Telugu Vedhabhumi - anilvaranasi/indianlanguages GitHub Wiki
నసస్నటో పన్ న ఈ లె స్కాం అ స లా ఓ న న వం. ట్ర న స. . ప వు ప నా ల రన కన్ నం న నా [పం ఖా. స. లట స వసో ల ప న. ట్లు [లా 8.00.0న్ య౦0.యస్. స౦బూల్షిపార్ నాన ఎలు వ. మం మంట ఈ న్న క న న & ॥ హా య న ళ్ గ్గ క. మ! క న. రం హా న భన న నట న | 2. గం. మి వటం ॥ పాక్ గ్గ లో... లతల క ఫ్. న. క సంక జ! కట సీ క్ క్ నే శి కీ ( క్ష క్ న | 1 (1 కు /
ఇయం.యస్. నంబూద్రిపాద్ . ప్రజాశక్తి బుకహౌన్ ఎమ్వాచ్ భవన్, వ్లాట్నెం. 27/1, అజామాబాద్ ఆర్టిసి కళ్యాణమండపం వద్ధర హైదరాబాద్-26. ఫోన్ : 27660073
కే త్రాగ ఛ్ద ఢా కం. భి అనువాదం: ఎ.జి. యతిరాజులు మ్ ల్ జూ గ్ ( ప్రచురణ సంఖ్య : 242 ఓ క్ట వ్ ప్రధమముద్రణ : ఆగస్టు, 1987 జి స్ట మూడవ ముద్రణ : అక్టోబర్ , 2009 వెల; రు.15/- ప్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్ 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్ : 27608107 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, హన్మకొండ, నల్గొండ, గుంటూరు ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ ల స ఖా . | రి ం రిషం3మె ము | సెలాజ్త్ -- వా క |
ముందుమాట
“వేద భూమి” అనే శీర్షికన కామ్రేడ్ ఇయం.యస్. నంబూద్రిపాద్ మళయాళ భాషలో వ్రాసిన ఈ చిన్న పుస్తకం భారతదేశ సాంఘిక, సాంస్కృతికాభివృద్ధిని మార్చిస్టు దృక్పథంతో విపరిస్తోంది. భారతీయ నహాజాన్ని మార్కిన్స దృక్కోణంలో పరిశీలించగోరేవారికి ఇది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.
భారతదేశానికి ఆర్యులు రావడానికి ముందునుంచీ, ఆంగ్లేయులు వచ్చిన తర్వాతిపరకూ వున్న దీర్హకాల సాంఘికాభిపృద్ధిని ఆయన ఈ పుస్తకంలో పరిశీలించారు. దానితో పాటు భారతదేశంలో సంభవించిన మార్పులను కూడా వివరించారు. ఆర్యుల రాకకు పూర్వమే భారత ఉప ఖండంలో వారి కంటే వున్నతమైన సాంస్కృతికాభివృద్ధిని సాధించిన ప్రజలు వున్నారనే విషయాన్ని కామ్రేడ్ ఇయం.యస్. ప్రస్తావించారు.
అఆ సంస్కృతి పతనానంతరం అర్యులు సృష్టించిన వైదిక సమాజమూ, సంస్కృతీ ఏ విధంగా రూపుదెద్దుకుంటున్నాయి? అవి చాతుర్వర్ణంగా ఎలా మార్పుచెందినాయి? బానిసలు - యజమానులు పున్న పర్గ తారతమ్యం గల బానిస సమాజం ఎలా రూపొందింది? భారతదేశానికే ప్రత్యకమైన కులప్యపస్థ ఎలా ఉదయించింది? పర్ణష్యవస్థను (కులప్యపస్థసు) ఆధారం చేసుకున్నదే ఆర్యులు సృష్టించిన భారతీయ సంస్కృతి! పాశ్చాత్య దేశాలలో జరిగినట్లు పర్గ పోరాటాలు, సాంఘిక విప్లవాలు లేకనే భారతదేశంలో పురాతన కమ్యూనిస్టు సమాజం సశించి బానిస సమాజం ఎలా ఉద్భవించింది, దాని తర్వాత భూస్వాష్యు సమాజమూ, పెట్టుబడి సమాజమూ ఎలా ప్రారంభమయ్యాయి? అందువల్ల భారతదేశాభివృద్ధి ఎలా కుంటుపడింది? ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తుంది ఈ పుస్తకం. _
ఆర్య సంస్కృతి ప్రారంభంలో భారతదేశ సాంస్కృతికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేసింది. అయితే అదే తర్వాతి కాలంలో దేశాభివృద్ధి స్తంభించిపోవడానికీ కారణమయింది. మొదటి షుట్టంలో ఆర్య సంస్కృతి అనేకానేక ఆలోచనా రంగాలలో అభిప్ఫద్ధికి సాయపడింది. కానీ అదే అంధవిశ్వాసాలకూ ఆధారమయింది.. దీనికి కారణాలేమిటి? భారతీయ సమాజంలో ఆనాటి నుంచి నేటి పరకు ఆ ధోరణులు ఎలా కొనసాగుతున్నాయి?
ఏ
పలు భారతీయ భాషలెలా రూపొందాయి?
భారతదేశంలో ఆర్య సంస్కృతి, సంస్కృత భాషా, మౌర్య, గుప్త సామ్రాజ్యాలూ రూపొందించిన కాలంలో దక్షిణ భారతదేశాన (ద్రావిడ సంస్కృతీ, తమిళభాషా,చేర, చోళ, పాండ్య రాజ్యాలూ రూపుదెద్దుకున్నాయి. కాలక్రమంలో ఒకదాని ప్రభాపం మఠో దానిమీద ఎలా పడిందో విపరిస్తుందీ రచన.
భారతదేశం విదేశీ దండయాత్రల కెందుకు గురి అయింది? షౌర్య చక్రపర్తుల కాలం నుంచి, మొగలాయి చక్రవర్తుల కాలం దాకా పైస్థాయి పాలనా వ్యవస్థలో ఎన్ని మార్పులు జరిగినా, క్రింది స్థాయిలో వున్న గ్రామ స్వాపలంబన సామాజిక జీవితం మారనేలేదు. ఆంగ్లేయుల రాక తర్వాత అది ఎందుకు మారింది? బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోను, తదనంతరం నపభారతాన్ని నిర్మించడంలోను భారతీయ సంప్రదాయసిద్ధమైన వర్ణ (కుల) సంస్కృతి ప్రతి బింబాలు, ఆటంకాలు ఏవేవి?
- వీటన్నిటినీ ఈ పుస్తకంలో కామ్రేడ్ ఇయం.యస్. విపరించారు.
చివరగా, భారతీయ సాంప్రదాయ సంస్కృతిలో గర్వించదగిన అంశాలను ప్రశంసించి, అదే సమయంలో, తిరోగమనాంశాలను తీప్రంగా ఎదుర్కొపలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.
రేపటి నవ భారతాన్ని - సోషలిస్టు భారతాన్ని - సృష్టించడానికి కృషి చేసేవారు. నిన్నటి భారతాన్నీ నేటి భారతదేశాన్ని సమగ్రంగా తెలుసుకుని వుండాలి. గత కాలపు సంప్రదాయాలు, సంస్కృతులు భారతీయ సమాజంలో గాఢంగా రూపొందించిన భావాలను, వ్యవస్థలను, జీవన విధానాలను సంపూర్ణంగా అవగాహన చేసుకుని పుండాలి.
కొత్తమార్చులకు ఇవి సృష్టించిన ఆటంకాలను ఎదిరించి పోరాడాలి. పర్ణ (కుల) సంస్కృతికీ, జీవన పద్ధతులకూ, భావాలకూ బలియై వేలాది కులాలు విభజించబడి వున్న భారతీయ శ్రామిక ప్రజలను వర్గ రీత్యా సమీకరించి, సోషలిస్టు సమాజ స్థాపనకు పోరాదే బలమైన శక్తిగా మార్చడానికి ఇపన్నీ అత్యంతావశ్యకాలు.
మార్చిస్టు దృక్పథంతో ఈ విషయాలను అవగాహన చేసుకోవడానికి తెలుగు పాఠకులకు వుపయోగకరంగా వుంటుందనే కామ్రేడ్ ఇయం.యస్. గారి ఈ పుస్తకం అనువదింపబడింది.
- పి.ఆర్. పరమేశ్వరన్ గే
వేదభూమి బకటి
నా చిన్నతనంలో తామ్మిదప ఏట నుంచి ఆరేళ్ళ కాలాన్ని బుగ్వేదాన్ని సంపూర్ణంగా కంఠతా బెట్టటానికై గడిపాను. మా వంశ పారంపర్యంగా ఏర్పడిన సంప్రదాయం ఇది. అరవై సంవత్సరాలకు పూర్వమిది జరిగింది.
కేరళలోని 'నంబూద్రి' బ్రాహ్మణులు బుగ్వేదులు, యజుర్వేదులు, సామవేదులని విభజింపబడ్డారు. ఆయా శాఖలకు చెందిన బాలురు చిన్నతనంలో ఒక్కసారైనా వారి వారికి నిర్ణయింపబడ్డ వేదాలను గురువుగారి వద్ద ప్రత్యక్షంగా విని, వాటిని స్వయంగా పారాయణం చేసితీరాలి. వారిలో కొందరైనా తమ తమ వేదాలను. అనేక భాగాలుగా పలుమార్లు పారాయణం చేసి, కంఠస్తం చేసుకున్నారు. వారిలో నేనూ ఒకణ్ణి.
అయితే బట్టీ పట్టడం తప్ప, తాము పారాయణం చేసే వాటి భాపమేమిటో ఈ బాలురుగాని, వారి గురువులుగాని తెలుసుకుని వుండలేదు. ఆ కాలంలో వాటర్థం నాకూ తెలియదు. ఆ వేదాలను ఉచ్చరించడం వల్లనే తమ ఆత్మలతో పాటు ప్రపంచం మొత్తం కూడ ప్రయోజనం పొందగల ఏదో ఒక మహాత్తర శక్తి ఆ వేద శ్లోకాలలో వుందనేది అందరి విశ్వాసం!
ఈ వేదాలు బోధించడానికీ, పఠించడానికీ వసతులు సమకూర్చే మఠాలు, దేవాలయాలు పున్నాయి. వాటికి స్వంత ఆస్తులూ వున్నాయి. అక్కడ ఉచిత నివాసమూ, భోజన సదుపాయమూ వున్నందువల్ల బోధకులూ, విద్యార్థులూ అక్కడకు వచ్చి చేరేవారు. ఆ విధంగా నంబూద్రి (బ్రాహ్మణుల సాంఘిక, సాంస్కృతిక జీవితంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని అర్థమే బోధపడని వేదాలను ఉచ్చరించడానికీ, అభ్యసించడానికి వ్యయ పరుస్తుండిన కాలమది! నంబూద్రి బాలురు స్కూళ్ళలో చదువుకో నారంభించిన తర్వాత కూడా ఇది కొనసాగింది; ఈనాడూ కొనసాగుతోంది.
దీనికి విరుద్ధమైన పరో అంశంకూడా వుంది. నంబూద్రి బ్రాహ్మణులకు తప్ప పేరేవరికీ వేదాలను ఉచ్చరించడానికో, అభ్యసించడానికో అర్హత లేదు. అర్హతలేని నిమ్న జాతులవారు అర్జత్రగల వారు చేసే వేదోచ్చరణను విన్నా కూడా 'పాపం చుట్టుకుంటుంది.
ర్
అర్హత గల నంబూద్రి బ్రాహ్మణుల్లో కూడా ప్ర్రీలు పురుషుల వేదోచ్చారణను విసపచ్చునే గానీ స్వయంగా ఉచ్చరించడానికో, నేర్చుకోడానికో అనర్హులు. కొన్ని శాఖల సంబూద్రి కుటుంబాలకు చెందిన పురుషులు కూడా ఒకసారి గురుపుగారి వద్ద విని,పారాయణం చేయవచ్చునే గానీ, స్వయంగా వేదాధ్యయనం గావించరాదు.
అనగా, సమాజంలోని అల్బ సంఖ్యాకులకు తప్ప. అత్యధిక సంఖ్యాకులకు పేద పారాయణమూ, వాటి అభ్యాసమూ నిషేధింపబడింది.
అయితే ఒకటి, ఒకటిన్నర శతాబ్దాలుగా నంబూద్రి బ్రాహ్మణులు నీచమైందిగా భావించి తిరస్కరించిన అధర్వణ వేదంతో సహా నాలుగు వేదాలనూ ప్రపంచం మొత్తానికి చెందిన విద్వాంసులు, మేధావులు లోతుగా పరిశోధించారు. వాటితోపాటు ఉపనిషత్తులు, విజ్ఞానానికి సంబంధించిన అనేక (గ్రంథాలు, పురాణేతిహాసాలు, కావ్యాలు, నాటకాలు మొదలైన సాహిత్య (గ్రంథాలన్నిటినీ వారు తమ పరిశోధనకు వాడుకున్నారు. ఇపన్నీ భారతదేశంలో రచించబడ్డ కాలాన, ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో సృష్టించబడ్డ (గ్రంథాలతో వీటిని పోల్చి చూశారు. ఈ విధంగా వారు ప్రాచిన భారతదేశానికి చెందిన తత్వశాస్త్రం, విజ్ఞానం, సాహిత్యం మున్నగువాటిని మతమనే పవిత్రమైన తెర ఏదీ లేకుండా వైజ్ఞానికంగా అధ్యయనం చేసే ఒక కొత్త విజ్ఞాన శాఖనే అభివృద్ధి చేశారు.
ఈ పనిని జర్మనీ, యితర ఐరోపా దేశాలే మొదట ప్రారంభించాయి. క్రషు క్రమంగా యిది భారతదేశంలో కూడా విస్తరించింది. ఈ విధంగా భారతదేశం గురించి నవిపరంగా తెలుసుకోవడానికి వీలు కలిగించే ఎన్నో [గ్రంధాలను భారతీయులు, భారతీయేతరులూ రచించారు. ఆ క్రమం ప్రస్తుతం కూడా కొనసాగుతూనే వున్నది దీని ఫలితంగా విద్వాంసులందరూ వచ్చిన నిర్ణయం యిది; సమకాలీన వేరే ఏ యితర సంస్కృతికీ ప్రాచిన భారతీయ సంస్కృతి తీసిపోయింది కాదు.
భారతీయులైన మనమందరం గర్వించడగ్గ యీ సంస్కృతి, సృష్టికర్తలు చరిత్రలో “ఆర్యులిని, చెప్పబడుతున్నారు. . ఈ కారణంగా ప్రాచీన భారతీయ సంస్కృతిని “ఆర్య సంస్కృతి' అని, ఆ సంస్కృతీ ఉద్గమ స్టానాలుగా వేదాలు ఉన్నందుపల్ల “వైదిక సంస్కృతి" అని పండితులు పేర్కొంటారు.
ఇదే భారతదేశానికి చెందిన మిక్కిలి ప్రాచీన సంస్కృతి అనీ, దీన్ని సృష్టించిన ఆర్యులు యిక్కడకు రాకమునుపు యిక్కడ నిపళిస్తున్న ప్రజలు మిక్కిలి అనాగరీకులుగా వున్నారనే నేను పాఠశాల విద్యార్ధిగా వున్నకాలంలో భారతదేశ చరిత్ర పాఠ్యపుస్తకాలు మాకు బోధించేవి. అంతకు మునుపు వ్యాపించి పున్న వేదాలు పవిత్రమైనపనే భావనసు బలపరచే చారిత్రక దృక్చథంగా యిది వుండేది.
పూర్వం వుంటూ వచ్చిన అభిప్రాయలలాగానే యిధి సరియైనది కాదనే విషయాన్ని నిరూపించగలిగే అనేక సత్యాలను చారిత్రక పరిశోధీకులు కనిపెట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్లో వున్న మొహంజొదారో, హరప్పా అనే చోట్లలో భూమిలోనుంచి పలికితీయబడ్డ అవశేషాలు
6
ఒక విషయం స్పష్టం చేశాయి. అదేమంటే, భారతదేశానికి అర్యులు రాపడానికి అనేక శతాబ్దాలకు మునుపే, వారికన్నా అభివృద్ధి చెందిన ఒక (ప్రజా సమూహం ఆనాటి భారతాపనిలో పున్నారన్న విషయం.
ఈ నిజాన్ని తెలిపే వస్తుపుల అపశేషాలు 'సింధునది ఒద్దున వెలికి తీయబడినందు పల్ల అవి సూచించే సంస్కృతికి “సింధు సంస్కృతి" అనే పేరు వచ్చింది. దానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా వెలికి రాపలసే పున్నవి. దానికోసం పరిశోధనలు, పరిశీలనలు జరుగుతూనే పున్నాయి. అయితే ఒక విషయం మాత్రం నిస్సందేహంగా నిరూపించబడింది. ఆర్యులు రాకపూర్వం భారతదేశం అనాగరిక ప్రజల సమాజంగా పుందనే అభిప్రాయం పూర్తిగా తప్పు.
ఆర్యుల రాకతోనే భారతదేశంలోసాంస్కృతిక అభిప్ఫద్ధి ప్రారంభమైందనే వాదనకు దక్షిణ భారతదేశం నుండి బలమైన దెబ్బతగిలింది. ఇక్కడి భూమి నుండి త్రవ్వి తీయబడిన అపశేషాలు మాత్రమే గాక, ఆర్యుల భాషయైన సంస్కృతం నుంచి పూర్తిగా భిన్నమైన ఒక స్వతంత్ర భాషా, అందులో రచింపబడ్డ సాహిత్య [గ్రంథాలు పరిశోధకులకు దక్షిణ భారతాపనికి చెందిన ఒక ప్రత్యేక సంస్కృతి వుండేదని విస్పష్టంగా తెలుపుతున్నాయి. ఉత్తర భారతదేశంలో రూపొందిన సంస్కృతానికి ద్టైన దక్షిణాది 'ఆశంతమిళో భాషా, అక్కడి పౌర్యగుప్త సామ్రాజ్యాలకు దీటైన చేర, చోళ పాంద్య సాఘ్రూజ్యాలు ఏర్పడినందువల్ల దక్షిణ భారతదేశం పూర్తిగా ఆర్యులపైన ఆధారపడిందనే అభిప్రాయం తప్పని తేలిపోయింది.
అయిత్తే సింధు సంస్కృతికీ, దక్షిణ భారతదేశంలోని ద్రావిడ సంస్కృతికి వున్న గొప్పదనాన్ని అతిశయోక్తిగా చెప్పడమో, ఆర్యులచే సృష్టించబడ్డ వైదిక సంస్కృతి గొప్పదనాన్ని తక్కుపచేసి చెప్పదమో పొరపాటే అవుతుంది. వైదిక సంస్కృతి కన్నా పురాతనమైనదైనప్పటికీ, దానికన్నా ఎంతో అభివృద్ధి చెందినదైనప్పటికీ సింధు సంస్కృతి సజీపంగా లేదు. ఆర్యులు రాకకు మునుపే అది నశించనారంభించిందనే విషయంలో సందేహం లేదు. ఆర్యుల రాకకు పూర్వమే అది పూర్తిగానశించిందా లేక వారి దండయాత్రలు ముందుకు సాగుతున్నపుడు అది నశించిందా అనే విషయంలో మాత్రమే పండిళులు భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సింధు ప్రజలు ఆర్యుల ఆక్రమణలను నిరోధించి వారిని జయించలేకపోయారనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.
దక్షిణ భారతదేశం తన స్వంత సంస్కృతిని సృష్టించుకున్న తర్వాత, అది ఉత్తర భారతదేశంలో అభిప్ఫద్ధి చెందిన ఆర్యుల సంస్కృతితో అనక రకాల సంబంధాలకు లోనైనది. సైనిక పరమైన దండయాత్రలు, వాటి నెదుర్కోవడాలు, వాణిజ్య రంగంలోని ఇచ్చి పుచ్చుకోపటాలు, అనేక మత బోధకులనుంచి ప్రజలు పొందిన ఉపదేశాలు, భాషా, సాహిత్య రంగాలలో ఏర్పడ్డ పరస్పరావగాహనలు - ఇపన్నీ అర్య ద్రావిడ సంబంధాలలో చాలా ముఖ్యమైన మార్పులు తెచ్చిపెట్టాయి. దక్షిణాది ప్రభావం ఉత్తర దేశంలోను, ఉత్తరాది ప్రభావం దక్షిణ దేశం లోను పడసాగింది. అయితే ఇందులో మొదటి దాని కంటె రెండవదే అధిక బలపత్తరమైనది.
7
అనగా, ఆర్యుల రాకకు పూర్వం భారతదేశం అనాగరీకంగా పుందేదనే అభి'ఘ్రాయాన్ని తొలగించే సమయంలోనే మరో విషయం కూదా స్పష్టపరచాలి. సింధు సంస్కృతి పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ సంస్కృతీ శూన్యతను నింపడానికి సహాయపడిన ఒక సంఘటన మాత్రమే ఆర్యుల ఆగమనం: సింధు సంస్కృతితో పోల్చి చూచినపుడు వెనుకబడ్డ వారుగా వున్నప్పటిక, ఆర్యులు ఇక్కడకు పచ్చినప్పటి సుండి భారతీయ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముఖ్యమైన పాత్రనే పహించారు.
ఆర్యుల రాక తర్వాత వరుసగా జరిగిన సామాజికాభిప్పద్ధి ప్రాధమిక దశను బుగ్వేదంలోని మొదటి భాగాల్లో చూడవచ్చు. దానిలోని ఇతర భాగాల్లోను, మిగతా వేదాల్లోను, తత్వశాస్త్రం - విజ్ఞానానికి సంబంధించిన ఇతర (గ్రంధాల్లోను, కావ్యాలు - నాటకాల వంటి సాహిత్య (గ్రంధాల్లోను, పురాణేతిహాసాల్లోను కొత్త ఆర్య సంస్కృతి లేక వైదిక సంస్కృతి యొక్క క్రమాభివృద్ధిని పరికించపచ్చు. ఈ అభివృద్ధి ద్రావిడ ప్రజల్లోను, వారి సంస్కృతిలోనూ ప్రతిబింబించింది. అదే సమయాన ద్రావిడులు కూడ ఆర్య సంస్కృతాభివృద్ధిలో తమ పాత్రను నిర్వర్తించారు. ఆర్య- (ద్రావిడ సంస్కృతులు పూర్తిగా ఏకాకి అయినవికావని దీనర్ధం.
