Telugu Swathantram Tharuvatha Bharathadesham - anilvaranasi/indianlanguages GitHub Wiki
౮
=.
/ స్వతంత్రం తరువాత
భారతదేశం బిపన్‌చంద్ర
మృదుల ముఖర్జీ
| 1. ఆదిత్య ముఖర్జీ
క వ
. వ వ న. న. .. స్ స గ వీటి
15 లీ కీ గి ం
- ' శిత ి. ఈ
స్వతంత్రం తరువాత భారతదేశం బిపన్‌చంద్ర మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ అనువాదకులు కేశవరెడ్డి ప్రజాశక్తి బుక్హౌన్ ఎమ్పాజబ్ భవన్, వ్లాట్నెం, 21/1, అజామాబాద్ ఆర్టిసి కళ్య్ళాణనుండపం దద్ధర హైదరాబాద్-26. ఫోన్: ౧46 - 27660013
ర న్ ౦ ఎ ||| 1110 క రగ ఊసు నం య్ ద యు) (| ॥ గ్ +?” ఫో నయ క ప్రచురణ సంఖ్య : 1228 ప్రధమ ముద్రణ : జనవరి, 2012 వెలు ₹. 300 , శ్రేపా ప్రజా (ర 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్ :; 27608107 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, నృకొందే, నల్గొంద, గుంటూరు, ఒంగోలు ముద్రణ పజాశకి డెలీ పింటింగ్ షెస్, హిదరాబాద్
విషయసూచిక మనవి న.
-
ముందుమాట వలం క్రై 2 వలసవాద వారసత్వం లల 19
-
రాజ్యాంగ ఆవిర్భావం - ముఖ్య నిబంధనలు అలయ ఉీద్రె
-
రాజ్యాంగ నిర్మాణం, మౌలిక లక్షణాలు, సంస్థలు అంటు పే
-
తొలి సంవత్సరాలు “౨ 9ర్
-
భారతదేశం జాతిగా ఏకీకరణ లం శే 15
-
జాతిగా భారతదేశ ఏకీకరణ - భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్నిర్మాణం ఆ 136
-
భారతదేశం జాతిగా ఏకీకరణ - తెగల నిశీనం ఆల 145
-
జాతిగా భారతదేశ ఏకీకరణ - ప్రాంతీయవాదం, ప్రాంతీయ అసమానతలు ....... 161
-
ఆశావహ సంవత్సరాలు - సాధించిన ఫలితాలు ,.1951- 64 4 శ 25
-
విదేశాంగ విధానం - నెహ్రూ శకం అజం 199
-
జవహర్లాల్ నెహ్రూ - చారిత్రక దృష్టి కోణం లల 231
-
రాజకీయ పార్టీలు,1947-64, కాంగ్రెస్ లం 27
-
రాజకీయపార్టీలు, 1947-65, ప్రతిపక్షం ఎల 265
-
శాస్తి నుండి ఇందిరాగాంధీ వరకు 1964-1969 ఎంఐ 289
-
ఇందిరాగాంధీ సంవత్సరాలు 1969-1973 “= 309
-
జెపి. ఉద్యమం - అత్యవసర పరిస్థితి - పరీక్షకు నిలిచిన భారత ప్రజాస్వామ్యం ఆం ప27
-
జనతా అరాచకకాలం, ఇందిరాగాంధీ తిరిగి అధికార స్వీకారం 1977-84 ల ఏడం
-
రాజీవ్ సంవత్సరాలు అలం కిర్
-
సహస్రాబ్దికి పరుగు 1989 -93 ఐల ప79
-
రాష్ర్రాలలో రాజకీయాలు -1, తమిళనాడు, ఆంధ్రప్రదేక్, అస్వాం ల 397
-
రాష్ట్రాలలో రాజకీయాలు-2 , పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్ ఎల 415
-
పంజాబ్ సంక్షోభం అం 4పశే
-
భారత ఆర్థిక వ్యవస్థ, 1947-1965 నెహ్రు హయాం 000 జేక్.
-
భారత అర్థిక వ్యవస్థ 1965 -199+ అరవయ్యవ దశేకం మధ్య భాగం : సంక్షోభం - ఉపశమనం 0 469
-
ఆర్థిక సంస్కరణలు - 1991 నుండి ఆం తృటి?
-
నూతన సహస్రాజ్దిలో భారతదేశ అర్థిక విధానం యం జతి?
-
భూసంస్క్మరణలు-1 వలసవాద ప్రభావం - జాతీయ రైతు ఉద్యమాల వారసత్వం ఎ 515
-
భూసంస్కరణలు -2 జమిందారీ విధానం రద్దు - కౌలుదారీ సంస్కరణలు ఎ 529 3౩1. భూసంస్కరణలు -3 గరిష్ట పరిమితి - భూదానోద్యమం, భూగరిష్ట పరిమితులు 543 ౩2. సహకార సంఘాలు - భూసంస్కరణలు - సమీక్ష = క555్
-
వ్యవసాయాభివృద్ధి - హరిత విళ్లనం ఎ 575 3౩4. స్వతంత్ర్యానంతరం వ్యవసాయ పోరాటాలు = 5తి5్ ౩5. మతతత్వవాద పునరుద్ధరణ పెరుగుదల ఎ 599
-
మతతత్వ నాదం - రాజ్యాధికార వినియోగం జం 613 ౩7. కులం, అంటరానితనం, కుల వ్యతిరేక రాజకీయాలు, వ్యూహాలు అలం 631 ౩8. స్వతంత్రానంతరం భారతీయ మహిళలు ఐ 639
-
వలస వాదానంతర భారత రాజ్యం రాజకీయ ఆర్థికాభివృద్ధి : పరిశీలన ఎఎ 653
-
పాలనా సంస్థలలో క్రమరాహిత్యం 865
-
నూతన సహస్రాబ్ది ప్రారంభంలో ఆ 685
ఉపోద్దాతం యి
గతంలో బహుళ ప్రజాదరణ పొందిన మా భారత స్వతంత్ర పోరాటం (1857 - 1947) (గ్రంథానికి కొనసాగింపుగా స్వతంత్రం తర్వాత పరిణామాలపై ఈ రచన తలపెట్టాము. ఆ గ్రంథం ఇంగ్లీషులో లక్ష ప్రతులకు పైగా విక్రయించబడటమే గాక హిందీతో సహా అనేక భారతీయ భాషల్లో అనువాదమైంది. ఆ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ సంస్థ ప్రతినిధి డేవిడ్ దేవ్‌దర్ స్వాతంత్ర్య సాధన తరువాత సహస్రాబ్ది చివరి వరకూ జరిగిన పరిణామాలపై దానికి తోడుగా మరో రచన చేయవలసిందిగా మాకు పదే పదే చెబుతూ వచ్చిన మీదట అందుకు ఉపక్రమించాము. 1999 చివరి నాటికి ఆ రచన పూర్తయింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం 1947-2000 పేరిట అది ప్రచురితమైంది.
అనేక కారణాల వల్ల దాని మరో ముద్రణ తయారు చేయవలసి వచ్చింది. సాధారణ ప్రజానీకం నుంచి ప్రత్యేకించి చరిత్ర సామాజిక శాస్త్రాలు, అర్ధశాస్త్రం, రాజకీయాలు సమకాలీన ఘటనలను అధ్యయనం చేసే విద్యార్థుల నుండి వచ్చిన స్పందన చాలా ఉత్సాహం కలిగించింది. అనేక విశ్వ విద్యాలయాలు, మేనేజ్మెంట్ శిక్షణా సంస్థలు దీన్ని తమ పాఠ్యగ్రంథంగా ఎంచుకోవడంతో సమకాలీన చరిత్ర అధ్యయనంలో పెద్ద లోటు భర్తీ అయిందన్న భావన కలిగింది. ఈ (గ్రంథం కూడా హిందీతో సహా అనేక భారతీయ భాషలలో అనువాదమైంది. ఈ పుస్తకాన్ని మరింత తాజాపరచవలసిందిగా పాఠకులు ప్రచురణకర్తల నుండి ఒత్తిడి ఎక్కువైంది.
నిజంగానే 1999లో ఈ పుస్తక రచన జరిగిన తర్వాత ప్రాధాన్యత గల అనేక ఘటనలు జరిగాయి. ఈ పుస్తకంలో వాటన్నిటినీ పొందుపర్పవలసిన అవసరమేర్చడింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ అపూర్వమైన అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోవడానికి సిద్ధంగా వుండింది. ఆర్థిక రంగంలో దేశం ముందంజ వేయడంతో
పాటు మారిన దేశ అణ్వస్త్ర దేశాలలో భారశ్ర్ హోదా మారడంపై సుదీర్త సంప్రదింపులు జరుగుతుండటం కూడా బయటి దేశాలతో దాని సంబంధాలను సమూలంగా మార్చేసింది. మరోవైపున భారత రాజకీయాలు అంతకు ముందెరుగని స్థాయికి పడిపోయాయి. 2002లో గుజరాత్ మారణకాండ తర్వాత భారతదేశ స్వాతంత్రం తర్వాత ఎన్నడూ ఎరుగని అతి త్రీవ్ర ప్రమాదం ఎదురైంది. వేలాదిమంది ముస్లింలను ఊచకోత కోయడం, ఇళ్ళలోంచి తరిమేయడం జరుగుతూంటే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అధికొర యంత్రాంగం కుమ్మక్షై (పేక్షక పాత్ర వహించారు. అయితే భారత పౌర సమాజంలోని ఇతర విభాగాలు, ప్రభుత్వ సంస్థలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాయి. ఇదేకాలంలో భారత విద్యావ్యవస్థను మతతత్వపూరితం చేసేందుకు బాహాటంగా పచ్చిగా ప్రయత్నం జరిగింది. పాఠశాల విద్యా స్థాయి పుస్తకాల దశ నుంచి జరిగిన ఈ ప్రయత్నంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంది. దీనిపైనా దేశ వ్యాపిత నిరసన వ్యక్తమైంది. 2004లో (ప్రభుత్వం మారిపోవడం వల్ల ఈ పరమ ప్రమాదకరమైన ధోరణికి అడ్డుకట్ట పడినట్లయింది. మొత్తంపైన ఈ కాలం అద్భుతమైన ఆర్థికాభివృద్ధిని చూడటమే గాక ఆ ఫలితాలు విస్తారంగా అందుబాటులోకి రాని విపరీత పరిస్థితిని కూడా చూసింది (భారతదేశం మానవాభివృద్ధి సూచికలలో నిజానికి దిగజారిపోతున్నది). దేశంలో కుల మత విభజనలు మళ్ళీ తలెత్తుతున్న స్థితి గోచరిస్తున్నది. అందువల్ల పెంగ్విన్ సంస్థకు చెందిన రవి సింగ్ మమ్ముల్ను ఒత్తిడి పెట్టడం ఆమోదయోగ్యమే అయింది. 1999-2000 నుండి 2007 వరకూ జరిగిన పరిణామాలపై మూడు విస్తారమైన అధ్యాయాలను మేము జతకూర్చాము. నూతన సహాస్రొబ్దిలో భారత ఆర్థిక వ్యవస్థ అన్న కొత్త అధ్యాయం ఈ కాలంలో ఆర్థిక రంగంలో సాధించిన అభివృద్ధికి సంబంధించిన బహుముఖ కోణాలను విశదపరుస్తుంది. అదే సమయంలో ఇంకా కొనసాగుతున్న తీవ్ర సవాళ్ళను, పట్టింపు నోచని సమస్యలను కూదా నొక్కి చెబుతుంది. మతతత్వం రాజ్యాధికార వినియోగం అనే మరో కొత్త అధ్యాయం వుంది. రాజ్యాధికారం మతతత్వ అజెండాను ముందుకు తీనుకుపోవదానికి గనుక ఉపయోగపడేట్టయితే ఏం జరుగుతుందో గుజరాత్ ఘటనలను విద్యా వ్యవస్థ, మతతత్వీకరణ విశ్లేషిస్తూ చెప్పడం చూస్తారు. మరో అధ్యాయం భూ సంస్కరణలు : వలస పాలన ప్రభావం, జాతీయ, రైతాంగ ఉద్యమాల వారసత్వం అన్నది. ఆ తర్వాత మూడు సమగ్ర అధ్యాయాలు స్వాతంత్ర్యం తర్వాత భూ సంస్కరణలు భారతదేశంలో
ఎలా అమలు జరిగిందీ చర్చిస్తాయి. భారతదేశంలో వ్యవసాయంపై వలస పాలన ప్రభావానికీ జాతీయోద్యమం రైతు ఉద్యమం వ్యవసాయిక సమస్యపై తీసుకున్న వైఖరికీ మధ్య గల కీలక సంబంధాన్ని కూడా ఈ అధ్యాయం దృష్టికి తెస్తుంది. స్వాతంత్రానంతరం అర్ధ శతాబ్దికి పైబడిన కాలంలో భూ సంస్కరణల తీరుతెన్నులను ఎత్తిచూపుతుంది. నూతన సహసస్రాబ్టికి సన్నాహం ఆ తర్వాత అన్న అధ్యాయాన్ని విస్తారంగా సవరించి విస్తృతపరిచాము. రాజీవ్‌గాంధీ హత్యానంతర కల్లోల సంవత్సరాలనూ, ఆ కాలంలో ముందుకొచ్చిన ప్రధానమైన విదేశాంగ విధాన సమస్యలను ఇందులో పొందుపర్ప్హాము. ఈ కాలంలోనే 2007 వరకూ చూస్తే భారత రాజకీయ రంగంలోని దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలాగే సహస్రాబ్ది ఉషోదయం : “విజయాలు సమస్యలు అవకాశాలు" అన్న అధ్యాయంతో సహా అనేక కొత్త వాటిని చేర్చాము. సమకాలీన చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ ఆర్థిక పరిణామాన్ని సమగ్ర దృష్టితో పరిశీలిస్తుంది. రెండు వందల సంవత్సరాల వలస పాలన సుదీర్థమైన, శక్తివంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజొ ఉద్యమం స్వతంత్ర భారత రిపల్లిక్ ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేస్తుంది. ప్రత్యేకించి భారత స్వాతంత్ర్యం అరవయ్యవ వార్షికోత్సవ సందర్భంలో ఈ రచన తీసుకువస్తున్నందుకు మాకు మరింత సంతోషంగా వుంది. నవంబర్, 2007 బిపన్ చంద్ర మృదుల ముఖర్జీ ఆదిత్య ముఖర్జీ
మనవి
(ప్రామాణిక ప్రసిద్ధ చరిత్ర పుస్తకాల ప్రచురణలో ప్రత్యేకత చాటుకుంటున్న ప్రజాశక్తి బుకహౌస్ మరో విశిష్ట గ్రంథంతో మీ ముందుకు వస్తున్నది. సమకాలీన చరిత్ర రచయితలకు గౌరవాస్పదుడైన బిపన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్లీలు రచించిన భారత స్వాతంత్ర్య పోరాటం (గ్రంథాన్ని గతంలో మేము అందించాము. అది చరిత్ర విద్యార్థులకే గాక రాజకీయాసక్తి గల వారందరికి అమితాదరణ పొంది నిరంతరం పునర్ముద్రణలు పొందుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన చరిత్ర (గ్రంథాల సిఠీస్ను, డిఎన్రూ (ప్రాచీన భారతం, సతీష్ చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్ సర్మార్ ఆధునిక భారతదేశం తదితర (గ్రంథాలను కూడా ్రచురించాము. పలు దేశాల చరిత్రలు ప్రముఖ నేతల, ఆదర్శమూర్తుల జీవిత చరిత్రలు కూడదా నిరంతరాయంగా అందిస్తున్నాము. ప్రాచీన 'ప్రపంచ చరిత్ర, అమెరికా ప్రజల చరిత్ర, ప్రపంచ ప్రజల చరిత్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్ర వరకూ ఎన్నో (గ్రంథాలు వెలువరించాము.
అదే కోవలో ఇప్పుడు 'స్వతంత్రం తర్వాత భారతదేశం” అన్న బిపన్ చంద్ర బృందం రచనను తెలుగులో వెలునరిస్తున్నాము. ఈ పుస్తకం విశిష్టతను రచయితలే ముందుమాటలో విశదపర్చారు. కాకుంటే సమకాలీన చరిత్ర గనుక కొన్ని సంఘటనలకు సంబంధించి, కొందరు వ్యక్తులకు నంబంధించి వారి అంచనాలతో మాకు తేడాలుండొచ్చు. అవి వారి అభిప్రాయాలు కాగా వారు గ్రంథస్తం చేసిన వాస్తవాలు నిర్వివాదమైనవి. ప్రత్యేకించి విద్యార్థుల కోణం నుండి ప్రాథమిక సమాచార వనరుగా దానికి గల విలువ అపారమైంది.
గతంలో అనేక అమూల్య (గ్రంథాలను అనువదించి ప్రజాశక్తి బుక్‌హౌస్‌కు అందించిన కొమ్మారెడ్డి కేశవరెడ్డి ఈ ఉద్దంధాన్ని కూడా తెలుగు చేశారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే కోవలో ఆయన అనువాదంతో భవిష్యత్తులో మరిన్ని గొప్ప చరిత్ర గ్రంథాలు అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
- ప్రజాశక్తి బుక్‌హౌస్ య. ప. స్ట.
శ్ర
భారతదేశ స్వతంత్రం భారత ప్రజల ఆశల ఆకాంక్షల నూతన శకారంభానికి ప్రాతినిధ్యం వహించింది. వలసవాద వారసత్వంగా సంక్రమించిన వెనుకబాటుతనం, దుర్భర పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానత, అన్యాయాలను అధిగమించేందుకు 1947లో భారతదేశం లాంగ్‌మార్చ్ ప్రారంభించింది. 1947 ఆగస్ట్ 15న వలసవాద నియంత్రణకు అంతం పలికింది. ఇక శతాబ్దాల వెనుకబాటు తనం అధిగమించాలి. స్వతంత్ర పోరాట వాగ్దానాలు అమలు జరపాలి. ప్రజల ఆశలు నెరవేర్చాలి.
భారత ప్రజలు, వారి నాయకులు విజయం సాధించగలమనే విశ్వాసంతో దృఢ నిర్ణయంతో జాతి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రఖ్యాత ఉపన్యాసం ఈ ఉత్సావాన్ని ప్రతిబింబించింది.
నిర్మించవలసిన భారత దేశం యొక్క మౌలిక రూపురేఖలపై, జుతీయవాదం, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై త్వరిత ఆర్థికాభివృద్ధి లక్ష్యాలపై, సమూలమైన సామాజిక మార్పులపై విస్తృతమైన ఏకాభిప్రాయంతో (ప్రారంభించటం గొప్ప సానుకూలత. ఈ విలువలను, లక్ష్యాలను, వీటిని సాధించటానికి అనుసరించవలసిన మార్గాన్ని జాతీయోద్యమం 70 సంవత్సరాల నుండి రూపొందిస్తూ వచ్చింది. ఐనప్పటికి ఈ _ ఏకాభిప్రాయాన్ని నిరంతరంగా విస్తృతపరుస్తూ నిర్మించవలసి వుంది. ఈ సందర్భంగా నెహ్రూ నిర్వహించిన పాత్ర, ఆయన ప్రతిపాదించి అభివృద్ధి పరచిన ఆలోచనలు కీలకమైనవి, మౌలిక లక్ష్యాలు
మొదటిది అత్యంత ముఖ్యమైన కర్తవ్యం : భారతదేశ ఐక్యతని పరిరక్షించి సంఘటితం చేయటం, భారతజాతి నిర్మాణ క్రమాన్ని ముందుకు తీసుకొని పోవటం, స్వతంత్రం తర్వాత భారతదేశం ఫ్ర
అభివృద్ధి మరియు సామాజిక మార్చు సాధనంగా జాతీయ రాజ్యాన్ని నిర్మించి పరిరక్షించటం. భారత దేశ ఐక్యతని దాని యొక్క అపారమైన ప్రాంతీయ, భాషాపరమైన తెగలపరమైన మతపరమైన వైవిధ్యాన్ని గుర్తించి అంగీకరించటం ద్వారా బలోపేతం చేయవలసి వుంది. భారత ప్రజల బహుళ గుర్తింపులను అంగీకరించి స్టానం కల్పించటం ద్వారా, దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రజలలోని వివిధ సెక్షన్నకు భారత సమాఖ్యలో తగు స్థానం కల్పించటం ద్వారా భారత జాతీయతని అభివృద్ధి పరచవలసి వుంది. ఈ పథకం దీర్హక్షాలిక నిరంతర 'కశ్రమమనే అవగాహన వుండాలి.
ఈ క్రమంలో సెక్యులర్ దృక్పథం చాలా ప్రాథమికమైనది. జాతీయనాయకులు దేశ విభజన, విభజనానంతర ఘర్షణలతో కలత చెందకుండ సెక్యులర్ సమాజాన్ని, రాజ్యాన్ని నిర్మించ సమాయత్తమయ్యారు.
భారతదేశ విష్లవం రాజకీయ పరిధిని అతిక్రమించి ఆర్థిక సామాజిక మార్పులను సాధించేదిగా వుండాలి. స్వతంత్ర భారతదేశం ఆర్థికంగా అట్టడుగు లోతుల నుండి పైకి ఎగబాకవలసి వుంది. అంతేగాక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా వుంటూనే, స్వావలంబన ప్రాతివదికగలిగి, విదేశీ (ప్రాబల్యానికి లోబడనిదిగా వుండాలి. మార్కెట్ శక్తుల్ని (ప్రైవేటు వాణిజ్యాన్ని నిరాటంకంగా పని చేయనిస్తే ఇది సాధ్యపడదు. అందుకు ప్రణాళికలు పెద్ద పబ్లిక్ సెక్టరు అవసరమవుతాయి. కాబట్టి భారతదేశం ప్రత్యేకించి 1955 తరువాత దేశీయ మార్మెటు అవసరాలను తీర్చగలిగే దేశీయ పరిశ్రమల ప్రాతిపదిక గల ఆర్థిక విధానాన్ని చేపట్టింది. సోషలిజాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికి స్వతంత్ర జాతీయ ఆర్థిక విధానాన్ని రూపొందించుకొనేందుకు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణపరమైన మార్పులు చేపట్టడం కీలకంగా ఎంచుకొన్నది.
సమాజ స్వరూపాన్ని కూడా త్వరగా మార్చవలసి వుంది. దేశంలోని పలు ప్రాంతాలలో దిగువ కులాల ఉద్యమాలు వున్నప్పటికీ, గాంధీజీ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికి గ్రామీణ సమాజంలో ఇప్పటికీ కుల వ్యవస్థ ప్రబలంగా వుంది. అస్పృశ్యత పాటించబడుతుంది. దిగువ కులాలు నిటారుగా నిలబడగల స్థితిలో లేవు. పురుషాధిక్యత ప్రబలంగా వుంది. స్త్రీలు కుటుంబంలో అణచివేతకు గురవుతున్నారు. హిందువులలో, ముస్లింలలో బహుభార్యాత్వం వుంది. మహిళలకు వారసత్వ హక్కులు లేవు, విడాకులు కోరే హక్కు లేదు. విద్యావకాశాలు అంతంత మాత్రమే. 1951 నాటికి ప్రజలలో నిరక్షరాస్యత అజ్ఞానం సర్వసామాన్యం. పురుషులలో 25 శాతం, స్త్రీలలో 7.9 శాతం మాత్రమే అక్షరాస్యులు.
10 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జాతి నిర్మాణంలో చారిత్రక ప్రాధాన్యత గల రెండు పెద్ద మార్పుల పట్ల భారతదేశ రిపన్లిక్కు నిర్మాతలు దూరదృష్టి నిబద్ధత కలిగివున్నారు, మొదటిది: నిరక్షరాస్యులతో పౌరస్వేచ్చ గల ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించటం. రెండవది: ప్రజాస్వామ్య రాజకీయ చట్ర పరిమితులలో ఆర్థికాభివృద్ధి చేపట్టటం. ఇప్పటి వరకు ఆర్థికాభివృద్ధి సాధించిన అన్ని సమాజాలలో లేక తొలుత పారిశ్రామికంగా వ్యవసాయకంగా ముందుకు చొచ్చుకు పోయిన అన్ని సమాజాలలో కట్టుదిట్టమైన (ప్రజాస్వామ్యం - ప్రత్యేకించి కార్మికులకు చాలా పరిమితం చేయబడింది. మరొక వైపు మొదటి నుండి భారతదేశం వయోజన ఓటింగుతో స్వేచ్చగా నిజాయితీగా నిర్వహించబడే ఎన్నికల ప్రాతిపదికపై ఏర్పడే పౌరహక్కులు గల ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ లేక ప్రాతినిధ్య ప్రభుత్వ విధానం పట్ల నిబద్ధత కలిగివుంది. అంతేగాక ప్రభుత్వం యూనివర్శిటీలు పత్రికలు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇతర వృత్తి సంఘాలు లాంటి పౌర అధికార ఉత్పత్తి స్థానాలలో వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవలసి వుంటుంది. దేశం ఎదుర్మోనున్న సామాజిక ఆర్థిక రాజకీయ సవాళ్ళను ప్రజాస్వామ్యయుతంగా పరిష్మరించవలసి వుంటుంది.
నాయకత్వం ఎదుర్కొన్న పెద్ద రాజకీయ కర్తవ్యాలలో ఒకటి : స్వతంత్ర పోరాటకాలంలో ప్రజలలో (ప్రారంభమైన ప్రజాస్వామ్య చైతన్యాన్ని యింకా పెంచటం. వెనుకబడిన దేశంలో పేద ప్రజలు ప్రజాస్వామ్యం కంటే కడుపునింపుకొనడం పైననే ఆసక్తి చూపుతారని, కూడుగుడ్డా నీడకి హామీ కల్పించకపోతే వారికి ప్రజాస్వామ్యం నిరుపయోగమని చెప్పే రైస్‌బౌల్ సిద్ధాంతం” యొక్క వివిధ వ్యాఖ్యలను నాయకత్వం పూర్తిగా తిరస్కరించింది.
భారతదేశం యొక్క వైవిధ్యం రీత్యా జాతీయ సమ(గ్రతని పెంపొందించేందుకు ప్రజాస్వామ్య రాజకీయ నిర్మాణం అవసరమని గుర్తించబడింది. సామాజిక మార్పు తీసుకొని వచ్చేందుకు ప్రజాస్వామ్యం అత్యవసరమని భావించబడింది. పేద ప్రజలు కాస్త ముందు వెనుకగా వారి ఓటుహక్కు ద్వారా వారి అధికారాన్ని వ్యక్తీకరిస్తారని, వారి అవసరాలను తీర్చే సామాజిక వ్యవస్థని తీసుకొని వస్తారనే ఆదర్శప్రాయమైన ఆలోచనని నెహ్రూ సమర్థించాడు.
ప్రస్తుతం వున్న ఆర్థికపరమైన, కులపరమైన స్త్రీ పురుష వివక్ష పరమైన వ్యత్యాసాలను అధిగమించేందుకు పేదరికాన్ని రూపుమాపి జీవన స్థాయిని పెంచేందుకు ఆర్ధికాభివృద్ధి ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలకు సామాజిక మార్చుతోడు కావాలి. భారత సమాజ నిర్మాణం త్వరితగతిని సోషలిస్టు దిశగా మార్చబడాలి. కాని సోవియట్ స్వతంత్రం తర్వాత భారతదేశం క్ష
కమ్యూనిజం తరహాలో జరిగి తీరాలని కాదు. ఈ లక్ష్యాల సాధనకు విస్తృతమైన ఐక్యత అవసరమని గుర్తించబడింది కాబట్టి స్వతంత్ర పోరాట లక్ష్యమూ అలాగే, లక్ష్యాన్ని సాధించే ప్రజాస్వామ్య రూపాల చుట్టూ విస్తృతమైన ఏకాభిప్రాయం రూపొందింపబడాలి.
జాతీయోద్యమం వ్యక్తి యొక్క సమాజం యొక్క సౌభాగ్యానికి, సామాజిక ఆర్ధిక సమానత్వానికి మంచి జీవితానికి సంబంధించిన అంచనాలను పెంచింది. 1950 నుండి నిరంతరంగా సాగుతున్న రాజకీయీకరణ క్రమం, అలాగే 197] నాటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం - ఈ అంచనాలను మరీ పెంచింది. అంచనాలకు అమలుకు మధ్య అంతరాయాన్ని పెరగనీయకుండా నిరంతరంగా పెరుగుతున్న ప్రజల ఆశలు ఆకాంక్షలు వీలైనంత త్వరలో నెరవేర్చబడాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇతరులు శతాబ్దం ఇంకా అంతకంటే ఎక్కువ కాలంలో సాధించిన అభివృద్ధిని భారత (ప్రజలు, వారి నాయకులు కొద్ది దశాబ్బాలలో సాధించాలని ఆకాంక్షించారు. ఈ అభివృద్ధి రక్తపాతాన్ని అధికారవాదాన్ని ఆభ్రయించకుండా, విభిన్న సామాజిక ఆర్థిక ప్రాంతీయ ప్రయోజనాలకు స్థానం కల్పించే క్రమం ద్వారా ప్రజాస్వామ్య ప్రాతిపదికన సాధించవలసి వుంది. ఇందుకు వ్యవసాయ సంస్కరణలను ప్రభుత్వ ప్రణాళికను బలమైన పబ్లిక్ సెక్టారుని ప్రధాన సాధనాలుగా వినియోగించుకోవలసి వుంటుంది.
ఈ కర్తవ్యాలను నెరవేర్చటానికి రాజకీయ స్థిరత్వం అవసరం. రాజకీయ వ్యవస్థ సామాజిక మార్పులతో స్థిరత్వాన్ని అనుసంధానం చేయాలి. భారతదేశ విప్లవం రాజకీయ స్థిరత్వం ప్రాతిపదికగా క్రమబద్ధంగా అహింసాయుతంగా సాగాలి.
అభివృద్ధి చెందటానికి లేదా పురోగమించటానికి లేక సామాజిక పరమైన అభివృద్ధి నమూనాని నిలబెట్టుకొనటానికి భారతదేశానికి గల సమర్ధతపై 1947 నుండి ఈనాటి వరకూ చాలామంది భారతీయులు - విదేశీయులు, విమర్శకులు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. భారతదేశంలో స్వతంత్రంగాని ప్రజాస్వామ్యంగాని ఎక్కువ కాలం మనజాలదని, భారతదేశ రాజకీయ వ్యవస్థ కాస్త ముందూ వెనుకగా కుప్పకూలుతుందని, భారతదేశం సమాఖ్యగా ఎక్కువ కాలం వుండబోదని, జాతీయ రాజ్యం భాషాపరమైన ప్రాంతీయ పరమైన ముక్కలు చెక్కలుగా విచ్చిన్నమవుతుందని పలువురు జోస్యాలు చెప్పారు. భారతదేశం యొక్క అసంఖ్యాకమైన మతపరమైన, కులపరమైన, భాషాపరమైన
తెగల పరమైన వైవిధ్యాలు, దాని పేదరికం సాంఘిక దుర్దశ అంతరాలు, విభిన్న స్థాయిలతో క్షి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కూడిన సామాజిక నిర్మాణం, విస్తృత స్థాయిలో వున్న నిరుద్యోగం, అనేకమైన సామాజిక ఆర్థిక సమస్యలు దాని జాతీయైక్యతని, దాని ప్రజుస్వామ్య సంస్థల్ని దాని అభివృద్ధి ప్రయత్నాలను బలహీనపరచి తీరతాయని మాటిమాటికి జోస్యాలు చెప్పారు. కాబట్టి భారతదేశం ముక్కలు చెక్కలవుతుందని, మిలిటరీ అధికార నియంతృత్వ పాలన ద్వారొ అది కలిపి వుంచబడుతుందని చెప్పారు.
1960 దశాబ్దం నుండి ఇంకా ఎక్కువగా 80, 90 దశాబ్దాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించటం ప్రారంభమయినప్పటి నుండి చాలా మంది వ్యాఖ్యాతలు - కొందరు మరీ ఆసక్తిగా ఎప్పుడు విచ్చిన్నమయ్యేది కూడా అంచనా వేయసాగారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ సెక్యులర్ రాజకీయ వ్యవస్థ పని చేస్తూ భారతదేశాన్ని జయప్రదంగా కలిపివుంచటం కూడా వీరు జోస్యాలు చెప్పకుండా నివారించలేకపోయింది. చైనా పాకిస్తాన్‌తో యుద్దాలు, నెహ్రూ మరణం, ఇందిరాగాంధీ హత్య, మతపరమైన భాషాపరమైన కులపరమైన హింసాయుత ఘటనలు, నక్సలైట్ల తిరుగుబాట్లు, కాళ్ళీరులో ఈశాన్య భారతదేశంలో పంజాబులో అంతకు ముందు తమిళనాడులో వేర్పాటువాద ఉద్యమాలు
- లాంటి గందరగోళం రాజకీయ సంక్షోభం తలెత్తిన ప్రతి సందర్భంలోనూ ఈ విమర్శకులు తమ జోస్యాలు పునఃప్రారంభించారు.
1960లోనే అమెరికా పండితుడు పత్రికా రచయిత సెలిగ్హేరిసన్ యిలా జోస్యం చెప్పాడు. “పరిస్థితులన్నీ స్వతంత్రం మనుగడకు ప్రతికూలంగా వున్నాయి. విషయమేమిటంటే వాస్తవంగా ఏ భారతరాజ్యమైనా మనగలుగుతుందా.” 1967లో టైమ్స్ పత్రిక విలేకరి నెవిల్ మేక్స్వెల్ 'విభిన్నమవుతున్న భారతదేశ ప్రజాస్వామ్యం” శీర్షికన వరుసగా ప్రచురించిన వ్యాసాలలో ప్రజాస్వామ్య చట్రంలో భారతదేశాన్ని అభివృద్ధి పరచే గొప్ప ప్రయోగం విఫలమయింది”" అని రాశాడు. అప్పుడు జరుగనున్న నాల్గవ సాధారణ ఎన్నికలు తప్పనిసరిగా భారతదేశంలో జరిగే చివరి ఎన్నికలవుతాయని జోస్యం చెప్పాడు.
అత్యవసర పరిస్థితి ప్రకటించబడినప్పుడు పలువురు తమ జోస్యం ఫలించినదని భావించారు. కొందరు మరికొంత ముందుకుపోయి భారతదేశంలోని ప్రజాస్వామ్య విధానానికి చివరిగా శాశ్వతంగా గ్రహణం పట్టిందని, అది గతంలోలాగా వుండబోదని బల్లగుద్ది మరీ చెప్పారు. మరి కొందరు ఆర్థికాభివృద్ధి సాధించటంలో భారతదేశం యొక్క అశక్తతని గురించి నొక్కి చెప్పారు. వారి అభిప్రాయాల ననుసరించి భారతదేశ రాజకీయ సంస్థల నిర్మాణం నిర్దేశించుకొన్న అభివృద్ధి లక్ష్యాలకనుగుణంగా లేవని, వాటిని స్వతంత్రం తర్వాత భారతదేశం క్షి
సాధించటానికి నియంతృత్వం కాకపోయినా ఒక మేరకు ఒత్తిడి బలవంతం అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు.
మరోవైపు తీవ్రమైన హింసాయుత విప్లవం లేకుండా ఎలాంటి సామాజిక ఆర్థిక లేక రాజకీయాభివృద్ధి సాధ్యపడదని, జాతి నిర్మాణం రాజకీయ (ప్రజాస్వామ్యం ఆర్థికాభివృద్ధి జాతీయెక్యత జాతీయత-అణగారిన దోపిడికి గురయిన వారిని మభ్య పెట్టేందుకు ఉద్దేశించబడిన బూటకపు మాటలని వామపక్ష సంశయవాదులు అభిప్రాయపడ్డారు. కాబట్టి వారు 1925-49 కాలంలో చైనాలో వచ్చిన రైతాంగ విష్లవం లేక 1917లో రష్యాలో వచ్చిన కార్మిక కర్షక విప్లవం రావాలని, వస్తుందనీ వాదించారు. వారి అభిప్రాయాలననుసరించి శేదరికం అసమానత వర్గ ప్రాబల్యం సామాజిక అణచివేతలు కాస్త ముందూ వెనుకగా అత్యధిక ప్రజానీకాన్ని విష్లవమార్గం పట్టిస్తాయి. ఫ్యూడలిజాన్ని పెట్టుబడిదారీ విధానాన్ని మాత్రమేగాక బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూదా అంతమొందిస్తాయి. 1970 దశాబ్దం ప్రారంభంలో హోంమంత్రిత్వశాఖ నివేదిక తయారు చేసిన వానితో సహా పలువురు పరిశీలకులు. హరితవిప్లవం కేవలం ధనిక రైతులకే లాభాలు తెచ్చిపెడుతుందని, చిన్న రైతుల్ని పొలాల నుండి నెట్టివేస్తుందని, వ్యవసాయ కార్మికులలో నిరుద్యోగితను పెంచక తప్పదని, ఫలితంగా హరితవిప్లవం ఎరుపుగా మారుతుందని జోస్యం చెప్పారు. భవిష్యత్తుపై అంతగా ఆశాభావం లేని వామపక్షవాద జోస్యులు భారతదేశంలో స్వతంత్ర ఆర్థికాభివృద్ధి చెందే అవకాశాలను కూడా ్రోసిపుచ్చారు. భారతదేశం పరాధీన నయావలసవాద దశలో ప్రవేశిస్తుందని చెప్పారు.
వామపక్ష వామపక్షేతరవాదుల ఈ సంశయాత్మకవైఖరితో పాలు పంచుకొనని వారిని ప్రస్తుత వ్యవస్థ సమర్థకులుగా చిత్రీకరించారు. భారతదేశ పరిస్థితిని అధ్యయనం చేస్తున్న అత్యంత ప్రతిభావంతులైన రాజకీయ శాస్త్రవేత్తలలో ఒకరైన దబ్బు. హెచ్. మారిస్ జోన్స్ 1966లో ఇలా చెప్పారు. 'భారతదేశ పరిణామాలపై చాలా సందేహాస్పద అభిప్రాయాల్ని అంగీకరించటం ఒక సాంప్రదాయమయింది.... అలాంటి వైఖరులతో ఏకీభవించిన వ్యక్తి ప్రభుత్వ వ్యక్తిగా బయటివాడిగా, దారి తప్పిన భావోద్వేగిగా పరిగణింపబడుతున్నాడు. భారతదేశం వివిధ రంగాలలో - గ్రామీణ ప్రాంతంలో అంతంత మాత్రం భూసంన్మరణలు, విస్తృతస్థాయిలో భూమి లేనివారు, పరిశ్రమలలో జాతీయాదాయంలో చాలా నెమ్మదిగా సాగుతున్న అభివృద్ధి రేటు, విపరీతమైన జనాభా కేశ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అభివృద్ధి రేటుని అదుపు చేయటంలో వైఫల్యం, కొనసాగుతున్న అసమానతలు, కులపరమైన అణచివేత, మహిళల పట్ల వివక్ష మంచి ఫలితాలు ఇవ్వని విద్యా విధానం, కలుషితమవుతున్న పర్యావరణం, నగరాలలో పెరుగుతున్న మురికివాడలు, మానవహక్కుల దుర్వినియోగం, రాజకీయాలలో ముఠాతత్వం, పార్టీల గందరగోళ పరిస్థితి పెరుగుతున్న రాజకీయ అశాంతి, వేర్పాటువాద డిమాంద్లు ఉద్యమాలు, పాలనాపరమైన వైఫల్యం, పోలీసు అసమర్ధత పై స్థాయిలలో లంచగొండితనం పాశవికతలాంటి క్లిష్ట సమస్యల్ని తట్టుకొని నిలబడగలగడం కొంత తక్కువ, నిరాశావాదులైన పరిశీలకులను కలవరపెట్టింది. ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రజాస్వామ్య సంస్థలు రాజ్యాంగం తయారు చేసినవారి ఆదేశాల మేరకు మార్చబడవనే వాస్తవం- కలవరానికి గురయిన ఈ పరిశీలకుల విభ్రాంతిని ఇంకా పెంచింది. గడిచిన వంద సంవత్సరాల కాలంలో స్వతంత్రపోరాటం, దానితో పాటు ఆధునిక మేధావులు- ప్రజాస్వామ్యాన్ని దేశీయం చేశారని భారతదేశంలో పాదుకొల్పారని గమనించడంలో ఈ పరిశీలకులు విఫలమయ్యారు.
ఇలాంటి సంశయాలతో, జోస్యాలతో ఏకీభవించని భారతదేశ పరిణామాల విశ్లేషకులు కూడా వెనుకబడిన ఆర్థిక విధానం కలిగి, ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఎంతో వైవిధ్యంగల సమాజంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి సమస్యలపై పర్యావలోకించారు. వారు కూడా భారతదేశ రాజకీయ స్థిరత్వం పట్ల ఆందోళనచెందారు. వారు పాలనాపరమైన రాజకీయపరమైన ప్రతిష్టంభన ఏర్పడుతుందని అంచనా వేయలేదు. కాని వారిలో చాలా మంది భారతదేశం పరిపాలనా సంక్షోభం ఎదుర్కోవడం ప్రారంభమయిందని వాదించారు. ఆకాంక్షించదగిన సామాజికాభివృద్ధి కొరకు పటిష్టమైన సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పడం కొరకు మౌలికమైన నిర్మాణపరమైన సంస్థాపరమైన మార్చులు అవసరమని నొక్కి చెపుతారు. అధికారవాద మద్దతుదారులకు, హింసాయుత విప్రవం యొక్క వాంఛనీయత సంభవనీయతలకు, దేశం ముక్కచెక్కలవుతుందనే జోస్యాలకు వ్యతిరేకంగా వాదిస్తూ కూడా గాంధీ నెహ్రూల అజెండా ప్రాతిపదికగా సమూలమైన మార్పులు తీసుకొని వచ్చే కార్యక్రమాలు అమలు జరపటాన్ని సమర్ధిస్తారు. రాజకీయ నాయకత్వం
ఒక జాతిగా ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థగా భారతదేశ మనుగడ, అలా? స్వతం[త్రపోరాటంచే నిర్దేశించబడిన జాతీయ లక్ష్యాల సాధన - దీర్ణకాలిక ఆర్థిక స్వతంత్రం తర్వాత భారతదేశం 15
సామాజికశక్తులు రూపుదిద్దుకోవడంపై అధారపడివున్నాయి. అయినప్పటికి రాజకీయ
నాయకుల స్వభావం, నిపుణతలు అనివార్యంగా గణనీయమైన పాత్ర నిర్వహిస్తాయి.
1947లో ప్రారంభమైన భారతదేశ తొలి ప్రయత్నాలకు పెద్ద సానుకూలత అప్పటి నాయకుల వ్యక్తిగత యోగ్యత, శక్తి సామర్భాలు. వారు ఆదర్శవంతులు, సామాజిక నిబద్ధత గలవారు. విస్తృతమైన ప్రజల మద్దతు పొందిన వారు. జాతీయ కార్యక్రమం జాతీయ లక్ష్యాల పట్ల ఉత్సుకత కలిగించగల, ప్రజల ఆశలు అకాంక్షల్ని ప్రతి ఫలించగల, ప్రజలకు బలమైన నాయకత్వం అందించగల నాయకులు. నాయకులు ప్రజలపై ప్రజాస్వామ్య సంస్థలపై అపారమైన విశ్వాసం గలవారు. అధికారం కొరకు ప్రజలపై ఆధారపడినవారు. జాతీయోద్యమకాలంలో నాయకులు విభిన్న ప్రయోజనాలు వైఖరులు గలవారితో చర్చించి ప్రజాభిప్రాయానికి స్థానం కల్పించగల, ఏకాభిప్రాయ చట్రంలో పని చేయగల సామర్భాన్ని అలవర్చుకొన్నారు. వారు దీర్హకాలిక అఖిలభారత దృక్పధాన్ని అలవరచుకొని రాష్ట స్థానిక నాయకులతో కలిసి పని చేయగలిగారు.
ఉన్నత నాయకత్వ లక్షణం కాంగ్రెస్‌కే పరిమితం కాలేదు. స్వతంత్ర పార్టీ నాయకుడు సి. రాజగోపాలాచారి, అసంతృప్త కాం(గ్రెస్వాదులకు నాయకత్వం వహించిన జె.బి.కృపలానీ, హిందూ మతవాదుల నాయకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ, కాంగ్రెసేతర దళిత నాయకుడు బి.ఆర్. అంబేద్కర్, సోషలిస్టు నాయకులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ, కమ్యూనిస్టుల నాయకులు పి.సి. జోషి అజయఫఘోష్ ఇయంయస్ నంబూద్రిపాద్లు ఉన్నత ప్రమాణాలు గల నాయకులు.
దీనికి విరుద్ధంగా గత కొన్ని దశాబ్దాల సమస్య రిపబ్లిక్ స్థాపన కాలం నాటి లక్షజాలు నిపుణతలు గల నాయకుల కొరత. ఇందిరాగాంధీకి ఈ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆమె పరిపాలనా కాలంలోనూ ఆ తరువాత కాలంలో కూడా బహుశా ఈ నాయకత్వలక్షణాల కారణంగానే ప్రాబల్యం వహించింది. ఆ తరువాత నాయకత్వం స్థాయిలో క్రమంగా బలహీనత ఆవహించింది. పలువురు రాజకీయ నాయకులు ప్రాంతానికి మతానికి, కులానికి కొన్ని కులాల గ్రూపులకు పరిమితమయ్యారు.
ఈ రచన పురోగమిస్తున్న ప్రజల కథ, క్రమబద్ధమైన విప్లవం కథ. స్వతంత్ర పోరాట స్వష్నానికి వాస్తవ రూపం కల్పించేందుకు భారతదేశ ప్రజలు సాగించిన ప్రయత్నాల కథ. రచయితలుగా మేము మా వ్యక్తిగత గతంలోకి వెళ్ళి నిష్పాక్షికంగా విశ్లేషించే ప్రయత్నం చేశాం. ప్రజల స్థితిగతులను పెంచే ప్రయత్నాలలో మమేకమైన ఆయా ఘటనల 16 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సందర్భంగా పొందిన పాక్షిక దృష్టిని ఉద్వేగాన్ని పూర్తిగా అధిగమించలేకపోయి వుండవచ్చు. పాఠకులు గమనించబోయే విధంగా మేము మన యిటీవలి గతం పట్ల, సమకాలీన ఘటనల పట్ల విస్తృతమైన ఆశావహచట్రంలో విమర్శనాత్మక వైఖరిని పాటించాం.
మార్చు కొత్త సమస్యలను సృష్టించింది. ఇవి పాత సమస్యలకు తోడయ్యాయి. కొత్త పరిష్కారాలు అవసరమయ్యాయి. పరిష్మరించవలసిన సమస్యలు ఎలా ఎప్పుడు ఎలాంటి పరిణామాల నాశించి చేపట్టాలి? అనే స్వభావానికి సంబంధించినవి. బానిసత్వం అంతమై స్వతంత్రం రాగానే సమస్యలన్నీ ఉపరితలానికి వస్తాయని గాంధీజీ అంచనావేయలేదా! అంతేగాక గాంధీజీ 'కలత చెందవలసిన పనిలేదు. మనం సమదృష్టితో చూడగలిగితే ప్రతి సమస్య పరిష్మరింపబడుతుంది” అని కూడా చెప్పాడు. జాతీయైక్యత, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, స్వతంత్ర ఆర్థికాభివృద్ధి సమానత్వం పేదరిక నిర్మూలన లాంటి స్వతంత్ర పోరాట వారసత్వం రేకెత్తించిన ఆకాంక్షలు ఏ మేరకు నెరవేర్చబడ్డాయో రానున్న సంవత్సరాలలో చరిత్రకారులు అంచనావేయవలసి వుంటుంది.
నెహ్రూ శకంలోని తొలి సంవత్సరాలలో ఆశావాహ వాతావరణం నెలకొన్నది. 1955లో రిపబ్లిక్ పెరేడ్ని సందర్శించిన తరువాత నెహ్రూ ఆత్మవిశ్వాసంతో సంతృప్తితో ముఖ్యమంధక్రులకు రాసిన లేఖలో యిది ప్రతిఫలించింది. “ఒక్కటొక్కటిగా లక్ష్యాల్ని సాధిస్తూ మన జాతి ముందుకు పోతున్న ఈ దృశ్యంతో నా హృదయం గర్వంతో ఆనందంతో ఉప్పొంగుతుంది. ఆశావహవాతావరణం, గమ్యంపై విశ్వాసం వున్నాయి.” కొద్ది నెలల తరువాత అయిన మరలా యిలా చెప్పాడు. “ఉదయ సంధ్యావీచికలు. ఎగుడు దిగుళ్లతో కూడిన సుదీర్హమైన భారతదేశ చరిత్రలో నూతన శకారంభమయిందనే భావన. ఈ విషయంలో మన దేశంలోని అనంఖ్యాకవమైన (ప్రజలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాననుకుంటున్నాను.' నెహ్రూని అంత ఆశావహని చేసిందేమిటి? నెహ్రూ జీవిత చరిత్రకారుడు యస్. గోపాల్ మాటల్లో “వ్యక్తి స్వతంత్రం సామాజిక న్యాయం, ప్రజల భాగస్వామ్యం, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, జాతీయ స్వావలంబన, అంతర్జాతీయ వ్యవహారాలలో గౌరవప్రదమైన న్థానం - అన్నీ ఉదాత్తమైన గొప్ప లక్ష్యాలు, అన్నీ కూడా ('ప్రధానమంటత్రి నాయకత్వంలో క్రమబద్ధంగా సాధించబడుళున్నాయి.
నెహ్రూ స్వతంత్రం రాకకు సాక్షీభూతంగా వున్న నెహ్రూ తరం ప్రజలు దేశం సాధించగలిగే కంటే ఎక్కువ అభివృద్ధి నాశించారు. ప్రజలు మేధావులు నెహ్రూ పాలనా కాలంలోనేగాక ఇందిరాగాంధీ పాలనాకాలంలో కూడా - కనీసం 1978-74 వరకు స్వతంత్రం తర్వాత భారతదేశం క్షే?
ఆశాభావంతోనే వున్నారు - కాని క్రమంగా ఈ ఉల్లాసం ఉత్సుకత ఆత్మగౌరవం సన్నగిల్లడం మొదలయింది. అయినప్పటికీ ఈ రచన వెలువరించనున్న విధంగా అవసరమైనది సాధించగలిగిందీ కూడా చాలా వుంది. ప్రత్యేకించి ప్రజల జీవన స్థాయిని పెంచటంలో చేయగలిగింది చేయటం జరగలేదు (అందుకు నిరాశ విమర్శలు సమర్ధనీయమే). సాధించిన గణనీయమైన విజయాలూ వున్నాయి. దేశం, దేశ ప్రజల భవిష్యత్తు పట్ల మా ఆశావాహ దృక్పథం సమర్థనీయమేనని ఈ విజయాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడిన బ్రిటిషు పండితుడు, మిషనరీ వెరియర్ ఎల్విన్ వ్రాసింది చాలా వరకు మా అభిప్రాయాలను భావాలను వ్యక్తీకరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. “భారతదేశాన్ని గురించి నేను ఆశాభావంతో వున్నాను. దేశంలోని కోపోద్రిక్తులైన యువకులు (భ్రమలు తొలగిపోయిన వృద్ధులు ఆగ్రహంగా వున్నారు. విమర్శలు చేస్తున్నారు. కొంత వరకు లంచగొండితనం వున్నమాట నిజమే. చాలా అసమర్ధత వుంది. నయవంచన కూడా ఎక్కువగానే వుంది. కాని సాధించింది కూడా అంత తక్కువేం కాదు. ఎన్నో ప్రతికూలతలకు వ్యతిరేకంగా తనను తాను తిరిగి రూపొందించుకొనేందుకు ప్రయత్నిస్తున్న జాతిలో భాగంగా వుండటం చాలా ఉద్వేగపరచే అనుభవం.” మన వైఫల్యాల పట్ల మేము చేపట్టే వైఖరి గోపాలకృష్ణ గోఖలే తన జీవిత
చరమాంకంలో మితవాదుల పట్ల చేపట్టిన వైఖరి కావచ్చు. “దేశం అభివృద్ధి చెందుతున్న దశలో మనం సాధించే ఫలితాలు తక్కువగా వుంటాయని, తరచుగా నిరాశానిస్పృహలకు గురవుతామని మరచిపోకండి. ఈ పోరాటంలో మనకు విధి నిర్దేశించిన స్థానం అది. ఆ స్థానానికి చెందిన పని పూర్తి చేసినప్పుడు మన బాధ్యత నెరవేర్చినట్లవుతుంది,
నిస్సందేహంగా ఈ బాధ్యత వారి విజయాలతో భారతదేశ సేవ చేసేందుకు భవిష్యత్తరాలకు
అప్పజెప్పబడుతుంది. ప్రస్తుత తరానికి చెందిన మనం ప్రధానంగా మన వైఫల్యాలతో
దేశసేవ చేసేందుకు సంతృప్తిపడాలి. మన వైఫల్యాల నుండి గొప్ప విజయాలు సాధించే
బలం చేకూరుతుంది.” 18 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
£౭2 ఆలి ఆ వలసవాద వారసత్వం
భారతదేశ వలసవాద గతం స్వతంత్రానంతరం భారతదేశాభివృద్ధికి గుదిబండ అయింది. ఇతర రంగాలలోలాగానే ఆర్థిక రంగంలో బ్రిటిషుపాలన భారత దేశాన్ని మార్చివేసింది. కాని జరిగిన ఈ మార్సులు. ఎ.గందర్ ఫ్రాంక్ సరిగ్గా వర్షించినట్టుగా వెనుకబాటుతనం అభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా సమాచారం ఆర్థిక పరిపాలన, విద్యారంగాలలోని ఈ మార్పులు వాటికవిగా చూస్తే సానుకూలంగా కనిపిస్తాయి. ఉదాహరణకు రైల్వేల అభివృద్ధిలాగా. కాని వలస వాద చట్రంలో భాగంగా, వలసవాదంలో పని చేయటం వలన అవి వెనుకబాటుతనం క్రమంలో అనివార్య భాగమయ్యాయి. అంతేగాక అవి పేదరికాన్ని, బిటన్పై ఆధారపడటాన్ని బ్రిటన్‌కి లోబడి వుండటాన్ని పెంచి వలసవాదం ఆర్థిక నిర్మాణం స్పష్టమైన రూపం దాల్చడానికి దారి తీశాయి. మౌలిక లక్షణాలు
భారతదేశంలోని వలస వాద నిర్మాణానికి నాలుగు మౌలిక లక్షణాలున్నాయి.
మొదటిది : వలసవాదం భారత దేశ ఆర్ధిక విధానాన్ని ప్రపంచ పెట్టుబడిదారీ విధానంతో సంపూర్ణమైన సంక్షిష్టమైన విలీనానికి దారితీసింది. 1750ల నుండి భారతదేశ ఆర్థిక ప్రయోజనాలు బ్రిటిషు ఆర్జీక ప్రయోజనాల అధీనంలో వుంచబడ్దాయి. ఒక దేశం యొక్క ఆర్థిక విధానం ప్రపంచ ఆర్థిక విధానంతో అనుసంధానం చేయబడడం అనివార్యమూ, స్వతంత్ర ఆర్థిక విధానం యొక్క మౌలిక లక్షణం గనుక ఇది కీలకమైన అంశం
రెండవది : బ్రిటిషు పరిశ్రమలకు అనుకూలించేందుకు ఉత్పత్తి మరియు అంతర్జాతీయ (శ్రమ విభజన యొక్క ప్రత్యేక నిర్మాణం భారతదేశంపై బలవంతంగా రుద్దబడింది. భారతదేశం ఆహారధాన్యాలను ప్రత్తి జనుము, చమురువిత్తనాలు, ఖనిజాలు స్వతంత్రం తర్వాత భారతదేశం 19
లాంటి ముడి వనరులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేసింది. బిస్కట్లు, చెప్పుల నుండి యంత్రాలు, కార్లు రైల్వే ఇంజన్ల వరకు బ్రిటీషు పరిశ్రమలలో తయారైన వాటిని దిగుమతి చేసుకొన్నది. 1935-39 కాలం నాటికి కూడా ఆహారం, పానీయాలు, ముడి పదార్దాలు భారతదేశ ఎగుమతులలో 68.5 శాతం వుండగా, యంత్రాలలో తయారైన వస్తువుల దిగుమతులు 644 శాతం వున్నాయి.
మూడవది : ఆర్థికాభివృద్ధి క్రమానికి మూలం ఆర్థిక మిగులు వినియోగం లేక పెట్టుబడికొరకు ఆర్థిక విధానంలో సాధించిన పొదుపు. 1914 నుండి 1946 వరకు స్థూల జాతీయాదాయంలో మిగులు 2.75 శాతం మాత్రమే. 1971-75 కాలంలో 12 శాతం. 1914-46 కాలంలో పెట్టుబడి సంచయము 6.75 శాతం, 1971-75 కాలంలో 20.14 శాతం.
అంతేగాక భారతదేశం యొక్క మిగులు లేక పొదుపులో అత్యధిక భాగాన్ని వలసవాదరాజ్యం వినియోగించుకొన్నది. మరొక పెద్దభాగం దేశీయ భూస్వాములు వడ్డీ వ్యాపారులు స్వాయత్తం చేసుకొన్నారు. వలసవాదం అంతమయ్యే నాటికి రైతులు చెల్లించిన శిస్తులు వడ్డీలు 1400 మిలియన్ల రూపాయలుగా అంచనా వేయబడింది. 1987 నాటిక్షి గ్రామీణ రుణాల మొత్తం 18000 మిలియన్ల రూపాయలు. మరొక అంచనా మేరకు రాజులు, జమీందారులు ఇతర దళారులు జాతీయాదాయంలో 20శాతం వినియోగించుకున్నారు. కొద్ది భాగం మాత్రమే వ్యవసాయం పరిశ్రమల అభివృద్ధికి వెచ్చించబడింది. అత్యధికభాగం భూస్వామ్య విధానాన్ని వడ్డీవ్యాపారాన్ని తీవ్రతరం చేయటానికి వినియోగించబడింది.
ఇక తరలింపు వుంది. దిగుమతులకు మించిన ఎగుమతుల ద్వారా వలస రాజ్యం, దాని అధికారులు, విదేశీ వర్తకులు ఏక పక్షంగా సాంఘిక మిగులును తరలించారు. భారతదేశం దానికి సమానమైన ఆర్థిక వాణిజ్యపరమైన వస్తుపరమైన ఫలితాలు పొందలేదు. ఆ విధంగా జాతీయాదాయంలోని 5 నుండి 10 శాతం ఏకపక్షంగా దేశం నుండి తరలించబడింది. ఆ విధంగా ఆర్థిక వనరులు తరలభించబడుతుంటే ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది?
నాల్గవది : వలసవాదచట్రాన్ని నిర్మించటంలో నిర్ణయించటంలో నిర్వహించటంలో రాజ్యం నిర్వహించిన కీలకమైన పాత్ర. భారతదేశ విధానాలు బ్రిటన్‌లో బ్రిటిషు ఆర్ధిక 20 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రయోజనాలకు బ్రిటిషు పెట్టుబడిదారీ విధానానికి అనుగుణంగా నిర్ణయించబడ్డాయి. భారతదేశం వెనుకబాటు తనానికి ముఖ్యమైన కారణం పరిశ్రమలకు వ్యవసాయానికి రాజ్యం మద్దతు నిరాకరణ. ఇది అభివృద్ధి చెందే తొలి దశలలో రాజ్యం యొక్క చురుకైన మద్దతు పొందిన బటన్‌తో సహ దాదాపు అన్ని పెట్టుబడిదారీ దేశాలలో జరిగిన దానికి భిన్నమైనది, వలస పాలన భారతదేశంపై స్వేచ్చావాణిజ్యాన్ని బలవంతంగా విధించింది. బ్రిటన్, పశ్చిమ యూరపు, అమెరికాలు తొలి దశలలో సుంకాల అద్దుగోడల వెనుక అభివృద్ధి చెందాయి. కాని వలస రాజ్యం భారతదేశానికి సుంకాల రక్షణ కల్పించ నిరాకరించింది.
1918 తరువాత జాతీయోద్యమం ఒత్తిడితో ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు ఒక మేరకు సుంకాల రక్షణ కల్పించక తప్పలేదు. ఈ రక్షణ కూడా తగినంతగా గాక అరకొరగా కల్పించబడింది. అంతేగాక 1880ల నుండి ప్రభుత్వం భారతీయ పరిశ్రమలకు హాని కలిగించేది గాను బ్రిటిషు పరిశ్రమలకు అనుకూలంగానూ వుండే ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇంతకు ముందు ప్రస్తావించిన విధంగా భారతదేశ సామాజిక మిగులులోని చాలా పెద్ద భాగాన్ని వలస రాజ్యం వినియోగించుకొన్నది. చాలాకొద్ది భాగాన్ని మాత్రమే వ్యవసాయం లేక పరిశ్రమలు లేక సామాజిక మౌలిక వసతులు లేక విద్య పారిశుధ్యం ఆరోగ్య సేవల లాంటి జాతి నిర్మాణ కార్యక్రమాలకు వెచ్చించింది.
వలసరాజ్యం దాదాపు తన మొత్తం ఆదాయాన్ని బ్రిటిషిండియా పాలనావసరాల కొరకు, బిటనకు ప్రత్యక్ష పరోక్ష పన్నుల చెల్లింపు కొరకు, బ్రిటిషు వాణిజ్యం పరిశ్రమల ప్రయోజనాలకు సేవలు చేయటం కొరకు వినియోగించింది. పెద్ద మొత్తాలను మిలటరీ వ్యయానికి, శాంతి భద్రతల పరిరక్షణకు, పన్నుల వసూళ్లను నిర్వహించే పౌరపరిపాలనకు వెచ్చించింది. 1890 తరువాత కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో దాదాపు 50 శాతం మిలటరకీకి వెచ్చించింది. 1947-48లో మిలిటరీ వ్యయం దాదాపు 47 శాతం.
అంతేగాక భారతదేశ పన్నుల విధానం చాలా అనుచితంగా న్యాయ విరుద్ధంగా వుంది. వలసపాలనా కాలంలో రైతులపై భూమిశిస్తు భారం మోపబడింది. పేదలపై ఉప్పు పన్ను విధించబడింది. ఎక్కువ వేతనాలు పొందే ఉన్నతాధికారులు, భూస్వాములు, వర్తకులు లాంటి అధికాదాయ [గ్రూపులు దాదాపు ఎలాంటి పన్నులు చెల్లించలేదు. ప్రత్యక్ష స్వతంత్రం తర్వాత భారతదేశం ల!
పన్నులు చాలా తక్కువ. 1946-47లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య కటబం 8,60,000 మాత్రమే. జాతీయ, రైతు ఉద్యమాల ఒత్తిడి కారణంగానే 20వ శతాబ్దంలో భూమిశిస్తు ఉప్పు పన్ను తగ్గుతూవచ్చాయి. 1900-01లో కూడా భూమిశిస్తు, ఉప్పు పన్ను వలన వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వాదాయంలో 58 శాతం 16 శాతం వున్నాయి. ఆర్థిక వెనుకబాటుతనం
వలసవాదం భారతదేశ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి బంధకమయింది. దేశంలోని పలు ప్రాంతాలలో వ్యవసాయం స్తంభించింది. ఎకరానికి వచ్చే సగటు ఆదాయం క్షీణించింది. 1901-1941 కాలంలో తలసరి వ్యవసాయ ఉత్పత్తి 14 శాతం క్షీణించింది. తలసరి ఆవిరధాన్యాల తగ్గుదల 24 శాతం.
సంవత్సరాలు గడచిన కొలదీ భూస్వాముల వడ్డీవ్యాపారుల, వర్తకుల, వలస రాజ్యం- 'ప్రాబల్యంగల వ్యవసాయ నిర్మాణం రూపు దిద్దుకొన్నది. జమీందారీ రైత్వారీ ప్రాంతాలలో కౌలు పాలికాపు వ్యవసాయం ప్రాబల్యం వహించింది. 1940ల నాటికి 70 శాతానికి పైగా భూమి భూస్వాముల నియంత్రణలో వుంది. మొత్తం వ్యవసాయోత్సత్తిలో సగానికి పైగా భూమి భూస్వాముల, వడ్డీ వ్యాపారుల, వలసరాజ్యం కైవశమయింది.
వ్యవసాయంలో వలస రాజ్యం యొక్క ఆసక్తి ప్రధానంగా శిస్తు వసూళ్ళకు పరిమితమయింది. అది వ్యవసాయాభివృద్ధికి చాలా తక్కువ వెచ్చించింది. అలాగే భూస్వాములు వడ్డీవ్యాపారులు వారి యజమాన్యంలో వున్న పొలాలపై ఉత్పాదక పెట్టుబడి పెట్టేకంటే వడ్డీరేట్లు పెంచటమే ఎక్కువ లాభదాయకంగా పరిగణించారు.
వ్యాపారీకరణ, కౌలు చట్టాల ఫలితంగా చాలా ప్రాంతాలలో సంపన్న రైతు వర్గం అభివృద్ధి చెందింది. కాని వారితో అత్యధికులు పొలాలు కొని భూస్వాములు కావటానికి, వడ్డీవ్యాపారం చేయటానికి ప్రాధాన్యత నిచ్చారు. ఫలితంగా చాలా కొద్ది ప్రాంతాలలో మినహాయించి పెట్టుబడిదారీ వ్యవసాయం చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందింది. మరొకవైపు చిన్న రైతులకు కౌలుదార్లకు పాలికాపులకు వనరులు లేవు. మంచి పశువులు, విత్తనాలు, ఎరువులు వ్యవసాయాన్ని మెరుగు పరుచుకోవటానికి ప్రోత్సాహకాలు లేవు. వలస పాలనా కాలంలో పొలాలు కొల్పోవటం పెరిగింది. వ్యవసాయ జనాభాలో పొలాలు లేని వ్యవసాయ కూలీలు 1871లో 18 శాతం వుండగా 1951 నాటికి 28 శాతానికి పెరిగారు. కౌలుదారీ పాలికాపు వ్యవసాయంపై రద్దీ పెరగడంతో వ్యవసాయం ముక్కలు చెక్కలయింది. వ్యవసాయంపై బతుకులు గడవడమే దుర్భరమయింది. లై బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రపంచ మార్కెటుతో అనుసంధానం రహదారుల రైలు మార్గాల అభివృద్ధితో (గ్రామీణ ఉత్పత్తులలో ఎక్కువ భాగం పట్టణ ప్రపంచ మార్కెట్లలో ప్రవేశించటానికి వాణిజ్యపంటల ఉత్పత్తికి దారితీసింది. కాని వ్యవసాయ వ్యాపారీకరణ పెట్టుబడిదారీ వ్యవసాయానికి సాంకేతిక వినియోగానికి దారితీయలేదు. సారవంతమైన భూములు, లభించే నీరు, ఇతర వనరులు ఆహార పంటల నుండి వాణిజ్య పంటలవైపు మరల్చబడ్డాయి.
అభివృద్ది చెందిన దేశాలలో వ్యవసాయం ఆధునీకరింవ బడుతూ విప్లవీకరింపబడుతూ వున్న సమయంలో భారతదేశ వ్యవసాయ ఉత్పత్తి విధానంలో దాదాపు ఎలాంటి మార్పులేదు. భారతదేశపు రైతు శతాబ్దాల తరబడి వాడిన పాతకాలపు పనిముట్లనే వాడడం కొనసాగిస్తున్నాడు. ఉదాహరణకు 1951లో ఉపయోగంలో వున్న కొయ్యనాగళ్లు 31.3 మిలియన్లు వుండగా ఇనుపనాగళ్లు 930,000 మాత్రమే. రసాయనిక ఎరువుల వినియోగం దాదాపు తెలియదు. పశువుల ఎరువులలో చాలా భాగం వృధా చేయబడింది. 1938-89లో వ్యవసాయయోగ్యమైన భూమిలో కేవలం 11శాతం మాత్రమే మెరుగైన విత్తనాల వాడకం జరిగింది. వాటి వినియోగం ఆహారేతర వాణిజ్య పంటలకే పరిమితమయింది.
వ్యవసాయ విద్య పూర్తిగా అశ్రద్ధ చేయబడింది. 1946లో 3110 మంది విద్యార్థులలో కేవలం 9 వ్యవసాయ కళాశాలలు మాత్రమే వున్నాయి.
నీటి పారుదల రంగంలో మాత్రమే కొంత అభివృద్ధి సాధించబడింది. 1940ల నాటికి మొత్తం సాగు భూమిలో 27 శాతానికి నీటి పారుదల సౌకర్యం కల్పించబడింది.
భారతదేశ ఆర్థిక వెనుకబాటుతనానికి మరొక కారణం అప్పటి పారిశ్రామిక పరిస్థితి. 19వ శతాబ్దంలో భారతదేశంపై విధించబడిన స్వేచ్భా వాణిజ్యంతో పాటు బ్రిటన్ నుండి దిగుమతి అయిన చౌక ఉత్పత్తుల పోటీ కారణంగా భారతదేశ చేతివృత్తులు పరిశ్రమలు కుప్పగూలాయి. ఉపాధి కొల్పోయిన చేతి వృత్తుల వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి లేదు. వారికి వున్న ఒకే ఒక మార్గం కౌలురైతులుగా పాలికాపులుగా కూలీలుగా వ్యవసాయరంగాల్ని ఆశ్రయించటం.
భారతదేశంలో 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుండి ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కాని ఉత్పత్తి ఉపాధికల్పనల రీత్యా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పారిశ్రామికాభివృద్ధి అంతంత మాత్రమే. పారిశ్రామికాభివృద్ధి 19వ శతాబ్దంలో ప్రధానంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 23
ప్రత్తి, జనుము, టీలకు 1980 దశాబ్దంలో చెక్కర సిమెంటు కాగితం రం॥*లకే పరిమితమయింది. 1907 తరువాత ఇనుము ఉక్కు పరిశమ కొంత అభివృద్ధి చెందింది. కాని 1946 నాటికి కూడా జనపనార వస్త్ర పరిజ్రమలు మొత్తం పారిశ్రామిక కార్మికులలో 80 శాతం మందికి మాత్రమే ఉపాధికల్పించాయి. బ్రిటీషు పాలన అంతమయ్యే నాటికి జాతీయాదాయంలో ఆధునిక పరిశ్రమల వాటా కేవలం 7.5 శాతం మాత్రమే. భారతదేశం విద్యుదుత్పత్తిని అభివృద్ధి పరచటంలో వెనుకపడింది. అలాగే బ్యాంకింగు ఇన్సూరెన్సు రంగాలలో కూడా పూర్తిగా వెనుకపడింది. భారతదేశం పారిశ్రామిక వెనుకబాటు తనానికి ఆర్థిక పరాధీనతకు ముఖ్యమైన కారణం ఉత్పాదక వస్తువుల యంత్రాల పరిశ్రమలు లేకపోవటం. 1950లో కూడా దేశానికవసరమైన యంత్ర పరికరాలలో 90 శాతం దిగుమతులు చేసుకొన్నది. ఈ వెనుకబాటుతనాన్ని 1950,1984ల ఆర్ధిక గణాంకాలకు పోల్చడం ద్వారా గమనించవచ్చు. 1984కి చెందిన గణాంకాలు (బ్రాకెట్లలో ఇవ్వబడ్డాయి. 1950లో భారతదేశం 1.04 మిలియన్ టన్నుల ఉక్కు (6.9 మిలియన్ టన్నులు) 32.8 మిలియన్ టన్నులు బొగ్గు (155.2 మిలియన్ టన్నులు) 2.7 మిలియన్ టన్నులు సిమెంటు (29.9 మిలియన్ టన్నులు) 8 మిలియన్ రూపాయల విలువజేసే యంత్ర పరికరాలు తేలికపాటి పరికరాలు (828 మిలియన్ రూపాయలు) 7? రైలు ఇంజన్లు (200) 99000 సైకిళ్ళు (5,944000) 14 మిలియన్ ఎలక్ట్రికల్ లాంపులు (317.8 మిలియన్) 383,000 కుట్టు మిషన్లు (388,000) ఉత్పత్తి చేసింది. తలసరి విద్యుదుత్సాదక 14 కెడబ్యుహెచ్ (160కెడబ్యుహెచ్) చేసింది. 1950లో వున్న బ్యాంకు ఆఫీసులు శాఖల సంఖ్య 5,072, 1988లో వీటి సంఖ్య 38,055కి పెరిగింది. 1950లో 357 మిలియన్ల జనాభాకి గాను కేవలం 28 మిలియన్లు మంది మాత్రమే ఆధునిక పరిశ్రమలలో ఉపాధిపొందారు. వ్యవసాయం మీద ఆధారపడటం పెరగటం వలన పెరిగిన గ్రామీణ పట్టణ జనాభా నిష్పత్తి ఆర్థిక వెనుకబాటు తనానికి మరొక సూచిక. 185 1లో దాదాపు 82.3 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. 1901లో వ్యవసాయంపై ఆధారపడిన భారతదేశ జనాభా 68.7 శాతం కాని 1941 నాటికి ఇది 70 శాతానికి పెరిగింది. మరొకవైపు 1901-1951 కాలంలో జనాభా 40 శాతం పెరిగినప్పటికి 1901లో పారిశ్రామిక కార్మికులు 10.9 మిలియన్లు వుండగా 1951 నాటికి ఆ సంఖ్య 8.8. మిలియన్లకు పడిపోయింది. వడ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1930లో దశాబ్దం చివరి సంవత్సరాల వరకు విదేశీపెట్టుబడి పారిశ్రామిక ఆర్థిక రంగంలో ప్రాబల్యం సాధించింది. విదేశీ వాణిజ్యాన్ని అదుపు చేసింది. బొగ్గు గనులు, జనపనార పరిశ్రమ, షిప్పింగ్, బ్యాకింగ్ ఇన్యూ్యూరెన్సు, టీ కాఫీ ప్లాంటేషన్లపై బ్రిటీషు పెట్టుబడిదారులు వారి మేనేజింగ్ ఏజెన్సీ కంపెనీల ద్వారా పలు భారతీయ యాజమాన్య కంపెనీలకు నియంత్రించారు, విదేశీ పెట్టుబడి వలన దేశానికి ప్రతికూల ఫలితాలు సిద్ధించటానికి కారణం రాజ్యాధికారం విదేశీయుల చేతుల్లో వుండటం. పరిశ్రమలు దేశంలోని కొద్ది ప్రాంతాలలో నగరాలలో కేంద్రీకృతమవటం వలన పారిశ్రామికాభివృద్ధిలో క్రమరాహిత్యం చోటు చేసుకొన్నది. ఇది ఆదాయాలలో విస్తృతమైన ప్రాంతీయ అసమానతలకు దారితీయటమేగాక ప్రాంతీయ సమగ్రతా స్థాయిని కూడా ప్రభావితం చేసింది. కాని 1980,1940 దశాబ్దాలలో' భారతదేశ ఆర్థిక విధానానికి బలాన్ని చేకూర్చి స్వతంత్రానంతర ఆర్థికాభివృద్ధికి ఒక ప్రాతిపదికని సమకూర్చే కొన్ని పెద్ద మార్పులు సంభవించాయి. ఒక సానుకూలమైన అంశం రవాణా సమాచార సాధనాలు అభివృద్ధి చెందటం. 1940 దశాబ్దంలో భారతదేశానికి 65000 మైళ్ల రోడ్డు దాదాపు 42000 మైళ్ల రైలు మార్గాలు వున్నాయి. వస్తువులు త్వరిత రవాజణాకి అవకాశం ఏర్చడింది. పారిశ్రామిక విప్లవం లేకుండా వాణిజ్య విప్లవం నిర్మించబడింది. ఇది భారత ఆర్థిక విధానాన్ని మరికొంత వలసవాదీకరణకు' గురి చేసింది. అంతేగాక భారతదేశంలోని లోతట్టు ప్రాంతాలలో గల ముడి వనరుల్ని ఎగుమతి రేవులకు, దిగుమతి చేయబడిన పారిశ్రామిక వస్తువుల్ని రేవుల నుండి లోతట్టు ప్రాంతాలకు చేరవేసే లక్ష్యంతో రైలు మార్గాలు నిర్మించబడ్డాయి. దేశంలోని వివిధ కేంద్రాల మధ్య రవాణా సొకర్యాలు కల్పించబడక పోవటంతో మార్కెట్లు ముడివనరులకు సంబంధించిన భారతీయ పరిశ్రమల అవసరాలు అడ్రద్ధ చేయబడ్డాయి. రైల్వే రవాణా ఛార్జీలు కూడా ఎగుమతులు దిగుమతుల కనుకూలంగాను, దేశంలో అంతర్గత రవాణా పట్ల వివక్షతతోను నిర్ణయించబడ్డాయి. అంతేగాక బ్రిటన్ అమెరికాలలో లాగా గాక భారతదేశంలోని రైలు మార్గాలు ఉక్కు యంత్ర పరిశ్రమల్ని (ప్రారంభించలేదు. భారతదేశంలోని రైలు మార్గాల అభివృద్ధితో (బ్రిటిషు ఉక్కు యంత్ర పరిశ్రమలు లాభాలార్జించాయి. భారతదేశ ప్రభుత్వం సమర్ధవంతమైన ఆధునిక పోస్టల్ టెలిగ్రాపు విధానాన్ని స్థాపించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 2గ్
మరొక ముఖ్యమైన అంశం భారతీయుల యాజమాన్యంలోని చిన్న పరిశ్రమలకు ఒక పారిశ్రామిక ప్రాతిపదిక ఏర్పడటం. ఇది ప్రత్తి జనపనార, జౌళి పరిశ్రమలు, చెక్కర సబ్బులు కాగితం అగ్గిపెట్టెల లాంటి వినిమయదారీ పరిశ్రమలు కలిగివుంది. ఇనుము ఉక్కు సిమెంటు, మౌలిక రసాయనాలు, మధ్య తరహా ఉత్పాదక వస్తువుల పరిశ్రమలు కూడా చాలా తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందటం మొదలయింది. 1980 నాటికి భారతదేశంలో 2217 మంది విద్యార్థులతో కేవలం ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే వుండి సాంకేతిక విద్యావసతులు చాలా తక్కువగా వున్నప్పటికి 1947 నాటికి శాస్త్ర సాంకేతిక నిపుణుల బృందం ఏర్పడింది. పరిశ్రమలలోని అత్యధిక యాజమాన్య సాంకేతిక ఉద్యోగులు భారతీయేతరులు.
1914 నాటికి స్వతంత్ర ఆర్థిక ప్రాతిపదిక గల బలమైన దేశీయ పెట్టుబడిదారి వర్గం ఆవిర్భవించింది. భారతీయ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడితో సంబంధం లేని స్వతంత్ర పెట్టుబడిదారులు. చాలా ఇతర వలసదేశాలలో వలె వారు దళారులు గాని లేక విదేశీ పెట్టుబడికి భారత మార్కెటుకి మధ్య మధ్యవర్తులు గాని లేక విదేశీ వాణిజ్య సంస్థలలో జూనియర్ భాగస్వాములు గాని కాదు. వారు బహుశా భారతదేశంలోని విదేశీ పెట్టుబడిదారుల కంటే సాహసికులు. ఫలితంగా బ్రిటిషు ఇతర విదేశీపెట్టుబడుల కంటె భారతీయుల పెట్టుబడి త్వరితంగా గణనీయంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి భారతీయుల పెట్టుబడి 60 శాతం పెద్ద పారిశ్రామిక సంస్థలపై అదుపు సాధించింది. భారీ పారిశ్రామిక రంగం కంటే ఎక్కువ జాతీయాదాయాన్ని పోగుచేసిన చిన్న పారిశ్రామిక రంగం దాదాపు పూర్తిగా భారతీయ పెట్టుబడిపై ఆధారపడి ఎదిగింది.
1947 నాటికి భారతీయ పెట్టుబడి బ్యాంకింగు జీవిత భీమా రంగాలలో చాలా ప్రగతి సాధించింది. మొత్తం బ్యాంకు డిపొజిట్లులో 64 శాతం భారతీయ జాయింటు స్టాక్ బ్యాంకులలో వున్నాయి. భారతీయుల యాజమాన్యం లోని ఇన్సూరెన్స్ కంపెనీలు దేశంలోని మొత్తం జీవిత భీమా వ్యాపారంలోని 75 శాతంపై అదుపు సాధించాయి. దేశీయ వాణీజ్యంలోని అత్యధిక భాగం, విదేశీ వర్తకంలోని కొంత భాగం భారతీయుల చేతుల్లోకి వచ్చింది.
కాని భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఈ సానుకూలమైన లక్షణాలను విస్తృత చారిత్రక నేపధ్యంలో పరిశీలించాలి. మొదటిదిగా భారతీయ పరిశ్రమ, పెట్టుబడిదారీ విధానం యింకా సాపేక్షంగా చాలా పరిమితమైనవే, బ్రిటన్‌లో లాగా పారిశ్రామిక విప్లవానికి 28 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
లోనుకాకుండా భారతదేశంలో జరుగుతున్న ఈ పారిశ్రామికీకరణ వలసవాద ఆర్ధిక విధాన చట్రంలో జరుగుతుంది. ఆర్థిక విధానం ఊపందుకోలేదు. ఏ కాస్త అభివృద్ధి జరిగినా అది వలసవాదం వలన గాక వలసవాద పాలన జరుగుతున్నప్పటికీ వలసవాదం విధానాలను వ్యతిరేకించి సాధించిన అభివృద్ధి. ప్రపంచ ఆర్ధిక వ్యవహారాలలో బ్రిటన్ క్షీణిస్తున్న స్థితి, రెండు ప్రపంచ యుద్దాలు, 1930లనాటి పెద్ద ఆర్థిక మాంద్యం నేపధ్యంలో వలసవాదానికి వ్యతిరేకంగా సాగించిన తీవ్రమైన ఆర్థిక రాజకీయ పోరాట ఫలితం. చివరిగా స్వయం ప్రతిపత్తి గల ఆర్థికాభివృద్ధి వలసవాద పాలనని అంతమొందించకుండా సాధ్యపడి వుండేది కాదు.
వలస పాలనా కాలం నాటి వెనుకబాటుతనం ప్రజలకు ప్రత్యేకించి రైతులను చేతివృత్తుల వారిని నిరుపేదలుగా మార్చింది. చాలా తీవ్రమైన కంటికి కనిపించే పేదరికం, రోగాలు, రోష్టులు, ఆకలి మంటలు సర్వసాధారణమయ్యాయి. వీటికి పరాకాష్టగా 19వశతాబ్దం ద్వితీయార్ధంలో వరుసగా వచ్చిన పెద్ద కరువులు దేశంలోని అన్ని ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాయి. బ్రిటిషుపాలనా కాలమంతటా దేశంలోని ఒక 'ప్రాంతంలోనో లేక మరొక ్రాంతంలోనో కొరతల, కరువులు సర్వసామాన్యమయ్యాయి. 1943లో సంభవించిన పెద్ద కరువులు బెంగాల్‌లోని దాదాపు 8 మిలియన్ల మంది ్రాజాలను బలిగొన్నాయి.
భారతదేశపు వెనుకబాటుతనానికి, పేదరికానికి సంబంధించిన ఇతర సూచికలూ వున్నాయి. 20వ శతాబ్దంమంతటా తలసరి ఆదాయం తగ్గకపోయినప్పటికి స్తంభించింది. 1941- 50 కాలంలో వార్షిక మరణాల రేటు 1000కి 25. శిశుమరణాల రేటు 1000కి 175,190 మధ్య వుంది. 1940-1951 కాలంలో పుట్టిన భారతీయుని సగటు జీవనకాలం 32 సంవత్సరాలు. మశూచికం, ప్లేగు, కలరా లాంటి అంటువ్యాధులు, అతిసార విరేచనాలు మలేరియా లాంటి జబ్బులు ఇతర విషజ్వరాలు ప్రతి ఏటా మిలియన్ల కొలది ప్రజల 'ప్రాణాలను హరించాయి.
ఆరోగ్య సేవలు నిరాశాజనకంగా వున్నాయి. 1943లో కేవలం 10 మెడికల్ కాలేజీలు వున్నాయి. అవి వార్షికంగా 700 మంది పట్టభద్రుల్ని తయారు చేసేవి. 27 మెడికల్ స్కూల్ 7000 మంది మెడికల్ ప్రాక్టీషనర్స్ని తయారుచేసేవి. 1951లో కేవలం 18000 మంది పట్టభద్రులైన దాక్టర్లువున్నారు. వారు నగరాలకే పరిమితమయ్యారు. 1,16,731 పడకలతో 1915 ఆస్పత్రులున్నాయి. 7072 పడకలతో 6589 డిస్పెన్సరీలు స్వతంత్రం తర్వాత భారతదేశం 27
వున్నాయి. అత్యధిక పట్టణాలలో ఆధునిక పారిశుధ్యం లేదు. ఉన్న నగరాలలో కూడా అది యూరోపియన్లు సంపన్న భారతీయులు నివసించే ప్రాంతాలకు పరిమితం చేయబడింది. ఆధునిక నీటి సరఫరా విధానం గ్రామాలకు తెలియదు. చాలా పట్టణాలలో కూడా లేదు. అత్యధిక పట్టణాలలో విద్యుత్తు సరఫరా లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల ఊహకు కూడా అందనిదిగా వుండేది,
19వ శతాబ్బాంతానికి ఆర్థికాభివృద్ధికి విద్య కీలకమైన ఉత్పాదకంగా గుర్తించబడింది. కాని భారతీయులలో అత్యధికులకు ఎలాంటి విద్య అందుబాటులో లేదు. 1951 నాటికి కూడా దాదాపు 84% నిరాక్షరాస్యులు. స్త్రీలలో నిరాక్షరాస్యతా శాతం 92. మాధ్యమిక పాఠశాలలు 18,590 ఉన్నత పాఠశాలలు 7288 మాత్రమే వున్నాయి. ఈ అంకెలు ఆదాయం వనరులు అవకాశాలలో గల విపరీతమైన అసమానతలను విస్మరిస్తాయి గనుక అత్యధిక భారత ప్రజల స్థితిగతుల్ని సరిగా ప్రతిబింబించవు. సమాజంలోని పేద వర్గాల నుండి చాలా కొద్దిమంది మాత్రమే మధ్య స్టాయికి, పై స్థాయికి ఎదగగలిగారు. గనుక అత్యధిక ప్రజల శక్తి సామర్దాలు సమాజాభివృద్ధికి వినియోగింపబడలేదు.
1871-1941 కాలంలో జనాభా వృద్ధిరేటు వార్పికంగా కేవలం 0.6 శాతం గనుక పేదరికం దరిద్రం పెరగటానికి జనాభా వృద్ధిరేటు కారణం కానేకాదు.
ఆ విధంగా స్తంభించిన తలసరి ఆదాయం, అత్యంత దిగువ న్థాయిలో వున్న జీవన ప్రమాణాలు, గిడసబారిన పారిశ్రామికాఖివృద్ధి, తక్కువ ఉత్పాదకత, అర్ద భూస్వామ్య వ్యవసాయ విధానం - వలసవాదం వారసత్వంగా సంక్రమింపజేసిన స్థితిగతులు. వలసరాజ్యం
బ్రిటిషు పాలకులు పై చదువులకు ఇంగ్లీషు మాధ్యమంగా విద్యా విధానాన్ని రూపొందించారు. ఈ విధానం అఖిల భారత స్థాయిలో మేధావి వర్గాన్ని తయారు చేసింది. సమాజం పట్ల బ్రిటిషు వారి వైఖరిని అలవరచ యత్నించింది. ఈ విధానమే వలస పాలనని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయటాన్ని అలవరిచింది. మేధావులు 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలోను ఆ తరువాత వలస పాలనపై విమర్శలు సాగించారు.
ఇంగ్లీషు చదువు రెండు తీవ్రమైన ప్రతికూల ఫలికాలనిచ్చింది. 28 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మొదటిది : విద్యావంతులకు సాధారణ (ప్రజలకు మధ్య పెద్ద అంతరాయాన్ని సృష్టించింది. మేధావుల నుండి నాయకులను ఢ్రేణులను కూడగట్టిన జాతీయోద్యమం ఈ అంతరాయాన్ని ఒక మేరకు పూర్చినప్పటికి అది స్వతంత్ర భారత దేశాన్ని కూడా వెంటాడింది. రెండవది : ఇంగ్లీషు భాషకి ఇవ్వబడిన ప్రాధాన్యత భారతీయ భాషల అభివృద్ధిని నిరోధించింది. సాధారణ ప్రజలలో విద్యావ్యాప్తిని అడ్దుకొన్నది. భారతదేశంలోని పాఠశాలలను, కళాశాలలను ఆవహించిన వలసవాద విద్యావిధానం ఇంకా చాలా బలహీనతలతో కునారిల్లింది. విద్యార్థుల హేతువాద, తార్మిక, విశ్లేషణ, విమర్శన సామర్ధ్యాలను ప్రోత్సహించలేదు. చాలా సందర్భాలలో ఇతరుల అభిప్రాయాలను వల్లెవేశారు. వారి అభిప్రాయాలను రూపొందించుకోలేకపోయారు. వలసవాద విద్యా విధానంలోని పెద్ద లోపం సాధారణ ప్రజల విద్యని అలాగే శాస్త్ర సాంకేతిక విద్యని అశ్రద్ధ చేయటం. ఈ విధానం బాలికల విద్యని పట్టించుకోలేదు. ఫలితంగా 1951 నాటికి మహిళలలో అక్షరాస్యత 8 శాతం మాత్రమే. వలసరాజ్యం యొక్క స్వభావం కూడా విరుద్ధమైనది. మౌలికంగా అధికారవాద నిరంకుశ స్వభావం గలది. చట్టబద్ధపాలన సాపేక్షికంగా స్వతంత్రన్యాయ వ్యవస్థ లాంటి ఉదారవాద లక్షణాలు వున్నాయి. సాధారణంగా కోర్టులు వ్యాఖ్యానించిన చట్టాలకు లోబడి పరిపాలన సాగించింది. ఇది నిరంకుశ పరిపాలనపై పాక్షిక అదుపుగా పనిచేసింది. అధికార వర్గం యొక్క తాత్మాలిక చర్యలకు వ్యతిరేకంగా పౌరహక్కులకు స్వేచ్చకు ఒక మేరకు రక్షణ కల్పించింది. కాని చట్టాలు తరచుగా అణచివేసే చట్టాలే. చట్టాలు భారతీయులచే (ప్రజాస్వామ్యయుతంగా రూపొందించబడినవి కానందువలన అవి అధికారాన్ని సివిలు సర్వెంట్ల, పోలీసుల చేతుల్లో పెట్టాయి. పాలనాపరమైన, న్యాయపరమైన విధుల మధ్య అధికార విభజన లేదు. జిల్లా కలెక్టరుగా పాలన నిర్వహించే సివిలు అధికారి జిల్లా మెజి(స్టేటుగా న్యాయ బాధ్యతలు కూడా నిర్వహించాడు. చట్టం ముందు అందరూ సమానులు" అనే భావన ప్రాతీపదికగా గలది వలస వాద న్యాయ వ్యవస్థ, కాని నేరారోపణ యూరోపియన్పై జరిగినప్పుడు కోర్టు పక్షపాతంగా వ్యవహరించింది. అంతేగాక కోర్టు వ్యవహారాలు ఖర్చుతో కూడుకొన్నవి. గనుక న్యాయసాధనాలు పేదవాడి కంటె సంపన్నుడికి ఎక్కువ అందుబాటులో వున్నాయి. వలస పాలకులు పత్రికా స్వతంత్రం, వాక్స్వాతంత్ర్యం సమావేశాలు జరుపుకొనే స్వతంత్రం లాంటి కొన్ని పౌరస్వేచ్చలు కల్పించారు. కాని ప్రజా పోరాటాలు జరిగేటప్పుడు స్వతంత్రం తర్వాత భారతదేశం 29
ఈ స్వేచ్చల్ని పూర్తిగా పరిమితం చేశారు. 1857 తరువాత సాధారణ పరిస్థితులలో కూడా వీటిపై దాడులు సొగించారు. వలస రాజ్యం 18568 తరువాత తరుచుగా రాజ్యాంగపరమైన ఆర్ధికపరమైన రాయితీలను ప్రతిపాదించటం మరొక వైరుధ్యం. భారతదేశానికి ప్రజాస్వామ్యం సరిపడదని వాదిస్తూ మొదట ట్రిటిషు రాజనీతిజ్జులు పరిపాలకులు భారతదేశంలో ప్రాతినిధ్య ప్రభుత్వ స్ట్థాపనని దృఢంగా వ్యతిరేకించారు. భారతదేశ సంస్కృతి చారిత్రక వారసత్వం కారణంగా భారతదేశానికి ధార్మిక నియంతృత్వం అవసరమని ఉచిత సలహాలు ఇచ్చారు. కాని భారతీయుల ఒత్తిడి కారణంగా కేంద్రంలోను రాష్ర్రాలలోను ఎన్నికలు చట్ట సభలు ప్రవేశపెట్టబడ్డాయి. కాని ఓటు హక్కు చాలా కొద్ది మందికే పరిమితం చేయబడింది. 1919 తరువాత 3 శాతం 1935 తరువాత 15% మంది మాత్రమే ఓటు వేయగలిగారు. ఆ విధంగా ప్రభుత్వం కొద్ది మందిని ఇముడ్చుకొని, జాతీయోద్యమాన్ని బలహీనపరచి తన రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకొనేందుకు రాజ్యాంగ చట్రాన్ని వాడుకోవాలని ఆశించారు. ఏమైనప్పటికి 1935 వరకు చట్టసభలు అధికారాన్ని చెలాయించలేకపోయాయి. ఆ తరువాత కూడా సర్వోన్నతాధికారం బ్రిటిషు పాలకుల చేతుల్లోనే వుంది. చట్ట సభల అమోదం లేకుండానే ప్రభుత్వం ఎ చర్యనైనా తీసుకోగలిగింది. ప్రభుత్వం ఏమి చేయదలచుకొంటే ఎప్పడు చేయదలచుకొంటే అప్పుడు చేసింది. కాని శాసన సభ్యులకు ప్రభుత్వం యొక్క మౌలిక అధికారవాద స్వభావాన్ని, వలస వాద రాజ్యాంగ సంస్కరణల డొల్లతనాన్ని బహిర్గతసరచే అవకాశం లభించింది. కాని చట్ట సభలు కొంతమంది భారతీయులకు ఎన్నికలలో పాల్గొనే అనుభవాన్ని ఎన్నుకోబడిన సంస్థలలో పనిచేసే అనుభవాన్ని సమకూర్చాయి. ఈ అనుభవం 1947 తరువాత ఉపయోగపడింది. ఈ మధ్యకాలంలో జాతీయవాదులు రాజ్యాంగ పరమైన అవకాశాన్ని ప్రజాపోరాటాలను తీవ్రమైన సైద్ధాంతిక రాజకీయ ప్రచారాలతో కలగలిపి వలసపాలనను కూలదోయడానికి ఉపయోగించుకొన్నారు. భారతదేశ ఐక్యతకి సంబంధించిన వలస వాద వారసత్వం కూడా వైరుధ్యభరితమైనది. వలస రాజ్యం గతంలో భారతదేశంలో ఎన్నడూ సాధించనంత గొప్ప రాజకీయపరమైన పాలనాపరమైన ఐక్యతని తీసుకువచ్చింది. మొగలు పాలనావ్యవస్థపై నిర్మించి దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసిన ఒకే విధమైన పాలనా వ్యవస్థని స్థాపించింది. బ్రిటిషువారు సమాజంపై రాజకీయాలపై సామాన్య దృక్పథధంగల తళ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అఖిల భారత మేధావి వర్గాన్ని సృష్టించిన విద్యా విధానాన్ని రూపొందించారు. ఏకీకృత ఆర్థిక విధానం రూపకల్పన ఆధునిక సమాచార సాధనాల అభివృద్ధి కలయికతో వలసవాదం భారతజాతి నిర్మాణ ప్రాతిపదికకు తోద్చడింది.
కాని దేశాన్ని ఏకీకృతం చేసిన బ్రిటిషువారు ప్రతికూల శక్తులను బరిలోకి దించారు. తమ పరిపాలనే తోద్చడిన భారతదేశ ఐక్యతని చూచి భయపడిన బిటిషువారు విభజించి పాలించే, సాంప్రదాయ సామ్రాజ్యవాద విధానాన్ని అమలు జరిపారు. భారత సమాజంలో రాజకీయాల యొక్క విభిన్నమైన విచ్చిన్నకరమైన లక్షణాలు పెంచబడ్డాయి. ప్రజలలో చీలికలను పెంచడానికి రాహ్హ్రానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని కులానికి వ్యతిరేకంగా కులాన్ని వర్గానికి వ్యతిరేకంగా వర్గాన్ని హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను, జాతీయోద్యమానికి వ్యతిరేకంగా రాజులను భూస్వాములను ప్రోత్సహించారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. దేశం విభజించబడింది.
బ్రిటిషువారు ఉన్నత్రాధికార వర్గం ద్వారా పాలన సాగించారు. అధికారులతో ఐసియస్ అధికారులు పై న్థాయివారు. వీరు ప్రతిభ ప్రాతిపదికన నియమించబడ్డారు. ఉన్నతాధికారులు చాలావరకు సమర్థులు నిజాయితీపరులు. భారతీయుల ఒత్తిడికి తలొగ్గి వివిధ సేవలు 1918 తరువాత భారతీయీకరణ చేయబడ్డాయి. 1947 నాటికి దాదాపు 48 శాతం ఐపియస్ ఆఫీసర్లు భారతీయులు. కాని నియంత్రించే అధికారాలు బ్రిటిషువారి చేతుల్లోనే వున్నాయి. ఈ సేవలలో వున్న భారతీయులు కూడా బ్రిటిషు ఏజంట్లుగానే పనిచేశారు.
సీనియరు అధికారులు స్వేచ్చ, నిజాయితీపై రాజకీయ ఆదేశాల మేరకు పనిచేయటం లాంటి సాంప్రదాయాలు అఖభివృద్ధిపరచినప్పటికి, తరువాత వచ్చిన అధికారులు సంకుచితమైన సామాజిక ఆర్థిక రాజకీయ దృక్పధాన్ని అలవరచుకొన్నారు. 1947 తరువాత పెద్ద ఎత్తున ఆశించిన సామాజిక మార్పుకి ఆర్థికాభివృద్ధికి అధికారుల వైఖరి పెద్ద ఆటంకమైంది.
ఐపియస్ అధికారులు దాదాపు లంచాలకు అతీతంగా వున్నప్పటికీ పరిపాలనకి చెందిన దిగువస్థాయిల్లో - ప్రత్యేకించి ప్రజాపనులు, నీటిపారుదల, పోలీసు లాంటి అవకాశమున్న శాఖలలో లంచగొండితనం బలంగా వేళ్లూనుకొన్నది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ప్రభుత్వ నిబంధనలు నిర్భంధాల కారణంగా పాలనా వ్యవహారాలలో స్వతంత్రం తర్వాత భారతదేశం త్రై
లంచగొండితనం బ్లాకు మార్కెటీంగు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆదాయం పన్ను, ఎక్సైజు పన్ను ఎగవేత పెరిగింది. సమాంతరంగా బ్లాకు ఎకానమీ కూడా పెరిగింది.
బ్రిటిషు పాలకులు బలమైన, చాలా ఖర్చుతో కూడుకున్న సాయుధదళాల్ని వదలివెళ్ళారు. భారతదేశంలో (భ్రిటిషుపాలనకు ముఖ్యమైన ఆధారంగా నిలిచిన బ్రిటిషు పాలకుల సాయుధదళాలను (ప్రజల జీవితానికి ఆలోచనలకు - (ప్రత్యేకించి జాతీయోద్యమానికి దూరంగా వుంచేందుకు చేయగలిగిందంతా చేశారు. జాతీయవాద వార్తాపత్రికలు ఇతర పత్రికలు ప్రచురణలు సైనికులకు ఆఫీసర్లకు చేరకుండా అద్దుకున్నారు. మరొకవైపు సైన్యం రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారులకు లోబడి వుండాలనే సాంప్రదాయం ఉంది. ఇది దీర్హక్షాలికంగా చూస్తే కొత్తగా సృష్టించబడిన పాకిస్తాన్‌కి విరుద్ధంగా స్వతంత్ర భారతదేశ పాలనని సాగించటానికి ఒక వరమయింది.
వలసవాదం మిగిల్పిపోయిన వారసత్వాన్ని (ప్రస్తావిస్తూ రవీంద్రనాధ ఠాగూర్ ఆయన మరణానికి మూడు నెలల ముందు 1941లో ఇలా వ్రాశారు.
“ఇంగ్లీషువారు ఎదో ఒకనాటికి తమ భారత సామ్రాజ్యాన్ని వదిలి వెళ్లక తప్పదు. వారు వదిలివెళ్లే భారతదేశం ఏ స్థితిలో వుంటుంది? ఎంతటి దయనీయమైన దైన్య స్థితిలో వుంటుంది? శతాబ్దాల పాటు సాగిన వారి పాలనా స్రవంతి ఎంత కుళ్ళుని మురికిని వదలి వెళుతుంది?” తై బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప న జాతీయోద్యమం - వారసత్వం వంద సంవత్సరాల స్వతంత్ర పోరాటంపై చేసే పరిశీలన, 1947 తరువాత భారతదేశ పరిణామాల విశ్లేషణతో విడదీయరానిదిగా వుంటుంది. భారతదేశానికి వలసవాదకాలం ముందు నాటి, వలసవాదకాలం నాటి ఆర్థిక పాలనా పరమైన నిర్మాణాలు వారసత్వంగా సంక్రమించినప్పటికి జాతి నిర్మాణానికి స్ఫూర్తినిచ్చిన విలువలు ఆదర్శాలు, దార్శనికత, స్పష్టంగా నిర్వచింపబడిన సమగ్రమైన సిద్ధాంతం- జాతీయోద్యమం నుండి స్వీకరించబద్దాయి. భారత ప్రజలకు ప్రాతినిథ్యం వహించిన జాతీయోద్యమం రైటు నుండి లెప్ట వరకు గల వివిధ రాజకీయ ధోరణులను కలుపుకొన్నది. అది మతవాదులను, వలస పాలకుల విధేయులను దూరంగా వుంచింది. జాతీయోద్యమ విలువలు, లక్ష్యాలు మేధావులకు మధ్య తరగతులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రజా రాజకీయాల దశలో పట్టణ, గ్రామీణ సాధారణ ప్రజానీకం నుండి వేలాది మంది కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఆదర్శాలు గడిచిన 5 దశాబ్దాలుగా భారత సమాజాన్ని రాజ్య పరిపాలనా పద్ధతిని ఐక్యం చేసి కలిసి కట్టుగా వుంచడంలో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించాయి. అవి జాతీయ విముక్తి ఉద్యమాన్ని దేశాన్ని అభివృద్ధి పరచే యత్నాలతో అనుసంధానం చేశాయి. దీనినే నెహ్రూ “నిరంతర విప్లవం” అన్నాడు. వాస్తవంగా ఈనాటికీ ఈ ఆదర్శాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రజలను పార్టీలను అంచనా వేయడం జరుగుతుంది. జాతీయోద్యమ స్వభావం స్వతంత్ర పోరాటం ప్రపంచ చరిత్రలో బహుశా అత్యంత పెద్ద ప్రజా ఉద్యమం. రాజకీయాలలో _ విముక్తి పోరాటంలో (ప్రజలు చురుకైన పాత్ర స్వతంత్రం తర్వాత భారతదేశం " 88
నిర్వహించగలరనే అవగాహన ప్రాతిపదికగా ఉద్యమం నిర్మించబడింది. ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించి, వారిలో అత్యధికులను రాజకీయ కార్యాచరణలోకి లాగడంలో జయప్రదమయింది. వలసపాలననంతమొందించడానికి గాని, సామాజిక మార్చుకి గాని అవసరమైన (ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది ప్రజలే గాని నాయకులు కాదని లక్షలాదిమందిని కదిలించి రాజకీయాలలోకి సమీకరించిన గాంధీజీ తన జీవితాంతం చెబుతూ వచ్చాడు. ఉద్యమం యొక్క విజయం లేక వైఫల్యం చాలా వరకు నాయకత్వ స్థాయిని బట్టి వుంటుందని కూడా చెప్పాడు.
సత్యాగ్రహం ఒక పోరాట రూపంగా (ప్రజల చురుకైన భాగస్వామ్యం మీద, పాల్గొనని లక్షలాది మంది సానుభూతి మద్దతులపైన ఆధారపడి వుంటుంది. నిబద్ధత గల (డ్రేణులు యోధులు పోరాడే హింసాయుత విప్లవం లా గాక అహింసాయుత విప్లవానికి లక్షలాది ప్రజల రాజకీయ సమీకరణ, యింకా అంతకంటే ఎక్కువ మంద్ర ప్రజల మద్దతు అవసరమవుతుంది.
సాధారణ ప్రజలు భాగస్వామ్యం వహించిన సుదీర్ణమైన అనుభవం కారణంగా భారత రిపబ్లిక్ నిర్మాతలు చివరి దశలో స్వతంత్ర పోరాటానికి నాయకత్వం కూడా వహించిన ప్రజల రాజకీయ శక్తిపై పూర్తి విశ్వాసం వుంచగలిగారు. పేదరికం నిరక్షరాస్యత విస్త్రృతంగా వున్నప్పటికి ఎలాంటి సంకోచం లేకుండా నాయకులు వయోజన ఓటింగు హక్కు ప్రవేశపెట్టారు.
భారత జాతీయోద్యమం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పట్ల పౌరహక్కుల పట్ల పూర్తి నిబద్ధత కలిగి ఉంది. భారత రాజకీయ ఆలోచనా విధానంలో ఈ రెండూ కూడ్రా అవిచ్చిన్న భాగాలుగా వుందే అనుభవాన్ని అందించింది.
... వెఎదటి నుండి ఉద్యమం (వజాస్వామ్య ఆలోచనలకు నంన్ధలక్తు ప్రచారమిచ్చింది. ఎన్నికల ప్రాతిపదికన పార్లమెంటరీ సంస్థలను ప్రవేశపెట్టేందుకు కృషి చేసింది. 20వ శతాబ్ది ప్రారంభం నుండి జాతీయ నాయకులు వయోజన ఓటింగు కొరకు డిమాండు చేశారు. ఇతర రాజకీయ ఆర్థిక విధానాలతో పాటు వలసవాద పాలకుల దాడులకు వ్యతిరేకంగా పత్రికా స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చ పట్ల చాలా ఢద్ధ వహించారు. ప్రజాస్వామ్య రాజకీయ రంగాన్ని విస్తరించేందుకు గల అవకాశాలను పరిమితం చేయడానికి పాలకులు చేసిన యత్నాలను అడ్డుకొనేందుకు చట్టపరమైన లెక బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజకీయ కార్యకలాపాలు శాంతియుత రాజకీయ ఆందోళనలు ప్రజాపోరాటాలు నిర్వహించటానికి ఉద్యమం పోరాడింది.
1937లో ఏర్పడిన కాం(గైస్ మంత్రి వర్గాలు రైతు, కార్మిక, విద్యార్థి ఉద్యమాలకు పొరహక్షుల్ని విస్తరించాయి. అంతేగాక కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీల లాంటి సమూలమైన మార్పులు కోరే గ్రూపులకు పార్టీలకు కూడా పౌరహక్కులు వర్తింపచేశాయి.
జాతీయోద్యమం యొక్క ప్రధాన రాజకీయ విభాగమైన భారత జాతీయ కాంథైెన్ 1885లో స్థావించబడినప్పటి నుండి వ్రజాస్వామ్య వదృతులలో నిర్వహింపబడుతూ వచ్చింది. అన్నిస్థాయిలతో విధానాల రూపకల్పనకు చర్చలపై ఆధారపడింది. విధానాలు తీర్మానాలు బహిరంగంగా చర్చించబడ్డాయి. ఓటింగుకు పెట్టబడ్డాయి. కాంగ్రెన్ చరిత్రలో కొన్ని అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీవ్రవాదోపవాదాలు చర్చలు - ఆపైన ఓటింగు జరిపి తీసుకొనబడ్డాయి. ఉదాహరణకు 1920లో గాంధీ తీర్మానంపై సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించాలనే అంశాన్ని ఓటింగుకు పెట్టగా 1836 మంది అనుకూలంగా 884 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. మెజారిటీ నిర్ణయంపై సహాయ నిరాకరణ ప్రారంభించబడింది. అలాగే 1929లో శాసనోల్లంఘనోద్యమ బాధ్యతలు స్వీకరించవలసిందింగా గాంధీజీని కోరిన లాహోరు కాంగ్రెస్‌లో వైస్రాయి రైలుపై రివల్యూషనరీ టెర్రరిస్టులు చేసిన బాంబుదాడిని ఖండిస్తూ గాంధీజీ ప్రవేశపెట్టిన తీర్మానం 942-794 స్వల్ప మెజారిటీతో ఆమోదం పొదింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధ ప్రయత్నాలకు సహకరించాలన్న గాంధీజీ వైఖరిని 1942 జనవరిలో కాంగ్రెస్ తిరస్కరించింది.
తన శ్రేణులు ఒకే రకమైన దృక్పథం, వైఖరి కలిగి వుండాలని కాంగ్రెస్ ఒత్తడి చేయలేదు. అనమ్మతిని అనుమతించింది. వివిధ మైనారిటీల అభిప్రాయాల్ని సహించటమే కాదు. బాహాటంగా వ్యక్తీకరించమని (ప్రోత్సహించింది. వాస్తవంగా అసమ్మతి కాంగ్రెస్ పని విధానంలో ఒక భాగమయింది. ఆ విధంగా స్వతంత్రం సాధించే నాటికి కాంగ్రెస్‌కి 60 సంవత్సరాల ప్రజాస్వామ్య యుతంగా పని చేసిన అనుభవం, పౌరహక్కుల కొరకు పోరాడిన అనుభవం వున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతులలో పని చేయటం కాంగ్రెస్‌కు మాత్రమే వున్న ప్రత్యేకత కాదు. కాంగ్రెస్ స్వతంత్రం తర్వాత భారతదేశం తత్
సోషలిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, కిసాన్ సభలు, విద్యార్థి, రచయితల, మహిళా సంఘాలు వివిధ వృత్తిదారుల సంఘాలు-అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతులలో పని చేశాయి. ఉద్యమం యొక్క ముఖ్య నాయకులు చిత్తశుద్ధిగా పౌరహక్కుల పట్ల నిబద్ధతగల వారు. ఉదాహరణకు లోకమాన్య తిలక్ “పత్రికా స్వేచ్చ వాక్ స్వాతంత్ర్యం జాతికి జన్మనిచ్చి ప్రోత్సహిస్తాయి.” అని స్పష్టంగా ప్రకటించాడు. “వాక్ స్వాతంత్ర్యం, సంఘస్వేచ్చ హక్కుల్ని గుర్తించాలి. ప్రాణాలొడ్డియైనా ఈ హక్షుల్ని పరిరక్షించుకోవాలి.!” గాంధీజీ. మరలా గాంధీజీ 1939లో 'అహింసతో కూడిన పౌరస్వేచ్చ స్వరాజ్యదిశగా వేసే మొదటి అడుగు. అది రాజకీయ జీవితానికి శ్వాస. అది స్వతంత్రతకు పునాది. పలచబరచడానికి, రాజీకి అవకాశం లేనిది. అది జీవజలం. నీరు పలచబరచబడడం నేనెప్పుడూ వినలేదు. ఆ విధంగా గాంధీజీ ఉదారవాద ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా నిబద్దుడని చాలా స్పష్టం. ఆయన వాటిలో లోపాల్ని గమనించి, పాశ్చాత్య దేశాలలో వున్న ఉదారవాద ప్రజాస్వామ్య నిర్మాణం ప్రజలు ప్రజాస్వామ్య నిర్మాణం ప్రజలు రాజకీయాధికారాన్ని అదుపు చేయటానికి సరిపడనిదని విశ్వసించాడు. 1986లో జవహర్లాల్ నెహ్రూ ఇలా వ్రాశాడు. “వజాస్వామ్య హక్కులు అణచివేయబడితే జాతి జీవశక్తిని కోల్పోతుంది. ఏమీ చేయలేని అశక్తతకి గురవుతుంది.” అంతేగాక 1931లో ప్రాథమిక హక్కులపై తీర్మానం ఆమోదించిన కరాచీ కాంగ్రెస్ వాక్ స్వాతంత్ర్య, పత్రికాస్వేచ్చ, సంఘస్వేచ్చ- హక్కులకు వామీ ఇచ్చింది. జాతీయోద్యమకాలంలో అపొంస ఆచరణపై వ్యక్తమైన ఏకాభిప్రాయం కూడా దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని సృష్టించడానికి దోహదపడింది. రాజకీయ సామాజిక మార్పు తీసుకొని వచ్చేందుకు నిరంకుశ, హింసాపద్ధతులకు భిన్నంగా ప్రజాభిప్రాయం మద్దతుతో చర్చ, వాదన, నచ్చచెప్పడం లాంటి పద్ధతుల్ని జాతీయోద్యమం చేపట్టింది. పౌరహక్కుల రక్షణ కూడా ఏదో ఒక గ్రూపు లేక దృక్పధాన్ని అనుసరించి సంకుచితంగా చేపట్టబడలేదు. సైద్ధాంతికంగా చాలా విభేదాలు కలిగి పరస్పరం తీవ్రంగా విమర్శించుకొనే రాజకీయ ధోరణులు గ్రూపుల వారు పౌరహక్కుల రక్షణకై పరస్పరం సహకరించుకొన్నారు. గోపాలకృష్ణగోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీలాంటి తో బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మితవాదులు అతివాద నాయకులైన తిలక్ వాక్ స్వాతంత్ర్యం, పత్రికాస్వేచ్చల రక్షణ కొరకు దృఢంగా నిలబడ్డారు. లాహోరు ఇతర కుట్ర కేసులలో విచారణలు ఎదుర్కొంటున్న భగత్‌సింగ్ ఇతర టెర్రరిస్టు రివల్యూషనరీల కొరకు, మీరట్ కుట్ర కేసులో నిందితులుగా వున్న కమ్యూనిస్టుల రక్షణ కొరకు అహింసావాదులైన కాంగ్రెస్ నాయకులు కృషి చేశారు. 1928లో వామపక్షాన్ని, కమ్యూనిస్టుల్ని అణచివేసేందుకు ఉద్దేశించబడిన పబ్లిక్ సేప్టీ బిల్లు, ట్రేడ్ డిస్పూట్స్ బిల్లులకు మోతీలాల్ నెహ్రూ మాత్రమే గాక మదన్మోహన్ మాలవ్యా, యం. ఆర్. జయకర్ లాంటి ఉదారవాదులు, ఘన శ్యాందాస్ బిర్లా, పురుషోత్తమ్ దాస్ ఠాకూర్‌దాస్ లాంటి భారతీయ పెట్టుబడి దారుల రాజకీయ ప్రతినిధులు, సెంట్రల్ అసెంబ్లీలో వ్యతిరేకించారు.
(ప్రజల పాలనాధికారం, ప్రాతినిధ్య (ప్రభుత్వం పాలకులకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించుకోగల పౌరహక్కులు - లాంటి భావనలు భారతీయ సాంప్రదాయంలో భాగం కాదు. కొందరు, తప్పుడు అవగాహనతో అనుకుంటున్నట్లుగా వలసవాదం నుండి సంక్రమించినవి కాదు. ఈ భావాలు ప్రజలలో (ప్రచారం చేసి దేశీయం చేసి భారతదేశంలో పాదు కొల్పింది, నిరంకుశ పాలన సాగించిన వలసవాద రాజ్యం కాదు. జాతీయోద్యమం మాత్రమే. వెనుకటి అధ్యాయంలో ప్రస్తావించినట్లు ఎన్నికల ద్వారా పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టవలసినదిగా జాతీయవాదులు చేసిన డిమాండుని వలసపాలన, వలసవాద సిద్ధాంతాలు ్రతిఘటించడమే గాక, 19వ శతాబ్దం మధ్యకాలం నుండి భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కారణాల రీత్యా భారతదేశం ప్రజాస్వామ్యానికి పనికిరాదని ప్రచారం సాగిస్తూ వచ్చాయి. ఈ వలసవాద సిద్ధాంతం, ఆచరణలకు వ్యతిరేకంగా జాతీయోద్యమ చైతన్యం యొక్క ప్రజాస్వామ్య ఆలోచనల సాంప్రదాయాలతో ప్రభావితమయింది. ప్రజాస్వామ్యాన్ని. పొర స్వేచ్చని భారత రాజకీయ నైతికత యొక్క మౌలికాంశాలుగా చేయటంలో జయప్రదమయింది. జాతీయోద్యమం భారత ప్రజలలో పౌర స్వేచ్చ, (ప్రజాస్వామ్య భావాలను సుస్థాపితం చేయడం వలననే, స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని స్వీకరించి కానసాగగలుగుతుంది. ఈ సాంప్రదాయమే భారత రాజ్యాంగలో ప్రతిఫలించింది. కులం, మతం, భాష సంస్కృతులతో విభజించబడిన సమాజంలో పశ్చిమ యూరపు, యునైటెడ్ స్టేట్స్లో లాగా కనీసం ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యత లేని చోట ప్రజాస్వామ్యం పౌరహక్కులు మనలేవని పలుమార్లు చెప్పిన జోస్యాలు తప్పని నిరూపించింది. వలస స్వతంత్రం తర్వాత భారతదేశం తై?
రాజ్యాంగం వున్న భారతదేశంలో ఇండియా, పాకిస్తాన్‌లు భాగాలుగా వున్నటికి స్వాతంత్రానంతరం రెండూ దేశాలలో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం పౌరహక్కులు వేర్వేరు ఫలితాలు ఇవ్వటాన్ని ఈ సాంప్రదాయమే వివరిస్తుంది. పాకిస్తాన్‌ని తీసుకొని వచ్చిన పార్టీ (దాని రాజకీయాలు) పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామ్య పని విధానం, రాజకీయ ' ప్రత్యర్థుల పట్ల సహనం - సాంప్రదాయాలుగా గల పార్టీ కాదు. దాని రాజకీయ సంస్కృతిలో ప్రజాస్వామ్యం ప్రాముఖ్యత గల భాగం కాదు. అంతేగాక పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతాలు జాతీయోద్యమం దాని రాజకీయ సంస్కృతి బలహీనంగా వున్న ప్రాంతాలు.
కాల (క్రమంలో నిరంకుశత్వం, నిరంకుశాధికార వర్గం, విధేయత, పితృ సంరక్షణ ప్రాతిపదికగా గల వలసవాద, వలసవాదముందు కాలం నాటి రాజకీయ సంస్కృతికి భిన్నమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని జాతీయోద్యమం సృష్టించింది. అసమ్మతి పట్ల గౌరవం, భావ (ప్రకటనా స్వేచ్చ, మెజారిటీ సూత్రం, మైనారిటీ అభిప్రాయం ఉనికిలో వుంటూ అభివృద్ధి చెందటం ప్రాతిపదికగా జాతీయోద్యమ ప్రజాస్వామ్య సంస్కృతి, సిద్ధాంతం పని చేశాయి. జాతీయోద్యమం - వలసవాదం ఆర్థిక విధానం
భారత జాతీయోద్యమం భారతదేశ వలసవాద ఆర్థిక విధానం యొక్క
మౌలికమైన అంశాలపై - ప్రత్యేకించి బ్రిటీషు ఆర్థిక విధానం యొక్క అవసరాలకు లోబడి వుండటంపై అధునాతనమైన విమర్శని అభివృద్ధి పరచింది. ఈ విమర్శనాధారంగా చేసుకొని జాతీయోద్యమం భారతదేశ ఆర్థిక వెనుకబాటు తనాన్ని అధిగమించేందుకు విస్తృతమైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించింది. స్వతంత్రానంతరం భారతదేశ ఆర్థిక ఆలోచనా విధానానికి ఇది ప్రాతిపదిక అయింది.
స్వావలంబన గల స్వతంత్ర ఆర్థిక విధాన దృక్పధం అభివృద్ధి పరచబడింది. ప్రచారం చేయబడింది. స్వావలంబన నిరంకుశత్వంగా గాక ప్రపంచ ఆర్థిక విధానానికి లోబడి విధేయతగా వుండడాన్ని నివారించడంగా నిర్వచింపబడింది. జవహర్లాల్ నెహ్రూ 1946లో చెప్పినట్లు స్వావలంబన “అంతర్జాతీయ వర్తకాన్ని మినహాయించదు. అంతర్జాతీయ వర్తకం ్రోత్సహించబడుతుంది. కాని ఆర్థిక సామ్రాజ్యవాదానికి దూరంగా వుంటుంది” ఆధునిక ఆర్థిక శాస్త సాంకేతిక రంగాల ఆధారంగా తిక బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వ్యవసాయం పరిశ్రమల్ని అభివృద్ధి పరచాలన్న లక్ష్యాన్ని జాతీయవాదులు మొదటి నుండి దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశంలో పారిశ్రామీకరణ జరగాలి. వారు వ్యవసాయానికి, పరిశ్రమలకు గల సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి మాత్రమే భూమిపైన గ్రామీణ నిరుద్యోగం పైన గల ఒత్తిడిని తగ్గించగలుగుతుంది. గనుక పారిశ్రామికాభివృద్ధి అత్యంత అవసరంగా భావించారు. పారిశ్రామికీకరణలో భారీ పరిశ్రమలు, యంత్రాలనుత్పత్తి చేసే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. అలాంటి పరిశ్రమలు అభివృద్ధి చెందక పోవడం ఆర్థిక పరాధీనతకు వెనకబాటుతనానికి దారితీస్తాయి. అదే సమయంలో అత్యవసర వినిమయ వస్తువుల కారకు మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలపై, కుటీర పరిశ్రమలపై ఆధారపడాలని జాతీయవాదులు వాదించారు. ఉపాధి పెంపుదల వ్యూహంలో భాగంగా చిన్న తరహా, గ్రామీణ పరిశ్రమలు ప్రోత్సహించబడాలి. పరిరక్షించబడాలి.
విదేశీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతున్న పరిస్థితులలో విదేశీ పెట్టుబడి భారతీయ పెట్టుబడిని అణచివేస్తుంది గనుక జాతీయ వాదులు అదుపులేని విదేశీ పెట్టుబడి చొరబాటుని వ్యతిరేకించారు. నిజమైన స్వావలంబన, అభివృద్ధి దేశీయ పెట్టుబడితోనే జరుగుతుందని విశ్వసించారు. భారతదేశం రాజకీయ స్వతంత్రం సాధించి ఆర్ధిక విధానాల్ని స్వయంగా రూపొందించుకొనగల స్వేచ్చ వున్నప్పుడు మాత్రమే పారిశ్రామిక పురోగతి సాధించడానికి భారీయంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులు అవసరమవుతాయి గనుక దేశీయ పెట్టబడికి తోడుగా విదేశీ పెట్టుబడిని ఉపయోగించుకోవచ్చునని జాతీయవాదులు నొక్కి చెప్పారు.
1930, 1940 దశాబ్దాలలో వ్యవసాయ సంబంధాల పునర్నిర్మాణం కూడా జాతీయోద్యమ లక్ష్యాలలో ఒకటయింది. రైతుల అధీనంలో వ్యవసాయం వుండే విధంగా జమీందారులు ఇతర భూస్వాములులాంటి కౌలు పొందుతున్న దళారుల్ని రద్దు చేయవలసి వుంది.
ఆర్థికాభివృద్ధిలో రాజ్యం చురుకైన ప్రధానమైన పాత్ర నిర్వహించాలని జాతీయ వాదులు భావించారు. శీఘ్ర పారిశ్రామికీకరణకు క్రమబద్ధమైన ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం అవసరమని భావించారు. ప్రభుత్వ అర్థిక ప్రణాళిక, పబ్లిక్ సెక్టర్ అభివృద్ధి అవసరమన్నారు జాతీయవాదులు. భారతీయ పెట్టుబడికి మించిన పెద్ద వనరులు స్వతంత్రం తర్వాత భారతదేశం 89
అవసరమైన విద్యుత్, నీటిపారుదల, రోడ్దు, నీటి సరఫరా లాంటి మౌలిక వసతలతో పాటు ప్రభుత్వం కీలక పరిశ్రమల్ని అభివృద్ధి పరచాలి. 1931లోనే ప్రాథమిక హక్కులు, ఆర్థిక కార్యక్రమంపై తీర్మానాన్ని ఆమోదించిన కరాచీ కాంగ్రెస్ సదస్సు. “స్వతంత్ర భారతదేశంలో కీలక పరిశ్రమలు, సేవలు, ఖనిజ వనరులు, రైల్వేలు, నీటి మార్గాలు, నౌకాయానం లాంటి రవాణా సాధనాలు ప్రభుత్వ యాజమాన్యంలో వుంటాయని ప్రకటించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే సదస్సుకి సర్దార్ పటేల్ అధ్యక్షత వహించారు. నెహ్రూ తీర్మానాన్ని రూపొందించారు. గాంధీజీ ప్రవేశపెట్టారు. సమగ్రమైన అభివృద్ధి అవసరాన్నే గుర్తించి కాంగ్రెస్ 1938లో జాతీయ (ప్రణాళికా సంఘాన్ని నియమించింది. పెట్టుబడిదారులు 1943లో 'బాంబే ష్లాన్'ని రూపొందించారు.
ఆధునిక పరిశ్రమకి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపై విభేదించిన ఏకైక జాతీయ నాయకుడు గాంధీజీ. కాని కాలక్రమంలో ఆయన కూడా మెజారిటీ అభిప్రాయంతో ఏికీభవించాడు. యంత్ర పరిశ్రమలన్నింటికీ తాను వ్యతిరేకిని కానని, కార్మికుల ఉపాధిని పాగోట్టే పరిశ్రమలకు మాత్రమే తాను వ్యతిరేకినని 1930లో ఆయన చాలాసార్లు ప్రకటించాడు. అందరికీ (ప్రయోజనం చేకూర్చే ప్రతీ శాస్త్ర ఆవిష్కరణని తాను అభినందిస్తానన్నాడు. కాని ఇది కూడా ఒక షరతుపై, అన్నీ భారీ పరిశ్రమలు ప్రభుత్వ యాజమాన్యంలో అదుపులో వుండాలి గాని (ైవేటు పెట్టుబడిదారుల అదుపులో కాదు అయినప్పటికీ అహింస, హిందూ-ముస్లిం ఐక్యత, అన్ఫృశళ్యతకు వ్యతిరేకత లాంటి అంశాలపై చేసినట్లుగా గాంధీజీ తన ఆర్థిక ఎజెండాకు ఆమోదం తెలపాలని జుతీయోద్యమంపై ఒత్తిడి చేయలేదు. అంతేగాక భారీ పరిశ్రమల్ని ప్రభుత్వ యాజమాన్యం అదుపులో అభివృద్ధి పరచాలన్న తీర్మానాన్ని గాంధీజీ స్వయంగా 1931లో కరాచీ కాంగ్రెస్ సదస్సులో (ప్రవేశపెట్టాడు. అంతేగాక ఆధునిక శాస్త్ర సాంకేతిక శాస్త్రాల ఆధారంగా పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి పట్ల పూర్తి నిబద్ధతగల జవహర్లాల్ నెహ్రూని తన వారసునిగా ప్రకటించడం గమనార్హం. అదే సమయంలో కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలపై గాంధీజీ వైఖరిని జాతీయోద్యమం ఆమోదించింది. నెహ్రూ ఆధ్వర్యంలోని రెండవ పంచవర్న ప్రణాళికలో ఈ వైఖరి పూర్తిగా ప్రతిఫలించింది.
సమకాలీన ప్రమాణాల్ని బట్టి భారతజాతీయోద్యమం చాలా ప్రగతి శీలమైనది. ప్రారంభం నుండి అది పేదల అనుకూల వైఖరి చేపట్టింది. ఉదాహరణకు “ప్రజల శ0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పేదరికం - వలస పాలన పాత్ర - వలస పాలన ఆర్థిక విధానంపై దాదాబాయ్ నౌరోజి విమర్శకు కేంద్ర బిందువు. గాంధీజీతో సోషలిస్టు భావాల వెల్లువతో ఈ వైఖరి బలాన్ని పుంజుకొన్నది. వలస పాలనను అంతంచేయడం తరువాత అత్యంత ముఖ్యమైన లక్ష్యం పేదరికం నిర్మూలన.
1929 దశాబ్దం చివరి నుండి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, రివల్యూషనరీ టెర్రరిస్టులు, ఇతర సోషలిస్టు గ్రూపులు జాతీయోద్యమానికి సోషలిస్టు దృక్పథాన్ని ఇచ్చి స్వతంత్రానంతరం సోషలిస్టు భారతదేశ స్వప్నాన్ని ప్రచారం చేసేందుకు కృషి చేశారు. ఉద్యమంలో సోషలిస్టు భావాలు ప్రాచుర్యం పొందాయి. అవి యువ జాతీయవాద డ్రేణుల్ని జాతీయవాద మేధావుల్ని ఆకర్షించాయి. కాని అవి ప్రధాన స్రవంతి కాలేకపోయింది. 1947కి ముందు సోషలిజానికి పెద్ద సిద్ధాంతకర్త అయిన జవహర్లాల్ నెహ్రూ, కాంగెస్ సోషలిజాన్ని తన ఆదర్శంగా అంగీకరించలేదని చెప్పారు. కాంగ్రెస్ ఆశించిన లక్ష్యాలు పౌరులందరికీ సమానావకాశాలు వుండే నాగరికస్థాయి జీవనం వుండే నవసమాజమని చెప్పారు.
స్వతంత్ర భారతదేశ ప్రాథమిక ఆర్ధిక నిర్మాణ స్వరూప సమస్య అనిశ్చితంగా వున్నప్పటికీ జాతీయోద్యమానికి సోషలిస్పలు వామపక్ష మొగ్గుని చూపడంలో సఫలీకృతులయ్యారు. సమాజంలో ఆర్థిక విధానంలో, రాజకీయాలలో మౌలిక మార్పులకు నిబద్భులై వున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అధికాధిక సామాజిక ఆర్థిక సమానత్వం వగైరాలను నిర్వచిస్తూ వచ్చారు. సమకాలీన పరిస్థితులలో సమూలమైన మార్పుల్ని కోరే కార్యక్రమాన్ని ఆమోదించారు. ప్రచారం చేశారు. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, పేదలపై దిగువ మధ్యతరగతులపై పన్నులు తగ్గింపు, ఉప్పుపన్ను, భూమిశిస్తు సుంకాల తగ్గింపు, వ్యవసాయదారులకు తక్కువ వడ్డీకి బుణ సదుపాయం, కౌలు రైతుల హక్కుల రక్షణ, ఆక్రమంలో భూస్వామ్య విధానం రద్దు, దున్నే వానికి భూమి, కార్మికులకు కనీస వేతన హక్కు తక్కువ పని గంటలు, కార్మికులు, కర్షకులు సంఘాలు ఏర్పరచుకొనే హక్కు శాంతి భద్రతల యంత్రాంగంలో సంస్కరణ, జాతీయోద్యమంలో సమూలమైన మార్పులు కోరే దిశలో జరిగిన మార్చు నాటకీయ పరిణామం. అది 1981 కాంగ్రెస్ కరాచీ సదస్సు చేసిన తీర్మానం. స్వతంత్రం తర్వాత భారతదేశం 41
“ప్రజలపై సాగే దోపిడీని అంతమొందించేందుకు రాజకీయ స్వతంత్రంలో భాగంగా ఆకలితో అలమటిస్తున్న లక్షలాది ప్రజలకు నిజమైన ఆర్ధిక స్వాతంత్రం కల్పించడం ఇమిడి ఉండాలి.” వీటన్నిటికి పరాకాష్ట “భూమి దానిపై పని చేసే వాడికి చెందాలి గాని మరొకడికి కాదని” 1942 గాంధీజీ చేసిన ప్రకటన. సమ సమాజం పట్ల నిబద్ధతతో జాతీయోద్యమం సెక్స్, కులం, ప్రొతిపదికన గల అన్ని రకాల వివక్షను వ్యతిరేకించింది. అందుకు మహిళల, దిగువ కులాల విముక్తి పోరాటాలలో పాల్గొన్నది. జాతీయోద్యమం లక్షలాది మహిళల్ని వారి వారి ఇళ్ళనుండి రాజకీయ రంగంలోకి రప్పించింది. దాని సంస్కరణ అజెండాలో స్రీలకు పనిహక్కు విద్యాహక్కు సమాన రాజకీయ హక్కులతో పాటు మహిళల సామాజిక స్థితి పెంపుదల వుంది. కులపరమైన అణచివేత, అసమానతలకు వ్యతిరేక పోరాటంలో భాగంగా 1920 తరువాత “అంటరానితనం రద్ద రాజకీయ ప్రాధాన్యతలలో ముఖ్యవైన అంశమయింది. గాంధీజీ 1940లో కుల వ్యవస్థని రద్దు చేయాలని వాదించినప్పటిక్తీ ఉద్యమం బలమైన కుల వ్యతిరేక విధానాన్ని రూపొందించి (ప్రచారం చేయడంలో విఫలమయింది. జాతీయోద్యమం సృష్టించిన వాతావరణం భావజాలం కారణంగా రాజ్యాంగ పరిషత్తులో షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు చర్చకు వచ్చినప్పుడు ఎలాంటి నిరసనలు వ్యక్తం కాలేదు. అలాగే జాతీయోద్యమ ప్రయత్నాల కారణంగానే మహిళా విముక్తికి అనుకూలంగా 50లలో హిందూకోడ్ బిల్లులు ఆమోదం పొందాయి. సెక్యులరిజం జాతీయోద్యమం ప్రారంభం నుండి సెక్యులరిజానికి కట్టుబడి వుంది. రాజకీయాల నుండి రాజ్యం నుండి మతాన్ని విడగొట్టడమని, మతాన్ని వ్యక్తి యొక్క ప్రైవేటు అంశంగా పరిగణించమని, రాజ్యం అన్ని మతాల పట్ల తటస్థంగా వుండడం లేక సమాన దూరం పాటించడమని, వివిధ మతాల వారి పట్ల వివక్ష పాటించకుండా వుండటమని, మతవాదం పట్ల తీవ్రమైన వ్యతిరేకత అని సెక్యులరిజం విస్తృతమైన పద్ధతిలో నిర్వచింపబడింది. ఉదాహరణకు మతవాదానికి ప్రతికూలంగా జాతీయవాదం శల బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
తన సెక్యులర్ నిబద్ధతను వ్యక్తీకరిస్తూ 1931 కరాచీ కాంగ్రెస్ తీర్మానం చేసింది. స్వతంత్ర భారత దేశంలో వ్యక్తి అంతరాత్మ స్వేచ్చననుభవిస్తాడని తన మతాన్ని స్వేచ్చగా ప్రచారం చేసుకొంటూ ఆచరించే హక్కు కలగి వుండటాన్ని పౌరులందరూ కులం, తెగ స్తీ పురుష విభేదంతో పని లేకుండా చట్టం ముందు సమానులని, కులం, తెగ స్త్రీ, పురుష భేదం ప్రభుత్వోద్యోగాలకు అధికార పదవులకు అడ్డురావని, రాజ్యం అన్ని మతాల పట్ల తటస్థత పాటిస్తుందని ప్రకటించింది.
గాంధీజీ తొలుత మతం పట్ల గాఢమైన విశ్వాసం గల వ్యక్తిగా మతం రాజకీయాల మధ్య సన్నిపొతమైన సంబంధం వుందని నొక్కి చెప్పాడు. అందుకు కారణం ఆయన రాజకీయాలు నైతికత మీద ఆధారపడతాయని నమ్మాడు. మతాలు నైతిక వనరులని భావించాడు. మతం అంటే ధర్మమని విశ్వసించాడు. కాని ఆయన 1931లో కరాచీ తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అంతేగాక మతవాదులు మతాన్ని ప్రజల్ని విభజించే పాక్షిక విశ్వాస విధానంగా పరిగణించడం గమనించి మతాన్ని రాజకీయాల నుండి విడగొట్టాలని స్పష్టంగా ఉద్దాటించాడు. 1942లో గాంధీజీ ఇలా చెప్పాడు. 'మతం రాజకీయాలలో స్థానం లేని, వ్యక్తిగత విషయం మరలా 1947లో 'మతం ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం దానిని రాజకీయాలతో గాని జాతీయ వ్యవహారాలలో గాని కలగలపకూడదు.' జవహర్లాల్ మతతత్వంపై లోతైన అవగాహనతో భావోద్వేగంతో చాలా మాట్లాడాడని వ్రాశాడు. ఆయన మతతత్వాన్ని ఫాసిజం యొక్క భారతీయ రూపంగా గుర్తించిన మొదటి భారతీయుడు. జాతీయోద్యమ నాయకులు మతపరమైన విజ్ఞప్తులు చేయలేదు. బ్రిటిషు పాలకుల మతం కైస్తవ మతమని చెప్పలేదు. వారు బ్రిటిషు పాలనని, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగానే విమర్శించారు.
జాతీయోద్యమం మతవాద శక్తులకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన వ్యూహాన్ని రూపొందించలేక పోయింది. ఫలితంగా దేశ విభజన, 1946-47లో మత మారణకాండ జరిగాయి. కాని జాతీయోద్యమం యొక్క బలమైన సెక్యులర్ నిబద్ధత కారణంగానే స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం సెక్యులరిజాన్ని రాజ్యం, సమాజం యొక్క మూల స్తంభంగా నిలబెట్టింది. స్వతంత్రం తర్వాత భారతదేశం శె
రూపుదిద్దుకుంటున్న జాతి భారతదేశం ఒక జాతిగా, రూపు దిద్దుకుంటుందని జాతీయోద్యమం గుర్తించింది. వలసవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం ద్వారా ఈ క్రమాన్ని ప్రోత్సహించడం దాని మౌలిక లక్ష్యం. రాజకీయంగా వలసవాదం యొక్క విభజించే ధోరణుల్ని వివరించినప్పటికి భారత దేశాన్ని ఆర్థికంగా, పాలనాపరంగా ఐక్యం చేయటంలో వలసవాదం నిర్వహించిన పాత్రని ఉద్యమ నాయకత్వం గుర్తించింది. ఉద్యమ ప్రారంభం నుండి తన అఖిల భారతీయతని నొక్కి చెప్పింది. ఉదాహరణకు 1885లో అప్పటికి వున్న రాష్ట్ర రాజకీయ సంఘాల సమాఖ్యగా గాక భారతదేశం యొక్క డిమాండ్ల ప్రాతిపదికగా దేశవ్యాప్త రాజకీయ సమీకరణ. నిబద్ధత గల రాజకీయ సంస్థగా జొతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. దాని యొక్క శ్రేణులు, దాని విజ్ఞప్తులు, దాని కార్యకర్తలు అన్నిటినీ మించి నాయకత్వం మొత్తం భారతదేశం నుండి స్వీకరించబడింది. ప్రారంభం నుండి ఉద్యమం దేశ ఐక్యత సమ(గ్రతలను నొక్కి చెప్పింది. భారత జాతీయోద్యమంలో భాగంగా 'స్వదేశీ సంస్థానాల ప్రజా ఉద్యమాల కలయిక స్వతంత్రానంతరం మిగిలిన భారతదేశంలో స్వదేశీ సంన్థానాల విలీనాన్ని సులభతరం చేసింది. ఈ అఖిల భారతీయత జాతీయ కాంగ్రెస్‌కి మాత్రమే చెందిన (ప్రత్యేక లక్షణం కాదు. ఇతర రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలు అదే పద్ధతిని అనుసరించాయి. జాతీయ నాయకులకు నిర్మాణంలో వున్న జాతిభావన దాని ఐక్యతకు విరుద్ధంగా కన్పించలేదు. వారు కేవలం గుర్తించడమే కాదు. భారతదేశం యొక్క సంపద్వంతమైన సాంస్కృతిక పరమైన, భాషాపరమైన మతపరమైన, పప్రాంతీయపరమైన వైవిధ్యాన్ని స్వాగతించారు. బలమైన జాతీయ గుర్తింపు ఆవిర్భావం, యితర గుర్తింపుల వికాసం పరస్పరం బలాన్ని చేకూర్చుకొనే క్రమాలుగా గుర్తించబడ్డాయి. వైవిధ్యం, బహుళ గుర్తింపులు అధిగమించవలసిన ఆటంకాలుగా గాక భారత సాంస్కృతిక నాగరికతకు, జాతికి బలాన్ని చేకూర్చే వనరులుగా, సానుకూలమైన అంశాలుగా, రూపుదిద్దుకొంటున్న జాతీయతలో అవిచ్చిన్న భాగాలుగా పరిగణించబడ్డాయి. ఈ ప్రాంతీయ సాంస్కృతిక గుర్తింపులు జాతీయోద్యమానికి, దాని అఖిల భారత గుర్తింపుకి వ్యతిరేకంగా గాక దానిలో భాగంగా అభివృద్ధి చెందాయి. శ్రీజ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారతీయ సమాజం వర్గ పరంగాకుండా విభజితమ్రైవుంది. కాని ఈ విభజనలు సమాజాన్ని ముక్క చెక్కలుగా చేయటాన్ని అనుమతించకుండా వర్గ సంస్థల్ని వర్గ పోరాటాల్ని ఉద్యమం ప్రోత్సహించింది.
ఉద్యమం నుండి ద్వంద్వ భావాలు ఉత్పన్నమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమైక్యత. మొదటిది సాంస్కృతిక వైవీధ్యము సాంస్కృతిక సంబంధాలపై ఆధారపడి సమాఖ్య రాజకీయాలకు దారితీసింది. జాతీయ నమైక్యత బలమైన కేంద్రానికి, వివిధ సాంస్కృతిక వైఖరులను కలగలిపి సమ్మిశితమైన భారతీయ సంస్కృతి రూపొందించడానికి దారి తీయవలసి వుంది. విదేశాంగ విధానం
స్వతంత్ర భారత దేశ విదేశాంగ విధానం యొక్క మూలాలు జాతీయ వాదులు 1870ల నుండి రూపొందిస్తూ వచ్చిన సూత్రాలలో విధానాలలో వున్నాయి. జాతీయ నాయకులు వలస వాదానికి వ్యతిరేకంగా స్వతంత్రం కొరకు పోరాడుతున్న ప్రజల సానుభూతి మద్దతుపై ఆధారపడిన విస్తృతమైన అంతర్జాతీయ విధానాన్ని రూపొందించారు. 1980, 1940లలో జాతీయోద్యమం బలమైన ఫాసిస్టు వ్యతిరేక వైఖరిని చేపట్టింది. గాంధీజీ దీనిని బలంగా వ్యక్తీకరించాడు. యూదులపై పొట్లర్ హత్యాకాండని నిరసిస్తూ, 1938లో గాంధీజీ యిలా రాశాడు. “మానవత కొరకు మానవత పేరుతో సమర్ధనీయమైన యుద్ధమేదైనా వుందంటే, అది జాతి మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా తుడిచి పెట్టడాన్ని నివారించే, జర్మనీకి వ్యతిరేకంగా చేసే యుద్ధం. 1980లలో ప్రపంచ సమస్యల పట్ల జాతీయవాద వైఖరిని జవహర్లాల్ నెహ్రూ 1986లో లక్నో కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో స్పష్టంగా ప్రకటించాడు.
“కనాదడు (ప్రపంచం రెండు పెద్ద (గ్రూపులుగా విభజితమై వుండటాన్ని చూస్తున్నాం. సామ్రాజ్యవాదులు, ఫాసిస్టులు ఒకవైపు, సోషలిస్టులు జాతీయవాదులు మరొకవైపు... అనివార్యంగా మన విధానం ఫాసిజానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ అభివృద్ధికర శక్తులకు అనుకూలంగా వుంటుంది.
ఖారత జాతీయవాదం జాత్యాహంకార పూరితమైనది కాదు, యుద్దోన్మాద వైఖరి గలది కాదు. భారతదేశంలో బ్రిటిషు పాలకుల జాత్యాహంకారాన్ని తీవ్రంగా స్వతంత్రం తర్వాత భారతదేశం డేర్
వ్యతిరేకించేటప్పుడు కూడా అది జాత్యాహంకారాన్ని ఆలంబనగా చేసుకోలేదు. బ్రిటీషు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ద్వేషిస్తూ కూడా జాతీయవాదం (బిటీషుప్రజల పట్ల ద్వేషం, కాఠిన్యాలకు దూరంగా వుండేలా తన శ్రేణులకు శిక్షణనిచ్చింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన కాం(గైెస్ సైద్ధాంతికంగా, సంస్థాపరంగా సర్దుబాటు వైఖరి గలది. ఒక వర్షానికి ఒక తెగకి గాక భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సైద్ధాంతికంగా మూసలో ఇమిదేది కాదు. విసృతంగా విభేదించే సైద్ధాంతిక రాజకీయ (న్రవంతులు, దానిలో అంతర్వాహినులు కలగలసి వున్నాయి. ఏ దశలో కూదా గాంధీజీ కాం(గైెస్పై తనకు గుత్తాధిపత్యం వున్నట్లు చెప్పుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యాలు సూత్రాల కొరకు కలిసి పోరాడేందుకు వివిధ సైద్ధాంతిక ధోరణులు గల వ్యక్తులను వివిధ స్థాయిల నిబద్ధత గల వారిని వివిధ స్థాయిల శక్తి సామర్థ్యాలు గల వారిని ఐక్యం చేయడంలో జయప్రదమయింది. కాంగ్రెస్ ఈ కర్తవ్యాన్ని ప్రజాస్వామ్య పనివిధానం ద్వారా సాధించగలిగింది. వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య నిరంతర చర్చలు వాదోపవాదాలు జరిగాయి. అవి భిన్నమైన రాజకీయ సైద్దాంతిక ధోరణులకు అవకాశాలు కల్పించాయి. వారి మధ్య లక్ష్యాలకు సంబంధించిన ఉమ్మడి ఆలోచనలు చాలా వున్నాయి. అవి పోరాటంలో వారిని ఐక్యం చేశాయి. ఉద్యమానికి చెందిన వ్యూహం, ఎత్తుగడలలో మెజారిటీ అభిప్రాయం ఆచరణలో పెట్టబడింది. మైనారిటీ తుడిచి పెట్టబడలేదు, అప్పుడు కాకపోతే మరొకప్పుడు తన అభిప్రాయం ఆమోదం పొందుతుందని ఆశిస్తూ మైనారిటీ కూడా ఉద్యమంలో భాగంగా వుండి పోయింది. కాం(గెస్కి వెలుపల వున్న (గ్రూపులు, ఉద్యమాలు కూడా దానితో స్నేహ సంబంధాల నేర్పర్చుకొన్నాయి. మతపరమైన, కులపరమైన పార్టీల గ్రూపులు మాత్రం పాలకులకు విధేయతగా వుంటూ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి నవలంబించాయి. వివిధ రాజకీయ దృక్పధాల మధ్య రాజీ, సర్చబాటు, సమన్వయం - సాంప్రదాయాన్ని జాతీయోద్యమం న్వతంథత్రభారత దేశానికి వారనత్వంగా సంక్రమింపచేసింది. స్వతంత్రానంతరం జాతీయ విధానాలను రూపొందించడంలో నెహ్రూ ఈ సాంప్రదాయాన్ని పాటించాడు. ఏమైనప్పటికి ఇప్పుడు ఈ వైఖరి దాదాపు త్తి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కనుమరుగవుతోంది. ప్రజా ఉద్యమానికి చెందిన, ఈ సాంప్రదాయాన్ని ఒక పార్టీని నడపడానికి గానీ, ప్రతిపక్ష పార్టీలకు గాని వర్తింపజేయడం సులభమైన పనికాదు. కాని బలమైన సంపద్వంతమైన భారతదేశాన్ని అలాగే న్యాయమైన సమసమాజాన్ని నిర్మించాలని కోరుకొనేవారికి ఇది అమూల్యమైన అనుభవం, వారసత్వం.
జాతీయోద్యమం రాజకీయాలకు, రాజకీయ ప్రవర్తనకు అత్యున్నతమైన ప్రమాణాల్ని నెలకొల్పింది. దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, లోకమాన్య తిలక్, గాంధీజీ, భగత్‌సింగ్, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి. రాజగోపాలచారి, ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ లాంటి జాతీయోద్యమ నాయకులు అత్యున్నతమైన నైతిక విలువల్ని పాటించారు. నాయకులు పాటించిన అత్యున్నత నైతిక ప్రమాణాల కారణంగానే ఉద్యమం లక్షలాది మందిని సమీకరించగలిగింది. చదువుల్ని, ఉద్యోగుల్ని జీవనోపాధి మార్గాల్ని వదిలి పెట్టి కుటుంబాన్ని త్యజించి జీవిత సర్వస్వం ఉద్యమానికి అంకితం చేసిన త్యాగధనులైన ఉద్యమ (్రేణులు అలాంటి అత్యున్నతమైన నైతికతని పాటించారు. లక్ష్యాలు మార్గాల మధ్య ఉద్యమం సమన్వయం సాధించగలిగింది. ఉద్యమం కాలాన్ని అనుసరించి రూపొందించుకొనే, నవీకరణ చెందే, మార్పు చేసుకొనే శక్తిని పెంచుకొన్నది. రాజకీయ కార్యకలాపాలతో చైతన్యవంతులైన ప్రజల ఆకాంక్షలకు, వలస పాలకుల మారుతున్న విధానాలకు స్పందించి ఉద్యమం సమూలమైన మార్పులు కోరే దిశలో దాని కార్యక్రమం విధానాలలో నిరంతర మార్పులు చేసుకొంటూ ముందుకు సాగింది. కాబట్టి సమకాలీన ప్రపంచ ఆలోచనలను విధానాలను ఉద్యమాలను గమనంలో పెట్టుకొని జాతీయోద్యమం మౌలికతను నిలబెట్టుకుంటూ నవీకరణ చెందింది.
జాతీయోద్యమ వారసత్వాన్ని ఈ విధంగా సంక్షిప్తీకరించవచ్చు. రాజకీయ ఆర్థిక స్వాతంత్ర్యం పట్ల నిబద్ధత, ఆధునిక ఆర్ధికాభివృద్ధి, అన్ని రకాల అసమానత, అణచివేత, ఆధిపత్యాల్ని అంతమొందించటం, పౌరహక్కులు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, అంతర్జాతీయత మరియు స్వతంత్ర విదేశాంగ విధానం, వైవిధ్యాన్ని సంతోషంగా అంగీకరించే ప్రాతివదికన జాతితో నిర్మాణ క్రమానికి ప్రోత్సాహం, సర్దుబాటు రాజకీయాలలో అత్యధిక ప్రజల మద్దతుతో ఈ లక్ష్యాలన్ని సాధించుట. స్వతంత్రం తర్వాత భారతదేశం శ?
జాతీయోద్యమ వారసత్వం యొక్క ప్రాథమిక అంశాల పట్ల స్వతంటత్ర భారతదేశం విధేయత ప్రకటించింది. చాలా అంశాలు అత్యధిక రాజకీయ పార్టీల కార్యక్రమాలలో మెనిఫెస్టోాలలో చేర్చబడ్డాయి. ప్రభుత్వాల, రాజకీయ పాద్దీల సంస్థల పని విధానాన్ని అంచనా వేసేందుకు ప్రజలు ఈ వారసత్వాన్ని ప్రమాణంగా స్వీకరించారు.
వారసత్వం, ప్రత్యేకించి సుదీర్హకాలం సాగిన ఉద్యమ వారసత్వం - ప్రజల మనస్సులలో చాలాకాలం మనగలుగుతుంది. కాని వారసత్వం ఎంత బలమైనది, మంచిదైనప్పటికీ కలకాలం నిలవదు. ఏ వారసత్వమైనా దానికి నిరంతరం నూతన జవసత్వాలు సమకూర్చకపోతే అభివృద్ధి పరచకపోతే, మారుతున్న పరిస్థితుల కనుగుణంగా _ సృజనాత్మక పద్ధతిలో మార్పులు చేయకపోతే క్రమంగా మసకబారుతుంది. సందర్భ శుద్ధి కోల్పోళుంది. శతి బిపన్చం(్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ర! రాజ్యాంగ ఆవిర్థానం - ముఖ్య నిబంధనలు
భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. అప్పటినుండి జనవరి 26ని గణతంత్ర దినంగా ఉత్సవాలు జరుపుకొంటున్నాం. 1980 నుండి జనవరి 26న బ్రిటిష్ పాలన నుండి భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు నిబద్భులైన ప్రజలు గ్రామాలలో పట్టణాలలో గుంపులుగా చేరి స్వతంత్ర ప్రమాణాలు చేస్తూ వచ్చారు. ప్రారంభం నుండి స్వతంత్ర పోరాటానికి భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం చేసిన రాజ్యాంగం అమలుకు నిరంతరాయతను పాటించిన ఆ దినాన నూతన గణతంత్ర రాజ్యం అమలు జరపడం సమంజసంగా వుంది.
రాజ్యాంగం రూపు దిద్దుకొనే క్రమం 1950 జనవరి 26కి చాలా దశాబ్దాల ముందు ప్రారంభమయింది. ఆ క్రమం నిరాఘాటంగా కొనసాగింది. దాని మూలాలు స్వతంత్ర పోరాటంలోను, స్వదేశ సంస్థానాలలో బాధ్యతయుతమైన రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వాల స్థాపన కొరకు సాగిన ఉద్యమాలలోను లోతుగా వేళ్లూనుకొని వున్నాయి.
తీర్మానాలు ఆమోదించటం లేక రాజ్యాంగ సంస్కరణ కొరకు ప్రతిపాదనలు రూపొందించటం కంటే జాతీయోద్యమ స్ఫూర్తి దాని నిర్ధిష్టమైన రాజకీయ ఆచరణలో వుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యం, పౌరహక్కులు సామాజిక ఆర్థిక న్యాయం లాంటి ప్రజాదరణ పొందిన భావాలు రాజ్యాంగంలో ముఖ్యమైన సూత్రాలుగా వున్నాయి. ఉదాహరణకు భారత జాతీయ కాంగ్రెస్‌లో కాంగ్రెస్ (అమెరికాలోని దిగువ సభ) అనే పదం చెప్పటం ద్వారా భారతదేశ రాజకీయ చైతన్యంలో పార్లమెంటరీ ప్రభుత్వ రూపం అనే ఆలోచన ప్రవేశపెట్టబడింది. కాంగ్రెస్ సంస్థ పని విధానం ప్రత్యేకించి 1920 తరువాత గాంధీజీ కాంగ్రెస్ నిబంధనావళిని మార్చిన తరువాత ఎన్నికల ప్రాతిపదికపై ఆధారపడి జరుగుతూ వచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎ,ఐ.సి.సి.) ప్రెసిదెంటుగాని లేక గ్రామ స్థాయి కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగాని ఎన్నిక ద్వారానే ఎంపిక చేయబడేవాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం శం
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పి.సి.సి.) లచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు గల అఖీల భారత కాంగ్రెస్ కమిటీ (ఎ.ఐ.సి.సి.) లోక్‌సభ లేక పార్లమెంటుకి సమానం. వర్కింగ్ కమిటీ మంత్రి వర్షానికి సమానం. కాంగ్రెస్ ప్రెసిడెంటు ప్రధానమంత్రికి ప్రతిరూపం. ఆ విధంగా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి వర్గంతో రాజ్యాంగం 1950లో పార్లమెంటరీ (ప్రభుత్వ విధానాన్ని అమలు జరిపినప్పుడు అది సాధారణంగా చాలా మంది అనుకొన్నట్లు బ్రిటిష్ పార్లమెంట్‌ని అనుకరించటం కాదు. ప్రజలకు సుపరిచితమైన జాతీయ విధానాలకు నిర్ధిష్టమైన రూపాన్ని కల్పించటం. రూపం కంటె కూడా ప్రజలకు జాతీయోద్యమం అలవరచిన ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగానికి పునాదిగా వుంది. ఇది ప్రజల విస్తృత భాగస్వామ్యంలో వ్యక్తమయింది. ఇది స్వతంత్రానంతరం వయోజన ఓటింగుకు అవకాశం కల్పించింది. 1980లోనే శాసనోల్లంఘనోద్యమంలో గాంధీజీ మహిళలకు కీలక బాధ్యతలు అప్పజెప్పియుండగా 1950లో వారికి ఓటు హక్కు నిరాకరించడం సాధ్యపడుతుందా? దరిద్ర నారాయణ, అంత్యోదయ భావనలలో ఆస్తి లేక ఆదాయం అర్షత సహజీవనం చేయగలుగుతుందా? లక్షలాది మూగజీవుల్ని ప్రాతిపదికగా చేసుకొని గాంధీజీ మొత్తం పోరాటాన్ని నడపగా రాజ్యాంగంలో అక్షరాస్యత, విద్యార్హతలు గలవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించబడుతుందా?
బ్రిటిష్ పాలనలో పత్రికా స్వేచ్చ కొరకు పలువురు నాయకులు తీవ్రపోరాటం చేశారు. ప్రత్యేకించి లోకమాన్య తిలక్ తన పత్రికల పోరాట ప్రవృత్తికి భారీ మూల్యం చెల్లించాడు. ఇంకా లీడర్, అమృతబజార్ పత్రిక, బాంబేక్రానికల్, ది హిందూస్ప్టాన్ టైమ్స్, దిహిందూ, ట్రిబ్యూన్, సెర్చిలైట్, ఆంధ్రపత్రిక, ఆజ్, ఆనంద బజార్ పత్రికలాంటి పత్రికలు జాతీయోద్యమానికి ఎనలేని సేవలు చేశాయి. ఈ చరిత్ర రాజ్యాంగంలో భావవ్యక్తీకరణ స్వేచ్భకి హామీ ఇచ్చింది.
“స్వరాజ్యం బ్రిటిష్ పార్లమెంటు ఇచ్చే బహుమతి కాదు. అది భారత ప్రజల మనోభావాల్ని వ్యక్తీకరించే ప్రకటన. అది పార్లమెంటు చట్టం ద్వారా ప్రకటింపబడడం వాస్తవమే. కాని అది భారత ప్రజల ప్రకటిత ఆకాంక్షకు మర్యాదపూర్వకంగా ఆమోదం తెలపటం మాత్రమే. పరిష్కారం కుదిరినప్పుడు బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రజల ఆకాంక్షలకు తన అధికార యంత్రాంగం ద్వారాగాక ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా ఆమోద ముద్ర వేస్తుంది. స్వరాజ్యం ఒక జాతి మరొక జాతికి యిచ్చే ఉచిత బహుమానం కాదు. జాతీ యొక్క అమూల్యమైన రక్తంచే కొనబడే నిధి. దానికి మనం మూల్యం చెల్లించినప్పుడు అది బహుమానంగా పరిగణింపబడదు.' త్0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
(బ్రిటిష్‌వారు వారంతట వారుగా ఏ రాజ్యంగ సంస్కరణగాని మరొకటిగాని ప్రవేశపెట్టలేదని, భారత జాతీయవాద ఒత్తిడికి స్పందనగా అనివార్యమైన పరిస్థితులలో వీలైనంత కాలయాపన చేసి సణుగుతూ కొన్ని చర్యలు చేపట్టారని 1922లో గాంధీజీ చేసిన ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నది. బ్రిటిష్‌వారు భారతదేశంలో ఆధునిక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన (ప్రభుత్వాన్ని (ప్రారంభించారని 1861, 1892,1909, 19885 సంస్కరణల తుది రూపమే భారత రాజ్యాంగమని బ్రిటిష్ పాలకులు ఆ తరువాత నయా సామ్రాజ్యవాద పండితులు జాగ్రత్తగా ఒక మేరకు జయప్రదంగా కట్టుకథ అల్లారు. ప్రతిదశలో భారతీయుల డిమాండ్ల కంటె బ్రిటిష్‌వారు ఇచ్చిన రాయితీలు చాలా తక్కువగా వుండటం కట్టుకథ బండారాన్ని బయట పెడుతుంది.
ఉదాహరణకు బ్రిటిష్‌వారు ఇండియన్ కౌన్సిల్స్ యాక్టు 1892లో ఎన్నిక చేసుకొనే పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, జాతీయవాదులు, భారతదేశ పత్రికలు కౌన్సిళ్లకు ఎన్నికలు జరపాలని, వాటిలో ఎన్నికైన ప్రతినిధులు మెజారిటీగా వుండాలని కౌన్సిళ్లలోని అనధికార సభ్యులకు ఎక్కువ అధికారాలు ఉండాలని అంతకు చాలా ముందు నుండి డిమాండు చేస్తూ వచ్చారు. జాతీయవాదుల డిమాండ్ల మేరకు 1892 చట్టంలో అవకాశాలు కల్చించబడలేదు.
బ్రిటిష్‌వారు ఆచరణలో పెట్టిన వాటికంటే జాతీయవాదులు చేసిన డిమాండ్లు కొంచెం ఎక్కువకాదు. చాలా ఎక్కువ. కెౌన్సిల్స్లో కనీసం సగం మంది ఎన్నికైన సభ్యులుండాలని, వయోజనులైన పురుషులందరికీ ఓటు హక్కు వుండాలని, బాలట్ పత్రాల ద్వారా ఓటింగ్ జరపాలని (రహస్య ఓటింగ్ పద్ధతి వుండాలని) అర్థిక బిల్లులపై లెజిస్లేటివ్ కౌన్సిళ్లకు ఓటు చేసే అధికారం వుండాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. కాని ఆచరణలో అప్పటి ఇంపీరియల్ లేక సెంట్రల్ లెజిస్తేటివ్ కౌన్సిల్ 17 మంది సభ్యులు కలిగి అధికార సభ్యుల మెజారిటితో వుంది. నామమాత్రంగా కొద్దిమంది భారతీయ సభ్యులున్నారు. 1892 చట్టం ఎన్నికయ్యే సభ్యుల్ని ప్రవేశపెట్టింది. కాని వారు మైనారిటిగా వున్నారు. వారికి గల అధికారాలు కూడా నామమాత్రం. మరొక వైపు భారత రాజ్యాంగ చట్టం స్వరూపంపై జాతీయ వాదుల ఆలోచనలు చాలా ముందుకు పోయాయి. 1895లో భారత రాజ్యాంగ బిల్లు లేక హోంరూలు బిల్లు వెలువడింది. రచయితను గురించిన స్పష్టమైన ఆధారాలు లేవు. అనిబిసెంట్ మాత్రం అది లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో రూపొందింపబడిందని భావించారు. దానిలో భారతదేశ పొరులందరికి భావ ప్రకటనా స్వేచ్చ, చట్టం ఎదుట సమానత, ఆస్తిహక్షు లాంటి మౌలిక మానవహక్షులు ఉండాలని పేర్కొనబడింది. భారత ప్రజల హక్కులపై ప్రకటన ఛేయవూపైసథైనా. 1895లో స్వతంత్రం తర్వాత భారతదేశం గ్గ ల్ కి... శ. రక
మొదటిసారిగా డిమాండు చేసి, ఆ తరువాత పలు మార్లు పునరుద్దాటించిన డిమాండును నెరవేర్చడంలో బ్రిటిష్‌వారి చివరి చట్టమైన భారత ప్రభుత్వ చట్టం 1935 కూదా విఫలమైంది.
రాజ్యాంగం వ్రాసేటప్పుడు జాతీయ నాయకులు స్వతంత్రానికి ముందుకాలం నాటి రాజ్యాంగపరమైన వారసత్వాన్ని వదులుకొని కొత్తగా ప్రారంభించవలసిన అవసరం కన్పించలేదు. ఇది వారి వారసత్వం. దీని కొరకు ఎన్నో త్యాగాలు చేశారు. పోరాటాలు చేశారు. రాజ్యాంగ రచయితలకు తమ స్వతంత్రమైన అర్హతలను నిరూపించుకొన వలసిన అవసరం లేదు గనుక మన రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం 19885 నుండి చాలా అంశాలను స్వీకరించింది. రాజ్యాంగ రచయితలు అప్పటికి వున్న సంస్థల పరిచయంతో వున్న అనుకూలతలను తిరస్మరించరాదని విశ్వసించారు. పాత్రలోని ప్రతికూల అంశాలను తిరస్కరించారు. క్రొత్తవి స్వీకరించారు. విలువైన అంశాలను అలాగే వుంచేందుకు సందేహించలేదు. రాజ్యాంగపరమైన అభివృద్ధి
బ్రిటన్ చేత భారతదేశానికి బాధ్యతాయుతమైన (ప్రభుత్వాన్ని మంజూరు చేయించాలనే తలంపుతో 1880, 1890లలో ప్రారంభమైన జాతీయోద్యమం 20వ శతాబ్దం యొక్కరెండవ దశాబ్దాంతానికి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని లేక వారి రాజ్యాంగాన్ని రూపొందించుకొనే భారతీయుల హక్కుని స్వాయత్తం చేసుకోవడం ప్రారంభించింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తిలక్, అనిబిసెంట్ హోంరూలు ఉద్యమం ప్రారంభించారు. రాజ్యాంగ సంస్కరణల కొరకు 1916 నాటి కాంగ్రెస్లీగ్ ఒప్పందం నుండి ఆవిర్భవించిన కాంగ్రెస్ ముస్షింలీగు పథకం రాష్ట్రాల చట్ట సభల యొక్క సభ్యులలో ఐదింట నాలుగు వంతుల మంది వీలైనంత ఎక్కువ ఓటర్లతో ఎన్నుకొనబడినవారై వుండాలని డిమాండ్ చేసింది. 1918లో ఢిల్లీ కాంగ్రెస్ సదస్సు యిలా తీర్మానం చేసింది. 'పెసిడెంటు విల్సన్, లియడ్ జార్జి ఇతర బ్రిటిష్ రాజనీతిజ్ఞుల ప్రకటనలను అనుసరించి భవిష్యత్తులో 'ప్రపంచశాంతిని పటిష్ట పరచేందుకు అన్ని అభివృద్ధికర జాతులకు స్వయం నిర్ణయ సూత్రం వర్తింపడేయబడాలి. .... భారతదేశాన్ని అభివృద్ధికరమైన దేశాలలో ఒకటిగా గుర్తించి స్వయం నిర్ణయసూత్రాన్ని వర్తింపజేయాలి” ఈ వాదనలు బ్రిటిషు పాలకుల్ని ప్రభావితం చేయలేదు. రాజ్యాంగ సంస్కరణల యొక్క సమయం, తీరు టబబిటీషువారి చేతనే నిర్ణయింపబడతాయని నిశ్చితంగా చెప్పి తరువాత దఫా సంస్కరణలు 1919 లో (ప్రవేశపెట్టబడ్డాయి. దీనికి భారతీయుల జవాబు గాంధీజీ నాయకత్వంలోని సహయనిరాకరణోద్యమం. ఈ ఉద్యమం 1922లో ముగిసిన తరువాత కాంగ్రెసులో 52 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొన్ని సెక్షన్లు స్వరాజ్య పార్టీగా ఏర్పడి చట్ట సభల ఎన్నికలలో పోరాడాయి. రాజ్యాంగపరమైన యుద్దానికి నూతన శక్తి తోడయింది.
అనిబిసెంట్, తేజ్ బహుదూర్ సహ్ర, వి.యస్. శ్రీనివాస శాస్త్రిలు నిర్వహించిన నాయకత్వ పాత్రతో భారతదేశంలో “కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు చిత్తు ప్రతి తయారు చేయబడింది. లేబర్‌పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీచే ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 1925 డిసెంబరులో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టబడింది. కాని లేబరు ప్రభుత్వ పరాజయాన్ని నివారించలేకపోయింది. భారతీయాఖభిప్రాయానికి అనుకూలంగా విస్తృతమైన సెక్షన్ల మద్దతు పొందిన ఆ బిల్లు భారతదేశానికి స్వయం పాలిత అధినివేశ రాజ్యాలతో సమానమైన స్థానం కల్పించబడాలి, అని స్పష్టం చేయడం గమనార్హం.
ఈ దశలో మోతీలాల్ నెహ్రు 1924 ఫిబ్రవరి 8నసెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రతిపాదించి ప్రముఖ పాత్ర నిర్వహించాడు. ఆ తీర్మానం ముఖ్యమైన మైనారిటీల హక్కులు ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తూ భారత రాజ్యాంగ ప్రణాళికకు సూచనలు చేసేందుకు అందరికీ ప్రాతినిధ్యం కల్పించే రౌండు టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రణాళిక కొత్తగా ఎన్నికయ్యే భారత చట్ట సభ ఆమోదం పొందుతుంది. దానికి చట్ట రూపం కల్పించబడేందుకు బ్రిటిష్ పార్లమెంటుకి పంపించబడుతుంది. ఆ విధంగా మోతీలాల్ నెహ్రూ మొదటిసారిగా రాజ్యాంగం కొరకు డిమాండు చేయడమే గాక, అనుసరించవలసిన విధానాన్ని కూడా స్పష్టంగా సూచించాడు. జాతీయ డిమాండ్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ తీర్మానం సెంట్రల్ లెజిస్తేటివ్ అసెంబ్లీలో 76-48 ఓట్లతో ఆమోదం పొందింది.
బ్రిటిష్ పాలకులు ఈ జాతీయ డిమాండ్‌ని తిరస్కరిస్తూ మరికొన్ని రాజ్యాంగ మార్పులను సిఫార్సు చేసేందుకు 1927 నవంబరులో అందరూ తెల్లవాళ్ళే సభ్యులుగా గల సైమన్ కమీషన్ని నియమించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బర్మిన్ హెడ్ 1927 నవంబరు 24న సైమన్ కమీషన్ నియామకాన్ని ప్రకటిస్తూ అతడు 1925 జులై 7న భారత ప్రజలకు విసిరిన సవాలును పునరుద్దాటించాడు. “భారత దేశంలోని గొప్ప ప్రజానీకం యొక్క సాధారణ ఆమోదం పొందే రాజ్యాంగం తయారు చేయనీయందడి.”
ఈ సవాలు స్వీకరించబడింది. కాంగైసు 1928 మేలో అఖిల పక్ష సదస్సు నిర్వహించింది. అఖిల పక్ష సదస్సు భారత రాజ్యాంగ నిబంధనలను నిర్ణయించేందుకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన కమీటీని నియమించింది. కమిటీ1928 ఆగష్టు 10న నెహ్రూ రిపోర్టు సమర్పించింది. అది భారత రాజ్యాంగ ముసాయిదాకు రూపు రేఖలను స్వతంత్రం తర్వాత భారతదేశం 58
సమర్పించింది. దానిలోని అత్యధిక అంశాలు తరువాత భారత రాజ్యాంగంలో చేద్చజల్యయి. అది మైనారిటీలకు నిర్జీతకాల వ్యవధి వరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి నియోజకవర్గాలతో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వానికి పార్లమెంటరీ విధానానికి ఆకృతి కల్పించింది. నెహ్రా రిపోర్టు భారత ప్రజలకు ప్రాథమిక మానవ హక్కులు కల్పించటానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. “వ్యక్తి వివేచనా స్వతంత్రం స్వేచ్చగా మతాన్ని అంగీకరించి పాటించే హక్కు భావ ప్రకటనా స్వేచ్చ, ఆయుధాలు లేకుండా శాంతి యుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు వర్పరచుకొనే హక్షు ప్రీ, పురుషులకు సమానహక్కులు, ఉచిత ప్రాథమిక విద్యా హక్కు లాంటి హక్కులు వీటిలో వున్నాయి. రాజ్యం యొక్క సెక్కులర్ స్వభావం ప్రాథమిక హక్కులలో చేర్చబడింది. నెహ్రూ రిపోర్టులోని 19 హక్కులలో 10 హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. రాష్ట్రాల (ప్రావిన్సుల) పునర్విభజన భాషా ప్రాతిపదికన జరపాలని కూడా నెహ్రూ రిపోర్టు సిఫార్సు చేసింది. నెహ్రూ రిపోర్టు తరువాత సైమన్ కమీషన్ బహిష్కరణ కమిషన్ సభ్యులు వెళ్ళిన చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాంగైస్ 1929 డిసెంబర్లో సంపూర్ణ స్వరాజ్యం తన లక్ష్యమని ప్రకటించింది. దాని కనుగుణంగా 1930 ఏప్రిల్‌లో శాసనోల్లంఘనం చేపట్టింది. శాసనోల్లంఘనం వందల వేల మందిని వీధుల్లోకి రప్పించింది. దాదాపు లక్షమందిని జైళ్ళకు పంపించింది. భారతీయులు వారి రాజ్యాంగాన్ని వారు రూపొందించుకొనే హక్కుకి తక్కువైనదేదీ అంగీకరించరని స్పష్టమయింది. ఇది నెహ్రా రిపోర్టులాగా, ఒక సదస్సుతోగాక వీలైనంత విశాలమైన ప్రాతిపదికన ఎన్నికయ్యే రాజ్యాంగ పరిషత్తు ద్వారా జరగాలనే ఆలోచన ఊపందుకొన్నది. మార్క్సిస్టు నాయకుడు, యం.యన్.రాయ్ మొదట ఈ ఆలోచనని సూచించినప్పటికి 1983లో మొదటిసారిగా దీనిని వ్యక్తీకరించిన జాతీయ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. తరువాత సంస్కరణలపై బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాన్ని తిరస్కరిస్తూ 1934 జూన్‌లో కాంగ్రెస్ వర్కింగు కమిటీ 'శ్వేతపత్రానికి జవాబు వయోజన ఓటింగ్ ప్రాతిపదికన ఎన్నికయ్యే రాజ్యాంగపరిషత్ చేత రాజ్యాంగాన్ని రూపొందింపజేయడమేనని తీర్మానించింది. రాజ్యాంగ పరిషత్ డిమాండు 1934 తరువాత చాలా తరుచుగా చేయబడింది. 1986-37లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబడింది. 11 ్రావిన్స్లకుగాను 7 ప్రావిన్సులలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. మంత్రి వర్ణాలనేర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగని అప్పుడున్న రాజ్యాంగ చట్రాన్ని అంగీకరించినట్లు అర్ధం చేసుకోరాదని స్పష్టం చేసింది. మంత్రి వర్గాల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న 1987 ఫిబ్రవరి 27-28 వార్థా కాంగ్రెస్ వర్కింగు కమిటీ సమావేశం కూడా కొత్త శాసన రడ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సభలలో వీలైనంత త్వరలో రాజ్యాంగ పరిషత్ కొరకు డిమాండ్ చేయాలని మైలాపూర్ కాంగ్రెస్ సదస్సులో చేసిన తీర్మానాన్ని శాసనసభ్యులకు గుర్తు చేసింది.
కాంగ్రెస్ శాసన సభ్యుల, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుల సదస్సు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మార్చి 19,20 తేదీలలో ఢిల్లిలో జరుపబడింది. వారంతా రాజ్యాంగ పరిషత్‌చే రూపొందింపబడే “పంచాయితీరాజ్” ప్రజలచే ఎన్నుకొనబడే గొప్ప పంచాయితీ రాజ్ కొరకు పనిచేయవలసి వుంటుందని నెహ్రూ ప్రతినిధులకు చెప్పాడు. “ఈ రాజ్యాంగం పూర్తిగా రద్దు కావాలి. దాని స్థానంలో మన రాజ్యంగ పరిషత్ రావాలని' స్పష్టంగా చెప్పాడు.
మరలా 1937 జులైలో అప్పటి రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ రాజ్యాంగ పరిషకత్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలను ప్రవేశపెట్టవలసిందిగా నెహ్రూ శాసనసభ్యుల్ని ఒత్తిడి చేశాడు. ఆగష్టులో ఆచార్య కృపలానీ తయారు చేసిన ముసాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ వర్మింగు కమిటీ ఆమోదించింది. అది రాష్ట్ర (ప్రావిన్సు) అసెంబ్లీలోని కాంగ్రెస్ సభ్యులకు పంపించబడింది. 1937 ఆగస్ట్, అక్టోబర్ల మధ్య కాంగ్రెస్ పాలిత రాహమ్షాల (ప్రావిన్సులు) బొంబాయి, మద్రాసు, యు.పి, బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్, వాయువ్య సరిహద్దు రాష్ట్రం - సింధ్‌తో సహా ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. తీర్మానం “భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దు చేయబడాలి.....వయోజన ఓటింగ్ ప్రాతిపదికన ఎన్నికైన రాజ్యాంగం పరిషత్‌చే రూపొందింపబడే స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం ప్రవేశపెట్టబడాలి.” 1937 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో రాజ్యాంగ పరిషత్‌చే రూపొందించబడిన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసే తీర్మానం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. గొప్ప ప్రజలు స్వతంత్రం సాధించాలని ఒక స్థిర నిర్ణయానికి వస్తే గ్రేట్ బ్రిటన్‌తో సహా ప్రపంచంలో ఏ శక్తి వారిని అడ్డుకోలేదు. మహత్నాగాంధీ చాచిన స్పేహ హస్తాన్ని అందుకోమని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నాయకుడు యస్. సత్యమూర్తి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. 1938లో జరిగిన హరిపుర కాంగ్రెస్ సదస్సు ఈ డిమాండుని పునరుద్దాటించింది.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత యుద్ధం పై వారి అభిప్రాయాన్ని ఆమోదాన్ని పొందకుండానే యుద్ధంలో భారతదేశాన్ని భాగస్వామిని చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంత్రి వర్ణాలు రాజీనామా చేశాయి. భారతదేశం తన రాజ్యాంగాన్ని తాను రూపొందించుకొనే స్వతంత్ర రాజ్యంగా పరిగణింపబడాలని చట్టసభలు తీర్మానాలు చేశాయి. ఆ తరువాత నెహ్రూ, కాంగ్రెస్‌తో పాటు గాంధీజీ తన అభిప్రాయాన్ని జోడించాడు. 'ఒకే ఒక మార్గం' అనే వ్యాసంలో రాజ్యాంగ పరిషత్ విషయంలో తాను నెహ్రూ కంటె ఉత్సుతకతో స్వతంత్రం తర్వాత భారతదేశం ర్5్
వున్నానని ప్రకటించాడు. “మీరే దృష్టి క్రోం నుండియైనా చూడండి. (ట్రజాన్వామ్య స్వరాజ్యానికి దారి సరైన పద్ధతిలో నిర్మిత్రమైన మ్రార్గం గుండానే పోతుంది. - దానిని మీ యిష్టమైన పేరుతో పిలుచుకోవచ్చు' దానిక్రి ప్రీ పురుషుల ఓటు హక్సు ప్రాతిపదికగల సంస్థ పూర్తి న్యాయం చేకూర్చుతుంది. - అది ప్రజారాజకీయలకు చైతన్యానికి వాహకంగా వుండటంతో పాటు మతపరమైన ఇతరములైన జాద్యాలకు విరుగుడుగా కూడా వుంటుంది. 1940 ఏప్రిల్ 15 నుండి 19 వరకు జరపబడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వద్ద గాంధీజీ జవహర్లాల్ నెహ్రూ మధ్య జరిగిన చర్చ గాంధీజీ వ్యవహార జ్ఞానం ముందు చూపుకి చెందిన విశిష్టమైన లక్షణాలను వ్యక్తం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ముందుగా భారతదేశం స్వతంత్రం పొందినట్లుగా ప్రకటించి అప్పుడు రాజ్యాంగ పరిషత్‌ని సమావేశపరచాలని నెహ్రు అభిప్రాయపడ్డారు కాని గాంధీ రాజ్యాంగ పరిషత్‌ని ముందుగా సమావేశపరచి స్వతంత్రం సమస్యని చర్చించేందుకు స్వేచ్చ కల్పించాలని అభిప్రాయపడ్డారు. గా ంధీజీ అభిప్రాయం జరిగిన ఘటనలకు దగ్గరగా వుంది.
యుద్ధ యత్నానికి భారతదేశ సహకారం పొందే ప్రయత్నంలో భాగంగా 1940లో తిన్లిత్గౌ చేసిన ఆగష్టు ప్రతిపాదన నూతన రాజ్యాంగ రూపకల్పన బాధ్యత ప్రధానంగా (పూర్తిగా కాకపోయినా) భారతీయులదేనని మొదటిసారిగా అంగీకరించింది. యుద్ధం ముగిసిన తరువాత నూతన రాజ్యాంగ చట్రం రూపకల్పనకు భారత జాతీయ జీవనానికి ప్రొతినిధ్యం వహించే సంఘం ఏర్పాటుని గూడా ప్రతిపాదించింది. కాని ఈ సంఘం ఎలా వర్పాటు చేయబడుతుంది - ప్రత్యక్ష ఎన్నికల ద్వారానా లేక పరోక్ష ఎన్నికల ద్వారానా? వయోజన ఓటింగు ప్రాతిపదికనా లేక పరిమితమైన ఓటింగుతోనా? -వివరాలు స్పష్టం చేయబడలేదు. .
ఆగష్టు ప్రతిపాదన అన్ని పెద్ద రాజకీయ పార్టీలను కదిలించింది. తన ఆమోదం లేకుండా యుద్ధంలో భాగస్వామిని చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ 1940 డిసెంబరులో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని ప్రారంభించేందుకు సమాయతమయింది. పార్టీకి యుద్ధ లక్ష్యాల పట్ల సానుభూతి వుంది గనుక యుద్ధ యత్నాన్ని ఆటంకపరచలేదు. భారతదేశం యొక్క సహకారం వుందనుకొన్న బ్రిటన్ హక్షుని నిరాకరించింది. చర్చలకు యింకా తలుపులు తెరవబడే వున్నాయి.
1942 మార్చిలో ఆగ్నేయాసియాలో బ్రిటన్ వైఫల్యం, మూడు రోజుల తరువాత రంగూన్ పతనం తరువాత బ్రిటన్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ యుద్ధకాలం నాటి మంత్రి వర్గ సభ్యుడు జవహర్లాల్ నెహ్రూ మిత్రుడు అయిన సర్స్టాపర్ క్రిప్స్ని పంపిస్తున్నట్లు ప్రకటించాడు. క్రిప్స్ ప్రడిపాదనలుగా పిలువబడిన రాజ్యాంగ రాయితీలు మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు విధానాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి. క్ బిపన్చం[ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాష్హ్రాల (ప్రావిన్సుల) ఎన్నికల ఫలితాలు ప్రకటించబడగానే, రాష్ట్రాల దిగువసభల సభ్యులందరూ ఓటర్లుగా, దామాషా ప్రాతినిధ్య విధానం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సంస్థని ఎన్నుకొంటారు. బ్రిటిషిండియా ప్రతినిధులలాగానే స్వదేశ సంస్థానాలు కూడా వాటి మొత్తం జనాభాలో దామాషా ప్రకారం ప్రతినిధులను ఎంపిక చేసి పంపించాలి. వారికి బ్రిటిషిండియా 'పతినిధులకున్న అధికారాలే వుంటాయి.
కిప్సు ప్రతిపాదనలు బ్రిటిషు ప్రభుత్వ వైఖరిలో పెద్ద ముందడుగు.. రాజ్యాంగం పూర్తి భారతీయుల బాధ్యత మాత్రమే అని బ్రిటిషు ప్రభుత్వం మొదటిసారిగా స్పష్టంగా అంగీకరించింది. రాజ్యాంగ పరిషత్ ఆలోచన కూడా నిర్ద్వంద్వంగా అంగీకరించబడింది. దాని విధి విధానాలు వ్యక్తం చేయబడ్డాయి. కాని విభజించే స్వభావం గల క్రిప్పు ('ప్రతిపాదనలలోని ఇతర అంశాలు కాంగ్రెస్ ఆమోదానికి అద్దుగా నిలిచాయి.
క్రిప్సు రాయబార వైఫల్యం జాతీయోద్యమానికి బ్రిటిషు ప్రభుత్వానికి మధ్య మరొక దఫా ప్రతిఘటనకు దారితీసింది. క్విట్ ఇండియా” (భారతదేశాన్ని వదిలిపొండి) అని డిమాండు చేసి 'డు ఆర్ డై (ప్రతిఘటించండి లేక మరణించండి) అని భారతీయులను ఉద్చోధించిన 1942 ఆగష్టు 8 కాంగ్రెస్ ప్రఖ్యాత తీర్మానం కూడా స్వతంత్ర భారతదేశం యొక్క తాత్కాలిక (ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్ కొరకు తగు పథకాన్ని రూపొందిస్తుందని స్పష్టంచేసింది. ఆ తరువాత ఉప్పొంగిన ప్రజా వెల్లువ తుదిసారి చర్చలకు సమయమిదేనని 'బ్రిటిషువారికి కనువిప్పుకలిగించింది. కాబట్టి 1945 మేలో యూరపులో యుద్ధం ముగియగానే భారతదేశంపై శ్వేతపత్రం విడుదల చేయబడింది. ఆ తరువాత 1945 జూన్ జులైలో ఎలాంటి ఫలితం చేకూర్చని సిమ్లా సదస్సు జరిగింది.
1945 జులైలో జరిగిన బ్రిటన్ ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం నూతన (ప్రారంభానికి అవకాశం కల్పించింది. 1945 సెప్టెంబరు 9న లార్డు వేవల్ భారతదేశంపై నూతన ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తూ వీలైనంత త్వరలో రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీని సమావేశ పరుస్తానని వాగ్ధానం చేశాడు. 1946 ఫిబ్రవరి 19న బ్రిటిషు ప్రభుత్వం స్వతంత్ర రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మొత్తం సమస్యని పరిష్కరించేందుకు మంత్రి వర్ణ రాయబార సంఘాన్ని పంపిస్తున్నట్లు ప్రకటించింది.
1946 మార్చి 24న భారతదేశానికి వచ్చిన మంత్రి వర్గ రాయబార సంఘం భారత నాయకులతో సుదీర్టమైన చర్చలు జరిపింది. ఒప్పందాన్ని సాధించడంలో విఫలమైన రాయబార సంఘం తన స్వంత పధకాన్ని ప్రకటించింది. వయోజన ఓటింగు ప్రాతిపదికన రాజ్యాంగ నిర్మాణ యంత్రాంగాన్ని ప్రారంభించటం చాలా మంచి పద్ధతి అని అంగీకరించింది. కాని అలాంటి చర్య చేపట్టడానికి చేసే ప్రయత్నం కొత్త రాజ్యాంగ స్వతంత్రం తర్వాత భారతదేశం 57
రూపకల్పనలో అంగీకారయోగ్యం కాని కాలయాపనకు దారితీస్తుందని పేర్కొన్నది. కాబట్టి కొత్తగా ఎన్నికైన రాష్ట్ర శాసన సభలు ప్రతి పది లక్షల జనాభాకు ఒక ప్రతినిధిని ఎన్నుకొనే ప్రాతిపదికన రాజ్యాంగ పరిషత్‌కి ప్రతినిధులను ఎన్నుకోవాలని నిర్ణయించింది. సిక్కు ముస్లిం శాసన సభ్యులువారి జనాభా ప్రాతిపదికన ప్రతినిధులను ఎన్నుకోవాలి.
యూనియన్ రాఘ్రాల అధికారాలకు సంబంధించి చాలా విధానాలు, సలహాలపై వివరాలు వున్నాయి. రాష్ర్టాలు (ప్రావిన్సులు) మూడు (గ్రూపులు ఎ, బి, సి లుగా విభజింపబడతాయి. సెక్షన్ “ఎలో హిందూ మెజారిటీ రాష్ట్రాలు మద్రాసు, బొంబాయి, యు.పి. బీహారు, సెంట్రల్ ప్రావిన్సెస్, ఒరిస్సా వుంటాయి. అలాగే సెక్షన్ 'బి'లో ముస్లిం మెజారిటీ రాష్ట్రాలు - పడమరన పంజాబు వాయువ్య సరిహద్దు రాష్ట్రం తూర్పున అస్సాం, బెంగాలు వుంటాయి. రాజ్యాంగ పరిషత్ వైర్మన్ని ఎన్నుకొనేందుకు ఇతర లాంఛనాలను పూర్తిచేసుకొనేందుకు సమావేశమైన తరువాత సెక్షన్లుగా విడిపోవాలని మంత్రివర్గ రాయబార సంఘం ప్రతిపాదించింది. వారి వారి సెక్షన్లలో సమావేశమయ్యే రాష్ట ప్రతినిధులు మొదట వారి వారి ్రావిన్సులలోని రాజ్యాంగాలను నిర్ణయించాలి. ఈ క్రమం పూర్తయిన తరువాతనే అన్ని రాష్ట్రాల, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు యూనియన్ యొక్క రాజ్యాంగాన్ని గురించి చర్చించేందుకు మరలా సమావేశం కావాలి. భారత యూనియన్ విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ల బాధ్యతలను చేపడుతుంది.
మంత్రివర్గ రాయబార సంఘ పధకానికి కాంగ్రెస్ తీవ్రంగానే స్పందించింది. ఒకసారి రాజ్యాంగ పరిషత్ ఉనికిలోకి వచ్చిన తరువాత అది సర్వసత్తాకమైనదిగా వుండాలన్నది. ప్రత్యేకమైన అంశాలపై మంత్రి వర్గ రాయబార సంఘ ప్రతిపాదనల్ని ఆమోదించే హక్కు లేక తిరస్మరించే హక్షు రాజ్యాంగ పరిషత్‌కు వుండాలన్నది. బ్రిటిష్ వారి నుండి ఎలాంటి హామీ లభించనప్పటికి తిరస్కరించడం వలన అధికార మార్చిడి క్రమం ఆలస్యం అవుతుందనే ఆలోచనతో కాంగైస్ చాలా తడవు చర్చించిన మీదట పధకాన్ని ఆమోదించింది. ముప్లింలీగు బద్ధ వ్యతిరేకతతో సాధించాలని ఆశించింది అదే.
.... లీగు రాజ్యాంగ పరిషత్ ఏర్పడక ముందు ఏర్పడిన తరువాత ప్రతి దశలో రాజ్యాంగ
పరిషత్‌ని వ్యతిరేకించటం కొనసాగించాలి. రాజ్యాంగ పరిషత్
ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి కర్తవ్యం నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశానికి స్వేచ్చ కల్పించటం, ఆకలితో వున్న ప్రజలకు ఆహారం సమకూర్చటం, త్రి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అర్ధ దిగంబరంగా వున్న ప్రజలకు బట్టలు సమకూర్చటం, ప్రతి భారతీయునికి తన శక్తి మేరకు అభివృద్ధి చెందటానికి పూర్తి అవకాశం కల్పించటం. ఇవి రాజ్యాంగ పరిషత్ ఎదుట జవహర్లాల్ నెహ్రు వ్యక్తీకరించిన ఆకాంక్షలు రాజ్యాంగ పరిషత్‌లో ౩89 మంది సభ్యులుంటారు. వీరిలో 296 మంది (బ్రిటిషిండియానుండి, 93 మంది స్వదేశ సంస్థానాల నుండి. తొలుత రాజ్యాంగ పరిషత్‌లో బ్రిటిషిందియా సభ్యులే వున్నారు. బ్రిటిషిండియాలో ఎన్నికలు 1946 జులై, ఆగష్టులో నిర్వహించబడ్డాయి. జనరల్ కేటగిరిలోని 210 సీట్లలో కాంగ్రెస్ 199 సీట్లు గెలిచింది. 78 ముస్లిం సీట్లలో కాంగ్రెస్ 3 సీట్లు గెలిచింది. కూర్చు, ఆజ్మీర్ - మేవాడ, ఢిల్లీ లనుండి ౩ సీట్లు గెలిచింది. మొత్తం 208 సీట్లు కాంగ్రెస్ వశమయ్యాయి. ఇక ముస్లిం లీగు 78 సీట్లలో 78 గెలిచింది. కాంగైస్ అకాంక్షించి డిమాండు చేసిన విధంగా రాజ్యాంగ పరిషత్ సార్వత్రిక వయోజన ఓటింగు ప్రాతిపదికన ఎన్నుకోబడినది కాదు గనుక, స్వభావ రీత్యా నిజమైన ప్రతినిధి కాదు గనుక, ప్రత్యేక ప్రాతినిధ్యానికి అర్హులుగా మైనారిటీలుగా ముస్లింలు సిక్కులు మాత్రమే గుర్తింపబడినారు గనుక, దేశంలో వున్న దృక్పధాల వైవిధ్యం రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిఫలించేలా చేసేందుకు ప్రత్యేక యత్నం చేయబడింది. షెడ్యులు కులాల, పార్చీల భారతీయ క్రైస్తవుల, తెగల, మహిళలు ప్రతినిధులకు కాంగైస్ జనరల్ కేటగిరిలో స్థానం కల్పించమని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలను 1946 జులైలో కాంగ్రెస్ వర్మింగు కమిటీ అదేశించింది. దేశంలో లభ్యమయ్యే అత్యుత్తమ ప్రతిభకు రాజ్యాంగ నిర్మాణ కర్తవ్యంలో భాగస్వామ్యం కల్పించే విధంగా రాజ్యాంగ పరిషత్ సభ్యుల పేర్లను ఎంపిక చేయటం జరిగింది. కాంగ్రెస్ జాబితాలో చేర్చవలసిందిగా కాంగ్రెస్ సభ్యులుకానివారు 30 మంది కాంగ్రెస్ టికెటుపై ఎన్నుకోబడ్డారు. అంతేగాక పరిషత్తు యొక్క సైద్దాంతిక వర్జచిత్రం కాంగ్రెస్ సభ్యత్వంలోని వైవిధ్య స్వభావంచే విసృతపరచబడింది. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలను అద్దుకొనడంలో విఫలమైన ముస్తింలీగు తన శక్తి యుక్తులను పరిషత్ కార్యక్రమాలలో పాల్గొన నిరాకరించడంపై కేంద్రీకరించింది. కాంగ్రెస్, తాత్మాలిక ప్రభుత్వ ప్రెసిడెంట్‌గా జవహర్లాల్ నెహ్రూ ముస్లిం లీగును శాంతింపజేసే ప్రయత్నాలు కొనసాగాయి. కాని ఎలాంటి ప్రయోజనం ఒనగూడ లేదు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబరు 9న జరపాలనే నిర్ణయం 1946 నవంబరు 20న ప్రకటించబడింది. స్వతంత్రం తర్వాత భారతదేశం ర్9ి
వైస్రాయ్ లార్డ్ వేవల్ పరిషక్ని సమావేశపరచడం పట్ల విముఖంగా వున్నాడు. ఎలాగూ రాజ్యాంగ పరిషత్ ఎన్నుకొనబడింది గనుక దానికి దూరంగా వుండాలనే వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా అది పనిచేయడం ప్రారంభించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. రాజ్యాంగ పరిషత్తు వైస్ (పెసిడెంటుని నియమించాలనే వైప్రాయి కోరికను తోసిపుచ్చి పరిషత్ మొదటి సదస్సుకు హాజరుకావాలసిందని నెహూ తన పేరుతో ఆహ్వానాలు పంపించవలసి వచ్చింది. నెహ్రూ పట్టు పట్టడంతో పరిషత్ సభ్యులలో అందరికంటె పెద్దవాడైన డాక్టర్ సచ్చినందానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. రాజ్యాంగ పరిషత్ సెక్రటరీ పేరుతో ఆహ్వానాలు పంపించబడ్డాయి. ఇలా చేయడంలో నెహ్రూ బ్రిటిష్ నియంత్రణ నుండి పరిషత్ స్వతంత్రాన్ని స్టాపిస్తున్నాడు. రాజ్యాంగ పరిషత్ పుట్టుక, దాని కర్తవ్యం అది నిర్వహించి పరిసమాప్తి కావడం - కాంగ్రెస్, ప్రత్యేకించి నెహ్రూ సాధించిన విజయం. అది బ్రిటిష్‌వారి మానసపుత్రిక కాదు. అంతేగాక స్వతంత్ర భారత దేశానికి న్యాయబద్ధమైన రాజ్యాంగ నిర్మాణ సంస్థగా దాని యొక్క విశ్వసనీయత అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా వుండటమే గాక స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా పరిగణింపబడడం మీద కూడా ఆధారపడివుంది. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 1946 డిసెంబరు ఉదయం 11 గంటలకు ప్రారంభమయింది. ఆ చారిత్రక దినంతో స్వతంత్ర భారతదేశ చరిత్ర (ప్రారంభమయింది. ఇక స్వతంత్రం అనేది రోజుల వ్యవహారమే. రాజ్యాంగ పరిషత్‌ని సమావేశ పరచడంతో రాజ్యాంగ చట్రాన్ని నిర్ణయించే బాధ్యత భారత ప్రజలకు బదిలీ చేయబడింది. హా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి 207 మంది సభ్యులు హాజరయ్యారు.
సమావేశపరచదాన్ని అడ్డుకొనడంలో విఫలమైన మున్సింలీగు సమావేశాలను బహిష్టరించింది. ఫలితంగా 76 మంది ముస్లిం లీగు సభ్యులు సమావేశాలకు దూరంగా వుండిపోయారు. నలుగురు కాంగ్రెస్ ముస్లిం సభ్యులు హాజరయ్యారు. డిసెంబరు 11న డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవి తరువాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా మార్చబడింది. డిసెంబరు 18న జవహార్‌లాల్ నెహ్రూ ప్రసిద్ధిగాంచిన లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించారు. దానిపై డిసెంబరు 19 వరకు చర్చ జరిగింది. కాని ముస్తింలీగు స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు కలవడానికి వీలుగా దాని ఆమోదం వాయిదా వేయబడింది. ఆ తరువాత 1947 జనవరి 20-22 లో జరిగిన సమావేశంలో ఇక ముస్లిం లీగు కొరకు ఏమాత్రం నిరీక్షించకూడదని నిర్ణయించబడింది. లక్ష్యాల తీర్మానం ఆమోదించబడింది. 60 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మూడవ ధపా సమావేశాలు 1947 ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు జరిగాయి. లీగు ఇంకా దూరంగానే వుండి పోయింది. జూన్ ౩న భారతదేశం విభజింపబడుతుందని స్పష్టం చేసిన మౌంట్‌బాటన్ పథకం ప్రకటించబడింది. ముస్లింలీగుతో రాజీ పడాలన్న మంత్రి వర్గ రాయబార సంఘం ప్రతిపాదన సందర్భ శుద్ది కోల్పోయింది కనుక ఇది రాజ్యాంగ పరిషత్ యొక్క దృష్టి కోణాన్నే మార్చివేసింది. భారతదేశం 1947 ఆగష్టు 15న స్వతంత్ర రాజ్యమవడంతో రాజ్యాంగ పరిషత్ సర్వసహాధికార సంస్థ అయింది. నూతన రాజ్యానికి అది చట్ట సభ అయింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రూపకల్పన, చట్టాలు చేయడం - రెండింటికి బాధ్యత వహించింది. రాజ్యాంగ పరిషత్ పరిమాణం రాజ్యాంగ రూపకల్పన బాధ్యతలకు అద్దురాలేదు. కారణం దాని యొక్క ప్రముఖ నాయకులు కష్టించి పని చేసేవారు, నిర్మాణపరమైన నిపుణతలు గలవారు. వారు చాలా ముందు నుండి సన్నాహక చర్యలు ప్రారంభించారు. కార్యక్రమం ఐదు దశలుగా చేపట్టబడింది. మొదటిది: కమీటీలకు మౌలిక సమస్యలపై రిపోర్టులు సమర్ప్చించవలసిందిగా కోరటం జరిగింది. రెండవది: ఈ కమిటీల రిపోర్టు ప్రాతిపదికన ఇతర దేశాల రాజ్యాంగాలపై తన పరిశోధన ఆధారంగా రాజ్యాంగ సలహాదారుడు బి.యన్.రావు తొలి ముసాయిదా తయారు చేశాడు. మూడవది: దాక్టర్ అంబేద్మర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ సవివరమైన ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించింది. ప్రజలు చర్చించి సూచనలిచ్చేందుకు వీలుగా అది (ప్రచురింపబడింది. నాల్గవది: ముసాయిదా రాజ్యాంగం చర్చించబడింది. సవరణలు ప్రతిపాదించబడ్డాయి. ఐదవది: రాజ్యాంగం ఆమోదించబడింది. అంతేగాక కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించింది. కాంగ్రెస్ పార్టీ 1946 జులై 4 నుండి అవసరమైన సమాచారాన్ని సేకరించి ప్రతిపాదనలు చేయవలసిందిగా నిపుణుల కమిటీని కోరింది. నెహ్రూ అధ్యక్షుడిగా అసఫాలి, కె.టి.షా., డి.ఆర్. గాడ్డిల్, కె యం. మున్నీ హుమాయూన్ కబీర్, ఆర్. సంతానం, యన్.గోపాలస్వామి అయ్యంగార్ సభ్యులుగా కమిటీ పనిచేసింది. నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని రూపొందించారు. దీనిని అసెంబ్లీ మొదటి సమావేశంలో ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఎ.ఐ.సి.సి.లు 1946 నవంబరు 20, 21 తేదీలలో ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్‌వారు అసెంబ్లీ చర్చలలో పాల్గొనడంతోపాటు ప్రతి నిబంధనని పార్టీ వేదికలపై లోతుగా పరిశీలించి చర్చించే క్రమం రాజ్యాంగ ఆమోదం పొందబడేవరకు జరిగింది. పార్టీ అంతగా ఈ క్రమంలో మమేకమవడంతో పార్టీ సభ్యుడైన షిబన్లాల్ సక్సేనా, “అసెంబ్లీ కార్యక్రమాలు కేవలం లాంఛన 'ప్రాయమయ్యాయి.' అని వ్యాఖ్యానించాడు. రాజ్యాంగంలోని ప్రతి నిబంధన క్షుణ్ణంగా పరిశీలింపబడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. జూన్ ఆస్టిన్ మాటల్లో... స్వతంత్రం తర్వాత భారతదేశం 61
కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీ రాజ్యాంగంలోని ప్రతినిబంధనని చర్చించిన అనధికార ప్రైవేటు వేదిక. చాలా సందర్భాల్లో అసెంబ్లీ చేరక ముందే దాని భవిష్వత్తుని నిర్ణయించింది. కాంగ్రెస్ టిక్కెట్టుపై అసెంబ్లీకి ఎన్నికైన ప్రతి సభ్యుడు, అతడు పార్టీ సభ్యుడైనా కాకపోయినా దానికి సన్నిహితుడైనా సమావేశాలకు హజరు కాగలడు.”
రాజ్యాంగం యొక్క తాత్వికతను మౌలిక అంశాలను వ్యక్తం చేసిన లక్ష్యాల తీర్మానాన్ని రూపొందించిన జవహర్లాల్ నెహ్రూకి రాజ్యాంగ నిర్మాణక్రమంలోని ప్రతి అంశంతోను జోక్యం వుంది. సర్దార్ పటేల్ మాజీ సంస్తానాల ప్రతినిధులను రాజ్యాంగ పరిషత్లోనికి రప్పించడంలోను మతపర మైనారిటీలకు సీట్ల రిజర్వేషన్ ప్రతిపాదనని దుర్చల పరచి ప్రత్యేక నియోజక వర్గాలను రద్దు చేయడంలోను నిర్ణయాత్మక పాత్ర నిర్వహించారు. అన్నిటిని మించి పూర్తిగా నిష్పాక్షిక వైఖరితో అత్యంత ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుంటూ, తన సంఖ్యా బలాన్ని బలవంతంగా రుద్దకుండా ఏకాభిప్రాయాన్ని సాధిస్తూ కాంగ్రెస్ తన యొక్క జాతియొక్క పరపతిని పెంచింది. భారత దేశంలో భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్రకారుడు గ్రాన్విల్ ఆస్టిన్ మాటల్లో :
'ఒక పార్టీ ప్రధానంగా గల దేశంలో రాజ్యాంగ పరిషత్ ఒక పార్టీ సంస్థ. పరిషత్తే కాంగ్రెస్: కాంగ్రెసే పరిషత్, త్రిభుజాన్ని పరిపూర్తి చేసిన మూడవ భుజము ప్రభుత్వం. అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయస్తాయిలో ఎన్నికయిన ప్రభుత్వ యంత్రాంగం కాంగ్రెసే ప్రభుత్వం గనుక యితర దేశాలలోని ఏకశిలా సదృశ రాజకీయ వ్యవస్థలలాగానే భారతదేశంలో కాంగ్రెస్ కూడా కఠినమైన సంకుచితమైన దృక్పధం కలిగి వుంటుందని, అసమ్మతిని అణచి వేస్తుందని, నిర్ణయాలు చేయటాన్ని కొద్ది మందికి పరిమితం చేస్తుందని చాలా మంది ఊహించి వుంటారు. కాని భారతదేశంలోని పరిస్తితి పూర్తిగా భిన్నంగా వుంది. రాజ్యాంగ పరిషత్తులోనూ వెలుపల గల కాంగ్రెస్ సభ్యుల సామాజిక ఆర్థిక రాజకీయ ఆలోచనలలో అభివృద్ధి నిరోధక భావాల నుండి విప్లవ భావాల వరకు ఎంతో వైవిధ్యం వుంది. వారు ఆ భావాలను వ్యక్తీకరించేందుకు ఏమాత్రం సందేహించలేదు. కాంగ్రెస్‌లోను, కేంద్ర ప్రభుత్వంలోను అదేపాత్ర నిర్వహించిన రాజ్యాంగ పరిషత్తు నాయకులు జాతీయ నాయకులు: దాదాపు పరిమితులు లేని అధికారాలు గలవారు. అయినప్పటికి పరిషత్తులో నిర్ణయాలు చేయటం ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. భారత రాజ్యాంగం కొద్దిమంది అవసరాలనుగాక అత్యధికుల ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. భారత రాజ్యాంగం- ముఖ్యమైన నిబంధనలు
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రభుత్వానికి ఒక చట్రాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వున్నాయి. మొదటిది 692 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజ్యం అక్రమ జోక్యాలకు వ్యతిరేకంగా హామీ ఇస్తుంది. రెండవది ఈ హక్కులను సార్ధకం చేసేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టమని రాజ్యానికి ఆదేశాలను నిర్దేశిస్తుంది. భారతదేశంలో పార్లమెంటరీ విధానం అమలు జరపాలని నిర్ణయం తీవ్రమైన చర్చ జరిపి తీసుకొనబడింది. ప్రత్యామ్నాయం - పంచాయితీ ప్రాతిపదిక గల పరోక్ష ఎన్నికలు మరియు వికేంద్రీకరణ ప్రభుత్వానికి విస్పృతమైన మద్దతు లభించలేదు. కొందరు గాంధేయుల ప్రత్యేకించి శ్రీమన్నారయణచే బలంగా ప్రతిపాదించబడిన ఈ (ప్రత్యామ్నాయం నిర్ణయాత్మకంగా త్రోసిపుచ్చబడింది. మేధాపరంగా సోషలిజం పట్ల నిబద్ధత గల పలువురు సభ్యులు కూడా పార్లమెంటరీ ప్రభుత్వం పట్ల దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అత్యధికులు సోషలిజాన్ని రాజ్యాంగంలో చేర్చనవసరం లేదని, భవిష్యత్తులో ప్రజలు కోరిన మేరకు సోషలిస్టు సమాజమవటాన్ని అనుమతించే విధంగా సోషలిజం మొగ్గు గల ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపొందింపబడాలని ఆకాంక్షించారు. వయోజన పటు హక్కు కాంగ్రెస్ 1920 లనుండి వయోజన ఓటు హక్కుడిమాండు చేసింది. కాంగ్రెస్‌కి తన కలలు సాఫల్యం చేసుకొనే సమయం వచ్చింది. కొందరు వయోజన ఓటింగు హక్కుని గ్రామస్థాయి పంచాయితీలకు పరిమితం చేయాలని పైస్థాయి పాలనా సంస్థలకు పరోక్ష ఎన్నికలు జరపాలని అభిప్రాయ పడ్డారు. కాని అత్యధికులు వయోజన ఓటింగుతో ప్రత్యక్ష ఎన్నికలకు అనుకూలించారు. సనాతన సాంప్రదాయాలు, అగ్ర కుల ఆధిపత్యం, పురుషాధిక్యత, కులీన ధోరణులు, అత్యధికంగా నిరక్షరాస్యులుగల దేశంలో ఇది చిన్న విజయం కాదు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర ఫోషించినవాడు అయిన అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు ఇలా చెప్పారు.: సామాన్య మానవునిపై ప్రజాస్వామ్య పాలన విజయంపై ఎనలేని విశ్వాసంతో రాజ్యాంగ పరిషత్ వయోజన ఓటింగు పద్ధతిని ఆమోదించింది. వయోజన ఓటింగుకు ఒకే ఒక ప్రత్యామ్నాయం. గ్రామీణ సమాజం లేక స్థానిక సంస్థల ప్రాతిపదికన పరోక్ష ఎన్నిక. అది ఆచరణీయం కాదు ఆస్టిన్ వయోజన ఓటింగు పద్ధతి ఒకే స్వరం దాని ప్రతిధ్వనులు నిద్రలో వున్న భారతదేశాన్ని మేల్కొలుపుతాయి - కదిలిస్తాయి" అన్నాదు. నిశితమైన పరిశీలనతో కె.యం. ఫణిక్కర్ ఇలా వ్యాఖ్యానించాడు. 'వయోజన ఓటింగు రాజకీయ ప్రాధాన్యత కంటె స్వతంత్రం తర్వాత భారతదేశం 68
సామాజిక అంతస్యూచనలు కలిగి వుంది. గత్రంలో వారి బలం వారికి తెలియని సంభవించిన రాజకీయ మార్పుల స్పర్శసోకని చ్రాల్రా సామాజిక గ్రూపులు ఒక్కసారిగా అధికారాన్ని వినియోగించుకోగల స్థితిని గుర్తించారు సామాజిక చట్రంలో దిగువ స్థాయిలో వున్న గ్రూపులు వారి అవసరాలను సాధించుకొనేందుకు వివిధ రాజకీయ పార్టీలతో ప్రయోగాలు చేయటం నేర్చుకున్నారు. వయోజన ఓటింగు పద్దతి. సామాజికంగా అత్యంత పైస్తాయికి చెందిన అభ్యర్థులు సాధారణ ఓటరు అనుగ్రహం కొరకు అర్రులు చాచక తప్పుని పరిస్థితి కల్పిస్తుంది.
(బ్రిటిషు పాలన అంతమయ్యేటప్పటికి ఆస్తి, విద్య ఇతర అర్హతలతో ఓటు హక్కు దేశజనాభాలోని దాదాపు 15 శాతానికి పరిమితం చేయబడిందనే వాస్తవాన్ని గుర్తుకు తెచ్చుకొంటే రాజ్యాంగం ఎంత పెద్ద ముందుడుగు వేసిందో స్పష్టమవుతుంది. ప్రవేశిక
రాజ్యాంగం యొక్క మౌలిక తాత్వికత, దాన్ని కదిలించే శక్తి రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడింది. నెహ్రూచే రూపొందింపబడి 1946 డిసెంబరు 18న మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ్రవేశపెట్టబడి 1947 జనవరి 22న ఆమోదించబడిన లక్ష్యాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశిక రూపొందించబడింది.
భారతదేశ ప్రజలందరికి సామాజిక, ఆర్జిక రాజకీయ న్యాయం చేకూర్చటానికి ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆలాధనలలో స్వతంత్రం కల్పించటానికి అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వం సాధించటానికి, వారందరిలో వ్యక్తిగౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించటానికి రాజ్యాంగ పరిషత్ దృఢ సంకల్పంతో వుందని రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేసింది. స్వతంత్రం సమానత్వం, సౌధ్రాతృత్వాలతో పోల్చితే న్యాయానికి ప్రాధాన్యత, రాజకీయ న్యాయం కంటె సామాజిక ఆర్థిక న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని స్పష్టంగా ప్రస్తావించబడింది. సొమాజిక ఆర్థిక న్యాయం భారత రాజ్యాంగం యొక్క అత్యంత ప్రాథమిక ప్రమాణంగా పరిగణించబడిందని దానిలోని పదాల వరుస సూచిస్తుంది. ప్రాథమిక హక్కులు - ఆదేశ సూత్రాలు
సామాజిక విప్లవం పట్ల నిబద్ధతసారం రాజ్యాంగం 1. [/ భాగాలలో రాజ్య విధానం యొక్క ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలలో వుంది. ఇవి రాజ్యాంగం యొక్క అంతరాత్మ.
64 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
(ప్రాథమిక హక్కులు న్యాయ ప్రకియా సాధ్యమైనవి. ఆదేశిక సూత్రాలు తక్కువ ప్రాధాన్యతగలవి కాకపోయినప్పటికి న్యాయ ప్రక్రియతో సాధించుకొనగలగినవి కావు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో కూడా రెండు రకాల హక్కులు ఉన్నాయి. సాంప్రదాయ పౌర రాజకీయ హక్షులు, నూతన ఆర్ధిక సామాజిక హక్కులు. భారత రాజ్యాంగంలో మొదటి తరహావి ప్రాథమిక హక్కుల క్రింద రెండవ తరహావి ఆదేశ సూత్రాల క్రింద పొందుపరచబడ్డాయి. ప్రాథమిక హక్కుల క్రింద వున్న రాజకీయ పౌర హక్కులకు రాజ్యం వామీ ఇవ్వగలుగుతుంది. కొంతకాలం తరువాత ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెంది సామాజిక మార్చు వచ్చినప్పుడు రాజ్యం ఆర్థిక సామాజిక న్యాయంచే కూర్చగలుగుతుంది. అందువలన ఆదేశిక సూత్రాలు న్యాయ (ప్రక్రియా సాధ్యమైనవిగా చేయబడలేదు. అంటే ఆదేశిక సూత్రాలు తిరస్మరించబడినప్పుడు ఒక వ్యక్తి న్యాయస్థానానికి వెళ్లి సాధించుకోవడం సాధ్యపడదు. ఆదేశిక సూత్రాలలోని హక్కులు చట్టాలు చేయబడిన తరువాతనే న్యాయస్థానాల పరిధిలోకి హక్షులు రాతపూర్వకంగా పొందాలనే నిర్ణయం, హక్కుల జాబితా, రాజ్యాంగంలో హక్కుల ప్రకటన లాంటి బ్రిటిషు రాజ్యాంగ సాంప్రదాయానికి ఆచరణకు భిన్నమైనది. హక్కుల జాబితా కొరకు భారతీయులు చేసిన డిమాంద్ని బ్రిటిషువారు తిరస్మరించారు. మరొక వైపు భారతీయులు వలసవాద పాలన అనుభవం కారణంగా ప్రభుత్వం పట్ల అనుమానం పెంచుకొన్నారు. హక్కులు వ్రాతపూర్వకంగా వుండడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి ప్రాధాన్యత అంతర్జాతీయ ధోరణులకనుగుణంగా వుంది. జర్మనీ, సోవియట్ యూనియన్ ఇతర చోట్ల మానవహక్కుల అణచివేత తరువాత అట్లాంటిక్ ఛార్జర్, యునైటెడ్ నేషన్స్ ఛార్జర్ రూపొందింపబడ్డాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ స్థాపించబడింది. 1895లో తయారు చేయబడిన భారత రాజ్యాంగ బిల్లులో ప్రాథమిక హక్కుల భావన పిండ రూపంలో వుంది. 1928 నాటి మోతిలాల్ నెహ్రూ రిపోర్టులో ప్రముఖంగా ప్రస్తావించబడింది. కాబట్టి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని చేర్చటం అనివార్యమైంది. అంతేగాక అది 'అభివృద్ది చెందిన ప్రజాస్వామ్య ఆలోచనకు' ప్రాతినిధ్యం వహించటమే గాక మైనారిటీల భయాందోళనలను తొలగించటానికి కూడా సరైన పద్ధతి అవుతుంది. భారతదేశంలో మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల్ని అణచివేస్తారని, మైనారిటీలకు రక్షణ కల్పించేందుకే తాము భారత దేశంలో వున్నామనే బ్రిటిష్ వారి వాదనతో కలతచెందిన కాంగ్రెసు, బ్రిటిషు వారి వాదన ఎంత తప్పుడు వాదనో నిరూపించాలని కృతనిశ్చయంతో వుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 65
పటేల్ చెప్పినట్లుగా 'అది బూటకపు అభియోగమని మనం నిరూపించవలసివుంది. మైనారిటీలకు రక్షణ కల్పించటంలో భారతదేశంలో మనకంటె ఎక్కువ ఆసక్తి గలవారెవరూలేరు. వారిలో ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచటం మన లక్ష్యం. రాజ్యాంగ పరిషత్ ఏ దశలో కూడా ప్రాథమిక హక్కుల అవసరాన్ని గురించి సందేహించలేదు. రాజకీయ హక్కులలాంటి వెంటనే అనుమతించవలసిన హక్కులకు, ప్రస్తుత అవసరాలుగా లక్ష్యాలుగా వుండి కాలక్రమంలో అనుమతించవలసిన సామాజిక ఆర్థిక హక్కులకు మధ్య ఎలాంటి విచక్షణ చూపాలి - అనేది సమస్య. ఐరిష్ రాజ్యాంగం నుండి ఒక భావనను అరువు తెచ్చుకొని ఈ సమస్యకి పరిష్కారం కనుగొనడం జరిగింది- ఫలితంగా సామాజిక ఆర్థిక హక్కులు రాజ్య విధానం యొక్క ఆదేశిక సూత్రాలుగా వర్గీకరించబడ్దాయి. ఇవి న్యాయ ప్రక్రియ ద్వారా సాధించడానికి వీలు పడనివి. న్యాయ స్థానాల ద్వారా పొందటానికి వీలుపదేవి, వీలుపడనివని హక్కులలో రెండు రకాల వర్గీకరణకు గల అవకాశాన్ని 1945 సప్రూ కమిటి సూచించింది. ఈ ఆలోచన బహుశా సప్రూ రిపోర్టు నుండి స్వీకరించబడి వుంటుంది. ప్రాథమిక హక్కులు ఏడు భాగాలుగా విభజించబడ్డాయి. సమానతా హక్కు స్వతంత్ర హక్కు దోపిడీ వ్యతిరేక హక్కు మతపరమైన స్వేచ్చకు హక్కు సాంస్కృతిక విద్యా హక్కులు, ఆస్తిహక్కు రాజ్యాంగ ప్రక్రియలకు హక్కు - రాజ్యాంగంలోని 12 నుండి 85 వరకు గల ఆర్టికల్స్‌లో పొందుపరచబడిన ఈ హక్కులు, వ్యక్తులకు, మైనారిటీ (గ్రూపులకు నిర్దేకుకమైన రాజ్యచర్య నుండి రక్షణ కల్పిస్తాయి. కాని వీటిలోని మూడు ఆర్టికల్స్ యితర (పైవేట్ వ్యక్తుల చర్యకు వ్యతిరేకంగా వ్యక్తికి రక్షణ కల్పిస్తాయి. నిబంధన 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. నిబంధన 15 (2) ననుసరించి ఏ పౌరుడు కూడా అతడి మతం, జాత్తి, కులం, సెక్స్, జన్మస్థానం కారణంగా షాపులు, రెస్టారెంట్లు, బావులు, రోడ్లు ఇతర బహిరంగ ప్రదేశం ఉపయోగించుకొనేందుకు అనర్హుడు కారాదు. నిబంధన 28 వెట్టిచాకిరిని రద్దు చేస్తుంది. వలస రాజ్యం స్వదేశీ సంస్థానాలు వెట్టి చాకిరి చేయించినప్పటికి అది ముఖ్యంగా భూస్వామ్య, అర్ధ భూస్వామ్యపు దోపిడి రూపంగా వున్నది. కొందరి హక్కులలోకి మరికొందరు అక్రమంగా ప్రవేశించకుండా రాజ్యం రక్షణ కల్పించాలి. ప్రాథమిక హక్కు నిరాకరించబడిన పౌరునికి హైకోర్టుని గాని సుప్రీంకోర్టుని గాని ఆశ్రయించే హక్కు వుంటుంది. ఈ హక్కు ఒక్క అత్యవసర పరిస్థితిలో తప్పు ఇతర సందర్భాలలో రద్దు చేయబడదు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయా లేదా- నిర్ణయించే హక్కు కోర్టుకు వుంది. వీటితో పాటు నిర్చంధితుని హాజరుపెట్టమని ఆదేశించే హక్కు ప్రధాన న్యాయస్థానం తన క్రింది న్యాయస్థానానికి ఆజ్ఞాపత్రం జారీ చేసే హక్కు 66 బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఒక దావా విచారణ జరిపే అధికారం దానికి లేదని ఉన్నత న్యాయస్థానం నిషేధిస్తూ ఉత్తరువు జారీ చేసే హక్కు అధికారానికి నిదర్శనం చూపమని ఆదేశించే హక్కు క్రింది కోర్టులో విచారణ జరీపిన వ్యాజ్యం రికార్డుల్ని పంపవలసిందిగా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసేహక్కు - లాంటి హక్కులు కోర్టులకు వుంటాయి. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు ఆదేశిక సూత్రాలు కోర్టుల పరిధినుండి మినహాయించబడ్డాయి. అవి వాస్తవంగా భవిష్యత్తు చట్ట సభలకు, కార్యనిర్వాహకులకు జారీ చేయబడిన మార్గదర్శకాలు లేక సూచనలు. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలను కలిపి అధ్యయనం చేయాలని స్పష్టంగా చెప్పినప్పటికి ఆరెండింటి మధ్య ఘర్షణని ఊహించలేదు. వాటిని వాఖ్యానించటంలో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. 1971 వరకు న్యాయస్థానాలు ఆదేశిక సూత్రాల కంటె ప్రాథమిక హక్కులకు ఎక్కువ 'ప్రాధాన్యతనిచ్చాయి. కాని 1971 లో 1976 లో ఇందిరాగాంధీ తీసుకొనివచ్చిన 25వ 42వ సవరణలు ఆదేశిక సూత్రాలకు ఆధిక్యతయిచ్చాయి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు - రెండు సమానమైన ప్రాధాన్యత గలవేనని, ఒకదాని కారకు మరొక దానిని బలిపెట్టరాదని 1980 లో మినర్వామిల్స్ లిమిటెడ్- యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రఖ్యాత తీర్పు స్పష్టం చేసింది. ఆదేశిక సూత్రాల సారాంశం ఆర్టికల్38లో చెప్పినట్లు “రాజ్యం సమర్థవంతమైన సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థని సాధించి పరిరక్షించడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచేందుకు కృషిచేయాలి” పొరులందరికి తగినన్ని బతుకు దెరువు సాధానాలు సమకూర్చటానికి భౌతిక వనరుల సమాన పంపిణీకి, సంపద ఉత్పత్తి స్థానాల కేంద్రీకరణ నివారణకు రాజ్యం పూచీ పడాలి. స్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఉండాలి. కార్మికుల, బిడ్డల, గర్భిణి ప్రీల ఆరోగ్యం పరిరక్షింపబడాలి. కార్మికులు బతకడానికి అనువైన వేతనాలుందాలి. న్యాయవంతమైన మానవత్వంతో కూడిన పని పరిస్థితులుండాలి. పౌరులందరికి పని హక్కు విద్యాహక్కు వుండాలి. నిరుద్యోగులకు, వృద్ధులకు జబ్బున పడ్డవారికి (ప్రభుత్వతోద్చాటు వుండాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన పది సంవత్సరాలలోపల 14 సం॥ల వయస్సు వరకు గల బిడ్డలందరికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేయాలని అదేశిక సూత్రాలు సూచించాయి. ఇంకా ఉమ్మడి సివిలు కోడ్ కూడా లక్ష్యంగా వుంది. రాజ్యం గ్రామ పంచాయితీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజల జీవన ప్రమాణాలకు పౌష్టికాహారాన్ని మెరుగుపరచాలని, షెడ్యుల్టు కులాల షెడ్యూల్డు తెగల ఇతర వెనుక బడిన సెక్షన్లకు ప్రయోజనాలు చేకూర్చాలని పేర్కొన్నది. ఇంకా రాజ్యం అంతర్జాతీయ శాంతి, రక్షణ పెంపొందించాలని దేశాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు స్వతంత్రం తర్వాత భారతదేశం 67
నెలకొల్పాలని అంతర్జాతీయ చట్టం ఒప్పందాల పట్ల గౌరవభావం పెంచాలని అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించటాన్ని ప్రోత్సాహించాలని పేర్కొన్నది.
వ్యక్తి స్వేచ్చా స్వాతంత్రాలను పదిలంగా వుంచే సమసమాజ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులను సృష్టించడం రాజ్యాంగ లక్ష్యమని ప్రవేశిక ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను కలిపి చేసిన అధ్యయనం స్పష్టం చేస్తుంది. ఒక సూత్రాన్ని లేక విలువను పరిరక్షించేందుకు మరొక దానిని త్యజించాలని రాజ్యాంగం ఊహించలేదు. వ్యక్తి స్వేచ్చ, సామాజిక మార్పుల మధ్య సంబంధం క్రియాశీలమైనదిగా, చలనశీలమైనదిగా గుర్తించటం జరిగింది.
నెహ్రూ చెప్పినట్లు 'ఆదేశిక సూత్రాలు ఒకానొక లక్ష్యం దిశగా క్రియాశీలకమైన చలనానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రాథమిక హక్కులు, స్థిరత్వానికి వున్న హక్కుల్ని పరిరక్షించటానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. క్రియాశీలమైన చలన క్రమంలో ప్రస్తుతం వున్న కొన్ని సంబంధాలు మార్చుకి గురవుతాయి. ప్రభావితం చేయబడతాయి. వాస్తవంగా అవి స్థిరపడిన సంబంధాలను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించబడ్డాయి. ఇక ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే అవి స్థిరపడిన సంబంధాలను పరిరక్షించటానికి ఉద్దేశించబడ్డాయి. రెండు వైఖరుల మధ్య కొంత ఘర్షణ ఉంది.
వాస్తవంగా ఘర్షణలు తలెత్తాయి. 1950వ దశాబ్దంలో కోర్టులలో ఆస్తి హక్కు కారణంగా జమిందారీ జాగిర్భారీ రద్దు చట్టంలాంటివి అడ్డుకొనబడినపుడు రాజ్యాంగానికి చాలా సవరణలు చేయవలసి వచ్చింది. రాజ్యాంగం రూపుదిద్దుకొనే క్రమంలోను అది అమలులోకి వచ్చిన తరువాత కూడా ఆస్తి హక్కు నిబంధనలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. వ్యవసాయ సంస్కరణలను సవాలు చేస్తూ కోర్టు కేసులు పెరిగాయి. రాజ్యాంగానికి మొదటి సవరణ అవసరమయింది. 1951 లో తాత్కాలిక పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన ఈ సవరణలో జమిందారీ విధానం రద్దుకు రాజ్యాంగ చెల్లుబాటును సమకూరుస్తూ కొత్తగా త1ఎ, 31 బి ఆర్దికల్స్ని రివ షెడ్యూలు ప్రవేశపెట్టబడ్డాయి.
ప్రాథమిక హక్కులకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ రాజ్యంగ రూపకర్తలు ఊహించిన విధంగా గాక వేరు విధంగా వ్యాఖ్యనించదగినవిగా వున్నాయని ఇతర సందర్భాలు కూడా స్పష్టం చేశాయి. అందువలన 1951లోనే తాత్మాలిక పార్లమెంటులో మొదటి సవరణ ఆమోదించబడింది. ఇది సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్చ, ఆస్తికి చెందిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ 15, 19, 31లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. జమీందారీ రద్దు చట్టం ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు అనే కారణంతోను, విద్యాసంస్థలలో ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు సమానత్వం హక్షుని నిరాకరిస్తున్నదనే 68 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కారణంతోను వాక్ - పత్రిక, సంఘం స్వతంగ్రంపై విధించబడిన హేతుబద్ధమైన ఆంక్షలు భావ ప్రకటనా స్వేచ్చని అతిక్రమిస్తున్నాయనే కారణంతోను సవాలు చేయబడకూడదని ఈ సవరణలు స్పష్టం చేశాయి. తరువాత సంవత్సరాలలో మరికొన్ని సవరణలు చేయ వలసి వచ్చింది. సేకరించిన ఆస్తికి చెల్లించే నష్ట పరిహారం మొత్తం నిర్ణయించటం కోర్టు పరిధిలో వుండదని 1955లో ఆర్టికల్స్ 314, 318 లలో సవరణలు చేయబడ్డాయి. ఆ తరువాత సంవత్సరాలలో కూడా వ్యక్తి హక్షులు, సామాజిక (శ్రేయస్సు మధ్య, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధాన్ని చాలా ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే రాజ్యాంగ నవరణలు నిర్వహించటం పునర్విచించటం కొనసాగింది. ఈ మారుతున్న సంబంధం బహుశా స్వాగతించదగినది,
రెండు రకాల హక్కుల మధ్య ఉద్రిక్తత సమాజ శ్రేయస్సుని ప్రోత్సహిస్తూ వ్యక్తి స్వతంత్రాన్ని ఎలా పరిరక్షించటం అనే సందిగ్భావస్థకు ప్రాతినిథ్యం వహిస్తుందని చెప్పిన ఆస్టిన్ మాటలతో ఈ అంశాన్ని ముగించటం సముచితంగా వుంటుంది. సెక్యులర్ రాజ్యం
భారతదేశం సర్వసత్తాక, సోషలిస్టు సెక్యులర్ (ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని
రాజ్యాంగం ప్రకటించింది. సెక్యులర్ మరియు సోషలిస్టు పదాలు 1976లో42వ సవరణ ద్వారా చేర్చబడినవైనప్పటికి రాజ్యాంగాన్ని రూపొందించిన స్ఫూర్తి సెక్యులర్ చైతన్యమే. రాజ్యాంగం యొక్క సెక్యులర్ స్వభావం రాజ్యాంగం మౌలిక లక్షణాలలో ఒకటని 1973లో సుప్రీంకోర్టు ప్రకటించింది. మతాన్ని పాటించటాన్ని ప్రచారం చేయటాన్ని మత కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్చని, ఒక ప్రత్యేక మతాన్ని ప్రోత్సహించేందుకు విరాళాలు యిచ్చే స్వేచ్చని మతబోధలకు హాజరయ్యే స్వేచ్చని, కొన్ని విద్యాసంస్థలలో మతపరమైన ఆరాధనా స్వేచ్చని, మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణతో సహా వారి సాంస్కృతిక విద్యాపరమైన హక్కులకు ప్రాథమిక హక్కుల పేరుతో ఆటంకాలు కల్పించకూడదు.
సెక్యులర్ పదం యొక్క అర్ధంపై చర్చ చాలా భావావేశపూరితమైనది. సెక్యులర్ పదం మనం పాశ్చాత్యుల నుండి అరువు తెచ్చుకొన్నాం. ఆ పదానికి పాశ్చాత్య సందర్భం వేరే అర్ధం వుంది. పాశ్చాత్య దేశాలలోని చర్చికి రాజ్యానికి మధ్య జరిగిన పోరాట ఫలితంగా ఆ రెండూ విడిపోయాయి. మత సాంప్రదాయాలను నిర్ణయించేందుకు చర్చి అనుమతించబడింది. మతం కాక పౌరుడికి సంబంధించిన యితర వ్యవహారాలను (క్రమబద్ధం చేయటం రాజ్యం యొక్క కర్తవ్యమయింది. భారతదేశంలో మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని, ఆవిర్భవిస్తున్న జాతిని మత ప్రాతిపదికన విభజించాలని స్వతంత్రం తర్వాత భారతదేశం 69
కోరిన మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా జాతీయవాదశక్తుల పోరాటంలో భాగంగా సెక్యులరిజం భావన రూపు దిద్దుకున్నది. నెహ్రూ మాటల్లో “మనం మన రాజ్యాంగాన్ని సెక్యులర్ రాజ్యం అని పిలుస్తున్నాం. సెక్యులర్పదం
అంత సరియైనది కాకపోవచ్చు. కాని అంతకంటే మంచి మాట దొరకనందున ఆ పదాన్ని ఉపయోగించాం. దాన్ని అర్ధం ఏమిటి? అది మతాన్ని నిరుత్సాహ పరిచే సమాజాన్ని ఉద్దేశించిన మాట కాదు. అది ఏ మఠాన్ని అవలంబించకుండా వుండే స్వేచ్చతో సవో మతం అంతకరణల స్వేచ్చ, ఒక మతం మరొక మతంలో జోక్యం చేసుకోనంత వరకు అన్ని మతాలు సమానమైన స్వేచ్చ కలగివుండటం'.
70 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
త్ రాజ్యాంగ నిర్మాణం మౌలిక లక్షణాలు, సంస్థలు
మౌలిక లక్షణాలు
రాజ్యాంగం మార్చటానికి వీలుపడని మౌలిక, నిర్మాణం కలిగి ఉందని భావించబడుతుంది. కేశవానంద భారతి కేసులో 1978లో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన మెజారిటీ తీర్పు ఈ అంశాన్ని స్పష్టం చేసింది.
డి.డి.బసు మాటల్లో ఆర్టికల్ 3668 ననుసరించి రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని ఉపయోగించుకొనడంలో రాజ్యంగంలోని కొన్ని మౌలిక లక్షణాలు మార్చబడకూడదు. కాబట్టి ఆర్టికల్ 368లోని సవరణ అనే పదానికి రాజ్యాంగ చట్రాన్ని మార్చడంగాక ఇతర మార్పులు అని అర్ధం గనుక రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని లేక చట్రాన్ని మార్చగోరితే ఆ రాజ్యాంగ సవరణ న్యాయ విరుద్ధమని రద్దుచేసే అధికారం కోర్టుకి వుంటుంది. జస్టిస్ సిక్రి అభిప్రాయాన్ని అనుసరించి రాజ్యాంగం యొక్క సర్వాధికారం, రిపబ్లికన్ మరియు ప్రజాస్వామ్య ప్రభుత్వరూపం, రాజ్యాంగం యొక్క సెక్యులర్ స్వభావం, శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల మధ్య అధికారాల విభజన - రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు,
రాజ్యాంగ మౌలిక లక్షణాలలోని మరికొన్ని, స్వేచద్భాయుతమైన ఎన్నికల సూత్రాలు, చట్టబద్ధపాలన, రాజ్యాంగ ప్రవేశికలో నిర్దేశింపబడిన లక్ష్యాలు, న్యాయ సమీక్ష వ్యక్తి గౌరవం స్వేచ్చ, దేశ సమక్యత, సమగ్రత, సమానత్వ సూత్రం, సామాజిక ఆర్థిక న్యాయభావన, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సౌలభ్యం. స్వతంత్రం తర్వాత భారతదేశం ణా
ఇందిరాగాంధీ హయాంలో అత్యవసర పరిస్టితి కాలంలో చేయఐఒది = 42వ రాజ్యాంగ సవరణ “పార్లమెంట్ సవరణ చేసే అధికారాలపై పరిమితులుండబోవని, ఏ రాజ్యాంగ సవరణ కూడా ఏ ప్రాతిపదికపైనా కోర్టులో సవాలు చేయబడగూడదని। ప్రకటించింది, కాని 'న్యాయ సమీక్ష రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణమని, రాజ్యాంగ సవరణ కూడా దానిని రద్దు చేయలేదని *మినర్వామిల్స్- యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రాన్ని పునరుద్దాటించింది. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ఏ రాజ్యాంగ సవరణయైనప్పటికి రాజ్యాంగ మౌలిక అక్షణాలలో దేనినైనా మార్చితే గాని లేక ప్రభావితం చేస్తేగాని కోర్టు ఆ రాజ్యంగ సవరణని చట్ట విరుమైనదిగా ప్రకటించగలదు. మౌలిక లక్షణాల సిద్దాంతం ప్రాతిపదికగా మన రాజ్యాంగంలో నిర్దిష్టమైన పరిమితి ప్రవేశపెట్టబడింది.
మౌలిక లక్షణాల జాబితాలోని అంశాలపై న్యాయమూర్తులలో కొంత అభిప్రాయ భేదమున్నప్పటికి మౌలిక లక్షణాలు లేక మౌలిక నిర్మాణ సిద్దాంతంపై ఏకాభిప్రాయం వుంది. పార్లమెంటు మెజారిటీల ద్వారా రాజ్యాంగానికి నష్టం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా అదుపు చేసేందుకు దానిని ఉపయోగించవచ్చు. సమాఖ్య లేక ఏక కేంద్రక
భారత రాజ్యాంగం ఏక కేంద్రకమాలేక బహు కేంద్రకమా నిర్ణయించటానికి రాజ్యాంగం స్పష్టమైన నిర్వచనంలో యిమడదు. 'సమాఖ్య సద్భశ' 'చట్టబద్ద వికేంద్రీకరణ' లాంటి పదాలు ఆసక్తికరంగా వుంటాయి గాని విషయాలను అంతగా వివరించవు. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కూడా సమాఖ్యతత్వానికి సంబంధించిన ఎలాంటి సిద్దాంతాన్ని గాని పిడివాదాన్ని గాని అనుసరించ నిరాకరించారు. భారతదేశానికి చరిత్రలో ఇతర సమాఖ్యలు ఎదుర్మోనని, భారతదేశానికి మాత్రమే వర్తించే తనవైన సమస్యలున్నాయని వారు విశ్వసించారు. అంతేగాక 'సమాఖ్య తత్వం” నిర్ధిష్టమైన భావన కాదు గనుక దానికి కచ్చితమైన అర్ధం లేదు గనుక ఈ సమస్యలు సిద్ధాంతాన్ని ఆశ్రయించడం ద్వారా పరిష్కరించబదవు. కాబట్టి, రాజ్యాంగ పరిషత్తు సభ్యులు యునైటెడ్ స్టేట్స్, కెనదా, స్విట్టర్లాండ్, ఆస్టేలియా లాంటి సమాఖ్యలను పరిశీలించి వాటిలో ఏ అంశాలు మన దేశానికి వర్తిస్తాయో ఎంపిక చేసుకొనే పద్దతి అవలంబించారు. ఈ క్రమం భారతదేశం యొక్క ప్రత్యేక అవసరాలకు సరిపడే నూతన సమాఖ్యని సృష్టించింది. 72 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజ్యాంగ పరిషత్ బహుశా “సహకార సమాఖ్యతత్వాన్ని (00-00ల౫|౫/౬ 06011108) స్వీకరించిన మొదటి రాజ్యాంగ బద్ధమైన సంస్థ. అది సమాఖ్య తత్వాన్ని అతిక్రమించకుండా సమాఖ్య, ప్రాంతీయ (ప్రభుత్వాలు పరస్పరం ఆధారపడటాన్ని పెంచటంగా సూత్రీకరించబడింది.
అప్పటికి వున్న పరిస్థితుల కారణంగా రాజ్యాంగ పరిషత్ బలమైన కేంద్రంతో
ఫెడరల్ రాజ్యాంగం వుండాలనే నిర్ణయం తీసుకొన్నది. విభజనకు ముందు, ఆ తరువాత చెలరేగిన మతతత్వ దొమ్మీలను అదుపు చేసేందుకు ఆహార సంక్షోభాన్ని ఎదుర్శొనేందుకు, కాందిశీకుల సమస్యని పరిష్కరించేందుకు, జాతీయైక్యతని పరిరక్షించేందుకు, వలస పాలనాకాలంలో ఆటంక పరచబడిన సామాజిక ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు బలమైన కేంద్ర ప్రభుత్వం అవసరం. ,
కాని వభజన అంగీకరింపబడిన ఒక వాస్తవం కాకముందు రాజ్యాంగ పరిషత్ బలమైన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. నెహ్రూ నాయకత్వంలోని యూనియన్ పవర్స్ కమిటీ తన మొదటి రిపోర్టులో బలహీనమైన కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. కాని విభజన నిర్ణయం జరిగి 1947 జూన్ 8న ప్రకటించిన తరువాత రాజ్యాంగ పరిషత్ మంత్రి వర్ణ రాయబార సంఘం పధకం విధించిన పరిమితుల నుంచి స్వేచ్చ పొందినట్లు భావించింది. బలమైన కేంద్రం గల సమాఖ్య దిశగా ఆలోచనలు సాగించింది.
రాజ్యాంగ ముసాయిదాని ప్రవేశపెడుతూ డాక్టర్ వి.ఆర్. అంబేద్కర్ 'రాష్ర్రాల సమాఖ్య (66263600 0562669) అనే పదజాలానికి బదులుగా “రాష్ట్రాల యూనియన్ (0౧1౦౧ ౦ 562689) ఎందుకు ఎంపిక చేయబడిందో వివరించాడు.
“భారతదేశం సమాఖ్య కానున్నప్పటికి రాష్ట్రాలు ఒక ఫెడరేషన్లో చేరాలనే ఒప్పందంతో ఫెడరేషన్ ఏర్పడలేదు. ఫెడరేషన్ ఒప్పందం ఫలితం కాదు గనుక ఏ రాష్ట్రానికి దాని నుండి విడిపోయే హక్కువుండదు. ఫెడరేషన్ ఒక యూనియన్. ఎందుకంటే యూనియన్ విడగొట్టడానికి వీలుపడనిది. పాలనా సౌలభ్యం కొరకు దేశమూ ప్రజలూ వివిధ రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికి ఒకే వనరు నుండి లభించిన అధికారం చే పాలింపబడే ఒక దేశం ఒకే ప్రజలుగా వుంటారు.”
భారతదేశ సమాఖ్యకి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్లో ఒక పౌరునికి అమెరికా పౌరసత్వం వుంటుంది. అలాగే అతడు / ఆమె నివసించే స్వతంత్రం తర్వాత భారతదేశం 78
రాష్ట్ర పౌరసత్వం వుంటుంది. కాని భారతదేశంలో భారతీయ పౌరసత్వం మాత్రమే వుంటుంది.
రాజ్యాంగం యూనియన్, రాష్ట్ర చట్ట సభల అధికారాలను నిర్దేశించడం ద్వారా యూనియన్‌కి రాష్ట్రాల మధ్య విభేదాల్ని వీలైనంత తగ్గించ యత్నించింది. అది మూడు జాబితాల అంశాలు కలిగి వుంటుంది. యూనియన్ జాబితాలో పొందుపరచబడిన అంశాలు పార్లమెంటుచే చట్టాలు చేయబడతాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలు రాష్ట్ర చట్టసభలచే శాసనాలు చేయబడతాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలు రెండింటి పరిధిలోనికి వస్తాయి. కాని రాష్ట్ర కేంద్ర చట్ట సభల మధ్య వివాదం వచ్చినప్పుడు కేంద్ర చట్టసభది పై చేయి అవుతుంది.
కేంద్రానికి ఆర్థిక వనరులపై విస్తృతమైన అధికారం వుంటుంది. రాష్ర్టాలు తమ విధుల నిర్వవాణకు ఆర్భిక కేటాయింవుల కొరకు కేంటదంపై ఆధారపడడం-ఫెడరలిజంపై కొన్ని పరిమితులు విధిస్తుంది. రాజ్యాంగ బద్ధంగా కేంద్రం, రాష్ట్రాలు పని చేయడం వలన కొందరు విశ్లేషకులు అతిశయించి చెప్పే విధంగా ఫెడరలిజం బలహీనపడదు. సమాఖ్య విధానం సరిగా పని చేస్తుందనదానికి నిదర్శనం పూర్తిగా భిన్నమైన సైద్ధాంతిక, సంక్షిష్హతలు వున్న రాష్ట ప్రభుత్వాలు నహజీవనం చేయగలుగుతున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలో లెప్ట్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, తమిళనాడులో డి.ఎం.కె., ఏ.ఐ.ఏ.డి.యం.కె. ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం, గుజరాత్, కర్దాటకలలో జనతాదళ్ ప్రభుత్వాలు, యు.పి. మధ్య (ప్రదేశ్ రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బిజెపి ప్రభుత్వాలు, కేంద్రంలో కాంగ్రెస్ లేక జనతాదళ్ లేక యునైటెడ్ ఫ్రంటు లేక బిజెపి ప్రభుత్వాలు. కొత్త రాష్ట్రాల కొరకు ఆందోళనలు, ఎక్కువ ఆర్థిక అధికారాల కొరకు తరచుగా జయప్రదమైన డిమాండ్లు.
- సమాఖ్యతత్వం సజీవంగా వుందనడానికి సాక్ష్యాలు. ఇటీవల 1998 జూన్ 18న బెంగాలులోని లెస్ట ఫ్రంటు ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని అంచనా వేసేందుకు బి.జె.పి. నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిజ నిర్దారణ కమిటీని పంపించడాన్ని శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశమని ఉదహరిస్తూ ఆక్షేపించి చరిత్ర సృష్టించింది. మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ఒత్తిడికి స్పందనగా బి. జె.పి. తెచ్చిన రాజకీయ జత్తిడి ఎదుర్శొనేందుకు సి.పి, ఎం. నాయకత్వంలోని ప్రభుత్వం ఫెడరల్ సూత్రాన్ని ఆయుధంగా ఉపయోగించుకొన్నది. 74 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు మాటల్లో ఈ అంశాన్ని ముగించడం సమంజసంగా వుంటుంది. 'రాజ్యాంగం ఫెడరల్ విధానం పని చేసేందుకు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. కాని నిర్దిష్టమైన అసాధారణమైన పరిస్థితులలో దానిని ఏక కేంద్రక లేక ఫెడరల్ లాంటి వ్యవస్థలోనికి మార్చేందుకు కొన్ని వర్పాట్లు వున్నాయి. బహుశా పూర్తి సమాఖ్య రాజ్యాంగాలలో లోపించినది, భారత రాజ్యాంగంలో గల ఈ సరళత స్వతంత్రం సాధించిన తరువాతి 50 సంవత్సరాల నుండి పలు రకాల కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సర్దుకుపోవటాన్ని సాధ్యం చేసింది. పరిపాలనా సంస్థలు రాష్ట్రపతి రాజ్యాంగం కార్యనిర్వాహణాధికారాన్ని భారత రాష్ట్రపతికి ఇచ్చింది. కాని అంబేద్మర్ మాటల్లో 'రాష్ట్రపతి రాజ్యాంగ పరంగా రాజ్యాధినేత. ఇంగ్లీషు రాజ్యాంగం ప్రకారం రాజు పదవి లాంటిదే రాష్ట్రపతి పదవి. రాష్ట్రపతి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని దేశాన్ని పరిపాలించడు. పార్లమెంటుకు బాధ్యత వహించే మంత్రి మండలి నాయకుడు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తాడు. భారతదేశ పార్లమెంటరీ ప్రభుత్వ రూపానికి బ్రిటీషు విధానానికి దగ్గరి పోలికలున్నాయి. తేడా దేశాధినేతగా బ్రిటన్‌లోని వారసత్వపు రాజు వుంటాడు. ఇక్కడ ఎన్నుకొనబడిన రాష్ట్రపతి వుంటాడు. భారత రాజ్యాంగం రాష్ట్రపతికి నామమాత్రంగా అసాధారణ అధికారాలను యిస్తుంది. కాని వాటిని మంత్రివర్గం సలహామేరకు వినియోగించాలి. అలాగని రాష్ట్రపతి కేవలం నామమాత్రపు దేశాధినేత కాదు. క్రియాశీలకంగా వ్యవహరించటానికి పరిస్థితులు చొలా అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్రపతి యొక్కనామమాత్రమైన, నిజమైన అధికారాల మధ్య ఉద్వేగం మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కాలం నుండి ప్రకటితమయింది. హిందూ కోడ్ బిల్లుపై తనవైన ప్రత్యేక అభిప్రాయాలు గల రాజేంద్రప్రసాద్ 1951 సెప్టెంబరులో రాష్ట్రపతి పెద్ద పాత్ర నిర్వహించవలసి వుందని వాదించ యత్నించారు. నెహ్రూ రాజ్యాంగ నిపుణుడైన అల్లాడి కుప్పుస్వామి అయ్యంగార్, అటార్ని జనరల్ యం.సి. సెతల్వాద్‌లను సంప్రదించాడు. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ వాదనని అంగీకరిస్తే అది మొత్తం రాజ్యాంగ చట్రాన్ని తారుమారు చేస్తుందని, రాష్ట్రపతి నియంతృత్వ అధికారాలు స్వతంత్రం తర్వాత భారతదేశం భర్
చేపట్టడానికి దారితీస్తుందని ఇరువురు నిపుణులు విస్పష్టంగా చెప్పారు. ఇంగ్లాండులో మంత్రుల సలహా మేరకు వ్యవహరించే సాంప్రదాయాన్ని ఇక్కడ రాష్ట్రపతి పాటించారు.
ఒక పార్టీ పూర్తి మెజారిటీ కలిగివుంటే రాష్ట్రపతి విశేషాధికారాలను ఉపయోగించుకొనే అవకాశం చాలా తక్కువ. అస్థిర సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసేవిధంగా అస్పష్టమైన ఎన్నికల తీర్పు వస్తేగాని లేక పాలక పార్టీలో చీలికలు ఏర్పడితే గాని రాష్ట్రపతి (క్రీయాశీలకంగా వ్యవహరించటానికి అవకాశం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకు మొరార్టీదేశాయ్ విజ్ఞప్తిని నిరాకరించడంలోను, నిర్ణీత తేదీల లోపల పార్లమెంటులో మెజారిటీని నిరూపించుకోమని చరణ్‌సింగ్‌కి అవకాశం ఇవ్వడంలోను, నూతన ప్రధానిని అంగీకరించబోయే ముందు ఇతర పాద్దీల నాయకులను సంప్రదించడంలోనూ, చరణ్‌సింగ్ సలహా మేరకు లోక్‌సభని రద్దు చేసేందుకు రాష్ట్రపతి సంజీవరెడ్డి తన వివేచనని ఉపయోగించారు. అస్థిర పరిస్థితి రాష్ట్రపతి తన వివేచన వినియోగించుకొనే అవకాశం కల్పించింది.
ఇటీవల సంవత్సరాలలో ఇందిరాగాంధీ హత్యానంతరం 1984-85లో జరిగిన సాధారణ ఎన్నికలలో తప్ప ఏ ఎన్నికలలోను ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించనందున రాష్ట్రపతి నిర్వహించవలసిన పాత్ర యొక్క ప్రాధాన్యత పెరిగింది. 1989, 1991, 1996, 1998 ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి జోక్యానికి అవకాశాలు సృష్టించాయి. ఉదాహరణకు 1998లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి ఇతర పార్టీల కంటె ఎక్కువ సీట్లు గెలిచిన పెద్ద పార్టీగా అవతరించింది. లోక్‌సభ విశ్వాసం పొందగలిగిన విధంగా ఇతర పార్టీల మద్దతు వున్నందున ప్రభుత్వాన్ని ఏర్పరచే అవకాశం కల్పించమని కోరినపుడు రాష్ట్రపతి నారాయణన్, బిజెపి నాయకుడయిన వాజ్‌పేయిని మిత్ర పక్షాల మద్దతు తమకుందని రాతపూర్వకమైన నిరూపణ చూపమన్నారు. అప్పుడే కీలకమైన మద్దతు దారులలో ఒకరైన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. నాయకురాలు జయలలిత ఊగిసలాటలో పడి చివరిగా తన పార్టీ మద్దతు లేఖను బిజెపికి పంపదానికి ముందు చాలా ప్రచారం పొందిన రహస్య సమావేశాలలో బేరసారాలు సాగించడం, ఫలితంగా కొన్ని రోజుల పాటు కానున్న ప్రధానమంత్రి కొరకు దేశం ఉత్కంఠతతో ఎదురుచూడటం ఇటీవలి ఘటన. ఈ మొత్తం కథలో రాష్ట్రపతి పాత్ర సంక్లిష్టమైనది. రాష్ట్రపతి మద్ధతులేఖ కొరకు నిరవధికంగా నిరీక్షించేందుకు నిరాకరించి, తరువాత పెద్ద పార్టీని లేక గ్రూపుని ఆహ్వానించి వుండవచ్చు. కాబట్టి అస్థిరమైన, సందిగ్ధమైన రాజకీయ పరిస్థితులు రాష్ట్రపతి వివేచనకు ఆ విధంగా అధికారాల దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తాయని స్పష్టమవుతుంది. 76 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అంతేగాక సాధారణ పరిస్థితులలో కూడా రాష్ట్రపతులు వ్యక్తిగత ఆకాంక్షల కారణంగా గాని లేక రాజ్యాంగ బాధ్యతల పట్ల నిబద్ధతతో గాని వివేచనాధికారాన్ని వినియోగించుకొన్నారు. అందుకు స్పష్టమైన ఉదాహరణ రాష్ట్రపతి జైల్‌సింగ్. బిల్లును పార్లమెంటుకు తిరిగి పంపించిన మొదటి రాష్ట్రపతి జైల్‌సింగ్. ముఖ్యమైన పరిణామాల్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయడం లేదని, అందువలన ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడపబడుతుందని హామీ పొందవలసిన తన రాజ్యాంగబద్ధమైన కర్తవ్య నిర్వహణను ఇది ఆటంక పరుస్తుందని రాష్ట్రపతి ప్రధాన మంత్రికి లేఖ వ్రాశారు. ఆయన ప్రధాన మంత్రిని పదవి నుండి తొలగించవచ్చునని పుకార్లు వ్యాపించాయి. తరువాత అదే సంవత్సరం అంటే 1987లో రక్షణ కొనుగోళ్లలో ముడుపులు ముట్టాయనే బోఫోర్స్ వివాదం చెలరేగినపుడు రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రి పదవి నుండి తొలగించేందుకు గల అవకాశాన్ని గురించి జైల్‌సింగ్ పలురకాల రాజకీయ నాయకులతో చర్చించాడు. కాని అలా తొలగించడం జరగలేదు. కాని పార్లమెంటులో ప్రధానమంత్రికి పూర్తి మెజారిటీ వున్నప్పుడు కూడా రాష్టపతి తన సాంప్రదాయ అధికార పరిమితుల్ని అధిగమించే అవకాశం వుందని స్పష్టమైంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో కాంగ్రైస్కి లోకసభలో ఎప్పుడూ లేనంత అత్యంత పెద్ద మెజారిటీ వుందనే అంశం ఇక్కడ గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడంలో రాష్ట్రపతి నిర్వహించే పాత్ర చర్చిం చదగిన మరొక అంశం. ఇటీవల 1998 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా యు.పి. గవర్నర్ రమేష్ భండారి బిజెపి నాయకత్వంలో గల కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి మరొకరి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు కళ్యాణ్సింగ్ని ముఖ్యమంత్రిగా తిరిగి నియమించింది. అసెంబ్లీని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా సిఫార్సు చేస్తూ గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్ర మంత్రివర్గం సుదీర్ధంగా చర్చించి గవర్నరు నివేదికను ఆమోదించింది. ప్రధాన మంత్రి ఐ.కె. గుజ్రాల్ దానిని రాష్ట్రపతికి సిఫార్సు చేశాడు. రాష్ట్రపతి నారాయణన్ తన స్పష్టమైన అనంగీకారాన్ని వ్యక్తం చేస్తూ పునఃపరిశీలన కొరకు మంత్రి వర్గానికి పంపించారు. యు.పి. గవర్నరు రాజీనామా చేశారు. ఫిరాయింపుదారులు, నేరస్థులు, ఇతరుల చీలిక పేలికలతో కళ్ళాణ్సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్రపతి నారాయణన్ చాలా క్లిష్టమైన ఎంపికను చేయవలసి వచ్చింది. కళ్యాణ్‌సింగ్ మంత్రి వర్షానికి వున్న మద్దతుపై ఆరోపణలు ప్రత్యారోపణలూ వున్నాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 77
ఫిరాయింపులున్నాయి. ఫిరాయించిన వారు మరలా ఫిరాయించారు. ఆర్ధికపరమైన ఇంకా ఇతర ప్రలోభాల ఆరోపణలున్నాయి. అయినప్పటికి యు.పి. మంత్రివర్షం ఎంత అక్రమంగా పొందినదైనప్పటికి తన మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకొన్నది గనుక రాష్ట్రపతి ఆ (ప్రభుత్వాన్ని రద్దు చేసే హక్కు తనకు లేదని నిర్ణయం తీసుకొన్నారు. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విచ్చిన్నమయిందా? లేదా? - నిర్ణయించటానికి మెజారిటీ మద్దతు మాత్రమే గీటురాయి కాదని, మద్దతు ఎలాంటి బెదిరింపులు లేక ప్రలోభాలతో వచ్చిందో పరిగణనలోకి తీసుకోవాలని విమర్శకులు వాదించారు.
44వ సవరణ రాష్ట్రపతికి మంత్రిమండలి యిచ్చే సలహాని పునఃపరిశీలించమని అడిగే అధికారాన్ని ఇచ్చింది. కాని మంత్రిమండలి దానిని పునరుద్దాటిస్తే రాష్ట్రపతి అంగీకరించి తీరాలి. కాని రాష్ట్రపతి నారాయణన్ - యు.షి. విషయంలోలాగా మంత్రి మందలి పునఃపరిశీలనకు పంపించటం విస్మరించటానికి వీలుపడని తీవ్రమైన అంశంగా పరిగణించబడుతుంది.
ఇతర అంశాలలో రాష్ట్రపతి అధికారాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఆర్టికల్ 111 ననుసరించి బిల్లు రాష్ట్రపతికి పంపినపుడు ఆయన కావాలనుకొంటే అనుమతి ఆపి వేయవచ్చు. పార్లమెంటు పునఃపరిశీలనకు పంపవచ్చు. ఉభయసభలు మరలా ఆమోదించాలి. మరలా పంపిస్తే రాష్ట్రపతి ఆమోదించితీరాలి. ఆర్ధిక బిల్లుల విషయంలో ఆయన వివేచనకు అవకాశం లేదు. వీటో అధికారం లేదు.
అత్యవసర పరిస్థితి ప్రకటించమని మంత్రి వర్గం నుండి రాతపూర్వకమైన నిర్ణయం అందిన తరువాత మాత్రమే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించగలడని 1978లో 44వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితి కాలంలో కూడా మంత్రి వర్షం సలహా మేరకే ఆయన పని చేయవలసి వుంటుంది. ఉన్నత న్యాయన్థానాల జడ్జీల, గవర్చర్ల, రాయబారుల, అటార్నీజనరల్ భారతదేశ కం[టటోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాంటి వివిధ పై స్థాయి వారిని నియమించడంతో సహా అన్ని అధికారాలు మంత్రి వర్ణం సలహా మేరకే వినియోగించుకోవలసి వుంటుంది. సాయుధ దళాల సుప్రీం కమాండరుగా గల అధికారాలు, పార్లమెంటు సమావేశాలు జరగని కాలంలో ఆర్జినెన్సులు జారీ చేసే అధికారాలు మంత్రిమండలి సలహా మేరకే ఉపయోగించుకోవాలి.
రాష్ట్రపతి పదవీకాలం ఐదు సంవత్సరాలు. తిరిగి ఎన్నికయ్యే అర్హత వున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మహాభియోగం ద్వారా తొలగించబడతాడు. ఎన్నుకోబడిన 78 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పార్లమెంట్ ఉభయసభల సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల చేత ప్రాతినిధ్య నిష్పత్తి పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా ఎన్నుకోబడతాడు. ప్రతి
- పార్లమెంటు సభ్యునికి, అసెంబ్లీ సభ్యునికి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు వుంటుంది. ఓటు విలువ అతదు ప్రాతినిధ్యం వహించే జనాభాని బట్టి వుంటుంది. ఉపరాష్ట్రపతి అధికారంలో వున్న రాష్ట్రపతి మరణిస్తే గాని లేక జబ్బు ఇతర కారణాల రీత్యా విధులు నిర్వర్తించలేని స్థితిలో వుంటేగాని, లేక తొలగించబడితేగాని లేక రాజీనామాలు చేస్తేగాని ఆర్జికల్ 65 ప్రకారం రాష్ట్రపతి బాధ్యతలు ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు. ఇలాంటి ఘటన రెండుసార్లు జరిగింది. రాష్ట్రపతులుగా వుంటూ డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ మరణించగా అప్పటి ఉపరాష్ట్రపతులుగా వున్న వి.వి.గిరి, బి.డి. జెట్టి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించారు. ఈ కారణం రీత్యా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి వుంటుంది. ఏ సభలో సభ్యుడు కానప్పటికి పార్లమెంటు ఉభయ సభల చేత ఎన్నుకోబడిన ఉపరాష్ట్రపతి సాధారణ పరిస్థితులలో రాజ్యసభ సభాధ్యక్షునిగా వ్యవహరిస్తుంటాడు. మంత్రి మండలి, ప్ర్రూనమంత్రి రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్య నిర్వహజాధికారం ప్రధాన మంత్రి నాయకత్వంలోని మంత్రి మండలికి వుంటుంది. లోక్‌సభలో మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని గాని లేక ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు లోకసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం పొందిన వ్యక్తిని గాని రాష్ట్రపతి ప్రధాన మంత్రిగా నియమిస్తాడు. ప్రధాన మంత్రి యితర మంత్రులను ఎంపిక చేసుకుంటాడు. రాష్ట్రపతి వారిని మంత్రులుగా నియమిస్తాడు. పార్లమెంటు సభ్యులు కాని వారిని కూడా మంత్రులుగా నియమించవచ్చు. కాని వారు ఆరు నెలల లోపల ఏదో ఒక సభకి (లోక్‌సభకి లేక రాజ్యసభకి) ఎన్నిక ద్వారా గాని లేక నామినేషన్ ద్వారా గాని సభ్యుడు కావాలి. మంత్రి మండలి లోక్‌సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్‌సభ విశ్వాసం కొల్పోయినప్పుడు రాజీనామా చేయాలి. నెహ్రూ మాటల్లో చెప్పాలంటే ప్రధాన మంత్రి ప్రభుత్వ యంత్రంలో కీలకమైన చీల లాంటివాడు. రాష్ట్రపతికి నామ మాత్రంగా వున్న అధికారాలన్నీ రాష్ట్రపతికి, మంత్రివర్గానికి, పార్లమెంటుకి అనుసంధానకర్తగా వుండే ప్రధానమంత్రే చెలాయిస్తాడు. దాదాపు 17 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగి విశేషమైన పేరు ప్రఖ్యాతులు స్వతంత్రం తర్వాత భారతదేశం 79
గడించిన మొదటి ప్రధాన మంటత్రి జవహర్లాల్ నెహూ వలన ప్రధానడదుంత్రి పదవికి కూడా ప్రాధాన్యత పెరిగింది. ఇందిరాగాంధీ ఎన్నికల విజయం, 1971 బంగ్లాదేశ్ యుద్ధం తరువాత రాజకీయ విధానంలో ప్రధానమంత్రి పదవికి విశేషమైన ప్రాచుర్యం లభించింది. ప్రధానమంత్రికి మంత్రులను ఎంపిక చేసుకొనేందుకు. తొలగించేందుకు పూర్తి అధికారాలుంటాయి.
352 ఆర్టికల్ ననుసరించి మంత్రి వర్గం కేబినెట్ హోదాగల మంత్రుల మంత్రి మండలిగా నిర్వచింపబడింది. కేబినెట్ మంత్రులు, మినిస్టర్స్ ఆఫ్స్టేట్, డిప్యూటీ మంత్రుల ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. ఎప్పుడూ ఒక మంత్రిమండలి వుంటుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన క్రమబద్ధంగా జరిగే మంత్రివర్గ సమావేశాలలో పాల్గొని ముఖ్యమైన సిర్ణయాలు చేసే కేబినెట్ హోదా మంత్రులు చాలా ముఖ్యమైనవారు.
రాజ్యాంగ యంత్రాంగం విచ్చిన్నమై రాష్ట్రాలలో లాగా కేంద్రంలో రాష్ట్రపతి పాలన విధించటాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఎప్పుడూ మంత్రి మండలి వుందాలి. విశ్వాస రాహిత్య తీర్మానం. ఆమోదించబడి, మంటత్రి మందలి రాజీనామా చేసినప్పుడు కూడా నూతన మంత్రి మండలి ఏర్పడే వరకు కొనసాగవలసిందిగా రాష్ట్రపతి కోరతాడు.
1999 ఏప్రిల్ 17న బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కొల్పోయి, ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగే సాంప్రదాయాన్ని తిరస్మరించినపుడు రాజ్యాంగ వివాదం తలెత్తింది. ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేసినప్పటికి రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదనే వాదనతో ఆపద్ధర్మ ప్రభుత్వ స్థాయిని తిరస్కరించింది. సుస్థాపితమైన సాంప్రదాయాన్ని విస్మరించింది. చట్టబద్ధంగా ఎన్నికలు ప్రారంభం కానప్పటికి దేశం అవృటికే ఎన్నికల (కవుంలో వుందని, దీనిని గవునంలో పట్టుకొని వ్యవహరించవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యిచ్చిన సలహాని పెడచెవిన పెట్టింది. (లోక్‌సభ 1999 ఏప్రిల్‌లో రద్దు చేయబడి కొత్తగా జరపవలసిన ఎన్నికలు రుతుపవనాల కారణంగాను, ఎన్నికల జాబితాలు సవరణ చేయవలసి వున్నందున వాయిదాపడినప్పటికి) ప్రభుత్వం లోక్‌సభని రద్దు చేసిన తరువాత 1999 మే 3న ఒక్క కలం పోటుతో శాంతి భద్రతలకు బాధ్యత వహించే హోంసెక్రటరీతో సహా ఎనిమిది మంది సెక్రటరీ స్థాయి (అధికార వర్గంలోని అత్యున్నత న్థాయి) అధికారుల్ని బదిలీ చేసింది. ఎన్నికలు ప్రకటించిన తరువాత ఎన్నికలు సజావుగా నిర్వహించటానికి అధికారుల్ని బదిలీ చేయకూడదనే ముఖ్యమైన నిబంధనని ఉల్లంఘించి (ప్రభుత్వం అలా చేసిం ఏ. రాజ్యాంగంలోని పదజాలం రాజ్యాంగాన్ని అతిక్రమించటానికి వినియోగించబడింది.
80 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పార్లమెంటు
భారతదేశ పార్లమెంటు రెండు సభల్ని కలిగివుంటుంది. ఎగువసభని రాజ్యసభ లేక కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. దిగువసభని లోక్సభలేక హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటారు. రాజ్యసభలో 250 మంది సభ్యులుంటారు. వీరిలో 288 మంది రాష్ట్రాల అసెంబ్లీల సభ్యుల చేత దామాషా ప్రాతినిధ్య పద్ధతిని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా ఎన్నుకోబడతారు. మిగిలిన 12 మంది విద్య, సామాజిక కార్యకలాపాలు, మీడియా, క్రీడలు లాంటి వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించేందుకు ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతిచే నియమించబడతారు. ప్రతీ రెండు సంవత్సరాలలో పార్లమెంటు సభ్యులలో మూడవ వంతు మంది పదవీ విరమణ చేస్తుంటారు. రాజ్యసభకి ఎన్నికైన సభ్యుడు ఆరు సంవత్సరాలు పదవీలో వుంటారు. రాజ్యసభ శాశ్వత సభ. ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభకు సభాధ్యక్షుడు. రాజ్యసభ సభ్యులు వారిలో ఒకరిని ఉపనభాపతిగా ఎన్నుకొంటారు.
లోక్‌సభ (ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ. సభ్యుల పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు. కొని 5 సంవత్సరాలు పూర్తికాక ముందు కూడా రద్దు చేయబడవచ్చు. అత్యవసర పరిస్థితి అమలులో వున్నప్పుడు లోక్‌సభ పదవీకాలాన్ని ఒకసారి ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు. కాని అత్యవసర పరిస్థితిని రద్దు చేసిన తరువాత 6 నెలలకు మించి పొడిగించరాదు. ఆచరణలో ఒక్కసారి మాత్రమే 1976లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి (ప్రకటించినప్పుడు లోక్‌సభ పదవీకాలం ఒక సంవత్సరం పాటు పొడిగించబడింది.
18 సం॥లు, ఆపై వయస్సుగల భారతదేశ పౌరులందరూ ఓటు హక్కుకి అర్హులు. పోటీ చేసిన వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వాడు గెలిచినట్లు ప్రకటించడం జరుగుతుంది. చాలా దేశాలలో అమలులో వున్నట్లు గెలిచిన వానికి కనీసం 50 శాతం ఓట్లు రావాలనే నిబంధన లేదు. కాని ఎన్నికైన అభ్యర్థి యొక్క ప్రాతినిధ్య స్వభావానికి హమీగా వుండేందుకు, అభ్యర్థులు ఓటు బ్యాంకు పరిమితులు దాటి విస్తృతమైన ఓటర్ల ప్రయోజనాలు కాపాడటాన్ని ప్రోత్సహించేందుకు కనీసం 50 శాతం ఓట్లు తెచ్చుకున్న వానినే గెలిచినట్లు ప్రకటించాలని ఆలోచనా పరులైనా పరిశీలకులు ఆకాంక్షిస్తున్నారు.
నియోజకవర్గాలు (ప్రాదేశికంగా జనాభా నిష్పత్తిని బట్టి విభజింపబదతాయి. కొన్ని నియోజక వర్గాలు షెడ్యూలు తెగల, షెడ్యూల్డు కులాలకు ఆ రాష్ట్ర జనాభాలో వారి నిష్పత్తిని బట్టి కేటాయించబడతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని జనాభాలో
స్వతంత్రం తర్వాత భారతదేశం 81
40 శాతం ప్రజలు షెడ్యూల్డు కులాలు 10 శాతం షెడ్యూల్టు తెగల వారు వుంటే ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ సీట్లలో 40 శాతానికి షెడ్యూల్డు కులాల అభ్యర్దులు 10 శాతం సీట్లలో షెడ్యూల్డు తెగల అభ్యర్థులు పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో నివశించే ఇతరులు ఈ అభ్యర్థులనే ఎన్నుకోవాలి. స్వతంత్రానికి ముందు కాలంలో లాగా ప్రత్యేక నియోజక వర్షాలు వుండవు.
ఇటీవలి సంవత్సరాలలో మూడవ వంతు సీట్లు మహిళలకు రిజర్వు చేయాలని ఒత్తిడి పెరిగింది. ఆ మేరకు 1998లో పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశ పెట్టబడింది. కాని అలాంటి రిజర్వేషన్ల వలన పై కులాలకు చెందిన కులీనులు, హిందూ మహిళలే వాటిని కైవశం చేసుకుంటారని, అందువలన రిజర్వేషన్లలో రిజర్వేషన్లు వుండాలని డిమాండు చేస్తున్న కుల, మత [గ్రూపుల వాదాలు ప్రతివాదాల సాలెగూటిలో ఈ బిల్లు చిక్కుకున్నది. ఫలితం ఎలా రానున్నప్పటికీ సూత్రరీత్యా మహిళల రిజర్వేషన్ ఆమోదం పొందింది.
లక్ష్యం ఎంత కోరదగిందైనప్పటికి, ఒకసారి సూత్రం ఆమోదింపబడితే అవే ప్రయోజనాల కొరకు ఇతర (గ్రూవులు కోరే అలాంటి కోరికల్ని నివారించడం అసాధ్యమవుతుంది. రిజర్వేషన్లు అమలు జరపడం ఏ స్థితికి చేరుకొన్నదంటే ఈనాడు వాటిని రద్దు చేయడం సాధ్యపడని స్థితికి చేరుకొన్నది. రాజ్యాంగం రిజర్వేషన్లను పది సంవత్సరాల పాటు కొనసాగే స్వల్పకాలిక చర్యగా అంచనావేసింది. ప్రభుత్వాలు రిజర్వేషన్ల కాల పరిమితిని పది సంవత్సరాలు పెంచుతూ వచ్చాయి. ఇప్పుడు ఏభై ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు కొన్ని గ్రూపుల గుర్తింపులను పెంపొందించడం రాజ్యాంగంలో రూపొందింపబడిన పొరసత్వభావనకు ఆటంకం కాగలదా? - లాంటి ప్రశ్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రస్తావించడం కూడా కష్టం. రిజర్వేషన్లు సర్వరోగ నివారిణి అని నమ్మించడం చాలా సులభం. అందువలన ఇప్సటికి ప్రయోజనాలు పొందని గ్రూపులు- వారి నాయకులు సులభంగా నమ్ముతున్నారు. చేతికి దొరికే పక్షి కనిపించని భవిష్యత్ పొదలో పక్షికంటే మేలని భావిస్తారు.
లోకసభలోని గరిష్ట సీట్ల సంఖ్య 552. వీటిలో 550 ప్రాదేశిక నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రెండు సీట్లు నామినేట్ చేయబడే ఆంగో ఇండియన్లకు చెందుతాయి. లోకసభ సభ్యులకు కనీసం 25 సం॥ల వయస్సు వుండాలి. స్పీకరు, స్పీకరు లేనప్పుడు డిప్యూటి స్పీకరు సభాపతిగా వుండి లోకసభ కార్యకలాపాలు నిర్వహిస్తాడు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లోకసభ సభ్యులచే ఎన్నుకొనబడతారు. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ పదవి మెజారిటీ పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి 82 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దక్కుతుంది. కాని ఇటీవలి అస్పష్టమైన తీర్పులు, అస్థిర సంకీర్థాలు, ప్రభుత్వం లోపల వెలుపల గల ప్రత్యర్థి గ్రూపుల డిమాండ్లు సాంప్రదాయాన్ని తలక్రిందులు చేశాయి. సభని అదుపు చేయగల సమర్భ్థుని ఎంపిక చేసి సభాపతి నిష్పాక్షిక వైఖరికి ఒక న్థాయి కల్పించేందుకు సభాపతి ఉపసభాపతి పదవులను పోటీకి అతీతంగా వుంచే సాంప్రదాయం వుంది. కాని 1998లో బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం మొదట కాంగ్రెస్ ప్రతిపాదించిన పి.ఎ.సంగ్మాని బలపరచేందుకు అంగీకరించి ఆ తరువాత మాటతప్పి సంకీర్ణంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీని తృప్పిపరిచేందుకు ఆ పార్టీకి చెందిన బాలయోగిని సభాపతిని చేసింది. పార్లమెంటుకి విస్తృతమైన శాసనాధికారాలుంటాయి. బిల్లులు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. బిల్లులు చట్టమయ్యేందుకు ఉభయ సభల ఆమోదం పొందాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం పొందాలి. బిల్లుల్ని రాష్ట్రపతి పార్లమెంటుకి గాని ప్రభుత్వానికి గాని పునఃపరిశీలనకు పంపవచ్చు. అవి మరలా ఆమోదం పొందితే రాష్ట్రపతి ఆమోదించి తీరాలి. ఆర్థిక బిల్లులు రాష్ట్రపతి సిఫార్సుతో మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. అప్పుడు రాజ్యసభకి పోతాయి. 14 రోజులలో తిరిగి పంపబడకపోజే అవి ఆమోదం పొందినట్లుగా భావించబడతాయి. ఆర్టికబిల్లుల విషయంలో రాజ్యసభ సిఫార్సుల్ని ఆమోాదించవచ్చు. ఆమోదించకపోవచ్చు. రాజ్యాంగం పార్లమెంటుకి ఒక సంస్థగా గొప్ప స్థాయిని కల్పించింది. పార్లమెంటు సభ్యులకు స్థాయికి తగిన హక్కుల్ని ఇచ్చింది. దురదృష్టవశాత్తు యిటీవలి సంవత్సరాలలో కొందరు సభ్యులు కొన్ని పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని అద్దుకొంటున్నారు. అనవసరమైన వాకౌట్లు చేస్తున్నారు., కేకలేస్తున్నారు. పోట్లాటకు తలపడుతున్నారు. సభ యొక్క స్థాయిని దిగజార్భుతున్నారు. అవసరమైన చట్టాలు కాకుండా అద్దుకొంటున్నారు. ఇలాంటి చర్యలు పార్లమెంటు సభ్యుల పట్ల, పార్లమెంటు పట్ల ప్రజలకు చిరాకు కలిగిస్తున్నాయి. రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రి మండలి రాష్ట్ర అసెంబ్లీకి బాధ్యత వహిస్తూ కార్యనిర్వాహక బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం పార్లమెంటు నమూనా ప్రాతిపదికగా వుండాలి. (ప్రెసిడెంటు లాగానే గవర్నరు రాష్ట్ట్రాధినేతగా వుంటాడు. కాని ముఖ్యమైన తేడా ఏమిటంటే రాజ్యాంగ యంత్రాంగం విచ్చిన్నమై 356 ఆర్టికల్ ననుసరించి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు యూనియన్ గవర్నమెంటుచే నియమింపబడిన సలహాదారుల సహాయంతో రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్చరు పాలనా బాధ్యతలు నిర్వహిస్తాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం 88
రాజ్యాంగ రూప కల్పన చేసే సమయంలో రాజ్యాంగ రచయితలు రాజకీయాలలో అంతగా పాల్గొనని ప్రముఖ వ్యక్తులు - ప్రముఖ విద్యావేత్తలు, ఇతర జీవన రంగాలలో ప్రసిద్ధులు గవర్నర్లుగా వుండాలని ఆశించారు. కాని గవర్నర్లు పదవీకాలంలటోనూ రాజకీయాల కతీతంగా లేరు. పదవీకాలం పూర్తి అయిన తరువాత క్రియాశీల రాజకీయాలలో పాల్గొంటున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ ఆదేశాల మేరకు పని చేశారు. లేక వారిని నియమించిన పార్టీకి విధేయతగా పని చేశారు. కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే వ్యూహంలో కుట్ర దారులుగా పని చేశారు. అన్నిపార్టీలు కూడా వాటికి విధేయతగా వుండే వారిని గవర్చర్లుగా నియమించుకొనే ధోరణి పెరిగింది. గవర్చర్లను నియమించబోయే ముందు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదించే పద్ధతి పాటించబడడం లేదు.
గవర్నర్లు విచక్షణాధికారాలు దుర్వినియోగపరుచుకొన్న ఉదాహరణలు చాలా వున్నాయి. వాటిలో ఈ దిగువ పేర్కొన్నవి ప్రముఖమైనవి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్బుల్లా 1984 జూలై 2న వెంటనే అసెంబ్లీని సమావేశ పరచవలసిందిగా గవర్నరు జగ్మోహన్ని కోరాడు. 12 మంది తన పార్టీ సభ్యులు పార్టీని వదలి వెళ్ళడం వలన అసెంబ్లీలో బలాన్ని పరీక్షించుకోవాలనుకొన్నాడు. కాని గవర్నరు అతడి మంత్రివర్దాన్ని రద్దు చేసి జి.ఎం. షాని ముఖ్యమంత్రిగా నియమించాడు. అబ్బుల్లా తన మంత్రి వర్గం రద్దుకు నిరసనగా దేశవ్యాప్త ప్రచారం చేపట్టాడు. ఈ ఘటన రాష్ట స్వయం ప్రతిపత్తిని కేంద్రం అతిక్రమించింది అనడానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి.రామారావు (తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది) బలాన్ని వరిక్షించుకొనడానికి వీలుగా అసెంబ్లీని సమావేశపరచవలసిందిగా కోరగా, గవర్నర్ రామ్‌లాల్ ముఖ్యమంత్రి 1984 ఆగష్టు 16న వదవి నుండి తొలగించాడు. యన్.టి.రామారావు మెజారిటీ నిరూపించుకొనేందుకు కేవలం రెండు రోజుల వ్యవధి కోరాడు. గవర్నర్ ప్రత్యర్థికి 30 రోజుల వ్యవధి యిచ్చాడు. అయినప్పటికి అతడు బలాన్ని కూడగట్టడంలో విఫలమయ్యాడు. గవర్నర్ రామ్‌లాల్ తీసుకొన్న చర్య తనకు ముందుగా తెలియదని ఇందిరాగాంధీ బాహాటంగా ప్రకటన చేసింది. గవర్నర్ చేత రాజీనామా చేయించింది. శంకర్ దయాళ్ శర్మని గవర్నర్ గా పంపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు యన్.టి. రామారావు ఆహ్వానించబిడ్డాదు. ఈక్రమం గవర్నర్ వదవీ స్థాయిని దిగజార్చింది. 84 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అన్ని రామ్షాలకు సభ్యుల సంఖ్య 500కి మించని, 60కి తగ్గని విధంగా శాసన సభలు వున్నాయి. కొన్ని రాష్ట్రాలలో శాసన మండళ్ళు కూడా వున్నాయి. రాష్ట్ర జాబీతాలోని అంశాలపై చట్టాలు చేసే ప్రత్యేక హక్కు రాష్ట్రాలకు వుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా రాష్ట్ర శాసన సభల చట్టాలు చేయవచ్చు. ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై రాష్ట్ర శాననసభ, కేంద్ర పార్లమెంటు చట్టం చేస్తే పార్లమెంటు చేసిన చట్టమే నిలుస్తుంది. ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రపతిచే నియమింపబడిన లెస్ట్నెంట్ గవర్నర్ల ప్రత్యక్ష పాలనలో వున్నాయి. ఢిల్లీ, పాండిచ్చేరిలలాగా ఇవి కూడా చట్టసభలు మంత్రి మండళ్ళు కలిగి వుంటాయి. కాని రాష్ట్రాలకు వలెగాక వీటి అధికారాలు పరిమితంగా వుంటాయి. స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ సంస్థల నమూనా పై రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవు: కాని రాష్ట్రాలు గ్రామపంచాయితీలను ఏర్పరిచి, వాటిని స్వయం పరిపాలనా యూనిట్లుగా వనిచేసే విధంగా చర్యలు చేవట్టాలని ఆదేశిక నూత్రాలు తెలియజేస్తున్నాయి (ఆర్టికల్ 40). ఇది రాష్ట్రాలు వాటి అవసరాలకు సరిపడే నమూనాలను ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. అంతేగాక స్వతంత్ర పోరాట వారసత్వం, ప్రత్యేకించి 1920-22 నాటి సహయ నిరాకరణోద్యమ కాలం నుండి గాంధీజీ పంచాయితీలను తన రాజకీయ కార్యక్రమంలో భాగం చేసుకొన్న వారసత్వం
- స్థానిక స్వయంపాలనా సంస్థలను నెలకొల్పడం అనివార్యం చేసింది. కాని 1950 దశాబ్ధం లోని తొలి సం॥లలో అంత అభివృద్ధి సాధించబడలేదు. స్థానిక అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలన్నింటిని సమాజ అభివృద్ధి కార్యక్రమంపై (609810 06౪610910604 508/20గల) కేందీకరించింది. సమాజాభివృద్ధిపథకం అభివృద్ధి కార్యక్రమాలు సాగించేందుకు (గ్రామస్థాయి వర్కర్తు, సోషల్ వర్మర్త, వ్యవసాయ నిపుణులు, కొత్తగా నియమింపబడిన అభివృద్ధి అధికారుల సహాయంతో 100 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకున్నది. ఈ పథకంపై ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకొన్నది. కాని అది మంచి ప్రయోజనాలు సాధించలేకపోతున్నదని స్పష్టమైన తరువాత దానిని మెరుగుపరచడానికి సరియైన సూచనలు చేయవలసిందిగా 1956లో ప్రముఖ గాంధేయవాది బల్వంత్రాయ మెహతా అధ్యక్షతన ఉన్నత స్థాయి స్వతంత్రం తర్వాత భారతదేశం 85్
కమిటీని నియమించింది. సమాజ అభివృద్ధి పథకం వైఫల్యానికి ముఖ్యమైన ౬ 5ణం నిజమైన అధికారాలు గల (ప్రజాస్వామ్య స్థానిక సంస్థలు లేకపోవడమని బల్వంతరాయ్ కమిటి నిర్ధారించింది. అందుకు విరుగుడుగా మూడు స్థాయిల ప్రాతినిధ్య సంస్థలుగల పంచాయితీరాజ్ని ప్రవేశపెట్టమని సలహా ఇచ్చింది. గ్రామస్థాయిలోని గ్రామపంచాయితి (గ్రామంలోని వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంది. బ్లాకు స్థాయి లోని పంచాయితీ సమితి సభ్యులు, జిల్లా స్థాయిలోని జిల్లా పరిషత్ సభ్యులు వాటి దిగువ స్థాయి సభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడతారు. సహకార ఉద్యమ అధికారులు, ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులు కో ఆస్ట్ చేయబడతారు.
1959-1962 కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు పంచాయితీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టాయి. కాని పలు కారణాల రీత్యా పంచాయితీ రాజ్ విధానం ఆశించిన మేరకు పని చేయలేదు. ఎన్నికలు జరుపవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఎన్నికలు జరపలేదు. ఫలితాలు (ప్రతికూలంగా వుంటాయనుకొన్నప్పుడు సంవత్సరాల తరబడి వాయిదావేశాయి. పంచాయితీలు స్వతంత్రంగా పనిచేసేందుకు అవసరమైన నిధులు లేవు. పంచాయితీలపై స్థానిక పెత్తందారులు ఆధిపత్యం చెలాయించారు. ఆశోక్ మెహతా కమిటీ 1978, జి.వి.కె.రావు కమిటి 1985, ఎల్వి. సింఘ్వీ కమిటి 1986
- లాంటి పలు కమిటీలు విస్తృత అధ్యయనం చేశాయి. విలువైన సలహాలు ఇచ్చాయి.
రాజీవ్‌గాంధీ నాయకత్వంలో పంచాయితీ రాజ్‌కి ప్రోత్సాహం లభించింది. 1988లో పి.కె. తుంగన్ కమిటీ పంచాయితీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధమైన గుర్తింపు ఇవ్వాలని, ఈ సంస్థలకు ఎన్నికలు సకాలంలో క్రమబద్ధంగా నిర్వహించాలనే నిబంధన రాజ్యాంగంలో వుండాలని, ఆ సంసల కాల పరిమితి 5 సంవత్సరాలు వుండాలని సిఫార్సు చేసింది. 1989 లో పార్లమెంటులో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడింది. అప్పుడు కాంగ్రెస్‌కి రాజ్యసభలో మెజారిటీ లేదు. బిల్లు ప్రవేశపెట్టడంలో కాంగ్రైస్ ఉద్దేశాల పట్ల ప్రతిపక్షాలకు సందేహాలున్నాయి. రాష్ర్రాల అధికారాలను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టిందని అనుమానించాయి. బిల్లు చట్టం కాకుండా అడ్డుకొన్నాయి. ఆ తరువాత ఒక సంవత్సరం లోపలే వి.పి.సింగ్ (ప్రభుత్వం అదే బిల్లును చిన్న మార్పులతో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందక ముందే వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోయింది. మరలా 1993లో కాంగ్రెస్ 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయితీరాజ్ బిల్లు ఆమోదం పొందింది.
86 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
73వ సవరణ పంచాయితీలు స్వయం పరిపాలనా యూనిట్లుగా విస్తృతమైన వ్యవస్థాపనకు అవకాశం కల్పించింది. భారత రాజ్యాంగ చరిత్రలో మొదటి సారిగా పంచాయితీల స్థాపన, వాటి కాలవ్యవధి, వాటి సభ్యత్వం, వాటి ఆర్థిక పరిస్థితి సమిక్షించేందుకు ఆర్థిక కమిషన్ స్థాపన - వివరించబడింది. అది పంచాయితీలచే నిర్వహించబడే 29 అంశాలు గల 11వ పషెద్యూలుని చేర్చింది. ఈ సవరణతో పంచాయితీరాజ్ సంస్థలు లోక్సభలాగానే భారతదేశ రాజ్యాంగ బద్ధ ప్రభుత్వ నిర్మాణంలో భాగమయ్యాయి. న్యాయవ్యవస్థ (46101200) రాజ్యాంగంలోని 124-147, 214-237 ఆర్టికల్స్ భారతదేశంలోని మొత్తం న్యాయవ్యవస్థ నిర్మాణాన్ని నిర్ణయిస్తాయి. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని నిలబెట్టేదిగా పరిరక్షించేదిగా వుంటుంది. నియామకం పద్ధతి, ఉద్యోగకాల పరిమితి, అర్హతలు, ప్రతి కోర్టు యొక్క అధికారాలు, జీతాలు బత్తాలు - అన్నీ కూడా రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. భారతదేశ న్యాయవ్యవస్థ అత్యున్నత స్థానంలో సుప్రీంకోర్టు గల ఏకీకృత న్యాయవ్యవస్థ. సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, 25 మంది ఇతర న్యాయమూర్తులతో (1950లో ఏడుగురు, క్రమంగా 1986 నాటికి 25కి పెంచబడింది) వుంటుంది. వీరిని రాష్ట్రపతి నువ్రీంకోర్చు న్యాయమూర్తులతో, అవనరమనుకుంటే హైకోర్టుల న్యాయమూర్తులతో సంప్రదించి నియమిస్తాడు. వీరు 65 సం॥ లు నిండే వరకు పదవిలో కొనసాగవచ్చు. ప్రధాన న్యాయమూర్తి గాక ఇతర న్యాయమూర్తులను నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. (ఆర్టికల్ 124) సాంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిలో కీనియర్ అయి వుంటారు. ఈ సంప్రదాయాన్ని ఇందిరాగాంధీ 1978లో అలాగే 1976లో పరిహసించి (1973లో ముగ్గురు సీనియర్లను, 1976 లో ఒకరిని ప్రక్కన పెట్టించి) నియామకాలు జరిపించింది. ఈ చర్య నాయవ్యవస్థ స్వతంత్రంపై జరిపిన దాడిగా ఖండించబడింది. ఆ తరువాత ఏ ప్రభుత్వం అలాంటి సాహసానికి ఒడిగట్టలేదు. ను(వ్రీంకోర్స న్యాయమూర్తిని పార్లమెంటు మాత్రవే వదవి నుండి తొలగించగలదు. అసమర్ధత, దుష్ప్రవర్తన కారణంగా తొలగించబడవచ్చు. అందుకు స్వతంత్రం తర్వాత భారతదేశం 87
లోక్‌సభ, రాజ్యసభలు విడివిడిగా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాలి. లంశేగాక రెండు సభలలో మెజారిటీ సభ్యులు హాజరైనవారిలో మూడింట రెండు వంతుల ఓటు వేసి ఆ ప్రతిపాదనని ఆమోదించాలి. నిరూపితమైన దు(ష్ప్రవర్తనలేక అసమర్ధత కారణంగా న్యాయమూర్తిని తొలగించమని అభ్యర్థనని రాష్ట్రపతికి పంపాలి (ఆర్టికల్ 24 (4).
