Telugu Vallamadya vanthena - anilvaranasi/indianlanguages GitHub Wiki

“ననా ళ్ళ లు. . శ్ర

గల్లా ఖీ

ఖే ల గ్‌ మ. /

గ్‌ కం వాళ్ళమధ్య వంతెన శీలా వీర్రాజు.

శ44-22 షప ౬ యు దాక వీఠాపో ౪కిట౬నకికిన 01144 ౪౬017౬14 0018010౧ 0 510% 510%69 0 55౯౯౬ ౪5౬౯౧౧4౮ థ్రథమ ముద్రణ నవంబరు, 1967 ద్వితీయ ముద్రణ * ఆగస్టు, 2001 ముఖచిత్రం : శీలావి డిటిపి * నునుగ్రాఫిక్స్‌ 1031 చిక్కడపల్లి, హైదరాబాదు ముద్రణ : శ్రీ బాలాజీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ చిక్కడపల్లి హైదరాబాదు - 500 020 వెల:రూ. 40 ప్రతులకు : శీలా నుభద్రాదేవి 2/6 బ్రవ్మానందనగర్‌ మలక్‌పేట, హైదరాబాదు - 500 036 మరియు దిశ పుస్తక కేంద్రం - చిక్కడపల్లి హైదరాబాదు-20. నవోదయ బుక్‌హొస్‌ = కాచిగుడా చౌరస్తా హైదరాబాదు ప్రజాశక్తి బుక్‌హౌస్‌ - చిక్కడపల్లి, హైదరాబాద్‌-20 ౬ ౧4690 యు య లో (. 40461 స్వ శై వాలా / నం

స్నేహశీలి శ్రీమతి పూడి పెద్ది శకుంతల కు

శీలా వీర్రాజు రచనలు కథల సంప్లటాలు సమాధి బండిచశ్రం హ్టోదిని రంగుటద్దాలు పగా మైనస్‌ ద్వేషం వాళ్ళమధ్య వంతెన మనసులోని కుంచె ఊరు వీడ్కోలు చెప్పింది శీలా వీర్రాజు కథలు (ఎంపికచేసిన కథల సంపుటి) నవలలు వెలుగు రేఖలు కాంతిపూలు

  • “మైనా” కరుణించని దేవత కవితా సంప్పటాలు కొడిగట్టిన సూర్యుడు హృదయం దొరికింది మళ్ళీ వెలుగు కిటికీ కన్ను ఎ(ర్రడబ్బా రైలు 1 అ0ళనటం49ల (తెలుగు కవితల అంగ్లానువాద౦) వ్యాస సంపుటి కలానికి ఇటూ అటూ ఇతరములు శిల్పరేఖ (లేపాక్షి స్కెచ్‌ బుక్‌)

ఇందులో ...... నీడపట్టు మనిషి............................?-33 దీపానికి చమురు ......................... 3డీ-ర్‌4 వాళ్ళమధ్య వంతెన ....................... 55-75 శథనాదీ-ముగింపు ఆమెదీ............... 76-94

ఇల్షి రచయిత పరిచయం

రాజమండ్రిలో 1939లో జన్మించారు. విద్యాభ్యాసమంతా ఆ వూళ్ళోనే జరిగింది. చిన్నప్పటినించీ వుస్తకాలు బాగా చదివే అలవాటువల్ల కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ప్రజామత, ఆంధ్రప్రభ వారపత్రికల్లో రెండు సీరియల్లు రాశారు, రెండు కథల సంపుటాలు కూడా అప్పుడే వెలువడ్డాయి. 1976 వరకు కథలు, నవలలు రాస్తూ; మరో రెండు నవలలు, ఇంకొక ఏడు కథల సంపుటాలు వెలువరించారు. ఆధునిక కవిత్వంలో కథ చెప్పి 'వచన కవిత్వకథికు శ్రీకారం చుట్టారు. చిత్ర లేఖనంలోనూ చేయిపెట్టి కలం, కుంచెలను సమాంతరంగా నడిపిస్తున్నారు.

విద్యాభ్యానం పూర్తికాగానే హైదరాబాదు వచ్చి 1961లో కృష్ణా పత్రికలో చేరి రెండేళ్ళపాటు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖలో 1063 జూన్‌లో అనువాదకుడిగా ప్రవేశించి 1990 జనవరిలో ఐచ్చికంగా ఉద్యోగ విరమణ చేశారు.

1971లో మేనమామ కుమార్తె సుభద్రాదేవిలో వివాహమైంది. ఆమెకూడా కథలూ, కవితలూ రాస్తుంటారు. సాహిత్యంలో ప్రయోగాలంటే యిష్టపడతారు,

జీవితంలోనూ, సాహిత్యంలోనూ నిజాయితీని హర్చిస్తారు నిరాడంబరతను ఆశిస్తారు.

ప్రగతిశీల భావాలతో రచనలు చేసేవారిని గౌరవిస్తారు.

నీడపట్టు మనిషి

“మీకు మనియార్హరు వచ్చింది. పోస్టమేన్‌ మళ్ళీ వస్తానన్నాడు. ఎక్కడికీ వెళ్లకండి”

వారంరోజులుగా అతనిముందు మూగపిల్లలా కదిలి, కేవలం పరదాలు దించుకున్న ఘోషా చూపులతో సిగ్గుగా, రహస్యంగా, ఉత్సుకతతో పక్కలనించి, కిటికీల వెనకనించి వింతగా ప్రతికదలికనీ పరిశీలించే నాగావళి; ప్రాణం పోసుకున్న విగ్రహంలా మొదటిసారిగా అతని ఎదుట బిగదీసుకుపోయిన పెదాల్ని మెల్లగా కదిళ్చి, ఆ వెంటనే తన ప్రమేయం లేకుండా అజ్ఞాపించగలిగిన తన కంఠాన్ని గుర్తుపట్టి, సిగ్గుపడి అతని ఎదుట వుండలేక లోపలికి వెళ్ళిపోయింది.

సదానంద జోళ్ళు తొడుక్కోబోతున్నవాడల్లా మానేసి వెనక్కు తిరిగిచూస్తే నాగావళి కదిల్చిన గాలి అలలకు ఎగిరిన దుమ్ము అటూ యిటూ కదుల్తోంది.

వెనక్కు తిరిగొచ్చి గదిలో కూర్చున్నాడు. ,

గదిలో ఏమీ తోచడంలేదు ఒంటరితనమూ, నిశ్శబ్దమూతప్ప తనకౌరకు ఆ గదిలో కాలక్షేపానికి వీలుగా ఏమీలేవు. కూనిరాగాలు తీసుకోడానికి కొత్త ప్రదేశంలోని బెరుకూ, స్వేచ్చగా కదలడానికి యింకా అలవాటు పడని మనుషుల్టూ వాళ్ళ పొడిపాడి పలకరింపులూ అతన్ని దిగ్బంధనం చేశాయి.

త వాళ్ళమధ్య వంతెన ఉద్యోగానికని వచ్చి వారంరోజులయ్యింది. నాగావళి తండ్రి రాఘవరావుగారు రమ్మంటే వచ్చాడు. ఆయన బహు తెలివైనవాడు. ఓ పెళ్ళిలో కలిసిన సదానంద తల్లిని ముందుచూపుతో పలకరించి, అబ్బాయిని తన దగ్గరకు పంపిస్తే ఉద్యోగం వేయిస్తాననీ, తనదగ్గరే వుండే ఏర్పాటుచేస్తాననీ మాట యిచ్చాడు. ఆయన యింట్లో ఎదిగినకూతురు వుందన్న సంగతి బంధువులందరికీ తెలుసు. అమ్మాయి బంగారపు బొమ్మే బంగారపు బొమ్మ ఒంటిమీది బంగారాన్ని వాలిస్తే ఎన్ని తులాలు తూగుతుందా అన్న ఆలోచనతప్ప మరో ఆలోచనలేని మనుషుల్ని చూసేసరికి రాఘవరావుగారికి కంగారుపుట్టి, ఇతరత్రా ప్రయత్నాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

అలాంటి ప్రయత్నమే సదానందను రప్పించుకుని ఉద్యోగం వేయిస్తాననడం. ఇందుకు సదానంద అంగీకరించాడని తెలిసిన బంధువులు, అతన్ని గేలానికి తగులుకోబోతున్న చేపను చూసినట్టు చూసి జాలిపడ్డారు.

పెళ్ళి పందిట్లో చలాకీగా అటూయిటూ కదిలి చిరుగాలుల్నీ చిరునవ్వుల సౌరభాల్నీ చల్లుకుని, అందరి చూపుల్ని తనవైపు తిప్పుకోగలిగిన నాగావళిని చూసి “ఇల్హాంటి అమ్మాయి తనకు యిల్గాలైతే బాగుండును” అనుకున్నాడు సదానంద. ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి రావువరావుగారు ఉద్యోగం వేయిస్తానంటే పరుగెత్తుకొచ్చాడు. చేతిలో డబ్బు లేకపోతే అందిన తర్వాత మనియార్గరు చెయ్యమని ఇంట్లో చెప్పి'వెంటనే బయలుదేరి వచ్చేశాడు.

వచ్చి వారం రోజులయ్యింది. రాఘవరావుగారు ఉద్యోగ ప్రయత్నాలైతే చేస్తున్నారు. కోపరేటివ్‌ సబ్‌ రిజిష్ట్రారు ఆయన. పలుకుబడి వృన్నవాడే. పదిరాళ్ళు నెనకేయాలన్నా చేతగాలేదు. రోగిష్టిభార్యా, మంచంలోంచి లేవలేని మునలితల్లీ, కాలేజీచదువుకు తనమీదే ఆధారపడిన తమ్ముడికొడుకూ, అడపాదడపా నాగావళీ అతని జీతాన్ని పంచుకుని, ఏ లాటరీయో తగిలితేనేతప్ప లేళకపోతే తమది మిగులులేని సంసారమే అని నిరూపించారు.

ఈ వారంరోజులూ నాగావళి, చూపుల్లోనే తృప్తిపడుతూ వచ్చింది. ఇవ్వాళే పలకరించింది. అది పలకరింపులా అనిపించలేదు అతనికి. ఓ నిముషం అలానే నిలుచుని, దయదలచి దానం చేసినట్స యింత పిసరు చిరునవ్వును తనముందు పడేసి, కనురెప్పల పరదాల్ని ఎత్తిపట్టుకుని మరికాస్సేవు ఆ వెనక నర్తకిని నాట్యం చేయించి, కంఠంలో యింకాస్త శ్రద్ధతో శృతులు సరిచేసుకుని మంద్రస్థాయిలో

“మృనియార్డరు వచ్చింది మీకు, పోస్టుమేన్‌ మళ్ళీ వస్తానన్నాడు. కాస్సేషు కూచోండి”

నీడవట్టు మనిమి రి అని పలకరించి, కొద్దిసేపు అక్కడే నిలిచి, కృతజ్ఞతలు చెప్పుకునే తన చూపుల్నికూడా అందుకుని, సిగ్గుతో అలవోకగా తలవంచుకుని, జారని పవిటను సర్దుకుని, అంతలోకే ఆమెచుట్టూ ఎగురుతున్న చూపుల తుమ్మెదల రెక్కలకింద కదిలిన చిరుగాలులకు పులకరించి, చటుక్కున తన ఎదుటనించి తప్పుకునిపోయివుంటే ఎంత బావుండును! ఇంత పొయిటిక్‌గా ప్రవర్తిస్తే ప్రతి సంఘటననీ ఓ కావ్యంగా సృష్టించగలదు స్త్రీ! ఎదుటి జీవితాలను రసాత్మకం చెయ్యగలదు-అనుకున్నాడు అతను.

గదిలో ఏమీ తోచడంలేదు. ఈ ఏకాంతాన్ని తగలెయ్యడానికి సిగరెట్లుకూడా లేవు. పొద్దున్నే అయిపోయాయి మూడు ఫర్ధాంగులు వెళ్ళాలి. అ యింట్లో సాహిత్యాన్ని మోసే బీరువాలైనా ఎక్కడా కనిపించలేదు ఇంచుమించు యిల్లంతా చూశాడు ఒక్క గది తప్ప ఆ గదిని నాగావళి వాడుతోంది. ఏమన్నా వుంటే-అందులో వుండాలి పిలిచి అడగాలనిపించింది. కాని ఏమని పిలవాలి? సేరెట్టి పిలిచేంత చనువేర్పడలేదు. ఉత్తరోత్రా అర్భాంగి అయ్యే అవకాశాలున్న అమెను తెలిసి తెలిసి 'ఏమండీ' అని ఎలా పిలవడం? అలాంటిదేమీ లేకుండా అతితెలివిగా “చదువుకునే పున్తకాలేమైైనా వున్నాయా? అని అడగడానికి ఎప్పుడైనా ఆమె అతనిముందుకొస్తేగా.

చాలా ఇబ్బందిగా ముళ్ళమీద కూర్చున్నట్టు ఆ గదిలో కూర్చున్నాడు సదానంద. అరగంటసేపు అలానే కూర్చుని తన సహనాన్ని తనే పరీక్షించుకున్నాడు. ఇక చేతకాలేదు. వీధి వరండాలోకి వద్దామని రాబోతుంటే నట్టింట్లో కూర్చుని కూనిరాగంతీస్తున్న నాగావళి అతన్ని చూసి చటుక్కున ఆపేసింది. అల్లాంటి పరిస్థితికి బాధ్యుడయినందుకు కాస్తంత తత్తరసడి మళ్ళీ గదిలోకి తిరిగివెళ్ళిపోయాడు.

రాగం బాగానే తీస్తోంది. పాటలు బాగాపాడే సామర్థ్యంవుందో! లేక ఉత్సాహం కొద్దీ కూనిరాగాలతోనే సరిపుచ్చుకుంటోందో మరి మళ్లీ కంఠం కదిపితే విందామని అతిశ్రద్ధగా తలుపు దగ్గర్జోనే తచ్చాడుతూ నిలుచున్నాడుగాని ఆమె అక్కడున్న అలికిడే వినిపించలేదు

పావుగంటసేపు గదిలోనే వుండి, బయటికొచ్చాడు. నాగావళి నట్టింట్లోనే వుంది, తలగడ గలీబుకు పూలుకుడుతోంది. అలికిడి విని తలెత్తి చూసింది.

“ఇంట్లో ఏమయినా పుస్తకాలు వున్నాయా?”

“ఏం వుస్తకాలండీ?”

“ఏవైనా నరే ఇంగ్లీషువైనా, తెలుగువైనా నవలలుంటే యివ్వండి కాలక్షే ”

10 వాళ్ళమధ్య వంతెన చటుక్కున ఆపేసి తనలో తానే నవ్వుకున్నాడు. ఓ పొడిదగ్గు దగ్గి కంరం సవరించుకుని “కాలక్షేపానికి ఏవయినా నరే నాకు పుస్తకాలు చదివే పిచ్చి ఎక్కువే. నవలలు లేకపోయినా వారపత్రికలన్నా వుంటే యివ్వు” అన్నాడు.

నవ్వుతోంది ఆమె. ఏ చెరువు మీదనో, ఏ పున్నాగ చెట్టుకిందనో విడిపోయి తప్పించుకొని వచ్చిన చల్లటి పిల్లగాలితెర ఒకటి గర్భగుడిలో కదలక అతినిశ్చలంగా వెలిగే ఆముదపు దీపం జ్యోతిని అరక్షణం అలా కాస్తంత కదిల్చినట్టుగా పెదాల్సి కదిపీ కదపనట్టు అతిసుతారంగా, మరీ నాజూగ్గా కదిలే అతిపల్బని చిరునవ్వు నవ్వి “సాయంకాలం తెచ్చిపెడతాలెండి. ఇంట్లో అయితే లేవు ఓ స్పేహితురాల్ని అడిగి పట్టుకొస్తాను. దానిదగ్గర పెద్ద లైబ్రరీయే వుంది” అంది

“సరే లెండి” అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏకాంతం అనిపించడంలేదు. ఇంతకు మునుపే గబగబా ఏరుకుని మనసులో దాచేసుకున్న నాగావళి రూపచిత్రాల్ని జ్ఞాపకాల భూతద్దాలకింద పెట్టి పెద్దవిగా పెంచుకుని చూస్తూ కూచున్నాడు. అప్పుడప్పుడు అభిరుచుల రంగులు కూడా అద్ది భవిష్యత్‌ తెరమీదకు ప్రొజెక్టుచేసి, దూరంగా నిలుచుని మరీ వివరంగా, స్పష్టంగా కనిపించే ఆ చిత్రాల్ని చూసి ఆనందం భరించలేక హృదయాన్ని మీటుకుని తనలోతానే పాట పాడుకున్నాడు.

ఎంతసేపు అయ్యిందో, బయటనుంచి పిలుపు వినిపిస్తే కూనిరాగం కట్టేసి, పోస్ట్రమేన్‌ వచ్చాడేమోనని కంగారుగా తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. ఎదురుగా నాగొవళి! చేతిలో పుస్తకాల దొంతర-అంత ఎండలోనూ వెళ్ళొచ్చినట్టు ఎర్రగా కందిపోయిన ముఖంతో, చేతిలో బరువుకు ఊసిరి బిగబెట్టి ఒక్కసారిగా విడీచి మరీఎక్కువగా కదిల్చిన వక్షాల్తో నొసటిమీంచి ముక్కు పక్కగా కదిలి, ఎత్తులేని చెక్కిలిమీదుగా కంగారుగా జారి, పెదవి కింద పల్లంవేపుగా కొట్టుకొచ్చి అగాధంలాంటి కంఠంలోతుల్లోకి దూకడానికి భయపడి అక్కడే ఆగిపోయిన అందమైన చెమట బిందువుతో, స్నేహపూరితమైన చూపుల్లో నిలుచుని వుంది.

“అరరె. ఇంత ఎండలో వెళ్ళకపోతే ఏంపోయింది. ఎండ ఎలా మాడ్చేస్తోందో బయట, చెమటలుకూడా కారుతున్నాయి. ఏ సాయంకాలమో వెళ్ళి తీనుకు రావాల్సింది” అన్నాడు. అన్నాడేగాని అతని మాటలు అతనికే నచ్చలేదు; ఎబ్బెట్టుగా వున్నాయి. కృతజ్ఞత చెప్పుకునే మాట ఒక్కటీలేదు. కృతజ్ఞత చెప్పుకుందామనే మొదలెట్టాడు. ఏమిటేమిటో అనుకోనివన్నీ మాట్టాడేశాడు, కృతజ్ఞత అతని దగ్గరే

నీడనట్టు మనిషి 77 వుండిపోయింది. ఈ యిబ్బంది ఎందుకొచ్చిందో అతనికి తెలుసు. స్వేచ్చగా “నువ్వు అని ప్రయోగించలేని బెరుకుతనం అందువల్ల మనసులోని భావం మాటల్లోకి రాలేదు మరికొన్ని రోజులపాటు యీ ఇబ్బంది తప్పదు. అంతవరకూ యిలా మాటల్ని తడుముకోవాల్సిందే. పుస్తకాలు అందుకున్నాడు “ఇవి చదివేసినతర్వాత యిచ్చేసి మరికొన్ని తేవచ్చులెండి” అంది. “అలాగే, వీటితో వారం రోజులపాటు కాలక్షేపం చెయ్యొచ్చు.” నాగావళి యింట్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి పుస్తకాలన్నీ తిరగేసి “ఫరవాలేదు మంచి సెలక్షనే” అనుకున్నాడు. కాస్సేపటికి పోన్టుమేన్‌ వచ్చాడు. ఆ తర్వాత యిక అతనికి అవతలికి వెళ్ళాలనిపించలేదు. ఓ పుస్తకం ముందేనుకుని కూర్చుండిపోయాడు. ఆ రోజిక మళ్ళీ నాగావళి పలకరించలేదు. మర్హాడు సెలవురోజు, రాఘవరావుగారు పొద్దున్నే అతన్ని వెంటేసుకుని తెలిసిన నలుగురి దగ్గరికీ తీసుకెళ్ళారు. ఆ రోజుల్లా అలా బయటతిరగడంతోనే సరిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం కాఫీ పట్టకొచ్చినప్పుడూ, నీళ్ళు తోడినప్పుడూ, మధ్యాహ్నం విసనకర్ర పట్బకొచ్చి యిచ్చినప్పుడూ, సాయంకాలం వీధివరండాలో వున్నప్పుడూ నాగావళి పలకరించినా జ్ఞాపకాల్లో నిలుపుకోదగ్గ ప్రత్యేకత ఏమీలేని పొడిపొడి మాటలే అవడంవల్ల అతనుకూడా అట్టే పట్టించుకోలేదు. అయితే ఆతర్వాతకూడా అలానే గడిచిన యింకోలెండు రోజుల్లోనూ అరడజను అనుభవాల్ని ఏరుకున్నాడు. ఆందులో చివరిది- నవల ఒకటి సాయంకాలంవరకు చదివి విసుగెత్తి షికారుకని బయలుదేరాడు. మురిగ్గా, యిరుగ్గా వున్న బాటల్నుంచి తప్పించుకుని వెళ్ళి ఓ పార్కులో కూర్చున్నాడు, అతనికి దగ్గర్లోనే నిప్పులాంటి రంగులో ఎర్రటి పూలు నాలుగు సన్నగా, పొడుగ్గా అడుగు ఎత్తులో వున్న కాడలమీద చిరుగాలులకు సైతం పులకరించిపోతున్నాయి. మనసుకూడా అంతే. ఎంత ఉన్నతంగా వుంటే అంత అతి చిన్న అనుభవానికి కూడా పులకరించిపోతుంది. ఈర్వ్యతో, కుత్సితంతో, పగతో, అసహనంతో నిండి కరుకుగా మోటుగా, ఎదిగి ఉన్నతంగా నిలవలేని మనసు బలమైన ఉద్రేకానికితప్ప సున్నితమైన

శ వాళ్ళమధ్య వంతెన అనుభవానికి పులకరించలేదు. ఈ సత్యాన్ని తెలుసుకోలేని మనిషి పగతో, ద్వేషంతో, అసహనంతో మనసును నింపుకుని సమయమైన యీ జగత్తును చూడలేక కళ్ళుండీ గుడ్డివాడైపోతున్నాడు

సదానందకి ఓ పువ్వు కోసుకోవాలనిపించింది తోటమాలిని సిలిచి అడిగితే అతని ఆకారాన్ని చూసి “దానికేంభాగ్యం కోసుకోండి” అన్నాడు. కొాడతోపాటు ఒకటి కోసుకుని, మరికాస్పేపు అక్కడే కూర్చుని లేచి బయలుదేరాడు.

ఆకాశం కాలికాలి నల్లబడిపోయింది. అక్కడక్కడ యింకా ఆరిపోని నిప్పుల్లా మెరుస్తున్నాయి నక్షత్రాలు. సముద్రంమీంచి గాలి అలలు అలలుగా వీస్తోంది. అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. టౌనుహాలు దగ్గర కార్లూ, ఖరీదైన మనుషులూ, దీపాలూ, దుమ్మూ-మంచి హడావిడిగా వుంది. దగ్గరకు వెళ్ళాడు. ఇంటరొస్టేట్‌ కల్చరల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రాంక్రింద వొచ్చిన మద్రాసు సొంస్కృతిక బృందంవారు భరతనాట్య ప్రదర్శన యిస్తున్నారట.

భరతనాట్యం అనేసరికి సదానంద మనసు ఎగిరి గంతేసింది. అందులోనూ మద్రాసు బృందంవారి ప్రదర్శన! ఇటీవలి కాలంలోకూడా భారతదేశంలో లలితకళలు నంకరంకాకుండా న్వచ్భంగా సాంప్రదాయాన్ని పరిపోషించుకుంటూ ఎక్కడన్నా వున్నాయంటే అవి ఆంధ్రదేశానికి దిగువనేతప్ప పైన కాదని అతని అభిప్రాయం.

టిక్కెట్టు కొనుక్కొని లోపలకు వెళ్ళాడు. అప్పుడే ప్రదర్శన ప్రారంభమైంది. ఇద్దరమ్మాయిలు కలసి అలారిష్టు ప్రదర్శిన్తున్నారు. వక్కవాయిద్యాలు చక్కగా కుదిరాయి. గాయకీ కంరంలో సంగతులు పలికిస్తోంది. నాట్యం చేస్తున్న యిద్దరూ రసాభినయం చేస్తున్నారు. వాళ్ళ పాదాలు లయబద్ధంగా పడుతున్నాయి. గజ్జెల చిరుమువ్వలు బృందశబ్దం చేస్తూ తలలూపుతున్నాయి. ఫిడేలుతీగలమీద కమాను ఊయలలూగుతోంది. మృదంగం మీద వ్రేళ్ళు నృత్యం చేస్తున్నాయి అన్ని నాదాలూ పాయలుపాయలుగా వచ్చి ఒకేతాడుగా అల్గుకుని (ప్రేక్షకుల్ని బంధించేశాయి

తెరవాలింది

చప్పట్లతో హాలు దద్దరిల్లిపోయింది.

“ఎందుకలా చప్పట్లు చరుస్తారో వీళ్ళు. దాన్నిండా అన్నీ తప్పులే. ముద్రలు పట్టడంతోనే సరిపోదు, తాళానికి తగ్గట్టు పాదాలువడందే ఇంతకన్నా చక్కగానే చేయగలను నేను”= ఎవరో విసుక్కుంటున్న శబ్దం వినిపించింది సదానందకి,

నీడవట్టు మనిషి న వెనక్కు తిరిగి చూశాడు. పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ముఖం చిట్లించుకుని పక్కావిడతో మాట్లాడుతోంది. ఆమె కూడా నర్తకే అని ఆమె కళ్ళ అలంకరణే తెలుపుతోంది. ఆ తర్వాతప్రదర్శనలమీద కూడా ఆమె ఏదో కామెంట్‌ చేస్తూనే ఉంది. సదానందకి నవ్వొచ్చింది. ఈ కళాకారులంతా యింతే. వొట్టిస్వార్థపరులు. నిజానికి కవులు, చిత్రకారులు, గాయకులు, నర్తకులంత స్వార్థపరులు మరొకరు లేరు. పిసినిగొట్టు వాడి స్వార్ధం డబ్బు విషయంలో వుంటే కళాకారుడి స్వార్ధం కీర్తి విషయంలో వుంటుంది. ఒక విధంగా పిసినిగొట్టువాడే నయం. పిసినిగొట్టువాడి స్వార్ధం అతని కుటుంబానికి సంబధించినది కాని కళాకారుడి స్వార్ధం అతని ఒక్కడికే సంబంధించినది అందుకే నదానంద కళను గౌరవించినంతగా కళాకారుడి గౌరవించలేడు ప్రదర్శన పూర్తయ్యేసరికి చాలా రాత్రయ్యింది. ఎవ్వుడైనా చక్కని అనుభవం నదానందకు లభిస్తే ఆ అనుభవాన్ని తలంచుకొంటూ కొద్దిసేపు వొంటరిగా నడవాలనిపీస్తుంది అతనికి, అనుభవాన్ని ఆ వెంటనే హృాదయంలోంచి తోడుకుంటే ఆ అడుగున చేరిన స్వచ్భమైన పరిమళభరితమైన అంతరాత్రిలోన్తూ విశాలమైన ఆకాశంకింద నిర్మానుష్యమైన బాటల్లో నడిచి నడిచి యింటిని చేరుకున్నాడు. కాంపౌండు గోడకున్న బయటి తలుపు వేసివుంది. ఈపాటికి అంతా గాఢనిద్రలో వుంటారు. తలుపుతట్టి పిలుద్గామనుకున్నాడు కాని- ఆ తలుపులే తెరుచుకున్నాయి. ఆ తెరచిన తలుపుల వెనక నాగావళి! అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రివరకూ నిద్రపోకుండా తన గురించి ఎదురుచూస్తూ తనరాకను కనిపెట్టుకుని కూర్చున్నదన్నమాట! తనగురించి యింతగా పట్టించుకున్న హృదయం ఒకటి వుండడం ఎంత అదృష్టం. అతనికి చెప్పలేని ఆనందమైంది. *రండి,అక్కడే వుండిపోయారేం?” పక్కకు తప్పుకుంది. అతను లోపలకు వెళ్ళిపోయాడు. ఆమెకూడా తలుపేసుకుని లోపలకు వచ్చేసింది. భోజనం వడ్డించి పిలుస్తే వెళ్ళాడు. ఆమె వడ్డించడం అదేమొదటిసారి. వాళ్ళమ్మను లేపబోతే బామ్మ కోప్పడింది. “నువ్వెళ్ళి వడ్డించవే. దాన్ని లేపుతావెందుకు

14 వాళ్ళమధ్య వంతెన నడుంనొప్పని పడుకుంటేనూ” అంది. ఆ మాటలు వినిపించాయి అ తర్వాత అయిదు నిముషాలకు నాగావళి వచ్చి పిలిచింది తలవంచుకుని భోజనం చేస్తున్నాడు. తినాలనిలేదు ఆకలి చచ్చిపోయింది నాగావళి అవతల ద్వారబంధం దగ్గర నిలుచునివుండి చూస్తోంది. అందుకని ఎలాగో భోంచేస్తున్నాడు “సినిమాకు వెళ్ళారా?” “లేదు, డేను 'ప్రోగ్రాంకు వెళ్ళాను.” ఆమె ఓసారి కళ్ళు ఎగరేసింది “అభిరుచులు మంచివేకాని అలవాట్లే బావుండ లేదు ” అంది. అర్ధంకానట్న చూశాడు అతను “ఆ అన్నం తినడానికి ఎంత యిబ్బంది పడుతున్నారో చూస్తూనే వున్నాను ఇంతరాత్రి ఆకలేం వుంటుంది చెప్పండి. వేళకు భోజనం చెయ్యకపోతే ఆరోగ్యం పాడవదూ ” అతనేమీ మాట్టాడలేదు. ఈ కొద్దిరోజుల్లోనూ రాత్రిళ్ళు అలా ఆలస్యంగా రావడం యిదే మొదటిసారి కాదు. సముద్రపు పడ్డున కూర్చుంటే ఓరాత్రి పన్నెండయింది. మరొకరోజు వెన్నెల వుందని ఆప్‌లేండ్స్‌లో పిచ్చిగా తిరిగి యింటికొచ్చేసరికి పదకొండు దాటింది తాను వొచ్చేసరికి కనిపించకపోయినా తనను కనిపెడుతూనే వున్నదన్నమాట! ఎంత తినాలని ప్రయత్నించినా అంతరాత్రప్పుడు అన్నం సహించలేదు మధ్యలోనే చేతులు కడుక్కుని లేచిపోయాడు. “మీరు యింట్లోంచి కదలకుండా కూచోనక్కరలేదుగాని ఎక్కడికైనా వెళ్తేమటుకు యింటిని మర్చిపోకండి” అంది లేస్తోన్న అతనితో. బావుంది. చాలా సున్నితంగా శాసిస్తోందీమె. ఈ కొద్దిపాటి పరిచయంతోనే తనను కట్టిపడేయాలని చూస్తోంది కాబోలు అతనికి నవ్వాచ్చింది. నవ్వుకుని గదిలోకి వెళ్ళిపోయాడు సిగరెట్బ కాలుద్దామని జేబులోంచి పెట్టె తియ్యబోతే పార్కులో కోసినపువ్వు కిందపడింది అది తీసి మృదువైన దానిరేకల్తో చెక్కిలిమీద రాసుకుంటున్నాడు నాగావళి గదిలోకి వచ్చింది. “అన్నం సరిగా తినలేదు. అసలే వేసవికాలం,

నీడవట్టు మనిషి 15 వేడిచేస్తుంది ఇవైనా తినండి ” అని ప్లేటులో మామిడిపళ్ళ ముక్కలూ, గ్లాసులో నీళ్ళూ అక్కడ పెట్టీ క్షణంసేపు అతని చేతిలోని పువ్వువైపు చూసి, నవ్వుకుని వెళ్ళిపోయింది అదే. ఆ చిరునవ్వును . అనురాగపు అరుణిమను పూసుకుని పల్చని నాజూకు పెద్దాలవెనక స్నేహపు ధవళిమను నింపుకున్న ఆ చిరునవ్వును .. ఆమె తోరణంగా వేలాడగట్టిన మల్లెపూదండలోంచి జారిపడిన చిన్నరేఖలాంటి క్షణం చిరునవ్వును అతను ఏరుకుని దాచుకున్నాడు ఇలా తెరిచిన కిటికీల్లోంచి తన జీవితంలోకి తొంగిచూస్తున్న నాగావళి తన యింట్లోకి ఎప్పుడు అడుగుపెడుతుందో ఆనాడు ఈ యింటి తాళాలు ఆమెకు యిచ్చెయ్యాలి ఇంటి పెరట్లో పూలమొక్కల్ని నాటమనాలి అనురాగాన్ని అడుగడుగునా జ్ఞప్తికితెచ్చే ఎర్రటిపూలు అందులో వుండాలి. సిగ్గుతో కందిన చెక్కిలి ఎరుపు, ఆకలి కదిలిన మంట ఎరుపు, తాంబూలం తడిపిన పెదాల ఎరుపు, వెలుగు కరిగిన ఉదయపు ఎరుపు, పసుపు చేరిన కాషాయ ఎరుపు, పసుపు చేరని మెజంటా ఎరుపు, వెన్నెల్లో తామరపూవు ఎరుపు, పండిన గోరింటాకుఎరుపు., ముగ్గిన ఎర్రజాంపండు ఎరుపు, - యిలా ఎన్ని ఎరుపులున్నాయో అన్నిటినీ పండించమనాలి. ఆమెను మడుల్ని కట్టమని తను నీళ్ళుపోయాలి రోజూ పూలు కోయాలి వాటితో యింటిని అలంకరించాలి... జీవితానికి కోటాకొట్టుకుని, భవిష్యత్తు అద్దంలో తనరూపం చూసుకుని తననితానే గుర్తుపట్టలేకపోయాడు. రాత్రి చాలాసేపటివరకూ ఆ ఆకారాన్నే చూస్తూ కూర్చున్నాడు ఉదయం లేచేసరికి ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి రాఘవరావుగారి కంరం అది." “అబ్బాయి లేచాడో లేదో, ఉమాపతిరావుగారు పొద్దునే అతన్ని వచ్చి కలవమన్నారు. వాళ్ళాఫీసులో ఓ ఖాఖీ వుందట.” యూ మధ్య మీరు చెప్పిన వుద్యోగమేనా. అసలు ఆయనకు ఆ వుద్యోగం చేయడం యిష్టమో కాదో కనుక్కోండి. ఆయనదంతా అదో తరహా.” ఏమిటి నాగావళి తన తత్వాన్నికూడా తెలుసునన్నట్లు మాట్లాడేస్తోంది చాలా సన్నిహితంగా తనని పరిశీలిస్తోందన్నమాట. తన తత్వంకూడా ఆమెకు కొవలసివచ్చింది తన అభిరుచుల్నీ యిష్టాయిష్టాల్నీకూడా తనకన్నా ముందుగా ఆవిడే వూహించేస్తోంది. తనదంతా అదో తరహా అంటే అర్థం ఆమె తరహాకాదనే. ఇంతకీ ఆమె తత్వం ఏమిటి? ఆమె అభిరుచులు ఏమిటి? ఏమాత్రం బయటపడదేం ఎంత గుంభనం! సాహిత్యంలో 'ప్రవేశముందా? సంగీతం వచ్చా?పాడేవాళ్ళలో బహుతక్కువమందీ, నాట్యంచేసే వాళ్ళలో

శ్‌ వాళ్ళమధ్య వంతెన బహు ఎక్కువమందీ అందంగా వుంటారట. ఇంత అందమైన అమ్మాయికి నాట్యం రాకుండా వుంటుందా...

నాగావళి వచ్చింది అతని గది కిటికీముందు నందివర్థనం చెట్టుకింద నుంచి

సిగరెట్టు పాగ పాయలు పాయలుగా గాలిలోకి ఎగరడం చూసి అతను లేచాడని తెలుసుకుని తలుపురెక్కలు కొద్దిగా తోస్తూ “లేచారా? నాన్నగారు అడిగారు మిమ్మల్ని ఎవరిశో కలుసుకోవాలట. వేగంగా తెమలమంటున్నారు” అంది.

కొద్దిగా తెరచిన తలుపురెక్కల సందులోంచి కనిపిస్తోంది ఆమె బిగువు సడలి,

చెవులమీదకు జారి, చుట్టూ ఆవరించిన నల్లనిజుత్తులో మరీ తెల్లగా నందివర్ధనం పువ్వులా వుంది ఆమె ముఖం. ఆకులమీద వాలి, అవి కదిలినప్పుడు పక్కలకు చెదిరి అడుగున పూసిన పుష్పం చెక్కిలిమీద ముద్దిడుతున్న ఉదయారుణ కిరణంలా ఆమె నొసటి కుంకుమబొట్టు తలుపుఖాళీలో దాగుడుమూతలాడుతూ మెరుస్తోంది. రెక్కల్ని ఆడించి శక్తిని పుంజుకుని గాలిలో తేలిపోయే గండుతుమ్మెదలా నల్లటికనురెప్పల్ని టపటపా కొట్టుకొని ఎగిరిన చూపులు తలుపు మధ్య ఖాళీయిరుకు సందులోంచి 'స్వేచ్ళగా రాలేకపోతున్నాయి. మంచుపడి శేకలమీదుగా జారి తెగి కిందపడిపోలేక అంటిపెట్టుకుని వేలాడుతోన్న సాగిన మంచుబిందువులా వుంది ముక్కు.

అలా అఆ సన్నటి తలుపుసందులోంచి కనిపించీ కనిపషించనట్లు నిలుచున్న నాగావళి మరీ మనోహరంగా వుంది..లేచొచ్చి తలుపులు బార్జాతెరిచి లోపలికి రమ్మని పిల్గుద్దామని కూడా అనుకోలేదు అతను. తెరిచేస్తే యింత అందం అప్పుడు వుండదు. ఎంత నిర్మలంగా వున్నా మేఘాలు లేకపోతే ఆకాశానికి అందంలేదు. మేఘాలు ఆకాశాన్ని కిప్పి అక్కడక్కడా కొద్ది కొద్దిగా వొదిలేసి వున్నప్పుడే అందం. ఎంత అందగాడయినా, ఏ కొబ్బరిచెట్టు ఆకులచాటునో దాగుడుమూత లాడుతున్నప్పుడే చంద్రుడి అందం రాణిస్తుంది, తామరాకుల్ని కప్పుకుని అక్కడక్కడ నగ్నంగా వాదిలేసినవొంప్పల్ని చూపించినప్పుడే కొలనువైపు మళ్ళీ చూడాలనిపిస్తుంది.

“ఏమిటి! ఇంకా కదలదలుచుకోలేదా మీరు. రాత్రి భోజనంకూడా సరిగా చెయ్యలేదు లేచి ముఖం కడుక్కుంటే టిఫిను చేద్దురుగాని” తలువులు బార్ధా తీసేసింది. రాత్రి తెచ్చిన మామిడిముక్కల స్లేటూ, గ్లాసూ తీసుకెడదామని గదిలోకి అడుగుపెట్టి ఆగిపోయింది.

