Telugu Vennela Veta - anilvaranasi/indianlanguages GitHub Wiki

7 ఇ గ, | 1 ట్‌ కవల . . | నే ల న () , శ ఘౌ చి ని. జి కటి శులె తహ అసం యప న. సహ చుకుదే చూసు ,. న! సుూ' త్యాణి మం పస్‌ శంకా న్‌ మ గ ఈపుమ జ్దాస్‌ [0 , న రం గ? య్య స్తునొవ్‌ న ర్యమళ క్ల సా ంతోబ' మొల కౌ

వన్నెల వట శారదా అశోకవర్ధన్‌

ధృడ్శిట[. క్రైషిడం ॥ ఆశా - జ్తో (వ వన విక క ౭8౪ 5[42ట04 450% 712004! వి019264 09 : లి౭౭౭204 7608 426404 702, తుంజుయడంరే 502002 ంంగం1బం $.9.2046, 56యిరేల౭6026 - 500 003. వ్యాలటంండం! : లీజగంి 1997 శం 069160 : త౭6౭/4ల౮ కారటా+ం4ే 2: 5౫ 854/4 ఉల విరంల6/5 యమయంర2ంజ81, గ్వంల౭0864, 2౧: 7638326 0? ౧౦౧1౯౬5: 4 5702041 0 0540024074 8ం05 066 తయ, గ్వేరలార2ర 4 తండ కంంగ్‌ ౮4౯౮౭ 0 గి యతజతంజక, గెళలాలజత రె గీడళ0464౪4 500% నోంటడ56 ర్‌ ౧. తం: 5జం02) సె! జరరు? శేరియుర్రంరే2, క స్రేడల 2026 స్టారాలయ నం స్టా యో జ్‌ వో06 : [9. 50 గో షి. | 462” ష్‌ గల్చిదాత్ర స్రదరల

అంకితం స స్వ్‌క కృథిస్వకర్త సహృదయ స్నేహశీలి, కార్యశీలి చిత్రిర్మాత స్టూడియో అధినేత శ్రీ డి.రామానాయుడి గారికి

స్‌ ల ే న సగ నం

| ః' /. నా ర! క్ట /.

|| /| ర ఫ్లో న ఛా

పో || న్స న్న నో వ. య భే ర్త ౯. ః

స న. ర్‌. ॥ సళ . పట టా ౮. . న ౯ ॥

స న షయ స . త న ను ప న మండే | న | క నం! వ చే శు

వెన్నెల వేట వెన్నెల వేట కోర్టు హాలు జనంతో కిటకిటలాడుతోంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవటానికి చోటులేక చాలా మంది నిలబడి వున్నారు. అందరి ముఖాల్టోనూ ఆతృత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. దేశంలోనే సంచలనం రేపిన “డాక్టర్‌ ఫణికుమార్‌ కేసు'కి ఆరోజే తీర్పు! కోర్టు బయట ఆడామగా తేడా లేకుండా జనం గుమిగూడి ఉన్నారు.

“ఫణికుమార్‌ని ఉరి తీయాలి!”

కోర్టులోకి ప్రవేశించటానికి ముందుకి ఉరకబోతుంటే పోలీసులు వారిని ఆటంకవరిచి, వారితో పాటు మిగతా వారిని కూడా దూరంగా నెట్టుకువెళుతున్నారు.

మహిళా సంఘాల తరపున అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఆవేశంగా ముందుకు దూసుకువస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు.

“గౌరవప్రదమైన వైద్య వృత్తిలో వుండి (స్త్రీల పట్ట అసభ్యంగా ప్రవర్తించటమే కాక, ఒక స్త్రీని అతి దారుణంగా హత్య చేసిన ఫణికుమార్‌ కు మరణ దండన విధించాలని" వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నట్టుండి కోర్టు ఆవరణలో ఉన్న జనంలో అలజడి చెలరేగింది. వారిలోంచి ఓ పాతికేళ్ళ స్రీ ముందుకొచ్చింది. ఆమె చేతిలో కిరోసిన్‌ డబ్బా ఉంది. ఆమె పోలీసులవైపు, కోర్టు భవనం వైపు చూస్తూ గొంతు చించుకొని అరవసాగింది.

“ఆడవారి పట్ట అనుచితంగా ప్రవర్తించే డాక్టర్‌ ఫణికువార్‌కి శిక్షపడాలి. ఒక ్రీని అతి కిరాతకంగా హత్య చేసిన ఫణికుమార్‌కి ఉరిశిక్ష విధించాలి. లేకపోతే నేను ఇప్పుడే, ఇక్కడే ఆత్మాహుతి చేసుకుంటాను” అంటూ తన చేతిలోని కిరోసిన్‌ డబ్బాని పైకెత్తి మీద ఒంపుకొంది. అక్కడి జనంలో హాహాకారాలు చెలరేగాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

7

శారదా ఆశోకవర్ధన్‌

ఆడ పోలీసులు ఆత్మాహుతికి ప్రయత్నించిన 'స్త్రీని అదుపులోకి తీసుకున్నారు.

జనంలో ఆందోళన బయలుదేరింది. బిగ్గరగా నినాదాలు చేయసాగారు.

ఆవేశంగా అరుస్తూ ముందుకు ఉరుకుతున్నారు.

అంతే, పోలీసుల లారీలు లేచాయి. లాఠీ దెబ్బలకు తాళలేక ఆర్తనాదాలు చేయసాగారు. కోర్టు ఆవరణ అంతా బీభత్సంగా అల్లకల్లోలంగా తయారయింది.

కోర్టు హాలులో జడ్డిగారి 'అర్డర్‌! ఆర్డర్‌!” అనే హెచ్చరికలతో గుసగుసలు ఆగిపోయి, వాతావరణం నిశ్ళబ్ద ఆవరించింది.

బడ్డి తుది తీర్పు ఇవ్వడానికి ఉద్యుక్తులయ్యారు.

మరోసారి కోర్టు ఆవరణలోంచి బిగ్గరగా నినాదాలు చుట్టుముట్టాయి.

“జడ్జి ఒక్క క్షణం ఆగి గొంతు సవరించుకున్నారు. చెప్పటం మొదలెట్టారు.

“ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం డాక్టర్‌ ఫణికుమార్‌ అనే ఈ ముద్దాయి సాక్ష్యాధారాలను బట్టి 'హర్షిత అనే తన స్నేహితుడి భార్యను అతి దారుణంగా హత్య చేసినట్టు రుజువైంది. దేశం యావత్తు సంచలనం సృష్టించిన ఈ హత్యకు కారకుడైన ఫణికుమార్‌ సాధారణ వ్యక్తికాదు. బాధ్యతగల పౌరుడిగా, మహోన్నతమైన వైద్య వృత్తిలో వుండి చేయరాని నేరానికి పాల్పడ్డాడు. ప్రజలలో వ్యతిరేక భావానికి గురయ్యాడు. వృత్తికే కళంకం తెచ్చి, మన స్థిమితం చాటున తప్పించుకోజూసిన డాక్టర్‌ ఫణికుమార్‌ను శిక్షార్హుడిగా నిర్ణయించడమైంది. ఆతను చేసిన నేరానికి పరిహారంగా......”

జడ్జిగారు శిక్షను ప్రకటించకుండానే కోర్టు హాలులోని (ప్రేక్షకులలో అలజడి బయలుదేరింది.

అందరూ ఒక్కుమ్మడిగా లేచి నిలబడ్డారు.

8

వెన్నెల వేట “ఈ పాపాత్ముడికి ఉరిశిక్ష విధించాలి!” ఆంటూ అరవసాగారు. వారి అరుప్తులతో కోర్టంతా ప్రతిధ్వనించింది. క్షణాలలో ఈ విషయం కోర్టు బయట ఉన్నవారందరికీ తెలిసిపోయింది. అంతే! ఆ జనంలో మళ్ళీ ఆవేశం పెల్టుబికింది. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయసాగారు. “డాక్టర్‌ ఫణికుమార్‌ని ఉరితీయాలి!” “ఉరి తీయండి. లేదా మాకు వదలండి. మేమే తగిన శిక్ష విధిస్తాం.” “ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో ఉంచటానికి వీలులేదు.” ఆ గందరగోళ పరిస్థితికి మరికొంతమంది జనం కోర్టు ఆవరణలో పోగయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం. జనాన్ని అదుపులో పెట్టటానికి పోలీసులు మళ్ళీ లాలఠీఛార్జి చేశారు. నినాదాలు ఆపకుండానే జనం చెల్లాచెదురుగా అటూ ఇటూ పరుగెడుతున్నారు. కోర్టు ఆవరణలోని ఆందోళనకర పరిస్థితిని సమీక్షించి జడ్జిగారి చెవిన వేశారు. కోర్టు హాలులో కూడా అలజడి తగ్గలేదు. “ఆర్డర్‌! ఆర్హర్‌!!” జడ్జిగారు ఆదేశించారు. కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. జడ్జిగారు అందరినీ ఓసారి కలియజూశారు. అందరి ముఖాలలోనూ ఆందోళన, ఆతృత తాండవమాడుతున్నాయి. జడ్జిగారు మళ్ళీ ఏం ప్రకటన చేస్తారోనని ఉత్సుకతతో చూస్తున్నారు కొందరు. 9

శారదా అశోకవర్ధన్‌

బోనులో నిల్చున్న ఫణికుమార్‌ ముఖం పాలిపోయింది. కళ్ళు లోతుకు లాక్కుపోయి, గడ్డం బాగా పెరిగిపోయి, జుట్టు రేగిపోయి పిచ్చివాడిలా ఉన్నాడు. మనిషి ఆందోళనతో నిలువెల్లా వణికిపోతున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడో, ప్రాణాల మీది తీపివల్ల ఆవేదనతో రగిలిపోతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు ఫణికుమార్‌.

కాలేజి రోజుల్లో అందరినీ అమితంగా ఆకర్షించే 'హర్షిత'ను మనసారా (ప్రేమించాడు అతను. కానీ, తనతోనే కలిసి తిరుగుతూ ఉండే ఆనందమూర్తి హర్షిత (ప్రేమను సంపాదించి పెళ్ళి చేసుకున్నాడు. చదువులోనూ, (ప్రేమలోనూ, పెళ్ళిలోనూ తనకంటే పైచేయి అయిన ఆనందమూర్తి ఆ తరువాత డాక్టర్‌ వృత్తిలో కూడా తనను అధిగమించిపోయి తన మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితిని తెచ్చిపెట్టాడు. అలాంటప్పుడు - మరి అలాంటప్పుడు ఆనందమూర్తిని కడతేర్చాలి. కాదు... కాదు... కుమిలి, కృళించి అతి దయనీయంగా కుక్కచావు చచ్చేలా చేయాలి. అందుకే హర్షిత మరణిస్తే ఆనందమూర్తి పిచ్చివాడు కావడం ఖాయం. ఆ ప్లాన్‌తోనే హర్షితని అతి దారుణంగా హింసించి చంపాడు. హర్షిత చావుని తల్బుకొనేసరికి ఫణికుమార్‌కి ఒళ్ళు గగుర్పొడిచింది.

హర్షిత అంత కిరాతకంగా బాధించి హత్య చేసిన క్షణాలలో తనలోని మానవత్వం ఏమైంది? ఏ మూలకు వెళ్ళి దాక్కుంది? తన మనుసులో ప్రేమ మందిరాన్ని నిర్మించుకొని, హర్షితని అందులో ఊహించుకొని ఆరాధించి చివరికి ఎలా హత్య చేయగలిగాడు?

జడ్డిగారి గొంతు ఖంగుమంది.

ఫణికుమార్‌ ఆలోచనల్లోంచి బైటపడి అటువైపు చూశాడు.

కోర్టుహాలులోని అందరి దృష్టి జడ్జిగారు చెప్పబోయే మాటల మీదే లగ్నమై ఉంది.

“డాక్టర్‌ ఫణికుమార్‌ హర్షిత అనే స్రీని ఆతి దారుణంగా హత్య చేసినట్టు

10

వెన్నెల వేట సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. మానవత్వాన్ని మంటగలిపి సభ్య సమాజమంతా ఆవేదన చెంది, అతని పట్ట విపరీతమైన వ్యతిరేక భావం (ప్రదర్శించే తీరులో ఆ హత్య చేయటాన్ని ఎంతో తీవ్రమైన విషయంగా కోర్టు పరిగణిస్తున్నది.

ఫణికుమార్‌ చేసిన హత్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, డాక్టర్‌ ఫణికుమార్‌కు కోర్టు ఉరి శిక్షను విధిస్తున్నది.”

ఈసారి కోర్టు హాలులో కేరింతలతో పాటు నిరసన నినాదాలు చెలరేగాయి!

జడ్జిగారికి ఏమీ అర్ధం కాలేదు.

హాలంతా కలియజూశారు.

“ఫణికుమార్‌ని ఎప్పుడో ఉరితీయటం కాదు. వెంటనే మా అందరి ముందు ఉరితీయాలి. ఇప్పుడే ఉరి తీయాలి”

“ఆర్షర్‌! ఆర్హర్‌!”

అయినా హాలులో సద్దుమణగలేదు. ఇంకా గొడవ గొడవగానే ఉంది. కోర్టు ఆవరణలో మళ్ళీ అల్లరి మొదలైంది.

“ఆ కిరాతకుణ్ణి పబ్లిక్‌ హ్యాంగింగ్‌ చేయాలి.”

“మా అందరి కళ్ళముందు ఉరి తీయాలి.”

“అలా చేయకపోతే మూక ఉమ్మడి ఆత్మాహుతికి పాల్పడుతాం.” ఆవేశపూరితమైన నినాదాలతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. అప్పటికే పది మంది స్రీలు, పురుషులు ఒంటిమీద కిరోసిన్‌ గుమ్మరించుకున్నారు.

ఒంటికి నిషంటించుకోవటానికి సిద్ధమయ్యారు.

పోలీసుల వల్ల సెరిస్టీతి అదుపులోకి రాలేదు. (ప్రజలు లాఠీఛార్జిని లెక్క చెయ్యటం లేదు.

పోలీసులు నిర్మించిన వలయాన్ని ఛేదించుకొని కోర్టులోకి జొరబడటానికి

[గ

శారదా అకోకవర్ధన్‌ ముందుకు దూసుకువస్తున్నారు. పరిస్థితి విషమించింది. మరుక్షణంలో స్టేట్‌ సాయుధ దళం (ఎన్‌.ఎ.ఆర్‌.) దళం దిగింది. లాకీలోంచి కిందికి దూకి జనంలోకి దూసుకువెళ్ళారు పోలీసులు. చేతికి దొరికిన వారిని లాఠీలతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. అందర్నీ కంట్రోల్‌ చేయటం కష్టసాధ్యమని అర్ధమయింది. వారిని భయభ్రాంతులను చేస్తేగాని, (ప్రాణాల మీద భీతి కలిగేలా చేస్తేగాని వారు మాట వినరని అనిపించింది. మెజిథ్టేట్‌ నుంచి ఫైరింగ్‌ ఆర్హర్స్‌ వచ్చాయి. గాలిలోకి కాల్పులు జరిపారు! అల్లకల్లోలంగా జనం పరుగెత్తసాగారు. అదెంతసేపు! ఒక్క సముషంలో మళ్ళీ ధైర్యం కూడగట్టుకున్నారు. జనం ఎదురు తిరిగారు. ఆత్మాహుతికి సిద్ధపడిన వారికి ఫైరింగ్‌ అంటే భయమెందుకు ఉంటుంది? “ఫణికుమార్‌ని అందరి సమక్షంలో ఉరి తీయాలి!” “ఆ కర్కోటకుణ్ణి పబ్లిక్‌ హ్యాంగింగ్‌ చేయాలి” “శిక్షాస్టృతిని తిరగరాయాలి!” “ఇలాంటి రాక్షసుల్ని బతకనీయకూడదు.” జనం ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహిస్తోంది. ఎన్‌.ఎ.ఆర్‌: దళాన్ని తప్పించుకొని కోర్టులోకి (ప్రవేశించటానికి పరుగులు 12

వెన్నెల వేట తీస్తున్నారు జనం!

సరిగ్గా అదే సమయానికి-

కోర్టులో న్యాయపీరంలో ఆశీసులై ఉన్న జడ్జి గంభీరంగా అందరినీ పరికించి చూశారు.

బయటి పరిస్థితి ఆయనకి అర్థమయింది. ఆవేశంతో రెచ్చిపోతున్న వారిని శాంతింప చేయటానికి ఒక్కటే మార్గం!

అత్మాహుతులతో, కాల్పుల వల్ల అనేక ప్రాణాలు బలికాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం!

అఆ నమయుంలో (వ్రజల ఉ(ద్రేకానికి న్యాయస్థానం గౌరవం మంటగలిసిపోకుండా నిలపాలంటే ఒక్కటే మార్గం!

పబ్లిక్‌ హ్యాంగింగ్‌!!

ఫణికుమార్‌కి ప్రజా సమూహం ముందు ఉరిశిక్ష విధించటమే!

ఆలస్యం చేస్తే పరిస్థితి చెయ్యిదాటిపోతుంది.

మరుక్షణం జడ్జి ఒక నిర్ణయం తీసుకున్నారు.

“ఆర్డర్‌! ఆర్షర్‌!”

ఆ హెచ్చరికతో సద్దు మణిగింది.

“ప్రజావెల్టువ ఎంతో శక్తివంతమైంది. ఆ ప్రజల్లో ఫణికుమార్‌ తను చేసిన హత్య మూలంగా ఎలాంటి ముద్ర వేసుకున్నాడో అర్ధం అవుతోంది. వారి ఆవేశాన్ని అర్థం చేసుకున్నాను. ఆ ఆవేశంలో వారు తమ (ప్రాణాలు బలిదానం చేయడానికీ కూడా వెనుకాడకుండా ఉ(ద్రేకంతో ఉరకలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్తితిలో అనేకమంది ప్రాణాలకి ముప్పువాటిల్లే ప్రమాదాన్ని తప్పించటానికి తప్పనిసరి పరిస్థితుల్లో నేనొక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది.

“భారతీయ శిక్షా స్మృతిలో పబ్లిక్‌ హ్యాంగింగ్‌ లేకపోయినా, "కోడ్‌ ఆఫ్‌

శం

శారదా ఆశోకవర్ధన్‌

ఎథిక్స్‌' పాటించాల్సిన ఒక నాగరికుడైన వైద్యుడు అనాగరికంగా ప్రవర్తించటంతో పాటు నరరూప రాక్షసుడిలా ఒక స్త్రీని అతి కిరాతకంగా హత్య చేయటాన్ని మానవ మా్రులెవ్వరూ క్షమించరు. ప్రజాభీష్టం మేరకు నేను సాహసం చేసి చారిత్రాత్మకమైన తీర్పుని ఇస్తున్నాను. ఫణికుమార్‌ని ప్రజా సమూహం ముందు ఉరి తీయటానికి అదేశిస్తున్నాను. పబ్లిక్‌ హ్యాంగింగ్‌ చేసి శిక్ష అమలుపరచటం జరుగుతుంది.”

జడ్జిగారు లేచి నిలబడ్డారు.

కోర్టు హాలులో హర్షద్రానాలు మిన్నుముట్టాయి.

క్షణంలో ఈ వార్త బైటికి పరుగెత్తింది.

అంతా =

ఆనందోత్సాహాలతో (ప్రజావాహిని కేరింతలు కొడుతోంది.

“జడ్జిగారికి జై” అంటూ జయజయధ్వానాలు చేయసాగారు.

జడ్జిగారు భారంగా నిట్టూర్చి అక్కణ్టుంచి కదిలారు.

బోనులో నిలబడ్డ ఫణికుమార్‌ ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు.

ప్రేక్షకుల్లో కూర్చున్‌ వున్న ఆనందమూర్తి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళనుండి కన్నీటి బొట్టు జలజలా రాలాయి.

ఒక్కసారిగా గతం ఆతని కళ్ళ ముందు కదిలింది.

ప

వెన్నెల రాత్రి వెండి పౌడరు అద్దుకుంది.

ఆకాశపు కొలనులో విరిసిన వెండిపువ్వులా వెలిగిపోతున్నాడు చంద్రుడు.

మత్తును వెదజల్టుతున్నట్టున్న ఆ చల్లని వెన్నెల్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కబుర్జు చెప్పుకొంటున్నారు వాళ్ళిద్దరూ.

వాళ్ళు ప్రేమికులు కాదు.

14

వెన్నెల వేట (ప్రేమ సాగరంలో జలకాలాడుతున్న భార్యాభర్తలు. ఆనందమూర్తి - హర్షిత! అప్పుడు సరిగ్గా రాత్రి పది గంటల పది నిముషాలు అయింది... ఆనందమూర్తి పేరు పొందిన డాక్టర్‌. తనను నమ్ముకున్న మనుషుల్ని, తను నమ్ముకున్న వృత్తినీ ప్రేమించే మనిషి (ప్రేమించి పెళ్ళి చేసుకున్న హర్షితకు తన (ప్రేమను పంచి ఇచ్చే ఉత్తమ పురుషుడు. పేషంట్ల పాలిటి పెన్నిధి! తోటి డాక్టర్లకు ఆత్మీయుడు, మార్గదర్శి. డాక్టర్‌ ఆనందమూర్తి అంతకు ముందే డిస్పెన్సరీ నుంచి వచ్చి భోజనం చేసి, భార్యతో కబుర్లలో పడ్డాడు. అంతలో ఫోన్‌ మోగింది. ఆనందమూర్తి లేచి ఫోన్‌ దగ్గరికి వెళ్ళాడు. డిస్పెన్సరీ నుంచి ఫోన్‌! నైట్‌ డ్యూటీ నర్ఫ్‌ మాట్లాడింది. ఒక పేషంట్‌కి బ్రీతింగ్‌ ట్రబుల్‌ వచ్చి తలకిందులవుతున్నాడని చెప్పింది. ఏం చేయాలో ఫోన్‌లోనే ఇన్‌'స్టక్షన్స్‌ ఇచ్చి. అవసమైతే మళ్ళీ ఫోన్‌ చేయమని చెప్పి, రిసీవర్‌ పెట్టేసి హర్షిత దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. “డిస్పెన్సరీ నుంచి పిల్చగంట కూడా కాలేదు... అప్పుడే అక్కణ్టుంచి ఫోనా?” అంది హర్షిత. “తప్పదు. ఒక పేషెంట్‌ బ్రీతింగ్‌ ట్రబుల్‌ వల్ల అప్‌సెట్‌ అయ్యాడట. నైట్‌ డ్యూటీలో వున్న వాళ్ళు కంగారుపడి నాకుఫోన్‌ చేశారు” అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ. 15

శారదా ఆశోకవర్థన్‌

“మీరు ఒక పని చెయ్యండి!” అంది హర్షిత ఆనందమూర్తి నిచిరుకోపంతో చూస్తూ,

“రాణీగారు చెప్తే చేయకుండా ఉంటానా? ఏమిటో సెలవియ్యండి!” ఆన్నాడు ఆనందమూర్తి హర్షితను అనునయంగా దగ్గరికి లాక్కుంటూ.

“రాత్రిళ్ళు కూడా ఇంటికి రావటం ఎందుకు డిస్పెన్సరీలోనే కాపురం పెట్టేయండి” అంది హర్షిత.

“నువ్వు సరేననాలేగానీ నేను రెడీ!” అన్నాడు ఆనందమూర్తి.

“చాల్లే ఊరుకోండి. అందరి ఆరోగ్యాలు రక్షించటం కోసం మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్న విషయం మర్చిపోతున్నారు. అర్థరాత్రీ, అపరాత్రీ చూడకుండా పేషంటు దగ్గర్నుంచి ఫోనొస్తే చాలు, విష్ణుమూర్తి పెళ్ళాన్ని కూడా పట్టించుకోకుండా గజేంద్రుణ్ణి రక్షించటానికి పరుగెత్తినట్ట పరుగు పరుగున వెళ్తారు” ఆవేశంగా అంది హర్షిత.

“న్హావ్‌! స్టాప్‌! అమ్మాయిగారు ఆవేశానికి పుల్‌స్టాప్‌ పెట్టాలి. డాక్టరుగా వృత్తిధర్మం నేను నిర్వహిస్తున్నాను. నీకు మాత్రం నా మనసు తెలియదా! పిచ్చిదానా!” అన్నాడు ఆనందమూర్తి హర్షిత బుగ్గ మీద చిటికెవేస్తూ.

సిగ్గుమొగ్గలై అతని ఒళ్ళో ఒదిగిపోయింది హర్షిత.

మళ్ళీ ఫోన్‌ మోగింది.

హర్షిత భారంగా నిట్టూర్చింది.

“మళ్ళీ ఫోను. మోగి మోగి అదే ఊరుకుంటుంది. మీరు వెళ్ళకండి” ఆనందమూర్తిని గట్టిగా కౌగిలిరదుకొంది హర్షిత.

“ఉండు హర్ష! వెళ్ళనీ!” ఆమెను విడిపించుకొని లేచాడు ఆనందమూర్తి,

“నా ఖర్మ, మిమ్మల్ని కట్టుకోవడం నా బుద్ధి తక్కువతనం. డాక్టర్నీ, పోలీస్‌ ఆఫీసర్నీ కట్టుకున్న ఏ ఆడదీ సుఖపడదని మా అమ్మమ్మ చెప్తుండేది. అవన్నీ 16

వెన్నైల వేట అమ్మమ్మ కబుర్లని కొట్టిపారేసి మీ మోజులో పడి 'పెళ్ళాడాను. ఇప్పుడు అనుభవిస్తు న్నాను.” రోషంగా అంది హర్షిత. ఆనందమూర్తి తనలో తను నవ్వుకుంటూ వెళ్ళి ఫోనెత్తి “హల్లో!” అన్నాడు. అవతలి నుంచి ఫణికుమార్‌ కంఠం వినిపించింది. “ఆనందమూర్తీ! నువ్వు అర్జెంటుగా రావాలి. ఆలస్యం చెయ్యవద్దు!” అతని గొంతులో ఆందోళన ధ్వనించింది.

ఫణికుమార్‌, ఆనందమూర్తి స్నేహితులు.

ఇద్దరూ డాక్టర్లే!

ఇద్దరూ ఒకేసారి ప్రాక్టీసు ప్రారంభించారు.

ఫణికుమార్‌ ధనవంతులైన పేషంట్లకి ట్రీట్‌మెంట్‌ చేయడంలో ఆనందం పొందుతాడు.

“కలవారు క్షినిక్‌కి వస్తే, మన కష్టానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. నీలాగా దరిద్ర నారాయణులకు వైద్యం చేయటం మొదలెడితే ముందు మనం దరిద్రుల జ్ఞనాభాలో చేరిపోతాం” అని ఆనందమూర్తితో జోక్‌ చేస్తుంటాడు ఫణికుమార్‌.

ఆనందమూర్తి, ఫణికుమార్‌ బాల్యమిత్రులు. వైద్య వృత్తిమీద, వైద్యం మీద వారిద్దరి అభిప్రాయాల్లో తేడాలున్నా. - ఇద్దరూ ఆత్మీయులే!

ఇద్దరి ఇళ్ళు పక్కపక్క వీధుల్లోనే ఉన్నాయి. డిస్పెన్సరీలు మాత్రం చాలా దూరంలో ఉన్నాయి.

ఎప్పుడూ నిబ్బరంగా మాట్లాడుతూ, తొణకని కుండలా ఉండే ఫణికుమార్‌ అర్థరాత్రి సమయంలో ఆందోళనగా తనకు ఫోన్‌ చేయడం ఆనందమూర్తికి ఆళ్ళర్యం కలిగించింది. “ఫణీ! ఎక్కణ్నుంచి మాట్టాడుతున్నావ్‌?” అడిగాడు ఆనందమూర్తి ఫోన్‌లో. [17

శారదా ఆశోకవర్ధన్‌

“నా డిస్పెన్సరీ నుంచి”

“ఏమిటీ అర్జెంటు పని?”

“ఒక సీరియస్‌ కేసు. నాకు అంతుపట్టడం లేదు. నువ్వు వెంటనే ఇక్కడికి రా. వివరాలు ఇక్కడ చెప్తాను. ప్లీజ్‌!” (బ్రతిమాలుతున్నట్టు హడావుడిగా చెప్పాడు ఫణికుమార్‌.

“కంప్టయింట్‌ ఏమిటీ?” ఇంకా ఏదో అడగబోయాడు ఆనందమూర్తి,

“ఆనంద్‌! ముందు నువ్వు ఇక్కడికి రా. నీకే తెలుస్తుంది. ఆలస్యం చేస్తే పేషంట్‌'బ్రతకడు. ప్లీజ్‌” ఫణికుమార్‌ మాటల్లో భయం, వణుకు ధ్వనించాయి.

ఫోన్‌ పెట్టేసి వెనక్కి తిరిగాడు ఆనందమూర్తి.

హర్షిత దగ్గరికి వచ్చింది.

“ఫణికుమార్‌ దగ్గర్నుంచా?” అడిగింది.

“ఆ

“ఏమిటి విశేషం?”

*ఒక్ష 'పేషెంటుకి సీరియస్‌గా ఉందట. మన వాడికి కాల్ఫూ చేతులూ ఆడటం లేదు. నన్ను అర్జెంటుగా రమ్మన్నాడు” అన్నాడు.

“వైద్యం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకోమని నేను ఫణితో లక్షసార్జు చెప్పాను. వింటేగా. ప్రతిసారీ ఎవరికో ఒకరికి ప్రాణాల మీదికి ముప్పుతీసుకువచ్చి మీకు ఫోన్‌ చేయటం, ఆపద్బాంధవుడిలాగ మీరు పరుగున వెళ్ళి చక్రం అడ్డేయటం.... మామూలేగా!”

హర్షిత చెప్తూండగానే ఆనందమూర్తి (డ్రైన్‌ మార్చుకొని సీద్దమయ్యాడు.

“హర్షిత! నువ్వూ బైలుదేరు” అన్నాడు ఆనందమూర్తి.

“నేనెందుకు”

“నువ్వు డిస్పెన్సరీకి కాదు. నేను వెళ్తూ నిన్ను ఫణికుమార్‌ ఇంటి దగ్గర

18

శా వెన్నెల వేట దిగబెట్టి వెళ్తాను. పాపం లతిక ఒక్కర్తే ఉంటుంది. తోడుగా ఉందువుగాని, నువ్వూ ఒక్క దానివేం వుంటావ్‌. తిరిగి వచ్చేటప్పుడు నిన్ను పికప్‌ చేసుకుంటాను.”

“అలాగే” ఆంది హర్షిత.

“నేను షెడ్‌లోంచి కారు బైటికి తీస్తాను. నువ్వు త్వరగా కిందికి రా! “బ్యూటీ కంటెస్ట్‌కి వెళ్ళేంత హడావుడి ఇప్పుడేం చేసుకోనక్కర్లేదు!” అంటూ ఆనందమూర్తి గబగబా కిందికి మెట్టు దిగాడు.

మరో రెండు నిమిషాల్లో హర్షిత తయారై కారు దగ్గరికి వచ్చింది.

ఎ(ర్ర మారుతీకారు వెన్నల్లో బాణంలా ముందుకు న(ర్రున దూసుకుపోయింది.

పక్క వీధిలో ఫణికుమార్‌ ఇంటి దగ్గర హర్షితని దిగబెట్టాడు.

ఫణీకుమార్‌ భార్య లతికకు విషయం వివరించాడు.

నేనూ రావటం లేటు అవ్వొచ్చు. అందుకే ఒకరికొకరు తోడుగా ఉంటారని హర్షితని తీసుకొచ్చాను. తిరిగివెళ్ళేటప్పుడు హర్షితని పీకప్‌ చేసుకుంటాను” అని చెప్పి కారు ముందుకి పరుగెత్తించాడు ఆనందమూర్తి. ఆనందమూర్తి కారు బంజారా హీల్స్‌లో రోడ్‌ మీద మెలికలు తిరుగుతూ వెళ్లి ఫణి క్లినిక్‌ ముందు ఆగింది.

కారు ఆగగానే అప్పటివరకు వరండాలో కాలు కాలిన పిల్లిలా పచార్జు చేస్తున్న ఫణికుమార్‌ పరుగున కారు దగ్గరికొచ్చి డోర్‌ తెరిచాడు.

ఆనందమూర్తి కారు దిగగానే ఒక్కసారిగా అతన్ని కావులించుకున్నాడు ఫణికుమార్‌.

“థాంక్యూ ఆనంద్‌! చాలా టెన్టన్‌గా నీకోసమే ఎదురుచూస్తున్నాను.

త్వరగా లోపలికి పద!” ఆంటూ తొందరచేసి, పరుగులాంటి నడకతో

19

శారదా అశోకవర్ధన్‌ లోపలికి దారితీశాడు ఫణికుమార్‌.

ఇద్దరూ ఇనొపీషంట్స్‌ ఉండేవైపు వెళ్ళారు. ఒక్కో రూమ్‌లో ఒక్కో పేషంట్‌ ఉన్నారు.

తిన్నగామూడో నెంబర్‌ రూమ్‌లోకి ఆనందమూర్తిని తీసుకెళ్ళాడు ఫణి.

అక్కడ శీద్దరు నర్సులు, కాంపౌండర్‌ ఉన్నారు.

వారు ఏం చేయాలో తెలీని అయోమయంలో ఉన్నారు.

బెడ్‌మిద యాభై ఏళ్ళ వయసున్న పేషంట్‌ ఉన్నాడు.

అతను ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాడు. అతను ఎగిరిపడకుండా నర్సులు, కాంపౌండరు అణచి పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నార్డు పేషంట్‌ తాలూకు బంధువులు కొందరు రూమ్‌లోను, మరికొందరు బయట నిలబడి వున్నారు.

వాళ్ళ ముఖాల్లో ఆందోళన, భయం, దిగులు - ఒకటి తర్వాత ఒకటి మారుతున్నాయి.

ఆనందమూర్తి పేషంట్‌ బెడ్‌ దగ్గరికెళ్ళి చెయ్యిపట్టుకుని 'పల్స్‌' చూశాడు.

స్టెత్‌ను అతని గుండెలమీద పెట్టి పరీక్షించాడు.

“ఆస్త్మా పేషంటా?” అడిగాడు ఆనందమూర్తి.

అవునన్నట్టు తలాడించి, కేస్‌ షీట్‌ని ఆనందమూర్తికి అందించాడు ఫణికుమార్‌. "

గబగబా దాన్ని తిరగేశాడు ఆనందమూర్తి.

ఉీషంట్‌కి వాడిన మందుల వివరాలు పరిశీలించాడు.

ఒక్కసారిగా ఫణికుమార్‌ ముఖంలోకి చివాల్న చూశాడు.

ఏమిటన్నట్టు కంగారుగా చూశాడు ఫణికుమార్‌.

“ఈ టాబ్లెట్స్‌ ఎందుకు వాడావు ఫణీ? వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తున్నాయని

20

వెన్నెల వేట ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వారు ఈ కంపెనీ మెడిసన్స్‌ అన్నీ లాస్టియర్‌ బ్యాన్‌ చేస్తూ సర్క్యులర్‌ పంపారు. గుర్తులేదా?” నిశితంగా ఫణి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు ఆనందమూర్తి.

ఆ చూపులకి ఫణికుమార్‌ తట్టుకోలేకపోయాడు. మారు మాట్లాడకుండా తల దించుకున్నాడు.

ఈ మందువల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మెడికల్‌ మేగజైన్స్‌లో ఆ కేసులక్రి వివరాలు ఆర్నెల్ల కిందట పబ్లిష్‌ చేశారు. ఇవన్నీ నీకు తెలియవని నేననుకోను. తెలిసి తెలిసీ ఈ మందులు వాడావంటే నిర్లక్ష్యం అని అనుకోవాలి. లేకపోతే శాంపిల్స్‌గా వచ్చిన టాబ్లెట్స్‌ వాడితే నష్టమేమిటనే కక్కుర్తితో ప్రవర్తించి వుంటావు.”

ఫణికుమార్‌ని మెత్తగా చివాట్లేస్తూనే బీరువాలోంచి ఒక ఇంజక్షన్‌ బాటిల్‌ వెతికి తీసుకొని, సిరంజిలోకి మందు ఎక్కించాడు ఆనందమూర్తి.

గబగబా పేషంట్‌ దగ్గరికెళ్ళాడు. ఇంజక్షన్‌ ఇచ్చాడు.

పేషంట్‌ పట్ల ఎలాంటి జూగ్రత్తలు తీసుకోవాలో నర్స్‌లకు ఇన్‌'స్టక్షన్స్‌ ఇచ్చాడు.

సేషంట్‌ పెద్దకొడుకు ఆనందమూర్తి దగ్గరికి వచ్చాడు.

అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“డాక్టరుగారూ! మౌ ఫాదర్‌ పరిస్థితి ఎలా ఉంది?” అడిగాడు. ఆతని గొంతు బొంగురుపోయింది.

ఆనందమూర్తి అతని కళ్ళల్లోకి ఒకసారి చూశాడు. అతని భుజం మీద చెయ్యి వేసి తట్టాడు.

“ప్సీ ఫ్రాదర్‌కి ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకాసేపట్లో నార్మల్‌ స్టేజికి వచ్చేస్తారు. మీలేమీ కంగారుపడనక్కరలేదు. ఆయన్ని మాత్రం డిస్టర్బ్‌

21

శారదా ఆశోకవర్థన్‌ చేయ్యకండి!” ఆతనికి ధైర్యం చెప్పాడు ఆనందమూర్తి,

ఆనందమూర్తి వాష్‌ బేసిన్‌లో చేతులు కడుక్కున్నాడు. ఫణి అందించిన టవల్‌ తీసుకుని చేతులు తుడుచుకున్నాడు.

ఫణి కూర్చునే ఆఫీసు రూమ్‌లోకి నడిచారిద్దరూ.

ఆనందమూర్తి చైర్లో రిలాక్స్‌ అయ్యాడు. "

అతని కెదురుగా ఫణికుమార్‌ కూర్చున్నాడు.

“ఫణీ! తెలిసి తెలిసి రాంగ్‌ మెడిసిన్‌ వాడి పేషంట్స్‌ ప్రాణాలతో చెలగాటం ఆడటం అలవాటుయిపోయింది నీకు. ఇంతకు ముందు ఇలాగే ఒక పేషంట్‌కి ఒకదానికి ఇంకొకటిస్తే ఆతడు కళ్ళు తేలేసాడు. అప్పుడు కూడా నన్ను ఇలాగే కంగారుపెట్టి పిలిచావు. సరైన సమయానికి అతనికి ఆపరేషన్‌ చెయ్యబట్టి బతికిపోయాడు. లేకపొతే నీ పీకకి చిక్కులు చుట్టుకొనేవి” మందలింపుగా అన్నాడు ఆనందమూర్తి.

  • అయామ్‌ సారీ ఆనంద్‌! నీకు చాలా ట్రబులిచ్చాను” ప్రాధేయపూర్వకంగా అన్నాడు ఫణికుమార్‌.

“నాకు ట్రబులివ్వటం కాదు. నీ దగ్గరికొచ్చే పేషంట్ల ప్రాణాల్ని ట్రబుల్స్‌లో ఇరికిస్తున్నావు. నీకు తెలియకపోతే కనీసం-నాకు ఫోన్‌ చేసి సలహా అడగొచ్చు కదా! ఎవడి ప్రాణాల మీదకైనా ప్రమాదం వస్తేగానీ అవసరం రాదా? ఏ క్షణంలోనైనా నా కోపరేషన్‌ ఉంటుంది. నువ్వు మొహమాటపడనక్కరలేదు. ఏమంటావ్‌?” అన్నాడు ఆనందమూర్తి.

“థాంక్యూ ఆనంద్‌! నువ్వెప్పుడూ నాకు తోడుగా ఉంటావని నాకు తెలుసు. ఇలాంటి (క్రిటికల్‌ సిట్యుయేషన్స్‌లో ఎన్నిసార్లో నాకు హెల్ప్‌ చేశావు. , తాంక్యూ వెరీమచ్‌!” కృతజ్ఞతగా అన్నాడు ఫణికుమార్‌.

“మనలో మనకి ఫార్మాలిటీస్‌ ఏమిటిగానీ, మీ ఇంటిదగ్గర లతికకి తోడుగా

22

వెన్నెల వేట

హర్షితని వదిలివచ్చాను. వెళ్ళేటవ్పుడు పికప్‌ చేసుకోవాలి. పద ఇంటికి వెళ్ళాం” అన్నాడు ఆనందమూర్తి.

ఫణికుమార్‌ కళ్ళు చెమ్మగిల్లాయి.

“ఆనంద్‌! నీ రుణం ఎలా తీర్చుకోగలను” అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు.

“సెంటిమెంటల్‌ పూల్‌! పద వెళ్టాం!” అటూ కదిలాడు ఆనందమూర్తి.

అంతలో,

ఆ గది (స్పింగ్‌డోర్స్‌ తెరుచుకొని ఒక వ్యక్తి లోపలికొచ్చాడు.

అతను ఆ పేషంట్‌ పెద్దకొడుకు!

అతని చేతిలోని కత్తి తళుక్కున మెరిసింది.

అది చూసి ఫణికుమార్‌ కంగారుపడ్డాడు.

బెదురుగా ఒకడుగు వెనక్కివేసి ఆనందమూర్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆతను విసురుగా ఆనందమూర్తి దగ్గరికొచ్చి, తన చేతిలోని కత్తిని ఆయన పాదాల దగ్గరుంచి: శిండు చేతులెత్తి దబ్ఞం పెట్టాడు.

“డాక్టర్‌ గారూ! నేను హంతకుణ్ణీ కాకుండా నన్ను కాపాడారు” అంటూ వెక్కి వెక్కి ఏడవసాగొడు.

ఆనందమూర్తి అతేనికి ధైర్యం చెప్తున్నట్టుగా వీపుమీద తట్టాడు.

ఫణికుమార్‌కే అంతా అయోమయంగా ఉంది.

ఆనందమూర్తి లేకపోతే వాడు ఆ కత్తితో తనని పొడిచి చంపేసేవాడేమో! “అతని తండ్రికి ఆర్నిట్టగౌ అస్మాకి వైద్యం చేస్తున్నాడు. ఫీజు పేరుతో వేలాది రూపాయలు అతని దగ్గర్నుంచి రాబట్టుకున్నాడు. పేషంటు ఆరోగ్యంలో ఆణువంత జైవలవ్‌మెంట్‌. కూడా కనిపించలేదు. బంగారుబాతుని వదులుకోవటం ఎందుకని తను కూడా మొక్కుబడి వైద్యం చేశాడు. అది

23

శారదా అశోకవర్థన్‌ వీడీకి అర్ధమయిపోయి నన్ను చంపి పాతేయడానికి వచ్చి ఉంటాడు." ఇలారకర్షకాల ఆలోచనలతో ఫణికుమార్‌ బుర్ర మొద్దుబారిపోయింది. ఆనందమూర్తి తన కాళ్ళ దగ్గరున్న కత్తిని తీసి, ఆ వ్యక్తి చేతికి అందించాడు. “మీకేమంటున్నారో నాకు అర్హం కాలేదు. స్పష్టంగా చెప్పండి. మీకెలాంటి సాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను!” అని అతనికి హామీ ఇచ్చాడు ఆనందమూర్తి.

“డాక్టర్‌ గారూ! మా నాన్నగారు రెండేళ్ళుగా ఆస్మ్మాతో బాధపడుతున్నారు. ఎన్ని రకాల వైద్యాలు చేయించినా ఫలితం కనిపించలేదు. ఆర్నెల్టుగా ఫణికుమార్‌ గారు వైద్యం చేస్తున్నారు. తగ్గుతున్నట్టు తగ్గి మళ్ళీ మొదటి స్థితికే వస్తోంది.

“ఆ ఆయాసం, బాధ భరించలేక మా నాన్న రెండుసార్లు ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ రెడుసార్లూ నేను గమనించి అలా జరగకుండా ఆపగలిగాను. కానీ, ఈ రెండు మూడు రోజులుగా ఆయన పడుతున్న నరకయాతన చూస్తే నాకే గుండెలు తరుక్కుపోయాయి. ఆయన పడే హింస శత్రువుకి కూడా రాకూడదని అనిపించింది. మేమంతా మా

ప్రాణాల కంటే అధికంగా ప్రేమించే మా తండ్రిగారిని ఆ నరకం నుంచి విముక్తి చేయడానికి ఆయన్ని పొడిచి చంపేద్దామనుకున్నాను.

ఆ హత్య అస్తికోసమో, మరే లాభం కోసమో ఆశించిమాత్రం కాదు. ఆవసాన దశలో కూడా ఆయన ఇలాంటి గుండెలు పిండేసే బాధని ఎదుర్కోవడం నేను చూసి తట్టుకోలేకపోయాను. 'మెర్సీ కిల్లింగొపేరుతో విదేశాల్లో డాక్టర్టు మానవతా దృకృధంతో ఇలాంటి నరకయాతన అనుభవించే వారి కష్టాలు గట్టెక్కించేందుకు ప్రాణాలు పోయేలా చేస్తున్నారని విన్నాను.నా తండ్రిని కూడా ఈ బాధనుంచి విముక్తి చేసేందుకు రిక్వెస్టు చేద్దామనుకున్నాను. కానీ, మన డాక్టర్లు అందుకు ఒప్పుకోరని నాకు తెలుసు, అందుకే ఆ పనేదో నేనే చేద్దామనుకున్నాను ఆవేశంలో, ఆవేదనలో తరువాత ఎదురయ్యే పరిస్థితుల్ని,

రై

వెన్నెల వేట

పరిణామాల్ని ఆలోచించలేదు. డాక్టర్‌ గారూ! ఇప్పుడు మా నాన్నగారు కళ్ళు తెరిచి చూస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఆయాసం తగ్గింది. మీరు వచ్చాక నాకు ధైర్యం చిక్కింది. మీ చేతి చలవతో నా తండ్రి బతుకుతాడనే నమ్మకం ఏర్పడింది. అందుకే మిమ్మల్ని రిక్పెన్ట్‌ చేస్తున్నాను. ఆయనకి మీరే ట్రీట్‌మెంట్‌ ఇవ్వండి. ఆయన్ని ఆరోగ్యవంతుల్లో చేయండి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్‌ డాక్టర్‌! నా మాట కాదనకండి!” ఆవేశంగా అతను చెప్పుకుపోతున్నాడు.

ఫణికుమార్‌ అవమానభారంతో, దిగులుగా తల దించుకు నిలబడ్డాడు.

ఆనందమూర్తి ఆవేశంగా మాట్లాడుతున్న ఆయువకుడి భుజం మీద చెయ్యి వేసి, ఆవేశపడవద్దన్నట్టు సైగ చేశాడు.

“చూడు మిస్టర్‌! ఏ డాక్టర్‌ అయినా తనను నమ్మి వచ్చిన పేషంట్‌ ఆరోగ్యాన్ని బాగుచేయడం కోసమే కృషి చేస్తాడు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని చివరి క్షణాల వరకు అతని ప్రాణం నిలబెట్టడానికే డాక్టర్‌ తపనపడతాడు. ఈ విషయంలో ఏ డాక్టర్‌ కేరక్టర్నీ సందేహించవలసిన అవసరం లేదు. మా ఫణికుమార్‌ కూడా మీ తండ్రిగారి జబ్బు బాగుచేయడానికి రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తూనే వున్నాడు. ఆతని ప్రయత్నలోపం ఏమీ లేదు. మీ తండ్రిగారి నరకయాతన చూపి నవ్వు ఆలోచించిన పద్దతి చూస్తే కొడుకుగా నువ్వెంత (శ్రేమిస్తున్నానో అర్ధం అవుతోంది. అంతే కానీ, ఆ తరువాత నువ్వు, న్టీ కుటుంబం ఎదుర్కొనే సమస్యల్ని గురించి నువ్వు ఆలోచించలేకపోయావు. ఏమైతేనేం! ఏ ప్రమాదం, అఘాయిత్యం జరగనందుకు నేను సంతోషిస్తున్నాను.

మీ తండ్రిగారికి ఇక ఎలాంటి ప్రమాదం ఉండదు. నేనూ, డాక్టర్‌ ఫణికుమార్‌ చర్చించుకొని ఆయనకి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తాము. నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. ఇక మీరంతా వెళ్ళి రెస్ట్‌ తీసుకోండి” అన్నాడు ఆనందమూర్తి.

25

శారదా అకోకవర్హన్‌

“థాంక్యూ సార్‌! వస్తాను!” అంటూ డోర్‌ తెరుచుకొని గబగబా వెళ్ళిపోయాడు ఆ యువకుడు.

అప్పటివరకు స్థాణువులా నిలబడిపోయిన ఫణికుమార్‌లో చలనం లేదు.

ఆనందమూర్తి అతన్ని పట్టుకొని గట్టిగా కుదిపాడు.

“ఫణీ! అడవిలో ముని శాపానికి గురైన రాజకుమారుడిలా శిలా విగ్రహంలా చలనం లేకుండా నిలబడిపోయావేమిటి?” అన్నాడు నవ్వుతూ.

ఫణికుమార్‌ లేని నవ్వును ముఖం మీదికి తెచ్చుకొంటూ "వాడు వెళ్ళిపోయాడా! ఆ కత్తితో నన్ను పొడిచి చంపటానికి వచ్చాడని భయపడ్డాను”

అన్నాడు.

“నవ్వు చేసిన పనికి అతను అంతపనీ చేసినా తప్పులేదు. ఫణీ! ఎప్పుడూ డబ్బే ప్రధానమని అనుకొని వైద్యం చేయకూడదు. రోగి ఆరోగ్యం తరువాతే మిగతా విషయాలు. డాక్టర్‌గానీ, లాయరుగానీ ఏ చిన్న పొరపాటు చేసినా కొన్నికుటుంబాలే కూలిపోతాయి. జీవితాలు నాశనం అయిపోతాయి. 'డబ్బు' అనే పదార్థాన్ని నీ దారికి అడ్డు రానివ్వకు. ఎదుటివారినీ, వారి ప్రాణాలనూ (ప్రేమించు. అప్పుడే నీవృత్తికి నువ్వు న్యాయం చేయగలుగుతావు" అన్నాడు అనందమూర్తి నవ్వుతూ. ఫణికుమార్‌ చిన్నబుచ్చుకున్నాడు. “ఆనంద్‌! నేనిప్పుడు చేసిన తప్పేమిటి? పేషంట్ల విషయంలో నేనెప్పుడూ నిర్లక్ష్య వైఖరిని చూపలేదు. ఎంతో (శ్రద్ధతోనే వైద్యం చేస్తున్నాను. ఈ ఒక్క కేసులోనే అనుకోని పొరపాటు జరిగి రాంగ్‌ మెడిసిన్స్‌ ఇవ్పటం జరిగింది” అన్నాడు ఫణికుమార్‌.

“మాడు ఫణి! ఆనుభవంతో పాఠాలు నేర్చుకొనేవారిని జ్ఞానులంటారు. ఇతరుల అనుభవంతో పాఠాలు నేర్చుకొనేవారు వివేకవంతులవుతారు. తమ అనుభవం నుంచిగానీ ఇతరుల ఆనుభవం నుంచి గానీ, ఏ పాఠమూ నేర్చుకోని వారు అజ్ఞానులవుతారు!” అన్నాడు ఆనందమూర్తి.

26

వెన్నెల వేట

ఆ మాటలు ఫణికుమార్‌కి సూటిగా తగిలాయి. తీక్షణంగా ఆనందమూర్తి ముఖంలోకి చూశాడు. అంతటితో ఆ (ప్రస్తావన ముగించటం మంచిదని భావించిన ఆనందమూర్తి -

“ఫణీ! చాలా ఆలస్యమయింది. ఇక ఇంటికి పోదాం పద!” అన్నాడు.

నైట్‌ డ్యూటీ స్టాఫ్‌కి ఇన్‌స్టక్షన్‌ ఇచ్చి ఫణి బైలుదేరాడు.

ఆనందమూర్తి కారుమీద ఇద్దరూ ఫణికుమార్‌ ఇంటికి చేరారు.

ఫణికుమార్‌ కారుని, (డైవర్‌ వాళ్ళ వెనకే ఫాలో అవుతూ తీసుకొనివచ్చి 'షెడ్‌లో పెట్టాడు. కారు శబ్దం విని లతిక హర్షిత బైటికి వచ్చారు.

ఆనందమూర్తి, ఫణి కారు దిగారు.

“థణీ! మేం వెళ్ళొస్తాం. హర్షితా.... కారెక్కు!” అన్నాడు ఆనందమూర్తి.

“భోజనం చేసి వెళ్ళండి ఆనంద్‌ గారూ!” అంది లతిక.

“ఇప్పుడు అర్ధరాత్రిదాటి ఒంటిగంటన్నర అయింది. ఇప్పుడేం భో జనాలు. మేము డిన్నర్‌ చేసేశాము. మరో రోజు ఎప్పుడైనా వచ్చి భోజనం చేస్తాంలే! అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.

“ఎప్పుడో ఎందుకు, ఎల్లుండి ఆదివారమే కదా! ఆరోజు మీకేమో ఎంగేజిమెంటు లేకపోతే మా ఇంటికి లంచ్‌కి వచ్చేయండి. అందరం కలిసి సరదాగా భోజనం చేద్దాం”! అన్నాడు ఫణికుమార్‌.

“ఓ యన్‌! ఆదివారం వస్తున్నాం, వెళ్ళొస్తాం” అంటూ కారెక్కాడు ఆనందమూర్తి. హర్షిత కూడా వాళ్ళిద్దరికీ చెప్పి కారెక్కి కూర్చుంది. కారు ముందుకి దూసుకుపోయింది! ఉన్నట్టుండి హర్షిత గావుకేక పెట్టింది. ఆనందమూర్తి నడన్‌ బ్రేక్‌ వేశాడు.

పెరిగిన గడ్డం, మాసిన బట్టలు, దుబ్బుగా వున్న జుట్టు, బలిష్టమైన శరీరం, దాదాపు నలభై ఆయిదేళ్తుంటాయి. ఒక్కసారిగా కారుకడ్డం వచ్చి ఇంచుమించు

27

శారదా అశోకవర్ధన్‌ కారు కింద పడ్డట్టే ఒక పది గజాల దూరంలో పడ్డాడు. అతడు కారుకింద పడి పోయాడనే ఫీలింగ్‌ హర్షితని ఊపేసింది. గజగజ ఒణికిపోతూ ఆనందమూర్తి భుజం మీద వొరిగిపోతూ గావుకేక పెట్టింది భయంతో. అంత చీకట్టోనూ అతనికడ్డంగా రావడం గమనించిన ఆనందమూర్తి సడన్‌ (బ్రేక్‌ వేశాడు. కీన్‌ మంటూ కారు శబ్దం చేసుకుంటూ, ఆగింది. ఆనందమూర్తి డోర్‌ తెరిచి దిగబోయాడు. భయంతో ఒణికిపోతూ నోట మాటరాక నాలిక పిడచకట్టుకు పోతుంటే, ఎలాగో గొంతు పెగల్చుకుని, రెండు చేతులతో ఆనందమూర్తిని కారు దిగకుండా పట్టుకుంది హర్షిత.

“పిర్రు కారు దిగకండి, వాణ్ణి చూస్తే నాకేదో రౌడిషీటర్‌లా అనిపించింది. పెద్ద గడ్డంవాడు. ఏ ఉద్దేశ్యంతో కారుకడ్డం వచ్చాడో తెలీదు. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. పదండి వెళ్లిపోదాం. కారు స్టార్ట్‌చేయండి, ప్లీడ్‌!” భయంతో, దుఃఖంతో గొంతు బొంగురుపోతూంటే ఎలాగో అంది హర్షిత.

“ఆనందమూర్తి ఆమె తల నిమురుతూ, భయం లేదన్నట్టుగా, భుజం మీద వాళ్చిన ఆమె తలని పైకెత్తి “డోంట్‌ వర్రీ...! అలా అన్నింటికీ భయపడితే ఎలా?” ఆంటూ హర్షిత వారిస్తున్నా వినకుండా కారు డోర్‌ తెరిచి, పాంటు జేబులో వున్న చిన్న టార్చ్‌లైట్‌ తీసి ఆన్‌ చేశాడు. టార్చిలైట్‌ వెలుతురులో అతడి మొహం స్పష్టంగా కనిపించింది. “ఆరె, సుదర్శన్‌ నువ్వా?” అంటూ ఒక్క ఉదుపులో కారు దిగి అతడి దగ్గరికెళ్ళాడు.

“ఇతడు మా వాచ్‌మెన్‌ సుదర్శన్‌” హర్షితకి చెప్పాడు. ఆతడు రెండు చేతులూ జోడించి ఆనందమూర్తికి నమస్కరిస్తూ, “సాబ్‌ ఉన్నట్టుండి గుండెలో నొప్పొచ్చింది. చెమటలు పట్టేశాయ్‌! ఇంట్లో ఎవరూ - లేరు, మా ఆవిడా పిల్లలూ మా ఆత్తగారింటికెళ్లారు. సైకిల్‌ తొక్కుదామని తిస్తే నా వల్ల కాలేదు. ఒక్క ఆటోగానీ, రిక్షాగానీ దొరకలేదు. అలాగే కొంత దూరం నడిచాక, ఒక ఆటో దొరికింది. మీ ఇంటికి వెళితే ఇల్లు తాళం వేసి ఉంది. 28

వెన్నెల వేట

బహుళ మీరు ఫణికుమార్‌ సాబ్‌ ఇంటికే వెళ్లుంటారని చెప్పి ఆటోని ఇటు రమ్మన్నాను..బైమయిపోయిందని, ఆటో ఇచ్చెయ్యాలని ఆటోవాడు రానన్నాడు. సరేనని వాడికి డబ్బిచ్చి పంపించేసి నడుచుకుంటూ ఇటొచ్చాను. నా అదృష్టం మీరు ఎదురుపడ్డారు. కాస్త ఆలస్యమైతే నేను మిమ్మల్ని ఇక్కడకూడా కలుసుకునేవాణ్ణై కాదేమో!” అంటూ మరి మాట్టాడలేక గుండెల మీద రెండుచేతులతో రాసుకుంటూ ఆనందమూర్తి కళ్ళల్లోకి చూశాడు. అప్పటికే ఆనందమూర్తి అతడి పల్స్‌ చూశాడు. మెల్లగా లేవనెత్తి, కారు వెనుక డోర్‌ తెరిచాడు.

ఈ సంభాషణంతా కారులో కూర్చునే వింటున్న హర్షిత రిలీఫ్‌గా నిట్టూర్చింది. 'రౌడీషీటరో, దొంగో కాదు, పాపం ఎవరో పేషంటు' అన్ననమ్మకం ఆమెలో కలిగి, కారు డోరు తెరవటంలో తనూ ఆనందమూర్తికి సాయపడింది.

కారు శరవేగంతో నడుపుతున్నాడు ఆనందమూ్తి. అతని మనసులోని ఆందోళనని పసిగట్టింది హర్షిత. “మెల్లగా వెళ్లండి. తొందరపడొద్దు” అంది మెల్లగా చెవిలో చెబుతూన్నట్టుగా అతని దగ్గరగా జరుగుతూ.

“డోంట్‌వగ్రీ హర్ష” అంటూ ధైర్యం చెప్పాడు ఆనందమూర్తి.

కారు డిస్పెన్సరీ వైపు కాకుండా మరో రూట్‌లో వెళ్లడం చూసి “డిస్పెన్సరీకి కాదా?” అడిగింది.

“కాదు. హాస్పటల్‌కి” అంటూ వేగంగా పోతూనే స్రమాధానమిచ్చాడు.

కారు రెడ్‌హీల్స్‌లోని “ప్రిన్సెస్‌ నిలోఫర్‌ వాస్పిటలో ఆవరణలో ఆగింది. నైట్‌ డ్యూటీ వాచ్‌మెన్‌ ఆనందమూర్తి కారు చూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“నమస్తే సాబ్‌, ఏమయింది” అంటూ, ॥

“బాలచందర్‌! వెనుక సీట్టో సుదర్శన్‌ వున్నాడు. మెల్లిగా ల తీసుకురా” అని చెప్పి తను కారు దిగాడు. హర్షితా! నువ్వూ దిగు ౯”

29

శారదా ఆశోకవర్హన్‌ కూర్చుందువు గాని నా రూమ్‌లో” అన్నాడు.

హర్షిత కారు దిగి అతని వెనకాలే వెళ్లింది. ఆనందమూర్తి నైట్‌ డ్యూటీ ఎమర్జన్సీ వార్డ్‌లో వున్న డాక్టర్‌ని కలిశాడు. అప్పుడే కాస్త కునుకుతీద్దామని స్టాఫ్‌ రూమ్‌లోకి వెళుతూన్న ఎమర్జెన్సీ వార్డ్‌ సిస్టర్‌, ఆవులించుకుంటూ వచ్చి “నమస్తే సార్‌” అంది.

“సిస్టర్‌! మన వాచ్‌మెన్‌ సుదర్శన్‌కి సివియర్‌ అటాక్‌ వచ్చింది. లక్కీఫెలో ఎలాగో నా దగ్గరకొచ్చాడు. ఐ.సిసి.యు.లో బెడ్‌ ఏర్పాటు చెయ్యండి” అన్నాడు.

డాక్టరూ, నర్ఫూ కంగారు కంగారుగా బెడ్‌ ఏర్పాటు చేశారు.

బాలచందర్‌ సుదర్శన్‌ని ఇంచుమించు ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్‌మిద పడుకోబెట్టాడు.

“డాక్టర్‌! కార్టెజాన్‌ ఇంజక్షన్‌ చెయ్యాలి” అన్నాడు ఆనందమూర్తి సుదర్శన్‌ పల్స్‌ చూస్తూ,

వెంటనే ఈ.సీ.జీ. ఏర్పాటు చేస్తోంది సిస్టర్‌, అవతలికెళ్ళి' దానికి సంబంధించిన వ్యక్తుల్ని లేపి తీసుకొచ్చి, డాక్టర్‌ రావు అలమారాలన్నీ చూశాడు. సిస్టర్ని పిలిచి అడిగాడు కార్టెజాన్‌ ఇంజక్షన్‌ ప్యాక్‌ ఎక్కడుందని.

“స్టాకు లేదు సార్‌. ఇండెంటు పెడదామంటే స్టోర్‌ కీపర్‌ రాలేదు. రేప్పాద్దున్నే తీసుకోవచ్చులే ఇప్పుడవసరం లేదు కదా అని ఊరుకున్నాను” అందినెమ్మదిగా సిస్టర్‌. డాణరావ్‌ ఆనందమూర్తికేసి చూస్తూ విషయం చెప్పాడు. ఆనందమూర్తి మొహం కోపంతో ఎర్రబడిపోయింది “ఎమర్జెన్సీ వాక్ట్‌లో ఎప్పుడు ఎవరికి ఏ మందు అవసరమొస్తుందో ఎవరికి తెలుసు? స్టాక్‌ వుంచుకోవద్దూ?” సిస్టర్ని కోప్పడ్డాడు ఆనందమూర్తి,

“బయటినుంచి తెప్పిద్దామా డాక్టర్‌?” అడిగాడు డాక్టర్‌ రావ్‌.

30

  • వెన్నెల వేట

“మెడికల్‌ షాపు ఎంత దూరంలో వుంది?”

“ఒక ఫర్హాంగ్‌ దూరంలో ఒక షాపుంది సార్‌. కానీ ఈ టైములో...” నసిగాడు డాక్టర్‌.

“షటప్‌.” విసుగూ, కోపం కలిపిన శృతిలో అరిచాడు ఆనందమూర్తి అసహనంగా.

నవ్వడం, నవ్వించడం, నవ్వుతూ పనిచేసుకోవడం తప్ప అతని కోపాన్ని చూడని ఆ నర్సుకీ, డాక్టరుకీ కూడా ఆశ్చర్యం వేసింది.

ఆనందమూర్తి మొహంలో ఆందోళన ఎక్కువైంది.

“సిస్టర్‌! స్టోర్సు తాళాలు ఎక్కడుంటాయి” అడిగాడు ఆనందమూర్తి ఆసహనంగా.

“ఇక్కడే డాక్టర్‌. కీ బోర్టులో క

“అయితే వెంటనే స్టోర్స్‌ తెరిచి, ఇంజక్షన్‌ పట్టుకురా...”

“డాక్టర్‌! ఇండెంటు లేకుండా... పైగా స్లోరు కీపర్‌. లేనస్టుడ్ధు నేను తాళాలు తీసి తేవడం, ఎగ్జైనిస్ట్‌ రూల్స్‌ డాక్టర్‌... నా మీద యాక్ష తీసుకోవచ్చు” భయంగా ఆంది నర్చ్ఫు.

“మీకేం ఫరవాలేదు. నేను సంతకం చేస్తాను ఇండెంట్‌ ఫారమ్‌ మీద, స్టోర్స్‌ డోర్‌ మీద నేనే తెరిచినట్టు కూడా సంతకం చేస్తాను. గో...సూన్‌..” అంటూ ఇంజక్టన్న్‌ కోనం రానీన ఇండెంటును నంతకం చేనీ మర్నాడు సూపరింటెండెంటుకి పంపించమని చెప్పి ఇచ్చాడు.

వాచ్‌మెన్‌ని కూడా తీసుకుని వెళ్లి స్టోర్సు తెరిచి ఇంజక్షన్‌ తెచ్చింది సిస్టర్‌. గబగబా ఇంజక్షన్‌ చేశాడు ఆనందమూర్తి. ఇంకేవో మందులు వేశాడు. నొప్పితో చుట్టుకుపోతూన్న సుదర్శన్‌ మెల్లగా రిలాక్స్‌ అయ్యాడు. పల్ప్‌ మానీటరింగ్‌ మెషీన్‌ పెట్టారు. ఆక్సిజన్‌ ట్యూబ్‌ పెట్టారు. మెల్లగౌ మత్తులో

పే

శారదా ఆశోకవర్ధన్‌ నిద్రలోకి జారుకున్నాడు.

“సిస్టర్‌! జాగ్రత్తగా చూసుకోండి. రేపటి ఉదయం వరకూ ఇంకే మందులూ అక్కర్లేదు. హీ.విల్‌...బి...ఆల్‌లైట్‌. ఒకవేళ నా అవసరం కావాలనుకుంటే, హెసిటేట్‌ చెయ్యకుండా ఫోన్‌ చెయ్యండి. బై... ” అంటూ బయలుదేరాడు ఆఅనందమూర్తి,

ఒక మామూలు చౌకీదారు కోసం, అర్హరాత్రీ అపరాత్రీ అని ఆలోచించకుండా వచ్చి, రూల్స్‌ని కూడా లక్ష్యపెట్టకుండా అతనికోసం అంత ఆతృతపడ్డ ఆనందమూర్తి, డాక్టర్‌ రావుగారి కళ్లకీ సిస్టర్‌ కళ్లకీ దేముడిలా కనిపించాడు. అతని వెనకాలే నడిచారు ఇద్దరూ డాక్టర్‌ రూమ్‌ దాకా!