ఈ విధంగా సింధు సంస్కృతీ పతనానంతరం ప్రాచీన భారతదేశంలో ఆర్యులు ఒక కొత్త సంస్కృతిని సృష్టించగలిగారనటంలో కొత్తదనమేమీలేదు. భారతదేశంలోపలె ఇతర దేశాలు కూడా ఇలానే అభిప్పద్ధి చెందాయి.
ఇక్కడ నెలకొన్న సింధు సంస్కృతిలాగానే, అదే సమయంలోను, దానికి ముందు పశ్చిమాసియాలోను, ప్రస్తుత చైనాలోను కొన్ని సామ్రాజ్యాలు, సంస్కృతులు ఉదయించి వున్నాయి. వాటికి సంబంధించిన సత్యాలను ఇంతపరకు చెప్పినవాటి కంటె ఎక్కుపగా పరిశోధించపలసి వున్నది. అయినా, సామ్రాజ్యాలు, సంస్కృతుల ఆవిర్భావం, అభిపృద్ధి, పతనంమొదలగు వాటిద్వారానే చారిత్రక పూర్వసమాజం చారిత్రక కాలం వైపు అభిప్ఫద్ధి సాగించిందని నిస్సంశయంగా చెప్పవచ్చు.
సింధు సంస్కృతి పతనానంతరం భారతదేశంలో ఆర్యుల సంస్కృతీ, మౌర్యుల, గుప్తుల సొమ్రాజ్యాలు ఉదయించినట్లుగా అదే సమయాన ఇతర (ప్రదేశాల్లో కూడా వాటికి సాటివచ్చే అనేక సంస్కృతులు, సాయమ్రాజ్యాలుదృవించాయి. వీటిలో ప్రధానంగా ేర్కొనదగినది ప్రాచీన గ్రీస్ దేశం. -
తత్వశాస్త్రం, విజ్ఞానం, సాహిత్యం, ఇతివోన (గ్రంథాల్లో భారతీయ అర్య సంస్కృతినీ, ప్రాచీన గ్రీస్ సంస్కృతినీ సరిపోల్చి పరిశోధించడానికి చాలా ముంది మేధావులు పరిశీలించారు. తరువాతి కాలంలో అభివృద్ధి చెందిన యూరపు సంస్కృతికి పునాదివేసినది గ్రీసూ, రోమూ అనే విధంగానే, భారతీయ సంస్కృతికి పునాది వేసినది ఆర్యుల ఆగపుసమే అన్ననిజాన్ని ఇంచుమించు అందరూ అంగీకరించారు.
అనగా, (ప్రాచీన సంస్కృతుల పుట్టుక, వికాసం, పతనం మున్నగు వాటికొక సామాన్యమైన విషయముంది. వాటిలో ఏదీ కూడా శాశ్వతంగా స్థిరంగా వుండిపోలేదు.
వ
కానీ అవి తాము పున్నకాలంలో ఒక్కొక్కటీ మానవ సమాజాభివృద్ధికి అంచనా కట్టలేని తోడ్పాటునిచ్చి వున్నవి. ఆ తోడ్పాటును ఎక్కువచేసి చూపడం లేక తక్కువ చేసి చెప్పడం ఇదే పలువురు చేస్తున్నారు. తపుతో కలిసిపోయిన సంస్కృతి పరిమాణాన్ని వున్నదానికన్నా అధికం చేసి చూడడం, ఇతర సంస్కృతీ అంశాలను దెబ్బతీసి క్రింద పడవేయడానికే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దానికో ఉదాహరణ ఇంతకు ముందు చెప్పిన ఆర్య - ద్రావిడ సంస్కృతులను సరిపోల్చి కొనసాగింపడుతున్న తగాదా! రెండు _ ఓకదాని వెంట ఒకటిగా సంస్కృతులు పుట్టడం, వృద్ధిచెందడం, పతనం చెందడం వెనుక పనిచేసే శక్తి ఏది? ఈ ప్రశ్నకు చరిత్ర పండితులు చెప్పే జవాబిదే: ప్రాణంతో జీవించడానికీ, జీవితాన్ని మరింత సుఖప్రదం చేసుకోవడానికీ మానవుడు ఎల్లప్పుడూ ప్రకృతితో పోరాడుతుంటాడు. ఈ పోరాటంలో భాగంగా ప్రజా సమూహాలు పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆక్రమణలు, పశపరచుకోవడాలు, బానిసలనుగా చేసుకోవడాలు, __ కలహాలు జరుగుతాయి. ఇపన్నీ నడపడానికి కాపలసిన యుద్ధనైపుణ్యం, దానికి అవసరమైన విజ్ఞాన విశేషాలను కనిపెట్టే ప్రయత్నంలో సమాజంలోని ఒక వర్ధంవారు నిమగ్నులౌతారు. వారి చర్యలు ప్రకృతికి నంబంధించిన జ్ఞానాన్ని మానవుడు అనేక విధాలుగా ఉపయోగించుకోవడానికి దోహదం చేస్తాయి. ఈ విధంగా అనాగరీకంగా వున్న మానవుడు తరతరాలుగా నాగరీకుడుగా మారిన గాథే చరిత్ర. దీనికి సంబంధించి రెండు ఘట్టాలున్నాయి. వ్రాయడం, చదవడం రెండూ మానప్త జీవిత భాగాలుగా లేని కాలమొకటి. అప్పుడు మానవ వికాస గాధను వ్రాసి వుంచడానికి వీలుపడదు గదా! చరిత్ర వ్రాతలో లేని కాలమది! తర్వాతి కాలంలో వ్రాయడం, చదవడం ప్రారంభమైన తర్వాత ఆక్రమణలు, వశపరచుకోటాలు, ప్రేమలు, కుటుంబ సంబంధాలు మున్నగువాటి నన్నిటినీ వ్రాసి వుంచనారంభించారు. చరిత్ర ప్రాతలో లేని దశ నుంచి, వ్రాయబడ్డ చారిత్రక కాలానికి మానవుడు ్రవేశిస్తున్నాడు. ఇదియే చరిత్రకు సంబంధించిన రెండవ షుట్టం: అయితే చరిత్ర వ్రాతలో లేని కాలానికి సంబంధించిన కొన్ని చారిత్రకాధారాలు ప్రకృతి నుంచి మనకు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని మొహంజౌదారోలోను, హరప్పాలోను వెలికి తీయబడ్డ శిధిలాలు నశించిపోయిన సింధు సంస్కృతి విలసిల్లిన కాలంలో అక్కడి మానవ సమాజం ఎలా వుండేదనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఇవి కొంత వరకు తోడ్పడతాయి. క్ర
ఈ శిథిలాలలో కొన్ని ఇటుక ముక్కలు దొరికాయి. వాటివల్ల ఆ ప్రజలకు వ్రాయడం, చదవడం, తెలిసి వుందని తెలుస్తోంది. “సింధులిపి” అనబడే ఆ లిపిలో ఏమి వ్రాయబడి వుంది? ఆ లిపి ఎంత పరకు ప్రచారంలో వుండేది? ఇటుపంటి ప్రశ్చలకింకా జవాబులు కనుగొనవలసే వుంది.
కానీ, ఈ శిథిలాలన్నిటినీ పరిశీలించే వారెవరైనా, బుగ్వేద శ్లోకాలు గాసం చేస్తూ తిరుగుతుండిన ఆర్యులకన్నా సింధు ప్రజలెంతో నాగరికమైన సమాజాన్ని కలిగి వున్నారని నిస్పందేహంగా చెబుతారు.
లిపిబద్ధం చేయబడ్డ చరిత్ర ప్రారంభమైన తర్వాత వున్న పరిన్భితులను పరిశీలించేటప్పుడు ఒక చిక్కు కలుగుతుంది. వేదాలతో సహా ఏ (గ్రంథాన్నీ అలాగే మనం గ్రహించరాదు. వాటిని రచించినవారు తమ స్వంత దృక్చధాలను, ప్రయోజనోలను ఆధారం చేసుకునే వాటిని రచించారనే విషయాన్ని మరువరాదు. ఈ గ్రంధాలన్నిటినీ కూలంకషంగా పరిశీలించాలి; వైజ్ఞానికంగా పరిశోధించాలి. ఇలా చేయడం చాలా ముఖ్యం.
వీర సాహస ఇతిహాస గాథలు, ఐతిహాస్యలు, సంప్రదాయాలు, అనేకానేక దేవతల నారాధించడం వెనుక వున్న సిద్ధాంత వివరణలు - వీటన్నిటికి ఆధారంగా ఒక ఆర్థిక వాతావరణం వుందనే విషయం (గ్రహించి, కఠిన ప్రయత్నాలతో విజ్ఞాన రీత్యా మానప సమాజ చరిత్రను, దానిలో ఒక భాగంగా భారతదేశ చరిత్రనూ, ఆధునిక విద్వాంసులు రచిస్తున్నారు.
ఈ ప్రాతిపదికనే ఆర్యుల రాకను, తదనంతర భారతదేశంలో కలిగిన సాంఘిక- సాంస్కృతిక మార్పులను పరిశీలించి అంచనా గట్టాలి. ఈ విధంగా అనేక మంది పండితులు చేసిన పరిశోధనల వల్ల కొన్ని విషయాలు స్పష్టమైనాయి.
ప్రాచీన భారతదేశంలో ఆర్యులు - ద్రావిడులు అనే రెండు వంశాలకు చెందిన వారు మాత్రమే వున్నారనీ, మొదటివారు రెండవవారిని ఆక్రమించి ఆధిక్యత సంపాదించారనే వాదం ఆధార రహితమైనది ఈ పండితులు అభిప్రాయపదడుతున్నారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఆర్యులందరూ ఒకే మానవ వంశానికి చెందినవారుకారు. వారిలో పలు గోత్రాలకు చెందినవారున్నారు. (బ్రతుకు తెరువును వెదుక్కుంటూ కొత్తప్రదేశాలకు చేరుకోనడం, అక్కడివారిపై ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించిన వారిలో వేర్వేరు (గోత్రాలకు చెందినవారున్నారు.. వారిలో వారికి కూడా పలు సంఘర్షణలు చెలరేగాయి. వారి ఆక్రమణలకు గురైన ప్రదేశాలలోని ప్రజలు కూడా విభిన్న గోత్రాలకు చెందివారున్నారు. ఈ విధంగా “గోత్ర మనే వర్గ సమాజం పతనమవుతున్న కాలంలో నివాస స్టలం, పశుగణాలను మేపడానికి గడ్డి మైదానాలు, ఆహార సంపాదన, ఆహార వస్తువుల ఉత్పత్తి మొదలగు సమస్యలతో పరస్పరం సంఘర్షించుకుంటున్న ప్రజా సమూహాలలో ఒక సమూహానికే 'ఆర్యూలనే పేరు ఏర్పడినది.
ఈ పేరు వారికి కలగడానికి గల కారణం గురించి కొంత మంది విద్వాంసుల అభిప్రాయమిది: సమాజంలో మెల్ల మెల్లగా ఏర్పడుతున్న అభివృద్ధి ఒక సమూహానికి
10
చెందినవారిని ఇతరుల కంటే వున్నతమైన సాంస్కృతిక దశకు తీసుకెళ్ళింది. వారు ఇతరులకన్నా సుసంపన్నమైన భాషను రూపొందించారు. ఈ విధంగా సుసంపన్నమైన భాషే “ఆర్య భాషొ అని పేర్కొసబడినది. ఇదే తర్వాత “సంస్కృతి భాషగా వికాసం చెందింది.
ఈ భాషనుపయోగించిస, అభిప్పద్ధి చెందిన సమూహాలవారు విభిన్న గోత్రాలకు చెందినవారుగా వున్నారు. వీరందరూ 'ఆర్యులనే పంశీకులు కారు. విభిన్న మానవ పంశీకులలో ఒక చిన్న వర్గీయులు సాధించిన అఖిప్పద్ధిని సూచించే 'ఆర్య భాషును రూపొందించి, దానినుపయోగించి “బుగ్వేదం? లాంటి (గ్రంథాలను సృష్టించినవారే “ఆర్యులయ్యారు.
దీనిని, దీనిపంటి వివాదాస్పదమైన కొన్ని సమస్యలను వదలివేసినా, ఒక విషయం విస్పష్టంగా తెలుస్తోంది. సింధు సంస్కృతి పతనానంతరం ఆ ప్రదేశంలో ఏర్పడ్డ శూన్య పరిస్టితులలో ప్రవేశించిన 'ఆర్యులినే సామాన్య నామధేయంతో గుర్తింపబడే ప్రజా సమూహం అంతవరకు అక్కడ నెలకొని వున్న గోత్రవర్గ సమాజాన్ని నాశనం చేసి, ఒక కొత్త సమాజం రూపొందడానికి సహాయపడ్డది. సింధు సంస్కృతికన్నా ఆర్యులు వెనుకబడిన స్థితిలో వున్నా అప్పుడక్కడ నివసిస్తోన్న గోత్ర వర్గ ప్రజాసమూహం కంటె "అభివృద్ధి చెందివున్నారు. తపు ఆక్రమణకు గురియైనవారివి కన్నా ఆర్యుల ఆయుధాలు పదునైనవిగాను, వారి వాహనాలు వేగపంతమైనవిగాను వున్నాయి. వాటి సహాయంతో ఆర్యులు స్థానిక గోత్ర వర్గాలవారిపై ఆధిక్యత సంపాదించి, వారి భూములను, ఆస్టులను స్వాధనపరచుకుని, తపము ఆక్రమణకు బలైనవారిని దాసులుగా-బానిసలుగా- చేసుకుని- వారిచే నిర్బంధంగా పనిచేయించగలిగారు.. ఈ విధంగా “ఆర్యులినీ, బానిసలు చేయబడ్డ 'దాసులనీ సమాజం రెండు భాగాలుగా చీలింది. ఇంతవరకు తెలిసిన నిజాలను బట్టి భారతదేశంలో వర్గ విభజన- ఉన్నతులు, నీచులనే తారతమ్యంగా (ప్రారంభమైంది. ఒక సమాజానికి చెందిన ప్రజలందరూ తిండి, బట్ట, ఇల్లు మొదలగు తమ జీవితాపసరాలను ఒకే విధంగా పొందడంలేదు. కొందరు వ్యవసాయం చేస్తే, మరికొందరు కుటీర పరిశ్రమలలో పాల్గొంటారు. కొందరు దైవారాధనలో నిమగ్నమైతే, మరికొందరు శత్రుపులను సంహరిస్తారు. వీరందరికీ వారి వారి స్వంత అనుభవాలుంటాయి. ఈ అనుభవాల మార్గదర్శకత్వంలో ఒక్కొక్క వర్గానికి చెందినవారి భావాలు, ఆలోచనా ధోరణులు రూపొందుతాయి. ఇటువంటి ప్రత్యేకతలున్న ప్రజా సమూహాన్నే “వర్గాలని చెబుతారు.
ఇటువంటి సంఘటనలే ప్రపంచంలోని కొన్ని ఇతరచోట్ల కూడా ఈ కాలంలోనే
" జరిగాయి. భారతదేశంలో ఆర్యులూ, దాసులూ 'రూపొందినట్లే, ప్రాచీన గ్రీసు దేశంలో బానిసలూ, యజమానులూ రూపొందారు. ్రజు సమూహంలో అత్యధికులైన బానిసలచే పనిచేయించి, యజమానులు జీవించే పద్ధతినే “బానిస సాంఘిక వ్యవస్థ అంటారు. మొదట గ్రీసులో ప్రారంభమైన ఈ వ్యవస్థ, తర్వాత రోమ్లోను, ఇతర యూరపు దేశాలలోను వ్యాపించినది. మానవ సమాజ పరిణామ క్రమంలో బానిస వ్యవస్థ ఒక ప్రధాన ఘట్టమని పండితులు పేర్కొంటారు. ” క్ష
బానిస వ్యవస్థ మహా ఘోరమైనది. (ప్రజలలో అత్యధిక సంఖ్యాకులను నిష్ట దరిద్రంలోను, వెనుకబడ్డ సంస్కృతీ పరిస్థితులోను తోసివేసి, అల్ప సంఖ్యాక వర్గంవారు మాత్రం విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం కలిగించే ప్యపస్థ అది: కష్టాలను, కడగళ్ల ననుభవించే ఈ అధిక సంఖ్యాకులు సహజంగానే ఈ పవ్యపస్థను వ్యతిటేకించే దశకు చేరుకుంటారు. వారి వ్యతిరేకతను అణగద్రొక్కడానికి కాపలసిన అణచివేత ఏర్పాట్లు కూడా ఆ వ్యవస్థలో ఒక భాగమపుతాయి. మానవత్వమున్న ఎవరు గూడ ఈ వ్యవస్థను అంగీకరించలేరు.
అయితే, అత్యధిక ప్రజలను ఆకలితో మాడ్చి, వెనుకబడ్డ సాంస్కృతిక దశలో పడవేసినప్పటికీ, కొంత మంది అల్ప సంఖ్యాకులు సాంస్కృతికరీత్యా అభివృద్ధి చెందడానికి దోపిడీ వ్యవస్థ మూలంగా అవకాశంకలుగుతుంది. ఈ అల్ప సంఖ్యాకుల సాంస్కృతిక ఫలాలు కాలక్రమేణ మానవ సమాజమంతటికీ చెందిన ఉమ్మడి ఆస్థిగా రూపొందుతాయి.
మానవ సమాజ సాంస్కృతిక చరిత్రలో (ప్రధానమైన గ్రీకు సంస్కృతికి బానిస పద్ధతే ఆధారమైనదని తెలుపుతూ మహోపాధ్యాయుడు ఏంగెల్స్ ఇలా చెప్పాడు:
" “బ్రానిసత్వం లేకపోతే గ్రీకు సంస్కృతీ, రోమన్ సంస్కృతీ కూడా లేవు. గ్రీకు సంస్కృతీ లేకపోతే నవ ఐరోపాకూడా లేదు. నవ ఐరోపా లేకపోతే నవ సోషలిజమూ లేదు. కాబట్టి, బానిసత్వం లేకుంటే సోషలిజం కూడా లేదని మనం చెప్పవచ్చు.”
వురాతన సమాజంలో దోపిడీ, అణచివేతలూ లేవు అనే మాట నిజమే! అందువల్లనే దానిని “పురాతన కమ్యూనిస్టు సమాజి మంటున్నారు. ఇంచుమించు సంపూర్ణ సమానత్వం ఆ సమాజంలో నెలకొని వుండేదనడంలో సందేహం లేదు. అయితే ఈ సమానత్వానికీ, దోపిడీ రహిత వ్యవస్థతో పాటు మరో ముఖ్యమైన అంశం కూడా పున్నది. ఆర్థికరీత్యాను, సాంస్కృతిక రీత్యాను ఆ సమాజానికి చెందినవారు మిక్కిలి అధ్వాన్న స్థితిలో వుండేవారు. జంతువులకన్నా కొద్దిగా మాత్రమే వారు అభివృద్ధి చెందారు. ఈ స్థితిని మార్చి ఉత్పత్తి రంగంలో జీవితావసర వస్తువులను, సాధనాలను తయారు చేయడానికి కావలసిన సామర్భ్వాన్నిి పద్ధతులనభివృద్ధి చేయడం, తత్వశాస్త్రం, విజ్ఞానం, సాహిత్య రంగాలలో ముందుకు పోవడానికి దారిని సుగమం చేయడం, ఇటుపంటి కృషిలో నిమగ్నమవడానికి కొంత మందికైనా అవకాశం కల్పించడం - వీటన్నిటినే బానిస సమాజ వ్యవస్థ చేసినది.
అల్ప సంఖ్యాకులకు మాత్రమే లభించిన ఈ అవకాశాలను అందరికీ లభించేటట్లు చేయడానికి అనేక శతాబ్దాల సమాజాఖివృద్ధీ, విభిన్న వర్గాల మధ్య వర్గపోరాటాలు
ఛి ౧ ళి అవసరమయ్యాయి. బానిసత్వం, భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం మున్నగు మూడు రూపాలలోను దోపిడీ వ్యవస్థ లేక వర్గ సమాజం అభివృద్ధి చెందింది. వీటిలో చివరిదైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అన్ని రకాల దోపిడీలు, వర్గ వైషమ్యాలు నశించే ఒక క్రొత్త సమాజ సృష్టికి అవసరమైన వాతావరణం, దాన్నుపయోగించుకునే సామర్థ్యం గల సామాజికశక్తిగా కార్మిక వర్గమూ ఉదయించాయి. క్షం
పురాతన కమ్యూనిస్టు సమాజంలో కన్నా పెట్టుబడిదారీ వ్యవస్థలో మానవ జీవితాన్ని సుఖపంతం చేసే ఎన్నో సౌకర్యాలు, వసతులు ఎక్కువైనాయి. కానీ ఈ సౌకర్యాలు, పసతులతో పాటు దోపిడీ రహితమైన కొత్త కమ్యూనిస్టు సమాజం రూపొందడానికి కావలసిన వాతాపరణం ఇప్పుడే ఏర్పడినది. బానిసత్వం, భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ మూడు రూపాలలోను పెంపొందిన పర్గ వైరుధ్యాలే కమ్యూనిస్టు సమాజ వుదయానికీ దోహదం చేస్తాయి.