ప్లేటులో మామిడి ముక్కలు ఎలా పెట్టినవి అలానే వున్నాయి అక్కడ!

నీడవట్టు మనిష 77 “ఇవి తినలేదా! వాటి విషయమే మరిచిపోయానుసుమా!” అన్నాడు నాగావళి ఏమీ మాట్లాడలేదు. కొద్దిక్షణాలు అతని ముఖంలోకి చూసి, గ్లాసు తీసుకుని వెళ్ళిపోయింది ఆ పగలల్గ్లా మళ్ళీ ఆమె అతనికి ఎదురువడనేలేదు టిఫిను, కాఫీ పట్టుకొస్తుందేమో అనుకున్నాడు. ఆమె రాలేదు. లోపల్నుండి కబురొస్తే అతనే వెళ్ళాడు. ఆమెకుకోపం వచ్చిందనే సంగతి సాయంకాలానికిగాని అతనికి అర్ధంకాలేదు కొత్తలో మాట్లాడకపోయినా కనీసం కనిపించనైనా కనిపించేది. ఈరోజు ఉదయం తర్వాత ఆమె దర్శనమే లేదు. కనిపిస్తే ఉదయం వెళ్ళాచ్చిన సంగతి మాట్లాడాలనుకున్నాడు. అదీగాక, వారం పదిరోజుపాటు కాలక్షేపం అనుకున్న పుస్తకాల్ని ఐదురోజుల్లోనే చదివేశాడు. కొత్తవి పట్టుకురమ్మని చెప్పాలి.

మధ్యాహ్నంనించీ మాటిమాటికీ వరండాలోకి వస్తూనే వున్నాడు నాగావళి కనిపిస్తుందేమోనని. అలా సాయంకాలంవరకూ చూసింతర్వాత చటుక్కున తట్టింది. తను మామిడిపళ్ళముక్కల్ని తినకుండా వదిలేసినందుకు కోపం వచ్చుంటుందని.

నవ్వుకున్నాడు.

తనకు కావలసింది ఇలాంటి హృదయమే. ఇంత సున్నితంగా స్పందించేదే కావాలి. అప్పుడప్పుడూ ఇలా కోపమూ, బెట్టసరికూడా వుండాలి. దగ్గరగా వుంటూనే దూరంగా మెలగాలి. అలావున్నప్పుడే అనుబంధం నిత్యనూతనంగా వుంటుంది. రోజూ ఉదయించే సూర్యచంద్రులే అయినా రోజూ కొత్తగానే వుంటారు వారు. ఆ కొత్తదనం వాళ్ళ దొగుడుమూతల్లోనే వుంది. చీకటినీడల మధ్య వెన్నెల వెల్తురులకు అందం. లోయల పక్కనే కొండలకు అందం. కన్నీళ్ళుపోసి పెంచితేనే చిరునవ్వులపూలు రంగుల్సీ, సువాననల్నీ నింపుకుంటాయి. కొంత బాధ, కొంత నిరీక్షణ కావాలి. నిరీక్షణ ఆశగా ఊహించడం నేర్పుతుంది.

ఆ సాయంకాలం షికారుకు వెళ్ళినప్పుడు ఓ పాతిక మామిడిపళ్ళు బుట్టలో కుట్టించి పట్టుకొచ్చాడు సదానంద.

ఇదేమిటోయ్‌ సళ్ళుకొన్నావ్‌, యింట్లో వున్నాయిగా” అన్నారు రాఘవరావుగారు.

“చవగ్గా వచ్చాయిలెండి, పట్టుకొచ్చిపడేస్తే యింట్లోవాళ్ళయినా తింటారు కదాని కొన్నాను.”

నాగావళి వచ్చి పళ్ళు చూసి తనలో తనే నవ్వుకుని లోపలికి తీసుకెళ్ళింది

18 వాళ్ళమధ్య వంతెన

చాలాసేపు రాఘవరావుగారితో ఉద్యోగవిషయాలు మాట్లాడుతూ కూర్చుండి పోయాడు భోజనం వడ్డించి పిలుస్తే యిద్దరూ లేచారు నాగావళి తల్లే వడ్డించింది గబగబా భోజనం చేసి ముందుగానే లేచి వొచ్చేశాడు సదానంద. గదిలోకి వెళ్ళబోతోంటే వీధివరండా స్థంభందగ్గర నాగావళి నిలుచునివుంది. అతన్ని చూసి యింట్లోకి వెళ్ళిపోబోతుంటే అతనే పలకరించాడు. ఆమె ఆగిపోయింది.

“సాయంకాలం కనిపిస్తే పుస్తకాలు ఏమున్నా పట్టుకురమ్మనమని చెప్పాలను కున్నాను. కనిపించనేలేదు మొన్నటిని చదివేశాను.” అన్నాడు

ఆమె ఏమీ మాట్లాడలేదు

“ఉదయం ఉమాపతిరావుగార్ని కలుసుకున్నాను. ఖాళీవుంది అప్లికేషను యిచ్చిమంచిరోజు చూసుకుని చేరమంటున్నారు ఉద్యోగం వచ్చినట్టే. ఆలోచించాలి మరి. తరచుగా కేంపులు వుంటాయట.” అన్నాడు తిరిగి.

అప్పటికీ ఆమె ఏమీ మాట్లాడలేదు.

“కోపం వచ్చింది కాబోలు మామిడిముక్కలు తినలేదని. నిజంగానే మర్చిపోయాను. నాకు మతిమరుపు ఎక్కువ. లేకపోతే మామిడిపళ్ళని తినకుండా వొదిలేస్తానా అవంటే నాకు చాలా యిష్టంగనుకనే దారిలో చవగ్గా అమ్ముతుంటే కొని వట్టుకొచ్చాను యివ్వాళ. చిన్నవ్రుడు మా వూళ్ళో రోజూ తోటల్లోకి పోయి దొంగచాటుగా. .”

నవ్వాచ్చిందామెకు. నవ్వుకుని-

“ఇంతపెద్ద సంజాయిషీ యిచ్చుకోనక్కరలేదులెండి. అయినా నాకు కోపం వచ్చుంటుందని ఎలా అనుకున్నారు?” అంది.

అవును, ఆమెకు కోపం వచ్చుంటుందని ఎలా అనుకున్నాడు తను? ఆమె కనిపించకపోవడానికి అనేక కారణాలు వుండొచ్చు పని వత్తిడిలో వుండిపోయిందేమో। ఒంట్లో బావుండలేదేమో!

ఆమె అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు

“ఇంతకీ మీరు ఉమాపతిరావుగారి ఆఫీసులో చేరుతున్నారా?”

“అదే ఆలోచిస్తున్నాను, తెరగాలట కదా ” “పోనీలెండి. ఆ చూసుకునే దేదో కాస్త మంచి ఉద్యోగం చూసుకుని చేరితేసరి.

నీడవట్టు మనిషి 9 నాన్నగారు అదేదో బేంకులో ఉద్యోగం చూస్తున్నారు అదొస్తే బాగానే వుంటుంది ఈ పదిహేను రోజులకూ కంగారెందుకూ?”

సదానందకు ఆశ్చర్యంగా వుంది. ఇంతకుముందే రాఘవరావుగారు అడిగితే మంచిరోజు చూసుకునే చేరిపోవాలనుకుంటున్నానని అన్నాడు. అదే మాట ఆమె ఎదుట అనలేకపోయాడు. నాగావళి ప్రభావం తనమీద పడుతోందా అన్న అనుమానం వచ్చింది అతనికి . అంతకుముందు చేరదామనే అనుకున్నాడు కాని యిప్పుడు చేరాలని లేదు. నాగొవళి ప్రభావం తనమీద పడిందనడానికి యింతకన్నా నిదర్శనం అతనికి అక్కరలేకపోయింది.

“నా వ్యక్తిత్వం? ఏమైపోయింది అనుకున్నాడు దోచుకోబడిన వాడిలాగ హృదయాన్ని తడుముకుంటూ.

మర్నాడు రాఘవరావుగారితో ఉద్యోగం విషయం చెప్పాడు.

“దానికేముందీ, అలానే. ఆ ఉద్యోగంలో చేరడం నాకుకూడా అట్టే యిష్టంలేదనుకో. సర్లీ, మరోటి ప్రయత్నిస్తున్నాను. వారం రోజుల్లో తెలుస్తుంది” అన్నారు.

సదానంద ఆ విషయం చెప్పినప్పుడు నాగావళి అవతలి గదిలోనే వుంది. కొద్దిసేపు కిటికీలోంచి అతన్నే తెరిపారచూసి, తిరిగి తన పనిలో తాను మునిగిపోయింది.

రాఘవరావుగారు ఆఫీసుకు వెళ్ళిపోయారు,

ఆయన వెళ్ళాక బయటితలుపు గడియపెట్టి నాగావళి తిరిగివస్తుండగా చూసి గబగబా వరండాలోకి వచ్చాడు సదానంద.

“ అ పుస్తకాలు చదివేశాను. అవి యిచ్చేసి కొత్తవేవైనా పట్టకొస్తే. .” మధ్యలోనే ఆగిపోయాడు.

“జ్ఞాపకం వుందిలెండి, మతిమరుపు మీకేగాని నాకులేదు. పొద్దుటినించీ ఊపిరి పీల్చుకోవడానికిక్కూడా తీరికలేదు ఇదుగో, వంటపని పూర్తయిందనుకుంటే వడ్డింపులూ అవీనీ అవీ అయిపోతే తీరిగ్గా వెళ్ళిరావచ్చని ఆగిపోయాను ”

సదానంద ఆశ్చర్యంగా చూశాడు “ఏమిటీ! వంట నువ్వే చేస్తావా?”

చాలా అమాయకంగానూ, కొత్తగానూ చూసింది.

“అదేమిటి! అలా అడిగారు?”

“ఏమీలేదు.”

20 వాళ్ళమధ్య వంతెన

“ఊరికే అడిగుంటే అంత ఆశ్చర్యం దేనికీ బహుశా నాకు వంటచేతకాదని అనుకుని వుంటారు అవునా”

“వంటరాదని ఎలా అనుకుంటాను చదువుకొనేటవుడు రూంమేట్స్‌ అయిదుగురం అందులో నలుగురికి వంటొచ్చు. మగాళ్ళకే వస్తోంటే ఆడాళ్ళకి రాదూ”

“మరి అలా అడిగారేం?”

అతనేమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు.

“చెప్పండి, వట్టినే అడిగుండరు.”

చాలాసేపు అతనేమీ మాట్టాడలేదు. ఆ తర్వాత మెల్లగా జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి పొగ వదుల్లూ-

“మీ డాన్సు గురువుగారు ఎవరూ?” అన్నాడు.

తెల్లబోయిందామె. అర్ధంగాక అయోమయంతో కళ్ళు చిట్లించి, ఇబ్బందికరంగా జారిన యిరుకు చూపుల్ని అతనిమీద నిలిపి, ముఖంనిండా అల్లుకున్న ఆ ముడుల్ని మెల్లగా సడలిస్తూ ఆలోచనల్లోకి దూరి చూస్తోంది.

“అదే-చిన్నవ్పుడు డాన్సు నేర్చిన గురువుగారెవరో తెలుసుకుందామని.”

నవ్వుల్లో పగిలిపోయి బేలెన్సు నిలుపుకోలేక నిజంగానే డౌన్సు చేసింది ఆమె. “నేనా... నేను డాన్సు నేర్చుకోవడమేమిటండీ.. కలగన్నారా?”

“సారీ ... డాన్సంటున్నానేమిటీ, డాన్సు కాదు, సంగీతం, సంగీతం నేర్పిన గురువుగారి పేరేమిటి?”

“ఇది మరీ బావుందండోయ్‌. ఇవ్వాళ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే మీరు. నేను నేర్చుకోకపోవడం అటుంచి కనీసం నేర్చుకున్న స్నేహిశురాళ్ళయినా లేరుకదా నాకు ఏమిటి ఇలా అడిగారు?”

“ఏమిటో వచ్చుంటుందని అడిగాను మరేంలేదు. ఇవ్వాళ కూజాలో నీళ్ళు పోశారా. దాహంగా వుంది. ఓ గ్లాసెడు నీళ్ళుతెచ్చి పెడతావా?”

తెగిపోయిన కలల మత్తులోంచి కదిలివెళ్ళినట్టు ఆలోచనల్లో ఊగుతూ ఊగుళూ మెల్లగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్లింది నాగావళి. రెండు నిమిషాల్లో గ్లాసుతో మజ్జిగ పట్టుకొచ్చింది

నీడవట్టు మనిషి 2

“ఇదేమిటి! మంచినీళ్ళు తెమ్మంటే మజ్జిగ పట్టుకొచ్చావ్‌ కూజాలో నీళ్ళు పోయలేదూ యివ్వాళా” అన్నాడు అతను

“పోశాను గానీ ముందిది తీసుకోండి. అంతగా కూజానీళ్ళు తాగాలంటే మరో గ్లాసుతో తెస్తాను.”

“అదికాదు...”

“అది అయినా కాకపోయినా ముందు ఇది తీసుకోండి. ఇదేమీ కషాయం కాదు, తీసుకోండి ”

గ్లాసు అందుకుని తాగుతూ మధ్యలో ఆపేసి-

“ఏమిటా అధికారం? ఆ శానింవృ ఏమిటి? అలా బలవంతం చేసీ తాగించకపోతేనేం? పోనీ ఆ కంఠాన్ని మరికాస్త మృదువుగా, నెమ్మదిగా పలికిస్తే ఏం పోయిందీ?' అనుకున్నాడు. ఓసారి ఆమె ముఖంలోకి చూసి మిగిలిన మజ్జిగనుకూడా గడగడా తాగేశాడు

అమె గ్లాసు తీసుకుని వెళ్ళిపోబోతూ ఆగిపోయి “ఇంతకీ మీరు అసలు విషయం చెప్పకుండా దాటేశారుకదూ. చెప్పరా ఎందుకడిగారో?” అంది ముఖం కొద్దిగా వంచి, బతిమాలుతున్న ధోరణిలో కళ్ళ కొసల్ని జాలితో తడిపి, కనుగుద్గను రెండింటినీ మూలల్లో నిలిపి,రెప్పల్ని వాల్బ్పకుండానే అతన్నే చూస్తూ నిలుచుంది.

“ఊరికే యధాలాపంగా అడిగాను. మరీ యింతగా పట్టించుకుంటావేమిటీ! ఏమీలేదు” అన్నాడు గదిలోకి వెళ్ళిపోతూ. నాగావళికూడా చాలాసేపు అక్కడే నిలుచొని యింట్లోకి వెళ్ళిపోయింది.

భోజనాలు అయిపోయాక పుస్తకాల గురించి వెళల్ళామనుకుంది కాని కుదరలేదు. ఇంట్లో అప్పడాలు చేస్తోంటే, ఆ పనిలో మునిగిపోయింది. సాయంకాలానికిగాని వెళ్ళి తీసుకురావడం పడలేదు తీరా తెచ్చేసరికి సదానంద షికారుకు వెళ్ళిపోయాడు. అతను తిరిగివచ్చేసరికి రాత్రయిపోయింది. అతను తిరిగిరావడం చూసి, కొద్దిసేపు వూరుకుని పుస్తకాలు పట్టుకునివచ్చింది నాగావళి

చాపమీద శూర్చుని వుత్తరాలు రాసుకుంటున్న సదానంద తనమీద నీడ పడితే తలెత్తి చూశాడు. పుస్తకాలు పట్టుకుని నిలుచుని వుంది నాగావళి. ఆమె నీడనుంచి తప్పుకుని అవతలకు జరిగి కూర్చున్నాడు.

బలి వాళ్ళమధ్య వంతెన

“పుస్తకాలు తెచ్చావా? చాలా ధాంళ్స్‌, నీకు శ్రమ యిస్తున్నాను కదూ.” పుస్తకాలు అందుకొని, ఓసారి అలా తిరగేసి పక్కన పెట్టి “నువ్వు చదివావా వీటిని? ఎప్పుడూ పుస్తకాలు చదువుతున్నట్టే కనిపించవు సాహిత్యం అంటే యింటంెస్టు లేదా నీకు?” అన్నాడు.

“ఏమీ తోచకపోతే చదువుతుంటాను. మరీ మీలా పిచ్చిగాచదివే అలవాటు నాకు లేదులెండి. వాటిని అర్థంచేసుకునే శక్తికూడా వుండాలి కదా? అంతపెద్ద చదువులు నేను చదువుకోలేదు ”

అకస్మాత్తుగా మౌననముద్రంలోకి వెళ్లినట్ట కొన్ని క్షణాలు అతనేమీ మాట్లాడలేదు. ఆమె చూసిచూసి చివరకు వెళ్ళిపోదామనుకుని “భోజనం వడ్డించేసింది అమ్మ. పీలుద్దానునే వచ్చాను. ముందు భోంచేసి ఆ తర్వాత కూర్చుని రాసుకోండి” అంది. వెనక్కు తిరిగి రెండడుగులు వేసింది.

“నాగావళీ!”

చెంగు పట్టుకుని లాగి నిలేసినట్బ చటుక్కున నిలబడిపోయింది.

“నిజంగానే నీకేవీ చేతకాదా?”

ఆమెకు అర్థంకాలేదు. రెప్పల్ని ఎగరేసి 'ఏమిటి?' అన్నట్టుచూసింది.

“అదే...ఏ ఒక్క కళలోనూ ప్రవేశంలేదా-నీకు? ఆఖరికి సాహిత్యంలోకూడా లేదా?”

కొద్దిక్షణాలు రెప్పల్ని వాల్చకుండా అతన్నే చూసింది.

అర్థమయ్యింది. ఉదయం ఆయన అడిగిన చిత్రమైన ప్రశ్నల వెనక ఆయన హృదయంలోని ఉత్సకత యిప్పుడు ఆర్థమయ్యింది . తనకేదో వచ్చుంటుందని ఎందుకనుకున్నారు? అంత కల్పన దేనికి? ఊహల్లోనే జీవిద్దామనితప్ప మామూలుగా జీవించడానికి ఎందుకు ప్రయత్నించరూ? ఆకాశంలో ఎగరడమేగాని భూమ్మీద నడవడం చేతకాదా? ఇలాంటి మనుషులు ఎలా బతగ్గలుగుతారు?

అతన్నిచూస్తే ఆమెకు జాలేసింది. అప్రయోజకుడైన కొడుకును చూసి కోపం రాకపోగా మరింత గ్రేమపాంగి, ఆలోచనలన్నీ అతన్నే అల్లుకుని, గొడుగు పట్టి చల్లని నీడల్ని కురిపించి సేదదీర్చి, మరింతగా తన కడుపుతీపిని పంచిఇచ్చిన తల్లిమనసులా నాగావళి హృదయం కరుణతో తడిసి, చల్లటి జలోచనల్ని గాలులుగా అతనిమీదకు

నీడవట్టు మనిషీ 28 విసిరి, అతని ఆకారాన్ని ఆమె కళ్ళలో నిలుపుకొని రెప్పలకింద భద్రంగా దాచుకుంది.

“మరీ అంత ఊహల్లో బతకడం మంచిదికాదు లేవండి, భోంచేద్దురుగాని, అందరూ తినేశారు మీరొక్కరే మిగిలారు. అవి అలా వుంచండి, నేను సర్జుతాను గానీ ముందు మీరు కదలండి.”

అతను కదిళివచ్చేవరకూ ఆమె అక్కడే ఎదురుచూస్తూ నిలుచుంది.

ఆమె వెనకనే వెళ్తూ'ఇలా ఈమె శాసించడం ఏమీ బావుండలేదు, అబ్బే ఏమీ బావుండలేదు అనుకున్నాడు.

అతని మనసంతా అదోలా అయిపోయింది. తను అద్దీన రంగుల్ని చెరిపేసుకుని నాగావళి అతనిముందు నిలుచునేసరికి మనసు చివుక్కుమంది. కిందపడి రెక్కలు విరుచుకున్న పక్షిలా గిలగిల్హాడింది.

భోజనం దగ్గర మరీ వరధ్యానంగానూ, ఐశ్వర్యాన్ని కోల్పోయినవాడిలా కళావిహీనంగానూ కూర్చుని, అతను భోజనం చేయడం నాగావళి చూసింది. వాళ్ళమ్మ అక్కడే వుండడంవల్ల ఏమీ మాట్ట్లాడలేకపోయింది. భోజనం అయిపోయాక అతని గదిలో మంచినీళ్ళు పెట్టడానికని వచ్చి “బాధపడుశున్నారు కదూ మీరు మీ ఊహలకు తగ్గట్టు లేను. ఏం చేస్తాను, ఎందులోనూ ప్రవేశం లేకపోవడం అది నా దురదృష్టం” అంది, దుఃఖంలో తడిసి అక్షరాలు ఒకదానితో ఒకటి అంటుకుపోయిన స్పష్టతలేని బొంగురు కంఠాన్ని వినేనరికి అతను చలించిపోయాడు. అంతకుముందు ఎప్పుడూ అమె అలా కాలేదు. అమె కంఠాన్ని అలా వినడం అదే మొదటిసారి. చిరునవ్వుతో సాగిన పెదాలనో, అధికారంతో తెరుచుకున్న పెదాలనో, అప్పుడప్పుడు కోపంతో బిగుసుకుపోయిన పెదాలనో చూశాడుకాని దుఃఖంతో యిలా వణికిపోయిన పెదాలను చూడలేదు. అది అతను భరించలేకపోయాడు.

“బాధపడడంలేదు నాగావళీ! బాధపడాల్సిన అవసరంకూడా లేదు. నాకుకూడా ఏవీ చేతకావు. అందుకని నేనెప్పుడూ బాధపడలేదే, మనమంతా కళాకారులం కాలేం. కళను అర్థం చేసుకునే ఈన్తటిక్‌ సెన్స్‌ వుంటే చాలు. అంతకంటే అదృష్టం ఎందుకూ” అన్నాడు.

మంచినీళ్లు పెట్టేసి నాగావళి వెళ్ళిపోయింది. .

“నీకేమీ చేతగాకపోయినా నా జీవితాన్ని రసాత్మకం చెయ్యగలవు చాలు' అనుకున్నాడు ఆ తర్వాత.

న! వాళ్ళమధ్య వంతెన

“శాసించడం మానుకోవాలి నాగావళీ. అందమైన ఎగ్రని నీ నాజూకు పెదాలు అనురాగ స్వరాలు మీటడానికేతప్ప శాసించడానికి కాదు” అనుకున్నాడు తిరిగి.

నాగావళి అతని జీవితం మీదికి పాగమంచులా జారి, బిందువులుగా విడిపోయి, వెలుగుకిరణాల్ని అందుకుని, సప్తవర్థాలుగా వికేంద్రీకరించి, ఆ విడిన రంగులను తిరిగి అతనిజీవితం మీదనే కుమ్మరించి,రంగులు అద్ది మురింత అందంగా,శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. మరొకప్పుడు సరుగుడు తోటలోంచి వీచిన గాలితెరలా అతని జీవితంమీదకు దిగిఆలోచనల కొసల్ని అందుకుని ఆకాశంలోకి ఎగిరి, అక్కడ మేఘాల మీద నిలిపి, దూరతీరాల్లోని రంగురంగుల పూలనుచూపి గొప్ప అనుభవంతో నింపివేస్తోంది. ఇంకొకప్పుడు కెరటంలా వచ్చి అతని జీవితాన్ని చుట్టుముట్టి ఉద్రేకంతో ఒక్క కుదుపుకుదిపి, పెకలించి, కదిల్చి,;సప్తవర్ణాలతో మెర్తిసే ఇసుక సింహాసనంమీద 'ప్రతిష్టిస్తోంది. కానీ అన్నిటినీమించి ఎక్కువగా తనవ్యక్తిత్వాన్నే గొడుగులా అతని జీవితంమీద పట్టి ఎండనీ, వాననీ అతనిమీద వాలనీకుండా కాపాడుతోంది.

కాని-

అతను అప్పుడప్పుడు వర్షంలో తడుస్తూ నడవాలనీ, ఎండలో తిరగాలనీ అనుకుంటాడు. అమె ఒదిలిపెట్టదు. అతనికి కోపం వస్తుంది. బాధకూడా కలుగుతుంది.

ఇలా చాలాసార్లు జరిగింది.

వారం రోజుల తర్వాత అతనికి బేంకులో ఉద్యోగం దొరికింది. ఒక రోజు - షికారుకు వెళ్ళొచ్చిన సదానందతో “మీకో మంచి వార్త చెప్తాను. నాకు ఏవిటిస్తారు?” అంది,

“నీ యిష్టమొచ్చింది కోరుకో, యిస్తాను” అన్నాడు.

“అదే వొద్దు. అలా కలల్లో నిలుచుని మాట్లాడతారెందుకు, మామూలుగా మాట్లాడండి” అంది.

అతని మనస్సు చివుక్కుమంది. ఈమెకు తన మాటలే ప్రధానమా, హృదయం ప్రధానంకాదా? ఈ మాటల వెనక తన హృదయాన్ని గుర్తించదేం-అనుకున్నాడు. మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోబోతూంటే కూడావచ్చి “పోనీలెండి; ఏ బహుమతీ యివ్వక్కరలేదుగానీ యీమాట ఆలకించండి-మీకు బేంకులో ఉద్యోగం వచ్చింది?”

నీడపట్టు మనిషి ౭ైక్‌

మరొకప్పుడైతే ఆనందంతో అలాగా! అయితే తప్పకుండా నీకు బహుమతి యివ్వాల్సిందే. రేపే నీకు ఫలానా వస్తువు బహుమతి యిస్తాను” అనేవాడు. కాని యిప్పుడలా అనాలనిపించలేదు. తన హృదయాన్ని గుర్తుపట్టనప్పుడు ఎందుకు దాన్ని బయటకు తీసి ప్రదర్శించాలి.

“అ(హా' అన్నట్టు తలమాత్రం ఊపాడు.

ఆమె దెబ్బతింది అయినా తేరుకుని మామూలుగానే, “నాన్నగారు చెప్పారు, మీకు ఊద్యోగం వచ్చిందని. ఆ కాగితం వారిదగ్గరే వుంది నిద్రపోతున్నారు గాబోలు, పొద్దున్న చూద్దురుగాని” అంది.

ఏమైనా ఆరోజు ఉండాల్సినంత ఆహ్లాదకరంగా లేదు వాతావరణం.

సదానంద మంచిరోజు చూసుకుని ఉద్యోగంలో చేరాడు. మొదట్లో కొంత కొత్తగా వున్నా రానురాను అలవాటైపోయింది. టైముకు వెళ్ళడం, టైముకు రావడం. బేంకులో కూర్చున్నంత సేపే బాధ్యతలు. బైటికొస్తే మరే చింతా వుండదు. సాయంకాలం అలా ఏ సముద్రపు ఒడ్డునో కూర్చుని మెల్లగా యింటికి వచ్చేవాడు. భోంచేసి ఏ నవలో పట్టకుంటే రాత్రి పన్నెండయిపోయేది.

“మరీ అంతరాత్రివరకూ మేల్కొని వుంటారెందుకూ? ఆరోగ్యం పాడౌ తుంది.” అని అనేకసార్లు నాగావళి కసురుకునేది ఐనా వినేవాడుకాదు. కాస్సేపైనా చదవకపోతే నిద్రరాదు అనేవాడు. కోపంవచ్చి పుస్తకాలు పట్టుకురావడం మానేసీంది. ఎక్కడైనా లైబ్రరీలో చేరాడో ఏమో, తనే తెచ్చుకుంటుండేవాడు.

ఒకసారి మామ్‌ ' రైటర్స్‌ నోట్‌ బుక తెచ్చాడు. భోంచేసి వున్తకం పట్బక్కూచున్నాడు. రాత్రి పదయ్యింది. లైట్లు ఆరిపోయాయి. వస్తాయేమో నని అర్ధగంట సేపు కాచుక్కూర్చున్నా ఎంతకీ రాలేదు, వినుగొచ్చింది. గత రోజుకూడా యింతే. మునిసిపాలిటీవారిమీద కోపం వచ్చి తిట్బక్కున్నాడు కూడాను. లైట్ల గురించి ఎదురుచూస్తూ కూర్చుని చివరకు నిద్రపోయాడు. ఆ మర్నాడు బేంకులో పక్కసీటు ఆయనతో మునిసిపాలిటీవాళ్ళ చేళకాని తనాన్ని గురించి తీవ్రంగా చర్చించాడు. స్టానిక రాజకీయ వార పత్రికలో పాఠకుల లేఖావళికి ఒక ఉత్తరం కూడా దీనిమీద రాద్దొామనుకున్నాడు. రాత్రి భోజనందగ్గర ఈ విషయం నాగావళితో చర్చించాడుకూడాను.

ఏం లాభం. ఆ రాత్రి కూడా అట్టానే అయ్యింది.

పదింటికి లైట్లు ఆరిపోతే పంతంపట్టి గంటసేపు కూర్చున్నా లైట్లు రాలేదు

25 వాళ్ళమధ్య వంతెన అయితే ముందు జాగ్రత్తపడి వచ్చేటప్పుడు కొవ్వొత్తులు కొనుక్కుని వచ్చాడు ఒకటి వెలిగించి కూర్చున్నాడు. ఆ వెలుతురు కింద చదవడం సాధ్యంకాలేదు. కళ్ళుమండాయి. వీధివరండాలోకి వచ్చాడు. సిగరట్బ కాల్చుకుందామని అగ్గిపుల్ల వెలిగించేసరికి నడవా కిటికీ వెనక గాజులచప్పుడు వినిపించింది. అటు చూశాడు. పక్కకు తప్పుకున్న అస్పష్టమైన అకారం ఒక క్షణంపాటు కనిపించి మాయమైపోయింది.

నాగావళే! ఆ బుట్టలోలకులు అమెవే. ఇంత రాత్రివరకూ నిద్రపోలేదా! ఏం చేస్తోంది?

చటుక్కున మెరుపులా ఓ ఆలోచన తట్టి అవతలికి వెళ్ళి చూశాడు. ఆ యింటికి అటూ యిటూ వున్న యిళ్ళల్లో దీపాలు వెలుగుతూనే వున్నాయి. ఇనతలి యింట్లో అంతా నిద్రపోతున్నారు కాబోలు, ఓ గదిలో మాత్రం అతి నీరసంగా రోగిష్టివాడిలా నీలంరంగు బెడ్‌రూంలైటు వెలుగుతోంది. అవతలి యింట్లో యింకా నిద్ర పోలేదేమో ట్యూబులైటు వేసి ఉంది.

అతనికి అర్ధమయింది. ఇది నాగావళి పనే. ఇంట్లో మెయిన్‌ ఆపేస్తున్నట్టుంది ఎందుకిలా చేస్తోంది? తనచుట్టూ హద్దుల్ని ఎందుకు గీస్తోంది? కొన్ని విషయాలలో తనంతటతాను కల్పించుకుని తలదూర్చినా అందంవుంది ప్రతిద్‌ పట్టించుకోవడం ఏమీ బావుండ లేదు-నాగావళిమీద కోపమేకాదు చిరాకుకూడా వచ్చింది.

సిగరెట్లు విషయంలోకూడా ఇంతే జరిగింది. అతనికి సిగరెట్లు కాల్చే అలవాటు వుంది. ఎక్కువగానే కాలుస్తుంటాడు ఈ వూరొచ్చింతర్వాత మరీఎక్కువయ్యింది నాగావళి చూసినా అట్టే పట్టించుకోలేదు.

ఒకరోజు పనిమనిషి రాకపోతే నాగావళే వెళ్ళి అతని గది ఊడ్చింది. అప్పుడు పోగైన సిగరెట్టు పీకలు చూసేసరికి ఆమెకు ఆశ్చర్యమేకాదు కోపంకూడా వచ్చింది

“మీ పద్ధతేమీ నచ్చలేదు ఒక్క రాత్రిలో యిన్ని సిగరెట్లా, ఈ లెక్కన రోజుకి ఎన్ని పేకెట్లు తగలేస్తుంటారు? ఏమీ తోచకపోతే ఏ ఒకటో రెండో కాల్చినా అర్థంవుంది మరీ యిన్నటండీ! ఇలా రాత్రుళ్ళు నిద్రపోక సిగరెట్లు తగలేస్తూకూచుంటే ఎప్పుడోఒకప్పుడు ఒంటికి తెచ్చుకునేట్టే వున్నారు” అంది టేబిలుమీద సిగరెట్ట పెట్టె వుంటే చింపేసి, సిగరెట్లను చిదిమి పారేసింది.

నాగావళి కోపం ప్రదర్శించినా నవ్వొచ్చేట్టగానే వుంది. పెట్టెను ముక్కలు ముక్కలుగా చింపేసి సిగరెట్టను చిదిమిపారేయాలన్న పొడుగాటి నాజూకైన వేళ్ళ కంగారు, పిడికిలి బిగింపులో కసి, వాసనని భరించలేక అసహ్యించుకుంటున్న చిట్టించిన

నీదవట్టు మనిషి 27 నాసికాపుటాలు, బలాన్ని ఒకేచోట కేంద్రీకరించి, సడలిపోకుండా బిగపట్టిన పెదాలు, మాటిమాటికీ అతని ముఖంలోని మార్పులను కొలుస్తూ ఎగిరే చూపులు- యివన్నీ చూసేసరికి అతను నవ్వాపుకోలేకపోయాడు.

అతను నవ్వుతూంటే ఆమెకు ఉక్రోషం వచ్చి, తుడిచిన తుక్కు అయినా ఎత్తకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళిపోయింది.

“బావుంది. చాలా బావుంది. అసహాయతలోంచి వచ్చిన కోపంలో మరీ అందంగా వుంటుందిసుమా'-అనుకున్నాడు.

అప్పటినించీ అతను సిగరెట్టు పెట్టెగాని, అగ్గిపెట్టెగాని బయట వుంచేవాడుకాదు. ఉంచేస్తే చింపి పారియ్యకుండా ఆమె వదిలిపెట్టేదీకాదు. మొదట్లో ఆమె చింపిపోరేస్తోంటే అందంగానే అనిపించేదికాని, రాను రాను చికాకు కలుగుతుండేది. ఇదికూడా తనను శాసించడమే అని అనిపించింది అతనికి.

“అవును. ఇది శాసించడంకాక మరేమిటి? తన స్వేచ్చకు హద్దుల్ని ఏర్పరచడం తనమీద అధికారాన్ని చెలాయించడం కాదూ. చాలా తెలివిగా శాసిస్తోందే! తనకు తెలియకుండా తనను కట్టిపడేయాలని చూస్తున్నట్టుంది. తనదైన వ్యక్తిత్వం తనకు లేకుండాచేస్తోంది యీమె” అనుకున్నాడు.

రోజూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే వుంది. ఆమె ప్రతి పలుకూ తనను శాసించడానికే, ఆమె ప్రతిచర్యా తనను కట్టిపడేయడానికే అన్న భావం అతనిలో మరీ బలవడిపోయింది. అమె మీద చిరాకూ, కోవమూ వన్తున్నాయి. ఆ విషయం అలోచిస్తోంటే ఒక్కొక్కప్పుడు అతనికే ఆశ్చర్యంగా వుండేది.

సదానంద తొలి జీతం అందుకున్నాడు. తన ఖర్చులకిలద కొంత డబ్బు రాఘవరావుగారికిస్తే ఆయన పుచ్చుకోలేదు.

“ఈ నెలనించేకదోయ్‌ సంపాదనలో పడ్డావు. వాచ్చే నెలనుంచి చూద్దాంలే. ఇంటికి పంపించు” అన్నారు ఆయన.

ఇంటికి డబ్బు పంపించడంకన్నా తల్లికీ, అక్కకూ బట్టలు తీసి వంపిస్తే బావుంటుందని అనిపించింది. చీరల గురించి తనకు తెలీదుకదా. ఎట్లా?- అనుకుంటుండగా చటుక్కున నాగావళి జ్ఞస్తేకి వచ్చింది. ఆమెకు ఆ విషయం చెప్పాడు.

“అలానేలెండి. రేపు ఎలాగూ మేం బజారుకు వెళ్ళదలచుకున్నాం, స్నేహితురాలు ఏవో బట్టలు తీసుకుంటానంది. నేను కూడా జాకెట్టు గుడ్డలు తీసుకోవాలి. రేపు బేంకునుంచి నేరుగా ఇంటికొచ్చేస్తే యిక్కడ్నుంచి కలిసి వెళ్ళొచ్చు” అంది.

28 వాళ్ళమధ్య వంతెన “నేనెందుకూ మళ్ళీ. మీరిద్దరూ ఎలాగూ వెళ్తున్నారుకదా. మీరే తెచ్చె య్యండి” అన్నాడు. “తెచ్చేస్తాలెండిగాని తమరూ రండి, ఫరవాలేదు” అంది నాగావళి.

ఆ మాటలు విన్న తర్వాత అతనికే సిగ్గేసింది. మరేమీ మాట్టాడలేకపోయాడు.

మర్నాడు సాయంకాలం బేంకునుంచి తిన్నగా యింటికే వచ్చేశాడు. నాగావళి స్నేహితురాలుకూడా వచ్చింది. యింట్లో చెప్పి బజారుకు బయలుదేరారు.

వాళ్ళు తరచుగా బట్టలుకొనే దుకాణం ఒకటుంది. అక్కడకు వెళ్ళారు. నాగావళి "స్నేహితురాలు పి.డబ్బుడి, ఇంజనీరుగారి అమ్మాయి. కాస్త పెద్ద ఎత్తునే బట్టలు ఖరీదుచేసింది. అంత పెద్ద ఎత్తున ఖరీదుచేసిన అమ్మాయి పక్కనే బ్లౌజు పీసులు " ఖరీదుచేస్తున్న నాగావళిని చూస్తే అతనికి జాలేసింది. అక్కకూ తల్లికీ చీరలు సెలెక్టు చేయించి తీసుకుని, నాగావళికి కూడా ఒకటి తీసుకోబోయాడు “నా కెందుకూ చీర. కొని, యింకా వాడని కొత్త చీరలే రెరడో మూడో పెట్లో వున్నాయి. కిందటి నెల్లోనే మేమిద్దమూ వచ్చి ఓ చీర కొనుక్కెళ్ళాం. వొద్దు తియ్యకండి” అంది. ఆ చీరని లోపల పెట్టించేసింది. ”

సదానందకూడా తనక్షేవైనా బట్టలు తీసుకుందామనుకున్నాడు. సేంటు గుడ్డలు చూస్తోంటే నాగావళి “ఇవేమిటిగాని మీకు లాల్చీ షరాయి చాలా చక్కగా నప్పుతాయి,

  • అవి తీనుకోండి” అంది.

“నా కవి నచ్చవు. కళాకారుడి వేషం వేసినట్టుంటుంది.” అన్నాడు.

