Telugu Velluo matladevela_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
లు న. స వా యం ల్ సనా గ న మ టం టం తళ 2 చెల్యు ఖాస్ షక క నం, , (2 [ప తై మిట్ ల్ ల! శ గ స వల్ కంత లో నే లో పరి శ! నో గం కలీ శ స్ స్స ర్ లో శే . అన్నా ం యాన వీ శస! నైయంాన కం సయం ఇం 4 త్ శు ' [1 ల ఉనే నో ల (0 కై శ లు గస చాలట న్ గరల్ (1 ము న్ న న మ యే ష్ట్ర. క ట్ షే? ఇజం న ఆ కి హం. న్ టి సక! . ము చ నన్ననాతలే మం టా” 0 స. సు. ర క్ స్త న. ట్ట ల న్లో ట్ ఎట ఆ లే నే భో అ క ట్ర ల న నం కల టి ్పా న ఎప న! నే ల ళో నక నా న | చీ / యం ల (యశ స 1. / న , ఎట్ న మ! కం య వ. మ! జ” కుట ర ణే స. క్ ఖ్ ప ల య జన న యక్ వన్వుక..! లు అకా ” భ్ గళ శీ గ వ త ఒం వ చ లం లెపి. న భట్ ర్య! , ॥ అస్త ఉత్త టర ఆ ౧ టా నాగ కా. ఉం. న లన సోనా... “+. నం“ శు ఘు. జ. 7 + శు టే జి వ టి మా. రా కా ల ల మ పహ తం యం. బం వయ ల తోం క ల, జ. శ వగ "సకలా టీ భీం 4 (లా నం మ | ళటి., ” న. ఖం” కం ప జ ఇన్ గ న్ నే | కం ఆబ శ్నస్టగ్ర ఖే ఎం | గే తే న క్ష జ జ్ య “సరన. ోళ్సి. / స ః బస ళ్య శ మె. గాష్తస శ స. న నం స క హా ॥ శ తన్న జ్జ కుక. ఆసు: నన న ము. శ ; క క స స లం న శ కారో శా ఫ్ శ ః ఇం / +టీ "గీ వ. న్! హస పెంటీ ఓ ఫం కం స క్ + ౯ క మే. తీ శ ( జంపా న యఉసనతీఫ క్. నప స. . భు గంటు వాం సబ. లు యచన మునిం న ఎన కళా. న్‌్ య్ క్ సంచిని. - వచ శక క, స ౧1. న మ్ హో ళా. లు. వ సను ళు | క ల న. వ్. కంల ల వ లు నా ర క పషన్ల యు ఖో త స. శి ౭ | ర లాం వనాల ాళాండాలా 1.11 షా ణల వ గ స? ఢా ద్ |! | లకక! .. లే / గ 1 30! " జ శ | న / 4 భా * ల ఖ్. | | ఉమ్, క్ శ ఖు యం క్ షూ ల గ స్ క్ష తట వంత వం... | న [ ర న గ్ శ స్తో | సళ? వలి క్ స్లో ॥ క్ట / పి కక. వ య మం. సుం గ్రోల నారా 1 . చనా యేమ.వబక్యుట్లో క యం స 4 ప న్ నన వ గ సు నీ శ్లో ప్రక (| సప? లీ /. ఖా? ॥ టం మం ్యా క క. జ ష్ త ప ౮ కా. ట్స కీ ( టు తంట 7 న్ 1 కుజ ఇ పం టప ల స గ. శశ ర. “మ క స క న న. సు ఖో ట్ థ్ స ం ప ఏల్ ర్న న్; మల త శ్రే మ. శ వ తర స్తు శం నో శ ఎం! గతంల ఆలా సుజ బావల టయలటల చెం లె వా ౫) చా ఆన న్యా త న్న మాష హో వ సప “1 . వ్, | న ల! వీటో వేలా 1 10 వరయ. న. ళీ క! న య. వం క శా సం న య. న 1 న శశ | జో “ల + స క 1 సో శక టా. ః వ. ఓ” ౬. స శ శ ॥ క టా శ వై. . వ. వ ళో న. లం = న. న " ప , +
వేళ్ళు మాట్లాడే వేళ కవిత్వం దర్భశయనం శీనినాసానార్వ
ఆల సెశఉటల4ంకి ఆ౬ఓ4 ₹ంజ03 హం. న వ త అప. ఎ ఆ. [6960190664 : లేల, 1999 600౪79? 65180 : 9224 7ఉంత ౮ వా 00౪61 ౧1060 : తం" ఖ్ (గరా ఆ. 284041 220914 భా ఖ్ నన్ను. వళ్ళ 2, ఆర్గాన్ సగం6 : ౧. వ్రై5్/- జి 6 / లీ ణా ప యో 01? ౧౦౧16౩ : హైద న్ చ్ కో ఆస 5 0. 5110129208, 501010. 15, 0౧౧. లగ౧గంనాం ! ౮24, (ర220200గ, [2020100062 - 506 009. రం 9౬21806072 8001 [0096, 82014 5086 ల్స్ ంల౭0464 2౧4 00౧౭” 32౧౧౧6౩. ఓం (2706208 కెం01% 110459, 82641 [౦౪61 6౭026. (౮ 2212౪4 9401021009, 4 గెండరే, [04262 / 192 9650202 గంంర200, 0౧00264208, ర్వేరం2036. స! 2౪060402 8001: [ంట6 614 గెండ6, స జురళ3రేడ. 00౧00964 |& ; క4కాలగ! ఓ4582 ఆ£4?[1105, గఉరునల46గగి. 001664 4! : గడ మాగంగిం, 06౧4840.
కనులకు. ..
కవితల వరుస
- ఒక ప్రేమ గీతం 11 శల ఆమె వేళ్ళు 53 ఖు వేళ్ళు గీ % ర్యాగింగ్ కక్
- శ్రద్ధాంజలి 7 *౬ బతకడమంటే గొంతెత్తడమే! 57 శు రంగుల చెలికాడు రి శు విల్లు ర్‌్రి శ మట్టీ పాటల మనిషి 11 ఇఓ బతుకు పలుకే అతని పాట! 60
- విడుదలకై శత శు వస్తు ప్రపంచం 42
- అగ్నివాక్యం 16 ఇ ఇస్తూ... 64
- సూర్యుల్లే గ్రేమిస్తాం 18 ఇల తల్లిదండ్రులకు 55 ఇ మట్టిపని 20 శు దిన చిత్రం 66
- తల్లి తనం 22 ఇ కంకులూ నిప్పులూ 70
- కిన్నెరసాని 25 శ నైట్‌క్వీన్ 72
- బతికే కల కెన్‌సారో వివ! 27 ఇఓ చావు కతలు 73
- ఛానెల్స్ 30 * ఆత్మహత్యల తీరంనుంచి 78
- ఎన్ గూగీ! ఎన్ గూగీ! 33 *ః మిత్రుడా! సొత్వికుడా! 77
- అఖరి మాట 34 శ రంగుల తిరణాల 79
- కల్మిడి 38 జ రెండు తోటలు 61 జ యాత్ర త] ఖు కోయిలా 83
- నెన్నెముకనే కాల్చేస్తార? 43 శు కాపలా 85
- హరిళతమూ అమ్లమూ 46 శు బావి 86 శ రామర్ ప్‌ళ్ళి త శ సందడి 88
- అజంతా గుహలోకి (క్రి * పిల్లలకు 89
- స్వాప్నికుడు 52 శ సఫైర్! 81
- పై కవితలను ప్రచురించిన పత్రికలకు కృతజ్ఞతలు. . .
ఒక ప్రేమగీతం ఏముంది ఇద్దరు వ్యక్తులే, రెండు ఏకాంత ప్రయాణాలే రెండు ఖండిత ప్రపంచాలె - ఎవరి తీరాన వారు వెళ్తూ ఏదో ఒక మంత్రమోహన క్షణాన ఒకరికొకరు ఎదురుపడి చటుక్కున ఆగి కదిలి కరిగి మృదువుగా సుకుమారంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చేరి వెలుగెత్తి పరిమళిస్తూ. .. ఇపుడిక ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే ప్రేమ! . ఇపుడేనా ఎదురుపడింది తొలిసారి - కాదేమో! పాత కాలంలో ఒక ప్రాచీన తీరంలో ఎక్కడో ఒకరినొకరు స్పర్శించుకున్న ఒక అస్పష్ట జ్ఞాపకం ఇన్నాళ్ళూ మనసు పచ్చిక బయళ్ళలో . కదలాడిన రంగుల అనురాగ వూహేదో రూపెత్తి ఇపుడిలా ఎదురుపడినట్లా - ఒకరినొకరు ఇప్పుడిపుడే తెలుసుకుంటున్నట్లు కాక ఇప్పటికే తెలుసుకున్నట్లు కాక ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లు తెలుసూ తెలియదూ - అంతా ఓ ప్రవాహం ఇద్దరి నడుమ - ఇంతలోనే పరిచయమై అంతలోనే దగ్గర దగ్గరై రెండు చెట్టు అల్లుకుని అందమైన అడవిగా విష్పారినట్లు - పచ్చని పరిమళమూ వెచ్చని వెల్తురూ కలగలిసి ఇద్దరి నడుమ చూపులై ప్రవహిస్తూ రెండు ఏకాంతాల్ని సంగమం చేసి ఓ యుగళగీతంగా రంగరించీ - అ వళ్ళు మాట్లూడో వేల సనన ్తమ్త్తననుననాాాాాాాాాాాన 1 సి
అప్పటిదాకా మామూలుగా పడివున్న పరిసరాలే ఆ నాలుగు కళ్ళ సంగీత సన్నిధిలో రాగభరితాలై - పూలతోటలు తరలొచ్చి సభపెడతాయి నదులు వొంపుల్లో గలగలల్లో వచ్చి వాల్తాయి పక్షులు కొత్త పాటల్ని నేర్చుకోడానికి చేరతాయి సముద్రాలు అలల కీర్తనలెత్తుకుంటాయి కాలం ముస్తాబై వేసవి సాయంత్రపు శీతల వాయువవుతుంది వేకువ సూర్యుడూ వెన్నెల చంద్రుడూ ఏక కాలంలో దీపాలై ఆ నాల్గు కళ్ళ వెల్లుతో పోటీపడతాయి వాళ్ళు మౌనంగా మాట్లాడుకున్నపుడు మాట సిగ్గు పడుతుంది వాళ్ళు శబ్బాలై వికసించినపుడు మౌనం ఆసక్తిగా వింటుంది ఆ ఇద్దరి మాటలో మౌనంలో చందన లేపనం తళుక్కుమంటుంది ఒకరి ఆనందాలు కదిలి మరొకరిలో పొంగి ఒకరి విషాదాలు పారలి మరొకరిలో కన్నీళ్ళ ఒకరేమిటో మరొకరిలో ప్రాణమై ప్రతిఫలించి ఒకరి ఉనికి మరొకరిలో ఉద్దీపనం చెంది ఒకరికొరకొకరై ఇద్దరూ జీవ సాహసాల్లో మునిగి తేలుతుంటే ఆ ఇద్దరు ఇద్దరా? ఉన్నదొకే ప్రేమ! అందరి ప్రపంచంలో ఈ ఇద్దరున్నా వీళ్ళ ప్రపంచమొకటి - దాని జనాభా ఇద్దరే! వీళ్ళ ప్రపంచం వీళ్ళదైనా అది వెల్తురు పలుకై పూల పరిమళమై అందరి ప్రపంచాన్నీ పలకరిస్తుంది అందరి ప్రపంచానికి వీళ్ళు తెలిసినట్టున్నా వీళ్ళకు వీళ్ళు తెలిసినంత మరెవరికీ తెలీదు అం 2 అమతటుటటు దర్భశయనం శ్రీనివాసాచార్య జజ
వీళ్ళిద్దరి సంభాషణ ప్రపంచం భాష కందక వీళ్ళిద్దరిదీ ఒక భాషవుతుంది - లిపిలేని భాష - ఇద్దరికే తెలుసు! ఇద్దర్నీ చెరో ధ్రువానికి విసిరేసినా దూరమేముంది? ఒకరి కళ్ళల్లోకి మరొకరు నివాసం మార్చుకున్నాక ఇపుడు వాళ్ళను విడదీసేదేముంది? ఇద్దరు వ్యక్తులు కారు, రెండు ఏకాంత ప్రయాణాలు కావు రెండు ఖండిత ప్రపంచాలు కావు ఒకే చూపు నింపుకున్న నాల్గు నేత్రాలు అ చూపు సేరేంటి? 29-03-1995 బఖ వేచ్ళు మాట్లాడే వళ పా 3 తన
ఎళ్ళు వేళ్ళు కనపడవు, అంతర్ణయ వినపడదు భూమి పారల్లో కర్తవ్య యాత్రలో కట్టుబడ్డ వేళ్ళు లోతుల్లోకి లోలోతుల్లోకి తొలుచుకు వెళ్తాయి చెట్టును నిలబెట్టడాన్కి - పల్లెలు వేళ్ళు ఆ చిత్రించిన సుందర వృక్షం! పచ్చని పత్రాలు తీరైన శాఖలు పొందికైన ఫలాలు . ముస్తాబైన పూలు - ఎంత రూపసోయగం! కానీ ఏవీ వేళ్ళేవీ? ఇంత ముగ్గ చిత్రంలో వేళ్ళున్నాయా? ఊరూరా వేలాడే దేశసటం! కొట్టొచ్చినట్లు మెరిసే పట్టణాలూ నగరాలూ కానీ ఏవీ పల్లెలేవీ? ఇంత విశాల దేశపటంలో పల్లెలున్నాయా? నృక్షాంగాలన్నీ నాజూకు! ఒక్క వేళ్ళు తప్ప! మట్టి పట్టి భూజలంలో తడిసీ ఆర్, ఆరీ తడిసీ ముతక ముతగ్గా చీకటి చీకటిలో ఊపిరాడీ ఆడకా - వేళ్ళు ఏం అందంగా ఉంటాయి? నగరాల్లో తళతళ! బతుకు చెమట చుక్కైన పల్లెలు - మోటుమోటుగా అలసీ సాొలసీ ఎండొవానల తాకిడిలో రాపిడిలో ప్రాణముండీ లేకా ఏం సుకుమారంగా వుంటాయి? మ్యీట్లు 4 జాము దదుళభయనం శ్రీనివాసాచార్య స్ల్ల్లు
వేళ్ళను ఏ (ఫేముల్లోకి ఎక్కించి ఎక్కడ వేలాడదీస్తారు చెప్పండి! ఇక్కడి జాతి పక్షులెగిరి ఎటు వలసపోతున్నాయో ఏ వలస పక్షులొచ్చి చెట్టు చేరుకున్నాయో ఇక్కడి పూలూ ఫలాలూ ఏ అంగడి పాలవుతున్నాయో ఈ శాఖలు విరిగి ఏ పరాయి వాకిలి పందిళ్ళవుతున్నాయో వేళ్ళకు తెలీదు తెలీనివ్వరు ఏమీ తెలీని తనంలోనే పల్లెల బాల్యమూ యవ్వనమూ వృద్ధాష్యమూ. . చెట్టు చరిత్రను పత్రపత్రాలుగా పుష్ప ఫలాలుగా శాఖోపశాఖలుగా సౌందర్య రేఖా చిత్రాలుగా ఎంత బాగా రాస్తున్నారు మూలాల గురించి ఏ మూలనా ప్రస్తావించకుండా - నీళ్ళను తెచ్చి చెట్టును పైపైన కడుగుతున్న వాళ్ళు వేళ్ళను బకికిస్తారా పాదును సరి చేయకుండానే నీటి వలయాల్ని మూలాలకు ముట్టజెప్పకుండానే చెట్టును బతికిస్తారా ఎవరో వేళ్ళతో పెకిలించి ఏదో రహస్య నిశీధిలో ఎత్తుకుపోవడం కాదు తోటమాలే వేళ్ళకు తెలీకుండానే వేళ్ళను తాకట్టు పెడుతూ తోట ద్వారాల్సి బార్జా తెరవడం ఏ ఉదారవాదం? పష వేళ్ళు మాట్లాడే వల పున 5 షూ
ఉదాసీనత నేరం ఉదాసీనత నేరం మూలాలు కదలాలి మూలాలు కదలాలి మూలాలేంటో దేహం దేహమంతా తెలియాలి వేళ్ళే చెట్సైన కొత్త చిత్రం గీయాలి దేశ సటమ్మీద పల్లెలు రాజధానులవ్వాలి
ఇకమీద చరిత్ర పల్లెల్లో కూర్చుని రాయాలి
సిద్ధాంత కర్తలారా భోక్షలారా
వేళ్ళు మాట్లాడే వేళ ఇది! ఖామోష్!
పల్లెల మొదటి సంతకం లేందే
ఇక ఏ ఒప్పందాలూ చెల్లవు
ఏ సిద్ధాంతాలూ బతకవ
ఏ ఉదారవాదపు వడ్డింపులూ సాగవు గాక సాగవు!
70-04-1995 “సమకాలీనం” కవితా సంకలనం 1998
6 అనా దర్భళయనం శ్రీనివాసాచార్వ అతో
శ్రద్ధాంజలి వేల నిముషాల యాంత్రిక యాత్రలో దొర్జుతున్న జీవితాన్నిటు లాక్కుని నిలబెట్టుకుని ఓ రెండు నిముషాలు మౌనంగా ధ్యానంగా శ్రద్ధాంజలి! ముగిసిన ఒక మానవ అద్భుత యాత్రను నిశ్శబ్ద శబ్దాలతో స్మరిస్తూ అదృశ్య హస్తాలో స్పృశిస్తూ. .. ఎవరి జీవనయాత్రనైనా ఓ రెండు నిముషాల్లోకి క్లుప్తీకరించగలమా? అందునా వెలుగు దారిగా మిగిలి వెళ్ళిన ప్రయాణాన్ని తేలిగ్గా ధ్యానించగలమా ఆ ఉదయాన్నీ ఆ తదుపరి నడకనూ నడకలో స్వేచ్చా తరంగాల విన్యాసాన్నీ యాత్రలో యాతననూ దాటిన మంటల్నీ అయినా నడిచిన అ పాదొల కెగువనూ బతుకు బరువునూ చూపు గరిమనూ ఒక్క రెండు నిముషాల్లో ఆ పొడుగాటి రీలును తిప్పుకోగలమా ఆ అద్భుత యాత్రని తిప్పుకుంటూంటే ఎన్నెన్ని దర్శనమౌతాయి నిల్చిన ధైర్యం కొండ కదిలిన నదీ ప్రవాహం విప్పారిన వృక్షచ్భాయ ఉవ్వెత్తీన సముద్ర ఘోష వెలుగెత్తిన వెన్నెల (ప్రేమ ధ్వజమెత్తిన సూర్యోద్యమమూ. ..
జ వేళ్ళు మూట్లాడ వళ జాఖ్లాాాాామాాస్లు 7 స్ల్ల్ల
ఆ జీవనయాత్ర చుట్టూరా
రెండు నిముషాల మౌన ధ్యాన యాత్రలో
రీలు ఆఖరి దృశ్యం చివర వేలాడుతూ
మన గుండె ఆకాళం వర్తిస్తుంది
కన్నీళ్ళు పారి కళ్ళను కడుగుతాయి
కళ్ళనే కాదు బతుకు చూపునూ శుద్ధి చేస్తాయి
చూప్తు తేటపడుతుంది పదునుదేరుతుంది
రెండు నిముషాలే కావచ్చు
వెలుగు దారిలో తిరుగాడాక
మూడోనిముషం
మన యాంత్రికతను బద్దలు కొట్టొచ్చు
బతుకునందంగానూ అర్జవంతంగానూ
మలుపు తిప్పాచ్చు
మనసు చట్రమ్మీద రీలు ఇంకా తిరుగుతూనే వుండొచ్చు
శ్రద్ధాంజలి!
