Telugu Telangana Roopakamulu Trivikramulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

అర 001౫ తొణంటులు = రు ళు టు న ॥ (సంగీత, నృత్య రూపక సంపుటి) ఇటా. నాలాలు టా ఆ [శం తే! ఫస స ని ఆం జస భూ వ ఊచ డా వం (ఆ! టు త ర సా ఎ ఎల) ట్‌ లా స. కా. .. గే. గా భశ. [౫ | " హ్‌, చ! స టల, ఖల లా " న. టి | మాం జ ను. | శం త. ల క! జు నీ? ల తస. వీ" ” వ మం శో త్‌ే సు! గ చ న్‌ నం రభ ॥ ఉం గ *ధ్హ(' దాః॥వర్డేపల్లికృష్ణ (( " ర టి. 6.౯౧౫ ల టి ల ॥ జె “ ం" లీ ట్ట క క ల య మ న న స ర స 1 ల్‌ వం

వ్‌ ప్రదర్శిత రూపకాల భాయా (న 1 టు న! . . టి. వ. స స! 1 న య... న [| రై, టో మ... న నశ శ ఇ రట... య భ టై (1 నే ల! (నా చ. టే. ర / లట . రః |. న (మం! శ ల స్ట | ళీ ఇసు న. అ సమన " నను న ర. హన కేం. న వై హం ప ఫా, |, న్యు షు! |; భా 1 టా ర్‌ | నా మ. (/ ఓ సాం!

తెలంగాణ రూపకములు & త్రివిక్రములు (సంగీత, నృత్య రూపకాల సంపుటి) దాః వడ్డేపల్లి కృష్ణ (ప్రచురణ టిం నానే

61208202 గెంం౧2|2006141 ఈ 171/102006416 (గగీట3162| 02౧66 82116) - 0/ 0౧౪౭660211 గసూ0౧౧2 తెలంగాణ రూసకములు త8& త్రివిక్రములు (సంగీత, నృత్య రూపకాల సంపుటి) (ర ప్రథమ ముద్రణ ; జనవరి, 2020 రా ల (రి అన్ని హక్కులు రచయితవి ల * గ్‌ వెల: రూ. 150/- ల్‌ $్‌ర్‌ (్ర “పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్చాలయం” ఆర్థిక సహాయంతో ముద్రితం. పుస్తకంలోని అభిప్రాయాలు రచయిత సొంతం. వాటితో విశ్వవిద్యాలయానికి ఎటువంటి బాధ్యత లేదు. డిటిపి ;లక్ష్మీ శ్రీనివాస్‌, 9885021689 లక్ష్మీ శ్రీనివాస్‌ కణ గ్ర ముఖచిత్రం : చందన్‌ గ్రాఫిక్స్‌ ౦ గ్ర చిక్కడపల్లి, హైదరాబాద్‌ / / 3 రి ముద్రణ: కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, “/. లా విద్యానగర్‌, హైదరాబాద్‌. ప్రతులకు:

  1. నవచేశన బుక్‌ హౌస్‌ ఆబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, బండ్లగూడ, హైదరాబాద్‌, హన్మకొండ, నల్లగొండ, కరీంనగర్‌, ఖమ్మం 2, విశాలాంధ్ర - విజయవాడ
  2. నవోదయ బుక్‌ హౌస్‌ ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదురు వీధి, సుల్తాన్‌బజార్‌, హైదరాబాద్‌
  3. దా॥ వద్దేపల్లి కృష్ణ, “లలితశ్రీ నిలయం 1-5-963, చైతన్యపురి, హైదరాబాద్‌-500 060, (తా, ౪|0౪2640902|1ఊఅం౧౧౬|.00/౧ 7
  • సలిల. మడాా ఖా రజ్రా భ్‌ ల్ని హైదరాభార్స్‌ మే

అంకితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు దా॥ కె.వి.రమణాచారి గారికి = న ఉద్యమాల చైతన్యపు హృద్యమమగు బుర్రకథల సంప్రదాయ భక్తి భావ అప్రమేయ హరికథలను జన్మదినం పేరుతోడ జనం మెచ్చ అదరించు పేద కళాకారులను ప్రేమతోడ పోషించు సాహిత్య - సాంస్కృతిక శ్వాసలతో జీవించు విక్రమించు అక్రమూల విధిగానేఖండించు తెలంగాణ ప్రభుత్వపు గౌరవ సలహాదారులు, కేవిరమణాచారికి కేలుమోడ్డి నాయీ కృతి సమర్చింతు అంకితముగ సానురాగ కృతజ్ఞతగ

వినకు సిధ2ంిం 020% 5 (౧66) 0౦0౯ 110 314/4 ౪1507 10 118 60౪ఆ౧గ౭౧1 మా. 11౯1007 0- 8106 ల్‌ స్వికృతి

డా॥ వడ్డేపల్లి కృష్ణ నాకు చిరకాల మిత్రుడు. “జయజయహే తెలంగాణ” సంగీత నృత్య రూపకం ద్వారా కొమురం భీం మొదలిడి కే.సీ.ఆర్‌. గారి సమరం దాకా 60 యేళ్ల తెలంగాణ సంఘర్షణ - సాధన ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లుగా సంగీత నృత్యరూపకాన్ని రచించి, అన్ని జిల్లాల (ఢేక్షకుల్ని ఆకట్టుకున్న అ(గ్రశ్రేణి రూపక రచయిత. సహాస్రాధిక లలిత గీతాల్ని 55 రూపకాల్ని అనేక నాటికల్సి, టీ.వి. ధారావాహికల్నే గాక సినీ గీతాల్ని రచించి, టీ.వి. సీరియళ్లు - సినిమాలకు సైతం దర్శకత్వం వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి!

ఇటీవల నా సమక్షంలో తన సాహిత్య స్వర్గోత్సవాన్ని జరుపుకున్న ధన్యజీవి! ప్రతిభా, వ్యత్పత్తులతో పాటు నిరంతర అభ్యాసాదుల్ని కలిగి వుంటేనే ఏ రచయితకైనా సాహిత్య స్వర్ణోత్సవం జరుపుకోగల అరుదైన అవకాశం సిద్ధిస్తుంది! అలాంటి ప్రతిభా వ్యత్పత్తి అభ్యాసాదుల్ని అపారంగా కలిగివున్న డా॥ వడ్డేపల్లి ఇదివరకే “వడ్డేపల్లి రూపకాలు” వెలువరించి, యీ “తెలంగాణ రూపకాలు - శ్రివిక్రములు” అనే సంపుటిని నాకు అంకితమీయనెంచడం నా అద్బ్భష్టంగా భావిస్తున్నాను.

ఇందులో “రామప్ప, “తెలంగాణ మహారాణి" (రుద్రమదేవి), 'తెలంగాణ పుణ్య క్షేత్రాలు “తెలంగాణ వైభవం, “యాదాద్రి వైభవం మొదలగువాటితో పాటుగా “విత్తనాల విలువి, “ప్రకృతి పరిరక్షణ అనే సామాజిక విషయాల మీద కూడ సమర్ధవంతంగా రచన సాగింది. విలక్షణంగా సాగిన, 'పుష్పవిలాసం' రూపకంలో అనేక

పూలను అద్భుతంగా వర్ణించడం జరిగింది. ముఖ్యంగా ఒళ్లు విరుచుకున్నట్లుగా విరబూసినట్లు మందారాన్ని మురిపాల పసిడి మువ్వలన్నట్లుగా తంగేడును, బతుకమ్మలపై నిలిచే గుమ్మడిని గౌరమ్మలుగా విశ్లేషించడం విశేషంగా మన మనసుల్ని ఆకర్షిస్తుంది.

“త్రివిక్రములు”గా “మహాత్మ ఫూలే, చా! అంబేద్కర్‌, “భాగ్యరెడ్డి వర్ణ సంఘ సంన్మర్తలపై కూడ ప్రతిభావంతంగా రూపకాల్ని రచించగలగడం వడ్దేపల్లికే చెల్లింది.

ఈ విశిష్ట కృతికి నా స్వీకృతినందజేస్తూ, వారికి అయిదు పది

యూ. దా.కె.వి.రమణాచారి

దా.ఎల్లూరి శివారెడ్డి కాక ర్స తెలంగాణ సారస్వత పరిషత్తు తిలక్‌రోడ్డు, హైదరాబాద్‌ - 500 001. ఫోన్‌ : (ఆఅ) 24753724 గీత రచనావశంవదుడు డా.వడ్డేపల్లి కృష్ణగారు కవితాహృదయులు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి “లలిత గీతాల) మీద పరిశోధన చేసి పి. హెచ్‌డి పట్టా ఫాందినవారు. వందలాదిగా గీతాలను రచించారు. ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో ప్రసారమైన వారి కవితలు, గీతాలు లోకానికి తెలిసినవే. దా.కృష్ణగారు చలనచిత్రరంగంలో దర్శకత్వం నిర్వహించి, అనేక దృశ్య రచనలు చిక్రీకరించి, సాహిత్యలోకానికి అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దాని వస్తువును ఇతివృత్తంగా తీసుకొని, రూపకాలు సృజించి ప్రశంసలందుకున్నారు. నిరంతర సాహితీ వ్యవసాయం వారి వృత్తి ఈ రూపకాలలో గోలకొండ చరిత్ర ఇతివృత్తం, పుష్కరాల ప్రాముఖ్యం, ప్రకృతి పరిరక్షణ వంటి 19 రూపకాలు మనకు దర్శనమిస్తాయి. భాష చాలా సరళం. ఛందోగతులు, నుడికారాలు విరివిగా దర్శనమిస్తాయి. అది వారి ఛందోవశవర్తిత్వం. డా.కృష్ణగారి ప్రతిభ అనేక ముఖాలుగా దర్శనమిస్తుంది. వారు రచించిన [గ్రంథాలు అనేకం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కవులలో స్థానం సంపాదించి, ఇప్పుడు ఈ రచనతో వారి ప్రతిభను ఇనుమడింపజేసుకున్నారు. ఈ (గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు, సాహితీవేత్తలు, వాగ్శి డా.కె.వి.రమణగారికి అంకితమివ్వడం ముదావహం. అభిమానంతో నాచేత యీ నాలుగు మాటల్ని రాయించిన డా॥ వద్దేపల్లి గారిని మనసారా అభినందిస్తున్నాను.

  • దా. ఎల్లూరి శివారెడ్డి

నేపథ్యం ఇప్పటివరకు దాదాపు ర్‌5్‌ సంగీత నృత్య రూపకాలకు రచన చేశాను. ఈ రూపకాలను గత సంవత్సరంలో నేను రచించి వెలువరించిన “వడ్డేపల్లి రూపకాలు'లో చేర్చలేదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా తెలంగాణ నేపథ్యానికి సంబంధించినవి కావడమే! ఇందలి “తెలంగాణ వైభవం, “తెలంగాణ పుణ్యక్షేశ్రాలు, “తెలంగాణ తేజోమూర్తులు", “గోలుకొండ, “రామప్ప, “కాకతీయ వైభవం, 'తరతరాల తెలంగాణ”, 'యాదాద్రి వైభవం” మొదలగునవన్నీ తెలంగాణ వేదికవే! అందుకే 'తెలంగాణ రూపకములు” అనే పేరును స్థిరపరిచాను. ఆయా సంస్థల అభ్యర్థనపై 'మహాత్మా జ్యోతిభా ఫూలే, “భారతరత్న అంబేద్కర్‌, “భాగ్యరెడ్డివర్మ అనే సామాజిక సంస్కర్తల జీవిత చరిత్రల్ని కూడ సంగిత నృత్య రూపకాలుగా మలిచే మహదావకాశం నాకే లభించింది. సామాజిక అక్రమాల్ని ఖండిస్తూ విక్రమంగా సంస్కరించి, మహనీయులుగా నిలిచిన ఈ ముగ్గురు త్రిమూర్తుల రూపకాల్ని “త్రివిక్రములు” పేరుతో ఈ సంపుటిలోనే చేర్చడమైనది. నన్ను అనేక విధాల ప్రోత్సహించే సౌజన్యశీలి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా॥ కె.వి.రమణ గారికే అంకితమీయడమైనది. ఇట్టి రూపకాల్ని నేను రచించడానికే గాక, రమణీయంగా ప్రదర్శించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలైన డా! దీపికారెడ్డి - దా॥పద్మజారెడ్డి డా॥ వనజా ఉదయ్‌, డా॥ పుట్టపర్తి నాగపద్నిని, వోలేటి రంగమణి, 'ప్రమోద్‌రెడ్డి, వరకాల వసుమతి మొదలగు ప్రముఖ నాట్యకళాకారులకు మరియు అంబేద్కర్‌ రూపకాన్ని అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శింపజేసిన డా॥ కోట్ల హనుమంతరావు-అనితారావు దంపతులకు ప్రత్యేక అభివాదాలు అందజేస్తున్నాను. కోరగానే తమ అమూల్య అభిప్రాయాన్ని జతచేసిన తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారికి - సంగీత పరంగా సహకరించిన ఆత్మీయమిత్రులు దా! వి.వి.రామారావు గారికి- ఇలా అక్షర రూపం దాల్చడానికి ఆర్థిక సహాయమందజేసిన తెలుగు విశ్వవిద్యాలయం వారికి- అందంగా అచ్చువేసిన కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి - మరెందరో మహానుభావులు, అందరికీ నా కృతజ్ఞతలు!

  • దా॥ వడ్డేపల్లి కృష్ణ

విషయ సూచిక

1 తెలంగాణ వైభవ౦..........ంంలలలలలలలలలలలలలం కరే 2... గోలుకొండ... లలలలలలలలలలలవలలలలలలలటలలు క్షే? 8 రమణీయ రామప్ప ........౨౨౨౨౨౨౨ ౨౨౨౨౦౨ లర 4& _ తెలంగాణ మహారాణి... త్మేకే ర పుష్కర పుణ్యఫలం! .........2260620200వటవలల2లం ర్‌2ై 6. కాకతీయ వైభవం... ౦౦౦ లంట 63 7... పుష్ప విలాసం!......... లంట 8 8. తరతరాల కెలంగాణి ...200000000000600000444ఎఎఎరి0 9. బంగారు తెలంగాణ... 4440066600 89 10. యాదాద్రి వైభవం! ౨.౨౨౨౨౨౦ రి9ి 11 వినియోగదార్ల విజయపథం! .................... 106 12. సీతా స్వయంవరం .......౨౨౦ లలల కేశే0 13. స్తంభాద్రి సంబరాలు.........240000ం4242024ఐఐ శేకర్‌ 14. తెలంగాణ తేజోమూర్తులు! .........000000004 కేబెక్తీ 156. విత్తనాల విలువ! .........22000260000062 000002 ప2ై/ 16 ప్రకృతి పరిరక్షణ! ౨.౨౨౨౨౦౦ ల కలిత తివిక్రములు

  1. మహాత్మా జ్యోతిభా పూలే! .............. కే4ీతి
  2. 'భారతరత్సు అంబేద్మర్‌! ....................... కేర్‌క
  3. భాగ్యరెడ్డి వర్మ. కేడీ

క్ర

తెలంగాణ వైభవం! (సంగీత, నృత్య రూపకం) (నర్తకులు పూల దోసిళ్లతో ప్రవేశించి, నాట్య గానాలతో స్వరమెత్తుతారు యిలా -) పల్లవి : కమనీయం! కడు రమణీయం! (నర్తకులు) తెలంగాణ ప్రాంతాలన్నీ... పర్యాటకులకు దర్శనీయం చారిత్రక ప్రదేశాలన్నీ... కమనీయం! చతుశ్శతాచ్లి “చార్మినారు” (తెరమీదజ్రూయా గొప్పచరిత్రల 'గోలుకొండ) చిత్రాల్ని “సాలారుజంగు మ్యూజియాలు చూపడం) హైదరాబాదుకు ఆనవాలు! నగరం మధ్యన హుస్సేన్‌సాగర్‌ దాని మధ్యన బుద్ధ విహార్‌! ఆకాశపు హర్మ్యం లాగా అలరారే “ఫలక్‌నుమా”! చూపరులను ఆకర్షించే చారిత్రకపు “చౌమహల్లా”! భాగమతీ - కులీకుతుబ్‌ రాగాభ్యుదయమె భాగ్యనగరం! తారామతి - (ప్రేమావతీ తారాడినదే యీ నగరం! నయనానందం భాగ్యనగరం, నవీన కళల నాట్య నిలయం! కమనీయం॥ వ్యాసమహర్షి ప్రతిష్టించిన “బాసరి భారతి నర్చించి 11

'ర్మపురినీ దర్శించి “కాలేశ్వరు'ణ్ని కీర్తించి “భద్రాచలమూన ఉప్పొంగే భవ్యగోదావరి మనదే!... అలంపురం 'జోగులాంబుకు అలంకారమౌ కృష్ణా మనదే!.... పాడిపంటలతొ వర్ధిల్లే

పలు జిల్లాల రాష్ట్రం మనదే!.... _ కమనీయం తకథిమి తాండవ నాట్యాల తరించె 'రామష్పా' ఆలయం! ఖ్యాతి గాంచగా వేయిస్తంభాల కాకతీయుల సామ్రాజ్యం, కాపుకాచెను రుద్రేశ్వరుని అర్ధనారి - ఆ భద్రకాళి! భద్రకాళి కాలి గడ్జెలుగ

ఘల్లు ఘల్గుమనె “ఓరుగల్లు”! కమనీయం॥ గణపతిదేవుని కూతురె అయినా గణుతికెక్కినా మగధీరునిగా

ఖడ్డ యుద్ధమున ఆరితేరినా కాకతీయ రుద్రాణిరూపమై రాణించెను రాణీరుద్రమయే, పరిపాలించెను రాణీరుద్రమయే! వీరము, శౌర్యమునే చూపిస్తూ శిల్ప - నాట్యకళలను పోషిస్తూ భద్రకాళినే ఆరాధిస్తూ ప్రజలకు భద్రతనే కూరుస్తూ

12

వెలుగొందెను రాజణజీరుద్రమయే! వెలుగొందెను రాణీరుద్రమయే!

  • జతులు- (అంతలో ప్రవేశ దరువులో రుద్రమదేవి అడుగిడుతుందిలా) (స్పాట్‌లైటొలో) అభినవ కాళిక రూపముయనగా అభినయ ముద్రలొా రుద్రమ కదలెను... పదమున అందెలు, కరమున ఖద్దము కదలియాడ అడుగిడె నిదిగో!... (అంటూ ఖడ్డ చాలనంతో - జతులతో నర్తిస్తూ నిష్రమిస్తుంది) నర్తకులు : కోవెలలోన కోడెలు కడుతూ భక్తులెందరో మొక్కులనిడుతూ వేడినంతనే కోర్కెల దీర్చే “వేములవాడ' రాజేశ్వరుడు కాలునిసైతం కారుణ్యంతో అనుగ్రహించిన కాలేశ్చ్వరుడు వెలుగొందే మన తెలంగాణము, కనువిందయ్యే తెలంగాణము! జనహితమగు జలనిధిగా నిలిచిన “ప్రాణహితా' సంగమ క్షేత్రము! ॥కమనీయం॥ (బ్యాక్‌గ్రౌండ్‌లో ఉత్తమ బుషి యాదర్ని ప్రార్ధనతా ఓం ఉగ్రంవీరం ఉగ్రరూపమే విసర్జించి మహావిష్ణుం సత్త్ప్వగుణంతో శ్రీ లక్ష్మితో జ్వలంతం సర్వతో వెలసె “యాదగిరి నారసింహుడు! ముఖమ్‌... శ్లోకం అపర తిరుపతిగ అనుగ్రహిస్తూ వినబడుతుంది) నిలిచె నిచ్చట యాదాద్రీశుడు!... 13

తుంగా - కృష్ణా సంగమస్థలిలో ఉత్తుంగ శక్తి పీఠమ్ముగా అలరారే శ్రీజోగులాంబా అగుపించే ప్రాంతమ్ము యిదే!... ॥కమనీయం॥ (స్పాట్‌లైటొలో రామానుగ్రహమే పొందిన పోతన గంటం రమ్య భావ పోతన్నతో... చేతబూని రచన పంచదార పద్యాలదేలు చేస్తుంటే... _ పవిత్ర భాగవతమ్ముతో... “మందార వర్ధిల్లిన మన తెలంగాణము మకరంద... వైభవకేతన మాగాణము! పద్యం ఉళలలలల అలంం వినబడతందిలా-) మందార మకరందమాధుర్యమునదేలు మధుపంబు బోవునే? మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునె? తరంగిణులకు... నర్తకులు : _ గోదావరి తీరమ్ములో భక్తిభావ సారమ్ముతో రామదాసు కీర్తనలతో రాజిల్లైెను భద్రాచలమే!....

కీర్సు _ : అంతా రామమయం...

(స్పాట్‌లైటొలో జగమంతా రామమయం!... రామదాసు అంతరంగమున ఆత్మారాము - అగుపిస్తూ దడనంత రూపమున వింతలు సలుపగ

ఆలాపిస్తాడు.) అంతా రామమయం!

జగమంతా రామమయం! 14

కొల్లలు కొల్లలుగా ఎల్లెడ నల్లబంగారు గనులతో శెంగరేణొ సింగారంతో విద్యుల్లతల విడిదితో కాలువుదీరిన నెలవుయిదే కోయజాతికీ దరువుయిదే... (గిరిజన బృందం ప్రవేశిస్తూ) జానపదం : “పన్నులేదు - గిన్నులేదు పాడిపంట రైతులదే! దుక్కిదున్ని సాగుచేయు దుఃఖార్తులు - రైతులదే!...” నర్తకులు : _ అంటూ ఎదిరించినట్టి అడవితల్లి బిడ్దలైన సమ్మక్కా - సారలమ్మ “చ్చేదారం జాతరమ్మ”; భక్తుల కోర్కెలు దీర్చే శక్తుల మహిమల రెమ్మ! విరిసిన ప్రాంతమ్ము యిదే!... విష్లవక్షేతమ్ముయిదే! “బంగారు తెలంగాణ సింగారాలా స్వప్నం సిగమూగే ఆశయాల సిరుల తెలంగాణ మిదే!... 15

కోయుతలో: జైజై బంగరు తల్లీ... 'ెలంగాణతల్లో జై తెలంగాణ తల్లి! ప్రవేశిస్తుంది. మా శ్వాసగ - మా ధ్యాసగ మసలే అనురాగవల్లి! మా ఆశలనన్నింటిని పండించవె పాలవెల్లి!.... జైజై బంగరుతల్లీ! జై తెలంగాణ తల్లి... (అంటూ నర్తకులంతా వలయాకారంగా 'తెలంగాణ తల్లి చుట్టూ తిరుగుతూ నిష్మమిస్తారు-) లు ల (పలుమార్లు దీపికారెడ్డి నాట్యాచారిణి బృందంచే ప్రధాన వేదికలపైనే గాక ఎల్‌బి. స్టేడియంలో 2017లో ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై, అంతర్జాతీయ నృత్యోత్సవ వేదికపై ప్రదర్శితం) ఎ్లుర్ణం 16

గోలుకొండ ఆకాశవాణి" సంగీత రూపకం) గోలుకొండ స్వగతం :

తెలుగు నేల నలరారిన జిలుగు వెలుగు ఆత్మను! చెరగని చరితను నిలిపిన చెదరని మహితాత్మను! హిందూ - ముస్లిం సఖ్యత ముందే తెలిసిన సభ్యత దండిగా కలిగి వున్న గుండెలకే వేల్చును! తీయనైన భావాల మాయని నిట్టూర్చును! మధురమైన రాగాల మహ్మదీయ కూర్పును! “'గోలు'గా వెలసిన నే గోలుకొండ కోటను! మురిపెంగా మలచిన నే ముత్యాలా పేటను! ॥తెలు॥ రెండున్నర శతాబ్దాలు నిండుగా మన సంస్కృతి రెక్కలతో కాచినట్టి ఉక్కులాంటి డేగను! మనసు విప్పి చెప్పలేని మాటరాని మూగను!

17

ఘనచరిత్ర పూవులున్న గత కాలపు తీగను! తెలు! ఒళ్లు శిథిల మవుతున్నా కళ్లు భిద్రమవుతున్నా ఓర్పుతో - నేర్పుతో ఒదిగివున్న కోటను! తరిగిపోని అనురాగపు తరతరాల పాటను! ఇతివాసం వెల్లివిరియు గత స్కృతుల బాటను! పదునారవ శతాబ్టీ ప్రారంభ కాలంలో “కుతుబుషాహి” వంశస్థుల ప్రథమ పాదుషాలైన సుల్తాన్‌ కుతుబుల్‌ ముల్క్‌ సూత్రధారులుగా నిలిచి సునిశితముగ శోధించి దుష్టులెవరూ రాకుండ దుర్ఫేద్యంగా మలచి గట్టి గట్టి రాళ్లతోడ కట్టించిరి నన్ను! ఆపై నను 'ఇబ్రహీము” అందముగా తీర్చిదిద్ది తెలుగువారి సంస్కృతిని తేట తేటగా అద్ది

18

కనువిందగు తోటలతో

కమనీయపు పేటలతో

అంగళ్లను రతనాలను

అమ్మే పలు మూటలతో

గోలుకొాండగా నిలిపే!

గొప్పకొందడగా తెలిపే!

తెలుగు భాషనాదరించె!

“మల్మిభరాం” 'పేరుగాంచె!

(ఇబ్రహీం పాదుషా ప్రవేశం) 1భటులు : జనాబ్‌ - గోలుకొండనవాబ్‌

శ్రీశ్రీశ్రీ మాలిక్‌ ఇబ్రహీం కుత్చ్‌షా

ఆరహేహైం! బహుపరాక్‌! బహుపరాక్‌! భట్రాజులు : రాజాధిరాజ! రాజమార్హాంద!

అరివీరగంభీర! రణరంగధీర!

స్వాగతం స్వాగతం! ఇబ్రహీం కుత్చ్‌షా!

స్వాగతం స్వాగతం! మల్మిభరాం పాదుషా! ఇబ్రహీం : బైఠియే! బైఠియే! బేటా బేటియేయ

భేష్‌ భేష్‌ మైఫిల్‌మే గజల్‌ భేంటియేం!

సయ్యద్‌ మహమూద్‌, ఫిరోజ్‌ ముల్లాఖయాలీ!

సునావో ఉర్జూకా గజల్‌, ఖవాలీ!

అచ్చతెలుగు పద్యాలా

అలరు తెలుగు కవులారా

అచ్చ తెనుగు పొన్నికంటి తెలగన్నా! సుకవీ!

అచ్చెరువుగ వినిపించూ తేటతెలుగు పద్యం!

19

ముచ్చటైన కైతకో ముత్యాల హారం మేలైనా కావ్యానికి మెచ్చి అగ్రహారం కానుకగా అందిస్తా! కవులనెల్ల పోషిస్తా! కలకాలం వర్ధిల్లగ “ఫర్మానా” రాసిస్తా! కవులు : జీహుజూర్‌! చంద్రునిలా జీవించుడు చల్లగా! ఇలనంతయు ఇంద్రునిలా పాలించుడు స్వేచ్చగా!... “4. (నిషమణం,)..... గోలుకొండ స్వగతం : మళల్మిభరాం కుమారుడే కులీకుతుబ్‌ షాహీ! సంగీతపు సాహిత్యపు భలే కుతుబ్‌ షాహీ! చిన్న నాటనే ప్రభువై రాజ్యం పాలించెను! కృష్ణదేవరాయల వలె కవితను పలికించెను! కవులను పోషించెను నగరం నిర్మించెను! తెలుగు పడతి భాగమతి ప్రణయం పండించెను! ఆ ప్రణయం యీనాటికి (ుతిగా వినిపించెను! 20

యుగళగీతం : (ఆలాపనతో కులీకుతుబ్‌ - భాగమతి ప్రవేశం)... కులీకుతుబ్‌ : చెలియా! చెలియా! ఓ భాగమతీ! గులాబిలా నా గుండెను కాస్తా దోచితివే!... అనురాగమతీ!... భాగమతి ; ట్రియా! ఓ ప్రియా! నా ప్రణజయపతీ! నా వయారమే నచ్చీమెచ్చీ... వలచితివే!.... నను త్వరితగతీ!... చెలి! కులీ : నీపద అందెల రవళులె నా గుండెల సవ్వడులై నినదించాయీ! చూడవే!.... నిరతం ఆడీ పాడవే!... భాగ : నీ సుమధుర మగు కవితలె నా నటనకు శ్రుతి గతులై... ఆడించెను ఆ నాగినిలా! పారించెను రసవాహినిలా!... చెలి! భాగ : నేనేమో నిరుపేదనులే! నీవేమో రారాజువులే!... ఏవిధిగా మన ప్రణయం పందేనో తెలుపరా!... కులీ : నింగిలోని నెలరాజునకూ నీటిలోని కలువభామకూ వలపులు ఎన్నో కుదిరెనుగా?... వ్యధలే వదలీ కదలిరా!... చెలి! భాగ ; ఇవతలి తీరం నాదిలే!... అవతలి తీరం నీదిలే! 21

కులీ : త్రీరం ఏదైతేమిలే!

వారధి నిర్మిస్తానులే!

భాగ : ముస్లిం మతమే నీదిలే!... హిందూ మతమే నాదిలే!

కులీ : మతములు ఏమైకేమిలే మనసులుకలిపేస్తానులే!.... చెలి

కులీ : ఓ భాగమతీ! నీపేరుననే నే భాగ్యనగరు నిర్మిస్తాలే! చలించనీ మన ప్రేమలతో ఓ చరిత్రనే సృష్టిస్తాలే!

భాగ :; మిసమిసలా నీ వలపులకే నే “మినారు”గా మారుతాలే! నిర్మలహృది నీ గోలుకొండదకే విరిదండై అలరారుతాలే! చెలి! న. (నిష్రమణం,...

గోలుకొండ స్వగతం : ఆ విధిగా వాది వలపు ఈ కొండను పాలించెను! గుట్టుగా గోలుకొండ గుండె గుండె నలరించెను!... కుతుబ్‌షాహి వంశీయుల కూతురునే పెళ్లాడి అబుల్‌ హసన్‌ తానాషా! ఆయె మరో పాదుషా!... 22

పరమత సహనమ్మే పాటించిన సమైక్యతా భక్తరామదాసునే బంధించిన ఘనతా ఈయన ప్రత్యేకతా! వినిపించెద నాటి కథా! తానాషా ; మహామంత్రి మాదన్నా! (సంబోధిస్తూ మీ అల్లుడు గోపన్నా తహశీలు శిస్తునంత తగని పనికి వెచ్చించెను! అధికారం అంతయూ దుర్వినియోగం చేసెను! ఏమి చేయుమంటావో ఎరిగించుము త్వరగా! మాదన్న ; తప్పు ఎవరు చేసిననూ దండనార్హులే ప్రభూ! అపరాధిని తగినరీతి శిక్షించండీ ప్రభూ! తానాషా : ప్రభుత ధనం యథేచ్చగా వాడుకున్న నేరానికి గోపన్నా! నీకింకా చెరసాలే తగినళిక్ష! గోపన్న ; అనుభవింతు మీ శిక్ష శ్రీరాముడె నాకు రక్ష! 23

నీకు నాకు అందరికీ ప్రభువైనా ఆ రాముని గుడికట్టుట తప్పుకాదు శిక్షించుట ఒప్పుకాదు అనుభ తానాషా : ఎవరక్కడ? యీ ద్రోహిని చెరసాలలొ వేయుడు! అరదండాలను వేసి కొరడాలతోొ శిక్షించుడు! భటులు ఏ చిత్తం! ఓ జహాపనా! శిక్షనమలు చేసెదము! గోపన్నను చెరసాలలొ ఘోరముగా కొట్టెదము! (కొరడా దెబ్బల శబ్దాలు) రామదాసు : రామా! రామా! (దుఃఖిస్తూ) (అనే ఆర్తనాదాలు) కీర్తన : ఇక్ష్వాకు కుల తిలక - ఇకనైన పలకవె రామచంద్రా! నన్ను రక్షింపకున్న రక్షకులెవరింక రామచంద్రా! 5) సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము రామచంద్రా! ఆ పతకమునకు పట్టే పదివేల వరహాలు రామచంద్రా! వాహనములు మీకు వరుసగజేయిస్తి రామచంద్రా! 24

కలికితురాయి నీకు బొలువగజేసితి రామచంద్రా! నీవు కులుకుచు తిరిగెదవెవడబ్బ సొమ్మని రామచం(ద్రా! అబ్బ! తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా! ఆ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా! 1 (అని పడిపోయిన శబ్దం) రామలక్ష్మణులు : లెమ్ము లెమ్మిక తానాషా!... సొమ్ములివిగో పాదుషా! తానాషా ; ఎవరు మీరూ? ఎవరు మీరూ? ఏల రాత్రిటు వచ్చినారూ? రామ ; రామలక్ష్మణ పేర్లు మావీ 'భద్రగిరియను పల్లె మాదీ రామదాసుకు ఆప్త్పలంలే! అప్పు తీర్చగ వచ్చితిమిలే! రశీదిచ్చీ అతడి నిపుడే వదలిపెట్టుము పాదుషా! | గోలుకొండ : ఆ విధిగా శ్రీరాముడె అర్ధరాత్రి కదలివచ్చి భక్తుడైన గోపన్నను విముక్తిణ్ని గాజేసెను 25

ప్రభువు - ప్రజలకందరికీ కనువిప్పును కలిగించెను తన ఉనికిని నిరూపించి కనుమరుగై పోయెను! ముత్యాల తలంబ్రాలను మునుముందును గోలుకొండ భద్రాద్రికి పంపించే పద్ధతి పర్పాటాయెను! ఆ విధి॥ గోలుకొండ వైభవాల కొల్లగొట్ట నెంచినట్టి బెరంగజేబు తుదకు ఫిరంగులతొ దండెత్తెను! ఎనిమిది నెలలుగ విసిగీ సేనానికి లంచమొసగి అర్ధరాత్రి కోట తలుపు లన్నిటినీ తెరిపించెను! గోలుకొండ సామ్రాజ్యం హస్తగతం చేసుకొనెను! తదనంతర కాలంలో తరతరాల ప్రగతిలో సాయుధ సంపత్తితో రహస్యాల గదులతో షాహిమహల్‌, గజ-అశ్వ శాలలతో వర్ధిల్లిన గుడులు, మసీదులు, తోటల గుట్టుగా విలసిల్లిన

26

గోలుకొండ వైభవాల మేలికొండగా నిలిచితి! నేడు నేను యాత్రికులే చూడ వింతనై వెలసితి! పర్యాటక కేంద్రంగా ప్రజల నాకర్షించితి! శిథిలం అవుతున్న నన్ను శీఘ్రంగా ప్రజలు - ప్రభుత పదిలంగా చూసుకొన్న పాత స్కృతుల పరిమళాల ఎల్లెడలా చాటెదను! ఎద ఎదనూ మీటెదను! కమనీయపు సంస్కృతిని కలకాలం నాటెదను! జసు స (వయోక్తగా దా/ వుట్టవర్తి నాగవద్దిని 2002లో రూపొందించగా, అనేకసార్లు 'ఆకాశవాణి'లో, ఇటీవల 2.1. 21.2029 నాడూ వునః (వ్రసారితం. నంగీతం : బం. చిత్తరంజన్‌: గానం : చిత్తరంజన్‌, కె బి.కె మోవాన్‌రాజు, గంగాధరశాన్తి, ఏ, లక్ష్య కః 27

“రమణీయ రామప్ప” (తొలి నేపథ్య వ్యాఖ్యానం)

దక్షిణ భారతదేశంలోని కృష్ణా - గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోని “తెలంగాణ” రాష్ట్రం చారిత్రక ప్రసిద్ధి గాంచిన సరికొత్త రాష్ట్రం! ప్రథమ శాతవాహనులు పరిపాలించిన 'కోటి లింగాల), వీరత్వం కాకలు దీరిన కాకతీయులు ఏలిన ఏకశిలానగరం - నాటి ఓరుగల్లు, నేటి వరంగల్లు!