అక్కడ కూర్చుని ఏదో మెడికల్‌ మాగజైన్‌ని తిరగేస్తూన్న హర్షితని చూసి “సారీ... హర్షితా ఆలస్యమైంది” అన్నాడు ఆనందమూర్తి,

“అతనెలా వున్నాడు?” అడిగింది హర్షిత.

“ఫరవాలేదు. అవుటాఫ్‌ డేంజర్‌. పద...” ఆంటూ కారువైపు నడిచాడు. డాక్టరు భార్యగా ఆమె చూపుతున్న స్పందనకి కూడా, డాక్టరు రావూ, సిస్టర్‌ సుజాతలు ముస్తులయ్యారు.

కారు కదిలేవరకూ వుండి, హర్షితకీ, డాక్టరు గారికీ నమస్కారాలు చెప్పి లోపలికెళ్లారు.

తలుపు తాళం తీసి లోపిలికెళుతున్న హర్షిత అప్పటికి గానీ గడియారం చూడలేదు. సరిగ్గా మూడు గంటలైంది. మరో గంటలో తెల్హారిపోతుంది. పాలవాడూ, పనిమనిషీ వచ్చేస్తారు. కనీసం రెండు మూడు గంటలైనా నిద్రపోకపోతే, మళ్లీ రేపు పొద్దుటే హాస్పిటల్‌, సాయంత్రం క్లినిక్‌ అలిసిపోతారు అనుకుంటూ లోపలికెళ్లి ఫ్రీజ్‌లోంచి పాలు తీసి వేడి చేసి తెచ్చి ఆనందమూర్తికి ఒక గ్లాసిచ్చి తనూ ఓ గ్లాసు తాగింది. ఆ తర్వాత బట్టలు మార్చుకుని,

32

వెన్నెల వేట నిద్రలోకిజారుకున్నారు.

దినకరుని వెచ్చని కిరణాల తాకిడికి మెల్లిగా కళ్లు తెరిచాడు ఆనందమూర్రి, కళ్ళు బరువుగా వున్నాయి. గడియారంవంక చూశాడు. ఎనిమిదీ పది నిమిషాలయింది. “హర్షితా” పిలిచాడు.

తలంటి పోసుకున్న జుట్టు ఆరబెట్టుకుంటూ, నారింజరంగు చీరలో, ఎర్రటి పొడుగాటి కుంకుమరేఖ నుదుటిపైన జ్యోతిలా వెలిగిపోతూ వుంటే హర్షిత అందం మరీ వన్నెకెక్కినట్టుంది. ఆనందమూర్తి దగ్గరికెళ్ళి తల నిమురుతూ, “బాగా నిద్రపోయారా?” అడిగింది.

“ఓ... తమరు పక్కన పడుకున్నాక నిద్రకేం లోటు? ఆ ఆనందం ఏ నిద్ర మాత్రకీ సరికాదు...” వవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు.

“ఆగండి. ఇంకా పూజకాలేదు. టిఫిన్‌ రెడీ కాలేదు” అంటూ అతని చేతుల్లోంచి తప్పించుకుంది.

“హర్డితా! నువ్వూ నేనూ ఒక్కసారే పడుకున్నాం కదా! మరి నీకు నీద్దరసరిపోయిందా? ట్రైముకెలా లేవగలిగావ్‌.”

“నాదేముందండి! నేనూరికే మీ పక్కన కూర్చున్నానంతే. మీరెంత టెన్షన్‌ పడ్డారని రాత్రి. అసలు ఫణికుమార్‌ ఫోనూ, ఆతని మాటలు నాకు తిక్క పుట్టిస్తే పాపం సుదర్శన్‌ అకస్మాత్తుగా ఇలా వచ్చిపడ్డాడు. అక్కడ ఫణికుమార్‌ 'సేషంటు ప్రాణాలు కాపాడారు. టెన్షనంతా మీదే. భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తిని ప్రసాదించాలి. ఆ ఆలోచనలతోనే ఆసలు ని(ద్రపట్టలేదు నాకు. ఆ బద్దకం పోవాలనే వేడి వేడి నీళ్ళతో తలంటి పోసుకున్నాను ఫ్రెష్‌గా వుంటుందని” అంది బోర్న్‌విటా కలపడానికి లోపలికి వెళుతూ.

అఆనందమూర్తి లేచి టూల్‌ట్రమ్‌ చేసుకుని ఆలాగే స్నానం కూడా ముగించుకుని వచ్చాడు.

33

శారదా అశోకవర్థన్‌ “హర్ష్మీ టిఫిన్‌ కూడా పెట్టేయ్‌..బైమయిపోయింది. అన్నట్టు రాత్రి ఆసుపత్రి నుంచి ఫోనేమీ రాలేదుకదా?” అడిగాడు. " అీదండీ. అయినా మీకు కంగారు దేనికి, ఒక్కసారి మీ చెయ్యి వాళ్ల ఒంటిమీద పడితే చాలు. జబ్బంతా పోయినట్టు. షీ హస్తవాసి అలాంటిది” అంది నవ్వుతూ. ఆమె (ప్రేమతో చెప్పే మాటలు తనకి ఎంత సేద దీరుస్తున్నాయో! వింజామరలు వీచినట్టుగా వున్నాయి ఆ పలుకులు. “హట్టి... మన పెళ్లయి ఎన్నాళ్ళయింది?” అడిగాడు నవ్వుతూ. “ఏమిటా ప్రశ్న? మీకు తెలీదా? రెండేళ్ళు.” అతడి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ చెప్పింది. “ఏమో! నాకింకా రెండ్రోజుల్జాగానే వుంది. అయినా ఇవాళ ఏమనిపిస్తోందో తెలుసా? “చప్పండి” “నాకు ఒక చిట్టీ హర్షిత కావాలని” “ఈ... హూల.. మరో ఏడాది తరువాత నాకు మరో బుచ్చి ఆనంద్‌ కావాలి.” “మరో ఏడాదే...” అన్నాడు ఇద్డీని సాంబారులో ముంచుతూ... “ఆహా.” అంది మరో ఇడ్జీ వేస్తూ, శ స స ఆసుపత్రి ఆవరణలో కారు పార్క్‌ చేసి సరాసరి సుదర్శన్‌ బెడ్‌ దగ్గరికెళ్ళాడు ఆనందమూర్తి, సుదర్శన్‌ నవ్వుతూ డాక్టరు గారికి రెండుచేతులూ జోడించి నమస్కరిస్తూ “డాక్టర్‌ సాబ్‌!.... నిన్న మిమ్మల్ని కలుసుకోలేకపోతే ఈపాటికి నా (ప్రాణాలు పోయుండేవి” అన్నాడు, కృజ్ణతనంతా కళ్లల్లోనే చూపిస్తూ. “ఛ! ప్రత

వెన్నెల వేట

అవేం మాటలు.” అంటూ కేన్‌షీట్‌ చూసి, పల్స్‌ చూసి, సిస్టర్‌కి చెప్పి ఏవో మందులు వెయ్యమని చెప్పాడు. అంతలోనే ఫోను మోగింది. సిస్టర్‌ ఫోనుతీసి “సార్‌... మిమ్మల్ని సూపరింటెండెంటు గారు పిలుస్తున్నారు” అంది.

వెంటనే ఆనందమూర్తి సూపరింటెండెంటు గదిలోకెళ్ళాడు. అప్పటికే డాక్టర్‌ రెడ్డి, వీరయ్య చౌదరి అందరూ అక్కడే వున్నారు. ఎప్పుడొచ్చాడో ఏమో ఫణికుమార్‌ కూడా అక్కడే వున్నాడు. డాక్టర్‌ సూర్యచంద్ర ఆనందమూర్తిని చూసి “డాక్టర్‌ ఆనంద్‌ రండి, గుడ్‌ మార్నింగ్‌! ప్లీజ్‌ టేక్‌ యువర్‌ సీట్‌” అన్నాడు ఎదురుగా వున్న కుర్చీ చూపిస్తూ,

“గృడ్స్‌ మార్నింగ్‌ డాక్టరొ' అంటూ కూర్చున్నాడు ఆనందమూర్తి,

“డాక్టర్‌ ఆనంద్‌! మీరు చాలా మంచివారు. చాలా సున్నితమైన మనసుగల వారు. పైగా మంచిడాక్టరు. అయితే ఉద్యోగంలో కొన్ని రూల్సున్నాయి. అవి.”

“నాకు తెలుసు డాక్టర్‌. మీరు చౌకీదారు సుదర్శన్‌ విషయంలో నేను చేసిన పనిని గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో 'కార్టిజానొ ఇంజక్షన్‌ ఇవ్వకపోతే అతని పరిస్థితి ప్రమాదకరంగా మారుండేది. అందుకే నేనే స్టోర్స్‌ తెరిపించి ఆ ఇంజక్షన్‌ చేయించాను. ఆ రాత్రి మీకు ఫోన్‌ చెయ్యడం ఎందుకులే, డిస్టర్చ్‌ చెయ్యడం తప్ప అని ఊరుకున్నాను. ఇప్పుడే వెళ్ళి సుదర్శన్‌ను చూశాను. మీదగ్గరికి వచ్చి చెబుదామనే లోపల మీరే ఫోన్‌ చేశారు.” అన్నాడు అనునయంగా.

“అదంతా నిజమే ఆనంద్‌. కానీ రూల్స్‌ని అధిగమించి మనం ఏమీ చెయ్యకూడదు.”

“డాక్టర్‌! మానవత్వం వున్న ఎవరైనా ప్రాణాపాయంలో వున్న పేషెంటుని ఎలా కాపొడాలో చూస్తాడు కానీ, రూల్స్‌ గురించి ఆలోచించడు.”

35

శారదా ఆశోకవర్హన్‌

“ఇంజక్షన్‌ తెప్పించవలసింది.”

"తెచ్చే లోపల ఆ రాత్రి ఏ ఘోరమైనా జరగొచ్చు.”

“ఆలా అని హాస్పిటల్‌ రూల్స్‌ని మనమే (బ్రేక్‌ చేస్తామా?”

“ఆవి మనం పెట్టుకున్న రూల్సే డాక్టర్‌”

“అవును. మనమే వాటని బ్రేక్‌ చేస్తే ఇతరులేం గౌరవిస్తారు?”

“రూల్స్‌ని బ్రేక్‌ చేస్తే సంజాయిషీ చెప్పుకోవచ్చు. మనిషి ప్రాణాలు పోతే ఏం సంజాయిషీ ఇస్తాం డాక్టర్‌?” ఆవేశంగా అన్నాడు ఆనందమూర్తి.

“వాడేదో పెద్ద వి.ఐ.ప. అయినట్టు, ఆందుకోసం విధిలేక రూల్స్‌ని బ్రేక్‌

చేస్తున్నట్బ మాట్టాడుతున్నారు మీరు” అన్నాడు హాప్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూర్యచంద్ర.

ఫణికుమార్‌ పకపకా నవ్వాడు.

డాక్టర్‌ రెడ్డి, డాక్టర్‌ వీరయ్య చౌదరి కూడా చిన్నగా నవ్వేర్ముఆనందమూర్తి రక్తం ఉడికిపోయింది. కోపం ఎరుపురంగు ధరించింది.

“ఐ యామ్‌ సారీ... టునో... వి.ఐ.పి.ల (ప్రాణాలు వేరు, మామూలు వాళ్ల ప్రాణాలు వేరూ అని నాకు తెలీదు. డబ్బుతో ప్రాణం విలువ పెరుగుతుందని నేను నేర్చుకున్న మెడికల్‌ కోర్సులో ఎక్కడా లేదు. నాకు తెలిసిందల్లా, "పేషంటుకి ఏ ప్రమాదమూ రాకుండా చూసుకోవడం, దట్స్‌ ఆల్‌!” అన్నాడు.

“అంటే అక్కడికి నువ్వొక్కడివే సిన్సియర్‌ డాక్టరువైనట్టు...”

“అని నేనెప్పుడూ ఎక్కడా ఎవరితోటీ అనలేదు.”

“డా? అనందమూర్తీ, మీరు చాలా ఆరగెంటుగా మాట్లాడుతున్నారు”

“నిజాన్ని ఆరగెంటుగానూ, వృత్తిని వ్యాపారంగానూ చిత్రించడం నాకు చేతకాదు.”

“మీరిష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు” అరిచాడు డాక్టర్‌ సూర్యచం(ద్ర.

36

వెన్నెల వేట వాతావరణం సీరియస్‌గా మారడం చూసి మిగిలిన డాక్టర్గందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డాక్టర్‌ ఫణికుమార్‌ కూడా వెళ్లిపోయాడు. మళ్ళీ కలుస్తానని సైగచేసి చెబుతూ.

“డాక్టర్‌ సూర్యచం(ద్రగారూ! నేను చేసింది తప్పుకాదు.”

“అని మీరంటే సరిపోదు. స్టోర్స్‌ లోంచి ఎన్నోమందుల్ని అర్హరా(్రిపూట డాక్టర్‌ ఆనందమూర్తి కాజేశారు అంటే మీ సంజాయిషీ ఏమిటి?”

“వ్యాట్‌? వైద్య వృత్తిలో వుండి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన డాక్టరుపైన ఇటువంటి నిందలా మోపడం? ఆన్యాయం.”

“ఏం? డాక్టర్లంతా మానవ సేవ చేస్తున్నారా? డబ్బు తీసుకోవడం లేదా? కొందరు ఎక్కువ తీసుకుంటారు. కొందరు తక్కువ తీసుకుంటారు. ఆది వాళ్ల ప్రతిభనిబట్టి వుంటుంది.”

“ఓ... డబ్బుతో ప్రతిభని కొలుస్తారన్నమాట...”

“వాదన నాకనవసరం డాక్టర్‌ ఆనందమూర్తీ, మీరు చేసిన పనికి క్షమాపణ కోరుతూ లెటర్‌ రాసివ్వండి. లేకపోతే...”

“ఆగండి. ఇప్పుడే రాసిస్తాను.” అని'బ్రిఫ్‌ కేసు తెరిచి దాన్గోంచి లెటర్‌ ప్యాడ్‌ తీసి గబగబా లెటర్‌ రాయడం పూర్తిచేసి “తీసుకోండి” ఆంటూ డాక్టర్‌ సూర్యచంద్ర కందించాడు.

లెటర్‌ చదివి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్‌ సూర్యచంద్ర. “ఏమిటిది?” అంటూ.

“శ్లియర్‌గానే వుంది. ఆది నా రాజీనామా లేఖ, నా మనస్సుని చంపుకుని, . నా వృత్తికి అన్యాయం చెయ్యలేను. ఇమడలేని చోట తప్పుకోవడం మంచిది. గుడ్‌టై...” అంటూ గబగబా అడుగులు బైటకు వేశాడు, డాక్టర్‌ సూర్యచంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా.

౩7

శారదా అశోకవర్థన్‌

కారు దగ్గర కనిపించారు సిస్టర్‌ సుజాతా, డాక్టర్‌ రావుగారూ.

“సా... సారీ... డాక్టర్‌...” అన్నాడు డాక్టర్‌ రావ్‌.

“డాక్టర్‌! మీలాంటి మంచివాళ్లు దగ్గర పనిచేసే అవకాశం పోగొట్టుకున్న మేము దురదృటష్టవంతులం” అంది సిస్టర్‌ సుజాత.

“ఏం ఫరవాలేదు. మీకెప్పుడు ఏం కావాలన్నా నా దగ్గరకు రావొచ్చు.” అన్నాడు.

అంతోలోనే ఈ వార్త ఆసుపత్రి అంతా పొక్కిపోయింది. వాచ్‌మెన్‌ మొయిన్‌ పరుగెత్తుకుంటూ వచ్చాడు 'సుదర్శన్‌ ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నాడని.' ఆనందమూర్తి ఒక్క అంగలో అక్కడికి చేరుకున్నాడు. “డాక్టర్‌ సాబ్‌! ఆంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించండి” అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ

“నో. నో! నీ వల్ల ఏం కాలేదు. నువ్వు రెస్టు తీసుకో. డాక్టర్‌ రావుగారి తోటీ, సిస్టర్‌ సుజాత తోటీ, అంతా మాట్లాడాను. నీకేం ఫరవాలేదు. డ్రిసా ర్డ్‌అయ్యాక

బై న్న గ

వొచ్చినా డిస్పెన్సరీలో కలువు” అన్నాడు.

/ “థాంక్యూ, నమస్కారం డాక్టర్‌ సాబ్‌ అన్నాడు మనసు నిండిన కృతజ్ఞతని మాటల్లోనే కురిపిస్తూ సుదర్శన్‌: అనందమూర్తి రాజీనామా ఎందరినో కదిలించింది,

“పేదల పాలిటి పెన్నిధి” “దేముడి లాంటి మనిషి" బా గా మ హస్తవాసో...” ఇలా పేషెంట్లు నర్ఫులూ, కొందరు డాక్టర్టూ వారది దర రెడ్డీ డాక్టర్‌ వీరయ్య చౌదరిలు, ప్రొఫెషనల్‌ జెలసీతో ఏడో -అం ఆనందమూర్తిని మెచ్చు 'నేవాదే” ఎంతో సంతోషించారు. ఛ్రన్మ్నావారే' ఆంటూ లోలోన న

వెన్నెల వేట

బాల్కనీలో వున్న పూలకుండీలకు నీళ్లు పోస్తూన్న హర్షిత కారు చప్పుడు విని, తలుపు గడియ తీసింది. 'ఏమిటి ఇలా వెంటనే వచ్చేశారు. ఒంట్లో బాగులేదేమో! రాత్రి భోజనం, నిద్రా రెండూ సరిగ్గా లేవు కదా!” అనుకుంటూ వెళ్లి తలుపుతీసింది.

ఆనందరావు మొహంలో తొణికిసలాడుతూన్న విచార రేఖల్ని గమనించింది.

పెళ్లయి రెండేళ్ళు పూర్తవుతున్నా ఆతణ్హిలా చూడలేదు.

“ఒంట్లో బాగులేదా?” అడిగింది.

“బాగానే ఉంది.”

“మరి?”

జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు ఆనందమూర్తి.

“ఫణికుమార్‌ ఎందుకొచ్చాడో అక్కడికి అర్ధం కాలేదు.” అంది హర్షిత.

“నాకూ అదే అర్ధం కాలేదు. వచ్చినవాడు ఊరుకోకుండా, డాక్టర్‌: సూర్యచంద్ర చెప్పే మాటలకి, అందరితోపాటు తానూ తందాన తానా అన్నాడు.”

బాధ అతని గొంతులో తొణికిసలాడింది. “ఫణికి మొదటినుంచీ మీరంటే జలసీయే. నేను ఎన్ని సార్టు చెప్పినా మీరు నమ్మేవారు కాదు. అతడికి డబ్బు తప్ప మరో ప్రపంచం లేదు. డబ్బు ముందు దేనికీ విలువలేదు. ఆతగాడిని, పాపం లతిక ఎలా భరిస్తోందో! చివరికి ఒక మామూలు చీర కొనుక్కోవాలన్నా అతగాడి పర్మిషన్‌ కావాలి. లతికని చూస్తే జాలేస్తుంది.”

“అవునా?” ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్‌.

“చివరికి పిల్లలు పుడితేకూడా ఎక్స్‌ట్రా ఖర్చులుంటాయని, పిల్లలు ఇప్పుడప్పుడే వద్దని ప్లాన్‌ చేస్తున్నాడట. పాపం లతికకి పిల్లలంటే చాలా ఇష్టం.”

“ఇడియట్‌!” అసహ్యంతో అన్నాడు.

అంతలోనే ఫోన్‌ మోగడంతో ఆనందమూర్తి వెళ్లి ఫోన్‌ తీశాడు.

39

శారదొ ఆశోకవర్ధన్‌ డాక్టర్‌ యాదవ్‌ హాస్పిటల్‌ నుంచి. జరిగినదానికి బాధపడుతూ ఏదో చెప్పాడు. “నాకేం ఫరవాలేదు. అదివరకు సాయం(త్రంపూటే నా క్లినిక్‌కి వెళ్లేవాణ్ణి, ఇప్పుడు ఉదయం కూడా వెళతాను. అంతా మనమంచికే” అన్నాడు. కాస్సేపు ఇద్దరూ మాట్లాడుకున్నాక ఫోన్‌ పెట్టేశాడు ఆనందమూర్తి. అతని మూడ్‌ మార్చే ఉద్దేశంతో “ఏమండీ చెన్‌ ఆడదామా?” అడిగింది హర్షిత. “రెడీ..."అన్నాడు ఆనందమూర్తి డ్రైన్‌ మార్చుకుని పైజామా లాల్చీ వేసుకుంటూ. వెంటనే బోర్లూ పావులూ తెచ్చింది హర్షిత. ఇద్దరూ ఆట మొదలెట్టారు. ఈ ఆటలో ఎప్పుడూ గెలుపు ఆనందమూర్తిదే. అటువంటిది ఈరోజు హర్షిత గెలిచింది. “వెరీగుడ్‌!” అన్నాడు ఆమె చెంపలు నిమురుతూ. “మీరు కావాలని ఓడిపోయినట్టన్నారు. లేకపోతే మీతో నేను గెలవడమేమిటి?” ఆంది నవ్వుతూ హర్షిత. “నేను బాగానే ఆడాను. అయితేనువ్వు చాలా బాగా ఆడావు.” అన్నాడు ఆనందమూర్తి ఆమె నడుం చుట్టూ చెయ్యేసి, మళ్ళీ ఫోను మోగింది. హర్షిత వెళ్లి ఫోన్‌ తీసింది. అది ఫణికుమార్‌ ఫోను. “వన్‌ మినిట్‌'అంటూ ఆనందమూర్తికి ఫోనిస్తూ “ఫణి” అంది. ఆనందమూర్తి రిసీవర్‌ తీసుకుని 'హల్లో' అన్నాడు. 40

వెన్నెల వేట

“ఆనంద్‌! నేను నిన్ను కలవాలని హాస్పిటల్‌కి వచ్చాను. అప్పుడే కారు దిగుతూ కనిపించాడు డాక్టర్‌ సూర్యచంద్ర. ఆతడితో మాట్లాడుతూ వెళ్లి అతని రూంలో కూర్చున్నాను. అంతే! అతడు నీకు ఫోన్‌ చెయ్యడం, నువ్వు రావడం అంతా జరిగిపోయింది. సారీరా... నువ్వు రాజీనామా చేస్తావను కోలేదు.”

“దీస్తే యేం?”

“నెల అయ్యేసరికి వచ్చే జీతం...”

“వటప్‌!... ఆమాత్రం సంపాదించుకోలేకపోలేను. పొద్దున్నపూట కూడా శేపటినుంచి క్షినిక్‌కి వెళ్తాను. నో 'ప్రాబ్బమ్‌”. అది సరే సండే మన ప్రోగ్రాం వుందా?” అడిగాడు మాట మారుస్తూ,

“ఉంది. అది చెప్తామనే ఫోన్‌చేశాను తప్పకుండా రావాలి. హర్షితకికూడా చెప్పు.”

శ ర ఆ

ఆదివారం ఫణికుమార్‌ ఇంట్లో సందడిగా వుంది. ఆనందమూర్తి, హర్షితా ఉదయమే వచ్చేశారు. అందరూ పిచ్చాపాటి కబుర్జు చెప్పుకుంటూ కూర్చున్నారు. లతిక, హర్షిత కలసి వంట పూర్తిచేశారు. నలుగురూ డైనింగ్‌ టేబిల్‌ దగ్గర కూర్చున్నారు భోజనాలకి. సరదాగా జోక్స్‌ చేసుకుంటూ, కబుర్హాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు.

“ఆరోజు మీరు మా ఆయనగారి ఆసుపత్రికెళ్ళి ఆస్త్మా "పేషంటు వాసుదేవరావు ప్రాణాలు నిలబెట్టి మీ మిత్రుడికి చాలా సాయం చేశారు ఆనందమూర్తిగారూ! మీ పుణ్యమా అని పేషెంటు బతికాడు. ఈయనకి చెడ్డపేరు రాకుండా మీరు సాయపడ్డారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు...” అంది లతిక. ఆనందమూర్తి చిరునవ్వు నవ్వాడు.

తే

శారదా ఆశోకవర్హన్‌

“క విషయాలన్నీ ఫణి చెప్పాడా?” అన్నాడు ఆనందమూంర్తి.

“ఆయనకి ఈ విషయాలన్నీ నాతో ముచ్చటించే తీరికకూడానా? నర్సింగొహోంలో విషయాలేమీ నాతో చెప్పరు. నిన్న ఆ పేషంటు పెద్దకొడుకు, మా ఇంటికొచ్చి మిమ్మల్ని కలవాలని మీ అడ్రస్‌ అడిగాడు. మిమ్మల్ని సాక్షాత్తూ దైవస్వరూపులుగా వర్షించాడు. మీ అడ్రసూ, ఫోన్‌ నెంబరూ ఇచ్చాను. అతను మీ దగ్గరికొచ్చి కలవొచ్చు” అంది లతిక.

“నిన్న వాసుదేవరావు పెద్ద కొడుకు మనింటికి వొచ్చాడా? మరి నాకు చెప్పలేదేం” అన్నాడు ఫణికుమార్‌ కొంచెం నొచ్చుకున్నట్టు చూస్తూ, “ఆతను వచ్చింది మీ గురించి కాదు. ఆనందమూర్తి గారి అడ్రసుకోసం అందుకే మీకు అతనొచ్చాడని చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు నాకు అనిపించలేదు అంది లతిక పరుషంగా.

ఫణికుమార్‌ మనసు చివుక్కుమంది.

“లతికా? ఏం మాట్టాడుతున్నావో నీకు తెలుసా? ఇతరుల ముందు నన్ను అవమానించాలనేగా ఇలా వాగుతున్నావ్‌?” కోపంతో అరిచాడు ఫణి.

పరిస్తితిని ఆవగాహన చేసుకున్నాడు ఆనందమూర్తి.

“ఫణీ! ఆవేశపడకు. ఇక్కడ బైటివాళ్ళు ఎవరున్నారనీ. లతిక ఏదో సరదాగా చెప్పింది. నువ్వలా ద్వేషపూరితంగా అరిస్తే ఎలా? ప్రేమించవలసిన దానిని ప్రేమించాలి. ద్వేషించవలసిన దానిని ద్వేషించాలి. ఈశెంటికీ వ్యత్యాసం తెలియాలంటే వివేకం ఉండాలి” అన్నాడు ఆనందమూర్తి,

“అదికాదు ఆనంద్‌. ఇప్పుడే కాదు. ఎప్పుడూ ఆమె ధోరణి ఇలాగే వుంటుంది. నన్ను చులకన చేసి మాట్లాడడం తనకి చాలా సరదా అయిన వ్యాసంగం. అందుకే ఆమె మాటలకి ఒళ్లు మండుతూ వుంటుంది” అన్నాడు

42

వెన్నెల వేట

“ఫణీ! ఎప్పుడూ కోపంతో విరుచుకుపడేవారు తమని తాము అనుక్షణం చంపుకుంటూన్నట్టు. డాక్టరువి అయివుండి ఈ విషయం నీకు తెలియక పోవడం దురదృష్టం. మనం నంతోషంగా జీవిన్తూ. ఎదుటివారిని

4 సంతోషపెట్టటమే ఉత్తమ జీవిత లక్ష్యం” అన్నాడు ఆనందమూర్తి.

“ఒడ్డున వున్నవాడివి, ఎన్ని నీతులైనా చెబుతావ్‌. అనుభవిస్తున్న వాడిని ఆ బాధ నాకు తెలుస్తుంది. నామీదగానీ, నా వృత్తిమోద గానీ లతికకు కొంచెం కూడా గౌరవం లేదు” అన్నాడు ఫణి.

“ఫణీ! అనవసరంగా లతికను అడిపోసుకోకు! నీ ప్రవర్తనే లతికను అలా తయారుచేసిందని ఎందుకు అనుకోవు? డబ్బు సంపాదనపట్ట నీకున్న ఆసక్తి "పేషంట్ల ఆరోగ్యం పట్ట వుండదు. ఈ విషయం అతికకీ, నాకే కాదు, మీ పేషంట్లందరికీ తెలుసు. అది నీ అభివృద్దికి గొడ్డలిపెట్టు అవుతుంది. ఈ విషయంలో నువ్వు జా(గ్రత్తపడకపోతే, ఎంతోకాలం ఈ ప్రొఫెషన్‌లో కంటిన్యూ కావడం కష్టం అవుతుంది.” అంది హర్షిత, లతికను సపోర్ట్‌ చేస్తూ. లతికను సపోర్టు చేసిందన్న బాధకన్నా తనని ఇన్‌సల్ట్‌ చేసిందన్న ఫీలింగు, ఫణికి మరింత కోపం తెప్పించింది. న

“ఫణీ! హర్షిత చెప్పినదాంట్లో నూటికి నూరుపాళ్ళూ నిజం వుంది. లతిక అయినా హర్షిత అయినా, నిన్ను విమర్శిస్తున్నారంటే వాళ్లకి నీమీద కోపం వుండి కాదు కదా! నీ మంచి కోసమే వాళ్లలా చెప్తున్నారు. అంచేత నీ ప్రవర్తన కొంచెం మార్చుకుంటే మంచిది. ఏమంటావ్‌?” అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.

“నిన్ను మా ఇంటికి సెలవు రోజున భోజనానికి పిలిచింది నీతో పాఠాలు చెప్పించుకోవటానికే కాబోలు. హాపీగా ఈరోజు గడుపుదాం అనుకుంటే, నా మూడ్‌ అంతా పాడుచేశారు మీరంతాకలిసి” అంటూ టేబుల్‌ దగ్గర్నుంచి లేచి విసురుగా వాష్‌బేసిన్‌ దగ్గరికెళ్లి చేతులు కడిగేసుకున్నాడు.

43

శారదా అశోకవర్ధన్‌

“అదేమిటండీ! భోజనం చెయ్యకుండానే చేతులు కడిగేసుకున్నారు?” కంగారుపడుతూ అడిగింది లతిక,

“మీ అందరి చీవాట్లతో నా కడుపు నిండిపోయింది. మీరు తినండి” అన్నాడు ఫణికుమార్‌ చేతులు తుడుచుకుంటూ.

“ఫణికుమార్‌ స్టూడెంటుగా వున్నప్పుడు ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ఏ మార్పూలేదు. ముక్కుమీద కోపం పోలేదు. లతిక ఫణి ముక్కుకి తాడేసి కడుతుందనుకున్నాను. కానీ చెయ్యలేకపోయింది” అంది హర్షిత ఉడుక్కుంటూన్న ఫణికుమార్‌ వైపు చూసి నవ్వుతూ. అయినా ఫణికుమార్‌ కోపం తగ్గలేదు. సీరియన్‌గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మిగిలిన వాళ్లంతా ముక్తసరిగా ఏదో తిన్నామంటే తిన్నామని భోజనాలు ముగించారు.

అంతలో ముందు తలుపుల దగ్గర బైట ఏదో చప్పుడైంది. ఫణికుమార్‌ అటు చూశాడు. మూసివున్న తలుపు అవతల ఎవరో నిలుచుని తలుపు సందులోంచి చూస్తూన్నట్టు సందేహం కలిగింది ఫణికుమార్‌కి.

“ఎవరక్కడ?” అరిచాడు.

ఆ ఆరుపువిని ఆ నీడ వేంగంగా కదిలింది. పరుగెడుతున్న అడుగల చప్పుడు వినిపించి, ఫణికుమార్‌ ఆలస్యం చేయకుండా, ఒక్క ఉరుకున డోర్‌ దగ్గరికెళ్ళి గభాల్న తెరిచాడు.

అదరూ ఫణికుమార్‌ వెనకాలే వెళ్ళారు ఆదుర్దాగా,

కాంపౌండు గోడ ఎక్కి అవతలికి జంప్‌ చేస్తున్న వ్యక్తిని చూసి ఫణికుమార్‌ ఆశ్చర్యపోయాడు.

కాంపౌండు గోడ అవతలికి జంప్‌ చేసిన వ్యక్తిని గురించి ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు ఫణికుమార్‌.

“ఆ వచ్చింది ఎవరు?” ఆడిగాడు ఆనందమూర్తి,

44

వెన్నెల వేట

“నా పేషెంటు వాసుదేవరావు పెద్దకొడుకు” అన్నాడు ఫణికుమార్‌._

“లోపలికి రమ్మనలేదే” అంది లతిక.

“అతను ఉంటేగా రమ్మనడానికి. నేను తలుపు తెరిచేసరికి పిట్టగోడ దూకి పారిపోయాడు.”

“పారిపోయాడా? అతనికి పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది? ధైర్యంగా మాట్టాడవచ్చుగా!” అంది హర్షిత. ఆనందమూర్తి ఆలోచిస్తూ కూర్చున్నాడు. “ఫణి! నువ్వు మరో విధంగా భావించకుండా వుంటానంటే నాకు తోచిన విషయం చెస్తాను” అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.

“నీ వి్షయంలో నేనుఎలాంటి ఆపోహపడను. నిరభ్యంతరంగా చెప్పొచ్చు” అన్నాడు ఫణికుమార్‌.

“నేను మొన్న వచ్చినప్పుడు, ఎంతో క్రిటికల్‌గా వున్న వాసుదేవరావుకి, నా చేతుల మీదుగా (ట్రీట్‌మెంట్‌ ఇచ్చేసరికి, ఆయనకి కొంత రిలీఫ్‌ ఇచ్చింది. దాన్లో అతని కొడుక్కి నామీద, నా హస్తవాసి మీద గురి కుదిరినట్టంది. నీ దగ్గర వైద్యం చేయించుకుంటూంటే, అర్నిల్లలోనూ కనిపించని మార్పు. ఆరగంటలో తన తండ్రిలో చూసుకున్నాడు. ఆందుకే తన తండ్రికి నన్ను వైద్యం చేసి ఆరోగ్యవంతుళణ్ణో చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నువ్వు లేని సమయంలో నీ ఇంటికొచ్చి లతిక దగ్గర నా ఆడ్రసూ, ఫోన్‌ నెంబరూ తీసుకున్నాడు. నన్ను కలుసుకుందామని మూ ఇంటికి ఫోన్‌ చేసి అడిగితే, మా పనిమనిషి మేము ఇక్కడికి వచ్చినట్టు చెప్పి వుంటుంది. అంచేత నన్ను ఇక్కడే కలుసుకుని మాట్లాడదామని వచ్చి ఉంటాడు” అన్నాడు.

ఫణికుమార్‌ మొహంలో కోపం, ద్వేషం, అసూయా పొంగుకొస్తున్నాయి. అయితే ఆవి కనబడనీయకుండా జా(గ్రత్తపడుతూ, “అయితే నిన్ను కలుసుకోకుండా ఎందుకు వెళ్లిపోయాడు?” అడిగాడు.

త్‌

శారదా అశోకవర్థన్‌ “ఆదే! అతను తలుపు వెనక ఉండగానే నువ్వు చాలా కోపంగా మాట్టాడుతూ వుండడం గమనించి, ఇది సమయం కాదని,ఇప్పుడు ఆ విషయం మాట్టాడితే, నీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని జంకి, మన కళ్లల్లో పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా, గోడ దూకి వెళ్ళిపోయి వుంటాడు.” జరిగిన సంఘటనని విశ్లేషించి చెప్పాడు ఆనందమూర్తి,

ఫణికుమార్‌ అనుమానంగా ఆనందమూర్తి వైపు చూశాడు.

“అంటే... వాసుదేవరావు కొడుకు తన తండ్రికి ట్రీట్‌మెంట్‌ ఇవ్వమని నీకు ఫోన్‌ చేసి అడిగాడా? అంతే అయి ఉంటుంది” అని తనను తాను సమాధానపరచుకున్నట్టు అన్నాడు ఫణి.

“అతను నాకు ఫోన్‌ చెయ్యలేదు” అన్నాడు ఆనందమూర్తి,

“అయితే వచ్చి కలిశాడా?”ో

“ఊహూ!”

“మరి ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు?” ఫణికుమార్‌లో అనుమానం

బిగుసుకుంది.

“ఇవన్నీ ఇలా జరిగివుండవచ్చని ఊహించాను” ఆనందమూర్తి తేలిగ్గా నవ్వేశాడు.

“నేను నమ్మను!” ఆమాట అంటున్నప్పుడు ఫణికుమార్‌ గొంతు కటువుగా ధ్వనించింది.

“చూడు ఫణీ! విశ్వాసమున్న చోట (ప్రేమ వుంటుంది. 'ప్రేమ వున్నచోట శాంతి వుంటుంది. శాంతివున్న చోట సత్యం వుంటుంది. సత్యం వున్నచోట భగవంతుడు ఉంటాడు. నేను చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.” ఫణిలో ఉక్రోషం పెరిగిపోతోంది. ఆ తికష్టం మీద అణచుకుంటున్నాడు.

46

వెన్నెల వేట

“ఫణీ! పతన దశకు ప్రధమ సోపానాలు మూడు. నిర్లక్ష్యం, నీతిరాహిత్యం, స్వార్థం. ఈ మూడూ ఏ వృత్తిలో వున్నవాళ్ళకైనా ప్రాణాలతో చెలగాటం వుంటుంది. నీకు ఈ మూడు లక్షణాలూ పుష్కలంగా వున్నాయి. నువ్వు నా స్నేహితుడివి కాబట్ట. నీ మీద వున్న ప్రేమతో, చనువుతో ఈ మాటలు చెబుతున్నాను. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే బాగుపడతావు. అహంకారం, అసూయ, అత్యాశా ఇవన్నీ శృతిమించితే పాతాళానికి తోసేస్తాయి” కొంచెం ఆవేశంగానే చెప్పాడు ఆనందమూర్తి.

లతిక, హర్షిత కూడా ఆనందమూర్తి ఆవేశంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. అతను అంత ఆవేశంగా ఎప్పుడూ మాట్టాడడు. అతను ఆవేశపడ్డాడంటే అతనిలో ఆంతకి రెండింతల కోపం, ఆవేదనా వున్నాయన్నమాట. ఫణికుమార్‌ యింతకుముందు ఆనందమూర్తితో పరుషంగా అతడు 'హర్టో అయ్యేలా మాట్లాడడం వల్లే ఇప్పుడు ఆనందమూర్తి ఇంత ఉపన్యాసం ఇచ్చాడని అర్ధమయింది అతికకీ, హర్షితకీ.

ఫణికుమార్‌ మాత్రం ఆనందమూర్తి మాటలను జీర్లించుకోలేకపోతున్నాడు. అతనిలోని అసూయ పడగవిప్పిన పాములా బుసలు కొడుతోంది. ఎంతో కష్టంమీద ఓర్చుకున్నాడు. అతని గుండెల్లో మండిపోతూన్న మంటల తీవ్రత కళ్లల్లోకి వచ్చినట్ట్లు ఫణికుమార్‌ కళ్ళు నిప్పుకణికలా ఎర్రగా మారాయి.

“ఫణీ! నువ్వెందుకు ఉ(ద్రేకపడుతున్నావో కారణం తెలీడంలేదు” అంది హర్షిత. ఫణికుమార్‌ హర్షిత కేసి చూశాడు. “ నా ఉద్రేకానికి కారణం తెలీడం లేదా హర్షితా! అయినా నువ్వు ఆనందమూర్తిని తప్ప నన్నెందుకు సపోర్ట్‌ చేస్తావు. అయినా నేనెలా అనుకుంటాను. అతడు నీ భర్త, ఇంటర్‌ మీడియట్‌ వరకూ నీతో చదివిన నీ మానసచోరుడు. ప్రేమించి పెళ్ళాడినవాడు. అసలు ఆరోజుల్లో నుంచే నీకూ వాడికీ కూడా నన్నాటపట్టించడం సరదా. అలవాటైన విద్య. అప్పట్లో మీరిద్దరూ ఒక్కటై నా జీవితాన్ని దెబ్బకొట్టారు. ఇప్పుడు నా

త?

శారదా అశోకవర్ధన్‌

వృత్తిమాద దెబ్బకొట్టి నన్ను సర్వనాశనం చెయ్యాలనుకుంటున్నాడు ఆనంద్‌. స్నేహం నటిస్తూ, సలహా ఇస్తున్నట్టు (ప్రవర్రిస్తూ కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు.అవును మరి! రూపాయీ ఆరా తీసుకుని దరిద్రులకి ట్రీట్‌ చేసే వాడికి నా సంపాదన చూస్తే కన్నెర్రగానే వుంటుంది. పేరుకోసం పొకులాడుతూ నా సంపదని చూసి ఏడుస్తున్నాడు.”

అతని మాటలు ములుకుల్టా గుచ్చుకున్నాయి హర్షితకీ, ఆనందమూర్తికీ!

లతికకిదంతా ఆయోమయంగానూ, భయంగానూ వుంది.

ఫణికుమార్‌ ఎందుకంత ఆవేశంగా మాట్టాడుతున్నాడో ఆమెకి అంతుబట్టలేదు.

“ఫణీ! నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా?” ఆనందమూర్తి అనునయంగా అన్నాడు ఫణికుమార్‌ భుజం తడుతూ, మరీ సీరియన్‌గా మారిపోతున్న వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ. “నేను కలలో వుండి మాట్లాడడం లేదు. స్పృహలో వుండే మాట్లాడుతున్నాను. నేను డీల్‌ చేసేది కాష్టీ పేషంట్లేని నీకు తెలుసు. నువ్వ దరిద్ర నారాయణుల దేముడివి, నువ్వు నెలంతా కష్టపడి సంపాొదించేది, నేను ఒక్క రోజులో సంపాదిస్తాను. అందుకే ఇప్పుడు నీ దృష్టి నా'పేషంట్ల మీదా నా ప్రాక్టీసు మోదా నాసంపాదన మోదా పడింది. నా పేషంట్లని నువ్వు నీవైపు తిప్పుకోడానికి ష్టాన్‌ చేస్తున్నట్లు ఈ సంఘటనతో అర్థమయింది” ఫణికుమార్‌ ఉద్రేకంతో

ఆనందమూర్తి ఫకాల్న నవ్వాడు.

“ఫణీ! పూల్‌లాగా మాట్టాడకు. నీలో దోషాలు వుంచుకొని ఇతరుల దోషాలను చూపించే అధికారం నీకు లేదు. పైగా లేని దోషాలు లెక్కగట్టి నిందలు వెయ్యడం నీచం. అర్థం లేకుండా మాట్టాడకు. నేను రూపాయా అర్థరూపాయీ ఇచ్చే దరిద్ర నారాయణులనే ట్రీట్‌ చెయ్యొచ్చు కానీ, నాకొచ్చే

త్ర

వెన్నైల వేట

పేషంట్ల సంఖ్య నీకన్నా పదింతలన్ని నీకిప్పటికే తెలిసుండొచ్చు. నా సంపాదన కూడా నీకన్నా పదింతలే! అయితే నీలాగా ధనవంతులకు మాత్రమే నేను వైద్యం పరిమితం చేసుకోలేదు. నా దగ్గరికి వచ్చినవాడు పూర్తి ఆరోగ్యం చేకూరి వెళ్ళాల్సిందే. చాలామంది పేషంట్టను (ట్రీట్‌ చెయ్యడానికి నాకు టైమ్‌ లేక నీకు రిఫర్‌ చేసి పంపాను కూడా! అలాంటిది నీ పేషంట్లను నావైపు తిప్పుకునే అవసరం నాకు లేదు. నువ్వే నీ పేషంట్లకి ప్రాణం మీదికొచ్చినప్పుడు నాకు కబురుపెడతావు. వచ్చేదాకా వదలవు. ఆ వామనరావు కొడుకు, నువ్వు నన్ను పిలవడం చూశాకే, తన తండ్రిని బతికించుకోవాలన్న ఆతృతతో, నాచే వైద్యం చేయించుకోవాలని తాపత్రయపడటం. అందులో నా ప్రమేయం, ప్రయత్నం ఏమాత్రం లేదు కాబట్టి నా తప్పూ కాదు.” ఫణికేసి నిశితంగా చూస్తూ అన్నాడు ఆనందమూర్తి.

ఫణి ఎటో చూస్తూ వింటున్నాడు ఆనందమూర్తి మాటల్ని. మళ్లీ ఆనందమూర్తే చెప్పడం మొదలెట్టాడు.

“ణీ! తమకి ఇష్టంవచ్చిన చోట వైద్యంచేయించుకునే అధికారం, హక్కూ ఎవరికైనా వుంది. ఇతరుల హక్కులను తెలుసుకొని ఆదరించనంతవరకు మనం ఎప్పుడూ సంస్కారులం కాలేము. ఏవేవో అనుమానాలూ, ఆపోహలూ మనసులో పెట్టుకుని నన్నూ, హర్షితనీ నిందించి ప్రయోజనం లేదు. మేము కాలేజీమేట్సే కాదు,ఫ్యామిలీ (ఫ్రెండ్స్‌ కూడా. నీ శ్రేయస్సునికాంక్షించే వాళ్ళం. ఇది గుర్తుంచుకుంటే చాలు” అన్నాడు ఆనందమూర్తి. ఫణికుమార్‌ మౌనంగా వింటున్నాడు. ఆలోచనలు అతడి మెదడును చుట్టేశాయి. ఆవేశం చల్చారాక మెదడు ఆలోచించడం మొదలెట్టింది. ఆనందమూర్తి మాటలు ఒక్కొక్కటే బు(ర్రకిక్కాయి.

“సారీ ఆనంద్‌!” ఇరిటేషన్‌లో మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఐ యామ్‌... వెరీ వెరీ సారీ!” అన్నాడు (ప్రాధేయపూర్వకంగా.

శ్ర

శారదా అశోకవర్థన్‌ “మనలో మనకి సారీలు, క్షమాపణలు ఏమిటిలే! తనకు మాత్రమే దుఃఖాన్ని లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఇంకెందరికో దుఃఖాన్ని కలిగిస్తుంటాడుమనిషి అలాంటి మార్గంలో మనం నడవకుండా జా(గ్రత్తపడితే చాలు” అన్నాడు ఆనందమూర్తి ఫణికుమార్‌ భుజం తడుతూ.

“థాంక్యూ... థ్యాంక్స్‌... ఎ..లాట్‌” అన్నాడు ఫణి.

“ఫణీ! నవ్వు ఆవేశంలో అన్నా ఆలోచించి అన్నా మమ్మల్ని దూషిస్తూ మాట్టాడావు. ఆమాటలు మమ్మల్ని బాధపెట్టలేదని మేం చెప్తే ఆత్మద్రోహం అవుతుంది. ఎదుటివారిని ఒక మాట అనే ముందు నిన్ను నువ్వు సమీక్షించుకో! నీకు నువ్వు గొప్పవాడిగా చెప్పుకుంటే లాభం లేదు. సమాజంలో కాలాన్ని బట్టి, మనం చేసే కార్యాలను బట్టీ గౌరవం, అగౌరవం (ప్రాప్రమవుతుంటాయి.” అంది హర్షిత కొంచెం పదునుగానే.

“నా తప్పుని ఒప్పుకున్నానుగా! నన్ను క్షమించు హర్షిత్రా?” అన్నాడు ఫణికుమార్‌.

“హర్షితా! ఫణిది చిన్నపిల్దాడి మనస్తత్వం. ఏ ఫీలిగ్‌సి మనసులో దాచుకోలేడు. త్‌ప స ల్ల

ప్పు రియలైజ్‌ అయ్యాడు చాలు. వెళ్ళాం పద” అంటూ లేచినుంచున్నాడు

ఆనందమూర్తి, హర్షిత, ఆనందమూర్తి, ఫణికుమార్‌ లతికలకు చెప్పి బయలుదేరి వెళ్లిపోయారు. వాళ్ళ కారు గేటు దాటి వెళ్ళేవరకు ఉండి చేతులు ఊపారు ఫణి, లతిక. భోజనానికి పిలిచి, అవమానించినట్టుగా మాట్టాడడం బాగోలేదు” అంది లతిక నె మ్మదిగా గొణుక్కుంటున్నట్నగా, ఫణికుమార్‌ మంచం మీద వాలిపోయాడు. వెల్లకిలా పడుకుని ఆలోచనలో పడ్డాడు. స! 50

వెన్నెల వేట

అతిక ఏదో అడుగుదామని అతని దగ్గరికొచ్చింది. ఆతను సీరియన్‌గా ఆలోచిస్తూ ఉండడం చూసి సంశయించి ఆగిపోయింది.

ఉన్నట్టుండి ఫణి గభాల్న లేచాడు.

ఫోన్‌ దగ్గరికెళ్ళాడు.

ఏదో నెంబర్‌కి ఫోన్‌ చేశాడు.

అవతల రిసీవర్‌ ఎత్తారు.

“హల్లో!... ఆనందమూర్తి స్పీకింగ్‌” అన్నాడు ఫణికుమార్‌.

ఫణికుమార్‌ తన పేరు ఆనందమూర్తిగా చెప్పడం లతికకు ఆశ్చర్యం కలిగించింది.

ఫోన్‌లో అవతలి వ్యక్తి ఎవరో ఏం చెబుతున్నాడో అర్ధకాలేదు. ఫణికువూర్‌ వింటూ “ఊం... కొట్టడం, ఆహాల.. అలాగా” అనడం తప్ప ఏమీ అర్ధం కాలేదు.

అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లతిక.

ఫణికేసే కన్నార్భకుండా చూస్తుండిపోయింది. (క్రమంగా అతని ముఖ కవళికలు మారిపోయాయి. ముఖం ఎర్రగా కందిపోయింది. మనిషి ఆవేశంతో కోపంతో ఊగిపోసాగాడు.

“సరే! వచ్చే వారం తీసుకురా. ఈలోగా నాకు ఫోన్‌ చెయ్యకు” అన్నాడు ఫోన్‌లో.

లతికకు అతని (ప్రవర్తన ఆందోళన కలిగించింది. మెల్లగా వచ్చి ఫణిప్రక్కనే కూర్చుంది.

అతను ఫోన్‌ పెట్టెయ్యగానే లతిక అడిగింది. “ఎవరికండీ ఫోన్‌ చేశారు?” అని.

ఫణి లతిక మొహంలోకి తీక్షణంగా చూశాడు. అలా చూస్తే లతిక ఒణికిపోతుంది. వెన్నులోంచి చలిపుట్టుకొచ్చినట్టుగా ఫీలవుతుంది. అయినా ధైర్యం తెచ్చుకొని “ఎవరికండీ ఫోన్‌ చేసింది?” మళ్లీ అడిగింది.

౧ గ తం గం ఓ రీ న. లాం వ. యాం ల

శారదా ఆశోకవర్థన్‌

“వామనరావు కొడుక్కి, అతనే మాట్లాడాడు” అన్నాడు ఫణికుమార్‌: మొహంలో లేని ప్రశాంతతని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ,

“ఆనందమూర్తి పేరుతో మాట్టాడారెందుకు?” అనుమానంగా అడిగింది “హాల అలా మాట్లాడితేనే అనలు విషయాలు బైటికొస్తాయి. నేనే అనందమూర్తిననుకొని వామనరావు కొడుక్రు నన్ను విపరీతంగా పాగిడేస్తున్నాడు. తన తండ్రిని ఫణిక్తుమార్‌ బారి నుంచి రక్షించి, మంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, అతని ప్రాణాలు కాపాడమని బతిమాలుతున్నాడు. ఆనందమూర్రిని కలవడానికి మన ఇంటికి వస్తే నేను చాలా సీరియస్‌గా మాట్టాడుతూ వుండడం చూసి భయపడి, నా కంటపడకుండా పారిపోయాడట. స్కౌండ్రలో” అంటూ పళ్ళు పటపట కొరికాడు కోపంగా. లతిక మనసునిండా భయం ముసురుకుంది.

“వాడి తండ్రికి వైద్యం చెయ్యడానికి ఎంత డబ్బయినా ఇస్తాడట. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే ఏడ్చి చచ్చే వెధవకి ఆనందమూర్తి అంటే అంత ప్రేమా” అంటూ పక్కనున్న బల్లమీద గట్టిగా గుద్దాడు తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ,

లతిక అఆత్రన్సి (ప్రవర్తన చూసి భయంతో ముడుచుకుపోయింది. అసలు ఫణీ అనందమూ్తీ ఎలా స్నేహితులయ్యారో ఆమెకు నిజంగా అంతుబట్టని ప్రశ్ళలాగా మిగిలిపోయింది. ఏవిధంగా చూసినా వాళ్లిద్దరి మధ్యా స్నేహలత అల్గుకుపోయే క్వాన్‌ విషయాలు క్రాన్సీ ఆలోచనలు కానీ లేవు. ఫణికి ముక్కుమీద క్ష, తనకన్నా ఎవర్ర ఎక్కువగా వున్నాసరే అసూయ. కట్టుకున్న భార్య నశేనం చచ్చేంత లోక్స్వ. స్నేహితులనికూడా మొహమాటపడడ్సు, తనలోన్సి లోభత్వాన్ని, అత్యాళనీ ప్రదర్శించేని లోకువయిపోతాడ్రు. అతడికి బంధుత్వం, స్నేహం, దయా, జాలీ, నీతీ, నిజాయితీ అన పదాలకి అర్థాలు తెలీద్స,

కానీ ఆనందమూర్తి అచ్చు శ్రీ రామచంద్రమూర్తే, ఏనాడూ అతనిలో

52

వెన్నెల వేట

కోపం చూడలేదు. హర్షితని పల్లెత్తుమాట అనగా వినలేదు. పేదలంటే జాలి. వృత్తిపట్ట గౌరవం, నీతీ నిజాయితీకి ప్రాణమిచ్చే ఆత్మాభిమానం గల గుణవంతుడు. ఫణి హర్షితని (ప్రేమించాట్ట. హర్షిత ఆనందఘూర్తిని ప్రేమించింది. ఆనందమూర్తీ హర్షితని ప్రేమించాడు. ఫణికి అది కూడా పరాజయమే. ఆనందమూర్తి ఆటల్లో చదువులో ప్రవర్తనలో 'మంచివాడు' అని పేరు రావడం, ఫణికుమార్‌ ప్రతిసారీ ఆనందమూర్తి తరువాతే నిలవడం కూడా అతనిలో ఆనందమూర్తిమీద అసూయ కలగడానికి కరణమయింది. అయితే చిన్నతనంలో ఇలాంటి భావాలు కలిగినా, పెద్దయ్యాక వాటిని తుడిచిపెట్టుకోవడం బాధ్యత గల వ్యక్తులు, సంస్కారవంతుల లక్షణం. కానీ ఫణిలో ఆ దుర్గణాలు కూడా పెరుగుతూనే వచ్చాయి ఈ ఆలోచనలన్నీ ఆమె మనసులో ఒక్కసారిగా ముసురుకుని ఫణికేసి చూడాలంటే వొంట్లో వొాణుకుపుట్టింది. పిచ్చిదానిలా ఆతని మొహంలోకి చూస్తూండిపోయింది “వచ్చే వారం వామనరావుని ఆనందమూర్తి డిస్పెన్సరీ లో చేరుస్తాడు పూర్‌ ఫెలో” అంటూ నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వాడు ఫణికుమార్‌. లతిక ప్రతిమలా అతనికేసి చూస్తుండిపోయింది

వెంటనే ఫోన్‌ ఎత్తి తన క్లినిక్‌ నెంబర్‌ డయల్‌ చేశాడు, “డాక్టర్‌ ఫణికుమార్‌ స్పీకింగ్‌ "అన్నాడు. డ్యూటీ నర్స్‌ ఫోన్‌ తీసింది ఆమెకేవో ఇనస్ట్రక్షన్స్‌ ఇచ్చాడు. లతిక మంచం మీద వాలిపోయింది

“ఎందుకు ఇప్పుడు ఫోన్‌ చేశారు క్లినికకి?” అడిగింది లతిక,

“అన్నీ నీకు చెప్పాలా? సరే చెప్తావిను. స్పెషల్‌ వార్డ్‌ పేషెంట్‌. శ్రీశ్రీశ్రీ వామనరావు గారికి ఏమేం టాబ్లెట్స్‌ ఇవ్వాలి, వన్నిగంటలకి ఇవ్వాలి, చెప్పాను” అన్నాడు =

“ఆ విషయాలు' ఇదివరకే చెప్పే వుంటారుగా. మళ్ళీ ఇప్పుడెందుకు ఫోన్‌ చేశారు?”

53

శారదా అశోకవర్ధన్‌

“ఒక డాక్టరుగా నా పేషంటు గురించి నేను శ్రద్ద వహిస్తే, నీకు ఏవేవో సందేహాలొస్తున్నాయే! అదే ఆనందమూర్తి చేస్తే మహా పాగిడేస్తోట్‌రీ. అతనికి బాధ్యతలెక్కువ, వంకాయ అంటూ! మరి నన్నుపొగడడానికి నీకు నోరు రావడం లేదా? చూడగా నవ్వు ఆనందమూర్తిని పేమిన్తున్నట్టుగా కనబడుతోంది.” కటువుగా అన్నాడు.

“ఛ.. వీమిటండీ ఆపాడు మాటలు? అతడు నాకు అన్నయ్య లాంటివాడు. ఇంతనీచంగా మీరు ఎలా మాట్లాడగలిగారు” కంట తడిపెట్టుకుంది లతిక. వెనక్కి వాలి ఆలోచనల్లో లీనమైపోయాడు ఫణి.

శ ర ఆ

రెండు రోజులు గడిచిపోయాయి.

ఎవరి పన్దు వాళ్లు చేసుకుపోతున్నారు. రాత్రి ఎనిమిది గంటలవుతోంది. ఫోన్‌ మోగితే లతిక వెళ్ళి తీసింది. ఆనందమూర్తి మాట్టాడుతున్నాడు. ఫణికోసం అడిగాడు. ఇంకా డిస్పెన్సరీ నుంచి రాలేదని చెప్పింది. “అయితే అక్కడికే ఫోన్‌ చేసి మాట్లాడతాను. రేపు రాత్రి మా ఇంటికి మీరిద్దరూ డిన్నర్‌కి రావాలి” అన్నాడు ఆనందమూర్తి.

“ఏమిటి విశేషం?” అడిగింది లతిక,

“మా మారేజ్‌ డే! ఫణితో నువ్వు కూడా చెప్పు. నేనూ క్లినిక్‌కి ఫోన్‌ చేసి చెప్తాను.” ఫోన్‌ పెట్టేశాడు ఆనందమూర్తి,

ఫణి ఇంటికొచ్చాక ఆనందమూర్తి ఫోన్‌ చేసిన విషయం చెప్పింది లతిక. “నాక్రూ చేశాడు వెళ్ళాం” అన్నాడు.

ఆ మర్నాడు డిస్పెన్సరీ నుంచి త్వరగా వచ్చాడు ఫణి. లతిక ముస్తొబై సిద్ధంగా వుంది. “ఏమండీ! మనం ఏదైనా (ప్రజెంటేషన్‌ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? వాళ్ళు మనకిచ్చేరుగా” అంది లతిక నెమ్మదిగా, భయపడుతూనే.

క్‌శే

వెన్నెల వేట

“ఐ...హేట్‌....దిన్‌....గివ్‌.... అండ్‌ టేక్‌ బిజినెస్‌! వాళ్లిచ్చారని మనమూ, మనమిచ్చామని వాళ్లూ ఇలా సాగుతూనే వుంటుంది” విసుక్కున్నాడు. “జీవితంలో ప్రతిదీ గివ్‌ అండ్‌ టేక్‌ సిద్దాంతమే! వాళ్ళిచ్చినప్పుడు మనం పుచ్చుకున్నాంగా. మనం ఇవ్వాల్సొచ్చినప్పుడు ఇలా మాటాడితే, ఏమను కుంటారు.”

ఫణి ఏమీ మాట్లాడలేదు.

కాస్త ధైర్యం పుంజుకుని, “ప్రేమా, అనురాగం, ఆప్యాయతా, వస్తువులు, ఆదరణ, ఆంతా తల్లీ బిడ్డల మధ్య, ఆలుమగల మధ్య అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, ఆంతా ఇచ్చి పుచ్చుకోవడమే. అదే జీవితం! అందులోనే ఆనందం. ఎవరికి ఎవరిచ్చిందీ సరిపోదు. అదే జీవితం కాదు. కానీ అవి జీవితాన్ని రసవత్తరంగా మార్చే తీపి గుర్తులు.”

“అయిందా ఉపన్యాసం? సరే పద. అక్కడికి గిఫ్ట్‌ ఇచ్చిన ఆనందమూర్తి మహా ఉదారస్వభావుడు, ఈ ఫణి ఉట్టి లోభి వెధవ అని నీచేత ఎందుకనిపించుకోవాలి?” అంటూ కారాపి, “ఏం కొందామో చెప్పు అడిగాడు.

అతిక క్షణంసేపు ఆలోచించి, “వెండి దుకాణానికి వెళ్ళి ఒక మంచి కుంకుమ భరిణె హర్షితకి కొందాం. ఆనందమూర్తికి మీ ఇష్టం” అంది.

“సరే! వాడికొక నెక్ష్‌టై కొనిచ్చేద్దాం” అన్నాడు.

“హమ్మయ్య” అనుకుంది. ॥

కారు జేమ్స్‌ ప్రీట్‌వైపు మళ్లించాడు. అక్కడ నెక్‌ టై కొని, పక్కసందులో వున్న వెండి దుకాణాలకెళ్ళి కుంకుమ భరిణె తీసుకున్నారు.

వీళ్లని చూడగానే “వెల్‌కమ్‌. రండి” అంటూ లోపలికి ఆహ్వానించింది హర్షిత. చెయ్యేసి కౌగిలించుకుని ఆహ్వానించాడు ఆనందమూర్తి “రారా అగ్గిరాముడా!” అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా

క్‌5్‌

శారదా అశోకవర్ధన్‌ కౌగిలించుకున్నాడు ఆనందమూర్తి. “అగ్గిరాముడా అంటూ పిలిచి మళ్లీ అతనికి కోపం తెప్పించకండి” నవ్వుతూ అంది హర్షిత. “ఏీడ్రి మాటలు నేను లెక్క చేస్తేకద. ఆ సంతి వాడికీ తెలుసు. అను శోనీ” అన్నాడు ఫణి నవ్వుతూ... 'స్నేహితులిద్దరూ అలా మాట్టాడుకుంటుంటే సంబరపడిపోయింది లతిక ముగ్గురూ కూర్చుని కబుర్లలో పడ్డారు. “ఏమిట్రా! నీ మేరేజ్‌ డేకి మేమిద్దరమేనా గెస్టులం. ఏ హడావుడీ లేదే?” అడిగాడు ఫణి,

“నాకు కావలసింది హడావుడీ, బోలెడంత మంది గెస్టులు కాదు, నాకు నచ్చినవాళ్ళు మాత్రమే” అన్నాడు ఆనందమూర్తి.

“కరెక్ట్‌” అలాగే వుండాలి అంది లతిక.

ఫణి లతికవైపు చూశాడు. “మరయితే మన మేరేజ్‌ డేకి ఎవరెవర్నో పిలవమన్నావెందుకు?”

“వాళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టరు. ఎప్పుడైనా పిలవాలి, అని మీరు అనేవారు కదా! ఆందుకే పెళ్ళిరోజు పిలిచేస్తే పోతుందని పిలవమన్నాను” ఆంది లతిక, గ

“ఒహో! మళ్లీ అదీ నా తప్పే?” అన్నాడు ఫణి.

“నో ఆర్యుమెంట్స్‌ ప్లీజ్‌...” అంది హర్షిత.

అంతలో ఫోన్‌ మోగింది. హర్షిత ఫోన్‌ తీసి “హల్లో” అంది.

“ఫణీ! నీకే ఈ ఫోను” అంది.

ఫణి వెళ్ళి హర్షిత చేతిలోనుంచి రిసీవర్‌ అందుకున్నాడు. “డాక్టర్‌ ఫణికుమార్‌ స్పీకింగ్‌” అన్నాడు. వెంటనే అతని ముఖ కవళికలు మారిపోయాయి.

“హాల.” అన్నాడు షాక్‌ తగిలినట్టు. అందరూ అతనికేసి చూశారు 5్‌6

వెన్నెల వేట

ఆత్రుతతో.

“ఏర్రా? ఏమయింది?” ఫణి భుజంమీద చెయ్యి వేసి అడిగాడు ఆనందమూర్తి

అవతల వాళ్ళు ఏదో చెబుతూనే వున్నారు. రిసీవర్‌ ఒక్క క్షణం దూరంగా పెట్టి, “వామనరావు పోయాట్ట. అయిదు నిమిషాలయిందిట” అన్నాడు.

మిగతా ముగ్గురూ ఆ వార్త విని, అదిరిపడ్డారు. ఆనందమూర్తి స్థాణువులా అయిపోయాడు. హర్షిత, లతికా, ఫణివైపే చూస్తూ ఉండిపోయారు, చలనం లేని వారిలా... ఫణికుమార్‌ ఫోన్‌లో ఏదేదో అడుగుతున్నాడు. ఆనందమూర్తి మాత్రం ఈ లోకంలో లేడు. ఆలోచనల్లో మునిగిపోయాడు. “ఏమిటి ఫణీ! వామనరావు చనిపోయాడా? ఎలా?” ఆందోళనగా అడిగాడు ఆనందమూర్తి.

“ఏమో, ఎందువల్ల అలా జరిగిందో అర్థం కావటంలేదు. నేను వెంటనే డిస్పెన్సరీకి వెళ్ళాలి.” అంటూ లేచాడు ఫణికుమార్‌.

“శేనూ రానా?” అడిగాడు ఆనందమూర్తి.

“వద్దు. ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదేం లేదు. లతికా, వెళ్చాంరా!” అన్నాడు ఫణి.

“నువ్వు డిస్పెన్సరీకి వెళ్తున్నావు. లతిక ఇక్కడ ఉంటుందిలే” అంది హర్షిత.

“అవును ఫణీ! నువ్వు ఇంటికి వచ్చే ముందు ఫోన్‌ చేస్తే మేము లతికను ఇంటికి తీసుకొచ్చి దిగబెడతాం” అన్నాడు ఆనందమూర్తి.

“లేదు నేనే వచ్చి తనని తీసుకెళతాను” అంటూ గబగబా బైటికి నడిచాడు ఫణికుమార్‌.

ఫణి వెళ్ళిన అయిదు నిమిషాల వరకు వాళ్ళ ముగ్గురి మధ్య నిశ్శబ్దం రాజ్యం సం భ స్ట ల్‌ ఇట

57

శారదా ఆశోకవర్థన్‌

“నేను లాస్ట్‌ వీక్‌ చూసినప్పుడు వామనరావు కండిషన్‌ బాగానే ఉంది. ఎలా పోయాడో పాపం!” స్వగతంగా అన్నాడు ఆనందమూర్తి,

“మళ్ళీ రాంగ్‌ ట్రీట్‌మెంట్‌ ఏమైనా జరిగిందేమో!”

“ఊ... హూ, ఒకసారి చేసిన తప్పుని తెలుసుకొన్న తర్వాత ఫణి మళ్ళీ దాన్ని రిపీట్‌ చేస్తాడని నేననుకోను.”

“ఎందుకనీ.”