“లేదు. అవి మీకు చాలా బాగా సరిపోతాయి సన్నటివాళ్ళకు లాల్చీ షరాయి బావుంటుంది. ఓ జత కుట్టించుకుని చూడండి” అంది తిరిగి.

“వాద్దులెద్దుూ. నాకు నచ్చదది.” అనేశాడు.

“అది కాదు. ఒక్క జత కుట్టించుకుని చూడండి. మీకు చాలా బావుంటుందంటే నమ్మరేం” అని,ఆ వెంటనే “ఏదయ్యా లాల్చీ షరాయిలకు మంచి గుడ్డవుంటే చూపించు” అంది కొట్లో గుమాస్తాతో. రెండు మూడు రకాలు చూసి ఓ రకం పైకి తీసి “ఇది బాగున్నట్టుంది కదూ!” అనీ సదానందకు చూపించింది

నాగావళి ప్రవర్తన సదానందకు చాలా చికాకు కలిగించింది. అప్పటికే కొట్టువాడూ, గుమాస్తాలూ వాళ్ళ నంభాషణని ఆలకించారు నాగావళి 'స్నేహితురాలుకూడా పెదాల్ని బిగబెట్టి నవ్వాపుకుంటోంది అవన్నీ సదానంద గుర్తించాడు.

నీడవట్టు మనిషి 29 అతనికి చిరాకు వేసింది. “ఇవ్వడొద్దు, తర్వాత తీనుకుంటాలే” అని అందామనుకున్నాడు గొని అప్పటికే నాగావళి ఆయనకు ఎంత గుడ్డ కావాలో లెక్కగట్టి చింపి యిచ్చెయ్యమని అర్గరు ఇచ్చేసింది.

ఆ కొట్టు అరుగుమీదే ఓ మిషను పెట్టుకుని టబైలరు ఒకడు వున్నాడు. అతనికి ఇచ్చేసి కొలతలు తీసుకోమంది నాగావళి. “మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం ఎందుకూ. యీయన కిచ్చేస్తే యాయనే కుట్టేస్తాడు. నాన్నగారుకూడా యితని దగ్గరే కుట్టించుకుంటారులెండి బాగానే కుడతాడు. కొలతలు ఇవ్వండి” అంది సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టు సదానందతో. ॥

సదానందకు సహనం సన్నగిల్లిపోతోంది. అనవసరంగా అక్కడ అల్లరి పడడం యిష్టంలేక మౌనంగా కొలతలు యిచ్చేశాడు,

ఆ కొట్లో ఎక్కువసేపు వుండబుద్ధేయలేదు అతనికి. అక్కడ అందరి చూపులూ తనమీదే వున్నట్టనిపించాయి బిల్లు చెల్లించేసి బయటపడ్డాడు.

“ఇంటికేనా?” అంది నాగావళి.

అతను సమాధానం చెప్పకుండా నడుస్తున్నాడు.

ఆమె తనలో తనే నవ్వుకుంది.

కొంతదూరం వెళ్ళిన తరువాత, తనకు పనుందని, అటు వెళ్ళాలని గాలికి చెప్పినట్టు చెప్పి గబగబా అడుగులు వేసుకుంటూ మరోవైపు వెళ్ళిపోయాడు సదానంద. అలా వెళ్ళి వెళ్ళి సముద్రపుటొడ్డుకొచ్చి కూర్చున్నాడు.

ఎదుటివారి యిష్టాయిష్టాల్ని ఎందుకు గుర్తించదీమె? ఇతరులకుకూడా వ్యక్తిత్వాలు వుంటాయనీ, వాటిని గౌరవించాలనీ యీమెకు తెలీదా? ఇతరుల వ్యక్తిత్వంమీద తన ప్రభావాన్ని ప్రసరింపచేయడం స్వార్ధపరుల లక్షణం అని ఎందుకు గుర్తించదు? ఆ బలవంతమేమిటి? ఆ అధికారాన్ని ఎవరిచ్చారు? జీవన సామ్రాజ్యంలో మహారాజ్ఞి అవుతున్నంత మాత్రంచేత ఆ జీవితాన్ని శాసించడానికి పూనుకోవడం తెలివైన పనికాదు. శాసించేకంఠాన్ని తను భరించలేడు. ఇతరుల వ్యక్తిత్వవు నీడల్లో నిలబడడం తనకు యిష్టంలేదు. స్వేచ్భాజీవితానికి అలవాటుపడిన తను ఏ పరిధుల మధ్యా ఆనందంగా జీవించలేడు. జీవించగలననుకోవడం ఆత్మవంచనే -అనుకున్నాడు సదానంద,

అతని మననంతా కకావికలుగా అయిపోయింది. ఇంతకాలంగా అతను హృదయంలో నిలుపుకున్న రూపం మంచులా కరిగి నీరుగారిపోయింది. అక్కడ

త్రం వాలళ్ళమధ్య వంతెన అతనికొరకు మిగిలిందేమీ లేదు. తన సర్వస్వమూ కోల్పోయినవాడిలాగ అతను బాధపడ్డాడు.

రాత్రి బాగా పొద్దుపోయేవరకు అతను ఆలోచనల్లోనే గడిపి మెల్లగా యింటిని చేరుకున్నాడు.

నాగావళి మేలుకునేవుంది. తలుపు తట్టితే వొచ్చి తలుపు తీసింది. ఆవిడే భోజనం కూడా వడ్డించింది. చాలా ముభానంగా భోంచేసి లేచిపోయాడు. గదిలో కొచ్చి కొవ్వాత్తి వెలిగించి, ఏదో రాసుకుంటూ కూచున్నాడు. నాగావళి మంచినీళ్ళు పెడదామని వొచ్చి చూసి, కరెంటు దీపం వెలిగించి వెళ్ళిపోయింది. ఆ వెనకనే లేచొచ్చి కరెంటుదీపం ఆర్బేసి, కొవ్వాత్తి కరిగి కరిగి చీకట్లో మునిగిపోయేవరకూ దాన్నే చూస్తూ కూర్చుని, నిద్రపోయాడు.

శ ఉదయం రాఘవరావుగారితో “మధ్యాహ్నం బండికి వూరెళ్ళుతున్నానండీ. నిన్ననే చూ అమ్మ ఉత్తరం రాసింది ఓ సారి రమ్మనమని” అన్నాడు.

“అప్పుడే యింటిమీద బెంగెట్టేసుకున్నావుటోయ్‌! భలేవాడివే” అని ఓవిట్టు విసిరి, విసిరినందుకు నవ్వుకుని “ననే వెళ్ళిరా. నిస్న మీ అక్కయ్యకీ, అమ్మకీ బట్టలుకూడా తీసుకున్నావటగా, మంచి పనేచేశావ్‌. తొలిజీతం అలాగే చెయ్యాలి. నేనూ చిన్నప్పుడు యిదే చేశాను. అదిసరేకాని అక్కడ ఎక్కువ రోజులు వుండిపోక. కొత్త ఉద్యోగంకదా బావుండదు” అన్నారు ఆయన. ఆఫీసుకు వెళ్ళిపోతూ “ఎక్కువ రోజులు వుండిపోకుండా త్వరగా -వచ్చెయ్‌. వీలయితే మీ అమ్మనుకూడా తీసుకురా” అని

  • మరోసారి హెచ్చరించారు.

సామాను సర్దుకుంటుండగా నాగావళి వచ్చింది

“వ్హూరు వెళ్తున్నారా... నిన్న మాటమాత్రంగానైనా చెప్పలేదేం?” అంది. కదూ,”

“అంతేనా? అంతకన్న ప్రత్యేకంగా చెప్పాలనుకోలేదా మీరు."

“ఎందుకనుకోలేదూ. తస్పకుండా నీకు చెప్పే వెళ్తాను. అలా చెప్పాల్సిన అవసరంకూడా వుంది”.

నాగొవళి అనుమానంగా చూసింది. ఆతను చూపులు మార్చుకున్నాడు.

“భోజనం వడ్డించేస్తావా, బండికి బైమయినట్టుంది.”

నీఢవట్టు మనిషి 31

“అలాగే...రండి” అంటూ వెళ్ళిపోయిందామె.

భోజనం చేసి, కాస్సేపు కూర్చుని యింట్లో అందరికీ చెప్పి బయలుదేరాడు. బయలుదేరేముందు నాగావళికి మళ్ళీ మరొకసారి చెప్పి “మీ 'స్నేహితురాలికికూడా చెప్పు. అన్నట్బ ఆమె పుస్తకాలు యిచ్చేసెయ్‌. ఇచ్చేముందు అందులో ఏమైనా రూపాయలు వున్నాయేమో ఓసారి చూడు, పుస్తకాల మధ్య నోట్లు పెట్టే పాడుఅలవాటు నాకుంది. వస్తామరి , మర్చి...”

రిక్షా అలా కదలడంతోనే నాగావళి గబగబా అతని గదిలోకి వెళ్లింది. కంగారుగా పుస్తకాలన్నీ తిరగేస్తోంది. రూపాయలు వుండవని ఆమెకు తెలుసు. ఏదో విశేషం వుండాలి. లేకపోతే ప్రత్యేకించి యీ విషయం చెప్పడం ఎందుకు? వేళ్ళు ఆత్రుతగా పేజీల్ని తిప్పుతున్నాయి. గుండెకూడా గబగబా కొట్టుకుని కదిలే వేళ్ళకు తాళం వేస్తోంది. అకస్మాత్తుగా ఆమె చూపులు నిలిచిపోయాయి. ఓ పుస్తకంలో మడతపెట్టిన కాగితం! 'పైన నాగావళి పేరు!

కొద్ది సెకనులు గుండె కొట్టుకోవడం మానేసి మళ్ళీ ప్రారంభించింది.

ఆతృతగా కాగితం మడతలు విప్పింది.

“నాగావళీ-

బానినత్వం ఎరగనివాడ్ని చిన్నప్పటినుంచీ స్వేచ్ళగా పెరిగినవాడ్ని. ఎప్పుడూ ఎవరి అదుపాజ్ఞల్లోనూ వుండలేదు. ఎవరినీడలోనూ పెరగలేదు. చాలా స్వతంత్రంగా జీవించాను. ఎదుటివారి ఆధిక్యతని వొప్పుకుంటానుగాని తలవంచలేను. ఇంట్లోకాని;" స్కూల్లోకాని ఎప్పుడయినా ఎవరయినా అధికారాన్ని చెలాయించడానికి వ్రయత్సిస్తే పడేవాడీనికాదు. పరిధులు గీసి, ఆ పరిధుల మధ్య నన్ను నిలబెట్టటానికి ప్రయత్సించేవాళ్ళంటే నాకు తగని చిరాకు. అధికారంతోగాని, అభిమానంతోగాని ఎవరయినా నన్ను కట్టిపడేయాలని చూన్తున్నట్క అర్థమైతే మళ్ళీ వారిదగ్గరకు వెళ్ళేవాడినికాదు. అలా నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ వచ్చాను. దీనిపై యితరుల ప్రభావం పడడం నాకిష్టంలేదు. నాదైన వ్యక్తిత్వం నాకు వుండాలని నా ఆరాటం.

నాగొవళీ! నేను అందగాడ్నీ కాకపోయినా అందమైన అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోవాలని స్వార్ధపరుడిగా కలలుగన్నాను. నిన్ను చూసిన తర్వాత ఎన్నో ఊహల్సి అల్లుకున్నాను. అదృష్టవంతుడ్నని మురిసిపోయాను. జీవితాన్ని అడుగడుగునా రసమయం చేసుకోవచ్చని ముచ్చటపడ్డాను. కొని నువ్వు అభిమానంతో కట్టిపడేయాలని చూశావు. (ప్రేమతో శాసించడానికి ప్రయత్సించావు. నా వ్యక్తిత్వాన్ని

తి వాళ్ళమధ్య వంతెన కూడా గౌరవించాలనే విషయాన్ని విస్మరించావు. నేనది సహించలేకపోయాను.

ఇప్పటికీ నీ అందాన్ని మెచ్చుకుంటాను. నీ అభిమానానికి కృతజ్ఞత చెప్పుకుంటాను. ఎన్నోసార్లు ఎన్నోరకాలుగా బాధపెట్టాను నిన్ను. నువ్వు నా జీవితాన్ని శాసించడానికి ప్రయత్సిస్తున్నావని తెలిసి, కావాలని నీకు బాధ కలిగేటట్టు ప్రవర్తించాను. నన్ను క్షమించు.

(ప్రేమతోనైనా శాసించబడడం ఇష్టంలేదు నాకు.

అందుకనే నీ నీడ నుంచి తప్పుకుని వెళ్ళిపోతున్నాను. నీకు బాధ కలిగించినందుకు మరోసారి క్షమాపణ చెప్పుకుంటున్నాను.

-సదానంది నాగావళికి దుఃఖం ఆగిందికాదు. పెదాల్ని బిగబట్టి ఎంతగా ఆపుకోవాలని చూసినా సాధ్యంకాలేదు. చెక్కిళ్ళు తడిసిపోయాయి. అరగంటవరకూ ఆ గదిలోంచి బైటికి రాలేకపోయింది. ఆ రోజల్లా తలనొప్పిగా వుందని మంచంలోంచి లేవలేదు. కూతురి వాలకాన్ని చూసి ఏదో జరిగుంటుందని తల్లీ, తండ్రీ పసిగట్టి అడిగారుగాని ఆమె ఏమీ చెప్పలేదు. “ఏమీ లేదు...ఏమీలేదు” అనేసింది. చివరికి రాఘవరావుగారే అతి లౌక్యంగా సదానంద తల్లిపేరున వుత్తరం రాశారు. “ఇప్పుడు అబ్బాయి చేస్తున్న ఉద్యోగం చాలా మంచిది. ఎం.ఏ. చదువులు చదువుకున్నవాళ్ళుకూడా దానికి ఎగబడుతుంటారు. ఆ ఉద్యోగం మన అదృష్టంకొద్దీ దొరికింది. అబ్బాయి చేరి నెలరోజులన్నా కాలేదు, ఇంటిమీద ధ్యాస పుట్టిందంటే సరే వెళ్ళిరమ్మన్నాను. ఎక్కువ రోజులు అక్కడ వుంచక సాధ్యమైనంత త్వరలో అబ్బాయిని పంపించేస్తే మంచిది, అబ్బాయితోపాటు మీరూ రండి; వారం రోజులుండి వెళ్ళుదురుగాని. మనవాళ్ళు చాలామంది వున్నారిక్కడ. వీళ్ళందర్నీ చూసినట్టూ అవుతుంది-అని,

ఆ ఉత్తరం సదానందే అందుకున్నాడు. చదువుకుని నవ్వుకున్నాడు. దానితోషాట్స కవరు కూడా ఒకటి వచ్చింది. పైన హేండ్‌ రైటింగ్‌ కొత్తగొవుంది. చించి ఉత్తరం బైటికి తీశాడు. చిన్నదే. అడుగున నాగావళి సంతకం వుంది, చదువుకున్నాడు,

“శ్రీ సదానందగారికి నాగావళి హృదయపూర్వకంగా నమస్కరించి వ్రాయునది-

మీరు వొదిలిపెట్టి వెళ్ళిన ఉత్తరం చూశాను. నేను దురదృష్టవంతురాలినని తెలుసుకున్నాను. బాధ పడ్డాను. నిజానికి యీ ఉత్తరం రాయాలనుకోలేదు. కాని మీ ఉత్తరంలోని ఒక విషయానికి సమాధానంగా యిది రాయక తప్పలేదు.

చీడవట్టు మనిషి 33

మీరు మీది అనుకుంటున్న వ్యక్తిత్వం మీదికాదు. అసలు మీకు ఒక వ్యక్తిత్వం అంటూ స్థిరంగా ఏదీలేదు. మరీ మంచివాళ్ళకూ, అమాయకులకూ ఒక స్థిరమైన వ్యక్తిత్వం అంటూ వుండదు. ఎప్పటికప్పుడు అది మారిపోతూ వుంటుంది. ఎదుటివారిని బాధపెట్టడం యిష్టంలేక తమ అభిరుచుల్ని మార్చుకుంటూ పోతుంటారు. దాన్నిబట్టే వ్యక్తిత్వాలుకూడా మారుతూ వుంటాయి అలా మారడం తప్పేమీ కాదు. మీ వ్యక్తిత్వంమీద యితరుల ప్రభావం పడుతున్నదని బాధపడిపోవలసిన పనేమీ లేదు.

మొట్టమొదట మీ నీడలోనే నేను వుందానునుకున్నాను. కాని మీ మీదనే గొడుగు పట్టాల్సిన అవసరం వుందని తెలుసుకున్నాను అంతటా సౌందర్యాన్నీ మంచితనాన్నీ చూసే మీకు ఊహల్లో విహరించడంతప్ప భూమ్మీద నడవడం చేతకాదు. అందువల్ల ఎప్పుడూ నీడలా అంటిపెట్టకునే మనిషి అవసరం మీకు.

మిమ్మల్ని శాసించాలన్న అధికార మనస్తత్వంకానీ, కట్టి పడేయాలన్న స్వార్ధంకానీ నాకు లేవు.

మీ చుట్టూ ఎన్నో ఆశల్ని అల్లుకున్నాను. కానీ మీరు దూరంగా పారిపోయారు. ఏం చేస్తాను- నా అదృష్టం అంతంతమాత్రంగానే వుంది. కాని మీకు నా సలహా ఒకటి వుంది. ఎప్పుడైనా మీరు పెళ్ళిచేసుకోదలిస్తే మిమ్మల్ని శాసించగలిగే ఆమెనే పెళ్ళిచేసుకోండి. మీ అంతట మీరు ఏపనీ చెయ్యలేరు. ఎవరో లాలించి, అవసరమైతే కసిరి కోప్పడి మీచేత ఆ పనిచేయించాలి. అందువల్ల మీకు మేలేకాని నష్టం కలుగదు- ఉంటాను మరి.

-నాగావళి

ఆ ఉత్తరం మళ్ళీ చదువుకున్నాడు. ఇంకొకసారికూడా చదువుకున్నాడు. సాయంకాలం కోనేరు గట్టుమీద కెళ్ళి చీకటి పడేవరకూ ఉ ఉత్తరాన్ని ముందుంచుకునే కూర్చున్నాడు. చివరకు ఆలోచనలన్నిటినీ అదే ఉత్తరంలో మడతపెట్టి, జేబులో పెట్టేసుకుని ఇంటికొచ్చి, బేంకువాళ్ళకు ఉత్తరం రాశాడు-అర్జంటు పనివల్ల స్వగ్రామం రావలసివచ్చిందనీ, సెలవు దరఖాస్తు పెట్టడానికికూడా వ్యవధి లేకపోయిందనీ, అందువల్ల పోస్టులో పంపిస్తున్నాననీ, అయిదు రోజులు సెలవు యిప్పించవలసిందనీ వ్రాసి, ఆ రాత్రికి రాత్రే పోస్టు చేశాడు సదానంద.

0

దీపొనికి చమురు

కౌముశ్వర్రావు దగ్గర్నుంచే వచ్చింది ఉత్తరం. మరీ పొడిపొడిగా వుంది. “మందాకిని కనిపించింది' అని ప్రారంభిస్తే ఆ ఉత్తరం నిండా మందాకినినే చూడొచ్చనుకున్నాను, “అబ్బ! మందాకిని వుండగా ఇంత చిన్న ఉత్తరం ఎలా రాయగలిగాఢు' అనిపించింది. కామేశ్వ!ర్రావు మీద కాస్త కోపమూ, 'చిరాకూ కలిగాయి. మొదటినుంచీ యింతే. ఎప్పుడూ మందాకినిని తీసిపారీయడమే ఆమె ఆంటే ఏ ప్రత్యేకతా తనకు లేదని ప్రకటించుకోడానికే ప్రయత్నించేవాడు. తన వ్యక్తిత్వాన్నీ దాని అధిక్యతనీ తెలుపుకోడానికి చేసే ప్రయత్నమే ఇదంతా

మరోసారి ఉత్తరం చదువుకున్నాను. ఓ కొత్త మాట కనిపించింది మందాకినిన్సి అక్షరాల్లో చూద్దామన్న కంగారులో యింతకుముందు దాటేసివుండాలి. “నిన్ను గురించి అడిగింది” అనివుంది. అడిగిందా...అడగదూ... చిన్నప్పుడు కలిసి ఆడుకునీ, చదువుకునీ, ఏడిపించుకునీ గడిపిన రోజుల్ని అప్పుడే ఎలా మర్చిపోతుంది! దూరంగా వెళ్ళిపోడేమాత్రం బాల్యాన్ని మర్చిపోతుందీ! ఎలా మర్చిపోగలదు? మర్చిపోలేదు... ఆ రోజులు-అయ్యో! అవిక రావు. వాటికి రెక్కలొచ్చేశాయి. ఇంకెక్కడి బాల్యం, ఎప్పుడో ఎగిరిపోయింది!

“సింహాచలం కొండమీద సంపంగిపూలు ఏరుకుంటూ కనిపించింది ఓ మిత్రుడి పెళ్ళికని వెళ్ళాను. పెళ్ళయ్యాక అలా కొండమీద తిరుగుదామని వెళ్తోంటే

దీపానికి చమురు ౩35 పాతికమంది అమ్మాయిలతో నంపంగిపూలు ఏరుకుంటూ కనిపించింది. తనే పలకరించింది. ఎక్స్‌కర్షన్‌కని స్కూలు సిల్లల్ని తీసుకొచ్చిందట, నిన్నుగురించి అడిగింది. చెప్పడం మర్చిపోయాను- ఆమె యిప్పుడు శ్రీకాకుళంలో అన్‌ట్రయిన్ట్‌ టీచరుగా పనిచేస్తోంది. ఒకసారి మనిద్దర్నీ రమ్మంది. ఎప్పుడొస్తావుమరి, వారం పదిరోజుల్లో రా, వెళ్దాం...

కామేళ్వర్రావు రాసిన ఉత్తరంలో ఆమెను గురించి అంతే వుంది.

ఇదేమిటి! ఆమె ఉద్యోగం ఎందుకు చేస్తోంది? వాళ్ళాయనకు ఖర్గపూర్‌లో ఉద్యోగంకదా, ఎప్పుడు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది? అయితే దగ్గరగా వచ్చేసిందన్నమాట!

మందాకిని ఇంత దూరమైపోతుందని అప్పట్లో అనుకోలేదు. రెండేళ్ళుగా బొత్తిగా ఆమె సమాచారమే తెలీలేదు. అప్పట్లో మా ముగ్గురిదీ ఒకటే అలోచన. ఆ ఆలోచనకు బహుళా పరోక్షంగా మందాొకినే కారకురాలు కావచ్చు “ఏమో, ఈ సెళ్ళీ...ఈ బాదరబందీ నాకు ఇష్టంలేదు. ఎప్పుడూ యిలానే వుండిపోదా మనుకుంటున్నాను” అనేది. ఆ ప్రభావం మా యిద్దరిమీదా పడిందేమో మరి, అలాంటి అభిప్రాయాలే మాలోనూ కలిగాయి. అనేకసార్లు కామేశ్వగర్రావూ, నేనూ అనుకున్నాం-పెళ్ళిచేనుకోకుండా బ్రహ్మచారులుగా వుండిపోదామని. చాలా విషయాలలో మా ముగ్గురి ఆలోచనలూ ఒకటే. అభిరుచులూ, ఆశయాలలో చాలా దగ్గరి పోలికలు వుండేవి. కొద్దిపాటి తేడా ఎక్కడైనా కనిపిస్తే దానిని సవరించుకోవడానికి అభ్యంతరం వుండేదికాదు.

కామేశ్వర్రావూ, మందాకినీ ఒకే ఇంటిలో రెండు పోర్షన్లలో వుండేవారు. డౌబా యిల్లు, నేను పదిళ్ళవతల వుండేవాడిని. రేడియో వినడానికో, కథల పుస్తకాలు చదువుకోడానికో, కబుర్లు చెప్పుకోడానికో రోజూ సాయంకాలాలు కామేశ్వర్రావు యింటికి వెళ్ళేవాడిని, మందాకినికూడా వచ్చేది. రేడియో వినేవాళ్ళం. కేరమ్సు ఆడుకునేవాళ్ళం. వాళ్ళ దొడ్డో ఉసిరికాయలు కోసుకుని ఉప్పూ, కారం నంచుకుని తినేవాళ్ళం, బాదంకాయలు కొట్టుకునే వాళ్ళం. కామేశ్వర్రావు చెట్టెక్కలేడు. మందాకిని సరేసరి. నేనే యెక్కి కోసేవాడిని,

ఒక కలలాగ చూస్తూవుండగానే బాల్యం కదిలి వెళ్ళిపోయింది. పెద్దాళ్ళ చూపుల్లోని సూది మొనలు గుచ్చుకోడం ప్రారంభించిన తొలిసారే అర్ధమయ్యింది- బాల్యం రెక్కలొచ్చి ఎగిరిపోయిందని. ఎగిరిపోయిన యీ కోయిల మళ్ళీ యీ జీవితకాలంలో గూటికొచ్చి వాలదని, ఎక్కడో ఓ చెట్టు కనిపిస్తుంది, రంగురంగుల

86 వాళ్ళమధ్యూ వంతెన పూలు చూపిస్తుంది. కొమ్మలు గాలికి కదిలి రమ్మంటాయి. అక్కడ వాలుతుంది. కొత్త గూడు కట్టుకుంటుంది అందులోనే వుండిపోతుంది. ఎప్పుడో అక్కడే కన్ను మూస్తుంది. కామేశ్వర్రావు డ్రాయింగు నేర్చుకుంటున్నాడు. మందాకిని సంగీతం నేర్చుకుంటోంది.

నాకు పుస్తకాలున్నాయి.

“ఇదిగో యీ పాయింట్‌ దగ్గరే మనం విడిపోతున్నాం” అన్నాను ఒకసారి.

“లేదు, మూడూ వొక్కలాంటివే”-అంది. ఆ వయసులో అంతకన్నా ఎక్కువ సమర్ధించలేకపోయింది.' ఇప్పుడైతే “ఇవి మూడూ మూడు దారులేకాని వీటి గమ్యం మాత్రం ఒక్కటే. మనోల్లాసమూ, మానసిక వికాసమూ, వీటన్నిటినీ మించి ఒక విధమైన అర్థత, లాలిత్యం, సంస్కారం-ఇవి కలిగించడమే ప్రధాన లక్ష్యం. దానికి ఇవన్నీ దారులు” అంటూ అదే భావాన్ని ఇంకా విపులంగా చెప్పుండేది.

నిజానికి ఆ రోజుల్లోనే మందాకిని అనేక విషయాలమీద వ్యాఖ్యానాలు చేసేది. తప్పయినా ఒప్పుకుని తీర్చాల్సిందే. కాదంటే వినేదికాదు. మరీ మొండిదానిలా అనిపించేది మాకు, ఎందుకులే అని వూరుకునేవాడిని. కామేశ్వర్రావు వూరుకునేవాడు కాడు. వాదించేవాడు. చివరకు విసుగొచ్చి, కోపం వొచ్చి వూరుకునేవాడు. నిజానికి, తన ఓటమిని ఒప్పుకోవడానికి స్త్రీ సిగ్గుపడదు. పురుషుడు పూర్తిగా యిందుకు విరుద్ధం. కాని యిక్కడ యిది తారుమారు అయ్యింది!

ఆ మొండితనంలోంచే మందాకిని ఒక విధమైన వ్యక్తిత్వాన్ని రూపొందించు కుంది. ఎవరినీ లక్ష్యపెట్టని స్వభావం అలవడిందామెకు. తనను చూసి ఏడ్చేవాళ్ళను మరీ ఏడిపించాలనీ, తనను లక్ష్య పెట్టని వాళ్ళను తనూ లక్ష్యపెట్టగూడదనీ, బయటిక్టి విలక్షణంగా కనిపించి హృదయాన్ని మంచితనంతో నింపుకోవాలనీ, యితరుల వూహక్త తను అందగూడదనీ .యిలాంటి ఆలోచనలు ఆమెవి.

ఆ ఆలోచనలే ఆమెకు శత్రువులవుతాయేమోనని నా భయం,

అలా అని ఆమెతో అంటే చిరునవ్వు నవ్వేసింది. ఆ నవ్వువెనక నిర్లక్ష్యంలేదు. అభిమానాన్ని గుర్తించినప్పటి కృతజ్ఞత వుంది. స్త్రీ చిరునవ్వు వెనక సంతృప్తి వుంటుంది. పురుషుడి చిరునవ్వు వెనక గర్వం వుంటుంది, ఆడంబరం వుంటుంది. నిర్లక్ష్యపు చిరునవ్వుతోపాటు చూపులుకూడా నిర్ణక్ష్యంగా మనిషిని దాటుకుని దూరంగా జారిపోతాయి అభిమానపు చిరునవ్వుతోపాటు చూపులు ఆ మనిషిమీదే వాలతాయి

దీపానికి చమురు అందుకే ఆమె నిర్లక్ష్యంతో నన్ను తీసిపారేయలేదన్న సంతృప్తి నాకు,

అలాంటి సంతృప్తి ఎప్పుడోగాని మిగిల్బేదికాదు. కామేశ్వర్రావుకయితే ఆ సంతృప్తి అసలే లేదు

ఒకసారి కామేశ్వర్రావు అన్నాడు, “నాకు పెళ్ళిచేసుకోవాలనిలేదు. ఇలానే వుండిపోవాలనుకుంటున్నాను. ఏ వూరి చివరనో కాలవ పక్కన చిన్న పాకేసుకుని బొమ్మలు గీసుకుంటూ, మనసు పుట్టినప్పుడు వూళ్ళు తిరుగుతూ నిశ్చింతగా జీవితాన్ని గడిపేయాలని వుంది” అన్నాడు.

“అదిగో! నన్ను కాపీ కొట్టేస్తున్నావ్‌. ఆ ఐడియా నాది. దాన్ని నువ్వు స్వంతం చేసేసుకుంటున్నావ్‌ ఒప్పేసుకో” అంది.

నిజానికి ఆమె ఆ అభిప్రాయాన్ని అనేకమార్డు వ్యక్తపరచేవుంది.

“డాల్లగా వున్నప్పుడే వేణువులో రాగం పలుకుతుంది. గుల్లగా ఉంటేనే మద్దెల మోగుతుంది; వీణా వాయులీనాలలో రాగం ప్రవాహమై పారుతుంది. అలానే ఏ కోరికలూ లేకుండా హృదయం శూన్యమైవున్నప్పుడే జీవితంలో ప్రశాంత సంగీతం ప్రతిధ్వనిస్తుంది. అందుకే అతిసామాన్యంగా ఈ జీవితం గడిచిపోతే చాలు. ఏ బరువూ బాధ్యతలూ, ఏకోరికలూ నాకు అక్కరలేదు... ఏమో యీ పెళ్ళీ యీ బాదరబందీ నాకు యిష్టంలేదు. ఎప్పుడూ యిలానే వుండిపోదామనుకుంటున్నాను” అని చాలాసార్లు అంది.

ఆమె అన్నట్టు ఆమెకు కాపీ అయితే కావచ్చు. అంత నన్నిహితంగా వుంటున్నప్పుడు ఒకరి ప్రభావం మరొకరిమీద పడకపోధు. ప్రాణంలేని పరిసరాలే మనిషిని ప్రభావితం చేస్తున్నప్పుడు తోటి మనిషి ఎందుకు చేయలేడూ? ఆ మాటకొస్తే మందాకిని ఏర్పరచుకున్న సగం అభిప్రాయాలకు రూపకల్పన చేసినవాడు కామేశ్వర్రావే. అ విషయం ఆమె వొష్టాకోదు. నాలాగ మీకూ అన్ని విషయాలూ తెలుసుంటే మీరుకూడా “అవును సుమా! కామేశ్వర్రావే” అంటారు.

మందాకినిని చూసి చాలాకాలమైంది మరీ దూరంలో లేదిప్పుడు. దగ్గరకే వచ్చేసింది. ఇంత దగ్గర్లోకి వచ్చేసిందని తెలిస్తే యీపాటికే ఎప్పుడో వెళ్ళి చూసాచ్చేవాడిని. ఇప్పుడు సెలవలు లేవు, వున్న సెలవలన్నిటినీ ఎప్పుడో వాడేసాను. సంవత్సరం ఆఖరు చొచ్చేసింది. మళ్ళీ జనవరి రావాలి. రెండు నెలలు ఆగమని కామేశ్వర్రావుకు ఉత్తరం రాశాను. “మరీ అంత ముక్తసరిగా ఉత్తరం రాశావేం, మందాకినిని గురించి యింకా

చితి వాళ్ళమధ్య వంతెన ఏమన్నా చెప్పు, వింటాను” అని రాశాను

ఇప్పుడు యీ ఉత్తరం రాసిన పెన్ను మందాకిని (పెజెంట్‌ చేసినదే. ఏదో సందర్భంలో “రాతగాళ్ళకు మంచి పెన్ను ఉండాలి. ముందు ముందు యీ పెన్నుతో కధలవీ రాయడం అలవడుతుంది. నన్ను గురించికూడా రాయొచ్చు. అభ్యంతరం లేదు” అని ప్రజెంట్‌ చేసింది.

రాసిన మొట్టమొదటి కధ ఆమెను గురించి కాదు. బహుశా చిట్టచివరి కథ అవుతుందేమో.

కామేశ్వర్రావు తన జ్ఞాపకంగా నా పోట్రేట్‌ ఒకటి గీసిచ్చాడు. బాగా వచ్చిందది.” కామేశ్వర్రావు పోటబ్రేట్‌ డ్రాయింగులో మంచి కృషి చేశాడు. అందుకు మందాకినే కారణం. పిలిచినప్పుడల్లా అతని ముందుకు వచ్చి కూర్చునేది. అతను ఆమె చిత్రం గీసేవాడు. అలా ఎన్ని బొమ్మలేశాడో లెక్కలేదు. ఇప్పుడు ఒక్క చిత్రంకూడా మిగలలేదు. వేసిన చిత్రాన్నల్హా పట్టకుపోయేది వాళ్ళింట్లో చూపిస్తానని. వాళ్ళింట్లో చిన్నపిల్లలున్నారు. వాళ్ళు ఆ బొమ్మను చించేయడమో, దానిమీద సెన్సిలుతో పిచ్చిగీతలు గీసెయ్యడమో చేసేవారట. తిరిగొచ్చి కంప్లెయింట్‌ చేసేది. కామేశ్వర్రావుకు ఎలా వుండేదోగాని నాకుమాత్రం చాలా కోపం వచ్చేది. అంత శ్రమాపడి బొమ్మ వేయడం చించేయడానికా. మరీ అంత నిర్లక్ష్యమా. నేను కోప్పడేవాడినికూడాను. “పోనీలేవోయ్‌. మళ్ళీ వేస్తానంటే తనే వచ్చి కూర్చుంటుందిగా” అనేవాడు.

మందాకిని గొప్ప అందగత్తెకాదు. సన్నగా వుంటుందేమో అర్జిస్టకు నచ్చుతుంది. ప్రత్యేకంగా చెప్పుకునే ఆకర్షణ ఏమీలేదు. వదిమందిలోనూ ఒకర్తి అందంగా వుందనుకుంటే వుంటుంది; లేదనుకుంటే లేదు.

ఒకసారి మందాకినీ స్కెచ్‌ నేను తీసేసుకున్నాను. |

“నీకెందుకూ?” అంది.

“కావాలి. నా దగ్గరన్నా జాగ్రత్తగా వుంటుందిలే” అన్నాను.

“నీకు స్టూడియోలో తీయించుకున్న ఫొటో యిస్తాను. ఈ డ్రాయింగు నా కిచ్చేయ్‌. దీనితో పనుంది. ఫ్రేము కట్టించుకోవాలి” అంది. ఇచ్చేశాను. నాకు కెమేరాత్రో తీసిన ఫొటో తెచ్చిచ్చింది, ఆ తర్వాత విన్నాను-ఆ చిత్రంకూడా పిల్లల చేతుల్లోపడి చిరిగిపోయిందట.

ఏమిటో నాకర్థంకాలేదు. కామేశ్వర్రావు చిత్రలేఖనంమీద చిన్నచూపా? అతన్ని

దీపానికి చమురు 89 ఏడిపించడమా? లేక పదేపదే కామేశ్వగర్రావుచేత తన చిత్రాలు గీయించుకునే ప్రయత్నమా? తన అందాన్ని గుర్తింపజేయడానికి అమె పడే పాట్లా?... ఏమిటో ఏమీ తెలియకుండా వుంది

“చూసేవా, కామేశ్వర్రావు ఎన్నిసార్లు నా చిత్రం వేశాడో, మరి నువ్వు ఒక్కసారన్నా నా గురించి కథ రాశావా?” అంది ఒకసారి.

అర్థమయ్యింది. తనను కామేశ్వగర్రావు గుర్తించాడు, నేను గుర్తించలేదని, ఆ విషయాన్ని నమ్మించడానికి ఇంతనిర్జాక్షిణ్యంగా, ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఎందుకు?

“కామేశ్వర్రావు బొమ్మలకు పట్టినగతే నాకథకూ పడుతుందేమోనని భయం” అన్నాను నవ్వుతూ. అమె ముఖం మాడ్చుకుంటుందేమోనని మళ్ళీ వెంటనే “అది కొదనుకో. నీ గురించి కథరాస్తే నువ్వు దూరమైపోతావు. కథ కదా; కల్పనలు చేయాలి. కొసమెరుపుల గురించి లేనిది వున్నట్టు చెప్పాలి. అదంతా జీవితానికి అన్వయించుకుంటే ప్రమాదం మరి. నువ్వు చదవవని తెలిసినప్పుడో, నువ్వు బాగా దూరమైపోయినప్పుడో రాస్తాను” అన్నాను.

“అదేమిటి! అలాంటి ఆలోచన వచ్చిందేం నీకు?” అంది.

“అవును, ఎంతకాలమని మనం యిలా ఉండగలుగుతాం. ఎప్పుడో ఒకప్పుడు దూరమైపోక తప్పదు” -

“నాకు తేలును నీ అభిప్రాయం ఏమిటో, పెళ్ళిచేనుకుని నేను దూరమై పోతాననేగా. నేనసలు పెళ్ళే చేసుకోను” అంది.