హాలుడు, పంపడు, భీమకవియే గాక “బసవ పురాణ కర్త యగు పాల్కురికి సోమనాథుడు, భాగవతకర్తయైన బమ్మెర పోతనామాత్యుడు మొదలగు కవులకు జన్మనిచ్చిన నేల - తెలంగాణ!

పౌరాణిక ప్రాశస్త్యంగల వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, భద్రాద్రి, అలంపురం మొదలగు ప్రసిద్ధ పవిత్ర క్షేత్రాలకే గాక చారిత్రక కట్టడాలైన చార్మినార్‌, గోల్కొండ, గద్వాల - వరంగల్లు కోటలకు నెలవు తెలంగాణం!

ఇట్టి తెలంగాణ రాష్ట్రంలో అపూర్వ శిల్పకళకి అద్దం పదుతూ, కాకతీయుల కాలంలో క్రీ.శ. 12వ శతాబ్దిలో జాయపసేనాని రచించిన “నృత్త రత్నావళి"కే బోధగా, ఒక చరితార్థ గాథగా నిలిచి, రమణీయంగా అలరారుతున్న రమ్య ప్రదేశం “రామప్ప!

వరంగల్లు జిల్లా కేంద్రం నుంచి 70 కి.మీ. దూరంలో, పాలంపేట (గ్రామంలో, పర్యాటక ప్రాంతంగా అందర్నీ ఆకర్షిస్తున్న రామలింగేశ్వర ఆలయ ఆరామం, రమణీయ రామప్ప!

అనల్ప శిల్పకళా నైపుణ్యంతో రాణించే ఈ రామప్ప చారిత్రక నేపథ్యం ఏమిటో కళ్లారా వీక్షిద్దాం!

28

“రమణీయ రామప్ప” (సంగీత, నృత్య రూపకం) (తెర తీయగానే రామప్ప గుడి మండప దృశ్యం - పేరిణి నాట్యాన్ని గురువు ముందు కొందరు నర్తకులు అభినయిస్తూ ఆనందిస్తుంటారు - ) నర్తకులు : ఎదయే నదియై పొంగగ ఎవరీ విధి మలచిరహో!... 'ామప్పును ఎటు గాంచిన రాగం రవళించునహో! ॥ఎదయే॥ కదలలేని ప్రతి శిల్చం కదిలించును ప్రతి హృదయం పలుకలేని ప్రతి శిల్పం పలికించును నవ గీతం మలచినదది స్తంభమో? మగువల (ప్రతివింబమో? శిథిలమైననూ అన్నీ శివునే ధ్యానించేను... 11 ఎదయే॥ ఏ రాతిని తాకినా నాతి నాట్యమే చేయును ఏ నాతిని చూసినా నాగినినే తలపోయును చెక్కిన ప్రతి శిల్చ్పమ్మున చక్కని నైపుణ్యమ్మే!... చెరగని ముద్రలు వేసే చరిక్రలిక ధన్యమ్మే! 1 ఎదయే!॥ 29

(నర్తకులు అభినయం పూర్తి చేసి 'నట్టువాంగం'తో వున్న గురువుకు నమస్కరిస్తారు) గురువు : ఈ పేరిణి (తాండవ) నాట్య ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? శిష్యుడు 1 : తెలుసు ఆచార్యా! ఇది తెలంగాణకే ప్రత్యేకమైన వీర నాట్యం! గురువు : ఎందుకు దీనికి వీరనాట్యమని పేరొచ్చింది? శిష్యుడు 2 : యుద్ధ సమయాలకు ముందు సైనికుల్లో సమరోత్సాహం కలిగించడానికి, విజయం సంప్రాప్తింపజేయాలని విశ్వేశ్వరుణ్నీ ప్రార్ధించడానికి ఉపకరించే ఉధృత నాట్యం కాబట్టి 'వీరనాట్య' మనే పేరు స్థిరపడింది. గురువు : దీని సృష్టికర్త ఎవరో తెలుసా? శిష్యుడు 8 : “నృత్తరత్నావళి” గ్రంథకర్తయైన జాయపసేనాని! గురువు : కాని ఆ జాయప్పకే (మేరణ కలిగించినవాడు, ఒక శిల్పాచార్యుడు! శిష్యుడు 1 ; ఎవరా శిల్పాచార్యుడు ఆచార్యా? గురువు : రామప్ప! శిష్యుడు 2 : రామప్పా? ఎవరాతను? గురువు: తెలుసుకోవాలని ఆసక్తిగా వుందా? అయితే ఆ నేపథ్యాన్ని మనం మననం చేసుకుందాం! (ఫ్లాష్‌ బ్యాక్‌)

  • రాజమందిర దృశ్యం - (రాజమందిరంలో జాయపసేనాని, రామప్ప అగుపిస్తుంటారు. జాయపసేనానికి రామప్ప నమస్కరిస్తూ ప్రవేశిస్తాడు) 30

రామప్ప : వందనాలు జాయప్ప మహాప్రభో!... కాకతీయ సామ్రాజ్య కళా విభో!... ॥౧వం॥ కదనరంగ మందు మీకు మీరే సాటి కళారంగ మందు కూడ మీరే మేటి! మీ దృక్కులు ఏ దిశగా ప్రసరిస్తే ఆ దిక్కుల వసంత లత వాటి! 1వం॥ (సగర్వంగా మీసం మెలివేస్తూ) జాయప్ప : వింటిని నీ కైవారము రామష్పా! వినుమంటిని నా ఆదేశము మనసొప్పా! ॥వి॥ ఉడుకు రక్తమున్న ఓ యువశిల్నీ! పవలు రేయి కూడా కృషి స్పీ నలనల్లని శిలలనెల్ల నయనానందంగా నాట్యారామంగా యిట నెలకొలిపీ, రామలింగేశ్వరునీ మందిరం చెక్కాలి అత్యంత సుందరం! అది కావాలీ శిల్పకళావైభవం, పది కాలాల కాకతీయ ప్రాభవం! ॥వి॥ రామప్ప : మీ ఆజ్జయె మాకు శిరోధార్యం మా ప్రజ్ఞకు మంచి సదవకాశం మీ 'నృత్తరత్నావళి" కోసం మలిచెద గుడినే నటనలకోశం! ॥మీ॥ ఉలి తాకిడితో ఉత్తమ శిలలే ఊర్వశిలా నవనాట్యం చేయాలి! వివిధ భంగిమలతో 'నాగిసిలా విశిష్ట నర్తనశాలై పోవాలి! ॥మీ॥ 31

జాయసప్ప : భేష్‌ రామప్పా భేష్‌ గొప్పగా చెప్పావు. మాటను మించిన చేతతో మరలిరమ్ము! తగిన బహూకృతి నందుకొమ్ము!

రామప్ప : చిత్తం ప్రభూ! మీ యిచ్చ నెరవేర్చెద!

జాయప్ప : ఇది నాయిచ్చకాదు, 'రేచర్ల రుద్రయ్య ప్రభువు వాంఛ!

రామప్ప _ : మీరైనా వారైనా నాకు ప్రభువే కదా! ప్రభువు ఆజ్ఞ పాటించుట మా కర్తవ్యం! (అంటూ నమస్కరించి నిషమిస్తాడు)

  • మందిర ప్రాంగణ దృశ్యం -

(రామప్ప అటూయిటూ సంచరిస్తూ, శిలలు చెక్కడానికి యత్నిస్తూ, ఆలోచనలు తట్టక ఆగిపోతాడు. ఉలి జారవిడిచి చతికిల బడతాడు. అది చూసి నాగిని దగ్గరగా వచ్చి ప్రశ్నిస్తుంది)

నాగిని ; సఖుడా! ఎందుకలా చతికిల బడిపోయావు? లేలే! రాజకార్యం పూర్తి చేయి!

రామప్ప: లేదు సఖీ! నా ఊహకు తగ్గ ఊర్వశి అందం తోచడం లేదు.

నాగిని: (కిలకిల నవ్వి) నీకోసం ఊర్వశి దిగివస్తుందా ఏమి? నీ (ప్రేయసియైన నన్నే ఊర్వశిగా ఊహించుకోలేవా?

రామప్ప : ఆరే (అని ఎగాదిగా చూసి) లెస్సగా పలికావు! నాగినివైన నిన్నే నా ప్రణయ రాగిణిగా భావిస్తాను. రాళ్లలో రమణీయ శిల్పాల్ని సృష్టిస్తాను. కానీ... నాకు (ప్రేరణ కోసం అర్ధనగ్న భంగిమల్లో అగుపిస్తావా?

నాగిని: నీ అద్భుత కార్యం కోసం అర్ధనగ్నంగానే కాదు, నువ్వు పులకించేలా పూర్తి నగ్నంగానూ కనిపిస్తాను...

32

(అంటూ కొంగును జూరవిదుస్తుంది. భంగిమల్ని ప్రదర్శిస్తుంది. రామప్ప ఆమె అందాల్ని తదేకంగా చూస్తూ లేస్తాడు. చుట్టూ తిరిగి చూస్తాడు. పరవశించి సరూగంగా స్వరమెత్తుతాడు. నాగిని అలాపనతో స్వరం కలుపుతూ నాట్యం చేస్తూ వుంటుంది) రామప్ప : ప్రియురాలా! నీ నయనం విరి తూపులకే శయనం! జవరాలా! నీ జఘనం, నయగారపు ఆ గగనం! పూర్ణకుంభ కుచద్వయం, పులకింతల మరు నిలయం! 1ట్రి॥ నాగిని : (జతులతో) ఆ...ఆ...ఆ... రామప్ప : ఆామప్పుగ యీ స్థలియే రమణీయపు తల్పంగా కాకతీయ శిల్ప కళల ఖ్యాతి కెక్కు “కల్చం'గా నాగిని న ఆ....ఆ....ఆ.... రామప్ప : రమణీయంగా చెక్కగ రామలింగేశ్వరునే వరమీయగ మొక్కుదాం! చరిత్ర పుట కెక్కుదాం! 1టి॥ నాగిని ; ఆ....ఆ....ఆ.... రామప్ప : నటియించే నాగినిలా నను చుట్టేయగ రావే!... కటి ప్రాంతం నటియించగ త్రుటిలో ఒకటై పోవే!... 33

నాగిని ; ఆ....ఆ....ఆ.... రామప్ప : సానురాగ రాగిణిలా సరసాలా తేలించవె! ముచ్చటైన భంగిమలో మురిపాలా ముంచెత్తవె! నాగిని : ఆ...ఆ... (జతులతో) రామప్ప : _ (పతాక స్థాయిలో) నాగినివే! రాగిణివే!... వలపు తలపులా వాహినీవే!... శిల్చ కళా వేదంగా శిరసెత్తే మోహినివే!... (అంటూ ప్బాదయానికి హత్తుకుంటాదు. నాగిని విడిపించుకొని ఉలి, సుత్తి అతని చేతికి అందిస్తుంది. అతడు చెక్కడం ఆరంభిస్తాడు. ఇదంతా చాటు నుంది ఒక చారుడు గమనిస్తాడు. శాస్తి చేయిస్తానంటూ తలవూపి వెళ్తాడు) (నాగిని వివిధ భంగిమల్లో నిల్చుని, రామప్పకు (ప్రేరణ కలిగిస్తుంటే, అతను రమణీయంగా చెక్కుతుంటాడు) వ్యాఖ్యానం : కొన్నాళ్లకు నాగిని నాట్య (ప్రేరణతో రామప్ప ఉలి తాకిడికి శిలలు రమణీయ శిల్పాలుగా మారిపోతాయి. సుందర రామలింగేశ్వర మందిరంగా రూపుదాలుస్తాయి. కాని వీరి (ప్రేమ భావాన్ని కామభావంగా తలచిన ఒక చారుని వల్ల రేచర్ల రుద్రయ్య (ప్రభువు విపరీతంగా అర్ధం చేసుకొని ఆ(గ్రహిస్తాడు. భటుల చేత రామప్పను నాగినితో సహా రప్పించి, శిక్షించదలుస్తాడు-) 34

= రాజమందిర దృశ్యం జ రేచర్ల రుద్రయ్య : ఏమప్పా! రామపష్పా! ఏమిటి నువు చేస్తున్నది? చెప్పెను కద జాయప్పా గొప్ప గుడిని చెక్కుమని! రమణీయ శిల్పాలతొ రామలింగేశ్వరునికి మందిరమే కట్టాలని మా నిర్ణయమే అయితే నాగిని భోగిని కాగా నటన మాడుతున్నావే!... 1వ రామలింగేశ్వరునే రాసలింగేశ్వరునిగ రూపొందిస్తున్నావే!... పాపం చేస్తున్నావే!... అట్టి పాపమునకింకా గట్టి శిక్ష వేయాలీ! సంప్రదాయ సంస్కతికే తగిన రక్ష చేయాలీ!.... ॥1వ॥ రామప్ప ; అయ్యయ్యో! మహాప్రభూ!... అన్యాయం మహాప్రభూ!... తప్పుడు ఆరోపణ విని తగని శిక్ష వేస్తారా? ॥1అ॥ (ప్రేయసి నా శిల్పాలకు (ప్రేరణయే మహాప్రభూ! 35

నాగిని నర్తనతోనే రాగోదయమాయి ప్రభూ! ॥అ॥ అనాదిగా ఆలయాల అతివ అంత చందాలను ఎందరెందరో శిల్పులు సుందరంగ మలిచారే! కామసూత్ర భంగిమలను కావాలని తొలిచారే! వారికి వైభవయోగం! నాపైనా అభియోగం? న్యాయం కాదూ ప్రభూ! ధర్మం కాదూ ప్రభూ! రుద్రయ్య: ధర్మాధర్మం నాకే దండిగ బోధిస్తావా? సిగ్గులేక చెక్కితివి శిక్ష అనుభవిస్తావా? రాజాజ్ఞకె ధిక్కారమా? కావున కారాగారమే! తప్పదు తప్పదు రామప్పా! చెప్పకు యింకా ఏ గొప్పా! (అని భటుడికి సైగ చేయగానే, అతడు యిద్దర్నీ కొరడాతో కొడతాడు. నాగిని వీ! హతవిధీ అంటూ కుప్పకూలి పోతుంది. రామప్ప చేతులెత్తి రామలింగేశ్వరుణ్ని స్తుతిస్తూ, ఆవేశంగా నర్తిస్తాడిలా-) రామప్ప : _ ధర్మో రక్షతి రక్షితః అన్నది అనాది వేదం! 36

శివ కర్మో రక్షతి రక్షితః అంటున్నది నా హృది నాదం! వింటున్నావా నటరాజా?... వినకుంటున్నావా మహరాజా?... 1ధ॥ నాగిని క గణపతి - సురపతి - బ్రహ్మమురారి షణ్ముఖ సేవిత రక్షమాం! శక్తిస్వరూపిణి, శ్రీనారాయణి పార్వతి శోభిత పాహిమాం! రామప్ప : భుజంగ భూషణ! అనంగ భీషణ భూతనాథ శరణం శరణం! విభూతి వదనా! స్మశాన సదనా! విశ్వనాథ నీచరణం శరణం! 1ధ॥ (అంతలో జాయప్ప ప్రవేశిస్తాడు, గమనిస్తాడు) మంచికి మంచే జరిగితీరునని మంచు కొండ దొర! భావించానే! రమణీయంగా నీ గుడి చెక్కగ రక్తిలేక యిల శిక్షించావే! తపం జపం యిక చాలించు తక్షణమే మము వీక్షించు కాలాంతక! హే బోళాశంకర! కారుణ్యంతో రక్షించు! ధర్మో! (అంటూ ఉధృతంగా నాట్యంచేస్తూ శివున్ని వేడుకొంటాడు. రేచర్ల రుద్రయ్య ఆశ్చర్యంగా చూస్తుంటాడు.) జాయప్ప : కాకఠీయ మహారాజ కైమోడ్చ్పులు మీకివే! 37

రుద్రదేవ మహారాజ భద్రమనవి మీకిదే! మీ ఆనతిపై గుడికై ఇతడిని నియమించాను! అభియోగం విని ఆలయ మంతా వీక్షించాను! 1కా॥ రమణీయం! రమణీయం! రామప్ప నైపుణ్యం! నాట్వానికె నవ్యార్ధం, రామప్ప శిల్పాలు! నాగిని వక్షద్వయాన నడయాడే సర్పాలు, కామం విషసర్పాలను కమనీయపు అర్జాలు! నగ్న నాట్య శిల్పాలు దిగంబరపు తత్వాలు! ఆవేశంగా యితడు అభినయించు నాట్యాలు “ప్వేర్రిశ తాందవ ముద్రకె (శేరణ యను సత్యాలు! నాకు గోచరమ్మాయెను నవ్యనాట్యమే తోచెను! “కొక్షోకమ్మే” చెక్కిన శిల్పుల సన్మానించిన తరతరాల సంస్కారం, తగినట్టి పురస్కారం

38

అందించిన ఘనత మనది!

ఆదరించు చరితమనది!

అందుకె యీ రామప్ప

అందరిలోనూ గొప్ప!

నాగిని యీ రామప్పకు

ఢ్రేరణగా నటియించెను!

ఆవేశపు అతని నటన

'పేరిణినే సృజియించెను!

కావున ఇతనికి తగదు

కఠిన కారాగారం!

ఆదరంగ యివ్వాలి,

అమూల్య అగ్రహారం!

(అనగానే రుద్రయ్య తల ఆడిస్తూ అంగీకరిస్తాడు.) ప్రభువు : అయితే 'పాలంపేటిను

(గగ్రామంనే రామప్పకు

అ(గ్రహారం గానే

శీఘ్రంగా యిచ్చేనిక!

రామలింగేశ్వర గుడి

“ధామప్ప”గ నిలిచే నిక!

చరితార్జుడిగా యితడిని

చరిత్ర పుట వలచేనిక! (అనగానే నాగిని, రామప్ప అటు ప్రభువుకు ఇటు కృతజ్ఞతగా జాయప్పకు ప్రణమిల్లుతారు. ప్రభువు రామప్పను లేవనెత్తి ముత్యాల హారంతో సత్కరిస్తాడు.)

39

నేపథ్య వ్యాఖ్యానం : ఇట్టి “రామప్ప”తో పాటు రమణీయ శిల్పాల రాశిగా వాసికెక్కిన ఓరుగల్లు వేయిస్తంభాల రుద్రాలయం, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, గోదావరి తీర కాలేశ్వరం, బాసర

  • భద్రాచలం మొదలగు ఆధ్యాత్మిక క్షేత్రాలు, చార్మినార్‌ - గోల్కొండ - గద్వాల లాంటి చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నవి! తెలంగాణ తేజోరాశిగా ప్రకాశిస్తున్నవి! వీక్షకులకు నయనానందంతో పాటుగా హృదయానందం కలుగజేస్తున్నవి! నర్తకులు : కమనీయం! కమనీయం!

విమల విశిష్ట క్షేత్రాలన్నీ!

రమణీయం! రమణీయం!

పర్యాటక ప్రాంతాలన్నీ...

తేజంగా ఆకర్షించే

తెలంగాణ జిల్లాలన్నీ!... ॥కమ॥ (అంటూ కొసమెరుపుగా ప్రస్తుతిస్తూ నిష్రమిస్తారు-)

(తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రోత్సాహంతో, వసుమతి వరకాల బృందంచేత “రవీంద్రభారతిలో, న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో ప్రదర్శితమై ప్రశంసల్ని పొందింది.) అస్టుస్షణ 40

కాకతీయ వైభవం! (సంగీత, నృత్యరూపకం) నర్తకులు (జతులతో) ; వైభవం! వైభవం కాకతీయ వైభవం చరిత్రపుటలో చెరిగిపోనిది ధరిత్రి ఘటనల చెదిరిపోనిది కాకతీయ ప్రాభవం కమనీయ వైభవం! ॥మై। “కాలేశ్వరమూ'” మొదలుకొని కళింగదేశం దాకా తెలుగు సీమనే స్థాపించి తేజంగా పరిపాలించి గణనీయంగా వెలుగొందే గణపతిదేవ చక్రవర్తి! కాకలు దీరిన కాకతీయ సామ్రాజ్య తేజోవర్తి! కొడుకులు అసలే కలుగలేదని కొంత చింతయూలేకుండా (స్పాట్‌లైటొలో ప్రాప్ర 'రుద్రమిను రుద్రదేవునిగ బాల రుద్రమ (ఫైంతాలన్నిట ప్రకటించే! కత్తియుద్ధం క్రన్హి సామును - గుర్రపు స్వారిని నేర్చుకోవడం) బాల్యం నుంచే నేర్పించే! పరిపాలనలో మెలకువలన్నీ పదిలంగాను వివరించే! యుక్తవయసుకు రాగానే శ]

యుక్తిగ పట్టము గట్టించే!... మంటత్రియైన శివదేవయ్య మంత్రాంగాన్ని మన్నించి రుద్రదేవుని “రద్రమదేవి”గ ప్రజల ముందర ప్రకటించే! చాళుక్య వీరభద్రునితో చాకచక్యముగ రుద్రమ పెళ్లి వైభవంగా జరిపించే! వనితా రత్నం అనిపించే!... శీఘ్రంగా యాదవరాజు స్తీపరిపాలన ప్రతిఘటించే! అతనితోడుగా సవతి సంతతగు హరిహర - మురారి దేవులు కూడ సోదరి రుద్రరాణి కావడం అసలే మాత్రము సహించకా రాజ్యం కోసం చాటుమాటుగా రహస్య మంతనాలు చేసిరి! ప్రీ పరిపాలన గిట్టనట్టి లకుమారెడ్డిని ఆశ్రయించిరి!... (అంటూ నర్తకులు నిమిస్తారు. లకుమారెడ్డి, హరిహర - మురారిదేవులు యాదవరాజు మహాదేవుడు ప్రవేశిస్తారు...)

  • రాజ దర్బారు దృశ్యం ఆ హరిహర _ : లక్ష్మీవల్లభులై తులతూగే లకుమారెడ్డీ మవాప్రభో!... మురారి. : మీ సహకారం కోరివచ్చితిమి! మీరే మార్గం చూపాలి! ఖై

ఇద్దరు కలిసి : ఏ విధిగైనా రుద్రమదేవిని పీఠం నుంచీ దింపాలి! లకుమారెడ్డి : హరిహర-మురారి దేవుల్లారా! అంతా నాకు తెలుసులెండీ! గణపతిదేవుని సవతి తమ్ముడగు సారంగదేవుని పుత్రులు మీరు! న్యాయానికి - రాజ్యానికి మీరే అసలగు వారసులు! పుత్రులు లేని గణపతిదేవుడు పుత్రికనే రాణిని చేసి పట్టం కట్టుట అన్యాయం! పడతి ప్రభువగుట హేయం! సమయం చూసి దెబ్బతీయగా సామ్రాజ్యాన్ని ఆక్రమించగా మార్గం అన్వేషించండి! మా సాయం మీకెపుడుంటుంది! పొరుగు రాజ్యమగు దేవగిరిని పోటీగా పరిపాలించే యాదవరాజగు మహదేవా! నీ నిర్ణయము తెలిపేవా? మహాదేవు : తరతరాలుగా కాకతీయులు మా-యాదవులకు బద్ధశత్రువులు! పైగా ఆడది పాలించుటయా? పథకం వేసి దింపేద్దాం! హరిహర : ఆదది ఆడదనీ ఆమెను తక్కువ అంచన వేయరాదు! తపి

మురారి : _ కత్తిపట్టెనా కదనరంగమున కాళికనే మరిపించేను! మహాదేవు : కాళిక అమే అయిపోతే కాలఖైరవులు మనమవుదాం! లకుమారెడ్డి : అంతేమరి! అనుమానం వలదు అదనుచూసి ఎదిరించండి! వెన్నుదన్నుగా మేముంటాము వెన్నుపోటుకై యత్నించండి! మురారి ; ఆ ధైర్యం యిక చాలు చాలు! ఆడిస్తాం! మాకత్తి - డాలు! (అంటూ నవ్వుతూ వెళ్లిపోతారు) (మళ్లీ నర్తకులు ప్రవేశిస్తారు-) నర్తకులు ; గణపతిదేవుడు అస్తమించినా గణనీయంగా రుద్రమదేవి రాజ్యము పరిపాలించింది! రాణిగ ప్రజలను లాలించింది! చెట్లను ఎన్నో నాటించింది! లోటు పాట్లను సవరించింది! లలిత కళలనూ పోషించింది! రుద్రాణిగా భాసించింది! మేనమామ జాయపసేనాని మేటి నాట్యకళ గుర్తించింది! రామప్పుకడ రమణీయంగా శిల్పమందిరం పోషించింది వేయిస్తంభాల గుడి దీవెనతో వేడుకగా పరిపాలించింది! తక

చెరువులు - కుంటలు తవ్వించింది! కరువులనన్నీ అధిగమించింది! సమర్జులైన యోధుల్నే సామంతులుగా నియమించింది! కన్నబిడ్డలుగ ప్రజలందరినీ కంటిరెప్పలా కాపాడింది! ఓరుగల్లును శత్రురాజులు ఓరగనైనా చూడకుండగను వైరులందరికి దుర్భేద్యంగా వైభవంగ కోటను తీర్చింది! శిఖరకీర్తిగా కాకకీయుల శిలాతోరణం కట్టించింది! కాకతమ్మయగు “ఖభద్రకాళొని కులదేవతగా పూజించింది! అయినా రుద్రమకూ కూడ మగసంతానం కలుగలేదు! కూతురైన “ముమ్మడమ్మ”కు వంశోద్ద్ధారకుడే పుడితే

మొత్తం వ్రతాలు చేయిస్తానని మొగిలిచర్ల దేవికి మొక్కింది! ముమ్మడమ్మకు పుత్రుడు పుట్టగ మొక్కుతీర్చగా ఆనందంగా 'మొగిలిచెర్లోకే వెళ్లింది! ఏకవీరను ఆరాధించి

ఎంతో భక్తిగ ప్రణమిల్లింది! మనుమడు ప్రతాపరుద్రుడే యిక తన తదుపరి పట్టాభిషిక్తుడు కాగలడంటూ మురిసింది!

4ిక్‌

కన్నుల వెన్నెల కురిసింది! = జతులు -

(తాళం మార్చుతో) రాణికోటలో లేదని రహస్యముగ తెలుసుకొన్న హరిహర మురాలే... హఠాత్తుగా దందెత్తీ కోట వశముచేసుకొనిరి! ఆట పాటలో మునిగిరి! ఆ విషయం విని రుద్రమ

(స్పాట్‌లైటొలో షంమిత సైన్యంతోనే

రుద్రమదేవి స్వర్ష్బన్ల త్రిరిగొచ్చింది!

పోరాటం) సమరం సాగించింది! మహారాణి వచ్చిందను మహదానందపువార్త చెవుల సోకగానె (ప్రజలు చెలరేగుతు పోరాడిరి! హరిహరుల సైన్యంపై అదే పనిగ తిరగబడిరి! ఊహించని సంఘటనకు ఉక్కిరిబిక్కిరి మైన హరిహర, మురారులంత రుద్రమతో 'ఢీ కొనిం! శత్రుశేషమసలే యిక వుంచరాదనీ యెంచిన రుద్రమ ఖద్గమ్ముతో రుద్రాణిగ చెలరేగెను!

46

(స్పాట్‌లైటొలో హరిహర - మురారులా హరిహర - శిరములనే ఖండించెను! మురారుల ముప్పుయే తప్పెననీ

సంహారం ప్రజల ముదమున జనమంతా ఆనందోత్సాహం) తప్పెట్లను మోగించెను! తమ రాణిని కీర్తించెను! అది తెలిసిన లకుమారెడ్డి అంబదేవునితో కూడి మహదేవునితో మళ్లీ మంత్రాంగం నడిపించెను! (అంటూ నర్తకులు నిష్మమిస్తారు.) = రాజ మందిర దృశ్యం జు (లకుమారెడ్డి, మహదేవుడు తదితరులు ప్రవేశిస్తారు) లకుమారెడ్డి : ఎంత ఘోరము జరిగిపోయెను

(మిశ్రగతి మిత్ర శిరములు నేల కొరిగెను తాళం తగు విధంగా ప్రతీకారము

మార్పుతో) శ్రక్ష్యమ్మిక చేయవలెను!

యాదవరాజు : చవటలు ఆ సోదరులను

(మవదేవుడు) చంపగానే వీరనారిగ

విర్రవీగే రుద్రమాంబను

విధిగ నే నెదిరించెదనులే!

అంబదేవుడు కూడ వెనుకగ

దాడి చేయగ తోడు కాగా

మీరు కూడా సైన్యములతో

చేర వస్తే జయము ఖాయమ! ట్‌

అంబదేవుడు : మూడు దిక్కుల దండయాత్రలు

ముగ్గురమ్మిక చేయగానే

రుద్రమాంబకు మూర్భతప్పదు

భద్ర విజయము మనకు తప్పదు! యాదవరాజు : లెస్స లెస్సగ పలికినావులె!

కస్సుబుస్సుగ కదలి నేనిక

కాల సర్పము వోలె ఆమెను

కాటు వేసే తరుణమాయెను! లకుమారెడ్డి : ఆలసించక అందరమ్మిక

ఆలమందున కలియ వలెనిక

ఓరుగల్లును ఒడిసిపట్టగ

ఆడ రాణిని అణచి పెట్టగ

కాకతీయుల సామ్రాజ్యము

కావలెను మన పాద క్రాంతము! మహదేవుడు & అంబదేవు : కావలెను మన పాద క్రాంతము

(అని వికటాట్టహాసం చేస్తూ, కత్తులు దూసి కదలుతారు) (మళ్లీ నర్తకులు ప్రవేశిస్తారు. అభినయంతో పాడుతారు)

నర్తకులు _ : గూఢచారుల వల్ల సర్వము

గుప్తముగనే తెలియరాగా

రాణిరుద్రమ రౌద్రమూర్తిగ

మారి సమరము చేయనెంచెను

శంకలేకను శీఘ్రముగనూ

శంఖమే పూరించదలచెను

రయముగా ప్రజలందరీనీ

రణమునకు చైతన్యపరిచెను!

  • జతులు -

48

రుద్రమ (ప్రవేశిస్తూ) : కాకతీయా పౌరులారా! ఏకవీరా భక్తులారా! ఏకధాటిగ శత్రుసేనల ఎదుర్మొనగా సాగిరండీ! తెలంగాణము కేంద్రమవగా తేజరిల్లెడు తెలుగు నేలను ముక్కముక్కలు చేయనెంచెడు ముష్కరుల పని పట్టరండీ! శత్రువులతో చేయికలిపిన దేశ ద్రోహుల నణచలెండీ! కాకతీయుల సైన్యములతో కదలి కత్తులు దూయరండీ! కాక! ప్రోలినాయడు - పోతినాయడు గోనగన్నారెడ్డి వీరుడు పొందికగనూ పోరు సలుపగ పొంచి మనతో చేరి వత్తురు! దొంగ దెబ్బను తీయనెంచిన ద్రోహులిక రణమందు చత్తురు! కదన పటిమను చూపవలెనిక కాకతీయపు ఉడుకు నెత్తురు! (అంటూ ఖడ్గమెత్తి) జై జై కాకతీయా భద్రకాళీ! జై జై ప్రకయకాలా రుద్రకేళీ! (పిడికిళ్లు ఎత్తి

(ప్రజలు : జైజై కాకతీయా భద్రకాళీ! జైజై ప్రళభయకాలా రుద్రకేళీ!

వి

(రుద్రమదేవి ననుసరిస్తూ ప్రజలు ముందుకు సాగిపోతారు) (మళ్లీ నర్తకులు ప్రవేశిస్తారు) నర్తకులు అశ్వము నెక్కి ఆలమందున (స్పాట్‌లైటొలో విశ్వరూపమే చూపుతూ రుద్రమ విచ్చుకత్తిలా విరుచుకు పడ్డది వీరవిహారం) రాణీ రుద్రమదేవీ!... పిడుగు పాటులా మీద పడ్డది వడిగా రుద్రమదేవీ! ఎదురు నిలువగా సత్తువలేక బెదిరిన “దేవగిరీ” మహదేవుడు “బీదర్‌ కోటను అప్పగించీ సంధికే దిగి వచ్చాడు! కాళికయైన రుద్రమ కక్తికి కడకూ బలియైపోయాడు! ఆడదియనుచూ అబలాయనుచూ చులకనచేసిన అంబదేవుడూ రుద్రమ ధాటికి తాళలేక భద్రంగా దాక్కున్నాడు! రుద్రమ శత్రువులందరినీ రూపు మాప చెండాడుతుంటే, రుధిరం చిందిన లెక్కచేయకా వీర విహారం చేస్తుంటే, పొంచి వుండీ వెనుక నుండే పొడిచె దుష్టుడు, అంబదేవుడు! చివరి రక్తపు బొట్టు దాకా చీల్చెను వైరుల రుద్రమ్మా! 50

నింగి కెగిసినా అందరి మదిలో నిలిచెను రాణీరుద్రమ్మా! ప్రతీకారముగ ప్రతాపరు[్రుడు అంబదేవునీ అంతము చేసెను! అమ్మమ్మా - రుద్రమ్మా అత్మకు శాంతిని చేకూర్చెను! విశాల సామ్రాజ్యాన్ని ఏలిన వీర నారియే రాణీ రుద్రమ! ఆడది అబలనుటే తప్పని బుజువు చేసెను రాణీరుద్రమ! అన్ని విద్యలందారి తేరిన అఖండ తేజోరాశీరుద్రమ! కాకతీయవైభవ చరిత్రకే కాంతి పతాకం రాణీరుద్రమ! కోరస్‌ బృందం: కాకతీయ వైభవ చరిత్రకే కాంతి పతాకం రాణీరుద్రమ రుద్రమయే కాకతీయ మ వంశమంతటికి వైభవం! ము ర భి రుద్రమయే తెలంగాణ న్య ర్త నిన్న (1 | భద్రకీర్తి గల ప్రాభవం! //” న. (ఆ. కాకతీయ (ప్రాభవం! ాటంట్తడాడ కమనీయ రమణీయ కాకఠీయ వైభవం! (దా! వనజా ఉదయ్‌ కోరికపై రచించినది) క్‌1

వుష్కర పుణ్యఫలం! (సంగీత, నృత్యరూపకం) (సూత్రధారులుగా నర్తకులు ప్రవేశించి, పుష్కర మాహాత్స్య్వం గూర్చి వివరిస్తారిలా -) నర్తకులు ;

అతడు : పుష్కరాలు - పుష్కరాలు! పావన ఆవిష్మరాలు!

ఆమె : పుష్కరాల స్నానాలకె ముంగిట మోక్షము వాలు!

ఇద్దరు ఏ పుష్కరాలు - పుష్కరాలు ! పావన ఆవిష్కరాలు!

అతడు :; మేషరాశిలో గురువు ప్రవేశించగా గంగకు

ఆమె : వృషభరాశిలోకి గురువు మారగనే నర్మదకు

అతడు :; మిథునంలో సరస్వతికి కర్కాటకమున యమునకు

ఆమె : ఏటేటా ఒక నదికి ఏతెంచును పుష్కరాలు!

అతడు : అటుల సింహరాశిలోకి బృహస్పతియె అడుగిడగా

ఆమె : పావన గోదావరిలో ప్రవేశించు పుష్కరుడు!