అప్పీళ్ళు, ప్రాథమిక హక్షుల అమలుకి సంబంధించిన రిట్లు సుప్రీంకోర్టు యొక్క (ప్రాథమిక విచారణాధికారం క్రిందికి వస్తాయి. అంటే ఒక వ్యక్తి క్రింది కోర్టుల ద్వారా . కాక నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు (ఆర్జీకల్ 32). కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలలో అలాగే రా[ష్రాల మధ్య వివాదాలలో నువ్రీంకోర్ట్డుకి ప్రాథమిక విచారణాధికారం వున్నది, సుప్రీంకోర్టు దిగువ కోర్టుల నుండి కేసులను ఐదిలీ చేసి తానే పరిశీలనకు స్వీకరించవచ్చు. రాజ్యాంగ సంబంధమైన సివిల్, క్రిమినల్ కేసులు సుప్రీంకోర్టు అప్పీలు అధికార పరిధిలోకి వస్తాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఏదైనా ఒక అంశం అతడిపై / ఆమెపై ప్రత్యక్షంగా ప్రభావం చూపేది కాకపోయినప్పటికి ఒక పౌరునిగా అతడికి ఆందోళన కలిగించేటట్లయితే అతడు/ఆమె ప్రజాప్రయోజనాల వ్యాజ్యం క్రింద అత్యున్నత న్యాయస్థానానికి ఒక ఫోస్టుకార్డు ద్వారా అప్పీలు చేసుకొనే అవకాశం సుప్రీంకోర్టు కల్పిస్తుంది. పైన వివరించిన విధంగా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని
- ప్రత్యేకించి ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య మారుతున్న సంబంధాన్ని వ్యాఖ్యానించడంలో పెద్ద పాత్ర నిర్వహించింది. ఏదైనా ఒక చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదని (ప్రకటించేందుకు “తగినచట్ట క్రమం” (466 ౧౧౦౦౭౩౩ 06 [2౪7 లేక “సహజ న్యాయ (ప్రమాణాలు అనే పదజాలం లేనందువలన అమెరికా సుప్రీంకోర్టుకు వున్న అధికారాలతో పాల్చితే మన సుప్రీంకోర్టుకి వున్న అధికారాలు పరిమితం. కాని ఆ పదజాలానికి బదులుగా మనకు 'మౌలిక లక్షణాల” (34516 [61-
- సిద్ధాంతం వున్నది. దాని ప్రాతిపదికన ఒక రాజ్యాంగ సవరణ కూడా “మౌలిక లక్షణాలకు నష్టం కలిగించేదిగా వుంటే అది చెల్లుబాటు కాదని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకి వుంది. భారత రాజ్యాంగ ముసాయిదాని రూపొందించిన కమిటీ సభ్యుడైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఇలా వ్యాఖ్యానించాడు. “భారత రాజ్యాంగం యొక్క భవిష్యత్ పరిణామం చాలా వరకు సుప్రీంకోర్టుపైన, అది ఇచ్చే దిశానిర్దేశం పైన ఆధారపడి వుంటుంది. దాని బాధ్యత రాజ్యాంగాన్ని వాఖ్యానించడమయినప్పటికి అది సమకాలీన సామాజిక ఆర్థిక, రాజకీయ వైఖరులను విన్మరించలేదు. కాన్ని సందర్భాలలో రాష్రాలను తగ్గించి కేంద్రాన్ని బలోపేతం చేస్తున్నట్లు కనిపించవచ్చు. మరికొన్ని నందర్భాలలో రాష్ట్రాల స్వయం ట్రతిపత్తిని, (ప్రాంతీయ వాదాన్ని 88 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బలపరిచినట్లు కనిపించవచ్చు. ఒక సందర్భంలో సామాజిక, రాజ్య నియంత్రణకు వ్యతిరేకంగా వ్యక్తి స్వేచ్చకు అనుకూలంగా కనిపించవచ్చు. మరొక సందర్భంలో సామాజిక, రాజ్య నియంత్రణని అనుకూలించవచ్చు. అది వ్యక్తి స్వేచ్చకి, సాంఘిక నియంత్రణకు మధ్య విభజన రేఖని గీయవలసిన అత్యున్నత న్యాయస్థానం.
హైకోర్టులకు వాటి పరిథిలో వున్న అన్ని దిగువ కోర్టులపై అధికారం వుంటుంది. అవి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కేసులకు పరిమితం కావు గనుక వాటికి రిట్లు, ఆర్డర్లు జారీ చేసే అధికారాలు సుప్రీంకోర్టు కంటే విస్త్రృతంగా వుంటాయి. హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తి, అవసరమైనంత మంది ఇతర న్యాయమూర్తులు వుంటారు. వారిని నియమించే విధానం సువ్రీంకోర్చ జడ్జీల నియామకాన్ని పోలివుంటుంది. సుప్రీంకోర్టు ఆదేశం దేశంలోని అన్ని కోర్టులకు ఎలా వర్తిస్తుందో అలాగే హైకోర్టు ఆదేశం రాష్ట్రంలోని అన్ని కోర్టులకు వర్తిస్తుంది.
రాష్ట్రంలోని దిగువ కోర్టులన్నీ హైకోర్టు యొక్క ప్రత్యక్ష నియం(త్రణలో వుంటాయి. గవర్నర్ హైకోర్టుని సంప్రదించి జిల్లా జడ్జీలను నియమిస్తాడు. కనీసం మూడు సంవత్సరాల కోర్టు అనుభవం వున్న వారికి పరీక్షలు జరిపి దిగువ స్థాయి న్యాయమూర్తులు నియమించబడతారు. క్రింది స్థాయిలో లంచగొండితనం సర్వ సామాన్యమైంది. హైకోర్టు స్థాయిలో లంచగొండితనం సామాన్యం కాకపోయినప్పటికి తెలియంది కాదు. ఇక సుప్రీంకోర్టు స్థాయిలో లంచగొండితనం అసలు లేనే లేదని చెప్పలేము. కేసులు కుప్పలుగా పేరుకుపోయి వుండటం పెద్ద సమస్య. ఒక కేసు పరిష్కారానికి 10 లేక 20 సం॥లు కాలం పడుతుంది. వ్యాజ్యం ఖర్చుతోను చాలా కాలవ్యవధితోను కూడుకున్నది. ఫలితంగా సామాన్యులు కోర్టుల్ని ఆశ్రయించేందుకు సందేహిస్తుంటారు. న్యాయవ్యవస్థ కాలం చెల్లిన న్యాయసూత్రాలతో చుట్టు ముట్టబడింది. న్యాయవ్యవస్థని సంస్మరించవలసి వుంది. వరసగా వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంస్కరిస్తామని వాగ్దానాలు చేశారు. కాని ఆ దిశగా చేపట్టిన చర్యలు తక్కువ. పరిపాలనా సేవలు
స్వతంత్రం సాధించినప్పుడు వలసవాద అధికారానికి పెద్ద సాధనంగా వున్న పరిపాలనా చట్రం - రాజుల, జమీందార్ల కుటుంబాలకు చెందిన ఐ.సి.ఎస్.ల నుండి మెట్రిక్ పరీక్ష తప్పి చప్రాసి అయినందుకు తెగ సంబరపడిపోయిన పేద (బ్రాహ్మణ పూజారి కొడుకు వరకు దేశీయుల్ని ఇముడ్చుకొన్న ముఖ్యమైన సాధనం - బ్రిటిష్ పొలకుల నుండి భారతదేశానికి వారసత్వంగా సంక్రమించింది. బ్రిటిష్ పాలన ఉద్యోగి స్వామ్యం. ఐ.సి.ఎస్. ఆఫీసర్లు పెద్ద జీతాలు పొందుతూ ప్రజల సమస్యలకు స్వతంత్రం తర్వాత భారతదేశం 89
నృందించని కులీన వర్ణం - వీరిలో అత్యధికులు (బిటీష్ వాళ్ళు. అయితే స్వతంత్రానంతరం. ఐ.సి.ఎస్.లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి పాలనా యంత్రాంగాన్ని అంతకు ముందులాగానే ఎందుకు వుంచినట్లు? అందుకు ముఖ్యమైన కారణం స్వతంత్రం వచ్చినప్పుడు వున్న పరిస్థితులు : విభజన, తెలిసిన చరిత్రలో ఎప్పుడు లేనంతగా జనాభా బదిలీ, దాదావు 300 స్వదేశీ సంస్థానాల విలీనం, కొళ్ళీరులో యుద్ధం, గాంధీజీ హత్య. అప్పుడు స్థిరంగా ఎలాంటి ఒడిదుడుకులకు గురికాకుండా వున్నది ఒక్క పాలనా యంత్రాంగం మాత్రమే. ఐ.సి.ఎస్. అధికారులుగా వున్న బ్రిటిష్ వాళ్ళలో అత్యధికులు వెళ్ళిపోయారు. మిగిలిన కొద్దిమంది భారతదేశానికి అనుకూలురు. కొద్దిమందిగా వున్న భారతీయ ఐ.సి.ఎస్.లు కొత్త ప్రభుత్వానికి - కొందరు జాతీయవాదంతో, పైనుండి వచ్చే ఆదేశాల్ని పాటించి పనిచేయడం ఉద్యోగ ధర్మంగా భావించి మరికొందరు - విధేయతతో సంతోషంగా వనిచేస్తామని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ ఐ.సి.ఎస్. ఆఫీసర్ సర్ ఉమాశంకర్ బాజ్‌పాయ్ 'నేను విదేశీ శక్తికి అంత బాగా సేవలు చేయగలిగితే నా దేశ ప్రజలకు ఇంకెంతటి సేవలు చేస్తాను?”
- లాంటి తిరుగులేని తర్కంతో చేసిన విజ్ఞపికి భారతీయ నాయకులు ముగ్జులయ్యారు. ఐ.సి.ఎస్. స్థానంలో ఐ.ఎ.ఎస్, ప్రవేశపెట్టబడింది. ఇక అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అలాగే వుంచబడ్డాయి.
రాజ్యాంగం పార్టు ౫౫ లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నియామకాలు, పని పరిస్థితుల్ని వివరిస్తూ నిర్దేతుకంగా తొలగించటానికి వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ కల్చించింది. స్వతంత్రమైన పన్లీక్ సర్వీసు కమిషన్ల ద్వారా నియామకాలు జరపాలని రాజ్యాంగం (ఆర్టికల్ 365) నియామకాలలో న్యాయబద్దతకి హామీ ఇచ్చింది. కమిషన్ల సభ్యులు 6 సం॥ వనిచేసేందుకు రాష్ట్రపతి లేక గవర్నర్లచే నియమింపబదతారు. సభ్యులలో సగం మంది 10 సం॥లు సర్వీసు గల సివిలు సర్వెంట్లు వుంటారు. నియామకాల కవసరమైన పరీక్షలు నిర్వహించే బాధ్యత కమిషన్లకు అప్పజెప్ప బడుతుంది. నియామకం, పదోన్నతి, బదిలీ, ఉద్యోగిపై తీసుకోవలసిన క్రమశిక్షణా చర్యలకు - సంబంధించిన అన్ని విషయాలలో కమిషన్లను నం('ప్రదించవలసి వుంటుంది.
రాజ్యాంగం అప్పటికి అమలులో వున్న రెండు అఖిల భారత సర్వీసులనే ప్రస్తావించింది. ఐ.ఎ.ఎస్., ఇండియన్ పోలీస్ సర్వీసు (ఐ.పి.ఎస్.) కాని మూడింట రెండొవంతుల మెజారిటీతో కొత్త ఆలిండియా సర్వీసులను ప్రవేశపెట్టే అధికారం రాజ్యసభకి కల్పించింది. ఈ రాజ్యాంగ నిబంధన మేరకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ ఇంజనీరింగు సర్వీసులు స్థాపించబడ్డాయి. ఆలిండియా సర్వీసులలో సగం 90 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మంది రాష్ట్రం వెలుపలివారై వుండాలనే నిబంధన కారణంగా అవి జాతీయ సమగ్రతను పెంచే గణనీయమైన శక్తిగా పనిచేస్తున్నాయి. ప్రతి ఆవీసరు మొదట కొన్ని సంవత్సరాలు జిల్లా కేంద్రంలో, జిల్లా డివిజన్ కేంద్రంలో, రాష్ట్ర కేంద్రంలో, మరలా రాష్ట్రం, జిల్లాలలో విధులు నిర్వర్తించడం వలన పరిపాలనకు చెందిన అన్నీ స్థాయిల్లోని పని విధానం యొక్క పరిజ్ఞానం, గుణాలు దోషాలు తెలుస్తాయి. కేంద్ర సర్వీసులు కూడా వాటి నియామకానికి దేశం మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకొనడం వలన ఏకీకరణ పాత్ర నిర్వహిస్తాయి. అలాగే ఆడిట్, అకౌంట్సు సర్వీసు ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలో పనిచేయవలసినప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాలలో నియమింపబడతారు.
రాజ్యాంగ రక్షణలు ఉద్యోగి వర్గంలో స్వేచ్చ నైతికతని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడ్డాయి. ఉద్యోగ భద్రతకు యిలాంటి రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించడం కారణంగా చాలా మంది ఉద్యోగులు అవాంఛనీయమైన రాజకీయ ఒత్తిడిని తట్టుకొని వపనిచేయగలుగుతున్నారు. కాని పూర్తి రక్షణ ఒక మేరకు చారవలేమినేగాక లంచగొండితనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
రాజకీయ నాయకులు కూడా తరచుగా డబ్బు లేక ఇతర బహుమతులు ఇచ్చి తమకు, తమ అనుయాయులకు అనుకూలంగా పనులు చేసిపెట్టమని ఒత్తిడి చేస్తుంటారు. అత్యవసర పరిస్థితి నాటి 1975-77, జనతా (ప్రభుత్వం నాటి 1977-79 కాలవ్యవధులు భారత ఉద్యోగి స్వామ్య చరిత్రలో వ్రత్యేకించి పేర్మానదగినవి. ఇందిరాగాంధీ ఆదేశిక సూత్రాల పట్ల నిబద్ధత మిషతో అధికార స్వామ్యం పట్ల నిబద్ధతా భావాన్ని ప్రోత్సహించింది. ఆచరణలో (వ్రత్యేకించి సంజయగాంధీ పైకి ఎగబాకటంతో ఇది వ్యక్తి పట్ల నిబద్ధతగా పరిణమించింది. నిబద్ధత (ప్రదర్శించిన వారు ఆదరించబడ్డారు. ప్రదర్శించనివారు శిక్షించబడ్డారు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితి తారుమారయింది. అత్యవసర పరిస్థితి కాలం నాటి బాధితులు ఉన్నతమైన పదవులతో ఆదరించబడ్డారు. 'నిబద్ధులైన అధికారులు ఇబ్బందులకు గురయ్యారు. జాతీయ స్థాయిలో తరువాత పాలనా కాలాల్లో పెద్ద ఎత్తున అలాంటి ఆదరణ, నిరాదరణలు వ్యక్తం కాలేదు. కాని బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) లేక లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్ లాంటి కుల ప్రాతిపదిక గల పార్టీల ప్రాతిపదికతో రాజకీయ నాయకుల- అధికారుల మధ్య విధేయ సంబంధం నెమ్మదిగా పెరిగే క్రమం ప్రారంభమయింది. 1999 ఏప్రిల్‌లో బి.జె.పి. పార్లమెంటు స్వతంత్రం తర్వాత భారతదేశం న!
విశ్వాసం కోల్పొయిన తరువాత రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అధికారుల్ని బదిలీ చేయడం అలజడిని పెంచే ధోరణి. ముగింపు భారతదేశం శతబ్దాల తరబడి ఏం చేసిందో అదే చేస్తుంది. ఇతర సంస్కృతుల నుండి తాను ఆకాంక్షించింది స్వీకరించటం, తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొనటం. భారత రాజ్యాంగ రూపకర్తలు ఇతర రాజ్యాంగాల నుండి స్వేచ్చగా అరువు తెచ్చుకొన్నారు. విదేశీ మొక్కలు, పెరటి మొక్కలు వేళ్లూను కొనడానికి తగినంతగా పొలాన్ని చదును చేశామనే విశ్వాసంతో అమెరికా రాజ్యాంగం, దాని సుప్రీంకోర్టు విజ్ఞత, ఐరిష్ రాజ్యాంగం యొక్క నూతన మార్పులు, కాలానికి నిలబడిన బ్రిటిష్ పార్లమెంటు సాంప్రదాయాలు, భారత ప్రభుత్వ చట్టం 19835 యొక్క పాలనా పరమైన వివరణలు, అన్నిటిని మించి ప్రత్యేకించి భారత ప్రజల స్వతంత్ర పోరాట సారాంశం
- అన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క రూపంలోను విషయంలోనూ విలీనమయ్యాయి. భారతదేశం తాను వాగ్దానం చేసిన స్వేచ్చని ప్రజలకు ఇవ్వగలదా?
- అని శంకించిన సందేహస్పదులు వున్నారు. గతంలోకి ఒకసారి తిరిగిచూస్తే భారత రాజ్యాంగం దాన్ని రూపు దిద్దిన వారిని నిరుత్సాహపరచలేదు. ప్రజాస్వామ్య నిర్మాణం కొరకు అది సృష్టించిన సంస్థలు కాలానికి నిలబడ్డాయి. మారుతున్న అవసరాలను తీర్చే విధంగా పరిణామం చెందాయి. త్వరితంగా మారుతున్న పరిస్థితిలో అనివార్యమైన ఒడిదుడుకులున్నప్పటికి ఎన్నికైన చట్టసభలు, అమలు జరిపే కార్యనిర్వాహక వర్గం, జాగరూకత గల న్యాయస్థానాల మధ్య అవసరమైన సమతుల్యతని, న్యాయబద్ధతని - రాజ్యాంగం సాధించింది. అందుకు భిన్నంగా భారతదేశ ప్రజాస్వామ్యం లాంఛనప్రాయమైనదా లేక స్థిరమైనదా? - అని చర్చలు జరుగుతున్నప్పటికి రాజ్యాంగంలో రాసుకొన్న (ప్రజాస్వామ్యం నిజమైనదిగా భారతీయులు అంగీకరించారు. అలా అంగీకరించడంలో తప్పులేదు. ఎందుకంటే వారు, వారి చుట్టూ వున్న ఆసియా, ఆఫ్రికా దేశాలను, దూరంగావున్న లాటిన్ అమెరికా దేశాలను, తూర్పు యూరప్ మాఖీ సోషలిస్టు దేశాలను చూసినప్పుడు వారు సాధించిందేమిటో దాని విలువేమిటో వారికి తెలుసు గనుక. పత్రికా స్వేచ్చతో సహా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్చ, ఎంపిక మేరకు రాజకీయ పార్టీలలో చేతే స్వేచ్చ, కార్మిక సంఘాలు స్థాపించుకొనే స్వేచ్చతో $2 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సహా సభలు సమావేశాలు జరుపుకొనే స్వేచ్చతో ప్రాథమిక హక్కుల రక్షణ కారకు ఒక నిర్మాణాన్ని అందించడంలో రాజ్యాంగం గణనీయమైన విజయం సాధించింది. రాజ్యం అలాగే ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చొరబాటుకు వ్యతిరేకంగా పౌరుల ప్రయోజనాల పరిరక్షకులుగా కోర్టులు పనిచేశాయి. హక్కుల అర్ధాన్ని పరిమితులను వివరించడంలో కోర్టులు సృజనాత్మక పాత్ర నిర్వహించాయి. ఉదాహరణకు పేవ్మెంట్ ద్వెల్లర్స్ కేసుగా ప్రసిద్ధి గాంచిన ఒల్లా టెల్లిస్ - బాంబే మునిసిపల్ కార్పోరేషన్ కేసులో ఆర్టికల్ 21 లోని బతికే హక్కు అంటే జీవనోపాధి హక్కుగా వాఖ్యానించబడింది.
ఆర్టికల్ 21లో హామీ కల్పించబడిన వ్యక్తి స్వేచ్చ హక్కు - 'ఒక పేదవాడు అతడు అప్పులు తీర్చనందుకు జైలులో నిర్భందించరాదని' వాఖ్యానించబడింది. హక్కులు విస్తృత ప్రజానీకానికి మేలు చేసే విధంగా వాఖ్యానించబడుతున్నాయి.
మన రాజ్యాంగం సవరణలకు అనుకూలంగా వుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభలలోనూ విడివిడిగా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాలి. అంతేగాక రెండు సభలలో మెజారిటీ సభ్యులు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదించాలని ఆర్టికల్ 368 నిర్దేశిస్తుంది. కాని 368 అర్జికల్లో సవరణల విషయంలో గాని రాష్ట్రపతి ఎన్నిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్య నిర్వాహక అధికారాల పరిమితులు, న్యాయస్థానాలు, అధికారాల పంపిణీ పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం లాంటి అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్‌లో గాని సవరణ బిల్లు కనీసం సగం రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం పొందాలి. 368 ఆర్టికల్ రాజ్యాంగంలోని ఏ భాగం కూడా సవరణల కతీతమని చెప్పలేదు. కాని సుప్రీంకోర్టు 'మౌలిక నిర్మాణ సిద్ధాంతం ద్వారా లేక రాజ్యాంగం యొక్క “మౌలిక లక్షణాల) ద్వారా సవరణ అధికారాలపై పరిమితులు విధించింది. ఈ సిద్ధాంతం పెద్ద మెజారిటీ ప్రభుత్వాల సవరణల ఆకాంక్షలపై ఆరోగ్యకరమైన ప్రతిబంధకంగా పనిచేస్తుంది.
రాజ్యాంగంలో చేయవలసిన సవరణలను గురించి చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. కొందరు అధ్యక్ష తరహా పరిపాలన ప్రవేశపెట్టాలన్నారు. పోలైన ఓట్లలో ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించే ప్రస్తుత విధానం స్థానంలో గాని లేక అదనంగా గాని దామాషా ప్రాతినిధ్య విధానం ప్రవేశపెట్టాలని మరి కొందరన్నారు. మరి కొందరు చాలా ఇతర దేశాలలోలాగా గెలిచిన అభ్యర్థులు కనీసం 50% ఓట్లు సాధించాలన్నారు. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పెట్టే విశ్వాసరాహిత్య తీర్మానం ప్రత్యామ్నాయ ప్రభుత్వం పై విశ్వాసం కల్పించేదిగా వుండాలని మరికొందరు ప్రతిపాదించారు. గణనీయమైన ప్రతికూలత వున్నప్పటికి బి.జె.పి నాయకత్వంలోని స్వతంత్రం తర్వాత భారతదేశం 08
యన్.డి.ఎ. ప్రభుత్వం 2000 సం॥లో రాజ్యాంగ సమీక్షా కమిషన్ (కన్స్టిట్యూషన్ రివ్యూ కమీషన్) నియమించింది. అత్యధిక పార్టీలు, అత్యధిక ప్రజానీకం వారు కోరే ముఖ్యమైన మార్పులు ప్రస్తుత రాజ్యాంగ నిర్మాణం పరిధిలోనే జరగాలన్నారు. మన వైఫల్యాలను రాజ్యాంగానికి ఆపాదించలేము. వైఫల్యాలున్నాయి. చాలా వున్నాయి. మనల్ని విఫలం చేసింది రాజ్యాంగం కాదు. రాజ్యాంగాన్ని మనం విఫలం చేశాం. రాజ్యాంగ రూపకల్పన సమయంలో రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా రాజ్యాంగం కొరకు పనిచేసే వారెంత మంచిగా వుంటారో రాజ్యాంగం అంత మంచిగా వుంటుంది. భారత రాజకీయ వ్యవస్థని తీవ్రంగా విమర్శిస్తూ దాని భవిష్యత్తు పట్ల నిరాశా పూరితవైఖరి వున్న వ్యాఖ్యాతలు కూడా రాజ్యాంగాన్ని విమర్శించలేక పోతున్నారు. అత్యధిక పాలనా వ్యవస్థలు తరతమ భేదాలతో న్యాయబద్దతని కోల్పోయిన సమయంలో రాజ్యుంగం గౌరవ ్రదమైనదిగా కొనసాగుతున్నది. ఇంత వైవిధ్యం ఇంత సంక్షిష్టత వున్న దేశంలో ఇది చిన్న విషయం కాదు. నూతన సహస్రాొబ్దిలో బహుశా మన కోసం నిరీక్షిస్తున్న సంక్షోభ సమయాలలో రాజ్యాంగం మనం నిలదొక్కుకొనడానికి అవసరమైన లంగరు అవుతుంది. ప్రజాస్వామ్య, సెక్యులర్, సమానావకాశాలు గల, పౌరస్వేచ్చ గల సమాజం పట్ల దానికి గల అసందిగ్ధమైన నిబద్ధత రాజ్యనౌకని దాని లంగరుకి దృఢంగా కట్టి పుంచటానికి తోద్బడుతుంది. ! బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
6 జోషి తొలి సంవత్సరాలు
1947 ఆగష్టు 15 - స్వతంత్రం పొందిన తొలిదినం. దేశమంతటా ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం వెల్లివిరిసాయి. తరతరాల దేశభక్తుల త్యాగాలు - మృతవీరుల రక్తతర్పణం ఫలించింది. కాని దేశం విభజింపబడడంతో ఈ ఆనందోత్సాహాలపై నీలినీడలు కమ్మాయి. కొత్తగా ఏర్పడిన రెండు దేశాలలోని పలు ప్రాంతాలను మత కలహాలు చుట్టుముట్టాయి. అభద్రతా భావంతో లక్షలాది ప్రజలు సరిహద్దులు దాటుతున్నారు. ఒకవైపు ఆహార పదార్థాలు ఇతర వినిమయ వస్తువుల కొరత. మరాకవైపు పాలనా యంత్రాంగం కుప్పకూలుతుందనే భయం.
ఆగష్టు 14 రాత్రి స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి (ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌ని ఉద్దేశించి చేసిన చిరస్మరణీయ ప్రసంగంలో ప్రజల ఆశలు అకాంక్షల్ని వ్యక్తీకరిస్తూ ఇలా చెప్పారు.
“చాలా సంవత్సరాల క్రితం మనం గమ్యం చేరాలని ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతిజ్ఞని నెరవేర్చుకునే సమయం వచ్చింది. అర్ధరాత్రి గంట కొట్టిన క్షణాన ప్రపంచం నిద్రలో మునిగివున్నప్పుడు భారతదేశం చైతన్యవంతమవుతుంది. స్వతంత్రమవుతుంది. చరిత్రలో చాలా అరుదుగా వచ్చే క్షణంలో మనం పాతశకం నుండి కొత్తశకంలోకి అదడుగువేస్తున్నాం. చిరకాలం అణచిపెట్టబడిన జాతి ఆత్మ గొంతుక విప్పుతోంది. ఈ మహత్తర క్షణాన మనం, భారతదేశం, భారతదేశ ప్రజలు యింకా విస్తృతంగా మానవాళి సేవకు అంకితమవుతామని (ప్రతిజ్ఞ తీసుకొనడం సముచితంగా వుంటుంది. దురదృష్టకాలం ఈనాటితో ముగుస్తుంది. భారతదేశం తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం లెగ్
కాని స్వతంత్రంతో పాటు అనేక సమస్యలు శతాబ్దాల వెనుకబాటుతనం, పాత ఆలోచనలు, అసమానత, అజ్ఞానం - గుదిబండలుగా దేశాన్ని కృంగదీస్తున్నాయి. రెండు శతాబ్దాల వలసవాదం శిధిలాలను తాలగించవలసి వుంది. స్వతంత్ర పోరాట వాగ్దానాలను నెరవేర్చవలసి వుంది. సుదీర్హమయిన ప్రయత్నం ఇప్పుడే మొదలయింది. జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 14న చెప్పినట్లు “ఈ రోజు జరుపుకుంటున్న ఉత్సవం ఒక ముందడుగు మాత్రమే. సాధించవలసిన విజయాలకు ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు పూలబాట కాదు. మనం చాలా తరుచుగా చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి నిరంతర కృషి సాగించవలసి వుంది.” స్వదేశీ సంస్థానాల విలీనం, విభజనతోపాటు వచ్చిపడిన మతకలహాలు, 60 లక్షలకు పైగా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన శరణార్జుల పునరావాసం, మతవాద (గ్రూపులచే భయకంపితులైన ముస్లింలకు రక్షణ, పాకిస్తాన్‌తో యుద్ధ నివారణ, కమ్యూనిస్టుల తిరుగుబాటు లాంటి తక్షణ సమస్యలు ఉన్నాయి. శాంతి భద్రతల పునరుద్ధరణ, రాజకీయ స్థిరత్వం, విభజన వలస సైన్యం, ఉన్నతాధికారవర్లం మతపరంగా విభజింపబడటం వలన పట్టుదప్పిన పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం లాంటివి ఇతర తక్షణ కర్తవ్యాలు. నెహ్రూ 1947లో ప్రకటించినట్లుగా 'మొదటి కర్తవ్యాన్ని మొదట చేపట్టాలి, భారతదేశ రక్షణ, స్థిరత్వం మొదటి కర్తవ్యం.” రాజకీయ శాస్త్రవేత్త డబ్యు: హెచ్. మోరిస్ జోన్స్ మాటల్లో మొదటి కర్తవ్యం “నీటిలో అలవాటు పడడానికి సజీవంగా వుండడానికి పడవలు తేలియాడుతూ వుండేలా చూసుకోవాలి.” వీటికి తోడు రాజ్యాంగ రూపకల్పన, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పౌరహక్కులు గల రాజకీయ వ్యవస్థ నిర్మాణం, కేంద్రంలో రాష్ట్రాలలో ప్రాతినిధ్య బాధ్యాతాయుత ప్రభుత్వాల ఏర్పాటు కొరకు ఎన్నికల నిర్వహణ, పూర్తిస్థాయి భూసంస్కరణల ద్వారా అర్ధ భూస్వామ్య వ్యవసాయ విధానాన్ని రద్దు చేయుట - లాంటి మధ్య కాలిక సమస్యలున్నాయి. ( జాతీయ సమైక్యతని పెంపొందించుట, జాతి నిర్మాణ (క్రమాన్ని వేగవంతం చేయుట, పేదరికాన్ని తొలగించి ప్రణాళికా క్రమాన్ని ప్రారంభించి త్వరిత ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టుట - లాంటివి, కొత్తగా ఏర్పడిన స్వతంత్ర ప్రభుత్వం యొక్క దీర్జకాలిక కర్తవ్యాలు. అంతేగాక స్వతంత్ర పోరాటం (ప్రజలలో రగుల్మొల్సిన ఆశలు ఆకాంక్షలకు వాటి అమలుకు మధ్యగల అంతరాన్ని వీలైనంత త్వరలో పూరించుట; శతాబ్దాల తరబడిగా కొనసాగుతున్న సొమాజిక అన్యాయం అసమానత అణచివేతలను తొలగించుట; అంతకంతకు ప్రచ్చన్న 96 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
యుద్ధ మేఘాలచే ఆవరించబడి శత్రు శిబిరాలుగా విభజితమైయున్న ప్రపంచంలో భారతదేశ స్వతంత్రతని పరిరక్షించి ప్రపంచ శాంతిని పెంపొందించే విదేశాంగ విధానాన్ని రూపొందించుట - ఇతర ముఖ్యమైన కర్తవ్యాలు.
ఈ సమస్యలన్నీ జాతీయోద్యమ నిబద్ధత యొక్క మౌలిక విలువలకు, విస్తృతమైన
జాతీయైక్యతకు లోబడి పరిష్మరించవలసివుంది.
ప్రజలు, రాజకీయ నాయకత్వం ఈ స్వల్పకాలిక దీర్హకాలిక సమస్యల్ని దేశ భవిష్యత్తు పట్ల విశ్వాసంలో ఆశావాదంతో చేపట్ట సమాయత్తమయ్యారు. నెహ్రూ కాలంలో చాలా సంవత్సరాల వరకు ఈ స్థితి కొనసాగింది. నెహ్రూ, ఆయన విధానాల పట్ల అసంతృప్తితో విమర్శించిన వామపక్షవాదులు కూడా ఈ ఆశావాదంలో పాలుపంచుకున్నారు. నెహ్రూ పాలనా కాలాన్ని చూసినవారు ఇప్పుడు గతాన్ని తలచుకొని ఆ కాలంలో తాముండడం అదృష్టంగా భావిస్తారు. దాదాపు దశాబ్దం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన తరువాత నెహ్రూ ఈ భావాన్ని ఇలా వ్యక్తం చేశాడు. “ఈ మారుతున్న ప్రపంచంలో నాటకీయతకు కొదవలేదు. భారతదేశంలో కూడా మనం చాలా ఉత్తేజపరచే కాలంలో జీవిస్తున్నాం. సుదీర్ధమైన భారతదేశ చరిత్రలో ఈ కాలంలో నివశించడం ఈ తరం ప్రజల ప్రత్యేకతగా భావిస్తాను. విస్తృతమైన ప్రపంచంలో నేదు భారతదేశంలో పనిచేయడం కంటే ఆసక్తికరమైన విషయం వుండదని విశ్వసిస్తున్నాను.”
ఈ ఉల్లాసభరితమైన దృశ్యం 1962 ఇండియా, చైనా యుద్ధంతో అంతరించింది. యుద్ధం ఒక మేరకు వాస్తవికతని కళ్ళకు కట్టింది. పరాజితులమన్న భావం నెహ్రూకి గాని దేశానికిగాని కలుగలేదు. నెహ్రూ భవిష్యదాశావాది. భవిష్యదాశావాదాన్ని ప్రజలకు అందజేయడంలో నెహ్రూ కృతకృత్యుడయ్యాడు.
ప్రస్తుతం మనం స్వల్పకాలిక సమస్యల్ని గురించి ఇక్కడ చర్చిద్దాం. దీర్హకాలిక కర్తవ్యాలు, నెహ్రూ నాయకత్వంలో దేశ పరిణతి, రాజకీయ పార్టీల అభివృద్ధి తరువాతి అధ్యాయాలలో చర్చిద్దాం.
స్వతంత్ర భారత దేశానికి దేశవ్యాప్తంగానున్న బలమైన కాంగ్రెస్ పార్టీతో పాటు ఉన్నతాదర్శ్భాలు అంకితభావం గల విశిష్టమైన నాయకత్వంతో కర్తవ్య సాధనకు సమాయత్తమయ్యే అవకాశం లభించింది. నెహ్రూతో పాటు స్వతంత్ర్య పోరాటంలో గణనీయమైన పాత్ర నిర్వహించిన నాయకుల బృందం వున్నది. ఆయన వెంట దృఢ
స్వతంత్రం తర్వాత భారతదేశం 97
సంకల్పం, నిర్ణయాత్మకమైన కార్యాచరణ, పరిపాలనాదక్షత గల ఉపప్రధాని సర్దార్ పటేల్ వున్నారు. ఇంకా విద్యా సంపన్నుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, అమోఘమైన పరిజ్ఞానం కల రాజేంద్రప్రసాద్, అద్భుత మేధావి సి.రాజగోపాలాచారి ఆయనతో వున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో, యు.పి.లో గోవింద వల్లభ్ పంత్, పశ్చిమ బెంగాల్లో బి.సి.రాయ్, బొంబాయిలో బి.జి.ఖేర్, మొరార్జీదేశాయ్ లాంటి (ప్రజల విశ్వాసం పొందిన నాయకులున్నారు. ఈ నాయకులందరూ ప్రజా ఉద్యమాలను నడపడం ద్వారా రాజకీయ పార్టీని నిర్మించడం ద్వారా, వలసవాద చట్టసభలలో దశాబ్దాల పాటు పని చేయడం ద్వారా ఆధునిక ప్రజాస్వామ్య పరిపాలనా రాజకీయ వ్యవస్థని నడపగల నిపుణతలు, అనుభవం సాధించారు. జాతీయోద్యమం ఉమ్మడి రాజకీయ అజెండాతో వున్న వివిధ ప్రాంతాలను సమాజంలోని వివిధ సెక్షన్లను, సైద్ధాంతిక నిబద్ధతలను సమైక్యం చేసింది. కాంగ్రెస్ వెలుపల ఆచార్య నరేంద్ర దేవ్ జయప్రకాష్ నారాయణ లాంటి సోషలిస్టులు, పి.సి.జోషి అజయ్ ఘోష్ లాంటి కమ్యూనిస్టులు, శ్యాం ప్రసాద్ ముఖర్జీలాంటి ఉదార మతవాదులు, దాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ లాంటి దళిత నాయకులు వున్నారు. కాంగ్రెస్ పరిధి వెలుపల ప్రఖ్యాత తత్వవేత్త డాక్టర్ యస్. రాధాకృష్ణన్, ప్రముఖ విద్యావేత్త దాక్టర్ జాకీర్‌హుస్సేన్, ఇంగ్లాండులో భారత స్వాతంత్రం కోసం పోరాడిన వి.కె.కృష్ణమీనన్, ఇంకా అంకితభావం గల పలువురు గాంధేయవాదులు వున్నారు. స్వతంత్ర భారతదేశ నాయకులు వ్యక్తిగత నిజాయితీ పరులు, నిరాడంబర జీవన విధానాన్ని పాటించిన వారు. ఉదాహరణకు సర్హార్ పటేల్ కాంగ్రెస్‌కి నిధుల్ని సంపన్నుల నుండి సమీకరించినప్పటికీ ఏ ఒక్కరూ ఆయనవైపు వేలెత్తి చూపలేదు. స్వతంత్ర భారతదేశం పట్ల కాంగ్రెస్ నాయకులకు ఉమ్మడి దృక్పథం వుంది. వారు ఆర్థిక సామాజిక మార్చు, సమాజాన్ని రాజకీయాల్ని ప్రజాస్వామ్య బద్ధం చేయటం, జాతీయోద్యం అందించిన విలువలు - లాంటి లక్ష్యాల పట్ల నిబద్ధతగలవారు. ఈ విలువల పట్ల నెహ్రూకి గల నిబద్ధత అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య విలువలు, పౌరహక్కులు, సెక్యులరిజం, స్వతంత్ర ఆర్టికాభివృద్ధి, సామ్రాజ్యవాద వ్యతిరేకత, సంఘసంస్కరణ, పేదలపట్ల అనుకూల వైఖరి- లాంటి విలువల పట్ల సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి.రాజగోపాలాచారి అంతే నిబద్దత గలవారు. సోషలిజం, సమాజ వర్ష విశ్లేషణ సమస్యలపై ఈ నాయకులు నెహ్రూతో విభేదించారు. ఈ అంశంపై పటేల్‌ని విమర్శకులే కాక అభిమానులు కూడా అపార్హం చేసుకున్నారు. మితవాదులు అతణ్ణి నెహ్రూ దృక్పధం, విధానాలపై దాగిచేసేందుకు ఉపయోగించుకున్నారు. వామపక్ష విమర్శకులు అతడిని కరుడుగట్టిన మితవాదిగా చిత్రించారు. ఇరువురిదీ తప్పే. దేశాభివృద్ది 98 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొరకు జాతి ఏకాభిప్రాయాన్ని నిర్మించటం అవసరమని నెహ్రూ, ఇతర నాయకులు విశ్వసించారు. ప్రజల మద్దతు విపరీతంగా వుండడం వలన నాయకత్వం బలపడింది. అన్నిటినీ మించి 1950 డిసెంబర్ తరువాత పార్టీపై, ప్రభుత్వంపై తిరుగులేని అధికారంగల నెహ్రూ ఈ గగ్రూపుకి నాయకత్వం వహించాడు. భారతదేశ పరిస్థితులలో మరొక సానుకూలమైన అంశం : బలమైనది, ప్రజాస్వామ్య యుతంగా పనిచేసేది, దేశవ్యాప్తంగా విస్తరించి యున్న సువ్యవస్థితమైన నాయకత్వంతో బలమైన మూలాలతో ప్రజల మద్దతు గలిగిన కాంగ్రెస్ పార్టీ వుండటం. ఒక్క కమ్యూనిష్టుపార్టీ మినహా దాని ఆధిక్యతని న్యాయబద్దతనూ మరెవరూ ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ఉద్యమం పార్టీగా మార్చబడినప్పటికీ, రాజకీయంగా, సైద్ధాంతికంగా వైవిద్య స్వభావాన్ని నిలబెట్టుకునేందుకు సతమతమవుతున్నప్పటికీ, సంక్షుభితమైన విభజనాంతర కాలంలో ఉమ్మడి కార్యక్రమాన్ని అమలు జరిపేందుకు వీలైనంత విస్తృతమైన ఏకాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం అవసరమని నాయకత్వం గుర్తించింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా వుండాలని నిర్ణయించుకున్నప్పటికీ, రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ వున్నప్పటికి కాంగైస్ నాయకత్వం ప్రముఖులైన క్రాంగ్రేసేతరులను కలుపుకొని రాజ్యాంగపరిషత్, ప్రభుత్వం పునాదిని విస్తరించింది. (ప్రభుత్వం వాస్తవంగా జాతీయ ప్రభుత్వమయింది. ఉదాహరణకు నెహ్రూ మొదటి మంత్రివర్గంలోని 14 మందిలో ఐదుగురు కాంగ్రేసేతరులు. వారు బి.ఆర్. అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీలు 1947కి ముందు కాంగ్రెస్‌ని వ్యతిరేకించారు. జాన్‌మత్తాయ్, సిహెచ్. బాబా, షణ్ముఖంచెట్టీ. అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన కమిటీ ఛైర్మన్ చేయబడ్డాడు. మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ యస్. రాధాకృష్ణన్ ఎప్పుడూ కాంగ్రెస్ సభ్యుడు కాదు. స్వదేశీ సంస్థానాల విలీనం విభజనానంతర భారతదేశాన్ని, స్వదేశీ సంస్టానాల్ని ఒకే పరిపాలన క్రిందకు తీసుకొని రావడం నాయకత్వం ఎదుర్శొన్న అత్యంత ముఖ్యమైన సమస్య, వలసపాలనలో వున్న భారతదేశంలో 40 శాతం భూభాగంలోని 56 చిన్న పెద్ద రాజ్యాలు స్వదేశీ సంస్థానాధీశుల పాలనలో వున్నాయి. వారు బ్రిటీషు సార్వభౌమాధికారం [క్రింద తరతమ స్థాయిల స్వతంత్ర ప్రతిపత్తి ననుభవించారు. (బ్రిటీషు పాలకులు వారికి (ప్రజల నుండి రక్షణ కల్పించారు. అలాగే బయటి దురాక్రమణల నుండి రక్షించారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 99
1947లో (బ్రిటీషువారు వెళ్లిపోవడంతో న్వదేశీ సంస్థానాల భవిష్యత్తు చర్చనీయాంశమైంది. పెద్ద సంస్థానాధీశులు స్వతంత్రాన్ని గురించి కలలు గనడం ప్రారంభించారు. అందుకు పథకాలు రూపొందించనారంభించారు. సార్వభౌమాధికారం కొత్త రాజ్యాలైన భారతదేశం, పాకిస్తాన్లకు ఐదిలీ చేయబడకూడదని కోరుకున్నారు. వారి ఆశలకు బ్రిటీషు ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లే 1947 ఫిబ్రవరి 20న చేసిన ప్రకటన “బ్రిటీషు ప్రభుత్వం తన సార్వభౌమాధికార హక్కులను, బాధ్యతలను బ్రిటీషు ఇండియాలోని ఏ ప్రభుత్వానికి అప్పగించదు” - అని ఆజ్యం పోసింది. ఫలితంగా పలువురు సంస్థానాధీశులు బ్రిటీషు పాలన అంతమైన 1947 ఆగస్టు 15 నుండి తమ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలవుతాయని ఆశించారు. అంతేగాక “సార్వభౌమాధికారం అంతమైనప్పటి నుండి సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలవుతాయి అవి కోరుకుంటే అవి స్వతంత్ర రాజ్యాలుగానే వుండి పోవచ్చును” - అని 1947 జూన్ 18న మహమ్మదాలీ జిన్నా చేసిన ప్రకటన వారికి మరికొంత ఊపునిచ్చింది. కాని ఆ తరువాత బ్రిటీషు ప్రభుత్వ వైఖరి మారింది. ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా బిల్లుపై చేసిన ప్రసంగంలో అట్లీ సంస్థానాలన్ని కాలక్రమంలో బ్రిటీషు కామన్వెల్త్లోని ఏదో ఒక అధినివేశ రాజ్యంలో చేరవలసి వుంటుందని ప్రకటించాడు. భారతదేశ వ్యాప్తంగా వున్న చిన్న పెద్ద సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా వుండడం, స్వతంత్ర భారతదేశ ఐక్యతకు ప్రమాదం గనుక జాతీయవాదులు వ్యతిరేకించారు. అంతేగాక 19వ శతాబ్వంతం నుండి నంస్తానాల ప్రజలు జాతి నిర్మాణ వక్రియలో భాగస్వాములయ్యారు. బలమైన భారీత జాతీయతా భావాల్ని అలవరచుకొన్నారు. సహజంగానే (్రిటీషిండియా అలాగే సంస్తానాలలో వున్న జాతీయవాదులు స్వదేశీ సంస్థానాల స్వతంత్రతని తిరస్మరించారు. కాన్ స్వదేశీ సంస్థానానికి ప్రాదేశిక సామిష్యత, ప్రజల ఆకాంక్షల్ని బట్టి భారతదేశం, పాకిస్తాన్లలో ఏదో ఒక దానిలో విలీనమయ్యే అవకాశం కల్పించాలన్నారు. రాజకీయాధికారం ప్రజలకు చెందుతుంది గాని పాలకునికి కాదని, సంస్థానాల ప్రజలు భారతజాతిలో అవిచ్చిన్న భాగమని జాతీయోద్యమం చాలా కాలం నుండి నిశ్చితాభిప్రాయంతో వుంది. అంతే గాక సంస్థానాల ప్రజలు సంస్థానాల 'ప్రజాసదస్సు నాయకత్వంలో సమీకృతులై ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కొరకు, తమతమ సంస్థానాల్ని దేశంలో విలీనం చేయమని డిమాండ్ చేస్తున్నారు. నచ్చచెప్పడం, ఒత్తిడి - రెండు పద్దతుల్ని ప్రయోగించి, నిపుణత రాజకీయ విజ్ఞత ప్రదర్శించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశంలోని వందలాది స్వదేశీ సంస్టానాల్ని రెండు దశలలో భారతదేశంలో విలీనం చేయగలిగాడు. కొన్ని సంస్థానాలు 1947 ఏప్రిల్‌లో 100 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజ్యాంగ పరిషత్‌లో చేరటం ద్వారా విజ్ఞత, వాస్తవికత ఒక మేరకు దేశభక్తి ప్రదర్శించాయి. కాని మెజారిటీ సంస్థానాలు దూరంగా వుండిపోయాయి. తిరువాన్మూర్, భోపాల్, హైదరాబాద్ లాంటి కొన్ని సంస్థానాలు స్వతం(త్రంగా వుండాలనే తమ ఆకాంక్షని బాహాటంగా ప్రకటించాయి.
సర్దూర్ పటేల్ 1947 జూన్ 27న కొత్తగా సృష్టించబడిన “సంస్థానాల శాఖ' బాధ్యతలు స్వీకరించాడు. వి.పి.మీనన్ ఆ శాఖ కార్యదర్శి. సంస్థానాధీశులు రాజీ పడకపోతే భారతదేశ ఐక్యతకు ప్రమాదం పొంచివుందని పటేల్‌కి స్పష్టంగా తెలుసు. పరిస్థితి ప్రమాదకరంగా వుందని మనం సరియైన సమయంలో సమర్ధవంతంగా వ్యవహరించకపోతే కష్టపడి సంపాదించిన స్వతంత్రం సంస్థానాల దొడ్డిదారి గుండా అదృశ్యమవుతుందని పటేల్ మీనన్‌ని హెచ్చరించాడు. లొంగిరాని సంస్థానాల్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించాడు.
ప్రాదేశిక హద్దులు పూర్తిగా భారతదేశంలో గల సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేయవలసిందిగా పటేల్ విజ్ఞప్తి చేశాడు. అసహనంగా వున్న సంస్థాన ప్రజల్ని తాను అదుపు చేయలేకపోవచ్చునని, ఆగష్టు 15 తరువాత ప్రభుత్వం విధించే షరతులు కఠినంగా వుంటాయని హెచ్చరించాడు.
సంస్థానాలలో ప్రజా ఉద్యమాలు వెల్లువత్తనున్నాయనే భయంతో, పటేల్ దృఢంగా నిష్కర్షగా వ్యవహరిస్తాడనే ఆందోళనతో జునాఘడ్, జమ్మూ కాళ్ళీర్, హైదరాబాద్ సంస్థానాధీశులు తప్ప మిగిలిన వారందరూ పటేల్ విజ్ఞప్తికి స్పందించి, 1947 ఆగష్టు నాటికి విలీనం చేశారు. 1948 సంవత్సరాంతానికి అంగీకరించని ముగ్గురు కూడా లొంగక తప్పలేదు.
- జునాఘడ్ సౌరాష్ట్ర తీరంపై చుట్టూ భారత ప్రాదేశిక సరిహద్దులు గల చిన్న సంస్థానం. భౌగోళికంగా పాకిస్తాన్ ప్రక్కనున్న సంస్థానం కాదు. అయినప్పటికీ అత్యధికులు హిందువులుగా గల సంస్థాన ప్రజలు భారతదేశంలో కలవాలని కోరినప్పటికీ జునాఘడ్ నవాబు పాకిస్తాన్లో విలీనం అవుతుందని 1947 ఆగష్టు 15న (ప్రకటించాడు.
జాతీయనాయకులు సంస్థానాధీశులకు వ్యతిరేకంగా ప్రజల పాలనాధికారం కొరకు దశాబ్దాల కాలంగా పనిచేశారు. కాబట్టి ప్లెబిసైట్ నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని నెహ్రూ, పటేల్ అంగీకరించారు. అందుకు భిన్నంగా పాకిస్తాన్ జునాగడ్ విలీనాన్ని ఆమోదించలేదు. ఉద్యమించారు. నవాబు పలాయనం చిత్తగించక తప్పలేదు. ప్రజలు తాత్కాలిక ప్రభుత్వాన్ని వర్చరచారు. జునాగడ్కి దినాన్గా వున్న స్వతంత్రం తర్వాత భారతదేశం 101
షానవాజ్ భుట్టా (జుల్పికర్ ఆలీ భుట్టొ తండ్రి) జోక్యం చేసుకొనేందుకు భారత (వ్రభుగ్వాన్ని ఆహ్వానించాలని నిర్ణయించాడు. భారత సైన్యాలు సంస్థానంలో ప్రవేశించాయి. 1948 ఫిబ్రవరిలో ప్లెబిసైట్ నిర్వహించబడింది. భారతదేశంలో విలీనానికి అనుకూలంగా ప్లెబిసైట్ ఫలితం వచ్చింది. కాళ్ళ్మీర్కి భారతదేశం పాకిస్తాన్‌లు సరిహద్దులుగా వున్నాయి. పాలకుడు హదిసింగ్ హిందూ. దాదాపు 75 శాతం జనాభా ముస్తింలు. హరిసింగ్ భారతదేశంలో గాని, పాకిస్తాన్లో గాని విలీనానికి ఆమోదం తెలపలేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, పాకిస్తాన్లో మతవాదం - రెంటికి ఎడంగా వుండి న్వతం్యత రాజుగా కొనసాగాలనుకున్నాడు. షేక్ అబ్బుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. భారత నాయకులు కాళ్ళీరుని చేర్చుకొనటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. చేరిక విషయం నిర్ణయించవలసింది కాళ్ళీరం ప్రజలనేది వారి వైఖరి. నెహ్రూ పటేల్‌లు జునాగడ్, హైదరాబాద్‌లు కూడా ప్రజల అభీష్టం మేరకు చేరవచ్చునన్నారు. గాంధీజీ మద్దతు తెలిపాడు. ప్రజల ఆకాంక్ష మేరకు కాళ్ళీరు భారతదేశంలో గాని, పాకిస్తాన్లో గాని కలవవచ్చునని గాంధీజీ 1947 ఆగష్టులో ప్రకటన చేశాడు. జునాగడ్, హైదరాబాద్‌ల చేరిక విషయంలో పాకిస్తాన్ ప్పెబిసైట్ సూత్రాన్ని నిరాకరించింది. కాశ్మీరు విషయంలో దగ్గర దారులు వెతక ప్రయత్నించింది. ఫలితంగా భారతదేశం తన వైఖరిని పాక్షికంగా మార్చుకొనక తప్పలేదు. అక్టోబర్ 22న పాకిస్తాన్ మిలటరీ ఆఫీసర్లు అనధికారికంగా పఠానులకు ఆయుధాలు సమకూర్చి కాళ్ళీర్పై దండయాత్ర సాగించారు. కాశ్మీరు రాజధాని శ్రీనగర్ వైపు దూసుకువెళ్ళారు. సరియైన శిక్షణ లేని మహరాజా సైన్యం దాడి చేసిన సైన్యానికి దీటు కాదు. అక్టోబరు 24న మహారాజ్ఞా భారతదేశాన్ని సైనికంగా సహాయం చేయవలసిందిగా అర్ధించాడు. నెహ్రూ ఆ దశలో కూడా (ప్రజాభిప్రాయాన్ని నిర్ధారించుకోకుండా విలీనానికి అనుకూలంగా లేడు. కాని అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ అంతర్జాతీయ సూత్రాన్ని అనుసరించి సంస్థానం నామమాత్రంగా నైనా విలీనం అయిన తరువాత మాత్రమే భారతదేశం సైన్యాన్ని పంపించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశాడు. షేక్ అబ్బుల్లా, సర్థార్ పటేల్ విలీనానికి ఒత్తిడి తెచ్చారు. అక్టోబర్ 26న మహారాజా భారతదేశంలో విలీనం చేశాడు. సంస్థాన పాలనా బాధ్యతల్ని అబ్బుల్లాకి అప్పగించేందుకు అంగీకరించాడు. నేషనల్ కాన్ఫరెన్స్, మహారాజా శాశ్వత విలీనాన్ని కోరినప్పటికి భారతదేశం తనకు ప్రజాస్వామ్యం పట్లగల 102 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నిబద్ధతతోను, మౌంట్‌బాటన్ సలహాతోను కాళ్ళీరులో శాంతి భద్రతలు పునరుద్ధరింపబడిన తరువాత రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించింది. వీలీనం జరిగిన సైన్యాన్ని వెంటనే పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. చెడుకి లోంగకూడదని, దాడి చేసిన వారిని తిప్పికొట్టాలని గాంధీజీ నెహ్రూతో చెప్పి (ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాడు. అక్టోబరు 27న దాదాపు 100 విమానాలు సైనికుల్ని ఆయుధాల్ని తరలించాయి. శ్రీనగర్ స్వాధీనమయింది. సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు దురాక్రమణదారుల ఆధీనంలో వున్నాయి. ఘర్షణ కొన్ని నెలలపాటు జరిగింది. దురాక్రమణదారులు క్రమంగా పారదోలబడ్డారు. భారతదేశం, పాకిస్తాన్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం చెలరేగుతుందనే ఆందోళనతో భారత ప్రభుత్వం 1947 డిసెంబరు 80న మౌంట్ బాటన్ సలహా మేరకు కాళ్ళీరు సమస్యని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు నివేదించేందుకు అంగీకరించింది. పాకిస్తాన్ దాడిని గమనంలోకి తీసుకొనవలసిన సెక్యూరిటీ కౌన్సిల్ బ్రిటన్ యునైటెడ్ స్టేట్స్ సలహా మేరకు పాకిస్తాన్‌వైపు మొగ్గుచూపింది. భారతదేశం యొక్క ఫిర్యాదుని విస్మరించి కాశ్మీరు సమస్యని భారత్ పాకిస్తాన్ వివాదంగా ముందుకి తెచ్చింది. అది చాలా తీర్మానాలు చేసింది. పర్యవసానంగా ఒక తీర్మానాన్ని అనుసరించి 1948 డిసెంబరు 31న భారతదేశం పాకిస్తాన్‌లు యుద్ధ విరమణ నంగీకరించాయి. సంస్థానాన్ని యుద్ధ విరమణ రేఖ విభజించింది. అది ఇప్పటికీ అమలులో వుంది. ఐక్యరాజ్యసమితి నుండి న్యాయం ఆశించిన నెహ్రూ 1948 ఫిబ్రవరిలో విజయలక్ష్మీ పండిట్‌కు రాసిన లేఖలో 'భ్రమనుండి బయటపడటాన్ని ఇలా వ్యక్తంచేశాడు. "సెక్యూరిటీ కౌన్సిల్ (భద్రతా మండలి) ఇంత అల్బంగా, పాక్షికంగా వ్యవహరించగలుగుతుందని ఊహించలేక పోయాను. ఇది ప్రపంచ శాంతి భద్రతలని కాపాడాలి. ప్రపంచం ముకృచెక్కలయితే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ నీచమైన పాత్ర నిర్వహించాయి. బహుశా తెరవెనుక పాత్ర బ్రిటన్ పోషించి వుంటుంది.” ఆక్రమిత కాళ్ళీరు నుండి పాకిస్తాన్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత 1951లో ఐక్యరాజ్యసమితి తన పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఒక తీర్మానం చేసింది. పాకిస్తాన్ ఆజాద్ కాళ్ళీరు నుండి సైన్యాల్ని ఉపసంహరించుకొన నిరాకరించడంతో ఈ తీర్మానం నిష్టలమయింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 103
అప్పటినుండి భారత పాకిస్తాన్ స్నేహ సంబంధాల మార్గంలో కాళ్ళీర్ ఉధాన అవరోధంగా వుంది. కాశ్మీరు భారత దేశంలో అవిచ్చిన్న భాగమని కాబట్టి దాని విలినతను రద్దు చేయడం సాధ్యపడదని భారతదేశం భావించింది. పాకిస్తాన్ దీనిని తిరస్కరిస్తుంది. కాలక్రమంలో కాళ్ళీర్ భారత సెక్యులరిజానికి ప్రతీకగా నిలచింది. భారతదేశంలో హైదరాబాద్ అత్యంత పెద్ద సంస్థానం. దాని చుట్టూ భారత సరిహద్దులే వున్నాయి. హైదరాబాద్ నవాబు ఆగప్టు 15 కి ముందు విలీనానికి ఒప్పుకోని మూడవ సంస్థానాధీశుడు. ఆతడు తన సంస్థానం స్వతంత్ర రాజ్యంగా వుండాలన్నాడు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో సైనిక బలగాలను పెంచడం ప్రారంభించాడు. చర్చల ద్వారా సమస్యని పరిష్కరిస్తానని మౌంట్ బాటన్ ఆసక్తి చూపడంతో పటేల్ ఆచితూచి వ్యవహరించాడు. పాకిస్తాన్‌తో విలీనం చేయనని నవాబు బ్రిటీషు ప్రభుత్వానికి రహస్య వర్తమానం పంపాడు. బ్రిటీషు ప్రభుత్వం హైదరాబాదుకి అధినివేశ ప్రతిపత్తి ఇచ్చేందుకు నిరాకరించింది. పోరాడి సాధించుకున్న స్వతంత్ర దేశం మధ్యలో ఒక మచ్చగా హైదరాబాద్ సంస్థానం వుండటాన్ని సహించబోమన్నాడు పటేల్. చర్చలు జరుపుతుండగా నిజాం ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ప్రవేశపెడతాదని, విలీనం సులభతరమవుతుందని ఆశించిన భారత ప్రభుత్వం 1947 నవంబరులో యధాతథ స్థితి ఒప్పందంపై సంతకం పెట్టింది. కాని నిజాం పథకాలు వేరుగా వున్నాయి. నిజాం తన తరుపున భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మౌంట్ బాటన్ స్నేహితుడు 'ప్రముఖ న్యాయవాది అయిన సర్ వాల్దర్ మాంక్‌టన్‌ని నియమించుకొన్నాడు. చర్చల్ని పొడిగించాలని, ఈ మధ్య కాలంలో సైనిక బలాన్ని పెంచుకొని తన సర్వసత్తాధికారాన్ని అంగీకరించేలా భారతదేశంపై ఒత్తిడి పెంచాలని నిజాం ఆశించాడు. లేక కాళ్ళీర్ సమస్యపై భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత కారణంగా పాకిస్తాన్లో విలీనం కావచ్చునని ఆశించాడు. ఈ కాలంలో సంసానంలో మూడు పరిణామాలు సంభవించాయి. (ప్రభుత్వ సహకారంతో ముస్లిం మతహిద సంస్త ఇత్తెహాద్-ఉల్-ముసిల్మిన్, దాని మిలటరీ విభాగం రజాకార్లు వేగంగా అభివృద్ధి చెందారు. (ప్రజాస్వామ్యం కొరకు నిజాంపై ఒత్తిడి 'పెంచేందుకు హైదరాబాద్ సంస్థాన కాంగ్రెస్ 1947 ఆగస్టు 7న శక్తివంతమైన సత్యాగ్రహ ఉద్యమం చేపట్టింది. దాదాపు 20,000ల మంది సత్యాగ్రహులు జైళ్ళలో నిర్భంధింపబడ్డారు. రజాకార్ల దాడులు, ప్రభుత్వ అణచివేత కారణంగా ప్రజలు సంస్థానాన్ని వదలి భారతదేశ ప్రాంతాలలో గల శిబిరాల్లో తలదాచుకున్నారు. సంస్థాన కాంగ్రెస్ నాయకత్వంలోని 104 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉద్యమం ఆయుధాలు చేపట్టింది. మరోవైపు 1946 ద్వితీయార్ధంలో సంస్థానంలోని తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో శక్తివంతమైన రైతాంగ ఉద్యమం అభివృద్ది చెందింది. 1946 చివరినాటికి ప్రభుత్వ తీవ్ర నిర్బంధ విధానంతో తగ్గుముఖం పట్టిన ఉద్యమం, (ప్రజల రక్షణ కొరకు రైతాంగ సాయుధదళాలు రజాకార్లపై జరిపిన దాడుల కారణంగాను, భూస్వాముల్ని ఎదుర్మ్శొని వారి భూముల్ని రైతులకు భూములు లేని పేదలకు పంచడం కారణంగాను ఉద్యమం బలం పుంజుకొన్నది. నిజాంతో చర్చలు ఒక కొలిక్కి రాక కొనసాగుతుందడంతో 1948 జూన్ నాటికి సర్దార్ పటేల్ అసహనానికి గురయ్యాడు. దెహ్రడూన్లో వైద్యం పొందుతూ నెహ్రూకి ఇలా రాశాడు. 'విలీనతకు స్పష్టమైన అంగీకారం తెలిపి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం తప్ప మరొకటేదీ మాకు అంగీకారయోగ్యం కాదని నిర్మాహమాటంగా చెప్పవలసిన దశ వచ్చిందని నేను దృఢంగా విశ్వళిస్తున్నాను.” నిజాం రజాకార్లు కవ్వింపు చర్యలు చేపట్టినప్పటికి భారత ప్రభుత్వం చాలా నెలలు సహనం పాటించింది. కాని నిజాం ఆయుధాల దిగుమతిని కొనసాగించాడు. రజాకార్ల దురాగతాలు మితిమీరాయి. చివరికి 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం హైదరాబాద్‌లో ప్రవేశించింది. మూడు రోజుల తరువాత నిజాం లొంగిపోయాడు. నవంబరులో సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. భారత ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. నిజాంని శిక్షించలేదు. మాజీ సంస్థానాధీశునిగా, రాజప్రముఖునిగా గుర్తించింది. 5 మిలియన్ల రూపాయల రాజ భరణాన్నిచ్చింది. అపారమైన అతడి సంపదలో అత్యధిక భాగాన్ని అతడికే వదిలి వేసింది. హైదరాబాద్ విలీనంతో భారతదేశంలో స్వదేశీ సంస్థానాల కలయిక పూర్తి అయింది. హైదరాబాద్ కథ భారతదేశ లౌకికతత్వానికి మరో విజయం. హైదరాబాద్‌లోని అత్యధిక ముస్లిం ప్రజానీకం నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడమే గాక దేశంలోని ఇతర (ప్రాంతాల వారు కూడా పాకిస్తొన్ని నిజాంని వ్యాకులత పరచే విధంగా ప్రభుత్వ విధానానికి చర్యకి మద్దతు తెలిపారు. పటేల్ సెప్టెంబరు 28న సుహ్రవర్ధీకి సంతోషంగా రాసిన విధంగా “హైదరాబాద్ సమస్యపై భారతదేశంలోని ముస్తింలు బాహాటంగా మా పక్షం వహించారు. అది దేశంలో మంచి అభిప్రాయాన్ని సృష్టించింది. రెండవది, సంస్థానాల విలీనంలోని కష్టమైన దశ 1947 డిసెంబరులో ప్రారంభమైంది. సర్జార్పటేల్ వేగంగా కదిలి విలీన క్రమాన్ని సంవత్సరం లోపల పూర్తి చేశాడు. చిన్న సంస్థానాలు పొరుగున వున్న రాష్ట్రాలతో (సంస్థానాలతో) కలిశాయి. లేక స్వతంత్రం తర్వాత భారతదేశం 105
అలాంటివి కొన్ని కలిసి కేంద్రపాలిత (ప్రాంతాలయ్యాయి. చాలా సంస్థానాలు ఐదు కొత్త రాష్ట్రాలుగా (యూనియన్‌గా) సంఘటితం చేయబడ్డాయి. అవి మధ్యభారత్, రాజస్థాన్, పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (8250), సౌరాష్ట్ర, తిరువాన్సూర్ కొచ్చిన్లు. మైసూరు, హైదరాబాద్, జమ్మూ-కాళ్ళ్మీరులు పాతరూపంలోనే యూనియన్‌లోని కొత్త రామ్రైాఎయ్యాయి.
సంస్థానాధీశులు వారి పాలనాధికారాన్ని వదులుకొన్నందుకు ప్రతిఫలంగా అన్ని రకాల పన్నులు మినహాయించి రాజభరణాలు ఇవ్వబడ్డాయి. 1949లో 4.66 కోట్ల రూపాయలు ఇవ్వబడ్డాయి. రాజ్యాంగం కూడా ఈ చెల్లింపులకు హామీ ఇచ్చింది. పాలకుల ప్రత్యేక హక్కులు, బిరుదులు అలాగే వుంచబడ్డాయి. ప్రత్యేకమైన సందర్భాలలో వారి వారి జెండాలు ఎగురవేసి, మిలటరీ వందనాలు స్వీకరించడానికి అనుమతి లభించింది.
రాజులకు ఇచ్చిన ఈ రాయితీల పట్ల అప్పుడు ఆ తరువాత కూడా విమర్శలు వచ్చాయి. స్వతంత్రం, విభజన తరువాతి గడ్డు పరిస్థితులలో సంస్థానాధీశులు అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు, సంస్థానాల్ని దేశంలో విలినం చేసేందుకు వెచ్చించిన మూల్యం అంత ఎక్కువేం కాదు. నిస్సందేహంగా భౌగోళిక ప్రాంతాలు జనాభారీత్యా పాకిస్తాన్‌గా విడిపోవడం వలన కలిగిన నష్టాన్ని సంస్థానాల విలీనం పూరించింది. విభజన గాయాల్ని విలీనం పాక్షికంగా నయం చేసింది.
ఇంకా భారతదేశ తూర్పు, పశ్చిమతీర ప్రాంతాలలో భారతదేశంలో విలీనం కాని రెండు ప్రాంతాలున్నాయి. అవి పాండిచ్చేరి, గోవాలు ఫెంచి, పోర్చుగీసు ఆధీనంలో వున్న స్థావరాలు. ఈ స్థావరాల్లోని ప్రజలు కొత్తగా స్వతంత్రం సాధించిన భారతదేశంలో చేరిపోవాలని చాలా ఆతురతగా వున్నారు. (థ్రెంచి పాలకులు కొంత హేతుబద్దంగా ఆలోచించారు. సుదీర్ధమైన సంప్రదింపుల తరువాత పాండిచ్చేరిని, తమ ఆధీనంలో వున్న ఇతర స్థావరాల్ని 1954లో భారతదేశానికి అప్పగించారు. కాని పోర్చుగీసు వారు అలాగే వుండి పోవాలనుకున్నారు. వారి తిరస్కార వైఖరికి వారి నాటో (౧/40) మిత్రులు బ్రిటన్, అమెరికా మద్దతు తెలపడానికి సిద్ధపడ్డాయి. దేశాల మధ్యగల వివాదాలు శాంతియుత పద్ధతులతో పరిష్కరింపబడాలనే విధానం పట్ల నిబద్ధత గల భారత ప్రభుత్వం గోవాని ఇతర పోర్చుగీసు వలసలను విముక్తి చేయడానికి సైనిక చర్యలు చేపట్టడానికి 106 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సుముఖంగా లేదు. గోవా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం పాశవికంగా అణచివేయబడింది. పోర్చుగల్ పై అంతర్జాతీయాభిప్రాయం ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు చాలాకాలం నిరీక్షించిన మీదట 1961 డిసెంబరు 17 రాత్రి భారత సైన్యాలు గోవాలో (ప్రవేశించాయి. ఎలాంటి ప్రతిఘటన లేకుండా గోవా గవర్నర్ జనరల్ లొంగిపోయాడు. భారతదేశ ప్రాదేశిక రాజకీయ ఏకీకరణ పూర్తయింది. మతతత్వ మారణహోమం విభజనతో చెలరేగిన హింస సర్వస్వం కోల్పోయిన 60 లక్షల మంది కాందిశీకుల్ని భారతదేశంలోకి నెట్టివేసింది. భారతదేశం మతతత్వ మారణహోమంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో సోదరుల మధ్య యుద్ధం చెలరేగింది. భారత, పాకిస్తాన్లలోని మైనారిటీలపై చెప్పనలవిగాని అత్యాచారాలు జరిగాయి. కొద్దినెలల వ్యవధిలో 5,00,000 మంది చంపబడ్డారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు లూటీ చేయబడ్డాయి. ధ్వంసం చేయబడ్డాయి. మతతత్వ హింస సామాజిక చట్రాన్ని కుదిపివేసింది. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం కళ్లెదుట ముస్లింలపై లూటీలు హత్యలు రోజుల తరబడి నిరాఘాటంగా సాగాయి. ప్రజలు, ప్రభుత్వం అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్మొన్నారు. అన్నీటికంటే పెద్ద ప్రమాదం విభజన సృష్టించిన వాతావరణం, ఆలోచనా విధానం. ఘర్షణలు కొనసాగుతాయి. భారత రాజకీయంలో మతతత్వ ధోరణులు బలపడిపోయాయి. కాని భారత జాతీయవాదం ఈ పరీక్షకు తట్టుకొనగలిగింది. కొందరు ముఖ్యమైన కేంద్ర, రాష్ట్ర కాంగైస్ నాయకులు భయంకరమైన మతతత్వ వాద ప్రభావానికి లోనయినప్పటికి జాతీయ నాయకత్వం, ప్రజలు భారతదేశంలో సెక్యులర్ రాజకీయాల్ని నిలబెట్టగలిగారు. ఇది అంత సులభమైన పని కాదు. ప్రత్యేకించి నెహ్రూ రాజీనామా బెదిరింపులతో సహా తన శక్తి యుక్తులన్నీటిని ప్రయోగించి దీనిని సుసాధ్యం చేశాడు. కొద్ది నెలల్లో నిర్ణయాత్మకమైన రాజకీయ పరిపాలనా చర్యల ద్వారా పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉదాహరణకు ఆగష్టు సెప్టెంబరు కాలంలో (ప్రభుత్వం సైన్యాన్ని వీధుల్లోకి రప్పించి లూటీలు, హత్యలకు పాల్పడుతున్న మతతత్వ మూకల్ని కాల్చి వేయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసి మతహింస వెన్నువిరిచింది. లోపాలు, బలహీనతలు స్వతంత్రం తర్వాత భారతదేశం 107
వున్నప్పటికి విభజన తరువాత ఘర్షణల పట్ల భారత ప్రభుత్వం, ప్రత్యేకించి వ్యక్తిగతంగా నెహ్రూ వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయంగా వుంది. దేశంలోని ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం జయప్రదమయింది. అందుకే 45 మిలియన్ల ముస్లింలు దేశంలో వుండి పోవాలని నిర్ణయించుకొన్నారు.
ఆ విధంగా మతతత్వవాదం అదుపులో వుంచబడింది; బలహీన పరచబడింది; కాని తొలగించబడలేదు. పెరుగుదలకు ఇంకా అనుకూలమైన పరిస్టితులే వున్నాయి. మతతత్వవాదాన్ని తుద ముట్టించాలంటే దానికి వ్యతిరేకంగా సుదీర్హకాలం నిలకడగల పోరాటం అవసరమవుతుంది. నెహ్రూ ఈ అంశాన్ని బాగా గుర్తించాడు. అందుకే ఆయన భారత రాజకీయాలలో మతతత్వవాదం ప్రాధమిక సమస్య అని, భారతదేశ సమగ్రతకు ప్రమాదకారి అని నిరంతరం చెబుతూ వచ్చాడు. ఆయన 195 1లో ఇలా రాశాడు.
“మతతత్వాన్ని యధేచ్చగా పనిచేయనిస్తే అది భారతదేశాన్ని ముక్కలు, చెక్కలు చేస్తుంది.” మతతత్వాన్ని “ఫాసిజం యొక్క భారతీయ రూపం'గా చిత్రిస్తూ 1947 అక్టోబరులో ఇలా చెప్పాడు. 'ముస్లింలీగు తన అనుచరులలో ముస్లిమేతరులపై ద్వేషాన్ని నూరిపోస్తూ సంవత్సరాల తరబడి సాగించిన విద్వేష ప్రచారం కారణంగానే ఇప్పుడు భారతదేశంపై ఫాసిజం కెరటం పట్టుబిగుస్తున్నది. లీగు నాజీ జర్మని ఫాసిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించింది....... ఫాసిస్టు సంస్థ ఆలోచనలు పద్ధతులు ఇప్పుడు హిందువులలో ఆదరణ పొందుతున్నాయి. హిందూ రాష్ట్ర స్తాపన కొరకు డిమాండు దాని యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ, అ
ల మైనారిటీలలో భద్రతాభావం పెంచేందుకు బహిరంగ ఉపన్యాసాలు, రేడియో ప్రసారాలు, పార్లమెంటులో ఉపన్యాసాలు, ముఖ్యమంత్రులకు లేఖలు - రూపంలో నెహ్రూ విస్తృతమైన మతతత్వ వ్యతిరేక ప్రచారం చేపట్టాడు. ఆయన పలుమార్లు స్పష్టం చేశాడు. “లౌకిక రాజ్యం తప్ప మరేది నాగరిక రాజ్యం కాదు.' 1951లో గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో ఇలా చెప్పాడు. “ఏ వ్యక్తియైన మరొక వ్యక్తిపై మతపరమైన కారణం రీత్యా కొట్టడానికి చేయెత్తితే అతనికి వ్యతిరేకంగా నేను ప్రధానమంత్రిగా, సాధారణ పౌరునిగా నా తుది శ్వాస విడిచేవరకు పోరాడుతాను. ఆయన ్రజాస్వామ్యవాది అయినప్పటికి మతప్రాతిపదిక గల సంస్థలపై నిషేధాన్ని సమర్ధించాడు. మతతత్వవాద ఉపన్యాసాలను, వ్రాతలను అదుపు చేసేందుకు, (ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కులపై హేతుబద్దమైన షరతులు విధించడానికి వీలుగా రాజ్యాంగాన్ని 108 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సవరింపజేశాడు. నెహ్రూ తన మతతత్వ వ్యతిరేక పోరాటానికి సర్భార్పటేల్, సి,.రాజగోపాలాచారి లాంటి సహచరుల పూర్తి మద్దతు పొందగలిగాడు. ఉదాహరణకు పటేల్ 1948 డిసెంబరులో జరిగిన జయపూర్ కాంగ్రెస్ సదస్సులో “భారతదేశాన్ని నిజమైన సెక్యులర్ రాజ్యంగా చేసేందుకు” కాంగ్రెస్, ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నాయని స్పష్టం చేశాడు. 1949 ఫిబ్రవరిలో హిందూ రాజ్యాన్ని గురించి మాట్లాడడం పిచ్చి ఆలోచనగా వర్ణించాడు. ఆయన 1950లో ఇలా చెప్పాడు. 'మనది సెక్యులర్ రాజ్యం... ఇక్కడ ప్రతి ముస్లిం తాను భారతీయ పౌరుడినని భావించాలి. భారతీయ పౌరుడిగా సమాన హక్కులుంటాయి. అతడు ఆ విధంగా భావించగలిగేటట్లు చేయలేక పోతే మనం మనదేశ వారసత్వానికి అర్జులం కాము.” గాంధీజీ బలిదానంతో మతతత్వ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్రానికి ముందు, స్వతంత్ర సాధన నాటి మత ఘర్షణల వివాదం గాంధీజీని విపరీతంగా కలచివేసింది. 1947 ఆగష్టులో జాతి మొత్తం ఆనందోత్సవాలు జరుపుకుంటూ వుండగా, 1919 నుండి స్వతంత్ర పోరాటాన్ని నడిపిన వ్యక్తి, భారత (ప్రజలకు అహింస, (ప్రేమ, ధైర్యం - సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి, భారతీయ సంస్కృతి రాజకీయాలలోని అత్యున్నతమైన విలువలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మతాగ్గికీలల్ని చల్లార్చ యత్నిస్తూ స్వతంత్రానికి మూల్యంగా దారుణమైన మత మారణహోమంలో ప్రాణాలర్చిస్తున్న ప్రజలను ఓదారుస్తూ బెంగాలు, బీహారులలో మత విద్వేషానికి గురయిన ప్రాంతాలలో పర్యటిస్తూ వున్నాడు. 1947లో జన్మదిన శుభాకాంక్షల సందేశానికి జవాబుగా గాంధీజీ తాను ఎక్కువకాలం బతకాలని కోరుకోవటం లేదని, ఒకడు ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, మరెవరైనా కావచ్చు. మనిషి తోటి మనిషిపై పాశవికంగా సాగిస్తున్న కసాయితనానికి సాక్షీభూతంగా వుందేకంటే ఈ కన్నీటి కడలి నుండి తీసుకుపోవలనిందిగా భగవంతుడ్ని కోరుకుంటున్నానని చెప్పారు. స్వతంత్ర ఉత్సవాలు సద్దుమణిగీ మణగక ముందే 1948 జనవరి 30న హిందూ మతోన్మాది నాధూరాం గాడ్సే జాతిపిత గాంధీజీని హత్యచేశాడు. యావజ్ఞాతి దిగ్భ్రాంతికి గురయింది. జాతి దుఃఖాన్ని వ్యక్తీకరిస్తూ నెహ్రూ ఆలిండియా రేడియోలో మాట్లాడారు. “మిత్రులారా, మన జీవితాల వెలుగు అంతరించింది. అంతటా చీకటి అలుముకుంది..... కాంతి అంతరించింది అన్నాను గదూ! తప్పు. ఈ దేశంలో కాంతి సాధారణమైన వెలుగు కాదు.. ఈ వెలుగు కేవలం ్రస్తుతానికే ప్రాతినిధ్యం వహించలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 109
తప్పుదారి నుండి సరియైన దారికి స్వతంత్రం వైపు నడిపిస్తూ జీవితానికి శాశ్వత సత్యాలకు ప్రాతినిధ్యం వహించింది.”
మతతత్వ సిద్దాంతానికి కట్టుబడి గాంధీజీకి సెక్యులరిజూనికి వ్యతిరేకంగా హింసా ద్వేషాలను ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్. ) శక్తులు ఈ హత్య వెనుక వున్నాయని ప్రభుత్వం గుర్తించింది. స్వయం సేవక్ సంఘ వ్యక్తులు ఉత్సవాలు కూడా జరుపుకొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్.యస్. యస్. ని నిషేధించింది. నాయకుల్ని ముఖ్య కార్యకర్తల్ని నిర్బంధించింది. నెహ్రూ కొంతకాలం నుండి ఆర్. యస్.యస్. ఫాసిస్టు సంస్థ అని చెబుతూ వచ్చాడు. 1947 డిసెంబరులో ఆయన ఇలా చెప్పాడు. 'ఆర్.యస్. యస్. పైవేటు సైన్యం నడిపే స్వభావం గలది. నిర్మాణంతో సహా పూర్తిగా నాజీ పద్ధతులలో ముందుకు పోయే సంస్థ అని నిరూపించడానికి చాలా ఆథారాలున్నాయి.
కాని, ప్రభుత్వానికి పౌరహక్కులపై గౌరవం వుంది. నెహ్రూ 1949 జూన్ 29న పటేల్‌కి ఇలా వ్రాశాడు: “ప్రస్తుత పరిస్టితులలో నిషేధాలు నిర్బంధాలు ఎంత తక్కువ ప్రయోగిస్తే అంత మంచిది! హోం మినిష్టర్ పటేల్ విధించిన షరతుల్ని ఆమోదించిన మీదట 1949 జులైలో ఆర్.యస్. యస్.పై నిషేధం ఎత్తివేయబడింది. విధించిన షరతులు: ఆర్.యస్.యస్. ప్రచురించబడిన నిబంధనావళిని ఆమోదించాలి. రాజకీయాలలో జోక్యం చేసుకోకుండా సాంస్కృతిక కార్యకలాపాలకు పరిమితమై వుండాలి. రహస్యాన్ని ద్వేషాన్ని త్యజించాలి. భారతదేశ జెండాకి రాజ్యాంగానికి విధేయత ప్రకటించాలి. (ప్రజాస్వామ్య పద్ధతులలో సంస్థని నిర్వహించుకోవాలి. కౌందిశీకుల పునరావాసము
సర్వస్వం కోల్పోయి పాకిస్తాన్ నుండి కాందిశీకులుగా వచ్చిన 60 లక్షల మందికి ప్రభుత్వం పునరావాసం కల్పించవలసి వచ్చింది. ఈ కర్తవ్యం నెరవేర్చటానికి కొంత సమయం పట్టింది. 1951 నాటికి పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చిన కాందిశీకులకు పునరావాసం కల్పించబడింది.
కాని తూర్పు బెంగాల్ నుండి వచ్చిన కాందిశీకులకు పునరావాసం కల్పించడం చాలా కష్ట సాధ్యమయింది. కారణం తూర్పు బెంగాలు నుండి కాందిశీకులు నిరంతర ప్రవాహంలా సంవత్సరాల తరబడి వచ్చి పడుతూనే వున్నారు. 1947లో పశ్చిమ పాకిస్తాన్ నుండి దాదాపు హిందువులు, సిక్కులు అందరూ ఒక్కసారిగా వలస వచ్చారు. కాని 110 బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విభజన జరిగిన తాలి సంవత్సరాలలో అంటే 1947, ఉ8లలో తూర్పు బెంగాలులోని అత్యధిక హిందువులు అక్కదే వున్నారు. కాని అక్కడ తరచుగా మత ఘర్షణలు చెలరేగుతుండడంతో కాందిశీకులు 1971 వరకు ప్రతి సంవత్సరం వరదలా వచ్చి పడ్డారు. వారికి పని, నీడ, మానసిక ధైర్యం కల్పించడం కష్టసాధ్యమైన నిరంతర ప్రక్రియ అయింది. బెంగాల్‌లా గాక పశ్చిమ పంజాబు నుండి తరలి వచ్చిన కాందిశీకులకు పంజాబు, యుపి, రాజస్టాన్ల నుండి పాకిస్తాన్‌కి వలస పోయిన వారి ఆస్తులు పొలాలు ఆక్రమించడం సాధ్యపడింది. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఇది కాదు. అంతేగాక భాషా పరమైన సాన్నిహిత్యం కారణంగా పంజాబీ సిక్కు కాందిశీకులకు ఈనాటి హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పశ్చిమ యుపి, రాజస్తాన్, ఢిల్లీలలో స్థిరపడడం సులభతరమయింది. తూర్పు బెంగాల్ కాందిశీకుల పునరావాసం బెంగాల్లో మాత్రమే. ఒక మేరకు అస్సాం, క్రిపురలలో సాధ్యపడింది. ఫలితంగా తరలి రావడానికి ముందు వ్యవసాయ వృత్తులు జీవనాధారం గల అత్యధికులు నగరాలలో, పట్టణాలలో బతుకు తెరువు చూసుకోవలసి వచ్చింది. ఫలితంగా పశ్చిమ బెంగాల్ పేదరికంలోకి నెట్టివేయబడింది. పాకిస్తాన్‌తో సంబంధాలు పాకిస్తాన్‌తో సంబంధాల సమస్య కష్టతరమయింది. కాళ్ళీర్ సమస్య వున్నప్పటికి భారత (ప్రభుత్వం పాకిస్తాన్‌తో పరస్పర ఉద్రిక్తతలు తగ్గించుకొని సత్సంబంధాలు పెంపొందించుకునే విధానం అవలంబించాలని నిర్ణయించింది. 1948 జనవరిలో గాంధీజీ నిరాహార దీక్ష తరువాత విభజన ఆస్తుల నష్ట పరిహారం కింద 550 మిలియన్ల రూపాయలు మొత్తాన్ని పాకిస్తాన్ ఆ కాశ్మీర్లో మిలటరీ ఖర్చులకు వెచ్చించవచ్చునని ఆందోళన వున్నప్పటికి చెల్లించింది. ఇరు దేశాల నుండి వలస పోయిన వారు వదలి వెళ్ళిన ఆస్తుల అంశాలపై రెండు దేశాల వ్రభుత్వాలు విభేదించాయి. కాని చర్చల ద్వారా పరిష్మరించుకోవాలని నిర్ణయించాయి. కాళ్ళీరు సమస్యతో బాటు ఇరుదేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతను పెంచే మరొక సమస్య తూర్పు బెంగాల్‌లోని హిందువుల అభద్రతా భావం. అభద్రతా భావానికి పాకిస్తాన్ యొక్క రాజకీయ వ్యవస్థ అగ్నికి ఆజ్యంలా తోడయింది. ఇది తూర్పు బెంగాల్ నుండి పశ్చిమబెంగాల్‌కు హింసకు గురయిన హిందువుల వలసల్ని పెంచింది. :“శ్చిమ బెంగాల్లో ముస్లింలపై ప్రతీకార దాడుల కారణంగా ముస్లిముల వలసలు పెరిగాయి. మైనారిటీల రక్షణ కొరకు తూర్పు బెంగాలులో సైనికంగా జోక్యం చేసుకొమ్మని భారత ప్రభుత్వానికి చాలామంది విజ్ఞప్తి చేశారు. కాని తూర్పు బెంగాలు హిందువుల భవితవ్యం పట్ల, స్వతంత్రం తర్వాత భారతదేశం క్షేష్ష1
భారతదేశంలో మతతత్వ పెరుగుదల పట్ల ఆందోళన చెందినప్పటికీ నెహ్రూ, భారతదేశ ప్రభుత్వం ప్రతీకారచర్యలు చేపట్టాలని రెచ్చిపోలేదు. పశ్చిమ బెంగాలులో ముస్లింలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు చేపడుతూ మానవతా సమస్యగా పరిగణించి భారత ప్రభుత్వం సమస్యని నచ్చజెప్పటం ద్వారా ఒత్తిడి ద్వారా పరిష్కరించ యత్నించింది. హిందువులపై మత దాడులకు అంతం పలకవలసిందిగానూ, తూర్పు బెంగాలులో వారు నివసించడానికి వీలుగా రక్షణ చర్యలు చేపట్టవలసిందిగానూ నెహ్రూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అర్ధించాడు. మైనారిటీలకు రక్షణ కల్పించటం ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అని నెహ్రూ పలు మార్లు నొక్కిచెప్పాడు. పదవికి రాజీనామా చేసి తూర్పు బెంగాలులో ఒక ైవేటు వ్యక్తిగా పర్యటించాలని ఆలోచన చేశాడు. భారత పాకిస్తాన్ ప్రధాన మంత్రులు మైనారిటీల రక్షణ సమస్యని పరిష్కరించేందుకు 1950 ఏప్రిల్ 8న నెహ్రూ, లియాకత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పుందంపై హిందూ మతవాదులు అసమ్మతి వ్యక్తం చేశారు. బెంగాలు నుండి ఇద్దరు మంత్రులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, కె.సి. నోగి నిరసనగా రాజీనామా చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఒప్పందం జరిగినప్పటికి తూర్పు బెంగాలు నుండి వలసలు కొనసాగాయి. నిరంతరంగా విభేదాలు కానసాగుతున్నప్పటికీ రెండు ప్రభుత్వాలు వర్తకం, రవాణా అంశాలపై చాలా ఒప్పందాలు చేసుకున్నాయి. రెండు దేశాలు ఎదుర్శొన్న చాలా జటిలమైన సమస్య పంజాబులో నీటి పంపకం సమస్య. ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో పరస్పర చర్చల ప్రాతిపదికన పరిష్కరించుకొనవలసిన దీర్హకాలిక సమస్య అయినప్పటికీ భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి ఉదారంగా నీటి పరిమాణం తగ్గకుండా సరఫరా చేసేందుకు అంగీకరించింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకొనే విధానం అవలంబించింది. విద్వేషం, శత్రుత్వ వాతావరణాన్ని నివారించ యత్నించింది. భారతదేశం పాకిస్తాన్‌ని శత్రువుగా పరిగణించదని ప్రత్యేకించి నెహ్రూ పాకిస్తాన్ ప్రజలకు పలుమార్లు హమీ ఇచ్చాడు. ఈ విధానం అవలంబించటానికి ఒక కారణం భారతదేశం యొక్క సెక్యులర్ వాతావరణాన్ని పరిరక్షించి దానికి బలాన్ని చేకూర్చటం, 'సెక్యులరిజునికి మతతత్వవాదులు వ్యతిరేకులుగా వున్నారు. భారతదేశం యొక్క మంచి ఉద్దేశాల్ని చెప్పి పాకిస్తాన్‌ని శాంతింప చేయటంలో విఫలమైనప్పటికి నిస్సందేహంగా దీర్హకాలికంగా చూస్తే సత్ఫలితాలిచ్చింది. 112 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పాకిస్తాన్ పట్ల తన వైఖరిలో ఇమిడి వున్న భావాన్ని 1950లో వ్యక్తీకరించినప్పుడు నెహ్రూ తన అభిప్రాయాన్ని తన ప్రభుత్వ అభిప్రాయాన్ని సెక్యులర్ భావాలు గల భారత ప్రజల అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు:
“మనం చరిత్ర గతికి వ్యతిరేకంగా పోలేము. ప్రజల ఆకాంక్షల్ని బట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. మనం విభజింపబడినప్పటికి వేరువేరుగా వుంటున్నప్పటికి మన భౌగోళిక, ఆర్ధిక, చారిత్రక సాంస్కృతిక సంబంధాలు చాలా దృఢమైనవి. ఏమి జరిగినప్పటికి తాత్కాలిక భావోద్వేగాలు ఎలా వున్నప్పటికి, పరస్పర హత్యలకు పాల్చడినప్పటికి మౌలిక సూత్రాలు కలకాలం మనగలుగుతాయి.
భారత పాకిస్తాన్ దేశాలు సాంస్కృతికంగా అత్యంత వెనుకబడిన దేశాలు కాకపొతే ఈ అంశాలు మనల్ని కలిపి వుంచుతాయి.” నెహ్రూ - కమ్యూనిస్టులు
స్వతంత్రం వచ్చిన తొలికాలంలో ప్రభుత్వం మరాక సవాల్‌ని వామపక్షం నుండి ఎదుర్కొంది.
మనం 15వ అధ్యాయంలో గమనించబోయే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ (0690 1948 ఫిబ్రవరిలో భారతదేశంలో సాధారణ విప్లవం ప్రారంభమయిందని ప్రకటించింది. నెహ్రూ (ప్రభుత్వం సామ్రాజ్యవాద, అద్ధ భూస్వామ్యశక్తుల ప్రతినిధి అని ప్రకటించింది. చాలా ప్రాంతాలలో సమరశీల ప్రజా ఉద్యమాలను ప్రారంభించింది. వాటిలో అత్యంత ప్రముఖమైనది 1949 మార్చి 9న దేశవ్యాప్తంగా చేపట్ట యత్నించిన రైల్వే సమ్మె తొలుత హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణా ప్రాంతంలో నిజాంకి వ్యతిరేకంగా చేపటిన సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. ఈ విప్లవం 1951 సంవత్సరం మధ్యకాలం వరకు కొనసాగింది.
నెహ్రూ వ్యాకులతకు గురయ్యాడు. సి.పి.ఐ. విధానాన్ని కార్యకలాపాల్ని తీవ్రంగా విమర్శించినప్పటికి దాని హింసాయుత చర్యలకు సరియైన రుజువు దొరికే వరకు దానిని నిషేధించకుండా నిభాయించుకున్నాడు. అప్పుడు కూడా సి.పి.ఐ. చురుకుగా వున్న పశ్చిమబెంగాల్, మద్రాసులలో నిషేధించేందుకు అనుమతించాడు. కమ్యూనిస్టుల మౌలిక సామాజిక ఆర్థిక లక్ష్యాలతో వకీభవిస్తూనే, వారి రాజకీయాలతో హింసాయుత చర్యలతో పోరాడేందుకు ఆర్థిక ఇతర సంస్మరణ చర్యలు చేపట్టి ప్రజల అసంతృప్తిని స్వతంత్రం తర్వాత భారతదేశం 118
తొలగించాలని విశ్వసించాడు. అయినప్పటికి భారత కమ్యూనిస్టు పార్డీ సాయుధ పోరాటాన్ని విరమించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో చేరాలన్న ఉద్దేశం ప్రకటించగానే సి.పి.ఐ.ని చట్టబద్దమైన పార్టీగా ప్రకటించి ఆ పార్టీ నాయకుల్ని ఇతర (శ్రేణుల్ని విడుదల చేయించాడు. 1951-52 సాధారణ ఎన్నికలలో పాల్గొనడం అనుమతించబడింది.
కమ్యూనిస్టుల, మతవాదుల మధ్య తేడాని నెహ్రూ గుర్తించాడు. 1964లో ఆయన ఆర్.కె. కరంజియాకి ఇలా చెప్పాడు:
'రైట్ లెఫ్ట్ పార్టీలలో సామాజిక ఆర్ధిక ఆలోచనా విధానంతో నిర్మించబడిన విధానం గల పార్టీకి నేను ప్రాధాన్యతనిస్తాను. నీవు కమ్యూనిస్టుల విషయం ప్రస్తావించావు. కమ్యూనిస్టులు లోపాలెన్ని వున్నప్పటికి ఆర్ధికపరమైన పరిష్కారాల కొరకు పని చేస్తారు. మనం వారి వైఖరిలోని పిడివాదం, హింసలను నిరాకరిస్తాం. వారు వారిలో పాతుకుపోయిన భావం నుండి బయటపడి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చిత్తశుద్దితో ఆమోదిస్తే, వారి సోషలిజం లక్ష్యానికి, మన లక్ష్యానికి మధ్య పెద్ద తేడా వుండదు. మీరు ప్రస్తావించిన జనసంఘ, స్వతంత్ర లాంటి ఇతర పార్టీలు ఎలాంటి సామాజిక ఆర్థిక ప్రాతిపదిక లేకుండా ఫాసిస్టు, ఫ్యూడలు భావాలతో నడిపించబదే పార్టీలు. కాబట్టి అవి దేశానికి మన ప్రజాస్వామ్య, సోషలిస్టు విలువలకు ప్రమాదకారులు. క్షే1ేడ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భ్ భారతదేశం జాతిగా ఏకీకరణ
1947 నుండి భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య బహుశ అత్యంత తీవ్రమైన సమస్య జాతీయైక్యత. దీనినే జాతీయ సమైక్యత లేక భారత ప్రజల్ని ఒక రాజకీయ సమాజంగా ఏకీకరణ చేయటం అంటారు. భిన్నత్రంలో ఏకత్వం
భారతజాతి చారిత్రక క్రమంలో ఆవిర్భవించింది. చాలా కాలం నుండి, కనీసం 5 శతాబ్ధాల కాలం ఉండి అది రూపొందుతూ వచ్చింది. భారత జాతీయత మూలాలు చరిత్ర లోతుల్లో ఉన్నాయి. స్వతంత్ర పోరాట అనుభవం లోనూ ఉన్నాయి. వలస పాలనకు ముందునాటి భారత దేశం ఉమ్మడి ఉనికికి, ఉమ్మడి చైతన్యానికి చెందిన కొన్ని అంశాల్ని సముపార్దించింది. విసృతమైన సాంస్క లతిక వైవిధ్యమున్నప్పటికీ శతాబ్ధాల కాలంలో భిన్నత్వం అసమ్మతి పట్ల సహనాన్ని అలవరుస్తూనే ప్రజల మధ్య సంబంధాలు పెంచి ఏకతాభావం కలిగించడం లాంటి కొన్ని ఉమ్మడి సాంస్కృతిక ధోరణులు అభివృద్ధి చెందాయి. భారతదేశ ఐక్యతని విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ “అత్మైక్యత” అన్నారు. రాజకీయ పరమయిన, పాలనాపరమైన, ఆర్థిక పరమైన ఐక్యతకి సంబంధించిన అంశాలు -ప్రత్యేకించి మొగలు పాలకుల కాలంలో అభివృద్ధి చెందాయి. పాలకుల రాజకీయాలు, వారి రాజ్య విస్తరణ కాంక్షలు ప్రాంతాల్ని అధిగమించాయి. ఉపఖండానికి విస్తరించాయి. అప్పటికి వార్తా రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందనప్పటికి భారతదేశ వ్యాప్త వర్తకం ఉత్పత్తి నిపుణతలు, రుణ సదుపాయాల అల్లిక అభివృద్ధి చెందాయి. భరత వర్ష హిందూస్తాన్ భానాలతో కొంత అస్పష్టంగానైనప్పటికి భారతీయతా స్పందన స్వతంత్రం తర్వాత భారతదేశం 15
అనుభూతి మొదలయ్యాయి. గత అధ్యాయంలో ప్రస్తావించినట్లు భారతీయ సమాజం, ఆర్థిక విధానం, పరిపాలన పద్ధతులు - వలసవాదీకరణ భారతదేశ ఏకీకరణ క్రమానికి బలాన్ని చేకూర్చాయి. 19వ శతాబ్ధం మధ్యకాలం నుండి ప్రాంతాలు భాషలు వేరయినప్పటికీ భారతీయులు అంతకంతకూ ఉమ్మడి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలలో సామాజిక సాంస్కృతికాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. మూడవ అధ్యాయంలో గమనించినట్లు భారతీయుల్ని రాజకీయంగా మానసికోద్వేగపరంగా ఒక జాతిగా సన్నిహితం చేయటంలో రాజకీయ గుర్తింపు విధేయత చట్రంలో విలీనం చేయటంలో జాతీయోద్యమం కీలకపాత్ర నిర్వహించింది. ఈ ఉద్యమం యొక్కగాథఢత, కాలవ్యవధి, సమాజంలోకి చొచ్చుకొని పోయే స్వభావం ప్రజలలోకి ఐక్యతని జాతీయతాభావాన్ని తీసుకెళ్లాయి. జాతి నిర్మాణం సుదీర్హమైన నిరంతర క్రమమని అది సవాళ్ళు, అంతరాయాలు విధ్వంసాలు ఎదురు దెబ్బలను ఎదుర్కొంటుందని జాతీయోద్యమ నాయకులు గుర్తించారు. అలాంటి విధ్వంసమే 1947లో జరిగింది. స్వాతంత్రానంతరం కూడా జాతీయ సమగ్రతని సైద్ధాంతిక రాజకీయ ప్రయత్నాల ద్వారా కాపాడుకోవలసి ఉంటుందని గుర్తించారు. 1947 తరువాత భారత దేశ నాయకులు దేశ ఐక్యతని పరిరక్షించి పటిష్ట పరచడం అత్యంత పెద్ద సవాలుగా గమనించారు. నెహ్రు -“అత్యంత్య ముఖ్యమైన అంశం భారతదేశ ఐక్యత. అన్నింటి కంటే పెద్దకర్తవ్యం భారతదేశ ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు. భారత దేశ ప్రజల మానసిక పరమైన భావపరమైన ఐక్యత అంతకంటే ముఖ్యమైన కర్తవ్యం. భారతదేశం యొక్క సంక్లిష్టమైన వైవిధ్యం ఒక అద్భుతం. భారతదేశంలో అనేక భాషాపరమైన, సాంస్కృతికపరమైన, భౌగోళిక - ఆర్థిక పరమైన భాగాలు ఉన్నాయి. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, బౌద్దులుయూదులు లాంటి పలు మతాలు పాటించేవారున్నారు. ఇంకా వివిధ విశ్వాస విధానాలు గల తెగల (ప్రజలున్నారు. 1950లో భారత రాజ్యాంగం కేవలం కొద్ది లక్షల మంది మాత్రమే మాట్లాదే వందలాది భాషలతో పాట్రు 14 ముఖ్యమైన భాషల్ని గుర్తించింది. 1961 గణాంక వివరాల ప్రకారం 1549 మాతృభాషలున్నాయి. జనాభాలో 6 శాతంగా ఉన్న తెగల ప్రజలు దేశవ్యాప్తంగా చెల్లా చెదురుగా ఉన్నారు. కేషే6 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఈ వైవిధ్యాన్ని గమనంలో పెట్టుకొని జాతీయోద్యమ నాయకులు భారతజాతి విస్సృతమైన పునాదులపై నిర్మించబడాలని గుర్తించారు. ఈ వైవిధ్యాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే భారతదేశం ఐక్యం చేయబడుతుంది. విభజనలను అధిగమిస్తుంది. బలమైన జాతీయ గుర్తింపు ఆవిర్భావం, భారతదేశం యొక్క సంపద్వంతమైన వైవిధ్య పరిరక్షణ రెండూ ఏకకాలిక ప్రక్రియలు. ప్రాంతీయ సాంస్కృతిక గుర్తింపులు అఖిలభారత గుర్తింపులో భాగంగా అభివృద్ధి చెందుతాయి గాని దానితో ఘర్షణ పడికాదు. ఈ భావాన్ని సంక్షిప్రీకరిస్తూ 1951లో నెహ్రూ ఇలా రాశాడు. “భారతదేశం వివిధ సంస్ప్పృతులు, అలవాట్లు, ఆచారాలు జీవన విధానాలు గల దేశమని మనమెప్పుడూ గమనంలో పెట్టుకోవాలి. ఈ అద్భుతమైన దేశంలో అనంతమైన వైవిధ్యం ఉందని గుర్తుంచుకొనడం అవసరం. దీనిని ఒక మూసలో పోయటానికి ప్రయత్నించడంలో హేతుబద్ధత లేదు. అది అసాధ్యం కూడా, అదే సమయంలో ఆకాంక్ష జవాబు కూడా ఉన్నాయి, భారతదేశం దానిలో ఒక భాగం కంటే చాలా గొప్పది. చాలా సంపన్నమైనది. చాలా వైవిధ్యభరితమైనది. ఈ వైవిధ్యాన్ని స్వీకరించి దానిని మన స్వంతంగా భావించే ధృక్చధాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆ విధంగా భాష సంస్ఫృతి మత, (ప్రాంతీయ భేదాలను అధిగమించవలసిన ఆటంకాలుగా గాక ఆవిర్భవిస్తున్న జాతికి బలాన్ని చేకూర్చే వనరులుగా సానుకూలమైన అంశాలుగా స్వీకరించాలి. ఫలితంగా స్వతంత్ర భారతదేశ ఏకీకరణ' భిన్నత్వంలో ఏకత్వం' భావాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జరగాలి.
కాని భారతదేశ వైవిధ్యం బలహీనతకు వనరుగా కూడా గుర్తించబడింది. వైవిధ్యాన్ని మతతత్వం, కులతత్వం, భాషాతత్వం లాంటి విధ్వంసకరమైన ధోరణులుగా మార్చవచ్చు. విచ్చిన్నకరమైన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకించి త్వరత్వరగా జరుగుతున్న సామాజిక మార్పులు సామాజిక ఘర్షణల తీవ్రతకు దారి తీస్తున్నాయి గనుక విభిన్న విఖేయతల్ని విలీనం చేయటం అవసరం, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రాజకీయాధికారం అందుబాటు, ఆర్థిక వనరులలో పెద్ద వాటా - లాంటి సమస్యలు మతం, ప్రాంతం, కులం, భాషల ప్రాతిపదికగల శక్రుత్వాలకు, ఘర్షణలకు ఇంధనాన్ని సమకూర్చుతాయి. జాతీయైక్యతను పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు, కృషి అవసరం. 1947 తరువాత దేశ సమైక్యతా వ్యూహంలోని ముఖ్యాంశాలు: సంస్థానాల విలీనం,రాజకీయ, సంస్థాపరమైన వనరుల సమీకరణ, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయాన్ని పెంచే విధానాల అమలు, స్పష్టంగా కనిపించే అసమానతలను తొలగించి సమానావకాశాలు కల్పించటం, స్వతంత్రం తర్వాత భారతదేశం 217
నాయకత్వం జాతీయైక్యతకు సహాయపడే రాజకీయ సంసా నిర్మాణాన్ని రూపొందించింది. ఈ నిర్మాణానికి పౌర హక్కులతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ గుండెలాంటింది. కొత్తగా విముక్తి పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత అనుకూలమైనవి కావని, భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశాన్ని సమైక్యంగా వుంచేందుకు నిరంకుశ రాజకీయ చట్రం అవసరమని చేసిన వాదన తిరస్మరించబడింది. భారతదేశం వైవిధ్యభరితమైనది కనుకనే ఐక్యంగా వుంచేందుకు ఒత్తిడి బలప్రయోగం కంటే ప్రజాస్వామ్యమే అవసరం. ప్రజాస్వామ్య విధానాలకు తగిలే ఎదురుదెబ్బ విధ్వంసానికి హింసకు దారి తీయవచ్చునని - నెహ్రు చాలా సార్లు హెచ్చరించారు. పూర్తి స్వేచ్చతో విభిన్న సామాజికార్థిక, సాంస్కృతిక రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం గల ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశాన్ని సమైక్యంగా వుంచగలదని నెహ్రు నొక్కి చెప్పాడు. మన రాజ్యాంగం భిన్న ప్రయోజనాలు గల వారి డిమాండ్లకు ఐక్యతావసరాలకు అవకాశం కల్పించింది. బలమైన కేంద్రం, చాలా వరకు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలతో రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) చట్రాన్ని రూపొందించింది. రాజ్యాంగ నిర్మాతలు వికేంద్రీకరణకు విచ్చిన్నతకి మధ్య,అలాగే ఐక్యతకు కేంద్రీకరణకు మధ్య గల తేదాని గమనంలో పెట్టుకున్నారు. రాజ్యాంగం జాతీయ సమైక్యతకు దోహదపడటమే గాక విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగించగల ప్రాధమిక చట్రాన్ని కూడా సమకూర్చింది. రాజకీయ నాయకత్వం ఎన్నికల్ని రాజకీయెక్యతని పెంపొందించటానికి, ఐక్యతా రాజకీయాల్ని చట్టబద్ధం చేయటానికి ఉపయోగించుకోవలసి ఉంటుంది. పార్లమెంటు సర్వొన్నతమైన అధికారాలు గల సంస్థ. వివిధ రాజకీయ ధోరణుల్ని వ్యక్తం చేసుకోవటానికి అధికారం కొరకు పోటీ పడటానికి రంగ స్థలం. అక్కడ చర్చించబదే అంశాలు సమస్యలు, కార్యక్రమాలు, విధానాలు, అఖిలభారత స్వభావం విస్పృతి గలవి. అశోక్ మెహతా చెప్పినట్లుగా జాతిని రాజకీయ పార్టీలు కూడా గొప్ప ఐక్యతాశక్తిగా పనిచేశాయి. 1947 తరువాత కాలం నాటి పెద్ద రాజకీయ పార్టీలు సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, జనసంఘ్, ఆ తరువాత స్వతంత్ర పార్టీ- అన్నీ కూడా వాటి నిర్మాణం సిద్ధాంతాల రీత్యా అఖిల భారత స్వభావం గలవి, అవి దేశ ఐక్యతకొరకు పనిచేశాయి. జాతీయ లక్ష్యాల కొరకు కృషి చేశాయి. ఆయా పార్టీల ప్రభావం, శక్తి కొన్ని ప్రాంతాలకు పరిమితమైనప్పటికీ అఖిల భారత సమస్యలపై అఖిల భారత ప్రాతిపదికన ప్రజల్ని సమీకరించాయి. ఇక 118 బిపన్చం[ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాంగ్రెస్ విషయానికొస్తే అది దేశంలోని అన్నీ ప్రాంతాలకు విస్తరించియున్న బలమైన పెద్దపార్టీ. పార్టీలో అంతర్గత ఐక్యతని కాపాడగలిగింది. సమాజానికి పాలనా వ్యవహారాలకు అనుసంధానకర్త పాత్ర నిర్వహించింది. స్వతంత్రానంతరం, మతతత్వ పార్టీలు, ఒక ప్రక్శకు నెట్టివేయబడడంతో భారతరాజకీయాలలో, మేథావులలో ప్రధానమైన విభజన కులృ్యమత భాషా ప్రాతిపదికన జరగలేదు. రాజకీయ సైద్ధాంతిక ప్రాతిపదికన జరిగింది. అప్పటికి ఎదిగిన సామాజిక గ్రూపులు, వర్గాలు బూర్జువాలు, కార్మిక వర్గం, మేథావులు, స్వాతంత్ర్యానికి ముందు, స్వాత్యంత్రానంతరం జాతీయ ధృక్సధం కలిగి జాతీయ సమైక్యత కారకు కృషి చేశారు. ఆవిర్భవిస్తున్న వర్గ చైతన్యంతో ఒకవైపు కార్మిక సంఘాలు, కిసాన్ సభలు మరోవైపు వాణిజ్య పారిశ్రామిక సంస్థ(ఎఫ్ఐసిసిఐ) అంతగా ఘర్షణ పడకుండానే అంగీకారానికి రాగలిగాయి. జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వర్షానికి గానీ, వర్గ సంస్థలకు గానీ భారత సమాజంలో ఏ సెక్షన్ విధేయతగా లేదు. జాతి నిర్మాణంలో జాతీ సమైక్యతలో న్యాయకత్వ పాత్ర - అది పనిచేసే విధానం చాలా ముఖ్యమైనది. జాతీయోధ్యమ నాయకులు జాతి ప్రయోజనాల రిత్యా ఆలోచించారు. జాతీ సమైక్యతకు నిబద్భులై ఉన్నారు. ఈ నిబద్ధత ప్రజల ఆమోదం పొందింది. అంతేకాక జవహార్‌లాల్ నెహ్రు, సరూర్ పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్రప్రసాద్ లాంటి స్వాతంత్ర్య భారత దేశ ప్రముఖ నాయకులు. ఏ ఒక్క ప్రాంతం, భాష మతం, కులంతో మమేకం కాలేదు. ఇది జయప్రకాష్‌నారాయణ జెపి కృపలానీ, రామ్ మనోహర్ లోహియా, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ , బిటి రణదేవే, అజయ్‌ఘోష్ లాంటి ప్రముఖ ప్రతిపక్ష నాయకులకు వర్తిస్తుంది. కాంగ్రెస్ నాయకులు సర్దుబాటు రాజకీయాలతో దిట్టలు- అధ్యాయం 8లో వివరించినట్లు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కాలంలో కాంగ్రెస్ వివిధ రాజకీయ సైద్ధాంతిక ధోరణులను కలిసి కట్టుగా ఉంచగలిగింది. దినిననుసరించి 1947 తరువాత దాదాపు పూర్తి రాజకీయ ఆధిక్యత ఉన్నప్పటికి. ప్రతిపక్ష పార్టీలతో అసమ్మతి గ్రూపులతో సమాధానపడటానికి సర్తుబాటు చేసుకోవడానికి సిద్ధపడింది. భాషాపరమైన సాంస్కృతిక అంశాల విషయాలలో చాలా సున్నితంగా వ్యవహరించింది. హింసకు తీవ్రంగా స్పందిస్తూనే ప్రజల మద్ధతుతో అహింస పద్దతుల ద్వారా ఒత్తిడి తెచ్చిన డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. ఉదాహరణకు కమ్యూనిస్టులు పొంసను విడనాడటంతో వారికి నచ్చజెప్పడానికి సర్థుబాటుకి ఇష్టాన్ని ప్రకటించారు. కొంతకాలం తరువాత కమ్యూనిస్టు స్వతంత్రం తర్వాత భారతదేశం 119
పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు సామాజిక ఘర్షణలను పరిష్కరించేండుకు పదజాలంలో తేడాలున్నప్పటికీ అవే పద్ధతులు విధానాలు అవలంబించాయి. భారతదేశ సైన్యం, పరిపాలనా సేవలు కూడా జాతీయ సమైక్యత నిర్మించేందుకు దోహదపడ్డాయి. 1947 తరువాత భారతదేశం పైనస్థాయిలో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ ఇతర కేంద్రస్థాయిలో ఉద్యోగుల నియామకం కొరకు నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ని అభివృద్ధి పరచింది. ఈ నియామకాలు అన్ని భాషలకు చెందిన అన్ని ప్రాంతాల నుండి కుల, మతాలకు అతీతంగా వ్యక్తిగత ప్రతిభ ప్రతిపాదికన జరిగాయి. ఈ సేవలు అఖిల భారత స్వభావం కలిగినవి. ఎంపికైన అధికారులకు ఉమ్మడి శిక్షణ ఇవ్వబడింది. వారు కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు. వారికి పదోన్నతులు కల్పించే అధికారం, శిక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర సర్వీసులు, రాష్ట్ర సర్వీసులు మౌలికంగా రాజకీయేతరంగా ఉండి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి విధేయతగా ఉంటాయి. అలాగే సైన్యం కూడా జాతీయ శక్తి, దానిలోని అధికారులు ఇతర థ్రేణులు దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి నియమించబడతారు. భారత ఆర్థిక విధానం, జాతీయ మార్కెట్లు , సమాచార రవాణాల అల్లికలు 1947 తరువాత మరింతగా ఏకీకృతం చేయబడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి కూదా జాతీయ న్థాయిలో అభివృద్ధి పరచబడింది. ఆనకట్టలు, ఉక్కు కర్మగారాలు, ఎరువులు, ఉత్పత్తి కేంద్రాలు, సిమెంటు ఫ్యాక్టరీలు, భారీ యంత్రపరిశ్రమలు విద్యుత్పుత్తి కేంద్రాలు అన్నీ కూడా జాతీయ పరిశ్రమలకు జాతీయమైక్యతకు సంకేతాలు అయ్యాయి. జవహూర్ లాల్ నెహ్రు ఇతర నాయకులు జాతీయ సమ(గ్రతకు ఆర్థికాభివృద్ధి అవసరమని గుర్తించారు. మనం 26వ అధ్యాయంలో గమనించబోయే విధంగా స్వతంత్ర్యం సాధించిన వెంటనే (ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని (ప్లానింగ్ కమిషన్) నియమించి ప్రణాళికా బద్ధమైన ఆర్థికాభివృద్ధికి చురుకైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రణాళికా సంఘం ప్రాంతీయ ఆర్థిక వ్యత్యాసాలన్ని అంతమొందించడంలో విజయవంతం కాలేక పోయినప్పటికి వివిధ రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేయడంలో అసమానతను తొలగించాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ర్రాలతోసర్థుకుబోయే పద్ధతిని పొటించింది. ఫలితంగా కొంత సణుగుడు, ఇబ్బందులు ఉన్నప్పటికి రాష్ర్రాలలో, ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందనే ఆరోపణలు లేవు. 120 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జాతీయ సమగ్రతకు సామాజిక న్యాయాన్ని ఆర్థిక సమానతని పెంపొందించే విధానాలు అవసరం. అణగారిన ప్రజల ప్రయోజనాల కొరకు జాతీయోద్యమం కూడా జాతి నిర్మాణ (క్రమాన్ని సామాజిక ఆర్థిక మార్పులతో అనుసంధానం చేసింది. స్వాతంత్రానంతరం జాతి సమైక్యతని అంచనా వేసేందుకు అవి ఏ మేరకు ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. అనేది గీటురాయిగా ఉంది. స్వాతంత్ర్యం ఆర్థికాభివృద్ధి రాజకీయ ప్రజాస్వామ్యం క్రమాలతో కేవలం మధ్య తరగతి, పై తరగతి ప్రజలు మాత్రమే కాక మొత్తం భారత ప్రజలు ప్రయోజనాలను పొందాలి. కులం,మతం, సెక్స్ ప్రతిపాదికలుగా వివక్ష పాటించరాదంటూ నిర్దేశించి రాజ్యాంగం సామాజిక వ్యత్యాసాన్ని తగ్గించేందుకు పునాది వేసింది. సమాజంలోని అణగారిన సెక్షనకు జాతీయోద్యమం చేసిన వాగ్దానాన్ని అనుసరించి రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, విద్యా సంస్థలలో ఉపాధి కల్చనలో చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించింది. 1947 తరువాత అనేక సంస్కరణలు, సంక్షేమచట్టాలు చేయబడ్డాయి. భూస్వామ్య విధానం రద్దు చేయబడింది. ఒక మేరకు భూపంపకం జరిగింది. అస్పృశ్యత నేరంగా ప్రకటిస్తూ చట్టం చేయబడింది. దురదృష్టవశాత్తు వారసత్వంగా సంక్రమించే కులవ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం జరగలేదు. ఫలితంగా ఒక వైపు కులవివక్షత, అణచివేత కొనసాగాయి. మరోవైపు ఎన్నికలు, ఇతర రాజకీయ ప్రయోజనాల కొరకు కులతత్వం, కుల సంఘటనలు పెరిగాయి. 1950 దశాబ్దం ప్రారంభంలోనే సంఘ సంస్మరణ ఉద్యమాలు వెనుకపట్టుపట్టాయి. కులం, మతం, భాష్స ప్రాంతం ఆర్టిక అసమానతల ప్రతిపాదికలుగా సామాజిక అణచివేత, సామాజిక వివక్షత, దోవిడీల తొలగింపు, జాతీయ నమ(గ్రతా కార్యక్రమంలో నామమాత్రమయ్యాయి. మొదటి నుంచి జాతీయోద్యమ నాయకులు సెక్యులరిజనాకి కట్టుబడి ఉన్నారు. దేశ విభజనతో చెలరేగిన సంఘర్షణలకు వెరవకుండా జాతీయోద్యమ సెక్యులర్ దృక్పథానికి దృఢంగా నిలబద్దారు. మత హింసపట్ల మెతక వైఖరి అవలంబించలేదు. మొత్తం మీద మతపరమైన మైనారిటీలకు రక్షణ కల్పించగలిగారు. స్వతంత్ర భారతదేశ విదేశాంగ విధానం ఐక్యతాశక్తిగా పనిచేసింది. అలీనవిధానం, వలసవాద వ్యతిరేకత, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా నెహ్రు యొక్క పెరుగుతున్న స్థాయి - దేశ వ్యాప్తంగా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని సెక్షన్ల ప్రజానీకంలో జాతిపట్ల గౌరవ భావాన్ని పెంచాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 121
స్వతంత్రం సాధించిన సమయంలో ఐక్యత అత్యవసరం. వివిధ విధేయతల్ని విలీనం చేయడం కూడా అత్యవసర సమస్యే, ఐక్యతని పెంచే వ్యూహాలకు ఎత్తుగడల అమలుకు కొంత వ్యవధి అవసరమయింది. కాని ప్రజలు తొందర పడుతున్నారు. వెంటనే ఫలితాలు కోరుతున్నారు. ఘర్షణలకు అవకాశమెక్కువ. అనైక్యత పెరుగుతుందని, దేశం ముక్కలు చెక్కలవుతుందని పరిశీలకులు జోస్యం చెప్పారు. ఈ అధ్యాయంలోని తరువాతి సెక్షన్లో తరువాత అధ్యాయంలోను ఘర్షణలను సృష్టించిన వైవిధ్యానికి సంబంధించిన కొన్ని అంశాలను, ఈ వివాదాల పరిష్కారానికి అవలంబించవలసిన పద్ధతిని గురించి అధ్యయనం చేద్దాం. భాషా సమస్య స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి 20 సంవత్సరాలలో భాషా సమస్య ప్రజల్ని విభజించే సమస్యగా ఉంది. దేశం యొక్క రాజకీయ సాంస్పృతిక ఐక్యత ప్రమాదంలో పడిందని చాల మంది భయాందోళనలకు గురయ్యారు. ప్రజల వారి భాషని (ప్రేమిస్తారు. అది సంస్కృతిలో అవిచ్చ్భిన్నభాగం. అన్ని సమాజాలలో భాషాపరమైన గుర్తింపు బలమైన శక్తిగా వుంటుంది. భారతదేశంలాంటి బహుళ భాషలుగల దేశానికి ఇది ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. భాషా పరమైన వైవిధ్యం అనివార్యంగా విద్య, ఆర్ధికాభివృద్ధి, ఉపాధి ఇతర ఆర్ధిక ఆవకాశాలు, థి రాజకీయాధికారానికి ప్రవేశ సౌలభ్యం లాంటి బలమైన రాజకీయ ఆలోచనలకు దారి తీస్తుంది. భారత రాజ్యాంగం ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు 16 పెద్ద భాషల్ని గుర్తించింది. అంతేగాక తెగల ప్రజలు, ఇతరులు మాట్లాడే లిపులు వున్న, లేని భాషలు అసంఖ్యాకం. స్వతంత్ర భారతదేశం ఈ భాషలన్నింటిని కలగలిపి ఒకే ఒక భాషని రూపొందించదలచ లేదు. ఒక భాష ఇతర భాషల్ని అణచివేయటాన్ని అనుమతించదలచలేదు. ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇది అసాధ్యం కూదా కాబట్టి చేయవలసింది ఆ బహుళ భాషల్ని అంగీకరించి, ఘర్షజాయుతమైన పరిస్థితులు ఏర్పడకుండా చూడడం ఏర్పడినప్పటికే అవి ఎక్కువ కాలం కొనసాగకుందా చూడడం. భాషాపరమైన వైవిధ్యం వలన జాతీయ సమైక్యతకు ఎదురయ్యే సమస్య రెండు రూపాలు తీసుకొంటుంది. వీటిని రెండు వేర్వేరు శీర్షికల క్రింద చర్చిద్దాం 1) అధికార భాషా వివాదం 122 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
- భాషా ప్రయుక్త రాష్ట్రాల పర్పాటు అధికార భాషా
అధికార భాషా వివాదం హిందీ వ్యతిరేక రూపం తీసుకొనడం వలన చాలా తీవ్రమయింది. దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు, హిందీ మాట్లాడని ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించే ధోరణి ప్రబలింది. వివాదం జాతీయ భాషా సమస్యపై కాదు. అంటే కొంతకాలం తరువాత భారతీయులందరు ఒక భాషను ఆమోదించాలని, భారత జాతీయతా గుర్తింపుకి ఒక జాతీయభాష అవసరం అనే ఆలోచన జాతీయ నాయకత్వంలోని అత్యధిక మెజారిటీచే గతంలోనే తిరస్మరించబడింది. భారతదేశం బహు భాషల దేశం. అది అలాగే కొనసాగాలి. జుతీయోద్యమం తన సైద్ధాంతిక రాజకీయ కార్యకలాపాల్ని వివిధ (ప్రాంతీయ భాషలలో నిర్వహించింది. ఉన్నత విద్య, పరిపాలన, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఇంగ్రీషుని తొలగించి మాతృ భాష మాధ్యమంగా జరగాలన్నది జాతీయోద్యమం డిమాండ్. ఈ అభిప్రాయాన్ని 1937లో నెహ్రూ ఇలా స్పష్టం చేశాడు. 'మన గొప్ప ప్రాంతీయ భాషలు సంపద్వంతమైన వారసత్వం గత ్రొచీన భాషలు, ప్రతి ప్రాంతీయ భాష లక్షలాది ప్రజలు మాట్లాడే భాషు ప్రతి భాష సాధారణ ప్రజల ఉన్నత వర్ణాల జీవితంతో సంస్కృతితో ఆలోచనలతో గాఢంగా పెనవేసుకొన్న భాష సాధారణ ప్రజలు, మాతృ భాషా మాధ్యమం ద్వారానే విద్యాపరంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి మనం ప్రాంతీయ భాషలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మన కార్యకలాపాల్ని వాటి ద్వారా సాగించడం అనివార్యం..... కాబట్టి మన విద్యావిధానం (ప్రజా కార్యకలాపాలు అన్ని ప్రాంతీయ భాషల ద్వారానే జరగాలి.
మన రాజ్యాంగ నిర్మాతలు మన పెద్ద భాషల్ని 'భారతీయ భాషలుగా” లేక భారత జాతీయ భాషాలుగా అంగీకరించడంతో జాతీయ భాషా సమస్య పరిష్మరింపబడింది. కాని దేశం యొక్క అధికార కార్యకలాపాలు అన్ని భాషలలో సాగించడం సాధ్యపడదు. కేంద్ర (ప్రభుత్వం పాలనా వ్యవహారాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు కలిగి వుండటానికి ఒక ఉమ్మడి భాష అవసరం అది ఏ భాషా భారతదేశ అధికార భాషగా అనుసంధానం భాషగా ఏది వుండాలి? అందుకు ఇంగ్లీషు, హిందీలు చర్చకు వచ్చాయి. ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేయాలని రాజ్యాంగ పరిషత్ తీవ్రంగా చర్చించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 123
కాని వాస్తవంగా ఈ ఎంపిక కూడా స్వతంత్రానికి ముందే జాతీయోద్యమ నాయకత్వం చేసింది. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత మాధ్యమంగా ఇంగ్లీషు కానసాగకూడదని నాయకత్వం విశ్వసించింది. ఉదాహరణకు ప్రపంచ భాషగా ఇంగ్రీషు విలువను అభినందిస్తూనే గాంధీజీ “విదేశీ భాషలో ప్రజల మేధస్సు విష్పారదు, సంస్కృతి మొగ్గ తొడగదు' అని స్పష్టం చేశాడు. 1920లలో గాంధీజీ 'ఇంగ్లీషు అంతర్జాతీయ వాణిజ్య భాష, దౌత్యన్తి భాష సాహిత్య నిధి కలిగిన భాష పాశ్చాత్య ఆలోచనల్ని సంస్కృతిని పరిచయం చేసిన భాషు అని ఇంగ్లీషు గురించి చాల గొప్పగా చెప్పారు. కాని భారతదేశంలో ఇంగ్లీషు వారితో మనకు గల అసమాన సంబంధాల కారణంగా అది అసహజమైన కృత్రిమమైన స్థానాన్ని ఆక్రమించిందని గాంధీజీ వాదించారు. ఇంకా ఇంగ్లీషు “జాతి శక్తిని పీల్చింది. సాధారణ ప్రజల వల్ల విముఖత కలిగించింది. సాధారణ ప్రజల నుండి దూరం చేసింది. విద్యావంతులైన భారతీయులు విదేశీ మాధ్యమం వశీకరణ మాయాజాలం నుండి ఎంత త్వరగా బయట పడితే అది వారికి భారత ప్రజలకు అంత మంచిది. 1946లో గాంధీజీ ఇలా వ్రాశాడు. “ఇంగ్లీషు భాష దాని స్పస్థానంలో అది ఉంటే నేను అభిమానిస్తాను. కాని తనకు చెందని స్థానాన్ని లాక్కొని ఆక్రమిస్తే దానికి నేను తీవ్రమైన వ్యతిరేకిని. ఇంగ్రీషు ఈనాడు నిస్సందేహంగా ప్రపంచ భాష. కాబట్టి రెండవ బచ్చిక భాషగా దానికి స్థానం ఇస్తాను.” నెహ్రూ 1937లో 'భాషా సమస్యపై వ్రాసిన వ్యాసంలోను, రాజ్యాంగ పరిషత్ చర్చలలోను ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
అధికార భాషలేక అనుసంధాన భాష స్థాయిని కోరుతున్న హిందీ లేక హిందుస్తానీ జాతీయ పోరాటకాలంలో ప్రత్యేకించి ప్రజా సమీకరణ దశలో ముఖ్య పాత్ర నిర్వహించింది. హిందీ ఎక్కువ ప్రాంతాలలో మాట్లాడే భాష గనుక హిందీ మాట్లాడని ప్రాంత నాయకులు కూడా హిందీని అంగీకరించారు. లోక మాన్యతిలక్ గాంధీజీ, సి, రాజగోపాలాచారి, సుభాష్ బోస్, సర్జార్ పటేల్ - హిందీని బలపరిచిన ముఖ్యులలో కొందరు. కాంగ్రెస్ సదస్సులలో, రాజకీయ కార్యకలాపాలలో కాంగ్రెస్ ఇంగ్లీషు స్థానంలో హిందీని లేక ప్రాంతీయ భాషల్ని ప్రవేశపెట్టింది. 1925లో కాంగ్రెస్ తన నిబంధనావళిని ఇలా మార్పుకొన్నది. “కాం(గ్రెన్ కార్యకలాపాలు వీలైనంత వరకు హిందూస్తానీలో నిర్వహింపబడతాయి. వక్త హిందూస్తానీ మాట్లాడలేక పోయినప్పుడు గాని లేక అవసరమైనప్పుడు గాని ఇంగ్రీషుని గాని మరే ఇతర ప్రాంతీయ భాషనిగాని ఉపయోగించవచ్చు. కాంగ్రెస్ ప్రాంతీయ కమిటీ కార్యకలాపాలు సంబంధిత ప్రాంతీయ శైవై4 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భాషలలో నిర్వహించాలి. హిందుస్టానీని కూడా ఉపయోగించవచ్చు.” జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రతిఫలిస్తూ 1928లో నెహ్రూ రిపోర్టు దేవనాగరి లిపిలో లేక ఉర్దూలిపిలో వ్రాయదగిన హిందూస్తానీ భారతదేశ ఉమ్మడి భాషగా ఉండాలని నిర్ధారించింది. ఇంగ్షీషు కూడా కొంతకాలం పాటు కొనసాగాలని చెప్పింది. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం కూడా హిందూస్తానీకి బదులుగా హిందీ అనే మార్పుతో అమలుపరచవలసి వచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో రెండు సమస్యలపై తీవ్రమైన చర్చ జరిగింది. ఇంగ్లీషు స్థానంలో హిందీ ఉండాలా లేక హిందూస్తానీ ఉండాలా? ఈ మార్పు ఎంతకాల వ్యవధి లోపల జరగాలి? అధికార భాషా సమస్య రాజకీయీకరణ చేయబడడంతో చర్చల్లో చాలా తీవ్రమైన విభేదాలు వ్యక్తమయ్యాయి. హిందీ లేక హిందూస్తానీ సమస్య త్వరలోనే పరిష్మరించబడింది. గాంధీ, నెహ్రూ - ఇద్దరూ దేవనాగరి లేక ఉర్దూ లిపిలో వుందే హిందుస్తానీకి మద్దతిచ్చారు. హిందీ మద్దతుదారులు విఖేదించినప్పటికీ గాంధీ నెహ్రూ అభిప్రాయాన్ని అంగీకరించేందుకు సన్నద్దులయ్యారు. కాని దేశ విభజన ప్రకటించబడగానే ఉర్జూ ముస్లింల భాష అని పాకిస్తాన్ భాషయని పాకిస్తాన్ మద్దతుదారులు ప్రచారాలు సాగించడంతో హిందీ భాషాభిమానుల వైఖరి మారింది. హిందీ వీరాఖిమానులు ఉర్జూపై వేర్పాటుకు సంకేతమనే ముద్ర వేశారు. దేవ నాగరలిపిలోని హిందీని జాతీయ భాషగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండు కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చింది. నెహ్రా, ఆజాద్. హిందూస్తానీ కొరకు పోరాడినప్పటికి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ 78-77 ఓట్లతో హిందీకి అనుకూలంగా నిర్ణయం చేసింది. హిందీ వీరాభిమానులు కూడా రాజీకి రాక తప్పలేదు. హిందీని జాతీయ భాషగా గాక అధికార భాషగా చేసేందుకు అంగీకరించారు. ఇంగ్లీషు నుండి హిందీకి మార్పుకి సంబంధించిన కాల వ్యవధి సమస్య హిందీ- హిందీయేతర ప్రాంతాల మధ్య విభజన తెచ్చింది. హిందీ ప్రాంతాల ప్రతినిధులు హిందీని వెంటనే అధికారభాషగా ప్రకటించాలన్నారు. కాని హిందీయేతర ప్రాంతాల ప్రతినిధులు నిరవధికంగా కాకపోయినా ఇంగ్లీషుని చాలా కాలం వరకు కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో ఏర్పడనున్న పార్లమెంటు హిందీని అధికారభాషగా ప్రకటించే వరకు యథాతథాస్థితి కొనసాగాలని కోరారు. నెహ్రూ హిందీని అధికార భాషగా చేసేందుకు అనుకూలంగా ఉన్నాడు. అదనపు అధికార భాషగా ఇంగ్లీషు కొనసాగింపుకి కూదా అనుకూలంగా ఉన్నాడు. ఇంగ్లీషు నుండి హిందీకి మార్పు నెమ్మదిగా క్రమంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 125
జరగాలన్నాడు. సమకాలీన ప్రపంచంలో ఇంగ్రీషు ఉపయోగాన్ని గమనంలో పెట్టుకొని దానిని ప్రోత్సహించాలన్నాడు.
భారత ప్రజలలోని మెజారిటీ కాకపోయినా అత్యధికులు మాట్లాడే భాష హిందీ. ఉత్తర భారతదేశంలో బెంగాలునుంచి పంజాబు వరకు అలాగే మహరాష్ట్ర గుజరాత్‌లలోని పట్టణ (ప్రజలు అర్థం చేసుకునే భాష, కాని ఒక సాహిత్య భాషగా సైన్సు రాజకీయాల భాషగా హిందీ ఇతర భాషల కంటే తక్కువ అభివృద్ధి చెందిన భాషని విమర్శకుల అభిప్రాయం. హిందీని అధికార భాషగా చేస్తే హిందీయేతర ప్రాంతాల వారు ప్రత్యేకించి దక్షిణ భారతదేశం విద్య, ఆర్థిక రంగాలలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలలో వెనుకబడుతుందని ఆందోళన. హిందీయేతర ప్రాంతాలపై హిందీని రుద్దడం వలన హిందీ ప్రాంతాల ఆర్థిక, రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆధిపత్యానికి దారి తీస్తుందని ఆందోళన.
రాజ్యాంగ నిర్మాతలు బహు భాషలు గల దేశం నాయకులుగా ఒక భాషా ప్రాంతాన్ని విస్మరించకూడదని, విస్మరించారనే భావం కలిగించడంగాని చేయకూడదని గ్రహించారు. ఒక రాజీ కుదర్చబడింది. అంతర్జాతీయ అంకెలతో దేవనాగరి లిపిగల హిందీ అధికార భాషగా రాజ్యాంగం అవకాశం కల్పించింది. 1965 వరకు ఇంగ్లీషు అధికార భాషగా కొనసాగుతుంది. హిందీ దశలవారీగా ప్రవేశపెట్టబడుతుంది. 1965 తరువాత. అది పూర్తి అధికార భాష అవుతుంది. అయినప్పటికి 1965 తరువాత కూడా ప్రత్యేకమైన ప్రయోజనాల రీత్యా ఇంగ్రీషుకి అవకాశం కల్పించే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. హిందీ విస్తరణని అభివృద్ధిని పెంపొందించే బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వంపై పెట్టింది. దీని అభివృద్ధిని సమీక్షించేందుకు కమిషన్ని, జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంటుని నియమించే అధికారం కల్పించింది. యూనియన్ అధికార భాష వివిధ రాష్ట్రాల మధ్య అలాగే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అనుసంధాన భాషగా పనిచేస్తుంది. రాష్ట్ర శాసన సభలు అధికార భాషని రాష్ట్ర స్థాయిలో నిర్ణయించాలి.
దేశ వ్యాష్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి రాజ్యాంగం నిర్దేశించిన భాషాపరమైన అంశాల అమలు కష్టతరమయింది. హిందీ పూర్తి అధికార భాష కాబోతుందనే అంశాన్ని ఎవరూ సవాలు చేయనప్పటికి కాలక్రమంలో సమస్య మరి జటిలమయింది.
రాజ్యాంగ నిర్మాతలు 1965 నాటికి హిందీ సమర్ధకులు హిందీ బలహీనతల్ని అధిగమిస్తారని, హిందీయేతర ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని ఆశించారు. 126 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అంతేగాక వేగంగా పెరుగుతున్న విద్యావ్యాప్తితో హిందీ కూడా విస్తరిస్తుందని, హిందికి (ప్రతిఘటన క్రమంగా బలహీనపడి అద్భృశ్యమవుతుందని ఆశించటం జరిగింది. కాని చాలా నెమ్మదిగా జరిగిన విద్యావ్యాప్తి ప్రతి కూల ప్రభావం చూపింది. అంతేగాక అధికార భాషగా హిందీ విజయావకాశాల్ని హిందీప్రతిపాదకులే షాడు చేశారు. హిందీయేతర ప్రాంతాల వారి అంగీకారాన్ని పొందేందుకు క్రమబద్ధమైన నెమ్మదియైన నచ్చజెప్పే మితవాద వైఖరి అవలంబించడానికి బదులుగా హిందీ వీరాభిమానులు ప్రభుత్వ చర్యల ద్వారా బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించారు. వారి అమితాసక్తి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రేరేపించింది. 1959లో నెహ్రూ పార్లమెంటులో చెప్పినట్లు వారి అత్యుత్సకత వారి వైఖరి “నాకు చిరాకు కలిగించినట్లే ఇతరులకు చిరాకు కలిగించింది” హిందీలో సామాజిక శాస్త్రాల, విజ్ఞాన శాస్త్రాల రచనలు వెలువడలేదు. ఉదాహరణకు 1950లలో సాహిత్యపరమైన పత్రికలుగాక విద్యావిషయక పత్రికలు 'ప్రచురింపబడలేదు. ఉన్నత విద్య, పత్రికలు, ఇతర రంగాలలో హిందీని ప్రయోజనకరమైన మాద్యమంగా అభివృద్ధి పరచడానికి బదులుగా నాయకులు హిందీని పూర్తి అధికార భాషని చేయడం పట్ల ఆసక్తి చూపారు. హిందీ ప్రచారకులు విస్తృతమైన ఆదరణ పొందే సాధారణ న్థాయి భాషని అభివృద్ధి పరచటానికి లేక హిందీ ప్రాంతాలలో ఇంకా దేశంలోని పలు ప్రాంతాలలో ప్రజలు మాట్లాడే, వ్రాసే వ్యవహారిక భాషకు ప్రచారం ఇవ్వటానికి బదులుగా విదేశీ ప్రభావాలకు దూరంగా వుంచాలని, భాష యొక్క పవిత్రతని కాపాడే పేరుతో, సాధారణంగా అందరికి అర్ధమయ్యే మాటల స్థానంలో కొత్తగా సృష్టించబడిన, కొద్దిమందికే అర్థమయ్యే మాటల్ని ప్రవేశపెట్టారు. హిందీ మాట్లాడనివారు (లేక హిందీ మాట్లాడేవారు కూడా) ఈ కొత్త భాషని అర్ధం చేసుకొనడం నేర్పుకొనడం _కష్టతరమయింది. హిందీని ప్రచారం చేయటంలో ముఖ్య పాత్ర నిర్వహించవలసిన ఆలిండియా రేడియో హిందీ వార్తల్ని సంస్కృతమయం చేసి శ్రోతల్ని హిందీ వార్తల్ని వినకుండా చేసింది. హిందీలో వక్త, రచయిత అయిన నెహ్రూ, హిందీలోకి అనువదింపబడి ప్రసారం చేయబడిన తన ఉపన్యాసాలను తానే అర్ధం చేసుకోలేకపోతున్నానని 1958లో ఫిర్యాదు చేశాడు. కాని హిందీ పరిశుద్ధవాదులు మెత్తబడలేదు. హిందీ వార్తల్ని సరళతరం చేసే అన్నీ ప్రయత్నాలు అడ్డుకున్నారు. ఈ వైఖరి చాలా మందిని హిందీ వ్యతిరేక శ్రేణుల్లోకి చేర్చింది. కాని నెహ్రూ, ఇతర నాయకులు హిందీని అధికార భాష చేయడం పట్ల నిబద్దులై ఉన్నారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 127
ఇంగ్రీషు అధ్యయనం ప్రాత్సహించదగిన దైనప్పటికి భారతదేశ అధికార భాషగా ఇంగ్లీషు కలకాలం కొనసాగకూడదన్నారు. జాతీయెక్యత అలాగే ఆర్ధిక రాజకీయాభివృదై ప్రయోజనాల రిత్యా హిందీని అధికార భాషగా మార్చడానికి నిర్ధిష్టకాల పరిమితిని విధించకూడదని, హిందీయేతర (ప్రాంతాల (ప్రజల ఆమోదం లభించేవరకు వేచి చూడటం అవసరమని గుర్తించారు. హిందీయేతరులు కూడా మెత్తబడటానికి సిద్ధంగా లేరు. కాలంతో పాటు వారి హిందీ వ్యతిరేకత పెరిగింది.
1956-60 కాలంలో అధికార భాషా సమస్యపై తీవ్రమైన విభేదాలు పెల్లుబికాయి. 1955లో నియమించబడిన అధికార భాషా కమిషన్ తన రిపోర్టుని 1956లో సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాలలో ఇంగ్రీషుకి బదులుగా హిందీని క్రమబద్ధంగా (ప్రవేశపెట్టాలని, 1965 నాటికి కట్టుదిట్టమైన మార్పులు తీసుకొని రావాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాని కమిషన్‌లోని పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు చెందిన ఇద్దరు సభ్యులు - ప్రొఫెసర్ సుసీత్కుమార్ ఛటర్జీ, సుబ్బరామన్లు కమిషన్ సభ్యులు హిందీ అనుకూల మొగ్గులో వున్నారని ఆరోపించారు. అధికార భాషగా ఇంగ్రీషు కొనసాగాలన్నారు. విపరీతమేమంటే స్వతంత్రానికి ముందు ఛటర్జీ బెంగాలులో హిందీ ప్రచారిణి సభ కార్య నిర్వహకుడు. కమిషన్ రిపోర్టుని పార్లమెంటు స్పెషల్ జాయింటు కమిటీ సమీక్షించింది. జాయింట్ కమిటీ సిఫార్సుల్ని అమలు జరిపేందుకు (ప్రెసిడెంటు 1960 ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేశాడు. దానిలో 1965 తరువాత హిందీ అధికార భాషగా ఉంటుందని ఇంగ్లీషు సహ అధికార భాషగా కొనసాగుతుందని స్పష్టం చేశాడు. కొంతకాలం తరువాత యూనియన్ పబ్లిక్ కమిషన్ పరీక్షలకు హిందీ ప్రత్యామ్నాయ మాధ్యమమవుతుంది. కాని ప్రస్తుతానికి మాత్రం హిందీ అర్హత కల్పించే సబ్జెక్టుగా ప్రవేశపెట్టబడుతుంది. ప్రెసిడెంటు ఆదేశాన్ననుసరించి హిందీని ప్రొత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్‌ను స్థాపించింది. హిందీ పుస్తకాల, హిందీలోకి అనువదించిన పుస్తకాల ప్రచురణ చేపట్టింది. కేంద్ర (ప్రభుత్వ ఉద్యోగులకు హిందీలో నిర్బంధ శిక్షణ ఇప్పించింది. చట్టానికి సంబంధించి పెద్ద గ్రంధాల్ని హిందీలోకి అనువదింపజేసి, కోర్టులలో వాటి ఉపయోగాన్ని ప్రోత్సహించింది.
ఈ చర్యలు హిందీయేతర ప్రాంతాలలో గ్రూపులలో అనుమానాన్ని ఆతురతని పెంచాయి. ఉదాహరణకు ప్రముఖ భాషావేత్త. హిందీ ప్రచార ప్రోత్సాహకుడు ప్రొఫెసర్ సునిత్ కుమార్ ఛటర్జీ అధికార భాషా కమిషన్ రిపోర్టుకి పంపిన అసమ్మతి పత్రంలో 128 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కమిషన్ దృక్పధం 'తక్షణమే గాక చాలా కాలం వరకు ప్రయోజనాలు పొందే హిందీ మాట్లాడే వారి ప్రయోజనాలేనని స్పష్టం చేశాడు. అలాగే 1958 మార్చిలో దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారిణి సభ మాజీ (ప్రెసిడెంట్ సి.రాజగోపాలాచారి 'హిందీ ప్రచారకులకు ఇంగ్లీషు ఎంత విదేశీ భాషో హిందీ మాట్లాడని వారికి హిందీ అంతే విదేశీ భాషనీ స్పష్టం చేశాడు. మరోవైపు ఇరువురు ప్రముఖ హిందీ భాషాభిమానులు పురుషోత్తమ్‌దాస్ టాండన్, సేఠ్ గోవింద్ దాస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇంగ్రీషుకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాజ్యాంగంలో నిర్ధేశించిన విధంగా ఇంగ్లీషుని తొలగించడంలో తాత్సారం జరుగుతుందని చాలా మంది హిందీ నాయకులు నెహ్రూని, విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ని దుయ్యబట్టారు. రాజ్యాంగంలో నిర్దేశించిన హిందీలోకి మార్పు గడువుని కచ్చితంగా అమలు జరపాలని పట్టుబట్టారు. అధికార భాషగా ఇంగ్రీషు స్థానంలో హిందీని తక్షణమే అమలు జరపాలని 1957లో దాక్టర్ లోహియా సంయుక్త సోషలిస్టు పార్టీ, జనసంఘ్ ప్రారంభించిన సమరశీల ఉద్యమం రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. లోహియా అనుచరులు విస్తృతంగా అమలు జరిపిన ఆందోళనా పద్ధతులలో ఒకటి షాపుల ఇతర స్థలాల్లోని సైన్ బోర్డులను చెరిపి వేయటం. పాలనా వ్యవహారాలపై అధికార భాషా సమస్య కలిగించనున్న ప్రమాదాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం హిందీయేతర ప్రాంతాల ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని సమస్య పట్ల జాగ్రత్తగా వ్యవహరించింది. రాజీ కొరకు ప్రయత్నించింది. అధికార భాష దేశంలోని ఏ ప్రాంతం పైనైనా బలవంతంగా రుద్దబడదని, హిందీయేతర ప్రజల ఆకాంక్షల్ని గమనంలో పెట్టుకొని హిందీ మార్పుకి వ్యవధి నిర్ణయంచబడుతుందని నెహ్రూ చాలాసార్లు స్పష్టం చేశారు. ఈ అంశంలో నెహ్రా ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్పి) భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు మద్దతునిచ్చారు. పి.ఎస్.పి - హిందీ తీవ్రవాదాన్ని విమర్శించింది. “భారతదేశం వంటి బహు భాషలు గల దేశంలో దేశ ఐక్యతకు తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు'నని ఆందోళన వ్యక్తం చేసింది. నెహ్రూ 1959 ఆగస్టు 7న పార్లమెంట్లో ముఖ్యమైన ప్రకటన చేశాడు. హిందీయేతర ప్రజల భయాందోళనల్ని తగ్గించేందుకు నిర్దిష్టమైన హామీ ఇచ్చాడు. “ప్రజలు కోరినంత కాలం ఇంగ్లీషు ప్రత్యామ్నాయ భాషగా ఉంటుంది. నిర్ణయం హిందీ ప్రజలు స్వతంత్రం తర్వాత భారతదేశం 129
గాక పొందీయేతర ప్రజలు చేస్తారు.” 'హిందీ నేర్చుకోవాలని కోరుకొనకపోతే నేర్చుకోకండి అని దక్షిణ భారత ప్రజలకు చెప్పాడు. ఈ హామీనే 1959 సెప్టెంబరు 4న నెహ్రూ పార్లమెంట్లో పునరుద్దాటించాడు. అంతర్గత పా ర్టీ ఒత్తిడులు, ఇండియా - చైనా యుద్ధం కారణంగా కొంత ఆలస్యమైనప్పటికి నెహ్రూ హామీల ననుసరించి 1963లో అధికార భాషా చట్టం చేయబడింది. 1965 తరువాత ఇంగ్లీషు ఉపయోగంపై రాజ్యాంగం విధించిన నిబంధనని తొలగించడం చట్టం యొక్క లక్ష్యమని నెహ్రూ ప్రకటించాడు. కాని హామీలను స్పష్టమైన పదజాలంతో చట్టంలో వ్యక్తం చేయకపోవడం వలన ప్రయోజనం పూర్తిగా సిద్ధించలేదు. చట్టంలో “హిందీతో పాటు ఇంగ్లీషు భాష ఉపయోగం కొనసాగించబడవచ్చును.” హిందీయేతర గ్రూపులు చట్టంలోని పదజాలాన్ని విమర్శించారు. వారు దానిని చట్టపరమైన హామీగా భావించలేదు. ఇంకా స్పష్టమైన పదజాలమవసరమన్నారు. కారణం నెహ్రూని నమ్మకపోవడం కాదు. హిందీనాయకుల నుండి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో నెహ్రూ తరువాత హామీకి ఏ గతి పడుతుందోనని ఆందోళన చెందారు. 1964 జూన్‌లో నెహ్రూ మరణించడంతో ఆందోళన పెరిగింది. దానికి తోడు వివిధ మంత్రిత్వశాఖలు రానున్న సంవత్సరంలో హిందీని అధికార భాషగా మార్చటానికి చర్యలు చేపట్టవలసిందిగా సర్క్యులర్లు జారీ చేశాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలో జరపాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. హిందీయేతర రాష్ట్రాలకు ఇంగ్లీషు అనువాదం కూడా జతపరచబడుతుందని కూడా పేర్కొనబడింది. నెహ్రూ వారసునిగా ప్రధానమంత్రి అయిన లాల్‌బహుదూర్ శాస్తి హిందీయేతర గ్రూపుల అభిప్రాయానికి అంత సున్నితంగా స్పందించలేదు. హిందీ వకైక అధికార భాష అవుతుందనే భయాన్ని పోగొట్టడానికి బదులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ _ పరీక్షలలో హిందీని ప్రత్యామ్నాయ మాధ్యమం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రకటించాడు. అంటే హిందీయేతరుల అఖిల భారత ఉద్యోగాలలో ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా పోటీలో వుండగలిగినప్పటికి హిందీ మాట్లాడే వారికి మాతృభాష కారణంగా సానుకూలత పెరుగుతుంది. అందుకు నిరసనగా చాలా మంది హిందీయేతర నాయకులు అధికార భాషా సమస్యపై వారి వైఖరి మార్చుకొన్నారు. ఇంగ్రీషు స్థానంలో హిందీని అధికార భాష చేసేందుకు 180 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చివరి గడువు పెట్టరాదని డిమాండ్ చేయడం ప్రారంభించారు. కొందరు నాయకులు ఇంకా ముందుకు పోయారు. ఉదాహరణకు ద్రవిడ మున్నేట్ర కజగం, సి. రాజగోపాలాచారి రాజ్యాంగాన్ని సవరించి ఇంగ్రీషుని అధికార భాష చేయాలని డిమాండ్ చేశారు. 1965 జనవరి 26 సమీపించేటప్పటికి హిందీయేతర ప్రాంతాలు, ప్రత్యేకించి తమిళనాడు భయాందోళనలకు గురయి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. జనవరి 17న డి.యం.కె. పార్టీ మద్రాసు రాష్ట్ర హిందీ వ్యతిరేక సదస్సు నిర్వహించి జనవరి 26 సంతాప దినంగా పాటించమని పిలుపిచ్చింది. అఖిల భారత ఉద్యోగాలలో హిందీ ప్రాంతాల కంటే బాగా వెనుకబడి పోతామని కలత చెందిన విద్యార్థులు ఆందోళన నిర్వహణలో ప్రజాభిప్రాయాన్ని తన కనుకూలంగా మలచుకొనడంలో చురుకుగా పనిచేశారు. 'హిందీ నెవర్-ఇంగ్లీషు ఎవర్ నినాదానికి విస్తృత ప్రచారమిచ్చారు. రాజ్యాంగ సవరణ కొరకు కూడా డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన రాష్ట్ర వ్యాప్త అశాంతిగా మారింది. ఉద్యమం యొక్కతీవ్రతని విస్తృతిని అంచనా వేయటంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంగ్రెస్ నాయకత్వం విద్యార్థులతో చర్చలు జరపడానికి బదులుగా ఉద్యమాన్ని అణచ ప్రయత్నించింది. ఫిబ్రవరి మొదటి వారాలలో విస్తృతంగా చెలరేగిన ఘర్షణలు, హింస పెద్ద ఎత్తున రైల్వేలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు విధ్వంసానికి దారి తీశాయి. హిందీ వ్యతిరేక భావాలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. అధికార భాషా విధానానికి వ్యతిరేకంగా నలుగురు విద్యార్థులతో పాటు చాలామంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు.కేంద్ర మంత్రి వర్గం నుండి ఇరువురు తమిళ మంత్రులు - సి.సుబ్రమణ్యం, అలగేశన్లు రాజీనామా చేశారు. ఆందోళన దాదాపు రెండు నెలలు కొనసాగింది. పొలీసు కాల్పులలో 60 మందికి పైగా చనిపోయారు. ఆందోళనకారుల పట్ల కలత చెందిన ఒకే ఒక కేంద్ర నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు ఆమె కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి. ఉద్యమం తీవ్రంగావున్న సమయంలో ఆమె మద్రాసు వెళ్ళింది. అలజడి ఎక్కువగా వున్న ప్రాంతాలలో పర్యటించింది. ఉద్యమకారుల పట్ల సానుభూతి ప్రకటించింది. ఆ విధంగా నెహ్రూ తరువాత బాధలలో కూరుకుపోయిన తమిళ ప్రజల, దక్షిణ భారత ప్రజల విశ్వాసాన్ని పొందిన మొదటి ఉత్తర భారతదేశ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. జనసంఘ్, యస్.యస్. పి పార్టీలు హిందీ ప్రాంతాలలో ఇంగ్లీషు వ్యతిరేక ఆందోళన నిర్వహించయత్నించారు. కాని ప్రజల మద్దతు అంతగా లభించలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 131
ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ - వైఖరులను మార్చుకొనక తప్పలేదు. దక్షిణ భారతదేశ ప్రజాభిప్రాయానికి తలొగ్గాలని నిర్ణయించాయి. విధానాన్ని మార్చుకొని ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను అంగీకరించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ వర్మింగు కమిటీ కొన్ని చర్యల్ని ప్రకటించింది. కేంద్ర చట్టానికి ప్రాతిపదికన వుండేది, హిందీ ఉద్యమ విరమణకు దారి తీసేది అయిన ఈ చట్టం చేయడాన్ని 1965 భారత్- పాకిస్తాన్ యుద్ధం కొంత వెనక్కి నెట్టివేసింది. చట్టం అసంతృప్తి సద్దుమణిగేలా చేసింది. లాల్ఐబహుదూర్ శాష్ట్రి 1966 జనవరిలో మరణించడంతో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఆమె అప్పటికే దక్షిణ భారత ప్రజల విశ్వాసం చూరగొనడంతో దీర్హక్రాలిక సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరుగుతుందని ప్రజలు ఆశించారు. ఇతర సానుకూలమైన అంశాలు జనసంఘ్ ఇంగ్లీషు వ్యతిరేక తీవ్రతని తగ్గించుకొని మెత్తబడటం, 1965 ఒప్పందంలోని మౌలిక అంశాలను యస్.యస్.పి. అంగీకారం తెలపటం. ఆర్థిక సమస్యల నెదుర్భొన్నప్పటికి 1967 ఎన్నికలలో పార్లమెంట్లో కాంగ్రెస్ బలహీన పడినప్పటికి ఇందిరాగాంధీ 1968 అధికార భాషా చట్ట సవరణ బిల్లుని నవంబరు 27న ప్రతిపాదించారు. 1967 డిసెంబరు 16న 205-41 ఓట్లతో లోక్‌సభ బిల్లును ఆమోదించింది. 1959 సెష్టెంబరులో నెహ్రూ ఇచ్చిన హామీలకు చట్టం అసందిగ్ధమైన చట్టపరమైన రక్షణ కల్పించింది. కేంద్రంలో అధికార కార్యకలాపాలకు, కేంద్రం హిందీయేతర రాష్ట్రాల మధ్య సమాచార సంబంధాలకు హిందీతో పాటు ఇంగ్రీషుని సహభాషగా ఉపయోగించుకొనడాన్ని హిందీయేతర రాష్ట్రాలు కోరినంతకాలం కొనసాగించటానికి చట్టం అవకాశం కల్పించింది. నిరవధికంగా ద్విభాషా విధానం ఆమోదించబడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు హిందీ, ఇంగ్లీషులలోనే గాక అన్ని ప్రాంతీయభాషలలో కూదా నిర్వహింపబడాలని ఒక విధాన తీర్మానాన్ని కూడా పార్లమెంట్ ఆమోదించింది. కాని అభ్యర్థులకు హిందీలో లేక్ర ఇంగ్లీషులో అదనపు పరిజ్ఞానం వుండాలని షరతు విధించింది. రాష్వైలు త్రిభాషా విధానాన్ని అమలు పరచాలి. దీనిననుసరించి హిందీయేతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో మాతృభాష హిందీ, ఇంగ్లీషు లేక మరేదైనా జాతీయ భాష బోధించాలి. హిందీ ప్రాంతాలలో హిందీయేతర భాష వీలైనంతవరకు దక్షిణ భారతదేశ భాష బోధించాలి. 192 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారత ప్రభుత్వం భాషా సమస్యపై 1967 జూలైలో మరొక ముఖ్యమైన చర్య చేపట్టింది. 1966 విద్యాకమిషన్ రిపోర్టు సిఫార్సులననుసరించి యూనివర్సిటీ స్థాయిలో అన్ని సబ్జెక్టులలో కాలక్రమంలో భారతీయ భాషలు విద్యామాధ్యమాలు అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మార్పుకి కాలవ్యవధిని నిర్ణయించుకొనే అవకాశం యూనివర్సిటీలకు వదిలి వేయబడింది. ఎన్నో మెలికలు మలుపులు, ఎన్నో చిన్నా పెద్ద చర్చలు ఆందోళనలు, రాజీల తరువాత సంక్షిష్టమైన అధికారభాష అనుసంధాన భాషల సమస్యకి విస్తృతామోదం పొందిన పరిష్కారం లభించింది. 1967 నుండి ఈ సమస్య భారతదేశ రాజకీయ రంగం నుండి క్రమంగా అదృశ్యమయింది. ఒక వివాదాస్పదమైన సమస్యని ప్రజాస్వామ్యయుతంగా జాతీయైక్యతని పెంపొందించే పద్దతిలో పరిష్కరించే శక్తి సామర్భాలు భారత రాజకీయ వ్యవస్థకి కలవని నిరూపితమైంది. ఉద్రిక్తతల పరంగా ప్రజల్ని విభజించిన, దేశ సమైక్యతకు వాని కలిగించగలిగే సమస్యకు చర్చలు రాజీ ద్వారా విసృతామోదం పొందిన పరిష్కారం కనుగొనబడింది. చివరికి భాషా సమస్య ముఖ్యమైన పాత్ర నిర్వహించడంతో అధికారంలోకి వచ్చిన డి.యం.కె కూడా తమిళనాడులోని రాజకీయ వాతావరణాన్ని శాంతింపచేయదానికి తోద్చడింది. ఏ రాజకీయ సమస్య కూడా శాశ్వతంగా పరిష్మరింపబడదు. భారతదేశం లాంటి సంక్షిష్టమైన దేశంలో సమస్య పరిష్కారం ఒక నిరంతర ప్రక్రియగా వుంటుంది. కాని హిందీయేతర ప్రాంతాలలో విద్య, వాణిజ్యం, టూరిజం, చలన చిత్రాలు, రేడియో, టెలివిజన్ల ద్వారా హిందీ వేగంగా అభివృద్ధి చెందడం గమనార్హం. ఇంగ్రీషుది ఆధిపత్యం అయినప్పటికి అధికారభాషగా హిందీ ఉపయోగం పెరుగుతూ వుంది. అదే సమయంలో హిందీ మాట్లాడే ప్రాంతాలతో సహా రెండవ భాషగా ఇంగ్లీషు వేగంగా విస్తరించింది. అందుకు ఉపాధ్యాయులు వసతులు ఎంత అధ్వానంగా వున్నప్పటికి కాళ్ళీరు నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం స్మూల్సే సాక్ష్యం. మాట్లాడే ఇంగ్రీషు, వ్రాసే ఇంగ్లీషు స్థాయి పడిపోయింది. కొని ఇంగ్లీషు తెలిసిన వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. ఇంగ్లీషు, హిందీ రెండు అనుసంధాన భాషలుగా అభివృద్ధి చెందవచ్చు, అధికార కార్యకలాపాల ద్వారా విద్య ద్వారా మీడియా ద్వారా స్వతంత్రం తర్వాత భారతదేశం 138
ప్రాంతీయ భాషలు విస్తరిస్తున్నాయి హిందీ, ఇంగ్లీషు ప్రాంతీయ భాషల పెరుగుదలకు ఆయా భాషలలో వెలువడుళున్న వార్త పత్రికలే నిదర్శనం. వాస్తవంగా ఇంగ్లీషు భారతదేశంలో కలకాలం మనగలుగుతుందని చెప్పలేము. కాని దేశవ్యాప్తంగా గల మేధావుల మధ్య పరస్పర భావవ్యక్తీకరణ భాషగా, లైబ్రరీ భాషగా యూనివర్సిటీలలో రెండవ భాషగా ఇంగ్లీషు వుంటుంది. అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు పొందీ ఆ మూడు పాత్రలు నిర్వహించడంలో విఫలమయింది. హిందీని దేశం యొక్క అనుసంధాన భాషగా చేయాలనే ఆదర్భం అలాగే వుండిపోయింది. కాని అత్యుత్సాహ పొందీ ప్రచారకులు హిందీ పట్ల అవలంబించిన విధానం హిందీ దేశవ్యాప్త అనుసంధాన భాష అయ్యే క్రమాన్ని కూడా వెనక్కి నెట్టి వేసింది.
184 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
త జాతిగా భారతదేశ ఏకీకరణ జి ఆక భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విర్మాణం
స్వతంత్రానంతరం జాతీయ సమైక్యత సమగ్రతల కొరకు భాషల ప్రాతిపదికన రాష్ట్రాల పునర్నిర్మాణం చేపట్టాలనే అంశం ముందుకు వచ్చింది. దాదాపు వంద సంవత్సరాలుగా సాగిన (బ్రిటీష్ ఆక్రమణ కాలంలో రాష్ట్రాల విభజన ఒక పథకం ప్రకారం కాకుండా యాధృచ్చికంగా జరిగింది. భాషా పరమైన లేక సాంస్కృతికపరమైన కలయికకు ప్రాధాన్యత లేదు. చెల్లా చెదురుగా వున్న స్వదేశి సంస్థానాలు వైవిధ్యాన్ని మరికొంత పెంచాయి.
భాషా రామాలు పరిపాలనా విభాగాలుగా వుండాలనే ఆకాంక్ష ప్రబలంగా వుంది. భాషకి సంస్కృతితో ఆచార వ్యనవారాలతో సన్నిహిత సంబంధం వుంటుంది. అంతేగాక మాతృభాష మాధ్యమం ద్వారా మాత్రమే వేగంగా అక్షరాస్యత, విద్యా వ్యాప్తి జరుగుతాయి. ప్రజలకు అర్ధమయ్యే భాషలో రాజకీయాలు, పరిపాలన నిర్వహించినప్పుడు మాత్రమే సాధారణ ప్రజలకు ప్రజాస్వామ్యం అర్ధవంతం, వాస్తవం అవుతుంది. భాష ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు జరగకపోతే విద్యకి పరిపాలనకు న్యాయ కార్యకలాపాలకు మాతృ భాష మాధ్యమం కాజాలదు.
ఈ కారణంగానే 1919 తరువాత జాతీయోద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో కాంగ్రెస్ మాతృభాష ద్వారా రాజకీయ సమీకరణ చేపట్టింది. 1921లో నిబంధనావళిని సవరించి భాషా ప్రాతిపదికన ప్రాంతీయ శాఖల్ని పునర్చిర్మించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్ర పునర్విభజన పట్ల కాంగ్రెస్ నిబద్ధతని ప్రకటించింది. హత్య స్వతంత్రం తర్వాత భారతదేశం 185
చేయబడడానికి 5 రోజుల ముందు గాంధీజీ చీలికలు తెచ్చే ధోరణుల్ని నిరుత్సాహపరచి భారతీయులుగా భావించి భారతీయులుగా ప్రవర్తించమని ప్రజలకు ఉద్పోధిస్తూనే ప్రాంతీయ భాషలు పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే భాషల ప్రాతిపదికన రామ్రాల పునర్విభజన జరగాలని చెప్పాడు.అంతేగాక స్వతంత్ర భారతదేశం పరిపాలనా హద్దుల్ని భాషల ప్రాతిపదికన నిర్ణయిస్తుందనేది దాదాపు అందరి ఆమోదం పొందిన ఒక వాస్తవం. స్వతంత్రం వచ్చిన వెంటనే జాతీయ నాయకత్వానికి వేరే ఆలోచనలు వచ్చాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. విభజన చాలా తీవ్రమైన, పాలనాపరమైన ఆర్థికపరమైన, రాజకీయపరమైన, అస్తవ్యస్తతని సృష్టించింది. యుద్ధం తరువాత వచ్చిన స్వతంత్రం తనతోపాటు ఆర్థిక, శాంతి భద్రతల సమస్యల్ని తెచ్చిపెట్టింది. అంతేగాక కాళ్ళీర్ సమస్య, పాకిస్తాన్‌తో యుద్ధం లాంటి పరిస్థితి వచ్చి పడ్డాయి. జూాతీయైక్యతని పటిష్టపరచడం తక్ష అత్యంత ముఖ్యమైన కర్తవ్యంగా జాతీయ నాయకత్వం భావించింది. రాష్ట్రాల పునర్విభజన కొరకు చేసే ఎలాంటి ప్రయత్నమైన పరిపాలనని ఆర్థికాభివృద్ధిని అస్తవ్యస్తం చేయవచ్చునని, ప్రాంతీయ భాషాపరమైన విభేదాల్ని తీవ్రతరం చేయవచ్చునని, విచ్చిన్నకర శక్తులకు ఊతమివ్వవచ్చునని, దేశ ఐక్యతకు నష్టం కలిగించ వచ్చునని భావించింది. నెహ్రూ 1947 నవంబరు 27న భాషా సమస్యపై మాట్లాడుతూ ఇలా చెప్పాడు : “ముందు చేయవలసిన పనులు ముందు చేయాలి. దేశ రక్షణ, స్థిరత్వం తక్ష సమస్య నెహ్రూ ఇతర నాయకులు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నిబద్ధులైనప్పటికి పునర్విభజనకు తక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఈ కర్తవ్యాన్ని కొన్ని సంవత్సరాల తరువాతనైనా చేపట్టవచ్చు ననుకొన్నారు. భాషల ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన సమస్య రాజ్యాంగ పరిషత్‌లో (ప్రస్తావనకు వచ్చింది. భాషా రాష్ట్రాల ఆవశ్యకతని గురించి అధ్యయనం చేసేందుకు పరిషత్ జస్టిస్ యస్,క. ధార్ నాయకత్వంలో 1948లో భాషా రాష్ట్రాల కమిషన్ నియమించింది. అప్పటి పరిస్థితులో భాషా రాష్ట్రాల విభజన జాతీయ సమ(గ్రతకు వాని, పాలనాపరమైన ఇబ్బందుల్ని కలిగించవచ్చునని ధార్ కమిషన్ సలహా ఇచ్చింది. ఫలితంగా భాషా ప్రాతిపదిక సూత్రాన్ని రాజ్యాంగంలో చేర్చరాదని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించింది. కాని ప్రజాభిప్రాయం- ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో అందుకనుకూలంగా లేదు. నమన్య రాజకీయంగా నజీవంగానే వుంది. భాషా రా్రాల్ని కోరేవారిని 186 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
శాంతింపజేయడానికి కాంగ్రెస్ 1948 డిసెంబరులో సమస్యని క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ సర్దార్‌పటేల్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ పట్టాభి సీత్రారామయ్య (జె.వి.పి) కమిటీని నియమించింది. ఈ కమిటీ ఐక్యత, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి తక్షణావసరాలుగా నొక్కి చెబుతూ అప్పటికప్పడు రాహష్ర్రాల పునర్విభజన చేపట్టరాదని సూచించింది. కాంగైస్ నాయకత్వం ప్రజల డిమాందుని వ్యతిరేకించలేదు. భాషా రాష్ట్రం కావాలని పట్టుదలగా ఉండి అక్కడి ఇతర భాషా గ్రూపులు కూడా అందుకు అనుకూలంగా ఉంటే భాషా రాష్ట్రం ఏర్పాటు చేయాలని జెవిపి రిపోర్టులోను, ఆ తరువాత కూడా కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. జెవిపి రిపోర్టు తరువాత దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ఉద్యమాలు జరిగాయి. అవి తరతమ భేదాలతో 1960 వరకు కొనసాగాయి. తెలుగు ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు చేసిన డిమాండు అందుకు ఉదాహరణ. ఈ డిమాండు దాదాపు 50 సంవత్సరాల నుండి ఉన్నది. దానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతూ ఉంది. అప్పుడున్న మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు - ప్రత్యేకించి తమిళనాడు నాయకత్వం కూడా అంగీకరించడం వలన _ జెవిపి కమిటీ అంగీకరించింది. కాని మద్రాసు ఏ రాష్ర్రానికి చెందాలనే అంశంపై వివాదం కారణంగా వెంటనే రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు పొట్టి శ్రీ రాములు 1952 అక్టోబరు 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల తరువాత అశువులర్చించారు. మూడు రోజులపాటు ఆంధ్ర పప్రాంతమంతటా ప్రదర్శనలు, హర్తాళ్ళు, హింస చెలరేగాయి. ప్రభుత్వం ప్రత్యేకాంధ్ర ఏర్పాటుకు అంగీకరించింది. 1953 అక్టోబరులో నూతన రాష్ట్రం అవతరించింది. అదే సమయంలో తమిళ ప్రజలకు తమిళనాడు ఏర్పడింది. ఆంధ్రుల పోరాట విజయం ఇతర భాషా (గ్రూపుల రాష్ట్రం ఏర్పాటుకు భాషాపరంగా రాష్ర్రాల సరిహద్దుల సవరణ కొరకు జరిపే ఆందోళనకు ప్రోత్సాహమిచ్చింది. నెహ్రూ అప్పుడు రాష్ర్రాల విభజనకు అనుకూలంగా లేడు. కాని ప్రజల డిమాండ్లను నిరాకరించేందుకు ఆయనకు గల గాధమైన ప్రజాస్వామ్య భావాలు అద్దువచ్చాయి. నెహ్రూ జీవిత చరిత్ర వ్రాసిన ఎస్. గోపాల్ చెప్పినట్లు ప్రజల భావాన్ని అణచివేయడం స్వతంత్రం తర్వాత భారతదేశం 187
అప్రజాస్వామికంగా భావించాడు. భాషాపరమైన ఐక్యత జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేస్తుంది. కాని ఆయనకు ఆందోళన కలిగించిన అంశాలేమంటే ఆందోళనకు వారు ఎంచుకొన్న సమయం, భాషా రాష్ట్రాల డిమాండుతో పాటు చేలరేగిన ఆందోళన, హింస ఈ డిమాండ్లు చేస్తున్న భారత ప్రజలలోని వివిధ సెక్షన్త మధ్య గల శత్రుత్వం. ప్రజల డిమాండుని స్వీకరించి సాచివేత వైఖరి నవలంబించేందుకు నెహ్రూ 1953లో జస్టిస్ ఫజ్లాలి, కె.ఎం ఫణిక్కర్, హిదయ తుల్లా కుంజు సభ్యులుగా గల రాష్ట్ర పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సి) నియమించాడు. యూనియన్‌లోని రాష్ర్రాల పునర్నిర్మాణ సమస్యని నిష్పక్ష పాతంగా పరిశీలించేందుకు కమిషన్ పనిచేసిన రెండు సంవత్సరాలలో ఎన్నో సమావేశాలు జరిగాయి. ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనలు నిరాహార దీక్షలు జరిగాయి. వేర్వేరు భాషా గ్రూపులు పరస్పరం దూషించుకొన్నాయి. ఘర్షణలు పడ్డాయి. కమిషన్ సభ్యులు బాధతో ఇలా రిపోర్టు చేశారు. స్వతంత్ర పోరాటంలో భుజం భుజం కలిపి పోరాడిన సహచరులు కొన్ని ప్రాంతాలలో పరమ శత్రుత్వంతో సరిహద్దు యుద్ధానికి తారసపడడం మనసుని కలబి వేసింది... ప్రజల సంకుచిత మత ప్రాంతీయ భావాల్ని రెచ్చగొట్టి ప్రజల ఆవేశకావేషాలను పెంచే ప్రయత్నాలు, పెద్ద ఎత్తున వలసల బెదిరింపులు ఫలానా భాషా గ్రూపు పరిపాలనా విభాగంగా అనుమతించబడకపోతే ఆ భాషా గ్రూపు అంతరించి పోవడం తప్పదని భయపెట్టడం అన్ని కూడా సరైన ధృక్చధం, సమతుల్యత కొరవడటాన్ని సూచిస్తున్నాయి. యస్. ఆర్.సి తన రిపోర్టుని 1955 అక్టోబరులో సమర్పించింది. పరిపాలన ఆర్థిక పరమైన అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ భాష సూత్రాన్ని గుర్తించి ఆ ప్రాతిపదికన రాష్ట్ర సరిహద్దుల్ని నిర్ణయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాని కమిషన్ బొంబాయి,పంజాబు రాల విభజనని వ్యతిరేకించింది. చాలా ప్రాంతాలలో రిపోర్టుకి వ్యతిరేకత వ్యక్తమయినప్పటికి కొన్ని మార్పులతో యస్.ఆర్.సి. సిఫార్సులు ఆమోదించబడ్డాయి. అమలు జరపబడ్డాయి. 1956 నవంబర్‌లో పార్లమెంటు రాష్ట్రాల పునర్నిర్మాణ చట్టాన్ని ఆమోదించింది. చట్టం 14 రాష్ట్రాలకు 6 కేంద్ర పాలిత ప్రాంతాలకు అవకాశం కల్పించింది. హైదరాబాదు సంస్థానంలోని తెలంగాణా ప్రాంతం ఆంధ్రలో కలపబడింది. తిరువాన్మూరు, కొచ్చిన్తో మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబారు జిల్లాని కలిపి కేరళ రాష్ట్రం ఏర్పరచబడింది. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్ కూర్చులలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు మైసూర్ సంస్థానంలో 188 చిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కలపబడ్డాయి. కచ్, సౌరాష్ట్ర సంస్థానాలు, హైదరాబాద్ సంస్థానంలోని మరాఠీ ప్రాంతాన్ని విలినం చేసి బొంబాయి రాష్ట్రం విస్తరించబడింది. యస్. ఆర్.సి. రిపోర్టుకి రామ్షైల పునర్నిర్మాణ చట్టానికి మహారాష్ట నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయింది. మహారాష్ట్రలో విస్తృతంగా ఘర్షణలు చెలరేగాయి. బొంబాయి నగరంలో 1956 జనవరిలో పొలీసుల కాల్పుల్లో 80 మంది హతులయ్యారు. విద్యార్థుల, రైతుల, కార్మికులు, కళాకారుల, వ్యాపారుల, విస్తృత ప్రజానీకం మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు శక్తివంతమైన నిరసన ఉద్యమాన్ని నడిపాయి. ఒత్తిడికి లొంగిన కేంద్ర ప్రభుత్వం బొంబాయి రాష్ట్రాన్ని రెండు భాషా రాష్ట్రాలుగా - మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలుగా విభజించాలని బొంబాయిని ప్రత్యేకమైన కేంద్ర పాలిత రాష్ట్రంగా చేయాలని నిర్ణయించింది. మహారాఘ్లులు ఈ చర్యని తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరచినందుకు కలతకు గురయిన నెహ్రూ బొంబాయిని ద్విభాషలు గల గ్రేటర్ బొంబాయిగా ప్రకటించాడు. ఈ చర్యని మహారాష్ట్ర ప్రజలు, గుజరాత్ ప్రజలు వ్యతిరేకించారు. విస్తృత (ప్రాతిపదికన ఏర్పడిన సంయుక్త మహారా(ష్టలో కాంగ్రెస్‌లోని పెద్ద సెక్షన్ బొంబాయి రాజధానిగా ఒకే భాషా రాష్ట్రాన్ని డిమాండ్ చేసింది. ఆ సమస్యపై కేంద్ర మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగావున్న సి.డి. దేశముఖ్ రాజీనామా చేశాడు. గుజరాతీలు కొత్త రాష్ట్రంలో మైనారిటీగా మిగిలిపోతామని భావించారు. బొంబాయి నగరాన్ని మహరా(్టకు వదిలివేయడానికి వారు అంగీకరించలేదు. పొంన, గృహదహనాలు,అహమ్మదాబాద్‌కి గుజరాతులోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. పాలీసు కాల్పుల్లో 16 మంది హతులయ్యారు. 200 మంది గాయపడ్డారు. బొంబాయి నగరంపై అనంగీకారాన్ని గమనంలో పెట్టుకొని ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి 1956 నవంబరులో రాష్ట్రాల పునర్నిర్మాణ చట్టాన్ని ఆమోదించింది. కాని సమస్య అంతటితో ఆగిపోలేదు. 1957 ఎన్నికలతో బొంబాయి కాంగ్రెస్ అంతంత మాత్రం మెజారిటీతో గట్టెక్కింది. ప్రజాందోళన దాదాపు 5 సంవత్సరాలు పాటు కొనసాగింది. కాంగ్రెస్ పైసిడెంటుగా ఇందిరాగాంధీ సమస్యని తిరగతోడారు. దేశాధ్యక్షుడు ఎస్. రాధాకృష్ణన్ మద్దతిచ్చారు. చివరికి 1960 మేలో ప్రభుత్వం బొంబాయి నగరాన్ని మహారాష్ట్రలో వుంచి, అహమ్మదాబాద్‌ను గుజరాత్ రాష్ట్ర రాజధానిగా చేస్తూ బొంబాయి రాష్ట్రాన్ని మహరాష్ట్ర గుజరాత్ రాష్ర్రాలుగా విభజించడానికి అంగీకరించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 189
భాషా సూత్రానికి మినహాయింపుగా ఏర్పడిన మరొక రాష్ట్రం పంజాబ్. 1956లో పాటియాల ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు) పంజాబ్‌లో విలీనం చేయబడింది. దీనితో పంజాబ్ మూడు భాషలుగా - పంజాబి, హిందీ, పహారీ భాషలు మాట్లాడే ప్రజల రాష్ట్రమైంది. పంజాబి మాట్లాడే ప్రాంతంలో ప్రత్యేక పంజాబి సుబ (పంజాబి మాట్లాడే రాష్ట్రం) కొరకు బలమైన డిమాంద్ ఉంది. దురదృష్టవశాత్తు సమస్య మతాల రంగు పులుముకుంది. అకాలీ దళ నాయకత్వంలో సిక్కు మతవాదులు, జనసంఘ నాయకత్వంలో హిందీ మతవాదులు భాషా సమస్యను మత రాజకీయాల కొరకు ఉపయోగించుకున్నారు. పంజాబి తమ మాతృ భాష కనుక హిందూ మతవాదులు పంజాబి సుబ డిమాండ్‌ను వ్యతిరేకించారు. గురుముఖి లిపిలో రాసిన పంజాబి సిక్కు భాష గనుక సిక్కు మతవాదులు సిక్కు రాష్ట్రాన్ని కోరారు. దీనిని కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌లోని ఒక సెక్షన్ బలపరిచినప్పటికీ ఈ డిమాండ్ మతంతో కలగలపబడింది. నెహ్రూ పంజాబ్ కాంగ్రెస్ నాయకులలోని అత్యధికులు పంజాబ్ రాష్ట్రం కొరకుచేసే డిమాండ్‌ను సిక్కులు మెజారిటీగా ఉందే రాష్ట్రం కొరకు భాష రంగు పులిమి చేస్తున్న మతపరమైన డిమాండ్‌గా భావించారు. నెహ్రూ ఇతర కాంగ్రెస్ నాయకులు మత ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కొరకు చేసే డిమాంద్ను అంగీకరించమని స్పష్టం చేశారు. పంజాబి మాట్లాదేవారికి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ అటు భాష సమస్యను ఇటు మత సమస్యను పరిష్మరించదు. గనుక ఎస్.ఆర్.సి. కూడా దానిని తిరస్కరించింది. (పంజాబ్ రాష్ట్రం కొరకు జరిగిన శక్తివంతమైన ఉద్యమాలు పంజాబ్ సంక్షోభంపై రాయబడిన 25వ అధ్యాయంలో చర్చించబడ్డాయి) చివరికి 1966లో పంజాబ్‌ని పంజాబి, హిందీ మాట్లాడే పంజాబ్, హర్యానా రాఘ్ట్రాలుగా విభజనకు ఇందిరాగాంధీ అంగీకరించారు. పహారీ భాష మాట్లాడే కాంగ్రా జిల్లా హోసియాపూర్ జిల్లాలోని కొంత భాగం హిమాచల్‌ప్రదేశ్‌లో కలుపబడింది. కొత్తగా నిర్మించబడిన నగరం సమిష్టి పంజాబ్‌కు రాజధానియైన చంథీఘర్ని పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రాంతంగా ప్రకటించబడింది.
ఆ విధంగా 10 సంవత్సరాలకు పైగా జరిగిన నిరంతర ఆందోళనలు, అలజడుల తరువాత ప్రజల రాజకీయ భాగస్వామ్యానికి అవకాశం కల్పించే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్నిర్మాణం పూర్తి అయింది.
140 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భాషాపరమైన విధేయత జాతీయతా విధేయతకు తోడుగా ఉండి దానిని పెంచుతుందని 1956 నుంది జరిగిన సంఘటనలు స్పష్టం చేశాయి. భాషల (ప్రాతిపదికన రాష్ట్రాల పునర్నిర్మాణం ద్వారా జాతీయ నాయకత్వం ద్వారా విచ్చిన్నకర ధోరణుల నరికట్టగలిగింది. కాబట్టి రాష్ట్రాల పునర్నిర్మాణం జాతీయ సమగ్రతా మార్గాన్ని సుగమం చేసింది. రాష్ట్ర విభజన కాలంలో, భాషాపరంగా శత్రు శిబిరాలుగా ఏర్చడి పరస్పరం దూషించుకున్నప్పటికి తరువాత రాష్ట్రాల రాజకీయాలు భాషా ప్రాతిపదికన జరగలేదు.
అంతేగాక చాలామంది ఆందోళన చెందినట్లు భాషాప్రయుక్త రాష్ష్రాల నిర్మాణం కేంద్రం యొక్క ఫెడరల్ స్వభావంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రాన్ని బలహీన పరచలేదు. కేంద్ర (ప్రభుత్వం అంతకుముందులాగానే రాష్ట్ర ప్రభుత్వాలను క్రమబద్ధంగా నడపగలిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రణాళికల రూపకల్పనలో ఆర్థికాభివృద్ధిలో సహకరిస్తూ వచ్చాయి. భాషా ప్రాతిపదికన వనరుల సమీకరణ, వినియోగంలో వివక్ష చూపినట్లు ఎవరూ అభియోగం మోపలేదు. పొందికగా ఉన్న రాష్ట్రాల ఏర్పాటు కారణంగా జాతీయ (ప్రభుత్వం బలపడింది.
ఆ విధంగా రాష్ట్రాల పునర్చిర్మాణం దేశ ఐక్యతను బలహీనపరచకపోవడమే కాక బలాన్ని చేకూర్చింది. ఆందోళనతో నిరాశావాదంతో జోస్యాలను చెప్పిన వారిని నిరుత్సాహ పరిచింది. రాజకీయ శాస్త్రవేత్త రజనీ కొఠారి మాటల్లో : నాయకత్వం యొక్క తొలినాటి వ్యక్తిగత అభిప్రాయాలకు భిన్నంగా, పరిశీలకుల అశుభ సూచిక జోస్యాలకు భిన్నంగా పునర్వ్యిస్టీకరణ ఐక్యతని బలహీనపర్చకుండా భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని వ్యవస్థీకృతం చేసింది. వమైనప్పటికీ విభేదాలను తొలగించి, అత్యధిక ప్రజానీకం అర్ధం చేసుకునే మాద్యమం ద్వారా పాలన సాగించే రాజకీయ విభాగాలను సృష్టించింది. భాష విభజించే శక్తిగా గాక అనుసంధానం చేసే, సమైక్యపరచే శక్తిగా నిరూపితమయింది.
రాష్ట్రాల పునర్నిర్మాణం భాషా వివాదానికి సంబంధించిన అన్నీ సమస్యల్ని పరిష్కరించలేదు. వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దుల వివాదాలు, భాషాపరంగా మైనారిటీల వివాదాలు, ఇంకా జలవనరుల పంపకం, విద్యుత్తు పంపకం లాంటి సమస్యలు కొనసాగుతున్నాయి. భాషాపరమైన దురభిమానం కూడా తరుచుగా వ్యక్తమవుతూనే ఉంది. కాని పునర్నిర్మాణం దేశ సమైక్యతని ప్రభావితం చేసే పెద్ద ఆటంకాన్ని తొలగించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం న!
మైనారిటీ భాషలు
భాషా సమస్య యొక్క ముఖ్యమైన అంశం మైనారిటీ భాషల స్థాయి. ఏ విధంగా విభజించినప్పటికి ఒకే భాష మాట్లాడే రాష్ట్రాల విభజన సాధ్యం కాదు. ఫలితంగా భాషాపరమైన మైనారిటీలు అంటే ఆ రాష్ట్ర అధికార భాష కాకుండా ఇతర భాష మాట్లాడేవారు ఉండక తప్పదు. మొత్తం మీద భారతదేశ జనాభాలో 18 శాతం ఆయా రాష్ట్రాల అధికార భాషలు మాట్లాడని వారున్నారు. 1971 గణాంక వివరాల ననుసరించి మైనారిటీ భాషలో మాట్లాడేవారు కేరళలో 4 శాతం, కర్నాటకలో 34 శాతం, అస్సాంలో 8.9 శాతం, జమ్మూ కాశ్మీర్లో 445 శాతం ఉన్నారు.
ప్రారంభం నుండి ఆయా రాష్ట్రాలలో మైనారిటీల న్థాయి, వారి హక్కులు ఒక సమస్యగా ఉంటూ వచ్చింది. ఒక వైపు వారి రక్షణ, మరొక వైపు రాష్ట్రంలోని ప్రధాన భాషా గ్రూపుతో వారి విలీనం. మైనారిటీలకు వారి పట్ల ఎలాంటి వివక్ష చూపబడదని నమ్మకం కలిగించాలి. వారి భాషా సంస్కృతుల అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. అదే సమయంలో మైనారిటీల అవసరాలు తీర్చడం వేర్పాటువాదానికి అవకాశమివ్వదని, అలా తీర్చడం వలన వారికి రాష్ట్రం పట్ల విధేయత పెరుగుతుందని మెజారిటీకి హామీ ఇవ్వాలి.
ఈ సమస్య పరిష్కారానికి భాషాపరమైన మైనారిటీలకు రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. ఉదాహరణకు ఆర్టీకల్ 30 ననుసరించి 'మతపరంగొ గాని, భాషాపరంగా గాని మైనారిటీలుగా ఉన్నవారు వారి వారి విద్యా సంస్థల్ని న్థాపించుకోవచ్చు. నడుపుకోవచ్చు.” అంతకంటే ముఖ్యంగా “రాజ్యం విద్యా సంస్థలకు- అవి మతపరమైన లేక భాషాపరమైనవైనప్పటికి ఎలాంటి వివక్ష చూపకుండా నిధులు మంజూరు చేయాలి.” మైనారిటీ పక్షాన చేసిన డిమాందుపై వారి భాష రాష్ట్రం మొత్తంలో గాని లేక దానిలోని కొద్ది ప్రాంతాలలో గాని అధికారికంగా గుర్తింపబడాలని రాష్ట్ర పతి ఆదేశించవచ్చునని ఆర్టికల్ 847 స్పష్టం చేస్తుంది. 1956లో చేసిన రాజ్యాంగ సవరణ మేరకు మైనారిటీల బిడ్డలు ఒక తరగతి ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యలో వుంటే వారికి ప్రాథమిక, సెకండరీ తరగతులలో వారి మాతృభాషలో విద్యా బోధన చేయటం ప్రభుత్వ విధానం. రాజ్యాంగ సవరణ భాషపరమైన మైనారిటీల కొరకు కల్పించిన రక్షణలను క్రమబద్ధంగా పరిశీలించి నివేదించేందుకు ఒక కమిషనర్ని నియమించాలని పేర్కొన్నది. 142 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మైనారిటీ హక్కుల రక్షణపట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరి చేపట్టింది. కాని వాటిని అమలువరచడం రాష్ట్ర (ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది .కాబట్టి అమలుపరచడంలో ఒక రాష్ట్రానికి మరొక రాష్ర్రానికి వ్యత్యాసం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో కొంత అభివృద్ధి జరిగినప్పటికి, అత్యధిక రాష్ట్రాలలో భాషాపరమైన మైనారిటీల పరిస్థితి అంత్ర సంతృప్తికరంగా లేదు. రాజ్యాంగ రక్షణలు అంతంత మాత్రంగా అమలుజరపబడ్డాయి. చదువులో, సాంకేతిక వైద్య సంస్థలలో ప్రవేశం కల్పించడంలో, రాష్ట్ర ప్రభుత్వం సర్వీసులలో ఉద్యోగాలు కల్పించడంలోను రాష్ట్ర అధికార భాషలో తగినంత పరిజ్ఞానం లేదనే సాకుతో భాషాపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా వివక్ష ఘటనలు అసంఖ్యాకమని భాషాపరమైన మైనారిటీల కమిషనర్ తన నివేదికలో ఎప్పటికప్పుడు ప్రస్తావించాడు. మైనారిటీలకు మాతృభాషలో ప్రాథమిక విద్యావకాశాలు ఒక మేరకు కల్పించబడ్డాయి. కాని అర్హత గల ఉపాధ్యాయులు, తగిన పాఠ్యపుస్తకాల రీత్యా చూస్తే ఇవీ అంతంత మాత్రమే. తెగల మైనారిటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. మైనారిటీ భాషలలో ఉర్జూ అన్నిటికంటే పెద్ద మైనారిటీ భాష. 1951లో ఉర్దూ మాట్లాడేవారు 28.3 మిలియన్లు మంది వున్నారు. యు.పిలో 10.5లో శాతం, బీవారులో 8.8 శాతం, మహారాష్ట్రలో 7.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం, కర్నాటకలో 9 శాతం ఉర్దూ మాట్లాడతారు. అంతేగాక భారతదేశంలో అత్యంత పెద్ద మతపరమైన మైనారిటీగా వున్న ముస్లింలకు ఉర్దూ మాతృభాష. భారతదేశ జాతీయ భాషలలో ఒకటిగా ఉర్దూ గుర్తించబడింది. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరుచుకొన్నాం.
భారతదేశంలోని పెద్ద భాషలన్ని ఏదో ఒక రాష్ట్రానికో, మరొక రాష్ర్రానికో అధికార భాషగా వున్నాయి. ఉర్దూ చాల చిన్న రాషష్టమైన జమ్మూ కాళ్ళీర్లో అధికార భాష. అక్కడా కాళ్ళీర్, దోగ్రీ, లడాఖీ మాతృభాషలుగా వున్నాయి. ఫలితంగా దేశంలోని ఏప్రాంతంలో కూడా ఉర్దూకి ప్రభుత్వ మద్దతులేదు. అంతేగాక యు.పి బీహారులలో ప్రభుత్వాల వివక్షకు గురవుతుంది. హిందీ ఉర్దూ రెండు ప్రత్యేక భాషలు కావు కాబట్టి ఉర్జూని రెండవ అధికార భాషగా ప్రకటించనవసరం లేదని సాకు చూపి యు.పి ప్రభుత్వం హిందీని మాత్రమే అధికారభాషగా ప్రకటించాలని నిర్ణయించింది. ఆచరణలో చాలా ప్రాధమిక పాఠశాలల్లో ఉర్దూ రద్దయింది. బోధనా భాషగా దాని ఉపయోగం చాలా స్వతంత్రం తర్వాత భారతదేశం 143
పరిమితం చేయబడింది. 1979-80లో కేవలం3.69 శాతం ప్రాథమిక విద్యార్థులు మాత్రమే ఉర్పూలో బోధన స్వీకరించగలిగారు. కాని ఉర్పూ మాట్లాడేవారు 10.5 శాతం వున్నారు. హిందీ ప్రచారకులు లిఖిత హిందీ నుండి ఉర్జూ పదాలను తాలగించడం ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ఉర్పూని ఆశ్రద్ధ చేయటం పట్ల ప్రముఖ ఉర్దూ విమర్శకుడు ఎస్.ఇ. హుస్సేన్ యిలా వాఖ్యానించాడు: 'ఉర్ట్జూ ఒక పిలక మాత్రమే హిందీలో ఒక రకం విదేశీ భాష. ముస్లిముల భాష మత విద్వేషానికి పనిముట్టు, భారతీయ ఐక్యతకు శత్రువు - అని నిరంతర ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారాలు ఉర్జూని అణచివేయడానికి సాగిస్తున్న ప్రచారాలు, ఉర్జూ మాట్లాడేవారు గణనీయంగా వున్న రాష్ట్రాలలో - ప్రత్యేకించి యు.పి., బీహరులలో దానిని రెండవ అధికార భాషగౌ గుర్తించాలని గట్టిగా కోరుతున్నారు. యు.పి. ప్రభుత్వం తిరస్కరిస్తూ వుంది. రాష్ట్రంలోని 30 శాతం ప్రజలు మాట్లాడే భాషని రెండవ అధికార భాషగా లేక రెండవ ప్రాంతీయ ఖాషగా గుర్తించాలని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫార్సు చేసింది గనుక తిరస్కరిస్తున్నాము అంటుంది ప్రభుత్వం.
కేశ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ం భారతదేశం జాతిగాపకీకరణ తెగల విలీనం
విభిన్న పరిస్థితులలో దేశంలోని వివిధ ప్రాంతా నివాసం, వివిధ భాషలు, విభిన్న సంస్కృతులు గల తెగల ప్రజల్ని ప్రధాన ప్రవంతిలో విలీనం చేసే సమస్య చాలా సంక్షిష్టమైనది. 1971 గణాంక వివరాలను బట్టి 400 తెగలకు చెందిన 88 మిలియన్ల (ప్రజలు దేశ జనాభాలో 6.9 శాతంగా వున్నారు. తెగల ప్రజలు దేశవ్యాప్తంగా విస్తరించి వున్నప్పటికి మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఈశాన్య పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర గుజరాత్, రాజాస్టాన్లలో ఎక్కువగా వున్నారు. ఈశాన్యంలో మినహాయించి వారి స్వంత రాష్ట్రాలలో వారు మైనారిటీలుగా వున్నారు. అడవుల్లో కొండల్లో నివశిస్తూ వేరుగా వుండిపోయారు. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, జీవన విధానం - అన్నీకూడా చాలా స్పష్టంగా వేరుగా వున్నాయి. అయినప్పటికి ఒక్క ఈశాన్య ప్రాంతంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలోని తెగల ప్రజలకు, ఇతరులకు మధ్య శతాబ్దాల తరబడి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు వున్నాయి.
వలసవాదం దేశంలోని అత్యధిక ప్రాంతాలలోని తెగలలో చాలా మార్పులు తెచ్చింది. మార్కెట్ శక్తులు చొచ్చుకుపోయి వారి ఒంటరితనాన్ని తాలగించాయి. వారు (బిటిషిండియాలో స్వదేశీ సంస్థానాలలో విలీనం చేయబడ్డారు. వడ్డీ వ్యాపారులు, వ్యాపారులు, దళారులు, ఉద్యోగులు తెగల ప్రాంతాలపై దాడి చేసి తెగల సాంప్రదాయ జీవన విధానాన్ని ధ్వంసం చేశారు. తెగల ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. భూములు కోల్పోయారు. పాలికాపులుగా, కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగా మార్చివేయబడ్డారు. చాలామంది కొండల్లోకి కోనల్లోకి నెట్టివేయబడ్డారు. తెగల ప్రజల భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకు ఆలస్యంగా చేయబడిన చట్టం స్వతంత్రం తర్వాత భారతదేశం 1148
ఈ క్రమాన్ని ఆపటంలో విఫలమయింది. దాదాపు తన జీవితమంతా మధ్య, ఈశాన్య భారతదేశంలోని తెగలతో గడిపినవాడు, తెగల ప్రజలకు సంబంధించిన నూతన ప్రభుత్వ విధానాల రూపకల్పనని గణనీయంగా ప్రభావితం చేసిన వాడు అయిన వెరియర్ ఎల్విన్ బ్రిటిషుపాలనలో తెగల ప్రజల దుస్థితిని గురించి ఇలా చెప్పారు : 'వ్యాపారులు, సారాయి అమ్మేవాళ్ళు - వాళ్ళతోపాటు మోసాలు, నయవంచనలు తెప్పారు. తెగల ప్రజల పాలాన్ని కొంచెం కొంచెంగా కబళించారు. దోపిడి, అజచివేతలు ప్రయోగించారు. పేదరికంలోకి నెట్టారు. తెగలకు అడవితో గల సంబంధాన్ని వలసవాదం మార్చి వేసింది. వారు ఆహారం, వంటచెరుకు, పశువుల మేత చేతి పనులకు అవసరమైన ముడి వనరుల కొరకు అడవిపై ఆధారపడతారు. మైదాన ప్రాంతాల నుండి వలసవచ్చిన రైతుల భూదాహం అడవుల విధ్వంసానికి దారి తీసింది. అంటే తెగల ప్రజల జీవనానికి అవసరమైన సాంప్రదాయ వనరులు ధ్వంసమయ్యాయి. వలసవాద పాలకులు అదవుల సంరక్షణకు, వారి వాణిజ్యపరమైన దోపిడీకి తోద్బదేందుకు విస్తారమైన అటవీ భూముల్ని అటవీ చట్టాల క్రిందికి తెచ్చారు. ఈ అటవీ చట్టాలు పోడు వ్యవసాయాన్ని నిషేధించాయి. తెగల ప్రజలు అడవిని ఉపయోగించుకొనడంపై తీవ్రమైన ఆటంకాలు కల్పించాయి.
పొలం పోగొట్టుకొనడం, అప్పుల్లో కూరుకుపోవడం, దళారుల దోపిడి, అటవీ ఉత్పత్తుల వినియోగాన్ని తిరస్కరించడం. పొలీసుల, అటవీ అధికారుల, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అణచివేత, దోపిడీలు 19-20 శతాబ్దాలలో అనేక తెగల ప్రజల పోరాటాలకు దారి తీశాయి. ఉదాహరణ : సంతాల్ తిరుగుబాటు, బిర్బాముండా నాయకత్వంలో ముండాల తిరుగుబాటు, ఒరిస్సా, బీహారు, పశ్చిమ బెంగాలు, ఆంధ్ర, మహారాష్ట గుజరాత్‌లలో రైతు ఉద్యమాలలో జాతీయోద్యమంలో తెగల ప్రజల భాగస్వామ్యం. తెగల ప్రజా విధానానికి మూలాలు 006 0 క0412'9 1021 వ౨010)0
తెగల ప్రజల సంపద్వంతమైన సాంఘిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం తెగల్ని విలీనం చేసే ప్రభుత్వం విధానంలోని కీలకాంశం. తెగల ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి రూపకల్పనని ప్రభావితం చేసిన జవహర్లాల్ నెహ్రూ మాటల్లో : 'తెగల ప్రాంతాలలో మనం ఎదుర్కొనవలసిన మొదటి సమస్య భారతదేశంలో వారూ భాగమనే విశ్వాసం వారిలో (తెగల ప్రజలలో) కలిగించడం, వారు దేశంలో భాగం గనుక దానిలో వారికి గౌరనీయమైన స్థానం వుందని గుర్తింపచేయడం. 'అదే సమయంలో వారికి భారతదేశం రక్షణ కల్పించే శక్తి గానే గాక విముక్తి కల్పించే శక్తిగా ద్యోతకమవ్వాలి.' భారత జాతీయతకు తెగల ప్రజలకు స్థానం కల్పించే సమర్ధత వుందని నెహ్రూ భావించాడు. 146 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారతీయ సమాజంలో తెగలకు ఇచ్చే స్థానంపై రెండు వైఖరులున్నాయి. ఒకటి ;: బయటి ప్రపంచపు ఆధునిక ప్రభావాలు పదకుండా తెగల ప్రజల్ని వారి మానాన వారిని వదిలివేయడం - అంటే వారు ఇప్పుడెలాగున్నారో అలాగే వుంచడం, రెండవది వారిని వారి చుట్టూ వున్న సమాజంలో పూర్తిగా వీలైనంత త్వరగా కలుపుకొనడం. తెగల జీవన విధానం అంతరించిపోవడం చింతించదగింది కాదు. అది వారి అభివృద్ధి గనుక స్వాగతించాలి.
జవహర్లాల్ నెహ్రూ ఈ రెండు వైఖరుల్ని తిరస్కరించాడు. మొదటి వైఖరి ననుసరించి వారు ప్రదర్శనశాల నమూనాగా పరిశీలింపబడడం అంటే వారిని అవమాన పరచడమే అవుతుంది అన్నాడు. నెహ్రూ : బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిని వేరుగా వుంచడం సరియైనది కాదన్నాడు నెహ్రూ. బయటి ప్రపంచం చాచ్చుపోయే క్రమం ఇప్పటికే చాల వరకు జరిగింది గనుక ఈ దశలో వేరుగా లేక విడిగా వుంచడం అసాధ్యం. అది కోరదగింది కాదు. బయట పనిచేస్తున్న శక్తులకు వదలివేసి విలీనం చేయటమూ కోరదగింది కాదు. ఇది తెగల ప్రజల సాంఘిక సాంస్కృతిక గుర్తింపు పోవడానికి దారి తీస్తుంది. “ఇప్పుడున్న పరిస్థితుల్ని అనుమతిస్తే అన్యాయాలకు వెనుకాడని బయటి ప్రజలు తెగల భూముల అడవుల్ని స్వాధీనం చేసుకొని తెగల ప్రజల జీవితంలో జోక్యం చేసుకుంటారు" అన్నాడు నెహ్రూ. ఇది 'వారి జీవనాన్ని సంస్కృతిని తలక్రిందులు చేస్తుంది.”
ఈ రెండు వైఖరులకు భిన్నంగా నెహ్రూ తెగల ప్రజల ప్రత్యేక గుర్తింపుని, సంస్కృతిని కొనసాగిస్తునే వారిని భారతీయ సమాజంలో విలీనం చేయడం, భారత జాతిలో అవిచ్చిన్న భాగంగా చేయడం మంచిదన్నాడు. నెహ్రూ వైఖరిలో రెండు ప్రమాణాలు వున్నాయి. ఒకటి: తెగల ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. రెండు: వాటి పద్ధతిలో అవి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే దేశంలో ఇతర ప్రాంతాలలో జరిగేదానికి నకలు తీసి చూపడం కాదు. దేశంలో ఇతర ప్రాంతాలలో జరిగే మంచిని వారు క్రమబద్ధంగా అమలుపరుచుకొనేలా చూడటం. అంతేగాక ఏ మార్పులు అవసరమవుతాయో అవి వారే తెచ్చుకానడం.
పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ రెండు వైఖరుల్ని ఎలా సమన్వయపరచడం
- అనేది సమస్య, నెహ్రు తెగల (ప్రజల ఆర్థిక, సాంఘిక అభివృద్ధి-ప్రత్యేకించి వార్తా రవాణా సౌకర్యాలు, ఆధునిక వైద్య సౌకర్యాలు, వ్యవసాయం విద్యా రంగాల ద్వారా జరగాలని కృతనిశ్చయంతో వున్నాడు. ప్రభుత్వ విధానం కొరకు కొన్ని మార్గదర్శకాలను నిర్ధారించాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం 147
మొదటిది : తెగల ప్రజలు వారి సహజ పద్దతిలో అభివృద్ధి చెందాలి. బయటినుండి నిర్భంధం ఒత్తిడి వుండకూడదు. తెగల ప్రజలు కాని వారు తొము అధికులమనే భావంతో వారి దగ్గరకు పోకూడదు. దేశం యొక్క ఉమ్మడి సంస్కృతి సామాజిక రాజకీయ జీవిత వికాసానిక్తి తెగలు ప్రజలు సమానమైన తోడ్పాటు అందించగలరనే అవగాహన వుండాలి.
రెండవది : భూమిపై, అడవులపై తెగల ప్రజల హక్కులు గౌరవింపబడాలి. తెగల ప్రజల పొలాల్ని బయటివారు స్వాధీనం చేసుకోరాదు. తెగల ప్రాంతాలలోనికి మార్కెట్ ఆర్థిక విధానం చొరబాటు కఠినంగా నియంత్రించబడాలి. క్రమబద్దం చేయబడాలి.
మూడు : తెగల భాషల్ని ప్రోత్సహించాలి. అవసరమైన మద్దతు యివ్వాలి. వాటి వికాసానికి అవసరమైన రక్షణ కల్పించాలి.
నాలుగు : పరిపాలనా వ్యవహారాలలో తెగల ప్రజలపై విశ్వాసం వుంచాలి. వారి నుండి పరిపాలనా నిర్వాహకుల్ని ఎంపిక చేసి శిక్షణ యివ్వాలి. తెగల ప్రాంతాలలో పరిపాలనా వ్యవహరాలలో వీలైనంత తక్కువ మందిని ప్రవేశపెట్టాలి. వారిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాలి. వారికి తెగల ప్రజల పట్ల సానుభూతి అవగాహన వుండాలి. తెగల ప్రజల కంటే భిన్నంగా వున్నామని గాని అధికులమనే భావనగాని వుందకూడదు. వారు పని చేన్తున్న ప్రాంతాలలోని తెగల ప్రజల జీవితాన్ని పంచుకోవటానికి సిద్ధపడివుండాలి.
ఐదు : తెగల సామాజిక సాంస్కృతిక సంస్థల ద్వారా పరిపాలన సాగించి అభివృద్ధిపరిచే ప్రయత్నాలు చేయాలి.
నెహ్రా వైఖరికి ప్రాతిపదిక 1920లలో గాంధీజీ తెగల ప్రాంతాలలో ఆశ్రమాలు నిర్మించి నిర్మాణాత్మక కార్యక్రమం ('ప్రోత్సహించినప్పటి నుండి అనుసరించిన జాతీయవాద విధానం. స్వతంత్రానంతరం మొట్టమొదటి దేశాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్య నాయకులు ఈ విధానానికి మద్దతిచ్చారు.
ప్రభుత్వ విధానానికి ఒక రూపమివ్వడం రాజ్యాంగంతో ప్రారంభమయింది. ఆర్టికల్ 46 ననుసరించి తెగల ప్రజల విద్య ఆర్ధిక ప్రయోజనాల పట్ల రాజ్యం ప్రత్యేక (థద్ధ వహించి ప్రోత్సహించాలి. సామాజిక అన్యాయం, ఇతర అన్ని రకాల దోపిడీ నుండి ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ కల్పించాలి. భూమిపై తెగల ప్రజల హక్కు కొరకు, వడ్డీ వ్యాపారుల నుండి రక్షణ కొరకు నిబంధనలు రూపొందించుట. చట్టాలను తెగల ప్రాంతాలకు వర్తింపచేయడంలో అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల్ని 148 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మార్పుచేయడంతో సహా తెగల ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పించే ప్రత్యేక బాధ్యత తెగల ప్రాంతాలు వున్న రాష్ట్రాల గవర్నర్లకు అప్పజెప్పబడింది. ఇందుకొరకు ప్రాథమిక హక్కుల వర్తింపు సవరణ చేయబడింది. రాజ్యాంగం తెగల ప్రజలకు అన్ని రాజకీయ హక్కుల్ని వర్తింపజెసింది. అంతేగాక షెడ్యూల్డు కులాలకు లాగానే షెడ్యూల్డు తెగలకు కూడా చట్ట సభలలో సీట్లను పాలనా పరమైన సేవలలో స్థానాలను రిజర్వు చేసింది. తెగల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సలహాలిచ్చేందుకు తెగల ప్రాంతాలున్న రాష్ట్రాలలో తెగల సలహా మండళ్ళ (౧౫౦౩1 &61300/ ౧౦౪౫610 ఏర్పాటుకి రాజ్యాంగం అవకాశం కల్పించింది. వారికి కల్పించబడిన రక్షణలు అమలు జరిగే విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్రపతి షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిషనర్ని నియమించారు. తెగల భూములు తెగలకు చెందనివారికి మార్పు జరగకుండా నివారించేందుకు, వడ్డీవ్యాపారుల దోపిడిని నివారించేందుకు చట్టాలు చేయబడ్డాయి. చట్టాల్ని అమలు జరిపే చర్యలు చేపట్లబడాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు తెగల ప్రాంతాల, తెగల ప్రజల సంక్షేమానికి, అభివృద్దికి కుటీర గ్రామీణ పరిశ్రమల్ని పోత్సహించి ఉపాధి కల్పించడంతో సహా ప్రత్యేక సౌకర్యాలు సృష్టించబడ్డాయి. (ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ప్రణాళికలలో పెద్ద మొత్తాలు కేటాయించబడ్డాయి. పెద్ద మొత్తాలు వెచ్చించబడ్డాయి. తెగల సంక్షేమానికి నిధులు ప్రత్యేకించి 1971 నుండి గణనీయంగా పెరిగాయి. రాజ్యాంగ రక్షణలు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ప్రయత్నాలు వున్నప్పటికి తెగల ప్రజల సంక్షేమం, అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. ఆగ్నేయ భారతదేశంలో మినహాయించి తెగల ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అప్పుల్లో కూరుకుపోతున్నారు. వారికి భూమిలేదు. ఉపాధి లేదు. మంచి ఉద్దేశాలతో చేపట్టిన చర్యలు కూడా అంతంత మాత్రంగా అమలు జరపబడుతున్నాయి. తరచుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలలో కూడా వ్యత్యాసాలుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తెగల ప్రజల ప్రయోజనాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వాల సానుకూలమైన విధానాల్ని చట్టాల్ని అమలుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. ఈ అంశాన్ని షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషనర్, ప్లానింగ్ కమిషన్ రిపోర్టులు చాలాసార్లు స్పష్టంగా పేర్కొన్నాయి. చాలా తరచుగా సాంఘిక సంక్షేమానికి కేటాయించిన నిధులు ఖర్చు చేయబడడం లేదు. లేక తగిన ఫలితాలు లభించే విధంగా ఖర్చు చేయబడడం లేదు. లేక దుర్వినియోగం చేయబడుతున్నాయి. తెగల ప్రజల (ప్రయోజనాల సంరక్షణకు కాపలాగా నియమించబడిన (ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిళ్లు పట్టీపట్టనట్లు పనిచేస్తున్నాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 149
పరిపాలనా సిబ్బంది అంతగా శిక్షణ పొందినవారు కాదు. తెగల పట్ల సానుభూతి గల అధికారులు వర్తకుల, వడ్డీ వ్యాపారుల, అటవీ కాంట్రాక్టర్ల భూ ఆక్రమణదారుల ఒత్తిడి మేరకు త్వరగా బదిలీ చేయబడేవారు. తెగల ప్రజలకు చట్టాలతో న్యాయవ్యవస్థతో అంతగా పరిచయం లేదు గనుక
వారికి సరియైన న్యాయం జరిగేది కాదు. బయటి వారికి భూమి బదిలీ చేయకుండా నివారించే చట్టాలు పాటింపబడేవికాదు. చాలా ప్రాంతాలలో గనుల, పరిశ్రమల త్వరిత విస్తరణ వారి పరిస్థితిని మరీ అధ్వాన్నం చేసింది. అవినీతి అధికారులు రాజకీయ నాయకులు అటవీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కవటంతో అటవీ నిర్మూలన వేగంగా పెరుగుతుంది. అడవి, అటవీ ఉత్పత్తులపై తెగల ప్రజలకున్న సాంప్రదాయహక్షుకు ఆటంకాలు కల్పించబడుతున్నాయి. అవినీతి అధికారులు తెగల (ప్రజల్ని బాధించేందుకు, దోపిడీ చేసేందుకు అటవీ చట్టాల్ని ప్రయోగిస్తుంటారు. భూమి కోల్పోవటం, అడవుల నరికివేత, అడవుల్లో ప్రవేశానికి నిర్బంధాలు - కారణంగా తెగల ప్రజలు అంతకంతకు ఉపాధికి దూరం చేయబడుతున్నారు. దారి డొంకా లేని దట్టమైన అడవుల్లోకి కొండల్లోకి నెట్టి వేయబడుతున్నారు.
తెగల ప్రజలలో విద్యాభివృద్ధి నత్తనడకన సాగుతుంది. కొన్ని ప్రాంతాలలో (ప్రాథమిక విద్య తెగల భాషలలో బోధింపబడుతుంది. ఇతర (ప్రాంతాలలో తెగల భాషలు నిరాదరణకు గురవుతున్నాయి. విద్యా బోధన వాటిలో జరగడం లేదు.
తెగల సమాజం కూడా ప్రతి చోటా వర్ద వ్యత్యాసాల్ని పెంచుతుంది. వర్గ చట్రంలో వారిలో పై పారకి చెందినవారు తరచుగా బయటి నుండి వచ్చిన వారిలోని పై స్థాయి వారితో కలుస్తుంటారు. అంతేగాక విద్య, పరిపాలనారంగంలో ఉద్యోగాలు, ఆర్థిక రంగం రాజకీయ ప్రోత్సాహం - రంగాలలో కాస్తో కూస్తో జరుగుతున్న అభివృద్ధి ఫలితాలు తెగలలో నుండి కొత్తగా పుట్టి ఎదుగుతున్న చిన్న కులీన వర్గానికి దక్కుతున్నాయి.
మొత్తం మీద కొన్ని ప్రమాద సూచికలున్నప్పటికి 1947 నుండి కొన్ని సానుకూల పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. తెగల వాక్కులు ప్రయోజనాల రక్షణకు చట్టం, తెగల సంక్షేమ శాఖల కార్యకలాపాలు, పంచాయతీ రాజ్, అక్షరాస్యత, విద్యావ్యాప్తి, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్లు, మాటిమాటికి వచ్చిన ఎన్నికలు, వారి రాజకీయ భాగస్వామ్యం రాజ్యాంగ రాజకీయ క్రమాలలో ఎదుగుతున్న మధ్య తరగతుల మేథావుల భాగస్వామ్యం - తెగల ప్రజలలో విశ్వాసాన్ని పెంచడానికి దారి తీస్తున్నాయి. వారు ఇప్పుడు స్వయంగా ఇంకా చురుకైన పాత్ర 150 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నిర్వహించాలని పట్టుబడుతున్నారు. వివిధ రాజకీయ సంస్థలలో నిర్మాణాలలో అధికాధిక ప్రాతినిధ్యాన్ని పొందుతున్నారు. అన్నింటిని మించి జాతీయ ఆర్థికాభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని కోరుతున్నారు. అభివృద్ధి సంక్షేమం కొరవడ్డాయనే నిరుత్సాహంతో తెగల (ప్రజల నుండి నిరసనోద్యమాలు పెల్లుబికాయి. ఇవి తప్పకుండా సానుకూలమైన ఫలితాలిస్తాయి. ప్రభుత్వ విధానం ఇబ్బందుల్ని పూర్తిగా తాలగించేదిగా కాక సాధారణంగా సర్దిచే ప్పేదిగా శాంతింపచేసేదిగా ఉంటుంది. కాని కొన్ని నిరసనోద్యమాలు. హింసని చేపట్టాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ ఉద్యమాలు దేశం దృష్టిని ఆకర్షించినప్పటికి సాధించిందేమీ లేదు. తెగలకు చెందని ప్రజలు లేక తెగల ప్రాంతాలలో నివసిస్తున్న బయటివారి పట్ల తెగల ప్రజలలో పెరుగుతున్న వైరం మరొక దురదృష్టకర పరిణామం. నిస్సందేహంగా వర్తకులు, వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, ప్రభుత్వ అధికారులు లాంటి కొందరు బయటివారు తెగల ప్రాంతాలలో ప్రమాదకారులుగా పరిణమించారు. కాని దశాబ్దాల కాలంలో రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంకా ఇతర మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు తెగల ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇలాంటి వారి సంఖ్య ఒక్క ఆగ్నేయ భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల తెగల ప్రజల సంఖ్యని మించింది. తెగల ప్రజలలో తెగలకు చెందని ప్రజలలో అత్యధికులు పేదలే. ఆర్థిక, సామాజికాభివృద్ధి అలాగే సాంఘిక ఆర్థిక న్యాయం ఉమ్మడి ప్రయోజనం. అంతేగాక చాలా మంది వర్తకులు పారిశ్రామికవేత్తలతో సహా తెగలకు చెందని మధ్యతరగతిలో అత్యధికులు తెగల 'ప్రాంతాలలో ఉపయోగకరమైన ఆర్థిక కార్యకలాపాలు చేపడుతున్నారు. తెగలకు, తెగలకు చెందని ప్రజల మధ్య ఎలాంటి అవాంఛనీయమైన శత్రుత్వమైనా ఇరువురికి నష్టదాయకం, ప్రమాదకరం. ఇరువురి మధ్య ఉండే సంబంధం కేవలం దోపిడీ సంబంధమే కాదు. తెగల ప్రజలు బయటి వారితో సంబంధాలు లేకుండా వేరుగా ఉండాలని ఆశించడం లేదు. కాబట్టి ఇరువురు కూడా పరస్పర సహకారంతోనే వారి ప్రయోజనాల్ని కాపాడుకొనగలరు. పెంపొందించు కొనగలరు. ఆగ్నేయ భారతంలోని తెగలు ఆగ్నేయ భారతదేశంలోని అస్సాం కొండ ప్రాంతాలలో నివసించే తెగల ప్రజలలో వందకు పైగా గ్రూపులున్నాయి. వారు ఎంతో వైవిధ్యంగల పలు భాషలు మాట్లాడతారు. వారికి భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసించే తెగలకు మధ్య ఉమ్మడి లక్షాణాలు, స్వతంత్రం తర్వాత భారతదేశం 151
ఉమ్మడి సమస్యలు చాలా ఉన్నాయి. చాలా అంశాల రీత్యా వారి పరిస్థితి వేరుగా ఉంది. వారు నివసించే ప్రాంతాలలో వారు అత్యధికులుగా ఉన్నారు. తెగల (ప్రాంతాలకు, తెగలకు చెందని (ప్రాంతాలకు మధ్య చాలా కాలం నుండి ఆర్టిక సంబంధాలు అభివృద్ధి చెందుతున్నప్పటికి బయటివారు ఆ ప్రాంతాలలోకి అంతగా చొచ్చుకు పోలేదు. ఇందుకు కారణం 19వ శతాబ్ధంలో బ్రిటిష్ పాలకులు అవలంబించిన విధానం. బ్రిటిష్ వారిచే ఆక్రమించబడిన తెగల ప్రాంతాలు అప్పుడు అస్సాం ప్రావిన్సులో భాగంగా ఉన్నాయి. కాని ఈ ప్రాంతాలకు ప్రత్యేకమైన పరిపాలనా స్తాయి కల్పించబడింది. వారి సామాజిక రాజకీయ నిర్మాణం చెదరగొట్టబడలేదు. మైదానాల నుండి వచ్చే బయటివారిని అనుమతించకూడదనే విధానం పాటించబడింది. ప్రత్యేకించి బయటివారు పొలాన్ని ఆర్జించటాన్ని అనుమతించలేదు. అందువలన తెగల ప్రజలు భూమిని కోల్పోలేదు. అదే సమయంలో ్రిటిష్ ప్రభుత్వం పాఠశాలలు, ఆస్ప(త్రులు, చర్చిలు స్థాపించేందుకు మత మార్చిడి చేసేందుకు కైస్త్రవ మిషనరీలను అనుమతించింది, ప్రోత్సహించింది. మిషనరీలు ప్రభుత్వంతో సహకరించి జాతీయ భావాలు చొరకుండా అడ్డుకున్నాయి. అస్సాం ప్రజల నుండి భారత ప్రజల నుండి తెగల ప్రజల్ని వేరుగా ఉంచటాన్ని ప్రోత్సహించాయి. స్వతంత్రానంతరం కొన్ని మిషనరీలు, విదేశీయులు ఆగ్నేయ భారతదేశంలో వేర్పాటువాద, స్వతంత్ర రాజ్యాల భావనని ప్రోత్సహించాయి. ఆగ్నేయ భారతదేశంలోని తెగల (ప్రజలకు మిగిలిన భారతదేశంతో ఎలాంటి రాజకీయ సాంస్కృతిక సంబంధం లేకపోవడం కూడా గమనార్హం. వెనుకటి అధ్యాయంలో గమనించినట్లు భారత ప్రజలను ఒక జాతిగా ఐక్యం చేసిన శక్తివంతమైన అంశం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటకాలంలో కలిపి ఉంచిన ఉమ్మడి సంబంధాలు. కాని ఈ పోరాటం ఆగ్నేయ భారతంలోని తెగల ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. జవహార్ లాల్ నెహ్రు మాటల్లో : 'మన స్వతంత్ర పోరాటం సారాంశం భారతదేశంలో విముక్తి కల్పించే శక్తిని స్వేచ్చగా ప్రనిచేయనీయడమే.” ఈ శక్తి సరిహద్దులున్న ముఖ్యమైన తెగల ప్రాంతాలలోని ప్రజల్ని ప్రభావితం చేయలేదు. “ఆ విధంగా భారతదేశం అనే ఒక దేశంలో వుంటున్నామనే భావన వారికి కలగలేదు. వారు స్వతంత్ర పోరాటంతో గాని ఇతర ఉద్యమాలతో గాని ప్రభావితులు కాలేదు. వారిని భారత వ్యతిరేకులుగా చేయటానికి ప్రయత్నించిన బ్రిటిషు అధికారులు, మిషనరీలు వారికి తెలిసిన వారితో సంబంధాలున్న బయటివారు.?” జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో రూపొందించిన భారత ప్రభుత్వ తెగల విధానం ఆగ్నేయ భారతదేశంలోని తెగల ప్రజలకు బాగా వర్తిస్తుంది. 1952 అక్టోబరులో 152 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నెహ్రూ ఇలా చెప్పారు. “ఆగ్నేయ భారతదేశ సరిహద్దు ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కేవలం ప్రభుత్వాలే కాదు, భారత ప్రజలు కూదా. వారితో సంబంధాలు మనకు మేలు చేస్తాయి. వారికి కూడా మేలు చేస్తాయి. అవి భారతదేశం యొక్క బలాన్ని వైవిధ్యాన్ని, సాంస్కృతిక సంపదని పెంచుతాయి. అస్సాం తెగల ప్రాంతాలకు మాత్రమే వర్తించే ఈ విధానం రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో చేర్చబడింది. ఇది అస్సాం శాసనసభ, పార్లమెంటుల అధికారానికి లోబడి కొన్ని చట్టపరమైన న్యాయపరమైన విధులు నిర్వహించుకునే స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు, జిల్లా ప్రాంతీయ మండలుల ఏర్పాటు ద్వారా తెగల ప్రజలకు ఒక మేరకు స్వయం పరిపాలనకు అవకాశం కల్పించింది. ఆరవ షెడ్యూలు లక్ష్యం తెగల ప్రజల్ని వారి పద్దతుల ప్రకారం వారు నివసించే అవకాశం కల్పించటం. తెగల ప్రజల స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించేందుకు రాజ్యాంగ సవరణలు చేయటానికి భారత ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అంటే దీనర్ధం ఒక ప్రాంతం భారతదేశం నుండి విడిపోవటాన్ని గాని స్వతంత్రతని ప్రోత్సహిస్తుందని గాని లేక కొన్ని డిమాండ్ల సాధనకు చేపట్టే హింసను సహిస్తుందని గాని కాదని నెహ్రూ వివరణ యిచ్చాడు. అస్సాం సరిహద్దు ప్రాంతాల నుండి 1948లో కొత్తగా సృష్టించబడిన ఆగ్నేయ సరిహద్దు ఏజెన్సీ (నీఫా)లో నెహ్రూ, వెరియర్ ఎల్విన్ విధానాలు అమలు పరచబడ్డాయి. నీఫా అస్సాం అధికార పరిధికి వెలుపల (ప్రత్యేక పాలనా విభాగంగా కేంద్ర ప్రాంతంగా ఉంచబడింది. ప్రారంభం నుండి పరిపాలన ప్రత్యేక (ేణికి చెందిన అధికారులకు అప్పజెప్పబడింది. ప్రజల సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని చెదరగొట్టనటువంటి ప్రత్యేకంగా రూపొందించిన అభివృద్ధి విధానాలను అమలు జరపవలసిందిగా అధికారుల్ని కోరటం జరిగింది. తన జీవితాంతం 'తెగల ప్రజలు - వారి స్థితిగతుల్ని గురించి అధ్యయనం చేసిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త 1967లో ఇలా రాశారు. 'ఒక మేరకు వేరుగా ఉండడానికి సానుభూతి కలగలిపి రూపొందించిన పాలనా విధానం దేశంలోని మరే ప్రాంతాలలో లేదు.” నీఫా పేరుని అరుణాచలప్రదేశ్గా మార్చి 1987లో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించబడింది. నీఫా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలాగా అభివృద్ధి చెందుతుండగా అస్సాంలో భాగంగా ఉన్న ఇతర తెగల ప్రాంతాలలో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అస్సాం కొండ తెగల ప్రజలకు అస్సాం ప్రజలతో గాని, మైదానాలలో నివసిస్తున్న బెంగాలీ ప్రజలతో గాని సాంస్కృతిక సంబంధాలు లేవు. తెగలు తమ గుర్తింపును కోల్పోతున్నామని, అస్సాం ప్రజలతో మమేకం చేయబడుతున్నామని ఆందోళన చెందారు. తమ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వతంత్రం తర్వాత భారతదేశం 153
వర్తకులు ఆధిక్యతాభావం ప్రదర్శిస్తూ తమను కించపరచడం వారికి నచ్చలేదు. అస్సాం ప్రభుత్వం తమను అర్థం చేసుకొనడం లేదని తమ ప్రయోజనాల పట్ల అశ్రద్ద వహిస్తున్నదని భావమూ ఉంది. అస్సాం రాజకీయ నాయకత్వం తగిన సమయంలో వారి బాధల్ని నివారించడంలోని వైఫల్యం వారి ఆందోళనని పెంచింది.
1950 దశాబ్ధం మధ్యకాలంలో అస్సాం ప్రభుత్వంపై అసంతృప్తి, దానితో పాటు తెగల ప్రజలలోని కొన్ని సెక్షన్లలో ప్రత్యేక రాష్ట్రం (హిల్ స్టేట్) కొరకు ఆందోళన ప్రారంభమయింది.
కాని 1960లో అస్సాం నాయకులు అస్సామి భాషని ఏకైక అధికార భాష చేయటానికి ప్రయత్నించడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బలం పుంజుకొన్నది. 1960లో కొండ ప్రాంతాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (416) గా విలీనమై ప్రత్యేక రాష్ట్రం కొరకు డిమాండ్ చేశాయి. అస్సామిని అధికార భాషగా చేస్తూ అధికార భాషా చట్టం ఆమోదం పొందడం, పాలనా వ్యవహారాలలో తెగల భాషల ఉపయోగాన్ని తిరస్మరించడం- తెగల జిల్లాలలో ప్రతిచర్యకి దారితీశాయి. హర్తాళ్లు, ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఆందోళన చెలరేగింది. 1962 ఎన్నికలలో తెగల ప్రాంతాలలోని అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని ప్రత్యేక రాష్ట్రవాదులు కైవశం చేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించారు. సుదీర్హమైన చర్చలు రాయబారాలు సాగాయి. చాలా కమిషన్లు, కమిటీలు సమస్యని అధ్యయనం చేశాయి. చివరికి 1969లో రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాం రాష్ట్రంలో రాష్ట్రంగా మేఘాలయ సృష్టించబడింది. శాంతి భద్రతలు మినహాయించి మేఘాలయ స్వయం (ప్రతిపత్తి గల రాష్టమయింది. శాంతి భద్రతల బాధ్యత అస్సాం ప్రభుత్వానిదే. హైకోర్టు, పబ్లిక్ సర్వీసు కమిషన్, గవర్నర్ కూడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగానే ఉన్నాయి. చివరికి ఆగ్నేయ భారతదేశ పునర్విభజనలో భాగంగా గారో ఖాసి, జైంతియా తెగలను కలుపుకొని 1972లో మేఘాలయ (ప్రత్యేక రాష్ట్రమయింది. అప్పుడే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న మణిపూర్, శ్రిపురలు కూడా రాష్ట్రాలుగా ప్రకటించబడ్డాయి. మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల ప్రదేశ్ రాఘ్ర్రైలుగా మార్చు చెందడం సరళంగా జరిగింది. కాని నాగాలాండ్, మిజోరంలలో వేర్పాటు వాద విద్రోహ ఉద్యమాలు అభివృద్ధి చెందడంతో సమస్య జటిలమయింది. నాగాలాండ్
నాగాలు అన్సాం - బర్మా సరిహద్దుపై ఆగ్నేయ సరిహద్దు వెంటగల పర్వతాలపై నివసిస్తుంటారు. 1961లో వారి సంఖ్య 5,00,000. దేశ జనాభాలో 0.1 శాతం కంటే 154 విపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
తక్కువ. వారిలో చాలా భాషలు మాట్లాడే పలు తెగలు ఉన్నాయి. బ్రిటిషు పాలకులు దేశంతో సంబంధం లేకుండా వీరిని వేరుగా ఉంచారు. కాని బ్రిటిషు మిషనరీలను అనుమతించారు. ఫలితంగా చదువు నేర్చిన ఒక చిన్న వర్గం అభివృద్ధి చెందింది.
స్వతంత్రం సాధించిన వెంటనే ప్రభుత్వం నాగా ప్రాంతాలను అస్సాంలోను భారతదేశంలోను విలీనం చేసే విధానం చేపట్టింది. కాని నాగా నాయకత్వంలోని ఒక సెక్షన్ విలీనాన్ని వ్యతిరేకించి ఎ.జద్. ఫిజో నాయకత్వంలో తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యం కొరకు డిమాండు చేశారు. కొందరు బ్రిటిషు అధికారులు, మిషనరీలు వారిని ప్రోత్సహించారు. 1955లో వేర్పాటువాద నాగాలు హింసాయుత తిరుగుబాటు ప్రారంభించి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటుని ప్రకటించుకొన్నారు.
తెగల ప్రజల పట్ల జవహర్లాల్ నెహ్రూ విస్తృతమైన వైఖరి కనుగుణంగా భారత ప్రభుత్వం రెండు పద్ధతుల విధానాన్ని చేపట్టింది. ఒక వైపు భారత ప్రభుత్వం స్వతంత్ర నాగా ప్రాంతాల వేర్పాటువాద డిమాండుని ధృఢంగా వ్యతిరేకిస్తుందని, హింసా మార్గాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. హింసాయుత వేర్పాటువాద ఉద్యమం పట్ల అణచివేత- చర్చలు జరపని విధానాన్ని పాటిన్తానన్నది. నాగాలలోని ఒక సెక్షన్ స్వతంత్ర నాగాలాండ్ కొరకు సాయుధ పోరాటాన్ని ప్రారంభించగా ప్రభుత్వం 1956లో శాంతిభద్రతల పరిరక్షణకు సైన్యాన్ని పంపించింది.
మిలటరీ చర్య తిరుగుబాటు దాడులు గెలిచే అవకాశం లేదని స్పష్టం చేసింది. పూర్తిగా అణచివేత సాధ్యం కాదు. వాంఛనీయం కాదు. ప్రభుత్వ లక్ష్యం ప్రజలను సమాధానపరచి తనవైపు తిప్పుకొనడం. నెహ్రు “స్నేహపూర్వక వైఖరి” అవలంభించారు. నాగాలను భారతదేశంలో ట్రికరణ శుద్దిగా విలీనం కమ్మని ప్రోత్సహిస్తూనే సాంస్కృతిక ఇంకా ఇతర అంశాలలో వారి స్వయం ప్రతిపత్తి హక్కు పట్ల సానుకూలంగా ఉన్నాడు. సాయుధ తిరుగుబాటు, స్వతంత్రం కొరకు డిమాండు వదులుకోనంత వరకు ఫిజాతో గాని అతడి మద్దతుదారులతో గాని చర్చలు జరప నిరాకరిస్తూనే నెహ్రూ మితవాద, అహింసాయుత, వేర్పాటువాదులు కాని నాగా నాయకులతో సుదీర్ణమైన చర్చలు జరిపారు. వారు కూడా అంత విస్తృతమైన స్వయం ప్రతిపత్తిని గాని సమస్య పరిష్కారానికి నెహ్రూ కంటె సానుభూతి గల నాయకుడిని గాని ఆశించలేక పోయారు.
సాయుధ తిరుగుబాటు వెన్నెముక విరచబడింది. 1957 సంవత్సరం మధ్యలో డాక్టర్ ఇంకాంగ్రిబ నాయకత్వంలో మితవాద నాయకులు ముందుకు వచ్చారు. భారత యూనియన్‌లో భాగంగా ఉండే నాగాలాండ్ కొరకు చర్చలు జరిపారు. (ప్రభుత్వం వారి డిమాండుని ఆమోదించింది. 1968లో నాగాలాండ్ ఏర్పడింది. భారతజాతి ఏకీకరణ స్వతంత్రం తర్వాత భారతదేశం 155
దిశలో మరొక ముందడుగు వేసింది. అప్పటి నుండి నాగాలాండ్‌లో అనుసరించబడిన రాజకీయాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రాజకీయాల నమునా అనుసరించాయి. నాగొలాండు రాష్త్ర ఏర్పాటుతో తిరుగుబాటు వెన్ను విరచబడింది. తిరుగుబాటుదారులు చాలా వరకు ప్రజల మద్దతు కోల్పోయారు. కాని విద్రోహ చర్యలు అదుపులోకి వచ్చినప్పటికి చైనా, పాకిస్తాన్, బర్మాలలో శిక్షణ పొందిన నాగా తిరుగుబాటు దారుల చెదురుమదురు గొరిల్లా కార్యకలాపాలు, టెర్రరిస్టు దాడులు ఇప్పటికి కొనసాగు తున్నాయి. మిజోరాం కొన్ని సంవత్సరాల తరువాత నాగాలాండ్‌లో పరిస్థితే స్వతంత్ర ప్రతిపత్తి గల మిజో జిల్లాలోఏర్పడింది. కొంత మంది బ్రిటిష్ అధికారుల ప్రోత్సహంతో వేర్పాటు వాద డిమాండ్ మొదలైంది. కాని దానికి మిజో యువ నాయకత్వం నుండి తగిన మద్దతు లభించలేదు. యువ నాయకత్వం మిజో సమాజాన్ని ప్రజాస్వామ్యయుతం చేయటం, ఆర్థికాభివృద్ధి, అస్సాం చట్ట సభలో మిజోలకు తగు ప్రాతినిధ్యం లాంటి సమస్యలపై కేంద్రీకరించింది. కాని 1959 కరువుకాలంలో అస్సాం ప్రభుత్వ సహాయక చర్యల పట్ల అసంతృప్తి, అస్సామి భాషని రాష్ట్ర అధికార భాషగా చేస్తూ 1961లో చేసిన చట్టం - లాల్డెంగా అధ్యక్షుడిగా మిజౌ నేషనల్ ఫ్రంట్ (041గ) ఏర్పాటుకు దారితీశాయి. ఎం.ఎన్. ఎఫ్. ఎన్నికల రాజకీయాలలో పాల్గొంటూనే మిలటరీ విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మిలటరీ శిక్షణ తూర్పు పాకిస్తాన్, బైనాల నుండి పొందింది. 1966 మార్చిలో ఎంం. ఎన్.ఎఫ్. భారతదేశం నుండి స్వతంత్రం పొందినట్లు ప్రకటించుకొన్నది. మిలటరీ తిరుగుబాటును కూడా ప్రకటించి మిలటరీ పౌర స్థావరాల మీద దాడులు చేసింది. కొద్ది వారాలలో తిరుగుబాటు అణచివేయబడింది. ప్రభుత్వం పూర్తి అదుపు సాధించింది. చెదురు మదురు గొరిల్లా దాడులు మాత్రం కొనసాగాయి. మిజా అగ్రశ్రేణి నాయకత్వం తూర్పు పాకిస్తాన్‌కి పారి పోయింది. 1978లో తీవ్రవాద స్థాయిని కొంత తగ్గించిన మిజొ నాయకులు భారత యూనియన్ లోపల ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. అస్సాం నుండి మిజొ జిల్లాని విడగొట్టి మిజొరాంకి కేంద్ర పాలిత ప్రాంత స్థాయి కల్పించబడింది. మిజాల తిరుబాటు 1970 దశాబ్దం చివరలో కొంత బలాన్ని పుంజుకొన్నది. భారత సైన్యాలు అణచి వేశాయి. వేర్చాటువాద శ్రేణుల్ని దాదాపు నిర్వీర్యం చేసిన తరువాత భారత ప్రభుత్వం మిగిలిన వారిలో చర్చలు జరిపింది. 156 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1986లో ఒప్పందం కుదిరింది. రహస్య హింసాయుత కార్యక్రమాల్ని విడనాడటానిక్రి, ఆయుధాలతో సహా భారత అధికారుల ముందు లొంగిపొవడానికి, రాజ్యాంగ బద్ధమైన రాజకీయ విధానంలో తిరిగి పనిచేయటానికి లాల్టెంగా ఎం.ఎన్. ఎఫ్. అంగీకరించారు. భారత ప్రభుత్వం మిజొలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సంస్కృతి సాంప్రదాయాలు, భూ చట్టాలు మొదలగు అంశాలలో పూర్తి స్వయం ప్రతిపత్తికి హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా 1987 ఫిబ్రవరిలో నూతన రాష్ట్రం మిజొరాంలో లాల్డెంగా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. జార్టండ్ ఛోటా నాగపూర్, సంతాల్ పరగణాలు గల బీహారులోని తెగల ప్రాంతమైన జార్ధండ్ దశాబ్దాల తరబడి స్వయం ప్రతిపత్తి కొరకు ఉద్యమాలు నడిపింది. ఈ ప్రాంతంలో సంతార్, ప్రణీ, ఒరయాన్, ముందా లాంటి భారతదేశంలోని చాలా పెద్ద జాతులు కేంద్రీకృతమైవున్నాయి. సాంప్రదాయ తెగలకు భిన్నంగా వీరు కుటుంబ వ్యవసాయ క్షేత్రాల ప్రాతిపదికన వ్యవసాయంలో స్టిరపడినవారు. ఆర్థిక వ్యత్యాసం అడుగుపెట్టింది. వీరిలో గణనీయమైన సంఖ్యలో వ్యవసాయ కార్మికులున్నారు; గనుల పారిశ్రామిక కార్మికుల సంఖ్య పెరుగుతూ వుంది. తెగలకు చెందని వారిలో లాగానే వీరిలో కూడా భూమి ఉన్నవారు, లేనివారు; ఉన్నవారిలో హెచ్చుతగ్గులూ ఉన్నాయి. వీరిలో వడ్డీ వ్యాపారుల వర్గం కూడా అభివృద్ధి చెందింది. జార్ధండ్లోని తెగల సమాజం అంతకంతకు వర్ష విభజిత సమాజమయింది. తెగలలో అత్యధికులుగా. రెండు మతాలవారు - హిందువులు, క్రైస్తవులు వున్నారు. కాని జార్ధంద్ తెగలకు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కొన్ని సామాన్య లక్షణాలు వున్నాయి. వారి పొలంలో అత్యధిక భాగం కోల్పోయారు. అది బయటి వారికి దక్కింది. తెగల ప్రజల అప్పులతో ఉపాధి లేమితో, చాలా తక్కువ వ్యవసాయోత్పత్తితో సతమతమవుతున్నారు. 19వ శతాబ్దంలో చాల పెద్ద తిరుగుబాట్లు చేశారు. 1919 తరువాత వారిలో చాలామంది జాతీయోద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 1951లో ఛోటా నాగపూర్ జనాభాలో షెడ్యూల్డు తెగల వారు 31.15 శాతంగా (1971లో 30.94 శాతం) వున్నారు. సంతాల్ పరగణాల జనాభాలో 44.67 శాతంగా (1971లో 36.22 శాతం) వున్నారు. ఆ విధంగా 1971లో జార్ధండులో మూడింట రెండు వంతుల మంది తెగలకు చెందిన వారున్నారు. తెగలకు చెందిన, చెందని వారిలో అత్యధికులు సమానంగా దోపిడికి గురయిన 'పేదరైతులు, వ్యవసాయ కూలీలు, గనుల స్వతంత్రం తర్వాత భారతదేశం 157
పారిశ్రామిక కార్మికులు. భూమి కలిగి వుండడంలో అసమానత, వడ్డీ వ్యాపారి భయం వారిలో సమానంగా వ్యాపించి వున్నాయి. అలాగే వ్యాపారీకరణకి గురయిన వ్యవసాయం కూడా వారిని భయపెట్టింది. తెగల ప్రాంతాలలో విద్య, ఆధునిక కార్యకలాపాలు విస్తరించడంతో ఛోటా నాగపూర్ దక్షిణ బీహరులోని సంతాల్ పరగణాలు, వాటికి ఆనుకుని వున్న మధ్యప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు తెగల ప్రాంతాలను కలుపుకొన్న జార్హండ్ రాష్ట్ర ఏర్పాటు కొరకు 1980 దశాబ్దం చివరలో 1940 దశాబ్దం [ప్రారంభంలో ఉద్యమం ప్రారంభమయింది. తెగల ప్రజలకు భారత యూనియన్‌లో భాగంగా స్వంత రాష్ట్రముంటే తెగల ప్రజల ప్రయోజానాలు సంరక్షింపబడతాయని, బయటివారి ఆధిక్యత పెత్తనం అంతమవుతాయని గుర్తించిన ఆక్స్ఫర్డ్ విద్యావంతుడైన జైపాల్‌సింగ్ నాయకత్వంలో 1950లో జార్ధండ్ పార్టీ స్థాపించబడింది. పార్టీ 1952 ఎన్నికలలో గణనీయమైన విజయాలు సాధించింది. ఛోటా నాగపూర్‌లో 32 సీట్లు గెలిచి బీహారు అసెంబ్లీలో ప్రధాన 'ప్రతిపక్షమయింది. 1957 ఎన్నికలలో 25 సీట్లు గెలిచింది. కాని జార్ధండ్ పార్టీ పెద్ద సందిగ్ధాన్ని ఎదుర్కొన్నది. తెగల ప్రజలు ప్రభావితం చేయగల చోట ప్రత్యేక రాష్ట్రం కొరకు పార్టీ డిమాండ్ చేసింది. కాని జనాభా రీత్యా అక్కడ తెగల ప్రజలు మైనారిటీగానే వుంటారు. ఈ సమస్య నధిగమించడానికి తెగలకు చెందని వారి పట్ల వ్యతిరేకతని తాత్కాలికంగా ప్రక్కన పెట్టి, పార్టీ సభ్యత్వంలో తెగలకు చెందని ప్రజలకు కూడా అవకాశం కల్పించింది. కాని రాష్ట్ర పునర్నిర్మాణ కమిషన్ ఆ ప్రాంతానికి ఉమ్మడి భాష లేదు గనుక జార్ధండ్ రాష్త్ర డిమాండుని తిరస్కరించింది. జార్ధండ్లో తెగలు మైనారిటీగా వున్నారు గనుక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడదన్నది.
1960 తొలి సంవత్సరాల నాటికి పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహలకు గురయ్యాయి. 1962లో జారండ్ పార్టీ బీహారు అసెంబ్లీలో 20 సీట్ల మాత్రమే గెలవగలిగింది. కాంగ్రెస్ లోపల నుండి పని చేస్తూ ప్రత్యేక రాష్ట్రం కొరకు ప్రభుత్వాన్ని ఒప్పించే అవకాశాలు మెరుగుపడతాయని వాదించి 1968 లో జైపాల్ సింగ్‌లో సహా పార్టీలోని పెద్ద భాగం కాంగ్రెస్‌లో చేరింది.
1967 తరువాత జార్ధండులో చాలా తెగల పార్టీలు ఉద్యమాలు అఖివృద్ధి చెందాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది. 1972 చివరలో ఏర్పడిన జూర్ధండ్ ముక్తి మోర్చా ౧౫44 జె.ఎం.ఎం. జార్థండ్ రాష్ట్ర డిమాంద్ని పునరుద్ధరించింది. కాని అది 158 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రెండు కొత్త మార్పులు చేసింది. జార్ధండ్ జనాభాలోనీ మూడింటా రెండు వంతుల మంది తెగలకు చెందని ప్రజలనే కటువైన వాస్తవాన్ని గుర్తించింది. కాబట్టి తెగల ప్రజల్ని కూడగట్టడానికి చేపట్టే ఉద్యమం ఆశించిన రాజకీయ బలాన్ని సమకూర్చుకోలేదు. కాబట్టి జార్ధండ్ ప్రాంతంలో చాల కాలం నుండి నివశిస్తున్నవారు తెగలకు చెందినవారు కాని, చెందనివారు గాని - వారంతా దోపిడి చేయబడుతున్నారు. వివక్షకు గురవుతున్నారు. ఉత్తర బీహారు, ఇటీవల వలసవచ్చిన వారి అధిపత్యం క్రింద (మగ్గుతున్నారు - అని (ప్రచారాలు చేయటం ప్రారంభించింది. కాబట్టి జార్ధండ్ని ఒక ప్రాంతంగా ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఆ ప్రాంత రైతులు కార్మికుల పక్షాన ప్రతిపాదన చేసింది. ఆర్థిక సమస్యలపై కేంద్రీకరించి తెగలకు చెందని పేదల మద్దతు పొందింది. అప్పటికి జె.ఎం.ఎం. అనుచరులలో అత్యధికులు తెగలవారే అయినప్పటికి తెగలకు చెందని చాలామంది నాయకులు చురుకైన రాజకీయ కార్యకర్తలు దానిలో చేరారు.
తెగల నాయకులు వారు ఆశిస్తున్న జార్ధండు రాష్ట్రంలో తెగలు మైనారిటీ అయినప్పటికి, అప్పటికి వున్న బీహరు రాష్ట్రంలో కంటే కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రంలో వారి ప్రాతినిధ్యం, ప్రాధాన్యతలు చాలా ఎక్కువగా వుంటాయని భావించారు.
జె.ఎం.ఎం. సమూలమైన మార్పులు తెచ్చే సిద్ధాంతం, కార్యక్రమం వైపు మరలింది. ఇతర (గ్రూపులు - ప్రత్యేకించి మార్చిస్టు కో-అర్జినేషన్ సెంటర్ లాంటి [గ్రూపుల చేరికతో పరాయికరణ జెందిన భూముల్ని తిరిగి పొందటం, వడ్డీ వ్యాపారుల దోపిడి, గనులలో పరిశ్రమలలో తెగల ఉపాధి పని పరిస్థితుల మెరుగుదల, మెరుగైన వేతనాలు, పోలీసుల అత్యాచారాలు అటవీ అధికారుల దాష్టీకం, పెరుగుతున్న మద్యం వినియోగం లాంటి సమస్యలపై చాలా సమరశీలమైన ఉద్యమాలు నిర్వహించింది. 1970-80 దశాబ్దాపు తొలి సంవత్సరాలలో శిబూసోరేన్ చాలా ప్రజాకర్షణ గల నాయకుడుగా ఎదిగాడు.
కాని వామపక్షవాదుల సహకారం ఎక్కువకాలం కొనసాగలేదు. అలాగే
తెగల, తెగలకు చెందని వారి మధ్యమైత్రి ఎక్కువ కాలం కొనసాగలేదు. కొత్త (గ్రూపులు వచ్చి కలుస్తూ ఉండడంతో కాలక్రమంలో ప్రత్యేక జార్ధంద్ రాష్ట్ర ఉద్యమం ఎగుదుదిగుళ్లకు గురయింది. దానిలో చాలా చీలికలు వచ్చాయి. పెద్ద అఖిల భారత పార్టీలతో సహకారం, లేక మైత్రి సమస్యపై జార్ధండ్ నాయకుల మధ్య పెద్ద విభేదాలు వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొద్దిమంది ఎంపిలు లేక ఎమ్మెల్యేలు వారంతట వారు వారి డిమాండుని సాధించుకోలేరు. నిరంతరం రాజ్యాధికారంతో ఘర్షణ పడడం, ఉద్యమంలోని వామపక్ష స్వతంత్రం తర్వాత భారతదేశం 159
తీవ్రవాదులు వాదించినట్లు హింస, సాయుధ పోరాటాలు చేపట్టడం నిష్పయోజనమని శిబూసోరేన్, అతడి అనుచరులు, మరి కొందరు ఇతరులు కూడా గుర్తించారు. ఉద్యమం ప్రాథమికంగా తెగల గుర్తింపు, తెగల డిమాండ్ల చుట్టూ నిర్మించబడింది గనుక తెగల ప్రయోజనాల నుండి వర్గ ప్రాతిపదిక గల రాజకీయాలవైపు ఉద్యమాన్ని మరల్బడం కష్టమయింది. ప్రత్యేకించి తెగలకు రిజర్వేషన్ విధానంలోనే తెగల ప్రజలకు ఇతరులకు మధ్య విభేదాలు పెంచే బీజాలు ఉన్నాయి. తెగల సమాజం కూడా ఒకే మాదిరిగొ లేదు. దానిలో కూడా భూస్వాములు, ధనిక రైతులు, వర్తకులు, వడ్డీ వ్యాపారులున్నారు. అన్నింటిని మించి ఉద్యమం బీహారులోని పాలక పార్టీల నుంచి కేంద్రం నుండి పొందగలిగే గరిష్ట ప్రయోజనం బీహారు రాష్ట్రంలో జార్ధండ్ ప్రాంకానికి స్వయం ప్రతిపత్తి వాగ్దానం. జార్ధండ్ ఉద్యమంలోని విభిన్న పార్టీలు, శాఖలు (ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి సూత్రాన్ని ఆమోదించాయి. ఉన్న విభేదాలు దాని వాస్తవ రూపం సొరంలోనే. 160 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
10 జాతిగా భారతదేశ ఏకీకరణ వు ప్రాంతీయవాదం, ప్రాంతీయ అసమానతలు
1950లలో చాలామంది ప్రాంతీయవాదాన్ని భారతదేశ ఐక్యతకు ప్రమాదకారిగా భావించారు. కాని ఏ దశలో కూడా భారతదేశ రాజకీయాలలో పరిపాలనలో 'పాంతీయవాదం ప్రధానమైన అంశంగా లేదు. భారతదేశ రాజకీయాలలో ప్రాంతీయవాద పాత్రని అంచనా వేసేందుకు ప్రాంతీయవాదం అంటే ఏమిటో అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
ఒక బస్తీ పట్ల లేక ఒక ప్రాంతం పట్ల లేక రాష్ట్రం పట్ల దాని భాష సంస్కృతి పట్ల విధేయత ప్రాంతీయ వాదం కాదు. అది జాతిని చిన్నాభిన్నం చేయదు. అది దేశభక్తికి జాతి పట్ల విధేయతకు అనుగుణమైనదే. ఒకడు తన ప్రాంతం పట్ల లేక రాష్ట్రం పట్ల గౌరవం (గర్వం) కలిగి ఉండడం కూడా ప్రాంతీయ వాదం కాదు. ఒక వ్యక్తి తన విలక్షణమైన ప్రాంతీయ గుర్తింపు పట్ల - తమిళుడు లేక పంజాబి బెంగాల్లేక గుజరాతి అయినందుకు గర్వించవచ్చు. కాని భారతీయుడైనందుకు అంతగా గర్వపడగలగాలి. ఇతర (ప్రాంతాల ప్రజల పట్ల వైరభావం పెంచుకోకుండా ఉండగలగాలి. దీనినే గాంధీజీ 1909లో చాల స్పష్టంగా వ్యక్తీకరించాడు. నేను భారతీయుడిగా గర్వపడడానికి పునాదిగా గుజరాతి వైనందుకు గర్వపడాలి. అలాకాకపోతీ మనం ఎలాంటి ఆలంబనం లేకుండా మిగివిపోతాము.”
భారత జాతీయోద్యమం కూడా ఈ అవగాహనతోనే పని చెసింది. మొదటి నుండి కూడా అది అఖిల భారత ఉద్యమంగా పని చేసింది గాని ప్రాంతీయ ఉద్యమాలు సమాఖ్యగా పనిచేయలేదు. అది రెంటిని - జాతీయతని, ప్రాంతీయతని గుర్తించింది. వాటి మధ్య ఎలాంటి ఘర్షణ వున్నట్లు భావించలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 161
ఒకడు తన రాష్ర్రాన్నిగాని ప్రాంతాన్ని గాని అభివృద్ధి పరచాలని లేక పేదరికాన్ని తొలగించి సొమౌజిక న్యాయం అమలు జరపాలని ఆశించడం పైగాని లేక ప్రత్యేక ప్రయత్నాలు చేయడంపై గాని ప్రాంతీయవాద ముద్ర వేయరాదు. వాస్తవంగా కొన్ని అలాంటి సానుకూల లక్ష్యాల సాధనకు ప్రాంతాలు పోటీపడడం ఆరోగ్యకరం. అంతేగాక స్వస్థలం ప్రాంతం మీద వుండే అభిమానం, గౌరవం విచ్చినకరమైన కుల, మత విధేయతల్ని అధిగమించేలా చేస్తాయి.
ఇండియన్ యూనియన్‌లో ప్రత్యేక రాష్ట్రం కొరకు చేసే డిమాందుగాని, రాష్ట్రంలో ఒక స్వయం ్రతిపత్తి గల ప్రాంతం కొరకు డిమాండ్గాని, రాష్ట్ర స్థాయి నుండి దిగువకు అధికార వికేంద్రీకరణ డిమాండ్గాని ప్రాంతీయ వాదమని గాక చాలా కారణాల రీత్యా ఆటంకపరచబడతాయి. ఒక ప్రాంత లేక రాష్ట్ర ప్రయోజనాల్ని దేశ ప్రయోజనాలకు లేక మరొక ప్రాంతం లేక మరాక రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాధించాలని పట్టుబట్టి ఘర్షణని ప్రోత్సహించడం ప్రాంతీయవాదం.
ఈ అర్ధంలో 1947 నుండి రాష్ట్రాల మధ్య ఘర్షణ చాలా తక్కువ వుంది. అందుకు మినహాయింపు 1950లలో 1960 తొలి సంవత్సరాలలో తమిళనాడులోని ద్రవిడ మన్నేట్ర కజగం (డిఎంకె) రాజకీయాలు. డి.ఎం.కె. ప్రాత 22వ అధ్యాయంలో చర్చించబడింది. డి.ఎం.కె. కూడా తరువాతి సంవత్సరాలలో ప్రాంతీయ వైఖరిని విడనాడుతూ వచ్చింది. కొందరు 1980లలో పంజాబిని ఉదహరిన్తుంటారు. కాని 24వ అధ్యాయంలో గమనించబోయే విధంగా పంజాబుది మతవాదం గాని ప్రాంతీయవాదం కాదు.
ఒక ప్రాంతం గాని రాష్ట్రం గాని సాంస్కృతిక ఆధిపత్యానికి లోనయినట్లు లేక వివక్ష చూపబడినట్లుగాని భావించి వుంటే భారతదేశంలో ప్రాంతీయవాదం అభివృద్ధి చెంది వుండేది. ప్రాంతాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుల్ని బలంగా కోరడం వలన భారతదేశ ఐక్యతకు ప్రమాదం వాటిల్లనున్నదని 1960లో అమెరికా పత్రికా రచయిత సెలిగ్ హేరిసన్ తన ప్రఖ్యాత గ్రంథం “భారతదేశం ప్రమాదకర దశాబ్దాలు”లో పేర్కొన్నాడు. కాని భారత జాతి - నెహ్రూ మాటల్లో “భారతదేశ సొంస్కృతిక వైవిధ్యానికి స్థానం కల్పించడంలో జయప్రదమయింది. భారతదేశం యొక్క వేర్వేరు ప్రాంతాలు సంపూర్ణ సాంస్కృతిక స్వయం ప్రతిపత్తి కలిగి వున్నాయి. భాషా రాష్ట్రాల పునర్నిర్మాణం, అధికార భాషా వివాదంపై తీర్మానం - సాంస్కృతిక ఆధిపత్యం అనే భావాన్ని తద్వారొ ప్రాంతాల మధ్య ఘర్షణని తొలగించడం ద్వారా ఈ అంశంలో చాలా ముఖ్యమైన పాత్రని
నిర్వహించాయి. 162 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చాలా ప్రాంతీయ వివాదాలు వుంటాయి. వాటికి రాష్ట్రాల మధ్య వైరాన్ని పెంచే శక్తి వుంటుంది. వివిధ రాష్ట్రాల మధ్య నదీజలాలు పంపకం సమస్య వుంది. ఉదాహరణకు తమిళనాడు - కర్నాటకల మధ్య, కర్నాటక - ఆంధ్రుల మధ్య, పంజాబ్- హర్యానా-రాజస్థాన్ల మధ్య భాషా రాష్ట్రాల విభజనతో సరిహద్దు సమస్యలుత్పన్న మయ్యాయి. ఉదాహరణ బెల్లాం, చండీఘర్లు. సాగునీటి, విద్యుచ్భక్తి ప్రాజెక్టులు ఇలాంటి ఘర్షణల్ని సృష్టించాయి. కాని ఆ వివాదాలు దీర్ధకాలికంగా కొనసాగుతూ ఉద్రికత్తల్ని రెచ్చగొట్టగలిగినవైనప్పటికీ అవి చాల పరిమితులలోనే వున్నాయి. కేంద్రప్రభుత్వం తరుచుగా మధ్యవర్తి పాత్ర నిర్వహిస్తూ ప్రాంతాల మధ్య ఘర్నణల్ని నివారించింది. ఆర్థిక అసమానతలు - ప్రాంతీయవాదం
వివిధ రాష్ట్రాల, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానత ప్రమాదానికి శక్తివంతమైన వనరుగా పని చేస్తుంది. కాని అసంతృప్తిని పెంచినప్పటికి, రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి చేసినప్పటికీ ఈ సమస్య ప్రాంతీయవాదానికి గౌని ఒక ప్రాంతం వివక్షకు గురిచేయబడిందనే భావానికి గాని అవకాశం కల్పించలేదు.
స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాల కంటే వెనుకబడి వున్నాయని నాయకత్వం గుర్తించింది. కలకత్తా, బొంబాయి, మద్రాసుల చుట్టూ వున్న కొన్ని ప్రాంతాలలో ఆధునిక పారిశ్రామికాభివృద్ధి జరిగింది. ఉదాహరణకు 1948లో బొంబాయి పశ్చిమ బెంగాల్‌లలో 59 శాతానికి పైగా పారిశ్రామిక పెట్టుబడి 64 శాతానికి పైగా పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రీకృతమయింది. వలసవాద పాలనలో వ్యవసాయం కూదా స్తంభించింది. స్తబ్ధత ఉత్తర, దక్షిణ భారతదేశంలో కంటే తూర్పు భారతదేశంలో ఎక్కువగా వుంది. (ప్రాంతీయ ఆర్థిక వ్యత్యాసం తలసరి ఆదాయంలో కూడా వ్యక్తమయింది. 1949లో పశ్చిమబెంగాల్, పంజాబ్, బొంబాయిల తలసరి ఆదాయం రూ. 353,8381,272 వుండగా బీహారు, ఒరిస్సా, రాజస్టాన్లలో రు. 200,188,173గా వుంది.
మొదటి నుండి ప్రాంతీయాభివృద్ధి ద్వారా ఈ అసమానతలను సరిదిద్దడం తన బాధ్యతగా జాతీయ ప్రభుత్వం భావించింది. ఉదాహరణకు 1956 భారత ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానం ఇలా స్పష్టంగా పేర్మాన్నది ప్రతి ప్రాంతంలో సమతుల్యమైన సమన్వయం చేయబడిన పారిశ్రామిక వ్యవసాయక ఆర్థిక అభివృద్ధి సాధించడం మాత్రమే దేశం మొత్తం యొక్క ఉన్నత ప్రమాణాల జీవన స్థాయిని సాధించగలుగుతుంది.? అలాగే జాతీయ సమగ్రతని పెంచడంలో ప్రాంతీయ సమతుల్యతని సానుకూలమైన అంశంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 1638
గుర్తించిన 1961 నాటి జాతీయ సమైక్యతా మండలి (౫౩4౦౧2) 10062210 6౧౦౪౧౦1) ఇలా చెప్పింది. “ఏ రాష్ట్రంలోనైనా ఆర్థికంగా వెనుకబడిన (ప్రాంతాల సత్వరాభివృద్ధికి - నిర్ణీతకాలంలో కనీస స్థాయి అభివృద్ధి సాధించే వరకైనా - ప్రాధాన్యత యివ్వాలి.” సంపన్న రాష్ట్రాలకు - పేద రాష్ట్రాలకు మధ్య గల ఆర్థిక దూరాన్ని తగ్గించేలా పేద రాష్ట్రాలలో పెరుగుదల రేటుని ప్రభావితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభం నుండి విస్తృతమైన పథకాల్ని అమలు జరిపింది. అందుకు ప్రభుత్వం ఆర్థిక వనరుల్ని పేద రాష్ట్రాలకు బదిలీ చేసింది. నిర్దీత కాల వ్యవధులలో రాష్ట్రపతిచే నియమించబడిన ఆర్థిక కమిషన్ (2122006 060౧155100) ఆర్థిక వనరుల్ని బదిలీ చేయడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. పన్నులు ఇతర వనరుల నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే సూత్రాలను కమిషన్ నిర్హయిస్తుంది. వివిధ ఆర్థిక కమిషన్లు రాష్ట్రాలకు సరియైన న్యాయం జరిగేలా చూడడమే గాక, రాషాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు పేద రాష్ట్రాలకు ప్రాధాన్యతనిచ్చాయి. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం గాక అదనంగా కేటాయించాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వనరుల్ని పేద రామ్ర్రాలకు బదిలీ చేశాయి. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రణాళిక శక్తి వంతమైన సాధనం. రెండవ ప్రజాళిక ఈ లక్ష్యాన్ని ప్రతిఫలించింది. మూడవ ప్రణాళిక చాల స్పష్టంగా ఇలా ప్రకటించింది: 'దేశంలో వివిధ ప్రాంతాల సమతుల్యతాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలను తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు విస్తరణ, పరిశ్రమల విస్తరణ ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి ముఖ్య లక్ష్యాలు”. ఇందుకొరకు ప్లానింగ్ కమిషన్ వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ తోడ్పాటు నందించింది. ఈతోడ్పాటు (గ్రాంట్ల రూపంలో,రుణాలు రూపంలోను ఇచ్చింది. అంతే గాక కేంద్రం నుండి రాష్ట్రాలకు వనరుల సంక్రమణలో ఆర్థిక మరియు ప్రణాళిక బదిలీల రూపంలో వెనుకబడిన రాష్ట్రాల కనుకూలంగా వివక్ష క్రమంగా పెరిగింది. ఉక్కురసాయనిక ఎరువులు, చమురు శుద్ది పెట్రో కెమికల్, యంత్రాల ఉత్పత్తి, హెమీ కెమికల్స్, విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు, రైలు మార్గాలు, పోస్టాఫీసులు, ఇతర మౌలిక సదుపాయల రంగాలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం కూడా ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి సాధనంగా పని చేస్తున్నది. 1957లో రెండవ కేళిడే బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రణాళిక ప్రారంభం నుండి భారతదేశం ప్రభుత్వం పెట్టుబడిపై (20010 1౪660626) విశ్వాసం వుంచింది. వెనుకబడిన రాష్రాలకు అనుకూలమైన వైఖరితో పనిచేసింది. ('ప్రణాళికలోను వ్రభుత్వ రంగ నంన్ధల నిర్ధారణలోను నమతుల్య ప్రాంతీయాభివృద్ధి - సంబంధిత పరిశ్రమల అర్ధిక వ్యయాన్ని కొంత పెంచినప్పటికి - ముఖ్యమైన పరిగణనగా వుంది. ఇలాంటి పెట్టుబడుల వలన బీహార్, మధ్యప్రదేశ్ చాలా ప్రయోజనం పొందాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాళ్ళీర్, ఆగ్నేయ రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల అభివృద్ధి ప్రత్యేకించి రోడ్ల వలన చాలా ప్రయోజనం పొందాయి. వెనుకబడిన ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగానికి సబ్సిడీలు, పన్ను రాయితీలు, రాయితీతో కూడిన బ్యాంకింగ్ రుణ సౌకర్యాలలాంటి ప్రోత్సాహకాలు కల్పించింది. 1956-1991 కాలంలో ప్రభుత్వం అమలు పరచిన ప్రైవేటు పారిశ్రామిక సంస్థల లైసెన్సింగ్ విధానం కూడా వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనని ప్రోత్సహించింది. 1969లో బ్యాంకులు జాతీయం చేయబడిన తరువాత, వాటి శాఖల అల్లిక, విస్తరణ కూడా వెనుకబడిన (ప్రాంతాలకు అనుకూలంగా ఉపయోగించబడింది. ఈ ప్రాంతాలలో పెట్టుబడుల్ని ప్రోత్సహించవలసిందిగా బ్యాంకులకు, ఇతర పబ్లిక్ రంగ అర్ధిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతేగాక వివిధ మంత్రిత్వ శాఖలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పథకాలు రూపొందించాయి. ప్రత్యేకించి 1970ల నుండి పనికి ఆహారం పథకం (గ్రామీణాభివృద్ధి పథకం (11/909176 మొణ! ౮౪౬౦0- ౧6౧౬ ?[08ఘగ6) లాంటి పేదరిక నిర్మూలన పథకాలు, ఒక మేరకు విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, ప్రజాపంపిణీ విధానం - పేద రాష్ర్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాయి. ప్రాంతీయ వ్యత్యాసం తగ్గింపుని గమనంలో పెట్టుకొనని రంగం - సాగునీటి పారుదల, వ్యవసాయాఖివృద్ధిలో సబ్సిడీల రంగం. 1960లలో హరిత విప్లవం ప్రారంభమై సాగునీటి వసతులు గల లేక అలాంటి వసతులు వెంటనే ఏర్పాటు చేయటానికి అవకాశాలు గల గ్రామీణ మౌలిక వసతులు సాంకేతిక నవీకరణలో పెట్టుబడులు కేంద్రీకరించబడ్డాయి. ప్రత్యేకించి వర్షంపై ఆధారపడిన మెట్ట వ్యవసాయంపై పెట్టుబడులు పెట్టలేదు. ఫలితంగా ప్రాంతీయ వ్యవసాయ వ్యత్యాసం పెరిగింది. హరిత విష్లవ సాంకేతిక పరిజ్ఞానం 1970లలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, తూర్పు యు.పి. రాజస్థాన్‌లోని కొన్ని స్వతంత్రం తర్వాత భారతదేశం 165
ప్రాంతాలకు, అలాగే 1980లలో బీహారు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాంలకు విస్తరించడంతో ప్రాంతీయ వ్యత్యాసాలు ఒకమేరకు తగ్గించబడ్డాయి. వెనుకబడిన ప్రాంతాల నుండి నిపుణత లేని పనివాళ్ళు, వెనుకబడిన ప్రాంతాలకు నిపుణత గల పనివాళ్ళ వలసలు కూడా ప్రాంతీయ ఆర్ధిక వ్యత్యాసాల్ని తగ్గించటానికి తోడ్పడతాయి. భారత రాజ్యాంగం ఈ వలసలకు హామీ కల్పించింది. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి చాలామంది వలసపోయారు. హిమాచల్‌ప్రదేశ్, ఒరిస్సా, బీహారు, కేరళ లాంటి కొన్నిరాష్ట్రాలు బయటికి వలసపోవడం వలన బెంగాల్, గుజరాత్, మహరాష్ట్ర లాంటి రామ్ష్రాలు లోపలికి వలసలు రావడం వలన ప్రయోజనం పొందాయి. పంజాబ్, కర్నాటక లాంటి రాష్ట్రాలు బయటికి వలసలు, లోపలికి వలసల వలన ప్రయోజనం పొందాయి. కాని కొన్ని రాష్ట్రాలు వలసల్ని అదుపు చేయదానికి ప్రయత్నించడం దురదృష్టకరం. ప్రాంతీయ వ్యత్యాసాల్ని తగ్గించడానికి జాతీయ ప్రభుత్వ చర్యలు ఎంతమేరకు జయప్రదమయ్యాయి? - అని ఆ దశలో (ప్రశ్నించుకొనడం సమంజసంగా వుంటుంది. దీనికి వచ్చే జవాబు చీకటి వెలుగుల సమ్మిశితంగా వుంది. నామమాత్రపు అభివృద్ధి జరిగింది. కాని ప్రాంతీయ అసమానత - ప్రత్యేకించి తలసరి ఆదాయ రీత్యా భారత ఆర్థిక విధానం యొక్క ప్రధానమైన లక్షణంగా కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అంతరాల్ని ప్రభుత్వ చర్యలు అడ్డుకొన్నాయి. ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టి వుండకపోతే పరిస్టితి మరీ అధ్వానంగా వుండేది. ఈ విధానాల ప్రభావంతో పరిశీలించవలసిన యితర అంశాలు వున్నాయి. ఒకటి : అంతర్రాష్ట్ర పారిశ్రామిక వ్యత్యాసంలో - ప్రత్యేకించి నిర్మాణబద్దమైన పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో తగ్గుదల వుంది. జీవన ప్రమాణం (11 50662200, శిశుమరణాలు, అక్షరాస్యత వగైరాలకు ప్రాతినిధ్యం వహించే సాంఘిక సంక్షేమ రంగంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చాలా తక్కున. కేరళ, తమిళనాడు లాంటి కొద్ది రామాలు చాలా ముందుకి పోయనప్పటికి, వ్యవసాయంలో వర్షాధారిత మెట్ట ప్రాంతాలు ఇప్పటికి వెనుకబడివున్నప్పటిక్రి ఇతర రాష్ట్రాల ప్రాంతాల మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతుంది. అన్ని రాష్ట్రాలలో పేదరిక రేఖకు దిగువన వుండే ప్రజల శాతం తగ్గుతుండగా, అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో గరిష్టం అభివృద్ది సాధించబడింది. మొత్తం మీద అన్ని రా(ష్ర్రాలలో ఆర్థికాభివృద్ధి జరిగినప్పటికి, అభివృద్ధి రేట్ల మధ్య చాలా వ్యత్యాసాలువున్నాయి. ఫలితంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాల అంతరం విసృతమయింది. కే66 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొన్ని వెనుకబడిన రాష్ట్రాలు పుంజుకోగలిగాయి. మరికొన్ని విఫలమయ్యాయి. ఫలితంగా అభివృద్ధి తలసరి ఆదాయపరంగా గతం నుండి కొనసాగుతూ వచ్చిన క్రమంలో మార్చు వచ్చింది. ఆ విధంగా బీహారు, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇంకా దిగువన వున్నాయి. మహారాష్ట్ర పంజాబ్, గుజరాత్ పైన కొనసాగుతున్నాయి. గతంలో వెనుకబడిన హర్యానా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు తమ స్థితిని మెరుగుపరుచుకొన్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, యుపిలు దిగజారాయి. యు.పి. అట్టడుగుకి, పశ్చిమబెంగాల్ మధ్యకి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజస్ట్రాన్లు అట్టడుగుకి కొద్దిగా పైన స్తబ్ధతగా ఉన్నాయి. ఈ స్థితిని మెరుగుపరచుకోవడానికి హర్యానా, దిగజారుడికి బీహార్ ఉదాహరణలుగా (ప్రాంతీయ అసమానత అంత విస్తృత స్థాయిలో ఎందుకు కొనసాగుతుంది? కొనసాగటానికి ఆటంకాలేమిటి? బీహార్, యు.పి.లు ఎందుకు వెనుకబడ్డాయి? వెనుక బాటుకి కారణం భౌగోళిక పరిస్థితులు కావు. సహజవనరులు లేక కాదు. బీహార్, యు.పి., ఒరిస్సాలలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. (ప్రజలు కష్టపడి పనిచేయగలినవారు. దేశంలోని ఇతర ప్రాంతాలకే గాక వెస్టిండీస్, మారిషస్, ఫిజీ లాంటి విదేశాలకు వలసపోయినవారు కూడా బాగా రాణించారు. అఖిల భారత స్థాయిలో ప్రాంతీయ అసమానత కొనసాగడానికి ముఖ్య కారణం ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండడం. ఈ లొసుగును అధిగమించి ముందుకు పోవాలంటే జాతీయ ఆర్థికాభివృద్ధి రేటుని పెంచుకోవాలి. అందుకు పెద్ద మొత్తాలు సేకరించి జాతీయాభివృద్ధిని కుంటుపరచకుండానే వెనుకబడిన ప్రాంతాలపై వెచ్చించాలి. భారత ఆర్థికాభివృద్ధి రేటు 1970ల చివరి వరకు 8.5 శాతంగాను 1980ల చివరి వరకు 5 శాతంగాను ఉన్నది. ఇది వెనుకబడిన ప్రాంతాలకు అనుకూలమైన పథకాలు రూపొందించి అమలుపరచినప్పటికి ప్రాంతీయ అసమానతని గణనీయంగా ప్రభావితం చేసేటంత ఎక్కువ కాదు. జనాభా పెరుగుదల కూడా తగ్గుముఖం పట్టగా ఇటీవలి సంవత్సరాలలోనే ఆర్థికాభివృద్ధి రేటు 7 శాతం అయ్యింది. నరియైన తరహా ప్రాంతీయాభివృద్ధి విధానాల్ని అనుసరించడం కొనసాగిస్తే ఆర్థిక అసమానతలో తగ్గుదల సాధించవచ్చు. కాని మేము కొన్ని రాష్ట్రాల వెనుకబాటుతనం యొక్క మూలాలు వాటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలోనే ఉన్నాయని భావిస్తున్నాము. ఉదాహరణకు బీహార్ తూర్పు యుపిలోని వ్యవసాయ నిర్మాణం తిరోగమ స్వభావం గలది. ఈ రాష్ట్రాలలోని చాలా స్వతంత్రం తర్వాత భారతదేశం 167
ప్రాంతాలలో భూ సంస్కరణలు సరిగా అమలు జరపబడలేదు (ఇటీవలి కాలం వరకు ఒరిస్సాలో కూడా) ఫ్యూడల్ ఆలోచనా విధానం బలంగా ఉంది. అంతేగాక బీహార్, ఒరిస్సాలలో భూమి ఏకీకరణ చాలా మందకొడిగా సాగింది. భూమి ఏకీకరణ (1.206 (0030144401) పంజాబ్, హర్యానాల వ్యవసాయాభివృద్ధిలో ముఖ్య పాత్ర నిర్వహించింది. వెనుకబడిన రాష్ట్రాలకు విద్యుచ్చక్తి, నీటిపారుదల, రోర్డు, టెలిఫోన్లు, వ్యవసాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెట్లులాంటి మౌలిక వసతులు తక్కువ. అభివృద్ధికి ఇవి చాలా అవసరం. ఇవి రాష్ట్రాల ఆధీనంలో ఉందే అంశాలు గనుక రాష్త్రాలే వీటిని అభివృద్ధి పరచుకోవాలి, విద్య, (ప్రజారోగ్యం, పారిశుధ్యంపై రాష్ర్రాలు తక్కువ వెచ్చిస్తుంటాయి. ప్రణాళికా వ్యయానికే వనరుల లేమితో సతమతమవుతుంటాయి. పెంచిన కేంద్ర ఆర్ధిక సహాయం కూడా ఈ లోటులను పూడ్చగలిగేదిగా ఉండదు. ఫలితంగా ఒక విష విలయం సృష్టించబడుతుంది. తక్కువ స్థాయి ఆర్థికాభివృద్ధి, ఉత్పత్తి అంటే తక్కువ ఆర్థిక వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళిక సామాజిక సేవలపై పరిమితమైన వ్యయం. ఈ తక్కువ స్థాయి వ్యయం తక్కువ స్పాయిల ఉత్పత్తికి- కాబట్టి తక్కువ ఆర్ధిక వనరులకు దారి తీస్తుంది. ఇ రాజకీయ పరిపాలనాపరమెన వైఫల్యం వెనుకబాటుతనానికి సాయపడుతుంది. బీహార్, యుపిలు ఉన్నతస్తాయి లంచగొండితనానికి, చెడు పరిపాలనకు, క్షీణిస్తున్న శాంతి భద్రతలకు నిలయాలయ్యాయి. ఫలితంగా కేంద్ర సహాయంగా లభించిన వనరులు సక్రమంగా వినియోగించక పోవడం లేక అభివృద్ధితో సంబంధం లేని పద్దులకు వెచ్చించడం జరిగింది. అంతేగాక్ర రోడ్డు, విద్యుత్తులతో మౌలిక వసతుల అభివృద్ధి అశ్రద్ధ చేయబడింది. లభ్యమవుతున్న మౌలిక వసతులు అసమర్హతతో లంచగొండితనంతో కునారిల్లాయి. పరిపాలనాపరమైన సామర్థ్యం రీత్యా కూడా బీహార్, యుపిలలో పోల్చి చూస్తే దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాలు మంచి ఆర్థికాభివృద్ధి సాధించాయి. ల సాధారణంగా ప్రతి రాష్ట్ర అభివృద్దిలో అంతరాలు ఉంటాయి. చాలా సందర్భాలలో ఈ వ్యత్యాసాలు ఉద్రిక్తతల్ని పెంచి ప్రత్యేక రాష్ట్రాల కొరకు, రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కారకు లేక విద్య ఉపాధి వనరుల కేటాయింపులలో రక్షణల కొరకు ఉద్యమాలకు జన్మనిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, మహారాష్ట్రలో విదర్భ, గుజరాత్లో రాష్ట్ర మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌ఘడ్, యు.పి.లో ఉత్తరాఖండ్, బుందేల్ ఖండ్, పశ్చిమ బెంగాల్లో గూర్చాలాండ్, అస్సాంలో బోడోలాండ్, బీహార్‌లో జార్ధండ్ ఉప ప్రాంతీయ ఉద్యమాలకు ఉదాహరణలు. 168 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రాంతీయ ఆర్థిక అసమానత అనేది జాతీయైక్యతకు, రాజకీయ స్థిరత్వానికి వ్యతిరేకంగా గురిపెట్టబడిన టైంబాంబు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు అది జీర్ణించుకొనబడింది. కలుపుకొనబడింది. శాంతింపజేయబడింది. కారణం అది అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వెనుకబడిన రాష్ర్రాలపై సాధించిన ఆధిపత్యం లేక దోపిడీ ఫలితం కాదు, లేక జాతీయ ప్రభుత్వం వెనుకబడిన రాష్ట్రంపై చూపిన వివక్ష నుండి పుట్టింది కాదు. రాజకీయంగా ముఖ్యమైన హిందీ మాట్లాడే రాష్ట్రాలు - యు.పి., బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు లోక్‌సభలో దాదాపు 87 శాతం సీట్లు కలిగిన ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు. మరొకవైపు లోక్‌సభలో దాదాపు 17 శాతం సీట్లు మాత్రమే గల పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్టలు ఎక్కువ ఆదాయం గల రాష్ట్రాలు. కాబట్టి ఇతర రాష్ట్రాలపై హిందీ రాష్ట్రాల ఆధిపత్యం గురించి చేసే ప్రస్తావనని ఎవరూ అంతగా పట్టించుకొనరు.
మరొకవైపు వెనుకబడిన హిందీ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం గాని హిందీయేతర రాష్ట్రాలు గాని తమపై ఆధివత్యం చెలాయిస్తున్నాయనిగాని తాము వివక్షకు గురవుతున్నామని ఆరోపించడం అసాధ్యమనిపించేంతగా రాజకీయ పట్టు కలిగిఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ఆధిపత్య ఆరోపణలు సాపేక్షికంగా అభివృద్ధి చెందిన పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుండి - స్పష్టంగా ఆర్థిక కారణాల రీత్యా గాక రాజకీయ కారణాలరీత్యా రావడం ఆసక్తికరమైన అంశం.
ఐ.ఎ.ఎస్. లాంటి అఖిల భారత సర్వీసులలో కూడా హిందీ ప్రాంతాల వారు అదనంగా ప్రయోజనాలు ఏమీ పొందలేదు. అలాంటి ఉద్యోగాలలో పంజాబ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తి కంటె ఎక్కువ ప్రాతినిధ్యం పొందాయి.
వెనుకబడిన రాష్ట్రాలలో ప్రాంతీయవాదం లేకపోవడానికి తాము వివక్షకు గురయ్యామనే భావన లేకపోవడానికి మరొక కారణం. ఆయా రాష్ర్రాల రాజకీయ, పాలనా బాధ్యతలు చూసే, వర్గాల చేష్టల ఫలితాలే పేదరికం, వనుకబాటుతనాలనే అవగాహన అక్కడి మేధావులకు ఉండడం. మోసం, వంచనల గురించి, వెనుకబాటుతనం గురించి తరచుగా వ్యక్తీకరించేది మేధావులే గదా! అదే సమయంలో పేద్ద రాష్ట్రాల అత్యధిక ప్రజానీకానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తాము వెనుకబాటుతనం, పేదరికాల్లో మగ్గుతున్నామనే అవగాహన ఉండదు. ఫలితంగా వారు అసంతృప్తి చెందరు. ఇతర రాష్ట్రాలతో సమానత సాధించే ప్రయత్నాలూ చేయరు. కాని విద్యా వ్యాప్తి టెలివిజన్ వార్తా పత్రికల లాంటి దృశ్య (శ్రవణ మాధ్యమాల అందుబాటుతో ఈ పరిస్థితి మారవచ్చు.
స్వతంత్రం తర్వాత భారతదేశం 1649
ఏది ఏమైనప్పటికి రాజకీయంగా ఆర్థికంగా ప్రాంతీయ అసమానతని కొన్ని పరిమితులలో ఉంచడం అవసరమని, రాష్ట్రాల స్వయం కృషి. కేంద్ర సహాయంతో సవో పేద రాష్ట్రాల వృద్ధి రేట్లని పెంచడం ద్వారా క్రమంగా అసమానతలని తొలగించాలని రిపబ్లిక్ నిర్మాతలు గుర్తించారు. అంటే సాంఘిక ఆర్థికాభివృద్ధి వ్యూహాల్ని రూపొందించి అమలు జరపడానికి వీలుగా జాతీయ ప్రభుత్వం పారిశ్రామిక దేశాల కంటే ఎక్కువ అధికారాన్ని 'ప్రయోగించాల్సి ఉంటుందని అజిత్ మంజుదార్ వాదించాడు. సహజ వనరుల వినియోగంపై రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలపైన ధనిక రా్ర్రాల నుండి పేద రాష్ట్రాలకు వనరుల్ని బదిలీ చేసే సమస్యపైన చర్చలు జరిపి పరిష్కరించే అధికారముండాలి. భూమి పుత్రుల సిద్ధాంతం 1950ల నుండి 'భూమి పుత్రుల సిద్దాంతం” రూపంలో ప్రాంతీయవాదం యొక్క వికృత రూపం వ్యాప్తి చెందింది. దాని వెనుకవున్న ఉద్దేశమేమంటే రాష్ట్రం దానిలో నివసిస్తున్న ప్రధానమైన భాషా గ్రూపుకి చెందుతుంది. ప్రధాన భాషా గ్రూపుకి చెందినవారు “భూమి పుత్రులు" “స్థానిక నివాసులు”. రాష్ట్ర ప్రధాన భాష మాతృభాష కాకుండా అక్కడ నివసిస్తున్న ఇతరులు 'బయటివారు' ఈ బయటివారు రాష్ట్రంలో చాలా కాలం నివసించి ఉండవచ్చు. లేక ఇటీవల వలసవచ్చి ఉండవచ్చు. వారు భూమి పుత్రులుగా పరిగణించబడరు. శ్ర సిద్దాంతం కొన్న నగరాలలో ప్రజాదరణ పొందింది. 4, 3852 తరువాత జరిగిన ఆర్థికాభివృద్ధిలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేకించ్చి నగరాలలో అసమాన ఆర్లిక అవకాశాలు పెరిగాయి. కొత్తగా కల్పించబడిన విద్యా ఉపాధి అవకాశాలలో బయటివారి కంటె స్థానికులకు, భూమి పుత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండు ముందుకు వచ్చింది. ఆర్ధిక వనరులు ఆర్థికావకాశాల కొరకు జరిగే పోరాటంలో తరచుగా మతతత్వాన్ని కులతత్వాన్ని, ఆ(శిత పక్షపాతాన్ని ఆశ్రయించడం జరిగింది. అదే విధంగా రాష్ట్రం లేక నగరం యొక్క ఆర్థిక జీవనం నుండి బయటివారిని మినహాయించేందుకు భాషాపరమైన విధేయత, ప్రాంతీయవాదం ఉపయోగించుకొనబద్దాయి. రాష్ట్ర భాష మాట్లాడేవారు మైనారిటీగా లేక అంతంత మాత్రం మెజారిటీగా ఉండడంతో చాలా నగరాలలో లేక ప్రాంతాలలో సమస్య తీవ్రతరం చేయబడింది. ఉదాహరణకు 1961లో బొంబాయిలో మరాఠీ మాట్లాడే వారి శాతం 42.8. 170 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బెంగుళూరులో కర్నాటక మాట్లాడేవారి శాతం 25కి తక్కువ. కలకత్తాలో బెంగాలీ మాట్లాడేవారు అంతంత మాత్రం మెజారిటీగా ఉన్నారు. అస్సాం పట్టణ (ప్రాంతాలలో అస్సామీయులు 33 శాతం మాత్రమే. 1951 తరువాత పట్టణాలకు వలసలు వేగం విపరీతంగా పెరిగింది.
ఇక్కడ తలెత్తే ముఖ్యమైన ప్రశ్నలు : భూమి పుత్రుల ఉద్యమాలు కొన్ని రాష్ట్రాలలోనే నగరాలలోనే ఎందుకు వచ్చాయి? ఇతర చోట్ల ఎందుకు రాలేదు? వారు కొందరు వలసలు వచ్చినవారిని భాషాపరమైన మైనారిటీలను ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇతరులను ఎందుకు పెట్టుకోలేదు? కొన్ని రకాల ఉద్యోగాలు ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? సాధారణ ఆర్ట్స్ చదువులు కాక టెక్నికల్, ప్రొఫెషనల్ చదువుల్ని ఎందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు? వలసలు వచ్చినవారికి అక్కడ ఉన్న ప్రజలకు (భాషాపరమైన మైనారిటీలకు, మెజారిటీలకు) మధ్య ఘర్షణ స్వాభావికమైనది కాదు. అనివార్యమైనది కాదు. చాలా రాష్ట్రాలలో వారూ వీరూ సమరసభావంతో జీవనం సాగించారు. స్పష్టంగా ఘర్షణ పెల్లుబికడానికి ప్రత్యేక పరిస్థితులున్నాయి.
వలస వచ్చిన వారికి, స్థానికంగా చదువుకొన్న యువకులకు మధ్య పారిశ్రామిక, మధ్యతరగతి ఉద్యోగాల కొరకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భూమిపుత్రుల ఉద్యమాలు ఆవిర్భవించాయి. బయటి వారు పై పదవులకు అనవకాశముండి ప్రభుత్వ ఉద్యోగాలలో, వృత్తులలో, పరిశ్రమలలో ఉద్యోగాలు సంపాదించి చిన్న పరిభమలు, వ్యాపారాలు నడుపుకుంటున్న రాష్ట్రాలలో నగరాలలో ఈ ఘర్షణ ఎక్కువగా ఉంది. దిగువ మధ్యతరగతి వారు, కార్మికులు, ప్రస్తుత వారి స్థితిగతులు బాగున్నప్పటికి వారి బిడ్డలు మధ్యతరగతి ఉద్యోగులు కావాలని ఆకాంక్షించే సంపన్న మధ్యతరగతి రైతులు ఈ ఉద్యమాలలో చురుకైన కార్యకర్తలు. ఈ సామాజిక గ్రూపులు వారి బిడ్డలకు పై చదువులు- ఇంజనీరింగు, మెడిసిన్, కామర్స్ చదివించాలని ఆకాంక్షిస్తారు.