గ్రీసులో బానిస వ్యపస్థ ప్రారంభమైనట్లే, భారతదేశంలో మరో రూపంలో వర్గ సమాజం రూపొందింది. అయిత్తే, గ్రీస్‌లో బానిసలు, యాజమానులనే వర్గాలేర్పడగా, అక్కడ “ఆర్యులు, “దాసులినే రూపంలో “వర్ణ తారతమ్యాలుదృవించాయి.. ఇదే తర్వాత కాలంలో చాతుర్వర్దాలు గాను, వాటి ద్వారా అనేక కులాలు, ఉప కులాలు గల వ్యవస్థగాను మారింది.
స్తానిక గోత్ర-వర్జ సమాజాలకు చెందినవారికి వ్యతిరేకంగా యుద్దాలు చేసి, వారిపై ఆధిక్యత సాధించిన ఆర్యులు తమ పనులను సమర్ధపంతంగా చేసుకోవడానికి, చిన్న పరిమాణంలోనైనా ఒక రకమైన 'పని విభజనిను ఆదిలోనే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. ఆయుధాల నుపయోగించి యుద్దాలు చేసేవారు, యుద్ధాలలో విజయానికి సహాయపడే విధంగా ఆరాధనలు, కర్మకాండలు చేసేవారు అనేదే యీ పని విభజన. వీరిలో మొదటివారు క్షత్రియులుగాను, రెండవారు బ్రహ్మణులుగాను మారారు. వీరిద్దరూ కాని మరోశాఖకు చెందిన “విశ్ అని పిలువబడ్డారు. వీరే పిదప 'వైశ్యులయ్యారు. ఈ మూడు శాఖలకు చెందినవారి అక్రమాలకు గురై అణచబడినవారు దాసులు-శూద్రులైనారు. వీరిలో మొదటి మూడు వర్గాలవారు పాలకులు, నాల్గనవారు పాలితులు. ఇదే భారతదేశ వర్గ (వర్ణ) భేదం యొక్క ప్రధమరూపం.
బానిసత్వ పద్ధతి గ్రీసులో చేసిన పనినే భారతదేశంలో ఈ వర్ణభేదం చేసినదనే విషయం అర్ధం చేసుకోవడం ఏమంత కష్టకాదు. యుద్ధకళ, దాని అభివృద్ధి క్రమంలో అనేక రకాల సాంకేతిక నైపుణ్యాలు, ఆరాధనలు, కర్మకాండల ద్వారా రూపొందే తాత్విక దృష్టి, ఆర్థికాభివృద్ధి ద్వారా ఏర్పడే ఉత్పత్తి, పంపిణీ విధానాలు - వీటన్నిటినీ సమర్ధవంతంగా నిర్వహించే వున్నతపర్గ మొకటి ఆవిర్భవించింది. బానిసల శ్రమ ఫలితాన్ని
13
అనుభవించే గ్రీకు ఆస్థిపరుల లాగానే “దాసులు” లేక “శూద్రులు” చేసే శ్రమఫలితాన్ని అనుభవించే ద్విజులు ** క్ష్మత్రియులు, (బ్రాహ్మణులు, వైశ్యులు - భారతదేశంలో తయారయ్యారు. ఈ నాల్గు శాఖలకు చెందిన వారే “వర్ణాశ్రమ వ్యవస్థలోని నాలుగు వర్దాలు లేక కులాలకు చెందిన వారు.
క్రమ క్రమంగా సాంకేతిక నైపుణ్యంలోనూ, ఆర్థికరంగంలోను ఏర్పడ్డ అభిప్ఫద్ధి కొనసాగింపుగా “దాసులిలోనూ, వున్నత వర్దాలలోను అనేక శాఖోపశాఖలు ప్రారంభమై వృద్ధిచెందినవి. బానిసపనులు, యుద్ధ పద్ధతులు, మతసంబంధమైన కర్మకాండలు, దైపపూజ వంటి ఒక్కొక్క కార్యంలోను అనేక విభజనలు ఏర్పడ్డాయి. వీటన్నిటిలోను నిపుణులు తయారయ్యారు. ఇవన్నీ జరుగుతున్న ప్రారంభదశలో మూడు వర్గాలవారు, 'దాసులు” మాత్రమే వున్నారు. కాలక్రమేణ వీరందరూ పందల కొలది కులాలుగానూ, ఉపకులాలుగాను మారారు. భారతదేశంలో సమాజాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకత ఇది!
చాతుర్వర్దాలు ఏర్పడడానికి మునుపు భారతదేశంలో వర్గ తారతమ్యాలు లేవా అనే సందేహం నేటికీ వుంది. సింధు నాగరికత కాలం లోనే బానిస పద్ధతి వుండేదని తెలిపేటటువంటి కొన్ని అవశేషాలు హరప్పాలోను, మొహొంజొదారోలోను వెలుపడ్డాయి. అయితే అవి ఇంకా వివాదాస్పదంగానే వున్నాయి.
" అదీగాక, బానినత్వం నెలకొన్న సమాజమే నింధు నాగరికతకు చెందిన సమాజమంటే, దాని రూపురేఖలు ఎలా వుండేవి? ఆ సమాజం ఎందుకు పతనం చెందింది? ఇలాంటి ఎన్నో (ప్రశ్నలు మిగిలివున్నాయి. వర్ణభేదం లేక చాతుర్వర్ణ వ్యపస్థ ప్రారంభమైన కాలంలో దానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించిన సమాజంలో సింధు నాగరికత పతనమైన తర్వాత కాలంలో ఎటువంటి వర్గభేదమో, వర్ణభేదమో లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఒ “ఆర్యులినే సామాన్య నామధేయంతో వ్యవహరింపబడే ఆక్రమణదారులైన గోత్రీకులు ఈ దేశంలో ప్రవేశించిన కాలంలో, ఇక్కడ నెలకొని వున్నది. బహుశా పురాతన కమ్యూనిస్ప సమాజ రూపంలోని గోత్రీయ వర్గ సమాజమే! దానిని ధ్వంసం చేసి పర్ణభేదం రూపంలోని సమాజం నెలకొన్నది ఆర్యుల ఆక్రమణ ద్వారానే! ఆనాటి నుంచీ నేడు పేర్కొనబడే “భారతీయ సంస్కృతి ఆవిర్భవించింది. ఈ విషయాలన్నీ నిస్సందేహమైనవి.
**ి ద్విజులు అంటే రెండుసార్లు జన్నించేవారని ఆర్థం. తల్లి గర్భం నుంచి మొదటీసారిగా జన్నిస్తారు. జందెం వేయించే 'యజ్ఞోపనీత సంస్మారమప్పుడు రెండవసారిగా జన్నిస్తారు. వీరందరికీ తింది, బట్ట, ఇల్లు సమకూర్చడానికై రాత్రింబవళ్ళు శ్రమించే “శూద్రులకు మాత్రం ఈ రెండుసార్లు జన్మించే “అదృష్టం” లేదు.
-అనువాదకుడు. క్షేగ
అయితే, ఆర్యుల ఆక్రమణకు గురైన ఉత్తర భారతదేశంలో మాత్రమే ఈ పరిణామాలు జరిగినాయని అనుకోవడం పొరపాటు. ఉత్తరాన ఆర్య సంస్కృతికి ధీటుగా భారతదేశంలో ద్రావిడ సంస్కృతి అభివృద్ధి చెంది వున్నది.
కానీ, ఉత్తరభారతదేశంలోలా గాక, వెలుపలి నుంచి వచ్చిన ఆక్రమణదారులకు బదులుగా ఇక్కడేవుండిన కొన్ని గోత్రీయ పర్గీయులే ఇతర వర్గాలవారిని ఆక్రమించి ఆధిక్యతను నెలకొల్పారు. ఉత్తరాన ఆర్యుల ఆక్రమణలకు స్థానిక వ్రజలు లొంగిపోయినందుపల్ల పర్ణభేదం ఆధారంగా గల సమాజావిర్భావం జరిగినప్పుడే, దక్షిణానకూదా దాడులు, ఎదురుదాడులు, ఇతరుల ప్రదేశాల నాక్రమించడాలు మొదలగున్నవి జరుగుతున్నాయి. వీటికి నాయకత్వం వహించిన 'సైన్యాధ్యక్షులను, రాజులను దక్షిణ భారతదేశంలోని (ద్రావిడుల భాషయైన 'శెంతమిళ్లో కీర్తిస్తూ అనేక కావ్యాలు వెలిశాయి. వాటిలోని విషయాలను ఆధారం చేసుకుంటే, ఉత్తరాధి నుంచి దక్షిణాదిపై జరిగిన ఆక్రమణ యుద్దాలలాగానే, దక్షిణాది నుంచి ఉత్తరాది పైకి కూడా ఆక్రమణలు జరిగాయి. దక్షిణ భారతదేశం లోని పురాతన కమ్యూనిస్టుల సమాజం పతనం చెందడానికి కారణం, బయటనుంచి వచ్చిన దాడులవల్ల కాకుండా ఇక్కడే ఆక్రమణ దారులు తయారవడమే అని నిస్సంశయంగా చెప్పపచ్చు.
వర్ణతారతమ్యాల ద్వారా కులాధిక్యత వైపు అభివృద్ధి చెందిన భారతీయ సమాజానికి, బానిస వ్యవస్థ ద్వారా భూస్వామ్య వ్యవస్థగాను తదనంతరం పెట్టుబడిదారీ విధదానంగాను అభివృద్ధి చెందిన యూరోపియన్ సమాజాలకు ఒక ప్రధానమైన అంతరమున్నది. ఐరోపాలో అఆస్టిపరులు, (ప్రభువులు, కార్మికులు, పెట్టుబడిదారులు పంటి వర్గభేదాలు మాత్రమే రూపొందాయి. ఏ విధమైన దాపరికం లేని బహిరంగమైన దోపిడీ, అణచివేతల ఆధారంగానే అక్కడ దోపిడీదారులు పీడిత ప్రజలను అణిచే వ్యవస్థ యొక్క విభిన్న రూపాలే ఏర్పడ్డాయని చెప్పపచ్చును. -
భారతదేశంలోని వర్ణ (కుల) విభజనలో దోపిడీ, అణచివేతలు దాచిపెట్టబడి వున్నాయి. నిమ్న కులాలవారు ఉన్నత కులాలవారికి అణగిమణగి జీవించినా, ఒక్కొక్క కులానికి చెందినవారు తమ మధ్య తమ స్వంత సోదరళ్వాన్ని, నమానత్వాన్నీ పెంపొందించుకున్నారు. వురాతన కమ్యూనిస్టు గోత్రీయ వ్యవస్థలో గోప్రీయ వర్గ ప్రజాస్వామ్యం విలసిల్లిన విధంగానే వర్ణ (కుల) వ్యవస్థలోను కులసమూహాలూ, వాటిలో వ్యక్తమయిన కుల సమానత్వము, ప్రజాస్వామ్యం మున్నగునవన్నీ వర్ణ (కుల) వ్యవస్థ 'ప్రారంభములోనూ వున్నాయి.
ఇది మాత్రమేగాక తక్కువ కులాలలోనే అత్యధిక సంఖ్యాకులు కొందరు “ఉన్నత కులాలి వారికి అణగిముణగి వున్నా కొన్ని విషయాలలో వారు వీరికంటే పై స్థాయిలోనే వుండేవారు. ఆ స్థితిలో వర్ద '(కుల) వ్యవస్థలో కష్టాలననుభవించేవారే తమ స్వంత కులం మీద గొప్పగా అభిమానం పెంచుకున్నారు. తమ కుల ఐక్యతను సంరక్షించుకొనే
15
ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. వారు తమకన్నా నిష్ను కులాల వారిని అణచి వుంచడేంలో పై కులాల వారికి తోద్బడ్డారు కూడా! అన్నిటి కంటే మిన్నగా వర్ద (కుల) పద్ధతుల చుట్టూ పత సంబంధమైన ఒకతెర, ఈ పద్ధతులు భగవంతుని చేతనే సృష్టించబడినవనే విశ్వాసమూ ఏర్పరచబడ్డాయి. కాబట్టి వర్ణ (కుల) శాసనాలను తూ.చ. తప్పకుండా పాటించి తీరాలనే అభిలాష పల్ల తక్కుప కులాలకు చెందిన ప్రజలు తాము మోయవలసిన కాడిని సంతోషంగాను, సంతృప్తిగాను మోస్తూ వచ్చారు. గ్రీసు దేశంలోనూ, బానిస పద్ధతి నెలకొన్న ఇతర ఐరోపా దేశాలలోనూ యజమానులకు వ్యతిరేకంగా బానిసలు అనేక తిరుగుబాట్లు చేశారు. వాటిలో “స్పార్టకస్ నాయకత్వంలో జరిగిన బానిసల తిరుగుబాటు ప్రసిద్ధి చెందినది. ఐతే అస్థిర పర్గాలు ఆ తిరుగుబాట్లను క్టూరంగా అణచివేసి తమ ఆధిక్యతను సంరక్షించు కొన్నారు. అయినా, చివరిలో బానిసల తిరుగుబాటు ఒక విధమైన విజయం సాధించింది. తర్వాత కాలంలో ప్రత్యక్ష బానిసత్వానికి బదులుగా అప్రత్యక్షమైన బానిసత్వం లేక సాగుబడిదార్ల పద్ధతి (భూస్వామ్య వ్యవస్థ) అమలుకు వచ్చినది. ఈ కొత్త పద్ధతికీ, భూ యజమాసులకూ వ్యతిరేకంగా కూడా సాగుబడిదార్లు (వ్యపసాయదార్లూ) తిరుగుబాటు చేశారు. వీటన్నిటి ఫలితంగానే ఐరోపాలో భూస్వామ్య వ్యతిరేక పెట్టుబడిదారీ విప్లవం సంభవించినది. భారతదేశంలో వర్ణభేదం (ప్రారంభమైనప్పటి నుంచీ బ్రిటిష్ పరిపాలన నెలకొన్న వరకూ ఐరోపాలో జరిగిన తిరుగుబాట్ల వంటి తిరుగుబాట్లు ఏవీ లేకుండానే సమాజం ముందుకు సాగింది. వర్ణ (కుల) వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కూడా తత్వశాస్త్ర రూపేణా. మతరీత్యానే కొన్ని ఉద్యమాల రూపంలో వ్యక్తమైనది. తత్వశాస్త్ర రంగంలో లోకాయతులు, ఇతర భౌతిక వాదులు జరిపిన పోరాటం, (బ్రాహ్మణ మతాన్ని సవాలు చేసిన బౌద్ద, జైన మతాలవృద్ధి, తరువాతి కాలంలో ఇస్తాం,
- కైస్తవ మతాలు భారతదేశంలోకి ప్రవేశించినపుడు తక్కుస కులాలవారికి చెందిన ఒక వర్గం ఆ మతాలకు పలికిన స్వాగతం - ఇవన్నీ వర్ణ (కుల) వ్యవస్థకు ప్యతిరేకంగా _ ప్రజల అసంతృప్తిని తెలుపుతున్నాయి. అయితే, వర్ణ (కుల) వ్యవస్థను ప్రత్యక్షంగా సవాలు చేసి వ్యతిరేకించిన రాజకీయ తిరుగుబాట్లు భారతదేశంలో జరగనేలేదు. . తత్వశాస్త్ర రీత్యా, మత రీత్యా జరిగిన పై సంఘర్షణల వల్ల ఉన్నతకులాలవారి ఆధిక్యతకు అత్యల్పమైన దెబ్బకూడా తగలలేదు. వారు లోకాయతులతో సహా ప్రాచీన భారతీయ భౌతికవాదు లందరినీ ఓడించి వారు రచించిన ప్రధాన గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేయగలిగారు. ఉన్నత కులాలను సంరక్షించే తత్వ శాస్రజ్ఞులదే పైచేయి అయినది, ఈనాడు ప్రాచీన భారతంలో లోకాయతులు వున్నారనే విషయం కూడా వారి శత్రువులు 16
తపు (గ్రంధాలలో వుటంకించిన లోకాయతుల వాదనల వల్లే తెలుస్తున్నది. దీన్నిబట్టి లోకాయతుల మూల గ్రంథాలన్నింటినీ పూర్తిగా నాశనం చేసి వేశారనీ స్పష్టమవుతున్నది.
సంపూర్ణంగా భౌతిక వాదాన్ని ఆధారం చేసుకునీ, అనేక పరిశోధనలు గావించే మానవ జీవితాన్ని, శారీరక నిర్మాణాన్ని, బైటి ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించిన విభిన్న వైజ్ఞానిక రంగాలకు చెందిన నిపుణులు కూడా పూర్తిగా భౌతికవాద ఆధారంతో కనుగొన్న సత్యాలకు కూదా ప్రజలు అంగీకారాన్ని పొందడానికి “భగవంతుని ఆశీస్సులొను ఆర్ధించి వేడుకున్నారు. వైద్యశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం మున్నగు విజ్ఞాన రంగాలలో మనదేశ విద్వాంసులు ఆ కాలంలోనే ఇతర దేశాలకు చెందిన విద్వాంసులకు తీసిపోని విధంగా అత్యుత్తమ పరిశోధనలు గావించి అమూల్య (గ్రంథ రచన చేశారు. " అయితే వారుకూడా తాము “భగవంతుడు ప్రసాదించిన జ్ఞాన ఖిక్షో వల్లనే అవన్నీ సాధించినట్టు చెప్పడానికి నిర్బ్భంధించబడ్డారు. లోకాయతుల భౌతికవాద గ్రంధాలను ధ్వంసం చేసిన ఉన్నత కుల సంజాత తత్వ శాస్త్రజ్ఞుల ఎడతెగని నిర్బంధమే ఇందుకు కారణం అనటంలో. సందేహం లేదు. ॥
అనగా భావ వాదానికీ, ఆధ్యాత్మిక వాదానికీ సంబంధించిన సర్వాన్నీ భగవంతునికి సమర్పించే పద్ధతిని సహాయంగా తీసుకుని సమాజం లోని అత్యధిక సంఖ్యాక ప్రజలను బానిస అలోచనలకు బలిచేశారు. ఆ విధంగా భారతదేశంలో పర్ణ (కుల) వ్యవస్థ రూపంలో పర్గసమాజం నెలకొన్నది. ఆ వ్యవస్థ వున్నతకులాల వారికి అణగి వుండడం మాత్రమేగాక, తమకన్నా తక్కువ కులాలవారిని అణచి వుంచడానికి పై కులాల వారికి తోడ్పాటు నివ్వడానికి కూడా అత్యధిక సంఖ్యాక ప్రజలను ప్రోత్సహించింది. ఇది హింసను ఉపయోగించవలసిన అవసరం లేకనే ప్రజలను అణచి వుంచడానికి ఉన్నత కులాలవారికి వీలు కల్పించింది. ఉన్నత కులాలకు చెందిన ప్రజలను కూడా ఈ వ్యవస్థ ఆలోచనా రంగంలో తాము నిజంగానే ఉన్నతులషనీ, తమకంటే తక్కువ కులాల వారిని అణచి వుంచడమే తమ కర్తవ్యమనీ బోధించింది.
నేనీ పుస్తక ప్రారంభంలో కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులు అర్ధం తెలియకుండానే వేదాలను వల్సించే వారనే విషయం తెలిపాను. దానికి కారణంకూడా ఈ వున్నత కులాల వారిలో పెంపొందింపబడిన బానిస మనస్తత్వమే కారణం! విజ్ఞాన, సాంకేతికాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి స్వతంత్రమైన ఆలోచనా విధానం అత్యవసరమైనది. కానీ వాటిని నాశనం చేసే వాతావరణం దీనిద్వారా ఏర్పడినది. ఆ కాలంలో గ్రీకు తత్వణ్ఞానులకు ధీటైన విధంగా భారతీయ తత్వజ్ఞానులను, గ్రీకు సంస్కృతికి దీటుగా భారతీయ సంస్కృతినీ ఆర్యులు వృద్ధి చెందించ గలిగారంటే దానికి కారణం అనాటి ఆర్యుల సమాజం స్వతంత్రమైన ఆలోచనను, విమర్శను 'పెంపాందించగలిగే సొంస్కృతిక వాతావరణరి
క్ష
నెలకొని వుండడమే! ఈ వాతావరణము తర్వాత కాలంలో లేకపోయినది. దీనివల్లే (గ్రీకు నాగరికత కొవసాగింపుగా రూపొరీదిన నవీన ఐరోపా నాగరికతతో పోల్చి చూసినపుడు, భారతదేశం ఎంతో వెనుకబడిపోయింది. వర్ణ (కుల) వ్యవస్థ, మత దృక్పధాలు అన్నీ చేరి భారతదేశంలో నెలకొల్పిన పరిస్థితి ఇదే! నాలుగు త. ణిుగ్వేదం, యజుర్వేదం, అధర్వణవేదం, సామవేదం - ఈ నాలుగు వేదాలూ సంస్కృత భాషలోనే వ్రాయబడి వున్నవి. సమాజంలోని ఒక చిన్న వర్గానికి చెందిన వారు మాత్రమె భాషను మాట్లాడేవారు. మిగతా అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడే భాషలు అనేకమున్నాయి. వాటిని అస్పష్టమైనవి అనీ మొత్తంగా చెప్పారు. సంస్కృతం కూడా ఒకే విధంగా వుండలేదు. అందులోనూ అనేక శాఖాంతరాలు పున్నాయి. వాటిలో ఒకటే సంస్కృత నాటకాలలో కనబడుతున్న “ప్రాకృతం. నేడు వాడుకలో వున్న హిందీ, గుజరాతీ, బెంగాలీ మొదలగు భాషలు వపవీకూడా ఆరంభకాలంలో లేవు. ఈనాటి హిందీ కూడా ఒకే విధమైన వాడుక భాష కాదు. అందులో ఎన్నో మాండలికాలు వున్నాయి: అయినా ఒక సామాన్యమైన సాహిత్య హిందీ భాష కూడా వున్నది. ప్రాచీనకాలంలో హిందీకినీ, ఇతర భాషలకునూ సామాన్యమైన ఒక సాహిత్య భాష లేదు. _ ఉత్తర భారతదేశంలో సంస్కృతానికీ, “పాలీ భాషకూ, దక్షిణ భారతదేశంలో తమిళ భాషకుమాత్రమే అటువంటి సామాన్య భాష ఉండేది. ప్రజా సమూహాలకు వందల కొలదీ భాషలు ఉన్నాయి. సుమారు 800-1000 సంవత్సరాలకు పూర్వం అంటే క్రీ.శ 1000-1200 కాలంలోనే పశ్చిమ భారతదేశంలో గుజరాతీ; _మరారీ భాషలు, తూర్పున బెంగాలీ భాషల ప్రారంభ.రూపాలు వికసించ నారంభించాయి. ఇంతకుముందే చెప్పినట్లు, దక్షిణాన 'శన్తమిళొ భాష దాని అనేక మాండలికాలు వున్నాయి. వీటినుంచీ ఆధునిక తెలుగు, కన్నడ, మళయాళ భాషల ప్రాధమిక రూపాలు వుదృ్భృవించసాగాయి. హిందూమతంలో వికసించిన భక్తి ఉద్యమము ఈ ప్రాంతీయ భాషలు అఖభిప్పద్ధి చెందడానికి దోహాదం చేసినవి. దక్షిణాదిన తమిళ భక్త సన్యాసులే దీనిని ప్రారంభించారు. _ఆ కాలంలో నెలకొన్న బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా ఈ భక్త సన్యాసులు ప్రజలను సమీకరించడానికి పూనుకున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే హక్కు భుక్తంగా వుండిన భగవతారాధన పద్దతులకూ శూద్రులను, ఇతర నిమ్న కులాలవారినీ అర్హులుగా చేయడానికీ, వారికి సులభంగా అర్ధమయ్యే ఈ భాషలలో తమగీతాలను రచించారు. ఈ భక్త కవులలో అత్యధికులు “తక్కువ కులాలిలో పుట్టినవారు. నామదేవ మీరాబాయి, సూర్దాస్, కమీర్ వంటి భక్త కవులు ఆ కోవకు చెందినవారే. 18
విభిన్నభాషలు ఈ విధంగా రూపొంద ప్రారంభించినప్పటికీ, నేడు చెప్పబడే విధంగా తమిళులు, బెంగాలీ, మరాఠీ, ఆంధ్రుడు, కన్నడిగుడు, కేరీయడు అనే విధంగా భాషను ఆధారంగా గొని ప్రజా సమూహాలను వేర్వేరుగా గుర్తించడం ఆ కాలానికి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడు పతం, కులాలు ఆధారమైన ఖేదాలే (ప్రధానంగా వున్నాయి.