దారి వేసి వెళ్ళిన వాడికి మనసారా నమస్కరించి
ఆ కాంతిలో మరో దారి వేసుకుంటూ వెళ్ళడానికే!
రేపటి మానవయాత్రకై!
24-05-7995 'సాహిత్య నేత్రం' ౧95 ఇల వామన దర్భళయనం శ్రీనివాసాచార్య క్లూ
రంగుల చిలికాడు ఒకే ఆకాశం - ఒక్కోరోజు ఒక్కో అకాశం ఒకే అరణ్యం - ఒక్కోరోజు ఒక్కో అరణ్యం ఒకే ప్రపంచం - ఒక్కోరోజు ఒక్కో ప్రపంచం రంగులు మారుతుంటాయి వాంపులు తిరుగుతుంటాయి ఇల్లుదాటి దారి నొకసారి దర్శించి. వొట్టి చేతుల్లో తళుకుల్లేని కళ్ళతో తిరిగిల్లు చేరి యాత్ర ముగిసిందనేవాడికి కలల్లేవు కళ్ళు లేవు రంగుల్లేవు చిత్రాల్లేవు ఇతనలా కాదు కళ్ళ కుంచెల్లో అంతరంగం తెల్లకాగితంతో బయల్దేరతాడు - ఇతను కదిలే చిత్రం నలుపూ తెలుప్తులు మొదలుకుని సర్వ వర్గాల స్వీకర్త వర్ణస్వరకర్త దృశ్యకాంతుల్లో కుంచెల్ని ముంచి కాగితమ్మీద అద్దుకుంటాడు భూమ్మీద నిల్చుని ఆకాశాన్నందుకుంటాడు తీరమ్మీద నిల్చుని నదుల్నీదుతాడు ఆఅకాశంనుంచి భూమిని తడుముతాడు నదుల్నీదుతూనే తీరాన్ని తడతాడు అడవుల్ని అడవుల శాఖోప శాబ్సుల్లీ రేఖల్నీ మనుషుల్నీ మనుషుల రూప విలాసాల్నీ విలాపాల్నీ కొండల్సీ కొండమంచుల్నీ అంచుల్నీ ఊహల చక్రాల మీదుగా నడిపించుకొచ్చి కుంచెల్లో కాగితమ్మీద దించుకుంటాడు పల్లే పట్పమూ గుడిసే భవంతీ మైదానాలు లోయలూ
కుంచెల కందినంతమేరా
కాగితమందుకునేంత మేరా స్వీకరిస్తూ వెళతాడు అంతరంగం ఇప్పుడిక తెల్లకాగితం కాదు
రంగుల జాతర
కళ్ళ కుంచెలు ఇపుడిక చేతుల కొస్తాయి
చేతుల నిల్చిన కుంచెల్లోకి కదుల్తాయి
ఇపుడిక కుంచెలు కదుల్తాయి
అచ్చం కాగితాల మీదా కాన్వాసుల మీదా -
కూర్చున్న చోటునే కూర్చుని
రంగుల ప్రపంచంలో కదుల్తూ
కుంచెల్ని కదిలిస్తూ బొమ్మల్ని గీస్తాడు
సరిచేసి స్వరపరచి రంగులకు రాగాల్నిస్తాడు
బొమ్మకు దగ్గర నిల్చుని చూసీ
దూరం వెళ్ళి తల పంకించీ
రేఖల కోణాల్ని అటు ఇటు అద్ది సరే ననుకుని కాగితాల మీద జీవితాల్ని తర్టుమా చేస్తాడు
రంగుల మిశ్రమం రాజ్యంచేస్తుంది అతని ప్రాంగణంలో చిత్రాలు రంగుల భాషలో మాట్టాడ్తాయి
అతని కుంచెల కనుసన్నల్లో
మౌన స్వరక్తీర్తనలు నిరంతరంగా మోగుతాయి అప్పటిదాకా మూగగా ఉన్న గోడలు
చిత్రాలు మీద సోకగానే మాటల్నీ పాటల్నీ నేరుస్తాయి అతను చిత్రం పూర్తయ్యాక ఒక చివరన సంతోషసంతకమై తళుక్కుమంటాడు
రంగులు చెప్పే రహస్యాలు వినమని
కుంచెల్లి జోడించి మనిషికి నివేదించుకుంటాడు
అతను చిత్రకారుడు - రంగుల చరిత్రకారుడు 26-05-2395 అంధ్రవ్రభో వార వత్రిక 1.7 నవంబల్ 1995
క్షు 10 దర్భశయనం శ్రీనివాసాచార్య ఘు
మట్టి పాటల మనిషి ఇక్కడ మట్టి పాడే పాటల్ని నాగళ్ళు విడుదల చేస్తున్నాయి పాటల పరిమళాల్లో తడిసి విత్తనాలు విష్పారి మొక్కలై లేస్తున్నాయి మొక్కల పాటల సందడిలో పొలాలు కచేరీల వేదికలవుతాయి మట్టి ఎపుడూ రైతు పాటల్ని పాడుతుంది బుణం తీర్చుకోవడానికన్నట్లు! రాత్రనేంటి పగలనేంటి ఎండనేంటి వాననేంటి పొలాల్లో ఆత్మను కాపలా పెట్టే రైతెక్కడ తిరిగినా ఆత్మవైపే ధ్యాస పెడతాడు పొలాల్లో తిరుగాడే ఆత్మకు నిద్రుందా నిరంతర జాగ్రదవస్థ తప్ప! లేవాలి పలుగూ పారా చూసుకోవాలి నాగలి కర్రూ కొడీ సరి చేసుకోవాలి పొద్దునూ మబ్బునూ చూసి పదునెరిగి దుక్కి దున్నాలి విత్తు నాటాలి ఒళ్ళంతా మట్టి కొట్టుకున్నా చెమట చేదుతున్నా పొలాలు పచ్చగా శుభ్రంగా నిగనిగలాడాలని కదా అతని తహ తహ! తపన! తపస్సు! కలుపును పెరకాలి జలధారను మలచాలి పురుగును పట్టాలి ఎరువును చల్లాలి
ఇఖి వేళ్ళు నూట్లాడే వేళ నునా 1 అలి
రైతు తడితడిమనిషి! మొక్కవాలినా గింజ దుఃఖంలా జలజలా నీళ్ళల్లోకి రాలినా రెండు కళ్ళ తడవుతాడు రెండు చేతులకూ పని చెప్పుకుని పైరు బతుకులో ప్రాణం నిలపడానికి అన్ని సాహసాలూ చేస్తాడు ఆఖరికి తాకట్టు పడైనా! ఎదిగిన 'పైరుకూ ఇంట్లో గుమ్మికీ నడుమ ఎంత దూరం వానా వరదా కుప్పను ముంచకపోతే చక్రవడ్డీలు అడ్డు పడకపోతే దూరం నిజంగా దూరమా నిండు ధాన్యంబండ్లు నిజంగా భారమా పొలాలే ఇళ్ళకు దగ్గరైనట్లు మొక్కలే నడిచొచ్చి వాంగి గుమ్మిలోకి గింజలు గింజలుగా కురిసినట్లు సకల జీవపరిమళాలూ కలగలిసి ధాన్యకాంతై ఇంటినంతా వెలిగించినట్లు! పాటలే పొలాల్నుంచి తరలొచ్చినట్లు! కానీ అకాలవర్షం అసహజం కాదు వరద అంతకన్నా కాదు అప్పు కొత్త మాటేమీ కాదు పాటలంత తేలిగ్గా ఇళ్ళు చేరవు సంటల కోతల తర్వాత కూడా బతుకు కోతే మిగిలితే ఎట్లా? ఖాళీ ఎడ్గబండ్ల మీద అత్మ ఒంటరి ఏడుపు మట్టికి తప్ప మరెవరికీ పట్టదు పళ్లు 12 దర్భశయనం శ్రీనివాసాబార్వ క్లక్షన్లు
నేల్లో విత్తనం నాటి మళ్ళీ
నేల నుంచి విత్తనాన్నందు కోవడానికి నడుమ
రైతు యాత్ర ఎంతెంతదూరం ఎంతెంత చీకటి
ఎంతెంత యాతన!
దూరాలున్నా చీకట్ట్లున్నా యాతనలున్నా
మట్టిని నమ్ముకునే వుంటాడు దగ్గరదగ్గరై!
మట్టికీ మనిషికీ దగ్గరతనమేంటో
పొలాలు చెబుతాయి విత్తనాలు చెబుతాయి
రైతూ మట్టీ పాలమూ విత్తనమూ
దేన్నించి దేన్ని విడదీస్తాం
దేన్నించి దేన్ని విడదీసినా
దేశాన్నించి దేశాన్నే విడదీసినట్లు!
మట్టిని ప్రేమించడమంటే విత్తనాన్ని ప్రేమించడమే
తన విత్తనం తనది కానప్పుడు రైతు
మట్టి సాక్షిగా ఆగ్రహాన్ని పండిస్తాడు
ఏ పంటల్ని కోరుకుంటున్నాం మనం? .
ఎవరు చేతుల కష్టంతో మట్టిని ధాన్యరేణువుల్లా
మలచి మన శ్వాసల్లో ప్రాణలయల్ని కాపాడుతున్నారో
ఆ రైతు స్వేచ్చే ఇక్కడి మట్టి స్వేచ్చ!
ఆ మట్టి పాటల మనిషి స్వేచ్చే
జండాల్ని పట్టుకుని పాటలు పాడుకోవడానికి
మనందరికీ గొంతు చేవ నిస్తుంది
దేశాన్ని పాటల మంటపం చేస్తుంది!
08-08-1985 రబన జన్మదిన ప్రత్యేక నంబిక్క, ఫిబ్రవరి, 999 న్య వేళ్ళు మాట్లాడ వళ జావా 13 ఇమ
విడుదలకై ఈ కాసేపటి కల్మిడిలో ముసుగులెందుకు చెప్పు ఏకాంత నిశ్శబ్ద మౌనయాత్రలోనే రోజులకు రోజులు యాంత్రికంగా ఒడ్డాం కదా ఒకింత అనురాగకాంతికై మరిన్ని కాలతరంగాల్ని దాటాం కదా ఇక ముఖాముఖిలో స్పష్టబింబాలవాల్సిన వేళ ఇపుడేమిటీ పరస్పర పరోక్ష సంభాషణ! _ ఏ మాట ఎలా ఒలికిస్తే ఎంత పలచనో ఎంత దిగంబరమోనని నువ్వూ ఏ మాట ఎలా కదిపితే ఎంత ఉరవడో నీకెంత భారమోనని నేనూ ఎంత తెలివిగా సంభాషిస్తున్నాం ఈ తెలివి తెల్లారడమే బాగు! నీ, నా లోలోపలి లేలేత సంగీతాలూ ఇక మరెవ్వరి ముంగిట్లోనూ . మనం విష్పదల్సుకోని నిక్షిప్త ప్రేమసంకేతాలూ నీలోనూ నాలోనూ ఖైదీలై ఎన్నెన్ని గింగిర్లు తిరుగుతున్నాయో! విడుదలను వాయిదాలు వేస్తూ జారిపోని జాగ్రత్తలో మనపట్ల మనమెంత నిర్ణయులం! నిర్భయ సూత్రాల నందుకొని మనం వాస్తవ దిగంబర రేఖలమీద కలునుకునేదెప్పుడు? కాలం విసురుల్లో కాసేపట్టోనో మరికాసేపట్లోనో నువ్వటో నేనిటో ఒంటరిఖండాల్లా చెదిరిపోమని గ దర్చళయనం శ్రీనివాసావార్వ పక్ష
ఎవ్వరివ్వగలరు చెప్పు హామీ ! ముఖాముఖి తెగిపోదని !
సరే ఇక సెలవని చెప్పుకోకముందే
మన లౌక్యప్రతాపాల్ని ఇకనైనా ఒగ్గేద్దామా
నిక్షిప్త సంగీతాల్నీ సంకేతాల్నీ విడుదల చేసి
నిజరూపాల్లో దూరాల్లేని మాటల్తో
ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుందామా
గుప్పిట్లు విప్పుకుని |
31-08-1995 నంతకాలు బులెట్‌న్, 1996 పన వేళ్ళు మాట్లాడే వేళ అన 150 కక
అగ్ని వాక్యం
ఒక డైరీ దొరుకుతుంది
ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆగినవాక్యం దట్టంగా అక్షరాల నల్లుకుని జీవితం మంటల నడుమ అక్షరాలు ఆగ్రహకీలలు - గర్విస్తావో భయపడతావో కానీ
అంతం కాని వాక్యాన్ని పట్టు కెళ్ళి మేకపోతు గాంభీర్యంతో ప్రకటిస్తావు వాక్యానికి చుక్క పెట్టేసినట్లు |!
భాష మరిచినట్టున్నావు
భాషను మలిచిన, భాషలో బతుకు నిలిపిన మనిషిని మరచినట్లున్నావు
మాటల లోతూ మర్మ్శ్మమూ
మాటల నల్లిన ఆర్తీ అంతస్సూ
ఏవీ పట్టించుకోని చుక్క చుక్కవుతుందా వాక్యం జీవితం నుంచి రాజుకుంటున్నపుడు తడిలేని చుక్కతో అంతమవుతుందా ? చూపుందా బతుక్కి ? వాక్యం చూడు ! ఎంత దుఃఖం పెనుగులాడాక
వాళ్యమలా మొదలై ఉంటుంది !
ఎంత అసహనం తన్నుకొస్తే
అలా టేకాఫ్ అయి ఉంటుంది !
నడకొచ్చా బతుక్కి ? వాక్యంతో కదులు | ముళ్ళతుప్పల ఎత్తు పల్లాల మైళ్ళ
కాలి నడకా బతుకు గరుకూ తెలుస్తుంది చీకటి కన్నీళ్ళ పాయల్ని కలుపుకుంటూ వంగీ లేచీ - ఐనాసరే -
జు 16 దర్భశయనం శ్రీనివాసాచార్య వక్ష
కదిలిన ధ్యేయం గాయాల్ని కలుస్తావు
డైరీ ఎలా దొరికిందో
వాక్యమెలా విరిగిందో
మనిషి శవమెలా అయాడో
అద్భుత శిల్చ విన్యాసాల్తో చెప్తావు
నిజానికి వాక్యం నిరాడంబరం
సాదా సీదాగా - అట్టడుగు బతుకులా అడ్డ దిడ్డంగా
నిరలంకారంగా - నగ్నమైన అగ్నిలాగా!
నువ్వూ నేనూ
ప్రవాహంలో వున్నవాడూ, కదలని వాడూ
వెనక్కి తిరిగిన అలా
తీరాన ఎటూ వూగని మొక్కా -
వినికిడి వుండాలేగానీ ఎవరైనా వినొచ్చు
శవం చెబుతున్నదేంటో -
“క్రీర్తించే వాళ్ళు కీర్తించకండి
నేను వాక్యకర్తను కాను
వాక్యం అనాది ఆగ్రహం, నేను పొడిగింపే -
దుఃఖించే వాళ్ళు దుఃఖించకండి
కథలల్లి సంతోషించే వాళ్ళు
ససేమిరా సంతోషించకండి
ఇది వాక్యాంతం కాదు
ఏ చీకటి దుఃఖ అసహనంలోంచో
ఏ మట్టి మూలాల నిష్ఫల శ్రమయాత్రనుంచో
మరో ఆగ్రహం మంటెత్తి జ్వలిస్తుంది
అంతంకాని వాక్యానికి కొనసాగిం పై, నాకు పొడిగింపై -
అవును - దుఃఖం పార్షుతున్నంత మేరా
వాక్యం ప్రవహిస్తూనే ఉంటుంది
దుఃఖం దగ్ధమవాల్సింది అగ్నిలోనే!”
21-09-1995 _ ఆంధ్రభూమి దినవత్రిక 09-02-1997 క వేళ్ళు మాట్లాడే నళ ల 17
సూర్యుత్లే ప్రేమిస్తాం సూర్యుజ్జే (పేమిస్తాం కాని సౌందర్యతృష్ణ ఎంత బలీయం ఒక్కోసారి అందంగా పరుచుకునే చీకటినే కౌగిలిస్తాం హఠాత్తుగా ఎదురై అంతలోనే కనుమరుగై అందీ అందనట్లు జారిపోయే అప్రకటిత సొందర్యరేఖ ఏం మిగులుస్తుందో ఎవరిలో ఏ రూప ముద్ర వేస్తుందో ఏమో! ఇవాళ అలా కాదు, ఇది పూర్వ(ప్రకటిత అద్భుత సూర్యఘటన! తెల్లవారడమూ ఎదురుచూడ్డమూ ఒకే వేళలో మొదలైంది పిల్లా పాపా చిన్నా పెద్దా అక్షరుడూ నిరక్షరుడూ ఉదయం విరిసే కొత్త రాత్రి దృశ్యం కోసం కళ్ళల్లో ఆనక్తి వత్తులేసుకుని జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఆకాశంకేసి, ఆ సూర్యుడికేసి, ఆ ఆగామి దృళ్య నిశీధికేసి! సూర్యవృత్తం వెలుతురు భాండాగారం ఓహ్! ఇపుడు వృత్తంలో ఎంత రూపపరిణామం ఈ గ్రహణవేళ। కరుగుతుందా తరుగుతుందా కొంచెం కొంచెంగా రాలుతుందా ఇది చంద్రుడు సూర్యుణ్జి కమ్ముతున్న సందర్భం దాని వ్యక్తిత్వం దీని కబ్బుతుందా ఏమిటి నెలవంక లాగా సూర్యుడు, ఇంకాసేపట్లో డైమండ్ రింగ్! ఇప్పుడిక లేదు వృత్తం ఏది వెలుతురు లేదు భాండాగారం మనుషులు ఉదయరాత్రిలో విస్తుపోతున్నారు తెలిసిన విస్మయమే, తేరుకుని కొత్త సౌందర్యంలో స్నానిస్తున్నారు పక్షులు దారి నడుమనే వెనక్కి తిరిగి గూళ్ళు చేరుతున్నాయి వాటి కిలకిలల నిండా కొత్త బాణీల ఆశ్చర్యసంకేతాలు! సూర్యుడి అస్త్రసన్యాసమా అని ఆకాశం తెల్లబోవడం మరిచి షాక్ తిన్నట్టు నల్లబడింది నల్లమబ్బుల దుప్పట్లేవీ లేకుండానే! "బి 16 దర్భళయనం శ్రీనివాసాచార్య ఫి
అసహజం ఎంత సౌందర్యభరితమైతేనేం
ఎల్లకాలం నిలవదు
సహజమే ఆఖరి సత్యం
సూర్యుడు కృత్రిమ రాత్రి నెత్తి బయటికొస్తున్నాడు
ఒకే రోజులో రెండో ఉదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు
మనిషిలో వెల్తురును మళ్ళీ నాటుతున్నాడు
మనిషి పక్షిరిక్కల్లో యాత్రాకాంక్షను తట్టి లేప్తతున్నాడు
సమస్త జీవ జాలాన్ని విస్మయతీరాలనుంచి
వాస్తవ వీధుల్లోకి కిరణాల్లో చేరేస్తున్నాడు
సౌందర్యాన్ని కౌగిలిస్తాం
కొని జీవనతృష్ణ ఎంతెంత బలీయం
ఎప్పటికైనా వెల్తురు జండాలెత్తే
సూర్యుళ్లే ప్రేమిస్తాం!
