Telugu Urwashi - anilvaranasi/indianlanguages GitHub Wiki
. ఊర్వశి. (నృత్య నాటికు
ఊర్వశి (నృత్యనాటిక) వారణాసి నాగ లక్ష్మి వారణాసి పబ్లికేషన్స్ “హైదరాబాద్
ఆగ౧/65| (గ6 1[011100) ణి 9౪ ౪070౧౦౩1 1160616151గ| ల్సి నో జో [1౫+ ౧౮౦11566: ౦౭౦౭గ౨౪) 20] 4 / ర్చ య్ (అ షం110/ య 7 ( తీ౦ర౧655: భీ ౪06160౧651 [1628061013 0గ1, 85, క1౧౧౧౦56, ౮౦౦౮1100౪2 గ60610006- 500032 5౧. 110. 0949076] 575 ఆ౧౦||./0/0౧051.౧66౦10100౧19ంగ0॥.00౧ 8100. ౪6౧౮|616[01.01005001.1౧ ంగ185; 500 ళాల ఆయ. కం0% 0౧6౪ : ౧౩. 25.00 ళం. సళ ర రుల రంం% 0౮01150109 //0గ౮: ల! లలని! కస్త 40110/061600|౪ క ్త్తే చల (/0101౪/0160010(98%76॥1.00గ లాం + ౧౧౦౧6: 80963 10140 ష్ట్ర 6౦౪౬౯ ౮ఆ5/8౧: ౪676౧651 [1000616109 0౧01 శ ర7౧& గంలంకొం్ర: ద 8 క. గిం ౧౧౦0006 య్డ్ ₹|; 9రరరర 08835 ల్ గిగ౧|80౮ 0): [11001076 /0౧|16 [1400640011 గరఅ౦506. 01: ర555 2357 ర5ం0గు ౮/౮|/౦5/6 01: నీరాంంరీంాం, 040-24652387 11696 కింం గేంం36, 9247446497
సృతిసీమల్లో పూతావి సుధాంతరంగ భార్గవి గడియారపు సమయపాలన లం పూ చెదరని కుందతోసం య 1 తదీగని ఆత్సవిశ్వాసం వేన్. వెదసి ఒకే ఒక్కభాక్షవరిపు! జ. న. ఐరిసిన లిల్లీపూవు స[ | బాం ... | మెలలీ తుషార్ బందువు స్ట జ్జ “ కొక్ళుల్లో కోంసల కులుకు ఎండల్లో తొలకరి చినుకు అభ్చే అవేవి ఆమెకు సాటిరావు! ఒక నృత్యమాతకం నుప్వు రాయాలి అని ఈ రీచనకు నన్ను వ్రురికొల్పి: కీ.శే. భార్గవీరావుగారికీ, నా స్కృతిసీకుల్లోని పూతావికి ప్రుకుప్రూర్వడంగా, ఐనక్రుంగా ఈ దీచన
ఊర్వశి (నృత్యనాటిక) ముందుగా ఒక మాట
నా మొదటి పుస్తకం, 'వానచినుకులు' లలితగీతమాలిక వెలువడిన కొత్తల్లో ఒక రోజు ప్రసిద్ధ రచయిత్రి భార్గవీ రావుగారు మా ఇంటికి వచ్చారు. “వాన చినుకులు పుస్తకానికి ముందుమాట అందించి, వాత్సల్యం కురిపించి, అడగక ముందే తన సహకారమందించి, పుస్తకావిష్ణరణ ఉత్సవాన్ని జయప్రదం చేసిన ఆమె ఆ రోజు నాకొక పని పురమాయించారు. 'నీ పాటల పుస్తకంలో చక్కని భావాలు, వాటికి తగిన పదజాలం చూసి నీ చేత ఒక నృత్యరూపకం రాయించాలని అనుకున్నానోయ'” అని ప్రకటించి, ఊర్వశీ పురూరవుల (ప్రేమకథని ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 'నృత్యరూపకమా? నేనా? అంటూ తల అడ్డంగా ఊపుతున్న నన్ను కోప్పడి ఆ పనికి ఒప్పించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె అమెరికా వెళుతూ, నృత్యరూపకం ఎలా రాయాలో సూచనలిచ్చి, చలంగారు రచించిన 'పురూరవి నాటిక పుస్తకాన్ని ఇచ్చి తను తిరిగి వచ్చేసరికి రూపకం తయారుగా ఉండాలని తర్జని చూపించి వెళ్లారు. తలా తోకా అర్థం కాని నేను 'పురూరవిను అకాశవాణివారు (శవ్యనాటికగా రూపొందించినపుడు, అందులో ఊర్వశికి తన గాత్రమాధురితో ప్రాణం పోసిన, జగమెరిగిన 'వాచికాభినేత్రి శ్రీమతి శారదా శ్రీనివాసన్గారింటికి పరుగు తీశాను.
శారదగారు ఆత్మీయంగా ఆహ్వానించి, ఎన్నో సంవత్సరాల క్రితం రేడియోలో ప్రసారమైన 'పురూరవి శ్రవ్య నాటిక కాసెట్ని ఇచ్చి, నా ఈ రచనకి శ్రీకారం చుట్టించారు. ఇంటికి తిరిగి రాగానే పురూరవ చదివి, శారదగారిచ్చిన క్యాసెట్ విన్నాను. శ్రవ్యనాటిక ద్వారా ఒక రచనకు అంతగా ప్రాణం పోయవచ్చని ఎవరైనా చెపితే నేను నమ్మలేకపోదును. ఆ నాటిక వింటుంటే ఊర్వశి కళ్ళముందు సాక్షాత్మరించిందంటే అతిశయోక్తి కాదు. వారణాసి నాగలక్ష్మి ర్
ఊర్వ+ (నృత్యనాటిక) శారదగారి గొంతులో వినిపించిన భావవల్లరి, ఆ నవ్వులో పలికిన రాగమంజరి అనితరసాధ్యమనిపించింది. అలా కొద్ది రోజులు ఆ కాసెట్ వింటూ ఆ ఇతివృత్తాన్ని ఆత్మగతం చేసుకుందుకు ప్రయత్నించి, మెల్లిగా రచనకి ఉపక్రమించాను.