ఆర్య ప్రజా సమూహాలు వేదాలు, ఉపనిషత్తులు, విభిన్న విజ్ఞాన గ్రంథాలు, పురాణేతివోసాలు, కావ్యనాటక, సాపాత్య (గ్రంథాల ద్వారా మానవ నమాజ సాంస్కృతికాభివృద్ధికి ఆమూల్యమైన తోడ్పాటు నందించగలిగారు. అయితే, ఈ అన్ని రంగాలలో యింకా యింకా జరగవలసిన అభివృద్ధి నిలిచిపోయి స్తంభించింది. ఇది భారతీయ సమాజాన్నీ సంస్కృతినీ తరువాతి కాలంలో ఎంతో నష్టపరచింది. దీనివల్ల 'తక్కుప కులాలి వారని చెప్పబడే అత్యధిక సంఖ్యాక ప్రజలు సాంస్కృతిక రంగం నుంచి తరమబడి వెలివేయబిడ్డారు. ఇదేగాక ఉన్నతకులాలకు చెందిన మేధావుల సామాజిక దృక్పధం కూడా సంకుచితమైపోయినది. తత్వశాస్త్రం, మతం మొదలైన రంగాలలో ఉన్నత వర్గాలకు చెందినవారు భౌతికవాదంపై సాధించిన విజయం ఈ అపకారాలను చేసేంది. ప్రపంచ సంబంధమైన వారి దృక్చధం దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టయినది. ప్రారంభ కాలంలో ఉదృతంగా సాగిన వైదిక సంస్కృతి ప్రవాహము 'తర్వాతి కాలంలో మందగించి స్తంభించిపోయినది శ
సాంఘిక, సాంస్కృతిక రంగాలలో వుండిన ఈ మందస్థితి తర్వాతి కాలంలో 15వ శతాబ్దం నుంచి క్రమ క్రమంగా అభివృద్ధి చెందిన యూరప్ సమాజాన్ని, సంస్కృతినీ ఎదిరించి నిలబడలేక దానికి దాసోహమనేటట్టు నిర్బంధించింది. యూరప్‌లో బానిసత్వ వ్యపస్థ పుట్టిన నాటినుంచీ వరుసగా అనేక తిరుగుబాట్లు, విఫ్లవాలు- జరిగి యూరప్ సమాజాన్ని శక్తిపంతమైన, సజీవమైన, అజేయమైనదిగా మార్చివేశాయి. అయితే భారతదేశంలో అనేక శతాబాలు ఎటువంటి తిరుగుబాటు, వివ్లవం లేకనే గడచిపోయినందువల్ల, భారతీయ" సమాజం విదేశీ ఆక్రమణను తట్టుకోలేకపోయినది. ఈ విధంగానే గొప్ప గత వైభపం కలదిగా మనమందరం గర్వించే మనమాతృభూమి = వేదభూమి - విదేశీపాలనకు, విదేశీ సంస్కృతికీ, విదేశీ అర్థిక ప్రభావానికీ బానిస అయినది.
గతంలో కూడా ఎందరో విదేశీయులు నమూహాలుగా సాయుధులై భారతదేశం లోనికి ప్రవేశించారు. వర్ణ (కుల) వ్యవస్థను రూపొందించి ప్రాచీన భారతదేశంలో సాంఘిక, సాంస్కృతికాభివృద్ధిని సాధించిన ఆర్యులు సైతం విదేశీయులే కదా! ఆ కాలమునందు స్థానిక ప్రజలు తమ వద్ద వుంచుకున్న వాటికంటే శక్తివంతమైన ఆయుధాలు, యుద్ధ సాధనాలు తమ వశమందుండినందువల్లనే ఆర్యులు స్థానిక గోత్రీయ వర్గాలవారిని ఓడించగలిగారని యింతకుముందే చూశాము. _
ఆర్యుల అధికారం నెలకొని, వర్ణ (క్రుల) వ్యవస్థ అనే సాంఘిక, సౌంస్కృతిక జీవన విధానం స్టిరపడిన తర్వాత కూడా ఎందరో విదేశీయులు భారతదేశాన్ని ఆక్రమించారు. పారశీకులు, గ్రీకులు, పశ్చిమాసియ్లా తెగలకు చెందినవారు వరుసగా మన దేశంపై దంజేత్తా'తాత్కాలికంగా తమ పరిపోలనను కూడా స్థాపించారు. కాలక్రమేణా ఇటువంటి దండయాత్రలు ఎక్కువ కావడమేకాక, ఆశ్రమణదారులు దీర్ధకాలం వరకూ కొనసాగిన
మం
సామ్రాజ్యాలను కూడా ఇక్కడ స్టాపించగలిగారు. వైదిక మతానికీ, దాని విరుద్ధ రూపాలైన బౌద్ధ, జైన మతాలకూ సంబంధించిన మౌర్య, గుప్త, హర్ష మున్నగు హిందూ సామ్రాజ్యాల తర్వాత అనేక మంది ముస్లిం పాలకులు కూడా ఉత్తర భారతదేశంలో తమ అధికారాన్ని స్థాపించారు. హిందూయేతర రాజ్యాలలో ఢిల్లీ సుల్తానుల పాలన, మొగలాయి"చత్రపర్తుల సామ్రాజ్యం ప్రత్యేకంగా పేర్ళొనదగినది. ”
ఈ ముస్లిం సామ్రాజ్యాలు హిందుపుల వర్ణ (కుల) వ్యపస్థకు లొంగలేదు. ఉన్నత కులాలు - నిమ్నకులాలు అనే తారతమ్యం లేక ఇస్తాం మతంలో విశ్వాసమున్న వారందరూ ఒక్కటే అనే దృక్పధం కలిగినవారే ఈ సామ్రాజ్యాల అధినాయకులు! లోకాయతుల పంటి భౌతికవాదులను పూర్తిగా నాశనం చేయగలిగిన బౌద్ధ, జైన శాఖలను పశీకరించగలిగిన వైదిక సంస్కృతీ నాయకులు ఇస్లామును విశ్వసించే 'ఆశ్రమణదారులను సైనికరీత్యా నిరోధించలేక పోయారు; సాంస్కృతిక రీత్యా ఓడించనూలేకపోయారు. వైదిక సంస్కృతికి తగిలిన మొట్టమొదటి బలమైన దెబ్బఇది! “
.. అదే సమయంలో ఇస్లాం ఆక్రమణదారులు, ముస్లిం సామ్రాజ్య నిర్మాతలు కూడా వైదిక సంస్కృతినీ లొంగదీసుకోలేక పోయారనే విషయాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వైదిక సంస్కృతీ క్రీనీడలో పెరిగిన వర్ణ (కుల) వ్యవస్థకు ఢిల్లీ సుల్తానులు లేక మొగల్ సామ్రాజ్యవాదులు స్వల్పహాని కూడా చేయలేక పోయారు. “తక్కువ కులాలి వారిపై 'వున్నత కులాలి వారి ఆధిక్యత, “ఉన్నత కులాల వారిలో (బ్రాహ్మణుల థేష్టత్వం, హిందూ సమాజన్నంతా ప్రభావితం చేసిన ప్రాపంచికదృష్టి - వీటినంతా కొంచెం కూడా ఇస్లాం పాలకుల వల్ల కదిలించ వీలుకాలేదు. అంతేగాక, వీటిని బలహీన పరచడానికి సమానత్వం పునాదిగా గల ఇస్తాం మతం వల్ల వీలుపడనే లేదు. వ్యత్యాస మల్గ్లామౌర్య, గుప్త చక్రవర్తులు హిందూ దేవుళ్లను విశ్వసించారు. సుల్తానులు, పాదుషాలు -ఒకే దైపం అల్లాను నమ్మారు,
రాజుల, చక్రపర్తుల మత విశ్వాసాలతో ఏర్పడిన ఈ మార్పు పర్ణ (కుల) ప్యపస్థలో ముందున్నవారిని కాస్తంతకూడా ప్రభావితము చేయలేక పోయినది. పాలక్తులుగా ఎవరున్నా "సమాజంలో పైస్థాయిలో వున్నవారు తాము మాత్రమేనని వారు నీబ్బురంగా వున్నారు. సుల్తానుల, పాదుషాల పరిపాలనలో కూడా వారి అధికారాన్ని సవాలు చేసే “భౌతికవాద దృక్పథం తలెత్తలేదు. అదేగాక వర్ణ (కుల) ఆధిక్యతను ఆధారం చేసుకుని వారు పొందిన భూమిపై హక్కులు, పాలనాధికారంలో భాగం వంటి వాటికి ఎటువంటి విఘాతం సంభవించలేదు. "
సంగ్రహంగా చెప్పాలంటే, పాలనాధికారంలో 'పైస్తాయిలో మత విశ్వాసంలో వచ్చిన మార్పులవల్ల వైదిక సంస్కృతీ సృష్టికర్తలకు, వర్ణ కుల) వ్యవస్థాధికారులకు ఎటువంటి హాని కలుగలేదు. స్ట “య... ఇస్లాం మతావేశులైన విదేశీయులు తమ సైన్యాలతో ప్రవేశించి దురాక్రమణ చేస్తి సామ్రాజ్యాల్లు నిర్మించిన ఉత్తర భారతదేశ పరిస్టితి ఇది! దక్షిణ భారతదేశంలో ఇటువంటిదేదీ- జరగలేదు. మొగల్ సామ్రాజ్యం యొక్క కదపటి రోజులలో మాత్రమే
20
దక్షిణ భారతాన కొన్ని చోట్లలో ముస్లిం నవాబులు, పాలకులు ఆధిక్యత పొందారు. అయినా దక్షిణ భారతదేశంలో కూడా హిందూయేతరుల ప్రభావం హిందూ సమాజంలోను, సంస్కృతిలోనూ వ్యాపించినది. = . . 18వ శతాబ్దాంతం పరకూ కూడా కేరళలో హిందూయేతర పాలకుడు ఒకడు ాడా.పాలించలేదు. కాని హిందూయేతర మతాలవారు ఒకటి, రెండు వేల సంవత్సరాల వరకూ అక్కడ నివసిస్తూ వచ్చారు. వర్ణ (కుల) వ్యవస్థ ననుసరించి వైశ్యులు చేయవలసిన పృత్తియైన వ్యాపారాన్ని కేరళలో యూదులు తర్వాత ముస్లిములు, కైస్తవులే చాలా కాలం నుంచీ చేస్తూ వచ్చారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాల కన్నా కుల వ్యవస్థ యొక్క రవ్రత కూడా ఇక్కడే అధికంగా వున్నది. దీనివల్ల అత్యధికమంది ఇస్లామును, క్రైస్తవాన్ని స్వకరించదానికి నిర్భంధించబడ్డారు. ఈ విధంగా కేరళలో ఆయుధ బలము, వాలనాధికారము లేకనే ఇస్తాం, జైస్తప మతాలు స్థిరపడ్డాయి. నేటి కేరళ జనాభాలో సగానికి కొద్ది శాతం తక్కువైన ప్రజలు 'ఈ రెండు మతాలకు చెందినవారే అనే విషయం ఇక్కడ గుర్తించుకోవాలి. ॥ ” . సంగ్రహంగా చెప్పాలంటే, వైదిక సంస్కృతి ఇన్లాం,' కైస్తవ సంస్కృతులను జయించలేకపోయినది. అపన్నీ శాంతియుత సహజీవనం చేస్తుండిన కాలంలోనే 'ఆధునిక "పెట్టుబడిదారీ వృద్ధి అనే తుపొనులాగా యూరప్ వ్యాపారులు ఈ దేశానికి పచ్చారు. .తోపా పెట్టుబడిదారీ వ్యపస్థ యొక్క ఈ ఆక్రమణను హీందూ-ముస్లిం సమాజాలు ఆర్థిక, "సాంస్కృతిక, సైనిక, రాజకీయ రీత్యా ఎదిరించి నిలువరించలేక పోయాల్చు. ఇరుమతాలకు చెందిన పాలకులు, సైనిక అధినాయకులు ఈ కొత్త విదేశీ ఆక్రమణ దారులకు లొంగిపోయారు. ఆధునిక పెట్టుబడిదారీ సంస్కృతితోనూ, జీవన విధానంతోనూ సర్జుకొనిపోలేక పోయిన భూస్వామ్య వర్గానికి చెందినవారు వెనుకకు నెట్టబడ్డారు; సర్జుకుపోపదానికి ప్రయత్నించినవారు ముందుకు వెళ్ళగలిగారు.
ఈ అభివృద్ధిలో ఇంతకుమునుపే క్రైస్తవులుగా వున్నవారికి అదనపు సౌకర్యాలు లభించాయి. వాటినిచూచి ఎక్కువమంది హిందువులు ఆ క్రైస్తవులను అనుసరించి వెళ్ళారు. ఈ విధంగా అఆకాశానికెత్తబడ్డ వైదిక సంస్కృతి, దాన్ని సృష్టించిన వర్ణ (కుల) వ్యవస్థ పతనం చెందనారంభించాయి. వదు
ఆర్యులు భారతదేశంలోకి రానారంభించిన కాలం నుంచీ మొగల్ సామ్రాజ్య పతనం సరకూ జరిగిన కాలంలో పాలనా వ్యపస్థ పైన్థాయిలో అనేక మార్పులు జరిగాయి. మత, తత్వశాస్త్ర రంగాలలో బుగ్వేద కాలం నుంచి, ఇస్లాం, జైస్తవ మతాల అభివృద్ధి, సిక్కు మత ఆవిర్భావం వరకూ మన దేశంలో విభిన్న ఆలోచనా ధోరణులు ఒకటి తర్వాత మరొకటిగా రూపొందుతూ వచ్చాయి. అయితే అవి ఏవీ కూడా భారతదేశ సామాజిక జీవితంలో, దాని పునాదిగా వున్న (గగామీణ జీవన విధానంలో ఎటువంటి మార్పూ
2 లల నారాానమ్వు
తేలేకపోయాయి. ఇంచుమించు కొంచెం కూడా మార్చు లేకుండా శాశ్వతంగా కొనసాగిన (గ్రామీణ వ్యవస్థమీదే హిందూ, ముస్లిం తారతమ్యమనేది లేకుందా ప్రాచీన భారతదేశ పాలనా విధానం, సాంస్కృతిక జీపనం రెండు -మూడు వేల సంపత్సరాల పరకూ ఆధిక్యత. వహించాయనే దీనర్థం.
ఈ దీర్ధకాలంలో మన (గ్రామాల అర్థిక, సాంస్కృతిక జీవనంలో ఎటుపంటి మార్పూ పూర్తిగా జరగలేదని దీని భావం కాదు. ప్రారంభంలో వేటాడి, పశువులను మేపి జీవిస్తూ వచ్చిన ఆర్య సమూహాలు మెల్ల మెల్లగా వ్యపసాయం చేసే స్ఫితికి చేరుకున్నాయి. వారు, వారి ఆక్రమణకు గురయైనవారు ఒకటై సేద్యపు వృత్తిలో అభివృద్ధి సాధించడం, ఒకటి తర్వాత ఒకటిగా చేతి వృత్తులను నేర్చుకోవడం ప్రారంభించారు. మొదట వారు ప్రకృతిని భయంతోనూ, ఆశ్చర్యంతోనూ చూస్తూ వచ్చి, దాని అనుగ్రహాన్ని సంపాదించడానికై అనేక రకాలైన ఆరాధనలు, మొక్కుబడులు చేయనారంభించిన స్థితి నుంచి కొంచెం కొంచెంగా ముందుకెళ్ళి ప్రపంచానికి సంబంధించిన సమగ్ర భాఫన లేక దృక్పథాన్ని అలవరచుకుని, దానికి లోబడి విభిన్న వైజ్ఞానిక సత్యాలను తెలుసుకో నారంభించారు. తత్వశాస్త్రం, విజ్ఞానం వీటికి సంబంధించిన పరిశోధనలు వారు భగవంతునిపై విశ్వాసాన్ని ఆధారం చేసుకొని కొనసాగించినప్పటికీ, ప్రకృతికి సంబంధించిన అనేక సత్యాలు కనుగొనబడ్డాయి. భౌతికవాద దృక్పధం గల అనేక వైజ్ఞానిక శాఖలు "వికసించసాగాయి. వీటికి. సంబంధించిన మరో అంశంగా నాట్య, నాటక, కళలు, కావ్య, సాహిత్య (గ్రంథాలు సృష్టించబడ్డాయి.
దీనితో పాటే సమాజంలో వుంటూ వచ్చిన పరస్పర సంబంధాలలో కూడా
- మార్పులు ఏర్పడనారంభించాయి. “తక్కువ కులాలకు చెందినవారని చెప్పబడే, (శ్రమించి వస్తూత్పత్తిచేసే అధిక సంఖ్యాకులు (శూద్రులు, నిమ్న కులాలవారు), ఈ అధిక సంఖ్యాకుల (మఫలితాన్ని అనుభవించే వున్నత కులాలవారు అనే సామాన్య వర్గభఖేదం వికసించింది. ప్రధానమైన వుత్పత్తి సాధనమైన భూమి, ఇతర సంపదలు, 'గోబ్రాహ్మణ హిరానికై ఉపయోగించే పద్ధతి ఏర్పడినది. దేవస్థానం, (బ్రాహ్మస్థానం (దేవతలకు, బ్రాహ్మణుల కొరకైనవి) మొదలైన రూపాలలో వస్తు, సంపదలు కేంద్రీకరించబడాయి. ఈ సంపదల మీద ఆధిక్యత సంపాదించిన వారు గ్రాహాలలోను, పైసాయిలోనూు పాలకులుగా మారే పరిస్థితి కూడా వుండేది. శ ణి
భూమితో పాటు ఇతర సంపదల మీద అధికారం సంపాదించిన వారి ఆస్తులు, ఆదాయం ఎక్కువగా వున్నందువల్ల, అదనంగా వున్న వాటిని ఇతరులకు విక్రయించి, వాటికి బదులు లభించే వస్తువులు లేక నాణెములను ఉపయోగించి తమకు అవసరమైన, ఇతరుల వద్ద అదనంగా- వున్న వస్తువులను కొనడం అనే “వ్యాపారం” ప్రారంభమైనది. ఈ విధంగా వ్యవసాయం, చేతివృత్తులు, వ్యాపారం మొదలైన మూడు శాఖల్లు గల ఆర్థిక జీవనం, దానిని పట్టిష్టపరచి, సంరక్షించుటకు కావలసిన పాలనా వ్యవస్థ - ఈ రెండు కలసికట్టినదే భారతీయ సమాజం అనే స్థితి ఉదయించింది.