“ఇది పేషేంట్ల జీవితాలకు సంబంధించిన వ్యవహారం. ఆటకాదు. ఇంతకు ముందు తెలియక ఫణి పొరపాటు చేశాడు. ఆ విషయం తెలిసేలా వివరించాక మళ్ళీ అలా జరిగే అవకాశం లేదు” అన్నాడు ఆనందమూర్తి, దాంతో లతికకు ఏదో గుర్తొచ్చినట్టు ఆనందమూర్రి వైపు చూసింది. ఆనందమూర్తి ఏమిటన్నట్టు ఆమె వైపు చూశాడు. గ

లతిక జంకింది.

ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది.

“లతిక! ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు” ఆనందమూరి, 'ఏం లేదు. మళ్లీ రాంగ్‌ మెడిసిన్స్‌ వామనమూర్తికి ఇచ్చారేమోనని నాకు సందేహంగా ఉంది.” అంది లతిక. “ఆ సందేహం ఎందుకు కలిగింది?” “ఇది నా అనుమానం ఖె మాత్రమే. నిజం ఆయి ఉండకపోవచ్చు” సణిగింది లతిక. “అదే ఆ అనుమూనం రావడానికి కారణం?” “నాలుగు రోజుల క్రితం మీరు మా ఇంటికి వచ్చి వెళ్లారు. ఆరోజు 3 చాలా ్ఫ్ఫి , ఆరోజు ఫణి ఇర్రిటేటింగ్‌గా మౌట్టాడాడుక్రూడ్రా/ అ “ఆవును... 58

వెన్నెల వేట “ మీరిలా వెళ్ళగానే ఫణి వామనరావు కొడుక్కి ఫోన్‌ చేసి మాట్లాడాడు” అంది లతిక, “వామనరావు హెల్త్‌ విషయంలో కంగారుపడవద్దని ధైర్యం చెప్పటానికి అయి వుంటుంది” అన్నాడు ఆనందమూర్తి, “అందుకు కాదు” “మరెందుకు?” “ఫణి ఆతనికి ఫోన్‌ చేసింది మీ పేరుతో!” లతిక మాటలకు ఆనందమూర్తి అదిరిపడ్డాడు. హర్షిత ఆశ్చర్యపోయింది. “నాపేరుతో అంటే... నేను మాట్టాడుతున్నట్టుగా గొంతు మార్చి మాట్టాడాడా?” అడిగాడు ఆనందమూర్తి. “అవును” “అందువల్ల... ఫణికి వచ్చే లాభమేమిటి.” హర్షిత అడిగింది. “ఆనందమూర్తి గారే మాట్టాడుతున్నారని అనుకొని వామనమూర్తి కొడుకు ఫోన్‌లో మిమ్మల్ని తెగ పాగిడేశాడు. ఫణిని తిట్టాడు. తన తండ్రికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి ఆరోగ్యవంతుణ్నీ చేస్తే అడిగినంత డబ్బు ఇస్తానని బతిమాలాడు” చెప్పింది లతిక. “ఆ మాటలు విన్న ఫణి రియాక్షన్‌ ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవసరం లేదు. నిప్పులు తొక్కిన కోతిలా చిందులేసి ఉంటాడు” అంది హర్షిత. “అవును, చాలా మండిపడ్డాడు, రెండు రోజుల తరువాత డిన్‌చార్జ్‌ చేసేస్తానని, వారం తర్వాత డిస్పెన్సరీకి వామనరావుని తీసుకొని రమ్మని అతని కొడుకుతో చెప్పాడు. ఈలోగా ఫోన్‌ మాత్రం చేయవద్దని చెప్పాడుగో అంది లతిక. “అతను మీకు ఫోన్‌ చేస్తే ఆసలు విషయం బయటపడుతుంది కదా! 59

శారదా అశోకవర్థన్‌ అందుకే తెలివిగా అలా చెప్పి ఉంటాడు.” అంది హర్షిత అనందమూర్తివైపు చూసి.

ఆనందమూర్తిలో ఒక రకమైన ఆందోళన చోటుచేసుకుంది.

“అతికా! ఆతర్వాత ఏమైందో చెప్పగలవా?” ఆతృతగా అడిగాడు ఆనందమూర్తి.

“ఫణి వెంటనే డిస్పెన్సరీకి ఫోన్‌ చేసి, డ్యూటీలో ఉన్న నర్స్‌తో మాట్టాడాడు. వామనరావుకి ఏయే టాబ్లెట్స్‌ ఇవ్వాలో, ఎన్ని గంటలకి ఇంజక్షన్స్‌ ఇవ్వాలో చెప్పాడు.”అంది లతిక.

“ఏమేం టాబ్లెట్లు... ఇంజక్షన్లు... పేరు ఏమైనా గుర్తున్నాయా?” అడిగాడు ఆనందమూర్తి,

“ఊ...హూ... నేను వాటి సంగతి పట్టించుకోలేదు. డిస్పెన్సరీకి ఫోన్‌ చేశారెందుకని అడిగాను.”

“ఏం చెప్పాడు?”

“వామనరావు ఆరోగ్యం విషయంలో తగిన జా(గ్రత్తలు తీసుకోమని, సరైన టైమ్‌కి మందులు ఇమ్మని చెప్పానని అన్నాడు ఫణి” అంది లతిక,

ఆనందమూర్తి ఆలోచనలో పడ్డాడు.

“వామనరావు కొడుకు తనతం'డ్రిని ఫణి దగ్గరినుంచి తీసుకొచ్చి మీ డిస్పెన్సరీలో ఎక్కడ చేరుస్తాడోనని ఫణికి భయం పట్టుకొని ఉంటుంది. అలాగ్గాని జరిగితే అతని ఇమేజ్‌ దెబ్బతింటుంది. అతని పేషెంట్స్‌ అందరూ ఒక్కొక్కరే జారిపోయే ప్రమాదం ఉంది. ఆందుకే వామనరావుని స్లో పాయిజన్‌తో తనే కడతేర్చి ఉంటాడు,” అంది హర్షిత,

“హర్షితా!” గట్టిగా అరిచాడు ఆనందమూర్తి. హర్షిత, లతిక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

60

వెన్నెల వేట ఆనందమూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. హర్షితకి భయం వేసింది.

“హర్షిత్రా! నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. ఏ డాక్టరూ ఒక రోగిని తన స్వార్ధం కోసం (ప్రాణాలు తీయడు.” అన్నాడు స్వరం పెంచి.

“సారీ ఆనంద్‌” అంది హర్షిత ముఖం చిన్నబుచ్చుకొని.

“హర్షితా! డాక్టర్‌ వృత్తి ఎంతో పవిత్రమైంది. తనను నమ్మి వచ్చిన రోగికి ఆరోగ్యం చేకూర్చటానికి డాక్టర్‌ తన సర్వశక్తులూ ధారపోస్తాడు. అతడి ప్రాణాన్ని కాపాడటానికి తన (ప్రాణాలను సైతం లెక్కచేయడు డాక్టర్‌. అలాంటిది నువ్వు అలా కించపరుస్తూ మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను. ఫణికి తెలియకుండా మళ్ళీ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది.” అన్నాడు ఆనందమూర్తి.

“వార్రపాటు... ఒకటి... రెండుసార్లు అయితే పర్వాలేదు. ప్రతిసారీ పొరపాటని సరిపెట్టుకోగలమా? ఇది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితి చెయ్యి దాటిపోయాక పొరపాటు జరిగిపోయిందంటే పోయిన (ప్రాణం తిరిగి వస్తుందా? డాక్టర్‌ వృత్తిలో ఉన్న వ్యక్తి ఇన్ని సారు పొరపొట్టు చేస్తే ఎవరూ క్షమించరు.” ఆవేశంగా అంది హర్షిత.

అతిక మెల్లగా హర్షిత భుజం మీద చెయ్యి వేసింది.

“ఆవేశ పడకు హర్షిత! నేను వెంటనే ఫణి దగ్గరికి డిస్పెన్సరీకి వెళ్తాను. అక్కడి పరిస్థితి ఏమిటో చూడాలి. అతిక్కా నువ్వూ ఉండండి. వెంటనే వచ్చేస్తాను.” అంటూ గబగబా బైటికి నడిచాడు ఆనందమూర్తి.

హర్షిత, లతిక అతను వెళ్లినవైపే చూస్తూ నిలబడిపోయారు.

నే నే నే వామనరావు చనిపోయాడు! అతని ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలూ 61

శారదా ఆశోకవర్థన్‌ ఫణి డిస్పెన్సరీలోనే ఉన్నారు. ఆందరూ భోరున ఏడుస్తున్నారు. వామనరావు పెద్దకొడుకు దుఃఖానికి ఆనకట్ట లేకుండాపోయింది. గుండెలు బాదుకొని భోరున ఏడుస్తున్నాడు. అతను ఆనందమూర్తిని చూడగానే అతని చేతులు పట్టుకొని స్వరం పెంచి గట్టిగా ఏడవసాగాడు. “డాక్టర్‌ గారూ! మా నాన్నని మీచేతుల్లో పెడితే ఆరోగ్యవంతుడవుతాడని ఆశపడ్డాను. మీరు చెప్పినట్టు మరో నాలుగురోజుల్టో మీ డిస్పెన్సరీకి తెచ్చి జాయిన్‌ చేద్దామనుకున్నాను. కానీ, ఆంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. బాగా కోలుకుంటున్న మనిషి ఈ నాలుగు రోజులుగా చాలా బలహీనపడిపోయాడు. కారణమేమిటో తెలియదు. ఈవేళ ఉదయం కూడా బాగానే మాట్టాడాడు. నాలుగు రోజుల తర్వాత మీ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తే ఆయన సంతోషించాడు. మాట్టాడుతూండగానే ఆయనకి వెక్కిళ్ళు వచ్చాయి. ఉండే కొద్దీ అవి తీవ్రస్థాయికి వెళ్ళి ప్రాణాంతకమయ్యాయి. మంచినీళ్ళు తాగించబోతే గుటకవెయ్యలేదు. ఆంతే, నాచేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు. మమ్మల్ని అన్యాయం. చేసి వెళ్ళిపోయాడు” కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ జరిగింది వివరించాడు వామనరావు పెద్దకొడుకు.

ఆనందమూర్తి అతని భుజం తట్టి గుండె దిటవు చేసుకొమ న్నట్లు దైర్యం చెప్పాడు.

“డాక్టర్‌ గారూ! ఆ ఫణి బాబేనా తండ్రిని చంపేశాడు. మమ్మల్ని అన్యాయం చేశాడు ఆవేదనగా, ఆవేశంగా అన్నాడు వామనరావు రెండో కొడుకు.

“చూడండి, మీరెంత ఆవేశంలో ఉన్నా, బాధలో ఉన్నా అలాంటి మాటలు అనకూడదు. డాక్టర్‌ని, డాక్టర్‌ వృత్తిని ఆవమానపరచకూడదు. ఫణి మీ తండ్రిగారి ఆరోగ్యం బాగుచేయటానికి తన సాయశక్తులా (ప్రయత్నించాడు.

62

వెన్నెల వేట అలాంటి డాక్టర్ని మీరు నిందించటం విజ్ఞత అనిపించుకోదు. మీరు మీ తండ్రిపోయిన ఆవేదనలో అలా అంటున్నారని నాకు తెలుసు. నా దగ్గర అన్నట్టు ఇంకెవరి దగ్గరా అనకండి... రిలాక్స్‌ అవండి” అంటూ ఆనందమూర్తి గబగబా లోపలికి వెళ్ళాడు.

తన రూమ్‌లో ఫణికుమార్‌ తల పట్టుకు కూర్చుని ఉన్నాడు.

ఆనందమూర్తి వచ్చినట్టు చప్పుడు విని ఫణికుమార్‌ తల పైకెత్తి చూశాడు.

“ఆనంద్‌! నువ్వొచ్చావా?” ఆశ్చర్యపోయాడు ఫణికుమార్‌.

“ఏం?... రాకూడదా?” సూటిగా ప్రళ్ళించాడు ఆనందమూర్తి,

“ఆదేం కాదు. ఇప్పుడు... నువ్వు ఉంటే బాగుండునని అనుకుంటున్నాను. అంతలో నువ్వే వచ్చావు. ధాంక్‌ గాడ్‌!” అన్నాడు ఫణికుమార్‌ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ.

“ఎనీ ప్రాబ్బమ్‌?” అన్నాడు ఆనందమూర్తి.

“వామనరావు కొడుకు పోలీస్‌ కంప్టయింట్‌ ఇస్తానంటున్నాడు. నా అజాగ్రత్త వల్లనే తన తండ్రి చనిపోయాడని పోలీసు రిపోర్టు ఇస్తాడట. ఆనంద్‌! అతనికి నువ్వు నచ్చజెప్పే నాకు సాయం చేయాలి” ప్రాధేయపడుతూ అన్నాడు ఫణి.

“ని తప్పులేనప్పుడు... నువ్వు భయపడటం దేనికీ?” అన్నాడు ఆనందమూర్తి,

“తప్పు ఉన్నా, లేకపోయినా... పోలీసులు, గొడవలలో ఇరుక్కుంటే చాలా తలనొప్పి. నీకు తెలియనిది ఏముంది? ప్లీజ్‌ హెల్ప్‌ మీ!” ఫణి ఆనందమూర్తి రెండుచేతులూ పట్టుకున్నాడు.

“ఫత్రీ! నీలో ఆవేశం పాలు ఎక్కువ. ఆలోచనని ఆ ఆవేశం మింగేసి, నీలో ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్మ్నాదిని చేసేస్తోంది. వారంక్రితం ఎంతో హెల్టీగా ఉన్న వామనరావు ఎందుకు వీక్‌ అయిపోయాడు? అతను చనిపోవడానికి కారణం... నువ్వు వాడిన మెడిసిన్స్‌ కాదని గుండె మీద చెయ్యి వేసుకొని

63

శారదా అశోకవర్ధన్‌ చెప్పగలవా? డాక్టరుగా నీబాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించలేకపోయావని నేనంటాను. నువ్వు ఏం సమాధానం చెప్తావ్‌?” కొంచెం కటువుగా అన్నాడు ఆనందమూర్తి.

ఫణి మారు మాట్లాడకుండా తల వంచుకున్నాడు.

అతని మౌనం అతను తన తప్పుని అంగీకరించినట్లు అనిపించింది ఆనందమూర్తికి,

“ఫణీ! హర్చిత నీతో ఎన్నోసార్టు చెప్పింది. డాక్టర్‌ వృత్తి మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకోమని. కాని, నువ్వు నీ వృత్తినే వ్యాపారంగా మార్చేసుకున్నావు. పేషంట్ల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదని నీకెన్నిసార్టు చెప్పినా తలకి ఎక్కటం లేదు. నువ్వు వామనరావుని వాంటెడ్‌గా చంపావు. అతన్ని నా డిస్పెన్సరీకి తీసుకురాకుండా ఉండటం కోసం, నీ పరువు పోకుండా ఉండటంకోసం వామనరావు ప్రాణాలు నిలువునా నువ్వే తీశావు. బొనా?” ఆవేశంగా ఆన్నాడు ఆనందమూర్తి.

“డాక్టర్‌ వృత్తికి మచ్చ తెచ్చే నీలాంటి వాడికి ఒకసారి సరైన గుణపారం చెప్పాలి. పోలీసులే నీకు తగిన మందు. నీకు శిక్షపడాలి!” ఆంటూ విసురుగా గదిలోంచి బైటికి నడిచాడు.

“ఆనంద్‌!” అంటూ పిల్చాడు ఫణి.

ఆనందమూర్తి ఫణి గదిలోంచి బైటికి వచ్చి వామనరావు డెడ్‌బాడీ ఉన్న స్పెషల్‌వార్డు దగ్గరకి వచ్చాడు. “డాక్టరు గారూ! ఇప్పుడు నన్నేం చేయ మంటారు?” అడిగాడు వామనరావు పెద్దకొడుకు. అతని కడుపులోంచి దుఃఖం పొర్గుకువళి కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆనందమూర్తి అతని భుజం మీద చెయ్యివేసి పక్కవార్డు దగ్గరికి తీసుకెళ్ళాడు.” జరిగిపోయినదానికి బాధపడి ప్రయోజనం లేదు. గుండె దిటవు చేసుకోండి. డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా ముఖ్యమైన వాళ్ళెవరైనా ఉంటే కబురుపెట్టండి” అన్నాడు

64

వెన్నెల వేట ఆనందమూర్తి,

“లేదు డాక్టరు గారూ! నా తండ్రి చావుకి ఫణి బాధ్యులు. అందుకే పోలీసు కంప్లయింట్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకాలం ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా ఆయనకి నయం చేయలేకపోయారు. అడిగినంత డబ్బు ఇచ్చాను. కానీ తన నిర్లక్ష్య వైఖరితో నా తండ్రి ప్రాణాలను తీశారు. ముమ్మాటికీ ఫణిగారి ఆ(శ్రద్దవల్లనే ఆయన చనిపోయారు.” ఆవేదనగా అన్నాడు వామనరావు కొడుకు. "ఆందుకే కేసు పెడతాను. అతడి రోగం కుదురుస్తాను”

“మీరు... ఆవేశపడకండి. ఏ డాక్టరూ కూడా తన వద్దకి వచ్చిన పేషెంటు విషయంలో నిర్లక్ష్యం వహిభీచడు. అతనికి నయం చేయడానికి తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తాడు. ఎంత ' అసమర్జ్హుడైన డాక్టర్‌ అయినా రోగి బతికి బట్ట కట్టలేకపోతే - రోగి తాలూకు వారికంటే డాక్టరీ ఎంతో బాధపడతాడు. తన ప్రయత్నం ఫలించలేదని కుమిలిపోతాడు. ఇప్పుడు ఫణి పరిస్థితి అలానే ఉంది. మీ తండ్రి పోయినబాధ మిమ్మల్ని మాత్రమే కాదు అతనిని కూడా దహించివేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మీరు అనాలోచితంగా పోలీస్‌ కంప్లయింట్‌. ఇస్తాననటం ఏమంత సబబుగా ఉంది? మీరే ఆలోచించండి!” ఆతనికి నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు ఆనందమూర్తి.

“డాక్టరు గారూ! ఇదేకేసు మీ దగ్గరికి వస్తేనా తండ్రి ఏనాడో ఆరోగ్యవంతుడై మా కళ్ళ ఎదుట లేచి తిరుగుతూ ఉండేవాడు” అన్నాడు అతను కళ్ళు తుడుచుకుంటూ.

“నామీద అభిమానంతో మీరలా అంటున్నారు గ్గానీ, దేనికైనా కాలం ఖర్మం కలిసిరావాలి” భిన్నాడు ఆనందమూర్తి, కాలంమీద, ఖర్మంమీద కంటే తన శక్తియుక్తుల మీద, ఆత్మవిశ్వాసం మీద ఎంతో నమ్మకం ఉన్న ఆనందమూర్రి ఎదుటి వ్యక్తిని ఓదార్భటం కోసం ఆమాటలు పప్రయోగించక తప్పలేదు.

“నా మాట విని.... వెంటనే డెడ్‌బాడీని ఇంటికి తీసుకువెళ్ళండి. పోలీసుల

65

శారదా అశోకవర్ధన్‌ వరకు వెళితే మీకూ, ఫణికి తలనొప్పి తప్ప ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు.”

“అలా అని మేం ఊరుకుంటే ఆయనగారి నిర్లక్ష్యం ఇంకా పెరిగిపోతుంది. మరికొంతమంది పేషెంట్లు (ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశం కలుగుతుంది. అందుకే పోలీసుల చేత హెచ్చరించేలా చేయాలి” గుప్పిళ్ళు బిగించి ఉద్రేకంగా అన్నాడు అతను.

“మీ తండ్రిగారు పోయిన బాధలో మీరలా మాట్లాడుతున్నారు. ఇకపై ఫణి డిస్పెన్సరీలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జా(గ్రత్తలు తీసుకొనేలా నేను హెచ్చరిస్తాను. మీరిక జరగాల్సిన కార్యక్రమాలు చూడండి.”

ఆనందమూర్రి చెప్పిన మాటలకి అతను మౌనంగా తల ఊపి అక్కణ్నుంచి తన మనుషులు ఉన్న స్పెషల్‌ వార్డు వైపు వెళ్ళాడు. అప్పుడు అటుగా వెళ్తున్న నర్స్‌ని ఆపి పలకరించాడు ఆనందమూర్తి. నర్స్‌ ఆనందమూర్తికి నమస్కారం పెట్టి నిలబడింది. “ఈవేళ ఆదివారం కదా! డ్యూటీకి వచ్చావేమిటి?” అడిగాడు ఆనందమూర్తి,

“పోయిన వారంమతానేను నైట్‌ డ్యూటీలోనే ఉన్నాను సార్‌! వామనరావుగారి పరిస్థితి బాగోలేదని ఆదివారం కూడా డ్యూటీకి వచ్చి జాగ్రత్తగా చూసుకోమని డాక్టరుగారు చెప్పారు. ఆందుకే ఈవేళ కూడా రావటం తప్పలేదు.” అంది నర్చ్‌.

“వామనమూర్తికి మెడిసిన్స్‌ ఇన్ఫటంఅంతా నువ్వే డీల్‌ చేస్తున్నావు కాదూ!”

“జానండీ, నేను ప్రొద్దుటే డ్యూటీలో నర్స్‌కి వివరాలన్నీ చెప్పి వెళతాను. మళ్లీ సాయంత్రం వచ్చినప్పుడు ఆమె సరిగ్గా నేను చెప్పినట్టు చేసిందో లేదో చెక్‌ చేసుకుంటాను.”

“ఈవారం రోజులుగా వామనరావుకి ఏమేం మందులు ఇస్తున్నారో నీకు తెలుసుకదూ!”

656

వెన్నెల వేట

“తెలుసండీ!” అంటూ ఆ వివరాలు చెప్పింది నర్స్‌.

“థాంక్స్‌.” అన్నాడు ఆనందమూర్తి. నర్స్‌ ముందుకి వెళ్లడానికి, వెనక్కి తిరిగాడు. ఫణి గబగబా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళారు.

“ఆనంద్‌! వామనరావు కొడుకు ఏమన్నాడు?” ఆతృతగా ఆడిగాడు.

“పోలీసు కంప్టయింట్‌ ఇస్తానంటున్నాడు.”

“నువ్వు నచ్చజెప్పలేదా?”

“చెప్పాను!”

“అయితే ఏమంటాడు?”

“ఇప్పుడుకానీ కంప్లయింట్‌ ఇవ్వకపోతే ఇంకా ఎంతమంది "పేషంట్ల ప్రాణాలు తీస్తాడోనని ఎదురు ప్రశ్న వేశాడు.”

“ఇడియట్‌... అలా అన్నాడా?” కోపంగా అన్నాడుఫణి.

“అతనన్నదాంట్లో తప్పేముంది? ఇది మొదటి కేసు కాదుగా నీకు...”

“ఆనంద్‌!”

“అవును... కన్నతండ్రి ప్రాణాలతో ఆటలాడుకున్న నీలాంటి డాక్టర్ని ఏకంగా పొడిచి చంపకుండా పోలీసు కంప్టయింటు మాత్రం ఇస్తానంటున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడివనే చెప్పాలి.”

“ఆనంద్‌.. ఇలాంటి పరిస్థితిలో జోక్‌ చేస్తున్నావా?” ముఖం చిన్నబుచ్చు కున్నాడు ఫణి.”

“జోక్‌ కాదు ఫణీ! నిజమే మాట్టాడుతున్నాను. ని పేషంట్లు నీకు బిడ్డల్లాంటి వాళ్ళు. ఆ విషయం మరిచి నువ్వు వాళ్ళమీద ప్రయోగాలు చేసి వాళ్ల ఆరోగ్యంతో, ప్రాణాలతో ఆడుకుంటావా?”

“ఏమిటలా మాట్టాడతావ్‌? నేనేం చేశాననీ?” బెదురుగా చూశాడు ఫణి.

67

శారదా అశోకవర్ధన్‌

“గత నాలుగు రోజులుగా నువ్వు వామనరావుకి ఇచ్చిన మందులు ఏమిటి? అవి వాడితే మనిషి బతికి బట్టకట్టలేడని నీకు తెలీదా? నీకు తెలియదని నేననుకోను. నువ్వు తెలిసి తెలిసీ, అవి వామనరావుకు వాడావు. బౌనా?” సూటిగా అడిగేసరికి ఫణీ ఇబ్బందిగా చూశాడు.

“అవి వాడినట్ట నీతో ఎవరు చెప్పారు?” కంగారుపడ్డాడు ఫణి.

“కేన్‌ షీట్‌ చూశాను!”

“దాన్లో నోట్‌ చేయవద్దని చెప్పానుగా...”కంగారుగా అన్నాడు.

“నువ్వు చెప్పినట్టే నోట్‌ చెయ్యలేదు. నిజంగా కేన్‌ షీట్‌ నేను చూడలేదు.”

  • ఫణి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఆనందమూర్తి,

“అలాగా” తడబడ్డాడు ఫణి.

“వేసిన తప్పుని నువ్వే ఒప్పుకున్నావు. ఆ మందులు నోట్‌ చేయకుండా ఆతనికి ఇచ్చావు. అంటే ఇదంతా ష్టాన్‌ ప్రకారమే చేశావని అర్ధంఅవుతోంది'

  • అన్నాడు ఆనందమూర్తి,

“ఆనంద్‌! నన్ను క్షమించు. ఇది కావాలని నేను చేయలేదు” ఆనందమూర్తి రెండుచేతులూ పట్టకున్నాడు ఫణి.

“ఫణీ! నువ్వెందుకిలా మారిపోయావ్‌? సీకేమయింది. సైకిక్‌గా తయారవుతున్నావు. ఇది ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ, నీ వృత్తికీ సరిపడేది కాదు.”

“సారీ ఆనంద్‌... వామనరావు కొడుకుని పోలీస్‌ కంప్టయింట్‌ ఇవ్వకుండా నువ్వే ఆపాలి. లేకపోతే చాలా చిక్కుల్లో ఇరుక్కుంటాను.” అన్నాడు ఫణి.

“నీ టెండన్సీ మార్చుకుంటేగాని అది సాధ్యం కాదు.”

“తప్పకుండా మార్చుకుంటాను. ప్రామిస్‌... ప్లీజ్‌ , వెళ్ళి చెప్పు ఆనంద్‌.”

68

వెన్నెల వేట

“ఆందోళనపడకు. వామనరావు డెడ్‌ బాడీని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. పోలీసు కంప్లయింట్‌ ఇవ్వటం లేదు. నేను నచ్చజెప్పాను. ఈ, విధంగా నీ పాపంలో నేనూ భాగం పంచుకున్నట్టు అయింది ఫణి. ఇక ముందెప్పుడూ ఇలాంటివి జరక్కుండా జా(గ్రత్త తీసుకో!” కొంచెం పరుషంగానే ధ్వనించింది ఆనందమూర్తి గొంతు. ఫణిలో ఆందోళన, భయం తగ్గాయి. కొంచెం రిలీఫ్‌ ఫీలయ్యాడు.

“థాంక్యూ ఆనంద్‌! నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను” కృతజ్ఞతగా చూశాడు ఫణి.

“ఈ జన్మలోనే కాదు. ఏ జన్మలోనూ తీర్చవలసిన అవసరం లేదు. ప్రాణాలమీదికి తెచ్చే ఇలాంటి తెలివితక్కువ పనులు చేయకుండా ఉంటే చాలు!” హెచ్చరించినట్టుగా అన్నాడు ఆనందమూర్తి.

“అలాగే” అన్నాడు ఫణి అవమానంతో ముఖం చిన్నబుచ్చుకుని.

“ఆనంద్‌! నువ్వు నాకొక ప్రామిన్‌ చేయాలి!”

“ఏమని?”

“వేస్తానని మాటివ్వు!”

“విషయమేమిటో చెప్పు!”

“ఇక్కడ జరిగినదేమీ హర్షితకు గానీ, లతికకు గానీ తెలియనివ్వవద్దు.” ఆనందమూర్తి నవ్వాడు.

“ఏమిటలా నవ్వుతావ్‌? (ప్రామిస్‌ చెయ్యవా?”

“చేస్తాను” అన్నాడు ఆనందమూర్తి,

“మరి నవ్వుతావెందుకు?”

69

శారీదా అశోకవర్థన్‌

“నేను ్రామిన్‌ చేసి, ఆ మాటమీద నిలబడినా ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియకుండా ఉండదు.”

“ఎలా తెలుస్తుంది.?”

“వామనమూర్తి విషయంలో జరిగిన యదార్థం ఏమిటో వాళ్ళిద్దరూ ఊహించుకొని ఈ సబ్జెక్టు మిదనే ఇంట్లో కూర్చుని చర్చించుకొంటున్నారు. ఏ క్షణంలో అయినా ఫోన్‌ చేసి ఎవరో ఒకరి ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు అనుమానిస్తావు లో

“అంటే.. నిన్నెందుకు అనుమానిస్తాను?”

“ఈ విషయం మనిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదని నీ భ్రమ. నిజం నిప్పులాంటీది. ఎంత దాచినా అది దాగదని నీకు తెలుసు. ఆ నిజం మన వాళ్ళకి నాద్వారా మాత్రమే తెలిసిందని నా మీద అనుమానపడవని గ్యారంటీ ఏమిటి?”

“ఛ! అలా ఎప్పటికీ జరగదు.”

“ఎందుకు జరగదూ? ఇంతకుముందే జరిగింది? వామనరావు కొడుకు నాతో మాట్లాడకపోయినా మాట్లాడాడని నువ్వు ఊహించి నా మీద కోపం పెంచుకున్నావు. ఆ గొంతుతో నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడి అతని

అభిప్రాయం తెలుసుకున్నావు. తన తండ్రిని నా డిస్పెన్సరీకి తీసుకురాకముందే ఆతనికి ఆ అవకాశం కలగకుండా స్లో పాయిజన్‌ ఇచ్చి ఆతని తండ్రిని శవంగా మార్చావు.” ఫణి గభాల్జు ఆనందమూర్తి నోరు నొక్కేశాడు. తలుపు దగ్గర ఏదో చప్పుడైతే! అప్పుడే తలుపులు తెరుచుకొని పోలీన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర ప్రవేశించాడు. 70

వెన్నెల నేట

అతన్ని చూడగానే ఫణి ముఖం పాలిపోయింది.

ఆనందమూర్తి ముఖం వికసించింది.

ఫణి మొహం నెత్తురుచుక్క ఇంకిపోయినట్టు పాలిపోయింది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చినట్టనిపించి ఒణుకుతున్నాడు. ఏదో భయం ఆతని మనసు నిండా చుట్టుకుని, కదలనీయడం లేదు. ఒళ్ళంతా చిరు చెమటలు పట్టేశాయ్‌. కూర్చున్న కుర్చీ భూమిలోకి కూరుకుపోతున్నట్టనిపించింది. తల వంచుకుని టేబుల్‌ మీద వున్న ఉీపర్‌వెయిట్‌ని ఆటూ ఇటూ తిప్పుతూ కూర్చున్నాడు. . “అప్పుడే పోలీసులకెలా తెలిసింది? వామనరావు కొడుకుచెప్పుంటాడా? కానీ ఆతడు ఆ శం దగ్గరి నుంచి కదలడం కూడా కనిపించలేదే? పైగా ఎందుకైనా మంచిదని తను జనరల్‌ ఫోన్‌ ప్లగ్‌ తీసేసి వుంచాడు. ఎవరూ ఫోన్‌ చెయ్యడానికి గానీ, ఫోను రావడానికి గానీ వీలు పడదు కదా! అలాంటప్పుడు ఈ వార్త పోలీసులకెలా పొక్కింది? నిముషాల మీద ఇన్‌స్పెక్టర్‌ ఎలా వచ్చాడు, ఆలోచనల్లో అంతు దొరకక అవస్థపడుతూ సతమతమయిపోతున్నాడు ఫణికుమార్‌. సురేంద్ర ఆనందమూర్తితో కరచాలనం చేసి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

“సీ క్రోసం మీ ఇంటికెళితే మీ అవిడ నువ్విక్కడున్నావని చెప్పింది. నిన్నెలాగయినా పట్టుకోవాలని వెంటనే ఇక్కడికొచ్చేశాను” అన్నాడు ఇన్స్‌పెక్టర్‌ సురేం(ద్ర.

“ల్సి ప్రోలీసులకి ఎక్కడున్నా క్షణాల మీద పట్టుకోవడం కష్టం కాదుగా” నవ్వేడు ఆనందమూర్తి. ఫణికి అక్కడ కూర్చోబుద్ది కావడం లేదు.

“ఆనందమూర్తి ఫోన్‌ చేసి పోలీసులని పిలిపించి వుంటాడు. మళ్ళీ ఏమీ తెలీనివాడిలా నటిన్తున్నాడు. ఎంత షాన్‌ వేశాడు! ఆనందమూర్తిని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది ఫణికి, ఆవేశాన్నెలాగో అణిచిపెట్టుకుని

71

శారదా అకోకవర్థన్‌ లేవలేక కదల్లేక కూర్చున్నాడు.

“బై...ది...టై! మీట్‌ మై కజిన్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర...! మొన్నటి వరకు కడపలో వున్నాడు. మొన్నీ మధ్యే ఈ వూరు '(ట్రాన్స్‌ఫరై ఇక్కడికొచ్చాడు. మీట్‌ మై కోట్‌ ఫ్రెండ్‌ డాక్టర్‌ ఫణికుమార్‌...” అంటూ పరస్పరం పరిచయం చేశాడు ఆనందమూర్తి,

ఫణి అయిష్టంగానే షేక్‌ హాండ్‌ ఇచ్చాడు యాంత్రికంగా. ఆనందమూర్తి ఎంత సరదాగా మాట్లాడుతున్నాడో ఫణికి అంత కోపంగా వుంది. 'బంధువు కదా బయలుదేరే ముందే ఇంటినుంచి ఫోన్‌ కొట్టి, ఏమీ తెలీనివాడిలా ఇక్కడికొచ్చుంటాడు. లేకపోతే అంత అర్జంటుగా వెతుక్కుంటు నా క్షినిక్‌కి రావలసిన పనేముంది?” అని ఊహలు అల్టుకుపోతున్నాడు ఫణి. అంతలో లోపల్నుంచి ఘోల్టున ఏడుపులు వినిపించాయి.

“ఏమైంది?” అడిగాడు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర.

“ఒక పేషంటు పోయాడు. వాళ్ళ బంధువులు వాళ్ళు” ముక్తసరిగా చెప్పాడు ఆనందమూర్తి,

“ఒ... ఏమిటి జబ్బు?”

“సివియర్‌ అటాక్‌ ఆఫ్‌ ఆస్త్మా బట్‌ నౌ సడన్‌ కార్డియాక్‌. అరెస్ట్‌...” చెప్పేడు ఆనందమూర్తి, ఫణి మొహంలో నెత్తురు చుక్కలేదు. అతని ధ్యాసల్హా ఆనండమూర్తి ఆతనికి ఏం చెబుతాడోనన్న భయమే. మౌనంగా వుండిపోయాడు.

“ఏం గొడవరా నాయనా! తెల్లవారి లేచినప్పటినుంచి ఆఫీసు కెళ్ళినా ఇంట్టో వున్నా ఇవే గొడవలు. వరకట్నపు చావులు, రేపులతో చావులు. మర్షర్లూ దొంగతనాలూ తలలు పగలగొట్టుకోవడాలూ... ఛ... ఛ మనిషి ప్రాణం ఇంత చవకైపోయింది. చెట్టునుంచి ఒక కాయ కోసినంత సులువుగా ఒక (ప్రాణం

[ల

వెన్నెల వేట తీసేస్తున్నారు. ఒక మనిషిని మరో మనిషి చంపడం అంటే ఎక్కడో ఒక మృగం లాంటి మనిషి తప్ప మామూలు వాళ్ళెవరూ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తూ చేసేవన్నీ వెధవపన్లే! ఆఖరికి ఆడవాళ్ళు కూడా తయారయ్యారు. కట్నం తేలేదనో, తెచ్చింది చాలలేదనో, కిరసనాయిల్‌ పోసి, ప్టవ్‌ అంటించినంత తేలిగ్గా మనిషిని అంటించి చంపేస్తున్నారు.” అన్నాడు సురేంద్ర. వణిలో ఒణుకు ఎక్కువైంది. కాళ్ళూ చేతులూ చల్లబడు

తూన్నట్టనిపించింది. ఆనందమూర్తి కేసి మింగేసేలా చూశాడు.

ఫణిలో సుళ్లు తిరుగుతూన్న ఆలోచనలని పసిగట్టినా ఏమీ తెలీనట్టగానే ఊరుకున్నాడు ఆనందమూర్తి. “ఆనంద్‌ అసలీ పరిస్థితికి కారణమేమిటంటావ్‌? స్వార్థం. డబ్బు! కీర్తి! వీటికోసం పెద్ద పెద్ద విద్యావంతులు కూడా వెధవ పన్హు చేస్తున్నారు. శిక్ష వెయ్యవలసిన పోలీసులూ, న్యాయవాదులే కట్నం కోసం ఆడపిల్లలని హింస 'పెడుతూంటే, ఆమె రక్షణ కోసం ఇంకెక్కడికి పోతుంది? రోగి చావు బతుకుల మద్య పోరాడుతూ డాక్టర్‌ దగ్గరికొస్తే, కాసులు రాబట్టే పద్ధతే తప్ప అతని స్థితి పట్టించుకోని డాక్టర్సుంటే రోగి ఏమైపోతాడు. కంచే చేను మెయ్యడమంటే ఇదే మరి.” చెప్పుకుపోతున్నాడు సురేంద్ర.

వామనరావు చిన్న కొడుకు టాక్సీ పట్టుకొచ్చాడు. నర్ఫూ వార్డ్‌ బాయ్‌ల నహాయంతో వామనరావు శవాన్ని టాక్సీలోకెక్కించాడు.

మళ్ళీ అందరూ ఘౌొల్టుమన్నారు. వామనరావు పెద్ద కొడుకు ఆనందమూర్తి కాళ్ళ మీద పడి భోరున ఏడ్చాడు. అతణ్ణి లేవనెత్తి ఓదార్చాడు ఆనందమూర్తి,

“వస్తాం డాక్టర్‌'... అటూ ఫణికుమార్‌కి నమస్కరించి వెళ్ళి టాక్సీలో కూర్చున్నారు. టాక్సీ కదిలింది. పది నిముషాల పొటు ఏడువులతో

7

శారదా అశోకవర్థన్‌ గగ్గాలెత్తిపోయిన ఆసుపత్రి ఆవరణ (ప్రశాంతంగా నిశ్ళబ్దంగా మారిపోయింది. ఆనందమూర్తి కర్చీపుతో కళ్ళు తుడుచుకున్నాడు. ఫణి నుదుటి మీద పట్టిన చెమటని కంగారుగా తుడుచుకున్నాడు. అందరి మధ్యా భరించలేని నిశ్శబ్ధం! నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టేలా పెద్దగా నవ్వాడు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర. ఆనంద్‌, ఫణీ ఆశ్చర్యంగా చూశారతనికేసి ఓరేయ్‌ ఆనంద్‌! చావుకీ బతుక్కీ మధ్య ఎంత చిన్న తేడారా! కళ్ళు తెరిస్తే పట్టుక కళ్ళు మూస్తే గిట్టక. ఈ రెంటికి మధ్యకాలం ఒక్క క్షణం చాలు!” ఏమిట్రా... ఖాకీ బట్టలు వేసుకుని కవిత్వం చెబుతున్నావా?” నవ్వుతూ అన్నాడు ఆనంద్‌.

“కాదు! ఏ బట్టలు వేసుకుంటేనేం? నే చెప్పింది కఠిన సత్యం. నాకు బాబు వుట్టాడు. ఎల్లుండి నామకరణం అని చెప్పడానికి నేనొచ్చాను. క్షణంలో ఇక్కడి వాతావరణం ఆ విషయాన్ని చెప్పనియ్యక విషాదంతో నిండిపోయింది. అదే మరి...” అన్నాడు వేదాంతిలా చిన్నగా నవ్వుతూ ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర.

“ఓ... కం(గ్రాచ్యులేషన్స్‌, మీనాకి కూడా చెప్పు, ఇంక తన క్రికెట్‌ ఆట చాలించమని చెప్పు. ఆడుకోడానికొక బుడతడొచ్చాడుగా!” అన్నాడు నవ్వుతూ,

“అన్నట్టు మా మీనా... అంటే వీడి వైఫ్‌ మంచి క్రికెట్‌ ప్లేయర్‌. ఎన్నో చోట్టకి టీమ్‌ కౌప్టెన్‌గా కూడా వెళ్ళింది.” చెప్పాడు ఫణితో ఆనంద్‌.

ఈ సంభాషణతో ఫణి మనసు కాస్త తేలికపడింది. “కంగ్రాట్స్‌” అన్నాడు. చేతులు కలుపుతూ ఫణి. “మీరుకూడా రండి మా ఆనంద్‌తో పొటు

డాక్టర్‌” అంటూ ఇన్‌వైట్‌ చేశాడు ఫణిని కూడా ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర. “అలాగే” తలూపాడు ఫణి 74

వెన్నెల వేట కాస్సేపు కూర్చుని “వస్తారా... డోంట్‌... ఫర్‌గెట్‌ టు కం... హర్షితకి కూడా మరీ మరీ చెప్పా. ఏదో కేసొచ్చిందని అదీ ఇదీ చెప్పి డుంకీ కొట్టక” నవ్వుతూ లేచాడు సురేంద్ర.

“శీసులూ గీసులూ అని సాకులు చెప్పడం మీ పోలీసోళ్ళ అలవాటు" అన్నాడు ఆనంట్న్‌ సురేంద్ర భుజాల మీద చేతులు వేస్తూ.

“ఓరేయ్‌! మన ఇద్దరి సర్వీసులూ అలాంటివే. ఎమర్జన్సీ సర్వీసెస్‌. అసలు నన్ను మా వాళ్ళు డ్యూటీకి పిలవకుండా, పీటల మీద కూర్చోనిస్తేచాలు” పెద్దగా నవ్వాడు సురేంద్ర.

ఆనంద్‌, ఫణి కూడా నవ్వేశారు.

ఇద్దరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర.

ఫణికి ప్రాణం లేచొచ్చింది.

సురేంద్ర వెళ్ళాక దాదాపు అయిదు నిమిషాలు ఆనంద్‌, ఫణీలు ఎవరూ ఎవరితోటీ మాట్లాడుకోలేదు.

ఫణి మనసు ఆవేశంతోనూ ద్వేషంతోనూ నిండిపోయింది. ఇక్కడి కొచ్చేముందు ఆనంద్‌ సురేంద్రకి ఫోన్‌చేసి వచ్చాడేమోనన్న అనుమానం అతణ్లో దహించేస్తోంది.

“థణీ! అయిందేదో అయిపోయింది, ఇక పైనైనా జా(గ్రత్తగా వుండు.” అని చెప్పి లేవబోయాడు ఆనంద్‌.

ఆనంద్‌ భుజాలు పట్టుకుని కూర్చోబెట్టేశాడు ఫణి.

ఆనంద్‌ మొహంలోకి తీక్షణంగా చూశాడు ఫణి. “ఆనంద్‌! నేనాలోచిస్తూన్నది ఇ్సుడు జరిగి పోయినదానికి బాధపడుతూ కాదు. శేపు జరగబోయే -దానికి

75

శారదా ఆశోకవర్ధన్‌ భయపడుతూనూ కాదు.”

“మరి?”

“నీ గురించి!”

“అంటే?”

“నువ్వు ఇంత తెలివిగలవాడివి ఎప్పుడయ్యావా అని”

“నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు.”

“కాదు! యూ... ఆర్‌...ఎ...గ్రేట్‌ ఏక్టర్‌!.. నాకు తెలీని పోలీన్‌ కజిన్‌ నీకెక్కడ నుంచి సడన్‌గా ఊడిపడ్డాడు? పైగా బారసాలకి పిలవడానికి ఈ రాత్రిపూటే పనిగట్టుకుని రావాలా? అదీ నువ్వు ఇంట్లో ఉండకపోయినా నిన్ను వెతుక్కుంటూ, ఇదంతా ఆశ్చర్యంగా లేదూ? ఎంత పిచ్చి వాడికైనా నువ్వు తెలివిగా చేశాననుకున్న చేశాననుకున్న పని క్షణం ఆలోచిస్తే ఇది నీ ప్లానని ఇట్టే తెలిసిపోతుంది. మైడియర్‌... ఫండ్‌... నన్ను పోలీసులకప్పగించాలనుకుంటున్నావా?” ఆవేశంతో, కోపంతో ఊగిపోతూ ఒక్కొక్క మాటే నొక్కి పలుకుతూ అన్నాడు ఫణి.

ఆనంద్‌కి నోట మాట రాలేదు.

“ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావ్‌ ఫణీ! ఇటువంటి పాడు ఆలోచనలు నాకు ఛస్తే రావు. ఆ సంగతి నీ అంతరాత్మకి తెలుసు. అయినా నన్ను బాధ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఇట్టా మాట్టాడుతున్నావ్‌!”

“కాదు. ఉన్న మాటే అంటున్నాను.”

“ఫణీ! పిచ్చి పిచ్చిగా వాగకు. ఇనొస్పిక్టర్‌ సురేంద్ర మా బాబాయిగారబ్బాయి. ఐపి.ఎన్‌.కి సెలక్టయి, ఫస్టు పోస్టింగ్‌ కడపలో చేసి వారం రోజుల (క్రితమే ఇక్కడికొచ్చాడు. వాడికి బాబు పుట్టీ మూణ్ఞైల్లయ్యింది. మీనా

76

వెన్నెల వేట వాళ్ళమ్మగారింటినుంచి మొన్ననే వచ్చిందట. ఈ సంగతి రెండ్రోజుల క్రితం ఫోన్‌లో చెప్పాడు. ఈ రోజు పిలవడానికివస్తానని కూడా చెప్పాడు. అయితే ఇంతలోనే ఈ గొడవ జరిగి నువ్వు ఒంటరిగా క్షినిక్‌కి రావడం చూసి వామనరావు కొడుకు నీతో ఏదైనా గొడవ పడితే సర్టి చెబుదామనే జెద్దేశ్యంతో నీవెనకే నేనూ వచ్చాను.” నెమ్మదిగానే అన్నా ఖచ్చితంగా అన్నాడు ఆనందమూర్తి.

“స్టాప్‌... యువర్‌.. స్టోరీన్‌.. ఐ...సే.”. ఏహ్యభావంతో అన్నాడు ఫణి. ఆనంద్‌కి ఎంత ని(గ్రహించుకోవాలని చూసినా కోపం ఆగడం లేదు.

“ఫణీ! నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు ఏం వాగుతూన్నా, మనం ఇద్దరం చిన్నప్పటి స్నేహితులం, (ప్రస్తుతం ఇద్దరం గౌరవనీయమైన వైద్య వృత్తిలో వున్నాం అని సహిస్తూ వచ్చాను.”

“లేకపోతే ఏం చేస్తావేమిటి? నేను 'ప్రేమిస్తున్నాని తెలిసి కూడా హర్షితను పెళ్ళి చేసుకున్న (ద్రోహివి. నువ్వా స్నేహాన్ని గురించి మాట్టాడేది?” పళ్ళు పటపట కొరికాడు కోపంతో ఫణి.

“ఫణీ! నీకు నిజంగానే పిచ్చెక్కింది. లేకపోతే ఏమిటా మాటలు? ప్రేమంటే ఏదో ఒక మందు నీ ఇష్టం వచ్చింది పేషంటుకిచ్చేసి పంపించడం అనుకున్నావా? ఏమందిచ్చినా నయం అవడం అవకపోవడం వాళ్ళ ఖరా, గనికొదిలేసి డబ్బులాగే వ్యాపారంగా మార్చుకున్న వ్యవహారం అనుకున్నావా? నువ్వు హర్షితని (ప్రేమిన్తున్నావని గోలపెడితే సరా? ఆమె నిన్ను ప్రేమిస్తోందో లేదో తెలుసుకోనక్కర్లేదా? ఆమెని నువ్వు ్రేమించావు. కానీ ఆమె నన్ను ప్రేమించింది. నన్ను ఆరాధించే ఆమెను నేను పెళ్ళి-చేసుకోవడం తప్పెలా అవుతుంది?”

“షటప్‌! నేనామెను ప్రేమిస్తున్నాని తెలిసి, నువ్వు కావాలనే ఆమెను వలలో

77

శారదా అశోకవర్ధన్‌ వేసుకోవడానికి ప్రయత్నించావు. నా కన్నా నాలుగడుగులుముందుకెళ్ళి ఆమెని పెళ్ళి చేసుకున్నావు. నీది మొదటి నుంచి కుళ్ళుబుద్దే! అంతా నటనే! నీ స్నేహం, నీ అభిమానం ఆంతా నటనే! అసలు హర్షిత మీద నువ్వు చూపిస్తున్న (ప్రేమా గీమా అంతా కూడా నాటకమేనని నా అభిప్రాయం”

ప్రతి అక్షరాన్ని కక్షతో నొక్కి నొక్కి పలుకుతూ అన్నాడు ఫణి.

ఫణి అంటూన్న (ప్రతిమాటా ఆనందమూర్తి గుండెల్లో ముళ్లులా గుచ్చుకున్నాయి. కోపం, అసహ్యం రెండూ ఆనందమూర్తి మనసులో గరళంలా నిలిచి, కళ్ళు ఎజ్జబడ్డాయి. “షటప్‌... అండ్‌...స్టాప్‌.. దిన్‌ నాన్సెన్స్‌” అంటూ పెద్దగా అరిచేశాడు. ఆపుకోలేని ఆవేశంతో ఆనంద్‌.

ఆకేకకి నర్సింగ్‌హోంలోని నర్సులూ, వార్డ్‌ బాయ్‌లు, కొందరు పేషంట్టు అందరూ పరుగెత్తుకొచ్చారు.

  • కానీ, ఎవ్వరూ గదిలోపలికి వెళ్ళడానికి సాహసించలేదు. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేంత "స్నేహితులు. ఒకరంటే ఒకరికి 'ప్రాణమిచ్చుకునేంఛ స్నేహితులు, చిన్న నాటి క్లాస్‌మేట్స్‌, ఎప్పుడూ సరదాకి, కూడా గట్టిగా కేకలేసుకుని ఎరుగని ఈ మిత్రులు ఇవాళ ఇలా ఎందుకు గంటల తరబడి దెబ్బలాడుకుంటున్నారో ఆర్థం కాలేదు. షాక్‌ కొట్టిన వాళ్ళలా ఎవరికి వారీ మూగగా వుండిపోయారు.

“నిజం చెబితే వంత ఉక్రోషమో”... ఎగతాళిగా అన్నాడు ఫణి. “హూ! ఫణీ! నిజం చెప్పడమనేది నీ డిక్షనరీలోనే లేదు. నీ నరనరంలోనూ “నిండుకున్నది అసూయా, ద్వేషం. నీ కన్నా ఎవరూ ఎక్కువగా వుండకూడదు. అందరూ నీమోచేతికింద నీరు తాగుతూన్నట్టు పడుండాలి. అందరూ నిన్ను తప్ప ఎవ్వరినీ పొగడకూడదు.” . 78

వెన్నెల వేట

“ఓ.. గొప్ప రిసర్చ్‌ చేశావన్నమాట నా మీద.”

వ్యంగ్యంగా అన్నాడు ఆనందమూర్తిని ఇంకా వుడికించాలనే ధోరణిలో.

“ఆవునురా! నీ గురించి ఏనాడో రిసెర్చ్‌ చేశాను. అసలు నీలాంటి వాళ్ళికి ఫారిన్‌లో శాడిస్ట్‌ అనో సైకిక్‌ అనో ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తారు. నీలో పేరుకుపోయి వున్నది స్వార్థం తప్ప ఇంకేమో కాదు. కేవలం నిన్ను నువ్వు 'ప్రేమించుకుంటావు అంతే! చిన్నప్పుడు నీ సొంత తమ్ముడు హరి నీకన్న రన్నింగ్‌ రేసులో ముందున్నాడని, వాడికడ్డం వెళ్ళి కాలికి మెలికేసి పడేసి నువ్వు ముందు పరుగెత్తావు. వాడుపడి కాలు బెణికి పదిహేనురోజులు మంచంపట్టాడు సరే. నువ్వు చేసిన వెధవపనికి, నీకు బహుమతిరాకపోగా నిన్ను డిన్‌క్వాలిపై చేశారు. నీకు బహుమతి రాలేదన్న బాధకన్నా వాడికి రాకుండా చేశావన్న తృప్తి నీకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది శాడిజమ్‌ కాదా?” చెప్పడం ఆపి పక్కగ్హాసులో వున్న మంచి నీళ్ళు తీసి గడగడా తాగేశాడు. నీటి చల్లదనానికి కాస్త ఆవేశపు వేడి చల్చారినట్టయింది.

“ఫణీ! నీ కన్నా నీ చెల్లెలికి ఎక్కువ మార్కులొచ్చాయని తెలిసి, మీ అమ్మా నాన్నా అర్భనని పొగడడం చూసి, ఆమె నోట్‌ పుస్తకాలు చింపి పారేసి ఏమీ తలినట్టు కూర్చున్నావు. అది చూసిన నేను నిన్ను చీవాట్లు పెట్టి మీ నాన్నగారికి చెప్తానంటే, చెప్పొద్దని కాళ్ళమీద పడితే మరోసారి చెయ్యొద్దని వార్నింగ్‌ ఇచ్చి వదిలేశాను గుర్తులేదూ? ఒరేయ్‌! ఇప్పటికీ నీకు నీ రక్త సంబంధమున్న వాళ్ళ మీద కూడా కొంచెం కూడా (ప్రేమ లేదు. అభిరాం ఆమెరికా వెళ్ళాడని అసూయి, అర్చన పెద్ద రిసెర్చ్‌ స్కాలర్‌ అనీ ఆమె, భర్త సైంటిస్టని నీకు కొంచెమైనా గర్వం ఆనందం లేకపోగా అసూయ. ఆ ఆసూయవల్ల ద్వేషం! నీ కెంతసేపూ “నేనూ.... నా” అనే అహం తప్ప ఎదుటివారి పచ్చ గిట్టదు.

ఒరేయ్‌! ఈ (ప్రపంచంలో మూడు రకాల మునుషులుంటా6(ర్రా. మొదటి

ం9

శారదా అశోకవర్థన్‌ రకం వారు, వారి కోసం ఏమీ కోరుకోరు. “స్వామీ! భగవంతుడా! ఈ దేశాన్ని ఈ మనుషలందరినీ రక్షించు” అని దేవుణ్ని వేడుకుంటారు. వారిని ఉత్తములంటారు. పీఠాధిపతులు, మతాధిపతులూ, బాబాలూ, గాంధి 'మొదలైనవారంతా ఆ కోవకు చెందిన వాళ్ళు.

“ఇక 'నన్నూ నా కుటుంబాన్ని నా వాళ్ళందరినీ రక్షించుదేపా! అని వేడుకుంటారు. వారిని మధ్యములంటారు.

ప్లోతే మూడోరకం మనుషులుంటారు. వాళ్ళు ఎంతసేపూ, 'నాకు లేకపోయినా పరవాలేదు కొనీ నా పక్కవాళ్ళకీ నాతో బుట్టవులకీ వాళ్ళందరికి నా కన్నా ఎక్కువ వరాలిచ్చి కాపాడకు' అని ప్రార్థిస్తారు. వీరినే అధములంటారు.

ఫణీ! నువ్వు ఆ కోవకు చెందిన వాడివిరా. (ప్రతిక్షణం ప్రతి వ్యక్తి ముందు. నీ ఆధిక్యతని చూపించుకోవాలనే నీ ఆరాటం; అందరికన్నా నువ్వే ధనవంతుడివనీ, గొప్పవాడివనీ, అనిపించుకోవాలనే నీ ఆబ తప్ప నీకు నిజమైన ప్రేమ ఎవ్వరి మీదా లేదురా! నీ ప్రేమ కల్తీ! నీ అభిమానం కల్తీ! నీ స్నేహం కల్రీ! నువ్వు కల్తీ!”

ఆవేశంతో మాట్టాడలేక క్షణం ఆగాడు ఆనందమూర్తి, _ ఫణి టేబుల్‌ మీదున్న లెటర్‌ ప్యాడ్‌ మీద బాల్‌పెన్నుతో ఏవో పిచ్చిగీతలు

గీస్తూ కూర్చున్నాడు.

ఆనందమూర్తి ఆవేశం ఆగడం లేదు. రెచ్చగొట్టిన పుల్లిలా వున్నాడు. అన్ని విషయాలు మాట్లాడి ఈ రోజుతో అతని స్నేహం నిలవడమో, తెగిపోవడమో నిర్ణయంచుకోవాలనుకున్నాడు. అందుకే మళ్ళీ మొదలెట్టాడు:

ఆంతలో ఫోన్‌ మోగింది!

రిసీవర్‌ తీసి “హల్లో” అన్నాడు!

80

వెన్నెల వేట అవతలి నుంచి మాట్టాడుతూన్నది హర్షిత. “ఏమిటి? ఇంతసేపయింది? మన వెడ్డింగ్‌ డే అంతా ఫణి క్లినిక్‌లోనేనా? భోజనం చేసేదెప్పుడు? పన్నెండవుతోంది. పదార్థాలన్నీ చల్దాగా అయిపోయాయి. రండి “అని! “హర్షితా! నువ్వూ, లతికా భోంచెసెయ్యండి. మాకు ఇంకాస్తటైం పడుతుంది” అంటూ పెట్టేశాడు.

“ఒరేయ్‌! నువ్వు హర్షితని (ప్రేమించానంటున్నావ్‌! ఎన్నిసార్హు ఆమె బాధపడేటట్టు సూటిపోటి మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నావు. నిజంగా ప్రేమించే మనసు ద్వేషించగలదా? సరిగ్గా ఈ రోజుకు మా పెళ్ళయి రెండేళ్ళు పూర్తయ్యాయి. హర్షిత కొన్ని నెల్లో తల్లికాబోతుంది!..”

ఫణి తలెల్తి ఆనందమూర్తికేసి చూశాడు.

“అవును. ఈ రోజు ఈ వార్తని భోజనాలయ్యాక స్వయంగా హర్షిత మీకు చెప్పాలనుకుంది. అలా జరగక నేను ఇక్కడ చెప్పాల్పొచ్చింది. నీ పెళ్ళయి కూడా సంవత్సరంన్నర దాటింది. లతిక కూడా మంచిపిల్లే! కాకపోతే, నీలో వున్న అసూయ, ద్వేషాలు పెద్దగా లేకపోయినా ఒక్క గుణం మాత్రం నీలాగే వుంది. అది అందరికంటే తాము అధికులమనిపించుకోవాలని పట్టుపట్టడం, డాక్టర్‌ కుముదిని వాషింగ్‌ మెషిన్‌ కొంటే అలాంటిదే అయినా అంతకన్నా కొంచెం ఎక్కువదే అయినా కొనాలని, కొనేదాకా నిద్రపోకపోవడం ఈ రకమయిన పోటీ మనస్తతత్వం ఆమెకీ వుంది. బహుశః లోవర్‌ మిడిల్‌క్టాసునుంచి వచ్చిన ఆ అమ్మాయికి, సడన్‌గా నీ సంపాదన బంపర్‌ లాట్రి కొట్టినట్టయింది. ఆందుకే ఆడంబరాల మీద అంతే మోజు. ఈ ప్రవర్తన వల్ల తన గొప్పతనాన్ని చాటుకోలేక ప్రతీసారీ ఫయిలయిపోతోంది!”

“ఇదంతా నీకెలా తెలుసు?” ఫణి ఆశ్చర్యంగా ప్రళ్నించాడు.

81

శారదా ఆశోకనర్ధన్‌

“ఫణీ! కాస్త సైకాలబీ అర్ధం చేసుకునే మనిపైతే ఎవరికైనా అర్థమవుతుంది. డాక్టర్షయి వుండి ఆ మాత్రం సైకాలజీ అర్ధం కాదా? మనుషులకి మంచి మందివ్వడంతో పాటు వాళ్ళ మనస్తత్వాన్ని కూడా ప్టడీ చేస్తేనే మంచి డాక్టరుగా వాళ్ళ ముందు పరిగణింపబడతాం.” ఫణి తలవంచుకుని మళ్ళీ కాగితం మీద గీతలు గియ్యడం మొదలెట్టాడు.

“ఫణీ! మనిషికి పట్టదల వుండాలేగానీ, సాధ్యం కానిదేదీ వుండదు -

  • ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు,

మనుసు విరిగెనేని మరి ఆతుకునేర్చునా" అని వేమన అన్న మాట అక్షరాలా నిజమే! విరిగిన మనసు అతుక్కోవడం కష్టం! అయితే కారు మబ్బు పట్టిన ఆకాశం వర్షించాక మామూలుగా మారినట్టు మనసుకు పట్టిన మబ్బును, కృషితో, కార్య దీక్షతో పట్టుదలతో నిజాయితీతో - ఆంటే నిజమైన పశ్చాత్తాపంతో = కడిగేసి మనసులనూ మమతలనూ కలుపుకోవడానికి ప్రయత్నించొచ్చు! అది చాలా కష్టం. ఈ ప్రొసెసింగ్‌లో మనిషికొత్త సమస్యలు సృష్టించుకుంటాడు. అందుకే మనస్సులు అతుక్కునే బదులు మళ్ళీ విడిపోతాయి. నూటికో కోటికో ఏ ఒక్కరికో తప్ప మనస్సులను అతికించే ఓపిక ఎవ్వరికీ వుండదు. అందుకే వేమన 'మరి ఆతకబడవు' అని స్పష్టంగా చెప్పేశాడు. ఫణీ! జెలసీ అండ్‌ ఇగో అసూయా, ఆహం ఈ రెండే ప్రధాన కారణాలు మనుషుల మధ్య అకారణ శత్రుత్వాని కలిగించడానికి” ఆంటూ అలిసి పోయినవాడిలా కుర్చీకి ఆనుకుని కూర్చున్నాడు.

“అయిందా నీ ఫిలసాఫికల్‌, సైకాలాజికల్‌, సోషల్‌ ప్రాబ్లమ్స్‌ మీద లెక్బరు. సరిగ్గా మూడు గంటలు సుత్తికొట్టావ్‌!” అన్నాడు ఫణి ఆవేశం చల్చారిన స్వరంతో,

82

వన్నెల వేట

“ఫణీ! మూడు గంటలు సుత్తికొట్టాను కనుకేనీలోని ఆవేశం కొంచెమైనా తగ్గింది. నువ్వు సుత్తి అనుకున్నా కత్తి అనుకున్నా నాకు కావలసింది నువ్వు మారడం. మన స్నేహం కలకాలం నిలవడం. అంటే!” అన్నాడు గద్దదస్వరంతో ఆనందమూర్తి.

మళ్ళి ఫోనుమోగింది.

ఈ సారి ఫణి తీశాడు ఫోను.

“భోజనానికి రారా! అక్కడే పడుకుంటారా ఏమిటి? ఇప్పుడు టైమెంతయిందో తెలుసా ఫణీ?” అడిగింది హర్షిత.

“వచ్చేస్తున్నాం. ముందు వెడ్డింగ్‌ అనివర్భరీతో పాటు రాబోయే పాపాయికి కూడా స్వాగతం పలుకుతూ కం(గ్రాచ్చులేషన్స్‌ చెబుతున్నాను. స్వీకరించు” అన్నాడు.

“థ్యాంక్యూ... ఆయితే ఆనంద్‌ చెప్పేశాడన్నమాట! అదిసరే ఇంక కబుర్హు మాని ఇంటికి రండి. లతిక నిద్రపోతోంది కూడా!” అని ఫోన్‌'పెట్టేసింది హర్షిత.

“అబ్బ! తుఫానొచ్చి వెలిసినట్ట్బంది” అన్నాడు ఆనందమూర్తి.

“నన్ను క్షమించు ఆనంద్‌” అన్నాడు ఫణి,

“ఇది నీకెప్పుడూ ఆలవాటేగా! తప్పుచెయ్యడం, క్షమాపణ అడగడం. ఫణీ! ఈసారి అసలు తప్పు చెయ్యకుండా వుండడానికి ప్రయత్నించు” అంటూ కుర్చీలోంచి లేచాడు ఆనందమూర్తి. ఇద్దరూ డోర్‌ తెరుచుకుని చిరునవ్వుతో బయటికి రావడం చూసి, నర్సింగ్‌హోం స్టాఫంతా ఎంతో సంతోషించారు. యుద్ధం వొచ్చి ఆగిపోయినంతగా రిలీఫ్‌ పొంది, తృప్తిగా నిట్టూర్చారు.

నర్సింగ్‌ హోంగేటు బారాల్ల తెరిచి రెండు కార్గూ ఒకదాని 'వెనకే వొకటి పోతూవుంటే, సెల్యూట్‌ చేశాడు వాచ్‌మెన్‌: నిశిరాత్రి చీకట్టో దీపాల వెలుగుల్లో

83

శారదా ఆశోకవర్ధన్‌ రెండు తెల్లని మారుతీకార్టూ, వన్నెల ముద్దల్లా అగుపిస్తున్నాయి. కదిలే మంచు కొండల్లా అనిపిస్తున్నాయి. కార్ల చప్పుడు విని వరండా లైటు వేసి బయటికొచ్చారు హర్షిత, లతికలు. ఏం గొడవ జరిగిందో అని భయపడుతూన్న హర్షిత ఇద్దరూ నవ్వుకుంటూ రావడం చూసి “హమ్మయ్య?” అనుకుంది. లోపలికెళ్ళి పదార్థాలన్నీ వేడి చేసింది హర్షిత, టేబుల్‌ మీదున్న గ్లాసుల్లో మంచినీళ్ళు పోస్తూ “మీరిద్దరూ ఇంతవరకు రాకపోతే ఏదైనా ఘర్షణ పడుతున్నారా లేక ఏమైనా గొడవ జరుగుతోందా అని హడలి చచ్చాను” అంది తన మామూలు ధోరణిలో లతిక! ఫణి గతుక్కుమన్నాడు. వెంటనే తేరుకుని “ఆయినా నీకెప్పుడూ పిచ్చి అనుమానాలే! అయినా నీ నోట్లో ఏదో మచ్చ వున్నట్టుంది. శుభం పలకమంటే ఏదో వాగుతావ్‌” “అంటే నా అనుమానం నిజమే నన్నమాట"”। “నోర్ముయ్‌! అపశకున పక్షి!” “ఏమిటా మాటలు అర్థం పర్థం లేకుండా.” విసుక్కుంది లతిక, ఇది చినికి చినికి గాలివానవుతుందన్న భయంతో, “మీరిద్దరూ ఎప్పుడూ ఇలా పిల్లీ ఎలకలాగా పోట్టాడుకుంటూ వుండకపోతే హాయిగా చిలకా గోరికల్లా వుండొచ్చుగా” ఆంది నవ్వుతూ హర్షిత, అందరూ భోజనానికి కూర్చున్నారు. “గుత్తాంకాయ కూర, కొబ్బరన్నం, పాయసం, సాంబారు, కొబ్బరి పచ్చడి ఓహో! ఇనన్నీ నువ్వే చేశావా?” అడిగాడు ఫణి, “లేకపోతే మ్యాజిషియన్‌ చేశాడనుకున్నవా?” అంది హర్షిత. “గుత్తాంకాయి, బ్రహ్మాండం, ఇంకొంచెం వెయ్యి” ఆంటూ స్లేటు చాపాడు వ!