ఎప్పటికప్పుడు రాసిందంతా శారదగారికి వినిపిస్తూ సాగించిన ఈ రచన భార్గవిగారు తిరిగి వచ్చేసరికి సుమారుగా పూర్తయింది. అమెరికా నుంచి కూడా భార్గవిగారు చరవాణి ద్వారా పలకరించి, రచన ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటూ ఉండేవారు. వెనక్కి వస్తూనే మా ఇంటికి వచ్చి నేను రాసినదంతా చదివి, ఆమోదించారు. ఇతివృత్తం ఎంపికలో, రచన కొనసాగింపులో ఆమెది ముఖ్యపాత్ర కనుక ఇది సంయుక్త రచనగా వెలువరిద్దామని అంటే, సరేనని ఊర్వశి భువికి దిగివచ్చే సమయంలో కావలసిన పాట స్థానంలో తన 'రాగవల్లికలు' పాటల పుస్తకంలోని గీతమొకటి సరిపోతుందని చెప్పి, ఉదయకిరణ కాంతులపై అరుణ సారథీ అనే పాటని నాకు పంపించారు. అలా ఊర్వశి నృత్యరూపకం తయారయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఊర్వశి, ప్రముఖ నాట్యాచార్యులు భాగవతుల సేతురాంగారి ఆధ్వర్యంలో లలితకళాతోరణంలో ప్రదర్శితమయిందంటే దానికి ఈ రచన పట్ల భార్గవీరావుగారు చూపిన (ప్రత్యేక శ్రద్ధే కారణం.
సుందర రూపమే గాక అందమైన అంతరంగం ఉన్న భార్గవిగారు శుభకామిని. అందరికీ శుభం కలగాలనీ, ఎవరి మనసూ నొచ్చుకోకూడదనీ, అంతా హాయిగా నవ్వుతూ జీవించాలనీ కోరుకునేవారు. మనసు నిండా ఉత్సాహం నింపుకున్న ఆమె నిత్యయవ్వని. 'సమస్యలు అందరికీ ఉంటాయి గనక మనకూ ఉంటాయి. వాటి దారిన అవి ఉంటాయి, ఉందనీ" అన్నట్టుండేది ఆవిడ ధోరణి. ఎన్నో దశాబ్దాల తర్వాత కలుసుకున్నా క్షణంలో పాత స్నేహాన్ని పునరుజ్జీవింప జేయడం, పూలను కలిపే దారంలా మనుషులని కలిపి, వారి మధ్య స్నేహసుమాలు వికసిస్తుంటే చూసి ఆనందించడం ఆవిడ కలవాటు.
“నీ కవిత చదివి కళ్లు చెమ్మగిల్లాయి నాగలక్ష్మీ! నా '0గ019జూకి దాన్నే పెట్టుకుంటా! అని, తన మాటలకి నిర్జాంతపోయిన నన్ను చూసి *ఈ
ఛ్ వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక)
అరవై వళ్ళలో జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాను. ఇంకేం కోరికల్లేవ” అంటూ నవ్వేసిన అవిడ గుర్తొస్తే జీవితం పట్ల ఆమె మోహరాహిత్యం అర్ధమవుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆవిడ మరణవార్త. వందమంది రచయిత్రుల కథాసంకలనం 'నూరేళ్ళ పంటి నిచ్చిన ఆవిడకి అరవైలోనే నూరేళ్ళూ నిండిపోవడం పెద్ద విషాదం!
భార్గవిగారి మరణం తర్వాత ఈ నృత్యరూపకం వెలుగు చూడకుండా ఆగిపోయింది. సంయుక్త రచనగా దీని ప్రచురణ ఖర్చులూ, అమ్మకం లెక్కలూ, ఇతర అనుమతులూ ఒకసమస్య, ఈ రచన పుట్టుపూర్వోత్తరాలకు సాక్షిగా నిలిచిన శ్రీమతి శారదా శ్రీనివాసన్గారి సలహా తీసుకుని, చాలాకాలం తర్వాత ఇప్పుడు, నా స్వీయరచనలో భార్గవిగారు చేర్చిన పాట స్థానంలో “దిగివచ్చెను దిగివచ్చెను భువికి ఊర్వశీ అనే కొత్త పాటని రాసి, ఊర్వశి నృత్యరూపకాన్ని పుస్తకరూపంలోకి తెచ్చేందుకు పూనుకున్నాను. ఈ రచన నేనే చేసినా దీని వెనక చోదకశక్తి మాత్రం భార్గవీరావుగారే! ఈ రచనను నాట్యాచార్యులు ఆదరిస్తారనీ, ఊర్వశి అనేక వేదికలపైన దృశ్యమానమై రసజ్ఞుల మన్ననలు పొందుతుందనీ ఆశిస్తూ, కళాఖిమానుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. వారణాసి నాగలక్ష్మి 7
ఊర్వశి (నృత్యనాటిక) ఇతివృత్తం - కథా సారాంశం న్ టక - 1 నారాయణముని గొప్ప తపస్వి, భగవత్సాక్షాత్మారాన్ని కోరి మోక్ష సాధన లక్ష్యంగా నిష్టగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. ఇంద్ర పదవిని ఆశించి తపస్సు చేస్తున్నాడేమో అన్న భయంతో దేవేంద్రుడు, తపోభంగం కావించమని రంభను పంపిస్తాడు. నారాయణముని చలించకపోగా, తన ఊరువునుండి మరో అప్సరస ఊర్వశిని సృష్టించి, రంభకు దీటుగా నిలబెడతాడు. రంభ, ఊర్వశి - ఇద్దరూ పోటీపడి నృత్యం చేస్తారు. రంభ రాజసం ఓడిపోతుంది. ఇంద్రుడు తాపసిని క్షమించమని ప్రణమిల్లుతాడు. నారాయణ ముని క్షమించి ఊర్వశిని స్వర్ణాధిపతికి కానుకగా ఇస్తాడు. వలసల - 1 దేవేంద్రలోకంలో ఇంద్రుడు, శచీదేవి కొలువై యుంటారు. యక్షులు, గంధర్వులు, అప్స్పరసలతో సభ నిండుగా ఉంటుంది. భరత మహాముని అప్సరసలకు నాట్యరీతులు వివరించి, నాట్యం నేర్పిస్తుంటాడు. నాట్యం చేస్తున్న ఊర్వశి మనస్సు తడబడుతుంది. తాళం తప్పుతుంది. భరతుడు కోపంతో - భూలోకంలో పుట్టిన నీకు మట్టివాసన పోలేదు. అక్కడికే వెళ్లి ప్రక్షాళన చేసుకుని రమ్మని శపిస్తాడు. 