(నేవధ్యం :- సంపూర్ణ నూర్యగ్రహణం,)
24-10-1995 ॥ కను వళ్ళు మాట్లాడే వేళ పాలా 10 ఉల
న మట్టి పని వాకిట్లో ఏదో చప్పుడు ! వేసిన తలుపులు వేసినట్లే ఉనై మాటా ముచ్చటా ఉలుకూ పలుకూ లేని మెరుస్తున్న వస్తువులన్నీ నిక్లేపం - అమ్మయ్య ! దొంగలు పడలేదు చూస్తే ఏముంది వాకిట్టో మట్టి తవ్వెళ్లారెవరో వాకిలంతా మట్టీ మట్టి / ప్చ్ ! పనిలేని వాళ్ళ పని ! వాకిట్లో ఏదో కొత్త నీడ |! మనుషులెవరూ కదిలిన జాడలేదు చూస్తే ఏముంది వాకిట్లో కొత్త అతిథిలా ఓ మొక్క వూగుతోంది అటు ఇటూ | వాకిట్టోంచి ఏదో పరిమళం | అత్తర్జేవీ కొనలేదే | ఖరీదైన మనుషుల వస్రాలొచ్చాయా సెంట్లతో - చూస్తే ఏముంది వాకిట్లో పూల సింగారం మొక్కవీచే పరిమళ ప్రవాహం సకఖ20 దర్భళయనం శ్రీనివాసాచార్య క్రక్షు
ఎవరు నాటాకీ మొక్కను ఈ బతుకు వాకిట్లో చెప్పా పెట్టకుండా ? ఇన్నాళ్ళదాకా నాకు తెలీదే వాకిట్లో పూలుండాలని బతుక్కింత వాసనుండాలని |! కొందరంతే ! వస్తు సందడిలో ఎండే ఎడారి వాకిళ్ళలో పరిమళం రేపీ వెళ్తారు వాళ్ళ శ్వాసలా కదిలే ఈ మొక్కల్నీ పూలనీ చూస్తూ మనం మురుస్తుంటామా మరో వాకిట్లో వాళ్ళు మట్టి పనిలో నిమగ్నం ! 25-70-1995 ఆం(్రవ్రభ దిన వథత్రిక 03-17-1996 యు రి రాల్యా ల 1 పల క) టీ. రశ్కళ్తో షు శ ల్న లో సా క జ్ కో సిక క
తల్లి తనం
తల్లివి కాలేకపోయిన ఓ తల్లీ!
నీ ఊహా మైదానాల్లో అన్నీ బాల్య తరంగాలేనా
నీ ఏకాంత దేహావరణంలో అన్నీ బాల్య స్వప్నాలేనా అంతా పెద్దరికం నిండి ఉన్న ఇంట్లో
బాల్యకాంతి సోకని ఒక రకం ఇరుకుదనం ఇంట్లో
నీ మనసులో ఎపుడూ ఒక ఖాళీ ఊయల్ని మోస్తూ తిరుగుతున్నావా
చుట్టూ ఏ ఇల్తూలేని ఒంటరి ఇల్లులా
ఎక్కడా ఏ చిగుళ్ళూలేని ఎదిగిన చెట్బలా
విలవిలలాడే తల్లీ
ఏ చిట్టి చేతుల్ని తేవాలి నీ ఊయలకు ?
ఇరుకిరుకు ఇల్లుదాటి నువ్వు ఏ కూడలిచేరినా
మరే పలకరింపూ లేనట్లు మరో జీవనాంశమే లేనట్లు అందరూ మనుషుల్లా కొక ్రళ్ళ గుర్తుల్లాగా
అన్ని ప్రశ్శగుర్తుల్లోనూ ఒకే ప్రశ్న పరామర్శై ఎదురై “ఇంకొ పిల్లల్లేరా”
ఎన్నిసార్లైదుర్కుంటావు ఈ నిరానింద పరామర్శను థి అందునా ఒక నెగెటివ్ ప్రశ్న!
సంబాళించుకునే లోపే మరో సందర్భం అదే పరామర్శ! ఇల్లు తోచనివ్వదంటే కూడలి కూడా అంతే!
వెలితినెత్తి చూపే ఏ సన్నివేశానికి సన్నిహితమౌతాం “అవును ఇంకాలేరు”
నీ జవాబులో ఎంత సంజాయిషీ! సహించలేను తల్ల సహించలేను 'గొడ్రాలు'మాటను కనిపెట్టిన వాణ్ణి ఎపుడో శిలువేయాల్సింది ఆ మాటను చెలామణి చేసేవాళ్ళను ఇప్పుడైనా
అ 22 అం దర్భశయనం శ్రీనివాసాదార్వ ప్లై
ఆ మాటకు ఈ మాటకూ వేలాడుతూ ఆ ఆసుపత్రీ ఈ అసుపత్రీ ఆ అకూ ఈ పసరూ ఆ పూజలూ ఈ విభూతీ - దేన్నీ కాదనక ఒక్క నమ్మకాన్నే నమ్ముకుని వెళ్తున్నావు గానీ నువ్వు గాయాల్ని మోస్తున్నావో గాయాలే నిన్ను మోస్తున్నాయో ఇలా సగం దూరం దాటావు కదా ప్రయాణమంతా నిరీక్షణయితే ఏది తృప్తి మజిలీ తల్లీ బతుకు అమూల్యం, విస్తారం, ప్రయోగక్షేత్రం కనడం ఒకానొక జీవనాంశమే కానీ కనలేక పోవడం నేరమెట్లా ? ఒక్క కనడం కోసమే బతుకు సమస్తాన్నీ జారవిడువడం మాత్రం నేరమే తల్లీ “పిల్లల్లేరా అయ్యో” పరామర్శలకెదురొడ్డి జాలిని విసిరికొట్టి ఏ సంజాయిషీ ఛాయళల్లేని “ఐతేనేం” అన్నంత జవాబు కాలేవా నెగెటిన్ ప్రశ్నగుర్తుల్ని విరిచి వివేకాన్నివ్వలేవా . ఎవరైనా తను జీవించకుండా మరెవ్వరికి జీవితాన్నివ్వగలరు ? సంతానం సవ్వడిలో ఇరుకున పడి జీవితాన్ని జీవించడం మరిచిన వాళ్ళకు ప్రయాణ స్పృహనందించేలా సాగలేవా ఉనికిని మరిచిన ఏ వెతుకులాటైనా దేనికి ? సంబంధాలన్నీ సాహచర్యానికే సారభూతప్రయాణానికే కళ్ళు తెరవగానే చుట్టురా శూన్యమే గుచ్చుకునే శిశుసంక్షోభాలేంటి ? రెక్కలు మొలవగానే సంతానాలెగిరిపోతే
తల్లడిల్లే తల్లుల ఏకాకి తనాలేంటి ? ఏ సాహచర్య సంబంధాలివి ?
జట్ల నోళ్ళు మాట్లాడో నోళ ఫ్రా 23 క్లో
ఏ సారభూత ప్రయాణాలివి ?
తర్కించు తల్లీ తర్కించు!
ప్రయాణ జన సందడిలో పరిమళించే ఎవరికైనా
ఒంటరితనముందా తీరికలేనితనమే తప్ప!
నలుగురికై చెమ్మగిల్లే యాత్రలో
ఎన్నెన్ని తీగలు అల్లుకోవూ!
కాదూ మాతృత్వ కాంక్షేనంటావా అచ్చంగా ?
కనడమేనా తల్లీ మాతృత్వమంటే ?
ఏ శిశువుకింత నీడనిచ్చినా అది తల్లితనమే తల్లీ!
ఒక తల్లి లేక ఒకింత నీడలేక కాసిన్ని చిగుళ్ళూ లేక
ఏ నిర్దిష్టమైన చిరునామా లేక దారిపక్క సొమ్మసిల్లిన
శిశువులెందరు లేరూ!
తల్లివికా
ఒక్క అనాధకైనా చిగుళ్ళ నిచ్చే తల్లివికా తల్లీ
అనాధల్లేని ప్రపంచం వైపు
ఈ భూమిని కాస్త కదుపు తల్లీ!
15-17-1985 ఆంధ్రజ్యోతి దినపత్రిక ౧2-02-1900 అం 24 అటో దర్శశయనం శ్రీనివాసాచార్య అకు
కిన్నెరసాని ఇక్కడ ఏ కిన్నెరలు గాన బీజాల్ని విత్తి వెళ్ళారు పాటలు చెట్లై తపస్సులో లీనమైన మునుల్లా వున్న చోటునే వుంటూ అద్భుత వృక్షద్వీపాలై - నీళ్ళ పాయలన్నీ ద్వీపాలకు జీరాడే తడి అంచులై - నీళ్ళూ చెట్లూ రాళ్లూ తప్ప ఇక్కడ నేల వుందా వాటి అంతరంగాలై కదలాడే పాటలు తప్ప - నీళ్ళమీద సూర్యుడు సంతోష తరంగాల్లో విష్పారి వేల వేల నక్షత్రాలై మెరుస్తున్నాడు తెలకతెల్లగా - దూరంగా వంపులు తిరిగిన నీటి రేఖ సిగ్గిలి ఎటో పక్కకు చటుక్కున తప్పుకుంది చిన్న చిన్న జలపాతాలు యవ్వన యాత్రతో శిఖరాల్నీ లోయల్నీ నీళ్ళతో ముడేస్తున్నాయి ఎప్పుడైనా మనిషి భూమ్మీద అతిథే! ఇక్కడికి అతిథుల్ని పచ్చని దోసిళ్లూ నీళ్ళ వాకిళ్లూ మౌనాతిశయంతో స్వాగతిస్తాయి శిలలై వచ్చిన వాళ్ళు నదులయ్యేట్లు నదులై వచ్చిన వాళ్ళు సముద్రాలై ఉప్పాంగేట్లు ఈ తపోవనం ఎప్పుడూ అందాల తడి విడిదై ముస్తాబై ఉంటుంది దాహార్తులై వచ్చిన వాళ్లు ఇన్ని నీళ్ళు తాగితే గొంతులు పాటలెత్తుకుంటాయి ఇక్కడి పాటల్లో జతగలిసి పోతాయి ఇక్కడ కాలం చెట్లై పాకుతుంది నదై సాగుతుంది తట్టి చూస్తే - ప్రతి క్షణం చుట్టూరా జలదృశ్యమే! ఎవరైనా రెండు కళ్ళను బతికించుకుంటేనే
అతి వళ్ళు మాట్లాడ వళ అన్న 25 అలి
ఏ కిన్నెరసానైనా దొరికేది
అడవీ వాగూ కలసిన జలవృక్తం నీడలో
కాసింత సేద దీరగలిగేది
నీడను వీడి వెళ్ళినా
తడి తడిగా ప్రవహించే పాటొకటి
గుండెలో కదుల్లూనే ఉంటుంది అడవి పరిమళాల్లో!
24-22-1995 ఆంధ్రప్రభ వారవత్రిక 20-03-7996 క్రూ 26 దర్భశయనం శ్రీనివాసాచార్య క్రమ
బతికే కల కెన్ సారో వివా! ఎగొనీ! ఎగ్గొనీ! ఎగొనీ! ఒక్క 'ఒగొనీ'దే కాదు సమస్త భూ(పేమికులదీ సారహీనమౌతున్నది నేలే కాదు మానవ దేహం కూడా - భూదేహకాంతికై ఎలుగెత్తినందుకు మనిషిని ఉరితీసిన వాడు అమానవుడు అబాచా అమానవ కాండలో చెట్టు మరణిస్తాయి జలాలు ఆవిరవుతాయి జైళ్ళు విస్తరిస్తాయి జన దరిద్రాలు వ్యాపిస్తాయి మనిషితనం అరుదైన అవశేషమవుతుంది నియంతలు ఎడారుల్ని ప్రేమిస్తారు వీరులు చెెటైై వీస్తారు భూమ్మీద ఎన్ని చెట్లనురితీస్తారు? ఉనికి వర్తమాన ప్రశ్న ఒక్క నైజీరియాకే కాదు అన్ని పేదజాతులకీ! సామ్రాజ్య దౌర్జన్య వాణిజ్య దావానలం పాకినంత మేరా వస్తుధ్యంసం జీవధ్వంసం జీవనలాలిత్య ధ్వంసం జాతులు ముడేసుకున్న సకల సంస్కృతులు శిథిలం శిథిలం వాళ్ళ నేలా నింగీ చెట్టూ చేమా వొట్టి పోయి మొదటి గళ్ళోంచి నడక మొదలెడతాయి బుణభారంతో - నియంతలు సొంత జాతిని తాకట్టు పెడతారు వీరులు జాతిని విడిసించే పోరుకు దిగుతారు భూమ్మీద ఎన్ని పోఠరాటాల్ని ఉరితీస్తారు? ఇది డాలర్ కాలం డాలర్ నేర్చే కొత్త వాణిజ్య భాషనందుకుని మూడో ప్రపంచ నేతలు ఉదారరాగాలు మొదలెడతారు కను వళ్ళు మాట్లాడే వళ అనా 27 కను
ఇంపీరియల్ షెల్స్ ముందు సాష్టాంగ నమస్కారాలు కాసిన్ని డాలర్లకే సమృద్ధతైల సమర్పణలూ కానీ ఇదే చరిత్ర కాదు
మట్టిని పట్టుకుని జాతి ఎంత లోతుల్నుంచి ప్రయాణించిందో ఆ దారి దారంతా ఆ జాతి చరిత్రే!
ఒక నియంత ఎంత! అప్త్రాల్ అబాచా ఎంత!
వాడి డాలర్ గొంతుతో పాడే చరిత్ర ఎంత!
నియంతలు ఉరికంబాల్ని నమ్ముకుంటారు
వీరులు మట్టిని విశ్వసిస్తారు
భూమ్మీద ఎంత మట్టిని ఉరితీస్తారు?
పచ్చదనాన్ని కలగనకుండా
ప్రపంచం బతికిందెపుడు
బతికే కల పేరు కెన్ సారోవివా!
అతను మోసోప్!
అతను ఒగోనీ!
అతను అబాచాకు ప్రశ్న!
అతను షెల్‌కు ప్రతిఘటన!
అతను నైజర్ నది!
అతను నైజీరియా!
ఇక ఆఫ్రికా అవుతాడనీ
భూమి పుత్రుడై విస్తరిస్తాడనీ
విశ్వవ్యాప్త వీరుడవుతాడనీ
దడిసిన అమానవుడు అబాచా!
క్యరాతి క్యారంగా
ఎవడు బతగ్గలడు ఒక్క నియంత తప్ప!
నవంబర్ 10 ఉరికంబం ఏడ్చిన రోజు
విశ్వం విస్తుపోయిన రోజు
భూమి రొమ్ముబాదుకున్న రోజు _
క28 దర్భళయనం శ్రీనివాసాచార్య క్లోక్లూ
అఫ్రికా ఎర్రగా రోదించిన రోజు
నైజీరియా ఎడారితుఫానైన రోజు
నైజర్ నది స్తంభించిన రోజు
మనిషిని బతికించే ఓ కల
భళ్ళున పగిలిన రోజు
నియంతలు ప్రశ్నల్ని తప్పుపడతారు ,
వీరులు ప్రశ్నాయుధాలై బతుకుతారు
భూమ్మీద ఎన్ని ప్రశ్నల్ని ఉరితీస్తారు?
ఏది ముందు మాట? ఏది ఆఖరి మాట?
వీరుడి ఆఖరి మాటలు ఉరికంబం దగ్గర రాలిచావవు
అవి పక్టులై ఎగిరి భూమ్మీద గుంపులు గుంపులుగా వాలి .
రెక్కల్ని గుర్తు చేస్తాయి ఉనికిని గుర్తు చేస్తాయి
ఉనిక్కోసం విషాదాల్ని ఆగ్రహాలుగా
మలుచుకుంటున్న వాళ్ళకవి ముందు మాటలవుతాయి
కెన్‌సారోవివా ఆఖరి మాటలు ఇపుడు మూడో ప్రపంచంలో వాలాయి
ఉనికి పోరాటాల వాకిళ్ళలో వాలాయి ఇక రెక్కలు లేస్తాయి
అబాచాలు మాటలు మిగలక అంతరిస్తారు
ఉనికి పాటలు హోరెత్తుతాయి కెన్ సారోవివాలు గొంతులై!
నేల చావదు
నేలక్రై పోరాడే వాడూ చావడు
బతికే పచ్చని కల పేరు కెన్ సారో వివా!
05-01-1996 “ఉరికంబం మీద నూర్యుడు' కవితా నంకలనం, 1996 కక వేళ్ళు మాట్లాడో వేల పున 29 అ
ఛానెల్స్
ఏ లోగిలిలో ఎన్ని పచ్చని పతాకలున్నాయో ఏ కొమ్మ ఏ పాట నెత్తుకుంటున్నదో
ఏ రాగం ఏ చిగుళ్ళను తలపిస్తున్నదో
ఇవాళ కదిలించొద్దు అది పురాతన ప్రస్తావన అవుటాఫ్ డేట్ ఆలాపన
పాత కాలంలో మాగిన వయను మళ్ళిన పరామర్శ ఇంటి కిరీటమై నిల్చిన ఏంటెన్నా
ఎన్ని ఛానెల్స్‌ని ప్రసరిస్తున్నదో
ఏయే వేళల్లో ఎన్నెన్ని విన్యాసాల్ని విప్పాతుందో తెలియడమూ మాట్టాడ్డమూ ఇవాలి శైలి
అప్ టు డేట్ కల్చర్
వర్తమానంలో బతుకుతున్నట్టు బుజువు చేసే దాఖలా. ..
ఇపుడు మట్టిని గురించో
మట్టిలో మాగిన శతాబ్దాల సారాంశం గురించో మాట్లాడొద్దు
మట్టి కోసమై మట్టిలో కల్సిన రక్తాన్ని
ఇపుడు వెలికి తీయొద్దు
ఏ పాత పాటనూ ఇవాళ విడుదల చేయొద్దు ఇది కొత్త పాటల కాలం
నేల మీద కాళ్ళానని నృత్యాల కాలం
అన్ని అపరిచిత పాత్రల్లో అనూహ్యంగా నడిచే సంభ్రమాశ్చర్యాల కథల్ని కోరుకుంటున్న కాలం ఏ స్ర్కీనింగూ లేని అనాచ్భాదిత విహారాల
వయ30 దర్చశయనం శ్రీనీవాసావార్య క్ల
కవాతులు కదులుతున్న కాలం స్విచ్ ఆన్ చేయడమే తరువాయి అన్ని ఛానెల్సూ బతుకులోకి దూసుకొచ్చి నేల నుంచి ఎత్తి వేస్తాయి
అర్ధ సంబద్ధతా, కాల సంబద్ధతా, నేల సంబద్ధతా ఏదీ అక్కర్లేదు బతుకు మొదటి అడుగులోని పసివాడో
ఆఖరి అడుగులోని ముసలివాడో
వయసు తరంగాల మీది కుర్రాడో
ఇంటి మనిషో ఆఫీసు మనిషో
మినహాయింపుల్లేవు
అందర్లోకీ ఛానెల్స్ ఛానెల్స్!