52

అతడు : సకల తీర్ధ పుణ్య ధరుడు జనజీవన పాపహరుడు ఆమె : టప్రవేశించినంత నదికి పందైెండు దినములకు అతడు : పుష్కరాల పుణ్య తిథులు పుష్మలంగ కలిగేను! ఆమె : ఆ ద్వాదశ దినములలో అందరు స్నానం చేసిన అతడు : పాప ప్రక్షాళనమై పరమార్ధం సిద్ధించును! ॥1పు! ఒక వ్యక్తి: అసలు పుష్కరుడు ఎవరు? (ప్రవేశిస్తూ) అతని చరిత మేమిటో? పుష్మరునికి, బృహస్పతికి పుట్టినట్టి అనుబంధం అవగతమవగా మాకు అంతా వివరిస్తారా? అతడు : పుష్మరగాథను వినుము! పునీతగాథను కనుము! అతని గాథ విన్నంతనె అతి పవిత్రుడవు కమ్ము! పూర్వము పుష్మర భక్తుడు అపూర్వముగ శివుని గూర్చి ఘోరతపమ్మాచరించె! గొంతెత్తీ ప్రార్ధించే! ర్‌ం

(అంటూ నర్తకులు నిషమిస్తారు - వెంటనే శివస్తుతితో పుష్కరుడు ప్రవేశిస్తాడు) పుష్మరుడు : పంచాక్షరీ ప్రియా! పరమేశ్వరా!... జడధారి జంగమా! జగదీశ్వరా!... కావరా! పురహరా! కాలేశ్వరా! (బ్రోవరా! శంకరా! రాజేశ్వరా!... ॥పంచా॥ నిరతమ్ము నిను కొలవనెంచానురా! త్వరితమ్ము నా కోర్కె నీడేర్చరా!.. కైలాసమే దిగి కదలిరా! కైవల్యమందీయ తరలిరా! “'నమళ్శివాయా!” అన్నంతనే తమస్సునే తరిమేస్తావుగా! మహదేవా! అనుకున్నంతనే మహస్సునే కలిగిస్తావుగా!... ॥పంచా॥ ఓం నమశ్శివాయ - ఓం నమశ్శివాయ ఓం నమళ్శివాయ - ఓం నమశ్శివాయ ఓం నమళ్ళివాయ - ఓం నమళ్ళివాయ ఓం నమశ్శివాయ - ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ - ఓం నమశ్శివాయ (అంటూ తపస్సులో కూర్చుంటాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు) శివుడు : వత్సా! పుష్కరా! వచ్చానురా! కోరుకో! ఏదైనా యిస్తానురా! నిరతమ్ము నన్నే ధ్యానించిన నీ మనోరథమే తీర్చేనురా! (అనగానే పుష్కరుడు లేచి అంజలి ఘటిస్తూ - ) ర్‌శ

  • తాళం మార్పుతో - పుష్మరుడు : హరహర మహదేవా! పురహర మహదేవా! మనోవాంఛ తీర్చేవా? మల్లికార్డునా! దేవా! అయితే నా అభీష్టమ్ము ఆలకించు శివదేవా! ॥హర॥ సకల పుణ్యతీర్థాల సారం నా గుప్పిటలో వుండేట్లు అనుగ్రహించు! ఉనికి, ఉన్నతిని 'పెంచు! కరుణతో విధాతచేతి కమండలం నివాసంగ కలిగేలా దీవించు! నన్నిక ఆశీర్వదించు! శివుడు : తథాస్తు! తథాస్తు! మనోఖీస్ట సిద్ధిరస్తు! (అని ఆశీర్వదించి శివుడు అంతర్జానమవుతాడు. పుష్కరుడు అనందంగా ముందుకు సొగుతాడు.) _ తెర - వ్యాఖ్యానం : అలా పుష్కరుడు సకల తీర్ధ పుణ్యధరుడై బ్రహ్మ కమండలంలోకి ప్రవేశించడం గమనించిన బృహస్పతి పుష్కరుడు తనతో వుంటే నదులన్నిటికీ ప్రత్యేక అతి పవిత్రత ఏర్పడుతుందని భావించి, బ్రహ్మ వద్దకు వెళ్లి అర్థించాడిలా లా ర్‌5్‌

(బ్రహ్మ జపమాలతో అగుపిస్తుంటే, బృహస్పతి ప్రవేశించి ఎలుగెత్తి ప్రార్ధిస్తాడు) బృహస్పతి క ఓ విధాతా! ఓ విరించీ! (గురువు) యోచించుము మాగురించీ! పుష్కరుడినే మాకు యిమ్మని యాచించెద నిను తలంచీ! ॥1ఓ॥ పుష్మరుడు నీ కమండలమున వున్న ఫలమదియేమొగాని నదుల యందున నాతొ పాటుగ మెదలినచొ మహికెల్లమేలు 1౬1 పుష్కరుడు :; (వెంటనే స్పందిస్తూ) (బ్రహ్మదేవా! నిన్ను వదలి బయటకసలే వెళ్లలేను! సృష్టికర్తా! సత్యలోకము యిష్టపడి నే వచ్చినాను! బ్రహ్మ॥ బ్రహ్మ : ఆలకించితి మీ యిరువరి ఆంతరంగిక ఆర్తిని! పరమశివుని అనుగ్రహముతో ప్రవేశించిన పుష్మరుడిని (బృహస్పతితో) - శాశ్వతముగా నీతొ వుండగ శాసించగ వీలులేదు! కాని మానవ హితముకై నీ కాంక్షనూ కాదనగరాదు! అందుకై ప్రతియేడు నదిలో 56

పుష్మరుదు పండ్రెండు దినములు నీతో పాటే మసలనెంచును! పుణ్య తీర్మమహిమ పెంచును! (పుష్మరుడు, బృహస్పతి సమ్మతిగా తలలాడిస్తారు-) (నమస్కరిస్తూ) గురువు & పుష్కరుడు : మా ఉభయులకు యిది సమ్మతం! మీ అభయమే అవనికి హితం! ॥మా॥ వ్యాఖ్యానం : అలా విధాత కుదిర్చిన ఒప్పందం మేరకు పుష్కరుడు బృహస్ఫతితో ప్రతి యేటా పన్నెండు దినాలు ఆయా నదులలో ప్రవేశించి, వాటికి అత్యంత పవిత్రత కలుగజేస్తున్నాడు. గురువు సింహరాశిలో ప్రవేశించే సమయంలో గోదావరికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఈ గోదావరి పుష్టరూలలో మాత్రం పుష్టరుడు ప్రారంభంలో పండ్రెండు దినములేగాక సంవత్సరాంతంలో గూడ పండ్రెండు దినములు మసలనెంచడం విశేషం! ఇది గోదావరి నదికి గల పవిత్ర ప్రత్యేకత! అసలు గోదావరి నది ఎలా ఉద్భవించిందో, యింతటి పవిత్రత ఆ నది కెలా సిద్ధించిందో తెలియాలంటే ప్రాచీన పురాణ గాధను - గౌతముని గోహత్యా పాతక నివారణ చర్యను మనం మననం చేసుకోవలసిందే! (తెరపె సౌధ బ్రహ్మ నారాయణని పొదాల్ని తన కమండల జలంతో ఆయా. కడుగగా ఆ నీళ్లు నాలుగు పాయలుగా పారి, చతుర్విధ ఘట్టాలు. గంగగా రూపుదాల్చాయి. అందులో దక్షిణ గంగను శివుడు అగుపిస్తాయి.) స్వీకరించి, తలపై ధరించగా గౌరీదేవి గంగను సవతిగా 57

భావించి, ఎలాగైనా వదిలించుకోనెంచి, సుతుడైన వినాయకుడికి ఆ పని అప్పగించింది. ఫలితంగా గణపతి మాయగోవును సృష్టించి, గౌతమ బుషి మాగాణంలోని పంట మేయడానికి పంపించాడు. అందుకు ఆగ్రహించిన గౌతముడు, ఆ ఆవును గడ్డిపోచతోనే అదిలించాడు. అయినా మాయ గోవు వెంటనే మరణించింది. దాంతో మునులంతా గౌతముణ్ని గోహత్యా పొతకునిగా నిందించి వెలివేశారు. మనోవేదనకు గురియైన గౌతముడు, పదే పదే పరితపించసాగాడిలా - గౌతముడు : ఏమిటీ విధి వైపరీత్యం?

ఎందుకీ విధి జరిగెనో?

అవు కూడ గడ్దిపోచకె

ఆయువును కోల్పోవునా?

మందలింపుకె మనిషి కూడ

మరణశయ్యకు చేరునా?

కింకర్తవ్యం? కింకర్తవ్యం?

(భష్టమాయెను నా భవితవ్యం!

గణపతి (ప్రవేశిస్తూ) :

కాలమే కాటేయ నెంచిన

తాడు కూడా పాము కాదా?

కర్మమే అణచేయనెంచిన

జన్మమే భ్రష్టమ్ము కాదా?

తెలిసో తెలియక గోహత్యకు

పూనుకొంటివి గౌతమా!

ఇద్టీ పాప క్షాళనముకై

గట్టి తపమిక చేసుకో!

58

పరమ శివునే ప్రార్ధించీ గంగనే అర్థించుకో! అదియె తరణోపాయమూ! ఆచరించిన క్షేమమూ! (అని సూచించిన గణపతికి గౌతముడు నమన్మ్కరించి బదులిస్తాడు) గౌతముడు : తప్పు అసలే చేయకున్నా ముప్పు యీ విధి ముంచుకొచ్చెను! ॥1ఈ॥ కరువు కాలంలోన కూడ ఆశయించిన అతిథులందరి కడుపు నింపుతు ఆదుకున్నా కర్మమీ విధి కాలిపోయెను “వ్రంచితనముకు మంచి ఫలితము” అన్న సామెత సున్న ఆయెను! విఘ్ననాయక! నీదు సూచన శీఘ్రముగనిక అనుసరించెద! పరమశివునే మెప్పించి గంగ నిటకే రప్పించెద! (అంటూ అభివాదం చేసి, ముందుకు సాగిపోతాడు.) కొండ - కోన దృశ్యం (రంగం మార్పుతో కొండల్లో శివస్తుతితో అగుపిస్తాడు యిలా-) పల్లవి ; మృత్యుంజయ! మృత్యుంజయ! మృత్యుంజయ పాహిమాం! మృత్యుంజయ! మృత్యుంజయ! మృత్యుంజయ రక్షమాం! ॥మృ॥ 59

ముక్కంటి దొరా! హరా! ఇక్కట్లను బాపరా! కైలాసవాస హరా! కైవల్యము నీయరా! ॥మృః॥ పాపిట వెన్నెల పాపడు గళమున గరళము దోసెడు శిరమున గంగను దోపెడు శివ శివ శివ పాహిమాం! క్షుద్రశక్తులకు ధమధమ! రుద! భక్త కల్ప ద్రుమ! నిర్జిద్రంగా కొలువగ అణగించర పాపభ్రమ! మృ (అని ఎలుగెత్తి కొండల్లో కొలువగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ) శివుడు : నిర్ణిద్రంగా కొలిచే నీదు స్తుతిని మెచ్చాను! కోరుకో వదైనా కొరతలేక యిస్తాను! (చేతులు జోడించి) గౌతముడు : కైలాసగిరి నుండి కదలివచ్చిన స్వామి కైవల్యమందీయ అభయమిచ్చిన స్వామి గోహత్య పాతకం త్వరగా హరించగా తక్షణం నీ గంగ నా వెంట సాగంగ ఆశీర్వదించయ్య! శరణు శరభయ్యా! అనుగ్రహించయ్య! భక్త సులభయ్యా! 60

(తాళం మార్పుతో) శివుడు : గంగనిదిగో నీకు శీఘ్రంగ వదిలేను! దక్షిణంగా సాగి నీ కోర్కె తీర్చీను! గౌతమా! నీజన్మ ధన్యమ్ము అయ్యేను! నీపేర యీ గంగ 'గౌతమి'గ మారేను! గోముక్తి కలిగించ గోదారి అయ్యేను! గోదారితో బ్రతుకు పూదారి అయ్యేను! పుష్మరుని కలయికతొ పుణ్యవాహినియై మునకలిడు భక్తులకు ముక్తి కలిగించేను! (అంటూ శివుడు గంగను శిరస్సు పైనుండి ధారగా వదలగానే, కిందికి ప్రవహిస్తుంది. గౌతముడు పరవశిస్తాడు.) గౌతముడు : ధన్యోస్మి! ధన్యోస్మి! దయా సముద్ర! కైమోడ్పులందుకో కైవల్య రుద్రా!... 1ధ॥ వ్యాఖ్యానం : అలా నాసిక్‌ సమీపాన 'త్రంబకేశ్వర్‌'లో ప్రభవించిన గోదావరి మన రాష్ట్రంలో 'బాసర' వద్ద ప్రవేశించి, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం మీదుగా గౌతమునితో 'కొవ్వూరు'ను చేరి మాయ గోవును బ్రతికించి, అతని గోహత్యా పాతకాన్ని తొలగించింది. 61

అహల్య కారణంగా గౌతముని శాపంతో ఒళ్లంతా కళ్లయిన దేవేంద్రుని వికృత రూపాన్ని కూడ (బ్రహ్మ సూచనతో పుష్మర కాలంలో స్నానమిడగా, పునీతున్ని చేసింది యీ గోదావరియే! ప్రతి నదికి 12 యేళ్ల కొకసారి పుష్కరాలు వస్తే, ప్రతి 12 పుష్కరాలకు అంటే 144 యేళ్లకు “మహాపుష్కరాలు” ఏర్పడతాయి. అట్టి 144 యేళ్ల విశిష్ట మహాపుష్మరమే యీ యేడు గోదావరికి ఏర్పడడం అరుదైన మహాభాగ్యం! ఇక గోదావరి పుష్కర స్నానంతో - తగు విధ దానంతో అందరం పునీతులమవుదాం! పుణ్య కార్యాల్లో నిమగ్నమవుదాం!....

  • గోదావరి గీతం - నర్తకులు ; వందనం! వందనం వైభవ గోదావరి! వందనం! వందనం పుష్కరాల పుణ్యర్వురీ! 1॥వం॥ గౌతమ గోదావరి నాసికా నందినీ! వందనం! వందనం గోముఖ స్యందినీ! “త్యంబకేశ్వర* దేవ పాదనాద శింజినీ!... ॥వం॥ (2003లో జరిగిన గోదావరి మహాపుష్మరాల సందర్భంగా) ఎ 62

తెలంగాణ పుణ్య క్షేత్రాలు (సంగీత - నృత్యరూపకం) నర్తకులు ఓం.... ఓం... ఓం... ఓం... ఓంకార నాదం - తొలి దివ్యనాదం! ఆ నాదమున ఆడె నటరాజపాదం! బ్రహ్మయే పులకించ, విశ్వమే సృష్టించ 'ప్రథమంగ పలికింది, సామ-బుగ్వేదం!

  • జళులు- ॥ఓం॥

వేద నిర్దేశమే - భక్తి ఆశ్వాసమే వేలాది పుణ్య క్షేత్రాలు!... తేజరిల్లే తెలంగాణంలో విరాజిల్లే వివిధ క్షేత్రాలు!... “ధర్మోరక్షతి రక్షితః అన్నది అనాది వేదోక్తి! “దిన కర్మో రక్షతి రక్షితః” అన్నది నేటి విధి సూక్తి! కర్మం ధర్మం ననుసరించి దైవమునే ఆరాధించి; కైమోడ్పులతో ప్రార్ధిస్తే... కైవల్యమ్మే సిద్ధించు!

= జతులు - తేజోమయ తెలంగాణ క్షేత్రాలు

(తాళం తరతరాల వైభవాల స్తోత్రాలు ॥తేజో॥ మార్పుతో) ఆదిలాబాద్‌ *“బాసరి భాసురం, కరీంనగర్‌లోని 'కాలేశ్వరం!! 63

(తెరపై ఆయా నల్లగొండ జిల్లా 'యాదాద్రీ), క్షేక్రాల్ని ఖమ్మం జిల్లా 'భద్రాది!!

చూపడం) వరంగల్లు “కాళికాంబ పాలమూరు 'జోగులాంబి” భద్రంగా కాపాడే బంగారు తెలంగాణం! 1లేజో!॥ పుణ్యక్షేత్రములె పునీతమై దైవరూపముల పాత్రములై పుడమిలోపల వర్ధిల్లే!... భక్తి భావనల శోభిల్లే!... 1పుణ్య॥ నదీనదాలే పాదపీఠమున పారాణిగ పారాడగా... పర్వత(శ్రేణులె 'మణిమేఖలోగా కటియందున తారాదగా విరాజిల్లు మన తెలంగాణం పరిథవిల్లు ప్రతి మాగాణం!

  • జతులు - తేజో!

(తాళం శివుని జటాజూటము నుంచి

మార్పుతో) దిగివచ్చి “త్యంబకేశ్వరు” కొలచి “బాసరి భారతినే అర్చించి భాసురముగ గోదావరిగా ఆశాజనకముగా ప్రవహించే సస్యశ్యామలం గావించే తీర్థం - క్షేత్రం - దైవప్రధానం, బాసర సరస్వతీ ఆలయం, 604

వ్యాస ప్రతిష్టిత దేవాలయం! బాల బాలికల విద్యాభ్యాసం, విలసిల్ల జేయు విద్యాలయం! పైన భవానీ కొలువుండే వాణీ - లక్ష్మీ “త్యంబికాలయం! ॥బాల॥ షల ల పల్లవి ఇ; కాలుడు శివుడు కలగలిసి కైవల్యమ్మిడు కాలేశ్వరం! త్రిలింగదేశ ప్రథమలింగముగ ఖ్యాతి గాంచినది కాలేశ్వరం! కాలు! కాలయముని మనవిని మన్నించి కాలకంరుడే కరుణించీ... ప్రాణవట్టమున చోటిచ్చీ... “ప్రాణహిత'ను గోదావరిలో సంగమించగా దీవించి... ద్విలింగమ్ముగా భాసించ పరమేశ్వరుడే వెలసిన క్షేత్రం, పావన కాలేశ్వర క్షేత్రం! మొదటి లింగముగ యముని పిదప లింగముగ శివుని దర్శించి సేవించిన భక్తుల దయతోడను దీవించే మృత్యుంజయ ముక్తీశ్వరక్షేతం! కరుణామయ కాలేశ్వర క్షేత్రం! ॥కాలుదు॥ జ స జ 65

(తాళం మార్చుతో) పల్లవి. : _ వేడుకైన వేములవాడా!... భక్తి వేదికైన వెన్నాలవాడా! వేడు కోడెల మొక్కులకేను కోర్కెల నన్నీ తీర్చే వేములవాదా ఈశుడు రాజ రాజేశ్వరుడు, కార్యసిద్ధి కలిగించే సిద్ధ స్థాపిత శివుడు! ॥వేదు॥ మంటత్రపూతమగు హవిస్సును తస్మరించగా భాస్మరుడు దక్షకోప శాపమ్ముతో దండి శక్తి కోల్పోవగా... వృత్రాసుర సంహారం కావించిన ఇంద్రుడినే బ్రహ్మ హత్యా పాతకం పట్టి ఎంతో పీడించగా,... భాస్మరునికి బాహుశ్రక్తిని ఇంద్రునికి శాపవిముక్తిని కలిగించినదీ క్షేత్రం, కమనీయం యీ క్షేత్రం! రాజ రాజ నరేంద్రుడు నిర్మించినదీ క్షేత్రం! వరప్రసాది 'భీమకవి వర్ధిల్లినదీ క్షేత్రం! వేడు! లలు జ 66

పల్లవి ; భద్రకాళి - రుద్రాలయాల కాకతీయుల వైభవాల కళ్లకు కట్టి చూపే ఓరుగల్లు క్షేత్రాలు! ॥1భద్ర॥ రమణీయమ్మగు శిల్పాలతో (తెరపై ఆయా క్రన్చనీయమ్మగు నాట్యాలతో క్షేత దర్శనం) _ నృత్త రత్రావళిే స్ఫూర్తి జాయప్ప సేనానికి కీర్తి చిత్తమలరగా కలిగించే కొత్త కోవెలై ఆకర్షించే శ్రీరామలింగేశ్వరం, చూడ చూడ అతి సుందరం! అదే అదే రామప్ప మరీటీరం, జాయప్ప రచనా బంధురం! 1॥భద్ర॥ భక్తిగ కొలువగ కాకతీయులకు భద్రత కూర్చిన 'భద్రకాళీ, వేయిస్తంభముల మంటపాన వేడుకగొలిపే రుద్రకేళీ! కాకతీయుల నైపుణ్యానికి తెలంగాణా చైతన్యానికి చెక్కుచెదరని దర్పణం చరిత్ర పుటకు సమర్చణం! ణల జ పల్లవి. : యాదాద్రీ! యాదాద్రీ! యాదాద్రీ!... నారసింహుడే వెలసిన నవ్య వేదాద్రీ!... ॥యా॥ 67

(తాళం మార్పు) హిరణ్యకశిపుని చీల్చి ్రహ్షాదుడినే కాచి అరణ్యముల సంచరించి యాదాద్రికి ఏతెంచి “యాదర్షి ప్రార్ధనతో ఆదరముగ శాంతించి ఉగ్రరూపమును వదలి శీఘ్రమే కరుణించి వెలసినదే వేలయేండ్ల యాదగిరి క్షేత్రం! మరో తిరుమలగ తలచే మహాపుణ్య క్షేత్రం! యా స్తోత్రం : శ్రీ లక్ష్మి నరసింహస్వామీ!... (స్పాట్‌లైటొలో కరుణించు శిరసా నమామీ!... యాదర్షిచే) మహలక్ష్మి నరసింహ స్వామీ! మన్నించు మనసా స్మరామీ!.. శ్రీః ణయ ల్ల కురుమలు - గొల్లలు మెండుగ కులదైవముగా తలచే భక్తిభావనతొ ముంగిట పట్నాలెన్నో వేసే జానపదుల “ఒగ్గుకథలు” జాలు వారు “కొమురెల్లొ, మల్లికార్జున స్వామి మనసుపడ్డ పాలవెల్లి; 68

రయముగా భక్తులపై దయచూపే రంగవల్లి! న.

(మిశ్రగతిలో) _ మెట్టు మెట్టుగ గుట్టనెక్కీ

పట్టు వదలక పదము మొక్కీ

రామనామముతోడ కొలువగ

రోమరోమము నిక్కపొడువగ

పవన సుతుడే వెలసినట్టి

పరమ క్షేత్రం “కొండ గట్టూ'!

ఆంజనేయుడు భక్తులందరి

నాదుకొను మోక్షాల గట్టూ!... స్తోత్రం : కేసరి నందన హనుమా!....

నీసరి నీవే వినుమూ!...

హేశని భంజన - వీరప్రభంజన

మమ్ముల దయతో గనుమా!... 1కేసరి॥

క.

కరువు కాలమున పంటలు పండక

కప్పము నసలే కట్టలేమనీ...

మోకరిల్లినా వినకుంటే,

కాకలు దీరిన కాకతీయులను

ఖడ్దయుద్ధమున ఎదిరించీ

మేటిగ సమరం సాగించీ...

“'మేడారం'లో వేల్పులు అయిరి,

సమ్మక్కా - సారలమ్మలూ!

69

అడవి తల్లులై భక్తుల కాచిరి, ముడుపు గట్టగనె ముక్తినియిచ్చిరి! సమ్మక్కా - సారలమ్మలూ ద్వైవార్షిక వేల్పుటమ్మలూ! ఖల ఇ పల్లవి ; అదిగదిగో అందాల “భద్రాద్రి!” సీతారాములు వెలసిన పుణ్యాద్రి! ॥అది॥ భక్తరామదాసునే కరుణించి బంధవిముక్తిని చేసిన భవ్యాద్రి! భవబంధ విముక్తిని చేసిన భవ్వాద్రి! భవ్యాద్రి - భద్రాద్రి - దివ్యాద్రి! ఉత్తుంగ తరంగాలా గోదారి, ఉత్తమ పంటలకదే రహదారి! గోపన్నలకే గాక ఆపన్నులకూ (స్పాట్‌లైటొలో మోక్షగమ్యాన్ని చేర్చు పూదారి! అది! రామదాసుచే) _ “ఇక్ష్వాకు కుల తిలకి లేదా ఏదైనా

  • రామదాసు కీర్తన - వ 2 పల్లవి : పాలమూరు పరమ పుణ్యక్షేత్రం! “అలంపురం జోగులాంబ క్షేత్రం! ॥పాల॥ కులుకుతు పారే 'కృష్ణవేణీ' కూడుతు సాగే 'తుంగభద్రా సంగమించిన 'అలంపురరిలో సంగమేశ్వరుని సహితముగా 70

వెలసెను వేడ్కగ 'జోగులాంబ” జగముల కాచే జగదాంబ; శక్తి పీరముగ భక్తుల బోచే సకల శక్తి నికురుంబా!... అసుర సంధ్యలో ఆనందముగా తాండవ మాడే పరమశివునితో జతగా - శుతిగా - లాస్యపుజతిగా నృత్యము సలిపే విజయవిహారిణి, శీఘ్రముగా మము దీవించు “శ్రీచక్ర సంచారిణీ రుద్రాణి -నారాయజణీ!... = జతులు - సకల తెలంగాణ క్షేత్ర దర్శనం, నిఖిల శుభాలకు యిదే నిదర్శనం! మంగళకరమౌ దివ్య దర్శనం! సుఖశాంతుల నిడు సుదర్శనం! ఈ దర్శన సుదర్భ్శనమ్మే కాచేను మన రాష్షాన్ని ఈ పునీత క్షేత్రావళియే అణచేను అరిష్టాల్నీ! బంగారు తెలంగాణా బాపేను మన కష్టాల్నీ! అచిరకాలమందే యిక తీర్చేను అభీష్టాల్నీ!

71

మంగళం ; మహిమాన్వితమౌ క్షేత్రాలు, (నర్తక బృందం) మంగళకరమౌ క్షేత్రాలు! తెలంగాణా క్షేత్రాలు, మోక్షవితరణా క్షేత్రాలు, లక్ష్య సాధనా సూత్రాలు! మంగళం! జయ మంగళం! మంగళం! శుభ మంగళం! తెలంగాణమీక తేజరిల్లగా భక్తకోటి భజమంగళం! | మంగళం॥ (ప్రమోద్‌రెడ్డి తన నాట్య బృందంతో పలుమార్లు అనేకచోట్ల ప్రదర్శించిన రూపకం) కః 72

పుష్పవిలాసం! (సంగీత, నృత్యరూపకం) (కమనీయ సూర్యోదయ దృశ్యంతో రమణీయ ఉద్యానవనం అందంగా వెనుక తెరపై అగుపిస్తుంటే, ఒక అందాల నర్తకి ప్రవేశిస్తుంది. ఆ దృశ్యాన్ని గాంచి పరవశిస్తుంది. తకథిమి (జతుల) నాట్యంతో పాడుతూ అభినయిస్తుంది - నర్తకి ; రాగ రంజిత ఉషోదయం రమ్య పులకింత రసోదయం! కర్మసాక్షిని కనులగాంచిన జగతికంతా నవోదయం! రాగ! ప్రకృతినంతా తట్టిలేపే ప్రగతికంతా దారిచూపే దివ్య దినకర శుభోదయం నింగి -నేలకు ప్రభోదయం రాగ విమలమైనా ప్రేమతోడ విరిసి మురిసే కమలకాంత! జాలువారే వెలుగులోన జలక మాడే జగతియంత! రాగ అరుణ కిరణా సముదాయం అవనికే హారాలు వేసే! గగన రాణీ కౌగిలింతల మేఘమే రాగాలు తీసే! రాగ ఈ శోభలనే చూడగా పలు సొగసులతో పాడగా 73

నా హృదయం పులకించెను! నవ నాట్యం చేయించెను (రాగ! (అంటూ పూలతోటలో విహరిస్తూ, పరిమళించే పూలను పలకరిస్తుందిలా-) నర్తకి (పద్మంతో) : ఓహోహో పద్మమా! ఒయ్యారి పద్మమా! ఇనకిరణం సోకగనే విరిసే శత పత్రమా! 181 పంకములో పుట్టిననూ పరిమళాల వెదజల్లుతు తళుకులతో కులుకుతున్న తామర మరి కుశలమా? 1 ఓ (పద్మం పక్కనున్న బాలిక పైకి లేచి) పద్మం : దినకరుడే నన్ను వలచి దివ్యంగా ప్రకాశించ పంకములో పుట్టిననూ బింకముగా పైకి పూచి అందరు దేవుళ్లకు యిల ఆసనమై వెలుగొందగ నేను సదా కుశలమే! నా మనసూ విమలమే! (అనగానే నర్తకి తలవూపుతూ వెళ్లి పక్కనున్న గులాబిని పలకరిస్తుంది) 74

(తాళం మార్పుతో) నర్తకి : ముచ్చట గొలిపే... ముద్దు గులాబీ రూపంలో రంగులీను ఓ “రూబీ” సుకుమారపు రేకులున్న పూబాలా! సూదిలాంటి ముల్లు ఏల? నీ మైోలా! ॥ము॥ గులాబి : (సమాధానంగా) పూలన్నిటికీ నేను రాణిననీ బంటువోలె ముల్లు అంటి వుండులే! వివిధ ఉత్సవాలలో అందంగా మధుర పరిమళాల మసలుచుందులే! (నర్తకి ఆ తర్వాత తల ఆడిస్తూ వెళ్లి ఇటువైపున గల మందారాన్ని సమీపించి, ప్రశ్చిస్తుందిలా - ) (తాళం మార్చుతో) నర్తకి : ఎగ్రని రక్తపు రంగున ఎదిగే మందారమా! ఒళ్లు విరుచుకున్నట్లుగ విరిసే విరి కేసరమా! ఎందుకలా! అందరిలో ఎగిరెగిరీ పడుతున్నవు? మందారం : (బాలికగా పైకి లేచి) కనకదుర్గ మెడలోనా కాంతు లీను తుంటాను! వీరుల మెడలందున నే విజయహార మవుతాను! 75

సుమధుర మకరందాలతా (భ్రమరాల వరిస్తాను! 1॥1కనక॥ (అనగానే అర్ధమైనట్లుగా తలవూపి, (ప్రక్కనున్న మళ్లెల్ని పలకరిస్తుంది ఆ నర్తకి) నర్తకి. : కెల్ల తెల్లనీ మల్లీ! తెలుగు సిరుల వల్లి! రంగు హంగు లేకున్నా పొంగు పాలవెల్లీ! నీ ప్రత్యేకత కూడ తెలుపవె ఓ చెల్లీ! తెల్ల (సమాధానంగా బాలికగా పైకిలేచి తాళం మార్పుతో) మల్లి : శ్రీగలపై విరబూచే తీగమల్లినీ! నాగుల నాకర్షించే నాగమల్లినీ! వలపులు పండించే - శోభనమలరించే 'ప్రీల సిగల మురిసే సిరిమల్లినీ! మండుటెండలో సైతం మెండుగా వికసించే విరుల బొండు మల్లినీ! ఆ.... ఆ.... ఆ.... 18 నర్తకి : (ళుతి కలుపుతూ) ఆ....ఆ....ఆ... (అంటూ పూబంతి - చేమంతితో) పులకించే పూబంతీ! వికసించే చేమంతీ! మనసారా సాగించరె నాతో మాటా-మంతీ! ॥పుల॥ 76

(అనగానే పూబంతి - చేమంతి బాలికలు సమీపించి, ఎలుగెత్తుతారిలా) పూబంతి & చేమంతి : (నర్తిస్తూ) పండుగలకు - పబ్బాలకు వేలాడగ గుమ్మాలకు వేడుక కలిగించేము! మిమ్ముల మురిపించేము! దసరా - దీపావళికి దుర్గ - లక్ష్మి హారాలుగ సంక్రాంతి విహారాలుగ సదా వెలిగి పోయేము! ॥1పందు॥ (నర్తకి సుందరి వారితో కలిసి జతులతో నర్తిస్తూ వెళ్లి తంగేడు

  • గునక పూలను ప్రశ్నిస్తుందిలా -) నర్తకి. :; పసుపు వన్నెకలిగివున్న ముచ్చటగా ముడుచుకున్న మీ పేరేమిటి చెప్పు? ప్రత్యేకతనూ విప్పు! పసుపు! (అని ప్రశ్నించగానే తంగేడు, గునక - గుమ్మడి పూలతో కలిసి ఉమ్మడిగా కదలివస్తుంది. జానపదంగా స్వరమెత్తి నర్తిస్తుంది) తంగేడు పువ్వు తోటలు అక్కరలేని పేటలు అక్కరలేని పల్లెల్లా - చెలకల్లా పసిడివన్నె తళుకుల్లా పూచే తంగెడు పువ్వును! మురిపాలా విరిమువ్వను! తోట! 77

గునక పువ్వు : బంగారపు తంగేడుకు బౌసటగానూ నిలిచే రంగు రంగు బతుకమ్మల సింగారంగా తీర్చే గుడ్డములో విరబూచే గునక పువ్వునే నేను!

గుమ్మడి : (సమీపిస్తూ) తంగేడు - గునకపూల రంగారు బతుకమ్మల తలల మీద “గౌరమ్మ”గ తలచే గుమ్మడి పువ్వును! బంగారు బతుకమ్మల సింగారాలా నవ్వును! (అంటూ తంగేడు - గునక పూబాలికలతో ఆత్మీయంగా చేతులు కలిపి, వలయాకారంగా నర్తిస్తూ - )

తంగేడు - గునక - గుమ్మడి ముగ్గురు కలిసి : (ఏకంగా) తెలంగాణ ప్రీలచేత తేలాడే బతుకమ్మకు ప్రధానంగ ముగ్గురమూ ప్రదానమై నిలుస్తము! ఉద్యమాలలో గూడా ఊపిరియై గెలుస్తము! తెలంగాణ (ప్రీలందరి తేజమ్మై కలుస్తము! అడ్డదారి దొక్కేటి అవినీతుల నిలదీస్తము!