నిజమే. అప్పటి ఆలోచనలన్నీ వేరు. ఇలాగే స్నేహితులుగా ఉండిపోవాలి. జీవనభృతి వెతుక్కోవాలిగదా- ఉద్యోగాలు చేసుకోవాలి, ఊరూరూ తిరిగే ఉద్యోగాలు వద్దు. ఎక్కడో స్థిరంగా ఉండే ఉద్యోగాలే చేయాలి. ఒకవేళ వూళ్ళల్లోపడి వెళ్ళిపోతే ఎప్పుడో రిబైరయ్యాక మళ్ళీ ఒక్కచోటికే చేరుకోవాలి. నాగావళి వడ్డున ఎకరం నేల కొనుక్కుని మూడు పాకలు వేసుకోవాలి. అందులో గులాబీతోట వేసుకుంటే చాలు తిండికి సంపాదించుకోవచ్చు. ఆవిడేమో వంట చేసిపెడుతుంది. రోజూ తోటపని. నాగావళిలో నీళ్ళచప్పుడూ పూలతోటలో పక్తుల పొటలూ వింటూ గడిపేయాలి. ఏమీ తోచకపోతే ఆమె పాటలు పాడుతుంది. తనేమో వున్తకాలు చదువుకుంటాడు. అప్పుడప్పుడు కథలు రాసుకుంటాడు. కామేశ్వర్రావు బొమ్మలు గీసుకుంటాడు.

శతం వాళ్ళమధ్య వంతెన మరికొంత కాలం గడుస్తుంది. ముగ్గుర్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు. మిగిలిన ఇద్దరూ ఆ తోట చివర పూలచెట్టమధ్య సమాధి చేస్తారు. రోజూ ఆ సమాధిమీద పూలు చల్లుతారు వెళ్ళిపోయిన వ్యక్తి ఆలోచనలతోనే రోజంతా గడిచిపోతుంది వారికి. రాత్రిళ్ళు రోజూ తోటలో ఏవో పాదాల శబ్దం వినిపిస్తూ వుంటుంది. ఇద్దరూ తలుపులు తీసుకుని తోటలోకి వస్తారు. అక్కడ ఎవరూ వుండరు. కాలవనీళ్ళ చప్పుడుమాత్రం వినిపిస్తుంది. తిరిగి ఇద్దరూ వాళ్ళ పాకల్లోకి వెళ్ళిపోతారు. నిద్రరాదు. ఏదో కొద్ది కొద్దిగా నిద్ర, మళ్ళీ ఉదయం. మరికొంత కాలం గడుస్తుంది. మరొకరు కూడా కన్నుమూస్తారు. మిగిలినవారు ఒక్కరే. ఏ పని చెయ్యడానికీ ఉత్సాహం ఉండదు. శక్తి ఉండదు. రాత్రిళ్ళు నిద్రరాదు. ప్రతిక్షణం తోటలోంచి పిలుస్తున్నట్టు ఉలిక్కిపడడమే. తోటెండిపోతుంటుంది. పక్షులు రావిక. భరించలేని నిశ్శబ్దం మిగిలిపోతుంది. జ్ఞాపకాలుకూడా మనసుకు అందవు. బతకడంకూడా బాధగానే ఉంటుంది. జాలిపడినట్టుగా ఎప్పుడో ఓ పిలుపు వస్తుంది. ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి తోటలోకి వెళ్ళబోతారు. ఏ రాయో తగులుతుంది. ఏ ఎండిపోయిన గులాబీ మొక్క మీదో వాలిపోతారు. అంతే, అక్కడ నిశ్శబ్దాన్ని ఏ వూపిరీ మరిక చెదర్చలేదు.

-ఇలా ఎన్నో ఆలోచనలు. కలల్లాంటి ఆలోచనలు,

కలల మత్తులోనే అ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే ॥ మిగిలిపోయాయి. మరికొంతకాలంపోతే అ జ్ఞాపకాలుకూడా మిగలవేమో.

కామేశ్వర్రావుకు ఉత్తరం రాసిన నాలుగు రోజులకు అతని దగ్గర్నుంచి నమాధానం వచ్చింది.

“...ఏముంది! మందాకినిని మొట్టమొదట నేను చూడలేదు. తనే చూసి పలకరించింది. గంటకన్న ఎక్కువ కలిసి వుండలేదు. ఆ పిల్లలూ, టీచర్లూ-వీళ్ళమధ్య ఒంటరివాడయిపోయాను. “ఇంకా చెయ్యి. కాల్చుకుంటున్నావా? అంది నన్ను. అవునన్నాను. నిన్ను గురించికూడా అదే ప్రశ్చ అడిగింది. చెప్పాను. చాలాసేపు వూరుకుని ఓ నిట్టూుర్చుమాత్రం తీసింది, ఎందుకో అర్థంచేసుకోగలవుగా. నేనే అడిగాను-ఇంత దగ్గరకు వచ్చికూడా కనీనం ఓ ఉత్తరంముక్కన్నా రాయలేదేం అని. మమ్మల్ని మర్చిపోయావ్‌ అనంటే చాలా నొచ్చుకుంది. ఎంత నొచ్చుకుందంటే, ఆమె కళ్ళు చెమ్మగిల్లాయనికూడా గుర్తించగలిగాను, మనిద్దర్నీ ఒకసారి రమ్మంది. అడ్రసు ఇచ్చింది. ఆరునెలలైందట ఉద్యోగంలోచేరి మీ ఆయనకు ట్రాన్స్‌ర్‌ అయ్యిందా అని అడిగాను.

దీపానికి చమురు 4 అవలేదుగానీ అవ్వొచ్చు అంది. నిన్ను అచ్చులో చూస్తున్నట్టు చెప్పింది. తనమీద నువ్వు కథ రాశావేమో అడిగింది. నాకెందుకో ఆమె చాలా కొత్తగా కనిపిస్తోంది. వెనకటి ఉత్సాహంలేదు. మాటలుకూడా తూచితూచి మాట్లాడుతోంది. పెళ్ళితో చిలిపితనమూ, మొండితనమూ ఒదిలి వెళ్ళిపోయాయిలే! కాని, ఒకవిధమైన నిర్లిప్తత ఏర్పడింది. ఏమిటోమరి, ఒకసారి వెళ్ళాద్దాం. రెండు నెలలు పొడిగించావేమిటి? ఈ మధ్యలోనే రావడానికి ప్రయత్నించు...”

ఇంకా అసంతృప్తిగానే వుండిపోయింది. తన కొత్త జీవితాన్ని గూర్చి ఆమె ఏమీ చెప్పలేదా? మా ఒంటరిజీవితంమీద ఆమె ఏమీ వాఖ్యానాలు చెయ్యలేదా? ఎందుకింత మౌనంగా వుండిపోయింది?

బహంశా కొత్తజీవితంలో నిలుచుని మాట్లాడాలంటే సిగ్గుగా వుందిగాబోలు.

పెళ్ళి చేసుకోనని పదేపదే చెప్పి అకస్మాత్తుగా పెళ్ళీ చేసేసుకుంది మందాకిని అప్పటికి ముగ్గురమూ ఒకేచోటకూడా లేము. మొట్టమొదట వూరు విడిచిపెట్టినవాడు కామేశ్వర్రావు. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్‌ఫర్‌ అయితే వెళ్ళిపోయాడు. అ తర్వాత రెండేళ్ళ! ఉద్యోగరీత్యా నేను దూరంగా వచ్చెయ్యాల్సి వచ్చింది. కొంతకాలానికి మందాకినీ వాళ్ళుకూడా వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన యేడాదికి పెళ్ళయి భర్తతోపాటు మరీదూరంగా వెళ్ళిపోయింది.

ఇలా చెదిరిపోవడంవల్లనే ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకుని వుండాలి. పెళ్ళికి ముందు పెళ్ళి విషయాన్ని తెలియజేన్లూ, అందుకు నంజాయిషీ యిచ్చుకుంటున్నట్ట పెద్ద ఉత్తరం రాసింది.

“రోజులు గడిచేకొద్దీ జీవితంలో వెలితి కనిపించడం మొదలుపెట్టింది. కొంతకాలంపాటు ఆ వెలితి ఏమిటో అర్థంకాలేదు. తర్వాత తర్వాత తెలుసుకున్నాను. 'నాకు జ్వరం వచ్చింది, చూడాలనివుంది, రండి" అంటే నువ్వూ, కామేశ్వర్రావూ పరుగెత్తుకొస్తారు. దిగులుగా నా ముందు కూర్చుంటారు. మందు తాగిస్తారు. నా కళ్ళల్లోకి చూస్తూ వుండిపోతారు. నేను బాధపడుతుంటే, అయ్యో! అనుకుంటారు. కళ్ళల్లో నీళ్ళు నింపుకుంటారు. అప్పుడు-నాకేమీ అక్కరలేదు. ఈ మాత్రం చాలు” అనుకుంటాను. కాని ఆ మరుక్షణం దిగులు పడిపోతాను. 'ఈ కన్నీళ్ళు, ఈ సానుభూతి నాకొరకే, నా చొక్కదానికొరకే. మరింకెవరికొరకూ కావు. నా స్వంత ఆస్థి'-అని అనుకోలేకపోతున్నాను. నేను పాటపాడుతాను. ఆనందంతో బావుంది అంటారు. మెచ్చుకుంటారు. మీ యీ

శై వాళ్ళమధ్య వంతెన

మెప్పు యీ ఆనందం-'యివి నావే. మరెవరివీ కావు' అనుకోలేను. ఈ వెలితి యిటీవల మరీ ఎక్కువయిపోయింది. ఒక్కచోటే వుంటామనుకున్న ముగ్గురం చెల్హాచెదురై పోయాం. ఒక్కర్తినీ అయిపోయాను అందువల్ల ఈ ఆలోచనలు మరీ ఎక్కువై పోయాయి. .

-ఇలా సాగింది ఆమె అప్పుడు రాసిన ఉత్తరం.

ఆమె దూరమైపోతుందన్న ఆలోచన బాధగానే వుంది వెనకటంత 'స్వేచ్భ యిష్పుడు వుండదు. అప్పటి అభిమానాలుకూడా యిప్పుడు నిలిచిపోవు. ఆమె చిరునవ్వులు, ఆమె కన్నీళ్ళు మరొకరి ఆస్థి. మా గురించి ఆమె వాటిని ఖర్చుపెట్టదు. వెనకటిలా సన్నిహితంగా వుండలేమన్న విషయాన్ని ముందుగానే ఊహించుకునే ఆమెను ఒకసారి చూసివద్దామనుకున్నాను.

ఇదిగో అదిగో అనుకుంటూనే సంక్రాంతి వచ్చేసింది మరో నాలుగు రోజులు సెలవుపెట్టి, మొత్తం వారంరోజులు అయే్యేటట్స చూసుకుని పండగకు యింటికి వెళ్ళాను-మందాకిని దగ్గరకుకూడా వెళ్ళొద్దామని కామేశ్వర్రావుకు ఉత్తరం రాశాను.

పండుగ నాలుగు రోజులూ యింటిదగ్గరీ వున్నాను. పండుగ రోజులు హాయిగా గడిచిపోయాయి. ఈ పండుగపూటకూడా అమ్మ కళ్ళల్లో దిగులెందుకో వాకు తెలుసు. అభిమానంతోనైనా ఆజ్ఞాపించడం తెలీదు అమ్మకు, అందుకే అ మౌనం.

“హోటలు భోజనంతో ఎలా అయిపోయావో చూడు?” అంది. అదే చాలు " ఆమె చెప్పదలచుకున్నది చెప్పేసిందనడానికి.

రాత్రి భోజనం చేస్తున్నప్పుడు చెప్పాను-- రేవు ఉదయం మందాకిని దగ్గరక్షు వెళ్తానని.

“అలాగే, వెళ్ళిరా వాళ్ళమ్మగార్హి అడిగినట్టు చెప్పు. పాపం! యీ వయసులో ఆమెకు యీ కష్టం వచ్చిపడింది. ఆ పిల్ల ఆదృష్టం అది, ఏం చెయ్యగలం, అయ్యో అనుకోవడం తప్ప ”

గతుక్కుమన్నాను. ఏమయింది? ఆమె మాంగల్యం

“ఏం జరిగిందేమిటి?”

“నిజం ఎంతుందో గాని భర్త ఏలుకోడంలేదట. వీధిలోవాళ్ళు చెప్పుకున్నారు. అయినా మన వీధిలో మరీలెస్తూ, కాస్త ఎడముఖం పెడముఖంగా వుంటే వున్నవీ లేనివీ పుట్లించడమే” అంది.

దీపానికి చమురు త్ర

అన్నం తినలేకపోయాను.

ఏమిటిది? వాదిలేయడమా? పోట్టాడుకుని వచ్చేయడమా? అభిప్రాయ భేదాలతో విడిపోవడమా?

అంతకన్న విశేషాలు అమ్మ చెప్పలేకపోయింది.

రాత్రంతా నిద్రలేదు. మనసంతా గాయపడ్డట్టు బాధ.

ఎందుకిలా జరిగింది?

ఆమెకు యిష్టంలేని పెళ్ళి కాదిది. ఆమె అంగీకారాన్నికూడా తీసుకునే యీ పెళ్ళి జరిపించారు. అతనుకూడా మంచివాడేనని చెప్పుకున్నారు. ఖర్గపూర్‌లో రైల్వేలో ఉద్యోగం. నాలుగొందలవరకూ వస్తుందట, పెళ్ళికి వెళ్ళినప్పుడు చూశాను. మందాకిని అదృష్టవంతురాలేనని అనిపించింది. కామశ్వర్రావుమాత్రం రాలేకపోయాడు. అప్పటికి అతను బాగా జ్వరంలో వున్నాడు-నూటమూడు డిగ్రీల జ్వరం, అతన్ని వొదలిపెట్టా లనిపించలేదు సాయంకాలానికి కొద్దిగా తగ్గింది... “నువ్వుకూడా వెళ్ళకపోతే బాగుండదు. నువ్వెళ్ళు” అన్నాడు. బస్సు అందుకుని వెళ్ళేసరికి సరిగ్గా పీటలమీద వుంది. బాధపడింది. మర్నాడు వచ్చేశాను. వచ్చేముందు “ఉత్తరాలు రాస్తూవుండు. కామేశ్వర్రావుకుకూడా _ చెప్పు. వెళ్ళడంతోనే అతని జ్వరం ఎలావుందీ రాయి” అంది.

ఎందుకో ఉత్తరం రాయలేకపోయాను, నాకు తెలినినంతవరకూ కామేశ్వర్రావుకూడా రాయలేదు. వెనుకటంత స్వేచ్చ తీసుకోవడానికి మా యిద్దరికీ యిష్టంలేదు.

రాత్రంతా మందాకినినిగురించిన ఆలోచనలె.

ఉదయం ఫస్టు బస్సుకే కామేశ్వర్రావు దగ్గరకు బయలుదేరాను. నా గురించే చూస్తున్నాడతను. ఎప్పుడెప్పుడు అతనికి మందాకిని విషయం చెప్పామా అని వుంది. చాలా రోజులకు కలుసుకున్నామేమో అతని ఉత్సాహాన్ని అకస్మాత్తుగా అణిచివేయడం యిష్టంలేకపోయింది. మధ్యాహ్నం భోజనాలవేళవరకూ ఎలాగో గడిపాను. ఇక ఆవిషయం మనసులో ఉంచుకోలేకపోయాను.

“మందాకినినిగురించి ఉత్తరంలో రాసినదానికన్నా ఇంకేమీ నీకు తెలీదా?” అన్నాను.

అతను ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూశాడు అర్ధంగాక.

ఆ తర్వాత ఓ చిరునవ్వు నవ్వి “అదా, అలాంటిదేమీ లేదులే. ఇప్పట్లో పిల్లలు

న్‌! వాళ్ళమధ్య వంతెన కలిగేట్టకూడా కనిపించలేదు” అన్నాడు.

నాకు నిజంగా నవ్వొచ్చింది.

“అది కాదు, ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చింది?” అన్నాను.

“ఎందుకొచ్చిందీ అంటే ఏమని చెప్పగలం. చెయ్యాలనిపించి చేస్తున్నదేమో. అసలే పట్టుదల మనిషి. అందులోనూ, ఇతరుల ఆధిక్యతని ఒప్పుకోని మనస్తత్వం ఆమెది” అన్నాడు. అని, తిరిగి “ఎప్పుడూ లేనిది ఈ ప్రశ్నలన్నీ ఏమిటి?” అన్నాడు.

“ఆమెను గురించి విచిత్రమైన వార్త ఒకటి విన్నాను, అందుకని.”

“ఏమిటది?”

“భర్త వొదిలేశాడట!”

తుళ్ళిపడ్డట్టు నావైపు చూశాడు కామేశ్వర్రావు.

“అవును. వొదిలేశాడట. అది వాదిలేయడమో, అభిప్రాయభేదాలొచ్చి పోట్టాడుకుని వొచ్చేయడమో తెలీదుమరి.”

కొద్దిసేపు అతను ఏమీ మాట్లాడలేదు. అయిదు నిముషాలు అలానే శూర్చుని

  • “ఇప్పుడే బయలుదేరుదాం పద” అని లేచాడు. బస్సుస్టేండుకు చేరుకునేసరికి బస్సు సిద్ధంగా వుంది.

చీకటి పడుతూ పడుతూ వుండగా శ్రీకాకుళం చేరుకున్నాం.

మందాకినిని ఎలా పలకరించాలీ అన్నది ఒక సమస్య. పుట్టెడు దిగులుతోవున్న ఆమెను సరదాగా పలకరించడానికి వీలవుతుందా? ఎలా ఆమెను ఓదార్చాలి? ఎలా మాట్లాడాలి?

మా ఇద్దర్నీ చూసి మందాకిని ముఖం యింత చేసుకుంది. “కామేశ్వర్రావు కలిసిన తర్వాత పద్‌-పదిహేను రోజులపాటు ఎదురుచూశాను వస్తారేమోనని, ఇంక్ర రారని నిశ్చయంచుకున్నాక అకస్మాత్తుగా వూడిపడ్డారు, రండి. .రండి” అంది.

ఇంటిల్లిపాదికీ మేం వచ్చినట్టు చెప్పేసింది ఆమె సంతోషానికి మాకే ఆశ్చర్యం వేసింది. నేను వూహించుకున్నట్టులేదు ఆమె. కనీసం కామేశ్వర్రావు చెప్పినట్టయినా నా కనిపించలేదు. ఈ చిరునవ్వు వెనక, ఈ సంతోషం వెనక కన్నీటితో తడిసిన ఆమె జీవితం వున్నట్టనిపిస్తోంది.

దపానికి చమురు తర్‌

“ఏం...ఇంత మౌనంగా వుండిపోయారు. మాటలు మర్చిపోయారా ఏమిటి?” అంది భోజనం వడ్డిస్తున్నప్పుడు.

ఆమెతోపాటు మేంకూడా సరదాగా మాట్టాడితే ఆమె నొచ్చుకోకుండా వుంటుందా? తనను తాను దాచుకుని నటిస్తోంది. ఆమె నవ్వే ప్రతిచిరునవ్వు వెనకా ఓ కన్నీటిబొట్టన్నా కదలకపోదు. ఆమెతోపాటు మేమూ అలాగే మాటాడితే ఆమె హృదయం గాయపడక మానదు.

“బాగా మారిపోయారు మీరిద్దరూ. నేను ఎలా వూహించుకున్నానో అలానే కనిపిస్తున్నారులెండి” అంది తిరిగి,

మరీ మౌనంగా వుండిపోవడం యిష్టంలేక నేనే అవీ యివీ చెప్పుకొచ్చాను-మా ఉద్యోగాలు, అక్కడి పరిస్థితులు, ఇంటిదగ్గరి విశేషాలను గురించి చెప్పాను. ఎక్కడా ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు జారకుండా జాగ్రత్తపడ్డాను. భోజనం అయిపోయాకకూడా చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం.

వాళ్ళమ్మగారుకూడా చాలాసేపు అక్కడి వూళ్ళో విషయాలు అడుగుతూ కూర్చున్నారు. మందాకినిలో లేని దిగులు ఆమెలో కనిపించింది నాకు. మందాకిని పక్కలు పరుద్దామని అవతలి గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మీగార్ని అడిగాడు కామేశ్వర్రావు-“ఇంతకూ ఏం జరిగిందండి. ఇద్దరూ ఫోట్లాడుకున్నారా? ఒకసారి మీరన్నా ఉత్తరం రాయించలేకపోయారా? మీకు తెలియందేముంది; మందాకిని మరీ పట్టుదల మనిషి కోప్పడి మీరే ఆమెచేత ఉత్తరం రాయించాల్సింది”.

ఈ విషయం ఎలా తెలుసా అన్నట్టుగా ఓ క్షణం ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటించింది. “నాకు మాత్రం ఏం తెలును నాయనా ఏం జరిగిందో. అడిగితే చెప్పదు. ఒకరోజు, ఉత్తరం ముక్కన్నా రాయకుండా వూడిపడింది. ఏమిటే అంటే ఏమీలేదు, చూద్దామని వచ్చాను అంది. వచ్చిన రెండు నెలలకు ఉద్యోగం చెయ్యాలనివుందని యిందులో చేరింది. అక్కడికీ నేను పిల్లవాడిచేత ఉత్తరం రాయించాను. “మీ అమ్మాయిని అడగండి, చెప్పంది' అని రాశారు అల్టుడుగారు...”

అంతే అయివుంటుంది. ఏదో చిన్న విషయంమీద అభిప్రాయభేదాలు వచ్చుంటాయి. ఆయన తన ఆధిక్యతను చూపించుకోవడానికి ఏదో అనేసి వుంటాడు. అది చిలికి చిలికి గాలివాన అయ్యుంటుంది. చెప్పాచెయ్యకుండా పుట్టింటికి వచ్చేసి వుంటుంది. పిలిస్తేనేగాని వెళ్ళగూడదనుకుని వుండిపోయి వుంటుంది.

46 వాళ్ళమధ్య వంతెన

“పక్కలు వేశాను. పడుకుంటారా, కాస్సేపు కూర్చుని కబుర్లు చెప్పుకుం దామా?” అంటూ వచ్చింది మందాకిని,

రాత్రి పన్నెండు వరకూ కూర్చున్నాం. చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం చేయడానికి భయం వేసింది నాకు. మందాకినే వాటిని ప్రస్తావించింది. చిన్న పిల్లలా అయిపోయి ఆరోజుల్ని జ్ఞాపకం చేసింది. ఉసిరికాయలు, బాదంకాయలు కోనుకుతిన్నప్పటి అనుభవాలూ, కామేశ్వర్రావు చెట్టెక్కలేని నిస్సహాయత కారణంగా కిందవుండి ఏరుకున్న

కాయల్లో మాకన్నా ఎక్కువే పోగుచేసుకునే అతితెలివీ, చిటారు కొమ్మమీదకుకూడా _ ఎగబాకిపోయే నా మొండి సాహసమూ, సంగీత సాధనగురించి తెల్లవారురూమునే లేద్దామని లేవలేని తన మొద్దనిద్రా-ఆ సంఘటనలూ, ఆ అనుభవాలూ మరీ మరీ _

  • జ్ఞాపకం చేసుకుని చెప్పింది.

కామేశ్వర్రావు నిద్రకుఆగలేక జోగుతుంటే యిక పడుకుందామని లేచాం. గత

రాత్రి సరిగా నిద్రలేదేమో నాకుకూడా మత్తుగా నిద్రపట్టేసింది.

ఉదయం లేచేసరికి చాలా ఆలస్యమయ్యింది. అప్పటికే కామేశ్వర్రావు _ కాలకృత్యాలు ముగించుకుని కూర్చున్నాడు. “లేవోయ్‌, చాలా పొద్దెక్కిపోయింది.

పరాయిచోటకూడా యింతసేపు నిద్రపోవడమేనా[” అన్నాడు.

ఎక్కడ్నించి విన్నదోగాని మందాకిని గబగబా వచ్చి “చూసేవా, కామేళ్వర్రావు ఎప్పుడూ యింతే. ఇది పరాయిచోటు అనుకునేంత దూరమైపోయానా నేను? ఎందుకలా నన్ను దూరం దూరంగా వుంచేసి మాట్టాడుతావు. నిన్నటినుంచీ చూస్తూనే వున్నాన్స_ మరీ ముభావంగా వుండిపోయావు” అంది.

ఇదేమిటి! ఇంత పొద్దుటే యిలా కనిపిస్తోందేమిటి? బహుశా రాత్రల్త నిద్రపోయివుండదు. ఆలోచనల్లో గడిపేసి వుంటుంది తన జీవితాన్ని తలచుక్సృన్ది తనమీద తనకే కోపం వచ్చుంటుంది. బాధకలిగి వుంటుంది. అది ఇలా పార్గిపోతోం అదిగో! రాత్రి నిద్రలేనట్టు ఆ కళ్ళల్లో ఎరుపు!

“ఏం, కోపం వచ్చిందా...సర్లే యిప్పుడు నా మీద అందరికీ కోపమే. ఎప్పుడూ నువ్వు నాతో వాదన వేనుకునేవాడివిగా. ఇప్పుడిలాగ మూగనోము పడితే ఏమిటోల్రా వుంది. నీతో కాస్సేపు పోట్లాడాలనిపించిందిలే, మరేంలేదు” అంది అంతలోకే కంఠాన్నీ చూపుల్నీ మార్చుకుని మెల్లగా నవ్వుతూ.

మేంవచ్చి ఆమెను మరీ బాధపెడుతున్నామేమో అనిపించింది నాకు. ఈ

దీపానికి చముడు 47 పరిస్థితుల్లో ఆమెను చూడకుండా వుంటేనే బావుండేది. మా గురించి తనను తాను దాచుకోవాల్సివస్తోంది ఆమెకు, మా రాక ఒక విధంగా ఆమెను రెచ్చగొట్టడమే. మేం వెళ్ళిపోయాక ఒక రోజల్లా ఆమె ఏడుస్తూ వుంటుందనేది నిజం.

ఎక్కువసేపు అక్కడ వుండాలనిపించలేదు. అ సాయంకాలం బన్స్నుకే వెళ్ళిపోదామని నిశ్చయించు కున్నాం. మందాకినితో చెస్తే వొవుకోలేదు. వాళ్ళమ్మగారుకూడా మరో రోజు వుండమని బలవంఛం చేశారు. ఆఫీసు సాకు చెప్పి తప్పించుకున్నాం. మందాకినీకి నామీద శోపంకూడా వచ్చింది.

అ రోజు ఆమె స్కూలుకు సెలవుపెట్టేసింది.

పదిగంటలవేళ అలా వూళ్ళో కాస్సేపు తిరిగివస్తామని అంటే వెళ్ళనిచ్చిందికాదు. “ఎలాగూ సాయంకాలం వెళ్ళిపోతున్నారుగా. ఈ కొద్దిసేపైనా ఇంట్లో వుండకుండా ఎక్కడికి?” అంది. కోపంగానూ, అజ్ఞాపూర్వకంగానూ అనేసరికి మారు మాట్లాడలేక పోయాం.

“రండి, ఇంకా నిలుచున్నారేం....ఇలా వచ్చి కూర్చోండి”

అవును! ఈ కంరంతోనే తన జీవితాన్ని తాను నాశనం చేసుకుంది.

గదిలో కూర్చున్నాం. చెప్పుకోవడానికి ఏమున్నాయి. పొడిపొడిగా ప్రనంగం నడుస్తోంది. మాట్టాడుకున్నదానికన్న మౌనమే ఎక్కువ.

“నువ్వు వెళ్ళిపోయలోగా నీతో గట్టిగా పోట్లాడేయాలనివుంది కామేశ్వర్రావ్‌, మరీ యింత మౌనంగా మీ వూరికి నిన్ను పంపేయదలచుకోలేదు” అంది మందాకిని.

“అవును. నాకూ అలానేవుంది. నీతో మాట్టాడీగాని యిక్కడ్నించి కదలాలనిపించడం బేదు” అన్నాడు కామేశ్వర్రావు.

“దేనిగురించి పోట్లాడుదామనుకుంటున్నావ్‌?”

“నీ గురించే.” +

“నా గురించి నాతోనే పోట్టాడ్డమేమిటి? అది పోట్టాటనిపించుకోదు”

“పోట్లాట కాకపోతే మరోటి. ఏ పేరైతేనేం. ఏ రాయైనా ఒకటే పళ్ళూడగొట్టు కోడానికి” అన్నాడు.

మందాకిని చిరునవ్వు నవ్వి, “ఇప్పటికి చూశాను మా పాత కామేశ్వర్రావుని” అంది.

48 వొాళ్ళమధ్య వంతెన నాకు నవ్వొచ్చింది. కామేశ్వర్రావు మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టి, “పంతాలు పట్టి నీ జీవితాన్ని నువ్వే చేజేతులా ఎందుకు నాశనం చేసుకుంటావ్‌?” అన్నాడు.

“ఏమిటటా!” అంది అమె చిలిపిగా అతనివైపు చూస్తూ,

అతను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు.

ఆమె రెప్పలు వాల్చేసుకుంది.

“ఎందుకా నటన? నాకేమీ తెలీదనుకోకు. ఆమాట అనడానికి నిన్ను నువ్వు ఎంత హింసించుకుంటున్నావో నాకు తెలును"

ఆమె ఏమీ మాట్లాడలేదు.

“అవును మందాకినీ! నువ్వు చాలా తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నావు. చిన్నప్పుడు పంతాలు పట్టినా అందం వుంది. పెద్దయ్యాక పంతాలు పడితే-అది జీవితానికే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. నంసొరం అన్నతర్వాత అభిప్రాయభేదాలు రాకుండా పోవు. మాటామాటా అనుకోకుండా వుండరు. అంతమాతక్రంచేత నువ్విలా ప్రవర్తించడం మాకేమీ నచ్చలేదు. నీ ఆలోచనలు నీకే శక్రువులవుతాయని వెనక చెప్పాను. అది నిజమనిపించావు. వైవాహిక విషయాలలో నీకు సలహా యిచ్చేపాటి అర్హతలు మాకు లేవు. సలహాలుకూడా యివ్వదలచుకోలేదు. కాని, ఒక విషయం చెప్పక తప్పదు. నువ్వు చేసిన పని మాత్రం మంచిపని కాదు” అన్నాను.

“చివరికి మీరిద్దరుకూడా నన్నే తప్పుపట్టుతున్నారా?” అంది. ఏడుపూ, నిరాశా నిండిన కంఠంతో జాలిగా అడిగినట్టందది.

“నిజమే. నీది తప్పుకాకపోవచ్చు. అతనిదే తప్పుకావచ్చు. అంతమాత్రంచేత శ పట్టుదలేమిటి? పరిస్థితులతో రాజీ పడలేకపోతే ఈ దేశంలో స్త్రీ సుఖానికి నోచుకోల్రేద్రన్న నీకు తెలీదా?” అన్నాడు కామేశ్వర్రావు.

ఆమెకు ఏడువు అగలేదు. పెదాలు బిగబెట్టి దుఃఖాన్ని ఆపుకోవడ్రాన్సిక్ర ప్రయత్నించిందిగాని సాధ్యంకాలేదు. రెండు చేతుల్తోనూ ముఖాన్ని కప్పుకుని కూచ్చుంది ఓ నిమిషం అలా కూచుని మెల్లగా లేచి వెళ్ళి ఓ కాగితం తెచ్చి “నన్ను నేను చంప్పక్సుని ఆయనకు రాసిన ఉత్తరం నకలు యిది. ఇంతకన్నా పరిస్థితులతో రాజీపడడం ఎలాగ?” అంది.

కామేశ్వర్రావు ఆ కాగితం అందుకుని చదువుకుని మౌనంగా నాచేతికిచ్చాడు.

దీపానికి చమురు శ్ర

“శ్రీవారికి మీ మందాకిని నమస్కరించి వ్రాయునది-

మీ కోపం తాత్కాలికమైనదేనని రెండు నెలలు నిరీక్షించాను. ఎప్పుడో ఓ చల్లటి ఉత్తరం మీ దగ్గర్నుంచి వస్తుందని ఎదురుచూశాను. కాని మీకు నామీద దయకలగలేదు. మీ చల్లని నీడకింద అదృష్టవంతురాలిగా మురిసిపోతోన్న నాకు ఆ అదృష్టాన్ని దూరంచేయకండి. మీ హృదయంలో ఇంత కారిన్యం వుండడానికి వీలులేదు. అది ఎంత మెత్తనైనదో నాకు తెలుసు. తాత్కాలికమైన ఆవేశంతో మీరన్న మాటల్ని నిజంగా మీ హృదయంలోనుంచి వచ్చినవనుకోను. నా మీద కోపంతోగాక సానుభూతితో ఆలోచించండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు రుద్దిన అభాండంతో ఏ స్రీ కూడా ఇంకా బతకాలనుకోదు. మీరు పరిస్థితుల్ని సావకాశంగా మరోసారి ఆలోచిస్తారనీ, అన్యాయం చెయ్యరనీ నాకు తెలుసు. అందుకే ప్రతిరోజూ నిరీక్షఐలతోనే గడుపుతున్నాను. నేను స్త్రీని. నా పైన ఇంత కరినంగా ప్రవర్తిస్తే యిక నాకు దిక్కేమిటి? మీ హృదయంలోంచి ఒక చల్లని పలుకు, ఒక చల్లని చూపు, ఒక చల్లని మాట జాలితో నాపైన కురుస్తుందన్న ఆళతోనే ఇంకా బతికి వున్నాను. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించండి.

మీ మందాకిని.”

నేనెరిగిన మందాకిని కాదు. శాసించడమే గాని శిరసావహించడం తెలీని మందాకిని,మొండిగా తను చెప్పడమేగాని ఆలకించడం తెలీని మందాకిని యింత జాలిగా, బిచ్చగత్తెలా యాచించేముందు తనను తాను ఎంతగా హింసించుకుని వుండాలి? మందాకిని ఇలా యాచించగలదని నేను ఎవ్వుడూ అనుకోలేదు. మొదటినుంచీ తన వ్యక్తిత్వాన్నే ప్రదర్శించుకోవడానికి అలవాటుపడింది. ఆ వ్యక్తిత్వ ప్రదర్శన కోసమే పెళ్ళికూడా చేసుకోగూడదని ఆలోచించింది. ఆ మందాకినీయేనా యీమె?

ఆయన సమాధానం ఏం రాశాడో అడగడం అనవసరం, మందాకిని ఈ వుత్తరం రాసి ఎనిమిది నెలలయ్యింది. అతను ఏం సమాధానమిచ్చివుంటాడో వూహించవచ్చు.

“అసలు ఏం జరిగింది?” అన్నాడు కామేశ్వర్రావు.

ఆమె ఏమీ మాట్లాడలేదు.

మందాకిని ఒకసారి చెంగుతో కళ్ళు తుడుచుకుని “కామేశ్వర్రాన్‌! ఏవైనా

త్‌ వాళ్ళమధ్య వంతెన విశేషాలు చెప్పు వింటాను- నా సాద ఏం వింటావుగాని. నేను బాధ పడడం చాలక మిమ్మల్నికూడా బాధపెట్టడం దేనికి?” అంది.

ఇంత దుఃఖంలోకూడా ఎంత వోర్చు! ఇంత బాధలో కూడా ఎంత సహనం॥

ఏం మాట్లాడగలం? ఏం మాట్లాడినా అది ఆమె హృదయాన్ని తూట్లు పరచేట్ట వున్నప్పుడు నోరు ఎలా మెదిపేది? మా కళ్ళముందే ఆమె చిత్ర హింసలనుభవిస్తోంటే ॥ ఎలా భరించేది? పెదవి కదపడానికే భయంగా వుంది.

“ఏమిటలా మూగనోము పట్టారు. ఇక్కడ కూర్చోవడం ఇబ్బందిగా వుందా. పోనీ నలా ఊళ్ళో తిరిగిరండి. బలవంతంగా కూర్చోవడం దేనికి?” అంది.

హమ్మయ్య అనుకుని బయటపడ్డాం. భోజనం టైమువరకూ అలా వూళ్ళోనే తిరిగాం. ఒక గమ్యం లేదు-వట్టినే వీధుల్ని కొలుస్తూ తిరగడం తప్ప. మందాకిని ఎదుటినుంచి తప్పుకోడానికి ఎలా గడీపితేనేం, కాళ్ళు నొప్పెట్టేవరకూ తిరిగి తిరిగి ఒంటిగంటకు ఇంటికి చేరుకున్నాం.

“ఇంతసేపా, ఇందాకటినుంచీ ఎదురుచూన్తున్నాను. బతుకంతా ఇలా నిరీక్షబలతోనే గడిచిపోతోంది. ప్రతి చిన్న విషయానికీ, పెద్దవిషయానికీ నిరక్షలు నాకు తప్పడంలేదు” అంది మందలిస్తున్నట్టు.

భోజనం దగ్గరకూడా యిలానే కసిరి, కోప్పడి శాసించగలిగే నోరును విప్పి “మరికాస్త - మరికాస్త అంటూనే పీటలమీంచి కదలలేనంతగా మాచేత తినిపించేసింది. భుక్తాయాసంతో యిద్దరమూ నడవాలోకొచ్చి కూర్చున్నాం. తనుకూడా మరో అర్ధగంటల్రో భోంచేసి వచ్చింది.

“కాస్సేవు సాగిలపడతారేమో, మంచాలు వాల్చుదామనుకున్నాన్సు. మళ్ళీ ఎందుకులే అనిపించింది. ఎలాగూ సాయంకాలం వెళ్ళిపోతున్నారుగా! ఇంటికి వెళ్ళాక హాయిగా నిద్రపోదురుగాని, నా గురించి ఈ కొద్ది గంటలూ ఇబ్బంది పడక తప్పద్వు” అంది.

“ఇక్కడొద్దు, నా గదిలో కూర్చుందాం రండి అక్కడ కాస్తంత ప్రశాంతంగా వుంటుంది.” అంటూ గదిలోకి తీసుకెళ్ళింది. తన స్కూలు విషయాలు చెప్పింది. తమ్ముళ్ళ భవిష్యత్తు గురించి చెప్పింది. సంగీతం గురించి మాట్లాడింది లలిత సంగీతం పాటలు ఓరెండు వినిపించింది. కామేశ్వర్రావు చిత్రలేఖనాన్ని గూర్చి అడిగింది. నా

కథలను గూర్చి చర్చించింది వరచుగా నా కథల్లో ఆడొళ్ళకు అన్యాయం చేస్తున్నానని

దీపానికి చమురు ల్‌? గట్టిగా విమర్శించింది. ఏమిటేమిటో చెప్పింది. మంత్రించినట్టు మా మౌనాన్ని తోలేసి ప్రసంగంలోకి దించేసింది అక్కడ్పుంచి వాదనలోకి లాగేసింది. ఆవాద '్రతివాదాల్లో పడిన మాకు కాలమే తెలీలేదు!

చూస్తుండగానే మూడున్నర అయిపోయింది. మరో గంటన్నరే అక్కడ వుండేది. అయిదున్నరకు బస్సుంది. అయిదింటికి యింటిదగ్గర బయలుదేరితే అర్ధగంటలో బస్సుస్టేండు చేరుకోవచ్చు

మందాకిని అంతసేపూ అంత సరదాగా, హుషారుగా మాట్లాడుతూ వున్నదల్లా అకస్మాత్తుగా దిగులుగా అయిపోయింది. అర్ధగంటసేపు ఏమీ మాట్లాడకుండానే మౌనంగా వుండిపోయింది.

వాళ్ళమ్మగారు టిఫిను, కాఫీ పట్టుకొచ్చారు. మెల్లగా తీసుకుంటున్నాం.