ఇంటినిండా ఛానెల్స్ ఛానెల్స్!
ఇప్పుడు నీతి సూత్రాల్నీ మంచీ మర్యాదల్నీ కళాత్మక మూల్యాల్నీ జాతి మూలాల్నీ
సహజాతి సహజ మానవ అంతస్నూత్రాల్నీ ప్రస్తావనకైనా తలవొద్దు
నోళ్ళకు కుల్లేసుకుని ఛానెల్స్ ముందు వాలి మోకరిల్గాల్సిందే
కళ్ళల్లోకో చెవుల్లోకో చేరి ఛానెల్స్
అంతలోనే అంతరించవు
రక్తరహదారుల్ని చేరి బతుకు సమస్తంలోకి దిగబడతాయి
అఖరికి స్వప్నవాటికలో బీజాలై పాతుకుంటాయి ఇక మనుషులు మట్టిని కాదు ఛానెల్స్ విన్యాసాల్నే స్వస్నిస్తారు కళ్ళు మూసీ తెరిచీ -
అన్ని వికృత ఆకర్షణల నడుమ
జీవితంలోంచి సాంతదనం ఇగిరిపోతుంది
కాళ్ళూ నేలకూ నడుమ వేళ్ళు
ఫుకు వేళ్ళు మాట్లాడో వేళ వాలు 31 అ
పుటుక్కున తెగిపోతాయి
ఇక నేల మాటేముంది?
నేల్లో మాగిన చరిత్రతో మన
అన్వయమేముంది?
ఇపుడు ఆమె ఆమెలోనూ
అతను అతనిలోనూ నువ్వు నీలోనూ
నేను నాలోనూ పల్లె తన పల్లెలోనూ
దేశం తన దేశంలోనూ శ్వాసిస్తున్నట్లేనా?
ఏది మన ఆయువు పట్టు?
ఎక్కడ మన సొంత గొంతు?
ఎపుడు మరచాం ఎలా మన నేల పాట?
మన పచ్చని పతాకల్లో మన కోయిలల్ని
మళ్ళీ ఎట్లా గుర్తు పబ్టేది?
పరాయితనాన్ని బట్వాడా చేస్తున్న
ఛానెల్స్‌ని ధ్వంసించకుండా
మనల్నిమనం చేరేదెట్లా?
మనకు మాటనిచ్చిన మట్టికి దగ్గరయేదెట్లా?
70-03-1996 ఆంధ్రప్రభ వారవత్రిక 04-09-986 ప 32 దర్భశయనం శ్రీనివాసాచార్య కక్ష
ఎన్ గూగీ! ఎన్ గూగీ! తన మట్టి అద్దంలో సాంత ముఖాన్ని చూడాలనుకున్నందుకు అద్దం నుంచే దూరమైనవాడా పరాయి తొక్కిళ్ళకు అద్దం బీటలు వారుతుందని దుఃఖించి ఘోషించినందుకు అద్దం జాడే లేని జైల్లో మగ్గినవాడా పరాయివాడు తరలి వెళ్ళినా అద్దం జాతీయం కానందుకు మసక బారుతున్నందుకు రాత పూర్వకంగా ఆగ్రహించిన వాడా “గుకియా' భాషే సాంతగూడని గూట్టోంచే నాటకీయంగా జాతికి అద్దం పట్టినందుకు కెన్యానుంచి తెగోయబడ్డవాడా " ఎన్ గూగీ! ఎన్ గూగీ! ఇప్పుడు నువ్విక్కడ నిల్చున్నావు నిలువెత్తు కెన్యా మట్టిలా! కెన్యాలోనూ కదుల్తున్నావు నీ నిలువెత్తు ఆశయపొత్రలై! నీ దేశాన్నీ నీ అద్దాన్నీ ప్రస్తావిస్తూనే నువ్వు మాకు మాగూడు గుర్తు చేస్తున్నావు మాకు మా అద్దాన్ని గుర్తు చేస్తున్నావు బతుకు పగుళ్ళకూ అద్దం పగుళ్ళకూ తేడా ఏమీ లేదని బరువు బరువుగా నీ అద్దం సాక్షిగా మా కళ్ళకు చెబుతున్నావు! (కన్యా రచయిత 'ఎన్ గూగి' ఉపన్యాసం విని) 18-03-1996 ఆంధ్రజ్యోతి దినవత్రిక 19-08-1996 భై వేళ్ళు మాట్లాడే వళ అనాం
ఆఖరి నూట బతుకునంతా తవ్విపోస్తున్నాను నడిచిన దారంతా మళ్ళీ జ్ఞాపకాల పాదాల్లో నడిచొచ్చి నిల్చిపోవాలనుకున్న చోట్నుంచి నడకనంతా రాస్తున్నాను నా ఆగిన అడుగు నుంచి నిశ్శబ్దంగా మీకు నేను వినపడ్డాను చిన్నప్పుడు కలలు గుత్తులు గుత్తులుగా నాలో విరబూసినప్పట్నుంచి రేపటి దారులమీద వెలుగునూ సువాసననూ వూహించా అపుడు నాలో ఊయలలే ఊయలలు భూమి పచ్చ పచ్చగా ఆకాశం తేట తేటగా మనుషులు దగ్గరి దగ్గరి మిత్రులుగా - పేదరికం గొప్ప శత్రువు నన్నెపుడూ వెన్నంటే వుంది కలలు రాలాయి ఊయలలాగాయి చూస్తే భూమ్మీద ముళ్ళూ నింగిలో దిగుళ్ళూ మనుషులు దూరాలు దూరాలుగా - లేనితనం పలచదనంతో అంతటా నేనంటరాని జంతువుని - నెలవు లేదు కుదురైన కొలువులేదు రోజంటే మూడుపూటల ఆకలి శత్రువు పరాక్రమించిన కొద్దీ బతుకు ఉనికి పోరాటమైంది
జన 34 దర్సళయనం శ్రీనివాసాచార్వ క్ష
సున్నితత్వం మరో శత్రువు కలల్లో అపుడెప్పుడో పూలు మృదువుగా పూయడమే తప్పైంది పూసి సున్నితత్వాన్ని గుప్పించి మనసునెంత సుకుమారం చేసాయి కలలు రాలిపోయాయి మృదుత్వమెటుపోతుంది వుండీ ముళ్ళ పాలయింది రిక్షా లాగీ లాగీ హోటల్ కప్పులు కడిగీ కడిగీ పొద్దున్నే పేపర్లు విసిరీ విసిరీ బరువుల్ని అటూ ఇటూ మోసీ మోసీ అహంకార అహంభావ తిరస్కారాల మోపుకు మనసు చివుక్కుమని సున్నితత్వం చిట్లి బతుకు పనుల్ని మార్చుకుంటూ ఒదులుకుంటూ ఊళ్ళు మారుతూ వెళ్ళా ధనసంస్కృతి ఈసడింప్తు నన్ను నరికి పోగులు "పెడితే బతుకు నమ్మకం నజ్జు నజ్జ్ఞయింది నిలకడలేదు మిగులుడులేదు ఉన్నదల్లా ఏకైక దేహం దేహం లోపల గాయాల లోయ - చుట్టూ చూశా అందరూ పరుగుల్లో పరుగుల్లో - ఒంటినిండా జేబులు అవి నిండాలని నిండాలని - డబ్బు రింగ్ మాస్టర్ చెప్పు చేతుల్లో గిరగిరా గిరగిరా తిరుగుతూ - తిరుగుతున్నవి దేహాలా
అటి వేళ్ళు మాట్లాడే వేళ వాం 35 తి...
వాటిని కమ్మేసిన జేబులే
పరుగెత్త జూశాను జేబుల నడుమ - తిరగలేక ఒదగలేక
ధనం గలగలలూ రెపరెపల్లేక
మళ్ళీ మళ్ళీ చివుక్కుమన్నాను చీలిపోయాను లేనివాడికి ఎవరుంటారు
ఖాళీ చేతుల్ని ఎవరు లెక్కగడ్తారు
సమస్త సంబంధాలన్నీ క్యూ కట్టి
రింగ్ మాస్టర్ ఎటు చెబితే అటు వెళ్తాయి నేను శబ్దాల నడుమనే తప్ప
మనుషుల నడుమ ఉన్నానా!
నజ్ఞు నజ్జవుతున్నా కొద్దీ మిగిలిందల్లా
ఒక్క నేననే ఒంటరితనమే!
ఇది సోమరి నిందా పర్వం కాదు
నడిచిన యాతనల ఎత్తిపోతలే!
ఈ రాత్రి చీకట్లో కలుస్తున్నాను
రేపు నా శవం ముందు
ఈ మాటల మూటను విప్పి మీరు జాలి పడ్తారేమో
నా అంతట నేనే అవిరైనందుకు -
నేను లేని వేళ నా శవమెలాగూ వినలేని వేళ మీరు నన్ను చిత్రిక పడ్తారేమో
దారి తప్పాడనో ఓడిపోయాడనో
అవివేకుడనో అతిసున్లితుడనో
బతక నేర్వని వాడనో ఇంకా ఇంకా. ..
తీరా దుఃఖిద్దామని
ఎవరు గుండెలు బాదుకోబోయినా జేబులు అడ్గొస్తాయి రింగ్ మాస్టర్ గుర్తొస్తాడు పరుగు గుర్తుకొస్తుంది గలగలలు రెపరెపలు!
జూం6 దర్భళయనం శ్రీనివాసాచార్య ఫ్లష్ల్లి
కాదనను, భూమీ, భూమ్మీద బతుకూ గొప్పవే
కానీ కరచాలనం చేయడానికీ
ఈ ఖాళీ చేతులకు మరే రెండు చేతులూ
కానరానపుడు ముందు దారంతా ఊబి ఊబి!
ఒంటరి తనాన్ని ధ్వంసించుకోవడానికే
ఈ నా మహా విషాద మరణం
మరణం మహాశత్రువు, ఇది నా లొంగుబాటు
అకాలంగా మహాశత్రువుకు లొంగిన వాళ్ళలో
నేనే ఆఖరి వాణ్ణి అయేందుకు
మీరూ మీరూ మీరూ
కాస్త జేబుల్లోంచి చేతులు తీసి
దేహాల్గోకి వెళ్తారా
శబ్దాలూ పరుగులూ జేబులూ రింగ్ మాస్టర్ కాదు!
ఇక్కడ మనుషులున్నారని
బతుకు పల్లవించేలా మనిషి పాట పాడ్డారా
దారుల్లో నడకలకే కాదు
ఏ సమాధుల అడుగునో పడిపోయే
నా లాంటి వాళ్ళకూ విన్పించేలా!
సమాధుల మీదికి మొక్కలు మొల్చుకొచ్చి
అటూ ఇటూ వూగేలా పచ్చగా స్వేచ్భగా!
సరే, చీకటి పడుతున్నది నాకు!
చుట్టూ ఎవరూ లేని వేళ
నాలోకి నేనే నిష్కమిస్తున్నాను, సెలవ్!
14-06-1996 సొపొత్యనేత్రం, 1997 పక నోళ్ళు మాట్లాడో వేళ స్తనాల 37 అ
కల్మిడి ఇలా మనం కలుస్తూనే వుంటాం కలిసినపుడల్లా సంభాషిస్తూనే వుంటాం అలా అలవోకగా ఒకరికొకరం అంది పుచ్చుకుంటాం సహజంగా సరళంగా - ఆనందమే పలుకుతుందో విషాదమే ఒలుకుతుందో అనుభవాలు కరుగుతూ వుంటాయి మనం ప్రవాహంలో కదుల్తాం కలిసిన ప్రతిసారీ ముసుగుల్లేని నాలుగు మాటల్ని ముందేసుకుంటాం మాటలంటే ఏంటి జీవితాలే! సరిగ్గా మనం చౌరస్తాల్ని ముందేసుకుంటాం నడకల్నీ వూరేగింపుల్నీ మనిషి పతాకాల్నీ రెప రెపల పరుగు పరుగుల సందళ్ళని గమనిస్తాం ఒకోసారి ఒక్కసారిగా రోడ్డు ఆగిన దృశ్యనేపథ్యంలో త్రైతుల్నో కూలీల్నో మహిళలో పిల్లల్నో గమనిస్తాం రోడ్డు వేల గొంతులై విచ్చుకుంటాయి చలనమాగినదనుకున్నచోట శబ్ద సంచలనాన్ని వింటాం ఇలా మనం కలుస్తూనే వుంటాం ఒక తోవనూ ఊహనూ చూపునూ పట్టుకుని నేనొస్తాను మరోలా నువ్వూ మరోలా అతనూ మరోలా ఆమే నాలుగు తోవలూ నాలుగు ఊహలూ నాలుగు చూపులూ ఒక మనుషుల కూడలిని నిర్మిస్తాం ఒకోసారి ఒకే తోవలోనో ఒకే ఊహలోనో ఒకే చూపులోనో కలుస్తాం
ఒక మానవ హారాన్ని నిర్మిస్తాం కలవడం యాత్రాంశమవుతుంది అనివార్య జీవనాంశమవుతుంది ఒకోసారి ఒకరో ఇద్దరో ఇష్టంగానో అయిష్టంగానో వెనక్కి చూడకుండానో వెనక్కి చూస్తూ చూస్తూనో
మన నుంచి తిరిగి రాని చూపుతో ఏకాంత గీతంతో వెళ్ళిపోతారు ఒకోసారి ఒకరో ఇద్దరో అజాగ్రత్తలోనో అనూహ్యంగానో
పరాయి హస్తాల్లో చిక్కి పత్రికల్లో మృత దేహాలవుతారు
మనం తలలొంచి మూగపోతాం
ఠూడలి కాసింత వాడి పోతుంది
ప్రవాహం మెల్లనయినట్లు తోస్తుంది
ఎంతసేపు! కాసేపే!
కొత్త పాయలు చేరడం సహజం
నదులు కదలడం సహజాతి సహజం
సంభాషణ మళ్ళీ ఊపందుకుంటుంది
ఒక్కోసారి పగలు మసకబారుతుంది
రోడ్డమీద జీవితం బిక్కు బిక్కున వెళ్తూంటుంది
నవ్వడమూ ఏడ్వడమూ మాట్టాడ్ణమూ అంత తేలిగ్గాదు అనుమతి పత్రం కనీస జీవితావసరమవుతుంది
అలవాటుగానే అప్పుడూ మనం కలుస్తాం
చుట్టూరా ప్రతికూల పవనాలు శత్రునయనాల్లా కదుల్లూంటాయి అరుబయట కూర్చోలేం
ఏ వీధి చివరి ఇంటి మూల లోనో
ఏ చెట్టు కాండం తొర్రలోనో
కాళ్ళు కాస్త సర్దుకుని కూర్చునే చోటిచ్చే ఏ నీడలోనో
మనం కలుస్తూనే వుంటాం
మనవైన బాటలున్నాయనీ బాటలు కలిసిన ఊళ్ళున్నాయని ఊళ్ళు కలిసిన దేశముందని
దేశానికి తనదైన మెరుపూ సలుకూ వున్నాయనే
ఒక స్పృహ ఒక ఎరుక ఒక సమాన సూత్రం
బన వేళ్ళు మాట్లాడే వేళ బస్తా 39 తన
మనల్ని కలుపుతూనే వుంటుంది ఆకాశం నిండా అరణ్యాల నిండా నదీనదాలనిండా మనిషిని బతికించే సమస్త మూలకాల నిండా సామూహిక జీవనోత్సవాలు లేవా? మనిషి ఎట్లా ఏకాంత జీవి? మనిషిని ఏకాంతుణ్ణి చేసి ఒంటరి అనాథ మరణాన్ని చేసేవాడు మనకు శత్రువు] శత్రువు నుంచి కాపాడు కోవడానికే కాదు శత్రువును వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికీ మనం కలుస్తూనే వుంటాం మన కూడలి ఏదైనా ఒకే బ్యానర్‌ని నేలాడదీస్తాం “మనిషి ఏక వచనం కాదు బహువచనం” ౩1-07-7996
హ్లష్ల4౦ దర్భశయనం శ్రీనివాసావార్వ కి
యాత్ర జాగ్రత్త! అత్యంత జాగ్రత్త! ఎటూ కదలక పాతుకుపోయి నిటారుగా కాంక్రీటు స్తంభం లత అల్లుకోనీ నది తాకిపోనీ తడి ఆరిపోనీ తనువొకింత తెగనీ తలమీద దివిటీ ఒకటి వెలగనీ స్తంభం ఉలకదు పలకదు మెదలదు లోపల ఏ వూహ లేదు బయట ఏ స్పృహ లేదు స్తంభం కానివాడే యాత్రికుడు! కదలిక జీవన సూత్రం ప్రాణగాత్రం నదుల్లోకి కొండల్లోకి గుహలోకి అనాది సుదూర కాల చిత్రాల్డోకి అగాధ నిగూఢ దృశ్య మూలాల్లోకి వర్తమాన విసృత సంక్షోభాల్లోకి అంతరంగాల అంతర్మయనాల్లోకి కన్ను నుంచి లోతైన చూపులోకి పాదం నుంచి చిగిర్చీ మైళ్ళలోకి చెమరింపు పులకింత వెలుగింళ ద్రవిస్తూ ధ్యానిస్తూ ధైర్యిస్తూ. .. నడక సేదకై మజిలీ మజిలీ స్తంభం కాదు నిల్చి చూసే యాతశ్రే! పాదలేపనం ముందడుక్కి! మొదలుకూ ఆఖరుకీ తేడాలేని నడకేంటి? స్తంభమే!
కక వేళ్ళు మాట్లాడే వో కఖ్రాాాాాాాతాు 41 ఇనా
యాత్ర పిదప మిగిలేది
ఒట్టి ఒంటరితనమా? స్తంభమే!
కాదూ ఓ కొత్త దారా
ఓ వెల్తురు ధారా? అది ఉదాత్త చరిత్ర!
యాత్ర అనుభవ సంప్పటి
కళ్ళకు కన్ను పాదాలకు పాదం
కాంతి మీద కాంతి మీద కాంతి
గొప్ప మనిషైన వాడు
గొప్ప యాత్రికుడు కూడా!