78

దసరా నవదుర్గల్లా విజయాలను కలిగిస్తము! తొమ్మది రోజులు స్త్రీలను ఉమ్మడిగా ఆడిస్తము! నీటి అలల తేలాడుతు ముచ్చటగా మురిపిస్తము! మునిగి పోయినా కదకు ముక్తినే ప్రసాదిస్తము! పూలన్నింట్లో అందుకె మేమే మరి మేటిమేటి! మేమెవరికి కాము పోటి, మాకెవ్వరు రారు సాటి! ఊరికేమొ 'గౌరమ్మే' పూలకేమొ 'బతుకమ్మే' ఉన్నతమైనవి కదా? తెలిసిందా మా కథా? నర్తకి. : (తల ఆడిస్తూ) తెలిసెను మీ ప్రత్యేకత, తెలిసెను మీ విరుల కథ! తెలంగాణనూ సైతము తెచ్చినట్టి మీ చరిత ॥తెలి॥ అందుకే మీ కిదిగో అందిస్తా నా జోత! (అంటూ నమస్కరిస్తూ - నర్తిస్తూ నిష్కమిస్తుంది) వు 79

తరతరాల తెలంగాణ (సంగీత, నృత్య రూపకం) నేపథ్య వ్యాఖ్యానం : మహాభారత కాలం నాటికే ఆంధ్ర శబ్ద ప్రస్తావనతో తెలుగుజాతి ఉనికి ఉన్నట్లు స్పష్టమవుతున్నాా చారిత్రకంగా 'తెలంగాణు తేజంగా వర్ధిల్లినట్లు (ప్రస్ఫుటమవుతున్నది! గౌతమీపుత్ర శాతకర్ణి మొదలగు శాతవాహనుల కాలం నుంచే క్రీ.పూ. 2వ శతాబ్ది మొదలిడి క్రీ.శ.2వ శతాబ్ది వరకు శాతవాహన సామ్రాజ్యం సతత హరితంలా శాఖోపశాఖలుగా విస్తరిల్లింది! కరీంనగర్‌ "కోటి లింగాల” రాజధానిగా, అటు గోదావరి అవతల 'నాసిక్‌' వరకు, ఇటు ధాన్యకటకం అమరావతి దాక అజేయంగా విరాజిల్లింది! కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆశీస్సులతో అఖండంగా అలరారింది!... (తెర తీయగానే పూలదోసిళ్లతో నర్తకులు ప్రవేశిస్తారు) నర్తకులు : _ అదిగో... అదిగదిగో... (తెరపై ఆయా అరివీరుల అణగార్చిన చిత్రాలు ప్రధమంగా “తెలంగాణ” అగుపిస్తుంటాయి) (ప్రాంతం పరిపాలించిన శాతవాహనులు ఏలిన “కోటి లింగాల” అదిగో! తెలంగాణ (ప్రజల తీరు తేటతెల్ల మొనరిస్తూ పైశాచీ భాషలోన 'ప్రౌాఢంగా గుణాధ్యుడు విరచించిన “బృహత్మథ”ను విధిగ “గాధసప్తశతొగ 80

ప్రాకృతమున అనువదించి (గ్రంధస్థం గావించి ప్రఖ్యాతిని గడియించిన ప్రముఖవర్తి - చక్రవర్తి హాలుడు అదిగదిగో! ॥అది॥ న. (తెరపై ఆయా రాజన్న సన్నిధిలో

చిత్రాలు రాజ్యం కొనసాగించిన

అరికేసరి పాలనలో అగుపిస్తుంటాయి) చా ఆదికవులుగా నిలిచిన పంపడు - జినవల్లభుడు ప్రసిద్ధుడగు భీమకవి వెలుగొందుచు జీవించిన “చేములవాడ”దిగో! తొమ్మిదవ శతాబ్దిలోనె తొంగి చూసినా తెలుగు పదియవ శతాబ్దిలోనె పదిలమైన మన తెలుగు కంద పద్య శాసనాల “జొమ్మలమ్మగుట్టోదిగో!... న మెతుకు సీమలో పుట్టి ఉజ్జయినిలొ అడుగుపెట్టి కవికులగురు - కాళిదాసు కావ్యాలకు దివ్యభాష్య జు మల్లి ఖ్యాతిగాంచినట్టి మల్లినాథసూరతడే!.. 81

వ్యాఖ్యానం : శాతవాహనుల తదనంతరం చెల్లాచెదరైన తెలుగునేల కాకలుదీరిన కాకతీయ ప్రభువులచే ఏకమై, “ఏకశిలానగరరి అనగా ఓరుగల్లు రాజధానిగా పటిష్టమై - సమర్ధవంతమైన పరిపాలనతో పరిపుష్టమై ఇటు కాలేశ్చరం - అటు దాక్షారామం

  • శ్రీశైలం వరకు త్రిలింగక్షేతంగా అఖండ తెలుంగు రాజ్యంగా వ్యాపించి వర్ధిల్లింది! నర్తకులు : భద్రకాళి దీవెనతో రుద్రఖద్గ చాలనతో తెలుగు ప్రాంత మంతటినీ తెలుగు ప్రజలనందరినీ ఏకం గావించినట్టి లోక ఖ్యాతి బడసినట్టి కాకలు దీరిన వీర- కాకతీయులదిగో! గణపతి - రుద్రమదేవిల ఘనతలు అవిగవిగో! (అనగానే కాకతీయ గణపతిదేవుడు కూతురైన రుద్రమదేవితో సభలోకి ప్రవేశిస్తుంటే కైవారం -) వందిమాగధులు : బహుపరాక్‌! బహుపరాక్‌! అరివీర మార్తాండ, గండరగండ, అఖండ కాకతీయ ప్రచండ! శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులు, అవక్రపరాక్రమ శ్రేణి - రుద్రాణి - మహారాణి శ్రీశ్రీశ్రీ రుద్రమదేవి గార్లతో వేం చేస్తున్నా రహో!... జాను తెనుగు జానపదం జాలువారు ద్విపద కావ్య ప్రథమ కవిగ రాణించిన పాల్కురికి అదిగో! యఖ జ 82

(స్పాట్‌లైటొలో వాణియె తన రాణి యనుచు ఆయా వైభవముగ రచియించిన పాత్రలు) 'ల్లలమద్రిగ నిలిచిన పిన-వీర భద్రుడదిగో! ఖు ల మందార మకరంద మాధుర్య పద్యాల “*వ్పుహాభాగవత” రచన మహాద్భుత మొనరించిన భక్తకవిగ రాణించిన “బమ్మెర పోతన్నదిగో!... జయ జ ముచ్చటైన తెలంగాణ ముస్లిములకు వశమైనా అంగళ్లను ముత్యాలను అమ్మజేసినట్టి నెలవు “గోలకొండ” గొప్ప ప్రభువు మళల్మిభరాం! అతడదే!... మన ఇబ్రహీం! అతడదే!.... గ. పొందికగా అచ్చ తెలుగు ఆదికావ్య రచన చేసి వెలుగొందిన “పొన్నికంటి- తెలగనార్యు” డతడే! అతదే!... ఖలు మ 83

తెగువగ మూసీని కడచి తెలుగు భాగమతిని వలచి “చార్మినారు” కట్టడాన్ని చతురంగా నిర్మించి, అద్భుతంగ “గజళ్లానే అనేకంగ రచియించి అలరారిన “కులీకుతుబ్‌” హైదరాబాదిదిగో!... ఇదిగో!... జలు ల సీతారాముల కోసం సింగారంగా కోవెల గోదావరి తీరంలో గొప్పగాను నిర్మించి కీర్తనలను రచియించి కీర్తిగాంచినట్టి భక్త - రామదాసు అతడే! అతడే!... అట్టి రామదాసునే పట్టి “గోలకొండ” చెరలొ పెట్టి విధిగ దండించగ తానీషా ప్రభువు కడకు తప్పనిసరి తరలివచ్చి పరమాత్ముడు శ్రీరాముడె పైకము చెల్లించి నట్టి (గోలకొండ) ప్రాంతము యిదిగిదిగో! యల 2 84

ముచ్చటైన “సాలార్‌జంగ్‌ - మ్యూజియం”తో పాటు కడపటి నవాబు, నిజాం కట్టించిన గండిపేట, “ఫలక్‌నుమా”, “చౌమహల్లా”- “వ్యాలెస్‌లివిగివిగో! “ఉస్మానియా విశ్వ - విద్యాలయాలు అవిగో!... కాని దుష్ట రాజకీయ రజాకార్ల రాక్షసత్వ నిజాం నిరంకుశత్వ పాలనయే వ్యాపించే! ప్రజలందున విప్లవాల ప్రతిఘటనలు ప్రజ్బలించె!... (అంటూ నర్తకులు నిషమిస్తారు) వ్యాఖ్యానం : అలా ప్రతిఘటించిన వారిలో ఆదిలాబాద్‌ అడవి బిడ్డ, కొదమసింగంలా ఎదురొడ్డిన పులిబిడ్డ - కొమరం భీమ్‌ ఒకడు! జల్‌ - జంగల్‌ - జమీన్‌ తమదేనంటూ తన గిరిజన జాతిని చైతన్యపరిచి, జబ్బచరిచి, నిజాం నిరంకుశత్వ ధోరణిపై తిరగబడ్దాడు. (కొమరంభీమ్‌ ప్రవేశిస్తూ) కొమరంభీమ్‌ : ఎవడురా? వాడెవడురా? ఏనాడూ ఎరుగనట్టి శిస్తు - గిస్తు కట్టాలని శిక్షలనుభవించాలని శాసించే నిజామెవడురా? కప్పమాశించే నవాబెవడురా? ॥ఎవ॥ 85

అడవితల్లి బిడ్డలము పుడమి మట్టి బెడ్డ్దలము అయినా మాకే చెట్లకు పండించిన పంటలకు హక్షు - గిక్కు లేదంటూ హుకుం - గికుంనే తెచ్చే పోలీస్‌ జులుముతొ వచ్చే “'మాలీపటేలెవడురా?... ॥ఎవ॥ వ్యాఖ్యానం : అలా కొమురం భీమ్‌ గర్జించి ఎదిరించినా - కుర్దూ పటేల్‌ చేసిన ద్రోహం వల్ల నిజాం పోలీసుల తూటాలకు బలి అయ్యాడు. కాని అదే బాటలో మరికొన్ని ఉద్యమాలు ఊపందుకొన్నాయి. అటు చాకలి ఐలమ్మ - ఇటు దొడ్డి కొమురయ్యల ప్రతిఘటనలతో ్రజ్వరిల్లాయి! (ఎడమవైపు “స్పాట్‌ లైటొలో) ఐలమ్మ : చావో బతుకో తేల్చుకుంటా! చాకలి ఐలమ్మగ ఎదిరిస్తా! రజాకార్లతో కుమ్మక్కయి జాగిర్జార్లు కొనసాగించే దోపిడి దొరల పెత్తనాల్ని పంటను దోచే ప్రభుత్వాల్ని నడుం బిగించి అడ్డగిస్తా! నా “తడాఖా చూపిస్తా! దొడ్డి కొమురయ్య: (కుడివైపు 'స్పాట్‌లైటొలో) దున్నేవాడిదె భూమిరా! రైతన్నదే సేద్యమ్మురా!... కాదన్నవాడు ఎవడన్నా 86

కన్నెర్ర జేసి పదరన్నా! చిర్రెత్తి చిందులేయన్నా దున్నే! (బృందంతో కలిసి): కర్రెత్తి పోరు చేయనా! దేశ ద్రోహం కొడిగట్టే దేశ్‌ ముఖుల్లారా! దుద్డుకర్రతో ఎదిరించే దొడ్డి కొమురయ్య నేనేరా! (అంటూ ఆవేశంగా ముందుకు సాగుతాడు. కాని చివరలో తుపాకి తూటాతో నేల కొరుగుతాడు) వ్యాఖ్యానం: ఆ విధంగా ఐలమ్మ- కొమురయ్యలు కమ్యూనిష్టుల అండదండలతో దేశ్‌ముఖ్‌లు - జాగిర్జార్లను - రజాకార్లను ఎదిరించి పోరాడినా, రజాకార్లు స్త్రీల మానభంగాలకు - దోపిడీలకు, రాక్షస కృత్యాలకు రంగస్థలమై నిలిచారు. ఫలితంగా సాయుధ నైతాంగ పోరాటాలకు పరోక్షంగా తెర తీశారు. ఆ బాటలోనే సుద్దాల హన్మంతు - కాళోజి పదునైన పాటల్ని మాటల్ని ఈటెలుగా సంధించారు. నిజాం నిరంకుశత్వ ధోరణుల్ని వట్టికోట ఆళ్వార్లు - దాశరధి పద్యాల్ని తమ తల్వార్గుగా రుళిపించారు. నలితంగా జైలు జీవిత మనుభవించారు. నిజామాబాదు జైలు గోడలపై కూడ బొగ్గుతో ఉద్యమ పద్యాల్ని రచించారు - (స్పాట్‌లైటొలో పద్యం : ఓ నిజాము పిశాచమా! కానరాడు దాశరధి, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని వట్టికోట ఆళ్వార్లు నా తెలంగాణ కోటి రత్నాలవీణ!' అగుపిస్తారు) తీగలను తెంపి అగ్నిలో దింపినావు... 87

వ్యాఖ్యానం : ఆవిధంగా కవులు కలాలతో, కళాకారులు గళాలతో కర్షక కార్మికులు పలుగు పారలతో ఎదిరించగా, రెచ్చిపోయిన నిజాం పోలీసులు - రజాకార్లు దారుణ మారణ హోమాల్ని సృృష్టిస్తుంటే, తెలంగాణ చిత్రహింసలకు గురియవుతుంటే భారత స్వాతంత్ర్యం సాధించిన ఇండియన్‌ యూనియన్‌ నైజాం సంస్థానాన్ని విలీనం చేయడానికి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పోలీసు చర్య చేపట్టాడు. విధి లేక 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన నిజాం లొంగి పోయాడు. తెలంగాణకు విముక్తి ప్రకటించాడు. శతాబ్దాల తరబడి చిత్రహింసలకు గురియైన తెలంగాణ స్వేచ్చావాయువుల్ని పీల్చుకోగా, (ప్రజలు పరమానందంగా తెలంగాణ తల్లిని కీర్తించారు. నర్తకులు : _ నా తెలంగాణా శిరసా నమామీ! (ప్రవేశిస్తూ) జై తెలంగాణా మనసా స్మరామీ! వర్ధిల్లు వర్ధిల్లు నవ తెలంగాణా భాసిల్లు 'బాసరి భారతీ వీణా 1నా॥ గోదావరీ తీర క్షేత కాళేశ్వరం కోడెలకు వరమిచ్చు రాజరాజేశ్వరం యాదగిరిగా కాచు లక్ష్మి నరసింహం భద్రాద్రిగా బోచు కోదండరామం అందాల నానేల ఆనవాలైనట్టి గద్వాల్‌, పోచంపల్లి పట్టుచీరను నట్టి 1నా॥ (నర్తకులు క్రమక్రమంగా నిష్మమిస్తారు) క్‌ 88

బంగారు తెలంగాణ (సంగీత, నృత్యరూపకం)

వ్యాఖ్యానం : 1971 నుండి 2001 వరకు (ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యారంగాల్లో నీటి పారుదల ప్రాజెక్టులలో తెలంగాణకే అన్ని విధాలా అన్యాయం జరుగుతుంటే, అట్టి అన్యాయాల్ని అరికట్టే తగిన నాయకునికై తెలంగాణ నిరీక్షిస్తున్న సమయంలో మధ్యాహ్న మార్తాందునిలా చండద్రనిప్పులు కురిపిస్తూ మన మధ్య నిలిచారు, థ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారు! చావో - రేవో తేల్చుకుందామని, ప్రగాఢ సంకల్పంతో “తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. వెన్ను చూపని యోధునిలా, గన్ను పట్టిన సైనికునిలా ముందుకు నడిచారు. నమ్ముకున్న ప్రజానీకాన్ని పట్టుదలతో మునుముందుకు నడిపించారు. ఆమరణ నిరాహారదీక్షతో కేంద్ర ప్రభుత్వాన్ని హడలెత్తించారు. రాత్రికి రాత్రి ప్రత్యేక తెలంగాణకై ప్రభుత్వ ప్రకటన వెలువడేలా చేశారు.

వ్యాఖ్యానం : కాని సీమాంధ్రనేతల కుటిల కుతంత్రం రాష్ట్రాన్ని యథాతధంగా వుంచాలన్న ఒత్తిడి తెచ్చి, కేంద్రం 'యూటర్న్‌ తీసుకోవాలని

  • చిదంబరం ప్రకటన అమలు కారాదని పట్టు బట్టి, కృత్రిమ ఉద్యమాల్ని చేపట్టి అడ్డు తగిలింది - శ్రీకృష్ణ కమిటీని వేయించింది. శ్రీకృష్ణ కమిటీ అన్ని జిల్లాల్లో హాయిగా పర్యటించి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు పనికిమాలిన రిపోర్టునే సమర్పించింది. దాంతో సహాయ నిరాకరణగా 10.08.2011 నాడు “మిలియన్‌ మార్చ్‌” రూపు దాల్చింది. ఉస్మానియా క్యాంపస్‌ చుట్టూ పోలీసులు ముళ్ల కంచెను పెట్టి, విద్యార్ధి సంఘాల్ని అడ్డగించేలా నాటి ముఖ్యమంత్రి కిరణ్‌

89

కుమార్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా, పొడుస్తున్న పొద్దు నెవ్వరూ ఆపలేరంటూ గద్దర్‌ తోడై -

“పొడుస్తున్న పొద్దు మీద

నడుస్తున్న కాలమా - నా తెలంగాణమా!” అంటూ గజ్జెకట్టి మారుమైోగాడు.

వ్యాఖ్యానం 2: అలా “మిలియన్‌ మార్చ్‌” మిన్నంటే నినాదాలతో “ట్యాంక్‌బండ్‌

దద్దరిల్లగాా, విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది! తడబడు కేంద్రం గడగడ లాడగా, “కెర్‌ ఏక్‌ దక్కా

  • తెలంగాణ పక్కా” అంటూ కరీంనగర్‌లో 12. 09.2011 కే.సీ.ఆర్‌ కేసరిలా గర్జించారు. దాంతో పొలిటికల్‌ జే.ఏ.సి మరునాటి నుంచే సకల జనుల సమ్మె కొనసాగించింది.

సమ్మె - సమ్మె - సమ్మెరా!

సకల జనుల సమ్మెరా!

ప్రచండంగ సమ్మె కదలి

(ప్రభుత్వాన్ని కుమ్మెరా! స

రోడ్డెక్కిన వంటలతో

రొప్పుతున్న బతుకులతో

బతుకంతా బాగుపడగ

అతివల బతుకమ్మలతో

ఉద్యోగులు - విద్యార్థులు

ఉప్పెనలా సాగెరా! స

వ్యాఖ్యానం : ఆవిధంగా 42 రోజులపాటు సుదీర్హంగా సమ్మె కానసాగగా

30.9.2012వ తేదీన కే.సీ. ఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై “డెడ్‌లైన్‌గా పెట్టి, లక్షలాది జనంతో సాగరపహారం నిర్వహించారు. 28.12.2012 నాడు కేంద్రంలో అన్ని పార్టీలతో సంచలన సమావేశం ఏర్పాటు చేశారు.

“కేసీఆర్‌ నిశ్రిత్ర వాగ్గాటికీ

కేలు మోడ్చె కడకు సోనియా!

90

ఫలితంగా కేంద్రం దిగివచ్చెను! ఎలెక్షన్లు విధిగా ప్రకటించెను! ఎలెక్షన్లలో కేసీఆర్‌ సలక్షణంగా చుట్టూ తిరిగి కేశవరావ్‌ - నరసింహారెడ్డి కేటీఆర్‌ - హరీశ్‌రావు ఈటెల మాటల తూటాలతో “ఆర్రాసినే గెలిపించెనహో! స్వరాష్ట్రమే సాధించెనహో! అరవై ఏళ్ల అందరి కలలను నిజం చేసి చూపించెనహో! తెలంగాణా రాష్ట్రమునే బలంగా స్థాపించె నహో! బంగారు తెలంగాణ కూ బాటల్నే వేయించె నహో! చాతుర్యంతో రకరకాలా పథకాలే సాధించెనహో! వ్యాఖ్యానం 1: అలా పట్టు వదలని విక్రమార్శునిలా - పట్టపగటి అర్భునిలా నిలిచి, తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి అనితర సాధ్యంగా - అనేక సంక్షేమ పథకాల్ని నెలకొలువుతూ “బంగారు తెలంగాణొగా తీర్చిదిద్దుతున్నారు మాన్య ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారు - కల్యాణలక్ష్మి : (స్పాట్‌లైటొలో) మల్లన్న _ : అరే ఈరన్నా! గట్ల చిన్నవోయి కూర్చున్నవేందిర? ఈరన్న _ : ఏం చెయ్యను మల్లన్నా? పెద్దబిడ్డ పెండ్లి గిట్ట చేత్తామంటె పైనలు లెవ్వాయె! ఏం జెయ్యాలో ఎట్ల చెయ్యాలో తెలుస్తలేదాయె! ర్ర1

మల్లన్న : గట్లనా? అరె ఏం ఫికర్‌ జెయ్యకు! మన ముఖ్యమంత్రి కే.సీ.ఆరన్న మన అసొంటి గరీబు బి.సి.ల బిడ్డల పెళ్లికి “కల్యాణలక్ష్మి పథకం పేరుతో 75,000/- రూ! యిస్తున్నరు! ఈరన్న _ : ఆం ఎంత మంచి మాట చెప్పినవు మల్లన్నా! అయితె రందిలేక యిక నా బిడ్డ పెళ్లి జెల్లి జేస్త! (అంటూ వెళ్లిపోతాడు) ఖలు 2 (మరోవైపు పెళ్లిలో అక్షింతలు వేస్తూ ఈరన్న మిత్రుడు మస్తాన్‌ ఆశ్చర్యపోతాడు.) మస్తాన్‌ _ : అరె ఈరన్నా! గింతజెల్టి గీ “బేటీ షాది” ఎట్ల జేస్తున్నవు? ఈరన్న _ : గీ మల్లన్న చెప్పినట్లు ముఖ్యమంధ్రన్న పెట్టిన పధకం కింద 75,000/- రూ॥ వచ్చినయి కాబట్టి చేస్తున్న! మస్తాన్‌ : అచ్చా! యే సచ్‌హై మల్లన్నా? మల్లన్న _: సచ్‌ హై మస్తాన్‌ భాయ్‌! మా అసొంటి బి.సి.లకే కాదు మీ ముస్లిం మైనారిటీలకు గూడ 75,000/- రూ॥ “షాదీముబారక్‌” పేరుతో యిస్తున్నరు! మస్తాన్‌ _ : బాప్‌రే బాప్‌! పచ్‌ హత్తర్‌ హజార్‌ రూప్వ్యే?... అయితే యిగ పరేషాన్‌ మానేసి, మా బేటీ “చాందినీ” షాదీ గూడ 'సయ్యద్‌ మియ్యాతో షాన్‌దార్‌గా జరిపిస్త! (నేపథ్యంలో) పాట: కమనీయం! కమనీయం “కల్యాణలక్ష్మి” కమనీయం! 'షాన్‌దార్‌” రమణీయం “షాదీముబారక్‌ సాయం! 92

హరితహారం : (మరోవైపు 'స్పాట్‌లైటొలో) రంగ ; ఎల్లన్నా! ఏం జేత్తున్నవు? చెట్లు నాటితే ఆరోగ్యం, ఆదాయం పెరుగుతది! ఆదాయాలు పెరిగితె అభివృద్ధి జరుగుతది! గందుకే మన ముఖ్యమంత్రి ఇంటింటికో చెట్టు పెట్టాలన్నడు. నాటుదాం పాండ్రి! ఎల్లన్న : ఆం రంగన్నా! గప్పట్ల అశోకుడు బాట బాటకు చెట్లు నాటించిండట! గిప్పుడు మన కేసీఆరన్న ఇంకో అడుగు ముందుకేసి ఇంటింటికి నాటించుమంటండు. పాండ్రి పొండ్రి!... (అంటూ తనతోటి వాళ్లను కూడ పురమాయిస్తడు) పాట :; హరితహారం! హరితహారం! (నర్తకబ్బందం) ఆకుపచ్చని ప్రగతి సారం! హరితహారం! హరితహారం! తెలంగాణ చరితహారం! ॥హారిత॥ బాటల కిరువైపులనే కాదు ఇంటింటికో చెట్టుంచాలి! మండుటెండలో నీడలనివ్వగ మంచిగ మొక్కలు నాటించాలి! పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు! ప్రతి పౌరుడు యిక గుర్తించాలి! హరిత! న. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు : (మరోవైపు 'స్పాట్‌లైటొలో) రాజన్న _ : ఏంది కొామురన్నా? గట్ల దినంగ కూసున్నవు? కొమురన్న : ఏం జెప్పాలె రాజన్న? రోడ్లకు రెండు దిక్కుల మొక్కల్ని నాటినం! కాని ఇంటింటి కోచెట్టు పెంచాల్నట! ఏడపెంచాలె? ఇల్లే దిక్కులేదాయె! 93

రాజన్న _ : గందుకు రంది పడుతున్నావు? నీకు దెల్వదేమో? మనసోంటోల్ల కోసమె కే.సీ.ఆర్‌ అన్న డబల్‌బెడ్‌ రూమ్‌లు కట్టించి యిస్తున్నరు! కొమురన్న : నిజంగనా? నమ్ముమంటవా? రాజన్న _ : ఎర్రవల్లి - నర్సన్నపేట కాడ 600 యిండ్లు కట్టించి యిచ్చుడే గాక సామూహిక గృహాప్రవేశాల్ని కూడ చేయించిండు మన ముఖ్యమంత్రి! గట్లనే మనకు కూడ యిస్తరు! కొమురన్న : (సంతోషంగా) ఆం! ఎంత మంచి మాట జెప్పినవు! పాట: ఎన్నాళ్లకెన్నాళ్లకూ ఓ మంచి మాట యింటి! డబల్‌ - డబల్‌ - డబల్‌ డబల్‌ డబల్‌ బెడ్‌రూమ్‌ యిండ్లు! నిజంగా తొలగిపోవు నిరుపేదల కడగండ్లు! (అంటూ గొంతెత్తి పాడుతాడు. ఆనందంగా చిందులేస్తాడు) న. ఆసరా పింఛన్లు : (ఎడమవైపు 'స్పాట్‌ లైటొలో) రామన్న : పనికిపోలేదా పాపన్నా? అరుగుమీద హాయిగ కూసున్నవు! పాపన్న : అదిగాదు రామన్నా! రెక్కలు ముక్కలయ్యేట్లు చేసి చేసి అలసిపోయిన! అరవైదాటిన! ఇంకేం జెయ్యాలె? రామన్న _ : మరిపొట్ట ఎట్ల గడుస్తది? పాపన్న _ : గవన్ని గట్టిగ ఆలోచన జేసి మన ముఖ్యమంత్రన్న నా అసోంటి ముసలోళ్లకు ఆసరాగ పింఛన్లు నెలనెలా 1500/- రూ॥ యిస్తున్నడు! వికలాంగులకు, అంధులకు - వితంతువులకు ర్రి4

ఇంక ఎక్కువే యిస్తున్నడు. రేషన్‌ బియ్యం రానే వస్తున్నయి! ఇగ హాయిగుండనా మరి? రామన్న : అయితే నాకు గూడ 'ఆసరా ఫించన్‌' అందుతదన్న మాటే! కేసీఆర్‌ అన్న చల్లంగుండాలీ! మనం గిట్ల వెచ్చంగుండాలి! న. మిషన్‌ కాకతీయ : (కుడివైపు 'స్పాట్‌లైటొలో) సూపర్‌వైజర్‌: అరే రంగా! లింగా! వానలు గిట్టపడక ముందే, చెరువులకు పూడిక తియ్యిండ్రి! మంచిగ తవ్వండ్రి! రంగ ; చెరువుల నిండ నీళ్లు నిలిచేట్లు కట్టలు గూడ మంచిగ కడుతున్నమయ్య! లింగ : చెరువుల నిండ నీళ్లుంటె, బాయిలకు - బోరింగులకు బాగ నీళ్లస్తయి! పంటలు పండుతయి! సూపర్‌. : గందుకే మన ముఖ్యమంత్రి “మిషన్‌ కాకతీయ”పేరుతో కాకతీయులు తవ్వించిన చెరువుల్ని - ఊరూరున్న కుంటల్ని పూడికలు తీయించి బాగు జేయిస్తున్నడు! పాట : మిషన్‌ కాకతీయా! (నర్తక బృందం) మిషన్‌ కాకతీయా! నీటి కొరత త్నర్చే మేటి కాకతీయా! జలకళతో చెరువుల్ని మిలమిల లాడించేటి ఊరూరును చెరువులతో ఉద్ధరించగలిగేటి ॥మి॥ 95

మిషన్‌ భగీరథ : (ఎడమవైపు 'స్పాట్‌లైటొలో) అంజన్న _ : అరే ఈరిగా! యిన్నావుర? మన కేసీఆరన్న తెలంగాణకు ఎన్నడులేని “జలకళ” తెస్తున్నడు! ఈరిగాడు : గా సంగతేందో యిగురంగ జెప్పు అంజన్నా అంజన్న : ఆం చెప్తా! యిను! మన కేసీఆరన్న మహారాష్ట్రతో మాట్లాడి, సముద్రం పాలయ్యే గోదావరి - ప్రాణహిత నీళ్లను పెద్ద యెత్తున కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఆనకట్ట కట్టించి, ఎత్తిపోతల పధకంతో ఇటు చేవెళ్లతో పాటు అటు లెక్కలేని నారుమళ్లకు నీళ్లు అందించే పథకం చేపట్టిండు! ఈరిగాడు : గట్లనా! మరి నాడు అటు కేంద్రంల, యిటు రాష్ట్రంల ఒకే పార్టీ (ప్రభుత్వాలున్నా ఇన్నాళ్లు వం జెయ్యకపాయిరి! అంజన్న _ : కేసీఆరన్న మాత్రం భగీరథుని లెక్క పట్టుబట్టి ప్రాజెక్టులు కట్టిస్తున్నడు! గందుకే దీనికి “మిషన్‌ భగీరథ” అని పేరు పెట్టిండ్రు! బంగారు తెలంగాణకు పెద్ద బాట యేసిండ్రు! పాట : మిషన్‌ భగీరథ! మిషన్‌ భగీరధ (నర్తక బృందం) మరో మహత్తర భగీరథం! అపర భగీరథుడై కేసీఆర్‌ తీర్చేను మన మనోరథం! వ్యాఖ్యానం : అనేక పథకాలతో - 33 జిల్లాలతో మన తెలంగాణ యిక బంగారు తెలంగాణ అయితది... బంగారు తెలంగాణ భవితవ్యపు గానమా! ముప్పయి మూడు జిల్లాల గొప్ప తెలంగాణమా! 96

కే.సీ.ఆర్‌ పాలనలో వాసిగాంచు రాష్ట్రమా! వందనం! వందనం! వర్ధిల్లే రాష్ట్రమా! ॥బం॥ అధిక అటవి సంపదల ఆదిలబాద్‌ జిల్లా! బాసర భారతి వెలసిన పావన నిర్మల్‌ జిల్లా! సాగునీటి - తాగునీటి సజల శ్రీరామ్‌సాగర్‌ పంచదారనే పంచే నిజామబాద్‌ జిల్లా! నాటి శాతవాహనుల “కోటి లింగాలొతో వెలుగొందే జిల్లా జగిత్యాల జిల్లా! రాజన్న - చేనేతా రాజిలు సిరిసిల్ల జిల్లా! విద్యుత్తు - బొగ్గుగనులు విలసిళ్లే జిల్లా! విలసిల్లే జిల్లా - పెద్దపల్లి జిల్లా! వేయిస్తంభాల గుడితా వెలుగు వరంగల్‌ జిల్లా! నారసింహుడే వెలసిన యాదాద్రి జిల్లా! రామచంద్రుడే నిలిచిన భద్రాద్రీ జిల్లా!

97

మేలైన జిల్లా మేద్చెల్‌ జిల్లా! రంగారే జిల్లా రంగారెడ్డి జిల్లా! సిద్ధి బుద్ధి కలిగున్న సిద్ధిపేట జిల్లా! తాగునీటి - సాగునీటి “నాగార్జున సాగరొతో నాణ్యమైన జిల్లా, శక్తిపీఠి జోగులాంబ గద్వాలా జిల్లా! కష్ట జీవులా జిల్లా పాలమూరు జిల్లా! చరితార్థపు గోలుకొండ చార్మినారు నెలకొన్నా హైదరాబాద్‌ జిల్లా ఐ.టీ,కే ఖిల్లా! బంగారు! (నత్ఫళాభారతి* నత్యనారాయణ కోరికపై రచించినది) వ్ల 98

యాదాద్రి వైభవం! (సంగీత, నృత్య రూపకం) సూత్రధారులు ;. (నర్తకులు) అతడు : తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందే తేజోమయ క్షేత్రాలు ఎన్నెన్నో ఆమె : తెలంగాణ క్షేత్రాల ఆలయాలు నిజదైవ దర్శనీయ నిలయాలు = జతులు - ॥తెలం॥ అతడు ; గోదావరి తీరంలో 'బాసరా అందరి కందించును పలు బాసలా! ఆమె : ఆపై తీరాననున్న ధర్మపురీ శ్రీలక్ష్మీ నారసింహ పుణ్యపురీ! బృందం : ॥తెలం॥ అతడు : తుంగ - కృష్ణ సంగమతీరంలో తులలేని శక్తి పీఠ “మలంపురం”! ఆమె : ఉప్పొంగే గోదావరి తీరంలో ఉన్నతంగ వెలిగే భద్రాచలం! అతడు : కాకతీయ సామ్రాజ్యపు ఓరుగల్లు కారుణ్య భద్రకాళి ఆనవాళ్లు! బృందం : ॥తెలం॥ ఆమె : రాజన్న కొలువున్న జేములవాడ' రాజిల్లే బోళాశంకరు జాడ! 99

అతడు : నర్సన్న నెలకొన్న యాదగిరి నలుగుతున్న జనులనెల్ల కాచుగిరి! బృందం వ $తెలం!॥! నేపథ్య వ్యాఖ్యాన వచనం : అతడు: ఇట్టి యాదగిరినే పట్టుబట్టి మన ముఖ్యమంత్రి గారైన కేసీ.ఆర్‌ గారు కేలెత్తి మొక్కేలా, మరో తిరుమలలా తీర్చిదిద్దడానికి పూనుకొన్నారు. అనితర సాధ్యంగా అపూర్వ వైభవంగా “యాదా(ద్రి”గా వునరుదృ్యరించారు. తెలంగాణకే మణిమకుటంగా మార్చారు - నర్తకులు : విరాజిల్లు వైభవాల యాదాద్రి తేజరిల్లు తెలంగాణ వేదాద్రి! అర్చనతో దర్శించే భక్తులనూ ఆదుకొనే పురాతన పుణ్యాది! దర్శించినంతనే పాపాలణచి దయతో కాపాడే ధన్యాద్రి!

  • జతులు - ॥వి॥ శ్రీలక్ష్మి నరసింహ స్వామీ! కరుణించు శిరసా నమామీ! యాదాద్రి నరసింహన్వామీ దీవించు మనసా స్మరామీ! బృందం : ॥విరా॥ అనికొలిచే అనేక భక్తుల్నీ అతి శీఘ్రంగా కాచును స్వామీ! 100

దుష్ట గ్రహదోషాలన్నింటినీ దునిమి భక్తులను బోచును స్వామీ! ॥వి॥ ఆడ : ఇంతకూ ఈ నరసింహస్వామి 'యాదగిరిలో ఎప్పుడు ఎలా వెలిశాడో చెప్తారా? మగ : అలాగే! ఆ వృత్తాంతం సాంతం యిక వినుకో! యాదగిరి ప్రాశస్యం తెలుసుకో! (నర్తకులు అభినయిస్తుంటే) ఆడ ; పూర్వకాలమున హిరణ్య కశిపుడు ఉర్వినెల్ల తన దుశ్చేష్టలతో హింసలకే గురిచేయగా మహర్షులను బాధించగా దేవతలంతా మహావిష్ణువును ఆదుకొనగ ప్రార్థించగా తగిన సమయమున తానే (తెరపై తరణోపాయం కనుగొంటానని ఆయా (బ్రహ్మవరముతో విర్రవీగు చిత్రాలు) ఆ కశిపునే కడతేరుస్తానని అభయమిచ్చి దీవించాడు అందుకై నిరీక్షించాడు! హరి శత్రువుగా చెలరేగే ఆ కశిపునికే కొడుకుగా ఆగర్భశ్రీహరి భక్తునిగా ఆవిర్భవించె ప్రహ్లాదుడు! బృందం : హరి! 101

హరినామ స్మరణమ్మే అతనికి పానీయమాయె! హరినామ ధ్యానమ్మే అతనికి ఆహారమాయి! గురుకులమున అందరికీ హరిక్తీర్తనె బోధనాయి! పద్యం : కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రిగాక సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక హరినామ స్మరణమెల్ల అసలే యిక కూడదనుచు అరియగు హరినే తలచిన అతి కఠినముగా శిక్షలు అమలు చేసెద ననుచూ ఆత్మజునికి తెలిపిననూ అతడసలే వినడాయెను హతుడు కాక విసిగించెను! అంత ఆగ్రహాన తండ్రి చెంత నున్న స్తంభమ్మున హరిని చూపుమనుచు 102

హిరణ్య కశిపుడే గదతో స్తంభమ్మును బాదగానె సద్యో రూపమ్ము దాల్చి భక్తుడైన ప్రహ్లాదుని భావనలను నిరూపించ మహో([గ్ర నరసింహునిగా (తెరపై మరుక్షణం హరి నిలిచెను! ఆయా కశిపుని కడుపును చీల్స్పెను! చిత్రాలు) కంటకాన్ని తొలగించెను! పరమభక్త ప్రహ్లాదుని ప్రసన్నముగ దీవించెను! కాని తీవ్రకోపమ్మును కాస్తయినా అణచుకోక రురులు - గిరులు - కాననాలు జడియగాను గర్జిస్తూ పలుదిక్కుల పరుగెత్తెను యాదగిరికి చేరుకానెను! శ్లోకం : ఓం ఉగ్రం వీరం మహావిష్ణుమ్‌ జ్వలంతం సర్వతో ముఖమ్‌! నృసింహం భీషణం భద్రం మృత్యోర్భుత్యుమ్‌, నమామ్యహమ్‌!.... ఉ(గరూపమున సాగే ఆ(గ్రహాన చెలరేగే మహోగ్ర నారసింహుడే మహాతపము చేస్తున్న 10

యాద బుషిని వీక్షించెను ఆదరముగ దీవించెను! అప్పుడు ఆ యాదబిష్ని చప్పున నరహరిని గూర్చి పలు విధాల ప్రార్ధించెను కీడు తొలగ కీర్తించెను! తన మనవిని మన్నించి తక్షణమా యాదగిరిని ఉగ్రరూపమెల్ల వదలి ఉర్విజనులనెల్ల కావ అభయ నారసింహునిగా అచ్చటనే నిలవాలని వేడుకొనగ నరసింహుడు వెలసినాడు యిచ్చోట!... యాదర్ని పేరున గిరి ఆయెను మరి “యాదగిరి”! అఆవిధిగా తెలంగాణ వరమైనది యాదగిరి! దీనజనులనెల్ల కావ దీటైనది యాదగిరి! శ్రీలక్ష్మీ సహితముగా అభయ నారసింహుడే వెలసినట్టి యాదాద్రి వేడుకైన యాదాద్రి!