50టాా-2! భిన్న మనస్కురాలై భూలోకానికి దిగివస్తున్న ఊర్చశి కింద కనిపిస్తున్న పచ్చని చెట్లనూ, నదులనూ, కొండలనూ, ప్రకృతిలోని వైవిధ్యాన్నీ చూసి పరవశిస్తుంది. పులకించిన మనసుతో ఆ అందాల్ని ఆస్వాదిస్తూ కిందికి వస్తుంటే 'కేశొ అనే రాక్షసుడు ఆమెను మోహిస్తాడు. తనతో రమించమని వారణాసి నాగలక్ష్మి ర
ఊర్వశి (నృత్యనాటిక) కోరతాడు. ఊర్వశి తిరస్మరించగా బలాత్మరించబోతాడు. అప్పుడు అటు వైపుగా వస్తున్న చక్రవర్తి పురూరవుడు కేశితో పోరాడి గెలిచి, అతన్ని తరిమేస్తాడు. ఊర్వశి పురూరవుడికి (ప్రేమతో, కృతజ్ఞత తెలుపుతుంది. నలమ౫ - 117 ఊర్వశీ పురూరవులు పరస్పరం ఆకర్షితులై (పేమించుకుంటారు. ఊర్వశి పురూరవుడికి (శప్రేమ అంటే పరస్పర ఆత్మార్పణ అనీ, అది వ్యామోహానికీ, కామదాహానికీ అతీతమైనదనీ తెలుపుతుంది. రాజునన్న అహంభావం ఉన్నంతకాలం దైవికమైన (ప్రేమ అనుభవంలోకి రాదని చెప్తుంది. ప్రణయ శృంగారాలలోని రసతత్త్వాన్ని ఇద్దరూ పంచుకుని పరవశళిస్తారు. న ౮ళ8 - 1 ఊర్వశి లేని దేవేంద్ర సభ చిన్నబోతుంది. రంభ, మేనక, తిలోత్తమ
మొదలైనవారు ఆమె లేని లోటుని దేవేంద్రునికి ఎత్తి చూపుతారు. ఊర్వళి శాపవిముక్తురాలయిందని చెప్పి, స్వర్గానికి తిరిగి తీసుకురమ్మని అప్పరసలను భూలోకానికి పంపిస్తాడు దేవేంద్రుడు. 'తనకు రావాలని లేదనీ, భరతుడి శాపం తనకు వరంగా మారిందనీ - క్రేమ ఉన్న చోటే స్వర్గమనీ - జీవంతో తొణికిసలాడే భూలోకమే తన స్వర్ణమనీ, పురూరవుడే తన సర్వస్వమసీ ఊర్వశి వారి అభ్యర్థనను తోసిపుచ్చుతుంది. ఊర్వశీపురూరవుల ప్రణయగీతంతో నాటిక ముగుస్తుంది.
10, వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) వాత్రలు (ప్రవేశక్రమంలో) నారాయణ బుషి ఇంద్రుడు రంభ ఊర్వశి భరతుడు కేశి (రాక్షసుడు) పురూరవుడు (చక్రవర్తి) అప్పరసలు వారణాసి నాగలక్ష్మి భ్
ఊర్వశి (నృత్యనాటిక) ఊర్వశి (నృత్యనాటిక) 0౧౫౫600 90 టా య్ విఘ్నశ్వర ప్రార్ధన శ్లోకం: 1. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥
2, విఘ్నేశా తన చరణం విఘ్న వినాయక మమ శరణం గంగాధర హర, గౌరీ మనోహర గిరిజాతనయా తవ చరణం మూలాధారా మోదక హస్త మోక్షదాయకా తవ చరణం జ్ఞానాధారా జ్ఞానవినాయక నటన వినోదా మమ శరణం ॥
భా! సరస్వతీ ప్రార్ధన వాణీ పరాకు గీర్వాణీ పరాకు వీణా విమోహన పాణీ పరాకు సంగీత సాహిత్య న్యాయాది సాహిత్య జగతీ పరిపాలించు జననీ పరాకు “ఊర్వశి” కావ్యగీతి నాట్యా - తుల్యానంద ్రదాదేవి పరాకు (ఇష్టదేవతా ప్రార్థన) సంధివచనం అని ఇష్టదేవతా (ప్రార్ధనాంతరంబు, కల్పతరు ప్రతిరూపంబుగా, నేడిట సమావిషన్టంబయిన పెద్దల, రనజ్ఞుల, వండితుల, నవృాదయుల సముదాయముతో కూడుకున్న విస్తృత విశాల సభాసరస్వతికి నమో వారణాసి నాగలక్ష్మి 13
ఊర్వశి (నృత్యనాటిక) వాకంబులర్చించి “ఊర్వశి యను మధుర కథానిబద్ధ కావ్యగీతి నాట్య 'ప్రబంధమునకు ఆరంభమెట్టిదనిన...
(తపోదీక్షలో ఉన్న నారాయణ ముని పద్మాసనంలో కూర్చుని ఓంకారాన్ని జపిస్తుంటాడు. ముందు కొంచెం పైశ్చ్ళతిలో, తర్వాత మంద్రంగా ఓంకారం వినిపిస్తుంది.)
ఓం.... ఓం.... ఓం.... ఓం నారాయణముని ప్రవేశ దరువు
ఇతడే ఇతడే నారాయణముని మహిమాన్వితుడు మహాతపస్వి
అన్నపానముల త్యజియించి, ఆ భగవంతుని కోరి వరియించి
వేయి నామముల విష్ణుమూర్తిని సాకారముగ సాక్షాత్మరింపుమని
మోక్షకామియై మైమరచి తపోదీక్ష వహించిన దివ్యతేజుడు 1 ఇతదే॥
ఓం.... ఓం.... ఓం.... ఓం
సర్వం నారాయణం. నరుని నరనరమందు నర్తించు జీవం
జీవకోటిని నడిపించు తేజం.... సృష్టి స్థితి లయ కారణభూతం
అభీష్టసిద్ధిని అందించు మంత్రం... సర్వం నారాయణం!
(నారాయణముని కళ్ళు తెరచి అభినయిస్తాడు.)
