయారు.

ల్‌

రెండవ ప్రపంచ మహాయుద్ధం ముగిసిన తర్వాత అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ తన సెయింట్‌ మేరీస్‌ కళాశాలకు తిరిగివచ్చి, ప్రయోగశాలలో పరిశోధనలు ప్రారంభించారు. బ్యాక్టీరియాకు సంబంధించిన పరిశోధనల కార్యక్రమానికి లండన్‌ విశ్వవిద్యాలయం ఆయన్నే డైరెక్టర్‌గా నియమించింది. ఆ ప్రయోగశాలలో యాదృచ్చికంగా జరిగిన ఒక వైద్యరంగ అద్భుకాలు విజ్ఞాన విక్రమాదెత్యునికథలు 85

శత యానా... "ఆక్‌: నటరాపక్‌

సంఘటనే, ఆ తరువాత కాలంలో మానవజాతిని గాయాలనుంచి రక్షించిందని చెప్పవచ్చు. ఒకరోజు అర్ధరాత్రి గడచినా, ఫ్లెమింగ్‌ తన ప్రయోగశాలలో పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. బ్యాక్టీరియాలకు సంబంధించిన అనేక పరిశోధనలు చేస్తూ, వాటిని నాశనం చేసే పద్దతుల్ని కనుగొనేందుకు తీవ కృషి చేస్తున్నారు. ప్రయోగశాలలో బ్యాక్టీరియావున్న గాజు స్లేటును తీసుకొని ఒక చోటు నుంచి మరోచోటుకు వెళ్ళేటప్పుడు ఆయనకు తుమ్ము వచ్చేసింది. ఆ తుమ్ము కారణంగా ముక్కులోంచి మ్యూకస్‌ నీటి బిందువులు ఆ గాజు ప్లేటులో పడ్డాయి. మరుసటి రోజు ఉదయం అలెగ్జాండర్‌ స్లెమింగ్‌ ఆ గాజు ప్లేటును చూసినపుడు, ముక్కు తుంపరలు పడిన చోట్లలో మాత్రం బ్యాక్టీరియాలు నశించి పోయి ఉన్నాయి.

అంతే, వెంటనే ఆయన మానవ శరీరంలోవున్న అంతః(స్రావాల గురించి పరిశోధించనారంభించారు. మొదట కన్నీటి నుంచి “లైసోజోమ్‌” అనే బెషధాన్ని కనుగొని, దాన్నుంచి మరింత తీవ్రంగా పరిశీలనలు గావించి 1928లో స్లెైమింగ్‌ పెన్సిలిన్‌ మందును కనుగొన్నారు. ఆయన నాలుగు రకాల పెన్సిలిన్‌ టెషధాలను ఆవిష్కరించారు. ఎలాంటి గాయమైనా సరే, వాటిలోని బ్యాక్టీరియాలను నాశనం చేయగలిగి, మానవ జాతిని కాపాడిన అద్భుతమైన ఆవిష్కరణ చేసిన గొప్ప శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ స్లెమింగ్‌.

భేతాళుడా, పెన్సిలిన్‌కి సంబంధించిన ఒక అద్భుత విషయాన్ని చెబుతాను, విను! మనవద్ద పెన్సిలిన్‌ మందు చాలా తక్కువ పరిమాణంలో ఉందని ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రత్యేకత పెన్సిలిన్‌కి ఉంది.

ఒకసారి అమెరికన్‌ పోలిస్‌ కానిస్టేబుల్‌ ఒకరు తీవ్రమైన తుపాకీ కాల్పులకు గురి అయ్యారు. అతడ్ని అమెరికాలోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ స్లెమింగ్‌ మందును ఇంజెక్షన్‌ ద్వారా రోగికి వేస్తున్న దాక్టర్లిద్దరు పనిజేస్తున్నారు. వారివద్ద 17 మిల్లీ గ్రాముల మోతాదుకూడా పెన్సిలిన్‌ నిలువలేదు. అయితే దాన్ని ఆ కానిస్టేబుల్‌కు మూడు గంటలకొకసారి ఇంజెక్షన్‌ చేన్తుంటే, అతడు బతకగలడని వారు నిర్ధారించుకున్నారు. వారు స్లెమింగ్‌ను ఈ విషయమై సలహా కోరగా, ఆయన ఒక చక్కటి ఉపాయం చెప్పారు. అదేమిటంటే, ఉన్న పెన్సిలిన్‌ను ఆ కానిస్టేబుల్‌కు వేసి, తదనంతరం ఒకటిన్నర గంట తర్వాత అతడి మూత్రం నుంచే పెన్సిలిన్‌ను వేరుపరచి, దాన్నే కానిస్టేబుల్‌కు మరలామరలా వేయవచ్చు. మరలా ఇంకోసారికూడా ఒకటిన్నర గంట తర్వాత అలాగే కానిస్టేబుల్‌ మూత్రం నుంచి పెన్సిలిన్‌ను వేరుచేసి ఆ డాక్టర్లు వైథరంగలద్భుకాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు 87