. 22 "
ఇవన్నీ సంభవించిన తర్వాత (గ్రామస్థాయికి పైబడిన సాంఘిక, రాజకీయ సంబంధాలు కొత్తరూపు దాల్చాయి. ఆక్రమణలు, ఆధిక్యతలు ఏర్పడడానికి, పతనం' చెందడానికి కారకులైన సామ్రాజ్యాల పాతపాలనా విధానానికి బదులుగా ఉత్పత్తి పంపిణీ అనే అర్థిక రంగాన్ని మరింత క్రమబద్దమొనర్చే ఒక పాలనా వ్యవస్థ క్రింది నుండి పైదాకా రూపొందనారంభించింది. భూమిని, ఇతర ఉత్పత్తిసాధనాలను తమ అధీనంలో _ _వపుంచుకొనిన ఉన్నతకులాల వారిని సంరక్షిస్తూ వున్న సామంతులూ, రాజులూ (గ్రామాలపై అధికారం చెలాయించేవారుగా మారారు. వీరిలోనే అత్యధికులు *“దేవన్వం' (దేపతలకొరకైనది), “'బ్రహ్మస్వం' (బ్రాహ్మణల కొరకైనది) వంటిరూపాలలో వున్న భూములను, ఇతర సంపదలను వశపరచుకొన్న వారుగానూ వుండిరి. కుల ప్రాతిపదికన వారు. ఉన్నత కులాలకు చెందినవారుగా వుండిరి.
. _ఇలా సమాజం, ఆర్థికం, రాజకీయం అనే మూడు రంగాలతో పాటు సాంస్కృతిక రంగంలోను వున్నత స్థితిని పొందిన ఒక పాలకవర్గం జన్మించినది. దీని తోడ్చాటుతోనే హిందూ, ముస్లిం తారతమ్యం లేకుండా' రాజులూ, చక్రవర్తులూ దేశపాలన గావించారు.
ఇదీ ఒక విధమైన -భూస్వామ్య వ్యవస్థయే! ఐరోపా దేశాలతో పోల్చినపుడు పలు భేదాలున్నప్పటికీ భూస్వామ్య వ్యవస్థ యొక్క అనేక ప్రధాన అంశాలు ఇందులో పున్నాయి. అవి ఏవి?) భూస్వాములకు, పాలకులకు మధ్య వేరుచేయలేని సంబంధం, రాజ్యపాలనకు ప్రధాన సాధనమైన సైన్యం యొక్క *సాధారణ స్వభావం, సామంతులూ, రాజులూ, వీరిననుసరించియే చక్రవర్తులు, పాదుషాలు దేశాన్ని పరిపాలించగలరనే స్థితి, వ్యపసాయం, చేతివృత్తులు, వ్యాపారం, వృద్ధియై ఆర్థిక జీవనంలో ఏర్పరచిన సర్వతోముఖ వికాసం, వీటిన్నిటి అవిభాజ్య అంగంగా ధనం యొక్క వుపయోగం ఎక్కువవుతున్న పరిస్టితి ఆ ఇపన్నీ ఐరోపాలోని భూస్వామ్య వ్యవస్థలో నిండివున్నాయి అని అనుకుంటే, క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దం నుంచీ ఇపన్నీ భారతదేశంలోకూ వృద్ధికాజొచ్చాయి.
అయితే, ఇవి మొత్తం గ్రామీణ ప్రజల సామాజిక జీవన విధానానికి పునాదెయైన వర్ష (కుల) వ్యవస్థలో ఏ విధమైన మార్పునూ తేలేకపోయాయి. - ఐరోపాదేశాలలాగా ప్రత్యక్షమైన యజమాని, బానిస సంబంధాలు భారతదేశంలో అభివృద్ధి చెందలేదనీ, దానికి బదులుగా “వున్నత కులాలి వారు;/దాసులు అనే రెండుశాఖలు రూపొందాయి అని ఇంతకుమునుపే చెప్పాంకదా! ప్రత్యక్షంగా కాకపోయినా, యజమాని, బానిససంబంధాల ఒక రూపమే 'దాసులు”, 'వున్నతకులాలి వారి మధ్య వున్నదనే విషయం నిజం. ప్యపసాయం, చేతిపృత్తులు, వాణిజ్యం, పాలన, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి ఏర్పడినపుడు “దాసుల లోను, 'వున్నత కులాల వారిలోను విభిన్నశాఖలు (అసంఖ్యాకమైన కులాలు, ఉప కులాలు) రూపొందాయి. ఫలానా కులానికి ఫలానా వృత్తి, ఫలానా వృత్తికి ఫలానా కులం అనే విధంగా వృత్తి విభజనలు జరిగాయి. ఈ విభిన్న వృత్తులు అనేకంగా గ్రామ ప్రాంతాల్లోనే జరుగుతున్నందువల్ల ఒక్కొక్క గ్రామంలోనూ, ధానికవసరమైన విభిన్న పృత్తులు చేయడానికి నిర్ణయింపబడ్డ విఖిన్న కులాలవారూ, వారి జీవనాధారానికి కావలసిన ఆర్థిక ఏర్పాట్లు, గ్రామజీవితం యొక్క అవిభాజ్య అంశాలైనాయి. ఒక్కొక్క గ్రామానికీ కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలివారు తప్పక అవసరమయ్యారు. ఇపన్నీ గల (గ్రామీణ
లి
వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ ఉదయించడానికి పూర్వమే రూపొందివున్నది. భూస్వాష్యు వ్యవస్థలోనూ అది కొనసాగి వృద్ధిచెందినది. ఇప్పుడుకూడా అది ఒకంత కొనసాగుతూనే వున్నది.
ఈ సామాజిక వ్యవస్థ యొక్క అనివార్యమైన ఒక ఫలితమేమంటే, ఆ వత్తులు చేసిన వారందరి దృక్పథంలోను, కార్యాచరణలోను నిండివున్న వురాతన దృక్ ణం! పాతకుటుంబ పెద్దలు చెప్పిన వాటిని తు.ఛ. తప్పక అనుసరించడం తప్ప, వృత్తుల సంబంధంగా కొత్త పుంతలు (క్రాక్కడానికి ఎవరూ సాహసించలేదు. వేరెపరినీ తపు "వృత్తులు చేయమని పిలవనూలేదు. తాము వేరువృత్తులకు వెళ్ళనూ లేదు. ఈ విధంగా ఒక తరంనుంచి మరో తరానికి వంశపారంపర్యం లభించిన వృత్తిని పాటించడం తప్ప, విభిన్న వృత్తులను ఆధునికపరచాలనే ఆలోచన ఎవరికీ తోచలేదు. .
ఈ పరిస్థితికిపూర్తిగా సరిపోయే ఒక ప్రాపంచిక దృక్పథాన్నే హిందూ తత్వజ్ఞానులు (ప్రజలకు బోధించారు. ఈ ప్రపంచ జీవనంలో జరిగేదంతా భగపంతుని ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. దానిని మార్చడానికి ఎవరివల్లా వీలుకాదు. కాబట్టి స్వంత, జీవితాన* ప్రయోజనం పొందడానికి ఎవరూ ఏమీ చేయవలసినపనిలేదు. భగపంతుని దయ మాత్రం వుంటేచాలు, పరలోకంలో కూడా రక్షణ లభిస్తుంది... అనే దృక్పథమే ప్రజలలో “వ్యాపించివున్నది. అన్ని విషయాలను 'కర్మ' సిద్ధాంతానికి లోనుచేసే దృక్కోణమూ, క్తులాల్సు .ఉపకులాలు అనే పద్ధతిలో ఏర్పడ్డ వృత్తి విభజన భారతీయ సామాజికాభివృద్ధిని.
' మందగింపజేసింది. అందువల్లనే పరిశ్రమలు పారిశ్రామిక సాంకేతిక రంగంలో విప్లవం సాగించి, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థను రూపొందించిన ఐరోపాకు' మారుగా భారతదేశంలో తరతరాలుగా వచ్చిన ఆర్థిక జీవనమూ, వర్ణ (కుల) వ్యవస్థతో నిండిన సామాజిక జీవనమూ ప్రధానమైన మార్చులేవీ లేకుండానే ఆంగ్లేయుల పాలన వరకు కొనసాగాయి. . _ మనదేశంలో ముస్లిం పాలకులు వర్ణ (కుల) వ్యవస్థకు బయట వున్నా అందులో ఎటువంటి మార్పును కూడా తీసుకురాలేక పోయారు. వారు కూడా వర్ణ (కుల) వ్యవస్థ పునాదిగా గల గ్రామీణ సమాజాన్నీ దానిపై ఆధిక్యత వహించిన ఉన్నత కులాధికారులు (భూస్వామ్య), సైనికాధికారుల (ప్రాపకంలోనే తమ - సొమ్రాజ్యాలను నిర్మించారు.
మత, తత్వశాస్త్ర రంగాలలో హిందువుల ప్రాపంచిక దృక్చధానికి విరుద్ధమైన సిద్ధాంతమైన సిద్ధాంతమేదీ ముస్లిం తత్వజ్ఞానుల వద్ద లేకపోయినది. వారు బహు ఈశ్వరారాధనకు బదులుగా ఏకేశ్వరోపాసన చేశారనే "కారణంగానే, వైదిక తత్వజ్ఞానుల ప్రయత్నాల ఫలితంగా భారత ప్రజలలో రూపొందిన ప్రాపంచిక దృష్టి నశించిపోదుగదా!
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో (ఉదా: కేరళలో) ప్రధానమైన స్థానము పొందివున్న శైస్తవ తత్వబోధకుల వల్ల కూడా హిందూ ప్రాపంచిక ' దృక్పథానికి సవాలు విసరదానికి వీలుకాలేదు. -
అదీగాక, వైదిక సంస్కృతికి పునాదియైన వర్ణ (కుల) వ్యవస్థ యొక్క కొన్ని అంశాలను [గ్రహించి ఇస్లామ్ మతాన్ని, (కైస్తవమతాన్ని కొంతవరకు “భారతీయం” చేయడానికి రెండు మతాలకు చెందిన ఉన్నతవర్గాలు ప్రయత్నించాయి కూదా! ల
. ఐరోపాలో పరిశ్రమ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలు మానవ జీవితంలోని అన్ని రంగాలలోసు వ్యాపించిన పెట్టుబడిదారీ విప్లవం యొక్క అవిభాజ్య -అంగాలుగా వున్నాయి. అక్కడి సాంస్కృతిక విప్లవం నాస్తిక వాదానికి, భౌతికవాదానికి పునాదివేసినది. జైస్తవ కేథలిక్ సుతాధిపతియైన 'పోప్' ఆధిక్యతకు బ్రెిటిషురాజు, జర్మనీకి చెందిన మార్చిన్ లూథర్వంటి మతపండితులు సవాలు విసిరారు. వీటన్నింటి వల్ల అన్ని యూరప్ దేశాలలోను సాంస్కృతిక వునరుజ్జీవనము కలిగి, విజ్ఞానము వృద్ధిచెంది, దాని నుపయోగించుకొని పారిశ్రామిక, వ్యాపసాయక విప్లవాలు అక్కడ జరగడానికి దోహదమైనది.
అనేక శతాబ్దాల కాలంగా ఎడతెగని ప్రయత్నాల ఫలితంగా ఐరోపాలో రూపొందిన పారి_శామిక, సాంకేతిక పద్శృతుల వంటి వృద్ధతులను భారతీయ మేధావులు కనిపెట్టలేకపోయారు. వాటిలో కొన్నిటిని కొత్త యూరోపియన్ వరిపాలకులు భారతదేశంలోకి దిగుమతి చేసినపుడు, యిక్కడి ప్రజల కేర్పడిన భయ సందేహాలను వారు నివృత్తి చేయలేకపోయారు కూడా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రైళ్ళు, తంతి పద్ధతి, తీగలేని తంతి, (వైరలస్) మొదలగున్నవి ప్రవేశపెట్టబడి నపుడు అధిక సంఖ్యాకులైన భారతీయులు వాటిని భగపంతుని కార్యాలుగానో లేక దయ్యపు చేష్టలుగానో మాత్రమే భావించారు. విజ్ఞానానికి వ్యతిరేకమైన దృక్పథము యొక్క అవశేషాలను నేడు కూడా చూడపలసి రాపడం నిజంగా విచారించదగ్గ విషయం. ఆధునిక యాంథత్రిక యుగంలో యింత ఘోరంగా వెనుకబడ్డ స్థితికి ప్రజలను తోసివేసిన భారతీయ సమాజం, అనేక శతాబ్బాల వరకు మానవ సమాజం యొక్క సాంస్కృతికాభివృద్ధికి గర్వించదగిన తోడ్చాటునందించిందని ముందే చూశాం. మౌర్య, గుప్త హర్ష పంటి హిందూ చక్రవర్తుల కాలంలోనూ, మొగలాయి చత్రవర్తులతో సహా ముస్లిం పాలకుల కాలంలోను ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఉన్నత స్థితిని పొందివున్న భారతీయ సమాజం, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ కాలంలో ఎందుకిలా పతనం చెందిందో, దానికి కారణం ఏమిటో దేశ (ఫేమికులందరూ ఆందోళనతో పరిశీలించాలి. దీనికి సరైన జవాబు మనమింతవరకు చేస్తూ. వచ్చిన పరిశోధనలోనే లభిస్తుంది. ఆరు డా రెండు, మూడు వేల సంవత్సరాలకు పూర్వం వెనుకబడి వున్న స్థితి యందుండిన'
- భారతదేశం అభివృద్ధిచెందడానికి వర్ణ (కుల) వ్యవస్థ తోడ్పడినది. ఆర్థిక సాంస్కృతిక రంగాలలో అంతవరకు ఏర్పడని అభివృద్ధి వర్ణ (కుల) వ్యవస్థలోనే ఏర్పడినదనే విషయాన్ని నిరాకరించలేము. ' “దాసులు”, “ఉన్నత కులాలవారు” అనే రెండు వర్షాలు ఆవిర్భవించడంతో 26
పాటు వున్నత వర్గాలవారు విభిన్న రంగాలలో తమ సామర్థ్యము పెంపొందించుకోపదానికి అనేక అవకాశాలు లభించాయి. ఇందువల్ల వారికి ప్రయోజనము కలగడమే గాక మొత్తము సామాజికాభివృద్ధికి కూడ అది' దోహదపడినది. .
అయితే ప్రారంభదశలో 'దాసులు”, “ఉన్నత కులాలవారు” అనే రెండు పర్గాలేకాక, కాలక్రమేణా లెక్కలేనన్ని కులాలు, ఉపకులాలు ఏర్పడి, తరువాత కాలంలో -అవి సామాజికాభివృద్ధికి ఆటంకాలుగా పరిణమించాయి. ఈ పర్ణ (కుల) వ్యపస్థ సంరక్షకులు కోట్ల కొలది ప్రజలలో వ్యాపింపజేసిన ప్రాపంచిక దృక్పథము ఇక్కడ ప్రత్యేకంగా పేర్ళొనదగినది. కావున, ఐరోపాపలెనే ఆధునిక యాంత్రిక యుగము భారతదేశంలో ఆవిర్భవించాలంటే, ఈ దేశం వర్ణ (కుల) ప్యపస్థ నుంచి, సనాతన హిందూ ప్రాపంచిక దృక్పధము నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం, సమానత్వం సొ(భాతృత్వం పంటి పెట్టుబడిదారీ ఆదర్భాలతో వున్న ఒక కొత్త సిద్ధాంతం భారతీయ సమాజంలో పుట్టాలి. మరో విధంగా చెప్పాలంటే, ఐరోపాలో పెట్టుబడిదారీ పునరుజ్జీపన రూపంలో జరిగిన సాంస్కృతిక విప్లవం లాంటి విప్లవం భారతదేశంలోనూ జరగాలి.
150 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ సాంస్కృతిక విప్లవం అసంపూర్ణంగానైనా ఆరంభమైనది. ఆనాడు విదేశీపాలకులు (ప్రారంభించిన పనిని నలభై . సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారు. అయితే బ్రిటిష్ పాలకులో, వారి తర్వాత వచ్చిన కాం(గైస్ పొలకులో వర్ణ (కుల) వ్యవస్థ పునాదిని విధ్వంసము చేయలేకపోయారు. హిందూ తత్వ శాస్త్రజ్ఞులు ప్రజలమీద మోపిన ప్రాపంచిక దృష్టికి వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవాన్ని వారు రూపొందించలేదు. బ్రిటిష్, కాం(గెస్ పాలకులిరువురు వర్ణ (కుల) వ్యవస్థ నాయకులతోను, అభివృద్ధి నిరోధక ప్రాపంచిక దృష్టితోను సర్దుకుంటూ వెళ్ళుతూ, తమ స్వంత అధికారాన్ని సుదృధము చేసుకోపడానికే ప్రయత్నించారు.
అదీకాక, వర్ణ (కుల) పద్ధతిలో తమకనుకూలమైన మార్పులు చేయటానికి వారు తీసుకున్న ప్రయత్నాలు, ఆధునిక విజ్ఞానాన్ని చాలా తక్కువ మోతాదులో ప్రజల కందించే వారి విద్యా పద్ధతి - ఇవన్నీకూడా భారత ప్రజల మీద భరించరాని బరువును మోపింది. 125 సంవత్సరాలకు మునుపు అనాటి భారతదేశ పరిస్థితులను పరిశీలించి, కారల్ మార్క్ చెప్పినట్లు, “భారతదేశ ప్రజలు తమదైన పాత్ర ప్రపంచాన్ని పోగొట్టుకున్నారు. అయితే వారికి కొత్త ప్రపంచమేదీ లభించలేదు” ఈనాడు కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు.
2000 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వున్న భారతీయ సమాజ, సంస్కృతుల పునాదిని విచ్చిన్నం చేసి పదునైన ఆయుధాలతోనే యూరోవియన్ వ్యాపారులు భారతదేశంలోకి ప్రవేశించారు. కేరళలోని కళ్ళికోట, కొచ్చిన్, కొల్లమ్లతో సవా భారతదేశంలోని అన్ని సముద్రతీర పట్టణాలలోనూ వ్యాపారం కోసం దిగిన ఆంగ్రేయులు, అంతకుముందు మనదేశంపైకి వచ్చిన అక్రమణదారులు తమతో తెచ్చుకున్నంత పెద్ద సైన్యాన్ని తెచ్చుకోలేదు. సైన్యబలాన్నుపయోగించి దేశాన్ని వశపరచుకుని, అధికారాన్ని
బగ్ర
నెలకొల్పడానికి వచ్చినవారు కారువారు అయినా, మౌర్యుల మొదలు మొగల్ చక్రవర్తుల వరకు పున్న అందరి పాదుషాల, చక్రపర్తుల సింహాసనాల క్రిందనుండిన సామాజిక శక్తి అనే పునాదిని విచ్చిన్నం చేయడానికి కావలసిన శక్తివంతమయిన ఆయుధం ఆంగ్లేయుల " చేతిలో వున్నది అది వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలే! ఆంగ్లేయులు తమ దేశంలో తయారయ్యేవస్తువులను భారతదేశంలోని విస్తృతమైన మార్కెట్లో విక్రయించడానికీ, భారతీయ వస్తుపులను తమ దేశానికి తీసుకుపోవడానికే -... వచ్చారు. బాహ్యరూపానికి సైనిక రీత్యానో, పాలనా రీత్యానో ఎటువంటి స్వభావము లేని ఈ వ్యాపార దాడిపలన భారతదేశ సామాజిక వ్యవస్థ, సంస్కృతి పతనం చెందబోతాయనే విషయం ఆనాడు ఎపరూ ఊహించనైనాలేదు. కాని దీర్ధకాలం గదడపకముందే ఆ సత్యం బయటపడింది. మౌర్య సాఘ్రాజ్య కాలం నుంచి, మొగల్ సామ్రాజ్య కాలం నుంచి మనదేశంలో కుటుంబాలు, అవి ఉంటున్న (గ్రామాలు స్వయం పోషకత్వంతోనే విలసిల్లాయి. అదే భారత సామాజిక జీవనానికి, రాజకీయ పాలనా వ్యవస్థకు, సాంస్కృతిక జెన్నత్యానికి పునాదిగా వుంది. ప్రతి కుటుంబములోని వారునూ తమ జీవితానికి అపసరమైన వపస్తుపులనుతామే ఉత్పత్తి చేసుకొనేవారు. తమకు కొరతపదే వస్తువులను మాత్రమే అదే గ్రామంలోని ఇతర కుటుంబాల నుంచి తీసుకొనేవారు. ఈ పద్ధతిలోనే భారతదేశంలోని తరతరాల సాంఘిక జీవనం గ్రామీణ స్వయం పోషకత్వం పునాదిగా వున్నది. తమ స్వంత గ్రామంలోని ఇతర కుటుంబాల ఉపయోగానికై గాక, వేరే చోట్ల తీసికొని వెళ్ళి అమ్మడానికై వస్తువులనుత్పత్తి చేసేవారు కాదు. బయటి ప్రదేశాలలో తయారుచేయబడే వస్తువులను తాము ఉపయోగించేవారు కాదు.