పాట (1)
షః నారాయణా! నీ చరణ కమలాలు శరణంటి కరుణామయా ! నారాయణా! నీ నామస్మరణమే మోక్షమొసగు సన్మార్గమయా! ॥
చ॥ ఇహమందు రుచి లేదు - దేహ స్థితిగతుల స్పృహ లేదు నరుల నృపాలుర నుతియించలేనయ్య సురలోక సౌఖ్యాలు సుతరాము వలదయ్య ॥
14 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) చః నా అణువణువు నీ నామ పారాయణము చేయ అహరహము నీ స్మరణ అనుక్షణము నీ భజన నాపైన నీ కరుణ ప్రసరింపుమయ్యా నీలోన లీనమౌ తరుణ మెపుడయ్యా లక్ష్మీవల్లభా! నారాయణా ! శ్రీమన్నారాయణా! ఓం.... ఓం.... ఓం.... ఓం శ్లోకం! నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా తస్యా శృీభాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స్స శివ స్స్పహరిస్సేంద్ర స్పోక్షర పరమ స్వరాట్ (మంశ్రపుష్పము) చ నాలోన అణువుగా భాసించు పరమాత్మ కోటానుకోట్ల ఈ జీవాలయందు ఈ సృష్టిలోని ప్రతి ప్రాణియందు సూక్ష్మాతి సూక్ష్మ రూపాన నిలచీ నడిపించు స్వామీ - నారాయణా నా మీద కృప చూపి మోక్షంబు నందించి నీలో విలీనంబు గావించుకొనవయ్య నారాయణా! నమో నారాయణా! ఇంద్రుడి ప్రవేశ దరువు ఇతదే ఇతడే ఇంద్రుడు దేవేంద్రుడు సురేంద్రుడు శచీదేవి ప్రాణేశ్వరుడు అష్టదిక్పాలకులకు అధినాయకుడు నాట్య గాన సుర భోగభాగ్యాల తేలే స్వర్గాధిపతి ఇతడు (ఇంద్రుడు నారాయణమునిని చూచి భృకుటి ముడివేసి తన సందేహాలన్నిటినీ వ్యక్తం చేస్తాడు) వారణాసి నాగలక్ష్మి 154
ఊర్వశి (నృత్యనాటిక) పాట (92)
పష। తాపసి ఇతదెవ్వదు? జటాధారి ఎవదీతడు? ఏమి కోరి కఠోరమైన తపోదీక్ష పట్టినాడు? ఎవరీతడి ధ్యానమునకు కేంద్రము? ఏమి ఇతడు కోరబోవు వరము? ॥
చ॥ శంకరుదైతే భక్తవశంకరుడు కోరిన వరములనిచ్చే భక్త సులభుడు భక్తవరదుడే ఆ నారాయణుడు కోరిన కోర్కె దీర్చు కల్పతరువు ఆతడు ।
చ సాక్షాత్మరించినచో శ్రీ పరాత్పరుడు కోరునేమొ స్వర్గానికి ఆధిపత్యమీతడు స్వర్గసుఖములెన్నెనా కోరినచో తప్పులేదు ఇంద్రపదవి కెసరు పెడితె ముప్పు నాకు తప్పదు! (హేళనగా) అంత సులువు కాదోయి తపము పండుట! ఎంతటి మౌనికైన ఇంద్రుడుండగా దేవేద్రుడుండగా! ॥అంత॥ దిక్కులనే శాసించెద! ముని దీక్షను సడలించెద! భయభ్రాంతుదై ఈతడు తపము తానె చాలించగ!
(పెద్దగా గాలివాన... మెల్లగా గాలి ఉధృతం తగ్గుతుంది. ఓంకారం మరింత దృథంగా, స్పష్టంగా వినిపిస్తుంది. నారాయణముని తపోనిష్టకు దిక్కులే తలవంచుటతో కలవరపడిన ఇంద్రుని స్వగతం)
16 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) పాట (8)
ప॥ ఎవరీతడు దృఢచిత్తుడు తపోనిష్టా గరిష్టుడు? దిక్కులనే శాసించి దివిజుల మెప్పించువాడు?
(తల పంకించి)
చ ఉపేక్షించ సరికాదు సహస్రాక్ష! యోచించుము సురాంగనల పంపించుము తపోభంగ మొనరించుము ఎట్టులైన ఇతని పట్టు పటాపంచలౌనట్టు తరుణోపాయమ్మును తక్షణమే సంధించుము!
(సాధికారంగా “రంభా! అని పిలుస్తాడు ఇంద్రుడు. ఆహ్లాదకరమైన
సంగీతంతో రంభ ప్రవేశిస్తుంది) రంభ ప్రవేశ దరువు
ఇంద్రసభను మెరిపించే నాట్యాంగన రంభను!
మునులనైన మోహములో ముంచివేయు మవహాస్తమును!
నాట్టమందు మయూరాన్ని! తేజమందు మయాూఖాన్ని!
కామిని నేను! మోహిని నేను! రంభను 1 నే రంభను!
(ఇంద్రుని మనోగతం అవగతమైన రంభ తన నాట్యహేలతో నారాయణముని తపస్సు భగ్నం చేయ ప్రయత్నిస్తుంది.)
పాట (4)
షః ఏల ఈ తపము మునిపుంగవా? వసంత హేల కలరవము ఆలకించవా? ॥
చ। మూసిన కనుదోయి తెరచి చూడుము ముంగిట నర్తించె సుందర కావ్యము
వారణాసి నాగలక్ష్మి 17
ఊర్వ? (నృత్యనాటిక)
జపము మానుము - జవ్వని గనుము జలతరంగ విలాసము గాంచుము ॥
చః సరస మొలికించు నాట్య జతిగతులు మదిని మురిపించు శృంగార లయలు కనుల విందులివె కలికి పొందులివె అతివ అందాలు అందుకోవోయి! వలపు సుమమాల వాడనీకోయి! సురల సొత్తెన సోయగాలన్ని మునివరా నిను కోరి దరిచేరగా॥
(నారాయణ ముని కళ్ళు తెరచి చూసి దేవేంద్రుని భయాన్నీ అతని ఎత్తుగడనూ అర్ధం చేసుకొంటాడు. గంభీరంగా తలపంకించి, తన ఊరువును చరుచుకొంటాడు. రూపుదాల్చిన మెరుపుతీగ వలె ఊర్వ+ ప్రత్యక్షమౌతుంది. లలిత మృదు పదనర్తనతో నారాయణమునికి నమస్కరిస్తుంది. ఆమె రూప విలాసం తనకు సవాలుగా భావించిన రంభ తన నాట్యకౌశలాన్ని ప్రదర్శించ బోతుంది. ఊర్వశి ఆమెకు దీటుగా నర్తిస్తుంది.)
పాట (5)
రంభ: రంభను నేను! రసభావనను సురపతి సంధించు విరితూపును నేను!
ఊర్వశి: ఊరువు నుండి ఉదయించినాను - మౌని ఊరువు నుండి ఉదయించినాను ఊర్వశిని నేను! ఉల్లాస వీచికను !
రంభ; సరిలేరు నాకెవ్వరు - ముల్లోకములలోన సరిలేరు నాకెవ్వరు!
ఊర్వశి: పోల్చ సరికాదు నన్నెవరితో సాటియే లేదు నాకెవరితో!