ఇటీవల చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలోని ఆర్థిక విధానం యొక్క వైఫల్యం ఉద్యోగాల కొరతని సృష్టించింది. 1960, 1970లలో అప్పటికి ఉన్న ఉద్యోగాల కొరత తీవ్రమైన పోటికి దారి తీసింది. మెజారిటీ భాషా గ్రూపు ప్రజల్ని సమీకరించి ప్రజాస్వామ్య రాజకీయ క్రమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యా, ఉపాధి అవకాశాల్ని వినియోగించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రూపులు రాజకీయాధికారాన్ని పొందేందుకు భూమిపుత్రుల సెంటిమెంటుని అవకాశంగా ఉపయోగించుకొనగలిగాయి. ఇది అనివార్యం కాదు. కమ్యూనిస్టు పార్టీ తన సైద్ధాంతిక స్వతంత్రం తర్వాత భారతదేశం శ్ష71
నిబద్ధత కారణంగా కలకత్తాలో వలస వ్యతిరేక భావాల్ని ఉపయోగించు కొనేందుకు తిరస్కరించింది. అందువలననే భూమిపుత్రుల సిద్దాంతం ప్రజాదరణ పొందలేక పోయింది. అలాగే భూమిపుత్రుల సిద్ధాంతం విషయంలో కాం(గైస్ అవకాశవాద రాజీ వైఖరి చేపట్టినప్పటికి తానుగా ఉద్యమాల్ని ప్రారంభించలేదు. చురుకుగా మద్దతివ్వలేదు. బయటి వారు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా, సాంప్రదాయ పరిశ్రమలైన జూట్, బట్టల మిల్లులో తక్కువ వేతనాలు పొందే కార్మికులుగా ఎక్కువగా ఉంటారు. కాని ఇక్కడ భూమి పుత్రుల సిద్ధాంతం లేదు. బయటి వారి పట్ల శత్రుత్వం లేదు. కారణం మధ్యతరగతి ఉద్యోగాలు లేకపోవడం. ఈ ఉద్యోగాల కొరకు స్థానికులు కూడా బయటివారితో పోటీపడరు. ఫలితంగా (శ్రామికులు బీహార్, యుపిల నుంచి పెద్దఎత్తున పంజాబ్, హర్యానాలకు లేక బొంబాయికి లేక బీహార్ నుండి కార్మికులు కలకత్తాలోని జూట్ ఇతర మిల్లులకు, బీహార్, ఒరిస్సా కార్మికులు అస్సాం, బెంగాల్ టీ తోటలకు లేక ఒరిస్సా భవన నిర్మాణ కార్మికులు గుజరాత్‌కి, ఇంటి పని వాళ్ళు దేశవ్యాప్తంగా వలసలు పోయినా స్థానికులతో ఘర్షణలు జరగలేదు. అలాంటి వలసలు స్థానిక మధ్యతరగతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇక ఇంటి పనివాళ్ళ విషయంలో ఎక్కువ ప్రయోజనం పొందినవారు మధ్య తరగతివారు. అందుకే ఈ వలసలను ప్రోత్సహించింది కూడా వారే. కాని ఇటీవల సాంకేతికంగా అభివృద్ధి చెందిన పరిశ్రమల ఉద్యోగాలకు ఎక్కువ చదువు నిపుణతలు- వాటితో పాటు ఎక్కువ వేతనాలు లభిస్తున్నందున స్థానికులు ఈ ఉద్యోగాలకు పోటీపడుతున్నారు. ఒక ప్రాంతంలో వలసల వ్యతిరేక ఉద్యమాలు ఆవిర్భవించటాన్ని, ఆవిర్భవించక పోవటాన్ని ప్రభావితం చేసిన మరొక అంశం: అచట వలసలు పోయే సాంప్రదాయం ఉండటం, లేకపోవడం. ఒక రాష్ట్ర ప్రజలు - ప్రత్యేకించి మధ్యతరగతులు వలసలు పోయి ఉంటే అక్కడికి ఇతరులు వలసలు రావడం పట్ల వ్యతిరేకత ఉండదు. పళ్చిమ బెంగాల్, కేరళ పంజాబ్, బీహార్, యుపిలు ఈ కోవకి చెందుతాయి. మరొక వైపు వలసలు పోత్షో సాంప్రదాయం లేని మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాలలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా ప్రాంతంలోను భూమి పుత్రుల సిద్ధాంతం అభివృద్ధి చెందింది. వలసలు పోయే వారి హక్కుల సమస్యపై రాజ్యాంగంలో ఒక మేరకు సందిగ్ధత ఉంది. ఆర్టికల్ 15 మతం, తెగ, కులం, సెక్సు, జన్మస్థానం - ప్రాతిపదికన వివక్షని నిషేధిస్తుంది. ఆర్టికల్ 16 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో అసమ్మతి, జన్మస్థానం లేక నివాసం ప్రాతిపదికన వివక్షని నిషేధిస్తుంది. కాని పార్లమెంటు ఒక రాష్ట్రంలో 172 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర నివాసియై ఉండాలనే షరతు విధిస్తూ చట్టాన్ని ఆమోదించవచ్చు. రాజ్యాంగంలోని సందిగ్ధతని అవకాశంగా తీసుకొని, రాజకీయ ఒత్తిడితో చాలా రామాలు ఉద్యోగాల్ని తిరస్కరిస్తాయి. లేక రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగాలలో విద్యా సంస్థల (ప్రవేశంతో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తాయి. అలాంటి సందర్భాలలో నివసించిన కాలవ్యవధిని నిర్ణయిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను ప్రాధాన్యతని భాషా ప్రాతిపదికన గాక నివాస స్థల ప్రాతిపదికన ఇవ్వాలని రాజ్యాంగం అనుమతించినప్పటికి కొన్ని రాష్ట్ర (ప్రభుత్వాలు మరికాస్త ముందుకుపోయి రాష్ట్ర భాష మాతృభాషగా గల స్థానికులకు ప్రాధాన్యతని పరిమితం చేశాయి. ఈ విధంగా అవి చాలా కాలం క్రితం వలస వచ్చినవారికి, వారి బిడ్డలకు, మైనారిటీ భాష మాతృభాషగా కలిగి రాష్ట్ర అధికార భాషలో మాట్లాడగలిగి అచట నివసించేవారికి వ్యతిరేకంగా వివక్ష చూపబడింది. ఇది చాలా స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన. ప్రయివేట్ సంస్థలలోని ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వమని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. విద్య ఉపాధి కల్పనలో ( ఉద్యోగాలలో) స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని చేసే వాదనలో ముఖ్యాంశం : ఆయా రాష్ట్రాలలో స్థానికులు సాంఘికంగా ఆర్ధిక పరంగా విద్యాపరంగా వెనుకబడివున్నారు. వలస వచ్చిన అభివృద్ధి చెందిన వారితో పోటిపడలేరు. అంతేగాక సాంకేతిక కళాశాలలు యూనివర్సిటీలలో కూడా వెనుకబడిన స్థానికులు కంటే అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్ర విద్యార్థులు చాలా ఎక్కువగా వుంటారు. ఆ కారణం రీత్యా నెహ్రు తరువాతి కాలంలో పబ్లిక్ సెక్టరు సంస్థల ఉద్యోగాలలో ఒక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కంటె తక్కువ అవసరమైన కాలేజి యూనివర్సిటీ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే వైఖరిని కేంద్రప్రభుత్వం బలపరిచింది. నివాసం ప్రాతిపదికగా ఇవ్వబడిన ఉద్యోగాలకు కోర్టులు కూదా ఆమోదించాయి. శివసేన నడిపిన ఉద్యమం ఫానిస్టు తరహాలో తీవ్రమైన ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టిన ఉద్యమం. శివసేన బాలథాకరే నాయకత్వంలో 1966లో స్థాపించబడింది. ఉద్యోగాలలో చిన్న వ్యాపారాలలో మహారాష్ట్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసింది. మహారాష్ట్రీయుల్ని మాతృభాష మరాఠీగా గల వారుగా నిర్వచించింది. 'మహారాష్ట్ర మహారాష్టీయుల కొరకు' అనే నినాదంతో శివసేన సమరశీలమైన, దక్షిణ భారతీయులకు, ప్రత్యేకించి తమిళులకు వ్యతిరేకంగా హింసాయుత ఉద్యమాన్ని నడిపింది. ప్రైవేట్ సంస్థలలో గుమస్తాలుగా, టైపిస్టులుగా, టీ షాపులు, స్వతంత్రం తర్వాత భారతదేశం క్ష79
టిఫిన్ సెంటర్ల లాంటి చిన్న వ్యాపారాలలో తమిళులు ఎక్కువగా వున్నారు. 1969లో శివసేన దక్షిణ భారతీయులకు వ్యతిరేకంగా భయోత్సాతాన్ని సృష్టించింది. ఇళ్ళు తగులబెట్టింది. టీస్టాల్స్, హోటళ్ళను ధ్వంసం చేసింది. బొంబాయి నగరానికి ఫాసిస్టు హింసని రుచి చూపింది. కాని శివసేన దక్షిణ భారతీయ వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేక పోయింది. బొంబాయి నగరం వెలుపల పెద్ద రాజకీయ శక్తి కాలేకపోయింది. ఏ అఖిల భారత రాజకీయ పార్టీ మద్దతు పొందలేక పోయింది. కాబట్టి అది తన సైద్ధాంతిక ప్రాతిపదికన హిందూ మతతత్వ వాదానికి మార్పు చేసుకొన్నది. భారతీయ జనతా పార్టీతో జతకట్టగలిగింది. అస్సాం, తెలంగాణాలలో భూమిపుత్రుల ఉద్యమాలు సంక్షిష్టమైనవి. కొన్ని అదనపు ప్రత్యేక లక్షణాల గలవి. కాబట్టి ఈ ఉద్యమాలను గురించి రాష్ట్ర రాజకీయాల అధ్యాయాలలో చర్చిద్దాం, రక్షణాత్మక ప్రాధాన్యత నియమాలు 1960 దశాబ్దం నుండి విస్తృతంగా వున్నప్పటికి వలసలు వచ్చిన వారికి వ్యతిరేకంగా వైరం శత్రుత్వం హింస యిటీవల సంవత్సరాలలో తగ్గాయి. భూమి పుత్రుల సిద్ధాంతం యిప్పటికీ చిన్న సమస్యగా వున్నప్పటికీ ఆందోళన కలిగించేదిగా లేదు. అది ఉధృతంగా వున్నప్పుడు కూడా కొద్ది నగరాలకు, రాష్ట్రాలకు పరిమితమైంది. ఏ దశలో కూడా అది దేశ ఐక్యతకు జాతి నిర్మాణ క్రమానికి 'ప్రమాదకారిగా లేదు. అది భారత ఆర్షిక విధానాన్ని అంతగా ప్రభావితం చేయలేదు. దేశంలో వలసలు నిరోధించబడలేదు. వాస్తవంగా వలసలు పెరిగాయి. కాని ఈ సమస్య నిరుద్యోగాన్ని ప్రాంతీయ అసమానతని తొలగించేంతవరకు సజీవంగానే వుంటుంది. ల స్వతంత్ర్యానంతరం భాషా రాష్ట్రాల నిర్మాణం, తెగల విలీనం ప్రాంతీయ అసమానత, ప్రాంతీయవాదం - లాంటి విభజన సమస్యల్ని సమీక్షిస్తే “చీకటి వినాశనం” జోస్యాలు నిరాకరించబడ్డాయి. భాషా రాష్ట్రాలు వివిధ భాషా ప్రాంతాల పూర్తి సాంస్కృతిక ప్రతిపత్తికి అవకాశం కల్పిస్తూ దేశ ఐక్యతని పటిష్టపరచాయి గాని బలహీన పరచలేదు. హిందీ, ఇంగ్లీషు అఖిల భారతదేశ భాషలుగా అభివృద్ధి చెందుతున్నాయి. డి.ఎం.కె. లాంటి ప్రాంతీయ ఉద్యమాలు 1967 తరువాత వెనుకపట్టు పట్టాయి. మద్రాసు రాష్ర్టాన్ని తమిళనాడుగా, మద్రాసుని చెన్నైగ్రా మార్చటంతో సంతృప్తి చెందాయి. తెగల (ప్రజలు సాంస్కృతిక ఆర్థిక స్వయం ప్రతిపత్తి అంశాలలో రక్షణ పొందినట్లు భావిస్తున్నారు. వారు బలం పుంజుకొన్నారు. వారికి కాలక్రమంలో రాజకీయ మద్దతు లభించింది. జాతి నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. భారతీయుదడననే జాతీయ గుర్తింపు అందరి ఆమోదం పొందింది. కే74 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
శ1 ఇని ఆశావహ సంవత్సరాలు - సాధించిన ఫలితాలు 19051- 64
1951-64 పరిపక్వత, విజయాలు సాధించిన సంవత్సరాలు, ఆశలు, ఆకాంక్షలు, ఆశావాదం విశ్వాసం పాదుకొల్పిన సంవత్సరాలు. జవహర్లాల్ నెహ్రూ 1953 ఏప్రిల్‌లో ఇలా ప్రకటించాడు.
“దేశంలోని ప్రతి పురుషనికి, స్త్రీకి, బిడ్డకి న్యాయం జరిగి కనీస స్థాయి జీవనం సాగించగలిగే వరకు నేను తృప్తిగా విశ్రాంతి తీసుకోలేను... ఒక జాతిని అంచనా వేయడానికి ఐదు లేక ఆరు సంవత్సరాలు చాలా తక్కువ వ్యవధి. మరొక పది సంవత్సరాలు నిరీక్షించండి. మన పథకాలు దేశం యొక్క స్వరూపాన్ని పూర్తిగా, ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా
ప్రజల మనోభావాల్ని ప్రతిఫలిస్తూ 1955 జూన్‌లో ఇలా రాశాడు.
'మనకు అనేక సమస్యలున్నప్పటికీ, కష్టాలు చుట్టుముట్టి దాదాపు ముంచివేసేలా ఉన్నప్పటికీ ఈ దేశంలో అశావహమైన వాతావరణం, మన భవిష్యత్తుపై విశ్వాసం, ఇప్పటి వరకు మనకు మార్గదర్శకంగా ఉన్న మౌలిక సూత్రాలపై నమ్మకం ఉన్నాయి. ఉదయ సంధ్యా వీచికలు, చీకటి వెలుగుల సమ్మిజ్రితమైన సుదీర్టమైన భారతదేశ చరిత్రలో నూతన శకారంభమనే భావనని కలిగిస్తున్నాయి.
ఈ సంవత్సరాలు భారతదేశం ఇంచుమించు స్థిరంగా ఉన్న సంవత్సరాలు. భారతదేశ రాజకీయ వ్యవస్థ ప్రత్యేకమైన స్వరూపం సంతరించుకున్నది. అన్నీ రంగాల్లో దేశం అభివృద్ధి ప్రారంభమయింది. అన్నింటిని మించి రాజకీయ ఆర్థిక వ్యవస్థల్లో పెద్దఎత్తున పునర్నిర్మాణం (ప్రారంభమయింది. ప్రజాస్వామ్యం, పొరస్వేచ్చ, సెక్యులరిజం, శాప్రీయ స్వతంత్రం తర్వాత భారతదేశం 175
అంతర్జాతీయ దృక్పథం, ప్రణాళికా రచన, ఆర్ధికాభివృద్ధి, సోషలిజం - మౌలిక లక్ష్యాలుగా గల మార్గంలో ప్రజల పురోగమనం (ప్రారంభమయింది. కానీ నెమ్మదిగా జరుగుతున్న అభివృద్ది పట్ల ప్రత్వేకించి పేదరికం, ఉపాధికల్పన, సమస్యలపై నత్తనడకన సాగుతు ఫ్రోభ్ర బి న్యలణ ణఆల్త భూసంస్మరణలపై మేధావులలో అసంతృప్తి నెలకొన్నది. కొన్ని బలహీనతలు పరిమితులు ఉన్నప్పటికి ఈ రంగాల్లో అభివృద్ధి విజయాలు సాధించాము.
- జాతి ఏకీకరణ, భాషు తెగల సమస్యల పరిష్కారం.
- స్వతంత్రమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి కమం ప్రారంభం.
- స్వతంత్రమైన, విదేశాంగ విధాన రూపకల్పన
- ఎన్నికల క్రమాన్ని ప్రారంభించుట
- ప్రజాస్వామ్యం పాదుకొాల్పుట
- పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టుట
- శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి
- సంక్షేమ రాజ్య ప్రారంభం. మొదటి మూడు అంశాలు ఈ (గ్రంథంలో ప్రత్యేక అధ్యాయాల్లో చర్చించబడ్డాయి. చివరి ఐదు అంశాలు ఈ అధ్యాయంలోనే దిగువన చర్చించబడ్డాయి. ఎన్నికల క్రమాన్ని పాదుకొల్పుట మొట్ట మొదటి చర్యగా ప్రజాస్వామ్యానికి సురక్షిత స్ధానం కల్పించబడింది. 1947 శ్యూక రాజ్యాంగరూపకల్పన, 1950 జనవరి 26 న దానిని అమలు చేసే క్రమం జై రంభమయింది, 1951 -52 లో నాలుగు నెలల కాల వ్యవధిలో ఎన్నికల నిర్వహణతో ప్రజాస్వామ్యం పెద్ద ముందడుగు వేసింది. ఈ ఎన్నికలు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద ప్రయోగం. 21 సం॥లు ఆపై వయస్సు గల వారికి ఓటింగు హక్కుతో సార్వత్రిక ప్రయోజన ఓటింగు ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 173 మిలియన్లకు పైగా ఓటర్లున్నారు.వారిలో అత్యధికులు పేదలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, ఎన్నికల అనుభవం లేనివారు. ఈ అవకాశానికి ప్రజలు ఎలా స్పందిస్తారనేది అప్పటి సమస్య 176 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అలాంటి ఓటర్లు రాజకీయ పరిపక్వతతో బాధ్యతాయుతంగా ఓటుహక్కు వినియోగించుకానడం పై చాలా మంది సందేహలు వ్యక్తం చేశారు, పలుమతాలు, కులవిభజన, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం గల భారతదేశంలాంటి దేశానికి ప్రజాస్వామ్య ఎన్నికలు సరిపడవని కొందరు పెదవి విరిచారు. ఇలాంటి దేశానికి కనికరం గల నియంతృత్వం అవసరమన్నారు. రానున్న ఎన్నికలు “చీకటిలో గెంతటమని' కొందరు 'అసంగతం, అసంబద్ధమనని “విశ్వాసంతో కూడిన చర్య'అని కొందరు వర్ణించారు.
భారతదేశపు ఎన్నికల విధానం రాజ్యాంగం యొక్క ఆదేశాలననుసరించి అభివృద్ధి పరచబడింది. రాజ్యాంగం ఎన్నికల నిర్వహణకు ఛీప్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్వంలో ఎన్నికల కమిషన్ని నియమించింది, అది కార్యనిర్వాహకుల (2౫646౪ల) లేక పార్లమెంటు లేక అధికారంలో వున్న పార్టీ ప్రమేయం లేని స్వతంత్ర సంస్థగా పనిచేస్తుంది.
ఎన్నికల నిర్వహణ అద్భుతమైన కర్తవ్యం. ఓటర్లను నమోదు చేసేందుకు ఇంటింటి సర్వే జరిగింది. 70 శాతానికి పైగా ఓటర్లు నిరక్ష్యూస్యులవడం వలన అభ్యర్థుల్ని వారికి కేటాయించబడిన గుర్తుల్ని బట్టి గుర్తించ వలసి వుంది. గుర్తులు బ్యాలట్ పెట్టెలపై (ఆ తరువాత బాలట్ పేపర్లపై) ముద్రించబద్దాయి. ఓటర్లు ఓటును అభ్యర్ధికి కేటాయించిన పెట్టెలో వేయవలసి వుంది. ప్రతి 1000 మంది ఓటర్లకి ఒకటి చొప్పున 2,24,000 పోలింగు బూత్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. అభ్యర్ధికి ఒకటి చొప్పున 2 1/2 మిలియన్ల స్టీలు బ్యాలట్ పెట్టెలు సరఫరా చేయబడ్డాయి. దాదాపు 62,00,00,000 బ్యాలెట్ పేపర్లు ముద్రించబడ్దాయి. దాదాపు మిలియన్ మంది అధికారులు ఎన్నికల్ని పర్యవేక్షించారు. అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు వచ్చినవారు ఎన్నికవుతారు. గెలిచే అభ్యర్థికి మెజారిటీ రావాలనే నిబంధన లేదు.
మొత్తం 489 లోక్‌సభ స్థానాలకు 3283 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 14కి పైగా జాతీయ, 63 ప్రాంతీయ లేక ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీ చేశారు. వీటిలో 98 లోక్‌సభ స్థానాలు, 669 అసెంబ్లీ స్థానాలు, షెడ్యూల్టు కులాలు, షెడ్యూల్డు తెగలకు కేటాయించబడద్డాయి. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు దాదాపు 17,500 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఎన్నికలు 1951 అక్టోబరు 25 నుండి 1952 ఫిబ్రవరి వరకు అంటే దాదాపు 4నెలల కాలవ్యవధిలో నిర్వహించబడ్డాయి. ఈ కాలవ్యవధి 1957 లో 19 రోజులకు ఆ తరువాత ఎన్నికలలో 7 నుండి 10 రోజులకు కుదించబడింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 177
జనసంఘ్, సి.పిఐ.తో సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో స్వేచ్చగా పాల్గొనేందుకు తగిన పరిస్థితులు కల్పించబడ్డాయి. జనసంఘ్ మతతత్వ పార్టీ. దాని చోదక శక్తిగా వున్న ఆర్.ఎస్.ఎస్ మత విద్వేషాన్ని ప్రచారం చేసి గాంధీజీ హత్యకి దారి తీసింది. సి.షిఐ ఎన్నికలకు ముందు కొద్దినెలల క్రితం వరకు విప్లవ విధానాన్ని అనుసరించింది. రాజ్యాంగ చట్రాన్ని కూడా ధృఢంగా వ్యతిరేకించింది. ప్రతి పక్షాలు ముక్కలు చెక్కలుగా వున్నాయి. మతవాద పార్టీలకు వామపక్ష పార్టీలకు మధ్య ఎన్నికల మిత్రత్వం లేదు. సీట్ల సర్దుబాటు లేదు, మొదటి సాధారణ ఎన్నికలలో నెహ్రూ చేపట్టిన ఎన్నికల ప్రచారం ప్రత్యేకంగా పేర్మానదగింది. 40,000 &ఓమీ పర్యటించి 35 మిలియన్ల ప్రజల్ని అంటే దేశ జనాభాలో 10వ వంతు మందిని ఉద్దేశించి ప్రసంగించారు. “1947కి ముందు లాగానే నెట్రా ఉపన్యాసాలన్నీ వయోజన విద్య క్రమంలో భాగంగా, ప్రజలకు ఆలోచించే శక్తి వుందని, ఆలోచించాలని” ఉదోధించాడని నెహ్రు జీవిత చరిత్ర రచయిత యస్. గోపాల్ రాశాడు. ఎన్నికల ప్రచారానికి నెహ్రూ కేంద్రబిందువుగా వున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన ప్రాధాన్యతని గుర్తించాయి. అవన్నీ కూడా యస్. గోపాల్ మాటల్లో చెప్పాలంటే 'ప్రతి దృష్టి కోణం నుండి అతడిని ఎదుర్కొనడంలో ఏకమయ్యాయి.) నెహ్రూ కూదా తన (ప్రాధాన్యతని గుర్తించి ఇలా రాశారు,'కాంగ్రెస్‌లో నేను లేకుంటే ఏ రాష్ట్రంలోగాని కేంద్రంలోగాని స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి వుండేది కాదు. విచ్చిన్న క్రమం ప్రారంభమయ్య్యేది. నెహ్రూ తన ప్రచారంలో మత వాదాన్ని ప్రధానమైన అంశంగా చూపెట్టాడు. మౌలికమైన పోరాటం సెక్యులర్, మతవాద శక్తుల మధ్య జరుగుతుందన్నాడు. దేశ సమగ్రతకు మతవాద శక్తుల నుండి పెద్ద ప్రమాదం వుందన్నాడు. యధేచ్చగా పని చేయనిస్తే మతవాదం భారతదేశాన్ని ముక్కలు చేస్తుందని" హెచ్చరించాడు. 'దానిని గురించి ఎలాంటి సందేహానికి అవకాశం ఇన్వక్తుండ్తా స్పష్టంగా వుండాలి....తుదిశ్వాస విడిచేవరకు సెక్యులర్ రాజ్యం కొరకు నిలబడదాం” అని ఉద్దాటించాడు. చెదురు మదురు హింసాత్మక ఘటనలు మినహాయించి ఎన్నికలు స్వేచ్చగా నిషాక్షికంగా క్రమబద్ధంగా నిర్వహించబడ్డాయి. మన మొదటి ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుకుమార్సేన్న్సి ఎన్నికలపై నిపుణుడైన సలహాదారుగా గుర్తించి పలు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఆహ్వానించాయి. ఎన్నికల క్రమం 1950 మేలో పూర్తిఅయింది. రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా, డాక్టర్ యస్.రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1178 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నూతన రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల స్పందన అద్భుతంగా వుంది. ఓటు విలువను గుర్తించి ఎన్నిలలో చురుకుగా పాల్గొన్నారు. చాలా చోట్ల ఎన్నికల్ని పండుగగా బహిరంగ ఉత్సవంగా జరుపుకొన్నారు. కొత్తబట్టలు ధరించారు. స్రీలు నగా నట్రా పెట్టుకున్నారు. పేదలు, నిరక్షరాస్యులైనప్పటికి ఓటు హక్షుని వినియోగించుకోవడంలో గల సమర్దతని వ్యక్తం చేశారు. చెల్లని ఓట్లు 3,4 శాతం కంటే లేవు. పట్టణాలలోనే గాక (గ్రామీణ ప్రాంతాలలోను, 'షెద్యూల్టు కులాల, షెడ్యూల్డు తెగల ప్రాంతాలలోను ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. 40శాతం మహిళలు ఓటుహక్కు వినియెగించుకొన్నారు. ఆవిధంగా ప్రజలపై నాయకత్వం వుంచిన విశ్వాసం సమర్థనీయం. మొదటి సాధారణ ఎన్నికలలో 46.6 శాతం ఓటర్లు ఓటువాక్కు వినియోగించుకున్నారు. అప్పటి నుండి ఈ ఓటింగ్ శాతం యునైటెడ్ స్టేట్స్తో పోల్చదగినంతగా పెరుగుతూ వచ్చింది. లోక్‌సభ, రాష్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీవారిగా ఈ దిగువన ఇవ్వబడ్డాయి. లోక్ సభ పార్టీ గెలిచిన సీట్లు ఓట్ల శాతం రాష్ట్ర అసెంబ్లీలో గెలిచిన సీట్లు కాంగ్రెస్ 364 శ5్.00 2,248 కమ్యూనిస్టులు, మిత్రులు 23 త్ర కడ సోషలిస్టులు 12 10.6 125 కెయం.పి.పి రి 5.8 ఆాా జనసంఘ్ 3 31 ఆం హిందూ మహాసభ శ్తీ 0.95 85 ఆర్. ఆర్.పి. తె 203 గా ఇతరపార్షీలు 80 12.08 273 ల ఇండిపెండెంట్లు శక 15.8 325 మొత్తం శీప్9ి పఏ279 గమనిక : కె.యం.పి.పి - కిసాన్ మజ్డూర్ ప్రజాపార్టీ, ఆర్.ఆర్.పి - రామరాజ్య పరిషత్ 1962 ఎన్నికల వరకూ, ఆ తరువాత ఎన్నికల్ని ప్రభావితం చేసిన ఈ ఎన్నికల ముఖ్య లక్షణాలు : స్వతంత్రం తర్వాత భారతదేశం 179
-
కాంగ్రెస్ 75 శాతం లోక్‌సభ స్థానాల్ని 68.5 శాతం అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకొన్నది. కాని రెంటిలో కూడా పోలైన ఓట్లలో 50 శాతం కంటె తక్కువ ఓట్లు తెచ్చుకొన్నది. విజేతని నిర్ణయించడంలో అనుసరించిన బహుళత్వం లేక ఫస్ట్ పాస్ ది పోస్ట్ సూత్రం వలన అలా జరిగింది. ఈ ఎన్నికలు (గ్రామస్థాయి వరకు అల్లుకుపోయిన కాంగ్రేస్కి, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం జాతీయ సమైక్యత సిద్ధాంతానికి, అన్నిటికి మించి స్ఫూర్తినిచ్చిన నెహ్రు నాయకత్వానికి విజయం. కేంద్రంలోను, అన్ని రాష్ట్రాలలోను కాంగ్రెస్ ప్రభుత్వాల నేర్పరచింది. కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాలలో మద్రాసు, తిరువాన్సూర్ కొచ్చిన్, ఒరిస్సా, పెప్సూ (ఆజూఆఐఏ) లలో స్వయంగా మెజారిటీ సాధించలేక పోయింది. కాని అక్కడ కూడా ఇందిపెండెంట్టు, చిన్న స్థానిక పార్టీల సహాయంతో ప్రభుత్వాలనేర్పరచింది. ఆ తరువాత ఇండిపెండెంట్లను, చిన్నపార్టీలను తనలో కలుపుకొన్నది.
-
కమ్యూనిష్ట్రపార్టీలు మతతత్వపార్టీలు ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించలేక పోయాయి. సోషలిస్టు పార్టీ, క.యం.పి.పి.ల ఆశలు, ఎన్నికలలో సాధిస్తాయని చెప్పుకొన్న సీట్లు(రెండూ కలిసి లోక్‌సభలో 21 సీట్లు) రీత్యా చూస్తే ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా వున్నాయి. యు.పి.లో చాలా బలంగా వుందనుకున్న సోషలిస్టు పార్టీ అసెంబ్లీలో కేవలం 19 సీట్లు గెలిచింది. అలాగే మూడు మతవాద పార్టీలు- జనసంఘ్, హిందూమహాసభ, రామరాజ్య పరిషత్‌లు పోలైన ఓట్లలో 6 శాతం తెచ్చుకొని 10 లోక్‌సభ స్థానాలను గెలిచాయి.
-
కమ్యూనిష్టులు అంచనాలను మించి మంచిఫలితాలు సాధించారు. లోక్‌సభలో సి.షి.ఐ రెండవ పెద్ద (గ్రూపుగా ముందుకు వచ్చింది. ఆతరువాత 1977 వరకు జరిగిన చాలా ఎన్నికలలో ఈస్త్టానాన్ని నిలబెట్టుకొన్నది. సి.వి.ఐ వుదాను, తిరువాన్మూర్-కాచ్చిన్, 'హైదరాబాద్‌లలో గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించింది.
-
దేశంలోని చాలా ప్రాంతాలలో రాజులు, పెద్ద భూస్వాములు యింకా పలుకుబడి కలిగివున్నారని ఎన్నికలు స్పష్టం చేశాయి. వారి పార్టీ ఒరిస్సా అసెంబ్లీ సీట్లలో 22.1 శాతం సీట్లను అంటే 31 సీట్లను గెలుచుకుంది. అదే విధంగా మాజీ స్వదేశీ సంస్థానాలలోని 85 సీట్లలో 64 సీట్లు మూడు మతతత్వ పార్టీలు గెలిచాయి.
180 బీపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇండిపెండెంట్లు, చిన్నప్రాంతీయ, స్టానిక పార్టీలు పెద్ద సంఖ్యలో ఓట్లు తెచ్చుకొన్నాయి. లోక్ సభలో అసెంబ్లీలలో సీట్లూ తెచ్చుకొన్నాయి. కాని ఇండిపెండెంట్లు పాత్ర కేంద్రంలో, రాషాలలోనూ 1962 తరువాత తగ్గుతూ వచ్చింది.
1951-52 ఎన్నికలలో ప్రారంభమైన ఎన్నికల విధానం ఒక్కపార్టీ ఆధిపత్యానికి (ప్రారంభమని చాలామంది రాజకీయ పండితులు వాఖ్యానించారు. కాని వాస్తవంగా అది బహుళపార్టీ విధానం ఆరంభానికి (ప్రాతినిధ్యం వహించింది. కాంగ్రెస్ కేంద్రంగా వుంటూ నిలకడగా వుండే శక్తిగా పనిచేసింది. కాంగ్రెస్ సంఖ్య రీత్యా ఆధిపత్యం చెలాయించే స్థితిలో వున్నప్పటికి పార్లమెంటులో ప్రతిపక్షం కట్టుదిట్టంగా పనిచేసింది. క్వశ్చన్ అవర్‌లో ఉన్నతస్థాయి చర్చలు జరిగేవి. ప్రతిపక్షం కట్టుదిట్టంగా పనిచేయటానికి ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు ఉన్నతమైన శక్తి సామర్ధాలు, మరొకవైపు నెహ్రాకి ప్రతిపక్ష అభిప్రాయంపై గల గౌరవం - కారణాలు. "
మధ్య తరగతులకు, నిర్మాణబద్ధమైన కార్మిక వర్షానికి, ధనిక మధ్యతరగతి రైతాంగానికి ట్రేడ్ యూనియన్లు, కిసాన్ సభలు, సమ్మెలు, హర్తాళ్లు, బంద్‌లు, ప్రదర్శనలు లాంటి రాజకీయ భాగస్వామ్య రూపాలున్నప్పటికీ అత్యధిక (గ్రామీణ, పట్టణ పేద ప్రజానీకానికి ఎన్నికలు మాత్రమే ప్రధానమైన ప్రత్యక్ష రాజకీయ భాగస్వామ్య రూపంగా వుంది.
మొదటి సాధారణ ఎన్నికల కాలంలో కొన్ని మొలకల దశలో వున్న ప్రతికూల అంశాలు- భవిష్యత్తుకు సూచికలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్‌లో టికెట్ల కౌరకు ఘర్షణలు, అనుచరులకు గెలిచే సీట్లు ఇప్పించేందుకు నాయకుల మధ్య కలహాలు అప్పుడే వున్నాయి. చాలా మంది ఇండిపెండెంటు అభ్యర్థులు కాం(గెస్, యితర రాజకీయ పార్టీల చేత తిరస్మరింపబడిన వారే. దాదాపు అన్నీ పార్టీలలో ముఠాతత్వం కూదా మొదలయింది. పార్టీ లేక సిద్దాంతంతో సంబంధం లేకుండ తరచుగా (గ్రామాలు విభజింపబడ్డాయి. తాము ఆర్ధికంగా ఎవరి మీద ఆధారపడతారో అలాంటి పలుకుబడి గల వ్యక్తుల ఆదేశాల మేరకు కొందరు ఓటు వేసే విధంగా ఓటుబ్యాంకులు అవిర్భవించడం కూడా మొదలయింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు లాంటి స్థానిక ప్రముఖులు స్థానిక ఓటర్ల ప్రాధాన్యతలకు మార్గదర్శకత్వం వహించారు. ఈ ఎన్నికల నుండే కుల బంధుత్వ సంబంధాలు కూడా ఓటర్లను గణనీయంగా ప్రభావితం చేయటం మొదలయింది.
స్వతంత్రం తర్వాత భారతదేశం 18]
1952 తరువాత నెహ్రూ హయాంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు రెండు సాధారణ ఎన్నికలు 1957, 1962 లలో నిర్వహించబడ్డాయి. రెండింటిలోను ఓటింగ్ శాతం పెరిగింది. 1951-52 లలో ఓటింగు శాతం 46కాగా 1957 లో47 శాతానికి 1962లో దాదాపు 54శాతానికి పెరిగింది. రెండు ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకున్నది. రైటు,లెప్ట పార్టీలు తీవ్రమైన సవాలుగా ఎదగలేక పోయాయి. కాని కాంగ్రెస్ ఆధిపత్యంగల రాష్ట్రాలలో చొచ్చుకు పోగలిగాయి. కమ్యూనిస్టులు 1957లో కేరళలో ప్రభుత్వాన్ని వర్పరచగలిగారు. అది ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మొట్ట మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం.
(ప్రజాస్వామ్య విధానం, ప్రజాస్వామ్య సంస్థలు - జాతీయోద్యమం యొక్క వారసత్వం వేళ్ళూను కొనడానికి న్యాయమైన శాంతియుతమైన ఎన్నికల నిర్వహణ ఒక
సూచిక. అవి చాలా వరకు ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పని చేయటం ప్రారంభించాయి. ఎన్నికల నిర్వహణ ఫలితంగా కమ్యూనిస్టులు, మతతత్వవాదులతో సహా రాజ్యాంగ చట్రం అందరి అమోదాన్ని పొందింది. అప్పటి నుండి ఏ పార్టీలు భారతదేశాన్ని పరిపాలించేది ఎన్నికలు నిర్ణయిస్తాయని, రాజ్యాంగపరంగా అవకాశం కల్పించబడిన ప్రజాస్వామ్య నియమాల ద్వారా ప్రభుత్వంలో మార్పు వస్తుందని, ఎన్నికల ఫలితాలు ఓడిపోయిన పార్టీల చేత ఆమోదింపబడతాయని, క్రమబద్ధమైన వ్యవధులలో ఎన్నికలు జరుగుతాయని అందరి ఆమోదం పొందిన వాస్త్వవాలయ్యాయి. భారతదేశం, విదేశాలలో -ప్రత్యేకించి మాజీ వలసదేశాలలో నెహ్రూ అభిమానింపబడడానికి కారణాలలో ఒకటి క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించటం.
జాతీయోద్యమ సాంప్రదాయాలపై నిర్మిస్తూ భారత నాయకులు -అందరిని మించి నెహ్రా దేశంలో ప్రజాస్వామ్య పునాదుల్ని వాటి రాజకీయ పని విధానం ద్వారా మరింతగా పటిష్టపరిచారు. వారు పార్లమెంటరీ సంస్థల పట్ల ప్రజల ఆసక్తి క్రమంగా పెరిగేలా, ప్రజాస్వామ్య విధానం యొక్క వ్యవస్థాగతమైన అంశాలకు తగు ప్రాధాన్యత ఇచ్చారు. వారు కేవలం ప్రజాస్వామ్య స్ఫూర్తినే గాక ప్రజాస్వామ్య సంస్థల, వాటి పని విధానాల రూపాలను కూడా అనుసరించారు. ప్రత్యేకించి నెహ్రూ బాగా చెలాయించగలిగిన స్థితిలో వున్నప్పటికీ రాజకీయాధికారం వికేంద్రీకరించబడింది. విస్తరించబడింది. 182 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినప్పటికీ పత్రికా స్వేచ్చ పరిరక్షించబడింది. పౌరహక్కులు దృఢంగా పాదుకొల్పబడ్డాయి. న్యాయస్థానాలు ప్రజాదరణ పొందిన చట్టాన్ని
- వ్యవసాయ సంస్కరణ చట్టాన్ని త్రోసిపుచ్చినప్పటికీ వాటి యొక్క స్వేచ్చ పెంచి పోషించబడింది. తన పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ నెహ్రూ పార్లమెంటుని గౌరవించాడు. పార్లమెంటుస్టాయిని గౌరవించి, అధికారాన్ని నిలబెట్టడానికి నిరంతరం ప్రయత్నించాడు. (ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు పార్లమెంటుని పెద్ద వేదికగా చేయ యత్నించాడు. “క్వశ్చన్ అవర్ సమయంలో పార్లమెంటులో ఉండడం, పార్లమెంటరీ చర్చలో పాల్గొనడం పద్ధతిగా పాటించాడు. (వ్రతివక్షం కూడా పార్లమెంటుని, పార్లమెంటరీ విధానాలను గౌరవించడంలోనూ, పార్లమెంటరీ చర్చల ఉన్నత స్థాయిని నిలబెట్టడంలోనూ తన పాత్ర తాను నిర్వహించింది. అంతేగాక అంచనాల కమిటీ (ఉఆగ౧2163 6౦0౧౫౫1466) లాంటి పార్లమెంటరీ కమిటీలు కూడా ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని విమర్శించేవిగా, సంరక్షించేవిగా ముఖ్యమైన పాత్ర నిర్వహించాయి. నెహ్రూ నాయకత్వంలో మంత్రివర్గం ఆరోగ్యకరమైన పద్ధతిలో రూపొందింది. కట్టుదిట్టంగా పనిచేసింది. నెహ్రూ మంత్రివర్గాన్ని సమిష్టి విధాన నిర్ణయాలు చేసే ప్రతినిధిగా చేయ యత్నించాడు. నెహ్రూ తన మంత్రి వర్గ సహచరులను మర్యాదగా, గౌరవంగా ఆదరించాడు. 1950 నుండి 1956 వరకు భారతదేశ ఆర్ధిక మంత్రిగా పనిచేసిన సి.డి. దేశ్‌ముఖ్ తన స్వీయ చరిత్రలో ఇలా రాసుకొన్నాడు. “మంత్రివర్గం నాయకుడుగా నెహ్రూ నిర్ణయాన్ని తన సహచరులపై బలవంతంగా రుద్దని పెద్దమనిషి, ప్రజాస్వామ్యవాది. నా కాలంలో నాకు జ్ఞాపకమున్నంత వరకు నిర్ణయాలు ఓటింగుతో కాక ఏకాభిప్రాయంతో తీసుకొనబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధిక్యం వున్నప్పటికి ఈ కాలంలో ప్రతిపక్ష పాత్ర బలోపేతం చేయబడింది. నెహ్రూ ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా గౌరవించాడు. వారి విమర్శలకు బాధ్యత వహించాడు. ఒకసారి నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని ఇలా నిర్వచించాడు. “అది ఒక ఆలోచనా విధానం, కార్యాచరణ విధానం, నీ పొరుగువానితో నీ 'ప్రత్యర్థితో శత్రువుతో నీ ప్రవర్తనా విధానం”, ప్రతిపక్షపార్జీలు సంఖ్యరీత్యా తక్కువైనప్పటికి కాంగ్రెస్ ఒక మూసలో ఇమిడే పార్టీ కాకపోవటాన్నిి దానిని చాలా సైద్ధాంతిక రాజకీయ స్వతంత్రం తర్వాత భారతదేశం 188
ధోరణులు ఆవరించటాన్ని అవకాశంగా తీసుకోగలిగాయి. కాంగ్రెస్‌లోని విభిన్న సైద్దాంతిక ధోరణుల్ని ప్రభావితం చేయడం ద్వారా అవి ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేయగలిగాయి. నెహ్రూ కూడా కాం(గ్రైస్ పార్టీలోపల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చర్చని, నూతన సామాజిక శక్తుల్ని ధోరణుల్ని గౌరవించారు. ప్రోత్సహించారు. నెహ్రూ కాలంలో రాజ్యాంగంలోని ఫెడరలిజం (సమాఖ్యతత్వం) రాష్ర్రాలకు నిజమైన అధికారాల్ని సంక్రమింపజేస్తూ దృఢంగా పాదుకాల్పబడింది. నెహ్రూ తన ఆలోచనల్ని తెలియజేస్తూ, సలహాలిస్తూనే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవించారు. రాష్ట్రాలపై నిర్ణయాలను రుద్దలేదు. లేక వారి విధానాల్లో జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు - వాటి పార్టీ, ప్రభుత్వ నాయకుల్ని ఎంపిక చేసుకోవడాన్ని అనుమతించాడు. రాష్ట్రాల అంతర్గత సమస్యల్ని అర్ధంచేసుకునేందుకు రాష్ట్ర నాయకులపై వాటి ప్రభుత్వాలపై విశ్వాసం ఉంచారు. నెహ్రూ తాను భావించిన విధంగా భూసంస్కరణలు అమలు పరచమని రాష్ష్రాల్ని ఒత్తిడి చేయకపోవడానికి కారణం భూసంస్కరణలు రాష్ర్రాధీన అంశం కావడమే. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు అధికారాలపై నిష్కర్షగా జోక్యం చేసుకోలేదు. నెహ్రూ సలహాలిస్తారు. మార్గం చూపిస్తారు. అర్ధిస్తారు. కానీ రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమించరు. నెహ్రూ రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తారు. వ్యవసాయ, విద్య, వైద్య ఇతర సాంఘిక సంక్షేమ పథకాలు సరిగా అమలు జరగకపోవదానికి కారణం, ఇవి రాష్ర్రాధీన అంశాలు కాబట్టి వీటి అమలుకు కేంద్రం రాష్ట్రాలపై ఆధారపడాలి. నెహ్రూ కేంద్రప్రభుత్వం యొక్క అధికారం స్థాయిలను బలహీనపరచదాన్ని అనుమతించలేదు. జాతి నిర్మాణం కొరకు, దేశ సమైక్యత, స్వతంత్రాన్ని కాపాడేందుకు, విచ్చిన్నకరశక్తుల్ని అదుపు చేసేందుకు అవసరమైన బలమైన కేంద్రానికి, అధికార కేంద్రీకరణకి మధ్యగల స్పష్టమైన తేడాని గుర్తించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం రెండు చోట్ల ఒకేపార్టీ అధికారంలో ఉండడం. అంతేకాక కేంద్ర మంత్రివర్గ్ణంలోనూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ అత్యున్నత స్థాయి వ్యక్తిత్వం గలవారు పదవులు నిర్వహించడం వల్ల కూడా కేంద్రం పాత్ర బలోపేతమయింది. సాయుధ బలగాలపై పౌర ప్రభుత్వం యొక్క ఆధిక్యతా సాంప్రదాయం ఈ కాలంలో దృఢంగా స్థాపించబడింది. భారతదేశ సాయుధ బలగాలు సాంప్రదాయకంగా 184 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజకీయేతరమైనవి. పౌర అధికారాన్ని నాయకత్వాన్ని ఆమోదించేవి. కానీ అవి అలాగే కొనసాగుతాయని హామీ ఏమీలేదు. నెహ్రా ప్రత్యేకించి కొన్ని ప్రత్యేక పరిస్థితులల్లో సాయుధ దళాలు రాజకీయాల్లో ప్రభుత్వంలో జోక్యం చేసుకునే అవకాశాన్ని గురించి ఆందోళన చెందారు. 19వ శతాబ్దిపు ఫ్రాన్స్, జర్శనీల్లో ఇటీవలి కాలంలో చాలా సాయుధ దళాలు రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో జోక్యం చేసుకున్నాయి. మూడవ ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో అలాంటి అవకాశాన్ని నివారించేందుకు నెహ్రూ చాలా చర్యలు చేపట్టారు. మిలిటరీ బలగాలను చాలా పరిమితంగా ఉంచారు. 1954లో పాకిస్థాన్‌కి అమెరికా పెద్దఎత్తున మిలిటరీ సహాయం అందజేయడం ప్రారంభించినప్పటికీ నెహ్రూ మిలిటరీ బలాన్ని విస్తరించలేదు. రక్షణ వ్యయాన్ని కూడా జాతీయాదాయంలో రెండు శాతం కంటే తక్కువకే పరిమితం చేశారు. యుద్ధజాతుల నుండి సిపాయిలను నియమించుకునే బ్రిటీష్ వలస పాలకుల విధానానికి స్వస్తిచెప్పి సాయుధ బలగాల్లో ప్రతి ప్రాంతానికి సమాజంలోని ప్రతి సెక్షన్‌కి ప్రాతినిధ్యం కల్పించబడింది. ఆ విధంగా తొలి సంవత్సరాల్లో మిలిటరిజం ప్రమాదం నుండి భారతదేశాన్ని రక్షించడం జరిగింది. సైన్యాన్ని సైనిక వ్యయాన్ని పరిమితుల్లో ఉంచడం కూడా రెండు కారణాల రీత్యా జరిగింది. 1. పరిమితంగా ఉన్న వనరుల్ని ఆర్థికాభివృద్ధి నుండి మరల్చడాన్ని నివారించడానికి, 2. దేశీయంగా రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేనందున విదేశీ వస్తువులపైన ఆధారపడడాన్ని భారతదేశ అంతరంగిక, విదేశీ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకునే అవకాశాన్ని నివారించడానికి.
నెహ్రూ కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మిగిల్చిన పెద్ద మచ్చ : కేరళలో చట్టబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం 1959లో రద్దు చేయబడడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడడం. పరిపాలనా నిర్మాణం
స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశం బ్రిటిషువారి ప్రయోజనాల పరిరక్షణకు రూపొందించిన వలసవాద పాలకుల నుండి వారసత్వంగా సంక్రమించిన పరిపాలనా చట్రాన్ని యంత్రాంగాన్ని కొనసాగించాలా? లేదా? - నిర్ణయించవలసి వచ్చింది.
ఈ నిర్మాణంలో ప్రధానమైనది ఇండియన్ సివిల్ సర్వీస్ (103). ఈ నిర్మాణాన్ని క్షాళనం చేయాలంటే ఐ.సి.ఎస్ తో ప్రారంభించాలి. మొదట ఈ సమస్యపై నెహ్రూ, పటేల్ వైఖరుల్లో తేడాలున్నాయి. ఐ.సి.ఎస్, ఉన్నతాధికార వర్ణం వలసవాద వారసత్వమే స్వతంత్రం తర్వాత భారతదేశం 185
గాక సంప్రదాయాల్ని పరిరక్షించేవి. నెహ్రూ వీటిని తీవ్రంగా విమర్శించేవాడు. 1946లో ఆయన పరిపాలనా యంత్రాంగాన్ని 'రాజ్యనౌకగా వర్ణించారు. ఇది 'పాతది, క్షీణదశలో ఉంది, నెమ్మదిగా కదులుతుంది. త్వరగా మారుతున్న ఈ కాలానికి సరిపడనినదీ, కాబట్టి నెహ్రూ దానిని రద్దు చేసి దాని స్థానంలో మరొక దాన్ని ప్రవేశపెట్టాలన్నారు. మరొక వైపు పటేల్ అంతర్గత భద్రత ప్రమాదంలో పడిన ఆ క్షిష్ట పరిస్థితుల్లో పాలనా యంత్రాంగాన్ని మార్చు చేయకుండా అలాగే కొనసాగించడం అవసరమని భావించారు. పరిపాలనలో ఒక శూన్యత ఏర్పరచడానికి పటేల్ అనుకూలంగా లేడు. 1949లో రాజ్యాంగ పరిషత్‌లో పటేల్ అఖిల భారత సర్వీసులను సమర్థిస్తూ ఇలా చెప్పాడు. “ఈ కష్టకాలంలో వారితో పనిచేశాను. వారిని తొలగించండి. దేశమంతటా ఒక అస్తవ్యస్తమైన పరిస్టితి కనిపిస్తుంది”. పటేల్ ఇంకా ఇలా చెప్పాడు. “గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో అఖిల భారత సర్వీసులకు చెందిన అత్యధికులు దేశభక్తితో, విధేయతతో మెలగి ఉందకపోతే దేశం పతనమై ఉండేది.' నెహ్రూ కాస్త అయిష్టంగానైనప్పటికీ పటేల్ వైఖరినంగీకరించారు. పరిపాలనకు అంతరాయం రాకుండా చూడాలంటే అఖిల భారత సేవల్ని విశ్వసించడం తప్ప (ప్రత్యామ్నాయం లేదు. కాలక్రమేణా నెహ్రూ కూడా వారి పాలనా సామర్దాన్ని అభినందిస్తూ ఈ సేవలపైనే ఆధారపడడం ప్రారంభించారు. రాజ్యం - తిరుగుబాటు" లో లెనిన్ చెప్పిన అంశాలను అనుసరిస్తూ అప్పటికి ఉన్న రాజ్య పరిపాలనా యంత్రాంగాన్ని ధ్వంసం చేసి ఉండవలసిందని, ప్రారంభంలో కొత్త రాజ్యం అలా చేయడం చాలా సులభమని చాలా మంది వాదించారు. కానీ భారతదేశం, ఇతర దేశాల చారిత్రకానుభవాన్ని బట్టి పరిశీలిస్తే దేశం గందరగోళంగా ఉన్న అలాంటి పరిస్థితుల్లో శిక్ష ప్రాంద్రిన అనుభవం గల సమర్ధులైన సివిలు సర్వీసు ఉద్యోగులుండడం భారతదేశానికి ఎంత్రో ప్రయోజనకారి. విభజనాంతర సంవత్సరాల్లో వారు దేశానికి అమూల్యమైన సేవలందించారు. కాని అప్పటి పరిస్థితుల్లో అప్పటికి ఉన్న ఉన్నతాధికార వర్షాన్ని పరిపాలనా చట్రాన్ని అలాగే ఉంచడం అనివార్యమే అయినప్పటికి దానిని పునర్చిర్మించి స్వభావాన్ని మార్చడంలోని వైఫల్యం సృష్టంగా నష్టదాయకమే. వలస పాలనాకాలంలో ప్రధానంగా శాంతి భద్రల పరిరక్షణకు, భూమిశిస్తు వసూలుకు పరిపాలనా యంత్రాంగం నిర్మించబడింది. క్షే8ి6 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాని ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాలకు, నూతన ఆర్ధిక సాంఘిక సంక్షేమ విధానాలను అమలు జరిపేందుకు ఆ యంత్రాంగాన్ని నెమ్మదిగా అయినప్పటికీ క్షాళన చేసి ఉండవలసింది. ప్రజల సమస్యలను అర్ధం చేసుకునేందుకు కొత్త పథకాలను అమలు పరిచేందుకు అప్పటికి ఉన్న ఉన్నతాధికారం చాలదని నెహ్రూ గుర్తించారు. 1951లో ఆయన ఇలా ఆరోపించారు. “మనం అధికంగా అధికార సంస్థలపై నమ్మకముంచుతున్నాం. అది సాధారణంగా మంచిదే. కానీ వాటి దృక్సధం, ఆచరణ ప్రజలను ఆకట్టుకునే విధంగా లేవు”. పరిస్థితిని రెండు విధాలుగా సరిచేయవచ్చని ఆయన నమ్మారు. 'ఒకటి : యంత్రాంగం మొత్తాన్ని చైతన్య పరచడం ద్వారా. రెండోది : అవసరమైన చోట కొత్త తరహా వ్యక్తిని నియమించడం ద్వారా”. కానీ ఆచరణలో ఏదీ జరగలేదు. కొత్త ఐ.ఎ.ఎస్ దాదాపు పాత ఐ.సి.ఎస్ మూసలోనే సృష్టించబడింది. ఉన్నతాధివర్లం పైనుండి కింది దాకా ఈ నమూనాను అనుసరించింది. ఉదాహరణకు ఆదర్శాలతో సామాజిక నిబద్ధతతో కమ్యూనిటీ దెవలవ్వెంట్ (్రాజెక్సలలో చేరిన కొందరు తాము ఉన్నతాధివర్గం చేత నియంత్రించబడుతున్నామని, హీనంగా చూడబడుతున్నామని గమనించి నిరాశా నిస్పృహలకు గురయ్యారు. పరిపాలన సంవత్సరాలు గడిచిన కొలది మెరుగు పడలేదు. అసమర్ధత పెంచుకున్నది. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. పరిపాలన క్షీణించింది. ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఉన్నత్రాధికార వర్గం యొక్క - ప్రత్యేకించి పోలీసుల ధోరణి ప్రజలకు సహాయపడేదిగా లేదు. అన్నింటిని మించి లంచగొండితనం ప్రబలింది. నెహ్రూ శకంలో రాజకీయ పరమైన పరిపాలనా పరమైన లంచగొండితనం పెరగడం ప్రారంభమైంది. 1950లలో లంచగొండితనం అదృశ్యహస్తాలు అంతగా చాచలేదు. స్వతంత్ర పోరాటంతో గాంధేయ నైతికకతో సంబంధాలు గల రాజకీయ నాయకత్వం శ్రేణులు, మంచీ మర్యాద పాటించే అధికారులు - ప్రత్యేకించి మధ్య, పై స్థాయిలలో, అత్యున్నత స్థాయి వ్యక్తిత్వం గల న్యాయమూర్తుల రూపంలో ప్రతిబంధాలుగా పనిచేశారు. కాబట్టి లంచగొండితనాన్ని కాంత సులభంగానే అణిచివేయడానికి అప్పటికి ఇంకా అవకాశం ఉంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 187
ప్రజా పరిపాలనకు సంబంధించిన సమస్యలపై నెహూకు ఇతర నాయకులకు మంచి అవగాహన ఉంది. 1948 మే లో 'మన అసమర్ధత, అందుబాటులో లేకపోవడం, తాత్సారం, లంచగొండితనం' పై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని నెహూ ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చారు. ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు : “వీటిలో చాలా ఫిర్యాదులు సమర్థనీయాలే. అలాగే ఆయన 1968 మే లో ముఖ్యమంత్రులకు రాసిన చివరి లేఖలో “లంచగొండితనం, అసమర్ధతకి వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేసేందుకు మన ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది" అని నొక్కి చెప్పారు. ఆయన ఇంకా ఇలా రాశారు : లంచగొండితనాన్ని గురించి చాలా వింటున్నాం. కొంత అతిశయించి చెప్పడం ఉండవచ్చు. కాని లంచగొండితనం వుందనీ మనశక్తి యుక్తుల్ని ప్రయోగించి ఎదుర్మొనాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. మన మనసుల్లో ఉన్న బృహత్ పథకాల దారిలో అడుగడుగున ..... ఆటంకాలతో మన ప్రభుత్వ యంత్రాంగం ఇంకా నత్త నడకన సాగుతుంది. మన ప్రజా జీవితాల్ని క్షాళన చేసుకోవాలని నేను బలంగా నమ్ముతున్నాను. కనుక ఈ అంశాలు మీ దృష్టికి తెస్తున్నాను. తన మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నెహ్రూ నిర్ధిష్టమైన చర్చలు చేపట్టాడు. కాని లంచ గొండితనానికి వ్యతిరేకంగా ప్రచారం సాగించలేదు. అందుకు కారణం లంచగొండితనం పై చేసే ప్రచారం అనుమానం, ఆరోపణల వాతావరణాన్ని సృష్టిస్తుంది, ప్రజలు ఆ వాతావరణానికి లోనై అధికారుల్ని నిలదీస్తారు. ఫలితంగా అలాంటి (ప్రచారం అధికారులు, మంత్రులు సకాలంలో నిర్ణయాలు తీసుకుని బాధ్యత వహించడాన్ని అద్దుకుంటుంది. శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక విద్య - రంగాల్లో నెహ్రూ శకం పెద్ద విజయం సాధించింది. భారతదేశ సమస్యల పరిష్కారానికి శాప్ర సాంకేతిక రంగాలు చాలా కీలకమైనవని నెహ్రా విశ్వసించారు. 1938 జనవరిలో నెహ్రూ భారత సైన్సు కాంగ్రెస్‌కి పంపించిన సందేశంలో ఇలా పేఠ్మాన్నారు : 'ఆకలి, పేదరికం, సమస్యలు, పారిశుద్యలేమి, నిరక్షరాశ్యతా సమస్యలు, కాలం చెల్లిన ఆచార సంప్రదాయాల సమస్యలు, విస్తారమైన వనరులు వృధా అవుతున్న సమస్యలు, ఆకలితో అలమటిస్తున్న సంపన్న దేశం యొక్క 188 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సమస్యలను సైన్సు మాత్రమే పరిష్మరించగలదు'. దేశం యొక్క ఆర్థిక, సాంఘీక, సాంస్కృతిక పురోభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాలు నిర్వహించే పాత్రని గుర్తిస్తూ 1958 మార్చిలో లోక్సభచే ఆమోదించబడిన శాన్రీయ విధానం తీర్మానంలో ఈ దృక్పథమే పునరుద్దాటించబడింది. 1947 తర్వాత భారతదేశ రక్షణలో శాస్త్రీయ పరిశోధన కీలకమైన పాత్ర నెహూ గమనంలో ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల స్వానలంబనను పెంచే ప్రయత్నంలో భాగంగా భారతదేశ మొదటి జాతీయ ప్రయోగశాల, జాతీయ భౌతిక శాస్ర ప్రయోగశాలకు (౧౧6 1240021 [051021 12000260౧0 1947 జనవరి 4న శంకుస్థాపన చేయబడింది. తర్వాత నెహ్రూ పాలనా కాలంలో వివిధ రంగాల్లో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు 17 జాతీయ ప్రయోగశాలలు నెలకాల్ప్బబడ్దాయి. విజ్ఞాన శాస్తం శాప్రీయ పరిశోధన ్రాధాన్యతపై లోతైన అవగాహన గల నెహ్రూ శాస్త్ర మరియు పరిశోధన మందలి (00౪41011 0₹50162- 0 206 561000) కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మందలి జాతీయ ప్రయోగశాలలకు (22410%21110002[000 ఇతర శాస్త్ర సంస్థలకు (301ఆ6|ం 10314605) మార్గదర్శకంగా ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చింది. దేశానికి అవసరమైన సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సత్వర చర్చలు చేపట్టబడ్డాయి. ఐదు సాంకేతిక సంస్థల్లో మొదటిది మసూచసెట్స్. సాంకేతిక సంస్థ నమూనాలో ఖర్గపూర్లో 1952లో స్థాపించబడింది. ఆ తర్వాత నాలుగు సంస్థలు మద్రాసు, బొంబాయి, కాన్చూర్, ఢిల్లీలో స్థాపించబడ్డాయి. శాస్త అభివృద్ధి కొరకు చేసిన కృషి అది సాధించిన విజయం - శాస్త్రీయ పరిశోధనకు, శాస్త్ర ఆధారిత కార్యక్రమాలకై వెచ్చించిన మొత్తాలు ఒక మేరకు వ్యక్తం చేస్తాయి. 1948 - 49లో వీటి కొరకు వెచ్చించిన మొత్తం 1.10 కోట్ల రూపాయలు కాగా, 1965 - 66 నాటికి 85.06 కోట్లకు పెరిగింది. శాస్ర సాంకేతిక సిబ్బంది 1950 లో లక్షా 88 వేలు ఉండగా 1965 నాటికి 7,31,500 కి పెరిగింది. ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీ దశకి నమోదు చేసుకున్న వారి సంఖ్య 1950 లో 18 వేలు ఉండగా 1965 నాటికి 78 వేలకి పెరిగింది. అదే విధంగా అదే కాలంలో వ్యవసాయం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2,600 నుండి 14,900 కి పెరిగింది. సంవత్సరాలు గడచిన కొలదీ శాప్రీయ సంస్థల నిర్మాణం, యాజమాన్య చట్రం ఉన్నకాధికార ఉద్యోగిస్వాన్యూన్ని అలవర్చుకొని అనవసర జాప్యానికి నిలయాలయ్యాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 189
సిబ్బందిలో ముఠాతత్వాన్ని కుట్రల్ని కుతంత్రాల్ని, నిరాశా నిస్పృహల్ని పెంచాయి. ఫలితంగా శాప్రీయ పరిశోధన దెబ్బతిన్నది.
భారతదేశం అణుశక్తి ప్రాధాన్యతని గుర్తించిన మొదటి దేశాలలో ఒకటి. అణుశక్తి దేశాల రక్షణ సామర్థ్యాన్ని ప్రభావితం చేయటంతో పాటు సామాజిక ఆర్ధిక రాజకీయ రంగాలలో ప్రపంచ విప్లవాన్ని తీసుకు వస్తుందని నెహ్రూ విశ్వసించారు.
1948 ఆగప్టులో భారత ప్రభుత్వం శాప్రీయ పరిశీలనా విభాగంలో ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త హామి.జె.బాబా ఛైర్మన్‌గా అణుశక్తి కమిషన్ (40006 8068) 00౫13510) ని నియమించింది. శాస్త్రీయ పరిశోధనా విభాగం నెహ్రూ పర్యవేక్షణలో వుంది. 1954లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో హోమిబాబా కార్యదర్శిగా ప్రత్యేకంగా అణుశక్తి విభాగాన్ని (660219610 సృష్టించింది. దేశంలోని (ఆసియాలోనే) మొదటి అణుశక్తి రియాక్టర్ ట్రాంబే (బొంబాయి) లో నెలకొల్పబడింది. రానున్న కొద్ది సంవత్సరాలలో విద్యుచ్చక్తి ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ప్లాంట్స్‌ని స్థాపించే పథకాలు సిద్ధం చేసింది. భారతదేశం అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కొరకు వినియోగించాలనే నిబద్ధత కలిగివుంది. కావాలనుకుంటే అణుబాంబును, అణ్వాయుధాలను తయారు చేసి వుండేది. భారతదేశం అంతరిక్ష పరిశోధనకూడా చేపట్టింది. 1962లో అంతరిక్ష పరిశోధన కొరకు భారత జాతీయ కమిటీ (00059924 నియమించింది. తుంబా వద్ద రాకెట్ ప్రయోగశాలను నిర్మించింది. రక్షణమంత్రిగా కృష్ణమీనన్ రక్షణ పరిశోధన అభివృద్ధికి ప్రారంభ చర్యలు చేపట్టారు. రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారతదేశ సామర్దాన్ని పెంచేందుకు, (క్రమంగా రక్షణ అవసరాలలో స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు చేపట్టబడ్డాయి. భారతదేశం నాజాలలో దశాంశ పద్ధతికి, తూకాలు కొలతలతో మెట్రిక్ విధానానికి మారింది. సామాజిక మార్చు
రిపబ్లిక్ నిర్మాతలు జాతీయ సమగ్రత, రాజకీయ స్థిరత్వాలకే పరిమితం కాలేదు. భారతీయ సమాజం సామాజిక మార్పుల దిశగా ముందుకు పోవాలి. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలపై గల ఆర్టికల్ 36 ఇలా పేర్కొన్నది. 'రాజ్యం న్యాయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థని సాధించి రక్షణ కల్చిండం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచటానికి (ప్రయత్నిస్తుంది. 1955లో ఈనూతన సామాజిక వ్యవస్థ భావనని 'సోషలిస్ట్ తరహాసమాజం'- పదజాలం చుట్టు ముట్టి ఆవరించింది. సోషలిస్టు తరహా సమాజం 190 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పదజాలం అవడి కాంగ్రెస్ సదస్సు ఆమోదం పొందింది. తరువాత రెందవ, మూడవ పంచవర్ష ప్రణాళికల లక్ష్యంగా చేర్చబడింది. ఫలితంగా నెహ్రూ కాలంలో కొందరిచే సంక్షేమరాజ్య 'ప్రారంభంగా వర్ణించబడిన ముఖ్యమైన సంఘ సంస్మరణ చర్యలు చేపట్టబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి: (ప్రణాళికాబద్ధమైన ఆర్ధికాభివృద్ధి, పబ్లిక్ సెక్టారు విస్తరణ, వీటిని ప్రత్యేక అధ్యాయాలుగా ఈ గగ్రంథంలోనే పరిశీలిద్దాం. అంతేగాక సమిష్టి బేరసారాల గుర్తింపు, సంఘాలు ఏర్పరచుకోవడం, సమ్మె చేసేహక్కు ఉద్యోగరక్షణ, ఆరోగ్యప్రమాద ఇన్సూరెన్స్ అవకాశంతో సహా శ్రామికచట్టం చేయబడింది. ఇన్‌కంటాక్స్, ఎక్ర్రైజ్టాక్స్లను భారీగాపెంచి సంపద వీలైనంతవరకు సమానంగా పంపిణీ చేయబడాలని 'ప్రతిపాదనలూ వున్నాయి. విద్య, ఆరోగ్యం ఇతర సామాజిక సేవల విస్తరణ ప్రతిపాదనలు వున్నాయి. ఇప్పటి వరకు వెనుకబడిన, అణచివేయబడిన సెక్షన్త సామాజిక విముక్తికి దారితీసే విధంగా సామాజిక వ్యవస్థని మార్పుచేయాలని నెహ్రూ, ఇతర నాయకులు పట్టుదలగా వున్నారు. 1956లో నెహ్రూచెప్పిన విధంగా: “మనం రాజకీయ విప్లవం కొరకు పోరాడి సాధించడమే కాక అర్ధిక విప్లవం కొరకు తీవ్రంగా కృషి చేయడమేగాక మనం సాంఘిక విప్లవం కొరకు అంతే పట్టుదలగా వున్నాం, మనం ఈ మూడు పంథాలలో ముందుకు పోవడం వలననూ, ఈ మూడింటిని ఒకే దానిగా విలీనం చేయడం ద్వారాను భారత ప్రజలు అభివృద్ది చెందుతారు.” రాజ్యాంగం అంటరానితనాన్ని రద్దుచేసింది. అంటరాని తనాన్ని పాటించడం శిక్షార్హమైన నేరమని ప్రభుత్వం 1955లో అస్పృశ్యతా వృతిరేకచట్టం చేసింది. విద్యాసంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, ఇతర బలహీనవర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు జరప ప్రయత్నించింది. వారి సామాజిక స్థాయిని పెంచేందుకు, ఉపకార వేతనాలు, వాస్టలువసతి, గ్రాంట్లు అప్పులు ఇంటివసతి, ఆరోగ్యపరిరక్షణ, న్యాయసలహా సేవలు లాంటి ప్రత్యేక వసతులు అవసరమైన చర్యలు చేపట్టబడ్డాయి. ఇలాంటి వన్నీ సరిగా అమలు జరిపించేందుకు షెడ్యూల్డు కులాల షెడ్యూల్డు తెగల కమిషనర్ని నియమించింది. ఇలాంటి చర్యలు తీసుకొన్నప్పటికి షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల వెనుకబాటుతనం కొనసాగుతుంది. కులపరమైన అణచివేత ప్రత్యేకించి భూమి లేని వ్యవసాయ కూలీలుగా షెడ్యూల్డు కులాలు, పెడ్యూల్టు తెగలే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో వుంది. కుల వ్యవస్థను నిర్మూలించడానికి గాని లేక కులపరమైన అసమానతని, కులపరమైన అణచివేతని తొలగించడానికి ఎలాంటి (ప్రయత్నం స్వతంత్రం తర్వాత భారతదేశం 191
జరగలేదు. ఫలితంగా కులతత్వం పై కులాల నుండి వెనుకబడిన కులాలకు గ్రామీణ (ప్రాంతాలనుండి పట్టణ ప్రాంతాలకు వ్యాపించడం మొదలయింది.
జాతీయోద్యమంలో సంవత్సరాల తరబడి పాల్గొన్న మహిళా (గ్రూపులు, మహిళా సంఘాలు కుటుంబంలో మహిళాహక్కులకు సంబంధించిన చట్టాలు మార్చాలని డిమాండు చేస్తున్నాయి. నెహ్రూ వారికి గట్టి మద్దతుదారు. స్వతంత్రానికి ముందు ఈ సమస్యపై తనవైఖరిని స్పష్టంచేస్తూ (ఫ్రెంచి తత్వవేత్త ఛార్లెస్ ఫోరియర్ని యిలా ఉటంకించారు. “ఒకదేశంలోని మహిళల సామాజిక రాజకీయ స్థాయిని బట్టి ఆదేశం యొక్క నాగరికతా స్థాయిని అంచనా వేయవచ్చు.”
ఈ దశలో ముందడుగుగా 1951లో పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు 'ప్రతిపాదింపబడింది. ఈ బిల్లుకు సమాజంలోని కులీనవర్ణాల నుండి ప్రత్యేకించి జనసంఘ్, ఇంకా ఇతర హిందూమత సంస్థల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండిమహిళాపార్లమెంటు సభ్యుల నుండి మహిళా సంఘాల కార్యకర్తల నుండి చురుకైన మద్దతు లభించినప్పటికి ఇంకా ఎక్కువ మద్దతుని సమీకరించేందుకు నెహ్రూ బిల్లుని చట్టంగా చేయించటాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు, నెహ్రూ బిల్లు విషయంలో కృతనిశ్చయంలో వున్నారు. 1951-52 ఎన్నికలలో దీనిని అంశం చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం నాలుగు వేర్వేరు చట్టాల రూపంలో బిల్లును ఆమోదించింది. ఒకడు ఒకే భార్యని కలిగివుండడం, ప్రీ పురుషులు యిరువురికీ విడాకులు పొందేహక్కు వివాహ వయస్సు పెంపుదల, మహిళలకు భరణం పొందే హక్కు
- కుటుంబ ఆస్తిలో వారసత్వపు హక్కు ఈ బిల్లు పూర్తి అమలుకు దశాబ్దాల కాలం పట్టినప్పటికి ఈ బిల్లు మహిళా విముక్తి కొరకు వేసిన విప్లవాత్మకమైన ముందడుగు. అన్ని మతాలవారికి వర్తించే విధంగా సివిల్ కోడ్ ఆమోదించబడలేదు. అందుకు ఒకే భార్యని కలిగివుండడం, వారసత్వానికి సంబంధించి 'ముస్తిం పర్సనల్ లాలో మార్పులు చేయవలసివుంటుంది. ముస్లిం సాంప్రదాయవాదుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయింది. ఆధునిక కాలంలో సంఘ సంస్కరణ క్రమంలో ముస్లింలు హిందువుల కంటె చాలా వెనకబడ్దారు. ఫలితంగా మధ్యతరగతి ముస్లిం మహిళలో కూడా సామాజిక మార్పు చాలా నెమ్మదిగా వచ్చింది” ముస్లింలు అప్పటికి మరొక విధంగా ఒత్తిడికి గురయి వుండడం వలన నెహ్రూ వారిని కలత పరచడానికి సుముఖంగా లేరు. ముస్లింలు కూడా 192 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సిద్ధపడినప్పుడు 'ముప్లిం పర్సనల్ లా” లో మార్పులు చేసి సివిల్కోద్ ఆమోదింపజేయాలని నెహ్రూ ఆకాంక్షించాడు. విద్య
సామాజిక ఆర్థికాభివృద్ధికి, సమాన అవకాశాలకు (ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి సాధనంగా మంచి విస్తృతమైన విద్య యొక్క అవసరాన్ని జాతీయ నాయకులు గుర్తించారు. 1951లో మొత్తం జనాభాలో అక్షరాస్యత శాతం 16.6, గ్రామీణ కుటుంబాల అక్షరాస్యతా శాతం చాలా తక్కువ. అది కేవలం 6శాతం మాత్రమే. ఈపరిస్థితిని సరిదిద్దడానికి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ 1961 నాటికి నిర్భంధ ప్రాధమిక విద్య నందజేయాలని రాజ్యాంగం ఆదేశించింది. తరువాత ఈలక్ష్యం 1966కి మార్చబడింది.
(ప్రభుత్వం ప్రాధమిక, సెకండరీ, పై స్థాయి విద్యకి, సాంకేతిక విద్యకి పెద్ద మొత్తాలు కేటాయించింది. 1951-52లో విద్యపై వెచ్చించిన మొత్తం 198 మిలియన్లు వుండగా 1964-65 నాటికి 14627 మిలియన్లకు అంటే 7? రెట్లకు పైగా పెరిగింది. విద్య ప్రధానంగా రాష్ట జాబితాలోనిది గనుక ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులెదురైనా ప్రాధమిక విద్యపై వెచ్చించే మొత్తాలు తగ్గించవద్దని నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరాడు. అవసరమయితే పారిశ్రామికాభి వృద్ధి వ్యయాన్ని తగ్గించుకోమని సూచించాడు. ఆయన 1961 మేలో జాతీయాభివృద్ది మండలితో ఇలా చెప్పాడు : “అన్నిటికి మూలం విద్య. మన తలలు నరికివేయబడి మనం పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే తప్ప విద్యారంగం నిధులు లేకపోవటాన్ని అనుమతించలేం”.
నెహ్రూ కాలంలో విద్య వేగంగా - ప్రత్యేకించి బాలికలలో వ్యాప్తి చెందింది. 1951-1961 కాలంలో పాఠశాలలో బాలుర నమోదు రెట్టింపయింది, బాలికల నమోదు 3 రెట్లయింది. 1950-51 నుండి 1965-66 వరకు 1 నుండి 5 తరగతుల వరకు నమోదయిన బాలుర సంఖ్య 13.77 మిలియన్ల నుండి 32.18 మిలియన్లకు పెరిగింది. బాలికల నమోదు 5.398 మిలియన్ల నుండి 18.29 మిలియన్లకు పెరిగింది. సెకండరీ విద్యకూడా వేగంగా అభివృద్ధి చెందింది. 1950-51,1965-66 మధ్య కాలంలో నమోదయిన బాలుర సంఖ్య 1.02 మిలియన్ల నుండి 408కి మిలియన్లకు (4రెట్లు, బాలికల సంఖ్య 0.19 మిలియన్ల నుండి 1.2 మిలియన్లకు (దాదాపు 6.5రెట్టు) పెరిగింది. ఈకాలంలో సెకండరీ పాఠశాలల సంఖ్య 7,288 నుండి 24,477కి పెరిగింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 198
స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు 3,00,000 మంది విద్యార్థులతో 18 యూనివర్సిటీలు వున్నాయి. 1964 నాటికి యూనివర్సిటీలు 54 కి, కాలేజీల సంఖ్య 2,500 కి, ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్యని మినహాయించి అండర్గ్రాద్యుయేట్స్, పోస్టుగ్రాడ్యుయేటు విద్యార్థుల సంఖ్య 6,13,000 కి పెరిగింది. చదువుకొనే అమ్మాయిల సంఖ్య 6రెట్లు పెరిగింది. మొత్తం విద్యార్థులలో 22 శాతం వుంది. ప్రాధమిక విద్య గణనీయంగా పెరిగినప్పటికి అవకాశాలు ఆకాంక్షల కనుగుణంగా కాని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా కాని పెరగలేదు. నిర్బంధోచిత ప్రాధమిక విద్యాలక్ష్యం గడువు, మొదట 1961 నుండి 1966 కి ఆ తరువాత అనిశ్చిత సుదూర భవిష్యత్తుకి పొడిగించబడింది. మూడవ పంచవర్ష ప్రణాళిక ముగింపుకి 1965-66 లో 6-14 వయో పరిమితిలోగల బిడ్డలలో 61 శాతం మంది మాత్రమే పాఠశాలల్లో వున్నారు. బాలికల శాతం 48 మాత్రమే. ఫలితంగా విస్తృతంగా వున్న నిరక్షరాస్యత కొనసాగింది. 1991 నాటికి కూడా అక్షరాస్యత శాతం 52 మాత్రమే.
కాని ఈ గణాంకాలు పూర్తి కథను చెప్పవు. 1965 నాటికి 5 శాతం గ్రామీణ ప్రజానీకానికి ఏ పాఠశాలా అందుబాటులో లేదు. అంతేకాక ప్రస్తుతం వున్న పాఠశాలల్లో వసతులు సౌకర్యాలు అరకొరగా వున్నాయి. అత్యధిక పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. నల్ల బిల్లలు లేవు, త్రాగునీరు లేదు. దాదాపు 40 శాతం పాఠశాలల్లో మూడు లేక నాలుగు తరగతులు బోధించడానికి ఒకే ఉపాధ్యాయుడున్నాడు. ప్రాధమిక విద్యని పట్టి పీడించిన ప్రత్యేకమైన జబ్బు మధ్యలో చదువు మానుకోవడం. ఒకటవ తరగతిలో నమోదయిన బిడ్డలలో దాదాపు సగం మంది 4వ తరగతికి వచ్చేలోపల చదువు మానుకుంటున్నారు. కొద్దికాలం తరువాత వీరూ నిరక్షరాస్యులై పోతారు. అంతేగాక చదువు మానుకోవడం బాలురలో కంటె బాలికలలో ఎక్కువగా వుంది. స్పష్టంగా విద్యలో సమానావకాశం లేదు. కాబట్టి పేదలకు గ్రామీణ ప్రాంతాలలో వుండే అత్యధికులకు ఉపాధి సౌకర్యాలలో సమానావకాశాలు లేవు.
లోపలికి చొచ్చుకు వచ్చిన మరొక పెద్ద బలహీనత విద్యాస్థాయిల పతనం. సమస్యని గుర్తించినప్పటికీ, సాంకేతిక రంగాన్ని మినహాయించి విద్యారంగంలో, సంస్కరణలు జరగలేదు. విద్యాస్థాయి మొదట పాఠశాలల్లో, తరువాత కాలేజీలలో, యూనివర్సిటీలలో క్షీణించడం కొనసాగుతుంది. విద్య యొక్క సైద్ధాంతిక అంశం కూడా వలస పాలనాకాలం నాటిదే కొనసాగుతుంది.
194 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అసంతృప్తికరమైన విద్యాప్రగతి పట్ల నెహ్రూ ఆందోళన చెందాడు. చివరికాలంలో విద్యాభివృద్ధి పట్ల - ప్రత్యేకించి ప్రాధమిక విద్య పట్ల చాలా (శ్రద్ధ వహించారు. ఎట్టి పరిస్థితులలోనైనా విద్యాభివృద్ధి జరగాలన్నారు. 1963లో ముఖ్య మంత్రులకు యిలా వ్రాశారు : 'అందరికీ అందుబాటులో వుండే సరియైన విద్య మన చెడుగులన్నిటీకీ విరుగుడు" “మన పరిశ్రమలు పెరగాలని నాకు బలమైన ఆకాంక్ష వున్నప్పటికీ క్రింది స్థాయిలో సరియైన విద్యలేకుండా వుండే దానికంటే పారిశ్రామిక పెరుగుదలను తగ్గించుకానడమే మంచిదని నేను దృఢంగా నమ్ముతున్నాను, సమాజాభివృద్ధి కార్యక్రమం (౧౦౫౫4110 06+76ఈ10009లు వంళైమమాంుం)
గ్రామీణాభివృద్ధి కొరకు రెండు పెద్ద కార్యక్రమాలు - సమాజాభివృద్ధి కార్యక్రమం, పంచాయితీరాజ్-1952, 1959లలో ్రవేశ పెట్టబడ్డాయి. అవి గ్రామాలలో సంక్షేమ రాజ్యానికి పునాదులు వేయాలి. అవి వ్యవసాయాభివృద్ధి కొరకు రూపకల్పన చేయబడినప్పటికీ వాటిలో సంక్షేమాంశం ఎక్కువగా వుంది. వాటి ప్రాధమిక లక్ష్యం గ్రామీణ భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చటం, ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం.
సమాజాభివృద్ధి కార్యక్రమం 1952లో పరిమిత స్థాయిలో 55 అభివృద్ధి బ్లాకులకు వర్తింపజేస్తూ ప్రవేశ పెట్టబడింది. ఒక్కొక్కబ్లాకులో 60 నుండి 70 వేల మంది జనాభాగల మొత్తం దాదాపు 100 గ్రామాలున్నాయి. 1960దశాబ్దం మధ్య కాలం నాటికి దేశంలోని అత్యధిక భాగం భ్లాకులుగా విభజింపబడింది. కార్యక్రమం అమలు జరిపేందుకు 6000 మంది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (3.0.09) 6000 మంది విలేజ్ లెవెల్ వర్కర్లు (17.౫9) లేక గ్రామ సేవకులు నియమించబడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ పద్ధతుల్ని మెరుగు పరచడం నుండి వార్తా, రవాణా, ఆరోగ్యం, విద్య మెరుగుపరచడం వరకు గ్రామీణ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ వున్నాయి.
కార్యక్రమం స్వావలంబన, స్వయంసహాయం, ప్రజల భాగస్వామ్యం బాధ్యులకు ప్రాధాన్యత నిచ్చింది. అది ప్రాధమికంగా ప్రజల సంక్షేమం కొరకు ప్రజల ఉద్యమం, నెహ్రూ 1952లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రాధమిక లక్ష్యం 'దిగువ స్టాయి ప్రజలలో వున్న శక్తియుక్తులు స్వేచ్చగా ఎదగడానికి అవకాశం కల్పించటం' అని పేర్కొన్నారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 195
'నమూనా తయారు చేయటం, నిర్దేశించటం, సంఘటిత పరచడం, సమన్వయ పరచటం అవసరం. కాని అంతకంటే కూడా క్రింది నుండి స్వాభావికమైన పెరుగుదలను సాధ్యం చేసే పరిస్థితుల్ని సృష్టించటం ఇంకా ఎక్కువ అవసరం. కార్యక్రమం నుండి కొంత భౌతికమైన అభివృద్ధి, ఫలితాలు ఆశించినప్పటికీ ప్రధానంగా” వ్యక్తిని (గ్రామ కేంద్ర నిర్మాణానికి విసృతార్ధంలో భారతదేశ నిర్మాణానికి సన్నద్ధం చేయడం” కార్యక్రమ లక్ష్యం. మరొక లక్ష్యం వెనకబడిన సెక్షన్స్‌ని ఉద్ధరించటం. “అవకాశాల్లో ఒక మేరకు సమానత్వాన్ని సాధించటం లక్ష్యం”. 1952 లోను, ఆ తరువాత సంవత్సరాలలోను గ్రామీణాభివృద్ధి పధకం (00%%4%10 ౨6+౪6౦౧౫ల౦( క?02రుణుం) జాతీయ విస్తరణ సేవలను (2601241 మ4ల08100 5లంగ606) మార్చుని తీసుకొని వచ్చే నూతన నైతిక శక్తికి, గొప్ప విప్లవానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, అవి భారతదేశ పునరుజ్జీవన స్ఫూర్తికి సంకేతాలని పలుమార్లు ప్రస్తావించారు. కార్యక్రమం విస్తరణ సేవలలో గణనీయమైన ఫలితాలు సాధించింది. మెరుగైన విత్తనాలు, రసాయనిక ఎరువులు లాంటివి వ్యవసాయాఖివృద్ధిలో అధికాహరోత్పత్తి రోడ్డు, చెరువులు, పాఠశాలల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం విద్య ఆరోగ్య సేవల విస్తరణ జరిగాయి, మొదట ఈ కార్యక్రమం పట్ల ప్రజలు చాలా ఉత్సాహం చూపారు. కాని కాలక్రమంలో క్రమంగా నీరసించారు. ఈ కార్యక్రమం మౌలిక లక్ష్యాలలో ఒక దానిలో - అభివృద్ధి కార్యక్రమంలో (ప్రజల్ని పూర్తి భాగస్వాముల్ని చేయటంలో విఫలమయింది. ఇది స్వయం సహాయాన్ని ప్రొత్సహించక పోవటమే కాదు, ప్రభుత్వంపై అధికాధికంగా ఆశించటాన్ని పెంచింది. ఆధారపడటాన్ని పెంచింది. ఇది అధికార దృక్పధాన్ని అలవరచుకొన్నది, అధికార చట్రంలో భాగమయింది. బి.డి.డి.లు సాంప్రదాయ సబ్‌డివిజన్ ఆఫీసర్లకు నకళ్లుగ్గా, వి.యల్.డబ్యులు క్రిందిస్థాయి పనివాళ్లుగా పరిపాలన సాగించబడింది. నెహ్రూ 1963లో చెప్పినట్లు 'తరతరాలుగా మురికి కూపంలో మగ్గుతున్న రైతును దాని నుండి బయటికి లాగేందుకు కార్యక్రమం రూపొందింపబడగా, ఈ మొత్తం కార్యక్రమమే మురికి కూపంలో పడిపోయింది'. ఈ కార్యక్రమంలోని బలహీనతలు 1957 నాటికే బహిర్గతం కాగా ప్రభుత్వం మొత్తం కార్యక్రమాన్ని సమీక్షించి అంచనా వేసేందుకు బలవంతరాయ్ కమిటీని 196 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నియమించింది. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కొరవడటాన్ని ఉద్యోగి స్వామ్యం చేయబడటాన్ని కమిటీ తీవ్రంగా విమర్శించింది. అందుకు విరుగుడుగా మొత్తం గ్రామీణ జిల్లా అభివృద్ధి యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యయుతంగా వికేంద్రీకరణ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు గ్రామ పంచాయితి పునాదిగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వయంపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించబడింది. పంచాయితీరాజ్గా చెప్పబడిన ఈ నూతన విధానం చాలా రాష్ట్రాలలో 1959 నుండి అమలు పరచబడింది. ఇది మూడంచెల విధానం. ప్రత్యక్షంగా ఎన్నుకొనబడిన గ్రామ పంచాయితీలు, పరోక్షంగా ఎన్నుకోబడిన బ్లాకు స్థాయి పంచాయితీ సమితులు, జిల్లాన్థాయి జిల్లాపరిషత్‌లు. సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని పంచాయితీరాజ్‌తో విలీనం చేయవలసి వుంటుంది. అభివృద్ధి పథకాలు అమలు జరిపేందుకు విధులు, వనరులు, అధికారం మూడంచెల సమితులకు సంక్రమిస్తాయి. ఆవిధంగా నిర్ణయాలు చేయటంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా, మూడంచెల సమితుల మార్గదర్శకత్వంలో అభివృద్ధి పనులను అధికారులచే అమలు జరిపించడం ద్వారా సమాజాభివృద్ధి కార్యక్రమం (00౧- గట 6100ల ౫౧08౫౧౫6) యొక్క లోపాల్ని సరిదిద్దేందుకు, పంచాయితీరాజ్ ఉద్దేశించబడింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతమంతటా సహకార బ్యాంకులు భూమి తనఖా బ్యాంకులు, సేవామార్కెట్టు సహకార సంఘాలు లాంటి వేలాది సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. ఇవి ఎన్నికైన సంస్థలతో ఉద్యోగుల పెత్తనం అంతగాలేని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. సమాజం మార్చు దిశగా వేసిన ముందడుగులకు పంచాయితీరాజ్, సహకార సంస్థలు ప్రాతినిధ్యం వహించడంతో నెహ్రూ చాలా ఉత్సాహ భరితుడయ్యాడు. అవి అభివృద్ధి, గ్రామీణ పరిపాలనా బాధ్యతల్ని ప్రజలకు బదిలీ చేసి గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేస్తాయి. అవి ఎక్కువ స్వావలంబనకు దారితీయడమే గాక (ప్రజల దృక్పథంలో మార్చుతెచ్చే విద్యాసాధనాలుగా కూడా పని చేస్తాయి. అన్నీటినీ మించి అవి మంచి మనుషుల్ని సృష్టించే క్రమాన్ని ప్రారంభిస్తాయి. కాని ఈ ఆశలు అడియాసలయ్యాయి. పంచాయితీరాజ్ని ఏదో రూపంలో అమలువరుస్తూూనే ర్యాష్టవ్రభుత్వాలు దాని పట్ల అంత ఆనక్తి చూపలేదు. పంచాయితీసమితులకు నిజమైన అధికారాలు అప్పజెప్పలేదు. అధికారాలకు, విధులకు స్వతంత్రం తర్వాత భారతదేశం 197
ఆటంకాలు కల్పించారు. నిధులు కేటాయించక నిస్సహయస్టితికి నెట్టివేశారు. అఛెకార వర్ణం కూడా వివీధ స్థాయిల గ్రామీణ పరిపాలనపై పట్టు సడలించలేదు. గ్రామాలలో ముఠాపరమైన మద్దతుని కూడగట్టుకునేందుకు పంచాయితీలు రాజకీయీకరణ చేయబడ్డాయి. ఫలితంగా (గ్రామీణ స్వయంపరిపాలనా విధానానికి వునాదులు వేయబడినప్పటికి మొత్తం ప్రజాస్వామ్య వికేంద్రీకరణకి అడుగడుగునా ఆటంకాలు కల్చించబడ్డాయి. పంచాయితీరాజ్కి బల్వంతరాయ్ మెహతా కమిటీ, నెహ్రూ అప్పగించిన బాధ్యతల్ని అది నిర్వర్తించలేక పోయింది.
అంతేగాక సమాజాభివృద్ధి ఫలితాలు నూతన వ్యవసాయ సరఫరాలు, విస్తరణ సేవలు - అన్నీ కూడా పంచాయితీ రాజ్ సంస్థలపై ఆధిపత్యం సాధించగలిగిన ధనిక రైతులకు పెట్టుబడిదారీ వ్యవసాయదారులకు దక్కాయి. సమాజాభివృద్ధి కార్యక్రమం పంచాయితీరాజ్, సహకార ఉద్యమం-యొక్క ప్రాథమిక బలహీనత ఏమిటంటే అవి గ్రామీణ సమాజం యొక్క వర్గ విభజనని విస్మరించాయి. గ్రామీణ సమాజంలో దాదాపు సగం మందికి భూములులేవు. వారికి ఆయాసంస్తలలో అధికారాలు వుండవు. [గ్రామం సాంఘికంగా ఆర్థికంగా ఆధిపత్యం చెలాయించగలిగిన పెట్టుబడిదారీ వ్యవసాయదారులు, ధనిక మధ్యతరగతి రైతాంగం చేతుల్లోవుంది. ఆధిపత్య (గ్రామీణ వర్ణాలు గాని, అధికార వర్గం గాని సామాజిక మార్పుకి లేక ప్రజా భాగస్వామ్యూనికి ప్రతినిధులు కాలేరు. 198 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
12 విదేశాంగ విధానం - నెహ్రూ శకం మౌలిక ప్రమాణాలు
1947 తర్వాత రాజకీయాలలో భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రత్యేకంగా పేర్కొన దగిన అంశం. అంతర్జాతీయ పరిస్థిత్రుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ స్వతంత్ర పోరాటకాలంలోనూ స్వతంత్రానంతర తొలి సంవత్సరాల్లోనూ రూపొందింపబడిన విస్తృత ప్రమాణాలు ఇప్పటికీ వర్తించేవిగా వున్నాయి. జవహర్‌లాల్‌నెహ్రూ మన విదేశాంగ విధాన రూపశిల్పి. గొప్ప నాగరికత గల భారతదేశం తనసాంత గొంతుకను వినిపించాలని ఆకాంక్షిస్తుంది. అంతర్జాతీయ రంగంలో భారతదేశం తన విధానాన్ని వ్యక్తీకరించకపోతే వలస పాలన నుండి పోరాడి సాధించుకున్న స్వతంత్రం అర్ధరహితమౌతుంది. ఉపఖండంగా ఉన్న భారతదేశం కక్షిదారీస్థాయిని అంగీకరించజాలదు. స్వేచ్చాయుత వ్యక్తీకరణ ఎంపిక కాదు. తప్పనిసరి.
ఈ వ్యక్తీరణకు అలీన ఆలోచన రూపంలో అలీన ఉద్యమం ద్వారా ఒక రూపాన్నిచ్చినవాడు నెహ్రూ. ఈ ఉద్యమ ఆవిర్భావానికి తక్షణ సందర్భం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచం రెండు శత్రుశిబిరాలుగా చీలిఉండడం. ఒకటి అమెరికా ఇతర పశ్చిమ రాజ్యాల నాయకత్వంలో, మరొకటి సోవియట్ యూనియన్ నాయకత్వంలో. కొత్తగా స్వతంత్రం పొందిన ఆసియా, ఆఫ్రికా పేద దేశాలు అగ్రరాజ్యాల మిలిటరీ శిబిరాల్లో చేరడం వల్ల సర్వస్వం కోల్పోవడం తప్ప పొందే ప్రయోజనం ఏమీ ఉండదని నెహ్రూకి నృష్టవ్షైన అవగావాన ఉంది. అవి అ(గరాజ్యాల వుర్షణలో పావులుగా ఉపయోగించుకోబడతాయి. పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు రొస్టులపై విపరీతంగా పోరాదడం పేద దేశాల అవసరాలు. ఇలాంటి అవసరాలు మిలిటరీ శిబిరాల్లో చేరడం స్వతంత్రం తర్వాత భారతదేశం 199
వల్ల తీరవు. దీనికి భిన్నంగా భారతదేశం అలాంటి స్థితిలో ఉన్న ఇతర దేశాలు అభివృద్ధి చెందడానికి శాంతి సామరస్యాలు అవసరం. వాటి ప్రయోజనాలు యుద్ధం, శత్రుత్వం కాక శాంతి సామరస్యాలు విస్తరణతో నెరవేరతాయి. కాబట్టి భారతదేశం బాగ్దాద్ ఒప్పందం, మనీలా ఒప్పందం, సీటో (3240) సెంటో (౧౯౫గ౦) లలో చేరలేదు. వాటిని ఆమోదించలేదు. ఈ ఒప్పందాలు పశ్చిమ, తూర్పు ఆసియా దేశాలను, పాశ్చాత్య రాజ్యాల శిబిరాల్లో చేర్చాయి.
కాని భారతదేశం తటస్థత లేక మిలిటరీ శిబిరాలకు బైట ఉండడంతో ఆగిపోలేదు. జాన్ ఫాస్టర్ డల్లెస్ భారతదేశంపై విసిరిన “అనైతిక తటస్థత” ఆరోపణను నెహ్రూ వెంటనే తిరస్కరించాడు. అలీనత అంటే ప్రతి అంశాన్ని దాని గుణాల్ని బట్టి నిర్ణయించడం. ఏది మంచి, ఏది చెడు అని పర్యాలోచించడం, అప్పుడు మంచికి అనుకూలమైన వైఖరి చేపట్టడం. “ఫాసిజం, వలసవాదం, జాత్యాహంకారం లేక అణుబాంబు దురాక్రమణ అణచివేత లాంటి దుష్ట శక్తులకు సంబంధించినంత వరకు మనం వాటికి వ్యతిరేకంగా దృఢంగా, నిస్సందేహంగా, నిబద్దతతో నిలబడతాం... మన అలీనత మిలిటరీ ఒప్పందాలతో కూడిన ప్రచ్చన్న యుద్దాన్ని, కొత్తగా విముక్తి పొందిన ఆసియా, ఆఫ్రికా దేశాలను వారు ప్రచ్చన్నయుద్ధ యంత్రాంగంలోకి లాగడాన్ని ఆక్షేపిస్తుంది. ప్రపంచానికి, చెడు లేక అపకారిగా పరిణమించే ప్రతి పరిణామాన్ని ఖండించే స్వేచ్చ మనకుంది. సందర్భం వచ్చినప్పుడు అలాంటి స్వేచ్చని మనం ఉపయోగించుకుంటాం.”
వలసవాదం, సామ్రాజ్యవాదం నుండి భారతదేశం, కొత్తగా స్వతంత్రం సాధించిన ఇతర దేశాలు వాటి స్వతంత్రాన్ని నిలబెట్టుకుని పటిష్టపరుచుకోడానికి ప్రతీక 'అలీనత'. మొదట స్వతంత్రం పొందిన భారతదేశం ఇతర మాజీ వలస దేశాలకు నాయకత్వం వహించింది. ఈ దేశాలు సమిష్టిగా గణనీయమైన శక్తి. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితిలో ఈ దేశాల చేరికతో సభ్యత్వం పెరిగింది. 'ఒక దేశం ఒక ఓటు” విధానంతో అలీన దేశాలు తరచుగా సోవియట్ సహకారంతో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగాయి. వ సూ ” అంతర్జాతీయ సంబంధాల యొక్క ప్రజాస్వామ్య క్రమాన్ని అలీనత ముందుకు
వలసవాద, మాజీ వలసవాద దేశాల వలసవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటలకు మద్దతునివ్వడం భారత విదేశాంగ విధానం యొక్క మౌలిక లక్షణం. అలీన విధానం ఈ లక్ష్యానికి బాగా ఉపకరించింది. ప్రపంచ శాంతిని పెంచే మరొక లక్ష్యానికి 200 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కూడా అలీన విధానం తోద్చడింది. యుద్దానికి, అణుయుద్ధ ప్రమాదానికి నెహ్రూ వ్యతిరేకత హీరోషిమా సంఘటన తర్వాత పెరిగింది. అది తన అహింసాయుత పోరాట అనుభవం నుండి, అణుబాంబు చట్టవిరుద్ధమైనదిగా ప్రకటింపజేయడం తన కర్తవ్యంగా పెట్టుకున్న గాంధీపై గల విశ్వాసం నుండి పెరిగింది.
గాంధీచే (ప్రేరేపితుడై ఐన్ప్టీన్, బెట్రెండ్ రస్సెల్ వంటి గొప్ప మేధావుల మద్దతు పొందిన నెహ్రూ శాంతి అణ్వస్త్ర నిరాయుధీకరణ లక్ష్యాన్ని భారతదేశం తరపున ప్రపంచం ముందుంచారు.
విభిన్న సిద్ధాంతాల, విభిన్న వ్యవస్థల శాంతియుత సహజీవనం అవసరమని సత్యంపై ఎవరికీ గుత్తాధిపత్యం లేదని, బహుళత్వం జీవన విధానమని నెహ్రూ నొక్కి చెప్పాడు. దేశాల మధ్య సంబంధాల నిర్వహణకు శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలను లేక పంచశీలను ప్రతిపాదించాడు. అవి ప్రాదేశిక, సమగ్రత, సర్వసత్తాక, అధికారం పట్ల పరస్పర గౌరవం, దురాక్రమణ జరపకుండుట, పరస్పరం అంతర్గత వ్యవహారల్లో జోక్యం చేసుకోకుండుట, సమానత్వం, పరస్పర ప్రయోజనం, శాంతియుత సహజీవనం.
దేశాల అంతర్జాతీయ సంబంధాలను గురించి నెహ్రూ తన ఆలోచనలను అవకాశమున్న ప్రతి వేదికనుండి చెప్తూ వచ్చాడు. ఈ అన్వేషణలో కొన్ని మహత్తర ఘటనలు ఉన్నాయి. స్వతంత్రానికి ముందు 1947 మార్చిలో నెహ్రా (ప్రేరణతో ఢిల్లీలో 20 దేశాలకు పైగా హాజరైన ఆసియా దేశాల సంబంధాల సదస్సు (49122 2ల26003 6011006ల నిర్వహించబడింది. సదస్సు యొక్క స్ఫూర్తి ఆసియా దేశాల స్వతంత్రం : దానిని ప్రపంచ వేదికనుండి న్పన్టంగా ప్రకటించడం. ఈ నదన్సు సాధారణ అంశాలకు సంబంధించిందైనప్పటికీ తరువాతి సదస్సు ప్రత్యేక సమస్యకు స్పందనగా జరపబడింది. సమస్య : 1948 డిసెంబర్లో ఇండోనేషియాను వలసగా మార్చేందుకు డబ్చి ప్రయత్నం. హిందూ మహాసముద్రం సరిహద్దుగా గల దేశాలను నెహ్రూ ఆహ్వానించాడు. చాలా ఆసియా, ఆష్టేలియా దేశాలు వచ్చాయి. డచ్చి నౌకలకు వసతులు కల్పించకుండా నిరాకరించాలని సదస్సు తీర్మానించింది. తీర్మానాలను ఐక్యరాజ్య సమితికి పంపించింది. వారం లోపల యుద్ధవిరమణ ప్రకటించాలని ఇండోనేషియా జాతీయ ప్రభుత్వం పునరుద్ధరింపబడాలని భద్రతా సమితి తీర్మానించింది. వలసలను రద్దు చేసే ప్రయత్నం 1954లో కొలంబోలో ఆసియా దేశాల నాయకుల సదస్సులోనూ, భారతదేశం, ఇతర కొలంబో రాజ్యాలు 1955లో బాండుంగ్, ఇండోనేషియాలలో నిర్వహించిన ఆఫ్రా ఆసియన్ స్వతంత్రం తర్వాత భారతదేశం 201
సదస్సులోనూ ముందుకు తీసుకుని పోవడం జరిగింది. సదస్సు ప్రపంచ శాంతిపై, అణ్వాయుధాల ప్రమాదాలపై తీర్మానాలు చేసి బెల్లేడ్ అలీన సదస్సుకు అగ్రగామి దూతగా పనిచేసింది. నెహ్రూ, ఈజిష్ట అధ్యక్షుడు నాజర్, యుగోస్తేవియా అధ్యక్షుడు టిటోతో కలిసి బెల్లేడ్లో శాంతి, అణ్వస్త్ర నిరాయుధీకరణకు పిలుపు ఇవ్వడంతో నెహ్రూ శాంతి (ప్రయత్నాలు శిఖరాగ్ర స్థితికి చేరుకున్నాయి. వలస వాద అవశేషాలు తొలగిపోతాయని తర్వాత ప్రపంచం ఎదర్మోనున్న సవాలు అణుయుద్ధ నివారణ అని నెహ్రూ విశ్వసించాడు. భారతదేశ విదేశాంగ విధానం యొక్క కర్తవ్యం భారత ఆర్ధిక ప్రయోజాలను కాపాడడం. తాను స్వయంగా ఎంపిక చేసుకున్న మార్గంలో ముందుకు పోవడం. అలీనత ఏదో ఒక శిబిరానికి కట్టిపడవేయక పోవడం వల్ల, విభజన రేఖకి ఇరువైపులా ఉన్న దేశాలతో ఆర్థిక సంబంధాలు పెంపొందించుకోవడానికి తోద్పడింది. తనకవసరమైన పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, ఆహార ధాన్యాలను పశ్చిమ దేశాలనుండి పొందింది. భారతదేశం ప్రత్యేకించి 1954 తర్వాత పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల నిర్మాణానికి సోవియట్ యూనియన్‌పై ఆధారపడింది. పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలకు తోడద్చడేందుకు అమెరికా విముఖత వ్యక్తం చేసింది. వివిధ వనరుల నుండి రక్షణ సామాగ్రి, ఆయుధాలు పొందగలగడం, భారతదేశం చాలా దేశాలతో స్నేహ సంబంధాలు కానసాగించగలిగిందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. ఏదో ఒక దేశంపై ఎక్కువగా ఆధారపడడాన్ని నివారించింది. ఈ విధంగా కొత్తగా స్వతంత్రం పొంది అభివృద్ధి చెందుతున్న పేదదేశం యొక్క స్వతస్సిద్ధ బలహీనతలు తగ్గించబద్దాయి. అదే విధంగా భారతదేశం ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ సంస్థల్లోనూ ఐ.ఎం. ఎఫ్, ప్రపంచ బ్యాంకులలో సభ్యత్వం కొనసాగించింది. అంతేకాక వివిధ అంతర్జాతీయ సంస్థలనుండి రాయితీలతో అత్యంత ఎక్కువ మొత్తాలను పొందగలగడం భారతదేశ అద్ధిక రాజసీతిజ్ఞత యొక్క విశిష్టత. భారతదేశ విదేశాంగ విధానం కొన్ని సార్లు సమాధాన పరచడానికి పొసగని లక్ష్యాన్ని అనుసంధానం చేసింది. ఉదాహరణకు సోవియట్ యూనియన్, భారతదేశం 1963లో ప్రారంభించి 1964 ఆగస్టులో, 1965 ఆగస్టులో, 1965 నవంబర్‌లో ఆయుధ ఒప్పుందాలపై సంతకాలు చేశాయి. ఈ విధంగా సోవియట్ యూనియన్ భారతదేశానికి అత్యంత ఎక్కువ ఆయుధాలు సరఫరా చేసే దేశమైంది. భారత సోవియట్ సంబంధాలు గుణాత్మకమైన నూతన దశలో '్రవేశించాయి. అదే సమయంలో భారతదేశం అమెరికా మద్దతుతో వ్యవసాయ అభివృద్ధి కొరకు హరితవిప్లవ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు 202 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పరచాలని నిర్ణయించింది. సోవియట్ యూనియన్‌తో ఆయుధ ఒప్పందాలు, కొద్ది సంవత్సరాల్లో ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి దారితీసిన హరిత విప్లవం భారతదేశం తన కాళ్లపై తాను నిలబడగల శక్తిని పెంచాయి. ప్రపంచ వ్యవహారాల్లో ఇంకా స్వతంత్ర వైఖరిని చేపట్టే శక్తిని పెంచాయి. అలాగే అమెరికా, సోవియట్ యూనియన్లు చాలా సందర్భాల్లో రూపాయలలో చెల్లింపులకు అంగీకరించాయి. ఆవిధంగా విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించాయి.
భారతదేశం బహు అంతర్జాతీయ సంస్థల్లో చురుకుగా పాల్గొంది. వాటిలో తన ఉనికిని తనకనుకూలంగా మార్చుకుంది. ఈ కారణం రీత్యానే నెహ్రూ కామన్వెల్త్లో ఉండాలని నిర్ణయించాడు. అందుకు విరుద్ధంగా బలమైన ప్రజాభిప్రాయం ఉన్నప్పటికీ భారతదేశం ఒకసారి స్వతంత్రమైన తర్వాత దానిపై బ్రిటన్ ఆధిపత్యం చెలాయించే సమస్య ఉందదని, భారతదేశం బహుళజాతి సంస్థలలో ఉండడం వల్ల ప్రయోజనం పొందవచ్చునని నెహ్రూ భావించాడు. భారతదేశం తనకు మిటత్రులెవరో, శత్రువలెవరో ఇంకా తెలుసుకోవలసిన పరిస్థితిలో కామన్వెల్త్ సభ్యత్వం ఒక మేరకు భద్రత కల్పించింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి శాంతి సంరక్షణ దళాలలో భారతదేశం చురుకైన పాత్ర నిర్వహించింది. భారతదేశం చురుకైన పొత్ర నిర్వహించిన కొన్ని అంతర్జాతీయ పరిస్థితుల్ని కొంత నిశితంగా పరిశీలిస్తే అలీన విదేశాంగ విధానం నిర్దేశించిన కర్తవ్యాలు తేటతెల్లమౌతాయి.
అంతర్జాతీయ పాత్ర
కొరియా యుద్ధం
రెండవ ప్రపంచయుద్ధం ముగింపు కొరియాని కమ్యూనిస్టుల అదుపులో ఉన్న ఉత్తర కొరియాగా, పశ్చిమ రాజ్యాల ఆధిపత్యంలో ఉన్న దక్షిణకొరియాగా విభజించింది. ఐక్యరాజ్య సమితి 1947 చివరిలో కొరియాపై నియమించిన కమిషన్‌కి ఛైర్మన్‌గా ఎన్నికైన కె.పి.ఎస్.మీనన్ ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన నివేదికలో కొరియాని ఐక్యంగా వుంచమని అగ్రరాజ్యాలకు విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేదు. 1950లో ఉత్తర కొరియా దక్షిణకొరియాపై దాడిచేసినప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం అమెరికాకు మద్దతు ఇచ్చింది. ఉత్తర కొరియాని దురాక్రమణదారునిగా ఖండించింది. యుద్ధవిరమణకు పిలుపిచ్చింది. కాని దక్షిణ కొరియాకి సహాయం కొరకు పిలుపునిస్తూ, అందుకొరకు స్వతంత్రం తర్వాత భారతదేశం 203
సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలనే తీర్మానంపై ఓటింగుకు భారతదేశం గ్రైరుహాజరవడంతో అమెరికా సంతోషం ఆగ్రహంగా మారింది. ఘర్షణలోకి బయటికి సైనిక శక్తుల ప్రవేశాన్ని అద్దుకోవాలని భారతదేశం కోరింది. నెహ్రూ, ట్రూమన్, స్టాలిన్లకు విజ్ఞప్తి చేశారు. స్టాలిన్ నుండి సానుకూలమైన స్పందన వచ్చింది. కాని ఐక్యరాజ్య సమితి అదుపులో ఉన్న ఆమెరికా సైనికాధిపతి జనరల్ మాక్ ఆర్జూర్ ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందకుండానే ఉత్తర కొరియా సైనిక బలగాలను దక్షిణకొరియా నుంది నెట్టివేసి ఉత్తరకొారియాలో ఉన్న 88వ సమాంతర రేఖని అతిక్రమించి, కొరియా వైనాలను వేరు చేస్తున్న యాలూ నదివైపుకి పురోగమించాడు. ప్రతీకారం తీర్చుకుంటామని చైనా ప్రధానమంత్రి చౌ యన్ లై చైనాలో భారత రాయబారిగా ఉన్న కె.ఎమ్. ఫణిక్కర్ ద్వారా పశ్చిమ రాజ్యాలను హెచ్చరించాడు. పశ్చిమ రాజ్యాలు హెచ్చరికను పట్టించుకోలేదు. అప్పుడు చైనా అలలు అలలుగా సైనిక దళాలను పంపించింది. అమెరికా సైనికుల్ని 88వ సమాంతర రేఖ దక్షిణానికి నెట్టివేసింది. కానీ ఈ ఘర్షణల్లో చైనా, కొరియా, అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దశలో మరలా నెహూ యుద్ధం ఆపివేయించాలని ప్రయత్నించాడు. కానీ అమెరికా హడావుడిగా ఐక్యరాజ్యసమితిలో చైనా దురాక్రమణదారుగా ప్రకటిస్తూ తీర్మానం చేయించింది. ఉత్తర కొరియాపై దురాక్రమణకు దిగింది చైనా కాదు, మాక్ ఆర్టూర్ కనుక భారతదేశం ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేసింది. మిలిటరీ ప్రతిష్టంభన ఏర్పడింది. భారతదేశం అలుపెరుగని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇరుపక్షాల్ని యుద్ధవిరమణకి అంగీకరింపచేసి యుద్ధఖైదీల మార్పిడికి అంగీకారయోగ్యమైన ఒప్పందాన్ని కుదిరించడం1958 జూన్ నాటికి గాని సాధ్యపడలేదు. కృష్ణమీనన్ ఒప్పందాన్ని రూపొందించాడు. దానిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, స్టాలిన్ మరణానంతరం సోవియట్ యూనియన్ శిబిరం ఆమోదించాయి. యుద్ధభైదీల మార్పిడికి తటస్థదేశాల కమిషన్ నియమించబడింది. కమిషన్ ఆధ్యక్షుడు జనరల్ తిమ్మయ్య. యుద్ధఖైదీల మార్పిడి బాధ్యత జనరల్ తిమ్మయ్య నాయకత్వంలోని సంరక్షక దళానికి అప్పజెప్పబడింది. కౌరియా యుద్ధం అలీన విధానంలో భారతదేశం యొక్క విశ్వాసానికి, శాంతి పట్ల నిబద్ధతకు ఒక అగ్నిప్రరీక్ష పరీక్షలో భారతదేశం నెగ్గింది. భారతదేశం తొలుత చైనా ఆగ్రహాన్ని ఆతర్వాత ఉత్తర కొరియా మొదటి దురాక్రమణ దారుగా ఓటు చేసి సోవియట్ యూనియన్ ఆగ్రహాన్ని చవిచూసింది. యుద్ధంలో పశ్చిమ దేశాల జోక్యంతో చేయి కలపనిరాకరించి, చైనాని దురాక్రమణదారుగా ప్రకటించ నిరాకరించి ఆమెరికా ఆగ్రహాన్ని భరించింది. ఇది ఇలా జరుగుతుండగా 1950లో చైనా టిబెట్‌పై దాడిచేసి టిబెట్‌ని 204 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కలుపుకొన్నది. నెహ్రూ కలతచెందినప్పటికీ కొరియా యుద్ధంపై వైఖరిని మార్చుకోలేదు. కమ్యూనిస్టు చైనాని గుర్తించి భద్రతా మండలి (3600గ0/ 602001) లో వైనాకి సభ్యత్వం ఇవ్వమని - ప్రత్యేకించి సోవియట్ యూనియన్ నిరసనతో వైదొలగిన పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి చేయడం కొనసాగించింది. అప్పుడు భారతదేశం దాదాపు కరువు పరిస్థితుల్లో ఉంది. కనుక అమెరికా అహారధాన్యాల సహాయం చాలా అవసరం. అయినప్పటికీ కొరియాలో అమెరికా వైఖరిపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. భారతదేశం కృషి ఫలించింది. ఏ సరిహద్దురేఖని ఇరుషక్షాలూ మార్చాలని ప్రయత్నించాయో దానినే గుర్తించక తప్పలేదు. ప్రపంచం అలీనవిధానం యొక్క విలువను గుర్తించింది. అలీన విధానాన్ని 'పిరికితనపు తటస్థత'గా త్రోసిపుచ్చలేకపోయింది. సోవియట్ యూనియన్ భారతదేశాన్ని కొత్తకోణం నుండి చూడడం ప్రారంభించింది. 'సోవియట్ యూనియన్ కామన్వెళ్త్లో భారతదేశ వైఖరిని పూర్తిగా అభినందించింది. దానిలో ఉండడం కొనసాగించాలని ఆశిస్తుంది అని సోవియట్ ప్రధాన మంత్రి బుల్గానిన్ భారతరాయబారి కె.పి. యస్.మీనన్‌కి చెప్పాడు. భారతదేశం పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి లొంగిపోయిందనదడానికి ఒక నిదర్శనంగా భావించబడిన సమయంలో ఇది పెద్ద మార్పు. ఇండో చైనా
కొరియా యుద్ధం ముగింపు ఆసియాకి తాత్మాలిక విరామాన్ని ఇచ్చింది. వియత్నాం యుద్ధంలో అలసి సొలసి ఉన్న (ఫెంచి వలసవాదాన్ని దరిచేర్చేందుకు పెద్ద ఎత్తున అమెరికా ఆసక్తితో సహాయం అందజేయడంతో 1954 ప్రారంభంలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పవిత్ర యుద్ధాలకు ఇండో చైనా రంగ స్థలం కానున్నది. 1954 ఫిబ్రవరిలో యుద్ధ విరమణ కొరకు విజ్ఞప్తి చేసేందుకు నెహ్రూ చొరవ చూపాడు. పరిష్కారానికి తొను సూచించిన ఆరు సూత్రాల ప్రతిపాదనకు 1954 ఏప్రిల్‌లో జరిగిన కొలంబో సదస్సులో ఆసియా దేశాల నాయకుల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించాడు. ఇండో చైనాపై జరిగిన జనీవా సదస్సుకు (సభ్యదేశంగా భారతదేశం ఆహ్వానించబడలేదు) ఆసియా వైఖరిని విరించేందుకు కృష్ణమీనన్ని పంపించారు. 1954లో నెమ్రూ ఢిల్లీలో కలవడంతో పాటు ఈ చర్యలు తెర వెనుక జరిపిన ఇతర చర్యలు, సంభాషణలు, పొందిన వామీలు ఇండోచైనా యుద్దాన్ని అంతర్జాతీయం చేయకుండా నివారించాయి. లావోస్, కంబోడియాలను తటస్థం చేసే హామీని భారతదేశం చైనా నుండి పొందింది. లావోస్ కంబోడియాలలో అమెరికా స్థావరాలను అనుమతించబోమని గ్రేట్ బటన్, ప్రాన్స్ల నుండి చైనాకు హామీ ఇప్పించింది. చర్చలు రాయబారాలలో భారతదేశం నిర్వహించిన పాత్రను గురించి ఫెంచ్ ప్రధానమంత్రి పిరైమెండిస్ - ఫ్రాన్స్ జనీవాలో చేసిన ప్రస్తావన 'ఈ పది రాజ్యాల సదస్సులో తొమ్మిది స్వతంత్రం తర్వాత భారతదేశం 205
తెరపైన ఉన్నాయి. మరి భారతదేశం (తెరవెనుక ఉంది)” - భారతదేశం చేసిన కృషిని వివరిస్తుంది. చైనా అభ్యర్థన మేరకు భారతదేశం ఇంటర్నేషనల్ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించబడింది. లావోస్, కంబోడియా, వియత్నాంలలోకి విదేశీ ఆయుధాల దిగుమతుల్ని పర్యవేక్షించడం కమిషన్ పనిలో భాగం. తాత్కాలికంగా వియత్నాం పక్షాన చైనా జోక్యం చేసుకునే ప్రమాదం, ఫ్రెంచికి అమెరికా సహాయాన్ని పెంచే ప్రమాదం నివారించబడ్డాయి. ఫ్రాన్స్ యుద్ధంతో అలసిపోయింది. అమెరికా యుద్దోన్మాద ఆలోచనలతో టిటన్ భయపడింది. సోవియట్ యూనియన్ ప్రత్యేకించి స్టాలిన్ మరణానంతరం “శాంతియుత సహజీవనం" దిశగా ఆలోచనలు సాగించింది.
ఆమెరికా కుటిల రాజనీతిజ్ఞతతో కంట్రోలు కమిషన్లు నిర్వీర్యం చేయబడ్డాయి. ఇండోచైనా 'ప్రచృన్న యుద్దానికి రంగస్థలమయింది. ఆ తర్వాత శాంతి యత్సాలు నెహ్రౌ సూచించిన పరిష్కారాల దిశలో సాగాయి. సూయజ్కెనాల్
1956లో అలీన విధానాన్ని వదిలిపెట్టవలసిందిగా ఒత్తిడి చేసేందుకు ట్రైటన్ అమెరికాలు నైలునదిపై అశ్వాన్ ఆనకట్ట నిర్మాణం కొరకు వాగ్దానం చేసిన ఆర్ధిక సహాయాన్ని నిలిపివేశాయి. దీనికి ప్రతిచర్యగా ఈజిష్ట సూయజ్ కాలువను జాతీయం చేసింది. ఈచర్య సూయజ్ కాలువను ఉపయోగించుకునే దేశాల్ని కలవరపరిచింది. బ్రిటన్, ప్రాన్సులు సూయజ్కాలువసై అంతర్జాతీయ అదుపు ఉండాలని డిమాండు చేశాయి. సూయజ్కాలువను ఉపయోగించుకునే దేశాలలో భారతదేశం ఒకటి. కాని కాన్స్టాటిల్ నోపుల్ సదస్సు (1888) తీర్మానాన్ననుసరించి సూయజ్ కాలువ ఈజిష్టలో అంతర్భాగం. సంయమనం పాటించవలసిందిగా కైరో, లండన్లను భారతదేశం అర్ధించింది. సూయజ్కాలువ ఫై ఈజిష్ట అదుపు ఉండాలని, దానిని ఉపయోగించుకునే వారికి సలహాలు ఇచ్చే పాత్ర ఉండాలని, ఐక్యరాజ్యసమితి ఆదేశాలననుసరించి వివాదాలు పరిష్కరిచుకోవాలని షరతులతో ఒప్పందాన్ని క్రుదిర్బాలని 1956 ఆగస్సులో లండన్ సదస్సులో ప్రయత్నించింది. భారతదేశ ప్రతిపాదనకు ఈజిష్టతో సహా విస్తృతమైన మద్దతు లభించింది. ఆ తరువాత ఫ్రాన్సు, బ్రిటన్లు కలిసి ఇజ్రాయెల్ చేత ఈజిఫ్టపై దాడి చేయించింది. సైన్యాన్ని సూయజ్‌లో దించినప్పుడు అమెరికా, ఐక్యరాజ్య సమితి కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండించాయి. నెహ్రూ దీనిని 'నగ్నమైన దురాక్రమణ చర్చ" అని, గత వలసవాద పద్ధతులను వెనక్కి తిప్పడం” అని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో 206 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జరిగింది. శాంతి పరిరక్షణ దళాల్లో భారత సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిష్షారానికి దారితీసిన తరువాతి చర్యలలో కూడా ఈజిప్టు ప్రజల ప్రయోజనాలకు భారత్రదేశం తన మద్దతు కొనసాగించింది. బ్రిటిషు వారి, అలాగే సూయజ్ కాలువను ఉపయోగించుకునే ఇతరుల ప్రయోజనాలకు కూడా రక్షణ కల్పించబడింది. ఆ తర్వాత 'టిటన్ కూడా భారతదేశ వైఖరి యొక్క నిజాయితీని అంగీకరించింది. ఈ ఘటన భారత 'టిటిషు సంబంధాలపై ఎలాంటి శాశ్వత ముద్ర వేయలేదు. హంగేరి
హంగేరిని సోవియట్ శిబిరం నుండి బయటికి రప్పించడానికి, జరిగిన తెరుగుబ్రాటుని అణచివేయడానికి 1956 అక్టోబర్‌లో సోవియట్ యూనియన్ హంగేరిలో సైనిక చొరబాటు జరిపింది. ఐక్యరాజ్య సమితి చొరబాటుని ఖండించింది. చొరబాటుని విరమించుకోవలసిందిగా డిమాండు చేసింది. ఖండనలో పాల్గొనకుండా భారతదేశం గైరుహాజరయింది. యూరప్‌లో రెందు ప్రాంతాల ప్రభావం - పశ్చిమ దేశాల, తూర్పుదేశాల 'పభావం రెండవ ప్రపంచ యుద్ధానంతర జీవితంలో ఒక వాస్తవం. పరిస్థితిలో చిన్న మార్పు కూడా పెద్ద ఉపద్రవానికి దారి తీస్తుంది. సోవియట్ యూనియన్ని చిన్నబుచ్చడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీలేదు. ఒక విధానపరమైన అంశంగా భావించి భారతదేశం గైరుహాజరయింది. ఖండించడం భవిష్యత్తులో రాజీపడడాన్ని కష్టతరం చేస్తుంది. నెహ్రూ సోవియట్ చర్యని విమర్శించారు. తన అయిష్టతని వ్యక్తం చేసేందుకు రెండు సంవత్సరాల వరకు బుడాపెస్ట్కి రాయబారిని పంపించలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాళ్ళీరు సమస్య వచ్చినప్పుడు సోవియట్ యూనియన్ గైర్దాజరై బదులు తీర్చుకుంది. తరువాత భారతదేశ (ప్రయోజనాలకు భిన్నంగా వీటో హక్షుని వినియోగించుకుంది. భారతదేశంపై రెండు వైపుల నుండి ఒత్తిడి వచ్చింది. కానీ ఏ ఒకృవైపుకీ మొగ్గు చూపలేదు. కాంగో
కాంగో స్వతంత్ర సమగ్రతల పరిరక్షణలో భారతదేశం అందజేసిన సహాయ సహకారాలు భారతదేశ విదేశాంగ విధానం యొక్క విజయాలుగా పేర్కొనవచ్చు. కాంగో 1960 జూన్ 30న బెల్జియం నుండి స్వతంత్రం పొందింది. కాంగోలో రాగితో సంపన్న రాష్ట్రంగా ఉన్న కటంగా కాంగో నుండి స్వతంత్రతను (ప్రకటించుకుంది. తిరుగుబాటు నాయకుడు వోంబేకి బెల్టీయం మద్దతు ఉంది. బెల్జియం పౌరులకు రక్షణ కల్పించే నెపంతో బెల్జియం సేనలు కాంగో రాజధానికి తరలించబడ్డాయి. కాంగో ప్రధాన మంత్రి పాట్రిస్ స్వతంత్రం తర్వాత భారతదేశం ౨౧7
లుమూంబా ఐక్యరాజ్య సమితి, అమెరికా, సోవియట్ యూనియన్ల సహాయం అర్ధించాడు. సహాయం కొరకు తగు ఏర్పాట్లు చేయమని ఐక్యరాజ్యసమితి తన సెక్రటరీ జనరల్ డేగ్ హెమర్ షోల్ట్ని ఆదేశించింది. తరువాత కొద్ది నెలలు విదేశీ శక్తులు తమ కీలుబొమ్మలకు అధికారం అప్పజెప్పేందుకు చురుకుగా ప్రయత్సాలు చేశాయి. అమెరికా ప్రెసిడెంటు కసావుబుకి మద్దతు ఇచ్చింది. సోవియట్ యూనియన్ పాట్రిస్ లుముంబాకు దన్నుగో నిలబడింది. బెల్జియం సైనిక నాయకుడు మొబుటు"కి ఆశీస్సులందజేసింది. వారి ఎత్తుగడలు లుముంబా హత్యకి దారితీశాయి. లుముంబా హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిల ఐక్యరాజ్యసమితి చాలా నిర్ణయాత్మక పాత్ర నిర్వహించాలని కిరాయి సైనికుత్ని వి శ సైనికుల్ని తొలగించాలని, అంతర్యుద్దాన్ని ఆపాలని పార్లమెంటుని సమావేశపరిచి క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెహ్రూ డిమాండు చేశారు. అంతేకాక అందుకవసరమై' సైనికుల్ని పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించింది, భద్రతామండలి 1961 ఫిబ్రవరి 21న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భార దళాలు జయప్రదంగా అంతర్యుద్దాన్ని అణచివేశాయి. కటాంగా పై కేంద్ర పాన అధికారాన్ని పునరుద్ధరించాయి. 1968 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా శాంతి భద్ర పునరుద్ధరించబడ్డాయి.
దేగ్ హేమర్షోల్డ్ భారతదేశాన్ని అభినందించారు. అవి భారతదేశ అలీన విధానానికి అత్యుత్తమ ఘడియలు. కొత్తగా స్వతంత్రం పొందిన ఆఫ్రికా, ఆసియా దేశాల సహాయపడిన ఘడియలు. ఐక్యరాజ్యసమితి లాంటి బహుళజాతి సంస్థల పాత్రని బలోపేతం చేసిన ఘడియలు.
నెహ్రూ అలీన విధానం సక్రమంగా పనిచేయగలుగుతుందని, అలీన దేశాలు నూతనంగా ఆవిర్భవిస్తున్న దేశాలకు మద్దతుగా నిలిచి పనిచేయాలని నెహ్రూ చెప్పారు కొత్తగా స్వతంత్రం పొందిన దేశాలు స్వతంత్రాన్ని రుచి చూడకముందే వాటిని కబళించడాని అగ్రరాజ్యాలు పొంచివుంటాయిని హెచ్చరించారు. అగ్రరాజ్యాలతో సంబంధాలు-అమెరికా
యుద్ధానంతర ప్రపంచంలో అగ్రరాజ్యమయిన అమెరికాతో సత్సంబంధాలకు భారతదేశ అలీన విధానం ఆటంకం కాలేదు, అభిలషణీయమయింది. సాంకేతిక పరిజ్ఞానం: యంత్రాలు, అభివృద్ధి ప్రయత్నాలకు సహాయం, ఆహారధాన్యాలు, జాతి నిర్మాణానికి, ప్రజాస్వామ్య యత్నాలకు నైతిక మద్దతు - అన్నీ కూడా అమెరికా సమకూర్చగలదని భారతదేశం అశించింది. కాని కాశ్ళీర్పై అమెరికా వైఖరి ఈ ఆశల్ని కలచి వేసింది. 1940 దశాబ్దం చివరిలో, 1950 దశాబ్దం ప్రారంభంలో అమెరికా దాని మిత్రరాజ్యాల 208 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆధిపత్యంలో ఉన్న ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతామండలి కాళ్ళీర్లో పాకిస్తాన్ సైనిక దళాలున్నాయని ఐక్యరాజ్యసమితి కమిషన్ నివేదించిన తర్వాత కూడా పాకిస్తాన్ దురాక్రమణపై, భారతదేశ ఆరోపణపై నిర్ణయాన్ని ఠలాయించింది. భారతదేశానికి అనుకూలంగా ఉన్న ఐక్యరాజ్యసమితి మధ్యవర్తుల నిర్ధారణలన్నీ విస్మరించబడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను భారతదేశం పాటించలేదనే కల్పిత కథని పాశ్చాత్య దేశాలు తమ శక్తివంతమైన ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేశాయి. ఆహార ధాన్యాల కొరకు చేసిన విజ్ఞప్తులు పక్కన పెట్టాయి. 1949లో నెహ్రూ అమెరికా పర్యటనలో దేశంలోని కరవు పరిస్థితుల్ని వివరించినప్పటకీ, నెహ్రూ ఆ విషయాన్నే ప్రస్తావించలేదన్నది అమెరికా. బైనా, సోవియట్ యూనియన్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన తర్వాత అమెరిక్షా ఆహార ధాన్యాల నౌకలను పంపించింది.
1950 దశాబ్దం ప్రారంభంలో భారతదేశం కమ్యూనిస్టు చైనాని గుర్రించడాన్ని అమెరిక్షా జీర్ణంచుకోలేకపోయింది. ఐక్యరాజ్య సమితిలో చైనాకు ప్రాతినిధ్యం ఇవ్వాలన్న భారతదేశ వైఖరి అమెరికాకు రుచించలేదు. కొరియాపై భారతదేశం తీసుకున్న తొలి వైఖరిని అమెరికా స్వాగతించింది. తర్వాత వైఖరిని నిరసించింది. పొకిస్తాన్కి మిలటరీ సహాయాన్ని అందజేసేందుకు 1952 లోనే సిద్ధపడింది. 1958లో బాహాటంగా 'పకటించింది. ఆయుధాలు సోవియట్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రయోగించడానికని బయటికి చెప్పింది. కాని అవి హిందూ కుష్ పర్వతాలు దాటి వెళ్లగలిగే ఆయుధాలు కావు. భారతదేశంపై ప్రయోగించడానికి పనికి వస్తాయి. భారతదేశంపై ప్రయోగించబడవని అర్ధం పర్ధం లేని హామీలు గుప్పించి భారతదేశ అభ్యంతరాలను అమెరికా తోసిపుచ్చింది. పాకిస్తాన్‌ని 66110. $96160 లలో చేర్చుకుని (ప్రచ్చన్న యుద్దాన్ని ఉపఖండంలోకి తెచ్చినందుకు నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశాడు. గోవా విషయంలో కూడా భారతదేశ ఆందోళనను అమెరికా పరిగణనలోకి తీసుకోలేదు. గోవా పోర్చుగల్ రాష్ట్రమని 1955 లో పోర్చుగల్ వాదనని సమర్ధించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 14 ఏళ్ళు ఓపికగా నిరీక్షించిన తర్వాత భారతదేశం 1961లో గోవాని బలప్రయోగంతో విముక్తి చేసినప్పుడు అమెరికా తీవ్రంగా విమర్శించింది.
(ప్రపంచంలో రెండు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేకపోవడానికి కారణం రెండింటికి ప్రచ్చన్నయుద్ధం పట్ల వేర్వేరు దృక్పథాలు ఉండడమే, కమ్యూనిజం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఆమెరికా ఇతరులకు ప్రత్యామ్నాయ ప్రాధాన్యతలు ఉండడాన్ని అంగీకరించలేకపోయింది. ప్రపంచం వాషింగ్టన్ నుండి చూస్తే స్వతంత్రం తర్వాత భారతదేశం 209
నల్లగా తెల్లగా కనిపించింది. ఢిల్లీ నుండి చూస్తే బూడిద రంగులో కనిపించింది. స్వతంళ్రే పోరాటంలో నెహ్రాకి కమ్యూనిస్టులు మంచి మిత్రులుగా తెలుసు. ఆయన మార్చిజంలో చాలా ఎక్కువగా ప్రభావితుదయ్యాడు. నెహ్రూకి కమ్యూనిస్తులతో విభేదాలున్నప్పటి్క అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు తిరుగుబాటుని అణచివేయవలసి వచ్చినప్పుటి ఆయన వారిని చెడ్డ వారిగా పరిగణించలేదు. ఆర్థిక, ఆయుధ, సహాయం కొరకు భారతదేశం ప్రచృన్న యుద్ధంలో పశ్చిమ దేశాల సరసకు చేరదలచుకోలేదు. అంతేగాక భారతదేశం ఆసియా, ఆఫ్రికా దేశాలను అలీన విధానం పాటించమని ప్రోత్సహించింది. భారతదేశం పట్ల అమెరికా వ్యతిరేకతకు కారణం కేవలం ప్రచ్చన్న యుద్ధంలో భారతదేశం అమెరికా పక్షం వహించ నిరాకరించడమే కాదు. బ్రిటీష్ సామాజ్యాన్ని. కూలదోయడం కారణంగా కాంగ్రెస్ నాయకుల పట్ల వ్యతిరేకత, బ్రిటీష్ వారికి అనుకూలం” ఉంటూ యుద్ధ ప్రయత్నాలకు సహకరించింది. కనుక ముస్లిం లీగు - పాకిస్తాన్ పట్ల సానుకూల వైఖరి అమెరికాకు వారసత్వంగా సంక్రమించింది. భారతదేశం సమైక్యం/” ఉండదని అమెరికా నమ్మిక. భారతదేశ వైవిధ్యం, భారతదేశ విచ్చిన్నతకు దారి తీస్తుందని నమ్మంది. ఫలితంగా కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకునే బలమైన కోటగా భారతదేశొన్ని పరిగణించలేదు. పశ్చిమరాజ్యాలకు భారతదేశం యొక్క విశ్వసనీయత, స్థిరత్వం పై బలంగొ నాటుకున్న సందేహాలున్నాయి. అమెరికా విధానం యొక్క ప్రధానమైన లక్షణం అధికారం: సామ్రాజ్యవాదం. భారతదేశ నాయకులు సామ్రాజ్యవాదాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు బాహాటంగా కృషి చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో సామ్రాజ్యవాద శక్తిని బలహీనపరిచే క్రమానికి దోహదం చేశారు. అమెరికా పాలనా వ్యవస్థలో బలమైన వలసవాద అనుకూల ధోరణి ఉంది. యుద్దం తర్వాత ఫ్రెంచి, బ్రిటీష్ వలసలని నిలబెట్టేందుకు మద్దతు ఇచ్చింది. ఆఫ్రికాలో పోర్చుగీసు వలస వాదాన్ని దక్షిణాఫ్రికా, రొడీషియాలలో వోర్సర్, ఇయూన్స్టి్ల వలస వాదాలను సమర్ధించింది. భారతదేశం యొక్క బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి వీరికి ఇంపితం కాదు. అలాగని భారత అమెరికా సంబంధాలు నిరంతర శత్రుత్వంతో సాగాయి అనుకోవడం తప్పు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలున్నాయి. ఇఅమెరికొ సాంకేతిక పరిజ్ఞానానికి యంత్రాలకు వనరు కనుక ఆర్లిక సంబంధాలు అభివృద్ధి చెందాయి. భారతదేశంలో విసృతంగా ప్రభావితం చేయగల అభిప్రాయం అమెరికాకు అనుకూలంగౌ ఉంది. అమెరికాలోని ఛెస్టర్ బౌల్స్, జాన్ షెర్మన్ కూపర్, సెనేటర్ పుల్టైట్ లాంటి ఉదారవాదులు భారతదేశం పట్ల సానుకూల వైఖరితో ఉన్నారు. 1950 దశాబ్దం చివరికి భారత, అమెరికా సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. అందుకు కారణం భారతదేశ 210 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విధానాల పట్ల సరియైన అవగాహన ఏర్పరచుకొనడం కావచ్చు, సోవియట్ మైత్రి, భారతదేశ స్థాయిని పెంచి ఉండవచ్చు. సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కెనడి 'ప్రభుత్వం 1961 లో భారతదేశాన్ని అభిమానించిన వ్యక్తి నెహ్రూకి సన్నిహితుడైన జాన్ గాల్ ట్రైయిత్ని రాయబారిగా పంపించింది.
కానీ 1962 లో భారతదేశంపై చైనా దాడి పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దిగ్భమకు గురైన నెహ్రూ సహాయం కొరకు కెనడీని అర్ధించారు. గాల్ బ్రెయిత్ మధ్యవర్తిగా ఉండి పరిస్థితిని ఒక మేరకు చక్కదిద్దాడు.
కానీ ఈ కథ తన గొప్ప మిత్రుడు, శ్రేయోభిలాషి చైనా చేసిన విద్రోహగాథలో అంతర్భాగం, సోవియట్ యూనియన్
సోవియట్ యూనియన్‌తో భారతదేశ సంబంధాలు సాదాసీదాగా ప్రారంభమై గాధానుబంధంగా అభివృద్ధి చెందాయి. భారతదేశం ఇంకా సొమ్రాజ్యవాద ప్రభావంలో ఉందని సోవియట్ యూనియన్ భావించింది. భారత స్వాతంత్ర్య పోరాటం కాంగ్రెస్ నాయకుల పట్ల కమ్యూనిస్టులకు గల విరుద్ధభావాల ప్రభావం నెహ్రా ప్రభుత్వంపై పడింది. భారత కమ్యూనిస్టు పార్టీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణాలో తిరుగుబాటు చేసింది. కామన్వెల్త్లో ఉండాలన్న భారతదేశ నిర్ణయాన్ని సామాజ్యావాదానికి లౌంగిపోవడంగా పరిగణించింది సోవియట్ యూనియన్. దీనినే సోవియట్ రాయబారి నోవికోవ్ “భారతదేశానికి, ప్రపంచానికి దుర్గినం” గా వర్ణించాడు.
కాని నెహూ1946 తాత్మాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షునిగా ఉపన్యసించినప్పటినుండి కూడా సోవియట్ పట్ల స్నేహపూరిత వైఖరితో ఉన్నారు. ఆయన సోవియట్ యూనియన్ని అభిమానించారు. 1927లో సందర్శించారు. భారతదేశంలో కమ్యూనిస్టు తిరుగుబాటుని సోవియట్ శత్రువైఖరికి నిదర్శనంగా వాఖ్యానించ నిరాకరించారు. స్వాతంత్రానికి ముందే దౌత్య సంబంధాలు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. తన సోదరి విజయలక్ష్మి పండిట్‌ని రాయబారిగా పంపించారు. స్టాలిన్ ఆమెకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.
కాని కొరియా యుద్ధ సంక్షోభంలో భారతదేశం వ్యవహరించిన తీరు సామ్రాజ్యవాద పలుకుబడికి లోనుకాకుండా స్వతంత్రంగా వ్యవహరించడంతో 1951 - 52 నాటికి సోవియట్ కాఠిన్యాన్ని తగ్గించుకున్నది. చైనాతో పాటు రష్యాకూడా ఆహార స్వతంత్రం తర్వాత భారతదేశం లయ
ధాన్యాల నౌకలు పంపించింది. నూతన రాయబారి, తర్వాత కాలంలో కానున్న రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్‌ని స్టాలిన్ కొన్ని సార్లు కలిశాడు. స్నేహ ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. కాళ్ళీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితిలో మద్దతు సూచనలు ప్రారంభమయ్యాయి. నెవ్రూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయవద్దని భారత కమ్యూనిస్టు పార్టీకి సూచనలు అందాలూ. 1954లో స్టాలిన్ మరణానంతరం ఈ క్రమం వేగవంతం చేయబడింది. పాకిస్తాన్ సెంటో (09010), సీటో ($61210) లలో చేరిన తర్వాత సోవియట్ యూనియన్ భారతదేశానికి సైనిక పరికరాలను ఇస్తానని ప్రతిపాదించింది. కానీ ఉచితంగా సైనిక సహాయాన్ని పొందగూడదని తన విధానాలకి అనుగుణంగా భారతదేశం సహాయాన్ని నిరాకరించింది. 1955లో నెహ్రూ సోవియట్ యూనియన్ సందర్శించాడు. అదే సంవత్సరంలో కృళ్చేన్: బుల్గానిన్ లు భారతదేశం సందర్శించారు. 1956లో సోవియట్ యూనియన్ అదుపులో ఉండి అన్ని కమ్యూనిస్టు పార్టీలకు సైద్ధాంతిక పంథాని నిర్ధేశించిన కామింటర్న్ 20వ కాంగ్రెస్, స్టాలిన్ మరణానంతరం స్టాలిన్ విధానాలను రద్దు చేసే క్రమంపై అమోదముట వేసింది. నివిధ సామాజిక వ్యవస్థలు గల దేశాల మధ్య శాంతియుత సహాజీవనొన్ని (ప్రస్తావించడం ద్వారా ప్రచ్చన్న యుద్ధ వైఖరిని సరళతరం చేసే ప్రయత్నం చేసింది. అది మార్చిజంలో పూర్తిగా నూతన భావనని “సోషలిజానికి శాంతియుత మార్తాన్తా” ప్రవేశపెట్టింది. అమెరికా ఈ అవకాశాల కనుగుణంగా స్పందించడంలో విఫలమయింది. పరస్పర సహకారానికి అడ్డుగా ఉన్న సైద్ధాంతిక అవరోధాలు తొలగించబడ్డాయి. కనుక ఇది భారత్, సోవియట్ సంబంధాలకు ఎంతో దోహదపడింది. కాశ్మీర్‌పై భారత వైఖరికీ 1955 నుండి సోవియట్ యూనియన్ పూర్తి మద్దతును ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కాశ్మీర్‌పై భారతదేశానికి ప్రతికూలంగా ఉన్న తీర్మానాలను అద్దుకునేందుకు సోవియట్ యూనియన్ 1956 నుండి వీటోని ప్రయోగించింది. వీటోని ప్రయోగిస్తానని బెదిరించింది. సోవియట్ యూనియన్ రక్షణగా నిలబదదం ప్రారంభించేవరకు భద్రతామండలిలో భారతదేశ పరిస్తితి చాలా ఇరకాటంలో ఉంది. కనుక సోవియట్ వీటో బెదిరింపులని, వీటో చేయడాన్ని తక్కువ అంచనా వేయకూడదు. కాళ్ళీర్పై ఇచ్చిన నిలకడయైన మద్దతు భారత, సోవియట్ మైత్రీ బంధాన్ని దృఢతరం చేసింది. రెండు దేశాలు కూడా వలసవాదానికి వ్యతిరేకంగా ఒకే వైఖరిని అవలంబించాయి- ఐక్యరాజ్యసమితిలో గోవా విలీనం సమస్యపై సోవియట్ యూనియన్ అమెరికాని వ్యతిరేకించి భారతదేశానికి మద్దతునిచ్చింది. 212 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రణాళిక ప్రాతిపదికగా పారిశ్రామికీకరణలో - ప్రత్యేకించి భారీ పరిశ్రమలో పబ్లిక్ సెక్టర్‌కి ప్రధానమైన పాత్ర - ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ఎంపిక చేసుకున్న పంథా సోవియట్ యూనియన్ సన్నిహితం చేసింది. పశ్చిమ రాజ్యాలు, ప్రత్యేకించి అమెరికా సహాయపడేందుకు తటపటాయిస్తున్న సమయంలో, 1956 భిలాయ ఉక్కు కర్మాగారం నిర్మించడంలో సహాయపడింది. ఆ తర్వాత బ్రిటీష్ సహకారంతో దుర్గాపూర్‌లో, జర్మన్ సహకారంతో రూర్కెలా ఉక్కు కర్మాగారాలు నిర్మించబడ్డాయి. బొకారో కర్మాగారానికి అమెరికా సహాయం కోరగా, అది అంత సంసిదత చూపకపోవడంతో మరలా సోవియట్ ముందుకు వచ్చి సహాయపడింది. ఆ తర్వాతి సంవత్సరాలలో చమురు అన్వేషణలో కూడా కీలకపాత్ర పోషించింది. భారతదేశం “ఉక్కులో 30 శాతం, చమురులో 35 శాతం, విద్యుత్ శక్తిలో 20 శాతం, భారీ విద్యుత్ పరికరాలతో 65 శాతం, యంత్రాలనుత్పత్తి చేసే భారీయంత్రాల ఉత్పత్తిలో 85 శాతం సోవియట్ సహకారంతో నిర్మించబడిన భారీ పరిశ్రమల ద్వారా జరుగుతుందని 1973 -_ 74 లో అంచనా వేయబడింది.”
దలైలామా భారతదేశంతో ఆథయంకోరడం, భారత చైనా సరిహద్దులో ఘర్షణలతో 1969 నుండి భారత చైనాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలయింది. అప్పుడు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సోదరదేశం పక్షం వహించలేదు. తటస్థంగా వుంది. ఆ పరిస్థితులలో తటస్థంగా వుండడమే పెద్దదహాయం. నెహ్రు సోవియట్ వైఖరి ప్రాధాన్యతను గుర్తించారు. సోవియట్ యూనియన్‌కి ఇంకా సన్నిహ్రితుడయ్యాడు. అదే ఘటనతో సోవియట్ టైనా విభేదాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం మిలటరీ సరఫరాల మొదటి ఒప్పందంపై భారతదేశం సోవియట్ యూనియన్ సంతకాలు చేశాయి. 1960లో భారతదేశం వైనాతో వివాదం వున్న ప్రాంతాలలో రోడ్లు నిర్మించేందుకు సరఫరాలను చేరవేసే విమానాలు, హెలికాష్టర్లు ఇంజనీరింగు పరికరాలు సోవియట్ యూనియన్ నుండి పొందింది. 1962 మధ్యలో మిగ్ విమానాలనుత్పత్తి చేయడానికి భారతదేశాన్ని అనుమతించే ఒప్పందం కుదుర్చుకొనబడింది. ఇది సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టేతర దేశాన్ని అధునాతన సైనిక పరికరాలను తయారు చేసుకొనడానికి అనుమతించిన మొదటి ఒప్పందం. సోవియట్ యూనియన్ అప్పటి వరకు చైనాకు కూడా అనుమతినివ్వలేదు.
1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినవ్చుడు మరలా సోవియట్ యూనియన్ తటస్థత పాటించింది. అందుకు క్యూబా క్షిపణి సంక్షోభం తారాస్థాయిలో స్వతం[త్రం తర్వాత భారతదేశం 213
వున్నప్పుడు దాడి జరగడం పాక్షికంగా కారణం కావచ్చు. ఆ తరువాత 1962 డిసెంబరులో సోవియట్ ముఖ్యనాయకుడు సుస్లోవ్ సుప్రీం సోవియట్ సమావేశంలో యుద్దానికి చైనాదే బాధ్యత అని విస్పష్టంగా ప్రకటించాడు. భారత చైనా యుద్ధకాలంలో పశ్చిమ రాజ్యాలలా గాక సోవియట్ యూనియన్ చాలా ఆయుధాల విక్రయం ఒప్పందాలపై సంతకాలు చేసింది. హెలికాప్టర్లు టాంకులు, మొబైల్ రాదార్ సెట్లు, భూమిపై నుండి గగనంలోకి ప్రయాణించగల క్షిపణులు, సబ్మేరిన్లు, క్షిపణినౌకలు, గస్తీ నౌకలు సరఫరా చేసింది మిగ్ విమానాల నుత్పత్తి చేసుకోనడానికి, నౌకాస్థావరాల నిర్మాణానికి తోద్బడింది. హెలికాప్టర్లు టాంకులు, సబ్మెరైన్లు, సరఫరా చేసింది మిగ్ విమానాల ఉత్పత్తి సౌకర్యాల అభివృద్ధికి నిర్మాణానికి తోడ్పడింది. ఈ స్వతంత్ర ఉత్పత్తి స్థావరం భారతదేశం 1971 యుద్ధంలో విజయం సాధించడానికి తోద్చడింది. మరీ ముఖ్యంగా అమెరికా లాగా గాక యుద్ధపరికరాల ఉపయోగించటాన్ని పర్యవేక్షించేందుకు వారి సైనిక స్థావరాన్ని నెలకోల్పడం గాని లేక యుద్ధపరికరాల్ని సరఫా చేసేందుకు కఠినతరమైన షరతుల్ని విధించడంగాని చేయలేదు. సోవియట్ యూనియన్ కూడా భారతదేశంతో సంబంధంతో ప్రయోజనం పొందింది. సోవియట్ మైత్రిని కోరుకుంటూ అమెరికాకు ఉపగ్రహలుగా మారడానికీ యిష్టపడని, కొత్తగా స్వతంత్రం పొందిన ఆఫ్రికా, ఆసియా ప్రపంచదేశాలకు భారతదేశం ముఖ్యమైన ముఖద్వారం. ఇది ప్రచృన్న యుద్ధంలో సోవియట్ యూనియన్‌కి సహాయపడింది. సోవియట్లకు కూడా భారతదేశం లాగానే చైనాతో సుదీర్ధమైన సరిహద్దు వుంది. పరిష్మరింపబడని సరిహద్దు వివాదాలూ వున్నాయి. భారతదేశంతో మైత్రి చైనాని అదుపులో వుంచింది. భారతదేశాల నుండి సమతుల్యతా మొగ్గుని మార్చింది. ఇది కూడా సోవియట్కీ అనుకూలమైన అంశమే. అమెరికా (్రేరిత ఒప్పందాలు, మిలటరీ స్థావరాలతో పరివేష్టించబడిన సోవియట్ యూనియన్‌కి మిత్రులు కావాలి. ఇతర దేశాలతో సమానస్థాయితో మిత్రత్వం నెరపింది. అంతేకాక లోపాలున్నప్పటికి మార్శిజం జాత్యాహంకారానికి వ్యతిరేకమైనది, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైనది, పేదలకు అనుకూలమైనద్ది, బద్ద ఆవిధంగా భారత సోవియట్ మైత్రి భారత విదేశాంగ విధానంతో ముఖ్యమైన అంశంగా ఆవిర్భవించింది. అభివృద్ధి చెందింది. 2ైక్షేక్ష బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పొర్ప్సుగ్స దేశాలతో సంబంధాలు
1962 వరకు భారతదేశం ఒక్క పాకిస్తాన్ మినహాయించి మిగిలిన అన్ని పొరుగు దేశాలత్రో సత్సంబంధాలు కలిగి వుంది. 1950లో నేపాల్‌తో శాంతి స్నేహ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది భారతదేశం ద్వారా వాణిజ్య రవాణాకు అవకాశం కల్పించింది. ఇరుదేశాలు పరస్పర రక్షణకు బాధ్యత వహించడం వలన నేపొల్ సర్వసత్తాక అధికారానికి రక్షణ క్రల్పించింది. బర్మాలో స్థిరపడిన భారతీయుల సమస్య, సరిహద్దు సమస్య స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయి. శ్రీలంకలో స్థిరపడిన తమిళుల సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేది కాదు. ఉద్రిక్తతలు వున్నాయి. కాని ఈకాలంలో అవి రగుల్మానలేదు. ఇతరత్రా స్నేహ సంబంధాలు కొనసాగాయి. కాని పాకిస్థాన్‌తో, తరువాత సంవత్సరాలలో చైనాతో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. వాటితో సంబంధాలు దిగువన వివరంగా చర్చించబడ్డాయి. పాకిస్తాన్
నెహ్రూ ఇతర నాయకులు దారికిరాని సమస్యకు పరిష్కారంగా అయిష్టంగానే దేశవిభజనకు అంగీకరించారు. విభజనతో వైరం కూడా అంతమవుతుందని ఆశించారు. కాని సమస్య తీవ్రత అంతర్జాతీయ రంగానికి బదిలీ చేయబడింది. గతంలో ఎన్నదూ లేనంత పెద్ద ఎత్తున జరిగిన మత ఘర్షణలు, ప్రజల వలసలు సంబంధాలను దెబ్బతీశాయి. కాని స్వతంత్రం వచ్చిన రెండు నెలల తరువాత 1947అక్టోబరులో కాళ్ళీరుపై పాకిస్తాన్ దాడి కార్యకారణ సంబంధంతో చాలా ఘటనలకు దారి తీసింది. దాని యిటీవలి పరిణామమే కార్గిల్ యుద్ధం. 7వ అధ్యాయంలో వివరించినట్లు భారత్‌లో కాళ్ళీర్ విలీనం చిక్కుసమస్య బ్రిటీషు పాలకులు దేశాన్ని వదలి వెళ్ళినప్పుడు భారతీయ రాజుల చేత నామమాత్రంగాను, పరోక్షంగా బ్రిటీషు వారి చేతను పాలింపబడిన అత్యధిక స్వదేశీ సంస్థానాలు ఇటు భారతదేశంలో గాని అటు పాకిస్థాన్‌లో గాని విలీనమయ్యాయి. బ్రిటీషు పాలకులు ప్రోత్సహించిన దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రమాదం నివారించ బడింది. కాని బ్రిటీషు అధికారులు అలాగే పాకిస్తాన్ ప్రోత్సాహంతో కొన్ని సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలను గురించి కలలుగనడం ప్రారంభించాయి. హైదరాబాద్, జూనాగడ్, కాళ్ళ్మీరు అలాంటి సంస్థానాలు. హైదరాబాద్, జునాగడ్ భారతదేశంచే పరివేస్టింపబడి ఉన్నాయి. కనుక వాటికి అలాంటి అవకాశం బహు తక్కువ. కానీ కాశ్మీర్ సరిహద్దు పాకిస్తాన్‌తో ఉంది. మెజారిటీ ప్రజలు ముస్లింలు, హిందూ పాలకుడు నెహ్రూ, కాంగ్రెస్‌కి సన్నిహితుడైన పేక్ స్వతంత్రం తర్వాత భారతదేశం 215
అబ్బుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో ప్రజాస్వామ్యం కొరకు ప్రజాఉద్యమం సమస్యని జటిలం చేయడానికి ఇంధనంగా పనిచేశాయి. మహారాజా యథాస్థితిని కొనసాగిస్తూ తాను ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఒక సంవత్సరం వ్యవధి కోరాడు. పాకిస్తాన్ అంగీకరించింది. భారతదేశం ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కనుగొని ఆ తర్వాత తెలియజేయాలనుకొన్నది. కాశ్మీర్లో ప్రజాభిప్రాయం తనకనుకూలంగా ఉండకపోవచ్చని ఆందోళన చెందింది. పాకిస్తాన్ కాళ్ళీర్పై దాడి చేసేందుకు సరిహద్దు రాష్ట్రం నుండి తెగల ప్రజలనబడే వారికి తోడుగా సాయుధదళాల్ని పంపించింది. మహరాజా భారతదేశ సహయాన్ని అర్థించాడు. కానీ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైతేనే సైన్యాన్ని పంపించగలుగుతుంది. ఇతర వందలాది సంస్థానాధీశులలాగానే మహారాజా విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. కాళ్ళీర్ భారతదేశంలో భాగమైంది. భారత సైన్యాలు సకాలంలో శ్రీనగర్ చేరాయి. రాజధాని నగరం దురాక్రమణ దారుల వశం కాకుందొ అద్దుకున్నాయి. భారతదేశం పాకిస్తాన్ 'వలంటీర్లను” వెనక్కి నెట్టివేశాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. అక్కడ న్యాయం పొందడానికి బదులుగా భారతదేశం ప్రచ్చన్నయుద్ధ రాజకీయాలలో మొదటి పాఠం నేర్చుకుంది. భారతదేశం యొక్క అసమ్మతిని, ఆగ్రహాన్ని, ముస్లింలీగు, పాకిస్తాన్ల పట్ల అనురాగం ఆసక్తిని పెంచి పోషించడం కొనసాగించిన బ్రిటీషువారి ప్రోత్సాహంతో, వ్యూహాత్మక కారణాల రీత్యా సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్‌తో జట్టుకట్టింది. భారతదేశం సామ్రాజ్యవాదానికి విధేయత కొనసాగిస్తుందా లేదా? అనే విషయంపై సోవియట్ యూనియన్ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అందువల్ల మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ భారతదేశం సైనిక పరిస్థితి తనకనుకూలంగా ఉన్నప్పటికీ ఐక్యరాజ్యసమితి యుద్ధవిరమణ తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసినందుకు సప్లెబిసైటు నిర్వహిస్తామన్నందుకు నెహ్రూ తర్వాత తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఈ విమర్శలు అర్ధరహితం. ఎందుకంటే భారతదేశం ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసి ఉండకపోతే పాకిస్తాన్ చేసంది ప్లెబిసైటు జరపమని కోరివుందేది. ప్లెైబిసైటు నిర్వహించడానికి తర్వాత్ భారతదేశం నిరాకరించడం వల్ల అపార్ధం చేసుకొనబడింది. 1948 ఆగస్టు ఐక్యరాజ్యసమితి ప్రీర్మానం ఫ్లెబిసైటు నిర్వహించడానికి రెండు షరతుల్ని విధించిందనే అంశానికి అంతగా ప్రచారం లభించలేదు. ఒకటి : పాకిస్తాన్ సైన్యాల్ని జమ్మూ కాళ్ళీర్ నుండి విరమించుకోవాలి. రెండు : శ్రీనగర్ పరిపాలనాధికారం రాష్ట్రం మొత్తానికి వర్తింపచేయాలి. శ్ర షరతులు అమలు జరగలేదు. ఈ కాలంలో కాళ్ళీరు రాజ్యాంగ పరిషత్ కొరక్త ఎన్నికలు జరిపింది. రాజ్యాంగ పరిషత్ భారతదేశంలో విలీనం కావడానికి 216 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కటు వేసింది. భారత ప్రభుత్వం పెబిసైట్కి సరియైన ప్రత్యామ్నాయం రాజ్యాంగపరిషత్ ఓటు అనే వైఖరి తీసుకుంది. తర్వాత కాళ్ళీర్ భారత సాధారణ ఎన్నికల్లో పాల్గొన్నది. రాష్ట్ర ఎన్నికలు నిర్వహించింది. ఆ విధంగా ప్లెబిసైటుపై చర్చని అసంబద్ధం చేసింది. ఏమైనప్పటికీ ముస్టిమ్సులు సహజంగా ముస్లింలీగుకి విధేయులుగా ఉంటారని, ముస్లిం మెజారిటీ 'పాంతాలు పాకిస్తాన్‌కి చెందుతాయని, ఆ ప్రాతిపదికన కాళ్ళీరు పాకిస్తాన్‌కి చెందాలని భౌరత్ర జాతీయోద్యమ చరిత్రలో పరిచయం లేని పాశ్చాత్య పరిశీలకుల కొరకు పాకిస్తాన్ చేసే వాదన. ద్విజాతి సిద్ధాంత వాదనని భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదు.
1953 - 54 లో కొద్దికాలం కాశ్ళీరు సమస్య పరిష్మరింపబడుతుందనే విశ్వాసం కలిగించిన కాలం. 1953 లో మహమ్మదాలీ బోగ్రా పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూ మహమ్మదాలీలు కలిసి సాదరంగా మాట్లాడుకున్నారు. కాశ్మీరులో ప్లెబిసైట్లు నిర్వహణకు నెహ్రూ అంగీకరించాడని 1958 ఆగస్టు 20న ఉమ్మడి ప్రకటన వెలువడింది. కాని ఈ ఆశాజ్యోతిని ప్రచృన్న యుద్ధ రాజకీయ అవసరాలు ఆర్సివేశాయి. భారతదేశ అలీనత అనైతికమైనదని, కాబట్టి తాను (అమెరికా) పాకిస్తాన్‌కి మిలటరీ సహాయం అందజేయాలని కొరియా యుద్ధం తర్వాత అమెరికా నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్లెైబిసైటు నిర్వహణాధికారి పొరుగుదేశం నుండి ఒకరిని పంపమని భారతదేశం కోరగా అమెరికా సీనియర్ సైనికాధికారి అడ్మిరల్ నిమిజ్ పేరు ('పతిపాదించబడింది. రాజీకి గల చివరి అవకాశం చేజారిపోయింది.
పాకిస్తాన్ ౧౫౧౦. 92410, బాగ్దాద్ ఒప్పందం, 1954లో అమెరికాతో మిలటరీ ఒప్పందం వగైరాలతో ఆమెరికా ఆధిపత్యం గల సైనిక కూటమిలో అధికారికంగా ఏలీనమవడంతో కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితిలో తరచుగా ప్రస్తావించబడింది. ఆమెరికా ఆడించినవిధంగా ఆదేందుకు భారతదేశం తిరస్కరించింది. పాకిస్తాన్ అంగీకరించింది (స్వతంత్రం రాకముందు ముస్లింలీగు బ్రిటన్ ఆడించిన విధంగా ఆడింది. దానిబిడ్డ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఆదేశాల మేరకు ఆడుతుంది. కాంగ్రెస్ సామ్రాజ్యవాద వ్యతిరేక సంప్రదాయాన్ని కొనసాగించింది). ఈ పరిస్థితుల్లో కాళ్ళీరు సమస్య పరిష్కారానికి వదో అద్భుతం జరగాలి. భారతదేశ అలీన విధానాన్ని సోవియట్ యూనియన్ అర్ధం చేసుకోవడం ప్రారంభించి, కాశ్మీరు సమస్యపై భారతదేశాన్ని బాహాటంగా బలపరిచినప్పుడు కొంత ఉపశమనం పొందినట్లు భారతదేశం నిట్టూర్పు విడిచింది. 1956 తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కాళ్ళీరు సమస్యపై భారతదేశానికి అంగీకార యోగ్యంగాని
స్వతంత్రం తర్వాత భారతదేశం లగా
అన్ని తీర్మానాలను తిరస్మరించేందుకు సోవియట్ యూనియన్ వీటో అధికారాన్ని ప్రయోగించింది. భారతదేశం కాశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ ఒత్తిడిని 1950 దశాబ్దం మధ్యలో, చివరిలో 1960 దశాబ్దం ప్రారంభంలో తట్టుకొనగలిగింది. కానీ 1962 లో చైనా దాడితో భారతదేశం పశ్చిమదేశాల సహాయం అర్ధించక తప్పలేదు. ఆమెరికా, బ్రిటీషు ఒత్తిదికి తట్టుకోవడం కష్టమయింది. 1962 నుండి పాకిస్తాన్ చైనాతో జతకట్టడంతో భారతదేశాన్ని అడకత్తెర దాడికి గురిచేసే పరిస్థితి ఏర్పడింది. 1960 దశాబ్దం మధ్యలో సోవియట్ యూనియన్ పాకిస్తాన్‌కి కొంత సన్నిహితమయ్యే అవకాశాన్ని (1965 భారత - పాకిస్తాన్ యుద్దాన్ని ఆపివేయించేందుకు కోసిగిన్ తాష్కంట్‌లో తీసుకున్న చొరవ దానిలో భాగమే) పరిశీలించింది. కాని పాకిస్తాన్ పశ్చిమ దేశాల విధానంతో విలీనమయింది. కనుక దాని వలన ప్రయోజనం లేదని సోవియట్ యూనియన్ గుర్తించింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్యగల సంబంధాలు నెహ్రూకు, భారతీయులకు బాధ కలిగించాయి. ఉమ్మడి చరిత్ర భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, పేదరికంలో అలమటిస్తున్న ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరుచుకునే లక్ష్యం - రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచిఉండవలసింది. రెండు దేశాల సంబంధంలో గల అడ్డంకుల్ని తొలగించాలని నెహ్రూ శాయశక్తులా కృషిచేశారు. విభజనకు ముందుగల ఆస్తి పంపకం శరణార్థులక్తు నష్టపరిహారం, సింధునదీ జలాల పంపకం అన్నింటిలో నెహ్రూ చాలొ ఉదారంగా వ్యవహరించారు. 1953లో పాకిస్తాన్ సందర్శించారు. విభజన పరిష్కారంలో భాగంగా భారతదేశం పెద్దమొత్తాల్ని చెల్లించింది. పాకిస్తాన్ కాళ్మీర్ పై దాడి చేసినప్పుడు భారతప్రథృత్యం చెల్లింపుల్ని ఆపివేసింది. గాంధీజీకి విషయం తెలిసింది. చెల్లింపుల్ని పాకిస్తాన్ యుద్ధ అవసరాలకు వినియోగించకుండా నిరోధించేందుకు తాత్మాలికంగా నిలిపివేసినట్లుగొ నెహా, పబేల్ చెప్పిన అభ్యంతరాలను తోసిపుచ్చి వెంటనే చెల్లింపులకు ఏర్పాట్లు చేయించారు. అదే సమయంలో కాళ్ళీరును సాయుధదళాలతో రక్షించుకోవడానికి సమర్ధించాడు. పాకిస్తాన్ వివేశ్రాంగ విధానం మన విదేశాంగ విధానం కంటే బాగుందని కొందరు వాభ్యానిస్తుంటారు. ఈ సందర్భంగా కె.పి.యస్.మీనన్ వ్యాఖ్యని జ్ఞప్తి తెచ్చుకోవడం అవసరం. తనన 'పాకిస్తాన్ రాజనీవ్రిజ్ఞత ఫలితం: అయూబ్‌ఖాన్ పదవి కోల్పోయాడు. యవహ్యాఖాన్ న స్వతంత్రం కోల్పోయాడు. షాక్రిస్తాన్ సగం భూభాగాన్ని కోల్పోయింది.” 218 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చైనా
భారతదేశం ప్రారభం నుండి చైనాతో స్నేహ సంబంధం పాటించే విధానం అవలంబించింది. సామ్రాజ్యవాదం పట్ల వైనా చేసిన పోరాటం పట్ల కాంగైస్ సహానుభూతి 'పకటించింది. 1980 లలో చైనాకు వైద్యబృ్బందాన్ని పంపించింది. జపాన్ చైనాని ఆక్రమించడానికి వ్యతిరేకతని వ్యక్తం చేసేందుకు జపాన్ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. చైనా ప్రజారిపబ్లిక్ని మొట్టమొదటగా అంటే 1950 జనవరి 1న గుర్తించిన దేశం భారతదేశం. వలసవాద శక్తులచేతుల్లో బాధలకు గురయిన అనుభవం గల రెండుదేశాలు, పేదరికం, వెనుకబాటుతనం ఉమ్మడి సమస్యలుగా గల రెండు దేశాలు ప్రపంచంలో ఆసియాకు తగుస్థానం కల్పించేందుకు చేతులు కలపాలని పెద్ద ఆశలు ఆకాంక్షలతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కమ్యూనిస్టు చైనాకు ప్రాతినిధ్యం వుండాలని నెహ్రూ ఒత్తిడి తెచ్చాడు. కొరియా యుద్ధంలో అమెరికా వైఖరిని బలపరచలేదు. కొరియా యుద్ధ పరిష్కారానికి శాయశక్తులా కృషి చేశాడు. 1950లో చైనా టిబెట్టుని ఆక్రమించినప్పుడు తనను విశ్వాసంలోనికి తీసుకోనందుకు భారతదేశం కొంత ఆందోళన చెందింది. కాన చైనా చరిత్రలో టిబెట్ చాలా సార్లు చైనా పరిపాలనలో ఉంది గనుక టిబెట్టుపై చైనాకు గల హక్షుల్ని గుర్తించి ప్రశ్నించలేదు. 1954లో భారతదేశం చైనా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దానిలో టిబెట్టుపై చైనా హక్కుల్ని భారతదేశం గుర్తించింది. ఇరు దేశాలు తమ పరస్పర సంబంధాలలో పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉండాలని అంగీకరించాయి. సరిహద్దు వివాదాలు చర్చకు వచ్చాయి. కానీ చైనా తాను ఇంకా కొమింగ్‌టాంగ్ మ్యాపులను అధ్యయనం చేయలేదని, విభేదాలు తర్వాత పరిష్కనించుకోవచ్చని చెప్పింది.
రెండు దేశాల మధ్య సంబంధాలు సన్నిహితంగా కొనసాగుతున్నాయి. నెహ్రా బాందుంగ్ సదస్సులో వైనా గురించి వౌ-యన్-లై ని గురించి గొప్పగా చెప్పాడు. కాని 1959లో టిబెట్‌లో పెద్దతిరుగుబాటు చెలరేగింది. వేలాదిమంది కాందిశీకులతో దలైలామా టిబెట్టు ఉండి తప్పించుకుపోయాడు. భారతదేశం దలైలామాకు ఆశ్రయం కల్పించింది. కానీ ప్రవాస ప్రభుత్వాన్ని స్థాపించేందుకు అనుమతించలేదు. రాజకీయ కార్యకలాపాలు చేపట్టవద్దని చెప్పింది. అయినప్పటికీ చైనీయులకు ఇది నచ్చలేదు. 1959 అక్టోబర్‌లో వైనావాళ్లు లడక్‌లోని కోంగ్కా కనుమ వద్ద భారతదేశ గస్తీదళంపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. 12 మంది ఖైదీలుగా పట్టుబడ్డారు. రెండు (ప్రభుత్వాలమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. చర్చలకు ఉమ్మడి ప్రాతిపదిక ఏర్పడలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 219
భారతదేశం 1960 ఏప్రిల్‌లో చౌయన్ లై ని ఢిల్లీకి ఆహ్వానించింది. చర్చలు ముందుకు సాగలేదు. చర్చల ప్రాతిపదికన అధికారులచే రూపొందించ బడాలని నిర్భయం జరిగింది. 1962 చైనా దాడి
1962 సెప్టెంబర్ 8న చైనా సైనిక దళాలు తాగ్గా శిఖరంపై దాడిచేసి అక్కడున్న భారత్ సైనికుల్ని నెట్టివేశాయి. కానీ ఇది చిన్న సంఘటనగా పరిగణింపబడింది. నెహ్రా లండన్ సదస్సుకి వెళ్లి వచ్చాడు. వెంటనే అక్టోబర్ 12 కొలంబో వెళ్లాడు. ఒకవారం తర్వాత చైనా సైన్యం పెద్ద ఎత్తున నీఫా (1౭౯4) లోని తూర్పురంగంలో గల సైనిక స్థావరాల్ని ఆక్రమించింది. నీఫాలోని భారత ఆర్మీ కమాండరు ప్రతిఘటించకుందా తప్పించుకుపోయాడు. చైనా సైన్యం లోపలికి రావడానికి తలుపులు తెరిచినట్లయింది. పళ్చిమరంగంలో అక్టోబర్ 20న గల్వన్ లోయలో 13 అగ్రస్థావరాలు చైనా వశమయ్యాయి. చుఘాల్ విమానాశ్రయం ప్రమాదంలో చిక్కుకుంది. చైనా ఉద్దేశాలు తెలియవు. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చైనా వాళ్ళు మైదాన ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చి అస్సాం, ఇతర ప్రాంతాలు ఆక్రమిస్తారని ప్రజలు ఆందోళన చెందారు. నెహ్రౌ నిరాశాజనకమైన పరిస్థితిని వివరిస్తూ మిలటరీ సహాయాన్ని అర్ధిస్తూ నవంబర్ 9న ప్రెసిడెంటు కెనడీకి రెండు లేఖలు రాశాడు. బ్రిటన్ సహాయాన్ని కూడా కోరాడు. 24 గంటల తర్వాత చైనా ఏకపక్షంగా విరమణ ప్రకటించింది. చైనా భూతం ఎంత ఊహించని విధంగా వచ్చిందో అదే విధంగా అదృశ్యమైంది. గుండెపగిలిన మిత్రుడ్డి: కకావికలమైన ప్రజల్ని వదిలి వెళ్లింది. ఆశర్వాశ్ర ల భారతదేశం తన ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బనుండి కోలుకోటానికి చాలొ సమయం పట్టింది. చైనా, ఆమెరికాలు పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చినప్పటికి బంగ్లాదేశ్ యుద్ధంల్రో పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత భారతదేశం ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ప్రాంద్రంది. నెహ్రూ దెబ్బ నుండి కోలుకోలేదు. 1964 మే లో చనిపోయాడు. ఆయన కీర్తి ప్రబల అత్యున్నత దశకి చేరుకున్న తరుణంలో ప్రత్యర్థుల విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. విమర్శలకు తలొగ్గి తన చిరకాల మిత్రుడు రక్షణమంత్రి అయిన కృష్ణమీనన్ని మంత్రి వర్గం నుండి తొలగించవలసి వచ్చింది. తాము ఎంతో శ్రద్దతో సంచి పోషించిన అలీనవిధానం మిత్రుడు కొట్టిన దెబ్బకు తట్టుకుని నిలబడలేని పరిస్థితి వచ్చింది. బాధాకరమైన అంశం ఏంటంటే ఆ విధానాన్ని పట్టాలు తప్పించింది సోషలిస్టు 220 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దేశం, పెట్టుబడిదారీ దేశం కాదు. మితవాద శక్తులు, పశ్చిమ దేశాల కనుకూలంగా వ్యవహరించేవారు నెహ్రాని తీవ్రంగా విమర్శించారు. ఈ అవకాశాన్ని భూపరిమితి చట్టాన్ని పటిష్ట్వరిచేందుకు చేపట్టిన రాజ్యాంగ సవరణని అడ్డుకునేందుకు వాడుకొన్నారు. యుద్ధ 'పభావం మూదవ పంచవర్ష ప్రణాళికపై పడింది. వనరులు రక్షణకు మరల్చబడ్డ్దాయి. పార్తమ్వైంట్రుకి జరిగిన మూడు వరుస ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. నెహ్రూ తన జీవితంలో మొదటిసారిగా 1963 ఆగస్టులో విశ్వాస రాహిత్య తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చింద్రి.
చైనా దాడి భారతదేశానికి ఇతర దేశాలతో గల సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. సంక్షోభంలో సహాయపడి ఆమెరికా, (బ్రిటన్ సానుకూలంగా స్పందించాయి. యుద్ధం ముగిసినప్పటికి బ్రిటన్, ఆమెరికాలను విస్మరించడానికి వీలు పడని పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ పురిగొల్ప్బడంతో భారతదేశ బలహీనతను అవకాశంగా తీసుకుని కాశ్మీరు సమస్యపై లొంగదీసేందుకు అమెరికా, బ్రిటన్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. కానీ నెహ్రూ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగాడు. భారతదేశాన్ని అలీన విధానం నుండి వైదొలిగేలా చేయాలని అమెరికా బ్రిటన్లు ఆకాంక్షించాయి. అవి అందజేసిన ఆర్థిక సాయం 60- 120 మిలియన్లు అంత మొత్తాలేంకాదు. కానీ ఆమెరికా ప్రభావం ప్రత్యేకించి మిలటరీ వ్యవహారాల్లో గణనీయంగా పెరిగింది. చైనా బూచికి వ్యతిరేకంగా పనిచేస్తే నెపంతో అమెరికా రహస్య సమాచార సంస్థలు సంబంధాలు పెంచుకున్నాయి. బైనా మిలటరీ కార్యకలాపాలపై నిఘా వుంచేందుకు హిమాలయాల్లో అణుశక్తి యంత్రం నెలకొల్బబడింది. నెహ్రూ ఈ ప్రయత్నాలను అవగతం చేసుకున్నాడు. సోవియట్లతో మిలటరీ ఒప్పందాలతో ముందుకు సాగాడు. సోవియట్ భారతదేశానికి దీర్జకాలిక అవసరాలరీత్యా ఏవి అవసరమో అవి ఇవ్వడానికి సిద్ధపడింది. అమెరికాలాగా కొద్ది మొత్తాల సహాయం అందజేసి అసాధ్యమైన షరతులు విధించలేదు. పాకిస్తాన్ చైనా సరసన చేరింది. భారతదేశం బలహీనపరచబడిందని భావించి 1965 లో యుద్దానికి దిగింది. ఇది ఎవరి తప్ప?
దాడి జరిగినప్పుడూ, ఆ తర్వాత కూడా పత్రికలు చైనా మోసానికి నెహ్రాని బాధ్యుణ్జి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నెహ్రూ భావావేశం గల కపటరహితమైన అవివేకియని కమ్యూనిస్టు విద్రోహం నుండి భారత (ప్రయోజనాలను సంరక్షించడంలో విఫలమయ్యాడని ఒక అభిప్రాయం. మరొక రకమైన అభిప్రాయం ఇండియా, వైనా స్వతంత్రం తర్వాత భారతదేశం లం
యుద్ధంలో వ్యక్తం చేయబడింది. దీనిననుసరించి నెహ్రూ పట్టుదల గల జాతీయవాది, యుద్దోన్మాద ప్రజాభిప్రాయంతో కొట్టుకుని పోయి చైనా ప్రతిపాదించిన హేతుబద్దమైన షరతుల మేరకు సరిహద్దుల్ని పరిష్కరించుకునేందుకు తిరస్కరించారు. 1959 నుండి ముందుకు దూసుకుపోయే పద్ధతిననుసరించాడు. అది ఆత్మరక్షణ కొరకు చైనా దాడి చేసేలా రెచ్చగొట్టింది. ఈ రెండింటిలో ఏది కూడా చైనా పట్ల నెహ్రూ అవగాహనను సరిగా వివరించలేదు. వైనా చరిత్ర పట్ల, విప్లవాల చరిత్ర పట్ల ప్రత్యేకించి రష్యా విప్లవం పట్ల నెహ్రూకు గల అవగాహన, చైనాను ఏకాకిని చేసి ఒక మూలకు తోచివేయబడకూడదని, జాతుల సమూహంలోకి తీసుకురాబడాలని విప్లవం మానవతతో పరిపూర్ణం చేయబడాలని అభిప్రాయాన్ని ఆయనలో నాటుకునేలా చేసింది. “బలమైన చైనా అంటే సాధారణంగొ విస్తరణవాద చైనా అని అర్ధం చేసుకునేందుకు మనకు కావలసినంత చరిత్ర తెలుసూ నెహ్రూ చెప్పాడు. కానీ చైనాతో ఎలాంటి యుద్ధమూ రావాలని కోరుకోం. ఎందుకం అది జర్మన్ ఫ్రెంచి యుద్ధం లాగానే రెండు దేశాలకు వినాశకరం. 1962 దాడికి ముందు 1961 డిసెంబర్ 7న లోక్‌సభలో నెహ్రా ఇలా చెప్పాడు : “ఒక దేశం యొక్క పెద్ద ఏనుగు సరిహద్దుపై కూర్చుని ఉంది. ఇది మనం విమర్శించలేని వాస్తవం”. చైనా విప్లవం మన సరిహద్దులకు ప్రమాదం పొంచి ఉందని నెహ్రూ గుర్తించాడు. నెహ్రూ 1963 సెష్టెంబర్ 3 న రాజ్యసభలో మిలటరీపై ఎక్కువగా వెచ్చించడం సరియైనది కాదని, దేశం తన బలాన్ని తానే నిర్మించుకోవాలని, అదే సరైన రక్షణ అని వివరిస్తూ సుదీర్హ ప్రకటన చేశాడు. “పారిశ్రామికీకరణ చెందని ఏ దేశం కూడా ఈనాడు సైనిక పరంగా బలంగౌ లేదూ” “ఈనాడు మన ముందున్న కర్తవ్యం దేశాన్ని పారిశ్రామికంగా పటిష్ట పరచడం. అంతేగాని విషరీతంగా ఉండే తుపాకీని, విపరీతంగా ఉండే విమానాన్ని గానీ తెచ్చుకోవడం కాదు'. పాక్రిస్తాన్క్రో ఇప్సటిత్రే శత్రుత్వం ఉంది. భారతదేశం మరొక శత్రురాజ్యాన్ని కోరుకోదు. రెండువైపులా యుద్దానికి సన్నద్ధం కావడమంటే అభివృద్ధికి అంతం పలకడమే. కాబట్టి ఘర్దన అనివార్యమైనప్పటికీ స్నేహవైఖరిని పాటించి ఇతరులను కూడా అలాంటి వైఖరినే పొటించమని కోర్రుత్తూ ఉదాహరణకి చైనాని ఐక్యరాజ్యసమితిలోనికి రప్పించేందుకు కృషి చేస్తో ఘర్షణని వీలైనంతవరకు వెనక్కి నెట్టివేయాలి. టైనా టిబెట్ ఆక్రమణ అంటే ఘర్షణలకు అవకాశం గల ఉమ్మడి సరిహద్దు ఉండడమని నెహ్రూక్రు అవగాహన ఉంది. చైనాకి పరిష్మరించుకోవలసిన పెద్ద సమస్యలు ఉన్నాయి. కనుక విస్తరణను గురించే ఆలోచించదు. టిబెట్‌లో తిరుగుబాటు, దలైలామా 222 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాక, సరిహద్దు ఘర్షణలు తర్వాత రానున్న ప్రమాదాల పట్ల నెహ్రూకి అవగాహన ఉంది. కానీ వైనాని బెదిరించడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటి? చైనా ఆటకట్టించేందుకు సోవిద్సట్క్సు సన్నిహితంగా జరిగి దానితో దౌత్య సంబంధాలు పెంచాడు. కమ్యూనిస్టు చైనా, కమ్యూనిస్టు సోవియట్ యూనియన్, భారతదేశ కమ్యూనిస్టులతో జతకట్టి దేశానికి 'పమాదకరంగా పరిణమిన్నారని నెహ్రూ ఆలోచించలేదు. భారతదేశ కమ్యూనిస్టులు చైనా, సోవియ్సట్రల చేతిలో పనిముట్లని ఆయన విశ్వసించలేదు. అలాగే భారతదేశంలో చాలామంది వాదించినట్లు భారతీయ మిత్రులకు వ్యతిదేకంగా సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సోదరులక్షు మద్దతు ఇస్తుందని ఆలోచించే పొరపాటు ఆయన చేయలేదు. అక్కడక్కడ సరిహద్దు ఘర్షణలు జరుగుతాయి కానీ అంతపెద్ద ఎత్తున దాడి
జరుగ్పత్త్సుందని నెహ్రూ ఊహించలేదు. దాడి జరిగిన స్థాయి నెహ్రూని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాడి స్వభావాన్ని, స్థాయిని అంచనా వేయలేకపోవడంలో నెహ్రూ తప్పు చేశారు. మరుసటి రోజు చైనా యుద్ధం విరమించడంతో అమెరికా, బ్రిటన్లను సహాయమర్ధించడంలో వ్యక్షమయిన భయాందోళన మరాక పొరపాటు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షప్రార్టీలు, తన సొంత పార్టీ సభ్యుల బాధ్యతా రాహిత్యమైన దాడులు ఈ కలవరపాటుకి దారి తీశాయి. నాయకులపై విశ్వాసంతో ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కొనడంలో దేశం అశక్తతను 'పదర్శించింది. నిరాశానిస్ట్రహలతో కృంగిపోయింది. పరస్పరం నిందలకు దిగింది. పరిస్థితిని సరిదిద్దేందుకు నెహ్రూ శాయశక్తులా కృషి చేశారు.
1962లో చైనా చేతుల్లో భారతదేశ పరాజయానికి కారణం చైనీయుల స్నేహితం పట్ల నెహ్రూకి గల నిష్కపటమైన విశ్వాసం ఊహాజనితమైన యుద్ధ వ్యతిరేకత, ఫలితంగా రక్షణ సన్నద్ధత పట్ల భారత అశ్రద్ధ కాదని పలువురు వ్యాఖ్యాతలు ఈనాడు అంగీకరిస్తారు. 1949 - 50 నాటికి 280,000 భారత సైనిక దళాలు 1962 నాటికి 5,50,000 కి పెరిగాయి. 1947 లో భారత వైమానిక దళంలో ఏడు కంబాట్ స్వాాద్రన్తు ఉండగా 1962 నాటికి 19 స్వాడ్రన్స్కి పెరిగాయి. 1965 లో అదే సైన్యం అవే ఆయుధాలతో పాకిస్తాన్‌తో యుద్ధం చేసింది. కానీ ఘోరపరాజయం పాలవలేదు. చైనాతో సరిహద్దు ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయని నెహ్రూ 1959 నుండి హెచ్చరిస్తూ వచ్చారు. కానీ రాజకీయ నాయకత్వం కానీ, మిలటరీ నాయకత్వం కానీ చైనా దాడి స్వరూప స్వభావాన్ని అంచనా వేయలేకపోయాయి, అందువల్ల దాడి జరగడం పట్ల దిగమకు గురయ్యాయి. సరిహద్దు ఘర్షణలు గానీ లేక అస్సాం మైదానాలలో పూర్తిస్థాయి యుద్ధం జరగవచ్చునని మిలటరీ నాయకత్వం అంచనా వేసింది. కాని పరిమిత ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చి స్వతంత్రం తర్వాత భారతదేశం 223
విరమించుకుంటుందని ఊహించలేదు. చైనాకు సోవియట్ పూర్తి మద్దతు ఉంటుంది కనుక చైనాతో పూర్తిస్థాయి యుద్ధం ఊహకు అందనిదిగా భావించారు సర్వసైన్యాధికారి జనరల్ తిమ్మయ్య. ఆయనకు ఇతర సీనియర్ అధికారులకూ చైనా సోవియట్ యూనియన్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిసినట్లు లేదు. భారతవైమానిక దళం చైనానుండి ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అరుణాచల ప్రదేశ్, టిబెట్‌లపై పూర్తి ఆధిపత్యం చెలాయించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు వైమానిక దళం నిర్వహించగల పాత్రపై అవగాహన లోపించింది (నెహ్రా తన వైమానిక బలంతో సం'్రదించకుండానే అమెరికా వైమానిక దళాలనుండి రక్షణ కోరాడు) వైఫల్యానికి కారణం : రక్షణ ఆదేశాల యాజమాన్యం వ్యవస్థలో ని లోపాలు, రక్షణ ప్రణాళికా వ్యవస్థ సివిలు. మిలటరీ సంబంధాల నిర్మాణంలోని లోపాలు, ఉన్నతస్థాయి మిలటరీ అధికారులు పౌరవిధాన నిర్మాణ చట్రంలో విలీనం చేయబడలేదు. స్వల్పకాలిక భవిష్యత్తుకు సన్నద్ధం చేసేవారుగా ఉండిపోయారు. గాని దీర్హకాలిక రక్షణ వాతావరణానికి సన్నద్ధం కాలేదు. చైనాతో ప్రమాదం ఉందని 1959 నుండి నెహ్రూ హెచ్చరిస్తున్నప్పటికీ మిలటరీ అధికారులు హిమాలయాల్లో చైనా యుద్దానికి ప్రణాళిక రూపొందించుకోలేదు. ఇది వ్యూహరచన వైఫల్యం, రహస్య సమాచార విభాగం వైఫల్యం. సైన్యం వైమానిక దళాల మధ్య సమన్వయ వైఫల్యం. గతంలో జరిగిన యుద్ధాలలో మంచి నిపుణత 'ప్రదర్శించినవాడు, కనీసం వారం రోజుల పాటు శత్రుసైన్యాన్ని నిలువరించిగల సమర్భుడు అయిన సైన్యాధికారి ఆత్మవిశ్వాసం కోల్పోయి యుద్దానికి తలపడకుండానే వెనక్కితగ్గడం మరొక వైఫల్యం. ఇక చైనీయుల విషయానికొస్తే వారు వేగంగా పరిమితమైన ప్రాంతంలో లోపలికి చొచ్చుకుని వచ్చి భారతదేశాన్ని న్యూనత పరచే వారి లక్ష్యాన్ని సాధించుకుని అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. భారతదేశం చైనా యుద్ధ విరమణని అంచనా వేయడంలో విఫలమయింది. అస్సాం మైదానాలలో పూర్తిస్థాయి యుద్దాన్ని ఎదుర్కొనడానికి పథకాలు ప్రారంభించింది. భారతదేశ దురాక్రమణ తత్వాన్ని గురించి మేక్స్వెల్ చేసిన నిర్ధారణలను నిపుణులు తీవ్రంగా పరిగడించలేదు. భారతదేశానికి యుద్దాన్ని రెచ్చగొట్టిన జాడలు గానీ రెచ్చగొట్టే ఆలోచనలు గానీ లేవు. భారతదేశ ప్రధానమంత్రి, రక్షణమంత్రి దేశంలో లేరు. ఆర్మీ ఛీఫ్ సెలవులో ఉన్నారు. ఒక సీనియర్ కమాండర్ సముద్రయానంలో ఉన్నారు. యుద్దాన్ని... రెచ్చగొట్టడం వలన భారతదేశం పొందే ప్రయోజనం ఏంటి? దానికి భిన్నంగా మేక్స్వెల్కి అవగాహన లేని చైనా అనివార్య పరిస్థితులు చైనాని యుద్ధంవైపు నెట్టివేశాయి. చైనాని ఘర్షణ దిశగా నెట్టివేసిన అంశాలు నెహ్రూ అదుపులో లేనివి. 224 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
టిబెట్ విషయం తీసుకోండి. ప్రతి బలమైన వైనా ప్రభుత్వం టిబెట్‌ని విలీనం చేయాలని ప్రయత్నించింది. నెహ్రూ కూడా 1954 పంచశీల ఒప్పందంలో టిబెట్‌పై టైనా వైఖరిని ఆమాదించాడు. 1959లో మాత్రమే చౌ-యన్-లై లడఖ్, నేపాల్‌లో తమ ఘాభాగం ఉందని చెప్పారు. అడీఖాంసా తిరుగుబాటు, చాలామంది కాందిశీకులతో కలిసి దలైలామా పారిపోయి వచ్చిన నేపధ్యంలో చెప్పాడు. భారతదేశం దలైలామాని రెచ్చగాట్టిందని చైనా ఆరోపించింది. ఆశ్రయమివ్వడాన్ని ఆక్షేపించింది. ఏ భారత ప్రభుత్వం శ్రయమివ్వడాన్ని తిరస్మరించి ఉండేది కాదు. భారతదేశం తిరుగుబాటుని ప్రోత్సహించలేదు. నెహ్రూ ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని గానీ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను గానీ అనుమతించలేదు. కానీ ఆయన టిబెట్ తిరుగుబాటుని నివారించగలిగి ఉండేవాడు కాదు.!
నెహ్రూ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అమెరికా విధానాన్ని ప్రభావితం చేయలేకపోయాడు. చైనాకి స్థానం కల్పించేందుకు అమెరికా తిరస్కారం, ఫార్మొజా (తర్వాత జైవాన్) మాత్రమే చట్టబద్దమైన చైనా అని దాని (అమెరికా) పట్టు. అంటే కమ్యూనిస్టు టైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో స్థానం నిరాకరణ, చైనాని నిరాశా నిస్పృహలకు గురిచేశాయి. దురాక్రమణ దారికి నెట్టివేశాయి. అంతేగాక అమెరికా చైనాలోని దుందుడుకు వాద శక్తుల్ని ప్రోత్సహించి వారిని రాజకీయరంగం పైకి వచ్చేందుకు తోడ్చాటునందించి బైనాకి కంటిమీద కునుకు లేకుండా చేయడంలో అమెరికా పెద్ద పాత్ర పోషించింది.
చైనా సోవియట్ విభేదాలకు నెహ్రూ కారకుడు కాదు. ఈ విభేదాలు చైనా అభద్రతా భావాన్ని పెంచి దాన్ని దుందుడుకువాద దశలోకి నెట్టివేయడంలో తమ పాత్ర తౌము పోషించాయి. కొంతకాలం నుండి ఉంటూ వచ్చిన ఈ విభేదాలు 1959లో బట్టబయలయ్యాయి. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలు జరిగినప్పుడు సోవియట్ యూనియన్ తటస్థంగా ఉంది. 1962 ఏప్రిల్, మే కాలంలో సింకియాంగ్‌లో సోవియట్ చైనా సరిహద్దుపై చాలా ఘటనలు జరిగాయి. సరిహద్దులో ఐదువేలకి పైగా ఉల్లంఘనలు జరిపినట్లు సోవియట్ ఆరోపించింది. సరిహద్దు పొడవునా వేలాదిమంది తమ (ప్రజల్ని మభ్యపెడుతున్నట్లు చైనా సోవియట్ యూనియన్ పై ఆరోపణలు చేసింది. అణు ఆయుధాల అభివృద్ధిపై సోవియట్ యూనియన్ చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని సోవియట్ యూనియన్ 1959 లో నిరాకరించింది. 1962 ఆగస్టు మొదటి వారంలో మిగ్ - 21 విమానాల తయారీపై చేసుకున్న ఒప్పందంపై సోవియట్ యూనియన్, భారతదేశం సంతకాలు చేశాయి. చైనాతో స్వతంత్రం తర్వాత భారతదేశం 225
అలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఆగస్టు చివరి వారంలో సోవియట్ యూనియన్ తాము అణ్వస్తాల ప్రయోగాన్ని పాక్షికంగా రద్దు కారకు చర్చలతో ముందుకు పోతున్నట్లు చైనాతో చెప్పింది. తమ అణ్వస్తాల పెంపుదలను అడ్డుకునే లక్ష్యంతోనే సోవియట్ యూనియన్ అలా చెప్పిందని చైనా భావించింది. అంతార్జాతీయ రంగంలో చైనా ప్రయోజనాల్ని పరిరక్షించగల స్థితిలో సోవియట్ యూనియన్ ఉందనే భావన కూడా ఛైనాని తికమక పెట్టింది. విదేశీ విధాన నిపుణుడు వి.పి. మీనన్ మాటల్లో :
“చైనా తన జాతీయ ప్రయోజనాలపై నూతన సైద్దాంతిక అవగాహనకు వచ్చింది. అమెరికాతో తనకు గల సమస్యలకు శాంతియుత పరిష్కారం పట్ల ప్రాథమిక లక్ష్యాలు నెరవేరడం పట్ల - అంటే తైవాన్ తిరిగి తనకు దక్కడం... చైనాకు గొప్పశక్తిగా గుర్తింపు, భద్రతా మండలిలో స్థానం... రాకెట్లు, ఐ.సి.బియం లలో సోవియట్ పురోగమనం కారణంగా అంతర్జాతీయ బలాల పొందికలో సోవియట్ శిబిరానికి మొగ్గువుంది కనుక అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు చైనాకు రాయితీలు పొందేందుకు రాజీలేని సమరశీల విధానాన్ని అమలు జరిపే సమయం వచ్చింది”.
ఆఫ్రో ఆసియా దేశాలు భారతదేశ పద్ధతిని అనుసరిస్తూ అటు సోవియట్ యూనియన్ ఇటు ఆమెరికా స్నేహ సహకారాలు కోరాయి. కానీ చైనాలాగా రెండింటికీ దూరంగా ఉండే పద్ధతిని అనుసరించలేదు. ఇది కూడా చైనాని కలవరపరచింది. భారతదేశ స్థాయిని తగ్గించడం ద్వారా వారి పంథాని ఆమోదింపజేయగలమని ఆశించారు.
కాబట్టి భారతదేశంపై చైనా దాడికి భారత వైనా దేశాల మధ్య సమస్యలతో సంబంధం లేదు. దాడి, ఒంటరితనం, సంయమనం కోల్పోవడం, నిరుత్సాహం నిష్టలతల 'పతిచర్య.. భారతదేశంపై దాడి చేయడం ద్వారా చైనీయులు నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయాలని కోరి ఉండవచ్చు లేక భారతదేశాన్ని పశ్చిమదేశాల శిబిరంలోకి నెట్టివేయాలని ఆశించి ఉండవచ్చు. ఆ విధంగా సోవియట్ యూనియన్ భారతదేశం యొక్క అలీన విధానం పైగల భ్రమల్ని తొలగించుకుని, తన శాంతియుత సహజీవన విధానాన్ని గురించి పునరాలోచించుకోవచ్చు. కాని ఈ రెండు అంచనాలలో చైనొ విఫలమయింది. 19692 యుద్దానికి కృశ్చేవ్ బాధ్యుడని తర్వాతి కాలంలో భారత ప్రతినిధి వర్గంతో డెంగ్ సియానోపెంగ్ చెప్పినట్లు అ ప్రతినిధి వర్గంలో ఒక సభ్యుడుగా ఉన్న వి.షి.దత్ పేర్కొన్నారు.
226 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ల ఆ విధంగా 1962 దాడికి కారణాలు చైనాయొక్క అనివార్య పరిస్థితులకు సంబంధించినవి గాని, నెహ్రూగాని, భారతదేశం గానీ తెచ్చిపెట్టినవి కావు. అమెరికా గురింపు తెచ్చుకోలేక భద్రతా మండలిలో స్థానం పొందలేక, ఆఫ్రో ఆసియా నాయకత్వం పొందలేక అణ్వస్తాల విషయంలో గానీ చైనాతో సరిహద్దు వివాదంలో గానీ సోవియట్ మద్దత్స వ్రాందలేక చైనా రాజకీయాలలో దుందుడుకువాద మార్పు చోటుచేసుకుంది. భారతదేశాన్ని న్యూనత పరచడం ద్వారా భారతదేశం యొక్క శాంతి అలీన విధానాలు ఆచరజ సాధ్యమైనవి కావని చూపయత్నించింది. అలాగే సోవియట్ శాంతియుత సహజీవ్షనం కూదా, ఒత్తిడికిలోనై భారతదేశం అలీన విధానాన్ని వదిలిపెడుతుందని, ఆసియా ఆధ్రికా దేశాలు చైనా నాయకత్వాన్ని అనుసరిస్తాయని ఆశించింది. ఆవిధంగా భారతదేశం మిలటరీ పరంగా పొందిన న్యూనత భారతదేశ విదేశీ విధాన వైఫల్యంగా పరిగజ్రించబ్రడరాదు. అంచనా వేయడానికి వీలుపడని అరుదైన చారిత్రక ఘటనలలో ఒకటిగా ప్రరిగణింపబడాలి.
చైనాపట్ల భారతదేశ విధానం వైఫల్యమయినట్లయితే మరి ఏ ఇతర దేశ విధానం విజయవంతమైయినట్లు? 1971 అమెరికా తన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నది. సోవియట్ యూనియన్ 1959 తర్వాత తన విధానాన్ని మార్చుకోవడం ప్రారంభించింది.
భారత చైనా యుద్ధం నెహ్రూ విదేశాంగ విధానంపై ఎలాంటి సందేహాలను రేకెత్తించదు. ఉదాహరణకు భారతదేశ అలీన విధానం కారణంగా ఆమెరికా, సోవియట్ యూనియన్లు పరస్పర వ్యతిరేక పక్షాలలో చేరిపోలేదు. భారతదేశం రెండింటి నుండి తరతమ భేదాలతో సానుభూతి పొందగలిగింది. ఇది ప్రచ్భన్న యుద్ధకాలంలో చాలా అసాధారణ ఘటన : రెండవ అంశంగా చైనా యుద్ధం జరిగి అలా ముగిసినప్పటికీ చైనాతో స్నేహ సంబంధాలు కలిగివుందాలన్న నెహ్రూ విధానం సరియైనదే. ఒకవైపు పాకిస్తాన్లో సత్సంబంధాలు లేని పరిస్థితులలో (స్వతంత్రానంతరం కాళ్ళీర్పై ఘర్షణ 1954లో పాకిస్తాన్‌కి మిలటరీ సహాయం చేయాలని అమెరికా నిర్ణయంతో తీవ్రమైన ప్రమాదంగా పరిణమించిన పరిస్థితుల్లో) మరొక పొరుగుదేశంతో శత్రుసంబంధాలతో అడకత్తెరలో చిక్కుకునే ప్రమాదాన్ని నివారించడం భారత ప్రయోజనాల రీత్యా అవసరం. పశ్చిమ రాజ్యాలు చైనాని ఒంటరిని చేయడం వల్లనే చైనా మరీ బాధ్యతారాహిత్యంగా మారిందని నెహ్రూ సరిగా అంచనా వేయగలిగాడు కనుకనే భారత చైనా యుద్ధం తరువాత కూడా ఐక్యరాజ్యసమితిలో చైనాకి సభ్యత్వం ఇవ్వాలన్న వాదనని నెహ్రూ కొనసాగించాడు. అంతేగాక నెహ్రూ చాలా తరచుగా ప్రస్తావించినట్లు రక్షణ అనేది కేవలం ఆయుధాల స్వతంత్రం తర్వాత భారతదేశం 227
వ్యవహారం కాదు. ఆర్థికాభివృద్ధి స్వావలంబన కర్తవ్యం కూదా. కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశం లాంటి పేదదేశం తన అరుదైన వనరుల్ని భారీ మిలటరీ యంత్రాంగాన్ని నిర్మించడం వైపు మరల్చలేదు. దానికి భిన్నంగా నెహ్రూ భారతదేశ ఆర్ధిక బలాన్ని పెంచడం ద్వారా తన వారసులు ఘనమైన విజయాలు సాధించడాన్ని సుసాధ్యం చేశాడు. ముగింపు 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు అమెరికాతో ఇతర పశ్చిమదేశాలతో సంబంధాలు నాటకీయంగా మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉన్నట్లు భావించారు. ఎందుకంటే చైనా సమరశీలతని గురించి చైనాకి సరియైన అవగాహన వుంది. చైనా మరలా దాడిచేస్తే సహాయం చేస్తానని అమెరికా వాగ్గానం చేసింది. మరొక వైపు తీవ్రమైన కరువు క్లిష్టమైన ఆర్షిక పరిస్టితి. 1962, 1965 యుద్దాల కారణంగొ ఏర్పడిన భారీ ఆహార కొరతలు అలాంటి సహాయం అవసరమయ్యేలా చేశాయి. ఈ విధాసం కొనసాగింపుగా ఆమెరికా సలహా మేరకు రూపాయి విలువను తగ్గించేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ అంగీకరించారు. భారతదేశ ప్రయోజనాల రీత్యా కూడా అలొ తగ్గించవలసిన అవసరం ఉంది. అర్థిక సహాయాన్ని పొందేందుకు, నూతన సంబంధాలను పెంపొందించుకునేందుక్తు, ఆహార ధాన్యాల్ని నౌకల్ని త్వరగా రప్పించేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ ఆమెరికా సందర్శించారు. కానీ ఆమె బాధతో తిరిగి వచ్చారు. '్రెసిడెంట్ లెండన్ జాన్సన్ చేసిన (ప్రకటనలకు విరుద్దంగా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేశారు. అందుకు ఒక కారణం వియత్నాంపై అమెరికా కురిపిస్తున్న బాంబు దాడుల్ని విమర్శించడం ఆసివేయాల్సిందిగా భారతదేశంపై ఒత్తిడి తెచ్చేందుకు అలా చేశారని తరువాత ఇందిరాగాంధీ న. దీని నుండి గుణపాఠాన్ని ఇందిరాగాంధీ నేర్చుకున్నది. హరిత విప్లవ వ్యూహాన్ని త పరచడం ద్వారా స్వతంత్ర వ్యవసాయ మార్గాన్ని పటిష్టపరచింది. అలీన ఉద్యమాన్ని. వైరీయ వ్యవహారాలలో స్వయం ప్రతిపత్తిని పటిష్టపరచ సమాయత్తమయింది. భారత, మిల సోవియట్ యూనియన్ సమాన ప్రాతిపదికన ఆదరించదాన్ని పాకిస్తాన్‌కి ప్రయత్రా షి కందజేయడాన్ని అద్దుకునేందుకు 1966-67 లో దౌత్యపరమైన శ్చాల ద్వారా నచ్చజెప్పి సోవియట్ యూనియన్‌తో సంబంధాలు దృఢపడేలా చేసింది. అమలు లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం అసలైన అలీన విధానాన్ని విధానాలు సతామని ఘనంగా చెప్పింది. పరిస్థితులను గమనించి వెనక్కి తగ్గి నెహ్రూ అమలు జరిపింది. పెద్ద ఎత్తున ఆయుధాల ఒప్పందాలకై సోవియట్ 228 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
యూనియన్‌తో చర్చలు జరిపింది. 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చలు ముగిశాయి. జనతా ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని తగ్గిస్తామన్న వాగ్ధానం నుండి వెనకడుగ్స వేయవలసి వచ్చింది. రాజీవ్ గాంధీ కూడా అమెరికాకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదన్సి త్వరలో గుర్తించాడు. అలీన విధానం, అణు నిరాయుధీకరణ దక్షిణాఫ్రికాకు మద్దత్తు వ్రగైరాలకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతులకు మరలాడు. అలీనత ఒక విధానానికి విపులమైన ప్రణాళిక కాదు. అదొక వైఖరి. ఒక చట్రం. ఒక ప్పద్ధత్రి, యువజాతికి చీకటి రాత్రిలో దారిచూపే వెలుగు. భారత విదేశాంగ విధానాన్ని కఠినమైన నియమ నిబంధనతో కట్టిపపేయడానికి బదులుగా భారతీయ సమాజం యొక్క మారుత్తున్న అవసరాలను తీర్చే విధంగా అలీనత రూపుదిద్దుకొనే అవకాశం కల్పించింది. అది రక్రశ్న నుండి సోవియట్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకోడానికి అద్దురాలేదు. భారతదేశం కామన్వెల్త్లో చేరడానికి అడ్డురాలేదు. నెహ్రూ అంతర్జాతీయ మానవతావాద ప్రాపంచిక దృక్చధం కొందరు ఆరోపించినట్లుగా భారత ప్రయోజనాలు త్యాగం చేయడానికి గానీ, రక్షణ అవసరాలను అశ్రద్ధ చేయడానికి గానీ దారి తీయలేదు. అవసరమైనప్పుడు భారత ప్రయోజనాల పరిరక్షణకు బలప్రయోగాన్ని నిరాకరించే శాంతివాదికాదు నెహ్రూ. 1947-48 లో కాశ్మీర్లో, జునాఘడ్‌లో, హైదరాబాద్‌లో సైన్యాన్ని పయోగించమని ఆదేశాలు జారి చేశాడు. అలాగే 1961లో గోవాపై కూడా. మొదట నెహ్రూ చెప్పినప్పుడు ఆచరణ సాధ్యంగానివని తోసిపుచ్చబడిన అంశాలనే (ప్రపంచం తర్వాత నెమ్మదిగా అమలు జరపవలసి వచ్చింది. ఇది అంతర్జాతీయ సంబంధాలపై నెహ్రూ అవగాహన యొక్క దార్శనిక స్వభావాన్ని తెలియజేస్తుంది. అణు నిరాయుధీకరణ ప్రపంచ వ్యాప్తంగా అంగీకారం పొందిన, ఆశించదగిన లక్ష్యమయింది. అణుయుద్ధంలో గెలుపు వుండదని కాబట్టి అణుయుద్ధం చేయరాదని అమెరికా సోవియట్ యూనియన్లు అంగీకరించాయి. 1972 ఫిబ్రవరిలో అమెరికా చైనా సంబంధాలు శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలు - నెహ్రూ పంచశీల ప్రాతిపదికన ఉండాలని షాంఘై ప్రకటనలో సంతకాలు చేశాయి. 1962లో భారతదేశంపై దాడిచేచినప్పుడు ఏ వ్యక్తినైతే నిర్ధాక్షిఖ్యంగా వంచన చేశారో ఆ వ్యక్తి ప్రతిపాదించిన సూత్రాలు చైనా అమలు జరపక తప్పనిసరి పరిస్థితి రావడం సాధారణ విషయం కాదు. ఈ సూత్రాలు 1954 లో భారతదేశం, చైనాల మధ్య స్వతంత్రం తర్వాత భారతదేశం 2920
టిబెట్‌పై ఒప్పందంలో నెహ్రూ (ప్రేరణతో రూపుదిద్దుకున్నాయి. అంతర్జాతీయ సంబంధాలలో జాతుల సామాజిక జీవితంలో అహింసా సూత్రాన్ని పొందుపరచిన ఢిల్లీ ప్రకటనపై సోవియట్ నాయకుడు మెహైల్ గోర్బచెవ్ భారత ప్రధాని రాజీవ్ గాంధీలు 1986 నవంబర్‌లో సంతకాలు చేశారు. అంతకంతకు సాంప్రదాయ యుద్దాలు కూడా విద్వంసకరమైనవని గుర్తించబడినది. అంతేకాక ఈ యుద్దాలు సరిహద్దుల్ని అంతగామార్చడంలో గానీ (ఇరాక్
- ఇరాన్యుద్ధంలో లాగా) లేక ఆక్రమణలో ఉన్న ప్రజల్ని ఉంచడంలో గానీ (వియత్నాం, ఆస్టనిస్తాన్, వెస్ట్‌బ్యాంక్) విఫలమయ్యాయి. కాబట్టి ఆచరణీయమైన ఆదర్శం ఆజ్వస్త
రహిత అహింసాయుత ప్రపంచాన్ని రూపొందించుకోవడమే. నెహ్రూకి పాత శత్రువు అయిన చర్చిల్ రాసిన లేఖలోని ఈ పంక్తుల్ని ఉటంకించి అధ్యాయాన్ని ముగించవచ్చు. 'శాంతి కొరకు మీ ప్రగాఢ ఆకాంక్షను మనల్ని గతంలో విభజించిన వైరాలు పరిగణించడంలో మీరు కాఠిన్యం కనబరచకపోవదాన్ని నేను ఎప్పుడూ అభిమానించాను. దేశంలోని కోట్లాది ప్రజల భవితవ్యాన్ని తీర్చిదిద్దుతూ ప్రపంచ వ్యవహారాల్లో విశిష్టమైన పాత్ర నిర్వహిస్తూ మీరు పెద్ద బరువును మోస్తున్నారు. బాధ్యత నిర్వహిస్తున్నారు. మీ కర్తవ్య నిర్వహణని అభినందిస్తున్నాను. ఆసియా కీర్తి ప్రతిష్టల్ని గమనంలో ఉంచుకోండి.” 280 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
13 జవహర్లాల్ - చారిత్రక దృష్టి కోణం
జవహర్లాల్ నెహ్రూని సముచితంగా ఆధునిక భారతదేశ వాస్తు శిల్పిగా పరిగణించవచ్చు. ఆయన 20వ శతాబ్దపు అత్యంత గొప్ప భారతీయులలో ఒకడు. ఆయనని ('ప్రజాస్వామ్యవాదిగా, సోషలిస్టుగా, మానవతావాదిగా, దార్భనికుడిగా పలువురు పలువిధాలుగా వర్ణించారు. వాస్తవంగా ఆయన అవన్నీ మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువకూడా. స్వతంత్ర భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో ఆయన నిర్వహించిన పాత్రపై అంచనా ఆయన యొక్క అపారమైన స్థాయిని, అసాధారణ వ్యక్తి త్వాన్ని వాటితో పాటు ఆయన సంక్షిష్టతని వైరుధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది.
నెహాలోని ఏ అంశాలు ఈనాడు చాలా మంది భారతీయులు నెహ్రుశకాన్ని స్మరించుకొనేలా చేస్తున్నాయి? అప్పటి కాలం ఇప్పటి 'కంటె బాధలతో పేదరికంతో మగ్గినకాలం. నెహ్రూ ఆ కాలంలో వుండడం వలన ఒనగూడిందేమిటి? స్వతంత్ర భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో నెహ్రు తోడ్చాటులోని ముఖ్యాంశాలేమిటి? ఆయన వారసత్వం ఏమిటి? ఆయన నాయకత్వంలో భారత ప్రజలు ఏమిసాధించారు? భారత ప్రజల యొక్క వారి నాయకుల యొక్క కార్యకలాపాలకు ప్రకటనలకు ఆలోచనలకు మార్గదర్శిగా కొలమానంగా పరిగణించడమంటే ఎలాంటి విలువల్ని అలవరచయత్నించాడు? అవకాశాలకు అనుగుణంగా ఎదిగొడా? ఈప్రశ్చలకు జవాబులు చరిత్రలో నెహ్రూ స్థానాన్ని నిర్ణయిస్తాయి.
నెహ్రూ వ్యక్తిత్వాన్ని గురించి చర్చించడం ఇక్కడ సాధ్యపడదు. కాని నెహ్రూలో 'ప్రశంసనీయమైన అంశాలు చాలావున్నాయి. నెహ్రూకి పరిచయమైన వారంతా మంత్రముగ్గుల్లా అతడి ప్రభావానికి లోనవడం యాదృచ్చికం కాదు. నెహ్రూ అభిరుచులు, సంబంధాలు, ప్రాధమిక విద్య నుండి భారీ పరిశ్రమల వరకు, గణాంకాల సేకరణ స్వతంత్రం తర్వాత భారతదేశం లప
నుండి ప్రపంచశాంతి వరకు, మహిళల విముక్తి నుండి తెగల సంక్షేమం వరకు, కళల నుండి పర్వతారోహణ క్రికెట్ వరకు- చాలా విస్తృతమైనవి. హేతువాదం, మానవత్వం, వ్యక్తి పట్లగౌరవం, స్వతంత్ర స్ఫూర్తి, సెక్యులరిజం పట్ల నిబద్దతతో జ్ఞానవికాసంతో, జ్జాన పునరుజ్జీవనంతో ప్రభావితుడైన వ్యక్తి జీవితం యొక్కప్రతి అంశంపై విశాలమైన ఉదారమైన దృక్సధంగల నెహ్రు తన సహచరులకు, దేశప్రజలకు అలాంటి లక్షణాలు అలవరచ యత్నించారు. 1954 లో ముఖ్యమంత్రులకు రాసినట్లుగా, మనం కోరుకుంటున్నట్లుగొ భారతదేశం నిజంగా గొప్పది కావాలంటే ఇతర దేశాలతో సంబంధాలు లేకుండా ప్రత్యేకంగొ వుండాలను కోకూడడు. ఆలోచనలలో సామాజిక జీవితంలో అభివృద్దికి గల ప్రతి ఆటంకాన్సీ. తొలగించుకోవాలి. భారత జాతీయ విప్లవం యొక్క బిడ్డయైన నెహ్రూ ప్రధానంగా జాతీయవాది. బ్రిటీషు రాజకీయ పండితుడు చెప్పినట్లుగా ఆయన శత్రువులు కూడా ఆయనపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. కులం, మతం, పట్టణం, మాతృభాష లాంటి విధేయతలు నెహై విషయంలో అర్ధంలేని మాటలు, ఆయనకు భారతదేశమే సర్వస్వం” 1947 తరువాతే నెహ్రూ జాతీయత, జాతీయైక్యత, జాతీయ స్వతంత్రం పట్ల నిబద్దతకు కట్టుబడి వున్నాడు. ఆ నిబద్ధతే ఆయన ఆలోచనలకు, విధానాలకు ఆలంబనం. నెహ్రూ దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ స్వతంత్రం కాదు. మార్పు అభివృద్ధిపట్ల, సమసమాజం న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య సమాజం -సమసమాజ నిర్మాణం పట్ల పౌరస్వేద్భ గల ప్రజాస్వామ్య రాజకీయాలకు పునాదులు వేయడం పట్ల భారతదేశాన్ని. ఒక జాతిగా ఏకీకరణ చేయడంపట్ల నెహ్రూ దృఢమైన నిబద్ధత కలిగి వున్నాడు. నెహౌ స్వతంత్రం రాక ముందు స్వతంత్రానంతరం జీవితాంతం తనకు జాతీయ వాదం పట్లగల నిబద్ధతను సోషలిజం పట్లగల నిబద్ధతతో అనుసంధానం చేయ ప్రయత్నించాడు. ఇది ఎవరూ తొక్కని బాట. నెహ్రూని దీర్హకాలికంగా (ప్రభావితుద్ని చేసిన మార్ గౌసి, గాంధీగాని జాతిని ఎలా నిర్మించాలి అనే అంశంపై మార్గదర్శకాలు సమకూర్చలేదు. రాని నెహ్రూ త్మ కష్టతరమైన కర్తవ్యాన్ని ఉత్కంఠతో ఆశావాదంతో చేపట్టాడు. ఆయన ఉత్సాహం, విజయంపట్ల విశ్వాసం 1962 భారత చైనా యుద్ధంలో పరాజయం, తరువాత కూడా వదులుకోలేదు. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే ఈ విశ్వాసం కోట్లాది భారతీయులకు అందజేయడంలో సఫలీ కృతుడయ్యాడు. __ __ాస్యామ్యం, చట్టబద్ధ పరిపాలన, స్వేచ్చ పట్ల గౌరవం వ్యక్తి స్థాయి, సామాజిక సమానత్వం, అహింస, మానవ వ్యవహరాలకు మార్గదర్శకంగా హేతుబద్ధత, నీతి 282 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
'పాతిపదికగా రాజకీయాలు జాతి నిర్మాణానికి నెహ్రా చేపట్టిన విధానానికి మూలస్తంభాలు. వ్యక్తిత్ర నిజాయితీ, భారత ప్రజలపట్ల గల ప్రేమ, విశ్వాసాలు-ఆయనకు గల అమూల్యమైన లక్షణాలు, భారత స్వతంత్రాన్ని పటిష్టపరుచుట భారతదేశ స్వతంత్రాన్ని నిలబెట్టడం, పటిష్ట పరచడం నెహ్రూ ముఖ్య కర్తవ్యాలు. అమెరికా సోవియట్ యూనియన్, రెండు అగ్రరాజ్యాల మధ్య విభజితమైవున్న ప్రపంచంలో-రెండు అగ్రరాజ్యాలు ప్రపంచంలోని ఇతర దేశాలకు తమ ఆధిపత్యాన్ని విస్తరించు కోవాలని నిర్ణయించుకొన్న తరుణంలో -నెహ్రూ ఒత్తిడులకు తట్టుకొని నిలబడి వాటి చేతుల్లో పావుగా మారేందుకు నిరాకరించాడు. భారతదేశ అంతర్ణత విధానాలు ఒప్పుగాని తప్పుగాని -అ(గ్రరాజ్యాల ప్రత్యక్ష పలుకుబడికి లోనుగాకుండా అభివృద్ధి చెందాయి. భారతదేశ అంతర్గత విధానాలు, విదేశీ విధానాలు పూర్తిగా భారతదేశం అదుపులోనే వున్నాయి. భారతదేశ రాజకీయ ఆర్ధిక నిర్మాణంలోనికి సంస్థలలోనికి విదేశీ సంస్టల చౌరబాటుని నెహ్రూ జయప్రదంగా ప్రతిఘటించారు. స్వతంత్రం ఒక దేశం యొక్క ఆర్దిక బలంపై ఆధారపడి వుంటుంది. ఈ అవగాహనతో వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో వలసవాద వెనుక బాటుతనాన్ని అధిగమించి స్వతంత్రం స్వావలంబన ఆర్ధిక విధానాన్ని నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. చాలావరకు విజయం సాధించారు. త్వరిత పారిశ్రామికీకరణ, ప్రత్యేకించి భారీ పరిశ్రమల పెరుగుదల, ప్రణాళికలు, ప్రభుత్వరంగ అభివృద్ధి, అణుశక్తి శాస్త్ర సాంకేతిక రంగాలలో పని చేసే వారికి శిక్షణ - స్వతంత్ర ఆర్థికాభివృద్ధికి స్వావలంబనకు అవసరాలుగా నెహ్రు ఎంచుకొన్నారు. దేశప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని స్వావలంబనా భావాన్ని పెంచారు. జాతీయైక్యత స్వతంత్ర పోరాట కాలంలో రూపుదిద్దుకొని, 1947లో అధికార మార్చిడి జరిగిన విధానం కారణంగా ఒక మేరకు బలహీన పడిన జాతీయెక్యతని నెహ్రు పటిష్టపరచాడు. విధ్వంసక శక్తుల్ని అదుపులో వుంచడంలోను, జాతిని స్వతంత్ర రాజ్యాన్ని ఏకీకృతం చేయడంలోను, భారతప్రజల్ని మానసికంగా సమైక్య పరచడం లోనూ నెహ్రూ సఫలీకృతుడయ్యాడు. ఇది చిన్న విషయం కాదు... స్వతంత్ర పోరాట కాలంలో కులతత్వం, ప్రాంతీయతత్వం, తెగలతత్వం, భాషాపరమైన అరాచక వాదం లాంటి విచ్చిన్నకర ధోరణుల్ని స్వతంత్రం తర్వాత భారతదేశం 233
అధిగమించడం జరిగింది. అవి మరలా ముందుకు వచ్చాయి. ఒక వైపు స్వదేశీ సంస్థానాలు వున్నాయి. మరొకవైపు రావణకొష్టంలా రగులుకునే మతతత్వవాద ప్రమాదం వుందనే వుంది. భారతదేశం జాతిగా రూపుదిద్దుకొంటున్న దేశం. ఎంతో వైవిద్యంగల దేశం. దేశంలో విచ్చిన్నకర శక్తులు-కొన్ని సార్లు నిద్రాణంగా కొన్నిసార్లు చురుకుగా వున్నప్పటికి-నెహూ ఈశక్తుల్ని అదుపులో పెట్టగలిగాడు. రాజకీయ స్టిరత్వాన్ని సమకూర్చగలిగాడు. జాతీయైక్యతను జాతి నిర్మాణక్రమాన్ని ముందుకు తీసుకుపోగలిగాడు. ఇతర సమస్యలన్నిటి కంటే దీనికి ప్రాధాన్యత నిచ్చాడు. పంచవర్న ప్రణాళికల వెనుక జాతీయ్రైక్యత భావం వుంది. భారతదేశం యొక్క స్వతంత్రతకి ఐక్యతకి సన్నిపాత సంబంధం వుంది. 1958లో నెహ్రూ ఇలా రాశాడు, “బలంగా ఐక్యంగా వున్నవారు మాత్రమే జీవనం సాగిస్తూ స్వతంత్రాన్ని నిలబెట్టుకొనగలిగిన చాలా ప్రమాదకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం.” ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రభుత్వం నెహ్రూ జాతీయోద్యమ సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని షార్లమెంటరీ ప్రభుత్వాన్ని సురక్షితంగా పెంచి పోషించారు. ఆయన సార్వత్రిక వయోజన ఓటింగు పద్ధతిన మూడు సాధారణ ఎన్నికలు జరిపించాడు. ఎన్నికల్ని ఒక పద్ధతిగా ప్రజలకు అలవాటు చేశాడు. ప్రజాస్వామ్యం పట్ల, పౌరహక్కుల పట్ల నెహ్రూకి పూర్తి నిబద్ధత వుంది. నెహ్రూ ృష్టిలో అవి లక్ష్యాన్ని చేర్చే సాధనాలు కావు, పరిపూర్ణ విలువలు. సామాజిక మార్పు లేక సామాజిక ఆర్థికాభివృద్ధి లాంటి లక్ష్యాల కొరకు ప్రజాస్వామ్యం పౌరహక్షుల్ని కుదించటాన్ని అనుమతించలేదు. పార్లమెంటరీ విధానంలో కొన్ని లోపాలు, బలహీనతలు వున్నట్లు నెహ్రూ గమనించారు. వాటిలో కొన్నింటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. కాని ఆయన నికొరకైన ప్రజాస్వామ్య విధానాన్ని వదులుకోనని' ప్రకటించాడు. ___ వ్యక్తిగా నెహ్రకి గల అపారమైన పేరుప్రఖ్యాతులు ఆయనలోని ప్రజాస్వామ్యవాదిని కలుషితం చేయలేక పోయాయి. నెహ్రూ ఈబలాన్ని ప్రజాస్వామ్య క్రమాన్ని పౌరహక్కుల సాంప్రదాయాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించాడు. 1950 తరువాత నాటి ఆధిపత్య రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలోకూడా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని 2త్రిక బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బాహటమైన చర్చని ప్రోత్సహించాడు. ప్రాధమిక పౌరహక్కులు పొందు పరచబడిన రాజ్యాంగం, సార్వత్రిక ఓటింగ్ ప్రాతిపదికన ఎన్నికయ్యే సర్వసత్తాక అధికారం గల పార్లమెంటుకి క్రమబద్ధమైన ఎన్నికలు, పత్రికల స్వేచ్చ, మంత్రివర్గ ప్రభుత్వం, స్వతంత్ర న్యాయ వ్యవస్థగల అధికారాన్ని వికేంద్రీకరించే 'ప్రజాస్వామ్యయుత సంస్థ నిర్మాణాన్ని సృష్టించేందుకు సహాయపడద్డాడు.
నెహ్రూకి సామాన్య మానవుని పట్ల గల ప్రగాఢమైన విశ్వాసం గౌరవంతో ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత వేళ్ళూను కొన్నది. 'అదే నాకు మతం” అన్నాడు నెహ్రూ, కాలగమనంలో ప్రజలు ఆలోచనల మధ్య విచక్షణ చూపగలరని నెహ్రూ విశ్వసించారు గనుక' ఆలోచనల స్వేచ్చా మార్కెట్టుని బలపరచడానికి ఇష్టపడ్డాడు. అదే సమయంలో దేశంలోను పార్టీలోను నిరంకుశ ధోరణులున్నట్లు గమనించాడు. 'మన ప్రజాస్వామ్యం తెలివితో జాగ్రత్తగా పెంచిపోషించవలసిన సున్నితమైన మొక్క - అని 1951లో నెహ్రూ చెప్పారు. కాబట్టి సాధారణ (ప్రజానీకంలో (ప్రజాస్వామ్య భావనల పట్ల అభిరుచిని ఆసక్తిని పెంచేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఆయన హేతుబద్ధమైన ప్రజాస్వామ్య ఆలోచనా విధానంతో ప్రజల్ని చైతన్య పరుస్తూ ఆలోచనలను పంచుకొనేందుకు క్రమబద్దంగా పర్యటనలు జరిపారు. భారతదేశానికి ఆయన అందించే వారసత్వమేమిటని ప్రశ్నించినప్పుడు ఆయన యిలా చెప్పాడు. “తమని తాము పరిపాలించుకొనే సమర్ధత గల, 400 మిలియన్ల ప్రజల్ని”
నెహ్రు సామాజిక రాజకీయాఖివృద్ధి ఆలోచనకు ప్రజాస్వామ్యం స్వాభావికం. (ప్రజాస్వామ్యం ప్రజల్ని వారంతట వారు సమీకృతులయ్యేలా చేస్తుంది. సామాజిక న్యాయం, సమానత్వం అలాగే ఆర్థిక అసమానత తగ్గుదల సాధించేందుకు క్రిందినుండి ఒత్తిడి తెస్తుంది. కాలక్రమంలో యిది సోషలిజానికి దారి తీస్తుంది అధికారంలో వున్న రాజకీయ పార్టీ ప్రజాభిప్రాయాన్ని అమలు పరుస్తుంది. లేకపోతే పార్టీ తుడిచిపెట్టబడుతుంది. ఈ క్రమానికి చాలా సమయం పడుతుందని నెహ్రూకి తెలుసు. ఎందుకంటే పార్లమెంటరీ విధానం సార్వత్రిక ఓటింగు పరిపాలించే హక్కునిస్తాయి. కాని పరిపాలించగల శక్తిని లేక సమర్ధతనిస్తుందనే హామీ ఏమీలేదు. కాని కాస్త ముందో వెనకో హక్షుని అధికారం అనుసరిస్తుందని ఆయన విశ్వసించాడు. సమాజాభివృద్ధి పథకాలు, పంచాయితీరాజ్, సహకార సంఘాలు, అన్ని రకాల అధికార వికేంద్రీకరణతో పాటు నెహ్రూ ఎన్నికలకు అంత ప్రాధాన్యత నివ్వడానికి యిదొక కారణం. స్వతంత్రం తర్వాత భారతదేశం 2886
ప్రత్యేకించి భారతదేశంలాంటి వైవిధ్య సమాజంలో ఐక్యతను పటిష్ట పరచేందుకు ప్రజాస్వామ్యం అత్యవసరమని నెహ్రూ వాదించాడు. ఎలాంటి బలమూ లేక ఒత్తిడి భారతదేశాన్ని ఒకటిగా వుంచలేదు. “ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతికి ఎలొంటి ఎదురుదెబ్బ తగిలినా అది విధ్యంసానికి, హింసకి దారితీయవచ్చు.” 1960లో నెహ్రా చెప్పాడు.
(ప్రజాస్వామ్య, పౌరహక్కులు, రాజకీయ నిర్మాణ ప్రాతిపదికన ఆర్జీకంగొ దేశాన్ని అభివృద్ధి పరచాలనే తన ప్రయత్నం నూతనమైనదని, గతంలో ఎన్నడూ లేని స్వభౌవం గలదని నెహ్రూ గమనంలో వుంది. ఇప్పటి వరకు ఏ దేశమూ అలాంటి ప్రయత్సం చేయలేదు. అత్యధిక దేశాలు ఆర్థిక ఎదుగుదల ప్రారంభంలో నిరంకుశమైన పాలనాపరపైగ చర్యలు చేపట్టాయి. తన ఆర్థికాభివృద్ధి పంథా వలన అభివృద్ధి రేటు మందగిస్తుందనే అవగాహన నెహ్రూకి వుంది. కానీ భారత ప్రజలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకొరకు ఈ మూల్యాన్ని చెల్లించటానికి ఇష్టపడతారని భావించారు.
నెహ్రూ పిడివాద ఆలోచనా ధోరణిని వ్యతిరేకించాడు. ఇది మతం పట్ల తనకుగల ముఖ్యమైన అభ్యంతరం, జీవితం, జీవన సమస్యల పట్ల శాస్త్రీయ ఆలోచనా విధానం: శాస్త్రీయ ధృక్చధాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమైన భూమిక. సోషలిజం నిర్మాణం
తస నెహ్రూ పెట్టుబడిదారీ అభివృద్ధి విధానానికి చెందిన నాగరికతా దృష్టికోణాన్ని. మా శించారు. దానికి బదులుగా సోషలిస్టు దిశలో భారతదేశం సమాజం యొక్కమౌ లిక సాలు కృషి చేశారు. స్పష్టంగా ఆయన సోషలిస్టు సమాజ నిర్మాణంలో విజయం ఆయన దు. ఆయన ఆలోచనలకు ఆచరణకు మధ్య పెద్ద అంతరాయం ఉంది. క సమ వెనుకబడిన దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలతో సోషలిజాన్ని ప్రారంభించే సొషల్ లని తంటాలు పడ్డాడు. లక్షలాది మందికి సోషలిస్టు దృక్పధాన్ని చూపె, ఆయన ఆల చైతన్యంలో భాగమయ్యేలా చేసినవాడు నెహ్రా. అంతేగాక సోషలిజం 2 ఆచరణ చనలు, సోషలిజం స్థాపన, అభివృద్ధి పట్ల ఆయన వ్యూహం, ఆయన రాజకీయ ఆచరణ ఆధునిక ప్రపంచంలో సోషలిస్టు పరిణామం సమస్యపై లోతైన అవగాహనని సమకూర్చాయి. ట్ నిరిప వ్ దృష్టిలో సోషలిజం అంటే ఏమిటి? నెహ్రూ ఎప్పుడూ సోషలిజాన్ని ర్థిష్ట పదజాలంతో గానీ స్పష్టమైన సాధారణ సూత్రాలతో గాని నిర్వచించలేదు. ఆయన 236 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దృష్టిలో సోషలిజం అంటే అవకాశాలలో ఎక్కువ సమానత్వం, సామాజిక న్యాయం, ఉత్పత్తి 'కమాలను ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్వ్నయింపజేయడం వల్ల లభించే పెద్ద ఆదాయాల సమాన పంపకం. భూస్వాన్యు పెట్టుబడిదారీ విధానాలు కల్పించిన తీవ్రమైన సామాజిక ఆర్థిక వ్యత్యాసాల్ని అంతమొందించడం. సామాజిక సమస్యలను శాప్రీయమైన దృక్పథాన్ని అన్వయింపజేయడం. ఇంకా సోషలిజం అంటే ఇంకా ఇంకా పోగు చేసుకోవాలనే ధోరణిని, లాభాపేక్ష ఆధిక్యతని, పెట్టుబడిదారీ పోటీని అంతమొందించి సహకార స్ఫూర్తిని ప్రోత్సహించడం. సోషలిజం అంటే ముఖ్యమైన ఉత్పత్తి సాధనాలపై పెద్ద ఎత్తున సామాజిక యాజమాన్యం లేక అదుపు. కానీ నెహ్రా పేదరికాన్ని సమానంగా పంచలేము కనుగ సోషలిజం అంటే అధికోత్పత్తి జరగాలన్నారు. సంక్షిప్తంగా ఆయన దృష్టిలో సోషలిజం అంటే అధికోత్స్పత్తి పస్ సమాన పంపిణీ. భారతదేశ పరిస్థితుల్లో నెహ్రూ సోషలిస్టు పరిణామాన్ని ఒక ఘటనగా గాక ఒక క్రమంగా పరిగణించాడు. సోషలిజం నిర్దిష్ట లక్ష్యం వైపు స్పష్టంగా ముందుగా నిర్వచింపబడిన సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం సాగే పరిణామ క్రమం కాదు. క్రమంగా ముందుకు సాగే క్రాలదీ ఒక దశ తర్వాత మరొక దశ సోషలిజం నిర్వచింపబడుతూ ఉండాలి. అంతరాయం వుండకూడదు. క్రమబద్దమైన మార్పుగా సాగాలి. సోషలిజంలో జరిగే మార్పుని 'ప్రస్తుత సామాజిక, ఆర్థిక నిర్మాణ కక్ష్యలలో జరిగే సంస్కరణ (శ్రేణులుగా పరిగణించాలి. కొంత కాలవ్యవధిలో మార్పుల మొత్తం విప్లవం లేక నిర్మాణపరమైన సామాజిక మార్పు అవుతుంది. ఈ సంస్కరణలను నెహ్రూ శస్త్ర చికిత్సలను అమలు జరపడంగా వర్ణించాడు. ఆ విధంగా సోషలిస్టు విప్లవం ప్రజాస్వామ్యబద్దమైన శాసన సభ ద్వారా క్రమబద్ధమైన చట్టం ద్వారా నిర్వహింపబడే శస్త్ర చికిత్సల ్రేణి. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు - సోషలిజం నుండి విడదీయరాని సోషలిజం యొక్క మౌలికమైన భాగాలుగా నెహ్రూ విశ్వసించారు. జాతీయోద్యమం అనుభవం ప్రాతిపదికగా మౌలికమైన సామాజిక మార్పు విసృత ఏకాభిప్రాయంతోగానీ లేక అత్యధిక ప్రజానీకం ఆమోదంతో గానీ తీసుకుని రాబడుతుందనే అభిప్రాయానికి నెహ్రూ వచ్చారు. ఆయన 1956 లో టైబర్ మెండేకి చెప్పినట్లు “ఒకడు (నాయకుడు) ప్రజల్ని తన వెంట తీసుకుపోగలగాలి. వారు మార్పులు అంగీకరించాలి" పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది. కానీ అంతకంటే ముఖ్యంగా “ప్రజల్లో పెద్ద సెక్షన్ కూడా ఆమోదించాలి. కనీసం ఆమోదించడానికి సిద్ధపడి ఉండాలి. మరొక సందర్భంలో (ప్రజల్ని అభివృద్ధి పంథాలో నడిపించవలసిన ప్రాధాన్యత వుందనే నిశ్చితాభిప్రాయానికి స్వతంత్రం తర్వాత భారతదేశం 237
వచ్చినట్లు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో చెప్పారు. 'మనది ఎన్నికైన కొద్దిమందిగల పాక్షిక సంస్థకాదు. మనం భారత ప్రజలతో కలిసి ముందుకు సాగే సహ ప్రయాణీకులం'. ఈ వైఖరికి చాలా ఉప సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది : కాంగ్రెస్ లోపల వెలుపల ఉన్న విభిన్న అభిప్రాయాల్ని సమాధాన పరచి ప్రజల మద్దతు పొందే క్రమానికి చాలా సమయం పడుతుంది. కనుక సామాజిక మార్పు క్రమం నెమ్మదిగా జరగాలి. నెహ్రూ తన సహచరుల, ప్రజల అభిప్రాయాల్ని మొరటుగా తోసిపుచ్చడం, రాజ్యం యొక్క వివిధ సంస్థల స్వయం ప్రతిపత్తిని విస్మరించడం అగౌరవపరచడం కంటే వారికి నచ్చజెప్పి తనతో తీసుకుని పోయేందుకు సోషలిజంలోనికి మార్పుచెందించే వేగాన్ని తగ్గించడానికి సిద్ధపడ్డాడు. సోషలిజం బలంగా వేళ్లూనుకొనేందుకు ప్రజాస్వామ్యం, (ప్రజాస్వామిక దృక్సథం అవసరం. విస్తృతమైన సామాజిక ఏకాభిప్రాయం లేనప్పుడు సోషలిజం దిశగా సమూలమైన మార్పుల కొరక్తు చేపట్టే చర్యలు కూడా ఫాసిజం ప్రమాదాన్ని ఆహ్వానించడమవుతుందని నెహ్రా 1930 లలో ఫాసిజం అభివృద్ధి చెందిన అనుభవాన్ని గమనంలో పెట్టుకుని వాదించారు. ల్ “పరిస్థితులు పరిపక్వం కాకముందు సోషలిజం కమ్యూనిజం కొరకు చేసే (ప్రయత్నం ప్రతిచర్యకు లేక విధ్వంసానికి దారి తీయవచ్చు” నెహ్రూ 1948 లో జయప్రకాష్ నారాయడణ్కు రాశారు, సమాజంలో సామాజిక సాయి, ఆరికబలం గల భూస్వాములు గణనీయంగొ వున్నారన్తే గమనం నెహ్రూక్రి ఉంది. అంతేకాక తనకు జనాకర్షణ శక్తి. వ్యక్తిగతమైన నద నప్పటికీ తన పార్టీ 1952, 1957 ఎన్నికలలో 50 శాతానికి తక్కువ జా మితవా తెలుసు. మరొక వైపు ఈ సంవత్సరాలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ద రాజకీయ శక్తులు 25 శాతం ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌లో ఉన్న మితవాదులు కాక కాంగ్రెస్ వెలుపల ఉన్న మితవాదులకు గల బలం ఇది. అన్నింటినీ మించి పట్టణ గ్రామీణ జనాభాలో పెద్ద సెక్షన్‌గా ఉన్న మధ్య తరగతితో జాగ్రత్తగా వ్యవహరించాలి. జర్మనీలో ఫాసిజ్లానిక్రి వెన్నెముకగా పని చేసింది మధ్యతరగతే. ఆస్తిపాస్తులు గల వర్గాలపై దాడి మధ్యతరగత్సిని ఫాసిస్టు వైఖరి చేపట్టేలా చేయవచ్చు. మెజారిటీ ప్రజల్ని తమవైపు తిప్పుకోకుండా మైనారిటీ విప్లవం కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా సోషలిస్టు విప్లవం తీసుకురావడంకంటే ప్రతిఘాత విప్లవానికి గానీ, ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడానికి గానీ 288 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దారితీయవచ్చు. అంతేగాక భారత ప్రజల ఐక్యత చాలా సున్నితమైన దశలో అవసరంగా ఉన్న స్థిత్రిలో అలాంటి ప్రయత్నం ప్రజల్ని విడదీస్తుంది.
నెహ్రూ శకంలో భారతదేశం చాలా మెతకవైఖరి గల రాజ్యంగా ఉందని, నెహ్రూ బలహీనమైన పాలకుడనీ విమర్శలున్నాయి. బలమైన రాజ్యం వల్ల బలమైన పాలకుని వలన నిరంకుశత్వ ప్రమాదముంది కనుక నెహ్రూ అలాంటి విమర్శనంగీకరించలేదు. ఆయన మరణానికి ముందు 1964లో ఇలా చెప్పారు 'మంచితనాన్ని సభ్యతాసంస్కారాన్ని బలహీనశత్రగా పారపదడకూడదు. నా బలహీనతని వారు విమర్శిస్తున్నారు. కాని ఇది బలమైన వ్యక్తి అన్వడ్రేవాడు ప్రజల్ని వారి ఆలోచనల్ని అణగదొక్కడాన్ని అనుమతించనంత ఎన్నో వైవిధ్యాలు గల పెద్ద దేశం.
సోషలిజానికి ఇచ్చే స్పష్టమైన నిర్మాణబద్దమైన సైద్ధాంతిక నిర్వచనం చుట్టూ 'పెద్ద మెజారిటీ ప్రజల్ని సమీకరించడం సాధ్యపడదని నెహ్రూ విశ్వాసం. కనుక సోషలిజం పట్ల నెహ్రూ నూతన భావాలను స్వీకరించే వైఖరిని అమలు జరిపాడు. ఒక ఉమ్మడి సోషలిస్టు స్వప్నం లేక విసృత చట్రం చుట్టూ విఖిన్న ప్రయోజనాలు పలు అభిప్రాయాలు పిద్ధాంతిక ధోరణులు గల పెద్ద మెజారిటీని సమీకరించవచ్చు.
కాలం గడిచిన కొలదీ నెహ్రూ శాంతియుతమైన అహింసా పద్ధతుల ద్వారా సోషలిస్టు సమాజం స్థాపించవచ్చునని విశ్వసించాడు. వర్గపోరాటం ఉనికిని ప్రాధాన్యతని గుర్తిస్తూనే దానిని అహింసా పద్ధతుల ద్వారా చట్టబద్ధపాలన ద్వారా పరిష్మరించవచ్చునని నమ్మారు.
రాజకీయాలు, సోషలిజం పట్ల నెహ్రూ వైఖరికి సంబంధించిన మరొక అంశం (ప్రస్తావించాలి. సోషలిస్టు భారతదేశ నిర్మాణంలో లక్ష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మార్గానికి కూడా అంత ప్రాధాన్యత ఉందని నొక్కి చెబుతూ కాలగమనంలో గాంధీజీ భావాలకు సన్నిహితుడయ్యాడు. తప్పుడు పద్ధతులు మంచి ఫలితాలకు దారి తీయవన్నారు. లక్ష్యాలు, మార్గాలు విడదీయరానివనే విశ్వాసం కారణంగానే ఆయన సోషలిజం లాంటి ఉన్నత లక్ష్య సాధనకు కూడా హింసామార్గం చేపట్టడాన్ని ఖండించారు. ఆర్థికాభివృద్ధి ప్రణాళిక
భారతదేశ స్వతంత్రానికి, ఐక్యతకు, పేదరిక నిర్మూలనకు, తన సోషలిస్టు సంక్షేమ కార్యక్రమాల అమలుకు త్వరిత ఆర్థికాభివృద్ధి వౌలికమైన అంశంగా భావించారు. మూడవ స్వతంత్రం తర్వాత భారతదేశం 289
పంచవర్న ప్రణాళిక కొరకు “ప్రణాళికాభివృద్ధి అనే అంశాన్ని గురించి రాస్తూ నెహ్రూ 'శౌరులందరి - ప్రత్యేకించి అల్పాదాయ గ్రూపుల, పనిచేయడానికి అవకాశం దొరకని వారి జీవన స్థాయి పెరుగుదల కొరకు ఆర్థిక పెరుగుదల రేటు దీర్హకాలికంగా కొనసాగడం అవసరం. ఆవడి కాంగ్రెస్‌లో ఇలా చెప్పారు 'మన జాతీయాదాయం బాగా పెరగకపోతే ప్రపంచంలో సోషలిజం లేక కమ్యూనిజంతో పాటు భారతదేశంలో సంక్షేమరాజ్యం ఉండదు. ఉన్న సంపద పంచడానికి సోషలిజం లేక కమ్యూనిజం సహాయపడవచ్చు. కానీ భారతదేశంలో పంచడానికి సంపద లేదు. పంచేందుకు పేదరికం మాత్రమే ఉంది. సంపద లేకుండా సంక్షేమ రాజ్యం ఎలా సాధిస్తాం? మరొక విధంగా చెప్పాలంటే సమాజ స్వభావం ఎలాంటిదైనా సోషలిస్టు సమాజమైనా లేక పెట్టుబడిదారీ సమాజమైనా ఉత్పత్తి అత్యవసరం. త్వరితగతిని పారిశ్రామిక వ్యవసాయాభివృద్ధి సాధించే ప్రణాళికలు, కీలకమైన పరిశ్రమల అభివృద్ధికి పబ్లిక్ సెక్టారు, మిభ్రమ ఆర్ధిక విధానం - ఈ మూడు విస్తృతమైన, మేథాపరమైన ఏకాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే నెహ్రూ అభివృద్ధి వ్యూహం యొక్క మూడు స్తంభాలు. ప్రణాళికకు నెహ్రా విసృత ప్రచారమిచ్చాడు. దానిని భారతీయ చైతన్యంలో ఒక భాగాన్ని చేశారు. సంధి దశలో భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంభించాలి, రానున్న చాలాకాలం వరకు ప్రణాళిక చట్ర పరిమితిలో పని చేయాలి. అన్నీ మౌలిక పరిశ్రమలు, అర్షికరంగం యొక్క కీలకరంగాలు రాజ్యం యాజమాన్యంలో లేక అదుపులో ఉంచడం ద్వారా ఆర్ధిక రంగం అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలి. పబ్లిక్ రంగం కేవలం ప్రభుత్వ యాజమాన్య పరిశ్రమలపైనే ఆధారపడకూడదు. సహకార సూత్రం 'పోత్సహించడంపై నెహ్రూకి స్పష్టమైన అవగాహన ఉంది. వర్తకం, పరిశ్రమలు, వ్యవసాయరంగాల్లో సహకార సంఘాలు ప్రముఖపాత్ర నిర్వహించాలి. కాలం గడిచేకొద్దీ మార్కెట్ శక్తుల లాభాపేక్షకు ప్రాధాన్యత తగ్గాలి. కాలగమనంలో పబ్లిక్ సెక్టారు అదనపు వనరుల్ని ఉత్పత్తి చేయాలి. రూపకల్పనలో నెహ్రూ సహకరించిన 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ననుసరించి పబ్లిక్ సెక్టారు రాజ్యం ఆదాయాన్ని పెంచాలి. నూతన రంగాలలో అదనపు అభివృద్ధికి వనరుల్ని సమకూర్చాలి. ఆచరణీయతని గమనంలో పెట్టుకుని నెహ్రూ “పబ్లిక్ సెక్టార్ సక్రమంగా పనిచేసిన చోట దానిని నిలబెట్టి (ప్రోత్సహించాలి. పనిచేయని చోట దానిని తొలగించాలి" అని స్పష్టం చేశారు. అన్నింటిని మించి స్వతంత్రం ఆర్థిక బలంపైన, ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిఘటించే శక్తిపైన ఆధారపడి వుంటుంది గనుక నెహ్రూ స్వతంత్రమైన స్వావలంబన ఆర్థిక విధానాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. స్వతంత్ర ఆర్థికాభివృద్ధికి త్వరితగతిని 240 చిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పారిశ్రామికీకరణ వ్యవసాయ స్వయం సమృద్ధి ప్రణాళిక, పబ్లిక్ సెక్టారు, విదేశీ పెట్టుబడిని సహాయాన్ని తక్కువగా వినియోగించడం, సాంకేతిక ఆధునీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెద్ద ఎత్తున్న శిక్షణ, అణుశక్తి లాంటివి అవసరమైన భాగాలుగా గుర్తించాడు. దీనిని సాధించడంలో నెహ్రూ విజయం సాధించాడు. భారతదేశం పెట్టుబడిదారీ విధానం ద్వారా వలసవాదం నుండి స్వతంత్ర ఆర్థిక విధానానికి పరివర్తన చెందింది. తర్వాత బలహీనతలు వ్యక్తమైనప్పటికీ నెహ్రూ ఆర్ధిక విధానం సరియైనదని నిరూపితమయింది. భారతదేశం గణనీయంగా ఆర్థికాభివృద్ధి సాధించింది. మతతత్వవాద వ్యతిరేకత
సెక్యులరిజం పట్ల నెహ్రూ నిబద్ధత అచంచలమైనది. ఆయన జీవితాంతం మతతత్వ వాదంతో పోరాడాడు. పరిస్థితులు మతవాదానికి అనుకూలంగా ఉన్నప్పుడు దాని వ్యాప్తిని అద్దుకున్నాడు. నెహ్రూ అన్నీ సమస్యల విషయంలో ఏకాభిప్రాయం, రాజీలకు అంగీకరించినప్పటికీ మతవాదం అందుకు మినహాయింపు. 1950 లో నెహఘూ 'మతవాదంతో రాజీపడడమంటే మన సూత్రాలను (పద్ధతులను) విడనాడడం, భారత స్వతంత్ర లక్ష్యానికి ద్రోహం చేయడం” అన్నారు.
భారతదేశ ప్రత్యేక పరిస్థితిని గమనంలో పెట్టుకుని సెక్యులరిజాన్ని నిర్వచించారు. “రాజ్యాన్ని రాజకీయాల్ని విద్యని మతం నుండి వేరుచేయడం, మఠాన్ని వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించడం. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్ని ఇస్తూ, అన్నీ మతాల అనుయాయువులకు సమానావకాశాలు కల్పించడం సెక్యులరిజం అని నిర్వచించారు. రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో హిందువుల్ని ముస్లింలని, సిక్కుల్ని లేక జైస్తవుల్ని వేర్వేరు నమూనాలుగా పరిగణించేది, మతపరమైన ముసుగులో ఒక మతపరమైన గ్రూపు మరొక మతపరమైన (గ్రూపుపై ద్వేషాన్ని రెచ్చగొట్టేది మతతత్వవాదం అని నిర్వచించారు.
మతతత్వవాదం యొక్క సామాజిక, అర్ధిక మూలాల్ని మొదట అర్థం చేసుకున్న వారిలో నెహ్రూ ఒకరు. మతతత్వవాదం యొక్క సామాజిక పునాది మధ్యతరగతులతో ఏర్పరచబడినదైనప్పటికీ అది తిరోగమన విధానానికి ఆయుధం. మతతత్వవాదాన్ని ఫాసిజం యొక్క భారతీయ రూపమని నెహ్రూ చాలా స్పష్టంగా వర్ణించాడు. దానికి విరుద్ధంగా సెక్యులరిజాన్ని ప్రజాస్వామ్యానికి అత్యవసరమైన షరతుగా పరిగణించారు.
ఆయన హిందూ, ముస్లిం, సిక్కు లేక క్రైస్తవ మతతత్వ వాదాల మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదన్నాడు. అవి ఒకే సిద్ధాంతం యొక్క వేర్వేరు రూపాలు గనుక అన్నీ స్వతంత్రం తర్వాత భారతదేశం బడ!
వ్యతిరేకించదగినవేనన్నాడు. సెక్యులరిజం మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పిస్తుందని, వారి భయాందోళనల్ని తొలగిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో మెజారిటీ మతతత్వవాదాన్ని వ్యతిరేకించినట్లే మైనారిటీ మతతత్వ వాదాలను కూదొ వ్యతోలేకించాలన్నారు. బహుళ మతాలు గల సమాజంలో జాతీయైక్యతకు సెక్యులరిజం ప్రాతిపదికగా ఉండాలని, మతతత్వవాదం జాతీయైక్యతకు 'ప్రమాదకరమైనదని కాబట్టీ జాతి వ్యతిరేకమైనదని ఒప్పించే విధంగా నచ్చజెప్పాడు. అయినప్పటికీ మతతత్వ సమస్య పట్ల నెహ్రూ వైఖరిలో ఒక పెద్దలోపం ఉంది. ప్రణాళికాబద్దమైన ఆర్థికాభివృద్ధి, విద్యశాస్త్ర సాంకేతిక రంగాల వ్యాప్తి మతతత్వ ఆలోచనల్ని. ఐలహీనపరుస్తాయని విశ్వసించి మతతత్వ వాదానికి వ్యతిరేకంగా సిద్ధాంతపరంగొ పోరాడవలసిన అవసరాన్ని విస్మరించారు. ఫలితంగా విద్యలోని పాఠ్యాంశాల పట్లగానీః ప్రజల్లో శాస్త్రీయ దృక్చథాన్ని వ్యాప్తి చేయడం పట్లగానీ శ్రద్ధ వహించలేదు. మతతత్వం పట్ల తనకు గల అద్భుతమైన అవగాహనని ప్రజలకు చేరవేసేందుకు కాంగ్రెస్‌ని ఒకే సంస్థగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. అంతేగాక 1960లో ముస్లింలీగు క్రైస్తవ మత గ్రూపుతో ఐక్య సంఘటలకు కాంగ్రెస్‌ని అనుమతించి తన మతతత్వవాద ప్రతికూల వైఖరితో తాను రాజీపద్దారు. మతహింసని రెచ్చగొట్టి ప్రోత్సహించే వారిపై కఠిన చర్యల్ని శీస్పకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చజెప్పలేకపోయాడు. ఆయన జీవితంలోని చివరి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మతహింస చెలరేగడం బాధాకరం. సౌంప్రదాయవాద వ్యతిరేకత పరిమితమైన అర్ధంతో సంఘసేవకు నెహ్రూ ఎక్కున శక్తియుక్తుల్ని సమయాని. టైచలేదు. కానీ ఆయన సామాజిక సాంప్రదాయవాదాన్ని వ్యతిరేకించారు. హల మం “లోనే బ్రతకలేరని ఆర్థిక రాజకీయ మార్పులతోపాటు సామాజిక రంగం ో సా న! తీసుకురావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రధానమంత్రిగా అయో బాలీకల ముఖ్యమైన విజయాలలో హిందూ కోడ్ బిల్లును ఆమోదింపజేయడం. ఆ విద్యని మధ్యతరగతి మహిళల ఉపాధిని ఎంతో (శ్రద్ధతో ప్రోత్సహించారు. విదేశాంగ విధానం 12వ అధ్యాయంలో వివరించినట్లు నెహ్రూ విదేశాంగ విధానం అత్యద్భుతమైనది, అసాధారణమైనది. వలసవాద వ్యతిరేకతకు ప్రపంచశాంతికి దోహదపడుతూ నెహ్రూ 242 చిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొత్తగా న్రధ్రించిన భారతదేశ స్వాతంత్రాన్ని పరిరక్షించి బలపరిచేందుకు భారతదేశ 'పయోజనాలను పరిరక్షిస్తూ స్వావలంబనని, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు విదేశాంగ విధానాన్ని ఒక సాధనంగా వినియోగించాడు. నెహ్రూ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులందరూ ఆయన విదేశాంగ విధానాన్ని అమలు జరపడం కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. నెప్రూపై అంచనా చరిత్రలో నెహ్రూ స్థానాన్ని అంచనా వేసేటప్పుడు ఆయన రాజకీయ బలహీనతల్ని పరిగ్యనలోకి తీసుకోవాలి. భారతజాతి ఏకీకరణ, ఆర్థికాభివృద్ధి సామాజిక మార్పులలో నెహ్రూ వ్యూహంలోని బలహీనత గాంధేయ అహింసాయుత పోరాటంలోని ఒక అంశాన్ని ప్రజలను సమీకరించడాన్ని విడనాడం. జాతి నిర్మాణ ప్రక్రియలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిన అవసరాన్ని నెహ్రూ గుర్తించారు. ఐచ్చికంగా ప్రజలు సమీకృతులవుతారని విశ్వసించారు. ఆశించినట్లుగా ప్రజలు సమీకృతులు కాలేదు. (ప్రజలు తమ ప్రయోజనం కొరకు ఓటు వేయడం ద్వారా క్రమంగా చైనత్యవంతులవుతారని నమ్మారు. ఆయన తన ఉపన్యాసాలు తనలాంటి ఇతరుల ఉపన్యాసాలు ప్రజల్ని చైతన్య పరిచి కదిలిస్తాయని 19వ శతాబ్దపు ఉదారవాద ధోరణిని ఆశ్రయించారు. నెహ్రూకి ప్రజల పట్ల గల (ప్రేమాభిమానాలు ఆపారం. నెహ్రూ ప్రజల ఆలోచనల్ని అభిప్రాయాల్ని గ్రహించి వారి ్రేమాభినాలు విశ్వాసం చూరగొని ప్రజల్ని విపరీతంగా (ప్రభావితం చేశాడు. కానీ రాజకీయాల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యానికి వారి సామాజిక విముక్తికి నిర్మాణం. సమీకరణ అవసరం. వాస్తవంగా నెహ్రూ అభివృద్ధి నమూనా, సామాజిక మార్పు అణగారిన అణచివేత ఆధిక్యాలకు గురయిన దిగువ ప్రజలు తీసుకునిరాగల తీవ్రమైన వత్తిడిపై ఆధారపడినట్టివి. రాజకీయాలో అలాంటి చురుకైన ప్రజల భాగస్వామ్యం మాత్రమే జాతి నిర్మాణం సామాజిక మార్పు సమానత్వం సాధించే సాధనంగా పార్లమెంటరీ (ప్రజాస్వామ్యాన్ని పనిచేయించగలుగుతుంది. కానీ నెహ్రూ ప్రజల్ని లేక తన స్వంత పార్టీలోని దిగువ స్థాయి (శ్రేణుల్ని సమీకరించి చైతన్యవంతుల్ని చేసే సంస్థల్ని లేక నిర్మాణాల్ని లేక ఏజెంట్లని సృష్టించుకోవడంలో విఫలమయ్యాడు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ఆయన అనుసరించిన పద్ధతి విసృతంగా పర్యటించడం, ఉపన్యసించడం, తన విధానాలకు ప్రజల మద్దతు పొందడం. స్వతంత్రం తర్వాత భారతదేశం 243
1947కి ముందు ఆయన పర్యటనల వలన ఒనగూడిన రాజకీయ ప్రయోజనాన్ని స్టానిక కాంగ్రైస్ కమిటీలు జాతీయవాద శ్రేణులు పోగుచేసుకున్నాయి.. కానీ 1947 తర్వాత ఆయన పర్యటనల ఫలితాన్ని పొందేందుకు దిగువ స్థాయిలో (ప్రజాసంస్థలు లేకపోవడంతో స్ధానిక రాష్ట్రస్థాయి నాయకులు ఆ ఫలితాన్ని పొందారు. నెహ్రూ కాలంలో ప్రజల భాగస్వామ్యం ఎన్నికలలో తప్ప రాజకీయ కార్యక్రమాల్లో అంతగా లేదు. క్రమంగా ప్రజల సమీకరణ తగ్గింది. కింది స్థాయి ప్రజలకు అధికారంలో ఉన్న జాతీయ నాయకత్వానికి మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. రాజకీయాలకు సామాజిక నిర్మాణాత్మక పనికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్నికల రాజకీయాలు స్థానిక ఆర్థిక రాజకీయ కులీనుల పట్టుని పెంచాయి. నెహ్రూ తన విధానాలకు ప్రచారమిచ్చి వాటికి అనుకూలంగా ప్రజల్ని సమీకరించడంలో, నెహ్రూ తన విధానాలను అమలు పరచడానికి లేక వాటి వెనుక ప్రజల్ని సమీకరించడానికి అవసరమైన నిర్మాణపరమైన సంస్థల్ని నిర్మించడంలో కూదా విఫలమయ్యారు, ఇది తన ఆలోచనలను రాజకీయాలను అమలుపరచడంలో బలహీనతకి దారితీసింది. భూ సంస్కరణలు, సమాజాభివృద్ధి పథకాలలో పబ్లిక్ సెక్టారు నిర్వహణలో లోపాలకు ఇదే ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ జాతీయవాద శక్తుల్ని కూడగట్టే పాత్ర నిర్వహించి ఉండవలసింది. కానీ నెహ్రూ 1951లో పార్టీపై పూర్తి అదుపు సాధించిన తర్వాత కూదొ పార్టీ నిర్మాణాన్ని అశ్రద్ధచేశారు. ఆయన స్వతంత్రానికి ముందు కూదా పార్టీనర్మాత నిర్వాహకుడు కాదు. 1947 కి ముందు పార్టీ నిర్మాణ దక్షులుగా ఉన్న గాంధీజీ, సర్దార్ పటేల్ రంగం నుండి నిష్మమించిన తర్వాత నెహ్రూ ఏకైక నాయకుడయ్యాడు. కాంగైైబ “౦స్టగా క్రమంగా బలహీనపడింది. సామాజిక మార్చుని తెచ్చే సాధనంగా లేక ప్రభుత్వ విధానాలను అమలు పరిచే సాధనంగా, లేక పార్టీ సిద్దాంతాన్ని ప్రజలకు వివరించే సాధనంగా కూడా కాంగైస్ 'ప్రాధాన్యతని కోల్పోయింది. క్రమంగా యాంత్రిక రాజకీయాల దిశగా దారి తప్పింది. ఫలిశంగా నెహ్రూ తన విధానాల అమలు కొరకు అధికార వర్గంపై ఆధార పడవలసి వచ్చింది. ప్రజల అభివృద్ధి కొరకు ప్రజల్ని భాగస్వాముల్ని చేయవలసిన సమాజాభివృద్ధి పథకం, పంచాయితీరాజ్ - రెండు గొప్ప ప్రయత్నాలు కూడా అధికారుల అదుపాజ్ఞలతో జరిగాయి. గ్రామీణ పునర్నిర్మాణంలో ప్రముఖపాత్ర నిర్వహించవలసిన బైకడ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విలేశ్లా బైల్ వర్కర్స్ కూడా అధికార యంత్రంలో భాగమయ్యారు. వీలైనంత తక్కువ సమయం (గ్రామాల్లో గడిపారు. అంతేకాక పరిపాలనా చట్రం, ఉన్నతాధికార వర్గం, సంస్మరింప్రబడకుండా, పునర్నిర్మింపబడకుందా అంతకుముందు లాగానే ప్రజలకు దూరంగా ఉండిపోయాయి.
ప్రస్తుత సామాజిక ఆర్థిక వ్యవస్థకి మద్దతుగా ఉన్న కులవ్యవస్థ, పురుషాధిక్యత, 'గామీణ పేదలు గ్రామీణ సంపన్నులపై ఆర్థికపరంగా ఆధారపడడం, పెరుగుతున్న లంచగాండితనం లాంటి అంశాలను నెహ్రూ కూదా ప్రజాసమీకరణ ద్వారా, ప్రజల్ని వైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల ద్వారా ఎదుర్మోలేదు. అంతేగాక సామాజిక ఆధిపత్య వర్షాల యొక్క మార్చు, అంగీకారం పాత్ర గురించి అతిగా నొక్కి చెప్పాడు. ఈ వైఖరి నెహ్రూక్రి గాంధీనుండి వారసత్వంగా సంక్రమించింది. కానీ తన రాజకీయ లక్ష్యాలను వ్యతిరేకించేవారు - బ్రిటీషువారు గానీ, రాజులు గాని, ఆగ్రకుల ఛాందసులుగాని ఎవరైనా వారికి వ్యత్రిరేకంగా క్రియాశీల రాజకీయ సైద్దాంతిక పోరాటాలు నిర్వహించాలని గాంధీజీ విశ్వసించాడు. గాంధీజీ వ్యూహంలోని ముఖ్యమైన భాగం వారిని ప్రజాభిప్రాయం నుంది వేరుచేసేందుకు ఉద్దేశించబడింది. నెహ్రా తన గురువుగారి వ్యూహంలోని ఈ భాగాన్ని అనుసరించలేదు.
నెహ్రూ లక్ష్యాలు నిర్దేశించగలడు, ప్రజల ఆకాంక్షలకు ఆకారం కల్పించగలడు. ఒక దార్శికతతో (ప్రజల్ని ప్రభావితం చేయగలడు. ఆయన నిపుణుడైన రాజకీయవేత్త. కానీ వ్యూహాత్మక చట్రాన్ని రూపొందించే శక్తి తన లక్ష్యాల్ని సాధించేందుకు ఎత్తుగడలు రూపొందించే నిపుణత కొరవడ్డాయి. రాజకీయ అవకాశవాదాన్ని మోసాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నెహ్రూ వాటి స్థానంలో తాత్కాలిక పాలనా పరమైన చర్చలు చేపట్టాడు. ఇలా చేయడం మోసకారులకు స్వేచ్చగా అవకాశం ఇచ్చినట్లయింది. రాజకీయ కుయుక్తులు జరుగుతున్న క్రమాన్ని గమనించగలిగిన నెహ్రా వాటిని తిప్పికొట్టడానికి చేసిందేమీలేదు. తన ప్రభుత్వానికి తానే ప్రతిపక్షనాయకునిగా వ్యవహరిస్తూ ఒకప్పటి వలసవాద దేశంలో పెచ్చుపెరుగుతున్న లంచగొండితనం, ఏదోరకంగా జీవితంలో పైకి ఎగబాకడం, ఉన్నతాధికార వర్గీకరణ లాంటి చెడుగుల్ని ఖండించారు. కానీ వాటిని అదుపుచేసేందుకు అవసరమైన నిర్దిష్ట చర్చలు చేపట్టలేకపోయాడు. విద్యావిధానం మొత్తాన్ని పట్టించుకోలేదు. సంస్కరించలేదు. మెజారిటీ ప్రజలకు విద్య అందుబాటులోకి రాలేదు. ఒక సిద్ధాంతంగా ఉన్న మతతత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక ప్రజాపోరాటం చేపట్టబడలేదు. భూసంస్మరణల్ని అసమగ్రంగా అమలు జరపడం, (గ్రామీణ భారతదేశంలో ఆర్థిక అసమానత, సాంఘీక స్వతంత్రం తర్వాత భారతదేశం 245
అణచివేత, రాజకీయ హింసల వారసత్వాన్ని మిగిల్చింది. తొలిదశలో లంచగొండితనాన్ని అణచలేకపోవడం వలన అది నిరాఘాటంగా పెరిగి పరిపాలన రాజకీయాలకే కాక జీవితంలోని అన్ని రంగాలకు విస్తరించింది. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా నెహూ చాలా కష్టతరమైన కర్తవ్యాలనెదుర్కొన్నాడు. అయినప్పటికీ ఏ చారిత్రక ప్రమాణాలతో కొలిచినప్పటకీ ఆయన చాలా గొప్ప విజయాలు సాధించాడు. ఆయన కొన్ని విలువల్ని, వైఖరుట్నా, లక్ష్యాల్ని దృక్చధాల్ని పాదుకొల్పాడు. వాటిని భారత ప్రజల జీవన విధానంలో అవిచ్చిన్న భాగం చేశాడు. ఆయన జీవిత చరిత్రకారులలో ఒకరైన జాట్రీ టైసన్ చెప్పినట్లు “నెహ్రూ మరొక తరహావ్యక్తి అయివుంటే భారతదేశం వేరు విధంగా ఉండి ఉందేది'. నెహ్రూ, నెహ్రూ శకం చారిత్రక జ్ఞాపకంలోకి గడచిపోయాయి. ఇప్పుడు ర్0 సం॥ పైబడ్డవారు మాత్రమే ఒక వ్యక్తిగా జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చాలామంది భారతీయులు
- ఆయన జీవిత కాలంలో తీవ్ర విమర్శకులుగా ఉన్నవారు కూడా - నెహ్రూ శకంలోకి వెనుతిరిగి చూసి ఆయనతో మమేకమవుతారు. ఆయన జీవితం నుండి ఆయన సామాజిక దార్భనికత నుండి వర్గపరమైన కులపరమైన అణచివేత లేని సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన $05121 చేసిన విలువల నుండి (ప్రేరణ పొందుతారు. ఈనాడు నిరాశా సంద్రంలో మునిగిపోనున్న భారతీయులకు ఆయన వదలి వెళ్లిన వారసత్వం పలువిధాలుగా పెద్ద లంగరు. ఒక నాయకుని నుండి ఇంకా ఏమి ఆశిస్తారు? ఏ దేశమైనా, ఏ ప్రజలైనా నాయకుద్ని అతడు గొప్ప వాడైనా - సమస్యలన్నింటిని పరిష్మరించమని అడగగలరా! 246 భిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
శత రాజకీయ పార్టీలు,1947-64, ఇ కాంగ్రిబ
ఒకప్పుడు వలస దేశాలుగా వున్న వాటిలో ఒక్క భారతదేశం మాత్రమే స్వాతంత్రానంతరం 50సంవత్సరాలకు పైగా పార్లమెంటరీ ప్రభుత్వంగా కొనసాగుతున్న దేశం. నెహ్రూ కాలమంతటా రాజకీయంగా కాంగ్రెస్ ఆధిపత్య స్థానంలో వుంది. కేంద్రంలోనూ దాదాపు అన్నీ రామ్ర్రాలలోను అధికారాన్ని నిలబెట్టుకొన్నది. కాని అదే సమయంలో ప్రారంభం నుండి పార్టీల మధ్య స్వేచ్భ్బాయుతమైన పోటీ ప్రాతిపదికగా బహుళపార్దీవిధానం, బలమైన పార్లమెంటరీ సంస్థలు కూడా అభివృద్ధి చెందాయి. స్వతంత్రం నాటికి కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, కిసాన్ మజ్యుర్ ప్రజాపార్టీ, భారతీయ జనసంఘ్ లాంటి పలు రాజకీయ పార్టీల స్వభావం, పని విధానం 1951-52 నాటికి అవి చురుకుగా పనిచేస్తూ వుండటం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందటానికి దోహదపడింది.
అన్ని పెద్ద రాజకీయ పార్టీలు-వాటి రాజకీయ పునాదులు కొన్ని ప్రాంతాలకు లేక వర్గాలకు, సమాజంలోని కొన్ని సెక్షన్లకు పరిమితమైనప్పటికీ వాటి నిర్మాణంలో, నిర్వహణలో, విధానాల కార్యక్రమాలలో జాతీయ లేక అఖిలభారత స్వభావం గలవి. వాటికి జాతీయ లక్ష్యాలున్నాయి. అవి అఖిలభారత సమస్యల్ని చేపట్టాయి. వాటికి అఖిల భారత నాయకత్వం వున్నది. అవి దేశం మొత్తం యొక్క సామాజిక, ఆర్థిక రాజకీయాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రతిపాదించాయి.
ప్రజల మద్దతు రీత్యాగాని, పార్లమెంటులో రాష్ట్ర అసెంబ్లీలలో సీట్ల రీత్యాగాని, (ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా కాంగ్రెస్‌తో పోళ్చిచూస్తే బలహీనంగా వున్నప్పటకీ అవి స్వతంత్రం తర్వాత భారతదేశం 27
చురుకుగా పనిచేయలేదు. అవి ప్రత్యామ్నాయ ఆర్ధిక, రాజకీయ, విధానాలను తీవ్రంగా ప్రచారం చేశాయి. 1951-52, 1957, 1962 సాధారణ ఎన్నికలలో కాంగ్రేసేతర అభ్యర్థులు కాంగ్రేస్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొనడం గమనార్హం. వారు1952 ఎన్నికలలో 26 శాతం, 1957లో 25 శాతం, 1962 లో 28 శాతం లోక్‌సభ సీట్లను కైవసం చేసుకొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలలో అంతకంటే మంచి ఫలితాలు సాధించారు. 1952లో 32శాతం, 1957 లో 35శాతం, 1962 లో 40 శాతం అసెంబ్లీ స్థానాలు గెలిచారు. అంతకంటే ముఖ్యమైన అంశమేమంటే వారు ప్రభుత్వంపై పరిపాలనా పార్టీపై గణనీయమైన ఒత్తిడి తెచ్చారు. వారికి ప్రజల సమస్యలపై సరియైన అవగాహన వుంది. ప్రజలలో పలుకుబడి చట్టసభలలో వారి సంఖ్యకి మించివుంది.
ఈ కాలంలో ప్రతిపక్ష పార్షీలు బలహీనంగా వుండటానికి కారణం అవి ఐక్యం కాలేక పోవడం. ప్రతిపక్ష పార్టీలు వాటి మధ్య కంటే కాంగ్రెస్‌లోని ఏదో ఒక [గ్రూపుతో సారూప్యత వున్నట్లు భావించాయి. ఇది యాదృచ్చికం కాదు. 1947కి ముందు కుల, మతతత్వపార్టీలు మినహాయించి అన్ని పార్టీలు కూడా జాతీయోద్యమంలో కాంగ్రెస్‌లో భాగంగా పనిచేశాయి. వామపక్ష (16%) మితవాద (1800 పార్టీలు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం వలననే 1977, 1989లలో కాంగగైస్ని ఓడించగలిగాయి.
స్వతంత్రం సాధించినప్పుడు అలాగే నెహ్రూ శకంలోనూ భారత జాతీయ కాంగ్రెస్ అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్ల. కనుచూపు మేరలో దానికి ప్రత్యామ్నాయం లేదు. జాతీయోద్యవు నాయకునిగా, వారసునిగా కాంగ్రెస్ సంస్థకు అపారమైన ్రతిష్టవుంది.
దాని విస్తృతి దేశవ్యాప్తం. దాని సామాజిక పునాది మహానగరాల నుండి మారుమూల (గ్రామాల వరక్తు, పెద్దపెద్ద పెట్టుబడిదారుల నుండి (గ్రామీణ పేదల వరకూ విస్తరించింది. కొంగ్రైెస్ దేశ్శాన్సిక్రి స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చింది. దశాబ్దాల కాలం పాటు భారతదేశ రాజకీయ స్థిరత్వానికి కాంగ్రెస్ సాధనంగా పనిచేసింది. స్వతంత్రం తరువాత అప్పటి వరకు ఉద్యమంగా వున్న కాంగ్రెస్ పార్టీగా ప్రచ్చడిందని చరిత్రకారులు రాజకీయ పండితులు చెపుతుంటారు. కాని 1947 ఆగప్టు ఎలాంటి అంతరాయం రాలేదు గనుక ఇది అర్ధసత్యం. వాస్తవంగా ఇది కాంగైసి వను మారిన పరిస్థితులలో ప్రజాఉద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం అవస కాని అది ప్రభుత్వాన్ని ఏర్పరచే ఆధునిక పార్టీ అయి జాతి నిర్మాణానికి రమయిన, విస్తృతమైన, సంకీర్ణ స్వభావాన్ని నిలబెట్టుకొనగలదా? ఒక పార్టీగా అది నిర్మాణపరమైన ఐక్యత కలిగివుండాలి. నిబంధనావళి, నిర్మాణచట్రం గల ఏ ఇతర రాజకీయ వకరి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పార్టీకి గాని గ్రూపుకి గాని చెందిన వ్యక్తి కాంగ్రెస్ సభ్యుడు కాజాలడు - అనే షరతు సూర్ పటేల్ చారవతో విధించబడడంతో కాంగ్రెస్‌లో నిర్మాణపరమైన ఐక్యత సాధించబడింది (1947కి ముందు సోషలిస్టులు, కాం(గైెస్, కమ్యూనిష్టులు వారి పార్టీలను వారు ఏర్చరచుకొన్నప్పటికి కాంగ్రెస్ సభ్యులుగా వుండటం అనుమతించబడింది). కాని కాంగ్రెస్ తన సైద్ధాంతిక ఆచరణాత్మక వైవిధ్యాన్ని ఒకమేరకు సంన్థాపరమైన సడలింపుని నిలబెట్టుకొన్నది.
కాంగ్రెస్ సోషలిస్టులు ఆవిర్భవించనున్న కాం(గైస్ స్వభావాన్ని అపార్ధం చేసుకొన్నారు. పటేల్ సవరణ తరువాత కాంగ్రెస్ ఇక ఏ మాత్రం విస్తృత ప్రాతిపదిక గల పార్టీ కాదని, పెట్టుబడిదారీ పంథాలో అభివృద్ధి పట్ల స్పష్టమైన సైద్ధాంతిక నిబద్ధతగల పార్టీగా మార్చబడిందని భావించారు. ఈ విభేదాల కారణంగా సోషలిస్టులు కాంగ్రెస్‌ని వదిలి వెళ్ళాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విస్తృత ప్రాతిపదిక స్వభావానికి కచ్చితంగా ఒక దెబ్బ.
మరొకవైపు జవహార్‌లాల్ నెహ్రూ అందరిని ఇముడ్చుకొని ఉమ్మడి అంగీకారం పాందే కాంగ్రెస్ స్వభావాన్ని నిలబెట్టడం అవసరమని, కాంగ్రెస్ నాయకత్వం లేకపోతే రాజకీయ స్టిరత్వం వుండదని, ఆర్థిక సామాజికాభివృద్ధి సాధ్యపడదని విశ్వసించాడు. పార్టీ వామపక్ష మితవాద విధానాలపై విభజింపబడడం నెహ్రాకి ఇష్టంలేదు. నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ సోషలిజాన్ని సామాజిక మార్పుని తీసుకొని వస్తుందని విశ్వసించిన చాలామంది కాంగ్రెస్ సోషలిస్టులు కూడా కాంగ్రెస్‌లో వుండిపోయారు. కాని సోషలిస్టులు కాంగ్రెస్‌ని వదలి వెళ్ళడం కాంగ్రెస్ యొక్క సోషలిస్టు ఆకాంక్షల పట్ల తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించిన నెహ్రూ వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావటానికి లేక తన జాతి నిర్మాణ ప్రయత్నాలలో కనీసం సహకారం పొందటానికి చాలా ప్రయత్నాలు చేశారు. నెహ్రూ చాలా కష్టతరమైనదైనప్పటికి కాంగ్రెస్‌ని సంస్కరించటానికి, దానిని వామపక్ష దిశగా మరల్చటానికి నిరంతరం కృషిచేశాడు. ఆయన మతతత్వవాదులతో తప్ప మిగిలిన రాజకీయ (ప్రత్యర్భులతో సమాధాన పరచే వైఖరి అవలంబించాడు.
1947 తరువాత కాంగ్రెస్ రాజకీయాధికారం కొరకు ఇతర పార్టీలతో పోటీపడే స్పష్టమైన రాజకీయ పార్టీ అయింది. కాని అది ఏకశిలా సదృశమైన పార్టీ కాలేదు. చాలా వరకు సైద్ధాంతిక మెతకదనం, అస్పష్టతలతో కాంగ్రెస్ తన నిరాకారమైన జాతీయ అనుకూల స్వభావాన్ని నిలబెట్టుకొన్నది. ఒక మేరకు క్రమశిక్షణని పాటిస్తూ నిర్ణయాలు చేయటాన్ని ప్రజాస్వామ్యబద్ధ పని విధానాన్ని సాగించింది. పార్టీలో అంతర్గతంగా చాలా చర్చలు స్వతంత్రం తర్వాత భారతదేశం 240
జరిగేవి. వివిధ అభిప్రాయాలు, ధోరణులు, బాహాటమైన అసమ్మతి - పట్ల సహనం (ప్రదర్శించేది. పార్టీ సభ్యుల అభిప్రాయాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలోను, పార్టీ వార్షిక సదస్సులలోనూ వ్యక్త మయ్యేవి. జిల్లా, రాష్ట్ర పార్టీల సంస్థాపరమైన నిర్మాణాలు సమర్ధవంతంగా పని చేసేవి, పార్టీలో వస్తున్న విభిన్న అభిప్రాయాల్ని నాయకత్వానికి తెలియజేసేవి. దీనిలో ముఖ్యమైనది ప్రజాస్వామ్యవాదిగా పార్టీలోను. ప్రతిపక్ష పార్టీలతోను నెహ్రూ నిర్వహించిన పాత్ర ముఖ్యమైనది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కాలంలో లాగానే కాంగ్రెస్, విభిన్నవర్ల, ప్రాంతీయ ప్రయోజనాలను సమాధాన పరచటానికి, సానం కల్పించటానికి, సర్దుబాటు చేయటానికి మాధ్యమంగా పనితేసింది. పార్టీలోని విభిన్న దృక్పథాలను సమాధానపరచే, రాజీచేసే, యిముడ్చుకొనే శక్తి కాంగ్రెస్‌కి వుంది. సంపన్న [గ్రూపులను సామాజికంగా ఆధిపత్యం సాధించిన గ్రూపులను బుజ్జగించగలదు.అదే సమయంలో అణగారిన పేదల ప్రతినిధిగా నిలబడగలదు. వామపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహించడంలో విఫలమవడం వలన ఆవిర్భవించి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన నూతన సామాజిక రాజకీయ శక్తులకు కాంగ్రెస్ స్థానం కల్పించగలదు. ఇలా అందరినీ దగ్గరికి తీసుకొని కలుపుకొనే కాంగ్రేస్ స్వభావానికిక పాక్షికంగొ జాతీయోద్యమ వారసత్వం కారణం. అంతకంటె జాతీయైక్యత, ప్రజాస్వామ్యం సామాజిక మార్చు సాధించడానికి అత్యధిక (ప్రజానీకం యొక్క ఆమోదం పొందడం అవసరమని 18వ అధ్యాయంలో వివరించిన నెహ్రూ భావనకూడా కారణం. నెహూశకంలో మితవాద (181%), వామపక్ష (16%) మైనారిటీలు దానిలో వున్నప్పటికి కాంగ్రెస్ వామపక్ష మొగ్గుగల మధ్యేవాద పార్టీగా వుంది. స్పూలంగా కాంగ్రెస్ జౌతీయవాదం, ఆర్థికాభివృద్ధి సామాజిక న్యాయం, సంపద పునర్విభజన, సమానావకాశాలు లాంటి భావాలచే అవరింపబడిన ప్రజాస్వామ్య సోషలిజానికి ప్రాతినిధ్యం వహించింది. పేస్టైనద పార్టీగా దానికి మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి. మొదటిది మతతత్వ కాంగ్రెస్‌లో [ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వాటి వైఖరులను ప్రతిఫలించే గ్రూపులు ఎప్పుడా గల గ్రూష్వ వుంటాయి గనుక వాటి ప్రజాందోళనల ద్వారా లేక కాంగ్రెస్‌లో గల సారూప్య (౨ (టూపుల ద్వారా కాంగ్రెస్‌ను ప్రభావితం చేయగలిగాయి. రెండవది: కాంగ్రెస్ యొక్క సమాధానపరచే వైఖరి ప్రత్రిపక్ష షార్టీలను తనలో కలుపుకొనడానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీల సామాజిక పునాదిని, శ్రేణుల్ని కార్యక్రమాల్ని. విధానాల్ని స్వీకరించగలిగింది. రాయితీలిచ్చి శాంతింపచేసి ప్రతిపక్ష పార్టీల ప్రజా ఉద్యమాలను శాంతింప జేయగలిగింది. 250 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కలుప్పుకానగలిగింది. మూడవది: వామపక్ష మితవాద ప్రతిపక్ష పార్టీలు తమశ్రేణుల్ని అనుచరుల్ని-నాయకుల్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం కాకుండా నివారించేందుకు తమ విధానాలను స్పష్టంగా నిర్వచించ యత్నించాయి. కాని ఈ వైఖరులు కూడా ఆయా పార్టీలను ప్రజాభిప్రాయానికి దూరం చేశాయి. వాటిలో చీలికలు తెచ్చాయి ప్రతికూల ఫలితాల్రిచ్చాయి. పార్టీనాయకత్వం - ప్రభుత్వం ల పార్టీ నాయకత్వానికి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధం వుండాలి? అనే సమస్యపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం చేయవలసి వచ్చింది. ప్రభుత్వ నాయకుడు పార్టీ అద్యక్షుడు-రెండు పాత్రల్ని కలవకూడదనే ప్రాతిపదికన 1946 నవంబరులో నెహ్రా అధ్యక్షపదవికి రాజీనామా చేసి తాత్కాలిక (ప్రభుత్వంలో చేరాడు. కానీ పార్టీ (థ్రైసిడెంటుని, వర్కింగ్ కమిటీని సంప్రదించి ప్రభుత్వ విధాన రూపకప్పన, ప్రభుత్వ నిర్ణయాలు జరగాలని నెహ్రూ వారసునిగా కాంగ్రెస్ థైసిడెంట్ అయిన జె.బి.కృపలానీ డిమాండ్ చేశాడు.
ప్రభుత్వాధికార బాధ్యతలు చేపట్టిన నెహ్రూ, సర్ధార్‌పటేల్ ఇతర నాయకులు కృపలానీతో విభేదించారు. వారు ప్రభుత్వ కార్యకలాపాలు, పత్రాలు, రహస్యాలని అవి 'ప్రభుత్వపాలనా బాధ్యతలతో లేని వారికి వెల్లడించకూడదని అన్నారు. పార్టీ దీర్హకాలిక విధానాలను, లక్ష్యాలను నిర్ధారించాలే గాని పాలనా పరమైన ప్రత్యేక బాధ్యతలలో జోక్యం చేసుకోకూడదని వాదించారు. వారి ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం ఎన్నికైన చట్టసభకి రాజ్యాంగ బద్దంగా జవాబుదారీగా వుండాలి. దానిని పార్టీకి జవాబుదారీగా చేయకూడదు. సారాంశంగా వారు పార్లమెంటరీ విభాగానికి స్వయం ప్రతిపత్తి వుండాలని, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినంత వరకు దానికి పార్టీపై ఆధిపత్యం కూడా వుండాలని వాదించారు.
పార్టీ ప్రభుత్వానికి లోబడి వుండడాన్ని కృపలానీ అంగీకరించలేదు. చాలా ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం తనను సంప్రదించ నిరాకరించడంతో నిస్పృహకు గురై తన రెండు సంవత్సరాల అధ్యక్ష పదవీకాలం పూర్తికాకముందే 1947 నవంబరులో రాజీనామా చేశాడు. తన రాజీనామా గురించి ఎ.ఐ.సి.సి ప్రతినిధులకు వివరణ ఇస్తూ యిలా చెప్పాడు. 'కాంగ్రైెస్ అత్యున్నత కార్యనిర్వాహకుడు లేక ఎన్నుకొనబడిన అధ్యక్షుడు విశ్వాసంలోకి తీసుకొనబడకపోతే జాతిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలలో (ప్రభుత్వానికి కాంగ్రేస్ తన చురుకైన చైతన్యవంతమైన సహకారాన్ని ఎలా అందించాలి? స్వతంత్రం తర్వాత భారతదేశం 2ర్ర1
కృపలానీ స్థానంలో అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ ఒక సంవత్సరం, ఆ తరువాతే రెండు సంవత్సరాలు బి.పట్టాభి సీతారామయ్య అధ్యక్షులుగా పనిచేశారు. కాని యిరువర కూడా ప్రభుత్వంపై కాంగ్రెస్ సంస్థ ఆధిపత్యం వుండాలని గాని లేక పభుత్వం సమానస్థాయి వుండాలని గాని డిమాండు చేయలేదు. పార్టీ అధ్యక్షుని విధుల్ని సంస్పా డు కార్యకలాపాలకు పరిమితం చేసుకున్నారు. కాని ఈ సమస్య సమసిపోవడానికి ముం సంస్థాగతమైన అదుపుపై నెహ్రూ-టాందన్ వివాదం తెరపైకి వచ్చింది. 1950లో పురుషోత్తందాస్ టాండన్‌ని కాం(గెస్ అధ్యక్షుని చేసే సమస్యపై పార్టీ ప్రభుత్వం మధ్య విధానాల విభేదాల సంక్షోభం వచ్చింది. 1945లో కమూనిస్తుల కాంగ్రెస్‌ని వదలివెళ్లడం, 1947 చివరి నుండి నెహ్రూ పట్ల ప్రభుత్వం పట్ల పూర్తి ప్రతికూ వైఖరి చేపట్టడం, 1948లో సోషలిస్టులు కాంగ్రెస్ నుండి వేరుపడడం లాంటి ఘటనల కాంగ్రెస్‌లో సమూలమైన మార్పులు కోరే శక్తులు బలహీన పడ్డాయి. సాంప్రదాయ శక్త చ బలపడాలని నిర్ణయించుకొన్నాయి. పార్టీపైన ప్రభుత్వ విధానాల పైన పట్టుసారల యత్నించాయి. కాని ఈ సంక్షేభాన్ని వివరించటానికి ముందు నెహ్రా-పటేల్ వి ఫలితంగా తలెత్తిన ఉద్రిక్తతని గురించి సంక్షిప్తంగా (ప్రస్తావించుకుందాం. నెహ్రు- పటేల్ సర్థార్ పటేల్‌ని గురించి చాలా అపార్దం చేసుకొనడం జరిగింది. కొందరు నెహూ దార్భనికతపై, విధానాలపై దాడిచేసేందుకు పటేల్‌ని కరుడుగట్టిన మితవాద భావాల గలవానిగా చిత్రించారు. రెండు వైఖరులూ తప్పే. పటేల్ నిస్సందేహంగా కాంగ్రెస్ మితవొ పక్ష (గర(ఇ10ల) ముఖ్య నాయకుడు. కాని ఆయన మితవాదవైఖరి తరచుగా తప్పుడుగొ వాఖ్యానించబడింది. నెహ్రులాగానే పటేల్ కూడా జాతీయోద్యమ మౌలిక విలువలు, ప్రజాస్వామ్యం పౌరహక్కుల పట్ల నిబద్ధత, సెక్యులరిజం, స్వతంత్ర ఆర్ధికాభివృద్ధి ఎంపుసంస్మరణ, పేదల పట్ల షక్షపాతం- గలవాడు. భూస్వామ్య విధానం రద్దు కావాలనిమై కాని నష్ట పరిహరం చెల్లించడం ద్వారా రద్దు కావాలన్నాడు. మతతత్వ వాదానికి బద్ధ వ్యతిరేకి. సెక్యలిజ్యం పట్ల నిఐద్గత గలవాడు - 1946-47లో మత ఘర్షణలకు దిగిన వారిపై కఠిన చర్యలు చేపట్లారు. ఆయన 1950లో ఇలా ప్రకటించాడు : మనది సెక్యులర్ రాజ్యం. పాకిస్తాన్ లాగా మన విధానాలను, నడవడిని మార్చుకోలేం. మన సెక్యులర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. ఇక్కడ ప్రతి ముస్లిం తానొక భారతీయ పౌరుడినని; భారతీయ పౌరునిగా తనకు సమాన హక్కులున్నాయని భావించాలి. అతడు అలౌ భావించగలిగేలా చేయలేకపోతే మన దేశ వారసత్వానికి మనం అర్హుబం కాము... 252 బీపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
| ఆయన అశైత పక్షపాతాన్ని, లంచగొండితనాన్ని సహించేవాదు కాదు. ఏమైనప్పటికీ వర్గం, సోషలిజం సమస్యలపై పటేల్ సాంప్రదాయ ధోరణి వ్యక్తమవుతుంది. 1947కి ముందు పటేల్ సోషలిస్టుల్ని కమ్యూనిస్టుల్ని వ్యతిరేకించాడు. 1947 తర్వాత (పైవేట్ వాణిజ్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆస్తిహక్కుని ప్రాథమిక హక్కుగా రాజ్యుంగంలో చేర్చాలని జయప్రదంగా వాదించాడు. ఆవిధంగా పటేల్ యొక్క మితవాద వైఖరి మౌలికంగా సామాజిక సిద్దాంత పరమైనది. పెట్టుబడి దారీ విధానం, పెట్టుబడిదారుల పట్ల ఆయన సానుకూల వైఖరి పూర్తి వ్యక్తిగత నిజాయితీతో కూడినట్టిది. ఆయన జాతీయోద్యమం కొరకు సంపన్నుల నుండి డబ్బు వసూలు చేశాడు. కాని ఏ ఒక్కరు కూడా ఆయనకు గాని, ఆయన కుటుంబానికి గాని ఒక్క పైసా ఇవ్వటానికి సాహసించలేదు.
వాస్తవంగా నెహ్రూ, పటేల్ మధ్య సంబంధం చాలా సంక్షిష్టమైనది. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు వారి మధ్య గల సారూప్యతని విస్మరించి విభేదాల్ని ఎత్తి చూపే వైఖరి చేపట్టారు. వారి మధ్య విభేదాలు వైరుధ్యాలు గమనించదగినవి, వాస్తవమైనవి. కానీ అవి చరిత్రని వక్రీకరించేంతగా అతిశయించబడ్డాయి.