వెన్నెల వేట ఫణి.

“నేను చేస్తే ఒక్క రోజన్నా ఇలా పొగిడారా?”"మూతి ముడుచుకుంది లతిక.

“నువ్విలా చేస్తేగాగ్‌ బదులు చెప్పాడు ఫణి,

“లతికా! ఈ మగాళ్ళకెవ్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి!” అంది హర్షిత నవ్వుతూ, వాతావరణం భోజనాలముందు సీరియన్‌ కాకుండా ప్రయత్నిస్తూ. ఆ తరువాత సంభాషణంతా సినిమాల గురించీ, పాత సినిమా యాక్టర్త గురించి, పాత పాటలగురించీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళం గురించి, ఎమ్‌.ఎస్‌.సుబ్బలక్ష్మి గురించీ, బాలసుబ్రమణ్యం పలికే రకరకాల రాగభ్దావాల గురించీ హాయిగా జరిగింది.

శైము రెండు రూములు దాటింది.

“ఇక వెళ్తాస్తాం. చాలా రాత్రయిపోయింది.” లేచాడు ఫణి.

“ఈరాత్రికిక్కడ పడుకోండి. చాలా పొద్దుపోయింది. రేప్పాద్దుటే లేచి వెళ్ళురు గాని” అన్నాడు ఆనందమూర్తి. “నో....నో...వెళ్లాలి. పొద్దుటే బద్దకిస్తే ఆలస్యంగా లేస్తే రేపు లంచ్‌ కూడా ఇక్కడే అవుతుంది. హర్షిత బాబు వాళ్ళమ్మని ట్రబుల్‌ చేస్తున్నానని తిట్బకుంటాడు. బై”... ఆంటూ బయటికి నడిచాడు ఫణి

“విష్‌... యు... ఆల్‌ది బెస్ట్‌”... అని ఫణి వెనకాలే వెళ్ళింది హర్షితకి బై చెబుతూ లతిక,

అలిసిపోయిన హర్షిత వాళ్ళు వెళ్లగానే తలుపులు వేసొచ్చి డ్రెస్సు మార్చుకోవడానికి బాత్‌రూం వైపు వెళ్లింది, నైటీ తీసుకుని. నైటీ మార్చుకుంటూన్న హర్షిత బాత్‌రూం వెంటిలేటర్‌ లోంచి కనబడ్డ వ్యక్తిని చూసి కెవ్వుమంది!

85

శారదా అశోకవర్ధన్‌

ఆ కేకకి పరుగెత్తుకొచ్చాడు ఆనందమూర్తి. హర్షిత బాత్‌రూం తలుపు దభాల్న తెరిచి ఆనందమూర్తిని గట్టిగా పట్టుకుని వొణికిపోతూంది.

“హర్ష్మీ ఏమయింది? ఏమయింది? అలా వొణికిపోతున్నావు” ఆమెను గట్టిగా కౌగిలించుకుని వీపుపై నిమురుతూ అడిగాడు ఆనందమూర్తి.

“ఎవరో... ఎవరో బాత్‌రూము వెంటిలేటర్‌ ఎత్తి నాకేసి చూస్తున్నాడు”

“ఆ!..4” అంటూ ఒక్క అంగలో బాత్‌రూంలో కెళ్ళి స్టూలెక్కి వెంటిలేటర్‌ ఎత్తి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. చుట్టు పక్కల .

“హర్ష్మీ ఎవరూ లేరోయ్‌, నీ నీడని చూసి నువ్వే భయపడుంటావు.” నవ్వుతూ ఆమె బుగ్గలు నిమురుతూ అన్నాడు.

“కాదానంద్‌! ఎవరో వుండాలి.... నాకేదో .... భయంగా వుంది” చెప్పడం ఆపింది.

గబుక్కున ఫణి మొహంలా అనిపించింది.”అంది భయంగా. ఆనంద్‌ పెద్దగా నవ్వేశాడు.” హర్షీ! అంతా నీ ఊహ! ఇమాజీనేషన్‌. మనముందేకదా వాళ్ళిద్దరూ కార్గో వెళ్లిపోయింది. నీకు వెంటిలేటర్‌. దగ్గర ఎలా కనిపిస్తాడు. పైగా ఫణి ఎంత దుర్మార్గుడయినా అలాంటి పని చెయ్యడు. అతడొక డాక్టరు” అన్నాడు హర్షితని నవ్వించడానికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ, “అవును నిజమే! ఇంకెవరో దొంగ అయి వుంటాడు.” అంది హర్షిత.

“నేను చుట్టు పక్కల చూశానుగా! ఎవ్వరూ లేరు. దొంగే అయినా పారిపోవడానికి కొంత టైము పట్టాలి కదా! నువ్వే ఏదో చూసి భయపడుంటావు. బాగా టైర్డ్‌ అయిపోయావు. పద ని(ద్రపోదాం.” అంటూ ఆమెని మంచం దాకా నడిపిన్తూ తీసికెళ్ళాడు ఆనందమూర్తి. హర్షిత మనస్సులో మాత్రం వెంటిలేటర్‌లోంచి కనిపించిన కళ్లు తననే చూస్తున్నట్టనిపిస్తూ వుంటే, “ఆనంద్‌!

656

వెన్నెల వేట

  • అంటూ అతడికి మరింత దగ్గరగా జరిగి పడుకుంది.

(ఎవరతను? ఎవరివా కళ్లు? ఆనంద్‌ అన్నట్టు ఆది తన (భ్రమా? కాదు... తను స్పష్టంగా చూసింది! ఏమో! ఏమీ అర్థం కావడం లేదు" అనుకుంటూ ఆనంద్‌ చెప్పే కబుర్జు వింట్ళూ నిద్రల్లోకి న్రారుకుంది హర్షిత.

తలంటిపోసుకుని జుట్టుకు కట్టుకున్న ముడి విప్పి టవల్‌ తీసి ఆరేసి జుట్టు దులుపుకుంటూ బాల్కనీలో పడుతూన్న నీరెండకి జుట్టారబెట్టుకుంటూ, వేళ్ళతో చిక్కులు తీసుకుంటూ కూర్చుంది హర్షిత. నిమ్మపండు రంగుకి మెరూన్‌ బార్డర్‌ కొట్టొచ్చినట్టుగా కనబడుతూన్న బెంగాల్‌ సిల్క్‌చీర ఆమె శరీరానికి మరింత వన్నెతెచ్చింది. కుంకుడు గింజంత మెరూన్‌ కుంకంబొట్టు ఆమె విశాలమైన ఫాలభాగంలో చందమామలా మెరుస్తోంది. తీర్చి దిద్దుకున్న కాటుకరీఖలు కళ్ళకు మరింత అందాన్నిస్తున్నాయి. ఎడంచేతి మునివేళ్ళతో చిక్కులు తీసుకుంటూ కుడిచేతిలోని బిస్కట్టును మెల్లగా కొరుకుతూ, పూలకుండీలో ఉన్న గులాబీ మొక్కల సౌందర్యాన్ని చూస్తోంది హర్షిత,

సౌందర్యాధనలో ఉన్న హర్షిత కాల్‌టెల్‌ వినగానే ఉలిక్కిపడి లేచింది. తలుపు తీసి ఆశ్చర్యంగా “నువ్వా” అంది.

“ఓం? నేను నేనుగా కనబడ్డం లేదా?” అన్నాడు.

“ఫణీ! ఎప్పుడూ నువ్విలాంటి పిచ్చిమాటలే మాట్టాడుతావు. ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా చెపుతావు తప్ప, సమాధానం తిన్నగా చెప్పవు. అంతా డొంక తిరుసడే” అంది చిరుకోపంతో.

“హర్షిత! ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు” అన్నాడు ఆమె చెప్పే మాటలని పట్టించుకోకుండా ఫణి.

అప్పుడప్పుడు ఆతడామెని అలా పొగుడుతూనే ఉంటాడు. అది హర్షితకి

87

శారదా ఆశోకవర్ధన్‌ అలవాటే. అయినా ఈరోజెందుకో అతని పొగడ్త అసహ్యంగా అనిపించింది. “ఇలాంటి చీరే ఒకటుంది ఆ షాపులో. లతికకి కొని పట్టుకెళ్ళు” అంది. ఫణి పెద్దగా నవ్వాడు.

“ఎందుకు నవ్వుతావు? కనీసం చీర కొనుక్కొచ్చావని లతిక సంతోషిస్తుంది,”అంది హర్షిత.

“అందం చీరవల్ల మనిషికి రాదు. కట్టుకున్న మనిషివల్ల చీరకి అందమొస్తుంది. కొందరు ఎంత మంచి చీర కట్టుకున్నా, ఆ చీర అందం పోతుంది. కొందరికి ఎంత పిచ్చి చీరైనా, కొట్టొచ్చినట్టు ఎంతో అందంగా ఉంటుంది,” వివరించాడు ఫణి.

“అచ్చు ఆడవాళ్ళలా మాట్లాడుతున్నావు” అంది హర్షిత.

“ఏం! మాటలు ఆడవాళ్ళకే వచ్చా?”

“ఫణీ! నీకీపూట పనేంలేదా? తీరిగ్గా ఈవేళప్పుడొచ్చావ్‌? అయినా టైం ఈజ్‌ మనీ కదా నీకు?” చెప్పింది హర్షిత.

“అదుగో ఆ మాటలే వద్దన్నాను. డబ్బెవరికి చేదు? ఆనంద్‌కి వొద్దా? నీకొద్దా? అయినా ఏమిటో కొందరు నాలా ముద్రపడిపోతారు. అంత డబ్బే ముఖ్యమనుకొంటే, ఇప్పుడు నిన్ను చూడ్డానికెందుకొస్తాను?”

“అదే నాకర్థం కావడం లేదు” అంది దువ్వెనతో చిక్కులు తీసుకోవడం పూర్తిచేసి, వాదులుగా జడల్గుకుంటూ.

“రాత్రి నువ్వు కల్టోకొచ్చావు”

ఉలిక్కిపడింది హర్షిత. “నేనా?” అంది ఆశ్చర్యంగా. ఆమె కళ్లు అతడి మనస్సునూ, అతడి కళ్ళనూ చదవడానికి ప్రయత్నిస్తున్నాయి. రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. బాత్‌రూం వెంటిలేటర్‌లోంచి చూస్తున్న కళ్ళు

88

వెన్నెల వేట ఆక్షణంలో ఫణి కళ్లలాగే అనిపించాయ్‌. ఆనంద్‌ ఆ మాటలను కొట్టి పారేయడంతో ఆ అనుమానాన్ని తానూ తోసిపుచ్చినా, ఎందుకనో పూర్తిగా ఆనంద్‌తో ఏకీభవించలేకపోతోంది. అలాగని అవి వణి. కళ్ళేననీ చెప్పలేకపోతోంది.

“హర్షితా! ఏమిటలా కొత్తగా చూస్తున్నావ్‌ నాకేసి?” అడిగాడు ఫణి.

ఆతని మాటలతో ఈ లోకాని కొచ్చిపడింది హర్షిత.

వెంటనే తమాయించుకుంది. "ఏం లేదు ఫణీ... ఇంత ఖాళీగా ఉంటే లతికను కూడా వెంటబెట్టుకొనెస్తే బావుండేదిగా! ఇద్దరం హాయిగా షాపింగ్‌కైనా పోయుండేవాళ్ళం.”

“ఓయమ్మో... లతికతో షాపింగా? “హైదరాబాద్‌ చార్మినార్‌కెళ్ళి గాజులతో ప్రారంభించి, కోఠీలో ఉన్న పట్టుచీరెల దుకాణాలన్నీ చుట్టేసి, ఆబిడ్స్‌లోని నగల దుకాణంలో వజ్రాల దగ్గర్నుంచీ అన్ని వస్తువులు చూసేసి, చివరికేవో పిచ్చివి కొనుక్కువస్తుంది. కొన్ని వేలు తగులబెట్టి సంతోషంగా ఇంటికొస్తుంది. డబ్బు విలువ అసలు తెలీదు. పోనీ మంచి టేస్టు ఉందా ఆంటే అదీలేదు. పిచ్చి టేస్టూ అదీనూ.”

ఫణీ! పెళ్ళాం గురించి ఇతరులతో ఈవిధంగా మాట్టాడ్డానికి నీకు సిగ్గుగా లేదూ! ఆమెకి టేస్టు లేకపోతే నువ్వు కూడా వెళ్లి, నీకు నచ్చినవి కొనొచ్చుగా! కట్టుకున్న భార్య గురించి ఎంత దగ్గరివారైనా సరే హేళనగా మాట్టాడితే అవతలివాళ్ళు ఇంకా చులకన చేస్తారు. గుర్తుంచుకో! ఆమెను నీకు నచ్చినవిధంగా మలుచుకోవడం, నీ చీతిలో వుంది. నువ్వు అలా చేస్తే నీకు నచ్చిన విధంగా తృప్తి పొందడమే కాక ఆమెని కూడా సంతృప్రిపరచిన వాడీవవుతావు. (ప్రతీసారీ ఆమె ఏం కొన్నా బాగులేదంటే ఆమె కూడా

89

శారదా అశోకవర్ధన్‌ విసిగిపోయి మొండికెత్తుతుంది.-నువ్వు ఆమెను గురించి మాట్టాడినట్టే, ఆమె కూడా నీ గురించి మాట్టాడుతుంది. అప్పుడు వినేవాళ్ళకు మీ గురించి చెడ్డ అభిప్రాయం కలుగుతుంది.”

పెద్దగా చప్పట్టు కొట్టాడు ఫణి.

చెప్పడం ఆపి ఫణికేసి చూసింది.

“వాల బాగుంది నీ ఉపన్యాసం. ఈ మాటలన్నీ లతికని కూర్చోబెట్టుకుని చెప్పరాదూ! కాస్త బాగుపడుతుందేమో? అయినా తులసిచెట్టు తులసి చెట్టే, తుమ్మదచెట్ట తుమ్మచెట్టే! పక్క పక్కన పెట్టినంత మాత్రాన, తులసివాసన తుమ్మకొస్తుందా? నీ చదువూ, సంస్కారం, నీ ప్రవర్తనా లతికకి ఈ జన శైలో కాదు సరికదా, ఇంకొక జన్మ ఎత్తినా రాదు,” అన్నాడు హర్షితకేసి చూసి నవ్వుతూ.

“ఫణీ! పరాయి స్త్రీని నీ భార్య లేనప్పుడు పొగడడం, భార్యని చులకన చేసి మాట్టాడడం నీ సంస్కారమా?” నవ్వుతూనే చురకపెట్టింది హర్షిత.

“ఒకప్పుడు నీ ప్రేమకోసం తపించిన (ప్రేమ పూజారిని. ఇప్పటికీ మనందరం మంచి స్నేహితులం. ఆమాత్రం చనువు తీసుకుని మాట్లాడడం నేరమా? ఒకప్పుడు నీ ప్రేమకోసం జపించి, తపించి, నశించిన సామాన్య (ఫేమికున్లి! నేను ప్రేమించిన వ్యక్తిని నా మిత్రుడు కొట్టేసినా ఏమాత్రం ఫీలవకుండా, స్నేహాన్ని చెడగొట్టకోకుండా మెలుగుతూన్న వాణ్ణి, నాలో సంస్కారం లేకపోతే, నేను (ప్రేమించిన నిన్ను నా మిత్రుడు కొట్టేస్తే నేను మామూలుగా ఎలా ఉండగలిగాను?” శ్రాపు సరిదిద్దుకుంటూ చెప్తున్న ఫణిని చూస్తే కాస్త భయం కూడా వేసింది హర్షితకి. ఎందుకనో మొట్టమొదటిసారిగా ఒక కొత్త మనిషిని చూసినప్పుడు కలిగే రకరకాల భయాలలా అనిపించింది. ఒకవేళ ఫణి ఏదైనా

90

వెన్నెల వేట దుర్మార్గానికి తలపడితే? అందుకనేవచ్చాడేమో? రాత్రి బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌ నుంచి చూసింది ఫణి అయుండాలి. అతనిలో ఏదో పైశాచికత్వం తలెత్తినట్టుంది. ఆనంద్‌కి ఫోన్‌ చేసి రమ్మంటే?.... మెల్లగా వణుకును అదుపు చేసుకుని, “ఫణీ, ఆనంద్‌కి ఫోన్‌ చేసి, నువ్యొచ్చావని చెప్పి ఇంటికి రమ్మననా? కబుర్హు చెప్పుకుని భోంచేసి వెళ్ళొచ్చు” అంది హర్షిత ధైర్యం తెచ్చుకుని, ఎలాగో ఒక్కొక్క మాటా నొక్కిపలుకుగూ.

“నో...నో... నాట్‌ సెససరీ హర్షిత... నేనొచ్చింది ఆనంద్‌కోసం కాదు, నీకోసం?”

అతనికేసి తీక్షణంగా చూసింది హర్షిత.

“అవును హర్షిత్రా! రాత్రి నాకొక పీడకలొచ్చింది. నువ్వూ ఆనంద్‌ కారో ఎటో వెళుతున్నారట. కార్‌కి ఆక్సిడెంట్‌ అయిందట బస్సుతో. కారు పెద్దగా చప్పుడు చేసుకుంటూ వెళ్ళి రోడ్డు ప్రక్కనున్న చెట్టుకి కొట్టుకుందిట. నువ్వు డోర్‌నుంచి కిందపడిపోయి, బస్సుకింద నలిగిపోయావట. మీకారు వెనకాలే నేనూ, లతికా కూడా వొస్తున్నాంట. ఎక్కడికో అందరం కలిసి పిక్నిక్‌లాగా వెళదామని బయలుదేరామట. నీ శవం మీద పడి లతికా నేను ఒకటే ఏడుస్తున్నాంట. బిగ్గరగా అరిచానట నిద్రలో. లతిక లేపి 'ఏం జరిగింద"ని అడిగింది. నాకొచ్చిన పీడకల చెపితే, తనూ చలించిపోయింది. 'అలాంటి కల మంచిదే! అంటే హర్షితకి ఆయుషెక్కువ! కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకోండి. శేపొకసారి వెళ్ళి మాట్టాడండి. ఆ పీడకల మర్చిపోయినట్టవుతుంది” అని చెప్పింది. అందుకే వొచ్చాను. వస్తామరి... కేపో ఎల్టుండో వీలు చూసుకుని నేనూ లతికా వస్తాం. ఈ కల విన్నాక లతిక కూడా నిన్ను చూడాలంటోంది"అంటూ లేచి నుంచున్నాడు.

9]

శారదా అశోకవర్ధన్‌

హర్షిత అతని మొహంలోకి చూసింది?

మామూలుగానే ఉన్నాడు. ఆతని మాటల్లో అబద్ధం ఎక్కడా కనిపించలేదు. తనే అనవసరంగా అనుమానిస్తుననుకుంది. ఆనంద్‌ అన్నట్టు అంతా నా భయమే. పాపం ఫణి పీడకలొచ్చిందని పరుగెత్తుకొచ్చాడు, అనుకుంది. అంతలోనే టెలిఫోన్‌ (మోగింది.

హర్షిత ఒక్క ఆంగలో వెళ్ళి ఫోన్‌ తీసింది.

“ఓ... లతికా! మీ శ్రీవారు ఇక్కడే వున్నారు. మాట్లాడతావా?” అడిగింది. ఆవతలినుంచి లతిక తను ఫోన్‌ చేసింది శ్రీవారి కోసం కాదనీ, రాత్రి ఫణికి కల రావడం, ఆ కల తాలూకు వివరాలూ అన్నీ మళ్ళీ తనూ చెప్పి, “నేనే నిన్ను చూసి రమ్మని చెప్పాను. మనసు కుదుట పడుతుంది కదా! వచ్చారో. లేదో ఏదో అర్జంటు కేసు అంటూ ఆసుపత్రికెళ్ళిపోయారో కనుక్కుందామని ఫోన్‌ చేశాను” అంది. కాసేపు ఇద్దరూ ఏవేవో మాట్టాడుకున్నాక ఫోన్‌ పెట్టేసింది లతిక, హర్షిత మనసులోని మంచుతెరలు క్షణంలో కరిగిపోయాయి. కానీ తన మీద తనకే కోపం వచ్చింది. ఎన్నడూ లేనిది తనెందుకు ఇంత చవకగా ఆలోచిస్తోంది? ఎన్నో ఏళ్ళనుంచి ఫణి తనకు పరిచయమే. ఆతని దుడుకు స్వభావం పరిచయమే! అయినా ఇప్పుడు మరీ ఒక సంస్కారహీనుడిగా, నీచుడిగా ఎందుకు భావిస్తోంది?తనలో ఆసలు ఈ భయాలూ, ఈ అనుమానాలూ ఎందుకు చోటుచేసుకుంటున్నాయ్‌?

అసలు రాత్రి బాత్‌రూంలో ఎవరినో చూసినట్టు కూడా (భ్రమేనేమో? లేకపోతే ఆంత రాత్రి ఎవరొస్తారు? ఈమధ్యన మనసెందుకిలా భయాందోళనలకు గురవుతూందో అర్ధంగాక, అదంతా తనలోనే కలుగుతూన్న ఏదో బలహీనత, అది పోగొట్ట్బకోవాలి అని 92

వెన్నెల వేట ఒక నిర్దారణకొచ్చింది.

“ఏమిటి దీర్చాలోచనలో పడ్డావ్‌? మళ్ళీ కలంతా విపులంగా కళ్ళకు కట్టినట్పగా చెప్పిందా లతిక?” అడిగాడు ఫణి.

“అవును ఫణీ! అంతా చెప్పింది. నీ కల సంగతేవెగానీ, నాలో ఏదో కలవరం పుడుతోంది. తాడును చూసి పామనుకుని, నా నీడని చూసి ఎవరో అనుకుని భయపడుతూన్ల్హానీమధ్య. ఎందుకో తెలీదు” అంది ఫణికేసి ఆప్యాయతగా చూస్తూ.

“అదేంటి నీకు భయమా? కాలేజీలో ఎవరైనా పొరపాటున ఏదైనా అంటే పళ్ళు రాలేలా చెప్పుతో కొట్టేదానివి, ప్రిన్సిపాల్‌తో చెప్పి కాలేజీనుంచి డీబార్‌ చేయిస్తాననే దానివి, నీకు భయమా?” అన్నాడు కాలేజీలో ఒక రోజు నవీన్‌ అనే కుర్రాడు హర్షిత జడ పట్టి లాగితే, వాణ్ణి దవడ వాచేలా చెప్పుతో కొట్టి, ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసి వాడిచేత క్షమాపణ చెప్పించుకున్న సంఘటనని గుర్తుచేస్తూ!

నాటి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే హర్షితలో భయం పోయింది. పాత జ్ఞాపకాలను మననం చేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారిద్దరూ.

కాస్సేపు కూర్చుని 'టీ" తాగి, వెళ్ళొస్తానని బయలుదేరాడు ఫణి.

“సరేనంది హర్షిత.

నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఫణి మోద కలిగిన అనుమానపు పొరలు తొలగిపోయాయి.

ఫణి మాటలు, అతని కల మొదట్లో నమ్మకపోయినా, లతికకూడా ఫోన్‌ చేసి చెప్పడంతో నమ్మింది. ఫణి ఎప్పుడూ అబద్దాలు చెపుతాడు కనుక, ఈసారి కల కూడా ఒక కట్టుకథేనని అనుకుంది. అదే ఎప్పుడూ అబద్దాలు

03

శారదా ఆశోకవర్థన్‌ చెప్పేవాళ్ళకొచ్చే ప్రమాదం, ఎప్పుడైనానిజం చెప్పినా నమ్మరు అనుకుంది. ఫణి స్వభావం ఎంత ఆలోచించినా అంతుబట్టకుండా ఉంది. ఒక్కొక్కసారి ఎంతో మంచివాడిలా కనిపిస్తాడు. ఆప్యాయంగా మాట్టాడతాడు. ఒక్కొక్కసారి పరమ దుర్మార్గంగా కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు మళ్ళీ మండుకొస్తుంది. ఈ ద్వంద్వ స్వభావం అర్ధం గాకుండా ఉంది అనుకుంటూ వంట ప్రయత్నంలో మునిగిపోయింది. మళ్ళీ ఫోను మోగడంతో ముక్కల పులుసు కోసం చింతపండు కలుపుతున్నదల్హా చెయ్యి కడుక్కుని వెళ్ళి ఫోన్‌ తీసింది. ఆనంద్‌ గొంతు విని “హల్లో ఆనంద్‌ ఇప్పుడే ఫణి వచ్చి వెళ్ళాడు” చెప్పింది. “ఎందుకట?” ఆడిగాడు ఆనంద్‌. వివరంగా ఆంతా చెప్పింది. ఆనంద్‌ విని వూరుకున్నాడు. హర్షిత ఇంకా ఏదో. చెప్పబోయింది. “భోజనానికొచ్చేప్పుడు మాట్లాడు కుందాంలే” అన్నాడు. “అలాగే! ఇంకా నా వంట కూడా కాలేదు. ఎంత సేపులే, పదినిముషాల్లో చేసేస్తాను” “హర్డ్మీ ఎందుకు నీకీబాధ. ఆ రాధాబాయమ్మకి కబురు చేస్తే వొచ్చి హాయిగా వండి పెడుతుంది. ఎందుకంత (శ్రమ పడతావ్‌?” “ఆనంద్‌! నాచేతులతో చేసిన వంట నువ్వు సంతోషంగా తింటూ ఉంటే నాక్షు తృప్తీ! పైగా ఆ మాత్రం పని కూడా లేకపోతే నాకు ఇంక ఎక్సర్‌సైజు 94

వన్నెల వేట

ఏముంది చెప్పు?”

“బుల్లి హర్షిత వొస్తే బోలెడు ఎక్సర్‌సైజ్‌...”

హర్షిత బుగ్గలు మందారాలయ్యాయి. చిరు ఎరుపు రంగు మొహమంతా చిందినట్టయింది.

“సళ్ల! మరి ఆంతదాకా ఎక్సర్‌సైజ్‌!” నవ్వుతూ ఆంది.

“ఓకే!... ఒచ్చేస్తున్నా.” ఆంటూ ఫోన్‌ పెట్టేశాడు ఆనంద్‌.

గబగబా వంటింట్లోకి వెళ్లి ఆనంద్‌ కిష్టముయిన ముద్దపప్పు, ముక్కల పులుసూ, కొబ్బరిపచ్చడి చేసింది. ఆలూవేపుడు ఆనంద్‌కోసం, వంకాయ కారం పెట్టి తనకోసం చేసింది.

సరిగ్గా వంట పూర్తయ్యింది, ఆనంద్‌ వచ్చాడు.

ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు.

భోజనం చేస్తున్నంతాసేపూ ఫణిరావడం, ఏం మాట్లాడాడో, ఎలా మాట్టాడాడో అంతా చెప్పింది, పూసగుచ్చినట్టు.

అన్నీ ఊ...ఊ”' అంటూ విన్నాడు ఆనంద్‌!

హర్షిత చెపుతున్న మాటలు చెవిలో పడుతూన్నా, ఆనంద్‌ ఆలోచనలు ఎటో ఉన్నాయి. లేకపోతే ఏవో కామెంట్లు చేసేవాడే!

అది (గ్రహించిన హర్షిత “ఆనంద్‌! నువ్వీలోకంలో లేవు, ఏదో ఆలోచిస్తున్నావు. ఆ సంగతి (గ్రహించకుండా నేను ఏదో వాగుతూ పోతున్నాను. హౌ... ఈజ్‌ యువర్‌., డే...! ఆసుపత్రిలో ఏమీ సమస్యలు లేవు కదా” ఆడిగింది చెయ్యి కడుక్కుని. తడి చెయ్యి తువ్వాలుకు తుడుచుకుని ఆనంద్‌ రెండు భుజాలూ పట్టుకుని వెనకనుంచి మెడమీదకు వంగి, ఆతని మొహంలోకి చూస్తూ,

థ్‌

శారదా అశోకవర్థన్‌

“హర్షీ నీలోని అమాయకత్వం, పసితనం, అభిమానం చూస్తూంటే, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్హం చేసుకోలేదేమోననిపిస్తుంది. మనుషులు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. తొందరగా ఎవర్నీ నమ్మకూడదు" అన్నాడు.

అతడు మామూలుగా, జనరల్‌గా చెప్పినట్టు చెప్పినా, ఎందుకనో ఫణిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడేమోననిపించింది.

“ఆనంద్‌! ఫణిని ఎక్కువగా నమ్మకూడదంటావా?” అడిగింది.

“పిచ్చి హర్ష నేను చెప్పింది ఫణిని గురించి గానీ, ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ కాదు. జనరల్‌గా ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు. నీ స్వభావం, నమ్మితే పూర్తిగా నమ్మేస్తావ్‌? జాలిపడితే ఏమైనా ఇచ్చేస్తాన్‌? కోపం వస్తే కుండబద్దలు కొట్టినట్టు మాట్టాడతావ్‌? అందరూ నీలాగే సిన్సియర్‌, ఆనెస్ట్‌ అనుకుంటావ్‌. నేను చెవులతో విన్నవాటిని అసలు నమ గను, కళ్ళతో చూసినవాటిని యాభైశాతం నమ్ముతాను” అన్నాడు హర్షిత కేసి నవ్వుతూ.

హర్షిత ఆనంద్‌ మాటలలోని అర్జాన్ని వెతుక్కుంటోంది.

ఆమె అలా సైలెంట్‌గా ఉండడం చూసి “హర్షిత్రా! కేవలం నీకు ఈలోకం పోకడ చెప్పడానికే ఇలా అన్నాను. ఫణి విషయంలో ప్రత్యేకించి కాదు. ఫణి ఆవేశపూరితుడు. ఆంతే! నాతో,నీతో తగవులు పడ్డా, మనని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు. ఆ కల సంగతి నీకు చెప్పేదాకా వాడికి అన్నం సహించి ఉండదు. సాయంత్రంలోగా, నాకూ చెప్పేదాకా వాడికి నిద్రపట్టదు” అన్నాడు.

“అదే! అదొక రకం అమాయక్వతం” అంది హర్షిత నవ్వుతూ.

“కరెక్ట్‌! అది సరే లెటజ్‌ .. ఛేంజ్‌దె టాపిక్‌ సాయంత్రం సినిమా కెళదామా?”

96

వెన్నెల వట

“సాయంత్రమా?”

“అవును. ఏం?”

“తమరికి క్లినిక్‌ లేదా?”

“తమరివాళ ఆదివారమనీ, సాయంత్రం పూట ఆదివారాలు క్లినిక్‌కి వెళ్లడం మానేసి ఆ సమయం అమ్మగారి కోసమే కేటాయించారనీ, మర్చిపోయి నట్టున్నారు”

“ఓ... గౌడ్‌... ఇవాళ సన్‌డే కదూ!... మర్చేపోయాను. లెట్‌ అజ్‌ గో అవుట్‌. సాయంత్రం పిక్చరూ... రాత్రి ఓబరాయ్‌ హోటల్‌లో డిన్నరూ ఓకే!..”

“ఓ.శే

అంతలోనే ఫోన్‌ మోగింది.

ఆనంద్‌ వెళ్లి రిసీవర్‌ తీశాడు.

“ఎవరూ ఫణేనా?” అడిగింది హర్షిత,

ఎడమచేత్తో ఫోను చెవిదగ్గర పెట్టుకుని, కుడిచేత్తో రిసీవర్‌నిమాటలు వినబడకుండా అరచేత్తో మూస్తూ, “నే చెప్పానా? వాడే? నీకు చెప్పినదంతా మళ్ళీ నాకు చెప్పాలి” అన్నాడు.

“అది సరే సాయంత్రం మన ప్రోగ్రాం చెప్పకు. లేకపోతే తనూ వస్తానని వెంటబడతాదు. ఎంత గొప్ప స్నేహమైనా, అభిమానమైనా, కింత సమయం కేవలం వాళ్ళకే ఉండాలని అనిపిస్తుందని తెలుసుకోరు కొందరు, బాగా చదువుకున్నవారు కూడా. భోజనం వేళలో, రెస్ట్‌ తీసుకుందామనుకున్న సమయంలో చెప్పా పెట్టకుండా వచ్చేస్తారు. అది అవతలి వాళ్ళకి వీలయిన సమయమా, కాదా అని ఆలోచించరు” విసుక్కుంది హర్షిత.

97

శారదా అశోకవర్థన్‌ అవతల ఫణి ఏదేదో మాట్టాడుతున్నాడు. అన్నింటికీ 'ఊ' కొడుతూ విన్నాడు ఆనంద్‌. సాయంత్రం ్రోగాం ఏమిటని ఆడిగినట్టున్నాడు ఫణి. “ఆల... ఏంలేదు” అనేశాడు. “అయితే మా ఇంటికి రండి..” “లేదులే... హర్షిత బాగా అలిసిపోయింది. కాస్త రెస్ట్‌ తీసుకోమన్నాను” “ఏం... ఆయితే మేమే రామా... నేనూ లతికా?” “నో... నో... అర్లీ ప్రెన్నెన్సీ పీరియడ్‌ కదా... షీ నీడ్స్‌ రెస్ట్‌. ఎక్కువ (స్రైయినవడం మంచిదికాదు” అన్నాడు. *ఒ...ే..వి...విల్‌ మీట్‌ ఎగైన్‌! బై.” ఫోన్‌ పెట్టేశాడు. “హమ్మయ్య!” అంది సంతోషంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటూ హర్షిత, “పూర్‌ఫలో... ఐ పీటీ హిమ్‌...” అన్నాడు ఆనంద్‌. “ఏం పిటీయో! ప్రాణం తీసి ఉండేవాడు వాగి వాగి! బాగా టాకిల్‌ చేశావులే అంది ఆనంద్‌కేసి చూసి నవ్వుతూ. సాయంత్రం సినిమా, రాత్రిబయట భోజనం, ఏకాంతంగా ప్రశాంతంగా కాలం గడిచిపోయింది. ఇద్దరూ ఎంతో రిలాక్స్‌డ్‌గా ఫీలయ్యారు. ఆ రోజంతా నూతన వధూవరుల్లా వేరే ప్రపంచంలో తేలిపోయారు. బాధలూ, గాధలూ అన్నీ మర్చిపోయి విరబూసిన పండువెన్నెల్లో స్నానమాడి, నక్షత్రాల జలతారు దుప్పట్టో గుసగుసలు చెవ్పుకుంటూ, చందమామ దొంగచూపుల్ని తప్పించుకుంటూ ఒళ్ళు మరిచిపోయారిద్దరూ. పసిపిల్లల్లా నవ్వుకున్నారు, 98

వెన్నెల వేట ఆడుకున్నారు, పాడుకున్నారు ఒకరి ఒడిలో ఒకరు ఆదమరిచి నిదురపోయారు.

“ఆనంద్‌! ఈరోజు ఎంత హాయిగా గడిచిపోయింది. మనకోసమేనన్నట్టు వెన్నెల వెతుక్కుంటూ, వేటాడుకుంటూ వెండి జల్లులు వెదజల్లుతూ విరినింది” అంది తన్మయత్వంతో గువ్వలా ఆతని ఒడిలో ఒదిగిపోయి హర్షిత.

“అవును హర్షీ! ఇద్దరం ఒకే మనసుతో ఆలోచించి, ఒకే కంటితో చూసి ఒకే అడుగులో నడుస్తున్నట్టనిపించింది” మరింత ఆమెలో ఐక్యమైపోతూ అన్నాడు ఆనంద్‌.

“అదుగో ... డాక్టర్‌ కవై పోతున్నాడు” అంది చక్కిలిగింతలు పెడుతూ హర్షిత. *

“అవును! ఎందరో డాక్టర్టు యాక్షర్తిపోయారు. యాక్టర్లందరూ డాక్టర్లవుదా మనుకున్నామంటారు. ఈ డాక్టరుకీ, కళకీ ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా” అన్నాడు నవ్వుతూ.

ఇద్దరూ నవ్వుల పువ్వుల్ని వెన్నెల్లో ఏరుకుంటూ ఏకమైపోయారు.

“ఆనంద్‌ “హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోర్ట్స్‌' ఎగ్జిబిషన్‌ జరుగుతోందిట. నీకెలాగూ అటువంటివి నచ్చవు. నేను వెళ్ళిరానా. గబగబా వంటచేసి నీతోనే వొచ్చేస్తా. సరిగ్గా ఒంటిగంటకి నువ్వు అక్కడికి వచ్చేయ్‌. నేను రోడ్డు దగ్గరే పుట్‌పాత్‌ దగ్గరుంటాను. ఇద్దరం కలిసి వచ్చెయ్యొచ్చు” అంది హర్షిత.

“అలాగే... గెట్‌ రెడీ... అమ్మగారి కోరిక కాదనగలనా? అంటే మా బుజ్జి హర్షితకి కోపం రాదూ? మా బుజ్జి హర్షిత ఏం కొనమంటే అది కొనెయ్‌” అంటూ బ్యాంకు నుంచి (డ్రా చేసిన అయిదువేల రూపాయల కట్టని హర్షిత బ్యాగ్‌లో వేశాడు.

99

శారదా అశోకవర్హన్‌ భమ, న్‌ స న “థాంక్యూ డార్లింగ్‌" అంది నోటిదగ్గర చెయ్యిపెట్టి ఫ్రైయింగ్‌ కిస్‌ నో “ఇంత పెద్దమనిషిని ఎదురుగుండా ఉండగా ఫ్రైయింగ్‌ కిన్‌ ఏం ఖర్మ? చిలిపిగా నవ్వుతూ అన్నాడు. “ఫా... చిలిపీ! పొద్దున్నే ముద్దులివ్వాద్దు అంది మీ బుజ్జి” అంది నవ్వుతూ హర్షిత.

గబగబా వంట పూర్తిచేసి, ఇల్లుతాళం పెట్టింది హర్షిత.

“లతికను రమ్మంటావా? లేదా ఇంకే ఫ్రెండయినా...” అడిగొడు ఆనందమూర్తి,

“ఇంత సడన్‌గా ఎవరూ రాలేరు. లతికయితే వస్తుందనుకో. వెంట జిడ్డు మాస్టర్‌ కూడా వస్తాడు. నేను భరించలేను. ఒక్కదాన్నే వెల్లి అంతా చూసొస్తాను.” అంది.

“ఓ..శే!” ఆంటూ ముందుకి నడిచాడు.

కారు ఎగ్జిబిషన్‌ (గ్రౌండ్స్‌ దగ్గర ఆగింది.

ఆనంద్‌కి 'బై చెప్పి కారు దిగింది హర్షిత. ఆనంద్‌ క్షినిక్‌కి వెళ్ళిపోయాడు. ఎగ్జిబిషన్‌ ఎంతో బాగా పెట్టారు. అన్ని ర్యాష్ట్రాల నుంచి వారి వారి ప్రత్యేకమైన చేనేత వస్త్రాలను అందంగా అమర్చారు. ప్రతీ స్టాల్‌లో ఏదో ఒక ఆకర్షణీయమైన బొమ్మా బుజ్జకథలూ, డాన్సులూ జనాన్ని ఆకట్టకున్నాయి. ఒక్కొక్క స్టేట్‌ ఎంపోరియంనీ చూస్తుకుంటూ వెళుతోంది హర్షిత. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి బట్టలు,

హర్షిత మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంతే ఆహ్దాదకరమైన వాతావరణంలో ఇంపుగా అమర్చిన వ(స్త్రాలను చూస్తూ ఉంటే, ఆ వస్తాలకన్నా, వాటిని నేసిన పద్మశాలీల నైపుణ్యాన్ని గురించి ఆలో చించడం

100

వెన్నెల వేట

మొదలెట్టింది హర్షిత. ఎంతటి కళానైపుణ్యం! ఎన్నిరకాల డిజైన్లు. వేలాదిమంది కార్మికులు ఈ వృత్తిలో ఎంతో శ్రమకోడ్చి రకరకాల రంగులలో డిటైన్త్లలో ఈ వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నా వారికింత కట్టుకోవడానికి గుడ్డ, వుండడానికో గూడు, తినడానికింత తిండీలేక కనీస వసతులు కూడా కొరవడి బాధపడుతున్నారే! ఏమిటి వైపరీత్యం? కలవారి అమ్మాయో, అబ్బాయో కాస్త ప్రావీణ్యం చూపిస్తే, పేపర్లలోనూ, రేడియో, టి.వి.ల్లోనూ వాళ్ళ ఇంటర్వ్యూలు వేసి, వాళ్ళ ఫోటోలు వేసి, బహుళ (ప్రచారం చేస్తారే! మరి వీరికెవరు దిక్కు? పైగా వీరికెవరు సాటి? రెక్కలు ముక్కలయినా డొక్కాడని వీరి గురించి ఎవరూ పట్టించుకోరేం? ఒక్క వస్తాలే కాదు. రకరకాల హస్తకళలు! వెండి ఫిలిగ్రీ పని ఒరిస్సా రాష్ట్రంలో, మద్రాసులోని చెక్క సామాగ్రి, మైసూర్‌లోని మైసూర్‌ గంధం చెక్కసామాగగి, ఆంధ్రాలో లేసులూ, వీణలూ, బిద్రీపని అంటే జింకూ, రాగీ కలిపిన లోహం మీద వెండితో డిజైన్లు వేసే అనేక వస్తువులు, షర్టు బటన్లూ చెవిపోగులూ, ఆష్‌ట్రేలూ ఎన్నో ఇలా ఆలోచిస్తే ఇండియా మొత్తంలో ప్రతీరాష్ట్రంలోనూ వున్నాయి ప్రత్యేకతలు. కొన్ని కోట్ల జనాభా కొన్ని లక్షలమంది కళాకారులూ, చేనేత కళాకారులూ, చేతివృత్తిపనుల కళాకారులూ వున్నారంటే అతిశయోక్తికాదు. దేవతామూర్తులను కళ్ళకు కట్టినట్టు రాతినుంచి మలచే స్థపతులను ఏమిచ్చి సత్కరించాలి. మనదేశంలో ఎన్ని కళాఖండాలు? ఎంత సౌందర్యం! ఈదేశంలో పుట్టినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటూ, అలా నిలుచుండి " పోయింది హర్షిత, మెల్లగా అప్పుడే వేడివేడిగా చేసిఅమ్ముతూన్న పాప్‌కార్న్‌ కొనుక్కుని ఒక్కక్కటే నోట్లో వేసుకుంటూ.

“ఏయ్‌ హర్షితా! ఏమిటిక్కడే నుంచుండి పోయావ్‌? అరగంట నుంచి చూస్తున్నా. ఏముందబ్బా అంత చూడవలసింది ఇక్కడ” అంది భుజం తట్టి

101

శారదా అశోకవర్థన్‌ పలకరిస్తూ అపర్ణ,

జయ్‌... నువ్వా బాగున్నావా? ఎన్నాళ్ళయిందో మనం కలిసి,” అంటూ పలకరించింది హర్షిత.

“చూడవే! మన రాష్ట్రం, మనదేశం... ఐ మీన్‌... ఆల్‌ ఇండియా.... ఎంత గొప్పదో! ఎటుచూసినా ఒక దాన్ని మించిన కళానైపుణ్యత మరో దానిలో! ఓహో ఎంత గొప్పదేశమే మనది! ఇదంతా ఒకెత్తయితే ఇంతకు మించిన గొప్ప సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించగల శక్తి ఒక్క మనదేశానికే ఉందే! అంది ఆవేశంగా హర్షిత.

“వండర్‌పుల్‌.. తమరేదో విదేశాలలో పుట్టి, విదేశాల్లోనే పెరిగి, ఇప్పుడే ఇండియాకొచ్చి ఇవన్నీ చూన్తూన్నట్ట వెఎందటిసారిగా, అలా ఫీలయిపోతున్నారంటబ్బా” వ్యంగ్యగా అంది అపర్ష

“అదేనే మన దౌర్భాగ్యం! ఎవరో విదేశీయులు మెచ్చుకుంటే తప్ప మన వాళ్ళకి మనం విలువ ఇవ్వం. మన ప్రతిభని పరదేశీయులు గుర్తించి సర్టిఫికెట్‌ ఇచ్చాక, మనం మనవాళ్ళని గుర్తిస్తాం. అంతదాకా మాట్లాడం. అదే మన ఖర్మ... పారుగువాణ్ణి పొగడడం మనకు నామోష్సీ మనని మనం గౌరనించుకుని మనలో మనం అంతా కలిసి మెలిసి ఉన్నరోజున మనం (్రవంచ దేశాలన్నింటిల్లోనూ (ప్రథమ స్థానంలో ఉంటాం” అంది మరింత ఆవేశంగా హర్షిత,

“వెరీ గుడ్‌... నీ సంగతి ముఖ్యమంత్రిగారికో ప్రధానమంత్రిగారికో రాస్తే నీ వాగ్జాటికి మెచ్చి, నీకు టిక్కెట్టిచ్చి ఎలక్షన్లలో నుంచోబెట్టి గెలిపించి, నీకు చేనేతమినిస్టీయిస్తే నీ వల్ల కళాకారుడికి గొప్ప గుర్రింపొస్తుంది. అది నెక్ట్‌ ప్రోగ్రాం. తల్లీ! ఇప్పుడు ఏమైనా చూడదలుచుకున్నావా? ఏమైనా

102

వెన్నెల వేట కొనదలచుకున్నావా? చెప్పు, కలిసి చూద్దాం. లేదా 'బై'...” అంది ఆపర్హ ఆపర్హ, హర్షిత పి.జీలో క్లాన్‌మేట్స్‌! అపర్ష అదే కాలేజ్‌లో లెక్సరర్‌ ఉద్యోగం చేస్తోంది. కట్నాలూ, కానుకలూ ఎక్కువగా అడిగే ఊరు వాళ్ళది. అంత ఇచ్చుకునే స్టోమత వాళ్ళకి లేకపోవడంతో అపర్లకింకా పెళ్ళికాలేదు. మామూలు వాళ్ళెనా సరే డైమండ్‌ దుద్దులూ, డైమండ్‌ ముక్కుపుడకా, ఇంటికి సరిపడే స్టీలు సామాన్లూ కనీసం మూడునాలుగు కేజీ వెండి పూజసామాన్లూ వగైరా, ఏదో ఒకలెక్క ప్రకారం ఇన్నీ అని పట్టుచీరలూ ఇవన్నీ కావాలి. “అలాంటి వేవీ అడగనివాళ్ళు నన్ను నన్నుగా కోరుకుని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు వచ్చినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే అసలు నాకు పెళ్ళే అక్కర్లేదు” అని పట్టుబట్టి కూర్చుంది ఆపర్ష. “ఉన్న ఇల్లూ వాకిలీ అమ్మి ఒక్కగానొక్క బిడ్డవు. నీపెళ్ళి చేసేస్తే మిగిలిన ఇద్దరూ మొగపిల్లలు. బాధలేదు” అనేవారు అమ్మానాన్నలు! “నన్నూ మొగపిల్లాడినే అనుకోండి. నా కోసం ఉన్న ఇల్లూ సామాన్గూ అమ్మేసి మీరూ తమ్ముళ్ళూ ఏం చేస్తారు? అసలు ఈ వ్యవస్థ మారాలి. ఆడపిల్ల తండ్రులు ఎందుకింత డబ్బిచ్చుకోవాలి? అయినా డబ్బుకీ, పెళ్ళికీ ఏమిటి సంబంధం? నాలాగే ఆలోచించే వ్యక్తి తటస్థ్రపడినప్పుడే నా పెళ్ళి. లేకపోతే లేదు...” అని ఖచ్చితంగా చెప్పెయ్యడంతో అపర్షకింకా పెళ్ళికాలేదు. చాలారోజుల తరువాత కలుసుకున్న స్నేహితులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అన్ని స్టాల్ఫూ చూశారు. చివరగా ఐన్‌'క్రీం షాప్‌ దగ్గర ఆగి, “అపరా అయిన్‌క్రీం తిందాం. తింటూ నీకొక గుడ్‌న్యూస్‌ చెపుతాను అంది హర్షిత. “అరె! సరిగ్గా నేనూ అదే అనుకున్నాను” ఆంది ఆపర్ష, “ఏమిటో! ఆయితే నువ్వే ముందు చెప్పు” అంది హర్షిత, 103

శారదా అశోకవర్హన్‌

ఇద్దరూ రెండు చాక్‌లెట్‌ కోన్‌ అయిన్‌'్రీంలు తింటూ, మెల్లగా నడుస్తూ మాట్టాడుకుంటున్నారు.

“నాకు పెళ్ళికుదిరింది. ఆట్‌లాస్ట్‌ నాకు నచ్చిన విధంగా, మా ప్రిన్సిపాల్‌గారి తమ్ముడు. దమ్మిడీ కట్నం లేదు. రిజిష్టరు పెళ్ళి, హోటల్‌ ద్వారాకాలో డిన్నరు. డిన్నరు ఖర్చు ఇద్దరిదీ ఫిష్టీ ఫిష్టీ! ఆంది అపర్ష

“వెరీగుడ్‌! మొత్తానికి సాధించావు! కంగ్రాట్స్‌! ఆతనేం చేస్తున్నాడు.”

“సి.ఎ. స్వంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. పేరు రఘు” చెప్పింది.

“ఐ...యామ్‌... ప్రవుడ్‌ ఆఫ్‌ యూ. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఆందరాడ పిల్లలూ నీలా ఉంటే అసలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఏ బాధలూ ఉండవు” అందీ హర్షిత.

“మరి నీ గుడ్‌ న్యూస్‌ ఏమిటి?” అడిగింది అపర,

“నేను మమ్మీని కాబోతున్నాను మరో ఆరునెలల్డో...”

“కంగ్రాట్స్‌! ఆనంద్‌కి కూడా నా తరపున కంగ్రాట్స్‌ చెప్పు. కార్డ్‌ పంపుతా... ఐయామ్‌ సారీ తిట్టకు. నేనే స్తయంగా వచ్చి ఇస్తా. వీలైతే నేనూ రఘూ ఇద్దరం కలిసే వచ్చి పిలుస్తాం. ఆతని ఫ్రెండ్స్‌నీ, నా ఫ్రెండ్స్‌నీ, అలా కలిసి పిలుద్దామని అనుకున్నాం,” అంది అపర్ల. ఆపర్ష మొహంలో సంతోషం, సంతృప్తి చూసి ఎంతగానో ఆనందించింది హర్షిత.

ఆపర్ల 'బై' చెప్పి ఏదో పనుందని వెళ్ళిపోయింది.

అంతవరకూ అన్ని స్టాల్ఫూ చూడ్డం, కబుర్జు చెప్పుకోవడం తప్ప ఏమో కొనుక్కోలేదు.

“ఆపర్డా, ఏమో కొనకుండానే వెళ్ళిపోతున్నావేమిటి?” అడిగింది హర్షిత.

104

వెన్నెల వేట

“ఇవ్వాళ ఊరికే చూడ్డానికే వచ్చాను. ఆదివారం నేనూ, రఘూ కలిపొచ్చి కొంటాం, రఘూతో వాళ్ళాఫీసుకొస్తానని చెప్పాను. లేటయిపోయింది. వెయిట్‌. చేస్తుంటాడు, వస్తా.” అని బయలుదేరింది అపర్ష,

హర్షిత మాత్రం మధ్యప్రదేశ్‌ స్టాల్గో తనకు నచ్చిన ఒక చీర కొందామని వెళ్ళింది. లైట్‌ గ్రీన్‌కి, వైలెట్‌ బార్డర్‌ చీర తీసి ప్యాక్‌ చెయ్యమంది. బిల్లు కౌంటర్‌. దగ్గరికెళ్ళి, డబ్బులు తియ్యడానికి బ్యాగ్‌ తీసింది. అంతే షాక్‌ తింది. పర్సు కత్తిరించి ఉంది. ఎవడో గుంపులోంచి పరుగులు తియ్యడం చూసింది. అంతా క్షణాల్లో జరిగింది.

“దొంగ... దొంగ... ప్లీజ్‌ పట్టుకోండి. నా పర్ఫుకొట్టేసి పారిపోతున్నాడు” అంటూ గట్టిగా అరిచింది హర్షిత. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా దొంగని పట్టుకోవడానికి పరుగెత్తారు. ముఖ్యంగా యువకులు.

ఈ కేకలూ, పరుగులూ విని చుట్టుప్రక్కల దుకాణాల వాళ్ళంతా కూడా పరుగెత్తుకొచ్చారు.

“హర్షిత... ఏం జరిగింది?” గుంపులో ఎక్కడ్నుంచో పిల్చి ఆడిగాడు ఫణి. ఫణిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి హర్షితకి.

“ఎవడో దొంగనా పర్సు కొట్టేశాడు. అటెళ్ళాడు. అయినా నువ్విక్కడికెలా వచ్చావ్‌” అడిగింది.

“ఊరికే... ఒక్క రౌండ్‌ కొట్టి బాగుంటే రేపు నిన్నూ లతికనీ, ఆనంద్‌ని తీసుకొద్దామనుకుని" వచ్చాను. ఇప్పుడే వచ్చాను. అది సరే... ఇక్కడేమైనా కొన్నావా?”

“అవును. లెండు చీరలు తీనుకున్నాను., బిల్టు నాలుగువేల శెండొందలయింది. 'పే' చేద్దామని హ్యాండ్‌ బ్యాగ్‌ చూస్తే, ఎవడో చూడు ఎలా

105

శారదా అశోకవర్థన్‌ కట్‌చేసి పర్సు తీసుకుపోయాడో!” అంటూ కత్తిరించబడిన బ్యాగ్‌ చూపించింది.

“సరే ముందు బిల్టు కట్టేసి పోదాం. వాడి పని చూస్తాను” అంటూ జేబులోంచి డబ్బు తిసి బిల్టు కట్టేశాడు ఫణి.

“హర్షిత! ఒకపని చెయ్యి, నువ్వు షాపులోనే కూర్చో, నేను వీడి సంగతేమిటో చూసొస్తా” అంటూ ఒక్క పరుగులో గుంపులోకి వెళ్ళిపోయాడు ఫణి. “అలాగే” అంటూ హర్షిత షాపు దగ్గరే ఉండిపోయింది. అందరి దృష్టి హర్షిత వైపు, ఆ గుంపుపైపే!

దాదాపు పదినిముషాల తరువాత, ఆ గుంపంతా షాపు వైపుకి కదిలారు. మధ్యలో ఫణి ఎవరిదో చొక్కా పట్టుకొని లాక్కొస్తున్నాడు. జనం అతణ్ణి తలో దెబ్బా వేస్తున్నారు. ఫణి అతణ్ణి ఒక్క తోపు తోశాడు హర్షితవైపు. వాడు తుళ్ళుకుంటూ వెళ్ళి ఆమె పాదాల దగ్గర పడ్డాడు. పర్సు తీసి ఆమె చేతిలో పెట్టి తప్పయిందన్నట్టు లెంపలేసుకున్నాడు,

హర్షిత గబగబా పర్సు తెరిచి చూసి, “అంతా సరిగ్గానే వుంది” అంది.

“పద!... పోలీన్‌ స్టేషన్‌కి” అంటూ వాణ్ణి చొక్కా పట్టుకుని లేవనెత్తాడు ఫణి. వాడి ముక్కులోంచి రక్తం కారుతోంది. ముక్కు మీద బాగా దెబ్బ తగిలినట్టుంది

ణు వాచిపోయింది.

“తప్పయిపోయింది సార్‌... ఈసారికి వదిలెయ్యండి సార్‌... మేడమ్‌ తప్పయింది మేడమ్‌... పెద్ద మనసుతో క్షమించండి మేడమ్స్‌...” ఏడుస్తూ బతిమాలుతున్నాడు వాడు, య

“ఫణీ! వదిలేసెయ్‌! మన డబ్బు మనకి దొరికింది కదా, ఒంటిగంటవుతోంది ఆనంద్‌ వస్తాడు నా కోసం బయట వెయిట్‌ చేస్తూ ఉంటాడు.” అంది ముందుకి నడుస్తూ,

106

వెన్నెల వేట

"హర్షితా! చదువుకున్నదానికి. నువ్వు కూడా అట్లూ మాటాడితే ఎట్లా? వ్‌ ఒదిలేస్తే ఇంకా ఎందరి పర్సులు కొట్టేస్తాడో ఏమో! మరోసారి ఇలాంటో వెధవపని చెయ్యకుండా వీణ్ణి జైలులోకి తోయించాలి. పోలీసు లారీ దెబ్బలు ఒక్కసారి తగిలితే, ఇంక జన్మలో ఇట్టాంటి పన్దు చెయ్యడు.”

“ఫణీ! ఇలాంటివాళ్ళు ఎన్నిసార్లో జైలుకి వెళుతుంటారు. వస్తుంటారు. మళ్ళీ ఇట్లాంటి పనులే చేస్తారు. అది వాళ్ళ వృత్తి, దేముడి దయవల్ల మన డబ్బు మనకి దొరికింది. వాడికి దేహశుద్దీ జరిగింది. సమయానికి నువ్వొచ్చి, కాపొడావు. పద ముందు ఇక్కడినుంచి బయటపడదాం” అంది ముందుకు నడుస్తూ.

“నో..నో..నో..! ఎవరికి వారు ఇట్లా అనుకోబట్టే ఈ పీక్‌ పాకెటర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మన అదృష్టం బావుండి వాబ్లీ పట్టుకున్నాం. డబ్బు దొరికింది. లేకపోతే.. సరే! మనం అంటే కాస్సేపు బాధపడి మర్చిపోతాం. అదే సామాన్యుల దగ్గరనుంచి పోతే, వాళ్ళింత బాదపడవలసివస్తుంది? అందుకే పద. వీణ్ణే పోలీన్‌ స్టేషన్‌లో అప్పగించి వెళదాం. ఆనంద్‌ వస్తే మరీ మంచిది” అన్నాడు ఉద్రేకంగా ఫణి.

ఫణి మాటలు కరెక్టేననిపించింది హర్షితకి.

'సరినంది.

ఇద్దరూ బయటకొచ్చారు. కొందరు దొంగని పట్టుకుని లాక్కొచ్చారు. అప్పటికే ఆనందమూర్తి వచ్చి పావుగంట దాటింది. హర్షితనీ, ఫణీని వళ్ళ వెంట వస్తున్న గుంపునీ చూసి, అర్థం కాక “హర్షితా! ఏం జరిగింది?” అడిగాడు కంగారుగా. |

జరిగినదంతా ఒక్క ముక్కలో చెప్పింది హర్షిత. “సమయానికి అక్కడ 107?

శారదా ఆశోకవర్ధన్‌ ఫణి కనిపించి, ఆ దొంగని నాలుగు తన్ని లాక్కొచ్చాడు” అంది ఆ దొంగని చూపిస్తూ,

ఆనందమూర్తి దొంగని చూశాడు. వాడి ముక్కు పెద్దగా వాచిపోయి ఉంది. రక్తపుచారలు ముక్కుమీద, చెంపల మీదా కనిపిస్తున్నాయ్‌.

“బాగానే బుద్ది చెప్పినట్టున్నారు. ఇంక వదిలెయ్యండి. వాడి పాపాన వాడు పోతాడు. మనకెందుకొచ్చిన గొడవ. వాడెలాగూ నాలుగు రోజుల్లో బయటికొస్తాడు. అనవసరంగా మన పన్గు పాడవుతాయ్‌” అన్నాడు ఫణిని చూస్తూ,

“ఆనంద్‌! డోంట్‌ బి స్ట్రపిడ్‌! మనలాంటి వాళ్ళం కూడా, మన పను పాడవుతాయనో, వొడి పాపాన వాడే పోతాడనో, ఒదిలేస్తే ఈ సమాజం ఇంకా దిగజారిపోతుంది.”

“ఇంతకన్నా ఘరానాదొంగలు ఎందరో ఉన్నారు ఈ నాటి సమాజంలో, మన చుట్టూనే తిరుగుతున్నారు. మనం ఏం చెయ్యగలం? ఎవరైనా కొన్నిసార్టు కొందరిని పూల్స్‌ చేసి బతుకుతారు. కానీ, అన్నిసార్లూ అందర్నీ మోసం చెయ్యలేరు. నోబడి కెన్‌ ఎస్కేప్‌ ఫ్రమ్‌ ది ఐస్‌ ఆఫ్‌ లా.. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టకున్నా, ఎవరూ కూడా న్యాయాన్నీ, చట్టాన్నీ ఎల్లకాలం ధిక్కరించి బతకలేరు. పట్టుబడిపోక తప్పదు. అంతవరకూ వాళ్ళ ఆటలు సాగుతాయ్‌ అంతే” అన్నాడు.

“ఫీ ఫిలానఫీ ప్రాక్టికల్‌ కాదు. వీడు న్యాయదేవత కంట్లో పడేసరికి మరో వంద పిక్‌ పాకెటింగ్స్‌ చేస్తాడు. వీణ్మి ఇప్పుడే పోలీసులకు అప్పగిస్తే మంచిది.”

“అవును ఆనంద్‌! ఫణి చెప్పింది కూడా కరెక్టే” అంది హర్షిత.

108

వెన్నిల వేట

“వ్వము తీసుకెళతామమ్మా పోలీన్‌ స్టేషన్‌కి మీరు వెళ్ళండి” అన్నారు గుంపులోంచి ఎవరో.

“క్తాదు. మనమే తీసికెళదాం” ఆని ఆనంద్‌ సమధానానికి కూడా ఎదురు చూడకుండా, “మీలో మరో నలుగురు ఎవరైనా రండి. వాణ్ణే నా కోర్టో కూర్చోబెట్టండి. నాంపల్లి పోలీన్‌ స్టేషన్‌కి వెళదాం” అన్నాడు ఫణి తన కారు డోర్టు తెరిచి, తను స్టీరింగ్‌ దగ్గర కూర్చుంటూ.

వెంటనే నలుగురైదుగురు కలిసి, దొంగని గట్టిగా పట్టుకుని పణి కారెక్కారు.

ఆనంద్‌, హర్షిత వాళ్ళ కారులో బయలుదేరారు.

“ఆనంద్‌: సారీ! ఇట్టా జరుగుతుందని అనుకోలేదు” అంది క్షమాపణ చెబుతున్నట్టుగా హర్షిత.

ఆనంద్‌ జవాబు చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.

“అనంద్‌! ఏమిటాలోచిస్తున్నావ్‌”

ఆలోచనలకి బ్రేక్‌ వేస్తూ “ఎం లేదు? ఎంతో జాగ్రత్తగా ఉంటావు. అటువంటిది నీ పర్సుపోవడం, ఆ సమయానికే ఫణి అక్కడికి రావడం అంతా నాటకీయంగా లేదూ? ఆసుపత్రినీ, 'పేషెంట్లనీ వదిలిపెట్టి, లతిక కూడా లేకుండా ఒక్కడే ఈ వేళప్పుడు ఫణి అక్కడికి రావడం ఆశ్చర్యంగా లేదూ?

  • అన్నాడు.

“అవును! కానీ ఈ విషయంలో ఫణిని అనూనించడం కరెక్టు కాదు. అది సరే. ఎప్పుడూ ఫణి మీద నాకు డౌట్టొచ్చేవి, కానీ ఇవాళ నీకు డౌట్‌ రావడం అశ్చర్యంగా ఉంది.”

“నో... నో.. డౌటేం కాదు. 'తమాషా కోయిన్సిడెన్స్‌' అన్నాను.”

109

శారదా అశోకవర్థన్‌ కారు నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆగింది. వెనకాలే ఫణి కారు కూడా ఆగింది. దొంగని నలుగురు మనుషులు పట్టుకుని దిగారు. “ఆనంద్‌! మీరెళ్ళి పోలీస్‌ కంస్టయింట్‌ చెయ్యండి. నేను కారు పార్క్‌ చేసొస్తా” అంటూ పార్కింగ్‌ స్టేస్‌కి వెళ్ళాడు ఫణి. హర్షితా, ఆనంద్‌ లోపలికి వెళ్ళారు. జరిగినదంతా చెప్పింది హర్షిత. ఇనొస్పెక్టర్‌ వాళ్ళు చెప్పినదంతా రాసుకున్నారు. ఇన్స్‌పెక్టర్‌ కానిస్టేబుల్స్‌కి చెప్పి దొంగని లాకప్‌లోకి పంపించాడు. అంతలోనే వచ్చాడు ఒక ఆగంతకుడు. ఇన్‌స్పెక్టర్‌కి చెప్పి ఆ దొంగని బెయిల్‌ మోద విడిపించమన్నాడు. వాడు నిజంగా దొంగ కాదనీ, కొంచెం మెంటల్‌ అనీ, వాడు తనకి అక్క కొడుకు అవుతాడనీ, తల్లీ తండ్రీ యాక్సిడెంట్‌లో చనిపోతే వాడిలా అయిపోయాడనీ, వాడి పేరు మీద బోలెడాన్తుందనీ, కావాలంటే లాయర్‌ పి.ఎన్‌.చౌదరిగారికి ఫోన్‌ చేసి మాట్లాడమనీ” చెప్పాడు. అతను మాట్టాడుతూ ఉండగానే ఫోన్‌ మోగింది. ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ తీశాడు. "చెప్పండి సార్‌! నమస్తే” అన్నాడు ఇంచుమించు ఫోన్‌కే సెల్యూట్‌ కొడుతూ “వాదిలేస్తాను సార్‌! అట్టాగే! ఇప్పుడే ఆతని మామయ్య కేశవ్‌గారొచ్చారు. అంతా చెప్పారు ఇక్కడే ఉన్నారు మాట్టాడండి.” అంటూ ఫోన్‌ అతనిచేతికిచ్చాడు. "నమస్కారం లాయరుగారూ!...” అంటూ ఏవేవో మాట్తాడి ఫోన్‌పెటేశాడు. హర్షితా, ఆనంద్‌ బిత్తరపోయి ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. - కాస్సేపటికి తేరుకుని “నేను డాక్టర్‌ ఆనంద్‌. ఈమె నా భార్య హర్షిత..." 110

వెన్నెల వేట ఆంటూ ఇంకా ఏదో చెప్పేలోపలే “ఏం డాక్టరువయ్యా.. అసలు నువ్వు మనిషివా పశువువా? గొడ్డును బాదినట్టు బాదావ్‌, చూడు వాడి ముక్కు ఎలా బద్దలయిందో!” అన్నాడు.

“అదికాదండీ! నాకసలేమీ తెలీదు. నేనిప్పుడే నా వైఫ్‌ని పికప్‌ చేసుకోవడానికి వెళ్ళాను” ఆంటూ చెబుతుండగానే...