“ఇంకేమిటి విశేషాలు?” అన్నాడు కామేశ్వర్రావు మందాకినితో,

“ఏమున్నాయ్‌ చెప్పడానికి. అప్పుడప్పుడు వస్తూవుండండి. ఇప్పుడు నాకు కావలసినంత తీరిక. ఉత్తరాలు రాస్తుంటాను, నమాధానాలు ఇస్తుంటారు కదూ. ఈ మారుమూల 'స్నేహిశురాల్ని మర్చిపోకండి” అంది మందాకిని,

“మర్చిపోయేంత గొప్పవాళ్ళం కాలేదు మేము. మర్చిపోయివుంటే యిప్పుడు యిలా వెతుక్కుంటూ వచ్చేవాళ్ళమే కాదు” అన్నాను నేను.

“మర్చిపోయే గుణం ఎవరికి వుందో తెలుస్తూనే వుంది. ఆరోజు సింహాచలం కొండమీద మనం కలుసుకోకపోతే మేం నీకు జ్ఞాపకం వుండేవాళ్ళమా?” అన్నాడు కామేశ్వర్రావు.

“ఎందుకలా విపరీతంగా వూహించుకుంటారు?” అంది మందాకిని కొస్త కోపంగా.

“అంతకుముందు సరేసరి. ఇక్కడకు వచ్చిన తర్వాతన్నా ఓ కొర్డు ముక్కన్నా రాయకపోతే ఏమనుకోవాలి” అన్నాను నేను.

కామేశ్వర్రావుకూడా వూరుకోలేదు-

“ఎందుకాకోపం, వున్నమాటంటే వులుకెక్కువేలే” అన్నాడు.

అమెకు కోపం అగిందికాదు.

తాగుతోన్న కాఫీని అక్కడే వొదిలేసి చరచర్హామైత్రైతుకకషువెళ్నింది. పెట్టే ళం

  • (6,శ యడల... *

త్‌2ి వాళ్ళమధ్య వంతెన తీసి, లోపలి చీరలన్నిటినీ చివాల్నబయటకులాగిపడేసి, అట్టడుగునుంచి ఓ కాగితాల దొంతర తీసి ముందుకు గిరాటేసి “ఇవన్నీ ఎందుకు దాచుకున్నానంటావ్‌. మర్చిపోడానికేనా? చెప్పు కామేశ్వర్రావ్‌, మాట్లాడవేం?” అంది.

కామేశ్వర్రావు యింకెక్కడ మాట్టాడగలడు ?

నా పరిస్థితీ అలాగే వుంది!

ఆ కాగితాల దొంతరంతా, వెనక కామేశ్వర్రావు వేసిన మందాకినీ చిత్రాలే అతని సంతకాలతోసహా ఎక్కడా చెక్కుచెదరకుండా, పిచ్చి గీతలు కాదుకదా కనీసం నలగనన్నా నలగకుండా అతి భద్రంగా వున్నాయి!

నేనే కింద చెల్లాచెదురైన అవన్నీ ఏరి మౌనంగా ఆమెకిచ్చేశాను

స్కూలునుంచి వాళ్ళ తమ్ముడు వచ్చేశాడు. అప్పుడే నాలుగున్నర అయి పోయింది. గబగబా ముఖాలవీ కడుక్కుని, బట్టలు మార్చుకున్నాం. ఇంట్లో అందరికీ చెప్పి బయలు దేరుదామనుకుంటుండగా “మీ యిద్దరికీ పూతరేకులు యిష్టమని తెప్పించాను” అంటూ చెరో పొట్టాం యిచ్చింది మందాకిని, అందుకుని, ఆమెకుకూడా చెప్పి బయలుదేరాం. గేటు తీసుకుని వీధిలోకొచ్చాం. మందాకిని తమ్ముడు రిక్షా గురించ్చి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఎదురుచూస్తూ నుంచున్నాం.

“ఇప్పుడే వస్తాను వుండు” అని చెప్పి లోపలకు వెళ్ళాడు కామేశ్వర్రావు.

అయిదు నిమిషాలు నిలుచుని, ఎంతకీ రాకపోయేసరికి, నేనుకూడా లోపలక్షు వెళ్ళాను. మందాకిని గదిలోంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. గదిలోకాలుపెచ్చేసం కి

కామేశ్వర్రావు ముఖమంతా జేవురించిపోయి వుంది. అతను అంటున్నాడ్స “మరీ అంత తెలివితక్కువదానిలా ప్రవర్తించకు. దేనికైనా అర్థంపర్థం అంటూ వుండాల్సి. మొండితనానికికూడా ఒక హద్దంటూ వుంది. నా బొమ్మలు నాకిచ్చేయమంటే ఏమిట పట్టుదల? ఇంత జరిగిన తర్వాతకూడా యింకా బుద్ధిలేకపోతే ఏమనుకోవాలి. చేజేత్సులా నీ నాళనాన్ని నువ్వే కోరితెచ్చుకునేంత పిచ్చిదానివైపోయావేం. ఇంత మొండితనం పనికిరాదు.”

“నేను ఇవ్వనుగాక ఇవ్వను.” అంది మందాకిని. టేబిలుమీద వుండిపోయిన

బొమ్మల్ని తీసుకుని పెట్టెలో దాచేసుకుంది. రిక్షా వచ్చినట్టుంది. మువ్వల శబ్దం వినిపిస్తే కామేశ్వగర్రావుని వెంటబెట్టుకుని వచ్చేశాను.

దీపానికి చమురు తం

“చూడు! మందాకిని ఎంత తెలివితక్కువగా వ్రవర్తిస్తోందో” అన్నాడు కామేశ్వర్రావు బస్సులో. అంతకన్నా అతనింకేమీ వ్యాఖ్యానం చెయ్యలేదు.

మందాకినిని చూడాలి... చూడాలి అనుకున్నంత ఆనందం యిప్పుడు లేదు. ఆమె చిరునవ్వుల్ని ఎక్కడ చూడగలిగాం? తనను తాను దాచుకోవడానికి ఆమె పడినపాట్టూ, వెనకటి "స్వేచ్చ లేదన్న ఆలోచనలతో ముఖంలో అల్ట్డుకున్న విచారం, తన విషాద చరిత్ర మాకు తెలిసిపోయిందన్న బాధ-యివే మాకు కన్పించాయి. ఆమెతోపాటు అ బాధ మాకూ తప్పలేదు. మందాకినిని ఏడిపించడానికే మేము వెళ్ళామనిపించింది. +

అమెను ఏడిపించే అధికారం మాకు లేదు, అవును, మాకులేదు.

మళ్ళీ మా మా ఉద్యోగాలు మాకు మిగిలిపోయాయి.

మందాకినీనుంచి తరచుగా ఉత్తరాలు వస్తున్నాయి. ఆమె ఉత్తరాలు ఆలోచనల్ని ేళిత్తించేవిగా వుంటాయి అవంటే నాకు చాలా యిష్టం. నానుండి సుదీర్ధమైన ఉత్తరాల్ని కోరుతుండేది. అలాగే రాస్తుండేవాడిని. ఎప్పుడైనా సమాధానం రాయడొనిక్షి నాలుగు రోజులు ఆలన్యమైతే ఎక్స్‌ఫ్రైస్‌ ఉత్తరం రాసేది. “ఈ మారుమూల ఒంటరి జీవితంలో ఈ ఉత్తరాలే నాకు ఆప్తలు. వాటిని పంపించడం మానొద్దు” అనేది. కామేశ్వర్రావు దగ్గర్నుంచికూడా ఆమె ఉత్తరాలు అందుకుంటుండేది,

చాలాసార్లు ఆమె మళ్ళీ ఒకసారి మా యిద్దర్నీ కలిసి రమ్మని రాసింది కాని వెళ్ళలేదు. మేం వెళ్ళడం ఆమెకు ఏవిధంగానూ ఆనందదాయకం కాదు. ఈ ఉత్తరాలు చాలు జ్ఞాపకాలని నిలపడానికి.

ఒకసారి కామేశ్వర్రావు ఉత్తరం రాశాడు-

“. చాలా చిత్రమైన నంమఘటనోయ్‌, మా ఆఫీసులో జగ్గూ అని ఓ మిత్రుడున్నాడు. వాడొచ్చి “మధ్యాహ్నం నీ గురించి గౌరీపతి వచ్చాడేం? నీకెట్లా తెలుసాయన?' అన్నాడు. గౌరీపతి ఎవరా అని ఆశ్చర్యపోయాను. నా గురించి ఎవరూ రాలేదు కూడాను. అదే చెప్పాను. అతను ఆశ్చర్యపోయి 'అదేమిటీ! మధ్యాహ్నం నీ గురించి వస్తేను! నీ సీటెక్కడా అని ఫప్యూన్‌ని అడుగుతుంటే అటొస్తూ ఆలకించి ఆగిపోయాను. అక్కడికీ బొమ్మలేస్తుంటాడు ఆ కామేశ్వర్రావేనా అన్నాను. అవునన్నాడు సెక్షన్‌ ఎక్కడో చెప్పండగా నువ్వే కనిపించావు. కేంటిన్‌కుగాబోలు వెళ్తున్నావు. పిలిచానుగాని వినపడలేదు గాబోలు. నే కలుస్తాలెండి అని ఆయనే నీవైపు వచ్చాడు.

ర్‌శీ వాళ్ళమధ్య వంతెన అయితే కలవనే లేదా?' అని అడిగాడు జగ్గు, లేదన్నాను. అ గౌరీపతి ఎవరో వాకర్థంకాలేదు“అతను ఏం చేస్తుంటాడోయ్‌. నీకు తెలుసా?” అని జగ్గూను అడిగాను. అతనితో పరిచయం లేకపోయినా అతన్ని గురించి జగ్గూకు తెలుసట. జగ్గూకు కాలేజీలో అతను రెండేళ్ళు సీనియర్‌ అట. 'స్పోర్ట్‌ ఛాంపియన్‌-అందువల్ల అందరికీ అతను బాగా తెలును" అన్నాడు. ఖర్గవూర్‌లో రైల్వేలో వనిచేన్తున్నాడట. ఇవ్వడు అర్ధమయ్యిందిగా అతనెవరో. మన మందాకినీ మొగుడే! అనుమానం వచ్చి ఇంటిళెళ్ళాక మందాకిని పెళ్ళి కార్డు బయటికి తీసిచూశాను. అదే పేరు. ఇది జరిగి మూడు రోజులయ్యింది. ఇంతవరకూ అతను కలవనేలేదు...”

అతను ఇక కలవడు. నాకు తెలుసు అతను ఛాలా సంతోషంగా తృప్తిగా, తేలిగ్గా ఈపాటికి యింటికి వెళ్ళిపోయి వుంటాడు.

మరికొద్ది రోజుల్లో మందాకిని దగ్గర్నుంచి కామేశ్వర్రావుకూ, నాకూ ఉత్తరాలుకూడా రావొచ్చు. వాళ్ళాయన వచ్చాడనీ, తనను తీసుకెళ్ళబోతున్నాడనీ రాస్తుంది.

ఆ సంఘటన జరిగేవరకూ ఈ కథను పొడిగించాలనుకోవడం లేదు నేను. అది తప్పకుండా జరుగుతుంది. ఈ నా విశ్వాసాన్ని వెలిగించే అశ-అది... కామేశ్వర్రావు ఆకారం,

_- పురిట్లోనే పెద్ద జబ్బుబేసి, కుడికాలు పడిపోయి అతను అవిటివాడైపోయాడు.

ఈ కాస్త చమురూచాలు ఈ దీపం వెలగడానికి.

ఉం

వాళ్ళమధ్య వంతెన

ఈ సంవత్సరమైనా వెన్నెల్నీ, మల్లెపూలనూ వ్యర్థపోనివ్వగూడ దనుకున్నాడు అనంతమూర్తి. ఇరవై ఎనిమిదో పుట్టినరోజు జరుపుకున్న రాత్రి ఒంటరిగా గదిలో కిటికీముందు కూర్చుని, జీవితాన్ని తనచుట్టూ వరచుకుని గట్టిగా ఆ మాటే అనుకున్నాడు. కాని-

ఆ ఏడాదికూడా వర్షకాలం ప్రవేశించింది. వేసవిలో విరగపూసిన మల్లెపూలు క్రమంగా అఖరైపోయాయి. ఆ పూలచుట్టూ తిరిగి గునగుసలు చెప్పి, పులకరింతలు పెట్టి, మైకంలోకి పడదోసి దొంగచాటుగా వాటి సువాననల నంపదను దోచుకున్న గాలులు అతని తలమీంచి, అందరాని దూరంలోంచి కదిలివెళ్ళిపోయాయి. వర్షంలా కురిసిన వెన్నెల అతని జీవిత క్షేతంమీద పడలేదు. ఎక్కడో ఏ అదృష్టపు కొండలమీదనో కురిసి, ఆ కురిసిన వర్షపు నీరంతా కలిసి పరవళ్ళు తొక్కే ఏరై, అతని జీవితానికి అల్లంత దూరంగా ప్రవహించి కదిలి, ఎవరి అనుభవాల సమద్రంలోనో లీనమైపోయింది.

నాలుగేళ్ళుగా యిలానే జరుగుతోంది. తన కోరిక ఎవ్పటికి తీరేనో అన్న భయంకూడా యిష్పుడిప్పుడు కలుగుతోంది అతనికి. అది అతని దోషమే అని బంధువులూ, మిత్రులూ అంటున్నారు. ఇలా అయితే యిక సెళ్ళయినట్టే అని ఎగతాళికూడా చేస్తున్నారు.

ల్‌6 వాళ్ళమధ్య వంతెన ఏం చేస్తాడు మరి? చిన్నప్పటినుంచీ ఆతని అభిరుచులు అలానే రూపు దిద్దుకున్నాయి. సముద్రపు అంచున వున్న '“ఉప్పాడిలో అతను పుట్టాడు. ఊహ తెలిసినప్పటినుంచీ అతను సముద్రాన్ని చూస్తూనే వున్నాడు. సముద్రపు అలల మీద విరిగిన సూర్యచంద్రుల్నీ, కెరటాల మీద ఊగిసలాడి కదిలి నర్తించే పడవలనూ (ప్రతిరోజూ అతను చూస్తూనే వచ్చాడు. ఉదయం నిద్ర లేచి, ఆవలించి వరండాలోకి వచ్చేసరికి దూరంగా తామర మొగ్గలా సముద్రాన్ని చీల్చుకొచ్చిన బాలసూర్యుడు కెరటాల పొత్తిళ్ళలో ఊయల లూగుతూ కనిపించేవాడు. సాయంకాలం యిసుకలో ఆడుకోడానికి సముద్రపు వొడ్డుకు వెళ్తే ఏ ఆకతాయో తుంచి పారేసిన తామరపూవులా కెరటాలమీద తేలుతూ ఎగిరిపడుతూ ఆ సూర్యుడే కనిపించేవాడు. అప్పుడప్పుడు మనసు పుట్టిన రాత్రిళ్ళు చంద్రుడుకూడా ఉల్లిపార కాగితంకన్నా సన్నని వెన్నెల తెరలోంచి దిగొచ్చి, అక్కడ కెరటాల మీద నృత్యం చేసి; తెల్గారిపోతుండగా, చెదిరి కిందపడిపోయిన వెలుగు ముత్యాల్నయినా ఏరుకోకుండా పారిపోయేవాడు. ఎప్పుడు చూసినా వయ్యారంగా వంగి, చివాల్న పైకెగిరి, దబ్బున జారిపడి, కాస్సేపు అటూ యిటూ ఊగిసలాడుతూ కనిపించేవి పడవలు. బాల్యమంతా అక్కడే గడిచింది. రోజూ కనిపించే ఆ దృశ్యాలే అతని మెదడుకు మేత అయ్యాయి. తర్వాత కాకినాడ వచ్చేశారు. వాళ్ళ వీధిలో డాక్టరుగారు ఒకాయిన నెమలిని పెంచుతుండేవాడు. వాళ్ళ బావమర్షి ఫారెస్టు రేంజరు. గొప్పిలి అడవుల్లోంచి దాన్ని పట్టుకొచ్చి, డాక్టరుగారికి యిచ్చాడట. ఆ నెమలి రోజూ యిళ్ళ కష్పాలమీద అడుకుంటుండేది. అది కదిలినప్పుడల్లా సన్నగా, పాడుగ్గా వున్న దాని మెడ అట్రూ యిటూ ఊయలలూగేది. చంచలమైన దాని చూపులతోపాటు మెడకూడా మూటిమాట్రక్ష కదిలేది. కుచ్చిళ్ళు విచ్చుకుని, రంగులు పరచుకుని పొడుగ్గా, బరువుగా కిందక్షృ జారిన దానిళోక విలానంగా అటూ యిటూ కదిలేది, దాని నడకలో లయ వృ్యం్వ్వ; లాస్యం వుంది; అందం వుంది. అన్నీ కలిసిన దాని నడక అతన్ని ఆకర్షించి ఆకట్టుక్రాన్న, అదొస్తే చదువుకూడా మానేసి దాన్నే చూస్తూ కూర్చునేవాడు. ఆ దృశ్యం కొంతకాలంపాటే వుండినా అది అతని మనసులో ముద్ర వేసుకుని నిలిచిపోయింది. ఆ తర్వాత ఆనర్సు చదివే రోజుల్జో ఆంధ్రా యూనివర్శిటీ పిఠాపురం హాస్టల్లో వుండేవాడు. సముద్రపు వొడ్డున అర ఫర్ణాంగు దూరంలో మూడేళ్ళు గడిపాడు. ఇవన్నీ అతనికి తెలియకుండానే అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. యౌవ్వనారంభవేళ ఆలోచనల తలుపుల్సి తెరచుకుని మనోహరమైన లోకంలోకి

వొళ్ళమధ్య వంతెన ళ్‌7 తొంగిచూసిన తొలిసారి అతనికి అక్కడ సప్తవర్ణాల కాంతులమధ్య కనిపించినది సముద్ర కెరటాలూ కాదు, సూర్యచంద్రులూ కాదు; ఊయల లూగే పడవలూ, ఆడుకునే నెమలీ కావు. అక్కడ-సూర్యచంద్రుల్ని వజ్రాల హారంలో బిగించి, సముద్ర కెరటాల్సి పాదాలలోకి దించి, నెమలి రంగుల్ని వాంటినిండా కప్పుకుని దాని నడకలోని లయనూ, సోయగాన్నీ అభినయాన్నీ అందుకుని అతి మనోహరమైన భంగిమలో ఒక నర్తకి కనిపించింది.

ఆ తర్వాత అతనికి చాలా అభిరుచులు ఏర్పడ్డాయి.

కృష్ణుడంటే అతనికి యిష్టం. కారణం-ఏ బొమ్మలో చూసినా కృష్ణుడి చుట్టూ నాట్యం చేస్తూ గోపికలు కనిపిస్తారు కనుక,

దేవాలయాలంటే యిష్టం. కారణం-్రతి దేవాలయం మీదా అసంఖ్యాకంగా నర్తకిలు రాళ్ళల్లో దాగివున్నారు కనుక,

లేడి అంటే యిష్టం. దాని చూపులు కూడా నర్తకి చూపుల్లా చంచలమై, సోయగమై, ఆకర్షణీయమైనవి కనుక,

అలాగే నర్తకి వేసుకుంటుంది గనుక పొడుగైన ఒంటిజడ అంటే యిష్టం. బుట్టలోలకులంటే యిష్టం. గోరింటాకు పెట్టకోవడమంటే యిష్టం.

అతనికి యిరవై మూడో యేట తొలిసారి ఓ సంబంధం వచ్చింది. అతని బంధువులూ, మిత్రులూ చూసి చాలా చక్కటి సంబంధం అని మురిసిపోయారు. అతనుమాత్రం కచ్చితంగా “నేను చేసుకోను” అన్నాడు. అందుకు అతను చెప్పిన కారణం-ఆ అమ్మాయికి నాట్యం రాదట అని. అ వార్త అలా అలా పాకిపోయి బంధువులందర్నీ చుట్టముట్టింది. “అతగాడికి ఆటగత్తెకావాలట. ఆతని గురించని యిష్టుడు గెంతడం నేర్చుతామా. చేసుకోకపోతే మానె”, అని నోళ్ళు నొక్కుకున్నారు బంధువులు, అతన్ని చూసి చాటుమాటుగా నవ్వుకునేవారు కూడాను.

వచ్చిన నంబంధాలన్నిట్నీ తిరగ్గొట్టేస్తంటే యిప్పుడు అవికూడా రావడం మానేసాయి. అడపాతడపా ఏ దూరపు సంబంధమో రావడంతప్ప తెలిసినవారివరూ అతన్ని వెతుక్కుంటూ రావడంలేదు.

ఇప్పుడిప్పుడు అతనికి భయంకూడా పట్టుకుంది,

ఈ ఏడాదికి యిలా యీ వెన్నెల వెలుగులూ, ఈ వూలగాలులూ వ్యర్థమైపోయినా వచ్చే యేడాదైనా వాటిని సార్ధకం చేనుకోవాలి- అని వ్రతిసారీ

కతి వాళ్ళమధ్య. వంతెన అనుకుంటూనే వస్తున్నాడు. అలా అనుకోవడమే మిగులుతోంది. తొలిరోజుల్లో మల్లెపూలు కొనుక్కునేవాడు. వెన్నెల్లో తిరిగేవాడు. ఇప్పుడు అవన్నీ మానుకున్నాడు. అవి బాధను కలిగిస్తున్నాయి. భయపెడు తున్నాయి. అందుకని వాటి జోలికి వెళ్ళడమే మానేశాడు.

పదిరోజుల కిందట ఓ సంబంధం చూడ్డానికి వెళ్ళినప్పుడు, అమ్మాయిని గదిలోకి తీసుకొస్తుండగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ, అలా వేసిన ప్రతి అడుగుమీదా బరువునంతా వాల్చి సన్నని నడుమును మరీ పక్కకు వాల్చేస్తూ, అలలు అలలుగా చీర కుచ్చిళ్ళను ముందుకు నెట్టుకుని నడిచివస్తోన్న అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి బుట్టలోలకుల్నీ, జడగంటలతో మరీ పొడుగుదేరిన జడనూ గుర్తించి, “ ఈ అమ్మాయికి తప్పక డేన్సు వచ్చుంటుంది” అనుకున్నాడు.

అతని చూపుల్ని కనిపెట్టి ఆతనికూడా వచ్చిన పినతండ్రి అడిగాడు: “అమ్మాయికి డేన్పు ఏమన్నా నేర్చించారేమిటి?” అని.

ఆ ప్రశ్నకు అమ్మాయితోసహా అంతా తెల్లబోయారు.

“డేన్ఫు నేర్పించలేదండి. ఏదో కాస్త నంగీతం మాత్రం వొచ్చు. పాడించమంటారా...” అన్నాడు అమ్మాయి తండ్రి.

“అక్కర్లేదులెండి” అనేశాడు అనంతమూర్తి. ఊరెళ్ళి యింట్లోవాళ్ళతో సంప్రదించి

_ ఉత్తరం రాస్తామని బయలుదేరారు.

అప్పుడే వచ్చి వారం రోజులయ్యింది. కార్డుముక్కన్నా రాయలేదు. ఆవళలివాళ్ళు కంగారుపడుతూ ఉత్తరంకూడా రాశారు.

ఏం రాయించాలో అనంతమూర్తికి తోచకుండా వుంది.

ఇదికూడా యిలానే అయ్యింది. ఇంత చిన్న కోరికకూడా తీరడంలేదు. ఇంత కాలంగా కోర్కెల మొలకలకు నిరీక్షణల నీళ్ళుపోసి పెంచుకుంటూ వస్తే ఆవి ప కాయలనూ కాయలేని గొడ్రాలు చెట్లు అయిపోయాయి. పూసిన పూలు రాలిపోతున్నాయ్సే తప్ప నిలవడంలేదు. ఎన్ని అమృతం కురిసిన రాత్రిళ్ళు తనకు కాకుండా పోయాయో! ఎన్ని గులాబీలు పరచుకున్న ప్రేమ నిండిన సాయంకాలాలు తనకు మిగలకుండా పోయాయో! ప్రకృతిలో ప్రతి అణువునా నిక్షిప్తమైన అందం యిష్పుడు తనకు అందడంలేదు. మోడుబారిపోయిన మొక్కలా అయిపోతోంది జీవితం. ఇంత మబ్బుతునక మీదవంగినా, ఇన్ని చినుకులు 'పైన జారినా, కాస్తంత ఎండపాడ తగిలినా

నాళ్ళమధ్య వంతెన ళ్‌ఠి ఏమ్మీ అనిపించని చైతన్యరహితమైన యీ మోడు జీవితంలోంచి తనకిక విముక్తి వుండదా? చిటారుకొమ్మన మిగిలిన ఆకులా చెప్పాచెయ్యకుండా యీ యౌవనం రాలిపోవడానికి యింకెంత కొలం కావాలి!..

దిగులుతో అతని మనసు రెపరెపలాడింది.

ఆ మర్నాడు వాళ్ళ చిన్నాన్న అతన్ని అంతకుముందు చూసొచ్చిన సంబంధం గురించి అడిగితే, “మీ యిష్టం. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే” అన్నాడు.

తొలిసారి 'పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు బంగారు బొమ్మలాంటి అమ్మాయిని చూసి చేసుకోనంటే ఎంతగా అశ్చర్యపోయారో యిప్పుడూ అంతగానే ఆశ్చర్యపోయారు బంధువులూ, స్నేహితులూను ఆలస్యమైతే మళ్ళీ ఏంబుడ్ధి పుడుతుందో అని

  • మాఘమాసంలో మొదటి లఘ్మానికే పెళ్ళికూడా జరిపించేశారు.

“దిగకేం చేస్తాడు. సాగనప్పుడు కొండమీదికోతికూడా దిగొస్తుంది-అనుకుని" వ్యంగ్యంగా నవ్వుకుని, తగిన శాస్తి జరిగిందన్న తృప్తి చూపొకటి అతను కనిపించినప్పుడు విసిరిన బంధువులు ఓ రోజు ముక్కుమీద వేలేసుకున్నారు.

కారణం౦--

డేను టీచరు ఒకామెను రోజూ యింటికి రప్పించుకుని భార్యకు డేన్సు నేర్పిస్తున్నాడు అనంతమూర్తి!

మొదట్లో అందుకు మలయవతి-అతనికి భార్యే-ఒప్పుకోలేదు.

“చూడు మలయవతీ! ఆ బుట్టలోలకుల్ని తీసయ్యకుండా అలానే వుంచేసుకుంటావు కదూ” అన్నాడు అనంతమూర్తి తొలిరోజున,

అలానే అన్నట్టు అనురాగపు కొసచూపులు విసిరీ, ఆనందపు చిరునవ్వులు వాదిలీ, నునుసిగ్గుతెరల మేలిమునుగును పైకి తీసుకుని మెల్లగా, లోలకులు సన్నగా పలకరించగా, అతి మనోహరంగా తలూపింది.

“జడకూడా అలానే వేసుకో, జడగంటలు అల్లుకున్న జడంటే నాకు చాలా యిష్టం” అన్నాడు.

మరీ పొడవైన చూపుతో అతని హృదయపు లోతుల్లోని అమృతాన్ని తోడితీసి, ఆ తెల్లని అమృతపు పాలనురగలకాంతుల్ని అతని కళ్ళల్లో నిలిపి, మత్తెక్కిన అతని కనుపాపల్ని ఊయలలూగిస్తూ జడగంటల చిరుమువ్వలు తాళం వేయగా

౭0 వాళ్ళమధ్య వంతెన “అలానే” అన్నట్టు తలూపింది.

“నృత్యం అంటే చాలా యిష్టం నాకు, నీకూ యిష్టమేనా?” అన్నాడు ఆమెను

హృదయంలో నిలుపుకుంటూ.

జల్లు జల్లుగా కురుస్తోన్న సిగ్గు తుంపర్లలో తడుస్తూ అతని హృదయపు నీడలోకి మరింతగా వొదిగి గుసగుసలు పలుకుతున్నంత మెల్లగా, సంగీతంతో సానబట్టిన కంఠంతో మనోహరంగా 'ఊ' అంది.

“నిన్ను చూసినప్పుడు నర్తకివేమో అనుకున్నాను. నీ నడకలోని లయన్సూ, నీ చూపుల్లోని భావాల కదలికలో వేగాన్నీ నీ ఆకారపు వొంపుల్లోని సాగసునూ చూసి నీకు డేన్సు వచ్చేమోనని అడిగించాను పెళ్ళిచూపులనాడు. నిన్ను నర్తకిలా చూడాలని మరీ ముచ్చటగా వుంది నాకు. పోనీ వేర్చిస్తాను నేర్చుకుంటావా?”

ప్రియుని సందేశాన్ని మోసుకొచ్చిన గాలితెర గుసగుసలకు చిగురాకు పవిట పులకరించినట్ట ఆమె మనసు జల్లుమంది. భర్త పాగడ్తల గిలిగింతలకు తెరలు తెరలుగా చిరునవ్వు కెరటాలు హృదయంలోంచి కొట్టుకొచ్చి విడిచిన తెల్లటి నురగల్ని కనిపించనీయకుండా పెదాలు బిగబట్టి, భర్త ముఖంలోకి విచిత్రంగా చూసింది మలయవతి. “వేర్చుకుంటే నీకు చాలా త్వరగానే వచ్చేస్తుంది; అట్టే కష్టంకూడా కాదు.” అన్నాడు అతను. భర్త ఆలోచనల్లోనూ హృదయంలోనూ నీడలా, కొంతి వెంట కిరణంలా, జ్వాలవెంట వేడిలా, పూవువెంట తావిలా కలిసిపోవడమేతస్ప విడివడడం మర్చిపోవలస్సిన తొలిరోజుల్లో భర్త కోరికను కాదని: చెప్పలేని మూగమనసుతో గుండెమీంచి జారిపోర్చి పక్కకి జరిగి కూర్చుని భయపడుతూ, బిడియపడుతూ జాలిగా దీనంగా భర్త ముఖంలో చూస్తూ వుండిపోయింది. “నిజం! నీ అందమూ, నీ లావణ్యమూ చక్కగా సరిపోతాయి. నీలాంటిది నర్తకి అయితే లాస్యాన్ని బాగా ప్రదర్శించగలదు” అన్నాడు తిరిగి. తొలిరోజునే భర్త కోరికను మన్నించలేని అసహాయతలో చిక్కుకున్నందుకు కళ్ళల్లో నీరు చేరి, అతని రూపాన్ని మసగ్గా అలిళేస్తోంటే, అతని మనసుకూడా తననుండి జారిపోతుందేమో నన్నంత భయంతో కళ్ళ రెస్పల్ని టపటపా కొట్టుకుని కన్నీళ్ళను ఒత్తుకుని “ఎలాగండీ! ఆసలు ఏమాత్రం నాకు చేతకాదుకదా. ఇప్పుడెలా నేర్చుకొనేద?

వాళ్ళమయధ్య వంతెన 8 ఈ వయసులోనా?” అంది. కళ్ళల్లో తడివైతే అద్దేసుకో గలిగిందిగాని, కంరంలో దుఃఖాన్ని మాత్రం పక్కకు నెట్టేయలేకపోయింది.

“కళకు కావలసింది సాధనగాని వయసుతో సంబంధమేమిటి. నువ్వేంగొప్ప నర్తకివి కానక్కర్లేదు స్టేజిమీద డేను చేసేంత పరిపూర్ణంగా నేర్చుకోనక్కర్లేదు. నాగురించి ఏకాంతంగా డేన్సు చేస్తేచాలు. చిరకాలంగా నాకున్న కోరిక అది. ఇలా చూడు మలయవతీ! నాగురించి ఆ మాత్రం కష్టపడలేవూ!” జాలిగా, పేదవాడి ఆకలి కోరికలా అతి దీనంగా తనను తాను తగ్గించుకుని, తన వ్యక్తిత్వాన్ని ప్రేయసి ముందు కర్చూరంలా మండించే ప్రేమ భక్తుడి ఆశ కళ్ళలాంటి కళ్ళతో ఎదుట నుంచున్న భర్త ముఖం చూసేసరికి నిలువునా ఆమె నీరైపోయి అప్రయత్నంగానే తలూపేసింది. అలా వూపుతూ చటుక్కున ఆగిపోయి “ఏమండీ! నలుగురూ ఏమనుకుంటారో నండీ!” అంది.

“ఏమనుకుంటే మనకేం, మనిష్టం మనది అయినా యింత పెద్ద వూళ్ళో మనల్ని గురించి పట్టించుకునేవాళ్ళే వుండరు” అన్నాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె కళ్ళల్లో తన రూపాల్ని చూసుకున్నాడు.

నెలరోజుల తర్వాత డేన్సు టీచరు ఒకావెను ఏర్పాటు చేశాడు. సాయంకాలంపూట అమెవచ్చి, ఓ గంటసేవు చెప్పి వెళ్తుండేది. అనంతమూర్తి ఆఫీసునుంచి ఆరింటికి యింటికి వచ్చేవాడు. ఆపాటికే డేన్సు పాఠాలు అయిపోయేవి. మలయవతి స్నానంకూడా చేసేసి భర్తగురించి ఎదురుచూస్తూ కూర్చునేది.

ఆ ఇంట్లో వుంటున్నది వాళ్ళిద్దరే. కొత్త సంసారం కాస్త దారిన పడేవరకు వుందామని అతని తల్లివచ్చి నెలరోజులుండి వెళ్ళింది. తండ్రి రిబటైరయ్యాక కాకినాడలోనే యిల్గాకటి కట్టుకుని స్థిరపడిపోయాడు. చదువుకుంటున్న ఆడపిల్లలున్నారు. స్వగ్రామంలో పొలాలు ఉన్నాయి. కాకినాడ అనువుగా వుంటుందని అక్కడ స్థిరపడ్డాడు తండ్రీ. అనంతమూర్తి ఉంటున్నది బెజవాడలో. రైల్వేలో ఉద్యోగం. బంధువులు చాలామంది ఆ వూళ్ళో వున్నారు.

వాళ్ళందరూ అనంతమూర్తి భార్యకు డేన్సు నేర్చిస్తున్నాడని “అవ్వ” అని నోరు నాక్కుకున్నారు. అతను ఎదురైనప్పుడు పలకరించి, వ్యంగ్యంగా వినుర్లు విసిరేవారు. అతను వాటిని ఏమాత్రం లక్ష్యపెట్టేవాడు కాదు.

ఊరిలో ఏమూల నృత్య ప్రదర్శన జరిగినా భార్యను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు, శాస్త్రీయ నృత్యాలుగల ఏ సినిమా వచ్చినా ఒకటికి రెండు సార్లయినా భార్యతోసహా

62 వాళ్ళనుధ్య వంతెన వెళ్ళివస్తుండేవాడు. భారతీయ నృత్యరీతుల్ని గురించి, ముఖ్యంగా భరతనాట్యం, కూచివూడి నృత్యాలను గురించి అతనికి బాగా తెలుసు. వాటిమీద వచ్చిన పుస్తకాలూ, పత్రికల్లో వ్యాసాలూ చదువుతుండేవాడు. తరచుగా ఈ విషయాలన్నీ భార్యకు తెలియజేస్తుండేవాడు. ఆమె నిరుత్సాహంతో నీరుకారిపోకుండా ప్రతి పలుకులోనూ ఆమెను ప్రోత్సహిస్తూ మాట్లాడేవాడు. -

భర్త శ్రద్ధ చూస్తే ఆమెకే ఆశ్చర్యం వేసేది. నేర్చుకుంటున్న తొలి రోజుల్లో ఆమెకు విసుగ్గా వుండేదికానీ కొద్దికొద్దిగా వంటబడుతున్న తర్వాత ఆమెకే అసక్తి కలిగింది. ఎవరూ లేనప్పుడు గదిలో నిలువుటద్దంముందు కూర్చుని తన చూపుల్తో తనే ఆడుకునేది.

క్రమక్రమంగా ఆమె పాదొలలోకి ప్రవాహంలోని ఒరవడీ, గలగలలూ జారి వెనకటి ఆమె కదలికల్గోని హోయలతో కలిసి హంస నడకలోని విలాసాన్సీ పావురం కదలికల్లోని రీవినీ, నెమలి అడుగుల్లోని నాజూకునూ నింపుక్తుంటున్నాయి. ఆమె చూపులు పదునుదేరి కళ్ళ కాసల్ని మృదువుగా కోసి విస్తరించి ఏ మారుమూల వెలుగు రేఖనైనా, ఏ దూరతీరాల్గోని మిణుగురు రేణువునైనా వెంటనే అందుకోగలిగే చురుకుదనాన్నీ గ్రహణశక్తిని అలనరచుకుంటున్నాయి. ఆమె శరీరం ఒకొక్కచోట కుంచించుకుని, మరొకచోట వికసించి, వాంపులు ప్రస్ఫుటమై, వెలుగునీడల్ని స్పష్టంగా విడదీయగలిగే కోణాల్ని నింపుకుని కంచుప్రతిమల్లోని గట్టిదనాన్నీ నునుపునూ ప్రకటిస్తున్నాయి. రూపంలేని పాగమంచులా జారి, మాయలోంచి వాస్తవంలోకి ద్రిగ ఆకారాల్ని ఏర్పరచుకున్న మంచు. బిందువుల ముత్యాల్లా అతని జీవితంమీదకు వాలి కలలు యధార్థమై అనుభవాల ముత్యాలసరాల్లో అతన్ని అలంకరిస్తున్నాయి,

అప్పుడప్పుడూ వెన్నెల వర్షాలు కురుస్తూనే వున్నాయి. అనేక రాత్రిళ్ళు వా ళ్ళ డాబామీద ఆ వెన్నెల్లో తడిసి చలికి రక్షణగా వెచ్చని అనుభవాల దుప్పట్లు కష్పుక్సృన్సి నిద్రపోయేవారు.