పటేల్, నెహ్రూల మధ్య స్వభావపరమైన అలాగే సైద్ధాంతిక పరమైన విభేదాలు వున్నాయి. 1947 తరువాత వారి మధ్య చాలా సమస్యలపై విధానపరమైన విభేదాలు ఉత్పన్నమయ్యాయి. ప్రధాన మంత్రి పాత్ర, అధికారం, 1947 మత ఘర్షణల పరిష్కారం, పాకిస్తాన్ తో సంబంధాలు-సమస్యలపై వారి మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 1950లో కాంగ్రెస్ (ప్రెసిడెంటుగా పురుషోత్తందాస్ టాండన్ ఎన్నిక వారి మధ్య పెద్ధ విభేదాన్ని సృష్టించింది. ఆస్తిహక్కుని రాజ్యాంగంలోని [ప్రాథమిక హక్కులలో చేర్చాలన్న పటేల్ అభిప్రాయాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. చాలాసార్లు సమస్యలపై విధాన పరమైన విభేదాలు దాదాపు జరగడానికి దారితీశాయి. రాజీనామాలకు సంసిద్ధమయ్యే వరకూ పోయాయి. ఇరువురి మధ్య ఒకమేరకు ఉద్రిక్తత ఎప్పుడూ వుంటూ వచ్చింది.
అయినప్పటికి యిరువురు విడిపోలేదు. కలిసి ముందుకు సాగారు. వేర్వేరు దారులు పట్టలేదు. కారణం వారిని విడదీసే దానికంటే కలిపివుంచిన విలువ ప్రాధాన్యత గలది. వారు పరస్పరం చాలా విధాలుగా సహయపద్డారు. ఒకరు నిర్మాణదక్షుడు పరిపాలనా దక్షుడు. మరొకరు అపారమైన ప్రజామద్దతు విస్తృతమైన సామాజిక అభివృద్ది దృక్పధం గలవాడు. పటేల్ నెహ్రూ పాత్రని కొన్ని అంశాలలో సవాలు చేస్తూ కూడా నెహ్రూకి సహయపడ్డాడు. అంతేగాక ఒకరిపట్ల మరొకరికి గణనీయమైన గౌరవాభిమానాలు వున్నాయి. ఇరువురు కూడా ఒకరి ఆవశ్వకతని మరొకరు గుర్తించినవారు. గాంధీజీ మరణం కూడా స్వతంత్రం తర్వాత భారతదేశం 253
పరిస్థితులో చాలా మార్చు తెచ్చింది. పరస్పర సహకారం చాలా అవసరమని గుర్తించారు. దాదాపు ప్రతి ప్రభుత్వ ప్రధాన విధాన నిర్ణయంపై నిర్మాహమాటమైన చర్చల క్రమం ద్వారా ఒక నిర్ణయానికి వచ్చారు. పటేల్ తన వాదన బలంగా వినిపించాడు. కాన్నిసార్లు గెలిచాడు. తన వాదనతో నెహ్రాని ఒప్పించలేనప్పుడు అనివార్యంగా నెహ్రూ వాదనని ఆమోదించాడు. నెహ్రూ విధానాల పూర్తి మద్దతుకు హమీయిస్తూ పటేల్ నెహ్రోకి విశ్వసనీయమైన సహచరుడిగా కొనసాగాడు. గాంధీజీ మరణానంతరం నెహ్రాని తన నాయకుడిగా పటేల్ మాటి మాటికి వర్షించాడు. 1948 నవంబరు 14న నెహ్రా జన్మదినం సందర్భంగా పటేల్యిలా చెప్పాడు,,మహాత్మాగాంధీ నెహ్రూని తన వారసునిగా ప్రకటించారు. గాంధీ మరణించినప్పటి నుండి మా నాయకుని తీర్పు సరియైనదని మేము గుర్తించాలో అందుకు నెహ్రూ 'పటేల్ సాహచర్యం నాకు కొండంత అంద. ఆయన సలహ సంప్రదింపులు ప్రేమాభిమానాలు లేకపోతే నేను ప్రభుత్వపాలన సాగించగలిగే వాణ్నికాను.' పురుషోత్తందాస్ టాండన్ - నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు ఎన్నిక సమస్యపై పార్టీ మితవాద పక్షానికి నెహౌొకీ మధ్య వివాదం 1950 ఆగష్టులో తీవ్రదశకి చేరుకొన్నది. ఈ వివాదం ఒక సంవత్సరం పైగా కొనసాగింది. వివాదంలో సిద్ధాంత, విధాన సమస్యలు ఇమిడివున్నాయి. రానున్న సౌధారణ ఎన్నికలలో పార్టీ అభ్యర్దుల్ని ఎంపిక చేయడంలో కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టేవారు నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తారు గనుక ఈ వివాదానికి చాలా ప్రాధాన్యత వుంది. వు క ..! స్థానానికి పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు, పటేల్ బలపరలినే నో టాండన్, నెహ్రూ బలపరచిన జె.బి.కృపలాణ, శంకర్రావు సుపోత్తందాన్ టాండన్ సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పధంలో సాంప్రదాయవాది క టాండన్ అభ్యర్థిత్వాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. టాండన్ గెలిస్తే తాను కాంట్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా ప్రభుత్వ ప్రధాన బాధ్యునిగా కొనసాగడం కష్టతరమవుతుందని నెహ్రా స్పష్టంచేశాడు. మరొకవెపు టాండన్ మద్గ్దతుదారులు అతడి ఎన్నికతో నహని లొంగదీయవచ్చునని, ఆయన విదేశీ, ఆర్థిక, సామాజిక విధానాలను, ప్రత్యేకించి పాకిస్తాన్: హిందూకోడ్ బిల్లు పట్ల ఆయన విధాసాలను మార్చవచ్చునని ఆశించారు.
1950 ఆగస్టు 29 న చాలా తీవ్రంగా జరిగిన పోటీలో టాండన్ 1306 ఓట్లతో గెలిచాడు. కృపలానీకి 1092, దేవ్‌కి 202 ఓట్లు వచ్చాయి. తర్వాత టాండన్ వర్మింగ్ కమిటీని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీని తన అనుచరులతో నింపాడు. చాలా అంతర్గత చర్చ, వివాదం జరిగిన తర్వాత నెహ్రూ, అజాద్ నివారించినప్పటికి కృపలానీ నాయకత్వంలో 254 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చాలామంది కార్యకర్తలు 1951 జూన్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిసాన్ మజరూర్ 'ప్రజాపాద్దీ స్థాపించారు.
నెహ్రూ ఇక పోరాటానికి సిద్ధమయ్యాడు. కాంగ్రెస్‌ని పరిరక్షించుట అనివార్యం కన్సుక (ప్రభేల్ 1950 డిసెంబర్ 15 న మరణించాడు) పార్టీ వ్యవహారాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించాడు. కాంగ్రెస్ ఐక్యత పరిరక్షిస్తూనే రానున్న ఎన్నికల 'కమంలో మితవాద పక్షం పైచేయి కావడాన్ని అనుమతించకూడదనుకున్నాడు. గొప్ప నిపుణతతో కృతనిశ్చయంతో తన రాజకీయ ప్రజ్ఞాపాటవాల్ని ప్రయోగించి తన సామాజిక ఆర్థిక విదేశీ విధానాలపై తీర్మానాలను ఎ.ఐ.సి.సి చేత ఆమోదింపజేశాడు. అప్పుడు 'ఏ ఆలోచనా విధానం, ఏ దృక్పథం కాంగ్రెస్‌లో ప్రబలంగా వుండాలి. టాందన్దా, నాదా” నిర్ణయించవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతూ 1951 ఆగస్టు 6న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వారి ఎంపిక - ప్రత్యేకించి రానున్న ఎన్నికలలో నెహ్రూ నాయకత్వం ప్రచారం లేకుండా గెలవడం సాధ్యపడదు కనుక ఎలా ఉంటుందో ఊహించవచ్చు. నెహ్రూ రాజీనామాను ఆమోదించడానికి బదులుగా, నెహ్రూ రాజకీయంగా తాను తన స్నేహిత్రులకంటే బలంగా ఉన్నాడని గుర్తించిన టాండన్ రాజీనామా చేయాలని నిర్ణయించాడు. ఎ.ఐ.సి.సి సెప్టెంబర్ 8న టాండన్ రాజీనామాని ఆమోదించింది. నెహ్రాని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నది. ప్రధానమంత్రి పార్టీ శ్రైసిడెంటుగా ఉండడాన్ని నెహూ సూత్ర రీత్యా వ్యతిరేకించినప్పటికీ ఎ.ఐ.సి.సి నిర్ణయాన్ని ఆమోదించాడు కానీ “ప్రత్యేక పరిస్థితులలో తనను అవసరం వత్తిడి చేయవచ్చునని కూడా గతంలో చెప్పాడు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా టాండన్ రాజీనామా చేయడంతో కథ సుఖాంతమైంది. టాండన్‌ని వర్కింగ్ కమిటీలో చేరవలసిందిగా నెహ్రూ ఆహ్వానించాడు. టాండన్ ఆమోదం తెలిపాడు. అసమ్మతి వాదుల్ని పార్టీలో తిరిగి చేరవలసిందిగా నెహ్రా కోరాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ తో సహా పలువురు చేరారు.
పార్టీలో, ప్రభుత్వంలో నెహ్రూ తిరుగులేని నాయకుడయ్యాడు. నెహ్రూ ఈ స్థానాన్ని 1964లో చనిపోయేవరకు నిలబెట్టుకున్నాడు. కృపలానీ, ఇతర తిరుగుబాటు దారులని పార్టీలోకి రప్పించడంలో విఫలమైనప్పటికి బహుళత్వాన్ని ఏకాభిప్రాయాన్ని కాంగ్రెస్ యొక్క వామపక్ష మధ్యేవాద స్వభావాన్ని నిలబెట్టడంలో విజయం సాధించాడు.
నెహ్రూ టాందన్ల వివాదానికి సంబంధించిన మరొక అంశం కృపలానీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో మొదలైన పార్టీ నిర్వహణకు, ప్రభుత్వానికి మధ్య సంబంధానికి చెందినది. టాండన్ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంపై పార్టీ అదుపు స్వతంత్రం తర్వాత భారతదేశం 255
అంశాన్ని (ప్రస్తావించాడు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రివర్గం పార్టీ ఆదేశాన్ని పాటించాలని ఏధానాల అమలుకు బాధ్యత వహించాలని టాండన్, ఆయన మద్దతు దారులు ప్రకటించారు. కానీ టాండన్ రాజీనామా, ప్రెసిదెంటుగా నెహ్రూ ఎన్నిక - వర్కింగ్ కమిటీ పార్టీ నిర్వహణ అంశాలపై కేంద్రీకరించాలని, ప్రభుత్వ విధానాల రూపకల్పన అమలులో ప్రధానమంత్రి, మంత్రి వర్గం యొక్క ప్రముఖ పాత్రని ధృవపరిచాయి. 1953 తర్వాత నెహ్రూ ఎప్పుడూ పార్టీ అధ్యక్షుడు కాకపోయినప్పటికీ ఆయన జీవితకాలంలో పార్టీ, ప్రభుత్వం మధ్య ఎలాంటి వివాదమూ తలెత్తలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనా బాధ్యులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రజలచే ఎన్నుకోబడతారు. కనుక రెండు పాలనా కేంద్రాలు ఉండరాదని, పార్లమెంటరీ పక్షానికే నిజమైన రాజ్యాధికారం ఉండాలనేది - అందరి ఆమోదం పొందింది. కాసీ ఈ అంశంలో భారతదేశంలోని పరిస్థితి ఇంగ్లాండ్ అమెరికాలకు భిన్నంగొ ఉంది. అక్కడ పార్టీ నాయకత్వం సహాయక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షుడు అంతకంటే ఎక్కువ పాత్ర నిర్వహిస్తాడు. విధానాల రూపకల్పనలోనూ, పార్లమెంటు అసెంబ్లీలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ పార్టీ ముఖ్యమైన పొత్ర నిర్వహిస్తుంది. అత్యధిక నిరక్ష్యరాస్యులు కలిగిన, భారతదేశం లాంటి విశాలమైన దేశంలో ప్రజల సమస్యలు ప్రభుత్వ నాయకులకు తెలియ జేయడానికి, అలాగే ప్రభుత్వ విధానాలను ప్రజలకి వివరించడానికి పాలకపార్టీ, ఆ పార్టీ కార్యకర్తలు అనుసంధాన కర్తలుగా పనిచేయడం అవసరం. ప్రభుత్వ విధానాల అమలుకి, అధికార వర్గాన్ని అదుపులో ఉంచడానికి పాలకపార్టీ మాత్రమే హామీగా ఉండగలదు. ఉదాహరణకు భూసంస్కరణలని సక్రమంగా అమలు జరపడం, చురుక్తుగా ఉన్న పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడి ఉందేది. దురదృష్టవశాత్తు నెహ్రూ ఆయన సహచరులు పార్టీ ప్రాధాన్యతని గుర్తించి కూడా పార్టీ నిర్మాణాన్ని అశ్రద్ధ చేశారు. పార్టీ శ్రేణులకు తగిన పనులు అప్పజెప్పడంలోనూ, వారికి తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడంలోనూ విఫలమయ్యారు. దానికి బదులుగా పార్టీ పని విలువని ఒక మేరకు తగ్గించడం కూడా జరిగింది. పార్టీలో కొంత గుర్తింపు పొందిన ప్రతిఒక్కరూ పార్లమెంటులోనో లేక అసెంబ్లీలోనో ఉండాలని ఆ తర్వాత మంత్రి కావాలని ఆశించాడు. మంత్రులు శాసన సభ్యులు వారి పదవుల నుండి నెట్టివేయబడినప్పుడే పార్టీ పని చేపట్టారు. అది కూడా సొధారణంగా మరలా ఏదో రకంగా పార్లమెంటరీ పదవులు పొందటానికే చేశారు. పార్టీ ప్రెసిడెంట్ కావడానికి ఆంధ్రప్రదేశ్ పదవిని వదిలి 256 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వెళ్లిన ఎన్. సంజీవరెడ్డి రాష్ట ప్రభుత్వంలో ఒక జూనియర్ మంత్రి/సదవి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కంటే ఎక్కువ తృప్తినిచ్చింది' అని బావాటంగా వాఖ్యానించాడు.
నెహ్రూ తర్వాత దాదాపు ప్రతి ప్రధానమంత్రి కూడా పార్టీ ప్రెసిదెంటుగా ముఖ్య అనుచరుణ్ని విధేయుణ్ని లేక వ్యక్తి ఆరాధకుడ్ని ఉంచాలని ప్రయత్నించారు. లేక అతడు / ఆమె పార్టీ ఆధ్యక్ష పదవిని చేపట్టారు.. పార్టీ అంతర్గత వివాదాలు
తొలి సంవత్సరాలలోనే కాంగ్రెస్ క్రమంగా ప్రజలతో సంబంధాలు కోల్పోతున్న సూచనలు, దాని ప్రమాణాలు క్షీణిస్తున్న సూచనలు కనిపించాయి. పాలక పార్టీ పలుకుబడి క్షీణించడం అనివార్యం. కానీ ఈ క్షీణత హేతుబద్ధమైన హద్దులలో ఉండాలి. స్వతంత్రానంతరం కాంగ్రెస్ పరిస్థితి ఇదే. కానీ పార్టీ విలువల ప్రమాణాల తగ్గుదల బాధాకరం. ప్రమాదకరమైన కొన్ని ధోరణులు పార్టీలో బలపడ్డాయి.
“కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న లంచగొండితనం తొలగుతున్న (భ్రమలు, కొరవడుతున్న స్పూర్తి - “ఒక రాజకీయ పండితుని వ్యాఖ్యానం. మనం నిర్మించిన నైతిక విలువలు ఆదర్శాలు క్రమంగా క్షీణిస్తున్నాయి* - 1948లోనే నెహ్రూ ఆందోళన. గ్రామీణ ప్రాంతాలలో ముఠాలు చేసి పోషించే పద్ధతి రాజకీయ దళారీల, ఓటు బ్యాంకుల ఆవిర్భావానికి దారి తీసింది. తరచుగా వ్యక్తిగతమైన లేక గ్రూపు ప్రయోజనాల ప్రాతిపదికన ముఠాలు, ముఠాతత్వం, ముఠాపరమైన కీచులాటలు, వివాదాలు చెలరేగాయి. ఇవి పార్టీ దిగువస్థాయిల్లో ప్రజాస్వామ్య విరుద్ధమైన పని విధానానికి దారి తీశాయి. పార్టీ ప్రతిష్టని దిగజార్బాయి. రాష్ట్రాలలో పార్టీలో పనిచేసేవారికి మంత్రులకు మధ్యగల వైరం అంతర్గత ఘర్షణలకు దారి తీసింది. పార్టీలో పనిచేసేవారు ప్రతిపక్ష పార్టీలాగా విరుచుకుపడేవారు. వారి రాజకీయ లక్ష్యం మంత్రుల్ని తొలగించి ఆ స్థానాలు ఆక్రమించడంగా వుండేది. ఈ ధోరణి కాంగ్రెస్ పార్టీ అంటే అధికారం కోసం పోట్లాడుకునే పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించింది.
అన్నింటిని మించి సామాజిక న్యాయం, సామాజిక మార్చు అంశాలకు సంబంధించి అశ్రద్ధ ప్రబలింది. ఫలితంగా కాంగ్రెస్ అంతకంతకు ప్రజలతో సంబంధాలు కోల్పోయింది. మేథావుల్ని యువకుల్ని ఆకర్షించలేకపోయింది. కాబట్టి వారిలో మెరికల్లాంటి వారిని పార్టీలోకి రాబట్టలేకపోయింది. ఆదర్శభావాలు గల అత్యధికులు ప్రతిపక్ష పార్టీలలో చేరడం పట్ల మొగ్గు చూపారు. ఫలితంగా జాతీయోద్యమకాలంలో పార్టీలోకి వచ్చిన వారి స్థానంలో వచ్చిన కొత్తతరం నాయకత్వానికి శిక్షణ ఇవ్వడంలో విఫలమయింది. విలువలలో స్వతంత్రం తర్వాత భారతదేశం 2867
క్షీణత అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చేసింది. పాలక పార్టీ గనుక కాంగ్రెస్‌పై ఎక్కువ ప్రభావం చూపింది. దేశంలోని, కాంగ్రెస్‌లోని ఈ పరిస్థితుల పట్ల నెహ్రూకి స్పష్టమైన అవగాహాన వుంది. తొలగిన భ్రమలతో నిరాశా నిస్సృహలతో 1948లో ఇలా రాశారు. “మన విలువల్ని కోల్పోతున్నామని, అవకాశవాద రాజకీయాల నీతి బాహ్యతలో కూరుకుపోతున్నామనీ ఆలోచించడం చాలా బాధాకరం. 1949లో 'మన ప్రమాణాలు చాలా పడిపోయారు. ఇంకా మిగిలిన ప్రమాణాలు దాదాపు ఏవీలేవు' మరలా 1950లో మనం మనల్ని కదిలించే స్ఫూర్తిని కోల్పోయాం. దానిని తిరిగి మనం పొందకపోతే మన శమకి ఫలితం దక్కదు. 1957లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో ఇలా చెప్పాడు : 'కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇంకా బలహీనపడుతుంది... మన బలం గతం. మనం మన ప్రస్తుత గానుగెద్దుబాటి నుండి బయటపడకపోతే కాంగ్రెస్ పార్టీ ధ్వంసమవుతుంది”. దురదృష్టవశాత్తు నెహ్రూ పార్టీ నిర్మాణదక్షుడు కాదు. సంస్కర్త కాదు. నెహౌీ ఆయనతో పాటు ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దదాయకులకు పార్టీ నిర్మాణాన్ని చేపట్ల వ్యవధిలేదు. పార్టీపై ప్రభుత్వంపై నెహ్రూ పూర్తి ఆధిపత్యం సాగిన సంవత్సరాల పార్టీనిర్మాణం, దానిని శక్తివంతం చేయడం అశ్రద్ద చేయబడ్డాయి. పార్టీ యంత్రాంగా నడపడానికి నెహ్రూ రాష్ట్ర పార్టీ నాయకులపై ఆధారపడవలసి వచ్చింది. అయినప్పటి ఆదర్భవాదిగా నెహ్రూ రాజకీయంగా, సైద్ధాంతికంగా సోషలిస్టు అదర్భ్శవాద భావాలకు షార్టీని లంగరువేసి వుంచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సోషలిస్టులు - కాంగ్రెస్ సోషలిస్టులు కాంగ్రెస్‌ని వదిలివెళ్లడం కాంగ్రెస్‌లో సమూలమైన మార్పులు కోరే శక్తుల్ని బలహీనపరిచింది. వారు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీ జాగా అంతకంతకు భూస్వాములు ధనిక రైతులు, రాజాలలాంటి స్వప్రయోజనపరులతో నింపబడింది. పార్టీలో సోషలిస్టులు లేకపోవడంతో పార్టీ సైద్ధాంతికంగా బలహీనపడిందని నెహ్రూ గుర్తించాడు. క్రమంగా నెహాని సంప్రదాయ ఆలోచనా ధోరణులు చుట్టుముట్టాయి. అదే సమయంలో కాంగెస్ని విభజించడం గానీ లేక కాంగ్రెస్‌ని వదలిపెట్టడం గానీ తప్పని, ప్రతికూల ఫలితొన్ని ఇస్తుందని, అందువల్ల కాంగ్రెస్ అనివార్యమని భావించారు. కాబట్టి బలహీనతలున్నప్పటికీ కాంగ్రెస్‌ని సంస్కరించి అభివృద్ధి పరచాలనుకున్నారు. 258 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నెహ్రూ సోషలిస్టుల్ని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు. అభివృద్దికరమైన సమసమాజ అజెండా అమలులో వారి సహకారం కొరకు 'ప్రయత్నించాడు. అదే సమయంలో కమ్యూనిస్టుల్ని మంచి చేసుకోడానికి ప్రయత్నించలేదు. కారణం మనం తర్వాతి అధ్యాయంలో గమనించబోయే విధంగా వాళ్ళు నిర్మాణపరంగా, రాజకీయంగా, సెద్ద్ధాంతికంగా కాంగ్రెస్‌కి భిన్నమైన మార్గంలో వున్నారు. కానీ కమ్యూనిస్టుల్ని పార్లమెంటరీ రాజకీయాల ప్రధాన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నించి విజయం సాధించారు. సోషలిస్టుల సూత్రాలు, లక్ష్యాలు తన సూత్రాలు లక్ష్యాలు ఒకటేనని భావించాడు నెహ్రూ, అంతేకాక చాలామంది సోషలిస్టు నాయకుల పట్ల - ప్రత్యేకించి ఎన్నో సంవత్సరాలు తనతో సన్నిపాత సంబంధాలు గలిగి తనను సోదరునిగా (భాయ్) సంబోధించే జయప్రకాష్ నారాయణ పట్ల ఆయనకు వ్యక్తిగతమైన (య్రేమాభిమానాలు ఉన్నాయి.
సోషలిస్టుల్ని కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రయత్నం, నెహూ 1948లోనే ప్రారంభించాడు. తమకు సోషలిస్టులకు మధ్య పెరుగుతున్న దూరాన్ని ప్రస్తావించి అది కాంగ్రెస్‌కి మంచిది కాదు, సోషలిస్టు పార్టీకి మంచిది కాదు, దేశానికే మంచిదికాదన్నాదు. కానీ సోషలిస్టులు నెహ్రూ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. 1948 డిసెంబర్లో జయప్రకాష్ నెహ్రూక్రి ఇలా రాశాడు : 'నీవు సోషలిజం దిశగా ముందుకు పోవాలంటున్నావు. కానీ అందుకు పెట్టుబడిదారులు నీకు సహాయపడాలని కోరుకుంటున్నావు. అత్యవసర సర్వీసులలో సమ్మెల్ని చట్టవిరుద్ధంగా ప్రతిపాదించే చట్టం భారతీయ ఫాసిజం పెరుగుదలకు భయానకమైన ఉదాహరణ అని జయప్రకాష్ 1949 మార్చిలో నెహ్రూతో చెప్పారు.
సోషలిస్టులు ఆశ్చర్యకరమైన బాధ్యతా రాహిత్యాన్ని (ప్రదర్శించడం కొనసాగిస్తున్నారన్నాడు నెహూ. వారికి నిర్మాణాత్మకమైన ఆలోచనా విధానం కొరవడిందన్నాడు. నిరాశానిస్టృహలకు గురయి ఛిన్నాభిన్నమయ్యేలా వున్నారన్నాడు.
సోషలిస్టులతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని నెహ్రా19851లో చేసిన మరొక ప్రయత్నం కూడా ఫలించలేదు. నెహ్రూ అభివృద్ధి నిరోధక శక్తులకు మద్దతు ఇస్తూ వారి కొమ్ముకాస్తున్నాడని విశ్వసించిన జయప్రకాష్ నారాయణ్ మరొక సారి నెహ్రూయొక్క నగ్నమైన, బాహాటమైన ఫాసిజాన్ని నిరసించారు. ఆయన ప్రభుత్వం “శ్రామికుల విషయంలో విశ్వసనీయంగా హిట్లర్ అడుగుజాడల్ని అనుసరిస్తుంది" అని విమర్శించాడు.
1952 సాధారణ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత నెహ్రూ ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో కాంగ్రెస్‌లో వామపక్ష ధోరణికి బలం చేకూర్చేందుకు విశాలమైన స్వతంత్రం తర్వాత భారతదేశం . 259
రాజకీయ వేదిక నిర్మించాలని ఆశించి సోషలిస్టులతో కలిసి పనిచేసేందుకు తీవ్ర ప్రయత్సం చేశాడు. దీనికి స్పందనగా జయప్రకాష్ ఇతర సోషలిస్టులు కాంగ్రెస్‌లో చేరడానికి ముండు ఆయన రూపొందించిన సమూలమైన మార్పులు కోరే కార్యక్రమాన్ని కాంలో” ఆమోదించాలన్నారు. ఆయన రూపొందించిన 14 అంశాల కార్యక్రమంలో కొన్ని రాజ్యాల సవరణలు, పాలనా పరమైన సంస్కరణలు, భూ సంస్కరణలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు? గనుల జాతియీకరణ ఉన్నాయి. జయప్రకాష్ 14 అంశాలలో చాలా అంశాలు నెహూకి ఆమోదమే. లొనీ ముందుగా ఒప్పందానికి వచ్చేందుకు తిరస్కరించాడు. అలాంటి కార్యక్రమాన్ని ల రూపొందించి, దానిని ఆమోదించి అమలు జరపడాన్ని తన పార్టీకి నచ్చజెప్పగలిగి ఉల ఆయనకు సోషలిస్టుల సహకారం, అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్‌లో వామపక్ష వా డుం బలాన్ని పెంచి ఇలాంటి కార్యక్రమం చేపట్టేందుకే నెహ్రూకి సోషలిస్తుల సహక అవసరమయింది. సమూలమైన మార్పుల కార్యక్రమం యొక్క అమలు సోషలిస్టులు తి న కాంగ్రెస్‌లో చేరడం వలన వచ్చే ఫలితమవుతుంది. కానీ చేరడానికి ముందు నెరవేర్ధగల షరతుకాదు. నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో మార్పులు కోరే శక్తుల బలాన్ని పెంచుకోవడొని సన్నద్ధమయ్యారు. సోషలిస్టుల్ని కలుపుకుని పార్టీని చీల్చడానికి సన్నద్ధం కాలేదు. మార్పుల దిశగా కాంగ్రెస్, ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని: సోషలిజం దిశగా చర్యలు చేపట్టేందుకు విస్తృతమైన సామాజిక ఏకాభిప్రాయౌ నై నిర్మించాలని, వాస్తవ దృక్పధంతో చేపట్టవలసిన చర్యలు, సమయం నిర్హారింపబదాల ఇవన్నీ సాధించడానికి సోషలిస్టుల మద్దతు తనకవసరమని నెహ్రూ అవగాహన. జయప్రకో కూడా తన పార్టీలో చీలిక వస్తుందనే ఆందోళన కారణంగా వెనకడుగు వేయలేదు. అప్పటి నుండి నెహ్రూ కాంగ్రెస్ మార్పుల్ని వ్యతిరేకించడానికి కట్టుబడివున్నారని సోషలిస్టులలో అత్యధికులు విశ్వసించారు. నెహ్రూ కూడా సోషలిస్టులపట్ల తిరస్కార భావాన్ని. పెంచుకున్నార్చు, నెహ్రూ సోషలిస్తల సహకారం లేకుండా కాంగ్రెస్‌లో ఉన్న వామపక్షవా దుల సహాయంతో సోషలిస్టు అజెందా అమలు జరపవలసి ఉంటుందని భావించాడు. జయహొ దేనినైనా సహిస్తాడు కానీ కాంగ్రెస్‌ని సహించలేడనే అభిప్రాయానికి వచ్చాడు. ఫలితంగా జయ్రకాష్త్రో వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయి. సంవత్సరం గడచిన కాలదీ కాంగేస్కీ సోషలిస్టులక్షీ మధ్య సంబంధాలు జటిలమయ్యాయి. 'జయహ్రకాష్ అర్ధరహితమైనవీ సోషలిజంతో సంబంధంలేని అంశాలు మాట్లాడుతున్నాడు.” రాస్తున్నాడు అని ఒక లేఖలో నెహ్రూ పేర్కొన్నారు. ఎస్.గోపాల్ మాటల్లో చెప్పాలంటే "కాంగ్రెస్‌ని ఓడించడా నికి జయప్రకాష్ ఏ గ్రూపుతోనైనా చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నాడని నెహ్రూ భావించాడు. 260 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రత్యేకించి న్వతంథత్రపార్టీని బలపరిచినందుకు, పొందూ మతతత్వవాదుల్ని 'పోత్సపించినందుకు జయప్రకాష్‌ని నెహ్రూ నిందించాడు. బదులుగా నెహ్రూ జాతీయ నాయకుని స్థానం నుండి కాంగ్రెస్ సమర్ధకుని స్థాయికి దిగజారాడని జయప్రకాష్ నిందించాడు.
అప్పటి నుండి కాం(గైస్ వ్యతిరేకతే సోషలిస్టు పార్టీ విధానమవడం 'పారంభమయింది. కాంగ్రెస్‌పై విమర్శలు దాని వామపక్ష సోషలిస్టు విధానాల ప్రాతిపదికని అధిగమించి సాగాయి. ఈ విధానం సోషలిస్టుల్ని బలహీనపరిచింది. సోషలిస్టు పార్టీ చీలికలక్షు దారి తీసింది. ప్రతి చీలికతో కొందరు సోషలిస్టులు కాంగ్రెస్‌లో కూడా చేరారు. కాంగ్రెస్‌లో సోషలిజం ల కాంగ్రెస్‌ని నవీకరించేందుకు, స్థబ్దతనుండి బయటకి లాగేందుకు సోషలిస్టుల సహాయం పొందడంలోని విఫలతతో నెహ్రూ పార్టీ విధానాలను ప్రత్యేకించి అప్పటివరకు చేపట్టిన సామాజిక సమానత, ఆర్ధికాభివృద్ధిలాంటి పరిమిత చర్యల్ని అధిగమించి సమూలంగా మార్చాలని నిర్ణయించాడు. 1953లోనే భూసంస్మరణలను భూస్వామ్య విధానం రద్దు నుండి భూగరిష్ట పరిమితి విధింపు వరకు విస్తరించడాన్ని స్వీకరించాడు. ఆవడి కాంగ్రెస్ సదస్సు 1955 జనవరిలో సోషలిస్టు తరహా సమాజం తన లక్ష్యంగా ప్రకటించింది. తీర్మానం ఇలా పేర్కొన్నది.
సోషలిస్టు తరహా సమాజస్థాపన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందాలి. ముఖ్యమైన ఉత్పత్తి సాధనాలు సామాజిక యాజమాన్యం క్రింద లేక సమాజం అదుపులో ఉండాలి. ఉత్పత్తి క్రమం వేగవంతం చేయబడాలి. జాతీయ సంపద సమానంగా పంపిణీ చేయబడాలి.
రెండవ మూడవ పంచవర్ష ప్రణాళికలు సోషలిస్టు తరహా సమాజం పట్ల మరికొంత నిబద్ధతకు అవకాశం కల్పించాయి. కానీ నెహ్రూ దీనిని ఆర్థిక విధాన ఆధునికీకరణకు ఉత్పత్తి పెంపుదలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పరిస్టితులకనుగుణంగా మార్చడానికి వీలయ్యే విధంగా నిర్వచించాడు. రెండవ పంచవర్ష ప్రణాళికని పార్లమెంటు ముందుంచుతూ ఆయన ఇలా చెప్పాడు: 'సోషలిజం అంటే ఏమిటో నేను స్పష్టంగా నిర్వచించడం లేదు... మనం కఠినమైన ఆచరణ సాధ్యం కాని ఆలోచనని నివారించాలని కోరుకుంటున్నాం. కనుక ఆయన ఇంకా ఇలా చెప్పాడు : కానీ విస్తృతార్థంలో చెప్పాలంటే సమాన అవకాశాలు ఉండి ప్రతీ ఒక్కరూ మంచి జీవితం గడపడానికి అవకాశం ఉండే సమాజం. కాబట్టీ మనం సమానతకు, వ్యత్యాసాల తొలగింపుకి ప్రాధాన్యతనివ్వాలి. సోషలిజం అంటే స్వతంత్రం తర్వాత భారతదేశం 261
పేదరికాన్ని వ్యాప్తి చేయడం కాదని మనం ఎప్పుడూ గదునంలో ఉంచుకోవాలి. కొబిట్టీ ముఖ్యమైన అంశమేమంటే సంపద, ఉత్పత్తి ఉండాలి. మూడవ పంచవర్న పోక కొరకు “ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యాలపై రాసిన అధ్యాయంలో ఆవడి తీర్మానం పదజాలాన్నే ప్రణాళికా లక్ష్యంగా పునరుద్దాటిస్తూ రెండవ ప్రణాళిక నుండి ఈ విధంగొ ఉటంకించాడు : సోషలిస్టు తరహా సమాజం స్థిరమైన లేక కఠినమైన నమూనా" పరిగణింపబడరాదు. దీని మూలాలు ఏ సిద్ధాంతంలోగానీ లేక పిడివాదంలో గానీ ం ప్రతిదేశం దాని ప్రత్యేక సంప్రదాయాలననుసరించి అభివృద్ధి చెందవలసి ఉంటుం. చారిత్రక పరిస్థితుల వెలుగులో కాలానుగుణ్యంగా ఆదర్జిక సామాజిక విధానం రూపొందింపబడుతూ ఉండాలి.
కాంగ్రెస్ వామపక్ష దిశకు మరలడం వలన వామపక్ష మితదాద రాజకీయ పార్టీల భవితవ్యం ప్రతికూల ప్రభావానికి గురయింది. ఆ పార్టీల ప్రభావం పరిమితం చేయబడింది. ప్రత్యేకించి సోషలిస్థుల కమ్యూనిస్టుల సిద్దాంత సారాంశాన్ని లాభసాలాగౌ ఉపయోగించుకుని ఆ పార్టీలలో వివాదాల్ని విభజనల్ని ప్రోత్సహించింది.
1959 జనవరిలో నాగపూర్ సదస్సులో కాంగ్రెస్ వ్యవసాయ కార్యక్రమాన్సి. ప్రకటించి మరికొంత వామపక్ష దిశగా జరిగింది. భవిష్యత్ వ్యవసాయ విధానం సమ్వా సహకార వ్యవసాయమని, తొలుత సేవా సహకార సంఘాలు స్థాపించబడతాయని, ఈ తర్వాత అవి ఐచ్చిక ప్రాతిపదికన సమిష్టి సహకార క్షేత్రాలుగా మార్చబడతాయని సదస్సు తీర్మానాన్ని ఆమోదించింది. అంతేగాక భూమి కలిగి ఉండడంపై వరిమితి విధించబడుతుందని, అహార ధాన్యాల వాణిజ్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా తీర్మానం పేర్కొన్నది. నాగపూర్ నిర్ణయాలు పార్టీ లోపలా బయటా వ్యతిరేకతే నెదుర్కొన్నాయి. ఫలితంగా నిర్ణయాల స్ఫూర్తి తగ్గించబడింది. మధ్యతరగతి రైతుల మద్దతు పొందిన పెట్టుబడి దారీ వ్యవసాయదారుల, సంపన్న రైతుల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వాలు భూ పరిమితుల్ని చట్టం నుండి తప్పించుకోడానికి వీలుగా రూపొందించాయి. సమిష్టి వ్యవసాయంలో చిన్న ప్రయోగాలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహారధాన్యాల వాణిజ్యం ఆచరణ సాధ్యం కానిదని తేల్చబడింది. నెహ్రూ ఆచరణ సాధ్యం కాని వాటిని త్యజించాలన్నాడు. నాగపూర్ తీర్మానంలోని భూపరిమితి తప్ప మిగిలిన అంశాలన్నీ త్యజించబడ్డాయి. ఏమైనప్పటికీ 1964 జనవరిలో జరిగిన భువనేశ్వర్ సదస్సులో కూదొ సోషలిజం పట్ల నిబద్దత పునరుద్దాటించబడింది.
262 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాంగైస్ - వామపక్ష మితవాద భావాల ప్రాతిపదికన విభజింపబడటాన్ని నివారించి, నెహ్రూ దానిని మధ్యేవాద పార్టీగా నిలబెట్టాడు. ఆయన నిరంతరంగా మితవాద పక్షపార్టీలను, వ్యక్తులను ఎదుర్భొన్నాడు. వామపక్ష పార్టీలను విమర్శిస్తూనే వాటిని తనకుగల విభేదాలను స్పష్టం చేస్తూ అవి గౌరవ ప్రదమైనవిగా పరిగణించాడు. కాంగ్రెస్ క్షీణత
సోషలిజం పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటనలు కాంగ్రెస్‌ని క్షీతించకుండా ఆపలేకస్రోయాయి. దేశంలో పార్టీపై విమర్శలు పెరుగుతున్నాయి. భ్రమలు తొలగుతున్నాయి. పార్టీ త్రో అంతర్గత విభజనలు తీవమవుతున్నాయి. పాతనాయకులు అలసి సామ్మస్పల్లిషోయారు. సరైన కొత్త నాయకులు ముందుకు రావడం లేదు. పార్టీ బలహీనపడడం కౌనసాగుత్తూ ఉంది. పార్టీ చాలాకాలం అధికారంలో ఉంది. పార్టీలోని అత్యధికలు పార్టీ నిర్వహణ కార్యకలాపాలతో ఏ మాత్రం తృప్తిపడడంలేదు. పలుకుబడి, అధికారం, పదవుల కొరకు తహతహలాడుతున్నారు. లంచగొండితనం హద్దులు అధిగమించింది. స్వైరవిహారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రజలకు దూరమవుతూ ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తుంది. కాంగ్రెస్ బలమైన స్థావరాలలో లోక్‌సభకి ప్రతిష్టాత్మకంగా 1968లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు న్థానాల్లో ఓడిపోయింది. ప్రజలు నెహ్రూతర్వాత ఎవరు? నెహ్రూ తర్వాత ఏమిటి? అని ప్రశ్నించడం ప్రారంభించారు.
కాంగ్రెస్‌లో జవం, జీవం జొప్పించడానికి ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమతుల్యత పునరుద్ధరించడానికి మద్రాసు ముఖ్యమంత్రి కె.కామరాజ్ సహాయంతో నెహ్రూ చివరి (ప్రయత్నం చేశాడు. 1963 ఆగస్టులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రూపొందించబడిన కామరాజ్ పథకం అని పిలవబడే ఈ పథకం ద్వారా నెహౌ లక్ష్యం సాధించదలచాడు. పథకం సారాంశం : పార్టీ నిర్మాణ కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్‌కి నూతన జవసత్వాలు సమకూర్చేందుకు కేంద్రమంతులుగా, రాష్ట్రముఖ్యమంత్రులుగా ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నాయకులు స్వచ్చందంగా వారి పదవులకు రాజీనామా చేయాలి. ఎవరి రాజీనామాలు ఆమోదించాలో నెహ్రూ నిర్ణయిస్తాడు. పై స్థాయిలో పార్టీని క్షాళనం చేసేందుకు నెహ్రూకి ఇది దోహదపడుతుంది.
కామరాజ్ పథకానికి పార్టీ శ్రేణుల నుండి అనూహ్య స్పందన లభించింది. కేంద్రమంక్రులతో సహా చాలామంది మంత్రులు మొరార్దీదేశాయ్, లాల్‌బహదూర్ శాప్టి, స్వతంత్రం తర్వాత భారతదేశం 263
ఎస్.కె.పాటిల్, జగజ్జీవన్‌రాం, బి.గోపాల్‌రెడ్డి, కె.ఎల్. శ్రీమాలి...మరి ఆరుగురు ముఖ్యమంత్రుల రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
కామరాజ్ పథకం చాలా ఆలస్యంగా వచ్చింది. నెహ్రూ అప్పటికే జబ్బున పద్దాడు. 1964 జనవరిలో భువనేశ్వర్‌లో గుండెపోటు వచ్చింది. తరువాత చర్చలు చేపట్టడానికి అవసరమైన శక్తి లేకపోయింది. పదవులకు రాజీనామాలు చేసిన మంత్రులకు ఎలాంటి పార్టీబాధ్యతంటూ అప్పజెప్పలేదు. కామరాజ్ మాత్రం 1964 జనవరిలో కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. రాజీనామాలు చేసినవారు రాష్ట్రాలలోని రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఎత్తుగడలు, కుట్రలు కుయుక్తులలో నిమగ్నమయ్యారు. పథకం పార్టీని క్షాళనం చేయడంలో విఫలమయింది. పార్టీ నైతికత క్షీజిస్తూనే ఉంది. కాంగ్రెస్‌వారు గతంలో లాగానే పాలనాధికారాన్ని చెలాయిస్తున్నారు. పథకం యొక్క పరోక్ష ప్రభావం పార్టీలో మొరార్డీదేశాయ్ స్థానాన్ని బలహీనపరిచింది. మరొక ఫలితం : పార్టీ నిర్మాణ కార్యక్రమం యొక్క స్థాయీ ప్రాధాన్యతలను పునరుద్ధరించడంలో విఫలమవడంతో పాటు 1969లో ఇందిరాగాంధీ రాష్ట్ర పార్టీ నాయకులతో నిష్కర్షగా వ్యవహరించి మెడలు వంచే వరకు కేంద్ర రాజకీయాలలో వారిపట్టు పెరుగుతూ వచ్చింది. 1964 జూన్‌లో నెహ్రూ చనిపోయేటప్పటికి కాంగ్రెస్ పతనం కొనసాగుతూ వుంది. 264 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
115 రాజకీయపార్టీలు, 1947-65, ప్రతిపక్షం
సోషలిస్టుపార్టీ
స్వతంత్రానంతరం ఆవిర్భవించిన పార్టీలన్నింటిలో సోషలిస్టు పొర్టీ ఎక్కువ ఆశల్ని రగుల్మ్కొల్పింది. జవహర్లాల్ నెహ్రూ తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన జయప్రకాష్‌నారాయణ ఆ పార్దీలో ఉన్నాడు. ఆ పార్టీలో ఇంకా ఆచార్య నరేంద్రదేవ్, అచ్యుత్పట్వర్దన్, అశోక్ మెహతా, దాక్టర్ రాంయమనోహర్ లోహియా, యస్.యం. జోషి లాంటి ప్రతిభావంతులైన నాయకులున్నారు. సోషలిస్టులు ఎదుర్కొన్న మొదటి సమస్య చివరి వరకూ ఎదుర్శొంటూ వచ్చిన సమస్య : కాంగ్రెస్‌తో వారి సంబంధాలు. సోషలిస్టు పార్టీ 1934లో స్థాపించబడింది. దానికి ప్రత్యేకమైన నిబంధనావళి, సభ్యత్వం, క్రమళిక్షణ, సిద్దాంతం వున్నప్పటికి అప్పటి నుండి కాంగ్రెస్‌లో భాగంగా వున్నది.
చర్చల ద్వారా స్వాతంత్ర్యం సాధించబడదని విశ్వసించి సోషలిస్టు పార్టీ మంత్రి వర్గ రాయబార సంఘంతో చర్చలను బహిష్కరించింది. రాజ్యాంగ పరిషత్తులో లేక తాత్కాలిక ప్రభుత్వంలో పాల్గొనేందుకు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వాన్ని అంగీకరించేందుకు నిరాకరించింది. అలాగే స్వాతంత్ర్యం కొరకు మౌంటుబాటన్ వ్లాన్ని, దేశ విభజనని తీవ్రంగా వ్యతిరేకించింది. స్వతం(త్రం రాగానే భారతదేశం సోషలిస్టు రాజ్యంగా సోషలిస్టు సమాజంగా అభివృద్ధి చెందాలని నినాదం ఇచ్చింది. సోషలిజం పట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆచరణాత్మక, సైద్ధాంతిక నిబద్ధత ప్రకటిస్తుందని చాలమంది సోషలిస్టులు ఆశించారు. అలా చేసేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్ మితవాద బూర్డువా పార్టీ అయిందని నమ్మారు. కాంగ్రెస్ సభ్యులు తనస్వంత నిబంధనావళి క్రమళిక్షణ గల ఇతర పార్టీకి చెందకూడదు అనే సూత్రాన్ని కాంగ్రెస్ 1946 (ప్రారంభంలో రూపొందించింది. సోషలిస్టులకు వారి స్వంతపార్దీని రద్దు చేసుకోవడం ఇష్టంలేదు. కాబట్టి 1948 మార్చిలో కాంగ్రెస్‌ను వదలి (ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజాన్ని స్థాపించే లక్ష్యాన్ని ప్రకటించారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 265
సోషలిస్టులు కాంగ్రెస్‌ను వదలి వెళ్ళడం చారిత్రక తప్పిదంగా నిరూపితమైంది. కాంగ్రెస్‌కు ఇంకా అందరినీ కలుపుకొనే స్వభావం, విభిన్న అభిప్రాయాల పట్ల సహనము ఉంది. కాంగ్రెస్ సంస్థాపరమైన ఏకరూపత కొరకు ఒక నిబంధన పెట్టింది. కాని అది సైద్ధాంతిక పరమైనదికాదు. కాబట్టి సోషలిస్టులు వారి సిద్ధాంతాల్ని. విధానాల్ని త్యజించమనడం అందులో లేదు. అది అప్పుడు యూరపులోని కార్మిక పార్టీలలో వచ్చిన సమస్య లాంటిదే. వివిధ ఆలోచనా ధోరణులు గలవారు సభలు, సమావేశాలు నిర్వహించుకొనడానికి కాంగ్రెస్‌లో ఎలాంటి ఆటంకాలు లేవు. కాంగ్రెస్‌లో మితవాద భావాలు గలవారి (000567/265) లాగా సోషలిస్టులు కూడా వారి సమావేశాలు వారు జరుపుకొంటూ కాంగ్రెస్ నుండి చీలిపోకుండా వుండి వుండవలసింది. స్వరాజ్య సాధనతో సోషలిస్టులు కాంగ్రెస్‌లోని సోషలిస్టేతరులతో తమని కలిపి వుంచే బంధమేదీ లేదని భావించారు. కాని వాస్తవ పరిస్టితి అది కాదు. ఆర్ధికాభివృద్ధి, సెక్యులర్ ప్రజాస్వామ్యం, జాతీయైక్యతల ద్వారా సోషలిస్టు భారతదేశం యొక్క భౌతిక, సామాజిక, రాజకీయ పునాదుల్ని పటిష్ట పరచవలసివుంది. ఈ కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ యింకా ప్రధానమైన సంస్థగా వుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన కార్మిక ఐ.యన్.టి.యు.సి.లో చేరడాన్ని సోషలిస్టుపార్టీ నిరాకరించిన సందర్భంగా ఏ.ఐ.టి.యు.సి. మాజీ అద్యక్షుడు, సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అయిన హరిహరనాధశాప్తి ఇలా ప్రకటించాడు : “అసంపూర్తిగా వున్న జాతీయ విప్లవ కర్తవ్యం సోషలిస్టులు కాంగ్రెస్‌తో సహా దేశంలోని అన్ని సెక్షన్ల ప్రజానీకం యొక్క ప్రతి అభివృద్ధికరమైన గ్రూపు యొక్క పూర్తి సహకారాన్ని కోరుతుంది.” ఐక్య సంఘటనలో ఒక పార్టీ భాగంగా ఉన్నపుడు జాతి నిర్మాణం, సామాజిక మార్చు అంతిమంగా సోషలిజం సాధించేందుకు చేసే ప్రయత్నాలలో ఆ పార్టీ (క్రమశిక్షణకు భంగం కలగకుండా ఇతర ధోరణులతో పోటీపడడంలో నాయకత్వం యొక్క నిపుణత ప్రదర్శితమవుతుంది. సోషలిస్టులు కాంగ్రెస్‌లో మైనారిటీగా వున్నారు. పార్టీ స్థానిక స్థాయిలో కూడా నిర్మాణపరమైన వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అంగీకరించడంలో రాజకీయ విజ్ఞత వుంది. అంగీకరించి కాంగ్రెస్‌లోని మితవాద భావాలు, వామపక్ష భావాలు గల వారి మధ్య అధికార సమతుల్యతను మార్చేందుకు ఒక్కొక్క అంగుళం కేంద్రాన్ని వామపక్ష దిశకు లాగుతూ క్రమబద్ధంగా పోరాడాలి. కాంగ్రెస్‌పై గాంధీ, నెహ్రూల ఆధిపత్యం వున్నంత కాలం మితవాద భావాలు గలవారు ఇదే చేశారు. సోషలిస్టు తరహా సమాజం పట్ల కాంగ్రెస్ నిబద్ధతని ప్రకటించినపుడు విడిపోవటానికి బదులుగా మితవాద పక్షం ఒక 266 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సైద్ధాంతిక విధానపరమైన వైఖరికి ప్రాతినిధ్యం వహిస్తూ వామపక్ష భావాలు గల వారిది పైచేయి అవుతుందని నిరంతరం ఒత్తిడికి గురవుతూ కూడా కాంగ్రెస్‌లో కొనసాగింది. సోషలిస్టులుగాని కమ్యూనిస్టులు గాని లేక ఇరువురు కలసి గాని ఆ సమయంలో కాంగ్రెస్‌ని నెట్టి పడవేయడం గాని లేక కాంగ్రెస్‌ని వ్యతిరేకించి సోషలిజం సామాజిక మార్పు తీసుకొని రావడంగాని అసాధ్యం. నెహ్రా రాజకీయ చతురత, ప్రావీణ్యం సరిగ్గా దీనిని గుర్తించడంలోనే వున్నారు. సోషలిస్టులు కాంగ్రెస్ నుండి చీలిపోయినప్పుడు చాలామంది సోషలిస్టులు నెహ్రూని, కాంగ్రెస్‌ని సామాజిక మార్పుని తెచ్చే సాధనాలుగా గుర్తించి కాంగ్రెస్ లోనేవుంది పోయారు. అత్యంత ప్రతిభావంతుడు, పరిణతి చెందిన సోషలిస్టు నాయకుడు ఆచార్య నరేంద్రదేవ్ కాంగ్రెస్‌ని పదలి వెళ్ళే ఆలోచనని వ్యతిరేకించాడు. కాని పార్టీ నిర్ణయానికి కట్టుబడి అనుసరించాడు. సోషలిస్టులు కాంగ్రెస్‌ను వదలి వెళ్ళడం కాంగ్రెస్‌లోని వామష్షాన్ని చాల బలహీనపరచింది. ఎలాంటి సామాజిక మార్పులు కోరని వారి మధ్య నెహ్రూని వదలి వేసినట్లయింది. ఇది భారత రాజకీయాలలో వామపక్ష ధోరణికి అంచనాకిమించిన నష్టాన్ని కలిగించింది. మరొక వైపు మాటిమాటికి చీలికలకు దారితీస్తూ సోషలిస్టు పార్టీ విధ్వంసానికి కారణమయింది.
పార్టీపట్ల ప్రజాదరణకు సంబంధించి సోషలిస్టుల ఆశావాదం తేలిపోయింది. 1951-52 సాధారణ ఎన్నికలు పార్టీకి పెద్ద దుర్హబనగా నిరూపితమయ్యాయి. జాతీయ నాయకులందరూ ఓడిపోయారు. 10.6 శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటకీ కేవలం 12 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నది. రాష్ర్రాలలో 2248 సీట్లకు గాను 124 సీట్లు గెలిచింది. 58 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీకి బలమైన స్టావరాలైన యు-పి, బీహార్ బొంబాయిలలో వరుసగా 390కి 18, 2408 23; 269కి 9 సీట్లు గెలిచింది.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అసంతృప్తి వాదులు జె.బి. కృపలానీ నాయకత్వంలో కిసాన్ మజ్టూర్ ప్రజాపార్టీ (క.యం.పి.పి) స్థాపించారు. గాంధేయ వాదులమని, కాంగైసి కార్యక్రమం, విధానాలు ఆమోదిస్తున్నామని చెప్పుకుని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తామని వాగ్దానం చేశారు. ఆ పార్టీ నాయకులు పి.సి.జోషి, టి. ప్రకాశం అప్పుడు వారి రాష్ట్రాలలో. పశ్చిమబెంగాల్, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కృపలానీ 1950 వరకు కాంగ్రెస్ ప్రెసిడెంటు, తిరిగి ఎన్నిక కావడంలో విఫలమయ్యాడు. వారు కాంగ్రెస వదలివెళ్లదానికి కారణాలు వ్యక్తిగతమైనవి సిద్ధాంతపరమైనవి కావు.
కెయం.పి.పి కూడా పెద్ద ఆశలతో ఎన్నికల బరిలోకి దిగింది. కాని సోషలిస్టుపార్టీ కంటే కూడా ఎక్కువ నిరుత్సాహానికి గురయింది. 5.8శాతం ఓట్లు తెచ్చుకుని 9 లోక్‌సభ స్థానాలు, 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. స్వతం(త్రం తర్వాత భారతదేశం 267
అ తర్వాత ఎన్నికలలో తమ బలాన్ని గురించి అతిగా అంచనా వేసుకున్న సోషలిస్టు పార్టీ క.యం.పి.పిలు తమను కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరీ పరిమితం చేస్తాయని ఆందోళన చెంది విలీనమై ప్రతిపక్ష శక్తుల్ని పటిష్టం చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీల నాయకులు తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు లేవని భావించారు. కృపలానీ చెప్పినట్లు "మేము సామాజిక, రాజకీయ, ఆర్థిక దోపిడీలేని వర్గరహిత, కులరహిత సమాజాన్ని కోరుకుంటున్నాము. సోషలిస్టులు దానిని సోషలిస్టు సమాజం అంటారు. మేము సర్వోదయ సమాజమంటాము.
రెండు పార్టీలు 1952 సెప్టెంబరులో విలీనమై ప్రజాసోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశాయి. కొత్త పార్టీ చైర్మన్ కృపలానీ, జనరల్ సెక్రటరీ అశోక్ మెహతా, ప్రజాసోషలిస్టు పార్టీ ప్రతిషక్షపార్టీలలో అత్యంత పెద్దది. కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా కన్పించింది. 1952 ఎన్నికలలో 17.4 శాతం ఓట్లు సాధించింది. దేశవ్యాప్త నిర్మాణాన్ని చేపట్టింది. దానిలో జాతీయ, రాష్టస్థాయిల్లో ప్రఖ్యాతి చెందిన (ప్రజాదరణ పొందిన పలువురు నాయకులున్నారు. కానీ పార్టీ ఐక్యతని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది.
పార్టీ ప్రారంభం నుండి సిద్ధాంతపరమైన, ముఠాపరమైన కలహాలతో సతమతమయింది. చీలికలకు గురయింది. నాయకులతో (శ్రేణులలో క్రమశిక్షణా రాహిత్యం ప్రబలింది. భారతరాజకీయాలలో ప్రతిపక్ష పార్టీగా అది నిర్వహించవలసిన పాత్రపై విభేదాలు తలెత్తాయి. 1958 నుండి 1964 వరకు పార్టీలో చీలికలు తెచ్చిన సమస్యలు : కాంగ్రెస్ పట్ల అవలంభించవలసిన వైఖరి సమరశీల రాజ్యాంగేతర ఆందోళనలు, జాతి నిర్మాణ కార్యకలాపాలలో నిర్వహించవలసిన పాత్ర. 1953 జూన్‌లో పార్టీ బెటాల్ సదస్సులో అశోక్ మెహ్రత్రా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దానిననుసరించి వెనుకబడిన దేశంలో ముఖ్యమైన కర్తవ్యం ఆర్ధికాభివృద్ధి. కాబట్టి ఈ కర్తవ్యంలో (ప్రతిపక్షం విమర్శనా రహితంగొ కాకపోయినప్పటికీ పాలక పార్టీకి నిర్మాణాత్మక స్ఫూర్తితో సహకరించాలి. జాతీయవాదం, సోషలిజం, 'ప్రజాస్వామ్యాలలో కాంగ్రెస్, పి.ఎస్.పి లకు ఉమ్మడి విశ్వాసం ఉంది కనుక ఉమ్మడి అంగీకారం గల అంశాలలో సహకరించాలి. విభేదాలున్న వాటిలో వ్యతిరేకించాలి. కాంగ్రెస్‌తో సహాయ నిరాకరణ, దానికి పూర్తి వ్యతిరేకత - దీర్ధకాలంగా చూస్తే పి.ఎస్.పి ని రాజకీయంగా నిష్పయోజకంగా చేస్తాయి.
కానీ పార్టీ సదస్సు డాక్టర్ రామ మనోహర్ లోహియా వైఖరికి అనుగుణంగొ మెహతా సిద్ధాంతాన్ని తిరస్కరించింది. లోహియా కాంగ్రెస్ పట్ల నిర్ణయాత్మకమైన వ్యతిరేకతతో 268 భిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వ్యవహరించాలన్నాడు. కాంగ్రెస్‌కి, కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉండాలన్నాడు. లోహియా సమరశీల ప్రజా ఉద్యమాలు అవి చట్టపరమైన రాజ్యాంగ పరమైన పరిధులలో లేకషోం్పునప్పటికీ చేపట్టాలన్నాడు. లోపాయా, ఆయన అనుచరులు పార్టీ క్రమశిక్షణకు అంతగా అనుకూలంగా ఉండేవారు కాదు.
పి.ఎస్.పి ప్రారంభం నుండి నిరర్ధక అస్థిర నాయకత్వంతో సతమతమయింది. చాలామంది నాయకులు రాజీనామా చేశారు. విధేయతలు మార్చారు లేక బహిష్మరించ బెద్దార్సు. తమ విధేయులతో పార్టీనుండి బయటకి పోవడంతో ప్రతిసందర్భంలో పార్టీని మరింత బలహీనపర్చారు. లోహియా, ఆయన (గ్రూపు 1955లో పార్టీని వదలివెళ్లారు. 1956లో నరేంద్రదేవ్ చనిపోయాడు. 1954లో జయప్రకాష్ నారాయణ క్రియాశీల రాజకీయాల నుండి వైదొలగి తన జీవితాన్ని భూదానం, ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాలకు అంకితం చేస్తానని ప్రకటించాడు. 1957 సాధారణ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల నుండి వైదొలగాడు. భారతదేశానికి పార్టీ రాజకీయాలు సరిపడవన్నాడు. పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ప్రచారం చేశాడు. కృపలానీ రాజకీయాలలో స్వతంత్రపాత్రని నిర్వహించేందుకు పార్టీని వదలిపెట్టాడు. 1968లో అశోక్ మెహతా ప్లానింగ్ కమిషన్ ఉషాధ్యక్షుడయ్యేందుకు అంగీకరించాడు. పార్టీ నుంది బహిష్మరించబడ్డాడు. దాదాపు మూడవ వంతు పార్టీ కార్యకర్తలతో 1964 వేసవిలో కాంగ్రెస్‌లో చేరాడు. చాలామంది రాష్ట్రస్తాయి నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అలా చేరిన వారిలో ఆంధ్రలో ప్రకాశం, కేరళలో పట్టంథాను పిళ్లై, బెంగాల్లో పి.సి.ఘోష్, బీహారులో మహామాయ ప్రసాద్ సిన్హా యు.పి లో త్రిలోక్ సింగ్. చివరిగా 1971 లో సగానికి పైగా పార్టీ శ్రేణులు కొంలెస్లో చేరారు.
సాధారణ ఎన్నికలలో పి.ఎస్.పి క్షీణతలో ఇదంతా వ్యక్తమయింది. 1957లో మొత్తం పోలైన ఓట్లలో 10.4 శాతం ఓట్లతో పార్టీలోక్ సభలో 19 స్ధానాలు గెలిచింది. 1962లో 6.8 శాతం ఓట్లతో 12 స్థానాలు, 1967లో 8.1 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలిచింది. కానీ 1971లో పార్టీ ఒక శాతం ఓట్లతో 2 సీట్లు గెలుచుకుని అంత్య దశకు చేరుకుంది. పార్టీ అవశేషాలు సోషలిస్టు పార్టీతో కలిసి సంయుక్త సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశాయి.
సోషలిస్టు వైఫల్యానికి కారణం కాంగ్రెస్‌కి తమకుగల తేడాని - ప్రశ్యేకించి “ఆవడి”తీర్మానం సోషలిస్టు తరవా సమాజం పట్ల నిబద్ధత (ప్రకటించిన తరువాత స్వతంత్రం తర్వాత భారతదేశం 269
చూపడంలోని అశక్తత. వాస్తవంగా కాంగ్రెస్ లాగానే సోషలిస్టులకు కూడా జాతీయవాదం, సెక్యులరిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం -ప్రాతిపదిక గల ప్రభుత్వవిధానం. సామౌజిక మార్పులపట్ల నిబద్ధత ఉంది కనుక కాంగ్రెస్‌లో భాగంగా వుంటూ వారు అర్ధవంతమైన పాత్ర నిర్వహించగలిగి వుండేవారు. దాదాపు కాంగ్రెస్ ఆశయాలు, లక్ష్యాలే కలిగి కాం(ెస్ వెలుపలవుంటే నెహ్రూలాంటి పలుకుబడి, ప్రజాదరణగల నాయకుడు గల కాం(గెస్ పార్టీ చేత ఒక ప్రక్కకు నెట్టివేయబడక తప్పదు. చీలికలకు గురికాక తప్పుదు. పి.యస్.పి.ని వదలిపెట్టిన తరువాత డాక్టర్లోహాయా 1955 చివరలో సోషలిస్తు పార్టీ స్థాపించారు. ఈ కొత్త పార్టీ యొక్క ప్రత్యేకత. రాజకీయ సమరశీలత. ఆందోళనలు: శాసనోల్లంఘన ఉద్యమాలు, రాష్ట్ర శాసన సభల నుండి వాకౌట్లు. అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవటం లాంటి కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ ముఖ్య నాయకుడు లోహియా నెహ్రూ వ్యతిరేకి కాంగ్రెస్ వ్యతిరేకి. రెండు అంశాలు సోషలిస్తులు నొక్కి చెప్పారు. ఒకటి ఇంగ్లీషుని వెంటనే రద్దు చేయాలి. దాని స్థానంలో హిందీని అనుసంధాన భాషగొ (ప్రవేశ పెట్టాలి. రెండవది: ఉద్యోగాలలో 60 శాతం వెనుకబడిన కులాలకు, షెడ్యూట్లో కులాలకు, షెడ్యూల్లు తెగలకు, స్రీలకు రిజర్వు చేయాలి. వారు నెహ్రా ప్రభుత్వం అగ్రవర్తాల ప్రయోజనాలు కాపాడుతుందని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతానికి కులాన్ని ప్రాతిపదిక చేశారు గనుక 1990 లలో వచ్చిన కులపరమైన రాజకీయాలకు వారు ప్రారంభకులని చెప్పవచ్చు. తరువాత 1967లో లోహియా అనుచరులు కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒకవైపు స్వతంత్ర, జనసంఘ్ పార్టీల సహకారం మరో వైపు కమ్యూనిస్టుల సహకారం కోరారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పరమావధిగా పనిచేశారు. సోషలిస్టు పార్టీ ప్రత్యేకించి 1967లో రాయా స్రపోయిన తరువాత అసంతృప్తికి, ఫిరాయింపులకు ,విభజనలకు, అతీతంగా
- పార్టీ 1964లో పియస్.పి.తో కలిసింది. 1965లో విడిపోయింది. 1971లో మరలా కలిసింది. క్రాని అప్పటికి అది కూడా నామమాత్రమయింది. లోహియా సోషలిస్టులు లోక్‌సభలో 1957లో 8సీట్లు 1962లో 6సీట్లు 1967లో 23సీట్లు, 1971లో పోలైన ఓట్లలో 2.4 శాతం తెచ్చుకొని 3 సీట్లు గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ 1936నుండి కాంగ్రెస్‌లో భాగంగా వుంది. కాని కాంగ్రెస్ విధానాలతో విభేదించి 1945లో విడిపోయింది జాతీయోద్యమ ప్రధాన రాజకీయ ప్రవంతి నుండి వేరు చేయబడినప్పటికి ప్రజలపై ప్రాబల్యం కొంత కోల్పోయినప్పటికి 270 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1942-45 కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. 1947 లో భారత కమ్యూనిస్టు పార్టీకి క్రాన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీకి చాలా మంది సమర్భులైన నాయకులున్నారు. రైతులలో. కార్మికులలో, విద్యార్థులలో మేధావులలో క్రియాశీలకంగా పని చేసే వేలాదిమంది అంకితభావం గల, క్రమశిక్షణాయుతమైన, కష్టపడి పని చేసే కార్యకర్తలున్నారు. కాని సోషలిస్టు పార్టీలాగానే సి.పి.ఐ.కూడా 1947 తరువాత సంవత్సరాలలో. చివరికి 1964లో చీలిపోయేవరకు ప్రతి కొద్ది సంవత్సరాలకు అంతర్గత వివాదాలలో, సంక్షోభాలలో చిక్కుకున్నది. సి.పి.ఐ.లో ముఠాలేర్చాడ్డాయి. కాని అవిప్రధానంగా రాజకీయ. సైద్ధాంతిక విభేదాల కారణంగా ఏర్పడ్డాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే 1935 నుండి 1948వరకు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న పి.సి.జోషి 1950లో ప్రస్తావించిన సమస్య భారతదేశంలో రాజకీయ పరిస్టితి ఏమిటి?- పై ఒక వైఖరిని అంగీకరించలేకపోయింది.
సి.పి.ఐ. 1947లో చాల అంతర్గత గందరగోళానికి గురయింది. తొలుత భారత దేశం స్వతంత్రమయిందని గుర్తించింది. అభివృద్ధికర శక్తులన్నీ అభివృద్ధి నిరోధక, మతతత్వ, సామ్రాజ్యవాద అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నెహ్రూ వెనుక సమీకృతులు కావాలని సలహాయిచ్చింది. తరువాత 1947 డిసెంబరులో సోవియట్ మార్గదర్శకత్వంలో భారతదేశ స్వతంత్రం ఒక బూటకమని (యహ్ ఆజాది జూతీహై) ఆగష్టు 15 జాతీయ విద్రోహదినమని, కాంగ్రెస్ సామ్రాజ్యవాదం ప్యూడలిజం పక్షం వహించిందని, నెహ్రూ సామ్రాజ్యవాదం తొత్తు అయ్యాదని, ప్రభుత్వం ఫాసిస్టు తరహాలో పాలిస్తున్నదని, రూపొందింపబడుతున్న రాజ్యాంగం బానిసత్వ అధికార పత్రం అని ప్రకటించింది. కాబట్టీ కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్యూడల్ వ్యతిరేక కర్తవ్యాలు చేపట్టి, స్వతంత్రం ప్రజాస్వామ్యం కొరకు పోరాడేందుకు సాయుధ పోరాటం ప్రారంభించాలన్నది.
1948 ఫిబ్రవరిలో కలకత్తాలో నిర్వహించబడిన సి.పి.ఐ.రెండవ సదస్సు పి.సి.జోషి స్థానంలో బి.టి.రణదీవేని జనరల్ సెక్రటరీగా ఎన్నుకొన్నది. క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి కారణంగాను, సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ద్రోహం చేయడం వలననూ ప్రజలు కాంగ్రెస్ పట్ల భ్రమలు కోల్పోయారని, తిరుగుబాటుకు సిద్ధంగా వున్నారని సదస్సు ప్రకటించింది. కాబట్టి సాయుధ తిరుగుబాటుకి పార్టీ పిలుపిచ్చింది. పార్టీచాలా సాహసకృత్యాలు నిర్వహించింది. వాటిలో రెండు ప్రమాదకరంగా నిరూపితమయ్యాయి. 1946నుండి హైదరాబాద్ నిజాంకి వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణా రైతాంగ సాయుధ స్వతంత్రం తర్వాత భారతదేశం గ.
పోరాటాన్ని కొన సాగించాలని యిప్పుడు దానిని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురిపెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఫలితంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన అసమాన యుద్ధంలో వేలాది మంది సాహసులైన పార్టీ రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. రెండవ ప్రమాదకరమైన ప్రయత్నం: 1949 మార్చి 9ని జాతీయ రైల్వే సమ్మెగా ప్రకటించడం. అది అఖిల భారత సమ్మెకి దేశవ్యాప్త తిరుగుబాటుకి దారితీస్తుందని ఆశించారు. కాని సమ్మెవూర్తిగా విఫలమయింది. పార్టీ చాలా టెర్రరిస్టు కార్యకలాపాలు కూదా చేపట్టింది. ఫలితంగా చాలా రాష్ట్రాలలో సి.పి.ఐ. నిషేధించబడింది. ప్రజాభిప్రాయం నుంది వేరుచేయబడింది. బహిష్ట్మరణలు, రాజీనామాలతో సంస్ట్థాపరంగా బలహీనపడింది. 1951లో సభ్యత్వం 90,000 నుండి 18,000లకు పడిపోయింది.
1951 చివరలో అజయ ఘోష్ పార్టీ జనరల్ సెక్రటరి అయినప్పుడు తాత్కాలిక ఐక్యతకు దారితీస్తూ స్టాలిన్ ప్రత్యేక పర్యవేక్షణలో నూతనకార్యక్రమం, ఎత్తుగడల పంథా ఆమోదింపబడ్డాయి. కాని ఇది భారత సామాజిక, రాజకీయ వాస్తవికత అవగాహనకు ప్రాతినిద్యం వహించలేదు. భారతదేశం యింకను వలసదేశంగొను, 1947లో జరిగిన అధికార మార్చిడి “విద్రోహం”గాను, భారతదేశం సామ్రాజ్యవాదానికి లోబడి వుండి బ్రిటీష్ సామ్రాజ్య వాదంతో మిలాఖత్ అయిన భూస్వాముల, రాజాల, అభివృద్ది నిరోధక బడా బూర్జువాలకు ్రాత్రినిధ్యం వహిస్తున్నది గాను, పోలీసు రాజ్యం స్టాపించిన ప్రభుత్వంతో భారత రాజకీయ వ్యవస్థ ప్రాధమికంగా ప్రజాస్వామ్య విరుద్ధమైనదిగాను పరిగణించబడింది. సాయుధపోరాటం ద్వారా భారతరాజ్యాన్ని కూలదోయడం రాజకీయ కర్తవ్యంగా పరిగణించబడింది. ఈ కర్తవ్యం నెరవేరడానికి ప్రజలు సన్నద్ధంగా లేరని, ప్రజలు యింకొ 'ప్రభుత్వంపట్ల, కాంగ్రెస్ పట్ల భ్రమలలోవున్నారని, కాబట్టి దీనిని భవిష్యత్ అజందాలో భాగంగా చేయాలని సి.పి.ఐ. నిర్ణయించింది. ఇది సి.పి.ఐ. విధానంలోని నూతనాంశం. కాబట్టి పార్టీ విప్లవ కార్యాచరణని మార్చుకొని తెలంగాణాలో సాయుధ పోరాటం విరమించాలని, రానున్న సాధారణ ఎన్నికలలో పాల్గొనాలని నిర్ణయించింది. అప్పటికి నెహ్రా ప్రభుత్వం పై నెహ్రూ పూర్తి పట్టు సాధించడం పార్టీకి సహాయపడింది. నెహ్రౌ కమ్యూనిస్టుల అర్హతల్ని అంగీకరించాడు. దేశవ్యాప్తంగా పార్టీని చట్టబద్ధం చేయడం ద్వారా కమ్యూనిస్టుల మార్గాన్ని సుగమం చేశాడు.
సి.పి.ఐ.మొదటి సాధారణ ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొన్నది. గణనీయమైన బలంవున్న ప్రాంతాలలో మాత్రమే అంటే కాకున్న ఆంధ్ర, కేరళలలో కేంద్రీకరించింది. 272 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
61లోక్షసభస్థానాల్లో పోటీచేసి పోలైన ఓట్లలో 4.6శాతం సాధించి 23సీట్లు గెలిచింది. అంచనాలకు మించి అత్యంత పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. 1957 ఎన్నికలలో అంతకంటే బాగా 8.92 శాతం ఓట్లతో 27 సీట్లు గెలిచింది. కేరళలో మెజారిటీ సాధించి ప్రపంచంలో మొట్టమొదట ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వర్చరచ్రింది. దాదాపు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో పాతినిధ్యం సాధించింది. 1962లో 9.94శాతం ఓట్లతో 29 లోక్‌సభ స్థానాలను గెలిచింది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రలలోను దేశవ్యాప్తంగా గల కార్మికవర్గం మేధావులల్లోను, బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింద్ష
1962 ఎన్నికలు రానున్న కాలంలో పార్టీ, కాంగ్రైస్కి రాజకీయ ప్రత్యామ్నాయం కాగలదనే ఆశలు కల్పించాయి. కాని అవి నెరవేరలేదు. పార్టీలో సంధి తాత్మాలికమైనదిగా నిరూప్రితమయింది. ఎన్నికల తరువాత పార్టీలోని విభేదాలు మరలా బయటబడ్డాయి. 1951లో కార్యక్రమంపై అంగీకారం కుదిరినప్పటికి భారత రాజ్య స్వభావం, వివిధ సామాజిక వర్గాల పాత్ర-ప్రత్యేకించి భారత భూర్జ్చువాల పాత్ర, భారత విప్లవాన్ని తీసికొని వస్తే వర్గ పొందిక భారతదేశ విప్లవ స్వభావం, విప్లవాన్ని గురిపెట్ట వలసిన ముఖ్య శత్రువుని నిర్ణయించడం, కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రా పట్ల, అలాగే వారి సంస్కరణ వాద జాతి నిర్మాణ కార్యక్రమాల పట్ల అనుసరించవలసిన వైఖరి లాంటి ముఖ్యమైన సమస్యలపై పార్టీ ఏకాభిప్రాయాన్ని కొనసాగించలేక పోయింది. వర్ణ పొందికకు సంబంధించి ఒక అంశంపై అంగీకారం కుదిరింది. జాతీయ బూర్డువాలతో మిత్రత్వం నెరపాలని. కాని ఎవరిని జాతీయ బూర్జువాలుగా పరిగణించాలి? భారత రాజకీయాలలో, రాజ్యంలో బూర్జువాలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? అనే అంశంపై అంగీకారం కుదరలేదు. 1951 పార్టీ కార్యక్రమం పరిమితులలో సామాజికాభివృద్ధి క్రమంపై అవగాహనకు రావడంలో పార్టీలో ఘర్షణలు, వైరుధ్యాలు తలెత్తాయి. పరిస్థితుల మార్పుతో ఎక్కువ గందరగోళానికి గురయింది. క్రమంగా విఖేదాలు ముఠాలుగా ఘనీభవించాయి. ఎత్తుగడలపై ఐక్యత కూడా విచ్చిన్నమయింది. పార్టీ నిర్మాణం స్తంభించింది.
కాలక్రమంలో సి.పి.ఐ.పార్టీ విభానపరంగా నాలుగు పెద్ద మార్పులు చేసింది. మొదటిది: భారతదేశ ప్రభుత్వం దేశ అంతర్గత విధానాలలో సామ్రాజ్యవాదానికి ఏజంటుగా ఉంటూ స్వతంత్రంగా వ్యవహరించినప్పటికి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నదని 1953లో మధురై సదస్సులో ఆమోదించింది. రెండవది: 1956లో నిర్వహించబడిన పొల్దాట్ స్వతంత్రం తర్వాత భారతదేశం 273
సదస్సు భారతదేశం 1947లో స్వతంత్రం సాధించిందని అంగీకరించింది. ఇప్పుడు భారతదేశం ఒక సర్వసత్తాక (ప్రజాతంత్రరాజ్యం. ప్రభుత్వవిధానాలు సామ్రాజ్య వాదులకు రాయితీలిస్తూ ప్రజావ్యతిరేక విధానాలనవలంబిస్తూ పెట్టుబడి దారీ విధానాన్ని నిర్మించే దిశగా సాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మౌలికంగా అభివృద్ధి నిరోధకమైనది. కాంగ్రెస్‌ను తొలగించేందుకు ప్రజాస్వామ్య సంఘటనను నిర్మించడం పార్టీ ముఖ్యకర్తవ్యం. కొని ఆకట్టుకొని వారి నాయకుల నుండి విడగొట్టదగిన చాలా మంది ప్రజాస్వామ్య వాదులు కాంగ్రెస్‌లో ఉన్నారు కనుక ఈ సంఘటన కాంగ్రెస్‌కు వ్యతిరేక సంఘటనగా వుండకూడదు. మూడవది: శాంతియుతమైన పార్లమెంటరీ పద్దతుల ద్వారా సోషలిజంలోకి పురోగమించడం సాధ్యమేనని పార్టీ 1858లో అమృత్సర్ సదస్సు ప్రకటించింది. పార్టీ అధికారంలోకివస్తే రాజ్యాంగ పద్ధతుల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సోషలిస్టు ప్రభుత్వాన్ని సోషలిస్టు విధానాన్ని. వ్యతిరేకించే హక్కుతో సహా అన్ని పొరహక్కులకు అవకాశం కల్పిస్తుందని కూడా ప్రకటించింది. నాల్గవది: కాంగ్రెస్‌తో పోరాటం ఐక్యత విధానాన్ని అనుసరించాలని 1961లో విజయవాడ సదస్సు నిర్ణయించింది. పార్టీపోరాటానికి ప్రాధాన్యతయిస్తుంది. కాని కాంట్రేస్ అభివృద్ధికర విధానాలను బలపరుస్తుంది. అభివృద్ధికర, అభివృద్ధి నిరోధక విధానాల ప్రాతిపదికన కాంగ్రెస్ చీలిపోతుందని అప్పుడు అభివృద్ధికర విధానాలు అవలంబించే సెక్షన్‌తో ఐక్యంగా పనిచేయాలని పార్టీ అంచనా.
కాని పార్టీ సదస్సులలో వచ్చిన ఒప్పందాలు తాత్కాలికమైనవిగా మిగిలి పోయాయి. స్టాలిన్‌పై రష్యా విమర్శలపై అనుసరించవలసిన వైఖరి, రష్యా చైనా విభేదాలు, 1962నొటి ఇండియా-వైనాయుద్ధం-లాంటి సమస్యలపై విభేదాలు తీవ్రతరమయ్యాయి. చైనా దాడికీ వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఒక పక్షం పూర్తిగా బలపరచింది. మరాకపక్షం భారత చైనౌ సరిహద్దుల సమస్యపై చైనా వైఖరిని ఖండించింది. కాని వర్లస్వభావాన్ని గమనంలో పెట్టుకొని నెహ్రా ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. సోవియట్ రష్యా - వైనా సైద్దాంతిక విభేదాలు కూడా సిపిఐ.లో ప్రతిధ్వనించాయి. చాలా మంది చైనా వైఖరిపట్ల సానుభూతితో ఉన్నారు. సోవియట్ రివిజనిస్ట పంథాని బలపరిచే వారితో విభేదించాలని ప్రపంచ వ్యాప్తంగా గల కమ్యూనిస్పపార్టీలలోని విప్లవ శక్తులకు పిలుపిచ్చి చైనా వాళ్ళు సి.పి.ఐ. విభేదాల అగ్నిలో ఆజ్యం పోశార్తు,
చివరకి 1964లో సి.పి.ఐ. చీలిపోయింది. మితవాద, మధ్యవాద ధోరణులకు (ప్రాతినిధ్యం వహించినవారు సి.పి.ఐ.గా పిలువబద్దారు. వామపక్ష ధోరణికి ప్రాతినిధ్యం టు! బిపన్చం[ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వహించిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లేక సి.పి.ఐ.యం గా పిలువబడింది. వ్యక్తి గత్రమైన ముఠాపరమైన విభేదాలు ఒకటీ అరా వుంటే వుండవచ్చు కానీ చీలిక ప్రధానంగా సైద్ధాంతిక ప్రాతిపదికన జరిగింది.
సి.పి.యం విధానం మేరకు భారతదేశ రాజ్యం అంతకంతకు విదేశ విత్త పెట్టుబడితో మిలాఖత్ అవుతున్న బడా బూర్హువాల నాయకత్వంలో గల బూర్జువా భూస్వామ్య వర్షపాలనా సాధనం. కాంగ్రెస్ పాలకవర్థాల చేతుల్లోని ముఖ్యమైన పనిముట్టు. కాబట్టి దానిని ధ్వంసం చేయాలి. సి,పి.యం లక్ష్యమైన జనతా (ప్రజాస్వామిక రాజ్యం శాంతి యుతమైన పార్లమెంటరీ పద్ధతుల ద్వారా స్టాపించబడుతుందని విశ్వసించదు. ప్రత్యేకించి ఫారత రాజ్యాంగం (ప్రజాస్వామ్య విరుద్ధమైనది గనుక అదిపూర్తిగా రద్దుచేయబడాలి. అయినప్పటికి రాజ్యాంగాన్ని పార్టీపోరాట సాధనంగా ఉపయోగించుకుంటుంది. రాజ్యాంగపరిమితులలో పనిచేస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్సిస్తుంది. సామాజిక సంబంధాలలో మార్పులు తెచ్చేందుకు వ్యవసాయక విప్లవాన్ని పార్టీ మరియు కార్మిక వర్గం నాయకత్వంలో సాయుధపోరాటాన్ని ప్రారంభించడం అవసరమని సి.పి.యం విశ్వసిస్తుంది. వీలైనంతత్వరలో సాయుధపోరాటానికి అనువైన పరిస్థితులను సృష్టించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితులు సృష్టించడానికి, ప్రజలకు పార్లమెంటుపై. రాజ్యుంగముపై ఇంకను గల భ్రమలను తొలిగించేందుకు పార్టీ పార్లమెంటరీ రాజకీయాలలో పాల్గానడాన్ని ఉపయోగించుకొంటుంది. అంతర్జాతీయ ధృక్పధంలో స్టాలిన్ కొన్ని నివారించదగిన తప్పులు చేసినప్పటికి మౌలికంగా ఆయన విధానాలు సరియైనవని, ఆయన గొప్ప మార్క్సిస్టుని పరిగణిస్తుంది. సోవియట్ - చైనా విభేదాలపై స్వతంత్ర వైఖరిని తీసికున్నట్లు పార్టీ చెప్పుకొన్నది. కాని సోవియట్ రివిజనిజాన్ని ఖండించాలని డిమాండు చేస్తూ వైనాకు సన్నిహితమైన వైఖరి చేపట్టింది.
సి.పి.ఐ కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్యూడల్ వ్యతిరేక విప్లవాన్ని జయప్రదం చేయాలన్నది. కాని కాంగ్రెస్‌లోని అభివృద్ధి కరమైన సెక్షన్స్‌ని కలుపుకొని జాతీయ (ప్రజాస్వామ్య సంఘటనను ఏర్పాటు చేసి విప్లవాన్ని విజయవంతం చేయాలన్నది. అంతేగాక ఈ సంఘటనకు కార్మిక వర్గంగాని, లేక సి.పి.ఐ గాని నాయకత్వం వహించవలసిన అవసరం లేదన్నది. జాతీయ ్రజాస్వామ్యంలోనికి ఆ తరువాత సోషలిజంలోనికి మార్పు శాంతి యుతమైన పార్లమెంటరీ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుందని పార్టీ చెప్పింది. స్వతంత్రం తర్వాత భారతదేశం ల2ర్ర్
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి యితర చిన్నపార్టీలను కలుపుకొని పశ్చిమబెంగాల్ కేరళ, ్రిపురలలో ప్రభుత్వాల నేర్పరచినప్పటికి పార్లమెంటులో వాటి ఉనికిని కాపాడుకుంటున్నప్పటికి రెండుపార్టీలు కూడ స్తబ్దతకు గురయ్యాయి. ఎదుగుదల ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్ కేరళ, త్రిపురలు మినహాయించి మిగిలిన రాష్ట్రాలలో వాటిఉనికి నామమాథ్రంగానే వుంది. ప్రజలలో రాజకీయాలు నిర్వహించి విస్తృతమైన ప్రజా ఉద్యమాలు నడపటంలో విఫలమయ్యాయి. సోషలిస్టు పార్టీలలాగా విచ్చిన్నమై అదృశ్యం కానప్పటికి కమ్యూనిస్టు పార్టీలు కూడా వాటి రాజకీయబలాన్ని పెంచుకొనడంలో విఫలమయ్యాయి.
అనుకూల సామాజిక, ఆర్థిక పరిస్థితులున్నప్పటికి స్వతంత్ర భారతదేశం ఎదురుకొన్న సవాళ్ళను అంచనా వేయడంలో అవి భక్త కమ్యూనిస్టు పార్టీ, దాని నుండి వచ్చిన ఇతర పార్టీల వైఫల్యాన్ని ఎలా పరిగణించాలి? సంక్షిష్ట భారతదేశ సామాజిక అభివృద్ధిని మారుతున్న ప్రజల ఆలోచనా ధోరణిని అద్ధం చేసుకోవడంలో సి.పి.ఐ విఫలమయింది. ఉదాహరణకు 1947లో భారతదేశం స్వతంత్రం పొందిందని గుర్రించచానికి సి.పి.ఐకి 8 సంవత్సరాలకాలవ్యవధి పట్టింది. స్వతంత్ర పెట్టుబడిదారీ విధానం నిర్మింపబడుతుందని గుర్తించడానికి సి.పి.ఐ పార్టీనుండి విడిపోయిన పార్టీకి మరి 9 సంవత్సరకాలం పట్టింది. 1950, 1960 దశాబ్దాలలో సిద్దాంత సంబంధమైన చర్చలు విసృతంగా జరిగాయి. మరొకవైపు లోతైన ఆర్ధిక రాజకీయ విశ్లేషణ జరగకుండా ఆర్ధిక విధానం సంక్షోభంలో వుంది, ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి, వర్గ వైరుధ్యాలు తీవమౌతున్నాయి, కాంగ్రెస్ పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయి - లాంటి తీర్మానాల మీద తీర్మానాలు చేయబడ్డాయి. అనివార్యమైన సామాజిక ఆర్థిక పరిస్థితులు విప్లవ పరిస్థితి ఏర్పడినప్పుడు నిబద్ధత గల శ్రేణులు, ఆటుపోట్లలెదుర్శొన గల సభ్యులు, కచ్చితమైన క్రమశిక్షణ, సరియైన పార్టీపంధా గల తమషార్ధీ ప్రజావిప్లవానికి నాయకత్వం వహిస్తుందని సి.పి.ఐ ఆశించింది. ఫలితంగా పార్టీ, పార్టీలో పరస్పరం పోటీపదే (గ్రూపులు, ముఠాలు వాటి వాటి వరవడులకు అంటి పెట్టుకొనివున్నాయి. వాటినుండి బయట పడలేక పోయాయి.
భారతీయ రాజకీయ వాస్తవికతతో తలపడడంలో కమ్యూనిస్టుల వైఫల్యం మూడురంగాలలో వ్యక్తమయింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో మమేకమై పోరాడినప్పటికి, కాంగ్రెస్ గాంధీజీల నాయకత్వంలోని జాతీయోద్యమ ప్రధాన స్రవంతిలో భాగంగా ఉన్నప్పటికి, స్వతంత్ర భారతానికి ముందు తరువాత కూడా పార్టీ స్వతంత్ర 276 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పోరాట స్వభావాన్ని రష్యా, చైనా విప్లవాలతో పోల్చదగిన జాతీయ ప్రజా ఉద్యమంగా ఎరిగశించడంలో విఫలమయింది. స్వతంత్రానంతరం సి.పి.ఐ జాతీయవాదంపై జాతీయాభివృద్ధి జాతీయెక్యత సమస్యలపై ఒప్పందానికి రావడంలో విఫలమయింది. మాజీ వలస దేశాలలో జాతీయ వాదానికి యూరప్ దేశాల కంటే భిన్నమైన అర్ధం వుంది. ఇక్కడ జావ్రీయవాదం బూర్జువా ప్రయోజనాల సైద్ధాంతిక ప్రతిబింబంకాదు. (ప్రజల మనస్సులను బూర్జువా సిద్ధాంతంతో మరుగుపరచటాన్ని ప్రతిఫలించదు. దానికి భిన్నంగా “మైక్యమైన, పటిష్టమైన భారతదేశం సామాజిక స్థితిగతుల్ని మెరుగు పరచే వాహకంకావాలన్న 'పజల ఆకాంక్షని ప్రతిఫలించింది. అలాగే జాతి నిర్మాణం బూర్జువా కర్తవ్యం కాదు. జాతి నిర్మార్తంల్రోను ఆర్ధికాభివృద్ధి, విద్యావ్యాప్తి. శాప్రీయ అవగాహన, శాస్త్ర సాంకేతికరంగాలు, ఉత్పత్తి, కులవవ్యస్థకు వ్యతిరేక పోరాటం, స్వతంత్ర పరిరక్షణ, జాతీయ సమగ్రత దిరక్ష్యలాంటి జాతిమొత్తం యొక్క సామాజికాభివృద్ధికి సంబంధించిన రంగాలకు నాయకత్వం వహించడంలో విఫలమయ్యారు కనుక కమ్యూనిస్టులు ప్రబలమైనశక్తిగా ఎదగలేక్రవోయారు.
సి.పి.ఐ పౌరహక్కులు గల ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇమిడి వున్న అంతస్సూచనలను అంచనా వేయలేకపోయింది. విష్లవపంథా - విష్తవేతరపంథా, హింసాపద్ధతులు ఆ అహింసాపద్ధతులు, పార్లమెంటరీ పనివిధానం, సాయుధపోరాటం లాంటి సమస్యలపై చర్చలలో కూరుకుపోయింది. స్వతంత్రానంతర (ప్రజాస్వామ్య భారతదేశంలో సామాజిక విస్తవరారుడెవరు? అతడు ఏం చేయాలి? అనే వాస్తవ సమస్యపై చర్చ జరుగలేదు. ఎన్నికల్ని పార్లమెంటుని ప్రజావేదికలుగా ఉపయోగించుకొంటాం. కమ్యూనిస్టుల బలాన్ని కొలిచే సాధనాలుగా ఉపయోగించుకొంటాం, లాంటి సాంప్రదాయ కమ్యూనిస్టు ఆలోచనా ధోరణిచే పార్లమెంటరీ రాజకీయాలు కప్పివేయబడకూడదు. బూర్డువా సామాజిక నిర్మాణాన్ని ఊతంగా వాడుకుంటున్నప్పటికీ భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలు గణనీయమైన, చారిత్రాత్మకమైన ముందడుగు వేశాయి. ప్రజాస్వామ్య రాజకీయాలంటే రాజకీయాల ప్రవర్తనా నియమాలలో మౌలిక మార్చు. భారతదేశ పార్లమెంటరీ సంస్థల్ని, చట్రాన్ని - సామాజిక మార్పుని తీసుకునివచ్చే రాజకీయ మార్గాలుగా పరిగణించాలి.
ఈ అవగాహన దిశగా సి.పి.ఐ 1958లో అమృత్సర్ సదస్సులో ముందడుగు వేసింది. కాని పార్టీ అంతర్గత వాదనలు అవగాహనని త్యజించడానికి దారితీశాయి. స్వతం[త్రం తర్వాత భారతదేశం 277
ద్వారా వస్తుందని, విమర్శలు పాలకుల యొక్క ప్రస్తుత సామాజిక వ్యవస్థ యొక్క లోపాల్ని బహిర్గతం చేయడానికే గాక సామాజిక మార్చు ఆచరణరూపం దాల్బడానికి దోహదపడాలని గుర్తించడంలో కూడా సి.పి.ఐ విఫలమయింది. అలాంటి వైఖరి లోపించడం వల్లనే సి.హిఐ జాతి నిర్మాణం పట్లగాని, నెహ్రూ ప్రభుత్వ సంస్కరణల విధానాల పట్ల గానీ సానుకూలివైన, రాజకీయంగా ఆచరణీయ వైఖరిని చేపట్టడంలో విఫలమయింది. అదే సమయంలో పొ ల కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం కావడంలోనూ, జాతీయాభివృద్ధి సామాజిక న్యాయం పటి తన స్వంత అజెండాతో ముందుకు రావడంలోనూ విఫలమయింది. ఫలితంగా ప్రతిపక్ష స్థానాన్నీ క్రమంగా అభివృద్ధి నిరోధక కులమతతత్వపార్టీలు ఆక్రమించడం ప్రారంభమయింది.
చివరిగా సి.పి.ఐ యొక్క కేంద్రీకృత, పూర్తికాలం పనిచేసే పార్టీ శ్రేణుల మౌలికంగా పార్టీ రహస్య నిర్మాణం, ప్రజాస్వామ్య సమాజానికి సరిపడలేదు. అలాం్స్ పార్టీ ప్రజాసంస్థల్ని (ప్రజల అధికారాన్ని అభివృద్ధి పరచాలని ఆశించజాలదు. పార్టీ బలహీనతలకు తోడు 1962 కి ముందు సోవియట్ నాయకత్వానికి లోబడి పనిచేయడం: లక్ష్యం కొరకు పద్ధతుల్ని సమర్ధించుకొనే సిద్ధాంతం దిగుమతి - పార్టీ అంతర్గత వివాదాలకు దారితీసింది. భారతీయ జనసంఘ్
1951 అక్టోబర్‌లో స్థాపించబడిన భారతీయ జనసంఘ్ పార్టీ మౌలికంగొ మతతత్వ షార్టీ. దానిని మతతత్వ పార్టీగానే అధ్యయనం చేయాలి. మతతత్వ సిద్ధాంతం చుట్టూ నిర్మించబడిన పార్టీ మతతత్వపార్టీ. మతతత్వ పార్టీని ప్రత్యేకమైన వివాదాల ద్వోరొ సూత్రీకరించడం సాధ్యపడదు. ఎందుకంటే అది ఆచరణ విధానాలకు సంబంధించిన అంశాలను ఎప్పటికైనా తోసిపుచ్చగలదు. కొన్ని సందర్భాలలో వాటికి పూర్తిగా వ్యతిరేకమైన వాటినీ అన్ససరించగలదు. దాని ఆర్లిక, సామాజిక, రాజకీయ విధానాలు సాధారణంగొ గింజ యొక్క పై పార లేక ఊక లాంటివి లేక ముసుగు లాంటివి. ఓట్ల రాజకీయ అవసరాలకు సరిపడే విధంగా ముసుగుని ఎప్పుడైన మార్చవచ్చు. అలా మార్చదం రౌజీయాధికారాన్ని కైవశం చేసుకోవడానికి అవసరమని పార్టీ భావిస్తుంది. ముసుగుని తొలగించి మతతత్వ అజండాని అమలు జరుపుతుంది. (ప్రస్తుతమున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణానికి చెందిన పలు అంశాలను పరిరక్షించాలనే నిబద్ధత లేదు గనుక మతతత్వ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్ని సంరక్షించే పార్టీ కాదు. కానీ కానీ అర్ధికరంగానికి చెందిన అభివృద్ధి నిరోధక దోపిడీ శక్తులకు బలాన్ని చేకూర్చకుండా రాజ్యాన్ని సమాజాన్ని మతపరం చేయలేదు కనుక మతతత్వపార్టీ ఒక మితవాదపార్దీ (2180 ౪108 ౧26) 278 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జనసంఘ్ రెండు పెద్ద పరిమితులకు లోబడి పనిచేయవలసి ఉంటుంది గనుక అది తన మతతత్వ సిద్ధాంతాన్ని బాహాటంగా ప్రకటించుకొనదు. సెక్యులర్ ప్రజాస్వామ్య రాజకీయాలు గల సమాజంలో ఎన్నికలలో పాల్గొనే పార్టీగా జనసంఘ్ ఎన్నికలో మెజారిటీ సాధించడానికి మతేతర ఓటర్లకు విజ్ఞప్తి చేయవలసి ఉంటుంది. అలాగే మతపరంగా విజ్ఞప్తి చేయడాన్ని ఎన్నికల నిబంధనలు అనుమతించవు. భారతదేశంలో జాతీయోద్యమం పట్ల అలాగే మతేతర భావాల పట్ల దృఢమైన సైద్ధాంతిక నిబద్ధత ఉన్న కారణంగా ప్రత్యేకించి గాంధీజీ హత్యానంతరం మతతత్వవాదం యెడల ప్రజలలో వహ్యభావం పెరిగింది.
జనసంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్. యస్.యస్) సృష్టించిన పార్టీ. జనసంఘ్ ప్రారంభం నుండి ఆర్.యస్. యస్ యొక్క సైద్ధాంతిక పరమైన, నిర్మాణపరమైన అజమాయిషీలో ఉంది. కాబట్టి జనసంఘ్ యొక్క మౌలిక మతతత్వ స్వభావాన్ని దాని రాజకీయాలను అర్ధం చేసుకోవాలంటే ముందుగా ఆర్. యస్.యస్ని అధ్యయనం చేయాలి. జనసంఘ్‌కు నిర్మాణ పటిష్టతని, కేంద్రీకృత స్వభావాన్ని సైద్ధాంతిక సారూప్యతని సమకూర్చింది. - ఆర్.యన్.యన్ కింది స్థాయి కార్యకర్తల్ని నుశిక్షితులైన, కమశిక్షణాయుతమైన ్రేణుల్ని నిర్వాహకుల్ని క్రమంగా జనసంఘ్‌పై స్థాయి నాయకుల్ని పత్యేకించి సెక్రటరీల్ని జనరల్ సెక్రటరీల్ని సమకూర్చింది ఆర్.యస్.యస్. 1925లో స్థాపించబడిన ఆర్.యస్.యస్ మిలటరీ పద్ధతులలో నిర్వహణ చేపట్టింది. హింసని పోత్సషాస్తూ ముస్లిం వ్యతిరేకత సంస్థగా అభివృద్ధి చెందింది. అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. హిందువులు, ముస్లిం ఆధిపత్యం నుండి రక్షించి తన బలాన్ని నిలబెట్టుకునేందుకైనా అది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చేపట్టలేదు. యుద్ధ సంవత్సరాలలో రాజకీయాలకు మతపరం చేయడం వలననూ 1946 - 47 లో పెద్ద ఎత్తున చెలరేగిన మతహింస కారణంగాను ఉత్తర భారతదేశంలో 1940 దశాబ్దంలో ఆర్. యస్.యస్. అభివృద్ధి చెందింది. గాంధీజీ హత్యానంతరం ఆర్. యస్.యస్ నిషేధించబడింది. కార్యకర్తలు, నాయకులు నిర్బంధింబడ్డారు.
ఆర్.యస్.యస్ గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికి గాంధీజీ ఇతర నాయకులపై హిందూవ్యతిరేకులు దేశద్రోహులు అనే ముద్ర వేసి వారికి వ్యతిరేకంగా విద్వేష ప్రచారం సాగించింది. జీవితకాలం ఆర్.యస్.యస్ అధినేతగా నామినేట్ చేయబడిన యం.యస్. గోల్వాల్మర్ 1939లో ఇలా రాశాడు. 'విపరీతం, చాలా విపరీతం, దేశద్రోహులు జాతీయ నాయకులుగా సింహాసనం పై కూర్చొనడం'. స్వతంత్రం తర్వాత భారతదేశం 279
ఆర్.యస్.యస్ పై నిషేధాన్ని ఎత్తివేయించుకునేందుకు 1949లో దాస నాయకులు ఆర్.యస్.యస్ రాజకీయాలలో పాల్గొనదని పూచీపడ్డారు. జనసంఘ్ దాని సరియైన ముసుగుగా పనిచేసింది. ముస్లింల పట్ల ఆర్.యస్.యస్. మతతత్వ వైఖరికి మార్గదర్శకాలను గోలా 'మనం నిర్వచించబడిన మన జాతీయత అనే గ్రంథంలో పొందుపరచారు. దాని భారత రాజకీయాలలో సమాజంలో ముస్లింలను శత్రువులు విదేశీయులుగా చిత్రించౌ ల కాబట్టి ముస్లింలు హిందువులకు పూర్తిగా లోబడి ఉండడానికి అంగీకరించాలి కః ముస్లింలుగా తమ ఉనికిని కోల్పోవాలని స్పష్టం చేశాడు. గోల్వాల్కర్ (గ్రంథంలోని ఉదాహరణను పరిశీలించండి: జాందూస్తాన్లో ఉన్నది ఉండవలసిందీ (ప్రాచీన హిందూ జాతి. హిందూబౌతి తప్ప మరొకటి కాదు. కానీ వారు (ముస్లింలు హిందూయేతరులు) వారి మతపరమైో సాంస్కృతికపరమైన విభేదాల్ని కొనసాగించినంత కాలం వారు విదేశీయులుగానే వంటో: విదేశీ శక్తులకు రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. వారు స్వదేశీ జాతిలో కలిసీ పోయి వారి సంస్కృతిని అనుసరించడం లేక జాతిప్రజల ఆకాంక్షల మేరకు జీవనం సాగించడం. హిందూస్తాన్లో గల హిందూయేతర ప్రజలు హిందూ సంస్కృతిని భాషని అనుసరించాలి. హిందూ మతం పట్ల గౌరవాభిమానాలు కలిగివుండడం నేర్పుకోనొలి. ఒక్క మాటలో చెప్పాలంటే వారు విదేశీయులుగా ఉండిపోరాదు. దేశంలో వుండవచ్చు. హిందూజాతికి లోబడి ఎలాంటి ప్రత్యేక హక్కులు పౌరహక్కులతో సహా ఏమీ కోరకుందొ.” ఈ దేశంలో హిందువులు మాత్రమే జాతి. ముస్లింలు ఇతరులు దేశ వ్యతిరేకులో కాకపోయినప్పటికి జాతికి వెలుపలివారే'. గోల్వాల్కర్ మాటిమాటికి ముస్లింను “మన శత్రువులు, తీవ్రమైన శత్రువులు అంత్యంత దీర్జకాలిక శత్రువులుగా ప్రస్తావించాడు. ఇంకా ఇలా అన్నాడు. “మనం హిందువులం. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలతోనూ, మరొక వైపు బ్రిటీష్ వారితోనూ యుద్ధం చేశాం.” ఇటీవల1991 అక్టోబర్‌లో గోల్వాల్కర్ స్థానంలో ఆర్‌యస్, యస్ అధినేతయైన బాలా సాహెబ్ దేవర్స్ ముస్లిం కలహశీలమైన, విచ్చిన్నకరమైన మనస్తత్వొన్సి. ఖండించాడు. జాతి ప్రయోజనాలను త్యాగం చేస్తున్నాయని ముస్లిం జాతి వ్యతిరేకతే రాజకీయ ఆకాంక్షలను నెరవేరుస్తున్నాయని సెక్యులర్ పార్టీలను నిందించాడు. 280 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆర్.యస్.యస్. జాగ్రత్తగా క్రమబద్ధంగా తన థ్రేణులకు అనుయాయులకు అలవరచిన మతతత్వ భావాలను గమనంలో పెట్టుకుంటే ప్రముఖ జర్నలిస్టు కిషన్ భాటియా 1971లో గత 30 సంవత్సరాలలో జరిగిన అతి దారుణమైన మత ఘర్షణ వెనుక ఆర్.ఎస్.ఎస్ హస్తముందని ప్రస్తావించడం యాదృచ్చికం కాదు. అలాగే హిందువులు భారతజాతియని, భారతదేశాన్ని ఇస్తామీకరణ చేస్తున్న పథకాల ప్రమాదాన్ని నొక్కి చెబుతూ ఆర్.యస్,యస్ అనధికార పథత్రికలైన “ఆర్గనైజర్”, 'పాంచజన్య'లు ఈనాటికీ వ్యాసాలు 'పచురిస్తున్నాయి.
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అధ్యక్షుడుగా 1951 అక్టోబర్‌లో జనసంఘ్పార్టీ 'పారంభించబడింది. ముఖర్జీ ఆధ్వర్యంలో పార్టీ ఒకమేరకు స్వతంత్రంగా పనిచేసింది. అప్పుడు కూదా దాని అగ్రభాగాన ఉన్నది ఆర్.ఎస్.ఎస్. అప్పుడు కూడా ఆర్.ఎస్. ఎస్.చే ఎంపిక చేయబడిన డ్రేణులు పార్టీ కీలక స్థానాల్లో నియమింపబడ్డారు. 1953లో ముఖర్జీ మరణానంతరం పార్టీ స్వతంత్రతపై కప్పిన ఆచ్చాదన క్రమంగా తొలగించబడింది. 1954లో జనసంఘ్ పై ఆర్.ఎస్.ఎస్. ఆధిపత్యానికి నిరసనగా రెండవ అధ్యక్షుడు మౌళిచంద్ర శర్మ రాజీనామా చేసినప్పటి నుండి జనసంఘ్ దాని తర్వాతి అవతారమైన భారతీయ జనతా షార్టీ (బి.జె.పి.) ఆర్.ఎస్.ఎస్.తో బావోటంగా మమేకమై దానిచేతనే అదుపు చేయబడుతున్నది. ఆర్.ఎస్.ఎస్ వాటికి పై స్థాయిలోనూ, దిగువ స్థాయిలోనూ నాయకుల్ని సమకూర్చుతుంది.
జనసంఘ్ పెటీ బూర్జువాలకు అనుగుణమైన కార్యక్రమాన్ని ఆమోదించి బలపరిచింది. కానీ అప్పటికి ప్రణాలిక పబ్లిక్ సెక్టర్ ప్రాతిపదిక గల మిర్రమ ఆర్థిక విధానం, జమిందారీ విధానం రద్దు, భూమిపై పరిమితులు, దున్నేవానికి భూమి. వ్యవసాయ కార్మికులు ఆధునిక రంగంలో కార్మిక వర్గంలో ప్రయోజనాలు, భారీ పరిభమల నియంత్రణ, కీలక పరిశ్రమల జాతీయకరణ, (గ్రామీణ రంగంలో సేవా సహకార సంఘములు, వ్యక్తిగత ఆదాయంపై పరిమితులు లాంటివన్నీ నినాదాలుగానే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పార్టీకి నామమాత్రమైనవే. పార్టీ దాని సభ్యుల కేంద్రీకరణ మతతత్వంపైనే. పార్టీ నినాదాలు, దైనందిక ఆందోళనాంశాలు మతతత్వ రంగుటద్దాల నుండి చూడబడేవి. సైద్దాంతిక వడబోతకు గురయ్యేవి. పార్టీ మతేతరమైనదని, సెక్యులర్ పార్టీ అని ప్రకటించుకున్నది. ముస్లింలను కూడా సభ్యులుగా అనుమతించింది. పార్టీ లక్ష్యం హిందూ రాష్ట్ర స్థాపన కాదని భారతీయ రాష్ట్ర స్థాపన అని ప్రకటించింది. కానీ భారతీయ రాష్ట్ర సూత్రీకరణ స్వతంత్రం తర్వాత భారతదేశం 28
హిందూ రాష్ట్ర సూత్రీకరణ ఒక్కటే. ముస్లింలను పార్టీలోకి అనుమతించడాన్ని కూదొ పార్టీనాయకులు కార్యకర్తలు ఒక లాంఛనంగా సాంకేతిక పరమైన అంశంగౌః రాజకీయయుక్తిగా పరిగణించారు. జనసంఘ్ కార్యకర్తలు దిగువ స్థాయిలోనూ, నాయకులు బహిరంగ ఉపన్యాసాల ద్వారా, పత్రికల ద్వారా ముస్లింలపై అపనమ్మకాన్ని ద్వేషాన్ని. ఒక పథకం ్రకారం ప్రచారం చేశారు.
సెక్యులర్ పార్టీలు ముస్లిముల్ని సంతృప్తి పరిచేవిధంగా పనిచేస్తున్నాయని వారి ప్రయోజనాలకనుగుణంగా దళారీలుగా పనిచేస్తున్నాయని జనసంఘ్ విమర్శించేది. ముస్లిములను సమాధానపరిచే అత్మహత్యాసదృశమైన విధానాల్ని అనుసరిస్తున్నవని నెహౌని శ్యాంప్రసాద్ ముఖర్జీ పలుమార్లు విమర్శించాడు. జనసంఘ్ హిందూయేతరులకు భారతీయ సంస్కృతిని అలవర్చడం ద్వారా వారిని జూతీయీకరణ చేసి జాతీయెక్యత సాధిస్తామని ప్రకటించింది.
జనసంఘ్ పాకిస్తాన్ వ్యతిరేకి. జనసంఘ్ తీర్మానాలలో ఒకదానిననుసరించి భారతదేశంలో ముస్లిం ఆధిపత్యం సాధించే అంతిమలక్ష్యంతో పాకిస్తాన్ భారతీయ ముస్తించి విశ్వాసాన్ని పొందడం లక్ష్యంగా పెట్టుకున్నది. తొలి సంవత్సరాలలో జనసంక్షు అఖండభారత్ లక్ష్యంతో భారత్ పాకిస్తాన్లను కలపాలని వాదించింది. పాకిస్తొన్ని సమాధానపరచే విధానాన్ని అనుసరిస్తున్నదని జనసంఘ్ (ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శించేది. తర్వాత అఖండ భారత్ నినాదాన్ని వదలిపెట్టింది. జనసంఘ్ 1977 లో జనతాపార్టీలో విలీనమై “అటల్ బీహారీ వాజ్పాయ్ విదేశాంగ మంత్రి అయిన తర్వాళీ పాకిస్తాన్ పట్ల శత్రుత్వం విషయంలో కూడా కొంత మౌనం పాటించింది. ముస్లింలను పాకిస్తాన్ ఏజెంట్లుగా పరిగణిస్తూ గతంలో లాగా వారిపట్ల శత్రుత్వాన్ని కొనసాగించింది.
జనసంఘ్ భారతీయ సంస్కృతి వ్యాప్తిని గురించి భారతీయ జాతీయత స్థాపన గురించి నొక్కి చెప్పింది. ఈ రెండు పదాలను గురించి పాశ్చాత్యేతర సాంప్రదాయ విలువల ప్రాతిపదిక కలవిగా అస్పష్టంగా చెప్పడం తప్ప వాటిని ఎప్పుడూ స్పష్టంగొ నిర్వచించలేదు. వాస్తవంగా “భారతీయ” అనేది “హిందూకి బదులుగా వాడబడిన అలంకార (ప్రాయమైన పదం. మతపరమైన చిహ్నాన్ని నివారించడానికి జనసంఘ్ చేసిన ప్రయత్నం. మతతత్వవాదం పెరగడంతో హిందూ సంస్కృతి, హిందూ భారతీయత పదాలను జనసంఘ్ (ప్రచురణలు బాహాటంగా వాడడం ప్రారంభించాయి. కొనసాగిస్తున్నాయి. వాస్తవంగా హిందూ జాతీయత అనే పదం తప్పుడు ప్రయోగం, హిందూమతతత్వ వాదానికి పర్యాయపదం. 282 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జనసంఘ్ భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని నిరాకరిస్తూ “ఒకదేశం, ఒక సంస్కృత్తి, ఒక జాతి” నినాదాన్ని ఇచ్చింది. ఒక సంస్కృతిని ఆమోదించని వారంతా జాతివ్యతిరేక లక్షణాలను స్వీకరిస్తున్నారని ఉద్దాటించింది. భారతీయ ఆధ్యాత్మిక భౌతిక విలువలను ప్రస్తావించడంలో కూడా బలమైన పునరుద్దరణ వాదధోరణిని వ్యక్తం చేస్తుంది. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించాలన్నది గాని, అది అభివృద్ధి చెందిన క్రమాన్ని విస్మరించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేస్తుందని కాంగ్రెస్‌ని విమర్శించింది. దానికి బదులుగా మన స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా స్వయం సమృద్ధిని స్వయం ఉత్పత్తి ఆర్థిక విధానాన్ని అభివృద్ధి పరచడం లక్ష్యంగా పనిచేస్తానని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ విదేశీ ఆలోచనల ప్రాతిపదికన భారతీయ రాజకీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తున్నదని విమర్శిస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల సెక్యులరిజం పట్ల నిగూఢమైన వ్యతిరేకత్రని పలుమార్లు వ్యక్తం చేసింది. కానీ క్రమంగా జనసంఘ్ అలాంటి పునరుద్ధరణవాద సూత్రీకరణల్ని, భారతీయ విలువల్ని గురించి చేసే వాదునల్ని మానుకొన్నది. వాటిస్టానంతో బాహాటంగా మతతత్వ, హిందూత్సాన్ని చేపట్టింది.
జనసంఘ్ సంస్కృతీకరింపబడిన హిందీకి అనుకూలంగాను, భారతదేశ అధికార అనుసంధాన భాషగా ఇంగ్లీషు కొనసాగింపుకి వ్యతిరేకంగాను తీవ్రమైన వైఖరి చేపట్టింది. తర్వాత హిందీయేతర ప్రాంతాలకు విస్తరణ అవసరాన్ని గమనంలో పెట్టుకుని, హిందీయేతర రాష్ట్రాలు కోరినంతకాలం హిందీతోపాటు ఇంగ్లీషు కొనసాగించాలన్న 1965 నిర్ణయాన్ని ఆమోదించింది. యు.పిలోనూ, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను ఉర్చూ అభివృద్ధిని వ్యతిరేకించింది. జనసంఘ్ హిందూ కోడ్ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లు పాసయిన తర్వాత చట్టాన్ని రద్దు చేయిస్తానని వాగ్దానం చేసింది.
జనసంఘ్ ఆసక్తికరంగా మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకించింది. గోవధపై చట్టబద్ధమైన నిషేధం తప్ప మరి ఏ ఇతర మతపరమైన అంశాన్ని చేపట్టలేదు. 1980లలో వచ్చిన ఈ మార్పుకు గల కారణాలను స్వతంత్ర భారతదేశంలో మతతత్వ వాదం (అధ్యాయం 83) లో చర్చిద్దాం.
తర్వాతి సంవత్సరాలలో జనసంఘ్ బిజెపి కార్యక్రమాలలో విధానాలలో సామౌజిక మతపరమైన పునాదిలో గణనీయమైన మార్పులు సంభవించాయి. మతతత్వ సిద్ధాంతం యొక్క కేంద్రీకరణ అలాగే ఉండిపోయింది. ఏ సిద్ధాంతంతో ప్రజలలో పని చేస్తున్నారో ఆ సిద్దాంతం నుండి ఏ పార్టీని గానీ నాయకత్వాన్ని గాని విడదీసి చూడలేం ఈదశ అంతటా స్వతంత్రం తర్వాత భారతదేశం 288
భారత రాజకీయలలో జనసంఘ్ స్థానం చాలా పరిమితంగానే ఉన్నది. 1952లో ౨06 శాతం ఓట్లు తెచ్చుకుని లోక్‌సభలో ౩ సీట్లు గెలిచింది (జనసంఘ్, హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్ కూటమికి 6.4 శాతం ఓట్లతో 10 సీట్లు దక్కాయి. ఆ విధంగొ మూడు మతతత్వ పార్టీల కూటమి సమిష్టిగా సాధించింది నామ మాత్రమే). 1957లో జనసంఘ్ 5.97 శాతం ఓట్లతో 4 సీట్లు గెలిచింది. హిాందూమహాసభ రామరాజ్య పరిషక్ స్థావరాలను జనసంఘ్ ఒక మేరకు కైవసం చేసుకుని స్వల్పంగా ఎదిగింది. మూడు పార్టీలు ఉమ్మడిగా 7.17 శాతం ఓట్లతో 5 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాయి. కాబట్టి ఇది మతతత్వవాదం పెరుగుదలని సూచించటం లేదు. 1962లో జనసంకు 6.44 శాతం ఓట్లతో 14 సీట్లు గెలిచింది. మూడు మతతత్వ పార్టీలు 7.69 శాతం ఓట్లతో 17 సీట్లు సాధించాయి. జనసంఘ్ బి.జె.పిగా మారకముందు 1967లో గతంలో ఎన్నడు లేనంతగా 9.35 శాతం ఓట్లతో ౩5 స్థానాలు గెలిచింది. హిందూ మహాసళ రామరాజ్య పరిషత్ రాజకీయ శక్తులుగా అద్భశ్యమయ్యాయి. కానీ మరలా 1971 జనసంఘ్ 7.4 శాతం ఓట్లతో 22 సీట్లు మాత్రమే గెలిచింది. దక్షిణ భారతదేశంలో ఒకృసీటు కూడా గెలవలేదు. శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పశ్చిమబెంగాల్ లో రాజకీయపరమైన పట్టు పూర్తిగా కోల్పోయింది. దాని రాజకీయ పలుకుబడి ప్రధానంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ (ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, యు.పి, మధ్యప్రదేశ్, బీహార్‌లకు పరిమితమయింది. స్వతంత్రపార్టీ స్వతంత్రపార్టీ మొదటి అఖిల భారత సెక్యులర్ కన్సర్వేటివ్ పార్టీ 1959 ఆగస్టులో స్థాపించబడింది. ఆ పార్టీలో సి.రాజగోపాలాచారి, మినూ మసాని, యన్.జి.రంగొః కె.యం.మున్నీలాంటి ప్రముఖ నాయకులున్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్ వారే. మితవాద (62% ఇస) గ్రూపులు పార్టీలు గతంలో స్థానిక ప్రాంతీయ స్థాయిల్లో ఉన్నాయి. చెళ్లు చెదరుగా ఉన్న మితవాద శక్తుల్ని ఒక పార్టీగా ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు చేసిన మొదటి ప్రయత్నం స్వతంధ్రపార్టీ స్థాపన. అవడిలోనూ, నాగపూర్ తీర్మానం ద్వారాను కాంగ్రెస్ వామపక్షదిశగా మరలడం స్వతంత్ర పార్టీ స్థాపనకు పురిగొల్పింది. కేరివ శతాబ్దపు నైట్ వాచ్మెన్ లేక స్వేద్భావాణిజ్య రాజ్యం భావనకు అనుగుణంగా స్వతంత్ర పార్టీ ఆర్థికాభివృద్ధిలో రాజ్యం యొక్క చురుకైన పాత్రని వ్యతిరేకించింది. స్వేచ్భాయుతమైన ప్రయివేటు వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్నది. అది కేంద్రీకృత ప్రణాళికొ 284 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విధానాన్ని పబ్లిక్ సెక్టార్ పాత్రని, ఆర్థిక విధానంపై రాజ్యం అదుపుని పరిమితం చేయాలన్నది. అది ప్రయివేటు వాణిజ్యం జాతీయీకరణ చేయడాన్ని భూసంస్కరణల విస్తరణని ప్రత్యేకించి భూకమతాలపై గరిష్టపరిమితులు విధించడాన్ని వ్యతిరేకించింది. స్వతంత్ర పార్టీ సెక్యులరిజం పట్ల పూర్తి నిబద్ధతని ప్రకటించింది.
అందువలనే జనసంఘ్‌తో సీట్ల పంపకం ఏర్పాటు చేసుకొన్నప్పటికి దానిలో కలవడం గానీ, లేక మైత్రీబంధం పెంచుకోవడంగానీ సాధ్యపడలేదు. స్వతంత్రపార్టీ కాంగ్రెస్ షార్టీక్రి, సోషలిస్టేతర రాజ్యాంగబద్ధమైన సెక్యులర్ కన్సర్వేటివ్ ప్రత్యామ్నాయానికి అవకాశం కల్పించడం వల్ల చాలామంది సాంప్రదాయ మేథావులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, స్వతంత్ర పార్టీ అవిర్భావాన్ని స్వాగతించారు. కాంగ్రెస్‌పార్టీ కమ్యూనిస్టు సూత్రాలను ఆమోదిస్తున్నదని వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయయత్సిస్తున్నదని స్వతంత్రపార్దీ నాయకులు నిందించారు. నెహ్రూ చైనా తరహా కమ్యూన్లను, సమిష్టి వ్యవసాయాన్ని 'ప్రవేశపెట్ట యత్నిస్తున్నాడని ఆరోపించారు. 'నెహ్రూ కమ్యూనిజానికి రాచబాట వేస్తున్నాడు. నిరంకుశ పాలన ప్రమాదాల నుండి రక్షించడానికి స్వతంత్రపార్టీ అంకితమైఉంది' అన్నాడు రాజగోపాలాచారి.
స్వతంత్రపార్టీ విదేశీ వ్యవహారాలలో అలీన విధానాన్ని సోవియట్ యూనియన్‌తో సన్నిపాత సంబంధాలను వ్యతిరేకించింది. ఆమెరికాతో, పశ్చిమ యూరప్‌తో సంబంధాలను సమర్ధించింది. పాకిస్తాన్‌తో సవా కమ్యూనిస్టేతర దక్షిణాసియా దేశాలతో మొత్తం ఆసియా దేశాలతో అమెరికా ఆధ్వర్యంలో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిందిగా ప్రభుత్వాన్ని అర్ధించింది.
-
ప్రభుత్వ కంట్రోలు, కోటాలు, లైసెన్సులు విధానంతో అసంతృప్తి చెందిన వారు మేనేజింగ్ ఏజన్సీ విధానం జాతీయం చేయబడుతుందని ఆందోళన చెందినవారు, నెహాపై విశ్వాసం కొరవడినవారు.
-
భూములు, అధికారం, స్థాయి, కోల్పోయి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆగ్రహంగా ఉన్న రాజాలు, జాగీర్జారులు, భూస్వాములు.
-
పెట్టుబడిదారీ వ్యవసాయదారులుగా మారిన మాజీ భూస్వాములు దేశంలోని కొన్ని (ప్రాంతాలలోని సంపన్న మధ్యతరగతి రైతులు, భూస్వామ్య విధానం రద్దుని స్వాగతించినప్పటకి గరిష్ట పరిమితి విధించి భూ సంస్కరణలు అమలు జరిపితే
స్వతంత్రం తర్వాత భారతదేశం 285
తమ భూముల్లో కొంతభాగం పోతుందని ఆందోళన చెందినవారు, గ్రామీణ పేదల పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని - ప్రత్యేకించి వ్యవసాయ కూలీల చైతన్యాన్ని గమనించి కలవరపడిన వారు స్వతంత్ర పార్టీపట్ల ఆకర్షితులయ్యారు. అయినప్పటికీ స్వతంత్రపార్టీ సామాజిక పునాదిచాలా పరిమితమైనది. స్వతంత్ర పార్టీలో ర్షిట్రెరైన సివిలు అధికారులు, అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులు చేరారు. అందుకే ఒక చరిత్రకారుడు స్థానిక అసంతృప్తి గ్రూపుల కంపెనీగా వర్ణించాడు. మాజీ భూస్వాములకు, ధనిక రైతులకు ఆర్థికంగా సామాజికంగా తమపై ఆధారపడిన ప్రజలపై కొంత అదుపు ఉంది. ఒక మాజీ రాజాలు, జమిందారులు, సంప్రదాయ ప్యూడల్ విధేయతల్ని ప్రస్తావించి ఓట్లు అర్ధించారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ఒక మాదిరిగా మంచి ఫలితాలే సాధించింది. 6.8 శాతం ఓట్లతో లోక్‌సభలో 18 సీట్లు గెలిచింది. బీహార్, రాజస్టాన్, గుజరాత్, ఒరిస్సా - నాలుగు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షమయింది. 18 సీట్లలో ఒక్క బీవార్లోనే 7 సీట్లు గెలిచింది. ఈ గెలిచిన వారిలో రామ్‌ఘర్ రాజా తల్లి, భార్య, సోదరుడు, వదిన, బిజినెస్ మేనేజరు ఉన్నారు. 1967లో 8.7 శాతం ఓట్లతో లోక్‌సభలో 44 స్థానాలు సాధించింది. ఆ రెండు ఎన్నికలలో కూడా మాజీ రాజాలు, జాగీర్జారులు, పెద్ద భూస్వాములు పార్టీ గెల్సుప్పుకి ప్రధాన కారకులు. కానీ 1967లో సి.రాజగోపాలాచారి మరణానంతరం పార్టీ ముఠా తగాదాలతోనూ, ప్రజల మద్దతు పొందడంతోనూ విఫలమవడం వల్లనూ త్వరత్వరగా క్షీణించింది. 1971లో ౩ శాతం ఓట్లతో లోక్సథభతో ర సీట్లు మాత్రమే గెలిచింది. చాలామంది నాయకులు నిరాశ నిస్పృహలకు గురయి 1974లో భారతీయ లోక్‌దళ్‌లో చేరారు మరికొందరు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన కొద్దిమందికో మ్నూమసానీ నాయకత్వంలో పార్టీ కొనసాగింది. రాజకీయాలలో సమూలమైన మార్చులు జరుగుతున్నందున భారత రాజకీయాలలో కన్సర్వేటివ్ పార్టీకి స్థానం లభించనందున స్వతంత్ర పార్టీ విఫలమయింది. అంతేకాక మితవాద (1816 ౪/18) వర్గప్రయోజనాలు విభిన్నంగా వుంది ఐక్యతకు అనుకూలంగా లేవు. సమిష్టి వ్యవసాయ పధకాన్ని అటకెక్కించడం వలన భూపరిమితి చట్టాల వలన భూములు కోల్పోయే పరిస్థితులు అంతగా లేనందున సంపన్న మధ్యతరగతి రైతులు కాంగ్రెస్ నుండి విడివడి బయటకు రాలేదు. అంతేగాక భూమిశిస్తు తగ్గింపు (గ్రామీణ రుణసదుపాయంతో సహా సేవల విస్తరణ మెరుగుపరచిన రవాణా సౌకర్యాలు, 286 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నీటిపారుదల, విద్యుద్దీకరణ లాంటి ప్రభుత్వం అమలు జరిపిన పలు విధానాలు, చేపట్టిన చర్యల వలన ప్రయోజనాలు పొందింది కూడా ఈ సంపన్న మధ్యతరగతి రైతులే!
వ్యాపార వర్గం-చిన్నపెద్ద బూర్డువాలు కూడా మొత్తంగా అసంతృప్తిగాలేరు. మొత్తంమీద ప్రభుత్వం రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించడాన్ని వీరు అంగీకరించారు. ప్రణాళికలు, పబ్లిక్ సెక్టారు, ప్రభుత్వ నియంత్రణలు ఈవర్గం అభివృద్ధిని అడ్డుకోలేదు. అంతేగాక పలువిధాలుగా అభివృద్ధికి తోడ్పడ్డాయి. మిశ్రమ ఆర్థిక విధానం కూడా వీటి విస్తరణకు తగుఅవకాశం కల్పించింది. ఏమైనప్పటికి ఆస్తిపాస్తులు గల ఈ వర్గం సమీప భవిష్యత్తులో అధికారాన్ని కచ్చితంగా నిలబెట్టుకోగల కాంగ(గ్రెస్‌ని వ్యతిరేకించదలచుకోలేదు. అన్నిటికి మించి నెహ్రూ ప్రభుత్వం సంస్కరణవాద అభివృద్ధికరమైన అజండాని అమలు పరుస్తూనే ఆస్తిపాస్తులు గల వర్గాన్ని సమాధానపరచే వైఖరిని అవలంబించింది. నెహ్రూ (ప్రభుత్వ చర్యలు పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్థకు సవాలుగా పరిణమించలేదు. నెహ్రూ పెట్టుబడిదారీ వర్గాన్ని - పెట్టుబడిదారీ వ్యవసాయదారుల్ని సంపన్న రైతుల్ని అతిగా వారిని నిస్స్పహాయుల్ని చేసేంతగా వ్యతిరేకించలేదు. రాజులను భూస్వాముల్ని తుడిచిపెట్టలేదు. భరణాలు, ఇతర రాయితీలు ఇచ్చి ఓదార్చారు. ఫలితంగా వారి వ్యతిరేకత అంతర్గతంగా ఉందికానీ రాజకీయ చర్చల రూపంలో వ్యక్తం కాలేదు. అంతేగాక ఈ వర్గం తీసికొని వచ్చిన ఒత్తిడికి నెహ్రూ స్పందించాడు. ఒత్తిడికి స్పందించి ఆహార ధాన్యాలలో ప్రభుత్వ వాణిజ్యాన్ని, సహకార వ్యవసాయాన్ని చేపట్టలేదు. అదే సమయంలో భూపరిమితి చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు సరళంగా సంపన్న రైతుల్ని అంతగా ఇబ్బంది పెట్టని విధంగా రూపొందించాయి.
చివరిగా నెహ్రూ బతికున్నంత కాలం ఆయన స్థానం అజేయమని కాంగ్రెస్‌లోని మితవాద భావాలు గలవారు (00081655 గక్రై[ళ గుర్తించారు. కాబట్టి నెహ్రా అనే వటవ్చక్షాన్ని వదలి వెళ్ళదలచుకోలేదు. 1969 లో కాంగ్రెస్ చీలినప్పుడు కాంగ్రెస్ (ఒ) రాజకీయశక్తిగా ఆవిర్భవించింది. కాంగ్రెస్ (ఓ) ప్రబలమైన మితవాద (15%1- 798) పార్టీ గనుక ప్రత్యేకమైన మితవాద (180 7108) పార్టీగా స్వతంత్ర పార్టీ ఉనికి అవసరమయింది, మతతత్వ, ప్రాంతీయ పార్టీలు
1947 - 1964 కాలంలో చాలా మతతత్వ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మతతత్వ పార్టీలలో హిందూ మహాసభ పాతపార్టీ, 1952లో కేవలం 4 సీట్లు స్వతంత్రం తర్వాత భారతదేశం 287
గెలిచిన తర్వాత తన మద్దతుకు గల పునాదిని జనసంఘ్ కైవశం చేసుకోవడంతో పార్టీ అదృశ్యమయింది. రామ రాజ్య పరిషత్ పరిస్థితి కూడా దాదాపు అదే. పాకిస్తాన్ కొరకు డిమాలడ్ చేయడం వల్ల ముస్లిం లీగు నామమాత్రంగా మిగిలింది. నిరుత్సావానికి గురయిన చాలామంది నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్‌లోను, ఇతర పార్టీలోనూ చేరారు. కానీ తమిళనాడు, కేరళ లోని కొన్ని ప్రాంతాలలో పునరుద్ధరింపబడింది. మొదట కాంగ్రెస్ ఆ తర్వాత సి.పి.ఐ., సి.పి.ఎం. దానిని మిత్రపక్షంగా చేసుకొని ఆ పార్టీకి ఒక గౌరవస్థితి కల్పించాయి. అకాలీదళ్ పంజాబ్‌కి మాత్రమే పరిమితమైన పెద్ద మతపరమైన పార్టీ దీనిని 24వ అధ్యాయంలో చర్చిద్దాం. ఈ కాలంలో చాలా ప్రాంతీయ పార్టీలు రంగం మీదకి వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి తమిళనాదులోని ద్రవిడమున్నేట్రకజగం, జమ్ముకాళ్ళీర్కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్. వీటిని గురించి 22 అధ్యాయంలో చర్చిద్దాం. బీహారులోని జార్ధండ్ పార్టీని గురించి ఇంతకుముందే 9వ అధ్యాయంలో చర్చించాం. ఇక ఇతర పెద్ద ప్రాంతీయ పార్టీలు ఒరిస్సాలోని గణతంత్ర పరిషత్, అస్సాంలోని “ఆల్ పార్టీస్ హిల్ లీడర్స్ కాన్‌నరెన్స్, మహారాష్ట్రలోని "షెడ్యూల్డు కాస్ట్ ఫెడరేషన్. ఇవికాక ఒక రాష్ట్రానికి పరిమితమైన చిన్న వామపక్ష పార్టీలు ఉన్నాయి. అవి రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (కేరళ, పశ్చిమబెంగాల్) ఫార్వర్డ్ బ్లాక్ (పశ్చిమ బెంగాల్), పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (మహారాష్ట్ర. చాలా ప్రాంతీయ, వామపక్ష మతపరమైన (గ్రూపులు, పార్టీలు ఆయా ప్రత్యేక రాష్ట్రాలలో ప్రాంతాలలో గణనీయమైన పాత్ర నిర్వహించినప్పటికి వాటిని గురించి చర్చించడం సాధ్యపడదు. 288 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
16 (! శాస్తి నుండి ఇందిరాగాంధీ వరకు 1964-1969
1964 మేలో నెహ్రూ మరణం భారతరాజకీయ వ్యవస్థ యొక్క పటిష్టత పరీక్షకు ఒక అవకాశం కల్పించింది. భారత రాజకీయ వ్యవస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని వారసత్వ సమస్యపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయభేదాలు, ముఠా కుమ్ములాటలతో కుప్పకూలుతుందని దేశంలోను, విదేశాల్లోను పలువురు జోస్యాలు చెప్పారు. కాని ఉత్తరాధికార స్వీకారం పరిణితితో హుందాగా సరళంగా జరిగింది. భారత ప్రజాస్వామ్య పటిష్టతని వ్యక్తం చేసింది. బహుశా భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో నెహ్రూ తన వారసుని పేరు ప్రకటించేందుకు తిరస్కరించి ఉండవచ్చు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి, అంటే ప్రధాన మంత్రి పదవికి ఇరువురు - మొరార్దీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్తి పోటీపడ్డారు. దేశాయ్ సీనియర్, చాలా అనుభవజ్ఞుడు. పరిపాలనాదక్షుడు, నిజాయితీపరుడు, కఠినమైన దృఢమైన బెఖరి గలవాదు. కాని అహంకారియని, అసహనశీలియని, మితవాదభావాలు గలవాడని అపఖ్యాతి వుంది. పార్టీలోని అత్యధికుల అభిమానం చూరగొన్నవాడు కాదు. శాస్త్రి సాధు స్వభావంగల వాడు, నేర్పరి, నిజాయితీపరుడు.
నాయకత్వ ఎన్నిక, సిండికేట్ అని పిలువబడే కాంగ్రెస్ నాయకుల (గ్రూపు నిర్వహణలో జరిగింది. కాంఛెస్ ఢొసిడెంట్ కె.కామరాజ్, బెంగాల్‌కు చెందిన అతుల్యఘోష్ బొంబాయికి చెందిన ఎస్.కె.పాటిల్స్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యన్. సంజీవరెడ్డి, మైసూరు(కర్ణాటక)కు చెందిన యస్.నిజలింగప్పలతో 1963లో సిండికేట్ ఏర్పడింది. ఈ గగ్రూపుకి దేశాయ్ ఏ మాత్రం ఆమోదయోగ్యుడు కాదు. వారు శాస్తి అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఇతర అర్హతలతో పాటు పార్టీలో ఎక్కువ మంది స్వతంత్రం తర్వాత భారతదేశం 289
ఆమోదం శాస్త్రికి అనుకూలంగా ఉంది. శాస్ర్తి తమ ఆకాంక్షలకు అనుకూలంగా వ్యవహరిస్తాడని, పార్టీలో తమ నాయకత్వాన్ని సవాల్ చేయడని ఆశించారు. పోటీ పార్టీలోని ముఠాతత్వాన్ని సెంచుతుంది గనుక పార్టీలోని ఇతర నాయకుల లాగానే సిండికేట్ గ్రూపు నాయకులు కూడా పోటీని నివారించాలని పట్టుదలగా ఉన్నారు. కామరాజ్ పార్లమెంటు సభ్యులతో సంప్రదించి శాస్రికి ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారని ప్రకటించాడు. దేశాయ్ అంగీకరించాడు. హుందాగా పోటీ నుండి విరమించుకున్నాడు. పోటీ జరగకుండా పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన శాస్త్రి 1964 జూన్ 2న అంటే నెహ్రూ మరణాంతరం వారం రోజులలో పుగానే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. శాస్త్రి పాలనా సంవత్సరాలు తన రాజకీయ అధికారం యొక్క పరిమిత స్వభావాన్ని అంగీకరించిన శాస్త్రీ నెహ్రూ కూతురైన ఇందిరాగాంధీని సమాచార ప్రసార శాఖ మంత్రిగా చేరమని కోరడం మినవో కేంద్ర మంత్రివర్గంలో పెద్ద మార్పులు చేపట్టలేదు. ఆయన ఆధ్వర్యంలో మంత్రులు ఎక్కువ స్వయం ్రతిపత్తితో పనిచేశారు. పార్టీ వ్యవహారాలలోగాని లేక రాష్ట్ర ప్రభుత్వాల పని విధానంలోగాని ఆయన జోక్యం చేసుకోలేదు. మొత్తమ్మీద పరిపాలన చివరి కాలంలో తప్ప ఆయన దక్షత ప్రస్ఫుటంగా వ్యక్తం కాలేదు. అప్పుడు దేశం చాలా క్లిష్ట సమస్యలనెదుర్శొన్నప్పటికీ శాస్త్రి ప్రభుత్వం వాటిని నిర్ణయాత్మక వైఖరితో చేపట్టలేదు. వాలునపడిపోయే పద్దతిని అనుసరించింది. 1965 (ప్రారంభంలో అధికార భాషగా హిందీ వుండాలా లేక ఇంగ్రీషా అనే సమస్య రగుల్కొంది. కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించడంలో విఫలమయింది. పరిస్థితి కీణించడానికి అవకాశం కల్పించింది.కాని నమన్య ఎట్టకేలకు 1966లో వరిష్మరించబడింది. పంజాబీసు(రాష్ట్రం) కొరకు, మహారాష్ట్రతో గోవా విలీనం- సమస్యలు కూడా చాలా కాలం కొనసాగాయి. పారిడ్రామ, [ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ స్తంభిన్యూ వచ్చింది. అదే సమయం ల 0 ంది. చెల్లింపుల సమతుల్యతా సమస్య డ్లణించింది. 1965లో వ్రమైన ఆహార సమస్య వచ్చిపడింది. వ్యవసాయ ఉత్పత్తి క్షీణించింది. చాలా రాష్ట్రాలలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహార నిల్వలు దాదాపు వట్టిపోయాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు దీర్హకాలిక చర్యలు అవసరమయ్యాయి. కాని 290 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆహార ధాన్యాలు మిగులున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించ నిరాకరించడంతో అలాంటి చర్యలు చేపట్టబడలేదు. భారత పాకిస్తాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆహారధాన్యాల సరఫరా నిలిపివేసిన తరువాత ప్రభుత్వం శాసనబద్ధ రేషనింగు 'పవేశపెట్టక తప్పలేదు. కాని ఇది ఏడు పెద్ద నగరాలకే పరిమితమయింది (ప్రభుత్వం వ5ి65లో (ప్రభుత్వ ఆహార సంస్థని నెలకొల్పింది. కాని గణనీయంగా ఆహారధాన్యాల్ని సెకరించలేకపోయింది. కాని వ్యవసాయోత్పత్తిని పెంచి ఆహార రంగంలో స్వయం సమ్మద్ధి సాధించేందుకు హరిత విప్లవం ప్రారంభించడం ఒక సానుకూలమైన పరిణామం. ఇది ఆ తరువాత ఇందిరాగాంధీ పాలనాకాలంలో పట్టుదలగా కొనసాగించబడింది.
శాస్తి నిర్ణయాలు తీసుకోలేని బందీ అని, ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేయడంలోను, తన మంత్రివర్గ సహచరులకు నాయకత్వం వహించడంలోను, అదుపు చేయడంలోను విఫలమయ్యారని పార్టీలోని, పార్టీ వెలుపల విమర్శకులు ఆరోపించారు. విమర్శలకు కలత చెందిన శాస్తి 1965 జనవరిలో ప్రధానమంత్రి పదవి నిర్వహించే శక్తి సామర్థ్యాలు తనకు వున్నాయా అనే సందేహాన్ని బాహాటంగా వ్యక్తం చేశాడు.
కాల గమనంలో శాప్రి తన స్వతంత్రతని వ్యక్తీకరించడం ప్రారంభించాడు. ముఖ్యమైన నిర్ణయాలు చేయడంలో శాస్ర్తి తనను ప్రక్కనబెడుతున్నాదని కామరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబులు కురిపించడాన్ని మొదట విమర్శించిన వాటిలో భారత ప్రభుత్వం ఒకటి. శాస్త్రి తన స్వంత ప్రధానమంత్రి సచివాలయాన్ని ప్రారంభించాడు. విధానపరమైన అంశాలలో మంత్రుల శాఖలతో సంబంధం లేకుండా సమాచారం సలహాలు ఇచ్చేవనరుగా ఉపయోగించుకుంటూ తన ప్రిన్సిపల్ ప్రైవేటు సెక్రటరీ యల్.కె.రూని సచివాలయానికి ప్రధాన బాధ్యునిగా నియమించాడు. ప్రభుత్వ విధానాలు రూపొందించడంలోను అమలు జరపడంలో ప్రధానమంత్రి కార్యాలయంగా గుర్తింపు పొందిన సచివాలయం ఎక్కువ అధికారం చెలాయించడం ప్రారంభించింది. తరువాత ఇందిరాగాంధీ హయాంలో అది స్వతంత్రంగా శాసనాలు అమలు జరిపే సంస్థగా ఆవిర్భవించింది. ఏమైనాప్పటికి 1965 ఆగస్టు-సెప్టెంబరులో జరిగిన భారత-పాకిస్తాన్ యుద్ధంతో శాస్త్రి తన (ప్రతిభని ప్రదర్శించే అవకాశం వచ్చింది.
కాశ్మీరు సమస్యని తిరగదోదాలని పాకిస్తాన్, కాళ్మీరు భారత దేశంలో భాగమనేది పరిష్కరింపబడిన వాస్తవమని భారతదేశం- రెండు విభిన్నమైన వైఖరులతో కాళ్ళీరు సమస్య సంవత్సరాల తరబడి తుకతుక ఉడుకుతుంది. 1965లో షేక్ అబ్బుల్లా స్వతంత్రం తర్వాత భారతదేశం లం]
అనుచరులు, ఇతర అసంతృప్తి నాయకులు కాళ్ళ్మీర్ లోయలో చాలా అశాంతి సృష్టించాడు. పాకిస్తాన్ నాయకత్వం జోక్యానికి పరిస్థితి అనుకూలంగా ఉందని ప్రత్యేకించి అమో అధునాతన ఆయుధాలు తాము పొందియున్నందున ఆయుధాలలో తమది పై న అవుతుందని భావించింది. 1962 పరాజయం తరువాత రక్షణ రంగాన్ని మరు పరచుకొనే ప్రయత్నాలు ఇంకా అసమగ్రంగా వున్నందున, పాకిస్తాన్ భారతదేశాన్ని సైనికపరంగా ఎదుర్కోవాలని కోరుకొన్నది. డ్రస్ రిహార్స్ల్, లోతైన పరిశీలన మొదలయింది. అరేబియా సముద్రం గుజరాత్ సరిహద్దుగాగల రాన్ఆఫ్కచ్ అనే చిత్తడి ప్రాంతంలో వివాదాస్పదమైన ఎల్లలేర్పచేని భాగాన్ని ఆక్రమిస్తే భారతదేశ స్పందన ఎలా వుంటుందో 1965 ఏప్రిల్‌లో పర్తి పాకిస్తాన్. సైనిక ఘర్షణ జరిగింది. కాని ఆ ప్రాంతం స్వభావరీత్యా భారత స్పం బలహీనంగాను, సందిగ్ధంగాను ఉంది. బ్రిటన్ జోక్యంతో ఇరుపక్షాలు వివొ దాసి అంతర్జాతీయ తీర్చుకి నివేదించేందుకు అంగీకరించాయి. దురదృష్టవశాత్తు రాన్ఆవి ఘర్షణ పాకిస్తాన్ పాలకులకు తప్పుడు సంకేతాలు పంపింది. భారతదేశ ప్రభుత్వం: సైనికదళాలు యుద్దానికి సిద్ధంగా లేవనే నిర్ణయానికి వచ్చారు పాకిస్తాన్ పాలకుగ భారతదేశం యుద్ధం చేస్తే అది తాను ఎంపిక చేసుకొన్న సమయంలోను, స్థలం నని జరుగుతుందని శాస్త్రి ఆర్మీభీప్, జనరల్ జె.యన్. చౌదరితో సంప్రదించి చేసిన ప్రకట పాకిస్తాన్ పాలకులు పట్టించుకోలేదు. ఆగస్టులో పాకిస్తాన్ ప్రభుత్వం కాళ్ళీరు లోయలో పాకిస్తాన్‌కి అనుకూలంగౌ తిరుగుబాటును పురికొల్చేందుకు, ఆవిధంగా మిలటరీ జోక్యానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు సుశిక్షితులైన చొరబాటుదారుల్ని పంపించింది. పాకిస్తాన్ ప్రభుళ్వే 'పోత్సాహంతో జరిగిన చొరబాటు తీవ్రతని గమనంలోకి తీసుకొని విభజన రేఖదొటి కార్గిల్, యూరి, హాజీపీర్ లాంటి కీలకమైన స్థావరాల్ని ఆక్రమించేందుకు వస్తున్నదారుల్ని మూసివేయవలసిందిగా శాస్త్రి సైన్యాన్ని ఆదేశించాడు. 1962 లోవలె గాక ఈసారి దేశం మొత్తం ప్రభుత్వం వెనుక సమీకృతమయింది. పాకిస్తాన్ సెప్టెంబరు 1న భారతదేశానికి కాళ్ళీరుతోగల ఒకే ఒక రోడ్డు మార్గొన్ని అడ్డుకుంటూ జమ్మూకాళ్ళీరుకి నైరుతిలో గల చాంబ్రంగంలో పెద్దఎత్తున టాంకులతో: కాల్చ్బలంతో దాడిచేసింది. శాట్రీ వెంటనే కాళ్ళీరుని రక్షించడానికే పరిమితంగొక పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్‌కోట దిశగా పురోగమించవలసిందిగా భారత సైన్యాలకు ఆదేశాలు జారీ చేశాడు. ఆవిధంగా రెండు దేశాలు, అప్రకటితమైనదైనప్పటికి యుద్ధంలోకి 292 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దిగాయి. అమెరికా, (భిటన్లు వెంటనే రెండు దేశాలకు ఆయుధాలు, ఆహారం ఇతర సరఫరాలను ఆపివేశాయి. చైనా భారత దేశాన్ని దురాక్రమణదారుగా ప్రకటించి బెదిరింపు ధ్వనులు చేసింది. కాని భారతదేశం పట్ల సానుభూతిగల సోవియట్ యూనియన్ వైనాని పాకిస్తాన్‌కి సహాయపడకుండా నిరుత్సాహపరిచింది.
ఐక్కరాజ్య సమితి భద్రతామండలి ఒత్తిడితో ఇరుదేశాలు యుద్ధ విరమణకు అంగీకరించాయి. యుద్ధ విరమణ సెప్టెంబరు 28న అమలులోకి వచ్చింది. ఇరుపక్షాలు గూడా తాము గణనీయమైన విజయాలు సాధించామని శత్రుషక్షానికి భారీ నవ్వాన్ని కలిగించామని విశ్వసించాయి. ఒకే ఒక ఫలితం చొరబాటు ద్వారా కాశ్మీరు ఆక్రమణ అద్దుకొనబడింది. అదే సమయంలో మూడు వారాలుగా జరిగిన యుద్ధం ప్రాణనష్టం, విలువైన మిలటరీ పరికరాలు విధ్వంసంతో పాటు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు అషార నష్టం కలిగించింది. ఆర్థికాభివృద్ధికి తక్షణావసరాలైన వనరులు వృథా అయ్యాయి. ఇరుదేశాల రక్షణ పద్దులు విపరీతంగా పెరిగాయి.
భారత ప్రజలు 1962 చైనా యుద్ధంలో కోల్పోయిన ప్రతిష్ట ఆత్మవిశ్వాసం తిరిగి పొందినట్లుగా భావించారు. భారత సైనిక దళాలు సాధించిన విజయాలను శ్లాఘించారు. యుద్దం వలన భారతదేశం యొక్క రాజకీయ పటిష్టత, ఐక్యత, ప్రదర్శితమయ్యాయి. చొరబాటుదారులు కాశ్మీరీ ప్రజల మద్దతు పొందడంలో విఫలమయ్యారు: భారతదేశ సైన్యం 1947-48 నుండి జరిగిన మొదటి పెద్ద పరీక్షలో కృతార్ధత సాధించింది. యుద్ధకాలంలో మతపరమైన సమస్య తలెత్తలేదు. భారతదేశ ముస్లింలు మనస్ఫూర్తిగా యుద్ధ ప్రయత్నానికి మద్దతిచ్చారు. సాయుధ దళాలలోని ముస్లింలు తమ హిందూ, సిక్కు క్రైస్తవ మిత్రులతో భుజం, భుజం కలిపి సాహసోపేతంగా పోరాడి పాకిస్తాన్‌కి ఆశాభంగం కలిగించారు. యుద్ధ ఫలితంగా శాప్రి ప్రతిష్ట పెరిగింది. నియంటత్రించే రాజకీయ శక్తి అయ్యాడు.
యుద్ధ విరమణ ఒప్పందం తరువాత సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో జనరల్ యాహ్యాభాన్, భారత ప్రధాని శాస్తి సోవియట్ యూనియన్‌లోని తొప్కెంటులో 1966 జనవరి 4న తాష్మెంటు ప్రకటనపై సంతకాలు చేశారు. ఈ ప్రకటననుసరించి ఇరుపక్షాలు ఆక్రమిత ప్రాంతాల నుండి వైదొలగి యుద్ధానికి ముందు అగస్టులో గల వారి స్టావరాలకు తిరిగి వెళ్లేందుకు అంగీకరించాయి. భారతదేశం విషయంలో ఇలా చేయడమంటే పాకిస్తాన్ చొరబాటుదారులు తిరిగి కాశ్మీరు లోయలో ప్రవేశించగల వ్యూవాత్మకమైన హాజీపీర్ కనుమ నుండి వెనక్కి తగ్గటం, కాళ్ళీరులో సాధించిన వ్యూహాత్మక స్వతంత్రం తర్వాత భారతదేశం 298
లాభాలను వదులుకోవడం అవుతుంది. ప్రత్యామ్నాయం ఇరుదేశాలకు వినాశకర యుద్దం గనుక శాస్తి ఈ అననుకూలమైన షరతుల్ని ఆమోదించాడు. అమోదిం న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాళ్ళీరు సమస్యపై సోవియట్ యూ భారీ మద్దతును, రక్షణ సరఫరాలను ప్రత్యేకించి మిగ్ విమానాలను, మధ్యతరహా, తరహా టాంకులను కోల్పోవలసి వస్తుంది. లే తాప్కెంటు సమావేశం విషాదకరమైన ఫలితాన్నిచ్చింది. కేవలం 19 ప్రధానమంత్రిగా సేవలందించిన శాస్త్రి హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో జ 10న తాష్కెంటులో మరణించాడు. శాస్తి మరణం మరలా వారసత్వ సమస్యని ముందుకు తెచ్చింది. రెండు సంవత్సరాలలో రెండవసారి వచ్చిన ఈ సమస్య కూడా భారతదేశ రాజకీయ వ్యపా యొక్క త్వరగా కోలుకొనేశక్తిని ధృవపరుస్తూ సానుకూలంగా పరిష్కరింపబడింది. మొరార్జీ దేశాయ్ మరొకసారి రంగం మీదికి వచ్చాడు. దేశాయ్ పట్ల కామరాణే - సిండికేట్ అయిష్టత అలాగే కొనసాగుతుంది. తమనీడలో మెలుగుతూ దేశౌ బ్బ ఓడించగల అభ్యర్థి కొరకు పరిశీలన జరిపారు. ఇందిరాగాంధీని ఎంపిక చేలా ఆమె నెహ్రూ కుమార్తె అఖిల భారత స్థాయి ఆకర్షణ గల వ్యక్తి. ఏ ఒక్క ర ం ప్రాంతం, కులం, మతంతో మమేకమైన వ్యక్తి కాదు. ఇందిరాగాంధీ అంతగా అనుభ గా లేని వ్యక్తి. అమెకు పార్టీలో బలమైన స్థానం లేదు. కాబట్టి ఆమెను తమకి అనుకూల మలుచుకోవచ్చని సిండికేట్ భావించింది. కామరాజ్ ఆమె ఎన్నికకు దర్శకత్వం చెశౌ లో వారి వారి రాష్ట్రాల పరిపాలనలో ఎక్కువ అధికారం పొందవచ్చునని రానున్న ఎన్నికల ని ఆమె జనాకర్షణ శక్తి నెహ్రూ పేరు ఉపయోగించుకొని ఓటర్లను ఆకట్టుకోవచ్చు ఆశించిన 14 రాష్ట్రల ముఖ్యమంటత్రులలోని 12 మంది ఇందిరాగాంధీకి అండగొ నిలిచారు. ఎన్నిక దాదాపు నిర్ణయమైపోయింది. దేశాయ్ ఎన్నిక కొరకు పట్టుబట్టడంతో ఈసారి అభిప్రాయ సేకరణ క్రమం జరగలేదు. తన సీనియారిటీ, పార్టీలో తనకు గల స్థాయి రీత్యా ప్రత్యేకించి ప్రత్యర్థి ఆయన మాటల్లో చెప్పాలంటే 'ఈ చిన్న పిల్ల కావటం వలన గెలుపు తథ్యమని నమ్మకంలో ఉన్నాడు. 1866 జనవరి 19న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో రహస్య ఓటింగ్ విధానం నిర్వహించబడింది. ఇందిరాగాంధీ 855-169 ఓట్లతో దేశాయని ఓడించింది. మహిళలు చురుకుగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వేలాది మంది జైళ్లకు పోయారు. చాలా 294 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మంది కాంగ్రెస్‌లో ఉన్నత పదవులు చేపట్టారు. ఇందిరాగాంధీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. కాబట్టి ఆమె మహిళగా ఎలాంటి ప్రతిబంధకం ఎదుక్కానలేదు. స్వతంత్రానంతరం కూడా భారతదేశంలోని అత్యంత పెద్ద రాష్ట్రమైన యుపిలో ముఖ్యమంత్రితో సహా మహిళలు గవర్నర్లుగా, కేంద్రంలోను, రాష్ర్రాలలోను మంత్రులుగా ఉన్నత పదవులు చేపట్టారు. ఇందిరాగాంధీ : తొలి సంవత్వరాలు
ఇందిరాగాంధీ ప్రభుత్వం దీర్దకాలికంగా 'పేరుకుపోయినవైనప్పటికీ తక్షణం దృష్టి సారించి పరిష్మరించవలసిన చాలా క్లిష్ట సమస్యల్ని ఎదుర్శొన్నది. పంజాబు సమన్య తుకతుక ఉడుకుతుంది. నాగ, మిజో ప్రాంతాలలో తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. ఇందిరాగాంధీ ఈ సమస్యల పట్ల సమర్ధవంతంగా వ్యవహరించింది. పంజాబీసుబ డిమాండును ఆమోదించింది. (అధ్యాయం 24 చూడండి) నాగ, మిజో తిరుగుబాటుదారులతో దృఢంగా వ్యవహరించింది. వారితో చర్చలు జరపడానికి అంగీకరించింది. నాగా తిరుగుబాటుదారుల డిమాండు అయిన స్వయం ప్రతిపత్తికి ఆమోదం తెలిపింది (అధ్యాయం 9).
కాని అర్ధిక పరిస్థితి అదుపులోకి రాకుండా వుంది. ఆర్థిక రంగం మాంద్యంలో చిక్కుకొన్నది. త్వరితగతిని క్షీణిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి ఎగుమతులు పడిపోతున్నాయి. వరుసగా రెండు సంవత్సరాలు వర్నాలు లేవు. 1966లో అనావృష్టి పరిస్థితులు, 1965 కంటె తీవ్రంగా ఉన్నాయి. పరిస్థితులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆహార ధాన్యాల కొరతకు దారి తీశాయి. దేశంలో చాలా ప్రాంతాలలో ప్రత్యేకించి బీహారు, తూర్పు యు.పిల్లో కరువు పరిస్థితులేర్పడ్డాయి. 1962, 1965 యుద్దాలు, పాకిస్తాన్ - చైనా మైత్రి మిలటరీ వ్యయంలో విపరీతమైన పెరుగుదలకు, ప్రణాళికలు ఆర్థికాభివృద్ధి నుండి వనరుల మళ్లింపుకు దారి తీశాయి. నాల్లవ పంచవర్న ప్రణాళికని అసాధ్యం చేస్తూ బడ్జెట్ లోట్లు పెరిగాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ఖచ్చితంగా అమలు చేయవలసిన సమయం. కాని ప్రభుత్వం ఊగిసలాటలో ఉంది. నిర్ణయాలు చేయడంలో జాప్యం జరుగుతుంది. అమలు జరపడంలో తాత్సారం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు పెరిగిన పాలనా వ్యయాన్ని తగ్గించుకోలేకపోయింది.
కాని ప్రభుత్వం వర్షాభావ, కరువు పరిస్థితులనెదుర్శొనడంలో గణనీయంగా విజయవంతమయింది. ఆహార ధాన్యాల సేకరణ, పంపకం, కరువు మరణాల నివారణకు స్వతంత్రం తర్వాత భారతదేశం 295
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టబడ్డాయి. ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విజయం.
క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు, ఆహారధాన్యాల దిగుమతులు సాయపదేందుకు ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాత్మక చర్య బెడిసికొట్టింది. ఇందిరాగాం తొలి నిర్ణయాలు అత్యంత వైరుధ్యభరితమైనవిగా నిరూపితమయ్యాయి. అంతకుమ ప్రస్తావించినట్లు భారతదేశ ఎగుమతులు పెరగడం లేదు. చేస్తున్న ఎగుమతులపై సఖ్సీ ఇవ్వబడుతున్నాయి. రూపాయి విలువ ఎక్కువగా ఉండడం వలన ఇలా జరుగుతుందోగ్ ఇందిరాగాంధీ సలహాదారులు వాదించారు. రూపాయి మారకపు విలువ తీగ అవసరమైన విదేశ పెట్టుబడి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుందన్నారు. భారతదేశం ఆహార భద్రత కొరకు పి.యల్, 480 పథకం క్రింద అమెరికా గోధుమ దిగుమతుల ఎక్కువగా ఆధారపడింది. అంతేకాక భారత పాకిస్తాన్ యుద్ధకాలంలో నిలిపివేయబిడిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.యం.ఎఫ్.) అందచేసే ఆర్థిక సహాయాన్ని వెంటనే పునరుద్ధరించవలసి వుంది. అమెరికా, ప్రపంచబ్యాంకు, ఐ.యం. ఎఫ్. రూపొం విలువ తగ్గింపు కొరకు పట్టుబట్టాయి. ఫలితంగా ఇందిరాగాంధీ అధికారం చేపట్టి నాలుగు నెలలకే భారత ప్రభుత్వం జూన్ 6న రూపాయి విలువను 35.5 శౌలే తగ్గించింది.
నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం, ఆందోళన వ్యక్తమయింది. వివిధ రాజకీయాభి[పప్రాయాలు గల సెక్షన్లు వ్యతిరేకించాయి. వామపక్షగ్రూపులు, పార్టీలు మేధావులలో అత్యధికులు వ్యతిరేకించారు. నిర్ణయం తీసుకొనకముందు తనను సంప్రదించలేదని కామరాజ్ నిరసన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలోని విమర్శకులు కూడా అలాంటి వైరుధ్యం గల, ప్రజాదరణ పొందని నిర్ణయం ఎన్నికల సంవత్సరంలో తీసికొని ఉండవలసింది కాదని భావించారు. విదేశీ ఒత్తిడి మేరకు పని చేస్తున్నదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతమైన ఆగ్రహం వ్యక్తమయింది. రూపాయి విలువ తగ్గింపు ప్రకటించిన లక్ష్యాలైన ఎగుమతుల్ని పెంచడంలోను, విదేశీ పెట్టుబడిని ఆకర్షించడంలోను విఫలమయింది. ఆహారం, ఇతర విదేశీ సహాయంలోను గణనీయమైన పెరుగుదల లేదు, చాలా సంవత్సరాల తరువాత 1980లో ఇందిరాగాంధీ రూపొయి విలువ తగ్గించియుండవలసింది కాదని, తగ్గించడం వలన చాలా నష్టం జరిగిందని అంగీకరించారు. 296 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అధికారానికి వచ్చిన కొద్ది నెలల తరువాత ఇందిరాగాంధీ విదేశీ వ్యవహారంలో చాలా చొరవ తీసుకొన్నది. అమెరికా గోధుమలు, ఆర్థిక సహాయం, పెట్టుబడి అత్యవసర మవడంతో అమెరికాతో స్నేహ సంబంధాల కొరకు ప్రత్యేకించి 1966 మార్చిలో ఆమె వాషింగటన్ సందర్శించిన సమయంలో ప్రయత్నించారు. ప్రెసిడెంటు జాన్సన్ పి.యల్- 480 పథకం క్రింద 3.5 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు, 900 మిలియను డాలర్ల సహాయం అందజేస్తానని వాగ్దానం చేశాడు. కాని అమెరికా చిన్న మొత్తాలతో వాయిదాల పద్ధతిన పంపండం ప్రారంభించింది. భారతదేశం విదేశవిధానాన్నిి వియుత్నాంపై వైఖరిని మార్చుకోవాలని షరతు పెట్టింది. ఇందిరాగాంధీ అవమానపరచబడినట్లు భావించారు. అమెరికా బాహాటమైన ఒత్తిడికి తలవంచేందుకు నిరాకరించారు. వీలైనంత త్వరలో ఈ దుర్చలమైన స్థితి నుండి బయటపడాలని నిర్ణయించారు. ఆ తరువాత కఠినమైన షరతులకు లోబడి భారతదేశం అమెరికాతో సాన్నిహిత్యాన్ని పెంచుకొనేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.
ఇందిరాగాంధీ అమెరికాతో పొందిన అసంతృప్తి విదేశీ విధాన రంగంలో వ్యక్తమయింది. ఆమె అమెరికా నుండి దూరమవడం ప్రారంభించింది. ఆమె 1966 మార్చి- ఏప్రిల్‌లో అమెరికా సందర్శించిన కాలంలో వియత్నాం విషయంలో మౌనం చాల్చారు. 1966 జూలైలో ఉత్తర వియత్నాం దాని రాజధాని నగరమైన హోనాయ్పై అమెరికా బాంబు దాడిని నిరసిస్తూ ప్రకటన విడుదల చేశారు. జూలై చివరిలో తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా అమెరికా బాంబులు వేయడం ఆపివేయాలని డిమాండ్ చేస్తూ, వియత్నాంలో అమెరికా చర్యని సామ్రాజ్యవాద దురాక్రమణగా పేర్కొంటూ, మాస్కోలో సోవియట్ యూనియన్‌తో కలిసి ఉమ్మడి (ప్రకటనపై సంతకం చేశారు.
పి.యల్-480 రూపాయి నిధులతో 800 మిలియన్ల డాలర్లమేరకు భారత అమెరికా విద్యాసంస్థ నెలకొల్పాలని అమెరికా చేసిన ప్రతిపాదనను వాషింగ్టన్లో ఇందిరాగాంధీ అంగీకరించారు. కానీ ఇది భారతదేశంలోని పైస్థాయి విద్య, పరిశోధనలలో చొచ్చుకొని వచ్చి అదుపు చేసే అమెరికా ప్రయత్నమని భారతదేశంలోని పలువురు మేధావులు, కాంగ్రెస్ లోపల వెలుపల. గల వామపక్షవాదులు తీవ్రంగా విమర్శించడంతో ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనని త్యజించారు.
ఇందిరాగాంధీ ఈజిప్టు అధ్యక్షుడు నాజర్తోను, యుగోస్లేవియా అధ్యక్షుడు టిటోతోను సన్నిహిత సంబంధాలు పెంచుకొని అమెరికా, పశ్చిమ యూరపు దేశాల నుండి ఎదురయ్యే నయా వలసవాద (ప్రమాదాన్ని ప్రతిఘటించేందుకు, అలీన దేశాలు స్వతంత్రం తర్వాత భారతదేశం 297
ఆర్థికంగా రాజకీయంగా సహకరించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశం పాకిస్తాన్లకు, సమాన దూరంలో వుండేందుకు సోవియట్ యూనియన్ పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకొనడానికి యత్నించడం పట్ల కలత చెందిన ఇందిరాగాంధీ సోవియట్‌తో భారత స్నేహ సంబంధాలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఆమె చైనాతో చర్చలు ప్రారంభించాలని ఆకాంక్ష కూడా వ్యక్తం చేశారు. కాని పరిస్థితులు అనుకూలంగా లేవు, వాషింగ్టన్ వైఫల్యం తరువాత విదేశీ వ్యవహారాలలో బలమైన స్వతంత్ర విధానాన్ని అనుసరించారు.
పెరుగుతున్న ధరలు, ఆహారకొరత, ప్రబలుతున్న నిరుద్యోగం, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా 1966 సంవత్సరం రాజకీయ ఆందోళనలు విస్తృతంగా చెలరేగిన సంవత్సరం. ఈ అశాంతితో పాటు పెరుగుతున్న సమాజంలోని వివిధ సెక్షన్ల నెరవేరని ఆకాంక్షలు - ప్రత్యేకించి దిగువ మధ్యతరగతి ఆకాంక్షలు తోడయ్యాయి. అంతేగాక పెట్టుబడిదారీ అభివృద్ధి విధానం వివిధ సామాజిక వర్ణాల, (గ్రూపుల మధ్య ఆర్థిక వ్యత్యాసాన్ని పెంచింది.
ప్రజాందోళనల వెల్లువ - ప్రదర్శనలు, విద్యార్థుల సమ్మెలు, దొమ్మీలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు- దాదాపు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రారంభమయ్యాయి. ఆందోళనలు తరచుగా హింసాయుతంగా మారాయి. కొత్త తరహా ఆందోళన- బందులు అంటే పట్టణాల్ని, నగరాల్ని లేక మొత్తం రాష్ట్రాన్ని మూసివేయడం ప్రారంభమయింది. ఆందోళనలు చేసే (గ్రూపులు పోలీసులతో ఘర్షణ పడడం వలన శాంతి భద్రతలు విచ్చిన్నమయ్యాయి. కొన్ని సందర్భాలలో సైన్యాన్ని దించవలసి వచ్చింది. లాఠీఛార్జీలు, పోలీసు కాల్పులు, పరిపాలనకు మరింత అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు, కరువుభత్యం పెంచాలని డిమాండు చేస్తూ ఆందోళనకారులు సమ్మెలు చేసేవారితో ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్ల లాంటి మధ్యతరగత్తి వృత్తిదారులు చేరడం మొదలయింది. పరిపాలనపై, పాలక రాజకీయ నాయకత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం పెరిగింది.
ప్రతిపక్షపార్టీలు - ప్రత్యేకించి సి.పి.యం, సోషలిస్టులు, జనసంఘ్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరకాటంలో పెట్టేందుకు ప్రజల మనోభావాల్ని అవకాశంగా తీసుకొన్నాయి. బందులు ఇతర ఆందోళనలు నిర్వహించడంలో నాయకత్వం వహించాయి. కొందరు పాలనాపరమైన ప్రతిష్టంభన-ఎన్నికల ద్వారా గాని లేక పార్లమెంటేతర పద్ధతుల ద్వారాగాని తాము అధికారంలోకి రావటానికి అనువైన పరిస్థితులు సృష్టిస్తుందని 298 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విశ్వసించారు. ఫలితంగా వారు తరచుగా ప్రజాస్వామ్య పరిమితులనుగాని రాజ్యాంగ నిబంధనలు గాని పాటించలేదు.
జనసంఘ్ ఇతర మతతత్వ శక్తులు రానున్న ఎన్నికలలో హిందువుల మతపరమైన భావాలను సొమ్ము చేసుకోవాలనే అశతో దేశవ్యాప్తంగా గోవధనిషేధం అమలు జరపాలని పెద్ద ఆందోళన చేపట్టాయి. కాని ఈ డిమాండులోని మతతత్వ స్వభావం కారణంగాను, హిందువులలోని మైనారిటీలు, దిగువ కులాల వారు ధర తక్కువ కారణంగా అవు మాంసం తింటారు గనుక ప్రభుత్వం ఈ డిమాంద్కి వ్యతిరేకంగా నిలబడింది. శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంటులో ఇలా చెప్పారు- 'ఇది ప్రభుత్వంపై చేసే దాడి కాదు. ఇది మన జీవన విధానంపై, మన విలువలు సంప్రదాయాలపైన చేసే దాడి.” నవంబరు 7న కత్తులు, బల్లాలు, త్రిశూలాలు ధరించిన నగ్న సాధువుల నాయకత్వంలో వందల, వేల మూక రాజ్యాంగబద్ధమైన (ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తూ మార్గమధ్యంలో బస్సులను, కార్లను తగులబెడుతూ, షాపుల్ని లూటీ చేస్తూ ప్రభుత్వ భవనాలపై దాడులు సాగిస్తూ ఏకంగా పార్లమెంటు భవనంపై దాడికి ప్రయత్నించింది. కామరాజ్‌పై దాడి చేసేందుకు మూక ఆయన ఇంటిని చుట్టుముట్టింది. పోలీసులతో జరిగిన ఘర్షణలో ఒక పోలీసు, ఆరుగురు సాధువులు చనిపోయారు. అప్పటి హోంమినిష్టరు గుల్జారీలాల్ నందా పరిస్థితిని ఎదుర్మొానడంలో విఫలమయ్యాడు. గనుక ఇందిరాగాంధీ అతడిని రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఉద్యమం తేలిపోయింది. తరువాత జరిగిన ఎన్నికలలో గోవధ ఒక సమస్యగా కూడా నిలబడలేదు.
1966 సంవత్సరంలో పార్లమెంటు ఒక సంస్థగా కూడా దిగజారడం ప్రారంభమయింది. కొందరు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటరీ మర్యాద, నాజూకుదనంపై ప్రదర్శించిన అనాదరణ కారణంగా పార్లమెంటులో అలజడులు, క్రమశిక్షణా రాహిత్యం సర్వసాధారణమయ్యాయి. ప్రధానమంత్రి పదవికి ఇవ్వవలసిన గౌరవం కూడా కొన్ని సందర్భాలలో విస్మరించబడింది. ప్రధానమంత్రిపై వెక్కిరింపులు, వేళాకోళాలు, నీచమైన వ్యక్తిగత దాడులు పురుష దురహంకారంతో కూడిన ప్రస్తావనలు, నిరాధారమైన ఆరోపణలు చేయబడ్డాయి. ప్రత్యేకించి డాక్టర్ రామమనోహర్ లోహియా అమెను అపహసించే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఆమెను గూంగిగుడియా (మూగబొమ్మ)గా వర్ణించాడు.
పార్టీలో కూడా ఇందిరాగాంధీ బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. ఒకటి కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు తగ్గింది. నెహ్రూ కాలం నుండి పార్టీ క్షీణిస్తూ వచ్చింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 299
రాజకీయ చారవ కోల్పోతూ వచ్చింది. అంతకంతకు [గ్రూపుల ముఠాల కోరల్లో చిక్కుకున్నది. ఫలితంగా దాదాపు ప్రత్తి రాష్ట్రంలో అసంతృప్తి గ్రూపులు ఏర్పడ్డాయి. పార్టీలో శ్రీమతి ఇందిరాగాందీ స్టితి కూడా బలహీనంగా అభ(ద్రతగా ఉంది. ప్రధాన మంత్రి అయిన తరువాత తన స్వంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. అన్ని ముఖ్యమైన శాఖలు- హోం, రక్షణ, ఆర్ధిక, విదేశీ వ్యవహారాలు, ఆహార శొఖిల మంత్రుల్ని కదల్చకుండా అలాగే ఉంచవలసి వచ్చింది. పార్టీ ప్రెసిడెంటు కామరాజ్: సిండికేట్ సమిష్టిగా ప్రధానమంత్రి కార్యాచరణను, విధానాల రూపకల్పన వాటీని అమలు పరచడానికి పరిమితం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలోగాని, పార్లమంటరీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలోగాని ఆమెను నామమాత్రం చేశారు. 1967 ఎన్నికల సంవత్సరం గనుక ఇందిరాగాంధీ వీటన్నిటిని భరించవలసి వచ్చింది: రాజకీయ నాయకురాలిగా గూడా ఆమె రెండు బలహీనతలతో సతమతమయ్యారు. ప్రత్యర్థులు ఆమెను పార్లమెంటరీ పార్టీలోను, మంత్రివర్గంలోను ఒంటరిని చేయడంలో జయప్రదమయ్యారు గనుక ఆమె ప్రభావశూన్యంగా వుండిపోవలసి వచ్చింది. ఆమెకు సైద్ధాంతిక పట్టుకొరవడింది. 1967 సాధారణ ఎన్నికలు- రాష్ట్ర సంకీర్ధాలు
1967 ఫిబ్రవరిలో నాల్లన లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికలు భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. లంచగొండితనం: విలాసవంతమైన జీవన విధానం కారణంగా చాలామంది పైస్థాయి నాయకుల పట్లి ప్రజలకు గల (భ్రమలు తొలగిపోయాయి. ప్రజలు చాలా మంది ప్రాంతీయ స్థానిక కాంగైస్ నాయకుల్ని పదవుల కొరకు ్రాకులాదేవారుగాను ముఠాతగాదాల్లో కూరుకుపోయేవారుగాను పరిగణించారు. అదే సమయంలో కాంగ్రెస్‌కి సరియైన క్రత్యామ్నాయం లేకపోవడం పట్ల కూడా నిరాశచెందారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మౌలిక సామాజిక సమస్యల్ని ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ని పీడించేందుకే ప్రచారం సాగించారు. కాని ప్రజలు గొప్ప రాజకీయ, వైతన్యం ప్రదర్శించారు. 1967 ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా 61.2 శాతం ఓట్లు పోలయ్యాయి.
కొంగ్రెస్ 1964 నుండి క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు సిండికేట్ నాయకత్వంలో ఎన్నికల బరిలోకి దిగింది. కాం(గగైన్ బలహీనవడి విభజితమ్హై ముఠాలతో 800 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సతమతమవుతున్నప్పటికి ప్రజల మద్దతు తమకు తగ్గడాన్ని పట్టించుకోకుండా నాయకత్వం ఎన్నికలకు సిద్ధపడింది. గతంలో ముఠాతత్వం రాష్ట్రాలకు పరిమితమై వుండేది. ఇప్పుడది కేంద్రానికి కూడా విస్తరించింది. గతంలో అసంతృప్తి వాదులు తాము వేరు చేయబడద్డామనే భావనకి గురికాకుండా రాష్ట్రస్థాయి వివాదాన్ని కేంద్ర నాయకత్వం పరిష్మరించేది. ఇప్పుడు కేంద్ర నాయకత్వం కేంద్రంలో తమ స్టితిని పదిలపరచుకొనేందుకు రాష్ట్రాలలోని ఆధిపత్య (గ్రూపులకు అందగా నిలిచింది. జరీర్ మసాని చెప్పినట్లు “ఫలితం కాంగైస్ నాయకత్వం యొక్క అన్ని స్థాయిల్లో అధికారం కొరకు ఎడతెగని కుమ్ములాట, స్వాతంత్రోద్యమ కాలంలో నిర్మించిన ఎలాంటి పార్టీ క్రమశిక్షణ విశ్వాసం, స్నేహభావం లాంటివి లేనిదే పార్టీ ఐక్యంగా మనలేదో అవి వేగంగా క్షీణించడం.”
పార్టీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌లోని ముఠాతత్వం స్పష్టంగా ప్రతిబింబించింది. చాలా పాక్షికంగా వ్యవహరించిన సిండికేట్ సభ్యుల టికెట్ల పంపిణీలో ఆధిపత్యం సాధించారు. టికెట్లు నిరాకరించబడిన దాదాపు వెయ్యిమంది కాంగ్రెస్ సభ్యులు అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్రులుగా పోటీ చేయడంగాని లేక రాష్ట్ర స్థాయి అసంతృప్ప్తివాదుల (గ్రూపులో చేరడంగాని జరిగింది.
1967 ఎన్నికలలో ప్రతిపక్షాలు దగ్గరయ్యాయి. కొన్ని రాష్ట్రాలలో వాటిలో కొన్ని కాం(గైస్ వ్యతిరేక ఫప్రంటులు ఏర్పాటు చేశాయి. ఇతర రాష్ట్రాలలో పోటీలను నివారించి సీట్లు పంచుకోవడం ద్వారా ఎన్నికల సర్దుబాట్లు చేసుకొన్నాయి. తరచుగా ఈ క్రమంలో అసంతృప్త కాంగ్రెస్ పార్టీ (గ్రూపులు కూడా కలిశాయి. కాని ఎన్నికలపరంగా దగ్గరైన ఈ పార్టీలు సిద్ధాంతాలు కార్యక్రమాల రీత్యా భిన్నమైనవి. కాంగ్రెస్‌ని ఓడించాల కోరికే వాటిని దగ్గరికి చేర్చింది. లోహియా సోషలిస్టులు ఎలాంటి పద్ధతులు పాటించని వారిలో అగ్రగణ్యులు. వారు మతతత్వ జన సంఘ్తోను, మితవాద స్వతంత్రులతోను కలవటానికి ఏ మాత్రం సంశయించలేదు. అలాగే చాలా రాష్ర్రాలలో సెక్యులర్ పార్టీ అయిన స్వతంత్ర పార్టీ జనసంఘ్‌తో చేతులు కలిపింది. తమిళనాడుతో స్వతంత్ర, సి.పి.యం, ముస్లింలీగ్, డి. యం.కె.భాగస్వాములు, కేరళలో సిపిఎం, ముస్లింలీగ్ అలాగే పంజాబ్‌లో జనసంఘ్, అకాలీలు, సిపిఎంలు మిత్రపక్షాలు.
ఎన్నికల ఫలితాలు నాటకీయంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభపై అదుపుని నిలబెట్టుకొన్నప్పటికి 520 సీట్లకుగాను 28క సీట్లు మాత్రమే గెలిచింది. 1962లోని 228 మెజారిటీ ఇప్పుడు 48కి తగ్గింది. పశ్చిమబెంగాల్, స్వతంత్రం తర్వాత భారతదేశం 801
కేరళలో మాత్రం కాంగ్రెస్ సీట్లని వామపక్ష పార్టీలు గెలుచుకొన్నాయి. మిగిలిన అన్ని. చోట్ల కాంగ్రెస్ తగ్గుదల వలన లాభపడింది మతతత్వ, ఫ్యూడల్. మితవాద, ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ 8 రాష్ట్రాల అసెంబ్లీలలో- బీహార్, యు.పి. రాజస్టాన్, పంజాబ్! పశ్చిమబెంగాల్ ఒరిస్సా, మద్రాసు, కేరళలో- మెజారిటీ కోల్పోయింది. యు.పి, మధ్యప్రదేశ్, హర్యానాలలో జనసంఘ్, ఒరిస్సా, రాజస్టాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో స్వతంత్ర పార్టీ, బీహార్‌లో యస్.యస్.పి, పశ్చిమబెంగాల్. కేరళలలో కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షాలుగా ఆవిర్భవించాయి.
1967 ఎన్నికలు కొన్ని దీర్హకాలిక ధోరణుల్ని దీర్షకాలిక ఫలితాల్ని వ్యక్తం చేశాయి. ఇంతకుముందు ప్రస్తావించిన వివిధ కారణాల రీత్యా కాంగ్రెస్ పట్ల తొలగిన భ్రమలతోపాటు ఉత్తరాదిరాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయంతో కాంగ్రెస్ క్యాంజు నుండి సంపన్న మధ్య తరగతి రైతుల ఫిరాయింపు పెద్దపాత్ర నిర్వహించింది.
1950 దశాబ్దం తొలి సంవత్సరాల భూసంస్కరణల ఫలితంగా భూయాజమాన్యం సామాజిక అధికారం క్రమంగా సంపన్న రైతులవైపు మారాయి. వారు కొత్తగా పొందిన ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి, భూమిపై అదుపు వగైరాలు కాంగ్రెస్ సంకల్పించిన ఆహార ధాన్యాల సేకరణ విధానాలు, భూసంస్కరణలు, కాంగ్రెస్ యొక్క ప్రత్యేకించి ఇందిరాగాంధీ, కాంగ్రైస్లోని వామపక్ష భావాలు గల వారి ప్రజాకర్షక పథకాల వలన ప్రమాదంలో పడతాయని ఆందోళన చెందారు. అంతేగాక (గ్రామీణ ప్రాంతాలలో పెరుగుతున్న వర్గవిభేదాలు, భూమిలేని వ్యవసాయ కూలీల బేరసారాలాదే శక్తి రాజకీయ టైతన్యం పెరుగుదల, గ్రామంపై సంపన్న రైతుల ఆధిపత్యానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. కాంగ్రెస్ సృష్టించిన వర్గ పొందికలో సంపన్న రైతులు, ఇంకా ముఖ్యపాత్ర నిర్వహించాలని ప్రభుత్వ విధానాలు తమకనుకూలంగా మార్చబడాలని కోరుకున్నారు.
దక్షిణ భారతదేశంలో వర్ష, కుల, నిర్మాణం ఉత్తర భారతదేశాని కంటే భిన్నమైనది. కమ్యూనిస్టులు ఎక్కువగా ఉండడం (గ్రామీణ భూస్వాముల్ని కాంగ్రెస్‌కి కట్టిపడేసింది. అంతేగాక ప్రత్యామ్నాయ సంపన్న రైతు పార్టీలు లేవు. బీహార్, యుపి, పంజాబ్‌లలో సంపన్న రైతు ప్రయోజనాలకు వాహకాలుగా పనిచేసే ప్రత్యామ్నాయ పార్టీలు -యస్యస్పి, బిజెపి, అకాలీదళ్ రూపంలో ఉన్నాయి.
వాస్తవంగా కాంగ్రెస్ ఎక్కడ కూడా సంపన్న రైతుల వ్యతిరేక పార్టీ కాదు. కాని కాంగ్రెస్ సమూలమైన మార్పులు తెస్తానని చెబుతూ ప్రయోగించిన పదవిన్యాసముతో
202 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సంపన్న రైతులు కాంగ్రెస్ సంపన్న రైతుల వ్యతిరేక పార్టీ అని భావించారు. అలాగని కాంగ్రెస్ అంగీకరించిన ఆర్ధికాభివృద్ధి, పారిశ్రామికీకరణకు నష్టం వాటిల్లజేస్తూ సంపన్న రైతుల డిమాండ్లను సంతృప్తి పరచేందుకు అంగీకరించలేదు.
సంపన్న రైతులకు చాలా ఎక్కువ సంఖ్యలో ఉందే మధ్యతరగతి, పేద రైతుల్ని తమ వెనుక నిలబెట్టుకొనే అవకాశం వుంది. రైతు యాజమాన్యం అనే ఉమ్మడి ఆదర్శం భూమి కలిగి యుండటం. భూమిపై అదుపు లాంటి ఉమ్మడి ఆకాంక్షలు ఉన్నాయి. ఒక మేరకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వ్యవసాయ కూలీలతో సంబంధం లాంటి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. వారంతా మధ్యతరహా లేక వెనుకబడిన కులాలకు చెందినవారు. సంపన్న రైతులు గ్రామీణ ఓటుబ్యాంకులపై అదుపు సాధించారు. గ్రామీణ ప్రజలపై పట్టుగల జమీందారులను ఆ పాత్ర నుండి తొలగించి చిన్న రైతులు, వ్యవసాయ కూలీల ఓట్లపై కూడా అదుపు సాధించారు. వ్యవసాయ కూలీలలో అత్యధికులు దళితులు కనుక వారిని పోలింగ్ బూతులకు వెళ్లనీయకుండా నిరోధించే కండబలం కూడా పారికి జ్రంది.
1967 ఎన్నికలు భారత రాజకీయాలలో సంపన్న మధ్య తరగతి రైతులకు ఎక్కువ ప్రాధాన్యతని గ్రామీణ, సామాజిక, ఆర్థిక రంగాలపై వారి పెత్తనాన్ని. ఈనాటికి కొనసాగుతున్న కాంగ్రెస్ కమ్యూనిస్టుల పట్ల వారి వ్యతిరేకతను పెంచాయి. చిన్న రైతుల, వ్యవసాయ కూలీల ఐక్యత మాత్రమే ఈ ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు. 1971 లో సంపన్న రైతుల ప్రయోజనాలను ఆక్షేసించకుండా ఎన్నికలపరంగొ ఇందిరాగాంధీ ఈ ఫలితాన్నే సాధించయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వాలు
1967 ఎన్నికలు కొద్దికాలంపాటు మనగలిగే ప్రభుత్వాల, ఫీరాయింను రాజకీయాల శకానికి నాంది పలికాయి. ఎన్నికలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసినప్పటికీ ఏ చాష్ట్రంలో కూడా కాంగ్రెస్ స్థానంలో ఒక పార్టీగాక పలు పార్టీలు (గ్రూపులు, ఇండిపెండెంట్లు కలిసి అధికారంలోకి వచ్చాయి. ఒక్క తమిళనాడులో తప్ప ప్రతిపక్ష పాలిత రాష్రాలన్నింటిలో సంకీర్ద ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. పంజాబు, బీహార్, యుపిలలో ప్రతిపక్షాలు ఏర్పరచిన ప్రభుత్వాలలో స్వతంత్ర, జనసంఘ్, బి.కె. డి, సోషలిస్టులు, సిపిఐ పార్టీలు ఉన్నాయి. సిపిఎం ఈ (ప్రభుత్వాలలో చేరనప్పటికీ అది కూడా వీటిని బలపరిచింది. ఈ ప్రభుత్వాలు సైద్ధాంతికంగా వైవిధ్యభరితమైనవి. స్వతంత్రం తర్వాత భారతదేశం 308
వామపక్ష-మితవాద లేక సెక్యులర్- మతతత్వ విభజనలు వాటిలో అనుసంధానం చేయబడ్డాయి. మైనారిటీకి తగ్గించబడిన కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కూడా స్వతంత్రులతో ప్రతిపక్ష పార్టీల నుండి విడిపోయిన గ్రూపులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలనేర్పరచింది. తమిళనాడులో డి.యం.కె. ప్రభుత్వం, ఒరిస్సాలోని స్వతంత్ర పార్టీ నాయకత్వంలో గల ప్రభుత్వం మినహాయించి ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ లేక ప్రతిపక్షాలు ఏర్పరచా సంకీర్ణ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉన్నాయి. ఎక్కువ కాలం అధికారం కొనసాగలేకపోయాయి. భాగస్వాములలోని వైవిధ్యత కారణంగా సంకీర్ణ ప్రభుత్వాలన్నీ నిరంతర ఉద్రిక్తతలకు అంతర్గత వత్తిడులకు లోనయ్యాయి. పశ్చిమబెంగాల్ కేరళలు మినహాయించి ఇతర రాష్ట్రాలలో విధానాలపరంగా గాక మంత్రివర్గ స్థానాలు, ఇత ప్రయోజనాల గురించి నిరంతరంగా బేరసారాలు సాగాయి. ఇది అస్థిర మంత్రివర్తాలకు దారి తీసింది. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. శాసనసభ్యుల విధేయతలు మార్చిన కారణంగా పడిపోయాయి. మరలా వర్చరచబడ్డాయి. కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్ట్లు ఉన్న ప్రభుత్వాలను కూలదోశాయి., భాగస్వాముల్ని మార్చివేశాయి. క్ల్తె 'ప్రభుత్వాలనేర్చరచాయి. ప్రభుత్వాల మధ్య రాష్ట్రాలు, రాష్ట్రపతి పాలన క్రిందికి వచ్చాయి. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు కూడా పార్టీల మధ్యసీట్ల పొందికని మార్పరదు ఆ విధంగా 1967 సాధారణ ఎన్నికల నుండి 1970 సంవత్సరాంతం వరకు బీవోర్ 7 ('ప్రభుత్వాలేర్చడ్డాయి. యుపిలో నాలుగు, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్ పశ్చిమబెంగాల్‌లలో మూడు, కేరళలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏడు రాష్ట్రాల 8 సార్లు రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టబడింది. పడగొట్టి కొత్త ప్రభుత్వాలనేర్పాటు చేసే ఆటలో చిన్న పార్టీలు, స్వతంత్రులు(ఇండిపెండెంట్లు) ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఈ కాలానికి చెందిన సంకీర్ణ ప్రభుత్వాల యొక్క మరొక ముఖ్యమైన లక్షణం
- “ఫిరాయింపు రాజకీయాలు ప్రారంభం” ఫిరాయింపుల కారణంగా ఉత్తరాదిలో చాలౌ (ప్రభుత్వాలు మారాయి. అవినీతి శాసనసభ్యులు అధికారం దబ్బుపట్ల ఆకర్షితులై బేరసారాలకు దిగి చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చారు. ఫిరాయింపులు మొదట (ప్రారంభమైన హర్యానాలో ఫిరాయించిన శాసనసభ్యులు “ఆయారా?: గయారారొలుగా పిలవబద్దారు. ఫలితంగా రెండు కమ్యూనిస్టు పార్టీలు, జనసంఘ్ మినవాయించి ఇతర పార్టీలలో క్రమశిక్షణ సన్నగిల్లింది. 1967-1970 కాలంలో 04 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దాదాపు 800 మంది శాసనసభ్యులు పార్టీలు ఫిరాయించారు. దాదాపు 155 మందికి మంత్రిపదవులు దక్కాయి.
| వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా పార్టీలు మార్చి ప్రభుత్వాన్ని కూలగొట్టిన అరాయింపుదారులు మరలా మరలా ఎన్నికయ్యారు. ఫిరాయింపుల సమస్య నిరంతరం కొనవ్సంగే దీర్జకాలిక సమస్య అయింది. కాని 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని ఆమోదింపచేయడంతో ఫిరాయింపులకు అవరోధం కల్పించబడింది.
కేంద్రంలో పాలక పార్టీకి స్వల్పమైన మెజారిటీ మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్ర 'ప్రభుత్వాలు ఏర్పడుతూ పడిపోతూ ఉన్న ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉండడం ఆసక్తికరమైన అంశం. ఫిరాయింపు వ్యతిరేక చట్టం లేనప్పటికీ కేంద్రంలో ఫిరాయింపులు జరుగలేదు. అలాగే ఒకనాకొక దశలో దాదాపు సగం రాష్ట్రాలు ప్రతిపక్ష పాలనలో ఉన్నప్పటికీ కేంద్రంలో అంతకుముందులాగానే ఫెడరల్ వ్యవస్థ పనిచేయడం కొనసాగింది. అంతేగాక రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత్వం పరిపాలనా స్తంభనకి దారితీయలేదు.
ఈ ఎన్నికలతో బ్లుతిపక్ష పార్టీలలోను, మేధావులలోని పెద్ద సెక్షన్‌లోను పచ్చి కాం(గైన్ వ్యతిరేకత (1౧(౧-౧౦౧81౬35150%1) విన్నరించింది. వచ్చి కాం(ైన్ వ్యతిరేకతకు, సిద్దాంతం, విధానాలు కార్యక్రమాలలో విభేదాల ప్రాతిపదికన కాం(్రెస్ని 'పతిఘటించి పనిచేయటానికి తేడా ఉంది. కాంగ్రెస్‌తో విసుగు చెంది “కొంటెస్ కాని దేనినైనా అపేక్షించడం” పచ్చి కాంగ్రైస్ వ్యతిరేకత. కాంగ్రెస్ వ్యతిరేక మేధావులు, సోషలిస్టులు, కాంగ్రెస్‌ని బలహీనపరచేందుకు సిపిఎం నుండి బిజెపి నుండి జనసంఘ్ వరకు దేనికైనా మద్దతిచ్చేందుకు సిద్ధపడ్డారు. సిపిఎం, సిపిఐలు గూడా అలాంటి వైఖరినే అనుసరించాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రజనీకొఠారి మాటల్లో చెప్పాలంటే రాంమనోహర్‌లోహియా “దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నింటిని ఐక్యం చేయటం ద్వారా కాంగ్రెస్ అధికారగుత్తాధిపత్యాన్ని ధ్వంసం చేసే కర్తవ్యానికి” - అంకితమయ్యాడు. 1967లో లోహియా రాజకీయ శక్తుల్ని కాంగ్రెస్- కాం(ెస్ వ్యతిరేక (ప్రాతిపదికన విడగొట్టగలిగాడు. కాని ఫలితాలు సానుకూలంగా రాలేదు.
అత్యధిక ప్రతిపక్ష పార్టీలు మరొక ప్రతిపక్ష పార్టీతో కంటే కాంగ్రెస్‌లోని ఏదో ఒక పక్షానికి సన్నిహితంగా ఉన్నాయనే వాస్తవాన్ని కాంగ్రెస్ వ్యతిరేకత విస్మరించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 805
ఉదాహరణకు: కమ్యూనిస్టులు, సోషలిస్టులు కాంగ్రెస్‌లోని వామపక్ష భావాలు గలవారికి సన్నిహితులు. అలాగే స్వతంత్ర పార్టీ కాంగైస్ మితవాద భావాలు గల వారికి సన్నిహితులు. ఇక జనసంఘ్ తన మతతత్వ సిద్ధాంతం కారణంగా కాంగ్రెస్‌ని, ప్రతిపక్ష సెక్యులర్ పార్టీలను వ్యతిరేకించింది. కాంగ్రెస్‌కి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలు భారత రాజకీయాలలో కాంగ్రెస్ ఆధిపత్యం అంతం కావడానికి ప్రారంభాలని పలువురు రాజకీయ వ్యాఖ్యాతలు జోస్యాలు చెప్పారు. కాని వాస్తవ పరిస్థితి అదికాదు. కాంగ్రెస్ పార్లమెంటరీ మెజారిటీ గలిగిన దేశంలోని అత్యంత పెద్ద పార్టీ మాత్రమే కాదు. దేశవ్యాప్త నిర్మాణం, అనుచర వర్గం గల దేశవ్యాప్త పార్టీ. అంతేగాక దానికి సమైక్యప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ మైనారిటీ అయిన రాష్ట్రాలలో ప్రతిపక్షాలు అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. అదే సమయంలో కేవలం వాగ్దానాలు గాక నిర్దిష్ట ఫలితాలు కోరుతున్న ప్రజల్ని ఆకర్షించే విధానాల కొరకు కాంగ్రెస్ అన్వేషిచవలసి వుంది. కాంగ్రెస్ ఇక ఏ మాత్రం స్వతంత్ర పోరాటంలో తన పాత్ర లేక నెహ్రూతరంలో సాధించిన ఫలితాల ప్రాతిపదికన ప్రజల మద్దతు పొందగలిగిన స్థితిలో లేదు. కాంగ్రెస్ తనకు తాను నవీకరించుకోవలసి వుంది. 1967 ఎన్నికలు కాంగ్రెస్‌లోని అధికార సమతుల్యతని పూర్తిగా మార్చివేశాయి. సిండికేట్ రూపంలో కాంగైస్పై అధికారం చెలాయించిన నాయకత్వం దెబ్బతిన్నది. కామరాజ్ (కాంగైస్ ప్రెసిడెంట్‌తో సహా సిండికేట్ ప్రముఖులు మట్టిగరిచారు. సిండికేట్‌కి విధేయులుగా ఉన్న వారిలో అత్యధికులు పార్లమెంటుకి, అసెంబ్లీలకు ఎన్నిక కాలేదు. ఫలితంగా 1964, 1966లలో లాగానే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు క్రమాన్ని అదుపు చేసే అవకాశం సిండికేట్‌కి దక్కలేదు. కాంగైస్ పార్టీ దెబ్బతిన్నప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో ఇందిరాగాంధీ స్థానం బలహీనపడలేదు. అంతేగాక కామరాజీ్కి, సిండికేట్‌కి ఆమెను సవాల్ చేసే స్థితిలేనందున ఆమె బలపడింది. అంతేగాక అప్పటికి ఇందిరాగాంధీ, నెహూ అంత ప్రజాదరణ పొందిన నాయకురాలు కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఓట్లు సాధించగల నాయకురాలు ఆమె. ఇందిరాగాంధీ పోటీ లేకుండా పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికవడం: మంత్రివర్గ నిర్మాణంలోను, వివిధ శాఖల కేటాయింపులోను ఆమె చూపిన చొరవ, స్వేచ్చ- పార్టీపై ఆమెకు గల పట్టును వ్యక్తం చేసింది. పోటీగా నున్న ఏకైక వ్యక్తి మొరార్డీ దేశాయ్. ఆయన పోటీ నుండి తప్పుకుంటూ ఉపప్రధానమంత్రి పదవి కొరకు బేరసారాలాడాడు. పార్లమెంటులో పార్టీకి అంతంత మాత్రం మెజారిటీ వుంది. 806 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖ్డీ
ఇందిరాగాంధీ దేశాయ్ డిమాండ్‌ను అంగీకరించారు. ఉప ప్రధాన మంత్రి హోదా కేవలం ఒక లాంఛనం మాత్రమే. అది ఒక స్థాయి మాత్రమే. ఆర్థికమంత్రిగా ఆయన స్థాయి మినహా మంత్రివర్గంలో ప్రత్యేక అధికారాలు లేవు.
1967-69 సంవత్సరాలు రాజకీయాల్ని మార్పుల దిశగా నడిపిన సంవత్సరాలు. 1969లో కాంగ్రెస్ చీలిపోయింది. భారత రాజకీయ పరిణామంలో ఇది నూతన దశ. కాని వామపక్షంలో పెద్ద పరిణామం చోటు చేసుకొన్నది. దీనిని సంక్షిప్తంగా పరిశీలిద్దాం.
నక్సలైట్లు
సి.పి.యం విపష్లవరాజకీయాలు, సంస్క్మరణవాద పార్లమెంటరీ రాజకీయాల ప్రాతిపదికన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి 1964లో చీలిపోయింది. కాని ఆచరణలో సిపిఎం అప్పటికి ఉన్న రాజకీయ వాస్తవాలను గమనంలో పెట్టుకొని దేశంలో విప్లవ పరిస్థితులు వచ్చే వరకు సాయుధ పోరాటాన్ని వాయిదా వేస్తూ పార్లమెంటరీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నది. 1967 ఎన్నికలలో పాల్గొని పశ్చిమబెంగాల్లో బంగ్లా కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. దానిలో సిపిఎం ప్రముఖ నాయకుడు జ్యోతిబసు హోంమినిష్టరయ్యాడు. ఇది పార్టీలో విభేదాలకు దారితీసింది.
అప్పుడు చైనాలో కొనసాగుతున్న సాంస్కృతిక విష్లవంచే ప్రభావితమైన పార్టీలోని ఒక సెక్షన్- ముఖ్యంగా యువకులు పార్టీ నాయకత్వం విప్లవానికి విద్రోహం చేస్తూ, సంస్కరణ విధానానికి, పార్లమెంటరీ తత్వానికి ఎరగా మారిందని ఆరోపించారు. పార్టీ వెంటనే విముక్తి ప్రాంతాల ఏర్పాటుకు దారితీసే విధంగా గ్రామ ప్రాంతాలలో సాయుధ రైతాంగ తిరుగుబాట్లు ప్రారంభించాలని, సాయుధ పోరాటాన్ని క్రమంగా దేశం అంతటికీ విస్తరంపచేయాలని వాదించారు. సిపిఎం తిరుగుబాటు నాయకులు వారి రాజకీయ పంథాని అమలు జరిపేందుకు ఉత్తర పశ్చిమబెంగాల్లో గల నక్సల్బరీ అనే చిన్న ప్రాంతంలో రైతాంగ తిరుగుబాటుని ప్రారంభించారు. సిపిఎం నాయకత్వం తిరుగుబాటు నాయకుల్ని వెంటనే పార్లీ నుండి బహిష్కరించింది. వారిది వామపక్ష దుందుడుకు వాదమని పేర్కొన్నది. పార్టీని ప్రభుత్వ యంత్రాంగాన్ని నక్సల్బరీ ఉద్యమం అణచివేతకు (ప్రయోగించింది. చీలిపోయిన సి.పి.ఎం. నాయకులు నక్సలైట్లుగా పిలువబడ్డారు.
దేశంలోని ఇతర ప్రాంతాలలోని అలాంటి (గ్రూపులు వారితో కలిశారు. ప్రస్తుత రాజకీయాలతో అసంతృప్తి చెంది సామాజిక స్థితిగతుల పట్ల ఆగ్రహంగా ఉన్న యువకుల్ని = ప్రత్యేకించి కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థుల్ని నక్సలైటు ఉద్యమం ఆకట్టుకొన్నది.
స్వతంత్రం తర్వాత భారతదేశం 807
1969లో చారుమజుందార్ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ మార్చిస్ట -లెనినిస్ (ఎం.ఎల్) స్థాపించబడింది. ఆంధ్ర, ఒరిస్సా, బీహారు, యుపి, పంజాబు, కేరళలలో అలాంటి పార్టీలు గ్రూపులు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ప్రజాస్వామ్యం ఒక బూటకమని, భారత రాజ్యం ఫాసిస్టు రాజ్యమని, భారతదేశంలోని వ్యవసాయక సంబంధాలు ఇంకొ ఫ్యూడల్ సంబంధాలుగానే ఉన్నాయని, భారతదేశంలోని బడాబూర్జువా దళారీయని, భారతదేశం రాజకీయంగా ఆర్ధికంగా అమెరికా, బ్రిటీష్ సోవియట్ సామ్రాజ్యవాదొల ఆధిపత్యంలో ఉందని, భారత రాజకీయాలు, ఆర్థిక విధానం ఇంకా వలస వాద దశలో ఉన్నాయని, భారత దేశ విప్లవం ఇంకను సామ్రాజ్యవాద వ్యతిరేక, ఫ్యూడల్ వ్యతిరేక దశలో ఉందని, భారతదేశంలో విష్లవస్వరూపం చైనా తరహా దీరకాలిక గెరిల్లా యుద్ధ తంత్రంగా వుంటుందని సిపిఐ(యంఎల్) ఇతర నక్సలైటు గ్రూపులు వాదించారు. నక్సలైటు గ్రూపులు రాజకీయ, సైద్ధాంతిక మద్దతు చైనా ప్రభుత్వం నుండి పొందాయి. కాని “వైనా ఛైర్మన్ (మావో సేటుంగ్) మా వైర్మన్- అనే నక్సలైటు నినాదం పట్ల” బైగొ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సి.పి.ఐ.(యం.ఎల్) ఇతర నక్సలైటు గ్రూపులు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సాయుధ దళాల్ని నిర్మించి పోలీసులపై పాలక వర్ణాలకు ఏజంట్లుగా పని చేస్తున్న ప్రత్యర్థి కమ్యూనిస్టులపై దాడులు చేశాయి. ప్రభుత్వం వారిని అణచడంలోను వారి పలుకుబడిని పరిమిత ప్రాంతాలకు పరిమితం చేయడంలోను జయప్రదమయింది. రాజ్య అణచివేతను ఎదుర్కొనలేక నక్సలైట్లు పలు గ్రూపులుగా చిన్న ముఠాలుగో చీలిపోయారు. కాని వారి వైఫల్యానికి నిజమైన కారణం భారత రాజకీయాలలో వారి రాడికలిజాన్ని భారతీయ వాస్తవికతలో పాదుకొల్పడంలోను భారత సమాజాన్ని రాజకీయాల్ని రూపుదిద్దుకుంటున్న వ్యవసాయ చట్రం స్వభావాన్ని అవగతం చేసుకొని వారి సామాజ్రిక్ర పునాదిని రైశులలో మార్పులు కోరే మధ్యతరగతి యువకులలో ర ట్ ్బ్రాలు స్ట్ వీసృతపరచుకొనడంలోని అశక్తతలోను వుంది. 1960 దశాబ్దం అలాగే 1970 దశాబ్దం తొలి సంవత్సరాల సాంస్కృతిక విప్లవాన్ని మావోయిజాన్ని ఆ తరువాత వచ్చిన బైగొ నాయకత్వం నిరాకరించడం కూడా నక్సలైటు ఉద్యమ పతనానికి కారణమయింది. 308 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
శే ఇందిరాగాంధీ సంవత్సరాలు 1969-1973
1969లో కాంగ్రెస్ చీలిపోయింది. అనేక కారణాలరీత్యా ఈ చీలిక జరిగింది. 1967 ఎన్నికల ఘోర పరాజయంలో ప్రతిఫలించిన కాంగ్రెస్ పార్టీ క్షీణతని గురించి గత అధ్యాయంలో మనం ఇంతకుముందే చర్చించాము. క్షీణతని తగ్గించి పార్టీకి, ప్రభుత్వానికి నూతన జవసత్వాలు సమకూర్చేందుకు తగు చర్యలు చేపట్టాలని విచారశీలత గల కాంగ్రెస్ పార్టీ వాళ్లు గుర్తించారు. కేవలం యుక్తులు, చిట్కాలు పనిచేయవని (గ్రహించారు. 1969 ఫిబ్రవరిలో నాలుగు రాష్ర్టాలకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో కూడా కాంగ్రెస్ సాధించిన ఫలితాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేశాయి. ఈ పరిస్థితులలో ఏం చేయాలి - అనే ప్రజల ఆలోచనకు 1969 చీలిక ఒక జవాబు.
గత అధ్యాయంలో చర్చించిన సామాజిక ఆర్థిక పరిస్థితులలో క్షీణత కొనసాగింది. 1962 నుండి ఆర్ధిక పెరుగుదల రేటు తగ్గుతూ వచ్చింది. ప్రణాళిక సంక్షోభంలో పడింది. పొదుపులు, పెట్టుబడి రేటు స్తంభించాయి. అమెరికా సహాయం 1968 నాటికి సగానికి కుచించుకు పోయింది. లంచగొండితనం, నల్లడబ్బు అంతూ పొంతూ లేకుండా పెరిగాయి. ఫలితంగా (గ్రామీణ ప్రాంతాలలో అశాంతి ప్రబలింది. పట్టణ ప్రాంతాలలోని దిగువ మధ్యతరగతులలో, విద్యార్థులలో, కార్మికవర్గంలో అసంతృప్తి పెదిగింది. అంతేగాక దేశంలోని వివిధ ప్రాంతాలలో నక్సలైట్లు ఉద్యమాలలాగా రాజ్యాంగేతర హింసా పద్ధతులు అవలంబించే వైఖరి పెరిగింది. కార్మికులు తమ డిమాండ్లు ఆమోదింపబడదే వరకు ఫ్యాక్టరీ మేనేజర్లను గంటలు, రోజుల తరబడి వారి ఆఫీసులలో నిర్బంధించే, ఘెరావ్‌లు అనే కొత్త పోరాట రూపాలు ఆవిర్భవించాయి. ఘెరావ్‌లు ఆ తరువాత విద్యా సంస్థలలాంటి ఇతర రంగాలకు వ్యాపించాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 309
గత అధ్యాయంలో ప్రస్తావించిన పాలనా బాధ్యతల నిర్వహణ, పార్టీ నిర్మాణ బాధ్యతల నిర్వహణ విభాగాల మధ్య సంబంధాలపై అపరిష్కృతంగా ఉన్న సమస్య మరలా ముందుకు వచ్చింది. 1967 ఎన్నికలలో సిండికేట్ దెబ్బతిన్న తరువాత, ప్రభుత్వంపై ఇందిరాగాంధీ ఒక మేరకు అదుపు సాధించినప్పటికీ పార్టీపై ఆమెకు పట్టులేదు. అంతేగాక కామరాజ్, యస్.కె.పాటిల్ ఉప ఎన్నికలలో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు సిండికేటుకి శత్రువుగా ఉన్న మొరార్టీ దేశాయ్ సిండికేటుతో చేతులు కలిపొడు. సిండికేట్ బలం పుంజుకుంది. పార్టీ వర్కింగ్ కమిటీ విధానాల రూపకల్పన చేస్తుందని ప్రభుత్వం అమలు జరుపుతూ పార్టీకి జవాబుదారుగా ఉండాలని సిండికేట్ స్పష్టంగా చెప్పింది. పార్టీ వ్యవహారాలలో ఇందిరాగాంధీ జోక్యాన్ని నిశ్చితంగా సిండికేట్ అనుమతించలేదు. 1967 చివరలో కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కామరాజ్ విరమణ తరువాత ఇందిరాగాంధీ తనకనుకూలమైన వానిని కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఎంపిక చేసుకొనడాన్ని అడ్డుకొన్నది. సిండికేట్ సభ్యుడైన నిజలింగప్పకి ఆ పదవి దక్కింది. ఇందిరాగాంధీ తన వారిని వర్కింగు కమిటీకి ఎన్నికయ్యేలా చేయలేకపోయింది.
1968-69 కాలంలో సిండికేట్ సభ్యులు తమ వైఖరికి అనుకూలమైన తర్కంతో ఇందిరాగాంధీని ప్రధానమంత్రి పదవి నుండి తొలగించే కుట్ర ప్రారంభించారు. 1969 మార్చి 12న నిజలింగప్ప తన డైరీలో ఇలా వ్రాశాడు “అమె (ఇందిరాగాంధీ) ప్రధానమంత్రిగా కొనసాగడానికి అర్హురాలని నేననుకోను. బహుశా త్వరలో తుది పరీక్ష వుండవచ్చు. ప్రధానమంత్రిని తొలగించవలసిన అవసరాన్ని” గురించి దేశాయ్ చర్చించాడని ఏప్రిల్ 25న వ్రాశాడు.
ఇందిరాగాంధీ ఆచి తూచి స్పందించింది. పార్టీకి లోక్‌సభలో కొద్ది మెజారిటీ మాత్రమే ఉన్నందున పార్టీతో గల ఘర్షణని త్వరితం చేయడం ద్వారా పార్టీ ఐక్యతని, తన ప్రభుత్వ ఉనికిని ఇరకాటంలో పెట్టాలని కోరుకోలేదు. ఆమెకి పార్టీలో గల బలం పరిమితమని తెల్పుస్తు, అందువలన ఆమె బాహాటమైన ఘర్షణ, విభజన నివారించేందుకు మంత్రివర్గంలోను విధానాల రూపకల్పనలోను సిండికేటుకి, దేశాయికి స్థానం కల్పించ ప్రయత్నించింది. కాని ఆమె ప్రధానమంత్రి సర్వోన్నత న్థాయి అధికారాల విషయంలో గాని లేక పరిపాలనా విధానాలలో ప్రభుత్వానికి గల అధికారం విషయంలోగాని రొజీ పడదు. ('ప్రభుత్వానికి అధికారం పార్లమెంటు ద్వారా, ఎన్నికల నుండి ప్రజల ద్వారొ సంక్రమించింది గాని పార్టీ వలన కాదని ఆమె స్పష్టం చేసింది. కాబట్టి తన పదవికి 310 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
'పత్యక్ష సవాల్ ఎదురైనప్పుడు ఆమె నిష్కర్షగా అనూహ్యమైన శక్తితో పోరాడుతుంది. షార్టీతో ప్రాధాన్యత స్థానం పొందాలని కూడా నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటంలో సైద్ధాంతికపరమైన అంశాలున్నాయి. 1967 ఎన్నికల తరువాత పరస్పర సంబంధం గల రెండు అంశాలు (ప్రాధాన్యతని సంతరించుకొన్నాయి. ఒకటి: పెరుగుతున్న ప్రజల అసమ్మతి, దానితోపాటు చెలరేగే హింసతో ఎలా వ్యవహరించాలి? రెండవది: పార్టీ ప్రస్తుత స్థితిని అధిగమించి ప్రజల మద్దతు ఎలా పొందాలి? ఈ సమస్యలను పరిష్క్మరించడంలోను అలాగే ఆర్థిక రాజకీయ విధానాలకు దిశానిర్దేశం చేయడంలోను పార్టీ విసృతంగా మితవాద, వామపక్ష రఅుంథాలలో విభజితమయింది. కాం(గైెస్లో ఎప్పుడూ సిద్ధాంతపరంగా వైవిధ్యమున్నప్పటికీ విభిన్న సైద్దాంతిక ధోరణులకు వివిధ విభాగాల ప్రయోజనాలకు స్థానం కల్పిస్తూ పార్టీ వామపక్ష మధ్యేవాదం వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. 1967 ఎన్నికల తరువాత అత్యధిక కాంగ్రెస్ వాదులు తొలి స్పందన వామపక్షం వైపు మొగ్గుకి అనుకూలంగా ఉంది. ఆ విధంగా 1967 మేలో కాంగ్రెస్ వర్మింగు కమిటీ సమూలమైన మార్పులు కోరే 10 అంశాల కార్యక్రమాన్ని ఆమోదించింది. పది అంశాలు :- బ్యాంకులపై సామాజిక నియంత్రణ, ఇన్సూరెన్సు జాతీయం, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎగుమతుల దిగుమతుల వాణిజ్య నిర్వహణ, పట్టణ ఆస్తి ఆదాయాలపై పరిమితులు, వాణిజ్య గుత్తాధిపత్యంపై మరింత అధికార కేంద్రికరణపై అదుపు, ఆహార ధాన్యాల ప్రజాపంపిజీ, భూసంస్కరణల త్వరిత అమలు, గ్రామీణ పేదలకు ఇండ్ల స్థలాల ఏర్పాటు, సంస్థానాధీశుల (ప్రత్యేకాధికారాల రద్దు. కాంగ్రైస్లోని మితవాద భావాలు గలవారు, గతంలో నెహ్రూ (ప్రభావానికి లోబడినవారు ఇప్పుడు తమ మితవాద విధానాలను బాహాటంగా సమర్థించుకొనడానికి సిద్ధమయ్యారు. కామరాజ్ మినహా ఇతర సిండికేట్ సభ్యులు, మొరార్టీ దేశాయ్ లాంఛనప్రాయంగా 10 అంశాల కార్యక్రమాన్ని ఆమోదించారు. కాని వాటి అమలుని అడద్దుకోవాలని నిర్ణయించారు. పది అంశాలకు బదులుగా మితవాద పక్షం (1) ఆర్థిక రంగంలో ప్రణాళికావిధానాన్ని బలహీనపరచడం, పబ్లిక్ సెక్టారు (ప్రాధాన్యత తగ్గింపు, 'పైవేటు వాణిజ్యానికి విదేశీ పెట్టుబడికి ప్రోత్సాహం (2) విదేశీ విధానంలో పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికాతో ఆర్ధిక, రాజకీయ సంబంధాలను పటిష్టపరచుకోవడం, (39) రాజకీయ రంగంలో ధనికరైతుల, పెద్ద భూస్వాముల మద్దతు తిరిగి పొందేందుకు స్వతంత్రం తర్వాత భారతదేశం తేక
వామపక్షాల్ని, నిరసన ఉద్యమాల్ని ప్రత్యేకించి గ్రామీణ పేదల్ని అణచివేయడాన్ని సమర్థించింది.
కాంగ్రెస్‌లోని వామపక్ష వాదులు నెహ్రూ సోషలిస్టు అజెండాలోని రాజకీయ ఆర్థిక విధానాలను చేపట్టాలని వాదించారు. కాంగ్రెస్ తక్షణమే పది అంశాల కార్యక్రమాన్ని అమలు జరపాలని, సమూలమైన సంస్కరణల ప్రాతిపదికన పట్టణ, (గ్రామీణ పేదల్ని హరిజనులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు- లాంటి సామాజికంగా వెనుకబడిన గ్రూపుల్ని ఆకట్టుకోవాలని వాదించారు. కార్మికవర్గ సమరశీలతను పాలనాపరమైన అణచివేతతోగాక, ఆర్థిక రాయితీలతో తటస్థం చేయాలన్నారు. కాంగ్రెస్ మరొకసారి సామాజిక మార్చుకి ఆర్థికాభివృద్ధికి వాహకం కావాలని ఆకాంక్షించారు. విదేశీ సహకారంపై వీలైనంత తక్కువ ఆధారపడే విధంగా ప్రణాళికా విధానాన్ని అలాగే త్వరిత పారిశ్రామికీకరణని చేపట్టాలన్నారు. ప్రజాస్వామ్య పనివిధానం ప్రాతిపదికన, అట్టడుగు స్థాయి నుండి పునర్జీవాన్ని సమకూర్చే విధంగా పార్టీ పునర్నిర్మాణం జరగాలని నొక్కి చెప్పారు. విదేశీ విధానంలో వామపక్ష వాదులు సోవియట్ బ్లాకుతోను, యుగోస్లోవియా, ఈజిష్ట, ఇతర అలీన దేశాలతో సన్నిహిత సంబంధాలను సమర్థించారు.
కాంగ్రెస్‌లోని మితభావాలు గలవారికి వామపక్ష భావాలు గలవారికి మధ్య ఘర్షణ పెరగడంతో మితవాద భావాలు గల వారు పార్టీలో క్రమశిక్షణ పెరగాలన్నారు. మరొకవైపు వామపక్ష వాదులు మొరార్దీ దేశాయ్ బడావ్యాపారవేత్తల ప్రతినిధి అని బాహాటంగా దాడి చేశారు. పూర్తిగా బ్యాంకుల జాతీయకరణ, మాజీ పాలకుల రాజభరణాల రద్దు, రాజకీయ పార్టీలకు కంపెనీల విరాళాలపై నిషేధం కొ రకు పట్టుబట్టారు.
కాంగ్రెస్‌లోని మితవాదుల, వామపక్షవాదుల మధ్య పోరాటం తీవతరమవడంతో ఇరుపక్షాలు కూడా సైద్ధాంతికంగా తమకు సన్నిహితులుగా ఉండే ప్రతిపక్ష పార్టీలు బయట నుండి ఇచ్చే మద్దతుపై ఆధారపడడం ప్రారంభించారు. జరీర్మసానీ మాటల్లో చెప్పాలంటే “యంగ్ టర్కులు” కమ్యూనిస్టుల, ఇతర వామపక్ష పార్టీల సహకారాన్ని కోరారు. స్వతంత్ర జన సంఘ్ పార్టీలతో అవగాహనకు సిండికేట్ సిద్ధపడింది. కాం(ైస్ చీలితే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో సారూప్యతగల ప్రతిపక్ష పార్టీలను మిత్రులుగా భావించారు.
తొలుత ఇందిరాగాంధీ సంస్థాపరమైన సిద్ధాంతపరమైన విభజనని, పార్టీలో చీలికని నివారించేందుకు, పార్టీలోని మితవాద వామపక్ష వాదుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలో జాగ్రత్తతో కూడిన నిష్పాక్షిక వైఖరి నవలంబించారు. కాని ప్రజల అవసరాలు త్12 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆకాంక్షలు అవగతం చేసుకొన్న ఇందిరాగాంధీ వామపక్ష మధ్యేవాద కార్యక్రమాలు విధానాలతో పాద్దీ, అలాగే దేశం అభివృద్ధి చెందుతాయని విశ్వసించారు. క్రమంగా ఆమె సందిగ్ధంగా జాగ్రత్తగా వామపక్ష వైఖరిని, ఆర్ధిక విధానాలను ఎంపిక చేసుకొన్నారు.
1969 మేలో సంభవించిన రాష్ట్రపతి డాక్టర్ జాకీర్‌హుస్సేన్ మరణంతో ఘటనలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌లో చీలికను తొందరపెట్టాయి. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి లాంఛనప్రాయమైనదైనప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంట్ ఏర్పడితే అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరిని ఆహ్వానించడం ద్వారా నిర్ణయాత్మక పాత్ర నిర్వహించవచ్చు. కాబట్టి సిండికేటు తమ మనిషిని రాష్ట్రపతి చేయాలని నిర్ణయించింది. జూలై 11 నుండి 13 వరకు బెంగుళూరులో జరిగిన పార్టీ సదస్సులో ఇందిరాగాంధీ వ్యతిరేకించినప్పటికీ, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో మెజారిటీ గల సిండికేటు ప్రముఖ సిండికేటు సభ్యుడైన సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా ప్రకటించింది.
సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకొని తనను ప్రధానమంత్రి నుండి తొలగించాలనే సిండికేటు పథకాన్ని గమనించిన ఇందిరాగాంధీ, మార్గాంతరంలేని స్థితిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని పోరాటం తుదివరకు సాగించాలని నిర్ణయించారు. సమూలమైన మార్పుల్ని కోరే సిద్ధాంతాన్ని ముఖ్యమైన ఆయుధంగా ఎంచుకొన్నారు. బెంగుళూరు సదస్సు తరువాత కొద్ది రోజులకు - జూలై 18న ఇందిరాగాంధీ తన సమూలమైన మార్పుల కార్యక్రమాన్ని మితవాద భావాలు గల మొరార్దీ దేశాయ్ అమలు పరచలేదనే కారణం చూపి మొరార్టీ దేశాయ్‌ని ఆర్థిక మంత్రి పదవి నుండి తొలగించారు. మొరర్దీ దేశాయ్‌కి మంత్రి వర్గం నుండి రాబీనామా చేయడం తప్ప మార్దాంతరం లేకపోయింది. ఇందిరాగాంధీ ఆర్థిక శాఖను స్వయంగా స్వీకరించి, వెంటనే జూలై 21న రాష్ట్రపతి ఆర్టినెన్స్ ద్వారా 14 పెద్దబ్యాంకుల్ని జాతీయం చేస్తున్నట్లుగా ప్రకటించారు. మాజీ రాజుల ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయనున్న తన పథకాన్ని ప్రకటించారు. ఆమె ప్రకటనల్ని వామపక్షాలు, సాధారణ ప్రజలు స్వాగతించారు. (ప్రజల మనిషిగా ఆమె పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయి.
కాని సిండికేటు, దేశాయి అవమానాన్ని దిగమింగి రెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు నిరీక్షించాలనుకొన్నారు. ఇందిరాగాంధీ యుక్తిగా పావులు కదిపారు. స్వతంత్ర, జనసంఘ్ పార్టీలు రాజనీతిజ్ఞుడు సి.డి.దేశ్‌ముఖ్‌ని అభ్యర్థిగా నిలబెట్టాయి. అప్పటి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనిర్ణయించుకొన్నాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం తం
గిరి అభ్యర్థిత్వాన్ని ఉభయ కమ్యూనిస్టులు, యస్.యస్.పి., డి.యం.కె., ముస్లింలీగ్! అకాలీదళ్‌లోని ఒక సెక్షన్ బలపరచాయి. స ఇందిరాగాంధీ గిరికి మద్దతివ్వాలనుకొన్నారు. కాని తాను స్వయంగా నామినేషన్ స గ చేయాలో అర్గం కాలేదు. పత్రాలు దాఖలు చేసిన తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎలా అరం కడుకు ఈ దశలో సిండికేటు పెద్ద తప్పు చేసింది. రెడ్డి గెలుపును ఖాయం చేసుకునం జా నిజలింగప్ప జనసంఘ్, స్వతంత్ర పార్టీ నాయకులను కలిసి వారి రెండవ పాదా ఓట్లను రెడ్డికి వేయవలసిందిగా కోరాడు. ఇది ఇందిరాగాంధీకి మంచి అవనతం అందిచ్చింది. ఇందిరాగాంధీ తనను (ప్రధాని పదవి నుండి తొలగించేందుకు సిండి న్ మతతత్వ అభివృద్ధి నిరోధక శక్తులతో రహస్య ఒప్పందం చేసుకొన్నదని ఆరోపించారు ఇక ఇప్పుడు రెడ్డికి అనుకూలంగా పార్టీ విప్ జారీ చేయడాన్ని నిరాకరించి బాహాటంగా బలపరచారు. కాంగ్రెస్ పార్టీ యం.పి.లు, ఎమ్మెల్యేలను స్వేచ్చగా అం వంతు ప్రబోధం మేరకు ఓట్లు వేయవలసిందిగా చెప్పారు. ఎన్నికలలో దాదాపు 38వ క సభ్యులు పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి గిరికి ఓట్లు వేశారు. గిరి ఆగస్టు 20న స్వంఖి మెజారిటీతో ఎన్నికయ్యాడు. ఇరుపక్షాలు కొద్దికాలంగా మౌనంగా ఉండిపోయాయి. నవంబరు రిస ఇందిరాగాంధీ కాంగ్రెస్ వారికి ఒక బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో ం ప్రకటించారు:- 'ఈనాడు మనం చూస్తున్నది వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు. అధికొ న కొరకు పోరాటం కాదు. ఇది సోషలిజం కొరకు మార్పు కొరకు పార్టీలో సంపూర్ణకా అంతర్గత (ప్రజాస్వామ్యం. చర్చ కొరేవాళ్లకు, సాంప్రదాయవా దాన్ని యథాస్టిత రాపొదాలని కోరే వాళ్లకు మధ్య ఘర్షణ. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజం కొరకు అంతర్తాతీయ సంబంధాలలో అలీన విధానం కొరకు కృషి చేస్తుంది. దొ సిండికేట్స ఇందిరాగాంధీ మోసకారి అని, అధికారం మొత్తం తన చేతుల్లొ కేంద్రీకరించుకోవాలని ఆకాంక్షిన్తున్నదని, కమ్యూనిన్సు నియంతృత్వాన్ని. స్థాపించయత్నిస్తున్నద్రని ఆరోపించింది. ఓటమికి, అవమానానికి గురయిన సిండికేటు నవంబరు 12న ఇందిరాగాంధీపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించినందుకు అమెను పార్టీ నుండి బహిష్కరించింది. చివరికి పార్టీ చీలిపోయింది. ఇందిరాగాంధీ పోటీ కాంగ్రెస్ సంస్థ కాంగ్రెస్(ఆర్) స్థాపించింది. సిండికేట్ నాయకత్వంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ (ఒగా పిలువబడింది. పార్టీ లోక్‌సభ సభ్యులలో 220 మంది ఇందిరాగాంధీతో ఉన్నారు. తశ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సిండికేట్‌తో 68 మంది ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఉన్న 705 మంది సభ్యులలో 446 మంది ఇందిరాగాంధీ పక్షం వహించారు.
కాం(గ్రైస్(ఆర్) ఏ విధంగాను వామపక్ష పార్టీకాదు. దానిలో గతంలో కాంగ్రెస్‌లో ఉన్నట్లే అన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక భావాలు గలవారున్నారు. కాని గతానికి ఇప్పటికి ఒక తేడా ఉంది. భారత రాజకీయాలలో అది వామపక్ష మధ్యేవాద (1౬6%-0£ 06౧66) స్థానాన్ని ఆక్రమించింది. కాం(ెస్(ఒ) మితవాద మధ్యే (౧8౧౦౬06౧66) స్థానాన్ని ఆక్రమించింది. అంతేగాక ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి, కొత్త పార్టీకి తిరుగులేని నాయకులయ్యారు. కొద్ది కాలానికే ఈ కొత్త పార్టీయే అసలైన కాంగ్రెస్ అయింది. పేద, మధ్యతరగతుల ప్రజలు మేధావి వర్గంలోని అత్యధికులు ఇందిరాగాంధీతో వున్నారు. వాస్తవంగా ఆమె తండ్రి ఎప్పుడూ పొందనంత రాజకీయాధికారం ఇందిరాగాంధీ పొందారు. 1977 సాధారణ ఎన్నికల దిశగా
ఇందిరాగాంధీ సిండికేట్‌పై స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, ఆమె పార్టీకి పార్లమెంటులో మెజారిటీ లేనందు వలన ఆమె రాజకీయంగా ఇంకొ బలహీనంగానే ఉన్నారు. ఆమె ప్రభుత్వం సమస్య ప్రాతిపదికన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కొందరు సోషలిస్టులు ఇచ్చే మద్దతుపైన, అలాగే డియంకె, అకాళీీదల్, కొందరు ఇండిపెండెంట్లు ఇచ్చే మద్దతుపై ఆధారపడి వుంది. ఐనప్పటికీ తమ వామపక్షమధ్యే వాద వైఖరిన్ కొనసాగిస్తూ చాలా చర్యలు చేపట్టారు. వివక్షతతో కూడుకొన్నదని, చెల్లించిన నష్టపరిహారం తగినంతగా లేదనే కారణాలు చూపి 1970 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు బ్యాంకుల జాతీయీకరణని రద్దు చేసినపుడు ప్రభుత్వం చట్టపరమైన అవరోధాల్ని అధిగమించి బ్యాంకుల్ని తిరిగి జాతీయం చేసేందుకు రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ని ప్రయోగించింది. జాతీయం చేయబడిన బ్యాంకుల ద్వారా చిన్నతరహా వ్యాపారులకు, రైతులకు, రిక్షా, టాక్సీ దైవర్లకు అప్పులు ఇప్పించడం లాంటి చాలొ పథకాలను ప్రవేశపెట్టింది.
1970 ఆగస్టులో రాజభరణాల్ని, రాజులకు వున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేసేందుకు చేపట్టిన రాజ్యాంగ సంస్కరణ రాజ్యసభలో ఒక్క ఓటుళతో వీగిపోయినప్పుడు ప్రభుత్వం రాజాల గుర్తింపును రద్దు చేస్తూ వారి ఆర్థిక, ఇతర ప్రత్యేక హక్కులకు అంతం పలుకుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించింది. కానీ సుట్రీంకోర్టు ఈ ఉత్తర్వుని కూడా చెల్లకుండా చేసింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 315
కొద్దిమంది పెట్టుబడిదారులు అనేక పారిశ్రామిక సంస్థల్ని అదుపు చేయడానికి అవకాశం కల్పించిన మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. చాలా కొద్ది వ్యాపార కుటుంబాల చేతుల్లో ఆర్ధికాధికారం కేంద్రీకృతమవటాన్ని అదుపు చేసేందుకు 1969లో చేయబడిన యం.ఆర్.టి.పి. చట్టం (కింద ప్రభుత్వం యం.ఆర్.టి.పి. కమిషన్ నియమించింది. అప్పటికి ఉన్న భూసంస్కరణ చట్టాల్ని కఠినంగా అమలు జరుపమని ఇంకా భూపరిమితి చట్టాలను చేపట్టమని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రుల్ని ఆదేశించింది. చాలా కాలంగా వాయిదా వేయబడుతున్న నాల్గవ పంచవర్ష ప్రణాళికని ప్రారంభించింది. ప్రణాళికా వ్యయాన్ని మూడవ ప్రణాళికా వ్యయానికి రెట్టింపు చేసింది.
1962 నుండి ఆవహించిన నిరాశ, నిరుత్సాహము, నిర్లిప్తఊలను అద్దుకొని ఒక ఆశావహ వాతావరణాన్ని సృష్టించడం ఇందిరాగాంధీ సాధించిన రాజకీయ విజయం. ఆమె సమసమాజ పథకాలు, నినాదాల ఫలితంగా ప్రజల దృష్టిలో ఎంతో ఎదిగిపోయారు. ఆమె కాంగైస్ పార్టీ సామాజిక మద్దతుని- ప్రత్యేకించి గ్రామీణ పట్టణ పేద ప్రజలలో ఒక మేరకు పట్టణ మధ్యతరగతులలో తిరిగి పొందింది. అదే సమయంలో సంపన్న వైతులు, పెట్టుబడిదారులు దూరం చేయబడ్డారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం కనుక లోక్‌సభలో ఒక చట్టాన్ని ఆమోదింపచేయడానికి ఆమె ఇతరులపై ఆధారపడవలని వచ్చింది. ఈ పరిస్థితి అధిగమించేందుకు ఎన్నికలు జరపాలి. అందుకు సమయం సందర్భం కొరకు ఎదురు చూస్తుంది. రాజభరణాల రద్దును సుప్రీంకోర్టు నిరాకరించడంతో అందుకు అవకాశం లభించింది. 1970 డిసెంబరు 27న లోక్‌సభను రద్దు చేసి ఒక సంవత్సరం ముందుగొ ఎన్నికలక్రు పిలుపిచ్చింది.
కమ్యూనిస్టేతర ప్రతిపక్షపార్టీలు - కాంగ్రెస్(ఒ), జనసంఘ్, స్వతంత్ర, సంయుక్త సోషలిస్టు షార్టీ _ బ్ర్వక్రాశవాద సూత్రరహితకూటమి- గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు
చేశాయి. ఎలాంటి సైద్ధాంతిక పొందిక, సానుకూలమైన ఉమ్మడి కార్యక్రమము లేకపోవడంతో గ్రాండ్ అలయన్స్ తన ఆగ్రహాన్ని ఇందిరాగాంధీ వ్యక్తిపై కేంద్రీకరించింది. “ఇందిరా హటావో? (ఇందిరని ఓడించండి) దాని ప్రచార నినాదమయింది. ఇందిరాగాంధీని వ్యక్తిగతంగా దూషించడం ఎన్నికల ప్రధానాంశమయింది.
త1ే6 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అందుకు పూర్తి విరుద్ధంగా ఇందిరాగాంధీ వ్యక్తిగత దూషణలు చేయలేదు. సామాజిక మార్పు, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజం లాంటి జాతీయ సమస్యలపై (ప్రచారం సాగించింది. ప్రత్యేకించి పబ్లిక్ సెక్టార్ అభివృద్ధి, గ్రామీణ భూకమతాలపై పట్టణ ఆస్తిపై పరిమితి విధింపు, ఆదాయంలో అవకాశంలో విపరీతంగా వున్న వ్యత్యాసాల తొలగింపు, రాజభరణాల రద్దుపై అమె కేంద్రీకరించారు. ఇంకా విచ్చిన్నకర మతతత్వ శక్తిమైన జనసంఘ్‌పై హింసకు మద్దతిస్తున్నందుకు వామపక్ష తీవ్రవాదులపై ఆమె విరుచుకుపడ్డారు. సామాజిక మార్పుని తెచ్చే తన ప్రయత్నాలకు అడ్డుపడుతున్న వారిని ఓడించాలని ఆమె నేరుగా ఓటర్లను అర్ధించింది. ఆమె భూమిలేని వ్యవసాయ కూలీల్ని, షెడ్యూల్డు కులాలు, తెగల వారిని, మైనారిటీలను, మహిళల్ని నిరుద్యోగ యువతని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందిరా హటావో నినాదాన్ని “గడిబీ హటావో” (పేదరికాన్ని తొలగిద్దాం) నినాదంతో తిప్పి కొట్టింది. మధ్యతరగతి, సంపన్న వర్ధాలకు బలమైన స్థిరమైన ప్రభుత్వం, హింస, అలజడులు సృష్టించే వారిపై కఠినమైన చర్యలు, మిశ్రమ ఆర్థిక విధానంలో ్రైవేటు సెక్టార్‌కి పూర్తి అవకాశం, వగైరాలు వాగ్గానం చేసింది.
ఫిబ్రవరి ఎన్నికల ఫలితాలు ఇందిరాగాంధీకి ప్రబలమైన వ్యక్తిగత విజయంగా ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా పరిణమించాయి. కాం(గ్రైస్(ఆర్) 518 లోక్‌సభ స్థానాలకు గాను 352 స్థానాలు గెలిచి అఖంద విజయం సాధించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. గ్రాండ్ అలయన్స్, మితవాద పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఎన్నికలలో గణనీయమైన ఫలితాలు పొందిన పార్టీలు సిపిఎం, సిపిఐ, డియంకెలు. చివరి రెండు కాంటెసి మిత్రపక్షాలే.
1971 ఎన్నికలు భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రముఖ స్టానొన్ని. తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని సామాజిక మార్పుని కోరుకున్నారు. 1967 తరువాత రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాల అనుభవంతో ప్రజలు ఫిరాయింపుల నాటకం, కేంద్రంలో పార్టీల విధేయతలు మాటి మాటికీ మారడం పునరావృతం కావాలని కోరుకోలేదు. ఎన్నికలు ప్రజలు రాజకీయీకరణ చెందటానికి కూడా ప్రాతినిధ్యం వహించాయి. ప్రజలు మతం, కులం, ప్రాంతం అవరోధాలను అధిగమించి ఓటు చేశారు. జాతీయ సమస్యల ఎదుట ఓటు బ్యాంకులు, ప్రాపక రాజకీయాలు అసంబద్ధమని ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రజలు ఆదేశాలకు, బెదిరింపులకు, డబ్బుకు లొంగరని స్పష్టం చేశారు. ఆ విధంగా ఇందిరాగాంధీ ఒక స్వతంత్రం తర్వాత భారతదేశం 817
జాతీయ కార్యక్రమం చుట్టూ బడుగు బలహీన వర్గాల కూటమి నిర్మాణం రాజకీయ ప్రత్యామ్నాయమని నిరూపించకలిగింది. ఇందిరాగాంధీ తానాశించిన రాజకీయాధికారం పొందింది. ఆమె కాంట తిరుగులేని నాయకురాలయింది. దేశంలో ప్రబల రాజకీయ శక్తి అయింది. అమో ఇక ఎవరూ “గూంగి గుడియా' అనలేరు. కానీ ఓటర్లు ప్రత్యేకించి పేదలు అమ్మ వుంచిన విశ్వాసం ప్రమాద సూచికకు కూడా ప్రాతినిధ్యం వహించింది. ఆమ ప్రజల ఎన్నో ఆశల్ని రేకెత్తించింది. ఇప్పుడు ఆ వాగ్దానాలను నెరవేర్చాలి. వి చ చేయడానికైనా ఎలాంటి పాలనాపరమైన చర్యలు చేపట్టడానికైనా పార్దమెంట కావలసినంత బలం వుంది. వైఫల్యానికి ఎలాంటిసాకులు, నెపాలు ఎన్నడానికి అవకొ లేదు. కాని ఇందిరాగాంధీ (ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే బంగ్లాదేశ్ సంక్షోభం వచ్చిపడింది. ఫలితంగా 1971 ఎన్నికల వాగ్దానాల ర్ వాయిదా పడింది. బంగ్లాదేశ్ సవాల్ 1971 సాధారణ ఎన్నికలైన వెంటనే తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్‌లో పెద్ద రాజకీయ మిలటరీ సంక్షోభం ప్రారంభమయింది. భారత పాకిస్తాన్ల మధ్య యుదానికి దారి త్రీసేవిధంగా భారతదేశం బరిలోకి లాగబడింది. భారతదేశంలోని ముస్లింలు ప్రత్యేకమైన జాతి అనే విశ్వాసం, సైద్ధాంతిక అందో ప్రాతిపదికన పాకిస్తాన్ సృష్టించబడింది. కానీ మతం మాత్రమే పశ్చిమ పాకిస్తాన్ /.1 పంజాబీ మ్రాట్లాడ్డే ప్రజల్ని తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ మాట్లాడే ప్రజల్ని క ఉంచలేదు, పశ్చిమ పాకిస్తాన్‌లోని రాజకీయ ఆర్టిక ఉన్నత వర్గం పాకిస్తాన్ యొ, సైనిక, ఉన్నత్రాధకార ఆరిక రాజకీయ రంగాలలో ప్రబలమైన స్థానం ఆక్రమించారు. ఫలితంగా తూర్పు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా రాజకీయ, ఆర్ధిక వివక్షత ప్రబలింది అంతేగాక రాజకీయ (ప్రజాస్వామ్యం లేకపోవడంతో బెంగాలీలకు పరిస్థితిని చక్కదిద్దుకునే నిర్మాణ విధానం లేదు. ఫలితంగా కాలక్రమంలో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కొరకు తూర్పు ప్రాక్రిస్తాన్షక్రి ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తి కొరకు తూర్పు పాకిస్తాన్ ప్రజలు శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించారు. పాకిస్తాన్ పాలకులు ఉద్యమ నాయకులతో చర్చలు జరపడానికి బదులుగా ఉద్యమాన్ని అణచివేయాలని నిర్ణయించారు. ఫలితంగొ 3918 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉద్యమ స్వరూపం మారిపోయింది. పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యాన్ని కోరే ఉద్యమంగా మారింది.
పాకిస్తాన్ మిలటరీ నియంత జనరల్ యావ్వ్యాఖాన్ 1970 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాడు. ఎన్నికలలో షేక్ ముజిబూర్ రహమాన్ నాయకత్వంలో బెంగాలీల అవామీ పార్టీ తూర్పు పాకిస్తాన్లో 99 శాతం సీట్లను, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ స్థానాల్ని గెలిచింది. కాని అవామీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటాన్ని ప్రముఖ పశ్చిమ పాకిస్తాన్ నాయకుడు జుల్ఫీకర్ ఆలి భుట్టో మద్దతుతో సైన్యం, యాహ్స్చాఖాన్ తిరస్కరించారు. రాజ్యాంగ అమలుకై ముజిబూర్ రహమాన్ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించాడు. ఒక్కసారిగా 1971 మార్చి 25న యాహ్యాఖాన్ తూర్పు పాకిస్తాన్‌పై తీవ్రమైన మిలటరీ చర్యకై ఆదేశాలు జారీ చేశాడు. ముజిబూర్ రహమాన్ పళ్చిమ పాకిస్తాన్‌లోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించబడ్డ్దాడు. పశ్చిమ పాకిస్తాన్ సైన్యం అమాయక ప్రజల్ని చంపింది. పంటల్ని, గ్రామాల్ని తగులబెట్టింది. భయోత్సాతాన్ని సృష్టించింది. ప్రజలకు ఎలాంటి నాయకత్వం లేకుండా చేసేందుకు వేలాదిమంది మేధావుల్ని పోలీసు మిలటరీలో పని చేస్తున్న వారిని విచక్షణా రహితంగా ఒక క్రమపద్ధతిలో నాశనం చేసింది. సైనికులు మానభంగాలు చేశారు. చిత్రహింసలు పెట్టారు. గృహదహనాలు చేశారు. దారుణ హత్యాకాండ సాగించారు. ఇంకొ పలు నీచాతి నీచమైన నేరాలు చేశారు. ఈ బీభత్స కాండ ఆరు నెలలపాటు సాగింది. తూర్పు పాకిస్తాన్ పోలీసు, పారామిలటరీ సంస్థలు, తూర్పు బెంగాల్ సైనిక రెజిమెంటు- విభాగాలలోని పెద్ద పెద్ద సెక్షన్లు తిరుగుబాటుకి స్పందించారు. కలకత్తాకి పారిపోగలిగిన అవామీలీగ్ నాయకులు ప్రవాసంలో బంగ్లాదేశ్ (ప్రభుత్వాన్ని ఏర్పరచారు. ముక్తివాహిని (విముక్తి సైన్యం) నిర్మించారు. అజ్ఞాత ఉద్యమాన్ని గొరిల్లా యుద్దాన్ని ప్రారంభించారు.
తూర్పు పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువులపై పాకిస్తాన్ సైన్యం పాశవికంగా ప్రవర్తించింది. దారుణ హత్యాకాండ సాగించింది. పలువురు ముస్లింలు, క్రైస్తవులు: బౌద్ధులు తప్పనిసరియైన పరిస్థితులలో ప్రాణాలు కాపాడుకునేందుకు వలసబాట పట్టారు. భారతదేశంలోని పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయలలో ఆశ్రయం పొందారు. 1971 నవంబరు నాటికి తూర్పు బెంగాల్ కాందిశీకుల సంఖ్య 10 మిలియన్లకు చేరింది.
భారతదేశంలో తూర్పు బెంగాల్ ప్రజలపట్ల సానుభూతి వెల్లువెత్తింది. ప్రజలు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా సత్వర చర్య చేపట్టమని డిమాండ్ చేశారు. కాని ఇందిరాగాంధీ యుద్ధం ఆవశ్యకతని గృర్తించి కూడా తొందరపడకూడదనుకొంది. సంక్షోభకాలమంతటా స్వతంత్రం తర్వాత భారతదేశం 89
ఎంతో జాగ్రత్తగా తగు అంచనాలతో పరిస్థితిని సాహసోపేతంగా ఎదుర్శొన్నది. తూర్పు పాకిస్తాన్లో స్వయం ప్రతిపత్తి కొరకు సాగుతున్న ఉద్యమం ఫలితంగా చెలరేగిన తిరుగుబాటు- అంతా కూడా ప్రజల తిరుగుబాటు కాదని, భారతదేశ కుట్రయని పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చకూడదనుకొన్నది. భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని నియమాల్ని అతిక్రమిస్తుందనే ఆరోపణకు బలం చేకూర్చే ఏ చర్యా చేపట్టడం అమెకి ఇష్టం లేదు.
సంయమనం పాటించే విధానం అనుసరించడంలో ఇందిరాగాంధీ దృష్టిలో రెండు పెద్ద అంశాలు ఇమిడి వున్నాయి. యుద్ధం చేయవలసి వస్తే అది భారతదేశం ఎంచుకొన్న సమయంలో జరగాలి. అందుకు జాగ్రత్తతో కూడిన ప్రణాళిక సన్నాహాలు అవనరం,. వర్షాకాలంలో తూర్పు పాకిస్తాన్‌లోని నదులు, ఉవనదులు పొంగిపొరలుతున్నప్పుడు, ముందుకు పోవటానికి వీలుపడని విధంగా చిత్తడి నేలలున్నప్పుడు మిలటరీ చర్యలు చేపట్టకూడదు. చలికాలంలో హిమాలయాల కనుమలు మంచుతో కప్పబడి, చైనా జోక్యం చేసుకొని పాకిస్తాన్‌కి అనుకూలంగా సైన్యాన్ని తరలించడం అసాధ్యమవుతుంది. పాకిస్తాన్ సైన్యాన్ని యుద్దంలో ఎదుర్కొనటానికి తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు ముక్తివాహినికి గూడా కొంత సమయం అవసరం.
రెండవది : అంతర్జాతీయాభిప్రాయాన్ని చైతన్యపరచాలని, బంగ్లాదేళ్కి అనుకూలంగా మలచాలని, కాందిశీకుల విషయంలో భారతదేశం యొక్క క్షిష్టపరిస్థితిని అవగతమయ్యేలా చేయాలని, భారత దేశం యొక్క ఆర్థిక రాజకీయ స్థిరత్వానికి భంగం కలిగిస్తూ కాందిశీకులు భారతదేశంపై ఎలాంటి భారం మోపుతున్నారో తెలియజెప్పాలని ఇందిరాగాంధీ గుర్తించింది. ఇలా చేయడం వలన ఇతర దేశాలు భారతదేశం పట్ల సానుభూతిగా వుంటాయని లేక కనీసం ప్రతికూలంగా ఉండవని ఇందిరాగాంధీ ఆశించింది. కాందిశీకులు ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే తిరిగి వెళ్లాలని ఇందిరాగాంధీ నొక్కి చెప్పింది. కాని ఇది పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్లో విశ్వాసం, శాంతి వాతావరణం కల్పించినపుదే సాధ్యపడుతుంది.
తరువాత 8 మాసాలు ఇందిరాగాంధీ నాలుగు అంశాల విధానాన్ని అనుసరించారు. భారతదేశం ప్రవాస బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఆశయం ఇవ్వడమేగాక భారత సైన్యం భారత భూభాగంపై మిలటరీ శిక్షణ కూడా ఇచ్చింది. ముక్తి వాహినికి ఆర్థికంగా మిలటరీ సరఫరా పరంగా కూడా సహాయపడింది.
భారత ప్రభుత్వం ఆర్థికంగా పెద్దభారమైనప్పటికీ కాందిశీకులకు ఉదారంగా ఆహారం, బట్టలు, వైద్య సదుపాయాలు కల్పించింది. కాందిశీకుల సమస్యకు శాంతియుత 320 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పరిష్కారము సాధ్యపడని పక్షంలో త్వరితంగా సైనిక చర్యలు చేపట్టడానికి భారత సైన్యం 1971 ఏప్రిల్ ప్రారంభం నుండి అతి రహస్యంగా సన్నాహాలు ప్రారంభించింది. అంతేగాక అగ్రరాజ్యాలు జోక్యం చేసికొని యుద్ధవిరమణని విధించకముందే సైనిక చర్య పూర్తి కావాలి.
భారతదేశ (ప్రభుత్వానికి సోవియట్ యూనియన్ ఇతర తూర్పు యూరపు కమ్యూనిస్టు దేశాల ప్రజల నుండే గాక పాశ్చాత్య దేశాల పత్రికలు, మేధావులు, విద్యోర్థుల నుండి, పశ్చిమ యూరపు ప్రభుత్వాల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. కాని అమెరికా చైనా ప్రభుత్వాలు భారతదేశం పట్ల ప్రతికూల వైఖరి చేపట్టాయి. భారతదేశం యొక్క నిరసనని విస్మరించి పాకిస్తాన్‌కి అమెరికా ఆయుధ సరఫరా కొనసాగించింది. అంతేగాక సమస్యని బంగ్లాదేశ్ స్వతంత్రానికి సంబంధించిన సమస్యగాకంటే భారత్ పాకిస్తాన్ల మధ్య సమస్యగా చూపించయత్నించింది. చైనా పాకిస్తాన్‌కి మిత్రదేశం అయింది, గనుక పాకిస్తాన్‌ని పూర్తిగా సమర్ధించింది. 1971 జులై - ఆగస్టులో అమెరికా చైనాల మధ్య సామరస్యం సాధించేందుకు పాకిస్తాన్ సహాయపడింది.
వరిన్టితులు యుద్దానికి దారితీస్తే అమెరికా చైనా జోక్యం నుండి రక్షించుకొనేందుకు భారతదేశం 20 సంవత్సరాల భారత్ సోవియట్ ఒడంబడికపై సంతకం చేసింది. ఒడంబడిక పరస్పర సంప్రదింపులకు, ఒక దేశానికి యుద్ధ ప్రమాదం ఏర్పడితే సరియైన చర్యలకు అవకాశం కల్పించింది. ఒడంబడికను భారత ప్రజలు సాదరంగా స్వాగతించారు.
ఇందిరాగాంధీ ఇప్పుడు పూర్తిగా ఆత్మ విశ్వానంతో వుంది. బి.బీ.ని. కార్యక్రమంలో ఆమె ఇలా చెప్పింది: ఇతర దేశాలు ఆశిస్తున్న విధంగా మేము ఎవరిపైనా ఆధారపడిలేము. మాకు కావలసిందేదో మాకు తెలుసు. మూల్యమెంత అయినా అదే చేస్తాం. ఏ దేశం నుండియైనా సహాయాన్ని స్వాగతిస్తాం. సహాయం రాకపోయినా ఫరవాలేదు" మొదటి నుండి బంగ్లాదేశ్ సమస్యపై భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తుందని కాందిశీకులు సమస్య అనివార్యమని గ్రహించి ఇందిరాగాంధీ నవంబరు మాసాంతానికి అందుకు సన్నద్ధమయింది. భారత సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ భారత సైన్యాలు ప్రత్యక్షంగా బంగ్లాదేశ్‌కి విముక్తి కల్పించేందుకు డిసెంబరు 4ని ఎంపిక చేసినప్పటికీ యుద్ధం ప్రారంభించడం పట్ల ఇందిరాగాంధీ విముఖంగా వుంది. కాని యాహ్యాఖాన్ ఆ పని ప్రారంభించాడు. యుద్ధం వాకిట ముందుందని గ్రహించి ముక్తివాహిని, గెరిల్లా దాడులతో కలత చెంది యాహ్యాఖాన్ తొలి దెబ్బతీయాలని స్వతంత్రం తర్వాత భారతదేశం 821
నిర్ణయించాడు. భారత వైమానిక దళాలకు తీవ్ర నష్టం కలిగించేందుకు బంగ్లాదేళ్ సమస్యని అంతర్జాతీయం చేసేందుకు, ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పొందేందుకు పాకిస్తాన్ వైమానిక దళాలు డిసెంబరు 3న పశ్చిమ భారతదేశంలోని 8 విమానాశ్రయాలపై హఠాత్తుగా దాడి చేశాయి. కానీ యాహ్యాఖాన్ రెండు లక్ష్యాలూ నెరవేరలేదు. పాకిస్తాన్ దాడిని ముందే ఊహించి లోపలి విమానాశ్రయాలకు వెళ్లిపోవడం వలన భారత వైమానిక దళాలకు నష్టం వాటిల్ల లేదు. వెంటనే భారత దేశం బంగ్లాదేశ్‌ని గుర్తించింది. బలమైన దాడులు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని పశ్చిమ రంగానికి అంటి పెట్టుకొని వుండేలా చేసి, అమెరికా, చైనా లేక ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడానికి ముందే తూర్పున త్వరగా నిర్ణయాత్మక యుద్ధంతో అక్కడ వున్న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయేలా చేయటం భారతదేశ వ్యూహం. జనరల్ జె. యస్. ఆరోరా నాయకత్వంలో ముక్తి వాపొనితో కలిసి భారత సైన్యం 11 రోజులలో తూర్చుబెంగాల్ రాజధానిమయైన ఢాకా వరకు చొచ్చుకుపోయాయి. పాకిస్తాన్ రక్షణ సైన్యాన్ని చుట్టుముట్టాయి. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ “హెన్రీ కిసింజరు మాటల్లో “పాకిస్తాన్ ఓడించబడటాన్ని నిక్సన్ అనుమతించడు”. అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకొనేందుకు (ప్రయత్నించింది. భారతదేశాన్ని దురాక్రమణదారుగా ప్రకటించింది. భారతదేశానికి ఆర్షిక సహాయాన్ని ఆపివేసింది. కాని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుద్గ విరమణ, సైనిక ఉపసంహరణపై అమెరికా ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై సోవియట్ యూనియన్ వీటో ప్రయోగించింది. బ్రిటన్, ఫ్రొన్సు ైర్దాజరయ్యాయి. చైనా బెదిరింపు కూడా ఖండన మండనలకు పరిమితమయింది. దారా పతనాన్ని కొద్దికాలం పాటు వెనక్కి నెట్టే లక్ష్యంతో నిక్సన్ ఆదేశాల మేరకు 9వ తేదీన అమెరికా సప్తమ నౌకాదళం బంగాళాఖాతానికి బయలుదేరింది. ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపుని లక్ష్య పెట్టలేదు. అంతేగాక సైనిక పథకాన్ని త్వరగా పూర్తి చేయమని జనరల్ మానెక్షాని ఆదేశించింది. భారత సైనిక దళాలు డిసెంబరు 13న ఛాకాని చుట్టుముట్టాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న 98,000 పాకిస్తాన్ సైన్యం డిసెంబరు 16న లొంగిపోయింది. ఢాకా లొంగుబాటు తరువాత డిసెంబరు 17న భారత (ప్రభుత్వం పశ్చిమ రంగంలో ఏకపక్షంగా యుద్ధ విరమణ ప్రకటించింది. యుద్ధం కొనసాగించి వుంటే దౌత్యరీత్యాను మిలటరీ పరంగాను ప్రమాదకరంగా పరిణమించి ఉండేది. అమెరికొ, వైనా, ఐక్యరాజ్య సమితి చురుకుగా జోక్యం చేసుకొని ఉందేవి. యుద్ధం కానసాగింపుకి సోవియట్ యూనియన్ కూదా అనుకూలంగా లేదు. పశ్చిమ రంగంలో యుద్ధం 822 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొనసాగింపు అపారమైన ప్రాణవానిని వనరుల విధ్వంసాన్ని కలిగించి ఉండేది. తూర్పున 'పజలు ఖారత సైనికుల్ని రక్షకులుగా ఆహ్వానించారు. పశ్చిమ రంగాన ప్రజలు, సైనికులు కలిసికట్టుగా ఉన్నారు. కనుక మాతృభూమి సంరక్షణకు సర్వస్వాన్ని ఒడ్డి పోరాడుతారు. అంతేగాక పాకిస్తాన్ విచ్చిన్నం, లేక దానిలో కొంతభాగాన్ని కలుపుకొనడం భారత లక్ష్యం కాదు కనుక పశ్చిమ భాగంలో శత్రుత్వాల కొనసాగింపు లక్ష్యరహితమై వుండేది. పాకిస్తాన్ యుద్ధ విరమణ నంగీకరించింది. ముజిబూర్ రహమాన్ని విడుదల చేసింది. ముజిబూర్ రహమాన్ 1972 జనవరి 12న బంగ్లాదేశ్ పాలనాధికారాలు స్వకరించాడు. బంగ్లాదేశ్ యుద్ధం నుండి భారతదేశం చాలా ప్రయోజనాలు పొందింది. భారతదేశం ప్రబలమైన శక్తిగా ఆవిర్భవించడంతో దక్షిణాసియాలోని అధికార సమతుల్యత మార్పుకి గురయింది. తీవ్రమైన కాందిశీకుల సమస్య- 10 మిలియన్ల కాందిశీకుల్ని బంగ్లాదేశ్‌లోని వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చడంతో పరిష్కారమయింది. 1962 నాటి పరాజయం యొక్క అవమానకరమైన స్మృతి తుడిచిపెట్టబడింది. కోల్పోయిన ప్రతిష్ట ఆత్మగౌరవం పునరుద్ధరించబడ్డాయి. భారతదేశం ఇబ్బందులు కలిగించే పొరుగుదేశాన్ని జయించడమేగాక విదేశీ వ్యవహారాలలోను, జాతి ప్రయోజనాల్ని సంరక్షించుకొనడంలోను తన స్వాతంత్ర్యాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది. భారతదేశం ప్రపంచంలో ప్రబలమైన శక్తికానప్పటికీ బలహీనమైనది కాదని స్పష్టం చేయగలిగింది. యుద్ధం భారతదేశం సెక్యులరిజం యొక్క బలాన్ని రుజువు చేసింది. ఈ సంక్షోభ సమయంలో పౌరులుగ్గాగాని, సైనికులుగాగాని హిందువులు, ముస్లింలు, (క్రైస్తవులు, సిక్కులు, ఒక ముస్లిం దేశానికి వ్యతిరేకంగా దృఢంగా ఐక్యంగా నిలబడ్డారు. అంలేగాక 1947లో విభజనకి ప్రాతిపదిక అయిన ద్విజాతి సిద్ధాంతంపై దెబ్బతీశారు. ఆ సెద్దాంతాన్ని సమర్థించేదారు. బెంగాలీ ముస్లింలను ఎలాంటి బాధలకు గురిచేశారో, భారతదేశంలోని ముస్షింలు అవగతం చేసుకోగలిగారు. బంగ్లాదేశ్ యుద్ధం వాస్తవంగా ఇందిరాగాంధీకి వ్యక్తిగత విజయం. ఈ సంక్షోభ కాలమంతటా ఆమె కాఠిన్యాన్నిి దృధథసంకల్పాన్ని అత్యంత (ప్రతిభావంతమైన నాయకత్వ లక్షణాల్ని భారతీయులు అభిమానించారు. చాలా మంది ఆమెని ఆధునిక కాలంనాటి దుర్గగా, శక్తి, మహిళాశక్తి స్వరూపిణిగా ప్రశంసించారు. ఈ విజయం సాధించిన సందర్భంగా ఇందిరాగాంధీ తనకి దక్కిని కీర్తిని మానిక్షాతో పంచుకొన్నది. మానిక్‌షా ఫీల్డ్ మార్షల్‌గా నియమింపబడ్డాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం 328
యుద్ధ విరమణ జరిగింది. కాని శాంతి స్తాపన జరుగలేదు. 90,000 మంది యుద్ధ ఖైదీలు భారతదేశం ఆధీనంలో ఉన్నారు. 9000 చఃకీ.మీ. పాకిస్తాన్ భూభాగం భారత్ ఆధీనంలో ఉంది. పాకిస్తాన్ ఇంకను బంగ్లాదేశ్‌ని గుర్తించవలసి ఉంది. శాంతి కలకాలం నిలబడాలంటే ఇరుదేశాలు చర్చించుకొని ఒక పరిష్కారానికి రావలసి వుందని ఇందిరాగాంధీ గుర్తించింది. శత్రువుగా ఉన్న పాకిస్తాన్ భారత రక్షణ వ్యయాన్ని పెంచడమేగాక ఉపఖండ వ్యవహారాలలో బయటిశక్తుల జోక్యానికి అవకాశం కల్పిస్తుంది. ఇందిరాగాంధీ, కొత్తగా ఎన్నికైన పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ ఆలీ భుట్టో మధ్య 1972 జులైలో సిమ్లాలో శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడింది. పెద్దఎత్తున ఇచ్చిపుచ్చుకోవడాలపై చర్చలు జరిగాయి. ఇరువురు “సిమ్లా ప్రకటన” అని పిలువబడిన ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. శ్రీనగర్, లడక్‌లోని లే మధ్యగల రోడ్డు మార్గాన్ని రక్షించుకోవడానికి అవసరమైన కాళ్ళీరులోని కొన్ని వ్యూహాత్మక శిఖరాలు ముఖ్యంగొ కార్గిల్ సెళ్టార్లోనివి తప్ప భారతదేశం తాను ఆక్రమించిన పాకిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి తిరిగి ఇవ్వటానికి అంగీకరించింది. పాకిస్తాన్ కాళ్ళీరులోగల నియమిత రేఖ (00ని గౌరవించేందుకు, దానిని ఏకపక్షంగా బలప్రయోగంతోగాని, బలప్రయోగం బెదిరింపుతోగానిి మార్చకుండా ఉండేందుకు అంగీకరించింది. ఇరు దేశాలు ఐక్యరాజ్య సమితి లేక ఇతర దేశం యొక్క మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వాటి వివాదాలన్నింటిని పరిష్కరించుకొనేందుకు అంగీకరించాయి. పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు కూడా భారతదేశం అంగీకరించింది. కాని ఇది బంగ్లాదేశ్ పా కిస్తాన్ ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. మరుసటి సంవత్సరం 1973 ఆగస్టులో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ని గుర్తించిన తరువాత యుద్ధఖైదీల అప్పగింత జరిగింది. సిమ్లా ప్రకటనపై సంతకం చేయడంపై ఇందిరాగాంధీ 1972 జులైలో పార్లమెంట్రుక్తు ఇచ్చిన సమర్ధన గమనించదగింది. ఆమె ఇలా చెప్పింది... “నాకు తెలిసింది సతీ కొరకు పోరాడాలని, శాంతికి దారి తీసే చర్యలు చేపట్టాలని... ఆసియా తన జి కొరకు మేల్మొానవలసిన సమయం వచ్చింది. ప్రజల నిజమైన అవసరాల కొరకు మ్. గతంలో ఎలాంటి తగాదాలున్నప్పటికీ, గతంలో ఎలాంటి ద్వేషాలున్నప్పటికీ మనం యుద్ధాలు చేయడం ఆపివేయాలి. గతాన్ని విస్మరించాల్సిన సమయం వచ్చింది.” స్ట విజయం సాధించినవేళ 1972, భారత స్వతంత్రాసికి 25వ సంవత్సరం - ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు పరచడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దేశంలో 324 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజకీయ స్థిరత్వం ఉంది. ప్రభుత్వానికి లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వుంది. ప్రజలకు వారి శక్తి సామర్భాల మీద ఆత్మవిశ్వాసం, నాయకత్వంపై విశ్వాసం బుదిగింద్రై,
ఈ సానుకూల క్రమం ప్రారంభించబడదానికి ముందు, సంస్కరణల అభివృద్ధి కార్యక్రమాలు విధానాలలో అత్యధిక భాగాన్ని అమలు జరిపేది రామ్హ్రాలు గనుక రా్ర్రాల అధికార పగ్గాలను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని కాంగైస్ నాయకత్వం భావించింది. ఫలితంగా యు.పి., తమిళనాడు, కేరళ, ఒరిస్సాలు మినవాయించి అన్ని రాష్ట్రాలలో 1972 మార్చిలో అసెంన్లీలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మరలా అన్ని రాష్ర్టాలలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. 1971, 1972 ఎన్నికలు స్వతంత్ర, కాంగైస్(ఓ) షార్టీలు అంతమవడానికి దారి తీశాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రాలలో రాజకీయ ఆధిపత్యం ఏకీకృతం చేయబడింది. ఇందిరాగాంధీ కూడా పార్టీ మీద, తన మంత్రివర్గం మీద్ద, ముఖ్యమంత్రుల మీద అదుపు సాధించింది.
1971-74 కాలంలో ప్రభుత్వం తన వామపక్ష మధ్యేవాద అజండాని అమలు జరిపేందుకు చాలా చర్యలు చేపట్టింది. 1972 జనవరిలో జనరల్ ఇన్సూరెన్స్, ఐదు నెలల తరువాత బొగ్గు పరిశ్రమ జుతీయం చేయబడ్డాయి. పట్టణ భూమి యాజమాన్యంపై పరిమితులు విధించబడ్డాయి. కొద్దిమంది చేతుల్లో పారిశ్రామిక సంస్థల కేంద్రీకరణని అదుపు చేసేందుకు 1969లో యం.ఆర్.టి.పి. చట్టం చేయబడింది. ఆ చట్టాన్ని అమలు పరచేందుకు 1971లో యం.ఆర్.టి.పి. కమిషన్ నియమించబడింది. సిపిఐ, తన పార్టీలోని వామపక్షవాదులు ఒత్తిడి చేసినప్పటికీ ఇందిరాగాంధీ పరిత్రమల్ని జాతీయం చేయడంలో అంతకంటే ముందుకుపోయేందుకు నిరాకరించింది. ఆమె మిశ్రమ ఆర్థిక విధానానికి పూర్తిగా కట్టుబడి ఉంది. చాలా రాష్ట్రాలలో వ్యవసాయ భూమి యాజమాన్యంపై పరిమితుల్ని తగ్గించి, మిగులు భూమిని భూమిలేని పేదలకు పంచాల' చట్టం చేయబడింది. కేంద్ర ప్రభుత్వం సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చౌకగా ఆహారధాన్యాలు సరథరా చేసే కార్యక్రమం ప్రారంభించింది. జాతీయం చేయబడిన బ్యాంకుల చేత చిన్న పట్టణాలలో, నగరాలలోని వెనుకబడిన ప్రాంతాలలో శాఖలు ఏర్పాటు చేయించి వాటి ద్వారా చిన్న పరిశ్రమలకు, వ్యవసాయదారులకు, స్వయం ఉపాధికి రుణాలు అందేటట్లు చేసింది. రాజకీయాలలో వ్యాపారుల ప్రభావం తగ్గించేందుకు రాజకీయ పార్టీలకు జూయింటు స్టాకు కంపెనీల విరాళాలపై నిషేధం విధించింది. ఇందిరాగాంధీ ష్షానింగ్ కమిషన్ని, ప్రణాళికా యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 325
(ప్రభుత్వం రెండు ముఖ్యమైన రాజ్యాంగ సవరణల్ని ఆమోదింపచేసింది. సుప్రీం కోర్టు 1961, 1965లలో ఇచ్చిన తీర్పులు ఆస్తిపై ప్రాథమిక హక్కును సవరించేందుకు పార్లమెంటు అధికారాన్ని సమర్ధించాయి. కాని 1967లో సుప్రీం కోర్టు గోలక్‌నాథ్ కేసులో ఈ తీర్పుల్ని రద్దు చేసింది. ఆ తరువాత బ్యాంకుల జాతీయకరణని, రాజభరణాల రద్దును క్రోసి పుచ్చింది. 1971లో ఆమోదం పొందిన 24వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుల్ని సవరించే పార్లమెంటు అధికారాన్ని పునరుద్ధరించింది. అదే సంవత్సరం ఆమోదం పొందిన 25వ రాజ్యాంగ సవరణ భవిష్యత్ ప్రయోజనాల రీత్యా ఏదైన (ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకుంటే చెల్లించవలసిన నష్టపరిహారాన్ని చెల్లించవలసిన పద్ధతిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు కల్పించింది. అలాంటి నష్టపరిహారం తగినంతగా లేదని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకి ఇక ఏ మాత్రం ఉండదు. కోర్టులు అభివృద్ధి నిరోధక వైఖరి చేపట్టినప్పుడు, వ్యవసాయ సంస్కరణ చట్టం, పరిశ్రమలు ఇతర పారిశ్రామిక సంస్థల జాతీయీకరణ, సంపద ఆర్థికాధికారం (ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరణని అదుపు చేయడాన్ని అడ్డుకొనే చర్యలు, పార్లమెంటుపై న్యాయవ్యవస్థ ఆధిపత్యం, రాజ్యాంగ సవరణ క్రమంపై స్వీకరించిన అధికారాలు- లాంటి అంశాలతో రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించని పరిస్థితి ఎదురైనప్పుడు సరిదిద్దేందుకు 24వ, 25వ సవరణలు చేయబడ్డాయి. ఆ తరువాత మరొక రాజ్యాంగ సవరణ మాజీ సంస్థానాధీశుల (ప్రత్యేక హక్కుల్ని భరణాల్ని రద్దు చేసింది.
భారతదేశం శాస్ర సాంకేతిక రంగాలలో గొప్ప పురోగతి సాధించింది. అటామిక్ ఎనర్జీ కమిషన్ రాజస్థాన్ ఎడారులలో ఫోఖ్రాన్ వద్ద 1974 మే 18న అణు పరీక్షలు జరిపింది. భారతదేశానికి అణ్వస్తాలను తయారు చేయగల శక్తి సామర్థాలు ఉన్నప్పటికీ వాటిని చేయబోవడం లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు, న్యూక్లియర్ టెక్నాలజీలో స్వావలంబన సాధించేందుకు పోశ్రాన్ అణు పరీక్షలు జరిపామని పేర్కొన్నది.
1978లో పరిస్థితులు ఒక్కసారిగా ఇందిరాగాంధీకి ప్రతికూలంగా మారాయి. ఆర్థిక పరిస్థితులు, రాజకీయాలు, ఇందిరాగాంధీ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత అధోముఖం పట్టాయి. తొలగిన ప్రజల భ్రమలు 1974 జెపి. ఉద్యమంలో వ్యక్తమయ్యాయి. తరువాత 1975లో అత్యవసర పరిస్థితి విధించబడింది. ఈ కాలంలో పెల్లుబికిన అసంతృప్తి అశాంతి వగైరాలను తరువాతి అధ్యాయంలో చర్చిద్దాం. 826 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
186 షె - ర పరిస్టితి జ్కెపె, ఉద్యమం అత్యవసర ప సై గాళ్ళ ఆ పరీక్షకు నిలిచిన భారత ప్రజాస్వామ్యం 1975లో జూన్ 26న అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించినపుడు భారతదేశం అతిపెద్ద రాజకీయ సంక్షోభానికి గురయింది. అత్యవసర పరిస్థితి ఎలా వచ్చిపడింది? ఇందిరాగాంధీ చెప్పినట్లు మార్గాంతరం లేకనా? ప్రతిపక్షం ఆరోపించినట్లు అది ఆమె నియంతృత్వ వైఖరి వ్యక్తీకరణా? లేక ఇరు పక్షాలు దిగ్భాంతిలో కూరుకుపోయాయా?
1973 ప్రారంభం నాటికి ఇందిరాగాంధీ పట్ల (ప్రజాదరణ తగ్గడం మొదలయింది. ప్రజల ఆకాంక్షలు, ఆకాంక్షలుగానే మిగిలిపోయాయి. గ్రామీణ పట్టణ పేదరికం, లేక ఆర్థిక అసమానతల విషయంలో అంతగా చేసిందేమీ లేదు. గ్రామీణ ప్రాంతాల కులపరమైన, వర్షపరమైన అణచివేతలలో తగ్గుదల లేదు.
ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో అసంతృప్తి పెరిగింది. మాంద్యంతోపాటు పెరిగిన నిరుద్యోగ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఆహారధాన్యాల కొరత, తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించాయి. 1971లో దాదాపు 10 మిలియన్ల బంగ్లాదేశ్ శరణార్థులకు ఆహార వసతి కల్పనతో దేశంలోని ఆహార నిల్వలు కరిగిపోయాయి. దానికి తోడైన బంగ్లాదేశ్ యుద్ధ వ్యయం భారీగా బడ్జెట్ లోటుకి దారి తీసింది. యుద్ధం విదేశీమారక నిల్వల్ని తరలించింది. 1972, 1978 వరుసగా రెండు సంవత్సరాలు రుతుపవనాల వర్షాలు విఫలమయ్యాయి. వర్షాభావంతో దేశంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. కొరతతో ధరలు పెరిగాయి. వర్షాభావం కారణంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 827
విద్యుత్చాదన, వ్యవసాయ ఉత్పత్తి తగ్గాయి. పారిశ్రామిక వస్తువులకి డిమాండ్: పారిశ్రామిక మాంద్యానికి, నిరుద్యోగం పెరుగుదలకు దారి తీసింది. 1973లో చమురు సంక్షోభం వచ్చిపడింది. క్రూడ్ ఆయిల్ ప్రపంచ ధరలు నాలుగురెట్లు పెరిగాలొ ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, రసాయనిక ఎరువుల ధరలు విపరీతం పెరిగాయి. దీనితో విదేశీ నిల్వలు ఖాళీ అయ్యాయి. బడ్జెట్ లోటు పెరిగింది. ఆర్థికమాంద్యం తీవ్రతరమయింది. ఈ పరిస్థితులలో ధరలు నిరంతరాయంగా పెరిగొట ఒక్క 1972-78లోనే 22 శాతం పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలపై ౨ (ప్రభావం చూపిన ధరల పెరుగుదలకు వినిమయదారీ అత్యవసర వస్తువుల కొరతే తోడయింది. దేశంలోని పలు ప్రాంతాలలో తిండి కొరకు ఘర్షణలు జరిగాయి. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వస్తువుల కొరత దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్దఎత్తున పారిశ్రామిక అశాంతికి ఉవ్వెత్తున ఎగిసిన సమ్మెలకు దారితీసింది. వీటికి పరాకాష్టగా 1974 మేలో అఖిల భారత రైల్వే సమ్మె 22 రోజులు సాగింది. సమ్మె విచ్చిన్నం చేయబడింది. కాని కార్మికులలో ఇందిరాగాంధీ పలుకుబిడి చాలా వరకు తుడిచిపెట్టబడింది. శాంతిభద్రతలు - ప్రత్యేకించి 1974-75 కాలంలో క్షీణించాయి. సమ్మెలు:
విద్యార్థి నిరసనలు, ప్రజాప్రదర్శనలు తరచుగా హింసొయుతంగా మారాయి. చాలౌ కాలేజీలు, యూనివర్సిటీలు మూసివేయబడ్డాయి. 1978 మేలో యు.పి.లో సాయుధ పోలీసు దళాలు తిరుగుబాటు చేశాయి. అణచడానికి పంపించబడిన సైన్యంతో నొ యుధ ఘర్షణకి దిగాయి. ఘర్షణలో 35 మంది పోలీసులు, సైనికులు చనిపోయారు.
_ క్షీణిస్తున్న ఆర్థిక రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగ్లాదేశ్ సంక్షోభ కాలంలో ప్రదర్శించిన, విదేశీ వ్యవహారాలను నిర్వహించడంలో వ్యక్తమైన దృఢమైన నాయకత్వం అవసరమయింది. కానీ అలాంటి నాయకత్వం ముందుకి రావడం లేదు. ఇతర కారణాలు కూడా తోడవడంతో రాజకీయ పరిస్థితి మరీ క్షీణించింది. కాంగ్రెస్ ఒక సంస్థగా క్షీణిస్తూ వుంది. రాష్ట్ర స్థాయిలో, క్రింది స్థాయిలో రాజకీయ సంక్షోభంతో వ్యవహరించడంలో కాంగ్రెస్ అశక్తత నిరూపితమయింది. జీవితంలోని అన్ని రంగాలకు విస్తరించిన లంచగొండితనం, పాలకపార్టీకి పాలనా నిర్వహణకి చెందిన పై స్థాయిల్లో వున్నవారు దీనిలో కూరుకుపోయారని, ప్రజలలో వ్యాపించిన విశ్వాసం
- కారణంగా (ప్రభుత్వం కూడా పరిస్థితిని చక్కదిద్దే స్థితిలో లేదు. ఇందిరాగాంధీ చిన్న 8328 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొడుకు సంజయ్‌గాంధీ వార్షికంగా 50,000 మారుతీకార్ల ఉత్పత్తికి లైసెన్స్ పొందడంతో లంచగొండితనం కొరడా ఇందిరాగాంధీని కూడా తాకింది.
కాం(౮ెస్ నుండి మూడు పెద్ద సామాజిక (గ్రూపులు దూరమవడం ఒక పెద్ద నూతన పరిణామం. కాంగ్రెస్‌కి పేదల మద్దతు కొనసాగుతుంది. మధ్యతరగతులు ధరల పెరుగుదల, కాంగ్రెస్‌కి అంటిన అవినీతి మరక కారణంగా ఒక మేరకు దూరమయ్యారు. సంపన్న రైతులు భూ సంస్కరణల బెదిరింపుల కారణంగాను, పెట్టుబడి దారులు సోషలిజం, బ్యాంకులు, బొగ్గుగనుల, గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల ప్రస్తావన కారణంగాను కాంగ్రైస్కి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మారారు. ప్రతిపక్ష పార్టీల నిరాశ, నిస్పృహలు కూడా రాజకీయ వ్యవస్థని బలహీనపరచాయి. విభిన్న సిద్దాంతాలు, కార్యక్రమాలు గల ఈ పార్టీలను ఐక్యం చేసిన ఒకే ఒక అంశం కాంగ్రెస్ వ్యతిరేకత. కానీ ఇటీవలి 1971 సాధారణ ఎన్నికలలోను, 1972 అసెంబ్లీ ఎన్నికలలోనూ ఘోర పరాజయం పాలైన ఈ పార్టీలు విడి విడిగాను, కలిసిగాని కాంగ్రెస్‌ని సవాల్ చేసే స్థితిలో లేవు. ప్రజాదరణని పరీక్షించుకొనేందుకు రానున్న ఎన్నికల వరకు నిరీక్షించడం ఇష్టపడని ఈ పార్టీలు రానున్న పరిణామాలతో సంబంధం లేకుండా కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ గ్రూపు ఏ రూపంలో చేపట్టిన ఉద్యమానికి గాని గుడ్డిగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. గుజరాత్, బీహార్ - అశాంతి
ఆహార ధాన్యాలు, వంట నూనెలు, ఇతర అత్యవసర వస్తువుల ధరలు పెరగడం పై (ప్రజాగ్రహం నగరాలలో, పట్టణాలలో పెల్లుబికినపుడు 1974 జనవరిలో గుజరాత్లో విద్యార్ధి ఉద్యమ రూపంలో తిరుగుబాటు చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి ఉద్యమంతో చేతులు కలిపాయి. పది వారాలకుపైగా రాష్ట్రంలో అరాచకం స్వైర విహారం చేసింది. సమ్మెలు, లూటీలు, దొమ్మీలు, గృహదహనాలు, బలవంతంగా ఎమ్మెల్యేల ను రాజీనామాలు చేయించే ప్రయత్నాలు యథేచ్చగా సాగాయి. పోలీసులు అతిగా స్పందించారు. విచక్షణారహితమైన అరెస్టులు, తరచుగా లాటీఛార్జీలు, కాల్పులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వంచేత రాజీనామా చేయించి అసెంబ్లీని రద్దు చేయించి రాష్ట్రపతి పరిపాలన విధించక తప్పలేదు. 1975 మార్చిలో గుజరాత్ నాటకం చివరి అంకానికి చేరింది. ఆందోళన కొనసాగుతుంది. మొరార్దీదేశాయ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. ఇందిరాగాంధీ అసెంబ్లీని రద్దు చేసి జూన్‌లో ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 829
గుజరాత్ ఆందోళన వెనువెంటనే, దానిచేత (ప్రేరితులై విద్యార్దులు బీహార్‌లో 1974 మార్చిలో అలాంటి ఉద్యమమే ప్రారంభించారు. విద్యార్థులు మార్చి 18న అసెంబ్లీ ఘెరావ్ చేపట్టారు. అతిగా వ్యవహరిస్తున్న పోలీసులతో మాటి మాటికి ఘర్షణలకు దిగారు. ఒక్క వారంలో 27 మంది ప్రజలు చనిపోయారు. అంతేగొక గుజరాత్లో లాగానే ప్రతిపక్ష పార్టీలు వెంటనే విద్యార్థి ఆందోళనకారులతో చేతులు కలిపాయి. బీహార్ ఉద్యమానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. జె.పి.గా ప్రఖ్యాతీ గాంచిన జయప్రకాష్ నారాయణ రాజకీయ పదవీ విరమణ నుండి బయటికి వచ్చాడు. ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సంపూర్ణ విప్లవానికి లేక దాదాపు ప్రతివాజ్డీ లంచగొండిగా మార్చిన వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చాడు. బీహార్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ రాజీనామాని, అసెంబ్లీ రద్దుని డిమాండ్ చేశాడు.శాసన సభ్యుల్ని రాజీనామా చేయవల్సిందిగా ఒత్తిడి చేయమని, ప్రభుత్వాన్ని స్తంభింపచేయమని రాష్ట్ర అసెంబ్లీని ప్రభుత్వ ఆఫీసుల్ని ఘెరావ్ చేయమని, రాష్ట్ర వ్యాప్తంగా సమానాంతరంగొ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించమని, పన్నులు చెల్లించవద్దని, విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిచ్చాడు. రెండవ లక్షణం: అసెంబ్లీ రద్దు డిమాండ్- అది దేశంలోని ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వానికి విస్తరిస్తుందని ఇందిరాగాంధీ తిరస్కరించటం. విస్తరించిన అవినీతికి వ్యతిరేకంగాను, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగాను: లంచగొండితనానికి మూలాధారంగాను వరిగణించబడిన ఇందిరాగాంధీని తొలగించేందుకు జె.పి. దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించాడు. జె.పి. పలుమార్లు దేశమంతటా పర్యటించాడు. పెద్ద బహిరంగసభల్ని - ప్రత్యేకించి జన సంఘ్ికి లేక న్షలిస్సులకు బలమైన స్పావరాలుగా ఉన్న ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర (ప్రాంతాలలో నిర్వహించాడు. | జె.పి. ఉద్యమం విద్యార్థుల, మధ్యతరగతుల, వర్తకుల, మేధావులలోని ఒక సెక్షన్ మద్దతు ప్రాంద్రింద్రి. 1971లో ఘోర పరాజయం పాలైన వామపక్షేతర పార్టీలన్నిటి మద్దతు పొందింది. అవి కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయమనే విశ్వసనీయత కల్పించగల ప్రజాదరణ గల నాయకునిగా జె.పి.ని గుర్తించాయి. జె.పి. కూడా నిర్మాణబద్ధమైన ఈ పార్టీలు లేకుండా వీధుల్లోగాని, ఎన్నికలలోగాని ఇందిరాగాంధీని ఎదుర్మోవటం సాధ్యపడదని గ్రహించాడు. 830 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జె.పి. ఉద్యమం తీవ్రత ఎక్కువ కాలం నిలబడలేదు. 1974 సంవత్సరాంతానికి క్షీణించడం ప్రారంభమయింది. విద్యార్థి అనుచరులలో అత్యధికులు తిరిగి తరగతులకు హాజరయ్యారు. అంతేగాక ఉద్యమం బీహారు, గుజరాతులలో కూడా గ్రామీణ పట్టణ పేదల్ని ఆకర్షించడంలో విఫలమయింది. జె.పి. ఉద్యమం యొక్క పార్లమెంటరీయేతర వైఖరిని నిందిస్తూ ఇందిరాగాంధీ వారి 'ప్రజాదరణని బీహారులోను, దేశవ్యాప్తంగ్లాను 1976 ఫిబ్రవరి-మార్చిలో రానున్న సాధారణ ఎన్నికలలో పరీక్షించుకోవలసిందిగా సవాలు చేసింది. సవాలును జె.పి.స్వీకరించాడు. ఆయనను బలపరిచే పార్టీలు జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
ఈ దశలో వాస్తవంగా (ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు- అనే సమస్య పరిష్కరింపబడేలా కన్పించింది. కాని అలా జరగలేదు. రాజ్‌నారాయణ్ ఎన్నికల పిటిషన్‌పై ఇందిరాగాంధీ ఎన్నికల (ప్రచారంలో అవినీతి పద్ధతులు చేపట్టిందని నిర్ధారించి, ఆమె ఎన్నిక చెల్లనేరదని జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల్ని మలుపు తిప్పింది. ఇందిరాగాంధీ 6 సం॥ల వరకు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయరాదని, అధికారం చేపట్టరాదని, కాబట్టి (ప్రధానమంత్రిగా కొనసాగరాదని తీర్పు స్పష్టం చేసింది.
ఇందిరాగాంధీపై చేసిన తీవ్రమైన ఆరోపణల్ని జస్టిస్ సిన్హా శ్రోసిపుచ్చి, అల్పమైన అనావాశ్యకమైన ఆరోపణలపై శిక్ష విధించాడని పలువురు పరిశీలకులు భావించారు. ఇందిరాగాంధీ రాజీనామా చేసేందుకు తిరస్కరించింది. సుప్రీం కోర్టుకి అప్పీలు చేసింది. సుప్రీం కోర్టు జులై 14న ఆమె అప్పీలుపై విచారణ చేపట్టనుండగా, జూన్ 24న సుప్రీం కోర్టు వకేషన్ జడ్జి వి. ఆర్.కృష్ణయ్యర్ ఇందిరాగాంధీ అప్పీలుపై చువ్రీంకోర్టు పుల్ బెంచి తుది తీర్పు వెలువరించే వరకు, ఆమె ప్రధానమంత్రిగా కానసొగవచ్చునని, పార్లమెంటులో ప్రసంగించవచ్చునని, కాని ఓటు చేయరాదని తన నిర్ణయం (ప్రకటించి మరికొంత గందరగోళం సృష్టించాడు.
ఈలోపల జూన్ 18న గుజరాత్ ఎన్నికల వలితాలు వెలువడడంతో ఇందిరాగాంధీకి రాజకీయంగా మరొక ఎదురుదెబ్బ తగిలింది. 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష జనతాఫ్రంటు 87 సీట్లు కాంగ్రెస్ 75 సీట్లు గెలిచాయి. చాలా విపరీతమూ, ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఏచిమన్భాయ్ పటేల్ అవినీతి అక్రమ స్వతంత్రం తర్వాత భారతదేశం 381
పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టబడిందో అదే చిమన్‌భాయ్ పటేల్ సహకారంతో జనతా ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అలహాబాద్ తీర్పు, గుజరాత్ అసెంబ్లీ ఫలితాలు (ప్రతిపక్ష ఉద్యమాన్ని పునరుద్ధరించాయి. జె.పి. ప్రతిపక్షాల ఐక్య సంఘటన సుప్రీంకోర్డుకి ఇందిధాగాం చేసుకొన్న అప్పీలు ఫలితం వచ్చేవరకు గానీ, 8 నెలల్లో రానున్న లో క్‌సభ సాధా ఎన్నికల వరకుగాని నిరీక్షించేందుకు సిద్ధపడలేదు. వారు అవకాశాన్ని అందిపుచ్చు దని ఇందైరాగాంధీ తప్పుడు పద్ధతులతో పొందిన అధికారాన్ని అంటి పెట్టుకొని వున్న ఆరోపిస్తూ వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ఒత్తిడి పెంచేందు క దేశవ్యాప్త ప్రచారానికి పిలుపిచ్చారు. జూన్ 25న ఢిల్లీలో జరిపిన బహిరంగ సభ క్ష ఇందిరాగాంధీ రాజీనామా కొరకు వారం రోజులపాటు జనసమీకరణ శాసనో బంఘనం జూన్ 29న ప్రారంభింపబడతాయని ప్రకటించారు. వందల వేల మంది కార్యకడ గ (ప్రధానమంత్రి నివాసాన్ని ఘెరావ్ చేయడంతో ప్రచారం ముగుస్తుంది. బహి ల సభలోని ఉపన్యాసంలో జె.పి. ప్రభుత్వం పని చేయడం అసాధ్యమయ్యేలొ చేయవలసిందిగా ప్రజలకు ఉద్చోధించారు. చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తొ కు పరిగణించిన ఎలాంటి ఆదేశాలనైనా పాటించ నిరాకరించమని సైనిక బలగాలంః పోలీసులకు, అధికారవర్గానికి విజ్ఞప్తి చేశాడు.
ఈ నేపథ్యంలో తక్షణ స్పందనగా ఇందిరాగాంధీ జూన్ 26న అత్యవసర పరిస్థితి ప్రకటించింది. జెప్ప, ఉద్యమం
అత్యవసర పరిస్థితి ఎలా వచ్చిపడింది? దానికి గల చట్టబద్ధత ఏమిటి? చివరకు అది ఎందుకు ఎలాంటి ఫలితాలు సాధించి రద్న చేయబడింది? - లాంటివి విమర్శనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అంశాలు.
భారతీయ జీవితంలోని, రాజకీయాలలోని అవినీతిని అంతమొందించడానికి జె.పి. ఉద్యమం ఆవిర్భవించింది. అవినీతికి మూలాధారం ఇందిరాగాంధీ. ఆమె అధికార పిపాస గల వ్యక్తిత్వంతో, ఆమె రాజకీయ పరిపాలనా నిర్వహణ విధానంతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్యమం అవసరమయింది. ఇందిరాగాంధీ అధికార దాహంతో ప్రజాస్వామ్య సంస్థలన్నింటిని ధ్వంసం చేసి సోవియట్ మద్దతుతో నియంతృత్వాన్ని స్థాపించయత్నిస్తున్నదని జె.పి. పలు మార్లు ఆరోపించాడు. ఆమె 332 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అధికారంలో కొనసాగడం భారతదేశంలోని ప్రజాస్వామ్యానికి ప్రమాదమని జె.పి. చాలాసార్లు హెచ్చరించాడు. ఆ తరువాత చాలా మంది ప్రత్యర్థులు అలాంటి భావాలనే వ్యక్షం చేశారు.
జాతీయ రాజకీయ ప్రయోజనాలను గమనంలో పెట్టుకొని ముఖ్యంగా మూడు కారణాల రీత్యా అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఇందిరాగాంధీ తన చర్యని సమర్ధించుకొన్నది. మొదటిది: జె.పి. ఉద్యమం యొక్క విచ్చిన్నకర స్వభావం కారణంగా భారతదేశం యొక్క స్థిరత్వం, రక్షణ, సమగ్రత, ప్రజాస్వామ్యం (ప్రమాదంలో పడ్డాయి. జె.పి ఉపన్యాసాల్ని ప్రస్తావిస్తూ ఆమె ప్రతిపక్షాలు సైనిక బలగాల్ని, పోలీసుల్ని, తిరుగుబాటుకి రెచ్చగొడుతున్నాయని ఆరోపించింది. పేద ప్రజల, వెనుకబడిన (ప్రజల ప్రయోజనాల రీత్యా సత్వర ఆర్థికాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు జరుపవలసిన అవసరముంది. మూడవది:- భారతదేశాన్ని బలహీన పరచి అస్థిర పరచే లక్ష్యంతో విదేశీ శక్తులు జోక్యం చేసుకొని విద్రోహాలకు పాల్పడుతున్నాయి.