70-08-996 తచన మాన వజ్రిక్క ఆగస్టు 197 క్ల 42 వర్చళయనం శ్రీనివాసాబార్వ కై
క్ వెన్నెముకనే కాల్దేస్తారా? అన్నం పెట్టిన రైతులు కాల్పుల్లో కూలారు ఇవాళ అన్నం ముందు కూర్చోలేను అన్ని అనిశ్చితాల నిరాదరణల నడుమ ఇవాళ పొలాలు పైర్లవుతున్నాయి మరి రైతులెక్కడున్నారు? కోసిన పాలాల మొదళ్ళలోనే! రైతెత్తిన విత్తనాల్ని డంకెల్ చేతుల్లో పెడతారు! రేపు ఇక్కడి మట్టినీ పరాయి తీరాలకు బదలాయించరని ఎవరు చెప్పగలరు? రైతుకందాళ్సిన ఎరువు ఇక్కడి మట్టిని చేరనే లేదు పైకం మాత్రమెపుడో ఎగుమతైంది కుంభకోణాల ప్రభల్లో పెద్దలు వెల్లుతారే కానీ చిక్కుతారా? రేపు దర్యాప్తల తూతూ మంత్రంలో వాళ్ళు వేడుగ్గా విడుదల కారని ఎవరు చెప్పగలరు? పంట చేతికంది రాక అప్పు గొంతు పట్టుకుంటే అన్నదాతలు ఆత్మహత్యల తీరంలో బీడుపాలాలవట్లేదా? రేపు ఊళ్ళకు ఊళ్ళే బీళ్ళు కావని ఎవరు చెప్పగలరు? పి వేళ్ళు మాట్లాడే నోల బ్రా 43 ఈ
ముందుకెళ్తుందనీ ముందుకెళ్తుందనీ ఎంతెంత ఆర్భాటం పటాటోపం! దేశం నిజానికి పల్లెల్గోకి పాలాల్గోకి తనకన్నం పెట్టే ఆత్మలోకి వెళ్ళిందెప్పుడు చెప్పండి? పల్గెల్ని శ్రోతల్ని చేసే నగరోపన్యాసాల్తో ఏ పంట తీస్తారు? రేపు దేశమంటే నగరాలేననే నినాదం రాదని ఎవరు చెప్పగలరు? ఎంతటి వెన్నెముకయినా ఎంతని బరువు మోస్తుంది? ఊళ్ళనూ పొలాల్నీ మట్టిని మొక్కనూ నమ్ముకుని వొంగి వున్నందుకు ఎంత చీకట్ని మోయాలి చెప్పండి! మీ తీరువాతో నీరు బరువు మీ వడ్డింపులో విద్యుత్ బరువు తడి తడీ కాదు కాంతి కాంతీ కాదు బరువు కింది బతుకే పొడి చీకటి ఈ బరువేంటని బరువు బరువుగా రోడ్డెక్కితే రైల్‌పట్టాలెక్కితే దిక్కుతోచని రైతుల మీద కాల్చులూ రక్తపాతాలా ఇవాళ వెన్నెముకను కాల్చి రేపెట్టా నిలబడతారు? పొలాలు పడి లేవు రైతుల వీపుల మీదున్నాయి పొలాలు కూడా కదుల్తాయి
గ దర్భశయనం శ్రీనివాసాచార్య ఫ్లక్ల
బతుకు నిండా భారాలైతే
దారి పొడుగునా కాల్పులైతే
రోడ్డేంటి రైల్ దారులేంటి
సమస్త మార్గాలన్నీ రోకోరోకో!
రైతు ఆగ్రహమై పాలాలే కదిలిననాడు
దేశం దేశమంతా స్తంభించదా
ముందు దారే కాన రాక
అపుడు అందరి చేతుల్లోనూ
ఖాళీ ఖాళీ భిక్షాపాత్రలే సుమా!
04-09-1996 ప్రజాసాహితి నవంబర్, 1997 ఇనా నోళ్ళు మాట్లాడో వేల స్రక్రిమ్రాాకు 46 టట్
హరితమూ ఆమ్లమూ
ఆకు పచ్చతనం పాఠంగా విస్తరించే
ప్రాంగణ కాంతిలోనేనా
ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి!
మట్టి మొక్కగా ఆకృతి దాల్చే
పరిణామమే పాఠంగా విప్పారే
పచ్చని లోగిలిలోనేనా
ఈ వికృత ధ్వంస క్రీడ!
ఎన్నో కలల తోటలు కదలాడే వయసు
ఇట్లా మాడిపోవడం భరించేదెట్టా
కనుల యెదుట పచ్చని మైదానాల్ని
పెంచుకున్న ఆ హరిత విద్యార్థిని
ఇట్లా కమిలిపోవడం సహించేదెట్లా
వేట ఎప్పుడైనా ప్రేమవుతుందా
పశుత్వం తప్ప మరే మృదుత్వమూ లేనివాడికి
(పేమ ఒక సాకు, వేట వాస్తవం, వేట ఒక అట
వాడినీ, వాడి ఆటవిక ఆటకు నీడనిచ్చిన
సకలాధికార బృందాన్నీ మన్నించేదెట్లా
మొక్కల నీడలు చల్లగా పరుచుకునే చోట
ఈ యాసిడ్ మంటను అన్వయించుకునేదెట్లా
నా జ్ఞాపకాల మైదానంలో కదలాడే చెట్లన్నీ
ఇట్లా ఒక్కసారే దహనమైతే ఓర్చుకునే దెట్లా
అన్ని దాడుల్నుంచీ మొక్కల్నే కాదు
కలల ముఖాల్నీ బతికించుకోవడానికి
ఏ మందుల్తోనైనా ఎదురు దాడి చేయాలని
ఆగ్రహపాఠం వల్గెవేయక ఇపుడిక వుండేదెట్లా
(నా ఆల్మామేటర్ వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్‌లో ఒక విద్యార్థినిపై ఆసిడ్
దాడిని ఖండిస్తూ)
09-09-1996 ఆంధ్రజ్యోతి దినవత్రిక 21-70-1996 పను 46 కత్రా దర్భశయనం శ్రీనివాసాచార్య మై
బి
రామర్ పిళ్ళై ఇతడు మన వనమూలిక ఇక్కడ ఉబికిన మానవ ఇంధనం ఒక అనుభవ దృశ్యమ్మీద కన్నుమోపి ఏళ్ళ కేళ్ళు శోధన సల్పిన సాధకుడు అంతా పరాయి తెరలకూ పశ్చిమ తీరాలకూ ముఖాల్నీ మెదళ్ళనూ వ్రేలాడదీసుకుంటున్న వేళ నేలకు అద్దమై ఇక్కడి చేవనూ పచ్చనూ ప్రతిబించిస్తున్న వాడితను - అకడమిక్ మిడి మిడి తెలివితో ఇతని చదువును గురించో నెలవును గురించో చచ్చు పుచ్చు ప్రశ్నలు వేయొద్దు అద్దంలోకి చూస్తే చాలు తెలుస్తుంది ఈ నేలేమిటో ఇతనేమిటో తపస్సేమిటో! మహా మహా ప్రతిభలన్నీ తాకట్టు సంతకాలకే పనికొచ్చినపుడు ప్రవాస ప్రయాణాలకే పాస్ పోర్టులైనపుడు ఇపుడిక్కడ జెండా నెగరేసేది ఇతనూ ఇలాంటి అజ్ఞాత నేల పుత్రులే! జెండా నెగరేయడమే కాదు ప్రశ్నలూ విసురుతారు హక్కుల సరళిని మొత్తంగా తిరగదోడ్డారు ఇక్కడి మొలకల్నీ మూలికల్నీ ప్రాకృతిక సొరాన్నీ ఎవడెవడికో రాసివ్వడం ఎవడి హక్కు? సరళీకరణ వశీకరణ మంత్రంతో ప్రపంచాలింగన జపంతో రెండు చేతులా సంతకాలు చేసి దేశాన్నే బదలాయించడం ఎవడి హక్కు?
ప్లై నోళ్ళు మాట్లాడే వేళ ప్రమా 47 కము
ఇవాళ ఇతనూ రేపు మరో మట్టి మనిషీ
మరోనాడో గిరిజనుడూ ఇంకో ఆదివాసీ
ఈ నేల పువ్వు సరిమళమేమిటో ఇంకా ఇంకా చెబుతారు
ఇక్కడి రేపటి తరానికి సారంగా అప్పజెబుతారు
ఇక్కడి మట్టి నెత్తి నాగరికతగా రాస్తారు
ఇక్కడి నిస్సిగ్గు దళారీ నేతల్ని మంటెయ్యడానికి
ఇంధన శక్తులై లేస్తారు జ్వలిస్తారు జయిస్తారు
నిజానికి ఇక్కడి నేలకూ ఇంధనానికీ తేడా ఏముంది?
21-09-1996 బైతన్య కవిత మార్చి 1998 పన్లూ 48 దర్భశయనం శ్రీనివాసొబార్వ శకో
అజంతా గుహల్లోకి ఆకాశం వానగా ప్రయాణిస్తున్న ఒకానొక ఉదయం వేళ చిరుతడుపులో ఊళ్ళుదాటి నలిగిన బాటలు దాటి ప్రాచీన మానవ కళాకృషిలోకి అజంతా గుహల్లోకి ఆసక్తి నేత్రాలో ఉత్సాహ పాదాల్లో - మనిషి స్పర్శకు మునుపు ఇవి ఏ ప్రవాహకాంతి లేని వొట్టి కొండలు కాబోలు క్రీస్తు పూర్వం నా పూర్వులు ఇక్కడ పాదం పెట్టి మొదలెట్టిన ఉఊలీ కుంచెలపని శతాబ్దాలుగా సాగి శిలల్ని గుహలుగా లాగి అంతరంగ చిత్రాలు గీసి అలా శిలాశ్రేణిని చిత్ర కళా తోరణం చేసి బహుశా తృప్తి చూపుల్లో వెళ్ళిపోయాక - వెయ్యేళ్ళ విరామం - మనుషుల తాకిడి లేక - అసలు బొమ్మలున్నాయనీ తెలీక, శతాబ్దాల అవిశ్రాంత మానవ చింతన దిద్దిన అపూర్వ దృశ్య కేంద్రమిదనీ తెలీక - . లేని తలుపులు పడి మరుగున పడి దృశ్యముండీ అదృళ్యమైపోయాక - ఎవరో ఆంగ్లేయుడు పందొమ్మిదో శతాబ్దం గడప దగ్గర ఇప్పటి ఆ వ్యూపాయింట్ దగ్గర నిల్బొని ఈ గుహల ఉనిక్ పట్టడం ఎంత గొప్ప సందర్భం! పూర్వునిలోకి శతాబ్దాల తదుపరి మళ్ళీ మనిషి వెళ్ళడం ఓహ్! ఎంత అనుభూతి! ఒక్కొక్క గుహలోకి గుహనుంచి మరో గుహలోకి యాత్రిస్తుంటే ఎన్నెన్ని చిత్ర దృశ్యజీవితాలు జీవనవర్ణకాంతులు! అటు పద్మపాణి ఒకే ముఖంలో ధ్యాన సౌందర్యం కారుణ్యశాంతి కాంతి రేఖల ప్రవాహం ఆ సరసనే నీలకాంతితో మెరుస్తున్నదెవరు
కము వేళ్ళు మాట్లాడే వేల ప్రకా అ
అతని సహచరే (ప్రేమవాలుతో - ఇటు వజ్రపాణ్ దేహమ్మీద సకలాభరణాలు సుకుమారాలూ కలగలిసిన నిగనిగఛాయ, ఆ సరసనే ఒక ప్రభువెవరో బోధిసత్వుని కందిస్తున్నది పుష్పకానుకల్నీ గౌరవభావాల్సీ - ఇటు స్తంభమ్మీద ఈ నాలుగు లేళ్ళు ఒకే తలతో ఒదిగి పొాదగడం ఎంత చిత్ర చతురత! ఎ౦త ప్రాణకాంతి! అటు ఎవరా యువతి ఏకాగ్రతతో అద్దమందుకుని ముఖాన్నీ చూపుల్నీ తీర్చిదిద్దు కుంటున్నది కాలం ప్రవహించినా అద్దం వెలుగు అలాగే - వాలిపోకుండా - తాజాగా - ఇటు ఎవరీ రాకుమారీ చిట్ట చివరి చూపుల్లో వీడ్కోలు సంజ్ఞల్తో - ఈమె కళ్ళకీ దుఃఖానికి తేడా లేదు! అక్కడేమిటి ఇరవైమూడు బాతులు శిక్తిత సైనికుల్లా లయతప్పని వరుసలో ఒకదాని వెనుక మరోటి - ఒక ఊరేగింపు! ఈ తీరాన ఇదేమిటి పడవల ప్రయాణం ఏనుగుల విన్యాసం ఏ రాజు పట్టాభిషేకపు అట్టహాసం ఆడంబర విలాసం సరే ఆమె ఎవరు? మాయాదేవి! ఆమె కలలో కదిలిందేమిటి? ఆరు దంతాల తెల్ల ఏనుగు అదేమిటి? లుంబిని మైదానం అతనెవరు? ఆమె కన్న గౌతముడు అతను చూస్తున్న దేమిటి గాయాల్నీ రక్తాల్నీ సకల జీవన సత్యాల్నీ - ఏడేళ్ళ యాత్రలో గౌతముడే బుద్భుడై అటుగా కాషాయంగా వచ్చి నిల్చున్నదెక్కడ ఒకప్పటి తన వాకిలిలోనే, మరింత విప్పారిన చూపుతో! భిక్ష అడుగుతున్న దెవర్షి? తన భార్యా బెడ్డలనే! వీళ్ళెవరు వందలూ వేలూ ఈ జనగణమేమిటి ఒకే ప్రార్ధన ఒకే నివేదన “బుద్దా! అష్ట భయాల్నించి రక్షించు”! గుహలు కావివి బౌద్ధకాంతి గనులు . ప్రజ 50 దర్భళయనం శ్రీనివాసాచార్య ప్రక్తూ
చైత్యవిహారాల నెలవు ఒకప్పటి చైతన్యాల కొలువు కుడ్య దేహాల మీద తీగల్లా సాగిన జాతక కథలు తలెత్తితే పశువులూ పక్షులూ ఫలాలూ పచ్చని అల్లికలూ అటు ఒకే బుద్ధుడు వేల రూపాలుగా విప్పారిన బహుళ బుద్ధసందోహం కదిలీ కదిలి ఆ చివరి గుహలోకి అడుగిడితే ఎవరా మహా మానవుడు సుదీర్ధ నిద్రావిశ్రాంతీలో - ముఖకాంతితో - అది బుద్ధుని పరినిర్యాణమా నిజానికి నిర్యాణం కాదు - అలాంటి మనిషెప్పుడూ నిలిచే నిర్మాణమే! కదిలే నిర్మాణం! ఒకప్పటి వాఘీరాలాగో! ఇప్పటి అజంతా నదిలాగో! అందంగానూ ఉరవడిగానూ దూకుతూ కదుల్తూ కదిలిస్తూ. .. గుహల్ని తాలిచిందెవరు? మనిషి ధారనిలా మలిచిందెవరు? చిత్ర చిత్రాలుగా బతుకును సహజ సహజంగా దిద్ది వెళ్ళిందెవరు? ఎక్కడా ఏ సంతకం లేదు ఆనవాళ్ళు లేవు ఏ పరిచయమూ లేదు పరుచుకున్న బహుముఖ నైపుణ్య విన్యాసమే వాళ్ళ విలాసం సరే! అజంతా నుంచి ఆ ప్రొచీన తీరంనుంచి తిరిగొస్తున్నాను కానీ అప్పటి చిత్ర కారుడెవరో ఒకరు నాలో ఇపుడు ఒడుపుగా నాలుగు కుంచెల్తో కదుల్తున్నట్టుంది " బుద్ధుణ్ణి నా గుండె గోడల మీద దిద్దుతూ! 30-71-1996 చైతన్యకవిత, ఏవ్రీల్ - సెష్టెంబర్ 1997 ల్! టంధౌల్వు యాం న్. ఖ్ ౬. రాత ర్ల జ్త న్ మో నే వ. ల పాదా ని డ్ శో న వేళ్ళు మాట్లాడో వేళ బ్రాల 51 ౬
స్వాప్నికుడు కలలు తరలి వెళ్ళిపోయాక నేత్రోత్సవాలకు తెరపడుతుంది లోనా బయట అంతటా అలికిడి లేనితనం మోహరిస్తుంది ఆవిరైన పచ్చదనం నీడల అఖరి అనవాళ్ళూ మిగలవు ఎటు చూసినా ఒకే దృశ్యం అన్నింటినీ ఇసుకలా రాల్చుకున్న ఎడారి! ఎడారిలేని తీరం నా దేహం తీరంలో కలల కళ కళ పచ్చని తోరణాల తిరణాలై! నాలో మీరెటు తిరుగొడినా తిరణాల పరిమళాల అతిథ్యం! అరణ్యమో అర్హవమో ఆకాశమో వర్షమో వెన్నెలో వేకువో స్పృతిలాంటి మృదువైన ఆమెనో చరిత్రలాంటి వీరుడైన అతనో ' వాగులాంటి ఊపైన వాళ్ళో వీళ్ళో కలలై నాలో ఉత్సవ సంగీతం! తడిలేని కలే లేదు కలల తడే నా చూపైనా మ్లూటైనా! ఎప్పుడైనా కాలమేద్గో నిష్క్రమించిందనను కొత్త కలలు తరలి వస్తున్నాదుంటాను ౩0-72-1996 అంధజ్యోతి దినవ(త్రిక 02-06-1997
తయో 52 దర్భశయనం శ్రీనివాసాచార్య వ్రొకో
ఆమె వేళ్ళు వర్షం వెలిసాక మెత్తని నేల్లోకి ఆమె సారగింజ విత్తింది చిన్నపనే అనుకున్నాను మొలక శిరసెత్తి అటూ ఇటూ చూస్తుంటే ఊతగా ఆమె కర్ర పాతింది కర్ర మీదికి తీగ - ఇపుడు కర్రా తీగా ఒకే బతుకు కర్ర తల మీంచి తీగ ఇల్లెక్కింది ఇక పర్వాలేదంది ఆమె కొన్నాళ్ళ తన ఆందోళనకు తెరేస్తూ - ఇప్పటిదాక ఇంటిపై కప్పుకు కాంక్రీటు మోటుదనమే - ఇపుడంతా పచ్చని తీగల లాలిత్యం తెల్లని పూలూ, పిందెలూ, కాయలూ, పాకుతూ పోతున్న బహు బాహువులూ బాహువుల కొసల్లో సన్న సుకుమారాలూ = సారపాొదు ప్రస్తావన వస్తుందింట్లో - తానే విత్తానని ఆమె ఎపుడూ అనదు పెద్ద పనే విత్తడమంటే! పనుల చిందరవందరలో మనసు చెద పట్టినట్లనిపిస్తే ఇంటిమీది తీగ దగ్గరి కెళ్తాను ఓ గొప్ప కవితై అది నన్ను అల్లుకుంటుంది కొసల సుకుమారాలు మనసు నెగబాకుతాయి పూలు లోన రాలి మృదువుగా దొర్జుతాయి చెదవదలి మనసు చిగురిస్తుంది
వేళ్ళు మాట్లాడే వేళ పాానతటను 3 అన
చిగుళ్ళ కొనల్లో ఇంట్లోకి సాగుతాను
ఎన్ని తీగల్నో సృజించిన
ఆమె వేళ్ళకు కృతజ్ఞత పలుకుతూ -
తీగ లాగే కవితలాగే నేనూ
బహు దిశలకూ సాగివెల్తా
ఆమె వేళ్ళు నాలో కదుల్లూంటే!
20-07-1997 ఆంధ్రవ్రభ వారవత్రిక 19-02-1997 తక యయ దరళయనం శ్రనివాసాబార్వ
ర్యాగింగ్ మేం అపరిచితుల్లా వస్తాం మృదువైన ఊహల్లో, కళ కళలాడే కలల్లో ఒక పాతదనం తొడుగు విడిచి కొత్తదనం వస్త్రాల్లో వస్తాం కాసిన్ని అక్షరాల్తో, మరి కాసిన్ని అక్షరాల్రై - కళాశాల వాకిట్లోకి అలా అడుగు పెడ్తామా లోలోపల ఎంత ఉత్పాహరాగం కదుల్తున్నా బెరుకుతనంజీర గొంతును పట్టేస్తుంది లోలోపల ఎంత కల్మిడితనం కాంక్ష పొర్గుతున్నా ఒంటరితనం సంకెల కాళ్ళను కట్టేస్తుంది ఇంతలో మీరు ప్రత్యక్షం! గుంపులు గుంపులుగా చుట్టుముడతారు మేం ఒంటరి పక్తులమై ముడుచుకు పోతాం మొరటు జంతు వాతావరణంలో మా పేర్లను మా మాటల్నీ మరచిపోతాం మీరు దాడికి దిగుతారు హక్కుగా! సిగ్గులేనితనంలోకి మమ్మల్ని తరుముతారు అసభ్య వికృత చేష్టల్ని పరీక్షగా పెడతారు అనాగరిక మృతభాషను వాగిస్తారు బానిసతనాన్ని మా మెళ్ళో దిగేసి ఏ పరిచయాన్నడుగుతున్నారు రింగ్ మాస్టర్ వేషం వేసుకొని మీరే పరిచయాన్నందిస్తున్నారు రెండు శత్రుశిబిరాలుగా నిల్చున్నాక మీరాయుధులై, మేం నిరాయుధులమై! మాలో మరీ సున్నిత మనసొకటి
జ్ర వేళ్ళు మాట్లాడే వేల పను 55 ఆ
మీ తాకిడిలో భగ్నమై ఛిద్రమై జారి
బతుకునుంచే సెలవు తీసుకుంటే
ఎవరు జవాబుదారీ?