15 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) రంభ: భోగులైనా రారాజులైనా అందుకోలేని ఆకాశపుష్పాన్ని సురసభను వెలిగించు శృంగార దీపొన్ని మర్ష్యుల మదిలోని మందార గంధాన్ని! ఊర్వశి: పదగతులందు మలయ సమీరాన్ని స్వరమాధురిలోన కలకూజితాన్ని చిరునవ్వులే సిరిమువ్వలై రవళించు రసరాగ రాగిణి నేను! రంభ: నను జూచి తలవంచు గిరిశిఖరాలు అకసమందుకొను రసతరంగాలు రాజసమే నా రంజక తత్త్వము సరసోద్దీపిత ఈ సరసిజము తాపసులను భోగలాలసుల జేసి తన్మయ వీధుల విహరింపజేసి భక్తిని మరపించి రక్తిని రగిలించి అమరసుఖాలిచ్చు ఆరని జ్వాలను ॥ ఊర్వశి: ననుగాంచి వికసించు నవకుసుమాలు కురిపించు మేఘాలు ప్రణయరాగాలు సత్త్వగుణమే నా వారసత్త్వము సద్భావన నా సౌందర్యము ఉదాసీనులను ఉల్లాసమున తేల్చి చిత్తముల గెల్బు చిత్రాంగిని నేను చంచలాక్షిని నేను - చేమంతినే నేను ॥ (రంభ రాజసంగా ఊర్వశి సాత్త్వికంగా నాట్యగతులకు అనువుగా నాట్యం చేస్తారు. రంభ రాజసం ఓడిపోతుంది. అవమానంతో తలవంచి వారణాసి నాగలక్ష్మి 104
ఊర్వశి (నృత్యనాటిక) తప్పుకుంటుంది. ఊర్వశి నారాయణమునికి, దేవేంద్రునికి నమస్మరించి ఒదిగి నిలబడుతుంది.) ఇంద్రుడు: తాపసి! నా తప్పిదమును మన్నించుము తపమేల తలచితివో సెలవిమ్ము! ఇంద్రపదవి కోరితివా? తెలియజేయుమా భవదీయుడు సురేంద్రుడితడు దీవించుమా! నారాయణముని: సర్వమూ త్యజించినట్టి తాపసి నేను భయము వలదు ఏ పదవిని నే కోరను సురనాధా! లేదు నాకు ఎటువంటి లాలస! పరమాత్ముని ధ్యాస తప్ప లేదయ్య ఏ ఆశ! గైకొనుము దేవేంద్ర! ఊర్వశి నా పుత్రిక ఇంద్రసభకు వెలుగునిచ్చు మణిదీపిక! (నేపథ్యం నుండి రంభ మరికొందరు అప్సరసలు వచ్చి ఊర్వశి చేతులు పట్టుకొని దగ్గరగా వస్తారు. ఒకరినొకరు స్నేహంగా చూసుకొంటారు.) న్ ౮ - 2 (ఇంద్ర సభ. నాట్యకోవిదుడు భరతముని అప్పరసలకు నాట్యం నేర్చిస్తుంటాడు. రంభ, ఊర్వశి, మేనక మొదలైనవారంతా తాళ లయబద్ధంగా నాట్యం చేస్తుంటారు.) పాట (6) పః స్వాగత హృదయాంజలి సుస్వాగత స్వర్ధాంజలి చతుర సంగీత స్వరాంజలి సద్భావ సమ్మోహ కుసుమాంజలి ॥ 20 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) చః సరసాంతరంగాల స్వ్పరతరంగాలు కదలి కెరటాలై కవ్వించగా మధురభావాల మలయ పవనాలు మదిని ఉయ్యాల లూపేయగా రాగభరితమై, రసపూరితమై సరస జగతి సమ్మోహితమై తన్మయించే తరుణమిదియే అమర నాట్య గానామృతమిదియే ॥ చ విమల హృదయాల భావకుసుమాలు పరిమళ వర్షాలు కురిపించగా కనుల వాకిలిని కలల మేనాలు కమ్మగా కదలి పయనించగా రాగమే సాగి, కాలమే ఆగి.... (ఊర్వశికి అడుగు తడబడుతుంది, భరతుడు ఆగ్రహంతో ఆమెవైపు చూస్తాడు) భరతుడు: ఊర్వశీ! (అందరూ ఒక్కసారి ఆగి మళ్ళీ అందుకుంటారు) రాగమే సాగి, కాలమే అగి గాలమున చిక్కి రసహృదయమే పరిమళించేటి స్వరసుధకు, పరవశించేటి సురసథకు ॥ భరతుడు: ఊర్వశీ ఆపు... ఆపు నీ నర్తనం! నాట్యమంటే ఏమనుకున్నావు? పంచమ వేదమది! అది సిద్ధించాలంటే తనువూ, మనస్సూ యోగసంగమం కావాలి. యతో హస్తః తతో దృష్టిః యతో దృష్టిః తతో మనః యతో మనః తతో భావః యతో భావః తతో రసః వారణాసి నాగలక్ష్మి 21
ఊర్వశి (నృత్యనాటిక) అని నాట్య శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇలా పరధ్యానంగా చేసే నాట్యానికి రససిద్ధి కలుగదు! ఊర్వశి; క్షమించండి స్వామీ! నా మనస్సును ఎవ్వరో గాలం వేసి లాగుతున్నట్లు అనిపిస్తోంది. ఎంత నిగ్రహించుకున్నా వశం తప్పుతోంది. భరతుడు: అర్థమైంది. నీవు జన్మతః అప్సరసవు కావు. భూలోకంలో నారాయణముని సృష్టివి. మర కన్యవు. అందుకే నీ మనసులో మట్టి వాసనలు ఉట్టిపడుతున్నాయి. వెళ్ళు. ఇప్పుడే భూలోకానికి వెళ్ళు. అక్కడి సుఖాలను అనుభవించి నీ మనోకామన పూర్తి అయిన పిదప మరల ఇక్కడకు రా! ఊర్వశి: స్వామీ శపిస్తున్నారా? (అప్పరసలందరూ ఆందోళనగా చూస్తారు.) భరతుడు: ఉహుం ఇది శాపం కాదు ఊర్వశీ! నీ మనస్సు కోరుకున్నదే. కొద్దికాలం ఎడబాటు తరువాత ఈ స్వర్గం విలువేమిటో నీకు తెలిసి వస్తుంది. (ఊర్వశి తలవంచి అంగీకారం తెలుపుతుంది. అప్పరసలందరూ ఆత్రంగా చూస్తూండగా... తెర) 5౮౫% = 3 (ఊర్వశి దేవలోకం నుండి దిగివస్తూ క్రింద భూమిని చూసి విస్మయానికి లోనవుతుంది, తను ప్రవేశించిన వనంలోని పక్షుల కలరవాలు, కొండల మీదనుంచి దూకుతున్న జలపాతాలు చూస్తూ, పిల్లగాలి తెమ్మెరల నాస్వాదిస్తూ పరవశానికి లోనవుతుంది. ) ప॥ _దిగివచ్చెను దిగి వచ్చెను భువికి ఊర్వశి దివినుండి అసమాన సౌందర్యరాశి అనుపమ లావణ్య తేజోరాళీ... చారుకేశీ 22. వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) చ॥ ఇంద్రపురిని విడిచి ఇలకు అరుదెంచిన చంద్రవదన సమ్మోహిని శివరంజని బింబాధర ఈ మానిని చః అంభోరుహ నేత్రి సరళ - మృదు మంజుల మధురగాత్రి హంసాలస మందయాన - సుహాసిని కల్యాణీ చ॥ ప్రత్యూష పవనాల తేలియాడు కలరవాలు సేదతీర్చి లాలించే మలయమారుతాలు శుకపికాల పిలుపులకే ఘల్ ఘల్లను కింకిణియై నర్తించే కోమలాంగి తన్మయించె తలిరుబోడి చ నీలగిరుల పైనుండి హోరున నేలకు దూకే జలపాతపు హొయల గనీ మైమరచిన విరిబోణి సుగుణమణి సుభాషిణి - నీలవేణి వలపువాణి నెమలికి నాట్యం నేర్పే - నెరజాణ కీరవాణి (అలా ఊర్వశి భువికేతెంచి తన్మయించి నర్తిస్తుంది. ఇంతలో 'కేశి అనే రాక్షసుడు ప్రత్యక్షమౌతాడు. వికటాట్టహాసం చేస్తాడు.) కేశి ప్రవేశ దరువు రకృసుడినే నేను ఇంతీ రసపిపాసినే నేను పూబంతీ వరపరాక్రముడను - కేశి నామము నాది హరిహరాదులనైన ఆదరించి బెదరించి అమరసుఖముల తేలు అజరామరుడను ॥ రక్కసుడనే నేను ఇంతీ! నీ ప్రేమ దాసుదైతిని పూబంతీ! హహ్ఞహ్హా..! (కేశి రాక్షసుని చూసి బెదరిపోయిన ఊర్వశి భయంతో వణికి పోతుంది. కేశి ఆమె మీది మీదికి వస్తాడు.) వారణాసి నాగలక్ష్మి 23
ఊర్వశి (నృత్యనాటిక) కేశి: హహ్హస్హా.. సుందరీ! దివి నుండి భువికి దిగివచ్చావా నాకోసం! రా... నా పొందులో చూపిస్తా స్వర్గం నీకు!
(చక్రవర్తి వస్తున్నట్లుగా నేపధ్యంలో సంగీతం. వందిమాగధుల కలకలం వినిపిస్తుంది.) పురూరవుడి ప్రవేశ దరువు
ఇదిగో ఇతడే పురూరవుడు!
విమలకీర్తి విరాజితుడు!
ఇలా సుతుడు, బుధుని కుమారుడు
చక్రవర్తి! ఘనసాంద్ర సత్మీర్తి!
మేరునగ సమాన ధీరుడు
సకల గుణోపేతుడు సత్ఫీలుడు
నారీజన మనోహరుడు!
అరివీర భయంకరుడు!
(అభయమిస్తున్నట్టుగా ఊర్వశిని చూసి, కేశి రాక్షసుడిపై లంఘిస్తాడు. ఊర్వశి పురూరవుడి రక్షణ కవచం వెనక వెళ్ళి నిలబడుతుంది. ముగ్గురి మధ్యా నటన ద్వారా పట్టు విడుపులు - చివరగా పురూరవుడు కేశిని కత్తితో చంపబోతే తప్పించుకుని - ఊర్వశిని బెదరిస్తూ వెనక్కి వెనక్కి వెళ్ళి మాయమైపోతాడు. ఊర్వశి పురూరవుణ్ణి కృతజ్ఞతతో చూస్తూంది. అతడు (1 ఆమెను కౌగిలిలోకి తీసుకుంటాడు. )
500౫1 - 4 పాట (8) ఊర్వశి: పురూరవా! పురుషపుంగవా! తలచినంతనే తనువూ, మనసూ తన్మయించెరా! మోహన రూపా! భు వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) ఎన్ని యుగాలది ఈ బంధము ఎంత వెదకితి నీ కోసము ॥పురూరవా॥ పురూరవుడు: మంజులవాణీ! భువనమోహినీ! తన్మయించుట నిజమే గాని ఎవరివి నీవు? నీ పరిచయమేది? బంధమెక్కడిది? ఈ వెదకుట ఏమిటి? ॥మంజుల॥ (ఊర్వశి పురూరవుని ప్రశ్నకు విస్తుపోయి, అంతలోనే తనని తాను సంబాళించుకుని తనవలె అతనికి పూర్వజ్ఞాపకాలేవీ లేవు కాబోలు అనుకుని) పాట (9) ఊర్వశి: ష। ఓ నా ప్రియతమా! ఓ నా హృదయమా! నేటిది కాదోయి ఈ స్నేహము ఈనాటిది కాదోయి ఈ బంధము ॥ చ తరచి చూచితే నీకే తోచును తేటతెల్లమై నాటి జ్ఞాపకము అలజడి సదడలిన అంతరంగమున పరిమళించులే నాటి ప్రణయము ॥ (ఒకవైపు ఊర్వశి సౌందర్యానికి ముగ్భుడవుతున్నా మరోవైపు చక్రవర్తిననే అహం, ఏదో ఆశించి ఆమె పన్నాగాలు పన్నుతున్నదేమో అనే అనుమానం పురూరవుని పీడించగా అతడు ద్వెదీభావానికి లోనవుతాడు.) పాట (10) పురూరవుడు: మునుపెన్నడు చూడలేదు అన్నుల మిన్న! నిన్ను మునుపెన్నడు చూడలేదు అన్నులమిన్న! నిను కాంచిన గురుతు లేదు వెన్నెల కొమ్మా! ॥ వారణాసి నాగలక్ష్మి 25