వాస్తవంగా జె.పి.గాని, ఇందిరాగాంధీగాని సంక్షోభం నుండి బయట పదేందుకు ప్రజాస్వామ్య పద్ధతిని ఎంపిక చేనుకోలేదు. ఎలాగూ 1976 ప్రారంభంలో నిర్వహించవలసి యున్న లోక్‌సభ ఎన్నికలను 1975 అక్టోబరు- నవంబరులలో జరపమని జె.పి. డిమాండు చేసివుండవలనింది. ఇందిరాగాంధీ ఆమోదించి వుండవలసింది. అలా చేయడం రాజీనామా డిమాండుకి, అత్యవసర పరిస్థితికి ఆచరణీయ ('ప్రత్యామ్నాయమై ఉండేది. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల వెలుగులో జె.పి. ఇందిరాగాంధీల వైఖరులను విమర్శనాత్మకంగా అధ్యయనం చేయవలసి వుంది.
జెపి ఉద్యమం - దాని నిర్మాణం, చేపట్టిన చర్యలు, నాయకుని తాత్విక స్వభావం రీత్యా చాలా లోపాలు ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ యొక్క నిజాయితీ, పదవీకాంక్ష లేకపోవడం, నిర్భయత్వం, నిస్వార్థం, త్యాగం, పౌర హక్కులు న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థ నిర్మాణం పట్ల నిబద్దత- (ప్రశంసనీయం. కాని సైద్ధాంతికంగా ఆయనలో స్పష్టత లేదు. 1950 దశాబ్దం ప్రారంభం నుండి అయన పార్లమెంటరీ రాజకీయాల్ని పాఠ్షమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విమర్శించాడు. చాలా సంవత్సరాలు ఆయన పార్టీ రహిత (ప్రజాస్వామ్య భావనని ప్రచారం చేశాడు. 1974-75లో ఆయన సంపూర్ణ విప్లవాన్ని (సంపూర్ణ క్రాంతి) సమర్ధించాడు. రెండు భావనలలోనూ స్పష్టత లేదు. ఏ దశలో కూడా రాజకీయ స్వతంత్రం తర్వాత భారతదేశం 888
పార్టీల జోక్యం లేని రాజకీయ వ్యవస్థని గురించి వివరించలేకపోయాడు. అలాగే సంపూర్ణ విప్లవం యొక్క సామాజిక ఆర్థిక, రాజకీయ అంశాలు, కార్యక్రమం లేక విధానాలు కూడా ఎప్పుడూ నిర్వచింపబడలేదు. అదే సమయంలో జెపి ప్రజాస్వామ్యవాది. అధికారవాదాన్ని బలపరచే నాయకుడు కాదు. అలాగే ఆయన 1974-75 లో నడిపిన ఉద్యమం కూడా అధికారవాద లేక ఫాసిస్టు ఉద్యమం కాదు. కాని అది తన ఫాసిస్టు విభాగానికి అవకాశాన్ని స్థానాన్ని సృష్టించగల ఉద్యమం - ఇది చాలా ముఖ్యమైన గమనార్జమైన అంశం. పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గురించి సంపూర్ణ విప్లవాన్ని గురించి పార్లమెంటరీ (ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు (ప్రజాస్వామ్య సంస్థల పట్ల నిర్లిప్తతని, నిరాశని, ధిక్కారాన్ని ప్రోత్సహించాయి గనుక అవి అస్పష్టమైనవి మాత్రమే గాక ప్రమాదకరమైనవి. అలాంటి ప్రసంగాలు 1929 తరువాత ఇటలీ, జర్మనీలలోను, 1960లలో పాకిస్తాన్, ఇండోనేషియాలలోనూ సృష్టించినట్లు అధికారవాదానికి ఫానిజానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలవు. | సిద్ధాంతపరంగా గాని, విధానాలు కార్యక్రమాలలోగాని ఎలాంటి సారూప్యతలేని రాజకీయ పార్టీల, గ్రూపుల మద్దతు స్వీకరించడంతో జెపి రాజకీయాలలో గల అస్పష్టత వ్యక్తమవుతుంది. జెపి ఉద్యమంలో మతతత్వ జనసంఘ్, జమాత్-ఇ-ఇస్లామ్, నయాఫాసిస్ట్ర ఆర్.యస్.యస్, కన్సర్వేటవ్, సెక్యులర్ కాంగ్రెస్(ఓ) సోషలిస్టులు, వామపక్ష తీవ్రవాద నక్సలైటు [గ్రూపులు వున్నాయి. ఇందిరాగాంధీ (ప్రభుత్వాన్ని యం తప్ప ఉద్యమానికి ఎలాంటి ప్రత్యామ్నాయ కార్యక్రమంగాని, విధానాలుగాని జెపి ఉద్యమం తరువాత దశలలో బలమైన నిర్మాణపరమైన అల్లిక, శిక్షణ పొందిన శ్రేణులు- ప్రత్యేకంగా ఉత్తర, మధ్య భారతదేశంలోగల ఆర్.యస్. యస్, జనసంఘ్‌పై ఆధారపడింది. బీహారులో కూడా జెపి ఉద్యమానికి సారధ్యం వహించిన ఛాత్రయువ సంఘర్ష్నవాహినికి ఆర్.యస్.యస్. అనుబంధ సంఘమైన అఖిలభారత విద్యార్థి పరిషత్ వెన్నెముకగా పనిచేసింది. ఫలితంగా ప్రజల్ని సమీకరించగల అగ్రనాయకుడు జెపి అయినప్పటికీ ఉద్యమం అంతకంతకు ఆర్.యస్. యస్-జనసంఘ్ (ప్రాబల్యం క్రిందికి వచ్చింది. ఇది ఉద్యమం యొక్క రాజకీయ న్వభావంలో ప్రతిఫలించింది. పెద్ద మార్చుకి గురయింది. ఉద్యమం కోరింది విధానాల మార్చు తి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాదు; రాష్ట్ర ప్రభుత్వాల మార్చు కాదు. ఇందిరాగాంధీని తొలగించడం ఉద్యమ ప్రధాన లక్ష్యమయింది. అంతేకాక డిమాండ్ల పరంగాగాని రూపొందించిన లేఖ అమలు పరచిన విధానాల పరంగాగాని ఉద్యమం అప్రజాస్వామిక స్వభావం గలది. దాని లక్ష్యం ప్రభుత్వ విధానాలను అద్దుకొనటంగాని, లేక కొన్ని విధానాలలో మార్పులు తీసుకొని రావడంగాని కాదు. ముందుగా బీహార్ ప్రభుత్వాన్ని ఆ తరువాత కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరచడం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చట్ట సభలు, (ప్రభుత్వాలు రద్దు చేయబడాలి. వాటిని ఎన్నికల ద్వారాగాక ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు పరిమితమైన రాజ్యాంగేతర ప్రజాందోళనల ద్వారా ఏర్పరచాలి. ఇది రాజకీయ వ్యవస్థ యొక్క మౌలిక మార్పు కొరకు హెచ్చరిక పత్రం జారీ చేయడంలాంటిది. జె.పి. ఉద్యమం ఆమోదించి ప్రచారం చేసిన ఆందోళనా పద్ధతులు రాజ్యాంగేతరమైనవి; ప్రజాస్వామ్య విరుద్ధమైనవి. బీహారులో శాంతియుతమైన ఊరేగింపులు, ప్రదర్శనలు, బహిరంగ సభల్ని అధిగమించి గతంలో గుజరాత్లోలాగానే ఎన్నికైన శాసన సభ సభ్యుల్ని రాజీనామాలు చేయమని బెదిరించడం ద్వారా ప్రభుత్వ ఆఫీసుల్ని అసెంబ్లీని, గవర్నర్‌ని ఘెరావ్ చేయడం ద్వారా అసెంవ్లీలను రద్దు చేయించడం, ఆ విధంగా ప్రభుత్వాన్ని స్తంభింపచేయడం ఉద్యమం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ 1975 జూన్ - జులైలలో కేంద్రంలో పునరావృతం చేయబడుతుంది. అంతకంటె తీవ్రమైన అంశం జె.పి. సైన్యాన్ని పోలీసుల్ని సివిల్ ఉద్యోగుల్ని రెచ్చగొట్టడం. ఉద్యమ కాలంలో జె.పి. చాలాసార్లు “అన్యాయమైన ఉద్యోగ విధుల్లో భాగంగాని' లేక 'చట్టవిరుద్ధమైన లేక రాజ్యాంగేతరమైన, ఆత్మ ప్రబోధానికి విరుద్ధమైన' ఆదేశాలను పాటించవద్దని ఉద్బోధించారు. మనం ఇంతకు ముందు గమనించిన విధంగా జె.పి. ఉద్యమం పరాకాష్టగా 1975 జూన్‌లో దేశవ్యాప్తంగా శాసనోల్లంఘనోద్యమానికి పిలుపివ్వబడుతుంది. అది ప్రధాన మంత్రి నివాసాన్ని ఘెరావ్ చేయడంగా పరిణమిస్తుంది. ఆ విధంగా ఆమె రాజీనామా చేయడంగాని లేక జలియన్ వాలాబాగ్ హత్యాకాండని పునరావృతం చేయక తప్పని స్థితికి గాని నెట్టివేయబడుతుంది. అదే రోజు సాయంత్రం మొరార్టీ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మొత్తం ప్రతిపక్షం యొక్క వ్యూహాన్ని స్పష్టంగా చెప్పాడు. 'ఆమె రాజీనామాపై ఒత్తిడి తెస్తాం. ఆమె బయటికి రాకుండా, సందర్శకులు ఆమెని కలవకుండా వేలాదిమందిమి ఆమె నివాసాన్ని చుట్టు ముడుతొము. రాజీనామా చేయవలసిందిగా స్వతంత్రం తర్వాత భారతదేశం 8385
నినాదాలు చేస్తూ రాత్రింివళ్లు అక్కడే బస చేస్తాము. మరొక విధంగా చెప్పాలంటే (ప్రతిపక్ష పథకానికి బలప్రయోగంతో ప్రభుత్వాన్ని కూల్చే అన్ని లక్షణాలూ ఉన్నారో. జె.పి. ఉద్యమం సృష్టించిన పరిస్థితి విప్లవంలేని తిరుగుబాటు. కొంతకాలంగొ రూపొందించిన ఎత్తుగడలతో అది దాదాపు విప్లవ రూపం సంతరించుకొన్నది. కొని ఇది దిశానిర్దేశం, నాయకత్వం సమకూర్చేందుకు విప్లవ పార్టీ, నిర్మాణం, సిద్దాంతం: కార్యక్రమం లేని విప్లవం. వాస్తవంగా ఇది సిద్దాంత రహితమైన ఛాత్రవాపొని శ్రేణులు: కాంగ్రెస్(ఓ) కన్సర్వేటివ్ శ్రేణులు, బికెడి స్వతంత్ర పార్టీలు, ఆర్.యస్.యస్- జనసంఘ్ నయాఫాసిస్టు శ్రేణుల కలయికపై నమ్మకముంచి సాగించిన తిరుగుబాటు (విప్లవం). విప్లవ పదజాలాన్ని చట్టవిరుద్ధమైన రాజ్యాంగేతర, తరచుగా హింసాయుత ఆందోళనా పద్ధతులను ఒక ప్రజా ఉద్యమం అమలు జరపడం ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ పని విధానానికి విరుద్ధమైనది. కాని అంతకంటే ముఖ్యమైన అంశం: సామాజిక: ఆర్థిక వ్యవస్థని మార్చేందుకు అలాంటి పదజాలం పద్ధతులు విప్లవ పథకంలో భాగం కానప్పుడు, తగు విధంగా ఏర్పాటు చేయబడిన నాయకత్వం నడిపించే విప్లవ పార్టీ లేకుండా, గజిబిజిగా వున్న నిర్మాణ బద్ధంగాని ఉద్యమంలోనికి ప్రజా సందోహాలు ప్రవేశించినపుడు (ప్రత్యామ్నాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించకుండా ఒక రాజకీయ వ్యవస్థపై విశ్వాసాన్ని ధ్వంసం చేసినప్పుడు వచ్చే ఫలితం అధికారవాద, తరచుగొ ఫాసిస్టు పాలనా విధానాన్ని స్థాపించటమే అవుతుంది. చారిత్రకంగా అలాంటి కలయిక తెచ్చేది విప్లవం కాదు. యూరపులో ఫాసిజం అభివృద్ధి, లాటిన్ అమెరికాలో నియంతృత్వ పాలనా వ్యవస్థల చరిత్ర సూచించే విధంగా 'ప్రతీఘాతుక విప్లవం అవుతుంది.
ఈ సందర్భంగా ఒక విషయాన్ని గమనించాలి. అధికారవాద ప్రమాదం జయప్రకాశ్ నారాయణ నుండి రావటం లేదు. అధికారవాద ప్రభుత్వాన్ని చలమోగంతో హల్బదానికి ఆయన పథకాలు సిద్ధం చేయటం లేదు. దిశానిర్దేశం
/ ఆకాంక్షించేవారు, క్రమక్రమంగా ఉద్యమం౭ పట్ట సాధిస్తున్నవారు, ఆయన సైద్ధాంతిక డొల్లతనాన్ని - శారీరక బలహీనతని ప్రయోజనకారిగా మార్చుకోవాలని కోరుకుంటున్నవారు ఆయన చుట్టూ చేరారు. ఉంది ఏమైనప్పటికీ ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యబద్ధమైన మూడు ఎంపికలకు అవకాశం
౨౬, 886 చిపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
(1) సుప్రీం కోర్టు తీర్పు కొరకు నిరీక్షించటం, తీర్చు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వస్తే దానిని అమలు జరపమని డిమాండు చేయటం. (2) 1976లో జరుగునున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల కొరకు నిరీక్షించటం. అప్పటి వరకు ప్రజలలో ఇందిరాగాంధీకి గల పలుకుబడిని తగ్గించేందుకు శాంతియుత ఆందోళనలు, ప్రచారం చేపట్టడం. (3) అలహాబాదు తీర్పు దృష్ట్యా వెంటనే - 1975 అక్టోబరు - నవంబరులలో ఎన్నికలు జరపమని డిమాండు చేయటం. రానున్న సాధారణ ఎన్నికలు ఉద్యమ డిమాండ్ల భవితవ్యాన్ని తేల్చనివ్వండి- అవి ఇందిరాగాంధీ చేసిన సవాలును జె.పి. ఆమోదించాడు. ఇందిరా గాంధీని ఓడించాలని కోరుకుంటున్న ప్రతిపక్షాలు ఆమోదించాయి. కాని రాజకీయాలలో ఒక సంవత్సరం లేక 6 నెలలు కూడా సుదీర్హ కాలమే. ఈ కాలవ్యవధిలో ప్రజా ఉద్యమం యొక్క ఉధృతి పెరగవచ్చు లేక తరగవచ్చు. అంతేగాక కాంగ్రెస్ పునాది దక్షిణ భారతదేశంలో గ్రామీణ పేదలు, మహిళలు, మైనారిటీలలో యథాతథంగా వుంది గనుక రానున్న ఎన్నికలలో గెలుస్తారని గ్యారంటీ ఏమీ లేదు. జూన్ ప్రారంభంలో జరిగిన గుజరాతు ఎన్నికలలో కూదా కాంగ్రెస్ మెజారిటీ సాధించడంలో విఫలమయింది. అలాగే జైప్మై మొరార్టీ దేశాయ్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించినప్పటికీ ప్రతిపక్ష జనతా కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోయింది. ఈ సందర్భంలో వెలువడిన అలహాబాద్ తీర్చు కీలకమయింది. దీనిని అవకాశంగా తీసుకొని జె.పి, మొరార్డీ దేశాయ్, ఇతరులు ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రధానిని పదవి నుండి తప్పించటానికి సమాయత్తమయ్యారు. అత్యవసర పరిస్థితి
అత్యవసర పరిస్థితి విధింపు ఇందిరాగాంధీ ప్రభుత్వం పట్ల ప్రజాదరణను తగ్గించింది. రాజ్యాంగేతర సవాలు ఎదుర్కొనడం వలన మార్దాంతరం లేక అత్యవసర పరిస్థితి విధించవలసి వచ్చిందని ఇందిరాగాంధీ తరువాత చెప్పుకొన్నది. తన రాజీనామా (ప్రజాస్వామ్య క్రమానికి ప్రమాదం కల్పించే శక్తులకు బలం చేకూర్చి దేశాన్ని గందరగోత్రపరచే అరాచకపు అంచులకు నెట్టివేసి వుండేదని ఇందిరాగాంధీ చెప్పింది. అంతేగాక తన అప్పీలు సుప్రీంకోర్టు విచారణలో ఉండగా తాను పదవి నుండి స్వతంత్రం తర్వాత భారతదేశం 837
తప్పుకొనవలసిన చట్టపరమైన, రాజకీయపరమైన, నైతిక పరమైన హేతుబద్ధత లేదన్నది. కాని ఇంతకుముందు (ప్రస్తావించినట్లు వాన్తవంగా అమెకు కూడా ప్రజాస్వామ్యబద్ధమైన మరొక ఎంపికకు అవకాశం ఉంది. లోక్‌సభని రద్దు చేసి ఎన్నికలు నవంబరు-డిసెంబరులో నిర్వహించబడతాయని ప్రకటించి వుండవలసింది. ఆమె ప్రతిపాదనను జె.పి., ప్రతిపక్షం అంగీకరిస్తే రాజకీయ ట్రతిష్టంభనని ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించటానికి తలువులు తెరచినట్లయ్యేది. వారు అంగీకరించకుండా, ఆమె రాజీనామా చేయాలని పట్టుబట్టి వారంతకు ముందు ప్రకటించిన పద్ధతులలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తే రాజ్యాంగేతర సవాలును ఎదుర్కొనేందుకు ఒకే ఒక ప్రత్యామ్నాయంగా ఆమె అత్యవసర పరిస్థితిని చట్టబద్ధంగా ప్రకటించి వుండగలిగేది. అదే సమయంలో ప్రతిపక్షం ఆమె రాజీనామా డిమాండును వదలిపెట్టి సుప్రీంకోర్టు లేక పార్లమెంటు తీర్పుకి కట్టుబడటానికి అంగీకరించి ఎన్నికల పరీక్షకు అంగీకరిస్తే అత్యవసర పరిస్థితి తొాలగించబడుతుందని ప్రకటించగలదు.1968 మేలో విద్యార్థుల, కార్మికుల తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు జనరల్ డిగోల్ అదే చేశాడని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. ఎన్నికలలో డిగోల్ని ఎదుర్కోవాలన్న సవాల్‌ని విద్యార్థులు, కార్మికులు, వారి నాయకులు అంగీకరించారు. ఏమైనప్పటికీ అత్యవసర పరిస్థితి అంతకాలం (దాదాపు 19 మాసాలు) కొనసాగింపు సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిపాలన యొక్క చట్టబద్ధతకు, ప్రజాభీష్ట వ్యక్తీకరణకు వాహకాలైన ఎన్నికల గురించి అటు జెపి ఉద్యమం, ఇటు ఇందిరాగొంధీ పట్టించుకోలేదు. అందుకు కారణం 1974-75 నాటి రాజకీయ ఘర్షణ - అది పరిణమించిన తీరు తెన్నులు. ఫలితంగా పరస్పరం తలపడుతున్న రెండు పక్షాల మధ్య చర్చ, ఇచ్చిపుచ్చు కోవడాలు సాధ్యపడని వాతావరణం సృష్టించబడింది. ఇందిరాగాంధీ రాజ్యాంగం యొక్క 3852 ఆర్టికల్ క్రింద జూన్ 26 ఉదయాన అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించింది. సాధారణ రాజకీయ క్రమాలన్ని రద్దయ్యాయి. రాజ్యాంగం యొక్క సమాఖ్య నిబంధనలు, ప్రాథమిక హక్కులు, పొర హక్కులు రద్దయ్యాయి. ప్రభుత్వం పత్రికలపైన కఠినమైన సెన్సార్షిప్ విధించింది. నిరసనల్ని ప్రభుత్వ వ్యతిరేకతని అణచివేసింది. జూన్ 26న తెల్లవారక ముందే (ప్రతిపక్ష ముఖ్య నాయకులు అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (141534) ప్రయోగించి అరెస్టు చేయబడ్డారు. అరెస్టయిన వారిలో జయప్రకాశ్ నారాయణ, మొరార్టీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పాయ్, 898 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాంగ్రెస్ అసంతృప్తివాదులు చంద్రశేఖర్ లాంటివారున్నారు. పలువురు విద్యావేత్తలు, పత్రికారంగ రచయితలు, (ట్రేడ్ యూనియన్ నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో నిర్బంధింపబడ్డారు. అరెస్టు అయిన వారిలో చాలామంది క్రమంగా విడుదల చేయబడ్డారు. జె.పి, ఆరోగ్య కారణాల రీత్యా 1975లో, 1976లో చరణ్‌సింగ్, వాజ్పాయ్ విడుదల చేయబద్దారు. ఆర్.యస్.యస్. అనందమార్గ్, జమాత్-ఇ-ఇస్లామి, మావోయిస్ట్ సి.పి.ఐ.(ఎం.ఎల్లతో సహా పలు మతతత్వ వాద, వామపక్ష తీవ్రవాద సంస్థలు నిషేధింపబడ్డాయి. అరెస్టు చేయబడిన వారు కొద్దిరోజులలో, నెలలలో విడుదల చేయబడినప్పటికీ అత్యవసర పరిస్థితి కాలమంతా అరెస్టులు కొనసాగాయి. 19 నెలల
కాలవ్యవధిలో లక్ష మందికిపైగా అరెస్టు చేయబడ్డారు. అరెస్టయిన వారిలో స్మగ్లర్లు,
హోర్టర్లు, బ్లాక్‌మార్కెటీర్లు, గుండాల లాంటి సంఘ వ్యతిరేక శక్తులు పెద్ద సంఖ్యలో
ఉన్నారు.
అత్యవసర పరిస్థితి కాలంలో పార్లమెంటు నిరర్ధకం చేయబడింది. అరెస్టు
చేయబడని ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల ప్రసంగాలు పత్రికలలో ప్రచురించబడలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నియంత్రించబడ్డాయి. రెండు కాంగైసేతర ప్రభుత్వాలు-
తమిళనాడులో డియంకె ప్రభుత్వం, గుజరాత్లో జనకాప్రభుత్వం- కేంద్ర ప్రభుత్వానికి
విధేయంగా ఉన్నప్పటికీ 1976 జనవరిలో, మార్చిలో రద్దు చేయబడ్డాయి. తగినంతగా,
విశ్వసనీయంగా లేరని యుపి, ఒరిస్సాల కాంగైస్ ముఖ్యమంక్రుల్ని తొలగించి వారి
స్థానాల్లో విశ్వాసపాత్రుల్ని నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా కఠినంగా
నియంత్రించబడింది. పార్టీలోని అంతర్గత (వజాస్వామ్యం ఇంచుమించు
అణచివేయబడింది. 1976 ద్వితీయార్థం నుండి సంజయ్ గాంధీ నాయకత్వంలోని
యువజన కాంగ్రెస్ మాతృసంస్థ కంటే ముఖ్యమైన సంస్థ అయింది.
కార్యనిర్వాహకవర్గం యొక్క పని విధానాన్ని అదుపు చేసేందుకు న్యాయవ్యవస్థకు
గల అధికారాలను డిక్రీలు, చట్టాలు, రాజ్యాంగ సవరణలు తగ్గించాయి. పౌర స్వేచ్చను,
పౌర హక్కులను అద్దుకొనేందుకు 1975 జులైలో భారత రక్షణ చట్టం, మీసా చట్టం
సవరించబడద్దాయి. రాజ్యాంగం యొక్కపౌర హక్కుల మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రయత్నం చేయబడింది. పేద
ప్రజలకనుకూలమైన భూసంస్కరణల చట్టం లాంటి సామాజిక ఆర్థిక చర్యల్ని ప్రాథమిక హక్కుల రక్షణ మిషతో న్యాయవ్యవస్థ అద్దుకొంటున్నదనే సాకు చూపి రాజ్యాంగ సవరణపై న్యాయాధికారుల సమీక్షని రద్దు చేసింది. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటు స్వతంత్రం తర్వాత భారతదేశం 3389
అధికారానికి పరిమితులుండకూడదని నిర్దేశించబడింది. (ప్రాథమిక వాక్కు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశిక సూత్రాలకు లోబడి ఉందేలా చేయడం ద్వా! పరోక్షంగా నిర్వీర్యం చేయబడ్డాయి.
ఆ విధంగా అత్యవసర పరిస్థితి అపరిమితమైన రాజ్యాధికారాన్ని పార్టీ అధికారాన్ని ప్రధానమంత్రి చేతుల్లో కేంద్రీకరించింది. ఈ అధికారాన్ని ప్రధానమంత్రి చుట్టూ రా కొద్దిమంది రాజకీయ నాయకులతో అధికారులతో కూడిన చిన్న ముఠా దా చెలాయించటానికి వీలు కల్పించింది. అత్యవసర పరిస్థితి జు ప్రజల స్త దన
స ది.
మేధావులలోని ఒక సెక్షన్ అత్యవసర పరిస్థితికి ప్రతికూలంగా స్పందించా గ కాని అత్యధిక ప్రజలు ముభావంగా వున్నారు. మౌన సమ్మతి తెలిపారు. కాని మే ట్ ప్రారంభం నుండి అత్యవసర పరిస్థితికి (ప్రజాదరణ తగ్గటం మొదలైంది. రం ఆలస్యంగా స్పందించడానికి కారణమేమిటి? ఒకటి: ఇటీవల కాలంలో అంటే స్వతంఠిం వచ్చిన తరువాత ప్రజలకు అధికారవాద పాలనలో వున్న అనుభవం లేదు. వ్ తమకు తెలియనిది అంటే వారి అనుభవంలోకి రానిది వచ్చిపడటంతో వ్యక్తీ
భయాందోళనలకు గురయ్యారు. అంతేగాక ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో పాటు సంఘ వ్యతిరేక శక్తులపై లేక అంత ప్రజాధరణ పొందని మతతత్వ శక్తులపై వామపక్ష శీవ్రవాదులపైన అణచివేత చర్యలు చేపట్టబడ్దాయి. మొదటి కొద్ది రోజులలో దేశవ్యాప్తంగా అరెస్టు చేయబడిన వ్యక్తుల సంఖ్య 10,000 కంటే తక్కువ. చాలా కొద్ది కాల వ్యవధి అనేక మంది డిటెన్యూలు విడుదల చేయబడ్డారు. అన్నిటిని మించి విస్తృతంగా ప్రచారం చేయబడిన అత్యవసర పరిస్థితి యొక్క సానుకూల ఫలితాల పట్ల చాలా మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కాని వాస్తవమేమంటే అత్యవసర పరిస్థితి విధించకుందానే ఈ చర్యలు చేపట్టవచ్చు. పరిస్థితి కాస్త చక్కబడడంతో చాలామంది దేశం గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితుల నుండి రక్షింపబడినట్లుగా భావించారు. నగరాలలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఘెరావ్‌లు, హింసాయుత (ప్రదర్శనలు సద్దుమణిగాయి. వాతావరణంలో ఉద్రిక్తత తగ్గిందనే భావన ప్రబలింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరలా తరగతి గదులకు వెళుతున్నారు. కాలేజీలు, యూనివర్సిటీల పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. జర్నలిస్ట్ ఇందర్ మళల్తోలొ తి40 బిపన్చందద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇలా వ్రాశాడు: “సమ్మెలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, పోలీసులతో ఘర్షణలు, నిరంతర విధ్వంసం తరువాత సాధారణ క్రమబద్ధమైన జీవితం రావటాన్ని ప్రజలు స్వాగత్రించారు. తొలి మాసాలలో అత్యవసర పరిస్థితి భారత దేశానికి సంవత్సరాల తరబడి లేని ఒకరకమైన ప్రశాంతతని పునరుద్ధరించింది.”
ప్రభుత్వోద్యోగులు సకాలానికి ఆఫీసులకు వచ్చి ప్రజల పనుల పట్ల (శ్రద్ధ కనపరచడంతో పరిపాలన మెరుగయింది. దొంగ రవాణాదారుల్ని అక్రమ నిల్వదారుల్సి నల్ల బజారు వ్యాపారుల్ని విదేశీ కరెన్సీ, చట్ట విరుద్ధమైన వర్తకుల్ని. పన్నులు ఎగవేసేవారిని- వేలాదిమందిని మీసా చట్టం క్రింద జైళ్ళకు పంపించిన నాటకీయమైన, విస్తృత ప్రచారం పొందిన త్వరిత చర్య చేపట్టబడింది. ఆర్థిక పరిస్థితులలో కూడా గణనీయమైన అభివృద్ధి జరిగింది. అభివృద్ధికి ఒక కారణం అత్యవసర పరిస్థితిలో చేపట్టిన చర్యలు; మరొక కారణం: సకాలంలో మంచి వర్షపాతం, అత్యవసర పరిస్థితికి చాలా ముందు ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు. అంతకంటె ధరల విషయంలో (ప్రభుత్వం అనుసరించిన విధానం స్వాగతించదగింది. ఆహార పదార్థాలతో సహా అత్యవసర వస్తువుల ధరలు తగ్గాయి. షాపులలో అవి తగినంతగా లభించాయి.
ఇందిరాగాంధీ జులై 1న 20 అంశాల కార్యక్రమాన్ని ప్రకటించింది. దాని 'ప్రధాన లక్ష్యం విస్తృతంగా వున్న గ్రామీణ పేదల సామాజిక ఆర్థికాభివృద్ధి : 20 అంశాల కార్యక్రమం; భూమిలేని (శామికుల, చిన్న రైతుల, (గ్రామీణ చేతివృత్తుల వారి అప్పుల్ని రద్దు చేసి ప్రత్యామ్నాయ రుణ సౌకర్యం కల్పించుట, వెట్టిచాకిరీ రద్దు, వ్యవసాయ భూపరిమితి చట్టాన్ని అమలు జరిపి మిగులు భూమిని భూమి లేనివారికి పంచుట, భూమిలేని పేదలకు, బలహీన వర్గాలకు ఇండ్ల స్థలాన్ని సమకూర్చుట, వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల్ని పెంచుట, చేనేత పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రత్యేక సహాయమందించుట, ధరలు తగ్గించుట, పన్ను ఎగవేతని, దొంగ రవాణాన్ని అడ్డుకొనుట, ఉత్పత్తిని పెంచుట, అత్యవసర వస్తువుల సరఫరా సక్రమంగా జరిపించుట, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.8,000లకు పెంచుట. పెట్టుబడి పద్ధతుల్ని సరళతరం చేయుట.
20 అంశాల కార్యక్రమం అమలు కొరకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ధరల తగ్గుదల, అత్యవసర వస్తువుల లభ్యత, అక్రమ నిల్వలు, దొంగ రవాణా, పన్నుల ఎగవేతల నరికట్టడం లాంటి సత్వర ఫలితాలు సాధించబడ్డాయి. 20 అంశాల స్వతంత్రం తర్వాత భారతదేశం తశ
కార్యక్రమంలో కీలకాంశం పేద ప్రజల అభ్యున్నతి. దానిలో కూడా కొంత పురోగతి సాధింపబడింది. భూమిలేని పేదలకు, దళితులకు 3 మిలియన్ల ఇళ్ల స్థలాలు ఇవ్వబడ్డాయి. భూమిలేని వారికి 1.1 మిలియన్ల ఎకరాల మిగులు భూమి పంచబడింది. కాని మొత్తం మిగులు భూమిలో ఇది 10% మాత్రమే. వెట్టిచాకిరి చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించబడడం జరిగింది. కాని దానిని నిర్మూలించడానికి దాదాపు చేసిందేమీ లేదు. భూమిలేని వ్యవసాయ కూలీల, చిన్న రైతుల రుణ భారాన్ని తగ్గించేందుకు, రద్దు చేసేందుకు వివిధ రాష్ట్రాలలో అప్పు వసూళ్ళపై మారిటోరియం ప్రకటిస్తూ చట్టాలు చేయబడ్డాయి. కానీ జాతీయ బ్యాంకుల ద్వారా, గ్రామీణ సహకార సంస్థల ద్వారా కల్పించిన రుణ సదుపాయం చాలా తక్కువ. ఫలితంగా వడ్డీ వ్యాపారుల, భూస్వాముల మీద ఆధారపడడం కొనసాగింది. వ్యవసాయ కూలీల కనీస కూలి రేట్లు పెంచబడ్దాయి. కాని అంతంత మాత్రంగానే అమలు పరచడం జరిగింది. ఏమైనప్పటికీ పెద్ద భూస్వాములు, ధనిక రైతులు, పేదల పట్ల సానుభూతిలేని ఉద్యోగ వర్గం ఆటంకపరచటంతో 20 అంశాల కార్యక్రమం యొక్క గ్రామీణ విభాగం సరిగా అమలు జరుగలేదు. అత్యవసర పరిస్థితి యొక్క రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన తాత్కాలిక న్వభావానికి ప్రజల ఆమోదం లభించింది. అది రాజ్యాంగంలోని 3852వ ఆర్టికల్ననుసరించి ప్రకటించబడింది. పార్లమెంటు ఆమోదం పొందింది. కోర్టుల చట్టబద్ధతని పొందింది. ప్రజల దృష్టిలో అది తాత్కాలికమైన చర్య. సాధారణ నియమాల, (ప్రజాస్వామ్య సంస్థల తాత్కాలిక రద్దు. (ప్రజలు దానిని ప్రజాస్వామ్యానికి (ప్రత్యామ్నాయంగా గాని లేక నియంతృత్వాన్ని విధించే ప్రయత్నంగా గాని పరిగణించలేదు. అత్యవసర పరిస్థితి కాలమంతటా ఇందిరాగాంధీ తాను బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి పట్రికా స్వేచ్చకి పూర్తిగా నిబద్భురాలై ఉన్నానని, అత్యవసర పరిస్టితి అసాధారణ పరిస్థితికి అసాధారణ విరుగుడని, పరిస్థితి అసాధారణ స్థితికి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య పరిస్థితులు పునరుద్ధరించబడతాయని, ఎన్నికలు నిర్వహించబడతాయని నిశ్చితంగా చెప్పింది. ప్రజలు ఆమె మాటల్ని నమ్మారు. కొద్ది మాసాలలో (వ్రజలకు అత్యవసర పరిస్థితి వట్ల గల (భ్రమలు తొలగిపోయాయి. 1976 సంవత్సరాంతానికి ప్రజల అసంతృప్తి పరాకాష్టకు చేరింది. అందుకు విభిన్నమైన కారణాలున్నాయి. తి42 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
(ప్రజలకు ఉపశమనం ఎక్కువ కాలం కొనసాగలేదు. అత్యవసర పరిస్థితి మొదటి సంవత్సరం యొక్క ఆర్ధికాభివృద్ధి నిలకడగా కొనసాగలేదు. వ్యవసాయోత్పత్తి క్షీణించింది. 1976 సంవత్సరాంతానికి ధరలు 10 శాతం పెరిగాయి. అత్యవసర పరిస్థితి దిగ్రమ నుండి తేరుకొన్న లంచగొండులు, నల్ల బజారు వ్యాపారులు, దొంగ రవాణాదారులు, తమ కార్యకలాపాలు తిరిగి చేపట్టారు. తమ సంక్షేమం కుంటి నడకన సాగుతుండడంతో పేదల భ్రమలు తొగిపోయాయి. వేతనాలు, బోనస్, కరువు భత్యాలపై సమ్మెహక్షుపై షరతుల కారణంగా కార్మికులు అసంతృప్తి చెందారు. కఠినమైన క్రమశిక్షణ అమలు జరపడం వలన చాలా సందర్భాలలో కుటుంబ నియంత్రణ కోటాలు పూర్తి చేయమని నిర్బంధించడం వలన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి చెందారు.
సామాజిక మార్చుకై నూతన సంస్థల్ని ప్రజాసమీకరణకు యంత్రాంగాన్ని సృష్టించడంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ విఫలమవడం వలన ప్రకటించిన పద్ధతులలో నిజమైన అభివృద్ధి సాధ్యపడలేదు. 20 అంశాల కార్యక్రమాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు జరిపే బాధ్యత లంచగొండులు, అసమర్భులు అయిన అధికార వర్గానికి, తిమ్మిని బమ్మిని చేసి అప్రతిష్టపాలైన రాజకీయ నాయకులకు అప్పజెప్పబడింది. ఇక సాధారణ ప్రజలు వారి కష్టాల్సి కడగండ్లని చెప్పుకొనేందుకు, నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశాలు లేకపోవడం వలన వారి పరిస్థితి పెనం మీద నుండి పాయ్యిలో
పడ్డట్లు వుంది. కేవలం మేధావులు, రాజకీయ కార్యకర్తలే కాక సాధారణ ప్రజలు
కూడా భయం, అభద్రతలు ఆవహించిన వాతావరణంలో బతుకులు సాగించారు.
అధికార వర్షానికి, పోలీసులకు విశేషాధికారాలు సంక్రమించాయి. పత్రికలు, కోర్టులు,
ఎమ్మెల్యేలు, ఎం.పి.లు, రాజకీయ పార్టీలు, (ప్రజా ఉద్యమాలు వారిని అడ్బుకోలేని
నిస్సహాయ స్థితికి నెట్టివేయబడ్డాయి. అధికారులు, పోలీసులు - వారి అలవాటు ప్రకారం
వారి పద్ధతులలో అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దీని ప్రభావం ప్రజలపై-
ప్రత్యేకించి పేద ప్రజలపై ఎక్కువగా పడింది. అదే సమయంలో పత్రికల సెన్సార్షిప్,
నిరసనల నోరు నొక్కడం- దేశంలో ఏమి జరుగుతున్నదో ప్రభుత్వానికి తెలియని
స్థితికి దారితీశాయి. అంతేగాక పత్రికలలో, రేడియోలలో వచ్చేవి కూడా పూర్తిగా సెన్సార్ చేయబడుతున్నాయని ప్రజలకు తెలుసు కనుక వారు పత్రికల్ని రేడియోల్ని ఏ మాత్రం నమ్మలేదు. పుకార్లను, వదంతుల్ని నమ్మారు. ప్రభుత్వ చర్యలకు సంబంధించిన చెడునే నమ్మాలనే ధోరణి ప్రబలింది.
స్వతంత్రం తర్వాత భారతదేశం తకం
పౌర హక్కుల నిరాకరణని గురించి కూడా ప్రజలు తీవ్రంగా ఆలోచించారు. క్రింది స్థాయిల ఉద్యోగులు లంచాలు, వేధింపుల రూపంలో తమ జీవితాలతో చెలగొాట మాడుతున్నారని భావించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడంలోని జాప్యం- ప్రత్యేకించి ఇందిరాగాంధీ 1976 నవంబరులో ఎన్నికలు ఒక సంవత్సరం పొటు వాయిదా వేయాలని పార్లమెంటు అమోదం పొందడంతో అధికారవాద పాలనా చట్రం శాశ్వతం చేయబడుతుందని లేక చాలాకాలంపాటు కొనసాగుతుందని భయం కలిగించింది. మేధావులు- ఉపాధ్యాయులు, పత్రికా రచయితలు, వృత్తిదారులు, చిన్న పట్టణాలలోని న్యాయవాదులు - ప్రత్యేకించి మధ్యతరగతి వాళ్ళు 1976 సెప్టెంబరులో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణని రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా ప్రజాస్వామ్యానికి హాని కలిగించేందుకు చేసిన ప్రయత్నంగా భావించారు. అంతకుముందు ఆమోదయోగ్యంగా ఉన్న అత్యవసర పరిస్థితి దాని న్యాయబద్ధతని కోల్పోవదం మొదలయింది.
అత్యవసర పరిస్థితి ప్రజాదరణ కోల్పోవడానికి పెద్ద కారణం: ప్రభుత్వంలోగొ ని కాంగ్రెస్‌లోగాని ఎలాంటి పదవిలేని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్గొంభీ రాజకీయాధికారానికి ఎగబాకి రాజ్యాంగేతర అధికార కేంద్రంగా పరిణతి చెందడం. 1976 ఏప్రిల్ నాటికి ప్రభుత్వ పరిపాలనా పని విధానంలో జోక్యం చేసుకొ న్ సంజయ్‌గాంధీ సమాంతర అధికారంగా ఆవిర్భవించాడు. కేబినెట్ మంత్రులు, కాం(ెన నాయకులు, ముఖ్యమంత్రులు, సీనియర్ సివిల్ అధికారులు సంజయ్‌గాంధీ ఆదేశాలను పాటించవలసి వచ్చింది. కాంగ్రెస్ లోపల అతడు యువజన కాంగ్రెస్ నాయకుడయ్యాడు. యువజన కాంగ్రెస్ రాజకీయ ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది.
1976 జులైలో నంజయ్గాందీ నాలుగు అంశాల కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. నాలుగు అంశాల కార్యక్రమం (ప్రభుత్వం యొక్క 20 అంశాల కార్యక్రమం కంటే ముఖ్యమైనదయింది. నాలుగు అంశాలు: పెండ్లి సమయంలో కట్నం తీసుకోవద్దు. కుటుంబ నియంత్రణని అమలు పరచి కుటుంబాన్ని ఇద్దరు పిల్లలకే పరిమితం చేయండి, మొక్కలు పెంచండి, అక్షరాస్యతను ప్రోత్సహించండి. సంజయగొంధీ మురికివాడల్ని, రోడ్లకు, బజార్లకు, పార్కులకు, సమీపంలో ఉన్న అనధికార కట్టడాలను తొలగించి నగరాలను అందంగా తీర్చిదిద్దాలనుకాన్నాడు. త్క్షడ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సంజయ్‌గాంధీ ఒత్తిడితో ప్రభుత్వం కుటుంబ నియంత్రణని చురుకుగా, చట్టవిరుద్ధంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రోత్సాహకాలు, నచ్చచెప్పటాలకు బదులుగా ఒత్తిడులు, నిర్బంధాలు పెరిగాయి. ఇంతమందిని ఆపరేషన్లకు తీసుకొని రావాలని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, హెల్త్ వర్మర్లకు కోటాలు నిర్ణయించబడ్డాయి. కోటాల అమలుకై పోలీసుల, పాలనా నిర్వాహకుల జులుం తోడయింది. గ్రామీణ, పట్టణ పేదలు దాక్కొన్నారు. పారిపోయారు. కొన్ని సందర్భాలలో ఘర్షణలకు తలపడ్డారు. అంతేగాక పత్రికలపై సెన్సార్షిప్ కారణంగా నిర్బంధ ఆపరేషన్లకు సంబంధించిన నిజాలు, కల్పిత కథలు, హింసాయుత ప్రతిఘటనల కబుర్లు ప్రజలలో వేగంగా విస్తృతంగా ప్రచారమయ్యాయి.
కుటుంబ నియంత్రణ కార్యక్రమం తరహాలోనే పేదవాడల తొలగింపు, అనధికార కట్టదాల విధ్వంసం, ఇంకా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా చేపట్టబడింది. కాని ఇది ఢిల్లీ, ఇతర కొద్ది నగరాలకే పరిమితమయ్యింది.
ఆ విధంగా భయం, అణచివేత, లంచగొండితనం, అధికార దుర్వినియోగంతో అప్పటికే కలుషితమైన వాతావరణం సంజయ్‌గాంధీ ఆదేశాల మేరకు జరిపిన అత్యాచారాలతో మరీ క్షీణించింది. హఠాత్తుగా 1977 ఎన్నికలు
ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికలు మార్చిలో నిర్వహించబడతొయని ఎవరూ ఊహించని విధంగా 1977 జనవరి 16న ప్రకటించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. పత్రికలపై సెన్సార్షిప్, బహిరంగ సభల నిర్వహణ లాంటి రాజకీయ కార్యకలాపాలపై నిర్బంధాలు తొలగించింది. రాజకీయ పార్టీలు స్వేచ్ళగా ప్రచారం చేసుకోవడానికి అనుమతించబడ్డాయి.
మార్చి 16న స్వేచ్భాయుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వపొంచబడ్డాయి. ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పూర్తిగా ఓడింపబడింది. ఇందిరాగాంధీ, సంజయగాంధీ పరాజితులయ్యారు. ప్రజల తీర్పుని అంగీకరిస్తూ తగు నమతతో ఇందిరాగాంధీ ప్రకటన విడుదల చేసింది.
ఇందిరాగాంధీ ఎందుకు ఎన్నికల ప్రకటన చేసి స్వేచ్చాయుత ఎన్నికలు నిర్వహించింది? ఆమె కేవలం రెండు నెలల క్రితం 1976 నవంబరులో ఎన్నికలను స్వతంత్రం తర్వాత భారతదేశం కశక
ఒక సంవత్సరం వాయిదా వేస్తూ పార్లమెంటు ఆమోదం పొందింది. చాలా ఊహాగానాలు వున్నప్పటికీ ఈ ప్రశ్చకు ఇప్పటికీ సంతృప్తికరమైన జవాబు లేదు. మూడు వివరణలు ఇవ్వబడ్డాయి. మొదటిది: ఉదార ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఇందిరాగాంధీకి అంతర్గతంగా వున్న నిబద్ధత యొక్క వ్యక్తీకరణే ఎన్నికల నిర్ణయం. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రచయిత మేరీ సి.కార్స్ ఇలా వివరించింది. 'ఆమె జీవిత కాలమంతటా ఆమె స్వీయ (ఆత్మ) ప్రతిబింబం ప్రజాస్వామ్యవాదిగా ఉంటూ వచ్చింది. ఆమె స్వీయ ప్రతిబింబం నుండే ఆమె ఆత్మ గౌరవం ప్రాప్తించింది. ఆమె ఇప్పుడూ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదినని ప్రపంచానికి, అన్నిటిని మించి తనకు తాను నిరూపించుకోవలసి వచ్చింది. మరికొందరు రచయితల అభిప్రాయం (ప్రకారం అత్యవసర పరిస్థితి, అత్యాచారాలు ఆమె గమనంలోకి రాగానే పరిస్లితులు ఆమె చేయిదాటి పోతున్నాయని (గ్రహించింది. అధికారం కోల్పోవలసి వచ్చినప్పటికీ ఎన్నికలు నిర్వహించి ఆ స్థితి నుండి బయటపడాలని నిర్ణయించింది. రెండవది : ప్రతికూలుర అభిప్రాయాన్ని అనుసరించి ఇందిరాగాంధీ ప్రజలనాదిని పట్టుకోలేక పోయింది. వందిమాగధులు, రహస్య సమాచార సంస్థలు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆమెకి గెలుస్తాననే నమ్మకం కలిగింది. ప్రజాభిప్రాయానికి దూరమై, ఒంటరియై ఆమె పరిపాలన ఎంతగా ప్రజాదరణ కోల్పోయిందో ఆమెకు తెలియదు. ఎన్నికలలో గెలవడం ద్వారా అత్యవసర పరిస్టితి విధింపుని సమర్ధించుకొని తన వారసునిగా సంజయ్‌గాంధీకి మార్గం సుగమం చేయాలని ఆశించింది. శ మూడవది : ఎన్నికల ద్వారా అత్యవసర పరిస్థితి విధానాలు చట్టసమ్మతం బడాలి. మొదటనే అత్యవసర పరిస్థితి విధింపు రాజ్యాంగం మేరకు చేయబడింది. గనుక అది చట్ట సమ్మతమైనది. కాని ప్రజలలో లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలననుసరించి అది చాలదు. అంతేగాక ప్రజలలో అసంతృప్తి అలజడి సంకేతాలు సృష్టంగా కనిపించాయి. అత్యవసర పరిస్టితి కాలం నాటి పరిపాలన అపఖ్యాతి పాలైనట్లు ఆమె గ్రహించి వుంటుంది. అందువలన అసమ్మతిని పాశవికంగా అణచివేసి అధికారవాదాన్ని బలోపేతం చేసుకోవాలి లేదా ప్రజాస్వామ్య విధానానికి మారి ఎక్కువ చట్టబద్ధతని, రాజకీయాధికారాన్ని సాధించాలి. మొదటి ఎంపిక ఎంతో వైవిధ్యం గల పెద్ద దేశంలో అందునా ప్రజాస్వామ్య సంప్రదాయాలు గల దేశంలో పని చేయదు. త46 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అది సాధించడానికి అవసరమైన అణచివేతని తీవ్రతని ప్రజలు అంగీకరించరు, సహించరు.
1975-77 కాలంలో భారతీయులు, విదేశాలకు చెందిన భారతదేశ మిత్రులు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయ సంక్షోభాన్ని తట్టుకొని మనగలుగుతుందని ఆశించినప్పటికీ వారికి ఆ వ్యవస్థ భవితవ్యంపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అంత ఆశావహ దృక్పథం లేనివారు భారతదేశంలోని ప్రజాస్వామ్యం సంపూర్ణంగా శాశ్వతంగా (గ్రహణంలో చిక్కుకొన్నదని, ఇతర వలస వాదానంతర దేశాలలో లాగా అధికారవాద రాజ్యాంగాన్ని మారుతుందనుకొన్నారు. మరికొందరు అత్యవసర పరిస్థితిని రద్దు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని పునరుద్ధరించినప్పటికీ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టిన మౌలిక మార్పులు, విధానాలు కొనసాగుతాయని చెప్పారు. కొందరు వ్యాఖ్యాతలు మరికొంత ముందుకు పోయి అధికారవాదం వైపుగా మార్పు 1950 నుండి జరుగుతూ వుందని, అది ఒక పేద నిరక్షరాస్య దేశానికి స్వాభావికమని పేర్కొన్నారు. మరికొందరు భారత దేశంలో 1950లో స్థాపించిన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ భారతదేశ స్వభావానికి లేక దేశ ప్రజల అవసరాలకు సరిపడనిదని వ్యాఖ్యానించారు. ఆర్థికాభివృద్ధిని ప్రజాస్వామ్యంతో కలపటం సాధ్యపడదని మరికొందరు అభిప్రాయపడ్డారు. కొందరు రాడికల్స్ ఉదారవాద ప్రజాస్వామ్యం, సమాజంలోని వర్గాధిపత్యం ప్రజల పోరాటాల అణచివేతల కటువైన వాస్తవాన్ని దాచిపెట్టే ఉపరితలమేనని వాదించారు. అత్యవసర పరిస్థితి ఉపరితలాన్ని తొలగించింది. అది సామాజిక రాజకీయ వాస్తవికతని అందరికీ కనపదేలా చేసింది తప్ప ఎలాంటి మౌలిక రాజకీయ మార్చు కొరకు కాదు.
అత్యవసర పరిస్థితి అంటే భారత ప్రజలకు రాజకీయ నాయకత్వం ప్రజాస్వామ్యం పట్ల గల నిబద్ధత నుండి తాత్కాలికంగా ప్రక్కకు తొలగడమేనని కాస్త ముందూ వెనుకగా (ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడుకుందని భారత దేశంలోను, విదేశాల్లోనూ పలువురు నమ్మారు.
భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ జె.పి ఉద్యమాన్ని అత్యవసర పరిస్థితిని తట్టుకొని మనగలగడమే గాక బలోపేతమయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవినీతినంతమొందించటానికి నియంతృత్వమవసరమనే మాటలు 1977 నుండి సద్దుమణిగాయి. స్వతం[త్రం తర్వాత భారతదేశం 847
అత్యవసర పరిస్థితి ఎత్తివేత, వెను వెంటనే ఎన్నికలు స్వతంత్రానంతర భారతదేశ చరిత్రలో ఒక నిర్దిష్టమైన ఘటన. ఇది ప్రజాస్వామ్య విలువల పట్ల భారత ప్రజల ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ ప్రజాస్వామ్య విలువలు స్వతంత్ర్య పోరాట ప్రభావం; అలాగే 1947 నుండి స్వేచ్చాయుత ఎన్నికలతో సహా ప్రజాస్వామ్య పనివిధానం యొక్క ఫలితం. తారిఖ్ఆలీ ప్రస్తావించినట్లు 1977 మార్చి ఎన్నికలలో పౌర హక్కుల సమస్యలు కేవలం పట్టణ మధ్యతరగతులకు చెందినవే కావని పట్టణ గ్రామీణ పేదలు సూటిగా స్పష్టంగా నిరూపించారు. ఎన్నికల ప్రచారాన్ని గురించి పత్రికలకు రిపోర్టు చేస్తూ ఇందర్మల్లోత్రా దేశంలోని మారుమూలల్లో గల పల్లె ప్రజలు పౌరహక్షులు, ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయవ్యవస్థలపై జరిపిన వాదనలకు ఎలా స్పందించారో చాలా స్పష్టంగా వివరించారు. జె.పి. ఉద్యమం, అత్యవసర పరిస్టితి పాలనల స్వభావం ఏమైనప్పటికీ స్వేచ్భాయుతంగా ఎన్నికలు జరపాలని ఇందిరాగాంధీ నిర్ణయం, ఆమె పరాజయం, ప్రతిపక్షాల విజయం - భారత ప్రజాస్వామ్యం యొక్క ఘన విజయం. 1975-77 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పరీక్ష సంవత్సరాలుగా వర్ణించబడ్డాయి. భారత 'ప్రజలు ఈ పరీక్షలో సంపూర్ణంగా కృతార్జులయ్యారు. తెక్ష8ి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
19 జనతా అరాచక కాలం, ఇందిరాగాంధీ తిరిగి అధికార స్వీకారం 1977-84
ప్రతిపక్ష నాయకులు 1977 జనవరిలో జైళ్ల నుండి విడుదల కాగానే కాంగ్రెస్(ఒ), జనసంఘ్, భారతీయ లోక్థళ్ (బి.యల్.డి), సోషలిస్టు పార్టీలు కొత్త జనతా పార్టీలో విలీనమైనట్లు ప్రకటించారు. జగజ్జీవన్‌రాం, 'హెచ్.యన్.బహుగుణ, నందినీ సత్బతి ఆకస్మికంగా 1977 ఫిబ్రవరి 2న కాంగ్రెస్ నుండి ఫిరాయించి కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ (సి.యఫ్.డి) స్థాపించడంతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాక మార్చిలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలైన సిపిఐ, ఎఐఎ డియంకేలతో ముఖాముఖి తలపడేందుకు డియంకె, అకాళీదళ్, సిపిఎంలు జనతాపార్టీతో ఉమ్మడి ఫ్రంటు ఏర్పాటు చేశాయి.
ప్రతిపక్ష ఫ్రంటు తన ఎన్నికల ప్రచారంలో అత్యవసర పరిస్థితి, ఆ కాలంలో జరిగిన అత్యాచారాలు- (ప్రత్యేకించి నిర్భంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను, పౌర హక్కులపై నిర్బంధాలను ప్రధానమైన సమస్యలుగా ముందుకు తెచ్చింది. ప్రజలు కూడా ఎన్నికల్ని అత్యవసర పరిస్థితిపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా పెల్లుబికిన ప్రజావెల్లువతో జనతా పార్టీ దానిమిత్రపక్షాలు ఘన విజయం సాధించాయి. 542 స్థానాలలో 330 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ కేవలం 154 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ మిత్ర పక్షాలు- సిపిఐ 7 సీట్లు ఎ.ఐ.ఎ., డి.ఎం.కె. 21 స్థానాలు గెలిచాయి. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టబడింది. ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో 234 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. ఇందిరాగ్గాంధీ, సంజయగాంధీ- ఇరువురూ పరాజితులయ్యారు. పశ్చిమ భారతదేశంలో అత్యవసర పరిస్థితి కఠినంగా అమలు జరుపకపోవడం వలన 20 అంశాల కార్యక్రమంలోని పేదలకనుకూలమైన చర్యలు మెరుగ్గా అమలు జరుపడం వలన కాంగైస్ గతంలోకంటే స్వతంత్రం తర్వాత భారతదేశం 349
మంచి ఫలితాలు సాధించింది. 1971లో 71 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 1977 ఎన్నికలలో 92 సీట్లు గెలిచింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో జనతాపార్టీ కేవలం 6 సీట్లు మౌ త్రమే గెలిచింది. ఎన్నికలైన వెంటనే కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ జనతా పార్టీలో విలినమయింది. మొరార్జీ దేశాయ్, చరణసింగ్, జగబ్జేవన్రాంలలో ఎవరు ప్రధానమంత్రి కావాలనే సమస్యపై దాదాపు సంక్షోభం ఏర్పడింది. సమస్య సీనియర్ నాయకులైన జయట్రకా నారాయణ, జె.బి.కృపలానీ సమాలోచనకి అప్పగించబడింది. వారు 81 సంవత్సరాల మొరార్డీ దేశాయిని ప్రధానమంత్రి చేయాలని సూచించారు. మొరార్జీ దేశాయ్ మార్చి 28న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కొత్త ప్రభుత్వం చేపట్టిన మొదటి చర్యలలో ఒకటి రాష్ర్రాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించడం. జాతీయ స్థాయి ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర స్టాయి కూడా పాలించే అర్హత కోల్పోయిందనే వాదనతో ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఉన్న 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసింది. రాష్ట్ర అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికల్ని ప్రకటించింగి 1977 జూన్‌లో జరిపిన ఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు- ఒక్క తమిళనాడు కె తప్ప మిగిలిన 8 రాష్ట్రాలలోను విజయం సాధించాయి. తమిళనాడులో ఎఐఎదియా గెలిచింది. జనతాపార్టీ మిత్రపక్షమైన సిపిఎం పశ్చిమబెంగాల్లో పూర్తి మెజారి సాధించింది. పార్లమెంటుపై, రాష్ట్ర అసెంన్లీలపై అదుపు సాధించిన జనతాపార్టీ తన అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని పోటీ లేకుండా 1977 జులైలో రాష్ట్రపతిని చేయగలిగింది. జనతా ప్రభుత్వం అత్యవసర పరిస్టితి కాలం నాటి అధికారవాద ధోరణులకు అంతం పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది: పత్రికలకు, రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు ప్రాథమిక హక్షుల్ని, పౌర హక్కుల. పునరుద్ధరించింది. ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని. వక్రీకరించిన నిబంధనల్ని రద్దు చేస్తూ &4వ రాజ్యాంగ సవరణ చేసింది. కేంద్రం లేక రాష్ట్ర శాసనాల చట్టబద్ధతని నిర్ణయించే నుప్రీంకోర్చు, హైకోర్టు హక్కులొ పునరుద్ధరించబడ్డాయి. సంక్షోభంలో జనతాపార్టీ పరిపాలనా నిర్వహణ, అభివృద్ధి విధానాల అమలు, సొమాజిక న్యాయం సాధన లాంటి అంశాలలో జనతా (ప్రభుత్వ పని విధానం, ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు 3850 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
లేకపోవడంతో జనతాపార్టీ పరిపాలనకు ప్రజాదరణ తగ్గడం మొదలయింది. ప్రభుత్వం 1979 జులై వరకు అధికారంలో కొనసాగినప్పటికీ జనతాపార్టీ విచ్చిన్నమవడం (ప్రారంభమయింది. జనతాపార్టీ పాలనా శక్తిపై సన్నగిల్లిన విశ్వాసం ఆగ్రహంగా మారడం మొదలయింది. అందుకు చాలా కారణాలున్నాయి. మొదటిది: పేదలపై షెడ్యూల్డు కులాలపై అత్యాచారాల రూపంలో వ్యక్తమైన (గ్రామీణ ప్రాంతాలలోని సామాజిక ఉ(ద్రిక్తల విషయంలో జనతాపార్టీ సక్రమంగా వ్యవహరించలేకపోయింది. ఉత్తర భారతదేశంలో సామాజిక పునాదిగా ఉన్న వారు ప్రధానంగా అత్యధికులు మధ్యస్థ కులాలకు చెందిన ధనిక, మధ్యతరగతి రైతులు, అగ్రవర్జాలకు చెందిన పెద్ద భూస్వాములు, పట్టణ (గ్రామీణ ప్రాంతాల దుకాణాదారులు, చిన్న వ్యాపారస్థులు, పెటీ బూర్జ్డువాలు. కేంద్రంలో రాష్ట్రాలలో జనతా ప్రభుత్వాలు ఏర్పడడంతో గ్రామీణ భూస్వాములు దేశంలో- ప్రత్యేకించి (గ్రామీణ ప్రాంతాలలో తమకు తిరుగులేని అధికారం దక్కినట్లు భావించారు. మరొకవైపు అత్యధికంగా షెడ్యూల్డు కులాలకు చెందిన భూమిలేని శ్రామికులు, పేదలు, చాలాకాలంగా అనుభవిస్తూ వచ్చిన ఓటు హక్కు ఇతర ప్రజాస్వామ్య హక్కులతో ఒక మేరకు చైతన్యవంతులయ్యారు. వారు 20 అంశాల కార్యక్రమం క్రింద పొందిన ప్రయోజనాల్ని హక్కుల్ని పరిరక్షించుకొన ప్రయత్నించారు. చాలా రాష్ట్రాలలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్ని దౌర్జన్యంగా తిరిగి స్వాధీనం చేసుకొన ప్రయత్నించారు. వడ్డీ వ్యాపారులు ఎమర్జెన్సీ కాలంలో రద్దు చేసిన అప్పుల వసూలుకు ప్రయత్నించారు. ఫలితంగా ఉత్తర భారతదేశంలో కుల ఉద్రిక్తలు, షెడ్యూలు కులాల వారిపై హింసాత్మక దాడులు విస్తృతంగా జరిగాయి. ఇలాంటి దాడులలో భాగంగా 1977 జులైలో వీహారులోని బెల్బి వద్ద హరిజనులపై హత్యాకాండ జరిగింది.
పెద్దఎత్తున మతతత్వ హింన రగులుకొన్నది. చెలరేగిన ఆందోళనలు, చట్టరాహిత్యం, హింస-ప్రభావం కాలేజీలు, యూనివర్సిటీలపై పడింది. వాటి మూసివేతకు దారి తీసింది. 1979 మధ్యలో సమ్మెలు వెల్లువెత్తాయి.
అంతేగాక జనతా పాలన భారీ పరిశ్రమలు, ఆధునిక వ్యవసాయం, అభివృద్ధి చెందిన శాస్తసాంకేతిక రంగాల ప్రాతిపదికన అభివృద్ధి జరగాలన్న నెహ్రూ దృక్పథాన్ని నిరాకరించింది. కాని అర్థిక వెనుకబాటుతనాన్ని అధికమించే ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించడంలో విఫలమయింది.
జనతా ఆర్థిక విధానం కేవలం పారిశ్రామికాభివృద్ధికి గామీణాభివృద్ధి సరితూగేలా చేయాలన్నది. ఈ విధానం మూడు అంశాలపై ఆధారపడింది. భారీ పరిశ్రమలకు స్వతంత్రం తర్వాత భారతదేశం 351
సహాయకారిగా ఉండే చిన్న తరహా పరిశ్రమలుగాక భారీ పరిశ్రమల స్థానంలో చిన్న పరిశ్రమలు, జాతీయ ప్రణాళికా స్థానంలో వికేంద్రీకరణ, ఉదారంగా ఇచ్చే సబ్సిడీలు, భూమిశిస్తు పన్నులలో తగ్గుదల, పరిశ్రమల నుండి గ్రామీణ ప్రాంతాలకు వనరుల తరలింపు ప్రాతిపదికపై సంపన్న రైతుల నాయకత్వంలో వ్యవసాయాభివృద్ధి. జనతాపార్టీ భూసంస్క్మరణలపై, వ్యవసాయ కార్మికులకు వేతనాల పెంపుపై చేసిన వాగ్దానాలు నెరవేర్చటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. జనతా ప్రభుత్వం చేపట్టిన ఒక సానుకూలమైన చర్య గ్రామీణ నిరుద్యోగులకు పనికి ఆహారం పథకం ద్వారా ఉపాధి కల్పించడం. ఈ పథకం రోడ్లు, పాఠశాల భవనాలు లాంటి గ్రామీణ మౌలిక నదుపాయాల్ని వెరుగువరచటానికి తోడ్పడింది. ఈ వథకాన్ని పశ్చిమబెంగాల్లోని సిపిఎం ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు జరిపింది. జనతాపాలన మొదటి సంవత్సరాంతానికి అటు వ్యవసాయరంగంలోను, ఇటు పారిశ్రామిక రంగంలోను ఆర్థికాభివృద్ధి స్తంభించింది. 1978, 1979 సం॥లలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, చాలా రాష్ట్రాలలో విధ్వంసకరమైన వరదలతో వ్యవసాయోత్పత్తి పడిపోయింది. ప్రత్యేకించి ఆహార ధాన్యాల నిల్వలు పనికి ఆహారం పథకం క్రింద ఖర్చవడం వలన ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు మరలా విపరీతంగా పెరిగాయి. ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్ 1979లో ప్రవేశపెట్టిన భారీ లోటు బడ్జెట్టు గణనీయమైన ద్రవ్యోల్బణ ప్రభావం చూపింది. 1979లో కిరోసిన్ ఇతర నిత్యావసర వస్తువుల కొరతలు ఏర్పడ్డాయి. సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణం 20% అధిగమించింది. జనతా ప్రభుత్వం చాలా కొద్ది కాలం పాటే అధికారంలో ఉంది. విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయటానికి ఆ కాలవ్యవధి చాలా తక్కువ. అయినప్పటికీ విస్తృతంగా ఆమోదం పొంది, అప్పటికి అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూనే విదేశీ విధానాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నించింది. అసలైన అలీన విధానాన్ని గురించి అంటే సోవియట్ యూనియన్‌లో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికా, (బ్రిటన్లతో సంబంధాలను దృఢపరచుకోవాలన్నది. పార్టీని కలిపి వుంచటం జనతా నాయకులకు తలకుమించిన పనయింది. సరియైన దిశానిర్దేశం లేక అటు కేంద్రంలోను, ఇటు రాష్ర్రాలలోను పార్టీ అంతర్గత చీలికలతో కుమ్ములాటలతో కునారిల్లింది. జనతా పార్టీలోని ప్రతిరాజకీయ విభాగం వీలైనంత ఎక్కువ రాజకీయ, పాలనాపరమైన అవకాశాల్ని స్వంతం చేసుకోవాలని తై5ల్లె బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
(ప్రయత్నించింది. జన సంఘ్ సైద్ధాంతికంగా తన మతతత్వ అజెందాని పాఠ్యపుస్తకాల ద్వారా, ప్రసార ప్రచార రంగాలలో విద్యాసంస్థలలో పోలీసులలో ఎక్కువ మందిని నియమించడం ద్వారా బలపడాలని ప్రయత్నించింది. జనతాపార్టీ భిన్నమైన పార్టీల (గ్రూపుల సంకీర్ణం. నాయకుల వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షల ముఠా తత్వానికి, కుట్రలు, కుయుక్తులు, మాయోపాయాలకు పార్టీ బలిపశువయింది. జనతాపార్టీగా ఏర్పడిన విభిన్న పార్టీలు చారిత్రకంగా సైద్ధాంతికంగా, కార్యక్రమాల రీత్యా భిన్న దృక్పథాలు గలవి. ఇందిరాగాంధీ వ్యతిరేకత, అధికార కాంక్ష మాత్రమే వాటిని కలిపి ఉంచాయి. 90 మంది పార్లమెంటు సభ్యులు గల జనసంఘ్, జనతాపార్టీలో నిర్మాణబద్ధమైన, (ప్రబలమైన విభాగం. ఆర్.యస్.యస్‌తో జనసంఫ్కి విడదీయరాని సంబంధాలున్నాయి. ఆర్.ఎస్. ఎస్ జనసంఘ్‌కి సిద్ధాంతాన్ని, శ్రేణుల్ని సమకూర్చుతుంది. జనసంఘ్ ఇతర పార్టీలతో కలవడాన్ని అంగీకరించదు. కాంగ్రెస్(ఒ) కన్సర్వేటివ్ సెక్యులర్ పార్టీ. మౌలికంగా కాంగ్రెస్ స్వభావం గలది. బి.యల్.డి కూడా సెక్యులర్ పార్టీ. ధనిక రైతు పార్టీ. అఖిల భారత లేక అభివృద్ధికరమైన దృక్పథం లేని పార్టీ. సోషలిస్టులు సిద్ధాంత రహితంగా ఉన్నారు. వారికి బీహారులో తప్ప ఎక్కడా పట్టులేదు.
కాంగ్రెస్ పునరుజ్జీవం
ఈ మధ్య కాలంలో కాం(గెస్ చీలిపోయింది. వునరుజ్జీవం పొందింది. ఇందిరాగాంధీ పని అయిపోయిందని రాజకీయంగా ఆమెతో కలిసివుండడం నష్టదాయకమని భావించిన పలువురు ప్రముఖ నాయకులు వైబి. చవాన్, బ్రవ్మానందరెడ్డిల నాయకత్వంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించారు. ఆమె 1978 జనవరిలో కాంగ్రెస్‌ని చీల్చింది. ఆమె పక్షం కాంగ్రెస్(ఐ) 'ఐ) అంటే ఇందిరా.. రెండవ పక్షం కాంగ్రైస్(యు) (యు అంటే దేవరాజ్ అర్స్).
ఆ తరువాత ఇందిరాగాంధీకి రాజకీయంగా మంచి రోజులు వచ్చాయి. 1976 ఫిబ్రవరిలో కర్నాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రైెస్(ఐ) జనతాపార్టీని, కాంగ్రైస్(యు)ని ఓడించింది. కాంగ్రెస్(ఐ) పునరుజ్జీవానికి రెండు కారణాలున్నాయి. మొదటిది: జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీపై పగబట్టి వేధించటానికి, ఎమర్జెన్సీ కాలం నాటి ఘటనలపై ఆమెని శిక్షించటానికి చేసిన ప్రయత్నం. ఇందిరాగాంధీ, అధికారులు ఎమర్లెన్సీ కాలంలో జరిపిన అధికార దుర్వినియోగాలపై, అత్యాచారాల పై దర్యాప్ష చేసేందుకు చాలా విచారణ కమిటీలు- ప్రత్యేకించి షా కమిషన్ నియమించబడ్డాయి. 1979లో ఆమె నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేకమైన స్వతంత్రం తర్వాత భారతదేశం 859
న్యాయస్థానాల నియామకం జరిగింది. వీటిని సాధారణ (ప్రజలు ఇందిరాగాంధీపై పగ, కసి తీర్చుకునే చర్యలుగా భావించారు. ఆమెని అధికారం నుండి తొలగించడం జరిగింది గనుక అప్పటికే శిక్షింపబడిందని భావించారు. అంతేగాక గ్రామీణ, పట్టణ పేదలు, హరిజనులు, మైనారిటీలు, మహిళలు ఇంకా ఇందిరాగాంధీని తమ రక్షక్షురాలిగా, ఇందిరమ్మగా లేక అమ్మ ఇందిరమ్మగా పరిగణించారు. పత్రికల వివక్ష కారణంగా ఇందిరాగాంధీ పట్ల పెరిగిన ప్రజాదరణ ప్రభుత్వానికి కూడా తెలియలేదు. 1978 నవంబరులో కర్నాటకలోని చిక్కగలూరు నియోజకవర్గం నుండి ఇందిరాగాంధీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం అందుకొక ఉదాహరణ. కాని ఒక చిన్న ఆరోపణపై ఇందిరాగాంధీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించి జనతాపార్టీకి గల మెజారిటీని ఉపయోగించుకొని ఆమెను పార్లమెంటు నుండి బహిష్మరించడమేగాక వారం రోజుల పాటు జైలుకి పంపింది. జనతా ప్రభుత్వం, జనతా పార్టీలోని ముఠా కుమ్ములాటలు 1979 సం॥ మధ్య కాలం నాటికి తీవ్ర రూపం దాల్హాయి. హోయమినిష్టర్ చరణ్‌సింగ్ 1978జూన్‌లో రాజీనామా చేయవలసి వచ్చింది. 1979 జనవరిలో మరలా అర్థిక మంటతిగౌ మంత్రివర్గంలో చేరాడు. చరణ్‌సింగ్ సోషలిస్టుల సాయంతో పార్టీని, (ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేశాడు. జనసంఘ్ సభ్యులు జనతా పార్టీ, ఆర్.యస్.యస్ల ద్వంద్వ సభ్యత్వం వదులుకొనేందుకు తిరస్కరించడంతో సోషలిస్టులు పార్టీ నుండి ప్రభుత్వం నుండి వైదొలిగారు. మెజారిటీ కోల్పోయిన మొరార్డీ దేశాయ్ ప్రభుత్వం జులై 15న రాజీనొమౌ చేసింది. ఒక వారం రోజుల తరువాత కాంగ్రెస్(యు), చవాన్ పక్షం, సోషలిస్టుల మద్దకుతో కాంగ్రెస్(ఐ), సిపిఐలు బయటి నుండి మదతుతోను చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని. ఏర్పాటు చేశాడు. చరణ్‌సింగ్ (ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టకుండానే: పార్లమెంటు విశ్వాసం పొందడానికి ఒక రోజు ముందే, ఇందిరాగాంధీని విచారించడానికి నెలకొల్పిన ప్రత్యేక కోర్టుల్ని రద్దు చేయవలసిందిగా చేసిన డిమాండుని చరణ్‌సింగ్ తిరస్కరించిన మీదట ఇందిరాగాంధీ తన మద్దతుని ఉపసంహరించుకొన్నది. చరణ్‌సింగ్ అభ్యర్థన మేరకు రాష్ట్రపతి లోక్‌సభని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు ఆదేశాలు జారీ చేశారు.
1980 జనవరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్(ఐ), కాంటైస్(యు), చరణ్‌సింగ్ సోషలిస్టులు కలిసి పెట్టిన కొత్తపార్టీ లోక్‌దళ్, ప్రధానంగా జనసంఘ్, ఇంకొ జగజ్జీవన్‌రామ్, చంద్రశేఖర్‌లాంటి పాత కాంగ్రెస్ నాయకులు గల జనతాపార్టీ- రంగంలో తర్ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉన్నాయి, సిపిఎం, సిపిఐలు రంగంలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం పశ్చిమబెంగాల్, కేరళక్రి పరిమితమయింది. నిరంతరం కుమ్ములాటలలో కూరుకపోయిన పాలనా వ్యవహారాల్ని పట్టించుకోని జనతాపార్టీపై ప్రజల (భ్రమలు తొలగిపోయాయి. ప్రజలు ఇందిరాగాంధీ వైపు కాంగ్రెస్ వైపు మరలారు. ఆమె కాంగగ్రెస్ని అసలైన కాంగ్రెస్‌గా గురించారు.
ఇందిరాగాంధీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి, పౌర హక్కులకు ప్రమాదం ఎర్పడుతుందని జనతా పార్టీ హెచ్చరించింది. చరణ్‌సింగ్ రైతు రాజ్యాన్ని గురించి చెప్పాడు. జనతా పాలనలో పరిపాలన స్తంభించిందని కాబట్టి పని చేసే ప్రభుత్వానికి ఓటు వేయమని ఇందిరాగాంధీ అర్ధించింది.
(ప్రజలు 1971, 1977లలో లాగానే కులం, మతం, ప్రాంతాలను అధిగమించి కాంగ్రెస్ (ఐ)కి ఓట్లు వేశారు. 529 సీట్లకు గాను కాంగ్రెస్(ఐ) 358 సీట్లు అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. లోక్‌దళ్ &1 సీట్లతో, జనతా 81 సెట్లతో కాంగ్రెస్(యు) 31 సీట్లతో బాగా వెనుకబడి పోయాయి. సిపిఎం, సిపిఐలు కాంగ్రెస్ ఉరవడిని తట్టుకాని 36, 11 సీట్లు సంపాదించాయి.
ఎన్నికల తరువాత జనతాపార్టీ మరొకసారి చీలిపోయింది. 3980 చివరలో పాత జనసంఘ్ నాయకులు జనతాపార్టీని వదలి భారతీయ జనతాపార్టీని స్థాపించారు. జగజ్జీవన్‌రాం కాంగ్రెస్(యు)లో చేరాడు. ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి
34 మాసాలపాటు అధికారానికి దూరంగా ఉన్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖమైన పార్టీగా పూర్వస్థితిని పొందింది. జనతా ప్రభుత్వం 1977లో ప్రవేశపెట్టిన చెడ్డ సంప్రదాయాన్ని అనుసరించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షపాలిత తొమ్మిది రాష్ట్ర అసెంబ్లీలను రద్దు చేసింది. తరువాత జూన్‌లో జరిపిన ఎన్నికలలో ఒక్క తమిళనాడులో మినహాయించి కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. 22 రాష్ట్రైలలో 15 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలన క్రిందకు వచ్చాయి.
ప్రధానమంత్రి, జాతీయస్థాయిలో ప్రజాదరణ, ప్రజాకర్షణ గల ఒకే ఒక నాయకురాలైనప్పటికీ ఇప్పటి ఇందిరాగాంధీ 1969-77 నాటి ఇందిరాగొంధీ కాదు. ఆమెకు ఇప్పుడు రాజకీయాలు పాలనా వ్యవహారాలపై గట్టి పట్టు లేదు. పూర్తి అధికారం స్వతంత్రం తర్వాత భారతదేశం 855
చేజిక్కినప్పటికీ నూతన విధాన నిర్ణయాలు చేయడంలోను, కలచివేసే సమస్యలతో వ్యవహరించడంలోను ఆమె ఊగిసలాటకు గురయింది. అయినప్పటికీ ఆర్ధిక, విదేశీ విధానాలలో కొన్ని విజయాలు సాధించింది. మొత్తం మీద దిశానిర్దేశం చేయడంలోను, దృఢంగా వ్యవహరించడంలోనూ గతానికి ఇప్పటికి తేడా వుంది. అందుకే ప్రజలు ఆమె నుండి ఆశించినంతగా చేయలేకపోయిందనే భావానికి దారి తీసింది. అత్యవసర పరిస్థితి, జనతాపాలనా సంవత్సరాల ప్రభావం ఆమెపై పడింది. తన చుట్టూ ఉన్న వారిపట్ల అనుమానాస్పద వైఖరి ప్రబలింది. తన కుమారుడు సంజయ్‌గాంధీని తప్ప మరెవరినీ నమ్మలేదు. గతంలోని ఆమె శక్తి, నిర్ణయాత్మకత, దృఢసంకల్పం, స్థానంలో జాగ్రత్త, సంకోచం, అనిశ్చితత్వం వచ్చి చేరాయి. ఆమెలో అలసిపోయిన వ్యక్తి లక్షణాలు గోచరించాయి.
అంతేగాక ఇందిరాగాంధీ తన ఎన్నికల వాగ్దానాలను అమలు జరిపేందుకు ఆమెతోబాటు కొద్దిమంది నాయకులే మిగిలారు. ప్రసిద్ధులు, అనుభవజ్ఞులైన జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులలోని అత్యధికులు, గతంలోని ఆమె సహచరులు 1977 - 78లో ఆమెని వదలి వెళ్లారు. కేంద్రంలోగాని రాష్ట్రాలలో గాని ఆమె చుట్టూ చేరిన వారు- కొద్ది మినహాయింపులతో అంతా కొత్తవారు. రాజకీయంగా స్వంత బలం లేనివారు. పాలనా పరమైన లేక రాజకీయపరమైన సమర్ధతని గాక విధేయతని బట్టీ ఎంపిక చేయబడినవారు.
1980 జూన్, 28న విమాన విన్యాసాలలో సంభవించిన సంజయ్‌గాంధీ మరణం ఆమెని పూర్తిగా క్రుదిపివేసింది. సంజయ్‌గాంధీ స్థానాన్ని పెద్దదుమారుడు రాజీవ్‌గాంధీతో నింపాలనుకొన్నది. రాజకీయాలలోకి తీసుకొని వచ్చింద్. యంపిగా ఎన్నిక చేయించింది. 1983లో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించింది.
మొదటిసారిలాగానే ఇందిరాగాంధీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తరువాత కూడా కాంగ్రెస్‌పార్టీ యొక్క నిర్మాణపరమైన బలహీనత కొనసాగుతూనే ఉంది. పార్టీని పునర్నిర్మించి బలోపేతం చేయడంలో ఆమె విఫలమయ్యారు. పార్టీ నిర్మాణ పరమైన బలహీనత అంటే ప్రజల అభిప్రాయాలు నాయకత్వానికి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించే - వాహకాలు బలహీనంగా ఉండడం ఇది అనివార్యంగా ప్రభుత్వ పని విధానం మీద ప్రభావం చూపుతుంది.
పార్టీ మీద, ప్రభుత్వం మీద ఇందిరాగాంధీ పూర్తి ఆధిపత్యం సాధించినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ శాఖలలో, రాష్ట్ర ప్రభుత్వాలలో ముఠాతత్వం,
856 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అంతర్గత క్రమ్ములాటల సమస్య నెదుర్కొన్నది. తరచుగా ముఖ్యమంత్రులు మారారు. ఫలితంగా సంస్థాగత ఎన్నికలు చాలా సార్లు వాయిదా వేయబిడ్డాయి. చివరికి ఎన్నికలే నిర్వహించబడలేదు. ఫలితంగా పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ సమకూర్చజాలదు- అనే అభిప్రాయం ప్రజలకు కలిగింది. సంస్థాగతమైన బలహీనత పార్టీకి ప్రజల నుండి లభించేమద్దతుని తగ్గించింది. అసమ్మతివాదులు పార్టీ అభ్యర్థులకు ద్రోహం చేయటం వలన పార్టీ విజయావకాశాలు దెబ్బతిన్నాయి.
పార్టీ ప్రతిష్ట క్షీణించిందనటానికి స్పష్టమైన ఉదాహరణ 1988 ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఫోర పరాజయం. రాష్ష్రాలు ఎర్పడినప్పటి నుండి ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుడుగా మారిన సినిమా యాక్టర్ యన్.టి రామారావు స్థాపించిన తెలుగుదేశం చేతిలో కాంగైస్ ఘోరంగా ఓడిపోయింది. తెలుగుదేశం 202 సిట్లు గెలవగా కాంగ్రెస్ కేవలం 60 సీట్లు మాత్రమే గెలిచింది. 224 సీట్లు గల కర్నాటక అసెంల్లీతో జనతా నాయకత్వంలోని ఫ్రంటు 95 సీట్లు గెలవగా కాంగ్రెస్ 8] సీట్లు గెలిచింది.
ఇందిరాగాంధీ రెండవసారి ప్రధానమంత్రి అయినప్పటి నుండి కేంద్రంలో దాదాపు ఎలాంటి గట్టి ప్రతిఘటన ఎదురుకానప్పటికీ మతతత్వ, భాషాపరమైన కుల ఘర్షణల పరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యల్ని ఇందిరాగాంధీ దృఢచిత్తంతో దీర్హకాలిక దృష్టితో పరిష్కరించలేదు. సాచివేత వైఖరితో సంవత్సరాల తరబడి నాన్సింది. చాలా తీవ్రమైన సమస్యలలో మూడు ఇతర అధ్యాయాలలో చర్చించబడ్డాయి. కాశ్మీరు సమస్య 22వ అధ్యాయంలో, అస్సాం 28వ అధ్యాయంలో, పంజాబ్ 2డ్తవ అధ్యాయంలో చర్చించబడ్డాయి. ౩౩వ అధ్యాయంలో వివరించినట్లు 1977-79లో లభించిన ప్రోత్సాహంతో మతతత్వవాదం బలం పుంజుకొన్నది. దాని బాహాటమైన వ్యక్తీకరణ మతఘర్నణలు. అవి 1980-84 సంవత్సరాలలోను ఆ తరువాత విస్తృతంగా జరగడమేగాక దక్షిణ భారత దేశానికి విస్తరించాయి.
అలాగే షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలకు వారి సామాజిక రాజ్యాంగ బద్ధమైన హక్కులపట్ల చైతన్యం పెరిగిన కొలదీ వారిపై అత్యాచారాలు కొనసాగాయి. కొన్ని సందర్భాలలో అత్యాచారాలకు పాల్పడిన వారిపై పాలనాపరమైన, న్యాయపరమైన చర్యలు చేపట్టబడ్డాయి, స్వతంత్రం తర్వాత భారతదేశం తక్?
ప్రభుత్వం ఎక్కువ నిధుల్ని కేటాయించి ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టింది? ప్రపంచ ఆర్థిక విధానంలో వస్తున్న మార్పుల్ని భారత దేశంపై దాని ప్రభావాన్ని. గుర్తించింది. పబ్లిక్ సెక్టార్‌ని బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆర్థిక సరళీకరణ చర్యల్ని ప్రారంభించింది. కాని భారత స్వాలంబనను తగ్గించేందుకు బహుళ జా సంస్థల పాత్రపై ఇందిరాగాంధీకి గల ఆందోళన కారణంగా 25-82 అధ్యాయాల ఆర్థిక విధానంపై వివరించిన విధంగా [ప్రభుత్వం నెమ్మదిగా క్రమబద్ధంగా ముందుకు సాగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం విదేశీ విధానంలో కూడా ఒక మేరకు విజయం సాధించింది. 1983లో భారతదేశం, ఇందిరాగాంధీ ఛైర్మన్‌గా జరిగిన అలీన ఉద్యమ సప్తమ శిఖరాగ్ర సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చింది. అలీన ఉద్యమ నాయకురాలిగొ ఇందిరాగాంధీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలంగా వుండే నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కొరకు కృషి చేసింది. 1979 డిసెంబరు 26న ముట్లడించబడిన ఆవ్షనిస్తాన్ ప్రభుత్వానికి చ క ట్ర ఘ్ కు సహాయపడేందుకు సోవియట్ సైన్యాల్ని పంపించినపుడు ఆ చర్యని ఖండించేందు ఇందిరాగాంధీ నిరాకరించింది. అదే సమయంలో ఆస్థనిస్తాన్ నుండి సోవియట్ సైన్యాల వెనక్కి రప్పించవలసిందిగా సోవియట్ యూనియన్‌కు సలహా ఇచ్చింది. ఆమె ఆప్టనిస్తాన్ అంతర్యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ల పరోక్ష జోక్యాన్ని వ్యతిరేకించింది. సోవియట్ యూనియన్‌తో భారతదేశానికి గల దీర్షకాలిక మైత్రీబంధం, ఆఫ్టనిస్తాన్‌లో భారతదేశానికీ ప్రతికూలమైన పాలకుడు వుండకుండా అద్దుకొనడంలోని భారతదేశం యొక్క వ్యూహాత్మక 'ప్రయోజనం- ఈ రెండు అంశాలు ఆప్పనిస్తాన్ సమస్యపై ఇందిరాగాంధీ వైఖరిని నిర్ణయించాయి. ఖ్ న అమెరికా పాకిస్తాన్ వైపు మొగ్గుచూపినప్పటికీ ఇందిరాగాంధీ అమెరికాతో భారతదేశ సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు ప్రయత్నించింది. ఆమె బైనొః పాకిస్తాన్లతో- (ప్రత్యేకించి పాకిస్తాన్ వంజాబ్లోని టెర్రిస్సులకు మద్దతు ఇస్తున్నప్పటికి-సాధారణ సంబంధాల కొరకు ప్రయత్నించింది. కాని 1984 ఏప్రిల్‌లో కాళ్ళ్మీరులోని నియంత్రణ రేఖ వెంటగల సియాచిన్ గేసియార్కి ఒక బ్రిగేడ్ సైన్యాను తరలించడానికి వెనుకాడలేదు. స సుదీర్హ కాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరాగాంధీ 1984 అక్టోబరు 31న ఆమె సెక్యూరిటీ గార్జుకి చెందిన ఇరువురు సిక్కులచే హత్య చేయబడింది. 858 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఆమె 40 సం॥ కుమారుడు రాజీవ్‌గాంధీని 'ప్రధానమంత్రిగా నామినేట్ చేసింది. ఇందిరాగాంధి ఇందిరాగాంధీ చాలా సంక్లిష్టమైన వ్యక్తి. ఆమెలో గల వైరుధ్యాలు ఆమెని వివాదాస్పదమైన వ్యక్తిగా చేశాయి. ఆమెలో బలహీనతలున్నప్పటికీ ఆమె బలాన్ని బలహీనతల్ని కాలక్రమంలో ఆమె మారిన వెలుగులో చూడాలి. ఇందిరాగాంధీకి గొప్ప రాజకీయ నిపుణత ఉంది. నూతన పరిస్థితులు సవాళ్లు ఎదురవుతుండడంతో ఆమె రాజకీయ నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకొన్నది. ఆమెకు చుట్టు వున్న వారి అభిప్రాయాలు, సలహాలు అడిగే అలవాటున్నప్పటికీ తుది నిర్ణయాలు స్వయంగా ఆమే చేసేది. ఇందిరాగాంధీ తన రాజకీయ జీవితమంతటిలోను అమోఘమైన సాహసం ప్రదర్శించింది. ఆమె రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆమెకుగల ఈ లక్షణం పట్ల సరియైన అవగాహన వుంది. స్టిరచిత్తం, దృఢమైన సంకల్పం గల ఆమె అవసరమైనప్పుడు చాలా కఠినంగా నిరాక్షిణ్యంగా వ్యవహరించగలదు. 1969లో కాంగ్రెస్ చీలిక, 1971లో బంగ్లాదేశ్ సంక్షోభం, 1971 డిసెంబరులో బంగాళాఖాతానికి సప్తమ నౌకాదళాన్ని పంపించాలని అమెరికా నిర్ణయం, 1966లో పంజాబ్ రాష్ట్ర ఏర్పాటు, 1975లో అత్యవసర పరిస్థితి విధింపు, 1975-77లో జనతా పార్టీ ఎంక్వయిరీ కమిటీ నియామకంలాంటి సందర్భాలలో ఇందిరాగాంధీ ధైర్యంగా, వేగంగా, సమయోచితంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. ఇందిరాగాంధీ రాజకీయాలలోని ప్రధానమైన అంశం: భారతదేశం, భారత ప్రజల పట్ల ఆమెకు గల ప్రగాఢమైన (ప్రేమానురాగాలు; దేశభవిష్యత్తు పట్ల గల విశ్వా 9 ఆమెకు జాతీయ ప్రయోజనాల పట్ల లోతైన అవగాహన ఉంది. ప్రపంచ దేశాలలో భారతదేశ బెన్నత్యాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే నిబద్ధత ఉంది. దేశ అంతర్గత పటిష్టతపై దేశం యొక్క గొప్పదనం స్వతంత్రం ఆధారపడి ఉంటాయనే అవగాహనతో ఇందిరాగాంధీ ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా. సాంకేతికంగా, సైనికంగా దేశ స్వావలంబన సాధించేందుకు ప్రతికూల ఆర్థిక రొజు య పరిస్థితులనెదుర్కొని విశేషంగా కృషి చేసింది. 1970లలో చమురు సంక్షోభాన్ని అధిగమించిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటి. హరిత విప్లవం ద్వారా భారతదేశం ఆహార ధాన్యాలలో స్వయం సంవృద్ధి సాధించింది. పెట్టుబడిదారీ దేశాలలో తరచుగా వచ్చే ఆర్ధిక మాంద్యం నుండి భారతదేశానికి రక్షణ కల్పించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 350
ప్రపంచ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన గల ఇందిరాగాంధీ భారత దేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యాన్ని నివారించగలిగింది. భారతదేశాన్ని రెండు ప్రచ్చన్న యుద్ధ శిబిరాలకు, రెండు అగ్రరాజ్యాలకు దూరంగా ఉంచగలిగింది. నెహ్రూ రూపొందించిన విదేశీ విధానాన్ని బలోపేతం చేసింది.
ఇందిరాగాంధీ జాతి నిర్మాణ క్రమానికి విశేషంగా తోడ్పడింది. దేశ ఐక్యతని పటిష్టపరచింది. కష్టకాలంలో దేశాన్ని సమైక్యంగా ఉంచింది. చివరికి అందుకొరకే తన ప్రాణాన్ని అర్చించింది. తప్పులు, వైఫల్యాలున్నప్పటికీ 1966లో ఆమె అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఆమె తుది శ్వాస విడిచే నాటికి దేశం యొక్క పరిస్థితిని ఆత్మ విశ్వాసాన్ని పెంచగలిగింది.
ఇందిరాగాంధీ ఆచరణవాది. ఆమె అభివృద్ధికరమైన సంస్కరణవాద, వామపక్ష మధ్యేవాద రాజకీయ దృక్పథం పట్ల నిబద్ధత కలిగి ఉంది. ఆర్థిక రంగంలో నెహ్రౌ యొక్క త్వరిత ఆర్థికాభివృద్ధి లక్ష్యాన్ని అనుసరించింది. మిశ్రమ ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తూనే ప్రణాళికా విధానాన్ని పబ్లిక్ సెక్టార్‌ని బలోపేతం చేసింది. (ప్రభుత్వం యొక్క కఠినమైన నియంత్రణలో వుండే ఆరోగ్యకరమైన (యైవేటు సెక్టార్‌ని ప్రోత్సహించింది. కాని ఈ నియంత్రణని 1980-84 కాలంలో క్రమంగా సడలించింది.
సైద్ధాంతికంగా ఆమె జాతీయ వాద సెక్యులర్ సంప్రదాయానికి దృఢంగా కట్టుబడి ఉంది. మతతత్వ శక్తులను వ్యతిరేకించింది. ఆర్.యస్.యస్.ని దేశ సమైక్యత సమగ్రతలకు - ప్రత్యేకించి ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదకారిగా పరిగణించింది. సెక్యులరిజం పట్ల ఆమె దృఢమైన నిబద్ధత డాక్టర్ జాకీరహుస్సేన్ని రాష్ట్రపతిగా చేయాలని పట్టుపట్టడంలోను, 1984లో ఆమె సెక్యూరిటీ గార్జులోని సిక్కులను తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను భారత దేశం సెక్యులర్ రాజ్యం అనే ప్రాతిపదికన రద్దు చేయడంలోను స్పష్టంగా వ్యక్తమయింది. చివరి నిర్ణయానికి ఆమె ప్రాణాన్నే మూల్యంగా చెల్లించవలసి వచ్చింది.
ఇందిరాగాంధీకి గల రాజకీయ సంపద - ఆమెకి పేదల, అణగారిన, మైనారిటీల పట్ల గల ప్రేమ; వారి పట్ల గల ప్రేమాభిమానాలను వారికి నేరుగా చేరవేయగల శక్తి పేదలు కూడా ఆమెని తమ రక్షకురాలిగా పరిగణించారు. విశ్వసించారు. అభిమానించారు. ఆదరించారు. అంతేగాక ఇందిరాగాంధీ ప్రజల్ని రాజకీయీకరణ చెందించడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ప్రత్యేకించి పేదలు, హరిజనులు, 360 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
గిరిజనులు, మైనారిటీలు, మహిళలు లాంటి బడుగు బలహీనవర్గాలకు వారి సామాజిక స్థితిని, దాని వెనుక గల అన్యాయమైన స్వభావాన్ని తెలియజెప్పి వారిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది.
కాని ఇందిరాగాంధీ 16 నంవత్సరాలకుపైగా రాజకీయాధికారాన్ని చెలాయించినప్పటికీ ఆమె సాధించిన వ్యవస్థాపరమైన అభివృద్ధి పాలనాపరమైన బెన్నత్యం, రాజకీయ విధానం, నిర్వహణ, దీర్ధకాలిక సామాజిక, ఆర్థిక మార్పు చాలా తక్షువే, రాజకీయ నాయకురాలిగా ఆమె బలహీనత- ఆమెకు ఆర్థిక రాజకీయ పాలనా పరమైన విధానాల ప్రాతిపదికన ఒక వ్యూహం, దీర్టకాలిక దృక్పథం లేకపోవడం. ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఆమె రాజకీయ ఎత్తుగడలలోను, సరియైన సమయాన్ని ఎంపిక చేసికొనడంలోను దిట్ట. సమకాలీనులలో ఆమెకు దీటుగా రాగలవారెవరూ లేరు. కాని ఎత్తుగడలు ఏ దశలో కూడా ఆమె ముందుగా రూపొందించుకున్న వ్యూహంలో భాగాలు కావు. అత్యవసర పరిస్థితి కూడా వ్యూహంలో భాగం కాదు. అప్పటి సంక్షోభానికి తాత్మాలిక స్పందన మాత్రమే. ఎంత గొప్పదైనప్పటికీ కేవలం ఎత్తుగడలు చాలవు. ఒక వ్యూహాన్ని అమలు జరపడానికి అప్పటికెదురైన సమస్యని బట్టి తాత్కాలికంగా అవలంబించే విధానాలే ఎత్తుగడలు. వ్యూహం లేకుండా ఎత్తుగడలు ఎంతమేధస్సుతో కూడినవైనప్పటికీ గాలిలో తేలిపోతాయి. అవి నాయకత్వం ప్రకటించిన లక్ష్యాల్ని సాధించేందుకు అవసరమైన లేక ఒక దేశాన్ని ఆశించిన లక్ష్యం వైపు నడిపించగల విధానాల రూపకల్పనకు దోహదపదవు.
ఆర్థికాభివృద్ధి విదేశీ విధానాలలో ఆమెకు మార్గదర్శకత్వం వహించేందుకు నెహ్రా విధానాలు వున్నాయి. కొంత ఊగిసలాట తరువాత ఇందిరాగాంధీ వాటిని స్వీకరించింది. రాజకీయ విధాన నిర్వహణ లేక రాజ్యం యొక్క అస్థిరతని అధిగమించేందుకు, లేక పాలనా చట్రం అభివృద్ధికి లేక అది క్రిందికి దిగజారకుండా నిరోధించేందుకు స్పష్టమైన వ్యూహాలు లేవు. ఇందిరాగాంధీ తన స్వంత వ్యూహాల్ని రూపొందించుకొనడంలో విఫలమయింది. మారిన జాతీయ మరియు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్థిక రంగంలో కూడా నెహ్రూ వ్యూహాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి పరచలేకపోయింది. అలాగే మితవాదం, వేర్పాటు వాద సమస్యలతో వ్యవహరించేందుకు ఒక వ్యూహాత్మక చట్రాన్ని రూపొందించడంలో కూడా ఆమె విఫలమయింది. ఫలితంగా పంజాబు, అస్సాం, కాళ్ళీరు, సమస్యలతో సమర్ధవంతంగా వ్యవహరించడంలో విఫలమయింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 361
ఒక వ్యూహాత్మక చట్రాన్ని రూపొందించుకొని దాని పరిమితులలో పనిచేయడంలో ఇందిరాగాంధీ యొక్క వైఫల్యం ఇతర రంగాలలో కూడా వ్యక్తమయింది. ఇందిరాగాంధీ పెద్ద మెజారిటీతో ఎన్నికలలో విజయాలు సాధించినప్పటికీ తన ఎజెందాని అమలు పరచడానికవసరమైన రాజకీయ లేక ప్రభుత్వ యంత్రాంగాలలో - పార్లమెంటు, మంత్రివర్గం, పోలీసు లేక అధికార వర్గం లేక కాంగ్రెస్ పార్టీ లేక విద్యావిధానాలలో సంస్థాగతమైన మార్పులు చేయలేకపోయింది. ఆమె నూతన సంస్థల్ని నిర్మించకపోవటమే కాదు; పాత సంస్థల్ని సంస్కరించి పటిష్టపరచేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా ఇందిరాగాంధీ కాలక్రమంలో రాజకీయ, పాలనాపరమైన సంస్థల మీద కంటే తన వ్యక్తిగత అధికారంపై ఆధారపడవలసి వచ్చింది. పార్టీలో ప్రభుత్వంలో నిర్ణయాలు చేసే అధికారం ఆమె చేతుల్లో కేంద్రీకరించుకొన్నది. స్వంత రాజకీయ బలం గల తన పార్టీ నాయకుల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్లక్ష్యం చేసి, తన మద్దతు లేనిదే మనుగడ సాగించలేని వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. అంతేగాక వీరికి స్వంత రాజకీయ బలం లేకపోవడమే కాదు, వీరు రాష్ట్ర స్థాయిలలో పార్టీలోని నిరంతర ముఠా తత్వ బాధితులుగా వుండేవారు. ఇందిరాగాంధీ తరచుగా ముఖ్యమంత్రులను మార్చవలసి వచ్చేది. ఫలితంగా రాష్త్రాల పాలనా వ్యవహారాలలో పార్టీ నిర్వహణలో అస్థిరత పెరిగింది. ఆమె సమయమంతా రాష్ట్ర పార్టీ, పాలనా వ్యవహారాల కుమ్ములాటల పరిష్కారానికే వెచ్చించవలసి వచ్చింది. దేశం యొక్కతీవ్రమైన సమస్యలకు సంబంధించిన వ్యూహాల విధాన నిర్ణయాల రూపకల్పనకు తగు సమయాన్నే కేటాయించలేకపోయింది. ఆమె నిర్మించి పటిష్టపరచిన ఒకే ఒక్క సంస్థ ప్రధాన మంత్రి సచివాలయం (పషియంబ). అది శాస్త్రి నుండి వారసత్వంగా సంక్రమించింది. ఇందిరాగాంధీ కాలంలో అది విధానాల రూపకల్పనకు నిర్ణయాలకు అన్నిటికి ప్రధాన కేంద్రమయింది. అది మంత్రుల స్వయం ప్రతిపత్తి పాత్రని నిర్విర్యపరచింది. అధికారమంతా ఆమె చేతుల్లో కేంద్రీకరించుకొన్నప్పటికీ ఇందిరాగాంధీ (ప్రజాస్వామ్య వ్యతిరేకి అని గాని లేక అధికార వాద పాలనను రుద్దేందుకు ప్రయత్నించింది అనడంగాని తప్పవుతుంది. 1975-77 కాలంలో మినహాయించి ఆమె పార్లమెంటరీ చట్ర పరిధిలోనే పనిచేసింది. భారతదేశాన్ని ప్రజాస్వామ్య పంథాలో వుంచడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ఆమెకి ఇష్టం లేకపోయినా న్యాయవ్యవస్థ అధికారాన్ని ఆమోదించింది. పత్రికలు దుయ్యపట్టినా పత్రికాస్వేచ్చని గౌరవించింది. మేధావులు ౩62 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
తీవ్రంగా విమర్శించినప్పటికీ వారి స్వేచ్చను ఆటంకపర్చలేదు. ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగ నిబద్ధనల మేరకే విధించబడింది. అంతేకాదు ఎమర్జెన్సీని ఎత్తివేసింది ఆమే. ఎన్నికల్ని ప్రకటించి నిర్వహించింది. ప్రజల తీర్పుని నమతతో స్వీకరించింది. అధికారాన్ని త్యజించింది. ఇది నియంతలు చేసే పని కాదు.
కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో ఇందిరాగాంధీ విఫలమయింది. పార్టీ నిర్వహణకవసరమైన సమర్ధతగాని సమయంగాని ఆమెకి లేవు. ఈ పనిని ఇతరులతో పంచుకోవడం ఆమెకి ఇష్టం లేదు. పార్టీ సామాజిక మద్దతుని తిరిగి పొందినప్పటికీ 1969 చీలిక తరువాత పార్టీని పునర్నిర్మించడంలోను దానికి జవసత్వాలు సమకూర్చడంలోను విఫలమయింది. ఫలితంగా ఎన్నికల సమయంలో తప్ప పార్టీ ప్రజలతో సంబంధాలను నిలబెట్టుకోలేకపోయింది. ఒక సంస్థగా అది క్రమంగా ప్రత్యేకించి స్థానిక, రాష్ట్ర స్థాయిల్లో క్షీణించింది. పార్టీలో ఆమెకి ఎదురులేదు. పార్టీ (పెసిడెంటుని, వర్కింగ్ కమిటీ సభ్యుల్పి రాష్ట్ర శాఖల అధ్యక్షుల్ని ఆమె నామినేట్ చేసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. సమస్యలపై చర్చలేదు. కేంద్ర నాయకత్వంపై విమర్శలేనే లేదు. సంజయ్‌గాంధీ మరణానంతరం కూడా ముఖస్తుతి సంస్కృతి కొనసాగింది. పార్టీలో సర్వోన్నత స్థానం ఆమెదే అయినప్పటికీ పార్టీ స్థానిక రాష్ట్ర న్థాయిల్లో ముఠాతత్వం వ్యాప్తిని నివారించలేకపోయింది. చాలా సందర్భాలలో ముఖస్తుతి చేసేవారు వారి ఆశలు నెరవేరనప్పుడు తిరుగుబాటుదారులయ్యారు. పార్టీని చీల్పారు.
ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడల నిపుణతతో పార్టీని అదుపుచేయగలిగింది. సంస్థని పటిష్టపరచి జవసత్వాలు సమకూర్చలేకపోయింది. ఆమె ప్రజలకు చేరువై ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొనుటలో సఫలమయింది. కాని ప్రజాకర్షక చర్యల ద్వారా అదీ కేవలం ఎన్నికల ప్రచారం బహిరంగ సభల సమయంలో మాత్రమే ప్రజలకు సన్నిహితమయింది. ఇది ఆమెకి పార్టీమీద, చట్ట సభల్లోను, ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని సాధించిపెట్టింది. కాని ఇది పార్టీకి చట్టసభల వెలుపల గాని లేక ఎన్నికలలో పొందిన మద్దతుని ఎక్కువ కాలం నిలబెట్టడం గాని చేయలేకపోయింది. ఫలితంగా ఆమె ప్రధాన మంత్రిత్వ కాలమంతా ప్రజాఉద్యమాలు ఆందోళనలు చుట్టుముట్టి ఆమెని చికాకు పరిచాయి. క్షోభ పెట్టాయి.
పేదలకు, అణగారిన వారికి కొంత సహాయం, కొన్ని ప్రయోజనాలు సమకూర్చినప్పటికీ ఇందిరాగాంధీ సమూలమైన సామాజిక ఆర్థిక మార్పు తీసుకొని స్వతంత్రం తర్వాత భారతదేశం 868
వస్తానన్న వాగ్దానం గాని, సామాజిక న్యాయంతో కూడిన ఆర్ధికాభివృద్ధి వాగ్దానం గాని నెరవేర్చడంలో విఫలమయింది. ఆమె సుదీర్హ కాలం పాలన సాగించినప్పటికీ ఆర్థిక విధానం సామాజిక సమానత్వ దిశగా ముందుకు సాగలేదు. అందుకు భిన్నంగా 1966 నాటి భారతదేశంలో కంటే 1984 నాటి భారతదేశంలో అసమానతలు పెరిగాయి. భారతదేశాన్ని సమ సమాజ దిశలో ముందుకు నడపడంలోని అశక్తత, కాంగ్రెస్‌ని ప్రజలకు రాజకీయ విద్యని అందించే సాధనంగా సామాజిక రాజకీయ మార్పుని తీసుకొని వచ్చే సాధనంగా మలచడంలోని వైఫల్యం - కారణంగా కాంగ్రెస్ అటు సంప్రదాయ వాదులకు, ఇటు మార్చు కోరేవారికి ఆశయంగా వుండటం కొనసాగింది. పేదలు, అణచివేయబడిన వాళ్ళు ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి 1971, 1972, 1980 ఎన్నికలలో పెద్ద ఎత్తున మద్దతిచ్చినప్పటికీ పార్టీ యొక్క కూర్చు, నిర్మాణంలో ఎలాంటి మార్చు లేకుండా కొనసాగాయి. పార్టీలోకి, రాజకీయాలలోనికి నల్లధనం, నేరస్తుల చేరికతో పరిస్థితి మరికొంత క్షీణించింది. కొన్ని అనుకూలతలు బలహీనతలు ఉన్నప్పటికీ అసాధారణ శక్తి సామర్ధ్యాలు గల ఇందిరాగాంధీ స్వతంత్రానంతర భారతదేశ రాజకీయ రంగంపై ఆమె తంగ్రి కంటే ఎక్కువ కాలం ప్రాబల్యం వహించింది. ఆమె హత్యకు కొద్ది రోజుల ముందు ఆమె ఒక మిత్రునితో “నాకేమి జరిగినప్పటికీ నా రుణాలన్నీ తీర్చుకున్నానని భావిస్తున్నాను అని చెప్పిన మాటలు పూర్తిగా సమంజసము, సమర్ధనీయాలు. భారతదేశం భారత ప్రజలు ఆమె అలా చేయటం వలన ప్రయోజనం పొందారు. 864 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
20 రాజీవ్ సంవత్సరాలు
అధికార స్వీకారం
ఇందిరాగాంధీ కుమారుడు, జవహర్లాల్ నెహ్రూ మనవడు అయిన రాజీవ్‌గాంధీ 1985 అక్టోబరు 3౩1 రాత్రి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రోజు ఉదయం ఇందిరాగాంధీ ఒక టెలివిజన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇంటి నుండి తన కార్యాలయానికి నడిచివస్తూ ఉంది. 1984 జూన్‌లో స్వర్ణ దేవాలయం నుండి సిక్కు టెర్రరిస్టుల్ని బయటకి రప్పించేందుకు దానిపై చేయించిన దాడికి ప్రతీకారంగా ఇద్దరు సిక్కు గార్డులు ఆమెని కాల్చి చంపారు. మధ్యాహ్నానికి ఇందిరాగాంధీ చనిపోయినట్లు ప్రకటించబడింది. అప్పుడు రాజీవ్‌గాంధీ పశ్చిమబెంగాల్లో ఉన్నాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు (యీమెన్ పర్యటన నుంచి హడావిడిగా తిరిగి వచ్చిన రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ ఆమోదంతో) రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని నిర్ణయించారు. నిర్ణయానికి విముఖంగా ఉన్న రాజీవ్ అంతకంటే విముఖంగా ఉన్న సోనియాని ఒప్పించి ఆమోదించారు. ఈ నిర్ణయం ఆరున్నర సంవత్సరాల తరువాత తమిళ టెర్రరిస్టు మానవబాంబు చేతుల్లో రాజీవ్ దుర్మరణానికి దారి తీసింది.
ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 14 సంవత్సరాలు పైలెట్‌గా పనిచేసిన రాజీవ్‌గాంధీ తన తమ్ముడు సంజయ్‌గాంధీ 1980 జూన్‌లో విమాన ప్రమాదంలో మరణించే వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. సంజయ్ మరణానంతరం ఇందిరాగాంధీ రాజకీయాలలో తనకు సహాయంగా ఉండవలసిందిగా ఒప్పించింది. సంజయ్ గాంధీ మరణంతో ఖాళీ అయిన అమేధి నుండి లోక్‌సభకి ఎన్నికై 1981 జూన్‌లో రాజకీయాలలోకి ప్రవేశించాడు. 1982లో న్యూఢిల్లీలో ఆసియా (క్రీడల నిర్వహణ బాధ్యుడుగా నియమింపబడ్డాడు. రాష్ట్ర అసెంఛ్లీ ఎన్నికలలో పరాజయం పాలయి బలహీనపడిన కాంగ్రెస్‌కి నూతన జవసత్వాలు సమకూర్చే బాధ్యతతో 1983 ఫిబ్రవరిలో కాంగ్రెస్ స్వతంత్రం తర్వాత భారతదేశం 365
ప్రధాన కార్యదర్శి అయ్యాడు. శిక్షణాకాలం పూర్తికాకుండానే సారధ్య స్థానంలోకి విసిరివేయబడ్డాడు. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ నాయకులు సహజంగా ప్రజాకర్షక నాయకుడు కావాలనుకున్నారు. వారి అంచనా మేరకు ఇందిరాగాంధీ బలిదానంతో వెల్లువెత్తిన సానుభూతితో రాజీవ్ అలాంటి ప్రజాకర్షక నాయకుడవుతాడని భావించారు. వారి అంచనా పూర్తిగా సరియైనదే. నిర్దీతీ కాలం కంటె కాస్త ముందుగా అంటే 1984 డిసెంబరు 24-27లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీ సాధించింది. ఆ తరువాత పంజాబు, అస్సాంలలో జరిగిన ఎన్నికలతో కలిపి 518 లోక్‌సభ సీట్లకు గాను కాంగ్రెస్ 415 సీట్లు గెలిచింది. రాజీవ్‌గాంధీ అమేధీలో సంజయ్‌గాంధీ వారసురాలిగా పోటీ చేసిన అతడి భార్య మేనకాగాంధీపై పెద్ద మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని భారతదేశం యొక్క సమైక్యతా సమగ్రతలకు ఏర్పడిన ప్రమాదంపై కేంద్రీకరించింది. ఇందిరాగాంధీ మరణం దేశ ఐక్యతకి ఏర్పడిన ప్రమాదంగా ప్రజలు భావించారు. అందుకే అద్భుతమైన స్పందన లభించింది. రాజీవ్ ప్రారంభం నుండి పెద్ద సంక్షోభాల్ని ఎదుర్కొన్నాడు. తన తల్లి దారుణ హత్యకు గురయింది. ప్రపంచ వ్యాప్తంగా గల పలు దేశాల నుండి అంతర్జాతీయ ప్రముఖులు ఇందిరాగాంధీ అంత్యక్రియలకు వస్తున్నారు. ఆమె హత్యకి ప్రతిచర్యగా నగరంలో- ప్రత్యేకించి నగర పొలిమేరలలోని పునరావాస కేంద్రాలలో, పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో సిక్కులపై దారుణ హత్యాకాండ సాగుతున్నది. ఇందిరాగాంధీ మరణించిన అక్టోబరు 81 నుండి నవంబరు 3 వరకు సిక్కులపై దాడులు జరిగాయి. వారి వ్యాపార సంస్థలు, ఇళ్లు లూటీ చేయబడ్డాయి. తగులబెట్టబడ్డాయి. సుమారు 2800 మంది హత్య చేయబడ్డారు. హత్యలకు పాల్పడ్డవారు పేదలు, మురికి వాడల్లో బతుకుతున్నవారు. వారు ఇందిరాగాంధీని తమ నాయకురాలిగా తమ మనిషిగా భావించారు. ఆమె మరణంతో దిక్కూ దరిలేని వారయినట్లుగా భావించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు- కొందరు న్థానిక నాయకులు అల్లరి మూకలకు సహాయపడారని దగ్గరుండి నడిపించారని, పోలీసులు కళ్లెదుట జరిగే హత్యాకాందని చూడ నిరాకరించారని ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల్ని మరి కాస్త పెంచి పై నుండి వచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ హత్యాకాండ సాగించిందని కూడా ప్రచారం జరిగింది. కాని ఇది స్పష్టంగా నిరాధారమైన, నిరూపణకి నిలవని ప్రచారం. వేలాది మంది సిక్కులకు హిందూ మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్లు ఆశ్రయం ఇచ్చారు. రక్షణ కల్పించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జరిగిన జాప్యానికి కారణాలు: హత్యానంతరం ఏర్పడిన గందరగోళ పరిస్థితి, నూతన ప్రధానమంత్రి 866 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రమాణ స్వీకారం. లక్షలాది మంది హాజరయిన అంత్యక్రియల ఏర్పాట్ల బాధ్యత, విదేశీ అతిథుల సంరక్షణ బాధ్యత, హత్యాకాండ యొక్క విస్తృతి, తీవ్రత యొక్క సమాచారం ప్రభుత్వంలోని పై స్థాయి వారికి చేరడానికి, వారు స్పందించడానికి కొంత సమయం పట్టింది. నవంబరు 3న అంటే అంత్యక్రియల రోజున ఉదయం రాజీవ్ బాధిత ప్రాంతాల్ని సందర్శించాడు. సైన్యం రప్పించబడింది. హింస అణచివేయబడింది. సాధారణంగా హిందువులు కార్యకర్తలుగా గల చాలా స్వచ్చంద సంస్థలు నెలల తరబడి బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాయి. అలాంటి హింసే తక్కువ స్థాయిలో ఉత్తర భారతదేశంలోని ఇతర నగరాలలో- ప్రత్యేకించి కాన్పూరు, బొకారోలలో చెలరేగింది. రాజీవ్ ప్రధానమంత్రి అయిన రెండు వారాలలో భోపాల్ గ్యాస్ దురంతం సంభవించింది. బహుళ జాతి కంపెనీ యూనియన్ కార్సైడ్ ఫ్యాక్టరీ రసాయనాల నుండి వెలువడిన విషవాయువు కారణంగా పేదలు, మురికి వాడల్లో నివసించే 2000 మంది చనిపోయారు. వేలాది మంది జబ్బున పడ్డారు. నష్టపరిహారం కొరకు భారతదేశ, అమెరికా న్యాయ స్థానాలలో జరిగిన పోరాటం సంవత్సరాలపాటు సాగింది. తుది తీర్పు కూడా బాధితులకనుకూలంగా లేదు. ఇబ్బందులెదురైనవ్పటికీ రాజీవ్ పరిపాలన సానుకూలమైన వైఖరితో ప్రారంభమయింది. రాజకీయ స్థాయిలో పంజాబు, అస్సాం ఒప్పందాల అమలు క్రమాన్ని ప్రారంభించారు. ఆరు టెక్నాలజీ మిషన్స్ ప్రారంభించాడు. ఇవి యువ (ప్రధాని యొక్క ఆధునిక శాప్రీయ దృక్చథానికి ప్రతీకలని పలువురు ప్రశంసించారు. ఈ పథకాల ఉద్దేశం: సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ వైఖరి అవసరమైన ఆరు వెనుకబడిన రంగాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింపచేయటం. ఈ లక్ష్య నిర్దేశిత పథకాలను టెక్నాలజీ మిషన్స్ అన్నారు. నూతన సహస్రాన్ధి వచ్చేటప్పటికి ఇవి పూర్తి కావాలి. భారతదేశం ఆధునిక దేశంగా నూతన సహస్రాబ్దిలోనికి ప్రవేశించాలి. వీటిలో అత్యంత ముఖ్యమైనది త్రాగునీటి పథకం. ప్రస్తుతం భారతదేశంలోని ఐదవ వంతు (గ్రామాలకు మాత్రమే త్రాగునీటి సరఫరా ఉంది. దేశంలోని అన్ని గ్రామాలకు రక్షిత త్రాగునీటి సరఫరా పథకం యొక్క లక్ష్యం. నీటి వనరులను గుర్తించి వెలికి తీసి శుభ్రపరిచి సరఫరా చేసేందుకు భూగర్భ శాస్త్ర, సివిల్ ఇంజనీరింగు, బయోకెమిష్టీల పరిజ్ఞానాన్నేగాక, ఉపగ్రహాలను కూడా ఉపయోగించుకోవాలి. అక్షరాస్యతా పథకం నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు ఉద్దేశించబడింది. స్వతంత్రం వచ్చి 40 సం॥లు గడచినప్పటికీ ఇంకా దాదాపు 60 శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో టెలివిజన్ అల్లికని విస్తరించి, దృశ్య, శ్రవణ పరికరాల్ని (కేసెట్లని౫ ఇంకా ఇతర పరికరాల్ని ఉపయోగించి స్వతంత్రం తర్వాత భారతదేశం 367
అక్షరాస్యతని వ్యాపింపచేయాలి. సంపూర్ణ అక్షరాస్యతా పథకంపై విస్తృత రాజకీయ చర్చ జరిగింది. విసృత ప్రచారమూ పొందింది. మూడవ పథకం గర్భిణీ స్రీల, శిశువుల సంరక్షణకి సంబంధించినది. నాల్గవది శ్వేత విప్లవం. ఆవుల గేదెల ఆరోగ్యాన్ని పొల దిగుబడిని పెంచటం. ఇది గణనీయంగా విజయవంతమయింది. భారతదేశం పెద్దఎత్తున ఖాద్య తైలాల్ని దిగుమతి చేసుకొన్నది. ఇది విదేశీ మారక ద్రవ్యలోటుని పెంచింది. కాబట్టి ఐదవ పథకం లక్ష్యం ఖాద్య తైలాల ఉత్పత్తిని పెంచటం. శతాబ్దాంతానికి దేశంలోని ప్రతి గ్రామానికీ టెలిఫోన్ సౌకర్యం కల్పించటం పథకం ఆరవ లక్ష్యం.
సాంకేతిక పథకాల దృక్చథాన్ని ప్రోత్సహించి అమలు పరచటానికి సహాయపడిన వ్యక్తి శ్యామ్ పిట్రోడా. అమెరికాలో టెలిఫోన్ స్విచింగ్ సిస్టమ్స్ పెట్టి బాగా దబ చేసుకొన్నవాడు. టెలిమేటిక్స్ అభివృద్ధి కొరకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గురించి ఇందిరాగాంధీకి నచ్చజెప్పాడు. అతడు ఇప్పుడు సాంకేతిక పథకాలవి రాజీవ్‌గాంధీ సలహాదారుడు. టెలికాం కమిషన్ ఛైర్మన్.
ఇందిరాగాంధీ కాలంలో రూపొందించబడిన భారతదేశ కంప్లూ వటరీకరణ కార్యక్రమానికి రాజీవ్‌గాంధీ మంచి ప్రోత్సాహమిచ్చాడు. స్థానిక ఉత్పత్తిదారులు ఉత్పతిని పెంచుకొనటానికి వీలుగా కంప్యూటర్ విడి భాగాలపై దిగుమతి సుంకాలు తగ్గించబడ్డాయి. దేశీయ మార్మెట్టులోనికి ఏదేశీ ఉత్పత్తిదారులు అనుమతించబడ్డారు. ఆఖీసులలో, పాఠశాలలో కంప్యూటర్ వినియోగం ప్రోత్సపహించబడింది. విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే కంప్యూటర్ సాఫ్ట్వేరలతో ముందుకుపోయాడు. భారతదేశం గతంలో వలసదేశంగా వుండడం వలన పారిశ్రామిక విప్లవం రాలేదు. కాని ఇప్పుడు ఇన్ఫర్మేషన్! కమ్యూనిక్తేష్షన్స్ విప్లవంలో భాగస్వామి కావడం అనివార్యం (ఇది దూరదృష్టి గల పలువరు భారతీయుల అభిప్రాయం. రాజీవ్ అభిప్రాయం గూడా ఇదే. అందుకే అది వాస్తవరూపం దాల్చేందుకు పూర్తిగా దోహదపడ్డాడు.) ఆర్థిక రంగంలో నియంత్రణల సరళీకరణ ఎగుమతుల పెరుగుదల, దిగుమతి సుంకాల తగ్గింపు- లాంటి ప్రయత్నాలు చేయబడ్డాలూ' ఈ అంశాలు ఈ (గ్రంథంలోనే మరాక చోట చర్చించబడ్డాయి.
స్థానిక స్వయం పరిపాలనా సంస్థల్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని గురించి చాలా మంది చాలా చెప్పారు. కాని పంచాయతీ సంస్థలపై చర్చ జరిపి వా టికి రాజ్యాంగ అనుమతిని ఇప్పించి పంచాయతీ ఎన్నికల్ని తప్పనిసరి చేసేందుకు చట్టాన్ని చేయించడం ద్వారా పంచాయతీ సంస్థల్ని పటిష్టపరిచేందుకు రాజీవ్‌గాంధీ, ఆయన 368 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రభుత్వం చొరవ తీసుకొన్నది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరమయింది. కాని కాంగ్రైస్కి మెజారిటీ లేని రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులు పాసుకాకుండా అద్దుకొన్నాయి. 1987 డిసెంబరు, 1988 జూన్ మధ్య కాలంలో రాజీవ్ 400 మంది జిల్లా కలెక్టర్లను, లేక జిల్లా బాధ్యులైన అధికార్లను కలిశాడు. 1988 జులైలో రాష్ట్రాల అక్యున్నతాధికారులైన ఛీఫ్ సెక్రటరీలతో సమావేశం, 1989 జనవరిలో 8000 మంది ప్రతినిధులతో పంచాయతీరాజ్ సమ్మేళన్, మేలో మహిళల కొరకు పంచాయతీ రాజ్ సదస్సు నిర్వహించబడ్డాయి. 1989 మే లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనల్ని చర్చించి బలపరచింది. ఆ తరువాత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించబడింది. అత్యున్నత స్థాయిలోని ప్రభుత్వం క్రింది స్థాయి ప్రజాస్వామ్యం, అభివృద్ధిని గురించి ప్రతి స్థాయిలోని వేల మంది (ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొన్న సందర్భం గతంలో ఎన్నడూ లేదు.
పతీ గ్రామీణ కుటుంబంలో కనీసం ఒకరికి సంవత్సరంలో 50- 100 రోజులకు ఉపాధి కల్పించటానికి ఉద్దేశించిన పథకం జవహర్ రోజ్‌గార్ యోజన పథకం. జవహార్ లాల్ నెహ్రూ శతజయంతి (నెహ్రూ 1889లో జన్మించాడు) సందర్భంగా ప్రారంభించబడిన ఈ పథకానికి అయ్యే ఖర్చులో 80 శాతం కేంద్రం భరిస్తానని వాగ్దానం చేసింది. నూతన విద్యావిధానం కూడా గ్రామీణ 'ప్రాంతాలపైన (గ్రామీణ పేదలపైన కేంద్రీకరించింది. నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యాలు అక్షరాస్యతా ప్రచారం, ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్ (పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించబడింది) దూర విద్య, రాజీవ్ విద్యా విధానం యొక్క కులీన స్వభావానికి నిదర్శనంగా విమర్శలకు గురయిన నవోదయా విద్యాలయాలు గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన బిడ్డలకు వా సిగల విద్యని అందచేసేందుకు ఉద్గేశించబడినవి. ప్రతిభ ఆధారంగా ఉచిత విద్యకు ఎంపిక చేయబడే ఈ విద్యార్థులకు జిల్లాకొక రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పబడుతుంది.
మహిళల కొరకు 1988లో జాతీయ పథకం రూపొందించబడింది. పంచాయతీ రాజ్ సంస్థలన్నిటిలో ఎన్నికలకు సంబంధించిన సీట్లలో ౩౦ కాతం మహిళలకు రిజర్వు చేయబడడం ముఖ్యమైన 'ప్రతిపాదనలలో ఒకటి. క్రిందిస్థాయి అధికారులు నిర్వాహకులలో 50 శాతం మంది మహిళలు వుండాలని పథకం సిఫారసు చేసింది. ఈ పథకంలో మహిళల ఆరోగ్యం విద్యకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వరకట్నం నేరాలకు శిక్ష విధించే చట్టం కూడా 1986లో ఆమోదించబడింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 869
ఇందిరాగాంధీకి వలెనే రాజీవ్‌గాంధీకి కూడా వాతావరణ, పరిసరాల పరిరక్షణ చాలా ఇష్టమైన పథకం. భారతదేశ నదులన్నిటిలో అత్యంత పవిత్రమైన గంగానది, పరిశుభ్రతని కాపాడేందుకు బృహత్పథకాన్ని ప్రారంభించాడు. ఆయన కొత్తగా వాతావరణ మంత్రిత్వ శాఖని సృష్టించాడు. పెద్ద ప్రాజెక్టులకు వాతావరణ మంత్రిత్వశాఖ ఆమోదాన్ని నిర్బంధం చేశాడు. వాతావరణ పరిరక్షణకు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల అందుబాటులోకి తెచ్చేందుకు అలీన దేశాల 9వ శిఖరాగ్ర సభలో ఆయన (గ్రహరక్షణ నిధి (212016 2౯01604101 1416) కొరకు ఒక (ప్రతిపాదన చేశాడు. రాజీవ్ ప్రభుత్వం పాశ్చాత్యుల అభిరుచులకనుగుణంగా పలు పొశ్చాత్య దేశాలలో భారత ఉత్సవాలను ఆడంబరంగా జరిపించిందని రాజీవ్ సాంస్కృతిక విధానంపై విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం కేంద్రీకరణ రాజథాని నగరానికి పరిమితం చేయకుండా ఏడు జోనల్ కేంద్రాలు నెలకొల్పబద్దాయని, స్థానిక ప్రాంతీయ రూపాలు ప్రోత్సహించబడ్డాయనే విషయాన్ని విమర్శకులు విస్మరించారు. వారి విమర్శలెలా ఉన్నప్పటికీ ఈ ఉత్సవాలు ప్రపంచ సాంస్కృతిక పటంలో భారతదేశానికి స్థానం కల్పించడంలో జయప్రదమయ్యాయి. పరిపాలిస్తున్న దేశం యొక్క పరువు, ప్రతిష్టల్ని ప్రపంచంలో పెంచడం ఒక ప్రభుత్వం యొక్క కర్తవ్యమైతే, భారతదేశ ఉత్సవాలు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాయి. అపరాధం చేస్తున్నవారిని నిరుత్సాహపరచేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టడం ద్వారా ఎక్కువ పారదర్శకతని జవాబుదారీ తనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయ, ఉన్నకాధికార వ్యవస్థని క్షాళనం చేసేందుకు ఒక గట్టి ప్రయత్నం జరిగింది. అది ఫిరాయింపు నిరోధక చట్టం. ఇది ప్రతిపక్షాలతో చర్చలు జరిపి రూపొందించబడి 1985లో ఆమోదించబడింది. దీనిననుసరించి పార్లమెంటులోని ఒక రాజకీయ పార్టీ యొక్క సభ్యులలో మూడవ వంతు మంది తమ విధేయతల్ని మార్చుకొంటే అది చీలికగా గుర్తింపబడుతుంది. మూడవవంతు కంటే తక్కువ సంఖ్యలో సభ్యులు పార్టీ విధేయతను మార్చుకుంటే అది ఫిరాయింపు అవుతుంది. వారిని పార్లమెంటు బహిష్మరిస్తుంది. అంటే వారి పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది. ఇది భారత రాజకీయ వ్యవస్థకి ఒక శాపంగా మారుతున్న పార్టీ విధేయతలు మార్చటానికి వ్యతిరేకంగా బేరసారాల్ని అదుపు చేయటానికి ఉద్దేశించబడింది. లోక్ అదాలత్‌లు, వినిమయదారి రక్షణ చట్టం ఈ కోవకి చెందినవే. ప్రభుత్వ ప్రసార మాధ్యమాలకు- ప్రత్యేకించి ప్రజాదరణ పొందుతున్న టెలివిజన్‌కి- తాం బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఎక్కువ స్వేచ్చ, ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమాలకు ్రోత్సాహం-లాంటివి మంత్రుల్ని ఉన్నతాధికారుల్ని తగు జాగ్రత్తగా పద్ధతిగా వ్యవహరించేందుకు ఉద్దేశించబడినవి. వీటిపై ప్రధానమంత్రి వ్యక్తిగత ముద్ర వుంది. (ప్రారంభంలో రాజీవ్‌గాంధీ మద్దతిచ్చిన వ్యాపార సంస్థలపై వి.పి.సింగ్ జరిపించిన దాడులు విస్తృత ప్రచారం పొందాయి. ప్రారంభంలో రాజీవ్ మద్దతూ వుంది. అవి రాజీవ్‌గాంధీపై “మిస్టర్ క్లీన్ ముద్రపడడానికి దోహదపడ్డాయి.
కాని 1985 డిసెంబరులో కాంగ్రెస్ శతవార్చికోత్సవాల సందర్భంగా రాజీవ్ చేసిన ఉపన్యాసం అభిమానులను విమర్శకులనూ (అప్పుడు విమర్శకులకంటే అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు) కలచివేసింది. గొప్ప పార్టీని డొల్లగా మార్చిన వారిని రాజీవ్ పవర్ బ్రోకర్లుగా వర్ణించాడు. పార్టీపై వారి పట్టుని తొలగించి నూతన జవసత్వాలు సమకూర్చుతానని వాగ్దానం చేశాడు. ఇది పాత నాయకులు హెచ్చరికగా భావించారు. రాజీవ్ విధానాల పట్ల సానుకూలత, అభిమానం ఉన్నవాళ్లు కూడా అతడి అమర్యాదకరమైన వైఖరిని అభిమానించలేకపోయారు. గొప్ప చరిత్రగల పార్టీ యొక్క వార్షికోత్సవ వేడుకలు అలాంటి ఉపన్యాసానికి సరియైన సమయం కాదని భావించారు. ఏమైనప్పటికీ రాజీవ్ ఆయన తల్లిలాగానే పార్టీలో అంతర్గత ఎన్నికలు జరపలేకపోయాడు. పార్టీ స్థానిక నాయకులు సామాన్యులు కారు. వాళ్ళు నకిలీ సభ్యుల్ని చేర్చగలరు. ఎన్నికల్ని తమకనుకూలంగా మార్చుకోగలరు. ఇలా చేసి ఎన్నిక కావడం వలన వారు చట్ట బద్ధత పొందగలరు. పార్టీ నాయకులతో రాజకీయ ప్రముఖులతో సంబంధాలు పెట్టుకోవడం ఒక సంస్థని క్రమబద్ధంగా నడపడం కంటే భిన్నమైనదని రాజీవ్ త్వరగానే గుర్తించాడు. కాలక్రమంలో తన సన్నిహిత సలహాదారులు అరుణ్‌నెహ్రూ, అరుణ్‌సింగ్, పి.వి.సింగ్‌లు దూరమవడంతో పాత సలహాదార్లను రప్పించుకొన్నాడు. 1985 డిసెంబరులో తాను ఏ పాత వ్యవస్థని తలక్రిందులు చేస్తానని అమాయకత్వంతో వాగ్దానం చేశాడో ఆ పాత వ్యవస్థకి ప్రతీకగా ప్రతినిధిగా ఉన్న ఇందిరాగాంధీ సన్నిహిత సలహాదారుడు ఆర్.కె.థావన్ 1989 ప్రారంభానికి ముఖ్య సలహాదారుదయ్యాడు. విదేశీ విధానం
రాజీవ్ విదేశీ వ్యవహారాలలో చాలా చురుకుగా శక్తివంతంగా పనిచేశాడు. పెద్ద చిన్న దేశాలు విస్తృతంగా పర్యటించాడు. అనేక అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నాడు. అంతకు ముందు తన తాత, తల్లి వేసిన బాటలో ముందుకు సాగినప్పటికీ స్వతంత్రం తర్వాత భారతదేశం 871
తనదైన స్వంత ముద్ర వేశాడు. అణ్వస్త్ర నిరాయుధీకరణకు, దక్షిణాఫ్రికాలోని జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి, నమీబియా స్వాతంత్ర్యానికి విస్తృత ప్రచారం చేశాడు. ఇందిరాగాంధీ, ఆమె మరణానికి ముందు ఆయుధాల తగ్గింపుకు అణ్వస్తాల తొలగింపుకు అ(గ్రరాజ్యాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచేందుకు ఐదు ఖండాలకు చెందిన ఆరు దేశాల- అర్జెంటీనా, గ్రీస్, మెక్సికో, స్వీడన్, టాంజానియా, భారతదేశ ప్రభుత్వాధినేతల వేదికను ఏర్పాటు చేసింది. ఎన్నికలలో గెలిచిన ఒకనెలలోపలనే రాజీవ్ ఆరు దేశాల దేశాధినేతలతో శిఖరాగ్ర సమావేశం నిర్వహించాడు. గోర్బచెవ్ అధికారం చేపట్టక ముందు, అగ్రరాజ్యాల సంబంధాల అజెండాలో నిరాయుధీకరణని చేర్చక ముందు రాజీవ్ ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. గోర్బచెవ్ సోవియట్ యూనియన్‌లో అధికారం చేపట్టాక అతడిని రాజీవ్‌గాంధీ కలిశాడు. నిరాయుధీకరణ పట్ల అతడికి గల విశ్వాసాన్ని గమనించాడు. సోవియట్ యూనియన్ యొక్క కొత్త నాయకుని కొత్త ఆలోచనలను అమెరికా గమనించకముందే రాజీవ్ గోర్చచెవ్ని “శాంతిశక్తిగా ప్రశంసించాడు. 1986 నవంబరులో గోర్బచెవ్ ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఇరువురు నేతలు గోర్బచెవ్, రొజీవ్లు ఢిల్లీ (0611 0601424018) ప్రకటనలో అహింసాయుత ప్రపంచం కొరకు పిలుపిచ్చారు. ఆరు దేశాలు తీసుకొన్న చొరవ కూడా నిరాయుధీకరణ కార్యాచరణ పథకంగా పరిణతి చెందింది. ఆ పథకాన్ని రాజీవ్ 1988 జూన్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిరాయుధీకరణపై జరిపిన మూడవ సదస్సుకి సమర్పించాడు. దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి రాజీవ్ గట్టి మద్దతుదారుగా నిలిచాడు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ (1898లో దక్షిణాఫ్రికాలో సమస్యని చేపట్టిన మొట్ట మొదటివాడు గాంధీజీ; 1940 దశాబ్దాంతంలో ఐక్యరాజ్యసమితిలో సమస్యని మొదట లేవనెత్తినవాడు నెహ్రూ. వాణిజ్య దౌత్య సంబంధాలను ఆపివేసి ఆంక్షలను మొదట అమలు జరిపిన దేశం భారతదేశం) ఆంక్షలకు అనుకూలంగా కామన్వెల్త్లో మెజారిటీ సాధించడంలో జయప్రదమయ్యాడు. కాని పట్టువదలని మిసెస్ థాచర్ని కదిలించడంలో విఫలమయ్యాడు. 1986లో హరారేలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికా ((్యూూంగు (దాడి, వలసవాదం, జాతి వివక్షతల (ప్రతిఘటన కొరకు కార్యాచరణ) నిధికి పిలుపిచ్చాడు. మూడు సంవత్సరాల తరువాత బెట్లేడ్లో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం నాటికి దక్షిణాఫ్రికాకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల కారణంగా ఆఫ్రికా రాజ్యాలకు వాటిల్లిన నష్టాన్ని అధిగమించేందుకు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న చేశాల నుండి అర్ధబిలియన్ డాలర్ల నిధిని సమకూర్చగలిగాడు. 372 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నమీబియా దక్షిణాఫ్రికా యొక్క వలస రాజ్యంగా వుంది. నమీబియా స్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్న సంస్థ '“స్వాపోకి రాజీవ్ దౌత్యపరమైన గుర్తింపునిచ్చాడు. 1986లో జాంబియా, జింబాబ్వే, అంగోలా, టాంజానియాలను సందర్శించాడు. అంతర్జాతీయ సమావేశాలన్నింటిలో నమీబియా స్వతంత్రాన్ని గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నమీబియా 1990లో స్వతంత్ర్యం సాధించింది. అప్పటికి రాజీవ్ (ప్రధానమంత్రిగా లేదు. కాని స్వాతంత్రోత్సవాలకు హాజరయ్యాడు. నెల్సన్ మండేలాని కలిసాడు. రాజీవ్ పాలనాకాలంలో అ(గ్రరాజ్యాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి. కాని పెద్ద మార్పులు లేవు. స్వేచ్చా మార్కెట్టు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం పట్ల గల ఆసక్తి ప్రాతిపదికన వేసిన అంచనాలకు భిన్నంగా యువ ప్రధాని అమెరికా వైపు మొగ్గలేదు. 1985లో రాజీవ్ అమెరికా పర్యటన జయహ్రదమయింది. రీగన్కి నచ్చచెప్పి భారతదేశ వాతావరణ పరిస్థితులనధ్యయనం చేయటానికి అవసరమైన సూపర్ కంప్యూటర్లు తెప్పించగలిగాడు. అమెరికా పాకిస్తాన్‌కు మద్దతు పట్ల నిబద్ధతతో వుంది. ఆస్టనిస్తాన్లో సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా ముజాహిద్దీన్లను ప్రోత్సహిస్తున్నది. ఈ పరిస్థితులలో పెద్ద మార్పులకి అవకాశం లేదు. కాని గోర్చచెవ్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇరువురు నాయకులు 5 సంవత్సరాలలో 8 సార్లు కలిశారు. "1988లో రాజీవ్ చైనా పర్యటన-19854లో నెహ్రూ మొదటి పర్యటన తరువాత
- భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన ప్రత్యేకంగా గమనార్హం. ఆ పరిస్థితులలో ఆ పర్యటన జరగడమే విశేషం. డెంగ్ రాజీవ్ చేతులు పట్టుకొని తమ తరం వాళ్లు చేసిన తప్పులు యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజీవ్ తరంలో పునరావృతం కాకూడదని చెపుతున్న టి.వి. దృశ్యాలు - భారత చైనా మైత్రి కలకాలం వర్జిల్లుతుందనే విశ్వాసం కలిగించాయి. ఈ పర్యటన తరువాత ఇరు దేశాల మధ్య గల దీర్హకాలిక సమస్యల పరిష్కారానికి క్రమబద్ధమైన చర్యలు (ప్రారంభమయ్యాయి. వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలు మెరుగయ్యాయి. ఇరు దేశాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకే భారతదేశం 1989 జూన్ నాటి తియాన్మన్ స్పేర్ హత్యాకాందని ఖండించకుండా మిన్నకున్నది. రాజీవ్ కాలంలో పొరుగు దేశాలతో సంబంధాలు అంత సజావుగా లేవు. బంగ్లాదేశ్ అంతకంతకు ఇస్తాం దిశలో ముందుకు పోతున్నది. నీటిపై వివాదాలు కొనసాగుతున్నాయి. నేపాల్ ప్రభుత్వం భారతదేశ వస్తువులపై భారీ సుంకాలు విధించింది. చైనా వస్తువులపై పన్నులలో భారీ మినహాయింపులిచ్చింది. 1988లో చైనా నుండి స్వతంత్రం తర్వాత భారతదేశం 878
విమాన విధ్వంసక తుపాకులు పొందింది. నేపాల్‌లో నివశిస్తున్న భారతీయుల్ని అక్కడ పనిచేసేందుకు వర్క్‌పర్మిట్లు తెచ్చుకొమ్మన్నది (లక్షలాది మంది నేపాలీలు ఎలాంటి పర్శిట్లు లేకుండానే భారతదేశంలో నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు. ) భారత ప్రభుత్వం 1989 మార్చిలో ఆర్థిక దిగ్బంధాన్ని విధించింది. సెప్టెంబరు నాటికి పరిష్కారం కొరకు చర్చలు (ప్రారంభమయ్యాయి. మాల్టివులలో బలప్రయోగంతో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది. భారత సహాయాన్ని అర్ధించింది. తగు సహాయం అందజేయడంతో ప్రయత్సం విఫలమయింది. పాకిస్తాన్‌కి బేనజీర్ భుట్టో ప్రధానమంత్రి కావడం, రాజీవ్ పొకిస్తొ పర్యటన జరపడంతో (జవహర్లాల్ నెహ్రూ తరువాత పాకిస్తాన్ సందర్శించిన మొదటి ప్రధాన మంత్రి) - ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించడం జరిగింది. కానీ పాకిస్తాన్ మద్దతుతో కాశ్మీరులో, వంజాబులో చొరబాట్లో కొనసాగుతున్నాయి.
శ్రీలంకలోని ఇబ్బందికరమైన పరిస్థితులలో భారతదేశం ఇరికించబడింది. వాటి నుండి బయట పడడం చాలా కష్టతరమైంది. శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాపై భారీ ఎత్తున అణచివేత చర్యలు ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది తమిళులు పారిపోయి తమిళనాడుకి రావడంతో సమస్య మొదలైంది. జాఫ్నా ఎల్.టి.టి.ఇ. స్థావరం. ఎల్టి.టి.ఇ తమిళుల స్వయం ప్రతిపత్తి కొరకు ఆ తరువాత శ్రీలంక నుండి స్వతంఠం కొరకు పోరాడుతున్న సంస్థ. భారతదేశంలోని ప్రత్యేకించి తమిళనాడులోని ప్రజాభిప్రాయం శ్రీలంకలోని తమిళులకు భారతదేశం సహాయపడడానికి అనుకూలంగా ఉంది. శ్రీలంకీ ప్రభుత్వం జాఫ్నాపై దిగ్బంధం విధించి నిత్యావసర వస్తువుల సరఫరాని అడ్డుకోవడంతో ఉదిక్తతలు రెచ్చగొట్టబడ్డాయి. భారతదేశం చేపల పడవలలో సరుకుల్ని పంపించింది. శ్రీలంక నేవీ అడ్డుకొన్నది. రవాణా విమానాల ద్వారా జారవిడిచింది. పరిస్థితిన్ గమనించేందుకు భారతదేశ, విదేశీ జర్నలిస్టుల్ని పంపించింది. తమిళ శరణార్జుల రొకే కొనస్తాగుతుంది. భారతదేశం తప్ప మరో దేశం సహాయపడజాలదని శ్రీలంక ప్రభుత్వం గుర్తించీంది. (పెసిడెంటు జయవర్ధనే రాజీవ్‌గాంధీని కలిశాడు. చర్చలు 1987 జులైలో ఒక ఒప్పందానికి దారితీశాయి. ఒప్పందాన్ని అనుసరించి శ్రీలంకలో తమిళులు మెజారిటీగా ఉన్న ఉత్తర తూర్పు ప్రావిన్సులను కలిపి ఒక ప్రావిన్సు చేయాలి. గణనీయంగొ అధికార వికేంద్రీకరణ జరగాలి. ఎల్టి.టి.ఇని రద్దు చేసి స్వల్చ్పకాల వ్యవధిలో ఆయుధాల్ని అప్పజెప్పాలి. శ్రీలంక కోరితే శ్రీలంక ప్రభుత్వానికి భారత సైన్యం సహాయపడుతుంది. కాని ఎల్టి.టి.ఇ. శ్రీలంక (ప్రభుత్వాన్ని నమ్మలేదు. ఎల్‌టిటిఇ బాధ్యులు ఒప్పందంపై సంతకం చేయలేదు. లొంగిపోయేందుకు తిరస్కరించారు. ఒప్పందం 374 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
విఫలమ్రయింది. ఒప్పందానికి యల్టిటియి అద్దుపడుతుంది కనుక బలప్రయోగంతో అమలు జరిపించవలసిందిగా జయవర్ధనే భారత సైన్యాన్ని అర్ధించాడు. తమిళ గెరిల్లాలకు ఆ ప్రాంతమంతా బాగా తెలుసు. అంతేగాక స్థానిక మద్దతు వుంది గనుక భారత సైన్యం తమని ఇరకాటమైన పరిస్థితులలోకి నెట్టివేయబడిన యుద్ధంలో చిక్కుకొన్నది. ఎల్‌టిటిఇని నిరాయుధం చేస్తున్నది గనుక భారత సైన్యాన్ని తమిళులు నిరసించారు. భారత సైన్యం విదేశీ సైన్యం గనుక శ్రీలంక ప్రజలు నిరసించారు. జయవర్ధనే స్థానంలో శ్రీలంక (సెసిడెంటు అయిన (ప్రేమదాస సైన్యాన్ని వెనక్కి పిలిపించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరడంతో పరిస్థితి మరీ క్షిష్టూపం దాల్చింది. దఫలవారీగా సైన్యాన్ని పంజాబులో విరమించేందుకు రాజీవ్ అంగీకరించాడు. 1989 సంవత్సరం మధ్య కాలం నాటికి సైనికులు తిరిగిరావటం ప్రారంభమయింది. కాని ఈ క్రమం 1989 ఎన్నికల తరువాత మాత్రమే పూర్తయింది. శ్రీలంక క్షిష్ట పరిస్థితి రాజీవ్ ప్రాణాన్ని బలిగొన్నది.
కంపూచియా (కంబోడియా) నుండి వియత్నాం వైదొలగడంపై జరిగిన చర్చలలో భారతదేశం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. అది నెహ్రూ కాలంలో ఆన్నేయాసియాలో కొరియాలో, కాంగోలో ఇంకా పలుచోట్ల గౌరవప్రదమైన మధ్యవర్తి పాత్ర నిర్వహించడానికి పిలిపించబడిన ఘటనల్ని స్ఫురణకి తెచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం కంపూచియాని ఆక్రమించిన వియత్నాం తాను అక్కడ నుండి వైదాలుగుతానని అందుకవసరమైన పద్ధతులను ఇతర దేశాలతో సంప్రదించి రూపొందించవలసిందిగా భారతదేశాన్ని కోరింది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి నట్వర్‌సింగ్ చాలా దౌత్య వ్యవహారం నడిపాడు. పదవీ భ్రష్టుడైన కంపూచియా పాలకుడు ప్రిన్స్ సిహనౌక్ని పారిస్‌లో చాలాసార్లు కలిశాడు. సిహనౌక్, హెంగ్ సమారియన్ల మధ్య సమావేశాలు ఏర్పాటు చేశాడు. దాదాపు పరిష్కారమయ్యే దశలో అమెరికా చైనాలు రంగ ్రవేశం చేసి భారతదేశాన్ని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించాయి. పారిస్‌లో 21 దేశాల సమావేశం నిర్వహించబడింది. భారతదేశం కూడా ఆహ్వానించబడింది. వియత్నాం వైదొలగడం, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ, సిహనౌక్, హెంగ్ సమారియన్ల సంకీర్ణ ప్రభుత్వ స్థాపన ఫలితాలుగా సమస్య పరిష్కరించబడింది.
రాజీవ్ అణు నిరాయుధీకరణ లక్ష్యంతో అలీన ఉద్యమానికి నూతన జవసత్వాలు సమకూర్చాడు. జి-77కు కుదింపుగా జి-15 ఆలోచనని సమర్థించయత్నించాడు. అది జి-7గా తుదిరూపం దాల్చింది.పలు సమస్యలపై పలు వేదికలలో పాల్గొని ప్రపంచపటంలో భారతదేశానికి సముచిత సానం కల్పించాడు. ఐదు సంవత్సరాల పాలనాకాలంలో సగటున నెలకొకటి చొప్పున విదేశీ పర్యటనలు చేశాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం తోక్
_ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని నిలిపేందుకు రాజీవ్ దేశ రక్షణ పాటవాన్ని పెంచటం పట్ల నిబద్ధుడయ్యాడు. సాయుధ బలగాల ఆధునీకరణ చేపట్టాడు. ఫలితంగా రక్షణ వ్యయం రెట్టింపయింది. 1983లో ఇందిరాగాంధీ ప్రారంభించిన క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఫలితాలివ్వడం ప్రారంభమయింది. త్రిశూల్, పృథ్వి, రాజీవ్ చాలా ఆసక్తి చూపిన మధ్య తరహా క్షిపణి జయప్రదంగా ప్రయోగించబడ్డాయి. రష్యా నుండి తెప్పించబడిన అణుశక్తి సబ్‌మేరిన్, బ్రిటన్ నుండి కొన్న రెండవ విమాన వాహకంతో భారత నౌకాదళం గణనీయంగా విస్తరించబడింది. స్వీడన్ నుండి హోలిట్టర్ తుపాకులు కొనుగోలు చేయబడ్డాయి. యుద్ధ ట్యాంకు అర్జున్ అభివృద్ధికి అనుమతి లభించింది. రాజీవ్ పాలనలోని చివరి రెండు సంవత్సరాలలో రక్షణ వ్యయం భారత ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఐదవ వంతుకి పెరిగింది. బోఫోర్స్ -దాని ఫలితం
రక్షణ కొనుగోళ్ళు తరువాత కాలంలో బంధాలై రాజీవ్ మెడకు చుట్టుకొన్నాయి. బోఫోర్స్ అంటించిన మరక ఇప్పటికీ వదలలేదు. భారతీయులు విదేశీ బ్యాంకుల్లో చట్టవిరుద్ధంగా దాచుకొన్న డబ్బును గురించి దర్యాస్త చేసేందుకు రాజీవ్ మంత్రివర్గంలోని ఆర్థికశాఖ మంత్రి వి.పి.సింగ్ ఫెయిర్ ఫాక్స్ అనే అమెరికన్ గూఢచారి సంస్థని నియమించాడు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహిత మిత్రుడు అమితాబ్ బచ్చన్‌పై కూడా దర్యాప్త జరుగుతుందని ఒక నకిలీ ఉత్తరం సృష్టించబడింది. అప్పుడు ప్రధానమంత్రి వి.పి.సింగ్‌ని ఆర్థిక శాఖ నుండి తప్పించి రక్షణ శాఖామంత్రిని చేశాడు. పాకిస్తాన్‌తో సంక్షోభం వుంది గనుక రక్షణని సమర్థవంతంగా నిర్వహించగల వి.పి.సింగ్‌ని ఆ శాఖకి మార్చానన్నాడు రాజీవ్. తన మిత్రుడు అమితాబ్‌కి రక్షణ కల్పించేందుకే ఈ మార్పు అని ప్రత్యర్భలు ఆరోపించారు. తరువాత హెచ్ డిడబ్యు సబ్‌మెరైన్ అపవాదు వచ్చిపడింది. భారతదేశం 1981లో పశ్చిమ జర్మనీ హెచ్డి డబ్యు షిస్యార్డ్ నుండి నాలుగు సబ్మెరైన్లు కొనుగోలు చేసింది. భారతదేశం అలాంటి మరి రెండు సబ్మెరైన్తకు ఆర్జరిస్తూ వెలపై కొంత డిస్కౌంటు ఇమ్మని అడిగింది. షిప్‌యార్డ్ కంపెనీ తాము ఇప్పటికే 7 శాతం డిస్కౌంటు ఇస్తున్నాము గనుక అంతకంటె ఎక్కువ డిస్కౌంటు ఇవ్వలేమన్నది. రక్షణ మంత్రిగా ఉన్న వి.పి.సింగ్ రాజీవ్‌తో మాట్లాడకుండా “రక్షణ కొనుగోళ్ల మీద డిస్కౌంటు'పై దర్యాస్త కమిటీని నియమించాడు. 1981 కొనుగోళ్ల సమయంలో ఇందిరాగాంధీ స్వయంగా రక్షణ మంత్రిగా కూడా వున్నారు గనుక కమిటీ నియామకం అమిత్ర చర్యగా భావించబడింది. వి.పి.సింగ్ వ్యవహార సరళిపై మంత్రివర్గ సమావేశంలో విమర్శలు వచ్చాయి. వి.పి.సింగ్ ప్రభుత్వం నుండి రాజీనామా చేశాడు. ఇది వి.పి.సింగ్ నిజాయితీని 876 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజీవ్ కప్పిపుచ్చే యత్నాలకు నిదర్శనమని ప్రతిపక్షం, పత్రికలు ప్రకటించాయి. మిస్టర్ క్లీన్ లేబుల్ రాజీవ్‌కి పోయింది. వి.షి.సింగ్‌కి దక్కింది.
వి.పి.సింగ్ రాజీనామా తరువాత కొద్ది రోజులకు భోఫోర్సు కుంభకోణం గుప్పుమంది. ఫ్రెంచి గన్ కంపెనీ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వీడన్‌కి చెందిన బోఫోర్స్ కంపెనీతో 410 హోవిట్టర్ గన్స్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంటున్నందుకు భారతదేశ అధికారులకు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 60 కోట్ల రూపాయలు లంచంగా చెల్లించబడిందని స్వీడన్ రేడియో ప్రకటించింది. ఈ ఆరోపణలకు భారతదేశంలోని పత్రికలు విస్తృత ప్రచారం ఇచ్చాయి. మొదట ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆ తరువాత హిందూ, ఇతర పత్రికలు, ప్రతిపక్షాలు ఆ డబ్బు రాజీవ్‌కి ఆయన కుటుంబ సభ్యులకు దక్కిందని ప్రచారం చేశాయి. రాజీవ్, రాజీవ్ కుటుంబ సభ్యుల జోక్యాన్ని బాహాటంగా ఖండించదానికి కూడా పరిస్థితులు రాజీవ్‌కి అనుకూలంగా లేవు. ఇది రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ రాజీవ్‌గాంధీతో వివాదాలు పరిష్కరించుకొనేందుకు అవకాశం కల్పించింది. రాజీవ్ తరచుగా కలిసి ముఖ్యమైన పరిణామాలను తెలియజేయటం లేదని, పంజాబు, మిజో ఒప్పందాలను గురించి తనతో సంప్రదించలేదని రాష్ట్రపతి అసహనంగా ఉన్నాడు. రాష్ట్రపతిగా మరో ఐదేళ్లపాటు కొనసాగాలని ఆకాంక్షతో వున్నాడు. ఫలితంగా 1987 మధ్య కాలంలో రాజీవ్‌గాంధీని ప్రధాని పదవి నుండి తొలగించేందుకు జరిగిన కుట్రకు జైల్‌సింగ్ కేంద్రబిందువయ్యాడు. లంచం ఆరోపణల్ని, రాష్ట్రపతికి ముఖ్య పరిణామాలను తెలియజెప్పాలనే రాజ్యాంగ ఆదేశాన్ని పాటించడంలోని వైఫల్యాన్ని- అవకాశంగా తీసుకొని రాజీవ్‌ని ప్రధానమంత్రి పదవి నుండి తొలగించమని ప్రతిపక్ష నాయకులు, కొందరు కాంగ్రెస్ అసమ్మతి నాయకులు జైల్సింగ్ని అర్ధించారు. అందుకు జైల్‌సింగ్ కూదా దాదాపు సుముఖంగా ఉన్నాడు. కాని ప్రత్యామ్నాయంగా వున్నవి.పి.సింగ్ ఈ ఎత్తుగడని తిరస్కరించాడు. ఆ విధంగా పెద్ద రాజ్యాంగ విపత్తు నివారించబడింది.
నిందలు కుట్రలు చుట్టుముట్టినప్పటికీ రాజీవ్‌గాంధీ 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద కరువులలో ఒక దానిని సమర్ధవంతంగా ఎదుర్శొన్నాడు. 1987లో నైరుతి రుతుపవనాలతో వర్షాలు లేవు. 11 రాష్ట్రాలకు చెందిన దేశంలోని నాల్లవ వంతు జనాభా దుర్భిక్ష పరిస్థితులలో చిక్కుకొన్నారు. కరువు ప్రాంతాలకు ఆహార, నీటి సరఫరాలు పెద్దఎత్తున చెపట్టబడ్డాయి. ఉపాధి పథకాలు ప్రారంభించబడ్డాయి. కరువు కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్వతంత్రానికి నాలుగు సంవత్సరాల ముందు, 1943లో కృత్రిమ కరువుతో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయిన దేశంలో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రాజీవ్ కరువుని ఎదుర్కొనడం గమనార్హం. స్వతంత్రం తర్వాత భారతదేశం 877
కాని బోఫోర్సులో అంటిన అవినీతి మరక పోలేదు. ఎన్నికల సంవత్సరమైన 1989లో మరలా ముందుకు వచ్చింది. జాయింటు పార్లమెంటరీ రిపోర్టు ఎలాంటి తప్పుపట్టలేదు. కానీ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్టు తుపాకులు ఎంపిక చేసుకొన్న విధానంపైన, ఇతర విషయాలపైన సందేహాలు వ్యక్తం చేసింది. రాజీవ్ తప్పు చేశాడనటానికి అది నిదర్శనమని, కాబట్టి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మూకుమ్మడి రాజీనామాలకు దిగాయి. ఎలాగూ ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయి గనుక ఆ సమయంలో రాజీనామాలు పెద్ద త్యాగమేం కాదు. కాని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. రాజీవ్ తన హయాంలో రెండవసారి ఎన్నికలకు సిద్ధమయ్యాడు. రాజీవ్ తాను సాధించిన వాటిని ఘనంగా చెప్పుకోగలిగిన స్థితిలో వున్నాడు. ఒక్క శ్రీలంక మినహా విదేశీ వ్యవహారాల నిర్వహణ గణనీయమైన ఆమోదం పొందింది. ప్రపంచంలో భారతదేశం యొక్క స్థాయి పెరిగింది, గాని తరగలేదు. అగ్రరాజ్యాలతో సంబంధాలు గతంలో కంటె కొద్దో గొప్పో మెరుగుపడ్డాయి. ఆర్థిక రంగంలో లోటు, అప్పు పెరిగినప్పటికీ అభివృద్ధి రేటు పెరిగింది. సాయుధ దళాల ఆధునీకరణలో రక్షణ రంగం పటిష్టమయింది. ప్రపంచంలో తగు గుర్తింపు తెచ్చిపెట్టే కంప్యూటరీకరణ 'ప్రోత్సహించబడింది. పేదరిక నిరోధక చర్యలు, పంచాయతీరాజ్‌లో చేపట్టిన సంస్కరణలు
- ముఖ్యంగా పేదలను, గ్రామీణ ప్రాంతాలను గమనంలో పెట్టుకొని చేపట్టబడ్డాయి. నిస్సందేహంగా కొన్ని లోపాలూ వున్నాయి. రాజీవ్ తరచుగా మనసు మార్చుకొనే వైఖరి- వాటిలో ఒకటి. ఉదాహరణకు సగటున ప్రతి రెండు నెలలకొకసారి మంత్రివర్దాన్ని పునఃవ్యవస్థీకరించాడు. తరచుగా నిగ్రహం కోల్పోయాడు. కొన్ని సందర్భాలలో రానున్న ఫలితాలను గమనంలో పెట్టుకోకుండా మాట్లాడాడు. ఉదాహరణకు: పత్రికా విలేకరుల సమావేశంలో విదేశీ కార్యదర్శిని పదవి నుండి తొలగించాడు. అందుబాటులో ఉండడని, అహంకారి అని ఆరోపణలు వున్నాయి. కాని ఇవి అత్యున్నత స్థాయిలో వున్నవారిపై సాధారణంగా చేసే ఆరోపణలు. వాస్తవంగా తగినంత రాజకీయానుభవం లేకపోవటం, క్రింది స్థాయి ప్రజల సమీకరణ, పార్టీ నిర్మాణం- లాంటి అంశాలతో పరిచయం లేకపోవటం అసలైన సమస్యలు. రాజీవ్ 1989 నాటికి విషమ పరీక్షలనెదుర్శొనే రాజకీయ స్థైర్యాన్ని అలవరచుకొన్నాడు. తనపై నీచమైన దుర్నీతితో కూడిన వ్యక్తిగత ఆరోపణలు చేసిన బోఫోర్స్ అపనిందలను తట్టుకొని నిలబడ్డాడు. రెండవసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధపడ్డాడు. గెలిచినా ఓడినా భారత రాజకీయాలలో ప్రముఖమైన పోటీదారునిగొ వుండాలని నిర్ణయించుకొన్నాడు, 878 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
21
సహస్రాబ్దికి పరుగు 1989 -99
రాజీవ్ గాంధీ ఆలోచనాపరులైన భారతీయుల మనసులలో 21 వ శతాబ్దానికి
- నూతన సహస్రాబ్ది యొక్క మొదటి శతాబ్దానికి సన్నద్ధం కావాలనే ఆలోచనను ప్రవేశపెట్టడంలో విజయం సాధించాడు. 1989 నవంబరులో రెండవసారి ప్రజల తీర్చు కోరినప్పుడు ఆయన దేశం ఎదుట వుంచిన లక్ష్యాలను కృషిచేసి సాధించగలననే ఆశాభావంతో వున్న లక్ష్యాలు సాధించడానికి కేవలం దశాబ్ద కాలం మాత్రమే వ్యవధి వుంది. కాని ప్రభుత్వ నిర్వహణ, ఎన్నికలలో గెలుపూ రెండూ ఒకటి కాదు. ఒక దానిలో విజయం రెండవ దానిలో విజయానికి గ్యారంటీ కాదు. గతంలో ఎన్నడూ లేనంతగా 5.5 శాతం వార్షికాభివృద్ధి సాధించడం, పేదరిక నిర్మూలనకు పెద్ద మొత్తాలు వెచ్చించడం, 1987 దుర్భర పరిస్థితులను జయప్రదంగా ఎదుర్మ్శొనడం, విదేశీ వ్యవహారాలలో గణనీయమైన విజయాలు సాధించడం జరిగినప్పటికీ రాజీవీగాంధీకి ఎదురు గాలి వీచింది. వి.పి.సింగ్ 1987లో బహిష్మరింపబడినప్పటి నుండి ఆయన సాగించిన నిరంతర అవినీతి వ్యతిరేక పోరాటం ప్రజల మనసుల నాకట్టుకొన్నది. క్రింది స్థాయి ఉద్యోగులలో లంచగొండితనం సంపన్నులు లేక పేదలనే తారతమ్యం లేకుండా ప్రజలందరి దైనందినిక సమస్య, పై స్థాయి లంచగొండితనం, క్రింది స్థాయి లంచగొండితనానికి ఒక విధమైన న్యాయబద్దతను ప్రజల మనసులలో ప్రబలంగా నాటుకొన్నది. వి.పి.సింగ్, సర్వోదయ కార్యకర్తల, దత్తాసామంత్ లాంటి కార్మిక నాయకుల, మహారాష్ట్రలోని శరద్‌జోషి నాయకత్వంలో గల రైతు ఉద్యమం, కాంగైసు వ్యతిరేక మేధావుల సెక్షన్లు ఇంకా విస్తృతమైన వివిధ శక్తుల మద్దతుని అర్ధించాడు, పొందగలిగాడు.
వి.పి.సింగ్ ఉద్రేకపరిచే సమస్యను ఎంపిక చేసుకోవడంతో పాటు రాజీవ్‌ను, కాంగ్రెస్‌ను ఒంటరి చేసే పక్కా రాజకీయ వ్యూహాన్ని రూపొందించాడు. మొదట ఏదో ఒక కారణంతో రాజీవ్ నుండి విడిపోయిన కాంగ్రెస్ వారినందరినీ కలుపుకొన్నాడు. వీరిలో స్వతంత్రం తర్వాత భారతదేశం 879
యువకుడు సెక్యులర్ ముస్లిం నాయకుదైన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గతంలో రాజీవ్‌కి చాలా సన్నిహితుడు షాబానో కేసు సమన్యపై రాజీనామా చేయడంతో చాలా ప్రముఖుడయ్యాడు. భర్రవే విడాకులివ్వబడిన ముస్లిం మహిళలకు మనోవర్తి ఇవ్వాలని సుట్రీంకోర్టు తీర్పు చెప్పింది. కోర్టు 'ముస్లిం పర్సనల్ లా'లో జోక్యం చేసుకొన్నదనే కారణంతో పురాతన భావాలు గల ముస్లిములు తీర్పును వ్యతిరేకించారు. రాజీవ్ ప్రోత్సాహంతో అరిఫ్ పార్లమెంటులో తీర్పును ప్రతిభావంతంగా సమర్ధించాడు. కాని రాజీవ్ అప్పుడు ముస్లిం సాంప్రదాయవాదుల ఆందోళన నుండి, సన్నిహిత సలహాదారుల నుండి వచ్చిన ఒత్తిడికి లోనయి కోర్టు తీర్చు అమలు కాకుండా ఉండేందుకు వీలుగా బిల్లు ప్రవేశపెట్టడానికి అంగీకరించాడు. అరిఫ్ కలత చెంది మంత్రి పదవికి రాజీనామా చేశాడు. షాబానో కేసు విషయంలో రాజీవ్ చేపట్టిన వైఖరి కారణంగా ఆయన మొదట ముస్లింల మద్దతు కోల్పోయాడు. మనసు మార్చుకొన్న తర్వాత ముస్లింల్ని బుజ్జగించ యత్నిస్తున్నాడని హిందువులు భావించడంతో హిందువుల మద్దతు కోల్పోయాడు. అరిఫ్ రాజీనామా రాజీవ్ రాజకీయ భవిష్యత్తు తిరోగమనానికి నాంది పలికింది. అరిఫ్‌కు అరుణ్ నెహ్రూ తోడయ్యాడు. రాజీవ్ మంత్రివర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా వున్న అరుణ్‌నెహ్రూ చాలా శక్తివంతంగా తయారవుతున్నట్లు కన్చించడంతో అతడిని రాజీవ్ మంత్రివర్గం నుండి తొలగించాడు. ఏ.షి.సింగ్, అరిఫ్, అరుణ్‌లతో కాంగ్రెస్ అసమ్మతివాదులుగా వున్న రామ్ధన్, వి.సి. శుక్లా సత్పాల్ మాలిక్‌లు కలిశారు. వి.పి.సింగ్ రాజీవ్ వ్యతిరేక ఫ్రంటును నిర్మించడం ప్రారంభించాడు. వి.పి.సింగ్ వామపక్ష పార్టీలను తన సహజ మిత్రులని చెబుతూ ప్రసన్నం చేసుకొన్నాడు. మతతత్వ వాదులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. బి.జె.పి. వేదిక నుండి మాట్లాడుతూ వాజ్‌పేయి, అద్వానీలతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తూ బిజెపి తన పక్షం ఉండేలా చేసుకొన్నాడు. 1988 జూన్‌లో అలహాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సాధించిన ఘన విజయంతో కాంగ్రెస్ వ్యతిరేక (గ్రూపుల్ని అతడు సమీకరించగలడనే విశ్వాసం బిజెపికి కలిగింది. వామపక్ష షార్టీలు బిజెపితో సంబంధాన్ని ఎప్పుడూ తిరస్మరిస్తున్నప్పటికి - ప్రత్యేకించి ఆ తరువాత ఎన్నికల అవగాహన వలన 1989 ఎన్నికలలో ప్రధానంగా ప్రయోజనంగా పొందింది బిజెపి అని స్పష్టమైనప్పుడు - బిజెపితో వి.పి.సింగ్ సంబంధాలు వారికి స్పష్టంగా తెలుసు. అలహాబాద్ ఉపఎన్నికలో వి.పి.సింగ్ ఘన విజయాన్ని అభినందించేందుకు జరిపిన బహిరంగ సభావేదికపై వాజ్‌పేయితో పాటు జ్యోతిబసు ఉండటాన్ని ఉటంకిస్తూ వి.పి.సింగ్ జీవిత చరిత్ర రచయిత సీమా ముస్తాఫా ఇలా చెప్పారు. “బిజెపితో అవగాహనకు రావటానికి కేవలం వి.పి.సింగ్ 880 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మాత్రమే బాధ్యుడు కాదు. అందుకు వామపక్ష పార్టీల రహస్య మద్దతు వుందని ఈ ఘటన స్పష్టం చేస్తున్నది. బిజెపితో ఎన్నికల ఒప్పందాన్ని తాము బాహాటంగా బలపరచకపోయినప్పటికి దానినాక సమస్య చేయబోమని వామపక్ష పార్టీలు వి.పి.సింగ్‌తో చెప్పాయి.”
బిజెపికి స్వంత బలం లేదు గనుక అంతగా ప్రయోజనం పొందజాలదని వి.పి.సింగ్ వామపక్ష పార్టీల అభిప్రాయం. ఇక తాను అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుండి తొలగించడం అవసరమనే విశ్వాసంతో బిజెపి అవమానాలను దిగమింగుకున్నది. వామపక్ష సెక్యులర్ శక్తులతో కలయిక వలన బిజెపికి అంటిన మతతత్వవాద మలినం తొలగింది. అప్పటివరకు దానికి కొరవడిన విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. 1984లో రెండు లోక్‌సభ సీట్లు గల బిజెపి 1989 లో 86 సీట్లు గెలిచింది. ఈ పెద్ద అంగ దాని అధికారం సాధించే మార్గములోకి నెట్టింది. 1998లో అధికారం సాధించింది. 1989లో ఏర్పడిన విస్తృతమైన సంకీర్ణం, తరువాత కాలంలో బిజెపి అధికారంలోకి రావడానికి గల కారణాలలో ముఖ్యమైనది.
ప్రతిషక్ష ఐక్యతా వ్యూహం మూడు దశల క్రమంగా పరిగణింపబడినది. మొదటిదశ మధ్యేవాద కాంగ్రేసేతర సెక్యులర్ జాతీయ పార్టీల ఐక్యత, రెండవ దశ కమ్యూనిస్టేతర ప్రాంతీయ, జాతీయ సెక్యులర్ పార్టీలతో జాతీయ ఫ్రంటు (నేషనల్ ఫ్రంట్) ఏర్పాటు. మూడవ దశ : వామపక్ష పార్టీలు, బిజెపిలతో సీట్ల సర్దుబాటు. 1986 ఆగస్టు 6న ఏడు పార్టీలతో జాతీయ ్రంటు ఏర్పాటుతో రెండవ దశ ముందుగా పూర్తి చేయబడింది. జయప్రకాష్ నారాయణ జన్మదినమైన అక్టోబరు 11 జనమోర్చా, కాంగ్రెస్ (ఎస్) జనతా, లోక్‌దళ్ పార్టీల కలయికతో జనతాదళ్ ఏర్పాటు చేయబడింది.
మూడవ దశ : జనతాదళ్ నాయకత్వంలోని జాతీయ ్రంట్, బిజెపిలు దాదాపు 85% సీట్లలో పరస్పరం పోటీ చేసుకోకూడదనే ఒప్పందానికి వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీలతో నేషనల్ ఫ్రంట్ అలాంటి ఒప్పందానికి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1989 -90
కాంగ్రెస్ 39.5% ఓట్లు సాధించి 197 సీట్లు సాధించి అత్యంత పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు పెద్ద దెబ్బగానే చెప్పాలి. కాంగ్రెస్ (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే ప్రసక్తే లేదని రాజీవ్ స్పష్టం చేశాడు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయట నుండి మద్దతిస్తామని వామపక్ష పార్టీలు, బిజెపి ప్రకటించడంతో స్వతాంత్ర్యనంతర భారతదేశంలో రెండవ కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు
స్వతంత్రం తర్వాత భారతదేశం 381
రంగం సిద్ధం అయింది. నేషనల్ ఫ్రంట్ 146 సీట్లు గెలిచింది. 86 సీట్లు గెలిచిన బిజెపి 52 సీట్లు గెలిచిన వామపక్షాలు మద్దతిచ్చాయి. ఆరంభమే తప్పటడుగులతో మొదలయింది. వి.పి.సింగ్ ప్రధాన మంత్రిత్వాన్ని చంద్రశేఖర్ పూర్తిగా వ్యతిరేకించాడు. దేవీలాల్ తనకు కనీసం ఉపప్రధానిని చేయాలని పట్టు పట్టాడు. ఎన్నికలు పూర్తయ్యాక వ్యక్తిగత ఆకాంక్షలు, పెంచుకొన్న స్వాభిమానాలు, సైద్దాంతిక ప్రాధాన్యతల కారణంగా విభేదాలు పెల్లుబికాయి. కొన్ని ఇబ్బందులు, సర్జుబాట్లు తరువాత 1989 డిసెంబరు 2న ప్రధానమంత్రిగా వి.పి.సింగ్, ఉప ప్రధానిగా దేవీలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణంలో “మంత్రి అని మాత్రమే చదవాలని రాష్ట్రపతి సున్నితంగా మందలించినప్పటికీ ఉప ప్రధానమంత్రి అని చేర్చాలని దేవీలాల్ పటుబట్టి తరువాత బట్టబయలు కానున్న విశ్వాస రాహిత్యాన్ని ప్రమాణ స్వీకారోత్సవంలోనే వ్యక్తం చేశాడు. వి.పి.సింగ్ పాలనా ప్రారంభంలోనే పంజాబ్‌లో పర్యటించాడు. పూర్తి రక్షణ వలయం మధ్య తిరిగే రాజీవ్‌కు, తనకు తేడా ప్రస్ఫుటంగా కనపడే విధంగా స్వర్హదేవాలయం చుట్టూ ఓపెన్ జీప్‌లో 86గాడు. కాంగ్రెస్ విధానాలను రద్దు చేయనున్నట్లు చాల ప్రకటనలు చేశాడు. పంజాబ్ పరిస్థితి ఆయన పరిపాలన ప్రారంభంలో ఎలా వుందో ఆయన పరిపాలన ముగిసేటప్పటికి అలానే వుంది. కాళ్ళీర్ పరిస్థితి క్షీణించింది. కాళ్ళ్మీర్ వ్యవహారాల కమిటికి జార్జి ఫెర్నాండెజ్‌ను అధ్యక్షునిగా నియమించాడు. కాని అరుణ్ నెహ్రూ, ముఫ్తి మహ్మద్ సయీద్‌ల జోక్యం కొనసాగడాన్ని అనుమతించాడు. ఎవరితో సంప్రదించకుండా జగ్మోహన్ను కాళ్ళీర్ గవర్నర్‌గా నియమించాడు. జగ్మోహన్ 1988లో ఫిరాయింపులను ప్రోత్సహించి ఫరూక్ అబ్బుల్లాను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాడు. జగ్మోహాన్ను గవర్నరుగా నియమించినందుకు నిరసనగా ఫరూక్ అబ్బుల్లా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఎవరినీ సంప్రదించకుండా జగ్ మోహన్ అసెంబ్లీని రద్దు చేశాడు. వి.పి.సింగ్ అతడిని వెనక్కిపిలిపించాడు. అతడిని శాంతింపజేసేందుకు రాజ్యసభ సభ్యుడ్ని చేశాడు. శ్రీలంక నుండి భారత సైన్యాన్ని ఉపసంహరించే క్రమం పూర్తి చేయడంతో పాటు నేపాల్‌తో వాణిజ్య, రవాణా వివాదాన్ని పరిష్కరించుకొనడం మినవాయించి నేషనల్ ఫ్రంటు ప్రభుత్వం ఇది చేశానని చెప్పుకోగలిగిందేమీ లేదు. తనకు బిజెపి ముస్లిం మత నాయకులతో గల సంబంధాలను ఉపయోగించుకొని అయోధ్య వివాదంపై ఒక ఒప్పందానికి రప్పించ లేకపోయింది. అంతేగాక మండల్ అంతకు ముందెన్నడూ లేనంతగా కులపరమైన భావాలను రెచ్చగొట్టినట్లే అద్వానీ రథయాత్ర మతతత్వ భావాలను తీవ్రస్థాయికి రెచ్చగొట్టింది. 882 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రభుత్వం అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం పైనే తన కాలాన్ని శక్తినీ వెచ్చించింది. చం(ద్రశేఖర్ ప్రధానమంత్రితో గల వైరాన్ని ఏనాడూ దాచుకోలేదు. ఫరూక్ అబ్బుల్లా రాజీనామా చేసిన వెంటనే చంద్రశేఖర్ అతడికి మద్దతు తెలిపాడు. అజిత్‌సింగ్ అంటే దేవీలాల్‌కు ఇష్టం లేదు. దేవీలాల్ ఒక్క చంద్రశేఖర్‌కు తప్ప ఎవరికీ ఇష్టుడు కాదు. ఉత్తరభారతదేశంలో 1967లో మొదటిసారిగా రైతుల ప్రయోజనాలకు ప్రచారం ఇచ్చినవాడు చరణ్ సింగ్. అజిత్‌సింగ్, చరణ్‌సింగ్ కుమారుడు దేవీలాల్‌కి పుత్ర వాత్సల్యం అధికం. దేవీలాల్ కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా. దేవీలాల్ ఉపప్రధాని కాగానే తన ముఖ్యమంత్రి స్థానంలో ఓంప్రకాష్ చౌతాలాను కూర్చొండబెట్టాడు. చౌతాలా మేహం నుండి ఎన్నికయ్యే ప్రయత్నంలో వివాదం చెలరేగింది. ఓటర్లును భయ ్రాంతులను చేశారని, పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని విచారణ కమిటీ నిర్ధారించింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికను రద్దు చేసింది. చౌతాలా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. రెండు నెలల తర్వాత మరల ముఖ్యమంత్రి అయ్యాడు. అరిఫ్, అరుణ్ నెఘహ్రూలకు ఇది విపరీతంగా తోచింది. ఇరువురూ ప్రభుత్వం నుండి రాజీనామా చేశారు. వరుస కట్టినట్లు వి.పి.సింగ్ కూడా రాజీనామా చేశాడు. కాని పదవి నుండి వైదొలగుతానని చౌతాలా హామీ ఇవ్వడంతో వి.పి.సింగ్ ప్రధానిగా కొనసాగాడు. కాని ఎల్జర్ అంకుల్ లేక తావూగా పిలవబడే దేవీలాల్ దగ్గర చాలా మాయోపాయాలున్నాయి. అతడు అరిఫ్, అరుణ్ నెహ్రూలు లంచగొండులని ఆరోపించాడు. వీరిరువురికీ బోఫోర్స్ ఒప్పందంతో జోక్యం ఉందని 1987లో వి.షి.సింగ్ రాష్ట్రపతికి రాశాడని చెపుతూ ఒక లేఖను సృష్టించాడు. వి.షి.సింగ్ అది నకిలీ లేఖ అని ప్రకటించి దేవీలాల్‌ను 1990 ఆగస్టు 1న మంత్రివర్గం నుండి తొలగించాడు.
దేవీలాల్ తన నిజమైన బలాన్ని వి.పి.సింగ్ ఎదుట ప్రదర్శించేందుకు ఆగస్టు “9న ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు ప్రదర్శనకు పిలుపిచ్చాడు. ఈ పిలుపుకి కలత చెందిన వి.పి.సింగ్ ప్రజల దృష్టిని మరల్చేందుకు తన పరిపాలనలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడు. జనతా ప్రభుత్వం (1977-79) చేత నియమింపబడి, ఇందిరాగాంధీచే విస్మరించబడిన మండల్ కమిటీ రిపోర్టు అమలు జరపబడుతోందని వి.పి.సింగ్ ఆగస్టు 7” న పార్లమెంటులో ప్రకటించాడు. ప్రభుత్వ సేవలలో, (ప్రైవేట్ సంస్థలలోని ఉద్యోగాలలో 27% వెనుకబడిన కులాలకు రిజర్వు చేయబడతాయని కమిషన్ సిఫార్సు చేసింది. అప్పటికే 22.5% ఉద్యోగాలు షెడ్యూల్డు కులాలు లేక దళితులకు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడి వున్నాయి. కమిషన్ సిఫార్సు చేసిన 27%తో కలుపుకొని మొత్తం 49.5% రిజర్వుడు కేటగిరి క్రిందకు వస్తాయి. సిఫార్సుల ప్రకారం తరువాత రెండవ దశలో ఈ రిజర్వేషన్లు విద్యా సంస్థలలో, పదోన్నతులలోను అమలు జరపబడతాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 3883
ప్రకటనను ఆగ్రహ జ్వాలలు చుట్టుముట్టాయి. ఈ నిర్ణయంతో సూత్రరీత్యా విఖేదించని వారు కూడా ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంతో గందరగోళపడిపోయారు. వి.పి.సింగ్ ప్రకటన చేయబోయే ముందు సన్నిహిత సహచరుల్ని కూడా సంవ్రదించలేదు. బిజూ పట్నాయక్, ఆర్.కె. హెగ్దే, యశ్వంత్ సిన్హా అరుణ్ నెహ్రూలు కూడా ఏదో ఒక కారణం రీత్యా అసహనానికి గురయిన వారిలో వున్నారు. నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి సూచన కూడా అందక పోవడంతో వామపక్ష పార్టీలు, బిజెపి దిగ్ర్భాంతికి గురయ్యాయి. దేవీలాల్, చంద్రశేఖర్‌లు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. నిర్ణయం ప్రకటించిన సమయం, ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు జరగకపోవడం, ప్రతిపాదనలోని విభజించే స్వభావం, వెనుకబడిన కులాలను గుర్తించేందుకు తప్పుడు ప్రమాణాలు - అన్ని అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. రిజర్వేషన్‌కు ఆర్థిక పరిస్థితిని ప్రమాణంగా తీసుకోవాలని సి.పియం కోరింది. చాలామంది ఇతరులతో పాటు హెద్దే కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. వెనుకబడిన కులాలను గుర్తించే పద్దతి పాతబడిపోయిందని స్వతంత్ర్యం వచ్చినప్పటి నుండి సామాజిక పొందికలో వచ్చిన మార్పుల్ని గమనంలోకి తీసుకోవాలని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రిపోర్టులో వెనుకబడిన కులాలుగా పిలువబడినవారు భూ సంస్కరణల ద్వారా, హరిత విప్లవం ద్వారా ప్రయోజనాలు పొందిన వారని, వెనుకబాటుతనం ప్రాతిపదికన అదనపు ప్రయోజనాలు కోరదగినవారు కాదన్నారు. వెనుకబడిన కులాలుగా గుర్తించబడిన వాటిలో కాన్ని సెక్షన్లకు చెందిన వాళ్ళు వారి ఆర్థిక సామాజిక స్థాయిలో షెడ్యూల్డ్ కులాల వారికంటె భిన్నంగా లేరని అలాంటి వారు ప్రత్యేకమైన ఆదరణకు అర్హులని, కాని వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా గుర్తింపబదాలని కులం పేరుతో గుంపుగా పరిగణిస్తే ప్రయోజనాల కొరకు పోటీపడే వారిలో వారు ఉండకపోవచ్చునని అన్నారు. మండల్ నిర్ణయం సమాజాన్ని విభజించింది. సామాజిక న్యాయం పేరుతో ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్ని పోటీ పెట్టింది. అది అమలు జరిగితే నష్టపోయే వారికి తప్ప దానికి ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మండల్ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారంతా అగ్రవర్ధాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవారని, దానివలన నిజంగా ప్రయోజనాలు పొందేవారిని రెచ్చగొట్టినట్లయింది. కులం దాదాపు అదృశ్యమైన సెక్షన్లలో కూడా మండల్ నిర్భయం కులాన్ని ఒక భావనగా, ఒక గుర్తింపుగా తిరిగి ప్రవేశపెట్టింది. రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన 24 సంవత్సరాల తర్వాత, వాటిని కొత్త సెక్షన్లకు వర్తింప చేయడానికి ముందుగా అవి సామాజిక న్యాయం సాధించే క్రమానికి ఎంతవరకు దోహదపడ్డాయనే అంశంపై తీవ్ర చర్చ, నిష్పాక్షికమైన వ! బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పరిశీలన జరిగి ఉండవలసింది. రిజర్వేషన్లు శాశ్వతంగా వుండేటట్లు చేయబడటం, అవి వెనుకబడిన వారి ప్రయోజనాలను కాపాడటం వలన కాదు, రిజర్వేషన్ల వలన ప్రయోజనాలు పొందుతున్న కులాలలోని కువీనుల ప్రయోజనాలను కాపాడటం వలన అనే వాదనలు, సామాజిక న్యాయం కొరకు ఏకైక వ్యూహంగా రిజర్వేషన్లపై కేంద్రీకరించడం - ఇతర ప్రత్యామ్నాయ వ్యూహాల పరిగణనను నివారించాయి. కుల రాజకీయాలు కులాల నాయకులకు ప్రయోజనకారిగా వున్నాయి గాని కుల వ్యవస్థ బాధితులకు కాదు. ఈ అంశాలన్నింటిని లోతుగా చర్చించవలసి వుంది. ఇలాంటి పెద్ద మార్పుకు ప్రయత్నించే ముందు ప్రజాభిప్రాయాన్ని దానికి అనుకూలంగా మలచవలసి వుంది. ఉత్తర భారతదేశంలో విద్యార్థులు మండల్ నిర్ణయంపై హింసాయుతంగా స్పందించారు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలు జీవనోపాధికి వనరుగా విద్యార్థులు భావిస్తున్న పరిస్థితులలో, ఇంకా డబ్బు, పలుకుబడి ఉపయోగించకుండా పోటీ పరీక్షల ద్వారా ఎంపికకు అవకాశమున్న పరిస్థితుల్లో దాదాపు సగం స్థానాలకు రిజర్వేషన్లు అద్దుపడడం అన్యాయంగా కనిపించింది. అంతేగాక రిజర్వేషన్ల వలన ప్రయోజనాలు ఫొందబోయేవారు ఆర్థికంగా, సామాజికంగా తమతో సమానులు లేక తమకంటె ఉన్నత స్థితిలో వున్నవారు కావడం గూడా వారు గమనించారు. ఈ రిజర్వేషన్లు షెడ్యూల్డు కులాలు, తెగలకు కల్పించిన వాటికి పూర్తిగా భిన్నమైనవి. ఎందుకంటే వారి ఆర్థిక సామాజిక అశక్తత విషయంలో ఎలాంటి అస్పష్టతలేదు. అంతేగాక ఈసమస్యపై సామాజిక ఏకాభిప్రాయం స్వతంత్ర పోరాట కాలం నుండి కూడగట్టబడింది. విద్యార్థులు కూడా మండల్ నిర్ణయం వెనుక వున్న రాజకీయ ఉద్దేశాలను గ్రహించలేనంత అమాయకులు. కారు. మండల్ వ్యతిరేక నిరసనలు, సభలు, సమావేశాలకే పరిమితం కాదు. పత్రికలలో చర్చలు సాగాయి. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. బస్సులు తగులబెట్టారు. వీటిలో విద్యార్థులు ముందున్నారు. వీరికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గృహిణుల లాంటి వివిధ సెక్షన్ల మద్దతు లభించింది. ఢిల్లీ, గోరఖ్‌పూర్, వారణాసి, కాన్పూరు లాంటి పలుచోట్ల పోలీసు కాల్పులు జరిగాయి. నిరసనలతో ఆశించిన ఫలితం రాకపోవడంతో కొద్దిమంది ఆత్మాహుతికి ప్రయత్నించారు. మండల్ నిర్ణయానికి అనుకూలంగా వున్నవారు అలజడులు, ఆందోళనలు ఒక పథకం ప్రకారం సాగుతున్న ఆటవిక చర్యలను ఖండించారు. నిర్ణయాన్ని వ్యతిరేకించినవారు సమన్య యొక్క లోతుపాతులను అవగాహన చేసుకోలేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొదట కులపరంగా ఉద్యమ నిర్మాణం జరగలేదు. కాని తరువాత దశలలో ప్రతికూలమైన వైఖరి పెరిగింది. కాలేజీలలో, హాస్టళ్ళలో అగ్ర వర్జాలను ఐక్యపరిచే కుల సంఘాలు వున్నాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 885
విద్యార్థుల సంభాషణలలో, చర్చలలో కులపరమైన దూషణలు ప్రవేశించాయి. కొంతకాలం పాటు కులపరమైన గుర్తింపు రద్దుకు వేదికగా వున్న ఉద్యమం తరువాత దశలలో కులాల పునర్జన్మకు ఊయలగా మారింది. మండల్ రిపోర్టు అమలును నిలుపుదల చేస్తూ 1990 అక్షోబరు “1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉద్యమం ఆగిపోయింది.
ఈ మధ్య కాలంలో బిజెపికి అది పూర్తి చేయవలసిన స్వంత అజెండా వుంది. మండల్ బహుశా దానికవసరమైన ఊపునిచ్చింది. మండల్‌కి వ్యతిరేకంగా వచ్చిన బలమైన స్పందనను గమనించిన బిజెపి మద్దతు ఉపసంహరిస్తానని అనడం ప్రారంభించింది. ఎల్.కె. అద్వానీ సెప్టెంబరు 25న గుజరాత్‌లోని సోమనాథ్ నుండి అయోధ్యకు (రామ మందిరం నిర్మాణానికి పునాది రాయి వేయడానికి) 6000 మైళ్ళ రథయాత్ర ప్రారంభించాడు. అక్టోబరు 28న బీహారులోని సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్టు చేయడంతో రథయాత్ర ముగిసింది. నేషనల్ ఫ్రంటు ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించుకొంది. వి.షిసింగ్ తన పార్టీకి, వామపక్షాలకు దూరం కాకుండా బిజెపిని సంతృప్తి పరచలేడు. బిజెపితో సంబంధాలను తెంచుకొన్నాడు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఎంపిక చేసుకొన్న ప్రాంతానికి చేరటానికి యత్నిస్తున్న గుంపుపై కాల్పులు జరిగాయి. రథయాత్ర, అద్వానీ అరెస్టు అయోధ్యలో కాల్పులు మత ఉద్రిక్తతలను పెంచాయి. ఉత్తర భారతదేశంలో పలువురి మరణానికి దారితీశాయి. నవంబరు '5ి న జనతాదళ్ చీలిపోయింది. 58 మంది
పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్‌ని నాయకునిగా ఎన్నుకొన్నారు. నవంబరు “7న అంటే 11 నెలల తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడపటానికి చేసిన రెండవ ప్రయత్నం ముగిసింది. చంద్రశేఖర్ నుండి వాజెసీయి వరకు
ఈ దశలో ఉత్పన్నమైన పెద్ద సమస్యలు ఆయా అంశాలకు సంబంధించిన అధ్యాయాలలో చర్చించబడ్డాయి. ఈ దశలో జరిగిన మౌలిక రాజకీయ మార్పులను గురించి మాత్రం ఇక్కడ సంక్షిప్తంగా ప్రస్తావించడం జరుగుతుంది.
కాంగ్రెస్ మద్దతుతో 1990 నవంబరు “10” న అధికారంలోకి వచ్చిన కొద్దికాలం మాత్రమే మనుగడ సాగించిన చంద్రశేఖర్ ప్రభుత్వం నిర్వహించిన ఒకే ఒక బాధ్యత, కాంగైసు ఎన్నికలు జరపాలని నిర్ణయించే వరకు బిడ్డను సంరక్షించటం, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెసుకు ఒక సాకు దొరికింది. 1991 మార్చి 5 న మద్దతు ఉపసంహరించుకొన్నది. ఎన్నికలు మే 19 నుండి జరుగుతాయని ప్రకటించబడినది. ఒక వరుస ఎన్నికలు పూర్తయ్యాయి. ఇందిరాగాంధీ కుటుంబంపై మరొక దుస్సంఘటన 886 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విరుచుకుపడింది. మద్రాసుకు 40 కి.మీ. దూరంలో వున్న శ్రీ పెరంబుదూర్‌లో రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఎన్నికల సభలో వున్న రాజీవ్ గాంధీకి అభివాదం చేయడానికి ఒక యువతి ముందుకు వచ్చింది. తన నడుముకు కట్టుకొన్న బాంబును పేల్చింది. రాజీవ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. ఇది ఎల్.టి.టి.ఇ. మిలిటెంట్లు జరిపిన హత్యగా నిరూపితమయింది. తన సద్భావనా యాత్రలు, ఇతర ప్రయత్నాలతో ప్రజాదరణ తిరిగి పొందుతున్న 46 సంవత్సరాల వయసు గల రాజీవ్ హత్యతో పెల్లుబికిన సానుభూతి కాంగ్రెస్‌కి 232 సీట్లతో అత్యంత పెద్ద పార్టీ స్థాయిని తెచ్చిపెట్టింది. నరసింహారావు జూన్ “21న మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. కాని అది క్రమంగా మెజారిటీ సాధించి పూర్తి 5 సం॥ల కాలం పాలన సాగించింది. అది ఆర్థిక సంస్మరణ చేపట్టింది. మొదటి సం॥లో కుల మతతత్వ ధోరణులు తీవ్రతని చాలావరకు తగ్గించింది. పంజాబులో సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించడంలోను, అస్సాం, కాళ్ళీర్లలో పరిస్థితిని మెరుగు పరచడంలోను, జయప్రదమయింది. బాబ్రీ మసీదును విధ్వంసం నుండి కాపాడటంలోను ఆ తరువాత ఘర్షణలను నివారించడంలోను విఫలమయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ (గ్రంథంలోనే మరాక చోట వివరంగా చర్చించబడ్డాయి. నరసింహారావు (ప్రభుత్వం దీర్మకాలిక చారిత్రక దృష్టికోణం నుండి పరిశీలించినప్పుడు చాలా సానుకూలమైన ఫలితాలు సాధించినప్పటికీ చివరి రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక సంస్కరణల వేగం మందగించడంతో పాటు లంచగొండితనం, హవాలా ఆరోపణలు, కాంగ్రెసు, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా లంచాలు, విదేశీ మారకాల అతిక్రమణల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం యొక్క వడుపు మందగించిందని (వెప్పడం) ప్రస్తుతానికి సరిపోతుంది. 1996లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు కేవలం 140 సీట్లు మాత్రమే గెలిచింది. 1991లో 120 సీట్లు గెలుచుకొన్న బి.జె.పి. ఈ ఎన్నికలలో బలాన్ని 161కి పెంచుకొన్నది. మెజారిటీ సాధించడంలో విఫలమైన బిజెపి ప్రభుత్వం మే 16 నుండి జూన్ “1” వరకు మాత్రమే మనగలిగింది. అ తరువాత హెచ్.డి. దేవెగాడ ప్రధానమంత్రిగా ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెసు, సిపిఎం బయట నుండి మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామిగా చేరింది. సిపిఐకి చెందిన ఇంద్రజిత్ గుప్తా హోంమినిస్టరయ్యాడు. 1997 మార్చి 30న కాంగైసు మద్దతు ఉపసంహరించుకొన్నది. కాని (ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో విఫలం అయింది. మరలా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని బలపరిచింది. ఈసారి ఐ.3. గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యాడు. మరలా మద్దతు ఉపసంహరించబడినది. 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. బిజెపి 182 సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ టిడిపి,ఎ.ఐ.ఎ.డిఎం.కె, తృణముల్ కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల మద్దతు పొంది స్వతంత్రం తర్వాత భారతదేశం 387
అటల్ బీహారి వాజ్‌పేయి ప్రధానమంత్రిగా బిజెపి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ కేవలం 147 సీట్లు మాత్రమే గెలిచింది. మిత్రపక్షాలు వారి వారి డిమాండ్లతో ప్రభుత్వాన్ని అన్ఫిరపరిచాయి. జయలలిత తన ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మద్దతును ఉపసంహరించుకొన్నది. 1999లో ప్రభుత్వం మెజారిటీ విశ్వాసాన్ని కోల్పోయింది. ('ప్రత్యాన్నూయ కాంగ్రెస్ ప్రభుత్వం గాని సెక్యులర్ ఐక్య సంఘటన ప్రభుత్వం గాని ఏర్పరిచే ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరొకసారి ఎన్నికలు ప్రకటించబడ్డాయి. 1999 సెప్టెంబరు
- అక్టోబరులలో ఎన్నికలు నిర్వహించే వరకు బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగింది. బిజెపి సీట్లు పెరిగినప్పటికీ ఎన్నికల ఫలితాలు బిజెపి దాని మిత్రపక్షాల సీట్లను 258 నుండి 296 కి పెంచాయి. సోనియగాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు, దాని మిత్ర పక్షాల సీట్లు 134కి పరిమితమయ్యాయి. ఓట్ల పంపకంలో తేడా అంతగా లేదు. కాంగ్రెసు, మిత్రపక్షాలు 34.7% ఓట్లు తెచ్చుకున్నవి. ఇవి 1998లో వచ్చిన వాటికంటె 3.4% ఎక్కువ. బిజెపి మిత్రపక్షాలకు 41.3% ఓట్లు వచ్చాయి. ఇవి 1998లో వచ్చిన వాటి కంటె 1.2% ఎక్కువ. మరలా వాజ్‌పేయి ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పరచబడింది. చరిత్రలో విపరీతాలు జరుగుతుంటాయి. ముందుచూపు కంటె గతాన్ని పునరుద్ధరించే వైఖరి గల పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం నూతన సహాస్రా్టికి స్వాగతం చెప్పబోతున్నది. నూతన సహస్రాబ్ది తన నూతన దిగంతాలతో భారత ప్రజలకు వారికి అర్హమైన అజేయమైన భవిష్యత్తును అందించవచ్చు. 1990 లలో విదేశీ విధానం కొత్త సవాళ్ళు - నేడు, రేపు ఇటీవల సంవత్సరాలలో సోవియట్ యూనియన్ విచ్చిన్నం, ప్రచ్చన్న యుద్ధం పరిసమాప్తి, సరళీకరణ, ప్రపంచీకరణల ఆర్థిక వ్యూహాలతో భారతదేశ విదేశాంగ విధానం పెద్ద సవాలు ఎదుర్శొన్నది. భారతదేశం అమెరికాతో పాశ్చాత్య ప్రపంచంతో తన సంబంధాలను పునర్వవస్థీకరించుకోవలసి వచ్చింది. భారతదేశానికి పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి కొరకు మార్కెట్లు అవసరమయ్యాయి. గతంలో లాగా ఆధారపడేందుకు సోవియట్ యూనియన్ లేదు. ఈనాటి ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక వనరులు గల దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో ఎక్కువ ప్రాబల్యం వహిస్తాయి కనుక నూతన వ్యూహాన్ని త్వరగా, బాగా ఉపయోగించుకొనడం పై విజయం, ఆర్థికాభివృద్ధి ఆధారపడి వున్నాయి. వి.పి.దత్ మాటల్లో “ఈనాటి ప్రపంచంలో అత్యంత 'గమనార్దమైన వైఖరి ఏమిటంటే 388 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజకీయ పోరాటం పై ఆర్ధిక పోరాటం ప్రాధాన్యతను సంతరించుకొన్నదని ఎవరైనా తడుముకోకుండా చెబుతారు.” భారత సోవియట్ మైత్రికి సంబంధించిన మంచిరోజులు గతించిన మాట వాస్తవమైనప్పటికి లోగడ సోవియట్ యూనియన్ దేశాలలో అమోఘమైన అంతర్నిహిత శక్తి వుంది. రష్యా (ప్రస్తుతం సంక్షోభ కాలంలో వుండవచ్చు. కానీ ఇప్పటికీ బలమైన శక్తే, గత వైభవాన్ని తిరిగి పుంజుకొంటుంది. భారతదేశ ప్రయోజనాల రీత్యా దానితో సంబంధాలు కొనసాగించటం అవసరం. సోవియట్ నుండి విడిపోయిన ఇతర మధ్య ఆసియా దేశాలు కూడా భారతదేశానికి విశ్వసనీయమైన మిత్రదేశాలు అవి సహజ వనరులతో సంపన్నమైనవి. వ్యూహరీత్యా కీలక స్థానంలో వున్నాయి. వాటి స్నేహం కోసం అమెరికా ఇతర పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయి. వాటికి భారతదేశంతో మంచి సంబంధాలు వున్నాయి. పాలస్తీనా కొరకు అరబ్ దేశాలు చేస్తున్న పోరాటాన్ని భారతదేశం ఎల్లప్పుడూ సమర్థిస్తూ వచ్చింది. భారతదేశానికి ఇజ్రాయిల్‌తో ఎలాంటి దౌత్య సంబంధాలు కూడా లేవు. కాబట్టి భారతదేశానికి మధ్య ప్రాచ్యంతో మంచి స్నేహ సంబంధాలు వున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో పి.ఎల్ ఓ.కి మద్దతు కొనసాగిస్తూనే భారతదేశం ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకొన్నది. ఇరాన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఇరాన్, ఇరాక్లను పూర్తిగా వెలివేసే అమెరికా విధానాలతో జతకట్ట నిరాకరించింది. ఫలితంగా ఇస్లామిక్ రాజ్యాల సమాఖ్యని భారతదేశానికి వ్యతిరేకం చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గల్ఫ్ యుద్ధ కాలంలో ఇరాన్‌కి వ్యతిరేకంగా అమెరికా ప్రేరేపించిన ఉన్మాదంలో కొట్టుకుపోకుండా భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకొన్న ఆర్థిక భాగస్వామ్యాన్ని సుహృద్భావాన్ని నిలబెట్టుకొన్నది. భారత దౌత్యం కొత్తదారులు తొక్కవలసి వుంది. ఈనాటి ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆసియా దేశాల ఆర్థిక సహకార మండలి (43£4గ0) యూరప్ ఆర్థిక సంస్థ (280) ఉత్తర అమెరికా స్వేచ్భా వాణిజ్య సమాఖ్య (/4)4ు లాంటి నూతన వాణిజ్య లేక ఆర్థిక విభాగాలుగా సంఘటితమవుతున్నాయి. భారతదేశం ఈ వైఖరి పట్ల అంత ఆసక్తి చూపలేదు. సరియైన సమయంలో _గ5841 లో భాగస్వామి అయ్యేందుకు ప్రయత్నించలేదు. చాలా ఆలస్యంగా చర్చలలో పాల్గొనడం ప్రారంభించింది. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ 344120 ఇంకను పటిష్టమైన ఆర్థిక బ్లాకుగా ఆవిర్భవించవలసి వుంది. హిందూ మహాసముద్ర దేశాలను సన్నిహితం చేసే ఇటీవలి ప్రతిపాదన ఆహ్వానించదగినది. దీనిలో భారతదేశం చురుకైన పాత్ర నిర్వహించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 389
భారతదేశం ప్రాచ్య దిశగా దృష్టి సారించవలసి వుంది. జపాన్ పెద్ద మొత్తాల పెట్టుబడులు పోగుపడి వున్న దేశం. మనపై వలసాధిపత్యం సాగించిన దేశం కాదు. మనతో ఎలాంటి సరిహద్దు వివాదాలు లేవు. మనతో చారిత్రకంగా సత్సంబంధాలు గల ఇతర ఆగ్నేయాసియా దేశాలతో రాజకీయ సంబంధాలు పెంపొందించుకొనడం అవసరం, ఇండోనేషియా డచ్ వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడింది. దానికి మద్దతు ఇచ్చాం. అలాగే (ఫ్రెంచి, అమెరికా వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వియత్నాంకు మనం మద్దతిచ్చాం. అలాగే మనలో ప్రాచీన సాంస్కృతిక సంబంధాలు గల థాయలాంద్, కాంబోడియా, మలేసియాలతో మనం సన్నిహిత ఆర్ధిక, రాజకీయ సంబంధాలు పెంపొందించుకోవలసి వున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన సింగపూర్‌తో సత్సంబంధాలు పెంపొందించుకోవాలి. బహుళ ధృవ ప్రపంచ ఏర్పాటుకు అంతర్జాతీయ సంబంధాల్ని ప్రజాస్వామ్యయుతం చేయడానికి భారతదేశం తోద్చడడం భారత ప్రయోజనాల రీత్యా అవసరం, ఏకధృ్భవ ప్రపంచం స్పష్టమైన రూపం దాల్బడాన్ని నివారించేందుకు ఆర్థిక బలం సాధించిన దేశాలకు అంతర్జాతీయ వ్యవహారాలలో వాటి అస్తిత్వాన్ని వ్యక్తీకరించుకోనేలా ప్రోత్సహించడం అవసరం. అమెరికా ఆధిపత్యానికి మౌనంగా అంగీకారం తెలపటానికి అలవాటు పడ్డ జపాన్, ఇతర తూర్పు ఆసియా దేశాలు వాటి యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తీకరించడం ప్రారంభించాలి. భారతదేశ ప్రయోజనాల రీత్యా, ప్రపంచ ప్రయోజనాల రీత్యా 1950 దశాబ్దంలో ప్రచ్చన్న యుద్ధ కాలంలో అలీన ఉద్యమం ద్వారా ప్రతిఘటించినట్లు బహుళ దృవ ప్రపంచానికి అనుకూలంగా ్రోత్సపహించబడాలి. జకార్తాలో జరిగిన అలీన ఉద్యమ పదవ వార్షిక సభలో అలీనోద్యమం కొనసాగింపుకు సభ్య దేశాల నుండి లభించిన మద్దతు ప్రోత్సాహకరంగా ఉంది. సభకు అధ్యక్షత వహించిన ఇండోనేషియాకు చెందిన సుహార్హో లాగానే మలేసియా ప్రధానమంత్రి మహతీర్ ప్రపంచ వ్యవహారాలలో ఆయా దేశాలు తమ స్వంత అభిప్రాయాలు వ్యక్తం చేయాలని అలీనోద్యమాన్ని బలపరచాలని పేర్కొన్నాడు. అలీనోద్యమ సభ ఐక్య రాజ్యసమితి ప్రజాస్వామికీకరణను, పారదర్శకమైన బహుళ వాణిజ్య విధానాలకు అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరుల్ని తరలించాలని ఇంకా పలు చర్యల కొరకు డిమాండ్ చేసింది. స్వయం నిర్ణయం, మానవ హక్కులు పేరుతో అమెరికా జోక్యం పెరిగింది. అందుకు కొసావో ఇటీవలి ఉదాహరణ. విభిన్న జాతులు భాషలు గల భారతదేశం, చైనా, రష్యాలలో అమెరికా జోక్యం పెరిగే అవకాశాలు వున్నాయి. అందుకే ఈ దేశాలు కొసావోలో అమెరికా, నాటోల పాత్రను నిరసించాయి. యుద్ధ సాంకేతీకరణ 890 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దురాక్రమణదారుల ప్రాణ నష్టాన్ని చాలా తగ్గించడం గూడా ఇలాంటి జోక్యాన్ని సాధ్యం చేశాయి. గల్ఫ్, కొసావో యుద్దాలు అందుకు ఉదాహరణలు. భారతదేశం ఈ నూతన పరిస్థితికి అనుగుణంగా విదేశీ విధానాన్ని రూపొందించుకొనవలసి వచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలలో స్వతంత్ర విధాన లక్ష్యానికి అనుగుణంగానే ప్రపంచ రాజ్యాలలో గౌరవ ప్రదమైన స్థానాన్ని పొందుతూ అంతర్జాతీయ సంబంధాలలో వస్తున్న మార్చులకు నిరంతరం మూల్యాంకనం చేసుకుంటూ తన లక్ష్యాలను సాధించుకొనే పద్ధతులను అనుసరించవలసి వుంది. ప్రపంచ వ్యవస్థ అస్థిరంగా వుంది. అది అలాగే కొంతకాలం పాటు కొనసాగే అవకాశమూ వుంది. ఈ స్థితిలో భారతదేశం సృజనాత్మకమైన విదేశీ విధానాన్ని రూపొందించుకోవాలి. అంతర్జాతీయ ప్రభావం గల రెండు అత్యంత ముఖ్యమైన ఘటనలను నిశితంగా పరిశీలిద్దాం. అవి : 1898లో భారతదేశ అణు పరీక్షలు, 1999లో పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితి. పోఖ్రాన్ - 11 1998 మే “11న భారతదేశం మరొక దఫా నిర్వహించిన అణు పరీక్షలు, తనకు తానుగా అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకొనడం - మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, అలాగే స్వతంత్రం పొందినప్పటి నుండి అజ్వస్తాల పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో పరిశీలించవలసిన సంక్షిష్టమైన సమస్య, అణు నిరాయుధీకరణని అజ్వస్త్ర రహిత ప్రపంచాన్ని కోరుతూ భారతదేశం నెహ్రూ కాలం నుండి చాలా సూత్రబద్ధ వైఖరిని అవలంబించింది. దశలవారీ అణు నిరాయుధీకరణకు ప్రపంచ వ్యాప్తంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఇటీవలి కాలంలో రాజీవ్‌గాంధీ భారతదేశ వైఖరిని బలంగా ప్రతిపాదించాడు. మరొకవైపు నెహ్రూ హయాంలోనే శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రత్యేకించి అణు విజ్ఞాన రంగంలో వస్తున్న పరిణామాల కాలానుగుణమైన అభివృద్ధికి భారతదేశం చాలా ప్రాధాన్యత నిచ్చింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పరిస్థితుల కనుగుణంగా వ్యవహరించాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న కాలంలో 1974 అక్టోబరులో మొదటి అణు పరీక్షలు జయప్రదంగా నిర్వహించబడ్డాయి. రాజీవ్‌గాంధీ, నరసింహారావు, దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వాలు భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చడానికి సిద్ధపడ్డాయి. నరసింహారావు 1995లో అణ్వస్త్ర పరీక్షలకు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధపడ్డాడని, స్వతంత్రం తర్వాత భారతదేశం 391
అమెరికా నుండి వచ్చిన ఒత్తిడి మేరకు ఆపివేయడం జరిగిందని విశ్వసనీయవర్థాల సమాచారం. ఆ విధంగా భారతదేశం 1998లో అణ్వస్త్ర పరీక్షలు జరిపే వరకు అణు నిరాయుధీకరణ వైఖరికి కట్టుబడి వుంటూనే అణ్వస్త్ర దేశంగా మారడానికి సన్నద్ధమై వుంది. చాలా కారణాల రీత్యా ఈ ద్వంద్వవైఖరిని అవలంబించింది. మొదటిది : రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో అణు రంగం చాలా న్యాయ విరుద్ధమైన పద్ధతి నెలకొని వుంది. (ప్రపంచంలో అణ్వస్తాలు కలిగిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ప్రాన్స్ - నాలుగు దేశాలకే వాటిని పరిమితం చేసేందుకు అణ్వస్త్ర నిషేధ ఒప్పందం (గగ) ఆలోచన ముందుకు తీసుకొని రావటం జరిగింది. తరువాత చైనా గూడా అణ్వస్త్ర పరీక్షలు జరిపి అణ్వస్త్ర దేశమయింది. ఇప్పుడు ఈ ఐదు పెద్ద దేశాలకే అణ్వస్తాలను పరిమితం చేయాలని వాటి సంకల్పం. అణ్వస్తాలు గల దేశాలు, అణ్వస్తాలు లేని దేశాలపై “సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (సెటిబిటి) పై సంతకం చేయవలసిందిగా ఒత్తిడి చేస్తున్నాయి. ఇది పూర్తి వివక్షాపూరితమైన చర్య. అవి ఇతర దేశాలు అణ్వస్త్ర దేశాలు కాకుండా అద్దుకొంటున్నాయి. అవి మాత్రం రానున్న50 సం॥ల్లో కూడా అణ్వస్త్ర నిరాయుధీకరణకు నిబద్ధత ప్రకటించవు. సిటి.బిటి.లో ఇలాంటి నిబద్ధత కొరకు భారతదేశం చేసిన ప్రయత్నాలు తోసిపుచ్చబడ్డాయి. అందుకే భారతదేశం సి.టి.బి.టి.పై సంతకం చేయ నిరాకరించక తప్పలేదు. అలాగే ఎన్.పి.టి.పై కూడా సందేశం చాలా స్పష్టమే. అణ్వస్తాలు లేని దేశాలు నోరెత్తకూడదు. రెండవది : భారతదేశం అజ్వస్తాలచే పరివేష్టించబడి వున్నది. ఒకవైపు చైనా (1962లో భారతదేశంపై దాడి చేసింది) బాలా బలమైన అణ్వస్తాలు గల దేశం. ఖండాంతర విధ్వంసక క్షిపణులు (1031 తో సహా సుదూర ప్రాంతాలను ఛేదించగల క్షిపణులు గల దేశం. దానికి టిబెట్టులో అణు స్థావరాలు వున్నాయి. మరొకవైపు భారతదేశం చుట్టూ గల సముద్రాలలో అమెరికా అజ్వస్త నౌకలు గస్తీ తిరుగుతున్నాయి. అమెరికాకి హిందూ మహా సముద్రములోని డిగో గార్జియా దీవులలో అణు స్థావరం ఉంది. అలాగే కజికిస్తాన్, ఉక్రెయిన్, రష్యాలలో పెద్ద అణ్వాయుధాలు వున్నాయి. అంతేగాక పాకిస్తాన్ ( మూడుసార్లు భారతదేశంతో యుద్ధం చేసి నిరంతరం శత్రుత్వం కొనసాగిస్తున్న దేశం) చైనా సహాయ సహకారాలతో గణనీయమైన అణు సామర్థ్యాన్ని పెంచుకొనడమే గాక సుదూర క్షిపణి కార్యక్రమముతో పక్కలో బల్లెంలా వుంది. భారతదేశం 1998 మే లో అణు పరీక్షలు జరపడానికి ముందు పాకిస్తాన్ ఉపరితలం నుండి ఉపరితలంలోకి 1500 కి.మీ. దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి ఘోరి (శతాబ్దాల క్రితం భారతదేశంపై దండయాత్ర చేసిన వాని పేరు మీదుగా) ని జయప్రదంగా ప్రయోగించింది. భారతదేశం అణు పరీక్షలు 3992 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జరిపిన వెనువెంటనే పాకిస్తాన్ అణు పరీక్షలు జరిపింది. చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న అణు సంబంధాలు దౌత్యపరంగా వాటి సన్నిహితత్వం భారతదేశ రక్షణ రీత్యా చాలా ప్రమాదకారులు.
అణ్వస్త్ర దేశంగా మారటానికి దేశం నుండి వచ్చిన మద్దతు న్యాయ విరుద్ధమైన ప్రపంచ అణు వ్యవస్థ, పొరుగు రాజ్యాల వలన దేశ రక్షణకు వాటిల్లనున్న ప్రమాదం, అణ్వస్తాలతో సంసిద్ధంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తాయి.
ఈ పరిస్థితులలో అటల్ బీవారి వాజ్‌పేయి ప్రధానిగా బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం హడావుడిగా అధికారంలోకి వచ్చిన కొద్ది వారాలలో, 1998 మే లో అణు పరీక్షలు జరపమని ఆదేశించింది. మే “11న పోఖ్రాన్ వద్ద 1974 లో అణు పరీక్షలు జరిపిన చోటనే పరీక్షలు జరుపబడ్డాయి. కాని ఈ సారి గతంలో ఇందిరాగాంధీ హయాంలో చెప్పినట్లు అణు పరీక్షలు శాంతియుత ప్రయోజనాల కొరకు జరుపుతున్నట్లు ప్రకటించలేదు. అణు పరీక్షలు జరిపిన వెంటనే భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యంగా ప్రకటించారు. దేశీయంగా అభివృద్ధి పరచబడిన ఉపరితలం నుండి ఉపరితలం పైకి ప్రయోగించటానికి వీలైన పృధ్వి అగ్ని అణ్వస్తాల వాహకాలుగా పని చేయగలవు.
మొత్తం మీద కొన్ని వామపక్ష సెక్షన్లు కొన్ని చిన్న అణు వ్యతిరేక గ్రూపులు మినహాయించి దేశం అణ్వస్త్ర పరీక్షలకు - ప్రత్యేకంగా చీఫ్ సైంటిఫిక్ అడై (జర్ ఎ.పి.జె. అబ్బుల్ కలాం, అణుశక్తి శాఖాధిపతి ఆర్.చిదంబరం నాయకత్వంలోని శాస్త్రీయ బృందం సాధించిన విజయాలను స్వాగతించింది. ప్రతిపక్ష నాయకురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన సోనియాగాంధీ శాస్త్రవేత్తల బృందాన్ని, ఇంజనీర్లను అభినందించింది. అణ్వస్త్ర రహిత ప్రపంచం పట్ల పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాల పట్ల కాంగ్రెస్ నిబద్ధతను ప్రకటించింది.
కాని బి.జె.పి. ప్రభుత్వం భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా ప్రకటించిన తీరు పట్ల
- ప్రత్యేకించి అణు పరీక్షల తరువాత అది వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తమయింది. దేశంలో రాజకీయ ప్రయోజనాలు పొందే దృష్టితో తగిన సన్నాహాలు లేకుండా హదావుడిగా పరీక్షలు జరిపించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోథభ్రాన్ వద్ద ఆలయ నిర్మాణం, పొరుగు దేశాలను బెదిరించే ప్రకటనలు, బిజెపి యుద్దోన్మాద వైఖరి వలన అనుమానాలు సమర్థనీయంగా కనిపించాయి. ఆర్.ఎస్.ఎస్. వాణిని వినిపించే పాంచజన్య పత్రికలో పాకిస్తాన్‌పై అణు దాడిని ప్రస్తావిస్తూ రాసిన వ్యాసాన్ని ఖండిస్తూ అతి ముఖ్యమైన జాతీయ దినపత్రిక (౧౫6 56000863 90391016 ౦00%662242600) శీర్షికతో సంపాదకీయ వ్యాసం స్వతంత్రం తర్వాత భారతదేశం 898
ప్రచురించింది. అణు పరీక్షలు జరిపిన తరువాత భారతదేశం ప్రపంచానికి - ప్రత్యేకించి పొరుగు దేశాలకు నిపుణతతో కూడిన దౌత్య చర్యల ద్వారా తన శాంతియుత ఆకాంక్షలను పునరుద్దాటించవలసి వున్నది. కాని ప్రభుత్వం దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటనలు చేసింది. అణు పరీక్షలు జరపటానికి వారం రోజులు ముందు రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ భారతదేశానికి, చైనా ప్రథమ శత్రువని ప్రకటించాడు. అణు పరీక్షలను సమర్థ్ధించుకొంటూ ప్రధానమంత్రి వాజ్‌పేయి చైనా, పాకిస్తాన్‌లు దేశ రక్షణకు ప్రమాదకారులుగా వున్నాయని అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌కు లేఖ రాశారు. అనవసరంగా దేశాల పేర్లను ప్రకటించి, ఫలానా దేశాలను లక్ష్యంగా పెట్టుకొని అణ్వస్తాలు తయారు చేసుకొన్నామని సూచిస్తూ తప్పుడు సంకేతాలు పంపించటం జరిగింది. చైనాతో గతంలోని కాంగ్రెసు, యునెటైడ్ ఫ్రంటు ప్రభుత్వాలు నిరంతరంగా కృషి చేసి దౌత్యనీతితో సంబంధాలు మెరుగుపరుచు కున్నాయి. అణు పరీక్షల పట్ల చైనా మొదట అంతగా పట్టించుకోలేదు. కాని ప్రభుత్వ ప్రకటనలు వెలువడిన తర్వాత దాని కంఠస్వరం మారింది. పశ్చిమ దేశాల, జపొన్ స్పందన ఊహించిన విధంగానే ప్రతికూలంగా వుంది. అణు పరీక్షల్ని ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా మరికొంత ముందుకుపోయి వెంటనే ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. జపాన్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ నెదర్గాంద్స్,కెనడాలు భారతదేశానికి సహాయాన్ని నిలిపివేసాయి. అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా జి - 8 దేశాలచే సమిష్టి చర్య చేపట్టేలా చేయటంలో జయప్రదం కాలేదు. ఫ్రాన్స్, రష్యా, జర్మనీలు భారతదేశంతో సాధారణ ఆర్ధిక సంబంధాలు కొనసాగించాయి. యూరోపియన్ యూనియన్‌కు ప్రెసిడెంటుగా వున్న బ్రిటన్ యూనియన్ బలమైన వ్యతిరేక వైఖరి చేపట్టేలా చేయడంలో విఫలమయింది. ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయన్నది స్పష్టం కానప్పటికి అణ్వస్త్ర దేశాలు చాలా బాహాటంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం వలన, న్యాయ విరుద్ధంగా వున్న ప్రస్తుత అణు వ్యవస్థకి భారత అణు పరీక్షలు పెనుసవాలుగా మారాయనేది సుస్పష్టం. ఈ సందర్భంగా సిటిబిటి ఆమోదం కొరకు తనదేశంలో తగినంత మద్దతు కూడ గట్టలేకపోయిన అమెరికా భారత అణుపరీక్షలపై సృష్టించిన అలజడి గమనార్హం. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ అమెరికాకు ఎలా చెప్పారు. ఇతరులకు (భారతదేశం, పాకిస్తాన్లకు) అణ్వాయుధాలు వుండకూడదని చెపుతూ నీవు అణ్వాయుధాలు కలిగి వుండి వాటిని విచ్చిన్నం చేయటాన్ని తిరస్కరించే సభ్యులు గల సురక్షితమైన క్లబ్బు కలిగి వుండలేవు.” 394 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపిన తరువాత పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపింది. ఇరు దేశాల నుండి బెదిరింపు ప్రకటనలు వెలువడ్డాయి. ఉద్రికత్తలు కాస్త తగ్గిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకొనడంలో గల ఆటంకాలను అధిగమించే లక్ష్యంతో 1999 ప్రారంభంలో వాజ్పాయ్ బస్దౌత్యం ప్రారంభించారు. కాని బస్ సర్వీసు ప్రారంభానికి ముందు నుండే పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ప్రేరిత ముజాహిద్దీన్ కిరాయి సైనికులు భారత భూభాగంలోనికి చొరబాట్లు సాగిస్తూ వచ్చారు. మే నాటికి కాళ్ళీర్ లోని నియంత్రణ రేఖను దాటి లోపలికి చొచ్చుకొని వచ్చి కార్గిల్ ప్రాంతంలోని కీలకమైన శిఖరాలను ఆక్రమించినట్లు కనుగొనడం జరిగింది. భారతదేశం, వ్యూహరీత్యా చాలా ప్రతికూలమైన పరిస్థితి వుండి చాలా కష్ట సాధ్యమైన ఎదురుదాడి చేయవలసి వచ్చింది. చొరబాటు సైనికుల్ని గెంటివేయాలంటే పెద్ద ఎత్తున ప్రాణాల్ని బలిపెట్టి పోరాడవలసిన పరిస్థితిలో చిక్కుకొన్నది. కార్గిల్ సైనిక చర్యలలో మరణించిన గోతాలలో కుప్పబడిన వందలాది భారత సైనికుల అధికారుల మృతదేహాలు ఫోటోలు అనునిత్యం పత్రికలలో పప్రచురించబడేవి.
కార్గిల్ సంక్షోభానికి అంతర్జాతీయ స్పందన ఊహించినంత ఎక్కువగా భారతదేశానికి అనుకూలంగా లభించింది. చాలాకాలంగా పాకిస్తాన్‌కి మిత్రదేశాలుగా వున్న అమెరికా, బ్రిటన్, చైనాలు కూడా భారత భూభాగం నుండి వైదొలగమని పాకిస్తాన్‌పై వత్తిడి తెచ్చాయి. భారత భూభాగంలో వున్నవాళ్లు పాకిస్తాన్ సైనికులు కాదని, చొరబాటు దార్లకు కేవలం నైతిక మద్దతు మాత్రమే యిచ్చామన్న పాకిస్తాన్ వివరణని ఎవరూ పట్టించుకోలేదు. పెరుగుతున్న అంతర్జాతీయ ఇస్లామిక్ టెర్రరిజం భయం అమెరికా వైఖరికి కారణమై వుండవచ్చు. పాకిస్తాన్ కార్గిలలో జరుపుతున్న సైనిక చర్యలలో 1998లో ఆఫ్రికాలోని ఆమెరికా వాణిజ్య కార్యాలయాలపై బాంబు దాడులు చేసిన ఒసామా బిన్‌లాదెన్ అనుచరుల ప్రమేయం వున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. 1999 ఏప్రిల్ - మేలోని కొసావో సంక్షోభంలో ఐక్యరాజ్యసమితిని లక్ష్యపెట్టకుండ, ప్రపంచ పోలీసు పాత్ర నిర్వహించిన అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించడంలో చైనాకు (రష్వాతో పాటు) భారతదేశం మిత్రదేశంగా వ్యవహరించింది. అందువలన చైనా భారతదేశం పట్ల సానుకూల వైఖరి నవలంబించింది.
ఇక భారతదేశంలో కొద్ది నెలల్లో జరుగనున్న ఎన్నికలలో కార్గిల్ సంక్షోభం బిజెపికి సానుకూలమైన పరిణామం. కాని ఈ సంక్షోభం కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలను ముందుకు తెచ్చింది. 1998 సంవత్సరం ప్రారంభం నుండి పాకిస్తాన్ సైనికుల చొరబాటు జరుగుతున్నట్లు తెలిసిన తరువాత ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ఎందుకు పేక్షకపాత్ర స్వతంత్రం తర్వాత భారతదేశం 395
వహించింది? సరిహద్దులోని కీలక ప్రాంతాలలో సైనికుల చారబాటుని గమనించడంలో గూఢచారి విభాగం పూర్తిగా విఫలమయిందా? లేక అంతకంటె విశేషమేమైనా వుందా? భారత భూభాగంలోనికి ఏర్పాటు చేసుకొనడానికి సంబంధించిన సమాచారం సైన్యంలోని అత్యున్నత అధికారులకే గాక ప్రభుత్వానికి కూడా చాలా నెలలముందే తెలియజేయబడిందని అందుకు ప్రామాణికమైన సాక్ష్యాధారాలున్నాయని (వీటిలో కొంతభాగం ఆన్లుక్ పత్రికలు ప్రచురింపబడింది) భారతసైన్యంలోని సీనియర్ అధికారి బ్రిగేదర్ సురేందర్ సింగ్, కార్గిల్ 121 బ్రిగేడ్ కమాండరు ఆరోపించినాడు. ఇది చాలా సందేహాలు రేకెత్తించింది. బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పరిస్థితి క్షీణించేవరకు నిరీక్షించి ఎన్నికల సమయంలో సైన్యాన్ని పంపించి విజయం సాధించి - అంటే సైనికుల ప్రాణాల్ని బలిపెట్టి రాజకీయ లబ్బి పొందాలని ప్రయత్నించింది - అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇది నిరూపించబడితే భారత రాజకీయాలు అత్యంత తక్కువ స్థాయికి దిగజారాయని చెప్పకతప్పదు. ఏమైనప్పటికి ఈ అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించక తప్పలేదు. కలత జెందించే మరొక అంశమేమంటే బిజెపి చర్యలు భారతదేశంలో సైనికుల్ని రాజకీయాల కతీతంగా వుంచే సాంప్రదాయాన్ని తారుమారు చేశాయి. బిజెపి పార్టీ సభ్యుల సమావేశాలకు ప్రభుత్వం సైనికాధికారుల్ని ఆహ్వానించింది. బిజెపి నాయకులు ప్రసంగించే వేదికలు సైనికాధికారుల భారీ కటౌట్లుచే అలంకరించబడ్డాయి. భారత సైనిక బలగాల బహుళ మతస్వభావం నేపథ్యంలో సౌత్బ్లాకులోని ఢిపెక్స్హెద్ క్వార్టర్సులోనికి వేలాది రాఖీలతో విహెచ్పి కార్యకర్తలు ప్రవేశించటం, సైనికులను ఆశీర్వదించేందుకు పూజారులను పంపిచటం గాని యాదృచ్చికమైన ఘటనలుగా గాని అమాయకమైన చర్యలకుగా గాని పరగణించబడవు. దేశ రక్షణ కొరకు ప్రాణాలర్పించిన ముస్లిం, సిక్కు సైనికులు ఈ రాకీలు అశీస్సుల నుండి మినహాయించబడ్డారు. అన్నిటికి మించి రిటైరైన సైనికాధికారులు పార్టీ రాజకీయాలలోకి రప్పించే ప్రయత్నాలు, పనిచేస్తున్న సైనికులను మతతత్వ సిద్ధాంతంతో ప్రభావితం చేసే ప్రయత్నాలు - గణనీయమైన అలజడి సృష్టించాయి. తీవ్రమైన విమర్శలకు గురయ్యాయి. సైనికులను రాజకీయీకరణ చెందించ యత్నించే, గత 50సం॥లకు పైగౌ పెంచి పోషించబడిన సెక్యులర్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు భంగం వాటిల్లజేసే ఎలాంటి ప్రతిపాదనయైనా అంగీకారయోగ్యం కాదు గనుక భారతదేశంలో అలాంటి చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతాయి. 396 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
22 రాష్ట్రాలలో రాజకీయాలు-1 తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అస్సాం
భారత యూనియన్ యొక్క ఆర్థిక రాజకీయ చట్రంలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయాలలో చాలా వరకు ఉమ్మడి అంశాలున్నాయి. కాని వాటి పని విధానంలో సాధించిన ఫలితాలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. ప్రతి రాష్ట్రంలో వేరు వేరు వర్షాలు, కులాలు, సామాజిక, సాంస్కృతిక శక్తులు, సామాజిక ఆర్థికాభివృద్ధి స్థాయిలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి.
కాబట్టి కులం, వర్గం, తెగ, మతం, ప్రాంతం, లింగ వివక్ష లాంటి రాజకీయాల యొక్క సామాజిక మూలాలలోని మార్పులు ముందుగా రాష్ట్ర స్థాయిలో ప్రతిఫలించడం యాదృచ్భికం కాదు. చిన్న పట్టణాలకు గ్రామాలకు విస్తరించే సంరక్షణ అల్లికలు (02000286 ౧60౪౦గ6) ఈ న్థాయిలోనే ప్రారంభించబడతాయి. నిర్మించబడతాయి. వ్యవసాయ చట్రంలో, వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధిలో, ఆరోగ్యం, రోడ్డు, విద్యుచ్చక్తి నీటి పారుదలలో మార్చులకు సంబంధించిన మౌలిక జాతి నిర్మాణ మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు పరుస్తాయి. కేంద్రం రాష్ట్రాలలో జోక్యం చేసుకొని, ఒక మేరకు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను స్వాయత్తం చేసుకుంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన ముఖ్యమైన నిర్ణయాల అమలుకు రాష్ట్ర (ప్రభుత్వాలపైనే ఆధారపడుతుంది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కూడా రాష్ట్రాల పనితీరుపైననే ఆధారపడుతుంది. కేంద్రంలో రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తన పథకాలను విధానాలను అమలు జరిపించికొనగల సామర్థ్యం కూడా పరిమితమే. ఉదాహరణ: వివిధ కాంగ్రెస్ పాలిత స్వతంత్రం తర్వాత భారతదేశం 897
రాష్ట్రాలలో 1950లో భూసంస్కరణల అమలు తీరు.. వాస్తవంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధతలోని వ్యత్యాసం చాలా వరకు వాటి పాలన సామాజిక, సాంస్కృతిక మానవ వనరుల అభివృద్దిలోని వ్యత్యాసాన్ని వివరిస్తుంది. రాజకీయాలకు సంబంధించిన ఈ అంశాలను గురించిగాని, స్వతంత్రం వచ్చిన తరువాత ప్రతి రాష్ట్రంలో వచ్చిన పరిణామాలను గురించి గాని చర్చించడం సాధ్యపడదు. కాని రాజకీయాల రీత్యా విభిన్నతని సంతరించుకొన్న కొన్ని రాష్ట్రాలను- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అస్సాం, పశ్చిమబెంగాల్, జమ్మూకాళ్ళీర్ రామ్రాలను గురించి చర్చిద్దాం.
మనం మతతత్వ రాజకీయాలు, మైనారిటీ మతతత్వ వాదం అంతిమంగా 'ప్రత్యేకవాద రూపానికి ఉదాహరణగా ఉన్న పంజాబుని గురించి 24వ అధ్యాయంలో చర్చిద్దాం.
(గ్రంథం మరీ పెద్దదయి పోతుందని బీహారుని గురించి వివరంగా చర్చించడం లేదు. ఒకవైపు భూమిహార్ల, (బ్రాహ్మణుల రాజ్పుట్ల, క్షత్రియులలాంటి అగ్రకులాల కులతత్వం మరొకవైపు యాదవుల, కుర్మీల, కోయర్లలాంటి వెనుకబడిన కులాల కులతత్వం- పరిపాలనకు, ఆర్థిక విధానానికి, విద్యావిధానానికి ప్రజల సంస్కృతికి క్రమంగా చాలా హాని చేశాయి. కాని బీహార్ గతం వైభవోజ్వలమైనది. జాతీయవాద, రైతాంగ, తెగల సమరశీల పోరాటాల సంప్రదాయం గలది. ఇటీవల కాలంలో సచిదానంద సిన్హా రాజేంద్రప్రసాద్, మజహర్-ఉల్-హక్, జయప్రకాష్‌నారాయణ, స్వామి సహజానంద సరస్వతి లాంటి గొప్ప రాజకీయ నాయకులను, ఆర్ధిక శాస్త్రవేత్త జ్ఞాన్ చంద్, చరిత్రకారుడు తాత్వికుడు రచయిత రాహుల్ సాంకృత్యాయన్, నవలా రచయిత ఫణీశ్వరనాథ్రేణు, కవులు నాగార్జున్, రామ్ధారిసింగ్, దినకర్ లాంటి మేధావుల్ని అందించిన రాష్ట్రం. తమిళనాడులో డియంకె
భారతదేశ రాజకీయాలలో బలమైన ్రత్యేకవాద ప్రాంతీయ ధోరణి ఏవిధంగా అధిగమించబడి విలీనం చేసుకొనబడిందో ద్రవిడ మున్నేట్ర కజగంపై చేసిన అధ్యయనం తెలియచేస్తుంది.
బలమైన కుల, ప్రాంతీయ వేర్పాటువాద భావాలతో, 1950లో డియంకె ఒక ఉద్యమంగా, పార్టీగా ఆవిర్భవించింది. స్వతంత్రం ముందు నాటి తమిళనాడులోని 3998 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రెండు వైఖరులకు అది వారసురాలు. ఒకటి: 1920లో బ్రిటీష్ అనుకూల జస్టిస్ పార్టీ ఏర్పాటుకు దారితీసిన (బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. రెండు: 'పెరియార్‌గా ప్రసిద్ధిగాంచిన ఇవి.రామస్వామి నాయకత్వంలో బలమైన సంస్క్మరణవాద కులవ్యతిరేక, మతవ్యతిరేక ఆత్మగౌరవ ఉద్యమం.
నాయకర్, సియన్. అన్నాదురైలు 1944లో [ద్రవిడకజగం (డి.కె) స్థాపించారు. 1949లో అన్నాదురై దాని నుండి చీలిపోయి ద్రవిడ మున్నేట్ర కజగం స్థాపించాడు. కాని జస్టిస్ పార్టీకి, నాయకర్కి భిన్నంగా అన్నాదురై బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయవాద అనుకూల వైఖరిచేపట్టాడు.
అన్నాదురై (ప్రతిభావంతుదైన రచయిత. మంచి వక్త, నిర్మాణదక్షుడు. యం.కరుణానిధిని, యం.జి.రామచంద్రన్ (యం.జి.ఆర్)ని చలనచిత్ర పరిశ్రమకి చెందిన యాక్టర్లను, డైరెక్టర్లను, రచయితలను కలుపుకొని అన్నాదురై ప్రజలలోకి చొచ్చుకుపోయేందుకు చలన చిత్రాలను, పత్రికలను, కరపత్రాలను ఉపయోగించు కొన్నాడు. అనతికాలంలో ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం గల యువకులతో ప్రజా పునాదిని, చలనశీలమైన రాజకీయ సంస్థని నిర్మించడంలో విజయం సాధించాడు.
డి.ఎం.కె. బ్రాహ్మణ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక, ఆర్యుల వ్యతిరేక స్వభావం గలది. ఉత్తర భారతదేశ వాసులు, దక్షిణ భారత దేశంలోని బ్రాహ్మణులు ఆర్యులుగాను, దక్షిణ భారతదేశంలోని మిగిలిన వారంతా (ద్రావిడులుగాను పరిగణింపబడ్డారు. అది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపై సాంస్కృతిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తుందని నినాదం ఇచ్చింది. మద్రాసు పాఠశాలల్లో హిందీ ప్రవేశపెట్టాలని కాంగ్రెసు మంత్రివర్గం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1988లో నాయకర్ ఇతరులు ఉద్యమము నడిపారు. హిందీని ప్రవేశపెట్టడం బ్రాహ్మణుల ఉత్తరభారతదేశ సాంస్కృతిక ఆధిపత్యంగా భావించారు. డి.యం.కె. దక్షిణాదిలో “హిందీ సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. దాని ప్రధానమైన డిమాండు: ద్రావిడులకు తమిళనాడు, ఆంధ్ర, కర్నాటక, కేరళలతో కూడిన ప్రత్యేకమైన స్వతంత్ర దక్షిణ భారత రాజ్యం ద్రవిడనాడు లేక ద్రావిడ స్టాన్.
1950, 1960 దశాబ్దాలలో సంభవించిన పలు పరిణామాలు డి.యం.క. మౌలిక రాజకీయ విధానంలో మార్పులకు దారితీశాయి. 1954లో (ప్రముఖ కాంగ్రెస్ స్వతంత్రం తర్వాత భారతదేశం 899
నాయకుడైన సి.రాజగోపాలాచారిని తొలగించి ఆస్థానంలో (బ్రాహ్మణేతరుడైన కామరాజ్ ముఖ్యమంత్రి అయ్యాడు. డియం.కె. కూడా బ్రాహ్మణ వ్యతిరేకతను తగ్గించుకొన్నది. డి.యం.కె. తన (ప్రాధాన్యతని జాతి నుండి తమిళ చైతన్యానికి తమిళ భాషా సంస్కృతులకు మార్చుకొన్నది. కాని హిందీ వ్యతిరేకతని నిలబెట్టుకొన్నది. సంఘసంస్కరణ పట్ల నిబద్ధతని ప్రత్యేకించి కుల వ్యత్యాసాలను తొలగించటానికి సంప్రదాయ హిందూ పవిత్ర గ్రంథాల పట్ల విమర్శనాత్మక వైఖరిని అలవరచడం పట్ల నిబద్ధతని ప్రకటించింది. డయం.కె. ఎన్నికలలో పార్లమెంటరీ రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించడం వలనను, ఇతర దక్షిణాది రాష్ట్రాలు వేర్పాటు వాదాన్ని బలపరచ నిరాకరించడం వలననూ దాని వేర్పాటు వాద వైఖరిలో క్రమంగా మార్పు వచ్చింది. డి.యం.కె. 1952 ఎన్నికలలో పాల్టొనలేదు. తన ఎన్నికల అభ్యర్థనను పరీక్షించుకాని 30 మంది ఎమ్మెల్యేల గెలుపుకు తోడ్పడింది. 1957, 1962 ఎన్నికలలో పాల్గొన్నది. 1962 ఎన్నికలలో స్వతంత్ర, సిపిఐల మిత్రపక్షంగా పోటీ చేసింది. ప్రత్యేక తమిళనాడు తన మేనిఫెస్టోలో ఉన్నప్పటికి దానిని ప్రచారాంశం చేయలేదు. ఇండియా చైనా యుద్ధ కాలంలో ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరిచింది. వేర్పాటువాద ప్రచారాన్ని ఆపివేసింది. వేర్పాటువాద ఉద్యమం పట్ల దృఢంగా వ్యవహరించాలని నెహ్రూ నిర్ణయం తీసుకొని వేర్పాటువాదాన్ని సమర్ధించడం నేరమని ప్రతి పార్లమెంటు లేక అసెంబ్లీ అభ్యర్థి రాజ్యాంగం పట్ల విధేయత ప్రకటిస్తూ ప్రమాణం చేయాలని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతలనామోదించాలని 16వ రాజ్యాంగ సవరణని అమోదింపచేసిన తరువాత డి.యం.కె. వైఖరిలో తుది మార్పు వచ్చింది. డి.యం.కె. తన నిబంధనావళిని మార్చుకొన్నది. వేర్పాటువాద డిమాండుని వదులుకొన్నది. డియం.కె. రాష్ట్రానికి ఎక్కువ స్వయం ప్రతిపత్తి కావాలని, రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం అధికారాలను పరిమితం చేసుకోవాలని, దక్షిణాదిపై హిందీ మాట్లాడే ఉత్తరాది వారి ఆధిపత్యం కూడదని, తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ఆర్థిక వనరులు కేటాయించాలని డిమాండ్లు చేపట్టింది. సమూలమైన మార్పులు తెచ్చే ఆర్థిక చర్యలు, సామాజిక మార్చు, ఆధునిక తమిళభాషా సంస్కృతుల అభివృద్ధి- కార్యక్రమంతో పట్టణ పల్లెల ప్రజల్ని ఆకట్టుకొని డి.యం.కె. క్రమంగా రాష్ట్రవ్యాప్త పార్టీగా విస్తరించింది. బ్రాహ్మణ వ్యతిరేక వైఖరిని మార్చుకొన్నది. తమిళ బ్రాహ్మణులను కూడా ఇముడ్చుకొనేందుకు తమిళులందరి పార్టీగా ప్రకటించుకొన్నది. 400 బిసన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఒక్కొక్క ఎన్నికలో డి.యం.కె. తన సామాజిక పునాదిని విస్తరించుకొన్నది. ఎన్నికల బలాన్ని పెంచుకొన్నది. 1962 ఎన్నికలలో డి.యం.కె. 50 రాష్ట్ర అసెంబ్లీ సీట్లను, 7 లోక్‌సభ సీట్లను గెలుచుకొన్నది. తరువాత జరిగిన రెండు ఘటనలు డి.యం.కె. 1967లో బాగా ఎదగడానికి తోడ్పడ్డాయి. మొదటిది: మనం 7వ అధ్యాయంలో గమనించిన విధంగా 1965 (ప్రారంభం నాటి హిందీ వ్యతిరేక ఆందోళన కాంగ్రెస్ వ్యతిరేక భావాల్ని తీవ్రంగా పెంచింది. దాని వలన ప్రధానంగా ప్రయోజనం పొందింది డియం,.కె. రెండవది: 1967 ఎన్నికలలో స్వతంత్ర, సిపిఎం, పియస్‌పి, యస్.యస్.పి., ముస్లింలీగుల మిత్ర పక్షంగా పోటీ చేసింది. ఫలితంగా అసెంబ్లీలోని 234 సీట్లకుగాను 188 సీట్లను కైవశం చేసుకొన్నది. కాంగ్రెసుకు కేవలం 49 సీట్లు దక్కాయి. అన్నాదురై ముఖ్యమంత్రిగా డి.యం.కె. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఈ పరాజయం నుండి కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేకపోయింది. ది.యం.కె. సాధారణ ప్రాంతీయ పార్టీ పంథాని అనుసరించింది.
1969 ఫిబ్రవరిలో అన్నాదురై మరణం తరువాత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. సిండికేట్‌కి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ చేసిన పోరాటంలో డి.యం.కె. ఇందిరాగాంధీని బలపరిచింది. లోక్‌సభలో ఇందిరాగాంధీ మైనారిటీకి తగ్గించబడిన తరువాత డి.యం.కె., సిపిఐల మద్దతుతో ఇందిరాగాంధీ అధికారంలో వుండగలిగింది. లోక్‌సభకి, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన 1971 ఎన్నికలలో డి.యం.కె. ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రైస్ (ఆర్)తో జతకట్టింది. కాంగైన్(ఆర్) పోటీ చేసిన 9 పార్లమెంటు సీట్లను డి.యం.కె. మద్దతుకి ప్రతిఫలంగా కాంగ్రెస్ (ఆర్) అసెంబ్లీ సీట్లు వదులుకొన్నది. కాంగ్రెస్(ఆర్) 9 పార్లమెంటు సీట్లు గెలిచింది. డి.యం.కె. 183 సీట్లు (మొత్తం అసెంబ్లీ సీట్లు 234) 28 లోక్‌సభ సీట్లు గెలిచింది.
1972లో యం.జి.ఆర్. ఆలిండియా అన్నాడియంకె స్టాపించడంతో (414924) డి.యం.కె. చీలిపోయింది. తమిళనాడులో రెండు పార్టీల విధానం ఆవిర్భవించింది. అప్పటి నుండి ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి అధికారంలోకి వస్తూ ఉంది.
ఎన్నికల రాజకీయాలలో పాల్గొనడం, అధికారం చేపట్టడం, జాతీయ ఆర్థిక విధానంలో తమిళనాడు ఎక్కువగా ఏకీకరణ చెందడం డి.యం.కె. ప్రత్యేకవాద ఉద్యమం నుండి భారత ప్రజాస్వామ్య సెక్యులర్ రాజకీయ వ్యవస్థలో అవిచ్చిన్న భాగంగాను రాజకీయ పరిణతి గల ఆచరణాత్మక ప్రాంతీయ పార్టీగా మార్పు చెందటానికి దారి తీశాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం క!
ఇతర పెద్ద పార్టీలలాగానే డి..యం.కె. కూడా రెండు పెద్ద పార్టీలుగాను ఆ తరువాత చాలా చిన్న పార్టీలుగాను చీలిపోయింది. డి.యం.కె, ఎ.ఐ.ఎ.డి.యం.కెలు (వాటి శాఖలు) కాం(గైెస్, సిపిఐ, సిపిఎం, జనతా, జనతాదళ్ ఇతర అఖిల భారత పార్టీలకు మిత్ర పక్షాలుగా వున్నాయి. ఎ.ఐ.డి.యం.కె 1998లో డి.యం.కె 1999లో బిజెపితో- ఉత్తర భారతదేశ ఆర్యులకు, హిందీ ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా ఆరోపించిన బిజెపితో కలిసి పని చేశాయి. వాటి ఉత్తర భారత వ్యతిరేక, హిందీ వ్యతిరేక వైఖరి కూడా పలుచబడింది. (ద్రవిడనాడు ఆలోచనకు, భారత యూనియన్‌లో వుంటూ, నాలుగు దక్షిణ భారత రాష్ట్రాలను ఐక్యం చేసే ఆలోచనను వదిలిపెట్టాయి. కుల వ్యవస్థ నిర్మూలనాలక్ష్యాన్ని కూడా నిరవధికంగా వాయిదా వేసుకున్నాయి. ఫలీతంగా షెడ్యూల్డు కులాలు ఇతర పీడిత తాడిత కులాలు వాటికి దూరమవుతూ వచ్చాయి. మొత్తం మీద బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం బ్రాహ్మణ కుల
వ్యవస్థ ఆధిపత్యంలోని లాసుగులలోకి చొచ్చుకు పోవడంలో వివలమయింది. (బ్రాహ్మణులను తమిళనాడు నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు, అమెరికాకు పంపించడంలో సఫలమయింది. తమిళనాడులోని శాస్త సాంకేతిక రంగాలను మేధాపరమైన జీవితాన్ని ప్రభావితం చేసింది. సంపన్న మధ్యతరగతి రైతుల, భూమిలేని గ్రామీణ పేదల మధ్య చీలికలలో చిక్కుకున్న డి.యం.కె, ఎ.ఐ.ఎ.డి.యం.కెలు వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తెచ్చే విధానాన్ని వదులుకున్నాయి. సామాజికంగా, విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు, వర్గాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించాయి. కులం వర్గం ప్రాతిపదికన గల ఆర్థిక వ్యత్యాసాలను తొలగించకుండా ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు దీర్హకాలికంగా చూచినప్పుడు పరిపాలన, విద్యాస్థాయి, అభివృద్ధికి నష్టం కలిగించాయి. ద్రవిడ పార్టీల పరివర్తనకు అత్యంత ముఖ్యమైన కారణం ఆ పార్టీలు ఈ క్రింది అంశాలను గుర్తించటం... 1) వేర్పాటు సాధ్యపడదు. ఆ దిశలో చేసే ఎలాంటి 'ప్రయత్నాన్నైనా భారత రాజ్యం అణచివేయగలిగినంత బలంగా ఉంది. 2) ప్రాంతీయ గుర్తింపుకి జాతీయ గుర్తింపుకి మధ్య నిజమైన వైరుధ్యం లేదు. 8) భారతదేశ ఫెడరల్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్రానికి, వ్యక్తులుగా తమిళులకు ఆర్థికావకాశాలు కల్పించింది. అభివృద్ధి చెందటానికి సంఘసంస్కరణలు చేపట్టటానికి, చాలా వరకు రాజకీయ పరిపాలనాపరమైన స్వేచ్ళకి అవకాశం కల్పించింది. 4) భారత రాజకీయ వ్యవస్థ 402 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జాతీయ సమగ్రతలు, రాజకీయ బహుళత్వం ప్రాతిపదికగా రూపొందించబడినవి. 5) భాష ఇతర సాంస్కృతిక వ్యవహారాలపై నియంత్రణతో సహా రామ్రాలు పూర్తిగా సాంస్కృతిక ప్రతిపత్తి గలవి. సంక్షిప్తంగా చెప్పాలంటే “భిన్నత్వంలో ఏకత్వం” భావనని ఆచరణీయమైనదిగా, భారతదేశ రాజకీయాలలో అవిచ్చిన్న భాగంగా ద్రవిడ పార్టీలు, తమిళనాడు ప్రజలు కాలగమనంలో గుర్తించారు. తెలంగాణా - కోస్తా ఆంధ్ర
ఆర్థికాభివృద్ధిలో వ్యత్యాసం, ఆర్థికావకాశాలలో అసమానతలు వున్నాయనే భావం ప్రాతిపదిక గల రాజకీయ ఘర్షణ, ప్రాంతీయ ఉద్యమాలతో ఒకే భాషా సాంస్కృతిక ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ సతమతమవుతున్నది.
మనం 8వ అధ్యాయంలో గమనించిన విధంగా 1958 అక్టోబరులో “ఆంధ్రా (ప్రత్యేక రాష్ట్రంగా సృష్టించబడింది. 1956లో నిజాం హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు మాట్లాడే తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. ఒకే భాషా రాష్ట్రం తెలుగు ప్రజల మధ్య సాంస్కృతిక రాజకీయ ఆర్థిక సంబంధాన్ని పటిష్టపరుస్తుందని ఆశించడం జరిగింది. అప్పుడు కూడా తెలంగాణా సాపేక్షికంగా వెనుకబడి ఉండడం వలన, దాని అభివృద్ధి స్థాయి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల అభివృద్ధి స్థాయిలో దాదాపు సగమే వుండడం వలన విలీనం పట్ల తెలంగాణా కాంగ్రెసు నాయకులు, అలాగే రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్ (ఎస్.ఆర్.సి) కొన్ని ఆక్షేపణలు వ్యక్తం చేశారు. కోస్తా జిల్లాల తలసరి ఆదాయం రూ. 292లు ఉండగా తెలంగాణా తలసరి ఆదాయం రూ.188లు మాత్రమే. కోస్తా జిల్లాలో ప్రతి వెయ్యి మందికి 55.6 ఆస్పత్రి పడకలుండగా తెలంగాణాలో 18.6 మాత్రమే. తెలంగాణాలోని అక్షరాస్యత శాతం 17.3%, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 30. 8శాతం. అలాగే తెలంగాణాలో ప్రతి 100 చ.మైళ్లకు తొమ్మిది మైళ్ల రోడ్డు వుండగా ఆంధ్రలో 87 మైళ్ల రోడ్డు మార్గం ఉంది. కోస్తా ఆంధ్రలోలాగా గాక తెలంగాణాలో నీటి పారుదల వనరులు వర్షంపై ఆధారపడిన చెరువులు, బావులు మాత్రమే.
రాష్ట్రం యొక్క రాజకీయాలను, వరిపాలనని ఆంధ్ర ప్రాంత (ప్రజలు నియంత్రిస్తున్నారని, అంధ్ర ప్రభుత్వం తెలంగాణాని అశ్రద్ధ చేసిందని, ప్రాంతీయ ఆర్థిక అసమానతలను తొలగించేందుకు చేసిందేమీ లేదని, ఆం(ధ్రులు తెలంగాణా స్వతంత్రం తర్వాత భారతదేశం 408
ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నారనే విశ్వాసం ఆధారంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొరకు శక్తివంతమైన ఉద్యమం అభివృద్ధి చెందింది. ఉదాహరణకు : గ్రామీణ విద్యుదీకరణ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో రెండవ పంచవర్న ప్రణాళికా కాలంలో 4 ఏ1 ఉండగా మూడవ ప్రణాళికా కాలంలో 5 :1 వుంది. అలాగే నీటిపారుదల పథకాలు కూడా తెలంగాణాని పట్టించుకోకుండా ఆంధ్రలో అమలు జరుపబడ్డాయి. . ఇంకా మద్యనిషేధం అమలులో లేని తెలంగాణాలో మద్యం అమ్మకాల వలన వచ్చిన ఆదాయం మద్యనిషేధం అమలులో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి తరలించబడింది. ఈ ఆరోపణలన్నింటిని ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. కాని తెలంగాణా ప్రజలను నమ్మించలేకపోయారు. అన్నిటిని మించి ప్రత్యేక వాద భావోద్వేగం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుందని, వివక్ష చూపబడుతుందనే భావంపై ఆధారపడివుంది. విద్యావ్యాప్తి ఫలితంగా ఉద్యోగాలను కోరే విద్యావంతుల సంఖ్య పెరుగుతుండగా మూడవ ప్రణాళిక అమలు జరుపడంలోని ఇబ్బందుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలలోని ఉపాధి అవకాశాలు కుచించుకుపోయాయి. కాని రాజకీయ నాయకులు, మధ్య తరగతి నిరుద్యోగ యువత తెలంగాణాలో హైదరాబాదు నగరంలో నిరుద్యోగం పెరగడానికి కారణం ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ప్రభుత్వం చూపుతున్న వివక్షయని నిందించారు.
ఈ సందర్భంగా ముల్కీ నిబంధనల అమలు ఒక పెద్ద సమస్య అయింది. వైజాం రాజ్యంలో పుట్టిన వారికి, లేక అక్కడ 15 సంవత్సరాలు నివసించిన వారికి (ముల్కీలకు) ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, బయటి వారికి ఉపాధి కల్పనపై పరిమితులు విధింపబడతాయని 1918లో నిజాం ప్రభుత్వం ఒక విధానాన్ని ఆమోదించింది. 1956లో ఆంధ్రలో తెలంగాణా విలీనమైనప్పుడు రెండు ప్రాంతాల నాయకులు, పెద్దమనుషుల ఒప్పందాన్ని (66౧1౫6౧9 2866%0600 రూపొందించారు. ఒప్పందాన్ని అనుసరించి మార్చు చేయబడిన రూపంలో ముల్కీ నిబంధనలు కొనసాగుతాయి. నిర్ణీత సంఖ్యలో తెలంగాణా నాయకులకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీతో సహా విద్యా సంస్థలలో తెలంగాణా విద్యార్థుల ప్రవేశానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రభుత్వం బాహాటంగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలంగాణా అసంతృప్తి నాయకులు ఆరోపించారు. ఒప్పందాన్ని శాయశక్తులా అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నానన్నది ప్రభుత్వం. 404 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పాత హైదరాబాద్ రాష్ట్రం విద్యావిషయకంగా వెనుకబడి ఉన్నందున కొన్ని సందర్భాలలో సరియైన అర్హతలు గల అభ్యర్థులు లభ్యం కాలేదన్నది ప్రభుత్వం. ఉదాహరణకు: తెలంగాణాలో విద్యావ్యాప్తికి ఆంధ్రప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల్ని రప్పించటం అవసరమయింది.
1968 సంవత్సరాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలలో విద్యలో వివక్ష సమస్యపై సమ్మె చేశారు. సమ్మె తెలంగాణాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. 1956 ఒప్పందం ప్రకారం ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని 1969 మార్చిలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో అగ్నికి ఆజ్యం తోడయినట్లు అయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణా అంతటికీ విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలు 9 నెలలపాటు మూతపడ్డాయి. తెలంగాణా యన్. జి.వో సంఘాలు ఆందోళనలో చేరాయి. నిరవధిక సమ్మెకు దిగాయి. ఉపాధ్యాయులు, లాయర్లు, వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన ఇతర సెక్షన్లు ఆందోళనలో చేరాయి.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని క్రమబద్ధంగా నడిపేందుకు తెలంగాణా ప్రజాసమితి (టి.పి.ఎస్) ఏర్పాటు చేయబడింది. కాం(గెస్ అసంతృప్త నాయకులు తెలంగాణా ప్రజాసమితిలో చేరారు. దానిలో ప్రముఖ స్థానాలు ఆక్రమించారు. అన్ని పెద్ద జాతీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర డిమాండును వ్యతిరేకించాయి. ఇది భూస్వామ్య బూర్జువా వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్న ప్రజాగ్రవాన్ని దారి మళ్లించేందుకు స్వప్రయోజనాపరుల ప్రయత్నంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. కాని స్వతంత్ర, సంయుక్త సోషలిస్టు పార్టీ, జనసంఘ్ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు డిమాండుని బలపరచారు. ఇందిరాగాంధీ, కేంద్ర కాంగైసు నాయకత్వం మధ్యవర్తి పాత్ర నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే డిమాండుని బలంగా అద్దుకున్నారు. తెలంగాణా ఆర్ధిక డిమాండ్లను సానుభూతితో పరిష్మరించమని, తెలంగాణా ప్రజల కష్టాలను నివృత్తి చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పారు.
రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం దృధమైైన వ్యతిరేకత, రైతాంగాన్ని సమీకరించడంలో ఉద్యమం యొక్క వైఫల్యం, అత్యున్నత దశలో ఉన్నప్పుడు విజయం సాధించలేకపోతే సహజంగా ఉద్యమాన్ని ఆవహించే స్తబ్ధత కారణంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం శక్తిని కోల్పోవటం మొదలయింది. 1969 వేసవి తరువాత క్షీణించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 405
ఆర్థిక ఒత్తిడులకు గురయిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. 1969 డిసెంబర్లో జరుపనున్న పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు చదువుకి వెళ్లారు. ఐనప్పటికీ 1971 లోక్‌సభకి జరిగిన ఎన్నికలలో తెలంగాణాలోని 14 సీట్లలో 10 సీట్లు టి.పి.యస్ గెలిచింది.
1971 ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక రాజీ కుదర్చబడింది. రాజీననుసరించి ముల్కీ నిబంధనలు కొనసాగుతాయి. శాసనాధికారాలతో తెలంగాణా ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. రాజీ అసంతృప్త మధ్య తరగతి యువకుల్ని తృప్తి పరిచింది. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసి ఆ స్థానంలో తెలంగాణాకి చెందిన పి.వి. నరసింహారావుని ముఖ్యమంత్రిని చేసిన తరువాత 1971 సెప్టెంబరులో టి.పి.యస్ కాంగ్రెస్‌లో విలీనం అయింది.
ఇక ఆంధ్ర ప్రాంతం మధ్య తరగతి ప్రజలకు తమ ఆగ్రహం వ్యక్తం చేసే వంతు వచ్చింది. ముల్కీ నిబంధనలను సవరించినప్పటికీ అవి ఆంధ్ర ప్రాంతం వారి ఉద్యోగావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించారు. అంతేగాక ముల్కీ నిబంధనల కొనసాగింపుని అనుమతిస్తూ 1972 అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పు
ఇచ్చింది. దీనితో ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ తుఫాను చెలరేగింది. తెలంగాణాలో లాగానే ఆంధ్రలో కూడా విద్యార్థులు, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల చొ రవతో సభలు, ప్రదర్శనలు, సమ్మెలు జరిగాయి. అవి కొన్ని సందర్భాలలో హింసాయుత రూపం దాల్చాయి. ముల్కీ నిబంధనలు ఎత్తివేయాలని, ఆంధ్రప్రాంతపు ఉద్యోగులకు వ్యతిరేకంగా వివక్షాపూరిత చర్యల్ని రద్దు చేయాలని డిమాండు చేశారు. వైద్య నిధులు హైదరాబాద్ నగరానికి మరల్చ్బ బడుతున్నాయని డాక్టర్లు వాదించారు. ఆంధ్రప్రాంతంలో హైకోర్టు ఉండాలని లాయర్లు కోరారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టణ ఆస్తి పరిమితిని వ్యతిరేకించిన వ్యాపారులు ఆందోళనలో చేరారు. తెలంగాణా ఆందోళనకు దీనికి గల ముఖ్యమైన తేడా ఏమిటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 1972లో చేసిన భూ పరిమితి చట్టాన్ని వ్యతిరేకించిన పెద్ద భూస్వాములు, ధనిక రైతులు కూడా ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు.
ప్రధానమంత్రి నవంబరు 27న రాజీ సూత్రం ప్రకటించారు. దీనిననుసరించి ముల్కీ నిబంధనలు ఇంకనూ మార్పు చేయబడతాయి. అవి హైదరాబాద్ నగరంలో 1977 సంవత్సరాంతం వరకూ, తెలంగాణాలోని ఇతర (ప్రాంతాలలోని 1980 406 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సంవత్సరాంతం వరకూ అమలులో ఉంటాయి. ఈ సూత్రం తెలంగాణాకి అనుకూలంగా వుందని భావించడంతో ఇప్పుడు ఉద్యమం అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి వ్యతిరేక వైఖరి చేపట్టింది. సెప్టెంబరు 7న ఆంధ్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. స్వతంత్ర, జన సంఘ్ పార్టీలు, మరికొందరు ఇండిపెండెంట్ల ప్రోత్సాహంతో ఆందోళనకారులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండు చేశారు. కమ్యూనిస్టులు రాష్ట్ర విభజనని గట్టిగా వ్యతిరేకించారు. ఫలితంగా అత్యధిక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆందోళనకు దూరంగా ఉండిపోయాయి. చాలా మంది కాంగ్రెసు వాళ్ళు కూడా బలపరచారు. నరసింహారావు మంత్రివర్గంలోని 9 మంది మంత్రులు రాజీనామా చేశారు. మిగిలిన వారు సమైక్యవాదులుగా వున్నారు. ఉద్యమకారులు చాలా చోట్ల రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. సెంట్రల్ రిజర్వు పోలీసు, సైన్యం రంగంలోకి దించబడింది. ఇందిరాగాంధీ మరొకసారి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి అనుకూలంగా దృఢమైన వైఖరిని చేపట్టింది. డిసెంబర్ 21న లోక్‌సభ ముల్కీ నిబంధనల బిల్లుని ఆమోదించింది. 1973 జనవరి 17న ఆమె నరసింహారావుని రాజీనామా చేయమని చెప్పి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టింది. పరిస్థితి క్రమంగా అదుపులోకి తీసుకొని రాబడింది. ఉద్యమం పట్ల కేంద్రం కఠినమైన వైఖరిని తీసుకొన్నది. ఉద్యమంలో అలసట మొదలయింది. ప్రత్యేకించి ఉద్యమం రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని సమీకరించలేకపోవడంతో ఉద్యమం అణగారిపోయింది. అంతేగాక కోస్తా జిల్లాలే ఉద్యమ కేంద్రంగా ఉన్నాయి. రాయలసీమ ముల్కీ నిబంధనలను వ్యతిరేకించినప్పటికీ ప్రత్యేక రాష్ట్ర వాదనని బలంగా చేపట్టలేదు. గతంలో తెలంగాణాలో లాగానే ఆంధ్రలో కూడా నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు మార్చిలో సమ్మె విరమించారు. విద్యార్థులు కూడా తరగతులకు హాజరయ్యారు. చివరిగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 6 అంశాల సూత్రాన్ని ప్రతిపాదించింది. ఇది ముల్కీ నిబంధనల్ని రద్దు చేసింది. కాని విద్యా ఉద్యోగాలలో అన్ని జిల్లాలకు, ప్రాంతాలకు బయటి వారికంటె (ప్రాధాన్యతనిచ్చింది. ఈ సూత్రం అమలు పరచటానికి వీలుగా 32వ రాజ్యాంగ సవరణ చేపట్టబడింది. ఇది రెండు ప్రాంతాలకు చెందిన అత్యధిక కాంగ్రెసు వాదుల్ని సంతృప్తి పరిచింది. డిసెంబరులో రాష్ట్రపతి పాలన ఎత్తివేయబడింది. ఏకాభిప్రాయ సాధనతో జె.వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆరు అంశాల సూత్రం అమలు ముఖ్యమంత్రికి అప్పచెప్పబడింది. ఆ తరువాత జన సంఘం తరువాత బిజెపి వారి కార్యక్రమంలో స్వతంత్రం తర్వాత భారతదేశం న!
భాగంగా ఆమోదించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రం కొరకు డిమాండు సద్దుమణిగింది.
తెలంగాణ, ఆంధ్ర- రెండు ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి డిమాండ్లు వస్తాయనే ఆందోళనతో రాష్ట్ర విభజన డిమాండుని దృఢంగా జయప్రదంగా వ్యతిరేకించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాలలోని ప్రాంతీయ డిమాండ్లకు స్థానం కల్పించటాన్ని సాధ్యం చేసింది. అవి పూర్తిగా మతపరమైన సాంస్కృతికపరమైన విభేదాలు లేని ఆర్ధికపరమైన డిమాండ్లు. రెండు ఉద్యమాల నుండి నేర్చుకున్న మరొక గుణపాఠం. వివిధ రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించటమేగాక ఒక రాష్ట్రంలోని సమగ్రాభివృద్ధికి సహాయపడేందుకు కేవలం భాషాపరమైన సాంస్కృతికపరమైన ఐక్యత చాలదు. అస్వాంలో సంక్షోభం
జనాభా రీత్యా అస్సాం చిన్న రాష్ట్రం ప్రజలు అస్సామీయులుగా తమ గుర్తింపు బలహీనపడుతుందని భయపడిన కారణంగా రాజకీయ సంక్షోభం రాష్ట్రాన్ని సంవత్సరాల తరబడి కుదిపివేసింది. కాని ఏ దశలో కూడా వారి రాజకీయాలు వేర్పాటువాద రూపం తీసుకోలేదు. చాలా అంశాలు వారి భయానికి కారణమయ్యాయి. డిమాండ్లను రూపొందించుకొని ఉద్యమం ప్రారంభించారు.
- అస్సాం ప్రజలలో కేంద్రం యొక్క సవతి తల్లి (ప్రమ అస్సాం వెనుకబాటుతనానికి కారణమనే భావం ప్రబలంగా ఉంది. కేంద్రం అస్సాం అభివృద్ధి పట్ల అశ్రద్ధ వహించడమేగాక కేంద్ర నిధులను కేటాయించడంలోను అస్సాంలో పారిశ్రామిక ఆర్థిక సంస్థల్ని నెలకొల్బడంలోను వివక్ష చూపింది. ముడి చమురు, టీ, ఫైవుడద్ పరిశ్రమల నుండి వచ్చే ఆదాయంలో కేంద్రం అస్సాం వాటా నిరాకరించింది. అస్సాం ఆదాయాన్ని దేశంలో మరొక చోటికి తరలించి ఉపయోగించుకొంటున్నది. అస్సాం ఆర్థిక విధానాన్ని ఇతర వనరుల్ని- ప్రత్యేకించి టీ, ప్లైవుడ్ ఇతర వస్తువుల ఉత్పత్తి అమ్మకాలు బయటి వారి- మార్వాడీల బెంగాలీల నియంత్రణలో వుండడం అస్సాం వెనుకబాటు తనానికి కారణం. అంతేగాక టీ, స్లెవుడ్ ఇతర పరిశ్రమలలోని శామికులలోని అత్యధికులు అస్సామీయేతరులు. న 408 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
స్వతంత్రం వచ్చినప్పటి నుండి అస్సాంలో వలు నిరసన ఉద్యమాలు చేపట్టబడ్డాయి. టీ, పైవుడ్ పరిశ్రమల నుండి వచ్చే ఆదాయంలో అస్సాంకి ఎక్కువ వాటా ఇవ్వాలని, అస్సాం ముడిచమురుకి ఎక్కువగా రాయల్టీ ఇవ్వాలని, కేంద్ర ఆర్థిక గ్రాంట్లు, ప్రణాళికా కేటాయింపులు ఎక్కువగా ఉండాలని, అస్సాంలో చమురు శుద్ది కర్మాగారాలు నెలకొల్పాలని, (బ్రవ్మాపుత్రానదిపై ఎక్కువ బ్రిడ్జిలు నిర్మించాలని, రాష్ట్ర పారిశ్రామికీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ వహించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలోను రాష్ట్రంలో స్థాపించిన పబ్లిక్ సెక్టార్ సంస్థలలోను ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
(2) చారిత్రక కారణాల దీత్యా వలసపాలనా కాలంలోను, స్వతంత్రం వచ్చిన తరువాత చాలా సంవత్సరాల వరకు అస్సాంలో స్థిరపడిన బెంగాలీలు ప్రభుత్వ ఉద్యోగాలలో బోధన ఇతర ఆధునిక వృత్తులలో, వబ్లిక్ (పైవేటు సెక్టార్లలోని ఉన్నతోద్యోగాలలో ప్రబల స్థానం ఆక్రమించారు. విద్యలో వెనుకబడడం వలన అస్సామీ మాట్లాదే యువకులు, బెంగాలీ మాట్లాడే మధ్య తరగతి వారి కంటె ఉద్యోగాల పోటీలో వెనుకబడుతున్నట్లు భావించారు. విద్య ఉద్యోగాలలో బెంగాలీల ఆధిక్యత అస్సాం భాషా సంస్కృతులకు పెను ముప్పుని అస్సామీ మాట్లాడే యువత నిశ్చితాభిప్రాయం.
ఉద్యోగావకాశాల కొరత, అస్సాం పరిశ్రమ వర్తకాలలో బయటివారికి గణనీయమైన పాత్ర, సాంస్కృతికంగా నియంతత్రించబడుతున్నామనే భావాలు, మధ్య తరగతి అస్సాం ప్రజల మనస్సులలో వంచనకు గురయ్యామనే భావం కలిగించాయి. వారు అస్సామీ మాట్లాడే వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇన్వాలని, అస్సామీ భాషని ఏకైక అధికార భాషగా చేయాలని పాఠశాలల్లో కళాశాలల్లో బోధనా మాధ్యమం చేయాలని డిమాండ్ చేస్తూ 1950లో ఉద్యమం ప్రారంభించారు. కాని కచార్ జిల్లాలో మెజారిటీగాను అస్సాంలోని ఇతర ప్రాంతాలలోని గణనీయంగాను ఉన్న బెంగాలీలు 1871 నుండి అస్సామీ, బెంగాలీ- రెండూ అధికార భాషలుగా వున్నాయని, ఆ క్రమం కొనసాగాలన్నారు.
అధికార భాషలో మార్చు కొరకు మొదలైన ఉద్యమం బెంగాలీ అస్సామీ మాట్లాడే వారి మధ్యవైరం పెరగడానికి దారితీసింది. 1960 జులైలో బాధాకరమైన భాషా దాడులు జరిగాయి. పట్టణాలలోని పల్లె ప్రాంతాలలోని బెంగాలీలు దాడులకు గురయ్యారు. ఇళ్లు లూటీ చేయబడ్డాయి. తగులబెట్టబడ్డాయి. పెద్ద సంఖ్యలో బెంగాలీలు కచార్లో స్వతంత్రం తర్వాత భారతదేశం 409
బెంగాల్లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. కచార్లో బెంగాలీలు ఆందోళన చేశారు.
1960లోనే బెంగాలీ మాట్లాడేవారికి ఇతర తెగల (గ్రూపుల అభీష్టానికి వ్యతిరేకంగా అస్సామీని ఏకైక అధికార భాషగా చేస్తూ అసెంబ్లీ చట్టాన్ని చేసింది. కచార్లో మాత్రం బెంగాలీ అదనపు అధికార భాషగా వుంటుంది. 1972లో గౌహతి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అస్సామీ ఏకైక బోధనామాధ్యమం చేయబడింది.
అస్సామీ భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నం. అస్సామీ గుర్తింపు క్రమాన్ని అడ్డుకొన్నది. రాష్ట్రమంతటా వ్యాపించటాన్ని నివారించింది. కొండ జాతులవాళ్ళు అస్సాం నుండి విడిపోవాలని డిమాండు చేయటానికి దారి తీసింది.
(3) భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి - ప్రత్యేకించి తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసలు అస్సాం జనాభా పొందికలో మార్పు తెచ్చాయి. కాని 1979లో విదేశీ వ్యతిరేక ప్రజా ఉద్యమం అభివృద్ధి చెందటానికి కారణం చాలా తక్కువ కాల వ్యవధిలో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుండి ఒక మేరకు నేపాల్ నుండి జరిగిన చట్ట విరుద్ధమైన వలసలు.
బయటివారు అస్సాంకి వలసలు రావటానికి సుదీర్హమైన చరిత్ర వుంది. బ్రిటిషు పరిపాలన వేలాది మంది బీహారీలను టీ తోటలలో పనిచేసేందుకు, వేలాది మంది బెంగాలీలను అస్సాంలోని సాగు చేయబడని భూఖండాలలో స్థిరవడేందుకు ప్రోత్సహించింది. ఇటీవల కొంత వరకు అస్సాం భూస్వాములు తక్కువ జన సాంద్రత గల అస్సాంలోనికి కష్టించి పనిచేసే బెంగాలీ కౌలు రైతుల్ని స్వాగతించారు. ముస్లిం మతతత్వవాదులు 1939-1947 కాలంలో భారతదేశ విభజన జరిగితే బేరమాడే శక్తిని పెంచుకొనేందుకు బెంగాలీ ముస్లిం వలసల్ని ప్రోత్సహించారు. దేశ విభజనతో తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్, ్రిపురలతో పాటు అస్సాంలోకి పెద్దఎత్తున కాందిశీకులు వచ్చి చేరారు. 1971లో తూర్పు బెంగాల్‌పై పాకిస్తాన్ విరుచుక పడ్డ తరువాత మిలియన్‌కి పైగా శరణార్థులు అస్సాంలో ఆశ్రయం పొందారు. బంగ్లాదేళ్ ఏర్పడిన తరువాత అత్యధికులు తిరిగి వెళ్లారు. కాని 100,000 మందికిపైగా అస్సాంలోనే వుండిపోయారు. 1971 తరువాత భూదాహంతో బంగ్లాదేశ్ రైతులు నిరంతరం వరదలా రావడం మొదలయింది. అస్సాం రైతులు, తెగల ప్రజలు అందోళన జెందారు. ఏమైనప్పటికీ జనాభా పొందికలో వచ్చిన తూర్పు అస్సామీ మాట్లాడే ప్రజలలో భాషా 410 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సాంస్కృతిక రాజకీయ అభద్రతా భావాన్ని కలిగించింది. 1980లలో చట్టవిరుద్ధమైన వలసవాదుల వ్యతిరేక ఉద్యమానికి బలమైన భావోద్రేకాన్ని సమకూర్చింది. స్వతంత్ర్యానంతరం అస్సాంలో అస్సామీ భాష సంస్కృత సాహిత్యం జానపద కళలు సంగీతం పట్ల అభిమానాన్ని పెంచే సాంస్కృతిక పునరుజ్జీవం ప్రారంభమయింది. భారతజాతి నిర్మాణ క్రమంలో భాగంగా వుంటూనే (ప్రత్యేకమైన అస్సామీ భాషా సాంస్కృతిక గుర్తింపు ఆవిర్భవించింది. రాష్ట్రంలో భాషా సాంస్కృతిక మతవైవిధ్యాల కారణంగా ఈ క్రమం చాలా సంక్లిష్టమైనది. క్రమబద్ధంగా అస్సామీ తెగల విలీనం ద్వారా విస్తృతమైన అస్సామీ గుర్తింపును పొందాలని పలువురు భావించారు. కానీ అస్సాం నుండి తెగల ప్రాంతాలను విడగొట్టి మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచలప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం విస్తృతమైన అస్సామీ గుర్తింపుకి ఆటంకంగా నిలిచింది. అస్సాంలో విదేశీయులు, అస్సామీయేతర భారతీయులు పెరిగిపోవడం వలన, అస్ఫామీయులు, అస్సాంలో మైనారిటీలుగా కుదింపబడడానికి, వారి భాషా సంస్కృతుల లొంగుబాటుకు, ఆర్ధిక రాజకీయాలలో వారి నియంత్రణ తగ్గిపోవడానికి, చివరికి వారి గుర్తింపు వ్యక్తిత్వం కోల్పోవడానికి దారి తీస్తుందని, అస్సాం జనాభా పొందికలోని మార్పు అస్సామీ ప్రజలలో భయాందోళనలు సృష్టించింది.
ఈ భయాందోళనలకు నిస్సందేహంగా ప్రాతిపదిక వుంది. 1971లో అస్సాంలో అస్సామీ భాష మాట్లాడేవారు కేవలం 59 శాతమే ఉన్నారు. వీరిలో చాలా మంది బెంగాలీలు తరువాత తరం వారు అస్సామీ నేర్చుకొని రాజకీయ ప్రయోజనాల రీత్యా కూడా ఉపయోగపడుతుందని జనాభా లెక్కలలో అస్సామీ మాతృభాషగా నమోదు చేయించుకొన్న వారు ఉన్నారు. అంతేకాక సాహిత్యం, సంస్కృతి, అధునిక ఆర్థిక విధానం రాజకీయాలకు నిలయాలైన గౌహతి, ఇతర పట్టణాలలో అస్సామీ మాట్లాడే వారు మెజారిటీ కోల్పోయారు.
1950 నుండి చట్ట విరుద్ధమైన వలసలు రాజకీయంగా చాలాసార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ బంగ్లాదేశ్ నుండి పెద్ద సంఖ్యలో చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారు రాష్ట్రంలో ఓటర్లయ్యారని స్పష్టమైన తరువాత అంటే 1979లో ఇది పెద్ద సమస్యగా ముందుకు వచ్చింది. 1979 చివరలో జరుగనున్న ఎన్నికల ద్వారా వలసదారులు స్వతంత్రం తర్వాత భారతదేశం శై1
అస్సాం రాజకీయాలలో ప్రబలమైన పాత్ర నిర్వహించనున్నారని అందోళన చెంది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (4450), అస్సాం గణ సంగ్రామ పరిషత్, ప్రాంతీయ రాజకీయ సాహిత్య సాంస్కృతిక సంఘాల ఐక్య సంఘటన పెద్ద ఎత్తున చట్టవిరుద్ధ వలస వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ ఉద్యమం అస్సామీ మాట్లాడే అన్ని సెక్షన్ల ప్రజల, హిందూ, ముస్లింల చాలామంది బెంగాలీల మద్దతు పొందింది.
రాష్ట్రం మొత్తం జనాభాలో చట్టవిరుద్ధ వలసదారులు 31 నుండి 34 శాతం వున్నారని ఉద్యమకారులు పేర్కొన్నారు. కాబట్టి వలసలను నివారించేందుకు అస్సాం సరిహద్దుల్ని మూసివేయాలని, చట్టవిరుద్ధంగా వలసలు వచ్చినవారిని గుర్తించి వారి పేర్లు ఓటర్ల జాబితాల నుండి తొలగించాలని, అలాంటి చర్యలు చేపట్టేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని, 1961 తరువాత రాష్ట్రంలోకి వలస వచ్చినవారందరిని దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపించి వేయాలని ఉద్యమ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని అర్ధించారు. ఉద్యమానికి ప్రజల మద్దతు బలంగా ఉంది. ఫలితంగా మొత్తం 16 పార్లమెంటరీ నియోజకవర్ణాలున్న రాష్ట్రంలో 14 నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యపడలేదు.
1979 నుండి 1985 వరకు ఆందోళనలు, సమ్మెలు, శాసనోల్లంఘనోద్యమాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవటం, రాష్ట్రపతి పాలన విధింపు లాంటి ఘటనలతో సాధారణ జీవితం స్తంభించింది. చాలా సంవత్సరాలు పలు దఫాలుగా, ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. కాని ఒప్పందానికి రాలేకపోయారు. చట్ట విరుద్ధమైన వలసదారులెవరో నిర్ణయించడం, బయటికి పంపడం సులభమైన పనికాదు. ఇరు పక్షాల మధ్య సుహృద్భావం విశ్వాసం కొరవడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం 1988లో రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుపటానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎన్నికలు బహిష్మరించబడ్డాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. ఎప్పుడూ లేనంత తీవ్రస్థాయిలో భాషాపరమైన తెగల పరమైన మతతత్వ గుర్తింపుల ప్రాతిపదికన హత్యలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసలో దాదాపు 38000 మంది హతులయ్యారు. అస్సామీయులు మెజారిటీ వున్న నియోజకవర్ణాలలో 2 శాతంలోపుగా ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాని దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. త1్ష2ై వీపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1983 హింస ఇరు పక్షాలకు మానని గాయాలను మిగిల్చింది. ఇరు పక్షాలు మరలా చిత్తశుద్దిగా చర్చలు చేపట్టాయి. చివరికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఉద్యమ నాయకులతో కుదిరిన ఒప్పందంపై 1985 ఆగస్టు 15న సంతకం చేయగలిగింది. ఒప్పందం ప్రకారం 1951, 1961 మధ్య కాలంలో అస్సాంలోకి వచ్చిన విదేశీయులకు ఓటింగు హక్కుతో సహా పూర్తి పౌరసత్వం ఇవ్వబడుతుంది. 1971 తరువాత ప్రవేశించిన వారు బయటికి పంపబడాలి. 1961, 1971 మధ్యకాలంలో ప్రవేశించిన వారికి పది సంవత్సరాలపాటు ఓటింగు హక్కు నిరాకరింపబడుతుంది. కాని ఇతర పౌర హక్కులుంటాయి. దీనితోపాటు రెండవ నూనెశుద్ధి కర్మాగారం, పేపరు మిల్లు, సాంకేతిక విద్యా సంస్థతో సహా ఆర్థికాభివృద్ధి ఒప్పందం కుదిరింది. అస్సామీ ప్రజల సాంస్కృతిక సామాజిక భాషాపరమైన గుర్రింపులను కాపాడేందుకు చట్టపరమైన పాలనాపరమైన రక్షణలు కల్పిస్తానని కేంద్ర (ప్రభుత్వం వాగ్దానం చేసింది.
ఒప్పందం ప్రాతిపదికన ఓటర్ల జాబితాలు తయారు చేసేందుకు ప్రయత్నం ప్రారంభమయింది. అసెంబ్లీ రద్దు చేయబడింది. 1985 డిసెంబరులో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. విదేశీయుల వ్యతిరేక ఉద్యమ నాయకులచే ఏర్పరచబడిన కొత్త పార్టీ అస్సాం గణపరిషత్ (4౮౫) మొత్తం 126 సీట్లలో 64 సీట్లు గెలిచి అధికారానికి వచ్చింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (4450) నాయకుడు స్వతంత్ర భారతదేశంలో 32 ఏళ్ల అత్యంత చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత బోడో తెగల వేర్పాటు వాద యునైటెడ్ లిబరేషన్ ఫ్రంటు తిరుగుబాట్లు తరువాత కాలంలో వచ్చినప్పటికీ అస్సాంలో సుదీర్షమైన తీవ్రమైన సంక్షోభానికి తెరపడింది.
విదేశీయులు ప్రవేశించకుండా ఆపడం అవసరమైనప్పటికీ పెద్ద సంఖ్యలో చట్టి విరుద్ధంగా ప్రవేశించి వున్నవారిని గుర్తించటం బయటికి పంపించటం అంత సులభం కాదు; సాధ్యమూ కాదు. అన్ని రకాల పాత్ర లేక ఇటీవలి మైనారిటీల బహిష్మరణ పరిష్కారం కాదు. క్రమబద్ధంగా విలీనం చేసుకోవడమే దీర్హకాలికమైన వాస్తవమైన పరిష్కారం. బలవంతంగా బయటికి పంపించడం రూపు దిద్దుకుంటున్న అస్సామీయిల చారిత్రక క్రమాన్ని బలహీనపరుస్తుంది.
అస్సాం విదేశీ వ్యతిరేక ఉద్యమం మతతత్వవాద, వేర్పాటువాద లేక ఏ ఇతర రూపంలో కూదా జాతి విచ్చిన్నకర రూపంగలదికాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి స్వతంత్రం తర్వాత భారతదేశం శ్ష18
అఖిల భారత రాజకీయ పార్టీలకు ఉద్యమం యొక్క డిమాంద్లు- కొన్ని సందర్భాలలో అతిశయింపబడినవి, అవాస్తవికమైనవి అయినప్పటికీ ఉద్యమకారులతో చర్చలు జరిపి వాటిని పరిష్కరించటం సాధ్యపడింది.
అస్సాంలో ఉన్న బయటి వారిలో అత్యధికులు ముస్లింలు కాబట్టి ఉద్యమానికి మతతత్వ మలుపు ఇవ్వాలని కోరుకునే ఆరీయస్యస్ లాంటి శక్తులు ఉన్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతీయ దురహంకారంతో విదేశీ వ్యతిరేకతను రెచ్చగొట్టే శక్తులూ. వున్నాయి. కాని అస్సామీయుల మతతత్వ వ్యతిరేక సాంస్కృతిక సంప్రదాయాల కారణంగాను, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌లోని గణనీయమైన సెక్షన్లు నిర్వహించిన పొత్ర కారణంగాను, ఉద్యమంలోని విస్తృతమైన భాగం అస్పామీ ముస్లింల, బెంగాలీల నాయకత్వంలో ఉండడం వలననూ ఉద్యమాన్ని విచ్చిన్నకర శక్తులకు దూరంగా వుంచడం సాధ్యపడింది. ఉద్యమం నిస్సందేహంగా చాలా బలహీనతలతో సతమతమవుతుంది. కాని ఏ ఉద్యమం కూడా ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం పుట్టి అభివృద్ధి చెందదు. ఎగుడు దిగుళ్లకు ఆటుపోట్లకు గురవుతుంది. అస్సాం ఉద్యమం అందుకు మినహాయింపు కాదు.
జాతి విచ్చిన్నకర మతతత్వ వేర్పాటువాద ఉద్యమాలకు స్థానం కల్పించరాదని: అవి వ్యతిరేకించబడాలని, ఓడింపబడాలని, అదే సమయంలో భాష లేక సంస్కృతి లేక ఆర్థికపరమైన వంచన అసమానత ప్రాతిపదికగా గల అస్తిత్వ రాజకీయాలు- అవి అభివృద్ధికర సెక్యులర్ జాతీయ వాదానికి అనుగుణమైనవి కనుక వాటితో సర్దుకుపోవడం అవసరం సాధ్యమని అస్సాం సంఘర్షణ దాని సంకల్పం నిరూపించాయి. శేకేడ్ష బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
23 రాష్ట్రాలలో రాజకీయాలు-2 బి పశ్చిమ బెంగాల్, జమ్మూ కాళ్మీర్ పశ్చిమ బెంగాల్లో పార్లమెంటరీ క్రమంలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం వున్న వ్యవస్థలో ప్రజాస్వామ్య పౌర స్వేచ్చల నియమాలననుసరించి పరిపాలన సాగించింది. ఇప్పటికి వరుసగా ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలకు పైగా పాలించింది. ప్రజలకు సమర్థవంతమైన సంస్కరణవాద ప్రభుత్వాన్ని ఇచ్చింది. బెంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1960 దశాబ్దం తొలి సంవత్సరాల వరకు పాలించింది. బెంగాల్ విభజన కారణంగాను, తూర్పు బెంగాల్ నుండి 1965 వరకు 4 మిలియన్లకు పైగా వరదలా వచ్చిపడిన కాందిశీకుల కారణంగాను ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమయినప్పటికీ ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని సమకూర్చగలిగింది. ప్రజారోగ్య కార్యక్రమంలో, విద్యుదుత్పత్తిలో రోడ్ల నిర్మాణంలో గణనీయమైన అభివృద్ది సాధించింది. కాని ప్రభుత్వం రెండు రంగాలలో విఫలమయింది. విద్యావంతులలో భూమిలేని గ్రామీణ ప్రజలలో నిరుద్యోగం నిరంతరంగా పెరిగింది. జమీందారీ విధానం రద్దు చేయబడినప్పటికి పాలి కాపులపై కౌలు రైతులపై మధ్యస్థ జోతేదార్త భూస్వాముల అధికారం ఆటంకపరచబడలేదు. 1930ల నుండి కమ్యూనిస్టు పార్టీ కలకత్తాలో మేధావుల కార్మికుల గణనీయమైన మద్దతు పొందింది. 1947 నాటికి బెంగాల్లో పెద్ద రాజకీయశక్తిగా ఆవిర్భవించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం శక్
1950 దశాబ్దంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1960, 1970 దశాబ్దాలలో సిపిఎం పెద్ద సంఖ్యలో ప్రజా ఉద్యమాలను కార్మిక పోరాటాలను నిర్వహించింది. వీటితోపాటు ప్రభుత్వ తప్పుడు విధానాలను బహిర్గతం చేయడానికి అసెంబ్లీని సమర్ధవంతంగా ఉపయోగించుకొన్నది. ఫలితంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆ తరువాత సిపిఎం ఎన్నికలపరంగాను నిర్మాణపరంగాను క్రమబద్ధంగా ఎదిగాయి. 1967, 1969 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడింపబడింది. కాంగ్రెసు నుండి చీలిపోయిన గ్రూపుల నాయకత్వంలో సిపిఎం భాగస్వామ్యంతో యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. రెండు యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వాలు అంతర్గత వైరుధ్యాల కారణంగా విచ్చిన్నమయ్యాయి. కాని అవి సి.పి.ఎం. పట్ల ప్రజాదరణని పెంచాయి. ఈ సంవత్సరాలలో సిపిఎం పాలికాపుల, కౌలు రైతుల ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహించి తన రాజకీయ పునాదిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించుకొనగలిగింది.