“షటప్‌! సూదులు గుచ్చి డబ్బులు లాక్కున్నట్టు కాదు. కాస్త మానవత కూడా ఉండాలి. బ్రూట్‌లా పడి కొట్టెయ్యడమే. ఆసలు కొట్టే అధికారం నీకు లేదు. వట్టుకుని పోలీనులకి అవృగించవలనింది. కొడతారో, ముద్దుపెట్టుకుంటారో అది వాళ్ళిష్టం! నువ్వు చేసిన పనికి పరువు నష్టం కేసు పెడతాను” అన్నాడు. ఆనంద్‌కి ఒళ్ళు మండిపోతోంది. ఆ పెద్దమనిషి తన గొడవే తప్ప మాట్టాడనివ్వలేదు.

హర్షిత ఏదో చెప్పబోయింది.

“అబ్బ! నువ్వుండవమ్మా మధ్యలో..” అంటూ కసిరాడు.

ఆనంద్‌ కోపం తారాస్థాయికి చేరుకుంది.

“అసలు విషయం తెలుసుకోకుండా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్టాడకండి.

మీ ఇష్టం వచ్చినట్టు ఏవేవో మాటలన్నారు. నేనూ మాట్టాడగలను. మీలాగే, కాకపోతే సభ్యత కలవాణ్లి అందుకే”

“అంటే... నాకు సభ్యత లేదంటావా

“నేనలేదే”

“అంటే దవడ పగలకొడతాను”

111

శారదా ఆశోకవర్థన్‌ “మర్యాదగా మాట్లాడండి” అరిచింది హర్షిత “ప్పి పని చెబుతా ఉండు. నీ అంతం చూస్తాను. నా మేనల్గుడి రక్తం కంట మాసినవాణ్ణు వాడికి తగిలిన దెబ్బలకి, దెబ్బ తీస్తాను” అరిచాడు కేశవ్‌. “ప్లీజ్‌ రుకోండి సార్‌..” అంటూ ఏదో సర్దిచెప్పబోయాడు ఇన్‌స్పెక్టర్‌. కేశవ్‌, ఆతణ్మి అంటే దొంగగారిని చెయ్యిపట్టి తీసుకెళ్ళి పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌కి ధన్యవాదాలు చెబుతూ కార్గో కూర్చున్నాడు. కారు రయ్‌మని గాలిలో తేలిపోతున్నంత వేగంగా వెళ్ళిపోయింది. కారు పార్క్‌ చేసి అప్పుడే లోపలికొస్తూ ఫణి “ఎమయింది?” అనడిగాడు. జరిగినదంతా చెప్పింది హర్షిత. “ఆరె! వాడెవడో దుర్మార్గుడిలా ఉన్నాడే..” అన్నాడు మిగతా విషయాలు ఇన్‌స్పెక్టర్‌ని అడుగుతానని వెళుతూ. “ఆఖ్యన్లేదు పోదాం పద!” అన్నాడు ఆనంద్‌ తన కారెక్కుతూ. హరిత వెనకాలే వెళ్ళి కార్గో కూర్చుంది. ఫణి కూడా తన కారు దగ్గరికెళ్ళాడు. కార్డు స్పీడుగా పోతున్నాయి, ఆలోచనలతో పోటీ పడుతూ! న ఇల్ఫాంతా హడావుడిగా వుంది. మామిడి తోరణాలతో పసుపు గుంభాల గడపలతో కళకళలాడుతోంది. బంధువులూ స్నేహితులతో ఇల్లు నిండిపోయింది. దబ్బపండులా నిగనిగలాడుతూ, ఆకుపచ్చ జరీ ఆంచు పట్టు చీరలో కొత్త అందాలతో మెరిసిపోతోంది హర్షిత. ఒద్దన్నా వినకుండా, తలనిండా పూలూ, చేతినిండా ఎరుపూ ఆకుపచ్చ గాజులూ, కాళ్ళకు పారాణీ పెట్టేసరికి, ఎత్తుగా వున్న పొట్ట తప్పిస్తే కొత్త పెళ్ళి కూతురిలా వుంది హర్షిత. అద్దం 112

వెన్నెల వేట ముందునుంచుని, చీర సవరించుకుంటున్న హర్షితని వెనకనుంచి వాటేసుకున్నాడు ఆనందమూర్తి,

“ఆ...ఆ... బాబు నలిగిపోతాడు దూరం వుండండి అంది చిలిపిగా చూస్తూ చిన్నగా అతణ్ణి వెనక్కి తోస్తూఆనంద్‌ కొంచెం తూగి చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ “అయ్యబాబోయ్‌! వీడెక్కడ దొరికాడురా నాయనా. వాడు బయటికి రాకముందే నన్ను నీ దగ్గరినుంచి దూరం చేస్తున్నాడు. ఒచ్చాక ఇంకేమయినా వుందా?” అన్నాడు బెంబేలు పడిపోతూన్నట్టు రెండు చేతులతోటీ గుండెల్ని అదిమి పట్టుకుంటూ. హర్షిత పకపకా నవ్వింది చిలిపిగా.

అంతలో హర్షిత అమ్మగారు లలితాంబగారూ, అత్తగారు మహాలక్ష్మమ్మ గారూ అటుకేసి రావడంతో ఆనంద్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

“బుగ్గచుక్క పెట్టడం మర్చిపోయా... అందుకే.. చెప్పబోయింది లలితాంబ.”

హర్షిత నవ్వుతూ తలెల్తి చూసింది. కిటికీ చువ్వలలోంచి ఫణి తనవైపే చూస్తూండడం కనిపించింది.

హర్షితకి కంపరం పుట్టుకొచ్చింది. అలా ఎంత సేపటినుంచి చూస్తున్నాడో...

ఛీ... ఛీ!.. అయినా వీడికిదేం బుద్ది? అనుకుంటూ పళ్ళు కొరుకుతూ అటు చూసేసరికి, అప్పుడే లతిక వచ్చి తల్లో కనకాంబరాల దండ పెట్టి “ఇంకరా.. కుర్చీలో కూర్చుందువుగాని..” అంటూ చెయ్యిపట్టి తీసుకెళ్ళి ఆమె కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక్కొక్కరే పేరంటాళ్ళు వస్తూ వున్నారు. చుట్టు పక్కల వాళ్ళూ, క్లాన్‌ మేట్సూ, బంధువులతో ఇల్లు పెళ్ళి వారిల్టులా వుంది. ఆనందమూర్తి స్నేహితులు కొందరొచ్చారు. పిలవకపోయినా అభిమానంతో కొందరు పేషంట్లూ వచ్చారు. ముత్తైదువులందరూ హర్షిత

113

శారదా అశోకవర్ధన్‌

చేతికి ఎజ్జగాజులూ, ఆకుపచ్చ గాజులూ తొడిగారు. హారతిచ్చి మంగళహారతులు పాడారు. హర్షిత మనసు ఆనందంతో ఊగిపోతోంది. పెళ్ళిరోజున ఇవన్నీ జరుగుతూంటే మనసు నిండి ఆక్రమించుకున్నది ఆనందమూర్తి బొమ్మ. ఈ రోజున ఆనంద్‌ పక్కన మరో బుజ్జి ఆనంద్‌ ఉయ్యాల్లో ఊగుతూ ఇల్లంతా పాకుతూ, చిలిపితనంతో చిందులు తొక్కుతూ చిన్ని కృష్ణుడిలా కనిపిస్తూ, కమ్మని ఊహలతో నిండిపోయి గిలిగింతలు పెడుతున్నాడు. స్నేహితులందరూ ఆట పట్టిస్తున్నారు. వెంటనే ఆనంద్‌ మాటలు జ్ఞాపకం వచ్చాయి. “నాకు చిట్టి హర్షిత కావాలి” అంటూ వెంటనే మనస్సనే కాన్వాన్‌ మీద, చిట్టి హర్షిత రూపం వెలిసింది. పట్టు పరికిణీలో తనే పసిపాపై ఉయ్యాల్లో ఊగూతూన్నట్టనిపించింది. తన పిచ్చి ఊహలకి తనకే నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుకుంది.

“ఏం జ్ఞాపకం వచ్చిందోయ్‌? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అదేదో మాకూ చెప్పు, మేమూ సంతోషిస్తాం.” అంటూ ఆట పట్టించారు స్నేహితులు.

“ఏం లేదు చెప్పడానికి” అని తప్పించుకోబోయింది.

“ఏదో మనోజ్ఞమైన తలపు నీ మదిని గిలిగింతలు పెట్టింది కనుకే ఆ చిరుమందహాసం నీ పెదవుల మిద పూచింది. ఏమిటో ఆ సంఘటన వివరించవే చెలీ...” క్లాస్‌మేట్‌ తపస్య గేలి చేసింది నాటక ఫక్కీలో మాట్టాడుతూ! మిగిలిన వాళ్ళందరూ తందాన తాన అన్నారు.

"పేరంటం ఆంతా ఎంతో సరదాగా పెద్దల ఆశీస్సులతో, స్నేహితుల ఆట పట్టింపులతో సరదాగా గడిచిపోయింది. మెల్లగా ఒక్కొక్కరూ వెళ్ళిపోవడంతో రద్దీ తగ్గింది.

“ఫణీపద, మనమూ వెళదాం” పిలిచింది లతిక, ఆనందమూర్తితో కబుర్లు చెబుతూన్న ఫణి లేచి హర్షిత దగ్గరికొచ్చాడు. మెల్లగా రహస్యం చెబుతున్నట్టుగా

114

వెన్నెల వేట “హర్షిత్తా! రంభా, రాగిణీ, మేనకా, తిలోత్తమలను తలదన్నే అప్సరస ఎవరో దివినుంచి భువికి దిగొచ్చి, మా మధ్యన కూర్చున్నట్టుంది.” అన్నాడు. మామూలుగా అయితే హర్షిత ఏదో సమాధానం చెప్పేదేగానీ ఆ రోజు తనూ ఆనంద్‌లు మాట్లాడుకుంటూన్నప్పుడు ఫణి దూరం నుంచి తమనే చూడడం సంస్కారంలేని అతని స్వభావాన్ని గుర్తుకుతెచ్చింది.

చిన్నగా నవ్వి ఊరుకుంది హర్షిత.

అందిరి దగ్గరా సెలవు తీసుకుని, ఫణి, లతికలు కూడా వెళ్ళిపోయారు.

లలితాంబగారు హర్షితని లోపలికి తీసుకెళ్ళి దిష్టి తీశారు. “ఇంక బట్టలు మార్చుకుని రామ్మా” అంది.

“అమ్మా... వేడి వేడి నీళ్ళతో స్నానం చెయ్యనా? నడుం నొప్పిగా వుంది అడిగింది హర్షిత.

“అలాగే చెయ్యి! హాయిగా నిద్దరపడుతుంది” అంది ఆమె.

మహాలక్ష్మమ్మగారు కోడలికి తల్టో పూలు తీసి జుట్టు చిక్కు విప్పారు. తల్లి వేన్నీళ్ళు పెట్టాచ్చి దిష్టి తీసింది.

తియ్యని తలపులతో వెళ్ళి స్నానం చేసొచ్చింది హర్షిత.

ఆ రాత్రి హర్షిత జీవితంలో మరపురాని మరువలేని వెండి వెన్నెల రాత్రి! ఆనంద్‌ అనురాగ డోలికలలో పాపొయిలా ముడుచుకుపోయిన మధురమైన రాత్రి!

కొత్త కొత్త తలపులతో, మురిపించే వలవులతో ఒకరిలో ఒకరు ఐక్యమయిపోయిన రాత్రి!

రెండు మనుసులూ పెనవేసుకుపోయి అనురాగాల అప్యాతల పందిట్లో

115

శారదా అశోకవర్ధన్‌ పరవశంతో పరవళ్ళు తొక్కిన రాత్రి!

పసిపాపలా, గువ్వలా, ఆనంద్‌ కౌగిట్లో ముడుచుకుపోయి. హాయిగా నిద్రపోయింది హర్షిత ఏ తెల్లవారు రూములోనో!

ఆవా అందాల నగుమోముని తిలకిన్తూ, అమాయుకవైైన, చంద్రబింబంలాంటి మొహాన్ని చూసి ఆనందిస్తూ, నుదిటిపై చిందరవందరగా పడ్డముంగురులను సవరిస్తూ ఆమెకు నిద్రాభంగం కలగకుండా అపురూపంగా "అదిమి పట్టుకుని జోపుచ్చుతూ తెల్లవార్లూ మేలుకునే వున్నాడు ఆనంద్‌. అతని మనో భావాలకి ఊహా చిత్రాన్ని రూపకల్పన చేసుకోవాలే తప్ప వర్షించలేము.

సూర్యోదయమైన నాలుగయిదు గంటల వరకూ హర్షితకు మెలకువ రాలేదు.

-ఆనంద్‌ మాత్రం మామూలు ట్రైముకే లేచిపోయి, మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళొచ్చి, రెడీ అయి కూర్చున్నాడు. “అర్జంటు కేసులేమైనా వుంటే ఇంటికి ఫోన్‌ చేస్తే క్లినిక్‌కి వస్తాను. లేకపోతే రానని ముందుగానే కాంపౌండర్‌కే నర్చుకీ చెప్పేశాడు.

తెల్లని మల్లెపువ్వులాంటి మక్‌మల్‌ పైజమా, కుర్తా వేసుకుని బాల్కనీలో కూర్చున్నాడు తల్లి అందించిన వేడివేడి ఇడ్లీలు తింటూ.

అప్పుడడిగింది లలితాంబగారు. “ఆనంద్‌ బాబూ, హర్షితని నాతో తీసికెళ్ళనా పురిటికి” అని,

ఆనంద్‌కి గుండె క్షణం కొట్టుకోవడం మానేసినట్టనిపించింది. ఇడ్లీ చేదుగా వున్నట్టు మింగుడు పడలేదు. 'హర్షిత పురిటికని వెళ్ళిపోతే కనీసం ఏ అయిదారు నెలలో తనకి దూరంగా వుండాల్సొస్తుందా? హర్షిత లేనిదే

116

వెన్నెల వేట ఒక్కరోజైనా తను ఊహించుకోలేడే! ఎలాగ?”

మహాలక్ష్మమ్మగారు నవ్వుతూ కొడుకుకేసి చూసింది. ఆతని ఆలోచనలను అర్ధ్హమయినట్టుగా పురుడొచ్చాక కావాలంటే నెల రోజుల్లోనే తీసుకొస్తాం. అప్పుడు నేనొచ్చి పాపకి మూడో నెల వచ్చేదాకా ఇక్కడ వుంటాను” అంది.

అప్పుడే లేచిన హర్షిత ఆటొచ్చి ఈ మాటలు విని ఆనంద్‌ కేసి చూసి నవ్వింది.

“హర్షితని విడిచి నేను క్షణం కూడా వుండలేను” అని అమ్మకీ అత్తగారికీ ఎలా చెప్పాలో తెలీక తికమకపడుతూన్న ఆనంద్‌కి హర్షిత అలా నవ్వితే ఉడుకుమోతుతనం కలిగింది.

“ఆమెనే అడగండి,” అన్నాడు ముక్తసరిగా.

“పుట్టింటికి వెళ్ళడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు? నువ్వు సరేనంటే తనూ సరేనంటుంది” అంది మహాలక్ష్మమ్మగారు కొడుకునుద్దేశించి.

“నాకు తెలుసు బాబూ! అన్నాళ్లు నువ్వు ఒంటరిగా వుండాలంటే ఇబ్బందే!...”

అంది లలితాంబ అల్టుడికేసి చూసి.

“హమ్మయ్య! ఈమైనా నన్నర్థం చేసుకున్నారు అదే చాలు" అనుకుంటూ ఊపిరి పీల్చుకునే లోగా, “అన్నాళ్ళు హోటల్లో భోజనం అదీ కష్టమే! కానీ తప్పుదు కదా” అంది మళ్ళీ!

“ఓహో ఈవిడ నా భోజనం గురించి ఆలోచిస్తోందా? దాందేముంది? ఏ హోటల్లోనో భోంచెయ్యొచ్చు. కానీ నా బాధ అదికాదు కదా! గలగలామాట్లాడుతూ, చిరునవ్వుతో పలుకరిస్తూ అడుగడుగునా తన కష్ట సుఖాలను విచారిస్తూ తన చుట్టూ తిరిగే హర్షితని ఒదిలి ఎలా వుండాలి అని" ఆ విషయం ఎవ్వరూ ఆలోచిస్తూన్నట్టు లేదు.

117

శారదా అశోకవర్థన్‌ ఇదంతా దూరంనుంచి చూస్తున్న హర్షిత మరి భరించలేకపోయింది. ఆనంద్‌ని చూస్తూ వుంటే జాలి ముంచుకొచ్చింది. “తనకి తెలుసు అతడు పసి పిల్దాడిలా, తల్లి కొంగుచ్చుకు తిరిగే పాపలా, క్లినిక్‌లో జరిగే ప్రతీ విషయమూ తనతో చెప్పనిదే ఏమీచెయ్యడు. ఇల్టూ అనారోగ్యంతో వున్న నాన్నగారినీ ఒదిలి అమ్మ ప్రస్తుతం రాలేదూ తన దగ్గర వుండడానికి! అత్తగారికీ మామగారికీ రాజమండ్రి గోదావరి నీళ్ళు లేకపోతే వుండలేదు సరికదా, నాలుగెకరాల మాగాణిలో వరి పంట చూసే వాళ్ళెవరూ లేరు. అందుకే తొమ్మిదో నెలొచ్చాక ఒక నెల అమ్మని పిలిపించుకుని, ఆ తరువాత అత్తగారిని మరో నెల కోసం రమ్మనమని చెబితే సరిపోతుంది. అప్పటికి వాళ్ళూ కాస్త్ర ఇక్కడ వుండడానికి వీలుగా ఏర్పాటు చేసుకుని వస్తారు" అనుకుని ఆమాటకే సైకి చెప్పింది. ఆనంద్‌ మనసు కుదుటపడింది. కళ్ళతోటే “థాంక్స్‌” అంటూ సౌంజ్ఞ చేసి చెప్పాడు. హర్షిత చెప్పిన తీరుకి ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు. అమ్మ చిన్నబుచ్చుకోవడం గమనించిన హర్షిత “అమ్మా! పురుడుఎక్కడ పోసుకుంటేనేమి? అమ్మ దగ్గరుంటే చాలుగా! ఆనంద్‌ డ్యూటీకి ఒక్క ట్రైెమంటూ లేదు. ఉదయం లేచింది మొదలు టెన్షనే! ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి, ఒంటరిగా తనలో తనే బాధపడవలసాస్తుంది. పైగా నేనేమీ తిరగలేని స్థితిలో లేను కదా! ఇప్పటి నుంచి రోజులు లెక్క ఎడుతూ కూర్చోవడం అనవసరం, రావడం లేదని బాధపడకు. ఫార్మాలిటీస్‌ మర్చిపోవాలి. మనకి ఏది అనుకూలమో అది చెయ్యాలిగానీ, అదేదో సిద్దాంతం లాగా, అది మనం పొటించనట్టగా ఫీలవకూడదు” అంది. ఆమె చెప్పిన తీరు అందరికీ 118

వెన్నెల వేట

నచ్చింది. అందుకే ఏకగ్రీవంగా “కరెక్టే! నీ ఇష్టం! అలాగే చేద్దా"మని ఒప్పుకున్నారు.

లలితాంబగారూ, మహాలక్ష్మమ్మగారూ, అక్కడి నుంచి వెళ్ళి లోపలేవో పన్లలో వడ్డారు. హర్షిత చెప్పిన విషయాలన్నీ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ చర్చించుకుంటూ,

వాళ్ళు వెళ్లగానే హర్షితను చుట్టేసి రెండు భుజాలు పట్టుకుని “థాంక్స్‌ హర్షీ! నన్ను బతికించావు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తికమకతో చచ్చిపోయాను అన్నాడు.

అతని మాటల్లోని ఆర్తి, కళ్ళల్లో కనిపించే అనురాగం చూసి హర్షిత ఆనందంతో పొంగిపోయింది.

శి శ 3

చాలా సంతోషంగా నాలుగురోజులు ఇట్టే గడిచిపోయాయి. ఫంక్షన్‌ కోసం వచ్చిన వాళ్ళంతా ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్ళిపోయారు.

ఆనంద్‌ రొటీన్‌ డ్యూటీలో పడిపోయాడు.

ఆ రోజు ఆదివారం. ఉదయం లేచినప్పటినుంచి బడలికగానే వుంది హర్షికకి.

మెల్లగా లేచి తనకీ ఆనంద్‌కీ పాలు కప్పులో పోసుకొచ్చింది. ఇద్దరూ ప్రాలుతాగుతూ, పేపర్‌ చదవడం పూర్తి చేశారు.

“ఇవాళ చాలా బద్దకంగా వుంది. వంట చెయ్యబుద్ధి కావడం లేదు” అంది గోముగా.

“ఒకే... నో.. కుకింగ్‌, ఇన్‌... ది... హౌన్‌..టుడే...” అన్నాడు నవ్వుతూ,

“అలాగే! ట్రేక్‌ ఫాన్ట్‌కి ఏదో ఉప్మా చేసేస్తాను. తినేసి వి...విల్‌..గో..” అంటూ

119

శారదా అశోకవర్ధన్‌ గబగబా స్నానానికి వెళ్ళింది హర్షిత. వేడి వేడిగా ఉప్మా తినేసి ఇద్దరూ తయారై బయలుదేరారు. “ఎక్కడికి వెళదాం”... అడిగాడు ఆనంద్‌. “మీ ఇష్టం.” “నీక్రోంకేమిటో.. తెలుపుదేవీ.. ప్రన్తుతం నీ కోరిక తీర్చడమే నా థ్యేయం... నా ధర్మం...” నాటక ఫక్కీలో అన్నాడు. “అలాగా!. అయితే వినండి! మీరెక్కడుంటే అక్కడ వుండడమే నాకిష్టం. మీతోటే వుండాలన్నది, నా అభీష్టం” అంది చిలిపిగా అతని కళ్లల్లోకి చూస్తూ. “అలాగా? అయితే ఏదైనా సినిమాకెళదామా? మార్షింగ్‌షో చూసేసి, ఆ తరువాత, గగ్రీన్‌పార్క్‌లో లంచ్‌ చేసి, ఆ తరువాత.. ఊ..” అంటూ ఏదో చెప్పబోతే ఆపేశాడు ఆనంద్‌. “ఆ తరువాత; చెప్పండీ.” ఏదో మత్తు ఆవరిస్తూ వుంటే మాట్లాడినట్టు మంద్రంగా అంది. “ఆ తరువాత... అమ్మాయిగారిని, నా గుండెల మీద పడుకోబెట్టుకునీ...' “భి.ఛీ... అవేం సాగవు సుమా... బుజ్జిగాడు...” నవ్వింది. “ఓహో... ఏమ్మా... బుజ్జిగాడు, నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొట్టడానికి కూడా ఒప్పుకోడా, పరమ దుర్మార్లుడిలాగా వున్నాడే...' “అదా...” పకపకా నవ్వేసింది హర్షిత. “ఆ నవ్వుల అందానికి ముగ్టడై తనూ శృతి కలిపాడు ఆనంద్‌. “ఢాం! ఢాం...ఢాం.” అని పెద్దగా పీడుగుపడ్డట్టు చప్పుడయితే ఇద్దరూ 120

వెన్నెల వేట ఉలిక్కిపడ్డారు. ఆనందమూర్తి కారుకి వెంటనే ్రేక్‌వేసి, హర్షితని గట్టిగా పట్టుకున్నాడు.

“భయపడకు” అంటూ మరీమరీ పొదివి పట్టుకున్నాడు. “ఏం జరిగింది?”

అడిగింది హర్షిత.

“చూస్తా” అంటూ మెల్లగా ఆమెను వొదిలి డోర్‌ తెరిచి దిగాడు. హర్షిత కూర్చున్న వైపు టైర్‌ బరెన్ట్‌ అయింది. “హర్షీ ఏమీ లేదు. ఇటుచూడు బుజ్జిగాడు బరువు ఎక్కువయిందేమో. ట్రైరుకాస్తా 'ఢాంఢాం' అంటూ పంకృరయింది. ఉండు. టైరు మారుస్తాను ఆటూ వెళ్లి డిక్కీ తెరిచాడు.

“టైరు పంకృరయిందా సార్‌... మీరుండండి. నేను మార్చి పెడతాను” అంటూ ఆనందమూర్తి చేతిలోంచి టైరును అందుకోబోయాడతను.

  • ఎవరు నువ్వు...”

“నేనొక మెకానిక్‌ని సార్‌... ఒకసారి విపరీతమయిన జ్వరంతో మీ అఆసుపత్రికొచ్చాను. మందిచ్చి, ఫీజివ్వబోతూంటే, ఒద్దు బాబూ! నేనిచ్చిందేమీ పెద్ద కాస్ట్ట మందు కాదు. రేపటికల్లా తగ్గిపోతుంది” అన్నారు. నేను డబ్బు తీసుకోమని చేతులు జోడించి చెప్పాను అయినా కాదన్నారు. మీరిచ్చిన మందు ఒక్కపూట వాడగానే జ్వరం మటుమాయమయింది. “పీ రుణం తీర్చుకోనివ్వండి సార్‌ అంటూ చేతిలోంచి టైరు లాక్కుని, పంకృరయిన ట్రెరుని విప్పసాగాడు. హర్షితా, ఆనందమూర్తిలు ఏదో మాట్టాడుకుంటూ నిల్చున్నారు. పది నిమిషాల్గోటైరు మార్చేసి “అయిపోయింది సార్‌” అన్నాడు.

ఆనందమూర్తి జేబులో నుంచి ఇరవైరూపాయల నోటు తీనీ అతనికందించబోయాడు.

“ఒద్దుసార్‌..” అంటూ తిరిగి చూడకుండా, స్కూటరెక్కి వెళ్ళిపోయాడు.

121

శారదా అశోకవర్ధన్‌ “ఎవరో దేముడిలా వొచ్చాడు” అంది హర్షిత. “అదే... అయినా ముక్తసరిగా రెండు' మాటలు చెప్పి, గబగబా, పని చేసుకుని వెళ్ళిపోయాడు” అన్నాడు ఆనందమూర్తి, “ఆనంద్‌! అంతా మీ మంచితనం! ఆ రోజున మీరు ఆతనికి ఫ్రీగా ట్రీట్‌ చేసి నయం చేసినందుకు ఆ కృతజ్ఞతలు ఈ రోజున, ఈ విధంగా తీర్చుకున్నాడు పాపం” అంది కారెక్కుతూ హర్షిత. ఇద్దరూ సినిమాహాలు చేరుకున్నారు. పాతసినిమా “బర్‌సాత్‌కేరాతో నడుస్తోంది మార్నింగ్‌ షో! “హర్ష్మీ చాలా పాత సినిమా, ఇది చూద్దామా, వేరే ఇంకేదైనా లేటెస్ట్‌ పిక్సర్‌ కెళదామా?” అన్నాడు కారు అపి. “ఆనంద్‌! ఈ లేటెస్ట్‌ పికృర్స్‌కన్నా పాత సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోరుకొట్టదు. తనివి తీరదు. మళ్ళీ మళ్లీ చూడాలనే అనిపిస్తుంది” అంది.

“కరెక్టొ' ఆంటూ కారు దిగాడు ఆనంద్‌.

హర్షిత కూడా కారు దిగింది. పోస్టర్లను చూస్తూ ఆనంద్‌ కారు పార్కింగ్‌ (ప్రయత్నంలో దూరంగా వున్నాడు. “మేడమ్‌! మీరు డాక్టర్‌ ఆనంద్‌గారి భార్య కదూ! ఇప్పుడే హౌన్‌పుల్‌ అయి టిక్కెట్టు కౌంటరు క్లోజ్‌ చేశారు. నా దగ్గర రెండు టిక్కెట్టున్నాయి. నా (ఫ్రెండు వస్తానని చెప్పి, ఇంతవరకూ రాలేదు. మీరు తీసుకోండి. పిక్సరు స్టార్టవబోతోంది.” అంటూ ఆమె సమాధానానికి ఎదురు చూడకుండానే, ఆమె చేతుల్లో టిక్కెట్ట పెట్టేసి, జనంలో కలిసిపోయాడతడు.

హర్షిత తేరుకుని వాడి మాటలు ఆనంద్‌కి చెప్పేలోపలే అతడు స్కూటర్‌మీద.

అవుట్‌ గేటులోంచి వెళ్ళిపోవడం గమనించారు. ఉదయం లాంటిదే బ్లూ కలర్‌ 122

వెన్నెల వేట టి.వీ.ఎస్‌. కానీ మనిషి వేరు.

“ఏం చేద్దాం! డబ్బుల సంగతెత్తకుండా టిక్కెట్లు చేతిలో పెట్టి వెళ్ళిపోవడం, ఆశ్చర్యంగా వుంది కదూ! అది కూడా థాంక్స్‌ చెబుతూంటే కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోవడం” ఆనంద్‌ ఏదో ఆలోచిస్తున్నట్టు, మెల్లగా అన్నాడు.

“వాడూ ఎవడో మీ దగ్గర ట్రీ ట్రీట్‌మెంట్‌ తీసుకునుంటాడు” నవ్వింది హర్షిత.

సినిమా మొదలవడం వల్ల అందరూ వెళ్ళిపోయారు. ఆవరణ ఆంతా ఖాళీ ఆయిపోయింది.

“ఏమిటీ! టిక్కెట్టు చేతిలో పట్టుకుని మనం ఇక్కడ కూర్చోవడమేనా? సినిమా చూస్తామా లేదా?” నవ్వుతూ అడిగింది హర్షిత.

ఆలోచనలకు బ్రేకు వేసి, లోపలికి నడిచాడు ఆనంద్‌.

పాతపాటలూ, పాత ఆర్టిస్టుల నటనా ఎంతో నచ్చాయి. హర్షితకి. సంతోషంగా చూసింది సినిమా అంతా.

“భోజనానికెక్కడికళదాం?” అడిగాడు కారు స్టార్టు చేస్తూ ఆనందమూర్తి,

“మీ ఇష్టం!”

“ఊహూ!.. నీ ఇష్టం!”

“అయితే. చైనీస్‌ పుడ్‌ తిందామా?”

“ఒకే! బుజ్జిగాడి ఆర్డరూ.. నీ ఇష్టం. నేనల్లా మీ ఒబీడియంట్లీ:”-." నవ్వుతూ హర్షిత బొజ్జని నిమురుతూ అన్నాడు ఆనంద్‌.

హర్షిత. చిన్నగా నవ్వుతూ... “కనబడకుండానే బుజ్జిగాడి మీద ఆంత

123

శారదా అశోకవర్ధన్‌ (ప్రేమ మీకు. ఇంక బుజ్జిగాడొచ్చాక, నన్ను కేర్‌... చేస్తారా...” అంది.

“హర్ష... బుజ్జిగాడైనా, ఎవరైనా ఈ (ప్రపంచంలో నీ తరువాతే! హర్షీ.. సరదాకి కూడా నిన్ను ఇగ్‌నోర్‌ చెయ్యలేను” అన్నాడు. అలా అంటూన్నప్పుడు, ఆతడి ముఖంలోని అనురాగం, ఆవేదనా కొట్టొచ్చినట్టు కనిపించింది.

హర్షిత ఆశ్చర్యపోయింది. ఏదో సరదాకందేగాని అతడి ప్రేమ తనకి తెలీదూ? ఒక్కసారి కూడా అతడి వల్ల తను బాధపడ్డ క్షణం లేదు. కన్న వారిని కూడా మరిపించేంత మధురాతి మధురమైన అనుభూతులు పంచాడు! పసిపాపలా లాలించాడు! 'ప్రణయదేవతలా (ప్రేమించాడు! అమ్మలా ఆదరించాడు! అసలు అటువంటి భర్తని పొందిన తను ఎంత అదృష్టవంతురాలు!

“ఆనంద్‌! నీ మనస్సు వెన్నలాంటిది. కాస్త వేడికూడా తట్టుకోలేదు. ఇంత మొత్తటి మనస్సయితే ఎలా? జీవితం ఎప్పుడూ పూలపాన్సే కాదుకదా! ముళ్ళూ వుంటాయి.”

“హర్ష! భగవంతుడు ఇంతవరకూ నన్ను పూల బాటమీదే నడిపిస్తూ వచ్చాడు. ఇకముందు కూడా అలాగే చేస్తాడని ఆశిస్తున్నాను. హర్షీ! తెలిసి, నేనెవ్వరికీ అపకారం చెయ్యలేదు.” ఆ మాటలంటున్నప్పుడు ఏదో ఆలోచనల్లో మునిగిపోయి, వేదాంతిగా కనబడ్డాడు హర్షితకి ఆనంద్‌!

“ఆనంద్‌! నీలాంటి అవృతహృదయుడిని భగవంతుడెప్పుడూ పూలబాటమీదే నడిపిస్తాడు.” ఆ మాటలు ఆంటూవుంటే ఆమె హృదయంలో ఏదో ఆర్రత అతనిని గురించిన తపన. మనసులోనే తను నిత్యం కొలిచే కనకదుర్గకి నమస్కరించుకుంది. మమ్మల్ని చల్లగా బ్రోవమని ప్రార్థించుకుంది.

కారు “గోల్డెన్‌ డ్రాగన్‌ రెస్టారెంటు ముందు ఆగింది.

“ఇద్దరూ ఒకరిపై మరొకరికి గల మమకారాన్ని తనివితీరా అనుభవిస్తూ

124

వెన్లుల వేట మత్తులో తేలుతూన్నట్టుగా, ఒకరిచెయ్యి మరొకరు పట్టుకుని, లోపలికి నడిచారు.

వాళ్ళు లోపలికెళుతూ వుంటే బ్లూ టీ.వి.ఎన్‌. అక్కడ ఆగివుండడం చూసి గిరుక్కున తిరిగి చూశాడు ఆనంద్‌.

“ఏంటానంద్‌? అలా కంగారుగా చూస్తున్నావు” అడిగింది హర్షిత.

“మూడు... బ్బూ..టీ...వీ.ఎస్‌!” చూపించాడు.

హర్షిత పకపకా నవ్వింది.

“ఎందుకానవ్వు?”

“లేకపోతే ఏమిటానంద్‌? బ్బూ... టీ... వి..ఎన్‌ చూసి అనుమానించడం ఏమిటి? నల్లవీర కట్టుకున్న వాళ్ళని చూసి నా పెళ్ళామే అనుకున్నాట్ట వెనకటికెవరో! ఇప్పటికిప్పుడు ఈ హోటలంతా చెకప్‌ చేస్తే, బ్బూ... టీ..వీ.ఎస్‌.లు కనీసం ఒక పాతికైనా కనిపిస్తాయి. అయినా ఆనంట్‌ నీకెందుకు అనుమానాలొస్తున్నాయి? నువ్వు ఈ మధ్యన అదోలా వుంటున్నావు. ఎందుకో నాకర్ధం కావడంలేదు. ఆనంద్‌! నీ మనస్సులో ఏముందో, ఏ విషయం నిన్ను కలవరపరుస్తోందో నాతో కూడా చెప్పకూడదా?” అనునయంగా అడిగింది హర్షిత.

ఆమె కళ్ళలోని భయాందోళనలను చూస్తే ఆనంద్‌కి ఆ విషయాన్ని ఇంక పొడిగించబుద్ది కాలేదు. “ఏం లేదులే పద.” ఆంటూ తలుపు తెరిచి లోపలికెళ్ళాడు. హర్షిత అతని వెనకాలే వెళ్లింది.

ఒక పక్కగా రెండే కుర్చీలున్నటేబుల్‌ చూసి, ఇద్దరూ కూర్చున్నారు.

మెనూకార్జ్డు తీసి హర్షితకందిస్తూ, ఏం కావాలో చెప్పు” అన్నాడు ఆనందమూర్తి. "కార్డుని అటూ, ఇటూ తిప్పి.చూసి, ఫ్రైడ్‌ రైన్‌, పాలక్‌ పనీర్‌,

125

శారదా ఆశోకవర్థన్‌ వెజిటబుల్‌ మంచూరియా అని నీకింకేమైనా కావాలా?” అడిగింది. “వెరీగుడ్‌ సెలెక్షన్‌. నాకింకేమీ అక్కర్లేదు” అంటూ టేబుల్‌ దగ్గరికొచ్చిన బేరర్‌కి, మెనూ ఆర్డర్‌ చేశాడు. బేరర్‌ భోజనం తెచ్చే లోపున ఇద్దరూ ఏవేవో విషయాలు మాట్టాడుతూ కూర్చున్నారు. ఇరవై నిముషాల్లో పొగలు చిమ్మే వేడివేడి భోజనం పట్టుకొచ్చాడు బేరర్‌. మంచి ఆకలి మీదున్నారేమో ఇద్దరూ తృప్తిగా తిన్నారు. “హర్జ్మీ హొ అబవుట్‌ అయిన్‌!క్రీం?” అడిగాడు అనంద్‌! జ క్షేగపమేమి అయిన్‌'క్రీం లున్నాయో వర్ణించాడు బేరర్‌. “టూ..పిస్తా” అన్నాడు ఆనంద్‌! “ఒశేగ అంటూ బేరర్‌ వెళ్లి, రెండు నిమిషాల్లో రెండు స్టేట్ల అయిన్‌ క్రీంతో తిరిగొచ్చాడు బేరర్‌. ఇద్దరూ అయిస్‌ శ్రీం తినడం పూర్తిచేశారు. సోంపు తీసి నోట్టో వేసుకుని, దాన్టో వున్న పటికబెల్లం ముక్కలని ఇద్దరూ ఏరుకుంటూ బేరర్‌ని పిలిచి బిల్‌ తెమ్మన్నాడు ఆనందమూర్తి, అలాగేనంటూ తలూపి వెళ్ళిన బేరర్‌, అయిదు నిమిషాల్లో తిరిగొచ్చి, “ఆయనెవరో మీ బిల్లడిగి పే చేసేశారు సారో” అన్నాడు. “ఆయనెవరు మా బిల్టు పే చేయడానికి?” అరిచాడు ఆనందమూర్తి, “ఏమో సార్‌! మేమంతా ఒక్కటే. ఆయన మా డాక్టరుగారు అని చెప్పి, మోరు బిల్లు డబ్బులిస్తూన్నట్టు చెప్పొద్దని రిక్పెస్ట్‌చేసి వెళ్ళిపోయారు సార్‌” అన్నాడు బేరర్‌. ఆనందమూర్తి గబగబా బయటికొచ్చి చూశాడు. అతనివెనకే బేరరూ, హర్షితా కూడా వచ్చారు. 126

వెన్నెల వేట

ఎవరో బ్బూ...టీ..వీ..ఎన్‌ మీద స్పీడుగా వెళ్ళడం కనిపించింది.

“అతనేసార్‌” అన్నాడు బేరర్‌.

ఆ టీ...వీ.ఎన్‌. నంబరుగానీ, దానిమీద వెళుతున్న అతని మొహం గానీ కొంచెం కూడా కనిపించలేదు ఆనందమూర్తికీ, హర్షితకీ!

జేరరు ముందు బయటపడడం ఇష్టంలేక కిమ్మనకుండా కారు దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ. ఇద్దరి మనుసుల్లోనూ ఏవేవోఆలోచనలు.

“ఈరోజులో ఇది మూడవసారి!

ఎవరా వ్యక్తి? బ్లూ.టీ..వి...ఎస్‌...!

పంకృరు దగ్గరా, సినిమాహాల్గో, హోటల్లో మూడు చోట్లా బ్బూ...టీ..వి...ఎన్‌...!

అంటే అతనెవరో మన కార్యక్రమాన్ని గమనిస్తూ మనని వెంటాడుతున్నాడన్న మాటు” అన్నాడు ఆనందమూర్తి.

“ఆనంద్‌! నాకేదో బయంగా వుంది ఆనంద్‌” అంది హర్షిత!

“ఛయమెందుకు నాన్సెన్స్‌! కాకపోతే ఎవరు, ఎందుకు ఏ ప్రయోజనాన్నాశించి ఇలా చేస్తున్నారన్నదే నా ప్రశ్న! దీనికి సరైన సమాధానం దొరకడం లేదు. అన్నాడు ఆలోచిస్తూ (డైవ్‌ చేస్తూనే ఆనందమూర్తి!

ఇరువురి మధ్యా క్షణంలో ఆలోచనలు ముసురుల్లా అలుముకున్నాయి.

అంతకుముందు వున్న ఆనందమంతా క్షణంలో ఆవిరైపోయింది.

కారు షెడ్డులోపెట్టి ఇంట్టోకెళ్ళారు ఇద్దరూ. ఎందకో ఇద్దరూ అన్ని గదులూ ఒక్కసారి పరికించి చూశారు. ఆనంద్‌ బయటికొచ్చి ఒక్కసారి చుట్టపక్కల కలయచూశాొడు.

మళ్ళీ ఆ బూ...టీ...వి.ఎన్‌ కానీ, ఇంకెవరైనా కొత్త మొహం కానీ

127

శారదా అశోకవర్ధన్‌ కనిపిస్తుందేమోనని!

హర్షిత బట్టలు మార్చుకునొచ్చింది. ఉదయం నుంచి బడలికగా వుందేమో, మంచం మీద వాలిపోయింది కానీ, నిద్దరపట్టడం లేదు.

“హర్ష్మీ నువ్వు మీ అమ్మా వాళ్ళింటికి వెళ్లిపోకూడదూ? నీకు బడలిక ఎక్కువవుతోంది. నిన్ను ఒంటరిగా వదిలి నేను క్రినిక్‌కి వెళ్లి పని చేసుకోలేకపోతున్నాను” అన్నాడు ఆనందమూర్తి తనూ బట్టలు మార్చుకుని "పైజమా లాల్ఫీ వేసుకుని మంచం మీద వాలుతూ.

“ఆనంద్‌! ఈ పరిస్థితిలో నిన్నాదిలి నేను వెళ్ళను గాక వెళ్లను. లేదా క్షినిక్‌ కొన్నాళ్ళపాటు ఎవరికైనా ఇచ్చేసి మీరూ నాతో రండి. చేంజ్‌గా కూడా వుంటుంది” ఆంది.

ఆనంద్‌ నవ్వాడు, హర్షిత సలహాకి! కానీ హర్షిత మొహంలోని సీరియన్‌ నెస్‌ చూసి, ఆమెలోని భయాన్ని పొగొట్టాలని ప్రయత్నిస్తూ, “హర్షీ పీరికివాడిలా పారిపోమంటున్నావా? రేపీపాటికి ఐ.జి.పి.కి ఫోన్‌ చేసి చెప్పి, ఇంటిచుట్టూ పోలీన్‌ కాపలాపెట్టించనూ? కాకపోతే, ఎవడైనా మనని ఆటపట్టించడానికిలా చేస్తున్నాడేమోనని అనుకుంటున్నాను. అది సరే గాని “నువ్వు ఇంక శ్రమ పడలేకపోతున్నావు. అన్మూ వాల్లింటికి వెళ్లడమే మేలు” అన్నాడు

హర్షిత ఆలోచనల్లో మునిగిపోయింది. కాస్సేపటికి ఒక నిర్ణయానికొచ్చిన దానిలా, “ఆనంద్‌... పోనీ అక్కడేవైనా ఏర్పాట్టు చేసి అమ్మనే ఇక్కడికి పిలిపిద్దాం. మీరూ కాస్త గట్టిగా బతిమాలి నచ్చచెబితే అత్తయ్యగారు కూడా వొచ్చి ఉంటారు.” అంతేకానీ నేను మిమ్మల్ని విడిచివెళ్లను” అంది హర్షిత, ఆనంద్‌ హర్షితకేసి చూశాడు! ఆమె మొహంలోని నిశ్చలత్వం చూసి ఇంక వేరే మాట్లాడకుండా, “అలాగే చేద్దాంలే! దట్‌...ఈజ్‌.....గుడ్‌..ఐడియా...” అన్నాడు.

126

వెన్నెల వేట

“రేపే ఫోన్‌లో మాట్లాడి వెంటనే రమ్మనమని చెప్పండి” అంది హర్షిత.

“ఓ..శే..బాన్‌...! అట్టాగే చేస్తాను.” అన్నాడునవ్వుతూ హర్షిత మొహం మీద మొహం పెట్టి ఆమె కళ్లల్లోకి చూస్తూ, పెదవుల మీద పెదవులను ఆన్ఫటానికి ప్రయత్నిస్తూ!

“న్లో నో...! ఒదులు...” అంటూ దూరంగా జరిగింది హర్షిత గోముగా అతని పెదవులను గోటితో గీకుతూ.

ఇద్దరి మధ్యా ఈ సంభాషణ వల్ల ఏదో ప్రశాంతత కలిగింది. ఏవేవో మాట్లాడుకుంటూ కబుర్లలో మునిగి తేలుతూ, నవ్వుల పువ్వులను ఏరుకుంటూ, మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.

అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం మూడుగంటలయింది!

కలత ని(ద్ర।

ఠక్కున లేచాడు ఆనందమూర్తి!

పోలీస్‌ స్టేషన్‌లో నీ అంతం చూస్తానన్న ఆగంతకుడు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న స్నేహితుడు ఫణి! టీ..వి...ఎన్‌ మీద మొహం కనబడకుండా వెంటాడుతూన్న వ్యక్తి!

వీళ్ళంతా ఎవరు?

అందరూ ఒక్కరేనా? వేరువేరా?

అర్ధంకాని ప్రశ్నలతో అటూఇటూ దొర్జ్హుతున్నాడు ఆనందమూర్తి.

శ శే 3

“సిస్టర్‌..ఎరేంజ్‌గగ్రూప్‌ 'ఎబి” బ్లెడ్‌ ఇమీడియెట్టీ. వాళ్ల కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఎబి [గ్రూప్‌ బ్లైడ్‌ ఉందేమో కనుక్కోండి.” అంటూ తన నర్సింగ్‌ 'హెంలో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌ సిద్ధం చేయించాడు ఆనందమూర్తి,

129

శారదా ఆశోకవర్థన్‌ “ఎమర్జెన్సీ... అపెండిసైటిస్‌ ఆపరేషన్‌. రాత్రి పదిగంటలకి విపరీతమైన కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పద్దెనిమిదేళ్ళ సుధీర్‌ని. నర్స్‌ ఇంటికి ఫోన్‌ చేసి ఆనందమూర్తికి చెప్పింది. హర్షితని ఒంటరిగా వదిలి వెళ్ళలేక, సీరియస్‌గా ఉన్న పేషెంట్‌ని చూడనని చెప్పలేక సందిగ్ధంలో పడ్డాడు ఆనందమూర్తి. “నాకేం ఫరవాలేదు. మీరు వెళ్లండి. పాపం మీమీద నమ్మకంతో కొండంత ఆతృతతో మీ దగ్గరకొచ్చారు” అంది హర్షిత.

“పోనీ ఆ కేసుని ఫణి దగ్గరికి పంపించేస్తే?” ఆలోచనగా అన్నాడు ఆనందమూర్తి.

“ఫణి దగ్గరకా? ఒద్దు ఆనంద్‌. అంతకంటే ఇంకెవరి దగ్గరకయినా పంపడం మంచిది. అయినా ఇప్పుడు నాకేమయింది. మీరు నిక్షేపంగా వెళ్ళిరండి. పాపం ఆ పేషంటు ఎంత బాధపడుతున్నాడో ఏమో?” అంది ఆనందమూర్తిని లెమ్మని చెయ్యి పట్టుకుని లేపడానికి ప్రయత్నిస్తూ.

“హర్జ్మీ మో అమ్మగారితో నువ్వెళ్ళిపోయుంటే బాగుండేది” అన్నాడు ఆనందమూర్తి మళ్ళీ. “ఏం? ఎందుకని? నేనేం బాధపెడుతున్నానమ్మా మిమ్మిల్ని?” బుంగమూతి పెట్టి అలిగినట్టుగా దూరంగా జరుగుతూ ఆంది. “నువ్వు నా బంగారు రాణివి. నువ్వు నన్ను ఏమీ బాధపెట్టడం లేదు. = కాకపోతే నేనే బాధపెడుతున్నాను. నీ చేత పన్దు చేయించుకుంటున్నాను. ఒంటరిగా ఒదిలివెళ్ళితే మనసంతా నీ మీదే ఉంటుంది. తొందరలొనే మీ అమ్మగారొస్తే బాగుండును” అన్నాడు బట్టలు వేసుకుంటూ ఆనందమూర్తి, అంతలోనే ఫోన్‌ మళ్లీ మోగింది. 130

వెన్నెల వేట హర్షిత వెళ్ళి ఫోన్‌ తీసింది.

“ఆ.. పేషంట్‌ తాలూకు వాళ్ళా?”

“కాదు! సిస్టర్‌లూసీ! పేషెంట్‌ ఫ్యామిలీలో ఎవరికీ ఎబి (గ్రూప్‌ లేదుట. ఆ బాబూ వాళ్ళ పెద్దక్కయ్య ఒకామె మలక్‌పేటలో వుంటుందట. ఆమె (గ్రూపు'ఎబి' అన్నట్టు గుర్తు అని అతను చప్పాట్ట. అమెను తీసుకురావడానికి” ఎవరో వెళ్ళారుట. మీరు తొందరగా వస్తే బాగుంటుంది అంటున్నార్ట” అంది. “సరే! నే వెళతాను. మధ్య మధ్య ఫోన్‌ చేస్తానులే. తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండు. పడుకో హాయిగా” అంటూ బయలుదేరాడు ఆనందమూర్తి.

“ఓ.కే... డోంట్‌వగ్రీ అబవుట్‌ మి.. మీ పని మీద కాన్‌సంట్రేట్‌ చేసుకోండి.

టై...బెన్ట్‌ ఆఫ్‌ లక్‌” అంది తలుపేసుకుంటూ హర్షిత.

“బై... థాంక్యూ” అంటూ కారు స్టార్ట్‌చేశాడు ఆనందమూర్తి.

తలుపులు వేసి, డైనింగ్‌రూంలోకి వెళ్ళి ఫ్రిజ్‌ తీసి, చల్లటి నీళ్ళు తాగింది హర్షిత. లైట్లు ఆఫ్‌ చేసేసి చిన్న లైట్‌ మాత్రం వుంచుకుని, మంచం మీద వాలిపోయింది,

“డాక్టర్లనీ పోలీసోళ్ళనీ మాత్రం పెళ్ళాడకే తల్లీ! అర్ధరాప్రీ అపరాత్రీ అని లేకుండా ఏవో కేసులంటూ పోతూఉంటారు” అనేది అమ్మమ్మ.

సరిగ్గా మళ్ళీ ఆ మాటే గుర్తు చేస్తూ “నేను చెప్పానా? అయినా డాక్టర్నీ ప్రేమించావు. ఫరవాలేదులే, శః కుర్రాడు ఎర్రగా, బుర్రగా సినిమా హీరోలా ముద్దుగా ఉన్నాడు. డాక్టరుకన్నా యాక్టరయితే బాగుండేదేమో!” నవ్వుతూ అంది అమ్మమ్మ.

“అమ్మో! అమ్మమ్మా! నువ్వూ బలే జోకులేస్తున్నావే! ఏమిటో అనుకున్నా అంది తను. బోసినోటితో నవ్వుతూన్న అమ్మమ్మని చూస్తూ అందరూ

131

శారదా అశోకవర్ధన్‌ నవ్వేశారు. ఎన్నిసార్లో ఆనందమూర్తి ఇలా రాత్రిళ్లు కేసులంటూ వెళ్ళినా ఇవాళెందుకో అమ్మమ్మ మాటలు గుర్తొచ్చి తనలోతనే నవ్వుకుంది హర్షిత. నిద్ర పడుతూ పడుతూ వుండగా ఫోనొచ్చిందేమో ఇంక నిద్ర పట్టక అటూ ఇటూ దొర్జుతూ వుంది హర్షిత. మళ్ళీ ఫోన్‌ మోగింది. మెల్లగా లైటు వేసుకుని ఫోన్‌ తీసింది. “ఇంకా పడుకోలేదా?” అడిగాడు ఆనందమూర్తి. “లేదు, నిద్దర రావడం లేదు. పడుకుంటానులే. ఏదయినా మేగజైను చదువుతూ ఉంటే అదే నిద్దరొస్తుంది. పేషెంటెలా ఉన్నాడు?” అడిగింది. “ఫరవాలేదు. మందులూ, ఇంజెక్షన్లు ఇస్తూ ఉన్నాం, వాళ్ళక్కయ్య ఇప్పుడే వచ్చింది. లక్కీగా ఆవిడ (గ్రూపు ఇతనికి సూటవుతోంది. సో...బ్బడ్‌బ్యాంక్‌ చుట్టూ తిరగక్కళ్లేదు. ఆవిడ బ్బడ్‌ తీస్తున్నారు. నాకు ఇదంతా అయ్యేసరికి రెండుగంటలు పట్టొచ్చు. ఏదైనా వుంటే ఫోన్‌ చెయ్యి. గుడ్‌ నైట్‌” ఆంటూ ఫోన్‌ పెట్టేశాడు ఆనందమూర్తి. టేబిల్‌ మీద వున్న న్యూన్‌ పేపర్‌ తీసి మళ్ళీ ఒకసారి తిరగేసింది. అలా చదువుతూ చదువుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది హర్షిత. కాల్‌బెల్‌ కంటిన్యూయన్‌గా మోగడంతో గబుక్కున మెలకువ వచ్చి లేచింది హర్షిత. గడియారం పన్నెండు గంటలు చూపిస్తోంది. “ఆనంద్‌ వచ్చినట్టున్నాడు" అనుకుంటూ గబగబా వెళ్ళి తలుపుతీసింది. ఆనంద్‌, వాళ్ళ హాస్పిటల్‌ అటెండరూ, పక్కింటి రామానాయుడుగారూ కనిపించారు. ఆంతమందిని ఒక్కసారిగా చూసి, కంగారుపడిపోతూ, “ఏం జరిగింది రామానాయుడుగారూ మీరొచ్చారు?” ఆంది భయంగా. 132

వెన్నెల వేట

“ఏం లేదు తల్లీ! నువ్వు బాగా నిద్రలో వున్నట్టున్నావు. మీ ఆయన ఆరగంట నుంచి తలుపు కొడుతూంటే నువ్వు తీయలేదు. ఆ చప్పుడు విని నేనూ లేచొచ్చాను అంతే”.

“నేను అంత మొద్దు నిద్దరపోయానా? మై గుడ్‌నెన్‌” అంది కొంచెం బాధపడుతూ సిగ్గుపడుతూ.

“నీక్సు ఈ సమయంలో ఎంత బాగా నిద్దర పడితే అంత ఆరోగ్యం తల్లీ! నీకుతెలీనిదేముంది. మీ ఆయనే డాక్టరు” నవ్వుతూ అంటూ వెళ్ళిపోయారు రామానాయుడుగారు.

రామానాయుడుగారు హర్షిత అన్నా, ఆనంద్‌ అన్నా ఎంతో ప్రాణం పెడతారు. “అమ్మాయ్‌, అమ్మాయ్‌” అంటూ అస్తమానం ఆయన, ఆయన భార్య వేదవతిగారు పలుకరిస్తూనే ఉంటారు. ఆవిడ ఏమైనా స్పెషల్‌ వంటకాలు చేస్తే హర్షితకి తెచ్చి ఇవ్వకుండా వుండదు. ఆమెకి ఒక కూతురూ, ఒక కొడుకూనూ. కొడుకూ కోడలూ దుబాయ్‌లో వున్నారు. కొడుకు లాయర్‌ కూతురూ, అల్లుడూ అమెరికాలో వుంటున్నారు.అల్టుడు ఇంజనీరు. ఉన్నవూరు విడవలేక, ఈ ఊళ్ళో నమ్ముకున్న నేలతల్లి పాతికెకరాల మాగాణిని విడిచి వుండలేక ఇండియాలోనే వుంటూ, ఒక సంవత్సరం కొడుకు దగ్గరికీ, ఒక సంవత్సరం కూతురి దగ్గరికీ వెళ్ళి ఆరు నెలలు ఉండి వస్తూ ఉంటారు వేదవతిగారూ, రామానాయుడుగారూనూ. “హర్ష... సారీ... డిస్టర్చ్‌ చేశాను. ఇంకా ఆపరేషన్‌ మొదలు పెట్టలేదు. కొన్ని మందులు కావలసొచ్చాయి. తేవటానికెళ్ళారు. ఈలోగా పేషెంటుని ప్రిపేర్‌ చేస్తున్నారు. వాళ్ళక్కయ్య నుంచి బ్లెడ్‌ తీస్తున్నారు. ఇంకా టైముంది కదా, నిన్ను చూడాలనిపించింది. నిన్ను ఒక్కదాన్నీ విడిచివెళ్ళడం బాధగా అనిఫించడం వల్ల చూసి వెళదామని వచ్చాను" అన్నాడు ఆనందమూర్తి.

133

శారదా అశోకవర్ధన్‌

“ఆనంద్‌! నువ్వు మరీ 'సెంటిమెంటలైపోతున్నావు. నేను నిక్షేపంగా వున్నాను.

నా గురించి నువ్వు అనవసరంగా వర్రీ ఆయిపోతున్నావు. ఇలా అయితే నువ్వు పని చెయ్యలేవు. నేను అమ్మా వాళ్లింటికి వెళ్ళిపోతాను” అంది గోముగా.

ఆనంద్‌ ఆమెకేసి చూసి నవ్వుతూ “నన్ను వదిలి నీవు పోలేవులే... అది నిజములే..” అంటూ ఏదోసినిమా పాటని హమ్‌ చేశాడు. “కాఫీ కావాలా?” అడిగింది.

“ఒద్దు కూర్చో! అయినా నేనెళ్ళిపోవాలి. ఒక్కసారి గ్యాపుంది కదా అని చూడ్డానికొచ్చాను” అన్నాడు “ఉండండి డికాషన్‌' 'రెడీగా వుంది” అంటూ వెళ్ళి 'ఫ్రిజ్‌లోంచి పాలు తీసి కలిపి కాఫీ కుతో (ప్రత్యక్షమయింది హర్షిత. “టేక్‌ ఎ సిప్‌...” ఆంటూ కప్పుని ఆమె నోటికందించాడు రెండు గుక్కలు తాగి, “నాకు చాలు, నువ్వు తాగు ఆనంద్‌! ప్లీజ్‌... ఆపరేషన్‌ మీద కాన్‌సంటట్రేట్‌ చెయ్యి” ఆంది హరిత.

యె

గబగబా కాఫీ తాగేసి “ఓకే... బో అంటూ బయలుదేరాడు ఆనందమూర్తి,

“ఎంతసేపవుతుంది ఆపరేషన్‌ అయ్యేసరికి?” అడిగింది.

“ఒక గంటన్నరా రెండు గంటలవుతుంది. ఇంక డిస్టర్బ్‌ చెయ్యనులే. పడుకో!” అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్‌.

కారు సందు మలుపు తిరిగేదాకా 'బై' అని చెయ్యూపుతూ, ఆ తరువాత తులుపు గడియవేసి, దీపాలు ఆర్పి వచ్చి పడుకుంది హర్షిత,

ఆలా మంచం మీద కాస్సేపు ఒరిగిందో లేదో కాల్‌బెల్‌ మోగింది.

“ఏమిటలా చేస్తున్నాడు ఆనంద్‌! ఒక పక్క ఎమర్జన్సీ ఆపరేషనుండగా ఇటూ అటూ ఊరకే తిరుగుతున్నాడు. పైగా నా గురించి తెగ వర్రీ

కేప4

వెన్నెల వేట అయిపోతున్నాడు” అనుకుంటూ వెళ్ళి తలుపు తీసిన హర్షిత నోటమాట రాక మూగదానిలా చూస్తూ నుంచుండిపోయింది. ఫణి లోపలికొచ్చి తలుపు మూసి “ఏమిటలా కొయ్యబారిపోయావ్‌, రుడుసుకున్నట్టు” అన్నాడు.

నాలికి ఎండిపోతున్నట్టుగా ఆనపించగా, నోరు తడి చేసుకుంటూ'అవును రుడుసుకున్నాను. అయినా ఇప్పుడొచ్చావేమిటి?భయం భయంగా అడిగింది హర్షిత.

“ఇప్పుడయితే ప్రశాంతంగా ఉంటుందని” నవ్వాడు.

" ఫణీ! ఏమిటా పిచ్చివాగుడు? ఆనంద్‌ ఇంట్లో లేడు. ఎమర్జన్సీ ఆపరేషన్‌ ఉందని ఆసుపత్రికి వెళ్ళాడు” అంది తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తూ ఫణి తలుపు తెరవనివ్వకుండా అడ్డంగా నిల్చున్నాడు. వెకిలిగా నవ్వుతూ. హర్షితకి అతణ్జి చూస్తూంటే, ఏదో కొత్త మనిషిని చూసినంత భయం వేస్తోంది. వొళ్ళంతా చెమటలు పట్టాయి. ఎలాగో గొంతు పెగలించుకుని “ఫణీ! ఇంత అర్థరాత్రి నువ్వు ఒంటరిగా ఎందుకొచ్చావ్‌? లతికేదీ?” అడిగింది. “లతిక ఇంట్లో హాయిగా నిద్దరపోతోంది.”

“మరి నువ్వెందుకొచ్చావ్‌? వెళ్ళు” అంది ఆవేశంగా.

“హర్షితా! కాలేజీలో నా (ప్రేమని తిరస్కరించావు. పైగా నా శత్రువు ఆనంద్‌ని 'ప్రేమించావు. నాలో రగిలిన ఆ చిచ్చు ఇప్పుడు మంటలుగా ఎదిగింది” అంటూ ఏదో చెప్పబోతూన్న ఫణికేసి ఆశ్చర్యంగా చూస్తూ, “ఏమన్నావ్‌! ఆనంద్‌ నీ శత్రువా? అయితే స్నేహితుడిలాగా ఎందుకు

“పగ తీర్చుకోవడానికి...”

“పగా? ఎందుకు?” ”

135

శారదా ఆశోకవర్థన్‌

“నాకు చెందవలసినవన్నీ నేను కోరుకున్నవన్నీ అతడు కొట్టేసేవాడు కనుక”

“అంటే?”

“అంటే, అంటే ఆంటూ ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నావే...”

“ఫణీ!” అరిచింది.

“అరుపెందుకు, అడిగేవుగా చెప్తా విను. ఆటల్లో పాటల్లో ప్రతి పోటీలో ఎప్పుడూ నాకన్నా ముందుంటూ నాలో అసూయని పెంచాడు ఆనంద్‌. స్ఫూర్తి నా మీద ఏవేవో పితూరీలు చెపితే పెద్ద హీరోలాగా అవన్నీ నమ్మి ఆమెని" వెనుకేసుకొచ్చి నాకు బుద్ధి చెప్పినట్టు చెప్పి తను మంచివాడనిపించుకుంటూ, అవమానపరిచాడు.నిన్ను (ఢేమిస్తూ, నరిగ్గా నా (ప్రేమని వ్యక్తం చేసుకుందామనుకునే సమయంలో నాకన్నా ముందుగానే నిన్ను ప్రేమించానని చెప్పి నాకు దక్కకుండా వుండేందుకు పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. నా (ప్రాక్టీసుకు పోటీగా తనూ నాలాగే ఆసుపత్రి పెట్టి ధర్మాత్ముడైన డాక్టరుగా పేరు సంపాదించుకున్నాడు... ఇంకా...”

“షట్‌...” ఉన్మాదిలా అరిచింది. హర్షిత శరీరంలోని బలాన్నంతా కూడగట్టుకుని. ఆ అరుపుకు ఇరుగు పొరుగు వాళ్లెవరైనా లేచారేమోనన్న అనుమానం కలిగింది ఫణికి. గట్టిగా ఆమె నోరు మూసేసాడు ఫణి. సరిగ్గా అప్పుడే రామానాయుడి గారింట్లో లైట్లు వెలిగాయి. అతను కిటికీలోంచి ఆసక్తిగా అటుకేసి చూడడం గమనించిన ఫణి అత్యాచారం తలపెట్టి హత్య చేయాలనుకున్నవాడు టైము లేదని (గ్రహించి, ఈ నిమ్సుషం జారిపోతే ఎంత (ప్రమాదమో ఊహీంచి ఆమె గొంతు నులిమేశాడు. ఆతి కష్టం మీద “ఫణీ! ప్లీజ్‌ నన్నాదిలేయ్‌” అంది మెల్లగా.

136

వెన్నెల వేట

“నాకు దక్కనిది ఆనంద్‌గాడికి దక్కడం ఇన్నాళ్ళూ నేననుభవించిన చిత్రవధ, ఈనాటికి నీ చావుతో నాకు మనశ్శాంతి కలిగింది. వాడి బతుకు బుగ్గిపాలవుతుంది” అంటూ మరింత గట్టిగా పీక నులిమేశాడు. ఆయాసంతో, బాధతో రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడిపోయింది హర్షిత.

కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూస్తూన్న రామానాయుడుగారు, కంగారుగా భార్యనిలేపారు. ఆమె కూడా కిటికీలోంచి చూసి షాక్‌ తింది. వెంటనే తేరుకుని "పదండి మనం వెళదాం. ఏదైనా మాటా మాటా అనుకున్నారేమో! అయినా గర్భవతి అని కూడా ఆలోచించకుండా ఆనందమూర్తి ఇలా చేస్తాడేమిటి?” అంటూనే ఇద్దరూ తలుపు తీసుకుని వచ్చేలోగా టెలిఫోను మోగింది. వెంటనే ఫణి గోడదూకి వెళ్ళిపోయాడు. మెల్లగా పాకుతూ వెళ్ళి ఫోన్‌ అందుకుని “ఆనంద్‌... ఆనంద్‌...” అంటూనే స్పృహ కోల్పోయింది హర్షిత. ఫణి కారు స్టార్ట్‌ చేసి వెళ్ళిపోయాడు. అవతలి నుంచి ఆనంద్‌ 'హల్లో.. హల్లో అంటూనే హర్షిత గావుకేక... ఆ తరువాత నిశ్శబ్దం విని, ఊహకందని భయంతో, వెంటనే బయల్దేరి వచ్చేశాడు. ఈలోగా తలుపులు తోసుకుని లోపలికొచ్చిన రామానాయుడుగారూ, వేదవతి గారూ నెలకొరిగిపోయిన హర్షితని చూసి కంగారుగా, ఇంటికి అటుపక్క, ఇటుపక్క ఉన్న వారినందరినీ లేపారు. అందరూ వచ్చి చూసి హర్షిత ప్రాణాలు పోయాయయని నిర్జారణ కొచ్చారు. సరిగ్గా అదే సమయానికి ఆనంద్‌ కారు పార్క్‌ చేసి గబగబా లోపలికొచ్చాడు. అందరూ మౌనంగా నుంచున్నారు. ఆనంద్‌ గబగబా వెళ్ళి “హర్ష. హర్షీ.. ఏం జరిగింది? ఏమైంది నీకు?” అంటూ నాడి చూశాడు. ఒక్కసారిగా పసిపాపలా, పిచ్చివాడిలా ఘఫౌల్టుమన్నాడు. హర్షిత శవం మీదపడి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ వుండిపోయాడు.