ఊర్యశి (నృత్యనాటిక] రూపమంధిన రాజోత్తముదను సురభూసురులు మునిపుంగవులు నన్నెరుగని వారే లేరీ ధరణిని శూరాల్రేసర, ధీరోదాత్తుడ చక్రవర్తిని నే పురూరవుడను నను కోరని భామిని ఈ భువిలో గలదే? నన్నాశించని సుందరి ఇలపై గలదే! (ఊర్వకి కలకల నవ్వుతో పురూరవుని పరిహసిస్తుంది.) ఊర్వశి: ఎంత భేషజము నీకు! ఎంతటి అహము! స్వచ్చ ప్రేమ ఎరుగదోయి వ్యామోహము రాజభోగాలను కామదాహాలను మించినదే పురూరవా ఆత్మబంధము! ఎంట (ఊర్వశి మాటలపై పురూరవునికి నమ్మకం కుదరదు) పురూరవుడు: గత జన్మ (్రేలాపన విడువుము నారి! చేరినావు నా సీమకు ఏమి కోఠీ? చక్రవర్తి ప్రాపు కోరి పన్నాగం పన్నబోకు! మోహవివశవైన నీవు డ్రేమ మాటలాడబోకు! (పురూరవుని పరుషవాక్కులకు ఊర్వశి గాయపడుతుంది. అయినా సంబాళించుకుని) పాట (111) ఊర్వశి: షః ఎంతటి అవివేకివోయి రాజశేఖరా! దివ్యాంగన ఊర్వశికి నీ కరుణ ఏలరా? 1.చ॥ అధికారం నీ కనులకు పరదాలు వేసింది నీ మనసుపైన ఐశ్వర్యం గర్వమై పేరుకుంది 26 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) నిర్మలమౌ మన (ప్రేమని, జన్మాంతర బంధాన్నీ మూఢుడవై విస్మరించి పెనుమాయలోన మునిగినావు॥ ఎంతటి! 2,చ॥ అంతరంగమందు నేను కల్లోలితనైతిరా అహరహము నీ తలపు వెంటాడగ వెర్రినైతి! అన్వేషినైన నేను విశ్వమంత వెదకితిరా ఈనాటికి నిన్ను చేరి చిత్తశాంతినందితిరా ఎంతటి! (పురూరవుడికి ఆ మాటలతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తన్మయుడై ఊర్వశిని సమీపిస్తాడు.) 5౮% = 5 (ఊర్వశీ, పురూరవులు (్రేమపరవశులై వనంలో విహరిస్తూండగా రంభ, మేనక, తిలోత్తమాదులు ప్రత్యక్షమవుతారు. ఊర్వశిని ఆత్మీయంగా చుట్టుముట్టి ప్రశ్నిస్తారు.) పాట (18) పః మరచితివా చెలి? మరచితివా? మరచితివా సఖి? మరచితివా? నాక ద్వారములు, స్నేహబంధములు, నెచ్చెలులందరి ముచ్చటలు? ॥ చః సురాంగనలకు నాట్యము నేర్పిన భరతమునీంద్రులు భవ గురుదేవులు వివశవైన నిను వీక్షించగనే మర్త్యకన్నెవు మహికే పొమ్మని ఆ(గ్రహపహించి శపించిన ఘటనను అవనికి నీవేతెంచిన విధమును॥ వారణాసి నాగలక్ష్మి 27
ఊర్వశి (నృత్యనాటిక) (ప్రేమతో సంభ్రమంతో తన స్నేహితురాళ్ళను స్పృశిస్తూ ఆదరిస్తూ తాను భూలోకానికి వచ్చాక ఏమి జరిగిందో వివరిస్తుంది ఊర్వశి.) పాట (14) పష మన్నించుడు నను నెచ్చెలులారా!
మరువజాల మిము ప్రియసఖులారా!
మౌని శాపమే నాకొక వరమై
పావనమైనది నాదు జన్మము ॥
చః భువిపై నాకొక భూమీశుడు
పురూరవుడను పునీతుడు లఖించె
తేజోవంతుడు దానశీలుడు
రూపవంతుడు శూరశిఖామణి
అతడి ప్రేమలో అవధులు మరచితి
అనురాగాంబుధి జలకమాడితిని | (రంభాదులు బుగ్గలు నొక్కుకుంటూ, మేలమాడుతూనే ఊర్వశి లేని సురలోకం కళాహీనమై వెలవెలపోతున్నదనీ, ఆమెను వెంటనే తిరిగి రమ్మని దేవేంద్రుడు ఆజ్ఞాపించినాడనీ తెలియజేస్తారు. ) రంభాదులు: ఎంతటి జాణవే భామిని నీవు!
ఇంతలోనె ఎంత కధను నడిపినావు?
నీవు లేని సురలోకం వెలతెలా పోతున్నది
తక్షణమే నిను రమ్మని దేవేంద్రుని ఆనతి! (అపుడు ఊర్వశి తన పరిస్థితిని వారికి తెలియజేసి, అపరిమితమైన సంతోషంతో పురూరవుని పరిచయం చేస్తుంది. )
26, వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) పాట (185) ఊర్వశి: ష। మన్నించుడు చెలులారా రాజాలను ఇంద్రపురికి! ప్రియుని వీడి మనజాలను ఆతడి ప్రేమ నా ఊపిరి! చ॥ మదీయ మనోమందిరాన కొలువైన ప్రియతముడు నా హృదయ సామ్రాజ్య చక్రవర్తి, సుగుణమూర్తి! సఖులారా! చెలులారా! ఇతడే నా మనోహరుడు! సఖులారా! చెలులారా! ఇతడే నా పురూరవుడు! (ఊర్వశి తనను చెలులకు పరిచయం చేయగానే, రంభాదులకు నమస్కరిస్తూ ఊర్వశిపట్ల తన (ప్రేమను వ్యక్తపరుస్తాడు పురూరవుడు. పాట (16) ప॥ సుందర సుదతులార! సుగుణఖని ఊర్వశి! మృదుభాషిణి! కలహాసిని! భవదీయుని భాగ్యరాశి! చః ఇంతి ప్రేమ నింతగగొని సఫలమయ్యె నా జన్మము! ఇంతకన్న స్వర్గమెచట లేదు లేదు ఇది నిజము! (ఊర్వశి వట్ల పురూరవుని (ప్రేమకు ముగ్యలైన రంభాదులు ఒకవైపు హర్షం వెలిబుచ్చుతూనే, భూలోకవాసికీ, అప్పరసకూ మధ్య ప్రణయం నిలిచేది కాదని వారిస్తారు.) రంభాదులు: పురూరవా! పాట (16) ప నీవంటి నరోత్తముని పరిచయమొక భాగ్యము! ఏమందుము మీ స్నేహము కాజాలదు శాశ్వతము! వారణాసి నాగలక్ష్మి 20
ఊర్వశి (నృత్యనాటిక) చ; ఎటువంటిది ఈ బంధము అనూహ్యము అసహజము! మర్ష్యునకు సురాంగనకు (ప్రేమ కాదు సమంజసము వినుము చెలీ! విపులముగా వివరింతుము ఆలకించు క్షణికమైన మోహములో మునిగిపోక మేలుకొనుము చ మధురమైన అనుభవమిది! మదిలోనే పదిలపరచి మరలిరమ్ము ఊర్వశి! సురలచ్చట వేచినారు! భరతముని శాపమునకు విముక్తి నీకు లభించినది వీడ్కోలు పలికి రమ్ము వెడలెదము మన వీటికి! (ఊర్వశి వారి మాటలను వింటూనే ఆ ఊహనే భరించలేనట్లు కంపించిపోతూ రంభాదులను వేడుకొంటుంది.) ఊర్వశి: సఖులారా! మన్నించుడు రాజులను ఇంద్రపురికి!