పెచ్చు పెరిగిన హింస, అరాచకత్వం, పాలనా సంక్షోభం, 1969 నుండి 1977 వరకు ప్రత్యక్షంగా గాని లేక రాష్ట్రపతి పాలన ద్వారాగాని పాలించిన కాంగ్రెసులో తీవ్ర స్థాయికి చేరిన ముఠాతత్వం, చీలిక- ఇదీ 1967-77 దశాబ్దంలో పశ్చిమ బెంగాల్ రాజకీయ దృశ్యం. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నక్సలైట్ల గ్రామీణ పేదల ఉద్యమాలపై అణచివేత చర్యలు చేపట్టబడ్డాయి. చివరికి సిపిఎం ప్రజాదరణ, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజాస్పందన 1977లో ఎన్నికల విజయంగా మార్చబడింది. సిపిఎం వామపక్ష మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అప్పటి నుండి సిపిఎం అధికారాన్ని ఇంకా పటిష్టపరచుకొన్నది. ప్రత్యేకించి రైతాంగంలో పాతుకుపోయింది. వామపక్ష ఐక్యతని నిలబెట్టడంలో జయ(ప్రదమయింది. ఐదుసార్లు వరుసగా ఎన్నికలలో విజయం సాధించి గడచిన 27 ఏళ్లుగా పరిపాలన కొనసాగిస్తున్నది. సిపిఎం విజయాల రికార్డు
(గ్రామీణ పేదల స్థితిగతుల్ని మెరుగు పరచిన సిపిఎం సాధించిన రెండు గణనీయమైన విజయాలు విశ్లేషించదగినవి. మొదటిది భూసంస్కరణ రంగం లేక కౌలుదారీ సంస్మరణ. కాంగ్రెసు ప్రభుత్వం 1950లలో జమీందారీ విధానాన్ని రద్దు చేసినప్పటికీ రెండు తప్పుల్ని అనుమతించింది. జోతేదార్లు (కౌలు వసూలు కొరకు జమీందారులకు పాలికాపులకు మధ్య ఉండేవారు. నిజమైన వ్యవసాయదారులు) శ16 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కొనసాగడానికి అనుమతించబడ్డారు. చాలామంది పెద్ద భూస్వాములు బినామీ లావాదేవీల ద్వారా పరిమితికి మించిన పొలాల్ని కలిగి ఉండడం అనుమతించబడింది.
సి.పి.ఎం. అధికారంలో కొచ్చిన తరువాత గ్రామీణ కుటుంబాలలో 25 శాతంగా ఉన్న బార్గాదార్ల (పాలికాపుల) ప్రయోజనాలకనుగుణంగా సంస్క్మరించబడిన కౌలుదారీ విధానం “ఆపరేషన్ బార్లా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దశాబ్దాల తరబడి పాలికాపులు రెండు రకాల ఇబ్బందులకు గురయ్యారు. చట్టం శాశ్వత కౌలుకి అవకాశం కల్పించినప్పటికీ కౌలు నమోదు చేయబడలేదు గనుక కౌలు వ్యవధిపై నెలకొన్న అభద్రత. అంటే కౌలు ఒప్పందాన్ని రద్దు చేసి తమని ఎప్పుడైనా పొలాల నుంచి గెంటివేస్తారనే భయం.
(2) జోతేదార్లకు తమ పంటలో పెద్ద భాగం కౌలుగా చెల్లించవలసి వుండటం, ఆపరేషన్ బార్జా ద్వారా పార్టీ, రైతు సంఘాలు పాలికాపుల్ని పెద్దఎత్తున సమీకరణ, రాజకీయీకరణ చేశాయి. ప్రభుత్వం పొలికాపుల్ని చట్టబద్ధంగా నమోదు చేసింది. ఆ విధంగా భూమిని శాశ్వతంగా కౌలుకి చేయటానికి అనుమతించడం వలన కౌలు కాలవ్యవధి, సమస్య పరిష్కరించబడింది. అలాగే ఉత్పత్తిలో వారు వుంచుకొనగలిగిన భాగానికి సంబంధించి చట్టాలు అమలు పరచడం ద్వారా వారి ఆదాయం పెరిగింది.
జోతేదారు విధానాన్ని మొత్తంగా రద్దు చేయకుండా దానిని పాలికాపుల ప్రయోజనాలకనుగుణంగా పెద్దఎత్తున సంస్కరించడం చాలా అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ. జోతేదార్లలో అన్ని సైజుల వారూ ఉన్నారు. చిన్న మధ్య తరహా జోతేదార్లు సంఖ్యరీత్యా చాలాఎక్కువ. అంతేగాక వారిలో చాలా మంది ధనిక, మధ్యతరగతి రైతులుగా వారి పొలాల్ని వారు సాగుచేసుకొనేవారు. వారిలో కొందరు గ్రామాలలో చిన్న షాపుల యజమానులు, పట్టణాలలో నగరాలలో ఉపాధ్యాయులు, గుమాస్తాలు, చప్రాసీలు. కాబట్టి సామాజిక రాజకీయశక్తిగా ఎక్కువ వ్యవసాయోత్సత్తి పట్ల ఆసక్తిగల వాళ్లను పూర్తిగా విస్మరించడం లేక వ్యతిరేకుల్ని చేసుకోవడం సరియైన చర్య కాదు. పంటలో వారి భాగాన్ని తగ్గించి పాలికాపులు శాశ్వతంగా వారి పొలాల్ని చేసుకొనడానికి అవకాశం కల్పించి జోతేదార్ల ఆదాయాన్ని పరిమితం చేయవచ్చు. వారి పంట భాగం, భూమిపై యాజమాన్యం పూర్తిగా రద్దు చేయబడకూడదు. ఎన్నికలు విస్తృతమైన సంకీర్ణం ద్వారా అంటే విస్తృతమైన రాజకీయ మద్దతు ప్రాతిపదికపై గెలవవచ్చు. ధనిక మధ్యతరగతి రైతులుగా, చిన్నషాపుల యజమానులుగా గ్రామీణ సెక్షన్లో గణనీయ సెక్షన్‌గా ఉన్న జోతేదార్లను దూరం చేసుకోకూడదు. స్వతంత్రం తర్వాత భారతదేశం తే
వారిని వీరు పెద్ద సంఖ్యలో చిన్న రైతులను గ్రామీణ పట్టణ మధ్య తరగ సమీకరించగలరు. ప్రభావితం చేయగలరు. అందుకే పార్టీ అక్కడ య పెద్ద భూస్వాములను మాత్రమే శాశ్వత వర్గ శత్రువులుగా పరిగణించిం ల వటానికి జోతేదారు విధానాన్ని సంస్క్మరించటం, ఉత్పత్తి విధానాన్ని టటదంలో ప్రోత్సాహకంగా పనిచేసింది. హరితవిప్లవం, బహుళ పంటల విధానం ప సెరుగుదలకు సహాయక అంశంగా పని చేసింది. పాలికాపుల జోతేదార్ల ఆదాయం గుదలపై దారితీసింది. వ్యవసాయదారులుగా ఉన్న జోతేదార్లను ఉత్పత్తి ఎ న కేంద్రీకరించేలా చేసింది. మించి రాజకీయ, పాలనాపరమైన కారణాలరీత్యా సిపిఎం ప్రభుత్వం పరిమితి చేసే బినామీ పేర్లతో ఉన్న పొలాలను గుర్తించి వాటిని భూమి లేని పేదలకు ళ్ జరిగేలా కార్యక్రమం ఒక్కసారిగా గాక జాగ్రత్తగా చాలా సంవత్సరాల వ్యవ కోకుండా చేపట్టింది. పాలికాపులు, చిన్న రైతులు వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల సదుపాయం రక్షించేందుకు కౌలుదారీ భూసంస్క్మరణ చర్యలకు, తక్కువ వడ్డీకి రుణ కుల ద్వారా కల్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జాతీయం చేయబడిన రం కల్పించే సహకార బ్యాంకుల ద్వారా సబ్సిడీలను, తక్కువ వడ్డీరేట్లకు రుణ సదుపా తు సంఘాల పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను పంచాయతీలు, పొ ర్జీరె మబెంగాల్ సహకారంతో జయ్రదంగా అమలు జరిపిన కొద్ది రాష్ర్రాలలో పళ్చి ముందున్నది. వదల పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సాధించిన మరొక పెద్ద విజయం: గ్రామీణ రో మధ్యతరగతి రైతులు గ్రామీణ మేధావులు స్థానిక స్థాయి రాజరీయాధికాం, ణం భాగస్వామ్యం వహించటానికి వీలు పదేలా పంచాయతీరాజ్ సంస్థల్ని పునర్చిర్మా చేయడం. 1960ల నాటి పంచాయతీరాజ్ ప్రయోగం గ్రామ, తాలుకా, జిల్లా సంస్థలబై గ్రామీణ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా పైనున్న సెక్షన్ల, స్థానిక జిల్లాన్యాలూ అధికార వర్గం యొక్క ప్రాబల్యం కారణంగా దేశం మొత్తంలోలాగానే పశ్చిమబెంగా కూడా విఫలమయింది. సిపియం. ప్రభుత్వం పార్టీ పంచాయతీరాజ్ సంస్థలు- జిల్లా న్ధాయి డ్ పరిషత్‌ల నుండి బ్లాక్‌స్థాయి సమితుల నుండి గ్రామస్థాయి పంచాయతీల నుండి ద భూస్వాముల్ని ఇతర ప్రబలమైన సామాజిక (గ్రూపుల్ని తాలగించాయి. (గ్రామీణ పేదల్ని శ18 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దిగువ మధ్య తరగతుల వర్గాలను, ఉపాధ్యాయుల్ని ఇతర సామాజిక, రాజకీయ కార్యకర్తల్ని కలుపుకొన్నాయి. అధికార వర్గాన్ని వారి నియంత్రణ క్రిందికి తెచ్చాయి. వారి అధికారాన్ని ఆర్ధిక వనరుల్ని పటిష్టపరచాయి.
అంతేగాక సిపిఎం (ప్రభుత్వం భూమిలేని పేదల సామాజిక న్ఫితిని మెరుగుపరచేందుకు చాలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ఆర్థిక వనరులతో చేపట్టిన పేదరిక నిర్మూలన ఉపాధి కల్పనా పథకాల అమలులో నూటికి నూరుపాళ్లు చేసిందని చెప్పలేము కాని ఇతర రాష్ట్రాల కంటే మెరుగుగా అమలు జరిపింది.
ప్రత్యేకించి పనికి ఆహార పథకం భూమిలేని పేదలకు ఉపాధి కల్పించేందుకు సమర్థవంతంగా అమలు పరచింది. అంతేగాక రోడ్ల నిర్మాణం, (డ్రైనేజీ, గ్రామీణ నీటి పారుదల చెరువులను శుభ్రపరచడం లాంటి పథకాలు గ్రామీణ పేదల ప్రయోజనాల రీత్యా ఉపయోగకరమైనవి మాత్రమేగాక వాటిని సంస్కరించబడిన పంచాయతీరాజ్ సంస్థల ద్వారా అమలు పరచడం ద్వారా లంచగొండితనం అవకాశాలు పూర్తిగా
సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘాల నిర్మాణం వేగవంతం చేసింది. మెరుగైన వేతనాల కోసం (క్రమబద్ధంగా పోరాటాలు నిర్వహించింది. సంపన్న రైతుల నుండి భూమిని స్వాధీనం చేసుకొని వ్యవసాయ కార్మికులకు పంచి భూయాజమాన్యాన్ని సమానం చేయడంపై కేంద్రీకరించడం కంటె మెరుగైన వేతనాల కోసం వ్యవసాయ కార్మికుల పోరాటసటిమని పెంచటంపై కేంద్రీకరించింది. హరిత విప్లవం బహుళ పంటల విధాన విజయం 1980, 1990 దశాబ్దాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని పెంచింది. వారి వేతనాలను పెంచింది.
సిపిఎం ప్రభుత్వం రికార్డు స్థాయిలో మతతత్వ హింసని నిరోధించింది. ముస్లిం జనాభా నిష్పత్తి ఎక్కువైనప్పటికీ, తూర్పు బెంగాల్ నుండి వరదలా హిందూ కాందిశికులు వచ్చి చేరినప్పటికీ పశ్చిమ బెంగాల్లో మత హింస చెలరేగకుండా ప్రభుత్వం అద్దుకొన్నది. 1984లో ఇందిరాగాంధీ హత్య, 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంగం సందర్భాలలో మత హింస జరగకుండా నివారించింది. పశ్చిమ బెంగాల్లో సిపిఎం కులతత్వ పెరుగుదలను, కులపరమైన హింసని అనుమతించలేదు. స్వతం[త్రం తర్వాత భారతదేశం శ్తీేపే
1986లో ప్రత్యేక గుర్ధా రాష్ట్రం డిమాండుతో సుభాష్ ఘీసింగ్ నాయకత్వంలో గూర్ధా నేషనల్ లిబరేషన్ ఫ్రంటు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సమరశీలమై హింసాయుతమైన తిరుగుబాటు చేసింది. జియన్ యల్ యఫ్, కేంద్ర రాష ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా 1988 ఆగస్టులో కలకత్తాలో ైపాక్షిక ఒప్పందం కుదిరింది. పశ్చిమబెంగాల్లో ఒక మేరకు స్వయం ప్రతిపత్తిగల డార్జిలింగ్ కౌన్సిల్ ఉనికిలోకి వచ్చింది. కౌన్సిల్‌కు ఆర్థిక, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి పై విస్తృతమైన అదుపు లభించింది. మొత్తం మీద సిపిఎం పశ్చిమబెంగాల్లో (ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో నిగ్రహం గల కట్టుదిట్టమైన సాపేక్షికంగా హింసకు చోటులేని ప్రభుత్వాన్ని అందించడంలి జయ'్రదమయింది. ఇతర చిన్న వామపక్ష పార్టీలలో సిపిఐ రివల్యూషనరీ సోషలిస్తు పార్టీ, ఫార్వర్డ్ బ్లాకులతో మైత్రి కొనసాగించింది. దుర్భర పేదరికాన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆధిపత్య వర్గాల అణచివేతను ఒక మేరకు తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల సంపన్నుల చేతుల్లో పనిముట్లుగా, గ్రామీణ పేదల అణచివేతదారులుగా దోపిడీదారులుగా పనిచేస్తున్న పోలీసుల దిగువస్థాయి ఉద్యోగుల పాత్రని అదుపు చేసింది. పశ్చిమబెంగాల్లో గ్రామీణ పేదల మద్దతు కారణంగానే సిపిఎం అధికారంలో వుండగలిగింది. సమస్యల ప్రాంతాలు పట్టణ పారిశ్రామికాభివృద్ధి రంగాలలో సిపిఎం కొంత బలహీనంగా ఉంది. (గ్రామీణ ప్రాంతాలలోలాగా పౌర సమస్యలపై పట్టణ ప్రజల జోక్యాన్ని పెంచి, వాటి పరిష్కారానికి అనువైన వేదికలను రూపొందించలేకపోయింది. నగరాలలో పంచాయతీరాజ్ నమూనాలేదు. 1977కి ముందు సిపిఎం మెరుగైన కూలీరేట్ల వేతనాల కొరకు రవాణా సౌకర్యాల కొరకు పట్టణ ప్రజల పోరాటాలను నిర్వహించింది. ఈ పోరాటాలు సిపిఎం పాలనలో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఫలితంగా కాం(గెసు పాలనలో మొదలైన పట్టణ (ప్రజల మౌలిక వసతుల, జీవన స్టాయి క్షీణత సిపిఎం పాలనలో కొనసాగింది. కాని సి.పి.యం. ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన బలహీనత: దేశం మొత్తంగాక ఒక రాష్ట్రం కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న పరిస్థితిలో ఆర్థికాభివృద్ధికి పారి(శ్రామికీకరణకు పెద్దఎత్తున ఉద్యోగాల సృష్టికి ఎలాంటి సిద్ధాంతం వ్యూహం లేకపోవడం వలన వాణిజ్యం పరిశ్రమల్ని అభివృద్ధి పరచలేకపోవటం. వేగవంతమైన 420 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పారిశ్రామికీకరణ, గణనీయమైన ఆర్థికాభివృద్ధి ఫలితంగా పరిశ్రమలు వాణిజ్యం సేవలలో ఉద్యోగాల సృష్టి జరగకుండా పేదరిక నిర్మూలన జరగదు. భూమిలేని గ్రామీణ పేదల జీవన పరిస్థితులలో దీర్ణక్షాలిక మెరుగుదల సాధ్యపడదు. పెద్ద ఎత్తున సంపద పునః ఎంపకం జరగదు. పెరుగుతున్న గ్రామీణ పట్టణ నిరుద్యోగాన్ని అద్దుకొనడం జరుగదు. స పశ్చిమ బెంగాల్‌లోని [గ్రామీణ జనాభాలో దాదాపు సగం మంది భూమిలేని మదలు, చిన్న రైతులు. వీరిని గణనీయమైన స్థాయిలో వ్యవసాయంలో ఇముడ్చుకొనడం సాధ్యపడదు. ఈ ఆర్థికాభివృద్ధి ఏవిధంగా ప్రభుత్వం పాలక పార్టీ యొక్క సోషలిస్టు విధానంలో విలీనం చేయబడాలి? ఈ ప్రశ్చకు జవాబు కనుగొనడానికి సిపిఎం ప్రయత్నించలేదు.
1967-75 కాలంలో పాలనాపరమైన అస్తవ్యస్తత, ఘెరావ్‌లు, బంద్‌లు, థామికుల సమరశీలత- కారణంగా పశ్చిమబెంగాల్ నుండి పెద్దఎత్తున పెట్టుబడి తరలించబడింది. 1977లో అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎం పెట్టుబడి సమస్యపై ఆచరణాత్మక వైఖరిని చేపట్టింది. (శ్రామిక పోరాటాలను అదుపు చేసింది. కొద్ది సంవత్సరాలలో పళ్చిమ బెంగాల్లో ఇతర రాష్ర్రాల కంటె ఎక్కువ పారిశ్రామిక శాంతి నెలకొన్నది. సిపిఎం ఆధ్వర్యంలో బెంగాల్లో శాంతిభద్రతలు రికార్డు స్థాయిలో పరిరక్షించబడ్డాయి. (ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో పెట్టుబడులు పెట్టవలసిందిగా దేశ విదేశీ పెట్టుబడిదారుల్ని కోరుతూ అనేక ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. కాని పెట్టుబడిదారులు స్పందించలేదు.
పని సంస్కృతి, జవాబుదారీతనం కొరవడడం వలన పెట్టుబడిదారులు పశ్చిమబెంగాల్‌కు దూరమవుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. కాని పెద్ద పెట్టుబడిదారులు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు పార్టీని నమ్మేందుకు సిద్ధపదరు. చిరుతపులి మచ్చలపై ముసుగు కప్పగలదు; కాని స్వభావాన్ని మార్పుకోలేదు- ఇదీ కమ్యూనిస్టు పార్టీ పట్ల వారి వైఖరి. సమస్య తొలగని సమస్య- పెట్టుబడిదారీ విధానం రద్దుకు నిబద్ధమై వున్న పార్టీ దేశంలోని ఒక రాష్ట్రంలో పాక్షికంగా పరిమితమైన అధికారం పొందింది. ఈ ఇబ్బందిని పార్టీ ముందుగా అంచనావేసి వుండవలసింది.
సమన్య యొక్క జటిలతని గుర్తించడంలో సిపిఎం వివలమయింది. పశ్చిమబెంగాల్లో వారు పాలిస్తున్న పరిస్థితుల కనుగుణమైన పరిష్కారాలకు ముందుగా అన్వేషించి వుండవలసింది. అలా అన్వేషించక పోవటానికి కారణాలున్నాయి. పా ర్దీ స్వతంత్రం తర్వాత భారతదేశం శ21
వరిపాలన ఎక్కువకాలం కొనసాగదని, కేంద్ర ప్రభుత్వం తమ (ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని భావించింది. కొద్దికాలం పాటు వుండే అధికారాన్ని ప్రజలకు విప్లవ శక్తులకు పోలీసులు అధికార వర్గం పట్ల ఉండే భయం నుండి విముక్తుల్ని చేయటొనికీ ఉపయోగించాలనుకున్నది.
పశ్చిమబెంగాల్, కేరళ భారతదేశంలోని ఇతర (ప్రాంతాలు తమని అందుకొనే వరకు నిరీక్షించవలసిన న్థావరాలుగా భావించింది. సామాజికొభివృద్ధి ఆర్థికాభివృద్ధి అభిలభారత విప్లవం వరకు నిరీక్షించాలని భావించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంటీ జ్యోతిబసు 1985లోనే చెప్పినట్లు “మా కార్యక్రమాల లక్ష్యం గ్రామీణ పట్టణ పేదల బాధల్ని తగ్గించటం, వారి పరిస్థితుల్ని ఒక మేరకు మెరుగుపరచటం. సామాజిక ఆర్థిక వ్యవస్థలో నిర్మాణపరమైన మార్పులు జరుగకుండా ప్రజల స్థితిగతులలో మౌలిక మార్పు తీసుకొని రావడం అసాధ్యం.” మరొక విధంగా చెప్పాలంటే సామాజిక ఆర్థికాభివృద్ధి పశ్చిమ బెంగాల్‌లోని సిపిఎం అజండాలో లేదు.
తన పరిపాలన దశాబ్దాలపాటు కొనసాగితే అది పట్టణాల క్షీణత గ్రామీణ పేదరికం, నగరాలలో పట్టణాలలో విద్యావంతుల, భూమిలేని గ్రామీణ పేదలలో పెరుగుతున్న నిరుద్యోగం లాంటి సమస్యల్ని పరిష్కరించవలసి వుంటుందని అంచనొ వేయలేకపోయింది. అందుకు ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పెట్టుబడిదారులపై ఆధారపడడం సాధ్యపడని పరిస్థితులలో సాధించాలి. కాబట్టి నిజమైన సమస్య చిన్న మధ్య తరహా పెట్టుబడిదారుల సహకారంతో రాష్త్ర సహకార సెక్టొక ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యూహాన్ని రూపొందించడంలో పార్టీ విఫలమవడం.
పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ప్రజాస్వామ్య రాజకీయ చట్రంలో సిపిఎం 1964 నుండి ఒక రాజకీయ పార్టీగా పని చేస్తున్నది. 1977 నుండి పళ్చిమ బెంగాల్లో అధికారంలో కొనసాగుతున్నది. 1957 నుండి మధ్య కొన్ని అంతరాలతో కేరళలోనూ అధికారంలో వుంది. అది బూర్డువా ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని వంచనగాొ పరిగణించడం లేదు. రాజ్యాంగానికి దానిలో పొందుపరచిన ప్రాథమిక హక్కులకు ప్రజాస్వామ్య సంస్థలకు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల దాడులనుండి రక్షణగా నిలుస్తుంది. ప్రస్తుత ప్రజాస్వామ్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయబడాలని శ22 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వాదిస్తుంది. అందుకే దాని రాజకీయ దృక్పథం సోషల్ డెమోక్రాట్లు లేక సంస్మరణ వాద దృక్పథమని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త అతుల్ కోస్తా వర్ణించాడు.
సిపిఎంకి సంస్కరణవాదం లేక సోషల్ డెమోక్రటిక్ దృక్పథం ఆచరణలో సిద్ధించింది గాని సైద్ధాంతికపరంగా కాదు. అందుకే పార్టీ రాజకీయ ఆచరణల ప్రాతిపదికన ముందుకు పోవడాన్ని సైద్ధాంతికంగా విశ్లేషించేందుకు నిరాకరించింది.
సిపిఎం పార్టీ యొక్క క్రమశిక్షణాయుత ప్రజాస్వామ్య కేంద్రీకృత పార్టీ నిర్మాణం రాజ్యహింసని తట్టుకోడానికి, రాజకీయాధికారాన్ని సాధించడానికి, ఒక మేరకు తన వ్యవసాయ విధానాలను అమలు జరుపడానికి తోద్బడింది. కాని స్పష్టంగా ఈ పార్టీ నిర్మాణం ఇప్పుడు అవరోధమయింది. తమ పనులు చేయించుకొనడానికి (ప్రజలు పార్టీపై ఆధారపడే విధానాన్ని ప్రోత్సహించింది. అధికారం హక్కుతో పార్టీ (శ్రేణులు, పంచాయతీ నాయకులు, కార్మిక సంఘ నాయకులు తమ స్వప్రయోజనాలను పెంచుకోవడం మొదలయింది.
వర్గ దృక్పథం, పేద ప్రజలకనుకూలమైన దిశానిర్దేశం క్రమశిక్షణయుతమైన పార్టీ నిర్మాణం పశ్చిమ బెంగాల్లో సిపిఎంని అధికారంలోకి తెచ్చాయి. పేద ప్రజలకనుకూలమైన చాలా చర్యల్ని చేపట్టేలా చేశాయి. కాని సిద్ధాంతపరంగా, సంస్థాపరంగా కొత్తమార్చులు తీసుకొని రావడంలోని ప్రభుత్వ వైఫల్యం దాని స్తబ్ధతకు దారి తీసింది. పెరుగుతున్న నిరుద్యోగాన్ని. నగర క్షీణతని, రాష్ర్రాన్ని అభివృద్ధి పరచడంలోని వైఫల్యం ఫలితంగా సిపిఎం దాని మిత్రపక్షాలు నగరాలలో ప్రశ్యేకించి కలకత్తాలో మద్దతు కోల్పోతున్నాయి. మద్దతులోని ఈ తగ్గుదల ఇప్పుడు గొమీణ ప్రాంతాలలో వ్యాపిస్తున్నది. ఆపరేషన్ బారా భూసంస్కరణలు ఇతర అభివృద్ధికరమైన చర్యలు (ప్రజల స్మృతిపథం నుండి తొలగిపోవడం ప్రారంభమయింది. సరియైన ప్రత్యామ్నాయం లేకపోవడం వలన, పార్టీ పట్ల పేద ప్రజల విధేయత కొనసాగుతుండడం వలన చాలా సంవత్సరాలుగా సిపిఎం ఎన్నికలలో విజయాలు సాధిస్తూ వచ్చింది. కాని ఆ పార్టీకి గల మద్దతుని క్రమంగా తగ్గించడంలో ప్రతిపక్షం విజయవంతమవుతూ ఉంది. స్వతంత్రం తర్వాత భారతదేశం త్న23
పశ్చిమబెంగాల్లో సిపిఎంకి మంచి భవిష్యత్తు లేదని చెప్పలేము. సాధారణ (ప్రజలలో ప్రత్యేకించి గ్రామీణ పేదలలో ఆ పార్టీకి వున్న విస్తృత ప్రజాదరణ, విధేయత నిబద్ధతగల పార్టీ కార్యకర్తల మద్దతుదారుల బలమైన పునాదితో సైద్ధాంతికంగా రాజకీయంగా పెద్ద ముందడుగు వేసే అవకాశం వుంది. అలా వేయగలుగుతుందా లేదా- అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాని పశ్చిమబెంగాలులోను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను దాని భవిష్యత్తు ఈ ఘటనపైననే ఆధారపడి ఉంది. కాశ్మీరు సమస్య భారత పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించినంత వరకు కాళ్ళీరు లొంగని ఒక కొలిక్కిరాని సమస్య. భారతదేశంలో కాళ్ళీరు విలీనాన్ని కోరే శక్తుల, వేర్పాటు కోరే శక్తుల మధ్య నిరంతర ఘర్షణ కారణంగా భారతదేశానికి కాశ్మీరు నిరంతర అంతర్గత సమస్య అయింది. కాశ్మీర్ భారతదేశ సెక్యులరిజానికి సంకేతమూ, పరీక్షా అయింది. 1947లో కాళ్ళీర్ పాకిస్తాన్లో విలీనానికి అంగీకరించి వుంటే భారత ప్రజలు అంతగా గందర గోళపడకుండా ఆమోదించి వుండేవారు. కాని కాళ్ళీరుపై పఠాన్ తెగల ప్రజల దాడి, ప్రజాదరణ గల నాయకుడు పేక్ అబ్బుల్లా ప్రజల్ని ఒప్పించిన మీదట జమ్మూకాళ్ళీర్ భారతదేశంలో విలీనానికి సమ్మతించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. కాళ్ళీర్ ముస్లిం మెజారిటీ రాష్ట్రం గనుక తనకే దక్కాలన్నది పాకిస్తాన్. ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించని సెక్యులర్ భారతదేశానికి ఇది అంగీకారయోగ్యం కాదు. కాళ్ళీరు సమస్య భారతదేశానికి తనకి చెందిన చిన్న భూభాగాన్ని సంరక్షించుకొనే సమస్య మాత్రమే కాదు. భారతదేశం సమాజం యొక్క మౌలిక స్వభావానికి సంబంధించిన సమస్య, నెహ్రూ, ఇతర నాయకులు గుర్తించినట్లు కాళ్ళ్మీరుని భారతదేశం నుండి విడగొట్టడం భారతదేశ సెక్యులరిజానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మతప్రాతిపదికన కాళ్మీర్ని భారతదేశం నుండి విడిపోవడానికి అనుమతిస్తే ద్విజాతి సిద్ధాంతానికి ప్రామాణికత సిద్ధిస్తుంది. ఇది భారతదేశంలోని మతతత్వ శక్తులకు బలాన్ని చేకూరుస్తుంది. పాకిస్తాన్లో కంటే సంఖ్య రీత్యా ఎక్కువగా ఉన్న భారతదేశంలోని ముస్లింలను ప్రమాదపుటంచులకు నెట్టి వేసినట్లవుకుంది. ఈ పరిస్థితిని విజ్ఞానవంతులైన విదేశీయులు న. బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కూడా గుర్తించారు. ఉదాహరణకు: భారత పాకిస్తాన్‌లపై ఐక్యరాజ్య సమితి నియమించిన కమిషన్ సభ్యుడు జోసెఫ్ కార్చిల్ 1954 లో ఇలా రాశాడు :
“ఇంత కఠినత్వానికి, రక్తపాతానికి, విషం గక్కే మాటలకు కాళ్ళీరు సమస్యగా రూపుదిద్దుకొన్న అయిష్టతకు అనంగీకారానికి గల అసలైన కారణం బహుశా రాజీపడని రాజీపడదానికి వీలు పడని రెండు జీవన విధానాలు, రెండు రాజకీయ నిర్మాణాల భావనల, విలువలను కొలిచే రెండు వేర్వేరు ప్రమాణాల, రెండు ఆధ్యాత్మిక వైఖరుల మధ్య పోరాటం. ఈ పోరాటానికి కాళ్ళీరు సంకేతమూ రణరంగమూ.”
1947 అక్టోబరులో కాళ్ళీరు విలీనం తరువాత భారతదేశం దానిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో కాళ్ళీరులో ప్లెబిసైటు నిర్వహణ ప్రతిపాదన చేసింది. కాని అందుకు ఒక షరతు విధించింది. ప్లెైబిసైటు నిర్వహణకు ముందు పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీరు నుండి వైదొలగాలి. పెబిసైటుకి సరియైన పరిస్థితులు కల్పించబడితే దాని ఫలితాలకు కట్టుబడి వుండేందుకు భారతదేశం 1958 సంవత్సరాంతం వరకు సిద్ధంగా ఉంది. కాని ఆక్రమిత కాశ్మీరు నుండి పాకిస్తాన్ సైన్యాల్ని ఉపసంహరించు కొనకపోవడం వలన, భారత పాకిస్తాన్ సంబంధాలపై ప్రచ్చన్న యుద్ధ మేఘాలు ఆవరించడం వలన ప్లెబిసైటు నిర్వహణ సాధ్యపడలేదు. 1953-54లో అమెరికా పాకిస్తాన్‌తో మిలిటరీ ఒప్పందం చేసుకొన్నది. ఇది పగ ప్రతీకారం ప్రాతిపదికగల పాకిస్తాన్ యొక్క సమాధాన పడని దుందుడుకు వాద వైఖరిని ప్రోత్సహించింది.
భారతదేశం అంతకుముందు చేసిన ప్రతిపాదనకు కాలం చెల్లిపోయేంతగా కాళ్ళీరు పరిస్థితిలో, భారత పాక్ సంబంధాలలో మార్పులు వచ్చాయని, భారతదేశంలో కాళ్ళీరు విలీనం పరిష్కరింపబడిన సమస్యయని, 1956 సంవత్సరాంతానికి భారతదేశం పాకిస్తాన్‌కి, అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. అప్పటి నుండి భారతదేశానికి సంబంధించినంత వరకు కాళ్ళీరు తిరగతోడడానికి వీలుపడని నిశ్చితమైన వాస్తవం. కాని అలా బాహాటంగా చెప్పకుండా నెహ్రూ ఆయన వారసులు యథాతథస్థితిని అంటే యుద్ధ విరమణ రేఖ లేక నియంత్రణ రేఖని శాశ్వత అంతర్జాతీయ సరిహద్దుగా ఆమోదిస్తూ వచ్చారు. స్వతంత్రం తర్వాత భారతదేశం శ్త2గ్
జమ్మూ కాళ్షీర్కి ప్రత్యేక ప్రతిపత్తి
1947 అక్టోబరులో సంతకాలు చేసిన విలీన పత్రాన్ని అనుసరించి భారత రాజ్యాంగం యొక్క 870 ఆర్టికల్ ప్రకారం ఇండియన్ యూనియన్‌లో జమ్మూ కాళ్ళీరుకి తాత్మాలిక ప్రత్యేక ప్రతిపత్తి మంజూరు చేయబడింది. రాష్ట్రం రక్షణ, విదేశీ వ్యవహారాలు సమాచార బాధ్యతలను భారత యూనియన్‌కి అప్పగించి మిగిలిన అన్ని అంశాలలో స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకొన్నది. రాష్ట్రం రాజ్యాంగ పరిషత్‌ని, తన స్వంత రాజ్యాంగాన్ని తన స్వంత రాజ్యాధినేతని, తన స్వంత జెండాని నిలబెట్టుకొనేందుకు అనుమతించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా పిలువబడతాడు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రాష్ట్రానికి వర్తించవు. అలాగే ఈ రాష్ట్రం సుప్రీం కోర్టు, ఆడిటర్ జనరల్స్ ఎలక్షన్ కమిషన్ల అధికార పరిధిలో ఉండదు. ఆర్టికల్ 870 భారత యూనియన్‌లో రాష్ట్రం చేరికకు గాక కేంద్రంతో రాష్ట్ర సంబంధాలకు వర్తిస్తుంది. విలీనం ఇప్పటికే జరిగిపోయింది.
1956లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ భారతదేశంలో రాష్ట్ర విలీనాన్ని 'ధ్రువపరిచింది. కాలం గడిచే కొద్దీ రాష్ట్ర ప్రత్యేక స్థాయి గణనీయంగా మార్చబడింది. దాదాపు రద్దు చేయబడింది. సుప్రీంకోర్టు ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్ లాంటి భారత యూనియన్ సంస్థల అధికార పరిధి, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రాష్ట్రానికి విస్తరించాయి. రాష్ట్రం కౌరకు చట్టాలు చేసే పార్లమెంటు అధికారం, రాష్ట్రపతి పాలన విధించడంతో నవా రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రవతి అధికారం కూడా విస్తరించబడ్దాయి. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, కేంద్ర, అఖిల భారత సర్వీసులలో విలీనం చేయబడ్డాయి. సాదర్-ఇ-రియాసత్ని గవర్నరుగా, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిగొ పరిభాష కూడా మార్చబడింది.
రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని తగ్గించడం పట్ల కాళ్ళీరీలలోని గణనీయమైన సెక్షన్ నిరసించింది. మరొక వైవు 370 ఆర్టికల్ రాష్ట్రంలోని జమ్మూ ప్రాంతంలో ప్రభుత్వ సర్వీసులలో జమ్మూకి ఎక్కువ వాటా కావాలని, జమ్మూ ప్రాంతాన్ని కాళ్ళీర్ నుండి విడగొట్టాలని కోరుతున్న బలమైన ఉద్యమానికి జన్మనిచ్చింది. మతపరంగా రాష్ట్రం చీల్చబడుతుందని ఆందోళన కలిగించే విధంగా ఉద్యమం మతం రంగుని పులుముకొన్నది. కాశ్మీర్లో ముస్లింలు మెజారిటీ. జమ్మూలో హిందువులు మెజారిటీ. 426 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జమ్మూలో ఉద్యమం ఆ తరువాత జన సంఘంలో విలీనమైన జమ్మూ ప్రజాపరిషత్ నాయకత్వంలో సాగింది. జన సంఘ ఉద్యమాన్ని అఖిల భారత స్థాయికి పెంచింది. దురదృష్టవశాత్తు జనసంఘ అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీరు జైలులో గుండె జబ్బుతో 1951 జూన్ 23న మరణించాడు. ఆయన ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లఘించి కాళ్ళీరు వెళ్లాడు. జమ్మూలోని ప్రజాపరిషత్ ఆందోళన కారణంగా కాళ్ళీరులోని ఉద్యమం పాకిస్తాన్ అనుకూల మతతత్వ శక్తుల చేతుల్లోకి పోయింది. అది భారతదేశ సెక్యులర్ ప్రతిష్టని దిగజార్చింది. కాళ్ళీరుపై భారతదేశ వాదనని బలహీనపరిచింది. భారత సెక్యులరిజం బలంపై అబ్బుల్లాలో సందేహాలను రేకెత్తించింది. అబ్బుల్లా రాజకీయాలు కాళ్ళీర్కి సంబంధించినంత వరకు భారతదేశ అంతర్గత సమస్యలు అబ్బుల్లాతో ప్రారంభమయ్యాయి. షేక్ అబ్బుల్లా ధైర్యవంతుడు, వ్యక్తిగత నిజాయితీ గలవాడు, ప్రజాదరణ పొందిన నాయకుడు. అదే సమయంలో ఒక మేరకు నిరంకుశ భావాలు గలవాడు. మొండిఘటం. పాకిస్తాన్లో విలీనాన్ని కోరుతున్న కాశ్మీరు లోయలోని మతతత్వ శక్తుల ఒత్తిడికి, భారతదేశంలో పూర్తిగా కలిసిపోవాలని కోరుతున్న జమ్మూలోని మతతత్వ శక్తుల ఒత్తిడికి లోనైన అబ్బుల్లా ప్రత్యేకత దిశగా దారి తప్పటం ప్రారంభించాడు. మతతత్వవాదుల బలాన్ని భారతదేశ సెక్యులరిజం బలహీనతని- అతిశయించి చెపుతూ భారతదేశంలో విఖీనత యొక్క పరిమిత స్వభావాన్ని రాష్ట్రం యొక్క పూర్తి స్వయం ప్రతిపత్తిని గురించి చెప్పటం ప్రారంభించాడు. అతడు అమెరికా, ఇతర విదేశ శక్తుల సహాయంతో కాళ్మీర్ స్వతంత్రం సాధించవచ్చునని సూచించాడు. కాశ్మీరు ముస్లింలలో మతపరమైన భావాలను కూడా కదపడానికి ప్రయత్నించాడు. సంయమనం పాటించమని నెహ్రూ సూచించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. 1953 జులైలో అబ్బుల్లో కాళ్ళీర్ స్వతంత్ర రాజ్యం కావాలని బాహాటంగా డిమాండు చేశాడు. మంట్రివర్గ సహచరులలోని అత్యధికులు అతడి ఈ రాజకీయ నూతన వైఖరిని వ్యతిరేకించారు. అతడిని లంచగొండితనం, తప్పుడు విధానాలు, విధ్వంసం, (ప్రమాదకరమైన విదేశీ సంబంధాల- ఆరోపణలపై పదవి నుండి తొలగించవలసిందిగా సాదర్-ఇ-రియాసత్ని అర్ధించారు. ఫలితంగా అబ్బుల్లా పదవీ బ్రష్పుడయ్యాడు. బక్షీ గులాం మహమ్మద్ నూతన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. నూతన ప్రభుత్వం అబ్బుల్లాని నిర్చంధించింది. కాని కాళ్ళీర్ ప్రజల దృష్టిలో అబ్బుల్లా గొప్ప నాయకుడు. పరిస్థితులలో వచ్చిన మార్చు స్వతంత్రం తర్వాత భారతదేశం త్త27
పట్ల నెహ్రూ కలత చెందాడు. కాని రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. అబ్బుల్లా రాజకీయ జీవితం కాళ్ళీరుతో పెనవైచుక పోయింది. 1950 నుండి ఆయన జీవితం 1982లో చనిపోయేవరకు ఎన్నో ఎగుడు దిగుళ్లకు ఆటుపోట్లకు గురయింది. నెహ్రూ ఒత్తిడి మేరకు 1958 జనవరి 8న విడుదల చేయబడ్డారు. కొని అతడు విభజన మతపరమైన భావాల ప్రచారం కారణంగా మూడు నెలలకే అలెగ్ప చేయబడ్డాడు. నెహ్రూ మరలా 1964 ఏప్రిల్‌లో అబ్బుల్లాను విడుదల చేయించాడు. కొని అబ్బుల్లా భారతదేశంలో కాశ్మీరు విలీనం పూర్తిగా పరిష్టరింపబడలేదని, కాళ్ళీరు స్వయం నిర్ణయాధికారం కొరకు తన పోరాటం కొనసాగిస్తానని ప్రకటిస్తూ వచ్చాడు. పాకిస్తాన్లో విలీనానికి కూడా అబ్బుల్లా వ్యతిరేకి గనుక మౌల్వీఫరూక్, అవామీ యాక్షన్ కమిటీల నాయకత్వంలోని పాకిస్తాన్ అనుకూల రాజకీయ (గ్రూవులు కూడా అతడిని వ్యతిరేకించాయి. అబ్బుల్లా గృహ నిర్బంధంలో వుంచబడ్డాడు. అతని స్వేచ్చ 1965 మే నుండి హరింపబడింది. 1968 మేలో నిర్బంధాలు రద్దు చేయబడ్డాయి. బక్స్నీ గులాం అహమ్మద్ పాలనలో లంచగొండితనం విస్తరించింది. పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. అతడి తరువాత జి.యం.సాదిక్ ఆ తరువాత మీర్ ఖాసిం ముఖ్యమంత్రులయ్యారు. వారు వ్యక్తిగత నిజాయితీపరులేగాని సమర్థులైన పాలకులుగారు. నిపుణులైన రాజకీయవేత్తలు కారు. పాకిస్తాన్ అనుకూల శక్తులు బలహీనంగా ఉన్నప్పటికీ వీరి పాలనలో ప్రభుత్వం ప్రజారంజకం కాలేకపోయింది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం, పాకిస్తాన్ విభజన కాళ్ళీరుపై గణనీయమైన ప్రభావం చూపాయి. పాకిస్తాన్ అనుకూల అవామీ యాక్షన్ కమిటీ వేర్పాటువాదం పైబిసైటు ఫ్రంటు తీవ్రమైన రాజకీయ కుదుపుకి గురయ్యాయి. అబ్బుల్లా ఆలోచనా విధానంలో మార్చు వచ్చింది. పునరాలోచించాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి చేపట్టాడు. అందుకు తగినట్లుగా ఇందిరాగాంధీ స్నేహహస్తం చాచింది. అబ్బుల్లాటై గల నిర్చంధాలను రద్దు చేసింది. చర్చలు ప్రారంభించింది. అబ్బుల్లా స్వయం నిర్ణయాధికారం లేక ప్లైబిసైటు సమస్యని (వ్రస్తావించకుండా వుండేందుకు అంగీకరించాడు. భారత యూనియన్‌లో కాళ్ళీరుకు ఎక్కువ స్వయం ప్రతిపత్తికి తన డిమాంద్లని పరిమితం చేస్తానన్నాడు. అబ్బుల్లా 1975 ఫిబ్రవరిలో మరొకసారి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యాడు. 1977 జులై మధ్యంతర ఎన్నికలలో శ2ర్ర బిపన్‌చంద్ర, మృదుల ముఖద్దీ, ఆదిత్య ముఖర్జీ
గెలిచాడు. 1982లో అతడు చనిపోగానే అతడి కుమారుడు ఫరూక్ అబ్బుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. ఫరూక్ అబ్బుల్లా విద్రోహం, టెర్రరిజం
1982 నుండి రాష్ట్రం ఎక్కువ కాలం ఫరూక్ అబ్బుల్లా పాలనలో ఉంది. లేదా రాష్ట్రపతి పాలనలో ఉంది. 1983 జులై మధ్యంతర ఎన్నికలలో ఫరూక్ మంచి మెజారిటీతో గెలిచాడు. కాని అతడికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు పెరిగాయి. 1984 జులైలో ఫరూక్ బావ జి.యం.షా నేషనల్ కాన్ఫరెన్సు పార్టీని చీల్చాడు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ జగ్ మోహన్ ఫరూక్. ముఖ్యమంత్రిత్వాన్ని రద్దు చేసి జి.యం.షాని ముఖ్యమంత్రి చేశాడు.
జి.యం.షా లంచగొండి, అసమర్జుడు. కాశ్మీరు పండితులపై దాడులను నియంత్రించడంలో విఫలమయ్యాడు. 1986 మార్చిలో అతడి ప్రభుత్వం రద్దు చేయబడింది. రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ తరువాత 1987 ప్రారంభంలో రాజీవ్‌గాంధీ ఫరూక్ అబ్బుల్లాతో ఎన్నికల ఒప్పందానికి వచ్చాడు. కాని ఎన్నికలలో గెలిచిన అబ్బుల్లాకు రాష్ట్రాన్ని రాజకీయంగా పాలనాపరంగా నియంత్రించడం సాధ్యపడలేదు. రాష్ట్రంలో వేర్పాటువాద ఉద్యమం ఊపందుకొన్నది. పొజిబుల్ ముజాహిద్దీన్ ఇతర మత సాంప్రదాయ వాద గ్రూపులు, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంటు నాయకత్వంలోని పాకిస్తాన్ అనుకూల గ్రూపులు హింసాయుత ఆందోళనలకు సాయుధ తిరుగుబాటుకి దిగాయి. ఈ గ్రూపులన్నింటికి పాకిస్తాన్ ఆర్థికం సమకూర్చింది. శిక్షణ ఇచ్చింది. ఆయుధాలు సమకూర్చింది. ఈ గ్రూపులు కిద్నాపులు, హత్యలు చేశాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని చిత్ర హింసలకు గురి చేశాయి. పోలీసుస్టేషన్లపై ప్రభుత్వ ఆతీసులపై ఇతర ప్రభుత్వ భవనాలపై దాడులు చేశాయి. కాళ్ళీరు పండితులపైన కూడా దాడులు చేశాయి. వారు ఇళ్ళు వదిలి జమ్మూ, ఢిల్లీలలోని శరణార్జుల శిబిరాలకు తరలి వెళ్లవలసి వచ్చింది. అదుపు తప్పిన అబ్బుల్లా ప్రభుత్వాన్ని రద్దు చేసి వి.పి. సింగ్ రాష్ట్రపతి పాలన విధించాడు. కాని ఫరూక్ అబ్బుల్లా 1996 ఎన్నికలలో గెలిచి మరలా అధికారం లోనికి వచ్చాడు.
రాష్ట్ర ప్రజలపై ముజాపొద్దీన్, జి.కె.యల్.యఫ్లు సాగించిన టెర్రరిస్టు కార్యకలాపాల కారణంగా ఇటీవలి కాలంలో ఆల్ పార్టీ హురియత్ (విముక్తి) కాన్ఫరెన్స్, స్వతంత్రం తర్వాత భారతదేశం 429
కాశ్మీరు స్వతంత్రాన్ని కోరుతున్న జి.కె.యల్.యఫ్, పాకిస్తాన్ అనుకూల ముజాపొద్దీనులు బలహీనపడ్డాయి. కాని పాకిస్తాన్ ప్రోత్సాహంతో నిర్వహించబడుతున్న టెర్రరిజం జమ్మూ కాళ్ళీరులోని సాధారణ రాజకీయాలకు ప్రమాదకారిగా కొనసాగుతున్నది. మార్గాంతరం
1950 దశాబ్దం (ప్రారంభం నుండి కాళ్ళీర్ పలు పెద్ద సమస్యలతో అస్తవ్యస్త పరిస్థితులలోకి నెట్టివేయబడింది. జమ్మూ కాళ్ళీరు ప్రజలు రాష్ట పాలకులకు భారతీ దేశానికి దూరమయ్యారు. రాష్ట్రంలో మంచి పరిపాలన లేదు. ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖలు అవినీతి ఆశ్రిత పక్షపాతంలో కూరుకుపోయాయి. 1952లో ప్రారంభమైన మొదటి ఎన్నికల నుండి రిగ్గింగు ఇతర ఎన్నికల అక్రమాలు సర్వసామాన్యమయ్యాయి. ప్రజలకు ఎన్నికల క్రమం, రాజకీయ విధానం యొక్క న్యాయబద్ధతపై విశ్వాసం సదలింది. ఫలితంగా రాజ్యాంగేతర పద్ధతుల్ని ఆశ్రయించటానికి వెనుకాడలేదు. కాలక్రమంలో పాకిస్తాన్ ప్రోత్సాహిత తిరుగుబాటు, టెర్రరిజం పెరిగాయి. పాకిస్తాన్ బెదిరింపులు, విద్రోహం కారణంగా కాశ్మీరులో సైన్యం నిర్వహించవలసిన పాత్ర పెరిగింది.
కాశ్మీరులో పెరిగిన అస్థిరత కారణంగా కేంద్రం జోక్యం పెరిగింది. ప్రభుత్వాలను రద్దు చేయటం, ఒక జట్టు అసమర్ధ లంచగొండి మంత్రులను తొలగించి మరొక జట్టు అసమర్ధ లంచగొండి మంత్రులను నియమించడం, రాష్ట్రపతి పాలన రుద్దటం లాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం మాటి మాటికీ జోక్యం చేసుకొన్నది. ఫలితంగా రాష్ట్ర 'ప్రజలు కేంద్రం మద్దతులో పాలన సాగించే పాలకుల్ని కీలుబొమ్మలుగా, గవర్చర్లను కేంద్ర ప్రభుత్వ ఏజంట్లుగాను పరిగణించారు. 430 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ర. జ అష పంజాబ్ సంక్షోభం
1980లలో పంజాబును ప్రత్యేకవాద ఉద్యమం ఆవహించింది. అది తీవ్రవాద పచార రూపం తీసుకొన్నది. దీనినే ఒకరు భారతదేశంలో జరుగుతున్న యుద్ధమని ప్రమాదకరమైన సంక్షోభమని వర్ణించాడు.
ఈ సమస్యకి మూలం 20వ శతాబ్దంలో ప్రత్యేకించి 1947 నుండి పంజాబులో మతతత్వ వాదం పెరుగుదలలో వుంది. 1980 తరువాత తీవ్రవాదంగా, ప్రత్యేకవాదంగా, టెర్రరిజంగా విస్పోటనం చెందింది. 1947కి ముందు పంజాబులో ముస్లిం, హిందూ, సిక్కు మతతత్వవాదాలు- పరస్పరం ఘర్షణ పడ్డాయి. కొన్ని సందర్భాలలో (తరచుగా) హిందూ సిక్కు మతతత్వవాదాలు కలిసికట్టుగా ముస్లిం మతతత్వవాదాన్ని ఎదుర్శొన్నాయి. 1947 ఆగస్టు తరువాత పంజాబు నుండి ముస్లిం మతతత్వవాదం అదృశ్వమయింది. హిందూ సిక్కు మతతత్వవాదాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పురికొల్పబడ్డాయి.
మొదటి నుండి అకాలీనాయకత్వం అన్ని దశలలో సిక్కు మతతత్వవా దాన్ని సంఘటితపరచే కొన్ని మతతత్వవాద అంశాలను అనుసరించాయి. అవి 1966కి ముందు అభివృద్ధి పరచబడ్డాయి. గనుక ప్రస్తుత పంజాబీ మాట్లాడే పంజాబు రాష్ట్రం సృష్టించబడింది.
సిక్కు మతంలో మతం రాజకీయాలు కలగలసి వుంటాయి కనుక రాజకీయాల్ని మతం నుండి విడదీయడం సాధ్యపడదని, అకాలీలు సెక్యులర్ రాజకీయ ఆదర్శాన్ని తిరస్మరించారు. అకాలీదళ్ సిక్కు పంత్ యొక్క ఏకైక ప్రతినిధి అని చెప్పుకొన్నారు. సిక్కు మతం, సిక్కులందరి యొక్క రాజకీయ ఇతర సెక్యులర్ ప్రయోజనాల కలయికగా సిక్కు పంత్ నిర్వహించబడింది. స్వతంత్రం తర్వాత భారతదేశం శత్రికే
సిక్కులు నిరంతరం వివక్ష అణచివేత, పీడన, అవమానం, కక్షసాధింపు చర్యలకు గురిచేయబడుతున్నారని అకాలీలు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా అన్ని రకొల కుట్రలు జరుగుతున్నా హిందువులు సిక్కులపై ఆధిపత్యం చెలాయించే, వారిపై (బ్రాహ్మణ నిరంకుశత్వాన్ని రుద్దే, సిక్కు గుర్తింపుకు ప్రమాదం తెచ్చిపెట్టే పథకాలు రూపొందించారు. సిక్కులకు వ్యతిరేకంగా బ్రాహ్మణ కుట్రకు ఢిల్లీ నుండి పరిపొలన సాగిస్తున్న కాంట! 'హిందూ' నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గనుక అకాలీల ఆగ్రహానికి నెహ్రూ, కాంలో లక్ష్యమయ్యారు. 1940ల నాటి ముస్లిం లీగు నినాదాన్ని అందిపుచ్చుకొని అకాలీలు 'సిక్కమతం ప్రమాదంలో పడిందని నినాదం ఇచ్చారు. కేవలం అకాలీ తీవ్రవాదులేగొ క్క మతపరమైన అభియోగాలు చేయడంలో మితవాదులు అంతగా వెనుకబడలేదు. అంచేగొకీ కాలగమనంలో తీవ్రవాదుల ప్రభావం పెరుగుతూ వచ్చింది. మితవాద అకాలీలు కూొదొ తీవ్రవాదుల్ని విమర్శించలేదు. కనీసం తమకు వారితో సంబంధం లేదని ప్రకటించలేదు. ఉదాహరణకు; అకాలీదళ్ అలాగే సిక్కుగురుద్వారా ప్రబంధక్ కమిటీ (50?6)పై ప్రాబల్యం సాధించిన మాస్టర్ తారాసింగ్ 1958లో ఆలిండియా అకాలీదళ్ సదస్సుని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా చెప్పాడు: “ఇంగ్లీషు వాడు వెళ్లిపోయాడు. కాని మనకు స్వాతంత్ర రాలేదు. మనకు స్వతంత్రం అంటే యజమాని మార్పు మాత్రమే. తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు. (ప్రజాస్వామ్యం సెక్యులరిజం ముసుగులో మన స్వేచ్చ స్వతం(ం అణచివేయబడుతున్నాయి.”
వారి బాధలు అణచివేత పీడనలకు పంజాబ్ రాష్ట్రాన్ని నిరాకరించడం తప్ప మరే ఇతర కారణమూ చూపలేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో సిక్కులపై వివక్ష చూపారని చేసిన నిర్ధిష్టమైన ఆరోపణ నిరాధారమైనదని 1961లో నెహ్రూ నియమించిన కమిటీ స్పష్టం చేసింది. భారతదేశ జనాభాలో సిక్కులు కేవలం 2 శాతమే అయినప్పటికీ భారతే పైన్యంలో వారు 20 శాతం ఉన్నారు. భారత ్రభుత్వ పరిపాలనా సర్వీసులలో వారి దామాషాకు రెట్టింపు వున్నారు. పంజాబులో కూడా సర్వీసులలో, చట్టసభలలో ౩ మంత్రివర్గంలో కాంగ్రెస్ సంస్థలో - అన్నింటిలో వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ ఉన్నారు అని రాజకీయ శాస్త్రవేత్త బలదేవ్‌రాజ్ నాయర్ స్పష్టం చేశాడు.
ఈ కాలంలో అకాలీ రాజకీయాలలో గమనించదగిన అంశం : మత సంస్థల్ని మతవరమైన నంకేతాల్ని ప్రజలలో మతపరమైన ఉధదిక్తతని పెంచటానికి ఉపయోగించుకున్నారు. 700కి పైగా గల సిక్కు గురుద్వారాలపై నియంత్రణ గల శ్తత్ర2 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
యస్జిపిసిని సిక్కులు అకాలీ రాజకీయాల్ని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకొన్నారు. ప్రత్యేకించి అమృత్సర్ స్వర్ణదేవాలయాన్ని నిరంతరంగా అందుకే ఉపయోగించుకొన్నారు. దేవలయ్ రాజకీయాలలో ముఠాతత్వం పెరిగింది. గురుద్వారాలపై, స్వర్ణ పై నియంత్రణ కొరకు వివిధ అకాలీగ్రూపుల మధ్య పోటీ, శత్రుత్వం పెరిగాయి. పోటీ స్పర్ధల కారణంగా వారి డిమాంద్లు నిరంతరంగా పెరిగాయి. మితవాద [గ్రూపులు కూడా తీవ్రవాద గ్రూపుల, కొత్తగా ఆవిర్భవించిన గ్రూపుల ఒత్తిడికి లొంగిపోయాయి. నెహ్రూ కాలంలో పంజాబులో హిందూ మతతత్వవాదం కూడా చాలా చురుకుగా ఉంది. సిక్కు మతతత్వవాదమంత దూకుడుగా లేనప్పటికి అది కూడా మతతత్వవాదానికి (శుతి కలుపుతూనే ఉంది. పంజాబ్ సమస్యకి సెక్యులర్ స్పందన 1966 వరకు పంజాబులో మతతత్వ రాజకీయాలు రెండు పెద్ద సమస్యల చుట్టూ తిరగటాన్ని గురించి చర్చించటానికి ముందు పంజాబు మతతత్వవాద సమస్య పట్ల సెక్యులర్ పార్టీలు ఎలా స్పందించాయో సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ఇంతకుముందు ప్రస్తావించినట్లు మతతత్వ ఆందోళనలు- వారి డిమాండ్ల వ్యవహారంలో నెహ్రూ కూదా ప్రాథమిక నియమాలను పాటించాడు. అవి: వేర్పాటువాద ధోరణులుంటేగాని: హొంసకు దిగితేగాని, మతతత్వవాద డిమాండ్లతో ఉద్యమం చేపడితేగాని వాటికి బాధ్యులైన నాయకులతో చర్చలు జరపకూడదు. వారి డిమాండ్లు ఆమోదించకూడదు. మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలోని అక్షాలీ తరహా ఉద్యమంతో సహా మతతత్వవాదం యొక్క ఫాసిస్టు స్వభావం పట్ల నెహ్రూకి సరియైన అవగాహన వుంది. అదే సమయంలో మైనారిటీల భావాలను పరిగణనలోకి తీసుకొని స్పందించే స్వభావం గల నెహ్రూ వీలైనంతవరకు అకాలీల సెక్యులర్ డిమాండ్లను ఆమోదించడం ద్వారా వారిని సమాధానపరచ యత్నించాడు. అకాలీలు మతతత్వ వాద స్వభావాన్ని వదులుకొనడానికి అంగీకరించిన కారణంగా నెహ్రూ అకాలీదళ్‌తో వచ్చిన ఒప్పందాలపై రెండుసార్లు 1948, 1956లలో సంతకాలు చేశారు. కాని పంజాబులో మతతత్వవాద పెరుగుదలను నిరోధించడంలో ఈ సర్దుబాటు వైఖరి విఫలమయింది. త్వరలో కొత్త నాయకులు ముందుకు వచ్చారు. చాలా తీవ్రవాద సైద్దాంతిక రాజకీయ 'ప్రొతిపదికన కొత్త డిమాండ్ల జాబితాలను రూపొందించి అకాలీదళ్‌ని పునరుజ్జీవింపజేశారు. అదే స్వతంత్రం తర్వాత భారతదేశం శీరితి
సమయంలో అకాలీలతో కాంగ్రెసు సర్దుబాటు వైఖరి హిందూ మతతత్వ శక్తులు బలపడేలా చేసింది.
హిందూ, సిక్కు మతతత్వవాదాలతో దృధంగా వ్యవహరిస్తున్న పంజాబు ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ కైరాన్కి నెహ్రూ పూర్తి మద్దతు ఇచ్చాడు. కాని నెహ్రూగాని కైరాన్గాని విస్తృత సైద్దాంతిక ప్రచారం ద్వారా మతతత్వాన్ని అదుపు చేసేందుకు- అలా చేయడం అంత కష్టం కాని సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
అవిభక్త కమ్యూనిస్టు పార్టీ పంజాబులో బలంగా ఉంది. సెక్యులరిజానికి బలమైన శక్తి. అది కూడా 1950లలో హిందూ, సిక్కు మతతత్వవాదాలను సైద్ధాంతికంగా రాజకీయంగా వ్యతిరేకించింది. కాని 1964 తరువాత సిపిఐ, సిపిఎంలు ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు అకాలీదళ్‌తో మైత్రి నెరిపాయి. ఆ విధంగా అకాలీదళ్ రాజకీయాలకు న్యాయబద్ధత కల్పించాయి. 1947 తరువాత మతతత్వవాద మూలాలు
వాటంతట అవి సెక్యులర్ స్వభావం కలిగినవైనప్పటికీ, సిక్కు హిందూ మతతత్వవాదులచే మతతత్వమయం చేయబడిన రెండు పెద్ద సమస్యలు 1966 వరకు పంజాబు రాజకీయాలపై ప్రాబల్యం వహించాయి. మొదటి సమస్య: రాష్ట్ర భౌ షకి సంబంధించినది. ద్విభాషా రాష్ట్రమైన పంజాబులో పాలనా భాషగా పాఠశాల భాషగా ఏది ఉండాలి? హిందూ మతతత్వవాదులు ఈ స్థాయి హిందీకి దక్కాలన్నారు. సిక్కు మతతత్వవాదులు ఇది గురుముఖి లిపిలో ఉన్న పంజాబీకి దక్కాలన్నారు. పంజాబుని పంజాబీ, హిందూ భాషా ప్రాంతాలుగా విభజించి ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కాని పంజాబీ భాషా ప్రాంతంలో జిల్లా పరిపాలన కొరకు మాత్రమే పంజాబీ అధికార భాషగా చేయబడింది గనుక హిందూ మతతత్వవాదులు హిందీతోపొటు పంజాబీని పాఠశాల భాషగా చేయటాన్ని వ్యతిరేకించారు. పంజాబీ భాష లిపి అంతకంటె వివాదాస్పదమైన సమస్య. సంప్రదాయంగా శతాబ్దాల తరబడి పంజాబీ ఉర్దూ, గురుముఖి, దేవనాగరి లిపులలో వ్రాయబడింది. కాని పంజావీని ఉమ్మడి సాంస్కృతిక నేపథ్యం నుండి వేరు చేసి అకాలీలు గురుముఖి మాత్రమే పంజాబీ లిపిగా వుంచాలని డిమాండు చేశారు. గురుముఖితో పాటు దేవనాగరి కూడా ఉపయోగింపబడాలని హిందూ మత సంస్థలు పట్టుబట్టాయి. సిక్కు హిందూ మత సంస్థలు సమస్యకి మతం రంగుని పులిమాయి. = శ్వత్రిడ్ష బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రెండవ సమస్య : పంజాబీ సుబ- 1955లో రాష్ట్ర పునర్నిర్మాణ కమిషన్ (ఎస్.ఆర్.పి) నియమింపబడినపుడు అకాలీదళ్, సిపిఐ, చాలామంది కాంగ్రెస్ వాదులు, పంజాబీ మేధావులు భాష ప్రాతిపదికన రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని డిమాండు చేశారు. ఇది పంజాబీ మాట్లాడే పంజాబు, హిందీ మాట్లాడే హర్యానా రాష్ట్రాల ఏర్పాటుకి దారి తీస్తుంది. హిందీ, పంజాబీల మధ్య పెద్ద తేడా లేదనే కారణంతో యస్.ఆర్.సి. ఈ డిమాండ్లని త్రోసిపుచ్చింది. బేరసారాల పిదప 1956లో అకాలీదళ్‌కి భారత ప్రభుత్వానికి మధ్య వచ్చిన ఒప్పందం పంజాబ్, పెప్సు (0£250)ల విలీనానికి దారి తీసింది.
కాని మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ పంజాబీ సుబ ఏర్పాటు డిమాందుపై శక్తివంతమైన ఆందోళన నిర్వహించింది. అకాలీదళ్ తన డిమాండుకు మతపరమైన రంగుని పులుముతూ, డిమాందుని నిరాకరించడం అంటే సిక్కులకు వ్యతిరేకంగా వివక్ష చూపడమేనని ఆరోపించింది. జనాభా ఆధిక్యత కారణంగా రాజకీయపరమైన, మతపరమైన ప్రాబల్యం వహించగల సిక్కులకు వారి స్వంత రాష్ట్రం కావాలని అకాలీదళ్ వాదించింది. అది సిక్కుల ఆధిపత్యాన్ని సిక్కు మత ప్రభుత్వాన్ని పంజాబుపై బలవంతంగా రుద్దడానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే కారణం రీత్యా జనసంఘ, ఇతర హిందూ మత సంస్తలు, వ్యక్తులు ఈ డిమాండుని వ్యతిరేకించారు. రాష్ట్రంలోని పంజాబీ మాట్లాడే ప్రాంతంలో హిందువుల మాతృభాష పంజాబీ అనడాన్ని నిరాకరించి, 1961 జనగణనలో వారిని హిందీ మాట్లాదేవారిగా నమోదు చేయించుకోవాలని కోరారు.
అత్యధికంగా భూమిలేని వ్యవసాయ కూలీలుగా వున్న మజ్హబి సిక్కులుగా పిలువబడే హరిజన సిక్కులు తమ వర్గ వ్యతిరేకులు సంపన్న రైతులయిన జాట్ సిక్కులు అకాలీదళ్‌కి ప్రధానమైన మద్దతుదారులు గనుక కొత్త రాష్ట్రం వారి ఆధిపత్యంలో వుంటుందని భయపడి పంజాబీ సుబ డిమాండుని వ్యతిరేకించారు.
నెహ్రూ పంజాబీ సుబ డిమాండుని దాని వెనుక వున్న మతతత్వ కారణాల రీత్యా అంగీకరించ నిరాకరించాడు. మతతత్వ డిమాండుని అంగీకరించటం రాజ్యం సమాజం యొక్క సెక్యులర్ నిర్మాణానికి ప్రమాదకరమని భావించాడు. హిందువులలోని పెద్ద విభాగంతోపాటు ప్రముఖ సిక్కు కాంగ్రెస్ నాయకులు ఫ్రతాప్సింగ్ క్రైరాన్, దర్చారా సింగ్ కూడా వ్యతిరేకించారు. నెహ్రూ కూడా న్యాయసమ్మతమైనదైతే ప్రత్యేకించి సెక్యులర్ ప్రాతిపదికన సిపిఐ, పియస్‌పి ఇంకా పలువురు మేధావులు మద్దతిచ్చి వుంటే 1960 నాటికి భారతదేశంలో ఇతర ప్రాంతాలన్నీ భాషాప్రాతిపదికన రాహ్ష్రైల పునర్నిర్మాణం జదిపించినట్లే పంజాబీ సుబని అంగీకరించి ఉండేవారు. స్వతం(్రం తర్వాత భారతదేశం శ్తీస్గ్
కాని నెహ్రూ పాటించిన ప్రమాణాలననుసరించి పంజాబీ సుబ ప్పూటుకు తరువాత రెండు పరిణామాలు మార్గాన్ని సుగమం చేశాయి. మొదటిది: యన్. బిపిని నుండి అకాలీదళ్ నాయకత్వం నుండి మాస్టర్ తారాసింన్ని తొలగించిన సంత్ ఫలేసింగ్ పంజాబీ సుబ డిమాందు పూర్తిగా భాషాప్రాతిపదికన చేస్తున్న డిమాందేనని ప్రకటించాడు.
రెండవది : హర్యానాలోని పెద్ద రాజకీయ సామాజిక సంస్థలు హిందీ మాట్లాడే ప్రజల ప్రత్యేక రాష్ట్రాల కొరకు డిమాండు చేశారు. కాంగ్రా ప్రజలు హిమాచలప్రదేశ్లో విలీనాన్ని కోరారు. ఫలితంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1966 మార్చిలో పంజాబు రెండు రాష్ట్రాలుగా విభజింపబడుతుందని ప్రకటించింది. పంజాబీ మాట్లాడే పంజాబ్, హిందీ మాట్లాడే హర్యానా, కాంగ్రా హిమాచల్‌ప్రదేశ్‌లో కలుపబడుతుంది.
కాని చండీఘర్ ఎవరికి చెందాలి? అనే ప్రశ్న మిగిలి ఉంది. ఈ సమస్యని పరిష్కరించేందుకు ఇందిరాగాంధీ పంజాబు సరిహద్దు కమిషన్ని నియమించింది. కమిషన్$ అప్పగించిన పరిశీలనాంశాలను ఇరుపక్షాలు అంగీకరించాయి. పరిసర ప్రాంతాలతో సవా చండీఘర్ హర్యానాకి చెందాలని కమిషన్ నిర్ణయించింది. కమిషన్ తీర్పుని అకాలీదళ్ అంగీకరించలేదు. అకాలీలను అసంతృప్తి పరచడం ఇష్టంలేని ఇందిరాగాంధీ చండీఘర్ని కేంద్రపాలితంగా ప్రకటించి, అది పంజాబు, హర్యానాలకు రాజధానిగా వుంటుందని ప్రకటించింది. అకాలీదళ్ అసంతృప్తితో 1966 నవంబరులో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయబడగానే చండీఘర్ని పంజాబులో చేర్చాలని పెద్ద ఆందోళన చేపట్టింది. కాని కొద్దికాలం తరువాత అకాలీదళ్ నాయకత్వం సమస్యని ప్రధానమంత్రికి వదిలిపెట్టి, ఆమె నిర్ణయానికీ కట్టుబడి ఉండాలని అంగీకరించింది. మరొకమారు ఇందిరాగాంధీ అకాలీల ఒత్తిడికీ లౌంగి చండీఘర్ని పంజాబుకి ఇచ్చివేస్తూ, హిందూ మెజారిటీ గల రెండు తహసీళ్లను (సబ్ డివిజన్లను) ఫజిల్మా అబోహర్లను హర్యానాకి అప్పగించింది. అకాలీదళ్ రెండు తహసీళ్ళ బదిలీని కూడా అంగీకరించ నిరాకరించడంతో ఈ నిర్ణయం కూడా అమలు జరుపబడలేదు.
పంజాబు సుబ డిమాండుని అంగీకరించడం సరియైన చర్యే. కాని దానిని పంజాబు సమస్యకి పరిష్కారంగా భావించకూడదు. అసలు సమస్యకి మూలం మతతత్వం. కాబట్టి మతతత్వాన్ని నిర్మూలించకపోతే సమస్య అలాగే వుంటుంది. కొత్త రూపొలు తీసుకోవచ్చు. ఉృతిగ్ర బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అకాలీ రాజకీయాలు, సమరశీలత
పంజాబీ సుబ ఏర్పాటుతో అకాలీదళ్ సంవత్సరాల తరబడి ప్రస్తావించి ఆందోళనలు జరిపిన నిర్దిష్టమైన పెద్ద డిమాండ్లన్నీ అంగీకరించబడ్డాయి : అమలు జరుపబడ్డాయి. అనుచరుల్ని ఉత్సాహపరచగల ఉద్రిక్తపరచగల సమస్యలేమీ లేవు. కాబట్టి అకాలీదళ్‌కి ఇప్పుడు రాజకీయంగా ఎటుపోవాలి?- అనే సమస్య ఎదురయింది. మతతత్వ రాజకీయాల్ని వదిలిపెట్టి పూర్తిగా మతపరమైన సామాజిక సంస్థగా చేయడంగాని సెక్యులర్ పార్టీగా ప్రనిచేయడంగాని అకాలీ నాయకులకి ఇష్టం లేదు. కాబట్టి అకాలీ మతతత్వ వాదం 1937 తరువాత ముస్లిం లీగు లాగానే వేర్పాటు దిశగా ముందుకు సాగింది. మెజారిటీ మతతత్వవాదం యొక్క తర్మం ఫాసిజం లాగానే డిమాంద్లన్నీ పరిష్మరింపబడిన తరువాత మైనారిటీ మతతత్వ వాదం యొక్క తర్మం వేర్పాటు వాదం అవుతుంది.
మరొక సమస్య ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికల ద్వారా అధికారం సాధించడం. కొత్తగా ఏర్పడిన పంజాబీ సుబలో కూడా అకాలీదళ్ 1967, ఆ తరువాత ఎన్నికలలో మెజారిటీ సాధించలేకపోయింది. అందుకు కారణాలు: మొదటిది పంజాబు జనాభాలో సిక్కులు 60 శాతంలోపుగానే ఉన్నారు. రెండవది: సిక్కు జనాభాలో 25 నుండి 80 శాతంగా వున్న షెడ్యూల్డు కులాల సిక్కులకు అకాలీదళీకి ప్రధానమైన సామాజిక పునాదిగా వున్న సంపద మధ్య తరగతి రైతులతో వర్గ వైరుధ్యం వుంది. కాబట్టి వారు 1980 వరకు కాంగ్రెస్‌కి కమ్యూనిస్టులకు ఓట్లు వేశారు. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది సిక్కులు కేవలం మతంపరంగా ఓట్లు వేయలేదు. తరచుగా మెజారిటీ సిక్కులు కాంగ్రెస్‌కి కమ్యూనిస్టులకు ఓటు చేశారు.
1952 నుండి 1980 వరకూ అకాలీదళ్‌కి సిక్కు ఓట్లలో 35 నుండి 45 శాతం వచ్చాయి. 1967లో అకాలీదళ్ జనసంఘం మైత్రితో ప్రభుత్వం వర్చరచింది. జనసంఘ పాందూ మతతత్వ పార్టీ. పంజాబీ సుబ డిమాండుని వ్యతిరేకించిన పార్టీ. అకాలీదళ్ 1977లో జనతాపార్దీతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. జనతా పార్టీలో జనసంఘ పెద్ద విభాగంగా ఉంది. అకాలీదళ్ అత్యంత సమరశీల మతతత్వ ఉద్యమాన్ని చేపట్టడానికి ముందు 1980లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో అది మొత్తం ఓట్లలో 26.9 శాతం ఓట్లు తెచ్చుకొన్నది. అంటే సిక్కులలో 50 శాతానికి తక్కువే అకాలీదళ్‌కి ఓట్లు వేశారు. మెజారిటీ సిక్కులు అకాలీ రాజకీయాలను సిద్ధాంతాన్ని తిరస్కరించారు. స్వతంత్రం తర్వాత భారతదేశం త్తి?
1980 ఎన్నికలలో ఓడిపోయి, సిక్కులలో వారి మద్దతు పునాదిని విస్తరించు కొనేందుకు అకాలీలు వారి రాజకీయాలలో మతతత్వ అంశాల్ని తీవ్రతరం చేయడం ప్రారంభించారు. నిరంతరం వారి డిమాండ్ల జాబితాని పెంచుతూ వచ్చారు. మితవాదుల నబడేవారు అతివాదుల అడుగుజాడలలో నడిచారు. 1981లో సంత్లాంగోవాల్ నాయకత్వంలోని అకాలీదళ్ పంజాబ్, హర్యానా, రాజస్టాన్ల మధ్య పంజాబు నదీ జలాల విభజనతో సహ చంఢీఘర్ని పంజాబుకి మార్చే సమస్యతో సహ 45 మతపరమైన, రాజకీయ, ఆర్థిక, సామాజిక డిమాండ్ల జాబితాను ప్రధానమంత్రికి సమర్పించింది. సమస్యలతో పెద్ద ప్రచారం చేపట్టింది. ఆ వెంటనే 1973లో ఆమాదించిన ఆఅనందపూర్ సాహిబ్ తీర్మానం అమలు అత్యంత (ప్రధానమైన డిమాండు అయింది. పలు రకాలుగా వ్యాఖ్యానం చేయబడిన ఈ తీర్మానం మతతత్వ వేర్పాటువాద పూరితమైనది.
అదే సమయంలో పైన చర్చించిన మతతత్వ అంశాలన్నింటిని అకాలీదళ్ చాలా దూకుడుగా చేపట్టింది. మతాన్ని సమీకరణ సాధనంగా బాహాటంగా ఉపయోగించుకొన్నది. అకాలీ ఉద్యమాలన్నింటికి గురుద్వారాలు కేంద్రాలయ్యాయి.
1947 నుండి అకాలీల మతతత్వవాద రాజకీయాల తర్కం వేర్చాటువాదం, సర్వసత్తాక మత రాజ్యం కొరకు డిమాండు. 1981 తరువాత టెర్రరిస్టులు ఈ విధానం యొక్క తార్మిక ముగింపు సాధించే ప్రయత్నాలు చేపట్టారు. హింస మార్దాంతరంగొ కనిపించింది. సమరశీల ఉద్యమాలు నిరుపయోగమైనప్పుడు, పెద్ద ఎత్తున హింసా పద్ధతులు సాధ్యపడనప్పుడు టెర్రరిస్టు హింస ప్రత్యామ్నాయమయింది.
అకాలీల ఉద్దేశాన్ని అనుసరించి అకాలీల డిమాండ్లన్నీ సాధించబడాలి. అందుకు చర్చలు ఒక పోరాటం రూపం మాత్రమే. అంతేగాక అకాలీలు తరచుగా ఒక తీర్పుని లేక ఒప్పందాన్ని ఆమోదిస్తారు. ఆ తరువాత అది అనుకూలంగా లేకపోతే తిరస్కరిస్తారు. ఒకే డిమాండు సాధించుకొన్న తరువాత కొత్త డిమాండ్ల చుట్టూ కొత్త ఆందోళనలు చేపడతారు. వారితో వచ్చే ఒప్పందం స్వల్పకాలికమైన తాత్కాలికమైన విరామాన్ని ఇస్తుంది. వారి మౌలిక వైఖరి; పంజాబు సిక్కు రాష్ట్రం, అకాలీదళ్ సిక్కు పార్టీ గనుక అది రాజకీయ పద్ధతులకు, దేశ నిర్మాణానికి లేక ఇతర పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు లేక అంతర్రొఫ్ట విధానాల పరిష్కారం కొరకు వున్న ప్రజాస్వామ్య ఫెడరల్ యంత్రాంగం- అన్నిటికీ ఆకతీతమైనది.
438 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పంజాబులో టెర్రరిజం
అకాలీ సమరశీలతకు సమాంతరంగా 1947 నుండి మతతత్వ రాజకీయాలకు, పంజాబు కాంగైస్ నాయకత్వం- ప్రత్యేకించి 1970 దశాబ్దం ప్రారంభం నుండి మతతత్వవాదంతో అనుసరించిన సర్దుబాటు వైఖరికి పరాకాష్టగా టెర్రరిజం ముందుకు వచ్చింది. టెర్రరిజం ప్రారంభకుడు సంత్జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలా. అతడు 1970 దశాబ్దం చివరలో సంప్రదాయ సిక్కు మత ప్రచారకుడుగా అందరి దృష్టినాకర్షించాడు. అకాలీ దుందుడుకు తనాన్ని తగ్గించే లక్ష్యంతో జ్ఞానీ జైల్‌సింగ్ నాయకత్వంలో పంజాబు కాంగ్రెస్ ఖింద్రన్వాలా ప్రచారాన్ని లోపాయికారిగా ప్రోత్సహించింది. కాని భింద్రన్‌వాలా తనను 'ప్రోత్సహించినవారిపై భస్మాసుర హస్తం చాచాడు.
ఖింద్రన్వాలా, అఖిల భారత సిక్కు విద్యార్థి "ఫెడరేషన్ నాయకుడు అద్రిక్సింగ్ల టెర్రరిజం నిరంకార్ తెగ పెద్ద హత్యతో 1980 ఏప్రిల్ 24న ప్రారంభమయింది. ఆ తరువాత పలువురు నిరంకారీలు, అసంతృప్త అకాలీలు, కాంగ్రెస్ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. 1981 సెప్టెంబరులో భింద్రన్‌వాలా విమర్శకుడు ప్రముఖ వార్తా పత్రిక సంపాదకుడు లాలా జగత్నరేన్ హత్య చేయబద్దాదు. భింద్రన్ వాలాపై ప్రభుత్వం చర్య తీసుకోకుండా 1980లో కేంద్రంలో హోంమంత్రి అయిన జైల్‌సింగ్ రక్షణ కల్పించాడు. భింద్రన్‌వాలా తనను తాను రక్షించుకొనేందుకు 1982 జులైలో స్వర్ణదేవాలయ భవన సముదాయంలో వున్న గురునానక్ నివాసంలో ఆశ్రయం పొందాడు. అక్కడ వుంటూ పంజాబులో టెర్రరిస్టు కార్యకలాపాలు నిర్వహించాడు. పంజాబు రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా ఎదిగాడు.
1983 సెప్టెంబరు వరకు టెర్రరిస్టు హత్యలు నిరంకారీలకు, క్రిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు, భింద్రన్‌వాలాతో విభేదించే సిక్కులకు పరిమితమయ్యాయి. 198] వరకు ఖింద్రన్వాలా హిందువులకు, సంస్మరణవాద సిక్కులకు వ్యతిరేకంగా పొంసని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఆడియో కేసట్ల ద్వారా చేశారు.
కాని 1983 సెప్టెంబరు నుండి భింద్రన్‌వాలా టెర్రరిస్టు కార్యకలాపాలను ఉధ్భతం చేశాడు. పెద్దఎత్తున హిందువులపై విచక్షణారహితంగా హత్యాకాండ సాగించాడు. పంజాబు పరిపాలన, పోలీసులు దుర్చలమైన స్థితిలో వుండడం వలన కేంద్ర ప్రభుత్వం టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకొనేందుకు తటపటాయిస్తుండడం వలన శిక్షల స్వతంత్రం తర్వాత భారతదేశం త్షపఫి
భయం లేకుండా హత్యాకాండ జరిపించడం సాధ్యపడింది. అంతేకాక స్థానిక బ్యాంకుల ఆభరణాల షాపుల్ని, హోంగార్డుల ఆయుధాల్ని లూటీ చేయించాడు. నిరంకారీలను, ప్రభుల్వే ఉద్యోగులను హత్య చేయించాడు. స్వర్ణదేవాయలంలో ప్రార్ధనలు చేసి బయటికి వస్తున "సిక్కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.యస్.అల్వూల్ 1988 ఏప్రిల్‌లో హత్యే చేయబడ్డాడు. అప్పటి నుండి టెర్రరిస్టు కార్యకలాపాల ఉధృతి పెరిగింది. సిక్కులు హిందువుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భింద్రన్‌వాలా సిక్కుల సర్వసత్తాకాధికారం కొరకు భారత్ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపిచ్చాడు. భింద్రన్‌వాలా అరెస్టుకి భయపడి 1983 డిసెంబరులో సురక్షిత స్థావరమైన స్వర్ణ దేవాలయంలోని అకల్తళ్తీకి చేరాడు. దానిని ప్రధాన కేంద్రంగాను, ఆయుధాగారంగొను మార్చుకొన్నాడు. తన టెర్రరిస్టు అనుచరులకు ఆశ్రయం చేశాడు. అనుచరులలో అత్యధికులు నేరగాళ్లు, దొంగ రవాణాదారులు. భింధ్రన్వాలా పెద్దఎత్తున తేలికపాటి మరతుపాకులను ఇతర అధునాతన ఆయుధాలను ఆలయంలోకి చేరవేశాడు. స్టెన్గన్సు చేతి బాంబులు ఇతర ఆయుధాల తయారీకి వర్కు షాపుల్ని పెట్టాడు. అకల్ తల్త్లో ఆ పరిసర భవనాలలో కొత్తగా చేరిన వారికి ఆయుధ శిక్షణ ఇప్పించాడు. అక్కడ నుండి హంతక ముఠాలను పంపించాడు, హత్యలూ, లూటీలు నిర్వహించాడు. ఇంకా చాలా ఇతర గురుద్వారాలను కూడా టెర్రరిస్టు కార్యకలాపాల కేంద్రాలుగా స్థావరాలుగా ఉపయోగించుకొన్నాడు. భింధ్రన్ వాలా నాయకత్వంలో ఖలిస్తానీలు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు - ఏ పేరుతో పిలువబడినప్పటికీ వారంతా టెర్రరిజాన్ని క్రమంగా సాధారణ తిరుగుబాటుగొ: సాయుధ తిరుగుబాటుగా మార్చాలని ఆశించారు. వారు పంజాబు ప్రజలపై రాజకీయ సైద్ధాంతిక ప్రాబల్యం కొరకు పోరాడుతున్నారు. భారత ప్రభుత్వం పంజాబుని పరిపాలించజాలదని, కాబట్టి భారతదేశం నుండి వేరుపడడం సాధించదగిన లక్ష్యమని నిరూపించేందుకు అనుగుణంగా వారి కార్యకలాపాలన్నీ రూపొందించబడ్డాయి. పట్రికల వాళ్ళను న్యాయమూర్తులను హింసించడం, పోలీసు అధికారులను (వారి కుటుంబాలను): పోలీసులకు, పరిపాలనకు సహకరిస్తూన్నారని అనుమానమున్న వారిని చంపటం, వారు చెప్పినట్లు చేసి తీరాలని అధికారులకు ఆదేశాలు జారి చేయటం, సమాంతరంగా పన్నులు వసూలు చేయటం, తమకు ఆశయం కల్పించమని రైతులను నిర్బంధించటం, అప్పుడప్పుడూ చంపటం- లాంటి చర్యలన్నీ తమ కార్యకలాపాలకు సహకారం పొందేందుకుగాక తమకు భారతదేశాన్ని సవాలు చేసే శక్తి వుందని, తామే కానున్న పాలకులమని, పంజాబు ప్రజలను శడ0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నమ్మించేందుకు చేపట్టారు. ఈ లక్ష్యం సాధించేందుకు హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి వ్యత్యాసం పాటించలేదు. 1981 నుండి 1984 జూన్ 8 వరకు చంపబడిన వారిలో దాదాప్రు 55 శాతం మంది సిక్కులు ఉన్నారు. టెర్రరిస్పులు- అకాలీలు
టెర్రరిస్టుల పట్ల అకాలీ నాయకత్వం వైఖరి నిర్ధిష్టంగా లేదు. వారితో కలవకుండా, ఒక మేరకు ప్రతికూల వైఖరితో వుండి కూడా భయం కారణంగా మౌనంగా ఉండి పోయింది. మరొక వైపు ప్రయోజనకరమని లోపాయికారిగా మద్దకు ఇచ్చింది. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా స్పష్టమైన బాహాటమైన వైఖరి లేదు. వారి కార్యకలాపాల్ని విచక్షణారహితమైన హత్యాకాండని, భింద్రన్‌వాలా విషపూరిత ప్రచారాన్ని నిరంద్వంగా ఖండించలేదు. అంతేగాక మితవాద అకాలీ నాయకులు కూదా టెర్రరిస్టు కార్యకలాపాల ఆరోపణలున్న వారిని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సమర్ధించారు. టెర్రిస్టులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన ప్రతి నిర్ధిష్టమైన చర్యనీ ఖండించారు. భింద్రన్వాలాకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రభుత్వ చర్యనైనా ఆక్షేపించారు. ఉదాహరణకు: “సిక్కు సమాజమంతా ఖింద్రన్ వాలాను సమర్ధిస్తుందని” లాంగోవాల్ 1981లో చెప్పాడు. ఒకటీ అరా సందర్భాలలో అకాలీ నాయకులు వ్యక్తిగత హింసావాదాన్ని ఖండించారు. కాని సిక్కుల బెన్నత్యాన్ని తగ్గించడానికి హింసని ప్రేరేపిస్తున్నదని ప్రభుత్వాన్ని నిందించారు. టెర్రరిస్టులు గురుద్వారాలను స్వర్ణదేవాలయాన్ని ఆక్రమించి అపవిత్రం చేసినందుకు ఎలాంటి చర్యా తీసుకోలేదు. సిక్కు ప్రజానీకంపై తమ నాయకత్వం ప్రమాదంలో పడిందని భావించి ఖింద్రన్వాలాను అంటకాగ్ వుండేందుకు ప్రయత్నించారు. భింద్రన్‌వాలాతో పోటీ పడుతున్నట్లు డిమాండ్లు పెంచారు. ఇందిరాగాంధీ - టెర్రరిస్టులు
భారత రాజకీయాలకు ఎదురైన మతతత్వవాద ్రత్యేకవాద సవాలును సాహసోపేతంగా ఎదుర్కొనడానికి బదులుగా ఇందిరాగాంధీ అనిశ్చితకు అవకాశం ఇచ్చింది. ఆమె స్పందన ఆమె రాజకీయ వ్యవహార సరళికి భిన్నంగా సర్దుబాటు వైఖరికి ఎత్తుగడల విన్యాసానికి మధ్య ఊగిసలాడింది. ఆమె 1981 నుండి 1984 వరకు గల మూడు సుదీర్చ సంవత్సరాల కాలం పాటు టెర్రరిస్టు హత్యలకు వ్యతిరేకంగా కఠినమైన చర్య చేపట్టడానికి గాని సైద్ధాంతికంగా రాజకీయంగా తీవ్ర మతతత్వవాదంతో పోరాడేందుకుగాని మతతత్వ వ్యతిరేక ప్రచారం సమర్థవంతంగా నిర్వహించేందుకుగాని నిరాకరించింది. స్వతంథత్రం తర్వాత భారతదేశం జ్తేడ్తేక్షే
మైనారిటీ భావాల షట్ల శ్రద్ధ వహించడానికి, మైనారిటీ మతతత్వవాదాన్ని బుజ్జగించడానికి మధ్యగల మౌలికమైన వ్యత్యాసాన్ని ఆమె గుర్తించలేదు.
జియస్.తోహ్ర, ప్రకాష్‌సింగ్ బాదల్ హెచ్. యస్.లాంగోవాలాలతో ఇందిరాగాంధీ నిరంతరాయంగా చర్చలు జరిపింది. అకాలీల, టెర్రరిస్టుల బెదిరింపులకు లోబడి మతతత్వవాదం వేర్పాటు వాదం టె(ర్రరిజంలతో పోరాడేందుకు వ్యూవాోన్ని రూపొందించడంలో విఫలమయింది. హర్యానా, రాజస్థాన్ ప్రజల రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని విస్మరించి ఏకపక్షంగా అకాలీల డిమాండ్లను ఆమోదించడం సాధ్యపడదని గుర్తించలేదు.
ఇందిరాగాంధీ అనుసరించిన లొంగిపోయే విధానం యొక్క థఫలితం: వేర్పాటువాదులకు టెర్రరిస్టులకు అలాగే పంజాబు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించటం. టెర్రరిస్టు వ్యతిరేక ప్రచారాన్ని జయప్రదంగా నిర్వహించిన మాజీ పోలీసు డైరెక్టరు జనరల్ కె.పి. యస్.గిల్ ప్రస్తావించినట్లు రాజకీయ నాయకత్వంలోని బలహీనత రక్షణ దళాల్లోని గందరగోళం టెగ్రరిస్టుల్ని ఉత్తేజపరచినంతగా మరేదీ ఉత్తేజపరచదు.'
ఈ సందర్భంగా ప్రస్తావించవలసిన ముఖ్యమైన అంశం: స్పర్ణదేవాలయ ఆవరణలో 1983 మార్చిలో అట్వాల్ హత్య సమయంలో ప్రభుత్వం స్పందించడంలోని వైఫల్యం. ఇది పంజాబు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
1984లో పంజాబులోని పరిస్థితి త్వరితంగా క్షీణించింది. అకాలీల సమరశీలత అంగలపంగలతో పురోగమించింది. నాయకత్వం జూన్ ౩ నుండి సమరశీల ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. భింద్రన్‌వాలాతో సంఘీభావాన్ని బాహాటంగా ప్రకటించింది.
మరొక విశేషాంశం పంజాబు వ్యవహారాలలో పాకిస్తాన్ జోక్యం పెరగటం. భారతదేశానికి వ్యతిరేకంగా తక్కువస్థాయి యుద్ధం చేయటంలోని వ్యూహంలో భాగంగొ పాకిస్తాన్ శిక్షణ ఆయుధాలు, సైద్ధాంతిక బోధ, దాక్కానడానికి రక్షిత ప్రాంతాలు, టెగర్రరిస్తు సంస్థలకు మిలిటరీ మార్గదర్శకత్వం సమకూర్చటం ప్రారంభించింది. విదేశాలలో వున్న కొన్ని సిక్కు తీవ్రవాద గ్రూపులు డబ్బు, ఆయుధాలు సమకూర్చుతూ వేర్పాటు వాదాన్ని ప్రోత్సపించాయి.
టెర్రరిస్టు కార్యకలాపాలు పెరగడంతో 1984 జూన్ నాటికి పరిస్థితి పరాకాష్టకు చేరింది. పంజాబులో మొత్తం దేశంలో శాంతికి దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడిందనే శ్తశ2ై బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భావం ప్రబలింది. పంజాబులోని హిందువులలో భయాందోళనలు వ్యాపించాయి. పలువురు రాష్ట్రం వదలి వెళ్లిపోయారు. అధిక సంఖ్యలో గురుద్వారాలు కోటలుగా ఆయుధాగారాలుగా మార్చబడ్డాయి. స్పష్టంగా పంజాబులో తిరుగుబాటుకి సర్వం సిద్ధం చేయబడుతోంది. 'ప్రభుత్వం పరువు ప్రతిష్టలు ప్రజల విశ్వాసం కోల్పోతోంది.
ఈ స్థితిలో అత్యంత బాధాకరమైన అంశం: పంజాబులో హిందూ సిక్కు విభజన, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో హిందూ మతతత్వవాద వ్యాప్తి, ఫిబ్రవరిలో హిందూ సిక్కు ఘర్షణ చెలరేగినప్పుడు హర్యానా నుండి ఒక హెచ్చరిక వెలువడింది.
మే చివరి నాటికి టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన చర్యని ఇక ఏ మాత్రం వాయిదా వేయడం కుదరని పరిస్థితి వచ్చింది. స్వర్హ దేవాలయంలో, ఇతర గురుద్వారాలలో జొరబడి ఉంటున్న టెర్రరిస్టుల్ని బయటికి నెట్టివేసేందుకు ప్రబలమైన శక్తి అవసరం. భారత ప్రభుత్వం 'ఆపరేషన్ బ్లూస్టార్ మిలిటరీ చర్య చేపట్టింది. పరిస్థితి అంతగా దిగజారిన తరువాత మిలటరీ చర్యకి ప్రత్యామ్నాయం లేదు. పథకం అప్పటికప్పుడు రూపొందించి హడావిడిగా అమలు జరపబడింది. ఫలితంగా పథకాన్ని రూపొందించిన వారు ఊహించిన దానికంటె ఎక్కువ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది.
జూన్ ౩న సైన్యం స్వర్దదేవాలయాన్ని చుట్టుముట్టింది. జూన్ 5న దేవాలయంలో ప్రవేశించింది. అక్కడ ప్రభుత్వం అంచనాకి మించి టెర్రరిస్టులు సంఖ్యారీత్యా ఎక్కువ మంది వున్నారు. వారి వద్ద మంచి ఆయుధాలు వున్నాయి. శస్త్ర చికిత్స లాగొ ఒకటి రెండు గంటలలో పూర్తికాలేదు. మిలిటరీ చర్య చిన్న యుద్ధంగా మారింది. చివరలో సైన్యం టాంకుల్ని మోహరించవలసి వచ్చింది. బాధాకరమైన అంశం ఏమంటే వెయ్యి మందికిపైగా భక్తులు, ఆలయ సిబ్బంది ఆలయంలో చిక్కుకున్నారు. వారిలో చాలామంది చనిపోయారు. ఆలయ (ప్రాంగణంలోని చాలా భవనాలు దెబ్బతిన్నాయి. అకల్తళ్స్ పూర్తిగా నేలమట్టమయింది. సిక్కు గురుపీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడే హర్ మందిర్ సాహెబ్‌కి నష్టం కలగకుండా సైన్యం ప్రత్యేకమైన (శ్రద్ధ వహించినప్పటికీ గోడలకు తుపాకీ గుండ్ల తూట్లుపడ్డాయి. భింద్రన్‌వాలా, అతడి అనుచరులలో అనేకులు చనిపోయారు.
“ఆపరేషన్ బ్లూస్టార్ దేశ వ్యాప్తంగా గల సిక్కుల ఆగ్రవావేశాలను పెంచింది. అత్యధికులు దానిని ఖింద్రన్వాలాపై ఇతర టెర్రరిస్టులపై అనివార్యంగా చేపట్టవలసిన స్వతంత్రం తర్వాత భారతదేశం శీశప
చర్యగాగాక ధర్మోల్లంఘనగా, దైవదూషణగా, సిక్కు జాతికి జరిగిన అవమానంగా పరిగణించారు. ఆహరేషన్కి వచ్చిన ప్రతిస్పందన భావోద్రేకపరమైన విస్ఫోటనానికి ప్రాతినిధ్యం వహించింది. టాంకులతో భారీ ఎత్తున సైన్యాన్ని తరలించడం కంటే ప్రత్యామ్నాయ మార్గం అనుసరించి వుండవలసిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అందుకు ఉదాహరణగా, 1984లో లాగానే స్వర్ణదేవాలయాన్ని ఆక్రమించిన టెగ్రరిస్తుల్ని తక్కువ రక్తపాతంతో పోలీసులకు లొంగిపోయేలా చేసేందుకు నిపుణతతో ప్రణాళికాబద్ధంగా 1988లో అమలు జరిపిన ఆపరేషన్బ్లాక్ ధండర్ని ప్రస్తావించారు.
ఆపరేషన్ బ్లూస్టార్ వలన చాలా ప్రతికూల పరిణామాలు సంభవించినప్పటికీ దానిలో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అది భారత రాజ్యం వేర్చాటువాదం, టెర్రరిజంలతో దృఢంగా వ్యవహరించగలిగినంత బలంగా ఉందని నిరూపించింది. అది సిక్కులను ఉత్తేజపరచే భింద్రన్వాలాని అతడి ముఠాని అంతం చేసింది. అది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లాంటి సెక్యులర్ పార్టీలు ప్రజలలోకి వెళ్లి మతతత్వ రాజకీయాలు ప్రజలకు కలిగించే నష్టాలని వివరించటానికి అవసరమైన శాంతి భద్రతలను నెలకొల్పింది. ఆపరేషన్ బ్లూస్టార్ ఆ తరువాత
ఆపరేషన్ బ్లూస్టార్ తరువాత టెర్రరిస్టులు స్వర్ణదేవాలయాన్ని ధ్వంసం చేయించినందుకు ఇందిరాగాంధీ, ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని ప్రతినబూనారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ ఆమె సెక్యూరిటీ దళంలోని ఇరువురు సిక్కులచే హత్య చేయబడింది. అంతకుముందు సెక్యూరిటీ దళం నుండి సిక్కుల్ని తొలగించాలని సెక్యూరిటీ ఛీప్ ఇచ్చిన సలహాని ఇందిరాగాంధీ 'మనం సెక్యులర్ వాదులం గదా అనే వ్యాఖ్యతో తిరస్కరించింది.
1981-84 కాలంలో ఉత్తర భారతదేశాన్ని తీవ మతతత్వవాదం ఆవహించిన వాతావరణంలో ప్రధానమంత్రి హత్య దేశవ్యాప్తంగా ప్రత్యేకించి పేద ప్రజలలో భయాందోళనలకు, మతతత్వ దౌర్టన్యాల వెల్లువకు దారి తీసింది. ఈ ప్రజాగ్రహం ఢిల్లీలోను, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వికృతమైన మతతత్వరూపం తీసుకొన్నది. హత్యావార్త వెలువడింది. సిక్కులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారని పుకొర్లు వ్యాపించాయి. ఆ వెనువెంటనే సిక్కులపై దాడులు జరిగాయి. అక్టోబరు 81 సాయంత్రం నుండి అల్లరిమూకలు ఢిల్లీ వీధుల్ని స్వాధీనం చేసుకొన్నాయి. సిక్కులు లక్ష్యంగా లూటీలు న బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
హింసాత్మక ఘటనలు విశృంఖలంగా సాగాయి. సిక్కులకు వారి ఆస్తులకు రక్షణ కల్పించడంలో శాంతిభద్రతల యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. మూడు రోజులపాటు సాగిన హత్యాకాండలో 2500 మందికిపైగా హతులయ్యారు. వారిలో అత్యధికులు సిక్కులు. హత్యాకాండ జరిగిన ప్రాంతాలు ఢిల్లీ మురికి వాడలు, పునరావాస కాలనీలు. నవంబరు దొమ్మీలు సిక్కులలో అత్యధికుల్ని ప్రభుత్వం నుండి వేరుచేశాయి.
ఇందిరాగాంధీ స్థానంలో ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ 1984 నవంబరు 1న ప్రమాణ స్వీకారం చేశాడు. 1984 డిసెంబరు సాధారణ ఎన్నికల తరువాత రాజీవ్ పంజాబ్ సమస్య చేపట్టాడు. 1985 జనవరిలో అకాలీదళ్ ప్రెసిడెంటు లాంగోవాలాతో సహా పెద్ద నాయకులంతా విడుదల చేయబడ్డారు. ఒక నెల తరువాత రాజీవ్‌గాంధీ నవంబరు దా మ్మీలపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాడు. ఆపరేషన్ బ్లూ స్టార్, నవంబరు దొమ్మీలు జరిగినప్పటికీ పంజాబు రాజకీయాలు సానుకూల దిశకి మళ్ళాయి. అకాలీలు చాలావరకు విశ్వసనీయత కోల్పోయారు. అంతేగాక అకాలీలు టెర్రరిస్టులతో పోరాడక పోయినప్పటికీ వారికి సహాయపడడం లేదు.
పంజాబు సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో రాజీవ్‌గాంధీ అకాలీలతో చర్చలు ప్రారంభించాడు. కాని ఈ విధానం ఫలితంగా ఆపరేషన్ బ్లూస్టార్ నుండి సమకూదుతున్న సానుకూలత కోల్పోవటం జరిగింది. టెర్రరిస్టు మతతత్వ వ్యతిరేక పోరాటం త్యజించబడింది. ఫలితంగా మతతత్వవాదం పుంజుకోవటానికి అవకాశం కల్పించినట్లయింది.
విడుదల తరువాత అకాలీ నాయకులు విడిపోయారు. గందరగోళానికి గురయ్యారు. ఒకవైపు లాంగోవాలాతో సహా పలువురు తమ స్టానాల్ని కాపాడుకొనేందుకు టెర్రరిస్టులకు దీటుగా సమరశీల పదజాల ప్రయోగానికి పరిమితమయ్యారు. మరొకవైపు అత్యధిక అకాలీ నాయకులు ప్రజాందోళనలు పునరుద్ధరించడం గాని సమరశీల రాజకీయాలు కానసాగించడంగాని సాధ్యపడదని గుర్తించారు. కాబట్టి లాంగోవాల్ దురుసుగా మాట్లాడుతూనే ప్రభుత్వంతో రహస్య చర్చలకు దిగాడు.
1985 ఆగస్టులో రాజీవ్‌గాంధీ లాంగోవాల్ పంజాబు ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వం అకాలీల ముఖ్యమైన డిమాండ్లను ఆమోదించింది. మిగిలిన వాటిని పరిశీలిస్తామని వాగ్దానం చేసింది. ఒప్పందం ప్రకారం చండీఘర్ పంజాబుకి బదిలీ స్వతంత్రం తర్వాత భారతదేశం 4శీ5్
చేయబడుతుంది. పంజాబు నుండి హర్యానాకు బదిలీ చేయవలసిన హిందీ మాట్లాడే ప్రాంతాలను కమిషన్ నిర్ణయిస్తుంది. నదీ జలాల వివాదంపై స్వతంత్ర ట్రిబ్యూనల్ నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంటుకి ఎన్నికలు 1985 సెప్టెంబరులో జరుపబడతాయి. అకాలీలు ఎన్నికలలో పాల్గొంటారనీ లాంగోవాల్ ఆగస్టు 20న ప్రకటించాడు. అదే రోజున టెర్రరిస్టుల చేత హత్య చేయబడ్డాడు. ఎన్నికలు సకాలంలో నిర్వహించబడ్డాయి. 1977,1984లలో ఓట్లు వేసినవారు 64 శాతం కాగా ఈసారి 66 శాతం ఓటర్లు ఎన్నికలలో పాల్గొన్నారు. అకాలీలు వారి చరిత్రలో మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో పూర్తి మెజారిటీ సాధించారు. కాని సూర్చిత్ సింగ్ బర్నాలా నాయకత్వంలోని అకాలీ ప్రభుత్వం ముఠాతత్వంతో ముక్కచెక్కలుగా చీలి నిశ్చలంగా వుండిపోయింది. ఈ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన పాలనాపరమైన చర్య టెర్రరిస్టు నేరారోపణలున్న వారిని పెద్ద సంఖ్యలో విడుదల చేయటం. వారిలో అత్యధికులు మరలా టెర్రరిస్టు శ్రేణులతో చేరారు. ఆ విధంగా టెర్రరిజానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. చండీఘర్ని కోల్పోతున్నందుకు నష్టపరిహారంగా హర్యానాకు పంజాబులోని ఏ ప్రాంతాలను కూడా దఖలు పరచటానికి పంజాబు ప్రభుత్వం అంగీకరించలేదు. పంజాబు నుండి కొన్ని ప్రాంతాలు రాకుండా చండీఘర్ కోల్పోవటాన్ని హర్యానా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అకాలీ నాయకత్వం నదీజలాల వివాదాన్ని కూడా తిరగతోడింది. ఆ విధంగా ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు మరలా వివాద 'గ్రస్తమయ్యాయి. అసలు ఈ ఒప్పందం కూడా ఆపరేషన్ బ్లూస్టార్ లాగానే ఆచరణీయతను, పరిగణనలోకి తీసుకోకుండా హడావిడిగా రూపొందించబడింది. బర్నాలా ప్రభుత్వం యొక్క మెతక వైఖరిని అవకాశంగా తీసుకొని మిలిటెంటు గ్రూపులు తిరిగి సంఘటితమయ్యాయి. క్రమంగా టెర్రరిస్టు కార్యకలాపాలు పునరుజ్జీవం పొందాయి. ముఠాతత్వంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిరోధించ లేకపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం బర్నాలా మంత్రివర్గాన్ని రద్దుచేసి 1987 మేలో రాష్ట్రపతి పాలన విధించింది. అకాలీదళ్, అకాలీ ప్రభుత్వం సిద్ధాంతపరంగా టెర్రరిస్టుల ఇలోచనలలో పాలుపంచుకుంటూ మతతత్వవాదాన్ని, వేర్చాటువాదాన్ని ఎదుర్శొనలేకపోయాయి. వాటితో పోరాడలేకపోయాయి. కాబట్టి పంజాబుకి మతానికతీతంగా వుంచే ప్రచారంలోను మతాన్ని 446 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రాజకీయాల నుండి విడదీయటంలోను మతతత్వ టెర్రిజంతో పోరాడటంలోను, బర్నాలా, ఆయన అనుచరులు ముందుంటారని అంచనా వేయటం రాజీవ్‌గాంధీ ప్రభుత్వం యొక్క వ్యూహాత్మకమైన తప్పిదం.
రాజీవ్‌గాంధీ పంజాబు ఒప్పందాన్ని మతతత్వ వాదానికి వ్యతిరేకంగా జరుపనున్న రాజకీయ సైద్ధాంతిక పోరాటంలో మౌలికమైన భాగంగా గాక టెర్రరిస్టు సమస్యకి పరిష్కారంగా పరిగణించాడు. అదే సమయంలో ప్రత్యేకవాదం, టెర్రరిజం, హింసలతో దృఢంగా వ్యవహరించాలనే (గ్రహింపు వుండాలి. అంతేగాక మితవాద మతతత్వవాదులు కూడా వారి పద్ధతులలో వారు రాజకీయంగా పనిచేయడానికి వీలుగా వారికి టెర్రరిస్టుల నుండి రక్షణ కల్పించాలి. ఆపరేషన్ బ్లూ స్టార్‌తో భింద్రన్వాలాని తొలగించి, టెర్రరిస్టుల్ని జయించడం అసాధ్యమనే భ్రమని తొలగించి, టెర్రరిజాన్ని చాలా వరకు అదుపు చేసిన తర్వాత మాత్రమే లాంగోవాల్ టెర్రరిజానికి వ్యతిరేకంగా మాట్లాడి రాజీవ్‌గాంధీతో ఒప్పందంపై సంతకం చేశాడనే వాస్తవాలు ఈ సందర్భంగా గమనార్హం. అలాగే టెర్రరిజం పంజాబును కుదిపివేస్తున్నప్పుడు జరిగిన ఎన్నికలను అంటే 1992 ఎన్నికలను అకాలీలు బహిష్కరించారు. టెర్రరిజాన్ని అణచివేసిన తరువాత 1997లో ఎన్నికలలో పాల్గొనడానికి అంగీకరించారు. టెర్రరిజం పరిష్కారం
రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ బలహీనత పునరుజ్జీవం దశల ద్వారా పంజాబులో టెర్రరిజం పెరుగుతూ వచ్చింది. ప్రత్యేకించి 1985 తరువాత పాకిస్తాన్ నిధులు పొందింది, మద్దతు పొందింది.
1985 తరువాత టెర్రరిజం, దాని పెరుగుదలను గురించి కె.పషి.యస్.గిల్ తన 'పంజాబ్- దినైట్స్ ఆఫ్ ఫాల్స్ హుద్'లో సవివరంగా వివరించాడు గనుక మనం ఆ విషయాలను ఇక్కడ లోతుగా చర్చించడం లేదు. అత్యధిక టెర్రరిస్టు ముఠాలు బలవంతపు వసూళ్లు, బందిపోట్లు, దొంగ రవాణా, మాదక ద్రవ్యాలు, అపహరణలు, మానభంగాలు, భూ కబ్బాలు, అమాయకుల హత్యలు, విలాస జీవితాలు- తమ విధానాలుగా చేసుకొన్నాయి. 1987 నుండి ప్రజలపై రాజకీయ సైద్ధాంతిక ప్రాబల్యం సాధించేందుకు క్రమబద్ధమైన (ప్రచారం ప్రారంభించాయి. మాంసం, మద్యం, పొగాకులపై, మహిళల చీరల వాడకంపై నిషేధం, పిల్లల పాఠశాల దుస్తుల్ని నిర్ణయించే ప్రయత్నం, వివాహాల, ఆచార వ్యవహారాలపై స్వతంత్రం తర్వాత భారతదేశం న
ఆంక్షలు, ప్రభుత్వ భవనాలపై ఖలిస్తాని జెండాలు ఎగురవేయటాలు, సమాంతర పన్నుల వసూళ్ళు - అన్నీ కూడా రేపటి పాలకులు వారేనని ప్రజల్ని నమ్మించేందుకు రూపొందించబడ్డాయి. ప్రముఖ వ్యక్తుల ప్రకటనలు, కొన్నిసార్లు వాటినే ప్రధానమంత్రి స్వయంగా పునరుద్దాటించడం, కేంద్ర ప్రభుత్వానికి టెర్రరిస్టు గ్రూపుల మధ్య చర్చలకు సంబంధించిన వార్తలు కూడా ప్రజలపై అలాంటి ప్రభావాన్ని కలుగచేశాయి. త్వరితంగా క్షీణిస్తున్న పరిస్థితి నుండి బయటపడేందుకు తాత్కాలిక చర్యగా 1987లో పంజాబులో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టబడింది. (1) పంజాబులో 1982 నుండి మతతత్వవాదం ఆమోదింపబడదడమో లేక ఓడింపబడడమో తప్ప మెతకవైఖరికి అవకాశాలు లేనప్పుడు. (2) &ీవ్ర మతతత్వవాదంతో లేక టెర్రరిస్టులతో పోరాడేందుకు మితవాద మతతత్వ వాదులపై ఆధారపడటం సాధ్యం కానప్పుడు. (3) టెర్రరిస్టుల్ని మతతత్వ వాదుల్ని సమాధానపరచే ప్రయత్నాలు చేపట్టకుండా అవసరమైనంత కాలం రాజకీయ సైద్ధాంతిక పోరాటంతో కూడిన దృధమైన విధానం మాత్రమే సరియైన ఫలితాలనిస్తుందనే అవగాహన వుండి తీరాలి. ఈ అవగాహన ప్రాతిపదికగా గల దీర్హకాలిక వ్యూహంలో రాష్ట్రపతి పాలన విధింపుని ఎత్తుగడగా చేపట్టి వుండవలసింది. 1986 తరువాత రాజీవ్‌గాంధీ 'ప్రభుత్వం టెగ్రరిస్టులపై చాలాసార్లు పైచేయి సాధించేంత దగ్గరగా వచ్చింది. పథకాన్ని పూర్తిగా అమలు జరిపే దృఢచిత్తం ప్రభుత్వానికి కొరవడింది. ప్రభుత్వం బలహీనమైన సలహాదారులచే దారి తప్పించబడింది. వేర్పాటువాద గ్రూపులలో ఏదో ఒకదానితో చర్చలు జరిపింది. ప్రభుత్వం దృధమైన చర్యతో పొందిన ప్రయోజనాన్ని కోల్పోయింది. అనివార్యంగా ప్రతిసారి టెర్రరిజానికి వ్యతిరేకంగా రాజ్యహింస పెంచటానికి దారితీసింది. టెర్రరిస్టుల్ని తీవ మతతత్వవాదుల్ని సమాధానపరచి చర్చల ద్వారా పంజాబు సమస్యని పరిష్కరించేందుకు 1990, 1991లలో వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ల ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేశాయి. ఈ కాలంలో టెర్రరిజం బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
1991 మధ్యలో కేంద్రంలో నరసింహారావు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1992 ఎన్నికల తరువాత పంజాబులో బియాంత్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెర్రరిజంపై కఠిన వైఖరి చేపట్టింది. 1988-1992 కాలంలో 1500 మందికిపైగా పోలీసులు హతులైనప్పటికీ, పోలీసులు గ్రామీణ ప్రజల సహకారంతో సమర్థవంతంగా వ్యవహరించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎంలు, శ్తీశ్ష8 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇంకా పలువురు కాంగ్రెస్ వ్యక్తులు చురుకుగా సాహసోపేతంగా పోరాడారు. ఆస్తిపాస్తులేగాక ప్రాణాలతో మూల్యం చెల్లించారు. 1993 నాటికి పంజాబుకి టెర్రరిజం నుండి విముక్తి కల్పించబడింది. ఒక నిర్ధారణ
పది సంవత్సరాలకుపైగా టెర్రరిస్టుల బీభత్సకాండ సాగినప్పటికీ పంజాబులో పరిస్థితి నుంది బయటపడే సానుకూలమైన అంశాలు కూడా వున్నాయి. హిందువులు, సిక్కుల మధ్య ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో ఒకమేరకు మానసిక పరమైన విభజన వున్నప్పటికీ, అడపాదడపా హిందూ, సిక్కుల మధ్య చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ టెర్రరిస్టు ప్రభావం కొనసాగిన సుదీర్హ కాలంలో పెద్ద మతతత్వ ఘర్షణ ఒకటి కూడా జరగలేదు. మొత్తం మీద పంజాబు ప్రజలు సెక్యులరిస్టులుగా వుండిపోయారు. టెర్రరిజంతో పోరాటానికి హిందూ వాలంటీరు దళాల్ని సమీకరించటానికి శివసేన, ఇతర హిందూమత సంస్థలు చేపట్టిన యత్నానికి సాధారణ హిందువుల మద్దతు లభించలేదు. అలాగే చాలా ప్రాంతాలలో టెర్రరిస్టుల్ని సిక్కులు బలంగా ప్రతిఘటించారు.
టెర్రరిస్టుల, తీవ్రమతతత్వవాదుల విలువల్ని సిద్దాంతాన్ని పంజాబు ప్రజలు స్వీకరించ నిరాకరించారు. గదర్ షార్టీ, గదరీ బాబాలు భగత్‌సింగ్ ఆయన సహచరులు, కీర్తి కిసాన్ గ్రూపులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, సమరశీల రైతాంగ ఉద్యమం, కాంగ్రెస్, జాతీయ ఉద్యమం లాంటి పార్టీల సంస్థల కృషి ప్రభావం కారణంగా పంజాబులో సెక్యులర్ సంప్రదాయం బలంగా వేళ్ళూనుకొన్నది.
సిక్కు మతం, సిక్కుల ప్రయోజనాల పరిరక్షణ కొరకు వేర్పాటువాదులు, టెర్రరిస్టులు పోరాడుతున్నారని సాధారణ సిక్కు ప్రజానీకం అంగీకరించలేదు. టెర్రరిస్టులు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మత ద్రోహం చేస్తున్నారని, సిక్కు సంస్థల సిక్కు గురువుల బోధల విలువను తగ్గిస్తున్నారని, గురుద్వారాలను అపవిత్రం చేస్తున్నారని క్రమంగా స్పష్టమయింది. 1981-1993 కాలంలో టెర్రరిస్టుల చేతుల్లో హతులైన 11,700 మందిలో 61 శాతానికిపైగా సిక్కుల. .
దేశంలోని ఇతర ప్రాంతాలు భవిష్యత్తులో అలాంటి సమస్యలు ఎదుర్శొనే అవకాశం ఉంది గనుక పంజాబు అనుభవం దేశానికి ఉపయుక్తమైనది. దాని నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన గుణపాఠాలున్నాయి. మొదటిది: మతతత్వవాదం రాజకీయంగా సైద్ధాంతికంగా స్వతంత్రం తర్వాత భారతదేశం త్తం
ఎదుర్కొనబడాలి. మతాన్ని రాజకీయాల నుండి విడగొట్టడం తప్పనిసరిగా అనులు జరపబడాలి. మతతత్వ సిద్దాంతానికి వ్యతిరేకంగా పోరాటం కేంద్రీకరించబడాలని పందాగి అనుభవం నొక్కి చెబుతున్నది. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం యొక్క పెద్ద ఐలవొన పంజాబులో నిజమైన దీర్హకాలికమైన సమస్య టెర్రరిజం కాదు, మతతత్వవాదమ గుర్తించడంలోని వైఫల్యం. టెర్రరిజం మూలాలు మతతత్వవాదంలో ఉంటాయి. తీవ్రదా డం టెర్రరిజంలు అకాలీ మతతత్వ సిద్ధాంతంతో అకాలీలు రాజకీయ ప్రయోజనాల కొర మతాన్ని బాహాటంగా ఉపయోగించుకొనడంతో ప్రత్యక్షంగా అనుసంధానం చేయణ ఉన్నాయి. ఇంతకుముందు సూచించిన విధంగా మతతత్వవాదం సమాధానపరచబడదు. సంతృప్తి పరచబడదు. కాబట్టి దానిని ప్రతిఘటించాలి, ఓడించాలి. మతతత్వ శకి. సమాధానపరచడం వలన తాత్కాలికంగా కొంత వ్యవధి లభించవచ్చు. ఆ విధంగ పొందిన వ్యవధిని మతతత్వవాదాన్ని వ్యతిరేకించేందుకు ప్రజల్ని సన్నద్ధం చేయటానికి వినియోగించుకోవాలి. అలా చేయకపోతే మతతత్వవాదం బలపడుతుంది. తీవ్రవాదంగొ పరిణతి చెందుతుంది.
రెండవది : టెర్రరిజంతో సహా అన్ని రూపాలలో వుండే మతతత్వవాదం రాజ్యం యొక్క శాంతి భద్రతల యంత్రాంగాన్ని తగు సమయంలో పూర్తిగా వినియోగించడం ద్వారా దృఢంగా నిర్ణయాత్మకంగా అణచివేయబడాలి. హింస, టెర్రరిజాలను ప్రజలి సంసిద్ధత, వ్యతిరేకతలు రాజ్యం, దాని భద్రతా దళాలు చేపట్టే చర్యలకు మద్దతుగొ నిలిచి సహాయక పాత్ర పోషించగలవు. మూడవది: మతతత్వవాదులు ఎంత మితవాదులుగొ ఉన్నప్పటికీ వారి మధ్య నిజమైన రాజకీయ విభేదాలున్నప్పటికీ, వారి మధ్య ఉమ్మడీ మతతత్వ సిద్ధాంతపు సామీష్యత ఉంటుంది గనుక తీవ్ర మతతత్వవాదంతో గాని లేక టెర్రరిజంతో గాని పోరాడేందుకు వారిపై ఆధారపడగూడదు. శీ5్0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
25 ఆ భారత ఆర్దిక వ్యవస్థ, 1947-1965 నెహ్రు హయాం
స్వాతంత్ర్యానంతరం భారతదేశం సాధించిన అభివృద్ధిని చారిత్రక, తులన్మాతక నేపథ్యంలో మనం అర్ధవంతంగా లెక్క తియ్యగలగాలి. ఆర్థికాభివృద్ధికి ఏ దశలో ఏ స్థాయిలో అంకురార్పణ జరిగింది. ప్రజాస్వామిక చట్రానికి లోబడి పారిశ్రామికీకరణ దిశగా రూపాంతరం చెందడానికి ఎలాంటి కృషి జరిగింది అనే అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. సాధించిన విజయాలను ఇదే అభివృద్ధి స్థాయిని పోలిన దేశాలతో పోల్చి చూసుకోవాలి.
మనకు స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి, రెండు వందల ఏళ్ళ పాటు వలసపాలనలో మగ్గిన మూలాన్ని మన సమాజము, మన ఆర్థిక వ్యవస్థా ప్రపంచ పటంలో ఇతరత్రా దేశాల్లో సంభవిస్తున్న ఆధునిక పారిశ్రామిక రూపాంతర దిశగా పయనించే అవకాశాలు లేనంతగా, ఎంతటి దయనీయమైన స్థితిలో ఉండేదో 2వ అధ్యాయంలో వివరంగా చెప్పుకున్నారు. దుర్భరమైన దారిద్ర్యం, అ విద్య, కునారిల్లుతున్న పరిశ్రమలు, ధ్వంసమై పోయిన వ్యవసాయం, సంస్థాగతమైన అవకాశాలతో వదలిపెట్టి పోయారు వలస పాలకులు భారత దేశ ఆర్థిక వ్యవస్థని, పౌర సమాజాన్ని (దేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల మధ్య ఉండాల్సిన పరస్పర పూరక సంబంధాలను, పెట్టుబడిదారీ అభివృద్ధి విధానానికి ఆదరువుగా ఉండాల్సిన లింకులను దుంపనాశనం చేసిపోయారు). ఈ కారణానే మన దేశం స్వయం సమృద్ధి సాధించి, భవిష్య సమాజంలోకి రూపాంతరం చెందడం బహుళ సంక్షిష్టంగా మారింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 4ర్1
కాబట్టి స్వాతంత్ర్యం సముపార్షించుకున్న భారతదేశం వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించాలంటే వలస పాలన మనకు వారసత్వంగా విడిచిపోయిన సంస్థాగత నిర్మాణాన్ని సరిదిద్దుకోవాల్సి ఉండి, ప్రపంచంలో తొలి పారిశ్రామిక విప్లవం సంభవించి అప్పటికే 20 ఏండ్లు గడిచింది. ఇతరత్రా దేశాల్లో పారిశ్రామికీకరణ ఊన అందుకుని అప్పటికే 100 ఏండ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని ఆధునిక పారిశ్రామికీకరణ దిశగా నడిపించడమనేది కళోరతరంగా నిలిచింది. ఒక వంక వలస వరిపాలన మనకు విడిచివెళ్ళిన నంస్థాగతమైన లొనుగులతో ఆలన్యంగొ పారిశ్రామికీకరణలో అడుగు పెట్టాల్సి రావడంతో పాటు భారతదేశం రాజకీయంగొ ఆర్థికంగా తీవ్రమైన మార్పులను కూడా ఎదుర్శొవాల్సి వచ్చింది. అందుకే విజయం సాధించడానికి నూతన, సృజనాత్మక వ్యూహాలు, ఎత్తుగడలు అవసరం పడ్డాయి. కష్టభూయిష్టమైన సంక్లిష్టమైన ఈ కర్తవ్య సాధనకు నడుం బిగించిన భారతదేశానికి ఇతరత్రా వలస దేశాల మాదిరి కాకుండా కొన్ని అవకాశాలూ కలిసీ వచ్చాయి. అందులో మొదటిది - స్వల్పమైనది అయినప్పటికీ స్వతంత్రమైన పారిజ్రామిక పునాది. (1941 -47 మధ్య కాలంలో దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో ఉండే పరిశ్రమలు ఏర్చడ్డాయి]. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ కాలాల్లోను, ఆ తరువాతే ఏర్పడిన 'మహా మాంద్యం' పరిస్థితుల్లోనూ సామ్రాజ్యవాదుల భల్లూకపు పట్టు. బలహొన పడిన అవకాశాన్ని భారత పెట్టుబడిదారీ వర్ణాలు అంది పుచ్చుకున్నాయి. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సముపార్షించుకునే నాటికి భారత పారిశ్రామిక వర్గాలు ఐరోపా పారిశ్రామిక వర్షాలతోనూ, దేశంలోకి వచ్చి పడుతున్న దిగుమతులతోనూ పోటీ పడగలిగే సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే దేశ పారిశ్రామికోత్పత్తిలో 75 శౌలం వాటాను కైవసం చేసుకున్నాయి. అంతేకాదు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదాది ఫైనాన్నియల్ రంగంలోనూ భారత పెట్టుబడిదారులు తమ ఆధిక్యాన్ని చేరుకున్నారు. కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే నాటికే వలసవాదం పట్ల వ్యతిరేకతే, వలసవాదం వ్యతిరేకత ఉన్నప్పటికీ స్వతంత్ర ఆర్ధిక పునాదిని అభివృద్ది చేసుకుని, అందు మీదుగా వేగవంతమైన స్వతంత్ర పారిశ్రామికీకరణను నెలకొల్పుకునే దానికి సిద్ధంగా ఉంది. ఈ కారణానే వలసపాలన నుండి విముక్తి చెందినా వలసవాదానికి లోబిదే మనుగడ సాగించాల్సిన ఇతర దేశాల మాదిరి కాకుందా భారతదేశం నిలదొక్కుకో గలిగింది. నామమాత్రపు రాజకీయ స్వాతంత్ర్యం లభించినా అంతకు పూర్వం ఉన్న వలసవాద ఆర్థిక వ్యవస్థ గాడినేబడి సామ్రాజ్యవాడ ప్రయోజనాలను ఈడేర్చడమే ప్రధాన లక్షణంగా ఉన్న ఇతర వలస విముక్తి దేశాల గతి భారత్‌కు పట్టలేదు. 452 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
స్వాతంత్రానంతరం భారతదేశంలో పరిణితి చెందిన బెకత్సాహిక పారిశ్రామిక వర్గం ఉనికిలో ఉండడం మూలంగా అది ప్రజాళికాబద్ధ అభివృద్ధిని ముందుకు తీసుకు పోవడంలో ఏజెంటుగా పనిచేసింది. అదే పెద్ద పెట్టుబడిగా మారింది. వలసపాలనలో ఉన్నప్పుడే భారతదేశంలో ఈ పారిశ్రామిక వర్గం పెట్టుబడిని సంఘటితం చేసుకుని గరిష్ట స్థాయిలో పోగేసుకుని ఉన్న మూలాని స్వాతంత్ర్యానంతర కాలంలో ఈ వర్గమే - బిర్లాలు, టాటాలు, సింఘానియా, దాల్మియా, జైన్లు - పెద్ద పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలుగా ఆవిర్భవించింది. ఒక్కో గ్రూపూ ఒక్కో రంగంలో - అటు వాణిజ్యం, ఇటు బ్యాంకింగ్, రవాణా, పరిశ్రమలు ఇత్యాది - పేరు సంపాదించింది. అప్పటికే మార్కెట్లో బలంగా ఉన్న విదేశీ పెట్టుబడి, బహుళజాతి కంపెనీలతో పోటీని విజయవంతంగా తట్టుకోవాలంటే (ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలోకి ఆలస్యంగా అడుగిడిన భారతదేశం వంటి దేశాలకు ఇలాంటి బలమైన దేశీయ పారిశ్రామిక వర్గం అవసరమైంది. జపాన్‌లో 'జై బట్సు దక్షిణ కొరియాలో 'చెబోల్ వంటి దేశీయ బహుళ వాణిజ్య సంస్థలు కూడా ఆయా దేశాల్లో ఈ అవసరానికే ఉపయోగపడ్డాయి. దేశీయ పారిశ్రామిక వర్గం బలంగా లేని ఆఫ్రికా దేశాల్లో అవి స్వాతంత్ర్య సముపార్టించుకున్నా ఈ నాటికీ పారిశ్రామికంగా ఏ మాత్రం ప్రగతి సాధించలేని సంక్లిష్ట స్థితిని మనం చూస్తున్నాం. మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలలో పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక రెండవ అంశం ఏమిటంటే - స్వాతంత్రానంతరం సాధించాల్సిన అభివృద్ధి
స్వభావం, అందుకు ఉన్న మార్గం పట్ల సమాజంలో విశాల ప్రాతిపదికన ఏకీభావం ఉన్నది. గాంధేయవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కాన్ని మినహాయింపులతో చివరికి పెట్టుబడిదారులు కూడా కాస్త అటూ ఇటూగా ఒకే అజెండాకు అంగీకరించారు - స్వావలంబన పునాదిగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి బహుముఖ వ్యూహం అనుసరించాలి. దిగుమతుల ఆధారిత విధానం నుండి బయట పదదానికి “క్యాపిటల్ గూడ్స్ సహా అన్ని రంగాల్లో శీఘ్రగతిన పారిశ్రామికీకరణ సాధించాలి. సామ్రాజ్యవాద - విదేశీ పెట్టుబడుల ఆధిపత్యాన్ని నిలవరించాలి, జమీందారీ విధానాన్ని రద్దు చేసేదిగా భూ సంస్కరణలు అమలు జరగాలి, కౌల్దారీ విధానాన్ని సంస్కరించాలి, సహకార సంఘాలకు శ్రీకారం చుట్టాలి - ముఖ్యంగా పరపతి, మార్కెటింగ్ వంటి 'సేవారంగాల్లో, అభివృద్ధితో పాటు సమానత్వమూ సాధించాలి - అంటే అభివృద్ధి పంథా సంక్షేమంతో కూడిన సంస్మరణవాద పంథాగా, పేదల పక్షపాతిగా అవసరమైన చోట సానుకూల వివక్షత, రిజర్వేషన్లు షాటించాలి. దేశంలో అణగారిన ప్రజానీకంగా ఉన్న షెడ్యూలు కులాలు, జాతులు ఆర్థిక
స్వతంత్రం తర్వాత భారతదేశం 453
బెన్నత్యం సాధించుకోగలిగే విధంగా, ఉత్పత్తి విధానంలో రాజ్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే విధంగా ఉండాలి. అంటే ప్రభుత్వ రంగ యాజమాన్యంలో పరిశ్రమలు నెలకొల్పాలి. ఇత్యాది విస్సృత అజెండా దేశ పారిశ్రామికీకరణకు, ఆర్ధికాభివృద్ధికీ పునాది కావాలనే ఏకాభిప్రాయం ఉండింది. అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రజాస్వామిక, పౌరస్వేచ్చా చట్రంలోనే ఈ ప్రణాళికాబద్ధమైన శీఘ్రగతి పారిశ్రామికీకరణను సాధించాలనే ఉమ్మడి అభిప్రాయం ఏర్పడింది. ఇది కీలకం” ఎందుకయ్యిందంటే ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామికీకరణ దిశగా, ఆదిమ పెట్టుబడి సంచయానికి పూనుకున్న తొ లిదశలో (ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ళకు తావు లేకుండా పోయింది. నెహ్రూ హయాంలో, పెట్టుబడిదారుల సహా అందరికీ ఒక వాస్తవం గమనంలో ఉండింది. “ఇప్పటి దొకొ ఎవ్వరూ అనుసరించని మార్గాన్ని భారత్ ఎంచుకున్నది అన్నదే అవాస్తవం. అయినొ ఈ మార్గానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లోనో, తూర్పు ఆసియా దేశాల్లోనో నియంతృత్వ ప్రభుత్వాలు - పెట్టుబడిదారులు చెట్టాపట్టాలు వేసుకునీ జనాన్ని మంటపెట్టి మరీ ఆర్థికాభివృద్ధిని వేగిరం సాధించాలనే వాదన భారతదేశంలో ఎవరూ లేవనెత్తే సాహసం చెయ్యలేదు. దేశంలో ఉధృతంగా, వెల్లువలా సాగిన స్వాతంత్రోద్యమం ఫలితంగా ప్రజాస్వామిక వ్యవస్థను పాదుకొల్పుకుని, నిలబెట్టుకుని దాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం వలస పాలన నుండి విముక్తమైన దేశాలన్నింటీ కల్లా ఒక్క భారత్‌లోనే సాధ్యపడడం అత్యంత సానుకూల పరిణామం. ప్రణాళికలు - ప్రభుత్వ రంగ సంస్థలు పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో యం.జి.రనదే, దాదాభాయ్ నౌరోజీ
వంటి తొలితరం జాతీయవాదుల ఆర్థిక ఆలోచనా విధానంలోనే భారతదేశ ఆర్థికాభివృద్ధిలో రాజ్యం కీలకమైన పాత్ర పోషించాలనే ధోరణి ఉండింది. రెందు ప్రపంచ యుద్దాల మధ్య అనుభవాలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆమెరికా అనుసరించిన 'న్యూ డీల్ విధానం: కీన్స్ సిద్ధాంతాల పాక్షిక ప్రభావం, సోవియట్ రష్యా ప్రయోగం - ఇవన్నీ కలిగి మార్కెట్‌ను కేవలం ఆర్థిక శక్తుల ఇష్టానిష్టాలకు వదిలెయ్యకూడదు. రాజ్యం జోక్యం చేసుకోవడం అనివార్యం అనే భావన మరింతగా బలపడింది. 1934లోనే భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి అధ్యక్షుడిగా ఉన్న ఎన్.ఆర్. సరార్ కల్తీ లేని స్వేద్భా వాణిజ్య విధానాలకు శాశ్వతంగా రోజులు చెల్లిపోయాయి' అని ప్రకటించాడు. అంతేకాదు ఆనాడు పెట్టుబడిదారీ 454 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వర్గానికి నాయకత్వంగా ఉన్న వారి అభిప్రాయాలను ప్రతిఫలిస్తూ - “భారతదేశం వంటి వెనుకబడిన దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాలన్నింటినీ కలుపుకునేలా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి సమగ్రమైన ప్రణాళిక, దీనితో సమన్వయం చేసుకునేందుకు విస్పృతాధికారాలు కలిగిన అత్యున్నత స్థాయి జాతీయ 'ప్రణాళికాభివృద్ధి సంస్థ అవసరం. దేశం తన పాత సంస్థాగత నిర్మాణాన్ని బద్దలు కొట్టుకుని సంపూర్ణమైన సామర్ధ్యంతో అభివృద్ధిని సాధించడానికి ఇది అనివార్యం” అని స్పష్టం చేసాడు. 1938లో భారతదేశపు ప్రణాళికాభివృద్ధికి ఆద్యుడు, మార్గదర్శి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదటి ప్రణాళికా సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఒక దశాబ్దం పాటు దేశ సమగ్రాభివృద్ధి కోసం విసృతమైన చర్చలు నడిపింది. ఈ సంఘం ఏర్పాటు చేసిన వివిధ ఉప సంఘాలు దేశ సమగ్రాభివృద్ధి కోసం ఇరవై తొమ్మిది సంకలనాల సిఫార్సులు చేసాయి.
ప్రణాళికలు రచించడంలో రాజ్యం పాత్ర గురించే కాకుందా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్రవ్య, కోశ బ్యాంకింగ్ తదితర విభాగాలపై రాజ్య నియంత్రణ, పర్యవేక్షణల ద్వారా ఆర్థికాభివృద్ధిని సరిచూసుకుంటా ఉండాలని, అంతేకాకుండా ఉత్పత్తి విధానంలో నేరుగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా జోక్యం చేసుకోవాలనే అంశం మీద దేశంలో విస్సతమైన ఏకాభిప్రాయం కుదిరింది. ప్రసిద్ధి చెందిన కరాచీ కాంగ్రెస్ మహాసభ (1931) “దేశంలోని కీలకమైన పరిశ్రమలు, సేవారంగాలు, ఖనిజ నిక్షేపాలు, రైల్వేలు, జలరవాణా, ఓడరేవుల నిర్మాణం తదాది ప్రజోపయోగ రవాణా రంగాలన్ని ప్రభుత్వ సంపూర్ణ యాజమాన్యంలో ఉండాలని, నిరంతరం రాజ్య నియంత్రణ కొనసాగాలని” తీర్మానం చేసింది. భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా నెహ్రూ - ప్రణాళికా సంఘాల ఆలోచనకు ఆమోద ముద్రవేసారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపన పాక్షిక జాతీయకరణలకు అంగీకరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనకు పారిథామిక వేత్తల నుండి ఈ రకమైన కీలక ఆమోదం లభించడానికి గల కారణాలు ఏమిటో 1945లో వాళ్ళే రూపొందించిన భారత ఆర్థికాభివృద్ధి ప్రణాళిక అనే నివేదికలో మనకు వెల్లడవుతాయి. ఈ ్రణాళికయే “బొంబాయి ష్లాన్' గా బహుళ ప్రసిద్ధికెక్కింది. దేశీయంగా కాపిటల్ గూడ్సు పరిశమలు'లేకపోవడం మూలంగా అంతకంతకూ దేశం అభివృద్ధి చెందిన దేశాల మీద ఆధారపడి రావల్సి వస్తుందని బాంబే ప్లాన్ అభిప్రాయపడింది. “రెండవ ప్రణాళికా వ్యూహంలో ఈ లోపాన్ని (కాపిటల్ గూడ్సు పరిశ్రమలు) సాధ్యమయినంత త్వరగా అధిగమించాలి. తద్వారా భారతదేశ పారిశ్రామికాభివృద్ధి వేగవంతం అవడమే కాకుండా స్వతంత్రం తర్వాత భారతదేశం డేర్ర్
పరిశ్రమలు స్థాపించడానికి, యంత్ర సామాగ్రి కోసం విదేశాల మీద ఆధారపాటును, విదేశీ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసే అవసరం లేకుండా చూసుకోవచ్చు” అని బాంబేష్ణాన్ తీర్మానించింది. అయితే కాపిటల్ గూడ్సు పరిశ్రమలు గాని, భారీ మౌళిక పరిశ్రమలు కానీ నెలకొల్పాలంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. అంత పెట్టుబడులు సమకూర్చినా ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. ఇంత బరువు (పైవేటు పరిశ్రమలు ఎత్తుకోలేవు కాబట్టి ప్రభుత్వ రంగంలో అలాంటి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన రంగం మీదకు వచ్చింది. నెహ్రూ, వామపక్ష జాతీయవాదులు, ఒక్క ప్రక్కన, పెట్టుబడిదారీ వర్గాలు మరో వంకన దేశపరాధీనతను అరికట్టడానికి ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు అనివార్యం, అవసరం అని భావించార్యా అయితే. ఈ రంగం పరిధి ఏమిటి, విస్శృతి ఏమిటనే అంశాల మీద రెండు పక్షాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రణాళికాబద్దమైన ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ రంగ పరిభమల స్థాపనలు సోషలిస్టు వ్యవస్థ దిశగా అడుగులు వెయ్యడానికి ఉపకరిస్తుందని మొదటి పక్షం భావిస్తే పెట్టుబడిదారీ శక్తులు మాత్రం ఈ విధానాలు స్వతంత్ర పెట్టుబడిదా విధానానికి ఉపకరిస్తాయని ఉమ్మడి పెట్టుబడి పద్ధతుల ద్వారా అభివృద్ధి చెంది సోషలిజానికి తావు లేకుండా చెయ్యవచ్చని భావించాయి. కొంతకాలం పాటున అదే స్వాతంత్ర్యానంతర తొలి కాలంలో ఈ రెండు వర్గాల మధ్యన ఉద్రిక్తతలు కొనసాగాయి.
ఉదాహరణకు 1947లో అలిండియా కాంగ్రెస్ కమిటీ జవహర్లాల్ నెహ్రొ అధ్యక్షతన “ఆర్ధిక కార్యక్రమావళి కమిటీ*ను ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ రక్షణ రంగం కీలక పరిశ్రమలు, ఇతర ప్రజోపయోగ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనే స్థాపించాలని తీర్మానిస్తూ “ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఉన్న పరిశ్రమలను ఒక ఐదేళ్ళే తరువాత క్రమంగా ప్రభుత్వ రంగం అధీనంలోకి తీసుకురావాలని” కూడా మరో వాక్యం జత చేసింది. దీంతో పెట్టుబడిదారులకు ప్రమాద ఘంటికలు వినిపించాయి. అరుపులు: పెడబొబ్బలు, నిరసనలు తెలిపారు. అయితే 1948 లో పారిశ్రామిక విధాన తీర్మానం రూపొందించేటప్పుడు కొంత రాజీ కుదిరింది. ప్రభుత్వ - (పైవేటు రంగాలకు మధ్యన స్పష్టమైన విభజన రేఖను గీసారు. ఏదన్నా పరిశ్రమను జాతీయం చెయ్యాలంటే పదేళ్ళ తరువాత అప్పుడున్న పరిస్థితుల ప్రాబల్యం దృష్ట్వా నిర్భయం తీసుకోవచ్చని రాసుకున్నారు. 1954 డిసెంబరులో భారత పార్లమెంటు 'సోషలిస్టు తరహా సమాజ స్థాపన, సామాజిక
- ఆర్థిక రంగాలలో సమభావ సాధన' లక్ష్యంగా ప్రకటించింది. 1955లో జరిగిన 'ఆవడి' కాంగ్రెస్ మహాసభలో ఇందుకు అనుగుణంగా వామపక్ష పంథావైపు పారిశ్రామిక శేర్6 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విధాన రూపకల్పన జరిగింది. అయితే 1956లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో కాని రెండవ పంచవర్ష ప్రణాళికలో కాని ప్రభుత్వ రంగాన్ని మరింత విసృత పరిచేందుకు సర్మారు పూనుకుంది. కాని (ఘైవేటు పరిశ్రమలను జాతీయం చెయ్యాలనే ఉసు ఎత్తలేదు. తీర్మానాల్లో సోషలిస్టు జపం చేస్తూ ఆచరణలో మాత్రం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పునాది వేసింది ప్రభుత్వం. ప్రభుత్వ - (ఫైవేటు పరిశ్రమలు సహజీవనం చెయ్యడమే కాదు, పరస్సర అథ్రితాలుగా కొనసాగాయి. జాతీయ ప్రణాళిక లక్ష్యాలకు లోబడి (పైవేటు రంగం విస్తరించడానికి తగినంత స్వేచ్చ కల్పించారు. అయితే రెండవ పంచవర్న ప్రణాళిక దృష్టి ప్రధానంగా భారీ పరిశ్రమలు, కాపిటల్ గూడ్స్ పరిశ్రమల స్థాపన మీద పెట్టడంతో సహజంగానే ప్రభుత్వ రంగ పరిశ్రమల విస్తరణ బహుముఖంగా కొనసాగింది.
నెహూ తన సైద్ధాంతిక భావజాలాన్ని ఒక దశకు మించి ముందుకు నెట్టలేకపోవడం స్టాలిన్ తరహా మార్క్సిజం ప్రభావంలో ఉన్న వామపక్ష పార్టీకి మింగుడు పడలేదు. నెహ్రూ భావజాలాన్ని మనం విశ్లేషిస్తే 1980 వ దశకం చివరి నుండి ప్రజాస్వామ్యం - సోషలిజం అవిభాజ్యమయినవిగా భావించడం మనకు కనబడుతుంది. అందుకే పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల వంటి కీలక అంశాలను ప్రజాస్వామ్యయుతంగా ముందుకు తీసుకు వెళ్ళాలని, సమాజాన్ని ఈ నిర్ణయాలకు అనుగుణంగా కలుపుకు తీసుకు పోవడం ప్రజాస్వామ్య పంథాలో మాత్రమే వీలవుతుందనేది నెహ్రూ ప్రగాఢ విశ్వాసం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అంటే కేంద్రీకృత అధిపత్య (కమాండ్) విధానం కాదని, వకాభిప్రాయ సాధనే మార్గమని నమ్మాడు. అందుకే తాను పెట్టుకున్న లక్ష్యాలతో చాలాసార్లు రాజీపడిపోయాడు.
1950 మార్చి 15న అవిర్భవించిన ప్రణాళికా సంఘం ఈ దృక్పథంతో పనిచేసింది. పేరుకు సంఘంలో చాలామంది సభ్యులు ఉన్నా దాదాపు సర్వాధికారాలు సంఘ అధ్యక్షుడిగా ఉన్న నెహ్రూయే చెలాయించేవారు. తొలి పంచవర్న ప్రణాళిక (1951-56) నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను శీఘ్రగతిన పూర్తి చెయ్యడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం తలెత్తిన ఆర్థిక సంక్షోభ సవాళ్ళను ఎదుర్కొవడం లక్ష్యాలుగా పెట్టుకుంది. స్వాతంత్ర్యంతో పాటు సమాంతరంగా దేశ విభజన విషాదాన్ని చవిచూడవలసి రావడం, శరణార్థుల సమస్య, ప్రజానీకం వలసలు తీవ్రమైన సమస్యలు సృష్టించాయి. రెండవ పంచవర్ష ప్రణాళిక (1956-61) నెమూ - మహలనోబిస్" ఆర్థికాభివృద్ది వ్యూహంతో నడిచింది (రెండవ ప్రణాళిక రూపొందించడంలో ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ ప్రధాన పాత్ర పోషించారు). మూడవ పంచవర్న ప్రణాళిక (1961-66)లో కూడా ఇదే పంథాను
స్వతం[థత్రం తర్వాత భారతదేశం శ్ర?
అనుసరించారు ఈ అభివృద్ధి వ్యూహంలో కీలకం ఏంటంటే - దేశంలో భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో విశేషంగా అభివృద్ధి చెయ్యడం. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మూడు ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది. దేశ స్వావలంబన కోసం, విదేశాల మీద ఆధారపాటును తగ్గించుకోవడం కోసం, దిగుమతుల మీద ఆధారపడడం కన్నా స్వయంగా ఉత్పత్తి పెంచుకోవాలనే కీలక లక్ష్యాలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండవ, మూడవ పంచవర్ష ప్రణాళికలు అదీ గాక అప్పట్లో ఎగుమతుల పట్ల అంత ఆశావహ దృక్పథం లేదు. ఎగుమతుల పట్ల ప్రణాళిక సంఘం ఆలోచనలతో అప్పటికి అందరూ ఏకీభవించారు కానీ తదనంతరం విమర్శలను ఎదుర్కొంది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భారీ పెట్టుబడులను విదేశీ సాయాల రూపేణా స్వీకరించినా, అంతర్గత సేవింగ్స్‌ను శీఘ్రంగా పెంచుకోవడం ద్వారా విదేశీ సాయాల మీద ఆధారపాటును దశలవారీగా తగ్గించుకోవాలని నిర్ణయించారు. (వాస్తవానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్ళలో విదేశీపెట్టుబడులను ఆకర్షించడానికి నెహ్రూ తీవ్ర కృషి చేసాడు. అప్పటికి శైశవదశలో ఉన్న భారత పెట్టుబడిదారుల పట్ల అంత నమ్మకం ఉండేది కాదు నెహ్రూకు).
భారీ పరిశ్రమల స్థాపనతో పాటు వినియోగ వస్తువుల తయారీ రంగంలో కార్మిక ఉపాధి కల్పన లక్ష్యంతో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకు గట్టి ఊతం ఇచ్చారు, ఈ విధంగా పరిశ్రమలలో ఉపాధి కల్పనతో పాటు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ సహకార కేంద్రాలు స్తాపించడం ద్వారా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను కట్టడి చేసే కృషి జరిగింది. ఈ “రంగాలలో ప్రభుత్వం పెద్దగా పెట్టుబడులు పెట్టింది లేదు (దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 30వ అధ్యాయంలో చూడవచ్చు.
నెహ్రూ - మహలనోబిస్ ప్రణాళికా వ్యూహంలో మరో కీలక ప్రాధాన్యత ఏంటంటే అభివృద్ధితో పాటు సమానత్వం సాధించడం. అందుకే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో కేంద్రీకరణ - పంపిణీల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. అయినా ఆశించినా ఫలితాలు రాలేదు. ఈ వ్యూహంలో లోపం ఏంటంటే సమానత్వ సాధన దిశగా అభివృద్ధి సాధన లక్ష్యంగా పెట్టుకోకపోవడం. ఆర్థికాభివృద్ధి వేగవంతమయితే సమానత్వం సాధనకు మెరుగైన అవకాశాలు ఉంటాయనే ఉద్దెశంతో, పెరిగిపోతున్న దారిద్ర్యాన్ని అరికట్టడానికి సత్వర ఆర్ధికాభివృద్ధి మీద దృష్టి పెట్టారు.
ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ది జరిగేలా రాజ్యం పర్యవేక్షించడం, ప్రభుత్వ - ప్రైవేటు రంగ పరిశ్రమల మధ్య పారిశ్రామిక కార్యకలాపాలను విభజించడం, గుత్తాధిపత్యాన్ని నిలవరించడం, చిన్న పరిశ్రమలకు రక్షణ, ప్రాంతీయ అసమానతలు శీర్8 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చేయి చేసుకోకుండా చూడడం, వనరులను ప్రణాళికా లక్ష్యాల ప్రాధాన్యత క్రమంలో కేటాయించడం - వీటన్నింటి మూలంగా కంట్రోళ్ళ (నియంత్రణ)తో కూడిన ఒక సంక్షిష్ట వ్యవస్థ ఏర్పడింది. పారిశ్రామిక లైసెన్సులు ఇవ్వడానికి, పరిశ్రమలను నియం(త్రించడానికి 1951లో పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణా చట్టం చేసారు. రెండవ పంచవర్ష ప్రణాళిక తొలి ఏడాదిలోనే 1956-57 విదేశీ మారక ద్రవ్యం కొరత, చెల్లింపుల సంక్షోభం (బ్యాలెన్స్ అఫ్ పేమెంట్ క్రైసిస్) ఏర్పడ్డాయి. లైసెన్సు, కోటాల రాజ్యం భారత ఆర్థిక వ్యవస్థ మీద బలమైన పట్టు సంపాదించాయి. అందుకే తదనంతర కాలంలో వీటిని సడలించడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. రాజకీయ నాయకులు - బ్యూరోక్రసీ సామ్యంతో పాటు ఈ వ్యవస్థ నుండి గరిష్టంగా ప్రయోజనం పొందిన లబ్టిదారులు 'మార్చు'ను తీవ్రంగా ప్రతిఘటించారు.
విజయాలు
నెహ్రూ హయాంలో అమలు చేసిన మొదటి మూడు పంచవర్న ప్రణాళికలు నెహ్రూ మరణానంతర కాలంలో పూర్తి ప్రభావం చూపించినప్పటికీ ఈ మూడు ప్రణాళికల కాలంలో సాధించిన విజయాలు ఏమిటో మనం ఇప్పుడు అంచనా వేద్దాం.
మొదటి మూడు పంచవర్న ప్రణాళికలు అమలయిన 19860 వ దశాబ్దం మధ్యకాలం వరకు బహుముఖ రంగాలలో తొలిదశ అభివృద్ధి గణనీయంగానే సాధ్యమయింది. బిటిష్ వలసపాలన కాలం నాటితో పోలిస్తే మొత్తంగా ఆర్థికవ్యవస్థ పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. జాతీయ స్థూల ఆదాయాలు, స్థూల జాతీయోత్పత్తి 1951 నుండి 1964-65 మధ్యకాలంలో సగటున ఏటా 4 శాతంగా నమోదయింది.
(1965-66 పరిగణనలోకి తీసుకోకపోవడానికి కారణం ఆ ఏడాది కని వినీ ఎరుగని స్థాయిలో కరువు ఏర్పడడం, యుద్ధం సంభవించడం). అంటే బ్రిటిష్ వలస పాలనలో అర్ధ శతాబ్దకాలంలో సాధించిన వృద్ధి రేటు కన్నా ఇది నాలుగురెట్లు ఎక్కువ. స్వాతంత్ర్యం సముపార్దించుకున్న ఇతర వర్ధమాన దేశాల ఆర్థికాభివృద్ధి రేటుతో పోలిస్తే భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించినట్లే. ప్రముఖ ఆర్థిక శాస్రవేత్త ప్రొఫెసర్ కె.ఎన్.రాజ్ ఈ విషయమై ఏం చెప్పారో చూద్దాం -
“19వ శతాబ్దపు రెండవ అర్థ శతాబ్ద కాలం నుండి 20వ శతాబ్దపు మొదటి రెండున్నర దశాబ్దాల కాలంలో జపాన్ శరవేగంగా అభివృద్ధి అయిన దేశంగా అందరూ విశ్వసిస్తుంటారు. కాని జపాన్ జాతీయ ఆదాయం ఈ కాలంలో 8 శాతం కన్నా కాస్త తక్కువ, 1893 నుండి 1912 మధ్య కాలంలో జపొన్ జాతీయ ఆదాయం సాలీనా స్వతంత్రం తర్వాత భారతదేశం శీర్లి
4 శాతం దాటలేదు. ఈ ప్రమాణాలతో సరిపోలిస్తే భారతదేశం గడిచిన దశాబ్దపున్నక కాలంలో (1950-65) సాధించిన ఆర్థికాభివృద్ధి ఖచ్చితంగా మెరుగైనది.”
ఆర్థికాభివృద్ధి రేటులో మెరుగుదల సాధించడానికి పెట్టుబడుల వృద్ధరేటులో గణనీయమైన మెరుగుదల ఉండాలి. ఈ కాలంలో సేవింగ్స్, పెట్టుబడుల వృద్ది వర్ష పెరిగింది. అస్తుబిస్తు సమాచారాన్ని ఆధారం చేసుకుని ముసాయిదా నాల్దవ పంచ ప్రణాళిక.
భారతదేశంలో జాతీయ పొదుపు, పెట్టుబడుల వృద్దిరేటు 1950-క మధ్యకాలంలో 5,5 శాతంగా ఉన్న వృద్ధిరేటు 1965-66 నాటికి జాతీయ పొ 10.5 శాతం పెట్టుబడుల వృద్ధిరేటు 14 శాతంగా గణించింది. జాతీయ పొ లో పెట్టుబడుల రేటుకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తదనంతర కాలంలో 1947 ను ఇంగ్లాండ్ భారతదేశానికి బకాయిపదిన స్టెర్లింగ్ నిల్వల నుండి 16 బిలియన్ రూపాయ' లో “లిక్షిడేటొ చెయ్యదం ద్వారా కొంతమేర పూరించుకుంది (రెండవ ప్రపంచ యుద్ధకాల్న శీ ఇంగ్లాండ్ భారతదేశం నుండి బలవంతంగా అప్పు తీసుకుంది). విదేశీ రుణాలు, ది సాయం రూపేణా సమీకరించిన నిధులనూ పాక్షికంగా ఇందుకోసం వినియోగించుకుంల 1965-66 నాటి మొత్తం పెట్టుబడులు 1951-52 కాలం నాటితో పోలిస్తే దాదాల ఐదు రెట్లు పెరిగాయి.
వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే స్వాతంత్రానంతరం సమగ్ర భూ సంసృరణలక శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామ స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుణర్నో రంగాల అభివృద్ధికి వీలుగా విస్తారమైన చర్యలు చేపట్టింది. సాగునీరు, విద్యుత్, వ్యవ న్ పరిశోధనలు, వ్యవసాయానికి తగిన మౌలిక వసతుల కల్పన మీద దృష్టి కేంద్రీకరించిం లో తద్వారా వ్యవసాయ అభివృద్దిని సాధించింది. తొలి మూడు పంచవర్న ప్రణాళికా కాలం న (1965-66 మినహా) ౩ శాతం వృద్ధిరేటు సాధించింది. బ్రిటిష్ వలస పాలనలో గడిచి అర్థశతాబ్ద కాలంతో పోలిస్తే దేశం ఏడున్నరరెట్లు వ్యవసాయ అభివృద్ధి సాధించింది వైనా, జపాన్ దేశాల వృద్ధిరటుతో పోల్చి చూపినా ఇది గణనీయమైన అభివృద్దియే. 1878 -1912 మధ్యకాలంలో జపాన్ సాధించిన వ్యవసాయాభివృద్ధి రేటు రెండున్న! శాతానికన్నా తక్కువగా ఉండింది. 1912-1981 మధ్య కాలంలో ఈ వృద్ధిరేటు ఇంకొ తక్కువగా ఉంది. చైనా, జపాన్, కొరియా, తైవాన్, సోవియట్, బ్రిటన్ వంటి దేశాలలో పోల్చినప్పుడు భారతదేశం వ్యవసాయాభివృద్ధి రేటును సాధించడానికి చేపట్టిన భూ సంస్కరణలు తదితర ప్రక్రియలు. ఆధునిక ప్రజాస్వామిక చట్రంలో పౌర హక్కులను శర్ర0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
గౌరవిస్తూ సాధించడం నమ్మశక్యం కానంతటి విజయం. అయినప్పటికీ ఈ వృద్ధిరేటు గిరాకీకి తగినట్లుగా లేకపోవడంతో తొలి మూడు పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 1956 నుండి భారతదేశం అమెరికా నుండి వివాదాస్పద పి.ఎల్-480 పథకం కింద గోధుమలు దిగుమతి చేసుకోవడం మీదనే ప్రధానంగా ఆధారపడింది. 1960 వ దశకంలో హరిత విప్లవానికి (గ్రీన్ రివల్యూషన్) శ్రీకారం చుట్టాక దిగుమతుల మీద ఆధారపాటు తగ్గుముఖం పట్టింది. (భూ సంస్కరణలు వ్యవసాయాభివృద్ధి దేశంలోని మెజారిటీ ప్రజానీకం బతుకుల మీద, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల మీద ఎలాంటి (ప్రభావం చూపించింది అనేది విడిగా 28, 29, 80 అధ్యాయాలలో చూడవచ్చు.)
తాలి మూడు పంచవర్ష ప్రణాళికలలో పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగాని కన్నా మరింత వేగంగా అభివృద్ధి చెందింది. 1951-65 మధ్యకాలంలో పారిశ్రామికాభివృద్ధి సాలీనా 7.1 శాతం నమోదు చేసింది. పారిశ్రామిక ప్రగతి ప్రధానంగా దిగుమతుల ఆధారపాటుకు ప్రత్యామ్నాయ లక్ష్యంతో సాగింది. తొలి పంచవర్న ప్రణాళికలో వినియోగ సరుకుల దిగుమతుల ఆధారపాటును తగ్గించుకోవడం లక్ష్యంగా చేసుకుంటే రెండవ పంచవర్ష ప్రణాళిక “క్యాపిటల్ గూడ్సు” మధ్యతరహా పరికరాలకు సంబంధించిన ఆధారపాటును తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండవ పంచవర్న ప్రణా ళికా కాలంలో లోహ, యంత్ర, రసాయన పరిశ్రమల మీద 70 శాతం ప్రణాళికా వ్యయం ఖర్చు చెయ్యడం, మూడవ పంచవర్న ప్రణాళికా కాలంలో 80 శాతం ఖర్చు చెయ్యడాన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకోవచ్చు. 1951-1969 మధ్యకాలంలో పారిశ్రామికోత్పత్తి సగటు సూచి మూడురెట్లు పెరగడానికి వినియోగ వస్తువుల పరిశ్రమల ఉత్పత్తిలో 76 శాతం. పెరుగుదల కారణం కాగా, మధ్యతరవో పరిశ్రమలలో పారిశ్రామికోత్పత్తి నాలుగురెట్లు క్యాపిటల్ గూడ్స్' పరిజ్రమలలో 10రెట్ల అధికోత్పత్తి సాధ్యపడింది. కాపిటల్ గూడ్స్, రంగంలో ఉత్పత్తి ఏ ప్రమాణాలతో చూసినా అత్యద్బుతమైన వృద్దిరేటుగా చెప్పుకోవచ్చు.
కింది పొందుపరిచిన పట్టిక 25-1, 25-2లను పరిశీలిస్తే 1957-71 మధ్య కాలంలో వినియోగ వస్తువుల తయారీ పరిశ్రమలు, టెక్స్టైల్ పరిశ్రమలు సాధించిన వృద్ధి రేటు కన్నా 'కాపిటల్ గూడ్స్" పరిథమలయిన ప్రాథమిక లోహాలు, రసాయనాలు, ఎలక్ట్రికల్, ఎలక్షికల్ యేతర పరిశ్రమలు, రవాణా విడి భాగాల పరిశ్రమలు సాధించిన వృద్ధిరేటు పెచ్చుగా ఉండడం మనం గమనించవచ్చు. స్వతంత్రం తర్వాత భారతదేశం శీటి1
పట్టిక 25-1 భారతదేశ పారిశ్రామిక వస్తూత్పత్తి సూచికలు 1951-79 1960 = 100 (1951-1971) 1970 = 100 (1978-79) పారిశ్రామిక (గ్రూపు 1951 1961 1971 1978-79 సాధారణ క్5్ 109 153 186 టెక్స్టైల్ 80 103 106 110 మౌలిక లోహాలు త్త 119 209 కశడ యంత్ర సామగ్రి 22 121 373 208 ఎలక్ట్రికల్ యంత్ర సామగ్రి 26 110 405 162 పట్టిక 25-2 భారతదేశ పారిశ్రామిక వస్తూత్నత్తిలో వృద్ధి రేట్లు 1951-52 - 1982-83 వరకు (శాతం) 1951-52 1960-61 1970-71 పారిశ్రామిక గ్రూపు నుండి నుండి నుండి 1959-60 1969-70 1982-85 టెక్స్టైల్ 2.98 0.70 5.36 రబ్బరు, పెట్రోలియం మరియు ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులు 17.54 10.40 3.82 రసాయనిక ఉత్పత్తులు 790 8.89 5.76 మౌలిక లోహాలు మరియు మిశ్రమాలు 6.52 701 546 ఎలగ్టికల్ యేతర యంత్ర సామగ్రి 2102 1700 16.09 ఎలక్టికల్ యంత్ర సామగ్రి 17.64 1401 6.17 రవాణా సాధనాలు 1488 7.66 8.84 462 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఈ రకమైన పాదిశ్రామక వృద్ధిరేటు మూలంగా ప్రాథమిక సరుకులు, యంత్రసామాగ్రి అవసరాల కోసం భారతదేశం సంపన్న విదేశీ దేశాల మీద ఆధారపడడం దాదాపుగా పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. పెట్టుబడుల సృష్టికి, ఉత్బాదక సామర్థ్యం పెంచుకోవడానికి ఇది అవసరపడింది. స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్ళలో ఏ యంత్ర పరికరాలనయినా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. 1950లో దేశానికి అవసరమైన యంత్ర సామాగ్రి 89.8 శాతం దిగుమతి చేసుకున్నవే. అదే 1960 కి వచ్చేసరికి ఈ దిగుమతులు 43 శాతానికి, 1974 కు వచ్చే సరికి కేవలం 9 శాతానికి పరిమితం అయింది. అలాగే ఈ కాలంలో దేశంలో స్థిరపెట్టుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 70వ దశకం మధ్య ప్రాంతానికి వచ్చేసరికి దేశానికి అవసరమైన భారీ యంత్ర సామాగ్రిని 90 శాతం దేశీయంగానే నిర్మించుకోగలిగాం. ఇది అసాధారణ విజయం. పెట్టుబడుల వృద్ధికోసం దేశం విదేశీ సాయం కోసం చెయ్యి సాచకుండా, స్వావలంబన దిశగా పయనించింది. అలాగే హరితవిష్లవాన్ని చేపట్టడం మూలంగా ప్రజలకు అహార భద్రత కల్పించగలిగింది. ఈ కారణాల రీత్యానే సంపన్న దేశాల నుండి ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నా భారతదేశం తన స్వతంత్ర్య, అలీన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉండగలిగింది.
విదేశీ పెట్టుబడులు, విదేశీ సాయం, సీమాంతర వనరుల మీద ఆధారపాటును అత్యల్ప స్థాయిలో ఉండేలా చూసారు. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ నికర జుతీయోత్పత్తితో పోలిస్తే 0.4 శాతం విదేశీ సాయాన్ని వినియోగించుతుంది. రెండవ - మూడవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఇది 2.25 శాతం, 3. 17 శాతంగా ఉన్నా (అధ్యాయం 26 చూడండి) 1960 మధ్య దశకం నుండి ఇది గణనీయంగా తగ్గుమొఖం పట్టింది. సీమాంతర వనరులు ప్రధానంగా అధికారిక విదేశీ సాయం రూపంలో వచ్చినదే. 1948-1961 మధ్య కాలంలో విదేశీసాయం - విదేశీపెట్టుబడుల నిష్పత్తి 6 :1 గా ఉండింది. మొదటి పంచవర్న ప్రణాళికా కాలంలో 4 శాతం పైబడి విదేశీ సాయాన్ని గోధుమల దిగుమతులకే వినియోగించారు. రెండవ, మూడవ పంచవర్ష (ప్రణాళికల కాలంలో అందిన విదేశీ రుణాల్లో 98 శాతం ఉక్కు పరిశ్రమల న్ధాపన,
స్వతంత్రం తర్వాత భారతదేశం 468
రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుచ్చక్తి రంగాల అభివృద్ధికి వినియోగించారు. మొత్తంగా చూస్తే మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలో 95 శాతం విదేశీ సాయాన్ని పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాలలో కుదువబెట్టారు. రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో సోవియట్ నుండి అందిన సాయాన్ని కీలక, మౌలిక పరిశ్రమలలో పెట్టుబడులుగా వినియోగించారు - అది కూడా ప్రభుత్వరంగ పరిశ్రమల స్టాపనకే. తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రభావం వేగంగా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు జాతీయ ఆర్థిక వ్యవస్థలో సమున్నత శిఖర స్థాయికి చేరుకోవడంతో విదేశీ కంపెనీల ఉనికి కుంచించుకుపోయింది. చాలా పరిమితం అయిపోయింది (లాటిన్ అమెరికా దేశాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు విదేశీ ప్రైవేటు పెట్టుబడులు, బహుళజాతి కంపెనీల అసరాతో పెరిగాయి. కొని భారతదేశంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. 1951-61 మధ్య కాలంలో మొత్తం కార్చొరేట్ రంగ మూలధనంతో (ప్రభుత్వ రంగ పరిశ్రమల మూలధనం 8.4 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. 1970వ దశకం తొలినాళ్ళలో ఇది 50 శాతానికి, 1978 నాటికి 75 శాతానికి చేరుకుంది. పరిశ్రమలు, వ్యవసాయానికి తోడు ప్రణాళికావేత్తలు బ్రిటిష్ వలస పరిపాలనా కాలంలో నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన విద్య, వైద్యం వంటి మౌళిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మొదటి మూడు (ప్రణాళికలలో రవాణా, కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి 18 బిలియన్ రూపాయలు వెచ్చించారు. సగటున ఇది ప్రతి ప్రణాళికా వ్యయంలో 26 శాతంగా ఉంది. సామాజిక రంగం కమ్యూనిటీ సేవలు - విద్యుత్ రంగాలకు వరుసగా 9.4 బిలియన్ రూపాయలు, 6.16 బిలియన్ రూపాయలు ఖర్చు చేసారు. సగటున ఇది ప్రణాళిక వ్యయంలో వరుసగా 19.9, 10.6 శాతానికి సమానం. క్రమేణా ఈ రంగాలలో (ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఉత్పాదకతను పెంచుకోవడం కీలకంగా మారింది. వ్యవసాయ రంగంలో హరితవిప్లవం సాధించడానికి ఇది దారితీసింది. శ్తేట్రిక బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
పట్టిక3 మౌలిక వసతుల కల్పనలో వృద్ధి, విద్య, ఆరోగ్యం అంశం యూనిట్ 1950 1960 1965 1950-51 -51-61 -66 మరియు 1965-66 మధ్యకాలంలో మార్పు శాతం విద్యుత్ : కెపాసిటీ మిలియన్ కౌలు 23 5.6 102 3985 విద్యుద్దికరించబడిన పట్టణాలు, గ్రామాలు 000 8,7 242 528 13185 రైల్వేలు : రవాణా మిలియన్ టన్నులు 98 156 205 120.4 రోడ్లు 000 కె.ఎం. 156 235 284 ఈ20 ఆసుపత్రుల పడకలు 000 118 186 300 1655 పాఠశాల నమోదు మిలియన్లు 285 4ఉఉఓ? 697.7 8821 సాంకేతిక విద్య ; ॥ ఇంజనీరింగ్, సాంకేతిక విద్య (ఎ) డిగ్రీ 1000 త 2198 247 502.4 (బి) డిప్లామా 1000 5.9 25.8 49.9 745.8 జనాభా మిలియన్లు 857 450 490 ౩7.3 ఈ పట్టికలో వివరాలను పరిశీలిస్తే మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమాల లబ్బిల తలసరి అందుబాటు జనాభా పెరుగుదల రేటు కన్నా పెచ్చుగా ఉండడం మనం గమనించవచ్చు, స్వతంత్రం తర్వాత భారతదేశం 465
1950-51 కాలంతో పోలిస్తే 1965-66 నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం నాలుగున్నర రెట్లు పెచ్చుగా ఉంది. గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో గతం కన్నా 14 రెట్లు ఎక్కువగా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రి పడకల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది. ప్రాథమిక విద్యలో నమోదు శాతం 3౩ రెట్లు పెరిగింది. ఇంజనీరింగ్ టెక్నాలజీ వంటి సాంకేతిక విద్యలో డిగ్రీలో 6 రెట్లు, డిప్లొమాలో 8.5 రెట్లు విద్యార్థులు చేరారు. అదే జనాభా పెరుగుదల విషయానికి వచ్చేసరికి 1/3 రెట్లు పెరిగింది.
జవహర్‌లాల్‌నెహ్రూ తదితర ్రణాళికావేత్తలు శాస్త సాంకేతిక రంగాల్లో. భారతదేశం ఎంత వెనుకబడి ఉందో గుర్తెరిగి ఉన్నారు (వలస పాలన కాలంలో ఈ రంగాల్లో ప్రగతి దాదాపు మృగ్యమనే చెప్పుకోవాలి). అందుకే ఈ బలహీనతను
అధిగమించడం మీద అత్యంత శ్రద్ధ పెట్టారు. అందుకే 'ఆధునిక లౌకిక భారతదేశంలో భారీ కర్మాగారాలు, నీటి పారుదల ప్రాజెక్టులే ఆధునిక దేవళాలు కాదు. ఉన్నత విద్యా సంస్థలు ప్రత్యేకించి శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా ఆధునిక దేవాలయాలే అన్నారు: నెహ్రు. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలోనే శాప్రీయ, పారిశ్రామిక పరిశోధనామందలి' (లవ్హై ఆధ్వర్యంలో పేరెన్నికగన్న జాతీయ స్థాయి లేబొ రేటరీలను స్టాపించారు. భౌతికశాస్త్రం, రసాయనికశా'స్తం, ఇంధనం, గాజు, పింగాణి, మందులు, ఆహారం, ఎలక్ట్రీ - కెమిస్ట్రీ, భవన నిర్మాణం, తోలు పరిశ్రమ, రోడ్ల నిర్మాణం వంటి కీలక సైన్సు విభాగాలు అన్నింటా మౌలిక పరిశోధనలు 'అవ్లయిడ్ రీసెర్చి' నిర్వహణకు పరిశోధనాలయాలు ఏర్పాటు చేసారు. 1948లో అణు ఇంధన సంస్థను ఏర్పాటు చేసారు. న్యూక్లియర్ సైన్సు తత్సంబంధిత రంగాలలో భారతదేశం ముందడుగు వెయ్యడానికి ఉపకరించేలా ఆనాడే పునాది వేసారు. సైన్సు, టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త కొత్త కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసారు. ప్రతి వార్షిక ప్రణాళికలోనూ శాస్త్ర పరిశోధనలకు కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 1949లో ఈ రంగానికి 10 మిలియన్ల రూపాయల కేటాయింపులు ఉంటే 1977 నాటికి అవి 4.5 బిలియన్ రూపాయలకు పెరిగాయి. ఫలితంగా ఈ రెండు కాలాల మధ్యన శాస్త్ర సాంకేతిక నిష్టాతుల సంఖ్య లక్షా తొంభై వేల నుండి సుమారు 12 రెట్లు పెరిగి ఇరవై మూడు లక్షల ఇరవైవేల మందికి చేరుకుంది. ఏ ప్రమాణాలతో చూసినా ఈ రంగంలో భారతదేశం సాధించిన ప్రగతి అత్యద్భుతంగా చెప్పుకోవచ్చు. సోవియట్ రష్యా పతనాంతరం ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం శాస్త్ర, సాంకేతిక నిపుణుల సంఖ్యా విషయంలో ద్వితీయ స్థానంలో ఉంది. విశ్వవిద్యాలయాల బోధనా పద్ధతులలో నాణ్యత తగ్గడం, మరోపక్కన మేధావుల 466 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వలసపోవడం (ప్రధానంగా అమెరికాకు) వంటి ఇబ్బందులు ఉన్నా ఈ స్థాయిలో నిష్టాతులను కలిగి ఉండడం దేశానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా “విజ్ఞానమే” ఉత్పత్తికి తోద్చదే కీలక సాధనం అన్న స్పృహ అంతర్జాతీయంగా పెరుగుతూ విద్య - మానవ వనరుల అభివృద్ధి మీద (శ్రద్ద పెట్టడం నానాటికీ పెరుగుతూ ఉంది. శాస్త్ర సాంకేతిక, ప్రధానమైన (ప్రపంచీకరణ క్రమంలో ఇవాళ భారతదేశం ఏ స్థాయిలో అయినా పోటీ పడడానికి సిద్ధంగా ఉందంటే దానికి భూమిక స్వాతంత్ర్యానంతర తొలినాళ్ళ నుండి పాలకులు (ప్రణాళికాబద్దంగా మానవ వనరుల అభివృద్ధికి ముఖ్యంగా శాస్త్ర - సాంకేతిక రంగాల మీద దృష్టి కేంద్రీకరించడమే తోద్పడిందని చెప్పుకోవచ్చు. భారతదేశం 1991 నుండి చేపట్టిన, ఆర్థిక సంస్కరణలను బలపరచడానికి
గాను పనిగట్టుకుని కాన్ని శక్తులు నెహా హయాం నుండి సాధించిన అభివృద్ధిని
తక్కువ చేసి చూపడమో, మొత్తంగా తృణీకరించదమో రివాజుగా మార్చుకున్నారు. ఇంతకన్నా చారిత్రక, హ్రస్వదృష్టి కల వాదన ఇంకొకటి ఉండదు. స్వాతంత్ర్యానంతర భారతదేశం
ఆధునికత వైపుగా ప్రయాణించడానికి అవసరమైన ముందస్తు భౌతిక ప్రాతిపదికను,
మానవ వనరుల అభివృద్ధిని కల్పించడంలో నెహ్రూ శకం శ్లాఘనీయమైన పాత్ర
పోషించింది. ఇవాళ భారతదేశం సాధించిన విజయాలు ఏమన్నా ఉన్నాయంటే దానికి
కారణం గతంలో నెహ్రూ హయాంలో సాధించిన ప్రణాళిక అభివృద్ధియే. అది లేనిది
తాజా విజయాలు లేవు.
అలాగే నెహ్రూ హయాం కూడా మనం ఆనాటి ప్రపంచ చారిత్రక పరిస్థితుల
దృష్ట్యా అంచనా వెయ్యాలి. బహుశా ఈ కారణానే 1991లో దేశంలో సంస్థాగత ఆర్థిక
సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మేధావి, స్వతహాగా ఆర్థికవేత్త అయిన నాటి కేంద్ర
ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఈ విధంగా సృష్టం చెయ్యాల్సి వచ్చింది - 1960 లలో
ఎవరన్నా రాబోయే పాతిక ముప్పైఏళ్ళలో తృతీయ ప్రపంచదేశాల కూటమిలో అగ్రగామి
ఎవరు అని అడిగితే భారతదేశమే అగ్రభాగాన ఉండేదని నా సమాధానం” పశ్చిమదేశాల
సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు -డబ్లూ, డబ్లూ రోస్ట్, రోసెన్ స్టీన్ - రొడాన్, విల్డ్రైద్ మాండెల్బామ్,
జార్దిరోసెన్, ఐయాన్ లిటిల్, బ్రెయిన్ రెఢ్వివే సవా విశ్వవ్యాప్తంగా అనేకమంది ఆర్థికవేత్తలు
భారతదేశం ఎంచుకున్న ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణం సానుకూలమైనదీ,
శక్తివంతమైనది” అని కొనియాడారు (చైనా అనుసరిస్తున్న కేంద్రీకృత ఆర్థికవ్యవస్థ విధానాల కన్నా ప్రజాస్వామిక భారతదేశం అనుసరిస్తున్న విధానాలు సరైనవిగా ఊరించడం కూడా ఈ కొనియాడడంలో అంతర్భాగం కావచ్చు). వాస్తవానికి ఆనాటి అభివృద్ధి పరిణామ స్వతంత్రం తర్వాత భారతదేశం 46౮7
క్రమ సిద్ధాంతానికి - భారతదేశ అనుభవానికి గతితార్మిక సంబంధం ఉంది. సుప్రసిద్ధ ఆర్థికవేత్త సుకొమయ్ చక్రవర్తి మాటల్లో చెప్పాలంటే - సమకాలీన ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాల్లో బలీయమైన అంశ భారతదేశ ప్రణాళికా తర్మాన్ని ప్రభావితం చేసినట్లే ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని కూడా భారతదేశ అనుభవం గణనీయంగా ప్రభావితం చేసింది.”
బ్రిటిష్ వలసపాలనలో అత్యంత వెనుకబడిన దేశంగా ఉన్న నేపథ్యం నుండి స్వాతంత్ర్యానంతరం ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామికంగా రూపాంతరం చెందడానికి ఎంచుకున్న ఈ విన్నూత్నమైన కృషిలోని అనుభవాలను గ్రహిస్తూ కాలానుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం తప్పక ఉంది. పారిశ్రామిక లైసెన్సు విధానం, ధరలు - పంపిణీలపై నియంత్రణలు, దిగుమతుల మీద నియంత్రణలు, ప్రభత్వ రంగ సంస్థల మీద ఆధారపాటు తదితర విధానపరమైన నిర్ణయాలను అవశ్యం సవరించుకోవాల్సిందే. అలాగే ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో సంభవిస్తున్న మార్పులు తెచ్చిపెట్టిన ఆర్థికావకాశాలనూ అందుకోవాల్సి ఉంది. (ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నానాటికీ వీటికి తులుపులు బార్గా తెరిచేస్తుంది.' అయితే అలాంటి అవకాశాలను అందుకోవడంలో భారతదేశం సఫలం కాలేదు. 1960 వ దశాబ్దంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న మార్పులు, అంతర్గతంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మూలంగా భారతదేశం మరింత రక్షణాత్మక విధానాలు అవలంబించాల్సిన స్థితికి నెట్టబడింది. ఆ వివరాలను తదుపరి అధ్యాయంలో మరింత వివరణాత్మకంగా పరిశీలిద్దాం. 468 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
26 భారత ఆర్లిక వ్యవస్థ 1965 -199]1 యః ఉం అరవయ్యవ దశకం మధ్య భాగం : జోషీ సంక్షోభం - ఉపశమనం మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల ద్వారా చెప్పుకోదగ్గ విజయాలు సాధించినా 60 వ దశకం మధ్యభాగంలోకి వచ్చేసరికి భారత ఆర్థిక వ్యవస్థ _అనేక విధాలుగా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది. తృతీయ ప్రపంచ దేశాలకు శీఘ్రగతిన అభివృద్ధి సాధిస్తున్న ఒక నమూనా ఆర్ధిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న భారతదేశం ఆ ప్రతిష్టను చేజార్చుకుంది. 1965, 66 సంవత్సరాలలో వరుసగా రెండు ఏళ్ళు రుతుపవనాలు మొహం చాటేయడంతో వ్యవసాయ రంగంలో సంక్షోభం పొడచూపింది. వ్యవసాయోత్స్పత్తి 17 శాతం, ఆహారోత్పత్తులు 20 శాతం పడిపోయాయి. 1968 వరకూ ఏటా 2 శాతానికి మించని ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 1965-1968 మధ్య కాలంలో సాలీనా 12 శాతానికి పెరిగింది. ఆహారోత్పత్తుల ధరలు సాలీనా 20 శాతం పెరిగాయి. ఈ ద్రవ్యోల్బణానికి వర్షాభావా పరిస్థితుల మూలంగా ఏర్పడిన కరువు ఒక కారణం కాగా 1962 లో చైనాతో, 1965 లో పాకిస్తాన్‌తో తలెత్తిన యుద్దాలూ ఇంకో కారణం అయ్యాయి. 1966-67 సంవత్సరంలో ప్రభుత్వ ద్రవ్వలోటు స్టూలజాతీయోత్స్పత్తిలో 7.3 శాతానికి చేరుకుంది.
1956-57 నాటి నుందే ఇబ్బందుల్లో ఉన్న చెల్లింపుల (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) పరిస్థితి మరింత దిగజారిపోయింది. 1964-65, 1966-67 మధ్యకాలంలో ప్రభుత్వం వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు (బంగారం మినహా) 340 మిలియన్ల డాలర్లు మాత్రమే. ఈ నిల్వలు రెండు నెలల దిగుమతుల బిల్లులకు చెల్లిపోయే పరిస్థితి. మొదటి స్వతంత్రం తర్వాత భారతదేశం 469
మూడు పంచవర్ష ప్రణాళికలలో విదేశీ సాయం పద్దు క్రమేణా పెరుగుతూ వచ్చింది చెల్లింపుల సంక్షోభం, ఆహార ఉత్పత్తుల కొరత మూలంగా దేశం మరింత విదేశీ సాయం మీద ఆధారపడాల్సి వచ్చింది. 1951-52 ఆర్థిక సంవత్సరంలో విదేశీ సాయం వినియోగం నికర జాతీయోత్పత్తిలో 0.86 శాతంగా ఉండేది. 1956-57 నాటికి ఇది 105 శాతానికి 1957-58 నాటికి 2.37 శాతానికి, 1960-61 నాటికి 25 శాతానికి 1965-66 నాటికి ఇది 3.8 శాతానికి పెరిగింది. వడ్డీ చెల్లింపులు ఎగుమతుల శాతంతో లెక్యిస్తే (డెట్ సర్వీస్ రేషియో) మొదటి ప్రణాళికా కాలంలో 0.8 శాతంగా వన్నీ ఈ చెల్లింపులు రెండవ ప్రణాళికా కాలం నాటికి 14.3 శాతానికి, మూడవ పంచవర్న ప్రణాళికా కాలం నాటికి 20.6 శాతానికి 1966-67 నాటికి 27.8 శాతానికి చేరుకుంది. పర్యవసానంగా దీర్హక్షాలిక పంచవర్ష ప్రణాళికలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి 1960 నుండి 1969 వరకూ ప్రభుత్వం వార్నీక ప్రణాళికలు రూపొందించింది. 1969 ఏటీల్ నుండి ఐదవ పంచవర్న ప్రణాళికల శ్రీకారం చుట్టింది.
1966 నుండి 69 వరకూ గడిచిన మూదేళ్ళూ భారతదేశానికి గద్దుకాలమనే చెప్పుకోవాలి. అధిక ద్రవ్యోల్బణం, అత్యల్ప విదేశీ మారకద్రవ్య నిల్వలు, ఆహార నిల్వల కొరత మూలంగా దేశంలో చాలా చోట్ల క్షామం పరిస్టితులు నెలకొన్నాయి. దాంతో భౌరీగొ దిగుమతుల మీద ఆధారపడాల్సి వచ్చింది. అందులోనూ ఈ దిగుమతుల కోసం విదేశీ సాయం మీద - ముఖ్యంగా ఆనాటికి అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చింది. అయిలే ఇందో - పాక్ యుద్దాన్ని అడ్డం పెట్టుకుని ఆమెరికా తన సాయాన్ని నిలిపివేసింది అలాగే గోధుమల దిగుమతుల కోసం కుదుర్చుకున్న పి. ఎల్-480 దీర్హకాలిక ఒప్పందొన్ని తిరగరాయడానికి నిరాకరించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్ మౌ టల్లో చెప్పాలంటే - “భారతదేశం మెడలో కుక్క గొలుసు ఉంటేనే కదా మా విధానొలో అనుగుణంగా ఆడించగలిగేది! - పి.ఎల్. 480 ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశం మీద ఒత్తిడి పెంచాలనేది అమెరికా వ్యూహం.
అమెరికా - ప్రపంచబ్యాంకు - అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ మూడు కలిసి భారతదేశం ముందు ఒక అజెండా పెట్తాయి. (అ) పారిశ్రామిక కంట్రోళ్ళు ఎత్తివెయ్యడం, వాణిజ్య విధానాలు సడలించడం (ఆ) రూపాయి విలువ తగ్గించడం (ఇ) నూతన వ్యవసాయక విధానాన్ని చేపట్టడం. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకు రావాలనే డిమాండుకి దేశీయంగా చెప్పుకోదగ్గమద్దతు లభించింది. (ఆ మేరకు విజయవంతంగా అమలయ్యాయి కూడా) కానీ వాణిజ్య - పారిశ్రామీక విధానాల సరళీకరణ 470 బిపన్చం[ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మీద, అంతకన్నా ఎక్కువగా రూపాయి విలువ తగ్గించడం మీదా సందేహాలు నెలకొన్నాయి. అయినప్పటికి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ రూపాయి విలువను 36.5 శాతం తగ్గించింది. అలాగే వాణిజ్య - పారిశ్రామిక రంగాలలో అమెరికా - అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సలహాల మేరకు సరళీకరణ విధానాలను శ్రీకారం చుట్టారు... అయితే పారి(శామిక రంగంలో ఏర్పడిన మాంద్యం, (ద్రవ్యోల్బణం, ఎగుమతులు ఊపందుకోకపోవడం, దుర్శిక్ష పరిస్థితులు - ఈ నేపథ్యంలో 60 వ దశకం మధ్యభాగంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు అరకొరవే అయినప్పటికీ, వాటి దీరకాలిక ప్రభావం ఏమిటో స్పష్టం కానప్పటికీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.
రూపాయి విలువ తగ్గింపు, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో నియంత్రణల సడలింపు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం దీనికి తోడు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చేతులు మెలిపెట్టి మరీ బలవంతానా ఈ విధానాలను అనుసరించేలా చేసాయనే సెంటిమెంటు “ఆర్థిక జాతీయ వాదానికి' దారితీసాయి. తిరిగి కంట్రోక్ళయుగానికి, రాజ్యం జోక్యం చేసుకునే విధానాలకు మళ్ళాలనే భావనను బలోపేతం చేసాయి. తక్షణం చెల్లింపుల సంక్షోభం నుండి బయట పడడం దీనికి గాను తగినన్ని విదేశీ మారక ద్రవ్యనిధులు సమకూర్చుకోవడం, వ్యవసాయోత్పత్తిని గణనీయంగా పెంచుకుని తద్వారా ఆహార దిగుమతుల మీద ఆధారపాటును తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చెల్లింపుల సంక్షోభం నుండి బయటపడడానికి, ద్రవ్యలోటును తగ్గించేదానికి ప్రభుత్వ వ్యయంలో భారీ కోత విధించడం, పన్నులు పెంచడం వంటి తీవ్రమైన చర్యలకు పూనుకుంది సర్కారు. ప్రభుత్వ వ్యయంలో కోత కూడా ప్రధానంగా క్యాపిటల్ వ్యయంలో కోతమీద కేంద్రీకరించింది. 1966-67, 1970-71 మధ్య కాలంలో క్యాపిటల్ వ్యయంలో దాదాపు 50 శాతం కోతపడింది. పారిశ్రామిక మాంద్యం కొనసాగడానికి ఇదొక కారణం కూడా. 70వ దశకం మధ్యభాగం వరకూ ఈ మాంద్యం కొనసాగింది. పారిభ్రామికాభివృద్ధి రేటు 1951-66 మధ్యకాలంలో 7.8 శాతం కాగా 1966 - 74 మధ్యకాలంలో ఇది 4. 9 శాతానికి దిగజారింది.
ఈ కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలమీద ప్రభావం చూపించాయి. 1967 జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఎదురు దెబ్బలు తినడంతో పాటు ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలలో బాగా దెబ్బతిన్నది. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అతివాద వైఖరి తీసుకోవడంతో పార్టీలో సంక్షోభం ముదిరి చివరకు నవంబరు 1969 లో పార్టీ చీలిపోయింది. పార్టీ చీలిక తర్వాత స్వతంత్రం తర్వాత భారతదేశం క్షే
కమ్యూనిస్టుపార్టీ మరికొన్ని ప్రాంతీయ పార్టీల సహకారంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. ఫలితంగా శ్రీమతి ఇందిరాగాంధీ అతివాద వామపక్ష విధానాలవైపు మొగ్గారు. 1970 డిసెంబరులో మధ్యంతర ఎన్నికలకు దారితీసేలా ప్రభుత్వం రాజీనామా సమర్పించింది. ఈ దఫా 'గరబీ హఠావో నినాదంతో, అతివాద సోషలిస్టు విధానాలకు కట్టుబడి ఉంటామన్న వాగ్గానాలతో ఎన్నికల బరిలోకి దిగారు. 1971 మార్చిలో జరిగిన ఎన్నికలలో అపూర్వ ఘనవిజయం సాధించారు.
1967 తరువాత శ్రీమతి ఇందిరా గాంధీ అతివాద ఆర్థిక విధానాలను గొలుసుకట్టుగా ప్రకటించేసారు. దీర్హకాలంలో ఈ విధానాలు దేశ ఆర్థికాభివృద్ధి మీద ప్రభావం చూపించగలిగేవి. కొన్ని విధానాలు 1950-60వ దశకాల్లో చేపట్టిన ప్రణాళికబిద్ధ ఆర్థిక విధానాల్లోని కొన్ని లోటుపొట్లను సరిదిద్దాయి. మరికొన్ని విధానాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. 1969లో దేశంలోని అతిపెద్ద (ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసారు. అదే ఏడాది గుత్త వాణిజ్య నియంత్రణా చట్టాన్ని (14277) తీసుకు వచ్చారు. ఈ చట్టం బడా పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలని తీవ్రంగా నియంత్రించింది. 1971 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన దరిమిలా పి.యన్.హక్సర్, డ.పి.ధర్, మోహన కుమార మంగళం వంటి అతివాద వామపక్ష మేధావుల మద్దతుతో ప్రభుత్వ నియంత్రణలు: జోక్యం మరింతగా పెంచే అనేక విధానాలను శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే 1972లో ఇన్సూరెన్స్ రంగాన్ని 1978లో బొగ్గు గనుల రంగాన్ని. జాతీయం చేసింది. అదే ఏడాది గోధుమల గుత్త వ్యాపారాన్ని జాతీయం చేసే వినాశకర ప్రయత్నం జరిగింది. కొద్ది నెలల తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నది. 1973లోనే విదేశీ మారక నియంత్రణ (ఫెరా) చట్టం కూడా చేసారు. తద్వారా దేశంలోని విదేశీ కంపెనీల కార్యకలాపాలు, దేశంలోకి వచ్చి చేరే విదేశీ పెట్టుబడుల మీద తీవ్ర ఆంక్షలు వచ్చిపడ్డాయి. విదేశీ పెట్టుబడులు కాలూనడానికి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్ట దేశంగొ తయారయింది భారతదేశం. అలాగే ఖాయిలా పడిన అనేక పరిశ్రమలను స్వాధీనం చేసుకుని వాటిని తానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్టాలు వస్తున్న పరిశ్రమలను మూసివెయ్యదానికి బదులు ప్రభుత్వమే వాటి నిర్వహణను తలకెత్తుకుంది. ఈ క్రమంలోనే వందలాది టెక్స్టైల్ పరిశ్రమలు ప్రభుత్వపరం అయ్యాయి.
ఈ విధానాలు మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపించాయి అనేది తదుపరి అధ్యాయంలో వివరంగా చర్చించాం. అయితే ఈ విధానాలన్ని ఓకే ప్రత్యేక చారిత్రక ఆర్థిక - రాజకీయ పరిస్థితులలో చేపట్టినవన్న విషయం మన గమనంలో శ72 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉందాలి. ఆ రోజుకి దేశం అనేకానేక క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటోంది. భారతదేశం ఆనాడు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడడానికి, సౌర్వభౌమత్వాన్ని రాజకీయ స్వాతంత్ర్యాన్ని, పశ్చిమదేశాల దృష్టిలో మసకబారిన హోదాని నిలబెట్టుకునే దానికి ఈ విధానాలు ఎంతగానో ఉపకరించాయని విస్పష్టంగా చెప్పుకోవచ్చు. సాధించిన విజయాలు
1960 వ దశకం మధ్యకాలం నుండి 80 వ దశాబ్దం చివరివరకూ శ్రీమతి ఇందిరాగాంధీ చేపట్టిన ఆర్ధిక విధానాలను తరచూ చాలామంది ప్రజాకర్షక విధానాలుగా కొట్టిపారేస్తుంటారు గానీ... నిజానికి ఈ విధానాలు చెప్పుకోదగ్గ ఆర్థిక విజయాలను సాధించి పెట్టాయి. పైన పేర్ళొన్న కాలంలో దేశం ఇంటా - బయటా ఎదుర్శొన్న సవాళ్ళ నేపథ్యంలో మనం ఈ విజయాలను అంచనా కట్టాలి. 60వ దశాబ్దం మధ్యకాలం నుండి వర్షాభావం, దుర్భిక్ష పరిస్థితులు, పారిశ్రామిక మాంద్యం వంటి సంక్షోభ పరిస్థితులలో దేశం కొట్టుమిట్టాడుతుండగానే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్‌లో జరిగిన మానవ మారణకాండ మూలంగా దాదాపు 10 లక్షబ మంది శరణార్థులుగా మనదేశంలోకి వచ్చి తలదాచుకున్నారు. ఈ శరణార్థుల సంఖ్య అనాటి అ్ట్రేలియా దేశ జనాభలో సగం అని మనం గుర్తుంచుకోవాలి. 1971 లో పాకిస్తాన్ తో యుద్ధం, 1972, 74 సంవత్సరాలలో సంభవించిన కరువు 1973లో అంతర్జాతీయ చమురు రంగంలో తలెత్తిన సంక్షోభం మూలంగా పెరిగిన ఆయిల్ ధరలు 1979 వచ్చేసరికి రెట్టింపు భారమయిన చమురు దిగుమతులు, 1978-50 ఆర్ధిక సంవత్సరంలో పంట దిగుబడులు దారుణంగా పడిపోవడం, స్వాతంత్రానంతరం ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో దుర్భిక్షం నెలకొనడం అలాగే 1957 -58 సంవత్సరాల్లో కరువు ఏర్పడడం - ఇవన్నీ ఆనాడు దేశం ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్ళు.
1960ల మధ్య దశకం నుండి నిర్మాణాత్మకమైన కృషి మొదలయ్యింది. చెల్లింపుల సంక్షోభం నుండి బయటపడడానికి, ఆహార భద్రత కల్పించేదానికి - ఇందులో భాగంగానే దారిద్ర్య నిర్మూలనా పథకాలు చేపట్టేదానికి, చమురు కోసం విదేశీ దిగుమతుల మీద ఆధారపోటు తగ్గించేదానికి బహుముఖ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చర్యల ఫలితంగా కరువులు, యుద్దాలు, చమురు సంక్షోభాలు చుట్టుముట్టినా భారతదేశం మిగిలిన వర్దమాన దేశాల మాదిరిగా ప్రత్యేకించి 80వ దశకంలో లాటిన్ దేశాలవలె - రుణ సంక్షోభంలోకి కూరుకుపోలేదు. అలాగే 50వ దశకంలో చైనాలో కరవు మూలంగా సంభవించినట్లు పెద్దఎత్తు మరణాలు చోటు చేసుకోలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 478
ఆహార రంగంలో పరిస్థితి త్వరితంగానే మెరుగుపడింది. హరితవిస్లవానికి థీని చుట్టడం, మేలైన అధికోత్పత్తిని ఇచ్చే వంగడాల వినియోగం, ఎరువులు తదితర వ్యవసాయ మౌలిక వసతుల అందజేత. ఎంపిక చేసిన ప్రాంతాలపై దృష్టి నిలపడంతో ఆహార భద్రే కల్పించడానికి అవసరమైన తక్షణ ఫలితాలు సాధించడానికి, దారిద్య్రాన్ని తగ్గించదానికీ వీలయ్యింది (వివరాలు 31వ అధ్యాయంలో విపులంగా చర్చించబడ్డాయి. 1967-68 1970-71 మధ్య రెండేళ్ళు కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 35 శాతం పెరిగింది. అలాగే నికర ఆహార ధాన్యాల దిగుమతి 1966 లో 10.3 మిలియన్ టన్నులు ఉండేది. 1970 నాటికి 3.6 మిలియన్ టన్నులకు తగ్గింది. అదే సమయంలో ఆహార భాన్వాల లభ్యత 73.5 మిలియన్ టన్నుల నుండి 89.5 మిలియన్ టన్నులకు పెరిగింది. 188 నుండి 1984 కి వచ్చేసరికి ఆహార ధాన్యాల లభ్యత 110.25 మిలియన్ టన్నుల నుండి 1288 మిలియన్ టన్నులకు పెరిగింది. 80వ దశకం మధ్యభాగంలో 30 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను నిలవబెట్టే స్థాయికి చేరుతుంది. ఆ రకంగా తీవ్ర ఆహారోత్పతో సంక్షోభం నుండి గబ్టెక్కిన దేశం 'అడుక్కుతినే పాత్ర నుండి 'అక్షయ పొత్ర' దశకు చేరుకుంది. ఇందుమూలంగానే 1987-88 సంవత్సరాల్లో వరుసగా కరువు పరస్థితులు ఏర్పడీనొ ఆహారోత్పత్తుల ధరలమీదా, దిగుమతుల వ్యయం మీదా ప్రతికూల ప్రభావం పదకుంగొ నిభాయించుకోగలిగింది. ఇంత కరువు కాలంలో కూడా గ్రామీణ పేదరిక సూచీ తగ్గుముఖి పట్టింది. కారణం ప్రభుత్వం గోదాముల్లోని ఆహార ధాన్యాల నిల్వలను ఉపయోగపెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించింది. స్వాతంత్ర్యానంతర కాలంలో దిగుబడి దెబ్బతిన్న మూలంగానో, కరువు మూలంగానో గ్రామీణ పేదరికం తీవ్రం కాకపోవడం ఇదే తొలిసారి.
ఆహారోత్పత్తులలో స్వావలంబన సాధించడంతో పాటు ఇతరత్రా అంశాలు కూదా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్వయం ప్రతిపత్తి సాధించడానికి తోద్పడ్డాయి. 1966-67లో 7-3 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 1969-70 నాటికి 3.8 శాతానికి తగ్గింది. ఆహారోత్చత్తులు తదితరాల దిగుమతులు గణనీయంగా తగ్గడం, చమురు రంగంలో “బూమ్” రావడంలో మధ్య ప్రాచ్యదేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయుల నుండి నిధులు దేశంలోకి గణనీయంగొ రావడంతో చెల్లింపుల పరిస్థితి మెరుగుపడింది. 1978-79 నాటికి విదేశీ మారక (ద్రవ్య నిధులు 7.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దాదాపు తొమ్మిది నెలల దిగుమతుల బిల్లుకు చాలినన్ని నిధులు సమకూరాయి. శత బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆర్థికసాయం అందచేయడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు చేతులు మెలిపెట్టే తీరు చూసాక విదేశీ సాయం మీద ఆధారపాటును తగ్గించుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి నెహ్రూ - మహలనోబిస్ల ఆర్థిక వ్యూహం ఎంత అక్కరకు వస్తుందో, స్వావలంబన సాధించడానికి, మధ్యకాలిక వ్యూహాలకు ఎంత అనువైనదో ఈ అనుభవం మనకు బోధపరుస్తుంది. ఈ దృక్పథాన్ని ఆలంబనగా చేసుకోవడంతో విదేశీ సాయం మీద ఆధారపాటు గణనీయంగా తగ్గింది. మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం నాటికి నికర విదేశీ సాయం నికర జాతీయోత్బత్తి లో 4.22 శాతానికి ఉండేదల్లా 1972-73 ఆర్థిక సంవత్సరానికి 0.35 శాతానికి తగ్గింది. 1978లో చమురు సంక్షోభం మూలంగా ఈ శాతం స్వల్పంగా పెరిగినా 1977-78 వరకూ ఇది ఒక శాతానికి ఎన్నడూ మించలేదు. 1970-71లో 23 శాతంగా ఉన్న రుణ చెల్లింపుల నిష్పత్తి 1974-75 నాటికి 16.5 శాతానికి 1980-81 నాటికి 10.2 శాతానికి తగ్గింది.
నెహ్రూ హయాంలో దేశీయంగా "కాపిటల్ గూడ్స్” పరిశ్రమ అత్యంత శీఘ్రగతిన ఎలా విస్తరించిందీ మనం పట్టిక 25లో చూసాం. ఫలితంగా యంత్ర సామాగ్రిని దిగుమతి చేసుకునేందుకు గానూ ప్రభుత్వం చేసే స్థిరపెట్టుబడి వ్యయం 1960లలో 48 శాతంగా ఉండేదల్లా 1974 నాటికి 9 శాతానికి తగ్గుముఖం పట్టింది. తద్వారా విదేశాల మీద ఆధారపాటు తగ్గడంతో పాటు దేశీయ పెట్టుబడి పెరిగే దానికి అవకాశాలు మెరుగయ్యాయి.
మొత్తం పెట్టుబడులలో (మైవేటు విదేశీ పెట్టుబడులు అతి స్వల్బంగా ఉండేవి. లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాలలో మాదిరి కాకుండా భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కాని బహుళజాతి సంస్థలు పోషించిన పాత్ర స్వల్పమనే చెప్పాలి. 1981-82 లో 'మైనింగు' (గనులు) వస్తూత్పత్తి రంగాలలో విదేశీ సంస్థలు జత చేసిన అదనపు విలువ 10 శాతంగా మాత్రమే ఉండేది. ఈ 10 శాతం కూదా 'పెరా' చట్టం నిబంధనలకు లోబడి, వివిధ సంస్థలలో ఉన్న విదేశీ షేర్ వోల్డింగ్ మాత్రమే అని మనం గమనంలో ఉంచుకోవాలి. 80వ దశకం వరకు విదేశీ భాగస్వాన్యూలన్నీ సాంకేతిక భాగస్వామ్యాలే తప్ప ఎలాంటి విదేశీ పెట్టుబడి కానీ, మూలధన వాటాల్లో భాగం కానీలేదు. 1977-80 మధ్యకాలంలో చూస్తే 86.5 శాతం సాంకేతిక దిగుమతి ఒప్పందాల్లో నయా పైసా విదేశీ పెట్టుబడి లేదు. అలాగే ఫైనాన్షియల్ రంగంలో కూడా విదేశీ పెట్టుబడి అతి స్వల్చంగా ఉండింది. ఇన్సూరెన్స్ రంగంలో అయితే లెక్కలోకే రాదు. బ్యాంకింగ్ రంగంలో మాత్రం 1970ల నాటికి మొత్తం డిపాజిట్లతో విదేశీ బ్యాంకుల వాటా కేవలం 8,9 శాతం మాత్రమే. బ్యాంకులను జాతీయం చేసిన 1969వ సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల స్వతంత్రం తర్వాత భారతదేశం 475
సంఖ్య 8,262 గా మలి విడత జాతీయకరణ (1981) నాటికి ఈ సంఖ్య 35,70*క చేరుకుంది. ఇదే కాలంలో విదేశీ బ్యాంకు బ్రాంచీల సంఖ్య 130 నుండి 132కి పెరిగింది. 1992 నాటికి వాణిజ్య బ్యాంకు శాఖల సంఖ్య 60,601 కి పెరగగా, విదేశీ బ్యాంకుల సంఖ్య 140కి చేరుకుంది. ఇంకా చెప్పుకోవాలంటే 60 శాతం బ్యాంకు శాఖల విస్తరణ (గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్సును సమీకరించడానికి బో వితరణకు ఈ విస్తరణ ఎంతగానో తోద్పడింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యతా రంగ రుణవితరణ విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. రెండవదళే భూ సంస్కరణలు, 'గరీబీ హఠావో ప్రచారానికి ఊతంగా నిలబడింది బ్యాంకింగ్ విస్తరణయే. ఆ రకంగా 1970వ దశకంలో విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు, విదేశీ సాయం రెండు కూడా పరిమాణంలో నామమాత్రంగా ఉండగా దేశీయ పెట్టుబడులు, సేవింగ్సు అనూహ్యాంగా అభివృద్ధి చెందాయి. పట్టిక 26.1 పరిశీలిస్తే స్థూల దేశీయ పెట్టుబడులు సంచయంతో కాని, పెట్టుబడులతో కానీ దేశీయ సేవింగ్సు సగటు రేటు పోల్చి చూ స్తే 50 దశకంలో 11.84 శాతంగా ఉందేదల్లా 1975-76, 1979-80 లనాటికి వరుసగొ 21.22 శాతం, 20.6 కి శాతానికి చేరుకుంది. 1980,90వ దశకాల్లో దేశీయ మదుపు (సేవింగ్స్) పెట్టుబడుల వృద్ధి మరింతగా పెరిగి ప్రపంచ అగ్ర దేశాల స్థాయికి చేరుకుగ్నారా. పట్టిక 26.1 స్థూల దేశీయ సేవింగ్స్ మరియు స్థూల దేశీయ పెట్టుబడి సంచయము మౌళిక వసతుల కల్పనలో వృద్ధి, విద్య, ఆరోగ్యం (4 వెలాంల ౧౮699 2 ౧౫౪౯ల 42061 వరంలా)
వార్షిక సగటు స్తూల దేశీయ సేవింగ్స్ స్టూల దేశీయ పెట్టుబడి
థి స్ట సంచయం
1950-51 నుండి 1959-60 10.58 1184
1960-61 నుండి 1969-70 18.58 15.63
1970-71 నుండి 1979-80 18.92 19.86
1975-76 నుండి 1979-80 21.22 20. 68
1980-81 నుండి 1989-90 20.08 21.99
1990-91 నుండి 1995-96 2380 25.85 474 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విద్యుత్ :
80వ దశకంలో స్టాక్ మార్కెట్లో “పబ్లిక్ ఇష్యూలో జారీలో అనూహ్యమైన పెరుగుదల చోటు చేసుకుంది. పరిశమలు తమకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి స్టాక్ మార్కెట్ ప్రధానమైన, కీలకమైన వనరుగా మారింది. 1981వ సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నుండి సమీకరించిన మూలధన. నిధులు దేశీయ మదుపులో కేవలం ఒక్క శాతంగా ఉండాలి. అదే దశాబ్దాంతానికి వచ్చేసరికి 7 రెట్లు పెరిగాయి. 1989లో 6500 కోట్ల రూ॥ల మేర మూలధన నిధుల సమీకరణ జరిగింది. 1989-90 ఆర్థిక సంవత్సరంలో సూల దేశీయ మదుపులో ఇది 7.25 శాతం, అలాగే 1990లో భారత పరిశ్రమలు అనూహ్యమైన రీతిలో 12,300 కోట్ల రూ॥లు (పైమరీ మార్కెట్ నుండి పెట్టుబడిగా సమీకరించాయి.
అలాగే 80వ దశకం ఆదిలోనే చమురు దిగుమతుల ఆధారపాటును తగ్గించుకోవడానికి చమురు, సహజ వాయువుల కమిషన్ (ఓ.ఎన్.జి.సి.) పర్యవేక్షణ ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ. ఎం.ఎఫ్.) నుండి స్వీకరించిన రుణంలో సింహభాగం ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన ఓ.ఎన్.జి.సి కార్యకలాపాలను విస్తృతం చేయడానికి వినియోగించారు. 1980-81 నాటికి దేశీయ చమురు ఉత్పత్తి 10.5 మిలియన్ టన్నులుగా ఉంటే, మరో 20.6 మిలియన్ టన్నుల చమురు విదేశాల నుండి దిగుమతి అయ్యేది. ఎగుమతుల ద్వారా సంపాదించిన ఆదాయంలో 75 శాతం చమురు దిగుమతి బిల్లుల చెల్లింపులకే ఖర్చయిపోయేది. ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980-85) చివరి నాటికి బాంబే హై చమురు క్షేత్రాల్లో నూతన అన్వేషణలు, వెలికితీతలు ఫలించడంతో దేశీయంగా 29 మిలియన్ టన్నుల చమురుని ఉత్పత్తి చెయ్యాలనే లక్ష్యం నెరవేరింది. పర్యవసానంగా 1984-85 నాటికి చమురు, చమురు ఉత్పత్తుల నికర దిగుమతులు దేశీయ వినియోగంలో మూడవ వంతుకి తగ్గాయి ఫలితంగా ఎగుమతి
- ఆదాయాల్ని చమురు దిగుమతుల బిల్లుల చెల్లింపు కూడా మూడవ వంతుకి తగ్గింది.
70 దశకం మధ్యకాలం నాటికి పారి(శ్రామికాభివృద్ధి రేటు క్రమంగా ఊపందుకుంది. 1965-75 నాటికి 3.4 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 1975-85 నాటికి 5.1 శాతానికి పెరిగింది. 1979-80ల సంక్షోభాన్ని మినహాయిస్తే 1974-76, 1978-79, 1980-81, 1984-85 మధ్యకాలంలో పారిశ్రామికాఖివృద్ధి రేటు సాలీనా 7.7 శాతంగా ఉంది. 80వ దశకం అంతా పారిశ్రామికాభివృద్ధి రేటు ఆరోగ్యకరమైన సగటున సాలీనా 8 శాతం నమోదయింది. భారతదేశం హిందూ వృద్ధిరేటుకు స్వతంత్రం తర్వాత భారతదేశం 477
(3-31/2 శాతం) పరిమితం అనే అపప్రధను తొలగిస్తూ తొలిసారిగా దేశ గై జాతీయోత్పత్తి రేటు 5,5 శాతం నమోదు చేసింది. ఒక లెక్క ప్రకారం 1990 గ మధ్యకాలంలో స్థూల జాతీయోత్పత్తి సగటు వృద్ధిరేటు చెప్పకోదగిన రీతిలో 6 శాతం నమోదు అయ్యింది. దీర్టకాలిక అవరోధాలు - సంస్కరణ ఆవశ్యకత 80వ దశకం నుండి ఒకవైపు నుండి భారత అర్థిక వ్యవస్థ పనితీరు మెం కనబడుతున్నా మరో వంకన దీర్షకాలిక సంస్థాగత బలహీనతలు మేట వేసుకు క 1991లో చెల్లింపుల సంక్షోభం పాలబడి దాదాపు దివాళా ప్రకటించే పరిస్థితికి నెట్టది న ఈ పెను సంక్షోభం కారణంగా తక్షణం సంస్థాగత సర్దుబాట్లు, ఆర్థిక సంస్కరణల; చేపట్టాల్సిన అవసరం తీసుకొచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థలో బలపడుతూ వచ్చిన ప్రధాన సమస్యలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో సంస్థాగతమైన సమస్యలు అసమర్ధతకు దారితియ్యి హంకో తరహా సమస్య. విదేశీ దిగుమతుల మీద ఆధారపాటును తగ్గించుకోవాలనే వం ీ దేశీయ పరిశ్రమలకు గరిష్టస్థాయిలో రక్షణ ఉండేలా చూసింది ప్రభుత్వం. దీని ఫలి ఖ్ దేశ పారిశ్రామిక పునాది బహముఖంగా విస్తరించి విదేశీ నాయం మీద అధారపాటును గణనీయంగా తగ్గించి దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం లభించేందుకు దోహదపడింది. మ్ కాలం గడిచే కొద్ది దిగుమతుల మీద నియంత్రణలు -దేశీయ పరిశ్రమలకు కల్పిం రక్షణల మూలంగా భారత పారిశ్రామిక రంగం సాంకేతికంగా వెనుకబడిపోయింది. మీదు మిక్కిలి అసమర్ధతకు దారితీసింది. దీనికి తోడు 'లైసెన్సు - కోటా రాజ్యం కావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. లెక్కకు మిక్కుటంగా నియమాలు, నియంత్రణలు, పరిమితులు ఇవన్నీ కలిసి బెత్సాషిక పారిశ్రామికవేత్త తత్వాన్ని (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) సృజనాత్మకత గిడసబార్చేసాయి. గుత్త వ్యాపార వ్యవహారాల నిరోధక చట్టం (ఎం.ఆర్.టి.పి. యాక్ట్), అనేక రంగాలను చిన్న తరహా పరిశ్రమల రిజర్వేషన్ కిందకు తీసుకు రావడం కూదొ ఇందుకు దోహదం చేసాయి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అంగలు పంగలుగా అభివృద్ధి కాపడానికీ (ఆ మాటకి వస్తే సోషలిస్టు ఉత్పత్తి అభివృద్ధి విధానానికయినా) ఈ యం.ఆర్ టీ) చట్టం ప్రధాన అవరోథంగా నిలిచింది. ఏదన్నా కంపెనీ యాజమాన్య నైపుణ్యంతోటో, శాస్త్ర పరిశోధనల ఆధారంగానో, నైపుణ్యమైన ఉత్పత్తి విధానాల మూలంగానో అభివృద్ధి 478 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చెంది ప్లాంటును విస్తరించాల్సి వస్తే ఈ చట్టం అలాంటి కంపెనీల సమర్ధత పట్ల శాపంగా మారాయి.
కొన్ని రంగాల్ని చిన్న పరిశ్రమలకు కేటాయించడమంటే వాటిని పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలకు గల అవకాశాల నుండి మినహాయించడమవుతుంది. చిన్న పరిశ్రమలు సమర్ధవంతంగా లాభసాటిగా పనిచేసి విస్తరిస్తే వాటికి లభించే ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు రద్దువుతాయి గనుక అవి ఎప్పటికీ చిన్న పరిశ్రమలుగానే వుండవలసి వస్తుంది. చిన్న పరిశ్రమల పట్ల అనుసరించే విధానం సమర్థతని ఆధునికతని అడ్డుకొంటుంది. అంతేగాక దిగుమతి నియంత్రణలు విదేశీ పోటీని ఎలా అద్దుకుంటాయో అదే విధంగా పారిశ్రామిక లైసెన్సింగు విధానం దేశీయ పరిశ్రమల ఎదుగుదలను అద్దుకొంటుంది.
భారతదేశ ఆర్ధిక వ్యవస్థని నియంత్రించిన పబ్లిక్ సెక్టారు అసమర్ధతకు నిలయంగా మారడం ప్రారంభమయింది. తాలి దశలో పబ్లిక్ సెక్టారు భారత పారిశ్రామిక అభివృద్ధికి ఎంతోగానో తోద్చడింది. పబ్లిక్ సెక్టారు కేపిటల్ గూడ్స్, భారీ పరిశ్రమల రంగాలలోనికి చొచ్చుకుపోయింది. భారత పారిశ్రామిక రంగానికి వైవిధ్యాన్ని సమకూర్చింది. భారతదేశం విదేశీపెట్టుబడిపై, విదేశీ యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటాన్ని తగ్గించింది. కాని కాలం గడచిన కొద్ది ప్రభుత్వ రంగ సంస్థలపై రాజకీయ, ఉద్యోగ స్వామ్యం ఒత్తిడి పెరిగి అవి నష్టాలలో నడవడానికీ దారితీసింది. వాటిలో అవసరాన్ని మించి ఉద్యోగులు నియమించబడ్డారు. పనిచేయకుండా జీతాలు పొందే రాజకీయ నాయకుల యాజమాన్యంలో అవి నిర్వహించబడ్డాయి. బాధ్యతారహితమైన కార్మిక సంఘాల ఒత్తిళ్ళకు లొంగిపోయారు. నమరవంతంగా జవాబు దారీతనంగా ఉద్యోగులచే వని చేయించలేకపోయారు. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు, రోడ్డు రవాణా సంస్థల లాంటి ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థలు విపరీతమైన నష్టాలలో కూరుకుపోయాయి. మితిమీరిన లంచగొండితనం, జవాబుదారీతనం లేకపోవటంతో పాటు ఈ సంస్థలు ప్రజాకర్షక ఒత్తిళ్ళకు లొంగి ఉత్పత్తి ధరలలో కొద్ది భాగాన్నైనా వినిమయదారుల నుండి రాబట్టలేదు. ఉదాహరణకు విద్యుత్తు రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని 1997లో పంజాబు ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయం చేయబడిన తరువాత పెద్ద వనరుల్ని పోగు చేసుకొని బాగా విస్తరించిన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు కూడా చాలాకొద్ది కాలంలోని పబ్లిక్ సెక్టారు జబ్బులైన అసమర్ధత, రాజకీయ జోక్యంలతో కునారిల్లుడం మొదలయింది.
లైసెన్సింగ్ అనుమతులిచ్చే విధానం, యం.ఆర్.టి.పి. చట్టం చిన్న పరిశ్రమల రిజర్వేషన్లు వాణిజ్య విస్తరణని కఠినతరం చేశాయి. 1970 దశాబ్దం మధ్యకాలం నుండి స్వతంత్రం తర్వాత భారతదేశం త్ర
ప్రభుత్వం అనుమతిలేనిదే నష్టాలు వచ్చే కంపెనీలను మూసివేయకూడదనే వి అమలులో వుంది. సమిష్టి బేరసారాలతో కార్మిక సంఘాలు చురుకుగా పనిఇశాయి. నష్టాలలో నడుస్తున్న కంపెనీల్ని మూసివేయకుండా చేయగలిగాయి. మూసివేయబిడిన నష్టాలతో నడుస్తున్న జబ్బుపడిన కంపెనీల్నీ (51010002020169) ప్రభుత్వం స్యాీనం చేసుకొన్నది. ఖాయిలా పడిన చిన్న చితక టెక్స్టైల్ కంపెనీల్ని కలుపుకొన్న నేషన టెక్స్టైల్ కార్పొరేషన్ పల్లిక్ సెక్టారు నష్టాల్ని మరికొంత పెంచింది.
ఇదంతా భారతదేశంలో పెట్టుబడి సమర్థతని చాలా తక్కువ నెయి్ దిగజార్చడానికి లేక పెట్టబడి - ఉత్పత్తి నిష్పత్తి పెరగడానికి దారితీసింది. ఒక యూనిట్ అదనపు ఉత్పత్తికి పెట్టే పెట్టుబడి పెరుగుతూ వచ్చింది. ఈ నిష్పత్తి మొదట [ణా 2 కి కాస్త ఎక్కువగా వుండగా మూడవ ప్రణాళికా కాలానికి ౩.రకి చేరింది. ఒక అంచనా మేరకు 1971-1976 మధ్య కాలంలో ఈ నిష్పత్తి అత్యధికంగా 5-76 కి చేరింది. 1950, 1970 ల మధ్య కాలంలో పెట్టుబడిరేటులో గణనీయమైన పెరుగుదలలు వున్నప్పటికి సరానరి వృద్ధిరేట్లు లేక స్థూల దేశీయ నిష్పత్తిలో ఎందుకు తగ్గుదల వుందో యిది వివరిస్తుంది.
సోషలిస్టు సూత్రాలను సామాజిక న్యాయాన్ని ప్రవేశపెట్టే పేరుతో తరచుగా (పభుత్వ నియంత్రణలు, పరిమితులు, జోక్యాలు ఎక్కువయ్యాయి. వలితంగా వక్రీకరించబడిన వెనుకబాటుతనంతో కూడిన పెట్టుబడిదారీ విధానం నిర్మించడం జరిగింది. కారణం ఇది నవీకరణ, సమర్లవంతంగా పెట్టుబడి వినియోగం లాంటి పెట్టుబడిదారీ మౌలిక సూత్రాలకు విరుద్గమైనది. ఈనాటి సామాజ్యనాదానంతర ప్రపంచంలో ఒక దేశం నుండి మరొక దేశానికి మిగులు తరలింపు ప్రత్యక్ష రాజకీయ లేక ఆర్థిక ఆధిపత్యం ద్వారా గాక వివిధ ఉత్పత్తి స్థాయిలు గల దేశాల మధ్య అసమాన మారకాల ద్వారా జరుగుతుంది. జాతీయాభివృద్ధికి ఉత్సాదకత కీలకమని ఈనాడు వామపక్ష మితవాద ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈనాడు త్వరిత (ప్రపంచీకరణ క్రమంలో స్వయం ప్రతిపత్తి కొరకు ఆర్థిక స్వావలంబన విధానాన్ని అనుసరించడం ఉత్పత్తి స్థాయిల్ని తగ్గించుకొనడం ఆ స్వయం ప్రతిపత్తికే నష్టం వాటి ల్లజేస్తాయి. దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా చేస్తాయి.
భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనుసరిస్తూ వచ్చిన అంతర్ముఖళ్వం గల అభివృద్ది పంథా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో రెండవ తరహా బలపహొనళలు చోటు చేసుకున్నాయి. మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలో అంతర్గతంగా వున్న శ80 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఎగుమతి నిరాశావాదం నుండి భారతదేశం సకాలంలో మార్చు జెందడంలో విఫలమయింది. వైఫల్యం 1940 లు 1950 ల విజ్ఞత నుండి ఆవిర్భవించిన విధానాలను అమలు జరపడంలో లేదు. వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధానంతరం - ప్రత్యేకించి 1960లు 1970ల నుండి అంతర్జాతీయ పరిస్థితిలో (ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో సంభవిస్తున్న మార్చులకనుగుణంగా త్వరితంగా స్పందించంలోని అశక్తతలో వుంది.
గమనించదగిన కొన్ని ముఖ్యమైన మార్పులు దిగువన ప్రస్తావించబడ్డాయి. మొదటిది, విదేశీపెట్టుబడి స్వభావం, బహుళజాతి సంస్థల స్వభావం మారుతూ వుంది. ఉత్పత్తిలో అంతర్జాతీయీకరణ క్రమం ప్రారంభమయింది. బహుళజాతి సంస్థల దృష్టి మార్కెట్లు ముడి వనరులపైన గాక చౌకగా ఉత్పత్తి చేయగల ప్రాంతాలపై పడింది. వెనుకబడిన దేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకొనడానికి బదులుగా దేశీయ ఆర్థిక వ్యవస్థని ఎంతగానో ప్రభావితం చేయగల పెట్టుబడుల్నిి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తున్నాయి. అంతేగాక ఒక వస్తువుకి అవసరమైన విడిభాగాలను ముడివనరులు చౌకగా దొరికే ఆయా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారు చేయించడం, వాటినన్నింటిని మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి సమీకరించి తుది వస్తువుగా రూపకల్పన చేయడం ఈనాడు బహుళజాతి కంపెనీలకు సర్వ సామాన్య న్యాయమయ్యింది. ఈ [క్రమంలో భాగంగాను, ఈ క్రమం యొక్క ఫలితంగాను వలసపాలన అత్యున్నత దశలో వున్నప్పుడు పెట్టుబడి బదిలీల్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా దేశాల మధ్య పెద్ద ఎత్తున పెట్టుబడి బదిలీలు జరిగాయి. కాని రెండు సందర్భాలలో జరిగిన పెట్టుబడి బదిలీల స్వభావంలో చాలా వ్యత్యాసం వుంది. కాని ఈ రెందు క్రమాలు కూడా మరొక పెద్ద అంతర్జాతీయ పరిణామానికి గతంలో కని విని ఎరుగని ప్రపంచ వాణిజ్య విస్పోటనానికి దారితీశాయి. 1950లు 1970ల మధ్య ఉత్పాదక వస్తువుల ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. కాని ఉత్పాదక వస్తువులలో ప్రపంచ వాణిజ్యం 10 రెట్లు పెరిగింది. 1965, 1990 మధ్య కాలంలో ప్రపంచ ఉత్పత్తుల ఎగుమతుల శాతం రెట్టింపయ్యింది. అంతేగాక ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులలో విపరీతమైన పెరుగుదలతో పాటు మూడవ ప్రపంచ దేశాలు గూడ 1970ల నుండి తమ పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల వాటా పెంచుకానగలిగాయి. ఈ దేశాలు పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు 1970లో 5 శాతం వుండగా 1988 నాటికి 10 శాతమయింది.
పారిశ్రామిక స్థావరాల్ని పడమర నుండి తూర్పుకి మార్చిన 1960 లలో ప్రారంభమైన తూర్పు ఆసియా దేశాల త్వరిత పారిశ్రామికీకరణ పెట్టుబడి మార్కెట్ల
స్వతంత్రం తర్వాత భారతదేశం న్!
లభ్యతావకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొన్నది. రెండవ ప్రపంచ యుడ్డానంతరం జపాన్ అందిపుచ్చుకొన్న అవకాశాన్ని దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్: హాంకాంగ్ మరీ యిటీవల ధాయ్‌లాండ్, మలేషియా, చైనా, ఇందో నేషియాలు ఉపయోగించుకున్నాయి. (ఏషియన్ టైగర్స్‌గా ప్రసిద్ధికెక్కిన దక్షిణకారియా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్లు ప్రపంచ ఎగుమతులలో 1965లో 1.5 శాతంగా వున్న. తమ వాటాని 1990 నాటికి 7.9 శాతానికి పెంచుకొనగలిగాయి. నూతనంగా పారిశ్రామికీకరణ చెందుతున్న ఇండోనేషియా, మలేషియా, ధాయ్‌లాండ్‌లు కూదా తమ ఎగుమతుల వొ టాని యిదే కాల వ్యవధిలో 0.1 నుండి 1.5 శాతానికి పెంచుకొన్నాయి. 1962 లో విస్మరించదగిన స్థాయిలో వున్న దక్షిణకొరియా ఎగుమతులు 1980 నాటికి భారలీదేశీ ఎగుమతులకు 4 రెట్లు పెరిగాయి. 1990 నాటికి దక్షిణ కొరియా 41 బిలియన్ల దాలక్ష విలువ గల పారిశ్రామిక వస్తువుల్ని ఒసిడి దేశాలకు ఎగుమతి చేయగా భారతదేశం కేవలం 9 బిలియన్ల డాలర్ల వస్తువుల్ని మాత్రమే ఎగుమతి చేయగలిగింది.
1960 దశాబ్దం మధ్య కాలం వరకు భారతదేశం అంతర్ముఖత్వం గల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే ప్రాతిపదిక గల వ్యూహాంపై ఆధారపడి మంచి ఫలితాలే సాధించింది. ఎదుట తూర్చు ఆసియా దేశాల అనుభవం స్పష్టంగా కన్పిస్తున్నప్పటికి మారుతున్న ప్రపంచ పరిస్థితి కల్పించిన నూతన అవకాశాలకు తీగు విధంగా స్పందించడంలో భారతదేశం విఫలమయింది. 1960 దశాబ్దపు మధ్య కాలం నాటి సంక్షోభం తరువాత భారతదేశం ప్రపంచీకరణ క్రమం అందిచ్చిన అవకాశాలను స్వకరించడానికి బదులుగా తక్షణం పరిస్థితుల ప్రాబల్యం రీత్యా కఠినతరమైన రక్షణాత్మక విధానాల వైపు మరలవలసి వచ్చింది.
ఈ కాలంలో బహుళజాతి సంస్థలపై నిబంధనలు, విదేశీపెట్టుఐడి పై అనుమానాలు పెరిగాయి. ఉత్పత్తి అంతర్జాతీయీకరణ నుండి, పెరిగిన అంతర్జాతీయ నిధుల ప్రవాహం నుండి లభించే సానుకూలతను స్వీకరించలేదు. ఇక ఎగుమతుల విషయానికివస్తే వివిధ రకాల వస్తువుల్ని విసృత భౌగోళిక ప్రాంతాలకు ఎగుమతులు చేసే ప్రయత్నాలు జరిగాయి. కాని ప్రపంచ వాణిజ్య విస్తరణ కల్పించిన అవకాశాల్ని. తూర్పు ఆసియాదేశాలు లాగా భారతదేశం వినియోగించుకోలేకపోయింది. ప్రపంచ ఎగుమతులలో భారతదేశం వాటా 1948లో 24 శాతం వుండగా అది 1980లో 0.42 శాతం, 1994లో 0.6 శాతం, రాశి రీత్యా చూసినప్పటికి 1980 -81లో పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు చైనా ఎగుమతులలో సగం, ెజిల్ ఎగుమతులలో మూడవవంతు దక్షిణ కొరియా ఎగుమతులలో నాల్గవ వంతు. శీ8లై బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
త్వరితంగా పారిశ్రామికీకరణ చెంది ఆర్థిక వ్యవస్థని మార్చుకొనడానికి ఆదాయ స్థాయిల్ని పెంచుకొనడానికి, పేదరికాన్ని తగ్గించుకొనడానికి మారిన ప్రపంచ పరిస్థితి కల్పించిన అవకాశాల్ని తూర్పు ఆసియా దేశాల లాగా భారతదేశం వినియోగించుకోలేక పోయింది. ఉదాహరణకు 1960లలో భారతదేశంలో పోల్చదగిన స్థాయి తలసరి ఆదాయం గల దక్షిణ కొరియా తలసరి ఆదాయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి దీటుగా వుంది. భారతదేశ స్థాయి చాలా దిగువన వుంది. 1978 లో తన పంథా మార్చుకొన్న చైనా ప్రపంచీకరణ క్రమంలో పాల్గొంటూ విదేశీపెట్టుబడుల్ని ఎగుమతుల్ని పెంచుకుంటూ భారతదేశం కంటె చాలా వృద్ది రేటు సాధించింది. 1980 -89 కాలంలో భారతదేశం కంటే వేగంగా చైనా స్తూల దేశీయ ఉత్పత్తి సరాసరి 9.4 శాతం రేటున పెరిగింది. స్ట ల కాన్ని రాజకీయ అనివార్యతల ఫలితంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థపైకి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ఇవి భారత రాజ్య నిర్మాణం ప్రజాస్వామ్య చట్రం రూపుదిద్దుకొన్న కార్యక్రమానికి సంబంధించినవి. సమాజంలోని వివిధ సెక్షన్లు రాజ్య వనరుల నుండి వనరుల్ని అధికాధికంగా డిమాండు చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ డిమాండ్లను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. వాటికి ప్రచారం ఇవ్వకుండ వుండలేకపోతున్నాయి. ఫలితంగా 1970ల నుండి క్రమంగా (ప్రభుత్వాలు ఆర్ధికపరమైన విజ్ఞతని త్యజించాయి. స్వతంత్రానంతరం దాదాపు 25 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన స్థూల ఆర్థిక సమతుల్యతా పరిస్థితి క్రమంగా క్షీణతకి గురయింది. 1960ల, 1970లలో చమురు సంక్షోభం ఫలితంగా వచ్చిన స్వల్పకాలిక అసమతుల్యతలకు భిన్నంగా ఇటీవలి కాలంలో ఆవిర్భవించిన స్ట్రూల ఆర్థిక అసమతుల్యత స్వభావ రీత్యా దీర్హకాలికమైనది. సంస్థాపరమైనది.
ఆర్ధిక దూరదృష్టి క్రమంగా క్షీణించడం, ప్రధానంగా సబ్సిడీలు టొరట్లు పెంచడంలో, సమర్ధత ఉత్పాదకతతో సంబంధం లేకుండా జీతాలు పెంచడంలోను, అవసరాలను మించి ఉద్యోగుల్ని నియమించడంలోను పెద్ద ఎత్తున అప్పుల్ని రద్దు చేయడం లాంటి ప్రజాకర్షక చర్యలలోనూ వ్యక్తమయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం క్షీణించడం ప్రారంభమవడంతీ పెరుగుతున్న రాజకీయ, అస్థిరత, రాజకీయ పోటీ వివిధ పార్టీలు ఒక దానిని మించి మరొకటి నజరానాలు పంచి ప్రజాకర్షక విభానాలు చేపట్టడానికి దారితీసింది. అంతేగాక కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతుండటంతో అది జాతీయాదాయాంలో పెద్ద వాటాలను కొరకు పోటీపడుతున్న గ్రూపులకు అతీతంగా వ్యవహరించలేకపోయింది. మరొకవైవు ఇందిరాగాంధీ, అంతకంతకు అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకొనడంలో కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్య పని విధానం క్షీణించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం శీ83
పార్టీ దిగువ స్థాయి కార్యకర్తలలో సంస్థాగత సంబంధాన్ని వారిపై అదుపుని కోల్పోయి ం సమాజంలోని వివిధ సెక్షన్ల మధ్య రాజకీయ బేరసారాలు పార్టీ నిర్మాణాల బడ్జెటు కేటాయింపుల ద్వారా జరిగింది. చివరిగా 1967 తరువాత మధ్యతరగ క్త? (ప్రాతినిధ్యం వహించే పార్టీలు చాలా రాష్ట్రాలలో అధికారంలోకి రావదం లో టు తరువాత ఆ పార్టీలు కేంద్రంలో కూడా గణనీయంగా పట్టు సాధించడం బు కేటాయింపులలో దేశాభివృద్ధికి వెచ్చించవలసిన మొత్తాలకు కోతలు పెట్టుకొన్న సెక్ష్య సల్సిడీలుగా యివ్వడం జరిగింది.
ఈ రాజకీయ అనివార్యతలు ఆర్థిక విధానాలుగా ఎలొ వ్యక్తమయ్యాయి ఇంతకు ముందు గమనించిన విధంగా 1960 దశాబ్దం మధ్య కాలం నాటి మరక స్పందన ద్రవ్య మరియు చెల్లింపుల హెచ్చరిక. కాని ద్రవ్య క్రమశిక్షణలో ఒక లో సడలింపు 1975 తరువాత ప్రత్యేకించి జనతా పాలనాకాలం 1977 ర్ (ప్రారంభమయింది. 1975-77 కాలంలో ఆహారపు సబ్సిడీలు రెట్టింపు అం ట్ బిలియన్ల రూపాయిల నుండి 5 మిలియన్ల రూపాయలకు పెరిగాయి. ఎరువులపై స్ 10 రెట్లు పెరిగింది. 1976-77లలో 0.6 బిలియన్లు రూపాయిలుగా వున్న స్ఫి 1979-80 నాటికి 608 బిలియన్ల రూపాయలకు పెరిగింది. 1974-75 - 1978-70 మధ్య కాలంలో ఎగుమతులపై సబ్సిడీ 0.8 బిలియన్ల రూపాయిల నుండి 3.75 బిలియన్లకు అంటే 4.5 రేట్లు పెరిగింది. 1977-79 (జనతా పాలన) కాలంలో సంబంధిత విడుదల ధరలతో సంబంధ లేకుండానే ఆహారధాన్యాల సేకరణ రేట్లు పెంచబడ్డాయి. చొలా వ్యవసాయ ఉత్పాదకలపై పన్నులు తగ్గించబడ్డాయి. నష్టాలు తెచ్చిపడితున్న పబ్లిక్ సెక్టారు పరిశ్రమలకు బడ్జెటు తరలింపులు పెంచబడ్డాయి.
1980 దశాబ్దం ప్రత్యేకించి ద్వితీయార్ధంలో ఆర్థిక క్రమశిక్షణారాపొత్యం అసంబద్ధమైన పరిమితులకు చేరింది. ఉదాహరణకు 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రైతుల రుణాల్ని రద్దు చేస్తున్నణి ప్రకటించి ప్రభుత్వ ఖజానాపై 100 బిలియన్ల రూపాయిల భారాన్ని మోపింది. 19807 81 లో ఆహారం, ఎరువులు దిగుమతులపై కేంద్ర బడ్జెటు నుండి యివ్వబడిన ప్రత్యక్ష సబ్సిడీలు, 15 బిలియన్ల రూపాయిల్ని మించాయి. ఇది ఆ సంవత్సరంలో పబ్లిక్ సెక్టారులోని ఉత్పాదక రంగంలోని స్థూల పెట్టుబడి సంచయనంలో సగం కంటి ఎక్కువ. ఈ విధంగా (ప్రభుత్వ వ్యయంలో విపరీతమైన పెరుగుదల వుండగా ప్రభుత్వ రంగ సంస్థలలో పొదుపులు తగ్గి నష్టాలు పెరిగాయి. ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం ఫలితంగా ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల) ద్రవ్యలోటు 1974-75 జిడిపిలో 41 శాతంగా వుందగొ 1979-80 నాటికి 6.5 శాతానికి, 1984-85లో 9.7? శాతానికి 1991లో అత్యధికంగొ శృర్రిక్ష బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
10.4 శాతానికి చేరుకొన్నది. ఈ కాలంలో ప్రభుత్వాలు ప్రభుత్వ ద్రవ్యలోటుని తగ్గించేందుకు సేవింగ్సుని పెంచటానికి లేక ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి బదులుగా దేశీయంగాను విదేశాల నుండి రుణాల సేకరణకు యత్నించాయి. ప్రభుత్వ పెట్టుబడి (ప్రభుత్వ సేవింగ్సుకి మధ్య అంతరం విపరీతంగా పెరిగిపోయింది. 1960 దశాబ్దం మధ్య కాలం నాటి సంక్షోభం తరువాత 1968-69, 1971-72 మధ్య కాలంలో ఈ అంతరం జిడిపిలో 3.6 శాతానికి తగ్గించబడింది. కాని 1980 -81 లో ర.3 శాతానికి 1989-90లో 9 శాతానికి పెరిగింది.
పెరుగుతున్న ప్రభుత్వ సేవింగ్ - పెట్టుబడి అంతరం, ద్రవ్యలోటు - చెల్లింపుల సమతౌల్యంపై రుణ పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపాయి. 1977-78 లో కరెంటు ఎకౌంటులో 1.5 బిలియన్స్ డాలర్లు (జిడిపిలో1.4 శాతం) చెల్లింపుల మిగులు పరిస్థితి నుండి 1980-81 నాటికి కరెంటు అకౌంటులలో లోటు 2.9 బిలియన్ డాలర్లకు (జిడిపిలో 1.7 శాతానికి) చేరుకొన్నది. లోటు 1984-86లో 3,5 బిలియన్ డాలర్లకు (జిడిపిలో 1.8 శాతానికి) పెరిగింది. 1990-91లో బాగా పెరిగి 9.9 బిలియన్ డాలర్లకు (జిడిపిలో 3.5 శాతం) చేరింది. చెల్లింపుల పరిస్థితి ప్రత్యేకించి 1980 దశాబ్దం చివరలో త్వరితంగా క్షీణించడానికి కారణం విదేశాల నుండి తగిలిన ఎదురుదెబ్బ గాని లేక దిగుమతి సరళీకరణ గాని కాదని గమనించడం అవసరం. 1980 దశాబ్దం ద్వితీయార్థంలో ఎగుమతులు సరాసరి 14 శాతం పెరిగి వాణిజ్య పరిస్థితి మెరుగుపడింది. ఆర్థిక వ్యవస్థ యొక్క సేవింగ్సు - పెట్టుబడి అంతరం 1985, 1990ల మధ్య సరాసరి జిడిపిలో 2.5 శాతానికి పెరిగింది. ఫలితంగా పెద్ద మొత్తాల అప్పులు చెల్లింపుల లోటుకి కారణమయ్యాయి.
1980లో ఎక్కువ వృద్ధిని సాధించిన కాలం. 1985, 1990ల మధ్య కాలంలో భారతదేశం యొక్క జిడిపి సగటు వార్షికవృద్ది రేటు 5.5 శాతం పరిశ్రమల వృద్ధిరేటు 7 శాతం కేపిటల్ గూడ్స్ వృద్ధి రేటు 10 శాతం వినిమయ వస్తువుల వృద్ధి రేటు 12 శాతం. కాని ఈ వృద్ధి సేవింగ్సుని పెట్టుబడిని పెంచడం ఫలితంగా సాధించినవృద్ధి కాదు. ఎక్కువ అప్పులు చేసి ఎక్కువ ఖర్చు పెట్టడం ఫలితంగా పొందిన వృద్ధి. ఇది 1970లలో లాటిన్ అమెరికా సాధించిన వృద్ధి లాంటిది. ఈ తరహా వృద్ధి సహజంగా నిలకడగా కొనసాగేది కాదు. ఆర్ధిక విధానంలోని అసమతుల్యతలు వినాశాన్ని నివారించలేని స్థితికి చేరుకొంటాయి. 1980లలో లాటిన్ అమెరికాలో యిదే సంభవించింది. ఒక దశాబ్దం తరువాత భారతదేశంలోను జరిగింది.
క్షీణిస్తున్న ద్రవ్య చెల్లింపుల పరిస్థితి పెద్ద ఎత్తున దేశీయంగాను, విదేశాల నుండి అప్పులు చేయడానికి దారితీసింది. 1980 దశాబ్దాంతానికి పరిస్థితి చాలా స్వతంత్రం తర్వాత భారతదేశం 485
తీవ్ర స్థాయికి చేరింది. ప్రభుత్వం (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) దేశీయంగా చేసిన కప్పు 1974-75 నాటికి జిడిపిలో 31.8 శాతానికి పెరిగింది. 1984-85 నాటికి 45.7 శాతానికి 1989 - 90 నాటికి 54.6 శాతానికి చేరుకుంది. విదేశీ రుణ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చింది. 1980 -81లో 28.5 బిలియన్ డాలర్లుగౌ వున్న విదేశీ రుణం 1985-86 నాటికి 37.3 బిలియన్ డాలర్లకు 1990-92 నాటికి 88.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. 1980 -81 లో 10.2 శాతంగా వుండి అదుపులో వున్న రుణ సేవల నిష్పత్తి 1990-91 నాటికి ప్రమాదకరమైన 35 శాతానికి పెరిగింది అంతేగాక మొత్తం రుణంలో రాయితీలపై యిచ్చే రుణం ఈ కాల వ్యవధిలో 80 శాతం నుండి 40 శాతానికి పడిపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) పై గలి ప్రతికులాభిప్రాయం కారణంగా విదేశీ పేర్ల పెట్టుబడికంటే. విదేశీ పెట్టుబడిపై ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితికి దారితీసింది.
భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1980-81లో 5.865 బిలియన్ల డాలర్లు వుండగా 1989- 90 నాటికి 4.1 బిలియన్లకు మరుసటి సంవత్సరానికి (1990-91) దానిలో దాదాపు సగం 2.24 బిలియన్లకు - అంటే కేవలం ఒక నెల దిగుమతుల సర్దుబాటుకు సరిపడేంత పడిపోయాయి. చమురు ధరల పెరుగుదలకు మధ్య ప్రాచ్యం లేక గల్ఫ్ ప్రాంతాలకు భారతదేశ ఎగుమతుల తగ్గుదలకు దారితీసిన కువైట్‌పై ఇరాన్ దాడి కూడా ఈ విదేశీ మారక ద్రవ్య పరిస్థితికి కారణమయింది. భారతదేశం విదేశాల నుండి అప్పు చేయడం కష్ట సాధ్యమయింది. అంతేగాక విదేశీ కరెన్సీలో వన్న ప్రవాస భారతీయుల డిపాజిట్లు కూడా త్వర త్వరగా ఉపసంవారించుకొనడం (ప్రారంభమయింది. విదేశీ అప్పుపట్టిని ఆ పరిస్థితుల్లో తక్షణ లావాదేవీల నుండి బయటి పడడానికి 1991 మార్చిలో ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్టర్లొంద్కీ 20 టన్నుల బంగారం అమ్ముకొనక తప్పలేదు. బయంయఫ్ నుండి అప్పు తెచ్చినప్పటికి 1991 జూలై నాటికి విదేశీ మారక నిల్వలు కేవలం. రెండు వారాల దిగుమకుల చెల్లింపులకు సరిపడేంత తక్కువగా వున్నాయి. దేశం దివాళా స్థితికి చేరువలో వుంది.
నరసింహారావు మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం (1991 జూలైలో) అధికారం స్వీకరించే నాటికి వున్న పరిస్థితి యిది. మన్మోహన్సింగ్ ఆర్దికమంత్రిగా గల నరసింహారాన ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. గ 486 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖ్జీ
2027 ఆర్దిక సంస్కరణలు - 1991 నుండి
ఖౌరత ఆర్ధిక విధానాన్ని బలహీనపరుస్తూ కొన్ని దశాబ్దాలుగా నిర్మితమవుతున్న దీర్మకాలిక ఆటంకాలకు ఇటీవలి తక్షణ కారణాలు తోడవటం 1991లో పరాకాష్టకి చేరుకొన్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభానికి దారితీసింది. సంక్షోభం భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు, సంస్థాగత సర్దుబాటు ప్రారంభించే విధంగా ఒత్తిడి చేసింది. భారతదేశ పరిస్థితుల దృష్ట్యా విష్లవాత్మకమైనవిగా భావింపబడుతున్న ఈ సంస్కరణలు నరసింహారావు నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వం ప్రారంభించింది. స్వాతంత్ర్యానంతర భారతదేశ అత్యంత ప్రముఖ ఆర్ధికవేత్తలలో ఒకరైన మన్మోహన్సింగ్ ఆర్థికమంత్రిగా మార్గదర్శకత్వం వహించారు.
నియంత్రణలతో ఎదుగూ, బొదుగూ లేని భారతదేశ ఆర్థిక విధానంలో ఎప్పుడో సంస్కరణలు ప్రవేశపెట్టి వుండవలసింది. భారతదేశం యొక్క ఎగుమతులకు సంబంధించిన నిరాశావాదం సమర్థనీయం కాదని 1960లలో మన్మోహన్సింగ్ వాదించాడు. ఆయన ఎక్కువ పారదర్శకత, తక్కువ నియంత్రణ గల ఆర్థిక విధానం కావాలన్నాడు. తొలి దశలలో సంస్కరణలు కావాలని కోరిన వారిలో జగదీష్ భగవతి లాంటి ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా వున్నారు. 1960 దశాబ్దం మధ్య భాగంలో సంస్కరణ కొరకు ప్రయత్నం జరిగింది. కాని ఈ (గగ్రంథంలోనే మరొక చోట వివరించిన విధంగా పలు కారణాల రీత్యా ఆటంకపరచబడింది. ఫలితంగా సంస్కరణల నుండి వైదొలగి వెనుకంజవేయడం జరిగింది. కాని 1970లలో మార్కెట్ పరిస్థితుల కనుగుణంగా రూపాయి విలువ తగ్గడం అనుమతించబడింది. 1980లలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత సరళీకరణ చర్యలు - ప్రత్యేకించి పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. గుత్త పెట్టుబడిదారీ సంస్సలపై పరిమితులు సడలించడం లాంటి చర్యలు చేపట్ట ప్రయత్నించింది. 1991 తరువాత కాలం నాటి సంస్కరణలతో పోల్చితే ఇవి చిన్నవిగా స్వతం(త్రం తర్వాత భారతదేశం త్తేప్రి7
కనిపించినప్పటికీ 1980ల నాటి వార్తా పత్రికలు వీటిని కొత్తదారి తొక్కడంగా ప్రశంసించాయి. 1984లో రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు, మారకపు ల సడలింపు, దిగుమతి నియంత్రణల పాక్షిక సడలింపు లాంటి చర్యలు చేపట్ట యత్సించా కాని రాజీవ్‌గాంధీ సంస్కరణల కొరకు చేపట్టిన ఈ అరకొర ప్రయత్నాలు కూడా కొద్దిగ తరువాత బోఫోర్స్ ఆరోపణలు, వి.పి, సీంగ్ తదితరులు పార్టీని వదిలి వెళ్ళదం ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కారణంగా త్యజించడం జరిగింది.
సంస్కరణల అవశ్యకత తగినంత ముందుగా గుర్తించబడినప్పటికీ వొటిని సమగ్రంగా అమలు పరచడం పలు కారణాల రీత్యా సాధ్యపడలేదు. ప్రభుత్వాల బలహీనంగా వున్న పరిస్థితిలో (ఉదా : బోఫోర్స్ తరువాత రాజీవ్, పంజాబ్ సంక్షోభం తరువాత ఇందిరాగాంధీ, బాబ్రీ మసీదు తరువాత నరసింహారావు ప్రభుత్వాలు) వ్య క్రమళిక్షణని తిరిగి పొందడం, కార్మిక చట్టాలలో మార్పు, తొలి దశలో బాధాకరంగౌ వుండే చర్యలు గనుక సంస్కరణలను ప్రారంభించేందుకు గాని, ప్రారంభించిన వాటిని కొనసాగించేందుకు గాని ఆచితూచి అడుగు వేయవలసి వచ్చింది. అంతేగాక ఉన్నతాధికోర వర్గం నుండి అప్పటికి అమలులో వున్న కంట్రోళ్ళ (నియంత్రణల) విధానం సలన ప్రయోజనాలు పొందిన వ్యాపార వర్గంలోని కొన్ని సెక్షన్ల నుండి బలమైన వ్యతిరేక వ్యక్తమయింది. మారుతున్న ప్రపంచ వాస్తవికతని విస్మరించిన వామపక్షవాదుల బలమై సైద్ధాంతిక వ్యతిరేకత సంస్కరణలను అడ్డుకొనటంతో తన వంతు పాత్ర నిర్వహించడం కొనసాగుతుంది.
1991 సంక్షోభంలో నరసింహారావు ప్రభుత్వం సంప్రదాయ ఆలోచనా విధానాన్నీ, అధిగమించి సమగ్రమైన మార్పులు తీసుకొని వచ్చే సంస్కరణలు ప్రారంభించింది. అప్పుడు ప్రతిపక్షం, స్వప్రయోజనాపరులు బలహీనమైన స్థితిలో వున్నారు. ఆలస్యంగానైనప్పటికీ బైనా తన విధానాన్ని మార్చుకొన్న 18 సం॥ల తరువాత 1991లో భారతదేశం సంస్కరణల కార్యక్రమం ప్రారంభించింది. ఈ మార్పు చాలా ఆలస్యంగా చేపట్టడానికి, చేపట్టిన తరువాత కూడ 1978లో చైనాలాగా 1980 దశాబ్దం మధ్య భాగంలో సోవియట్ రష్యాలో లాగా కాక చాలా సమయం పట్టడానికి కారణం ఒక్కసారిగా ప్రజాస్వామ్యేతర లేక నియంతృత్వ ప్రభుత్వాలలో వలె గాక ప్రజాసామ్య దేశంలో ఒక తరహా ఏకాభిప్రాయం నుండి మరొక తరహా ఏకాభిప్రాయానికి మార్చు అనేది ఒక క్రమంగాని ఒక సంఘటన కాదు.
1991లో ప్రారంభించిన సంస్కరణల క్రమం ద్రవ్య పరిస్థితిని సరిదిద్దింది. మారకం రేటుని మార్కెట్‌కి అనుసంధానం చేసింది (ప్రారంభంలోనే రూపాయి విలువను శ88 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
20 శాతం తగ్గించింది). దిగుమతులకు అవకాశాలు పెంచేందుకు వాణిజ్య పారిశ్రామిక నియంత్రణలను సరళీకరణ చేసింది. పారిశ్రామిక లైసెన్సు విధానాన్ని ఎం.ఆర్.టి.పి. చట్టం రద్దుని గణనీయంగా సడలించింది. క్రమంగా (థైవేటీకరణతో సహా పబ్లిక్ సెక్టార్‌ని సంస్కరించింది. బహుళజాతి సంస్థలపై, విదేశీ పెట్టుబడిపై గల నిబంధనల్ని చాలా వరకు తొలగించింది. వాటిని ప్రల్యేకించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కంట్రోళ్ళ నుండి ఆర్థిక విధానానికి విముక్తి కల్పించి 'దానిని దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రపంచీకరణ క్రమంలో పాల్గొనేందుకు సన్నద్ధం చేసింది. ల చాలా సమస్యలు సవాళ్ళు యింకా వున్నప్పటికీ సంస్కరణల తొలి సంవత్సరాల ఫలితాలు ఏ ప్రమాణాలతో చూసినప్పటికీ యోగ్యంగానే వున్నాయి. భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుండి త్వరగా కోలుకొన్నది. అంతేగాక సంస్థాగత సర్దుబాటు క్రమం
- ప్రత్యేకించి ద్రవ్య పరిస్థితిపై అదుపు చాలా తక్కువ నష్టంతో అంటే యిలాంటి పరిస్థితులలోనే సంస్థాగత సర్దుబాటు చేపట్టిన చాలా ఇతర దేశాలలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగానికి పేద ప్రజల స్థితిగతుల క్షీణతకు దారితీస్తే దీర్హకాలిక ఆర్ధిక మాంద్యపు సుడిగుండంలో చిక్కుకొనకుండా (ద్రవ్య పరిస్థితిపై అదుపు సాధించడం జరిగింది. ఉదాహరణకు సంక్షోభ సంవత్సరమైన 1991-92లో చాలా తక్కువ 0.8 శాతంగా వున్న భారతదేశపు జి.డి.పి. వృద్ధి రేటు త్వరగా కోలుకోని 1992-98 నాటికి 5.8 శాతానికి 1992-93లో అయోధ్య సంక్షోభం వచ్చినప్పటికీ 1993-94 నాటికి 6.2 శాతానికి పెరిగింది. ఇంకా ముఖ్యంగా ఆ తరువాత మూడు సంవత్సరాల సరాసరి వృద్ధి రేటు 7.5 శాతం. ఇది అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన తూర్పు ఆసియా దేశాల వృద్ధిరేటుకి యించుమించు సమానం. సంక్షోభం వచ్చినప్పటికి సంస్థాగత సర్దుబాటు జరిగినప్పటికి 8వ ప్రణాళికా కాలంలో (1992-97) సరాసరి వృద్ధి రేటు దాదాపు 7 శాతం (6.94) నిలకడగా కొనసాగింది. ఇది 7వ ప్రణాళికా కాలం (1985-90) సరాసరి వృద్ధి రేటు 6 శాతం కంటే ఎక్కువ. 1991-97 కాలంలో సరాసరి 23 శాతం పైగా వున్న స్టూల దేశీయ సేవింగ్స్ 7వ ప్రణాళికా కాలం నాటి సరాసరి 20.6 శాతం కంటే ఎక్కువ. 1992-97 కాలం నాటి స్టూల దేశీయ పెట్టుబడి సంచయం (౮౯055 అ౦1%16560 010121 ₹0౧౫2400) మరియు స్ఫూల దేశీయ స్థిర పెట్టుబడి సంచయం (౮1039 00%లటగం ౯0664 620121 2000028601) జి.డి.పి.లో 25.2 శాతం, 22.83 శాతం వున్నాయి. ఇవి ఏడవ ప్రణాళికా కాలం నాటి 21.8శాతం, 19.8 శాతం కంటే ఎక్కువ. స్వతంత్రం తర్వాత భారతదేశం 489
1991-92లో 1% కంటే తక్కువగా వున్న పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 1992-93లో 2.8 శాతానికి, 1993-94లో 6 శాతానికి పుంజుకొని 1995-96 నాటికి గతంలో ఎన్నడూ లేనంతగా 12.8 శాతానికి చేరింది. దిగుమతుల సరళీకరణ దేశీయ క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనని తొలగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా రుణాత్మక వృద్ధి రేట్లలో వున్న క్యాపిటల్ గూర్స్ రంగం తిరిగి పుంజుకొని 1994-95లో 25 శాతం వృద్ధి రేటు సాధించింది. ఎం.ఆర్.టి.పి. చట్టం రద్దు చిన్న పరిశ్రమల రంగంపై ప్రతికూల ప్రభావం చూపకపొగా వృద్ధికి తోద్చడిందని చూపుతూ మొత్తం పారిశ్రామిక వృద్ది కంటే చిన్న పరిశ్రమల రంగం త్వరిత అభివృద్ధి సాధించింది. వ్యవసాయం 1991-92లో కొంత క్షీణించినప్పటిత మరుసటి సంవత్సరంలో పుంజుకొని 1996-97 వరకు కూడా ౩ శాతానికి పైగా నిలకడయైన వృద్ధిరేటుని సాధించింది.
1990-91లో జి.డి.పి.లో 8.3 శాతానికి చేరిన కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు తగ్గించబడింది. 1992-97 కాలానికి సరాసరి దాదాపు 6 శాతంగా కొనసాగింది, ముఖ్యమైన విషయం ఏమిటంటే 1996-97లో ద్రవ్య లోటుగా నమోదైన 5.2 శాతంలో త్త శాతం వడ్డీల చెల్లింపుల ద్వారా జమ అయింది.
విదేశీ రంగం కూడా గణనీయంగా మెరుగుపడింది. 1991-92లో 15 శాతం తగ్గుదలగా నమోదైన ఎగుమతులు త్వరగా పుంజుకొని 1993-96 కాలంలో దాదాపు 20 శాతం సరాసరి వృద్ధి రేటు సాధించింది. 1980లలో దాదాపు 60 శాతంగా వున్న ఎగుమతుల రాబడి దిగుమతుల చెల్లింపుల నిష్పత్తి 1990 దశాబ్దం మధ్య కాలం నాటికి దాదాపు 90 శాతానికి పెరిగింది. ఫలితంగా దిగుమతులలోని ఎక్కువ భాగం ఎగుమతుల ద్వారా చెల్లించడం జరిగింది కనుక దేశ స్వావలంబన పెరిగింది. 1990-91లో జి.డి.పి.లో 3.2 శాతానికి చేరిన విదేశీ మారక ద్రవ్య చెల్లింపులలోని లోటు 1998-94లో 0.4 శాతానికి తగ్గించబడింది. 1995-96లో 1.6 శాతానికి పెరిగింది. అయినప్పటికీ 1991-92, 1997-98ల మధ్య కాలంలో సరాసరి లోటు 1.2 శాతం. ఇది 7వ ప్రణాళికా కాలం (1986-90) సరాసరి 2,8 శాతం కంటే తక్కువ. విదేశీ మారక నిల్వలు (బంగారం, ఎస్.డి.ఆర్.ఎస్.లతో సహా) 1999 జనవరి మాసాంతానికి 7 నెలల దిగుమతులకు సరిపడే విధంగా 80.4 బిలియన్ చాలర్లకు పెరిగింది.
రుణ పరిస్థితిలో సంక్షోభం నుండి బయటపడటం జరిగింది. విదేశీ రుణం - జిడిపి నిష్పత్తి 1991-92లో చాలా ఎక్కువగా వున్న 41 శాతం నుండి 1995-96లో 28.7 శాతానికి పడిపోయింది. రుణ సేవల సిప్పత్తి (060 56౪166 2౬00) 490 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1990-91లో 35.3 శాతం వుండగా 1997-98లో 19.5 శాతానికి పడిపోయింది. కాని 10 శాతం కంటే తక్కువగా వున్న చైనా, మలేషియా, దక్షిణ కొరియాల రుణ సేవల నిష్పత్తి (1997 వరకు) కంటే చాలా ఎక్కువ. 1980ల నుండి ప్రత్యేకించి 1991 తరువాత స్టాక్ మార్కెట్ సంస్కరణలు, సరళీకరణ నాటకీయ ఫలితాలనిచ్చాయి. జి.డి.పి.లో నిష్పత్తిగా భారతదేశ స్టాకు మార్కెట్లపై మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1980లో వున్న 5 శాతం నుండి 1990లో 18 శాతానికి పెరిగింది. 1991లో మరలా సంస్కరణలు చేపట్టిన తరువాత 1993 సంవత్సరాంతానికి త్వరితంగా జి.డి.పి.లో 60 శాతానికి పెరిగింది. 1995 నాటికి భారతదేశ స్టాకు మార్కెట్ దానిలో నమోదైన కంపెనీల సంఖ్యారీత్యా ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టాకు మార్కెటయింది. అమెరికా కంటే కూడా పెద్దదయింది. క్యాపిటల్ ఇష్యూస్ కంట్రోల్ యాక్టు 1947 రద్దులాంటి చర్యలు విదేశీ సరళీకరణ (విదేశీ సంస్థల పెట్టుబడిదారులకు భారతదేశ కార్పొరేట్ షేర్లు కొనేందుకు అనుమతి యిచ్చింది. భారతదేశ కంపెనీలకు విదేశీ మార్కెట్ల నుండి నిధులు సమకూర్చుకొనడాన్ని అనుమతించింది. స్టాకు మార్కెట్ నుండి భారతదేశ కంపెనీలు విధులు (విదేశీ మారక ద్రవ్యంతో సహా) సమకూర్చుకొనే శక్తిని పెంచాయి. 1980లో 929 మిలియన్ల రూపాయలు పెట్టుబడిని మాత్రమే సమకూర్చుకోగలిగిన భారతదేశ కంపెనీలు 1985లో 2.5 బిలియన్లు 1990లో 123 బిలియన్లు. 1993-94లో 225 బిలియన్లు -1980కి దాదాపు 250 రెట్లు సమకూర్చుకోగలిగాయి. విదేశీ మార్కెట్ ప్రవేశానికి అనుమతి కారణంగా భారతదేశ కంపెనీలు 1994-95లో 29 యూరో ఇష్యూస్ ఆఫ్ గ్లోబల్ డిపాజిటరీ రిసీస్ట్ (62మొ), ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (005) ద్వారా 2.03 బిలియన్ డాలర్ల పెట్టుబడిని సమకూర్చుకోగలిగాయి. 1995 డిసెంబర్ నాటికి భారతదేశ వ్యాపార సంస్థలు, ఎఫ్.సి.సి.బి.ల 64 ఇష్యూల ద్వారా 5.18 బిలియన్ డాలర్లు సేకరించగలిగాయి. విదేశీ పెట్టుబడికి ఇచ్చిన ప్రోత్సాహం ఫలితాలనిచ్చింది. 1991-1996 కాలంలో వార్షికంగా 100 శాతం విదేశీ పెట్టుబడి పెరుగుతూ వచ్చింది. 1991-92లో 129 మిలియన్లు డాలర్లుగా వున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 1995-96 నాటికి ౬] బిలియన్ల దాలర్లకు చేరింది. పోర్టుఫోలియో పెట్టుబడితో సహా మొత్తం విదేశీ పెట్టుబడి 1990-91లో వున్న 102 మిలియన్ల డాలర్ల నుండి 1995-96లో 49 బిలియన్ల డాలర్లకు పెరిగింది. నిస్సందేహంగా ఇది గణనీయమైన పెరుగుదల. కాని తూర్పు ఆసియా దేశాలతో పోల్చితే వెనుకబాటే. ఒక్క చైనా దేశమే కొన్ని సంవత్సరాల నుండి వార్షికంగా 30 బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను ఇముడ్నుకొంటుంది. ఒక్క 1996లోనే 40.8 బిలియన్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి చైనాలోకి వచ్చింది. కాని స్వతంత్రం తర్వాత భారతదేశం శర
ఒక సానుకూలమైన సంకేతం విదేశీ పెట్టుబడిపై గల విముఖత యిటీవలి కొలంలో తగ్గింది. కమ్యూనిస్టులు కూడా బలపరచిన సంకీర్ణ ప్రభుత్వం (1996లో కాం(ైను పరాజయం పాలైన తరువాత) యొక్క కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) కనీసం ]0 మిలియన్ల దాలర్ల విదేశీ పెట్టుబడిని రప్పించాలని ఆకాంక్షించింది. కాని ముందో అంచనా వేయడానికి వీలుపడని కారణాలతో ఒక్కసారిగా ఆకస్మికంగా ఉపసంహరించు లో అవకాశం గల (మెక్సికోలో, యిటీవల 1990 దశాబ్దం చివర ఆగ్నేయాసియా జరిగినట్లు) విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల అస్థిర స్వభావం నుండి ఉత్పన్నమయ్యే ప్రమాదం యిటీవలి ప్రభుత్వాలు గుర్తించాయి. స్వల్చ్బ వ్యవధి పెట్టుబడుల రాకను, తరలింపును నియంత్రించే ప్రయత్నాలు చేశాయి.
సంస్కరణల విమర్శకులు సంస్కరణలు పేదలకు వ్యతిరేకమన్నారు. కాని పలు దేశాలపై చేసిన అధ్యయనాలు కొద్ది మినహాయింపులతో ఆర్థికాభివృద్ధి పేదరిక స్థాయిని తగ్గించినట్లు ధృవపరిచాయి. కాని భారతదేశంలో కూడా 1980లలో త్వరితగతిన సాధించిన ఆర్థిక పెరుగుదల పేదరిక స్థాయిలలో గణనీయమైన తగ్గుదలని నమోదు చేసింది. దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజల నిష్పత్తి 1977-78లో 51.3 శాతం వుండగా 1987-88 నాటికి 38.9 శాతానికి పడిపోయింది. 1978-74లో భారతదేశపు పేదరిక నిష్పత్తి 549తో పోల్చితే 1975లో అంతకంటే ఎక్కువ పేదరిక నిష్పత్తి 59.5, 643 గల చైనా, ఇండోనేషియాలాంటి దేశాలు 20 సం॥ల వ్యవధిలో వాటి పేదరిక స్థాయిల్ళి. భారతదేశం కంటే చాలా తక్కువకి తగ్గించగలిగాయి. ఈ దేశాలు భారతదేశం కంటే ఎక్కువ వృద్ధిరేటుని సాధించి వాటి పేదరికపు నిష్పత్తులను నాటకీయంగా 22.2, 11.4లకు తగ్గించగలిగాయి. 1993-94 నాటికి భారతదేశం పేదరిక నిష్పత్తిని 36 శాతానికి మాత్రమే తగ్గించగలిగింది. కాబట్టి భారతదేశాన్ని ఎక్కువ వృద్ధి సాధించే దారిలో పెట్టేందుకు ఆర్థిక సంస్కరణలు రూపొందించబడిన మేరకు పేదరికపు స్తాయి కూదా తగ్గుతుంది. ముఖ్యమైన సమస్య ఏమిటంటే సంధి దశలో ప్రత్యేకించి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి దారితీసే ద్రవ్య లోటుని తగ్గించి, చెల్లింపుల సమస్యని మెరుగుపరచే ప్రయత్నాలతో అవసరమైన స్థిరీకరణ జరగవలసిన సమయంలో సంస్కరణలు పేదలపై ఎలాంటి (ప్రభావం చూపుతాయి? భారతదేశ తొలి స్థిరీకరణ ప్రయత్నం ప్రజలకు 'చాలా తక్కువ బాధ కలిగించి అసాధారణ విజయం సాధించింది. 1992-93లో పేదరికం పెరిగింది. అందుకు కారణాలు 1991-92 నాటి కరువు పరిస్లితులు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తగ్గుదల గాని స్థిరీకరణ కార్యక్రమం కాదని పేదరికంపై చేసిన వివిధ అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇవి కూడా చాలావరకు నివారించదగినదే. పరిస్థితిని అంచనా వేసి శ9్ర2 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ద్రవ్య స్థిరీకరణ సాధించడానికి, ప్రభుత్వం తగు ప్రయత్నాలు చేపట్టకపోవడాన్ని సంస్కరణలను సమర్దించేవారు కూడా విమర్శించారు. కాని 1998-94 నాటికి పేదరిక పరిస్థితి మెరుగుపడింది. 1998-94లో గ్రామీణ, పట్టణ పేదరిక స్థాయిలు 1992లో కంటి 6 శాతం పాయింట్లు తక్కువగా వున్నాయి. సంస్కరణలకు ముందు 5 సం॥లు అంటే 1986-87 నుండి 1990-91 కాలం నాటి సరాసరి కంటే తక్కువగా వుంది. ఆ విధంగా పేదరిక న్థాయిలపై సంస్కరణలలో భాగంగా చేపట్టిన స్థిరీకరణ ప్రభావం దాదాపు లేదు. *
1993-94 నుండి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు సామాజిక సేనలను గ్రామీణాభివృద్ధి వ్యయాన్ని పెంచింది. ఈ పద్దుపై 1992-98లో కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 7.8 శాతంగా వుండగా దానిని 1993-98 కాలంలో సరాసరి 10 శాతానికి పెంచింది. 1991-92లో 6.2 శాతం తగ్గిన వ్యవసాయ నిజ వేతనాలు తరువాత రెండు సంవత్సరాలలో వార్షికంగా 5శాతం పైగా పెరిగి 1993-94 నాటికి సంస్కరణల ముందు కాలం నాటి స్థాయిని అధిగమించాయి. 1991-92లోని దిగువ స్థాయి ఉపాధి తరువాత మొత్తం ఆర్థిక వ్యవస్థలో అదనపు ఉపాధి కల్పన 1994-95లో 7.2 మిలియన్లకు 1992-93, 1994-95 మధ్యకాలంలో వార్షిక సరాసరి 6.8 మిలియన్ల చొప్పున ఇది 1980లలో సరాసరి వార్షిక పెరుగుదల 4.8 మిలియన్ల కంటే చాలా ఎక్కువ. అంతేగాక పేదలను ఎక్కువగా యిబ్బందులకు గురిచేసే ద్రవ్యోల్బణం అదుపులో పెట్టబడింది. 1991 ఆగస్టులో అత్యధికంగా 17 శాతానికి చేరిన వార్షిక ద్రవ్యోల్బణ రేటు 1996 ఫిబ్రవరిలో 5 శాతానికి తగ్గించబడింది.
కాని ఇది సంస్కరణలకు సంబంధించిన సమగ్ర స్వరూపం కాదు. సంస్కరణల తొలి ప్రయత్నాలు జయప్రదంగా కన్పించినప్పటికీ యింకా వెళ్ళవలసిన దూరం క్ల! వుంది. 'ఏ రాజకీయ పార్టీకి పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొనసాగి రాజకీయ అస్థిరత కారణంగా ఏ ప్రభుత్వం కూడా ప్రజాకర్షక విధానాల నుండి వైదొలగి కఠినమైన అవసరమైన నిర్ణయాలను చేయలేకపోయింది.
అందువలన ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ, సేవింగ్స్‌ని పెంచేందుకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు గట్లి ప్రయత్నాలు చేపట్టలేదు. 1992-96 కాలంలో ప్రభుత్వ సేవింగ్స్ పెట్టుబడి అంతరం సరాసరి జి.డి.పి.లో 7.1 శాతంగా కొనసాగింద్ని 1991-92లో 28.5 బిలియన్న రూపాయలుగా వున్న ఆహార ధాన్యాలపై సబ్సిడీ 1996-97లో 61. 14 బిలియనకు పెరిగింది. అలాగే 1988-89లో 32.01 బిలియన్లుగా వున్న రసాయనిక ఎరువులపై సల్సిడీ 1989-90లో 45.42 బిలియన్లకు 1995-96లో
స్వతంత్రం తర్వాత భారతదేశం 498
62.35 బిలియన్లకు పెరిగింది. పెద్ద మొత్తాల సబ్సిడీలు, వ్యవసాయంలో వనరుల కొరత కారణంగా పెట్టుబడులు తగ్గడానికి దారితీసింది. 'ఒక్క రసాయనిక ఎరువులపై యిచ్చే సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయం, వ్యయానికి దాదాపు సమానంగా వుందని” ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక శాస్త్రవేత్త సి.హెచ్. హనుమంతరావు 1992లో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం 1995-96లో డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్‌లపై యిచ్చిన సబ్సిడీ 93.6 బిలియన్లు. ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించవలసిన బకాయిలు పెద్ద మొత్తాల్లో వున్నాయి. ఫలితంగా ఆయిల్ కంపెనీలు ఆయిల్ రంగంలో అవసరమైన పెట్టుబడులు పెట్టలేక పోయాయి.
అదేవిధంగా పబ్లిక్ రంగ యాజమాన్యంలోని ఎలక్ట్రిసిటీ బోర్డులు, రవాణా కార్పొరేషన్లు లాంటి వాటిలో సంస్కరణలు అంతగా ఫలితాలు సాధించలేదు. పంజాబ్ ప్రభుత్వం రైతులకు విద్యుత్‌ని, నీటిని ఉచితంగా సరఫరా చేసింది. చాలా యితర రాష్ట్రాలు కూడా ఉత్పత్తి రేట్ల కంటే చాలా తక్కువకి సరఫరా చేశాయి. కాబట్టి విద్యుత్స్ రవాణాల మౌలిక వసతుల కల్పన చాలా యిబ్బందుల నెదుర్కొంటున్న సమయంలో రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు నష్టాలలో నడిచాయి. ఆశించిన ఆర్ధిక వృద్ధిరేటు మందగించింది.
లేబరు మార్కెట్స్ నష్టాలు వచ్చే కంపెనీలకు ఎగ్జిట్ అవకాశాలు సృష్టించే సంస్కరణ చేపట్టేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టలేదు. కొద్ది సంవత్సరాల తొలి విజయం తరువాత ఆర్థిక సంస్కరణల వేగం మందగించింది. అంతేగాక 1997 నుండి ఆర్థిక విధానం నెమ్మదించడం మొదలయింది. 1996-97లో 7.8 శాతంగా వున్న జి.డి.పి. వృద్ధి రేటు 1997-98లో 5 శాతానికి తగ్గింది. 20 శాతానికి పైగా పెరుగుతున్న ఎగుమతులు 1996 నుండి వరుసగా 9వ సంవత్సరం కూడా బాగా తగ్గాయి. 1995-96లో పరిశ్రమలు మందగించాయి. మరీ ముఖ్యంగా కీలకమైన మౌలిక వసతుల కల్చనా రంగంలో వెనుకపట్టు పెద్ద ఆటంకంగా పరిణమించింది. విదేశీ పెట్టుబడులు
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, పోర్టుపోలియో పెట్టుబడుల ప్రవాహం క్షీణించింది.
[ద్రవ్యలోటు రంగంలోనూ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 1996-97లో జి.డి.పి.లో 0.6 శాతానికి తీసుకొని రాబడిన ద్రవ్యలోటు 1997-98లో రెట్టింపకి పైగా 1.8 శాతానికి పెరిగింది. కేంద్రం రాష్ట్రాలను మొత్తంగా చూస్తే ద్రవ్యలోటు 2.4 శాతానికి పెరిగింది. 1997లో యునైటెడ్ ఫ్రంట్ (గుజ్రాల్) ప్రభుత్వం ఐదవ వేతన కమిటీ సిఫార్సుల్ని పాక్షికంగా ఆమోదించిన కారణంగా వేతనాలపై ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరగడంతో ద్రవ్యలోటుపై వత్తిడి పెరిగింది. పరిస్థితి ఏ స్థితికి చేరిందంటే శ9ిశ బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే 1998-99 కూడా 'లోటుపై రాజ్యాంగ పరిమితుల సమస్యని పునఃపరిశీలించవలసిన సమయమాసన్నమైనదని” వ్యాఖ్యానించక తప్పలేదు.
1996-97 నుండి ఆర్థిక పరిస్థితి మందగించడానికి పాక్షికంగా కారణం ఆర్థిక మాంద్యంలో జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ యితర దేశాల రుణ వృద్ధి రేటుతో మొత్తంగా తూర్పు ఆసియా సంక్షోభంలో చిక్కుకొనడం. రష్యా, బెజిల్లాంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కూడా సంక్షోభ పరిస్థితుల నెదుర్శొన్నాయి. 1998లో ప్రపంచ వృద్ధి రేటు - ప్రత్యేకించి ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించింది. సంక్షోభం ప్రపంచ పెట్టుబడుల ప్రవాహంపై, ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులు, భారతదేశ ఎగుమతులు తగ్గాయి. మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతుల కంటే భారతదేశ ఎగుమతులు తగ్గిపోయాయి. అందుకు భారతదేశ ఎగుమతులకు ఆటంకాలుగా వున్న మౌలిక సదుపాయాల కల్పన (విద్యుత్, రవాణా, ఓడరేవు, వసతుల లాంటివి) లోను పాతకాలపు కార్మిక చట్టాలు, కొనసాగుతున్న వాణిజ్య నిబంధనలు లాంటి వాటిని సరిదిద్దడంలో సంస్కరణల వైఫల్యం కారణం. ఇది శ్రమ ఆధారిత వస్తువుల ఎగుమతి రంగంలో కొరియా, తైవాన్, హాంకాంగ్ లాంటి దేశాలు ఖాలీ చేసిన జాగాని భారతదేశం గాక చైనా ఆక్రమించుకొనగలిగేలా చేసింది.
అంతేగాక అణ్వస్త్ర పరీక్షల (రాజకీయ ప్రయోజనం కొరకు బిజెపి ప్రభుత్వం హడావిడిగా జరిపించిన) కారణంగా విధింపబడిన ఆంక్షలు ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపాయి. రాజకీయ అస్థిరత, వివిధ ప్రాపంచిక దృక్చథాలు గల భాగస్వాములతో ఏర్పడిన అవకాశవాద సంకీర్ణ ప్రభుత్వాలు, ఒకవైపు భారతదేశ సంస్కరణలను, ప్రపంచీకరణలో పాల్గొనడాన్ని అడ్డుకొనే స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్న బిజెపి మాతృ సంస్థ ఆర్.ఎస్.ఎస్., మరొకవైపు సంస్కరణలపై విశ్వాసాన్ని ప్రకటిస్తున్న బిజెపి - రాజకీయాలలో లాగానే ఆర్థికాంశాలలో కూడా బిజెపి రెండు నాల్కల ధోరణి - ఇవన్నీ సంస్కరణలు నత్తనదకని వివరిస్తాయి.
అయినప్పటికీ సంస్కరణల క్రమం కొనసాగాలని రైటు నుండి లెఫ్ట్ వరకు గల అన్ని రాజకీయ పార్టీలలో విస్తృతమైన ఏకాభిప్రాయం వుండటం ప్రజాస్వామ్యంలో చాలా ప్రాధాన్యత గల సానుకూల పరిణామం.
ఆర్థిక సంస్కరణలు లేక సరళీకరణ అంటే భారత ప్రజలు స్వతంత్రం సాధించుకొన్నప్పుడు నిర్దేశించుకాన్న త్వరితాభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్వావలంబన; పేదరిక నిర్మూలన లాంటి లక్ష్యాలలో మార్చు కాదు. సరళీకరణ, ప్రపంచీకరణ క్రమంలో స్వతంత్రం తర్వాత భారతదేశం శీ9ిక్
భాగస్వామ్యం వహించడం అంటే కొన్ని వామపక్ష సెక్షన్లు వాదిస్తున్నట్లు అంతర్జాతీయ పెట్టుబడికి లేక సామ్రాజ్యవాదానికి లేక ఐ. ఎం, ఎఫ్. -ప్రపంచ బ్యాంకులకు లొంగుబాటు కాదు. వివిధ కంట్రోళ్ళు ప్రభుత్వోద్యోగాల అనుభవం, సోషలిస్టు శిబిరం పతనం లాంటి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, రెండవ ప్రపంచ యుద్దానంతరం నూతన ప్రపంచీకరణ క్రమం, ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ది చెందుతున్న వివిధ ఆర్థిక వ్యవస్థల అనుభవం - వీటన్నిటి ప్రాతిపదికన, స్వతంత్రం సాధించుకొన్నప్పుడు నిర్దేశించుకొన్న లక్ష్యాల సాధనకు వ్యూహాన్ని మార్చవలసిన అవసరం ఏర్పడింది.
దీని అర్ధం నెహ్రూ వ్యూహం తప్పని కాదు. దానికి చారిత్రక (ప్రాధాన్యత వుంది. అది భారత ఆర్థిక వ్యవస్థకి గంభీరతని, విస్తృతిని సమకూర్చింది. బేరమా శక్తిని, స్వతంత్ర పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థ సమాజానికి స్థాయిని తెచ్చిపెట్టింది. మారిన ప్రపం పరిస్థితులకు స్పందనగా అవే లక్ష్యాలు సాధించడానికి వ్యూహంలో మార్చు అవసరమయింది. ఉదాహరణకు 1950లలో స్వావలంబనకు త్వరితాభివృద్ధిక దిగుమతులపై ఆధారపడటం అవసరమయింది. కాని ఈనాడు స్వావలంబన త్వరితాభివృద్ధి సాధించాలంటే పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం దాని ద్వారా సమర్ధత లేక ఉత్పాదక న్థాయిలు నిలబెట్టుకోవడం అవసరం.
నెహ్రూ వ్యూహానికి పలు విధాలుగా విశేషంగా కృషి చేసినవారే ఈనాటి పరిస్థితుల దృష్ట్యా సంస్మరణ ఆవశ్యకతని గుర్తించారు. ఉదాహరణకు ఇందిరగాంధీకో పాటు నెహ్రూ కాలం నాటి బ్రిటిష్ ఆర్ధిక శాస్త్రవేత్త కె.ఎన్. రాజ్, మార్చిస్ట్ ఆర్థిక శాస్త్రవేత్త లార్డ్ మేఘానంద్ దేశాయ్, నెహ్రూ అనుచరుడు నరసింహరావు, వామపక్ష అర్థిక శాస్త్రవేత్తలు సుఖమయ్ చక్రవర్తి, సిహెచ్. హనుమంతరావు, అర్జున్‌సేన్ గుప్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు స్వతంత్రానంతరం అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన జ్యోతిబసు - అందరూ వేర్వేరు వైఖరులతో వివిధ స్థాయిలలో సరళీకరణ అమలు జరుపుతున్నారు. ఆర్.ఎస్.ఎస్. మద్దతు గల స్వదేశీ జాగరణ మంచ్ బలంగా ప్రతిఘటిస్తున్నప్పటికి బిజెపి కూడా సంస్కరణల పట్ల నిబద్ధతతో వుంది. బయటి ప్రపంచంలో వస్తున్న మార్పులకు దేశీయంగా పొందిన అనుభవానికి స్పందనగా, స్వతంత్రం పొందినప్పటి నుండి సాధించిన విజయాలను వ్యర్థం కానీయకుందా కాపాడుకుంటూ ఈ గొప్ప దేశం తన నిగూఢమైన, అపారమైన శక్తిని గుర్తించి ప్రపంచంలో తనదైన స్థానాన్ని పొందేందుకు అనువైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. 496 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
28 అక్ ఆష్ నూ బ్లిలో తన సహస్రాబ్ది భారతదేశ ఆర్థిక విధానం ఆర్ధిక సంస్కరణల క్రమం చేసిన వాగ్దానం ప్రత్యేకించి 1991 సంస్కరణల తరువాత నూతన సహహ్రాబ్టి సంవత్సరాలలో సాధించవలసి వుంది. 2007లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యదవకాశం వలస పాలన నుండి విముక్తి పొందిన 60వ సంవత్సరంలో ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేనంత ఆశావహంగా వుంది. కాని సంస్కరణల తొలి దశలో ఎదురైన సమస్యలు యింకా కొనసాగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా దేశ అర్ధిక పరిస్థితిలో అద్భుతమైన వృద్ధి నమోదైనప్పటికీ సామాజిక న్యాయరంగంలోని వెనుకబాటుతనం కారణంగా ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో భారతదేశం స్థానం దిగువకు పడిపోతూ వుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం విలీనమవుతుండగా నూతన సహస్రాబ్దిలో భారతదేశం కొత్త సమస్యల్ని కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నది. తూర్పు ఆసియా దేశాల ఆగ్నేయాసియా సంక్షోభం కారణంగాను, ప్రపంచ ఆర్ధిక పరెస్టితి మందగించడం వలననూ 1990 దశాబ్దం చివరలో మందగించిన భారతదేశ ఆర్థిక పురోగతి సహస్రాబ్ది ప్రారంభంలోనూ కొనసాగింది. చమురు ధరలు 'పెరగడంతోను, అమెరికాలో 9/11 టెర్రరిస్టు దాడితోను నూతన సహస్రాద్టీ తొలి సంవత్సరాలు అల్లకల్లోలమయ్యాయి. అయినప్పటికి 1996-97 నుండి 2000-2001 వరసగా 9వ ప్రణాళిక కాలంలో సగటు వార్షిక జిడిపి వృద్ధిరేటు 5.ర్గా నమోదయింది. వృద్ధి రేటు ప్రణాళికా లక్ష్యమైన 6.5 కంటే తక్కువగా వున్నప్పటికీ పెద్ద నష్టం లేకుండా వృద్ధిరేట్లు తగ్గకుండా సంక్షోభ సంవత్సరాలను అధిగమించగల సంస్మరణానంతర భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సమర్ధతని చాటిచెప్పింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 497
పదవ ప్రణాళిక యొక్క మొదటి సంవత్సరం 2002-08 నెమ్మదిగా 3.8 శాతం వృద్ధి రేటుతో ప్రారంభమయింది. 1990లలో భారతదేశ వ్యవసాయ పురోగమనం వేగం తగ్గింది. 2002-03లో రుతు పవనాలు విఫలమయ్యాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత, 15.6 శాతం పడిపోయింది. 2002-08 నుండి 2006-07 వరకు గల ప్రణాళికా కాలంలో వ్యవసాయరంగం అంత ఆశాజనకంగా లేదు. ఈ కాలంలో సరాసరి వృద్ధి రేటు 2.3 శాతం మాత్రమే. ఇది 1980-83, 1992-95 కాలాల్లో సాధించిన 3.4 శాతం లేక నూతన సహస్రాబ్దంలోని మొదటి ఐదు సంవత్సరాల (2001-02 నుండి 2005-06) వృద్ధి రేటు 3 శాతం కంటే యిది తక్కువ.
ప్రణాళికా కాలంలోని మొదటి సంవత్సరంలో స్ట్రూల జాతీయోత్పత్తి (జిడిపి) తక్కువగా వున్నప్పటికీ వచణాళికా కాలంలో వ్యవసాయం అంత నజావుగా లేకపోయినప్పటికీ 2002-08 నుండి 2006-07 వరకు గల ప్రణాళికా కాలంలో 7.6 సగటు వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వుంది. ఇది ప్రణాళికా లక్ష్యమైన 8 శాతం కంటే కొంచెం తక్కువగా వున్నప్పటికి అపూర్వ విజయం. గతంలో ఎన్నడూ కూడా వృద్ధి రేటు 5 సంవత్సరములు నిలకడగా లేదు. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క 7 శాతం వార్షిక జిడిపి వృద్ధి, 5.6 శాతం తలసరి ఆదాయంలో పెరుగుదల - రానున్న 20 సంవత్సరములు సాధిస్తుందని 2004లో చెప్పబడిన జోస్యం ఊహాజనితమైన కలకాదు. (ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జఫ్రా డి. సాబ్స్ ఒక అడుగు ముందుకేసి నిరుపమ్ బాజ్‌పాయ్‌తో కలిసి 2000లోనే రానున్న దశాబ్దంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని భారత ప్రధానితో చెప్పాడు. “1960లలో జపాన్, 1970లలో కొరియా, 1980లలో చైనా తలసరి ఆదాయాన్ని రెట్టింపుకి పెంచగలిగాయి. 1990లలో భారతదేశం వార్షిక తలసరి వృద్ధి రేటుని రెట్టింపుకి అంటే 7 శాతానికి పెంచడమే గాక ఒక దశాబ్ధం పాటు వృద్ధి రేటుని నిలబెట్టుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం.”
వాస్తవంగా 10వ ప్రణాళిక యొక్క చివరి నాలుగు సంవత్సరాలలో అంచనాలకు మించి 8.6 శాతం సగటు వృద్ధి రేటు సాధించడం జరిగింది. అంతేగాక 2006-07లో భారత ఆర్థిక వ్యవన్థ అంతకుముందు నంవత్సరం సాధించిన వృద్ధి శీటు 9 శాతాన్ని మించి 9.4 శాతాన్ని సాధించింది. దీనితో భారత అర్ధిక వ్యవస్థ 1990లో 6 శాతం వృద్ధి రేటుని అతిక్రమించి ఊపందుకొని 9 శాతం, అంతకంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించే నూతన కక్ష్యలోనికి ప్రవేశించినట్లయింది. ప్లానింగ్ కమిషన్ 11వ పంచవర్ష ప్రణాళిక (2007-08 నుండి 2012-18)కు సగటు వార్షిక వృద్ధిరేటుని 9 శాతంగా నిర్ణయించింది. భారతదేశం అంతవరకే సాధిస్తుందా లేక అంతకంటే ఎక్కువ సాధిస్తుందా! శ98 బిపన్చం[ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1950ల నుండి సగటు తలసరి వార్షికాదాయం 8 శాతం సాధించి రెండు దశాబ్దాలలో ప్రపంచంలో రెండవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన జపాన్ స్థితికి భారతదేశం చేరుకొనే పరిస్థితి కనిపించింది. నూతన సహస్రాబ్దిలో భారతదేశం ఆర్థిక పురోగమనాన్ని సన్నద్ధం చేయబడింది.
అలాగనే మాడిసన్ బృహ(ద్గంథం మొదటి సహస్రాబ్ది కాలమంతటా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి వుందనీ, ప్రపంచ జిడిపిలో భారతదేశం వాటా దాదాపు 30 శాతమని వివరించింది. 1700 నాటికి కూడా భారతదేశం ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని వివరించింది. ఆ తరువాత భారతదేశం వలస పాలన క్రిందకి వచ్చింది. ప్రపంచ జి.డి.పి.లో భారత ఆర్థిక వ్యవస్థ వాటా క్రమంగా పడిపోయింది. స్వతంత్రం సాధించిన తొలి సంవత్సరాలలో 1950లో భారతదేశం వాటా 4.2 శాతం. ఆ తరువాత 50 సంవత్సరాలలో భారతదేశం క్రమంగా పుంజుకుంటూ 2001 నాటికి 5.1 శాతానికి చేరుకొన్నది. 1978, 2001 మధ్యకాలంలో వార్షిక వృద్ధిరేటు 5.12గా నమోదు చేసుకొంటూ ఈ స్థితికి చేరుకోగలిగింది. ఈ వృద్ధి రేటు చైనాకంటే తక్కువ. కాని ఈ కాలంలో ప్రపంచ వృద్ధి రేటు 3.05 కంటే చాలా ఎక్కువ. 2008-04 నుండి అమెరికా, జపాన్, యూరప్ దేశాల కంటే దాదాపు 2 1/2 రెట్లు వేగంతో, ప్రపంచ వృద్ధి రేటు 5 శాతం కంటే చాలా ఎక్కువగా వార్షికంగా 8.6 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ వృద్ధిరేటుని నిలబెట్టుకోగలిగితే సమీప భవిష్యత్తులో భారతదేశం జపాన్ని అధిగమించి అమెరికా, చైనాల తరువాత ప్రపంచంలో మూడవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలుగుతుంది.