ఈ శిక్షణలో వచ్చేయేడు మేము మీరై
వచ్చే తరాన్నీ గాయాలకట్టచేస్తే ఇదే వారసత్వకాంతి?
ఏ పాఠాలు నేర్చుకోవడానికి మాకీ మొదటి పాఠం?
ఉద్వేగ కెరటాలై చలనకాంతి ఖడ్డాలై
వెలుగెత్తాల్సిన వేదిక మీద ఈ వెర్రి పతనాలేంటి?
అవమానాలకో ఆత్మహత్యలకో కాదు
ఇంత కలల సంరంభంతో మా ఆగమనం
సహజ సహజంగా తేట తేటగా నిర్దిష్టంగా
ఇచ్చి పుచ్చుకునే పరిచయాలకే మేం సిద్ధం
ఇవాళ ఇక్కడ శుద్ధి పడకుండా
రేపు దేశ దేహాన్ని ఎలా శుభ్రపరుస్తాం
సూర్యభఖడ్గ కాంతే మా పరిచయం
చీకటి వికృత చేష్టలే ఇంకా మీ ఆనవాళ్షైతే
మిమ్మల్ని ధిక్కరించడమే మా సమాధానం
అవును,
ఇక్కణ్డుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం!
06-02-97 అధ్యావక జ్వాల, ఆగమ్హు 87,
" ఆంధ్రజ్యోతి వారవత్రిక 10-07-98
హ్ల్లూ 56 దర్భళయనం శ్రీనివాసాచార్య క్ర
బతకడమంటే గొంతెత్తడమే! సాహసాలు పుపష్పిస్తేనే ప్రేమలు ఫలిస్తాయి గుమికుల రాజ్యంలో గొంతులు పూలు మాటలు పరిమళాలు, దేహాలు పచ్చని తీగలు మృదుత్వలాలిత్యాల ప్రాంగణాలు కాలం కమ్మని పాటై కదుల్తుంది యుద్ధభూమిలాంటి దేశంలో మాత్రం బతుకొక ఎడారి. అనుభవం ఇసుక తుఫాను - సాహసి మాత్రమే మొక్కై జీవిస్తాడు గొంతు లేనివాడు నిరాయుధుడు, నిరంతర బందీ బందీ బతుకేంటి? చావులాంటి మూగతనం చుట్టూరా వాణిజ్య వాస్తవం ఎవడి లోయలో వాడు - గొంతెత్తకపోతే అంతా మంచు, నిద్ర పాడితనం, గుడ్డితనం, వొట్టి ఒంటరితనం - డిమాండ్ చేయకుండా ఏ హక్కు దక్కుతుంది? దిక్కులు దడదడలాడే గొంతు పిడుగుల్ని రాల్బకుండా ఏ గాయాల ఘోషనైనా ఎలా ప్రకటిస్తాం? గుండె గొంతై గొంతు ఆగ్రహ నినాదమై నినాదం నిలువెత్తు మహోజ్వల మానవుడై జ్వలిస్తే మంచు కరగదా నిద్ర చావదా తడి కురవదా కదల్లేని గాయాలు సైతం కదలవా చూపూ చురుకూ లేని వాళ్ళు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడి కొత్తగా గొంతెత్తరా గొంతుల నడుమ సూర్యుడు మెదలడా
ప.
గాయాలు ఎలుగెత్తితే మార్చ్ ఆన్ మార్చ్‌ఆన్
నిప్పులవాన, అణు విస్ఫోటం, భూమంతా బ్బోఅవుట్
కాలాన్ని కమ్మని పాటగా మలచడానికి
యుద్ధభూమిలో గొంతుల ఆగ్రహమనివార్యం
ఇపుడిక బతకడమంటే గొంతెత్తడమే
బతుక్కి పచ్చదనంలాంటి అర్భాన్నివ్వడమే -
14-3-7997 'వ్రజాసాపొతి ' మ, 1999 సాక8 దర్భళయనం శ్రీనివొసొచార్వ' ఫ్లైన్ల
విల్లు
వీరుల్ని కన్న నేలతల్లి ఆజ్ఞ!
“ఎవరు నా బిడ్డల్ని శవాలుగా
అదృశ్యపరుస్తారో
వారి తలలు నేల రాలాల్సిందే”
హక్కులా తప్ప మరోలా
ఎవరూ వీరుని శవాన్ని స్వీకరించాద్దు
తల్లినీ వీరత్వాన్ని అవమానించొద్దు
వీరుడెక్కుపెట్టి వెళ్ళిన విల్లు "
దేహమంతా ఆగ్రహద్రవ్యాన్ని
దట్టించుకునుంది
తనను విశ్వసించినందుకు విరిగైనా సరే
వీరుణ్ణి హక్కుగా దక్కించుకుంటుంది
విల్లును అవమానించొద్దు
విల్లెప్పుడూ వీరుణ్ణే (ప్రేమిస్తుంది
25-3-1997 వ్రజాసాహితి' అగప్టు, 1997 జు వేళ్ళు మాట్లాడే నేల ఫ్ల్లాన్లుావాాాాానానావననానానాాాానాను ౮ పనా
బతుకు పలుకే అతని పాట!
రక్తమూ [ప్రాణమూ పాటా
రక్తమెలా కదిల్తే ప్రాణమలాగే పాట అలాగే - కరిగి కరిగి కన్నీరైతే కన్నీరై
మరిగి మరిగి ఉప్పెనైతే ఉప్పెనై
అతనే పాటా పాటే అతనూ -
- నిఘంటువుల దయాభిక్ష కాదు
ఊహాశ్వాల పదఘట్టన కాదు
- అరువు తెచ్చుకున్న పరాయి లయకాదు దారిచ్చిన బతుకు పలుకే అతని పాట! గోడలు మూసిన వేదిక మీద కాదు ఉత్సవార్భాటాల నగర భారతుల్లో కాదు
నేలా నింగీ సాక్షిగా బహిరంగంగా
బాటల మీద బతుకుల నడుమ
తేట తేటగా ఊటలూరేదే అతని పాట! పాటనలా ముట్టుకుంటే చెమట చెమ్మ పాట అలా చుట్టు ముడితే నిప్పుల గుండం చెమట ఉడుకెత్తాలనీ శిరసెత్తాలనీ
కలలు కనే గాయాల సలుపుడు అతని పాట! గాల్లోంచి తేలి రాదు గాల్లోకి తేలిపోదు అడవుల్లో కలియదిరిగిన పాట
మట్టిరంగు మలుచుకుంది మట్టినుంచి తెగిపోదు ఊళ్ళల్లో ఊపిరి అందుకున్న పాట
పోరు తప్పని నేల మీద
వెనుదిరగని సాయుధ ధిక్కారం అతని పాట!
ఊళ్ళు వాడలూ దళాలు దళాలు
పాటనిండా వేల దళాల ప్రాణవాయువు కదుల్తుంటే
ఒక దాడి నాలుగు బుల్లెట్లు ఒక తప్పుడు లో!
రక్తసిక్తమైంది పాటొక్కటే కాదు
జనం పలుకూ జనం కలలూ జనం బతుకు బాటలూ!
రక్తమోడినా పదునెక్కేదే పాట!
జనం పదునెక్కుతున్న సందర్భంలో
తప్పుడు లెక్కలన్నీ మట్టి కరుస్తాయి
మట్టిలోంచి వీచే పాట మళ్ళీ గజ్జెకట్టి
అసలు లెక్కతేలేదాకా హక్కులన్నీ దక్కేదాకా
సింహాసనం గుండెల్లో మందుపాతరై
సవాల్ చేస్తూనే వుంటుంది!
09-04-997 నౌర్త దినవత్రికు 2209-97 కాజ ఎల్ళు మాట్లాడ ఆళ్ల వాాాాాాాాాావానన 01 పష
త నా! వస్తు ప్రపంచం మాటలనుంచి అర్భాలు " వలసపోతున్నాయి వస్తువుల తళుకుబెళుకుల్లోనే సకలార్థాలూ జీర్ణమౌతున్నాయి దార్గో అందరూ వెళ్తూంటే వస్తు సామాగ్రి కదుల్తున్నట్టుంది పాదాల తొక్కిడి, మాటల్లేవు "పెదాల పొడి పొడి కదలికలే గుండె లోతులు ఖాళీ బావులు మాటల ఊటలు పూడుకుపోయాయి రద్దీ దారి పొడుగునా మనిషి తనం ఇంతింతగా రాలి తొక్కిళ్ళలో సమాధవుతోంది చూపు కొత్తచూపు నేర్చింది నిగనిగల వస్తువుల్ని గుర్తించినట్లు మనిషిని గుర్తించగలదా? కూలర్ గాలీ టీవీ పాటా ఫ్రిజ్ చల్లదనం పడకల మెత్తదనమూ ఇళ్ళ భారీ దర్జా దర్చమూ సుకుమారాల కార్లూ కాడల్లేని ఫోన్లూ ఇంత సంరంభం ముందు మనిషెంత మనిషిదేముంది చీలొచ్చు చిట్టొచ్చు రక్తాలోడొచ్చు ముఖరహితుడవొచ్చు వస్తువు మాత్రం ప్రాణప్రదం మరకపడొద్దు రంగుమాయొద్దు కొట్టొచ్చినట్టుండాలి హుందాగా సమస్తాన్నీ కమ్మేసేంత ఉన్నతంగా వ 62 దర్భశయనం శ్రీనివాసాదార్య ఫక్షో
దారినిండా వస్తువుల పలకరింపులు
రంగుల హంగుల ఫ్యాషన్ల ప్రదర్శనలు య
హెచ్చు తగ్గుల కొత్తపాతల చర్చలు
ఇంత సందడిలో మనిషేడీ అతని మాటేదీ
వస్తు సంభాషణలో ఆ మూగ ళ్రోతేడీ
తీరా దార్లో అతను నిష్క్రమిస్తే
వెంటొచ్చిన వస్తువేదీ చెమ్మగిల్లదు
అతని తలపుగా ఒక్క మాటా రాలదు
ఏ బావిలోనూ కాసిన్ని నీళ్ళూరవు
వస్తు ప్రయాణం క్షణమైనా ఆగదు
దారి ఎప్పట్లాగే వస్తువుల్ని మోస్తూ -
భూమ్మీద కదిలేవీ బతికేవీ వస్తువు లేనా?
మనిషంటే వస్తు ప్రదర్శనశాలేనా?
20-5-1997 ఆంధ్రద్రభ వార వత్రిక 29-2-97 జు వళ్ళు మాట్లాడో వేళ జాన 60 క
నీ
ఇస్తూ... చిన్న కాగితప్పడవనిచ్చావు ఇచ్చుకోవడమూ పుచ్చుకోవడమూ నడుమ పడవ అలా పారేయలేను ఊరకే - చిన్న నీటి పాయనైనా వెతుక్కుంటాను లేదా సృజిస్తాను పడవను పాయలో వదుల్తాను అచ్చంగా నీలాంటి లాలిత్యం నీడే నీళ్ళలో - నేనూ దాంతో కదుల్లాను సుమా! అలా అలా కదుల్లూంటే చదునైన కాగితం లాంటి నా మనసూ పడవై రూపెత్తు - దాన్ని నీకిస్తాను నీ లోలోపలి నదిలో కదలనిస్తావనే తడి ఆశతో! 29-05-1997 'వార్త దినవ(తిక 02-08-97
అన 0+ అనిననననననననాననననననతననననననిక దర్వృళయనం శ్రీనవాసావార్య కనిన
తల్లిదంద్రులకు తడిమిచూస్తే దేహాలు ముడతల ఇసుక తీరాలు నీటిచుక్కా లేదు మొక్కా లేదు ఒకప్పటి తడి అనుభవాలన్నీ అవిరై ఇపుడిక వీస్తున్నదల్లా పొడిగాలి! వెనక్కి చూస్తే ఎంత సందడి! పిల్లల సంపద నిండిన చిలబిల! వాళ్ళకై పగళ్ళు చెమటలో తడిసి రాత్రులు నిద్రలు కాస్ - వాళ్ళ కలల చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ నిశ్శబ్దాల్జోని శబ్దాల్ని చదువుకుంటూ వాళ్ళ శబ్దాల్లోని నిళ్ళ్శబ్దాల్ని తెలుసుకుంటూ వాళ్ళ రేపటి మెత్తని బాటలకై మీ బాటల్ని ఒకటొకటిగా వదులుకుంటూ గుండెలు పగుళ్ళు చేసుకుని యాత్రించి - కడకు ఇసుక తీరాలైన తల్లిదండ్రులారా ఒకప్పటి పరవళ్ళ ప్రవాహాల్లారా ఏ తడి కెరటమైనా తాకకపోతుందా అని ఇపుడిక ఒంటరి ఎదురుచూపులైన వయసు వాలిన కలల రేణువుల్లారా నడిచిన దారి సృృతిలో తెగిపడి ఉంది " కేరాఫ్ చిరునామాలో సాంతదనం ఒకే పంక్తిలోకి చిక్కిపోయింది అలలైన నాటి ఆనందమిపుడు లేదు
తి తేళ్ళు మాట్లాడే వేళ బ్రతక తతనపనతనననతనమతన 05 ఘః
సాంత దుఃఖాన్ని పలికే గొంతూ లేదు దయాభిక్షకై వొంగి లొంగి ప్రాణంలేని కర్రమీద తలవాల్చి వాళ్ళ వాకిలే మీ బతుకై వాళ్ళ పంపకాల్లో మీరొంటరులై వాళ్ళ ఈసడింపుల్లో ఉత్త నిళ్శబ్దాలై వాళ్ళ సణుగుళ్ళకు నిరంతర శ్రోతలై! పలికిన మీసొంత సెదాలేమైనాయి నడిచిన అలల పాదాలేమైనాయి సొంత ఆలోచనలెక్కడికెళ్ళాయి ఒకప్పటి తడి నిగారింపులు వలసపోయి జీవితం ముడుచుకుందనే సాక్ష్యంగా దేహాలిపుడు ముడతల ఇసుక తీరాలు! పిల్లలు - మీ ప్రాణ ప్రవాహం నుంచి ఉద్భవించిన పాయలే- మీ కేటదనప్పు మిలమిల్నుంచి మీ పాటదనపు గలగల్నుంచి పాయల్ని పారించడానికి సాంతంగానే ఇంకాలా? రుడి యెడమల జానెడు నీటి తీగాలేక - పాయలెటో వెళ్ళాయి వెళ్తాయి ఇటుగా మళ్ళే తీరకలేదు వాలూ లేదు ఈ పొడిగాలిలో మీ కలలు మాడిపోతున్న అంగార దృశ్యం వెనకాల తగలబడుతున్న అనుభవాలెన్నో! బాధ్యత బాధ్యతే బతుకు సారాన్నంతా దగ్ధంచేసి
కు 8 దర్భళయనం శ్రీనివాసాచార్య ఫ్లో
ఒక్క పరాయితనాన్నె మిగిల్బే
బాధ్యతలొద్దు
కడకు కాళ్ళను కూడా నరుక్కునే
సర్వస్వాన్నీ రాల్బుకునే యాత్రలొద్దు
ఇవ్వడమంటే ఇగరడమేనా
ఇసుక తీరాలై మిగలడమేనా
పాయలనివ్వక మునుపు ప్రవాహాలే
పాయలనిచ్చాక కూడా ప్రవాహాలై
బతుకు పొడుగూతా కదలాలి కదా
ఆఖరిదాకా అలల సంగీతం మోగేలా
దారిచ్చిన అనుభవ కాంతింకా మిగిలేలా
మీరింకా సాగాలికదా ఇస్తూ స్వీకరిస్తూ. ..
రెండో బాల్యంలోనూ గలగలలుంటాయనీ
కలల నురగల కళకళలుంటాయనీ
బుజువు చేయండిక తల్లిదండ్రులారా!
ఎపుడూ ఇంకకూడని దయార్ధ ప్రవాహాల్లారా!
0+06-1997 'ఆంధ్రభూమి' దినవత్రిక 31-08-97 జు వేళ్ళు మాట్లాడో వేళ కాన్ 67 న్లో
దినచిత్రం ప్రొద్దున్నే నిళ్శబ్దకాంతి! వాకిట్లో కూర్చున్నా ఆగిన నదిలా అద్దంలా ఏ పిల్లాడైనా ఓ వువ్వో ఓ మాటో విసిరితే బావుండు - నది కదుల్తుంది కదా అలాగైనా మలుపుల దారి దక్కుతుంది కదా “సారగ ఆ కుర్రాడలా నిన్నటినంతా వుండచుట్టి నా మీదికి విసిరెళ్ళిపోయాడు, బహుశా ఇవ్వాళ్టిలోకి - నాలో వృత్తాలు వృత్తాలు వృత్తాలు వుండ విష్పా - పేపర్ విచ్చుకుంది చివ్వున రక్తం చిమ్ముకొచ్చింది నేనంతా ఎరుపెక్కా - నాలో ఇసుక కూడా! చేతిలో వందల వాక్యాలు . నిన్నటిని వొంపుతున్నాయి రక్తాలోడుతూ! సంకల్పిత విధ్వంస దృశ్యాలు అసంకల్పిత మరణ దృశ్యాలు బతుకు మరుగైన వొట్టి పెదాల మాటలు రెండు కాళ్ళ కుర్చీల దర్సాల వీరంగాలు కోట్ల స్వాహాల బహిరంగ కోణ కుంభాలు ఇంకాసేపటికే ఇగిరే హామీల తైలాలు. .. రక్తం నాలోకి ఇంకుతూ. . సూర్యుడు ఎండెక్కుతూ వాకిట్లో నేను ఎగ్రని నదిని, బీటలు వారిన అద్దాన్ని రేపటి వుండకూడా ఇలాగే వుంటుందా రావడమే రక్తసముద్రమై వస్తుందేమో! కాగితాన్నో అచ్చొత్తిన యంత్రాన్నో అం వాయు దరృళయనం శ్రీనివానాచార్త కి
విసిరెళ్ళిన కుర్రాజ్జో తప్పుపట్టలేను
వీధిలోకొచ్చాను
రక్తం ముఖాల శవాల హడావిడి -
ఏదీ పట్టక చూపుడు వేళ్ళను మరిచిన
మొండి నడకల ఏకాంతాల గుంపులు
గడ్డ కట్టాను అలాగని అలాగే వుండిపోను
నాలోకి చూపుడు వేలిని ముంచుకుంటాను
నది కదుల్తుంది
ఏమీ పట్టని ఏకాంతాల్డాగా కాదు
ఇంకా రక్తమంటని పిల్లలకై ప్రవహిస్తా
రేపట్ రక్త సముద్రంలో వాళ్ళు
పూలై కొట్టుకుపోతే ఎట్లా?