- ఈ పరిస్థితిని అంతం చేసి స్వంత గ్రామంలోని వారికోసం మాత్రమే గాక, బయటివారి ఉపయోగం కోసం కూడా వస్తువులను ఉత్పత్తి చేయటం, ఇతరులు ఉత్పత్రిచేసిన వాటిని తాము వువయోగించడం అనే పెట్టుబడిదారీ వద్శతిని మనదేశంలో ప్రవేశపెట్టినవారు ్రీ.శ.15వ శతాబ్దం నుంచి భారతదేశంలోకి రానారంభించిన యూరోపియన్ వ్యాపారులే! వారి రాకతో ఆ పెట్టుబడిదారీ పద్ధతో మనదేశం లోనూ వ్యాపించినది. | దీనికి తగిన వాతాపరణం సాంప్రదాయ సిద్ధమైన భారతీయ సమాజంలోనే 'పెంపొందుతూ పున్నది అన్న విషయం కూడా నిజమే! ఒక్కొక్క గ్రామంలోనూ ఇంచుమించు అన్ని కుటుంబాలు స్వయం పోషకత్వంతో వున్నప్పటికీ వర్ణ (కుల) పద్ధతి, అది పునాదిగా వున్న వ్యక్తిగత ఆస్తి వృద్ధి అందులో కొద్దిమార్చును తెచ్చిపెట్టాయి. క్రమక్రమంగా అభిపృద్ధి చెందుతూ వచ్చిన కొందరు అల్ప సంఖ్యాక గ్రామీణుల వద్ద గ్రామ పెద్దల పద్ద వారి అపసరాలకు పోను కొంత పస్తూత్చత్తి మిగల నారంభించినది. ఈ మిగులు నుపయోగించి తమ గ్రామానికి బయట తయారైన విలాస పస్తువులను కొని, ఆడంబరంగా జీవించడానికి వారికి సాధ్యమైనది. ల
ఈ విషయంలో వారికి సహాయము చేస్తూవచ్చిన ఒక శాఖావారు. పణిజులు లేక వైశ్యులు - వర్ణ (కుల) వ్యవస్థ 'పెంపొందిన ఫలితంగానే రూపొందారు. ఆ ప్యపస్థ క్రమ క్రమంగా భూస్వామ్య వ్యవస్థగా పరిణామం చెందెనపుడు, భూస్వాముల సైనిక, పాలనా అవసరాలకు కూడా వస్తుమార్పిడి అత్యాపశ్యకమైనది. ఈ విధంగా క్రింది స్థాయిలో స్వయం పోషక గ్రామాలు విలసిల్లినప్పుడే, వాటికి కావలసిన డబ్బు చెలామణి, ధనము వృద్ధిచెందగా ఏర్పడే వడ్డీకి డబ్బు ఇచ్చిపుచ్చుకొనే పద్ధతి ఇపన్నీ అమలులోకి పచ్చేశాయి, సామంతులు, రాజులు, నవాబులు, పాదుషాలు, చక్రవర్తులు ఈ విధంగావైన కేంద్ర ప్రభుత్వ వికాస క్రమానికి సాంఘిక పునాది ఇదే!
యూరోపియన్ వ్యాపారులు ఇక్కడ అడుగుపెట్టినపుడే వారితో చెట్టాపట్టాలు వేసుకున్న భారతీయ వ్యాపారులు కూడా వుత్సాహంతో ముందుకు వచ్చారు. వారికీ, తమలో తాము పోట్లాడుకుంటూ వున్న ఐరోపా వ్యాపారులకూ (ఈస్టిండియా కంపెనీలకు), న్వదేశీ పాలకులకూ యుద్ధాలు చేయడానికి బుణాలిచ్చే వడ్డీ వ్యాపారులు మొగల్పాలనాంతంలో వున్నారు. వారిలో అనేకుల పేర్లను, ఇతర విపరాలను పరిశోధకులు కనిపెట్టి చెప్పివున్నారు.
అయితే వాణిజ్యం, డబ్బు ఏర్పాటు సమాజంలోని పైస్థాయిలో మాత్రమే వున్నవి. కొందరు (గ్రామ, పెద్దలు తప్ప అధిక సంఖ్యాకులైన గ్రామీణ కుటుంబాలవారు స్వయం పోషక జీవనమే గడుపుతూ వచ్చారు. స్వంత గ్రామంలో ఇరుగుపొరుగు వారితో వారికున్న -ఆర్ధిక సంబంధాలు అనేకంగా వస్తువుల మార్చిడిగానే వుండేవి. డబ్బుల మూలంగా . జరిగేవి కావు భూస్వాములకు, ప్రభుత్వానికి చెల్లించవలసిన కౌలు లేక పన్ను కూడా డబ్బుల రూపేణ గాక వస్తువుల రూపంలోనే చెల్లించేవారు. వ్యవసాయం ద్వారా, ఇతర చేతివృత్తుల ద్వారా జీవించేవారు కూదా తమ తమ వుత్పత్తి వస్తువులను పరస్పరము మార్చిడి చేసుకున్నారేగాని, డబ్బులతో లావాదేవీలు చేసుకోలేదు.
సమాజంలోని పై వర్గాలలో 'పెంపొందుతూ వచ్చిన డబ్బు పుపయోగము, దాని మూలంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు గ్రామీణ జీవితంలో చెప్పుకోదగ్గ ప్రభాపము చూపలేక పోయాయనే దీనర్ధము!
ఈ జీవన విధానాన్ని ఐరోపా వ్యాపారుల రాక తీప్రంగా భంగపరచింది భారతదేశంలో తయారయ్యే వస్తువులను కొనేవారు ఐరోపాలో వున్నారనే విషయం, అదే విధంగా ఇక్కడ ఉత్పత్తి కానటువంటి అనేక వస్తువులను ఐరోపా నుంచి దిగుషుతి చేసుకోవచ్చనే విషయం నిర్ధారింపబడిన తరువాత అంతపరకూ సమాజంలోని పై స్థాయిలో మాత్రమే వున్నటువంటి వాణిజ్య సంబంధాలు, డబ్బు వినియోగము గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించ నారంభించినది. (గ్రామీణ ప్రాంతాలలో వుత్పత్తి చేయబడే వస్తుపులను కొని ఐరోపా వ్యాపారులకు చేరవేయడం, వారు తెచ్చే వస్తువులను మన గ్రామీణ ప్రాంతాలలో విక్రయించడం ఈ రెండింటిని చేసేవారు, అందుకోసం డబ్బునుపయోగించేవారు అతి వేగంగా ఎక్కున కాజొచ్చారు. భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతం కూడా విస్తృతమైన ప్రపంచ మార్కెట్లో ఒక భాగం కాసాగింది. తమ స్వంత (గ్రామానికి వెలుపల తమ వస్తువులను విక్రయించి డబ్బు సంపాదించదానికై. వుత్చత్తిని క్రమబద్ధం
॥ " 28 "
చేయడానికి బయటి ప్రదేశాల నుంచి కొనే వస్తువులను వుపయోగించేలా తమ జీవితాన్ని రూపొందించడానికి గ్రామీణ కుటుంబాలకు ప్రోత్సాహము లభించింది. (ప్రత్యక్షంగా కాకపోయినా, అమితవేగంగా భారతీయ సమాజం అంతటనూ విప్లవాత్మకమైన మార్పులు యూరోపియన్ వ్యాపారులతో కానసాగిన ఈ వాణిజ్య సంబంధం తెచ్చి పెట్టింది.
యూరోపియన్ వ్యాపారులు న్వదేశీ పాలకులను యుద్ధాలలో ఓడించి రాజ్యాధికారాన్ని పశపరచుకొనడానికి మునుపే ఇదంతా జరిగి పోయినది. వారు భారతదేశ పాలకులుగా మారిన తరువాత ఇది మకీ సుదృఢమైనది. ఇతర ఐరోపా వారిని వెనుకకు నెట్టి, ఇంచుమించు భారతదేశాన్నంతటని బ్రిటిషువారు తమ పాలన క్రిందకు తెచ్చుకున్నారు. దానితో ప్రపంచ మార్కెట్లో వృద్ధిచెందుతూ వున్న భారతదేశ ఆర్థిక సంబంధాలు ఇక్కడున్న రైతులను, చేతివృత్తులవారిని అతివేగంగా దివాళా తీయనారంభించాయి. = +
తమదేశంలో ఆధునిక కర్మాగారాలలో వుత్పత్తి చేయబడే వస్తువులను భారతీయ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం, భారత (గ్రామాలలో వుత్పత్తి చేయబడే వ్యవసాయోత్పత్తులను, చేతివృత్తుల సరకులను తక్కువ ధరలకు కొని తమ దేశానికి _కొనిపోవడం ఈ రెండింటిని చేయడంలో బ్రిటిషు వ్యాపారులకు సహాయపదేటటువంటి విధానాన్నే ఆనాడు రాజ్యాధికారం చెలాయించిన ఆంగ్లేయ వర్తకులు, వారికి పూర్తి సహకారం అందించిన బ్రిటిషు ప్రభుత్వం వుద్దేశ్యపూర్వకంగానే అనుసరించాయి. ఈ విధానం అత్యధికులైన రైతులను, గ్రామీణ చేతివృత్తుల. వారిని అతితీవ్రంగా నాశనం చేసినది.
“బిటిషు ఈస్టిండియా కంపెనీ" వారు పరిపాలించిన ప్రదేశాలలోను, స్వదేశీ సంస్థానాలలోను వారు తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పు భూస్వామ్యసంబంధాలకు సంబంధించినది. సంప్రదాయ సిద్ధమైన సాంఘిక సంబంధాలకు పునాదిగా వున్న వర్ణ (కుల) వ్యపస్థ యొక్క ఒక భాగంగానే భూస్వామ్య సంబంధాలు వుండేవి.
బానిసలు, రైతులు తాము ప్రభువులకు అణిగిమణిగి వుండడానికి చిహ్నంగా తాము పుత్చత్తిచేసే వస్తువులలో ఒక భాగాన్ని కౌలుగాను, రాజభోగంగాను చెల్లిస్తూ వచ్చారు. దీనిని పూర్చి భూమిశిస్తు విధించడం, దీనిని" డబ్బుగా నిర్ధారించడం, వసూలు చేయడం
- ఇవన్నీ మొగల్ చక్రవర్తుల పాలనాకాలంలోనే ప్రారంభమైనప్పటికీ అంత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చివుండలేదు. రైతులకు, (ప్రభుత్వానికి ఏర్పడ్డ సంబంధాలలోనే అవి వ్యాపించాయి. గ్రామ పెద్దలైన భూస్వాములకు, వారి ఆధీనంలో వున్న రైతులకు మధ్య సంబంధాలు వస్తురూపేణా కౌలుగానే కొనసాగినవి.
ఇందులో ముఖ్యమైన మార్పుని తెచ్చినది బ్రిటిషు వ్యాపారుల పాలనా విధానమే! ప్రభుత్వానికి చెల్లించవలసిన భూమిశిస్తును డబ్బురూపంగానే నిర్ణయించి వసూలు చేయడానికి, దాని కోసం రైతులు చెల్లించవలసిన కౌలును భూస్వాములు కూడా దబ్బు రూపంలోనే వసూలు చేసుకోవడానికి అధికారమిచ్చే ఒక విధానాన్ని కొత్త పరిపాలకులు అంగీకరించారు. ఈ విధంగా డబ్బు మూలమైన లావాదేవీలనుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేని పరిస్థితి రూపొందినది.
29
ఏడు
ఇంగ్లాడులో తయారయ్యే వస్తువులకన్నా నాణ్యమైన వస్తువులను తయారుబేసే భారతీయ పరిశ్రమలను నాశనం చేసే ఎగుమతి-దిగుషుతి విధానాన్ని బ్రిటిషు. పాలకులు అమలుపరచారు. 18ప శతాబ్దం ద్వితీయార్ధంలోను, 19వ శతాబ్దంలోను భారతదేశంలోని విభిన్న ప్రాంతాలలో అధికారం చెలాయిస్తున్న ఇంగ్లీషు పర్తకులు అక్కడ వున్న చేతి వృత్తులవారి నుంచి బ్రిటిషు పారిశ్రామిక వేత్తలకు కలిగిన పోటీలో తమ వారిని సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక రకాల భారతీయ పరిశ్రఘులు నశించ నారంభించాయి.
. బ్రిటిషు పెట్టుబడిదారులకు సహాయపదేదిగాను, భారతీయ చేతి వృత్తులను ధ్వంసం చేసేదిగాను ప్రభుత్వం అనుసరించిన విధానం కూడా అపాయకరంగానే వున్నది. డబ్బు పనియోగం వ్యాప్తిచెందే కొలది గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడిన దివాళాకోరుతనం రైతులను, చేతి వృత్తులవారిని, ఇతర (గ్రామీణ ప్రజానీకాన్నంతటినీ ఇక్కట్ల 'పాల్టేసినది. భూమి శిస్తును డబ్బు రూపంలోనే చెల్లించాలి. డబ్బు మారకం వినియోగం అధికం కాగా, అలా పెరుగుతూ వచ్చిన జీవితావసరాలను తీర్చుకోవడానికి భూమిని లేక ఇతర ఆన్ఫులను, తాకట్టు _ పెట్టవలసివచ్చేది. చివరకు వాటిని విడిపించుకోలేక తెగనమ్మివేయపలసి వచ్చేది. ఈ విషమస్థితిలో అత్యధిక (గ్రామీణ కుటుంబాలు అలమటించసాగాయి. రైతులు, చేతి వృత్తులవారిలో- పూర్తిగా దివాళా తీసినవారు పనిని వెదుక్కుంటూ పల్లెలను వదలి, పట్నాలకు తరలి వెళ్ళడం అధికం కాజొచ్చింది. గ్రామీణ జీవితమంతా ఇంకా ఇంకా విధ్వంసం వైపే సాగిపోయింది.
ఇవన్నీ భారతదేశంలో మాత్రమే మొట్టమొదటగా జరగలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ కాలంలో ఇంగ్లాండు, ఇతర ఐరోపాదేశాలలో కూడా ఈ క్రమం కొనసాగింది. అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలు నిర్బంధంగా దివాలా కోరులు చేయబడ్డారు. దీని పర్యవసానంగా ఆస్టులను, జీవనాధారాలను పోగొట్టుకున్నవారిని తక్కున కూలికి పనిచేసేటట్లు చేసి, పెద్ద మొత్తాలను లాభాలుగా "సంపాదించే ఇంగ్లాండులోను, యితర యూరోపియన్ దేశాల్లోను బూర్జువా వర్గం అభివృద్ధి చెందినది. అప్పటి హృదయవిదారక గాథను మార్క్ “పెట్టుబడి” గ్రంథంలోను, ఏంగెల్స్ “ఇంగ్లాండులో కార్మికవర్గ స్థితిలోను వివరించారు. నిజాయితీ పరులైన బూర్జ్హువా చారిత్రక పరిశోధకులు సైతం ఈ చీకటి కొణాన్ని చక్కగానే వర్ణించి వున్నారు. అయితే, భారతదేశంలో పెట్టుబడిదారీ అభివృద్ధి ఐరోపాలో జరిగిన దానికన్నా భిన్నమైనది. ఇక్కడ చేతివృత్తులవారు దివాలా తీయడమేమో జరిగిపోయినది; కానీ, 8!
దివాలా తీసిన అత్యధికులకు ఐరోపాలో తక్కుప కూలియైనా, కఠినమైన పని పరిస్లితులెనా పట్నాల్లోని కర్మాగారాల్లో పని లభించింది. అయితే, అది కూడా భారత ప్రజలకు దొరకలేదు. సంప్రదాయ సిద్ధమైన చేతి వృత్తులవారిని దివాలాకోర్లుగా తయారుచేసే సమయంలోనే ఇక్కడ ఒక స్వదేశ్ పెట్టుబడిదారీ వర్గముదయించి, తమ దేశంలోని పెట్టుబడిదారులకు అపాయం కలగకుండా చూడడానికి బ్రిటిష్ పాలకులు (ద్ద వహించారు.
ఐరోపా దేశాలలో రైతులు, చేతివృత్తులవారి పతనం నుంచి కార్మికవర్గం ఆవిర్భవించినది. కానీ భారతదేశంలో దానికి బదులుగా రోజు రోజుకూ నిరుద్యోగుల 'సైన్యమే పెరుగుతున్నది. బ్రిటిష్ పాలనాకాలం నుంచి నేటిదాకా కొనసాగుతున్న పరిస్థితి ఇది!.
అయితే తపు ఉనికికీ, వృద్ధికే అవసరమైన కొంత పారిశ్రామిక అభివృద్ధి జరపవపలసిన నిర్బంధానికి వారు నెట్టబడ్డారు. భారతదేశంలోని ప్రతి కుగ్రామాన్నీ విశాల ప్రపంచ మార్కెట్టుతో అనుసంధించడానికి అవసరమైన రైల్వే రవాణాను బ్రిటిషర్లు ఏర్పరచుకోవలసి వచ్చినది. తిరుగుబాటు జరిగే ప్రదేశాలలో శాంతి - భద్రతలను పరిరక్షించడానికి కూడా రైల్వే వ్యవస్థ వారికి అత్యంతాపశ్యకమైనది. రైల్వే వ్యవస్థ ఏర్పడగానే ఇంజన్లు మున్నగువాటిని మరమ్మతు చేయడానికి పర్మ్ షాపులు నెలకొల్పవలసి వచ్చినది అనివార్యంగా యిపన్నీ పారిశ్రామికీకరణకు తీసుకువెడతాయని మార్చ్ చెప్పిన భవిష్యత్ వాణి మిక్కిలి సరియైనదనే విషయాన్ని తర్వాతి సంఘటనలు నిరూపించాయి...
- రైల్వే రంగంలో మాత్రమేగాక, యితర అనేక రంగాలలో కూడా ఆధునిక పర్శిశమలను న్థాపించడానికి బ్రిటిషు పాలకులు నిర్భంధించబడ్డారు. పెట్టుబడిదారీ ప్యపస్థను ఆధారం చేసుకున్న తపు పాలనా వ్యవస్థను సుద్భఢ మొనర్చుకోవడానికై స్వదేశీ మేధావి పర్గాన్నాక దాన్ని వృద్ధిచేసుకోవలనిన అవసరం కూడా వారికేర్పడినది. వాణిజ్యంలోను, పాలనా వ్యవహారాల్లోను తమకు సహాయం చేసే కమీషన్ ఏజెంట్లు గుషాస్తాలు, వారికన్నా తక్కువస్థాయి వారు మున్నగువారిని తయారుచేసే ఉద్దేశ్యంతో తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భారతీయ విద్యా వ్యవస్థకు బదులుగా ఆంగ్లభాషా సాహిత్యాలు, నవీన విజ్ఞానం వంటివాటిని బోధించే ఒక నూతన విద్యావిధానం కూడా వారు అమలు చేయవలసి వచ్చినది. ఆ విద్యావిధానాన్ని రూపొందించిన లార్డ్ మెకాలే, “వేషంలోను, ప్రవర్తనలోను, .ఆలోచనలోను ఆంగ్రేయులైన భారతీయ సంస్కృతీని తయారు చేయడమే ఈ కొత్త విద్యావిధాన లక్ష్యమని ఉద్దాటించారు.
నూతన విద్యా విధానంతో పొటు, భారతీయులను పెట్టుబడిదారీ వ్యవస్థ కనుగుణంగా మార్చడానికి కాపలసిన కొన్ని ఏర్పాట్లకు కూడా ట్రిటిషుపాలకులు సహాయపడ్డారు. కొత్త బూర్జువా పద్ధతిలో దిన, వార, మాసపత్రికలను వెలువరించారు. ఈ పత్రికలను, గ్రంథాలను ముద్రెంచడానికై అచ్చు యంత్రాలను నెలకొల్పారు. దేశంలోని విభిన్న ప్రాంతాలను అనుసంధింపడేసే తంతి-తపాలా వ్యవస్థ నేర్పాటు చేశారు. గ్రామాల స్వయం పోషక పరిస్థితిని పూర్తిగా నాశనం చేసి, ఆధునిక బూర్జువా పద్ధతిలో సమాజాన్ని పునర్నిర్మించడానికి చిన్నవిగా వున్నా ఈ అన్ని ప్రయత్నాలు చాలా ప్రధానమైన చర్యలుగా
|
భారత ఉవఖండంలోని విభిన్న ప్రజా నమూహాలను కొత్త వద్ధతిలో పునర్నిర్మించడానికి 'ప్రారంభంగా యిదివుంది. ఇంతవరకు వర్ణం, కులం, సుతం ప్రాతిపదికనే ప్రజా సమూహాలు విభజింపబడింది. నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనది భాష ప్రజల ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్ది వారిని పరస్పర ఐక్యపరచడంలో దిన,వార,
"మాస పత్రికలు, పుస్తకాలు ప్రధానపాత్ర వహించాయి. దీనివల్ల బెంగాలి, తమిళుడు, ఆంధ్రుడు, కన్నడిగుడు, గుజరాతీ, కేరళలియుడు అనే జాతీయ భావాలు రూపొంద నారంభించాయి. భూవిస్తీరాన్ని భాషను ఆధారం చేసుకుని ఐక్య కేరళ, విశాలాంధ్ర, సంపూర్ణ మహారాష్ట మొదలగు కోర్కెలుదయించి, తర్వాత భాషా (ప్రయుక్త రామ్రైలుగా దేశాన్ని పునర్వ్యవస్థకరించడానికి నాంది కూడా యిక్కడే జరిగింది.
సంప్రదాయ సిద్ధంగా అలవాటుపడ్డ జీవన విధానాలకు యివన్నీ విరుద్ధంగా
- వున్నందువల్ల, అత్యధిక సంఖ్యాక ప్రజలు 'పేటినంగీకరించ లేకపోయారు. అదీగాక రైతులు, చేతి వృత్తులవారు రోజు రోజుకూ దివాలా తీస్తూ వచ్చినందువల్ల కొత్త పాలకులపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. హిందూ, ఇస్లాం మతాలలోనూ,వాటి సంస్కృతులలోను నిమగ్నులైవున్న కోట్లాది ప్రజలు, తమ మత నాయకులతో కలసి కొత్త విదేశీ సంస్కృతికి, జీవన విధానానికి వ్యతిరేకంగా పోరాటానికి వుద్యుక్తులయ్యారు.