ఈ వృద్ధి నిలకడగా వుండేదా?
సాధించిన వృద్ధి రేట్లు నిలకడగా వుండేవా లేదా నిర్ధారించడానికి ఇటీవలి
సంవత్సరాలలో ఆర్ధిక వ్యవస్థలోని కొన్ని ఇతర ప్రమాణాల్ని వరిశీలించడ౦ అవసరమవుతుంది. ఈ సందర్భంగా కీలకమైనది సేవింగ్స్ - ఆర్థిక వ్యవస్థచే ఉత్పత్తి చేయబడిన పెట్టుబడి. ఒక మంచి సంకేతమేమిటంటే జిడిపి యొక్క నిప్పత్తిగా నిలకడగా పెరుగుతున్న స్థూల జాతీయ సేవింగ్స్ మరియు పెట్టుబడి రేటు తూర్పు ఆసియా దేశాల స్థాయికి దగ్గరగా వచ్చింది. 2000-01లో జిడిపిలో 23.4 శాతంగా వున్న స్థూల జాతీయ సేవింగ్స్ 2005-06 నాటికి 32.4 శాతానికి చేరింది. స్థూల జాతీయ పెట్టుబడికి చెందిన సంబంధిత సంఖ్యలు 24, 83. 8. వాస్తవంగా 2004-05, 2005-06 సాధించిన ఎక్కువ వృద్ధిరేటులో వినిమయం కంటే పెట్టుబడి జిడిపి పెరుగుదల యొక్క ప్రధానమైన వనరు అయింది. 2008-04 నుండి పబ్లిక్ సెక్టారులో సేవింగ్స్ పెరిగాయి. ఫలితంగా
స్వతంత్రం తర్వాత భారతదేశం శ99ి
పబ్లిక్ సేవింగ్స్ - పెట్టుబడి మధ్య అంతరం తగ్గింది. సగటు సేవింగ్స్ - పెట్టుబడి అంతరంపై ప్రభావం బలపడింది. 2001-02 నుండి 2003-04 వరకు గల మూడు సంవత్సరాల వ్యవధిలో సేవింగ్స్ పెట్టుబడుల్ని అధిగమించాయి. ఇది 2000-01 నుండీ 2005-06 కాల వ్యవధికి జిడిపిలో స్వల్బంగా 0.2 శాతం సగటు వార్షిక మిగుళ్యా సమకూర్చడానికి దారితీసింది. 1980-81, 1990-91 మధ్యకాలంలో జిడిపిలో ౨. శాతంగా వున్న సేవింగ్స్ పెట్టుబడి అంతరం 1991 సంస్కరణల తరువాత 1991-92, 1999-2000 మధ్యకాలానికి 1.2 శాతానికి తగ్గింది.
భారతదేశంలో 2006లో 15-64 వయో పరిమితిలో 62.9 శాతం పలు వుండగా ఈ వయోపరిమితిలో వున్న వారి సంఖ్య 2026 నాటికి 68.4 శాలొనికీ చేరుతుందని అంచనా. మరొక విధంగా చెప్పాలంటే పనిచేయనివారు పనిచేసే వారిపై ఆధారవడే నిష్పత్తిని తగ్గిస్తే సేవింగ్సుని నిలబెట్టవచ్చు, యింకా పెంచవచ్చు. పనిచేయనివారు పనిచేసేవారిపై ఆధారపడిన నిష్పత్తి 2000లో 0.62 వుండగా 2025 నాటికి 0.48కి తగ్గించవచ్చునని అంచనా. ఆధారపడటంలో ఈ 14 పాయింట్లు తగ్గుదల సరాసరి సేవింగ్సులో పెరుగుదలని అంటే జిడిపిలో 25 శాతం (2002లో) సేవింగ్సుని 89 శాతం సేవింగ్సు (2025లో) పెంచుతుందని అంచనా.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు పరిస్థితి 2003-04 నుండి కొంతే మెరుగుపడటం మొదలయింది. ద్రవ్యలోటు సమస్య సంస్కరణ ముందుకాలంలోనే గొ 1990లలో కూడా పెద్ద అవరోధంగా కొనసాగింది. 1990-91లో జిడిపిలో 6.6 శాతంగా వున్న కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 1996-97లో 4.1 శాతానికి తగ్గింది. కొని మరలా క్రమంగా పెరిగి 2000-01 నాటికి 6.2 శాతానికి పెరిగింది. ద్రవ్యలోటు మరలా పెరిగి నిలకడ స్థితిలో వుండటమే గాక మొత్తం లోటులో రెవెన్యూ లోటు (వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం, జీతాలు మొదలైనవి కలిసి) నిష్పత్తి క్రమంగా పెరిగింది. 1990-91లో 49.4 శాతంగా వున్న ఈ నిష్పత్తి 1998-99లో 74రి శాతానికి 2003-04లో 79.7 శాతానికి పెరిగింది. అంటే పెట్టుబడిని పెంచడానికి అంతకంతకు తక్షువ మొత్తాలు వెచ్చించబడ్డాయి. 1990ల చివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోట్లపై రాజ్యాంగబద్ధమైన పరిమిళుల్ని విధించాలని ్రస్తావించవలసినంతగా పరిస్థితి క్షీణించింది.
ఫలితంగా 2008 ఆగస్టులో ఫిస్కల్ రిఫార్ట్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్టు (53144) చేయబడింది. చట్టం - దానికి సంబంధించిన నియమాలు 2004 జూలై ర్ నుండి అమలులోకి వస్తాయని ప్రకటించబడింది. చట్టం యొక్క లక్ష్యం ఆర్థిక దూరదృష్టి 8500 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
2 రెవెన్యూ లోటును వార్షికంగా జిడిపిలో 0.5 శాతం తగ్గించడం, 2009 మార్చి 81 నాటికి పూర్తిగా తొలగించడం. ద్రవ్యలోటును ప్రతి సంవత్సరం జిడిపిలో 0.8 శాతం తగ్గించడం, 2009 మార్చి 31 నాటికి జిడిపిలో 8 శాతం కంటే ఎక్కువ గాకుండా చేయడం.
ఈ ప్రయత్నాలు ప్రత్యేకించి 2004లో ఎఫ్.ఆర్.బి.ఎం.ఎ. అమలులోకి వచ్చిన తరువాత గణనీయమైన విజయం సాధించాయి. 2001-02లో జిడిపిలో 6.2 శాతంగా వున్న కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 2004-05లో 4 శాతానికి, 2006-07లో బడ్జెట్ అంచనా మేరకు 3.8 శాతానికి క్రమంగా తగ్గింది. 2000-01లో జిడిపిలో ఓ4 శాతంగా వున్న ద్రవ్యలోటు కూడ 2004-05లో 2.5 శాతానికి 2006-07లో బడ్జెట్ అంచనా మేరకు 2.1 శాతానికి తగ్గింది. ఇది ద్రవ్యలోటులో నిష్పత్తిగా రెవెన్యూ లోటు 27 శాతం పాయింట్లు తగ్గడానికి అంటే 2008-04లో వున్న 79.7 శాతం నుండి 2006-07లో 57 శాతానికి తగ్గడానికి దారితీసింది. రాష్ట్రాల ద్రవ్య పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడింది. 1990-01లో 8.3 శాతంగా వున్న రాష్ట్రాల ద్రవ్యలోటు 2003-04లో 45 శాతానికి పెరిగి ఆ తరువాత 2005-06లో 8.2 శాతానికి 2006-07లో 2.6 శాతానికి పడిపోయింది. అలాగే 1990-91లో 0.9 శాతంగా వున్న ద్రవ్యలోటు 2003-04లో 4.5 శాతానికి పెరిగి ఆ తరువాత 2005-06లో 0.5 శాతానికి తగ్గి 2006-07 నాటికి నున్నాకి చేరింది. రాష్ట్రాల ద్రవ్య రెవెన్యూ లోట కొరకు ఎఫ్.ఆర్.బి.ఎం.ఎ. లక్ష్యాలు రెండు సంవత్సరాల ముందుగానే చేరడం జరిగింది. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లోట్లలో కలగలిపిన పెరుగుదల సంఘటిత సాధారణ ప్రభుత్వ లోటు (001901628664 ౮ల౪1 6౦7అయిం[॥ ౨లకం19 కి దారితీసింది. 1990-91 జిడిపిలో 9.4 శాతంగా వున్న ఈ లోటు 2001-02లో 9.9 శాతానికి పెరిగి 2004-05లో 7.5 శాతానికి, 2006-07లో 6.3 శాతానికి పడిపోయింది. ఇక (ద్రవ్య సమీకరణంలోని ఆదాయం విషయానికి వస్తే ప్రభుత్వం పన్ను జిడిపి నిష్పత్తిని గణనీయంగా పెంచలేకపోయింది. సంస్కరణల తొలి సంవత్సరాలలో ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయం పన్ను కార్బారేట్ పన్ను) తగ్గింపుతో అలాగే పరోక్ష పన్నుల (కస్టమ్స్, ఎక్సైజ్ సర్వీసు టాక్స్) తగ్గింపుతో మొత్తం పన్ను - జిడిపి నిష్పత్తి 1900-01లో 10.1 శాతం వుండగా అది 2001-02లో 8.2 శాతానికి తగ్గింది. ఆ తరువాత అది నెమ్మదిగా పెరిగి 2005-06లో 10.3 శాతానికి 2006-07లో 10.8 శాతానికి పెరిగింది.
కాని మొత్తం మీద రెవెన్యూ అంకెలు భారతదేశ పన్నుల చట్రంలో జరుగుతున్న మార్పుని స్పష్టంగా తెలియజేయవు. రేట్లలో తగ్గింపులున్నప్పటికీ మొత్తంగా వ్యక్తిగత, స్వతంత్రం తర్వాత భారతదేశం 501
కార్పొరేట్ పన్నుల నుండి వచ్చే ఆదాయం పెరిగింది. వ్యక్తిగత ఆదాయం పన్ను మొత్తం పన్ను రెవెన్యూలో శాతంగా 1990-91లో 9.3 శాతం వుండగా 2000-01లో 171 శాతానికి పెరిగి దాదాపు రెట్టింపయింది. 2006-07లో బడ్జెట్ అంచనా 17. శాతం. కార్పొరేషన్ టాక్స్ మొత్తం రెవెన్యూలో నిష్పత్తిగా నాటకీయమైన పెరుగుదల నమోదు చేసుకొన్నది. 1990-91లో 9.8 శాతంగా వున్న కార్పొరేషన్ టొక్స్ 2001-02లో 19.6 శాతానికి 2004-05లో 27.1 శాతానికి పెరిగింది. బడ్జెట్ అంచనా 80.) శాతం ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేషన్) మొత్తం పన్ను అదాయం నిప్పుత్తి 1990-91లో 19.1 శాతం వుండగా 2006-07లో 47.6 శాతానికి పెరిగింది. దీనిని అభివృద్ధికరమైన దిశలో గణనీయమైన మార్పుగా సంస్కరణ విమర్శకులు గమనించాలి.
కాని సమస్య మార్చు వైపు వుంది. 2005-06లో రెవెన్యూ వసూళ్ళలో దాదాపు 86 శాతం వడ్డీ చెల్లింపులు సబ్సిడీలు, జీతం, పింఛన్లు, రక్షణలకు వెచ్చించబడింది. ప్రభుత్వం గతంలో భారీగా అప్పులు చేసి వున్నందువలన (మొత్తం ప్రభుత్వ అప్పు - జిడిపి నిష్పత్తి దాదాపు 90 శాతానికి చేరింది) 2005-06లో మొత్తం రెవెన్యూలో ఒక్క వడ్డీ చెల్లింపులకే 38శాతం సబ్సిడీలకు 13 శాతం ఖర్చయింది. సమాజంలోని వివిధ సెకన్ల డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వాలపై పెరిగిన వత్తిళ్ళు, సబ్సిడీల వ్యయం (పేదల పేరుతో తరచుగా వారికి ప్రయోజనాలు చేకూర్చని) జీతాల రాయితీలు లాంటి సమస్య-1990 దశాబ్దం ప్రారంభంలో ఐ.ఎం.ఎఫ్. వత్తిడితో కలిగిన కొద్దిపాటి వెసులుబాటు తప్ప 1991 సంస్కరణల తరువాత కూడా కొనసాగింది. ఫలితంగా వ్యవసాయం విద్య ఆరోగ్యం వగైరాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు (రోడ్డు ఓడరేవులు, విధ్యుత్ లాంటి) ప్రభుత్వ పెట్టుబడి అవసరమైన సమయంలో రెవెన్యూ వసూళ్ళు మరియు జిడిపిలో నిష్పత్తిగా ప్రభుత్వ పెట్టుబడి వ్యయం 2003-04 నుండి తగ్గడం మొదలయింది. ఎఫ్.ఆర్.బి.ఎం.ఎ. చట్లం చేసినప్పటి నుండి (ద్రవ్యలోటు పరిస్టితి మెరుగుపడినప్పటికి భారతదేశం మరికొంత ఎక్కువగా ఆరిక క్రమశిక్షణ ప్రవేశపెట్టడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గ్ ____3990 దశాబ్దం చివరి నుండి దిగజారుతున్న పారిశ్రామిక వృద్ధి నూతన సహస్రార్దీలో కోలుకొనడం ఒక సానుకూలమైన పరిణామం. 2000-01లో కేవలం 2.1 శాతం వృద్ధి రేటు గల పారిశ్రామిక రంగం 2006-07లో 10 శాతం వృద్ధి రేటు సాధించి బాగా పుంజుకొన్నది. మరీ ముఖ్యంగా 2006-07కి ముందు గల క్ సంవత్సరాలలో ఏనాడూ వృద్ధిరేటు 7 శాతానికి తగ్గకుండా సగటు వృద్ధి రేటు &క 502 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
శాతం సాధించింది. ఇది 1951నుండి ఎప్పుడూ సాధించని విజయం. వార్షిక పారిశ్రామికాభివృద్ది 10 శాతం సాధించడం 11వ ప్రణాళిక (2007-12) లక్ష్యం.
పారిశ్రామిక రంగంలో యంత్ర నిర్మాణం వేగంగా అభివృద్ది చెందింది. 2000-01లో అత్యంత దిగువ స్టాయికి చేరిన క్యాపిటల్ గూడ్స్ రంగం తరువాత 5 సంవత్సరాలలో బాగా పుంజుకొని 2002-03, 2005-06 మధ్యకాలంలో సగటు వృద్ధి రేటు 13.5 సాధించింది. క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 1993-2003 కాలంలో విపదీతంగా వృద్ధి చెందిన వినిమయదారీ వృద్ధి రేటుతో సమానమవదమే గాక 2005 నాటికి దానిని అధిగమించి ముందుకు పోయింది.
1980ల నుండి ఎక్కువ వృద్ధిరేటు (పరిశ్రమల కంటే ఎక్కువ) కలిగివున్న సేవల రంగం 2002-03 నుండి 2006-07 మధ్యకాలంలో జిడిపి పెరుగుదలలో 68.6 శాతం అందించింది. ఈ కాలంలో వ్యవసాయాభివృద్ధి మందగించడం వలన అవసరమైన తోడ్పాటు పరిశ్రమల నుండి లభించింది. దీర్జకాలికంగా ఈ రంగాల వేర్వేరు అభివ్చద్ధి రేట్ల కారణంగా జిడిపిలో ఈ రంగాల వాటాలు గణనీయంగా మారాయి. 2006-07లో సర్వీసు రంగం వాటా 55.1 శాతం, పరిశ్రమల వాటా 26.4 శాతం, వ్యవసాయం వాటా 18.5 శాతం, 1950-51లో, 1970-71లో తృతీయ, ద్వితీయ, ప్రాథమిక రంగాలకు సంబంధిత అంకెలు వరుసగా 27.5, 18.3., 59.2 మరియు 32.1, 21.6, 46.3. 2006-07 నాటికి జిడిపిలో 5ఠ శాతంగా వున్న సర్వీసు రంగం దేశ ఆర్ధిక విధానంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. బయటి ప్రపంచంతో సంబంధాలు
బయటి ప్రపంచంతో భారతదేశానికి గల సంబంధాల విషయంలో నూతన సహహ్రాబ్దిలో వచ్చిన మార్పులు అభివృద్ధికరంగా వున్నాయి. సరళీకరణ, ప్రపంచీకరణలతో కూడిన సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుటి నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఏకీకృతమనీతూ వచ్చింది. భారతదేశ వాణిజ్య పెరుగుదల జిడిపిలో నిష్పత్తిగా 1974లో దాదాపు 10 శాతం వుందగా, 1990లో 15.71 శాతానికి పెరిగింది. ఆ తరువాత 1991లో సంస్కరణలు చేపట్టిన ఫలితంగా 2004లో 82.6 శాతానికి అంటే 1990 సంఖ్యకి రెట్టింపుకి పైగా పెరిగింది. భారతదేశ విదేశీ వాణిజ్యం జిడిపిలో నిష్పత్తిగా 2002లో 30.8 శాతానికి చేరింది. ఇది అమెరికా సాధించిన 23.6 శాతం కంటే, జపాన్ సాధించిన 21 శాతం కంటే ఎక్కువ. కాని చైనా సాధించిన 54.8 శాతం కంటే దక్షిణ కొరియా సాధించిన 69.1 శాతం కంటే చాలా తక్కువ. స్వతంత్రం తర్వాత భారతదేశం ర్03
భారతదేశం ఎగుమతులు వస్తువుల రంగంలో 2002-2007 కాలంలో 20 శాతం పెరిగాయి. 2002-03, 2005-06 మధ్యకాలంలో వస్తువుల సరాసరి ఎగుమతుల రేటు 24 శాతం. 2006-07లో మొదటి 9 నెలల ఎగుమతి రేటు 36.8 శౌతం. 2005-06 నాటికి భారతదేశ ఎగుమతులు 100 బిలియన్ డాలర్ల మార్కుని దాటింది. 5 సం॥లలోపు రెట్టింపు విలువ గల వస్తువుల ఎగుమతి జరిగింది. స్వాతంత్ర్యం సాధించిన తొలి దశలో వస్తువుల ఎగుమతులు రెట్టింపు కావడానికి 23 సం॥ల కాలం (1949-72) పట్టింది. 2005 నుండి భారతదేశ ఎగుమతులు చైనా కంటే వేగంగాను, ప్రపంచ ఎగుమతుల రేటుకి రెట్టింపుకి పైగాను పెరుగుతున్నాయి. ఫలితంగా 196 1లో ప్రపంచ ఎగుమతులలో 0.43 శాతానికి పడిపోయిన భారతదేశం వాటా నిలకడగా పెరుగుతూ 2000లో 0.67 శాతానికి 2005లో 1 శాతానికి పైగా పెరిగింది. 2009 నాటికి లక్ష్యంగా ఎంచుకొన్న వాటా 1.5 శాతం.
గత కొద్ది సంవత్సరాలలో భారతదేశ సరుకుల ఎగుమతుల కంటే సేవల ఎగుమతులు త్వరితంగా పెరిగాయి. సేవల ఎగుమతుల విలువ 1992లో 49 బిలియన్ డాలర్లు, 2008లో 25 బిలియన్ డాలర్లు. 2005-06లో 61.4 బిలియన్ డాలర్లు. గడచిన మూడు సంవత్సరాలలో సేవల,ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. సాఫ్ట్వేర్ సేవలు, వాణిజ్య సేవలు, సమాచార సేవలు లాంటి వివిధ రకములైనసేవలలో వృద్ధి త్వరితంగా జరిగింది. 2005లో ప్రపంచ సరుకుల ఎగుమతులలో భారతదేశం వాటొ 1 శాతం. భారతదేశం ర్యాంక్ 29. ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతులలో భారతదేశం వాటా 2.3 శాతం. ర్యాంక్ 11. సరుకుల ఎగుమతుల కంటే వేగంగా పెరగడం వలన 2005లో సేవల ఎగుమతులు సరుకుల ఎగుమతులలో 60 శాతానికి చేరుకొన్నది.
సేవల ఎగుమతులు 1995-96, 2003-04 మధ్యకాలంలో వార్షికంగా 36 శాతం కాంపౌండ్ వృద్ధి రేటున పెరిగాయి. ఈ కాలంలో మొత్తం సేవల ఎగుమతులలో సాఫ్ట్వేర్ వాటా 10 శాతం నుండి 48.9 శాతానికి పెరిగింది. ఎదుగుదల బాగొనే వున్నట్లు కన్పించినప్పటికి ఈ రంగంలో యింకా నిలకడయైన అభివృద్ధికి చాలొ అవకాశాలు వున్నాయి.
సాఫ్ట్‌వేర్‌తో పాటు వచ్చిన యిటీవలి పరిణామం వృత్తిపరమైన సేవలతో సహా ఎగుమతులలో విప్లవాత్మకమైన పెరుగుదల. 2004-05లో వృత్తి సేవల ఎగుమతులు 2.6 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్ల విలువకు చేరాయి. 2005-06లోని మొదటి 6 నెలల్లో 181 శాతం పెరిగి 15.4 బిలియన్ డాలర్లకు చేరి సాఫ్ట్వేర్ విలువను అధిగమించాయి. కాబట్టీ సేవల రంగంలో భారతదేశం ఎదగడానికి అపారమైన త్04 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అవకాశాలు వున్నాయి. జఫరీ సాబ్బ్స్ చెప్పినట్లు '20, 25 సంవత్సరాల క్రితం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం 1990లలో అత్యున్నతమైన సాంకేతిక సమాచార సేవల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుందని ఎవరు ఊహించారు. ఎవరూ ఊహించి వుండరు.”
విదేశాలకు వలస పోయిన భారతీయుల డబ్బు (1970ల నుండి) వచ్చి చేరుతూ వుంది. ఇది కరెంట్ అకౌంట్ లోట్లను నిర్వహింపదగిన పరిమితులలో వుంచింది. పెట్టుబడులు వచ్చి చేరడం విషయానికి వస్తే కరెంట్ అకౌంట్లోకి వచ్చి చేరే ఈ మొత్తాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (01) పోర్టుఫోలియో పెట్టుబడి ప్రాతిపదిక గల క్యాపిటల్ అకౌంట్లోకి వచ్చి చేరే మొత్తాల కంటే చాలా ఎక్కువ. 1990ల ఐ.టి. విప్లవం తరువాత విదేశాలకు వలస పోయిన వారి సంఖ్య పెరిగింది. వారు పంపించిన దబ్బూ పెరిగింది. 1980-90ల మధ్య వార్షికంగా సగటున వచ్చి చేరిన మొత్తాలు 2.5 బిలియన్ల దాలర్లు కాగా 1991-2000ల మధ్య వార్షిక సగటు 7.4 బిలియన్ల డాలర్లకు పెరిగింది. నూతన సహస్రాబ్దిలో 2001-04ల మధ్య వార్షిక సగటు 21.7 బిలియన్లకు చేరింది. (ప్రపంచంలోనే భారతదేశం అత్యంత పెద్ద మొత్తాలు తెచ్చుకొనే దేశం అయింది. ఆ తరువాత స్థానాలలో చైనా (21.3 బిలియన్ల డాలర్లు), మెక్సికో (18.1 బిలియన్ల డాలర్లు), ప్రాన్స్ (12.7 బిలియన్ల డాలర్లు), ఫిలిప్పీన్స్ (11.6 బిలియన్ల డాలర్లు) వున్నాయి. 2004లో మొత్తం (ప్రపంచ చెల్లింపులు 225.8 బిలియన్ల డాలర్లలో భారతదేశం వాటా దాదాపు 106 శాతం. భారతదేశంలోకి వచ్చి చేరిన మొత్తాలు 1990-91లో వున్న 0.7 శాతం నుండి 2003-04లో 3.2 శాతానికి పెరిగింది.
వలస స్వభావంలో కూడా మార్చు వచ్చింది. గతంలో తక్కువ నిపుణత గల భారతదేశ కార్మికులు గల్ఫ్ దేశాలకు, మధ్య ప్రాచ్యానికి వలసపోయారు. కాని ఆ తరువాత కాలంలో ఎక్కువ సంపాదించగల, సాంకేతికంగా అర్హతలు గల కార్మికులు వృత్తిదారులు (ప్రత్యేకించి ఐ.టి. రంగంలో) పశ్చిమ దేశాలకు అమెరికా, కెనడా, యూరప్ దేశాలకు వలస పోయారు. ఫలితంగా చెల్లింపులు కూడా మధ్య ప్రాచ్య దేశాల నుందే గాక పశ్చిమ దేశాల నుండి వచ్చాయి. భారతదేశానికి విదేశాల నుండి వచ్చే మొత్తాలలో సగం ఒక్క అమెరికా నుండే వస్తున్నది. విదేశీ నిధులు రాబట్టడానికి చాలా ప్రోత్సాహకాలు ('ప్రకటించబడ్డాయి. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ క్యాపిటల్ మార్కెట్లు కూదా దృఢంగా, ఆకర్షణీయంగా వున్నాయి.
నూతన సహస్రాబ్దిలో భారతదేశంలోని క్యాపిటల్ అకౌంట్లోకి వచ్చి చేరే నిధులు ఆరోగ్యకరంగా వృద్ధి చెందుతున్నాయి. క్యాపిటల్ అకౌంట్ మిగుళ్ళు కరెంట్ స్వతంత్రం తర్వాత భారతదేశం 8506
అకౌంట్ లోట్లను పూద్చటమే గాక విదేశీ మారక నిల్వలు పోగు పడటానికి దారితీస్తున్నాయి. రూపాయి విలువ అంతగా తగ్గకుండా చూసేందుకు భారతదేశ పోటీపై ప్రతికూల ప్రభావం చూవకుండా నివారించేందుకు నమర్వవంతవెన యాజమాన్య వద్భతులు అవసరమవుకున్నాయి. 2000-01లో 42.3 బిలియన్లుగా వున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2007 ఫిబ్రవరి నాటికి 185. 1 బిలియన్ల డాలర్లకు అంటే కేవలం 6 సం॥లలో 4.5 రెట్లకు పైగా పెరిగాయి. ఇది గతంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1980-81లో 5.8 బిలియన్ల డాలర్లు, 1990-91లో 2.24 బిలియన్ల డాలర్లతో నన్న పరిస్థితితో పోల్చితే చాలా అద్భుతమైన మార్చు.
ఇక పెట్టుబడుల రాక విషయానికి వస్తే 1995-99 కాలంలో వార్షిక సగటు 2.5 బిలియన్ల డాలర్గుఆ 1995-99 కాలంలో వార్షిక సగటు 2.5 బిలియన్ల డాలర్లుగా వున్న నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరువాత ఆరు సంవత్సరాలకు అంటే 2000-01 నుండి 2005-06 వరకు వార్సిక సగటు 3.7 బిలియన్ల డాలర్లకు పెరిగింది. 2006 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చి చేరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 42 బిలియన్ డాలర్లు. గడచిన సంవత్సరంలో యిదే కాల వ్యవధిలో వచ్చిన పెట్టుబడికి రెట్టింపు. కాని వైనాకి తరలి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉదాహరణకు 2002లో 49.0 బిలియన్ల డాలర్లతో పోల్చి చూస్తే చాలా తక్కువైనప్పటికీ భారతదేశ గత రికార్డుతో పోల్చితే ఎఫ్.డి.ఐ. వృద్ధి గణనీయమైనది.
ఎఫ్.డి.ఐ. దేశంలోకి వచ్చి చేరడమే గాక దేశం నుండి పెద్ద మొత్తాలలో తరలి వెళ్ళడం యిటీవలి పరిణామం. 2005-06లో 3.2 బిలియన్ల దాలర్లు దేశం నుండి తరలిపోయింది. ఒకవైపు భారతదేశ కంపెనీలు విదేశాలలో పెట్టుడులు మెర్టర్లు ఎక్కిజిషన్లు జరుపుతున్నాయి. టాటా గ్రూపు ఆంగ్లో-డచ్ యాజమాన్యంలోని పెద్ద ఉక్కు సంస్థని 12.2 బిలియన్ల డాలర్లకు స్వాధీనం చేసుకొన్నది. హిండాల్కో అల్యూమినియం సంస్థ కెనడా నోవిలిస్ సంస్థని 5.5 బిలియన్ డాలర్లకు కొన్నది. ఒక అంచనా ప్రకారం భారత కంపెనీలు 2007లో విదేశాలలో 35 బిలియన్ల డలర్ల అక్విజిషన్లు మెర్దర్లు జరిపాయి. 2005 డిసెంబర్ రిపోర్టు ననుసరించి భాతరదేశంలోని అతి పెద్ద కంపెనీలలోని 20 కంపెనీలు వాటి రాబడిలో 20 శాతం పైగా విదేశీ అమ్మకాల ద్వారా పొందాయి.
భారతదేశ క్యాపిటల్ మార్కెట్లోనికి విదేశీ ఆర్సిక సంస్థల ద్వారా వచ్చ పోర్టుఫోలియో పెట్టుబడులు భారతదేశ కంపెనీలచే అమెరికన్ డిపాజిటరీ రిసీస్ట్స్ (40) గ్లోబల్ డిపాజిటరీ రిసీస్ట్స్ ద్వారా సమీకరించబడిన వనరులు వుంటాయి. భారత ప్రభుత్వం 1992 నుండి మాత్రమే విదేశీ సంస్థల ద్వారా భారతదేశ ప్రైమరీ 506 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సెకండరీ సెక్యూరిటీ మార్కెట్లోకి విదేశీయుల్ని కొన్ని షరతులతో పెట్టుబడులు పెట్టడాన్ని అనుమతించింది. అప్పటి నుండి విదేశీ ద్రవ్య సంస్థల ద్వారా పోర్టుఫోలియో పెట్టుబడులు పెరిగాయి. 1993 నుండి 2002 వరకు గల పది సంవత్సరాలలో వార్షికంగా సగటున 2.3 బిలియన్ల డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి. 2000 నుండి భారతదేశంలోకి వచ్చిన పోర్టుఫోలియో పెట్టుబడులు చాలా రెట్లు పెరిగాయి. 2005-06లో రికార్డు స్థాయిలో 12౨.5 విలియన్ డాలర్లు వచ్చాయి. పోర్టుఫోలియో పెట్టబడులలో భాగంగా అంతకుముందు సంవత్సరం 0. 62 బిలియన్లుగా వున్న ఎడిఆర్, జిడిఆర్‌లు 2005-06లో 2.5 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. భారతదేశ క్యాపిటల్ మార్కెట్ అంచనాలను మించి పరిణతి చెందింది. భారతదేశ స్టాకు మార్కెట్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1980లో జిడిపిలో 5 శాతం వుండగా 1990లో 18 శాతానికి, 1993లో 60 శాతానికి 2007 జనవరిలో 91.5కి పెరిగింది. ఇది ఆవిర్భవిస్తున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో పోల్చదగిందిగానే గాక యించుమించు జపాన్ (96 శాతం) దక్షిణ కొరియా (94.1 శాతంంల స్థాయికి చేరింది. పెద్ద మొత్తాలుగా వచ్చి పడే పోర్టుఫోలియో పెట్టుబడులు దేశీయ ఆర్థిక వ్యవస్థని ఎగుడు దిగుళ్ళకు గురిచేస్తాయి. అందువలన ఈ అస్థిరత నుండి దేశీయ ఆర్థిక వ్యవస్థని రక్షించుకొనడం సమస్య అయింది. సంస్కరణల తరువాత అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు భారత ఆర్ధిక వ్యవస్థని పోర్టుఫోలియో పెట్టుబడులు అస్థిరపరచకుండా పూర్తిగా మూలధన ఆస్తుల్ని మార్పిడి చేసుకొనే విధానానికి (౪11 040121 20000614 60౧౪7ఆ2011100 అనుమతి యిచ్చి (ఒక కంపెనీ స్వదేశంలో వున్న ఆస్తులు, అప్పులు ఖాతాని మార్కెట్ నిర్ణయించిన మారకం రేటు ప్రకారం విదేశీ ఆర్థిక ఆస్తి లేక అప్పుగా బదలాయించుకొనే స్వేచ్చకి అనుమతి యిచ్చి) క్రమబద్ధంగా జాగ్రత్తగా వ్యవహరించాయి. బయటి ప్రపంచంతో భారతదేశ సంబంధాలలో సానుకూలమైన పరిణామం విదేశీ రుణాలు పరిమితులు దాటకుండా జాగ్రత్త పడటం. నాలుగు 6601 505210201116/ 41026013 రుణం - జిడిపి నిష్పత్తి, రుణ - 'సేవల నిష్పత్తి, మొత్తం అప్పులో స్వల్పకాలిక రుణాల నిష్పత్తి, మొత్తం అప్పులో రాయితీలపై పొందిన రుణం నిష్పత్తిల విషయంలో భారతదేశ నిర్వహణ గౌరవప్రదంగా వుంది. భారతదేశ విదేశీ రుణం జిడిపి యొక్క నిష్పత్తి 1990-91లో 28.7 శాతం వుండగా 2000-01లో 22.5 శాతానికి 2005-06లో 15.8 శాతానికి పడిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, అప్పుల్ని తీర్చగల దేశం సమర్థతకు రుణ సేవల నిష్పత్తి కూడా 2000-01లో 17.1 శాతానికి 2004-05లో 6.1 శాతానికి పడిపోయింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 507
అత్యధికంగా అప్పులున్న మొదటి పది దేశాలలో 1991లో 3వ స్థానంలో వున్న భారతదేశం 2004లో 8వ స్థానానికి వచ్చింది. ముఖ్యమైన అంశమేమిటంటే ఈ దేశాలలో చైనా మాత్రమే 2004లో భారతదేశం కంటే తక్కువ రుణ - జిడిపి నిష్పత్తి, రుణ సేవల నిష్పత్తి - వరుసగా 12.9 శాతం, 3.5 శాతం కలిగి వుంది. భారతదేశ రుణ - జిడిపి నిష్పత్తి రుణ సేవల నిష్పత్తి వరుసగా 17.9 శాతం, 6.1 శాతం పది దేశాల జాబితాలోని రుణ జిడిపి, రుణ సేవలని రుణ జిడిపి, రుణ సేవల నిష్పత్తులు టైజిల్ (38 శాతం, 46 శాతం) టర్కీ (53.6, 356.9), ఇండోనేషియా (56.5, 22.1, హంగరీ (66.8, 25. 2)లతో పోల్చి చూస్తే భారతదేశ గణాంకాలు చాలా సానుకూలంగా వున్నాయి. స్వల్పకాలిక రుణం, మొత్తం అప్పుకు గల నిష్పత్తి భారతదేశానిది 6.1 శాతం మాత్రమే. చైనాది 47.2 శాతం, అలాగే భారతదేశం యొక్క రాయితీలతో కూడిన అప్పు మొత్తం అప్పులో 35 శాతం. చైనాది 15.5 శాతం మాత్రమే. విదేశీ అప్పులు : 2004 వు దేశం మొత్తం జిఎన్ఐకి. రుణ మొత్తం మొత్తం నెం, విదేశీ అప్పు రుణం సేవలు అప్పులో అప్పులో (యు.ఎస్, డాలర్లు స్వల్పకాలిక రాయితీలతో (బిలియన్లలో) రుణం... కూడిన రుణం
- వైనా 248.9 129 &ర్ 47.2 15.5
- బ్రెజిల్ 222.0 380 46.8 11త్త 15 శ రష్యన్ ఫెడరేషన్ 197.8 347 98 17.6 0.0 4 అర్జెంటీనా 1692 1174 285 162 08 ఠం టర్కీ 161.6 58.6 85.9 19.7 లర
- ఇండోనేషియా 140.6 565 221 17.4 277 7, మెక్సికో 189.7 20.8 229 6.6 10 & భారతదేశం 122.7 179 61 61 35.0 9, పోలెండ్ 99.2 త17 346 17.0 8డీ
- హంగరీ 69.2 668 25.2 19.5 0,8 508 బెపన్చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇది పరాధీన నయా వలసవాద అభివృద్ధా?
ఆర్ధిక సంస్కరణల లేక సరళీకరణ (ప్రపంచీకరణ క్రమం యొక్క విమర్శకులు భారతదేశం స్వావలంబన సామాజిక న్యాయంతో కూడిన నెహ్రూ అభివృద్ధి పంథాన్ని వదలి నయా వలసవాద పరాధీిన అభివృద్ధి దిశగా పోతున్నదని, ఈ అభివృద్ధి పంథాలో భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి వుందని భావించారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థని బార్లా తెరచి, వాషింగ్టన్ నిర్దేశిత నయా ఉదారవాద విధానాల్ని కొనసాగించడం వలన దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ విదేశీ బహుళజాతి సంస్థల పెట్టుబడులతో ముంచెత్తబదడతాయని, ఆ పరిస్థితి భారత పారిశ్రామిక విధ్వంసొనికి కాకపోయినా, పారిశ్రామిక స్తంభనకు దారితీస్తుందని వాదించారు. భారత పారిశ్రామిక ఉత్పత్తుల విలువ పెంచడంలోను, అమ్మకాలలోను విదేశీ సంస్థల వాటా 1990లో 9.5 శాతం 11.26 శాతం వుండగా అవి 2001 నాటికి కేవలం 12.68 శాతం 13.77 శాతానికి పెరిగినట్లు పెద్ద (ఫైవేట్ కంపెనీలపై చేసిన అధ్యయనం తెలియజేసింది. అధ్యయనం తన విశ్లేషణ నుండి పబ్లిక్ సెక్టార్ ఉత్పాదక కంపెనీలను విదేశీ పెట్టుబడులు లేని (పైవేట్ 'సెక్టారులోని చిన్న కంపెనీలను మినహాయించింది. ఆ విధంగా మొత్తంగా ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే భారత పారిశ్రామిక ఉత్పత్తిలో విదేశీ వాటా ఇంకా చాలా తక్కువ. భారత పరిశ్రమ చాలా ఎక్కువగా పోటీ వుందే ఆటోమొబైల్ ఫార్మాస్యూటికల్ రంగాలలో అంతర్జాతీయ మార్కెట్లో జయప్రదంగా పోటీపడగలుగుతున్నది.
ఈ ఆందోళనలలో వాస్తవం లేదు. ఇంతకు ముందు చర్చించిన విధంగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థ విదేశీ రుణంపై సహాయంపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూనే మంచి వృద్ధి రేటు సాధించింది. భారత పారిశ్రామిక వృద్ధి కూడా పుంజుకొన్నది. అది దిగుమతులు చేసుకొన్న వినిమయదారీ వస్తువులపై ఆధారపడిన నయావలసవాద పారిశ్రామికాభివృద్ధి కాదు. క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమలతో కూడిన వైవిధ్యభరితమైన పారిశ్రామికాభివృద్ధి. భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ కంపెనీలు దేశీయ పరిశ్రమల్ని దేశీయ మార్కెట్‌ని విదేశీ దిగుమతులతో ముంచెత్తలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎక్కువగా వచ్చినప్పటికి విదేశీ ప్రయోజనాలు భారత ఆర్థిక విధానంపై ఆధిపత్యం మాట అలా వుంచి గణనీయమైన అదుపు కూడా సాధించలేదు. స్వతంత్రం తర్వాత భారతదేశం 509
నూతన సహస్రాబ్దిలో సవాళ్ళు
భారతదేశం నిరంతరంగా ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సవాలు పేదరికం. పేదరిక నిర్మూలనా క్రమాన్ని సంస్కరణలు వేగవంతం చేశాయా లేక తగ్గించాయా? అనే అంశంపై అర్ధిక శాస్త్రవేత్తల మధ్య చర్చ జరుగుతుంది. 1983-93 మధ్యకాలం దారిద్ర్య రేఖకు దిగువన నివసించే ప్రజల శాతం 44.5 నుండి 36కి తగ్గిందని: పేదరికం గణనీయంగా తగ్గిందని ఒక అంగీకారం వుంది. కాని ఆ తరువాత అంటే 1990లలో ఏం జరిగింది? - అనే అంశంపై వివాదం వుంది. నేషనల్ శాంపుల్ సర్వే సేకరించిన సమాచారం మేరకు 1999-2000లో పేదరికం 26 శాతానికి పడిపోయింది. సర్వే జరిపిన పద్ధతి గతంతో పోల్చదగినదిగా లేదు. ఫలితంగా ఈ సమస్యపై గందరగోకాన్ని మరికొంత పెంచింది. 61వ దఫా ఎన్.ఎస్.ఎస్. 2004-05 సేకరించిన సమౌభారం 1998, 1999ల సమాచారంతో పోల్చదగిందిగా వుంది. 1993తో పోల్చదగిన సమాచారం మేరకు 1993, 2004-05 మధ్యకాలంలో పేదరికం 36 నుండి 27.8 శాతానికి తగ్గింది. 1999-2000తో పోల్చదగిన పద్ధతి ప్రకారం 1999-2006 2004-05 మధ్యకాలంలో పేదరికం 26.1 నుండి 22 శాతానికి తగ్గింది.
1993, 2004-05 కాలంలో పేదరికం 86 నుండి 27.8 శాతానికి తగ్గిందనేది ఎలాంటి నినాదం లేని అంశం. నూతన సహస్రాబ్టిలో 1999-2000, 2004-2005 మధ్య పేదరికం తగ్గడంపై ఏకాభిప్రాయం వుండటంతో 1990లలో ఏం జరిగింది? అనే అంశంపై చర్చ కేంద్రీకరింపబడింది. పోలిక సమస్యని అధిగమించడానికి చాలా పద్ధతుల్ని ఉపయోగిస్తూ, ఆంగస్ డీటన్ 1993-94, 1999-2000 మధ్యకాలంలో వార్షికంగా 1.3 శాతం పాయింట్లు పట్టణ పేదరికం 0.9 శాతం తగ్గదంతో 1990లలో ఎదరికంలో గణనీయమైన తగ్గుదల నమోదయిందని వాదించాడు. సుందరం, టెండూ ల్క్ ఈ అంచనాని అమోదిస్తూ అంతకుముందు గడిచిన 10 1/2 సం॥ల కాలవ్యవధి కంటే 1990 దశాబ్దంలోని చివరి 6 సం॥ల కాలంలో పేదరికంలో పాయింట్ టు పాయింట్ సగటు వార్షిక తగ్గుదల ఎక్కువగా నమోదయిందని వాదించారు. హిమాంశు, మహేంద్రదేవ్, సి. రవి లాంటి యితరులు ఈ వాదనతో విభేదించారు. వారు 1987-2005 కాలంలో వార్షిక పేదరికం తగ్గుదల 0.6 శాతంతోను 1998-2005 కాలంలోని 0.7 శాతంతోను పోల్చితే 1973, 988 మధ్యకాలంలో ఎక్కువ వేగంగొ వార్షికంగా 1.1 శాతం రేటు తగ్గిందన్నారు. కాని 1993, 2005 మధ్య పేదరికం తగ్గుదలకు, 1999-2000, 2004-05 మధ్యకాలంలో పేదరికం తగ్గుదల కారణమన్నారు. అంటే 1990లో పేదరికం తగ్గిన చివరి దశాబ్దం అన్నారు. ర్క0 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1990లలో పేదరికం తగ్గుదల రేటు కొంత వివాదాస్పదమైనప్పటికి నూతన సహస్రాబ్టిలో పేదరికం తగ్గిందని అందరూ అంగీకరించారు. ఒక అంచనా ప్రకారం వార్షిక (గ్రామీణ పేదరికం తగ్గుదల 1.8 శాతం, పట్టణ పేదరికం తగ్గుదల 0.8 శాతం. 1999-2005 కాలంలో మరొక అంచనా ప్రకారం గ్రామీణ పేదరికం తగ్గుదల 1.18 శాతం పట్టణ పేదరికం తగ్గుదల 0.78 శాతం. వ్యవసాయం తగ్గుముఖం పట్టిన ఈ కాలంలో గ్రామీణ పేదరికం తగ్గడం ఆసక్తికరం. ఇందుకు కారణం పెరిగిన వ్యవసాయేతర ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణంపై అదుపు. మరొక సానుకూలమైన అంశం. నిరుపేదలు మొత్తం - మొత్తం పేదల నిష్పత్తిలో 1988లో 55.2 శాతం వుండగా 1993-94లో 43.2 శాతానికి 2004-05లో 36.5 శాతానికి తగ్గింది.
భారత - ఆర్థిక వ్యవస్థ ఎక్కువ వృద్ధి రేటు పంథాలో ముందుకు సాగుతున్న 1980ల నుండి మొత్తం జనాభాలో పేదల నిష్పత్తి తగ్గినప్పటికి 2004-05లో పేద ప్రజల సంఖ్య స్వతంత్రం సాధించినప్పటికి భారతదేశ జనాభాకి (1951లో 361 మిలియన్లు) యించుమించు సమానం. ఆర్థిక వృద్ధి వేగంగా పెరగలేదు. అంతేగాక పెరుగుతున్న అసమానత అభివృద్ధి ఫలితాలు పేదలకు అందడానికి అవరోధంగా వుంది. 1993-2005 కాలంలో సాధించిన వృద్ధి రేటు పేదరికాన్ని తగ్గించడానికి తోద్సడినప్పటికి అసమానతలో పెరుగుదల ఈ (క్రమాన్ని పరిమితం చేసింది. అసమానత పెరగకుండా వుండి వుంటే పేదరిక స్థాయి గ్రామీణ ప్రాంతాలలో మరి 2.8 శాతం పట్టణ ప్రాంతాలలో 4.3 శాతం పడిపోయి వుందేది.
భారతదేశ వైఫల్యం సామాజిక న్యాయం రంగంలో వుంది. దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా వుంది. 6-14 వయో పరిమితిలో వున్న బిడ్డలలో దాదాపు మూడవ వంతు మంది బడికి వెళ్ళడం లేదు. బడికిపోయే వారిలో కూడా చాలామంది మధ్యలో మానుకుంటున్నారు (ప్రభుత్వాలు పెద్ద మొత్తాలు హెచ్చించి ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ సాధించిందని చెప్పుకున్న సర్వ శిక్ష లేక సార్వత్రిక విద్య వివాదాస్పదమయింది.. అంటే పేదలు సామాజికంగా ఎదగడానికి ముఖ్యమైన వనరుగా వున్న విద్య పేదలలో ఎక్కువ శాతానికి అందుబాటులో లేదు. భారతదేశం గడిచిన రెండు దశాబ్దాలలో అద్భుతమైన ఆర్థికాభివృద్ధి సాధించినప్పటికి ఆ అభివృద్ధి సమాజంలోని అత్యంత దుర్భలమైన సెక్టన్లు జీవనస్థాయి మెరుగుదలలో ప్రత్యేకించి పేద ప్రజల బిడ్డల ఆరోగ్య సంరక్షణ, విద్యలలో ప్రతిఫలించలేదు. 2006లో 8 సం॥ల వయస్సులోపు వున్న బిడ్డలలో 46 శాతం మంది ఆ వయసుకి తగిన బరువు కంటే తక్కువగా వున్నారు. అంతేకాదు. ప్రపంచ మానవాభివృద్ధి సూచిక (101లో 2000లో 124వ స్థానంలో వున్న భారతదేశం 2004 నాటికి 126వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక భారతదేశం కంటే పైన 89వ స్వతంత్రం తర్వాత భారతదేశం ర్12
స్థానంలో వుంది. పరిశ్రమల సేవలలో త్వరితమైన పెరుగుదల సాధించినప్పటికి నూతన సహస్రాబ్దిలో వ్యవసాయంలో వృద్ధి మందకొడిగా వుంది. భారతదేశంలో పనిచేసే వారిలో 55 శాతం మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నప్పటికి 2006-07లో జిడిపిలో వ్యవసాయం వాటా 18.5 శాతానికి పడిపోయింది. 1994, 2005 మధ్య కాలంలో వ్యవసాయంలో ఉపాధి పెరుగుదల దాదాపు ఏమీ లేదు. ఇది గ్రామీణ (ప్రాంతాలలో తీవ్రమైన నిరాశా నిస్ఫృహలకు దారితీసింది.
జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి వృద్ధి అనేది సామాజిక న్యాయానికి షరకుగా భావించబడింది. కాని కేవలం వృద్ధి సామాజిక న్యాయాన్ని తీసుకురాలేదు. ఈ వాస్తవం అత్యున్నత స్థాయిలో గుర్తించబడింది. అందుకే ప్రధాని మన్మోహన్సింగ్ వృద్ది అనేది ఎక్కువ మందికి వర్తించేదిగా వుండాలని, వ్యవసాయ దుర్గతిని పరిష్కరించేదిగా వుండాలని పలుమార్లు చెప్పారు. ఏమైనప్పటికి సామాజిక న్యాయం కొరకు వృద్ధిపై నెహ్రా - మహలనాబిస్ వ్యూహం సంస్కరణల తరువాతి కాలానికి కూదా వర్తిస్తుంది. అభివృద్ధికర చట్టాల ఫలితాలు దిగువ నుండి ప్రజల్ని సమీకరించినప్పుడే పేదలకు దక్కుతాయి. భారతదేశం గడచిన 20 సం॥లలో స్వతంత్రం సాధించిన తరువాత తొలి 20 సం॥ల కంటే ఎక్కువ వృద్ధి రేట్లను సాధించింది. కాని సాధారణ పేద ప్రజల జీవితాలలో మార్చు విషయానికి వస్తే బహుశా తొలికాలం వ్యవధే బాగుందని చెప్పక తప్పదు. నూతన సహస్రాబ్దిలో అభివృద్ధి ఫలితాలు సాధారణ ప్రజలకు చేరవలసిన అవసరాన్ని గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. భారతదేశంలో (ప్రజాస్వామ్యం, గణనీయమైన బలం గల వామపక్షాలు - పేదరికం సామాజిక న్యాయం సమస్యని ప్రబలంగా ముందుకు తెస్తున్నాయి. దీనిని ఏ ప్రభుత్వమూ విస్మరించజాలదు. అయినప్పటికి చేయవలసింది చాలా వుంది.
పౌర సమాజం నుండి ఆవిర్భవిస్తున్న దిగువ స్థాయి ఉద్యమాలు కూడొ గణనీయంగా కృషి చేస్తున్నాయి. అరుణ్‌రాయ్ నాయకత్వంలో రాజస్తాన్‌లోని ఉద్యమాలు, దేశంలోని ఇతర (ప్రాంతాల ఉద్యమాలు సమాచార హక్కుకొరకు పేదల్ని సమీకరించాయి. ఈ హక్కు పేదలకు కేటాయించబడిన నిధులు దుర్వినియోగపరచకుండా చూసేందుకు వినియోగించబడింది. అలాగే ఉపాధి హక్కు ఉద్యమాలు గ్రామీణ నిరుద్యోగులకు ఉపాది హామీ పథకాలకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో యం.వి. ఫొండేషన్ సంస్థ ద్వారా శాంతా సిన్హా నడిపిన ఉద్యమాలు - బాలల హక్కుల కొరకు - ప్రత్యేకించి బిడ్డల విద్యా హక్కు కొరకు నడిపిన ఉద్యమాలు గ్రామీణ ప్రజల్ని సమీకరించి మూడు లక్షల మంది బాల కార్మికుల్ని బడికి రప్పించాయి. 512 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఈ ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఆహారం హక్కు ఉద్యమం కూడా బలం పుంజుకొంటుంది. వైవిధ్యభరితమైన ఈ ఉద్యమాల్ని ప్రధాన రాజకీయ పాద్దీలు, వాటి శ్రేణులు జాతీయ అజెండాలోకి తెచ్చి పోరాటాలు చేపట్టినప్పుడు భారతదేశంలోని కోట్లాది కష్టజీవుల కలలు సాకారమవుతాయి.
మన్నోహన్సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సమాచార హక్కు (1) చట్టం, జాతీయ (గ్రామీణ ఉపాధి వామీ చట్టం (గహ౮8ు) చేసింది.
జాతీయ (గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సెప్టెంబర్‌లో ప్రకటించబడింది. 2006 ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. తొలి దశలో 200 వెనుకబడిన జిల్లాలు గుర్తించబడ్డాయి. దేశవ్యాప్తంగా గల మిగిలిన జిల్లాలన్నింటికి ఈ చట్టం 5 సం॥ల లోపు వర్తింపచేయబడుతుందని ప్రకటించబడింది. కాని 2007 సెష్టెంబర్లోనే (ప్రభుత్వం ఈ పథకం దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరింపచేస్తున్నట్లు ప్రకటించింది. చట్టం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం (గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులకు తగ్దకుండా ఉపాధి కల్పించవలసి వుంటుంది. కులపరంగాను, ఇతర విధాలుగాను పేదల్ని విభజించకుండా చాలా అవసరమైనవారు ప్రయోజనాలు పొందే విధంగా చట్టం ప్రయత్నించింది. ప్రజలు చైతన్యవంతులై సమీకృతులైనచో ట చట్టం సక్రమంగా అమలు జరుపబడింది.
బిడ్డల హక్కుల రక్షణ కొరకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి 2007లో శాంతాసిన్దాని దానికి ఛైర్‌పర్సన్‌గా నియమించడంతో బాలల హక్కుల సమస్యని ప్రభుత్వం చిత్తశుద్ధితోనూ చేపడుతుందని ఆశలు కలిగించింది. ఎం.వి.ఎఫ్. ప్రయోగం దేశవ్యాప్తంగా అమలు జరపడం జరుగుతుందని ఆశించడం జరిగింది. కాని ఆచరణలో జరిగింది దాదాపు శూన్యం. ఉదాహరణకు 2007లో ఆర్థిక ఇబ్బందుల సాకుతో విద్యా హక్కు బిల్లు ఆమోదం పొందలేదు.
ఉత్పాదనకు విజ్ఞానం కీలకమైన తరుణంలో, ప్రపంచం విజ్ఞాన సమాజం దిశగా ముందుకు పోతున్న సమయంలో ఆచరణ ఆకాంక్షించిన విధంగా లేదు. పెద ప్రజల మంచి జీవితానికి అవకాశాలు కల్పించేందుకు, పరిశోధన అభివృద్ధిలో ప్రపంచ పోటీని తట్టుకొని నిలబడటానికి అవసరమైన అపారమైన విద్యాపరమైన మానవ వనరుల్ని తయారు చేసుకొని వృద్ధి రేట్లు సాధించి వాటిని నిలబెట్టుకొనేందుకు ప్రాథమిక విద్యని పై స్థాయి విద్యని త్వరితంగా అభివృద్ధి పరచాలని అన్ని రకాలకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఐ.టి. రంగం కూడా నిపుణుల కొరతని ఎదుర్కొంటున్నది. ప్రాథమిక
స్వతంత్రం తర్వాత భారతదేశం 518
విద్యలో పై స్థాయి విద్యలు వైనా సాధించిన త్వరితాభివృద్ధి చైనా శాస్త్రవేత్తలు పలు రంగాలలో పరిశోధనా పత్రాలు రూపొందించడంలోను పేటెంట్లు దాఖలు చేయడంలోను ప్రతిఫలించింది. దీనితో (ప్రేరణ పొంది ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నాలెడ్డి కమిషన్ నియమించాడు. కాని అది తన కార్యకలాపాలతో అంతగా ముందుకు సొ గలేకపోయింది. ఇటీవల (2006-2007) యుపిఎ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అర్జున్‌సింగ్ ఉన్నత విద్యా సంస్థలలో 27 శాతం సీట్లకు వెనుకబడిన కులాలకు రిజర్వు చేయడానికీ చేసిన ప్రయత్నం బడి మొగమెరుగని లక్షలాది పేద ప్రజల బిడ్డల అవసరాల్ని తీర్చడానికి గొక్క్ తగిన సంఖ్యలో నిపుణులైన పనివారిని తయారు చేయడానికి గాక లేక వివిధ రంగొలలో పరిశోధనలో పోటీని పెంచడానికి గాక వెనుకబడిన కుల రాజకీయాల్ని లక్ష్యంగా పెట్టుకొన్నది. ముఖ్యులైన సభ్యులు నిరసనగా రాజీనామా చేయడం వలన నాలెడ్డి కమిషన్ దాని ప్రాధాన్యత కోల్పోయింది. విద్యారంగంలోని వివిధ స్థాయిలలో తక్షణ చర్యలు చేపట్టడంలోని లోపం పెద్ద ఆటంకంగా పరిణమించింది.
నూతన సహస్రాబ్దిలో దేశం ఎదుర్కొంటున్న సవాలు స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలాగా దేశ ఆర్థిక వృద్ధి రేటుని పెంచే ప్రయత్నం కాదు. ఈ వృద్ధిని నియంతణాకు తెచ్చే సమర్ధవంతమైన పాలన, ఈ వృద్ది అందరికీ వర్తించే విధంగాను నిలకడగా కొనసాగేదిగాను చేయగల సంస్థల్ని నిర్మాణాల్ని సృష్టించడం - అసలైన సవాలు ప్రభుక్వే యంత్రాంగం చేత సక్రమంగా పనిచేయించి. సాధిస్తున్న అభివృద్ధి కోట్లాది ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచే విధంగా రూపుదిద్దుకొనేలా హామీ కల్పించడం - పోరే సమాజ ఉద్యమాల రాజకీయ పార్టీల ఎదుటనున్న సవాలు. 'మనకు స్థిర సంకల్పం వుంటే మనలో అంతర్గతంగా వున్న శక్తి సామర్దాలలో సగమైనా వెచ్చించగలిగితే రానున్న 20 లేక 25 సంవత్సరాలలో భారతదేశ పేదరికం. గతకాలపు స్కృతిగా మిగులుతుంది
- భారతదేశ ఆర్థిక సంస్కరణలపై నూతన సహస్రాబ్ది ప్రారంభంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త వ్యాఖ్యానం. స్వల్పమైన రాజకీయ ప్రయోజనాల నాశించి మన శక్తియుక్తుల్ని సంకుచితమైన కులమత ఘర్షణల కొరకు వెచ్చించడానికి బదులుగా నిర్దేశించుకొన్న దేశ లక్ష్యాల్ని సాధించేందుకు ఒక మంచి చారిత్రక అవకాశం మన ముందున్నది. ర్14 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
29 భూసంస్కరణలు- 1 జి జీ వలసవాద ప్రభావం జి జాతీయ రైతు ఉద్యమాల వారసత్వం స్వతంత్రం వచ్చినప్పటి భారతదేశ వ్యవసాయం వలసవాద ప్రభావం
వలసవాదం భారతదేశ వ్యవసాయంపై వినాశకరమైన ప్రభావం చూపింది. దేశం మొత్తం ఉత్పత్తిలో వ్యవసాయోత్చత్తి అత్యధికంగా వున్న కాలంలో ఈ విధ్వంసం జరిగింది.
వలసవాదం ఎలాంటి కొత్త శక్తుల్ని తీసుకొని రాకుండా భారతదేశ సాంప్రదాయ వ్యవసాయ పునాదుల్ని కుదిపివేసింది. వ్యవసాయం వ్యాపారీకరణ చేయబడింది. కాని పారిశ్రామిక పెట్టుబడిదారీ ముందునాటి ఉత్పత్తి విధానం నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో మార్పు చెందుతున్న స్వతంత్ర సమాజాలలోలాగా గాక భారతదేశంలో వ్యాపారీకరణ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వైపు మార్చు చెందించలేదు.
వలస పాలనలో వున్న భారతదేశంలో వ్యవసాయ వ్యాపారీకరణ రైతుల నుండి మిగులును (శిస్తుల ద్వారా డబ్బు రూపంలో) వసూళ్ళు చేయడాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి మార్కెట్‌కు తీసుకొని వచ్చి భారతదేశం నుండి బ్రిటన్ తరలించడాన్ని సులభతరం చేసింది. ఆ విధంగా సంపద తరలింపుకి దోహదపడింది. స్వతంత్రం తర్వాత భారతదేశం ర5్కేక్
అదేవిధంగా భారతదేశంలో రైతుల వర్గీకరణ పెట్టుబడిదారీ వ్యవసాయదారుడు అభివృద్ధి చెందడానికి కాక వడ్డీలకిచ్చే భూస్వామ్య వర్గాన్ని పెంచింది. ఆ వ్ ధంగా భారతదేశంలో వ్యవసాయం మార్పుకి గురయినప్పటికి అది వలసవాద పద్ధతి దీర్ణకాలికంగా వ్యవసాయం బలహీనపదే విధంగా జరిగింది.
వలసవాద పాలనలో వున్న భారతదేశ వ్యవసాయంలో ఆవిర్భవించిన ప్రత్యేక లక్షణాలు రైతులపై భావింపరాని భారాన్ని మోపాయి.
మొదటిది : వలసరాజ్యం వ్యవసాయంపై చాల ఎక్కున పన్నులు విధించింది. వలస పాలన తొలికాలంలో భూమి శిస్తు రేట్లు ఎక్కువగా నిర్ణయించి రాట జమీందారీలతో శాశ్వత పరిష్కారాలకు (జమీందారీ పరిష్కారం లేక శాశ్వత పరిష్కారం) కుదుర్చుకొన్నది. జమీందారు ప్రభుత్వానికి వ్యవసాయదారునికి మధ్య దళారికీ అతడు నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాడు. అతడు రైతు నుండి శిస్తు వసూలు చేసుకొన్నాడు. కాని శిస్తు ముందుగా నిర్ణయించబడింది. కనుక కాలక్రమంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరిగినప్పటికి అదనంగా శిస్తులు వసూలు చేయడం వీలుపడదని ప్రభుత్వం గుర్తించింది. ఆదాయంలోని పెరుగుదలని దళారులు సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత వలస పాలకులు రైతులతో ప్రత్యేక సంబంధం గల భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనినే రైత్వారీ విధానం అంటారు. రైత్వారీ విధానం అమలులో వున్న ప్రాంతాలలో భూమి శిస్తు తరచుగా పెంచబడింది. బ్రిటిష్ పాలకులు చెప్పుకొన్నట్లుగొ గాక వారు గతంలో స్వదేశీ పాలకులు వసూలుచేసిన దానికంటే చాలా ఎక్కువ వసూలు చేశారు. పంటలు దెబ్బతిన్నప్పుడు లేక ధరలు తగ్గడం వలన రైతుకి చాలా తక్కువ ఆదాయం వచ్చినప్పుడు - 1930ల నాటి మహామాంద్యం (01621 60833109) లాంటి సందర్భాలలో కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతు ఉత్పత్తి చేసిన దానిలో దాదాపు 75 శాతం మార్పులు చేశారు. 20వ శతాబ్దం వచ్చేటప్పటికి వలసవాద రాజ్యం మొత్తం ఆదాయంలో సగానికి పైగా రైతుల నుండి భూమి శిస్తుల రూపంలో వసూలు చేసిందే.
రెండవది : వలస పాలనలో భారతదేశంలో పెద్ద ఎత్తున భూస్వామ్య విధానం పెరిగింది. వడ్డీ రేట్లు పెరిగాయి. రైతుల నుండి రాబట్టిన శిస్తు ఇతర బలవంతపు వసూళ్ళు చాలా ఎక్కువగా వుండేవి. రైతుల నుండి శిస్తుగా వసూలు చేసిన దానికి (ప్రభుత్వానికి చెల్లించిన దానికి మధ్య చాలా వ్యత్యాసం వుండేది. ఇది దళారీలకు దక్కేది. 516 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రైత్వారీ ప్రాంతాలలో ప్రభుత్వానికి, రైతుకి (ప్రత్యక్ష సంబంధం వున్నప్పటికి కాలక్రమంలో ఈ (ప్రాంతాలలో కూడా భూస్వామ్య విధానం, కౌలుదారీ పద్ధతి విస్తరించాయి. రైత్వారీ ప్రాంతాలలో మొత్తం భూమిలో 40 నుండి 50 శాతం భూస్వాముల అధీనంలోనే వుంది. స్వతంత్రానికి ముందు బ్రిటిషిండియాలో సాగులో వున్న భూమిలో 60 నుండి 70 శాతం (జమిందారీ ప్రాంతాలతో కలిపి) భూస్వాముల యాజమాన్యంలో వుంది.
వలసవాద పరిస్థితి కౌలుదారీ వ్యవసాయానికి అధిక వడ్డీ రేట్లకు అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించింది. సాంప్రదాయ హస్తకళలు చేతివృత్తుల పరిశ్రమలు క్షీణించడం ఆధునిక పరిశ్రమలు త్వరగా అభివృద్ధి చెందకపోవడం వ్యవసాయంపై ఒత్తిడి పెంచాయి. అంతేగాక రైతులలో పెరుగుతున్న వ్యత్యాసం ఫలితంగా కేంద్రీకరింపబడుతున్న భూయాజమాన్యం ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం భూమి కోసం వెంపర్లాడే భూమి లేని వారి సంఖ్యని పెంచింది. స్వతంత్రం వచ్చే నాటికి ఏమాత్రం భూమిలేని లేక ఎకరంలోపు భూమి గల గ్రామీణ కుటుంబాలు 60 శాతం పైగా వున్నాయి. మరొక అంచనా మేరకు 75 శాతం గ్రామీణ ప్రజానీకం భూమిలేని కౌలుదారీలు వ్యవసాయ కార్మికులు,
ఫలితంగా కౌలు రేట్లు చాలా ఎక్కువగా వున్నాయి. సాధారణంగా పంటలో 50 శాతానికి పైగా వున్నాయి. పంజాబులోను తమిళనాడులో తంజావూరు లాంటి ప్రాంతాలలోను పంటలో 80 నుండి 85 శాతం కౌలు చెల్లించాలి. 1930 దశాబ్దం చివరి పంటలో 50 శాతం కౌలుదారునికి దక్కాలని రైతు ఉద్యమం డిమాండ్ చేసింది. తంజావూరులో 1952 ఆర్టినెన్స్ పంటలో భూస్వామి వాటాని 60 శాతానికి తగ్గించింది. అంతేగాక భూస్వామి కేవలం భూమి శిస్తు మాత్రం చెల్లించేవాదు. ఉత్పత్తి వ్యయం మొత్తాన్ని కౌలుదారు భరించేవాడు. ఇంకా వ్యవసాయోత్పత్తుల ధరల కంటే చాలా వేగంగా
భూస్వాములు కౌలుతో పాటు రైతుల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేశారు. వెట్టిచాకిరి చేయించారు. ఉదాహరణకు యు.పి.లో వివిధ భాగాలలో అలాంటి అక్రమ వసూళ్ళు చేసిన 50 సందర్భాలను యు.పి. జమిందారీ విధానం రద్దు కమిటీ ఎత్తిచూపింది. వలస పాలనా కాలంలో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు అలాంటి అర్ధ భూస్వామ్య చట్టవిరుద్ధమైన వసూళ్ళకు వ్యతిరేకంగా పోరాడాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం 51?
ఇలాంటి పరిస్థితులలో భూస్వాములు వారి మొత్తం పొలాన్ని గాని లేక వారి కుటుంబం సాగు చేయడానికి వీలైనంత పొలాన్ని వుంచుకొని అదనంగా వున్న పొలాన్ని పోటీపడుతున్న భూమిలేని రైతులకు ఎక్కువ రేట్లకు కౌలుకిచ్చి కౌలుతో పాటు అక్రమ వసూళ్ళు చేయడం ఆర్ధికపరంగా ప్రయోజనకరమని భావించారు గాని కూలీలను నియమించుకొని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారీ వ్యవసాయానికి సిద్ధపడలేదు. పెట్టుబడిదారీ వ్యవసాయం ఆవిర్భవించకపోవదానికి కారణం కొందరు ఆరోపించిన విధంగా భారతదేశ రైతుల లేక భూస్వాముల సహజ సిద్ధమైన ఫ్యూడల్ మనస్తత్వం కాదు. కాబట్టి జమిందారీ రైత్వారీ ప్రాంతాలలోని పెద్ద భూస్వాములు వారి పొలాలను చిన్న ముక్కలుగా విభజించి సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న కౌలుదారులకు కౌలుకిచ్చారు.
భారతదేశంలో 60 శాతం వ్యవసాయ కుటుంబాలు ఒక్కొక్కరు 5 ఎకరాలలోపు 40 శాతం కుటుంబాలు 2.5 ఎకరాలలోపు కలిగి వున్నాయని స్వతంత్రం తరువాత కొద్ది కాలానికి జరిపిన అధ్యయనాలు అంచనా వేశాయి.
చిన్న కమతాల సమస్య ఆ కమతాలు విడగొట్టబడటం వలన తీవ్రతరం చేయబడింది. ఉదాహరణకు రత్నగిరిలో 1/160 వంతు ఎకరం వైశాల్యం గల భూఖందాలున్నాయని పంజాబ్‌లో మైళ్ళ పొడవుండి వెడల్పు మాత్రం కొద్ది గజాలు గల భూఖండాలున్నాయని రాయల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ 1928 తన నివేదికలో పేర్మొన్నది. కుటుంబం కమతం వారసుల మధ్య విభజింపబడటంతో యింకా చిన్న ముక్కలు చెక్కలయింది.
వలసరాజ్యం, గ్రామీణ సమాజంలో ప్రాబల్యం వహించిన సెక్షన్లు రైతుపై విపరీతమైన భారాలు మోపాయి. ఫలితంగా రైతు అప్పుల్లో కూరుకుపోయాడు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల అన్యాయమైన వడ్డీ రేట్లు కారణంగా రైతు రుణ భారం పెరిగింది. రైకులు తమ రుణ అవసరాలలో 98 శాతం (పైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి 8 శాతం ప్రభుత్వం నుండి మరొక 8 శాతం సహకార సంఘాల నుండి 1 శాతం వాణిజ్య బ్యాంకుల నుండి పొందుతున్నట్లు 1954లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాచే నియమింపబడి రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ స్పష్టం చేసింది. 1950-51 కొరకు రూరల్ క్రెడిట్ సర్వే నుండి సేకరించిన సమాచారం మేరకు ఎస్.జె. పాటిల్ రైతులు తమ అప్పులపై దాదాపు 6500 మిలియన్లు వడ్డీ చెల్లించారని అంచనా వేశారు. వలస పాలన అంతమయ్యే వరకు రైతులు వడ్డీలు శిస్తుల రూపంలో వార్షికంగా 14,200 మిలియన్ల రూపాయిలు చెల్లించారని అంచనా వేయబడింది. 518 బీపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అత్యధిక రైతులు దుర్భరమైన బతుకులీడుస్తున్న గ్రామీణ సమాజంలోని సై సెక్షన్లు పెట్టుబడిదారీ వ్యవసాయం కంటే కౌలు, వడ్డీ వ్యాపారం ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టే లాభసాటి వనరుగా పరిగణిస్తున్న కారణంగా వ్యవసాయానికి పెట్టుబడి పెరగలేదు. వ్యవసాయం అభివృద్ధి జరగలేదు.
వలస రాజ్యం వ్యవసాయం నుండి గుంజుకొన్న డబ్బులో కొంత భాగమైనా వ్యవసాయాభివృద్ధికి వెచ్చించలేదు. ఫలితంగా భారతదేశ వ్యవసాయం వెనుకబడిన స్థితిలో వుండిపోయింది. 1951 నాటికి కూడా ఉపయోగించిన నాగళ్ళలో 97 శాతం కొయ్యనాగళ్ళే కేవలం 3 శాతం మాత్రమే ఇనుప నాగళ్ళు అభివృద్ది పరచబడిన మెరుగైన విత్తనాలు రసాయనిక ఎరువుల వినియోగం బహు తక్కువ.
కాబట్టి చాలాకాలం నుండి స్తబ్ధతగా వున్న భారతదేశ వ్యవసాయంలో వలస పాలన చివరి దశాబ్దాలలో క్షీణతా లక్షణాలు కల్పించడం ఆశ్చర్యజనకం కాదు. 1986-50 మధ్యకాలంలో ముఖ్యమైన పంటల ఎకరా దిగుబడులు తగ్గాయి. అదేవిధంగా 1901 - 1941 మధ్యకాలంలో తలసరి వ్యవసాయ ఉత్పత్తి 14శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి 24 శాతం తగ్గాయి.
స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశం తీవ్రమైన ఆహార కొరతని ఎదుర్మొన్నది. చాలా ప్రాంతాలలోని దుర్భిక్ష పరిస్థితులున్నాయి. 1946-1953 మధ్యకాలంలో 10,000 మిలియన్ల రూపాయల విలువ గల 14 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ఇది ప్రణాళికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)లో ప్రణాళికా వ్యయంలో దాదాపు సగం ఆహార ధాన్యాల దిగుమతికే వెచ్చించవలసి వచ్చింది.
వ్యవసాయంలో వలన పాలనా కాలంలో ఆవిర్భవించిన లోపాలను తొలగించుకొని అభివృద్ధి పథంలో పెట్టడం 1947లో స్వతంత్ర భారతదేశం ఎదుట నున్న పెద్ద సవాలు. రైతుపై మోపబడిన పలు చట్టబద్ధమైన చట్టవిరుద్ధమైన భారాలను తొలగించడం, పెద్ద ఎత్తున అర్ధ భూస్వామ్య దళారీలను తొలగించడం, కౌలుదారీ హక్కుల్ని మెరుగుపరచటం, తక్కువ వడ్డీ రేటుకి రుణ సౌకర్యం కల్పించడం, వ్యవసాయం, వ్యవసాయానికి చెందిన మౌలిక వసతులకు పెట్టుబడులు పెంచటం, శాస్త్రీయ వ్యవసాయ పరిశోధనని ప్రోత్సహించడం లాంటి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. మరొక విధంగా చెప్పాలంటే భారతదేశ వ్యవసాయంలో సమ(గ్రమైన సంస్థాపరమైన స్వతంత్రం తర్వాత భారతదేశం 519
సాంకేతికపరమైన సంస్కరణ తీసుకొనివచ్చే ప్రయత్నం ప్రారంభమయింది. విదేశీ సహాయానికి అంతం పలకడానికి ఆహార స్వయం సమృద్ది సాధించాలి.
స్వతంత్రానంతరం చేపట్టవలసిన సంస్కరణలకు అవసరమైన ఆలోచనలు ఆచరణ భారత జాతీయోద్యమ కాలంలోనే రూపొందించబడ్డాయి. ఈ జాతీయోద్యమ వారసత్వాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకొందాం.
జాతీయోద్యమం, రైతు ఉద్యమాలు
19వ శతాబ్దం చివరి నుండి పారిశ్రామిక విధ్వంసం కారణంగా వ్యవసాయంపై రద్దీ పెరుగుతుందని, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించడంలో విఫలమయిందని, గ్రామీణ రంగంలో ఉపాధి కొరవడుతుందని తొలినాటి జాతీయవాదులు చెబుతూ వచ్చారు.
వలసవాదం కారణంగా భూమి కొరకు పెరిగిన పోటీకి ముక్కలు చెక్కలవుతున్న భూమికి పెరిగిన శిస్తు కౌలురేట్లకి మధ్య సంబంధం వున్నట్లు జాతీయవాదులు గుర్తించారు. వివిధ స్థాయిల రైతుల జీవితాలను క్రుంగదీసిన శిస్తు రేట్లను విమర్శించారు. 1885లో జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుండి తక్కువ భూమిశిస్తుని శాశ్వత ప్రాతిపదికన నిర్ణయించాలని, రైత్వారీ విధానం అమలులో వున్న ప్రాంతాలలో కూడా మాటిమాటికి భూమి శిస్తు పెంచరాదని ప్రతి సంవత్సరం డిమాండ్ చేస్తూ వచ్చింది.
తొలి తరం జాతీయవాదులు వ్యవసాయంలో (వ్రభుత్వ దోవిడీపై కేంద్రీకరించినప్పటికి, కొందరు భూస్వామ్య కౌలుదారీ సంబంధాన్ని అధిక వడ్డీ రేట్ల సమస్యని విమర్శించారు. మార్పు కావాలని వాదించారు. ఉదాహరణకు రైత్వారీ, శాశ్వత భూమి శిస్తు విధానాలు అమలులో వున్న ప్రాంతాలలో కఠినమైన చట్టాలతో నిర్వహించబడే చిన్న వ్యవసాయ క్షేశ్రాలు రైతుకు పూర్తి రక్షణ కల్పించాలని, తక్కువ వడ్డీ రేటుకి రుణ సౌకర్యం కల్పించాలని ,శాశ్వత ప్రాతిపదికన తక్కువ భూమి శిస్తు వుండాలని జి.వి. జోషి డిమాండ్ చేశారు.
జస్టిస్ రనదే మరాక అడుగు ముందుకేసి అర్ధ భూస్వామ్య వ్యవసాయం స్థానంలో పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టే వ్యవస్థాపరమైన మార్పు కావాలని ఆకాంక్షించారు. స్వతంత్రానంతరం అంటే అర్ధ శతాబ్దం తరువాత జరుగుతున్న పరిణామాలను అంచనాొ వేసి పెట్టుబడిదారీ విధానం యొక్క ఉమ్మడి నమూనాని ఆకాంక్షించారు. ఒకవైపు అప్పటి భూస్వాములు, సంపన్న రైతులు పెట్టుబడిదారీ వ్యనసాయదారులుగా మార్చు చెందుతారని, 520 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మరొకవైపు భూస్వామ్య అణచివేత నుండి స్వేచ్చ పొంది తక్కువ వడ్డీకి అంతగా భారం గాని రుణ సదుపాయం పొందగల చిన్న రైతులు అధిక సంఖ్యలో వుంటారని అంచనా వేశారు. సాగుచేసే వాడిని భూమికి దూరం చేయడం జాతి విపత్తుకి దారితీస్తుంది. పెద్ద చిన్న వ్యవసాయదారుల కలయిక దేశం స్థిరత్వం అభివృద్ధి సాధించేందుకు అవసరం. భూస్వామ్య విధానాన్ని సంపన్న మధ్యతరగతి రైతుల (పెట్టుబడిదారీ రైతులతో భర్తీ చేయడం, చిన్న సన్నకారు రైతులకు చేయూతనిచ్చి నిలబెట్టడం స్వతంత్రం నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ఆచరణీయమైన విధానంగా నిరూపితమయింది. ఇది 1947 తరువాత కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం ఆమోదం పొందిన విధానం. దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయ మార్పులు సూచించబడ్డాయి. వాటిని తరువాత పరిశీలిద్దాం.
19వ శతాబ్దాంతానికి రైతు కౌలుదారుల ఉద్యమాలు వలస వాదాన్ని గాని, వలస రాజ్యాన్ని గాని ప్రత్యక్షంగా ప్రతిఘటించకుండా తమ ప్రత్యేకమైన డిమాండ్ల కొరకు పోరాడుతూ ఆవిర్భవించాయి. ఉదాహరణకు బెంగాల్లో 1870లలో జమిందారులచే పెంచబడిన కౌలురేట్లకు వ్యతిరేకంగా కౌలు సమ్మెలను నిర్వహించిన వ్యవసాయ సంఘాలు స్థాపించబడ్డాయి. అలాషే 1880లలో బెంగాల్ కౌలుదారీ బిల్లుపై చర్చలు జరుగుతున్నప్పుడు అనువంశిక హక్కులను కౌలు శాశ్వత నిర్ణయాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రైతులు సమీకరించబడ్డారు. అదేవిధంగా మహారాష్ట్రలో 1870లలో వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా శక్తివంతమైన ఉద్యమం ఆవిర్భవించింది. ఈ రెండు సందర్భాలలో ఇండియన్ అసోసియేషన్, పూనా సార్వజనిక సభలాంటి జాతీయవాద సంస్థలు రైతులకు మద్దతు తెలిపాయి.
20వ శతాబ్దంలో రైతు ఉద్యమాలకు, విస్తృతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి మధ్య దృధమైన సంబంధం ఏర్పడింది. ఒకరు మరొక దానికి బలాన్ని యిస్తూ పొందుతూ రెండు రకాల ఉద్యమాలు బలపడ్డాయి. జాతీయోద్యమం ఇంకా విసృతమయింది. వ్యవసాయ సమస్యలను చేపట్టడం (ప్రారంభించింది. రైతు ఉద్యమాలు
1920లలో రైతు ఉద్యమాలు ఉత్తరప్రదేశ్ మలబారులలో సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలలో ఎదిగాయి. కౌలు కాల వ్యవధికి రక్షణ కల్పించాలి, భూమి శిస్తు తగ్గించాలి, చట్టవిరుద్ధమైన అక్రమ వసూళ్ళను రద్దు చేయాలి లాంటి డిమాండ్లను చేపట్టాయి. సర్దార్ పటేల్, మహాత్మాగాంధీ లాంటి నాయకులు స్వతంత్రం తర్వాత భారతదేశం 521
ప్రత్యక్షమైన చురుకైన పాత్ర నిర్వహించిన గుజరాత్‌లోని బార్జోలి సత్యాగ్రహం (1920) రైతు ఉద్యమాలు జాతీయోద్యమంలో ఐక్యమై మమేకమై పని చేశాయనదానికి ఉదాహర”.
1980, 1940 దశాబ్దాలు భారత జాతీయోద్యమం సమూలమైన మార్పులకు గురైన కాలం. జాతీయోద్యమంలో వామపక్ష భావాలు పెరిగిన కాలం. జాతీయోద్యమం రైతు ఉద్యమం అవిచ్చిన్న భాగంగా ఎదిగింది. భారత జాతీయ కాంగ్రెస్చే ప్రారంభించబి టి అత్యంత శక్తివంతమైన ఉద్యమమైన శాసనోల్లంఘనోద్యమం ఉత్తరప్రదేశ్ అంధ్రలాల
- దేశంలోని పలు ప్రాంతాలలో పన్నుల నిరాకరణ శిస్తుల నిరాకరణ రూపం తీసుక్ నడ చట్టబద్ధమైన శిస్తులు 50 శాతం మాత్రమే చెల్లించమని ఉత్తరప్రదేశ్ రైతులకు గౌం స్వయంగా చెప్పాడు.
క
స్వతంత్ర భారతదేశ భవిష్యత్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అర్థ కార్యక్రమం జాబితాలో ఈ క్రింది అంశాలను చేర్చాలని భారత జాతీయ కాం[ 1981 కరాచి సదస్సులో స్పష్టమైన వైఖరి తీసుకొన్నది.
(1) రైతులు చెల్లించే కౌలు శిస్తులలో గణనీయమైన తగ్గింపు, ఆర్థికపరంగా గిట్టబాటుకాని కమతాలకు అవసరమైన సందర్భాలలో శిస్తు మినహాయింపు.
(2) వ్యవసాయ రుణ భారానికి సహాయం, ప్రత్యక్ష పరోక్ష వడ్డీ వ్యాపారంపై అదుపు.
(3) బానిసత్వం నుండి బానిసత్వానికి దగ్గరగా వున్న పరిస్థితుల నుండి కూలీలకు స్వేచ్చ కల్పించాలి.
(4) రైతులు కూలీలు వారి హక్కుల పరిరక్షణ కొరకు సంఘాలు స్థాపించుకొనే హక్కు కలిగి వుండాలి.
(5) కనీసంగా నిర్ణయించిన వ్యవసాయ ఆదాయంపై హేతుబద్ధమైన రీతిలో అదాయపు పన్ను విధించాలి.
1985లో అల్హాబాద్లోని సర్టార్ పటేల్ అధ్యక్షతన జరిగిన కిసాన్ సభ జమిందారీ విధానాన్ని రద్దు చేయాలని తీర్మానించింది. దళారుల జోక్యం లేని రైతు యాజమాన్య వ్యవస్థ కొరకు డిమాండ్ చేసింది. అదే సంవత్సరం బీహార్ కిసాన్ సభ జమిందారీ విధానం రద్దు తీర్మానాన్ని ఆమోదించింది. కమ్యూనిస్టులు, సోషలిస్టులు కిసాన్ సభలో చేరి వాటికి గణనీయమైన బలాన్ని చేకూర్చారు. రైతు సంఘాల ప్రయత్నాలకు పతొక 522 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
స్థాయిగా ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ (తరువాత ఆలిండియా కిసాన్ సభగా పేరు మార్చబడింది) స్థాపించబడింది. కిసాన్ కాంగ్రెస్ మొదట సదస్సులో జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు.
కిసాన్ కాం(గెస్ కిసాన్ ప్రణాళికని ప్రకటించింది. 1936 డిసెంబర్లో మహారాష్ట్రలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఫైజ్ పూర్ సదస్సు ఆమోదించిన వ్యవసాయ కార్యక్రమాన్ని ఈ ప్రణాళిక ప్రభావితం చేసింది. ఫైజ్‌పూర్ కాంగ్రెస్ సదస్సుతో పాటు కిసాన్ కాంగ్రెస్ రెండవ సదస్సు ఎన్.జి. రంగా అధ్యక్షతన నిర్వహించబడింది. కౌలుని, శిస్తు గణనీయంగా తగ్గించమని కరాచీలో చేసిన తీర్మానాన్ని ఫైజ్‌పూర్ వ్యవసాయ కార్యక్రమం పునరుద్దాటించింది. అది యింకా నీటి తీరువా రేట్లని తగ్గించమని అన్ని రకాల వ్యూడల్ (భూస్వామ్య) అప్పులను, లెవీలను, వెట్టిచాకిరిని చట్టవిరుద్ధంగా 'పపకటించాలని, వారసత్వపు హక్కులతో కౌలు కాలవ్యవధిని స్థిరీకరించాలని, అప్పులపై మారిటోరియం (ప్రకటించాలని, తక్కువ వడ్డీరేటుకి రుణ సౌకర్యం కల్పించాలని, బతకడానికి అనువైన కనీస వేతనాన్ని సరియైన పని పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేసింది. అది రానున్న సంవత్సరాలలో తీవ్రమైన చర్యగా దారితీసి సమిష్టి వ్యవసాయాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని కూడా సిఫార్సు చేసింది.
రైతులను వ్యాకులత పరిచే పేదరికం, ఉపాధి లేమి రుణభారం దేశం యొక్క అడి ముఖ్యమైన అత్యవసర సమస్యగా 1937లో ప్రొవెన్నియల్ ఎన్నికలకు కాంగ్రెస్ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో వర్ణించింది. అందుకు కాలం చెల్లిపోయిన భూమి శిస్తు కౌలు విధానాలను పేర్కొన్నది. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం టిటిష్ సామ్రాజ్యవాద దోపిడీని తొలగించడం. భూమి శిస్తు కౌలు రెవిన్యూ విధానాలను సమూలంగా సంస్క్మరించడమే అయినప్పటికీ కౌలు రుణ భారాల తక్షణ ఉపశమనానికి చర్యలు చేపట్టవలసిన అవసరం వుందని మేనిఫెస్టో పేర్కొన్నది.
1937-89 మధ్య 28 నెలల్లో ్రిటిషిండియాలోని అత్యధిక ప్రావిన్సులలో కాంగైస్ మంతట్రివర్గాలు ఏర్పాటు చేసినప్పుడు వ్యవసాయ కార్యక్రమాన్ని. ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరపడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పటి మంత్రివర్ణాలు చాలా పరిమితులకు లోబడి పనిచేయవలసి వచ్చింది. మంత్రి వర్గాలకు పరిమిత అధికారాలు మాత్రమే వున్నాయి. అవి కేవలం 28 నెలల పాటు అధికారంలో వున్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో వివిధ వర్గాలు కలిసి పని చేస్తున్నప్పటికి ఘర్షణ పడుతున్న వర్షాల ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటిస్తూ సామ్రాజ్యవాద వ్యతిరేక ఐక్యత నిలబెట్టవలసిన స్వతం(త్రం తర్వాత భారతదేశం 528
అవసరం వుంది. అయినప్పటికి మంత్రివర్గాలు బాగానే పనిచేశాయి. కౌలు హక్కులు రుణభారం సమస్యలపై వివిధ మంత్రి వర్గాలు చాలా చట్టాలు చేశాయి. ఉదొహా రణకు 1937, 1938లలో బీహార్ కౌలు చట్టాలు చేయబడ్డాయి. 1911 నుండి పెంచిన కౌళ్ళను రద్ద చేశాయి. 12 సం॥లు సాగు చేసిన రైతులకు వారసత్వ హక్కుల్ని వర్తింపచేశాయి. చట్టవిరుద్ధమైన వసూళ్ళను నిషేధించాయి. కౌలుదారుల సితిగతులన్ని మెరుగుపరుస్తూ అలాంటి చట్టాలు యు.పి. బొంబాయి సెంట్రల్ ప్రొవిన్సెస్, వా యువ్య సరిహద్దు ప్రావిన్స్ ఒరిస్సా మద్రాసులలో కూడా చేయబడ్డాయి. ఒరిస్సాలో జమిందారుల ఆదాయాన్ని 50 నుండి 60 శాతం తగ్గించే బిల్లుకు బ్రిటిష్ గవర్నర్ ఆమోదం తెలుపలేదు. మద్రాసులో రెవెన్యూ మంత్రి టి. ప్రకాశం నాయకత్వంలోని కమిటీ కౌలుని మూడింట రెండు వంతులు తగ్గించి దాదాపు జమిందారీ విధానాన్ని రద్దు చేసే ఒక సిఫార్సు చేసింవది. జమిందారులకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించే సమస్యని తిరస్కరిస్తూ మద్రాసు అసెంబ్లీ ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి నివేదికకు మద్దతు తెలిపారు. కాని ఆ రిపోర్టు ప్రాతిపదికన బిల్లు రూపొందించే లోపల మంత్రివర్గం రొజీనొమా చేసింది. చాలా ప్రావిన్సులు రుణ సహాయం అందజేస్తూ వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలను క్రమబద్ధం చేస్తూ చట్టాలు చేశాయి. బొంబాయిలో 40,000 మంది కట్టు బానిసలకు ముక్తి కల్పించబడింది. ఒక విధంగా స్వల్పకాలంగా సాగిన కాంగ్రెస్ మంత్రివరాల పాలనాకాలం అటు గ్రామీణ భారతదేశంలోని ఆధిపత్య వర్గాలకు, అణగారిన వర్గాలకు భవిష్యత్తు దర్చణంలా పనిచేసింది (రెండు వర్గాలు గుణపాఠాలు నేద్చుకొన్నాయి..
1930, 1940 దశాబ్దాలలో గాంధీజీ వైఖరి - ప్రత్యేకించి వ్యవసాయ సమస్యపై గాంధీజీ వైఖరికి చాలా ప్రాధాన్యత వుంది. ఆయన భారతదేశ రాజకీయ రంగంలోని (క్రింది స్థాయి) వర్గ శక్తుల సమతుల్యతని సృష్టించాడు, ప్రతిఘటించాదు. 1987లో గాంధీజీ “భూమి మరియు ఇతర ఆస్తి అంతా ఎవడు పనిచేస్తారో అతడిదో అన్నారు. *“దున్నేవాడిది భూమి” అనే భావానికి దీనికి పెద్ద తేడా లేదు.
1942లో గాంధీజీ లూయిస్ ఫిచెర్కి యిచ్చిన ప్రభుత్వ ఇంటర్వ్యూలో రైతులు జమిందారుల పొలాన్ని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు. కొంత హింసకీ అవకాశం వున్నప్పటికీ జమిందారులు “పారిపోయి సహకరిస్తారన్నారు.” అంతేగొకీ భూస్వాములకు నష్ట పరిహారం చెల్లించడం ఆర్థికంగా అసాధ్యమన్నారు. స్వతంత్రానంతరం జమిందారుల భూమిని వారి స్వచ్చంద లొంగుబాటు ద్వారా గాని లేక చట్టిం ద్వారా 524 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
గాని స్వాధీనం చేసుకొని సాగుచేసేవారికి పంచుతుంది అని మీరాబెన్కి జైలులో (1942లో ఆయన అరెస్టు చేయబడ్డారు) చెప్పారు.
యుద్ధకాలంలో మరణించిన రైతు ఉద్యమాలు 1945లో యుద్ధం ముగిసిన తరువాత స్వతంత్రం నూతన సామాజిక వ్యవస్థ అంచనాలతో నూతన జవసత్వాలు పుంజుకొని ముందుకు వచ్చాయి. జమిందారీ విధానం రద్దు కొరకు ఒత్తిడి పెరిగింది. నిజాం సంస్థానంలోని తెలంగాణా ఉద్యమం బెంగాల్‌లోని తెభాగ ఉద్యమంలాంటి సమరశీల భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో పుట్టుకొచ్చాయి. 1930, 1940 దశాబ్దాలలో ఉపఖండంలోని విస్తృత ప్రాంతాలకు వ్యాపించిన రైతు ఉద్యమాల యొక్క అత్యంత ముఖ్యమైన తోడ్పాటు ఏమిటంటే అని, స్వతంత్రానంతరం వ్యవసాయ సంస్కరణలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాయి.
భారతదేశంలోని జాతీయ రైతు ఉద్యమాల సుదీర్హమైన చరిత్రకి స్వతంత్రానంతరం భూసంస్క్మరణలపై వచ్చిన ఒత్తిడికి మధ్య గల సంబంధం చాలా కీలకమైనది. గమనించదగింది. ఈ సంబంధాన్ని గమనించడంలోని వైఫల్యం కారణంగానే దేశంలో 1950లలో ప్రారంభించిన భూసంస్కరణల కార్యక్రమం జాతీయ లేక రైతు ఉద్యమాల ఫలితంగా గాక పాలకులు రైతులకు ఇచ్చిన వరమని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఎ.ఎం. ఖుస్రో ఆశ్చర్యకరమైన వాదన చేయడానికి దారితీసింది.
స్వతంత్రానంతర తాలి సంవత్సరాలలో జాతీయ రైతు ఉద్యమాల సుదీర్హ చరిత్రని ప్రతిఫలిస్తూ వ్యవసాయ సమస్యపై, రైతుల సమస్యలపై భారతీయ రాజకీయ వర్ణాలలో విస్తృతమైన ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఉదాహరణకు వామపక్ష భావాలతో ప్రభావితమైన జాతీయ ప్రణాళికా కమిటీ (1988లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఏర్పడి 1940లలో కూడా పనిచేసింది) బాంబే ప్రణాళిక (భారతదేశ ఆర్థికాభివృద్ధి 1944-45 (వణాళిక భారత పెట్టుబడిదారీ వర్గ వ్రముఖ (వతినిధులచే రూపొందింపబడినది) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీచే 1945లో విడుదల చేయబడిన ఎన్నికల మేనిఫెస్టో - ఈ క్రింది అంశాలను ఇంచుమించు అంగీకరించాయి.
రైతుకి రాజ్యానికి మధ్య దళారులను అంటే జమిందార్లను, తాలూకాదార్లను రద్దు చేస్తూ అత్యవసరంగా భూ సంస్కరణలు చేపట్టబడాలి. అవసరమైతే వారికి పరిహారం చెల్లించాలి. తక్కువ వడ్డీ రేట్లకి రుణ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామీణ రుణభారం సమస్య పరిష్కరింపబడాలి. దేశంలోని విసృత ప్రాంతాలలో వ్యక్తిగత వ్యవసాయం లేక స్వతంత్రం తర్వాత భారతదేశం 5్25్
రైతు యాజమాన్యం కొనసాగాలి. ప్రైవేట్ యాజమాన్యంలోని పొలాలలో సహకార వ్యవసాయం ప్రభుత్వ భూములలో సమిష్టి వ్యవసాయం ప్రోత్సహించబడాలి.
(గ్రామీణ ప్రాంతాలలో జమిందారీ విధానం రద్దుపై ఏకాభిప్రాయం (సహజంగ జమిందారులలో మినహాయించి) వ్యక్తమయింది. కాని సహకార వ్యవసాయంపై అలా ల ఏకాభిప్రాయం లేదు. ఈ అంశంపై తగినంతగా రైతుల సమీకరణ జరగలేదు. లో మనస్సులో ఇది బలంగా నాటుకొనలేదు. జాతీయ ప్రణాళికా కమిటీ పెట్టుబడిదారు. కాంగ్రెస్‌లకు ఈ సమస్య పట్ల సరియైన అవగాహన వుంది. ఈ సమస్యపై లాం ఎన్నికల మేనిఫెస్టో (1946) లోని మాటల పొందిక గమనార్హం. “వ్యక్తిగత వ్యవసార్యా లేక రైతు యాజమాన్యం కొనసాగుతుంది. అభివృద్ధికరమైన వ్యవసాయం అలాగేనా సామాజిక విలువల ప్రోత్సాహకాల సృష్టికి భారతదేశ పరిస్థితులకు అనువైన స హారం వ్యవసాయ విధానం అవసరమవుతుంది. అలాంటి మార్పు సంబంధిత రైతుల సొవోక్స్ ఆమోదంతోనే చేపట్టబడుతుంది.
1946 రాష్ట్ర ఎన్నికల తరువాత కాంగ్రెస్ మరలా విజయం సాధించింి. కేంద్రంలో నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడి? లు 'ప్రావిన్సులోనికి కాంగ్రెస్ ప్రభుత్వాలు జమిందారీ విధానం రద్దు కొరకు బిల్లు రూపొందించే కమిటీలను ఏర్పాటు చేశాయి.
స్వతంత్రం వచ్చిన తరువాత 1947 నవంబర్‌లో ఆర్థిక కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఎ.ఐ.సి.సి. ఒక కమిటీని నియమించింది. కార్యక్రమం 190 డిసెంబర్ ఎలక్షన్ మేనిఫెస్టో కొన్ని ప్రకటించిన సూత్రాల ప్రాతిపదికన రూపొందించా న ప్రకటించిన సూత్రాలు : సమానత్వం సామాజిక న్యాయం ప్రాతిపదికన దేశంలో నిజమో ప్రజాస్వామ్యాన్ని నిర్మించుట రాజకీయ ఆర్థిక అధికారాలు వికేంద్రీకరణతో కేం ప్రణాళికను అమలు జరుపుట (ఫైవేట్ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అధీనాన్మా నంపూర్చాధికార రాజ్య నియంధత్రణకు (ప్రత్యామ్నాయాన్ని నమకూర్చుట. * అనుసరించడానికి ఎలాంటి నమూనా లేని సంక్షిష్టమైన అజెండా కార్యక్రమం రూపకల్పన కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గాంధేయవాదులు, సోషలిస్టుల మేలి కలయికగొ వున్న మౌలానా ఆజాద్, ఎన్.జి. రంగా, జి.ఎల్, నందా, జయప్రకాష్ నారాయణ, జె.సి. కుమరప్ప, అచ్యుత్ పట్వర్ధన్ శంకరరావు దేవ్‌లు సభ్యులు.
కమిటీ వ్యవసాయం కొరకు 20 అంశాల్ని సిఫార్సు చేసింది. కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిద్దాం ఆ సిఫార్సులోని క్లాజు-2 ఇలా వుంది. “రైతుకి - రాజ్యానికి మధ్య 526 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
గల దళారీలందరు తొలగించబడాలి. దళారుల స్థానంలో లాభాలు పోగు చేసుకొనని సహకార సంఘాలు లాంటి సంస్థలు ప్రవేశపెట్టబడాలి” క్లాజులోని మొదటి భాగం జమిందారీ విధానం రద్దును ప్రస్తావించింది. దళారులను గురించిన రెండవ భాగం కొంత సందిగ్ధంగా వుంది. కొందరు దీనిని (మైవేట్ వడ్డీ వ్యాపారుల వర్తకుల తొలగింపుగా వ్యాఖ్యానించారు.
కొందరు కాంగ్రెస్‌వాదులు ఇదే ఆలోచనలో వున్నారు. కాని కమిటీ అలాంటి తీవ్రమైన వైఖరి తీసుకొన్నట్లు లేదు. వ్యవసాయ రుణం ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఖర్చుల్ని తగ్గించే బహుళార్థ సాధక సహకార సంఘాలను స్టాపించాలి అనేది ఈ దశలో అంగీకారం పొందింది.
సహకార వ్యవసాయానికి వస్తే (ప్రభుత్వం చిన్న కమతందార్లతో ప్రయోగాత్మకంగా పైలట్ పథకాన్ని నిర్వహించవచ్చు. ప్రయోగం, ప్రదర్శన కోసం ప్రభుత్వం సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.
కమిటీ భూగరిష్ట పరిమితి ఆలోచనని కూడా ప్రవేశపెట్టింది. కమతం యొక్క గరిష్ట పరిమితి నిర్ణయించబడాలని గరిష్ట పరిమితికి మించి వున్న భూమిని స్వాధీనం చేసుకొని గ్రామ సహకార సంఘాల అధీనంలో వుంచాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ చేసిన ఇతర సిఫార్సులు, ప్రస్తుత భూమి శిస్తు విధానం స్థానంలో అభివృద్ధికర వ్యవసాయ ఆదాయపు పన్ను వ్యవసాయోత్చత్తులకు గిట్టుబాటు ధరలు వ్యవసాయం పరిశ్రమ మధ్య న్యాయబద్ధమైన నిబంధనలు చిన్న కమతాలను పటిష్ట పరచడం కమతాలు విడగొట్టడాన్ని నివారించుట. కమిటీ ఇంకా ఇలా సిఫార్సు చేసింది.
“స్వయం పరిపాలన సాగించడానికి స్పష్టంగా నిర్వచింపబడిన అధికారాలతో తగినన్ని ఆర్ధిక వనరులతో పరిసరాలలోని అన్ని సంస్థలపై పర్యవేక్షణాధికారాలతో చట్టబద్ధమైన (గ్రామ పంచాయితీలు నెలకొల్పబడాలి” - ఈ సిఫార్సుని సరిగ్గా అమలు జరపడానికి దాదాపు అర్ధ శతాబ్దం తరువాత రాజ్యాంగ సవరణ (78వ సవరణ 1993) అవసరమయింది.
చాలా ఇతర క్లాజులు - ప్రత్యేకించి సహకార సంఘాలు గరిష్ట పరిమితులు వ్యవసాయ ఆదాయపు పన్నులాంటివి అంత సులభంగా శాసనం చేయబడలేదు. భూసంస్కరణలు, వ్యవసాయ రుణం, భూమి శిస్తు నిర్ధారణ వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపు లాంటి గ్రామీణ రంగానికి చెందిన కీలకమైన అంశాలు రాష్ట్ర జాబితాలో స్వతంత్రం తర్వాత భారతదేశం ర్27
చేర్చబడ్డాయి. ఈ అంశాలపై చట్టాలు చేసి అమలు జరుపవలసింది. రాష్ట్ర ప్రభుత్వొలు కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను, రాష్ట్రాలు ఇతర పరిపాలనా యంత్రాంగాలు ఇష్టపడే లేక అమలు జరపగల అంశాలకు మధ్య విభజన జరగడం ప్రారంభమయింది. కేంద్రం నుంచి వచ్చే సిఫార్సులు ఉదాహరణకు కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ (కుమరప్ప కమిటీ) 1949 జూలైలో లేక 1959 నాగపూర్ కాంగ్రెస్ చాలా అంశాలపై చేసిన సిఫార్సులు రాష్ట్రాలకు, రైతులకు మొత్తంగా ప్రజలకు ఆమోదయోగ్యం కాలేదు. సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఒక మేరకు నిర్బంధాన్ని ప్రవేశపెట్టడం, పైవేట్ వర్తకం, వడ్డీ వ్యాపారుల్ని తొలగించి సహకార సంఘాల్ని ప్రవేశపెట్టడం, భూగరిష్ట పరిమితి అమలు జరపడం లాంటివి. అలాంటి కార్యక్రమాలకు పలు రకాలుగా బలమైన ప్రతిఘటన బాహాటంగా నిగూఢంగా ఎదురయింది. దీనిని గమనంలో పెట్టుకొని స్వతంత్రానంతర భారతదేశ (ప్రజాస్వామ్య వ్యవస్థలో భూసంస్క్మరణ ప్రయత్నం యొక్క విజయాన్ని వైఫల్యాన్ని పరిశీలిద్దాం. 528 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
30 న్ భూ సంస్కరణలు -2 జమీందారీ విధానం రద్దు - కౌలుదారీ సంస్కరణలు స్వతంత్రానంతరం భూ సంస్కరణల క్రమం రెండు విస్తృత దశలలో జరిగింది. స్వతంత్రం వచ్చిన వెంటనే ప్రారంభమై 1960 దశాబ్దం ప్రారంభం వరకు కొనసాగిన మొదటి దశ ఈ క్రింది అంశాలపై దృష్టి సారించింది.
-
జమీందార్హు, జాగీర్జార్లు లాంటి మధ్యవర్తుల రద్దు.
-
కౌలు తగ్గింపు, కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించటంతో కూడిన కౌలుదారీ సంస్కరణలు.
ఏ. భూ కమతాలపై గరిష్ట పరిమితి.
- సహకారీకరణ, సమాజ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దశను సంస్థాపరమైన సంస్కరణల దశ అని కూడా అంటారు. 19860 దశాబ్దం మధ్యలో మొదలై హారితవిప్లవం ప్రారంభం వరకు కొనసాగిన ఈ దశని రెండవ దశ లేక సాంకేతిక సంస్కరణల దళ అంటారు. రెండు దశల్ని విడివిడి భాగాలుగా విభజించటానికి వీలుపడదు. ఈ ఒకటి మరొక దానిగా సహాయకారిగా వున్నాయి. ఒక దశ కార్యక్రమాలు మరొక దశ కార్యక్రనూలలోకి చొచ్చుకు వచ్చాయి. కాబట్టి మనం రెండు దశల కాలక్రమాన్ని కచ్చితంగా పాటించాము. జమీందాలీ విధానం రద్దు
స్వతం[త్రం వచ్చిన తరువాత ఒకటి రెండు సంవత్సరాలలో అంటే 1949 నాటికి జమీందారీ విధానం రద్దు బిల్లులు లేక కౌలుదారీ చట్టం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, మద్రాసు, అస్సాం, బొంబాయి లాంటి అనేక ప్రావిన్సులలో ప్రవేశపెట్టబడ్డాయి. స్వతంత్రం తర్వాత భారతదేశం క్29
ఇతర ప్రావిన్సులకు ఉత్తరప్రదేశ్ జమీందారీ రద్దు కమిటీ (జి. బి.పంత్ అధ్యక్షతన) రిపోర్టు నమూనాగా పనిచేసింది.
ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్తు భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో వుంది. జమీందార్లు కోర్టుల ద్వారా ఆస్తిహక్కు అతిక్రమణ లాంటి సమస్యల్ని పనా ద్యారా, పరిహారం స్వల్బమని సాకుతో గాని తమ ఎస్టేట్ల స్వాధీనాన్ని అడ్డుకుంటా జమీందారీ విధానం రద్దు పట్ల పూర్తి నిబద్ధత గల జవహర్లాల్ నెహ్రూ, జి. బి. కళ సర్థార్‌పటేల్ లాంటి కాంగ్రెస్ నాయకులతో సహా అందరిలో విస్తృతమైన ఆం రదు నెలకొని వుంది. రాష్ట్ర అసెంబ్లీలో పెండింగులలో వున్న జమీందారీ విధానం వా బిల్లులు - యివి న్యాయ ప్రక్రియ ద్వారా సాధించుకోవడానికి వీలుపదన దం రూపొందింపబడినవి గనుక రాష్ట్ర అసెంబ్లీ సిఫార్సు చేసిన పరిహారం ప్రాతిపదికన అమో పొందుతాయని తరువాత రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించబడతాయని, రాష్ట్ర ఆమో పొందడటమంటే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందడమే అవుతుందని - సుదీర్టవైన చర్చల తరువాత రాజ్యాంగంలో సంబంధిత నిబంధనలు రూపొందించబడ్డా నాయకులకు నమ్మకం కుదిరింది.
అసెంబ్లీలు సిఫార్సు చేసిన పరిహారం చాలా తక్కువగా కౌలుదార్లకు అనుకూలంగొ వుంటుంది.
రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన విధంగానే దేశంలోని వివిధ ప్రాంతాలలోని జమీందార్లు జమీందారీ విధానం రద్దుకు చెందిన చట్టం యొక్క రాజ్యాంగ నిబద్ధత సవాలు చేశారు. పొట్నా హైకోర్టు జమీందారీ వ్యాజ్యాన్ని (అభియోగాన్ని సమర్ధించింది. కాంగ్రెస్ (ప్రభుత్వం తగు విధంగా స్పందించి రాజ్యాంగ సవరణలను ఆమోదింపజేసింది.
జమీందారీ విధానం రద్దు అమలు కొరకు రాష్ట్ర అసెంబ్లీలను బలో పేతం చేసేందుకు, ప్రాథమిక హక్కు అతిక్రమణ సమస్య లేక పరిహారం తక్కువనే సమస్య కోర్టులలో అనుమతించకుండా చేసేందుకు మొదటి సవరణ 1951, నాల్గవ సవరణ 1955 లో ఉద్దేశించబడ్దాయి. జమీందార్లు వారి ఎస్టేట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనదాన్ని జాప్యం చేసేందుకు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అప్పీళ్లు కానసాగించనప్పటికి 1950 దశాబ్ధం మధ్య కాలం నాటికి వారి ప్రతిఘటన వెన్ను విరిచి వేయబడింది. తరచుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి విరుద్ధంగా మితవాద భావాలు గలవారు కూడా భూ సంస్కరణలను
అద్దుకొనే పథకంలో భాగస్వామ్యం వహించలేదు, వాస్తవంగా ఈ క్రమాన్ని ప్రజాస్వామ్య చట్రం పరిధిలో పూర్తి చేయ యత్నించారు. 530 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చాలా రాష్ట్రాలు 1956 నాటికే ఆమోదించిన జమీందారీ విధానం రద్దును అమలు పరచడంలో ఎదురైన పెద్ద ఆటంకం సరియైన రికార్డులు లేకపోవడం. అయినప్పటికీ 1950 దశాబ్దం చివరకు భూ సంస్కరణల క్రమం మధ్యవర్తుల (బిటిషిండియాలో జమీందారులు, స్వతంత్ర భారత దేశంలో కలిసిపోయిన స్వదేశ సంన్థానాలలోని జాగీర్జార్లు) రద్దు పూర్తి చేయబడింది. మొత్తం క్రమం ప్రజాస్వామ్య చట్రంలో జరిగింది. ఎలాంటి, హింస, బలాత్కారం ప్రయోగింపబడలేదు. చాలా తక్కువ వ్యవధిలో ఈ క్రమం పూర్తి చేయబడింది. జాతీయోద్యమ కాలంలో జమీందారులు సామ్రాజ్యవాద శిబిరంలో భాగంగా పరిగణింపబడి సామాజికంగా వెలివేయబడ్డారు గనుక యిది సాధ్యపడింది. కాని జాతీయోద్యమంలో భాగంగా వుండి గణనీయమైన సామాజిక మద్దతు పొంచిన పై సెక్టన్ల రైతుల ప్రయోజనాలకు బెదిరింపుగా వున్న సంస్కరణలను జయప్రదం చేయటం మనం ముందు చూడబోయే విధంగా చాలా కష్టంగా కొన్ని సందర్భాలలో అసాధ్యంగా పరిణమించింది.
జమీందారీ విధానం రర్దు అంటే దాదాపు 20 మిలియన్లుగా వున్న మాజీ కౌలుదారులు ఇప్పుడు భూ యాజమానులయ్యారు కాబట్టి అత్యధిక ప్రాంతాలలో కౌలు ఒప్పందాలు మౌఖికంగా (నోట మాటలతో) చేసుకొనబఐడతాయి కనుక రాత పూర్వక ఆధారాలు లభించవు. ఒక ప్రాంతంలో వున్న కౌలుదారు కుటుంబాల సంఖ్య నిర్జారించటం చాలా కష్టం అయినప్పటికి సంస్కరణలు ప్రారంభించిన తరువాత కౌలు ఒప్పందాలలో తగ్గుదల వున్నట్టు పండితులు అంగీకరిస్తారు. 1950-51లో 41 శాతంగా కౌలు వ్యవసాయం క్రింద వున్న ప్రాంతం 1960 ల నాటికి 20-25 శాతానికి తగ్గింది. కాని కౌలు వ్యవసాయంలో వున్న భూమి తగ్గుదల స్వంత వ్యవసాయంలో వున్న భూమి పెరుగుడలకు కారణం. కౌలుదారులు భూమి యాజమానులవడం వలన మాత్రమే కాదు. యాజమానులు అప్పటికి సాగుచేస్తున్న కౌలుదారులను ఖాళీ చేయించడం వలన కూడా.
ఎప్టేట్లు స్వాధీనం చేసుకొన్న తరువాత జమీందార్లకు చెల్లించిన పరిహారం సాధారణంగా చాలా తక్కువ. ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి తేడా వుంది. ఇది రైతు ఉద్యమం బలం మీద భూస్వాములకు కౌలుదార్లకు మధ్య గల వర్గ పొందిక మీద కాంగ్రెస్ నాయకత్వం యొక్క మొత్తం అసెంబ్లీ యొక్క సైద్ధాంతిక నిబద్ధత మీద ఆధారపడి చెల్లింపులు జరిగాయి. ఉదాహరణకు కాళ్ళీరులో పరిహారం చెల్లించబడలేదు. పంజాబులో పాటియాలో ఆక్రమణ కౌలుదారు (అనువంశిక కౌలుదారులు) ఎలాంటి పరిహారం చెల్లించలేదు. దిగువ సాయి కౌలుదారులు నామమాత్రంగా వుండే వాయిదాలుగా చాలా సంవత్సరాల తరబడి చెల్లించవలసిన దానిలో మొదటి వాయిదా చెల్లించారు. అత్యధిక స్వతంత్రం తర్వాత భారతదేశం శ్త్ష
రాష్హ్రైల్లో తరతమ భేదాలతో ఉత్తరప్రదేశ్ నమూనాన్ని అనుసరించాయి. అక్కడ చెల్లించబడీన పరిహారం భూస్వామి పొలానికి విలోమ సంబంధంలో వుంది. చిన్న జమీందారులు (సంపన్న రైతుల నుండి వేరు చేసి చూడటం సాధ్యపడనివారు, భూసంస్కరణలో వీరికి వ్యతిరేకంగా గురిపెట్టబడినవి కాదు) వార్షికంగా రు.25లుగా భూమిశిస్తు చెల్లించేవారు. వారి వాక్సిక
ఆదాయానికి 20రెట్లు నష్టపరిహారం పొందారు. ఇక వార్షికంగా రు.2000 ల నుండి
10,000 భూమిశిస్తు చెల్లించే పెద్ద జమీందార్లు వారి వార్చిక ఆదాయానికి 2 నుంది
శ రెట్లు నష్ట పరిహారం పొందారు. అంతేగాక ఈనష్టపరివారం చెల్లింపు దీరకాలికంగా .
కొన్ని సందర్భాలలో 40 ఏండ్ల పాటు సాగుతుంది. నష్టపరిహారం పొందిన పెద్ద
జమీందారులు అంతకు ముందు వారికి వచ్చే ఆదాయంలో కేవలం 40వ వంతు మాత్రమే
పొందగలిగారు.
మొత్తం చెల్లించవలసిన 6700 మిలియన్ల రూపాయల నష్టపరిహారంలో 396]
వరకు వాస్తవంగా చెల్లించింది 1642 మిలియన్లు మాత్రమే. భారతదేశం 1946-1853
కాలంలో ఆహార ధాన్యాల దిగుమతులలో చెల్లించిన 10,000 మిలియన్లతో పోల్చిలే
యిది చాలా చిన్న మొత్తమే దానిలో ఆరవ వంతు మాత్రమే. జమీందారీ విధాన రద్దులో బలహీనతలు
దేశంలోని వివిధ ప్రాంతాలలో జమీందారీ విధానం రద్దుకు చెందిన కొన్ని
క్లాజులు అమలు జరపబడిన విధానంలో కొన్ని ముఖ్యమైన బలహీనతలు వున్నాయి.
ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో జమీందారులు వ్యక్తిగత వ్యవసాయం క్రింద ప్రకటించిన
పొలాలు వారు వుంచుకొనడం అనుమతించబడింది. వ్యక్తిగత వ్యవసాయం అనే పదం
చాలా అస్బష్టంగా నిర్వచింపబడింది. పొలాన్ని సాగుచేసే వారే గాక పొలాన్ని వ్యక్తిగతంగా
పర్యవేక్షించే వారు, ఒక బంధువు ద్వారా పర్యవేక్షించేవారు, లేక పొలానికి పెట్టుబడి,
అప్పు సమకూర్చేవారు. వ్యక్తిగత వ్యవసాయదారులు - అని విపరీత వ్యాఖ్యానాలు
చేయటానికి వీలుగా పదం నిర్వచింపబడింది. అంతేగాక ఉత్తరప్రదేశ్, బీహారు, మద్రాసు
లాంటి రాష్ట్రాలలో (గరిష్ట పరిమితి చట్టాలు ప్రవేశ పెట్టబదే వరకు) జమీందారు వ్యక్తిగత వ్యవసాయంగా ప్రకటించబడే పొలాలకు ఒక పరిమితి విధించబడలేదు. కాంగ్రెస్ వ్యవసాయ సంస్మరణల కమిటీ (కుమరప్ప కమిటీ) 1949లో ఇచ్చిన రిపోర్టులో (కనీస శారీరక (గ్రమచేస్తూ వ్యవసాయపు పనులలో భాగస్వామ్యం వహించిన వారు మాత్రమే వ్యక్తిగత వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణించాలని స్పష్టంగా పేర్ళానబడినప్పటికీ వ్యక్తిగత వ్యవసాయదారుడు పదాన్ని అస్పష్టంగా నిర్వచించడం జరిగింది. ఏ పరిస్థితులలో కూడా 5్తిలై బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కౌలు రైతుని ఆర్థిక దుస్థితికి నెట్టివేయని విధంగా వ్యక్తిగత వ్యవసాయానికి తిరిగి పొందగలిగే పొలంపై గరిష్టపరిమితిని కమిటీ ముందుగానే స్పష్టం చేసింది.
కాని ఆచరణలో పరోక్ష భూ యజమానులైన (2056126 ౦౪౧ల౫) జమీందార్లు పెద్ద భూఖండాలను నిలబెట్టు కోగలిగారు. ఇంకా చాలా ప్రాంతాలలో జమీందార్లు వ్యక్తిగత వ్యవసాయం క్రింద వీలైనంత ఎక్కువ భాగాల్ని ప్రకటించుకొనేందుకు పెద్ద ఎత్తున కౌలుదార్లను ప్రధానంగా తక్కువ రక్షణ గల కౌలుదార్లను ఖాలీ చేయించటానికి పాల్పడ్డారు (భూగరిష్ట పరిమితులు కౌలుదారీ చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత భారతదేశ భూ సంస్కరణలో పెద్ద మచ్చని మిగిలిస్తూ రైతుల్ని పెద్ద ఎత్తున ఖాలీ చేయించటం జరిగింది).
గతంలో పెద్ద ఎత్తున కౌళ్లు పొందే జమీందారుల పొలాల్ని వ్యక్తిగత వ్యవసాయం క్రింద తెచ్చుకొనడం ప్రారంభించారు. వారు చాలా వరకు సఫలీకృతులయ్యారు. వారు ఆ పొలాలపై పెట్టుబడులు పెట్టారు. ఆ ప్రాంతాలలో భూ సంస్కరణ లక్ష్యాలలో ఒకటైన పెట్టుబడిదారీ వ్యవసాయం దిశగా ముందుకు సాగారు.
జమీందారీ విధానం రద్దు యొక్క పూర్తి ప్రభావాన్ని నివారించేందుకు విస్తృత భూ ఖండాలను ప్యక్తిగత వ్యవసాయం క్రిందకు తీసుకొని వచ్చి నిలబెట్టుకొనడం జమీందారులు అనుసరించిన ఒక పద్ధతి. జమీందారీ విధానం రద్దు చట్టాన్ని దాని అమలును నిరోధించేందుకు జమీందార్లు చాలా ఇతర పద్ధతులు చేపట్టారు. అలాంటి చట్టం రాష్ట్ర అసెంబ్లీలలో చేయబడుతుంది. గనుక భూస్వాములు పార్లమెంటరీ పద్ధతులలో గల ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొన్నారు. ఫలితంగా ముసాయిదా బిల్లులపై సుదీర్హ చర్చలు జరిగాయి. సెలెక్టు కమిటీలకు పంపించారు. చాలా సవరణలు ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లాంటి పలు రాష్ర్రాలలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అవి అమోదం పొందటానికి మధ్య చాలా సంవత్సరాలు గడిచాయి.
చట్టాలు చేసిన తరువాత కూడా వాటి అమలును వాయిదా వేయించేందుకు భూస్వాములు న్యాయస్థానాల్ని ఉపయోగించుకొన్నారు. మనం యింతకు ముందు గమనించిన విధంగా చట్టాల రాజ్యాంగబద్ధతని కోర్టులలో - సుప్రీంకోర్టు వరకు పోయి మాటమాటకి సవాలు చేశారు. భూస్వాములు ఎక్కువగా ప్రతిఘటించిన వీహారులో వారికి సుప్రీంకోర్టు రెండుసార్లు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికి చట్టం అమలు కాకుండా అడ్డుకొనే ప్రయత్నించారు. వారు అధీనంలో వున్న భూమికి సంబంధించిన రికార్డులను అప్పగించ నిరాకరించారు. భూస్వాముల క్రింద స్థాయి రెవెన్యూ ఉద్యోగుల మధ్య లాలూచీ స్వతంత్రం తర్వాత భారతదేశం 5898
కారణంగా చట్టం అమలు కష్ట సాధ్యం చేయబడింది. జమీందారీ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులతో చాలామంది గతంలో జమీందార్లకు శిస్తులు వసూలు చేసిన ఏజెంట్లు కావడం వలన జమీందార్లకి వాళ్లకి మధ్య లాలూచీ సాధ్యపడింది. భూస్వాములు చట్టి సభల్లో కోర్టులలో అమలు జరిపే దశలో ప్రతిఘటించారు. కా
జమీందారీ విధానం రద్దు క్రమాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని కాంగా తన సంకల్పాన్ని పలుమార్లు పునరుద్దాటించింది. ఈ సంకల్పాన్ని ఎఐసిసి తీరాన (ఉదా 1954 జూలై తీర్మానం) ముఖ్యమంత్రుల పిసిసి అధ్యక్షుల సదస్సులో (1 క ఏప్రిల్) మొదట ప్రణాళికా ముసాయిదాలో అన్నిటిని మించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యక్తం చేసింది. వయోజన ఓటింగుతో కూడిన ప్రజాస్వామ్యం జమీంగొర్ల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించింది. మరొకవైపు రైతుల దీర్షకాలిక డిమాండ్లను తీర్చవలసా అవశ్యకతను పెంచింది. సంవత్సరాల తరబడి ఈ డిమాండ్లు చేయించేందుకు కాంటైన స్వయంగా రైతుల్ని సమీకరించింది. కాంగ్రెస్ 1951, 1955లలో పార్లమెంట్చే రాజ్యాంగ సవరణలు ఆమోదింపచేయదడం లాంటి అవసరమైన పాలనాపరమైన చట్టపరమైన చర్యలు చేపట్టింది.
భూస్వాములు ్రతిఘటించినప్పటికి బీహారులోని కొన్ని ప్రాంతాలలో మినహాయించి జమీందారీ విధానం రద్దు క్రమం భారత రిపబ్లిక్ ఏర్పాటు చేసిన తరువా దశాబ్దం లోపల పూర్తి చేయబడింది. పెద్ద ప్యూడల్ ఎస్టేట్లు అంతరించాయి. ఈ క్రమం ప్రధానంగా నష్టపడినవారు భూములు కోల్పోయిన పెద్ద భూస్వాములు. ముఖ్యంగా లాభపడినవారు జమీందారు నుండి ప్రత్యక్షంగా కౌలుకి పుచ్చుకొన్న అనువంశిక కౌలుదారు ఇప్పుడు వారు భూయాజమానులయ్యారు. అలాంటి కౌలుదారులు సాధారణంగా మధ్యతరహా లేక సంపన్న రైతులు వీళ్లు కొన్ని సందర్భాలలో వారి పొలాలకు చిన్న రైతులకు ఎలాంటి రాతకోతలు లేకుండా కాలుకిస్తుంటారు. కౌలుదారీ సంస్కరణలు
జమీందారీ విధానం రద్దు అమలు జరుపబడిన తరువాత కూడా జమీందారీ ప్రాంతాలలో ఎలాంటి రాతకోతలు లేకుండా నోటిమాటతో కౌలుకిచ్చే పద్ధతి కొనసా గింది, అలాంటి కౌలుదారీ పద్ధతి ఇప్పుడు వ్యక్తిగత వ్యవసాయం క్రిందికి తెచ్చుకొన్న మాదీ జమీందారుల పొలాల్లో వుంది. గతంలో అనువంశిక కౌలుదారులుగా వుండి ఇప్పుడు భూ యాజమానులైన వారు ఉపకౌలుకిచ్చిన పాలాల్లోనూ వుంది. స్వతంత్రం వే నాటికి సగం పొలాలు జమీందారీ విధానం క్రింద వున్నాయి. మిగిలిన సగం రైత్వోరీ ర్కిశ బీపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విధానం క్రింద వుంది. ఇక్కడ కూడా భూస్వామ్య విధానం, అభద్రతలో అప్పులలో కూరుకుపోయిన రైతుల సమస్యలు వున్నాయి. కాబట్టి భూ సంస్కరణలలో రెండవ ప్రధాన లక్ష్యం కౌలుదారీ చట్టం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులలో చాలా వైవిధ్యం వుంది. వివిధ రాష్ట్రాలు ఆమోదించిన కౌలుదారీ చట్టం యొక్క స్వభావంలోను దానిని అమలు జరిపిన విధానంలోనూ వ్యత్యాసాలున్నాయి. అయినప్పటికి వివిధ చట్టాల మధ్యకొన్ని ఉమ్మడి లక్ష్యాలున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో వాటిని అమలు పరిచే విధానంలో కొన్ని సామాన్య అంశాలు ఆవిర్భవించాయి. ఈ అధ్యయనంలో వ్యత్యాసాలను గాక సామాన్య అంశాలను పరిశీలించటానికి పరిమితమవుదాం. కౌలుదారీ సంస్కరణలలో మూడు మౌలికమైన లక్ష్యాలు వున్నాయి. ఒక భూ ఖందాన్ని నిర్దీత సంవత్సరాలు ఉదాహరణకు 6 సంవత్సరాలు సాగుచేసిన కౌలురైతులకు రక్షణ కల్పించుట, రెండవది కౌలు రైతులు చెల్లించే కౌలుకు ఉత్పత్తిలో 1/4 నుండి 1/6 వంతు వుండేలా తగ్గించుట. మూడవది రైతు సాగుచేస్తున్న పొలంపై కొన్ని షరతులతో అతడికి భూ యాజమాన్య హక్కు కల్పించుట. మార్కెటు రేటు కంటె తక్కువగా సాధారణంగా వార్షికంగా చెల్లించే కౌలుసరి 8 రెట్లు లేక 10 రెట్లు రైతుకు భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో అతడు చెల్లించవలసిన ధర వార్షిక కౌలుకు 8 రెట్లు అంటే భూమి యొక్క మార్కెటు ధరలో 40 శాతం. రైతుల స్థితిగతులను పెంచటానికి ప్రయత్నిస్తూనే మొత్తం మీద భారతదేశంలో భూస్వామికి ప్రత్యేకించి చిన్న భూస్వామి ప్రయోజనాలను కౌలుదారు ప్రయోజనాలకు మధ్య సమతౌల్యం వుండేలా చేయటం లక్ష్యంగా సంస్కరణలు చేపట్టబడ్దాయి. స్వంత వ్యవసాయం కొరకు భూస్వామి తిరిగి పాలం పొందిన తరువాత అతడి సాగుభూమి రాష్ట్రం విధించిన గరిష్ట పరిమితికి మించని విధంగా అతడి పొలం పొందే హక్కు పరిమితం చేయబడింది. మొదటి (ప్రణాళిక కుటుంబ కమతానికి మూడురెట్లు భూమిని పరిమితిగా సూచించింది. కుటుంబ కమతం ఒక అరకుతో సాగు చేయగలిగిన పాలంగా సూత్రీకరించబడింది. భూస్వామి స్వంత వ్యవసాయం కారకు పొలాన్ని పొందేటప్పుడు కూడా కౌలుదారుకి ఏమీ మిగల్చకుండా మొత్తం తీసుకోకూడదు. కేరళ, ఒరిస్సా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర కర్నాటక, తమిళనాడు లాంటి రాష్ర్రాలలో కౌలు రైతు సాగుచేస్తున్న పొలంలో కనీసం సగం అతడికి వదలిపెట్టాలి. బీహారులాంటి ఇతర రాష్ట్రాలలో కౌలు రైతు సాగు చేస్తున్న పొలంలో సగం గాని లేక కనీసం స్వతంత్రం తర్వాత భారతదేశం 585
5 ఎకరాలు (పశ్చిమ బెంగాల్లో 2.5 ఎకరాలు) గాని ఏది తక్కువైతే దానిని కౌలు రైజీకీ వదిలి పెట్టాలి.
ఇక పొలం పంచిన తరువాత కౌలు రైతు కమతం రాష్ట్రం విధించిన గరిష్ట పరిమితిని మించకూడదనే షరతులలో భూస్వామి పొలాన్ని కౌలు రైతు పొందే హక్కు పరిమితం చేయబడింది.
చిన్న భూస్వాముల ఆర్థిక పరిస్థితులు కౌలుదారుల కంటె మెరుగుగా లేవని రెండవ ప్రణాళిక గుర్తించింది. కాబట్టి వారు స్వంత వ్యవసాయానికి వారి మొత్తం తాన్ని పొందవచ్చునని సూచించింది. కాని ఆచరణలో కౌలుదారీ చట్టాల అమల చ కిష్టమైన అనుభవాలు ఎదురయ్యాయి. చిన్న భూస్వాముల రక్షణ కొరకు ప్రవేశపెట్టి అవకాశాలు రెవెన్యూ అధికారులతో లాలూచీ పడిన పెద్ద భూస్వాములచే దుర్వాస? పరచబడ్డాయని వ్యవసాయ సంబంధాలపై ష్వానింగు కమిషన్ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు ళు నివేదిక (1978) లో స్పష్టం చేశారు. పెద్ద భూస్వాములు తమ పొలాలను వారి బంధువుల యితరులకు బదలాయించి చిన్న భూస్వాముల తరగతిలో చేరి ఆ తరువాత చిన్ని భూస్వాములకు యిచ్చిన రాయితీలను ఉపయోగించుకొని కౌలు రైతులకు తమ పొలాల నుండి ఖాళీ చేయించేందుకు పెద్ద భూస్వాములు చట్టంలోని అంశాలను దుర్వినియోగ పరిచారని మూడవ ప్రణాళిక కూడా స్పష్టం చేసింది.
వాస్తవంగా తిరిగి పొందే హక్కు యింతకు ముందు ప్రస్తావించిన పా వ్యవసాయానికి యివ్వబడిన అస్పష్టమైన నిర్వచనం కౌలుదారుల్ని పెద్ద ఎత్తున చేయించటానికి ఉపయోగించుకోబడి రానున్న కౌలు చట్టాన్ని ముందుగా అంచనా వేయటంతో భాళీ చేయించే క్రమం ప్రారంభమయింది. చట్టం అమలయ్యే లోపల అత్యధిక ప్రయోజనాలు పొందడానికి వీలుగా స్వప్రయోజనాపరులు చట్టాలు చేయదానికి అమలు జరపడానికి అమితమైన జాప్యాలు పథకం ప్రకారమే చేయించారు.
కౌలు రైతులు ఖాళీ చేయించటానికి వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ పొందిన తరువాత కూడా పెద్ద ఎత్తున ఖాళీలు చేయించబడ్డాయి. 1948-51 కాలంలో బొంబాయి రాష్ట్రంలో రక్షణ పొందిన కౌలుదార్ల సంఖ్య 1.7 మిలియన్ల నుండి 1.3 మిలియన్లకు 28 శాతం తగ్గినట్లు హైదరాబాదు రాష్ట్రంలో 1951, 1955 మధ్య కాలంలో 57 శొతం తగ్గినట్లు భూ సంస్కరణలపై నియమింపబడిన ష్లానింగు కమిషన్ పానల్ ప్రకటించింది. హైదరాబాద్‌పై జరిగిన మరొక వివరణాత్మక అధ్యయనం ప్రకారం 1951 నాటి ప్రతి 100 మంది రక్షిత కౌలుదార్లలో నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 1954 నాటికి 536 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
శీ5్.4 శాతం రక్షిత కౌలుదార్లుగా వున్నారు. 12.4 శాతం భూమి పొందే హక్షుని వినియోగించుకొని భూమి యజమానులయ్యారు. 2.6 శాతం మంది చట్టబద్ధంగా ఖాల్లీ చేయించబడ్డారు. 17.5 శాతం స్వచ్చందంగా భూమి హక్కుని వదలుకొన్నారు. స్వచ్చందంగా హక్కుని వదలుకొనడం వట్టిమాట. దౌర్దన్యంతో లొంగదీసుకొని స్వచ్చందంగా వదులుకొన్నట్లు ప్రకటించడం జరిగింది.
కౌలుదారులకు రక్షణ కల్పించడంలో వైఫల్యాలున్నప్పటికీ గణనీయమైన నిష్పత్తిలో కౌలుదారులు రక్షణ శాశ్వత అనువంశిక హక్కులు పొందగలిగారు. వెనుకటి పేరాలో ప్రస్తావించిన హైదరాబాద్‌పై వివరణాత్మక అధ్యయనం ప్రకారం 45.4 శాతం కౌలుదారులు రక్షిత కౌలుదారులుగా వుండిపోయారు. 12.4 శాతం యాజమానులయ్యారు. అంటే మొత్తం చట్ట పరిధిలోకి తీసుకొని రాబడిన 67.8 శాతం కౌలుదారులు ఎలాంటి అభద్రతకి గురి కాలేదు. రక్షణ పొందిన కౌలుదార్ల పొలాల్లో ఉత్పత్తి పెరుగుదల ఒక మంచి పరిణామం.
చాలా సందర్భాలలో కౌలు చట్టాలు కౌలుదారీ హక్కుల్ని దాచిపెట్టాయి. అంటే కౌలు విధానం మరో రూపంలో కొనసాగేలా చేశాయి. కౌలుదారులు గతంలో చేసిన పనిచేస్తూ అదే స్థాయిలో కొనసాగుతున్నప్పటికి వారు యిప్పుడు క్షేత్ర సేవకులు (20% 5612016) అని పిలువబడ్డారు. భూ సంస్కరణల తొలి సంవత్సరాలలో కౌలుదారులు పాలికాపులుగా మార్చబడ్డారు. పాలికాపులు కౌలుదారులుగా పరిగణించబడరు గనుక అమలులో వున్న కౌలుదారీ చట్టం (క్రింద రక్షణ లభించదు. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని పొలం సాగు చేసుకుంటూ డబ్బు చెల్లించేవారు కౌలుదారులుగా పరిగణింపబదతారు. పంటలో నిర్జీత భాగాన్ని గాని, పంటలో కొంత నిష్పత్తి ప్రకారం గాని చెల్లించేవారు పాలికాపులు. పశ్చిమబెంగాల్లో బార్జాదార్లుగా పిలువబడే పాలికాపులు పశ్చిమబెంగాల్ భూ సంస్కరణల చట్టం వారికి పరిమిత రక్షణ కల్పించే విధంగా సవరింపబడే వరకు అంటే 1970 జూలై వరకు ఎలాంటి రక్షణ పొందలేదు.
కౌలుదారుల అభద్రత ముఖ్యమైన కారణం అత్యధిక కౌలు ఒప్పందాలు నోటిమాటలతో జరిగాయి. రాతపూర్వకమైన ఆధారాలు లేవు. కాబట్టి కౌలుదారులు చట్టం వలన ప్రయోజనం పొందలేక పోయారు. కాని 1971 జనాభా లెక్కల నమోదు చేసిన వివరాలను బట్టి భారతదేశంలో సాగులో వున్న భూమిలో 91.1 శాతం యాజమానులు సాగుచేస్తున్నవి. అన్ని రాష్ట్రాలలో కంటె బీహారులో 99.6 శాతం యాజమానుల సేద్యంలో వున్నాయి. కేవలం 0.22 శాతంలో మాత్రమే కౌలుదారుల సాగులో వుందిలాంటి అసంబద్దమైన నిర్ణయాలకు రావలసిన వస్తుంది. బీహారులో అత్యధిక స్వతంత్రం తర్వాత భారతదేశం 537
శాతం కౌలుదారుల సేద్యంలో వుందనేది సాధారణంగా అందరూ అంగీకరించే ఒక వాస్తవం. 1961 జనాభా లెక్కలననుసరించి 36.65 శాతం సాగుభూమి కౌలుదా గా సేద్యంలో వుంది. కాబట్టి అత్యధిక కౌలు ఒప్పందాలు నమోదు చేయబదలేదని ఫలి శరం రైతులు రక్షణ లేని స్థితిలో వున్నారని 1961, 1971 గణాంక వివరాలలోని అం కు తెలియజేస్తున్నది. 1961 గణాంక వివరాలు దేశంలోని 82 శాతం కౌలు ఒప్పందాల రక్షణలేరని అంచనా వేశాయి.
స్వతంత్రానంతర తొలి సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్‌లో జమీందారీ విధా రద్దుకు భూ సంస్కరణల చట్టం అమలుకు సరియైన రికార్డులు లేకపోవడం తా అవరోధంగా గుర్తించబడింది. కొన్ని మిలియన్ల రికార్డుల్ని సరిచేయటానికి కొత్తగ రాయించటానికి అప్పటి రెవెన్యూమంత్రి చరణసింగ్ తీవ్ర ప్రయత్నం చేయవలసి వచ్చింల.
తరువాత సంవత్సరాలలోని అలాంటి తీవ్రమైన ప్రయత్నాలు వామపక్ష క నాయకత్వంలో చేపట్టబడ్ద్డాయి. ఫలితంగా కేవలం మధ్యతరగతి కౌలురైతులే గాక లు ఎలాంటి రక్షణ లేని పాలికాపులు కూడా ప్రయోజనాలు పొందారు. అలాంటి ప్రయత్సాల ప్రఖ్యాత ఉదాహరణలు, కేరళ, పశ్చిమ బెంగాల్లో చాలా వున్నాయి.
1960 దశాబ్దం చివరిలో గుడిసె వాసులకు కౌలుదారులకు భూములు పట్టాలు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబడింది. గణనీయమైన విజయం సాధించిన ఈ కార్యక కైతు సంఘాలు చురుకైన భాగస్వామ్యంతో ప్రారంభించబడింది.
1977లో అధికారంలోకి వచ్చిన పశ్చిమబెంగాల్ వామపక్ష ప్రభుత్వం పౌలికాపులకు చట్టబద్ధమైన హక్కులు శాశ్వత వారసత్వ హక్కులు కల్పించటానికి పాలికాప్తో పంటలో మూడవ వంతు భాగం దక్కటానికి వీలుగా పాలికాపుని నమోదు చేసే 19% జూలైలో ప్రఖ్యాత “ఆపరేషన్ బారా" కార్యక్రమం ప్రారంభించింది. 24 మిలియన్లు వుంటారని అంచనా వేయబడిన పాలికాపులలో 1978 జూన్ నాటికి 0.4 మిలియన్ల మంది మాత్రమే నమోదు చేయబడ్డారు. కాని ఆపరేషన్ బారా కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నమోదు చేయబడిన పాలికాపుల సంఖ్య 1979 అక్టోబరు నాటికి 0.7 మిలియన్లకు 1990 నవంబరు నాటికి 1.4 మిలియన్లకు పెరిగింది.
పశ్చిమబెంగాల్లో ఆపరేషన్ బార్గా ప్రయోగంలో గమనించదగిన అంశం. కేరళలో లాగా గ్రామీణ పేదల ప్రత్యేకించి ప్రయోజనం షాందనున్న బార్జాదార్ల మద్దతుని సమీకరించే ప్రయత్నం జరిగింది. సంస్కరణల అమలుకు వారి చురుకైన ఖాగస్వామ్యం అవసరమని వారిని వైతన్యపరచటం జరిగింది. అంతేగాక ప్రభుత్వ కార్యక్రమౌల్ని
533 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జయప్రదంగా అమలు చేయడంలో సాధారణంగా పెద్ద ఆటంకాలుగా పనిచేసే పట్వారీలు లాంటి క్రింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులను తటస్థ పరచటం జరిగింది. పచ్చిమబెంగాలు ప్రభుత్వం ఆపరేషన్ బార్జాని ప్రారంభిస్తూనే పేదలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా వ్యక్తీకరించేందుకు రెవెన్యూ అధికారుల వైఖరి మార్చేందుకు శిక్షణా తరగతులు నిర్వహించింది. దూరంగా వుండే గ్రామీణ ప్రాంత శిబిరంలో నిర్వహింపబడే 380 నుండి 4౦ మంది వ్యవసాయ కార్మికులు పాలికాపులు 18 మంది భూ సంస్మరణ యితర సంబంధిత శాఖల అధికారులు శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. వీరంతా కలిసి వుంటారు. కలిసి తింటారు. చర్చల్లో పాల్గొంటారు.
ఆపరేషన్ బార్గా పెద్ద ఎత్తున పాలికాపుల్ని నమోదు చేయడానికి ఫలితంగా వారి కౌలు వ్యవధికి రక్షణ కల్పించటానికి దారితీసినప్పటికి ఆ క్రమం పూర్తి చేయటం సాధ్యపడలేదు. మధ్యలో ఆగిపోయింది. అందుకు గణనీయమైన కారణాలు వున్నాయి. మొదటిది ఆపరేషన్ బారా కొనసాగింపు రాజకీయంగా ఆచరణీయం కాదు. నైతికంగా సమర్థనీయం కాదు అని గుర్తించబడింది. ఆపరేషన్ బార్ధా కార్యక్రమంలో తటస్థపదిన భూస్వాములవి పెద్ద కమతాలు కావు. వీరూ వ్యవసాయ దారులే. వీరి కమకాలు పాలి కాపుల కమతాల కంటె నామమాత్రంగా పెద్దవి. భూస్వాములకు పంటలో నాల్లవవంతు చెందుతుంది. మిగిలింది పాలికాపులకి చెందుతుంది. పశ్చిమబెంగాలులో కాలక్రమంలో అత్యధిక మెజారిటీ వ్యవసాయదారులు 5 ఎకరాల లోపు వ్యవసాయదారులు, చిన్న కమతాల సం(ద్రంలో కరిగిపోయారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎదుర్కొన్న సందిగ్దావస్టే చిన్న భూస్వామి కౌలుదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యతని పరిరక్షించడం ఎలా? అనే సందిగ్భావస్థ యిక్కడ ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు కౌలుదారీచట్టం ముందుగానే ఈ అంశాన్ని ఊహించి దీనికనుగుణమైన నిబంధనలను చేర్చింది. |
మరొక సమస్య బెంగాలులో వున్న భూమి మనిషి నిష్పత్తిని బట్టి భూ యాజమాని ఒక చిన్న భూ ఖండాన్ని యిద్దరూ అంతకంటె ఎక్కువమంది పాలికాపులు లేక బార్జాదార్ల మధ్య తిప్పగలిగితే అంటే ప్రతిచిన్న భూ ఖండానికి కౌలు హక్కులు కోరే బార్లాదార్లు ఒకరికంటె ఎక్కువ వుండవచ్చు. ఒకరిపేరు శాశ్వతంగా నమోదు చేయడమంటే మరొకరిని తొలగించడమే. బార్జాదార్లు అందరూ నమాదు చేయబడితే ఒక్కొక్కరికి దక్కేది చిన్న ముక్క మాత్రమే (వ్యవసాయానికి కనుకూలం కానంత చిన్న ముక్కలు) ఆ విధంగా ఆపరేషన్ బార్జా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడాన్ని రాజకీయ ఆర్థిక పరిమితులు స్వతంత్రం తర్వాత భారతదేశం 589
అద్దుకున్నాయి. 'దున్నేవాడికి భూమి లేక ప్రతి వ్యవసాయదారునికి కౌలు వ్యవధికి పూర్తి రక్షణ అమలు జరపడానికి వాస్తవ పరిస్థితులు అనుమతించలేదు. కౌలుదారీ సంస్కరణ పరిమితులు
ఆ విధంగా కౌలుదారులందరి కౌలు వ్యవధికి రక్షణ కల్పించాలన్న కౌలుదారీ చట్టం యొక్కమొదటి లక్ష్యం పాక్షిక విజయాన్నే సాధించింది. కాలుదారులలో అత్యధికులు (వారిలో చాలామంది భూ యాజమానులు కూడా అయ్యారు) రక్షణ పొందినప్పటికి యింకా రక్షణ లభించని వారు పెద్ద సంఖ్యలో వున్నారు. కేరళ, బెంగా ల్లలో పాక్షిక విజయాలు సాధించినప్పటికి ఆచరణలో ఎలాంటి రక్షణ లేని కౌలుదారీ విధానం అంబే పంటలో నిర్జీత వాటా యిచ్చే పద్ధతిగానే నిరీత మొత్తం డబ్బు రూపంలో యిచ్చే పద్ధతిగాని పెద్ద ఎత్తున నోటి మాటల ఒప్పందాలు కొనసాగుతున్నాయి. రక్షణ లేని కౌలుదారులు పెద్ద సంఖ్యలో కొనసాగడం వలన కౌలుదారీ చట్టంలోని రెండవ పెద్ద లక్ష్యమైన “న్యాయమైన స్థాయికి కౌలురేట్లని తగ్గించడం దాదాపు అసాధ్యమయింది. మార్కెట్ పరిస్థితి ఉదాహరణకు వలస పాలన కాలంలో పెరిగిన మనిషి పొలం నిష్పత్తి ఎక్కున కౌళ్తకు దారితీసింది. అలాంటి పరిస్థితిలో చట్టబద్ధమైన న్యాయమైన కౌళ్లు రక్షణ పొందిన కౌలుదార్లకు (అంటే తొలగించడానికి మార్చటానికి వీలుపడని కౌలుదార్లకు) వర్తింపజేయవచ్చు.
సాగుచేసే రైతులు చెల్లించవలసిన కౌలుని క్రమబద్ధం చేస్తూ అన్ని రాష్ట్రాలలో శాసనం చేయబడింది. అత్యధిక రాష్ట్రాలు మొదటి, రెండవ ప్రణాళికలు సూచించిన గరిష్ట కౌళ్లని అంటే ఉత్పత్తిలో 20 నుండి 25 శాతాన్ని నిర్ణయించాయి. పంజాబు హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (కోస్తా ప్రాంతాలు) అంతకంటె ఎక్కువగా ౩8.8 నుండి 40 శాతం వరకు నిర్ణయించాయి. కాని ఆచరణలో దేశంలోని అన్ని ప్రాంతాలో కౌలు మార్కెట్ రేటు ఉత్పత్తిలో 50 శాతంగా వుంది. అంతేగాక రైతు ఉత్పత్తి వ్యయం మొత్తంగా గొని పాక్షికంగాని భరించాలి. 1960 దశాబ్దం చివరిలో ప్రారంభమైన హరితవిప్లవం - పొలం విలువను దాంతో పాటు కౌలురేట్లు పెంచడం (పఫంజాబులోని కొన్ని (ప్రాంతాలలో 70 శాతం వరక్సు)లో సమస్యల్ని తీవ్రతరం చేసింది. మరీ బాధాకరమైన అంశమేమీటంటే పేదలు రక్షణ పొందని కౌలుదార్లు లేక పాలికాపులు మాత్రమే మార్కెట్ రేటు ప్రకారం కౌళ్లు లేక పంటలో పాలు చెల్లించారు. అనువంశిక హక్కులను పొందిన పై స్థాయికి చెందిన కౌలుదార్లు చట్టపరమైన కౌలురేట్లను అమలు జరిపించుకోగలిగారు. 540 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కౌలు చట్టంలోని మూడవ లక్ష్యమైన కౌలుదార్లకు యాజమాన్యహక్కులు కల్పించడం కూడా పాక్షికంగా సాధించబడింది. మనం యింతకు ముందు కొంత వవరంగా గమనించినట్లు, భూస్వాములు తిరిగి పొలం పొందే హక్కు వినియోగం, చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా ఖాళీ చేయించడం - స్వచ్చందంగా అప్పగించడం, కౌలు ఒప్పందాలు నోటిమాటల ఒప్పందాలకు మార్పు వగైరాలు. ఈ లక్ష్యాన్ని తగినంతగా సాధించే అవకాశాన్ని తగ్గించాయి. అయినప్పటికి పెద్ద సంఖ్యలో కౌలుదారులు యాజమాన్య హక్కులు పొందగలిగారు.
దురదృష్టవశాత్తు ఈ అంశంపై దేశం మొత్తం మీద సమాచారం లభ్యం కావడం లేదు. కాని కాన్ని ప్రత్యేక ప్రాంతాలపై జరిపిన అధ్యయనాలు సూచికగా పనిచేస్తాయి. పి.యస్. అప్పు 1975లో రాశాడు. ఇటీవలి సమాచారాన్ని బట్టి గుజరాత్లో వున్న 1.3 మిలియన్ల కౌలుదార్లలో సగం మందికి పైగా అంటే సుమారు 0.77 మిలియన్ల మంది యాజమాన్య హక్షుల్ని కొన్నారు. మహారాష్ట్రలోని 2.6 మిలియన్ల కౌలుదార్లులో 1.1 మిలియన్ల (దాదాపు సగం) మంది యాజమాన్య హక్కులు పొందారు. ఇతర రాష్ట్రాలలో కూడా గణనీయమైన సంఖ్యలో యజమానులయ్యారు (వీరు గాక జమీందారీ (ప్రాంతాలలో మధ్యవర్తులను (దళారీలను) తొలగించడం వలన 20 మిలియన్ల మంది యజమానులయ్యారు). ఇంకా పెద్ద సంఖ్యలో కౌలుదారులు యాజమాన్య హక్కులు పొందకపోవదానికి కారణం పెద్ద సంఖ్యలో శాశ్వత అనువంశిక హక్కులు, కౌలు తగ్గింపు పొందిన వీరు అన్ని అంశాలలో దాదాపు యాజమానులు లాగానే వ్యవహరిస్తున్నారు. గనుక పూర్తి యాజమాన్యం పొందేందుకు అంతగా (ప్రేరణ లేదు.
జమీందారీ విధానం రద్దు, కౌలుదారీ చట్టం, గరిష్టపరిమితి చట్టం - ఈ మూడింటి సమిష్టి ఫలితంగా భూ సంస్కరణల ప్రధాన లక్ష్యాలలో ఒకటైన - పెట్టుబడులు పెట్టి అధిక ఉత్పత్తిని సాధించే అభివృద్ధిపరమైన వ్యవసాయదారుల సృష్టి జరిగింది. భారతదేశంలోని భూ సంస్కరణలను అధ్యయనం చేసినవారు. ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త డేనియర్ థార్నర్ 1968లో యిలా పేర్కొన్నాడు. కొన్ని లాయింపులు లోపాలు వున్నప్పటికి గతంలో బలహీనమైన కౌలుదారులుగా వున్న చాలామిలియన్లు కొలది వున్న వ్యవసాయదారులు రక్షణ పొందిన కౌలుదారులు, యాజమానులు కాగలిగారు.
వచ్చిన మార్పులను వరుసగా పరిశీలిస్తే వీటి యొక్కసమిష్టి ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. జమీందారీ విధానం రద్దు 20 మిలియన్ల కౌలుదారులు యాజమానులుగా మారడానికి, పరోక్ష జమీందారుల్ని ప్రత్యక్ష వ్యవసాయం వైపు మరల్చి వ్యక్తిగత వ్యవసాయం స్వతంత్రం తర్వాత భారతదేశం ఛ41
చేపట్టడానికి దారితీసింది. రైత్వారీ ప్రాంతాలలో దాదాపు సగం మంది కౌలుదారులు ఉదాహరణకు బొంబాయి, గుజరాత్‌లలో భూ యాజమానులయ్యారు. అంతేగాక కౌలుదారుల్ని ఖాళీ చేయించిన 50 శాతం పొలాల్లో (బొంబాయిలో దాదాపు 70 శాతం) యాజమానులు ప్రత్యక్ష వ్యవసాయం చేపట్టారు. అంటే వాటిని కౌలుకు యివ్వలేదు. 0లో రైత్వారీ విధానం వున్న ప్రాంతాలు గణనీయమైన సంఖ్యలో దిగువ స్థాయి కౌలుదారులు అనువంశిక హక్కులు (గుజరాతు, మహారాష్ట్రలో సగం మంది) పొందారు. పశ్చిమ బెంగాలు లాంటి గతజమీందారీ ప్రాంతాలలో కూడా దాదాపు సగం మంది పాలికాపులు అనువంశిక హక్కులు పొందారు. అంతేగాక 3-5 మిలియన్ల భూ మిలేని వ్యవసాయదారులు సీలింగు చట్టాల క్రింద ప్రకటించబడిన మిగులు భూమిని పొందారు. పావన ఇప్పుడు అనువంశిక హక్కులు పొంది తగ్గించిన కౌలుని చెల్లిస్తున్న కౌలుదారులు పులు యాజమాన్య హక్కులు పొందిన కౌలురైతులు గరిష్ట పరిమితిని మించి మిగులు భూమిగా ప్రకటించబడిన పొలాన్ని పొందిన భూమిలేని పేదలు - ప్రత్యక్ష స్టవసాయదారులైన పరోక్ష భూస్వాములు - అందరికే వారిస్వంత వనరుల నుండి లేక ఉయ్. లకు కూడా సంస్థాగత వనరుల నుండి లభ్యమవుతున్న రుణాల్ని గొని గించుకొని అభివృద్దికరమైన రైతులు కావాలనే (పేరణ వుంది. 542 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
3శ అలి జి భూ సంస్కరణలు -3 ఆ మ గరిష్ట మురిమితి - భూ దానోద్యమం, జి భూ గరిష్ట పరిమితులు
భూ పంపకం న్యాయబద్ధంగా చేసేందుకు గరిష్ట పరిమితులను విధించడం భూసంస్క్మరణ లక్ష్యం. కాని ఈ సమస్యపై సామాజిక అనుకూలత లేదని చెప్పలేం గాని బలహీనంగా వుంది. ఈ కార్యక్రమం అమలు జరపడంలో ఎదుర్శొన్న ఇబ్బందులు దీనిని ప్రతిఫబించాయి.
ఆలిండియా కిసాన్‌సభ 1946లో గరిష్ట పరిమితి 25 ఎకరాలుగా వుండాలనే డిమాండుని బలపరిచింది. స్వతంత్రం వచ్చిన వెంటనే కాంగ్రెస్ భూ గరిష్ట పరిమితి ఆలోచనని అధికారికంగా ప్రవేశపెట్టింది. ఎ.ఐ.సి.సి. 1947 ఆగస్టులో ఆర్థిక కార్యక్రమాన్ని రూపొందించేందుకు కమిటీని నియమించింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ కమిటీ కమతాల గరిష్ట పరిమితి నిర్ణయించబడాలి. గరిష్ట పరిమితికి మించిన మిగులు భూమి సహకార సంఘాల అధీనంలో వుంచబడాలి అని సిఫార్సు చేసింది. అదే విధంగా కుమరప్ప అధ్యక్షతన నియమించబడిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ కూడా కమతం యొక్క గరిష్ట పరిమితి ఎకనామిక్ విల్టింగుకి మూడు రెట్లు వుండాలని సిఫార్సు చేసింది. కమిటీ తన రిపోర్టుని 1949 జూలైలో సమర్పించింది (వ్యవసాయదారునికి హేతుబద్దమైన స్థాయి గల జీవితాన్ని యిస్తూ సాధారణమైన పరిమాణం గల కుటుంబానికి ఒక జత ఎద్దులకు పని కల్పించగలిగిన కమతం ఎకనామిక్ హాల్దింగుగా నిర్వచించబడింది). స్వతంత్రం తర్వాత భారతదేశం క5్కకి
మొదటి ప్రణాళిక (1951-56) కూడా ఒక వ్యక్తి కలిగి వుండే పొలానికి గరిష్ట పరిమితి వుండాలని చెప్పింది. కుమరప్పు కమిటీ సూచించిన గరిష్ట పరిమితి సరియైనదని ప్రణాళిక అంగీకరిస్తూనే రాష్ట్రం దాని యొక్క వ్యవసాయ చరిత్ర, ప్రస్తుత సమస్యల్ని గమనంలో పెట్టుకొని గరిష్ట పరిమితిని నిర్ణయించాలని పేర్కొన్నది. అంతేగాక 1958లో సేకరించబోయే రైతు, వ్యవసాయానికి సంబంధించిన గణాంక వివరాలు ఈ నిర్ణయానికి సమాచారాన్ని సమకూర్చుతాయని కూడా పేర్కొన్నది. స్పష్టంగా గరిష్ట పరిమితి అమలు జరిపే తక్షణ కార్యక్రమం లేదు. అవసరమైన సర్వే జరిపి గరిష్ట పరిమితి చట్టాన్ని పటిష్టంగా అమలు జరిపే యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు రెండు లేక మూడు సంవత్సరాల వ్యవధి అవసరమని మొదటి ప్రణాళిక అంచనా వేసింది.
కాబట్టి అభిమతాలు సిఫార్సుల ప్రకటనలు వెలువడినప్పటికి స్వతంత్రానంతర తాలి సంవత్సరాలలో గరిష్ట పరిమితుల సమస్యలపై యిలాంటి పురోగతి లేకపోవటం ఆశ్చర్య జనకం కాదు. కాంగ్రెస్ ఈ అంశాన్ని గుర్తించింది. 1953లో ఆగ్రాలో జరిగిన ఎఐసిసి సదస్సులో “సాధ్యమయ్యే మేరకు భూమి లేని కార్మికులకు భూమిని పునఃపంపిణీ చేసే లక్ష్యంతో భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి కమతాలపై గరిష్ట పరిమితులను నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టారు అని కోరింది. ఈ వైఖరినే కాంగ్రెస్ వర్కింగు కమిటీకి ఎఐసిసి తరువాత కొన్ని సంవత్సరాలు పునరుద్దాటించాయి. కాన్ని రాష్ట్రాలు యింతకు ముందే ఆమోదించిన గరిష్ట పరిమితి చట్టాలను 1960 నాటికి అమలు జరపాలని యితర రాష్ట్రాలు అలాంటి చట్టాన్ని 1958-59 నాటికి ఆమోదించాలని 1957లో జాతీయాభివృద్ధి మండలి (106) న్థాయి సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది (1952 లో యన్.డి.సి స్థాపించబడింది. ఇది అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలను చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నెహ్రూ అధ్యక్షతన సమావేశమయ్యే వేదిక).
ఈ మధ్యకాలంలో దేశంలోని పలు (ప్రాంతాలలో, పత్రికలలో పార్లమెంటులో, రాష్ట్ర అసెంబ్లీలో, కాంగ్రెస్ పార్టీలోనూ గరిష్ట పరిమితులకు వ్యతిరేకత పెరుగుకూ వచ్చింది. గ్రామీణ భూస్వాములు, పట్టణ సంపన్నులు, ప్రైవేటు ఆస్తి హక్కుకు ముప్పు వాటిల్లనున్నట్లు ఆందోళన జెందారు. 1959 జనవరిలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ నాగపూరు సదస్సు నాటికి పరిస్థితులు ఒక స్వరూపం తీసుకున్నాయి. బహిరంగ సదస్సుకు ముందు ప్రముఖ కాంగ్రెస్‌వాదులు సబ్జెక్టు కమిటీ వ్యతిరేకించినప్పటికి నాగపూర్ కాంగ్రెస్ (2959 జనవరి) భూ సంస్కరణలకు సంబంధించిన అస్పష్టతను తొలగించి ర్శ4 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రైతుకి స్థిరత్వాన్ని చేకూర్చేందుకు కమతాలపై గరిష్ట పరిమితులు నిర్ణయించబడాలని 1959 సంవత్సరాంతానికి ఆ మేరకు చట్టం అన్ని రాష్ర్రాలచే ఆమోదింపబడాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతేగాక మిగులుగా ప్రకటించబడిన భూమి పంచాయితీల అధీనంలో వుంచి పొలం లేని కార్మికులతో కూడిన సహకార సంఘాల ద్వారా నిర్వహింప బడాలి.
నాగపూర్ సదస్సు తరువాత విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ యన్.జి.రంగా 1958లోనే గరిష్ట పరిమితి ఆలోచనని విమర్శిస్తూ 100 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతో నెహ్రూకి లేఖ పంపించాడు. 1959 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. నాగపూర్ సదస్సు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మితవాద శక్తులు బలపడడానికి తోద్బడింది. భూ గరిష్ట పరిమితి నిర్బంధ సహకారీకరణ ప్రతిపాదనతో కలత చెందిన యన్.జి.రంగా, సి.రాజగోపాలాచారి జాతీయీకరణకు పబ్లిక్ సెక్టరు, (ప్రైవేటు సెక్టారుని ముంచెత్తటానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన స్వేచ్భా వాణిజ్య వేదిక ముఖ్య నాయకుడైన మినూ మసానీతో చేతులు కలిపారు. యన్.జి. రంగా అధ్యక్షుడుగా స్వతంత్రపార్టీని స్థాపించారు.
జమీందారీ విధానం రద్దు వలన ప్రయోజనాలు పొందినవారు గతంలో కౌలుదారులుగా వుండి యిప్పుడు భూమి యాజమానులైన వారు కూడా గరిష్ట పరిమితిని అమలు పరచడం ద్వారా భూసంస్మరణలోని తరువాత చర్యగా చేపట్టనున్న భూమి పంపిణీ 'ప్రయత్నానికి వ్యతిరేకంగా నిలిచిన శ్రేణుల వెనుక సమీకృతులయ్యారు.
గరిష్ట పరిమితి చట్టాన్ని రూపొందించి అమలు జరపవలసింది. రాష్ట్రాలు గనుక చట్టాన్ని వ్యతిరేకించిన వారు రాష్ట్రాలలోని విజయం సాధించాలి. నాగపూరు సదస్సు తరువాత సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలు నాగపూర్ తీర్మానాన్ని అమలు జరిపేందుకు గట్టి ప్రయత్నాలు చేయలేదు. గరిష్ట పరిమితుల సమస్య సాచివేత వైఖరికి గురయింది. అత్యధిక రాష్రాలు 1961 చివరికి అంటే అధికారికంగా ప్రయత్నం ప్రారంభించిన తరువాత 14 సంవత్సరాలకు చట్టాన్ని ఆమోదించాయి.
భూ గరిష్ట పరిమితి చట్టంలోని బలహీనతలు విపరీతమైన జాప్యం, చట్టం యొక్క స్వభావం - గరిష్ట పరిమితులు చాలా కొద్దిపాటి భూమిని మాత్రమే పంపకానికి మిగుల్చుతాయని స్పష్టం చేశాయి. మొత్తం మీద చాలా రామ్ల్రైల గరిష్ట పరిమితి చట్టాలలో చాలా పెద్ద లోపాలున్నాయి. మొదటిది భారతదేశంలోని 70 శాతానికి పైగా కమతాలు స్వతంత్రం తర్వాత భారతదేశం ర్శీర్
5 ఎకరాల కంటె తక్కువగా వున్న పరిస్థితిలో రాష్ట్రాలు విధించిన గరిష్ట పరిమితి చాలా ఎక్కువగా వుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట పరిమితి (పాలం తరవిని బట్టి) 27 నుండి 312 ఎకరాల వరకు అస్సాంలో 50 ఎకరాలు, కేరళ 15 నుండి 375 ఎకరాలు పంజాబు 30 నుండి 60 ఎకరాలు పశ్చిమబెంగాలు 25 ఎకరాలు, మహారాష్ట్ర 18 నుండి 126 ఎకరాలు. అంతేగాక చాలా రాష్ట్రాలలో మొదట గరిష్ట పరిమితులు, కుటుంబ కమతాల మీదగాక వ్యక్తిగత కమతాలపై నిర్ణయించబడ్డాయి. ఫలితంగా భూస్వాములు గరిష్ట పరిమితి నుండి తప్పించుకొనడానికి బంధువుల మధ్య పంచటానికి వెసులుబాటు కల్పించబడింది. అంతేగాక భూస్వామి కుటుంబ సభ్యులు 5 కంటె ఎక్కువగా వుండే గరిష్ట పరిమితి పెంచబడింది. ఈ నిబంధన ననుసరించి కేరళలో 67 శాతం, మధ్యప్రదేశ్‌లో 90 శాతం, బీహారులో, మద్రాసు, మహారాఫ్రలలో 100 శాతం, త్రిపురలో 140 శాతం పెంచబడింది. ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబాలలో ఐదుగురుకి మించిన ప్రతి అదనపు సభ్యునికి 6నుండి 72 ఎకరాల వరకు (భూమి తరహాని బట్టి) అనుమతించబడింది. ఈ ఉదారమైన పరిమితులకు మించి పొలాలు కలిగి వున్న కుటుంబాలు చాలా తక్కువ. గరిష్ట పరిమితిని మించి చాలాకొద్ది కమతాలు వున్న జమ్మూ - కాళ్ళీర్, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబు లాంటి కొన్ని రాష్ట్రాలలో కుటుంబ పరిమాణాన్ని బట్టి ఎలాంటి మినహాయింపులు అనుమతింపబడలేదు. రెండవది : కొన్ని రకాల పొలాలు గరిష్ట పరిమితి నుండి మినహాయింపుబడవచ్చునన్న రెండవ ప్రణాళిక సిఫార్సులననుసరించి అత్యధిక రాష్ట్రాలు గరిష్ట పరిమితులకు చాలా మినహాయింపుల్ని అనుమతించాయి. టీ, కాఫీ, రబ్బరు తోటలు, పండద్లతోటలు, పశుపోషణ, పాడిపరిశ్రమ ఉన్ని ఉత్పత్తికి నిమగ్నమైన ప్రత్యేకమైన పొలాలు, చక్కెర ఫ్యాక్టరీల ఆధ్వర్యంలో చెరుకు తోటలు, భారీ పెట్టుబడులతో సమర్ధవంతంగా నిర్వహింపబడుతున్న వ్యవసాయ క్షేత్రాలు గరిష్ట పరిమితుల నుండి మినహాయింపులు పొందాయి. అదే సమయంలో కౌలుదారులు పాలికాపుల ద్వారా పెద్ద భూస్వాములు చేపట్టిన పరోక్ష భూస్వామ్య విధానానికి అంతం పలికి వారు పెద్ద ఎత్తున అభివృద్దికరమైన పెట్టుబడిదారీ వ్యవసాయం చేపట్టేలా (ప్రోత్సహించటం కూడా సంస్కరణల లక్ష్యం. మినహాయింపులు యివ్వడం అసంబద్ధమైన స్థాయికి చేరింది. ఉదాహరణకు తమిళనాడు 26 తరహాల మినహాయింపులు యివ్వటం జరిగింది. సమర్థవంతంగా నిర్వహింపబడుతున్న వ్యవసాయ క్షేశ్రాల పరిగణనకు సరియైన ప్రమాణం లేదు. అధిక సంఖ్యలో పెద్ద భూస్వాములు స్వయంగా గరిష్ట పరిమితుల నుండి బయటపడడానికి ర్46 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సమర్థవంతమైన వ్యవసాయదారులుగా ్రకటించుకొన్నారు. అలాగే మద్రాసు ప్రభుత్వం ప్రతిపాదించిన సహకార సంఘాల నిర్వహణలో వున్న పొలాలకు గరిష్ట పరిమితుల నుండి మినహాయింపు కూడా పెద్ద భూస్వాములు తమ పొలాలను నకిలీ సహకార క్షేత్రాలకు బదిలీ చేయించుకొనడం ద్వారా దుర్వినియోగపరచబడింది. కాని మరొకవైపు గరిష్ట పరిమితి చట్టాలు కనీసం కొందరు భూస్వాములు తమ పొలాలు అన్యాక్రాంతం కాకుండా నివారించుకొనేందుకు సమర్ధవంతమైన ప్రత్యక్ష వ్యవసాయంలోకి మారటానికి దారితీసింది.
గరిష్ట పరిమితి చట్టం తీసికొని రావడంలో జరిగిన విపరీతమైన జాప్యం చాలావరకు దాని లక్ష్యాన్ని దెబ్బతీసింది. పెద్ద భూస్వామి వారి మిగులు భూమిని అమ్ముకొనడానికి గాని లేక బంధువుల పేర్లలో నకిలీ బదలాయింపులు బినామి బదలాయింపులు చేయడానికి వ్యవధి లభించింది. అంతేగాక, భూస్వాములు తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో అభివృద్ధికరమైన వ్యవసాయానికి మారామని ప్రకటించుకొని కౌలుదారుల్ని పొలాల నుండి నెట్టివేయడానికి పాల్పడ్డారు. ఆవిధంగా గరిష్ట పరిమితాల చట్టాలు అమలు జరిపే సమయం వచ్చేటప్పటికి దాదాపు ఏ కమకాలకు గరిష్ట పరిమితికి మించిన పొలమూ లేదు. కాంగ్రెస్ నాయకత్వం ఈ పరిస్థితిని గుర్తించింది.
1961 నాటికి అత్యధిక రామాలు గరిష్ట పరిమితి చట్టాలను ఆఅమోదించినప్పటికి బీహారు, మైసూర్, కేరళ ఒరిస్సా, రాజస్ట్రాన్ లాంటి రొఘ్ట్రాలలో 1970 సంవత్సరానికి కూడా కనీసం ఒక్క ఎకరమైనా మిగులు భూమి వున్నట్లు ప్రకటించబడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1400 ఎకరాలు మిగులు భూమి ప్రకటించబడింది. కాని ఎలాంటి పరిపక్వం జరగలేదు. ఒక జమ్మూ కాళ్ళీరలో మాత్రం గరిష్ట పరిమితులు పూర్తిగా అమలు జరపబడ్దాయి. 1955 సంవత్సరం నాటికి 2,30,000 ఎకరాలు మిగులు భూమి కౌలుదారులకు భూమి లేని శ్రామికులకు అది కూడా ఎలాంటి పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేయబడింది. కాని భారతదేశం మొత్తంగా చూస్తే 1970 సంవత్సరాంతానికి 2.4 మిలియన్ల ఎకరాలు మిగులు భూమిగా ప్రకటించబడింది. దానిలో సగం మాత్రమే భారతదేశం మొత్తం సాగుభూమిలో కేవలం 0.8 శాతం మాత్రమే పంచబడింది.
గరిష్ట పరిమితుల అమలులోని వైఫల్యంతో 1960 దశాబ్దం మధ్య నుండి గ్రామీణ ప్రాంతాలలో కొత్త సమీకరణలో ప్రారంభమయ్యాయి. ధనిక రైతుల ఏకీకరణ జరిగింది. బికెడి (1967లో సి.బి.గుప్తా నాయకత్వంలోని కాంగ్రెస్ పొర్టీ ప్రభుత్వాన్ని స్వతంత్రం తర్వాత భారతదేశం ర్&7
పడగొట్టిన తరువాత చరణ్ సింగ్ స్థాపించిన పార్టీ) లాంటి పార్టీల స్థాపనతో వారి స్పష్టమైన రాజకీయాఖిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బికెడి తరువాత స్వతంత్ర పార్టీ యింకా యితర పార్టీలతో కలిసి 1974లో బియల్డి (31.0) అయింది. బియల్డి 1977లో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ యొక్క ముఖ్యమైన భాగం.
1960 దశాబ్దం మధ్యకాలం నాటి ద్రవ్యోల్బణం రూపాయి విలువ తగ్గింపు,
భారత పాకిస్తాన్ యుద్ధం లాంటి రాజకీయ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాలలో బలమైన వ్యవసాయ సమూల సంస్క్మరణవాద వైఖరి ఆవిర్భవించింది. సిపిఐ(యయం.యల్) నాయకత్వంలోని నక్సలైటు ఉద్యమం 1960 దశాబ్దాంతానికి పశ్చిమబెంగాల్లో, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహారుల్లోని కాన్ని ప్రాంతాలకు విస్తరించింది. 1970 లో పశ్చిమబెంగాల్ లాంటి కొన్ని రాష్ర్రాలలో, అంతకు ముందు సంవత్సరాలలో దేశంలోని పలు ప్రాంతాలలో కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల నాయకత్వంలో భూ ఆక్రమణ ఉద్యమం చేపట్టబడింది. ఈ సందర్భంగా 1969-70లో అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహారు, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పళ్చిమబెంగాల్లలో అలజడులు జరిగాయి. ఆక్రమింపబడిన భూమి చాలా తక్కువే, బంజరు భూములు, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంచని పొలాలు మాత్రమే ఆక్రమించబడ్డాయి. ఉద్యమం అణచివేయబడింది. 20,000 మంది క్రియాశీల రాజకీయ కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు. కాని భూ ఆక్రమణ పరిమితమైన విజయమే సాధించినప్పటికి మొత్తం మీద ఉద్యమం ప్రతీకాత్మక ప్రభావం చూపింది. నాటకీయంగా జాతి దృష్టి వ్యవసాయ సమస్యపై పడింది.
ఈ నేపథ్యంలో 1960 దశాబ్దం, 1970 దశాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో భూ సంస్కరణ ప్రయత్నాలు రెండవదశలో వున్నాయి. జాతీయాభివృద్ధి మండలి యొక్క భూ సంస్కరణల అమలు కమిటీ 1964 జూన్‌లో సమావేశమయింది. లోపాలు లేకుందా భూ సంస్కరణ చట్టాలు చేసి అమలు జరపవలసినదిగా ముఖ్యమంత్రులపై వత్తిడి తెచ్చింది. 1960 దశాబ్దం చివర ప్రత్యేకించి 1969 తరువాత ఇందిరాగాంధీ వామపక్ష దిశగా మొగ్గుచూపడంతో ఈ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. 1970 సెష్టెంబరులో ఆమె ముఖ్యమంత్రుల కొరకు ఏర్పాటు చేసిన భూ సంస్కరణల సదస్సులో గ్రామీణ ప్రాంతాలలో అసంతృప్తి హింస చెలరేగడానికి కారణాన్ని ఇలా వివరించారు.
“జాతీయోద్యమ కాలంలో లక్షలాది రైతులలో రేకెత్తించిన ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా అమలు పరచిన, భూ సంస్కరణ చర్యలు విఫలమయ్యాయి. 548 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సంక్షిప్తంగా చిన్నరైతులు కౌలుదారులు భూమిలేని కార్మికులు నూతన వ్యవసాయ విధానంలో పొలు పంచుకొనేలా సంస్థాపరమైన పరిస్థితులను మనం యింకను సృష్టించవలసి వుంది. ముఖ్యమంత్రుల సదస్సులో గరిష్ట పరిమితుల తగ్గింపు సమస్య చర్చించబడింది. ముఖ్యమంత్రులలో అత్యధికులు ప్రతిపాదనని తిరస్కరించారు. ఇదీ యింకా సదస్సులో వివాదాస్పదంగా వున్న యితర సమస్యలు కేంద్ర భూసంస్కరణల కమిటీ సమాలోచనకు నివేదించబడ్డాయి. 1971 ఆగస్టులో కమిటీ గరిష్ట పరిమితులలో గణనీయమైన తగ్గింపు, సమర్ధవంతమైన వ్యవసాయానికి యివ్వబడిన మినహాయింపుల ఉపసంహరణ, కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని గరిష్ట పరిమితుల వర్తింపుతో సహా పలు సిఫార్సులు చేసింది.
1971, 1972 ఎన్నికల తరువాత మరికొంత బలోపేతమైన కాంగ్రెస్ 1972 జూలైలో ముఖ్యమంత్రుల సమావేశం జరిపి నూతన జాతీయ మార్గదర్శకాలను అమోదింపజేసింది. నూతన మార్గదర్శకాలు కేంద్ర భూ సంస్మరణ కమిటీ 1971 ఆగస్టులో చేసిన సిఫార్సులు ప్రాతిపదికగా రూపొందించబడ్డాయి. 1972 జూలై మార్గదర్శకాలలోని ముఖ్యమైన అంశాలు.
-
నిరంతరం నీటి పారుదల సౌకర్యం గలిగి రెండు పంటల సాగు పొలాలకు గరిష్ట పరిమితి 10-18 ఎకరాలు. ఒక పంట పండించే పొలానికి 27 ఎకరాలు. తక్కువ రకం మెట్ట పొలాలకు 54 ఎకరాలు. "
-
ఐదుగురు సభ్యులు (భర్త, భార్య ముగ్గురు మైనరు పిల్లలు) గల కుటుంబం యూనిట్‌గా తీసుకొని గరిష్ట పరిమితి వర్తింపజేయబడుతుంది. ఈ సంఖ్యకి మించి వున్న
ట్ కుటుంబాలకు అదనప సభ్యునికి అదనపు భూమి అనుమతించబడుతుంది. కాని గరిష్ట పరిమితి ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి రెట్టింపుగా నిర్ణయించబడుతుంది.
- మిగులు భూమి పంపకంలో భూమి లేని వ్యవసాయ కార్మికులకు - ప్రత్యేకించి షెద్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారికి ప్రాధాన్యత యివ్వబడుతుంది.
4 మిగులు భూమికి పరిహారం మార్కెటు రేటు కంటే తక్కువగా కొత్తగా కేటాయించబడిన వారికి అందుబాటులో వుంటుంది.
1952 మార్గదర్శకాలననుసరించి అత్యధిక రాష్ట్రాలు (గరిష్ట పరిమితి చట్టాలు లేని ఈశాన్య భారత రాష్ట్రాలు, గోవాని మినహాయించి) గరిష్ట పరిమితుల్ని తగ్గిస్తూ
భూ పరిమితి చట్టాన్ని ఆమోదించాయి. గరిష్ట పరిమితి చట్టాలకు ప్రతిఘటన, గరిష్ట స్వతంత్రం తర్వాత భారతదేశం ర్49ి
పరిమితిని ఠలాయించే ప్రయత్నాలు పలు రకాలుగా కొనసాగాయి. దేశ వ్యాష్తంగా గల కోర్టులలో వందల వేల కేసులు దాఖలు చేయబడ్డాయి. ఒక అంచనా మేరకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 5,00,000 కేసులు పెండింగులో వున్నాయి.
ఈ ప్రమాదాన్ని అద్దుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం 1974 ఆగస్టులో పార్ల్షమంటులో రాజ్యాంగానికి 34వ సవరణని ఆమోదింపజేసింది. సవరించబడిన సీలింగు చట్టాలు రాజ్యాంగ ప్రాతిపదికన సవాలు చేయబడడం సాధ్యపడకుందా రాజ్యాంగం యొక్క 90వ షెడ్యూలులో చేరబడద్దాయి.
తిరిగి చేపట్టిన ప్రయత్నాలు మిగులు భూమి పంపిణీలో కొంత అభివృద్ధి సాధించింది. కాని మొత్తం మీద ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. 1970ల సీలింగు చట్టాలు ఫలితంగా 1980 దశాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో 2.27 మిలియన్ల ఎకరాల భూమి పంచబడింది. కాని 32.25 మలియన్న ఎకరాల భూమిని సీలింగుల నుండి తగ్గించేందుకు ఉద్దేశ పూర్వకంగా చెల్లా చెదరు చేయబడింది.
1985 మార్చి నాటికి మిగులు భూమిగా ప్రకటించబడిన 7.2 మిలియన్ల ఎకరాలలో 43 మిలియన్ల ఎకరాలు 3.8. మిలియన్ల మందికి పంచబడింది. అంతేగాక మిగులు భూమిని పొందిన వారిలో సగం మందికి పైగా 54.6 శాతం మంది షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు చెందినవారు. పంచబడిన భూమిలో వీరు 48.6 శాతం పొందారు. 1947 లో కాంగ్రెస్ అర్ధిక కార్యక్రమం ప్రకటించిన లక్ష్యమైన మిగులు భూముల్ని గ్రామ సహకార సంఘాలకు పంచటం లేక ఆ పొలాన్ని ఉపయోగించుకొని కొత్త సహకార సంఘాలను ప్రారంభించటం - ఏ మాత్రం విజయం సాధించలేదు, పసలుగా 'ప్రకటింపబడి పంచబడని పొలం దాదాపు 1.6 మిలియన్ల ఎకరాలు వ్యాజ్యంలో
ది.
సీలింగు అమలు జరపడంలో చాలా ప్రాంతీయ వ్యత్యాసాలు వున్నాయి. ప్రయోజనాలు పొందే వారిని రాజకీయంగా సమీకరించిన రాష్ట్రాలలో లేక ప్రభత్వం ఎక్కువ రాజకీయ చిత్తశుద్ధి ప్రదర్శించిన రాష్ట్రాలలో ఎక్కువ విజయాలు సాధించటం జరిగింది. ఉదాహరణకు దేశం మొత్తం మీద మిగులుగా ప్రకటించబడిన భూమిలో భారతదేశంలోని సాగుభూమిలో ౩ శాతం కంటె తక్కువ ఉన్న పశ్చిమబెంగాల్ అందజేసింది
1992 సంవత్సరం మధ్య కాలానికి 7.3 మిలియన్ల ఎకరాలు (1970 లో ఓ4 మిలియన్ల ఎకరాలు) మిగులు భూమిగా ప్రకటించబడింది, పంచబడింది. 5 మిలియన్ల 550 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
ఎకరాలు (1970లో 1.2 మిలియన్ల ఎకరాలు) ఉపకారం పొందినవారు 4.7 మిలియన్ల మంది ఉపకారం పొందిన వారి సంఖ్యలో పెరుగుదల ప్రత్యేకించి 1985-1992 కాలంలో పంచబడిన పాలం వైశాల్యం (ఎకరాలు) కంటే చాలా తక్కున. ఉపకారం పొందిన వారు 1.4 మిలియన్ల మంది పంచబడిన పొలం వైశ్యాలం 0.1 మిలియన్ల ఎకరాలు,
1972 తరువాత స్పష్టమైన మెరుగుదల వున్నప్పటికి భూమి లేని వారికి పంచదగినదిగా ప్రకటించబడిన మిగులు భూమి మొత్తం సాగులో వున్న భూమిలో 2 శాతం మాత్రమే. 4.ర్ మిలియన్లకు పైగా ప్రజలు ఎంతో కొంత భూమి పొందినప్పటికి భారతదేశ వ్యవసాయంలోని అన్యాయాలు చాలావరకు కొనసాగుతున్నాయి.
సీలింగు చట్టాల ముఖ్యమైన ప్రభావం - బహుశా దీర్షకాలికంగా చాలా కీలకమైన ప్రభావం ఏమిటంటే అది భూమి మార్కెట్‌ను నష్టసరిచింది. భూ కమతాలలో పెరుగుతున్న కేంద్రీకరణని అద్దుకొన్నది. భారతదేశ వ్యవసాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. విధాన రూపకర్త అయిన సిహెచ్.హనుమంతరావు యిలా చెప్పారు (గరిష్ట పరిమితికి మించిన భూ యాజమాన్య కేంద్రీకరణని చట్టం నిరుత్సాహపరిచింది). గరిష్ట పరిమితి విధించబడకపోతే భూమి మార్కెట్లో వున్న పోటీ కారణంగా చిన్న సన్నకారు రైతులు పొలాలు కోల్పోయే ప్రమాదం వుంది. చట్టం వారు పొలాలు కోల్పోకుండా నివారించింది.
లోపాలలో కూడుకున్న జాప్యం చేయబడిన సీలింగు చట్టాల కారణంగా పునః పంపకానికి విస్తారమైన మిగులు భూమి సేకరించే అవకాశం కోల్పోయినప్పటికీ దీర్మకాలికంగా చూస్తే విపరీత జనాభా పెరుగుదల, తరతరాలుగా పెద్ద కమతాల విభజన సీలింగు పరిమితులను మించి కొద్ది భూమి మాత్రమే మిగలడానికి దారి తీసింది. 25 ఎకరాలు లేక అంతకంటె ఎక్కువ (కనీసం 15 ఎకరాలు అంతకంటే ఎక్కువ) గల కమతాల సంఖ్య స్వతంత్ర్యానంతర దశాబ్దాలలో 1990ల వరకు తగ్గుతూ వచ్చింది. దేశంలోని కొన్ని చిన్న ప్రాంతాలలో మినహాయించి ప్యూడల్ తరహాలో పెద్ద ఎస్టేట్లు గతకాలం నాటిమాట అయింది. భూస్వాములలో అసమానత ఈనాటి ప్రధాన సమస్య కాదు. ఒక అంచనా ప్రకారం 1976 -77 నాటికి 25 ఎకరాల లోపు వున్న కమతాలు 97 శాతం 10 ఎకరాలలోపు వున్న కమతాలు 87 శాతం. ఏ మాత్రం భూమి లేని సమస్య వ్యవసాయ జనాభాలోని సగం మంది సమస్య, స్వతంత్రం తర్వాత భారతదేశం 551
గరిష్ట పరిమితిని తగ్గించడం ద్వారా భూ పంపకం కొరకు చేసే ప్రయత్నం రాజకీయంగా సాధ్యమయ్యేది కాదు లేక ఆర్థికంగా ఆచరణీయం కాదు. భారతదేశంలో మనిషి భూమి నిష్పత్తి ప్రత్యేకించి జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడడం (1991లో మొత్తం శ్రామికులలో 67 శాతం) ఫలితంగా భూమి కొరకు పోటీపడే వారి సంఖ్య ఎక్కువ. భూమి లేని కార్మికులకు భూమిని పంచేందుకు గరిష్ట పరిమితిని తగ్గించే ఎలాంటి ప్రయత్నం కూడా కనీస ఉత్పత్తిని సాధించలేని ఆచరణీయం కాని కమతాల సంఖ్యని పెంచుతుంది. అంతేగాక యిప్పుడు రాజకీయంగా చాలా ముఖ్యమైన భూస్వామ్య వర్గాలు. అలా చేయటానికి ప్రయత్నించిన పాలనకు వ్యతిరేకంగా నూతన వ్యవసాయదారుల ఉద్యమం (06౪ [0యలం గం౪లఅుల00 క్రింద సమీకృతమవుతాయి. ఒక ప్రముఖ జర్నలిస్టు యిటీవల చెప్పినట్లు “దున్నేవాడికి భూమి ప్రాతిపదికన భూమిని పంచేందుకు ఒక్క పోల్‌పాట్ మాత్రమే ప్రయత్నించగలడు”. కాబట్టి ఇటీవలి కాలంలో భూమిలేని పేదలకు కనీస వేతనానికి వామీ కల్పించటం, ఇళ్ల స్థలాలు సమకూర్చడం, అలాగే కౌలుదార్ల కౌలు వ్యవధికి వామీ కల్పించడం మాత్రమే ఆచరణీయమైన కార్యక్రమం. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర ఉపాధి పెంచటం పొలం అవసరం లేని పశుపోషణ, వ్యవసాయంలో సంబంధం గల ఇతర ఉపాధి మార్గాలు కల్పించడం ప్రత్యామ్నాయం. భూదానోద్యమం భూదానం వ్యవసాయంలో వ్యవస్థాగతమైన మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వ చట్టం ద్వారా గాక ఒక ఉద్యమం ద్వారా భూ సంస్కరణ దిశగా చేసిన ఒక ప్రయత్నం. ప్రముఖ గాంధేయ నిర్మాణాత్మక కార్యక్తర్త ఆచార్య వినోబాభావే 1950 దశాబ్దం ప్రారంభంలో ఉద్యమం ప్రారంభించేందుకు నిర్మాణాత్మక పని ధర్మకరృృత్వం లాంటి గాంధేయ ఆలోచనలు పద్ధతులను చేపట్టారు. వినోబాభావే దేశంలో అహింసాయుత సామాజిక మార్చు తెచ్చేందుకు నిర్మాణాత్మక కార్యకర్తల సమాఖ్య - సర్వోదయ సమాజ్‌ని స్తాపించాడు. ఆయన, ఆయన సహచరులు భూమి లేని పేదలకు పంచటానికి పెద్ద భూస్వాములను వారి పొలాల్లో కనీసం 6వ వంతు దానం చేయమని నచ్చజెప్పేందుకు పాదయాత్రలు నిర్వహించారు. భారతదేశంలో సాగులో వున్న 800 మిలియన్ల ఎకరాల సాగు భూమిలో 6వ వంతు అంటే 50 మిలియన్ల ఎకరాలు సేకరించటం లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఐదుగురు గల సాధారణ కుటుంబం 6552 బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భూమి లేని పేదవాడిని కుటుంబ సభ్యునిగా అంగీకరించి కుటుంబానికి వున్న పొలంలో ఆరవవంతు త్యాగం చేయాలని ప్రతిపాదించారు.
ఉద్యమం ప్రభుత్వంతో సంబంధం లేని దైనప్పటికి దానికి కాంగ్రెస్ మద్దతు వుంది. ఉద్యమంలో చురుకుగా పాల్గొనమని ఎఐసిసి కాంగ్రెస్ వారిని అర్ధించింది. గతంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఆ తరువాత ప్రఖ్యాత సోషలిస్టు పార్టీ నాయకుడైన జయప్రకాష్ నారాయణ 1953లో భూదానోద్యమంలో చేరటానికి క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకొన్నారు.
వినోబా మొదటి భూదానాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని సాయుధ రైతాంగ పోరాట ప్రతిధ్వనులు యింకా సమసిపోని తెలంగాణలో వున్న పోచంపల్లి గ్రామం నుండి 1951 ఏప్రిల్ 18న స్వీకరించాడు. ఆయన మూడు నెలల లోపల ఈ ప్రాంతంలోని దాదాపు 200 గ్రామాలు పర్యటించి 12,200 ఎకరాల భూదానం స్వీకరించారు. ఉద్యమం ఉత్తరానికి ప్రత్యేకించి బీహారు ఉత్తరప్రదేశ్‌లకు విస్తరించింది. 1956 మార్చి నాటికి 4 మిలియన్ల ఎకరాలకు పైగా స్వీకరించి ఉద్యమం తొలి సంవత్సరాలలో గణనీయమైన విజయం సాధించింది. ఆ తరువాత ఉద్యమ వేగం మందగించింది.
అంతేగాక దానం చేయబడిన భూమిలో చాలాభాగం వ్యవసాయ యోగ్యమైనది కాదు, లేక వివాదాలలో వున్నది. బహుశా ఈ కారణంగానే భూదానం ద్వారా సేకరించబడిన 45 మిలియన్ల ఎకరాల భూమిలో దాదాపు 6,54,000 ఎకరాలు మాత్రమే. 1957 సంవత్సరాంతానికి 2,00,000 కుటుంబాలకు పంచబడింది. 1961 ప్రారంభానికి 8,72,000 ఎకరాలు పంచబడింది.
ఈ మధ్యకాలంలో 1955 సంవత్సరాంకానికి ఉద్యమం “గ్రామదానం' రూపు తీసుకొన్నది. భూమి అంతా దేవుడికి చెందుతుందనే గాంధేయ భావజాలం గ్రామదాన (గ్రామాలలో భూమి ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదు. గనుక అది సమిష్టి యాజమాన్యంలో వుంటుందని ఉద్యమం ప్రకటించింది. ఉద్యమం ఒరిస్సాలో ప్రారంభమయింది. అక్కడ చాలా జయప్రదమయింది. 1960 సంవత్సరాంఠానికి 4500 కి పైగా 'గ్రామదాన (గ్రామాలున్నాయి. ఒరిస్సాలో 1946, మహారాష్ట్రలో 603 , కేరళలో 543, ఆంధ్రప్రదేశ్‌లో 488, మద్రాసులో 250 గ్రామదాన గ్రామాలున్నాయి. ఈ ఉద్యమం వర్గ వ్యత్యాసం యింకా ఆవిర్భవించని గ్రామాలలో, భూ యాజమాన్యంలో కూడా చాలా తక్కున వ్యత్యాసం వున్న (గ్రామాలలో కొన్ని తెగల నమూహాల ఆవాసాలుగా వున్న (గ్రామాలలో స్వతంత్రం తర్వాత భారతదేశం గ్ర్8ి
జయ'ప్రదమయిందని, వినోబాభావే తన ఉద్యమానికి అలాంటి (గ్రామాలను ఎంపిక చేసుకున్నాడనే వాదన వుంది. - భూదాన గ్రామదాన ఉద్యమం తొలుత కొంత ఆశావహంగా కన్పించినప్పటికి 1960ల నాటికి ఉత్సాహం కోల్పోయింది. కాలక్రమంలో ప్రజల స్మృతి పథం నుండి తొలగిపోయింది. గడచిన 38 సంవత్సరాలలో భూదానం ద్వారా లభ్యమైన పొలంలో కనీసం సగాన్ని కూడా పంచలేకపోయిన అశక్తత కారణంగా రాష్ట్ర భూదాన కమిటీని రద్దు చేసినట్లు బీహారు ప్రభుత్వం 1999 జూన్‌లో ప్రకటించింది. భూదానంపై సరియైన నిర్ధారణ ప్రత్యేకించి దాని నిగూఢశక్తిపై సరియైన నిర్ధారణ యింకా చేయవలసి వుంది. అది ఊహాజనితమైనది కానే గాక అభివృద్ధి నిరోధకమైనదిగా వర్గ పోరాటాన్ని నివారించే లక్ష్యం గలదిగా త్రోసిపుచ్చబడింది. రైతు విప్లవ పోరాటానికి అవరోధంగా పనిచేయటమే దాని లక్ష్యమని భారత వ్యవసాయ సంస్కరణల చరిత్ర కారుదొకరు వ్యాఖ్యానించాడు. కాని భూదానోద్యమంలో గమనించదగిన ప్రాధాన్యత గల అంశాలున్నాయి. మొదటిది, ఇది స్వతంత్రానంతరం భూసంస్కరణలు తీసుకొని వచ్చేందుకు ప్రభుత్వ చట్టం ద్వారా గాక ఒక ఉద్యమం ద్వారా చేసిన ప్రయత్నం రెండవది : ఉద్యమం ధర్మకర్శృత్వం ఆలోచనపై లేక భూమి అంతా దేవుడిది అనే ఆలోచనపై ఆధారపడింది. గనుక ఉద్యమం యొక్క నిగూఢ శక్తి (016౧621) అపారమైనది. భూస్వాములు, ఆస్తియొక్క ధర్మకర్తలుగా లేక సమాన భాగస్వాములుగా వ్యవహరించడంలో విఫలమైతే వారికి వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో సత్యాగ్రహం చేపట్టవచ్చు. భూస్వాములపై ఒత్తిడి తెచ్చి భూమి లేని వారికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించటం ద్వారా అంటే సానుకూలమైన నైతిక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఉద్యమం భూసమస్యకి గణనీయమైన తోడ్చాటునందించింది. దీనిని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఇయం.యస్. నంబూద్రిపాద్ గుర్తించారు. 'సర్వోదయం - కమ్యూనిజం అనే నంబూద్రిపాద్ వ్యాసాన్ని ఉటంకిస్తూ కాటాంస్కీ యిలా రాశారు. భూదాన గ్రామదాన ఉద్యమం ఒక మేరకు రైతాంగం యొక్క రాజకీయ యితర కార్యకలాపాలకు (ప్రేరణ యిచ్చింది. భూ పంపకం కొరకు, భూమిపై ప్రైవేటు యాజమాన్యం రద్దు కొరకు వ్యవసాయదారుల సహకార సంఘాల అభివృద్ధి కొరకు రాజకీయ ప్రచారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించింది. 554 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
32 జి జ్ జ సహకార సంఘాలు, ఆలో న ఆ ఆగి భూ సంస్కరణలు - సమీక్ష
మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో సహ సోషలిస్టులు, కమ్యూనిస్టులు సహకారీకరణ భారతదేశ వ్యవసాయంలో అభివృద్ధికి దారి తీస్తుందని, ప్రత్యేకించి పేదలకు చాలా ప్రయోజనకారిగా వుంటుందని అంగీకరించారు. కాబట్టి భూ సంస్కరణల ద్వారా సాధించదలచిన సంస్థాగత మార్పుల అజెందాలో సహకారీకరణ ముఖ్యమైన అంశమైంది. కాని భూ గరిష్ట పరిమితి సమస్యలో లాగానే సహకార సంఘాల సమస్యలో కూడా విస్త్రతమైన వకాభిప్రాయం ప్రత్యేకించి రైతులలో లేదు. ఈ పరిస్థితిని ప్రతిఫలిస్తూ స్వతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ “వ్యవసాయ యోగ్యమైన ప్రభుత్వ భూములలో సన్నకారు రైతులలో ప్రయోగాత్మకంగా సహకార వ్యవసాయంపై పైలెట్ పథకాలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది" లాంటి తాత్కాలిక ప్రతిపాదనలు చేసింది. అంతేగాక సహకారీకరణ దిశగా ప్రారంభించే ఎలాంటి ప్రయత్నానికైనా రైతులకు నచ్చజెప్పి వారి అంగీకారం, సౌహర్థం పొందడం జరుగుతుందని వివరణ యివ్వబడింది. ఎలాంటి ఒత్తిడి నిర్బంధాలు వుండబోవని చెప్పింది.
కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ కుమరప్ప కమిటీ 1949 జూలైలో చేసిన సిఫార్సులు అప్పటికి వున్న పరిమితమైన సానుకూలతని అధిగమించి కాంగ్రెస్ ముందుకు పోయే సంకేతాల్ని వ్యక్తం చేసింది. వివిధ తరహాల వ్యవసాయానికి రాజ్యం తరతమ భేదాలతో సహకారాన్ని వర్తింపజేస్తుంది. వ్యవసాయదారుడు సహకార సంఘాన్ని మార్కెటింగు, రుణాలకు ఉపయోగించుకోవలసి వుంటుంది. సన్నకారు రైతు తన లాంటి స్వతంత్రం తర్వాత భారతదేశం ర్ర్క్
ఇతరులతో కలిసి సమిష్టి వ్యవసాయం చేసుకోవలసి వుంటుంది. ఆ విధంగా సహకార సంఘాలను ప్రోత్సహించేందుకు నిర్భంధం ప్రయోగింపబడుతుందనే సూచన చేయబడింది. ప్రత్యేక శిక్షణ పొందిన శ్రేణుల ప్రచారం. ప్రభుత్వ సహాయం - రైతుల సందిగ్ధతను తగ్గించి వారిని సహకార సంఘాలకు సమిష్టి వ్యవసాయానికి సన్నద్ధం చేస్తుందని కమిటీ అభిప్రాయపడింది. కాని ఇది తొందరపాటుతో ఏర్పరచుకొన్న అభిప్రాయమని తరువాతి ఘటనలు స్పష్టం చేశాయి.
చిన్న మధ్య తరహా వ్యవసాయదారులు సహకార సంఘాలు ఏర్పరచుకొనడాన్ని ప్రోత్సహించాలని అందుకు తోద్చడాలని మొదటి ప్రణాళిక సిఫార్సు చేసింది. రాజ్యం యొక్కఅమలు పరచే అధికారాలను గురించి ప్రణాళిక ప్రస్తావించలేదు. కాని గ్రామంలోని సగం పొలానికి యాజమాన్యం వహించే మెజారిటీ రైతులు సహకార యాజమాన్యం (క్రిందికి రావాలని కోరితే ఆ నిర్ణయం (గ్రామం మొత్తానికి వర్తిస్తుంది. ఇలా వర్తింపజేయడంలో కొంత నిర్భందం వుంది.
నూతనంగా ప్రారంభించబడిన సమాజాభివృద్ధి పథకం యొక్క శిక్షణ పొందిన కార్యకర్తల సహాయంతో పార్టీల కార్యకర్తలతో ఉత్తేజపరచబడిన (గ్రామ పంచాయితీ గ్రామీణాభివృద్ధి పథకాలు అమలు జరపడానికే గాక భారతదేశ వ్యవసాయంలో కీలకమైన సంస్థాగతమైన మార్పుల్ని - ఉదాహరణకు భూ సంస్కరణ అమలులో తోద్బడడం ద్వారా, సమాజానికి చెందిన పని కొరకు స్వచ్చందంగా పనిచేసేవారిని సన్నద్ధం చేయడం ద్వారా సహకార సంఘాలను స్థాపించడం ద్వారా తీసుకొని రావటానికి కూడా తోడ్పడుతుందని ప్రణాళికా కర్తలు ఆశించారు. అంతేగాక తొలి సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తిలో లక్ష్యాల్ని సాధించడంలో సహకారీకరణ నిర్వహించనున్న పాత్రపై పెద్ద అంచనాలు వున్నాయి. 10సం॥1ల కాల వ్యవధిలో వ్యవసాయ భూములలో గణనీయమైన భాగం సహకార పద్ధతులలో సాగు చేయబడడానికి బలమైన పునాదులు వేసే చర్యలు చేపట్టడం (పథాన కర్తవ్యంగా రెండవ పంచవర్న ప్రణాళిక ప్రకటించింది. గణనీయమైన నిష్పత్తిలో వ్యవసాయ పొలాల్ని 10సం॥రాలలో సహకార సంఘాల యాజమాన్యం క్రిందికి తీసుకొని రావాలన్న అత్యాశ గల పథకం కూడా వ్యవసాయ ఉత్పత్తులలో చైనా సహకారీకరణ ద్వారా అద్భుతాలు సాధిస్తుందని వార్తలు వస్తుండడంతో చాలా సాదాసీదా పథకంగా కన్పించింది (చాలా సంవత్సరాల తరువాత 1976లో మావో మరణానంతరం వైనా చెప్పుకొన్నంత విజయాలు సాధించలేదని తెలిసింది. ఒక అంచనా ప్రకారం 1954 - 556 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1974 కాలంలో చైనా వ్యవసాయాభివృద్ధి రేటు కేవలం 2% మాత్రమే. ఇది భారతదేశం సాధించిన 2.5 శాతం రేటు కంటె తక్కువ). సహకార సంఘాల్ని ఎలా నిర్వహించింది, వ్యవసాయోత్సత్తిలో ఎంత అభివృద్ధి సాధించిందీ. అధ్యయనం చేసేందుకు భారతదేశం 1956లో రెండు ప్రతినిధి వర్గాలను (ఒకటి ప్రణాళికా సంఘానికి చెందినది. రెండవది ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖకి చెందినది). చైనాకు పంపించింది. రెండవ (ప్రణాళిక నిర్దేశించిన లక్ష్యాలు తగినంతగా లేవని వాటిని పెంచాలని అభిప్రాయపడింది. వ్యవసాయ వ్యయంలో పెరుగుదల లేకుండానే లక్ష్యాలు సాధించవచ్చునని చైనా అనుభవం స్పష్టం చేసినట్టు భావించింది. రెండు ప్రతినిధి వర్గాలు దాదాపు ఒకే విధమైన నిర్ణయానికి వచ్చాయి. చైనా సహకారీకరణ ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని నివేదించాయి. రెండు ప్రతినిధి వర్ధాలు (ఒక కమిటీలోని ఇరువురి సభ్యులు వ్యక్తం చేసిన కొద్దిపాటి అసంతృప్తిని మినహాయించి భారతదేశంలో సహకార వ్యవసాయ విస్తరణ కొరకు పెద్ద కార్యక్రమాన్ని సిఫార్సు చేశాయి. వ్యవసాయానికి అదనపు నిధుల కొరకు డిమాండు చేయకుండా వైనాని అనుసరించి వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత మార్పుల ద్వారా అధికోత్పత్తి సాధించాలని సహకారీకరణకు పూర్తిగా నిబద్ధుడైన జవహర్లాల్ నెహ్రా రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గతంలో రెండవ ప్రణాళిక ప్రతిపాదించిన లక్ష్యాలను అధిగమించి రానున్న 5 సంవత్సరాలలో వ్యవసాయోత్పత్తి 25 నుండి 85 శాతం వరకు పెంచాలని జాతీయాభివృద్ధి మండలి, ఎఐసిసి లక్ష్యాన్ని నిర్దేశించాయి. కాని రాష్ర్రాలు సహకార వ్యవసాయంలో ప్రయోగాలకు అంగీకరిస్తూనే సహకారీకరణకు పెద్ద ఎత్తున పథకాలు చేపట్టడాన్ని అడద్దుకొన్నాయి. నెహ్రూ నచ్చజెప్పటంలో సంస్థాగత మార్పుల ప్రాతిపదికగల వ్యవసాయ వ్యూహానికి అనుకూలంగా ఒత్తిడి పెంచడం కొనసాగించింది. ఫలితంగా 1959లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ సదస్సులో “ప్రఖ్యాత నాగపూర్ తీర్మానం” ఆమోదం పొందింది. (గ్రామపంచాయితీలు గ్రామ సహకార సంఘాల ఆధ్వర్యంలో గ్రామ నిర్వహణ జరగాలి. అవి వాటి విధులను నిర్వహించేందుకు అవసరమైన అధికారాలు, ఆర్థిక వనరులు కలిగి వుండాలి అని నాగపూర్ తీర్మానం స్పష్టంగా పేర్కొన్నది. తీర్మానం ఇంకా యిలా చెప్పింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 557
భవిష్యత్ వ్యవసాయ విధానం సహకార సమిష్టి వ్యవసాయం, సమిష్టి వ్యవసాయానికి భూమి సమీకరించబడుతుంది. వ్యవసాయదారులు తమ ఆస్తిహక్ముని నిలబెట్టుకుంటూనే వారి భూమి నిష్పత్తిలో వ్యవసాయోత్పత్తిలో వాటా పొందుతారు. అంతేగాక పొలంలో పనిచేసేవారు - వారికి పొలం వున్నా లేకపోయినా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో వారు చేసిన పనిని బట్టి ఫలితంలో వాటా పొందుతారు.
సమిష్టి వ్యవసాయ స్థాపనకు ముందు చర్యగా దేశ వ్యాప్తంగా సేవా సహకార సంఘాలు నిర్వహించబడాలి. ఈ దశ మూడు సంవత్సరాలలోపు పూర్తి చేయబడాలి. ఈ వ్యవధి లోపల కూడా అవకాశమున్న చోట రైతుల ఆమోదం పొంది సహకార వ్యవసాయాన్ని ప్రారంభించవచ్చు.
ఇక్కడ పెద్ద ముందడుగు వేయవలసి వుంది. నాగపూర్ తీర్మానం సమిష్టి సహకార వ్యవసాయం ప్రాతిపదిక గల భవిష్యత్ వ్యవసాయ విధానాన్ని ఊహించటమే గాక అలాంటి వ్యవసాయ విధానం మూడు సంవత్సరాలలో సాధించబడాలని పేర్మాన్నది. 1940 దశాబ్దం మధ్య కాలం నుండి సహకార సంఘాలు స్థాపించాలని చేస్తూ వచ్చిన ప్రతిపాదన వాటి అమలుకు స్పష్టమైన కార్యక్రమం లేకపోతే అది ఇక ఏ మాత్రం సమూలమైన మార్పులు కొరే సిఫార్సుగా పరిగణించబడదు. ఈ సిఫార్సుకి కాంగ్రెస్ లోపలి నుండి వెలుపలి నుండి వ్యతిరేకత పెల్తుబీకింది.
ఈ తీర్మానం (ప్రైవేటు ఆస్తిని, భూస్వామ్య వర్గాల పొలాలను స్వాధీనం చేసుకొనే దిశగా చేపట్టిన మొదటి చర్యయని, ఇది సోవియట్ లేక చైనా తరహాలో సమిష్టి యాజమాన్యానికి దారి తీస్తుందని వ(థత్రికలు, నాగపూర్ నదస్సు తరువాత సమావేశపరచబడిన పార్లమెంటు వాదించాయి. సి.రాజగోపాలాచారి, రంగా లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చరణ్‌సింగ్ లాంటి ఇతర నాయకులు పార్టీ లోపలా, వెలుపలా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి దేశంపై నియంతృత్వపు కమ్యూనిస్టు కార్యక్రమం రద్దుబడుతుందని బాహటంగా దాడి చేశారు.
పార్టీలో తీవ్రమైన విభజన నెదుర్మాన్న నెహ్రూ సహకార సంఘాలను ప్రవేశపెట్టడానికి ఎలాంటి నిర్భందాన్ని ప్రయోగించే సమస్య లేదని, పార్లమెంటు ఈ సమస్యపై ఎలాంటి కొత్త చట్టాన్ని ఆమోదించబోవడం లేదని 1959 ఫిబ్రవరిలో 5్5్8ి బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పార్లమెంటుకి హామీ యిస్తూ సభ్యులను సమాధానపరచే ప్రకటన చేశారు. కాని నెహ్రూ సహకార వ్యవసాయం ఆకాంక్షించదగినదని, రైతులకు నచ్చజెప్పటానికి తన ప్రయత్నం కొనసాగిస్తానని తన వ్యక్తిగత విశ్వాసాన్ని పునరుద్దాటించారు.
1959 మార్చిలో టిబెట్‌లో చైనా అణచివేత, కొన్ని నెలల తరువాత భారత సరిహద్దు లోపల చైనా ఆక్రమణలు నెహ్రూ వ్యక్తిగత ప్రతిష్టని తగ్గించడమే గాక చైనా తరహాకి చెందిన ఎలాంటి పథకం కూడా అనుమానాస్పదమైనదిగా పరిగణించబడింది. మరికొంత తిరోగమనం కూడా అనివార్యమయింది. రానున్న మూడు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా సేవా సహకార సంఘాలను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్లమెంటులో వాదించింది. పరిస్థితులు పరిపక్వమైన చోట స్వచ్చందంగా సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభింపబడతాయని చెప్పింది.
దేశ వ్యాప్తంగా మూడు సంవత్సరాలలో సేవా సహకార సంఘాలు స్థాపించడం చాలా బృహత్తరమైన ప్రయత్నమని, అందుకు నెలకు 6000 చొప్పున మూడు సంవత్సరాల పాటు సహకార సంఘాలను ్రారంభించవలసి వుంటుందని కాంగ్రెస్ గుర్తించింది. సేవా సహకార సంఘాల నిర్వహణలో కీలకపాత్ర పోషించ గల కాంగ్రెస్ కార్యకర్తల కొరకు శిక్షణా కేంద్రాన్ని నిర్వహించాలని ఎఐసిసి నిర్ణయించింది. పిసిసిలకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ప్రయత్నించినప్పటికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆదేశాలను విస్మరించారు. 1959 జూన్ తరువాత ఆ ప్రయత్నమే విరమించబడింది.
మూడవ (ప్రణాళిక రెండవ ప్రణాళికకు భిన్నంగా సహకారీకరణ గురించి సున్నితమైన, ఆచరణాత్మక వైఖరి చేపట్టింది. సహకార వ్యవసాయం విషయానికి వస్తే జిల్లాకి పది సైలెట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయించింది. అదే సమయంలో సమాజాభివృద్ధి ఉద్యమం రుణాలు, మార్కెటింగు, పంపకం, (గ్రామీణ పరిశ్రమ పెరుగుదల, భూ సంస్కరణల అమలు లాంటి కార్యక్రమాల ద్వారా సాధించబడే సాధారణ వ్యవసాయాభివృద్ధి విజయం నుండి సహకార వ్యవసాయం అభివృద్ధి చెందాలని హెచ్చరిక పత్రంలో స్పష్టం చేసింది. ఇది అనుకూలమైన ఆలోచనని, అకర్షణీయమైన మాటల్లో
వ్యక్తం చేయడంగా వుంది గాని కార్యాచరణ పథకం లాగా లేదు. " స్వతంత్రం తర్వాత భారతదేశం ర5్59
సహకారీకరణ పరిమితులు
విధానం ్రతిష్టంభనకు చేరుకున్న తరువాత సహకార ఉద్యమం యొక్క అభివృద్ధి మొత్తం మీద తొలినాటి ప్రతిపాదకులు నిర్దేశించిన లక్ష్యాలకు చాలా దిగువున వుంది. ప్రముఖ ఆర్థికవేత్త డేనియల్ ధార్మర్ 1958 డిసెంబరు 1959 మే మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా 117 మంచి సహకార సంఘాలపై జరిపిన సర్వేలో గమనించిన లోపాలు ఆ తరువాత కాలంలో కూడా కొనసాగాయి. మరొక ఆర్థికవేత్త భారతదేశ భూ సంస్కరణలు పరిశీలకుడు వుల్ఫ్ - లాడెజెన్సీ 1960, 1970 దశాబ్దాలలో అలాంటి లోపాలను గమనించారు.
సహకార వ్యవసాయానికి వస్తే రెండు రకాల సహకార సంఘాలున్నాయి. మొదటిది, భూ సంన్మరణల నుండి తప్పుకునేందుకు ప్రభుత్వం ఇవ్వజూపే ప్రోత్సాహకాలను అందుబాటులోకి తెచ్చుకొనేందుకు ఏర్పరచబడిన సహకార సంఘాలు,
- ఇవి సంపన్నులైన పలుకుబడి గల కుటుంబాలు ఏర్పాటు చేసిన సహకార సంఘాలు. వీటిలో వ్యవసాయకూలీలను, మాజీ కౌలుదారుల్ని నకిలీ సభ్యులుగా చేర్పించారు. సహకార సంఘాలను ఏర్పరచటం భూ గరిష్ట పరిమితి చట్టాలు లేక కౌలు చట్టాల నుండి తప్పుకొనడానికి తోద్బడింది. పలుకుబడి గల సభ్యులు వారి పొలాల్ని సభ్యులుగా నమోదు చేయబడిన కూలీలచే సాగు చేయించారు. నకిలీ సహకార సంఘాలు వారికి ప్రభుత్వం సబ్సిడీల రూపంలో యిచ్చే ఆర్థిక సహాయం, అలాగే కారతగా వున్న రసాయనిక ఎరువులు, మెరుగైన విత్తనాలు ట్రాక్టర్లు వంటి వ్యవసాయక ఉత్పాదకాలు పొందాయి.
రెండు : పేదలు, హరిజనులు ఇతర పీడిత తాడిత వర్ణాలకు గతంలో సాగులోకి రాని భూమిని అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాలు - తక్కువ రకం, నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడం, సన్నద్ధం చేయబడకపోవడం పొందబోయే ప్రయోజనం పై నమ్మకం కొరవడిన రైతులు - లాంటి కారణాలతో ప్రభుత్వ మద్దతుతో చేపట్టే ఇతర కార్యక్రమాల లాగానే ఖరీదైన, జయప్రదం కాని ప్రయోగాలుగా మిగిలిపోయాయి. ఉత్పత్తిలో ప్రయోజనాలలో ఆశించిన పెరుగుదల లేదు. 560 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సేనా సహకార సంఘాలు సహకార వ్యవసాయానికి మార్చు జెందుతాయనే ఆశలు చెదిరిపోయాయి. సహకార వ్యవసాయం ప్రభుత్వ ప్రాజెక్టులను నకిలీ సహకార సంఘాలను అధిగమించి అంతగా విస్తరించలేదు. సహకార వ్యవసాయ సంఘాల కంటె చాలా బాగా పనిచేసిన సేవా సహకార సంఘాలు కూడా పెద్ద లోపాల కారణంగా కుంటుపడ్డాయి. సేవా సహకార సంఘాలు భారతదేశ, గ్రామీణ అసమానతా నిర్మాణాన్ని ప్రతిఫలించడమే గాక దానిని బలోపేతం చేసే వైఖరి కలిగి వున్నాయి. సాధారణంగా సహకార సంఘం నాయకత్వం అంటే దాని (ఢ్రైసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్లు బాగా పొలాలు వున్న భూస్వాములే గాక వర్తకం, వడ్డీ వ్యాపారాన్ని గూడా నియంత్రించగలిగిన వారు - గ్రామంలో అన్నింటీకి తామే అయిన ఈ పెద్ద మనుషులు వ్యవసాయ రుణంతో పాటు కొరతగా వున్న వ్యవసాయ ఉత్ప్సాదకాలను స్వంతం చేసుకొంటారు. సహకార (గ్రామీణ బ్యాంకులచే తక్కువ వడ్డీకి ఇవ్వబడే వ్యవసాయ రుణాల్ని యిలాంటి కుటుంబాలు వ్యవసాయేతర పనులకు, వడ్డీ వ్యాపారానికి కూడా వినియోగించాయి. అట్టడుగు స్థాయిలో పంచాయితీలు, సమాజాభివృద్ధి కార్యక్రమాలు, సహకార సంఘాలు కల్పించిన రాజకీయ అవకాశాల్ని గ్రామీణ ప్రాంతంలో ని పేదలకు అనుకూలంగా వారిని కార్యాచరణకు సమీకరించడం ద్వారా వినియోగించుకొనడంలో కాంగ్రెస్, కాంగ్రెస్ లాంటి లక్ష్యాలు గల సోషలిస్టులు, కమ్యూనిస్టులు విఫలమైన మేరకు ఈ సంస్థలు గ్రామంలోని ఆధిపత్య సెక్షన్లచే స్వాధీనం చేసుకోబడ్డాయి. ఈ ఆధిపత్య సెక్షన్లు. ఈ సంస్థల్ని వారి ఆర్థిక రాజకీయ వలుకుబడీి పెంచుకొనేందుకు ఉపయోగించుకున్నాయి. తొలి సంవత్సరాలలో (గ్రామీణ పేదలు, భూమి లేనివాళ్లు ఈ సంస్థల నుండి ఎలాంటి సహాయాన్ని పొందలేకపోయారు. ఉదాహరణ : (గ్రామీణ సహకార పరపతి సంఘాలు పంటలు పండించే వ్యవసాయదారునికి రుణం యివ్వాలి గొని భూమి యజమాని కాదని 1954 రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) చేసిన వివరణాత్మక సిఫార్సుని అమలు పరిచేందుకు ఈ సంస్థలు నిరాకరించాయి. పంట బుణాలు యిచ్చేందుకు సహకార సంఘాల తిరస్కారం, భూమిని హామీగా పెట్టుకొని రుణాలిస్తామని పట్టుబట్టడం అంటే భూమి లేని వారిని ఈ పథకం నుండి మినహాయించడమే అయింది. కౌలుదారులు వ్యవసాయ కార్మికులు యితరులు మొత్తం పంపిణీ చేయబడిన రుణంలో 4 నుండి స్వతంత్రం తర్వాత భారతదేశం 561
6 శాతం మాత్రమే పొందగలిగారని 1969లో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అభిల భారత రుణ సమీక్ష కమిటీ 1969 నివేదిక, చిన్న సన్నకారు రైతుల రుణ సేవలపై జాతీయ వ్యవసాయ కమీషన్ రూపొందించిన తాత్కాలిక నివేదిక 1971 భూమి లేని వారిని పూర్తిగా మినహాయించినట్లు ధృవపరచాయి. అంతేగాక చిన్న సన్నకారు రైతులు (గ్రామీణ సహకార సంఘాల నుండే గాక జాతీయం చేయబడిన బ్యాంకుల నుండి వివక్షను ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశాయి. ఈ (గ్రూపుల్ని లక్ష్యంగా పెట్టుకొని సన్నకారు రైతుల వ్యవసాయ కార్మికుల పథకం (ఎం. ఎఫ్. ఎ. ఎల్), చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ లాంటి కార్యక్రమాల ద్వారా ఇందిరాగాంధీ ప్రారంభించిన “గరీబీ హఠావో వీటిపట్ల వివక్షను తగ్గించే ప్రయత్నం చేసింది. సహకార ఉద్యమంలోని సాధారణ లోపం ఏమిటంటే అది ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి బదులుగా బ్లాకు, జిల్లా, డివిజను, రాష్ట్ర స్థాయిల్లో, అవసరాలకు మించి నియమించబడిన అధికారులు, గుమాస్తాలు, ఇన్స్పెక్టర్ల లాంటి ఉద్యోగులతో ప్రభుత్వ డిపార్టుమెంటుగా మార్చబడింది. సహకార ఉద్యమ సూత్రాల పట్ల సాధారణంగా ఎలాంటి సానుభూతి లేని ఉద్యోగి స్వామ్యం స్థానిక స్వప్రయోజనాపరులచే ప్రభావితమై సహకార సంఘాలను ప్రోత్సహించటానికి మారుగా వాటి అభివృద్దిని ఆటంకపరచే సాధనమయింది. అయినప్పటికి సేవా సహకార సంఘాలు ప్రత్యేకించి సహకార పరపతి సంఘాలు భారతదేశ వ్యవసాయంలో కీలకపాత్ర నిర్వహించాయి. 1951-52లో (గ్రామన్థాయి సహకార సంఘాలుగా వున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (0209) 23 కోట్ల రూపాయలు రుణాలివ్వగా 1960-61 నాటికి అలాంటి 2,12,000 సహకార సంఘాలు దాదాపు 200 కోట్ల రూపాయల్ని రుణాలుగా పంపిణీ చేశాయి. 1992-98 నాటికి గ్రామీణ సహకార సంఘాలు రైతులకు 4900 కోట్ల రుణ సదుపాయం కల్పించింది. దిగువ పట్టిక చూపే విధంగా 1951-52లో రైతు రుణ అవసరాలలో 3.8 శాతం మాత్రమే సహకార సంఘాలు సరఫరా చేయగలిగాయి. కాని 1981 నాటికి దాదాపు 80 శాతం సమకూర్చగలిగాయి. 1951లో రైతు తన రుణ అవసరాలలో 92.7 శాతం మేరకు వడ్డీ వ్యాపారి, వర్తకుడు, భూస్వామి లాంటి వారిపై ఆధారపద్దాడు. 562 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పట్టిక వ్యవసాయదారుడు : వివిధ రుణ వనరులు 1951- 1981
(సంఖ్యలు శాతంలో)
1951-52 1971 1981
వడ్డీ వ్యాపారి, వర్తకుడు, భూస్వామి వగైరాలు 92.7 688 368
సహకార సంఘాలు 8.8 220 29.9
వాణిజ్య బ్యాంకులు 0.9 26. 294
ప్రభుత్వం 8.1 7.1 3.9 1981 నాటికి రైతు రుణ అవసరాలలో 63 శాతానికి పైగా తక్కువ వడ్డీకి సంస్థల నుండి లభించాయి. దాదాపు 390 శాతం రుణాలు సహకార సంఘాలు, మరొక 80 శాతం రుణాలు ఇందిరాగాంధీచే 1969 జూలైలో జాతీయం చేయబడిన వాణిజ్య
బ్యాంకులు సమకూరాయి.
కాని అప్పులు తీసుకున్నవారు సరిగా చెల్లించకపోవడం వలన పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. సహకార సంఘాలు సక్రమంగా పనిచేయటానికి ఇది పెద్ద ఆటంకమయింది. 1960,1970 మధ్య కాలంలో ప్రాథమిక సహకార సంఘాలు పంచిన అప్పులలో 20 నుండి 88 శాతం వరకు తిరిగి చెల్లించని అప్పులున్నాయి. 1970 నాటికి అఖిల భారత స్థాయిలో బకాయిల సరాసరి 45 శాతానికి, బీహారు లాంటి కొన్ని రాష్రాల బకాయిలు 7? శాతానికి చేరడంతో పరిస్థితి మరీ క్షీణించింది. బకాయి పడినవారు పేద, చిన్న రైతులు మాత్రమే కాదు. సంపన్న రైతులు కూడా. సంపన్న రైతుల ఆర్థిక రాజకీయ ప్రాబల్యంతో బకాయిల సమస్య ప్రమాదకర స్థితికి చేరుకొని గ్రామీణ పరపతి సంఘాల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపింది. రు.10,000 ల వరకు గల అన్ని గ్రామీణ రుణాల్ని రద్దు చేయాలని 1990లో వి.షి.సింగ్ స్వతంత్రం తర్వాత భారతదేశం 568
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం లాంటి ప్రజాకర్షక చర్యలు ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారాన్ని మోపడమే గాక గ్రామీణ రుణ సంస్థల స్వావలంబనని మరికొంత క్షీణింపచేశాయి. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు 1970లలో పెద్ద మొత్తాలలో సహకార సంఘాలు, బ్యాంకుల రుణాలు రైతులకు - ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులకు అందడం ప్రారంభమయింది. 1979-80లో వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన స్వల్పకాలిక రుణాలలో ౩4 శాతం మొత్తం కుటుంబాలలో 33 శాతంగా వున్న 2.5 ఎకరాలలోపు గల కుటుంబాలకు అందాయి. అదే విధంగా రుణాలలో 57 శాతం మొత్తం కుటుంబాలలో 4ఉ9 శాతంగా వున్న 5 ఎకరాల లోపు గల కుటుంబాలకు అందాయి. గతంలో లాగా గ్రామీణ రుణ సౌకర్యం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ విధానాలననుసరించి గ్రామీణ బ్యాంకులు రుణాలలో ఎక్కువశాతం బలహీన వర్గాలకు ఇవ్వవలసి వుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుండి మొత్తం పంపిణీ చేయబడిన రుణాలలో 5 ఎకరాల లోపు గల కుటుంబాలు 34 శాతం క్ ఎకరాల కంటె ఎక్కువ వున్న కుటుంబాలు 62% పొందాయి. భూమి లేనివారి పరిస్థితి అలాగే వుంది. మొత్తం పంపిణీ చేయబడిన రుణంలో కేవలం 4% మాత్రమే వారికి అందింది. (గ్రామీణ భారతదేశంలో సేవా సహకార సంఘం చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడం ప్రారంభించాయి. విస్తృతమైన రైతాంగానికి ఎక్కువ మొత్తాలలో రుణాలు తక్కువ వడ్డీరేటుకు లభ్యమయ్యేట్లు చేయటంలో కీలకపాత్ర పోషించాయి. అవి మెరుగైన విత్తనాలను ఆధునిక పరికరాలను, రసాయనిక ఎరువుల్ని తెప్పించటానికి సహాయపడటమే గాక, వాటిని వినియోగంలోకి తెచ్చుకొనడానికి అవసరమైన డబ్బును కూడా ఇప్పించాయి. చాలా ప్రాంతాలలో రైతులు వారి ఉత్పత్తులను మార్కెట్టు చేసుకోవటానికి కూడా సహాయపడ్డాయి. వాస్తవంగా అవి 1960 దశాబ్దం చివరిలో ప్రారంభించిన హరిత విప్లవాన్ని జయప్రదం చేయటానికి అవసరమైన పరిస్థితుల్ని కల్పించాయి. అందుకే భారతదేశంలోని సహకార ఉద్యమం యొక్క లోపాల పట్ల పూర్తి అవగాహన గల వుల్ళ్ లాదెజెన్సీ 1972 మేలో 'ప్రపంచబ్యాంకుకి పంపించిన వార్షిక నివేదికలో యిలా పేర్కొన్నాడు : “లక్షలాది మంది రైతులు వాటి (సహకార సంఘాల) నుండి ప్రయోజనం పొందారు, అవి లేని భారతదేశాన్ని ఊహించడం సాధ్యం కాదు.” 564 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పాల సహకార సంఘాలు
భారతదేశంలోని సహకార ఉద్యమం కథ అత్యంత జయప్రదమైన ప్రయోగాన్ని వివదించకుండా పూర్తి కాదు. గుజరాతులోని కెయిరా (ఖేదా) జిల్లాలో అతి సాధారణంగా (ప్రారంభమైన ఈ (ప్రయోగం దేశమంతటా వ్యాపించిన "క్షీర విప్లవం (౫16 ం014600) యొక్క అగ్రగామి అయింది. మనం ఇక్కడ ఆనంద్ ప్రయోగం యొక్క సంక్షిప్త వివరణకు పరిమితమవుదాం.
బొంబాయి నగరానికి పాలు సరఫరా చేస్తున్న ఖేదా జిల్లా రైతులు తాము పాల వ్యాపారులచే మోసగించబడ్డామని భావించారు. అదే జిల్లాకు చెందిన ప్రముఖ జాతీయవాద నాయకుడైన సర్దార్‌పటేల్‌ను ఆశ్రయించి సహాయమర్ధించారు. పటేల్, మొరార్దీ దేశాయ్‌ల ప్రోత్సాహంతో రైతులు సహకార సంఘంగా ఏర్పడి, వారి సంఘం సరఫరా చేసే పాలను కొనవలసిందిగా సమ్మె చేసి బొంబాయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. ఆ విధంగా అహమ్మదాబాద్, బరోడా జాతీయ రహదారిపై చిన్నవట్టణంగా వున్న ఆనంద్‌లో 1946 డిసెంబరులో “డ్రిస్టిక్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్' గా రిజిస్టర్ చేయించుకొన్న సహకార సంఘం బొంబాయికి రోజుకి లీటర్ల పాలు సరఫరా చేసింది.
గాంధేయ స్వాతంత్ర పోరాట యోధుడు త్రిభువన్దాస్, కె.పాటిల్ పాల సహకార సంఘం స్థాషించుకోమని నచ్చజెబుతూ గ్రామాలలో పాదయాత్రలు జరిపాడు. సహకార సంఘానికి మొదటిసారిగా 1947లో ఛైర్మన్ అయ్యాడు. 25 సం॥లుగా మరల టరలా ఛైర్మన్ అవుతూవున్నాడు. డాక్టర్ వర్డీస్ కురియన్ కేరళకు చెందిన ప్రముఖ టా క్షీర విప్లవానికి కీలకమైన వ్యక్తి. 1950 నుండి 1978 వరకు సహకార సం ల్ లే కార్య నిర్వాహణాధికారి, సంఘంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కానా 100 మంది సభ్యుల లోపు గల రెండు గ్రామ సహకార సంఘాలత్ [ క్ ణే యూనియన్ 2000 సం॥ నాటికి 1,015 సంఘాలతో 5,74,000 సభ్యత్వానికి ఎ 0 న రోజుకి 250 లీటర్ల పాల నుండి దాదాపు 1 మిలియన్ లీటర్లకు వార్షికంగా 487 కొట్ల వ్యాపారానికి ఎదిగింది.
ఈ త్వరిత పెరుగుదల క్రమంలో యూనియన్ తన కార్యక్రమాలతో వైవిధ్యాన్ని పెంచింది. చలికాలంలో పెరిగిన పాల ఉత్పత్తి కనుగుణంగా మార్కెట్లు దొరకని సమస్యని పాక్షికంగా పరిష్కరించేందుకు 1955లో యూనియన్ పాలపొడి, వెన్న తయారు చేసే స్వతంత్రం తర్వాత భారతదేశం 565
ఫ్యాక్టరీని స్థాపించింది. ఆ సంవత్సరమే యూనియన్ తన ఉత్పత్తులను అమూల్ ప ఎంపిక చేసింది. అమూల్ త్వరలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బహు ఉత్పత్తులైన గ్లాక్సో, నెజల్లలో పోటీపడగల న్థాయికి ఎదిగింది.
1960లో 600 టన్నుల జన్నుు 2500 టన్నుల పసిపిల్లల ఆహారం ర్పతి చేసే కొత్త ఫ్యాక్టరీ ప్రపంచంలోనే వాణిజ్య స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి యారు గేదె పాలతో ఉత్పత్తి చేసే మొదటి ఫ్యాక్టరీ ఇదే. 1964లో పశువుల అహారా న చేసే ఆధునిక కర్మాగారం నిర్మించబడింది. పశువులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఓ ధరలకు రైతులకు సరఫరా చేసేందుకు యూనియన్ ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకొన్నది. 1994-95 లో యూనియన్ 1,44,181 టన్నుల పశువుల మేతను తన శాఖల ద్వారా అమ్మింది.
ప్రతి సామాజికాభివృద్ధి కార్యక్రమానికి ఒక సమగ్రమైన వైఖరి ఉంటుంది యూనియన్ కార్యకలాపాల్ని నిరంతరంగా ఎలా విస్తరించవచ్చునో, సాధారణ రె సంబంధించిన వివిధ అంశాలను యూనియన్ తన పరిధిలోకి తెచ్చుకొనే (క్రమ ంలో కొత్త సంస్థలు ఎలా పుట్టుకొస్తాయో అవగతం చేసుకొనేందుకు ఖేదా సహకార సంఘం ఒక నమూనా, సభ్యులు మేలు జాతి పశువులు కలిగి ఉండదానికి ఒక కృత్రిమ గర్భోత్సక్తి కేంద్రాలు ఏర్పాటు చేయబడింది. 1994 -95లో 827 కేంద్రాల ద్వారా 6:70.000 మేలు జాతి పశువుల ఉత్పత్తి జరిగింది. రైతులు నామ మాత్రపు ఖర్చుతో పశువులకు వైద్యం చేయించుకోవటానికి వీలుగా 24 గంటలు అందుబాటులో వుండే రేడియో టెలిఫోన్లు అమర్చబడిన 29 వాహనాల సంచార వైద్యశాల నెలకొల్పబడింది. పశువులు కలిగి వున్న సభ్యులకు ఖీమా రక్షణ కల్పించబడింది. పశువుల మేత ఉత్పత్తికి మేలిరకం విత్తనాలు సరవరా చేయబడ్డాయి. వశువులకు రోగ నిరోధక టీకాల తయారీ కూడా ప్రారంభించబడింది. పశువుల పెంపకం, యాజమాన్య నిర్వాహ ణలో మెలకువలను గురించి రైతుల్ని చైతన్య పరచేందుకు క్రమబద్దంగా న్యూస్‌లెటర్ ప్రచురించబడింది. రైతు కుటుంబంలో సాధారణంగా పశుపోషణ బాధ్యతలు నిర్వర్తించే మహిళలకు శిక్షణ యివ్వడం జరిగింది. గ్రామీణాభివృద్ధి పథకాలకు అవసరమైన మేనేజర్లకు శిక్షణ యిచ్చేందుకు ఆనంద్‌లో గ్రామీణ యాజమాన్య శిక్షణా కేంద్రం స్థాపించబడింది. “ఆనంద్ నమూనా” గుజరాత్‌లోని ఇతర జిల్లాలకు వ్యాపించడంతో మార్కెటింగ్ అవసరాలను పర్యవేక్షించేందుకు 1974లో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆనంద్ స్థాపించబడింది. 566 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సహకార సంఘాలు ఖేదా జిల్లాలోని గ్రామీణ ప్రజల - ప్రత్యేకించి పేద రైతుల, భూమి లేని పేదల జీవన స్థాయిని మెరుగుపరచాయి. ఒక అంచనాననుసరించి, సహకార సంఘాల కార్యకలాపాల ఫలితంగా ఖేదా జిల్లాలోని గ్రామీణ కుటుంబాల ఆదాయంలో 48 శాతం పాడి చేయడం వస్తుంది. సహకార సంఘాల లాభాలలోని కొంత భాగం (గ్రామాలలోని బావులు, రోడ్డు, పాఠశాలల లాంటి ఉమ్మడి అవసరాల కొరకు వెచ్చించబడింది.
సహకార ఉద్యమం సహకార సంఘాల చేత ప్రజాస్వామ్యయుతంగా పనిచేయించింది. యాజమాన్యం సభ్యుల సమస్యల్ని చెవి యొగ్గి విన్నది. దిగువ కులాల వారు పేదలతో సహ సభ్యులందరి ప్రయోజనాల కొరకు పనిచేసింది. పథకంలో, విధాన రూప కల్పన క్రమంలో సభ్యుని భాగస్వామ్యం వుండే విధంగా సహకార సంఘ చట రూపకల్పన జరిగింది. పాల ఉత్పత్తిదారుడై వుండి క్రమబద్ధంగా పాలు సరఫరా చేసే వాడెవరైనా సభ్యునిగా నమోదు కావచ్చు. గ్రామంలోని పాలకేంద్రం వద్ద కులమతాల కతీతంగా క్యూలోనిలుచుని పాలు అమ్మి డబ్బు తెచ్చుకొనే గ్రామస్తుడు, ఒకటి రెండు గేదెలున్నవాడు పేదవాడు గాని భూస్వామి కాదు. పాల ఉత్పత్తిదారులలో దాదాపు మూడవవంతు మంది భూమి లేని పేదలే.
అలాంటి ఉత్పత్తిదారులు నామమాత్రమైన ఒక రూపాయి (ప్రవేశ రుసుము కనీసం రు॥10ల విలువల గల ఒక షేరు కొని సహకార సంఘంలో సభ్యులయ్యారు. సభ్యులు రహస్య ఓటింగు ప్రక్రియ ద్వారా యాజమాన్య కమిటీని ఎన్నుకుంటారు. పేర్ల సంఖ్యతో సంబంధం లేకుందా ప్రతీ సభ్యునికి ఒక ఓటు వుంటుంది. కమిటీ విధాన రూపకల్పన పర్యవేక్షణ చేస్తుంది. ఛైర్మన్, కమిటీలోని మూడవ వంతు సభ్యులు ప్రతీ సంవత్సరం పదవీ విరమణ చేస్తారు. కొత్త ఎన్నికలు నిర్వహించబడతాయి. ఎన్నికలు పట్టుదలగా పోటాపోటీగా జరుగుతాయి. దాదాపు 99 శాతం వరకు ఓట్లు పోలవుతుంటాయి. 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు యాజమాన్యంలో నిర్వహింపబడే జిల్లా స్థాయి యూనియన్‌లో ఆరుగురు డైరెక్టర్లు (గ్రామ సహకార సంఘాల చైర్మన్త నుండి ఎన్నుకొనబడతారు. బోర్డు గ్రామ ప్రతినిధుల నుండి వార్షికంగా ఒక చైర్మన్‌ను ఎన్నుకుంటుంది. ఒక మేనేజింగ్ దైరెక్టరును నియమిస్తుంది. అతడు అవసరమైన ఇతర ఉద్యోగుల్ని నియమిస్తాడు. ఈ సహకార సంఘం ఉత్పత్తిదారుని చొరవని నియంత్రణని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నది. స్వతంత్రం తర్వాత భారతదేశం 567
ఖేదాలో సాధించిన విజయంతో ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. 1964లో అప్పటి (ప్రధానమంత్రి, లాల్బహుద్దూర్ శాస్త్రి ఆనంద్ నమూనాలో సహకార పాల సరఫరా కేంద్రాలను ప్రారంభించాలనే పెద్ద కార్య!క్రమాన్ని ప్రతిపొదిస్తూ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో 1965 నేషనల్ డెయిరీ డెవలెప్మెంట్ బోర్టు స్థాపించబడింది. అత్యంత (ప్రతిభాశాలి అయిన కురియన్‌ని దానికి గౌరవాద్యక్షుడిని చేశారు. కురియన్ పట్టుబట్టడంతో యన్.డి.డి.లి. ఢిల్లీలో గాక ఆనంద్‌లో స్థాపించబడింది. ఆనంద్ నమూనాని అనుకరిస్తూ యన్.డి.డి.బి. దేశంలోని ఇతర ప్రాంతాలలో “ఆపరేషన్ స్లడ్' కార్యక్రమం ప్రారంభించింది. 1995 నాటికి 8.9 మిలియన్ రైతుల సభ్యత్వంతో దేశ వ్యాప్తంగా 69,875 గ్రామీణ పాల సహకార సంఘాలు ఏర్పడ్డాయి. విస్తరణ బాగా వున్నప్పటికీ ఒక అంచనా ప్రకారం మొత్తం పాల ఉత్పత్తిలో ఆపరేషన్ ఫ్లడ్ 6. ౩%నికి, మార్కెట్టు చేయబడుతున్న పాలలో 22%నికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నది. విస్తరణకు ఇంకా చాలా అవకాశం వుంది.
ప్రపంచ బ్యాంకు 'ఆపరేషన్ ఫ్లడ్" పై చేసిన అధ్యయనం ఆనంద్ నమూనాని అనుసరించడం వలన ఎలాంటి లాభాలు వచ్చిందీ వివరించింది. గతంలో గుజరాత్ పొందిన ప్రయోజనాలు "ఈనాడు దేశంలోని ఇతర (ప్రాంతాలు పొందుతున్నాయని పేర్మాన్నది.
మొదటిది : ఆపరేషన్ ఫ్లడ్ కారణంగా పాల సరఫరాలో గణనీయమైన పెరుగుదల ఫలితంగా పాల ఉత్పత్తిదారుల - ప్రత్యేకించి పేదల ఆదాయం పెరిగింది. 1969 వరకు జాతీయ పాల ఉత్పత్తి వార్షికంగా 0.7 శాతం రేటున పెరగగా “ఆపరేషన్ ఫ్లడ్ ప్రవేశపెట్టిన తరువాత పెరుగుదల రేటు 4 శాతాన్ని మించింది. పాల ఉత్పత్తిదారులకు సహకార వ్యవస్థ 1972 లో రు. 2.1 బిలియన్లు చెల్లించగా 1995 నాటికి 34 బిలియన్లకు పెరిగింది. అంతేగాక పాడి చేయటం రైతు యొక్క ముఖ్యమైన వ్యాపకం మాత్రమే గాక ప్రత్యేకించి పేదలకు ప్రధానమైన ఆదాయవనరు అయింది. ప్రయోజనాలు పొందుతున్న వారిలో 60 శాతం మంది చిన్నసన్నకారు రైతులు, భూమి లేని పేదలు, పాల సహకార సంఘాలు ఒక మేరకు పేదరిక నిర్మూలనా కేంద్రాలుగా పనిచేశాయి. అంతేగాక ఆనంద్ నమూనా పాల సహకార సంఘాలు కుల, మత లింగ వివక్షతకు అతీతంగా, ఏ ఒక్క (గ్రూపుని లక్ష్యంగా పెట్టుకోకపోయినప్పటికి పేదలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 1970 దశాబ్దం మధ్యలో తొలుత గ్రామీణ మహారాష్ట్రలో ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్‌లో సహ మరికొన్ని యితర రాష్ట్రాలలో ప్రారంభించబడిన ఉపాధి హామీ పథకం (2.6.3) శ68 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇలాంటి లక్ష్యాలనే సాధించింది. ఈ పథకం వలన ముఖ్యంగా ప్రయోజనాలను పొందినవారు షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు చెందిన భూమి లేని పేదలు. పథకం ఈ [గ్రూపుల్ని లక్ష్యంగా పెట్టుకొనకపోయినప్పటికి వారంతట వారు ఎంపిక చేసుకొని పథకంలోకి వచ్చారు. ప్రత్యేకించి అణగారిన సెక్షన్లను లక్షిత [గ్రూపులుగా నిర్దేశించుకొనకపోయినప్పటికి అలాంటి కార్యక్రమాలు ఆ సెక్షన్లకి చేరే సానుకూలత వుంది. యిది యితర గ్రూపుల నుండి అనివార్యంగా వచ్చే వ్యతిరేకతని అడ్డుకొన్నది.
రెండవది ; పాల సరఫరా సంఘాల, ఆపరేషన్ ఫ్లడ్ ప్రభావం పాలసరఫరా, ఆదాయం పెంపుదల అతిక్రమించి చాలా ముందుకు పోయింది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం రిపోర్టు చేసిన విధంగా ఆపరేషన్ ఫ్లడ్, పాడి పరిశ్రమ విస్తరణలకు అనుబంధ ఉత్పత్తిగా దేశీయంగా పాల పరిశ్రమ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ (ఇప్పుడు పాల పరిశ్రమకి చెందిన పరికరాలు 7 శాతం మాత్రమే దిగుమతి చేసుకోబడుతున్నాయి). పశువుల మేత, పశు ఆరోగ్యం, కృత్రిమ గర్భోత్పత్తి, యాజమాన్య సమాచార వ్యవస్థలు ఆహార సాంకేతికత లాంటి వాటికి సంబంధించిన దేశీయ నిపుణుల సంస్థ స్థాపన జరిగింది. మౌళిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, విసృతమైన సాంకేతిక పనులు చేసేందుకు గ్రామీణ ప్రజలకు శిక్షణ - లాంటివి దేశీయం చేయబడటం వలన ఉత్పత్తి ఖర్చుల్ని బాగా తగ్గించుకొనడం సాధ్యపడింది.
ఆపరేషన్ ఫ్లడ్, పాల సహకార సంఘాలు మహిళలపై బిడ్డలపై, విద్యపై సానుకూల ప్రభావం చూపాయి. ఈ ఉద్యమం ద్వారా మహిళల సాధికారితని పెంచగల అవకాశాన్ని (56౪/2) లాంటి ప్రభుత్వేతర సంస్థల (౮6౦) సహకారంతో ఆపరేషన్ ఫ్లడ్ దాదాపు 6000 మహిళలు నిర్వహించే పాల సహకార సంఘాలను స్థాపించింది. ఈ సంఘాలలో మహిళలు మాత్రమే సభ్యులు. యాజమాన్య కమిటీలను కూడా పూర్తిగా మహిళలే నిర్వహించారు. ఇవి పురుషాధిక్య సహకార సంఘాల కంటే సమర్ధవంతంగా పనిచేశాయి. ఇవి పాల ద్వారా వచ్చే అదాయంతో మహిళలకు వారి జీవితాలపై ఎక్కువ నియంత్రణ సాధించి పెట్టాయి. ఇళ్ల వెలుపల కూడా నిర్ణయాలు చేయడంలో పాలు పంచుకొనేలా చేశాయి. వారి యాజమాన్య, నాయకత్వ సమర్ధతకు అవకాశం కల్పించాయి. అంతేగాక పేద గ్రామాలలో పాల వలన వచ్చే ఆదాయం పిల్లలు బడికి పోవటానికి, కాస్త మెరుగైన గ్రామాలలో వారి పిల్లలు చదువు ఎక్కునకాలం కొనసాగించటానికి తోడ్చడింది. అంటే మధ్యలో చదువు మానుకోనే వారిని తగ్గించింది. పిల్లలందరూ బడికి పోతున్న ఒక మాదిరి సంపన్న గ్రామాలలో సహకార సంఘాల వలన వచ్చే ఆదాయంలో స్వతంత్రం తర్వాత భారతదేశం 569
కొంతభాగం పాఠశాల సౌకర్యాలను మెరుగుపరచటానికి వెచ్చించబడింది. పాల సహకార సంఘాల ప్రభావం కారణంగానే పాఠశాలల్లో బాలికల వాజరు పెరిగినట్లు క్షేతస్థాయిలో జరిగిన అధ్యయనాలు ధృవపరిచాయి.
ఆనంద్ నమూనా విస్తరణ కేవలం పాలకే పరిమితం కాలేదు. యన్.డి.డి.బి. ప్రోత్సాహంతో పంద్లు, కూరగాయల, ఉత్పత్తిదారుల, నూనెగింజల రైతుల, ఉప్పు తయారీదారుల, చెట్ల పెంపకందారుల సహకార సంఘాలు ప్రారంభించబడ్డాలూ. ఈ క్రమానికి సహాయపడేందుకు ఖేదా యూనియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ వొందీన్ కార్యకర్తలను సమకూర్చింది. స్వప్రయోజనపరుల నుండి - ప్రత్యేకించి నూనె గింజల వ్యాపారుల నుండి ప్రతిఘటన ఎదురయింది. దేశంలోని కొన్ని (ప్రాంతాలలో సహకార సంఘాల స్థాపనకు సన్నాహక చర్యలు చేపట్టిన యన్.డి.డి.బి. దళ సభ్యులకు భౌతిక దాడుల బెదిరింపులు వచ్చాయి. అయినప్పటికి ఉద్యమం అభివృద్ది చెందింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సహకార సంఘాల కూరగాయల, పంద్ల దుకాణులు, పొల బూతులంత ప్రాచుర్యం పొందాయి. పాలు, పాల ఉత్పత్తులలో 'అమూలొ ఎంతగా ప్రాతినిధ్యం వహించిందో శాఖాహార నూనెలలో సహకార సంఘాల ఉత్పత్తులైన ధారాబ్రాండ్ నూనెలు అంత ప్రాతినిధ్యం వహించాయి.
స్వతంతక్రానంతరం భారతదేశం సాధించిన పెద్ద విజయాలలో యిది ఒకటీ. సహకార సంఘాలను అధ్యయనం చేసేందుకు 1950 దశాబ్దంలో భారత ప్రతినిధి వర్గాలు చైనా వెళ్ళాయి. కాని ఈనాడు డజన్ల కొలది దేశాలు 'ఆనంద్ అనుభవాన్ని అధ్యయనం చేసి నేర్చుకొనేందుకు ప్రతినిధి వర్గాలను భారతదేశానికి పంపిస్తున్నాయి. దిగువస్థాయిలో ఈ ప్రయోగం యొక్క ప్రభావాన్ని 1985లో 'ఆనంద్' సమీపంలోని ఒక (గ్రామంలోని ఒక పేద రైతు ఈ రచయితలతో చెప్పిన మాటలు “ఒక కురియన్‌ని కలిగి వుండటం గుజరాత్ చేసుకున్న అదృష్టం. ప్రతీ రాష్ట్రానికి దేవుడు ఒక కురియన్‌ని యిస్తే భారతదేశంలోని చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి” - అని వ్యక్తం చేశాడు. భూ సంస్కరణలు - సమీక్ష
భారతదేశంలో ఆధునిక ప్రజాస్వామ్య చట్ర పరిమితులలో ఎలాంటి హింసొ ప్రయోగం లేకుండా విసృృతమైన భూ సంస్కరణలు అమలు పరచబడ్డాయి. సోవియట్ యూనియన్‌లో లాగా బలవంతపు సామూహీకరణ గాని లేక చైనాలో లాగా రైతుల్ని కమ్యూన్లలోకి నెట్టివేసి భూముల్ని స్వాధీనం చేసుకోవడం గాని జరగలేదు. జపాన్‌లో 6570 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
లాగా బయటి నుండి వచ్చి ఆక్రమించిన సైన్యం ఓడించిన ప్రజలలో భూ సంస్కరణలు చేపట్టలేదు. వయోజన ఓటింగు, ప్రతిపక్షాలకు పూర్తి పౌరహక్కులు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నచోట భారతదేశం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సుదీర్ధమైన శక్తివంతమైన జాతీయ, రైతు ఉద్యమాల వారసత్వం ప్రాతిపదికగా స్వతంత్ర భారతదేశం వలసవాద వ్యవసాయ చట్రాన్ని జయప్రదంగా మార్చివేసింది. అర్ధ శతాబ్దం పాటు గల వ్యవసాయ స్తబ్బతని తొలగించింది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఆధునిక అభివృద్ధికరమైన లేక పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని ఆ తరువాత దశలో హరిత విష్రవంతో సంబంధం గల సాంకేతిక వ్యవసాయాన్ని ప్రవేశపెట్టగల సంస్థాపరమైన మౌలిక మార్పులు చేపట్టబడ్డాయి.
భూస్వామ్య నిర్భంధ వసూళ్ళు, వెట్టిచాకిరి, గతకాలం నాటి మాటలు. రాజ్యం రైతు నుండి దాదాపు ఏమీ వసూలు చేయటం లేదు. కొన్ని రాష్ట్రాలు భూమి శిస్తుని కూడా రద్దు చేశాయి. ఇతర చోట్ల కూడా భూమి శిస్తు రేట్లు శతాబ్దాల తరబడి స్థిరంగా వుండగా భూమి శిస్తు యొక్క వాస్తవ విలువ విపరీతంగా తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పెరిగాయి. వలసపాలన కాలంలో భూమి శిస్తు చాలా ఎక్కువగా వుండేది. అది క్రమంగా పెరుగుతూ వ్యవసాయం నుండి వచ్చే ఆదాయంలో దాదాపు సగానికి చేరింది. ఆ తరువాత అది క్రమంగా వ్యవసాయాదాయంలో 1 శాతం కంటె తగ్గింది. సహకార బ్యాంకుల నుండి జాతీయం చేయబడిన బ్యాంకుల నుండి రైతుకి రుణాలు లభిస్తుండడం వలన అతడిపై వడ్డీ వ్యాపారి పట్టు కూడా సడలింది. అలాంటి సంస్థలు బ్యాంకులు రైతులకు రుణాలు 1950 -51 లో 0.28 బిలియన్లు ఇవ్వగా, 1965- 66లో 3.65 బిలియన్లు, 1972-78లో 7.75 బిలియన్లు ఇచ్చాయి. ఈ అప్పులు పేదలకు కూడా అందాయి. క్రమంగా పేదలకు సమాన ఓటు హక్కు గల ప్రజాస్వామ్య రైతాంగంలోని దిగువ సెక్షన్లు ప్రయోజనాలు అందేలా ప్రభుత్వంపైన గ్రామీణ కులీన వర్గంపైన వత్తిడి చేసింది. ఆ విధంగా వ్యవసాయాభివృద్ధికై రైతాంగం మొత్తానికి లభ్యమయ్యే వనరులు గణనీయంగా పెరిగాయి.
వ్యవసాయాభివృద్ధికి ఇచ్చే ప్రోత్సహకాలు వ్యవసాయ వర్గాలలోని విస్తృత సెక్సన్లను ఆకర్షించాయి. గతంలో పరోక్ష భూస్వాములుగా వున్న మాజీ జమీందార్హు, జాగీర్జార్లు వారి పొలాలను వ్యక్తిగత వ్యవసాయానికి ఉంచుకొనే అవకాశం కల్పించబడడం వలన వారంతా ఆధునిక పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని చేపట్టారు. అదే విధంగా కౌలుదారులు, పాలికాపులు యాజమాన్య హక్కులు లేక కౌలుకు రక్షణ పొందడంతో వారి పొలాల్ని అభివృద్ధి వరచుకొనేందుకు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి స్వతంత్రం తర్వాత భారతదేశం 571
సన్నద్ధమయ్యారు. సీలింగు మిగులు భూములు, భూదాన పొలాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గతంలో ఆక్రమించబడని ప్రభుత్వ భూములు పొందినవారు వారి పొలాల అభివృద్ధికి సన్నద్ధమయ్యారు. ఇంతకుముందు చర్చించిన విధంగా భూ సంస్మరణ కొరకు చేపట్టిన వివిధ చర్యల ప్రభావం పెట్టుబడిదారీ వ్యవసాయదారుల్ని సృష్టించడంపై ఉత్పాదకత పెంచటానికి పెట్టుబడులు పెట్టడంపై పడింది. అంతేగాక వలసపాలనా కాలంలో లాగా వ్యవసాయ మిగులు రాబట్టడానికి బదులుగా ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయాభివృద్ధికి పెద్ద ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. భారతదేశంలోని వందల వేల గ్రామాలలో అభివృద్ధిపరచబడిన వ్యవసాయ పద్ధతులను అలవరచేందుకు విత్తనాలను పరికరాలను సరథరా చేసేందుకు, చిన్న తరహా ప్రజా పనులను ప్రోత్సహించేందుకు బ్లాకు దెవలవ్మెంటు ఆవీనర్హు (9005) వ్యవసాయ విన్నరణాదికారులు, విలేజ్ లెవల్ వర్మర్ను (౪౬౪/5), వని చేయడం సర్వసాధారణమయింది. శాప్రీయ వ్యవసాయ పరిశోధనకు, నీటి పారుదల పథకాలకు, విద్యుదుత్పత్తికి, మౌలిక సదుపాయాల కల్చనకు పెద్ద మొత్తాలు వెచ్చించబడ్డాయి. 1950- 51 లో, 78,000 టన్నులుగా వున్న రసాయనిక ఎరువుల లభ్యత 1965-66 నాటికి 78400 టన్నులకు 1972-78 నాటికి 27,69,000 టన్నులకు పెరిగింది. ఇవన్నీ వ్యవసాయాన్ని చాలా ప్రభావితం చేశాయి. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలో వ్యవసాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వారిలో ఒకరైన డేనియల్ ధార్నర్ యిలా రాశాడు. తాలి పంచవర్ష ప్రణాళికలు వ్యవసాయాన్ని అశ్రద్ధ చేసినట్లు చెప్పటం జరుగుతుంది. ఈ ఆరోపణ తీవ్రంగా పరిగణించవలసింది కాదు. స్వతంత్రం వచ్చిన తరువాత మొదటి 21 సంవత్సరాలలో వ్యవసాయంలో మార్పులు తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. వాస్తవంగా గడచిన రెండు శతాబ్దాలలో కంటె ఈ కాలంలో ఎక్కువ మార్పులు జరిగాయి.” ఫలితాలు వాస్తవాల్ని తెలియజేస్తాయి. మొదటి మూడు ప్రణాళికల కాలంలో (మూడవ ప్రణాళిక చివరి సంవత్సరమైన 1965-66 ని మినహాయించి) భారతదేశ వ్యవసాయం వార్షికంగా ౩ శాతం పైగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి రేటు అంతకు ముందు గడచిన అర్హశతాబ్షిలో సాధించిన అభివృద్ధి రేటు కంటే 7.5 రెట్లు ఎక్కువ. 1891 -1946 కాలంలో వార్షిక అభివృద్ధి రేటు 0.4 శాతం. అంతేగాక మొదటి మూడు ప్రణాళికల కాలంలో సాధించిన అభివృద్ధి రేటు వ్యవసాయ భూమిని విస్తరించడం వలన మాత్రమే గాక ఎకరానికి సాధించిన దిగుబడులలో పెరుగుదల 572 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జి, ఆదిత్య ముఖర్జీ
వలన కూడా సాధించబడింది. దాదాపు వ్యవసాయాభివృద్ధి దిగుబడుల పెరుగుదల వలన సాధించబడింది. అంతేగాక ఈ కాలంలో సాధించిన వ్యవసాయాభివృద్ధి చాలా ఇతర దేశాలు సాధించిన దానికంటె ఎక్కువ. ఉదాహరణకు 1878 -1912 కాలంలో జపాన్ సాధించిన అభివృద్ధి రేటు 2.5 శాతం కంటె తక్కువ. ఆ తరువాత 1987 వరకు సాధించిన అభివృద్ధి రేటు అంతకంటె తక్కువ.
భూ సంస్కరణల ఫలితంగా దేశంలోని స్వంత వ్యవసాయం అత్యధిక ప్రాంతాలలో వ్యవసాయం యొక్క ముఖ్యమైన రూపమయింది. కాల గమనంలో పెద్ద వ్యవసాయదారులు చిన్న మధ్యతరగతి వ్యవసాయదారులయ్యారు. ఒక అంచనా ప్రకారం 1976-77 నాటికి 97 శాతం వ్యవసాయదారుల కమతాలు 25 ఎకరాలలోపుగా వున్నాయి. వారు సాగుచేస్తున్న పొలాలు మొత్తం సాగులో వున్న భూమిలో 79.6 శాతం (86.9 శాతం వ్యవసాయదారుల కమతాలు 10 ఎకరాలు లేక అంతకంటె తక్కువ. వారు సాగు చేస్తున్న భూమి మొత్తం వ్యవసాయ భూమిలో 48.4 శాతం) మరోవైపు 25 ఎకరాలు పైగా సాగుభూమి గల వ్యవసాయదారులు మొత్తం వ్యవసాయదారులలో 8 శాతం. వారు సాగుచేస్తున్న భూమి మొత్తం వ్యవసాయ భూమిలో 26.2 శాతం వుంది. అంతేగాక పెద్ద భూస్వాముల సంఖ్య, వారి అధీనంలో వున్న భూమి పరిమితి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 100 ఎకరాలు పైగా వున్న ఎస్టేట్లు చాలా అరుదు. ఆ ఎస్టేట్లలో ఆధునిక పెట్టుబడిదారి పద్ధతులలో వ్యవసాయం చేయబడుతున్నది.
కాని వ్యవసాయ జనాభాలోని దాదాపు సగం మందికి సంబంధించిన భూమి సమస్య (అత్యధిక ఇతర దేశాల లాగా గాక వారసత్వంగా సంక్రమించే కుల వ్యవస్థ కారణంగా ప్రాచీన కాలం నుండి భూమి లేనివారుగా వుండిపోతున్నారు.) కొనసాగుతూ వుంది. జనాభా వృద్ధి రేటు, వ్యవసాయ జనాభాలోని ఎక్కువ భాగాన్ని ఇముడ్చుకోలేని పారిశ్రామికీకరణ క్రమం యొక్క అశక్తత సమస్యని జటిలం చేశాయి. భారతదేశ పరిస్థితులలో భూమిలేని వారందరికీ భూమిని సమకూర్చటం రాజకీయంగా, ఆర్థికంగా, ఆచరణీయ పరిష్కారం కాదు. (దశాబ్దాల పాటు కొనసాగుతున్న పశ్చిమబెంగాల్, కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా 'దున్నేవాడికే భూమి సమస్యని అంత తీవ్రంగా చేపట్టలేదు. అక్కడ సాధించిన విజయం పాలికాపులు లేదా బార్గదార్లలో దాదాపు సగం మందికి కౌలు కాలవ్యవధికి రక్షణ కల్పించటానికి పరిమితమయింది.) భూమి లేని వారిపని స్వతంత్రం తర్వాత భారతదేశం 578
పరిస్థితుల్ని మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాలలో వారికి వ్యవసాయతలేర ఉపాధి కల్పించడం లాంటి ప్రయత్నాలకు వివిధ రాష్రాలలో విభిన్నమైన ఫలితాలు సిద్ధిదా:
గ్రామీణ పేదరికం, అన్యాయం, భూమిలేనితనం సమస్యల్ని పరిష్కరించేందుకు సహకార ఉమ్మడి వ్యవసాయం ఒక పద్ధతిగా విఫలమయింది. గ్రామీణ (ప్రాంతాలలో పేదల కొరకు ఉద్దేశించిన పథకాలను తరచుగా సంపన్నులు వినియోగించుకొన్నారు. నెహ్రా ఉన్నప్పటికి సోషలిస్ట్ తరహా సమాజం కాంగ్రెస్ లక్ష్యమని (అది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చబడింది) ఆవడి కాం(గెస్ (1965) ఆమోదించినప్పటికి నాగపూర్ కాంగ్రెస్ సిఫారసులు చేసినప్పటికి భారతదేశం వ్యవసాయం సోషలిజం దిశలో ముందుకు సాగలేదు. అయినప్పటికి స్వతంత్ర భారతదేశం, భారతదేశ వ్యవసాయం నుండి ప్యూడల్ అవశేషాలను తొలగించి, వారసత్వంగా సండ్రమించిన వలసవాద వ్యవసాయ చట్రాన్ని అభివృద్ధి ఫలితాలు పేద రైతులకు, ఒక మేరకు వ్యవసాయ కార్మికులకు నెమ్మదిగా అందే అభివృద్ధి మార్గం పట్టించింది.
కాని తొలి సంవత్సరాలలో సాధించిన గణనీయమైన అభివృద్ధి పెరుగుకున్న దేశ అవసరాలను తీర్చేదిగా లేదు. స్వతంత్రానంతరం వార్షికంగా 2.25 శాతం చొప్పున పెరుగుతున్న జనాభా, తలసరి ఆదాయం పెరుగుదల, త్వరిత పారిశ్రామికీకరణ ప్రయత్నాలు, పొరుగు దేశాలతో రెండు పెద్ద యుద్దాలు - భారతదేశ వ్యవసాయ డిమాంక్లని తీర్చటం కష్టతరం చేశాయి. మొదటి (ప్రణాళికా కాలంలో 12 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుమతి రెండవ మూడవ ప్రణాళికల కాలంలో 19.4, 32.4 మిలియన్ల టన్నులకు పెరిగింది. అప్పటికే పూర్తయిన సంస్తాగత సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించిన పెద్ద పెట్టుబడులు కారణరగా దేశం 1960 దశాబ్దం మధ్యకాలం
ద్ద పెట్టు 0గా బ్ద
నాటికి సాంకేతిక సంస్కరణల ప్రాతిపదికన తరువాతి దశ వ్యవసాయ పురోగతికి అంటే హరిత విప్లవానికి సన్నద్ధమయింది. 574 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
33
వ్యవసాయాభివృద్ది - హరిత విప్లవం
దీర్హకాలికంగా ఆహార కొరత ఎదుర్కొంటూ బిక్షాపాత్ర పట్టుకొని ఉన్న స్థితి నుండి భారతదేశాన్ని ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించే స్థితికే గాక అదనంగా ఉత్పత్తి చేసే స్థతికి తీసుకాని వచ్చినదిగా హరిత విప్లవం గుర్తించబడింది. భారతదేశ వ్యవసాయంలో - ప్రత్యేకించి 1960 దశాబ్దం మధ్య భాగం నుండి పెద్ద సాంకేతిక సంస్కరణల కారణంగా ఈ మార్చు వచ్చింది. హరిత విప్లవానికి దారితీసిన నూతన వ్యవసాయ విధానం ప్రవేశపెట్టడానికి వెనుక గల రాజకీయ ఆర్థిక కారణాలపైన, ప్రవేశపెట్టడానికి ఎంచుకొన్న సమయం పైన చాలా చర్చ జరిగింది. వ్యవసాయ పెరుగుదల స్వభావంపై వివిధ వ్యవసాయ వర్గాల - ప్రత్యేకించి పేదల స్థితి గతులలోని మార్పుపైన, ప్రభుత్వాల యొక్క వర్గ పొందికపైన, హరిత విప్లవం ప్రభావంపైన కూడా చాలా చర్చ జరిగింది.
నెహ్రూ పాలనా కాలంలో అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి 1964లో ఆయన మరణించే వరకు వ్యవసాయం అ(శ్రద్ధ చేయబడిందని, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పునాదిపై దృష్టి పెట్టలేదని విమర్శ వుంది. కాని దేశం త్వరితగతిని పారిశ్రామికీకరణ చెందాలనే నెహ్రూ కల నెరవేరాలంటే వ్యవసాయాభివృద్ధి కీలకమని ఆయనకి స్పష్టమైన అవగాహన వుంది. మొదటి ప్రణాళిక నుండి వ్యవసాయానికి కేటాయింపులు ఏ ప్రమాణాలతో చూచినప్పటికి గణనీయంగా వున్నాయి. మొదటి 'ప్రణాళికలో వ్యవసాయానికి నీటి పారుదలకు మొత్తం ప్రణాళిక వ్యయంలో ౩1 శాతం కేటాయించడంతో సహా తరువాత అన్ని ప్రభుత్వాల కేటాయింపులు కూడా 20, 24 శాతం మధ్య వున్నాయి. మొదటి రెండు ప్రణాళికల కాలాలు వ్యవసాయ సంస్కరణల సహకార వ్యవసాయం ప్రాతిపదికన ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుందని వేసుకొన్న అంచనాలు నెరవేరలేదు. కాని నెహ్రూ ప్రారంభం నుండి ఆధునిక వ్యవసాయానికి అవసరమైన శాప్తీయమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ప్రాధాన్యత యిచ్చాడు. స్వతంత్రం తర్వాత భారతదేశం 575
ఉక్కు ఫ్యాక్టరీలతో పాటు నెహ్రూ బాక్రానంగల్ లాంటి నీటి పారుదల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు అసంఖ్యాకమైన వ్యవసాయ విద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు రసొయనిక ఎరువుల కర్మాగారాలు - లాంటి ఆధునిక భారతదేశ దేవాలయాల నిర్మాణానికి చాలా
1950 దశాబ్దం చివరి 1960 దశాబ్దం ప్రారంభ సంవత్సరాల నాటికి భారతదేశ పరిస్థితుల కనుగుణంగా చేపట్టదగిన భూ సంస్కరణల ఫలితాలు అలాగే వ్యవసాయ విస్తరణ ద్వారా వ్యవసాయాభివృద్ధి అంటే ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని రావడం వలన జరిగిన వ్యవసాయాభివృద్ధి ఒక పరిమితికి చేరుకొనడంతో నెహౌ తన దృష్టిని అనివార్యంగా సాంకేతిక పరిష్కారాల దిశగా మరల్చాడు (పెద్ద ఎత్తున భూ సంస్కరణలు చేపట్టిన జపాన్, చైనా లాంటి దేశాలు కూడా వాటి అభివృద్ది రేటుని కొనసాగించేందుకు వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే పంథాని అనుసరించాయి, నెహ్రూ జీవించి వుండగానే మూడవ ప్రణాళికలో ప్రయోగ పూర్వకంగా శ్వేరలేగతిని వ్యవసాయాన్ని అభివృద్ధి పరచటానికి వసతులు వనరులు బాగా వున్న ప్రాంతాలను రొట్విని ఒకటి చొప్పున మొత్తం 15 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. తరువాత కాలంలో ఈ ప్రయోగం విసృత పరచబడింది. హరిత విప్లవాన్ని ప్రోత్సహించిన ప్రముఖులలో ఒకరైన జి.ఎస్.భల్లా యిలా చెప్పాడు.
“భారతదేశంలో గుణాత్మకమైన సాంకేతిక మార్పు - హరితవిష్లవం... ఆయన (నెహ్రూ) జీవిత కాలంలో గాక ఆయన చనిపోయిన తరువాత వచ్చింది. కాని సాంకేతికాభివద్ధిక్రి పునాదులు నెహ్రా కాలంలోనే వేయబడ్డాయి.”
_ ఏమైనప్పటికి 1960 దశాబ్దం మధ్యకాలం నాటికి కొన్ని దీర్హకాలిక ధోరణుల ప్రభావం అలాగే కొన్ని తక్షణ అనివార్యతలు నూతన వ్యవసాయ విధానాన్ని సాధ్యం యు,
1949-65 కాలంలో వార్షిక పెరుగుదల 3 శాతంతో వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల వున్నప్పటికీ భారతదేశం 1950 దశాబ్దం మధ్యకాలంలోను, 1960 దశాబ్దం మధ్యకాలంలోను ఆహార ధాన్యాల కారత ఎదుర్శొన్నది. 1960 దశాబ్దం ప్రారంభంలో వ్యవసాయాభివృద్ధి స్తంభించడం మొదలయింది. గత అర్ధ శతాబ్దంలో వార్షికంగా 1 శాతంగా వున్న జనాభావృద్ధి రేటు స్వతంత్రానంతరం 2.2 శాతానికి పెరగటం, పారిశ్రామికీకరణకు కేటాయింపులు పెంచటం. భారత వ్యవసాయ రంగంపై దీర్హకొలిక ఒత్తిడులు తెచ్చిపెట్టాయి. భారతదేశ మార్కెట్లు ప్రజల ఆహార డిమాందుని పూర్తిగొ తీర్చలేకపోయాయి. 1950 దశాబ్దం మధ్యకాలం నుండి ఆహార ధరలు పెరిగాయి. ఆహార కొరతని తీర్చటానికి, ధరలను స్థిరకరించటానికి భారతదేశం పెద్దఎత్తున ఆహార ధాన్యాలు క్76 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
దిగుమతి చేసుకొనక తప్పలేదు. దిగుమతులు వద్దనుకుంటే ఆహార ధాన్యాలను పెద్దఎత్తున సేకరించాలి. ఇలా చేయటం ప్రజాస్వామ్యం లేని రష్యా చైనాలతో సాధ్యమే గాని భారతదేశంలో ఆమోదయోగ్యం కాదు. భారతదేశం ఆమెరికా నుండి పియల్, 480 పథకం క్రింద ఆహారధాన్యాల దిగుమతి కొరకు చేసుకొన్న వివాదగ్రస్త ఒప్పందాలు 1956లో మొదలయ్యాయి. ఈ పథకం క్రింద మొదటి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ల టన్నుల ఆహారధాన్యాలు దిగుమతి చేసుకొనడం జరిగింది. ఆ తరువాత దిగుమతుల పరిమాణం పెరిగింది. 1963 నాటికి 4.5 మిలియన్ల టన్నులకు చేరింది.
ఈ పరిస్థితులలోనే చైనా (1962) తో పాకిస్తాన్ (1965) తో రెండు యుద్దాలు వచ్చిపడ్డాయి. వర్షాభావం కారణంగా రెండు సంవత్సరాలు 1965, 1966 లలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్చడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తులు 17 శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి 20 శాతం పడిపోయాయి. ఆహారధాన్యాల ధరలు 1965-68 కాలంలో వార్షికంగా 20 శాతం పెరిగాయి. 1966లో భారతదేశం 10 మిలియన్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకోవలసి వచ్చింది. దేశంలోని పలు ప్రాంతాలలో - ప్రత్యేకించి యు.పి, బీహారులలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడిన సంక్షోభ సమయంలో అమెరికా ఆహార ధాన్యాల దిగుమతి ఆపివేస్తామని బెదిరించింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం, వియత్నాంపై భారతదేశ వైఖరి - అమెరికాకు అనుకూలమైన విధానానికి భారతదేశాన్ని ఒప్పించటానికి (ప్రెసిడెంటు జాన్సన్‌కి అవకాశాలుగా వచ్చిపడ్డాయి. ఆహారం కొరకు ఆధారపడిన వాడిని షరతులతో లొంగదీయడం సులభం గదా!
1960 దశాబ్దం మధ్య సంవత్సరాల పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధిక స్వావలంబన
- ప్రత్యేకించి ఆహార స్వయం సమృద్ధి భారతదేశ ఆర్థిక విధానం యొక్క విదేశీ విధానం యొక్క అత్యంత ప్రాధాన్యతా లక్ష్యాలయ్యాయి. నూతన వ్యవసాయ విధానం అమలు ప్రారంభించబడింది. అప్పటి ప్రధానమంత్రి లాల్బహద్దూర్శాస్రి, ఆహార మంత్రి సి. సుబ్రమణ్యం, శాప్టి తరువాత 1966లో ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ భారతదేశ వ్యవసాయాభివృద్ధి కొరకు చేపట్టిన నూతన విధానంలోని మౌలిక మార్పులకు ప్రధాన కారకులు. ప్రపంచ బ్యాంక్చే నియమింపబడిన బెల్ మిషన్ ఈ మార్పుని సిఫార్సు చేసింది, పరిస్థితిని అమెరికా తనకనుకూలంగా మార్పురావాలని ఒత్తిడి చేసింది. భారతదేశంలో కూడా గణనీయంగా నూతన విధానానికి ఏకాభిప్రాయం ఆవిర్భవించింది. అధిక దిగుబడుల వంగడాలు (కణ) రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు ఏ ట్రాక్టర్లు పంపుసెట్లు లాంటి వాటితో సహా వ్యవసాయ యంత్రపరికరాలు, వ్యవసాయ విద్యాకార్యక్రమాలు రుణ సౌకర్యాలు ఏర్పాటు, నీటిపారుదల ఇతర అనుకూలతలు వున్న ప్రాంతాలలో
స్వతంత్రం తర్వాత భారతదేశం 577
82 మిలియన్ల ఎకరాల భూమి (మొత్తం వ్యవసాయం చేయబడుతున్న భూ మిలో 10వ వంతు) ఈ పథకం క్రింద ప్రయోజనం పొందడానికి ఎంపిక చేయబడింది.
వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడి గణనీయంగా పెరిగింది. 1968-73 కాలంలో వ్యవసాయ రుణ సౌకర్యాలు రెట్టింపు చేయబడ్డాయి. 1965 లో వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ నియమించబడింది. రైతు గిట్టుబాటు ధరకి హామీ కల్పించబడింది. ప్రభత్వ పెట్టుబడి రుణ సౌకర్యం గిట్టుబాటు ధరలు నూతన సాంకేతిక పరిజ్ఞానం లభ్యతలాంటివి రైతుల (ప్రైవేటు పెట్టుబడుల్ని పెంచాయి. ఫలితంగా హరిత విష్లవానికి ముందు వార్షికంగా ఒక మిలియన్ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించబడగా 1970 దశాబ్దంలో వార్షికంగా 2,5 మిలియన్ల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించబడింది. అంలే గాక 1960-61, 1970-71 మధ్యకాలంలో ఎలక్ట్రిక్ మరియు డీజిల్ పంపుసెట్లు 7౦ఫ్టి 421,000 నుండి 2.4 మిలియన్లకు బోర్‌వెల్స్ 90,000 నుండి 4,60,000 లకు ట్రాక్టర్లు 31,000 నుండి 1,40,000 లకు పెరిగింది. ఇదే కాల వ్యవధిలో రసాయనిక ఎరువులు నైట్రోజన్ ఫాస్పరస్, పొటాషియంల వినియోగం 3,06,000 మెట్రిక్ టన్నుల నుండి 2,350,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
ఈ నూతన విధానం యొక్క ఫలితాలు చాలా తక్కువ కాలవ్యవధిలో అందాయి. 1967-68, 1970-71 కాల వ్యవధిలో ఆహార ధాన్యాల ఉత్స్పత్తి, 35 శాతం పెరిగింది. 1964-85, 1971 -72 కాల వ్యవధిలో ఆహారధాన్యాల ఉత్పత్తి, 89 మిలియన్స్ టన్నుల నుండి 112 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే తలసరి' పెరుగుదల రేటు 10 శాతం. 1966లో 10.6 మిలియన్ల టన్నులుగా వున్న ఆహార ధాన్యాల దిగుమతి 1970 నాటికి 8.6 మిలియన్ల టన్నులకు పడిపోయింది. అదే కాలంలో ఆహారలభ్యత 73 మిలియన్ల టన్నుల నుండి 99.5 మిలియన్ల టన్నులకు పెరిగింది. నూతన వ్యవసాయ విధానం చేపట్టబడకపోతే భారతదేశం వార్షికంగా కనీసం 8 నుండి 10 మిలియన్ల టన్నుల దిగుమళులు చేసుకుంటూ 600 నుండి 800 మిలియన్ల డాలర్లు వెచ్చించవలసి వుండేదని అంచనా వేయబడింది. ఆహార లభ్యత 1978లో 110.25 మిలియన్ల టన్నులు వుండగా అది క్రమంగా పెరుగుతూ 1984 నాటికి 128.8 మిలియన్ల టన్నులకు చేరుకొంది. 1980ల నాటికి భారతదేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించటమే గాక 80. మిలియన్ల టన్నుల మిగులు ధాన్యాన్ని కలిగి పాతబాకీలను తీర్చే స్థితికి లేక ఆహార కొరత గల దేశాలకు ఎగుమతి చేయగలిగిన స్లితిక్రి చేరుకొన్నది. ఈ కారణంగానే 1987, 1988లో వచ్చిన వర్షాభావ పరిస్థితుల్ని జయప్రదంగా ఎదుర్కొనగలిగింది. 1990
దశాబ్దాంతానికి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 200 మిలియన్ల టన్నులకు చేరుకొంటుంది. ఇది 1950-51 నాటి కంటె 51 మిలియన్ల టన్నులు ఎక్కువ. జనాభా వృద్ధి రేటు 2,1 శాతం కాగా ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు ౩ శాతం.
క్78 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వ్యవసాయోత్పత్తుల దిగుబడుల పెరుగుదల కారణంగా హరిత విప్లవం వ్యవసాయాఖభివృద్ది రేటుని పెంచింది. 1949-50, 1989-90 మధ్య కాలంలో సరాసరి అఖభివృద్ధిరేటు వార్షికంగా 2.7 శాతం. హరిత విప్లవానికి ముందు కాలంలో అంటే 1949- 50 నుండి 1964-65 వరకు వ్యవసాయోత్స్పత్తి పెరుగుదలలో 51 శాతం సాగులోకి ఎక్కువ భూమిని తీసుకొని రావడం వలన (వార్షిక పెరుగుదలరేటు 1.61 శాతం) 49 శాతం దిగుబడి పెంచడం వలన (వార్షిక పెరుగుదల రేటు 1.5 శాతం) సాధ్యపడింది. వ్యవసాయోత్పత్తుల పెరుగుదలను అలాగే నిలబెట్టేందుకు వ్యవసాయ విస్తీర్ణం దిగుబడిలో పెరుగుదలా రెండు కొనసాగాలి. విస్తీర్ణంలో పెరుగుదల ఒకన్థాయికి వచ్చిన తరువాత అంటే యింక పెంచటానికి అవకాశాలు లేని స్థాయికి చేరుకొన్న తరువాత అదే అభివృద్ధి రేటు కొనసాగాలంటే త్వరితగతిని దిగుబడులు పెంచడం అవసరమవుతుంది. అలా చేయటంలో హరిత విష్రవం జయప్రదమయింది. 1967-68, 1989-90 మధ్య కాలంలో వ్యవసాయోత్పత్తిలో 80 శాతం పెరుగుదల దిగుబడులు పెంచడం ద్వారా (వార్షిక పెరుగుదల 2.5 శాతం) సాధించబడింది. విస్తీర్దాన్ని పెంచడం ద్వారా 20 శాతం అభివృద్ధి (వార్షికంగా 0.26 శాతం) సాధించబడింది. ఇటీవలి కాలంలో విస్తీర్ణంలో పెరుగుదల పూర్తిగా ఆగిపోయింది కనుక ఉత్పత్తి పెరుగుదల కేవలం దిగుబడుల కారణంగానే జరుగుతుంది. నూతన వ్యవసాయ విధానం అమలు ప్రారంభించినప్పటి నుండి కొన్ని సందేహాలు అపోహలు వ్యక్తమయ్యాయి. అప్పటికే అనుకూలతలు వున్న ప్రాంతాలలో వనరుల్ని కేంద్రీకరించడం వలన 'హరితవిప్లవం ప్రాంతీయ అసమానతల్ని పెంచుతుంది - అనేది ఒక తీవ్రమైన విమర్శ. అలాంటి ఆందోళనలకు పరిష్కారం హదితవిప్లవాన్ని యితర ప్రాంతాలకు విస్తరించడంలో వుంది గాని వ్యతిరేకించడంలో లేదు. హరిత విప్లవం ఇంకా అసమానతల్ని పెంచకపోగాా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి వాటిని సౌభాగ్యవంతం చేసిందని జి.ఎస్. భల్లాలాంటి పండితుల అధ్యయనం స్పష్టం చేసింది. 1862-65 నుండి 1970-73 వరకు గల కాల వ్యవధిలో అంటే హరిత విప్లవం తొలిదశలో అభివృద్ధి రేటు 2.08 శాతం సాధించబడింది. ఇది పశ్చిమోత్తర ప్రాంతాలైన పంజాబు, హర్యానా, పశ్చిమ యుపిలలో గోధుమ దిగుబడులలో విపరీతమైన పెరుగుదల కారణంగా సాధించబడింది. హరిత విప్లవం యొక్క రెండవ దశ లో అంటే 1970-78 నుండి 1980- 88 వరకు గల కాలవ్యవధిలో అధిక దిగుబడి వంగడాల సాంకేతిక పరిజ్ఞానాన్ని గోధుమ నుండి వరికి విస్తరించడం వలన హరిత విష్లవం దేశంలోని యితర ప్రాంతాలకు - తూర్పు యు.పి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలు, తమిళనాడు కర్షాటకలలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. మహారాష్ట్ర గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల అభివృద్ధి, అఖిల భారత వార్చిక అభివృద్ధి రేటు 2.38 ని అధిగమించింది. 1980-83 నుండి 1092-95 వరకు స్వతంత్రం తర్వాత భారతదేశం 579
గల హరితవిప్లవం యొక్కయిటీవలి మూడవదశ గణనీయమైన ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించింది. ఈ దశలో గతంలో చాలా తక్కువ అభివృద్ధి చెందిన పశ్చిమ బెంగాల్ తూర్పు ప్రాంతాలకు బీహారు, అస్సాం, ఒరిస్సాలకు విస్తరించింది. పశ్చిమబెంగాల్ గతంలో ఎన్నడూ లేనంతగా 5.39 శాతం అభివృద్ది సాధించింది. అలాగే యితర ప్రాంతాలు ప్రత్యేకించి మధ్యప్రదేశ్ దక్షిణ ప్రాంతం రాజస్థాన్ మధ్యప్రాంతం కూడా త్వరగా అభివృద్ధి చెందాయి. మూడవ దశ చివరికి వివిధ రాష్ట్రాల మధ్య ఉత్పత్తిలో దిగుబడులలో వ్యత్యాసం చాలా వరకు తగ్గింది. తొలి దశలో - ప్రత్యేకించి 1970 దశాబ్దం తాలి సంవత్సరాలలో హరిత విప్లవం గ్రామీణ ప్రాంతాలలో వర్గ విభజనకి దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమయింది. సంపన్నరైతులు పెట్టుబడిదారీ వ్యవసాయదారులు ఆధునిక వసతులు అందుబాటులో లేని చిన్న రైతుల్ని కౌలుదారుల్ని అణగద్రాక్కి బలపడుతున్నారని విమర్శ వుంది. అంతేగాక వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ కార్మికుల ఉపాధిని హరిస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. మరొక విధంగా చెప్పాలంటే గ్రామీణ పేదరికం పెరిగే క్రమం (ప్రారంభమయిందని, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయక అశాంతి, తిరుగుబాటు పరిస్థితులు సృష్టించబడుతున్నాయని భావించబడింది. 1960 దశాబ్దం చివరిలో 1970 దశాబ్దం (ప్రారంభంలో కొన్ని సెక్షన్లలో హరితవిష్త్రవం ఎరుపు విష్లవానికి దారితీస్తుందనేది అందిపుచ్చుకొనే నినాదమయింది. ప్రాంతీయ అసమానతల లాగానే పలు అపోహలు కూడా నిరాధారాలని తరువాత ఘటనలు యిటీవలి అధ్యయనాలు స్పష్టం చేశాయి. నూతన వ్యవసాయ విధానం ప్రారంభించినప్పటి నుండి దాని వలన వచ్చే ప్రయోజనాలను పేద రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టాలనే అవగాహన వుంది. (నూతన విధానం యొక్క ప్రతికూల ఫలితాలపై భారత మేధావుల ప్రమాద హెచ్చరికలు వాటిని నివారించటానికి తగు చర్యలు చేపట్టేందుకు తోడ్పడి వుంటాయి) నూతన విధానం ప్రారంభించిన తరువాత ఇందిరాగాంధీ 19860 దశాబ్దం చివరిలో 1970 దశాబ్దం ప్రారంభంలో చేపట్టిన “గరీబీ హఠావో'లో భాగంగా గ్రామీణ పేదల సన్న చిన్నకారు రైతుల ప్రయోజనాల సంరక్షణకు చర్యలు చేపట్టారు. గ్రామీణ పనుల కార్యక్రమం (౫) చిన్న రైతుల అభివృద్ది సంస్థ (3౯04) సన్నకారు రైతుల వ్యవసాయ కార్మికుల పథకం (140). గ్రామీణ ఉపాధి పథకం (05%5), మహారాష్ట్రలో ఉపాధి హామీ పథకం (265) - లాంటి పలు పథకాలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకు యస్యఫ్డిఎ, యంయస్ ఎయల్ పథకాలు పది లక్షల మందికి పైగా చిన్న రైతులను 5 లక్షల మందికి పైగా సన్నకారు రైతులను గుర్తించి వారికి స్వల్పకాలిక మధ్యకాలిక, దీర్హకాలిక రుణాల్ని 580 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అందజేశాయి. చిన్న సన్నకారు రైతులకు వారు తీసుకొన్న అప్పులలో 25 శాతం 838.8 శాతం ప్రభుత్వం సబ్సీడీలుగా యిచ్చింది. సహకార సంఘాల ద్వారా, వ్యవసాయాభివృద్ధి బ్యాంకుల ద్వారా, జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రభుత్వం లక్షలాది మంది పేద రైతులకు రుణ సౌకర్యం కల్పించింది. రుణాలు పేదలకు అందే విధంగా తగు చర్యలు చేపట్టింది. (30వ అధ్యాయం చూడండి)
ఈ పథకాలలో లోపాలు బలహీనతలు వున్నప్పటికీ ప్రజలకు చాలా దోహదపడ్డాయి. విత్తనాలు పెట్టుబడిలాంటి వ్యవసాయోత్పత్తుల కవసరమైన సౌకర్యాలు పెద్ద రైతులకంటె చిన్న రైతులు ఎక్కువగా పొందగలిగారని 1979లో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త రాజ్‌కృష్ణ రిపోర్టు చేశాడు. ఐదు ఎకరాలు అంతకంటె తక్కువ పొలాలు గల చిన్న రైతులు వ్యవసాయంలోకి వచ్చిన మొత్తం విస్తీర్ణంలో 21 శాతం పొలాలు గలిగి 31.4 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వారి రసాయనిక ఎరువుల వినియోగం 82 శాతం, పొందుతున్న వ్యవసాయ రుణాలు 33 శాతం, ప్రభుత్వం కల్పించిన రుణ సౌకర్యాల ద్వారా చిన్న రైతులు పెద్ద రైతుల కంటె ఎక్కువ దిగుబడి సాధించారు. 21శాతం పొలాలు గల చిన్న రైతులు మొత్తం వ్యవసాయోత్చత్తిలో 26 శాతం సాధించగలిగారు.
హరిత విప్లవం చిన్న రైతుని భూమిలేని పేదల శ్రేణులలోకి నెట్టివేయకపోగా అతడిని నిలదొక్కుకునేలా చేసింది. మెరుగైన విత్తనాలు ఇతర వ్యవసాయ ఉత్సాదకాలతో చిన్న రైతు ఒక మేరకు బలపడ్డాడు. తన పొలాన్ని పెద్ద రైతుకి అమ్ముకోవలసిన స్థితికి నెట్టివేయబడలేదు. జి.ఎస్. భల్లా, జి.కె.చంద్రాల అధ్యయనాలు ఈ వాస్తవాన్ని ధృవీకరించాయి. వాస్తవంగా 25 ఎకరాలు ఆ పైన వున్న వ్యవసాయదారుల సంఖ్య, వారి ఆదాయాలు స్వతంత్రానంతరం తగ్గాయి. చిన్న సన్నకారు రైతుల సంఖ్య క్రమంగా పెరిగింది. భారతదేశం చిన్న మధ్యతరహా రైతుల దేశమయింది. 1980-81లో 25 ఎకరాలు అంతకంటె తక్కువ పొలం గలిగిన వ్యవసాయ కుటుంబాలు మొత్తం వ్యవసాయ కుటుంబాలలో 98 శాతంగా వుండి 77.2 శాతం విస్తీర్ణంలోని పొలాలు సాగు చేశాయి.
10 ఎకరాలు అంతకంటె తక్కువ పొలం గలిగిన వ్యవసాయ కుటుంబాలు 88.5 శాతంగొ వుండి మొత్తం విస్తీర్ణంలో 47.5 శాతం సాగు చేశాయి.
కౌలు వ్యవధికి రక్షణలేని కౌలుదారులు పాలికాపులు మాత్రం నష్టపోయారు.
హరిత విప్లవం వ్యాప్తి జెందిన ప్రాంతాలలో కౌలురేట్లు పొలం విలువ త్వరితంగా పెరగడం వలన ఈ సెక్షన్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ ప్రాంతాలలో భూ యజమానులు రక్షణలేని కౌలుదారుల్ని తొలగించి ఆధునిక పరికరాలను ఉపయోగించుకొని స్వయంగా వ్యవసాయం చేయించటం ప్రారంభించారు. కాని రక్షణ పొందిన కౌలుదారులు పాలికాపులు చిన్న రైతులలాగానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోజనం పొందారు.