104

తలచినంత తక్షణమే మోక్షమొసగు యాదాద్రి భక్తుల నెల్లను (బోచే భవ్యాద్రీ - దివ్యాద్రీ! విరా! (వోరతి పడుతూ) నర్తకులు : మంగళం! మంగళం శ్రీలక్ష్మీ నారసింహ! మంగళం! మంగళం యాదాద్రీ నారసింహ! బంగారు తెలంగాణ భద్రంగా సమకూర్చగ కరువు కాటకాల నణచి సస్యశ్యామలము చేయగ సుందరముగ అందరికీ సుఖశాంతుల నందించగ మంగళం! మంగళం శ్రీలక్ష్మీ నారసింహ! మంగళం! మంగళం యాదాద్రీ నారసింహ! (నాట్వాచారిణి వోలేటి రంగమణి బ్బందంచే ప్రదర్శనకు నంనిద్ధం) ఎన్జస్లం 105

వినియోగదార్ల విజయపథం! (సంగీత, నృత్యరూపకం) (కొందరు నర్తకులు ఆట పాటలతో నర్తిస్తూ ప్రవేశించి, శథావ్యంగా స్వరమెత్తుతారిలా - ) నర్తకులు 2 _ వినియోగదారుల రక్షణకై వివిధ మోసాల శిక్షలకై విశిష్టంగా - పటిష్టంగా వెలసినదీ - వెలసినదీ వినియోగదారుల చట్టం! మన అందరికీ అది చుట్టం! ॥విని॥ మన దైనందిన జీవితంలో... అడుగడుగున యీ భారతంలో ఎదురౌనెన్నో మోసాలు వాటి నణచుటే మన లక్ష్యాలు! ప్రతిరోజూ కనుచూపుల్లో ప్రత్యక్షం ఎన్నో సాక్ష్యాలు! ఆ సాక్ష్యాల ఆధారంగా అన్నిటినీ శిక్షించడానికే జిల్లా ఫోరం - రాష్ట్ర కమీషన్‌ దేశీయ జాతీయ కమీషన్‌ న్యాయం - చట్టం ఉందండీ! అన్యాయాలను యిక అణచండీ! ॥విని॥ (ప్రక్కన 'స్పాట్‌లైటొలో కూరగాయలు అమ్ముతుంటే, కొందరు కొంటుంటారు-) 106

కూరగాయలు కొంటుంటే

తూకం సరిగా లేకుంటే

రశీదు దానికి తీసుకొని

ఫిర్యాదుల్నే చేయాలి!

పళ్లు తోముకొను 'పేస్టు'పైన

ఒళ్లు రుద్దుకొను సబ్బుపైన

ముద్రిత నాణ్యత లేకున్నా

అధిక ధరకు అమ్మేస్తున్నా

వెంట వెంటనే పట్టుకోవాలి!

వినకుంటే “ఫోరం” కెళ్లాలి! విని (నర్తకులు ఆయా సందర్భాలకనుగుణంగా హావభావాలు చూపుతూ నర్తిస్తుంటే...)

మోపెడ్‌, స్కూటర్‌, కారైనా

డీజిల్‌ - పెట్రోల్‌ ఏదైనా

ఇంటింటా ఉపయోగించే

వంటల 'స్లో గ్యాసైనా...

తక్కువగానే నింపేస్తూ

మోసాలెన్నో చేసేస్తూ

అమ్మకందార్లు వ్యవహరిస్తే

అప్పుడే నిలదియ్యాలి!

వినకుంటే వినియోగదారుల -

చట్టాన్ని ఆథభయించాలి!

సత్వరమే శిక్షించాలి! ॥విని॥ (స్పాట్‌లైటొలో ఒకసైడు బట్టల కొట్టులో చీరలు - నగలు కొంటుంటారు, కొందరు వినియోగదారులు...)

107

నర్త_ : కట్టుకునే చీర “స్కర్టు వేసుకునే 'ప్యాంటు' - “షర్టు” ధరించేటి ఏ వస్రాలైనా ధగధగలా ఏ నగలైనా... చెప్పిన నాణ్యత లేకున్నా అధిక ధరకు అమ్మేస్తున్నా పసిగట్టి ప్రతిఘటించాలి! “ఫోరం” ద్వారా ఎదిరెంచాలి!... ॥విని॥ (వాస్పిటల్‌ సీనులో) అనారోగ్యముతొ మంచమెక్కి ఆపై 'ఆసుపత్రి' మెట్లెక్కి తప్పుడు “టెస్టులో పాలైనా... 60166 మందులకూ ఎరయైనా “ఫోరం” ద్వారా పోరాడాలి! తగిన ఫలితమూ పొందాలీ!... ॥విని॥ (రియల్‌ ఎస్టేట్‌ సీనులో) ఇరవై లక్షలపైగా డబ్బును ఇల్లో - “'ఫప్లాటో” కొనుటకై “బిల్బర్లొకు వాయిదాలుగా బిక్కుబిక్కుమని చెల్లించినను చెప్పినట్లుగా చెయ్యకుంటే మోసాలకు గురి చేస్తుంటే 'కమిషన్‌నే ఆశ్రయించాలి! “చట్టం? అస్త్రం సంధించాలి! చెల్లించిన ప్రతి పైసానూ

108

ఖర్చులతో సహ సాధించాలి! న్యాయం ఆ చట్టం తెలుసుకొని నవ్వుతు హాయిగ జీవించాలి! అజ్ఞానాంధ కారాలన్ని విజ్ఞానంతో చెందాడాలి! అమ్మకందార్ల మోసాలన్ని వినియోగదార్లు పసిగట్టాలి! వక్రబుద్ధితో మెదిలారంటే విక్రమించి వాళ్ల పనిపట్టాలి!... ॥విని॥ (శ్రీమతి ఐనంవూడి శ్రీలక్షి అభ్యర్థనపై) అనం 109

సీతా సయంవరం (సంగీత, నృత్య రూపకం) (సింవోసనంపై జనకుడు, ప్రక్కనున్న ఆసనంపై వరమాలతో సీత అగుపిస్తుంటారు.) సూథత్రధారిణి సాకీ : మహిజ - అయోనిజ మంగళకర స్వయంవర మదిగో!... అపూర్వ - అమోఘ, సౌందర్య - సౌశీల్యరాశి మైథిలీ సయంవర మదిగదిగో!... పల్లవి : స్వయంవరం! స్వయంవరం! ముద్దుల జానకి ససయంవరం! స్వయంవరం! స్వయంవరం! సిగ్గుల సీతా స్వయంవరం! ॥స్వు। శ్రీదేవిని తలపించే అందం (సూత్రధారిణి భూదేవిని మరిపించే చందం నర్తకిగా క్రలగలిసిన అందాల రాళిని అభినయిస్తూ ల్రాగైననూ వరించాలని వుంటుంది) _ క్షన్యక్త స్లీతన్సు కన్నులవిందుగ పరిణయమాడి తరించాలని ఎందరెందరో రాజన్యులూ ఏతెంచిరీ స్వయంవరానికి! ॥స్వు। మిధిలాపతి జనకుడు గొంతెత్తి అతిథులకీ విధి తెలిపెను... “పటుతరమైనా పవిత్రమైనా శివుని విల్లునే ఎక్కుపెట్టిన 110

వీరయోధునే తన సుత- జానకి విధిగా వివాహమాడుననీ”... దనుజులైననూ ఎత్తజాలని దండి ధనుస్సును చూసినంతనే (ఆయా రాజుల గుండెలు జారెను రాజన్యులకు ప్రయత్నాలని మొండి ధైర్యమే మిగిలె చివరకు _ స్వః ముగ్ధసీత _ ట్రంగన సీతను పొందగోరుతూ ముచ్చటగా గమనిసూ అంగ రాజుయే లేచి నిలిచెను! వుంటుంది) ఇరు భుజములనూ ఉప్పాంగిస్తూ శివుని విల్లునే సమీపించెను! సమీపించి ఆ శివుని విల్లునే అమాంతమ్ముగా ఎత్తనెంచెను! కాని దానిని అంగుళమైనా కదపలేకనే తిరిగి వచ్చెను! ఆపై వంగదేశాధిపతీ అత్యుత్సాహంతో సాగీ ఎడమ చేతనే ఎత్తనెంచెను! 'పెడమొహమేసి తిరిగి వచ్చెను! కళింగ దేశపురాజు లేచెను కనుబొమలెగరేస్తూ చూచెను ఇరుచేతులతో శివుని వింటిని ఇట్టే యెత్తగ ప్రయత్నించెను! ఎంతగ ఏవిధి ప్రయత్నించినా ఎత్తలేక వెనుదిరిగి వచ్చిను! 1111

మిసమిసలాడే సీతను చూస్తూ మీసాలను కసిగా మెలివేస్తూ మగధ దేశపూ మహరాజూ తగుదు ననుచు దరికేతెంచే! శివుని వింటిని బహువిధాలుగా ఎత్తనెంచి అపజయమే గాంచే! ఎవ్వరు ఎత్తగ శక్యముగానీ వింటిని ఎందుకు పెట్టావంటూ సాటి రాజులను అవమానించే స్వయంవరం ఓ నాటకమంటూ నిప్పులు దొక్కుతు జనకుని అంతా నిలదీసిరి! పలునిందలు వేసిరి! అంతలోన రాజర్ని కౌశికుని అదడుగుజాడలో అయోధ్యరాముడు మైథిలి చూడగ అడుగిడెను! మనోహరుండై అగుపడెను! స్వ!

  • జతులు - శ్రీహరిలాంటి మేఘశ్యాముని చిరునగవాలికే శ్రీరఘు రాముని తిలకించగనే సీతాలక్ష్మికి పులకాంకురములు కలిగెను! చూపులు కలిసిన శుభవేళలలో సుమధుర భావన పెరిగెను!

112

(తాళం మార్పుతో) అప్పుడచటకు మబ్బులేనీ పిడుగువోలే రావణుండే వింటి నెత్తగ ముందుకొచ్చెను రాక్షసుండగు రావణుండే శివుని వింటిని విరుచునేమో? అనుచు జానకి కలత చెందెను! మనసులోనే మహికి (మొక్కెను! వి(ర్రవీగుతు లంక అధిపతి వింటి నంతను వేలి గోటితొ ఎత్తబోయెను! గోరువిరిగెను! తత్తరముగను ఎదమచేతను ఎత్తజూచెను! విఫలుడాయెను! దక్షిణపు హస్తమును కలిపెను! రెండు చేతుల వింటి నెత్తుచు గుండెపై పడవేసుకొనెను! దిక్కుతోచక నేల కొరిగీ బిక్కు బిక్కున చూడసాగెను! (తాళం మార్పుతో) అంతలోనె రఘురాముడు లేచాడు (రాముడు గురువు ఆజ్ఞకై ఎదురు చూశాడు! శివ ధనస్సును విశ్వామిత్రుడు విషయం గుర్తించీ సమీపిస్తాడు) వినయశీలి రాముని దీవించాడు! మత్తేభములా రాముడు నడచాడు శివధనుస్సు చెంతకే చేరాడు! 113

భక్తితో నమస్సులు అర్పించాడు అవలీలగ చెరకు గడగ ఎత్తాడు! కళ్లు తేలవేయుచు రాజన్యు లెల్లచూడగా నారిని సంధించనెంచి వంచాడు ఫెళ్లున ఆ వింటినే విరిచాడు! కురిసింది మింటి నుంచి విరిజల్లు జానకి మది తొక్కింది పరవళ్ల! సిగ్గుతోడ బుగ్గలు ఎరుపెక్కగా సీత నడచెను తడబడు నడకలా... మెల్లగా వచ్చి - శ్రీరాముణ్నే మెచ్చి మెడలో వరమాలవేసి నిలిచెను! (సీతారాములు నీలిమేఘ శ్యామునికే జంటయి అనురాగాలతో మేలిమెరుపు తీగలా తోచెను! అగుపిస్తారు) మధుర మలయ మారుతమే వీచెను! మహియెల్లను మైమరచి చూచెను! కన్యకయగు సీత కలలు పండగా కల్యాణ ఘడియలు ఏతెంచెను! నర్తకి వ కమనీయం! సీతా కల్యాణం! (బృందంతో) రమణీయం! రామా కల్యాణం! జగమంతటికీ కన్నుల విందుగా... జరిగెను సీతారామ కల్యాణం! కమనీయం! సీతా కల్యాణం! రమణీయం! రామాకల్యాణం! (డా॥ పద్మజారెడ్డిచే స్వదేశ, విదేశాలలో ప్రదర్శితం) అస్లం 114

(ఖమ్మం జిల్లా అభ్యర్థనపై 2007 వార్షిక ఉత్సవాలకై-) జ్‌ అసి స్తంభాద్రి సంబరాలు (సంగీత, నృత్య రూపకం) నర్తకులు : ఇదే ఇదే ఇదే మన ఖమ్మమిదే! (పల్లవి అన్ని రంగాల వెలుగు అభ్యుదయపు గుమ్మమిదే! పర్యాటక ప్రగతితో సామాజిక సుగతితో పల్లవించె స్తంభాద్రి సంబరాలు పరవశించె ఏటీటా అంబరాలు ఇదే!

  • పాత్రల ప్రవేశం - (స్పాట్‌లైటొలో) హిరణ్యకశిపుడు : ఎక్కడ? హరి ఎక్కడరా? చూపకున్న యిక్కడనే నిలువున నిను చీల్చెదరా! ప్రవ్వాదుడు : పద్యం. : ఇందుగలదండులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుం దెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవా[గ్రణి వింటే!... నర్తకులు : ఆగర్భ భక్తుడై ప్రార్ధించే డింభకుడగు ప్రహ్లాదుని కావగా స్తంభమునుదయించె నిచట ఉ(గ్రనారసింహుడే! 115

ఆమె : హిరణ్యకశిపుని చీల్చెను రుద్రనారసింహుడే! అతడు : స్తంభాకారపు గిరియే “స్తంభాద్రోగ పేరొందగ ఆమె ; స్తంభాద్రియె ఆపైన “ఖమ్మం”గా రూపొందగ అతడు : వేలవత్సరాల చరిత వేనోళ్లను కీర్తించగ ఇద్దరూ : వెలసెనిచట స్తంభాద్రి సంబరాలు! వెలిగెనంట ఖమ్మం అంబరాలు! బృందం : 11ఇదే॥ తెరపై పర్ణశాల దృశ్యం : (చతురస్ర గతిలో) ఆమె : ్రేతాయుగ మందున శ్రీరాముడు కీతామాతా లక్ష్మణుతోదను వసియించెను యిట, పర్ణశాలలో వనవాసమ్మే చేసే కాలంలో... అతడు : చెంగున ముంగిట దూకే మాయల బంగరు జింకను సీతయె గాంచెను! ముచ్చట పడితే తెమ్మని రాముని విల్లమ్ముతొ బయటకు పంపించెను! ఆమె : అప్పుడు ఆ రావణుడే భిక్షువుగా అరుదెంచీ సీత నపహరించెను! అట్టి సంఘటనల ఆనవాళ్లతో 116

ఆకర్షించును యీనాటికీ పర్ణశాలా! మన పర్జశాలా! 1ఇదే॥ (భద్రుడు తపోముద్రలో అగుపిస్తాడు) అతడు : భద్రుడనే భక్తుందు ఆపైన భగవానుందడైన శ్రీరామునే ప్రార్ధించి తపముతో మెప్పించి “భద్రాద్ర”గా తాను వెలసెనూ! విష్ణువే శ్రీరామ రూపాన భద్రాద్రి రాముడై నిలిచెనూ! కొలిచేటి భక్తుల్ని కాచేటి కోదండ రాముడై బోచెనూ! ఇదే! కూసుమంచి - నేలకొండపల్లి దృశ్యాలు : (మిశ్రగతిలో) ఆమె : కాకతీయుల శిల్చ్పకళలకు ఆకృతిగనే వెలసినట్టీ చిద్విలాసపు శివాలయముతొ వేణుగోపాల్‌ స్వామి గుడితో వేడుకైనది “కూసుమంచీ” సాగిరండిక చూడనెంచీ! అతదు :; ఆ అశోకా చక్రవర్తియె అద్భుతముగా ఉన్నతముగా బౌద్ధ స్థూపము వెలయజేసిన “నేలకొండా పల్ల మనదే! రామభక్తుడు “రామదాసుకు జన్మనిచ్చిన పల్లె మనదే! 117

ఆమె : రాజధనముతోొ గుడిని కట్టీ రామభక్తిని చెరను చాటీ భరత భూమిలొ “భద్రాద్రి"ని చరిత భూమిని చేసినట్టీ రామదాసూ మోక్షమొందిన రమ్య, భద్రాచలము మనదే! రామదాసు ప్రవేశిస్తూ - కీర్సు : ఏ తీరుగ నను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా! నా తరమా? భవసాగర మీదను నళిన దళేక్షణ! రామా! తెరపై గోదావరి & పాపికొండలు దృశ్యాలు : ఆమె : "నాసికా నందినిగా 'గోముఖా' స్యందినిగా త్యంబకేశ్వర దేవ పాదనాద శింజినిగా ప్రభవించిన గోదావరి “బాసరి భారతిని కొలచి, అతడు. : భాసురముగ ఉప్పాంగుతు భద్రాచలమున నిలిచి; నేలను సస్యశ్యామల మాలలుగా మలచినట్టి 118

ఇద్దరూ : పాపికొండలను సుందర దృశ్యాలుగ చూపునట్టి పావన “గోదావరీ” ప్రాంతమిదే! ప్రాంతమిదే! ఇదే!

తెరపై కిన్నెరసాని దశ్యం : (చతురస్రగతిలో)

ఆమె : కిలకిల నవ్వుల “కిన్నెర సానీ' తెలుగు పడుచులా అలిగే రాణీ! అత్తా మామల సాధింపులనే మొత్తానికి తన భర్తకు తెలిపీ ఆలింగనమున సముదాయించిన అసలే వినకా కన్నీరిడుతూ

అతడు. : నీరుగ వరుగ మారిందీ! కిన్నెర వాగై పారింది! కవి సామ్రాట్టగు “విశ్వనాధునీ ఎద మదినే కదిలించిందీ!

ఇద్దరూ : మధుర గేయమై వెలసిందీ! హృదయతాళమై పలికిందీ! పచ్చని పొలాల పండించగ, ఓ “ప్రాజెక్టయి యిల నిలిచిందీ! ఇదే!

(తెరపై శబరి అగుపిస్తుంటే -) ఆమె : చూపు కాస్తా మందగించగ (మిథగతిలో) దేహమెల్లయు నీరసించగ ఎదురు చూడగ - ఎదురుచూడగ ఎదుటకే “రామయ్య” రాగా ఎంగిలైనా పంద్లనెల్లా ఎంతొ (ప్రేమతొ పెట్టి శబరీ 119

కన్నుమూసెను, కదలిపారెను - శబరినదిగా ఇచట మారెను! అతడు : 'కూనవరము'న 'గౌతమీతో సంగమించీ సాగిపోయెను! అంతులేనీ రామభక్తికి ఆనవాలుగ నిలిచి పోయెను! ఆమె : ఆమె అంశతొ మరలయిచటా పోకలా దమ్మక్క పుట్టీ రామునికి తాటాకు పందిరి వేసి ధన్యత గాంచెనూ!... అతడు : రెండు గుట్టల నడుమ కన్నుల- పండువై వెలుగొందు వైరా” చెరువు ఎంతో మనోహరమూ! చేలకెంతో దివ్యవరమూ!... ఆమె : సాగునీరే గాక ప్రజలకు తాగునీరూ అందజేస్తూ పల్లెలను వెలిగించు విద్యుత్‌ వెల్లువా “పాలేరు” చెరువూ! పడవపైన 'షికారు' చేయగ పసందైనా యాత్ర కనువూ! ఇదే! తెరపై సింగరేణి బొగ్గుగనులు (కొత్తగూడెం) దృశ్యం : అతడు : నల్ల పసిడి యనగ జగతి (త్రితగతిలో) శ్రెల్ల బొగ్గు నందజేయు “సింగరేణి” బొగ్గు గనుల సింగారము కలిగి వున్న 120

విద్యుల్లతలన్ని దిశల విస్తరింపజేయుచున్న ఆమె : 'ొత్తగూడెమూ మనకు కొంగు బంగారమూ! తెలుగు తల్లి కంఠసీమ వెలుగు నీల హారమూ! 1 ఇదే॥ గిరిజనులు అగుపిస్తుంటే - అతడు :; అత్యధికా గిరిజనులా ఆత్మీయత నెలకొన్న కొండజాతి సంస్కృతులను దండిగా కలిగున్న మండలాలు మనవే! వెండి - కుండలాలు మనవే! కోయ కోరస్‌ : రేలా! రేలా! రేలారే! రేలా! రేలా! రేలారే! రేయీ పవలూ చెమటోద్బే కోయా - లంబాడి 'మేలారే! బంజరు బీళ్లను పండించే బడుగు బతుకులా 'డోలారే! ॥రేలా॥ సామాజిక ముక్తాయింపు : (ఇందిరమ్మ పథకం) అతడు. : గూడులేక గుడిసెలేక గోడుగోడు మనెడు బడుగు బీదల కందించు 'పక్కా “ఇందిరమ్మ ఇండ్లు వచ్చె! తరతరాలు కన్న కలలు త్వరితగతిని యీడేర్చే! 121

జలయజ్ఞం ఫి ఆమె : బిక్కుబిక్కుమనెడురైతు బీడు నేలకో పెద్ద దిక్కుగాను నిలువగాను దివ్యమైన గంగవోలె అతడు : అలలు అలలుగా పెరుగుతు అన్ని దిశల ఉప్పొంగుతు ఆదుకునే “జలయజ్ఞం” అందించును యింక ఫలం! పావలావర్డీ ; ఆమె 1 : నడ్డి విరగగొట్టె వడ్డీలాయెతల్లి, ఓలమ్మా! కూలినాలితో బతుకెట్ట గడిచేది? ఆంహుం ఆంహుం పిల్లపాపలకు చదువెట్ట వచ్చేది? ఆంహుం ఆంహుం ఆమె 2 : పావలావరడ్డీతొ బతుకులే మారాయి ఓలమ్మా! పాడి పంటలకూ లోటులేదమ్మా! ఆంహురే ఆంహుం పల్లెల్లో యింటింట పండగే నమ్మ! ఆంహురీ ఆంహుం! మహిళలంత యింక మహరాణులోయమ్మ ఆంహుం1 ఆంహుం! ఉపాధి హామీ పథకం : అతడు : పట్టణాలకు వలసలు ఆపే పల్లెసీమలకు ఉపాధి చూపే ఉపాధి హామీ పథకం వచ్చే ఉన్న చోటనే బతుకులు తీర్చే 122

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ : (తాళం మార్పుతో) ఆమె ; కర్మగాలి జబ్బుపడితె కార్పొరేటు వైద్యమ్మును బడుగు జీవులకు విధిగా భద్రంగా అందించే “రాజీవ్‌ ఆరోగ్యశ్రీ” రక్షాపథకమ్ముతో... అతడు. : రెండు రూపాయలకే కిలో బియ్య మందించే కష్టించే ప్రతి వాడూ కడుపారా భుజియించే ప్రభుత్వ యంత్రాంగమ్ము కల్పించిన పథకంతో ఆమె : గత వైభవ కీర్తిగా పర్యాటక స్ఫూర్తిగా అతడు : పారిశ్రామిక రంగ ప్రగతి కెల్ల దీప్తిగా ఆమె : రాజిల్లే మనజిల్లా ఖమ్మం జిల్లా! అతడు :; కమనీయంగా వెలిగే ఖమ్మం 'ఖిల్లా! బృందం : స్తంభాద్రి సంబరాల ఆడిపాడగా సంతోష స్వాగతాలు పలుకుతున్నదీ! అతిథులకాహ్వానితులకు ఆనందంగా ఆదరంగ చేతులెత్తి మొక్కుతున్నదీ! 1ఇదే॥ వ. 123

తెలంగాణ తేజోమూర్తులు! (సంగీత, నృత్య రూపకం) (తెర తీయగానే నర్తకులు ప్రవేశిస్తారు. అభినయిస్తూ యిలా ఆలాపిస్తారు -) నర్తకులు : తేజో విరాజమాన తెలంగాణమా! (ఆడ, మగ) __శ్రేనె లొలుకు మాందలికపు మధురగానమా! వందనం! అభివందన స్యందనం! తరతరాల సంస్కృతుల చందనం! తేజో! నర్తకీమణులు : ప్రథమ శాతవాహనుల హాలుడు ప్రాకృతకృతి 'సప్తశతిని రచియించే తెలంగాణ గ్రామీణ సంస్కృతినీ తెలివిగా కేటతెల్ల మొనరించే... మగ ; నన్నయాది కవులకన్నముందే జినవల్లభు శాసనాల “కందా లే బొమ్మలమ్మ గుట్టపై వెలసే! “పంపడు” మన కవియన్నది తెలిసే! ॥తేజో॥ ఆద _ : పద్యాలను మంత్రించి భీమకవి 'ప్రత్యర్భలపై విధిగా ప్రయోగించే! కాళిదాసు కావ్యసుధల కమనీయంగా మన - మల్లినాథ సూరియె వ్యాఖ్యానించే! మగ : జంగమకవి పాల్కురికి సోమన్న జాను తెనుగు ద్విపదలనే పోషించే! స్వేచ్భా కవిగా బమ్మెర పోతన్న అమృతతుల్య “భాగవతం” అందించే! తేజో! 124

(“స్పాట్‌లైటొలో పోతన రచన చేన్తూ అగువిన్తూ స్వరమెత్తుతాడిలా-)

ఉ. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వముదానయైనవా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌!

జ జి 2 ఆడ :; నృత్తరత్నావళినే “జాయప్పా” సరికొత్త నాట్య గ్రంథంగా రచియించే కతీయ శిల్పకళా వై (స్పాట్‌లైటొలో కా ల్పకళా వైభవాన్ని రమణీయ రామప్పగ వెలయించే రుద్రమదేవి అపూర్వముగ రుద్రమ్మ పరిపాలించి ఖడద్దపాణిగా స అబల కూడ సబలేయని చాటించే! కనిపిస్తుంది) తెలుగునేల నెల్ల 'తెలంగాణుగా వెలుగజేసి, ఘన కీర్తిని గడియించే! ॥తేజో॥ మగ :; భద్రాదిని రాముని గుడి నిర్మించి భక్త రామదాసుయే కీర్తించే! తానీషా చెరలో బంధించగా తల్లడిల్లి సీతమ్మను ప్రార్ధించే! (స్పాట్‌లైటొలో) రామదాసు : నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి నను బోవమని చెప్పవే! నారీ శిరోమణి... జనకుని కూతుర, జనని జానకీ! నను బ్రోవమని చెప్పవే!... ఖు 2 2 125

ఆడ : 'గోలకొండ) పత్రికతో సురవరం

మన గొప్పతనం చరిత్రపుటకెక్కించే!

బహుభాషావేత్తగా 'పీ.వీ.”

భారత ్రధానియై ప్రకాశించే!

తెలంగాణ మహా కవిగ 'సినారే”

జ్ఞానపీఠమే అధివసించే! తేజో! మగ ; తెలంగాణ విముక్తికై 'దాశరథి”

తేపతేప పద్యాగ్నిని కురిపించే!

మాటలనే ఈటెలుగా “కాళోజీ”

మాటిమాటికీ పోరుగ సంధించే !

సమరంగా కే.సీ,ఆర్‌' 'జయశంకరొతో

సాగి తెలంగాణనే సాధించే!...

బంగారు తెలంగాణ బాటలనే

భద్రంగా అందరికీ చూపించే!... ॥లేజో॥

(వసుమతి వరకాల బ్బందంచే పలుమార్లు (ప్రదర్శితం) ఎ్లుస్ణణ 126

విత్తనాల విలువ! (సంగీత, నృత్య రూపకం) నేపథ్య వ్యాఖ్యానం : విశ్వ సృష్టికి మూలాధారం ప్రకృతి అయితే, ప్రకృతికి (ప్రాణాధారం పచ్చపచ్చని వృక్ష సముదాయం! ఆ వృక్ష సముదాయానికి ఆధారభూతం ఒక చిన్న విత్తనమన్నది నగ్న సత్యం! ఆ విత్తనమే సజీవ ఆణిముత్యం! భూమిలో పాతిన విత్తనమే నేల పొరల్ని చీల్చుకొని, సజీవ చైతన్యంతో మొలకెత్తుతుంది. రెండు చేతులెత్తి ప్రకృతికి ప్రణమిల్లుతున్నట్లుగా రెండు ఆకులతో తలయెత్తుతుంది. ఆ తర్వాత, క్రమక్రమంగా మారాకులు తొడిగి, కొమ్మలు రెమ్మలతో వికసించి, చెట్టుగా రూపుదాలుస్తుంది. మండుటెండల్లో నీడల్ని, మాడే కడుపుకు ఫలాల్నీ అందిస్తుంది. పక్షులకు గూళ్లు కట్టుకునే చోటిస్తుంది. పైపైన కదలివెళ్లే మేవాల్ని ఆకర్షిస్తూ వర్షింపజేస్తుంది. ప్రకృతి పచ్చదనాన్ని పరిరక్షిస్తుంది. అట్టి చెట్లను పెంపొందించే, మానవాళి అగచాట్లను తప్పించే విత్తనాలను విధిగా ఆదరిద్దాం! అభివందనాలందజేద్దాం!... నర్తకులు (ప్రవేశిస్తూ) : విత్తనమా! వందనం విధిగా అభివందనం! గుప్త హరిత భరిత చరిత విత్తనమా వందనం! ॥వి॥ విత్తనమా! విత్తనమా మొలకెత్తే చేతనమా!... పరమయోగ్య ప్రకృతికే భవితవ్య నికేతనమా!... 127

వందనం! అభివందనం! విత్తనమా వందనం! తరువు మూలపెత్తనమా శిరసా అభివందనం! విలువైనా విత్తనమా! విధిగా అభివందనం! = జతులు- ॥విత్త।

(కీన్‌ మీద నీటి తేమతో గొంతు తడుపుకొని

ఆయా సూర్యరళ్ళ్శితో చేవ పెంచుకొని ఛాయా మెల్ల మెల్లగా నేల పొరల్ని చిత్రాలు) మెలకువతో చీల్చుకొని

మాతృగర్భమున దారి చేసుకొని పాపయే ప్రభవించినట్లుగా రెండాకుల రెక్కల్ని దాల్చుకొని నిండుగా మొలకెత్తే... విత్తనమా! వందనం!... గాలి వాటముకు ఒరుగక మేక మేతగా నలుగక

(స్కీన్‌ మీద “ట్రీగార్జుల సాయంతో

మామిడి చెట్ల జ్ట్వ్యజ్ట్య్వ్టంగ్లా ఎదిగి,

విజువల్స్‌) కొమ్మలతో -రెమ్మలతో కోయిలమ్మ గానాలతో మానవాళికి ఉపకరించే మధుర ఫలాల రసాలతో గుమ్మాలను అలంకరించే తోరణాది పత్రాలతో

128

అలరారు ఆ(యమ్ర వృక్షమా! అనేక లాభ సాక్ష్యమా!... వందనం! అభివందనం! విత్తనమా! వందనం! విత్త! నేపధ్య వ్యాఖ్యానం : అలా మచ్చుకు మామిడి తరువే కాదు, మనము రోజూ మూడు పూటలా ముచ్చటగా భుజించే అన్నము కూడ బియ్యం వల్ల; ఆ బియ్యం వరిధాన్య విత్తనాల వల్లనే లభిస్తోంది. రైతుకు రొక్కం మిగిలిస్తోంది. మానవ జాతి ఆకలి దుఃఖం అణగిస్తోంది నర్తకులు : _ బీడు నెల్ల చదును చేసి దుక్కిదున్ని సాగు చేసి వరి ధాన్య విత్తనాల్ని వరుసగానూ చల్లగ (వెనుక ట్రీస్‌ మొలకెత్తిన నారునెల్ల మీద వరి మొత్తంగా నీరుమడిలొ పొలాల నాట్లు నాటేసి - కలుపు తీసి _ కలుపుతీసే నాల్గు నెలలు కాపు కాచి “షాట్లు వగైరా) రైతన్నలు చెమటోడ్చి ఎండా - వానలకు ఓర్చి పండించగ వరి గొలకలు ధన్యమవగ మన బ్రతుకులు ధాన్యాగారం నిందును! దానికి మూలాధారం వరిధాన్య విత్తనమే! విత్తనమే - విత్తనమే దైవతుల్య విత్తనమే! ॥విత్త। 12రి

నేపథ్య వ్యాఖ్యానం : అలా ఆకలి తీర్చే మామిడి, వరి ధాన్యాలకేగాక మానవాళి మానరక్షణకు తోడ్ప్చడుతున్న దారానికి ఆధారమైన పత్తి విత్తనాలకూ ఎంతో ప్రాధాన్యమున్న నత్యాన్ని కూడ ఆవిష్కరిద్దాం! అభివాదాలందజేద్దాం!... నర్తకులు : నల్లరేగడి నేలల్లో ఎల్లవేళ నీరందకున్ననూ (పత్తిచేల మెట్ట ప్రాంతమున సైతం విజువల్స్‌) వ్వేటిగా మొలకెత్తేను, పత్తి విత్తనం! పత్తి విత్తనం! తరాతరాల సరికొత్త విత్తనం! దారాలకూ - వ(స్తాలకూ దానిదే మరి పెత్తనం! నల్ల మొక్కలుగా పైకిలేచి పత్తికాయలుగ కాచి పొట్ట పగిలినా ఓర్చి పుట్టెడు దూదిగ మార్చి ప్రకృతిమాత నవ్వులా తెల్లని దూది పువ్వులా దర్శనమిచ్చును పత్తి విత్తనం దారము నిచ్చును పత్తివిత్తనం! ఆ దారంతో రకరకాల అంగవస్త్రములె రూపుదాల్బగా పత్తి విత్తనం మొలకెత్తేను పలుచోట్లను తలయెత్తేను!... నల్ల 130

(చిరుధాన్యాల _ అదే విధంగా మెట్ట భూమిలో ఛాయా చిత్రాలు) అనేక రకాల చిరు ధాన్యాల కంది - పెసర - పల్లి - జొన్నలు పొందికైన మినుములు - శనగల విత్తనాలు మొలకెత్తేను! వివిధ పంటలందించేను! కరువుదీరగా - కడుపు నింపగా కమనీయం అనిపించేను! ప్రబోధంగా (తాళం మార్పుతో) : కనుక అట్టి విత్తనాల ఉనికిని రక్షించాలి! _ విత్తనాల మొలకెత్తే " వివిధ మొక్కలన్నిటినీ విధిగా కాపాడాలి! విరివిగానూ పెరిగే మార్దాలను చూడాలి! అప్పుడే విత్తనాల గొప్పదనం పాడాలి! తకథిమి తాళాలతో గజ్జెకట్టి ఆడాలి! ఆదాలి! పొడాలి! అందరు ఆనందంగా!... విధిగా దరువెయ్యాలి విత్తనాల డెందంగా!... 131

జానపదుల బృందం : వెయ్‌ వెయ్యరా! దరువెయ్యరా! విత్తనాలు నాటెయ్యరా! విలువైనా - పలు పంటల నెలవైనా విత్తనాలనే విరివిగా విధిగా నాటెయ్యరా వెయ్యరా! దరువెయ్యరా!... ॥వెయ్‌॥ మెల మెల్లగ మొలకెత్తిన మొక్కవోని పలుమొక్కల కంచెలతో కాపు కాచి పెంచేలా యత్నించరా! మొక్కలు పెరిగి చెట్లయితే మోక్షం మనకే దక్కురా!... అవియే మనకిక దిక్కురా!... మంచి గాలికి - మంచి నీడకు మధుర ఫలాల జాదకూ మొక్కలే అను సత్యమూ తెలుసుకోర అను నిత్యమూ!... ॥వెయ్‌॥ (ఆలంగాణ నొంన్భతిక శాఖ సంచాలకులు, శ్రీ మామిడి వారిక్ళష్ణ గారి పోత్సావాంతో జూన్‌ - 2019 ఇంటర్నేషనల్‌ నీడ్స్‌ ఫెస్టివల్‌లో నాట్యాచారిణి దా వనజా ఉదయ్‌ బృందంచే మనోహారంగా (వ్రదర్శితం) ఇ్లష్ణం 132

ప్రకృతి పరిరక్షణ (సంగీత, నృత్య రూపకం) నేపథ్య వ్యాఖ్యానం : అనాది నుంచి మనకు సంక్రమించిన ప్రకృతి క్రమక్రమంగా తన ఆకృతిని కోల్పోయే ప్రమాద పరిస్టితి గోచరిస్తోంది. అందుకు కారణం మన స్వార్ధమే అన్న సత్యం గుర్తించాలి. యథేచ్చగా సిగరెట్టు వీడీలనే గాక పలుచోట్ల పెంటల్నీ కాలుస్తూ ఇటు దేహం ఆరోగ్యాన్నే గాక అటు పరిసరాల వాతావరణాన్ని కలుషితం చేస్తూ, వాహనాల ద్వారా వ్యర్థ కాలుష్యాన్ని వదలుతూ వాయు కాలుష్యం గావిస్తూ మురుగునీటిని చెరువులు నదుల్లోకి వదలి జల కాలుష్యం గావిస్తూ, మన మెక్కిన కొమ్మను మనమే నరుక్కున్నట్లుగా మనం నివసిస్తున్న భూగోళ ఉపరితలాన్ని మనమే వేడెక్కిస్తూ, అనేక అనర్ధాలకు కారణభూతుల మవుతున్నాం! కావున ఇకనైనా మనం కళ్లు తెరవాలి! ప్రకృతి పరిరక్షణ చేయాలి! (తెర తీయగానే కొందరు నర్తకులు చుట్టూ పరిసరాలను, పైన నింగిని వరిశీలిన్తూ, ఆవేదనతో జతులతో నర్సిన్తూ స్వరమెత్తుతారిలా- ) నర్తక శిష్యులు : అతడు : ఏమిటిలా అవుతోంది?