చాలాకాలం క్రీతం, కాపరానికి వచ్చిన కొత్తలో, వాళ్ళ పెరడులో మలయవత్తి నాటిన మల్లెతుప్ప ఓ సాయంకాలం మసకచీకట్లో మూడు నక్షత్రాల్లాంటి పూలు పూసింది. వాటిని అతను కొయ్యలేదుగానీ ఆ మర్నాటి నుంచీ ఆఫీసు విడిచాక యింటికొచ్చేష్పుడ్రు రోజూ పావలా మల్లెపూలు కొనుక్కుని పట్టుకొచ్చేవాడు. డాబామీద పక్కలపై చల్గుకునేవారు. రాత్రల్లా ఆ పూల పరిమళం వాళ్ళ చుట్టూ దోమకెరలా అల్గుకునేది. చంద్రుడు వున్న వెలుగు రాత్రిళ్ళు ఆ పూలు వెన్నెల వర్షంలో పడిన వడగళ్ళయ్యేవి,

వాళ్ళమధ్య వంతెన గ్‌! చంద్రుడు లేని చీకటి రాత్రిళ్ళు నక్షత్రాలయ్యేవి. రాత్రల్లా ఆ పూల చక్కటి, మృదువైన గిలిగింతల స్పర్శ, చుట్టూ పరిమళం తెర, ఉదయం లేచేసరికి నిద్రలేని కళ్ళలా పక్కల మీద ఎర్రబడి కనిపించే పూలు, చూసేకొలదీ, సిగ్గుతో కందిన చెక్కిలి ఎరుపుతో నవ్వుతున్నట్టనిపించే ఆ పూల కొంటెతనం-ఆ పగలల్లా అతని ఆలోచనల్లో అవే, జీవితం గుబురునిండా కోరికల మొగ్గలు. అవి యౌవనపు నిండుతో విరిసి, గాలిలో పరిమళాల తెరలు పరిచి, రంగురంగుల ముగ్గులు పెట్టి మర్షాడు తృప్తిగా రాలిపోయేవి. అవి రాలకముందే ఆ పక్కనే మరికొన్ని. రోజూ ఉదయిస్తున్నాడు సూర్యుడు. వడగళ్ళతో హోరున వర్షిస్తోంది వెన్నెల. ఒక్కొక్కప్పుడు జల్టుజల్లుగా కురుస్తోంది. తుంపర్లు జారి పుషప్పాడిలా సన్నసన్నగా రాలుతోంది. ఇంకొకవ్వుడు పాగమంచులా అతని జీవితంచుట్టూ మత్తుగా అల్లుకుంటోంది. మెల్లమెల్లగా మల్సెపూలు వెనకవడ్డాయి. కుంభవృష్టిగా వర్షం కురిసి వెలిసిపోయినా ఆకుల్ని అంటిపెట్టుకుని వాదల్లేక జారే నీటిచుక్కల్లా వెనకబడిపోతున్న మల్లెల పరిమళాల కొనర్లు ముక్కు పుటాల్ని పట్టుకొని వేలాడుతున్నాయి. జీవితం రసమయంగా, శోభాయమానంగా, రాగభరితంగా అనిపిస్తోంది. కాలానికి పగ్గాలు వేసి, తొపీగా కలల్ని నెమరేసుకుంటున్నారు. నెలరోజులుగా రోజుకి పదిసార్లన్నా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన పెళ్ళిరోజు చివరకు ఓ రాత్రి చిక్కటి చీకట్లను చీల్చుకొని బైటపడింది. ఒక్కొక్క వెలుగురేఖనే విప్పుకుని నిండుగా వికసించాడు సూర్యుడు. అతను జార్చిన కాంతి వుస్పాడి లోకమంతా దట్టంగా పరచుకుంది. ఆరోజు అనంతమూర్తి ఆఫీనుకి సెలవు పెట్టాడు. ఆ పగలల్లా ఆమెను తన కళ్ళల్లోనే ప్రతిష్టించుకున్నాడు. సాయంకాలం మిత్రులకు ఘనంగా పార్టీ యిచ్చాడు. ఆ హడావిడి అంతా పూర్తయ్యేసరికి ఏడయ్యింది. తీరుబాటుగా కూర్చుని పెళ్ళినాటి ముచ్చట్లు నెమరేనుకుంటున్నారు. అనంతమూర్తి చటుక్కున లేచివెళ్ళి పెట్టెలోంచి ఓ పెద్ద పార్చిలు పట్టకొచ్చి అమె చేతిలో పెట్టాడు. కళ్ళ రెప్పల్చి ఎగరేసి “ఏమిటి?” అన్నట్టు చూసింది. “విప్పు, నీకే తెలుస్తుంది”

6౮4 వాళ్ళమధ్య వంతెన ఆమె విప్పింది. కళ్ళు జిగేల్‌మన్నాయి. మెరుస్తోన్న రంగు రాళ్ళతో ఆభరణాలూ, ఆ అడుగున ముదర రంగులో మధ్యమధ్య జరీ అల్లకం డిజైనులతో ఏవో బట్టలూ- ఆమె ఆశ్చర్యపోయింది. పెళ్ళిరోజు కానుకగా పొద్దున్నే సింధూరం రంగు గద్వాల్‌ చీర భర్త యిచ్చాడు. ఇప్పుడివన్నీ ఏమిటో అమెకు అర్ధంకాలేదు. బట్టలు పైకితీసి మడతలు విప్పింది. అర్థమయ్యింది. డేన్సు డ్రెస్సు అది! “అద్దెకు తెచ్చాను. ఇవ్వాళ నువ్వు ఇవన్నీ కట్టుకుని డేన్సు చెయ్యాలి. ఫొటోలు తీద్దామని రమణని అడిగి ఫ్లాష్‌ కెమెరా పట్టుకొచ్చాను” అన్నాడు అనంతమూర్తి. “అప్పుడే.ఏం వస్తుందండీ. కరణాల్ని కూర్చడం యిష్పుడిష్పుడే చేతనవుతోంది. ఏడాదికూడా కాలేదుకదా. ముద్రల్నయితే పట్టగలను కానీ వాటిని వరసగా కూర్చడం అంతగా రాదే” “ఎలా వొస్తే అలా చెయ్యి, చాలు. అసలు ఆ డ్రెస్సులో ఎలా కదిలినా అందంగానే వుంటుంది”. అక్కడికీ ఆమె సందేహిస్తూ నుంచుండిపోయిందిగానీ అతను అతి జాలిగా, దీనంగా మరీ మరీ అడిగేసరికి “అలాగేలెండి” అని చెప్పి లోపలకు వెళ్ళింది. పావుగంట తర్వాత తలుపులు తీసుకుని వచ్చి “ఎలావుంది ఈ డ్రెస్సు. నాకు నప్పిందా?” అని అడిగింది. అతను మాట్టాడడంకూడా మర్చిపోయి కళ్ళార్పకుండా ఆమెనే చూసూ వుండిపోయాడు. ఇంతకు ముందెప్పుడూ కనీసం కల్చ్పనలోకూడా చూడనంత అందంగా కనిపిస్తోంది ఆమె. యౌవనాన్ని ఎక్కడికక్కడ బంధించేసిన బట్టల్లో మామూలుక్షనా పుష్టిగా, ఆరోగ్యంగా, అందంగా వుంది. ఆ గదిలో ఆమె చుట్టూ రేడియో, ఎలక్టి! లైటు వంటి ఆధునిక పరికరాలు కన్చిస్తున్నాయిగాని లేకపోతే ఆమె కొన్ని తరా౭ క్రితంలో వున్నట్టు, ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఏ రాచరికపు వ్యవస్థలోన్స జీవిస్తున్నట్ట్బ, కలకంటున్నట్ట అనిపించివుండేది అతనికి.

“ఎల్సెలెంట్‌, బ్రహ్మాండంగా వుంది” అన్నాడు. ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగ కావలించుకున్నాడు. ఆమె భుజానికి తగిలించుకున్న దండకడియంలో రాతిపా రాలినచోట యిత్తడి రేకు గుచ్చుకోగా ఆమెను ఒదిలేసి చిన్నగా నవ్వుతు “త్రల్రివితక్కువగా ప్రవర్తిస్తున్నానుకదూ, ఇంతకాలానికి నా కోరిక తీరింది. నన్ను నే;

వాళ్ళమధ్య నంతెన రక్‌ మర్చిపోయాను. ఏదీ చక్కటి ఫోజు యివ్వు, ఫొటో తీస్తాను” అన్నాడు.

ఆమె మెల్లగా కదిలివెళ్ళి అతని ఎదుట మూడు గజాల దూరంలో నిలుచుని శరీరాన్ని ఓ పక్కగా తిప్పి, ఎడమకాలును కొద్దిగా వంచి, శరీరం బరువునంతా దానిమీదుగా పాదంమీద నిలిపి, కుడికాలును కూడా అదే రీతిలో అట్టేబరువును ఆన్బకుండా తేలిగ్గా చేర్చి, రెండు చేతుల్నీ నేలకు సమాంతరంగా చాచి, అలా చాచిన కుడిచేతిని రొమ్ముల ఎదుటికి మడిచి, రెండు చేతుల్తోనూ త్రిపతాక ముద్రలు పట్టింది. అతను ఏంగిల్‌ సరిచూసుకుని ఫొటో తీళాడు.

శిల్పంలా నిల్చున్న ఆమె ఆ భంగిమలోంచి కదిలి లయానుగుణంగా, కాలప్రమాణంతో ఆయా స్థితులకు గల హస్తముద్రలు పడుతూ పాద విన్యాసాల్ని చూపుతూ నమస్కరించింది.

కా ఆ తర్వాత సన్నగా పాడుతూ, పాటకు తగిన అభినయంచేస్తూ ఒక స్థితినుండి మరొక స్థితికి చటుక్కున కదులూళూ, దానికి అనుగుణంగా కరణాలను కలుపుకుని, అంగహారాలను అల్లుకుని, ఒక్కొక్క అంశాన్నీ అతనిముందు వుంచింది.

అతను మరికొన్ని ఫొటోలు తీశాడు.

ఆమె వచ్చి అతని పక్కనే కూర్చుని “సరిగ్గా రాలేదుకదండీ. తాళం ఎవరైనా వేసి పాడుతూ వుంటే బావుండేది” అంది. కళ్ళు ఎగరేసి పక్కవాటుగా చూపుల్ని జార్చి “ఎలా వుందండీ, చెప్పరూ” అంది తిరిగి కుతూహలంగా.

“ఇంకా కొత్తకదా, మరో రెండేళ్ళు యిలాగే నేర్చుకుంటే బాగానే రావొచ్చు; _ అభినయం చక్కగానే కుదిరింది గానీ తీర్మానాల్లో తాళకట్టు దెబ్బతింటోంది మరి. ఆటలో ఇంకా నాజూకు వొచ్చి చేరాలి. మరికొంత కాలంపోతే అదే వొన్తుందనుకో. అనలు ఏడాదిలో ఈమాత్రం నేర్చుకోవడమే గొప్పకదా. ఎలాగైతేనేం నాకోరిక తీర్చావు” అన్నాడు ఆమెను హృదయానికి హత్తుకుంటూ. అలసిపోయిందేమో రొమ్ములు ఎగిరిపడుతున్నాయి. అమె విడుస్తోన్న నిశ్వాసాలు మెడమీద గిలిగింతలు పెడుతున్నాయి. “నా పంతం నెరవేరడానికి నిన్ను యిబ్బంది పెడుతున్నాను కదూ” అన్నాడు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

కదిలి; విరిసి, విష్పారి, వాల్చడీన కనురెన్సల కిందనుంచి చూన్తూ “ఊహూం” అంది ఆమె. అతని కళ్ళల్లో వాలుతోన్న మత్తుపారల్ని గుర్తించి, నవ్వుకుని, మెల్లగా ఒడిలోంచి జారి లోపలకు వెళ్ళిపోయింది.

ర్‌ం వాళ్ళమభ్య వంతెన

ఆ రాత్రి వాళ్ళ డాబామీద వెన్నెలలేని చీకట్లో, ఈ ఏడాదిగా జరిగిన విశేషాలన్నీ ఒక్కొక్కటే మననం చేసుకుంటూ బాగా పొద్దుపోయే వరకూ కూర్చుండిపోయారు

మూడు రోజుల తర్వాత ఫొటో ప్రింటులు పట్టుకొచ్చాడు అనంతమూర్తి. మరీ బాగా వచ్చిన ఫొటోకు గ్రేముకూడా వేయించాడు. ఫొటోలలో తనని తాను చూసుకుని మురిసిపోయిందామె. “ఇంకా బాగా కృషి చేసి నేర్చుకోవాలి” అనుకుంది.

ఇప్పుడు ఆమెకు అడుగడుగునా నాట్యమే కనిపిస్తోంది. వంట చేసేప్పుడు స్టాలోంచి ఎగసిన జ్వాలలోనూ, తడిపి ఆరేసిన దండెంమీది చీర కదలికలోనూ, దేవుడి ముందు వెలిగించిన అగరువత్తి పాగ మెలికల్లోనూ, చెయిజారి ఒలికిన నీళ్ళు పల్తానికి జారిన చాలులోనూ- ప్రతిచోటా నాట్యరూపాలే కనిపిన్తున్నాయి. ప్రతి వస్తువు కదలికలోనూ కొత్తదనం కనిపిస్తోంది. చూపుకి కొత్త కోణాలు ఏర్పడ్డాయి. ఇంతకుపూర్వం జీవితం ఒక నాటకం అనుకునేది. ఇప్పుడు అదాక “బాలే”గా అనిపిస్తోంది.

ఆమె ఉత్సాహానికి ఆదిలోనే హంసపాదు తగిలింది. తండ్రికి రక్తపోటు వస్తే సాధ్యమైనంత త్వరగా తిరిగి వచ్చేద్దొమని వెళ్ళింది. అనంతమూర్తికి వీలుగాక ఒక్కర్తినే పంపించాడు. వారం' రోజుల్లో తగ్గింది కాని, ఎలాగూ సంక్రాంతి రానేవస్తోందికదా, అల్లుడు వస్తే ఏకంగా వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళిపోవచ్చునని ఆపేశారు ఆమెను.

పండక్కు అతను వెళ్ళాడు. కొత్తల్లుడికి పెట్టుపోతలవీ బాగానే జరిపారు. ఉన్న ఐధు రోజులూ బాగానే గడిచిపోయింది. ఇల్లుకదిలి బయటికే వెళ్ళలేదు. ఒకరోజు సాయంకాలం మాత్రం యిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళారు. ఆ

బయలుదేరి వచ్చేస్తూ బంధువులకు చెప్పడానికి వెళ్ళినప్పుడు యించుమించు అంతా ఒకేవిధంగా దీవించారు-ఆర్నెల్లు తిరక్కుండానే పుట్టింటికి నిండుగా రావాలి నుమా-అని, ఆ మాటే ఆమె "స్నేహితురాలు, చూడ్డానికి వచ్చి అంది. అప్పుడు మలయవతి “ఆ..ఏం పిల్లలో పోనిస్తూ, మరో అయిదేళ్ళ వరకూ పిల్లలు కలక్కపోతేనే' మంచిది” అంది.

ఆ మాటల్ని వాళ్ళ నాయనమ్మ ఆలకించినట్టుంది. “ఓహో! మీ ఆయన నిన్ను | కోతినిచేసి ఆడిస్తున్నాడుకదే, అందుకా యీ ఆలోచన” అని దెప్పిపొడిచింది. అఆ మాటలు అనంతమూర్తికి వినిపించాయి.

బాధపడ్డాడు.

రైల్లో “నిన్ను కోతినిచేసి ఆడిస్తున్నానా?” అని అడిగాడు అనంతమూర్తి.

వాళ్ళమధ్య వంతెన 67

బయలుదేరిన దగ్గర్నుంచీ భర్త ముభావంగా ఎందుకున్నాడో ఆమెకు అర్థమయ్యింది. “ఇందుకా మీరిలా మూతి ముడుచుక్కూచున్నారు. భలేవారే” అని నవ్వేసింది. ఆయన మూడ్‌ని మార్చుదామని ఏమిటేమిటో చెప్తోంది. ఆమెకు రైలు ప్రయాణమంటే యిష్టమట. చిన్నప్పుడు ఎక్స్‌కరన్లకు వెళ్ళినప్పుడు కిటకీ పక్కసీటు గురించి తరచు పోట్టాడుకునేవారట. ఇలా ఏమిటేమిటో చెప్తోంది.

ఆమె చెప్తున్నప్పుడు ఆమె చూపులు జ్ఞాపకాల్లోకిజారి, పసిపాప చూపుల్లోని కుతూవాలంతో కదిలి, యావనంలోని కీవితో నిలకడగా కొద్దిసేవు నిలుచుండిపోతున్నాయి. బాల్యంలోని కొంటెతనంతో గెంతి, అలసటేలేని ఉత్సాహంతో కుతూహలం ఎక్కువైనప్పుడు కళ్ళ రెప్పలు టపటపా కొట్టుకుని అంతలోకే చటుక్కున అగి, సిగ్గుతో ముడుచుకుపోయి, కొద్దికొద్దిగా తెరచుకుని చూపుల్ని దాగుడుమూత లాడిస్తున్నాయి. మధ్య మధ్య వాలుగా, కళ్ళకొసలలోంచి విలాసంగా చూసి, అతని ఆలోచనల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఆమె.

అమె పన్నిన చూపుల ఉచ్చులో చిక్కుకుపోయి శ్రద్ధగా ఆలకిస్తోన్న అనంతమూర్తి మధ్యలో ఎందుకో తలెత్తి అటు చూశాడు. అవతల కూర్చున్న వ్యక్తి తమవైపే చూస్తున్నాడు. అనంతమూర్తి ఇటు చూశాడు. ఈ పక్క కూర్చున్న వ్యక్తీ అలానే చూస్తున్నాడు. ఎదుటికి చూశాడు. ఆ ఎదుటి వ్యక్తీ అంతే. మూడు వైపులా చూశాడు. అందరి కళ్ళూ యిటేవున్నాయి. అనంత మూర్తి చూడ్డం చూసి, తప్పుచేసినట్టు చూపులు తిప్పేసుకుంటున్నారు వారు.

ఆమెచెప్పడమైతే మెల్లగానే చేస్తోందికానీ కళ్ళను తిప్పడంవల్లే అందరి చూపులూ యిటు వాలుతున్నాయి. అలా కళ్ళతో మాట్లాడడం ఆమెకు కొత్తేమీకాదు..చాలా సరదాగా కూడా వుండేది అతనికి. ”

ఇంట్లోనయితే బావుండును కాని యిక్కడేమిటి? అతనికి సిగ్గుగా వుంది, ఆమె మాత్రం అదేమీ గుర్తించినట్టులేదు. రాజమండ్రీ ఎక్స్‌కర్షన్‌ అనుభవాలూ, అక్కడ చూసిన విశేషాలూ చెప్తోంది.

ఆమె ఆపేటట్టులేదని మధ్యలోనే అతను అడ్డుకుని ఆ మధ్య అస్సాంలో జరిగిన రైలు ప్రమాదాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు.

ఆమె కళ్ళను యింతింత చేసుకుని చక్రాల్లా గుండ్రంగా తిప్పి మధ్యలో కనుపాపల్సి ఆశ్చర్యంగా, కళ్ళను ఆర్పి వెలిగిస్తూ బితుకు బితుకుగా, భృకుటి ముడిచి

రతి వాళ్ళమధ్య వంతెన కనురెప్పల్ని కొద్దిగా వాల్చి చూపుల్ని పగ్గాలతో వెనక్కులాగి బిగించి పట్టుకుని ప్రశ్నార్థకంగా; పైళత్తి పట్టుకున్న చోటినించి దబ్బున జారిపడి కుప్పగా నిస్తాణగా వాలిన చూపుల్తో జాలిగా చూస్తూ, మధ్యమధ్య కళ్ళతో పలకరిస్తూ, అడుగుతూ, అవునంటూ వింటోంది. చూపులతోపాటు తలనూ కదుపుతోంది సెదాలనుకూడా ముడుస్తూ కొసమెలికలు తిప్పి, ధనుస్సులా నిలిపి, సంధించినట్టు లాగి, అభినయపూర్వకంగా తలూపుతోంది

మధ్యమధ్య రహస్యంగా అతను చుట్టూ చూస్తున్నాడు అందరి చూపులూ యిటే వున్నాయి. ఏదో మాట్టాడుకుంటున్నట్టన్నా, వాళ్ళ చూపుల్లో కుతూహలం వుంది. దొంగతనం వుంది, చిరునవ్వు వుంది

అనంతమూర్తికి అదోలా వుంది. మలయవతి ఈ కళ్ళ కదలికల్ని కట్టిపెడితే బాగుండును అనుకుంటున్నాడు. నలుగురూ చూస్తున్నారన్న ఆలోచనైనా లేదేమిటి? “అతనికి చిరాకుకూడా కలిగింది.

ప్రయాణం పొడువునా అతను అలాంటి యిబ్బందిని ఎదుర్కొంటూనే వున్నాడు. బైటికే చెప్పేద్దిమనుకున్నాడుగాని మళ్ళీ ఆమె బాధపడుతుందేమో అని ఏమీ అనలేదు. భరిస్తూనే కూర్చున్నాడు. బెజవాడలో దిగిపోతున్నప్పుడు తమచుట్టూ కూర్చున్న జనం తమనే చూస్తున్నట్టనిపించింది అతనికి స్టేషను దాటి బైటికొచ్చి తేలిగ్గా ఊపిరి తీశాడు,

వెళ్ళినరోజు బడలికగా వుండి డేన్సు టీచరును పిలిపించలేదు. మర్హాడు కబురంపిస్తే మళ్ళీ మామూలుగా రావడం ప్రారంభించింది అమె. చురుగ్గా పాఠాలు సాగుతున్నాయి.

ఒకరోజు అనంతమూర్తికి తలనొప్పిగా వుంటే ఓగంట ముందుగా యింటికి బయలుదేరాడు. రెండు రోజులుగా రొంపచేసింది. తగ్గలేదు. ఒళ్ళంతా బరువుగా వుంది. మధ్యాహ్నంనించి తలనొప్పిగా వుండి ఇంటికెళ్ళి ఏ అమృతాంజనమో రాసుకుని, టీ తాగి, కాస్సేపు నడుం వాల్చుదామని బయలుదేరాడు. రిక్షా సగందూరం వచ్చాక బైముచూసుకుంటే అప్పుడే డాన్సు పారం పూర్తికాదుకదా అనిపించింది. బైట హోటల్లోనైనా టీతాగి వెళల్ళామని గవర్నరుపేట సెంటరు దగ్గర రిక్షానుఆపించి దిగిపోయాడు నాలుగడుగులైనా వేసాడోలేదో ఎదురుగ్గా పరాంకుశంగారు కనిపించారు. పినతండ్రి కొడుక్కి పిల్లనిచ్చిన మావగారు ఆయన. మంచి హోదాలో వుండి రిట్రైరయిన వ్యక్తి ఆయనంటే అందరికీ గౌరవమే సాయంకాలంపూట బారేజీవరకూ షికారుకు

వాళ్ళమధ్య వంతెన రం వెళ్ళడం అలవాటు “రావోయ్‌, అలా వెళ్ళొద్దాం” అని పిలిచారాయన. పిలిస్తే తప్పించుకోలేకపోయాడు. అక్కడికీ “మధ్యాహ్నంనించీ తలనొప్పి వస్తోందండీ; ఆఫీసులో కూర్చోలేక యింటికి బయలుదేరాను.” అన్నాడు గాని ఆయన “చల్లగాలి తగిలితే అదే తగ్గిపోతుందిలేవోయ్‌” అని తేలిగ్గా తీసిపారేశారు.

గంటన్నరసేపు ఆయనతో గడపాల్సి వచ్చింది అనంతమూర్తికి. టీ అయినా పుచ్చుకోలేదు. తలనొప్పి మరీ ఎక్కువగా వుంది ఒళ్ళు బాగా నొప్పులు పెట్టాయి. నడుం లాగేస్తోంది. ఆఫీసునుంచి తిన్నగా యింటికెళ్ళకుండొ యిలా రావడం బుద్ధితక్కువ అనిపించింది. ఇంటికెళ్తే ఈ బాధలన్నీ లేకపోనుకదా అనుకున్నాడు. వెళ్ళకపోవడానికి కారణం భార్యే అని అమె మీదా, దార్లో కనిపించి యివతలివారి కష్టసుఖాలైనా ఆలోచించకుండా కూడా వెంటబెట్టుకుపోయిన గౌరవంవున్న ఆ పెద్దమనిషిమీదా కోపం వచ్చి లోలోపలే చిరాకుపడ్డాడు. విసుక్కున్నాడు. ఆయన్ని అలావెళ్ళనిచ్చి రిక్షాలో కూలబడి యిల్లు చేరుకున్నాడు.

“ఆఅలస్యమయిందేం?” అంది మలయవతి ఎదురొచ్చి.

“ఏమీలేదు” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయాడు.

భర్త ముఖంలోని అలసటను, చిరాకును గుర్తించి అతని వెనకనే గదిలోకి వచ్చింది. బట్టలయినా మార్చకుండా మంచంమీద సాగిలబడుతున్న భర్తనుచూచి ఆశ్చర్యంగానూ, గాభరాగానూ “ఏమిటండీ, మీ ఒంట్లో బాగాలేదా?” అంది. నొసలు తాకిచూసింది. మంచులా చల్లగా తాకిన ఆమె చేతిని తొలగిస్తూ కళ్ళు విప్పకుండానే “మరేంలేదు, తలనొప్పిగా వుంది. టీ వుంటే పట్టకురా” అన్నాడు.

గ్లాసుతో టీ తెచ్చియిచ్చింది. అమృతాంజన్‌ తెచ్చి కణతలకి రాస్తూ కూచుంది. ఆమె ఆదుర్దాను చూస్తే అనవసరంగా ఆమెనుకంగారు పెడుతున్నానే అనిపించింది అతనికి. లేచి బట్టలు మార్చుకుని కూచుందామా అనుకున్నాడు.

“వాంట్లో బాగోకపోతే సెలవుపెట్టి వెంటనే యింటికి వచ్చేయలేకపోయారా? యింతసేపూ బయట ఎందుకు తిరుగుతున్నారూ ” అంది ఆమె మందలింపుగా.

అతనేమీ మాట్లాడలేదు. విపరీతమైన కోపం వచ్చింది. ఒకసారి కళ్ళు తెరిచిచూసి మళ్ళీ మూసుకున్నాడు. రాత్రికి భోజనం చెయ్యలేదు. ఆమె బలవంతంచేస్తే పాలు మాత్రం తీసుకున్నాడు,

70 వాళల్ళమధ్య వంతెన

పొద్దుటికి బాగా జ్వరం వచ్చింది. వాళ్ళంతా నొప్పులు కదిలే ఓపిక లేదు నడుమంతా విపరీతంగా లాగేస్తోంది దానికితోడు తలనొప్పి మలయవతి కంగారుపడి డాక్టరును పిలిపించింది. “ప్లూ తగిలింది. మరేం కంగారు పడనక్కరలేదని చెప్పి, మందిచ్చి వెళ్ళాడు డాక్టరు ఆరోజు డేన్సు టీచరు వస్తే రెండు రోజులపాటు రావాద్దని చెప్పి పంపించేసింది. మలయవతి.

మర్నాటికి తలనొప్పి కాస్త తగ్గింది. వొళ్ళు నొప్పులు యింకా తగ్గలేదు. గబగబా వంట పూర్తిచేసుకుని వొచ్చికూర్చుంది. “నిన్న భలే భయం వేసింది లెండి. ఒంటరిదాన్ని. ఇంటికి టెలిగ్రాం యిద్దామనుకున్నాను. డాక్టరు వచ్చి ఫ్లూ అనేవరకూ మనసు మనసులో లేదు” అంది.

అనంతమూర్తి అమె ముఖంలోకి చూడలేక చూపులుమార్చుకున్నాడు, కొద్ది సపయ్యాక యిటు తిరిగిచూస్తే-

“నూటమూడు డిగ్రీల జ్వరం అనేసరికి మతిపోయింది. దానికితోడు జ్వరతీవ్రతతో మీరు మూలుగుతోంటే మరీ భయపడిపోయాను” అంది.

అతను గట్టిగా కళ్ళుమూసుకుని అవతలి వైపుకు వత్తిగిల్లాడు.

“ఏమిటి! మళ్ళీ తలనొప్పి వస్తోందా? వుండండి. అమృతాంజనం రాసుకుందురు గాని” అని గబగబా వెళ్ళబోయింది.

“వొద్దు అక్కర్లేదు” అన్నాడు గట్టిగా.

ఆ మాటల్లోని తీక్షణతకు అమె తెల్లబోయి చూస్తోంటే అతను తననితనే సమాధానపరచుకుని “కాస్త టీ కలిపి పట్టకురా మలయవతీ! యివ్వాళ ఆకలి ఎక్కువగా వుంది” అన్నాడు.

అర్ధగంట క్రితం బత్తాయిపండు వలిచేదా అని అడిగితే “వొద్దు, ఆకలిగా లేదు” అన్న భర్త యిప్పుడు ఆకలేస్తోంది అంటే ఆశ్చర్యం వేసింది ఆమెకు. “ఈ టీలూ అవీ తాగితే ఆకలేం తీరుతుంది. రెండు బత్తాయిలు తినండి” అంటూ గబగబా ఓ బత్తాయి పండు ఒలిచింది. “కాస్పేపు లేచి కూర్చున్నాడు. ఆమె ఒక్కొక్క తొనే యిస్తోంటే తిన్నాడు. కడువు నిండుగా వుంది యికచాలు అని అంటున్నా వినిపించుకోకుండా మరో బత్తాయికూడా వొలిచేసింది. “ఒక పండుతోనే ఆకలేం తీరిపోయిందండీ, యిదిగో యిటు చూడండీ... యిలా చూసి చెప్పండి. నిజంగా ఆకలి తీరిందా...అబద్దం. మరీ

వాళ్ళమధ్య వంతెన 77 చిన్నపిల్లవాళ్ళు అయిపోతున్నారు మీరు. తీసుకోండి. పోనీ యీ నాలుగు తొనలూ...”

ఆ చూపులు, అ కదలికలు, ఆ కళ్ళల్లో విలాసం, ఆకర్షణ, గిలిగింతలు, దాగుడుమూతలు, ఆ ముఖంలో అభినయం అతనికి చాలా చికాగ్గా అనిపించాయి “ఉద్రేకాన్ని రెచ్చగొడుతున్నట్టు ఏమిటా తళుకుబెళుకులు? ఎందుకీ సంరంభం? మామూలుగా ఎందుకు ప్రవర్తించదూ?" అనుకున్నాడు.

ఆమెచేతిలోంచి చివాల్న ఆ నాలుగు తొనలూ లాక్కుని కసిగా నమిలి, తొక్కల్తోనే మింగేసి, “నాకు నిద్రాస్తోంది. పడుకుంటాను. నువ్వెళ్ళి నీ పనిచూసుకో” అని చెప్పి ముసుగు లాక్కున్నాడు

అమెకు ఏమిటో అర్ధంకాక తెల్లబోయి లేచివెళ్ళిపోయింది.

మర్నాటికి జ్వరం పూర్తిగా తగ్గింది. పధ్యం పుచ్చుకున్నాడు కాని ఆఫీసుకు " వెళ్ళలేదు. ఆరోజుకూడా యిల్గాంటి నంఘటనలే ఎదురుపడినప్పుడు సహనం అవధులుదాటిపోయి, “అలా కళ్ళుతిప్పి మాట్లాడకపోతే మామూలుగా మాట్టాడ లేవూ?” అన్నాడు ఆమె ముఖం మాడ్చుకుంది. ఆ ఉక్రోషంతోనే ఆరోజు డేన్సు పాఠాలుకూడా చెప్పించుకుంది. నిజానికి ఆ వేళకూడా సెలవు తీసుకుందామని అనుకుందిగాని పంతంవాచ్చి ఆరోజు పాఠాలు చెప్పించుకుంది.

అతను ఎవరినీ ఏమీ అనలేక తననుతానే కసురుకున్నాడు. తనమీద తనకే కోపం వచ్చింది. ఒకరోజంతా వాళ్ళు ఎడముఖం పెడముఖంగానే మసిలారు, మర్షాడు మళ్ళీ మామూలుగా మెసలక తప్పలేదు. ఇంట్లో మూడో వ్యక్తి వుంటే ఎన్నిపంతాలకు పోయినా సాగేవి. దానికితోడు తను అలా ప్రవర్తించడం అర్థంలేనిదిగా ఆతనికే అనిపించింది. భార్యను అనవసరంగా కసురుకున్నందుకు సిగ్గుపడ్డాడుకూడాను.“ఏదో ఎగతాళికి అంటే అలా బాధపడతావేం?” అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుని. ఆమె తీగలా అతన్ని అల్లుకుపోయింది.

శ్రీరామనవమికి ఊళ్ళో పందిళ్ళువేసి నాటకాలవీ వేస్తున్నారు. వాళ్ళ వీధిలోకూడా పందిరి వేశారు. ఆయన దగ్గర చందాకూడా తీసుకెళ్ళారు. నాలుగోరోజున భరత నాట్యం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆరోజున అనంతమూర్తి భార్యను వెంటబెట్టుకుని వెళ్ళాడు. భరతనాట్యం చేసే అమ్మాయిలు యిద్దరీ. అ యిద్దరికీ ఎనిమిదీ, పదేళ్ళకన్నా మించి వుండవు. చిన్న పిల్లలైనా చక్కగా చేశారు.

ఇంటి కెళ్ళాక “ఎలావుంది?” అని అడిగాడు అనంతమూర్తి,

72 వాళ్ళమధ్య వంతెన

“చాలా చక్కగా వుంది. చిన్నప్పుడు ఏ అయిదో ఏటనుంచో నేర్చుకోవడం ప్రారంభించి వుంటారు” అంది ఆమె. “మరి మీకెలా అనిపించింది? ఒఅన్నట్టు అతనివైపు చూసింది

“కదలికలు బాగున్నాయిగాని ముఖంలో సరైన ఎక్స్‌ప్రెషన్‌ లేదు” అన్నాడు.

“చిన్న పిల్లలకి అదెలా వొన్తుంద౦డీ, నయను వచ్చేకాలదీ పరిపూర్ణత వాన్తుందిగాని. నవ్వుతూ నవ్వుతూ చటుక్కున వెనక్కు తీసేనుకోవడం, జారి పోతున్నట్టగాక బిగించిపట్టుకుని పగ్గాలను ఒదులుతున్నట్టు చూపుల్ని ఒదలడ౦ం, ముఖ భంగిమల్లో కృత్రిమంగానే అయినా వాస్తవికతను కనబరచడం-యివన్నీ వయసుతో వచ్చే విద్యలుగాని పుట్టుకతో వచ్చేవికావు.

“ధీరీకూడా బాగానే వచ్చే” అన్నాడు నవ్వుతూ.

మంచులోని మొగ్గలా, కన్నెపిల్ల మనసులా సిగ్గుతో ముడుచుకుపోయిన కళ్ళలోంచి జారీజారని చూపుల్లో చూసి, చిరునవ్వు ఒలికీ ఒలకనట్టు పెదాల్ని కదిపింది.

ఆతని మనను చటుక్కున ఆలోచనల్లోకి ఎగిరింది. ఇంతకుముందే ఆమె అన్న మాటల్ని మననం చేసుకుంటున్నాడు.

ఆమె ఏమిటో అడిగినట్టుంది. పలక్కపోతే అతన్ని కదిపి “ఏమిటండీ ఆలోచిస్తున్నారు?” అంది.

“అబ్బే ఏంలేదు” అన్నాడు అతను.

“భలేవారే! పరధ్యాన్నంకూడా వస్తోందేమీకు. పక్కలు డాబామీద పరిచేదా, యింట్లోనా అంటే ఏమీ లేదంటారేమిటి” ఆంది నవ్వుతూ.

“అవును... అవును..అదే చిరునవ్వు...అదే అదే” అనుకున్నాడు అతను ఆ ఎదుటి గోడమీద మలయవతి నాట్య భంగిమ ఫొటోలోకి చూస్తూ,

ఆమెకు ఏమీ అర్థంకాలేదు. “ఏమోబాబూ, నాకు నిద్రొస్తోంది. నేను గదిలోనే పడుకుంటాను” అని ఆమె వెళ్ళిపోయింది.

ఆ రాత్రి చాలా సేపటివరకూ ఆతనికి నిద్రపట్టలేదు.

మర్నాడు ఆఫీసుకు వెళ్తున్నప్పుడు “సాయంకాలం త్వరగా వస్తారుకదూ, మర్చిపోకండి. మీతో పనుంది” అంది వాలుగా చూసి.

“అలాగేలే” అని ముఖం చిట్టించుకుని వెళ్ళిపోయాడు. మనసును ఎంతగా సమాధాన పరచుకుంధామన్నా వీలుకావడంలేదు అతనికి. ఆ మధ్య డేన్సు చేసిననాడూ

వాళ్ళమధ్య వంతెన 73 యిలాగే చూసింది. ఇలాగే కళ్ళతోనే పలకరించింది. ఆ రెప్పల్ని వాల్చ్బడమూ, ఆ చూపుల్ని జార్చ్భడమూ, ఆ పెదాల్ని మెలికలు తీప్పడమూ-అన్నీ అలానే వున్నాయి. కృత్రిమంగానే వాస్తవికతను (వ్రదర్శిస్తోంది!-అతని మనను మబ్బు వట్టినట్టు అయిపోయింది.

సాయంకాలం 'కావాలనే' వేగంగా యింటికి వెళ్ళలేదు. రాత్రి బాగా పొద్దుపోయేక వెళ్ళాడు. ఆమెకు ఏదో వంక చెప్పాడు.

“నేనూ అదే అనుకున్నానులెండి, ఏ 'స్నేహితుడో తగిలుంటాడని. ఎనిమిది కావస్తోంది, భోజనం వడ్డించెయ్యమంటారా?”

ఆమె ముఖంలోకి పట్టిపట్టి చూశాడు. ఎక్కడా బాధపడుతున్న ఛాయలే లేవు. మరీ మరీ అమె చెప్పినప్పుడు అమెను నిరుత్సాహపరచాలనే ఆలన్యం చేశాడు. కాని ఆ ధోరణే కనిపించలేదు. ఆమె బాధపడకుండా వుంటుందని అనుకోలేక పోతున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా ఏ ప్రోగ్రామైనా వేసుకున్న రోజున ఆలన్యంగావస్తే మూతి ముడుచుకునేది. అమెను ప్రసన్నం చేసుకోవడానికి అర్ధగంటైనా పడుతుండేది. ఇప్పుడిది- ఇది నటనకాక మరేమిటి?

“ఇవ్వాళ మీకు యిష్టమైైన కొత్తిమిరి పచ్చడి చేశాను. బట్టలు మార్చుకునివస్తే వడ్డించేస్తాను. కాస్పేప్పు డాబామీద కూర్చుందాం, ఇవ్వాళ వెన్నెలకూడా వంది” అర్థవంతంగా, ఆనందాన్ని కళ్ళల్లో దాగుడుమూతలాడిస్తూ, పెదాల వెనక చిరునవ్వును -

  • దౌొచుకుని చూసింది.

అతను కళ్ళార్చకుండా అమెనే సూటిగా చూస్తోంటే సిగ్గుతో ముడుచుకుపోయి, ముసిముసిగా నవ్వుకుంటూ “అబ్బ! ఏమిటండీ అలా చూస్తారు. మీరు అలా చూస్తుంటే మీ ముందుకే రానుబాబూ” అంది.

“ఆమధ్య డేన్చుచేసినప్పుడుకూడా నువ్వు రెష్పల్ని కదిపి, కంటిపాపల్ని ఆడించావు కదూ! అచ్చం యిలానే నవ్వావుకదూ!” అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు.