ఆందరూ అతణ్ణి ఎలా పూరుకోబెట్టాలో ఏం చెయ్యాలో తెలీక నానా

137

శారదా ఆశోకవర్థన్‌

రకాలుగానూ సముదాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. “నాయుడుగారూ... ఏమైందండీ... నా హర్షితకి? అమ్మా మీరైనా చెప్పండమ్మా.. నాయుడుగారూ ఇందాక నేనొచ్చి తలుపు తట్టినప్పుడు మీరు లేచొచ్చారే! అప్పుడు బాగానే ఉంది కదా? ఇంతలోనే ఏమయింది?” అంటూ ఆమె మెడకేసి చూసి “అయ్యో రామా ఇది హత్య అండీ... ఎవరో గొంతు నులిమి చంపేశారు చూడండీ..” అంటూ గబగబా నాయుడిగారి చేతులు పట్టుకుని లాక్కొచ్చి చూపిస్తూ వుంటే, నాయుడుగారూ, వేదవతిగారూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

“హర్షీ. నా హర్షీ. నన్నొదిలి ఎందుకు వెళ్ళిపోయావు. అసలు.. నేనీ ఆపరేషన్‌ చేయనంటెే, నువ్వే బలవంతంగా పంపించావే. పాపిష్టివాబ్లి! నేవెళ్ళకుండా ఉన్నా బాగుండేది. నీకీ ప్రమాదం వచ్చేది కాదు. కలలోనైనా ఎవరికీ అపకారం తలపెట్టని నీకు ఇంత శత్రువు ఎవరున్నారు హర్షీ” అంటూ ఆమె పక్కనే తల బాదుకుంటూ రోధిస్తున్న ఆనందమూర్తిని చూస్తూ వుంటే అందరికీ గుండె చెరువైపోయి, కళ్ళంట నీళ్ళు జలజలా రాలాయి. రామానాయుడు దంపతులకి మాత్రం అంతా అయోమయంగా అనిపించింది. ఏం చెప్పడానికి నోరు పెగలడం లేదు. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చారు ఫణీ, లతికా! లతిక హర్షితను పట్టుకుని భోరున ఏడ్చింది. ఫణి కళ్ళు తుడుచుకుంటూ ఏదో చెప్పబోయాడు.

ఆనందమూర్తి హర్షిత ఫోనులో “ఫణి... ఫణి” అంటూ ఏదో చెప్పబోయిన విషయం గుర్తుకొచ్చింది. కళ్ళలో నెత్తురు చిమ్ముకున్నట్ట కళ్ళు

లు వెట్లికోపంతోఎ(ర్రబడ్డాయి. “యూ... స్కౌండ్రల్‌... నువ్వే నువ్వే కదానా హర్షితని చంపేసింది.” అంటూ దెబ్బ తిన్న పులిలా ఫణిమీదకి దుమికాడు ఆనందమూర్తి, 138

వెన్నెల వేట

“ఆనంద్‌ నీకేమైనా పిచ్చిపట్టిందా? నేనేమిటి? హర్షితని చంపడమేమిటి? అన్నాడు ఎంతో ప్రశాంతంగా. “యూ డర్టీఫెలో.. నీతులు చెబుతున్నావా? అసలు కొద్ది నెలలుగా నువ్వు మా జీవితాలతో ఆడుకుంటున్నావు. నా అనుమానం నిజమయింది. అప్పుడే నిన్నుపట్టుకునుంటే నా హర్షిత చచ్చిపోయేది కాదు..” అంటూ అతని మెడని చుట్టేసిన ఆనందమూర్తి చేతులని అందరూ దూరంగా విడదీశారు.

“ఒశేయ్‌!.. ఈవేళప్పుడు నువ్వు అతికతో సహా పరామర్శించడానికి ఎలా వొచ్చావు. హర్షిత చనిపోయిందని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ముందు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు! నా హర్షిత నీకేం బ్రోహం చేసిందని గర్భవతి అని కూడా ఆలోచించకుండా, ఆ ఇల్లాలి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు! రాస్కెల్‌! నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను” అంటూ పెద్దగా అరుస్తూ, భోరుమని ఏడుస్తూన్న అతనిని చూసి అందరూ కంటతడి పెట్టడం తప్ప ఎలా ఊరుకోబెట్టాలో చాతకాక కన్నీరుకార్బారు.

“ఉరేయ్‌! నీకు మతి చలించిందిరా! పిచ్చివాడిలా మాట్టాడుతున్నావు. నేనేమిటి, హర్షితని చంపడమేమిటి? మన స్నేహం తెలిసినవాళ్ళివరైనా సరే వింటే నవ్విపోతారు.” అన్నాడు. ఆనందమూర్తి భుజం పట్టుకుని నచ్చజెబుతూ. అతిక హర్షిత శవం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. హారన్‌ చప్పుడు విని అందరూ అటుకేసి చూశారు. పోలీసు జీపు.

“డాక్టర్‌ ఆనందమూర్తిగారు మీరేనా?” అడిగాడు ఇన్స్‌పెక్టర్‌.

ఏడుస్తూనే “అవునండీ ఆనందమూర్తిని నేనే! నేనే మీ దగ్గరికొచ్చి రిపోర్ట్‌ చేద్దామనుకుంటున్నాను... మీరే వచ్చారు. అయినా మీకెలా తెలిసింది? నా భార్యని ఎవరో హత్య చేశారని? సార్‌! ఆమె ఉట్టి మనిషి కూడా కాదు. గర్భవతి!

139

శారదా అశోకవర్ధన్‌ ఆమె నా ప్రాణం! నా దేవత! ఎవరో దుర్మార్గులు నేను ఆసుపత్రిలో వున్నప్పుడు, ఈమెని హత్య చేసి వెళ్లిపోయారు. సమయానికి నా ఫ్రెండు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర కూడా ఊళ్లో లేడు” అంటూ ఏడుస్తున్న ఆనందమూర్తిని మాస్తే కసాయివాడీ కత్తి కూడా కన్నీరు కార్చినట్టు ఇన్స్‌పెక్టర్‌ కళ్లూ చెమ్మగిల్లాయి.

పోలీసులు రాగానే అందరి మొహాలూ మారిపోయాయి. అందరూ కొంచెం దూరంగా జరిగి నించున్నారు. ఆనందమూర్తి కళ్ళు తుడుచుకుంటూ “అయినా ఇన్స్‌పెక్టర్‌గారూ! మీకెలా తెలిసింది ఈ విషయం? మీరెలా వచ్చారు?” అడిగాడు ఆనందమూర్తి తేరుకుని.

క్షణం సేపు మౌనం వహించాడు ఇన్‌స్పెక్టర్‌ కరీమ్‌.

బహుశా! ఆనందమూర్తి మాటలూ, అక్కడి దృశ్యం ఖాకీ బట్టలని కరిగించాయేమో వెంటనే సమాధానం చెప్పలేదు ఇన్స్‌పెక్టర్‌ కరీమ్‌. ఆయిదు నిమిషాలు అందరి మధ్యా మౌనం తాండవం చేసింది. ఆనందమూర్తీ, లతికా గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తున్న దృశ్యాలు తప్ప.

వెంటనే ఇన్స్‌పెక్టర్‌ తేరుకుని “డాక్టర్‌గారూ! నేనీ వార్త తెలిసి రాలేదు. మరొక వార్త మీకు చెబుదామని వచ్చాను. ఇంతలో ఈ దృశ్యం ఇక్కడ కనిపించి, మీకు ఆ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.

“ఏమిటి ఇన్స్‌పెక్టర్‌గారూ మీరు మోసుకొచ్చి ఆ వార్త అడిగాడు ఆనందమూర్తి, “మీరు గంట కిందట ఆపరేషన్‌ చేసిన పేషంట్‌ చని పోయాడు” చెప్పాడు ఇన్స్‌పెక్టర్‌.

“ఆ..” అన్నాడు షాక్‌ తగిలినట్టు ఆనందమూర్తి. వెంటనే తేరుకుని “నో... అలా జరగడానికి వీల్లేదు. ఆపరేషన్‌ వజ్‌ సక్సెస్‌ఫుల్‌” చెప్పాడు ఆనందమూర్రి.

140

వెన్నెల వేట

“డాక్టర్‌! అతనికి రాంగ్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్లనే పోయాడనీ వాళ్ళ వాళ్ళు "మాకు ఫోన్‌ ఏశారు. మేము అక్కడికి వెళ్ళి మీరు రాసిచ్చిన ఇంజక్షన్‌, ప్రిన్‌కిష్టన్‌ తీసుకుని, వేరే డాక్టర్లకి చూపించాము. ఆది చాలా ప్రమాదకరమైన ఇంజిక్షననీ, అది ఎందుకివ్వవలసి వచ్చిందో తెలీదనీ ఆందరూ చెప్పారు. అది కేవలం మీ అజా[గగ్రత్త వలననే జరిగిందనీ, ఆపరేషన్‌ జరిగే లోపు మీరు రెండుసార్జు ఇంటికి ఫోన్‌ చెయ్యడం, ఒకసారి ఇంటికి కూడా అనవసరంగా వెళ్ళి రావడం జరిగిందని అక్కడి స్టాఫ్‌ చెప్పారు. దాంతో మీరు ఆపరేషన్‌ మనసు పెట్టి చేయలేదనీ, పరధ్యానంలో ఉండి ఏదో ఇంజెక్షన్‌ రాసేసి వెళ్ళిపోయారని, అది ఒక బాధ్యతగల డాక్టరుగా చేయదగిన పని కాదని, ఆ పేషంటు ప్రాణాలు పోవడానికి కేవలం మీ అజా(గ్రత్త, నిర్లక్ష్యమే కారణమని ఆ పేషంటు తరపువాళ్ళు “హెల్త్‌ మినిస్టరుగారికీ, హోం మినిస్టరుగారికి ఫోన్టు చేశారు. మిమ్మల్ని ఆరెస్ట్‌ చేయమని ఐ.జి.గారు ఆర్డర్స్‌ జారీ చేశారు. మేము అందుకని వచ్చాం. కానీ ఇక్కడ ఈ దృశ్యం, జరిగిన సంగతులూ చూస్తూ వుంటే మాకేం చెయ్యాలో తోచడం లేదు. సారీ డాక్టర్‌గారూ మిమ్మల్ని తీసుకెళ్ళక తప్పదు” అన్నాడు ఇన్స్‌పెక్టర్‌ కరీమ్‌ బాధపడుతూ.

“ఇన్‌స్పెక్టర్‌గారూ, నన్ను నిద్దట్టో లేపి పేషంట్‌కి మందివ్వమన్నా, ఆపరేషన్‌ చేయ్యమన్నా, పొరపాటున కూడా రాంగ్‌ ప్రిస్‌క్రిష్టన్‌ ఇవ్వను. ఈ రోజు హర్షితకి రెండు సార్టు ఫోన్‌ చేయడం, ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళడం, కేవలం ఆమె నిండుచూలాలు కావడం, ఒంటరిగా ఇంట్లో ఉండడమే కారణం. అంతమాత్రం చేత నేను నా వృత్తిలో పరధ్యానం చూపించడం గానీ, నిర్లక్ష్యం చేయడంగానీ జరగలేదు. జరగదు! ఇందులో ఏదో మిన్‌చీఫ్‌ ఉంది!” అన్నాడు బాధగా ఆనంద్‌.

“సార్‌! మీరు స్వయంగా రాసిన ప్రిస్‌క్రిష్టన్‌ ఉంది చూండండి!” చూపించాడు

[41

శారదా అశోకవర్ధన్‌

ఇన్స్‌పెక్టర్‌. ఆనందమూర్తి ఆదుర్దాగా అది తీసి చూశాడు. కింద సంతకం ఉన్నమాట నిజమే కానీ అది తాను రాసింది కాదు. ఆమాటే అన్నాడు. “అదెలా సారొ* అన్నాడు ఇన్స్‌పెక్టర్‌. “ఏమండీ! ఆనందమూర్తికి డాక్టరుగా ఎంత మంచిపేరుందో ఇక్కడ అందరికీ తెలుసు. వారు పొరపాటున కూడా ఒక మందుకి ఇంకొక మందివ్వరు” అంది లతిక. “నువ్యోదో! డాక్టరులాగా మాట్టాడుతున్నావే! ఎప్పుడూ తప్పు చెయ్యకపోయినా ఇవాళ తప్పు చేసుండొచ్చుగా!” అన్నాడు ఫణి. “ఫణీ! నువ్వు... నువ్వూ... అలా అంటున్నావా? నా సంగతి నీకు తెలీదూ? ఎన్నిసార్హు నిన్ను నేను నీ తప్పులలోంచి గట్టెక్కించాను? నీకు జ్ఞాపకం లేదూ? చెప్పు ఫణీ! నేను తప్పుడు ట్రిన్‌క్రిష్టన్‌ షారపాటునైనా ఇవ్వనని చెప్పు ఫణీ! ఫ్లీజ్‌!” చేతులు జోడించి వేడుకున్నాడు ఆనందమూర్తి, ఫణి మాట్టాడలేదు.

ఆనందమూర్తి పిచ్చివాడిలా అయిపోయాడు. అందరినీ అర్థించాడు. అందరూ మూగగా ఉండిపోయారు. “ఇన్స్‌పెక్టరుగారూ! ఇంట్టో డెడ్‌బాడీ ఉంది. ఆమెనెవరు హత్య చేశారో తెలీదు. ఈ సమయంలో మీరతన్ని అరెస్ట్‌ చేస్తే ఎలా?” అంది లతిక.

“రామానాయుడుగారూ! కనీసం ఈమె చనిపోవడానికి ముందు ఏమైనా కేకలు వెయ్యడం గానీ ఆరవడం గానీ జరిగిందా? మీకేమైనా కనిపించిందా” అడిగాడు ఆనందమూర్తి. వేదవతి ఏదో చెప్పాలని నోరు తెరిచేలోగా, రామానాయుడుగారు కల్పించుకుని “లేదు బాబూ మాకేమీ తెలీదు” అన్నారు ముక్తసరిగా.

“డాక్టరుగారూ! ముందు శవాన్ని పోన్ట్‌మార్టమ్‌కి పంపించాలి. ఆ రిపోర్టు వచ్చే వరకూ, మిగతా కార్యక్రమాలేవీ చెయ్యడానికి వీల్లేదు.

142

వెన్నెల వేట

ఈలోగా మీరు బెయిల్‌మీద విడుదలవడం వగైరాలు చూసుకోవచ్చు” అంటూ జరిగినదంతా ఫోన్‌లో ఎన్‌.పి.గారికి, ఐ.జి.గారికీ చెప్పి, అంబులెన్స్‌ తెప్పించి హర్షిత శవాన్ని పోస్టుమార్టమ్‌కి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈలోగా ఫణి, లతికా కలిసి అయిన వాళ్ళందరికీ టెలిఫోన్లు చేసి, టెలిగ్రాములిచ్చి అందరికీ ఈ వార్త అందజేశారు. ఆనందమూర్తిని పోలీసులు తీసుకెళుతూ ఉంటే “ఏమండీ! ఎన్నిసార్టు మిమ్మల్ని ఆపదలనుంచి కాపాడాడు ఆనందమూర్తి! నిన్నగాక మొన్న వామనరావు విషయంలో...” అంటూ లతిక ఏదో అంటూ వుంటోషటవ్‌! నీకు సంబంధంలేని విషయాలలో నువ్వు జోక్యం చేసుకోకు” అంటూ కసిరాడు ఫణి.

వేదవతీ, రామానాయుడుగారి కేసి చూశాడు ఆనందమూర్తి. వారు పొడిపొడిగా మాట్టాడటం ఆనందమూర్తిని ఆశ్చర్యపరిచింది. హర్షిత హత్య చేయబడిన షాక్‌ ఒక పక్కా, సవ్యంగా ఆపరేషన్‌ చేసొచ్చిన తరువాత తన సంతకంతో పాయిజన్‌ ఇంజక్షన్‌ ్రిన్‌క్రిష్టన్‌ ఫోర్టరీ సంతకంతో మేనేజ్‌ చేసి ఆ పేషెంటుని హత్య చేయడం, రెండూ ఒకే రోజు ఒకదాని వెనుక ఒకటి జరిపించడంలో ఎవరో తనమీద కక్షగట్టి ఈ పని చేయించారని అనిపించినా తన మాట ఎవరూ వినిపించుకునే స్టితిలో లేరు. అయినా నిరూపించడం ఎలా? హర్షిత కొన్ని గంటల క్రితం తన కప్పులో సగం కాఫీ తాగి, తియ్యగా మాట్లాడి. తనకు కొండంత ధైర్యాన్నిచ్చి ఆసుపత్రికి పంపించిన తన ఆరో ప్రాణం, సడన్‌గా శవంగా మారిపోయిందంటే తట్టుకోలేని ఆనందమూర్తి వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీసుల వెంట బయళ్టేరాడు. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు! మర్న్షాటికల్దా, ఆనందమూర్తి హర్షిత తాలూకు బంధువులందరూ వచ్చారు. తండ్రీ, తమ్ముడు కృష్ణమూర్తి కలిసి బెయిలుమీద ఆనందమూర్తిని విడిపించారు.

143

శారదా అశోకవర్ధన్‌ *

పోస్ట్‌మార్టమ్‌వివరాలలో తేలిందల్లా బలంగా గొంతునులిమి ఊపిరి రాకుండా చేసి హత్య చేశారనీ వేలిముద్రలు లేకుండా బట్టలలోనూ పౌడరుజల్లి హంతకుడు జాగ్రత్త పడ్డాడనీ కొద్దో గొప్పో కనిపించిన వేలి ముద్రలు, ఆనందమూర్తివని నిర్దారించారు. ఆనందమూర్తికి పిచ్చెక్కినట్టయింది.

“నా ప్రాణానికి ప్రాణమయిన హర్షితని నేను హత్య చేస్తానా? ఆమెను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేనే! అందుకే ఆమెని పురిటికి పుట్టింటికి పంపలేదే! ఆమె కూడా వెళ్ళనందే! మా ఇద్దరిదీ ఒకే ప్రాణం!” అన్నాడు ఆనందమూర్తి. “కావాలంటే రామానాయుడిగారిని అడగండి. వారి భార్యనడగండి. నా స్నేహితురాలు ఫణి, లతికలనడగండి” అన్నాడు రామానాయుడిగారు చెప్పిన సాక్ష్యం విని విస్తుపోయారు అందరూ. హర్షిత కేకలు విన్నామని, కిటికీలోంచి గొంతు నులిమిన వ్యక్తి మొహం కనిపించలేదనీ, కానీ ఒడ్డూ పొడుగూ ఆనందమూర్తిలాగే వుందనీ చెప్పారు. ఫణినడిగితే 'నోకామెంటో అని ఊరుకున్నాడు. ఆనందమూర్తికి మతిపోయింది. 'ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎవవరికి ఏమి హాని చేశానని ఇలా చెబుతున్నారు” విలవిలలాడిపోయి కుళ్ళికుళ్ళి ఏడ్చాడు ఆనందమూర్తి,

“అన్నయ్యా! వీళ్ళందరూ ఏదేదో అంటున్నా, నువ్విలా చేశావంటే నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఈ కేసుని చక్కటి లాయర్‌ కప్పగించి విషయాలు సరిగ్గా తెలుసుకోండి” అంది నెమ్మదిగా ఆనంద్‌కి దగ్గరగా వచ్చి లతిక.

శ 2 3 క హర్షిత శవం బూడిదయి నేలలో కలిసిపోయింది. ఆత్మ గాలిలో మిళితమైపోయింది! ఆనందమూర్తి రోజూ పోలీన్‌ స్టేషన్‌లో సంతకం చేసొచ్చి, పిచ్చివాడిలా ఇంట్లో కూర్చుంటున్నాడు. రామానాయుడుగారు గానీ, 144

వెన్నెల వేట

ఇరుగుపొరుగులు కానీ ఎవ్వరూ వచ్చి పలకరించడం లేదు. ఫణి ఆ ఛాయలికి కూడా రాలేదు. ఆనందమూర్తి ఇంటిచుట్టు పోలీసు కాపలా వుంది.

“ఈ హత్య చేసిందెవరు?”

“ఎందుకోసం?”

“పేషెంటుని కూడా ఎందుకు హత్య చేశారు?”

“ఫోర్టరీ చేసిందెవరు?”

ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ లాయర్‌ సాంబశివరావుగారితో సంప్రదిస్తున్నాడు ఆనందమూర్తి,

ఎవరా వ్యక్తి... ఎవరు... ఎవరు....?

ఇవే ప్రశ్నలు

శే నే ౮

ఆనందమూంర్తికి ఆ యింట్లో వుండబుద్ది పుట్టడం లేదు. ఆ యింటిలో ప్రతి ఇటుకా, ప్రతి చెక్కా, ప్రతీ వస్తువూ అనుక్షణం హర్షితనే గుర్తుకు తెస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఆనందంగా పాపాయితో పాటు, ఆ యింట్లో ఆడుకుంటూ ఆనందడోలికల్లో ఊగిపోవలసిన వాళ్ళం.... ఎన్ని కలలు కందో హర్షిత! క్షణంలో కలలన్నీ కల్లలై బూడిదగా మారిపోయింది. దుఃఖిస్తున్న ఆనందమూర్తిని చూసి, “మహారాజులాంటి దంపతులకి, ఆ పుణ్యమూర్తులకి ఎన్ని కష్టాలు, ఎటువంటి దు:ఖాన్ని కలిగించావు దేవుడా' అంటూ ఆ ఇంటి పనిమనిషి రుక్ష్మిణి గబగబా రామానాయుడిగారింటికెళ్ళి “పెద్దవారు... ఆరికి తల్లిదండ్రులాంటివారు. నాలుగు రోజుల్నుంచి పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోవడం లేదండి. ఆళ్ళ తమ్ముడుగారు ఆయనగారి కొడుక్కి ఓంట్లో బాగాలేదని ఎల్లిపోయారు. ఆ ముసలమ్మని ఎందుకు బాధపెట్టడం నా

145

శారదా అశోకవర్ధన్‌ దగ్గరుంచుకుని అని ఆల్టు ఎంత వద్దన్నా ఇనకుండా అమ్మనీ నానన్ననీ కూడా ఆల్ల ఊరికి పంపించేశారు. ఒక్కరే కూకుని “ఎందుకిట్టా జరిగింది? ఎవరు చేశారీపని?” అని తనలో తానే మాట్టాడుకుంటూ, గుండె పగిలిపోయేలా ఏడుస్తూన్న ఆ బాబు బాధని సూడలేకపోతున్నానయ్యా! మీరన్నా ఒక్కసారొచ్చి ఆయనచేత గుక్కెడు నీళ్ళు తాగించి పుణ్యం కట్టుకోండి బాబూ” అంటూ కంటతడి పెట్టింది.

నాయుడు దంపతులకు గుండె కరిగిపోయింది. మనస్సాక పక్క వారిరువురి అనుకూల దాంపత్యాన్ని గుర్తు చేస్తోంది. ఇద్దరూ ఎప్పుడూ ఆనంద సాగరంలో తుళ్ళుతూ, నవ్వుల పువ్వులను ఏరుకోవడం తప్ప, క్షణం కూడా ఎడమొహం 'పెడమొహంగా వుండడం గానీ, చిన్న చిన్న దెబ్బలాటలుగానీ, పోట్లాడుకోవడం కానీ చూడలేదని చెప్తోంది. మరి కళ్ళు? ఇద్దరూ కళ్ళారా చూసిన దాన్ని ఎలా నమ్మకపోవడం? ఇలా నాయుడుగారు దంపతులు సందిగ్టంలో పడిపోయారు. ఏమీ. పాలుపోక.

ఆ రోజురాత్రి పోలీసులడిగి నప్పుడు కళ్ళతో చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు చెప్పారు. అదే రకం చొక్కా, వెనకభాగం మాత్రమే కిటికీలోంచి కనబడడం వల్ల, అతను బలంగా హర్షిత గొంతు నులమడం మాత్రమే కనిప్‌ంచింది. మొహం కనబడలేదు. అయితేం ఏం. ఒడ్డూ పొడుగూ తెలీదూ? పైగా పదినిముషాల క్రితం ఇంటికొచ్చాడు. వెంటనే హర్షిత అరుపులు వినిఫించాయి. ఆ దృశ్యం కనిపించింది. ఆ కొద్ది క్షణాల్లో ఆనందమూర్తి ఎక్కడికి వెళ్ళి పోతాడు? లోపలికెవరు ఎలా వస్తారు? పైగా చొక్కా, ఎత్తు, మనషి తెలుస్తూనే వుందిగా! అనుకుంటూ తాము చూసింది చూసినట్టు చెప్పి తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించుకున్నామని తృప్తిపడ్డా, హర్షిత్రా ఆనందమూర్తిల అనుకూల దాంపత్యాన్ని వారి అనురోగం ఆప్యాయతలనూ

146

వెన్నెల వేట

తలుచుకున్నప్పుడల్దా 'తాము చూసిన వ్యక్తి ఆనందమూర్తి అవునా కాదా? అన్న సందేహంలో పడిపోతున్నారు. పనిమనిషి రుక్మిణమ్మ చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరూ లేచి బయల్దేరారు. పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో జబ్బుపడినవాడిలా, వాలు కుర్చీలో ఒరిగి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆనందమూర్తిని చూస్తే గుండె కరిగిపోయింది వారికి. హర్షిత నవ్వులూ, ఆమె గలగలా మాటలూ, ఎంతో సందడిగా పదిమంది పెట్టుగా వుండేది. ఎవరు చూసినా చిలకా గోరింకల్లాగా వున్నారు” అనేవారు. 'ఏ చూపు కోపమో, ఏ నోటి శాపమో ఇలా అయిపోయింది! అనుకుంటూ నాయుడిగారి భార్య రుక్మిణమ్మ అందించిన పాలగ్గాసును ఆనందమూర్తి నోటి దగ్గర పెట్టింది. ఆనంద్‌ గ్లాసుని ముట్టుకోవడానికి కూడా నిరాకరించాడు. “నాయుడుగారూ! దయచేసి చెప్పండి. ఎందుకు మీరు హర్షితని నేను హత్య చేశాననుకున్నారు? నా ప్రాణంలో ప్రాణమే హర్షిత! నా ఇంటి దేవత! నా కంటిలో పాప! హర్షితని చంపి నా కన్ను నేను శ్మశాన వాటికగా మార్చుకుంటానా? చెప్పండి. ఎందుకలా చెప్పారు? మీ పాదాలకి నమస్కరిస్తాను. నా తండ్రి వంటివారు. నిజం చెప్పండి. నా హర్షి పోయిందనే బాధనే భరించలేని నాకు, హర్షితని నేనే చంపానన్న బాధ దహించివేస్తోంది నాయుడుగారి పాదాలను కన్నీళ్ళతో కడిగేస్తూ రోదించాడు ఆనందమూర్తి. ఆ దంపతుల కళ్ళు వర్షించాయి. “బాబూ! నిన్ను చూస్తే హంతకుడవని మనసు వప్పుకోవడం లేదు. మీ దాంపత్యాన్ని చూసిన వాళ్ళివరికీ కూడా ఆ అనుమానం రాదు. కానీ ఆ రాత్రి మేమిద్దరం కళ్ళారా చూసినది నమ్మలేకపోతున్నాం” అన్నాడు నాయుడుగారు.

“చెప్పండి నాయుడుగారూ! ఆరాత్రి మనిద్దరం కలసి తలుపుకొట్టాం. హర్షిత నిద్రలోంచి మేల్కొని వొచ్చి తలుపుతీసింది. తరువాత మీరు వెళ్ళి పోయారు. నేను పదినిమిషాలు వుండి కాఫీ తాగి వెళ్ళిపోయాను” ఆ తరువాత

147

శారదా అశోకవర్హన్‌ ఏం జరిగింది?” ఆడిగాడు ఆనాటి సంఘటనని గుర్తు తెచ్చుకుని ఆనందమూర్తి. “ఆసలు ఆపరేషనుందని ఆసుపత్రికి రాత్రి పన్నెండు గంటలప్పుడు... అదీ ఆపరేషన్‌ కాకముందే వొచ్చారు, దేనికని?” అడిగారు.

ఆయన ప్రశ్నలనుబట్టే ఆయనకెన్ని సందేహాలున్నాయో అర్ధంచేసుకున్నాడు ఆనందమూర్తి.

“నాయుడుగారూ! మీరు నా తండ్రిలాంటివారు. హర్షితకూ నాకూ మీరంటే గౌరవం వుంది. మీకూ మా మీద వాత్సల్యం వుంది. భగవంతుని మీదా, నాకు జన్మనిచ్చిన నా తల్లితండ్రుల మీదా ఒట్టేసి చెపుతున్నాను. ఆరోజు హర్షితకి కొంచెం నలతగా ఉంది...”

అంతలోనే ఆతని మాటల కడ్డు పడింది నాయుడిగారి భార్య. ఆతని చేత కాసిన్ని పాలు తాగించడానికి అదొక్కటే మార్గం అనుకుంది. “బాబూ! ఈ కాసిన్ని పాలూ తాగాక చెప్పు బాబూ” అంటూ గ్లాసుని అతని నోటికందించింది. ఇంక కాదనలేక గబగబా పాలు తాగేసి గ్లాసు రుక్మిణమ్మ చేతికందించాడు.

= అంతలోనే వచ్చాడు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర “ఏంరా... ఏం జరిగింది? ఏంటీ ఘోరం?” ఆంటూ, భోరుమని ఏడుస్తూ ఆనంద్‌ గట్టిగా వాటేసుకుంటూ. సురేంద్రని చూడగానే గుండె పగిలిపోయినట్టయింది. కట్టలు తెగిన ఆనందమూర్తికి కడలిలా దుఃఖం పొంగుకొచ్చింది. అతణ్ణి గట్టిగా కౌగిలించుకుని భోరుమని ఏడ్చాడు చిన్నపిల్లాడిలా. జరిగినదంతా చెబుతూ, తన మీద వొచ్చిన రెండు హత్యకేసుల గురించి, బెయిల్‌ మీద విడుదలవడం గురించీ చెప్పాడు. “నాయుడుగారూ! వినండి! ఆరోజు హర్షితకి కొంచెం ఒంట్లో నలతగా ఉంది. దాదాపు పదకొండు కావస్తుందనగా సోన్‌ మోగింది. సునీల్‌ అనే సేషంటుకి అప్పెండిన్‌ బర్‌స్ట్‌ ఆయింది. ఎమర్జెన్సీ ఆపరేషన్‌ చెయ్యాలి అని సిస్టర్‌ లూసీ ఫోన్‌ చేసింది. హర్షితని ఒంటరిగా వొదిలి వెళ్ళడం నాకిష్టం 148

వెన్నెల వేట

లేకపోయింది. కేసును డాక్టర్‌ ఫణికుమార్‌ దగ్గరికి పంపుదామనుకున్నాను. కానీ వాళ్ళు నేనే చెయ్యాలన్నారు. హర్షిత కూడా 'నాకు బాగానే వుంది. మీరు వెళ్ళండి. వాళ్ళకి మీ హస్తవాసి అంటే నమ్మకం' అంటూ బలవంతపెట్టింది. కాదనలేక వెళ్ళాను. ఆతని బ్లడ్‌[గ్రూప్‌ కోసం వాళ్ళ వాళ్ళందరి బ్లడ్డూ పరిశీలించాం. ఎవరిదీ కుదరలేదు. వాళ్ళ అక్కయ్య మలక్‌పీటలో వుంటారని అమెని పిలిపిస్తామనీ చెప్పారు. ఆమె వొచ్చాక ఆమె బ్లడ్‌ సూటయిందని తెలిసి ఆమె బ్లడ్‌ తియ్యమని చెప్పి, ఆపరేషన్‌కి తగిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పి, బ్లడ్డు తీసేలోగా టైముందని హర్షితని చూసిపోదామని వొచ్చాను. “ఆ ఐయామ్‌ సారీ! ఆంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, మధ్యలో ఒకసారి ఫోన్‌ కూడా చేశాను. అప్పటికి ఇంకా నిద్ర రావడం లేదనీ పడుకోలేదనీ హర్షిత చెప్పింది. ఆందుకే ఆ గ్యాప్‌ పీరిడ్‌లో ఎలా వుందో చూద్దాం హర్షిత అని ఇంటికొచ్చాను. నాతోపాటు నా ఆటెండర్‌ కూడా ఒచ్చాడు. అయితే అప్పుడే నిద్ర పట్టడం వల్ల హర్షిత ఎంత తలుపు కొట్టినా తలుపు తియ్యలేదు. ఆ హడావుడికి మీరు లేచి, 'ఏంటి బాబూ!" అంటూ వచ్చారు. మమ్మల్నందరినీ

" చూసి కంగారు పడిపోయింది హర్షిత. మీరు వెళ్ళిపోయారు. నా అటెండర్‌ వెళ్ళి కారు దగ్గర నించున్నాడు.

“ఆపరేషన్‌ అయిపోయిందా? పేషెంట్‌ ఎలా వున్నాడు?” అడిగింది హర్షిత తన మామూలు ధోరణిలో.

“ఇంకా కాలేదు. ఇప్పుడే వాళ్ళ అక్కయ్య బ్లడ్‌ తీస్తున్నాం. అంతా అయ్యేసరికి మరో రెండు గంటలు పడుతుంది మధ్యలో నువ్వెలా వున్నావో చూద్దామని వొచ్చాను” అన్నాను.

“నేను బాగానే వున్నాని చెప్పానుగా? ఎందుకిలా చేస్తున్నారు ఇవాళ అంటూ నన్ను మందలించింది.

149

శారదా ఆశోకవర్ధన్‌ “సరే! ఎటూ ఒచ్చావుకదా! కాస్త కాఫీ తాగి ఫ్రెష్‌గా వెళ్ళు.” అంటూ కాఫీ కలిపిచ్చింది. వెంటనే కాఫీ తాగేసి బయలుదేరాను. ఆపరేషన్‌ పూర్తయి, మందులు రాసిచ్చి, సిస్టర్‌కి చెప్పి, బయలుదేరేముందు, మళ్ళీ ఫోన్‌ చేశాను. అంతే! ఆమె అరుపు కెవ్వుమని వినిపించింది. ఏదో చెప్పబోతున్నట్ట్లుప...ప...ప అంది. అంతే! నేను కంగారుగా బయలుదేరి వచ్చేశాను. అప్పటికే నా హర్షి శవమై పడివుంది” వొణుకుతున్న గొంతుతో మాట రాక వెక్కి వెక్కి ఏడ్చాడు ఆనందమూర్తి, నాయుడు గారి దంపతులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అయోమయంగా! “మరయితే నువ్వు హత్య చేశావనే మాట ఎందుకొచ్చింది?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర.

“సాక్ష్యాలను బట్టి...” తల దించుకునే సమాధానం చెప్పాడు ఆనందమూర్తి.

“ఏమిటా సాక్ష్యాలు? ఎవరు చెప్పారు?” అధికారికంగా ఆడిగినట్టుగా తన పోలీస్‌ ధోరణిలో టెగాడు సురేంద్ర న

“నేనే సార్‌!” అన్నారు నాయుడుగారు.

“మీరా?” ఆశ్చర్యపోయాడు సురేంద్ర.

“నేనే! మా అనుమానాన్ని వ్యక్తం చేశాం,” అన్నారాయన.

“ఏమిటది చెప్పండి!” అడిగాడు సురేంద్ర,

“బాబూ! నువ్వు లోపలికెళ్ళాక నేనూ లోపలికెళ్ళిపోయాను. సరిగ్గా ఒక పావుగంట గడిచిందో లేదో, కెవ్వున కేకలు వినిపించాయి. హాల్గోకొచ్చి లైటు వేసుకుని కిటికీలోంచి చూసేసరికి, హర్షితని గొంతు నులుముతున్న దృశ్యం కనబడింది. షాకులో మాట రాలేదు. ఎలాగో వెళ్ళి మా ఆవిణ్ణి లేపాను. ఆవిడా

150

వెన్నెల వేట

చూసి షాక్‌ తింది. తేరుకుని గబగబా బైటికి వచ్చి చూద్దుము కదా ఆనంద్‌ కారు లేదు. వెంటనే లోపలికొచ్చి చూశాం. తలుపులు తెరిచి దగ్గరగా వేసున్నాయి హర్షిత నేలకొరిగి వుంది. ఫోన్‌ రిసీవర్‌ వేళ్ళాడుతూ వుంది _ఆనందమూర్తికోసం ఆన్ని గదులూ చూశాం. ఎక్కడా కనిపించలేదు. వేదవతి

భయంతో పక్కవాళ్ళనీ, ఎదురింటి వాళ్ళనీ లేపింది. వాళ్లందరూ వచ్చిన

అయిదు నిమిషాల లోపే ఆనందమూర్తి రావడం, హర్షిత నాడి చూసి

నేలకొరిగిన ఆమెమీద పడి పసిపిల్దాడిలా ఏడవడం మా హృదయాలను

కరిగించేసింది. కానీ...”

“అది సరే నాయుడుగారూ! ఈ హత్య చేసిందీ ఆనందేననే అనుమానం మీకెందుకు కలిగింది?” అని ప్రశ్నించాడు సురేంద్ర,

“ఆ రాత్రి ఆతను ఒకలాంటి మెరూన్‌ షర్ట్‌ వేసుకునుండడం చూశాను

  • ఆసుపత్రి నుంచి పన్నెండు గంటలకొచ్చి తలుపు తట్టినప్పుడు. అతని మొహం కనబడలేదు కానీ అదే షర్టు. కలర్‌ మదురురంగు మెరూన్‌ కదా ఆ కాస్త వెలుగులో కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది.” అన్నారు.

“అవునండీ! పైగా ఒడ్డూ పొడుగూ అచ్చం ఆలాగే అనిపించింది ఆనందమూర్తిలాగే. పైగా తలుపులువేసుకొని లోపలికళ్ళిన పదినిమిషాలు... పావుగంటలోనే కేకలు వినబడడం, మేము కిటికీలోంచి చూస్తూండగానే కారు స్టార్ట్‌ చేసిఅతడు వెళ్ళిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. మేమొచ్చేసరికి తలుపులు తెరిచే ఉండడం అంతా మాకు అనుమానాన్ని కలిగించింది. మేము కంగారుగా ఇరుగుపారుగుల్ని లేపేసరికి ఆనందమూర్తిగారు తిరిగొచ్చారు” అంది వేదవతి.

“అమ్మా! అతను తిరిగొచ్చినప్పుడు అదే షర్టులో వున్నాడా!”

151

శారదా అశోకవర్ధన్‌

“సురేంద్రా!.... ఏమిటిరా ఇది?” పెద్దవాళ్ళను పట్టుకుని నీ ప్రశ్నలు?” రెండు చేతులలో ముఖాన్ని దాచుకుని మోచేతులను కాళ్ళమీద అన్ని కూర్చుని కన్నీళ్ళతో కరిగిపోతూ అడిగాడు ఆనందమూర్తి.

“నువ్వుండరా!” అది నా వృత్తి. అంటూ ఆతను వేదవతి వైపు చూశాడు.

“అవును. అదే మెరూన్‌ కలర్‌ షర్టులోనే వున్నాడు. అందుకే మాకు అనుమానం కలిగింది” అంది ఆమె.

“అటువంటి రంగు షర్టే హంతకుడు కూడా వేసుకుని వుండొచ్చుగా!”

“ఆట

“మరి?”

“క్రానీ,..”

“ఊల.కానీ... చెప్పండమ్మా. మీ మనసులోని సందేహాలను ఉన్నదున్నట్టు చెప్పండి. అప్పుడే ఈ కేసును పూర్తిగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.” ఆనందమూర్తిని రక్షించడానికి వీలవుతుంది.

“వెనుకనుంచి చూశామండి. ఆ లావూ, పొడుగూ, అదే రంగు షర్టు, ఇన్‌షర్ట్‌ చేసుకుని...” చెప్పడం ఆసీ కళ్ళు తుడుచుకుంది వేదవతి.

“ఇతనిలాగే వేరే ఎవరైనా ఉండొచ్చుగా?”

“ఉండొచ్చునుకోండి, తరచు అటువంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తాం కానీ నిజ జీవితంలో...”

“ఎవరైనా ఇతని మూమెంట్స్‌ని వాచ్‌ చేస్తూ, ఇతనిలాగే (డైస్‌ చేసుకుని, ఆతడు పదినిమిషాలు ఇంట్లో వుండి కాఫీ తాగి వెళ్ళగానే, తలుపుకొట్టి లోపలికొచ్చి ఈ హత్య చేసుండొచ్చుగా!”

152

వెన్నెల వేట

“సురేంద్రగారూ! మీరన్నవన్నీ జరిగే అవకాశం లేకపోలేదు. అంతలా ఆనంద్‌ గారిలాగా ఏక్టు చేసి వొచ్చి హత్య చెయ్యవలసిన అవసరం ఎవరికుంది? ఆ వచ్చినవాడు దొంగయితే కనీసం ఒంటిమీది నగలైనా పోయుండేవి! మరి ఎక్కడి వస్తువులక్కడే వున్నాయి. సార్‌! ఆనందమూర్తి మా బిడ్డలాంటివాడు. ఈ పాడు సంఘటన వల్ల ఇలా మాట్లాడవలసి వస్తోందే గానీ, లేకపోతే, ఆతడు దేవుడిలాంటి వాడు. మంచి మనిషి మంచి డాక్టరు” కంట తడిపెట్టుకుంది వేదవతి.

“ఎవరికైనా ఆనంద్‌బాబు మీద కక్ష వుందంటారా? ఎంతటి సీరియస్‌ కేస్తునైనా తన హస్తవాసితో ఇట్టే నయం చేస్తాడని పేరు తెచ్చుకున్న ఆనంద్‌బాబు రాంగ్‌ ప్రిస్కిష్టన్‌ ఇవ్వడంవల్ల, ఆ (ప్రమాదకరమైన మందు వల్ల పేషంటు సుధీర్‌ ప్రాణాలు పోగొట్టుకున్నాడంటే ఆశ్చర్యంగా లేదూ?” అడిగాడు సురేంద్ర.

“అవును. ఇన్‌స్పెక్టర్‌ గారూ! ఇదంతా ఏదో మిస్టరీగా వుంది. హంతకుడు ఒక పథకం (ప్రకారం, తెలివిగా చేశాడు” అన్నారు నాయుడుగారు.

“ఈ రెండు హత్యలూ ఒకరే చేసుండాలి అని నా అనుమానం” ఆలోచిస్తూ అన్నాడు సురేంద్ర.

“పైగా ఆనంద్‌ బాబులాగే సంతకం పెట్టాడుట ఆ విషపు ఇంజెక్షనేదో

శొర్రాసిన ఆ ట్రిస్కిష్టన్‌ మీద...” అన్నారు నాయుడుగారు.

“ఆదే!... ఆంటే అతగాడికి ఇతని సంతకం గురించి కూడా బాగా

శతిలిసుండాలి” ఆలోచిస్తూనే అన్నాడు సురేంద్ర.

“అంటే ఆసుపటత్రివాళ్ళెవరైనా అఆయ్యుంటారా?” అన్నారు నాయుడుగారు.

“ఆనంద్‌! ఆరోజు నీతో వచ్చిన అటెండరు వస్తున్నాడా ఆసుపత్రికి”

153

శారదా అశోకవర్ధన్‌ అడిగాడు సురేంద్ర.

“లేదు... వాడు ఆపరేషీన్‌ అయిన వెంటనే సరాసరి ఆసుపత్రినుంచే బస్కెక్కి ఏదో అర్జంటు పనుందని ఏలూరు వెళ్ళాట్ట.”

“అంత అర్జంటు పనున్నవాడు ముందుగా ఆవిషయం నీకు చెప్పలేదా?”

“లేదు”

ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర ఈ పాయింటుని డైరీలో నోట్‌ చేసుకున్నాడు.

“మరి ఉలెళ్ళినట్ట ఎవరు చెప్పారు?”

“సిస్టర్‌ లూసీ!”

“ఆమె ముందుగా నీకీ విషయం చెప్పలేదా?”

"లేదురా! సిస్టర్‌ మాధవి తన అక్కకి పెళ్ళిచూపులున్నాయని లీవడిగిందట. అమె లీవు లెటర్‌తోపాటు నా అటెండర్‌లీవ్‌ లెటర్‌ కూడా అప్పుడే చూపించింది” చెప్పాడు ఆనందమూర్తి,

“నీకెవరి మీదనైనా అనుమానం వుందా? చెప్పు. విషయాన్ని నీ మనసులోనే దోచుకుని, కుళ్ళి కుళ్ళి ఏడవడం వల్ల ఏమీ లాభంలేదు” ఆనంద్‌ భుజం తట్టీ ఓదారుస్తూ అడిగాడు సురేంద్ర.

ఆ ఓదార్పుతో, నిండుగా వున్న గ్లాసుని చిటికిన వేలు తగిలినా వొలికిపోయేటట్టు, కదిలిపోయిన ఆనంద్‌ కరిగిపోయి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.

అప్పుడే లోపలికడుగు పెడుతున్న ఫణికుమార్‌, లతికలు కూడా ఈ దృశ్యం చూసి కంటతడి పెట్టారు.

లతిక చేతిలో టిఫిన్‌ క్యారియరుంది. క్యారియర్‌ని తీసుకెళ్ళి డైనింగ్‌

154

వెన్నెల వేట టేబుల్‌ మీద పెట్టింది.

ఫణి తల వంచుకుని కూర్చున్నాడు.

“స్సులేంద్రగారూ! ఈరోజు మీరైనా ఆనంద్‌ చేత నాలుగు ముద్దలు తినిపించండి. రోజూ మేము క్యారియర్‌ తేవడం అది ఎలా తెచ్చామో అలాగే వెనక్కి తీసుకెళ్లిపోవడం జరుగుతోంది. ఇతడు పచ్చి మంచినీళ్లయినా ముట్టడం లేదు. వాళ్ళ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. ఇతను వాళ్ళతో వెళ్లలేక ఇక్కడ వుండలేక సతమతమయిపోతున్నాడు. పోనీ, కొన్నాళ్ళు మా ఇంటికొచ్చి ఉండమని బతిమాలినా వుండడంలేదు. మీరైనా చెప్పండి” ప్రాధేయపడుతూన్నట్టుగా అడిగింది లతిక.

సురేంద్ర ఆమెనీ, ఫణినీ మార్చి మార్చి చూశాడు.

అనంద్‌కేసి చూశాడు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల పంకించాడు. కొంచెం సేపు అందరిమధ్యా మౌనం తాండవం చేసింది. పనిమనిషి రుక్మిణమ్మ అందరికీ 'టీ' చేసి పట్టుకొచ్చింది. సురేంద్ర అందించిన టీ కప్పుని యాంత్రికంగా అందుకున్నాడు ఆనంద్‌. “నేను వెళ్తానురా! మళ్ళీ వస్తా. ఒక అర్జెంటు కేసుంది” అంటూ సురేంద్ర వెళ్ళిపోయాడు. “ఆనంద్‌! లతికగారన్నట్టు ఓ వారం రోజులు వాళ్ళింట్టో వుండకూడదూ? నువ్వూ, ఫణీ క్లోజ్‌ ఫ్రెండ్సే కదా!” అంది వేదవతి. “ఆవును బాబూ! మీరిద్దరూ మంచి స్నేహితులు. షీ రెండు జంటలూ రెండు కళ్ళలా అనిపించేవి మాకు” అన్నారు నాయుడుగారు. “నిజం! కొంచెం స్థలం మారిస్తే మనసూ కుదుటపడుతుంది. తరువాత కార్యక్రమాన్ని గురించి నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు బాబూ! ఇక్కడుంటే 155

శారదా అశోకవర్థన్‌ ఇవే జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూ వుంటాయి” అంది వేదవతి.

“అవునురా! మా ఇంటికొచ్చేయి” అన్నాడు తల వంచుకునే ఫణి.

“స్థలం మార్చగానే మారిపోయే జ్ఞాపకాలా మావి? ఈ కంరంలో 'ప్రాణమున్నంతవరకూ, నా నరనరం హర్షిత పేరే పలుకుతుంది! నా కళ్ళనిండా ఆమె రూపమే నిండిపోయి వుంది! అటువంటప్పుడు నేనెక్కడుంటే ఏం లాభం?” రెండు చేతులూ కణతలకు నొక్కుకుంటూ అన్నాడు ఆనంద్‌.

“ఇక్కడుంటే నువ్వు భోజనం కూడా చెయ్యడం లేదు. ఎంత ప్రేమించిన వాళ్లైనా పోయిన వాళ్ళతో పాటు మనమూ పోలేం కదా? ఆనంద్‌ మూ ఇంటికొచ్చేయ్యి, కాస్తైనా మరుపూ చెరుపూ వుంటుంది” బతిమాలుతూన్నట్టుగా ఆంది లతిక,

“నో! ఫ్లీజ్‌... నన్నిలా వొదిలెయ్యండి. నా హర్షిత పోయినా, ఆ పాపానికి, ఒడికట్టిన వాళ్ళెవరో తెలిసే వరక్రూ నన్ను ఈ ఇంట్లోనే ఆమె తలపుల్లోనే ఉండనివ్వండి" అన్నాడు ఆనంద్‌ ఖచ్చితంగా.

“పోనీలే బాబూ! అలాగే వుండు. భోజనానిదేముంది? మేము పంపిస్తాం లేదా రుక్మిణమ్మ వొ, రడిపెట్టిపోతుంది” అన్నారు నాయుడుగారు.

కాస్సేపు కూర్చుని పనుందంటూ ఫణి లేచాడు.

“మళ్ళీ వొస్తాం” అంటూ లతిక కూడా ఆతని వెనకాలే వెళ్ళింది.

వాళ్ళు వెళుతున్న వైపే ఆనంద్‌ తదేకంగా చూస్తుండడాన్ని చూసి, రామానాయుడు దంపతులు కూడా ఆటే చూశారు.

రామానాయుడు గారు భార్యవైపు చూసి “వేదా! వీళ్ళిద్దరినీ స్నేహితులనడం కంటే అన్నదమ్ములంటే బాగుంటుందేమో! వెనక్ష నుంచిచూడు ఆనంద్‌లాగే

లేడూ అన్నారు. 156

వెన్నెల వేట

“అవును! అయినా వీళ్ళ స్నేహం నిజంగా చెప్పుకోదగ్గది. ఏనాటినుంచో కాలేజీ రోజుల్నుంచి పెళ్ళిళ్ళయి పెద్దవాళ్ళయినా ఒకరిని విడిచి ఒకరుండేవారు కాదు.” అంది వేదవతి.

ఆనంద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రామానాయుడు గారి మాటలు ఆతని చెవుల్లో రింగుమంటున్నాయి. హర్షిత పెట్టిన కేక టెలిఫోన్‌లో వినబడిన పొడి పొడి అక్షరాలు... ఫ....ఫ....ఫ.... అంటూ గుర్తుకొచ్చాయి. హర్షితని హత్య చేసింది ఫణా? ఒళ్ళు గగుర్పొడిచింది. స్నేహం నటిస్తూ ఇంత పని చేశాడా? అసలు స్నేహంలో కల్తీ వుంటుందా? అప్పుడు స్నేహం అనే పదానికి నిర్వ్శచనం ఏమిటి. ఆలోచనలు చెదల్హా వెదడును చుట్టేశాయి. గుండె బరువెక్కినట్టనిపించింది. కళ్ళు చీకట్టు కమ్మాయి. మరి కూర్చోలేక, ఆలోచించలేక కుప్పలా కూలిపోయాడు.

“ఏమయింది బాబూ, అలా పడిపోయావ్‌?” అంటూ పట్టుకోబోయారు నాయుడుగారు.

వేదవతి కూడా చెయ్యిపట్టుకుని పల్స్‌ చూసింది.

. “అయ్యో! ఇంతసేపూ ఫణీ, ఇన్స్‌పెక్టరుగారూ వున్నారు. ఇద్దరూ వెళ్లిపోయారే! ఎలాగ? పోనీ ఆనంద్‌ ఆసుపత్రికి ఫోన్‌చేసి, అర్జంటుగా ఎవరినైనా రమ్మని చెప్పనా?” వేదవతి వంక చూస్తూ అన్నారు నాయుడుగారు.

“ఉండండి! సొమ్మసిల్లినట్టున్నాడు పాపం! కడుపులో ఏమీ లేదు. కాఫీలూ.. టీలూ... పైత్యం చేసుంటాయి.” అంటూ వెళ్ళి (ఫ్రిజ్‌ తలుపు తీసి సీసాలోనుంచి చల్లని నీళ్ళు మొహాన చల్లింది వేదవతి.

కళ్ళు తెరిచి చూశాడు ఆనంద్‌.

“క్షాంచెం కాఫీ తేనా?” అడిగింది రుక్కిణమ్మ.

“ఒద్దు! మంచినీళ్ళివ్వండి” అన్నాడు ఆనంద్‌ నెమ్మదిగా!

157

శారదా ఆశోకవర్ధన్‌ వెంటనే నీళ్ళందించింది రుక్మిణమ్మ. “బాబూ! ఎవరైనా డాక్టరుగారికి ఫోన్‌ చెయ్యమంటావా? లేకపోతే నేవెళ్ళి డాక్టర్‌ ఫణి గారిని పిలుచుకురానా?” అడిగాడు రామానాయుడు గారు. “ఆ పేరెత్తకండి ప్లీజ్‌!” ఇంచుమించు అరుస్తూన్నట్టుగా అన్నాడు. ఆకేకకి నాయుడుగారూ, వేదవతిగారూ కూడా షాక్‌ తిన్నట్టుగా చూశారు. “ఐ యామ్‌ సారీ... ఏమీ అనుకోవద్దు... ఏదో.. ఏదో అలా అరిచేశాను.” అన్నాడు అంతలోనే రామానాయుడు దంపతులకు క్షమాపణ చెప్పుకుంటూ ఆనంద్‌. క్షణం సేపు నాయుడుగారు ఆనంద్‌వైపు చూశారు. “బాబూ! నా బెడ్డలాంటివాడివి నువ్వేదో మనసులో చాలా బాధపడుతున్నావ్‌! ఆ బాధ హర్షిత పోయిందన్న బాధకన్నా నిన్ను వేధిస్తోంది. ఆలా ఒంటరిగా నీలో నువ్వే ఆలోచిస్తూ బాధపడుతూ వుంటే ఆరోగ్యం చెడిపోతుంది బాబూ! నీ బాధలూ నీ అనుమానాలూ నాతో చెప్పు. నాకు చేతనయిన సాయం చేస్తాను” అన్నాడు ఆనంద్‌ భుజం తడుతూ నాయుడుగారు.

“ఉండండి! లతిక క్యారియర్‌ తెచ్చిందిగా! రెండు ముద్దలు కలిపి పెడతాను. ఆ తరువాత మాట్లాడుకుందురుగాని” అంది వేదవతి టేబిల్‌ మీదున్న క్యారియర్‌ తెరవడానికి ప్రయత్నిస్తూ,

“నో.” ఆ భోజనం నేను ముట్టను. ఆ తిండి కాక్షులకీ, గద్దలకీ కూడా చెయ్యను. చెత్తలో పడెయ్యండి.” ఆవేశంగా అంటూన్న ఆనంద్‌ని ఆశ్చర్యంగా చూశారు అందరూ.

క్షణంసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు.

“క్షమించండి! ఆవేశంలో నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో నాకు తెలీదు” అన్నాడు వారికేసి చూస్తూ,

“పోన్లే బాబూ! మా ఇంట్లోంచి భోజనం పట్టుకొస్తాను. ఈ క్యారియర్‌

158

వెన్నెల వేట ముట్టుకోకు. ఇప్పుడే వస్తా!” ఆంటూ వేదవతి బయలుదేరబోయింది.

“అమ్మగారూ... అంతదాకా కాస్త ఉప్మాచేస్తా... భోజనం మెల్లగా తెద్దురుగాని”

ఆంటూ ఉప్మా చేసే ఏర్పాట్లకు వంటింట్టోకెళ్ళిపోయింది రుక్మిణమ్మ.

“ముందు ఆ భోజనం, క్యారియర్‌ నా కళ్ళముందే చెత్తబుట్టలో పడెయ్యి రుక్మిణమ్మా! దొన్గో ఏం విషం కలిపారో?” అన్నాడు ఆనంద్‌.

రుక్మిణమ్మ! మాట్టాడకుండా ఆ భోజనాన్ని చెత్తబుట్టలో పడేసి క్యారియర్‌. కడిగిపెట్టింది.

ఇదంతా అర్థంకాకుండా చూస్తున్న రామానాయుడి గారిని చూస్తూ “సార్‌! నాకు వముతిపోయిందను కుంటున్నారా? లేదా స్నపాతుడి ని అవమానిస్తున్నాననుకుంటున్నారా?” అన్నాడు ఆనంద్‌.

“లేదు బాబూ! నీ మనస్సులో ఏదో తీవ్రమైన సంఘర్షణ జరుగుతోంది. అదేమిటో చెప్పుబాబూ! తప్పకుండా మేమిద్దరం నీతో సహకరిస్తాం” అన్నాడు నాయుడుగారు ఆతని భుజం తడుతూ.

“అవును బాబూ! నిర్భయంగా చెప్పు.” అంది వేదవతి అతనిని ఊరడించే ధోరణిలో.

“సార్‌! నేను చెప్పేది (శ్రద్ధగా వినండి. నా అనుమానాలు తప్పైతే నన్ను కరెక్ట్‌ చెయ్యండి” అన్నాడు ఆనంద్‌: ప్రేమగా అతని చేతులను ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో భుజం నిమిరారు ఆప్యాయంగా నాయుడుగారు.

వామనరావు గారు జబ్బు పడడం దగ్గభినుంచి, హర్షిత భయాలూ, ఎగ్జిబిషన్‌లో ఎవరో దొంగ హర్షిత పర్సు కొట్టెయ్యడం, ఫణి అతన్ని పట్టుకుని

పోలీసులకప్పగించడం, బాత్‌రూం డోరులో నుంచి చూసినది ఫణేనని హర్షిత చెప్పడం, అసలు ఫణి హర్షితని ప్రేమించానని కాలేజీ రోజుల్లో వెంబడించడం, ఆమె అతని ప్రేమని నిరాకరించడం, తనని పెళ్ళి చేసుకోవడంతో సహా అన్నీ 159

శారదా అశోకవర్థన్‌ చెప్పాడు ఆనంద్‌. అతని మాటలన్నీ ఆశ్చర్యంగా విన్నారు రామానాయుడు గారూ, వేదవతీ. వారికి మతిపోయినట్టనిపించింది.

“ఏద్రి ఏమైనా ఇంత ఘాతుకానికి ఒడిగడతాడా "స్నేహం నటిస్తూ.”

రామానాయుడుగారు వేదవతిని చూసి “వేదా! ఇందాక ఫణిని వెనకనుంచి చూసినప్పుడు, ఆనంద్‌ లాగే అనిపించలేదూ? కొంచెం ఆ నడకా... అదీ...” అన్నారు.

“అవునండీ!” అందామె.

“మనం పొరపాటు పడి పోలీసులకి ఆనంద్‌పైన అనుమాన పడ్డట్టు చెప్పామేమో! ఎంతపని జరిగిపోయింది” బాధపడ్డారు నాయుడుగారు. “అవునండీ! ఇప్పుడెలాగ?” అని కాస్సేపు ఆలోచించి “మన అనుమానం ఆనంద్‌ ఫ్రెండ్‌ ఇన్స్‌పెక్టర్‌ సురేం(ద్రగారికి చెబితే?”

“ఇరెక్ట్‌! మంచి ఆలోచన. అలాగే చేద్దాం” అన్నారు నాయుడుగారు.

అంతలో ఉప్మా సిద్ధం చేసి మూడు స్టేట్లలో పెట్టీ తెచ్చింది రుకి గణమ్మ.

“మష్తాక్రూడా ఎందుకమ్మా” అంది వేదవతి.

“అమ్మగారూ... మోరూ తింటూ మాట్టాడుతూంటే కాస్తన్నా తింటారు అయ్యగారు” అంటూ మంచీనీళ్ళ గ్లాసు అందించింది రుక్మిణమ్మ.

“వదువు లేకపోయినా, దానికున్న పాటి కృతజ్ఞత, సంస్కారం కూడా లేకపోయింది డాక్టరు ఫణికి” అంది వేదవతి,

జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటే చెబుతున్నాడు ఆనంద్‌! ఎన్నిసార్టు హర్షిత ఫణిని గురించి తనకి అనుమానాలున్నట్టు చెప్పినా తనే నమ్మలేక తోసిపుచ్చినందుకు బాధపడ్డాడు ఆనంద్‌.

“జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడితే లాభంలేదు ఆనంద్‌

160

వెన్నెల వేట బాబూ! ఇలాంటి గోముఖ వ్యా[ఘ్రాలని, తేనెపూసిన కత్తులని, మనమూ స్నేహం నటిస్తూనే పట్టుకోవాలి. వాళ్ల ఆట కట్టించాలి,” అన్నారు నాయుడుగారు.

“అవును బాబూ! అందుకు మా సహకారం నీకెప్పుడూ వుంటుంది.” అంది వేదవతి.

“ఈ విషయాలన్నీ నీ పోలీసు (థ్రెండుకి చెప్పుబాబూ” అన్నాడు నాయుడుగారు.

"వ్రాస్తాను. అన్నీ చెప్తాను. నా హర్షితనీ, బిడ్డనీ పొట్టన బెట్టుకున్న హంతకుడెవరో తెలిసే దాకా ని(ద్రపోను, అంతేకాదు, అమాయకుడైన నా చీషంటు నా మీద నమ్మకంతో నా చేతే ఆపరేషన్‌ చేయించుకుంటానని చెప్పి, నావల్ల నా ఆసుపత్రిలోనే ప్రాణాలు పోగొట్టుకున్న అతడి తరపున కూడా, ఆ హంతకులకోనం అన్వేషిస్తాను. సార్‌! మీరు నాతో సహకరిస్తానని మాటివ్వండి.”

అన్నాడు ఆనంద్‌ చెయ్యిచాచి ప్రమాణం చెయ్యమన్నట్టుగా!

అతని చేతిలో చెయ్యేస్తూ “తప్పకుండా బాబూ! న్యాయం చచ్చిపోకూడదు. వెయ్యిమంది హంతకులు తప్పించుకు పారిపోయినా ఫరవాలేదు. కానీ ఒక్క అమాయకుడు అన్యాయంగా బలైపోకూడదు.” అన్నారు రామానాయుడుగారు. రుక్మిణమ్మ ఖాళీ ప్లేట్లు గ్లాసులు అక్కణ్జుంచి తీసేసి శుభ్రం చేసింది.

“వెళ్ళాస్తాం బాబూ!” లేచారు నాయుడుగారు.

“నేను క్యారియర్‌ తెస్తాను” అంది వేదవతి.

“ఎన్నాళ్లు తెస్తారు? ఆయినా మీకెందుకు (శ్రమ. రుక్మిణమ్మ వుందిగా ఏదో చేసిపెడుతుంది” అన్నాడు ఆనంద్‌. “నాకేం 'శ్రమలేదు. మా ఇద్దరికోసం చేసుకున్నదే నీకూ పంపుతాను, నువ్వు కాస్త తేరుకునేదాకా!” అంటూ లేచింది వేదవతి. “చ్చాగ్రత్త బాబూ! ఆ దరిద్రుడు నీకు ఏ హానీ తలపెట్టకుండా చూసుకో...” 161

శారదా అశోకవర్ధన్‌ అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు నాయుడుగారు, వేదవతిగారూ! ఆనంద్‌ లేచి స్నానం చేసి బట్టలేసుకున్నాడు. రుక్కిణమ్మ వెళ్లిపోయింది. నంటికి తాళం పెట్టి కారు స్టార్ట్‌ చేసి బయళ్టేరాడు ఆనంద్‌ తను చెయ్యవలసిన పనులను గుర్తుచేసుకుంటూ, శ ర ఆ

“ఏరా.. రా! ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నా... నువ్వే వచ్చావ్‌! చూశావా. దీన్నే 'టెలిపతి' అంటారు ఇంగ్లీషు వాళ్ళు.” అంటూ లేచి స్నేహితుడికి కరచాలనం చేస్తూ సాదరంగా ఆహ్వానించాడు ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర.

ఆనంద్‌ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు

“ఐ.. యామ్‌... సో... సారీ... ఆనంద్‌గారూ! ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చినప్పుడు,నాకొక 'ప్రాణమి(త్రుడున్నాడిక్కడ, నీకూ వాడి భార్యతో చక్కటి కాలక్షేపం అవుతుంది. ఆవిడెంతో మంచిది. ఆంటూ మీ గురించి ఎంత చెప్పారో? అంతలోనే ఇటువంటి పీడుగులాంటి వార్త వినవలసివస్తుందని ఊహించలేకపోయాం. సురేంద్ర అయితే ఇరవై నాలుగు గంటలూ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీకు ఇంతటి అన్యాయాన్ని తలపెట్టిన ఆ రాక్షసులను ఉరికంబం ఎక్కించేవరకూ నిద్రపోను అంటూ ఆలమటించి పోతున్నారు” అంది మీనా.

ఆనంద్‌ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

“మీనా! రాగానే, ఆ విషయాన్నెందుకెల్తావ్‌? అసలే ఆనంద్‌' ఇదైపోతున్నాడు. ఊరుకోరా ఆనంద్‌! నువ్విలా కుమిలి పోతూ ఉంటే ఏం లాభం? పోయిన మనిషి తిరిగి రాదు సరికదా, నీ ఆరోగ్యం చెడిపోతుంది,” ఆనంద్‌ భుజం చుట్టూ చేతులు వేస్తూ బుజ్జగించాడు సురేంద్ర.

“ఆనంద్‌గారూ! జరిగిపోయిన దాన్ని తలచుకుంటూ విచారిస్తూ కూర్చుంటే

162

వెన్నెల వేట లాభంలేదు. జరగవలసింది ఆలోచించండి. ఒకే దెబ్బతో రెండు ప్రాణాలు తీసి, ఇటు ఇంట్లో అటు వృత్తిలో కూడా మీకు మచ్చ తెచ్చిన హంతకులెవరో కానీ, సామాన్యులు కారు. అందుకే చెప్తున్నాను. ముందు వాళ్లెవరో తెలుసుకోవడానికి, మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి.” అంది.

“అవునురా! మీనా చెప్పింది కరెక్టే. ముందు ఆ ప్రయత్నం చెయ్యాలి. అందుకు నీ సహకారం పూర్తిగా కావాలి, సరేనా?” అన్నాడు పసిపిల్హాడికి నచ్చచెబుతున్నట్టుగా సురేంద్ర.

“ఆదే నా ధ్యేయం కూడా! అందుకే వచ్చాను!” అన్నాడు ఆనంద్‌.

ఉయ్యాల్లో ఉన్న బాబు ఏడవడంతో మీనా లోపలికెళ్ళిపోయింది.