అయితే, దీనికి మరో పక్షం కూడా వున్నది. వర్ణ (కుల) వ్యవస్థ మోతనంతటినీ మోస్తూ వుండిన అంటరాని కులాలకు చెందినవారిలో తమ 'హీనమైన స్థితిని తొలగించేవారు, అందుకు సహాయపడగలవారు కొత్త పరిపాలకులే అనే భావం (క్రమ క్రమంగా వృద్ధికాసాగింది. నిమ్న కులాలవారిని ఇంతకు మునుపువున్న పాలకులు పాలనా వ్యపస్థ నుంచీ, సంస్కృతీ వికాసం నుంచీ దూరంగా వుంచడాన్నీ కొత్త పాలకులు 'నిష్ను కులాలు, “ఉన్నత: కులాలూ అనే తారతమ్యం లేకుందా భారతీయులందరికీ నమూనాపకాశాలు కల్చ్పించడోన్నీ వారు చూశారు. ఉన్నత కులాల వారిలోనే ఒక చిన్న వర్షానికి చెందినవారు సమాజుభివృద్ధిని స్తంభింపజేసే వర్ణ (కుల) విధానానికి, దాని సంస్కృతికి వ్యతిరేకంగా 'పనిచేయనారంభించారు. కొత్త పెట్టుబడిదారీ సమాజాన్ని సంస్కృతిని రూపొందించే ప్రయత్నంలో వారు విఫలం చెందారు. నిమ్నకులాలవారిలో కలిగిన చైతన్యం లాగానే ఉన్నత కులాలకు చెందిన అల్బసంభఖ్యాకులలోను సాంఘిక, సంస్కృతీ రంగాలలో సమూలమైన మార్పులు కావాలనే భావం కలిగినదనే దీనర్ధం! -
కొత్త పరిపాలకులకు వ్యతిరేకంగా "నిలబడ్డ సామాన్య (ప్రజలూ, వారిని సమర్థించేవారూ, ఈ రెండు వర్గాలవారూ పరస్పరం తలపడ నారంభించారు. క్రీ.శ. 1857లో ఉత్తర భారతదేశంలో అనేక మాసాలు గొప్ప ప్రజా తిరుగుబాటు జరిగినది. దీనికి నాందిగా కేరళతో సహా భారత్ దేశానికి చెందిన విభిన్న ప్రదేశాలలో బ్రిటిష్ వ్యతిరేక కలహాలు (బ్రద్దలయ్యాయి.
ఈ అన్నిటికీ బ్రిటన్‌కు చెందిన అభివృద్ధివలన అధికారాన్ని పొగొట్టుకున్న సామంతరాజులే నాయకత్వం వహించారు కానీ, వారికి వెనుక సమీకృతులైనవారు “డబ్బు ఆక్రమణ” వలన దివాలా తీసిన రైతులు, చేతివృత్తులవారు. సంప్రదాయ పూర్వకమైన సంస్థ్టతి నాశనం కావడాన్ని చూచి ఆవేదన చెందిన మేధావులు, మతాభిమానులు కూడా వారితో పాటు వున్నారు. విదేశీ పాలన ఇక్కడ వేళ్ళూను కోకూడదనుకున్న దేశభక్తులు కూడా వారితో చేరారు. "
తై
బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికుల పట్ల చూపబడ్డ వివక్షా, వారిలోని గణనీయమైన సంఖ్యాకుల షునసును నొప్పించే కొన్ని అధికారిక చర్యలు మొదలగునవే ఒక కలహానికి నాంది పలికాయి. అందుపల్లే బ్రిటిష్‌వారు దానికి 'సిపాయి కలహం అని నామకరణం చేశారు.
అయితే ఈ తిరుగుబాటుకు దూరంగా వుండటం మాత్రమేగాక, దానిని వ్యతిరేకించిన ఒక పర్గ్ణంవారు కూడా ఈ సందర్భంలోనే రంగం మీదికొచ్చారు. సంప్రదాయ సిద్ధమైన భారతీయ సమాజాన్ని నాగరికతనూ బూర్జువా పద్ధతిని పునర్నిర్మించడానికై ముందుకు పచ్చినవారే వారు. ప్రాచీన కుల (పర్ణ) వ్యవస్థలో నాయకత్వ స్థానంలో వున్న మేధావులే ఈ ఉద్యమానికి నాయకత్వం పహించినప్పటికీ కొత్త బూర్జువా సామాజిక వాతాపరణంలో “సాంఘిక న్యాయరి పునాదిగా గల చైతన్యంతో ముందుకు వస్తున్న నిష్నకులాలకు చెందినవారిలో (ప్రధానపుయిన వారునూ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు.
ఈ తిరుగుబాటు నిర్ధాక్షిణ్యంగా అణచబడ్డ కొన్ని పదుల సంపత్సరాల తర్వాతే దానికి సంపూర్ణమైన, దేశవ్యాప్తమైన స్వరూపం లభించినప్పటికీ బెంగాల్లో అది ఒక మేర అభిప్ప్ఫద్ధిచెందే పున్నది. ఐరోపా బూర్జువా పునరుజ్జీవనంతో పోల్చదగిన ఒక ఉద్యమం క్రీశ. 1857కు అర్థశతాబ్దానికి పూర్వమే బెంగాల్లో రూపొందనారంభించింది. ఆ ఉద్యమంలో సతీసహగమనానికీ, శాశ్వత వైధవ్యానికీ వ్యతిరేకంగాను, మహిళా విద్యావ్యాప్తి కోసమూ సాంఘిక సంస్కరణలు నొక్కి చెప్పబడ్డాయి.
లార్డ్ మెకాలే ఎదురుచూచినట్లు “దుస్తులలోను* ప్రపర్తనలోను, ఆలోచనా విధానంలోను ఆంగ్లేయులైన భారతీయుల సంతతి" వృద్ధి చెంద నారంభించిన చిహ్నమే కదా ఇది అనే సందేహం కలగవచ్చు. అయితే, ఈ కొత్తతరానికి చెందినవారు కూదా సాంఘిక సంస్కరణల లోను, సంస్కృతిని ఆధునికీకరణ చేయడంలోను, దేశ స్వాతంత్ర్యం లోను త్రద్ధ కనబరచారనడానికి ఆధారాలున్నాయి. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన నాయకులలో ముఖ్యుడైన రాజా రామమోహనరాయ్ తన యూరపు పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో పయనించేటప్పుడు అక్కడ చరిత్ర ప్రసిద్ధమైన 'థ్రంచి విప్లపం”. జరుగుతున్నది. దానితో తన మనసు మమేకమవుతోందని ఆయన సగర్వంగా ప్రకటించారు. _ భారతీయ సమాజాన్ని సంస్కృతినీ ఆధునికీకరణ చేయడానికి ఇంగ్లాండు నాయకత్వాన్ని స్వీకరించిన “ఇండియాలో పుట్టిన ఈ ఇంగ్లీషువారి భావి సంతతి ఇంగ్లాండులో లాగానే భారతదేశంలో కూడా స్వాతంత్ర్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మొదలగున్నవి వున్నరాజకీయ వ్యపస్థ కోసం కృషి చేయబోతారనే దానికి రామమోహన్‌రాయ్ ఉద్దాటన ఒక భవిష్యత్ వాణిగా పున్నది. ॥
దీని కొనసాగింపే 1857ప సంపత్పరం తిరుగుబాటు అనంతరం కొడద్జి సంపత్సరాలలోనే రూపొందిన జాతీయ స్వాతంత్రోద్యమం! దానిని ప్రారంభంలో రూపొందించిన వారు “దుస్తులలోను, ప్రవర్తనలోను, ఆలోచనా సరళిలోను ఆంగ్లేయులైన భారతీయులే, ఇంగ్లాండులో పలెనే భారతదేశంలో కూడా ఆర్థిక ప్యపన్ఫను ఆధునీకరించాలన్నదే వారి కోర్కె. బ్రిటిషు వారు ఇచ్చాపూర్వకంగానే భారతదేశాన్ని ఒక వెనుకబడ్డ దేశంగానే వుంచుతున్నారని వారు ఆరోపించారు. బ్రిటిషు పాలకులు తపు
33
దేశాభివృద్ధి కోసం భారత ప్రజలను కొల్లగొడుతున్నారని వారు సంఖ్యా విపరాలనుల్లేఘించి నిరూపించారు. ఈ సత్యాలను ప్రజలకు విపరించి వారిని చైతన్యపంతులను చేయడానికి, భారత అర్థికాభివృద్ధికి కృషిచేయడానికి వారిలో కొంత మంది మేధాపులు రూపొందారు.
- అర్థిక రంగాన్ని ఆధునికం చేసే ఈ ఉద్యమం కొన్ని సంపత్సరాలకు రాజకీయ రంగానికి వ్యాపించినది. భారతదేశ పాలనా వ్యవస్థపై న్ధాయి నుంచి భారతీయులను దూరంగా వుంచడానికి వ్యతిలేకంగా ఒక ఆందోళనే రూపొందిసది. దుస్తులలోను, 'ప్రపర్తనలోను, ఆలోచనా సరళిలోను ఆంగ్లేయులైన కొందరు భారతీయుల సమస్యగా ఇది పున్నప్పటికీ, భారత (ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా వేగంగా మారినది. పాలనా ప్యపన్థను ప్రభావితంచేసే అనేక ఇతర సమస్యలు కూడా నారంభించాయి. ఇంగ్లాండులో లాగానే ఇక్కడా పాలకులను కంట్రోలు చేయగల అధికారమున్న (ప్రజా ప్రతినిధుల సభల నేర్పాటు చేయాలనే కోర్కె కూడా ఎలుగెత్తి చాటబడినది.
పాలనా పరమైన, రాజకీయ పరమైన ఈ కోర్కెలను పొందడానికై సహాయపడే వుద్దేశ్వంతో కొన్ని ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలు నెలకొనసాగాయి. ఈ ప్రాంతీయ ప్యవస్థల కార్యక్రమాలను ఐక్యపరచడానికి ఒక అఖిల భారత ప్యపస్థ రూపొందినది. అదే “భారత జాతీయ కాంగ్రెస్”!
దీనిని నిర్మించడంలో ముందున్నవారు “దుస్తులలోను, (ప్రపర్తనలోను, ఆలోచనా సరళిలోను ఆంగ్లేయులైన భారతీయులు" మాత్రమే గాదు వారికీ విషయాల్లో సహాయం చేయడానికి పాలనా ప్యపస్థ యొక్క పైస్థాయిలో కొంత పంది ఆంగ్లేయాధికారులు కూడా పుండిరి. పాలనా బాధ్యతలను నిర్వర్తించేటపుడు ప్రజల భావాలను వారు ప్రత్యక్షంగా చూపిన ఫలితమిది!
రోజు రోజుకూ “దివాలా తీస్తున్న గ్రామీణ ప్రజలలో తీవ్రాందోళన పెరుగుతోందనే విషయాన్నీ దానిని కేవలం పాలనా చర్యలతోనే నిరోధించలేమనే సత్యాన్నీ ఈ పాలనా వ్యపస్థ నాయకులు గ్రహించారు. తమను విశ్వసించేవారు, తమ విశ్వాసపాత్రులైన విద్యావంతుల నాయకత్వంలో ఆంగ్ల పాలకుల అధికారాన్ని సవాలు చేయని రీతిలో, మితమైన కొన్ని రాజకీయ సంస్కరణలను మాత్రమే కోరే ఒక అనధికార సంస్థ ద్వారానే అధికమవుతోన్న ప్రజా అసంతృప్తిని “సరియైన దారి'లోనికి మళ్ళించగలమనే నిర్ణయానికి వారు వచ్చారు.
తమ స్వదేశమైన ఇంగ్లాండులోని పార్లమెంటు, అందులో పని చేసే ప్రతిపక్షము
- ఇవి నిర్వర్తించే కర్తవ్యాలను అంగీకరించే భారతీయుల ఒక సంస్థను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ఉన్నత అధికారులు అనుకొన్నారు. అటువంటి భారతీయుల ద్వారానే తపుకు అవసరమైన రక్షణ లభించగలదని వారు ఆశించారు. ఈ అంచనాతోనే వారు “భారత జాతీయ కాంగ్రెస్ అనే ఈ సంస్థను నిర్మించడంలో ముందునిలిచారు.
24
ఎనిమిది న సమక “భారత జాతీయ కాంగ్రెసొను రూపొందించినపుడు ఈ బ్రిటిషు ఉన్నతాధికారులు ఆశించిన ఫలితము లభించలేదు. "*కాంగ్రైస్ స్థాపింపబడిన కాలంలో దానికుండిన స్వభాపము క్రమ క్రమంగా మారజొచ్చింది. పూర్తిగా కొన్ని మితమైన కోర్కెల కోసం “ఘనత పహించిని పాలకులకు మహజర్లు సమర్చించుకొనేస్థితిలోనే అది పున్నది. అయితే తర్వాతి కాలంలో ఈ పద్ధతిని విడనాడి, 'ఆంగ్రేయ అధిపత్యం నుంచి సంపూర్ణ స్వతంత్రమైన భారతదేశం' అనే లక్ష్యాన్ని ముందుంచి, కోట్లాది భారతీయులను సమీకరించి పోరాట పథంలోకి దించే ఒక వ్యపస్థగా అది మార్పు చెందినది.
మొదట కాంగ్రెసు ఆంగ్లేయులు రూపొందించిన శాసనాల హద్దులకు లోబడి పనిచేస్తూ పుందేది. మెల్లమెల్లగా శాసనోల్లంఘన, సత్యాగ్రహము పంటి రూపాలలో జరిగిన ప్రజా పోరాటాలకు అది మార్గ దర్శకత్వము వహించినది. ఒక తరం మారినపుడు కొత్త యుపతరం కాంగైస్కు నాయకత్వం పహించడం, మునుపటికన్నా అత్యధిక ప్రజలను విదేశీ పాలనకు వ్యతిరేకంగా సమీకరించడం, దీని ఫలితంగా అధిక పరిమాణంలో "పెల్లుబికిన ప్రజాందోళనలో పోరాటాల అఖిప్ఫద్ధి ఈ విధంగా కాం(గైెస్ ముందుకు అడుగువేసిసది.
వీటన్నిటి పర్యపసాసంగా, చిపరకు ఆంగ్లేయులు భారతదేశ పాలనను పదలివేసి భారత ప్రజలకు వారు ఎన్నుకొన్న ప్రతినిధులకు అధికారాన్ని అప్పజెప్పవలసి పచ్చింది. 1857వ సంపత్సరంలో జరిగిస తిరుగుబాటును అణచివేసిన 90 సంవత్సరాల లోపుగానే భారతదేశం స్వాతంత్ర్యము పొందినది.
అయిత భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రజల అభిలాషలను తీర్చే విధంగా బ్రిటిష్ వారు భారతదేశ పాలనను వదలి వెళ్ళలేదు. పశ్చిమాన సరిహద్దు రాష్ట్రము, పంజాబు నుంచి తూర్పున అస్సాం పరకున్న ప్రదేశాలలోనే ఆంగ్లేయులు పరిపాలన సాగిస్తూ వచ్చారు. 'ఇండియన్ యూనియన్, “పాకిస్తాన్ - అనే రెండు దేశాలను రూపొందించి 'ఆ ప్రదేశాల నాయకులను కొత్త పరిపాలకులుగా కూర్చోబెట్టిన తరువాతే వారు వెళ్ళారు. ఈ అధికార మార్పిడి జరగడానికి కొంత కాలం ముందు నుంచీ, జరిగినపుడూ భారతదేశ చరిత్రలో యింతపరకు కనీవినీ ఎరుగని దారుణమైన హత్యలు, దోపిడీలు, మానభంగాలు, గృహదహనాలు జరుగుతున్నాయి. రెండుకొత్త దేశాలలోను స్వాతంత్ర్యదినోత్సవం చేసుకొన్న రోజులలోనే ఇరుదేశాల సైన్యాలు తలపడే పరిస్థితి మ సంప మూ-కాశీీర్ స ము మీద ఎపరికి హక్కుండాలి ఏర్పడినది. ఆ సంఘర్షణకు కారణం జమ్మూ-కాళ్ళీర్ సంస్థానము ్కా అనె తగాదా ఒక తీరని సమస్యగానే పుండి పోయినది.
ఈ విధంగా లభించిస స్వాతంత్ర్యం 'స్వాతంత్ర్య పోరాట సేనాపతి అనీ 'దేశపిత' అనీ కీర్తింపబడే మవాత్మాగాంధీజీకి తీవ్ర ఆవేదస కలిగించినది. ఆయన స్టాతంత్య దినోత్సప వేడుకలలో పాల్గొన నిరాకరించారు. తనచుట్టూ దుర్మార్గాలకు బలై, రొధిస్తున్న ప్రజల కన్నీళ్ళను తుడవడానికి, రెండు దేశాల మధ్య రగుల్కొంటున్న యుద్దాన్ని ఆర్బడానిత గాంధీజీ తమీ జీవిత చరమదశసు అర్పించారు. స్వాతంత్ర్య హోరాటకాలంలో తన సన్నిహిత
| 35
మిత్రులుగా వున్నారు... ఇపుడు పాలకులుగా మారారు. వారి ప్రపర్తసను, పసులసు చూచి ఆయన మిక్కిలి ఆవేదన చెందారు. దేశం స్వతంత్రమైన తరువాత తన జీవిత లక్ష్యం నెరవేరినదనే సంతృప్తి ఆయనకు కలుగలేదు. దానికి మారుగా సర్వాన్నీ పోగొట్టుకున్న నిరాశా, నిస్సృహలే ఆయన్ను అపరించుకున్నాయి.
స్వతంత్ర భారతదేశ అవతరణ లాగానే మహాత్మాగాంధీజీ జీవిత చరసుకాలం కూడా వేదనాభరితంగానే వున్నది. స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ఆయన కేపలం ఐదు మాసాల, రెండు వారాలు మాత్రమే జీవించి వున్నారు. ఆ స్వల్ప కాలమంతటిలోనూ ఆయన అవిశ్రాంతంగా మత సామరస్య భావాలను ప్రచారం చేశారు. మతకలహాలలో బాధపడ్డ ప్రజలకు సమర్పణ భాపంతో సేవచేశారు. దీనితో అత్యధిక ప్రజలు అవేశం చెందారు. గాంధీజీ 25 సంపత్సరాలకు పైగా హిందూ-ముస్తింల ఐక్యతకై దృఢంగా కృషిచేశారు. కాని ఇప్పుడు ఆ ఐక్యత ఆయన కళ్ళ ఎదుటనే ధ్వంసమై పోతున్నది. దానిని చూచి వేదన చెందిన గాంధీజీ మాటలను, కార్యక్రమాలను చూచిన “ముస్సింలపట్ల శతృత్వమనే వున్నాదానికి గురైన హిందూ షతోన్నాదులు గాంధీజీకి బద్ద శతృపులైనారు. వరుసగా మతకలహాలు జరుగుతుండిన ఈ మతోన్నాదులు ఈ దుర్మార్గులకు ప్యతిరేకంగా, ఒంటరిగా కృషిసల్పుతున్న గాంధీజీని సహించలేకపోయారు. వారు ఆయన జీవితాన్ని అంతం చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని అమలు పర్చడానికై ఒక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారు తమ నిర్ణయాన్ని సమర్ధవంతంగా సెరవేర్చుకున్నారు కూడా!
భారతదేశాన్ని ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా చీలి, వాటి నాయకులను కొత్త దేశాల పాలకులుగా నియమించడమనే బ్రిటిషవారి కుతంత్రానికి, గాంధీజీని దారుణంగా హత్యచేసిన హిందూ మతోన్మాదుల రాక్షస కృత్యానికీ సన్నిహిత సంబంధము వున్నది. రెండు మూడు వేల సంపత్సరాలుగా పెంపొందుతూ పస్తున్న భారతీయ సాంఘిక, సాంస్కృతిక గతకాల సంప్రదాయం, నవీన ప్రపంచంలో దాని అనర్హత, ఈ అసమంజస వాతావరణంలో భారత జాతీయోద్యమము గైకొన్న ప్రత్యేక రూపాలు లేక జాతీయోద్యమంలో రూపొందిన హిందూ-ముస్లిం భావాల సంఘర్షణలు, వారిద్దరినీ ఐక్యపరచి సామాజిక ఐక్యతను స్థాపించాలని గాంధీజీ చేసిన ప్రయత్నాల వైఫల్యము ఇవియే స్వాతంత్ర్యంతో పాటు భారతదేశ విభజన జరగదానికీ, దానికి మునుపు, తరువాత దేశంలో చెలరేగిన మతకలహాలు, కలహాల కొనసాగింపుగా మండుతున్న మతోన్మాద భావాలు మొదలగు వాటిని సృష్టించాయి. ॥
| 1857వ సంవత్సర తిరుగుబాటుకు షునుపు, తిరుగుబాటు కాలంలోనూ రెండు
రకాలైన ఆలోచనా విధానాలు భారత (ప్రజలను ఆకర్షించాయి అని ఇంతకుముందే ' వివరించాము కదా! ఇంగ్లాండుతో సహా ఐరోపా అంతటిలోనూ వృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు సామాజిక, సాంస్కృతిక విధానాలను భారతదేశం కూడా అనుసరించాలని ఒకపర్గం వారు కోరారు. దీనికి విరుద్ధంగా షరో వర్గంవారు భారతదేశం తనదైన ప్రాచీన సామాజిక సంస్కృతిని సంరక్షించుకోవాలని అభిలషించారు. ఈ విధంగా భారతీయులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మొదటి పర్గం వారు 1857ప సంపత్సరం తిరుగుబాటును వ్యతిరేకించగా, రెండప పర్గం వారు దానికి పూర్తిగా షుద్దతు పలికారు.
ఆ తిరుగుబాటు అణచబడ్య తరువాత (ప్రారంభమైన జాతీయ స్వాతంత్రోద్యమంలోనూ ఈ రెండు రకాల ఆలోచనా సరళులు పరస్పరం సంఘర్షించాయి. స్వతంత్ర భారతదేశం ఆధునిక పెట్టుబడిదారీ వ్యపస్థలో అభివృద్ధి చేయబడాలనే లక్ష్యంతో,
36
దానికి కావలసిన పాలనా ప్యపస్థలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక రంగం, సాంఘిక సంస్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీపనము మొదలగు వాటికోసం వాదించినవారు భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో వున్నారు. వారిలాగానే వారి కన్నా అధిక పలుకుబడి కలిగిన మరో పర్గంవారు స్వాతంత్ర్యం తరువాత ఏర్పడే భారతదేశాన్ని ప్రాచీన భారతీయ పునరుజ్జీపనంగా చిత్రించారు. వారు స్వాతంత్ర్య పోరాట సంస్థల తరపునే పూజలు, ప్రార్ధనలు జరిపారు. 'గ్రామస్వరాజ్యంి, 'రాషురాజ్యం' పంటి కలలుకని వారు ఆ భావాలనే ప్రజలకిచ్చారు. వీరికి జాతీయోద్యమంలో గణనీయమైన పలుకుబడి వుండేది. వీరికీ, బూర్జువా సంస్మరణ వాదులకూ మధ్య ఒక సామరస్యం ఏర్పాటుగానే జాతీయోద్యమం విలసిల్లినదని చెప్పపచ్చు.