“వమోబాబూ, నాకు అవన్నీ జ్ఞాపకంలేవు. చూసిన వాళ్ళకు మీకే తెలియాలి” అని అంది , కళ్ళకొసల్గోంచి వాలుగా చూసింది.

“చూశానుగనకే అంటున్నాను. ఆ కళ్ళ కులుకులు, ఆ పెదాల వాంపులు అచ్చం ఆ భరతనాట్యంలోలాగే వున్నాయి?

భర్త మాటల్లో ఆ పదునేమిటో ఆమెకు అర్థంకాలేదు.

74 వాళ్ళమధ్య వంతెన

“సరేగాని మీరు వేగంగా తెమిలిరండి, వడ్డించేస్తున్నాను” అని చెప్పి లోపలకు వెళ్తున్నదల్లా చటుక్కున మనసులో మెదిలిన ఆలోచనకి ఆగిపోయింది. వెనక్కు తిరిగి భర్త ముఖంలోకి విచిత్రంగా చూసింది ఆమె కళ్ళల్లో వెలుగులు ఆరిపోయాయి. ఆమె పెదాల మీద చిరునవ్వు విరిగిపోయింది. ఆమె ముఖంలో సంతోషం భగ్గున మండిపోయింది ఆమె చూపులు పిచ్చిగా ఉన్నాయి ఆమె పెదాలు వణికిపోతున్నాయి. ఆమె ముఖం పాలిపోయింది

“ఇప్పాడర్థమయ్యింది. ఇదంతా నటన అనికదూ మీరనేది ఈ అభిప్రాయం ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకెలా కలిగింది? మిమ్మల్ని మోసగిస్తున్నానన్న అభిప్రాయం మీరెలా ఏర్పరచుకున్నారు? ఇంతకన్నా పెద్ద అభాండం మరోటి వుండదు. ఎందుకిలా శిక్షిస్తారు నన్ను.” ఆమె కళ్ళల్లో కన్నీరు కదిలింది. ఆమె కంఠం బాంగురు పోయింది.

అతనేమీ మాట్లాడలేదు. బట్టలు మార్చుకుని డాబామీదకు వెళ్ళిపోయాడు. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక మంచంమీద వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చేసింది.

గంట తర్వాత అతను డాబాదిగి నిద్రపోదామని గదిలోకివస్తే టేబిల్‌ మీద భోజనం వడ్డించివుంది. ఆమె ముసుగుపెట్టి నిద్రపోతోంది. అతను భోజనం చెయ్యలేదు.

ఒకరి నొకరు పలకరించుకోకుండా నాలుగు రోజులు గడిచిపోయాయి. ముఖం కడుక్కుని వచ్చేసరికి కాఫీ, టిఫిను గదిలో పెట్టివుండేది. తొమ్మిదిన్నర అయ్యేసరికి అతను వంట గదిలోకి వెళ్తే భోజనం వడ్డించి వుండేది. మరీ యిబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమె పొడిపొడిగా దగ్గేది. అతను అటుచూసేవాడు. ఆ టైమునుబట్టి ఆమె

“స్నానానికి నీళ్ళు తోడిందనో, భోజనం వడ్డించిందనో తెలుసుకునేవాడు.

ఓ రోజు మధ్యాహ్నం కేంటినుకు వెళ్ళినప్పుడు జేబులోంచి డబ్బులు తియ్యబోకే చిన్న చీటీ బైటికి వచ్చింది. “డేన్సు టీచరును మాన్పించి వారం రోజులైంది. ఆమెకు జీతం యివ్వాలి. చీరా, రవికలగుడ్డా పెట్టాలి ఎనభై రూపాయలు అవసరమౌతాయి. రేపు వస్తుంది ఆమె” అని వుంది.

మాన్పించేసిందంటే అతనికి బాధేమీ కలగలేదు. ఆమె మానేస్తేనే బావుండునన్న ఆలోచన కొంతకాలంగా అతని మనసులో మెదులుతోంది. ఇటీవల జీవితంనిండా అసహనం పేరుకుపోయింది. రోజురోజుకీ యిద్దరి మధ్యా ఎడం ఎక్కువైపోతోంది. దీన్ని ఎలా దాటడం? కోరిక తీరిందన్న సంతోషం కూడా లేకుండా పోతోందికదా! అలాంట ప్పుడు ఎందుకిది?

వాళ్ళమధ్య వంతెన 75

సాయంకాలం యింటికొచ్చినప్పుడు మధ్యాహ్నం ఎస్‌.బి. లోంచి తీసిన ఎనభై రూపాయలూ అలమారాలో పై రేక్‌లో ఆమెకు కనిపించేటట్టుగా పెడుతుండగా అక్కడ అతనికి కొత్తగా కొన్ని మందుసీసాలూ, ఇంజక్షను బుడ్లూ కనిపించాయి. అతను ఆశ్చర్యంగా అవతలి గదిలోకి చూశాడు అక్కడ అటు తిరిగి రేడియో వింటూ ఏమిటో అల్జుకుంటోంది మలయవతి. పరిశీలనగా చూశాడు. అమె చేతిలో పూర్తి అవుతూ అవుతూ వున్న బుల్లి మేజోడు!

అతను మెల్లగా కదలివెళ్ళి, ఎప్పుడో అమె చేతిలోంచి జారిపడి దొర్లుకుంటూ చాలా దూరం వచ్చేసిన ఊలు వుండను తీసి, దారంచుట్టుకుంటూ చుట్టుకుంటూ - చుట్టుకుంటూ అమె దగ్గరకు చేరుకున్నాడు

ఉం

కథ నాదీ-ముగింపు ఆమెదీ

“నీ తోఓ విషయం మాట్లాడాలి. రేపు ఓసారి రారాదూ” అంది సావేరి. తిరుగు లేని ఆయుధం అది. స్రీ మాట్లాడాలి రమ్మంటే రాననే పురుషుడెవరూ నాకు కనిపించలేదు, ఎంత బెట్టుసరిచేసేవాడైనా ఏ స్రీ అయినా అలా వొచ్చిపిలిస్తే వెళ్ళకుండా వుండడు.ఆ విషయం స్త్రీకి బాగాతెలుసు. పురుషుడ్ని తన దగ్గరికి రప్పించుకోవాలను కుంటే ప్రీ ఉపయోగించే ఆయుధాల్లో యిదొకటి.

ఇదే ఆయుధాన్ని ఏ పురుషుడన్నా స్త్రీ మీద ప్రయోగించాడనుకోండి. “ఏమిటా విషయం! ఇక్కడ చెప్పగూడదేమిటి? పోనీలే. అంత పరమరహస్యమైతే అది నీ దగ్గరే అట్టేపెట్టకో, నా కంత తీరిక లేదుబాబూ” అంటూ తీసిపారేస్తుంది ఆయనే తన దగ్గరకొచ్చిమరీ ఆ విషయం చెప్తాడని ఆమెకు తెలుసు అందుకే ఆమెకా బెట్టుసరి ఆమె బెట్టుసరి చేస్తున్నట్టు పురుషుడు గుర్తించినా అది ఆమెకు అందాన్నే యిచ్చింది సుమా అని మురిసిపోతాడు. ఆమెను తను పిలిచిన విషయం మర్చిపోయి, తనే ఆమె దగ్గరకి వెళ్తాడు.

సావేరి ఎందుకు రమ్మందో నాకు తెలుసు. చూచాయగా అంతకుముందే విన్నాను. దశవతారాన్ని ప్రేమిస్తోందట బహశా ఈ విషయంలో నా సలహాను కోరడానికే అయివుండొచ్చు. నిజానికి ఇలాంటివాటిలో సలహాలివ్వడం అంత మంచిదికాదు ఒకవేళ ఇచ్చినా ఇవ్వనట్టే మర్చిపోవడం అవసరం.

కథ నాదీయుగింవు అమెదీ 77

ఏ వ్యక్తయినా పనిగట్టుకుని నీ దగ్గరకొచ్చి తన (ప్రేమ కథంతా చెప్పుకుని నీ సలహా అడిగితే నువ్వెంతో మురిసిపోయి, నిన్నంతగా గౌరవించేస్తున్నాడనుకొని సంబరపడిపోతావు. కాని, నువ్వొట్టి అమాయకుడివి సుమా. నీ సలహాని అతను పక్కజేబులో పెట్టుకుని తొడుక్కున్న బట్టల్ని విప్పేవరకూ అలాగే వుంచుకుని తిరుగుతూ, జ్ఞాపకం వొచ్చినప్పుడు ఓమారు పైకి తీసుకుని చూస్తూ, మళ్ళీ జేబులో పెట్టుకుని, మళ్ళీ తీసి, మళ్ళీ పెట్టి-అలా అది మడతలుపడి చిరిగి శిథిలావస్థకి చేరుకుంటే విసుగేసి ఎప్పుడో నిర్ణయగా తీసి, అవతల రోడ్డుమీద పదిమందీ వొచ్చిపోయే నేలమీదకు నిర్లక్ష్యంగా విసిరేస్తాడు. అందుకే యితరుల (ప్రేమ విషయంలో నువ్వు సలవా ఇచ్చేప్పుడు దానం చేస్తున్నట్లు సంతోషపడిపోక, పారేసుకుంటున్నట్టు దిగులుపడు.

నేనుకూడా ఇంతవరకూ యిలాంటి విషయాల్లో ఎవరికీ నలహాలు ఇవ్వలేదు. ఒకవేళ సావేరి పిలిచినా నాకేం తెలీదని చెప్పి తప్పించుకోవాలనుకున్నాను.

సావేరి రమ్మన్నదని కాకపోయినా చుట్టపుచూపుగానన్నా వాళ్ళింటికి వెళ్ళకపోతే బావుండదని మర్నాడు వెళ్ళాను.

“నువ్వు వస్తావోరావోనని సాయంకాలంపూట నేనే ఓసారి వచ్చిపోదా మనుకున్నాను. నువ్వే వచ్చావు. యింకా నీకు నామీద గౌరవం వుందన్న మాట” అంది సావేరి.

ఆ గౌరవం ప్రస్తావన ఆమె ఎందుకు ఎత్తవలసివచ్చిందో అ విషయం ఆమెకూ, నాకూ మాత్రమే తెలుసు.

“పెళ్ళికి నువ్వొస్తావని మా తమ్ముడు చెప్పాడు. అనలు, వేణుగోపాలంగారికి అల్లుడి వెతికిపెట్టిందికూడా నువ్వేనటగా. ఆ పెళ్ళికి తప్పేకుండా నువ్వాస్తావనే అనుకున్నాను. ఈ విషయం తెలిసాక నిజంగా నాకు ప్రాణం లేచొచ్చిందనుకో అంది సావేరి.

ఇంతకు ముందయితే ఈ మాటలకి నేను చాలా అర్జాల్ని కల్పించుకుని వుండేవాడిని. ఒకసారి సావేరే అవన్నీ సరికావని చెరిపేసింది. చిన్నప్పుడు పద్యాలకు వ్రతివదార్థం రాయాల్సివాచ్చినప్పుడూ ఇంతే.నాకు నరిగా చేతనయ్యేదికాదు. మూడొంతులు తప్పులే రాసేవాడిని. సావేరి నా నోట్సు తీసుకుని తప్పుల్ని కొట్టిపారేసి సరైన అర్భాల్ని రాసిచ్చేది. అందుకే ఆమెకు ప్రతిసారీ పరీక్షల్లో తెలుగులో ఫస్ఫమార్కో,

78 వాళ్ళమధ్య వంతెన సెకండ్‌ మార్కో వస్తుండేవి

“భావనగర్‌ బాగానే వుంటుందటగా,ఎప్పుడైనావస్తే ఆతిథ్యం యిస్తావా?”అంది.

ఏమిటో! మర్‌ కాలక్షేపం మాటలివి. ఆమె రానూ రాదు, వస్తే నేను ఆతిధ్యం ఇవ్వకుండా వుండనూ వుండలేను.

నేనేమీ మాట్ట్లాడలేదనికాబోలు తిరిగి “అబద్ధం కాదు, నిజంగానే వద్దామను కుంటున్నాను. నిన్ను పిలిచిందికూడా అందుకే” అంది.

“అలాగే, తప్పకుండా రా. నాకైతే వంటరాదు, నువ్వే చేసిపెట్టాలిమరి” అన్నాను.

చాలాసేపు సావేరి మౌనంగా వుండిపోయి ఓసారి అటూఇటూ చూసి మెల్లగా “నీతో ఓ ముఖ్యమైన పనిపడింది. చేసి పెడ్తావా?” అంది.

నేను వూహించింది అబద్ధం కాలేదు. ఇంత రహస్యం కళ్ళల్లోనూ, కంరంలోనూ ఎందుకో నాకు తెలుసు. ఈ తెరవెనుక హృదయాన్ని చదవగలను. తన (ప్రేమ విషయం చెప్పుకుని నా సలహా యేమిటో అడగడానికే అయివుంటుంది.

(సేమించడం తప్పేమీకాదు. (క్రేమ జీవితాన్ని అర్ధవంతంచేస్తుంది. చైతన్యమయం చేస్తుంది. ప్రేమ అక్కర్లేని మనిషెవరు? ఆ మధ్య పత్రికల్లో చదివాను, అక్కడెక్కడో (గ్రేమ నిషిద్ధమట. (పమవల్ల పారిశ్రామికోత్పత్తిలో మాంద్యం ఏర్చడుతుందట. కాని, క్రేమలేందే జాలిలేదు. అది నునసును వెన్నలా మెత్తబరుస్తుంది. మనసు మృదువుగా వుంటేనే బాధా, శ్రమా అర్ధమౌతాయి. బాధితుల యెడ సానుభూతీ, జాలీ కలుగుతాయి. వాళ్ళ కన్నీళ్ళను తుడవడానికి చెయ్యి అందివ్వమంటుంది ్రేమ. చుట్టూ నిక్షిప్తమైవున్న అందాన్ని గుర్తింపచేన్తుంది. దానివల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుంది. శ్రమను మరిచిపోయే మానసిక బలం చేకూరుతుంది. ఉత్తేజం కలుగుతుంది. రెట్టింపు ఉత్సాహంతో యే పనైనా చేపట్టవచ్చు. అలాంటప్పుడు పారిశ్రామికటఉత్చత్తులు కుంటుపడతాయన్న వాదానికి తావులేదు. ప్రేమించలేని మనసు హత్యచేయడానిక్కూడా జంకదు. జాలీ, కరుణా లేనప్పుడు; చిత్తశాంతీ, మనోల్ద్లాసమూ లేనప్పుడు; సొందర్యారాధనా, రసదృష్టీ లేనప్పుడు కోపమూ, అసహ్యమూ, అసహనమూ వచ్చి చేరతాయి. కోపం, అసహ్యం, అసహనం ఉన్నచోట అశాంతి ప్రబలుతుంది. దారుణాలు జరుగుతాయి. హత్యలు జరుగుతాయి. అశాంతీ, భయం వ్యాపించిన చోట ఉత్పత్తి సక్రమంగా సాగదు. పారిశ్రామికోత్పత్తిలో మాంద్యం యేర్పడుతుంది.

కథ నాద-ముగింవు ఆమెటీ 79 కనుక, ఈ వాదన అర్థరహితమైనది

“అంతసేపు అలోచిస్తున్నావేమిటి! చేసిపెట్టడం యిష్టంలేదా?” అంది సావేరి.

ఆమె చెప్పే సంగతేమిటో తెలుస్తూనేవున్నా ఆమె నోటిమీదుగానే విందామని అసలు విషయమేమిటో చెప్పమన్నాను

“మీ వూరు వస్తాను. కొంతకాలంపాటు వుండనిస్తావా?”అంది.

ఇదా ఆమె చెప్పదలచినది! ఈ మాత్రందానికి యేదోరహస్యం చెప్తున్నట్టు ప్రవర్తించిందేం![?

“ఏం మాట్టాడవేం. నేను వస్తే ఆ మాత్రం వుండనివ్వవా?”

“లంకంత పోర్షను. హాయిగా వుండొచ్చు ఇంతకీ నువ్వు నిజంగా వస్తావా?” అన్నాను అనుమానాన్ని ప్రకటిస్తూ,

ఆమె వింతగా మాట్లాడడం ఆశ్చర్యంగా వుంది. ఏమిటో, నాకు యిప్పటికీ సావేరి అర్థంకాదు. ఆయిన్సా యితరులు మనకి అర్థంకాలేదనుకోవడం పొరపాటే, చాలాసార్లు మనకి మనమే అర్థంకాముకదా!

“చూసేవా! నా మాటల్ని యేమాత్రం నమ్మలేకపోతున్నావు. అంత నమ్మలేనిదాన్నయిపోయానా నేను” అంది. ఆమె కళ్ళచుట్టూ తడి, ఆమె కంరంచుట్టూ దుఃఖం అంటుకుంది.

ఇదిగో! ఇలాంటి కంరంతోనే ఆమె జయించుకొస్తోంది. ఇంట్లో నవతి తల్లి, అందుకే ఆమెకు కన్నీళ్ళూ, దుఃఖంతో తడిసిపోయిన కంఠమూ సర్వసాధారణమై పోయాయి. ఒకసారి నన్నుకూడా ఇలాంటి కంరంతోనే జయించింది. జీవితంలో నేను ఎప్పుడూ యే విషయంలోనూ పరాజయం పొందలేదు. అదిగో-అదొక్కటే. తట్బకోలేక గిలగిల్లాడాను. ఒడ్డున నిలుచుని బయట పడేసిన చేపను చూసినట్ట నరదాగా చూస్తూంటే నేను ఆమె ఎదుటనుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయాను.

సావేరి యేదో చెప్పబోయి ఆగిపోయింది. ఇటువైపు అడుగుల శబ్దం వినిపిస్తే పక్కకు తిరిగాను. సావేరి సవతితల్లి. గుర్తుపట్టి పలకరించింది. “అందరికీ పెళ్ళిళ్ళు చేయిస్తున్నావుగాని, నువ్వెప్పుడు చేసుకుంటావోయ్‌?” అంది. ఆమెకు నేనంటే మొదటినుంచీ అభిమానమే. బహుశా యీ అభిమానం వల్లనే గాబోలు సావేరి నాకు దగ్గరగా రాలేకపోయింది.

80 వాళ్ళమధ్య వంతెన ఆమె అవీఇవీ మాటాడి లోపలికి వెళ్ళిపోతూ “ ఆ వేణుగోపాలంగారంత చేయలేకపోయానటయ్యా నేను” అని ఓ విసురు విసిరింది.

నిజమే. అంతకన్నా దగ్గరి బంధువే మరి. వేణుగోపాలంగారికి సహాయం చేసినట్టు నేను యీమెకు సహాయం చేయగలనా? అంత నిస్స్వార్ధపరుడ్ని కాను. సావేరి ఒకసారి యేదో విషయంలో అననే అంది- నీలోనూ స్వార్ధం వుంది, లేకపోతే నువ్విలా మాటాడి వుండవు-అని. జెను అప్పుడు నేను స్వార్ధపరుడ్నే అప్పుడేకాదు యిష్పుడుకూడా.

“ఏమిటి! యేదో దీర్చాలోచనలో పడ్డట్టున్నావ్‌. చెవ్పవేం, మీ వూరు వచ్చేదా?” అంది సావేరి.

అమె నరదాకి అడగడంటలేదనీ, సీరియస్‌గానే అడుగుతోందని అర్థమైంది.”

“ఈ మాత్రందానికి నన్ను అడగాలా. అడగక్కరలేకుండా తిన్నగానే రావొచ్చు నువ్వు. ఆ మాత్రం చనువు నీకులేదూ?”

“ఉందనుకో, అయినా అడగడం మంచిదికదా. అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టడం అవుతుందేమోనని అడిగాను. ఇంతకీ నేను రావడంవల్ల నీకు యేమైనా యిబ్బంది కలుగుతుందా?”

“అలాంటిదేమీ లేదు”

“మరి ఎవరైనా నన్ను గురించి అడిగితేనో?”

అవును! ఎవరైనా అడిగితే? ... ఆలోచిస్తున్నాను.

“నరేలే, నువ్వేం చెవుకున్నానరే, నాకుమాత్రం కొంతకాలం ఆశ్రయం యియ్యి” అంది సావేరి.

కాలేజీనించి సావేరి తమ్ముడు వచ్చాడు. సావేరి అక్కడ్నించి లేచి వెళ్ళిపోయింది. వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతున్నానన్నమాటేగాని నా ఆలోచనలన్నీ సావేరి గురించే. దశావతారాన్ని గురించి చూచాయగానన్నా యేమీ చెప్పలేదేం? విలన్‌ని చూసినట్న ఎందుకలా చూడాలి నన్ను?

ఎంతసేపున్నా సావేరి తమ్ముడు కదల్లేదు. వెళ్ళిపోదామని లేచాను. వాళ్ళమ్మతో కూడా చెప్పి బయలుదేరబోతుండగా సావేరి వచ్చి “నేను చెప్పిన సంగతి మర్చిపోవుకదూ, వెళ్ళింతర్వాత ఆ ఉద్యోగం గురించి గట్టిగా ప్రయత్నించు. అప్లికేషన్‌ పెట్టమంటే

కథ నాదీముగింవు ఆమెదీ 81 తర్వాత పెడ్డాను. ఉత్తరం రాయి,, ఇదిగో అడ్రసు” అని ఓ కాగితం యిచ్చింది. నేనింకా ఆశ్చర్యంనుంచి తేరుకోకుండానే అక్కడ్నించి వెళ్ళిపోయింది. అడ్రసు యివ్వడమేమిటి, తెలీనట్టు, కాగితం విప్పాను. అడ్రసుమాత్రం కాదు! మడిచి జేబులో పెట్టుకుని హడావిడిగా వీధిలోకొచ్చాను. వీధి చాలా పొడుగ్గా వుంది ఉత్తరం చదవడానికి వీలుండదు. సావేరి తల్లికో, తమ్ముడికో కనిపించొచ్చు. ఆ కాగితం యిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే వున్నారు.

కాగితంలో యేముందో తెలుసుకోవాలని ఆత్రుతగా వుంది. ఎప్పుడో సావేరి అంది. నేను స్వార్థపరుడ్నని. అవును. నా స్వార్థం నాలో ఉన్నట్టు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అర్ధంలేని యీ పిచ్చి ఆనందం.

ఎదురుగా రిక్షా వస్తోంటే బేరంచెయ్యకుండానే ఎక్కి కూచున్నాను. కాగితం తీశాను.

“ఇంట్లో చాలా విషయాలు చెప్పడం కుదరలేదు. చిన్న పనిచేసిపేట్టు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటే ఓ ట్రైపిన్సు పోస్టు వుందనీ, అప్లికేషన్‌ పెట్టమనీ నా పేర ఉత్తరం రాయి. అది చూసుకుని సర్టిఫికెట్లన్నీ నీకు పంపిస్తాను. వారం రోజుల తర్వాత ఉద్యోగం వచ్చిందనీ, వెంటనే వచ్చి చేరమని టెలిగ్రాం యివ్వు బయలుదేరి వస్తాను. నీతో చెప్పాల్సిన విశేషాలు చాలా వున్నాయి.” |

ఆ ఉరుకులూ పరుగులు యిష్పుడులేవు. పాలపొంగులాగ అయిపోయింది. ఇన్ని నీళ్ళు చిలకరించిందీ వుత్తరం. స్వార్థంకళ్ళల్లో దుమ్ములాగ యీ నీళ్ళు.

“కుడివైపా, ఎడంవైపా బాబూ?” రిక్షావాడి ప్రశ్న

“క్సుడీలేదూ, ఎడమాలేదూ. ఆపెయ్‌” దిగిపోయి చిల్లర డబ్బులు చేతిలోపెట్టి బయలుదేరాను. చికాగ్గా వుంది. ఇంటికొస్తే సావేరి కనీసం కాఫీనీళ్ళన్నా యివ్వలేదుకదా.

హోటల్‌కి వెళ్ళాను. వెధవకాఫీ, పాతికపైసల కాఫీయేనా యిది. వట్టి నీళ్ళకాఫీ, సర్వర్‌ని కసురుకుని వీధిలోకొచ్చాను. ఇంత దుమ్ము కళ్ళల్లో కొట్టి వెళ్ళింది ఓ లారీ, ఛీఛీ, యేంరోడ్డో.నడవడానికిక్కూడా వీల్లేదు. దగ్గర్గో పార్కువుంటే వెళ్ళి కూచున్నాను. చల్లగా వుంది. మైక్‌లోంచి వెండితీగను జలతారు పోగులాగ సాగదస్తున్నట్ట అసావేరిలో సన్నగా వైలిన్‌ సంగీతం వస్తోంది.

82 వాళ్ళమధ్య వంతెన సావేరి ప్రవర్తన యేమిటో విచిత్రంగా ఉంది. దశావతారంనుంచి దూరంగా ఎందుకు పారిపోతున్నట్టు? సావేరి తనను (్రేమిస్తున్నదని దశావతారం ఎవరితోనో చెప్పినమాట నిజంకాదా? అది కేవలం స్వోత్కర్షేనేమో. తన గొప్పతనాన్ని చాటుకుందుకు యీ అబద్దాన్ని ఓ అలంకారంగా తగిలించుకున్నాడేమో. ఒకవేళ అమె అతన్ని ప్రేమించినా ప్రేమించి ఉండొచ్చు. డ్రేమ ఉప్పులాంటిది, అది విడిగా ఎందుకూ పనికిరాకపోవచ్చు. కాని అది లేందే జీవితానికి రుచేలేదు. చిన్నప్పటినుంచీ సావేరి జీవితం నిస్సారంగానే గడిచింది. దశావతారాన్ని ప్రేమించివుంటే అందులో వింతేమీ లేదు. వింతగా అనిపించే విషయం ఒకటే, ఆమె ప్రేమించే హృదయాన్నే కోరుతూ వుంటే, అంతకుముందు అలాంటి హృదయాన్ని ఎందుకు తిరన్కరించింది? దశావతారమంటే అంత ప్రత్యేకమైన అభిమానం ఉన్నప్పుడు యిప్పుడిలా పారిపోవడం దేనికి? _ దశావతారమే ఆమెను తిరస్కరించి ఉండొచ్చు. అవును, ఆమె కళ్ళల్లో గిలగిలా కొట్టుకుంటున్న చూపులూ, ఆమె ముఖంలో ఎగిరిపడుతోన్న బాధా, రెపరెపలాడుతోన్న ఆందోళనా, మాసికలు పడ్డ మసిగుడ్డలాటి ఉత్సాహం- యివన్నీ ఆ సంగతే చెప్తున్నాయి. వెనక యిలాంటి స్థితిలోనే నేనూ వుండి యిలాగే పారిపోయానుకదా. సావేరిమీద జాలేసింది. పాపం! ఎప్పుడూ ఆమె జీవితం సవ్యంగా గడవలేదు. అన్నీ వంకరగీతలే. చీకటిపడేవరకూ పార్కులోనే కూచుని యింటికివెళ్ళాను. భోంచేసి పడుకునే ముందు ఎంత వొద్దనుకున్నా గతం గుర్తుకొచ్చింది. మర్నాడే వెళ్ళిపోయాను. వెళ్ళేముందు సావేరిని కలుద్దామనుకున్నాను కాని అంతకుముందే అప్పగింతలన్నీ అయిపోయాయికదా, యింకెందుకు లెమ్మని కలవలేదు. ఊరు వెళ్ళింతర్వాత ఆమె కోరినట్టే ఉత్తరం రాశాను. ఏవేవో ట్రూ కాపీలూ, ఓ అప్లికేషనూ పంపించింది. ఆ తర్వాత ఓ టెలిగ్రాం ఇచ్చి, ఉత్తరం రాస్తే, రాసిన వారం రోజులకు పెట్టేబేడాతోసహా ఊళ్ళో దిగింది. మరోవిశేషం- కూడా వాళ్ళమ్మమ్మను వెంటబెట్టుకుని మరీవచ్చింది! “తోడుగా వుంటుందనీ ఏలూరు వెళ్ళి ఆమెను వెంటబెట్టకొచ్చాను” అంది. ఆమె సావేరి స్వంతఅమ్మమ్మ కూతురు పోయాక మనవరాలుని తీసుకు

కధ నాదీ-ముగింవు ఆమెటీ 83 పోవాలనుకుందిగాని అల్ట్లుడు పడనిచ్చాడుకాదు ఎప్పుడైనా వచ్చి మనవరాలుని చూసి వెళ్తుంటుంది. మనవరాలంటే ఆమెకు మాచెడ్డ అభిమానం,

సావేరి వచ్చేంతవరకూ నాకు అనుమానమే-నిజంగా వస్తుందా అని. నిజంగానే వచ్చింది. లేకపోతే యింతదూరం రావడం నాలుగైదు రోజులుండి వెళ్ళిపోవడానికా. ఆమె ఇక వెళ్ళలేదు. ఆమెచుట్టూ ఓ గోడ-మంచితనంతో ఎత్తుగా ఓ గోడ కట్టేసి దిగ్బంధనం చేసేస్తాను. ఆమె ఇక్కడే వుండిపోతుంది. ఈ జీవన ప్రాంగణంనించి ఆమె ఇక కదిలి వెళ్ళలేదు. వెళ్ళదు.

మనసంతా అర్థంపర్థంలేని ఆరాటంగా వుంది. బయటికి చెప్పుకోలేని పిచ్చి ఆనందంగా వుంది.

సావేరి యింట్లో అడుగుపెట్టింతర్వాత ఇంటికళే మారిపోయింది. బ్రహ్మచారి కొంప బొట్టులేని ఆడదిలాటిదే. ఎన్ని డ్యూకో పెయింట్లు వేస్తేమాత్రం యేమూలో కాస్తంత పసుపూ, మరి కాస్తంత కుంకుమా లేకపోతే వెలితిగానే వుంటుంది.

ముసిలావిడ వంట ్రారంభిస్తానంది. సామాన్లేవీ లేవురెండు రోజులు హోటలు తిండే గతయ్యింది. మూడోరోజున నా కూడా బజారుకు వచ్చి కావలసిన సామాన్లూ, వెచ్చాలూ కొంది సావేరి. డబ్బులు నన్ను ఇవ్వనియ్యలేదు. “నా దగ్గర డబ్బు ఎక్కువేం లేదు. కానీ వున్నంతవరకూ నన్ను ఖర్చుపెట్టనియ్యి. ముందు ముందు అవసరం వస్తే నువ్వే యివ్వాల్సి వుంటుందిలే” అంది

వాళ్ళు వచ్చిన నాలుగోరోజున - ఆదివారం- ఇంట్టోనేవున్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక వాళ్ళ అమ్మమ్మ నిద్రపోయింది.

“ఆదివారంపూట నిద్రపోయేవాడివేమో, నేను వచ్చి నీ అలవాట్లన్నీ మార్చేన్తు న్నానుకదూ. నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తోంది” అంటూ నా గదిలోకి వచ్చి కూర్చుంది సావేరి.

“నేను రావడంవల్ల నీకు యిబ్బందే, నా గురించి ఆ మాత్రం ఇబ్బంది పడేవాళ్ళు నువ్వుగాక నాకింతెవరున్నారు. అందుకనే నీ దగ్గరకొచ్చాను.” అంది తిరిగి.

“నేనేం ఇబ్బంది పడ్డంలేదు. పైపెచ్చు నువ్వాచ్చినందువల్ల నాకెంత సంతోషంగా వుందో తెలుసా. నిజంగా ఓ పండుగలాగే వుంది.”

సావేరి యేమీ మాట్లాడలేదు. ఓ నిట్టూర్చు మాత్రం విడిచిపెట్టి

ర్‌ వాళ్ళమధ్య వంతెన గొణుక్కుంటున్నట్టు “నీ మంచితనాన్ని నేను నా స్వార్ధానికి వుపయోగించుకుంటున్నా నేమో. కాని యేం చెయ్యనుమరి, మరో గత్యంతరంలేదు నాకు” అంది

సావేరి చాలా అర్థవంతంగా మాట్లాడుతుంది. ఆమె మాటలూ, ఆమె ప్రవర్తనా తేలిగ్గా నాకు అర్థంకావు. క్షిష్టన్వయాల్తూకరిన సమాసాలూ నిండిన ఏ సంస్కృత పదాల తెలుగు పద్యంలాగానో అనిపిస్తుంది సావేరి,

మొదటినుంచీ ఈ అర్భాలూ, ఈ తొత్సర్యాలూ నాకు వంటపట్టలేదు.

సావేరి నన్ను మంచివాడ్నని మెచ్చుకున్నందుకు కాస్త గర్వంగా వుంది. నిజానికి తననుతాను ప్రేమించుకోనడంకన్న, మెచ్చుకోవడంకన్న ఇతరులు తనను (్రేమించాలనీ, మెచ్చుకోవాలనీ కోరుకుంటాడు మనిషి ఎందుకంటే తననుతాను ఎలాగూ గౌరవించుకోలేడు. కారణం-తనలోని లోపాలూ, బలహీనతలూ అన్నీ అతనికి" తెలుసుగనక,.

నేను ఎందుకొచ్చానో ఈపాటికి నీకు అర్ధమయ్యే వుంటుందనుకుంటాను. యేమిటో, తెలిసుండికూడా అప్పుడ్గుడు కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూవుంటాం. ఆ పారపాట్లే ఒక్కొక్కసారి పీకలమీదకొచ్చి కూర్చుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే

  • చిక్కుకుని ఇక్కడికి వచ్చాను...” సావేరి మధ్యలోనే ఆపి నావేపు చూసింది. నేను వినడంచూసి-

“..వెనక ఒకసారి నీతో చెప్పానేమోకూడా- దశావతారం, నేనూ పెళ్ళి చేసుకోవా లనుకుంటున్నామని. పెళ్ళికి ఎప్పటికప్పుడు యేవో అవాంతరాలు వొచ్చిపడుతూనే వున్నాయి ఈ మధ్యనే అతను మాస్‌కమ్యూనికేషన్‌ ట్రైనింగ్‌కని ఢిల్లీ వెళ్ళాడు. నాకేమో యేమీ తోచకుండా వుంది. నా కడుపులో నలుసు కదులుతోంది. మూడోనెల. ఈ విషయం తెలిసాక రోజుకో వుత్తరం చొప్పున అరడజను వుత్తరాలు రాశాను. ట్రయినింగ్‌ అయ్యేవరకూ ఎలాగోఅలాగ గడిపేస్తే తనువచ్చి అన్నీ చక్కబరుస్తానన్నాడు. వీలయితే అబార్జన్‌కి ప్రయత్నించమన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. యే గత్యంతరమూ లేకపోతే ఆ పనే చేసేదాన్నేమోమరి ఇంతలో దేముడిలాగ నువ్వు అటొచ్చావు... ”

దీని ప్రభావం నామీద ఎక్కువగానే పడింది ఆమె ఆ తర్వాత యేం చెప్పినదీ సరిగా వినిపించుకోలేకపోయాను. బాధా? యేమో .. చెప్పలేను మనసంతా ఆరాటం, అశాంతిగా, తీరిగ్గా వినే ఓపిక కోల్పోయి చికాకు చికాకుగా వుంది

కథ నాదీచయుగంవు ఆమెదీ త్రిల్‌

“నిద్రొస్తున్నట్టుంది గాబోలు నీకు. పోనీ పక్కవేసేదా పడుకుందువుగాని. ”

“ఒద్దు, నేను వేసుకుంటాలే”

“ఏం నేను వేస్తే నచ్చదా ”

“ఇంతకాలమూ నాకు మరొకరి సాయం కావలసివచ్చిందా, నా పని నేను చేసుకోలేదూ.”

సావేరి బాధపడినట్టంది “నీ ఇంట్లోవుంటూ నీ తిండితింటూ ఆ మాత్రం నీకిందచేస్తే తప్పా. గతిలేక నీ దగ్గరకి వచ్చాననేకదా ఇలో మాట్లాడుతున్నావు.” ఎక్కిళ్ళొచ్చేసి, కళ్ళల్లో నీళ్ళుతిరిగి చూస్తుండగానే యేడ్చేస్తోంది. బయటికి గట్టిగా ఏడవలేక తనలో తనే కుళ్ళిపోతున్నట్ట ఎక్కిళ్ళు పడుత్తూ, కొంగు నోటికి అడ్డం పెట్టుకుని, మనసునిండా బరువుగా అల్లుకున్న దుఃఖం కరిగి కన్నీళ్ళె కారిపోయేవరకూ ఏడుస్తూనే వుండిపోయింది.

ఇంతకీ నేనేమన్నానని ఈ యేడుపు? ఆమెను బాధపెట్టాలన్న ఆలోచన నాకు యే కోశానా లేదు. ఇలా ప్రతి చిన్నవిషయాన్నీ తనకు అన్వయించుకుని ఆమె బాధపడడమేమిటి? అయినా ఆమెను నేనెందుకు యేడ్పిస్తాను. ఇంత కాలంగా బయటికి వ్యక్తం చేయలేక లోలోపలే బంధించేసుకున్న దుఃఖాన్ని ఇప్పుడు అవకొశం వచ్చిందని నా యెదుట పడేస్తోందికాని మరేంలేదు. ఆమెకు కావలసింది ఓదార్చు.

ఓదార్చడం నాకు చేతకాదు. యేడ్చేవాళ్ళని చూస్తే నా కంఠంకూడా దుఃఖంతో తడిసిపోతుంది. కంరంలో జీరపలికి మధ్యలో ఆగిపోతుంది. అందుకని సావేరి ఏడుస్తోంటే. నేనేమీ మాట్ట్లాడలేకపోయాను.

అవతల నడవాలో ముసలావిడ దగ్గిన శబ్దం విని కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళిపోయింది సావేరి,

సొవేరి రావడం ఓ చిన్న సమస్యే అయ్యిందినాకు. ఇంటివాళ్ళు వూళ్ళో మరోచోట వుంటున్నారు గనక వాళ్ళ బాధ తప్పింది. చుట్టుపట్టవాళ్ళతో పరిచయం లేదు. ఇంట్లో ఆడాళ్ళంటూ వుంటే భాష వచ్చినా రాకపోయినా పరిచయాలు పెరిగేవి. అఫీసులో మాత్రం ఇద్దరు ముగ్గురు కొలీగ్స్‌ అడిగారు.

“చుట్టం” అన్నాను.

“అంటే? అన్నారు.