న న 20౧ ్‌ 1 ల ల్‌ క

కానిస్టేబుల్‌కు ఇంజెక్ట్‌ చేశారు. అందరూ ఆశ్చర్యం చెందేవిధంగా కానిస్టేబుల్‌ బతికి బయటపడ్డాడు. ఈ అద్బుత సంగతి విని ప్రపంచం విస్మయం చెందింది. రెండవ ప్రపంచ మహాయుద్ధ కాలంలోనే జర్మనీకి చెందిన క్షాడస్‌హాబీ అనే మహిళామణి పెద్దమొత్తంలో పెన్సిలిన్‌ను ఉత్పత్తిచేసినా, అందుకు ఆధారం అందించిన అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ను మానవసమాజం ఎప్పటికీ మరువజాలదు. ఆయనకు 1945వ సంవత్సరంలో నోబెల్‌ బహుమతి లభించినా, ఆయన మాత్రం తన పరిశోధనలు మానుకోలేదు. అలెగ్జాండర్‌ స్లైమింగ్‌ మృతిచెందిన 1955లో కూడా చివరిగా క్షయవ్యాధికి “స్రైెష్టోమైసిన్‌” అనే రోగనిరోధక సూక్ష్మబెషధాన్ని (యాంటీబయాటిక్‌) కనుగొన్న మహావిజ్ఞాని ఆయనే. మూర్ధ శిరోమణి భేతాళుడా! నీవు చెప్పిన లక్ష్మీపతి ఇలాంటి ఏ వైద్యమూ చేసుకోకపోవడం వల్లే మృతిచెందాడు. ప్రమాదం, పైన్నుంచి పడి గాయపడడం మొదలగునవి మన అజాగ్రత్తవల్ల జరిగేవి. అప్పుడు మాత్రలవల్ల మాత్రమే ఫలితం కనబడనప్పుడు పెన్సిలిన్‌ లాంటి సూదిమందులు అత్యవసరం”. చక్రవర్తి విక్రమాదిత్యుడు చెప్పిన వివరణతో అతడి మౌనం భంగమైనతర్వాత, భేతాళుడు శవంతో సహా దగ్గర్లోనే వున్న మునగ చెట్టెక్కేశాడు. విక్రమాదిత్యుడు కొంచెం కూడా నిరాశ చెందక, మరలా ఆ చెట్టు వైపు నడిచాడు. వైద్యరంగలఅద్భుకాలు విజ్ఞాన విక్రమాదిత్యునికథలు ల్‌

గాయాలైతే ఏం చేయాలి? కోత గాయం ఒరుసుకుపోయిన గాయం కాలిన గాయం 1 రక్తస్రావాన్ని అరికట్టేందుకు. 1. గాయాన్ని పరిశుభ్రమైన నీటిలో ముంచిన 1. వెంటనే చల్లటి నీటితో తడిగుడ్డతో గాయాన్ని అదిమిపట్టాలి. దూదితో శుభ్రపరచాలి. గాయాన్ని కడగాలి. 2ఓఐన్‌ గడ్జలను ఉపయోగించి కూడా 2. గాలిలో గాయాన్ని ఆరబెట్టాలి. 2. గాయాన్ని కప్పిపెట్టరాదు. రక్తస్రావాన్ని ఆపవచ్చు. 8. వసుష్పపొడిని ఉంచినా & వైద్యుడి వద్దకు వెళ్లడం. & వైద్యుడి సలహా అత్యం రక్తస్రావం నిలిచిపోతుంది ముఖ్యం, ఓ గాయాన్ని శుభ్రమైన 4 గాయం మానుకున్నప్పుడు నీటిలో కడగాలి తర్వాత వెంటనే దురడేస్తే గోక్ళోరారు. వైద్యుల దగ్గరికెళ్లాలి, గమనిక : ఏ కారణంవల్లనైనా పెద్ద గాయాలకు స్వీయ చికిత్స చేసుకోరాదు. వైద్యుడి వద్దకే వెళ్ళాలి. లాలా. శప్తపిక్తుట్తమనా--3 లాలా తం నానా సా ఆర్‌, నటంజన్‌

న. - ల న. న! న. ర తాళ ల |. ల -. [గ ల | లై. స. న న న. న యు టం | చక పమ ఫర ప క స నం టం ఇ స . నా లన [ప | గస. . . ( సప ర ప ల య ల వ. గ స్‌ , భివదలతో -శోన్రవేత్తలు. తమ. జీవితాలను... ౨” స వవ హా. 2 న. -జ్రంకితం చేసి “అనేక “ప్రాణాంతక వ్యాధులకు ( 1 ల లం 1... - _ మందులు కనిపెట్టారు. ఇవ్నట్‌కి కనిపేడుతున్నారు. ౨... 2... అయిత్మేఈ అధునిక యుగంలో సైతం కొందరు... స 1... 'మాయగాళ్లుమంత్రాలు తంత్రాలు అట్లోప్రజల్లో ..... జీ క 1.2 , . అంధవిశ్వాసాలు వ్యాసింపడేస్తున్నురు తమపబ్బం 2. “| గ, .. . “గడుపుకునేయకు వారు అమాయకప్రజల చ 2 . వ. ఎ... ప్రాణాలతో చెలగ్గాటమోదుకున్నారు, ఈశవిజ్ఞాన.. . | భా?” విక్రమాదిత్య కథలు” పాఠకులకు ప్యాధులపై.... * (| “గ... "శాప్తీయ'అవగాహన కల్పిస్తాయి... ౨౨౨ న ట్‌ శ పం పై ఎ ళి వ న. 4 శ టచ్‌. వ నలి క నగ ౫. సం

న. / య శ స గా . -