ఎందుకిలా అవుతోంది?

పచ్చపచ్చనీ ప్రకృతి

ఆకృతి కోల్పోతోంది!

కోరస్‌ : ॥ఏ॥ ఆమె : పచ్చిక మైదానాలు మచ్చుకైన కానరాక 133

పరిసర ప్రాంతమ్మంతా పాడు ఎడారవుతోంది!...

  • జతులు - ॥1ఏ

అతడు : వర్షభాయలే రాక హర్ష భావనే లేక పుడమినెల్ల నీటి కొరకు తమిడి చూసినా లేక

ఆమె : సాగు మాట దేవుడెరుగు, తాగు నీటికీ కరువై స్వచ్చమైన గాలి కూడ పీల్చుకొనే వీలులేక

అతడు : మెతుకు కొరకు దేవులాడ (బ్రతుకు అంతయూ బరువై జనజీవన స్థితియంతా దారిద్యపు పెనుదరువై

ఆమె : కాలం విషమించుతోంది కాటేయగ చూస్తోంది!

(అంతలో ప్రవేశిస్తున్న గురువును చూస్తూ నమస్కరిస్తూ...) కర్తవ్యం సత్వరమే ఎరిగించుము గురుదేవా!... తగు విధముగ గుణపాఠం బోధించుము గురుదేవా!.... గురువు (ఆశీర్వదిస్తూ) : శిష్యకోటి జనులారా!.... శీఘ్రం యిక కనులారా!... 134

విశ్వం వీక్షించాలి! వసుధను రక్షించాలి! = జతులు - 1శిష్య॥ ఇంగిత జ్ఞానమ్ముతో (ష్కీనుపై ఇప్పటికైనా వెంటనె విజువల్స్‌ చెట్లనెల్ల పెంచాలి! చూపాలి -) చేటు నివారించాలి! ముంచుకు వచ్చే పెద్ద - ముప్పును తప్పించాలి! విజ్ఞతతో మెదలుచు కను - విప్పును కలిగించాలి! కోరస్‌ : కనువిప్పును కలిగించాలి! ॥శిష్య! నలుదెసలా మొక్కలనే నాటడ మేర్చరచాలి! నాటిన మొక్కలకన్ని “ట్రీగార్డుల నుంచాలి మంచిగ పెరిగేందుకై కంచెలు ఏర్పరచాలి! నిత్యము అతి (శ్రద్ధగా నీరు కూడ పోయాలి! సూర్యరళ్ళితో ఏపుగ పెరిగేలా చూడాలి! పెరిగి పెరిగి మొక్కలన్ని పెద్ద చెట్లు కావాలి! కోరస్‌ : పెద్ద చెట్లు కావాలి! శిష్య! ఇదే విధంగా అందరు మర్రి - రావి - జువ్వియనే 135

పంచ మహావృక్షాలను ప్రతిచోటా పెంచాలి! వాటి ఫలాలను పక్షులు వాడుకగా భక్షించీ రెట్టలు వేసిన గూడను రెట్టలోని విత్తనాలు మట్టిలోన పడి ఆపై మళ్లి మొలకలెత్తేను! మొలకలెత్తి ఆ మొక్కలె చెట్లయి తలయెత్తేను! అట్టి చెట్లె జగతి ప్రగతి ఆయువు పట్లయ్యేను! కోరస్‌ : ఆయువు పట్లయ్యేను!

  • జతులు - (మిశగతి తాళం మార్చుతో) చెట్ల కొమ్మల చేరి పక్షులు గూళ్లు కట్టుకు కునుకు తీయును! కొమ్మ కొమ్మకు రెమ్మలెన్నో... రెమ్మరెమ్మకు పూవులెన్నో.. పూవు పూవుకు కాయలెన్నో... కాయ కాయకు విత్తనాలూ కలిగి మళ్లీ చెట్లు ఎన్నో!... కోరస్‌ : కలిగి మళ్లీ చెట్లు ఎన్నో... అట్టి చెట్లే కంపుగొట్టే విషపు గాలిని విధిగ పీల్చీ మానవాళికి మంచి గాలిని మాటి మాటికి వీచనెంచును! 136

చెట్ల చల్లని అట్టి గాలికి చేరువై పలు మింటి మబ్బులు జల్లు జల్లుగ కురియనెంచును జల్లు పెరుగగ ఏరువాకలు వెల్లువై యిట పారనెంచును! వేడుకగ ఆకర్షించేను... పారునీటితొ - పంట చేలతొ నేల తల్లియె పరవశించును! భూమిలోపల నీరు నిలిచి బోరు బావుల కంది వచ్చును! కోరస్‌ : బోరు బావుల కంది వచ్చును! (తాళం మార్పుతో) అట్టి నీరె పరిశుభ్రతకైనా అట్టి నీరె స్నానాలకు అయినా అట్టి నీరె మరి త్రాగుటకైనా అట్టి నీరె పలు పంటలకైనా అట్టి నీరె నవ్యతకైనా అట్టి నీరె నాగరికతకైనా అధారం! మన కాధారం! అందుకు చెట్లే ఆధారం! పొందికైన నవ కేదారం!... కోరస్‌ : పొందికైన నవ కేదారం!.... = జతులు - (శిష్యులు మళ్లీ గురువును సంబోధిస్తూ) శిష్యులు : గురుదేవా! థైగురుదేవా! గురుతరమైనా గాలి - నీటికి 137

అన్ని విధాలా మానవాళికి ఆధారమ్మౌ చెట్లను గూర్చి సక్రమంగ వివరించారు అ(క్రమాల నెరిగించారు! ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతిదీ వివరించాలింకా!... ఏతా వాతా అడుగంటే వాతావరణం రక్షించే విధానాలు బోధించాలింకా! ప్రధానంగ ఎరిగించాలింకా! కోరస్‌ : ప్రధానంగ ఎరిగించాలింకా! గురువు : వివరిస్తానిక వినుకోండి! విజయాలను సాధించండి! గురుతరమైన వాయువు గూర్చి గూఢంగా (గ్రపహొయించండి! ॥వివ! మనుషుల కత్యవసరమైనా మంచిగాలియే కావాలన్నా చెట్లను పెంచుటయే గాకా చేటునెల్ల కలిగించేటీ వాతావరణ కాలుష్యాలను వడివడిగా అరికట్టాలి! దినదినమెల్లెడ పెరిగిపోయే ఘనముగ పొగనే వదలిసాగే వాహనాల పని పట్టాలి! కాలుష్యం విడగొట్టాలి! ॥వివ॥ 138

ఇండ్ల ముంగిటా - వీథులందునా

చేల గట్లనూ - చెరువు చెంతనూ

బాట బాటకూ రెండు వైపులా

అడవుల్లోన అన్ని వైపులా

తరువుల నెన్నో పెంచాలి!

కరువులనే అణగించాలి!

సమస్త భూతల ్రాంతమ్మంతా

సస్యశ్యామలమయ్యేలా

పతనం అయ్యే పర్యావరణం

హరితహారమై వెలిగేలా

ప్రకృతి నెల్ల పరిరక్షించగ

ప్రతి ఒక్కరు కృషి చేసేలా

మేటి బాట చూపించాలి!

నవ్య ప్రగతి సాధించాలి!

వాతావరణ కాలుష్యాలను

చూస్తూ ఊరుకోకుండా

తక్షణమే అణగారేలా

తరణోపాయం పట్టాలి!

ప్రకృతి ప్రగతిని - ప్రజల సుగతిని

సుకృతిగా జమకట్టాలి!... వివ

చుట్టా - బీడీ - సిగరెట్లు

చుట్టూ వదలే పొగలైనా

దట్టంగా ఎగజిమ్మేటీ

ఫ్యాక్టరీల పొగలైనా

వాహనాలు వదిలేసేటీ

వైపరీత్యపు పొగలైనా

పెరిగి పోవగా, భువినేకాచే

“ర్చిజ్రోన్‌” పొరయే చిరిగిపోవును! 139

ఇనకిరణాలే ఘనముగ వాలి ఇలా తలమ్మును వేడెక్కించును! అట్టి వేడిమికి జనము - జగతికీ అవసరమైనా వాతావరణపు సమతుల్యతయే సమసిపోవును! ఎండలు ఎంతో మండిపోవును! బుతుపవనాలా గతులే మారును! అందుకు సకాల వర్షము రాక అకాల దుస్థితి ఆవహించును! అందుకె అందరు అనర్జాలను తొందరగా గుర్తించాలి!... వాతావరణ సమతుల్యతను సత్వరమే సాధించాలి! నర్తక శిష్యులు : అర్థమైనదీ - అద్ధమైనదీ ఆచార్యా!...

అనర్థాల అరికడతామింకా ఆచార్యా!... ప్రకృతి పరిరక్షణ కొరకై వికృతాలనే అణచుటకై కాలుష్యాల నివారణకై సమతుల్యత సాధించుటకై వృక్ష సంపదే పెరగాలి! తక్షణ కార్యం జరగాలి!

కోరస్‌ ; తక్షణ కార్యం జరగాలి! ధర్మో రక్షతి రక్షితః అన్నది అనాది వేద సూక్తి! వృక్షో రక్షతి రక్షితః అన్నది ప్రస్తుత ముక్తి సూక్తి!

140

కోరస్‌ : అన్నది ప్రస్తుత ముక్తి సూక్తి! ఇట్టి సూక్తి పాటిస్తేనే ఇక - అంతా ఆచరిస్తేనే సుందరమ్ముగా చుట్టూరా నందన వనాలు వెలసేను! ప్రతి బంధకాలు పతనమ్మై ప్రకృతియే వర్ధిల్లేను! ప్రజల పాలిటి కల్పతరువుగా పర్యావరణం శోభిల్లేను! కోరస్‌ : పర్యావరణం శోఖభిల్లేను! ధరో! (అని నర్తిస్తూ వలయాకారంగా తిరుగుతూ, ఆచార్వునికి నమస్కరిస్తూ నర్తకులు నిష్ర్రమిస్తారు.) ఎస్లుస్ణణ 141

త్రివిక్రములు

మహాత్మా జ్యోతిభా పూలే! (సంగీత, నృత్య రూపకం) నేపథ్య వ్యాఖ్యానం : బ్రిటిషు పాలకులు వ్యాపారం పేరుతో ప్రవేశించి, అధికార ప్రభుత్వాలతో స్థిరపడుతూ, అటు అగ్రవర్థాలు అరాచకత్వాలతో అట్టడుగు వర్గాల్ని భయపెడుతూ, కాలం దొర్లుతున్న అంధకార దశలో, పూనాలోని ఒక పూరి గుడిసెలో అరుణారుణ కాంతి రేఖలా - కార్మిక, కర్షక ఆశాజ్యోతిలా కన్నుదెరిచాడు, జ్యోతిరావు పూలే! సమ సమాజ భావాలతో, మూఢ ఛాందస ఆచారాలపై విప్లవ శంఖాన్ని పూరించాడు జ్యోతిభా పూలే! శూద్ర - అతి శూద్రుల - అభ్యున్నతకై ఆజన్మాంతం కృషిచేసి, సార్థక “మహాత్మ” బిరుదంతో తాలి మహాత్ముడై చరిత్రపుట కెళ్ళాడు జ్యోతిభా పూలే! (తెర తీయగానే నర్తకులు పూల దోసిళ్లతో ప్రవేశిస్తారు. జ్యోతిభా ఫూలే పటానికి పూలు సమర్పించి, నర్తిస్తూ ఎలుగెత్తుతారిలా-) నర్తకులు ; అతడు : కమ్ముకున్న చిమ్మచీకట్లలో కన్నుదెరిచె నొక్క కాంతికిరణం! ఆమె : అ(గ్రవర్దజాతి కంతటికీ... ఉగ్రరూపమైన క్రాంతి చరణం! అతడు : ఆ కిరణం - ఆ చరణం జ్యోతి భా ఫూలేదే! ఆమె : మానవతా మూర్తి మన జ్యోతిభా పూలేదే! 143

ఇద్దరూ : మహాత్మా ఫూలేదే! మన మహాత్మా ఫూలేదే!

  • జతులు - బృందం ; కమ్ము! అతడు : వేదాంతపు స్మరణాలకు పురాతన పురాణాలకు ఆమె: అదడ్డదార్లు దొక్కునట్టి ఆర్యుల అవినీతులకు అతడు : గొడ్డలి పెట్టుగ నిలిచిన గొప్ప నేత జ్యోతిభా! మహా - గొప్ప నేత జ్యోతిభా! ఆమె : శూద్రుల - అతి శూద్రుల అభ్యుదయమె లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసిన మహాత్ముడే జ్యోతిభా తొలి - మహాత్ముడే జ్యోతిభా! అతడు : గాంధీ - అంబేద్కర్లకు ముందే మహాత్మ బిరుదు ఆమె: పొందినట్టి మహనీయుడు పోరాటపు గణనీయుడు అతడు : మహితాత్ముడె జ్యోతిభా! చరితార్జుడె జ్యోతిభా! 144

బృందం : మహితాత్ముడె జ్యోతిభా! చరితార్జుడె జ్యోతిభా! = జతులు - (నర్తకులు నట్టువాంగం వేస్తున్న ఆచార్యునికి నమస్కరిస్తారు. ఆచార్యుడు ఆశీర్వదిస్తాడు.) యువకుడు : ఆచార్యా! తొలి మహాత్కుడిగా కీర్తి గాంచిన జ్యోతిభా ఫూలే జీవిత చరిత్రనంతా సమగ్రంగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. దయతో వివరిస్తారా? ఆచార్యుడు : తప్పకుండా వివరిస్తాను. శ్రద్ధగా వినండి! 1827లో పూనాలో మధ్యతరగతి మాలి కులంలో చిమ్నూబాయ్‌ - గోవింద రావు దంపతులకు జ్యోతిరావు హలే సమస్త నిమృజాతి ఆశాజ్యోతిలా జన్మించాడు

  • లైట్స్‌ ఆఫ్‌ - ఆన్‌ (పాటలో నర్తకులు అభినయిస్తుంటారు) సూత్రధారి 1: మహారాష్ట్ర “పూణేలో మామూలు కుటుంబంలో ప్రభవించెను జ్యోతిరావు (ప్రభాకరుని తేజముగా! మహనీయంగా ఎదిగెను మార్తాండుని మాదిరిగా! ॥మహా॥ ఇంగ్లీషు చదువులతో ఇంగిత జ్ఞానం 'పెరుగగ బడుగువర్గ దీనులను 145

బ్రాహ్మణ్యం బాధించగ

విధిగా ఎదిరించనెంచె!

విప్లవంగ ప్రతిఘటించే!

(బ్రాహ్మణ మిత్రుని పెళ్లిలొ

బాహాటంగా తనను

అంటరాని వాడంటూ

గెంటివేయగానె మిగుల

అవమానంగా తలంచె!

ఎదిరించగ నిర్ణయించే! ॥మహా॥

కులం - మతం తత్వాలే

కుటిల జటిల కుద్యాలని

వాటిని పడదోస్తేనే

వర్ధిల్లే వీలుందని

అక్షరజ్ఞానం వల్లే

అభ్యున్నతి సాధ్యమృ్మని

సంఘ సంస్మరణ కొరకు

నాడు నడుం బిగించె! 1మహా॥

సూత్రధారి 2 : నేపథ్య వ్యాఖ్యానం : మితిమీరిన అగ్రవర్ణ దారుణాల్ని అట్టడుగు వర్గాల అతిహీన దయనీయ జీవనాల్ని పరిశీలించిన మూలే పరితపించాడు. నిమృజాతి నిరుపేదలు బానిసత్వ భావాల బందిఖానాలోంచి బయట వడాలంటే, అ(గ్రవర్ణుల అన్యాయాల్ని నిలదీసి నిర్జించాలంటే, ముందుగా అందరూ అక్షరజ్ఞానం కలిగి విద్యావంతులై తీరాలని పనిగట్టుకొని ప్రబోధించాడు, మన జ్యోతిభా ఫూలే! 146

జ్యోతిభా ; చదవాలీ అందరూ శద్ధగా! చదివి - ఎదగాలీ సంఘంలో బుద్ధిగా! చద విద్యలేనిదే వివేకం లేదు వివేకమ్ము లేక ఎట్టి నీతియూలేదు! నీతిలేనిదే ఏ పురోగతీ లేదు పురోగతీ లేనిదే ఎట్టి విత్తమూలేదు! విద్య- విత్తరహితమై శూద్రులే అధోగతిగ పీడితులవుతున్నారు! ధనికులధిక ధనవంతులు అవుతుంటే అయ్యో - పేదలు నిరుపేదలు అవుతున్నారు! ॥చద॥ వడ్డీ వ్యాపార దుష్టులా చత్ర - వడ్డీలకు నడ్డి విరిగి పవలు రేయి కష్టించినా పస్తులతో నేలకొరిగి చావలేక బతుకుతున్న చేవ చచ్చి కుములుళున్న కూడులేక - గుడ్డలేక గోడుగోడు మంటున్నా అ(గ్రవర్ణ బ్రాహ్మణ్యం, చూపదాయె దాక్షిణ్యం! అందుకే శూద్రులంత మారాలీ! అక్షర జ్ఞానంతో పైకెదగాలీ! చద॥ తరతరాల వేదాలకు తప్పుడు భాష్యం చెహ్హూ మను స్కృతిని వల్లిస్తూ మన దాస్యం అనుభవిస్తూ 147

వివిధ పూజలా పేరున

విత్తమునే లాగేస్తూ

అన్ని సేవలను పొందుతు

అంటరాని వాళ్లంటూ

అణగ (ద్రొక్కు బ్రాహ్మణులకు

గుణపాఠం నేర్చాలీ!

గూబలదిరి పోయేలా

గుణపారం నేర్సాలీ! ॥చద॥

సూత్రధారి 1; అలా ప్రబోధించడమే గాక ప్రాధమిక విద్యాబోధన కనీసం 12 యేళ్ల ప్రాయం దాక ప్రభుత్వం ఉచితంగా జరిపించాలని, పల్లెపల్లెలో శూద్రులకై ప్రత్యేక పారశాలల్ని తెరిపించాలని, అట్టి పాఠశాలల్లో దుర్మార్ణ ఛాందసులైన బ్రాహ్మల్ని మాత్రం ఉపాధ్యాయులుగా నియమించరాదని, బ్రిటిషు సామ్రాజ్యానికి పన్నులరూపంలో చెల్లిస్తున్న పేద రైతుల శ్రమ ఫలితాన్ని అ(గ్రవర్ధాల ఉన్నత విద్యలకు గాక, అట్టడుగు వర్ణాల పిల్లల ప్రాధమిక విద్యలకే వెచ్చించాలని ప్రభుత్వానికి - ప్రభుత్వ విద్యాధికారికీ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి స్వరమెత్తాడు, సంఘ సంస్కర్తలైన జ్యోతిభా ఫూలే! జ్యోతిభా : (విద్యాధికారితో)

వినుము వినుము విద్యాధికారీ!

విషయమెరిగి మసలుము అధికారీ! ॥విను॥

పల్లె పల్లెలో శూద్రులకోసం

ప్రత్యేక పాఠశాల పెట్టాలీ!

బాల బాలికలకు ఉచితంగానే

విద్యాబుద్ద్ధుల్ని బోధించాలీ! ॥నిను॥

148

ఉపాధ్యాయులుగా విధిగా మా వర్గంవారినె నియమించాలీ! పంతుళ్లుగ బ్రాహ్మలనే వేస్తే చింతలే చివరకు ్రాప్తించేను! విద్యాధికారి: [10.... ౧౦... 1115 ౯4156! ఫూలే వ ₹69.... ౫/65... 1 15 ౪౯06! విద్యాధికారి: [1047 ఫూలే వ ₹౧౦ 0/20/1౧1౧ 1920065 ౪|| 91700 60౧౫6 2౧6 91660! ఇంట్లో గంటల కొద్ది సంధ్యావందనాలు, గుళ్ల పూజా పునస్కారాలు గావించి ప్రసాదాలు బాగా సేవించి, బడులకు ఆలస్యంగా రావడమే గాక బద్ధకించి, చురుకైన కుర్రాడితో పిల్లలకు ఎక్కాలు వల్లె వేయిస్తూ కునుకు తీస్తారే తప్ప, తగిన పాఠాలు చెప్పరు. ఇది నేను ఎన్నోవోట్ల కళ్లారా చూసిన కఠోర సత్యం! అధికారి : 15107 ఫూలే : 799, 115. ౫౦6 02౧ ౧౫౬9 & 90[0౧|56 ౪15406 00౧/౫ న|$656 15546 0/66౧5 10 116 0౪/.1౧906010/5 0 5080019 10 [౧5౦601 6ఈ౪9౧/ ౧౮4గ67/ 061 ౧౦13/62/౫/ 0౧౦6౯... విద్యాధికారి: 0 111౧00౧616! | ౪|| [004 1010 16 ౧౭|161 ఫూలే వ ౧42౧500౪ 516 సూత్రధారి 2: నాటి దుష్ట బ్రాహ్మణ పీష్వాల పీడిత పాలనకన్నా? బ్రిటిషు వాళ్ల వలస పాలనే మెరుగైనదని భావించాడు జ్యోతిభా పూలే! పైగా బ్రిటిషు వారి వల్లనే రవాణా సౌకర్యం, ఆనకట్టలతో వ్యవసాయానికి తగిన సాగునీటి సౌలభ్యం ఏర్పడినట్లుగా 149

(గ్రహించాడు. శతాబ్దాలుగా ప్రబలుతున్న బ్రాహ్మణ బాల వితంతువులకు శిరోముండనాన్ని ఖండిస్తూ వారికి పునర్వివాహ యోగ్యతను కలిగించాలని, మానవతా దృక్పధాన్ని చూపాలని కోర్టు ద్వారా వాదించి సాధించాడు. సంఘదురాచారాల్ని “సత్య శోధక్‌ సమాజ్‌ ద్వారా ఎత్తిచూపుతూ, ్రీలకు విద్యా బోధన అత్యవసరమని ప్రబోధించడమేగాక, ఆడపిల్లలకై స్వయంగా పాఠశాలల్ని నెలకొల్పాడు. తన భార్యయైన సావిత్రిబాయి ఫూలేని ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది, బాలికల్ని విద్యార్దనతో వివేకంగా ఎదగాలని ఎలుగెత్తి ఆహ్వానించాడు. ఫూలే. : బాలికలారా! రండి రండీ!... భద్రంగా చదువు నేర్చుకోండీ! సావిత్రి : ఆచారపు ముసుగులోన అన్యాయం కాకండీ! ॥బాలి॥ పూలే. : బాల్య వివాహాలతో బందీలయి పోకండీ! సావిత్రి : చదువు సంధ్యలూ లేక చవటల్లా మారకండి! ఫూలే : మను స్కృతిని బోధిస్తూ మహిళలనే సాధిస్తూ సావిత్రి : బ్రాహ్మణ బాలికలకూ బాల్య వివాహం చేస్తూ ఫూలే. : భర్తలు మరణిస్తే మరి విధవరాండ్ర గావిస్తూ 150

బ్రతుకు బండలను చేసే బ్రాహ్మల పని పట్టండి! సావిత్రి : భార్యలు మరణిస్తై మగలు మళ్లీ పెళ్లికి సిద్ధం! భర్తలు మరణిస్తె ప్రీల మారుమనువు నిషిద్ధం! ఫూలే : ఇది ఎక్కడి విడ్డూరం? చదివి తెలుపు ధిక్కారం! సావిత్రి : చదివి తెలుపు ధిక్కారం! ॥బాలి॥

సూత్రధారి 1; వూలే (బ్రాహ్మణ్య విధానాల్ని ఖండించినా, (టబ్రావ్మాణ వితంతువుల్ని చేరదీసి ఆశ్రయం కల్పించాడు. మళ్లీ పెళ్లికి నోచుకోక, కోరికల్ని అణచుకోక అడ్డదారుల్లో గర్భవతులైన బ్రాహ్మణ వితంతువులు ఆత్మహత్యలకు సిద్ధపడుతుంటే వారించి, వారికో పెద్ద దిక్కుగా నిలిచాడు. తగిన వైద్యం చేయించి సుఖ ప్రసవం జరిగేలా చూశాడు. వారికి కలిగిన పిల్లలకు ఫూలే దంపతులు విద్యాబుద్ధుల్ని నేర్పించారు. తమకు పిల్లలు కలుగకపోగా, వారి పిల్లవాడినే తమ దత్త పుత్రుడిగా స్వీకరించి ఆదర్శంగా నిలిచారు.

2 సూత్రధారి: తమ ్రాహ్మణ్యాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడన్న కోపంలో (బ్రాహ్మణులు జ్యోతిరావు ఫూలేపై చాడీలు చెప్పి, బలవంతంగా అతని తండ్రియైన గోవిందరావు ఫూలేచే ఇంటి నుంచి గెంటి వేయించినా, రౌడీలతో కొట్టించాలని యత్నించినా, చెక్కుచెదరని ధైర్యంతో జ్యోతిభా వూలే తన ఆశయాల్ని విస్మరించక ఎదిరించాడు. ఆశించిన లక్ష్యాల్ని సాధించాడు. (బ్రాహ్మణేతరు

151

డని ఛత్రపతి శివాజీ సమాధిని సైతం నాటి పీష్వాలు మరుగున పదేయగా, జ్యోతిభా ఫూలే గుర్తించి ప్రకటించి ప్రసిద్ధం చేశాడు. సామాన్యరైతుగా కష్ట నష్టాలు చవిచూసిన ఫూలే, రైతులకు దీర్మకాలిక అప్పుల్ని తక్కువ వడ్డీకి ప్రభుత్వమే కల్పించి ఆదుకోవాలని సూచించాడు. పేద రైతుగా నష్టపోయిన జ్యోతిరావు పూనాలో పూలమ్మే వ్యాపారంతో కుదుటపడి, “జ్యోతిభా పూలేగా పేరుగాంచాడు. పూలమ్మిన చోటనే పూనా పట్టణానికే మున్సిపల్‌ కమిషనర్‌గా ఎదిగి, 1876 నుంచి 1882 వరకు సామాజిక సేవలందించాడు

1 సూత్రధారి: అతని నిర్విరామ సమాజసేవకు గుర్తింపుగా బొంబాయి - పూణే పొర సంఘాలు పూలేను 'మహాత్మ' బిరుదుతో సన్మానించ నెంచగా, సనాతన బ్రాహ్మణులు అభ్యంతరం ప్రకటించారు. అయినా బరోడా మహారాజు సయాజీరావ్‌ గైక్వాడ్‌ నాటి పౌరుల సన్మాన సభలో ఫూలేను 'మహాత్మా' బిరుదంతో సత్కరించి గౌరవించాడు. భారతదేశంలో 1888లోనే ప్రధమ 'మవాత్మా' బిరుదు బడసిన నిజమైన మహాత్ముడు జ్యోతిభా పూలే! అందుకే తర్వాతి కాలంలో “భారతరత్సుయైన అంబేద్కర్‌, ఫూలేను మహాత్ముడే కాదు మన జాతిపిత యని శ్లాఘించాడు. ప్రాచీన కాలంలో బుద్ధుడు, ఆధనిక కాలంలో జ్యోతిభా ఫూలేయే తనకు మార్గదర్భ్శకులని భావించి భక్తితో సమాదరించాడు. 1890లో జ్యోతిభా పరమపదించగా, 1891లో అంబేద్మర్‌ జన్మించడం విశేషం! గణనీయం! ఆ తర్వాత ఆయననిలా కీర్తించడం సదా స్మరణీయం! (అంబేద్యర్‌ ప్రవేశిస్తూ)

అంబేద్యర్‌ _ : జ్రోత్రలివే ! జోతలివే!

జ్యోతిభా ఫూలే! 152

అతి శూ(పద్రుల ఆశా -

జ్యోతివే ఫూలే! జో!

(అంటూ జ్యోతిభా పటానికి పూలు వేస్తాడు)

సర్వజన సమానత్వం

సదా మానవత్వం

కులమత రహితం

ఆయెను నీ అభిమతం!

అందుకే నీ చరితం

అందరిచే సన్నుతం! జో!

ఆనాటి బుద్దునిలా

ఈనాటి కార్యసిద్ధునిలా

అలరారిన జ్యోతిభా!

అమరనేత జ్యోతిభా!

నీ చరితం చిరస్మరణీయం!

నీ మార్గం సదా ఆచరణీయం! ॥జోః (అంటూ నిష్కమించగానే- ) (నర్తకులు ప్రవేశించి)

కోరస్‌ ; మహాత్నా....

నీ చరితం చిరస్మరణీయం

జ్యోతిభా!...

నీ మార్గం సదా ఆచరణీయం జో! (అంటూ జ్యోతిభా ఫూలే పటానికి పూలు సమర్పిస్తూ, వలయాకారంగా నర్తిస్తూ వెళ్లిపోతారు - )

ఎప్టస్ణణ 153

“'భారతరత్తు అంబేద్కర్‌! (సంగీత, నృత్య రూపకం) నాట్యంతో రంగస్థలంపైకి నర్తకులు ప్రవేశిస్తారు. సూత్రధారులు ఎలుగెత్తి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ను నూ(త(ప్రాయంగా స్తుతిస్తారిలా- సూత్రధారులు :; వినుడి వినుడి అంబేద్కర్‌ గాధ వినుడీ జనులారా! నృత్య గానముల, సత్యశోధనల కనుడీ కనులారా!

  • జతులు - 1వి॥ తెల్లదొారలకంటే హీనంగా నల్లదొరలు గావించినట్టి నానా వికృత చేష్టల్ని అహంభావ దుశ్చర్యల్ని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ బలంగానె చాదస్తుల్ని ఎదుర్కొన్న వైనాలన్నీ ఎదురీదిన ఘన కార్యాల్నీ మనసారా వీక్షించండీ! మహితాత్మను దర్శించండీ! ॥వి॥ నర్తకులు : _ భీమా బాయీ - రాంజీల నోము ఫలంగా - మహోజ్జ్వలంగా పద్నాల్లవ సంతానంగా పద్నాల్గ్లున ఏప్రిల్‌ నెలలో 154

ఉదయించెను మన అంబేద్కర్‌ అరుణారుణ ప్రభాతంలా!... పుట్టుకతోనే పరిమళించే ప్రతిభా పారిజాతంలా!... గుడిలో - గుడిసెలో - మసీదులో సడిగా - వడిగా - సమానంగా సూర్యకిరణములు వాలిననూ గాలి కెరటములు దూరిననూ బడిలో కూడ అస్పృశ్యతయే పంతులు సైతం పాటిస్తుంటే... అంటరాని వాడంటూ మిత్రులు అదే పనిగ అవమానిస్తుంటే... (స్పాట్‌లైటొలో గోనె సంచిపై మూలకు కూర్చొని ఆయా గొప్ప జ్ఞానమంబేద్మర్‌ పొందెను! దృశ్యాలు) భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ పొందెను! “అంబేద్మనో అను టీచరు మాత్రం భీమ్‌రావుపై వాత్సల్యంతో ఆహారం అందించేవాడు ఆప్యాయంగా చూసేవాడు “అంబావదేకరొ అసలు పేరును “అంబేద్కర్‌ొగా మార్చించాడు! పెద్ద కుటుంబంతో 'రాంజీ' చిన్నగదిలోన నివాసమున్నా అంబేద్మర్‌ను చదివిపించగా అధిక (శ్రద్ధనే చూపించాడు! అగ్ర కులస్తులు సంస్కృత భాషను 155

అసలే చదువ నీకున్నా స్వయంశక్తితో అభ్యసించి జయం అన్నిటా గాంచాడు! 'మెరిటొలొ “మెట్రిక్‌ ప్యాసవగా సంఘ సంస్కర్త ఎస్‌.కె. బోలే సన్మాన సభ జరిపించాడు, అంబేద్కర్‌ నభినందించాడు! మహనీయుడు 'కేలూస్కర్‌' గౌతమ - బుద్ధుని పుస్తక మందించాడు! బుద్దుని గాధను చదివిన తదుపరి బౌద్ధమతాన్నభిమానించాడు! పగలంతా రద్దీగా వుండే బొంబాయి 'బైకుల్లా' మార్కెట్‌యే అర్ధరాత్రి వేదికగా ఏర్పడ రాంజీ అంబేద్మర్‌ పెళ్లి రమాబాయితో జరిపించే! బాల్య వివాహం గావించే! తొమ్మిదేళ్ల భార్యకు అంబేద్మర్‌ నెమ్మదిగా చదువును నేర్పించే! సాత్వికురాలగు ఆ యిల్లాలు సంసారం తెలివిగ నడిపించే ఉమ్మడి కుటుంబ బాధ్యతలన్ని యుక్తిగ భక్తిగ నిర్వహించే... దారిద్యంతో అంబేద్కర్‌ దయనీయ స్థితిలో వుంటే

156

చదువుకు కూడ అంతటితో స్వస్తి చెప్పాలనుకుంటుంటే “కేల్రూస్మర్‌” అంబేద్కర్‌ను “బరోడి రాజా కాలేజీలో భద్రంగా చేర్చించాడు! “బర్సర్‌” యిప్పించాడు! కాలేజీలో ప్రొఫెసర్‌ ముల్లర్‌ కారుణ్యంతో ఆదరించినా... “కాలేజీ క్యాంటీన్‌'లో (బ్రాహ్మలు నీళ్లకు - “టీలకు దూరం చేసిరి! అంటరాని వాడంటూ అనేక అవమానాలకు బలిగావించిరి! అయినా కసితో - కృషితో బి.ఏ.లో ఉత్తీర్ణుడాయెను! ఆపై మహారాజు సాయముతొ అమెరికా విద్యార్థిగ చనెను! అమెరికాలో అందరితో కలిసిమలసీ భుజించడం సమభావంతో చరించడం సంపాదిస్తూ చదువుకోవడం అంబేద్మర్‌ నానంద పరచెను! అభ్యుదయపు మార్గాన్ని చూపెను! వ్యవధికి ముందే పరిశోధనల వ్యాసాల రచించి, ప్రశంసలు పొందెను! 'కాలంబియా' యూనివర్సిటీ “డాక్టరేటు” పట్టాను గడించెను! 157

అతని సిద్ధాంత (గ్రంథాన్ని లండన్‌ సంస్థ అచ్చువేసెను! అంబేద్మర్‌ దాన్ని కృతజ్ఞతగా బరోడ రాజుకె అంకితమిచ్చెను! నీగ్రో జాతిని సంస్కరించిన చైతన్యాన్ని రేకెత్తించిన “వాషింగ్టన్‌ జీవితచరిత్ర అమెరికా రాజ్యాంగ సవరణ అంబేద్మర్‌ను అకర్షించెను! లక్ష్యసాధనకు ఉపకరించెను! ఇచ్చిన మాటకు కట్టుబడి ఇండియాకు విచ్చేయగనే బరోడ రాజు సంస్థానంలో పని చేయాలని బయలుదేరెను! అతనికి స్వాగత - సత్కారాలు అందివ్వగ రాజాజ్ఞాపించెను! అయినా గిట్టని అగ్రజాతి అవమానాలే చవిచూపించెను!... ణయ

(బ్రాహ్మడు : అంటరాని అంబేద్మర్‌కా

(ప్రవేశిస్తూ). అతి మర్యాదల స్వాగతాలు? మాలకు తీసెయ్యాలీ రెడ్‌ కార్పెట్లు! మూలకు తోసెయ్యాలీ, ఏర్పడనట్లు!... (అంటూ కార్పెట్‌ తీసేస్తాడు)

నర్తకులు : అఆవిధి మిగతా సిబ్బంది కలిగించిరి ఆయన కిబ్బంది!