వీటి ద్వారా జాతీయోద్యమం అభిపృడ్టి అవుతూ వచ్చినది. అది రెండు బలహీనతలతో నిండి వున్నది. క
మొదటగా, 'పలు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న అధునిక మార్పులకు అడ్డంకిగా వున్న పర్ణ (కుల) వ్యపస్థ యొక్క పునాదిని ధ్వంసం చేసి సాంఘిక సమానత్వం, స్వతంత్ర ఆలోచనా విధానం, వైజ్ఞానిక దృష్టి మొదలగున్నవి పెంపొందలేదు. తరతరాలుగా కొనసాగుతూ పస్తున్న కాలానికి అనుగుణంకాని విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు మున్నగున్నవి నిరాటంకంగా అలాగే కొనసాగుతూ వచ్చాయి. దీని ఫలితంగా, ఆధునిక బూర్జువా అఖభిప్పద్ధి యొక్క అనివార్య పరిణామంగా '“తక్కుప కులాలవారు అని చెప్పబడే ప్రజలలో అసంతృప్తి వృద్ది కాసాగింది. “అంటరానివారుగా భావింపబదేవారు, అఆడివాసులు, వెనుకబడ్డ కులాలవారు - ఇలాంటివారు జాతీయోద్యమాన్ని దాన్ని నాయకులను అవిశ్వాసంతోను, సందేహంతోను చూశారు. వీరిలో గణనీయమైన సంఖ్యాకులను స్వాతరశ్రోద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిషువారు సమీకరించగలిగారు.
రెండపది, స్వరాజ్యాన్ని రామరాజ్యంగా చిత్రిస్తూ జాతీయ నాయకులు చేసిన ప్రచారానికి వ్యతిరేకంగా 'ఇన్లాం ఆధిక్యతను పునరుజ్జీవింప జేయడం' అనే స్వప్నం ముస్లిం సమాజంలో రూపొందినది. భారతదేశంలో (బిటిషుపాలన ప్రారంభం కావడానికి కొద్ది పూరం వరకుకూడా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వారు ముస్లిం చక్రవర్తులు కాబట్టి, ల్పగ్లేముల పరిపాలనను మళ్లీ తీసుకురావాలని ముస్లింలు అభిలషించసాగారు.
దీనికి బ్రిటిషు పాలకుల ప్రోత్సాహం సహజంగానే వున్నది. “భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా 'అభిల భారత ముస్తింలీగ్కు ప్రోత్సాహమిచ్చే ఎత్తుగడను రూపొందించారు; పాలనా సంస్కరణలకు సంబంధించిన చర్చలు జరిగినపుడల్లా వారు హిందూ అధిక సంఖ్యాకులకును, హిందువులు కాని అల్ప సంఖ్యాకులమును మధ్య వున్న వివాదస్పద సమస్యలను ముందుకుతెచ్చేవారు. హిందువులలో నిమ్న కులాలవారిని జాతీయోద్యమానికి వ్యతిరేకంగా సమీకరించగలిగినట్టే, హిందూయేతర అల్ప సంఖ్యాకులను కూడా ఆంగ్లేయులు జాతీయోద్యమానికి విరుద్ధంగా నిలవగలిగారు.
హిందూయేతర సమాజాలకు చెందినవారిని, అస్పృశ్యులుగా భావింపబడే పొందువులను శతృపుల దళంలో నిలిపే బ్రిటిషు కుతంత్రాన్ని ఖండించాలంటే స్వాతంత్రోద్యషు నాయకులకు ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక అపగాహన, సంస్కృతి వుండాలి. వర్ణ (కుల) పద్ధతిని సమూలంగా పెకలించి సాంఘిక సమానత్వాన్ని స్థాపించడం, హిందూమతానికి, ఇతర మతాలకూ పూర్తి స్వతంత్రం గల వాతావరణం: ఆర్థిక బూర్జువా సమాజాన్ని సృష్టించడం వర్ణ (కుల) వ్యవస్థ పలన, మత వాతావరణం వలన అనివార్యంగా
వ్ర
కలిగిన అంధ విశ్వాసాలు, పాత ఆచార సంప్రదాయాలు వీటికి ప్యతిరేకంగా శక్తిపంతమైన ఒక (ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, అధునిక విజ్ఞాసం, వైజ్ఞానిక దృక్పధం పునాదిగా గల ఒక నవీన సంస్కృతిని రూపొందించడం - ఇపన్నీ చేయడానికి జా యోద్యమ నాయకులు ముందుకు పచ్చి వుండాలి. ఆ విధంగా చేసి పున్నట్లయితే కుల, మత దృక్పథాలకు బలికాని ఆధునిక ప్రజూస్వాష్యు ఉద్యషఘం అభిప్పద్ధి చెంది పుంటుంది.
అయితే, ఈ దృక్పథాన్ని జాతీయోద్యమ నాయకులు స్వీకరించలేకపోయారు. దీనికి కారణము, ఐరోపా దేశాలపలె మధ్య యుగాలకు చెందిస భూస్వాష్యు వ్యపస్ట యొక్క సంస్కృతిని సమూలంగా ధ్వంసం చేసి ఆధునిక పెట్టుబడిదారీ ప్యపస్థ నిర్మించడానికీ తగిన కృషి భారత దేశంలో జరగలేదు. మరేమిటి? ఆర్యుల రాక నుంచి పెంపొందుతూ వచ్చిస వర్ణ (కుల) వ్యపస్థా దానిపై నిర్మించిన వైదిక సంస్కృతీ వీటిని రక్షించి దాని పునాది మీద ఆధునిక బూర్జువా ప్యపస్థను నిర్మించడానికై మొదట బ్రిటిష పాలకులు, తరువాత మన స్వదేశీ బూర్జువా పాలకులు ప్రయత్నించారు. దీనికి ఆధారంగా పుండేవి ఆర్థిక పాలనా రంగాలలో (హ్రచీన పెత్తందార్లకు - రాజులు, షహారాజులు, జమిందార్హు, ఇతర భూస్వామ్య పర్షాలు మొదలుగువారికి, అత్యంత తక్కుప నష్టము కలుగజేసే ఆర్థిక రాజకీయ సంస్మరణలే!
పెద్ద మొత్తాలలో నష్టపరిహారాలు చైల్లించి చేయబడ్డ భూసంస్కరణలు, స్వదేశీ సంస్తానాలలో చేయబడ్డ పాలనా సంస్కరణలు వీటికి చక్కటి ఉదాహరణలు. వీటి ఫలితంగా ఒక 'హ్త్త పాలకవర్గఘు, బూర్జువా, భూస్వామ్య పర్గము రూపొందింపబడినది. పర్ణ (కుల) వ్యవస్థలో బాహ్యదృష్టికి కొన్ని మార్పులు జరిగాయి అనేది నిజమే. అయితే ఆ వ్యవస్థలో అణచబడ్డ కొట్లాది ప్రజల జీవితంలో చెప్పుకోదగిన ఏ అభిప్పద్ధీ జరగలేదు. ఇందుకు మారుగా వారిలో అధిక సంఖ్యాకులు రోజు రోజుకు ఇంకా ఇంకా 'దివాళా కోరు'లపుతున్నారు. కారణం, అనేక శతాబ్దాలుగా కులాధిక్యత యొక్క అన్యాయాలసు, దారుణాలను అనుభవిస్తూ వస్తున్న ఈ (ప్రజలపై ఆధునిక బూర్జువా దోపిడీని కూడ మోపే విధంగానే పెట్టుబడిదారీ సామాజిక ప్యపస్థ, సంస్కరణలు “ఆధునికీకరణ” జరుగుతున్నాయి.
పెట్టుబడిదారీ సాంఘిక సంస్కరణల ఒక పరిణామం, వెసుకబడ్డ కులాలలోనే కొంచెం పున్నత కులాలకు చెందిన అల్బ సంఖ్యాకులు కొందరు (ప్రముఖ అధునిక బూర్జువా వర్గంగా మారారు. హరిజనులు, గిరిజనులు, ఆదివాసులు మున్నగు వర్గాల వారి నుంచి కూడా అల్ప సంఖ్యలో విద్యాపంతులు, ప్రభుత్వోద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు వంటివారు రూపొందారు. వారికంటే కొద్దిగా వున్నత స్థితిలో నున్న వెనుకబడ్డ కులాలకు చెందిన అల్ప సంఖ్యాకులు వ్యాపారులుగాను, భూస్వాములుగాను అపుతున్నారు. దీనికి వుద్యోగాలలోను, ఎన్నికలలోసు “రిజర్వేషన్ సహాయపడుతున్నది. తక్కువ కులాలకు చెందిన కొందరు ఎం.పి.లుగా, ఎం.ఎల్ ఎ.లుగా, మంత్రులుగా పదపులధిష్టించడానికి ఈ రిజర్వేషన్ పద్ధతి తోద్చడుచున్నది. ఈ విధంగా బూర్జువాలుగా మారనారలభించిన లోగడ వెనుకబడ్డవారికిని, లోగడనే అభిప్పద్ధి చెందిన కులాల నుంచి పచ్చిన బూర్జువాలకుసు అర్థిక ప్రయత్నాలు, రాజకీయ అధికారం పంటి సమస్యలలో తీవ్రమైన పోటీ ప్రారంభమై వుంది.
అదే సమయంలో వెనుకబడ్డవారు, అగ్రకులాలవారు అనే తారతమ్యం లేకుండా అన్ని కులాల, మతాలకు చెందిన అధిక సంఖ్యాకులు కార్మికులు, రైతులు, ప్యపసాయ కూలిలు, మధ్య తరగతి ఉద్యోగులు, చిన్న ఆస్తిపరులు మొదలగు పర్గాలకు చెందిన
38
జీపనాధారాన్ని పోగొట్టుకుని, జీవించడానికి కావలసిన పని, ఉద్యోగము ఏదీ లేశ్ర అల్లాడుతున్న దారుణ పరిస్థితి ఒకవైపు, చేసేపనికి న్యాయసమ్మతమైన జీవితము, కష్టించి వుత్పత్తిచేసే పస్తువులకు గిట్టుబాటు ధర దొరకని అధ్వానృస్థితి మరోవైపు. నిత్యజీవితాపసర పస్తుపుల ధరలు రోజు రోజుకూ అకాశాన్నంటుతున్న పరిస్థితి ఒక వైపు; పెరుగుతున్న బుణ భారము, పన్నుల మోత మరోవైపు; వీటి ఫలితంగా అత్యధికంగా నరకవేదన అనుభవించేవారు బహుసంఖ్యాకులైన ప్రజలే! హరిజనులు, గిరిజనులు, వెనుకబడ కులాలకు చెందినవారు లాగానే అగ్రకులాలకు చెందిస అత్యధిక సంఖ్యాకులు కూడ ఈ భారాలన్నింటినీ మోస్తున్నవారే.
అయితీ అగ్రకులాలవారు, వెనుకబడ్డ వారి పధ్య ఎటుపంటి భేదం లేదని చెప్పలేము. ఎెనుకబడ్డవారు, అంటరాని వారిలో అత్యధికులు, గిరిజనుల పంటి తక్కుప స్థాయిలో వున్న ప్రజలు పైన చెప్పబడ్డ అర్థిక సమస్యలతో పాటు వర్ణ (కుల) ప్యపస్థ యొక్క అవశేషాల ఫలితంగా కొనసాగుతున్న అనేక సాంఘిక అన్యాయాలను కూడా అనుభవిస్తున్నారు. అంటరానితనం పంటి సాంఫుక వివక్షతలు చట్టపరంగా నిషేధింపబడినప్పటికీ హరిజనులు, గిరిజనులు ఈనాడు కూడా ఆ అన్యాయాలకు గురి అయ్య బ్రతుకులీడుస్తున్నారు. ఈ అన్యాయాలకు ప్యతిరేకంగా వారు ప్రారంభించే వ్యతిరేకోద్యమాలు వారిమీద షరిన్ని దాడులు సాగించడానికే తోడ్పడుతున్నాయి. ఈ దాడులను నిశ్శబ్దంగా అంగీకరించలేక పోపడంపల్ల వీటిని విజయపంతంగా ఎదుర్కోపడానికి అవసరమైన శక్తి సామర్జాలు లేనందుపల్ల వారు అనేక ప్రాంతాలలో 'మతమార్చిడి” అనే రక్షణ మార్గంలో వెడుతున్నారు. వారు అనేకచోట్లలో మూకుమ్మడిగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మరికొన్నిచోట్ల దాన్నీ స్వీకరించలేషని ప్రకటించారు. వెంటనే దేశవ్యాప్తమైన ఒక చర్చ (ప్రారంభమైనది. శంకరాచార్యులు వారు, ఇతర హిందూపుత నాయకులు “పాందూపుత నంరక్షకులు'గా తహ్ము తాము చిత్రించుకొనేవారు “పాందూ సమషాజాన్నెదుర్కొంటున్న ఈ ఆపదిను తొలగించే ప్రయత్నాలలో నిపుగ్నులవుతున్నారు. ఇంకోవైపు ముస్లిం నాయకులు మత మార్చిడిని సమర్థించడానికి సహాయపడుతున్నారు. ఈ విధంగా రెండు షుతాలవారిలోను సంఘర్షణలు పెల్లుబికే ఒక విపత్కర పరిస్థితి రూపొందివున్నది. ఇదే నేటి స్థితి.
హరిజనులలో ఒక పర్గంవారు భావించినట్లు మత మార్పిడి వారికి రక్షణ కల్పించదు అనేది నిజం. వారు తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న కష్టాలకు, కడగండ్లకు పునాది మత విశ్వాసమో, పూజా పద్ధతులో కావు; పేదరికం, వెనుకబడ్డ స్థితి, అనేక శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వర్ణ (కుల) వ్యవస్థ యొక్క అవశేషాలు - ఇవే వారి కష్టాలకు కారణాలు. వీటిలో ఏవీ మత మార్పిడి వల్ల పరిష్కారం కావు. అదీగాక వర్ణ (కుల) వ్యవస్థ యొక్క దుష్పలితాలు త మిగతా బాధలన్నీ అస్పృశ్యులు, వెనుకబడ్డ కులాలవారి పలెనే అగ్రకులాలకు చెందిన పేద (ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి, అగ్రకులాల వారు, వెనుకబడ్డ వారు అనే తారతమ్యం లేకుండా అన్ని కులాలకు చెందిన శ్రామిక (ప్రజలు ఒకటై పేదరికం, అర్థిక దోపిడీ, సాంస్కృతిక రీత్యా వెనుకబడ్డ స్థితి - వీటికి వ్యతిరేకంగా పోరాడటానికి, అందులో ఒక భాగంగా “అంటరాని (ప్రజలు సాంఘిక రంగంలో అనుభవిస్తున్న అణచివేత, దోపిడీలకు ప్యతిరేకంగా అగ్రకులాల ప్రజలను కూడా సమీకరించడమే నిమ్నకులాల వారి రక్షణకు సరియైన మార్గమవుతుంది.
39
మరో విధంగా చెప్పాలంటే, కులాన్ని ఆధారం చేసుకొని నేటికీ కొనసాగుతున్న అసమానతకు వ్యతిరేకమైన పోరాటాన్ని ఆర్ధిక రంగం లోను, ఇతర రంగాలలోను కొనసాగుతున్న అసమానతను ఎదిరించే పోరాటంలోని ఒక భాగంగా స్వీకరించి, అందులో అ(గ్రకులాలవారు, వెనుకబడ్డ కులాలవారు అనే తారతమ్యం లేకుండా అన్ని కులాలవారిని, అత్యధిక సంఖ్యాకులు, అల్న సంఖ్యాకులు అనే తారతమ్యం లేక అన్ని మతాలకు చెందిన అధిక సంఖ్యాక ప్రజలను సమీకరించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగలం,
ఇదియే భారత జాతీయ కాం[గెన్ నాయకత్వంలో రూపొందిన జాతీయ స్వాతంత్రోద్యమం భారత (ప్రజల ముందుంచిన ప్రజాళిక. హిందూ-ముస్లిం ఐక్యత, హరిజనుల అభివృద్ధి, 'దరిద్రనారాయణులికు సేవచేయడం పంటి ఆదర్శాల ద్వారా మహాత్మాగాంధీజీ చెప్పినది కూడ ఇదియే. ఇపన్నీ అపులుకు వస్తాయనే విశ్వాసంతోనే దేశంలోని కోట్లాది ప్రజలు దేశ స్వాతంత్ర్యానికి స్వాగతం పలికారు.
అయితే ఇంతకు మునుపే చెప్పినట్లు, స్వాతంత్ర్యం లభించిన సమయంలోనే దాని వికృత రూపాన్ని చూచి గాంధీజీకి ఆయన అంతిమ రోజులలో తీప్రమైన మనోవేదన కలిగినది. ఆయన శిష్యులలో ఒక వర్గం వారు అధికార పదవులను స్వీకరించినా, ఆయన వారితో పాటు ఉండలేదు. అదీకాక, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న బహుశ ప్రజానీకం అత్యంత వేగంగా ఆశాభంగం చెందారు.
ఈ క్షిష్ట పరిస్థితులలో గత నలభై సంవత్సరాలలో భారతీయ రాజకీయ రంగం ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభంలోకే పయనిస్తున్నది. ప్రభుత్వ మార్పులు, పార్టీల చీలికలు, పునర్నిర్మాణం, పార్టీ మార్చిడులు మున్నగునవి అన్ని న్థాయిలలోను, విఖిన్న రాష్ట్రాలలోను, రాజకీయ రంగాన్నంతటిని గందరగోళపరచి వున్నాయి.
ఈ పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలకు పలువురు అనేక రకాల పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. వాటికి అనుకూలంగాను, ప్రతి కూలంగాను అభిప్రాయాలు వ్యక్తం చేయబడుతున్నాయి. వాటిలో ఏదీ సరిల్లైనది, ఏది సరియైనది కాదు అనే విషయాల గురించి ఇక్కడ చర్చించబోవడం లేదు. కాని ఒక విషయాన్ని మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. “వేదభూమి” అనే. పేరు సూచించే విధంగా పవిత్రమైనదనే ముసుగు ధరించి భారతదేశ చరిత్రను, సమాజాన్ని మార్చాలని చూచే ఏ ప్రయత్నమూ దేశం యెదుర్కొంటున్న ఏ సంక్షోభాన్ని పరిష్కరింపజూలదు. మన గతకాల చరిత్రలో మనం గర్వించదగిన అంశాలతో పాటు, వాటికి విరుద్ధమైన అంశాలు కూడ వున్నాయి. ఈ విరుద్ధ అంశాలవల్లనే భారతదేశం బ్రిటిష్ వారికి బాసస దేశంగా మారినది. సుషారు 150 సంపత్సరాల దీర కాలం వారి ఆధిక్యతలో వచ్చి దోపిడీకి గురైంది. భవిష్యత్‌లో కూడా విదేశీ అధిక్యతణే సహా లజ్ఞాకరమైన అనేక పరిస్థితులకు మనం గురికాకుండా పుండాలంటే, మన గతకాలానికి చెందిన గొప్ప విషయాలకు గర్వించడంతో పాట్టు వాటికి విరుద్ధమైన విషయాలకు వ్యతిరేకంగా దృఢంగా నిలిచి పోరాడాలి. అప్పుడే ప్రాచీన భారతదేశానికి ఆనాడు ప్రపంచంలో వున్నటువంటి గౌరపటప్రతిష్టల లాగా నేటి భారత .దేశం కూడా ఆధునిక ప్రపంచంలో గౌరన ్రతిష్టలతో విలసిల్లగలదు.
- ఈ సత్యాన్ని గ్రహించక రూపొందింపబదే ఏ ప్రణాళిక కూడా నేటి భారతదేశం ఎదుర్కొంటున్న కిష్ణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయలేదు. శేగోరోల ః ల్ ౯5 “ ౨. ఎ గ
ఆర్యుల రాకకు పూర్వమే భారత ఉపఖండంలోని వారికంటే _ వన్నతమైన సాంస్కృతికాభివృద్దిని సాధించిన ప్రజలు వున్నారు, ఆ సంస్కృతి పతనానంతరం ఆర్యులు సృష్టించిన వైదిక సమాజమూ, సంస్కృతీ ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి? అవీ చాతుర్వర్ణంగా ఎలా మార్పు చెందాయి? బానిసలు-యజమానులు వున్న వర్గ తారతమ్యంగల బానిస సమాజం ఎలా రూపొందింది? భారత దేశానికే ప్రత్యేకమైన కుల వ్యవస్థ ఎలా ఉదయించింది. మొదలగు ప్రశ్నలకు సమాధానమిస్తుందీ పుస్తకం. పలు భారతీయ భాషలెలా రూపొందాయి? భారతదేశం విదేశీ దండయాత్రల కెందుకు గురి అయింది? మౌర్య చక్రవర్తుల కాలం నుంచి మొగలాయి చక్రవర్తుల కాలం వరకు పైన్ధాయి పాలనా వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగినా క్రిందిస్థాయిలో వున్న గ్రామ స్వావలంబన (లేక) స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ సామాజిక జీవితం మార్పుచెందక ఆంగ్లేయుల రాకతర్వాతే అది ఎందుకు మారింది? వీటన్నింటినీ ఈ పుస్తకంలో వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి ఆర్యులు రావడానికి ముందునుండీ, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వరకూ వున్న దీర్హకాల సాంఘిక పరిణామ (క్రమాన్ని పరిశీలిస్తుంది పుస్తకం. [ ప్రజాశక్తి బుక్‌హౌస్