శక్రేయ్‌! బజారుకెళ్ళి బాబుకేదైనా కొనాలనుకున్నాను! కానీ ఏం కొనాలో నాకేం అర్ధం కాలేదు ఇలాంటివన్నీ హర్షితే చూసుకునేది. అందుకేరా క్యామ్‌ ఇచ్చి మీనాకి నచ్చిన వస్తువేదో తననే కొనుక్కోమని చెబుదామనుకున్నాను. హర్షిత వుంటే...” సురేంద్ర మధ్యలోనే కట్‌ చేస్తూ “ఆనంద్‌! ప్రతి నిమిషం హర్షిత పేరు తియ్యకు. నువ్వామెని ఎంత ప్రేమించినా, నీకూ ఆమెకీ ఈ జన్మకి బుణం తీరిపోయింది. నువ్వామెని మర్చిపోక తప్పదు. కష్టమే! కానీ ప్రాక్టీస్‌ చెయ్యి!” అంటూండగానే బాబుని తీసుకుని మీనా అక్కడికొచ్చింది.

“అదుగో... అంకుల్‌ని చూశావా?” అంటూ బాబుని ఆనంద్‌ చేతికిచ్చింది.

చ్వెం పేరు పెట్టారు?” ఎత్తుకోవడం చేతకాక కంగారుపడిపోతూ ఆమె చేతిలోంచి బాబునందుకున్నాడు ఆనంద్‌.

“బుత్విక్‌!” చెప్పింది మీనా. “బావుంది!” అంటూ బాబుని రెండు చేతుల్లో పైకెత్తి ముద్దు పెట్టకున్నాడు. ఆనంద్‌ ఎత్తుకున్నాడో లేదో బోసినవ్వు నవ్వుతూ బాబు వాడి పని వాడు 163

శారదా ఆశోకవర్థన్‌ చేశాడు!

ఆనంద్‌ కెవ్వున వేసిన కేకకి మీనా నవ్వుతూ, “చాల్లెండి! ఇందుకా మీ అరుపు? ఏంటో అనుకుని హడలి చచ్చాను” అంటూ బాబుని ఆనంద్‌ ఒళ్ళోంచి తీసుకుంది.

“ఇదుగోరా బాబూ! నువ్వు నాకు చేసిన మర్యాదకి బహుమానం” అంటూ ఆయిదువందల పదహారు రూపాయలు గల కవర్‌ని బాబు చేతికందించాడు ఆనంద్‌, కవరు మీద చిరంజీవి బుత్విక్‌ అని రాసి, “ఇవన్నీ ఎందుకు? త్వరలోనే మీకు పాప పుడితే మా బాబుకి చేసుకుని వియ్యమందుదా మనుకున్నాం” అని నాలిక్కరుచుకుంది మీనా తన అజ్ఞానానికి, తొందరపాటుకీ తనే సిగ్గుపడుతూ.

“మ్సీనా నువ్వు తెలివిగా ఉండే మాట్లాడుతున్నావా!” అరిచాడు సురేంద్ర కోపంగా.

“ఐ..యామ్‌..సారీ! ఏంటో? నోరు జారిపోయింది!” అంది, పశ్చాత్తాపపడుతూ మీనా,

“ఒరేయ్‌! మీనానెందుకురా అంటావ్‌) అహుడప నేనే హర్షిత లేదన్న విషయం మర్చిపోయి. పిలుస్తూ ఉంటాను కొత్తవారు చూస్తే పీచ్చివాడనుకుంటారు కూడా” బాధగా అన్నాడు.

ఇంక ఆ విషయాలు మాట్లాడడ్డం ఇష్టంలేనట్టు, సురేంద్ర మాట మారుస్తూ “సర్లే! ఆ షర్టు తీసేసి, నా షర్టేదైనా వేసుకో! ఫాంటు కూడా మార్చెయ్యి..” అన్నాడు.

“అక్కర్లేదులేరా! కాస్త్ర నీళ్ళతో కడిగేసుకుంటే సరి, అదేపోతుంది” అన్నాడు ఆనంద్‌. ఒద్దన్నా వినకుండా తన బట్టలు తెచ్చి ఆనంద్‌కి ఇచ్చి మార్చుకోమన్నాడు 164

వెన్నెల వేట

సురేం(ద్ర.

ఇంక కాదనలేక బట్టలు మార్చుకున్నాడు ఆనంద్‌.

“ఒరేయ్‌! నాబట్టలు నీకు కరెక్ట్‌గా ఫేట్టయి, ఆచ్చం నువ్వు కుట్టించుకున్నట్లే వున్నాయి..” ఆతని వంకే చూస్తూ అన్నాడు సురేంద్ర.

“ఏంటోలే! నాకు ఎవరి బట్టలైనా సరిపోయేటట్టే వున్నాయి.” అన్నాడు తను వేసుకున్న బట్టలవైపు చూస్తూ,

సురేంద్ర మెదడులో ఆలోచన మెరుపులా మెరిసింది.

“ఒకేయ్‌! నాకొక ఐడియా వచ్చింది. నేనడిగే ప్రశ్నలకి ఆలోచించి సమాధానం చెప్పు,” అన్నాడు సీరియన్‌గా.

“ఏమిట్రా అది?” అడిగాడు ఆనంద్‌.

మనం స్కూల్లో వున్నప్పుడు నా బట్టలేసుకుంటానని నువ్వూ, నీ బట్టలేసుకుంటానని నేనూ పట్టుబట్టి వేసుకునే వాళ్ళం గుర్తుందా?”

“ఆవును?”

“మీ ఇద్దరిదీ ఒకటే సైజు కనుక గొడవలేదు. లేకపోతే ఏమయ్యేదో... అంటూ మనకి కావలసిన బట్టలేసేవారు మనవాళ్ళు గుర్తుందా?”

“అవును.”

“అలాగే నువ్వూ నీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరైనా ఎప్పుడైనా ఒకరి బట్టలు ఒకరు ఎక్ఫేంజ్‌ చేసుకున్నారా? ఈ మధ్యకాలంలో” అడిగాడు సురేంద్ర,

“ఒరేయ్‌ చిన్నతనపు చేష్టలు పెద్దయినా చేస్తామనుకున్నావా?” అన్నాడు ఆనంద్‌!

“అలా! కొట్టి పారేయకు! సరిగ్గా సమాధానాలు చెప్పు”

“ఎంక్వయిరీ ఆఫీసరులా ఫోజు పెట్టి అడుగుతున్నావే సిల్లీ విషయాన్ని! నేను నీతో కొన్ని ముఖ్యమయిన విషయాలు మాట్ట్లాడటానికొచ్చాను!” అన్నాడు

165

శారదా అశోకవర్థన్‌ ఆనంద్‌.

“నేనడిగేది కూడా అతి ముఖ్యమైన విషయం గురించే! చెప్పు!” పోలీసు ధోరణిలో అడిగాడు. సురేంద్ర నిజంగానే సీరియస్‌గా ఆడుగుతున్నట్టు తెలుసుకున్నాడు ఆనంద్‌. జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, "సురేంద్రా! నేను మంచి (డ్రెస్సు ఏదైనా కుట్టించుకుంటే ఫణి, ఒకటిరెండు సార్హు అవి చాలా బాగున్నాయని అలాంటివే తనూ కుట్టించుకున్నాడు. ఒకటి రెండుసార్లు అనుకోకుండా ఇద్దరం, అవే (డ్రస్సులు వేసుకుంటే, అవతలి వాళ్ళు కన్‌ప్యూజ్‌ అయ్యేవాళ్ళు. ముఖ్యంగా మా స్టాఫ్‌!” అన్నాడు.

“దట్స్‌ రైట్‌!” డైరీలో రాసుకున్నాడు సురేంద్ర.

ఆనంద్‌ ఆలోచనలో పడ్డాడు.

సురేంద్ర కూడా ఆలోచిస్తూ కూర్చున్నాడు.

పదినిమిషాలు ఇద్దరి మధ్యా నిళ్ళబ్ధం తాండవం చేసింది.

“ఆనంద్‌! నీ కెవ్వరి మీదా అనుమానం కలగడం లేదా?” అడిగాడు సురేంద్ర,

“ హర్షిత ఎన్నోసార్హు ఎవరో తనని ఫాలో చేస్తేన్నట్టుగా ఫీలయ్యేది! ఒకటి రెండుసార్లు భయంతో వాణికిపోయింది కూడా! అయితే ఆ ఫాలో చేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఒక్కసారి కూడా తన మొహం కనబడకుండాకేర్‌. తీసుకున్నాడు. అందుకే హర్షిత ఏమీ చెప్పలేకపోయింది” ఆనంద్‌ కళ్ళల్లో నీటి తెరని గమనించి, కాస్త ఆ సబ్జెక్టుకి (బ్రేక్‌ ఇద్దామని “మీనా... మా ఇద్దరికీ రెండు కప్పులు స్ట్రాంగ్‌-టీ-పంపించవూ?” అడిగాడు సురేంద్ర.

“ఓ.కే.టూ...మినిట్స్‌..” అంటూ బాబుని ఆయాచేతికందించి తను వంటింట్లో కెళ్ళింది మీనా,

“ఎందుకనో ఈ మధ్యన హర్షిత ఫణి గురించి కొంచెం భయపడుతున్నట్టుగా

166

వెన్నెల వేట చెప్పేది” అన్నాడు ఆనంద్‌.

“అంటే?”

“ఒకసారి ఫణి రాత్రి మా ఇంటికొచ్చి వెళ్లిపోయాక, హర్షిత బాత్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటూంటే, ఎవరో వెంటిలేటర్‌లోంచి చూశాడని చెప్పింది. అతడి కళ్ళు అచ్చు ఫణి కళ్ళలాగానే వున్నాయని అంది.

“అవునా!

“బట్‌... నాకు నమ్మబుద్ది కావడం లేదు. ఒక డాక్టరుగా ఎదిగి సమాజంలో పేరూ ప్రతిష్టా సంపాదించుకుంటూన్న వ్యక్తి పెళ్ళయి భార్య ఉండగా, అందులోనూ మి(త్రుడి భార్యని ఆ దృష్టితో చూస్తాడంటే, నమ్మబుద్దికావడం లేదు” అన్నాడు ఆనంద్‌.

“ఆనంద్‌ హర్షిత కూడా మామూలు మనిషి కాదు, బాగా చదువుకున్న వ్యక్తి సంస్కారం గల వ్యక్తే! తను ఊరికినే అలా అనుమానిస్తుందా? చెప్పు” అన్నాడు సురేంద్ర.

“అది కూడా నిజమే అనుకో! అందులోనూ హర్షిత తొందరపడే మనిషి కూడా కాదు.”

“మరి?”

“అదే నాకూ అర్థంకావడంలేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదడుని తినేస్తున్నాయిరా?” సోఫాకి చేరగిలబడి కూర్చుంటూ అన్నాడు ఆనంద్‌.

“నువ్వు మామూలుగా నీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లడం లేదూ? పన్గోపడితే కాస్త ఆలోచనలు కూడా తగ్గుతాయి.” సురేం(ద్రా! ఏ మొహం పెట్టుకుని హాస్పిటల్‌కి వెళ్లముంటావురా? భార్యని చంపిన హంతకుడిగానా? లేక ఒక పేషంటుకి, ఒక మందుకి ఇంకో మందిచ్చి ప్రాణాలు తీసిన డాక్టరుగానా? సురేంద్రా! నామీద ఎంతో నమ్మకంతో, నేనే 167

శారదా.ఆశోకవర్థన్‌ ఆపరేషన్‌ చెయ్యాలని పట్టుబట్టి, నా దగ్గరకొచ్చిన పేషెంటుని నేను చంపానన్న వార్తా మరొకరిని నా దగ్గరికి రానిస్తుందా?” అన్నాడు బాధగా.

“ఆనంద్‌! నా ఉద్దేశ్యంలో ఈ రెండు మర్షర్దు చేసిందీ లేదా చేయించిందీ ఒకరే ఆయి వుండాలి. వీళ్ళు నిన్ను చంపెయ్యడం కాదు. చిత్రవధ చేయ్యాలనుకున్నారు. నువ్వు బతికుండి కుళ్లి కుళ్లి ఏడున్తుంటే, సంతోషించాలనుకున్నారు. నువ్వు వారికి లొంగకూడదు. ధైర్యంగా వుండాలి. నీ నిజాయితీని నిరూపించుకుని, వాళ్ళ అంతం చూడాలి. అందుకు నీ సహకారం పూర్తిగా కావాలి. నీకు ఎవరి మీద ఏమాత్రం అనుమానం వున్నా చెప్పు సందేహించకుండా, ఎంక్వయిరీకి ఉపయోగపడతాయి.” ఆవేశంతో అన్నాడు సురేంద్ర.

“నేనేమీ చెప్పలేకపోతున్నానురా!”

“సర్లే... ఒక పని చేద్దామా - ఒకసారి నీ ఆస్పత్రికి వెళ్లి సెలవలో వెళ్ళిన ఆటండరూ నర్ఫూ వచ్చారేమో చూద్దాం” అన్నాడు సురేంద్ర.

“సరే” అని తలూపాడు ఆనంద్‌:

క్షణంలో బట్టలు మార్చుకుని, ఆఫీసుకి రావడం లేదని చెప్పి ఫోన్‌ చేసి ఆనంద్‌ని వెంటబెట్టుకుని బయలుదేరాడు సురేంద్ర. కారు మమతా శినిక్‌ ముందు ఆగింది.

“ఆసుపత్రి అంతా ఎంత కళావిహీనంగా అయిపోయిందిరా”! అన్నాడు ఆనంద్‌. బాధగా, ఆ పరిసరాలను చూస్తూ

“దేముడు లేని గుడికి ఎవరొస్తారు? ఎలా ఉంటుంది?” అన్నాడు సురేంద్ర తన బాధని సాధ్యమైనంత వరకూ కనబడకుండా దాచుకుంటూ,

ఆనంద్‌ని చూడగానే స్టాఫంతా పరుగెత్తుకొచ్చారు “గుడ్‌ మార్షింగ్‌ డాక్టర్‌” అంటూ.

168

వెన్నెల వేట

డాక్టర్‌ రాఘవ, ఆనంద్‌ చెప్పాడని, ఆ ఆసుపత్రిలో పేషెంట్లను చూడ్డానికొస్తున్నాడు హర్షిత పోయినప్పటినుంచి. డాక్టర్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ రాఘవ ఇద్దరూ ఆనంద్‌కి ఆసుపత్రిలో అసిస్టెంట్టు! అప్పుడప్పుడు పని ఒత్తిడుంటే వేరే డాక్టర్లని కూడా పిలుస్తూండేవాడు ఆనంద్‌. డాక్టర్‌ రాఘవ కూడా గబగబా కారు దగ్గరికొచ్చాడు. కారు దిగుతూన్న ఆనంద్‌ని కౌగిలించుకుని కంటతడిపెట్టాడు డాక్టర్‌ రాఘవ.

అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అందరి కళ్ళల్లోనూ నీళ్ళే!

అందరి నోళ్ళూ మూగబోయాయి.

అందరి గుండెల్లోనూ ఏదో విపరీతమయిన బాధ.

“డాక్టర్‌ ఆనంద్‌! ఊరికే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటారు? క్షినిక్‌కి రండి, మీరు లేకుండా నేను నడపడం నాకు బాగాలేదు.” అన్నాడు డాక్టర్‌ రాఘవ.

“నర్సిమ్మ ఊరినుంచి ఒచ్చేశాడా?” అడిగాడు ఆనంద్‌.

“రాలేదు. లీవు పొడిగిస్తున్నట్టు ఉత్తరం కూడా రాయలేదు.” అన్నాడు డాక్టర్‌ రాఘవ.

“ఏ వూరెళ్ళాడో తెలుసా?” అడిగేడు సురేంద్ర.

“నూజివీడు అని లెటర్‌లో రాశాడు.”

“ఏదీ ఒకసారి ఆ లెటర్‌ తెప్పిస్తారా?” అడిగాడు సురేంద్ర.

వెంటనే రాఘన క్సార్కు సుబ్బారావును పిలిచి ఫైల్‌ తెప్పించాడు. సిస్టర్‌ మాధవి లీవ్‌ లెటర్‌ ఫైలూ తెప్పించాడు.

'ఫైళ్ళలో నుంచి ఆడ్రన్‌లు నోట్‌ చేసుకున్నాక ఆ తర్వాత సురేంద్ర ప్రతీ ఫైలు పరీక్షగా చూడ్డం మ్రైదలెట్టాడు.

ఆపరేషన్‌ రోజున డాః ఆనంద్‌ ఇచ్చిన ప్రిన్‌క్రిష్టన్‌ పేపర్లూ, బ్బడ్‌ బాంక్‌కి రాసిచ్చిన చిట్స్‌, ఆరోజు డ్యూటీలో ఎవరెవరున్నారో వాళ్ళందరి పేర్ల లిస్టూ

169

శారదా ఆకోకవర్థన్‌

అన్నీతెప్పించి పరికించి చూసి రాసుకున్నాడు సురేంద్ర. రాంగ్‌ ప్రిన్‌|క్రిష్టన్‌ ఉన్న కాగితొన్నీ మరీ మరీ పరికించి చూశాడు. దాని ఒరిజినల్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని జిరాక్స్‌ కాపీని ఆసుపత్రి రికార్డ్స్‌ కోసం-అదీ డాక్టర్‌ రాఘవ ఆనంద్‌ తరపున కావాలని ఆడగడంతో వుంచారు, ఆ కాపీని- మళ్లీ ఇస్తాను ఇవ్వమని డాక్టర్‌ రాఘవని సురేంద్ర అడిగాడు.

రాఘవ ఆనంద్‌ కేసి చూశాడు.

ఆనంద్‌ ఇవ్వమని తలూపాడు.

సురేంద్ర ఆ కాగితాన్ని భద్రంగా మడిచి వర్సులో పెట్టుకున్నాడు.

అంతలోనే పోస్ట్‌ వచ్చింది.

ఆనంద్‌ పోస్ట్‌ చూశాడు.

అందులో చాలామంది ఆనంద్‌ మంచితనాన్ని గురించి రాస్తూ, ఎందుకిలా జరిగిందో అర్థం కావడంలేదు. మీలాంటి మంచి డాక్టరు పొరపాటున కూడా వేరే మందు ఇచ్చి ఒక "పేషంటు ప్రాణాలు పోవడానికి కారకులవుతారంటే నమ్మబుద్ధి కావడంలేదు. మీతో పర్సనల్‌గా మాట్లాడాలంటే మీరు దొరకడంలేదు." ఆంటూ రాశారు.

కొందరు “డాక్టరుగారూ! మీరు మాకు డిస్పెన్సరీలో దొరకడం లేదు. ఇంటిదగ్గరా లేరని చెప్తున్నారు. మీరంటే గిట్టని వాళ్ళెవరో మోకా (ద్రోహం తలపెట్టారు కానీ మీరలాంటి వాళ్లుకాదు. మీరు మాకు అందుబాటులో లేకపోడం వల్ల, సడన్‌గా మాకు డాక్టరు అవసరంవాస్తే, ఎక్కడికెళ్ళాలో అర్థం

  • కావడంలేదు, డాక్టర్‌గారూ! దేముడు మీకు హాని చెయ్యడు. క్లినిక్‌లో వేరే

వారున్నా రాలేకపోతున్నాం. మీరు డిస్పెన్సరీకి రండి... దయచేసి మీరు ఒచ్చేయండి డాక్టరుగారూ!”

ఈ ఉత్తరాలు చదువుతూ “సురేంద్రా! ఇందరు నన్ను ఇంత (ప్రేమతో

170

వన్నెల వేట ముంచెత్తుతూంటే, ఎవరురా నాకీ (ద్రోహం తలపెట్టింది? పోనీ ఆసుపత్రి వ్యవహారాల్లో అనుకుంటే నా ప్రాణానికి ప్రాణమయిన ఇల్లాలు, హర్షితనెందుకు హత్య చేసినట్టురా” ముఖానికి చేతులు అట్టుపెట్టుకుని పసివాడిలా రోదించాడు ఆనంద్‌! “వాళ్లెవరో మీకు ప్రబల శత్రువులై వుండాలి డాక్టర్‌! పైగా మీకు బాగా తెలిసిన వాళ్లే అయివుండాలి” అన్నాడు డాక్టర్‌ రాఘవ. ప్లాన్క్‌ పంపించి సిస్టర్‌ లూసీ కాఫీ తెప్పించింది ముగ్గురికీ! మరో అటెండరు ఇట్రహీం, ముగ్గురికీ కాపీ కప్పుల్లో పోసి అందించాడు. ముగ్గురూ కాఫీ తాగడం పూర్తి చేసారు. చివరి ఉత్తరం ఆరోజు పోస్టులో వచ్చిందే. అది నర్సింహ రాజీనామా ఉత్తరం. “డాక్టర్‌ ఆనంద్‌ గారికి, నర్సింహ శతకోటి దండాలు. మా ఆయ్య ఇంట్లో ఏవో గొడవలుపడి ఇల్టు వాదిలి పారిపోయాడు! నాకు ఇద్దరు చెల్లెండ్రు, ఇద్దరు నాకన్న చిన్న తమ్ముండ్లూ వున్నారు. మా ఆయ్య వొట్టి తాగుబోతు సార్‌! ఇంట్ల ఏదుంటె ఆతి తీస్కపోయి ఎంతకొస్తే అంతకమ్మేసి తాగి పండుకుంటడు.,పనిజెయ్యడు. మా అమ్మ ఆళ్ళింట్లో ఈళ్ళింట్లో పనిచేసి తెచ్చిన పైసలు గూడ దొంగతనాన తీస్కబోయి తాగొస్తడు. మా చెల్లై మా ఊర్ల ఒక ఇస్కూల్ల పనిజేస్తుంది. ఆ ఇస్కూల్ల టీచరమ్మ ఇంట్లోనే ఇంటిపని చేసి రాత్రి పూట ఆ అమ్మ దగ్గర సదువు నేర్చుకుంటుంది. ఆయమ్మ మా సెల్లెకి వాళ్లింట్ట దావతయితే యాభై రూపాయలిచ్చింది. ఏదన్న కొనుక్కోమని. ఆదితెచ్చి మాయమ్మ సేతికిచ్చింది. అమ్మ తన పెట్టెల బట్టలకింది దాచి పెట్టిందట. అది తీస్కబోయి ఆయ్య బ్లాక్‌ల గుడంబ కొని తాగొచ్చి వాంతుల బేదీ తోటి, సిక్కయిపోయిండు! దానికోసం మా అయ్య అమ్మ కొట్టాడుకుం[డ్రంట! 'నువ్వు కష్టం జెయ్యవు. ఆడబిడ్డ తెచ్చిన సొమ్ము తీస్కబోయి తాగొచ్చెటందుకు సిగ్గులేదు" అని తిట్టిందంట మా యమ్మ. నీ సొమ్మొద్దు. నీ బిడ్డ సొమ్మొద్దు అనుకుంట [71

శారదా ఆశోకవర్ధన్‌ ఇంట్టకెళ్లి ఎల్లి పోయిండంట మా అయ్య! ఇట్ట కొట్టాఢుకుని మస్తుసార్జు ఇంటికెల్లి ఎల్లిపోయినా, ఈసారి పదిఏను దినాలైతున్నా తిరిగి రాలేదు. అమ్మ బెంగటిల్లి నాకు చెప్పుమని, ఒచ్చి పొమ్మని మా మేనమామతో చెప్పి పంపించింది. ఈ ఇసయాలన్నీ మీకు చెప్పి, మీతాన కొంత పైకం దీసుకొని ఒద్దామనుకున్నా! కానీ, అయ్యాల మీ మూడు జెర ఎట్టనో వుండె! అమ్మ నిడిసి పెట్టి రాలేకపోతుండ్రు. అర్జంటు ఆపరేషను సెయ్యక తప్పుతలేదు. అప్పుడు నేను సోది సెప్పకుంట కూకుంటె బావుండదని లీవు లెటరు ఇచ్చేసి, వున్న 'పైకంతో ఎల్టొచ్చిన. డాక్టర్‌ సొబ్‌! మీ గురించి ఏందేందో ేపర్ణ ఒచ్చిందని అందరంటున్నారు. ఆల్ల మాటలింటుంటె నా గుండెలో ఈటెలు దిగినట్టుంది సాబ్‌! నేనొచ్చి మీతో మాట్లాడి పోదామంటే మాయమ్మ పూర్తిగ అడ్డ బడ్డది! ఇంటికి నేనే పెద్దో్ళి! ఇల్లొదిలి పెట్టి ఒచ్చేటట్టలేదు. ఈడ పటేల్‌ సాబ్‌కాడ నౌకిరికి ఒప్పుకున్న, జెర్ర సమయం జూసుకుని, 'హైదరాబాదొచ్చి మిమ్మల్ని కలుసుకుంట. మీకు చెప్పకుంట' ఒచ్చినందుకు కోపగించకండి. దేముడు మిమ్మల్ని సల్లగ జూడాలనీ నర్శింహస్వామికి మొక్కుతున్న. ఇట్టు దండాలతో మీ నర్చిమ్మ. ఉత్తరం చదివిసురేంద్రచేతికిచ్చాడు. సురేంద్ర చదివి రాఘవ చేతికిచ్చాడు.

“పూర్‌ ఫెలో!... అన్నాడు ఆనంద్‌.

“ఇవ్వాలే ఒక కానిస్టేబుల్‌ని పంపించి, వీడు రాసిన దాంట్లో నిజం ఎంతో కనుక్కు౦టాను” అన్నాడు సురేంద్ర ఉత్తరాన్ని మడిచి కవర్గో పెట్టి పాంటు జేబులో పెట్టుకుంటూ “ఒరేయ్‌! వాడు స్పష్టంగా వాడి గొడవంతా ఉత్తరంలో రాసుకుంటే, ఇంకా నీకేమిట్రా అనుమానం? పాపం! నాతో చెప్తే కాస్త డబ్బిచ్చి

172

వెన్నెల వేట పంపించేవాణ్ణి!” బాధపడుతూ అన్నాడు ఆనంద్‌!

“వాడు చెప్పేది ఎంతవరకూ నిజమో ఇవాళే అక్కడి పోలీన్‌ స్టేషన్‌ నుంచి మనిషిని పంపించి తెలుసుకుంటాను” అన్నాడు సురేంద్ర.

“ఒరేయ్‌! నవ్వెంత పోలీన్‌ వాడివయినా, ఇంత స్పష్టంగా తన గోడంతా రాసిన వాణ్ణి! అనుమానించడ మేమిట్రా?” అన్నాడు ఆనంద్‌.

సురేంద్ర పెద్దగా నవ్వేడు.

“ఆనంద్‌! పట్టుపడనంత వరకూ అందరూ పెద్దమనుషులే! అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. దొరికితేనే దొంగలు! అందుకే ఏకేసైనా సరే, కేసు పూర్తయ్యేదాకా అందరినీ అనుమానించడం మా వృత్తి.” అన్నాడు సులేంద్ర నవ్వుతూ.

అతనలా ఇచ్చితంగా మాట్లాడుతుంటే అందరూ అతని వంక భయం భయంగా చూశారు.

“సిస్టర్‌ లూసీ గురించి నీ అభిప్రాయమేమిటి?” అడిగాడు సురేంద్ర.

డాక్టర్‌ రాఘన ఎవరో పేషంటుని చూడ్డానికి పక్క రూమ్‌లోకి వెళ్ళినప్పుడు.

“మంచి ఆవిడే!”

“నీకందరూ మంచిగానే కన్పిస్తారులే! ఆమె నీదగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది?”

“మూడేళ్ళనుంచి!”

“ఆమె వివరాలేమైనా నీకు తెలుసా?”

“తెలీదు.” "

“ఉద్యోగం ఇచ్చేముందు వివరాలేమీ తెలుసుకోలేదా?”

“లదు?”

“ఆదేమిటిరా?”

173

శారదా ఆశోకవర్ధన్‌ “ఆమె కుటుంబ వివరాలతో నాకేశ పని? ఆమె దగ్గర బి.ఎస్‌.సి నర్సింగ్‌ డిగ్రీ సర్టిఫికేట్‌ వుంది. వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా వుంది. ఉద్యోగం ఇచ్చాను. బాగానే పనిచేస్తోంది. సిస్టర్‌ మాధవి సంగతీ అంతే” ఓరేయే నువ్వు మరీ ఇంత మంచిగా వుంటే ఎట్టారా? సర్లో*” అంటూ ఫైల్‌లోంచి అన్నీ ఒక్కొక్క కాయితం తీసి, తనకి డౌట్టున్న చోటల్లా డైరీలో నోటుచేసుకుని ఫైల్సన్నీ పింపించేశాడు సురేంద్ర. పేషంట్టని చూడడం పూర్తి చేసి డాక్టర్‌ రాఘవ వచ్చి కూర్చున్నాడు. వారు మాట్లడుకుంటుంటే, ఆవిషయాలు డాక్టర్‌ ఆనంద్‌తో చెబుతూంటే ఒక్కొక్క "పేషంటు గురించీ “ఎక్య్యూజిమీ” అంటూ వెళ్లి ఆరోజు డాక్టర్‌ రాఘవ రాసిచ్చిన మందుల ప్రిస్కిప్షన్స్‌ అన్నీ చూసొచ్చాడు సురేంద్ర. డైరీలో ఏదో రాసుకున్నాడు. అంతలోనే బూట్ల చప్పుడు విన ఆందరూ అటు తిరిగి చూశారు. ఆనంద్‌ని చూసి ఒక్కసారిగా కౌగిలించుచుకున్నంత పనిచేశాడు ఫణి.

“ఒచ్చేశావా క్రినిక్‌కి!ఐ.యామ్‌... వెరీ... హాపీ...!ఇంట్టోకూర్చుని ఏడుస్తుంటే చచ్చినపోయిన హర్షిత తిరిగొస్తుందా. పేషంటూ తీరిగొస్తాడా?” అన్నాడు నవ్వుతూ డాక్టర్‌ ఫణి,

“నేనూ అదే చెప్తున్నాను డాక్టర్‌ ఫణిగారూ! పనిలో పడితే కాస్త్ర మనశ్శాంతయానా కలుగుతుంది” అన్నాడు డాక్టర్‌ రాఘవ.

“అందులో మా ఆనంద్‌కి తన యిల్లూ తన అసుపత్రీ ఈ రెండే దేవాలయాలు. రెండింటి మీదా ఆత్యంత ప్రేమా, శ్రద్దా భక్తినీ. కానీ ఆ దేముడు ఈ రెండూ కూడా వాడికి కాకుండా చేసి తీరని అన్యాయం చేశాడు. పాపం! ఆనంద్‌ ఎలా తట్టుకోగలుగుతున్నాడో ఏమో!” అన్నాడు ఫణి.

“మీరిద్దరూ ఆంత క్లోజ్‌ఫ్రెండ్స్‌ కదా! పోనీ మీరు చెప్పండి మీకెవరి మీదైనా అనుమానం వుందా ఈ రెండు హత్యకేసుల్లో? ఆనంద్‌ నడిగితే... ఏమీ

174

వెన్నెల వేట చెప్పడం లేదు” అన్నాడు సురే[ద్ర ఫణికేసి చూసి!

“నాకు తెలసి వాడికి మిత్రులే గానీ శత్రువులెవరూ లేరండీ!” ఆన్నాడు ఫణి.

“మరి ఈరెండు హత్యలూ ఎలా జరిగాయంటారు?” ఆదే నాకు ఆర్హం కావడం లేదు. అందులోనూ మా ఆనంద్‌ ఎలాంటి వాడంటే, కాలికింద చీమపడితే “అరెరె పాపం” అంటూ తీసి ట్రీట్‌మెంట్‌ ఇస్తానంటాడు. ఇక మా హర్షిత సరేసరి! భర్త అడుగుజాడల్లో నడుచుకోవడమే ఆమె ధర్మం అనుకునే మహా పతివ్రత! అటుంవంటి ఆజాత శత్రువులైన వీళ్లకి, ఇంతకక్ష తీర్చుకునే శత్రువు లెవరుంటారో అర్ధం కావడంలేదు.” అన్నాడు ఫణి.

కొద్దిసేవు అందరూ మౌనంగా వున్నారు. ఎవరిపాటికి వాళ్ళే ఆలోచించుకుంటూ!

ఫణి ఆనంద్‌కేసి చూస్తూ వున్నాడు.

“ఒరేయ్‌ ఆనంద్‌! ఎంత చిక్కిపోయి ఎలా వున్నావో తెలుసా? ఇప్పుడు నిన్ను డాక్టరంటే ఎవ్వరూ నమ్మరు. అన్నాడు విచారంగా. “ఆసలు అన్నం నీళ్లూ వుంటేగా?” అన్నాడు సురేంద్ర! “ఒరేయ్‌!క్యారియర్‌ పంపిస్తానంటే ఇంటికొస్తానంటావ్‌? ఇంటికి రమ్మంటే ఏదో సాకు చెప్తావు. ఎందుకురా ఇది? మేము నీకు కొత్తా? నేను లేకపోయినా, లతికని వడ్డించమని అడిగి భోంచేసే అధికారం నీకు లేదా?”

“కరెక్ట్‌! అలా చెప్పండి! ఏదీ ఈ రాత్రికి మీ ఇంటికి భోజనానికి పిలవండి అన్నాడు సురేంద్ర.

“డెఫెనట్లీ! ఏరా ఒస్తావా?” అడిగాడు ఫణి,

“బైదిటై... నన్నూ పిలవండి. ఎందుకంటే వాడు రానూ అంటే, చేతులకి బేడీలు వేసి మరీ తీసుకొస్తాను.” అన్నాడు పెద్దగా తన జోక్‌కి తనే నవ్వుకుంటూ.

175

శారదా అశోకవర్థన్‌ (ప్రతీ చిన్న విషయానికీ పెద్దగా నవ్వడం సురేంద్రకి అలవాటు. అప్పుడప్పుడు అతనలా నవ్వుతూంటే “ఊర్కోండి.. బాబు లేచిపోతాడు ఉలిక్కిపడి” అంటూ మీనా కంట్రోలు చేస్తుంది.

సురేంద్ర నవ్వులో శృతి కలుపుతూ “తప్పకుండా ఇన్స్‌పెక్టరుగారూ! మీరు చెప్పేది కరెక్టు! వాడికి బేడీలు వేస్తే తప్ప రాడు.” అన్నాడు ఫణి. “ఏదీ... మీ ఫోన్‌ నెంబరూ మీ అడ్రసు రాసివ్వండి. ఎందుకైనా మంచిది, మనవాడు మరీ రానని మొరాయించినా, ఒకవేళ-ఈరోజు డిన్నర్‌ కుదరదని మీ ఆవిడ దబాయించినా ఇన్‌ఫర్‌మేషన్‌ ఉంటుంది” అంటూ డయిరీ అందించబోయాడు సురేంద్ర.

“ఎందుకూ నా కార్డుంది ” అంటూ జేబులోంచి విజిటింగ్‌ కార్డ్‌ తీశాడు ఫణి.

“ఒద్దుసార్‌! మీరు కార్డిస్తే నేను ఎక్కడో పడేస్తాను. వెతుక్కోవడంలో శ్రైము సరిపోతుంది. డైరీలో రాయండి” అంటూ డైరీని చేతికందించాడు సురేంద్ర,

ఫణి డైరీలో ఎడ్రసూ, ఫోన్‌ నెంబరూ రాశాడు.

“థాంక్యూ” అంటూ డైరీ జేబులో పెట్టుకున్నాడు సురేంద్ర. మరి కొంతసేపు కూర్చున్నాక “ఇక వెళ్ళామా?” అన్నాడు సురేంద్ర ఆనంద్‌ని చూస్తూ,

“వీ ఇష్టం” అన్నట్టు చేతులు సగం పైకెత్తి తల పంకిస్తూ అన్నాడు ఆనంద్‌.

“డాక్టరు గారూ] శేపటి నుంచి క్లినిక్‌కి రండి” అన్నాడు డాక్టర్‌ రాఘవ.

ఆనంద్‌ మాట్టాడలేదు,

“డాక్టర్‌! కనీనం ఒక గంటకైనా వొచ్చి వెళ్లండి. నేను మేనేజ్‌

ళా చెయ్యలేకపోతున్నాను. పైగా అందరూ మీ గురించి అడుగుతున్నారు” అన్నాడు మళ్లీ.

“నేను వంపిస్తాలేవయ్యా...” అన్నాడు నురేంద్ర. అంతలోనే

176

వెన్నెల వేట నాలిక్కరుచుకుంటూ “సారీ డాక్టర్‌! సడన్‌గా మా పోలీసు భాషాచ్చింది. ఏమీ అనుకోకండి. నేను పంపిస్తాలే డాక్టర్‌! మీరు నిశ్చింతగా వుండండి” అన్నాడు సురేంద్ర డాక్టర్‌ రాఘవతో.

“అంతెందుకు? నేను తీసుకొస్తాలే! ముందు ఆనంద్‌ని ఇక్కడ దింపి, నేను నా క్రినిక్‌కి వెళతాను, సరేనా?” అన్నాడు డాక్టర్‌ రాఘవకేసి చూస్తూ ఫణి, “ఓ... థాంక్యూ డాక్టర్‌” అని ఫణికి షేక్‌ హాండ్‌ చేసి, అందరికీ 'బై చెప్పి సెలవు తీసుకుని లోపలి కెళ్ళిపోయాడు డాక్టర్‌ రాఘవ. ఫణి కూడా "లేచి నేనూ వెళ్తానండీ!” అన్నాడు సురేంద్రని చూస్తూ,

“ఒ..కే..” షేకిహాండ్‌ ఇచ్చాడు సురేంద్ర.

“ఆనంద్‌ని, నేను దింపెయ్యనా?” ఆడిగాడు కారుడోరు తెరుస్తూ వెనక్కి తిరిగి ఫణి. నాలుగడుగులు వెనక్కి వేసి.

“నో...నో! ఆనంద్‌... ఈబ్‌కమింగ్‌..టు..మైహెస్‌...నా...” అన్నాడు సురేంద్ర. “ఓ..ఐసీ..” అంటూ కార్టో కూర్చుని కారు స్టార్ట్‌ చేశాడు ఫణి. వెనకాలే సురేంద్ర కారు కూడా పోతోంది. సురేంద్ర జీప్‌ స్టో చేసి, జేబులోంచి సిగరెట్టు ప్యాకెట్‌ తీసి వెలిగించాడు. ఎప్పుడో బాగా ఆలోచనలతో ఉక్కిరి బిక్కరైనప్పుడు తప్ప, సిగరెట్టు కాల్చడు సురేంద్ర. సిగరెట్టుతో కారు దిగుతున్న సురేంద్రని చూసి “సిగరెట్టు కాలుస్తున్నావే! బుట్టి వేడెక్కి పోయిందా?” నవ్వుతూ అడిగింది మీనా! నవ్వుతూనే సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళాడు సురేంద్ర, “మీనా! ఆకలి దంచేస్తోంది. త్వరగా భోజనం పెట్టు” అన్నాడు. “ఒరేయ్‌! నాకు 'టీ' ఇస్తే చాలు, అన్నం తినను” అన్నాడు ఆనంద్‌. “ఏమీ? అన్నం తినకూడదనుకున్నావా? లేక 'టీ' చాలా ఆరోగ్యం బాగా 177

శారదా ఆశోకవర్థన్‌ వుండడానికి, అనుకున్నావా?” పెద్దగా నవ్వేడు సురేంద్ర.

'ఉమ్‌ బాబు పడుకున్నాడు!” హెచ్చరించింది మీనా...

“ఓ.. ఐ...యామ్‌...సారీ!... సరే వెంటనే వడ్డించు. ఆనంద్‌ వెళ్ళి చేతులు కడుక్కునిరా? అర్హర్‌ చేస్తూన్నట్టుగా చెప్పాడు సురేంద్ర. ఆనంద్‌ మౌనంగా వెళ్లి చేతులు కడుక్కొచ్చాడు. మీనా ఇద్దరికీ వడ్డించింది.

“నువ్వూ కూర్చో!” ఆన్నాడు సురేంద్ర.

“బాబు లేస్తే కష్టం! మీరు ముందు తినండి. తరువాత నేను తింటాను.

“బాబు లేచినా మీరు ఎత్తుకోవచ్చు.” అంది ఇద్దరికీ వడ్డిస్తూ మీనా, “ఓ..కే.. యువర్‌ విష" అంటూ “ఒరేయ్‌, కలపరా! మామిడికాయపప్పు అన్నాడు.” ఆనంద్‌ని చూస్తూ! సురేంద్ర.

పైకి నవ్వుతూ భోంచేస్తున్నా ఇద్దరి మనసుల నిండా ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి! సమాధానం దొరకని ప్రశ్నలు! ఎన్నో? ఎన్నెన్నో? ఎలాగో ఇద్దరూ భోజనం పూర్తి చేశారు!

ఎవరి ఆలోచనలతో వాళ్లు సతమతమయిపోతున్నారు. మీనా వాళ్ల మూగభాష అర్థంకాక మౌనంగా వుండిపోయింది!

ముగ్గురి మనసుల్లోనూ మెదిలే ప్రశ్న ఒక్కటే! ఎవరు? ఎవరు? ఈపని చేసింది? అనే! న శే క్‌

ఇల్లంతా నీట్‌గా సర్షించాడు ఫణి. సురేంద్ర ముందు తన గొప్పతనాన్ని చాటుకోవాలనీ, ఆనంద్‌ కంటే తనే గొప్ప డాక్టరుననీ, చాలా సంషాద్రించాననీ చెప్పుకోవాలనే తహతహ ఆతనిలో కొద్దికాలంగా కలిగింది. ఆనంద్‌ కంటే ' తను చాలా తెలివైన వాడినని చాటుకోవడమే కాక, ఆనంద్‌ వట్టిపూల్‌ అని అతడి స్నేహితుడి చేత అనిపించాలని చాలా ఉబలాట పడుత్తూ వచ్చాడు. అనుకోకుండా ఇన్స్‌పెక్టర్‌ సురేంద్ర తనంతట తానే డిన్నర్‌కొస్తాన్సన్సి చెప్పేసరికి,

178

"వెన్నెల వేట బూరెల బుట్టలోపడ్డట్టు ఫీలయ్యాడు ఫణి.

ఆ పూట క్లినిక్‌కి వెళ్లలేదు. ఎవరు ఎందుకు ఫోన్‌ చేసినా సాయంత్రం ఇంటికి ఫోన్‌ చెయ్యమని చెప్తున్నాడు. కొత్త ప్లవర్‌ వాజులు తెప్పించి ఇల్లంగా అలకరించాడు. ఆరాత్రి ఏమేమి వంటకాలు తయారుచెయ్యాలో 'మెనూ” తానే తయారుచేసి లతికకిచ్చాడు. ఆనంద్‌ తన పాత స్నేహితుడే, అతని కూడా వచ్చేది ఆనంద్‌ స్నేహితుడు సురేంద్ర ఒక్కడే. ఆ మాళత్రానికి ఎందుకింత హడావుడి చేస్తున్నాడు ఫణి! లతికకి కొంచెం కూడా అర్ధం కాలేదు.

“నిజంగా గొప్పవాడు తన గొప్పతనాన్ని గురించి తనే ఎప్పుడూ అనుకోడు.

గొప్పతనం లేక గొప్పవాడిలా నటించాలనుకునేవాడే ఇలాంటి ఆర్భాటాలు చేస్తూ వుంటాడు. ఎన్ని ఫోన్‌ కాల్స్‌ వస్తే ఇతరులముందు తను అంత బిజీ మనిషినీ, ప్రముఖడిననీ చాటుకుని సంతోషిస్తాడు. ఎంత అల్పులు' అనుకుంది లతిక.

లతిక మనస్రత్వానికీ ఫణి మనస్త్రత్వానికీ ఎక్కడా పోలిక లేదు. ఒక్కోసారి వీళ్ళిద్దరూ ఎలా భార్యాభర్తలయ్యేరా అనిపిస్తుంది. ఎన్నోసార్హు లతిక కూడా అలాగే అనుకుంది గానీ రచ్చకెక్కలేదు, మరొకరయుంటే ఇద్దరూ ఏనాడో విడాకులు పుచ్చుకునుండేవారు. ఫణిది దబాయించే స్వభావం. ఆడాళ్లంటే చులకన భావం. భార్య ఆంటే మరీ చులకన. ఆతని మాటకెదురు చెప్పకుండా, కిమ్మని పడుండాలి, ఆమెకి స్వంత ఆలోచనలూ స్వతంత్ర భావాలూ ఏవీ ఉండకూడదు. ఆలోచిస్తూనే పన్హన్నీ పూర్తిచేసింది లతిక. ఏడుగంటలకల్టా వస్తామని చెప్పిన సురేంద్ర ఆనంద్‌లు ఎనిమిదవుతున్నారాకపోయేసరికి ఆనంద్‌ ఇంటికి ఫోన్‌ చేశాడు ఫణి. సురేంద్ర ఫోన్‌ తీసి 'హలో” అన్నాడు.

“సురేందద్రగారా? నేను ఫణిని, ఇంకా బయళ్లేర లేదా?” అడిగాడు.

179

శారదా ఆశోకవర్థన్‌

“మీ మిత్రుడు ఒకపట్టాన కదిలితే కదా! ఎలాగో ఒప్పించేసిరికి తలప్రాణం తోకకొచ్చింది. బయళల్లేరుతున్నాం” అని చెప్పి ఫోను పెట్టేశాడు. సురేంద్ర,

అనంద్‌కి ఫణి ఇంటికి వెళ్ళాలని లేదని తెలుసు సురేంద్రకి, తన బలవంతం మీదే తయారవుతున్నాడనీ తెలుసు. అందుకే ఆతను స్నానం చేసొచ్చేలోగా బట్టలు తీసి పెడదామని, వైట్‌ ప్యాంటూ మెరూన్‌ షర్టూ తీసి మంచం మీద రెడీగా పెట్టాడు వేసుకోవడానికి. ఆనంద్‌ బాత్‌రూంలో నుంచొచ్చి ఆ బట్టలను చూసి “సురేంద్ర! ఈ బట్టలు జన్మలో వేసుకోను. ఎంతో ముచ్చటపడి హర్షిత నాబర్తడేకి కుట్టించింది. ఆ బట్టలు వేసుకునే ఆరోజు ఆపరేషన్‌ చెయ్యడానికెళ్ళాను. ఆ బట్టలతోనే హర్షిత శవాన్ని మోశాను. వీటిని తగల బెడ్డామనుకున్నాను. వీటిని చూసినప్పుడల్హా హర్షిత జ్ఞాపకాలు నన్ను చుట్టేస్తున్నాయి. అందుకే బీరువాలో అడుగున పెట్టేశాను.” అన్నాడు ఆనంద్‌ మళ్లీవాటిని బీరువాలో పెట్టేస్తూ మరో (డైస్‌ తీస్తూ.

“ఐ..యామ్‌... సారీ... రా.. ! ఎందుకనో నాకు ఈ కాంబినేషన్‌ నచ్చి తీశాను” అన్నాడు బాధపడుతూ.

మరికాస్సేపటికి ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ సురేంద్ర జీపులోనే ఫణి ఇంటికి బయళ్టేరారు.

జీపు శబ్దం వినగానే పరుగెత్తుకుంటూ ఎదురొచ్చాడు ఫణి. సురేంద్రకి షేకవోండు ఇచ్చాడు.

“ఏరా! మా ఇంటికి రావడానికికూడా, అతనిచేత అంత బతిమాలించు కున్నావా పూల్‌. ఇక్కడ ఎవర్రా నీకు కొత్త? నేనా? లతికా?” నవ్వుతూ (ప్రేమగా మందలించాడు ఫణి, “ఏమిటండీ ఆ పలకరింపు?” అంటూ బయటికొచ్చిన లతిక సురేంద్రకి నమస్కారం పెట్టి, “బాగున్నారా ఆనంద్‌గారూ? ఎంత చిక్కపోయారో తెలుసా కూర్చోండి మంచి నీళ్ళు తెస్తాను” అంటూ

180

వెన్నెల వేట

లోపలికెళ్లింది.

రెండు గ్లాసుల్లో మంచి నీళ్ళు తెచ్చి ఇద్దరికీ అందించింది. నీళ్లు తాగి గ్లాసుని బల్లమీద పెడుతూ “మీ ఇల్లు చాలా అఆర్టిస్టిక్‌గా వుంది! ఇది మీటేస్టా మీ ఆవిడ టేస్టా?” అడిగాడు సురేంద్ర.

“దాని మొహం, దానికేం తెలుసు. అంతా నా ప్లానే. రండి ఇల్టు చూద్దురుగాని” అంటూ ఆహ్వానించాడు ఫణి.

ఫణి మాటలు అతికకి అలవాటే అయినా, మరీ కొత్తవారి ముందు అలా తీసి పారెయ్యడం కొంచెం మనసుకి కష్టాన్ని కలిగించింది. అసలు ఆ యింటి ప్లానంతా అతిక అన్నయ్య వేణుగోపాల్‌ దగ్గరుండి వేయించాడు. కొన్ని సలహాలు లతిక కూడా ఇచ్చింది. అయినా ఏవో కాస్త సామాన్సు ఆటు ఇటూ మార్చి, అంతా తనే చేశానని చెబుతాడు ఫణి, ఇంటిష్టాను దగ్గర నుంచీ ఆంతా తన బుట్టేనన్నట్టు. అది అలతికకి అలవ్వాటైపోయింది. అందుకే ఆ విషయం పట్టించుకోక, ఆనంద్‌ దగ్గర కూర్చుంది.

ఆనంద్‌కి తెలిసిన ఇల్లే కనక సురేం(ద్రని తీసుకెళ్ళాడు ఫణి.

ఎవరో “సార్‌..సార్‌..” అని ఆరవడంతో “లతికా ఎవరో చూడూ!” అన్నాడు ఫణి.

చాకలి ఇ్రీకిచ్చిన బట్టల్ని తెచ్చాడు. “ఇదా సమయం బట్టలు తేవడానికి, ఇంత రాత్రయ్యాకనా? బొత్తిగా నీకు వేళా పాళా లేకుండా పోయింది.” ఆంటూ వాడి చేతిలోని బట్టల్ని తెచ్చి బెడ్‌ మీద పెట్టింది లతిక. బెడ్‌రూంలో అల్మారాలూ తలుపుల డిజైన్లనూ చూస్తూన్న సురేంద్ర బట్టలకేసి చూసి, అక్కడే నిలుచుండిపోయాడు.

“వాడంతే సులేంద్రగారూ! ఒకట్రైమంటూ లేదు. మా దోభీ మమ్మల్ని మించిపోయిన బిజీ” అంటూ తన జోక్‌కి తనే నవ్వుకున్నాడు.

181

శారదా ఆశోకవర్ధన్‌ అంతలోనే టెలిఫోన్‌ మోగడంతో “ఓ... సిస్టర్‌ సింధూ... ఏం సంగతి? ఓ.శే.ఓ.డే..బెడ్‌ నంబర్‌ 'సైవ్‌కి ఇంజక్షనిచ్చావా? ఆల్‌రైట్‌... బై...” అని ఫోన్‌ పెట్టేశాడు.

నులేంద్ర అతను చూపించిన వన్తువులన్నీ చూసి నవ్వుతూ “కంగ్రాచ్యులేషన్స్‌!... మా 'ఫ్రెండుకన్నా మీరు బాగా వృద్దిలో కొచ్చారు” అన్నాడు.

“అదే సురేంద్రగారూ! అది కూడా ఒక (గ్రేట్‌ ఆర్ట్‌. మన ఆనంద్‌కి డబ్బు సంపాదించుకోవడం చేతకాదు. పేరు...... పేరు... అనేవాడు. వాడికి తగ్గట్టు హర్షిత కూడా అంతే! ఇప్పుడేం పేరు పనికొచ్చింది? ఏం మిగిలింది?” అన్నాడు పెద్దగా నవ్వుతూ.

ఆనంద్‌ తలొంచుకు కూర్చున్నాడు. అది గమనించిన లతిక “పేరు సంపాదించడం అంత సుళువు కాదు” అంది ఆనంద్‌ని వెనకేసుకొస్తూ. “మౌ ఇంట్టో నాకు మా ఆవిడే ప్రతిపక్షం” అంటూ పెద్దగా నవ్వేడు గొప్ప జోకలాగొ ఫణి. ఆంతలో ఎవరో కాల్‌బెల్‌ నొక్కారు. అతిక వెళ్ళి “ఎవరండీ?” అని అడిగింది. “డాక్టర్‌ ఫణి ఇల్టు ఇదేనా?” ఆవునండి” “ఉన్నారా ఇంట్లో” “ఆ వున్నారు రండి” ఆహ్వానించింది. ఆతడు ఆరడుగుల పొడుగూ మంచి కండలు తిరిగిన శరీరం),ఉంగరాల జుట్టు, పచ్చటి శరీరఛ్భాయ, నల్లటి సూటూ, గొల్డ్‌'ఫ్రేం కళ్ళజోడూ వేసుకున్నాడు. లోపలికొచ్చి నుంచున్నాడు. ఫణి అతనెవరో తెలీక అతనికేసే చూస్తున్నాడు. 182

వెన్నెల వేట జేబులో నుంచి పైపు తీసి వెలిగించుకుంటూవుంటే అతని మొహం సరిగ్గా కనబడలేదు గానీ రెండు చేతులకీ వున్న రవ్వల కెంపుల, నవరత్నాల ఉంగరాలు ధగధగా మెరుస్తూంటే , షణి అతనెవరో కోటీశ్వరుడే అయివుండాలని అంచనా వేసుకుని “చెప్పండి సార్‌! నేనే డాక్టర్‌ ఫణిని” అన్నాడు. అతడు పైపు వెలిగించుకోవడం పూర్తిచేసి “హల్లో సురేంద్రా! సారీ నేను లేటుగా వచ్చాను." అన్నాడు సురేం(ద్రతో.

“ఫరవాలేదు?” అని చెప్పి “బైదిబై... మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. ఈ ఇంట్లో డిన్నర్‌కి నా ఫ్రెండుని తెస్తున్నానని చెప్పామనుకున్నాను. మీరు ఇల్టు చూపిస్తూంటే చూస్తూ ఆ సంగతే మర్చిపోయాను. సారీ... ఇఫ్‌. యూ డోంట్‌మైండ్‌” అన్నాడు సురేంద్ర.

“సురేంద్రగారూ యువర్‌ ఫెండ్‌...ఈజ్‌...మైఫ్రెండ్‌...” అన్నాడు ఫణి అతనికి ఫేక్‌హాండు ఇవ్వడానికి చెయ్యినందిస్తూ, ఆతను షేక్‌ హాండు చేస్తూ ఫణికేసి చూసాడు.

“ఫణి... ఇతను నా క్టోద్‌ ఫ్రెండ్‌ విద్యాసాగర్‌ రావు.”

“విద్యా... ఇతను నా ఫ్రెండ్‌ ఆనంద్‌కి క్లోజ్‌ ఫ్రెండ్‌. నాకూ ఈ మధ్యనే పరిచయమయ్యాడు. విద్యాసాగర్‌రావు విదేశాల్లో వుంటున్నాడు. గొప్ప బిజినెన్‌ మేన్నెట్‌! కాటన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇతని మెయిన్‌ లైను” అన్నాడు. ఫణి కేసి చూసి చెబుతూ.

ఫణికివేవీ చెవికి సోకడం లేదు.

'విద్యాసాగర్‌రావ్‌.... విద్యాసాగర్‌రావు... ఇతడు.... అతడేనా? చేరే విద్యాసాగర్‌రావా? వేరేనే అయ్యుండాలి! అతడెట్టా? నో.....నో!.... ఇంపాజిబుల్‌! ఇంత గొప్పవాడెలా అవుతాడు? అసలు ఆ విద్యాసాగర్‌రావు చచ్చిపోయుండాలి! ఒకవేళ బతికే వున్నాడేమో? హూ? ఉన్నా ఇంత ధనవంతుడెలా అవుతాడు?"

183

శారదా అశోకవర్ధన్‌ ॥ “డాక్టర్‌ ఫణీ మీరు ఏదో ఆలోచిస్తున్నారు. హాస్పిటలూ కేసుల గురించా” నవ్వుతూ అన్నాడు సురేంద్ర. ఫణి జవాబు చెప్పేలోగానే బైదిబై “విద్యా... ఆనంద్‌ని పరిచయం చెయ్యలేదు గదూ? నా చిన్నప్పుడు స్కూలు మేటు! ఫణీ, ఆనంద్‌లు మెడిసెన్‌ నుంచి క్లాస్‌మేట్స్‌!” అంటూ ఆనంద్‌ని పరిచయం చేశాడు సురేంద్ర. ఆనంద్‌ విద్యాసాగర్‌ రావ్‌కి షేక్‌హాండ్‌ చేశాడు. “మీ నేటివ్‌ స్లేన్‌ ఏదండీ?” అడిగాడు ఫణి విద్యాసాగర్‌ రావ్‌ని.

“బందర్‌” చెప్పేడు విద్యాసాగర్‌రావు. ఫణి మొహంలోని మార్పులు ఎవరికీ అర్థంకాలేదు. పిచ్చి చూపులు చూశాడు. నాలిక ఎండిపోయి పిడచకట్టుకు పోతూన్నట్టయింది.

“మీ ఊరూ” అడిగేడు విద్యాసాగర్‌రావు ఫణిని.

గొంతు పెగలడం లేదు ఫణికి. గొంతులో ఏదో అడ్డుకున్నట్టయింది.

అంతలో ఫోన్‌ మోగింది, ఫోన్‌ లోపలికి తీసికెళ్లి ఏదో మాట్లాడి పెట్టేశాడు ఫణి. మొహం అంతా చెమటలు పట్టింది. పక్కనున్న తువ్వాలుతో చెమటలు తుడుచుకున్నాడు.

కాళ్ళు ఒణుకుతున్నాయి! అందరూ తననే చూస్తూన్నట్ట్లూ తనని చూసి ఆందరూ నవ్వుతూన్నట్టనిపించింది. వెంటనే వచ్చి నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు.

“మీవూరేదో చెప్పలేదు” అన్నాడు విద్యాసాగర్‌రావు, పైపు నోట్లో పెట్టుకుని “ఉఫ్‌... ఉఫ్‌' అని దమ్ములాగుతూ. “మాదీ బందరే... బట్‌..... నేను మెడిసిన్‌ హైదరాబాద్‌లోనే చదివాను.” సమాధానం చెప్పాడు ఫణి. “మీ నాన్నగారి పేరు?”

ఫణికి మతి పోతూన్నట్టయింది. కళ్లు చీకట్టు కమ్ముతూన్నట్టయింది. “అబ్బా...! గుండెమీద చెయ్యేసి, మరో చేత్తో వెనక్కి వాలాడు ఫణి,

184

వెన్నెల వేట

“* ఏమయింది?” అంటూ ఆనంద్‌ ఫణి భుజాల్ని పట్టి కుదుపుతూ అడిగాడు.

“నా...ప్పి..! అన్నాడు మెల్లగా.

ఆనంద్‌ పల్స్‌ చూశాడు.

“ఏమయింది ఆనంద్‌?” ఆదుర్దాగా ఆడిగాడు సురేం(ద్ర.

“ఏం కంగారులేదు. కొంచెం పల్స్‌ వేగంగా కొట్టుకుంటున్నాయి? లెట్‌... హిమ్‌ రెస్ట్‌ ఫర్‌ సమ్‌టైమ్‌....! తగ్గకపోతే డాక్టర్‌ దగ్గరికి తీసుకువెళదాం. డాక్టర్‌ గోపాల్‌ దగ్గరికి!”

“ఆనంద్‌ మీరుండగా ఇంకా వేరే డాక్టరెందుకు”? అంది భయపడుతూ లతిక.

“డోన్ట్‌ వర్రీ ఐయామ్‌ ఆల్‌రైట్‌...” అన్నాడు ఫణి.

“కాస్పేపు బెడ్‌రూమ్‌లో కెళ్ళి పడుకో! యూ విల్‌ బి ఆల్‌రైట్‌!” అన్నాడు ఆనంద్‌ ఫణిని చూస్తూ,

అంతలోనే మళ్ళీ చం(ద్రమౌళిగారి కుటుంబం, పిల్లలకు జ్వరాలని అక్కడికొచ్చారు, మందు కోసం.

అక్కడ కూర్చున్న ఆనంద్‌ని చూసి, సంతోషం పట్టలేక “డాక్టర్‌ ఆనంద్‌ బాబూ! మిమ్మల్ని మళ్ళీ చూస్తామనుకోలేదు. మీరు ఈ వూరే వదిలేసి వెళ్ళిపోయారనీ, ఏవేవో హత్యకేసుల్లో ఇరుక్కున్నారనీ, మమతా క్లినిక్‌ క్టోజయిపోయిందనీ, డాక్టర్‌ ఫణి క్లినిక్‌కి వెళ్ళమని చెప్పారు కొందరు. దేముడిలాంటి మీకు ఇన్ని కష్టాలు ఎలా వచ్చాయా అని బాధ పడిపోయాం.

అయినా మమతా క్షినిక్‌ని ఎందుకు మూసేశారు బాబూ! మీ చెయ్యి

పడితేచాలు, మా రోగాలన్నీ నయమయిపోతాయి. మీ హస్తవాసి మీద మాకు

అంత నమ్మకం! ఎంత అదృష్టం బాబూ మిమ్మల్నిక్కడ చూశాం. మా 185

శారదా ఆశోకవర్ధన్‌ చిన్నబాబు శేఖర్‌కి పొద్దుటినుంచీ ఒకటే వాంతులూ విరోచనాలూనూ...” చం(ద్రమౌళిగారి భార్య ఆనంద్‌ని చూసి సంతోషంలో గుక్క తిప్పుకోకుండా చెప్పింది. “మమతా క్రినిక్‌లో డాక్టర్‌ రాఘవరావున్నారే! క్లోజ్‌ చేశారని ఎవరు చెప్పారు?” అడిగాడు సురేంద్ర.

“నర్సు లూసీ చెప్పారు” సమాధానం చెప్పింది చంద్రమౌళిగారి భార్య.

సురేంద్ర ఆనంద్‌ మొహం చూశాడు.

ఆనంద్‌ మాట్లాడలేదు.

“డాక్టర్‌ ఫణి లోపలున్నారు. ఒక పదినిమిషాలాగండి వస్తారు” అన్నాడు ఆనంద్‌.

“అదేంటి బాబూ? దేముడిలాగా ఇక్కడ మాకు మీరు కనిపించారు. మీరుండగా మరో డాక్టర్‌ దగ్గరికెళ్ళడమా? మీరే మందులు రాసివ్వండి” అన్నారు చంద్రమౌళిగారు.

బయటికొచ్చిన ఫణి మొహం మాడ్తిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నాడు.

'ఫణి! ఆ బాబుని చూసీ మందివ్వు. చంద్రమౌళిగారూ! ఫణి నా స్నేహితుడు. అతడికి బాబుని చూపించండి” అన్నాడు ఆనంద్‌.

“డాక్టర్‌గారూ! మా నమ్మకం మాది. ఎన్నో సంవత్సరాలుగా మేము మీ దగ్గిరకే వస్తున్నాం. మీ మందు మీదా, మీ మీదా మాకు ఎంతో నమ్మకం. ఎవరో దుర్మార్గులు మీ అభివృద్దిని చూసి ఓర్వలేక నిందలు మోపితే, ధర్మరాజులాంటి వారు మీకేం నష్టం? కాక్రప్రోత్రే కొంతకాలం వరకు నింద భరించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మీ క్రస్తుర్ర కొట్టకపోదు,” అంటూ అయిదేళ్ళ ఆ బాబుని ఆనంద్‌ చేతిలో పెట్టారు.

ఆనంద్‌ ఫణికేసి చూశాడు ఫణి కళ్ళు దించుకున్నాడు. 186

వెన్నెల వేట “ఒరేయ్‌... డాక్టర్‌! చాకలిషాపుకి, మంగలిషాపూకి ఇవ్వన్నీ నమ్మకం మీద పోతారు ఎవరైనా. ఒకసారి నమ్మకం ఏర్పడ్డాక ఛస్తే వాళ్లు మారరు. బాబుని చూసి మందులివ్వు” అన్నాడు సురేంద్ర పెద్దగా నవ్వుతూ. లతిక లోపలికెళ్ళి ఫణి స్టెతస్కోప్‌ తీసుకొచ్చిఇచ్చింది. ఇక ఆనంద్‌కి పేషంట్‌ని చూడక తప్పలేదు. బాబుని పరీక్ష చేసి మందులు రాసిచ్చాడు. ఎలా ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పాడు. చంద్రమౌళి జేబులోంచి వంద రూపాయల నోటు తీసి ఆనంద్‌కి ఇవ్వబోయాడు. “నో... నో...” అంటూ ఆనంద్‌ ఆడబ్బు తీసుకోలేదు. చంద్రమౌళిగారూ ఆయన భార్యా ఇద్దరూ ఆనంద్‌ని “చల్లగా వెయ్యేళ్ళు వర్రిల్లు బాబూ! ఆ ఏడుకొండల వాడి దయవల్ల మీ కష్టాలు గట్టెక్కాలని ఆ స్వామిని వేడుకుంటున్నాం” అంటూ బయళల్లేరారు.

వాళ్ళు వెళుతూ వుంటే “ బాబుకెలా ఉన్నదీ రేపు మా ఇంటికి గానీ, డాక్టర్‌ రాఘవ ఇంటికి గానీ ఫోన్‌ చేసి చెప్పండి” అన్నాడు ఆనంద్‌.

“అలాగే డాక్టర్‌ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇదంతా గమనిస్తూన్న విద్యాసాగరావు “కంగ్రాట్స్‌ డాక్టర్‌ ఇదంతా చూస్తూవుంటే, మీరు ఎంత గొప్ప డాక్టరో, అంతకుమించి ఎంత మంచి మనిషో అర్థమవుతోంది” అన్నాడు నవ్వుతూ.

“మా ఆనంద్‌ దేముడి లాంటివాడు విద్యా! పరిపూర్ణమైన మానవతామూర్తి! ఎవరో గిట్టనివాళ్ళు, వీడి మంచితనాన్నీ, వీడి భార్య మంచితన్నాని, వాళ్ళ అనుకూల దాంపత్యాన్నీ చూసి ఓర్వలేని దుర్మార్గులెవరో వీడి జీవితాన్ని నాళనం చేశారు” చెప్పాడు సురేంద్ర.

“అవునా? ఎలాగా?” అడిగాడు విద్యాసాగర్‌ రావు.