158

ఉండడానికి వసతిని కూడ ఉక్రోషంతో దూరం చేయగ 'కేలూస్కరొకు స్నేహితుడైన సహృదయ ఆచార్యుండొకరు వసతి నివ్వగా కష్టంగానే ఉద్యోగాన్ని చేయనెంచెను! కాని పదేళ్లు ఆవిధిగా పనిచేయలేక అంబేద్మర్‌ బొంబాయికే తిరిగి వచ్చెను! బోధన వృత్తిని చేపట్టెను! నిమ్నజాతి ప్రొఫెసర్‌గానే నీచంగా మొదట చూసినా అతని బోధనా నైపుణ్యానికి ఇతర కాలేజి విద్యార్థులూ అకర్షితులై అభ్యసించిరి! అంబేద్కర్‌ నభిమానించిరి! “కొల్హాపూర్‌ రాజా యిచ్చిన కొండంత సహకారంతో “లా చదివేందుకు అంబేద్కర్‌ లండన్‌ కూడా వెళ్లాడు! రెండేళ్లకే న్యాయశాస్త్రము అర్థశాస్త్రముల పట్టాలతో దాక్టరేట్‌ సాధించాడు! “దర్జాగా తిరిగొచ్చాడు! మొట్టమొదటి నిమ్నజాతి “బారిష్టరొగా నిలిచాడు! 159

నేపథ్య వ్యాఖ్యానం : 1918 మార్చి 28, 24 తేదీలలో బరోడా మహారాజు అధ్యక్షతన అఖిల భారత దళిత మహాసభలు మొదటిసారిగా బొంబాయిలో జరిగాయి. ఈ సభల్లో తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ కూడ పాల్గొని ప్రసంగించారు. 19319 చట్టం ద్వారా ప్రభుత్వంలో మొట్టమొదటి సారిగా దళిత జాతి ఉనికి అందరికీ తెలిసివచ్చింది. కేంద్ర అసెంబ్లీలోని 14 మంది అనధికార సభ్యులలో ఒక దళిత వ్యక్తి ఉండడం జరిగింది. అఖిల భారత _ కాంగ్రెస్‌ సమావేశాల్లో కుల, మత వివక్ష కూడదని నాయకులు చెప్పన్నాా వాస్తవిక పరిస్థితుల్లో మార్పురాలేదు. దాంతో అల్పసంఖ్యాక వర్గాల నాయకులు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ముస్లింలకు మహ్మదలీ జిన్నా నిమ్నజాతులకు అంబేద్మర్‌ అండదండగా నిలిచారు, దళిత జాతుల జనాభా ననుసరించి అసెంబ్లీలో కాన్ని సీట్లు వుండాలనీ, బ్రిటిషు వారిని స్వపరిపాలన అడిగే ముందు యీ విషయం విధిగా గమనించాలని అంబేద్కర్‌ వాదించడమే గాక “మూక్‌ నాయక్‌” పత్రికను స్థాపించి, అందరి దృష్టి నాకర్షించాడు. 1927లో మహారాష్ట్రలో మారుమూలలో వున్న “మహద్‌” (గ్రామంలో వర్ణాశ్రమ ధర్మాల పేరుతో అగ్రవర్జులు దళితుల్ని బావిసీరు - చెరువునీరు తాకకుండా అవమానిస్తుంటే, అక్కడ మహా సభల్ని నిర్వహించి, దళితుల్ని చైతన్యవంతుల్ని చేశాడు... అంబేద్మర్‌. : అణగద్రొక్క బడ్డ జాతి మనదిరా! దళిత జాతి బిడ్డ లేచి కదలిరా! దళిత బృందం :; ॥ అణగ॥ 160

అంబేద్మర్‌ : అంటరాని తనమంటూ ఊరికవతలే వుంటూ గుడికి ప్రవేశం లేకా చెరువు నీరు తాకరాక గుణుగుతు జీవించాలా? గుద్గురిమి చలించాలా? తేల్చుకో యికనైనా... మార్చుకో మనసైనా... అంబేద్కర్‌ & కోరస్‌ : అణగ! ఉత్తేజమే ఉచ్చ్వాసగా ఉద్వేగమే నిశ్వాసగా అ(గ్రవర్ణజాతి నింక ఉ([గంగా ఎదిరించగ ఉత్తుంగ తరంగంగా కదలాలీ! ఊరిచెరువు నీరింకా తాగాలీ! మనం కూడ మనుషుల మను సత్యాన్ని జనం కళ్లు తెరిచి తెలుసుకోవాలీ! అంబేద్కర్‌ & కోరస్‌: ॥అణగ॥ (అంబేద్కర్‌ దళితులతో ఉద్యమంలా కదలివెళ్లి, ఊరి చెరువు నీరు తాగేలా చేస్తాడు. అగ్రవర్డులు అద్దుకోగా ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. అంతలో జడ్జి ప్రవేశిస్తాడు.) జడ్జి. : గాలిలాగ ఊరిచెరువు నీరు కూడ అందరిదీ! నిమ్నజాతి జనులికపై 161

నీరు వాడు కోవచ్చు! గుళ్లలోను ప్రవేశించి ఎల్లెడలా సంచరించి హిందువులా బ్రతకవచ్చు! అందరితో మెలగవచ్చు! (దళితులు చప్పట్లు చరుస్తూ - ఆనందంగా అరుస్తారు) అంబేద్మర్‌. :_ (హర్షంతో) విజయం! విజయం! తొలి విజయం! నిమ్నజాతుల పోరాటంలో నిజవిజయం! బృందంతో పాటుగా : ॥వి॥ (అంటూ అంబేద్మర్‌ ఆనందంతో తన వాళ్లతో తిరుగు ముఖం పడతాడు.) వ్యాఖ్యానం : ఆ తర్వాత అంబేద్కర్‌ 1927లో బొంబాయి లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నామినేటు అయ్యాడు. బడ్జెట్‌, పన్ను వసూళ్లు, విద్యా విధానం విషయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రభుత్వ సర్వీసుల్లో దళిత అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని బైటిషు ప్రభుత్వాన్ని నిలదీయగా, అప్పటి గవర్చర్‌ ఇెస్టీవిల్సన్‌ మందలించబోయాడు. కాని అంబేద్కర్‌ ప్రత్యక్ష సాక్ష్యంగా విద్యాధికుడైన జాదవ్‌ను అభ్యర్థిగా చూపించాడు. ఫలితంగా ప్రభుత్వ వైఖరి మారింది. జాదవ్‌ని డిప్యూటీ కలెక్టర్‌ పదవి వరించింది. గాంధీ దండి సత్యాగ్రహానికి పదిరోజుల ముందే అంబేద్మర్‌ “నాసిక్‌లో దేవాలయ ప్రవేశోద్యమం తలపెట్టాడు. అందుకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు కొన్ని నెలలపాటు కాలారాం 162

దేవాలయాన్ని మూసి వేశారు. దళితుల పిల్లల్ని స్కూళ్ల నుండి తీసేయడం, తినుబందారాల్ని వాళ్లకు అమ్మకుండా అడ్డుకోవడం, ప్రధాన రహదారుల్లో నదవనివ్వకపోవడం లాంటి దుశ్చర్యలకు పూనుకొన్నారు. పర్యవసానంగా అనేక ఘర్షణలు, రక్తపాతాలు జరిగాయి. 8.8. 1980 నాడు నాగపూర్‌లో జరిగిన అఖిల భారత దళిత (ఆయా మహాసభకు అంబేద్మర్‌ అధ్యక్షత వహించి, స్వాతంత్ర్య సాధన ఛాయా వల్లనే దేశ ప్రగతి - అట్టడుగు వర్గ సుగతి సాధ్యమవుతుందని చిత్రాల్ని _ నొక్కిచెప్పాడు. కాని కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ దళితులకు తెరపై తగిన రౌండు టేబుల్‌ సమావేశాల్లో తమ ప్రతినిధులు కూడ చూపడం) పాల్గొనాలని తీర్మానం గావించాడు. తత్‌థలితంగా 12.11.1980 నాడు టిటిషు ప్రభుత్వం భారత ప్రజలకు నంతృవ్హికరంగా వుండే రాజ్యాంగ (వ జాళికను రూపొందించడానికి భారత రాజకీయ పార్టీలతో లందన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబేద్భర్‌ను ఆహ్వానించింది. దళితుల సమస్యల్ని బ్రిటిషు పార్లమెంటు సభ్యుల దృష్టికి అనేక విధాల అంబేద్మర్‌ తీసుకువచ్చాడు. తన ఉపన్యాసాలతో, పత్రికా వ్యాసాలతో ప్రపంచం గుర్తించేలా చేశాడు. అందుచేత అంబేద్కర్‌ను చూడాలని - ఆయన అభిప్రాయాలను స్వయంగా వినాలని గాంధీ ఆహ్వానించగా, గౌరవభావంతో వెళ్లి కలిశాడు. (గాంధీ మవ్మదీయులతో, యూరోపియన్లతో మాట్లాడుతుంటే అంబేద్కర్‌ వెళ్లి నమన్మరించి కూర్చుంటాడు, గాంధీ కాస్సేపయ్యాక అంబేద్కర్‌ని పరీక్షగా చూసి పలకరిస్తాడు) 163

గాంధీ : అంబేద్కర్‌ అంటే మీరేనా? హరిజన నేతా మీరేనా? కాంగ్రెస్‌ పైనా - నాపైనా “యాంగ్రతత్వం మీదేనా? మీ సమస్య మతపరమైనదిగా భావిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ! అస్పృశ్యత నివారణకై ఇరవై లక్షలు వెచ్చించాము! అయినా కాంగ్రెస్‌నే ఎందుకు అతిగా విమర్శచేస్తున్నారు? అంబేద్మర్‌ _ : అందుకు కారణముంది మహాత్మా! (ఆవేశంగా) అనాదిగా మాకణచివేతలే! లోతుగా తరచిచూడు మహాత్మా! లోపల అన్నీ నరకయాతలే! నిజంగ కాంగ్రెస్‌లోన నీతి - నిజాయితీలే వుండుంటే దళితజాతి అభ్యున్నతికై దండిగ శ్రమపడి వుండుంటే దళితుల కాదరణా దక్షేదే! దగా పడుటయూ తప్పేదే! మీకు స్వరాజ్యం ఎంత ముఖ్యమో? మాకు అభిమాన మంతే ముఖ్యం! గాంధీ : స్వతంత్ర సాధన కోసం మేము సర్వదా కృషి చేస్తుంటే స్వచ్చందంగా సహకరించాలి! నిర్షంద్వంగా తోడుండాలి! 164

అంబేద్మర్‌ : సవర్ణ హిందువులే మమ్ముల (ఆవేదనగా) వివక్షతకు గురి చేస్తుంటే కుక్కల కంటే హీనంగా కుటిలత్వంతో చూస్తుంటే స్వరాజ్యమైనా - ఏరాజ్యమైనా సమస్యనంతం చేస్తుందా? గాంధీ : (ఓదార్పుగా) అనాదిగానూ నేనూ అస్పుశ్యత ఖండిస్తున్నా! విశాల భావంతో చెప్పే నా మాటను వినుమంటున్నా! హిందువులందున భాగంగా ఇంత కాలముగ వుంటున్న దళితుల కోసం రాజకీయముగ కోరుతున్న ప్రత్యేకతలన్ని ఆత్మహత్య సదృశమంటున్నా అందుకే అవి వద్దు - వద! అంబేద్మర్‌ : (ఆవేశంగా) ఇదే కదా మీ కాంగ్రెస్‌ హద్దు ఇక చర్చలు మనకెందుకు లెద్దు! (అంటూ తన వాళ్లతో లేచి వెళ్తుంటే, అందరూ నోళ్లు తెరచి చూస్తారు, ఆశ్చర్యంగా) వ్యాఖ్యానం : లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనడానికి మళ్లీ 15.8. 1981 నాడు అంబేద్మర్‌ బొంబాయి నుండి ఓడలో బయల్దేరి వెళ్లాడు. గాంధీ, నెహ్రూ, పటేల్‌, 165

సరోజినీనాయుడు అత్యవసరంగా సిమ్లాలో వున్న వైస్రాయిని అత్యవసరంగా కలియడం వల్ల ఆలస్యంగా సెప్టెంబర్‌ 12న లండన్‌ చేరుకున్నారు. గాంధీ సెప్టెంబర్‌ 15న మొదటిసారిగా యీ సమావేశంలో పాల్గొని ప్రసంగించాడు. భారతదేశపు అన్ని పార్టీలకు, కులాలకు - మతాలకు తమ కాంగ్రెస్‌ పార్టీయే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ప్రకటించాడు. గాంధీ దళితుల్ని మైనార్టీల్లో చేర్చకపోవడంపై అంబేద్కర్‌ అసంతృప్తిని వెల్లడించాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గ ప్రాతినిధ్యం కావాలని పట్టుపట్టాడు. ఈ విషయంలో కమిటీ తుది నిర్ణయాన్ని బ్రిటిషు ప్రధానికే వదలివేశారు. గాంధీ మత దృష్టి - మానవతా దృష్టి రాజకీయాలతో ముడిపడి వుంటే, అంబేద్మర్‌ దృష్టి మాత్రం దళిత సాంఘిక అభివృద్ధికే అంకితమై వుండేది. ఆనాటి రాజకీయ పరిశీలకులు వీరిద్దరినీ వసిష్ట- విశ్వామిత్రులుగా భావించేవారు! 1982 ఆగస్టు నెలలో బ్రిటిషు ప్రభుత్వం మైనారిటీల కమిటీ నివేదికపై కమ్యునల్‌ అవార్డు ప్రకటించింది. తద్వారా దళితులకు రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేక స్థానాలతోపాటు తమ తమ ప్రత్యేక ప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి ఒక ఓటును, జనరల్‌ అభ్యర్థిని ఎన్నుకోవడానికి మరొక ఓటును వేసే హక్కు దక్కింది. జైలులో వున్న గాంధీజీ యీ విషయం వినగానే గాభరాపడి, వెంటనే బ్రిటిషు ప్రధానికి నిరసనగా టెలిగ్రాములు యిచ్చాడు హరిజనులు హిందువులలో అంతర్భాగం! కావున యీ విధంగా వేరు చేయవద్దంటూ ్రతిఘటించాడు. అందుకు అంబేద్కర్‌ వెంటనే వ్యతిరేకించాడు. కమ్యునల్‌ అవార్జునే సమర్ధించాడు. దాంతో గాంధీ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నాడు. 166

సెప్టెంబర్‌ 19వ తేదీన బొంబాయిలో హిందువులంత సమావేశమై ప్రత్యేక నియోజకవర్గాలు అక్కరలేదని అంబేద్మర్‌ బైటిషు ప్రధానికి చెప్పాలని తీర్మానించారు. దళితుల చేత (తెరపై. కూడ అలాగే తీర్మానాలు చేయించారు. శతాబ్దాలుగా ఎదురు ఆయా చూస్తున్న కల నిజమయ్యే వేళ యిలా చెదరగొట్టే ప్రయత్నం చిత్రాల్ని చేస్తున్నందుకు అందరిపై అంబేద్కర్‌ ఆగ్రహించాడు. చూపడం) మహ్మదీయులకు, సిక్కులకు గల ప్రత్యేక నియోజకవర్గాల వల్ల దేశ ఐక్యతకు భంగం వాటిల్లనప్పుడు - దళితుల ప్రత్యేకత వల్ల భంగం ఎలా కలుగుతుందని వాదించాడు. అప్పుడు పటేలు, నెహ్రూ, పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవ్యా, రాజాజీలు శుష్కించిన గాంధీని చూడరమ్మని టెలిగ్రాం పంపించగా, అంబేద్కర్‌ విధిలేక వెళ్లి, జైలులో దీక్షలో వున్న గాంధీజీని కలిశాడు... (జైలు దృశ్యం - ఒక మూల బక్కచిక్కిన దేహంతో గాంధీ దీనంగా కూర్చుని వుంటే, అగ్రనేతలు కంటతడి పెట్టుకుంటూ కనిపిస్తుంటే, అంబేద్మర్‌ సమీపించి ప్రశ్నిస్తాడు యిలా -) అంబేద్మర్‌ ౩ ఓ మహాత్నా! ఓ మహోదయా! మాపై మీకు యింత నిర్ణయా? చిరకాలానికి సాధించిన మా చిన్న ప్రగతినీ చిదిమేస్తారా? ఆమరణ దీక్షలనే పూని మా - ఆశలనంతం చేస్తారా? గాంధి : ఓ అంబేద్కర్‌ నాయకా! దళిత జాతి ఉద్ధారకా! ఓపిగ్గా నామాట విను! ఒడు దొడుకుల సవరించి చను! 167

నా ప్రాణం నిలపాలనుకుంటే దేశ సమైక్యత కావాలంటే నాతో సహకరించాలి! జాతిని సంరక్షించాలి! అంబేద్మర్‌ : నాజాతిని మీరుద్ధరించగా నడుం బిగిస్తానంటే తప్పక నే సహకరిస్తా! ఇప్పుడె ప్రాణాలైనా యిస్తా! మహాత్ములెందరో పుడుతున్నారు - గిడుతున్నారు! అంటరాని వారూ మాత్రం అలాగనే వుంటున్నారు! ఆనాడే యీ దీక్ష పూనితే “రౌండ్‌ టేబులే” అదిరేది! ఆశించిన మన స్వాతంత్ర్యం అందరి చేతికి అందేది! గాంధి : అంటరాని తనమందున నీవు ఆదిత్యునిలా పుట్టావు! అందులో నే పుట్టకపోయిన దానికి దత్తుడి నయ్యాను! నీ 'ప్యానలొ పద్ధతి సమ్మతమే! కాని అన్నటికి వర్తించాలి! హిందూ జాతి సమ(గ్రతకై అందరు ఏకం కావాలి! కాదంటావా? బెనంటావా? 168

అంబేద్మర్‌ : కాదంటే నే దానవుణ్ని! బెనంటే మీ సహచరుణ్ని అడకత్తెరలో పోకలా అయిపోయిన ఓ దళితుజ్ని! దీక్షను యికపై విరమించి దిక్సూచిగ నడిపించండి! రేపూ మాపని నిరాశపరచక “రెఫరెండమ్‌” పాటించండి! గాంధి : అయిదేళ్ల 'రెఫరెండమ్‌*ే అంగీకారం తెలపాలి! ఆ విధిగా నా ప్రాణాలు యీదినమున నీవే నిలపాలి! సత్యాగ్రహమున ఎప్పటికీ నాతో చేతులు కలపాలి! (అంటూ చేయిచాపగా, అయిష్టంగానే అంబేద్కర్‌ చేయికలిపి, వెనుదిరుగుతాడు. అగ్రనేతలు అతన్ని అభినందిస్తారు) వ్యాఖ్యానం : అలా గాంధీని పూనా ఎరవాడ జైలులో అంబేద్కర్‌ కలిసి, ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడానికి సహకరించడంతో దళితులు రెండు ఓట్ల హక్కును కోల్పోవలసి వచ్చింది. కాని సవర్జులు రాష్ట్ర - కేంద్ర అనెంబ్లీలలో ఎక్కువ సీట్లు దళితులకివ్వాల్సి వచ్చింది. ఈ ఒప్పందం 1932 సెప్టెంబర్‌ 26న భారత ప్రభుత్వ చట్టంలో భాగమైపోయింది. 1935లో అంబేద్భర్‌ అర్జాంగియైన రమాబాయి మరణించగా ఆయన ఎంతో పరితపించాడు. అంబేద్కర్‌ను 'లా” కాలేజి ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం నియమించగానే, రాజకీయాల్లోంచి 169

ఆయన తప్పుకుంటాడన్న పుకారు పుట్టింది. 1987లో జరుగుతున్న ఎన్నికలకై మిత్రుల సలహాలతో అంబేద్కర్‌ “ఇండిపెండెంట్‌ లేబర్‌పార్టోని స్థాపించాడు. తనతో పాటుగా 17 మందిలో 15 మందిని నెగ్గించాడు. ఎంతకూ మారని సంకుచిత పొందూ మతాన్ని వీడి, బౌద్ధమతంలో కలవడం మేలని తలచాడు. “మతం మనిషి కోసం- కాని మనిషి మతం కోసం బ్రతకరాదని భావించాడు. మతం మనిషిని మానవత్వం నుండి దైవత్వానికి నడిపించాలని బోధించాడు. ఎన్నికలలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించినా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోగా, బాధ్యతగా ముందుకు వచ్చిన పార్టీకి ప్రభుత్వం అప్పగించడంలో గవర్నర్‌ తప్పులేదని అంబేద్మర్‌ రాజ్యాంగ సూత్రాల్ని విశదీకరించాడు. 1940 అక్టోబర్‌లో గాంధీ కాం(గైస్‌ ఆధ్వర్యంలో 'సహాయ నిరాకరణోద్యమం' మొదలైంది. అహింసా సిద్ధాంతాల్ని అనుసరించి రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొనరాదన్న వాళ్ల నిర్ణయాన్ని అంబేద్కర్‌ ఖండించాడు. అభిప్రాయ భేదాలున్న ముస్లిములతో కలిసి కలహించేకన్న భారత్‌ - పాకిస్టాన్‌లుగా విడిపోవడమే మేలని సూచించాడు. చివరకు అత్యున్నతమైన “వైస్రాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలొలో అంబేద్కర్‌కు స్థానం లభించుటచేత దళితులకేగాక కార్మికులకు = శామికులకు న్యాయం జరిగింది. హైదరాబాద్‌ సంస్థానంలో మొదటి దళితుల సభ జరిపించడమే గాక అనేక కళాశాలల్ని స్థాపించిన - ప్రీ విద్యను ప్రోత్సహించిన 170

ఘనత అంబేద్మర్‌దే! ఆయనకు గౌరవ డాక్టరేట్‌ పట్టా యిచ్చిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదే! నాగపూర్‌లో 1942 జులైలో జరిగిన అఖిల భారత నిమ్నజాతుల మవాసభల్లో అంబేద్మర్‌ తన గంభీరోపన్యాసంతో 40 వేల మందిని ఆకట్టుకున్నాడు! (ేక్షకుల్ని చైతన్యవంతుల్ని చేశాడు... అంబేద్మర్‌ : న్యాయం - ధర్మం మన వైపున్నది

భయం వదలి ముందడుగెయ్యాలి!

కనీస మానవ హక్కుల కోసం

కదం దొక్కుతూ గళమెత్తాలి! ॥న్యా॥

విద్యా - ఉద్యోగవకాశాలు

విధిగా మనకూ కల్పించాలి!

కేంద్ర - రాష్ట్ర అసెంబ్లీల్లో

ప్రాతినిధ్యమూ సాధించాలి! 1న్యా!

గాంధీ - జిన్నా హిందూ - ముస్లిం

వర్గాలకె దుర్గాలై వుంటే

దళిత జాతి అభ్యున్నతి కోసం

దండిగ మనమే పోరాడాలి! ॥న్యాః

సంఘం - దేశం కార్మికుల

సంక్షేమంకై కృషి చెయ్యాలి!

కులాల - మతాల కుద్యాలన్ని

కూల్చి ప్రగతికై పాటుపడాలి! ॥న్వా॥

దళితుల ్రగతే నాశ్వాస,

దళితుల సుగతే నా ధ్యాస!

171

పాతాళానికి తొక్కిన జాతిని పైకి తేవడడమె నా ప్రయాస! ॥న్వాః వ్యాఖ్యానం : తన లక్ష్యాలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే స్వాతంత్ర్య సాధనకు సహకరించిన అంబేద్కర్‌ను, గాంధీ సూచనతో తొలి ప్రధాని నెహ్రూ తన క్యాబినెట్‌లో న్యాయశాఖా మంత్రిగా నియమించి గౌరవించారు. అంతేగాక రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా చేశాడు. ఆరోగ్యం సహకరించకపోయినా అంబేద్కర్‌ అత్యంత సమర్ధవంతంగా అయిదు నెలల్లోనే రాజ్యాంగాన్ని రూపొందించి అందరి (ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఏ రాష్ట్రానికారాష్ట్రం కాకుండా దేశమంతటికీ ఒకే రాజ్యాంగం - ఒకే విధమైన న్యాయ సూత్రాలు ఉండేట్లుగా రాజ్యాంగ రచన గావించిన అంబేద్మర్‌, స్వాతంత్ర్యం - సమానత్వం - సౌభ్రాతృత్వం అనే మూడు మౌలికాంశాలు స్థిరంగా వుంటేనే దేశం ప్రగతి శీలంగా వర్ధిల్లుతుందని ప్రబోధించాడు. ప్రభుత్వం 1949 నవంబర్‌ 26 నుండి యీ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చింది. అనితర సాధ్య రాజ్యాంగ నిర్మాతగా - దళిత భవిత నిర్ణేతగా, స్వార్ధ రహితనేతగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు డా॥ బి.ఆర్‌. అంబేద్యర్‌! (నర్తకులు పుష్పాలతో ప్రవేశించి, అంబేద్మర్‌ పటంపై పుష్పవృష్టి కురిపిస్తూ, ఆడుతూ పాడుతారిలా-) నర్తకులు : మాననీయుడు - అదర్శ ప్రాయుడు! మహాత్ముడు అంబేద్యర్‌ చరితార్జుడు! 172

అతడే అతడే దళిత భవిత నిర్లేత! అతడే అతడే మన రాజ్యాంగ నిర్మాత! పేదరికంలో పుట్టి పెరిగీ పెద్దల అస్సృశ్యతలకు మరిగీ మధ్యాహ్న మార్తాండునిమాదిరిగా విద్యల్లో విశేషంగ వెలిగీ లండన్‌ అమెరికాలొ చదివీ గుండె ధైర్యమే అండగ ఎదిగాడు! ॥మా॥ జ్వలిత దళిత జ్వాలలా మండాడు స్వాతంత్ర్య సమరంలో దూకాడు స్వతంత్ర భారత చట్టం సవరించి రాజ్యాంగ నిర్మాతగ నిలిచాడు! సమత, మమత, సమానతా భావంతో శాంతమూర్తి బుద్ధుని ప్రేమించాడు! ॥మౌ॥ (4 6. 2026 నాడు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌, టిఆర్‌ ఆడిటోరియంలో, గోవాద వెంకట్‌ అంబేద్దుర్‌గా, దా కోట్ల వాన్ముంతరావు

  • అనితారావుల దర్శకత్వంలో అత్వంత న్ఫూర్తిదాయకంగా ప్రదడ్డితం అస్హస్థం 173

భాగ్యరెడ్డి(వర్య) (సంగీత, నృత్య రూసకం) నేపథ్య వ్యాఖ్యానం : పారతంత్ర్యంలో మగ్గుతున్న దేశ స్వాతంత్ర్యంకై, బానిసత్వంలో బతుకుతున్న అట్టడుగు వర్గ సముద్ధరణకై గాంధీ - అంబేద్కర్‌లకు ముందే నడుం బిగించిన నాయకుడు, భాగ్యరెడ్డివర్మ అటువంటి మహనీయుడి చరిత్ర ఇంతకాలం మరుగున పడ్డ మాణిక్యంలా వుండి పోవడం శోచనీయం! అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన ప్రభుత్వం నివురుగప్పిన నిప్పుల్ని - గత పాలకులు చేసిన తప్పుల్ని ఎత్తిచూపుతూ మహనీయుల గాధల్ని మాననీయంగా అందరికీ తెలియజేసే ప్రయత్నంలో ఆవిర్భవించిందే, యీ “భాగ్యరెడ్డి వర్మ సంగీత - నృత్య రూపకం! ఈయన నాటి హైదరాబాద్‌ నగరం నడిబొడ్డులో రంగమాంబ ఆ వెంకయ్య పుణ్య దంపతుల పూజాఫలంగా 1888లో మే 22 నాడు బాగయ్యగా జన్మించి, ఆ తర్వాత క్రమక్రమ వికాసంగా “భాగ్యరెడ్డొగా “భాగ్యరెడ్డివర్మ”గా ఖ్యాతి గాంచారు. చిట్ట చివరిదాక 1906 నుంచే అట్టడువర్గ అభివృద్ధికై సమర శంఖం పూరించారు. ఆ విధి విధాన మెట్టిదో ఈ సంగీత నృత్య రూపకంగా తిలకిద్దాం! ఆ మహనీయుడి స్మరణతో పులకిద్దాం!.... (నర్తకులు పుష్పాంజలితో (ప్రవేశిస్తూ ఎలుగెత్తి గానం చేస్తారిలా-) నర్తకులు ; భాగ్యనగర్‌ భాగ్యోదయ సూర్యుడే “భాగ్యరెడ్డివర్మ!” 174

అంటరాని తన మణచిన ఆద్యుడే భాగ్యరెడ్డి వర్మా! భా! అతని జీవితమ్మే యిల ఆదర్శం అందరికీ! దీన జనోద్ధరణమే దిక్సూచి మనందరికీ! అతని చరిత - దళిత భవిత అవగాహన కలిగిద్దాం! అతని స్మరణకై నేదే అభివాదాలర్చిద్దాం! 1భా॥ ఎల *ఐ బజతులు.... మండే వేసవిలోన మార్తాండుని మాదిరిగా రంగమాంబ - వెంకయ్యల (తెరపై రాగోదయ ఫలితంగా సంబంధిత భాగ్యనగర భాగ్యంగా ఛాయాచిత్రాల్ని బాగయ్య జన్మించే! చూపడం) మన - బాగయ్య జన్మించే! కుల గురువు ప్రబోధిస్తూ 'శేడుయే రెడ్డియనుచు “బాగయ్య' అను పేరును భాగ్యరెడ్డిగా మార్చించే! ॥భా॥ గాంధీ - అంబేద్మర్‌లకు ముందే చైతన్యంతో 175

సాంఘిక అసమానతల్ని భాగ్యరెడ్డి ప్రతిఘటించే! చాదర్‌ఘాట్‌ సమీపాన “ఆది హిందూ భవనం” అదనుగా స్థాపించే! అస్పృశ్యత నణగించే! ॥1భా॥ “ధర్మ ప్రచారిణి” ద్వారా కర పత్రాలెన్నో ప్రచురించే! మాడపాటి - సురవరంల మార్తాలను సైతం తన మనసుకు నచ్చనిచో తగదంటు విఖేదించే! అంబేద్కర్‌ ఆశయాల్ని అనాడె సమర్ధించే! 1భా॥ అతని పూర్తి జీవితాన్ని “భాగ్యనగర్‌' గత గతాన్ని (క్రమంగా వీక్షిద్దాం! కైమాడ్పులు అర్పిద్దాం! ॥భా॥ ఎం అం తొతులు,.... మున్నూరు కాపు కన్య ముగ్ధ లక్ష్మీదేవిని భాగ్యరెడ్డి తన జీవిత భాగస్వామిగ వరించే! వారి పుత్ర రత్నంగా వర్ధిల్లగ “గౌతమ్‌” 176

వారసునిగ జన్మించే నాయకునిగ రాణించే! “పద్మశ్రీ” సాధించే! సూత్రధారి వ్యాఖ్యానం : మూసీ వరదలతో హైదరాబాద్‌ ముంపుకు గురియైన 1908లోనే 'దసరా' సందర్భంగా గొధ్రెను బలియివ్వడం కళ్లారా చూసిన భాగ్యరెడ్డి కళ్లు చెమర్చాయి. ఇక మీదట మాంసం భుజించరాదని - జంతు బలిని చేయరాదని స్థిర నిర్ణయం చేయించాయి. మూఢ విశ్వాసాల్ని - పాతకాలపు ఆచార వ్యవహారాల్ని నిరసిస్తూ “జగన్న్మిత్ర మండలిని స్టాపింపడేశాయి! నర్తకులు _ : జన హితమే తన హితమని అహింసయే అభిమతమని “జగన్మిత్ర మండలి"నే స్థాపించే! (స్పాట్‌లైటొలో సామాజిక చైతన్యం కలిగించే! భాగ్యరెడ్డివర్మ మద్యం - మాంసం పూర్తిగ అభినయం) మానేసిన వారికే... మండలిలో సభ్యత్వం అందించే 'సభకు ప్రవేశార్జతగా ప్రకటించే “ధర్మ ప్రచారిణి సంస్థను దానికి అనుబంధంగా స్థాపించి పుస్తకాలు ప్రచురించే!... ప్రచారాన్ని ఉధృతమే గావించే!... సంఘ సంస్కరణమే లక్ష్యమని అక్షరాస్యతయే మరి ముఖ్యమని ప్రాథమిక పాఠశాల ప్రథమంగా “ఇసామియా బజారులో స్టాపించే! 177

గన్‌ఫౌండ్రి, లింగంపల్లి, బౌగ్గులకుంట గణనీయ ప్రాంతాల్లో విస్తరించే! రెండున్నర వేల దళిత విద్యార్థులకు మెండుగ విద్యా బోధన గావించే! జోగినీలు - దేవదాసీలైనా... సంఘ భోగినీలు కారాదనుచూ దీన హీన వ్యవస్థనే ఖండించే దిక్సూచిగ నిలిచి నిర్మూలించే “మాన్య సంఘ"”మే ఆపైనా “జగన్మిత్ర మండలిగా అవతరించే! భాగ్యరెడ్డిని సంఘసంస్కర్తగా భాగ్యనగర మంతయు గుర్తించే! (తాళం మార్పుతో - త్రిశగతిలో)

(తెరపై ఆయా విజయవాడ ఆదిమాం(ధ్ర

ఛాయాచిత్రాల్ని మవాసభయు అతడినే

చూపడం) అధ్యక్షునిగా ఆదరించే! అతడి ప్రబోధం ప్రకాశించే! మాలపల్లి నవలలోన మంచి పాత్రగా ప్రవేశించే! వెంకటరెడ్డి పేరున భాగ్యరెడ్డి కనిపించే!... (తాళం మార్పుతో - చతురస్రగతిలో ) హిందువులందరి అవసరాలకై 'అంబర్‌పేటిలొ స్మశాన వాటిక నిర్మించాలని సంకల్పించే! నిధులను సైతం సమీకరించే! 178