పిల్లలకు పిలుపిస్తా నా నదినిస్తా నినదిస్తా
పూల ఊహల్లోనే కాదు
రాళ్ళ నిబ్బరాల్తోనూ రమ్మని. ..
పిల్లలు బతికారా ఊరేగింపులై కదిలారా
వికృతాల కెదురీదారా, తలెత్తారా
తప్పక ఆ తెల్టారగట్ల పేపర్ కుర్రాడు "
అన్ని వాకిళ్ళలోకి పూలచెండ్లను విసురుతాడు
24-07-997 'ఆంధ్రజ్యోతి' దినవత్రిక 23-03-08 కయ వళ్ళు మాట్లాడే వళ బాలలను 00 వ
కంకులూ నిప్పలూ వర్షం కురిసి వెలిసిన సాయంత్రం ఇపుడు గాలి మృదువైన తడి యాత్రికురాలు బజారుకో వైపు నేలమీద లేలేత కంకులూ నిషప్పులకుంపటీ అతడూ ఆమే కూడి ఒక చతురస్ర దృశ్యం! చతురస్రం ముందు కంకులకోసం జనం ఆమె ఒకటొకటిగా కంకుల్ని తీసి నిప్పుల మీద సేరిస్తే అతను విసనకర్రతో బొగ్గుల్లోకి మంటను పాకిస్తున్నాడు గుండ్రంగా కంకులు కాలాలి కదా ఆమె నిప్పుల్లో వాటిని తిప్పుతూంటే చేతులు మంటల్లో కలియదిరుగుతున్నట్టుంది అతను విసనకర్ర విసురుతూంటే నిప్పుల మీద గడియారం 'పెండ్యులం కదుల్తున్నట్ట్లుంది కాలిన కంకుల లేలేత రుచులందుకుని ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు లేత వెచ్చగా! బొగ్గులు మార్చుతూ కంకులు కాల్చుతూ ఆమె చేతులు నిప్పుల గుండంలో కదుల్తూనే వున్నాయి ఆ చేయి కాసేపు ఈ చేయి కాసేపూ అతని విసనకర్ర అవిశ్రాంతంగా కదుల్తూనే ఉంది నాలుగు కంకుల్లి నేనూ అందుకుని ఇంటిదారిన వెళ్తూంటే లేత వాసనలు
వట్లూ 70 వాలు దర్భశయనం శ్రీనివాసాచార్య న!
బాల్యం మొక్కజొన్న చేలోకి నడిపిస్తున్నట్లుంది
చతురస్ర దృశ్యం మాత్రం వెంటాడుతూనే వుంది "
కళ్ళముంధు నిప్పులు కదుల్తున్నాయి
నిప్పుల్లో ఆమె చేతుల మృదుత్వాలు
నిప్పుల మీద అతని చేతుల వింజామరలు .
అంతా ఎర్రెర్రని దృశ్యం!
కాస్త రాళైతే కుంపటి చల్తార్చి,
బహుశా నిట్టూర్చీ
చల్లని బొగ్గుల్తో మిగిలిన కంకుల్లో
ఆమే అతనూ
ఇంటి చీకట్లోకి వెళ్తారు కాబోలు!
అపుడు పొయ్యి వెలుగుతుందేమో!
చేతులెంత మృదువు! లేలేత కంకి గింజల్లా!
బతుకు నిప్పు కుంపటైనపుడు
అన్ని మృదుత్వాలూ అన్ని మార్దవాలూ
మంటల్లో కలియదిరగాల్సిందే కదా -
యీ రాత్రి మళ్ళీ వర్షం పడితే బావుండు
వాళ్ళ చేతుల్లో కాసిన్ని చల్ల గాలులు "
కలియ దిరిగితే బావుండు వింజామరలై!
వాళ్ళ కళ్ళల్లో నాలుగు తడి కలలు -
పురి విప్పితే మరీ మరీ బావుండు
పచ్చని మొలకలై!
రేపెట్లాగూ మళ్ళీ చతురస్ర దృశ్యంలో
కంకుల లేతదనాలై వాళ్ళు నిప్పుల కుంపట్లో! .
29-07-1997 'ఆంధ్రజ్యోతి' దినవత్రిక 19-10-97 జజ వేళ్ళు మాట్లాడే వళ మున 71 అన
పగలంతా
ఇసుమంత సువాసనా లేని "
వేల ఇరుకు నడకల్లో నలిగి
ఈ దారి మూర్భపోతుంది
రాత్రి నీ పరిమళాలు సోకి
తెప్పరిల్లి సేద దీరుతుంది
కొసింతా కాసింతా అలా
దారంతా దట్టంగా
నీ అద్దకాల్లో సుగంధ భరితం
ఈ దారంట రాత్రి నడకలకు
నీ ఉచిత పరిమళ ఆతిథ్యం
అప్పుడపుడు నేనూ నీ అతిథినే -
బీడు క్షణంలో అడవైనట్లు
నీ అదృశ్య కెరటాలు సోకి
నాలో ఖాళీలు అమాంతంగా పరిమళ భరితాలై. ..
నీ ప్రాణాలు నాలో వీస్తున్నట్లు -
నీ చుట్టూరా నేను ప్రదక్షిణం చేస్తున్నట్లు -
నా ఊహలన్నీ కొత్త ఎత్తులళగిసినట్లు!
ఇంతచేసి నీ పరిమళం నీకు తెలుసా?
నాలో ఒక ఆకాంక్ష - కదిలీ కదిలీ నేను
యాత్రలో సారమందుకునీ -
తేటనై వచ్చి ఈ దారిని కొత్తగా వెల్లించాలని -
వెల్తుర్లో నిల్చి నిన్ను
పరిమళ తరంగమై తాకాలనీ -
అలా నువ్వేమిటో నీకు ఒకింతైనా
పరిచయ పరచాలనీ -
79-70-1997 వార్త" దినవత్రిక 06-12-1997 అ 72 అటక దర్చళయనం శ్రీనివాసాచార్వ కై
చావు కతలు సాధారణ సహజ మరణాల సంగతి సరే సహజమైపోతున్న అకాల మరణాల మాటేమిటి? ఊళ్ళువేరు మనుషులు వేరు దృశ్యాలు వేరు దుఃఖాలు వేరు కానీ ఏ ఊరి చివర ఏ మనిషి శవమైనా వినబడే కథ ఒకటే శిల్పమొకటే మరణాల కోసం కాల్పనిక గాథలు పుడతాయని చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్నపుడు తట్టలేదు సుమా . గ్రామ దుఃఖాలంటే దేశం దుఃఖాలేనని ఎపుడు తెలుస్తుంది ఇవాళ్టి అకాల మరణాల్లో దేశం రేపటితనం తగలబడుతున్నదని ఎపుడు తెలుసుకుంటారు యౌవనాల్ని కూల్చేస్తూ అవి అకాలమరణాలు కాదు సకాల సహేతుక మరణాలని మీరంటే ఏది మరణమో ఏది జీవితమో ఊరవతల తుప్పల్లో కాదు ఊరి నడిబొడ్డో తేల్చండి ఊళ్ళ కళ్ళముందే -
ప్రజ వేళ్ళు నూట్లాడో నేల ప్లాన్లను 73 ఇ
సరదాల కాల్చనిక గాథల “చందమామిల్ని ఎప్పుడైనా ప్రేమిస్తాం హత్యల తాలూకు సత్యాల్ని పాతరేసే కాల్చనిక గాథల సంపుటాల్ని " ఊళ్ళే తగలబెడతాయి బహిరంగంగానే - ఊళ్ళంటే దేశమే! ఆఖరి తీర్పులు ఊళ్ళవే! 77-17-997 “ఆంధ్రజ్యోతి” దినవత్రిక 07-03-1998 అం? లాను దర్చశయనం శ్రనివాసాదార్వ కమి
ఆత్మహత్యల తీరంనుంచి
ఊళ్ళు ఉరితాళ్ళకూగుతున్న సందర్భమే గాలియాత్రల బోలుమాటల వీరులకు
మరో సందర్భం - ప్రచారార్భాటం -
రూలిన పత్తిచేల మీద
నకిలీ హామీల పిచికారీ
“జీ హుజూర్ అధికారుల వినయవిన్యాసం ఇప్పటికిప్పుడే అందరికీ
జ్ఞానోదయమైనట్ట్లు ఆకస్మిక వాతావరణం పరిహార ప్రకటనల్లో తంతు పరిసమాప్తి
ఐనా గాలి యాత్రలు నేలమీద ఏం నిలుస్తాయి? చేతులూపి ఆర్భాటాలు గాల్లోకి ఎగురుతాయి నేల యాత్రల ఊళ్ళు మాత్రం
ఆత్మహత్యల పరంపరలో శవవాటికల కేసి - పాలాలూ చేలూ పట్టని మట్టంటని
“ల్యాబ్ టు ల్యాండ్” ప్రణాళికలు తప్పుకాదు నకిలీ మందుల వాణిజ్యాలు తప్పుకాదు అవకతవకల అంగళ్ళు తప్పుకాదు గిట్టుబాటివ్వలేని చట్టచట్రం తప్పుకాదు కుతంత్ర యంత్రాంగాల కుమ్మక్కులు తప్పుకాదు తప్పంతా లద్దె పురుగుల్డే
అసలు తప్పంతా పత్తేసిన రైతుల్డే
పల్లెలకూ దేశానికీ లింకు తెగిందని తెలిసీ
ఇంకా చేలనూ నాగళ్ళనూ నేల చెమ్మనూ
ఆరు గాలాల్నీ ఆకాశాల్నీ నమ్ముకుంటున్న రైతుల్లే - గాలి యాత్రలకు గాలీ గాబరా పుట్టిస్తున్నుందుకు ఆత్మహత్యలన్నీ తప్పులు కాకేంటి?
బైకు వళ్ళు మాట్లాడే వోళో సనన 70 అని
అవను, తప్పులు చాలా దొర్జాయి ఇకనైనా ఒప్పుల పర్వం మొదలవ్వాలి ఊళ్ళన్నీ ముక్తకంఠంతో గజ్జెల పాదాల్లో పొల్లు పరామర్శల్నీ ముష్టి పరిహారాల్నీ తిప్పి కొట్టడంతో మొదలవ్వాలి పల్లెల పంటలేవీ లేకుండానే పాలన చేయండహో అన్న సవాల్ విసరడంతో మొదలవ్వాలి చావడానికి స్వస్తి చెప్పి బతికున్నాం కాచుకోండని అల్టిమేటం పేల్చడంతో మొదలవ్వాలి ఉరితాళ్ళనిపుడు ఊరి బయట మర్రి చెట్లకు వేలాడదీసి ఊపున వచ్చే గాలియాత్రల వీరుల్ని అక్కడికక్కడే ఉరితీస్తేగానీ కాయకపష్టాల పల్లెలు బతికి బట్టకట్టవు అపుడు పొలాలూ చేలూ రైతుల శ్వాసల్లో ప్రాణం పోసుకుంటాయి “27-2-1997 వార్త" దినవత్రిక 22-02-7298 స76 దర్భళయనం శ్రీనివాసాచార్య కషి
మిత్రుడా! సాత్వికుడా! మరింత దగ్గరయే వేళ ఇలా సాంతంగానే దూరమవడం ఏం బావుంది గోస్వామీ నా లోలోపలి స్పృహలన్నీ కన్నీటిమయం ఆమే పిల్లలూ వెంటరాని నీ ఒంటరి ప్రయాణం జారి రైలు పట్టాల మీద అపరిచితంగా అంతమవడం ఎంత దుఃఖాంతం! ఆఖరికి దిగబడ్డ రాతిముక్కలు సైతం . దుఃఖించి వుంటాయి సాత్వికుడా గుండెలనిండా దుఃఖంతో ఏళ్ళ మనోవ్యధలోనూ తేటగా బతికావు , మబ్బులు వీడి బతుకులో సూర్యకాంతి కురిసి వెచ్చదనం దేహమంతా పాకిందో లేదో ఇంతలోనే ఆనందగంధమిలా ఇగిరిపోయింది! నాకు గుర్తే! రాత్రిళ్ళు మాటల నడుమ ఎంత మృదువుగానో టీ తాగుదామా అనేవాడివి ఈ వేళలోనా అని నేనంటే |451 16 141 అని తాజా తాజా వేడిదనాన్ని అందించేవాడివి మరణం కూడా | 1146 1౧4 తన్నుకొస్తుందా బతుకెంత భరోసా లేనిదైంది సాత్వికుడొ! దూరంనించి నిన్ను ముక్తసరివనుకున్నాను దగ్గరయాక నీలో తాత్విక లోయల్లో ఎదిగిన సంగీత వృక్ష సముదాయం చూసాను చాలా సంగీతాలు చటుక్కున కూలి నల్లురి కందకనే నిష్క్రమిస్తాయా ఏంటి మిత్రుడా! మాటల్లో ఇంటికొస్తానన్నావు గుర్తుందా మాట నిలబెట్టుకునే కాలం మిగల్లేదు కదా
వేళ్ళు మాట్లాడ నేళ శ్రా 77 మి
ఇవాళ నా ఇల్లు బావురుమంది ముఖ్యంగా నా ప్రాణం లాంటి పుస్తకాల గది! గుర్తే! నాకళ్ళలో కవిత్వపు యిష్టాల్ని చదివి జీవనాన౦ంద దాస్‌నూ, టాగూర్‌నూ కలకత్తా నుంచి తెచ్చిచ్చావు అపురూపంగా! ఆనాడు తిరిగేసిన ఆ కవిత్వాల్ని ఇప్పుడు తిప్పితే పుటపుటనా నువ్వగుపిస్తావు కవిత్వ అమరత్వంలాంటిదే స్నేహం కూడా! రాత్రిపూట కవిత్వం రాస్తుంటే నాలోంచి తప్పక నువు తొంగి చూస్తావు ఇపుడు మరణించని నీ జ్ఞాపకాల తీరాన నిలబడి నీ లోయలోని సంగీతాల్ని వింటున్నాను (రైలు ప్రమాదంలో మరణించిన బెంగాలీ మిత్రుడూ, సహోద్యోగీ గోస్వామి స్ఫతిలో) 997 . పష 78 దద్చళయనం శ్రీనివాసాచార్వ క్రి
రంగుల ఈరణాల అన్ని రోజుల మాటేమో గానీ ఇవాళ మాత్రం అన్ని రంగులూ వన్నెకిక్కుతాయి మనుషులు పూలచెట్టవుతారు చెట్టు చెట్టూ పలు వర్ధాల్ని పూస్తుంది ఇవాళ రంగే పరిమళం కళ్ళదే కాంతి ఉత్సవం . అన్ని దేహాలూ కుర్రతనాన్నే తలపోస్తాయి ఒకింత చురుకైన విద్యుత్తు రోడ్లమీద కదుల్తుంది రోడ్డన్నీ కాంతి కాంతి! | ఎపుడో పారేసుకున్న రంగు ఇపుడు బతుక్కంటుతుంది ఎపుడో కోల్పోయిన రంగులపాటో మాటో వాటినీ దాటిన చూపో హఠాత్తుగా తలపుకొస్తుంది దేహమే కాదు మనసూ రంగెక్కుతుంది ఇవాళ అస్తవ్యస్తమే సవ్యం జుట్టు చెదరడమే సౌందర్యం రంగు రంగుల మరకలే ధవళ వస్త్రాలకు కుదురైన అద్దకం కాసింత చుక్కలా కాదు నుదురంతా నదై పారేదే బొట్టు! కరచాలనం కాదు సకల మిత్రుల వర్ణచాలనమే సిసలైన కాన్క! లోలోపల ఏవో లోయల్లో కూలిన గొప్ప జ్ఞాపకాలల్లా ఇవాళ రంగుల్లో తడిసి తాజాగా జు వేళ్ళు మాట్లాడే నేల ప్లస్? ఈ
మళ్ళీ రక్త నాళాల్లోకి ప్రవహిస్తాయి
మనం (ప్రేమించే రంగుల పరవశాలు
మనల్ని తడిపితేనే హోళీ!
మనల్ని సొంతంగా వివర్ణపరిచే
కల్తీ రంగుల్ని కబళించడానికైనా
సహజమైన హోళీని బతికించుకోవాల్సిందే!
3-03-998 'ఆంధ్రవ్రభ' వారవత్రిక 08-23-1999 గ్ దర్భశయనం శ్రీనివాసాచార్య క్రి
రెండు తోటలు
నేల లోతుల్లోంచి వేల చేతులు
మోసుకొచ్చిన ద్రవ్యకాంతి ఇది
ఈ ఖనిజమూ ఈ బొగ్గూ ఈ సున్నపురాయీ
భూగర్భ కాంతి అంతా లేచొచ్చి
ఇక్కడ పరుచుకున్నట్లే వుంది
ఇది ఉప్పతీరం ఇది ఉక్కుతోట " బొగ్గు జ్వలిస్తే చెమట ్రవిస్తే ఖనిజం ద్రవిస్తే
ఎరైర్రని లోహనదీ కాంతి!
నది ప్రవహిస్తూంటే అగ్నిపూలు లేస్తున్నాయి . నది ఘనీభవిస్తే రాటుతేలిన ఉక్కుముక్క!
ఈ ఉక్కుతోటలో ఎక్కడ తాకినా
నల్లని చెమట అంటుతుంది
చెమట లేకుండా అగ్నిపూలు పూస్తాయా?
ఉక్కు మనకు దక్కుతుందా
ఉక్కంటే యేంటి?
యుద్ధభూమిలో నిల్చిన వీరుడి గుండెకు - రెండో రూపం!
ఇక్కడే ఈ పక్కనే ఒక గులాబీ తోట
ఈ పాదులూ ఈ కొమ్మలూ
ఈ పూల సముదాయాలూ
ఇది పరిమళ తీరం ఇది సుకుమార గీతం
ఎన్ని దోసిళ్ళ నీళ్ళో ఎన్ని సవరింపులో
ఎన్ని చెమటల జోహార్జో
కలగలిసి ఉబికితే కదా ఈ గులాబీ పూలు! ఏ పువ్వును తాకినా సాకిన చేతియడేమ అందుతుంది
జజ వేళ్ళు నూట్లాడో వేల ఫక్తుక్తమ్త్తక్లున్లును్ల్లన్లున్లునకాాాన 61 ౪
చేతి పొరల్లో పారిన
చెమట ఆఅర్దత అంటుతుంది
చెమబే లేకుంటే గులాబీలు పూస్తాయా
సుకుమారాలు మనకు దక్కుతాయా
గులాబీ అంటే మేంటి?
పేమ తీరంలో చేరిన మనిషి హృదయానికి
రెండో రూపం!
అటు ఉక్కుతోటా ఇటు గులాబీ వనం
'ర0డూ మనిషి పెంపకమే
ఇతడెంత వింత తోటమాలీ!