క. “ఇబో జాలా వుంది. చెప్తాలెండి” అన్నాను " పకోడీ పొట్టంలాగ పనిచేసింది పొట్లం చూసి వెంటబడితిరిగిన కుక్కల్లాగే చుట్టూ తిరిగారు కేసికొన్టీ చాలాసార్సు చుట్టూ తిప్పుకున్నాను. ఇటాలియన్‌ స్పె పిక్చర్లు ఎగబడిచూసే ఆ మనుషుల కుతూహలం, చేతులు కట్టుకుని కూచోలేకపోయింది. ఎలాంటి చుట్టమో తెలుసుకోవాలన్న కుతూహలం పురుగుని దొలిచినట్టు దొలిచిందేమో రెండు మూడుసార్లు యింటికొచ్చారు. సెల్ళికాని హిందూస్రీని గుర్తుపట్టడం చాలా తేలికేకదా. ధైర్యం వుంటే మెడనీ, లేనప్పుడు బుద్ధిమంతుడిలాగ పాదాల్నీ చూసేస్తే సరి. వచ్చినవాళ్ళు పాదాల్నే చూసి గర్వంగా వెళ్ళిపోయారు జూనియర్‌ సైంటిస్టులు వాళ్ళు. నిజంగా వాళ్ళు గొప్ప పరిశోధకులే దేశానికి అవసరమైన ఓ గొప్ప సత్యాన్ని కనుగొన్నారు కదా మరి! కాదని ఎలా అనగలం? సావేరి కూడా బైటికి రావడానికి అంతగా యిష్టపడేదికాదు వచ్చిన కొత్తలోనే ఓ సెలవు రోజున ముసలావిడ్చీ సావేరినీ గాంధీ స్మారకమందిర్‌కు తీసుకెళ్ళాను. మరో రోజు సాయంకాలం గట్టిగా పట్టుబడితే “బోర్తలాబొకు వచ్చారు. ఊరంతటికీ మంచి నీటిని సరఫరా చేసే చెరువది. చెరువు పక్కనే పెద్ద తోటని పెంచి పిక్సిక్‌స్పాట్‌గొ డెవలప్‌ చేశారు, తోటలో వున్నంతసేపూ మనసేం బావుండలేదు. బయలుదేరినప్పుడున్న ఉత్సాహం, తీరా అక్కడికివెళ్ళాక లేదు. గులాబీ మొక్క పక్కనించి వెళ్తోంటే ఓ ముల్గు గరుకుపోయింది. గడ్డిలో కూచుందామని చెప్పులు తీసి గట్బదిగి రాబోతూంటే పల్దేరుకాయ గుచ్చుకుంది. ఎక్కువసేపు తోటలో వుండలేకపోయాను. సొవేరికూడొ చల్లగొలి పడదంటే తొందరగానే తిరిగినచ్చేశాం.

అ తరువాత ఎప్పుడూ సావేరిని నాకూడా రమ్మనమని అడగలేదు. ఎక్కడికెళ్ళినొ యేవో జ్ఞాపకాలతో మనసుకే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఒక్షసారి సావేరే సినిమాకు వెళ్ళామని అంది, ఫస్ట్‌కు జీతం అందుకుని ఇంట్లోకి శావలసిన సరుకులు కొందొమని సావేరిని వెంటబెట్బకుని బజారుకి వెళ్ళినప్పుడు తోవలో సెనిమాహాలుని చూసి అంది “స్పనిమా చూసీ చాలాకాలమైంది, మంచి సినిమా ఏదన్నావుంటే రేపు వెళ్దాం” అని.

మర్నాడు ముసలావిడ్ని రమ్మంటే “హిందీ సినిమా నాకేం అర్ధమౌతుంది

నాదూముగంప్పు ఆమెద్‌ ల న మూ ఫష్టషోకు వెళ్ళాం. సినిమా చాలా బావుండె. శ-ందపాడలా పఏమించి, ఆ సొవరికికూడా బాగా నచ్చినట్టుంది, చూస్తున్నంతసేపూ వెళ్ళిపోయిన ఓ నర్తకి కద నమైపోయింది. సినిమాలోనే లీనమై గొలో వదామంటే, ఉన్న అర్జ్హ్మక్షార్వుటాంగామాు సినిమా విడిచిపెట్టాక టాంగాల్‌ ఎద్బా హు కా విళ్చిపోతున్నాయ్‌. ఫర్ధాంగు దూరం నడిచి చారసాదా వుంటాయిగొని ఆమెను అంత రాత్రివేళ నడిపించడం య్యా అంకాల బయలుదేరాం. ఆ అనుభవం కొత్తది. వెచ్చగా కాలుస్తోన్న స్పర్శ, మలుపుల తూలివడకుండా గట్టిగొ పట్టుకున్నప్పుడు వేళ్ళచివరవరకూ సాగిన కోరికలతీగలు ఆధారాన్ని చుట్టుకుని పాకుతున్నాయ్‌. సావేరి మౌనంగొ నడుంమీంచి చేతిని తొలిగించేసింది. దగ్గరగా ముడుచుకుని రాయిలా బిగుసుకుపోయి కూచుండిపోయింది. ఇంటికి వెళ్ళాక ముసలావిడ భోజనం వడ్డించబోతే పడుకోమని చెప్పి తనే వడ్డించింది. తలవంచుకుని తింటున్నాను. వంటింటి తలుపులు దగ్గరగా చేరేసి వచ్చింది. మరోపీట వేసుకుని కూచుని “నీ దగ్గరికి పెద్ద నమ్మకంతో వచ్చాను. నువ్వు అందరిలాంటివాడివి కావనీ, నీ దగ్గర నాకు యే ఆపదా ఉండదనీ నమ్మి వచ్చాను. నా అసహాయస్థితిని అవకాశంగా తీసుకుని నువ్వుకూడా నన్ను ఆగౌరవపరుస్తావా! పెళ్ళి కాకుండా తల్లినయ్యాననేగా నువ్విలా చిన్నచూపు చూస్తున్నావ్‌.” అంది. అప్పటాం అమె చెక్కిళ్ళమీదకి కన్నీళ్ళు జారిపోయాయి. ఆమె కంఠం బొంగురుపోయింది. ఏం మాట్లాడగలను నేను ? యేమీ మాట్లాడకుండా మంచితనం పేరు చెప్పి నా నోరు కట్టేసింది. దొంగకు తాళాలగుత్తిచ్చే తెలివి ఆమెది! ఆమె ఎదుటినుంచి ఎంత వేగంగా తప్పించుకుందామా అని సగంతినీ, సగం వదిలేసే చేతులు కడుకో బోతే ప్పి చూసి, కళ్ళద్దుకుని గబగబా లేచొచ్చి “అదేమిటి! అలా సగంతిని సగం వొదిలేసి లేచిపోతున్నావ్‌. నీ సంపాదన అంతా మాలాటివాళ్ళకి పెట్టడానికేనా, నీ సౌఖ్యం గురించి అలోచించుకోనక్కర్లేదా. వుండు, లేచిపోకు. నువ్వులేస్తే, నామీద ఒబ్టే... కూరలన్నీ చల్గారిపోయినట్టన్నాయి, రెండు అప్పడాలు గబగబా వేయిస్తాను, తిందువుగాని” అంది. ఇదిగో! ఇలాంటప్పుడే సావేరి పరాయిదికాదన్న విషయం కొాట్టాచ్చినట్బ

తర్‌ వాళ్ళమధ్య వంతెన

“అంటే చాలా వుంది చెప్తాలెండి” అన్నాను.

పకోడీ పొట్టంలాగ పనిచేసిందది. పొట్టం చూసి వెంటబడితిరిగిన కుక్కల్లాగ చుట్టూ తిరిగారు. కసికొద్దీ చాలాసార్లు చుట్టూ తిప్పుకున్నాను

ఇటాలియన్‌ స్పె పిళ్చర్లు ఎగబడిచూసే ఆ మనుషుల కుతూహలం, చేతులు కట్టుకుని కూచోలేకపోయింది. ఎలాంటి చుట్టమో తెలుసుకోవాలన్న కుతూహలం పురుగుని దొలిచినట్టు దొలిచిందేమో రెండు మూడుసార్లు యింటికొచ్చారు.

పెళ్ళికాని హిందూస్త్రీని గుర్తుపట్టడం చాలా తేలికేకదా. ధైర్యం వుంటే మెడనీ, లేనప్పుడు బుద్ధిమంతుడిలాగ పాదాల్నీ చూసేస్తే సరి.

వచ్చినవాళ్ళు పాదాల్నే చూసి గర్వంగా వెళ్ళిపోయారు. జూనియర్‌ సైంటిస్పలు వాళ్ళు! నిజంగా వాళ్ళు గొప్ప పరిశోధకులే. దేశానికి అవసరమైన ఓ గొప్ప సత్యాన్ని కనుగొన్నారు కదా మరి! కాదని ఎలా అనగలం?

సావేరి కూడా బైటికి రావడానికి అంతగా యిష్టపడేదికాదు. వచ్చిన కొత్తలోనే ఓ సెలవు రోజున ముసలావిడ్నీ, సావేరిని గాంధీ స్మారకమందిర్‌కు తీసుకెళ్ళాను. మరో రోజు సాయంకాలం గట్టిగా పట్టుబడితే “బోర్తలాబొకు వచ్చారు. ఊరంతటికీ మంచి నీటిని సరఫరా చేసే చెరువది, చెరువు పక్కనే పెద్ద తోటని పెంచి పిక్నిక్‌స్పాట్‌గా డెవలప్‌ చేశారు.

తోటలో వున్నంతసేవూ మనసేం బావుండలేదు, బయలుదేరినప్పుడున్న ఉత్సాహం, తీరా అక్కడికివెళ్ళాక లేదు. గులాబీ మొక్క పక్కనించి వెళ్తోంటే ఓ ముల్లు గీరుకుపోయింది. గడ్జీలో కూచుందామని చెప్పులు తీసి గట్టుదిగి రాబోతూంటే పల్గేరుకాయ గుచ్చుకుంది. ఎక్కువసేపు తోటలో వుండలేకపోయాను. సావేరికూడా చల్లగాలి పడదంటే తొందరగానే తిరిగివచ్చేశాం.

ఆ తరువాత ఎప్పుడూ సావేరిని నాకూడా రమ్మనమని అడగలేదు. ఎక్కడికెళ్ళినా యేవో జ్ఞాపకాలతో మనసుకే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఒక్రసారి సావేరే సినిమాకు వెళ్ళామని అంది. ఫస్ట్‌కు జీతం అందుకుని ఇంట్లోకి కావలసిన సరుకులు కొందామని సావేరిని వెంటబెట్టుకుని బజారుకి వెళ్ళినప్పుడు తోవలో సినిమాహాలుని చూసి అంది “సినిమా చూసి చాలాకాలమైంది, మంచి సినిమా ఏదన్నావుంటే రేపు వెళ్ళాం” అని.

మర్నాడు మునలావిడ్ని రమ్మంటే “హిందీ సినిమా నాకేం అర్థమౌతుంది.

కథ నాదాముగింవు అమెదీ ఠి మీరెళ్ళండి” అంది. ఇద్దరమూ ఫస్ట్‌షోకు వెళ్ళాం. సినిమా చాలా బావుంది. ఓ బండివాడిని (ప్రేమించి, ఆ విషయం గట్టిగా హృదయానికి నచ్చజెప్పుకునే ఆత్మస్టైర్యంలేక దూరంగా వెళ్ళిపోయిన ఓ నర్తకి కధ. సావేరికికూడా బాగా నచ్చినట్టుంది, చూస్తున్నంతసేపూ సినిమాలోనే లీనమైపోయింది.

సినిమా విడిచిపెట్టాక టాంగాలో వద్దామంటే, ఉన్న అయిదారు టాంగొలూ జనాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాయ్‌. ఫర్ధాంగు దూరం నడిచి చౌరస్తాదగ్గరకు వెళ్తే టాంగాలు వుంటాయిగాని ఆమెను అంత రాత్రివేళ నడిపించడం యిష్టంలేదు. ఆటోరిక్షాలో బయలుదేరాం. ఆ అనుభవం కొత్తది. వెచ్చగా కాలుస్తోన్న స్పర్శ మలుపుల్లో తూలిపడకుండా గట్టిగా పట్టుకున్నప్పుడు వేళ్ళచివరవరకూ సాగిన కోరికలతీగలు ఆధారాన్ని చుట్టుకుని పాకుతున్నాయ్‌.

సావేరి మౌనంగా నడుంమీంచి చేతిని తొలిగించేసింది. దగ్గరగా ముడుచుకుని రాయిలా బిగుసుకుపోయి కూచుండిపోయింది.

ఇంటికి వెళ్ళాక ముసలావిడ భోజనం వడ్డీంచబోతే పడుకోమని చెప్పి తనే వడ్డించింది. తలవంచుకుని తింటున్నాను. వంటింటి తలుపులు దగ్గరగా చేరేసి వచ్చింది. మరోపీట వేసుకుని కూచుని “నీ దగ్గరికి పెద్ద నమ్మకంతో వచ్చాను. నువ్వు అందరిలాంటివాడివి కావనీ, నీ దగ్గర నాకు యే ఆపదా ఉండదనీ నమ్మి వచ్చాను. నా ఆసహాయస్థితిని అవకాశంగా తీసుకుని నువ్వుకూడా నన్ను ఆగౌరవపరుస్తావా? పెళ్ళి కాకుండా తల్లినయ్యాననేగా నువ్విలా చిన్నచూపు చూస్తున్నావ్‌.” అంది. అప్పటికే ఆమె చెక్కిళ్ళమీదకి కన్నీళ్ళు జారిపోయాయి. ఆమె కంఠం బొంగురుపోయింది.

ఏం మాట్లాడగలను నేను ? యేమీ మాట్లాడకుండా మంచితనం పేరు చెప్పి నా నోరు కట్టేసింది. దొంగకు తాళాలగుత్తిచ్చే తెలివి ఆమెది! ఆమె ఎదుటినుంచి ఎంత వేగంగా తప్పించుకుందామా అని సగంతినీ, సగం వదిలేసే చేతులు కడుక్కోబోతే చూసి, కళ్ళద్దుకుని గబగబా లేచొచ్చి “అదేమిటి! అలా సగంతిని సగం వాదిల్తేసి లేచిపోతున్నావ్‌. నీ సంపాదన అంతా మాలాటివాళ్ళకి పెట్టడానికేనా, నీ సౌఖ్యం గురించి ఆలోచించుకోనక్కర్లేదా. వుండు, లేచిపోకు. నువ్వులేస్తే, నామీద ఒట్టే... కూరలన్నీ చల్గారిపోయినట్టున్నాయి, రెండు అప్పడాలు గబగబా వేయిస్తాను, తిందువుగాని” అంది.

ఇదిగో! ఇలాంటవ్వుడే సావేరి పరాయిదికాదన్న విషయం కొట్టాచ్చినట్టు

తతి వాళ్ళమధ్య వంతెన తెలుస్తుంది. సావేరి పరాయి మనిషికాదు. ఈ అభిమానం పరాయివాళ్ళు చూపించలేరు. సావేరి పరాయిది కానేకాదు. కాని ఫావేరి పరాయిదే ఇది సత్యం. సత్యాన్ని అబద్ధంగా ఎలాచూడను? నిజాన్ని అంగీకరించకుండా ఎలా వుండను?

ప్రతి పనిలోనూ సావేరి కల్పించుకుని చేస్తోంటే నాకు భయం వేస్తోంది- ముందుముందు నేను వట్టి బద్దకన్తుడిగా తయారవుతానేమోనని. రేప్పాద్దున్న సావేరి వెళ్ళిపోతే మరొకరెవరో నాకింద చేసిపెట్టాల్సి వస్తుందేమో. వద్దంటే బాధపడుతుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. మాటిమాటికీ తన పరిస్థితిని ఎత్తి చెప్పుకుని, అందుకే చిన్నచూపు చూన్తున్నానంటుంది. ఇలాంటి వాళ్ళతో వేగడం కష్టమే.

ఒకసారి ముసలావిడతోనే అన్నాను-“పొద్దుట్నుంచి అలా ఎడతెరిపిలేకుండా" యేదో ఒకపని చేస్తూనే వుంటుంది. కాస్త తన ఆరోగ్యం గురించి చూసుకోమనండి, విశ్రాంతి లేకపోతే ఎలా” అని.

“నేనూ ఆ విషయమే మాట్టాడుదామనుకుంటున్నాను నాయనా. వొంట్లో యేమాత్రం రక్తంలేదు. ఒకసారి డాక్టరుకి చూపిస్తే మంచిది” అంది.

డాక్టరు దగ్గరికి తీసుకెళ్తనంటే వచ్చిందికాదు. ఎంతచెప్పినా వినిపించుకోలేదు. పెడచెవిని పెట్టేసింది. చివరకు డాక్టరును యింటికే తీసుకొచ్చాను. ఆవిడ వెళ్ళిపోయాక మనవరాలుని గట్టిగా కసురుకుంది ముసలావిడ. “గుట్టుగా యింట్లో పెట్టుకుని తిండి

_ పెట్టడం చాలక ఆయనచేత యీ ఖర్చులుకూడా చేయిస్తావటే. డాక్టరమ్మ వచ్చిందంటే ఎంత ఖర్చయ్యుంటుందో ఆలోచించావా. అర్దమై నవాళ్ళందరికిందా ఆయన ఎందుకు చేయాలి. వెధవ బెట్టూ నువ్వూనూ. బుద్భ్ధుంటేసరి. అయినా ఆ బుద్ధే వుంటే ఈ వ్యవహారం యింతదూరం ఎందుకొన్తుందీ.”

సావేరి యేడుస్తున్నట్ఫంది, మునలావిడ మళ్ళీ కసురుకోవడం వినిఫించింది.

ఆమె అలా కసురుకోవడం నాకేం నచ్చలేదు. నడవాలోకి వచ్చినప్పుడు ఆవిడ్ని పిలిచి అన్నాను-

“కోప్పడకండి. అసలే ఆమె మనసేం బావుండలేదు. ఏమన్నా ప్రతీదీ తన పరిస్థితికి అన్వ్నయించుకుని మరీ బాధపడుతుంది. మనమే ఎగతాళిచేస్తే పరాయివాళ్ళకి మరీ లోకువ. అయినా ఇందులో ఎగతాళి చెయ్యాల్సినది యేముంది. రేప్పాద్దున్న దశావతారం ట్రయింనింగ్‌ పూర్తిచేసుకొస్తే అన్నీ వాటంతటవే చక్కబడిపోతాయి”

కథ నాదీ+-ముగింవు ఆమెద్‌ తం ఆమె వయసులో మూడోవంతు లేదు నాకు. ఆమెకు నేను బోధచేన్తున్నా నేమిటని ఆశ్చర్యపోతున్నదో యేమో నా ముఖంలోకి చూసి “ఆ...ఆ....వచ్చేవాటంగానే వుంది. అంత అభిమానం వున్నవాడే అయితే ఒకసారి వచ్చి వెళ్ళకపోయేవాడా. ఇక్కడికి మేం వచ్చి మూడు నెలలు అవుతోందికదా. ఒకసారి వచ్చి వెళ్ళమని పదుత్తరాలు రాసినా వచ్చాడూ, పదిహేను పైసల కవరుమాత్రం రాశాడు. ట్రయినింగట, రావడానికి వీలుండదట. ఎప్పుడో వీలుచూసుకుని వస్తాడట. నిజంగా అభిమానమే వున్నవాడు, అమ్మాయి యిలాంటి పరిస్థితుల్లో వుందంటే నిమ్మకు నీరెత్తినట్టు వూరుకుంటాడా?” అయితే దశావతారం ఉత్తరాలుకూడాో సరిగా రాయడంలేదన్నమాట! సావేరి ఎప్పుడూ చెప్పనేలేదే! పైపెచ్చు అతని దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగేతే ఊ+ అనికూడా అంది. పాపం! సావేరి మోసపోయినట్టంది. ఆఫీసుకు వెళ్ళానన్న మాటేగాని యిదే ఆలోచన. సాయంకాలం ఆఫీసునించి వొస్తూ తిన్నగా యింటికి రావాలనిపించలేదు. కాస్సేపు పార్కులో కూచోవాలనిపించింది. మంచి హోటల్‌కి వెళ్ళి స్వీట్సు తినాలనిపించింది. ఊళ్ళోకంతటికీ పెద్ద హోటల్లోకివెళ్ళి, ఓ అర్ధగంట పార్కులో గడిపి వన్తూవస్తూ బజారుకువెళ్ళి బుట్టెడు పళ్ళు కొనుక్కుని వచ్చాను. “ఇన్ని పళ్ళా! నీకేమైనామతిపోయిందా, ఇవన్నీ తినమనే తెచ్చావా” అంది సావేరి. నిజమే. చాలా వళ్ళున్నాయి. ఏమిటో...కొనెయ్యాలనిపించి కొనేశాను. ఆలోచించనేలేదు. “వినీ తిన్నన్ని తిని మిగతావి వాదిలేయ్‌. అయినా ఈ ద్రాక్షపళ్ళు వున్నాయి “చూడూ...ఇలా మాట్టాడుతూ మాట్లాడుతూ కాలక్షేవంగా ఒకటొకటీ తినేసె యొ్య్యుచ్చు" వాటిలోంచి ఓ అరడజను తెంచి గాలిలోకి ఎగరేసి నోటితో అందుకొంటుంటే విచిత్రంగా చూస్తూ వుండిపోయింది సావేరి. చిన్నప్పుడు బఠాణీలు, వేరుశెనక్కాయ గింజలూ యిలా ఎగరేసి అందుకోవడం అప్పుడే మర్చిపోయిందేమో! “ఇవ్వాళ చాలా హుషారుగా వున్నావే, ఏమిటి విశేషం?” అంది. హుషారా.... వుండే వుండొచ్చు. ఏ విశేషంలేందే యింత హుషారు ఎక్కడిది. వుంది. కాని-ఎలా చెప్పను. “ఇదిగో..నువ్విలా ఖర్చుపెట్టడానికి వీల్లేదు. నీచేత ఖర్చుపెట్టించడానికొ మేం

తిం వాళ్ళమధ్య వంతెన వచ్చింది. నీ యింట్లో వుండనిచ్చావు ఆమాత్రం చాలు” అంది సావేరి. లోపలికెళ్ళి ఓ కాగితంసంచి పట్టుకొచ్చి యిచ్చి “ఇది వుంచు. ఇందులో డబ్బుంది. మందులకి దీంట్టోంచి ఖర్చు చెయ్యి. నీ చేతిడబ్బు ఎంతకని పెడ్తాన్‌ మేం వచ్చిందగ్గర్నుంచి సరిగా యింటికికూడా నువ్వు డబ్బు పంపిస్తున్నట్టలేదు” అంది. పుచ్చుకోనంటే వూరుకుంది కాదు. డ్రాయరు సారుగుతీసి లోపల పెట్టేసి వెళ్ళిపోయింది

ఈ వూరు వస్తున్నప్పుడు వాళ్లమ్మ తాలూకు వస్తువొకటి ముసలావిడ దగ్గరవుంటే అమ్మించేసి డబ్బు పట్టుకొచ్చినట్టు లోగడ చెప్పింది. ఇందులోనించే నెలనెలా రెండో తారీఖున యింటికి ఓ వందో డెబ్బయ్యో మనియార్డరు చేస్తోంది. మొత్తంమీద తెలివైనదే. మంచి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది! కాని, యింత తెలివైనదీ ఎలా యీ గోతిలో పడిందో అర్ధంకాదు. ఇప్పటికీ దశావతారాన్ని నమ్ముతోంది! అదే చిత్రం!!

ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో దశావతారంనించి ఉత్తరం ఒకటి వచ్చినట్న చెప్పింది సొవేరి, ఏంరాశాడో అడగలేదు నేను. ఏం రాసినా అతనిమీద నాకు ఏమాత్రం నమ్మకంలేదు. మునలావిడ వూహించింది అబద్దమేంకాదు. అంత అభిమానం వున్నవాడు ఏదోవిధంగా వీలుచూసుకుని రాకుండా వుంటాడా?

నెలలు దగ్గరపడేకొద్దీ మునలావిడకి కంగారు ఎక్కువయ్యింది. డౌక్టరు టానిక్కులవీ వాడమని రాసిస్తే వాడుతోంది. రెండు వారాలకు ఒకసారి డాక్టరువచ్చి వెళ్తోంది. డెలివరీఅప్పుడు ఆవిడ ప్రయివేటు నర్పింగ్‌హోంలోనే చేర్చించాను.

మధ్యాహ్నం అఫీనుకు ఫోను వచ్చింది-ఆడపిల్లట. కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పింది డాక్టరు. నాకు కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పడంలో ఆమె తప్పేంలేదు. ఏమైనావుంటే అది వాదే,

దశావతారానికి టెలిగ్రాం ఇచ్చాను. ఉత్తరంకూడా రాశాను. సమాధానం వచ్చింది. ఈ వార్త సంతోషాన్ని కలిగించిందట, నురో నెలరోజుల్లో ట్రయినింగ్‌ పూర్తయిపోతుందట. అ తర్వాత పోస్టింగ్స్‌ బహుశా హైదరాబాదులోనే యివ్వచ్చట. ఏకంగా అప్పుడే వస్తానని రాశాడు, ఈ విషయం సావేరకి చెప్తే ఏడ్చింది. అప్పటికి, ఆమెను ఇంటికి తీసుకొచ్చేశాను.

ఖర్చు బాగానే అయ్యింది. సావేరి యిచ్చినదాంట్లో నెలనెలా వాళ్ళింటికి పంపేయగా చివరికి ఏమీ మిగలలేదు. ఎస్‌బి లోంచి కొంత తీయాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత సావేరి కోలుకోవడానికికూడా బాగానే ఖర్చయ్యింది. “నీ బుణం వుంచుకోను.

కథ వాదీముగింప్పు ఆమెకు ఎప్పటికైనా తీర్చేస్తాను” అని అంటుండేది. అన్తమానమూ యిదేోమాట. లేదా కన్హుళ్ళు పెట్టుకోవడం దశావతారానికి మూడో నాలుగో ఉత్తరాలుకూడొ రాసింది సావేరి. పెద్ద పెద్ద ఉత్తరాలే. పోస్టచేయమని నాచేతికి యిచ్చేది, కవర్లు లావుగా అనిపించేవి. వాటికి సమాధానం రాసుంటాడనుకోను. రాసుంటే సొవేరో, వాళ్ళ అమ్మమ్మో చెప్పుండేవారు.

నెలా పదిహేను రోజులకు చివరికి ఓ ఉత్తరం వచ్చింది. ఉత్తరం పెద్దదే. అనలు సారాంశం మాత్రం చాలా చిన్నది. హైదరాబాదుకి పోస్టింగ్స్‌ యిస్తారనుకుంటే తీసుకెళ్ళి విశాఖలో పడేశారట. ఇక్కడకు వచ్చి వెళ్ళాడానికి బైములేకపోతే నేరుగా నాగపూర్‌ రూట్‌లో విశాఖ వెళ్ళిపోయాడట. తీరా ఛార్జి తీసుకునేసరికి సెంట్రల్‌ మినిస్టర్‌ టూర్‌ ఒకటి వచ్చిపడిందట. అ హడావుడి అయిపోతే సెలవు పెట్టేసి వస్తానన్నాడు.

మొత్తంమీద సావేరినిమాత్రం వూల్‌ని చేస్తున్నాడు. తెలివైనవాడే. ఎంత తెలివైనవాడు కాకపోతే సావేరిలాటిదాన్ని బుట్టలో వేసుకోగలిగాడు! విచిత్రమేమంటే, దశావతారం నాటకం ఆడుతున్నాడని యింత న్పష్టంగా తెలుస్తున్నా యింకా అమెకు ఆళ చావలేదు. పాపం! నిజంగా అతను వస్తాడనే నమ్ముతోంది! పిచ్చిపిల్ల!!

ఓరోజు సాయంకాలం అఫిసునించి వచ్చి పాపదగ్గర కూచుని అడిస్తున్నాను. మర్‌ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం యిబ్బందే. ఇప్పుడిప్పుడే ఆలవాటవుళోంది. ఎచ్తుకోబోతే “బట్టలు పాడుచేస్తుందేమో ఉండు, రబ్బరు గుడ్డ వేస్తాను” అంటూ రబ్బరు షీటు తెచ్చి వేసింది సావేరి. చాలా సేపు పక్కనే నుంచుంది. విశేషమేదో వుండివుంటుందని అనిపించింది నాకు. తలెత్తిచూస్తే-

“కీపు సోమవారంకాక ఆ పై సోమవారం వెళ్ళిపోదొమనుకుంటున్నాను. ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోవాలికదా. అదీకాక నువ్వే డబ్బు సర్దుబాటు చేయాల్సి వుంటుంది. ఓ నూటయాఖై అప్పుగా యివ్వు, బతికుంటే ఎప్పటికైనా నీ బుణం తీర్చుకుంటాను” అంది.

మునలావిడకూడా వచ్చింది. “అవున్నాయనా. ఇవ్పటికే నీకు చాలా బుణపడిపోయాం. ఆపదలో దేవుడిలాగ ఆదుకున్నావ్‌. నిన్నింకా యిబ్బంది పెట్టడం యిష్టంలేదు” అంది.

దగ్గర్థోనే ఎప్పుడో ఒకప్పుడు సావేరి తన ప్రయాణం సంగతి చల్లగా చెవిని

తై వాళ్ళమయధ్య వంతెన వేస్తుందని అనుకుంటూనే వున్నాను ఆ వార్త వినడానికి సిద్ధంగానే వున్నా తీరా విన్నతర్వాత మనసు బాధతో మెలికలు తిరిగిపోయింది. ఇంతకాలంగా ఆమె నాకింద సేవలుచేసీ, నేను ఆమెకింద చేసీ యిష్పుడిలా ఎవరికి ఎవరూ ఏమీ కానట్ట విడీపోవాలంటే బాధపడకుండా వుండలేకపోయాను

“రమ్మని రాశాడా?” అని అడిగాను.

“లేదు. మేమే వెళ్దాం అనుకుంటున్నాం” అంది ముసలావిడ.

“ఎలాగూ అతను వస్తున్నానన్నాడుకదా. మరో నెలరోజులు చూసి ఆ తర్వాత వెళ్ళుదురుగాని” అన్నాను.

కాని సావేరి నొప్పుకోలేదు. వెళ్ళితీరాలని పట్టుపట్టింది. ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోతే తన చేతిగాజు ఒకటి అమ్మేస్తానంది.

ఆమెను ఆపడం నాకు చేతకాలేదు. ఆమెకింద యింత ఖర్చుపెట్టినా, యింత 'సేవచేసినా కొంత స్వార్ధంతోనే చేశాను. కాని యిష్పుడు ఆమెను వెళ్ళొద్దని ఆపడంలో నా స్వార్ధం ఏమీలేదు. తీరా అక్కడికి వెళ్ళాక దశావతారం ఆమెను తిరస్కరిస్తే? ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? కూడా చిన్నపిల్ల ఒకర్తి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా వీల్లేని పరిస్థితి.

ఆఖరిసారిగా స్టేషనుకు బయలుదేరేముందుకూడా చెప్పాను. ఆమె ఎలాంటి చిక్కుల్ని ఎదుర్కోవలసి వస్తుందో వివరించాను.

“నీదంతా వట్టి భ్రమ. అతను అలాంటివాడేంకాడు. అతన్ని గురించి నీకు పూర్తిగా తెలీదులే” అంది. ఆమాట ఆమె మనస్పూర్తిగా అన్నదికాదు. అంత ధైర్యం వున్నది మాటిమాటికీ ఎందుకు కన్నీళ్ళు పెట్టకున్నట్ట?

“దశావతారం మంచివాడే, కాదనను. కాని పరిస్థితులకు జడిసి ఒకవేళ అతను నిన్ను వదుల్బుకోవాలని ప్రయత్నిస్తే?”

“నువ్వేం భయపడనక్కర్లేదు-నేను ఆత్మహత్యలాంటి యే అఘాయిత్యానికీ పూనుకోను. అంత పిరికిదాన్నేంకాను. ఇదేమిటి! నువ్వు యివ్వాళ యింత చిత్రళగో ఆలోచిన్తున్నావ్‌”

“ఏమీలేదుగానీ ఓ విషయం జ్ఞాపకం పెట్టుకుంటావా?”

కథ నాదీ-ముగింవు ఆమెదీ క!

“ఏమిటది?”

“ఒకవేళ అక్కడ నువ్వేమైనా చిక్కుల్లోపడితే ఇక్కడికి వచ్చేసెయ్యి, నేనున్నాను”

“ఎందుకూ, ఆశ్రయమిస్తావా?” అంది సావేరి నవ్వుతూ.

“కాదు, పెళ్ళిచేసుకుంటాను"”

ఆశ్చర్యంగా చూసింది సావేరి.

“దశావతారం నిన్ను తిరన్కరించాలని నేను కోరుకోవడంలేదు. ఒకవేళ తిరస్కరించడమేగాని జరిగితే యిక్కడ నేనున్నాను-మర్చిపోవద్దు?

ఆమె ఏమీ మాట్టాడలేదు. మౌనంగా అక్కడ్నించి కదిలి వెళ్ళిపోయింది.

రైలుకి టైముయ్యిందంటే వెళ్ళి టాంగా పట్టుకొచ్చాను. స్టేషనుకి వెళ్ళాం. దారిపొడుగునా, స్టేషన్లోనూ నా మంచితనాన్ని ముసలావిడ పొగుడుతూనే వుంది. సావేరి మాత్రం మాట్లాడకుండా మౌనంగా కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తూ వుండిపోయింది. బండి కదిలింది. వెళ్ళొస్తానన్నట్టు తలాడించింది సావేరి, ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. దీనంగా కిటికీలోంచి చూస్తోంది.

“నేను చెప్పిన విషయం మర్చిపోవుకదూ. వచ్చేముందు. ఉత్తరంరాయి, 'స్టేషనుకొస్తాను.”

  • ఆమె యింకా అలాగేచూస్తోంది. ఆలా చూస్తూనే చూవునించి తప్పుకుని

దాటిపోయింది.

ఇంటికొచ్చాను. నేనెంత వంటరివాడ్నో నాకిప్పుడు తెలిసొచ్చింది. నా చుట్టూ మహా సరస్సులాగ వంటరితనం. ఎటు కదలినా బురద బురదగా అంటుకుంటున్న జ్ఞాపకాలు. ఇల్లంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టు వుంది. రాత్రంతా ఆలోచనలే. కంటిమీద రెప్పవాలలేదు.

పొద్దుట్నుంచి మళ్ళీ నా పని నేను చేసుకోవాలంటే బాధగానే వుంది. మొదట్లో నా పని నేను చేనుకునేవాడ్ని. సావేరి వచ్చి యితరులమీద ఆధారపడడం నేర్చింది.

మళ్ళీ హోటలు తిండే గతయ్యింది నాకు, ఉన్న ఆ ఒక్కగానొక్క సౌతిండియన్‌ హోటల్‌నించి ఏం వస్తే అది తినకతప్పదుకదా. కేరియరు అంతకుముందు ఓ ముసల్లి తెస్తుండేది సావేరివాళ్ళూ వచ్చినప్పుడు మాన్చించేశాను. ఇప్పుడు మళ్ళీ ఆమెనే

క! వాళ్ళమధ్య వంతెన తెమ్మన్నాను. ముసలి ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళు వూరెళ్ళిపోయారని చెప్పాను. ఇంకా ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలో? ఎంతమంది ఎదుట భంగపడాలో? మరింకెంతమందితో అపహాస్యానికి గురికావాలో? సావేరి వెళ్ళిన మూడోరోజునించే ఉత్తరం గురించి ఎదురుచూస్తున్నాను. ఇంకా ఆశ యింకిపోలేదు. ఎక్కడో పల్చగా, తడితడిగా నన్ను అంటి పెట్టుకొనే వుంద్‌. సావేరినించి నేను నేర్చుకున్నవాటిలో మరొకటి-నిరీక్షణ. చిన్నప్పుడు అర్థాలు నేర్చుకున్నాను. పెద్దయ్యాక నిరీక్షించడం నేర్చుకున్నాను. శనివారం ఒకపూటే ఆఫీసు. ఇవ్వాళైనా యింటికొచ్చేసరికి సావేరి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చివుంటుందని హడావిడిగా ఆటోలో వచ్చాను. తలుపు తీస్తే లోపల ఏ ఉత్తరాలూ లేవు మనియార్డరు రసీదు మాత్రం వుంది. ఇంటికి పంపిన మనియార్డరు తాలూకు ఎకనాలెడ్డిమెంట్‌ రసీదు అది. కేరియర్‌ వస్తే భోంచేస్తున్నాను. ఇప్పుడిప్పుడే హోటల్‌ తిండి అలవాటవుతోంది. సావేరివాళ్ళూ వెళ్ళిపోయినతర్వాత మూడు రోజులవరకూ సరిగా భోజనమే చేయలేదు. బయట పోస్ట్‌మేన్‌ పిలుపు. కేరియర్‌ తెచ్చే మునల్సి హడావుడిగా టెలిగ్రాం పట్టుకొచ్చింది. సావేరి దగ్గర్నుంచేనేమో. ఆ ఆతృతలో ఎంగిలిచెయ్యి కడుక్కున్నానో లేదో తెలీదు, సంతకం పెట్టి పోస్టమేన్‌ను పంపించేసి టెలిగ్రాం విప్పాను. అవును, సావేరి దగ్గర్నుంచే! | ముసల్లి' ఆతృతగా చూస్తోంది. కాదుమరీ! టెలిగ్రాం అంటే ఎవరికైనా కంగారే. పాపం ఆ ముసల్డాన్ని చూస్తే జాలేస్తోంది. బీదది. ఎవరూ లేరు. ఆమెతో ఎల్లుండినించి కేరియర్‌ తేనక్కర్లేదని చెప్పాలంటే నాకు నోరు రావడంలేదు. త ద్హ్రరరయ్యు ్రరిరాలరు క్షా

వ వన] ౧; నన న న ననన న | భ్‌; | ం ల న్‌ . _ వ , ఉదయం వ. వచ్చేసరికి దూరంగా తామరమొగ్గలా _. -, సముద్రాన్ని చీల్చు! చ నాషాపసోట్యోడు కెరటాల పొత్తిళ్ళలో ఊయలలూగుతూ సో కనిపించేవాడు. సాయంకాలం యిసుకలో ఆడుకోవడానికి సముద్రపు వొడ్డుకు వెళ్తే “ ఏ ఆకతాయో తుంచిపారేసిన తామర పూవులా కెరటాలమీద తేలుతూ ఎగిరిపడుతూ -' | ఆ సూర్యుడే కనిపించేవాడు. అప్పుడప్పుడు మనసుపుట్టిన రాత్రిళ్ళు చంద్రుడుకూడా | " ఉల్లిపారకాగితంకన్నా సన్నని వెన్నెల తెరలోంచి దిగొచ్చి, అక్కడ కెరటాలమీద నృత్యంచేసి; తెల్దారిపోతుండగా, చెదిరి కిందపడిపోయిన వెలుగు ముత్యాల్నయినా 0 ఏరుకోకుండా పారిపోయేవాడు. ఎప్పుడు చూసినా వయ్యారంగా వంగి, చివాల్నపైకెగిరి, దబ్బున జారిపడి కాస్సేపు అటూయిటూ ఊగిసలాడుతూ కనిపించేవి పడవలు. క _ (-వాళ్ళమధ్య వంతెన) శ ॥ . ( ( . చె వ | | ట్తు జ్జ / , గి | , ] . ం ఉమ *