'హైదరబాదులొ "ప్లేగు వ్యాధితో ఆపై *'కలరా - “మలేరియాతో అనేక పౌరులు మరణిస్తుంటే మృతదేహాలను తరలించాలని నగర శుభ్రతను పాటించాలని “స్వాస్త్రదళొను సంస్థాపించే! స్వయం సేవలను సమకూర్చే! అందుకు నిజాం అభినందనగా యోగ్యత పత్రంనే అందించే! “ధర్మ ప్రచారిణి” ఉత్సవాలలో ఆర్య సమాజం ఆహ్వానించి యోగ్యంగా జంధ్యం వేయించి భాగ్యరెడ్డికి “వర్మను బిరుదును (ప్రకటిస్తూ సన్మానించే! “భాగ్యరెడ్డి వర్మా”యని పిలిచే! దళితులనూ సభ్యులుగా చేర్చే! అ(గ్రవర్గులకొ సమాదరించే!... సూత్రధారి వ్యాఖ్యానం : కాని “ఆర్యసమాజ్‌ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటైన “వేద మంత్ర పరనం పోటీ"లో ఇసామియా ఐజార్‌ బడికి చెందిన ఐదేళ్ల దళిత విద్యార్ధి ప్రథమ ఐహుమతి సాధించగా, బాజీ కృష్ణారావు పండికుడు అభినందించి వేదిక మీదికి తీసుకురాగా బేగంపేట వైదిక ఆశ్రమ కార్యదర్శి అంటరాని దళిత విద్యార్ధి ఆ బహుమతికి అనర్హుడని దుర్భాషలాడాడు. అందుకు ఆగ్రహించిన భాగ్యరెడ్డి వర్మ కుత్సిత భావాలున్న ఆర్య సమాజాన్ని వదలి, బ్రహ్మ సమాజంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే బెంగాల్‌కు చెందిన 179

బ్రహ్మసమాజం నాయకుడైన భూపేంద్రనాధ్‌ను కలిశాడు. అతడు ప్రాఫెసర్‌ ఎన్‌. జి. వెల్లింకర్‌ వద్దకు వంపాదు. ప్రొఫెసర్‌ ఎన్‌.జి.వెల్లింకర్‌ ఆనాటికి హైదరాబాద్‌ వాసి కానందున బ్రహ్మ సామాజికులైన సరోజినీ నాయుడు, గోవింద రాజలు నాయుడు దంపతుల నివాసమైన 'గోల్డెన్‌ త్రెషోల్డోలో అతిధిగా వుండేవారు. 1914లో భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో 14 మంది దళితులకు ప్రా. వెల్లింకర్‌ బ్రహ్మ సమాజదీక్షను కలుగజేశారు. అప్పుడే భాగ్యరెడ్డి వర్మ “బ్రహ్మ సమాజ భవనంకై - ఆ తర్వాత అంబర్‌పేటలో హిందువుల స్మశానవాటికకై రాయబాలముకుంద్‌ ద్వారా నిధులను సమకూర్చి, ఏర్పాటు చేయడమే గాక (బ్రహ్మ సమాజమైనా- ఆర్యసమాజమైనా - దివ్య జ్ఞాన సమాజమైన కుత్సిత భావాలులేని సమానత్వ ధోరణులనే అలవర్చుకోవాలని భావించే వాడు. అందుకే సమాజంలోని దురాచారాల్ని ఎండ గడుతూ రాసిన నాటకాల్ని ప్రదర్శింపజేయడానికి “సంఘ సంస్కార నాటక మండలొని కూడ స్థాపించాడు. దళితుల చేతనే ఆ నాటకాలు వేయిస్తూ, మూఢ విశ్వాసాల మాడుపగులగొట్టే ప్రయత్నం చేశాడు. ఆంధ్ర మహాసభలు జరిగే ప్రదేశాల్లో కూడా ఆ నాటక ప్రదర్శనలు జరిపించాడు. పద్యం ; _ స్వార్థ సంఘాల మౌధ్యాలు సమసిపోవ (స్పాట్‌లైటొలో) దేవదాసీల, జోగిని దీనమురళి ప్రీలనందర్ని విడిపించి మేలు చేసె! బాధలణగార్చి విద్యల్ని బోధచేసె! (తాళం మార్పుతో) 180

నర్తకులు : పుట్టుకతో మానవులంతా ఒకటేనంటూ గిట్టని వారే అసమానతలను పెట్టారంటూ ఆర్య సమాజం - బ్రహ్మసమాజం ఏదైనా అందరినీ సమభావంతో చూడాలంటూ అహర్షిశలు బోధించాడు భాగ్యరెడ్డివర్మా అందుకోసమై కష్టించాడు భాగ్యరెడ్డివర్మా!... ॥పుట్టు! గృహపరిచారిక - కార్మికులా హక్కులకై పనులకు తగిన వేతనాలు ఇప్పించుటకై నడుం బిగించిన నాయకుడే భాగ్యరెడ్డి వర్మా “పంచాయితి సమితి” స్థాపకుడే భాగ్యరెడ్డి వర్మా... పీడిత - తాడిత కార్మికులా సంక్షేమంకై సంఘంలో తలయెత్తే తగవుల నణచుటకై “పంచాయితి"లో తీర్చు లివ్వగా 'ప్రభుత్వమ్ముకు వ్యతిరేకంగా కార్యాలను జరిపిస్తున్నాడని కట్టుకథల ఫిర్యాదులందగా కొత్వాలైన వెంకట రామారెడ్డీ సత్యాలన్నీ సమూలంగ వీక్షించీ భాగ్యరెడ్డి చేస్తున్న పనులన్నీ యోగ్యమైనవని తీర్మానించే!... 1 సూత్రధారి వ్యాఖ్యానం : అంటరాని వారిగా పిలువబడే దళితులే 'ఆది ఆంధ్రులని” అది హిందువులని, కావున తమను పంచములని పిలువరాదని సభాముఖంగా బెజవాడ సభలో తీర్మానించి, భాగ్యరెడ్డి నాటి మద్రాసు ప్రభుత్వానికి పంపగా, నాటి ప్రభుత్వంచే 1988లోనే 181

అందుకనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకే “ఆది హిందూ భవనంి పేరున భవనాన్ని నిర్మించినట్లు, అది దళితులకే అన్నట్లు అర్ధమవుతోంది.

2 సూత్రధారి వ్యాఖ్యానం : ఆదిహిందూ సదస్సులు జాతీయ స్థాయిలో 1920 నుంచే ఉత్తర భారతంలో అనేక చోట్ల జరిగాయి. 1981లో “లక్షలో జరిగిన ఆది హిందూ ప్రత్యేక రాజకీయ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించడమేగాక అంబేద్కర్‌ను అఖిల భారత దళిత నేతగా “రౌండు టేబుల్‌” సమావేశానికి వకైక ప్రతినిధిగా ఎన్నుకోవడం విశేషం! 'వర్మ' అనే పేరు అగ్రవర్ణ సంకేతంగా వుందంటూ సభ్యులు అభ్యంతరం తెలుపగా, వెంటనే తన పేరు చివరన యిక “వర్మ పదాన్ని త్యజిస్తున్నట్లుగా (ప్రకటించాడు. అప్పటి నుంచి భాగ్యరెడ్డివర్మ తిరిగి మొదటి భాగ్యరెడ్డిగా మారిపోయాడు.

1 సూత్రధారి వ్యాఖ్యానం : మగవారు మద్యమాంసాలకు, జూదాలకు లోను కారాదని, ఆడవారు జోగిని - దేవదాసి - మురళి వంటి దురాచార వ్యవస్థకు లొంగరాదని, అందుకై తీవ్రంగా పోరాడి, నిజాం చేత దేవదాసీ వ్యతిరేక ఉత్తర్వు కూడ సాధించాడు. 1918 నాటికే గౌతమ బుద్ధుడిని అభిమానించి, తనకు పుట్టిన పుత్రునికి గౌతమ్‌” అన్న పేరు పెట్టుకున్నాడు. పత్రికా నిర్వాహకుడిగా పలు గ్రామాలలో పర్యటించి, దళితుల దయనీయ స్థితిగతుల్ని వివరిస్తూ - కరపత్రాల్ని ముద్రిస్తూ, వారి అభ్యున్నతికై సంఘ సంస్కర్తగా అహర్చిశలు కృషి చేసిన సమతా మమతా - మానవతా మూర్తి మన భాగ్యరెడ్డి!

182

(భాగ్యరెడ్డి చిజ్రపటానికి అంజలి ఘటిస్తూ) నర్తకులు _ : సమత మమత మానవతామాూర్తీ!

తెలుగు దళిత భవితా తేజో దీప్తీ!

బంగరు భావాల భాగ్యరెడ్డీ!

(ప్రగతిశీల ధ్యేయాల పసిడి కడ్డీ!

అభ్యుదయాలెన్నో సాధించెను

అడ్డంకులసైతం ఎదురొడ్డీ!.... ॥స!

అతని ఆశయాలే ఆచరణీయం!

అతని లక్ష్యసాధనే ఆదరణీయం!

అతని చరిత - దళిత ఘనత, సదా స్మరణీయం!

అనవరతం ఆ చరితం అభివందనీయం! సః

(అంటూ నివాళితో నిషమిస్తారు)

183

పొందిన గౌరవ సత్కారాలు - పురస్కారాలు

  • 1971లో 'కనరా నీ దేశం' అవిష్కరణ సందర్భంగా యువసాహితీ సమితి సిరిసిల్లచే సత్కారం.

  • 1978లో కరీంనగర్‌ సారస్వత జ్యోతి మిత్రమండలి కవిసమ్మేళనం అధ్యక్షునిగా సత్కారం.

  • 1974లో “పోతుకూచి” సారథ్యంలో బెంగుళూరులో జరిగిన 6వ అఖిలభారత తెలుగు రచయితల మహాసభలో కవి సత్కారం.

  • 1974లో “అంతర్మధనం” ఆవిష్కరణ సభలో వేములవాడ భీమేశ్వరాలయ (ప్రాంగణంలో వానమామలై, సి.నా రె గార్లచే కవి సత్కారం

  • 1975లో సిరిసిల్లాలో పొర సన్మానం.

  • 1976లో 'వెలుగుమేడ' ఆవిష్కరణ సందర్భంగా 'యువ సాహితీ సమితి'చే కవి సత్మారం

  • 1977లో 'రవీంద్రభారతి'లో గవర్నర్‌ నమక్ష్మంలో అక్కినేని నాగేశ్వరరావుగారిచే కవి సత్మారం.

  • 1978లో రవీంద్రభారతి మినీ థియేటర్‌లో దేవులపల్లి రామానుజరావు

  • ఆవుల సాంబశివరావు (హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌), డా॥ సి.నా.రె గార్లచే కవి సత్కారం.
  • 1981లో 'అంధ్రజ్యోతి' వార పత్రిక ఉగాది కధల పోటీలో విజేతగా సత్మారం.

  • 1981లో 'రాగరథం' ఆవిష్కరణ సందర్భంగా త్యాగరాయ గాన సభలో, దా॥ దాశరధి, డా॥ సి.నా.రె, ఎస్‌.పి.బాలు గార్లచే కవి సత్కారం.

  • 1985లో “రవీంద్రభారతిలో కనకదుర్గ కళానికేతన్‌ (ఆర్‌ & బి) వారిచే కవి సత్కారం

  • 1987లో “పద్మాలయా స్టూడియో'లో పి. యశోదారెడ్డి, కృష్ణ- విజయనిర్మల గార్లచే “హాలాహలం” ఆవిష్టరణ సందర్భంగా కవి సత్కారం.

  • 1987లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుగారిచే ఉగాది సందర్భంగా రాష్ట్ర కవి సత్మారం,

  • 1989లో 'దేవులపల్లొ స్మారక పురస్కారం, 'ఆంధ్ర మహిళాసభ వారిచే.

  • 1991లో 'రాగసుధి క్యాసెట్‌ ఆవిష్కరణతో త్యాగరాయగానసభలో సి సుబ్రహ్మణ్యం, సి.నా.రె గార్లచే రచయితగా అభినందన సత్మారం.

184

  • 1992లో తెలుగు విద్యాలయ “బాలసాహిత్య” రచయితగా పురస్కారం.

  • 1992లో ముఖ్యమంత్రి ఎన్‌,.జనార్జనరెడ్డిగారిచే (ఉగాది) రాష్ట్ర కవి సత్కారం.

  • 1993లో “పెద్దరికం” చిత్రం శతదినోత్సవ సభలో చెన్నైలో కవి సత్కారం.

  • 1994లో 'శ్రారవద్వీపం” చిత్రం శతదినోత్సవ సభలో వాహినీ స్టూడియోలో కవి సత్కారం.

  • 1994లో “మనసా! తెలుసా?” కావ్యకర్తగా మల్లెమాల, కె.వి.రమణ, సి.నా.రె గార్లచే సత్కారం.

  • 1994లో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిగారిచే ఉగాది రాష్ట్ర కవి పురస్కారం.

  • 1995లో వేములవాడ దేవస్థానంలో ఎమ్‌. ఎల్‌.ఏ సి. హెచ్‌. రాజేశ్వరరావు, సినీనటి జమున, ఈ.ఓ. రఘుపతి గార్లచే “ేయకిరీటొ బిరుదుతో వెండి పలకపై సన్మానపత్రంతో మొట్టమొదటి (1991) ఆడియో క్యాసెట్‌ రూపకర్తగా సత్కారం.

  • 1996లో సాహితీ గౌతమి కరీంనగర్‌వారిచే సి.నా.రె సాహిత్య పురస్కారం.

  • 1996లో “స్తీ టి.వి. సీరియల్‌ రచయితగా సత్కారం.

  • 1996లో మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌గారిచే దేశభక్తి గీత రచయితగా ఎగ్జిబిషన్‌ (గ్రౌండ్‌లో సత్కారం.

  • 1997లో “కళాంజలి ఆర్ట్స్‌" వారిచే “బాలసాహిత్య రత్డు” బిరుదుతో సత్మారం.

  • 1998లో 'భక్త కవి పోతన, భారతీయ సంస్కృతి శిఖరాలు' టీ.వి. సీరియళ్ల ఉత్తమ రచయితగా 'హరిహర కళాభవన్‌లో సత్కారం.

  • 1998లో ఉస్మానియా విశ్వవిద్యాలయ “టాగూర్‌ ఆడిటోరియం”లో గవర్నర్‌ రంగరాజన్‌ గారిచే 'డాక్టరేటొ పట్టా ప్రదానం.

  • 1999లో ఘంటసాల కళాపీరం మచిలీపట్నం వారిచే “మల్లాది స్మారక పురస్కారం.

  • 1999లో “శ్రీ గురు రాఘవేంద్రస్వామి” టీ.వి. సీరియల్‌ రచయితగా డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు గారిచే సత్మారం.

  • 2000లో జస్టిస్‌ చలమేశ్వర్‌, తెలుగు విశ్వవిద్యాలయ వైన్‌ ఛాన్స్‌లర్‌ ఎన్‌.గోపి గార్లచే 1998 సంవత్సరపు “వడ్డెపల్లి గేయనల్లొకి ప్రథమ గేయ సాహిత్య పురస్కారం.

185

  • 2000లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిచే ఉగాది రాష్ట్రకవి సత్మారం.

  • 2000లో “తెలుగులో లలిత గీతాలు” (పరిశోధనాగ్రంధం) ఆవిష్కరణ సందర్భంగా డా! సి.నా.రె, పాలగుమ్మి విశ్వనాథం, ఆర్‌.బాలసరస్వతి గార్లచే సత్భారం.

  • 2002లో “కిన్నెర ఆర్ట్స్‌” వారిచే లలిత గీత రచయితగా సత్కారం.

  • 2002లో రామా రామం” రూపక కర్తగా భద్రాచల దేవస్థానం వారిచే సత్మారం,

  • 2008లో సిరిసిల్లా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారిచే కేంద్రమంత్రి సి. హెచ్‌. విద్యాసాగరరావు, కలెక్టర్‌, పోలీస్‌ సూపరింటెండెంట్‌ గార్ల చేతుల మీదుగా “సిరి వెలుగుల” సత్కారం.

  • 2008లో వేములవాడ దేవస్థానంలో కమిషనర్‌ కె.వి.రమణ గారిచే “వేములవాడ క్షే మహాత్యం” ప్రధమ డి వి.డి రూపకర్తగా సత్కారం.

  • 2003లో న్యూఢిల్లీ ఆం(ద్ర(వదేళ్‌ భవన్‌లో కేంద్రమంత్రి సి, హెచ్‌, విద్యాసాగర్‌రావు, ప్రసార భారతి సి.ఈ ఓ కె యస్‌. శర్మ గార్లచే ఉత్తమ కవి సత్కారం.

  • 2008లో “లలిత కళాతోరణం”లో 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ న్యాయ నిర్ణేతగా సత్మారం.

  • 2004లో అమెరికా “షికాగోలో 'ఆటా' స్వాగతగీత అద్భుత రూపక కర్తగా “లలితశ్రీ బిరుదుతో సత్కారం.

  • 2004లో వంశీ ఆర్ట్‌ ధియేటర్స్‌ వారిచే “దేవులపల్లి” స్మారక లలిత గీత పురస్కారం.

  • 2005లో “ఎక్కడికెళ్తుందో మనసు?” చిత్ర రచయిత, దర్శకునిగా “ఆకృతి ఆర్ట్స్‌” వారిచే సత్కారం

  • 2005లో సెన్సార్‌ బోర్డ్‌ సభ్యునిగా “డాక్‌సదన్‌"లో సత్కారం.

  • 2007లో “జానపద లహరి” టీ.వి. సీరియల్‌ (ఎస్‌.వి బిసి ఛానల్‌ నిర్మాత, దర్శకునిగా సత్మారం.

  • 2007లో “ఆచార్య తిరుమల” స్మారక పురస్కారం.

  • 2007లో సినీగీత రజతోత్సవం సందర్భంగా త్యాగరాయగాన సభలో డా॥ సి.నా.రె, జొన్నవిత్తుల, డా! పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్‌, రంగనాధ్‌గార్లచే సత్కారం.

186

  • 2007లో ఢిల్లీ తెలుగు అకాడమీచే రవీంద్రభారతిలో “భారత్‌ గౌరవ” పురస్మారం.

  • 2008లో సినీ రచయిత, దర్శకునిగా సిరిసిల్లలో పౌర సన్మాన సత్కారం.

  • 2008లో 'న్యూజెర్సీ'లో దశమ 'ఆటా' స్వాగతగీత రూపక కర్తగా సత్కారం.

  • 2006 & 2009లో నంది అవార్డ్స్‌ కమిటీల ఛైర్మన్‌గా ముఖ్యమంధ్రులు డా॥ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి; రోశయ్యగార్లచే 'నందూల జ్ఞాపికలతో అభినందన సత్కారం.

  • 2009లో 'రసాంజలి” వారిచే త్యాగరాయ గానసభలో 40 వసంతాల లలితగీత రచయితగా సత్మారం.

  • 2009లో ప్రొద్దుటూరు విశిష్ట కవి సత్కారం.

  • 2010 బొంబాయిలో “ఆంధ్రమహాసభ వారిచే గౌరవ సత్మారం.

  • 2010లో పాలకొల్లులో తెలుగు సాంస్కృతిక సంస్థ వారిచే సత్కారం.

  • 2010లో త్యాగరాయ గానసభలో "కిన్నెర ఆర్ట్‌” వారిచే షష్టిపూర్తి సందర్భంగా “పాట వెలదులు” డా॥ కె.వి.రమణ, ఎన్‌.గోపి, సినీనటి జయసుధ చేతుల మీదుగా సత్కారం.

  • 2010లో 'యువకళావాహిని'చే సి.నా.రె అశీతి జయంతి సందర్భంగా సినీగేయకర్తగా సత్కారం. ,

  • 2011లో “తానా” స్వాగతగీత రూపక కర్తగా “శాన్‌'ఫ్రాన్‌సిస్కో (కాలిఫోర్నియా)లో సత్మారం.

  • 2011లోడా॥ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి” పురస్కారం.

  • 2012లో “ఎగ్జిబిషన్‌ కవి సమ్మేళనం అధ్యక్షునిగా అశేష జనవాహినిలో సత్కారం.

  • 2012లో 'రోటరీక్లబొ వారిచే ప్రతిభా పురస్కారం.

  • 2012లో బాల సాహిత్య పరిషత్‌ వారిచే 'వాసాల నర్సయ్య పురస్కారం.

  • 2012లో హ్యూస్టన్‌ (అమెరికా) “నాటా” వేదికపై హీరో బాలకృష్ణ, అధ్యక్షులు ఏ.వి.ఎన్‌.రెడ్డి గారచే కవి సత్కారం.

  • 2012లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభల్లో కవి సత్మారం.

  • 2012లో సినారె గారిచే సారస్పత పరిషత్తులో 'తేజ సాహిత్య' పురస్కారం.

  • 2012లో “లలితగీత ప్రపూర్ణ” బిరుదుతో 'తెలంగాణ భాషా పరిరక్షణ సమితిచే సత్కారం.

  • 2012లో 'ఆటా' అట్లాంటా వేదికపై విశిష్ట ప్రతిభా పురస్కారం.

  • 2012లో కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌ కాలేజీలో జిల్లా యువజనోత్సవాల ముఖ్య అతిథిగా సత్మారం.

187

  • 2012లో 'అరుంధతి కళాసంస్థ వారిచే 'చాశరధి' స్మారక పురస్కారం.

  • 2018లో మలేషియా “కౌలాలంపూరొలో వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ వారిచే కవి సత్కారం,

  • 2014లో “గోప్రాశస్త్యం” డాక్యుమెంటరీ దర్శకునిగా జాతీయ పురస్కారం.

  • 2014 జూన్‌లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ కలెక్టర్లచే “జయజయహే తెలంగాణ” రూపక కర్తగా సత్మారం

  • 2014 ఆగస్టులో “గ్రేటర్‌ కెన్సాస్‌ తెలుగు అసోసియేషన్‌” (అమెరికా) వారిచే “కవనప్రజ్ఞూ బిరుదుతో సత్మారం.

  • 2014 అక్టోబర్‌ “తాల్‌ (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ & చిట్టెన్‌ రాజు వంగూరి) ఆధ్వర్యంలో “లండన్‌ పార్లమెంటొలో కవి సత్మారం.

  • 2014 సిరిసిల్ల సాహితీ సమితిచే అభినందన సత్కారం.

  • 2014లో “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వారిచే డా.దాశరథి స్మారక పురస్కారం.

  • 2014లో “వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌” వారిచే వేయిలలితగీతాల “గిన్నిస్‌ బుక్‌ పురస్కారం.

  • 2015లో తెలుగు సినీ రచయితల సంఘంచే అభినందన సత్మారం.

  • 2015లో మహబూబ్‌నగర్‌, వరంగల్‌ కలెక్టక్షనే “జయజయహే తెలంగాణ” రూపక కర్తగా సత్మారం.

  • 2015లో “తెలంగాణ జాగ్భతి' అధ్యక్షురాలు కవిత (ఎం.పి) గారిచే కవి సత్మారం.

  • 2015లో “మహాభక్త సిరియాళ' సినీ గీతరచయితగా 'ప్లాటినమ్‌ డిస్క్‌తో సత్మారం,

  • 2015లో “వివాహబంధం' టీ. వి.సీరియల్‌ గీతరచయితగా “అంజేరి ఆర్ట్‌” వారిచే సత్కారం.

  • 2016లో న్యూజెర్సి ప్రభుత్వ కమిషనర్‌ (మంత్రిస్థాయి) గారిచే ప్రతిభా పురస్కార సత్మారం.

  • 2016లో కలెక్టర్‌ సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గార్లచే “జయ జయహే తెలంగాణ” రూపక కర్తగా సత్కారం.

  • 2016లో “అభినందన ఆర్ట్స్‌” సంస్థచే ఆత్రేయ స్మారక పురస్కారం.

  • 2016లో “తానా” ఆహ్వానగీత రచయితగా 'న్యూయార్మ్క్‌లో సత్మారం.

  • 2016లో గ్రేటర్‌ హ్యాస్టన్‌ తెలుగు అసోసియేషన్‌ వారిచే “లివింగ్‌ లెజెండ్‌

188

ఆఫ్‌ లైట్‌సాంగ్స్‌” ప్రతిభా పురస్కారం.

  • 2016లో “భారత్‌ కల్చరల్‌ అకాడమి' వారిచే 'కవి శిరోమణి" పురస్కారం.

  • 2016లో వరంగల్‌ పద్మశాలి హాస్టల్‌ వార్షికోత్సవంలో ఎమ్‌. ఎల్‌.ఏ వినయ భాస్మ్కర్‌గారిచే విశిష్ట కవి సత్కారం.

  • 2016లో తెలుగు విశ్వవిద్యాలయంలో 'లిటిల్‌ మ్యుజిషియన్స్‌ అకాడమి" వారిచే లలితగీత సత్మారం.

  • 2017 జనవరిలో “అలిశెట్టి” స్మారక పురస్కారం.

  • 2017 సెప్టెంబర్‌లో 'రాగరాగిణి' ఆర్ట్స్‌ వారిచే “అనిశెట్టి” పురస్కారం.

  • 2017లో సమీకృత అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సారస్వత సంఘం వారిచే “దాసరి స్మారక ప్రతిభా పురస్కారం.

  • 2017లో 'నవ్యనాటక కళాసమితి" వారిచే వసంతోత్సవ గేయ కవి సత్మారం.

  • 2017లో తెలంగాణ ప్రభుత్వ ప్రపంచ తెలుగు మహాసభల్లో లలితగీత ప్రసంగకర్తగా సత్కారం.

  • 2018లో భారత్‌ కల్చరల్‌ అకాడమి & టీ.వి.రైటర్స్‌ అసోసియేషన్‌ వారిచే 'సి.నా.ర స్మారక పురస్కారం.

  • 2018లో 'వంశీ ఆర్ట్‌” వారిచే 'కళారత్న! పురస్కారం.

  • 2018 ఆఫ్ట్రేలియా ప్రపంచ తెలుగు మవాసభల్లో “లలితగీత” విశిష్ట సత్మారం.

  • 2018లో “యువకళావాహిని” వారిచే 'దాశరధి' పురస్కారం.

  • 2018లో “ప్రాజ్ఞిక ఫౌండేషన్‌” వారిచే 'దాశరథి పురస్కారం.

  • 2018లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌చే జిల్లా విశిష్ట ప్రతిభా పురస్కారం.

  • 2019 జనవరిలో తేజస్విని కల్చరల్‌ అసోసియేషన్‌ వారిచే “సి.నా.రె. జీవిత సాఫల్య” పురస్కారం.

  • 2019 జనవరిలో “ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌” వారిచే 'సినారె - వంశీ ఫిలిం అవార్డ్‌ పురస్కారం.

  • 2019 అక్టోబర్‌లో “అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ - భోపాల్‌ వారిచే 'సరస్వతీ సమ్మాన్‌” పురస్కారం

  • 2019 నవంబర్‌లో తెలుగు సినీ రచయితల రజతోత్సవ సంఘంచే ప్రతిభా పురస్కారం.

  • “ఎల్టర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వారిచే టీ.వి. సేవారత్న పురస్కారం.

189

ముద్రిత గ్రంథాలు

1 కనరా నీ దేశం! (గేయ సంపుటి) - 1971 2 యువ స్వరాలు (కవితా సంకలనం) - 1978 తి అంతర్మథనం (వచన కవితాసంపుటి) - 1974 శ వెలుగు మేడ (గేయ నాటికలు) - 1976 5. వసంతోదయం (గేయకథా కావ్యం) - 1978 6 _రాగరధం (లలిత గీతాలు) - 1981 7. హాలాహలం (వచన కవితలు) - 1987

(ఆంధ్ర మహిళాసభ 'దేవులపల్లొ పురస్కారం - 1989) 8. మనసా! తెలుసా? (ముక్తకాలు) - 1990 9. తగిన శిక్ష (సాక్షరతాభవన్‌ - ఎయిడ్స్‌ కథానిక) - 1998 10. చిరుగజ్జెలు (బాలల గేయాలు) - 1994

(తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1992) పొందినది.) 11 వడ్డేపల్లి కవిత (సమగ్ర వచన కవిత) - 1995

(సాహితీ గౌతమి” సి.నా.రె పురస్కారం పొందినది.) 12. వడ్డేపల్లి గేయవల్లి (సమగ్ర గేయ సంపుటి) - 1995

(తెలుగు విశ్వవిద్యాలయ గేయ సాహితీ పురస్కారం (1998)

పొందినది.) 18. తెలుగులో లలిత గీతాలు (పరిశోధనా గ్రంధం) - 2000 14 తెలుగు పసిడి (సినీ గీతాల (1981-2006) వివేచనా వ్యాసం) 15. మబ్బుల పల్లకి (వెండితెర - బుల్లితెర గీతాలు) - 2007 16 పాట వెలదులు (నవీన ప్రయోగ పద్యాలు) - 2010 17 షష్టిపూర్తి అభినందన సంచిక - 2010 18. తెలుగు ప్రశస్తి (తెలుగు ప్రస్తుతి గీతాల సంకలనం) - 2012

(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురణ) 19 తెలుగు పాట - 2012

(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురణ) 20. వాణీ లక్ష్మీ వైభవం (ఆడియో గేయ సంపుటి)

190

  1. లలిత సంగీతపు కోర్సు] (తెలుగు విశ్వవిద్యాలయ లలిత సంగీత పాఠ్య పుస్తకం) - 2018

22 తెలుగు వైభవం (బుర్రకథ) - 2014

  1. గాంధి - గణాధిపత్యం (బాలల గేయ నాటికలు) - 2015

  2. త్రిశక్తం (భగవద్గీతకు తెలుగు అనువాదం) - 2016

  3. బతుకమ్మ జయ జయహే తెలంగాణ (సంగీత, నృత్య రూపకాలు)

  • 2016

2౨6. కాంతి కవాటం (కవితా సంపుటి - 2017

  1. [0౪ 60౪00 (861? 0 గా/9౦౦| !- 2017

  2. వద్దేపల్లి లలితగీతాలు - 2018

  3. రంగ తరంగాలు (రంగస్థల నాటికలు) - 2018

  4. వడ్డేపల్లి రూపకాలు (సంగీత, నృత్య రూపకాల సంపుటి) = 2019

  5. తెలంగాణ రూపకములు & త్రివిక్రములు - 2020 పొందిన బిరుదులు

  6. "గేయ కిరీటొ (వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం - 1995)

  7. “బాలసాహిత్య రత్న” (కళాంజలి ఆర్ట్స్‌ - 1997)

  8. “లలితశ్రీ” (అమెరికా 'ఆటా' సంస్థ - 2004)

  9. “లలితగీత ప్రపూర్ణ” (తెలంగాణ భాషా పరిరక్షణ సమితి - 2012)

  10. “కవనప్రజ్ఞూ (గ్రేటర్‌ కెన్సాస్‌ సిటీ తెలుగు అసోసియేషన్‌ - 2014)

  11. “కవి శిరోమణి” (భారత్‌ కల్చరల్‌ అకాడమి -2015)

  12. “లివింగ్‌ లెజెండ్‌ ఆఫ్‌ లైట్‌సాంగ్స్‌” (మ్యూస్టన్‌ తెలుగు ఆసోసియేషన్‌- 2016)

  13. “కళారత్సు” (వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ - 2018) అము(ద్రితాలు 1 బాలల రాగ రామాయణం (గేయకథాకావ్యం)

  14. వడ్డేపల్లి “ఆడియో” (భక్తి) గీతాలు భయయ న్యూ న

  15. భక్తకవి పోతన (నాటకం) సం టీ

  16. భాగ్యనగరం (నాటకం) గ ట్‌ (1.

  17. వెలుగు వెన్నెల (నాటకం) (జ దా,

  18. కొస మెరుపులు (మునీ కవితలు) స రర క

191

192

న్‌ క్రుదఠర్నిత రూప రై్రైటిట్యు! కగుకఠకాల ఛాయా చిత్రాలు [గా మ్‌ /| గ్‌ లర లం లల వనాని ాకతడతాళడాంలా న్‌ అ ల వలి సళ రయ కక! ల లా ల గ | స టు ర స... క్ల నా 'సమన్నే! 1 చాత్ర ప నం! య మ న. కం చట టి = కె. |. వషే ష్‌ సు నక్ష ష్‌ జ. ల న్‌ న ” 11 2 లే గ్‌ , గ (1 | 0 | ంఖ ; సిక గ 1 స పు . " న. త 7 మీ టు. ; అభ (హ్రీ కిన భష ప్‌

76/42౧౮2౧2 02౧౦౪ 0౧2౧౯725 0౫/ | “/266602// గగంగగ?౭ ల్‌ - దాః వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో 1949లో వడ్డేపల్లి లక్ష్మమ్మ, లింగయ్య =. దంపతులకు జన్మించారు. సహస్రాధిక లలితగీత / ద్విశతాధిక సినీ | గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకునిగానే గాక అనేక టి.వి. జు ధారావాహికలకు, కొన్ని సినిమాలకు రచనతో పాటు 1... .... ప్రతిభావంతంగా దర్శకత్వం నిర్వహించారు. డా॥ సి.నా.రెగారి

  1. స్ఫూర్తితో అన్ని సాహిత్య ప్రక్రియల్ని పండించారు. ఇంతవరకు 30 కావ్యాల్సి 60 ఆడియో ఆల్బమ్‌లను వెలువరించారు. 10 నాటిక, నాటకాల్సి 52 సంగీత, నృత్య రూపకాల్చి, 90 టీవీ ధారావాహికల్ని రచించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. 19 దాక్యుమెంటరీలను రూపొందించారు. 2005లో సెన్సార్‌ బోర్డ్‌ సభ్యునిగానే గాక, 2008లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి, 2010లో బాలల నంది నాటకాలకు న్యాయనిర్లేతగా నిలిచి, నిష్పక్షపాతంగా తీర్పునిచ్చారు. 2006 & 2009లో నంది అవార్డుల కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆకాశవాణి ద్వారా అన్ని రాష్ట్రాల్లో అనువాదాలతో వీరి లలితగీతం సెప్టెంబర్‌ 1995లో నెలంతా జాతీయస్థాయిలో ప్రసారం కావడం విశేషం. “ఎన్టీఆర్‌” (1987) మొదలిడి అందరు . ముఖ్యమంత్రులచే, మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌ (1996) గారిచే కవి సత్మారం పొందడం విశిష్టం! “చిరుగజ్జెలు' (బాలల గేయాలు), “వడ్డేపల్లి గేయవల్లి” (లలితగీతాలు) కావ్యాలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్మారాల్ని పొంది, స్వదేశ - విదేశాల్లో జరిగిన ప్రపంచ తెలుగు
  • | మహాసభల్లో కవితా ప్రతిభతో ప్రకాశించి, జాతీయ - అంతర్జాతీయ కవిగా ఖ్యాతిగాంచారు.

“చెట్లు మొదలగు వీరి పాటలు పూణె బాలభారతి తెలుగు వాచకాల్లో పాఠాలుగా నిలవడం గర్వకారణం! ః్‌ వీరు ఇటీవల 60 యేళ్ల తెలంగాణ సంఘర్షణ - సాధనను 60 నిమిషాల నిడివి గల “జయ జయహే తెలంగాణ” (సంగీత నృత్య రూపకం)ను రచించగా, అది దా॥కె.విరమణగారి ప్రోత్సాహంతో అన్ని జిల్లాల్లో ప్రదర్శింపబడడం అభినందనీయం! ఇందలి కొన్ని రూపకాలు అమెరికాలో కూడా ప్రదర్శితమై, ప్రజాదరణ పొందడం ప్రశంసనీయం. చారిత్రక నేపథ్యమైన |. “భాగ్యనగర్‌ నాటకాన్ని రచించగా, 'సత్మళాభారతిచే పలుమార్లు ప్రదర్శితమై ప్రశంసల్ని. _ పొందడం శ్లాఘనీయం! య బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన దా॥ వద్దేపల్లి కృష్ణ నిత్య సాహితీ కృషీవలుడు! 1968 నుంచి ఇప్పటివరకు నిరంతరంగా రచనలు కొనసాగిస్తున్న అభ్యుదయ భావ తపోధనుడు!

ర 4411404151 &౧౫5 (౧౦౮

[16/80/2౭౧6 00611042] శో