“ఆనంద్‌ భార్య హర్షిత బాలా మంచి మనిషి చదువూ సంస్కారం

187

శారదా అశోకవర్థన్‌ ఆమెలో ఉట్టిపడేవి. ఆనంద్‌దీ, ఆమెదీ శరీరాలు వేరైనా ఒకే మాట ఒకే బాటా! . అటువంటి మహా ఇల్లాలిని, ఆయిదునెలల గర్భవతి అనికూడా ఆలోచించకుండా (ప్రాణాలు తీశాడెవడో దౌర్భాగ్యుడు. అంతేకాదు. అదే సమయంలో ఆనంద్‌ తన ఆసుపత్రిలో ఒక 'పేషెంట్‌కి ఆపరేషన్‌ చేసి ఇంటికొచ్చేసరికి, వేరే మందేదో ఇచ్చి ఆ పేషెంటు ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్నాడు. తప్పుడు మందిచ్చి పేషెంటుని చంపేశాడని ఆనంద్‌కి డాక్టర్ల సర్కిల్‌లో చెడ్డపేరు రావాలనీ, "పేషంట్లలో భయం పుట్టకొచ్చి రావడం మానెయ్యాలని, జీవితంలో నరకయాతన అనుభవించాలనీ కక్షతో రెండుహత్యలూ ఒక్కసారే చేశాడు.” ఆవేశంతో చెప్పుకుపోతున్నాడు సురేంద్ర. “మెగాడ్‌! వాడెవడో ఇంటలిజెంట్‌ 'క్రూక్‌ అయ్యుండాలి!” అన్నాడు విద్యాసాగర్‌ రావు, “అవును. తెలివైన వాడు కనుకే ఆ రెండు హత్యలూ ఆనంద్‌ చేసినట్టు వాతావరణాన్ని సృష్టించగలిగాడు.”

“అంటే ఇప్పుడు ఆ రెండు కేసుల్లోనూ ఆనంద్‌ హంతకుడని నమ్ముతున్నారా?”

“అవును”

“పేషెంటుకి వేరీ మందిచ్చి హత్య చేశాడంటే అతడూ డాక్టరయివుండాలి. లేదా మందుల కంపెనీతోనో *"మందులతోనో బాగా సంబంధముండి, మందుల గురించి బాగా తెలిసినవాడై ఉండాలి

“కరెక్ట్‌ విద్యా! నేనూ అదే అనుకుంటున్నాను”

“ఈశేసు టేకప్‌ చేయ్యలేదా నువ్వు?”

“లేదు. ఈ ఏరియా నాకింద రాదు. పైగా పేషంటు తాలూకు వాళ్ళు, వీడి మీద హెల్త్‌ మినిష్టర్‌కి కంప్లయింట్‌ ఇచ్చారు. ఐ.జి.పి. లెవల్లో కేసు డీల్‌

188

వెన్నెల వేట చేస్తున్నారు. ప్రస్తుతం వీడు జామీను మీద విడిపించబడ్డాడు. తిండీ తిప్పలూ లేకుండా, క్లినిక్‌ మొహం చూడకుండా పడుంటున్నాడు. నేనే బలవంతాన ఇవాళ వీణ బయటికి తీసుకొచ్చాను” అన్నాడు సురేంద్ర. విద్యాసాగర్‌ మళ్ళీ జేబులో ఉన్న కవర్‌ తీసి పొగాకు తీసి సైపులో పెట్టి నొక్కి, లైటర్‌ తీసి వెలిగించాడు. ఆ లైటర్‌ వెలిగిస్తూన్నప్పుడు మంచి మ్యూజిక్‌ వినగానే ఫణి అటుకేసి చేశాడు. విద్యాసాగర్‌ రావు ఆ లైటర్‌ని చూపిస్తూ” ఈ మ్యూజిక్‌ వినగానే మీ దడ కొంచెం తగ్గినట్టంది. యూ లైక్‌ దిన్‌ లైటర్‌? అడిగాడు. ఫణి ఆటు చూస్తూ, “నో...నో! ఊరికనే చూశాను. నాకక్కర్రేదు,” అన్నాడు. విద్యాసాగర్‌ రావు ఆ లైటర్‌ని సురేంద్రకి చూపించాడు. “చాలా బావుంది” అన్నాడు సురేంద్ర దాన్ని ఇటూ అటూ తిప్పిచూస్తూ, “యూ కీపిట్‌...” అన్నాడు విద్యాసాగర్‌రావ్‌. “ఆరే నాకెందుకు. ఒద్దు” అంటూ వెనక్కివ్వుబోయిన సురేంద్ర చేతిని వెనక్కి నెట్టేస్తూ, “ఉంచుకో, నా గుర్తుగా?” అన్నాడు. “ఓ.శే! థ్యాక్యూ' ఆంటూ జేబులో పెట్టుకున్నాడు సురేంద్ర. “ఏవండీ! భోజనానికి లేస్తారా?” అడిగింది లతిక ఫణిని, ఫణి సురేంద్ర కేసి చూశాడు. “ఓ.యన్‌.. వి ఆర్‌ రెడీ...” అన్నాడు సురేంద్ర. “రండి చేతులు కడుక్కుందురుగాని” వాష్‌ బేసిన్‌ వైపు వెళుతూ చెప్పాడు ఫణి. అందరూ వెళ్ళి చేతులు కడుక్కున్నారు. లతిక చేతులు తుడుచుకోవడానికి టవల్‌ అందించింది. అందరూ టేబుల్‌ ముందు కూర్చున్నారు. లతిక వడ్డిస్తోంది. మామిడికాయ పులిహోర చేసింది. పెరుగు వడలు చేసింది. గుత్తాంకాయ కూర, సాంబారు, 189

శారదా అశోకవర్థన్‌ అప్పడాలూ, వడియాలు. “ఐటమ్స్‌ చాలా బాగున్నాయి” అన్నాడు సురేంద్ర. “ఎక్స్‌లెంట్‌” అన్నాడు విద్యాసాగర్‌ రావు. “ఒరేయ్‌ ఆనంద్‌! అన్నీ వేసుకో” అన్నాడు సురేంద్ర. ఫణి మాత్రం ఏవో ఆలోచనలలో మునిగిపోయినట్టు పరధ్యానంగా తింటున్నాడు.

“మీ ఆయన సరిగ్గా తినడం లేదు” అన్నాడు విద్యాసాగర్‌రావు లతికవైపు చూస్తూ,

“మీరు హోస్టు. మీరు సిగ్గుపడితే మేము సగం ఆకలితో లేచిపోవలసిందే” పెద్దగా నవ్వాడు సురేంద్ర, ఫణి కేసి చూస్తూ,

“నాకు కొంచెం ఒంట్లో సరిగ్గాలేదు. ప్లీజ్‌ మీరు మొహమాట పడకండి.

సరిగ్గా భోంచెయ్యండి” అన్నాడు ఫణి.

“ఆనంద్‌... మీకు పెరుగువడ వెయ్యనా” అడిగింది లతిక.

“ఒద్దమ్మా” అన్నాడు ఆనంద్‌.

“వాడలాగే అంటాడులే, వెయ్యండమ్మా” అన్నాడు సురేంద్ర.

ఆనంద్‌ రెండు చేతులూ అడ్డం పెట్టి వారిస్తున్నా, వినకుండా మరో వడ వేసింది లతిక,

“ఫణీ! మోరెంతో మాట్టాడతారనీ, కబుర్లు చెబుతారనీ మా ఫ్రెండు విద్యాసాగర్‌ రావ్‌ని కూడా పట్టుకొచ్చాను లిబర్టీ తీసుకుని. పైగా మీరిద్దరూ ఒక్కవూరి వాళ్ళు. ఏవేవో మాట్లాడి, నన్నూ ఆనంద్‌ని, మూగవాళ్ళలాగా కూర్చోబెట్టి, మీరే మాట్లాడుకుంటారేమో ననుకున్నా. కానీ నేను వాగుతున్నా, మీరు మూగవాళ్ళయిపోయారు.” అన్నాడు పెద్దగా నవ్వుతూ సురేంద్ర.

“అదేం లేదు” అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ ఫణి,

190

వెన్నెల వేట

“బంధరులో మీ నాన్నగారు ఏం చేసేవారు?” అడిగాడు విద్యాసాగర్‌రావు.

“గవర్నమెంటు స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేసేవారు”

“అంటే సుబ్బారావు మాస్టారు గారా?”

“అవును”

“మీ నాన్నగారి పేరు?” అడిగాడు ఫణి,

“హరనాధ్‌రావు! ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌లో పనిచేసేవారు”

“అలాగా?”

“అయితే నిజంగానే ఫణీ! నువ్వు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. నేనూ నువ్వూ ఒకే స్కూల్లో చదివాం. నేను నీ కన్నా రెండేళ్ళు సీనియర్‌ని. మీ కజిన్‌, మధూ, కిరణ్‌ మేమంతా ఒక కాసు. నువ్వు మా జూనియర్‌వి.. గుర్తొచ్చిందా?”

“మరయితే ఈ విషయాలు అప్పటినుంచీ ఎందుకు మాట్టాడుకోలేదు?” అడిగాడు సురేంటద్ర.

“నేను వాణ్ణి చూడగానే గుర్తు పట్టాను. కాని వాడే నన్ను గుర్తుపట్టలేదు. ఎంతసేపు గుర్తుపట్టడో చూద్దాంలే అని ఊరుకున్నాను” అన్నాడు విద్యాసాగర్‌రావు.

ఫణి అప్పుడే పెరుగు వడ్డించుకున్నాడు.

“అదేమిటండీ! సాంబారు వేసుకోలేదు. అప్పుడే పెరుగేసుకున్నారేంటి?” అడిగింది లతిక,

“ఏమిటే? గెస్పులని చూసుకోకుండా నాకు మర్యాదలు చేస్తున్నావ్‌?” కసిరాడు ఫణి. “అందరినీ చూసుకుంటున్నాను. మిమ్మల్నీ చూసుకుంటున్నాను” అంటూ ఆనంద్‌కి సాంబారు వడ్డించింది లతిక, “మా ముందర మీ ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు. మేం వెళ్ళాక మళ్ళీ 191

శారదా ఆశోకవర్థన్‌ వడ్డించండి. లేకపోతే అర్ధరాత్రి ఆకలికి ఆగలేక తనే వడ్డించుకోవలసి వస్తుంది” అన్నాడు ఎగతాళిగా విద్యాసాగర్‌రావ్‌. అందరూ పక్కున నవ్వేశారు. “అబ్బ ఇంతసేపటికి ఆనంద్‌గారు నవ్వడం చూశాను.ఐ..యామ్‌ హ్యాపీ” అంది లతిక, ఫణి ఇవేవీ విననట్టే వక్కపాడి పట్టుకొచ్చాడు. అందరికీ ఇచ్చాడు. విద్యాసాగర్‌ రావ్‌ వక్కపొడి వేసుకుంటూ, ఫణి మొహం కేసి చూశాడు. ఫని అటెటో చూస్తూ వక్కపొడి కిందపడేశాడు. పళ్ళెం వంకరగా పట్టుకోవడం వల్ల వక్కపొడంతా కిందపడిపోయింది. “ఏంటయ్యా పరధ్యానం” అంటూ లేచి నుంచున్నాడు విద్యాసాగర్‌రావు, “ఐయమ్‌ సారీ...” అంటూ ఆతని పాంటు మీద పడ్డ వక్కపొడి కర్చీపుతో దులుపుతూ అన్నాడు ఫణి, “ఫణీ ఇవ్వాల నువ్వు నిజంగానే మూడ్‌లో లేవు” అన్నాడు ఆనంద్‌! “ఆయన మూడు ఎప్పుడు బావుంటుందో, ఎప్పుడు చెడిపోతుందో, ఎందుకు బావుంటుందో, ఎందుకు చెడిపోతుందో ఎవ్వరికీ తెలీదు” అంది దెప్పుతూన్నట్టు లతిక “ఓ... ఆయితే మీతోట్రీ ఆంతేనా? అంటే మా వాడేం మారలేదన్నమాట” నవ్వుతూ అన్నాడు విద్యాసాగర్‌ర్వాా, ఫణి ముఖం ముడుచుకుపోయింది. అంతా అయోమయంగా వుంది ఆనంద్‌కే, సురేంధద్రకీ। మరీ కాస్సేపు కూర్చుని పిచ్చాపాటి మాట్టాడుకున్నారు నలుగురూను. ఫోన్‌ మోగడంతో అత్రిక్ర వెళ్ళి ఫోన్‌ త్రీస్తి “త్రీ సిస్టర్‌ లూసీట. ఎవరో పేషంటుని పంపుతానంటోంది. మీతో మాట్టాడుతుందట” అంది. “ఫణి...నో! నాకు ఒంట్టో బాగాలేదని చెప్పు... పడుకున్నానని చెప్పు” 192

వెన్నెల వేట అంటూ... ఆనంద్‌కేసి చూసి “నువ్వు మాట్లాడతావా?” అడిగాడు.

“ఆమె ఫోన్‌ చేసింది నీకోసం! నువ్వే మాట్లాడు. అన్నాడు ఆనంద్‌.

“ఆనంద్‌ లూసీ ఆంటే నీ క్లినిక్‌లో పనిచేసే లూసీయేనా” అడిగాడు సురేంద్ర.

అవునన్నట్టు తల ఊపాడు ఆనంద్‌.

సురేంద్ర ఆలోచనల్లో పడిపోయాడు.

అంతలోనే స్టేట్లలో ఐన్‌'క్రీమ్‌ తెచ్చింది లతిక.

“అదేమిటి? అయిన్‌్రీం వుందని చెప్పకుండా వొక్కపొడి ఇచ్చేశాడే మీ ఆయన” అన్నాడు విద్యాసాగర్‌ రావు.

“ఆయనంతే! అబొసెంట్‌ మైండెడ్‌ (ప్రొఫెసర్‌! చెపుతూనే వున్నా. వినిపించుకుంటేగా! ఫరవాలేదులెండి. అయిన్‌ క్రీం తీసుకోండి. వక్కపొడి మళ్ళీ వేసుకోవచ్చు” అంటూ అందరికీ స్టేట్టనందించింది.

చల్లని అయిన్‌'క్రీమ్‌ తింటున్నారే గానీ అందరి బుర్రల్గోను వేడి వేడి ఆలోచనలు!

“ఎందుకు ఫణి అదోలా ఉన్నాడు?” ఆనంద్‌ ఆలోచన!

'విద్యాసాగరావు ఫణితో ఒక్కవూరివాడైనా ఫ్రీగా మాట్టాడడం లేదు. లూసీ ఎందుకు ఫణికి పేషెంట్టని పంపిస్తోంది?, సురేంద్ర ఆలోచన.

“అందరూ మూడీగానే వున్నారేంటి?' లతిక ఆలోచనలు.

ఇలా ఎవరికి వారే ఆలోచనల్లో పడి, ఎలాగో అయిన్‌క్రీమ్‌ తినడం పూర్తి చేశారు.

మళ్ళీ అందరికీ వక్కపొడి అందించింది లతిక,

“ఇక వెళ్ళొస్తాం!” అంటూ సెలవు తీసుకుని బయళల్టేరారు వాళ్ళు.

ఆనంద్‌: సురేంద్ర జీపులో కూర్చున్నారు.

193

శారదా అశోకవర్థన్‌ విద్యాసాగర్‌రావ్‌ తన పెద్ద టాటా ఎస్టీట్‌లో కూర్చున్నాడు. “కాస్సేపు ఆనంద్‌ ఇంటికెళదాం ఫాలో మీ...” అన్నాడు సురేంద్ర విద్యాసాగర్‌రావ్‌తో, జీపుని స్టార్ట్‌ చేస్తూ. “ఓ.కే” అంటూ కారు స్టార్ట్‌ చేశాడు విద్యాసాగర్‌రావు. రెండు బళ్ళూ రోడ్డు మీద రయ్‌మని వ్హత్రన్నాయ్మిపణి మ్యదడులోని ఆలోచనల్డా. ఆరోజు ఉదయం అన్ని పేపర్రలోనూ 'ఒక్కటే వార్త, “భార్యా భర్రలు పోట్టాడుకుని ఆవేశంలో ఒకరినొకరు పొడుచుకోవడం విన్నాం! అస్తికోసం ఒక్క కడుపున పుట్టిన పిల్లలు తలలు బద్దలు కొట్టుకోవడం విన్నాం. ఒళ్ళు తెలీని కోపంలో ఇరుగుపొరుగులు కుమ్ములాడుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం విన్నాం. కొన్ని సందర్భాలలో ఉద్యోగులు పిచ్చి ఆవేశకావేశాలకు గురై చంపుకోవడమూ విన్నాం. కానీ, స్నేహమనే కమ్మని తలపుకే కళంకం తెచ్చే ద్వేషంతో, ప్రాణ స్నేహితుడిలా నటిస్తూ ప్రాణాలు తియ్యడం, అదీ కేవలం జెలసీ... అసూయతో ప్రాణాలు తీయడం బహు అరుదుగా జరిగుండొచ్చు! ఈరోజు ఆ ఆసూయ ఎన్ని ప్రాణాలు తీయించిందో తేనెపూసిన కత్తిలొ నటించిన డాక్టర్‌ ఫణికుమార్‌ చరిత్ర చెబుతుంది. డాక్టర్‌ ఆనంద్‌ భార్యనీ, ఆతని ఆసుపత్రిలో పేషంటునీ ఒకేరోజు పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు: కాలేజీలో చేరిన కొత్తలోనే ఒకమ్మాయితో (పేమించాననని చెప్పి బలాత్కరించబోగా, ఆమె ఒప్పుకోనందుకు, చెరువులో తోసేసి త్రైల్రివిగా తప్పించుకున్న పరమ కిరాతకుడు, రాక్షసుడు. ఈనాడు పాప్రం పండి పోలీసుల వలలో చిక్కుకుపోయాడు. ఈ కేసును అత్యంత సామర్థ్యంతో, పరిశోధించి నిజాలు వెలికి తీసిన ఇన్స్‌పెక్టర్‌ సురేంద్రనీ, డిటెక్టివ్‌ విద్యాసాగర్‌ రావునీ (ప్రభుత్వం తగురీతిన సత్కరించి డాక్టర్‌ ఫణికుమార్‌న్సి ల్రాక్తళ్టలోకి తీసుకున్నారు. తేనెపూసిన కత్తిలాంటి ఈ హంతకుడికి, బ్రయిల్‌ 194

వెన్నెల వేట నిరాకరించబడింది. ఎల్జుండే కోర్టులో ఈకేసు విచారణ.”

నాయుడుగారి కుటుంబం, ఇరుగు పొరుగు వాళ్లూ ఆందరూ ఆనంద్‌ ఇంటి చుట్టూ మూగిపోయారు. “ఎంత గుండెలు తీసిన బంటు! నిండు చూలాలని ఆలోచించకుండా చంపేసి, ఏమీ ఎరగనట్టు నటిస్తాడా?” నాయుడుగారి మాట.

“ఎంతమోసం[” ఆయన సతీమణి వ్యాఖ్య. “ఓ యమ్మో... ఓ యమ్మో... ఇంత అన్నాయం మా సదువురానోల్టు గూడ సెయ్యరు. డాక్టర్‌ సదువు సదివి, మందిచ్చి రచ్చించేవోడు ఇసమిచ్చి పానాలు తీసిండు. దేవతవంటి అమ్మను గొంతుపిసీకి సంపిండు. కసాయోడు” పనిమనిషి మాటలు. ఆనంద్‌ అందరి మాటలూ వింటూ ఆలోచిస్తూ'పేపరువంకే చూస్తూ కూర్చున్నాడు. “అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాం బాబూ అందరం! అదేమిటో వాడు అచ్చు వెనక నుంచి నీలాగే కనిపించాడు. కనికట్టు చేసేడేమో దరిద్రుడు” నాయుడుగారి భార్య మాటలు.

“కనికట్టూ కాదూ, గాడిద గుడ్డూ కాదు! రాక్షసుడిలా [క్రూరుడిలా (ప్రవర్తించాడు. ఆసలు వాడిలో మానవత్వం ఏ కోశానా లేదు” అన్నాడు లోపలికొస్తూ, ఇన్స్‌పెక్టర్‌ సురేం[ద్ర. ఆతని వెనకాలే ఒక ఆందమైన అమ్మాయి ఉంది. ఆధునికత, సంస్కారం అన్నీ ఆ అమ్మాయిలో ఉట్టిపడుతున్నాయి. చూడగానే మళ్ళీ చూడాలనే ఆకర్షణ ఆమెలో ఉంది.

“ఆనంద్‌ మీట్‌... మై... మరదలు షర్మిళ, మీనా చెల్లెలు. సుప్రసిద్ద లాయరు”

“నమస్తే” అంది ఆనంద్‌ని చూస్తూ మిగిలిన వారికి కూడా నమస్కారంపెడుతూ. అందరూ ్రతినమస్కారం చేశారు.

“ఆసలు ఫణి హర్షితనెలా చంపాడు బాబూ! ఆ రాత్రి ఆనంద్‌ తలుపు

195

శారదా అశోకవర్థన్‌

కొడుతూంటే, మేమూ వచ్చాం. హర్షిత తలుపు తియ్యడం చూసి నేను వెళ్ళిపోయాను.” అన్నారు నాయుడుగారు.

ఉఇబుతా! ఫణి ఆరోజంతా ఆనంద్‌ వెనక వెనకే ఫాలో అవుతూ ఒచ్చాడు. అతడు ఈ మధ్యనే లూసీతో కూడా స్నేహం పెంచుకున్నాడు. మమతా క్లినిక్‌కి వచ్చే పేషంట్టని కొంతమందినైనా డాక్టర్‌ ఆనంద్‌ లేరనో, ఇప్పుడు "పేషంట్లని చూడరనో ఏదో మిషపెట్టి, డాక్టర్‌ ఫణి దగ్గరికి పంపించే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకుగాను ఫణి ఆమెకు నెలకు వెయ్యి రూపాయలిస్తూ వచ్చాడు-గత ఆరునెలల నుంచి.

ఆరోజు అపరేషన్‌ సంగతి కూడా లూసీ ఫణికి చెప్పింది. ఆపరేషన్‌ చెయ్యడానికి కూడా డా॥ ఆనంద్‌ ఆ రాత్రి వస్తూన్నట్టు ఫణికి ఫోన్‌ చేసి చెప్పింది. ఫణి దాదాపు తొమ్మిది గంటలనుంచీ ఆనంద్‌ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. ఆ రాత్రి ఆనంద్‌ కార్టో వెళుతున్నప్పుడు, మెరూన్‌ కలర్‌ బుష్‌ షర్టూ, వైట్‌ పాంటూ వేసుకోవడం చూశాడు. తనూ ఇంటికెళ్లి, అటువంటి 'డ్రస్సే తనూ కుట్టించుకోవడం వల్ల” వెంటనే (డ్రస్సు మార్చుకునొచ్చాడు.

ఆనంద్‌ ఆ రాత్రి మధ్యలో ఇంటికెళ్లిన సంగతి లూసీ ద్వారా తెలుసుకున్నాడు. ఇంటికి కొద్ది దూరంలో కారాపి ఆనంద్‌ రాకపోకలు గమనిస్తూ వున్నాడు. ఆ రాత్రి ఆనంద్‌ కాఫీ తాగి వెళ్ళాక, వెంటనే ఒచ్చి తలుపుతట్టాడు. నిద్దర్లో వున్న హర్షిత తలుపుతీసింది. ఫణిని చూసి ఆశ్చర్యపోయుంటుంది. ఫణి వికృతిప్రవర్తనకి కేకలు పెట్టంటుంది. కేకలు బయటకి పోనీయకుండా నోరునొక్కేసి, గొంతుపిసికి చంపేశాడు ఫణి.అప్పుడే నాయుడుగారింట్లో లైట్టు వెలిగాయి. మైహం ఆటు కనపడకుండా జాగ్రత్త పడ్డాడు ఫణీ, అంతలోనే టెలిఫోన్‌ మోగింది. లే

అతికష్టం మీద ఫోన్‌ తీసి హర్షిత ఏదో చెప్పబోతూనే చనిపోయింది! ఆఫోన్‌

196

వెన్నెల వేట

ఆనంద్‌ చేసిన ఫోను అని (గ్రహించి ఫణి వెంటనే వెళ్లిపోయాడు. కంగారుగా ఆనంద్‌ ఇంటికి వరుగెత్తుకొచ్చాడు. ఆనంద్‌ వచ్చేలోవల వణి బయటికెళ్ళిపోయాడు. కానీ రిసీవర్‌ టెలిఫోన్‌ మీద పెట్టలేదు. పైగా మమతాక్షినిక్‌కి వెళ్ళి సిస్టర్‌ లూసీ సహాయంతో, ఆ పేషెంటుకి పాయిజనన్‌ (ప్రిస్కిప్షన్‌ ఇచ్చి ఏమీ తెలీని వాడిలా బయటవడ్డాడు. ఆ సేషెంటు పోయాడని తెలిశాక, వాళ్ళ తాలూకు వాళ్ళని ఆ బాధలో ప్రేరేపించి, రెచ్చగొట్టి ఆనంద్‌పైన కంప్లయింట్‌ చేస్తూ హెల్త్‌ మినిష్టర్‌కి ఫోన్‌ చేయించాడు. అంతా అయ్యాక ఏమీ తెలీని వాడిలా లతికని తీసుకుని ఆనంద్‌ దగ్గరికొచ్చి అందరితోపాటు తనూ సానుభూతి చూపించాడు,” గుక్క తిప్పుకోకుండా అంతా కళ్ళకి కట్టినట్టు చెప్పాడు సురేంద్ర.

“ఎంత మి(త్రద్రోహం, మి(త్రుడే కాదు. శత్రువుకైనా మనం ఇలాంటి "ఘోరాన్ని చెయ్యలేము. అంతా ఒక పథకం (ప్రకారం చేశాడు. పాపాత్ముడు” దూషించింది నాయుడు భార్య.

“లూసీ ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు” అన్నాడు ఆనంద్‌.

“లూసీ చాలా తెలివైనది ఆనంద్‌గారూ! నర్సిమ్మకి వెంటనే లీవిచ్చి పంపేసింది. నర్సిమ్మ విషయంలో అతను ఉత్తరంలో రాసిన విషయాలన్నీ కరెక్టే! సిష్టర్‌ మాధవిని తనే కావాలని పెళ్లి చూపులున్నట్టు లెటర్‌ పెట్టమని లీవిచ్చి పంపేసింది. నిజానికి మాధివికి పెళ్లి చూపులూ లేవు ఏమీ లేవు.

ఆమెకి మీరంటే ఎంతో గౌరవం, తనూ ఫణీ కలిసి ఆడుతున్న నాటకం మాధవికి తెలీకుండా వుండడానికే లూసీ అలా చేసింది. బెదిరించి లీవులో పంపించేసింది. లూసీ తనకన్నా వయస్సులో పెద్దది, సీనియర్‌ కావడం వ్లల బెదిరిపోయి మాధవి లీవు పెట్టింది. ఇదంతా నేను స్వయంగా వెళ్లి వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నాను. మీరంటే మాధవికీ, నర్సిమ్మకీ కూడా ఎంతో

197

శారదా ఆశోకవర్ధన్‌ గౌరవం. ఆమాటే బావగారికి చెప్పాను.” అంది షరి గ్రైళు

“స్నేహితుడిగా నటిస్తూ, ఇలా వెన్నుపోటు పాడవడానికి అంత ద్వేషం ఎందుకు సార్‌ డాక్టర్‌ ఆనంద్‌మిద? అతనూ సంపాదించుకుంటున్నాడు కదా! మరీ ఇంత దిగజారిపోవడానికి ఇంకేమైనా కారణాలున్నాయోమో?” అన్నారు పొరుగింటి కృష్ణవైతన్యగారు. “ఉన్నాయి, స్వతహాగా ఫణి చాలా ఆసూయాపరుడు. ఫణీ అతని సోదరుడు మణీ ఒకే స్కూల్లో చదివేవారు. మణీ ఫణి కన్నా ఒక్క ఏడాది సీనియర్‌: ఏ పోటీలోనైనా మణికి మంచి సేరొస్తే, వారం రోజుల వరకూ ఫణి మణిితో మాట్టాడేవాడు కాదు. మణితోటే కాదు అతడి స్నేహితులతో కూడా మాట్లాడేవాడు కాదు. పైగా ఒకసారి తనకన్నా మణికి హాఫ్‌ ఇయర్టీ ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులొచ్చాయని తెలిసి, వాడి నోట్సు చించిపారేసాడు. అంత అసూయాపరుడు” సురేంద్ర చెప్తుండగానే విద్యాసాగర్‌రావు లోపలికొచ్చాడు. “అంతేకాదు. ఇంకో విషయం చెబితే మీరంతా ఆశ్చర్యపోతారు,” అన్నాడు.

“అదేమిటి?” అడిగారు నాయుడుగారు.

“నేనూ మణీ ఒకటే క్లాసు. మేము చదువుకునే స్కూలు కో ఎడ్యుకేషన్‌. ఆరోజుల్లో ఆడపిల్లలూ మొగపిల్లలూ కలసి చదువుకునే స్కూలు అదొక్కటే! ఫణి క్లాసులో రజిత అని ఒకమ్మాయి వుండేది, రెండు జడలు వేసుకుని చూడ్డానికి నాజూగ్గా ఆకర్షణీయంగా వుండేది. ఆ అమ్మాయి కాసులో ఎప్పుడూ ఫస్టే, తన చదువూ తన గొడవా తప్ప ఎవ్వరి జోలికీ పోయేది కాదు. ముఖ్యంగా మొగపిల్లల జోలికి ఆసలే పోత్సుద్ద కాదు. పైగా చాలా భయస్సురాలు. వాళ్ల అమ్మానాన్న గుడివాడలో వుండేవారు. రబిత వాళ్ల మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేది. వాళ్లమేనమామకి పిల్లల్లేని మూలంగా చెల్లెలు కుంటుంబం భరించలేని ఖర్చులతో బాధపడుతూ వుంటే, రజితని తెచ్చి వాళ్ళింట్లో

198

వెన్నెల వేట పెట్టుకుని చదువు చెప్పించారు రజిత మామయ్య విశ్వేశ్చరరావు.

ఆ వివరాలు ఆనోటా ఆనోటా అందరికీ తెలుసు. ఫణికి కూడా తెలుసు. మా నాన్నగారూ రజిత మామయ్యగారూ ఫ్రెండ్ఫని తెలిసి ఎప్పుడైనా కాస్త నాతో చనువుగా మాట్టాడేది.”

అందరూ ఒక డిటెక్టివ్‌ కధ వింటున్నట్టుగా నిశ్శబ్దంగా వింటున్నారు విద్యాసాగర్‌ రావు గారి మాటలు. “కాస్త మంచినీళ్ళిస్తావా అమ్మా” పనిమనిషినడిగాడు విద్యాసాగర్‌ రావు. రుక్కిణమ్మ మంచినీళ్ళు తెచ్చిచ్చింది. మంచి నీళ్ళు తాగి మళ్ళీ మొదలెట్టాడు.

“నాతోటీ, నా ఫ్రెండు కావడం వల్ల మణితోటీ ఆ అమ్మాయి మాట్లాడ్డం చూసిన ఫణి ఒక పధకం వేశాడు. జ్వరం వొచ్చిందని మణి ఆరోజు స్కూలుకి రాలేదు. ఆమె స్కూలునుంచి బయలుదేరింది ఇంటివైపు. ఫణి గబగబా

ఆమెదగ్గరికెళ్ళి ఏం చెప్పాడో ఏమో వెంటనే ఫణి సైకిల్‌ మీద కూర్చుంది.

ఫణి గబగబా చిలకలపూడి బీచ్‌ వైపుకి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. వాడేం చెప్పాడో తెలీదు కానీ అందరూ అనుకోవడం, వాళ్లమ్మా నాన్నా కుటుంబం అంతా వొచ్చారనీ, వాళ్ల మామయ్యా అత్తయ్యా వాళ్లంతా కలిసి బీచ్‌కెళ్ళారనీ, ఇల్లు తాళం వేసుంది కనుక తనని బీచ్‌కి రమ్మన్నారని వాళ్ల మామయ్య చెప్పినట్టు చెప్పాడని తరువాత అందరూ అనుకున్నారట మా ఇంట్లోవాళ్లు. అలా అనుకోవడానికి ఆధారాలేమిటో తెలీదు.”

“అలా బీచ్‌కెళ్ళాక ఏం జరిగింది?” నాయుడుగారి భార్య ఆదుర్దాగా అడిగింది.

“ఆ అమ్మాయిని వాడు అలా తీసుకెళ్ళడం చూసి, నేనూ ఒక కిరాయి సైకిల్‌ తీసుకుని వాణ్ణి వెంబడించాను. నేను చేరేటప్పటికే వాడా అమ్మాయిని రేప్‌ చెయ్యడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి వీణ్ణి చెంప దెబ్బకొట్టడం,

199

శారదా అశోకవర్థన్‌ వీడు వెంటనే ఆ అమ్మాయిని నీళ్లలోకి తోసి ముంచెయ్యడం అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. గట్టిగా అరవాలనుకున్నా నాకు గొంతు పెగలలేదు. చెమట్లు కారిపోతున్నాయి. షాకునుంచి తేరుకుని, వాడి దగ్గరకెళ్లేలోగా వాడు నన్ను చూసి, “ఒరేయ్‌! ఈ సంగతి ఎక్కడన్నా కూశావో నీకూ ఇదే గతి పడుతుంది" " అని బెదిరించి వెళ్లిపోయాడు. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. భయంతో గుండె ఆగిపోయినట్టయింది. ఏం చెయ్యడానికీ తోచక బీచ్‌ దగ్గరికెళ్ళి రజిత కనిపిస్తుందేమోనని చూశాను. చీకట్లో ఆ కెరటాలు నా మీదకి దూకి నన్ను లాక్కుపోతాయోమోన్నంత భయం వేసింది. రజిత కన్పించలేదు. అక్కడ సముద్రాన్ని చూస్తే ఏదో భయం! పరుగు పరుగున సైకిల్‌ తొక్కుతూ ఇల్లు చేరుకున్నాను. కిరాయి సైకిల్‌ వాపన్‌చేసి, ఆరాత్రి జరిగినదంతా నాన్నగారితో చెప్పాను. అంతా విని నాన్నగారు “ఆ సంఘటన నువ్వొక్కడివే చూశావా? నీతో ఇంకెవరైనా వున్నారా?” అని అడిగారు. ఎవ్వరూ లేరని చెప్పాను. ఫణి అన్న మాటలు కూడా చెప్పాను. నాన్నగారు ఆలోచనలో పడిపోయారు. “తెల్లవారేటప్పటికి నాన్నగారు నన్ను ప్రయాణం కట్టించారు, ్రివేండ్రమ్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసరుగా పనిచేస్తూన్న మా బాబాయ్‌ దగ్గరికి. ఆ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాయనందున నా చదువు పోయింది. నన్కెక్కడికి పంపించారో చెప్పకుండా నాన్నగారు ఆ విషయాన్ని చాలా రహస్యంగా వుంచారు. అంతే! మళ్ళీ నేను బందర్‌లో కాలు పెట్టలేదు. (ప్రైవేటుగా మెట్రిక్‌ కట్టాను. (త్రివేండ్రం కాలేజీలో ఇంటరు చేశాను. డి(గీ కూడా అక్కడే చేసి బాబాయ్‌ ఇన్‌ఫ్టయన్స్‌తో పై చదువులకి ఆ(ప్టేలియా వెళ్లిపోయాను. “ఎంత ఘోరం” అన్నారందరూ. 200

వెన్నెల వేట

“ఆ తరువాత రజిత హత్య బయటపడలేదా?”

“లేదు. ఆత్మహత్యగా అనుకున్నారట అందరూ. హత్య అని చెప్పడానికి నేను తప్ప మరే సాక్ష్యమూ లేదు. అందుకే నేనెక్కడ చెప్పేస్తానో, ఆ తరువాత నాకేం జరుగుతుందోనన్న భయంతోటే, తెల్దారకుండానే నాన్నగారు నన్ను వూరు విడిచి పంపించేశారు.”

“ఆ తరువాత నువ్వు ఫణిని మళ్ళీ చూడనే లేదా?” అడిగాడు సురేంద్ర.

“లేదు, మొన్న నీతో చూడ్డమే! వాడు నన్ను గుర్తుపట్టాడు! అందుకే పిచ్చివాడిలా అయిపోయాడు. తలనొప్పని, గుండె నొప్పని నటించాడు. వాడీ పల్స్‌ వేగంగా కొట్టుకోవడానికి కారణం నా రాక్షే”

“కరెక్ట!నా విషయంలో కూడా అలాగే చేసేవాడు. అన్నింటికీ నాతో పోటీ పడేవాడు. ఇంటర్‌లో నేనూ, వాడూ, హర్షితా ముగ్గురం క్లాన్‌మేట్స్‌మి. నేను పోటీలో నెగ్గినప్పుడల్లా నాతో పోట్టాట పెట్టుకునేవాడు, గేమ్స్‌, డిబేట్స్‌లో అన్నింట్లో! పైగా నేను ఏ (డ్రస్సు వేసుకుంటే అదే వేసుకుంటాననేవాడు. హర్షితా నేనూ ప్రేమించుకుంటున్నామని తెలిసి కూడా, హర్షితకి ప్రేమలేఖలు రాయడం, ఊరికే ఆమె దగ్గరికెళ్ళి ఏదో ఒకటి అనడం చేసేవాడు” అన్నాడు ఆనంద్‌.

“నాలుగు తగిలించి దేహశుద్ది చెయ్యవలసింది” అంది షర్మిళ.

“హర్షిత ఒకసారి చెప్పుచ్చుకు కొట్టింది. అయినా సిగ్గులేదు.” అన్నాడు ఆనంద్‌.

“అసూయాపరులు ఆవేశంతో తప్ప ఆలోచనతో ఏ పనీ చెయ్యలేరు. వారి దగ్గర లేనిది మరొకరి దగ్గర వుంటే భరించలేరు. వారికి లేదన్న బాధకన్నా మరొకరికి ఉందన్న బాధ వాళ్ళని కాల్చేస్తుంది.

అందుకే వాళ్ళ కోర్కెలు తీర్చుకోవడానికి వాళ్లు ఏమైనా చేస్తారు. తెలివిగా

201

శారదా అశోకవర్ధన్‌ పట్టుదలగా ఎన్నో సాధించామని అనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకచోట పప్పులో కాలెయ్యక మానరు.” అన్నారు నాయుడుగారు.

“ఫణి చేసినవి రజితతో కలిపి మూడు హత్యలన్నమాట!” భయంగా అంది నాయుడిగారి భార్య.

అంతలోనే మమతాక్షినిక్‌లో వున్న స్టాఫంతా ఒచ్చేశారు. ఏనోట విన్నా పణి చేసిన అఘాయిత్యం, సిస్టర్‌ లూసీ చేసిన అన్యాయం విషయమే!

పేపర్లో వార్తలు చదివి సిస్టర్‌ మాధవి పరుగెత్తుకుంటూ వొచ్చింది, ఆనంద్‌ని చూసి పోదామని. నర్సిమ్మ కూడా వొచ్చాడు.

అందరికీ 'టీ చేసి పెట్టమని చెప్పేడు సురేంద్ర షర్మిళతో. “అయ్యో! ఆమెకెందుకురా (శ్రమ. పనిమనిషి రుకి కొమ్మను పెట్టమను. లేదా హోటల్‌ నుంచి తెప్పించు” అన్నాడు ఆనంద్‌.

“నాకేం (శ్రమలేదండీ! నా కలవాటే!” అంటూ చటుక్కున లేచి వెళ్లి టీ" చెయ్యడంలో నిమగమయింది షం ]₹. వెనకాలే వెళ్ళి ఏ గిన్నెలిక్కడున్నాయో, టీ పాకెట్‌ ఎక్కడుందో చూపించింది పనిమనిషి రుకి శణమ్మ. గబగబా టీ చేసీ కప్పులని ట్రేలో పెడుతూన్న షరి శ్రోకేసి రెప్పవాల్బకుండా చూసింది రుక్మిణమ్మ. అది గమనించిన షర్మిళ “రుక్మిణమ్మా ఏంటలా చూస్తున్నావ్‌ నన్ను. నేను సరిగ్గా చెయ్యడం లేదా?” అడ్సిగింది.

“అది కాదమ్మగారూ! మిమ్మల్ని సూత్తుంటే మా హత్తైతమ్మగోరు గ్యేపకం వొస్తనరు. మీలాగే చకచకా కలిప్పేవారు ట్రీ, కాఫీలు.” అంది రుక్మిణమ్మ షర్మిళను అలాగే చూస్తూ, ౮

మంచి నీళ్ళ కోసం ఫ్రిజ్‌ దగ్గరకొస్తున్న సురేంద్ర రుక్షిణమ్మ మాటలు విని షర్మిళకేసి చూశాడు. ఆమె తలదించుకుంది. తలలో ఆలోచనలు మెరుపులా మెరిశాయి. ఆకురాలి వాడిపోతూన్న చెట్టుకి, నీళ్ళుపోసి ఎరువు వేస్తే మళ్ళీ

202

వెన్నెల వేట

చిగురిస్తుంది. మొగ్గ దాలుస్తుంది, పూలు పూస్తుంది, కాయలిస్తుంది, పండ్లనిస్తుంది.

తోడు లేక బీడువారిన బతుకుకి తోడు కలిపిస్తే మళ్లీ కొత్త జీవితం పుట్టుకొస్తుంది. చావు పుట్టుకలు జీవితంలో ఒక భాగం. పోయిన వారితో ఎవరూ పోలేరు. జ్ఞాపకాల నీడల్లో సతమతమయిపోతూ నిర్జీవంగా బతికే వారికి, తోడూ నీడా కలగజేస్తే పునర్జన్మ ప్రారంభమవుతుంది. ఆనంద్‌ గొప్ప డాక్టరు. అంతకుమించి మంచి మనిషి! షర్మిళ లాయర్‌. మంచిపిల్ల. ఆనంద్‌ హర్షితని మరచిపోయి మళ్లీ మామూలు మనిషికావాలంటే అతడికి షర్మిళలాంటి తోడు ఆవసరం అనుకుని తనకన్నా ముందు రుక్మిణమ్మకి ఈ ఆలోచన కలిగినందుకు ఆమెని అభినందిస్తూన్నట్టు ఆమెకేసి చూసి చిరునవ్వు నవ్వేడు. సురేంద్ర మనసులోని భావాలని అప్పుడే చదివేసింది షర్మిళ. మొగ్గ తొడిగిన సిగ్గు అప్పుడే రెక్కలిప్పుతూన్నట్టు, మెల్లగా నవ్వింది సురేందద్రను చూసి!

షర్మిళ చేతిలోని టట్రేని సురేంద్ర అందుకోబోతూంటే వారించి తనే తీసుకెళ్ళి అందరికీ ఇచ్చింది. శ సి స

ఆనంద్‌ బంధువులూ, హర్షిత బంధువులూ అందరూ పేపర్గో వార్త చూసి, రెండు రోజుల తరువాత జరగబోయే తీర్పును స్వయంగా వినాలని ఒచ్చేశారు. ఇల్లంతా జనంత్రో కిటకిటలాడిపోతోంది.

రుక్మిణమ్మ సాయంతో షర్మిళ ఆ పూట వంటంతా చేసింది. షర్మిళ వంటా వార్పూ వడ్డనా, కలుపుగోలుతనం అందరికీ హర్షితనే గుర్తుతెస్తోంది. ఫణికి ఏం శిక్ష వేస్తారోగానీ, ఆనంద్‌ మాత్రం శిక్షార్డుడు కాదన్న విషయం అనాటి పత్రికలు రాయడంతో, అటు మమతాక్షినిక్‌లోనూ, ఇటు ఆనంద్‌ ఇంట్లోనూ సంతోషంతో సందడిగా వుంది. చనిపోయిన పేషెంటు తాలూకు వాళ్లు కూడా వొచ్చి ఆనంద్‌కి క్షమాపణ చెప్పుకున్నారు.

203

శారదా అశోకవర్థన్‌ హెల్త్‌ మినిష్టర్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆనంద్‌కి కంగ్రాట్యులేషన్స్‌ చెప్పారు. ఆరోజే తీర్చు-కోర్టు హాలు జనంతో నిండిపోయి, ఇసుకవేస్తే రాలనంతగా కిటకిటలాడిపోతోంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవటానికి చోటులేక పోగా, బయట ఆవరణలోనూ, రోడ్డుమీదా కూడా జనం గుంపులు గుంపులాగా నిలబడి ఉన్నారు. అందరి మొహాల్లోనూ ఆతృత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. దేశంలోనే సంచలనం రేపిన డాక్టర్‌ ఫణికుమార్‌ కేసుకి, ఆరోజే తీర్పు! కోర్టు బయట ఆడామగా, గుంపులు గుంపులుగా గుమిగూడి ఉన్నారు. “ఫణికుమార్‌ని ఉరి తీయాలి” ఆంటూ కోర్టులోకి ప్రవేశించడానికి ముందుకి పరుగెత్తుతూన్న యువతకి పోలీసులు అడ్డుపడి దూరంగా నెట్టుకుపోతున్నారు. అనేక మహిళా సంఘాల ్రతినిధులూ మహిళలూ “ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసిన దౌర్భాగ్యుడు. పొట్టన బెట్టుకున్నా కిరాతకుడు ఫణికుమార్‌ని కొద్దిపాటి శిక్షతో వదలకూడదు. ప్రాణాలు తీసినవారి ప్రాణాలను తియ్యడమే న్యాయం. అతనికి మరణ శిక్ష విధించాలి” ఆంటూ నినాదాలు చేస్తున్నారు. “యువత - మహిళావిభాగం” వారు కిరోసిన్‌ డబ్బాలతో ముందుకొచ్చారు. “ఫణి కుమార్‌ స్రీల ప్రాణాలను హరించిన దుర్మాద్లుడు, రాక్షసుడు. వాణ్లీ ఉరివేయకపోతే మేమంతా, ఇప్పుడే ఇక్కడే ఆత్మాహుతి చేసుకుని కాలిపోతాం, బూడిదైపోతా.” ఆంటూ అరుస్తున్నారు. ఈ జనాన్నందరినీ అదుపు చెయ్యలేక సతమతమయిపోతున్నారు ఆడా, మగా పోలీసులు, పత్రికల వాళ్లూ ఫోటో (గ్రాఫర్లూ అటూ ఇటూ పరుగెట్టి ఎవరికి తోచిన ఇంటర్వ్యూలు వాళ్లు తీసుకుని, అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అరుపులూ, నినాదాలూ, అదుపుచెయ్యలేక గాలిలోకి కాల్పులు జరుపుతూన్న పోలీసులూ, లాఠీ దెబ్బలు తింటున్లు 204

వెన్నెల వేట

జనాలూ, ఆ ఆవరణేకాదు, రోడ్డు రోడ్డంతా ఆలజడులతో నిండిపోయింది.

కోర్టు హాలులో జడ్డీగారి 'ఆర్హర్‌... ఆర్హరో అనే గొంతు విని వాతావరణం నిళ్ళబ్దంగా మారిపోయింది. జడ్జిగారు తీర్పు ఇవ్వడానికి పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించిన అనంతరం, “డాక్టర్‌ ఫణికుమార్‌ తన స్నేహితుడి భార్యను ఆతి దారుణంగా హత్య చేసినట్టు బుజునయింది. ఒక బాధ్యతగల పౌరుడిగా మహోన్నతమైన వైద్య వృత్తిలో వుండి ఇటువంటి నేరానికి పాల్పడమే కాకుండా, రోగ (గ్రస్థుడైన రోగి, రోగనివారణకు డాక్టర్‌ దగ్గరికొస్తే విషప్రయోగంచేసి చంపడం, అవృత్తికే కళంకం. ఆశాపూరితుడు, ఆవేశభరితుడూ, అసూయాపరుడూ అయిన ఈ డాక్టర్‌ ఫణికుమార్‌ వైద్య వృత్తికి కళంకం తెచ్చిపెట్టాడు.” అన్నారు.

బడ్డీగారు ఇంకా శిక్షను ప్రకటించకుండానే హాల్గో అలజడి బయలుదేరింది. “ఒక మందుకు మరో మందిచ్చి మా నాన్న ప్రాణాలు బలితీసుకున్నాడు.” జనంలోంచి ఆరిచాడొకతను.ఆందరూ తిరిగీ చూశాగు. ఆనంద్‌ అతనిని గుర్తు పట్టాడు. వామనరావుగారి కొడుకు. డాక్టర్‌ ఆనందమూర్తి అడ్డుపడి వుండకపోతే ఈ ఫణికుమార్‌ని ఆనాడే ఉరికంబం ఎక్కించి ఉండేవాళ్లం.” ఇప్పటికి వీడి పాపం పండింది.

“ఆంతేకాదు. దాదాపు పదిహేడేళ్ళ క్రితం చిలకలపూడి బీచ్‌లో ఒక యువతిని సముద్రంలోకి తోసి చంపేసిన రాక్షసుడు ఈ ఫణికుమార్‌. ఆనాడు సాక్ష్యాధారాలు లేక నోరు మూసుకుని పడున్నాం. ఈనాడు సాక్ష్యం దొరికింది” ఒక ముసలతని ఆక్రందన!

“ఇప్పుడు సాక్ష్యాలు దొరికాయా?” పత్రికలవాళ్ల ప్రశ్న!

“దారికాయిసార్‌! యువర్‌ ఆనర్‌! నేను సాక్షిని ఆంటూ జరిగినదంతా వివరించాడు విద్యాసొగరరావు.

205

శారదా అశోకనర్థన్‌ “మైగాడ్‌! నాలుగు హత్యలు! హర్టితగారి పొట్టలోవున్న బిడ్డతోసహా. నాలుగుకాదు, వీణ్లిలా ఒదిలేస్తే నలభై హత్యలైనా సునాయాసంగా చేసేస్తాడు. వీణ్ణి ప్రజల మధ్యన ఉరితీయాల్సిందే! అంతవరకూ మేమూరుకోం! లేదా ఇక్కడే ఆత్మాహుతి చేసుకుంటాం. ప్రాణాలు విడుస్తాం” మహిళలూ, యువతీయువకులూ ఏక కంఠంతో చేస్తున్న నినాదాలు! కోర్టుహాలులో అలజడి! బయట నినాదాలు! జడ్జిగారు వాతావరణాన్ని పరిశీలిస్తున్నట్టుగా అటూ ఇటూ చూశారు! “ఎప్పుడో ఎక్కడో ఉరితీయడంకాదు. ఇప్పుడే... ఇక్కడే. పబ్లిక్‌ హేంగింగ్‌ చెయ్యాలి. జనాన్ని అదుపులో పెట్టడానికి బయట పోలీసులు గాలిలోకి కాల్పులు చేశారు. నినాదాలు ఆపకుండానే జనం చెల్టా చెదురుగా అటూ ఇటూ పరుగెడుతున్నారు. కోర్టు హాలులో అలజడికి * ఆర్డర్‌! ఆర్డర్‌!” జడ్జిగారి కంరం కంచులా మోగింది, ఆయన ఏంచెప్తాడో నన్న ఆతృత అందరి మొహాల్లోనూ కనబడింది. “ఫణికుమార్‌ చేసిన హత్యల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అతడికి ఉరి శిక్ష విధిస్తున్నాం” జడ్డిగారి తీర్చు, జనం తృప్తి చెందలేదు. “యువర్‌ ఆనర్‌. మీరెప్పుడో ఫణికువూర్‌కి ఉరిశిక్ష విధిస్తామంటే సరిపోదు” జనం గోల. “భారతీయ శిక్షాస్మృతిలో పబ్లిక్‌ హాంగింగ్‌ లేకపోయినా, కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌" పాటించండి! ఒక నాగరీకుడైన వైద్యుడు, ఆనాగరికంగా ప్రవర్తించంతో పాటు నరరూప రాక్షసుడిలా హత్యలు చేయటాన్ని మానవమాత్రులెవరూ క్షమించరు. ప్రజాభీష్టం మేరకు నేను సాహసం చేసి, చారిత్రాత్మకమైన తీర్పుని ఇస్తున్నాను. ఫణికుమార్‌ని 'ప్రజాసమూహం ముందు ఉరితీయడానికి ఆదేశిస్తున్నాను. పబ్లిక్‌ హాంగింగ్‌ 206

వెన్నెల వేట చేసి శిక్ష అమలు పరచడం జరుగుతుంది. సిస్టర్‌ లూసీకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను."జనంలో చప్పట్టు వర్షం.

జడ్డిగారు లేచి నిలబడ్డారు.

కోర్టు హాలులో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. క్షణంలో ఈవార్త బయటంతా పొక్కిపోయింది.

“జడ్జిగారికి జై” మహిళా గొంతుకలు ఏకకాలంలో పలుకుతున్నాయి. బోనులో నిలబడ్డ ఫణికుమార్‌ కుప్పకూలిపోయాడు. డాక్టర్‌ ఆనందమూర్రి కళ్లు వర్షించాయి!

అప్యాయంగా ఒక హస్తం అతని కన్నీళ్ళను తుడిచింది. ఉలిక్కిపడి ఆ సుతిమెత్తని హస్తాన్ని గట్టిగా పట్టుకుని, “హర్షితా! నిన్ను ఆంతం చేసిన ఫణికి ప్రజలు బుద్దిచెప్పారు హర్షిత్రా! నీ బదులు వాళ్ళు వాడికి శిక్షవేసి మరోసారి మరో స్త్రీకి ఎవ్వరూ ఏహానీ తలపెట్టని విధంగా తీర్పుకోరి, నీ తరపున (ప్రతీకారం తీర్చుకుని నాకు మనశ్శాంతినీ నీకు ఆత్మశాంతినీ ప్రసాదించారు! నువ్వు నా దానివే. ప్రజలే మనకు దేముళ్ళు” అంటూ ఆమె చేతులలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆనందమూర్తి. “ఆనంద్‌గారూ! ఏమిటిది పసిపిల్హాడిలా!... ఊరుకోండి” ఓదార్చింది షర్మిళ.

“ఒ ...... సారీ!... షర్మిళా? మీరా? క్షమించండి. ఆవేశంలో ఆందోళనలో నన్ను నేనే మర్చిపోయాను.” అన్నాడు ఆనంద్‌ క్షమాపణ కోరుకుంటూ. “ఒరేయ్‌ ఆనంద్‌! ఈ రోజుతో హర్షిత ఆత్మ శాంతిస్తుంది. ప్రజాశక్తి గెలిచింది. ప్రజావెల్లువ తన శక్తిని నిరూపించుకుంది. ఫణికుమార్‌కి తగినశిక్షే పడింది. దుష్టశిక్షణా శిష్టరక్షణా జరిగింది. ఇంక నీ పాత జీవితానికి ఈ నాటితో తెరవేసేయ్‌! ఎంత మంచిదైనా చదివిన పుస్తకాన్నే మరీ మరీ చదవలేముగా! హర్షిత స్పూర్తిని నింపుకుని, నీకోసం, నీ మనశ్శాంతికోసం,

207

శారదా అశోకవర్థన్‌

హర్షితని హత్య చేసిన దుర్మార్గుణ్ణి పట్టించడం కోసం, మాతో పాటు ఆహర్షిశలూ నీకు తెలీకుండా పనిచేసీన 'షమ్మీ'ని నీ జీవితంలోకి మనసారా ఆహ్వానించు! ఏ ప్రజాశక్తి అయితే నీకోసం ఉద్యమించిందో తమ ప్రాణాలను కూడా లెక్కజెయ్యకుండా, లారీ దెబ్బలు తినడానికీ, ఆతా హుతి చేసుకోవడానికీ ముందుకొచ్చిందో వారి గురించి ఆలోచించు! ఎందుచేత? నీ మీద గౌరవం చేత! నీ వృత్తి మీదా (ప్రవృత్తి మీదా నమ్మకం చేత! వాళ్లు నీ వైపు చేరారు! ఆ ప్రజాశక్తి ముందు జడ్జిగారు సయితం, “భారతీయ శిక్షాస్మతిలో పబ్లిక్‌ హాంగింగ్‌ లేకపోయినా, నీమీద అభిమానంతో వారి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్దమయిన జనావళిని చూసి, ఆ అమాయకుల ప్రాణాలను రక్షించడానికి, నిర్జోషివైన నిన్ను కాపాడడానికి, సాహసం చేసి ఆ తీర్పునిచ్చారు అన్నాడు సురేంద్ర, మళ్ళీ వెంటనే _

“నువ్వు షమ్మీలో హర్షితని చూసుకుని ఆస్ఫూర్తితో, ఆ ప్రజలకు సేవ చెయ్యాలి. ఫ్లీజ్‌! షర్మిళ నా మరదలని చెప్పడం కాదు. అన్నివిధాలా నీ ఆశయాలకు తగిన పీల్ల అని చెప్తున్నాను.”"అన్నాడు. కి వాళ్ళు ప్రైబోగాపర్డు ఆనంద్‌ని చుట్టుముట్టేస్తున్నారు ఇంటర్వ్యూ

కష్టం మీద ఆనంద్‌ని అక్కల్టుంచి త్రీసికెళ్ళగలిగాడు సురేంద్ర. బంచిలమ మా కారల్‌. అన్ని కార్లూ ఆనంద్‌ ఇంటి ముందు ఆగాయి! రపయారు ఎ" నుంచి దిగిన జనం అందరూ ఆమెని చూసి సవర వలవల నన్ను క్షమించు!” ఆంటూ లతిక ఆనందమూర్తిని ఆనందమూర్తి, సురింగ్ర చేస్తే చేస్తిన్‌ ఊరుకో!” ఊరడించాడు చేశాడు. “పదండి లోపలళ రా ఆమెను ఆనందమూర్తి నుంచి దూరం న్నాడు. ఆందరూ అతనిని అనుసరించారు.

208

వన్నెల వేట ఇల్లంతా జనం! రోడ్డంతా జనం! నేలీనినట్టుంది! ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర ట్రాన్సిస్టర్‌ ఆన్‌ చేశాడు! ఫణికుమార్‌ని ఉరితీయాలన్న తీర్పూ, అతను చేసిన (ద్రోహాల లిస్టు, జనం చేస్తూన్న నినాదాలు, పోలీసుల అరుపులూ, అందరూ నిశ్శబ్దంగా రేడియో విన్నారు. “దురాశ దుఃఖాన్ని కలిగిస్తుంది! ఆసూయ అనర్థాలను తెచ్చి పెడుతుంది.” అన్నారెవరో. అందరి వంకా చూసి, నిశ్శబ్దాన్ని చేదిస్తూ షర్మిళ ఆందరికీ క్షణంలో టీ చేసి పట్టుకొచ్చింది. టీ కప్పునందుకుంటూ లతిక బావురుమంది. అందరూ ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించారు. “ఆనంద్‌! కొందరు చీకటి రాత్రులలో కూడా పున్నమి వెలుగులను చూడగలుగుతారు. మరికొందరు పున్నమి రాత్రులలోకూడా వెన్నెలని చూడలేక, దానికోసం వేటాడుతారు. ఫణి రెండో (శ్రేణికి చెందినవాడు. తనకున్న దానితో తృప్తిపడడం, తను సంతోషంగా వుండడం, ఎదుటి వారిన సంతోషపెట్టడం అతనికి చాతకాదు. ఎదుటివారి పచ్చని చూసి ఏడ్వడం తప్ప! హర్షితని అతడు ప్రేమించాడు. అతడికి దక్కని ప్రేమ నీకు దక్కినందుకు ఆ ప్రేమని ద్వేషంగా మార్చుకున్నాడు. దానికి తోడు నీ పేరు ప్రతిష్టలు ఆతను భరించలేకపోయాడు. అసలు చిన్నప్పటి నుంచీ అతడు అఆసూయతోటే పెరిగాడు. అతడితో పాటు అతడిలోని అసూయకూడా పెరుగుతూ వచ్చింది. నేను అతడి జీవితంలోకి ప్రవేశించాక అతణ్జి మార్చాలని ఎంతో ప్రయత్నించాను. అవమానాల పాలయ్యాను. భంగపడ్డాను. చివరికి చీకటి బ్రతుకులో ఏకాకిగా మిగిలాను. నీకు జరిగిన అన్యాయానికి నేను మొదటి నుంచీ ఫణిని అనుమానిస్తూనే వున్నాను. నా ఆంచనా తల్లకిందులు కాలేదు.” మోకాళ్ళమీద తల అన్పి వెక్కి వెక్కి ఏడ్చింది లతిక! 209

శారదా అశోకవర్థన్‌ “అయిపోయిన దాన్ని తలచుకుని ఏడిస్తే ఏం లాభం? దుర్మార్గానికి శిక్ష ఎప్పుడో ఒకప్పుడు పడక తప్పదుకదా!” ఓదార్చింది షర్మిళ, “స్సశ్షేంద్రగారూ! నాదొక కోరిక! మన్నిస్తారా?” “ఆనంద్‌ నువ్వూ తీరుస్తావా?” “తప్పకుండా తీరుస్తాను. ఏమిటో చెప్పు” ఆతృతతో అడిగాడు అనందమూర్తి. “ఆనంద్‌! ఫణి క్లినిక్‌ని కూడా నువ్వే నడుపు. కాకపోతే ఆ క్లినిక్‌లో నేను నర్సుగా పనిచేస్తాను” “చాలా బాగుంది. ఆనంద్‌! ఒప్పుకో” అన్నాడు సురేంద్ర. “అలాగే” ఇన్నాడు ఆనంద్‌! “అన్నయ్యా! మరొక్క కోరిక. కాదనకు” “సరి! చెప్పు!” లతిక అందరికేసీ ఒకసారి చూసింది. “హర్షిత సీ బతుకులో నీ మనసునిండా చందమామలా నిండిపోయింది. అయితే షర్మిళ నీకు వెలుగునిచ్చే వెన్నెల కావాలని ఆశిస్తున్నాను.” అంది. “వెరీ గుడ్‌ అతిక గారూ, మా అందరి మనసుల్లో వున్న మాటే మీరు పైకి చెప్పేసారు. ఏమంటావురా సురేంద్రా!” అడిగాడు విద్యాసాగర్‌రావ్‌. అప్పుడే వచ్చింది మీనా అక్కడికి. “వాళ్ళక్కనడుగు” అన్నాడు సురేంద్ర. విద్యాసాగర్‌ రావు విషయాన్ని చెప్పాడు. మీనా షర్మిళకేసి చూసింది! షర్మిళ తలదించుకుంది! అయితే ఆమె బుగ్గలలో విరిసిన అరుణిమని గమనించింది మీనా. 210

వెన్నెల వేట

“అక్కా ఒక మాటడగనా?” అంది లతిక కేసి చూస్తూ మీనా.

“అడుగు. సందేహం దేనికి?” అంది లతిక.

“అక్కా! ఇంత వెంటనే నేను ఆనందమూర్తిని పెళ్లి చేసుకుంటే అందరూ ఏమన్నా అనుకుంటారేమో? ముఖ్యంగా ఆనందమూర్తిని గురించి! 'భార్యపొయిన వెంటనే మరో భార్యని తెచ్చుకున్నాడు” అని ఎవరైనా అంటే, నేను భరించ లేను” అంది మీనా తలదించుకుని.

“పిచ్చిపిల్దా! అనేవాళ్లు ఏం చేసినా ఆంటారు. అందుకని మనం చేస్తున్నది మంచి పని అని అనిపించినప్పుడు చెయ్యడం మానేస్తామా? ఆనంద్‌ మళ్లీ మామూలు మనిషికావాలి, గొప్ప డాక్టరుగా పేరు తెచ్చుకోవాలీ అంటే, అతను హర్షితను మర్చిపోవాలి. నువ్వు అందుకు వెన్నెలలా అతనిలో ఇమిడిపోవాలి. ఇంక ఆలోచించకు” అంది చెంపలు నిమురుతూ.

మీనా కళ్లలోని వెలుగు జాబిలి వెన్నెలంత కాంతిని చిమ్మింది!

పూలకుండీలోని పూలను నెమ్మదిగా పెదవులతో స్పృశించింది మీనా, ఉప్పాంగిపోతున్న గుండెలని అరచేత్తో అదిమిపట్టుకుని!

అందరి హృదయాలూ తేలిక పడ్డాయి.

ఒక కంట ఆనంద్‌ జీవితం మళ్లీ వసంతం నింపుకుందన్న సంతోషం!

మరోకంట ఫణి వికృత నికృష్ట చేష్టలకి లతిక బలైపోయిందన్న బాధ.

“ఇక పదండి. ఈ కలియుగంలోనూ దుష్టశిక్షణా, శిష్టరక్షణా జరిగింది.

లేకపోతే అమానుష చర్యలూ, అ(క్రమాలూ రెచ్చిపోయి, రౌడీయిజం

  • గూండాయిజం తలెత్తి వీరనాట్యం చేస్తూవుంటే, (ప్రజాశక్తి చేతులు ముడుచుకు చూస్తూ ఊరుకుంటే, నీతి చచ్చి పోతుంది, న్యాయం నాశనమైపోతుంది. ఇది ప్రజా తీర్పు!” అంటూ నాయుడుగారు బయటికి నడిచారు.

మెల్లగా ఒక్కొక్కరే సెలవు తీసుకుని ఎవరి గూటికి వాళ్లు చేరుకున్నారు.

211

శారదా ఆశోకవర్థన్‌

తరువాత కథ మామూలే! కాలం ఏ ఒక్కరికోసమో ఆగిపోదు!

నీతి ఎల్లకాలమూ సమాధి కాదు.

న్యాయదేవత కళ్లగంతలు విప్పుకుని ఎప్పుడో ఒకప్పుడు ప్రజాభీష్టం తెలుసుకోక తప్పదు!

వెన్నెలకోసం వేటాడడం మాని చీకట్లో వెన్నెలను చూడాలి యువతరం!

పలకాలినాంది నవతరం!

ఇది లతిక అందరికీ ఇచ్చే సందేశం!

జీవన గీతోపదేశమిది!

పూల కుండీలోని ప్రతీ మొక్కకీ నీళ్లు పోస్తూ మొక్క మొక్కతో పూవు పూవుతో చెప్పే సత్యాలివి! ప్రతి నిత్యం లతిక,

ఈడ డన్పుు / రా ళ్‌ న్‌ లు న నాం 212

| | | | . కథ, నవల, కవిత, నాటిక, వ్యాసం, సంగీత నృత్యరూపకం |. మొదలైన అనేకానేక సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసి పాఠకుల, శ్రోతల ఆదరాభిమానాల్ని చూరగొన్న సాహితీమూర్తి శ్రీమతి .' |. శారదా అశోకవర్థన్‌. సాహిత్య వేదికలమోద తరచుగా వక్తగానూ, వ్యాఖ్యాతగానూ; పత్రికల పుటల్లో కవయిత్రిగానూ, ', . రచయిత్రిగానూ; మిత్రుల మధ్య స్పేహశీలిగానూ, మృదు భాషిజిగానూ దర్శనమిచ్చే శారదా అశోకవర్ధన్‌ సమాచార . శాఖ, ఆకాశవాణి, బాలభవన్‌లలో బాధ్యతాయుతమైన . | పదవులను సమర్థవంతంగా నిర్వహించి, నవాచార | _ శాఖనుంచి జాయింట్‌ డైరెక్టరుగా ఉద్యోగ విరమణ చేసిన ., _ తదాదిగా పూర్తికాలాన్ని సాహిత్యరంగానికి అంకితంచేసి | . పరంపరగా ఎన్నెన్లో రచనల్ని వెలువరిస్తూ వస్తున్నారు. ఇటీవలి _ 'వారి రచనల్లో చెప్పుకోదగినది ఈ 'వెన్నెల వేటి' నవల. | శీ .