మనిషి లోహంలా ద్రవిస్తాడు
మరుగుతాడు చల్గారుతాడు చిక్కబడతాడు
మనిషి పుష్పంలా సౌందర్శ్యిస్తాడు
పరిమళిస్తాడు గాలితో వీస్తాడు
నల్టెసలా ఆలవోకగా ప్రసరిస్తాడు
అది ప్రేమో పోరాటమో
సందర్భం చెబుతుంది
మనిషి గులాబీ మొక్కా కాగలడు
అళనే ఉక్కుముక్కా కాగలడు
(భిలాయ్ ఉక్కు కర్మాగార ప్రాంగణంలోనే ఓ గులాబీ తోటను చూసాక)
ర5-03-7998 ఆంధ్రభూమి దిన వత్రిక 05-04-9899 వ్ల 82 అతా ుుమమమమమమముుుుుుుుముుాుమముమమ్లు దద్భళయనం శ్రీనివాసాచార్య న!
కోయిలా! ఒకప్పుడు ఒక మామూలు మొక్కనే - నాలుగు కొమ్మలు కాసిన్ని ముడుచుకున్న ఆకులు మొహమాటపు చిగుళ్ళూ అణిగిమణిగిన దిగుళ్ళూ దరిదాపులా ఎదారీ లేనిచోట ఒంటరి తపస్సు నిల్చున్న యాత్రను నేను ఒకానొక అనుకోని వేళ నాలో కొత్త అలజడి కొంత కుదుపు ఒక ఊపు ఎవరో మీద వాలినట్లయిన స్పృహ చూద్దును కదా నువ్వే ఓ కోయిలా! నా నిశ్శబ్దపు అలవాటు మీద నీ అలవాటును వాల్చావు గొంతు పెకిల్చి! నా నిండా పాటల సంపుటాల్ని పేర్పావు బరువు కాని బరువు ఒక కొత్త సంరంభం దేహమ్మీద వసంతాల వాగు మలుపుల వాగు పిలుపుల వాగు ఎలా వచ్చి వాలావో కదా ఈ అపరిచిత ఏకాంత తీరమ్మీద - నీ పాటల పరవశంలో శాఖోపశాఖలై ఫలపుష్పభరితమై విస్తారకాంతి క్షేత్రాన్నయ్యాను ఇపుడొక చెట్టును కాదు అరణ్య సముదాయాన్ని - యాత్రలోంచి ఒంటరితనం ఎగిరిపోయింది నువ్వొచ్చి వాలాక - యాత్రలోకి స్వరలహరి చేరింది పాట కచేరీ మొదలయ్యాక - నేను పాడుతూంటే నువు వింటున్నానో నువు పాడుకూంటే నేనే వింటున్నానో అణి వళ్ళు మాట్లాడ నళ అానననననననిననననననన 6) అని
లేదా ఓ యుగళగీతమే సాగుతూందో
ఒకే రుతువు - వసంతం .
ఇక్కడ కాలచ[్రం నిండా పొదుగుకుంది
పత్రాల నిండా నీమీద ప్రేమ గీతాల పంక్తులు
చిగుళ్ళనిండా నీకై నిల్చిన తాజా ఆతిథ్యాలు
కొమ్మల నిండా నీకై వేచిన మెత్తని వేదికలు
కోయిలా!
సొంతింట్లో తిరిగినట్లే నాలో
నువు కదలాడుతున్నావు కనుకనే
నానిండా దట్టంగా అకుపచ్చదనం
చిగుళ్ళకిన్ని రుచులూ పువ్వులకిన్ని రంగులూ -
వాగు కదిలినంత సేపే నేనైనా
నా తపస్పైనా, తన్మయత్వమైనా!
కోయిలా నువ్వెగిరిపోతే
పాట అగుళుంది వాగు ఆగుతుంది
పరవశాలు కూలిపోతాయి
ఇక ఆఖరికేంటి?
అరణ్యం అంతరించాక మిగిలే నిళ్శబ్దం బీడు!
29-03-1998 వార్ల దినపత్రిక 01-08-1998 84 దత్భళయనం శ్రీనివాసానార్వ ఇక్
కాపలా
కంచె కాపుందని చేను విశ్వాసం
ఆకాశం నీడలో
పుష్పవ్యూహాలు ఫలమంతమవాలని
చేరాల్సిన నోళ్ళనే చేరాలని
స్వస్పిస్తూ వుంటుంది
నేలను నమ్మినట్లే కంచెనూ నమ్ముతుంది
బాహాటంగా పాటెత్తుకుంటుంది
పాట పరిమళాలు నేలంతా పాకి
ప్రజల్లో ప్రసరించాలని
రేపటి యాత్రను ఇవాళే రచిస్తున్న వేళ
హఠాత్తుగా ఒక్కుదుటున
కంచె శత్రువై చేనునే కాటేస్తుంది
పరమ భక్తి ప్రపత్తుల్తో జరజరా పాకుతూ వెళ్ళి
పశువుల కాళ్ళమీద పడుతుంది
అడ్డుపడతాయనుకున్న
కంచెలే దాసోహమంటూంటే
అసలు శత్రువుకు కొత్త ఆయుధం అందినట్టవుతుంది
కంచెల మీద పూలహారాలొచ్చి పడతాయి
చేను విశాల స్వప్న గీతం
నడుమనే ఆగిపోతుంది
కథ అలా ముగిసిందనుకుంటాం
కాలం ఎపుడూ కాకుండానే పోతుందా
స్వప్పాలు తెల్సిన ఆకాశం వర్షిస్తుంది
నేల్లోని అజ్ఞాత బీజాలు
మొక్కలై లేస్తాయి
చేను విరగబూస్తుంది
ఇపుడిక నిలబడింది కంచెనో శత్రువో
పోల్ప్చుకున్నాకనే చేను
పాటనెత్తుకుంటుంది
6-1998 వార్త" దినవత్రిక 03-01-1999
| (ప్రజాతంత్ర వారవత్రిక 1-1-1998
బ్ర వేళ్ళు మాట్లాడే వేళ కాను 06 పడు
బావి
మీ కెవరికీ కనపడదు బహుశా నా మాటల్లోకో మౌనంలోకో తొంగి చూస్తే ఆనవాళ్ళు దొరకవచ్చు దరి అందొచ్చు దరి పట్టుకుని మరీ దగ్గరైతే లోతూ తెలియొచ్చు బయటి వేసవికి నీళ్ళు అరి గలగలలంతరించి ఎడౌరీలోయవుతుంది బావి బుతువు చల్లబడితే నీళ్ళూరి కొత్త కలల సమ్మేళన వేదికవుతుంది బావి నా లోపల వుంటుంది వ్యూహంతోనే ఆటగానో ఎవరో రొయి విసురుతారు బావిలో నీళ్ళు గాయపడతాయి వాటి ఆనవాళ్ళను మీరు నా కళ్ళల్లో చూడొచ్చు ఎవరో ఓ పడవనో పువ్వునో నాలోకి వదలొచ్చు బావిలో పండగ సందడి నీళ్ళకు పరిమళాలు సోకుతాయి వాటి ఆనవాళ్ళనూ మీరు నా దేహమ్మీద పసిగట్టాచ్చు ప్రేమ ఉండాలి కదా! (ప్రేమలు కొరవడ్డ చోట లోపలి బావిని లోనే వుంచుతాను ఎవరికీ అందదు రహస్యబిలం
"ఏకాంత వేళల్లో బావిలోకి
అజం అంతే దదళయనం శ్రీనివాసాచార్య జి
తొంగి చూసుకుంటాను
బయట వేసవున్నా
లోపలి బావిలో నీళ్ళకై
దిగి తవ్వుకుంటాను జల దొరుకుతుందేమోనని!
బయట తుఫానాస్తే
నీళ్ళలో రక్తం చిందకుండా
బావి మీద రెండు చేతుల్నే కాదు
సమస్త దేవోన్నీ కప్పుతాను
కొన్ని అమృతవేళల్లో నీళ్ళు ప్రశాంతం
బావి తడి అద్దంలా నన్ను నేను పోల్చుకునేలా -
బావి నాకు సుపరిచితమే
ఇవాళ మాత్రం లోనుంచి కొత్త చప్పుడు విన్పిస్తే
చూద్దును కదా - లోన ఎవరో ఈత కొడుతూ -
సంభాషణ కూడా - పరిచిత ప్రాచీన భాష కొత్త రహస్యం తెల్సింది ప్రేమించడమంటూ తెలిస్తే బావి అందని దేమి కాదు ఎవరు ఎవరిలోకైనా దూకొచ్చు 13-06-1998 ఆంధ్రజ్యోతి దిన వత్రిక 26-04-1399
జజ వేళ్ళు మాట్లాడో వేల మ్ల? ఇన
సందడి ఎండ తాకీ తాకీ నేల్గోంచి ఎంత బతుకో ఆవిరైంది కదా! నా పాదాల్గోంచి కూడా! వాన ధాటిగా వాల్తూంటే అంతా హడానుడి నేలను చుడుతూ నీటి కాల్వల జాతర కాల్వల దేహాల మీద పార్గాడే ఆకూ, అలమూ, గడ్డీ, గట్రా - ఒక సందడి, గుంపు కోలాహలం (ప్రేమతో ఎవరెవరో రారమ్మని పిలుస్తున్నట్టు వర్షగాత్రం - తడి మునకల ఆనందంతోనే హోరు చూరుకింద ఒక అస్థిమిత స్థితి కూడా! అవిశ్రాంత తాడనం నేల్లోకి ఇపుడు బతుకు ప్రవహిస్తోంది నొ పాదాల్లో రూడా!] ఒంటరితనమంటే ఎండలో కాగీ కాగీ పగుళ్ళు బారిన నిష్ణబ్బపు ఇసుక కుప్ప! నల్గురితో బతుకం వానలో పిలుపుల్లో తడిసీ కాల్వల్లో మిశ్రమాల్లో మిళితమై దేహాన్ని బహిరంగ రంగస్టలిని చేసుకొని సకల మానవ లయల నేందడిని ఆహ్వానించడం అవిశ్రాంతమే, ఐనా ఆహ్వానించడమే - సందడి లేని తనం ఒక సమాధి స్థితే! 09-09-7996 అంధధబ్యోతి ఎారవత్రికు 23-70-1998 న. దర్భశయనం శ్రీనివాసాచార్య ప్రక
పిల్లలకు
భయాల చాటునో వినయాల మాటునో మాటల్ని పాతి పెట్టారా పిల్లల్లారా
వొద్దు
నిశ్శబ్ద కిరటాల బరువుకు
మీ శరీరాలు కుంగి పోతాయి
మాట్లాడండి పిల్లల్లారా తేలికవండి
ఎలా తోస్తే అలా
గుండె కొట్టుకున్నంత సహజంగా
మీ ఇష్టంగా ముచ్చటగా స్వేచ్చగా మాట్టాడండి తెల్లారగట్ల సూర్యుడే బాగున్నాడో
సూర్యుడి వెనకాల ఆకాశమే బావుందో మధ్యాహ్నం పూట పాఠాలే జడిపించాయో - పాఠాల టీచర్ బెత్తమే బెదిరించిందో సాయంకాలం ఆటలే మురిపించాయో
ఆటల తర్వాతి ఆఖరి గంటే మీ కష్టమో
ఎలా అనిపిస్తే అలా
చెప్పండి పిల్లల్లారా చెప్పండి
సంకొచాలొద్దు గొంతు బిగింపులొద్దు మాలాంటి పొడుగాటి మాటలే ఎందుకు సగం సగం మాటలో వొచ్చీరాని మాటలో ఒకటీ అరా మాటలో చాలు
అసలు మాటలే అందడం లేదా
కూతలేసి కేకలేసి చెప్పండి
కాసేపు పలకలూ బలపాలూ కొలబద్దలొద్దు పుస్తకాలూ రంగుల పులుముళ్ళూ వద్దు రాత్రి వొచ్చిన కల గురించో ఉదయం పూసిన పూల గురించో ఎండపూట కురిసిన వాన గురించో
కయి వేళ్ళు మాట్లాడే వేల పాలనను 00 అలి
చూసిందో విన్నదో తోచిందో
ఏదో ఒకటి చెప్పండి
ఉరకలూ ఉత్సాహాలూ సరేగానీ
ఇప్పుడిపుడే సెద్దరికాలు మాత్రం వద్దు
పెద్దల్గాంటి దాపరికాలూ వద్దు
మా మాటలా! పాతబడిపోయాయి
అచ్చంగా మాలా మొద్దుబారి పోయాయి
మ్సీరే మాట్లాడాలి
మీ మాటల సెలయేళ్ళలో తడిసి
మేం కేటపడాలి తేలికపడాలి
మాటల్ని పాతిపెట్టారా
మీరిక ఎంతకూ విష్పారరు
పూలు పూయరు పరిమళించరు
తోటల్లేక నేలంతా వొట్టిపోతుంది
మాట్లాడండి పిల్లల్లారా మాట్టాడండి
మాటల్ని మింగేసే
సకల భయాల్నీ వినయాల్నీ నిర్ణయగా పాతరపెట్టి
గొంతులెత్తి దిక్కులు దద్దరిల్లేలా మాట్లాడండి!
17-09-998 ఆంధ్రవ్రభ దిన వత్రిక 18-04-1999 జఖ90 దర్భళయనం శ్రీనివాసాచార్య క్లో
ఫైర్!
రాత్రి పూట అడవి తగలబడినపుడు
అగ్నినేమందాం
దగ్గమైన ఆకుపచ్చదనాన్ని అడగాలి
ఆదిగా అగ్నిని కనిపెట్టిన మానవుణ్ణి అడగాలి
భూమి నుంచి చెట్టును వేర్చేసే
అగ్శిని తృణీకరిద్దాం
భూమినీ చెట్టునూ మంచునుంచి
బతికించే అగ్నిని ఆహ్వానిద్దాం
అతను అతనే, ఆమె ఆమే, ఏకాంత కాంతి ఖండాలే. .
ఎవరి కలలూ కల్లోలాలూ వారివే ,
అతనూ ఆమే ఒక నీడలో సమ్మేళించినపుడు - ద్విగుణీకృత అద్వితీయ జీవనకాంతి సంరంభం
ఇద్దరు బతకడం ఇద్దరి కలలూ బతకడం
ఇద్దరి కాంతులూ బతకడం ఇద్దరి గొంతులూ బతకడం
ఇద్దరి ఇచ్చ్భాజనిత సంగమంలో
ఏ ఒకరూ ఆహుతి కాక
ఆమె ఆమెగా అతను అతనుగా విషప్పారడం
అదంతా రెండు స్వభావాల పరస్పర గౌరవ సాహచర్యం!
అలా కాదా
ఇద్దరున్నా ఒకరున్నారనే స్పృహ మరొకరికి లేదా .
ఒకరి కంటి నక్షత్ర భాషే మరొకరికి పట్టదా
ఎవరికి వారే గడియేసుకున్న ఒంటరొంటరి గదులా - అది అఫీసో వ్యాపారమో వ్యాపకమో అహంభావమో ఇద్దరి నడుమ ముళ్ళకంచై లేస్తున్నదా కంచె ఇంతింతై ఇనుప గోడై ఆకాశాన్నే తాకుళుందా గోడకటూఇటూ మిగిలేవి రెండు మంచు ముద్దలు " " మనిషి మంచు ముద్దెనపుడు అగ్నిలాంటి. తోడుకోసం ఓ అన్వేషణ!-... " అతనూ మరో అతనూ - అదొక స్నేహం 'న్న . ఆమె మరో ఆమే - అదీ ఒక స్నేహమే -
[22 వేళ్ళు నూట్తాడో కా నకకం తను = లా 91 కో
స్నేహాలన్నీ మానసిక తీరాల్లో
ఉద్యానవనాల పచ్చని సందడిని సృజించడానికే - స్పర్శల వంతెనల మీదుగా
ఒకరిలోకి మరొకరు సాగడం కదా సంగమం ఆమే అతనూ సమ్మళిస్తే అది సహజసంగమం ఆమే మరో అమె, లేదూ, అతనూ మరో అతనూ సంగమిస్తే అది అసహజమే!
సహజాలు బళతక్క వొట్టిపోయినప్పుడు
ఇక విస్తరించేవి అసహజులే!
సున్నితంగా రాగాలీనాల్సిన దాంపత్యాలు మొచ్డుబారిన తనాన్నే మోస్తున్నపుడు
ఆమె అమె కానప్పుడు, అతను అతను కానపుడు అసహజాలు తప్ప ఏం మిగుల్తాయి? అసహజాల్ని అర్ధం చేసుకోగలం
కానీ ధేమించగలమా
అమె లేని “అతనుల” ప్రపంచమైనా
అతను లేని “ఆమెల” ప్రపంచమైనా
సగంగా తెగి మొత్తంగా మూగబోయే రాగమే! బతుకులో అసహజాల్ని అనివార్యం చేస్తున్న దొరుణఖ వాతావరణమ్మీద "ఫైర్!
ముందు మొద్దుబారిన ఈనం బద్దలవ్వాలి
గోడలు దథేల్మని కూలీపోవాలి
మంచు కరిగి మనిషి ప్రవహించాలి
ఆమె ఆమెగా అతను అతనుగా - సమరమనివార్యమే ఇద్దరి నడుమ -
కానీ ఇది మిత్రసమరం।
సకల అహాంఛనీయాల్నీ రం చేసుకునేందుకు ఇద్దరూ అగ్నిలో దూకాలి లేవాలి
కొత్తకాంతిలో సహజాలు పల్లవించే ఆనేళ సంగమ తీరంలో సమ్మేళించేది
అతను ఆమెళ్తో, ఆమె జతనిత్తో స్‌ంయ? ల భా 02-02-౫89 (౧ రాజ్ ౮ తలో
హ్ల్లు92 యయా న కూ కా దర్భశయ్లుస్మ చీని సొచార్య ప్లూ
క న ల నం ఫం శీ జ ళ్ శు నాం న క ర ఇదీ "౯౪ ప్త నో ఖ్ న! జ వ క రాయసం ర ల్ ల్ క ం ఉ సంతు. ౮ ఇకో బా నాం ఇత... ౧౯లో టి గెక్టై క్షే వ తా టన్ను ను సంక 7లటనాట్ను పనన సక; ల. న స న. జ్ పుం న. | ళ్ క్ ఎపికి, వన న రక / క్ష శే ల ల “అ న | ల -ఛేపళ్లు ఉదాసీనత నేరం ఉదాసీనత నేరం . "శ మూలాలు కదలాలి మూలాలు కదలాలి | ( మూలాలేంటో దేహం దేహమంతా తెలియాలి ( $ జ. వేళ్ళే చెట్టెన కొత్త చిత్రం గీయాలి ష్ | స్షాల్లై ట్ 51 త దేశ పటమ్మీద పల్లెలు రాజధానులవ్వాలి సళ్ళ మ, గ్రా స | ఇకమీద చరిత్ర పల్లెల్లో కూర్చునిరాయాలి శ్లో " స తా [డా ధట || ఏ షల్ ఒసే సిద్ధాంత కర్తలారా భోక్తలారా నే ( " శ్తాచాతక్ గ [ వేళ్లు మాట్లాడే వేళ ఇది! ఖామోష్! సా | | పల్లెల మొదటి సంతకం లేందే వం
- , . ఇక ఏ ఒప్పందాలూ చెల్లవు జ క్ సు ” ఏ సిద్ధాంతాలూ బతకవు చు య ఏ ఉదారవాదపు వడ్డింపులూ సాగవు గాక సాగవు! ఖో జ న ల సహన ల నె కా జ్ స గ జక నన అంప కనా ( శా తవ న న చా / . యలు. రాలా 2 7 - ఎత లా కపి. "రం ఏ జహయు వా లం సళ ఇకా స గాం ట్ లై స చనల తకమానననిలాలాలాదమాలో నను స్ టన ము ౯ లు ట్ తి త /|