ప్రియుని వీడి మనజాలను అతడి (ప్రేమ నా ఊపిరి!
వేడుకొందు విన్నవించ దిక్పతికి నా మనవిని
ప్రియుని వీడి మనజాలను అతడి (పేమ నా ఊపిరి! (ఊర్వశి వెనుకే పురూరవుడు తన విజ్ఞాపన కూడా అదేనని రంభాదులకు విన్నవించుకుంటాడు.) పురూరవుడు: సుందర సుదతులార! సుగుణఖని ఊర్వశి!
క్షణమైన మనజాలను విడిచి నేను ఊర్వశిని!
పురందరుని కిదియే పురూరవుని విన్నపము
దిక్పతి కరుణించి మమ్ము దీవించిన ధన్యులము!
న "జీ, (ఊర్వశి పురూరవుల (ప్రేమలోని గాఢతను, తీవ్రతను అర్ధం చేసుకొన్న రంభాదులు సంభ్రమానికి లోనై వారికి తమ శుభాకాంక్షలను అందజేసారు ) 30 వారణాసి నాగలక్ష్మి
ఊర్వశి (నృత్యనాటిక) పాట (18) ప ఎంతగానో విన్నాము ఈనాడే కన్నాము! ఇలపైని మీ ప్రణయము జెగాక అక్షయము! చః పురూరవా! నిను పొందిన భాగ్యశాలి ఊర్వశి! ఆమె (ప్రేమ నందుకొన్న నీవెంతటి ధన్యజీవి! మహద్భాగ్యమే ఊర్వశి! మధురప్రేమ అనుభూతి! మహత్తరము మనోహరము దివ్యమైన మీ బంధము! (ఊర్వశి వారి శుభాభినందనలకు పొంగిపోతూ మరోసారి తన అశక్తతను శచీపతిొకి విన్నవించమనీ, సురసభలో నాట్యమాడు వేళ తనను తలచుకొమ్మనీ రంభాదులను కోరుతుంది.) పాట (19) పష మన్నించుడు చెలులారా! రాజులను ఇంద్రపురికి ప్రియుని వీడి మనజాలను అతడి డ్రేమ నా ఊపిరి! చ। విన్నపమిది శచీపతికి మన్నించగ వేడితినని (పేమ కన్న మిన్నయెన స్వర్దసుఖము లేదనీ! ప్రియమారగ సురసభలో మీరందరు చెలులారా! నాట్యమాడు వేళ నన్ను తలచుకొనుడు మనసారా! (అందుకు అంగీకరించిన అప్సరసలు మెల్లగా వెనక్కువెళ్ళి తెర మరుగవుతారు. ఊర్వశీ పురూరవుల ప్రణయగీతంతో నాటిక ముగుస్తుంది.) వారణాసి నాగలక్ష్మి ల్తు
ఊర్వశి (నృత్యనాటిక) పాట (20)
ప॥ ఊర్వశీ పురూరవం! ఊహాతీతం! అపూర్వమైన ప్రణయ సుధా పూర్ణోదయం! ఊర్వశీ పురూరవం! ఊహాతీతం! సురభిళం! సుమధురం! సుందరకావ్యం!
చ సుందరి సుమధుర కలహాసం శూరశిరోమణి దాసోహం సహజ నిర్మల (ఢ్రేమావేశం స్వచ్చ (ప్రేమకిది దిశానిర్దేశం 1
చ। ప్రణయిని ఉచ్చ్వాసం ప్రభువుకు జీవం ప్రేయసి నిశ్వాసం ప్రియునకు సంకేతం ఇరువురొక్కటై ఇహమే మరచి (ప్రేమాంబుధిలో పరవశమందిన ॥
చః సాంత్వన పొందె కల్లోల మానసం ఉల్లము నెగసె ఉల్లాస తరంగం పల్లవించెను పొవన ప్రణయం వెల్లివిరిసెగా (ప్రేమ సుమం ॥
(మంగళం) శ అతిని! వీ తీన్ గి ల 00 1 )ష25ి స్స ( మీ వూ ళ్ ఫీ లు వారణాసి నాగలక్ష్మి
| ణ్ రం థి లింంం లంగ! / .. కెంయాడు! సై! బరగ. గి జ్ . / . + . . వ్ _, లన మ పుట్టింది పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో. వ. పుట్టిల్లు కృష్ణాజిల్లా నూజివీడులో. 4రసాయన శాస్త్రంలో ఉన్నత విద్య కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాద్ లో. /| న రాయలసీమలో చదువుకున్న హైదరాబాద్ వాసి డాక్టర్ శర్మ గారితో వివాహం. వ్యాన చినుక్తుట్తుపలితగత,మ్లాలిక , ఆలంబన, ఆసరా కథా సంపుటాలు ఇంతవరకు ప్రద్హురీగచీనే స్తస్తకాల్గు26ర్కులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి హాటీ. “సాహితీ పురస్కారం” , 2005 లో నవ కథా రచయిత్రి గా ( న్ శ్రేసుతి బ్ట్యోర్ధ సఖకునట్రూరు 2009 లో “శ్రీ యమ్వియల్ సాహిత్య సత్కారం *, / 2011లో అసి “ఉత్తమ కథా రచయిత్రి ' పురస్కారం లభించాయి. [1 గ స త్రలేఖనం, లిత గీత రర మనైర్ష్యామాలు. కౌముది, రచన, స్వాతి , ఆంధ్ర భూమి, / 1 [సాహిలే స్రవీతి పత్రికల గండి సిలికా ఏరడ్ర, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఉగ, మ) క | గ క | న్యూజెర్సీ 'తె సే సీర నుండి కొన్ని రచనలకు బహుమతులు (| క ముంంలులముదార్ రదర్శనొమ్రురియు ఆకాశ వాణి నుండి కథలు, _ న! " | క న క ం గ్ సక శశాంక ఖఫావనలు , నొళ్ళిష్టరైక్ట్యక గీతాలు ప్రసారమయ్యాయి: ల న్ స్ట త్రి ర్ట ్ట "