స్వతంత్రం తర్వాత భారతదేశం త్81
హరిత విప్లవం గ్రామీణ నిరుద్యోగాన్ని పెంచుతుందనే ఆందోళనలు నిరాధాని నిరూపిత మయ్యాయి. 1969లో పంజాబులో వ్యవసాయాన్ని క్షుణ్ణంగా అధ్యయం లోభూ వుల్ఫ్ లాడెజిన్సీ (యుద్ధానంతరం మిత్ర రాజ్యాలు జపాన్ని ఆక్రమించిన కాల డు సంస్కరణల పథకాన్ని రూపొందించటంలో జనరల్ మాక్ అర్లూర్కి సలహా యా క ఆ తరువాత తైవాన్ దక్షిణ వియత్నాం నేపాల్ ఇండోనేషియా, ఫిలిఫైన్స్, భార ఆం భూసంస్కరణలతో సన్నిహిత సంబంధం గలవాడు) నూతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడంతో రోజువారీ కూలీకి డిమాండు పెరిగిందని, గతంలో కంటె భూ మిలేని శ్రామికుని పరిస్థితి మెరుగుపడిందని వివరించాడు. విరివిగా ట్రాక్టర్లు ప్రవేశ పెట్టడం వల ఎద్దులకు పని తప్పింది గాని కూలీల అవసరం తగ్గలేదన్నాడు. ట్రాక్టర్ల తరువా త దలే నూర్చిడి యంత్రాలు యితర యంత్రాలు విచక్షణా రహితంగా ప్రవేశపెట్టడం వలన కూలీలకు ఉపాధి దొరకదనే ఆందోళన కూడా అర్హ రహితం. ఇప్పటి వరకూ దేశంలోని ఏ 'ప్రాంతంలోను అలాంటి పరిస్థితి రాలేదు. ఉదాహరణకు 1961-81 కాలంలో పంజాబులో వ్యవసాయ కార్మికుల సంఖ్య ౩ రెట్లు పెరిగింది. భూమిలేని వ్యవసాయ కుటుంబాల సంఖ్య తగ్గింది. అదనంగా అవసరమైన కూలీలు తూర్పు యుపి, బీహారులలోని వెనుకబడిన జిల్లాల నుండి వలసల ద్వారా సమకూర్చబడ్డారు.
హరిత విప్లవం తరువాత దశలలో వ్యవసాయంలో ఉపాధి పెరుగుదల రేటు కౌంత మందగించిందనే వాదన వుంది. హరిత విప్లవం తగినంతగా ఉపాధి కల్పించడంతో విఫలమయింది గాని అప్పటికి ఉన్న ఉపాధిని పోగొట్టలేదు.
హరిత విప్లవం పంజాబు, హర్యానా, కోస్తా ఆంధ్ర, మహారాష్ట్ర తమిళనాడు వగైరాలకు వ్యాప్తి జెంది వ్యవసాయపరమైన ఉపాధిని పెంచడంతో పాటు వ్యవసాయక పరిశ్రమల అభివృద్ధి వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగుల నిర్మాణం. రసాయనిక ఎరువుల క్రిమిసంహారక మందుల వ్యాపారం, రవాణా పరిశ్రమ పెరుగుదల, వ్యవసాయ పరికరాల ఉత్పత్తి, ట్రక్కులు ట్రాక్టర్లు ఎలక్టిక్ డీజిల్ పంపులు యితర ఆధునిక వ్యవసాయ పరికరాల రిపెర్లకు సర్వీసింగ్‌కు పెరిగిన డిమాండు వగైరాలతో అది వ్యవసాయేతర (గ్రామీణ పట్టణ ఉపాధిని కూడా పెంచింది. -.
హరిత విప్లవాన్ని అనుసరించి పెరిగిన గ్రామీణ ఆదాయాలు గ్రామీణ ప్రాంతాలలో గృహ నిర్మాణ కార్మికులు వడ్రంగి పనివాళ్ళు, దర్జీ పనివాళ్ళు, నేతపనివాళ్లు యితర పనివాళ్లు డిమాండు పెంచాయి. అంతేగాక ట్రాన్సిస్తర్లు, శేడియోలు,వాబీలు, సైకిళ్లు ఫ్యాన్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు మోటారు సైకిళ్ళు, కార్లు, ఎయిర్ కండిషనర్లు లాంటి ఫ్యాక్టరీలలో తయారయ్యే వినిమయ వస్తువులకు డిమాండు పెరిగింది. వీటిలో కొన్నింటికి గ్రామీణ ప్రాంతాల డిమాండు పట్టణ ప్రాంతాలను అధిగమించడం వలన 582 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఉత్పతిదారులు (గ్రామీణ 'ప్రాంతాలకేసి చూడక తప్పటం లేదు. వ్యవసాయంలోని అభివృద్ధి ప్రభావం వ్యవసాయేతర రంగంపై పడడం వలన 1971 -81 కాలంలో పంజాబులో పట్టణ ఉపాధి 50 శాతం పెరిగింది. హరిత విష్లవం సృష్టించిన ఉపాధికల్పన త్వరితగతిని పెరుగుతున్న జనాభాకి ఉపాధి కల్పించలేదు. ఈ పరిస్థితిని ఎదుర్శొనేందుకు అత్యవసర స్వల్పకాలిక దీర్హకాలిక చర్యలు చేపట్టడం అవసరం. ఇక్కడ కూడా హరిత విప్లవం కీలకమని నిరూపితమయింది. హరిత విప్లవం కారణంగా పోగుపడిన ఆహారధాన్యాల నిల్వలు గణనీయమైన స్థాయిలో ప్రత్యేకించి వ్యవసాయకంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధికల్పన పేదరిక నిర్మూలన పథకాన్ని చేపట్టడం సాధ్యం చేశాయి. హరిత విప్లవం వ్యాప్తిజెందిన ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల నిజవేతనాలు పెరిగాయి. తక్కువ వేతనాలు వున్న బీవారు యుపిల నుండి వలసలు లేకపోతే హరితవిప్రవం వలన ఎక్కువ అభివృద్ది సాధించిన పంజాబు లాంటి ప్రాంతాలలో కార్మికుల వేతనాలు యింకా పెరిగి వుండేవి. వ్యవసాయ కార్మికులు ఏ ప్రాంతాల నుండి వలసలు పోయారో ఆ ప్రాంతాలలో కూదా వేతనాలు పెరిగాయి. 1970 దశాబ్దం మధ్యకాలం నుండి వ్యవసాయేతర వేతనాలతో అంతరాష్ట్ర వ్యత్యాసాలు తగ్గడం ప్రారంభమయింది. అందుకు వెనుకబడిన ప్రాంతాల నుండి హరిత విప్లవ ప్రాంతాలకు వలసలు పోవడం కూడా పాక్షికంగా కారణం. ఆహార లభ్యత, ఆహార ధాన్యాల ధరల తగ్గుదల, వ్యవసాయ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పన లాంటి కారణాల రీత్యా గ్రామీణ పేదరిక స్థాయిలపై హరిత విప్లవం గణనీయంగా ప్రభావం చూపింది. ఒక ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి లేక హరిత విప్లవ విస్తరణకు ఆ ప్రాంతంలో దారిద్ర్యరేఖకు దిగువన వున్న పేదల సంఖ్యకి సంబంధం వుందని ఈనాడు అందరూ అంగీకరిస్తున్నారు. భారతదేశంలోని అత్యధిక ప్రజానీకం (మూడింట రెండు వంతులు) యిప్పటికీ వ్యవసాయంపై ఆధారపడడంతో పేదరిక నిర్మూలన చర్యగా హరిత _విషవ తరహా అభివృద్ధి వ్యాప్తి జెందడం యొక్క (ప్రాధాన్యత గుర్తించబడింది. అందుకే నీటి పారుదల యితర వ్యవసాయ మౌలిక సదుపాయాలకు యిటీవలి సంవత్సరాలలో ప్రభుత్వ పెట్టుబదుల్ని తగ్గించడం తీవ్రమైన విమర్శలకు గురవుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో హరితవిప్లవం ఎరుపు విప్లవానికి దారితీయలేదు. కాని రైతుల నిరసన రైతుల సమరశీలత పెరిగింది. హరిత విప్లవం వలన ప్రయోజనాలు పొందిన చిన్న మధ్యతరవాో పెద్ద రైతులు వారి ఉత్పత్తులకు ఎక్కువ ధరలు కావాలని స్వతంత్రం తర్వాత భారతదేశం 588
వారి పెట్టుబడులు తగ్గించుకొనేందుకు ప్రభుత్వం సబ్సిడీలు యివ్వాలని డిమాండు చేస్తున్నారు. (అధ్యాయం 392 చూడండి). ఇటీవలి సంవత్సరాలలో ఈ సెక్షన్లకు రాజకీయ నాయకత్వం పెరుగుతున్నది. ఆర్థికపరంగా ఆచరణీయం కాని రాయితీలు యివ్వలసిందిగా ఒత్తిడి పెరుగుతున్నది. (ప్రభుత్వాలు ఒత్తిళ్ళు లొంగుతున్నాయి. ఉదాహరణకు చాలా రాష్హ్రాలు వ్యవసాయ అవసరాలకు ఉత్పత్తి ధర కంటె తక్కువకు విద్యుత్తు సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు వ్యవసాయంపైనే గాక దీర్హకాలికంగా భారత ఆర్థిక విధానంపై కూడా (ప్రతికూల ప్రభావం చూపుతాయి (చూడండి అధ్యాయాలు 28, 29,39)
'పర్యావరణ సమతుల్యతని కాపాడుకుంటూ దీర్హకాలికంగా వ్యవసాయ అభివృద్దిని కొనసాగించడం ఎలా? అనేది ఇటీవలి సంవత్సరాలలో తలెత్తిన కొత్త సమస్య, రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మండులు అతిగా వాడడం వలన, నీటి పారుదల కొరకు భూగర్భ జలవనరులను ఎక్కువగా వినియోగించుకొవడం వలన వాతావరణపరంగా వచ్చే ప్రతికూల ఫలితాలపై యిటీవల అభ్యంతరాలు జరిగాయి. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు లేవు. సాంకేతిక పరిజ్ఞానంతో జరిగే వ్యవసాయాభివృద్ధి సమస్యలు తెచ్చిపెడుతుండగా వ్యవసాయాభివృద్ధి జరగకపోతే స్పష్టమైన ఆర్థిక రాజకీయ సమస్యలతో పాటు సంక్లిష్టమైన పర్యావరణ సమస్యలు సృష్టించబడతాయి. హరిత విప్లవానికి ముందుకాలంలో హెళ్టారుకి పండించిన గోధుమ వరి న్థాయిలో ఈనాటి ఉత్పత్తులను సాధించాలంటే అదనంగా 80 మిలియన్ హెక్టార్ల భూమి అంటే ప్రస్తుతం వున్న వ్యవసాయోగ్యమైన భూమి కంటె 66 శాతం ఎక్కువ కావలసి వుంటుందని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త యం.యస్. స్వామినాథన్ అంచనా వేశాడు. అడవుల్ని యిష్పటికే ప్రమాదకరమైన స్థాయికి నరికివేయబడిన తరువాత ప్రస్తుతం వున్న అడవుల్ని రక్షించుకోవాలంటే అధిక దిగుబడి సాంకేతిక పరిజ్ఞానం అనివార్యం.
ఈ పరిస్థితులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయాభివృద్ధిని గుడ్డిగా వ్యతిరేకించడం అర్ధ రహితం. రసాయనిక క్రిమి సంహారక మందుల అధిక అనుచిత వినియోగంపై నీటిపారుదలలో వృథా నివారించడంపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరంపై ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ పర్యావరణ సమతుల్యతకు సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంపై రైతులను చైతన్యపరచవలసి వుంటుంది. ఈనాటి ప్రాపంచిక పరిస్థితులలో భారతదేశం స్వావలంబనతో వ్యవసాయంలో నిలకడ గలిగిన అభివృద్ధి సాధించాలంటే బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనకు అత్యధిక ప్రాధాన్యత యివ్వాలి. ర్84 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
34
స్వతంత్రానంతరం వ్యవసాయ పోరాటాలు స్వతంత్రం ముందు ప్రారంభమై కొనసాగుతూ - వచ్చిన మహత్తర తెలంగాణా వైతాంగ ఉద్యమం, పెప్సూ (18950) కౌలుదారుల ఉద్యమం నుండి 1960 దశాబ్దం చివరి నాటి నక్సలైటు లేక మావోయిస్టు ఉద్యమం, 1980 దశాబ్దం నాటి నూతన రైతాంగ ఉద్యమాల వరకు సాగిన వ్యవసాయ పోరాటాలు చాలా వైవిధ్యభరితమైనవి. వీటితో పాటు మధ్యకాలంలో 1957-58 లలో మధ్యప్రదేశ్, బీహార్, ఖర్వార్ తెగల ఉద్యమం, 1967-75 నుండి మహారాష్ట్రలోని ధులియాలో భిల్లుల ఉద్యమం, 1978 నుండి మార్క్సిస్టు ప్రదీప్ ప్రభు నాయకత్వంలో కస్టాకడ్ సంఘటన నడిపిన వర్లిల పోరాటం - లాంటి అంతగా ప్రాచుర్యం పొందని పోరాటాలు జరిగాయి. సి.పి.ఐ. లాగానే యస్.యస్.పి., పి.యస్.పి.లు కూడా 1970 లో భూ ఆక్రమణ ఉద్యమం చేపట్టాయి. నీటి పారుదల పథకాల వ్యయాన్ని రైతుల నుండి రాబట్టేందుకు విధించిన అభివృద్ధి పన్నుకు నిరసనగా పంటల గిట్టుబాటు ధరల కొరకు యింకా యితర సమస్యలపై పంజాబులో, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలు జరిగాయి. సి.పి.ఐ. 1968లో మెగాలో భారతీయ భేత్ మజ్ఞార్ యూనియన్ అనే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించింది. దేశ వ్యాప్తంగా ఇతర చోట్లలాగానే తంజావూర్, కేరళలలో వ్యవసాయ కార్మిక, రైతు ఉద్యమాలు చేపట్టబడ్డాయి. ఈ ఉద్యమాలు చాలా వరకు స్వతంత్రం వచ్చిన తరువాత వ్యవసాయపరంగా, సామాజికపరంగా వచ్చిన మార్పుల (క్రమాన్ని
వివరిస్తాయి. స్వతంత్రం, దానితోపాటు వ్యవసాయ సంబంధాలలో వచ్చే మార్పులను గురించిన అంచనాలతో 1945 - 47 కాలంలో దేశ వ్యాస్తంగా వ్యవసాయ పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. వీటిలో బెంగాల్‌లోని తెభాగౌ, పంజాబులోని కెనాల్ కాలనీల కౌలు స్వతంత్రం తర్వాత భారతదేశం క్8ిక్
రైతుల ఉద్యమాలు లాంటి కొన్ని ఉద్యమాలు స్వతంత్రానికి ముందు, ఆ తరువాతే కం మతతత్వ వాద వెల్లువతో ఆటంకపరచబడ్డాయి. కాని భారతదేశంలో విలీన య్యే క్రమంలో వున్న రెండు స్వదేశీ సంస్థానాలలో - ఉద్యమాలు స్పతంత్రానంతర సంవత్సరాలలో కూడా కొనసాగాయి. ఒకటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన తెలంగాణాః రెంటి పెప్పు (98050)కి చెందిన పాటియాలా, రెండు ఉద్యమాలకు కూడా కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. తెలంగాణా రైతాంగ పోరాటం
తెలంగాణాలో లేక హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు మాట్లాడే ప్రాంతంలో జాతీయోద్యమం, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ లాంటి ప్రజాస్వామ్య సంస్థల 'ప్రభానం కారణంగా 1980 దశాబ్దం చివరి నుండి నిజాం నిరంకుశపాలన రాజకీయ వ్యతి కత నెదుర్కొంటున్నది. 1040 దశాబ్ధం ప్రారంభం నుండి 1942 లో బ్రిటిషువారు సిపిఐపై విధించిన నిషేధం ఎత్తివేసిన తరువాత కమ్యూనిస్టులు వారి పలుకుబడిని త్వరగా విస్తరించుకొని ఆంధ్ర మహాసభపై అదుపు సాధించారు. తెలంగాణాలో రైతులు వందల వేల ఎకరాలు భూమి గల జాగీర్జారుల దేశ్‌ముఖ్‌ల దోపిడికి గురయ్యారు. ప్రభుత్వం విధించిన ధాన్యపు వసూళ్లకు భూస్వాములు అధికారులు విధించిన వెట్టిచాకిరికి వ్యతిలేకంగా కమ్యూనిస్టులు రైతులను సంఘటితపరిచారు. 1945 నుండి రైతులకు రక్షణగా నిలిచారు. రైతాంగ ఉద్యమం వేగంగా విస్తరించింది.
స్వతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్తాన్ బ్రిటిషు అధికారుల ప్రోత్సాహంతో, హైదరాబాద్ నవాబు స్వతంత్రరాజుగా కొనసాగాలనే ఆకాంక్షతో, భారతదేశంలో విలీనాన్ని నిరాకరించాడు. నిజాం ఉదాసీన వైఖరి పట్ల రాష్ట్ర ప్రజలు అసహనానికి గురయ్యారు. స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో విలీనం కొరకు ఉద్యమం ప్రారంభించారు. మహారాష్ట్ర కోస్తా ఆంధ్ర సరిహద్దులలో క్యాంపులు నిర్వహించారు. రజాకార్లదాడులను ప్రతిఘటించడానికి ఆయుధాలు సమకూర్చబడ్డాయి. నిజాం వ్యతిరేక విలీన అనుకూల ఉద్యమంలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. 1947 ఆగస్టు 1948 సెప్టెంబరు మధ్యకాలంలో గణనీయమైన విజయాలు సాధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను బలమైన స్థావరాలుగా మార్చుకొన్నారు. భూస్వాములు అధికారులు పట్టణాలకు పారిపోయారు. (గ్రామాలు కమ్యూనిస్టుల వశమయ్యాయి. గ్రామాలకు రక్షణ కల్పిస్తూ రజాకారులపై దాడులు జరిపేందుకు కమ్యూనిస్టులు సభలను గొరిల్లా దళాలను ఏర్పాటు చేశారు. వడిశాలలు, 586 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కర్రలు, రాళ్లు నాటు తుపాకులు ఆయుధాలుగా కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో (3000) (గామాలపై అదువు సాధించారు. ఈ అవకాశాన్ని భూ నంబందధాలను పునర్వ్యవస్ట్రీ కరించటానికి ఉపయోగించుకున్నారు. 1980ల నాటి ఆర్థిక మాంద్యం కాలంలో అప్పుల క్రింద భూస్వాములు స్వాధీనం చేసుకొన్న భూములను తిరిగి రైతులకు అప్పగించారు. బంజరు భూమి అటవీ భూమి భూమిలేని పేదలకు పంచబడింది. వ్యవసాయ కూలీల కూలిరేట్లు, భార్యలను కొట్టడం లాంటి సమస్యలు చేపట్టబడ్డాయి. భూస్వాముల భూమిపై గరిష్టపరిమితి మొదట 500 ఎకరాలుగా ఆ తరువాత 100 ఎకరాలుగా ప్రకటించబడింది. మిగులుభూమి భూమి లేని చిన్న రైతులకు పంచబడింది. అప్పుల క్రింద భూస్వాములు స్వాధీనం చేసుకొన్న పొలాలు - వాటిని భూస్వాములు యితర చిన్న రైతులకు అమ్మివేయడం వలన తిరిగి రైతులు పొందటానికి వీలుపడని పరిస్థితులలో కూడా రైతులు భూస్వాముల మిగులుభూమి పట్ల ఆసక్తి చూపలేదు. రైతులు వారికి వారసత్వంగా సంక్రమించిన భూములనే కోరుకున్నారు గాని భూస్వాముల మిగులు భూములను కాదు. రైతులు తమకు మాత్రమే హక్కులు గల, యితరులకు హక్కులు లేని భూమిని తరువాత కాలంలో కూడా నిలబెట్టుకొనేందుకు ఎక్కువ అవకాశం వుంటుందని అంచనావేసి వుంటారు. వాస్తవంగా ఉద్యమం క్ణి ౦చిన తరువాత జరిగిందిదే. రైతులు యిలాంటి భూముల్ని నిలబెట్టుకొనగలిగారు గాని “మిగులు” భూముల్ని కాదు.
నిజాం నిర్ణయించుకొనడానికి యిచ్చిన సంవత్సర కాల వ్యవధి గడిచిన తరువాత, నిజాం వ్యతిరేక ప్రతిఘటనా ఉద్యమం ప్రజలు ఆశించిన దిశగా ముందుకు పోయిన తరువాత, 1948 సెప్టెంబరు 18న భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశించింది. దీనిని విముక్తి సైన్యంగా భావించి ప్రజలు స్వాగతించారు. కొద్ది రోజులలో నిజాం, అతడి సైన్యం లొంగిపోయారు. భారత సైన్యం రజాకార్లను లౌంగదీసేందుకు గ్రామాలకు వెళ్ళింది. సైన్యాన్ని రైతులు ఆసక్తిగా ఆహ్వానించారు. కాని కమ్యూనిస్టులు వరి గెరిల్లా యుద్ధ దళాలను రద్దు చేయకూడదని, ఆయుధాలు త్యజించకూడదని, సామ్రాజ్యవాద అనుకూల బూర్జువా భూస్వామ్య నెహ్రూ ప్రభుత్వంపై విముక్తి యుద్ధం కొనసాగించాలని నిర్ణయించారు. ఫలితంగా గెరిల్లా దళ సభ్యులను అడవులలో రహస్య స్థావరాలేర్చరచుకోమని, రజాకార్లపై దాడులు చేసినట్లే భారతసైన్యంపై దాడులు చేయమని చెప్పారు. కాని వారు యిది రజాకార్లలాంటి మధ్యయుగాల ఆయుధాలు గల సైన్యం కాదని, ఆధునిక ఆయుధాలు గల బలమైన సైన్యమనే వాస్తవాన్ని విస్మరించారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 587
సైన్యం ఉద్యమంలో పాల్గొన్న చురుకైన కార్యకర్తల్ని అరెస్టులు చేసింది. ఈ క్రమంలో వేలాదిమంది రైతులను బాధలకు గురిచేసింది. అడవులలో దాకానే కమ్యూనిస్టులు సంబంధాలు పునరుద్ధరించుకొనడానికి, అడవులలోని తెగల ఫుల కొత్త స్థావరాలు నిర్మించుకొనడానికి ప్రయత్నాలు చేశారు. కాని వారి ప్రయత్సాలు అం జ ఫలించలేదు. సిపిఐ నిరంతరంగా చర్చలు జరిపి, పార్టీ నాయకులు మాస్కో సందర్భిం లో తరువాత 1951లో ఉద్యమం అధికారికంగా విరమించబడింది. అప్పటికి అడవుల కొద్దిమంది మాత్రమే మిగిలారు. చాలామంది సుమారు 500 మంది చనిపోయారు. 10,000 మంది జైళ్ళలో వున్నారు.
ఉద్యమం ప్రస్తావించిన సమస్యలకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. 1949లో జాగీర్దారీ రద్దు శాసనం చేయబడింది. హైదరాబాద్ కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950లో ఆమోదించబడింది. సాగులో వున్న నాల్గవ వంతుకు పైగా గల ప్రాంతం గల 6,00,000 మంది కౌలు రైతులు సులభమైన షరతులతో భూమిని కొనుగోలు వేస హక్కుతో సహా రక్షిత కౌలుదారులుగా ప్రకటింపబద్దారు. 1950 దశాబ్దం మధ్యకాలం భూ గరిష్ట పరిమితి విధించబడింది. రైతుల రాజకీయ చైతన్యం కారణంగా భూ సంస్కరణలు చాలావరకు బాగా అమలుపరచబడ్డాయి. ఉద్యమం సద్దుమణిగినన తరువాత తిరిగి వచ్చిన భూస్వాములు పాత పద్ధతులు అనుసరించలేకపోయారు. భూముల్ని తక్కువ ధరకి అమ్మడానికీ సిద్ధపడ్డారు. రైతుల స్వంత భూముల్ని గాని బంజరు భూముల్ని గాని స్వాధీనం చేసుకొనేందుకు అంతగా ప్రయత్నించలేదు. ఉద్యమం తెలంగాణాలోని భూస్వామ్య విధాన వెన్ను విరిచింది. కాని దీనిని నిజాం వ్యతిరేక విలీన అనుకూల విముక్తి పోరాటం అప్పటీ సాధించింది. ప్రజా ఉద్యమ నాయకులుగా కమ్యూనిష్టులు రైతుల డిమాండ్లను వ్యక్తీకరించే అవకాశం కల్పించింది.
పంజాబులోని స్వదేశీ సంస్థానం పాటియాలాలో స్వతంత్రం వచ్చేటప్పటికి కొనసాగుతున్న ముజారా లేక కౌలు రైతుల ఉద్యమం యొక్క మూలాలు 19వ శతాబ్దం చివరిలో వున్నాయి. గతంలో భూమిశిస్తు వసూలు చేసే హక్కులు గల బస్సేదార్లు (భూస్వాములు) పాలనా వ్యవహారాలలో పెరిగిన పట్టు కారణంగా యాజమాన్య స్థాయి పొందడంలో సఫలీకృతులయ్యారు. (భిటిషిండియాలో జమిందారులు లేక భూమిశిస్తు వసూలు చేసేవారు వారి సాంప్రదాయ హక్ష్ములతో శిస్తులు వసూలు చేసి దానిలో కొంతభాగం 588 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
స్వంతం చేసుకొనే విధానాన్ని అనుకరించడం వారిని భూస్వాముల్ని చేసింది) సంస్థానంలోని 6వ వంతు [ప్రాంతంలో వున్న దాదాపు 800 (గ్రామాలలో వ్యవసాయం చేస్తున్న భూ యాజమానుల్ని కౌలుదారుల స్టాయికి నెట్టివేశారు. తరతరాలుగా రైతులు సాగుచేస్తూ వచ్చిన, వారికి చెందిన ఈ భూమిపై ఈ కొత్త భూస్వాములకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదన్నారు రైతులు.
వివాదం పెరిగి పెద్దదయింది
జాతీయోద్యమం దానితో పాటు 1920లలో వచ్చిన అకాలీ, ప్రజామందడల్ ఉద్యమాలు రైతుల రాజకీయ చైతన్యాన్ని వ్యక్తీకరించటానికి అవకాశం కల్పించాయి. కాని పాటియాలాలోని అణచివేత వాతావరణం రాజకీయ కార్యకలాపాల్ని కష్టతరం చేసింది. 1980 దశాబ్దం చివరిలో చాలా రాష్ర్రాలలో కాంగ్రెస్ మంత్రి వర్షాలు. తీసుకొని వచ్చిన రాజకీయ వాతావరణంలోని మార్చుతో ఒక ఉద్యమం ఆవిర్భవించటానికి అవకాశం ఏర్పడింది. అప్పటికి పొరుగున వున్న బ్రిటిషు పంజాబులో కమ్యూనిస్టులు రైతాంగ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్నారు. ముజారా ఉద్యమాన్ని నడిపించగల నాయకత్వశక్తిగా ఎదిగారు.
1939 నుండి శక్తివంతమైన ఉద్యమం ఆవిర్భవించింది. 1945 నుండి ముజారాలు బస్వేందర్ల మధ్య బాహాటమైన ఘర్షణగా పరిణతి చెందింది. రాజ్యం బకాయి చెల్లించనందుకు, దాడులు జరిపినందుకు కేసులు పెట్టడంలో జోక్యం చేసుకొన్నది. బలవంతంగా భూముల్ని అధీనంలోకి తెచ్చుకొన్నందుకు బకాయిలను వసూలు చేసినందుకు పలు ప్రాంతాలలో ఘర్షణలు జరిగాయి. మహారాజ వ్యతిరేక ప్రజూస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రజామండల్ కమ్యూనిస్టుల పట్ల రైతు సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించింది. ప్రజామందల్ వెనుక కాంగైస్ వుంది గనుక యిది రైతులకు బలాన్ని చేకూర్చింది.
స్వరాజ్యం రాకతో పాటియాలా ఇండియన్ యూనియన్‌లో చేరింది. బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అన్ని రాజకీయ గ్రూపుల వ్యతిరేకతతో ఒంటరియైన మహారాజు ముజారాలపై తీవ్ర నిర్బంధకాండ సాగించాడు. 'ప్రజామండల్ రైతుల తరపున కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. -పంజాబులోని మాజీ సంస్థానాలను కలిపి పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబు స్టేట్స్ యూనియన్ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తరువాత అణచివేత ఆగిపోయింది.
స్వతంత్రం తర్వాత భారతదేశం 589
కాని రాజ్యం దృఢంగా వ్యవహరించకుండా పోటీపడే వర్గాలకు లేక రాబోయే (గ్రూపులకు పరిష్కారాన్ని వదిలివేయడంతో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు భూస్వాములు సాయుధ ముఠాలను రంగంలోకి దించడంతో, ఈ ముఠాల దాడుల్ని ప్రతిఘటించేందుకు ఉద్యమం తన సాయుధ ముఠాలను తయారు చేసుకోవలసి వచ్చింది. తేజసింగ్ స్వతంతర్, పంజాబు కమ్యూనిస్టుల నుండి చీలిపోయిన త్రీర్తి గ్రూపు కలిసి 1948లో లాల్ కమ్యూనిస్టు పార్టీని ఏర్పరిచి సాయుధ వలంటీరు దళాల నిర్వహణకు నిర్దిష్టరూపం యిచ్చింది.
1948 సంవత్సరాంతానికి బస్వేందర్లును వారి సాయుధ ముఠాలను ప్రతిఘటించి మజార్లకు అండగా నిలిచేందుకు ఒక చిన్న సాయుధ ముఠా సిద్ధమయింది. ఈ సాయుధ ముఠా మహా అయితే 100 మందికి మించనిదిగా వుంది. ఈ సాయుధ ముళా, ప్రభుత్వ బలగాలతో తలపడేందుకు సంసిద్ధమైనది కాదు. 1949 జనవరి కిషన్ ఘర్ ఘటనలో ఈ సాయుధ ముఠాలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు జరిగిన ఒక ఘటనలో ఒక పోలీసు చనిపోవటంతో ప్రభుత్వ బలగాలు దాడి చేస్తాయని ఊహించిన కమ్యూనిస్టు నాయకులు సాయుధ ముఠాలోని ముఖ్యుల్ని అక్కడ నుండి పంపించి తమని పూర్తిగా వదలపోయారనే భావం ప్రజలకు కలగకుండా నామమాత్రంగా అతికొద్దిమందిని వుంచారు. ఈ సంఘటన సందర్భంగా అరెస్టు చేయబడిన ధరమ్‌సింగ్ ఫక్కార్ తదితరులు విచారణ తర్వాత వదిలివేయబడ్దారు. వామపక్ష కాంగ్రెస్ వాదియైన బ్రష్బాన్ నాయకత్వంలో కాంగెస్వాదులు న్యాయపరమైన రక్షణకు సహాయ పడ్డారు.
1951 కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పాటుతో పరిస్థితి పూర్తిగా మారింది. బ్రిష్బాన్ ఉపముఖ్యమంత్రి అయ్యాడు. వ్యవసాయ నసంస్మరణల ఎంక్వయిరీ కమిటీ నియమించబడింది. రైతులను ఖాళీ చేయించకుండా రక్షణ కల్పించేందుకు తాత్మాలికంగొ 1952లో 'పెప్సు కౌలుదారుల చట్టం చేయబడింది. ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగాయి. పెప్సూలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. తమకు గతంలో సహాయపడిన ట్రీష్ఖాన్ గ్రూపు రుణం తీర్చుకొనేందుకు ముగ్గురు కమ్యూనిస్టు శాసనసభ్యులకు ఒక అవకాశం లభించింది. కాని బిస్వేదార్లకు చెల్లించవలసిన నష్టపరిహారంలో కొంత తగ్గింపు
.. సాధించామన్న మిషతో కమ్యూనిస్టులు మహారాజా మామగారైన రారేవాలాకు మద్దతు యిచ్చారు. పంజాబు ఎన్నికలలో సీట్లు పంపకంలో అకాళీలతో కుదిరిన ఒప్పందం మేరకు కమ్యూనిస్టులు రారేవాలాకు మద్దతు యిచ్చారని మరొక కథనం.
590 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
రారేవాలా మంత్రివర్గం వ్యవసాయ చట్టాన్ని ఆమోదించుకుండానే పతనమయింది. రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం పరిస్థితిలో గణనీయమైన మార్పు తెచ్చింది. రాష్ట్రపతి పెప్సు ఆక్రమణ కౌలుదారుల చట్టం (1953) జారీ చేశాడు. ఈ చట్టం ప్రకారం కౌలుదారులు వారు చెల్లిస్తున్న శిస్తుకి 12 రెట్లు మొత్తం పరిహారం చెల్లించి వారు సాగుచేస్తున్న పొలాలకు యాజమానులు కావచ్చు. ఈ చట్టం నష్టపరిహారం చెల్లించకుండా రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలన్న కమ్యూనిస్టుల డిమాండు మేరకు లేనప్పటికి రైతులకు అమోదయోగ్యమయింది. ఆ తరువాత రైతుల నుండి ఎలాంటి ప్రతిఘటన లేదు.
బిస్వేదారుల భూములు నష్టపరిహారం లేకుండా స్వాధీనం చేసుకోబడలేదు గనుక నూతన వ్యవసాయ చట్టం అసమ[గ్రంగా వుందని కమ్యూనిస్టుల నిరసన కొనసాగింది. ఫలితంగా కమ్యూనిస్టులు రైతులకు దూరమవటం పెరిగింది. ముజారా ఉద్యమం, ప్రజామండల్క్ బిష్బాక నాయకత్వంలోని వామపక్ష కాం(గెస్ గ్రూపు సహచరులకు దూరమయ్యారు. ఎదుగుతున్న అకాలీలకు మతతత్వ మితవాద గ్రూపులకు వ్యతిరేకంగా స్వయంగా సమర్ధవంతంగా పోరాడ గల బలంలేని కమ్యూనిస్టులు దీర్హకాలికంగా చూచినప్పుడు ఈ క్రమంలో ఎక్కువ నష్టపోయారు. పశ్చిమబెంగాల్ :
పశ్చిమ బెంగాల్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నుండి విడిపోయిన బంగ్లా కాంగ్రెస్‌ల మొదటి కాంగ్రెసేతర ఐక్య సంఘటన (యు.యఫ్) ప్రభుత్వం 1967 మార్చిలో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ప్రభుత్వం త్వరితంగా భూ సంస్కరణలను అమలు పరచాలని నిర్ణయించింది. భూమిలేని పేదలకు మిగులు భూమిని పంచే పాలికాపుల తొలగింపును ఆపివేసే కార్యక్రమాన్ని ప్రముఖ సిపిఎం రైతు నాయకుడు, రెవెన్యూ మంత్రి అయిన హరే కృష్ణకోనార్ ప్రకటించాడు. ఇది పేదల ఆశల్ని పెంచింది. చిన్న మధ్యతరగతి రైతులలో తమ పొలాలు పాలికాపులకు దక్కుతాయనే ఆందోళన పెంచింది. భూ పంపకంలో చాలా సమస్యలు వున్నాయి. అధికారంలో వున్న సిపియం చట్టపరమైన నిబంధనలను విస్మరించడం సాధ్యపడదు. అంతేగాక కోర్కెల పరిశీలన, సర్దుబాటు పట్టాల ప్రధానం - అంతా వెంటనే చేయగలిగింది కాదు. అనివార్యంగా కొంత సమయం అవసరం. ఈ క్రమాన్ని పార్టీ స్వతంత్రం తర్వాత భారతదేశం 591
నేర్చుకొనే దశలో వుంది. కొంతమంది సహచరులకు. వేరే ఆలోచనలు వున్నాయి. నేర్చుకోవాలనే ఆకాంక్ష లేదు. ఈ కోవకి చెందినవారు నక్సల్పరీ గ్రూపు. ఉత్తర బెంగాలులోని డార్జిలింగు జిల్లాకి చెందినన నక్సల్బరీ ప్రాంతంలో 1900 దశాబ్దం ప్రారంభం నుండి కమ్యూనిస్టులు సంతాల్, ఒరయాన్, రాజ్ఐన్స్ తెగలకు గం ర్త పాలికాపుల, టీ తోటల శ్రామికుల సమస్యలపై పనిచేస్తున్నారు. పాలికాపులు దొల్లి లేక భూస్వాముల కొరకు 'అధియార్' విధానం ప్రకారం పనిచేస్తున్నాయి. ఈ వీధానా స అనుసరించి జోతేదార్లు పాలికాపులకు నాగళ్లు, ఎద్దులు విత్తనాలు సరఫరా చేసి పంట వాటా పొందుతారు. వాటాలపైై, ఖాలీ చేయించటంపై సాధారణంగా వివాదాలు వస్తుంటాయి. కాని యునైటెడ్ ఫ్రంటు ప్రభుత్వం పొలాలు కౌలు రైతులకు యిచ్చి వేస్తుందనే భయం కారణంగా వివాదాలు పెరిగాయి. టీ తోటల కార్మికులు టీ తోటల యజమానులు వరి పండించే పొలాల్లో పాలికాపులుగా పనిచేస్తుంటారు. వరి పాలాలపై విధించిన గరిష్ట పరిమితి నుండి మినహాయింపు పొందేందుకు ఈ వరి పొలాలు రికార్డులలో టీ తోటలుగా చూపబదుకుంటాయి. చారుమజుందార్ ఆ ప్రాంతంలో పెద్ద నాయకుడు. 1965 నుం వ్యవసాయ విప్లవంపై సాయధ పోరాటంపై చారుమజుందార్ ఆలోచనలు మావో ఆలోచనల ప్రాతిపదికన వున్నాయి. ఇవి సిపిఎం వైఖరికి భిన్నమైనవి. ఆయన చట్టపరమైన పద్ధతుల ద్వారా భూ సంస్మరణ సాధ్యపడుతుందని విశ్వసించకపోవడమే గొక ఈ పంథా రైతుల విప్లవ ఆకాంక్షల్ని తగ్గిస్తుందని కూడా వాదించాడు. భూమిని అక్రమించాలి, హింసాయుత పద్ధతుల నవలంభించి సంరక్షించుకోవాలనే ఆలోచనలకు నిర్దిష్ట రూపమిచ్చేందుకు చారుమజుందార్ ఆయన సహచరులు కనూసన్యాల్, తెగల నాయకుడు జంగల్ సంతాల్ యునెటైడ్ ప్రంటు ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కేవలం 16 రోజుల ముందు డార్జిలింగ్ జిల్లాలకు సిపిఎం సిలిగిరి సబ్ డివిజన్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. వారు భూమిపై భూస్వాముల గుత్తాధిపత్యానికి అంతం పలకాలని, రైతుల కమిటీల ద్వారా భూపంపకం జరగాలని, భూస్వాములకు యునైటెడ్ ప్రభుత్వాన్ని కేంద్ర (ప్రభుత్వాన్ని సాయుధంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. వారిలో కొందరు చెప్పిన సమాచారాన్ని బట్టి గ్రామాలు సంఘటితం చేయబడ్డాయి. 15000 నుండి 20000 మంది సమరశీల కార్యకర్తలయ్యారు. (గ్రామాలలో ఏర్పాటు చేసిన రైతు కమిటీలు సాయుధ దళాల కేంద్రాలయ్యాయి. అవి భూముల్ని ఆక్రమించాయి. భూమికి సంబంధించిన రికార్డుల్ని తగులబెట్టాయి. అప్పులు రద్దయినట్లు ప్రకటించాయి. సమాంతర పాలనా వ్యవస్థని నెలకొల్పాయి. భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొన్న తుపాకులతో పాటు విల్లులు, 592 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బాణాలు, బల్లాలు సమకూర్చుకొన్నారు. నక్టల్బరీ, ఖారిబారి, ఫాన్సిదేవ పోలీసు స్టేషన్ల పరిధిలో గల హటిగిషు బారాగంజ్, బౌపుఖురియాలు విప్లవ స్థావరాలయ్యాయి.
కమ్యూనిస్టులు భాగంగా వున్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యా సదృశ్య్వమైన ఘర్షణలోకి లాగబడ్డారని సిపియం నాయకులు అర్ధం చేసుకొన్నారు. సిపిఎం ప్రభుత్వంలో వుంటూ నక్టల్బరీ కామేడ్ల చర్యని అనుమతించలేదు. మొదట నచ్చజెప్పటానికి ప్రయత్నాలు జరిగాయి. హరేకృష్ణ కోనార్ సిలిగురి వెళ్ళాడు. పోలీసులకు అవసరమైన వ్యక్తులు లొంగిపోయేలా చేసేందుకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఆపి వేయించేందుకు స్థానిక నైతు సంఘాలను సంప్రదించి చట్టబద్ధంగా భూ పంపకానికి సహకరించేందుకు స్టానిక నాయకులను ఒప్పించానని రెవిన్యూ మంత్రి ప్రకటించాడు. కాని స్థానిక నాయకులు ఒప్పందాన్ని తిరస్మరించారు. ప్రభుత్వం అణచివేత చేపడుతుందనే అంచనాతో స్టానిక రైతులను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించారు. పోలీసులపై దాడులు, పోలీసులు తిప్పి కొట్టదం, మరలా ఘర్షణలు జరిగాయి. సిపియం తిరుగుబాటుదారుల మద్దతుకు పోలీసుల అణచివేతకు మధ్యేమార్గం కొరకు ప్రయత్నించింది. యునైటెడ్ ప్రంటు మంత్రివర్గ ఉపసంఘాన్ని పంపించి రాజీ ప్రయత్నాలు చేసింది. రైతులు చర్చలను కోరారని కాని చారుమజుందార్ త్రోసి పుచ్చాడని సమాచారం. సిపియం ఈ చర్యల్ని ఖండించి అసంతృప్తి నాయకుల్ని బహిష్మరించటం గాని, ప్రభుత్వం నుండి రాజీనామా చేయించటం గాని - వదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిపియం మొదటి పద్ధతినే అవలంబించింది. అతివాద దుందుడుకు శక్తులు ఏకమయ్యాయి. నక్టల్బరీ రైతులకు సహాయపడేందుకు మొదట ఒక కమిటీగా ఆ తరువాత సి.పి.ఐ.(ఎం.ఎల్)గా శక్తులుగా సంఘటితమయ్యాయి.
ప్రభుత్వ అణచివేత ఆశించిన ఫలితాలనిచ్చింది. జూలై నాటికి ఉద్యమం అణగారిపోయింది. జగన్ సంతాల్తో నహా అత్యధిక (ేణులు నాయకులు నిర్చంధింపబడ్డారు. నక్సలైటు ఉద్యమం విద్యార్థులు ప్రధానమైన శక్తిగా పట్టణాలకు పరిమితమయింది. నక్సలైటు ముఠాలకు సిపిఎం కార్యకర్తలకు మధ్య వీధి పోరాటమయింది. రైతాంగ విప్లవం కలలు ఎడారి నినాదాలయ్యాయి.
శ్రీకాకుళానికి చాలా దూరంలో మావోచే స్ఫూర్తి పొందామని చెప్పుకొన్న మరోక (గ్రూపు విప్లవకారులు, తెగలలో ఒక (గూపుకి నాయకత్వం వహించి భారత రాజ్యాంగంతో స్వతం(త్రం తర్వాత భారతదేశం 53
ఆత్మహత్యా సదృశ్యమైన - ప్రతిఘటనకు సన్నద్ధమయ్యారు. విప్లవం పేరుతో ప్రయోగాంీ దిగి ఆధునిక పోలీసు బలగాలను ప్రతిఘటించేందుకు విల్లు బాణాలు బల్లాలతో రంగ గీ దించబడిన నక్టల్బరీ తెగల రైతులు వారి నాయకత్వాన్ని గురించి ఫమనుకుంటాూ అడగాలని శ్రీకాకుళం నాయకత్వానికి తోచకపోవడం ఆశ్చర్యకరం. దట్టమైన అడవుల వుంటూ బయట ప్రపంచంతో అంతగా సంబంధాలు లేని నిరక్షరాస్యులైన శ్రీకాకుళం తెగల ప్రజలు పోరాటానికి ముందు నక్టల్బరీ విషాదాన్ని గురించి తెలుసుకొనే అవకాశం లేదు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన ఒరిస్సా సరిహద్దుగా గల వెనుకబిడిన జిల్లా. 1950 దశాబ్దం ప్రారంభం నుండి పార్వతీపురం, పాలకొండ, పాతపట్నం, కొత్తూరు ప్రాంతాలలోని కమ్యూనిస్టులు స్థానిక జాతపు, సవర తెగల ప్రజలను సంఘటిత పరిచారు. 1957-58 నుండి 1967 వరకు గిరిజన సంఘాలుగా మహిళా సంఘాలుగా తెగల ప్రజలను సంఘటిత పరిచిన ఉద్యమం - తెగలకు చెందని వడ్డీ వ్యాపారులు, భూస్వాములు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకొన్న భూముల్ని తిరిగి పొందటం, కూలి పెరుగుదల అటవీ ఉత్పత్తులకు మెరుగైన ధరలు, అప్పుల తగ్గింపు, ఇళ్ళ నిర్మాణానికి యితర నిత్యావసరాలకు అడవిలోని కర్ర, కలప ఉచితంగా అందుబాటు లాంటి పలు ప్రయోజనాలు సాధించడంతో తెగల (ప్రజలు ఆత్మవిశ్వాసంతో పరిసర పట్టణాలలో జరిగిన (ప్రదర్శనలలో చురుకుగా పాల్గొన్నారు. అంతకంటె సమరశీలంగా పొంసాయుతంగా వ్రషహలు చేపట్టాలనే చొరవ తెగల ప్రజలు లేక గిరిజనుల నుండి వచ్చిన దృష్టాంతరాలు నక్టల్బరీలో లాగానే పార్టీ పంథాతో విభేదించిన సిపిఎం అసంతృప్త తీవ్రవా ద నాయకుల గెరిల్లా యుద్ధంతో తీవ్రవాద పంథాకి మారాలని నిర్జయించుకొన్నారు. నక్టబ్బరీలో కంటె మరికాస్త ముందుకు పోయి వ్యక్తులుగా వర్గ శత్రువులుగా వున్నవారిని నిర్మూలించాలని నిర్ణయించారు. నక్టల్బరీతో ప్రేరణ పొంది, కాని దాని అనుభవాన్ని విస్మరించి - నక్టల్బరీ ఉద్యమం అణచివేయబడిన తరువాత ఉద్యమం ప్రారంభించారు. ఇది 3967 నవంబరులో (ప్రారంభమై 1968 నవంబరు, 1969 ఫిబ్రవరిలలో అత్యున్నత దశకి చేరుకొన్నది. విల్లులు, బాణాలు, కర్రలు నాటు తుపాకులతో సాయుధులైన గిరిజనులు తమ కార్యకర్తల్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల్ని పారదోలారు. కమ్యూనిస్టు విప్లవకారులు గ్రామాలలో తిరిగి (ప్రజలను గ్రామరక్షక దళాలుగా ఏర్పడమని చెప్పారు. ఆయుధాలను సమకూర్చుకోమన్నారు. 1969 ఏప్రిల్‌లో జాతీయ స్థాయిలో తీవ్రవాద వామపక్ష కార్యకర్తలతో సి.పి.ఐ. (ఎం.ఎల్) 594 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రజా పంథా నుండి గెరిల్లా యుద్ధ తంత్రానికి, వ్యక్తిగత హింసావాదానికి విధానాన్ని మార్చుకొన్నారు. ప్రభుత్వ సమాచారం మేరకు తీవ్రవాదులచే 48 మంది హత్య చేయబడ్డారు. తీవ్రవాదులు దానికి రెట్టింపు సంఖ్యలో హత్యలు చేశామన్నారు. వీరిలో భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, పోలీసులు ఫారెస్టు అధికారులు వున్నారు. అనివార్యంగా అణచివేత తీవ్రతరమయింది. 1969 నవంబరు నుండి 1970 జనవరి వరకు 18 మంది నాయకులు చంపబడ్డారు. 1970 జూన్ వరకు 1400 మంది అరెస్టు చేయబడ్డారు. 1970 జూలై 10 న యిరువురు పెద్ద నాయకులు వి. సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం చంపబడ్డారు. ఉద్యమం అణచివేయబడింది. 1971 నుండి ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని మావోయిస్టు గ్రూపులు బలహీనమైన ప్రయత్నాలు చేశాయి. 1975 నాటికి ఉద్యమం పూర్తిగా అణగారి పోయింది. మావోయిస్టు గ్రూపుల యువకులు ఈనాడు కూడా ఆంధ్రప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్‌లలో తెగల ప్రజలు, దిగువ కులాల పేద వ్యవసాయదారులు వ్యవసాయకూలీలు నివశిస్తున్న మారుమూల వెనుకబడిన ప్రాంతకాలంలో వారి నమూనా విప్తవ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నూతన వ్యవసాయదారుల ఉద్యమాలు శరద్ జోషి షేత్మారి సంఘటన నాయకత్వంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో 1980లో రైలు రోద్దుల దిగ్బ్భంధనంతో జాతీయ రాజకీయ రంగం పైకి రైతు ఉద్యమాలు హఠాత్తుగా వచ్చాయి. ఉల్లిపాయలు, చెరుకు ధరలు పెంచాలని డిమాండు చేస్తూ నవంబరు 10 న రెండు లక్షల మంది రైతులు బొంబాయి - కలకత్తా, బొంబాయి - ఢిల్లీ రైలు రోడ్డు మార్గాలను దిగ్బంధం చేశారు. వేలమంది అరెస్టు చేయబడ్డారు. పోలీసు కాల్పులలో ఇద్దరు మరణించారు. చెరుకు, ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఉద్యమనాయకుడు శరద్‌జోషి ఐక్యరాజ్యసమితి మాజీ ఉద్యోగి. ఆయన పట్టణ పారిశ్రామిక భారతదేశానికి గ్రామీణ వ్యవసాయ భారతదేశానికి మధ్యగల వ్యత్యాసం తన ఉద్యమ సిద్దాంతానికి (ప్రాతిపదిక చేసుకొన్నాడు. 1986లో యు.పి.లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సిసౌలి గ్రామంలో మహీందర్‌సింగ్ తికాయత్ మాధ్యమిక పాఠశాల విద్యవరకు చదువుకొన్న మధ్యతరగతి రైతు. జాట్ కుల పంచాయితీ పెద్ద. ఆయన లక్షలాది మంది రైతులతో నిర్వహించిన పెద్ద బహిరంగ సభకు యుపి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పెంచిన విద్యుత్తు రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. ఇవి 1980 లలో మారుమూల గ్రామీణ ప్రజల సమీకరణతో సంభవించిన నాటకీయ పరిణామాలు. తమిళనాడులో వైవసాయిగల్, స్వతంత్రం తర్వాత భారతదేశం క్9ిక్
కర్నాటకలోని రాజ్యరైతు సంఘ, పంజాబు యుపిలలోని భారతీయ కిసాన్ యూనియన్, గుజరాతులోని ఖేదత్ సమాజ్ కిసాన్ సంఘ్, మహారాష్ట్రలోని తేత్కారి సంఘటనలు నాయకత్వంలో వివిధ సమయాలలో వివిధ డిమాండ్లపై వేల, లక్షల సంఖ్యలో రైతులు సమీకృతులై రోడ్ల రైళ్ల దిగ్బంధనం చేశారు. నగరాల నుండి సరఫరా అయ్యే సరుకుల్ని ఆపివేశారు. స్టానిక ప్రాంతీయ ప్రభుత్వ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశారు. అధికారులను ఘోరావ్ చేశారు. రాజకీయ నాయకులను అధికారులను వారి డిమాండ్లకు మద్ధతు తెలిపేంతవరకు గ్రామాలలో ప్రవేశించకుండా - ప్రత్యేకించి ఎన్నికల సమయాలలో అడ్డుకొన్నారు. పెంచిన విద్యుత్తు చార్జీలను రుణాలపై వడ్డీలను, నీటిపారుదల పథకాల ఖర్చుల్ని చెల్లించ నిరాకరించారు.
పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆహార పదార్థాలు యితర ముడివనరులు చౌకగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నియంత్రిస్తున్నది - అనేది ఈ ఉద్యమాల మౌలిక అవగాహన, వ్యవసాయోతృత్తికి అవసరమైన పారిశ్రామిక వస్తువులకు ఎక్కువ ధరలు చెల్లించవలసి వస్తున్నది. ఫలితంగా పట్టణ ప్రయోజనాల కొరకు రైతులు దోపిడీ చేయబడుతున్నారు. రైతులు అంతర్గత వలసవాద పీడితులవు తున్నారు. రైతులు యిప్పటికే చాలా చెల్లించారు గనుక అప్పులు తిరిగి చెల్లించనవసరం లేదు. మౌలిక వసతుల కల్పనకయ్యే ఖర్చులు చెల్లించనవసరం లేదు. రైతులు రుణపడి లేరు. వారు రుణదాతలు.
వివిధ సంఘాల నాయకులు ఇదే అంశాన్ని రైతులకు అర్ధమయ్యే విధంగా చెప్పారు. అన్యాయమైన ప్రభుత్వ డిమాండ్లను ప్రతిమఘటించటం న్యాయబద్ధమని సమంజసమని రైతులు నమ్మారు,
(ప్రసార సాధనాలను ఆకర్షించిన ఈ నూతన రైతు ఉద్యమాలు - ప్రత్యేకించి 1980లలో వాటి దృష్టిని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల డిమాండ్లపైన, నీటితీరువా, విద్యుత్ ఛార్జీలు వడ్డీల లాంటి (ప్రభుత్వ బకాయిల రద్దు లేక తగ్గింపు - లాంటి సమస్యలపై కేంద్రీకరించాయి. హరిత విష్రవంతో సహా స్వతంత్రానంతర వ్యవసాయాఖభివృద్ధితో ప్రయోజనాలు పొందిన సంపన్న ధనిక రైతుల డిమాండ్లకు ఈ ఉద్యమాలు వాహకాలుగా పనిచేస్తున్నాయని, వీటికి గ్రామీణ పేదలతో ఎలాంటి సంబంధం లేదని ఆరోపణ వుంది. కాని దీనిని సిద్ధాంతకర్తలు ఉద్యమనాయకులు త్రోసిపుచ్చారు. ఉద్యమానికి మధ్యతరగతి సన్నకారు రైతుల విస్తృతమైన సామాజిక పునాది వుందని, అంతేగాక ఉద్యమం వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల పెంపు, మహిళల దళితుల 596 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సమస్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కాని వాస్తవమేమంటే ఒక షేత్కారీ సంఘటన మినహాయించి ఏ సంఘం కూడా భూమి గల రైతుల పరిధిని మించి యితర సమస్యలను ప్రస్తావించలేదు. ఈ సంఘాలు భూమిలేని గ్రామీణ పేదల మహిళల సమస్యల పట్ల సవతితల్లి (ప్రేమ చూపాయి. కాని రైతులకు సంబంధించినంతవరకు అవి పెద్ద రైతుల సమస్యలకే గాక రైతులందరి సమస్యలకు ప్రాతినిధ్యం వహించాయి. చిన్న రైతులు కూడా మార్కెట్ల కొరకు ఉత్పత్తి చేస్తూ, ప్రభుత్వ రుణాలు చెల్లించవలసి వుంటుంది. గనుక వారి ప్రయోజనాలు కూడా వీరి డిమాంద్లలో ఇమిడి వున్నాయి. గిట్టుబాటు ధరల కొరకు, మెరుగైన వసతుల కొరకు చేసిన డిమాండ్లు న్యాయబద్ధమైనవే. కానీ వీరి సిద్ధాంతంలోని గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రజల మధ్య వివాదానికి సంబంధించిన అంశం సమంజసమైనది కాదు. ఇది అనాలోచితమైన ప్రతిఘటనకు రాజ్యం అణచివేతకు దారి తీస్తుంది. దీనివలన చిన్నరైతులు బలి పశువులవుతారు. వాస్తవంగా 1981లో తమిళనాడులో యిదే జరిగింది. అప్పులు చెల్లింపు నిరాకరణ, ఫలితంగా రాజ్యం చేపట్టిన అణచివేత బలమైన ఉద్యమాన్ని నీరుగార్చింది. 1982లో శ్రామికుల, రైతుల పార్టీ స్థాపనతో దాదాపు రెండు దశాబ్దాలుగా పెంచి పోషించిన ఉద్యమాన్ని పునరుద్దరించడానికి నాయుడు చేసిన అన్ని ప్రయత్నాలు నిష్టలుమయ్యాయి. చివరికి అతడు ఏమీ చేయలేకపోయాననే అసంతృప్తితో 1984లో చనిపోయాడు. తమిళనాడు ఉద్యమం నేర్చిన గుణపాఠాలు యితరులు స్వీకరించలేదు. స్వీకరించి వుంటే 1984లో పంజాబు రైతులకు ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గించమనడం లాంటి ఆత్మహత్యా సదృశ్యమైన సూచనలిచ్చి వుండేవారు కాదు. ఉద్యమాలను నడపడమంటే గాంధీజీలాగా ఉద్యమాన్ని ఎక్కడ ఎప్పుడు ప్రారంభించాలి. ఎక్కడ ఎప్పుడు ప్రారంభించాలి, ఎక్కడ ఎప్పుడు ఆపివేయాలో తెలుసుకొనడం కాని గాంధీజీ అడుగుజాడలలో నదుస్తున్నామని చెప్పుకొన్న నాయకులు అలాంటి గుణపాఠాన్ని నేర్చుకొన్న దాఖలాలు కన్పించలేదు.
ఈ ఉద్యమాలు కొత్తవిగా ప్రస్తావించబడుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన ధోరణిలో భాగమని, వర్గాతీతమైనవని సాంప్రదాయ రాజకీయ పార్టీల నిర్మాణాల విలువల ఆవిర్భవించిన సామాజిక ఉద్యమాలని చెప్పుబడుతున్నాయి. ఈ నూతన రైతు ఉద్యమాలు ఏ విధంగానూ నూతనమైనవి కావు. గతంలో రైతు ఉద్యమాలు యిలాంటి డిమాంద్లు చేపట్టాయి. ఉదాహరణకు సిపిఐ మార్గదర్శకత్వంలో అభివృద్ధిపన్ను లేక నీటితీరువా విధింపుకి వ్యతిరేకంగా కిసాన్‌సభ1958లో పెద్ద ఉద్యమం నడిపింది. అన్ని రైతు సంఘాలు పలు రాజకీయ పార్టీలు గిట్టుబాటు ధర కొరకు డిమాండు చేశాయి. 1967లో చరణ్‌సింగ్ ఆయన పార్టీ బియల్డి ఆవిర్భావంతో స్వతంత్రానంతరం వ్యవసాయ స్వతంత్రం తర్వాత భారతదేశం 597
ది. మార్చు నుండి ప్రయోజనాలు పొందిన సంపన్న రైతుల శకం వచ్చినట్లుగా భావించదది వెనుకబడిన కులాల ఉద్యమాలు కూడా ఈ (క్రమంలో భాగంగా పరిగణించబడ్దా తో ఈ ఉద్యమాలకు కొత్తదనం ఆపాదించటానికి చూపిన మరొక కారణం. గ గ్ వచ్చిన ఉద్యమాలన్నీ రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలు వాటే కూడా రాజకీయ పార్టీతో సంబంధం లేనివి. ఇది పాక్షిక సత్యం. వీటిలో ఏ క్ి రాజకీయ రాజకీయ పార్టీచే ప్రారంభింపబడినది కాదనేది వాస్తవమే కాని కాలక్రమం: త్రీయపార్టీగా పార్టీలతో అనుసంధానం చేయబద్దాయి. తమిళనాడు సంఘం బాహాటంగా రాజ సంఘం మారింది. ఇది ఆలిండియా బికెయుని అశాంతికి గురిచేసింది. కర్నాటక ష్ సంస్త (మన5) ఎన్నికలలో తన అభ్యర్థులను నిలబెట్టింది. పంజాబు బికెయు యుతే సమం కంటె రైతు సంక్షేమం కొరకు పనిచేసే స్వభావాన్ని నిలబెట్టుకొన్నది. కాని అనువై కల నుండి చూసి అకాలీలతో జతకట్టింది. షేత్కారి సంఘటన 1984 లోక్‌సభ ఎన్ని! సర్తాలలో రాజకీయాలలో జోక్యం చేసుకొన్నది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజక పి.సింగ్‌కి అభ్యర్థులను పోటీకి పెట్టింది. 1987 నుండి కాంగ్రెస్ వ్యతిరేక సమీకరణలో వ సూతన శరద్‌జోషి బాహాటంగా సహకరించాడు. అందుకు ప్రతిఫలంగా వి.పి.సిం చాడు, వ్యవసాయ విధానాన్ని రూపొందించేందుకు కేబినెట్ స్థాయి పదవి బహుకరించాదొ. వి.పి.సింగ్‌తో జోషి సంబంధాల కారణంగా జోషి తికాయత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అభిల భారత రైతు బక్యతని ఉమ్మడిగా ప్రదర్శించిన సందర్భంగా తికాయత్ అను కు జోష్‌కి యితర నాయకులను, బోటుక్షబ్ వేదిక నుండి దాదాపు లాగివేశారు. రాజకీయాలు శ్ దూరంగా వుంటామని తికాయత్ చేసిన ప్రకటనలు వట్టివేనని తేలిపోయింది. తికా అంతకు ముందు స్పష్టమైన రూపం దాల్చని బిజెపితో సంబంధాలు 1990 అయోగ్యు సమస్యతో స్పష్టంగా వ్యక్తమయ్యాయి. గుజరాత్ కిసాన్ సంఘ్‌కి బిజెపితో గల సంబంధా అందరికీ తెల్రిస్నవ్లే, సైద్ధాంతికంగా కూడా ఉద్యమం పూర్తిగా విభజితమైనది. రైతుని ప్రపంచ మార్కెటుకి అనుసంధానం చేస్తున్న సరళీకరణకు శరద్‌జోషి అనుకూలుడు : కె.ఆర్ బహుళజాతి సంస్థలకు వ్యతిరేకి, వాటి ప్రవేశానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. ఉద్యమంలో సంస్థాపరమైన సైద్ధాంతికపరమైన ఐక్యత లేదు. 1990లలో ఉద్యమ వేగం మందగించింది. క98 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
3కి మతతత్వవాద పునరుద్ధరణ పెరుగుదల
మతతత్వవాదం, మతతత్వవాద పార్టీలు సంస్థలు ఈనాటిరాజకీయ వాతావరణంలో భాగమయ్యాయి. ఎన్నికల సమీకరణకు మతతత్వవాద విజ్ఞప్తి ఉపయోగించుకానబడుతున్నది. దేశం గడచిన రెండు దశాబ్దాలుగా మత ఘర్షణల వెల్లువతో కునారిల్లింది. ఈనాడు మతతత్వవాదం భారతీయ సమాజాన్ని రాజ్య తంత్రాన్ని ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ప్రమాదం. అది సెక్యులరిజాన్ని ఐలహీనపరుస్తున్నది. కష్టించి సాధించిన భారత ప్రజల ఐక్యతకు ముప్పుగా మారింది. అనాగరిక శక్తుల్ని సమాజంపైకి ఉసికొల్పుతున్నది.
స్వతంత్ర భారతదేశంలో మతతత్వ వాద సమస్యని చర్చించేందుకు ముందుగా సెక్యులరిజం, మతతత్వవాదం పదాలను నిర్వచించవలసి వుంది. వౌలికంగా సెక్యులరిజం అంటే మతాన్ని రాజ్యం రాజకీయాల నుండి విడగొట్టడం. మతాన్ని వ్యక్తిగత విషయంగా పరిగణించడం. రాజ్యం ఒక పేరుని అతడి / ఆమె మతం లేక కులం ప్రాతిపదికన వివక్షతకు గురి చేయకుండా వుండటం.
భారతీయ సమాజం మతపరమైన సమూహాలుగా విభజింపబడి వున్నదని, మతపరమైన వ్యత్యాసాల కారణంగా ఈ సమూహాల ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక ప్రయోజనాలు వేరు వేరుగా వుంటాయని - పరస్పరం ప్రతికూలంగా కూడా వుంటాయనే విశ్వాసంపై "ఆధారపడిన సిద్ధాంతం మతతత్వవాదం. అన్నిటిని మించి మతతత్వవాదం విశ్వాసాల విధానం. ఆ విధానం ద్వారా అది సమాజాన్ని ఆర్ధిక వ్యవస్థని రాజ్య తంత్రాన్ని చూస్తుంది. వివరిస్తుంది. ఆ విధానం చుట్టూ రాజకీయాలను నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. ఒక సిద్ధాంతంగా అది జాతి విద్వేషం, యూదు వ్యతిరేకత ఫాసిజంలను పోలి వుంటుంది. దానిని భారతీయ ఫాసిస్టు రూపంగా పరిగణించవచ్చు. స్వతం[త్రం తర్వాత భారతదేశం 599
మతతత్వ సిద్ధాంతం, మత హింసల మధ్య సంబంధాన్ని గమనించాలి. ఒక సిద్ధాంతంగా మతతత్వవాదం, మతతత్వ భావాలను, ఆలోచనా ధోరణులను వ్యాప్తి చేస్తుంది. మత హింస మన దృష్టిని మారే పరిస్థితి వైపు ఆకర్షించినప్పటికి అది కీలకాంశం కాదు. మత హింస వెనుక దాగి వున్న దీర్హకాలిక కారణం మతతత్వ సిద్దాంతాన్ని లేక విశ్వాస విధానాన్ని వ్యాప్తి చేయడం. మతతత్వ ఆలోచన ఒక స్థాయి తీవ్రతకు చేరిన తరువాత మతపరమైన భయం, అనుమానం, ద్వేషాలలో వాతావరణం కలుషితం చేయబడిన తరువాత సాధారణంగా మతహింస చెలరేగుతుంది. ఆ విధంగా మతపరమైన హింస లేకుండానే మతతత్వ సిద్ధాంతం. వ్యాప్తి చెందగలగుతుంది. కాని మతతత్వ సిద్దాంతం లేకుండా మత హింస జరగదు. మరొక విధంగా చెప్పాలంటే మతతత్వ సిద్దాంతం, రాజకీయాలు జబ్బు, మతహింస కేవలం బయటికి కనిపించే సూచన. దురదృష్టవశాత్తు, మతపరమైన హింసకి భూమికగా వుండే మతతత్వ సిద్ధాంతం యొక్క ఉనికి సాధారణంగా విస్మరింపబడుతుంది. హింస చెలరేగినప్పుడు మాత్రమే మతతత్వ వాద చైతన్యం గుర్తింపుకు వస్తుంది. కాబట్టి మతతత్వవాదులు మతహింస కంటే మతతత్వవాద విశ్వాస విధానాన్ని వ్యాపింపచేయడం పట్ల ఆసక్తి చూపుతారు. వాస్తవంగా మతహింసని ప్రేరేపించి నిర్వహించే వారి ప్రధాన లక్ష్యం హత్యాకాండకాదు. ప్రజలకు మతతత్వ వాదంలోకి లాగే పరిస్థితిని సృష్టించడం. సెక్యులరిజం, మూలాలు దేశ విభజన, దానితో పాటు పాశవికమైన దొమ్మీలు జరిగినప్పటికి భారత
ప్రజలు సెక్యులరిజాన్ని మౌలిక విలువగా అంగీకరించారు. దానిని రాజ్యాంగంలో 'ప్రతిష్టించుకున్నారు. సెక్యులర్ రాజ్యాన్ని సమాజాన్ని నిర్మించ సమాయత్తమయ్యారు. ఇది జాతీయోద్యమం సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. స్వతంత్ర పోరాట వారసత్వం, గాంధీజీ బలిదానం, సెక్యులరిజం పట్ల నెహ్రూ పూర్తి నిబద్ధత, మతతత్వవాద వ్యతిరేక పోరాటంలో సర్దార్ పటేల్ మౌలానా ఆజాద్, సి. రాజగోపాలాచారి, ఇతర నాయకులు నెహ్రూకి ఇచ్చిన చురుకైన మద్దతు-1950 దశాబ్దంలోని సెక్యులరిజం ప్రబలమైన శక్తి కావటానికి దారితీశాయి. 1952, 1957, 1962 ఎన్నికలలో మతతత్వ పార్టీలు రాణించలేదు. తరువాత కొన్ని సంవత్సరాల వరకు కూడా భారతదేశ రాజకీయాలలో నామమాత్రపు శక్తిగా వుండిపోయాయి. ఫలితంగా (ప్రజలు ఆర్ధికాభివృద్ధి, విద్యావ్యాప్తి, శాస్త్ర సాంకేతిక రంగాలు మతతత్వ ఆలోచనని బలహీనపరుస్తాయని, అంతమొందిస్తాయని విశ్వసించారు.
600 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మతతత్వ వాదం భారతీయ రంగం నుండి క్రమంగా అదృశ్యమవుతుందని ప్రజలు నమ్మారు. కాని మతతత్వ వాదానికి పరిస్థితులను బట్టి కాస్త స్తబ్ధతగా, చురుకుగా వుండే దశలు వుంటాయని, బలమైన పోరాటం లేకుండా అది అంతరించి పోదని ప్రజలు, వారి నాయకులు గుర్తించలేదు. అంతేగాక మతతత్వ రాజకీయాలు నిద్రాణంగా వున్నప్పటికీ మతతత్వ సిద్ధాంతకర్తలు వారి పనికొనసాగించారు. ఆర్.ఎస్.ఎస్. జనసంఘ్, జమాయత-ఇ-ఇస్లామి, ముస్లిం లీగు, అకాలీదళ్, కేరళలో చాలా క్రైస్తవ మతతత్వ [గ్రూపులు లాంటి మతతత్వ సంస్థలు వాటి పని కొనసాగించాయి. 1960 దశాబ్దంలో మతతత్వ వాదం బలం పుంజుకొన్నది. 1950 దశాబ్దం చివరలోనే వరుసగా మత ఘ్నణలు జరిగాయి. మతపరమైన దొమ్మీలలో 1958లో ఏడుగురు చంపబడగా, 1959లో 41, 1961లో 108 మంది చంపబద్దారు. ప్రత్యేకించి 1961లో జబల్పూరు మత ఘర్షణలు జాతిని కుదిపివేశాయి. నెహ్రూ వెంటనే స్పందించి జాతీయ సమగ్రతా మండలిని ఏర్పాటు చేశారు. 1962లో చైనా దురాక్రమణ అన్ని సెక్షన్ల ప్రజలలో జాతీయైక్యతా భావాన్ని పెంచాయి. మతతత్వ భావాలు వెనుకంజ వేయవలసి వచ్చింది. కాని ఈ విరామం కొద్దిపాటిదేనని నిరూపితమయింది.
1960 దశాబ్దంలో మరలా మతతత్వ శక్తులు పెల్లుబికాయి. సాధారణ ప్రజలలోని గణనీయమైన సెక్షన్లు మత కులవాదాల ప్రభావానికి లోనయ్యారు. పార్లమెంట్లో జనసంఘ్ బలం 1962లో 14 వుండగా 1967 నాటికి 85కి పెరిగింది. చాలా ఉత్తర భారత రాష్ట్రాలలో సంకీర్ణ మంత్రి వర్ణాలలో భాగస్వామ్యం వహించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాలలో గణనీయమైన మద్దతు పొందగలిగింది. మత ఘర్షణలు కూడా పెరిగాయి. 1964లో జరిగిన మత ఘర్షణలు 1070; 1969లో 520; 1970లో 521; మత ఘర్షణలో చనిపోయిన వారి సంఖ్య వరుసగా 1919, 673, 298, 1971-1977 కాలంలో మత ఘర్షణలు తగ్గాయి. 1971 పార్లమెంటరీ ఎన్నికలలో ఇందిరాగాంధీ బలం పుంజుకొనడంతో ఈ కాలంలో సంవత్సరంలో కూడా 250కి మించి ఘర్షణలు జరగలేదు. చనిపోయినవారి సంఖ్య కూడా 1000కి మించలేదు. పార్లమెంట్లో జనసంఘ్ బలం కూడా 1967లో 85 వుండగా 1971 నాటికి 22కి తగ్గిపోయింది. 1971 చివరలో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధం కూడా హిందూ, ముస్లిం మతతత్వవాదాలను బాగా దెబ్బతీసింది. కాని మరలా 1978 నుండి మతతత్వవాదం, మత పొంస పెరగడం ప్రారంభమయింది. అప్పటి నుండి అంటువ్యాధిలా వ్యాపిస్తూ విస్తృతరూపం దాల్చింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 601
త్వరితంగా విస్తృతంగా వ్యాప్తి చెందే మతతత్వవాదం మతహింసల స్వభావం చాలా ఆందోళన కలిగిందే అంశం. ' గతంలో మతఘర్నణలకు దూరంగా నేన్స, కేక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒరిస్సాలతో సహా దాదాపు అన్ని పెద్ద నగరాలకు దేశంలోని అన్ని ప్రాంతాలకు మతతత్వ వాదం మతహింసలు వ్యాపించాయి. (గ్రామాలకు విస్తరించిన అన్ని మతపరమైన [గ్రూపులను భాగస్వాముల్ని. చేశాయి. మఠ హింస ముందుగా వేసుకొన్న పథకం (ప్రకారం సాగించేది. నిర్మాణబద్ధమైనది. ఎక్కువ కాలం కొనసాగేది. మతఘర్షణలు కొన్ని వారాల పాటు నెలల పాటు సాగాయి ఘర్షణలో పాల్గొన్న వారికి నిధులు, బాంబులు యితర విధ్వంసకర సాధనాలు సమకూర్చబిడ్డాయి. 1971-77 కాలంలో విధించబడిన అత్యవసర పరిస్టితి కాలంలో ఆర్. ఎస్.ఎస్. జనసంఘ్- జమాయిత్.ఇ. ఇస్లామిలకు చెందిన పెద్ద నాయకులు ముఖ్య కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు. మత ఘర్షణలను నిర్వహించడానికి, మత విద్వేషాన్ని రెచ్చుగొ ట్టడానికీ కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఫలితంగా మత ప్రచార స్థాయి మత పొంన తగ్గిపోయాయి. మరొక వైపు జనతా ప్రభుత్వ కాలంలో జనతా పార్టీలోను, ప్రభుత్వంలోను ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్ పలుకుబడి కారణంగా మతతత్వవాదం, మతపహి ంస పెరిగాయి. ఈ కాలంలో మతతత్వవాదం బలంగా వేళ్ళూనుకొన్నది. మరలా 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పటికి దాని పెరుగుదలను అదుపు చేయడంలో విఫలమయింది. మతతత్వవాద లక్షణాలు
అన్ని సిద్ధాంతాలు, రాజకీయాలు లాగానే మతతత్వవాదం స్పష్టమైన సామాజిక పునాది లేక మూలాలు కలిగి వుంటుంది. అది సామాజిక, ఆర్థిక రాజకీయాల నుండి ఉత్పత్తియై సామాజిక ఆర్ధిక రాజకీయాలను ప్రతిఫలిస్తుంది. కాని యిది వాస్తవ పరిస్థితిని కారణాలను పరిణామాలను సరిగా అంచనా వేయకుండా వక్రీకరించిన పద్ధతిలో సంభవిస్తుంది. ఆ విధంగా మతతత్వవాదం ఏ సామాజిక వాస్తవాన్ని (ప్రతిఫలించదు. అది ప్రకటించే సామాజిక వాస్తవం సామాజిక వాస్తవం కాదు. అది ప్రకటించే సామాజిక అసంతృప్తి కారణాలు కారకాలు కావు. సామాజిక రుగ్మతకి అది సూచించే పరిష్కారాలు పరిష్కారాలు కావు. వాస్తవంగా చెప్పాలంటే అదే (మతతత్వవాదమే) ఒక సామాజిక రుగ్మత. ఆ విధంగా మతతత్వవాదం - దాని పుట్టుకకు పెరుగుదలకు దారితీసే ఏ సమస్యలకు జవాబు కాదు. అంతేగాక అది సామాజిక మార్పుల కొరకు చేసే పోరాటొన్ని బలహీనపరుస్తుంది. స్వతంత్రానంతర భారతదేశ సమాజం సెక్యులర్ స్వభావం కలిగి వుండగా అది అనుసరిస్తున్న ఆర్థిక విధానం మతతత్వవాద వ్యాప్తికి అనుకూలమైన 602 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సారవంతమైన క్షేత్రాన్ని సమకూరుస్తున్నది. అది అనుసరిస్తున్న ఆర్ధికాభివృద్ధి తరహా నుంది నామాజిక సమస్యలుత్పన్నమవుతున్నాయి. 1947 తరువాత దేశం గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధించింది. కాని పేదరికం, నిరుద్యోగం, వలసవాద వెనుకబాటుతనం నుండి ఉత్పన్నమైన అసమానత సమస్యలు ప్రత్యేకించి జనాభా పెరుగుదల నేపథ్యంలో పాక్షికంగానే పరిష్కరించబడ్డాయి. ఈ సమస్యలు ప్రజల నైరాశ్యానికి, వ్యక్తిగత సామాజిక వ్యాకులతకు గురిచేస్తాయి. చాలీచాలని ఆర్థిక సామాజిక అవకాశాల కొరకు అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తాయి. వాస్తవంగా పెట్టుబడిదారీ అభివృద్ధి విధానం తీవ్రమైన, స్పష్టంగా కంటికి కనిపించే ఆర్థిక వ్యత్యాసాలను పెంచింది. మొత్తం మీద ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఆర్థికావకాశాలు పెరిగినప్పటికి వాటిని అందుకోవడానికి అసమానతలు గతంలో కంటే కూదా పెరిగాయి. ప్రజల ఆకాంక్షలు అవి నెరవేరే అవకాశాల కంటే వేగంగా పెరిగాయి. మతతత్వవాదం ఏపుగా పెరగడానికి భూమి చదును చేసి వుంచబడినట్లయింది. పైన వివరించిన సామాజిక సందిగ్ధత మధ్యతరగతులను లేక పెటీ బూర్జువాలను ప్రత్యేకించి ప్రభావితం చేసింది. ఇటీవలి సంవత్సరాలలోని పెటీ బూర్జువాలు నిరంతరం నిరుద్యోగ భయాన్ని ప్రతికూల సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అంతేగాక స్వతంత్రానంతరం విద్యావ్యాప్తి, సామాజిక మార్పు తరవో త్వరితగతిని జనాభా పెరుగుదలతో లక్షలాది రైతు శ్రామిక వర్గ యువకుల్ని నగరాలకు పాలనాపరమైన శాఖలలో ఉద్యోగాల కొరకు పరుగులు తీసేలా చేశాయి. ఈ తరవా విశ్లేషణ 1960 దశాబ్దం తాలి సంవత్సరాల వరకు మతతత్వ వాదం ఎందుకు నిద్రాణంగా వుందో వివరిస్తుంది. అధికార సోపొనంలో పరిపాలనా యంత్రాంగంలో భారతీయీకరణ, విస్తరణ, బ్యాంకింగ్, వాణిజ్యం, పారిశ్రామిక కంపెనీల అభివృద్ధి విస్తరణ, పాఠశాల, కళాశాల విద్య ఇతర సామాజిక సేవల పెరుగుదల, ఇంజనీర్లు, దాక్టర్ల శాస్త్రవేత్తల శిక్షణ నియామకాల పెరుగుదల కారణంగా న్వతం[త్రం మొదటి మూడు పంచవర్న వ్రణాళికలు మధ్యతరగతులకు విస్తృతమైన అవకాశాలు కల్పించాయి. ఈ అవకాశాలు 1960 దశాబ్దం మధ్యకాలానికి అడుగంటాయి. అంతేగాక ఆర్ధికాభివృద్ధి విధానం, శేటు, పారిశ్రామిక వాణిజ్య రంగాల్లోకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో విఫలమయ్యాయి. సామాజిక సేవల విస్తరణకు పరిమితులు విధించాయి. పెటీ బూర్జ్డువాలు మరలా ఉపాధి కొరత, పొటీ, స్పర్ధలు, అసంతృప్తి దశకి నెట్టివేయబడ్డారు. అంతేగాక వ్యవసాయ సంబంధాలలోని మార్పులు కుల మతతత్వవాద సిద్దాంతాలు ఉద్యమాలు, పార్టీలు పుట్టి పెరగడానికి స్వతంత్రం తర్వాత భారతదేశం 603
అనువైన సారవంతమైన నేలని సమకూర్చే కొత్త న్థాయి సంపన్న మధ్యతరగతి పెట్టుబడి వ్యవసాయదారుల్ని అంటే గ్రామీణ బూర్జువాలను పెటీ బూర్జువాలను ముందుకు తెచ్చాయి.
మతతత్వ వాదం పెటీ బూర్జువాల ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు. అది వారి సామాజిక ప్రయోజనాలను నెరవేర్చలేదు. వారి ఆర్థిక సామాజిక దురవస్థకు పెరుగుతున్న సామాజిక ఆర్థిక వ్యత్యాసానికి, అభద్రతా భావానికి కారణాలను అర్ధం చేసుకోలేని స్థితిల వున్న వారి వ్యాకులత కుల మతతత్వ రూపాలను చేపడుతుంది. వారి సమస్యలకు యితర పాలనాపరమైన, కులపరమైన గ్రూపులు కారణాలుగా చూపబడతాయి.
మతతత్వ సమస్య కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాలేదు. భారతీయులు చాలా తరాల నుండి సామాజికంగా మార్పు చెందుతున్నారు. వారు కొత్త ప్రపంచాన్ని పొందకుండానే పాత ప్రపంచాన్ని కోల్పోతున్నారు. ఈ క్రమం స్వతంత్రానంతరం వేగవంతమయింది. కులం, ఉమ్మడి కుటుంబం గ్రామీణ పట్టణ సంబంధాలు లాంటి వాటికి సంబంధించిన పాత సంప్రదాయ సామాజిక సంస్థలు, సంఘీభావాలు పరస్పరాలంబనగా వుందే విధానాలు వేగంగా క్షీణిస్తున్నాయి. వర్షాలు, కార్మిక సంఘాలు, కిసాన్ సభలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతర స్వచ్చంద సంస్థలు వగైరాలకు చెందిన సంస్థల సంఘీభావాలు మెల్లగా ముందుకు వస్తున్నాయి. కాని పాత సంస్థల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితులలో చాలామంది ప్రత్యామ్నాయ ఐక్యత, సంఘీభావ కేంద్రాలుగా మత సంస్థల వైపు మరలుతున్నారు. లాభాపేక్ష పెట్టుబడిదారీ విధానపు పోటీతత్వం, వ్యక్తిగా పైపైకి ఎగబాకాలనే అపేక్ష వెనుకబడ్డవాడిని గాలికి వదిలేసి గెలిచినవాడికే అన్నీ దక్కాలనే ఆధునిక తాత్విక ధోరణి యిత్యాదుల సమ్మెట పోట్లలో యిప్పటి వరకు వివిధ సామాజిక భాగాలను కలిపి వుంచిన పాత విలువలు సామాజిక కట్టుబాట్లు తుత్తునియలై అద్భృశ్యమవుతున్నాయి. ఫలితంగా నైతిక సాంస్కృతిక శూన్యం ఏర్పడుతున్నది. ఇది భయం, ద్వేషం ప్రాతిపదికలుగా గల సిద్ధాంతాలకు చాలా అనుకూలమైనది. వ్యక్తులు, గ్రూపులు, పార్టీలు మత భావాలను, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయాధికారాన్ని త్వరగా, సులభంగా పొందే మార్గాన్ని చేపడుతున్నాయి.
మరొకవైపు ప్రజలకు ప్రత్యేకించి యువతకు స్ఫూర్తినిచ్చిన సెక్యులర్ భావాలు జాతీయోద్యమ ఆదర్శాలు క్షీణిస్తున్నాయి. 1947 తరువాత ప్రజలకు భవిష్యత్తు పట్ల ఆశాభావం కల్పించగల, ఆరోగ్యపరమైన జాతీయ భావాలు పెంపొందించగల, ఉమ్మడి జాతీయ లక్ష్యం పట్ల ఆసక్తి కలిగించి కలిపించి వుంచగల, సెక్యులర్ భావాలను బలోపేతం 604 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చేయగల ప్రజలని సమైక్యపరిచే లక్ష్యం దార్శనికత అవసరమయింది. దురదృష్టవశాత్తు అలాంటి దార్భనికత ప్రత్యేకించి 1970ల తరువాత కొరవడింది. ఆ విధంగా సమూలమైన పారదర్శిక మార్పు, (ప్రజలకు ఆసక్తి కలిగించే అభివృద్ధికరమైన సమసమాజ ఆదర్శం లేకపోవుట వలన భారతదేశ ఐక్యతని భంగపరచి సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రయత్నాలకు అద్డుకొనడానికి మతతత్వవాద ఉద్యమాలకు మార్గం సుగమమవుతుంది. కాబట్టి మతతత్వ వాద పెరుగుదలకు అనుకూలించే సామాజిక పరిస్థితులను తొలగించడం అవసరం,
ఈ సందర్భంగా ఒక హెచ్చరిక అవసరం. సైద్ధాంతిక పరిశోధన ప్రాతిపదికపై మతతత్వవాదంపై లోతైన సామాజిక విశ్లేషణ జరగాలి. వివిధ వర్గాలకు మతతత్వ భావాలను ఆపాదించడం సరియైన వైఖరి కాదు. ఉదాహరణకు భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గం మతతత్వ వాదానికి మద్దతు ఇచ్చినట్లు ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు లేవు కాని భవిష్యత్తులో మద్దతు యివ్వదని కచ్చితంగా చెప్పలేదు. దీర్లకాలిక, స్వల్పకాలిక కారణాలు
మతతత్వ సిద్దాంతం మత హింసల మధ్య తేడాని గుర్తించినట్లే దీర్హకాలిక మతతత్వ కారణాలు, మ ఘర్షణలు యితర మతహింస రూపాలు చెలరేగడానికి తక్షణ స్వల్పకాలిక కారణాల మధ్య తేడాని గుర్తించాలి. మత హింస కారణాలు తరచుగా సంఘటనలపరమైనవి, అవి స్థానికమైనవి, ప్రత్యేక తరవాకి చెందినవి. యాదృచ్చికమైనవి, చిన్న మతపరమైన సమస్య లేక వివాదానికి సంబంధించినవి. ఒక అమ్మాయిని వేధించడం లేక భిన్న మతాలకు చెందిన యిరువురి మధ్య హింసాయుత ఘర్షణ లాంటివి. ముందుగా సంబంధిత ప్రాంతంలో మతతత్వవాద వాతావరణం వ్యాపింపజేస్తే చిన్న ఘటనలే ఘర్షణల రూపం దాల్చుతాయి. ఈ సంఘటనల కారణాలు మహీ అయితే నిపు రవ్వలుగా పనిచేసి మతతత్వ చిచ్చు రేపుతాయి. మత హింసకి మరికొన్ని అంశాలు కూడా కారణాలవుతాయి. క్రమరహితమైన ఆర్థికాభివృద్ధి కారణంగా పెద్ద ఎత్తున పల్లెల నుండి నగరాలకు వలసలు పెరగడం వలన మతహింసలో మురికివాదలలో నివసించే పట్టణ పేదల జోక్యం వుంటుంది. ఉపాధి లేక పేదరికంలో మ్రగ్గుతూ ఆరోగ్యం విద్య పారిశుధ్యం త్రాగునీరు లాంటి కనీస వసతులు లేకుండా వీరు గుంపులు గుంపులుగా బతుకుతుంటారు. దుర్భర జీవన పరిస్థితుల కారణంగా పెరిగే ఆగ్రహం, నైరాశ్యం వారిని మతహింసకి బలిపశువులుగా మారుస్తాయి. మత ఘర్షణలు లూటీలకు, దోపిడీలకు అవకాశం కల్పించినప్పుడు వారిలో ఆగ్రహం నైరాశ్యం వ్యక్తమవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో స్వతంత్రం తర్వాత భారతదేశం 605
స్మగ్లింగ్, చట్ట విరుద్ధమైన సారా తయారీ అమ్మకం జూదం, మాదక ద్రవ్యాల రవాణా, కిద్నాపింగ్లకు పాల్పడే చట్ట విరుద్ధ కార్యకలాపాల ప్రత్యర్థి నేరస్థ వర్డాల అధిక్యతని చాటుకౌనేందుకు మత ఘర్షణల్ని వేదికగా చేసుకుంటున్నాయి.
భారతదేశ రాజకీయాలలో పాలనా నిర్వహణలోని ఇటీవలి మరొక ముఖ్యమైన లక్షణం మతహింన పట్ల ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యేకించి పోలీసులలో పెరుగుతున్న మెతకదనం. మతహింసని జయప్రదంగా ఎదుర్శొనే సాధనాలు రాజ్యం అధీనంలోనే వుంటాయి. తక్షణ రాజ్య చర్య మాత్రమే మత హింసని అదుపు చేయగలుగుతుంది. కాని ఇటీవలి సంవత్సరాలలో పాలనా యంత్రాంగం శాంతి భద్రతల బలాన్ని తగు సమయంలో దృఢంగా నిర్ణయాత్మకంగా ప్రయోగించిన సందర్భాలు చాలా అరుదు... అండేగాక మతహింసకి ముందు తీవ్రమైన వివిధ రకాల ఉద్రేక జనక ప్రచారాలు సాగుతాయి. అయినప్పటికీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేవారికి మత హింస నిర్వాహకులకు వ్యతిరేకంగా అమలులో వున్న చట్టాల పరిధిలో తీసుకొన్న చర్యలు కూడా చాలా అరుదు. ఇటీవలి సంవత్సరాలలో మతతత్వవాదులు, మతతత్వ సిద్దాంతం రాజకీయ యంత్రాంగంలో చొచ్చుకుపోతున్నది. ఫలితంగా వివిధ స్థాయిలోని అధికారులు మతతళ్య శక్తుల్ని 'ప్రచ్చన్నంగా బావోటంగా ప్రోత్సహించారు. ప్రత్యేకించి పోలీసులలో మతతత్వీకరింపబడిన సెక్షన్లు చేష్టలుడిగి పరిస్థితిని క్షీణింపజేశాయి. మరికొన్ని సందర్భాలలో పాక్షిక దృష్టితో మత ఘర్షణల్ని సమర్ధించాయి.
1960ల నుండి సెక్యులర్ పార్టీలు, గ్రూపులు, వ్యక్తులు మతతత్వ వాదం పట్ల అనుసరించిన రాజకీయ అవకాశవాదం వలన కూడా మతతత్వ వాదం పెరిగింది. అవి రాజకీయాలలో మతం చొరబాటుని అనుకూలించాయి. మతపరమైన దాడుల సందర్భంగా ఊగిసలాడాయి. వెనుకడుగు వేశాయి. శాత్మాలిక ఎన్నికల ప్రయోజనాల కొరకు లేక కాంగ్రెస్ వ్యతిరేక విధానంలో భాగంగా మతతత్వ శక్తులతో రాజీపడ్డాయి. వాటికి న్థానం కల్పించాయి. అంతకంటే బాధాకరమైన అంశమేమంటే మతతత్వ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి: 1960 దశాబ్ధం తొలి సంవత్సరాలలో కాంగ్రెస్ కేరళలో ముస్లిం లీగుని మిత్రపక్షంగా స్వీకరించి మతతత్వ శక్తులతో మైత్రికి నాంది పలికింది. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలు కేరళలో ముస్లిం లీగుతో పంజాబ్‌లో అకాలీదళీలో మిత్రపక్షాలుగా వ్యవహరించాయి. మైనారిటీ మతతత్వవాదం అర్ధం చేసుకోగలిగిందని ప్రజాస్వామ్యబద్ధమైనదని, న్యాయబద్ధమైనదని మైనారిటీ మతతత్వవాదం మెజారిటీ మతతత్వవాదమంత ప్రమాదకారి కాదని ప్రతిచర్యల్ని సమర్ధించుకొన్నాయి. 1967లో ౮06 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సోషలిస్టులు ఇతర సెక్యులర్ పార్టీల (గ్రూపులు ఎన్నికలలో మతతత్వ జనసంఘ్‌తో మొదట సీట్ల సర్దుబాటు కొరకు ఆ తరువాత చాలా ఉత్తరాది రాష్ర్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకి చేతులు కలిపాయి. 1974-75లో జయప్రకాష్ నారాయణ కాంగ్రైెస్కి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చేపట్టిన సంపూర్ణ విష్లవానికి వెన్నెముకగా నిలిచేందుకు ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్, జమాత్-ఎ-ఇస్తామిలను అనుమతించారు. 1977లో జనసంఘ్ జనతాపార్ద్టీలో భాగమయింది. 1989 నవంబరు ఎన్నికలలో వి.పి. సింగ్ నాయకత్వంలోని జనతాదళ్ బిజెపితో పరోక్ష ఎన్నికల సంబంధం పెట్టుకొన్నది. ఆ తరువాత దాని మిత్రపక్షాలైన కమ్యూనిస్టు పార్టీలు పరోక్షంగానైనప్పటికి రెండు చర్యల్ని అనుమతించాయి.
మతతత్వ పార్టీలు (గ్రూపుల పట్ల మెతక వైఖరి వాటిని గౌరవప్రదమైనవిగా చేసే చాలా ప్రతికూల ఫలితాన్ని యిచ్చింది. మతతత్వ వాదానికి న్యాయబద్ధతని సమకూర్చింది. మతతత్వ వాదాన్ని పూర్తిగా నిర్మూలించినప్పటికి దానిని దూషితపదంగా చేసిన జాతీయోద్యమం, నెహ్రూ శకం అందిచ్చిన తోడ్చాటుని ఈ విధానం మలినపరచింది. సెక్యులర్ వాదులు యిటీవలి సంవత్సరాలలో వివిధ రాయితీల ద్వారా మతతత్వ భావాలను సంతృప్తిపరచే వైఖరి చేపట్టారు. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ షాబానో కేసు విషయంలో రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీం కోర్టు తీర్పుని తలక్రిందులు చేయడంలోను, 1980లో అయోధ్యలో వివాదంలో వున్న మసీదు మందిర్ ద్వారాలను తెరివించడం ను మతతత్వవాదుల్ని సంతృప్తిపరచ యత్నించారు. అలాగే వి.పి.సింగ్ 1990లో స్వతంత్ర దినోత్సవంనాడు రెడ్ ఫోర్స్ నుండి చేసిన ఉపన్యాసంలో ప్రవక్త జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించారు. హిందూ ముస్లిం మతతత్వవాదులకు యిచ్చిన ఈ రాయితీలు మతతత్వ ఉద్రిక్తతలకు తగ్గించకపోగా పెంచాయి.
కాని మితవాద, వామపక్ష మధ్యేవాద రాజకీయ పార్టీలు మేధావులు అవకాశవాదానికి తలొగ్గినప్పటికి అవి మతతత్వ పార్టీలు కావనే అంశం గమనార్హం, ఇది మతతత్వ వాద పెరుగుదలని అద్దుకొన్నది. భారతదేశన్ని మౌలికంగా సెక్యుల రాజ్యంగా నిలిపింది.
ఖారత రాజ్యం మౌలికంగా సెక్యులర్ రాజ్యంగా వుంటూ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించింది. కాని భారతరాజ్యం యొక్క అలాగే అత్యధిక రాజకీయ పార్టీల సెక్యులరిజంలో చాలా బలహీనతలు వున్నాయి. అయినప్పటికి భారతీయ సామాజిక రాజకీయ పరిస్థితిని పరిరక్షించే అంశమేమిటంటే మతతత్వ సిద్ధాంతానికి మతతత్వ స్వతంత్రం తర్వాత భారతదేశం 607
శక్తులకు రాజ్యం యొక్క చురుకైన మద్దతు లేకపోవడం. ఇటీవలి సంవత్సరాలలో రాజ్యానికి మతతత్వవాదం మతహింసలతో దృఢంగా వ్యవహరించే రాజకీయ సంకల్పం కొరవడినప్పటికి, అది తనకు గల అనేక ప్రచార (ప్రసార సాధనాల ద్వారా పాఠ్య పుస్తకాల ద్వారా పాలనాపరమైన చర్యల ద్వారా మతతత్వ సిద్దాంతాన్ని ప్రోత్సహించలేదు. వలస పాలన కాలంలో మన అనుభవం అలాగే పాకీస్తాన్, బంగ్లాదేశ్ అనుభవం ఒకవైపు ఇటలీ, జర్మనీ, స్పెయిన్ (అవి జయ్రదమైనవి) మరొకవైపు ఫ్రాన్స్. అమెరికా (ఆవి విఫలమైనవి) అనుభవం - మతతత్వ లేక మతతత్వ తరహా ఉద్యమాలు రాజ్యం మద్దతు ఇవ్వకపోతే లేక రాజ్యాధికారం తటస్టంగా ఉదాసీనంగా వ్యవహరించకపోతే అభివృద్ధి చెందజాలవు. ఈ దిశలో కొన్ని అంశాలు స్పష్టం చేయవచ్చు. మొదటిది : మతతత్వ పార్టీలకు మౌలికంగా సెక్యులర్ పార్టీలై వుండి మతతత్వవాదం పట్ల అవకాశవాదాన్ని పాటించే పార్టీలకు మధ్య గల స్పష్టమైన తేడాని గుర్తించాలి. మతతత్వ సిద్దాంతం చుట్టూ నిర్మింపబడిన పార్టీ మతతత్వ పార్టీ. అవి ఆవిర్భవించినప్పటి నుండి మతతత్వ ఆలోచనా విధానాన్ని మతపరమైన ఉద్రిక్తతల్ని ప్రోత్సహిస్తాయి. సెక్యులర్ అవకాశవాద పార్టీలు మతతత్వ దాడుల సందర్భంగా ఊగిసలాడుతూ వెనుకడుగు వేసే వైఖరి చేపట్టినప్పటికీ అవి మతతత్వ వైఖరిని స్వీకరించవు. మతతత్వ పార్టీలలా వ్యవహరించవు. ఇధి మతతత్వవాద పెరుగుదలనువ్యాప్తిని ఒక మేరకు అద్దుకొంటుంది. రెండవది మెజారిటీ (హిందూ) మతతత్వ వాదానికి మైనారిటీ (ముస్లిం, సిక్కు కైస్తవ) మతతత్వ వొ దానికీ మధ్య తేడా లేదు. అవి ఒకే మతతత్వ వాదం యొక్క భిన్నరూపాలు. రెండూ సమా నమైన 'ప్రమాదకారులే. మైనారిటీ మతతత్వవాదాలు-19478 ముందు ముస్లిం మతతత్వవాదం, ఇటీవలి సంవత్సరాలలో పంజాబులో సిక్కు మతతత్వవాదంలాగా విభజనతో పరిసమాప్తి కావు. కాని మెజారిటీ మతతత్వవాదం ఫాసిస్టు రూపాన్ని తీసుకొంటుంది. గతంలో లాగానే ఇటీవలి సంవత్సరాలలో కూడా విభిన్న మతతత్వవాదాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెంది ప్రమాదకరమైన ఫలితాలనందజేస్తున్నాయి. హిందూ - ముప్లిం మతతత్వవాదం
1960 దశాబ్దం ప్రారంభం నుండి భారతదేశంలోని మతతత్వవాదులు వారి రాజకీయాలలో ఉద్రిక్తత, తీవ్రత పెంచేందుకు మత సమస్యల నాథ్రయిస్తూ వచ్చారు. వలసవాద పాలనా కాలంలో 1940లలో “ఇస్లాం ప్రమాదంలో పడింది” అనే నినాదంతో ముస్లిం మతతత్వవాదం అభివృద్ధి చెందింది. కాని హిందూ మతతత్వవాదం అంతగౌ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టలేకపోయింది గనుక అది బలహీనంగా, పరిమితంగొ 608 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వుండిపోయింది. హిందూ మతతత్వవాదులు కూదా వారి సంస్కృతి ప్రమాదంలో పడిందని నినాదాలు యిచ్చారు. అవి ప్రజల్ని అంతగా కదిలించలేకపోయాయి. అందుకు చాలా కారణాలు వున్నాయి. హిందూయిజం ఒక నిర్మాణబద్ధమైన మతం కాదు. దానికి ప్రామాణికంగా పేర్కొనబడే ఒకే ఒక (గ్రంథం లేదు. అధికార క్రమం గల పూజారి వర్గం లేదు. హిందువులకు ఒకే దేవుడు లేడు. ఒకే విశ్వాసాల విధానం లేదు. ఫలితంగా వారిలో మతపరమైన వైవిధ్యం ఎక్కువ. వాస్తవంగా హిందువు ఎవరో నిర్ణయించడానికి స్పష్టమైన నిబంధనలు లేవు. మత సహనం, విశాల దృక్పథం హిందువుల సంస్కృతిలో భాగమయ్యాయి. భారతదేశంలో మెజారిటీగా వున్న హిందువులను వారి మతం ప్రమాదంలో పడిందని ఒప్పించడం కూడా సులభం కాదు. మతపరమైన భావోద్రేకాలను రెచ్చగొట్టనిదే మతతత్వ రాజకీయాలు వేగంగా ముందుకు పోవని పొందూ మతతత్వవాదులు గుర్తించారు. 1947 ముందు నాటి ముస్తిం రాజకీయాల నుండి ఒక పుటని అరువు తెచ్చుకొని, 1970ల నుండి తమ రాజకీయాలను అఖివృద్ధిపరచడానికి వీలైన మతపరమైన సమస్యని వెతకడం ప్రారంభించారు. 1980లలో బాబ్రీ మసీదు రామజన్మభూమి సమస్యని పట్టుకున్నారు. భారతదేశంలో రాముడికి ఏకైక స్థానం వుంది గనుక ఈ సమస్య హిందువుల్ని ఉద్రిక్తపరచగలదు. హిందువు - ఒక విధంగా భారతీయుడు ఆరాధించే విలువల ప్రతిరూపం రాముడు. రాముని 'పేరు లక్షలాది ప్రజల మనస్సులను స్పృశిస్తుంది. సంవత్సరాల తరబడి ఆర్.ఎస్.ఎస్.చే పెంచి పోషించబడిన బిజెపి విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్'సంస్థలు ఈ సమస్యని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా హిందువులలో పలుకుబడి పెంచుకొనడంలో జయప్రదమయ్యాయి. మతతత్వ వాద ప్రతిఘటనని ఒక మేరకు బలహీనపరచగలిగాయి. వివాదానికి సంబంధించిన సంక్షిప్త బాబర్చే నియమింపబడిన ఒక గవర్నరు 16వ శతాబ్దం (ప్రారంభంలో అయోధ్యలో (యు.పి.లో) ఒక మసీదు నిర్మించాడు. రాముడు జన్మించిన స్థలంలో అక్కడ ఒక మందిరం కూడా వున్న స్థలంలో మసీదు నిర్మింపబడిందని 19వ శతాబ్దంలో కొందరు హిందువులు అభ్యంతరం తెలియజేశారు. కాని 1949లో మతతత్వ భావాలు గల ఒక జిల్లా మేజి(స్ట్రేట్ హిందువులను మసీదులో ప్రవేశించేందుకు, అచట సీతారాముల విగ్రహాల్ని ప్రతిష్టించేందుకు అనుమతించే వరకు ఈ సమస్యని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అప్పటి హోంమినిష్టర్ సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రా జిల్లా మేజి(స్టేట్ చర్యని ఖండించారు. కాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ చర్యని వెనక్కి తీసుకొనడం స్వతంత్రం తర్వాత భారతదేశం 609
సాధ్యపడదని భావించింది. అయినప్పటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదుకి తాళాలు వేయించి హిందూ ముస్లింల ప్రవేశాన్ని నిషేధించింది. కోర్టులో వివాదంలో వన్న ఈ సమస్యకి తాత్కాలిక పరిష్కారంగా దీనిని దాదాపు అందరూ ఆమోదించారు. పకిరితి వరకు పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయి. 1983లో విశ్వపొందూ పరివళ్త్ రామజన్మభూమికి విముక్తి కల్పించాలని అంటే మసీదుని కూలగొట్టి అదే స్టలం రామమందిరం నిర్మించాలని సుడిగాలి ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారానికి ప్రతిగా సెక్యులర్ పార్టీలు గ్రూపులు చేసిందేమీ లేదు. ప్రచారాన్ని పట్టించుకోలేదు. అకస్మాత్తుగా 1986 ఫిబ్రవరి 1వ తేదీన బహుశా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా మేజిష్ట్రేట్ మసీదుని తెరిపించి హిందూ పూజారులకు అప్పజెప్పి హొందువులు వూజలు చేసుకొనడాన్ని అనుమతించారు. ఫలితంగా మతతత్వ ఉద్రిక్తతలు రెచ్చగొట్టబడ్దాయి. దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ పట్టణాలలోనే 65 మంది చంపబడ్డారు. వెంటనే వి.హెచ్.పి. బాబ్రీ యాక్షన్ కమిటీ నాయకత్వంలోని హిందూ, ముస్లిం మతతత్వ గ్రూపులు మోహరించాయి. మసీదుని కూల్చి ఆ స్థలంలోనే రామాలయం నిర్మించాలని హిందూ మతతత్వవాదులు డిమాండ్ చేశారు. మసీదుని ముస్లింలకు అప్పచెప్పాలని ముస్లిం మతతత్వవాదులు డిమాండ్ చేశారు. సెక్యులర్ జాతీయవాద భావాలు గల వ్యక్తులు, పార్టీలు గ్రూపులు ఒక్కసారిగా సమస్య తీవ్రతని గుర్తించాయి. కాని అప్పుడు కూడా తగు విధంగా స్పందించలేదు. ఇరుపక్షాల మతతత్వవాదులు వారి వారి బలాలతో సంఘటితమయ్యారు. కాలక్రమంలో అవసరమైన కొన్ని చర్యలు చేపట్టి వుండవలసింది. దశాబ్దాల చరిత్ర గల దేశంలో సహనం, ఉమ్మడి సంస్కృతి అభివృద్ధి శాంతి సామరస్యాలు వున్నట్లే పీడన అన్యాయం, అణచివేత, వివక్షలాంటివి కూడా వుంటాయి. కాని స్పష్టంగా గతంలో జరిగిన తప్పుని సరిదిద్దడానికి వర్తమానం ఉపయోగించకూడదు.
1989లో రానున్న లోక్‌సభ ఎన్నికలను గమనంలో పెట్టుకొని బాబ్రీ మసీదు వున్న చోట రామమందిరం నిర్మించడానికి వి.హెచ్.పి. పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా గల (గ్రామాలు, పట్టణాలు, నగరాల నుండి ఇటుకలు తీసుకొని రావలసిందిగా పిలుపు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలు ఉడిక్త మత వాతావరణంలో జరిగాయి. జనతాదళ్‌తో, దాని వామపక్ష మిత్రులతో బి.జె.పికి పరోక్ష అవగాహన వుంది. ఫలితంగా 1984లో రెండు సీట్లు వున్న బి.జె.పి. 86 సీట్లు గెలిచింది. అంతేగాక కేంద్రంలో వి.పి. సింగ్చే ఏర్పరచబడిన కొత్త ప్రభుత్వం సి.పి.వి,; 610 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సి.పి.ఎం., బి.జె.పిలు బయట నుండి యిచ్చే మద్దతుపై ఆధారపడింది. పెరిగిన ప్రజా మద్దతుని పటిష్టపరచుకానేందుకు బి.జె.పి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తన లక్ష్యమని అధికారికంగా ప్రకటించింది. ఈ లక్ష్యాన్ని ప్రచారం చేసేందుకు బి.జె.పి. అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ నాయకత్వంలో అఖిల భారత రథయాత్ర నిర్వహించింది. రథయాత్ర మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. చాలాచోట్ల మత ఘర్షణలు చెలరేగాయి. ములాయంసింగ్ నాయకత్వంలోని యు.పి. ప్రభుత్వం ప్రదర్శనని నిషేధించినప్పటికి 1990 అక్టోబరు మాసాంతానికి వేలాదిమంది బి.జె.పి., వి.హెచ్.పి. కార్యకర్తలు అయోధ్య చేరుకున్నారు. కార్యకర్తల్ని చెదరగొట్టడానికి మసీదుకు నష్టం వాటిల్లకుందా నిరాకరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులలో చనిపోయినవారు గాయపడిన వారు దాదాపు 100 మంది వున్నారు. ఆ తరువాత బి.జె.పి. వి.పి.సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. ఫలితంగా వి.పి. సింగ్ ప్రభుత్వం పడిపోయింది. కొత్త లోక్‌సభకి 1991లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. బి.జె.పి. 119 మంది పార్లమెంట్ సభ్యులలో కాంగ్రెస్‌కి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. బి.జె.పి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్ట్రాన్, హిమాచలప్రదేశ్ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల నేర్పరచింది. రాజకీయ ప్రయోజనాలను పటిష్టపరచుకొని యింకా పెంచుకొనేందుకు బి.జె.పి. వి.హెచ్.పి.లు 1992 డిసెంబర్ 6న రెండు లక్షల మందితో పెద్ద ప్రదర్శన నిర్వహించాయి. రెండుసంస్థల పెద్దనాయకులు హాజరయ్యారు. మసీదు పరిరక్షించబడుతుందని యు.పి. ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చాడు. బి.జె.పి. నాయకులు పార్లమెంట్లో ఇలాంటి హామీని పునరుద్దాటించారు. ఈ హామీలన్నీ వున్నప్పటికి బి.జె.పి. వి.హెచ్.పి. కార్యకర్తలు వారి నాయకులు చూస్తుండగా సమ్మెట పోట్లతో మసీదుని ధ్వంసం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్తంభించింది. దేశం దిగృమకు గురయింది. ఈ ఘటన చాలా వినాశకరమైన పరిణామాలకు దారితీసింది. మత ఘర్షణలు విస్తృతంగా దేశవ్యాప్తంగా జరిగాయి. బొంబాయి, కలకత్తా, భోపాల్‌లో ఘర్షణలు చాలా తీవ్రస్థాయిలో జరిగాయి. బొంబాయిలో ఘర్షణలు దాదాపు నెలరోజుల పాటు సాగాయి. దేశవ్యాప్తంగా ఘర్షణలలో 8000 మందికి పైగా హతులయ్యారు. భారత ప్రజల వివేచనం శక్తి కారణంగా మత ఉద్రిక్తతలు తగ్గినప్పటికి రామజన్మభూమి - బాబ్రీ మసీదు సమస్య పాత గాయంలా సలుపుతూ బాధిస్తూనే వుంది. మతతత్వ శక్తులు రాజకీయంగా ఎదగడం కొనసాగుతుంది. 1998లో ఎన్నికలలో బి.జె.పి. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచింది. బాబ్రీ మసీదు రామజన్మభూమి సమస్యపైకి మతపరమైన సమస్యగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా మతపరమైన సమస్య కాదు. మతతత్వవాదులకు నిజానికి స్వతంత్రం తర్వాత భారతదేశం 611
మతం పట్ల ఆసక్తి లేదు. మతాన్ని మతపరమైన గుర్తింపుని అవకాశంగా తీసుకొని (ప్రజలలో మతతత్వ భావాల్ని జొప్పించి రాజకీయ ప్రయోజనాలు పొందడం పట్లనే వారి ఆసక్తి. మతతత్వవాదానికి కారణం మతపరమైన విభేదాలు కావు. మతతత్వవాదం, మతపరమైన భావాలు కలిగి వుండటం రెండూ ఒకటి కాదు. వాస్తవంగా అన్ని మతాల నైతిక ఆధ్యాత్మిక విలువలు మతతత్వ విలువల్ని వ్యతిరేకిస్తాయి. మతతత్వవాదం అంటే రాజకీయాలు, రాజ్య వ్యవహారాలలోకి మతం యొక్క అవాంఛనీయమైన చొరబాటు. 1942లో గాంధీజీ చెప్పినట్లు “మతం వ్యక్తిగత విషయం. దానికి రాజకీయాలలో ఎలాంటి స్థానం ఉండకూడదు.” ముగింపు ఇటీవలి సంవత్సరాలలో మతతత్వవాదం మతతత్వ (గ్రూపులు పెరిగినప్పటికి భారతదేశం మౌలికంగా యిప్పటికి ఆరోగ్యకరమైన సెక్యులర్ సమాజాన్ని కలిగి వుంది. మతతత్వవాదం భారతీయ సమాజాన్ని రాజ్య తంత్రాన్ని ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు అయినప్పటికి అది యిప్పటికి భారత ప్రజల ప్రధానమైన ఆలోచనా రీతి కాదు. త్వరగా సులభంగా ఎన్నికలలో గెలిచి రాజకీయాధికారాన్ని పొందడానికి మతతత్వవాదాన్ని ఉపయోగించుకొనడంలో మతతత్వవాదులు విజయం సాధించినప్పటికి వారి ఓట్లు వేసిన ప్రజలు వారి అప్పటికి వున్న రాజకీయ ఆర్థిక పరిస్థితుల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసేందుకే ఓటు చేశారు. వారు మతతత్వ సిద్ధాంతాన్ని గణనీయంగా స్వీకరించలేదు. భారత ప్రజలు యిప్పటికి సెక్యులర్వాదులే. మతతత్వవాద సిద్దాంతాన్ని విశ్వసించే వారు చాలా కొద్దిమంది మాత్రమే. మత ఘర్షణలు జరిగిన ప్రాంతాలలో కూడా హిందువులు, ముస్లింల మధ్య లేక హిందువులు యితర మైనారిటీల మధ్య శాశ్వతమైన విభజన లేదు. ప్రజా వైతన్యం గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో మతతత్వవాద వ్యాష్తికి అడ్డుకట్టగా నిలిచింది. 19వ శతాబ్దం చివరి పాదంలో ప్రారంభమైన మతతత్వవాదం ఇప్పటికి బలంగా వేళ్ళూనడంలో ఎందుకు విఫలమయిందో ఇప్పటి ఈ బలాన్ని పొందడానికి ఇంత సుదీర్హ కాలం ఎందుకు పట్టిందో ఇది వివరిస్తుంది. 612 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
36
మతతత్వవాదం - రాజ్యాధికార వినియోగం
స్వతంత్రం వచ్చిన తరువాత 1998లో మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఒక మతతత్వ పార్టీ రాజకీయాధికారం స్వీకరించడం భారత ప్రజలకు ఒక కొత్త అనుభవం.. 1992 డిసెంబర్ 6న బిజెపి అగ్రనాయకుల సమక్షంలో హిందూత్వంచే (ప్రేరేపించబడిన కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు 1980లో జనసంఘ్ బిజెపిగా అవతారం ఎత్తినప్పుడు వేసుకొన్న గాంధేయ సోషలిజం ముసుగు తొలగిపోయింది. ఆ వెనువెంటనే జరిగిన మతతత్వ హింసాకాండలో దాదాపు 38000 మంది ప్రాణాలు కోల్పోయారు. మసీదు కూల్చివేతకు కొందరు అతివాద శక్తులు బాధ్యులని, పార్టీ అగ్రనాయకత్వం జరిగిన విధ్వంసకాండకు దిగ్ర్యమ చెందిందని, ఆందోళన వ్యక్తం చేసిందని పార్టీ తన నేరాలను కప్పిపుచ్చే సాధారణమైన ఎత్తుగడ మరొకసారి ప్రయోగించింది. జాతీయ ప్రజాస్వామ్య సంఘటన (ఎన్డివ)కు నాయకత్వం వహించి బిజెపి 1998లో మరలా 1999లో అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వాదనలు వ్యక్తమయ్యాయి. ఒకటి : అధికారం అతివాద శక్తుల తీవ్రతని తగ్గించి, మితవాదుల్ని బలపదేలా చేస్తుంది. ఆ విధంగా ప్రజామోదం పొందుతుంది. రెండవది : మతతత్వ / ఫాసిస్టు శక్తులకు రాజ్యాధికారం అప్పచెప్పడం చాలా ప్రమాదకరం. అవి రాజ్యాధికారాన్ని మతతత్వ సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించడానికి ఉపయోగించుకొంటాయి అనే సెక్యులర్ వాదన. రెండవ వాదన వాస్తవానికి దగ్గరగా వుందని తరువాతి ఘటనలు స్పష్టం చేశాయి.
తరువాత జరిగిందేమిటి? విహెచ్పి, భజరంగదళ్, ఆర్.ఎస్.ఎస్. మతతత్వ ఉద్రిక్తతని పెంచాయి. దీర్ణకాలిక ఆకాంక్షలైైైన హిందూ రాజ్యస్థాపన కొరకు రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొన యత్నించాయి. ఆర్.ఎస్.ఎస్. పట్ల విధేయతతో ఆర్.ఎస్.ఎస్. మార్గదర్శకులను సంతృప్తిపరచే లక్ష్యంతో మానవ వనరుల అభివృద్ధి స్వతంత్రం తర్వాత భారతదేశం 618
శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి విద్యని మతతత్వీకరణ చెందించే సైద్ధాంతిక అజెండాని పట్టుదలతో ముందుకు తీసుకుపోయాడు. మహాత్మాగాంధీని హత్య చేసిన కుట్రలో జస్టిస్ జీవన్‌లాల్ కమిషన్చే నిందితునిగా నిర్జారించబడిన వి.డి. సావర్శర్ చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్ హాలులో గాంధీజీ చిత్రపటానికి ఎదురుగా ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీతో సహా పలువురి నిరసనల మధ్య ఆవిష్కరించబడింది. సంకీర్ణ భాగస్వాముల మనోభావాల్ని గమనంలో పెట్టుకొని బిజెపి మతతత్వ అజెండాని ప్రక్కన పెట్టినట్లు ప్రకటించినప్పటికీ, వివాద స్థలంలో గాని, దాని పరిసరాలలో గాని ఆలయ నిర్మాణాన్ని అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికి, ఆయోధ్యలో రామాలయ నిర్మాణం కొరకు ఆందోళన 2002 ప్రారంభంలో అత్యంత తీవ్రస్థాయికి చేరింది. ఆర్.ఎస్.ఎస్. జోక్యం చేసుకొని సిహెచ్పిని నెమ్మదించవలసిందిగా నచ్చచెప్పమనీ ప్రధానమంత్రి ఆర్. ఎస్.ఎస్.ని అర్దించేంతగా పరిస్థితి క్షీణించింది. ఈ ఆందోళన గుజరాత్‌లోని మతతత్వ పరిస్థితిపై (ప్రత్యక్ష ప్రభావం చూపింది. గుజరాత్లో 2002లో (ప్రారంభమైన హత్యాకాండ దాదాపు మూడు నెలల పాటు కొనసాగిందని పరిశీలకులు పేర్కొన్నారు. మతతత్వపూరితం చేయబడిన విద్యని గురించి గుజరాత్ విషాదాన్ని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొందాం. విద్య - మతతత్వవాదం ఎన్.డి.ఎ. సంకీర్ణంలో భాగంగా బిజెపి అధికారంలో వున్నప్పటికి అది అవకాశమున్న అన్ని పద్ధతుల నుపయోగించుకొని హిందూత్వ సిద్దాంతాన్ని వ్యాప్తి చేయ యత్నించింది. భారతదేశ చరిత్ర సమాజం పట్ల విద్యార్థులలో పాక్షిక విభజన వైఖరిని అలవరచేందుకు పాఠ్య పుస్తకాలు రూపొందించి బోధించేందుకు 1990ల నుండి రాష్ట్ర స్థాయిలో వున్న రాజకీయాధికారాన్ని నిరంతరాయంగా ఉపయోగించుకొన్నది. ఈ పాఠ్య పుస్తకాలకు 1950ల నుండి ఆర్.ఎస్. ఎస్.చే నడపబడుతున్న సరస్వతీ శిశు మందిర్ల కొరకు విద్యా భారతి రూపొందించిన పాఠ్యపుస్తకాలు నమూనాలు. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ - బిజెపి అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాలలో ముస్లింల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తూ మైనారిటీలను విదేశీయులుగా వర్ణిస్తూ, హిందూ నాగరికతని ఆకాశానికెత్తుతూ రాయబడిన పుస్తకాలు పాఠ్య ప్రణాళికలో భాగమయ్యాయి. నరసింహారావు ప్రభుత్వ కాలంలో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (02520 పాఠ్య 614 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పుస్తకాలలో మతతత్వం జొప్పించడాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సమస్య యొక్క తీవ్రతని అధ్యయనం చేసి కమిటీ రిపోర్టు ఇచ్చింది. చరిత్రని మతపరంగా వ్యాఖ్యానించడం మతతత్వవాద సిద్ధాంతంలో కీలకమైన అంశం గనుక చరిత్ర పాఠ్య పుస్తకాలపై సైద్ధాంతిక దాడి కేందీకరించబడింది. ఆర్.ఎస్.ఎస్. మతతత్వ వ్యాఖ్యానాల చరిత్రని చాలా సంవత్సరాల నుండి ప్రచారం చేస్తున్నది. కాని బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తది ప్రమాదకరమైన ధోరణి : శాప్రీయమైన సెక్యులర్ చరిత్ర, చరిత్రకారులపై దాడి చేసేందుకు, అభివృద్ధి నిరోధక గత వైభవం కొరకు వెనుక చూపులు చూసే మతతత్వ చరిత్ర రచనకు ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వ సంస్థల్ని రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నం. జనసంఘ్ జనతా పార్టీలో విలీనమై జనతా పార్టీ1977లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్.ఎస్.ఎస్. కేంద్రంలోని అధికారానికి దగ్గరగా వచ్చింది. భారతదేశంలోని అత్యంత ప్రముఖ చరిత్రకారులైన రొమిల్లా థాపర్, ఆర్.ఎస్. శర్మ సతీష్‌చంద్ర, బిపన్‌చంద్ర లాంటి ప్రముఖ చరిత్రకారుల్ని ఎన్.సి.ఇ.ఆర్.టి. అభ్యర్థించి రాయించిన పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాల్ని నిషేధించే (ప్రయత్నం చేసింది. అప్పుడు ఎన్.సి.ఇఆర్.టి. ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థల నుండే గాక దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ప్రయత్నం విరమించుకోక తప్పలేదు. బిజెపి గత అనుభవాల నుండి గుణపాఠం చక్కగా నేర్చుకొన్నది. ఎన్,సి.ఇఆర్.టి., యు.జి.సి., ఐ.సిహెచ్.ఆర్.లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థల నుండి ప్రతిఘటనని అంచనా వేసిన ప్రభుత్వం తనకు పనిముట్లుగా పనిచేయడానికి యిష్టపడిన వారినే ఆయా సంస్థల డైరెక్టర్లుగా, ఛైర్‌పర్సన్స్‌గా, కౌన్సిల్ సభ్యులుగా నియమించడంలో జాగ్రత్తపడింది. ఆ తరువాత విద్యారంగంలో ఆర్.ఎస్.ఎస్. సైద్ధాంతిక అజెండాని అమలు జరిపేందుకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఆర్.ఎస్.ఎస్. ఆర్థిక, రాజకీయ, విదేశీ వ్యవహారాలలో వెనకడుగు వేసినట్లు విద్యారంగంలో తన సైద్ధాంతిక నిబద్ధత నుండి వెనుకడుగు వేయలేదు. ఆర్.ఎస్.ఎస్. తన అనుబంధ కార్మిక సంఘాల, రైతు సంఘాల డిమాండ్లను ప్రక్కన పెట్టింది. ఆర్థిక సంస్కరణలలో స్వదేశీ జాగరణ మంచ్ అభ్యంతరాల్ని విస్మరించింది. కాని మతతత్వ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడంలో పట్టుదలగా పనిచేసింది. దశాబ్దాల తరబడి శ్రమపడి నిర్మించిన విద్యారంగ చట్రాన్ని ధ్వంసం చేసేందుకు మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యం వహించారు. ఎన్.సి.ఇ ఆర్.టి. డైరెక్టర్ ఏకాభిప్రాయం స్వతంత్రం తర్వాత భారతదేశం 615
0 సాధించడం మాట అలావుంచి, విస్తృతమైన సంప్రదింపులు కూదా జరపకుండా ర సం॥లో నూతన జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టాడు. విద్య ఉమ్మడి జౌ నుండి వుండగా (కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్య జోక్యంతో) స్వతంత్రం వచ్చినప్పటి ల విద్యారంగంలో చేపట్టే ఏ ముఖ్యమైన చర్యయైనా పార్లమెంట్లో. అలాగే అన్ని సలహా కేంద్ర పాలిత ప్రాంతాల విద్యా మంత్రులు సభ్యులుగా గల కేంద్రీయ విద్యా క్ు మండలి (౮433) లో చర్చించే సంప్రదాయం వుంది. కాని ఎన్.సి.ఇఆర్. ధతుల్ని ౮4383 తో సంబంధం లేకుండా ఇటు సాంప్రదాయాల్ని అనుసరించే పద్ధ పాటించకుండా నూతన పాఠ్య ప్రణాళికని నిర్ధారించింది. ఎన్.సి.ఇఆర్.టి. దేశంలోని ప్రముఖ సెక్యులర్ చరిత్రకారులచే రాయబడిన చరిత్ర పుస్తకాలలోని భాగాలను రచయితల ప్రమేయం లేకుండా, కాపీరైటు హక్కుని. కూడా ఉల్లంఘించి తొలగించింది. ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఈ చరిత్ర శా జాతీయ సమైక్యతా మండలి ()14/1002] 1146226101 60౪౧611) సిఫార్సు తను ఎన్.సి.ఇఆర్.టి. అభ్యర్థనతో చరిత్ర పుస్తకాలలో గల వలసవాద, మతతత్వవాద పాక్షిక ధి సరిదిద్దేందుకు ప్రముఖ చరిత్రకారులచే రాయబడినవి. ఈ తొలగింపుల్ని ఎంపిక చేసిం గుర్తించబడిన చరిత్రకారుల కమిటీ కాదు, ఆర్.ఎస్.ఎస్. ఈ తొలగింపులు మతభావాల పట్ల గల ప్రత్యేకించి మైనా రిటీల మత భావాల
పట్ల గల నమ్రతతో చేయడం జరిగిందని ప్రస్తావించబడింది. పాఠ్య పుస్తకాలలో ఏ మతానికి చెందిన అంశాలనైనా చేర్చబోయే ముందు మతపరమైన భావాలను నొప్పించడాన్ని నివారించేందుకు సంబంధిత మతపరమైన నిపుణులను సంప్రదిస్తానని ఎన్.సి.ఇఆర్.టి. డైరెక్టర్ హామీ ఇచ్చాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రతిపాదనని విద్యామంత్రి మురళీ మనోహర్ జోషి ఆమోదించాడు. మతానికి సంబంధించిన సమాచారమంతా పాఠ్యపుస్తకాలలో చేర్చడానికి ముందు ఆయా మతపెద్దల ఆమోదం పొందుతుందని వామీ ఇచ్చాడు. ఒకసారి పాఠ్య పుస్తకాలలో చేర్చబోయే ప్రతి అంశంపై అలాంటి వీటో హక్కు మత పెద్దలకు కల్పించిన తరువాత జీవశాస్త్రంలో చరిత్రలో శాస్త్రీయ పరిశోధన హేతుబద్ధమైన బోధన అసాధ్యమవుతుంది. కొందరి మనోభావాలు దెబ్బతింటాయనే సాకుతో భారతదేశంలోని కుల వ్యవస్థ యొక్క అణచివేత స్వభావాన్ని ఎత్తి చూపే అంశాలు ఇప్పటికే తొలగించబడ్డాయి. అలా చేయడం వలన వచ్చే ప్రమాదకరమైన పరిణామాల్ని గురించి - ప్రత్యేకించి భారతదేశం లాంటి బహుళ మతాలు గల దేశంలో పలువురు ప్రస్తావించారు.
616 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
కాని హిందూ మతతత్వ శక్తుల వ్యాఖ్యానాన్ని ఆమోదించని వారిపై జాతి వ్యతిరేకులనే ముద్రవేయడం మొదలయింది. ఎన్.సి.ఇఆర్.టి. పాఠ్య పుస్తకాలలోని మార్పుల్ని ప్రతిఘటించిన వారిని ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ్ చాలక్ కె.ఎస్. సుదర్శన్ హిందూ వ్యతిరేకులని యూరో ఇండియన్స్ అని వాదించాడు. రొమిల్లా థాపర్, ఆర్. ఎస్. శర్మ, అర్జున్దేవ్లాంటి చరిత్రకారుల్ని అరెస్టు చేయాలని ఆర్. ఎస్.ఎస్. పహరా (గ్రూపులు డిమాండ్ చేశాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి తొలగింపుల్ని సమర్ధిస్తూ దేశం యొక్క సాంస్కృతిక స్వేచ్చకై యుద్దానికి పిలుపిచ్చాడు. మంత్రి మరొక అడుగు ముందుకేసి వ్యతిరేకించిన మేధావి వర్గాన్ని బెదిరించ యత్నిస్తూ, వారు రాసిన చరిత్ర వామపక్ష వాదనల మేధాపరమైన టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తుందని, అది సీమాంతర ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదని పేర్యొన్నాడు. బిజెపి ముట్టడి సేనలు రెండు రకాల టెర్రరిజాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ఉద్భోదించాయి.
విద్యా విధానాన్ని మతతత్వపూరితం చేయడం పట్ల నిరసనలు పెల్లుబికాయి. చరిత్రకారులు, సెక్యులర్ మీడియా, భారత మేధావి వర్గంలోని విస్తృతమైన సెక్షన్లు అసందిగ్ధంగా తమ నిరసనలు వ్యక్తంచేశాయి. ప్రభుత్వ ప్రయత్నాలకు హేతుబద్ధమైన వాదనలతో ప్రతిఘటించారు. కొందరి మనోభావాలు దెబ్బతింటాయనో లేక విద్యార్థులలో దేశభక్తి భావాల్ని తగ్గిస్తాయనో సాకులు చూపి నాగరిక సమాజాలు వారి గతానికి చెందిన రుచించని అంశాల్ని నిషేధించవని చెప్పారు. భారతదేశం గత వైభవాన్ని అతిశయించి చెప్పేందుకు కట్టు కథలల్లితే ప్రపంచం దృష్టిలో నవ్వుల పాలవుతుందని వివరించారు. అమెరికా తన పాఠ్య పుస్తకాల నుండి బానిసత్వాన్ని యూరప్ ప్రజామోద అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు గలవారిని చంపివేయడాన్సి హిట్లర్ యూదులపై సాగించిన హత్యాకాండని తాలగిస్తాయా? భారతదేశం నాగరిక దేశాల మధ్య తలెత్తుకుని సగర్వంగా నిలబడగలగాలి గాని చరిత్రని, చరిత్రకారుల్ని అణచివేయడంలో తాలిబాన్త సరసన చేరకూడదు.
ఖారతదేశ చరిత్రని వక్రీకరించడానికి సంకుచితమైన పాక్షికరంగు పులమడానికి చేసే ప్రయత్నాలు ప్రాచీన భారతదేశానికి చెందిన అసాధారణమైన, గమనించదగిన వాస్తవాల్ని మరుగుపరుస్తాయని ప్రముఖ మేధావి నోబెల్ బహుమతి గ్రహీత అమర్యసేన్ 2001 జనవరిలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. విభిన్న అభిప్రాయాలు గల విభిన్న మతాలు, సంస్కృతుల పట్ల భారతదేశం అలవరచుకొన్న స్వతం[త్రం తర్వాత భారతదేశం 617
వైఖరి భారతదేశంలో విజ్ఞానశాస్త్రం గణితం అభివృద్ధి చెందదానికి దోహా దపడిందని వివరించారు. గుప్తుల కాలానికి కాస్త అటూ ఇటూగా (ప్రత్యేకించి ఆర్యభట్ట వరహ మిహిరులతో ప్రారంభమైన) విజ్ఞాన శాస్త్ర గణిత శాస్త్రాల ఆవిష్కరణలకు మూలాలు అప్పటికే కొనసాగుతున్న వైవిధ్యభరితమైన ఆలోచనలలో వున్నాయన్నారు. బా స్తవంగా నిరీశ్వరవాదాన్ని. అజ్జేయతావాదాన్ని మత విజ్ఞాన పరమైన సందేహ వాదాన్ని సమర్ధించే సాహిత్యం ఏ యితర ప్రాచీన భాషల్లో కంటే సంస్కృతం పాళీ భాషల్లో ఎక్కువగా వెలువడింది. గుప్తుల కాలంలో శాస్త్ర పురోగతికి అగ్రగామిగా పనిచేసింది మత విజ్ఞానపరమైన సందేహవాదమని, అది కనీసం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందు కాలం నుండి కొనసాగుతున్నదని, అది గణిత విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధికి యితోధికంగా తోడ్బడిందని వివరించారు. అంతేగాక 'భగవద్గీతతో సహా ్రాబీన గ్రంథలలోని ప్రతి అంశంపై నా వివేకంతో ఏర్పరచుకొన్న అభిప్రాయాలు నాకు వుంటాయి. మత గ్రంథాలలో చెప్పబడిన అంశం హేతుబద్ధమైన ఆలోచనని కప్పి వేయడాన్ని అనుమతించను అన్నాడు. దేశవ్యాప్తంగా నిరసనలు - ప్రత్యేకించి విద్యావేత్తల నుండి (గౌరవా భిమానాలు
పొంది 60 సఃలు నుండి పనిచేస్తున్న ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, చరిత రచయితల జాతీయ సంఘంతో సహా) పత్రికారంగం నుండి నిరసనలు వ్యక్తమైనప్పటికి, హిందూస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడు వీర్ సంఘ్వీ పేర్కొన్నట్లుగా విద్యని తాలిబానీకరణ చేసే (కమం కొనసాగించబడింది. నేషనల్ కరిక్యులమ్ యేం వర్క్ ప్రాతివదికన
రూపొందించబడిన పాఠ్య ప్రణాళిక సాధారణ పద్దతులు పాటించబడకుండానే అమలు
జరపబడింది. ప్రముఖ చరిత్రకారులు రాసిన పాఠ్య పుస్తకాలు (ఇంతకు ముందు కొన్ని
తొలగింపులు చేసిన) పూర్తిగా తొలగించబడ్డాయి. ఆ స్థానంలో ఆర్. ఎస్.ఎస్. సిద్ధాంతాలతో
సాన్నిహిత్యం గల, విద్యారంగంలో ప్రముఖులుగా గుర్తింపు పొందని రచనలు
ప్రవేశపెట్టబడ్డాయి. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 'నూతన ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్య
పుస్తకాలలో చరిత్ర అనే 180 పేజీల పుస్తకం ప్రచురించింది. దానిలో ఈ కొత్త పుస్తకాలలో
గల పెద్ద తప్పుల వక్రీకరణల జాబితా యిచ్చింది. వాటిలో కొ న్నింటిని దిగువ
ఉటంకిస్తున్నాము.
తరచుగా తప్పులు రచయితల తెలియనితనం కారణంగా దొర్లుతాయి. కొని
వీటిలో తప్పులు మతతత్వ పక్షపాతంతో, దురభిమానంతో చరిత్రని చెప్పాలనే ఆతురత కారణంగా జరిగాయి. కొంతకాలం నుండి సంఘపరివార్ ప్రచురణలు ఏ తరహా ప్రచారం 618 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చేస్తున్నాయో ఈ పుస్తకాలు ఆ తరహా ప్రచారం చేస్తున్నాయి. సంకుచితత్వం, పక్షపాతం చోదక శక్తులుగా గల ఈ పుస్తకాలు సూచికలో ప్రస్తావించిన భాషాపరమైన, విషయపరమైన తప్పుల్ని తొలిగించడం ద్వారా అంగీకారయోగ్యమైన పాఠ్యపుస్తకాలుగా మార్చడం సాధ్యపడదు.
పదవ తరగతి కొరకు హరిఓం యొక్క “సమకాలీన భారతదేశం” మొదటి ప్రచురణలో గాంధీజీ హత్య ప్రస్తావించబడలేదు. ఈ సమస్యపై పార్లమెంట్‌లోనే గాక దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కాగా ఈ క్రింది వాక్యాన్ని చేర్చి పునర్ముద్రించడం జరిగింది :
“ఢిల్లీలో గాంధీజీ ప్రార్ధనా సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతూ వుండగా 1948 జనవరి 30న నాధూరాం గాద్సేచే హత్య చేయబడిన కారణంగా సమాజంలో శాంతి సామరన్యాలు తీసుకొనివచ్చే గాంధీజీ ప్రయత్నాలు అకస్మాత్తుగా విషాదంగా ముగిశాయి.” (పేజి 57)
కాని గాద్సే ఎవరు, అతడికి ఆర్.ఎస్. ఎస్.తో, హిందూ మహాసభతో - ప్రత్యేకించి దాని నాయకుడు సావర్మర్తో గల సంబంధాలేమిటి లాంటి అంశాల ప్రస్తావన లేనేలేదు.
పాఠ్య పుస్తకాలను మకతత్వపూరితం చేయడం దీర్టకాలిక దుష్ఫలితాలనిస్తుందని గుజరాత్లో చెలరేగిన మతతత్వ హింసాకాండ స్పష్టం చేసింది. గుజరాత్‌తో బాగా పరిచయం వున్నవారు పాఠ్య పుస్తకాలలో చాలా అభ్యంతరకరమైన సమాచారం వుందని చెబుతున్నారు. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలోని 9వ తరగతి విద్యార్థులు తమ సోషల్ స్టడీస్ పాఠ్య పుస్తకం ద్వారా మైనారిటీలు విదేశీయులని నేర్చుకొని వుంటారు.
ముస్లింలతో పాటు క్రైస్తవులు, పార్శీలు, ఇతర విదేశీయులు కూడా మైనారిటీ మతాలుగా గుర్తింపబడుతున్నాయి. అత్యధిక రాష్ట్రాలలో హిందువులు మెైనారిటీలుగా వున్నారు.. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు మెజారిటీగా వున్నారు.
అలాగే 10వ తరగతి సోషల్ స్టడీస్ (సాంఘిక శాస్త్రం) పాఠ్యపుస్తకం ఫాసిజాన్ని నాజీయిజాన్ని ప్రశంసిస్తుంది. హిందువులను వారి స్వదేశంలో మైనారిటీలుగా మార్చుతున్న ఈ విదేశీయులతో ఎలా వ్యవహరించాలో బిడ్డలకు బోధించబడుతుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 6819
నాజీయిజం సిద్ధాంతం : ఫాసిజం లాగానే ఒక జాతిని పరిపాలించేందుకు హిట్లర్చే ప్రతిపాదించబడిన సూత్రాలు సిద్ధాంతాలే నాజీయిజం. నాజీ పార్టీ అధికారం చేపట్టిన తరువాత అపరిమితమైన సర్వాధికారం నియంతకి అప్పచెప్పింది. నియంత ఫ్యూడల్ అని పిలువబడ్డాడు. ప్రపంచంలో జర్మన్లు మాత్రమే స్వచ్చమైన ఆర్యులని, ప్రపంచాన్ని పాలించేందుకే వారు పుట్టారని హిట్లర్ (ప్రకటించాడు. జర్మన్ ప్రజలు నాజీయిజం సూత్రాల్ని కచ్చితంగా అనుసరించేందుకు వీలుగా అవి పౌ థ్యాంశాలలి చేర్చబడ్డాయి. 'హిట్లర్ మా నాయకుడు. మేము ఆయన్ని శ్రేమిస్తాము' అని పాఠ్య పుస్తకాలు
నాజీయిజం సాధించిన విజయాలు : హిట్లరు బలమైన పాలనా యంత్రాంగాన్ని స్థాపించి కొద్దికాలంలోనే జర్మన్ ప్రభుత్వానికి పెద్ద గౌరవం తెచ్చిపెట్టాడు. విస్తారమైన గ్రేటర్ జర్మనీ సృష్టించాడు. యూదు ప్రజల వ్యతిరేక విధానాన్ని అమలు జరిపి జర్మన్ జాతి ఆధిక్యతని సమర్ధించాడు. నూతన ఆర్ధిక విధానాల్ని అమలు జరిపి జర్మనీని సంపద్వంతం చేశాడు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒక దశాబ్దంలో జర్మనీ స్వావలంబన సాధించేందుకు నిరంతర ప్రయత్నాలు చేశాడు. వర్సైల్స్ సంధి ఒప్పందాన్ని కాగితపు ముక్కగా త్రోసిపుచ్చి యుద్ధ జరిమానాన్ని చెల్లించడం నిలిపివేశాడు. సాధారణ ప్రజలతో సాహసస్ఫూర్తి రగుల్కొల్పాడు.
అర్యజాతి పవిత్రతను, ఆధిక్యతను నిలబెట్టేందుకు లక్షలాదిమంది ఊచకోత కోయబడ్డారనే విషయం కనీసం ప్రస్తావించబడలేదు.
నాజీయిజం కీర్తి ప్రతిష్టల్ని వినిపిస్తూ మైనారిటీలను విదేశీయులుగా అలోచించే విధంగా పెంచబడిన తరాన్ని గతంలో ఎన్నడూ లేని పద్ధతిలో మైనారిటీలపై దాడులు చేసేందుకు 2002లో గుజరాత్లో చేసిన విధంగా మతతత్వ శక్తుల ముట్టడి సేనగా సమీకరించడం సులభం. గుజరాత్లో హత్యాకాండ
“ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టని తగ్గించిన జాతి నాసట నల్లమచ్చ' - అప్పటికీ భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పీయి-20092 మార్చిలో గుజరాత్ హింసాకాందను వర్ణిస్తూ శాంతి కొరకు జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలోని మాటలు. ఆయన 620 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
నాయకత్వంలోని ప్రభుత్వం హింసని అణచడంలో విఫలమయింది. హింస మూడు నెలల పాటు నిరాఘాటంగా కొనసాగడమే గాక కొత్త ప్రాంతాలకు విస్తరించింది. పట్టణాల నుండి పల్లెలకు విస్తరించింది. ఈ క్రమం భారతదేశ ్రతిష్టని మరీ దిగజార్చింది. హింస సద్దుమణిగాక చనిపోయిన వారి సంఖ్య 2000 గాను, శరణార్థుల శిబిరాలలో తలదాచుకొన్నవారి సంఖ్య 2,00,000 గాను అంచనా వేయబడింది.
ఈ విషాదగాథ గుజరాత్‌లోని ఒక చిన్న పట్టణం గోధద్రాలో ఫిబ్రవరి 27 ఉదయం మొదలయింది. సబర్మతీ ఎక్స్థ్రైస్లోని ఒక బోగీలో చెలరేగిన మంటలు 15 మంది స్రీలు, 20 మంది పిల్లలతో సహా 59 మందిని సజీవ దహనం చేశాయి. బాధితులు హిందువులు, కరసేవకులు, అయోధ్య వద్ద మత కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నవారు. 1992 డిసెంబర్ 6న మతతత్వ ఉదేకంతో రెచ్చగొట్టబడిన మూకలచే కూబ్చివేయబడిన బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మూలించాలనే ప్రచారంలో భాగంగా సమరశీల హిందూ పోరాట సంస్థ విశ్వహిందూ పరిషత్‌చే సమీకరించబడిన వేలాదిమంది కరసేవకులలో వీరూ వున్నారు. బిజెపి రామమందిరం నిర్మిస్తానని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి 3 సం॥లు పైగా కాలం గడిచింది. ఆర్.ఎస్.ఎస్. ముట్టడి సేనలు అసహనంతో కుతకుతలాడుతున్నాయి. రెచ్చగొట్టబడిన మతతత్వ ఉద్రిక్తత కాస్త ముందు వెనుకగా భగ్గుమనక తప్పదు. అది గోద్రాలో మంటలు రేపింది. వివిధ విచారణ కమిటీల నుండి అందిన సమాచారం మేరకు జరిగిన ఘటన : స్టేషన్ వద్ద అమ్ముకొనే ముస్లింలు హిందూ కరసేవకుల మధ్య బహుశా హిందూ కరసేవకులు ముస్లింల్ని రెచ్చగొట్టే విధంగా ఎత్తిపొడుపు మాటలనడం వలన తగాదా వచ్చింది. కరసేవకులు రాముడిని పొగుడుతూ నినాదాలు ఇవ్వమన్నారని, తిరస్కరించిన ముస్లింల గడ్డాలు పట్టి లాగారని కొన్ని రిపోర్టుల కథనం. జరిగిన ఘర్షణ సమాచారం పరిసరాలలో వున్న ముస్లింలకు చేరింది. 10 లేక 15 మంది గుంపుగా వచ్చి రైలుపై రాళ్ళు రువ్వారు. అప్పటికే రైలు స్టేషన్ దాటి వెళ్ళింది. పొలిమేరలలో ఆగింది. ఈ దశలో కరసేవకులు ప్రయాణిస్తున్న బోగీకి నిప్పంటుకాన్నది. విషాద ఘటన జరిగింది.
ముస్లిం గుంపు బోగీపై పెట్రోల్ లేక కిరోసిన్ పోసి నిప్పంటించిందని విస్తృత ప్రచారం జరిగింది. కాని ఆ తరువాత వచ్చిన న్యాయ నివేదికలు అలాగే యు.పి. బెనర్జీ ఎంక్వయిదీ కమిటీ నివేదిక అలా జరిగి వుండదని, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని, రైలులోనే ఎవరో తీసుకొని వెళుతున్న కిరోసిన్ లేక డీజిల్ కారణంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 621
మంటలు చెలరేగి వుంటాయని పేర్కొన్నాయి. కాని ఆ సమయంలో బాధ్యతాయుతమైన స్థానాలలో వున్నవారు వేలెత్తి చూపడం వలన ముస్లింలపై ఆగ్రహానికి న్యాయబద్ధత చేకూర్చబడింది. విజెపి పాలిత రాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఆర్. ఎస్.ఎస్కి చెందిన వ్యక్తి. హిందూత్వంకు పరమ విధేయుడు. గోద్రా రైలు మంటలలో చనిపోయినవారికి ప్రభుత్వం పక్షాన అంత్యక్రియలు జరిపిస్తామని ప్రకటించాడు. మృతదేహాలు అహమ్మదాబాద్ తీసుకొని రాబడతాయి. అవి వచ్చే సమయం కూదా రేడియోలో ప్రకటించబడింది. టి.వి. ఛానళ్ళు, గుజరాత్ వార్తా పత్రికలు కాలిపోతున్న రైలు ఫొటోలను ప్రచురించాయి. రైలుపై దాడి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్చే జరుపబడిందని మోడీ ప్రకటించాడు. ఆ విధంగా ముస్తింలు ముందు వేసుకున్న పథకం ప్రకారం రైలు తగులబెట్టబడిందని సూచించాడు. ముస్లింలే బాధ్యులని విహెచ్పి స్పష్టంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాష్ట్ర వ్యాప్త బంద్‌కి పిలుపిచ్చింది. దీనికి ప్రభుత్వ మద్దతు లభించింది. ఫిబ్రవరి 28న మతతత్వ హత్యాకాండ ప్రారంభమయింది. దాదాపు 3 నెలల పాటు కొనసాగింది. తలలకు కాషాయం రిబ్బన్లు కట్టుకున్న హిందూ యువకుల గుంపు ముస్లిం పరిసరాలపై దాడులు చేశాయి. ఇళ్ళు తగులబెట్టాయి. మహిళలపై అత్యాచారాలు సాగించాయి. మానభంగాలు చేశాయి. పాలనా యంత్రాంగం, పోలీసులు తలలు తిప్పుకొన్నారు. చూసీచూడనట్లున్నారు. మౌనాంగీకారం తెలిపారు. కొన్నిచోట్ల సహాయపడ్డారు. హింసని అటకాయించేందుకు జోక్యం చేసుకోవద్దని అత్యున్నత రాజకీయాధికారం నుండి అధికారులకు ఆదేశాలందినట్లు గణనీయమైన సాక్ష్యాధారాలు లభించాయి. అందుకే హింస అహమ్మదాబాద్ వడోదర్ల నుండి చాలా పట్టణాలకే గాక పల్లెలకు కూడా ప్రాకింది. ఒక సందర్భంలో 40 పట్టణాలలో కర్ఫ్యూ విధించబడింది. హింస యొక్కతరహా, స్థాయి కొనసాగింపు చాలా స్పష్టంగా, యాదృచ్చికంగా వచ్చిపడింది కాదని స్పష్టం చేస్తున్నాయి. దాడులు చేసే ముఠాల వద్ద ముస్తిం యజమానుల వ్యాపార సంస్థల జాబితాలు వున్నాయి. ముఠాలు ఆ సంస్థల్ని గుర్తించాయి. లూటీ చేశాయి. తమ వెంట తెచ్చుకొన్న గ్యాస్ సిలిండర్ల నుపయోగించి తగులబెట్టాయి. ముస్లింల అభిమానం, గౌరవం పొందిన వలి గుజరాతి దర్జాలాంటి చారిత్రక ప్రాధాన్యత గల పలు కట్టడాలు ధ్వంసం చేయబడ్డాయి. హింస గ్రామాలకు వ్యాపించింది. తరతరాలుగా కలిసి మెలిసి జీవించిన ప్రజలు ఒక్కసారిగా పరస్పరం శత్రువులయ్యారు. బాధితులు 622 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పెద్ద ఎత్తున గ్రామాలు విడిచిపెట్టి పారిపోయారు. దాడులలో పై కులాల వారితో పాటు దళితుల తెగల ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.
సాధారణంగా రెండు గ్రూపుల మధ్య జరిగే ఘర్షణలలా గాక 2002 నాటి ఘటనలు ఏకపక్షంగా ముందుగా వేసుకొన్న పథకం ప్రకారం అతి పాశవికంగా ప్రభుత్వ మద్దతుతో జరిగినట్లు పరిశీలకులు గమనించారు. హింస స్వభావాన్ని తమ అధీనంలో వుంచుకొనేందుకు జాతి విధ్వంసం, జాతిని తుడిచిపెట్టడం లాంటి పదజాలం ఉపయోగించబడింది. మొదటి దాడుల ఉప్పెన తరువాత మైనారిటీలు వారు ఎక్కువగా వున్న ప్రాంతాలలో దాడులకు తలపడ్డారు. గుజరాత్ విద్యార్థులు చాలా సంవత్సరాలుగా చదువుతున్న చరిత్రలో హిట్లరు నాయకుడు. ముస్లింలు విలన్లు. హిందూ మతతత్వ శక్తులు గుజరాత్లో 1998లో మత మార్చిదుల్ని అడ్డుకొనే నెపంతో క్రైస్తవులపై దాడులు చేశాయి. కాని తరువాత జరగనున్న పెద్ద కథకి అవి రిహార్సల్స్‌గా పరిశీలకులు గమనించారు. ఆ విధంగా చాలాకాలం నుండి రూపొందించుకుంటూ వచ్చిన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి గోద్రా ఒక సాకుగా ఉపకరించింది.
గోద్రా ఘటనలు జాతి చైతన్యాన్ని కుదిపివేశాయి. గుజరాత్ వాస్తవాలను వెలుగులోకి తీసుకొని రావడంలో పత్రికలు, టివిలు ప్రముఖ పాత్ర పోషించాయి. రాష్ట్ర ప్రభుత్వం తగు విధంగా స్పందించి పాలనా బాధ్యతలు నిర్వహించేలా చేసేందుకు కాంగ్రెస్ ఇతర (ప్రతిపక్షాలు వాజ్‌పేయి ప్రభుత్వంపై చాలా వత్తిడి తెచ్చాయి. ప్రభుత్వం అక్కడి పరిస్థితుల్ని పరిశీలించేందుకు ఒక ఒప్పందాన్ని పంపించవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఆర్థించక తప్పలేదు. గుజరాత్ ప్రజల హక్షుల్ని రక్షించే బాధ్యతలో మోడి ప్రభుత్వం విఫలమయిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.
పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఏప్రిల్ 29న బొగ్గు గనుల శాఖా మంత్రి, పెద్ద దళిత నాయకుడు మంత్రి వర్గం నుండి రాజీనామా చేశారు. ఎన్.డి.ఎ. నుండి లోక్ జనశక్తి వైదొలగింది. మతతత్వ హింసని అదుపు చేయడంలో గుజరాత్ ప్రభుత్వ వైఫల్యానికి, ముఖ్యమంత్రిగా నరేంద్రమోడి కొనసాగడానికి నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నాడు. మరుసటి రోజు ప్రధాన మంత్రికి ఆయన పార్టీ సహచరులకు మరొక అవమానం ఎదురు కానున్నది. 2002 మే 1 హిందూ పత్రిక ప్రచురించిన విధంగా ఎన్.డి.ఎ. మిత్రపక్షాలు కూడా ప్రతిపక్షాలతో పాటు కొనసాగుతున్న గృహ దహనాల హత్యాకాండని ఖండిస్తూ, నరేంద్ర మోడీని స్వతంత్రం తర్వాత భారతదేశం 6928
ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో వున్న ఆ పార్టీ ప్రతినిధి ఒమర్ అబ్బుల్లా రాజీనామాకు సిద్ధపడ్డాడు. ఎన్.డి.ఎ. భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రైస్, తెలుగుదేశం నాయకులు మమతా బెనర్జీ, ఎర్రన్నాయుడు కూడా మోడీని తొలగించాలన్నారు. బిజెపికి చెందిన కేబినెట్ మంత్రి ఉమాభారతి సన్వాసినిలా గాక నాజీ ప్రతినిధిగా మాట్లాడిందని మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఆరోపిస్తూ నాజీలు జర్మనీలో చేసింది బిజెపి గుజరాత్లో చేయ యత్నిస్తుందని సూచించాడు. “గుజరాత్లో చర్య తీసుకొనడానికి మరెన్ని శవాల్ని లెక్కించాలి? మరెన్ని గృహదహనాలు జరగాలి? అని ములాయంసింగ్ యాదవ్ ప్రధానమంత్రిని నిలదీశాడు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలా లేదా అనేది సమస్య కాదని జాతి మనుగడ అసలైన సమస్య అని స్పష్టం చేశాడు. సిపిఐ(ఎం) నాయకుడు సోమనాథ ఛటర్జీ గుజరాత్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో నరేంద్రమోడీ రూపొందించిన హత్యాకాండ సాగుతుందని ఆరోపించాడు. ప్రతిపక్ష నాయకురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన సోనియాగాంధీ పార్లమెంట్ చర్చలో జోక్యం చేసుకుంటూ గుజరాత్లో జరుగుతున్న అత్యాచారాలు గృహదహనాలు హత్యాకాండ ఘటనల్ని వివరంగా ప్రస్తావించారు. అ తరువాత ఆమె ఈ క్రింది డిమాండ్లు చేశారు. మొదటిది : గుజరాత్ ముఖ్యమంత్రి వెంటనే తక్షణమే తొలగించబడాలి. రెండు : 855 ఆర్టికల్ ననుసరించి వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జోక్యం చేసుకోవాలి. మూడు : సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జీ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ నియమించబడాలి. గుజరాత్లో పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్ ల వ్యపహరించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. అంతేగాక జాతీయ మానవ నేరస్తుల్ని కఠినం. న్ చట్టబద్ధ సంస్థల సిఫార్సులన్నీ వెంటనే అమలు జరపాలి. కు క్షించాలి. బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమం వంటనే చేపట్టాలి, విభేదాల నుండి సర్దుబాటు దిశగా వైమనస్యం నుండి చర్చల దిశగా గుజరాత్‌ని పునర్నిర్మించేందుకు ముందుకు సాగాలని చెబుతూ సోనియాగాంధీ గోద్రా హత్యాకొండీ పార్లమెంట్లో ఖండింపబడి వుంటే గుజరాత్ హత్యాకాండ నివారింపబడి వుండేదన్న వాజ్‌పేయి వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ ఖండించలేదనడం అసత్యమన్నారు. “అందరికంటే ముందుగా భయంకరమైన గోద్రా విషాదాన్ని అత్యంత తీవ్రమైన పదజాలంకో 624 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
27వ తేదీననే ఖండించానని” ఆమె చెప్పారు. అసత్యాన్ని మాటిమాటికి చెప్పడం ద్వారా దాన్ని సత్యంగా చెలామణీ చేయడం ఆర్.ఎస్.ఎస్.కి సంఘపరివార్‌కి చాలా ఇష్టమైన ఎత్తుగడయని అన్నారు. వాజ్‌పేయి గోవా ఉపన్యాసంలో ముస్తింల్ని గురించి చెప్పిన అంశాల్ని ఉటంకిస్తూ ఆయనది 'రెండు నాల్మల ధోరణియని ఆరోపించారు. “ఒకరోజు ఆయన సానుభూతి ప్రకటిస్తాడు. మరుసటి రోజు ఆ మతాన్ని ఖండిస్తాదు. ఒకరోజు సహనం వహించమని అర్ధిస్తాడు. మరుసటి రోజు విచ్చిన్నకరమైన పక్షపాతం ప్రదర్శిస్తాడు. ప్రధానమంత్రే రెండు నాల్మల ధోరణికి పాల్పడితే ఈ ప్రభుత్వం నుండి దేశం ఏమి ఆశించగలదు?” అయినప్పటికి 'ఇప్పటికే మించిపోయిందేమీ లేదు. పరిస్థితిని ఇప్పుడూ సరిదిద్దవచ్చు”, (ప్రధానమంత్రి మతం విశ్వాసాల కతీతంగా భారతదేశ ప్రజల పట్ల తనకు గల బాధ్యతలకు కర్తవ్యాలకు అనుగుణంగా స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. సోనియాగాంధీ లోక్‌సభ ప్రసంగం తరువాత గుజరాత్‌లోని గాంధీ జన్మస్థానమైన పోరుబందర్లో ప్రసంగిస్తూ 'గాంధీజీ గుజరాత్ గాడ్స్ గుజరాతొగా మార్చబదుతుందని ఆరోపించారు. రాష్ట్రపతి కూడా పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సంకట స్థితికి నెట్టివేయబడిన బిజెపి రాజ్యసభలో ఎన్.డి.ఎ.కి మెజారిటీ లేకపోవడం వలన ఎత్తుగడ మార్చింది. రాజ్యాంగం యొక్క 355 ఆర్టికల్ ననుసరించి గుజరాత్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షం ప్రవేశపెడితే తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించింది.
_ అయినప్పటికి రాజ్యసభలో తీవ్రమైన విమర్శల నెదుర్శొనక తప్పలేదు. బీహారు మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ గోద్రా ఘటన వెనుక ఆర్.ఎస్.ఎస్. హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నరేంద్రమోడీని పోటా చట్టం క్రింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మిత్రుల చేత ఒంటరి చేయబడి, ప్రతిపక్షం విమర్శలకు గురయి, పత్రికల యొక్క ప్రజాభిప్రాయం యొక్క ప్రతికూలత నెదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం పంజాబ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.ఎస్.పి. గిల్‌ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి రక్షణ సలహాదారుగా పంపించింది. గిల్ గతంలో అస్సాం పోలీస్ చీఫ్‌గా మతపరమైన సమస్యల్ని నిపుణతతో పరిష్కరించాడు. ఆ తరువాత పంజాబ్‌లో టెర్రరిస్టు హింసని జయప్రదంగా అణచివేయగలిగాడు. గుజరాత్ ప్రభుత్వం ఈ నియామకం పట్ల సుముఖంగా లేదు. కనుక సహాయ నిరాకరణ వైఖరి నవలంబించింది. కాని కేంద్రం ఆదేశాల్ని స్వతంత్రం తర్వాత భారతదేశం 625
పాటించడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఆ తరువాత పరిస్థితి మెరుగుపడింది. హింసాయుత చర్యలు వెనుకపట్టు బట్టాయి.
జూలై ప్రారంభంలో మోడీ ప్రభుత్వం మతపరమైన ఉద్రిక్తతల్ని అవకాశంగా మార్చుకొనేందుకు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించాలని నిర్ణయించింది. గుజరాత్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రకటించింది. గిల్‌ని ఢిల్లీకి పంపించింది. అసెంబ్లీని రద్దు చేసింది. త్వరగా ఎన్నికలు జరిపించమని ఎలక్షన్ కమిషన్ని కోరింది.
స్వతంత్రమైన నిష్పాక్షికతమైన జె.ఎం. లింగ్లో ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషన్ అభిప్రాయాలు వేరుగా వున్నాయి. 2002 ఆగస్టు 16న సమావేశమైన ఎన్నికల కమిషన్ గుజరాత్ ప్రభుత్వం కోరికను ఎన్.డి.ఎ. ఒత్తిడిని తిరస్కరించింది. ఎలక్షన్ కమిషన్ పరిశీలకులు గుజరాత్ ప్రభుత్వంపై దోషారోపణ చేసే విధంగా వున్నాయి. అవి బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని శాంతి భద్రతలు సాధారణ స్టితికి రాలేదని, ఘర్షణల తరువాత మత విభజన చేసిన గాయాలు ఇంకా మానలేదని కమిషన్ చెప్పింది.
నెమ్మదిగా సాగుతున్న సహాయ పునరావాసం పన్నుల వలన, దోషుల్ని అరెస్టు చేయడం, శిక్షించడం జరగనందున శాంతి భద్రతల పరిస్థితి సాధారణ స్థితికి చేరడానికి జాప్యం జరుగుతుందన్నది. మైనారిటీల ఆధిపత్య ప్రాంతాలలో మెజారిటీ మతం వారి అభిప్రాయాలు కూడా యిలాగే వున్నవన్నది. ప్రజలు స్థానిక పోలీసుల్ని అధికారుల్ని రాజకీయ నాయకుల్ని నమ్మడం లేదన్నది. విశ్వాసం కలిగించే చర్యలు చేపట్టడం అవసరం. ముందుగా దోషుల్ని వారి స్థాయి హోదాలతో సంబంధం లేకుండా అరెస్టు చేసి శిక్షించాలన్నది. ఎన్నికల ప్రచారాలు ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి నామమాత్రంగా వున్న శాంతికి భంగం కలిగిస్తాయన్నది. న
ఆ నెలలోను గతంలోను గుజరాత్ సందర్భించిన తొమ్మిది మంది సభ్యుల బృందం నివేదికను ప్రస్తావిస్తూ బాధితులలో యింకను అభద్రతా భావం వుందన్నది. ఆ తర్వాత ప్రజల నుండి స్వయంగా సమాచారం తెలుసుకొనేందుకు ఎలక్షన్ కమిషన్ సభ్యులందరితో కూడిన బృందం గుజరాడ్ సందర్శించింది. గతంలో తమకు తెలిసిన వాటికంటే ఎక్కువగా బాధిత ప్రాంతాలు వున్నట్లు గమనించింది. రాష్ట్రంలోని 25 జిల్లాలలో 20 జిల్లాలు మతహింసచే ప్రభావితమైన జిల్లాలు. మొత్తం రాష్ట్రంలో గల 182 అసెంబ్లీ 626 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నియోజకవర్ణాలలోని 154 నియోజకవర్ధాలు, 464 పోలీస్ స్టేషన్లలో 284 పోలీస్ స్టేషన్‌న పరిధిలో గల (ప్రాంతాలు, 151 పట్టణాలు, 993 (గామాలు దాడులకు గురయ్యాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్.బి. శ్రీకుమార్ ప్రకటనని కమిషన్ ఉటంకించింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే దాడులు పరిమితమయ్యాయన్న ఇతర ప్రకటనలు అవాస్తవమని కమిషన్ గమనించింది. ఫిబ్రవరి 27 గోద్రా ఘటన తరువాత సాగిన గృహ దహనాలు హత్యాకాండ నుండి తప్పించుకొనేందుకు ప్రాణాలు అరచేత బట్టుకొని ఇళ్ళు వదిలి (గ్రామాలు వదిలి పారిపోయినవారు యింకా తిరిగి రాలేదు గనుక ఓటర్ల జాబితాలు తాజాగా సవరించడం సాధ్యపడదని క్షేత్రస్థాయి పరిశీలనలు స్పష్టం చేశాయని కమిషన్ పేర్కొన్నది. రాష్ట్రంలో తీవ్రంగా విస్తృతంగా గల దుర్భిక్ష పరిస్థితిని గుర్తు చేస్తూ “దుర్భిక్ష పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిపి తద్వారా సహాయ కార్యక్రమానికి అంతరాయం కలిగించడమా లేక సహాయ కార్యక్రమం కొనసాగించడమా - దేనికి ప్రాధాన్యత యివ్వాలి? - అని ప్రశ్నించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ యింత పరుష పదజాలాన్ని ఉపయోగించిన ఘటన మరొకటి లేదు.
ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు త్రోసిపుచ్చినప్పుడు బిజెపి న్యాయబద్ధతని దాదాపు కోల్పోయింది. రాజ్యాంగాన్ని అనుసరించి అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరునెలల్ని మించరాదు. గనుక వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల తేదీలను నిర్ణయించే హక్కు ఎన్నికల కమిషన్‌కు వుందని, ఆరునెలల వ్యవధి నియమం కూడా అమలులో వున్న అసెంబ్లీకి వర్తిస్తుంది గాని రద్దు చేయబడిన అసెంబ్లీకి వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడు ఎన్నికలు డిసెంబర్ మధ్యలో నిర్వహింపబడతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ లోపల ఉద్రిక్తతల్ని మరికొంత రెచ్చగొట్టే విధంగా సెప్టెంబర్ 24న గాంధీనగర్‌లో ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయం వద్ద దాదాపు ఏ0 మంది ప్రాణాల్ని బలిగొన్న టెర్రరిస్టు దాడి జరిగింది. ఎన్నికలు నిర్వహించబడ్డాయి. గుజరాత్ సమాజం మతపరంగా ఎంతగా విభజితమైవుందో చూపెట్టాయి. అత్యధిక మెజారిటీతో బిజెపి గెలిచింది. మోడి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యాడు. ఎన్నికల విజయం స్వతంత్రం తర్వాత భారతదేశం 627
హిందూత్వవాదులకు కొత్త బలాన్ని తెచ్చిపెట్టింది. రానున్న రెండు సంవత్సరాలలో హిందూ రాష్ట్రాన్ని ఆశించవచ్చు. భారతదేశ చరిత్రని పాకిస్తాన్ భూగోళాన్ని మారుస్తాం - విహెచ్పి నాయకుడు ప్రవీణ్ తొగాడియా ప్రకటించాడు. గుజరాత్ అనుభవం పలు విధాలుగా భారతీయ సమాజంలోని రాజకీయాలలోని మంచినీ చెడ్డనీ వెలికి తీసింది. ఒకవైపు ఆర్థిక బహిష్కరణ అంటే ఉపాధి తిరస్మరణ మరియు ముస్లిం వ్యాపార సంస్థల్ని వెంటబడి వేధించడం ద్వారా మున్సింలపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు, మరొకవైపు కేసులు ఎత్తివేసుకుంటామని మాట ఇవ్వకపోతే గ్రామాల్లోకి రాకుండా చేస్తున్న అటకాయింప్తులు, ఎఫ్. ఐ.ఆర్.లు నింపకుండా ఛార్జిషీట్లు రూపొందించకుండా బాధితులు న్యాయం పొందడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకపడుతున్న పోలీసులు. గోద్రా రైలు విషాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, దాడులకు గురయి చనిపోయినవారి కుటుంబాలకు ఒక లక్ష పరిహారం ఇవ్వడం జరిగింది. గోద్రా రైలు ఘటనలో చనిపోయిన వారందరూ హిందువులు. దాడులకు గురై చనిపోయిన వారిలో అత్యధికులు ముస్లింలు. మొదట ప్రభుత్వం బాధితులకు సహాయ కేంద్రాలు పెట్టేందుకు నిరాకరించింది. ఆ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నిరూపించేందుకు కేంద్రాలను మూనివేసింది. గోడా కైలుకు నిప్పటించడానికి కుట్ర పన్నిన అనుమానితుల నెపంతో ముస్లింలలో భయోత్సాతం సృష్టించేందుకు పోటీ చట్టం ప్రయోగించబడింది. ఈ పరిణామాల ఫలితంగా ఒక మతానికి చెందిన వారంతా ఒకేచోట వుండాలనే భావం ప్రబలింది. మధ్యతరగతి ముస్లింలు వన్ని నివాస ప్రాంతాల వైపు ఆకర్షితులు కాక తప్పలేదు. ప్రభుత్వ భయం, భయంతో క విచ్చలవిడిగా సంచరిస్తున్న మతతత్వవాద గుంపుల భయం - అంతటా ఈల డిన వాతావరణం ఆవపొంచింది. అసాధారణ ధైర్యవంతులు మాత్రమే న్ని అధిగమించగలరు. అందిం చ్ కవైవు బాధితులకు న్యాయం చేసేందుకు మద్దతు నహాయం సహమతక్ క జన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, అన్హాద్, కమ్యూనలిజం కంబాట్, లాంటి పలు పౌర సమాజ (గ్రూపులు, ఫాదర్ సిసిల్ ప్రకాష్ లాయర్ ముకుల్ నివు. వలనా సెత్వలాడ్స్, హర్ష మండేల్ లాంటి సామాజిక కార్యకర్తలు సేకరించింది. మానవ ల చేశారు. ఒక స్వతంత్ర పౌర న్యాయస్థానం సాక్ష్యాల్ని ్కెల (గ్రూపులు ఫెమినిస్టు గ్రూపులు విచారణలు చేపట్టాయి. 028 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పత్రికా రచయితలు ప్రజా ప్రయోజనాల్ని పరిరక్షించ యత్నించారు. రాకేష్ సిన్హా లాంటి చిత్ర నిర్మాతలు డాక్యుమెంటరీ చిత్రాల్ని నిర్మించి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. మనసుల్ని కదిలించే పార్దానియా ఫ్చర్ ఫిల్మ్ రూపొందించబడింది.
బాధితులకు చట్టపరమైన రక్షణ కల్పించడం కీలకమైన అంశం. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (౮౪౫౦), సుప్రీం కోర్టు విశిష్టమైన పాత్ర నిర్వహించాయి. 2008 మేలో ఎన్. హెచ్.ఆర్.సి. బాధితులకు అందిన బెదిరింపులకు స్పందిస్తూ బాధితుల సాక్షుల రక్షణకు చేపట్టిన చర్యలపై నివేదిక పంపవలసిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. 2004 మార్చి 15న సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై గల విశ్వాసరాహిత్యాన్ని తెలియజేసి, 9 గుజరాత్ దొమ్మీ కేసులలో సాక్షుల్ని గుర్తించి వారికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ పోలీసుల్ని పారా మిలిటరీ దళాల్ని పంపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రఖ్యాత బెస్టు బేకరీ కేసులో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఒక మహత్తర సంఘటన. వడోదరిలోని ఒక బేకరీకి నిప్పంటించి 14 మందిని సజీవ దహనం చేసిన కేసులో విడుదల చేయబడిన దోషులపై కొత్తగా సమాచారం సేకరించి గుజరాత్ వెలుపల విచారణ జరిపించవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే బల్మీస్ యాకూబ్ రసూల్ పటేల్ కేసు కూడా గుజరాత్ వెలుపల విచారణ జరవపబడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గుజరాత్ హింస సందర్భంగా పోలీసులు నమోదు చేసిన 4252 కేసులలో 2100 కేసులు విచారణ జరపకుండా మూసివేయబడ్డాయని మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అమికస్ కురియే హరేష్ సాల్వే పెట్టుకొన్న అర్జీకి సుప్రీంకోర్టు నుండి వచ్చిన స్పందన ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రతిఘటించినవారు సాధించిన గొప్ప విజయం. స్థానిక పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా మూసివేసిన కేసుల్ని తిరిగి చేపట్టేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో ఒక పానల్ని ఏర్పాటు చేయవలసిందిగా 2004 ఆగస్టు 17న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక రివ్యూ కమిటీ సాధించిన అభివృద్ధిని ప్రతి మూడు నెలల కౌకసారి రిపోర్టు చేయవలసిందిగా గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది.
2004 మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో యన్‌డిఎ పరాజయం పాలయింది. కాంగ్రెస్ నాయకత్వాన గల కూటమి అధికారం చేపట్టింది. గుజరాత్ ఘటనలు ఎన్.డి.ఎ. పరాజయానికి దారితీశాయని పలువురు వ్యాఖ్యానించారు. సెక్యులర్ శక్తులు కాంగ్రెస్ వెనుక సమీకృతమవడానికి గుజరాత్ ఘటనలు తోద్చడ్డాయి. యు.పి.ఎ. నుండి ప్రజలు స్వతంత్రం తర్వాత భారతదేశం 629
చాలా ఎక్కువ ఆశించారు. 2005 మేలో నరేంద్రమోడీకి అమెరికా వీసా తిరస్కరించింది. ఇంగ్లండ్ కూడా వీసా తిరస్కరించి బిజెపికి, దాని మిత్రపక్షాలకు ముఖం చెళ్లని పరిస్థితి కల్పించింది. పోటా చట్టం రద్దు కొరకు చేసిన ప్రయత్నం పాక్షిక విజయాన్ని సాధించింది. పోటా రద్దు చేయబడింది. గాని రద్దు గతానికి వర్తించేలా చేయలేదు. గతంలో నిర్భంధింపబడినవారు జైళ్ళలో మగ్గుతూనే వున్నారు.
భారత రాజకీయాలపై గుజరాత్ వేసిన ముద్ర తొలగిపోలేదు. గుజూత్లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా బిజెపి పాలన కొనసాగుతోంది. 2007 ఏప్రిల్ మేలో నిర్బంధంలో వున్న వారిపై జరిగిన హత్యాకాండ, నేరగాళ్ళతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ముస్లిం అధ్యాపకునిపై, అతని భార్యపై గుజరాత్ సీనియర్ పోలీస్ అధికారులచే జరుపబడిన నకిలీ ఎన్కౌంటర్ - రాష్త్రంలో పరిస్థితులు సజావుగా లేవని దేశానికి తెలియజెప్పాయి. బరోడా యూనివర్శిటీలో చిత్రకళ అభ్యసిస్తున్న విద్యార్ధి 2007 ఏప్రిల్‌లో అరెస్టు చేయబద్దాడు. అతడికి మద్దతు తెలిపిన ప్రొఫెసర్ యొక్క డీన్‌షిప్ రద్దు చేయబడింది. కారణం చాలా హాస్యస్పదంగాను, ఆలోచనాపరులు సిగ్గుతో తలదించుకునే విధంగాను వుంది. విద్యార్థి ప్రదర్శన కొరకు గాక పరీక్షలో భాగంగా వేసిన చిత్తరువు తమ మతపరమైన భావాల్ని గాయపరిచిందని కొందరు మతతత్వవాదులు వైస్ ఛాన్సలర్‌కి ఫిర్యాదు చేశారు. ఫలితంగా విద్యార్థి నిర్బంధం, ప్రాఫెసర్ డీన్‌షిప్ రద్దు. గోద్రాకి ప్రాతినిధ్యం వహించిన ఎం.ఎల్.ఎ. గుజరాత్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన లాయర్ నానావతి కమిషన్ ఎదుట గోద్రా సంఘటానంతరం పాొంసాకాండలో వారు నిర్వహించిన సొత్రకి సంబంధించిన రక్తపంకిలమైన వివరాలను 2007 అక్షోబర్ 25న వీక్షించిన (ఫైమ్టైమ్ టెలివిజన్ ప్రేక్షకులు దిగ్రమకు గురి అయినారు. "
హిందూ మతతత్వ పార్టీలు, (గ్రూపులు కాస్త వెనక్కి నెట్టివేయబడ్డాయి. కానీ వారు పశ్చాత్తాపపడలేదు, ఓడింపబడలేదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో 'మోడీ' మరలా ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. కటిక చీకట్లు కమ్ముకున్న రోజుల్లో కూడా ఎవరి స్ఫూర్తి భవిష్య ఆశావాదజ్యోతుల్ని సజీవంగా వుంచిందో అలాంటి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మార్గంలోకి గుజరాల్ రావలసి వుంది... 630 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
పహ కులం, అంటరానితనం, కుల వ్యతిరేక రాజకీయాలు, వ్యూహాలు
ఖారతదేశంలో కుల వ్యవస్థ దాదాపు 2500 సం॥ల క్రితం పుట్టింది. ఇది కేవలం హిందువులలోనే గాక సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలలో. కూడా ప్రబలంగా వుంది. దానిలో చాలా అంశాలు వున్నప్పటికీ వనరుల అందుబాటులో అసమానవకాశాలకు, దిగువ కులాల అణచివేతకు దోపిడికి, అగ్రవర్థాలు, నిమ్నవర్ధాలకు వ్యతిరేకంగా వివక్షత పాటించడానికి, - న్యాయబద్ధత కల్పించిన కుల సోపాన పరంపరకు, హెచ్చుతగ్గులకు, స్పృశ్యత, అస్ప ఇచగ్యతలకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం.
వర్ద వ్యవస్థ కొన్ని గ్రూపులపై అస్పృశ్యులు, కులహీనులు అనే ముద్ర వేసి వారికి భూమిపై యజమాన్యాన్ని, దేవాలయ ప్రవేశాన్ని గ్రామానికి చెందిన బావి, చెరువు లాంటి ఉమ్మడి వనరుల అందుబాటుని నిరాకరించింది. అస్పృశ్యులు కానివారు, వారిలో అత్యంత దిగువ శ్రేణికి చెందిన వారైనప్పటికి అస్పృశ్యులతో ఎలాంటి భౌతిక సంబంధం కలిగి ఉండకూడదు. వారి చేతుల మీదుగా ఇచ్చే నీటిని, ఆహారాన్ని అంగీకరించరాదు.
గ్రామాలలో అంటరాని కులాలకు చెందినవారు పాకీపని, నీరు మోయటం, చచ్చిపోయిన జంతువుల చర్మాలు ఒలిచి శుద్ధి చేయటం, వ్యవసాయక (శ్రమ - లాంటి నీచమైన పనులు చేసేవారు. 'వారు వారి సేవలకు ప్రతిఫలంగా 'జాజిమణి విధానం ప్రకారం భూ యాజమాన్య కుటుంబాల నుండి నిర్దిష్టమైన భాగాన్ని పొందేవారు.
19వ శతాబ్దం మధ్య, చివరి భాగాల నుండి 'జాజిమణి విధానం) పగుళ్ళ బారటం మొదలయింది. ఆర్థిక మార్పులు - ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ సంబంధాల వ్యాపారీకరణ, గ్రామాల వెలుపల ఫ్యాక్టరీలలో, మండీలలో ప్రభుత్వ 'సేవలలో, సైన్యంలో నూతన ఉపాధి అవకాశాలు - అస్పృశ్యుల జీవన స్థితిలో మార్పుకి తోద్చడ్డాయి. మహారాష్ట్రలో జ్యోతిబాపూలే, కేరళలోని శ్రీ నారాయణ గురు లాంటి సంస్కర్తలు చేపట్టిన స్వతంత్రం తర్వాత భారతదేశం 631
సంఘ సంస్మరణ ఉద్యమాలు కుల వ్యవస్థని, కుల అసమానతలను సదాలు చేయటం ప్రారంభించాయి. 1920 తరువాత గాంధీజీ అస్పృశ్యతా నిర్మూలనను జాతీయోద్య! టి భాగంగా చేసి పెద్ద ఎత్తున వైకాం (1924-25) గురువాయూర్ సత్యొభవోల ౯౭ పోరాటాలు నిర్వహించారు. అంటరానితనాన్ని పాటించడం ద్వారా అగ్రకులాలవారు ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తున్నారో (గ్రహించేలా చేసి వారి తప్పుని సరిదిద్దుకొనమని నచ్చచెప్పేందుకు గాంధీ ప్రయత్నించాడు. (బ్రిటిషు పాలకులు అణగారిన వర్గాలను హిందువుల నుండి వేరు చేసి, 1932 ఎన్నికల అవార్డులోని ప్రత్యేక నియోజక వర్గాల ప్రాతిపదికన చట్ట సభలలో వీరికి కొన్ని నియోజకవర్గాలు రిజర్వు చేయ యత్నించాడు. గాంధీజీ ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాడు. కారణం ఒకసారి వారు హిందూ సమాజం నుండి విడగొట్టబడితే వారిపట్ల హిందూ సమాజం వైఖరిని మార్పు చెందించటానికి అవకాశం ఉండదు.
1920 దశాబ్దాంతానికి బరోడా మహారాజు ఇచ్చిన ఉపకారవేతనంతో అమెరికాలో విద్యనార్దించి వచ్చిన ప్రముఖ న్యాయవాది బి.ఆర్. అంబేద్కర్ అణగారిన వర్ణాలకు పెద్దనవ్ద్దాయకుడుగా ఎదిగాడు. అంబేద్కర్ మహారాష్ట్రలో అంటరాని కులంగొ పరిగణింపబడే మెహర్ కులానికి చెందినవాడు. 1932 గాంధీజీ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేపట్టిన తరువాత అణగారిన వర్గాలకు (షెడ్యూల్డు కులాలకు) జనరల్ హిందూ కేటగిరి నుండి సీట్లు రిజర్వ్ చేయబదతాయనే పూనా ఒప్పందాన్ని అంగీకరించాడు. 1936 నాటికి మరొక మతంలోకి మారటం అవసరమని వాదించాడు. సిక్కు మతాన్ని కూడా ఎంపిక చేసుకొన్నాడు. కాని మతం మార్పుతో రిజర్వేషన్ల వలన ఒనగూడే ప్రయోజనాలు కొనసాగింపుకు బ్రిటిషు ప్రభుత్వం హామీ ఇవ్వనందున మతమార్చిడి వాయిదా వేయబడింది. రైతుల్ని, శ్రామికుల్ని కలిపి ఉంచాలనే ఆలోచనతో 1986లో అంబేద్యర్ ఇండిపెందెంటు లేబర్ పార్టీని స్థాపించాడు. 1937లో బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పాల్గొని కొద్ది సీట్లు గెలిచాడు. కాని 1940 దశాద్ది ప్రారంభంలోనే తన కాంగ్రెస్ వ్యతిరేక సంఘటన ప్రయత్నం ప్రయోజనకారిగా లేదని గుర్తించాడు. కాబట్టి షెడ్యూల్ కులాలపై మాత్రమే కేంద్రీకరించాలని నిశ్చయించుకొని 1942లో షెడ్యూల్టు కులాల సంఘటనను స్లాపించాడు. షెద్యూల్టు కులాలు ఎక్కువ ప్రయోజనాలు పొందే అవగాహనతో అంబేద్మర్ వలసవాద ప్రభుత్వానికి రాజకీయంగా సహకరించాడు. ఆయన విధేయత ఆయనకు వైస్రాయి కార్యనిర్వాహక మండలి (10౪౦5 కొంం66 6081201ఏలో స్థానాన్ని తెచ్చిపెట్టింది.
వివిధ ప్రాంతాలలో ఇతర ధోరణులు ఆవిర్భవించాయి. పంజాజ్‌లో ఆధారం, యు.పిలో ఆదిహిందు, బెంగాల్లో నామశూద్రులు. పంజాబ్, బెంగాల్లో వారు టిటి 632 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అనుకూల యూనియనిస్టు, కృషిక్ ప్రజాపార్టీలతో జతకట్టారు. బీహార్‌లో చాలా ముఖ్యమైన హరిజన కాంగైసు నాయకునిగా ఎదిగిన జగజ్జీవన్ రాం ఖేత్ మజ్టూర్ సభని, అణగారిన వర్ణాల లీగును స్థాపించాడు. స్వతంత్రానికి ముందు హరిజన సంస్థల ముఖ్యమైన దిమాండు. బేగార్ లేక కులపరంగా బలవంతంగా రుద్దబడిన శ్రమ నుండి విముక్తి వ్యవసాయానికి అటవీ భూములు మంజూరు, భూమి కలిగి వుందేందుకు గల చట్టపరమైన ఆటంకాలను తొలగించటం. చాలామంది వ్యక్తులుగా గాంధేయవాదులు, గాంధేయ సంస్థలు ఈ అంశంపై చురుకుగా పని చేశాయి.
స్వతంత్రం రాకతో కులపరమైన అన్యాయాన్ని అసమానతల్ని తొలగించటానికి ప్రయత్నాలు జరిగాయి. కులం, మతం, సెక్సు, భాష్క తెగల కతీతంగా రాజ్యాంగం పౌరులందరికీ రాజకీయ హక్కులు కల్పించింది. రాజ్యాంగంలో 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది. ఏ రూపంలోనైనా దాని ఆచరణ నిషేధించబడినది. అంటరానితనం కారణంగా కల్చించబడే అసౌకర్యం చట్టరీత్యా నేరం. 1955లో చట్టం చేస్తూ అంటరానితనం నేరాలకు జరిమానా విధించబడుతుందని, లైసెన్సులు, పబ్లిక్ గ్రాంట్లు నిలిపి వయబడతాయని పార్లమెంటు చట్టం చేసింది. నేరస్తులను శిక్షించేందుకు (ప్రత్యేక కోర్టులు, అధికారుల నియామకంతో కఠినమైన పెంచబడిన శిక్షకు అవకాశం కల్పిస్తూ 1976లో పౌరహక్కుల రక్షణ (సవరణ) చట్టం ఆమోదించబడింది. రాజ్యాంగం షెడ్యూల్డు కులాలకు చట్టసభలలో, విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది.
స్వతంత్రానికి ముందురోజులలో విభేదాలున్నప్పటికి కాంగైసు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్‌ను ఛైర్మన్‌గా ఎంపికచేసింది. నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిని చేసింది. కాని తరువాత కూడా విభేదాలు తలెత్తడంతో అంబేద్మర్ ప్రభుత్వం నుండి బయటకు వచ్చి అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ స్థాపించాడు. కాని పార్టీ అభ్యర్థులు అత్యధికంగా రిజర్వుడు సీట్లతో కాంగ్రెసు అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 1956లో అంబేద్కర్ మరలా మతం మారడం అవసరంగా భావించాడు. తన నాయకత్వంలో అర్ధ మిలియన్ ప్రజలు (కొందరు “6 మిలియన్లు అంటారు ముఖ్యంగా మెహర్గ్లు బొద్దమతం స్వీకరించారు. కైస్తవ, ఇస్తాం మతాలలో మారిన షెడ్యూల్డు కులాల వారికి రిజర్వేషన్లు తిరస్మరించబడ్డాయి. బౌద్ధమతానికి ఇది వర్తింపచేయలేదు. అందువలన అంబేద్కర్ బౌద్ధమతాన్ని ఎంపిక చేసి వుండవచ్చు.
ఆ|గ్రాకు చెందిన జాతవ్‌లు లాంటి కొన్ని అండరాజి గ్రూపులు అంబేద్మర్‌ను అనుసరించాయి. చాలా ఇతర గ్రూపులు మతమార్చిడికి దూరంగా ఉండిపోయాయి.
అంబేద్కర్ ద్వితీయ (శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయకుండా 1956లో మరణించాడు. కాని మరణానంతరము ప్రచురింపబడిన అంబేద్కర్ లేఖ ప్రాతిపదికగా స్వతం(త్రం తర్వాత భారతదేశం 633
1957లో రిపబ్లికన్ పార్టీ స్థాపించబడింది. అదే సంవత్సరము బొంబాయి శాసనసభ ఎన్నికలలో పాల్గొని కొన్ని సీట్లు గెలిచింది. వ్యక్తిపరమైన ఇతర అంశాలకు చెందిన సమస్యలు చీలికకు దారితీశాయి. చీలిన గ్రూపులు అత్యధికం కాంగ్రెసులో చేరాయి. వాటికి కాంగ్రెసులో స్థానం కల్పించేందుకు వై.బి.చవాన్ (ప్రత్యేక ప్రయత్నాలు చేశాడు.
1970 దశాబ్దం తొలి సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా రాజకీయాలలో వచ్చిన మార్పులలో భాగంగా మహారాష్ట్రలో దళిత పాంధర్లుగా గుర్తింపబడిన నూతన ధోరణి (దళితులు అంటే అణచివేతకు గురికాబడినవారు, దేశంలోని పలు ప్రాంతాల షెడ్యూల్డు కులాలవారు తాము అలా పిలవబడాలని కోరుకున్నారు). ఆవిర్భవించింది. అది మొదట సృజనాత్మక సాహిత్యంలోను ఆ తరువాత రాజకీయాలలో ప్రతిఫలించింది. 972 రాజకీయ సంస్థను స్థాపించిన దళిత పాంథర్లు సైద్ధాంతికంగా అంబేద్మర్ ఆలోచనలను స్వీకరించారు. యువకులు నగర ప్రాంతాలలో విద్యార్థుల మద్దతు పొందారు. విప్లవాన్ని గురించి మాట్లాడారు. నిర్దిష్టమైన వ్యూహం రూపొందించిన దాఖలాలు లేవు. మరట్యాగా యూనివర్శిటీ పేరును అంజేద్మర్ యూనివర్శిటీ మార్చటానికి జరిగిన అందోళన 1978లో మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో దళిత వ్యతిరేక దాడులకు దారితీసింది. దాడులకు పాల్పడిన వారు ప్రధానంగా మధ్యస్థ కులానికి చెందిన బ్రాహ్మణేతర మరాఠి కున్సీ రైళులు.
1980ల నాటికి దళిత పాంధర్లలో దళితేతర పేదలను, బౌద్ధమతానికి చెందని దళితును కలుపుకోవాలా? లేదా? సాంస్కృతిక, ఆర్థిక పోరాటాలలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? రాజా ధాలే నామ్‌దేవ్ ధశాల్ ల వ్యక్తిత్వ ప్రాధాన్యత లాంటి సమస్యలపై దళిత పాంధర్లలో విభేదాలు పెల్లుబికాయి, చీలికలు మొదలయ్యాయి. 20 సం॥లు క్రితం రిపబ్లికన్ పార్టీ చీలికల లాగానే వీనిలో అత్యధికం కాంగ్రెస్‌లో చేరిపోయాయి. లేక కాంగ్రెస్‌కు మిత్రపక్షాలయ్యాయి. బి.ఆర్. అంబేద్మర్ మనుమడు ప్రకాష్ అంబేద్మర్ 1990లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు దళిత సంస్థలన్నింటిని ఐక్యపరిచే ప్రయత్నం చేశాడు. 5,00,000 మందితో బొంబాయిలో ప్రదర్శన నిర్వహించాడు. తరువాత విభేదాలు మొదలయ్యాయి.
ఉత్తర భారతదేశంలో 1980 దశాబ్దంలో కన్నీరాం (తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మాయవతి) నాయకత్వంలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ రాజకీయాధికారమే తన లక్ష్యంగా, వ్యూహంగా ప్రకటించింది. మొదట దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు బహుజన సమాజ పార్టీగా ఏర్పడాలని చెప్పినప్పటికీ, దాని ఓట్లు పెంచుకోవటానికి అది బి.జె.పి, కాంగ్రెస్, జనకా, సమాజ్‌వాది పార్టీ దేనితోనైనా జత కట్టడానికి సిద్ధపడిన దళితుల పార్టీ అయింది. 6934 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బి.జె.పి.తో అలాంటి ఒప్పందం 1995లో మాయావతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసింది. ఏ.పి.సింగ్‌ని సామాజిక న్యాయ మహా పురుషునిగా భావించిన వారికి చిరాకు కలిగించే విధంగా బి.ఎస్.పి. దేవీలాల్హ్ చంద్రశేఖర్లకు అనుకూలంగా వి.పి.సింగ్‌కు మద్దతును ఉపసంహరించింది. బి.ఎస్.పి., యు.పి. పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో షెడ్యూల్డు కులాల మద్దతు పొందడంలో జయప్రదమయింది. దళికేతర పార్టీలు, గ్రూపులు దళితుల సమస్యలను చేపట్టడం కూడా బి.ఎస్.పి. అధికారంలోకి రావటంలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. కూలీ, ఉపాధి వామీ పథకం, పనిహక్కు ఇళ్ళ స్థలాలు, విద్యాహక్కు లాంటి సమస్యల పరిషారానికై వివిధ పార్టీలు, ప్రభుత్వేతర సంస్థలు స్థాపించిన వ్యవసాయ కూలీ సంఘాలు అన్నీ దళితుల ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ప్రత్యేక దళిత సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టాయి. (గ్రామీణ ప్రాంతాలలో దళిత యువకులు, అంబేద్మర్ సంఘాలు స్థాపించారు. పట్టణ (ప్రాంతాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, ఆఫీసులలో పనిచేసేవాళ్ళు దళిత సంఘాలుగా నిర్మాణ బద్ధం చేయబడ్డారు. ఈ సంఘాలు వాటి సభ్యుల ప్రయోజనాల కొరకు పనిచేశాయి గాని వీటికి గ్రామీణ పట్టణ 'పేదలతో అంతగా సంబంధాలు లేవ. దళితపార్టీలు, ఇతర రాజకీయ (గూపులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికి,
యిప్పటికీ మెజారిటీ దళితులు కాంగ్రెస్‌కు ఓటు చేయడం గమనించవలసిన అంశం. ఈ సాధారణమైన వాస్తవ పరిస్థితే దళిత నాయకులను కాంగ్రెస్ వైపుకు నెట్టింది గాని ఇముడ్చుకానడం లేక నమ్మద్రోహం సిద్ధాంతాల ప్రాతిపదికన చేసే వివరణలు కావు. ఈ
పరిస్థితిని మార్చటం వారి లక్ష్యమైతే, దళిత సిద్దాంతకర్తలు ఈ పరిస్థితికి మూలాధారమైన
కారణాలను అవగాహన చేసుకోవాలి.
దళిత నాయకుల కోర్కెలేమయినప్పటికి బౌద్ధమతం స్వీకరించిన గ్రామీణ ప్రజలు
హిందూ దేవతలను వదులుకోలేదు. వారి దైవ గణంలో అంబేద్మర్, బుద్ధుడు ఫోటోలను
చేర్చారు. బౌద్ధమతం స్వీకరించినవారు హిందువుల పండుగల్ని ప్రల్వేకించి వారికి
నిషేధింపబడిన గౌరి, గణపతి పూజల లాంటి పండుగలను మతపరంగా నిషేధించబడిన
ఆహార పదార్థాలను వండి కొత్తగా పొందిన ఉత్సాహంతో బాహాటంగా అట్టహాసంగా
చేసుకొన్నారు. అ(గ్రవర్ధాలవారు ఆ(గ్రహోద(గ్రులైంది, దళితులు బౌద్ద్భులైనందుకు కాదు.
దానిని వారు సులభంగానే సర్దుకుపోగలిగారు. సాంప్రదాయ హిందూ సాంప్రదాయాల్ని తిరస్మరించి హిందూ మత ఆచారాలను అనుకరించటం వారికి ఆ(గ్రహాన్ని తెప్పించింది.
అ(గ్రవర్ణ హిందువులు ఏ ఆచారాలు, సాంప్రదాయాలు దళితులు పాటించరాదని నిషేధించారో అవే ఆచార సాంప్రదాయాలను ఆచరించగలిగినందువలన వారు సవర్డ హిందువులతో సమానులమని భావించారు. దేవాలయ ప్రవేశం ద్వారా మతపరమైన స్వతంత్రం తర్వాత భారతదేశం 685
సమానత్వం సాధించటం సమంజసమైనదనే గాంధీజీ అవగాహన సరియైనది. క్త మతంలోకి మారిన దళితులను ప్రత్యేకమైన చర్చీలు లేక చర్చీలలో ప్రత్యేకమైన ర కేటాయింపు, చర్చి పదవులతో పదోన్నత నిరాకరణ, మతపరమైన కార్యకలాపాల నిర్వ న వాక్కు తిరన్మరణ, మత బోధకులు దళితుల చేతిమీదుగా ఇచ్చిన నీటి అంగీకరించకపోవటం లాంటి వివక్షతలు కులపరమైన వివక్షతా సమస్యని హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మార్చినట్లు నిరూపితమయింది. ముస్లింలలో గూడా 2 జరిగింది. దిగువ కులాల నుండి ముస్లిం మతంలోనికి మారినవారు అగ్రకులం అషారఫ్ల వివక్షతకు గురయ్యారు.
అదే విధంగా ఉద్యోగాలలో పై స్థాయి విద్యా సంస్థల సీట్లు రిజర్వేషన్లు నామమాత్రమైన తేడాని తీసుకోగలిగాయి. మొత్తం జనాభాలో కేవలం 3% మంది మాత్రమే పై చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందగలుగుతున్నారు. పెద్యూలు కులాలవారు పేదలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు వారికి ఈ అవకాశాలు మ తక్కువ. ఎన్నికలు అవసరాల రీత్యా షెడ్యూల్డు కులాల ప్రతినిధులు చట్ట సభలలో వారి సమస్యలను ప్రస్తావించడం అనివార్యం గనుక చట్ట సభలలో సీట్ల రిజర్వేషన్లు కొంత ప్రభావం చూపింది. కాని వ్యక్తిగతంగా పైపైకి ఎదగాలనే ఆకాంక్ష విషయంలో పెడ్యూట్లు కులాల ప్రతినిధులు అగ్రవర్గాల ప్రతినిధుల కంటె ఏ విధంగాను వెనుకబడి పోలేదు. మహారాష్ట్రలో మహర్తు, మాంగ్లు, ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు, మాలలు, ఉత్తర భారతదేశంలో చహర్హుు చుహ్రాలు లాంటి షెడ్యూలు కులాలలోని కులాల మధ్య పోటీ ఇటీవలి సమస్య. షెడ్యూల్లు కులాలలో కొంత మెరుగైన కులాలు అనివార్యంగా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందగలుగుతారు కనుక రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడంలో వెనుకబడిన కులాలు రిజర్వేషన్లలో రిజర్వేషన్లు లేక కోటాలలో కోటాలు డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు. ఫలితంగా షెడ్యూల్డ్ కులాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. రాజకీయంగా కూడా వ్యక్తమవుతోంది. ఇది రిజర్వేషన్ల తర్కం - ఒకసారి రిజర్వేషన్ సాధించిన తరువాత న్స అవకాశాన్ని ఇంకా పెంచుకొనడానికి రిజర్వేషన్ కేకులో నీ గ్రూపుకి పెద్ద ముక్క కొరకు ప్రయత్నించక తప్పదు.
ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే షెడ్యూలు కులాల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. కాని అందుకు కారణాలు మతమార్చిడులు, రిజర్వేషన్లు, వ్యూహాలు కొవు. సామాజిక ఆర్థిక మార్చు, పారిశ్రామికీకరణ, గ్రామీణ ఉపాధి మెరుగుదలకు దారితీసిన వ్యవసాయాభివృద్ది - అన్నీ తోద్బడ్డాయి. ప్రాథమిక విద్య, ఆరోగ్య వసతుల విస్తరణ, పెదరిక నిర్మూలన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు, పాల ఉత్పత్తి, మేకల పెంపకం పథకాలకు సన్సిడీలు, అప్పులు లాంటి గ్రామీణ ఆదాయాన్ని పెంచే పథకాలు, అక్షరాస్యతా ప్రచారం, బాల కార్మిక వ్యవస్థ రద్దు ప్రచారం లాంటివి కీలకంగా పనిచేశాయి. 636 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
అత్యంత పేదవాని, అత్యంత దిగువ కులానికి చెందిన వాని ఓటు చాలా విలువైనది కావడం వలన వయోజన ఓటుహక్కు చాలా ప్రభావం చూపింది. భూ పంపకం అంతకు ముందు భూమిలేని వారి స్థాయిని పెంచింది. వారి జీవన ప్రమాణాలను పెంచింది. (ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు, అప్పుల సహాయంతో షెడ్యూల్డు కులాలవారు భూమి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టింది. అలాగే బాజ్ మణి విధానం విచ్చిన్నత, సాంప్రదాయ వృత్తి నుండి కులాన్ని విడగొట్టడం కూడా కీలకమైనవి. వీటన్నిటి ఫలితముగా పట్టన ప్రాంతాలలో అస్పృశ్యత అంతరించింది. (గ్రామాలలో చాలావరకు తగ్గిపోయింది. దిగువ కులాలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగిన అభివృద్ధి చెందిన గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం దాదాపు అంతరించింది. శ్రామికుల అవసరం ఎక్కువగా వుండడం వలన యజమానులు తమ అగ్ర కుల ఆధిక్యతను ప్రక్కనపెట్టవలసి వచ్చింది. ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో కులపరమైన పూర్వ భావనలు పూర్తిగా తొలగిపోనప్పటికీ కుల ప్రాతిపదిక గల వివక్షత చాలా అరుదు. షెద్యూల్టు కులాల వారిపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. కాని అవి దిగువ కులానికి చెందిన యువకుడు పై కులానికి చెందిన అమ్మాయిలతో పారిపోవడం లేక అగ్రకులం అధికారాన్ని సవాలు చేసేందుకు దిగువ కులాలు తీవ్రవాద రాజకీయ [గూపులతో కలవటం అగ్రకుల నియమాలను బాహాటంగా ఉల్లంఘించటానికి ప్రతిక్రియగా గాని జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలు అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించదగినదైనప్పటికీ వీటిని దిగువ కులాలు తమ హక్కుల్ని తాము దృఢంగా ్రతిపాదించడానికి నిదర్శనాలుగా అర్ధం చేసుకోవాలి. కాని విద్య, ఉపాధి, ఇతర సామాజిక ఆర్ధిక అవకాశాల అందుబాటులో ఇప్పటికి అసమానతలు కొనసాగుతున్నాయి. కులానికి, అక్షరాస్యతకు మధ్య సంబంధం చాలాబలమైనది. (గ్రామాలలో అగ్రకులాలు దశాబ్దాలుగా దాదాపు సార్వత్రిక వయోజన అక్షరాస్యత సాధించగా దిగువ కులాల వారు ప్రత్యేకించి మహిళలు నిరక్షరాస్యులుగా వున్నారు. 1991లో భారతదేశం మొత్తంలో చూస్తే పురుషులలో అక్షరాస్యులు 64% ప్రీలలో అక్షరాస్యులు 39% షెడ్యూల్లు కులాల పురుషుల అక్షరాస్యత 46% ప్రీల అక్షరాస్యత 19% మాత్రమే. యు.పి.లో సంబంధిత గణాంకాలు 56/25, 86/8 కాన్సి కేరళలో మొత్తంగా చూసినప్పుడు సంబంధిత గణాంకాలు 94/86, 'షెడ్యూల్లు కులాలలో 85/73. ప్రాథమిక విద్యావకాశాలు లాంటి సానుకూల చర్యల ద్వారా అసమానతల్ని ఎలా తగ్గించవచ్చునో ప్రాంతీయ అధ్యయనాలు వివరిస్తాయి. విద్య లేకపోతే రిజర్వేషన్ విధానం సమకూర్చే ప్రయోజనాలు కూడా ఉపయోగించుకొనడం సాధ్యపడదు. ప్రతిన్థాయిలో షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయబడిన ఉద్యోగాలు, సీట్లు నింపడం సాధ్యపడక పోవడమే దీనికి నిదర్శనం. స్వతంత్రం తర్వాత భారతదేశం 637
భవిష్యత్తులో కూడా ఉపాధిహామీ పథకాలు, ఇతర చర్యల ద్వారా త్వరిత ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన లాంటి పేదరిక నిర్మూలన పథకాలు కొనసాగించవలసి వుంటుంది. సామాజిక పరివర్తనకు విద్య పెద్ద సాధనంగా గుర్తించబడింది. కాబట్టి సార్వత్రిక ప్రాథమిక విద్యకు సెకండరీ విద్యకు అవకాశాలు తప్పనిసరిగా కల్పించబడాలి. స్త్రీ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. 1990లో మండల్ వ్యతిరేక ఆందోళన ప్రాధాన్యత సంతరించుకున్నది. వెనుకబడిన వర్గాల లేక కులాల సమస్య, షెడ్యూల్డు కులాల సమస్యకి పూర్తిగా భిన్నమైనది. వెనుకబడిన వారు ఆచారాలు, సాంప్రదాయాలు పాటించడంలో (బ్రాహ్మణులు, క్షత్రియులు కంటె దిగువన, అస్పృశ్యుల కంటె పైన వుంటారు. కాని భూమి, ఇత ఆర్ధిక వనరులు కలిగి వుండే అవకాశం ఎక్కువ గనుక వీరిని షెడ్యూల్డు కులాలతో పోల్చటానికి వీలులేదు. అంతేగాక వారు అస్పృశ్యులుగా పరిగణించబడలేదు. ఈ వెనుకబడిన కులాలలో చాలా వ్యత్యాసాలున్నాయి. వీటిలో కొన్నికులాలు ఆర్ధికంగా, సామాజికంగా చాలా శక్తివంతమైనవి. జమ్ందార్ల పొలాల కౌలుదారులుగా వున్నవారికి భూమిపై హక్కులు కల్పించిన స్వతంత్ర్యానంతర భూ సంస్కరణల వలన అహిర్లు, యాదవులు, కుర్మీలు, వకృలిగులు, లింగాయత్‌లు, లోధాలు లాంటి వెనుకబడిన కులాలవారు గణనీయమైన ప్రయోజనాలు పొందారు.
ఈ క్రొత్తగా పొందిన బలం వారి రాజకీయ చారవని, ప్రాతినిధ్యాన్ని పెంచింది. దీనికి వీరు విద్యలో, ఉద్యోగాలలో ఇతర రంగాలలో ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగించుకొనే ప్రయత్నంలో వున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా వున్న షెడ్యూల్డు కులాల వారిని ఎక్కువగా దోచుకునేది వీరే. మండల్ రిపోర్టు కావలసినంత సమాచారం సేకరించకుండా తప్పుడు పద్దతులలో రూపొందించబడిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మండల్ తప్పులు కూడా సామాజిక శాస్త్రవేత్తల తీవ్ర విమర్శలకు గురయ్యాయి. స్వతంత్ర్యానంతరం కులం తీవ్రమైన మార్పులకు గురయిందని కాని, కాలం చెల్లిపోయిన, కులం పట్ల పాశ్చాత్యులకు గల దురవగాహన ప్రాతిపదికన న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదని సామాజిక శాస్త్రవేత్తలు వాదించారు. వాస్తవంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్లు, రాజకీయాలకు సామాజిక న్యాయం కొరకు పోరాటంతో కంటె అధికార పదవీలాలస పట్ల ఎక్కువ ఆసక్తి గలవి.
638 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
38 టే స్వతంత్రానంతరం భారతీయ మహిళలు స్వతంత్రానంతరం మహిళలకు సంబంధించి చట్టపరంగాను రాజకీయపరంగాను
విద్యా సామాజిక స్థాయిపరంగాను నాటకీయమైన మార్పులు సంభవించాయి. రాజారామ్మోహనరాయ్ సమాజంలో పాతుకుపోయిన ఛాందస భావాలను ప్రశ్నించడం ప్రారంభించిన 19వ శతాబ్ది మొదటి పాదం నుండి సంఘ సంస్కరణ ఉద్యమంలో మహిళల స్థితిగతులు మెరుగుపరచటం ప్రధానమైన అంశంగా వుంటూ వచ్చింది.
అంతేగాక స్వతంత్ర పోరాటం 1920ల నుండి ప్రత్యేకించి 1980 ల నుండి మహిళల సృజనాత్మక శక్తియుక్తుల్ని వినియోగించుకొన్నది. 1980 దశాబ్దం మధ్యకాలంలో గాంధీజీ మహిళా నాయకురాలు మృదుల సారాబాయ్తో చెప్పిన “నేను భారతీయ స్త్రీలను వంట గది నుండి బయటికి రప్పించాను. వారు వెనక్కిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మీద (మహిళా కార్యకర్తలది” మాటలు చాలా అర్థవంతమైనవి. కుటుంబానికి చెందిన మగవాళ్ల తోడు లేకుండా స్త్రీలు ప్రదర్శనలో పాల్గొని జైళ్లకు పోగలిగినప్పుడు వారు ఉద్యోగాలను ఆశించవచ్చు. ఓటుహక్కు కలిగి వుండవచ్చు. పిజ్రార్దితాన్ని వారసత్వంగా పొందవచ్చు. శతాబ్దకాలంపాటు సాగిన సంఘ సంస్మరణ కంటె 1920 ల నుండి ప్రజా పోరాటాలతో ప్రారంభమైన మహిళల రాజకీయ భాగస్వామ్యం స్రీలకు విస్తృతమైన అవకాశాల కొత్త ద్వారాలను తెరచింది.
19 శతాబ్దంలో న్యాయ గ్రహీతగా వున్న మహిళస్థాయి 20వ శతాబ్దం ప్రారంభంలో జాతీయవాదులైన పురుషులకు మద్దతుదారులుగాను 30,40 దశాబ్దంలో పురుషులతో చేయి చేయి కలిపి పోరాడే దశకి ఎదిగింది. మహిళలు గాంధీయవాదం నుండి సోషలిస్టులు, కమ్యూనిస్టులు, రివల్యూషనరీ టెర్రరిస్టుల వరకు గల జాతీయవాదం యొక్కఠఅన్ని పాయలలో పాల్గొన్నారు. వారు రైతు ఉద్యమాలలో పాల్గొన్నారు. కార్మికవర్గ పోరాటాలలో పాల్గొన్నారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 689
వారు ప్రత్యేక మహిళా సంస్థల్ని స్థాపించారు. వీటిలో 1926లో స్థాపించిన అఖిల భారత మహిళా సంఘం అత్యంత ముఖ్యమైనది.
స్వతంత్రానంతరం పోరాడి సాధించుకొన్న స్వతంత్ర ఫలితాలననుభవించే సమయం వచ్చినప్పుడు సహజంగా దృష్టి చట్టపరమైన రాజ్యాంగపరమైన హక్కుల వై మరలింది. రాజ్యాంగం మహిళలకు సమానత్వాన్ని వాగ్గానం చేసింది. చాలా సంవత్సరాల క్రితం జాతీయోద్యమం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిందే. మహిళలకు విద్యలేక ఆస్తి లేక ఆదాయం లాంటి అర్జ్దతలతో సంబంధం లేకుండ పురుషులతో పొటు ఓటుహక్కు కల్పించింది. పాశ్చాత్య దేశాలలో దీర్షకాలం పోరాడి సాధించుకొన్న ఓటుహక్కు భారతే మహిళలు సునాయాసంగా సాధించగలిగారు.
1930 దశాబ్దం ప్రారంభం నుండి మహిళలు డిమాండు చేస్తున్న హిందూ కోడ్ బిల్లును చట్టం చేసే క్రమాన్ని నెహ్రూ 1950 దశాబ్దంలో ప్రారంభించాడు. భారత రాజ్యాంగ చిత్తుప్రతిని రూపొందించిన రాజ్యాంగ నిపుణుడు బి.యన్.రావ అధ్యక్షతన గల కమిటీ విషయాన్ని సాకల్యంగా అధ్యయనం చేసి 1944లో చిత్తు ప్రతిని సమర్పించింది. స్వతంత్రానంతర న్యాయశాఖ మంత్రి బి.ఆర్. అంబేద్మర్ అధ్యక్షతన మరొక కమిటీ వివాహ వయస్సును పెంచుతూ ఒకనికి ఒకే భార్య మాత్రమే వుండాలనే పద్ధతిని సమర్దిస్తూ మహిళలకు విడాకులు మనోవర్తి, వారసత్వ హక్కులను కల్పిస్తూ బిల్లును సమర్పించింది. బెల్లు వరకట్టాన్ని ప్రీ ధనంగా లేక మహిళల ఆస్తిగా పరగణించాలన్నది. బిల్లుకు మెజారిటీ కాంగ్రెస్ సభ్యుల మహిళా కార్యకర్తల సంఘ సంస్కర్తల బలమైన మద్దతు లభించినప్పటికి సమాజంలోని కులీన సెక్షన్ల నుండి ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్‌తో సహా కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల వ్యతిరేకత బిల్లు వాయిదా పడడానికి దారితీసింది. చివరికి బిల్లులోని సెక్షన్ నాలుగు ప్రత్యేక చట్టాలుగా ఆమోదించబడ్డాయి. అవి హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వపు చట్టం, హిందూ మైనారిటీ సంరక్షకత్వ చట్టం, హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం. +
హిందూ మహిళలకు చట్టపరమైన హక్కులను వర్తింపచేయటం చాలదు. ఇంకా చాలా చేయాలి. అయినప్పటికి యిది పెద్ద ముందడుగే. చట్టపరమైన హక్కులను యితర మతాల వారికి వర్తింప చేసే ప్రయత్నాలలో ప్రభుత్వం ఎదుర్కొన్న తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో ఈ అంశాన్ని గమనించాలి. అందుకు షాబానో కేసు స్పష్టమైన ఉదాహరణ. 1985లో హిందూ చట్టం సంస్కరింపబడిన 40 సం1॥॥ల తరువాత సుప్రీంకోర్టు 640 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
విడాకులివ్వబడిన ముస్తిం మహిళ మనోవర్తిగా కొద్దిమొత్తాన్ని. మంజూరు చేసింది. ముస్లిం కులీన వర్ణాలలో పెద్ద గందరగోళం చెలరేగింది. సుప్రీంకోర్టు తీర్పు అమలు జరగకుండా బిల్లు ప్రవేశపెట్టవలసిందిగా రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. (ప్రభుత్వం యొక్క పిరికితనాన్ని నిందించటం సులభమే గాక అవసరం కూడా. కాని ప్రత్యర్థులు లక్షలమందిని వీధుల్లోకి రప్పించగా షాబానో మద్దతుదారులు కొన్నివందలమందిని మాత్రమే సమీకదించగలిగారు. హిందువులకు అంతటి పెద్ద మార్పులు తెచ్చే బిల్లును పేదలందరికీ వర్తించే సివిలు కోడ్బిల్లును తీసుకురానందుకు నెహ్రాని విమర్శించేవారు. ముస్లింలలో కంటె హిందువులలో సంఘ సంస్కరణ క్రమం చాలా ముందుకు పోవటం వలన నెహ్రూ ప్రతిఘటన నెదుర్కొంటూనే గణనీయమైన మద్దతును కూడా పొందగలిగాడని గుర్తించటం అవసరం. మహిళలు కొన్ని చట్టపరమైన హక్కులు పాొందగలిగినప్పటికి మరికొన్ని కాగితాలకే పరిమితమయ్యాయి. మహిళలు ప్రత్యేకించి గ్రామీణ మహిళలు ఓటుహక్కు శక్తిని గుర్తించారు. కాని యితర అంశాలలో ప్రత్యేకించి తండ్రి ఆస్తి నాయకత్వంగా పొందే హక్కు విషయంలో మొత్తం మీద చట్టపరమైన హక్కులు కోరలేదు. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలలోని గ్రామీణ పట్టణ మహిళలు తండ్రి అస్తిలో హక్కులు వదలుకొనడం సర్వసామాన్యం. అందుకు భర్త యింటిలో నివాసముండే సాంప్రదాయకం కారణం. తండ్రి ఆస్తిలో వాటా ఉపౌందేందుకు మహిళలకున్న ఒకే ఒక్క అవకాశం కట్నం గనుక మహిళలు వరకట్నాన్ని అంతగా వ్యతిరేకించలేదు. విడాకులు తీసుకోవదమంటే సమాజంలో కొంత తేలికైన భావం వున్నప్పటికీ స్త్రీ ఒంటరిగా నివసించటంలో చాలా యిబ్బందులున్నప్పటికీ పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలు విడాకులు పొందేహక్షుని వినియోగించుకొంటున్నారు. 1947 తరువాత మహిళా ఉద్యమాలు మహిళల సమస్యలు మహిళా సంఘాలు అలాగే ప్రధాన రాజకీయ పార్టీలు చేపట్టడం ఒక సానుకూలమైన పరిణామం. వరకట్న హత్యలు మానభంగాలు, తాగడం వలన చెలరేగే కుటుంబ హింసకి చెందిన సమస్యలు చేపట్టబడ్డాయి. 1970 ల తరువాత 1990లలో కూడా సమస్యలపై కొన్ని స్థానికంగా మరికొన్ని కొంత విసృతంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రజల చైతన్యం పెరిగింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 641
స్వతంత్రానంతరం జాతీయోద్యమంలో విభిన్న రాజకీయ శక్తులు వాటి పద్ధతులను అవి ఎంచుకొన్నప్పుడు మహిళా ఉద్యమం కూడా బహుముఖమయింది. చాలొమంది మహిళా నాయకులు విభజన సందర్భంగా జరిగిన ఘర్షణల సందర్భంగా తప్పిపోయిన వదలి వెళ్లబడిన వారి పునరావాసంలో సహా ప్రభుత్వం యితర సంస్థలు ప్రారంభించిన మహిళా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగరాలలో వర్కింగ్ విమెన్ హాస్టల్, వృక్తి విద్యా కేంద్రాలు నెలకొల్చారు. 1954లో కమ్యూనిస్టు మహిళలు ఆలిండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ వదలి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ స్థాపించారు. అది విస్తృతమైన మహిళా వేదికగా గాక పార్టీవేదికగా పనిచేసింది. 1950, 1960 దశాబ్దాలలో మహిళా పోరాటాలు అంతగా జరగలేదు. 1970 దశాబ్దంటో మరలా కొంతకదలిక వచ్చేవరకు స్వతంత్రానంతరం మహిళా ఉద్యమం లేదనే అభిప్రాయానికి దారితీసింది. కొని అలాంటి అభిప్రాయం ఏర్పరుచుకోవడం అంటే ఉద్యమ పోరాట దశల తరువాత పటిష్టపరచుకోవడం, నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడం. దశలు ఉద్యమంలో అభిన్న భాగాలుగా అర్థం చేసుకోలేకపోవడమే. భారతీయ మహిళా ఉద్యమం స్వతంత్రానంతరం సరిగ్గా అలాంటీ దశల గుండా ముందుకు సాగింది.
మహిళలు, రైతుల తెగల ప్రజల కార్మిక సంఘాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. ఆయా సంఘాలలో మహిళల సమస్యలను ప్రస్తావించారు. 1946 - 47 లో బెంగాలులో తెభాగ రైతాంగ ఉద్యమంలో మహిళలు “నారి వాహిని' అనే ప్రత్యేక వేదికను స్పాపించి పనిచేశారు. కమ్యూనిస్టు మహిళా కార్యకర్తలు ఆర్థికం యితర ఆస్తిపరమైన హక్షులు, గ్రామస్తాయి మహిళాస్థ్రాయి, మహిళా ఆత్మరక్ష్యసమితి లాంటి సమస్యలపై గ్రామీణ మహిళల్ని సమీకరించారు. వారు గృహహింసని భార్యలను కొట్టడం లాంటి సమస్యలు కూడా చేపట్టారు. 1946-50 కాలంలో హైదరాబాదు సంస్థానంలోని తెలంగాణాలో కమ్యూనిస్టులు చేపట్టిన రైతాంగ పోరాటంలో మహిళల భాగస్వామ్యం గణనీయమైనది. కాని అక్కడ మహిళా సంఘాలు స్థాపించబడలేదు. గెరిల్లా దళాలలో మహిళల చేరిక నిరుత్సాహపరచబడింది. పట్లుదలగా చేరిన వారి సేవలు కూడా పూర్తిగా ఆమోదం పొందలేదు. ఇతర ప్రాంతాలలోని కమ్యూనిస్టు మహిళలు కూడా కమ్యూనిస్టు యువకుల్ని పెళ్ళి చేసుకోవలసిందిగా ప్రోత్సహించారని, మహిళలకు చెందిన సమస్యలపై పనిచేయమన్నారని కాని వారిని సభ్యులుగా నాయకత్వంలో విలీనం చేసుకోలేదని ఆరోపించారు. 642 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1960 దశాబ్దం చివరిలోను 1970 దశాబ్దం ప్రారంభంలోను నక్సలైటు ఉద్యమం, జె.పి. ఉద్యమం, చిప్కో ఉద్యమం, ధరల పెరుగుదల వ్యతిరేక ఉద్యమం లాంటి నూతన రాజకీయ ధోరణులు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాలలో కమ్యూనిస్టులు సోషలిస్టులు చేపట్టిన ఆ అధిక ధరల వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలలో వేలాదిమంది మహిళలు పాల్గొన్నారు. ఉద్యమం గుజరాత్‌కి విస్తరించింది. కాని అక్కడ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవంచే ప్రభావితమైన నవనిర్మాణ ఉద్యమం వలలో చిక్కుకొన్నది. ఈ ఉద్యమాలు మహిళల సమస్యల్ని ప్రత్యక్షంగా చేపట్టలేకపోయినప్పటికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వలన వారికి పితృస్వామ్యం, మహిళల అణచివేత లాంటి సంక్షిష్ట సమస్యల దిశగా ముందుకు సాగటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చాయి. ఈ మధ్యకాలంలో గుజరాతులో వచ్చిన ముఖ్యమైన నూతన పరిణామం జెౌళి కార్మిక సంఘం (1ల616 ౬20042 త&ీ550012400) యొక్క మహిళా విభాగాన్ని స్వయం ఉపాధి మహిళా సంఘాలు ఏర్పాటు చేయటం, అది జౌళి కార్మిక సంఘం నుండి విడివడి స్వతంత్ర సంఘమయింది. అది అసంఘటిత రంగంలో ఇళ్ళవద్ద అమ్మకందారులుగా వీధుల వెంట తిరిగి అమ్మేవారుగా వున్న మహిళల్ని సమీకరించి సమిష్టి బేరసారాలతో శిక్షణ, రుణ సదుపాయాలు, సాంకేతిక సహాయాన్ని. అందజేసింది. ఇది ఇండోర్, భోపాల్, ఢిల్లీ, లక్నీలకు విస్తరించింది. ఇప్పటి ఈలాభాట్ సమర్ధవంతమైన నాయకత్వంలో మహిళలకు సేవ చేస్తున్నది.
మహారాష్ట్రలోని ధులియా జిల్లాకి చెందిన షహద తెగల ప్రాంతంలో 1972 మరొక తరహా ఉద్యమం ఆవిర్భవించింది. తొలుత గాంధేయ సర్వోదయ నాయకుల ఆ తరువాక మావోయిస్టు కార్యకర్తల నాయకత్వంలో భాల్లు తెగల మహిళా ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమంగా పరిణితి చెందింది. ఉద్యమకారులు సారాకల్లు కొట్లలోని సారాయి కుండల్ని పగులగొట్టారు. తాగి భార్యలను హింసించే వారిని బహిరంగంగా శిక్షించేందుకు ప్రదర్శనలు జరిపారు. 1960 దశాబ్దం తొలి సంవత్సరాలలో స్వతంత్రానంతరం కుమవాన్లో ఆశ్రమాలు నెలకొల్పిన వినోబాభావే, గాంధీయ నాయకులు సరళాజన్ మిరాబెన్ యుపిలోని పర్వత ప్రాంతాలైన ఉత్తరాఖండ్ చిప్కో ఉద్యమంలో ప్రసిద్ధుడైన స్థానిక గాంధేయవాదైన సుందర్‌లాల్ బహుగుణల ప్రభావంతో ఇలాంటి ఉద్యమం సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో సారాయి అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. సారాయి దుకాణాలను పికెటింగ్ చేశారు. సారా వ్యతిరేక ఉద్యమాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెలరేగడం కొనసాగింది. ఇటీవల 1990 దశాబ్దం మధ్య కాలంలో
ఆంధ్రప్రదేశ్‌లో కేద (గ్రామీణ మహిళల శక్తివంతమైన సారా వ్యతిరేక నిరసన వెల్లువ స్వతంత్రం తర్వాత భారతదేశం 643
మద్వపాన నిషేధానికి, ఆ తర్వాత సారా అమ్మకంపై పరిమితి విధించడానికి దారితీసింది. గాంధీజీ మహిళా చైతన్యంలోని ముఖ్యమైన అంశాన్ని అవగతం చేసుకొని మద్యపాన బహిష్కరణ జాతీయ వాద కార్యక్రమంలో భాగంగా చేసి దాని అమలును మహిళలకు అప్పచెప్పారు.
1974 నుండి ఉత్తరాఖండ్‌లో మహిళలు చిప్కో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహిళలు చెట్లను కౌగిలించుకొని కలప కాంట్రాక్టర్లు చెట్లు నరికి వేయకుండా అడ్డుకోవడం వలన ఉద్యమానికి చిప్కో అనే పేరు వచ్చింది. ఇది పర్యానరణ పరిరక్షణ కొరకు చేపట్టిన మొదటి పెద్ద ఉద్యమం. అడవులు ధ్వంసమైతే మహిళలు వంట చెరకు, పశువుల మేత, నీటి కారకు మైళ్ళ కొలది నడిచి సేకరించవలసి వుంటుంది. పరిసరాల పరిరక్షణలో మహిళలు ప్రముఖ పాత్ర వహించారు.
మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌ఘడ్ తెగల ప్రాంతాలలో భిలాయ ఉక్కు కర్మాగారం యాంగ్రీకరణని 1977లో స్థాపించబడిన ఛత్తీస్‌ఘడ్ గనుల శ్రామిక సంఘంలో నిరసించేందుకు మహిళలు చురుకుగా పాల్గొన్నారు. మహిళా ముక్తి మోర్చా అనే కొత్త వేదికను స్థాపించారు. 1979లో జయప్రకాష్ నారాయణ ఆలోచనలో ప్రభావితమైన ఛాత్రయువ సంఘర్శవాహిని అనే సంఘం బోధి గయలోని ఆలయ పూజారులకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు పోరాటానికి నాయకత్వం వహించింది. దానిలో మహిళా కార్యకర్తలు సాధారణ మహిళలు ప్రధాన పాత్ర పోషించారు. పొలాలను మహిళల పేర్లతో కూడా రిజిష్టరు చేయబడి డిమాండ్ చేశారు. తరువాతి సంవత్సరాలలో ఈ డిమాండుకి మంచి ఆదరణ లభించింది. కాన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంచే పంచబడిన భూములు, పట్టాలు మహిళల పేర్లత్రో రిజిష్టరు చేయబడ్డాయి.
1984 యూనియన్ కార్చైడ్ ఫ్యాక్టరీ నుండి విడుదలైన రసాయనిక విషవాయువు బాధితులకు న్యాయం సాధించే ప్రయత్నంలో “భోపాల్ గ్యాస్ పీడిత మహిళా, ఉద్యోగ్ సంఘటన నాయకత్వ పాత్ర నిర్వహించింది. 1980 నుండి మహారాష్ట్రలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న షేట్కారీ సంఘటన యొక్క మహిళా విభాగంగా 1980 దశాబ్దం మధ్యభాగంలో సమగ్ర మహిళా రిగాధి ఆవిర్భవించింది. అది 1986 నవంబరులో నిర్వహించిన సదస్సుకి లక్షమందికి పైగా మహిళలు హాజరయ్యారు. సమాజంలోని ఇతర సెక్షన్ల కంటె మహిళల పట్ల పాశవికంగా వ్యవహరిస్తున్న రాజకీయాలకు వ్యతిరేకంగొ సదస్సు దృఢమైన వైఖరి చేపట్టింది. పంచాయితీ జిల్లా పరిషత్‌లకు జరుగనున్న ఎన్నికలలో మహిళా అభ్యర్థులను పోటీ పెట్టాలని నిర్ణయించింది.
(44 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మహిళా ఉద్యమంలో మరొక వైఖరికి చెందిన వారు స్వయం ప్రతిపత్తి గల మహిళా గ్రూపులను నిర్మించడం ప్రారంభించారు. ఈ [గ్రూపులు 1970 దశాబ్దం మధ్యకాలంలో పట్టణ కేంద్రాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో మావోయిస్టు లేక నక్సలైటు ఉద్యమంలో ్రభావితులైనవారు అధికంగా వున్నారు. 1970 దశాబ్దం ప్రారంభంలో ఉద్యమం క్షీణించడంతో వీరు స్రీ, పురుష సంబంధాలు, రాజకీయ సంస్థలలో మహిళల స్టానం సమస్యలపై చర్చ పునరాలోచన ప్రారంభించారు. ఈ చర్చలు చేపట్టిన తొలి సంస్థలు 1974లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలోని ప్రగతిశీల మహిళా సంఘం, 1975లో పూనాలోని పురోగామి స్త్రీ సంఘటన, బొంబాయిలోని ప్రీ విముక్తి సంఘటన, ఐక్యరాజ్యసమితి 1975 ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించటం మార్చి 8 న మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొనడానికి ఊపునిచ్చి వుంటుంది. అక్టోబరులో పూనాలో జరిపిన సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా గల మావోయిస్టు గ్రూపులకు సోషలిస్టు రిపబ్లికన్ పార్టీలకు, సి.పి.యం లాల్ నిషాన్ పార్టీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
1977లో ఎమర్జెన్సీ తరువాత మహిళా కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఢిల్లీలోని మహిళా [గ్రూపు 'మానుషి అనే పటత్రిక ప్రారంభించారు. మహిళా ఉద్యమం, చరిత్ర, మహిళా సాహిత్యం విశ్లేషణతో ప్రచురించింది. మధు కిషార్ సమర్థవంతమైన నాయకత్వంలో మహిళల సమస్యలకు సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురిస్తున్న ఆ పత్రిక యిప్పటికి కొనసాగుతున్నది.
జనతా పార్టీలోని మహిళలు ముఖ్యంగా సోషలిస్టులు మహిళా రక్షణ సమితిని స్థాపించి వరకట్న ప్రచారంలో ప్రముఖ పొత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన ప్రీ సంఘర్ష కూడా చురుకుగా పాల్గొన్నది. వరకట్న వేధింపులు, వరకట్న హత్యల సమస్య ప్రదర్శనలు వీధి నాటకాలు వరకట్న బాధితుల ఇళ్ళ ఎదుట ప్రదర్శనలు, చట్ట సంస్కరణ కొరకు డిమాండ్ల ద్వారా పెద్ద ఎత్తున చేపట్టబడింది. సి.పి.ఎం. మహిళా విభాగం అనుబంధ సంస్థ జనవాది మహిళా సమితి, 1981లో స్థాపించబడిన అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం (యం₹/%ు ఈ సమస్యపై యింటింటి ప్రచారం చేపట్టాయి. వరకట్న నిషేధ చట్టం (1961) సవరణ బిల్లు, పార్లమెంటు జాయింటు సెలక్ట్ కమిటీకి పంపించబడింది. కమిటీ దేశవ్యాప్తంగా పర్యటన చేపట్టగా 1981, 1982 సం[[లలో మహిళా సంఘాలు, కార్యకర్తలు కమిటీకి విజ్ఞప్తులు, సాక్ష్యాధారాలు అందజేశారు. స్వతంత్రం తర్వాత భారతదేశం 645
వరకట్న నేరాలను ్రోత్సహించటాన్ని వ్యతిరేకించే చట్టానికి బలం చేకూర్చే సవరణలు 1984 లో ఆమోదం పొందాయి. కాని వరకట్నం కొనసాగుతుండడం, తీసుకొన్న వారికి శిక్షలు పడేలా చేయటంలో గల ఇబ్బందుల కారణంగా అంతగా విజయం సాధించాలనే భావం ఉద్యమకారులకు కూడా కలగకపోవడంతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది. ఉద్యమం చేపట్టిన మరొక పెద్ద సమస్య మానభంగాలు ప్రత్యేకించి పోలీసులు చేసిన మానభంగాలు. 1978లో హైదరాబాద్‌లో రమీజాబీ కేసు, మహారాష్ట్రలో మధుర కేసు. 1980లో పశ్చిమ యు.పి.లో మాయాత్యాగి కేసు లాంటి పలు సంఘటనలు సమస్య తీవ్రతని ప్రజల దృష్టికి తెచ్చాయి. ప్రధాన రాజకీయ పక్షాలతో సహా మహిళా (గ్రూపులు సంఘాలు సమస్యని పెద్ద ఎత్తున చేపట్టాయి. మానభంగంపై అప్పటికి వున్న చట్టాన్ని సవరించే బిల్లు 1980లో ప్రవేశపెట్టబడింది. 1983లో బిల్లు ఆమోదం పొందింది. నిరూపణ బాధ్యత బాధితుల నుండి ఆరోపణలు ఎదుర్శొనే వారికి మార్చటం బిల్లు తీసుకొని వచ్చిన పెద్ద మార్పు. ఇది నేరాలు చేసిన వారికి శిక్షలు పడేలా చేయటంలో పెద్దమార్చులు తెచ్చింది. కాని ఈ కాలంలో ఉద్యమ గమనంలోని ఎగుడు దిగుళ్ల కారణంగాను, సిద్ధాంతం, వ్యూహాలలో విభేదాల కారణంగాను మహిళా ఉద్యమం మందగించింది. ప్రభుత్వం యొక్క సత్వర స్పందన కూడా చాలామంది కార్యకర్తలను తమ అజెండాని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నదనే భావం కలిగించింది. అంతేగాక సంస్కరణ ప్రయోజనాలను యిమడ్చుకొనగల అవకాశం లేని వ్యూహంలోని అంతర్గత బలహీనత పూర్తిగా వ్యక్తమయింది. ఉద్యమం మందగించింది. 1985 - 86లో షాబాను కేసు నిరసనలు అంతకు ముందుగల ఉత్సుకత ఐక్యత కొరవబడ్డాయి. అతి సాధారణ మహిళా హక్కుల సమస్య ముస్లిం విలక్షణలో ముడిపెట్టబడడం, ముస్లిం మహిళల హక్కుల పట్ల హిందూ మతతత్వవాదుల ఉత్సుకత - సంక్లిష్టం చేయబడిన వాతావరణం మహిళా హక్కుల కార్యకర్తల్ని గందరగోళపరిచింది, నిస్సహాయుల్ని చేసింది. అలాగే సతి లేక రాజస్థాన్‌లో దియోరలాలో రూప్‌కన్వర్ అనే యువతి హత్యకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనని కూడా హిందూ మతతత్వవాద (గ్రూపులు దానిని హిందూ సాంప్రదాయంపై జరిగిన దాడిగా చిత్రించి మహిళల్ని వారి సతి హక్కుని రక్షించుకొనడానికి వీధులలోని రప్పించడంతో సమస్య ప్రక్కదారి పట్టించబడింది. ఆసక్తికరంగా సతికి వ్యతిరేకత స్వామి అగ్నివేష్లాంటి ఆర్య సమాజవాదుల నుండి వచ్చింది. అగ్నివేష్ రాజస్థాన్, 646 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
హర్యానా గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి సతికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. ఆయన సతికి మత (గ్రంథాలలో గల ్రామాణికతపై చర్చించేందుకు పూరి బనారస్ దేవాలయాల అగ్ర పూజారుల్ని ఆహ్వానించారు. ఒరిస్సాలో గాంధేయవాదులు 10,000 మంది మహిళలతో ప్రదర్శన జరిపి పూరీ ఆలయ పూజారులలో పెద్దని మతపరమైన ప్రామాణికత నిరూపించమని ఘెరావ్ చేశారు. ఆయన ఎలాంటి ప్రామాణికతని చూపలేకపోయాడు. మహారాష్ట్ర కుల వ్యతిరేక ఉద్యమం నుండి రాజస్తాన్‌లోని గ్రామీణ మహిళల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమయింది.
1980లలో “స్వయం ్రతిపత్తో మహిళా గ్రూపులు ఆందోళనల నుండి న్యాయం సహాయం, పరిశోధన ప్రచురణ లాంటివి చేపట్టే మహిళా కేంద్రాల స్థాపన వైపు మరలాయి. ఢిల్లీలోని 'సహేలి' లాంటి మహిళా గ్రూపులు కేవలం మహిళల సమస్యలపై కేంద్రీకరించటమే గాక వారిలో వున్న సంగీతం, నృత్యం కళల్ని వ్యక్తీకరించుకొనే విధంగా ప్రోత్సహించడం అవసరమని భావించాయి.
మరికొన్ని సంఘాలు గ్రూపులు, పత్రికలు నడిపాయి. పత్రికలలో మహిళల ప్రతిష్టని దిగజార్చే అద్వర్బైజుమెంట్లు, సినిమాలలోని అసభ్యకర దృశ్యాలపై నిఘా వేశాయి. మహిళల ఆరోగ్య సమస్యల్ని ప్రస్తావించాయి. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాయి. మురికివాడలలో నివసించే ప్రీలు నీరు గృహ వసతుల సమస్యలకు ప్రచారం ఇచ్చాయి. కేవలం మహిళలు గాక యితర సమూహాలతో కలిసి పనిచేసే గ్రూపులు కూడా మహిళా సమస్యలపై దృష్టి పెట్టాయి.
హైదరాబాద్‌లో మహిళా సమస్యలపై సిద్ధాంతపరమైన అధ్యయనం చేసేందుకు అన్వేషి అనే వేదిక స్థాపించబడింది. ఢిల్లీలో మహిళాభివృద్ధి అధ్యయన కేంద్రం పరిశోధనని, అధికార పత్రాలు రుజువు చేసే క్రమాన్ని ప్రోత్సపాంచింది. మహిళా సమస్యలపై పత్రిక నడిపింది. 1990లలో యింకా చాలా యూనివర్శిటీ ప్రాతిపదిక గల కేంద్రాలు ఆవిర్భవించాయి. ఈనాడు యూనివర్శిటీలలో మహిళా సమస్యలపై అధ్యయనం చేసేందుకు వలసినంత పరిశోధనా పత్రాలు లభ్యమవుతున్నాయి.
ఉద్యమం స్పష్టంగా 1950 దశాబ్దం (ప్రారంభంలోలాగానే వ్యవస్థీకృతమైన దశలోకి ప్రవేశించింది. కొందరు కార్యకర్తలకు ఉద్యమం తగ్గుముఖం పట్టినట్లు కల్పించింది. కాని వాస్తవంగా ఉద్యమం ఆలోచనల్ని సమాజంలోకి విస్తరింపజేసింది. ఈ దశలో స్వతంత్రం తర్వాత భారతదేశం 647
సైద్ధాంతికాంశం కొంత పలుచబడి తీరుతుంది. ఉద్యమం యొక్క లక్ష్యాలలో, న్యూవాలలో పద్ధతులలో ఐక్యత లోపించిన మాట కూడా వాస్తవమే. కార్యాచరణపై ఏకాభిప్రొయాన్ని సాధించటానికి బదులు తక్షణ సంక్షోభాలకు స్పందించే వైఖరి అందుకు కారణం కొవచ్చు. ఉద్యమంలోని కొన్ని సెక్షన్లు విదేశీ సంస్థల నుండి ఆర్థిక వనరులు పొంది. భారతదేశంలోని ఉద్యమానికి సంబంధం లేని వనరులు సమకూర్చిన వారికి సంబంధించిన సమస్యలు చేపట్టారనే విమర్శలు వున్నాయి. పట్టణ విద్యావంతులైన మహిళా గ్రూపుల పేద గ్రామీణ పేదల లేక పట్టణ పేదల మహిళా (గ్రూపుల సమస్యల మధ్య అంతరం అలాగే వుండిపోయింది.
అలాగని అప్పటివరకు సాగించిన ఉద్యమాల కృషి వృధా అయిందని అర్ధం కాదు. ప్రభుత్వ విధానం సత్ఫలితాలనిచ్చింది. మహిళల ఆరోగ్యం, విద్య రాజకీయ భాగస్వామ్యం కొరకు పథకాలను రూపొందించి 1988లో ప్రభుత్వం మహిళల సమస్యలపై నిర్దిష్టమైన జాతీయ పథకంలో ముందుకు వచ్చింది. పంచాయితీలలోని మూడవ వంతు సీట్లు మహిళలకు రిజర్వు చేయబడాలని ఆదేశించిన పంచాయితీరాజ్ బిల్లు 1989లో ప్రవేశపెట్టబడింది. (అది 1990లో ఆమోదం పొందింది) గ్రామీణ ప్రాంతాల మహిళలు, బిడ్డల అభివృద్ధి పథకం (0/41624) ప్రవేశపెట్టబడింది. పేద మహిళల్ని (గ్రూపులుగా సంఘటితపరచడంలో స్థానిక వలంటరీ గ్రూపులు, రాజకీయ కార్యకర్తలు సహాయపడ్డారు. మరొక నూతన పథకం మహిళా కోష్ ప్రారంభించబడింది. ఇది మహిళా మండలి సభ్యుల నిపుణులను జీవనస్థాయిని పెంచుకొనేందుకు మహిళలకు ఈ సదుపాయం కల్పించింది. ఈ పథకాలు సమర్థవంతంగా సనిచేయడమనేది స్థానిక స్థాయి నాయకత్వం వీటిని వినియోగించుకొానడంపై ఆధారపడి ఉంటుంది. ఇది మహిళా సమాజంపై మహిళల రాజకీయీకరణ స్థాయి చైతన్య స్థాయిని బట్టి మారుతుంటుంది. కాని చాలొ (గ్రూపులు పేద గ్రామీణ మహిళల దగ్గరికి వెళ్ళి సహాయపడటానికి ప్రభుత్వం యొక్క చట్టబిద్ధతని ఉపయోగించుకోగలిగాయి.
స్థానిక జాతీయ రాజకీయాలలో మహిళల పాత్రని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయితీలలో మూడవవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. గనుక ఎన్నికైన పంచాయితీ సభ్యులకు, గ్రామ సర్పంచులకు వారి పాత్ర సరిగా నిర్వహించేందుకు శిక్ష యివ్వటం జరుగుతున్నది. పార్లమెంటులో మూడవవంతు సిట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు కొంత కాలంగా గట్టి ప్రయత్నం జరుగుతున్నది. అందుకు మహిళా రాజకీయ వేత్తలు, మహిళా గ్రూపుల కొన్ని రాజకీయ పార్టీల మద్దతు వున్నది, 648 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్దీ, ఆదిత్య ముఖర్జీ
ఆరోగ్యం - విద్య
చాలా వెనుకబడిన రాష్ట్రం (రాజస్తాన్)లోని వెనుకబడిన జిల్లా బార్మర్‌లో మహిళల అక్షరాస్యతా శాతం 8 ఇది సబ్ సహరన్ ఆఫ్రికాలోని వెనుకబడిన దేశం బర్మినఫాసోలో కంటె తక్కువ. అక్కడ అక్షరాస్యతా శాతం 10. భారతదేశంలోని వెనుకబడిన జిల్లా గంజాం శిశు మరణాల రేటు వెయ్యికి 164. ఇది సబ్ సహారన్ ఆఫ్రికాలోని వెనుకబడిన దేశం మాలి కంటె అధ్వాన్నంగా వుంది. అక్కడి శిశుమరణాల రేటు 16% యు,పి.లో 6060110 5% ఇది తక్కువ ఆదాయం వచ్చే దేశాల సరాసరి కంటె ఎక్కువ. బర్మా, బంగ్లాదేశ్‌ల కంటె చాలా ఎక్కువ స్తీ పురుష నిష్పత్తి ఉండే ప్రతి 1000 మంది పురుషులకు గల మహిళల సంఖ్య 865. ఇది ప్రపంచంలో అన్ని దేశాలకంటె తక్కువ.
12-14 వయో పరిమితిలో వుండి ఏ పాఠశాలలో నమోదు కాని బాలికలు భారతదేశం మొత్తంలో చూసినప్పుదు దాదాపు సగం మంది వున్నారు. యు.పి, యం.పి, బీహారులలో మూడింట రెండు వంతులకు పైగా వున్నారు. రాజస్థాన్‌లో 82 శాతం మంది వున్నారు. 10-14 వయో పరిమితిలో వున్న గ్రామీణ బాలికలలో 42 శాతం 5- 9 వయోపరిమితిలో వున్న గ్రామీణ బాలబాలికలలో 40శాతం మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు. మధ్యలో బడి మానుకొనే వాది శాతం చాలా ఎక్కువగా వుంది. భారతదేశం మొత్తం మీద ఒక సం॥లో పైబడిన వారు పాఠశాలకు సరాసరి హాజరయ్యే సంవత్సరాలు 2.4 మహిళల సరాసరి 1.2 సం॥లు. పురుషుల సూసరి 8-5 సం॥లు 15-19 వయోపరిమితిలో వున్న ప్రీలలో సగంమంది నిరక్షరాస్యులు చైనాలో 10 శాతం కంటె తక్కువ.
అఖిల భారత సరాసరి, వెనుకబడ్డ ప్రాంతాలను గురించి చెప్పి వదిలివేస్తే ఆశావహమైన ప్రాంతాలు విరజిమ్మే వెలుగు రేఖలను విస్మరించినట్లువుతుంది. కేరళ రాష్ట్రం సాధించిన ప్రగతి ఏ అభివృద్ధి చెందుతున్న దేశానికైనా అసూయ కలిగించే విధంగాను, కొన్ని అంశాలలో అభివృద్ధి చెందిన జేశాలతో సమానంగాను వుంది. వయోజన మహిళల అక్షరాస్యతారేటు 1990-91లో 86 శాతం (పురుషుల అక్షరాస్యతా రేటు 94 శాతం) ఇది చైనా కంటె చాలా ఎక్కువ. అక్కడ మహిళల అక్షరాస్యతా లేటు 68 శాతం, పురుషుల అక్షరాస్యత రేటు 86 శాతం. కేరళలో సాధించింది చైనాలోని ఏ ప్రాంతంలోనైనా సాధించిన దానికంటె కూడా ఎక్కువ. 1987-88 నాటికి 10-14 వయోపరిమితిలో వున్న కేరళ (గ్రామీణ బాలికల అక్షరాస్యతా రేటు 98 శాతం. 1992-98 నాటికి ప్రాథమిక విద్యపూర్తి చేసిన ఆరు సంవత్సరాలు ఆ పై వయస్సు గల బాలికల శాతం 60. సంబంధిత అఖిల స్వతంత్రం తర్వాత భారతదేశం 649
భారత శాతం 28.1% మాత్రమే. 1992లో జననోత్పత్తి రేటు 1.8. ఇది లక్షేలోగొ నిర్దేశించుకొన్న 28.1% (అమెరికా స్వీడన్ల) రేటు కంటె తక్కువ. అఖిల భారత సోని జనానోత్పత్తి రేటు 3.1 మహిళల స్థితిగతులతో సన్నిహిత సంబంధం గల శిశు మరణాలు కేరళలో 1992లో 10008 17 మాత్రమే. సంబంధిత సంఖ్యలు చైనాలో 31, భారతదేశం మొత్తం తీసుకుంటె 79, స్త్రీ పురుష నిష్పత్తి1990-91 కాలంలో 1004 నుండి 1085 కి పెరిగింది. అదే కాల వ్యవధిలో అఖిల భారత స్థాయి 972 నుండి 927కి తగ్గింది. అదృష్టవశాత్తు కేరళ మాత్రమే ఉజ్వలమైన ఉదాహరణ కాదు. విద్యావ్యాప్తి కొరకు ముందుగా ప్రయత్నాలు ప్రారంభించిన చారిత్రక అనుకూలత, రాష్ట్ర జనాభాలోని గణనీయమైన భాగం మాతృస్వామ్య సొంప్రదాయాలు పాటించడం - కారణాలుగొ కేరళ అభివృద్ధి చెందినట్లుగా కన్పించవచ్చు. ఈ రెండు వాస్తవాలే. వీటితో పాటు ఆధునిక కేరళలు పెద్ద భాగంగా వున్న తిరువాన్సూరు కొచ్చిన్ సంస్థానాలు 19 శతాబ్దం (ప్రారంభం నుండి విద్యకి ప్రాధాన్యత నిచ్చాయి. మాతృస్వామ్య విధానం - మహిళల ద్వారా వారసత్వపు హక్కులు సంక్రమించటం కూడా బలమైన సానుకూలమైన అంశం. అంతేగాక చురుకైన భాగస్వామ్య రాజకీయ సంస్కృతి, ఆ సంస్కృతికి తోద్బడిన అక్షరాస్యతా స్థాయి, ఆరోగ్యం ప్రజాపంపిణీ విధానం, ప్రాధమిక విద్య - లాంటి యితర అంశాలు కూదా చాలా ముఖ్యమైనవి. హిమాచల'ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ సానుకూలమైన అంశాలను అనుకరించి అభివృద్ధి సాధించాయి. 1961లో కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో మహిళల అక్షరాస్యతా రేటు 9 శాతం (పురుషుల అక్షరాస్యతా రేటు 21 శాతం) - అఖిల భారత సరూసరి కంటె చాలా తక్కువగా వున్నాయి. 1987-88 నాటికి 10-14 వయో పరిమితిలో వున్న బాలికల అక్షరాస్యతారేటు గ్రామీణ ప్రాంతాలలో 81 పట్టణ ప్రాంతాలలో 97 (బాలుర సంబంధిత సభ్యులు 95 శాతం 96 శాతం) ఆ విధంగా పట్టణ ప్రాంతాలలో బాలుర కంటె బాలికల అక్షూూస్యతా శాతం ఎక్కువ. ఈ విషయంలో కేరళ తరువాత రెండవ స్టానం హిమాచల్‌ప్రదేశ్‌కి దక్కింది. పట్టణ ప్రాంతాలలో పాఠశాలకు హాజరయ్యే బాలికల విషయంలో హిమాచల్‌ప్రదేశ్ కేరళని అధిగమించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 95 శాతం, కేరళలో 94 శాతం. గ్రామీణ (ప్రాంతాల విషయానికి వస్తే కేరళ, హిమాచలప్రదేశ్ కంటే చాలా ముందు వుంది. కేరళలో 591 శాతం హాజరవుతుండగా హిమాచలప్రదేశ్లో 73 శాతం మాత్రమే. ఐనప్పటికి హిమాచల్‌ప్రదేశ్ యితర రాష్ర్రాల కంటె చాలా ముందుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో 1901-1991 కాలంలో ప్రీ పురుష నిష్పత్తి 884:976. భారతదేశం మొత్తంలో యిది అత్యంత ఎక్కువ (492) పెరుగుదల కేరళలో యిది 1004 నుండి 1036 కి పెరిగింది. 450 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
1991లో హిమాచల్‌ప్రదేశ్‌లో ౦-4 వయో పరిమితిలో గల ఆడమగ శిశు మరణాల రేటు నిష్పత్తి 88.2 సంబంధిత కేరళ రేటు 91.1 శాతం కంటె కూడా తక్కువ. అఖిల భారత సరాసరి 107.4 శాతం కంటె చాలా తక్కువ. ఐనప్పటికి శిశు మరణాల రేటు 1990-92లో శ్రతి వెయ్యికి 70, అలాగే 1991లో జననోత్పత్తి రేటు 3.1 ఈ రెండు కూడా అఖిల భారత సరాసరి కంటె తక్కువ.
తమిళనాడులో కూడా వివిధ స్రీ పురుష సంబంధమైన సూచికలలో గణనీయమైన పెరుగుదల వుంది. 1991లో జననోత్పత్తి రేటు 2.2. ఈ అంశంలో కేరళది ప్రథమస్థానంలో వుండగా తమిళనాడుది రెండవస్థానం. శిశు మరణాల రేటు 1990-92లో ప్రతి వెయ్యికి 58. అంటే తమిళనాడు 3వ స్టానంలో వుంది. ప్రథమ, ద్వితీయ స్థానాలు కేరళ పంజాబులవి. 1987-88లో 10-14 వయోపరిమితిలో గల బాలికల అక్షరాస్యతా శాతం పట్టణ ప్రాంతాలలో 85.6 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 70.8 శాతం, 1991లో 0-4 వయో పరిమితిలో గల బాలికల బాలుర మరణాల రేటు నిష్పత్తి 90.5 శాతం. అఖిల భారత సరాసరి రేటు 107.4 శాతం. 1992-93 నాటికి 12-28 నెలల వయోపరిమితిలో గల బిడ్డలలో 97 శాతం మందికి రోగ నిరోధక టీకాలు వేయటం జరిగింది. దేశంలోనే ఇది అత్యంత ఎక్కువ శాతం.
ఈ వైవిధ్యం లింగ వివక్షకి చెందిన ప్రతికూల అంశాల విశ్లేషణ చేయటానికి ఉపకరిస్తుంది. చరిత్ర సాంప్రదాయాలు చాలా ముఖ్యమైనప్పటికి, దక్షిణ భారతదేశానికి చారిత్రకంగా మంచిరికార్డు వున్నప్పటికి ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత త్వరితమైన మార్పు తీసుకొనిరాగలదని హిమాచలప్రదేశ్ స్పష్టం చేస్తున్నది. ఆర్థికపరమైన అభివృద్ధి లేక పెరుగుదల దానంతట అది మహిళలకు న్యాయం జరిగేందుకు దారి తీయదు. అభివృద్ధి చెందిన రామ్ష్రాలైన పంజాబు, హర్యానాలలో లింగవివక్షను తగ్గించడానికి అంతగా ప్రయత్నాలు జరగలేదు. మహిళ: అక్షరాస్యత, విద్య - యితర సూచికలలోని అభివృద్ధితో సంబంధాల ద్వారా మహిళల అభ్యున్నతికి దారితీస్తాయి. విపర్యయంగా అక్షరాస్యత విద్యలలోని తక్కువస్థాయి యితర సూచికలలో ప్రతికూల ధోరణులకు దారితీస్తుంది.
కాబట్టి అక్షరాస్యత ప్రాధమిక విద్య రంగాల వైఫల్యం వలన బాధలకు గురయ్యేది స్రీలు. (గ్రామాలలోని పాఠశాలలు సరిగా పనిచేయినప్పుడు అబ్బాయిలకు పొరుగు గ్రామాలకు లేక పట్టణాలకు లేక ప్రైవేటు పాఠశాలలకు పంపించటం జరుగుకుంది. అమ్మాయిలను సాధారణంగా యిళ్లలోనే వుంచుతారు. కారణం అమ్మాయి చదువు వలన వచ్చే ఫలితాలు అమ్మాయి అత్తగారింటివాళ్లు పొందుతారు గనుక అమ్మాయి చదువుకి స్వతంత్రం తర్వాత భారతదేశం 651
పెట్టే ఖర్చు పొరుగింటిలో వున్న మొక్కకి నీరు పోయటం లాంటిదనే భావన ప్రబలంగా వుండటం వలన అమ్మాయిలను యిళ్లకే పరిమితం చేస్తారు. కాని కావలసినన్ని పాఠశాలలు వుండి ఉపాధ్యాయులు సక్రమంగా వచ్చి తరగతులు నిర్వహిస్తే దేశంలో అత్యధిక ప్రాంతాలలో అమ్మాయిలను బడికి పంపించటం జరుగుతుంది. ఈ మేరకు విద్యవిలువ పట్ల చైతన్యం అత్యంత పేద ప్రజల సెక్షన్లలో కూడా వ్యాప్తి చెందింది. సామాజికంగా పైకి ఎగబాకటానికి విద్య వారికి ఒక మార్గమని చాలా స్పష్టంగా తెలుసు. కాని దేశంలోని పాఠశాలల్లో మూడవవంతు పాఠశాలల్లో ఒకే ఒక ఉపాధ్యాయుడు పనిచేసే పరిస్థితిలో (1986లో) మూడింట రెండువంతుల మంది ఉపాధ్యాయులు గైర్జాజరవుతున్న పరిస్థితులలో, 6-10 వయోజన పరిమితిలో వున్న 58 మంది పిల్లలకు ఒకే ఉపాధ్యాయుడిని నియమించే పరిస్థితులలో విద్యకి వెచ్చించే తలసరి వ్యయంలో 116 దేశాలలో భారతదేశం 82వ స్థానంలో వున్న పరిస్థితులలో మహిళా అక్షరాస్యత 39 శాతంగానే వుండడంలో విపరీతమేమీ లేదు (1990- 91).
, మహిళల స్థితిగతులను మెరుగుపరచేందుకు దిగువస్థాయి నుంది ఉచిత ప్రాథమిక అరోగ్య వసతులు కల్పించాలి. విద్యలో లాగానే ఆరోగ్యవసతులు అందుబాటులో లేకపోతే లేక పెద్ద ఖర్చుతో కూరుకున్నవయితే నష్టపోతున్నది స్రీలు, బాలికలు. మెరుగైన వసతులకు మెరుగైన స్థాయికి గల అవకాశాలలో వ్యత్యాసాలు 1901 -1999 కాలంలో స్రీ పురుషనిష్పత్తి 972 నుండి 927కి తగ్గడానికి ప్రధాన కారణం. పురుషులతో పోల్చి చూస్తే ఆరోగ్య వసతులకు జీవనస్థాయికి కల్పించబడిన అవకాశాల నుండి మహిళలు తక్కువ ప్రయోజనాలు పొందారు. అందుకే వారి నిష్పత్తి తగ్గింది. ఈ అసమానతని తగ్గించేందుకు ఆరోగ్యవసతులు మహిళల అందుబాటులోకి తీసుకొని రావాలి. కేరళలో యిలాంటి వసతులు అందుబాటులోకి తీసుకొని రావడం వలన 90 శాతం ప్రసవాలు ఆస్పత్రులలో జరుగుతున్నాయి. మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయి.
ఆ విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన చట్టపరమైన రాజకీయపరమైన హక్కులు - సామాజిక న్యాయపరంగాను వారి ప్రయత్నాల పరంగాను వారివైన హక్కులు
- సాధించబదాలంటే, 'ప్రజాస్వామ్యబద్ధం చేయబడాలంటే లక్షలాది మహిళలు వాటిని అవగాహన చేసుకోగలగాలి, వినియోగించుకోగలగాలి. దేశం యొక్క రెండు ధృవాలలో వున్న కేరళ, హిమాచలప్రదేశ్లు దారి చూపాయి. మిగిలిన రాష్ట్రాలు అనుసరించాలి. మహిళా ఉద్యమం కూడా విద్య ఆరోగ్యాలకు మహిళా సాధికారికత వ్యూహంలో 'ప్రాధమ్యాలుగా చేర్చుకోవాలి.
652 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
39 జ్ వలస వాదానంతర భారత రాజ్యం ఆలి
రాజకీయ ఆర్దికాభివృద్ధి : పరిశీలన
1947లో స్వతంత్ర భారతదేశానికి జన్మనిచ్చిన జాతీయ విముక్తి పోరాటం వలస వాదానంతర భారత రాజ్యంపై ప్రగాఢ ముద్రవేసింది. స్వతంత్రం వచ్చి అర్ధ శతాబ్దం పైగా కాలం గడిచింది. దేశం నూతన సహస్రాబ్దీలోనికి అడుగిడింది. ఏ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం ఎదురొడ్డి దృఢంగా పోరాడిందో వాటిలో కొన్ని ఉపరితలంపైకి వచ్చాయి. జాతి నిర్మాణానికి సవాళ్ళు విసురుతున్నాయి. జాతీయోద్యమం లేక విముక్తి పోరాట భారత ప్రజల యొక్క బహుళ ప్రజా ఉద్యమం. శతాబ్ద కాలం సాగిన ఈ సుదీర్చ పోరాటం జాతీయ విప్లవానికి దారితీసింది. వర్గ కుల మత లింగ వివక్ష వయోభేదాలను అధిగమించి తరతమ భేదాలతో అందరికీ ప్రాతినిధ్యం వహించింది గనుక యిది జాతీయ విప్లవమయింది. ఏ దేశంలో కూడా యింత వైవిధ్యభరితమైన రంగాల నుండి ప్రజలను ఆకట్టుకొని ఆకర్షించిన విప్లవం బహుశా ఉండదు. సంఘ మత సంస్కర్తలు కవులు రచయితలు కళాకారులు తాత్వికులు వర్తకులు పారిశ్రామికవేత్తలు, రాజకీయ మేధావులు. రాజనీతిజ్ఞులు - అందరూ సాధారణ ప్రజలతో చేతులు కలిపారు. ప్రజల నుండి నేర్చుకొన్నారు. మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటైన ఈ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించారు. ఉద్యమం యొక్క ఈ స్వభావం భారత జాతీయ రాజ్యానికి నూతనత్వాన్ని సమకూర్చింది.
జాతీయోద్యమం విస్తృతమైన ప్రజల భాగస్వామ్యం గలప్రజా ఉద్యమమే గాక జాతీయ రాజ్యం యొక్క మనుగదని, దాని ప్రత్యేక స్వభావాన్ని వివరించే కొన్ని మౌలిక స్వతంత్రం తర్వాత భారతదేశం 658
లక్షణాలు గల ఉద్యమం. అవి సామ్రాజ్యవాద వ్యతిరేకత. సెక్యులర్ పజానివనో పేదల కనుకూలమైన వైఖరి పట్ల పూర్తి నిబద్ధత, శ్రేణుల ప్రాతిపదిక గల విప్లవో ద్యమానికి భిన్నంగా (ప్రజా ఉద్యమంగా వుండటమంటే ఉద్యమం యొక్క మౌలిక లక్షణాలను వెనుకకు మరల్చడం దాదాపు అసాధ్యమయ్యేంతగా ఆలోచనలకు భారతీయ సమాజంలోని అట్టడుగు పొరలలోకి జొప్పించడం. అందువలననే ఈ సూత్రాల నుండి వైదొ లగడం గొని లేక వాటిని ప్రక్కన పెట్టడానికి ప్రయత్నించినపుడు గాని భారతదేశ ప్రభుత్వాలు బలమైన ప్రతిఘటన నెదుర్కొన్నాయి. (అత్యవసర పరిస్థితి 1975-77 కాలంలో ప్రజాస్వామ్య హక్కులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించినప్పుడు ప్రజల నుండీ పెల్లుబికిన స్పందన. భారత విముక్తి పోరాటం లేక జాతీయోద్యమం యొక్క మౌలిక భావాలు స్వతంత్రం వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు, అధికార వర్గం పోలీసు న్యాయ వ్యవస్థ చట్టసభలు విద్యా విధానం పత్రికలు రాజకీయ పార్టీలు లాంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అలాగే పొర సమాజాన్ని సాధారణ ప్రజలను ప్రభావితం చేసిన పరిమితి స్వతంత్ర్యానంతర భారత రాజ్య స్వభావాన్ని నిర్ణయించడంలో కీలక పొత నిర్వహి చింది. ప్రభుత్వం రాజ్యం యొక్క చాలా ముఖ్యమైన, కీలకమైన సాధనమైనప్పటికీ (ప్రభుత్వం అంటే రాజ్యమని గందరగోళపడకూడదని వివరించడం అవసరం. ప్రభుత్వమే అన్నీ చూనుకుంటుందనే ఆలోచన నరియైనవి కాని తొందరపాటు అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి దారితీయవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రౌలాంటి దృఢమైన సోషలిస్టు నాయకత్వంలో వుండవచ్చు. అది రాజ్యాంగంతో పార్లమెంట్‌తో సోషలిజం లక్ష్యంగా ప్రకటించేటట్లు చేయవచ్చు. అది పేదలు భూమిలేనివారు అణగారిన కులాలు తెగలు లాంటి వారి రక్షణకు బలమైన చట్టాలు చేసి వుండవచ్చు. అయినప్పటికీ రాజ్యం సోషలిస్టు రాజ్యంగా గాక బూర్జువా రాజ్యంగా వుండవచ్చు. కారణం రాజ్బ యంత్రాంగంలో సమాజంలో మొత్తంగా అధికార పొందిక ప్రభుత్వ నాయకత్వంలో బదా, నిర్ణయించవచ్చు. రాజ్య చట్రాన్ని నిర్మించడం లేక మార్చటం అంటే కేవలం ప్రభుత్వం కాదు. అంతకంటే చాలా ఎక్కువ. గాంధీజీ రాజ్యం యొక్క సంక్షిష్ట స్వభావాన్ని బాగా అవగతం చేసుకొన్నాడు. వలస రాజ్యాన్ని కూల్చటంలో జయప్రదమైన తన ప్రయత్నంలో భాగంగా 65% బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆయన వలసవాద (ప్రభుత్వాన్ని విమర్శించడం మార్చటం పైననే గాక వలసవాద రాజ్య అధికారాన్ని క్రమబద్ధంగా నిర్వీర్యం చేయడంపై కేంద్రీకరించాడు. దీనిని ఆయన విద్యా విధానంలో పత్రికలలో పోలీసులలో అన్నిటిని మించి ప్రజలలో వ్యాపించిన వలసవాద ప్రభావాన్ని ప్రతిఘటించడం ద్వారా సాధించ యత్నించాడు. వలసవాదానంతర భారత రాజ్యానికి ప్రత్యామ్నాయ దిశా నిర్దేశం చేయాలనుకాన్న వారిలో అలాంటి అవగాహన లోపించింది. జాతీయ వాద వారసత్వం, వలసవాదానంతర రాజ్యం జాతీయోద్యమ వారసత్వంగా 1947 తరువాత ప్రజాస్వామ్య సర్వ సత్తాక బహుళ వర్ష జాతీయ రాజ్యం ఏర్చడింది. రాజ్యంలోని వర్గ పొందిక లేక వర్గ స్వభావం రాజకీయ సమీకరణ యొక్క వ్యూహాలచే లేక వివిధ వర్ణాల చేత కూడగట్టబడే సామాజిక మద్దతు చేత రూపొందింపబదాలి. జాతీయోద్యమం యొక్క అంక్షలు లేని స్వభావం ఒక వర్షం లేక వర్గాల గ్రూపుకి అనుకూలంగా లేక ప్రతికూలంగా వర్గ దృక్పథం మార్చడానికి సాధ్యం చేస్తుంది. రెండవది : జాతీయోద్యమం వారసత్వంగా సామ్రాజ్యవాద వ్యతిరేకతని జాతీయ సర్వ సత్తాధికార నిర్వహణని అందజేసింది. జాతీయోద్యమ నిర్మాతలు 19వ శతాబ్దం చివరి పాదం నాటికే సామ్రాజ్యవాదంపై వలసవాద నిర్మాణంపై సమగ్రమైన విమర్శ నభివృద్ధి చేశారు.' ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికీ అలాంటి విమర్శ నభివృద్ధి పరచడంలో వారు ప్రథములు. ఆధునిక సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందదానికి పరిస్థితుల్ని సృష్టించడం కంటే వలసలకు ఏ విధంగా వెనుకబాటుతనానికి గురిచేస్తుందో దాదావు మార్చ్ కనుగొన్నప్పుడే కనుగొన్నారు. వోబ్బన్ లెనిన్‌ల కంటే ముందే వలసవాదంపై వివరణాత్మక విమర్శని అభివృద్ధిపరిచారు. సామ్రాజ్యవాద వ్యతిరేక సుదీర్ధ పోరాటం, మారుతున్న పరిస్థితులను గమనంలోకి తీసుకొని అభివృద్ధి పరచిన విమర్శకి సంబంధించిన ఆలోచనలను ప్రజలలో ప్రచారం చేయడం - ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. లాటిన్ అమెరికాలో తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో పరాధీన పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి కీలకంగా భావించబడిన అంతర్జాతీయ పెట్టుబడి, రాజ్యం (స్వదేశీ ప్రభుత్వం), దేశీయ పెట్టుబడి - కలయిక గల పాలక సంకీర్ణ నమూనా స్వతం[త్రం తర్వాత భారతదేశం 655
భారతదేశానికి వర్తించదు. భారతదేశంలో స్వతంత్రానంతరం పాలకవర్గ సంకీర్ణంలో విదేశీ పెట్టుబడి భాగస్వామి కాదు.
విదేశీ పెట్టుబడికి సామ్రాజ్యవాదానికి బహుళ జాతి సంస్థలకు విధేయత గల భాగస్వాములుగా సహకరిస్తున్న బూర్జువా బదా బూర్జువా భూస్వామ్య వర్గం ప్రాబల్యం స్వతంత్ర భారతదేశం వుందనే ఆలోచనని చాలాకాలం వరకు సంప్రదాయవాద పక్షంలోని ఒక సెక్షన్ బలపరచింది. స్వతంత్రం వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన భొరతీ బూర్జ్చువాలు లేక పెట్టుబడిదారీ వర్షం సొమ్రాజ్యవాదంతో రాజీపడుతున్నదని, ఫలితంగా స్వతంత్రానంతర భారత రాజ్యం నయా వలస రాజ్యమని కూడా వాదించడం జరిగింది. కాబట్టి గతంలో వలసవాద పాలనలో వున్న భారతదేశం లాంటి దేశాలు సోషలిస్టు విధానానికి అనుకూలంగా పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయనిదే స్వతంత్రంగా అభివృద్ధి చెందజాలమన్నారు. ఈ ఆలోచనలు సవాలు చేయబడ్డాయి. వీటికి విరుద్ధమైన సాక్ష్యాధారాలు వీటిని తోసిపుచ్చాయి.
భారత పెట్టుబడిదారీ వర్గం యొక్క రాజకీయ ఆర్ధిక స్వతంత్రాన్ని గురించి, అలాగే అది జాతీయోద్యమం యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక సాంప్రదాయాల్ని స్వాయత్తం చేసుకొనడమే గాక 1920ల నుండి సామ్రాజ్యవాద ఆర్థిక విధానంపై విమర్శ నభివృద్ధి పరచడంలో ఏ విధంగా అగ్రభాగాన వున్నదీ ఈ (గ్రంథంలోనే మరొక చోట వివరించాలి. భారతదేశాన్ని సామ్రాజ్యవాద లేక విదేశీ ప్రాబల్యానికి లోను గాని ప్రణాళికాబద్ధమైన స్వావలంబన ఆర్థికాభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలన్న నెహ్రూ సాధించిన ఏకాభిప్రాయంలో పెట్టుబడిదారులు భాగస్వాములుగా వున్నారు. నెహ్రూ - మహలనొబిస్ వ్యూహంలోని ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి : భారత అర్ధిక వ్యవస్థకి విదేశీ ప్రాబల్యం నుండి విముక్తి కల్పించడం, భారతదేశంలో విదేశీ పెట్టుబడిని విస్మరించదగిన స్థాయికి తగ్గించి ఈ లక్ష్యాన్ని ఇందిరాగాంధీ హయాంలో సాధించడం జరిగింది (25, 28 అధ్యాయాలు చూడండి). కార్మికవర్గం సంఘాలుగా రూపుదిద్దుకొన్నప్పటికీ అది కార్చొరేటీకరణ చెందుతున్నది. రాజకీయ ప్రత్యామ్నాయంగా వామపక్షాలు కార్మికవర్గంలో కూడా పట్టు కోల్పోతున్నాయి. ప్రస్తుత వ్యవస్థకు ధీటైన సవాలుగా ఎదగలేకపోతున్నాయి. బూర్జువా వర్గం తన మనుగడకు సామ్రాజ్యవాదాన్ని ఆశ్రయిస్తుందని, విదేశీ సహాయం అర్ధిస్తుందని ఊహాగానాలు చేస్తున్నాయి. ఇక ఫ్యూడల్ భూస్వాముల విషయానికి వస్తే 656 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వారి శక్తి జాతీయోద్యమ కాలంలోనే హరించబడింది. స్వతంత్రానంతర భూసంస్కరణలతో వారు ఒక మూలకు నెట్టివేయబడ్డారు.
భారతదేశ ఉన్నత విద్యా సంస్థలలో కొంత పలుకుబడి గల వామపక్షవాద విమర్శకులు 1947లో సాధించిన స్వతంత్రం వలసవాదుల నుండి నెహ్రూ కాపలాదారుగా వున్న నయా వలస రాజ్యానికి అధికార బదిలీ కాదని సణుగుతూ అంగీకరించారు. వారు సరళీకరణ దిశగా చేపట్టే ఎలాంటి చర్యలోనైనా దానిలో అంతర్గతంగా యిమిడి వున్న సామాజ్యవాద అనుకూలతను, భారత రాజ్య పరాధీన స్వభావాన్ని చూస్తున్నారు. 1960 దశాబ్దంలో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూపాయి విలువ తగ్గించి వాణిజ్య సరళలీకరణకు ప్రయత్నించినప్పుడు ఇదే వాదన చేశారు. 1960 దశాబ్దం చివరి సంవత్సరాలతో 1970 దశాబ్దంలో ఇందిరాగాంధీ ఆర్థిక జాతీయవాదం దిశగా మరలినప్పుడు ఈ విమర్శలను ప్రక్కనబెట్టారు. మరలా 1980 దశాబ్దం ప్రారంభంలో సరళీకరణ ప్రయత్నాలతో భారతదేశం ఐ.ఎం.ఎఫ్. నుండి పెద్ద మొత్తం అప్పు తీసుకున్నప్పుడు ఈ విమర్శలను మరలా ముందుకు తెచ్చారు. ఇటీవల 1991 తరువాత సరళీకరణ (వ్రపంచీకరణలలో చురుకైన భాగస్వామ్యంతో కూడిన చర్యలను స్వతంత్రానంతరం అనుసరిస్తూ వచ్చిన విధానాన్ని వెనక్కి తిప్పటంగా తిరోగమన చర్యలుగా పరిగణిస్తున్నారు.
భారతదేశంలో సంస్కరణలపై ఇటీవలి కాలంలో వచ్చిన బహు జనాభిప్రాయం ఇందుకు భిన్నంగా వుంది. ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ పెట్టుబడిదారీ విధానం మార్పులకు గురైన పరిస్థితులలో, దేశీయాభివృద్ధి కొరకు ప్రపంచ పెట్టుబడిని ప్రపంచ మార్కెట్లకు వినియోగించుకొనే అవకాశాలు ఆవిర్భవించినపుడు, సమర్ధత ఉత్సాదక స్థాయి ప్రమాదకరమైన స్థితికి పడిపోవడానికి దారితీసే సంరక్షణ వాద వ్యూహం నుండి బయటపడి ప్రపంచీకరణ క్రమంలో భాగస్వామ్యం వహించాలనే (ప్రేరణ సంస్కరణలకు అనుకూలంగా విస్తృతమైన ఏకాభిప్రాయానికి దారితీసింది.
ఇది లక్ష్యాల దృష్ట్యా మద్దతు దృష్ట్వా నెహ్రూ కాలం నాడు సాధించిన బహుజన సమ్మతిని జ్ఞప్తికి తెస్తుంది. స్వావలంబన, త్వరితాభివృద్ధి, పేదరిక నిర్మూలన లాంటి స్వతంత్రం సాధించుకాన్నప్పుడు నిర్దేశించుకొన్న లక్ష్యాలను గాలికి వదిలివేయడం గాక, వాటిని సాధించాలనే ఆకాంక్షే ఇప్పుడు సంస్కరణల నూతన వ్యూహం అమలుకు మద్దతుని స్వతంత్రం తర్వాత భారతదేశం 657
కూడగట్టింది (అధ్యాయం 26, అధ్యాయం 27లోని దీర్షక్షాలిక నిర్బంధాలు, సంస్కరణల ఆవశ్యకత చూడండి). గతంలో వామపక్ష ఆలోచనా ధోరణితో ప్రభావితుడైన ఎఫ్.హెచ్. కార్టాసో (బెజిల్ (డైసిడెంట్గా ప్రపంచీకరణ క్రమంలో పాల్గొని ఆర్థిక సంస్కరణల ద్వారా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు). తన గత ఆలోచనలను మార్చుకొన్నాడు. ఆయన విదేశీ పెట్టుబడి స్వభావం ఎలా మారిందీ, అది వెనుకబడిన దేశాల అభివృద్ధికి ఎలా వినియోగించుకోవచ్చునో చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ విస్మరించజాలని వాస్తవం, కాబట్టి ప్రపంచీకరణ చేపట్టాలా వద్దా అనేది సమస్య కాదు. వెనుకబడిన దేశాలు ప్రయోజనాలు పొందే విధంగా తాలి దశలో అయ్యే ఖర్చు భారం పేదలపై పడకుండా ప్రపంచీకరణ ఎలా చేపట్టాలనేది సమస్య. ఇదే అభిప్రాయాన్ని 'ప్రపంచీకరణని బలపరిచే వామపక్షవాదులు, వివేకం గల వాణిజ్యవేత్తలు అంగీకరించారు. పేదలకు పూర్తి రక్షణ కల్పించబడాలంటే పేదలను సమీకరించాలంటారు కార్టొసో. ఈ విషయంలో మహాత్మాగాంధీ నెలకొల్పిన సాంప్రదాయాలు ఇతర వెనుకబడిన దేశాల కంటే స్పష్టమైన సానుకూలతని అందజేస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. జాతీయోద్యమ వారసత్వంగా భారత రాజ్యం ప్రజాస్వామ్యాన్ని ప్రాథమిక విలువగా స్వీకరించింది. ఏ అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినప్పటికీ భారతదేశంలోని ప్రజాస్వామ్యం పూర్తిగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యం. కొందరు వాదిస్తున్నట్లుగా లాంఛనప్రాయమైనది, పాక్షికమైనది కాదు. కులీనులు సాధారణ ప్రజలకు బహుమతిగా ఇచ్చిన లేక బ్రిటిషు వాళ్ళు బహుమతిగా ఇచ్చిన తలక్రిందులు ప్రజాస్వామ్యం కాదు. జాతీయోద్యమ కాలంలో భారత ప్రజలు సుదీర్హకాలం పోరాడి సాధించుకున్న (ప్రజాస్వామ్యం. అందువలన ఇది భారత సమాజంలో బలంగా వేళ్ళూనుకాన్న ప్రజాస్వామ్యం. ఎన్నికలలో ఎక్కువ శాతం ప్రజలు పాల్గొనడం వలన, క్రొత్త గ్రూపులు వర్ధాలు ప్రజాస్వామ్య సంస్థలలో చురుకుగా మమేకమవడం వలననూ ప్రజాస్వామ్య పునాది విస్తృతపరచబడింది. (ప్రజాస్వామ్య పరిధిని ఇంకా విస్తృతపరచే పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వ సంస్థలలోను ఇతర సంస్థలలోను ఎక్కువ పారదర్శకత కొరకు, సమాచార హక్కుకొరకు ప్రచారం జరుగుతుండటం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 658 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారతదేశం ప్రజాస్వామ్య చట్రంలో పారిశ్రామిక పరిణామం కొరకు ప్రయత్నించడం ప్రత్యేకించి పేరొనదగినది. ఈ ప్రయత్నానికి ఎలాంటి నమూనా లేదు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య పారిశ్రామిక దేశాలు, సోషలిస్టు దేశాలు లేక కొత్తగా పారిశ్రామికీకరణ చెందిన తూర్పు ఆసియా దేశాలు అన్ని పారిశ్రామిక దేశాల పారిశ్రామిక పరిణామానికి కీలకమైన ప్రారంభ దశలో వనరుల సమీకరణ (పెట్టుబడి కొరకు మిగులును సమీకరించడం, శ్రామికుల్ని పరిశ్రమల వైపు మరల్చడం) పూర్తి ప్రజాస్వామిక హక్కులు లేని పరిస్థితులలో జరిగింది. ఉదాహరణకు కంచెల ఉద్యమాలు (బ్రిటన్) బలవంతపు సమిష్టీకరణ (సోవియట్ యూనియన్) ఎక్కువ భూమి శిస్తులు (జపాన్) బానిస విధానం (అమెరికా), కార్మిక హక్కుల అణచివేత (తూర్పు ఆసియా దేశాలు) వలసవాద మిగులు సంగ్రహణ (చాలా దేశాలు ఉదాహరణకు ఆసియా వెస్టిండీస్ వలసల నుండి ఆయా దేశాల దేశీయ పెట్టుబడి సంచయం నుండి 85 శాతం ఏకపక్ష బదలాయింపుగా బ్రిటన్ పొందింది) లాంటి మార్గాలు ప్రజాస్వామ్య భారతదేశానికి లేవు.
భారతదేశంలో కార్మికవర్గంపై, రైతాంగంపై భారాలు మోపకుండా పారిశ్రామిక మార్పు చేపట్టేందుకు ప్రజాస్వామ్యం హామీ ఇచ్చింది. కార్మికవర్గం సమిష్టి బేరసారాలతో చాలా ప్రయోజనాలు సాధించుకున్నది. స్వతంత్రానంతరం ప్రభుత్వం వ్యవసాయానికి వనరులు కేటాయించింది గాని వ్యవసాయం నుండి రాబట్టలేదు. 1959-61 కాలంలో చైనాలో 16 నుండి 23 మిలియన్ల జనాభా కరువులతో చనిపోయారని చాలా సంవత్సరాల తరువాత బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ళ వున్న దేశంలో (ప్రజలకు వాస్తవాలు తెలియకుండా నొక్కిపట్టడం సాధ్యపడుతుందని ఊహించలేము. భారతదేశంలో పత్రికా స్వేచ్చ (8600 దినపత్రికలు 388,000 వార పక్ష మాస పత్రికలు) ప్రభుత్వాలను జాగరూకతగా వుండేలా చేస్తున్నది. కొరత పరిస్థితులను పెద్ద కరువులను నివారించడానికి తోదడుతున్నాయి.
ప్రజాస్వామ్యం అభివృద్ధి క్రమంలో పేద ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం కల్పిస్తుంది. వారి ప్రయోజనాలు తోసిపుచ్చడానికి వీలుపడదు. స్వతంత్రం వచ్చినప్పటినుండి పేద ప్రజలను దెబ్బతీసే ద్రవ్యోల్బణ విధానాన్ని కొనసాగించడం ఏ ప్రభుత్వానికి సాధ్యపడని పరిస్థితి ప్రజాస్వామ్యం కల్పించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 659
1950 దశాబ్ద ప్రారంభ సంవత్సరాలలో ధరలు పడిపోయాయి. 1956-2890 మధ్యకాలంలో రెండుసార్లు చమురు సంక్షోభాలు కరువులు సంభవించినప్పటికీ ద్రవ్యోల్బణ రేటు 8శాతాన్ని మించలేదు. 1991 తరువాత సంస్కరణలలో అవసరమైన స్థిరీకరణ సంస్థాగత సర్దుబాట్లు చేపట్టబడినప్పుడు కూడా - ఇవి ప్రభుత్వ వ్యయాన్ని కుదించదం ద్వారా పేదలను ఇబ్బందులకు గురిచేసే చర్యలైనప్పటికీ, ప్రజాస్వామ్యం (పజలను పట్టించుకోకుండా వారి మానాన వారిని వదలివయటం జరగలేదు. పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టబడ్డాయి. సంస్కరణలు చేపట్టిన మొదటి రెండు సంవత్సరాలలో పెరిగిన పేదరికాన్ని తగ్గించడం జరిగింది. ఆర్థికపరమైన దూరద్యష్టికి సమ సమాజం పట్ల నిబద్ధతకు మధ్య సందిగ్ధంలో (అమర్త్యసేన్ ఇది మంచికి చెడుకూ మధ్య సందిగ్ధం కొదని, రెండు మంచి చర్యలకు మధ్య వాస్తవికమైన సందిగ్ధం అన్నాడు) రెండవ దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వనిదే సందిగ్ధం పరిష్కరించబడదని ప్రజాస్వామ్యం హామీ ఇస్తుంది.
జాతీయోద్యమం సంక్రమింపచేసిన వారసత్వంలోని నాల్గవ అంశేం పేద ప్రజల కనుకూలమైన దృక్పథం. పేద ప్రజలకు చేయవలసినంత చేయలేక పోయినప్పటికీ భారత రాజ్యం ఈ దృకథానికి అనుకూలంగా వుంది. స్వతంత్రానంతరం రూపొందించిన 9 పంచవర్ష ప్రణాళికలలో ప్రతి ప్రణాళిక కూడా పేదరిక నిర్మూలనని కీలకమైన లక్ష్యంగా ఎంచుకున్నది. మితవాద రాజకీయ సంఘటనలు కూడా పేదల సంక్షేమం పట్ల నిబద్ధతను (ప్రకటించడం యాదృచ్చికం కాదు. 1980 దశాబ్దం ప్రారంభంలో బిజెపిగా అవతరించిన జనసంఘ్ గాంధేయ సోషలిజాన్ని తన లక్ష్యంగా ప్రకటించింది.
భారత రాజ్యం స్వతంత్రం వచ్చినప్పటి నుండి భూసంస్కరణల పట్ల నిబద్ధత కలిగి వుంది. ఫ్యూడల్ తరహా భూస్వాముల అధికారం ఆధిపత్యం నుండి రైతాంగానికి విముక్తి కల్పించింది. భారతదేశం భూసంస్కరణల్ని ప్రజాస్వామ్య చట్ట పరిధిలో చేపట్టడం గౌరవప్రదమైనదైనప్పటికీ సంస్కరణల ఫలితాలు రైతాంగంలోని మెరుగైన సెక్షన్లు పేద సెక్షన్ల కంటే సానుకూలమైన ఫలితాలు పొందాయి. ఇలా జరగడానికి పాక్షికంగా కారణం క్రింది స్థాయిలో వర్గ పొందిక - ప్రత్యేకించి దిగువ స్లాయిలోని న్యాయమూర్తులు, పోలీసులు, అధికార వర్గం లాంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క దృక్పథం ప్రభుత్వం
" ఒరవడిలో లేకపోవడం. అది పేదల పట్ల అంత సానుకూలంగా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బలప్రయోగంతో అమలు జరపలేదు. కాలక్రమంలో చాలా ప్రభుత్వాలు ఈ చర్యల్ని కొనసాగిస్తూ వచ్చాయి. 1970 దశాబ్దం ప్రారంభం నుండి హరిత విప్లవ 660 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
వ్యూహం ఫలితాలు పేదలకు అందజేసే నిర్దిష్ట లక్ష్యాలతో రెండవ దఫా సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఫలితాలు ప్రశంసనీయంగా వున్నప్పటికీ ఇంకా చేయవలసింది చాలా వుంది. రోజూ రెందు పూటల తిండికి హామీ లేని గ్రామీణ పేదల నికృష్ణ పేదరికానికి ఈనాటి పరిస్థితులకు మధ్య ఎలాంటి పోలిక లేదు. దేశవ్యాప్తంగా జరిపిన సర్వేల ప్రాతిపదికన డేనియల్ ధార్నల్ లాంటి పండితులు ఇతర పరిశీలకులు గ్రామీణ పేదల జీవితాలలో గుణాత్మకమైన మార్పు వచ్చినట్లు నివేదించారు. భూసంస్కరణలు, దేశంలోని అత్యధిక ప్రాంతాలకు హరిత విప్లవ విస్తరణ, నిర్దేశిత పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
- ప్రత్యేకించి 1960 దశాబ్దం చివరి నుండి భారతదేశంలోని విస్తృత గ్రామీణ ప్రజానీకానికి రక్షణ కల్పించాయి. (28 నుండి ౩1 వరకు అధ్యాయాలు చూడండి.
కేదరికాన్ని కొలిచేందుకు లభ్యమయ్యే అనమ(గ్రమైన నూచికలను ఉపయోగించుకొన్నప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన వున్న గ్రామీణ ప్రజల నిష్పత్తి 1970-71లో వున్న 58-75 శాతం నుండి (1950 దశాబ్దంలో యింకా చాలా ఎక్కువగా వుంది గాని గణాంకాలు లభ్యం కాలేదు). 1998-94 నాటికి 87.8 శాతానికి తగ్గింది. పట్టణ (గ్రామీణ ప్రజలతో సహా మొత్తం జనాభాకి చెందిన సంబంధిత గణాంకాలు 56. 259 369%. 1950-51లో 32 సంవత్సరాలుగా సరాసరి ఆయుష్కాలం 1998-94 నాటికి రెట్టింపుకి పైగా 63 సం॥లకు పెరిగింది. 1996-97లో తలసరి ఆదాయం 1950-51 నాటికంటే 2 1/2 రెట్లు పెరిగింది. ఈ కాల వ్యవధిలో జనాభా 158 శ్యతానికి పైగా పెరిగింది. అక్షరాస్యతా శాతం 1951లో అతి తక్కువగా వున్న 18.3 శాతం నుండి 1997 నాటికి 62 శాతానికి పెరిగింది. శిశు మరణాలు ప్రతి వెయ్యి మందికి 1951లో 146 వుండగా 1997 నాటికి 71కి తగ్గాయి. ఆహార రంగంలో స్వయం సమృద్ది కరువుల్ని గతకాలపు పీడకలలుగా మిగిల్చింది. పేదరికం, ప్రజాస్వామ్యం - భారత రాజ్యం
ఇవి గణనీయమైన విజయాలు. ఈ అభివృద్ది సాధించినప్పటికి భారతదేశంలో 300 మిలియన్లకు పైగా ప్రజానీకం దారిద్ర్య రేఖకు దిగువన బతుకులీడుస్తున్న దాదాపు సగం మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయిన దయనీయమైన పరిస్థితి కొనసాగుతున్నది. నెమ్మదిగా సాగుతున్న అభివృద్ధి రేటు (తూర్పు ఆసియా, (ప్రత్యేకించి ఇండోనేషియా, స్వతంత్రం తర్వాత భారతదేశం 661
చైనాలు నాటకీయంగా పేదరికాన్ని తగ్గించిన త్వరిత అభివృద్ధి రేటుకి ఉదాహరణలు), భారత రాజ్య స్వభావం ప్రజా సమీకరణ ద్వారా పేదల కనుకూలంగా వర్ల పొందికని తగు విధంగా మార్చడంలోని వైఫల్యం - పేదరికం కొనసాగడానికి కారణాలు.
. స్వతంత్రం వచ్చిన తరువాత ఉనికిలోకి వచ్చిన సర్వసత్తాక ప్రజాస్వామ్య జూతీయ రాజ్యం స్వభావరీత్యా బహుళ వర్గాలు గలది. వివిధ వర్గాల మధ్య గల వర్గ సమతుల్యత లేక వర్గ పొందిక మార్చడానికి అనువైనది. మరొక విధంగా చెప్పాలంటే భారత జాతీయ రాజ్యరంగంపై పలు వర్గాలు - వాణిజ్యం, పరిశ్రమ, విత్తరంగాలలోని పెట్టుబడిదారులు, రైతాంగంలోని పై సెక్షన్లు, మధ్యతరగతి వృత్తిదారులు, విజ్ఞాన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, చేతివృత్తుల వాళ్ళు, గుర్తింపు పొందని పట్టణ కార్మికులు - ప్రాబల్యం కొరకు పోటీ పడుతున్నాయి. ప్రాబల్యం కొరకు జరుగుతున్న ఈ పోటీ ఆయా వర్షాలు రాజకీయంగా ప్రజల్ని సంఘటితపరచడంపై ఆయా వర్గాల వర్గ దృక్చథం, సైద్ధాంతిక ప్రాబల్యం సాధించగలగడం లేక సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయడంపై ఆధారపడి పరిష్కరించబడుతుంది.
మొదటి నుండి నెహ్రూ మహలనొబిస్ యొక్క న్యాయంతో కూడిన అభివృద్ధి వ్యూహం, నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన సమూలమైన మార్పుల కొరకు చేపట్టిన చర్యలు సమర్ధవంతంగా అమలు జరిపేందుకు క్రింది న్థాయి నుండి పేదల సమీకరణ జరగాలని ఆశించింది. కాని ఈ కర్తవ్యాన్ని నిర్వహించవలసిన ఏజెన్సీని గుర్తించడం సమస్య అయింది. అప్పటి వరకు పోరాటాలు, ఉద్యమాలు నడిపిన కాంగ్రెస్ స్వతంద్ర్యానంతరం నెహ్రూ నాయకత్వంలో పాలక పార్టీగా మార్పు చెందింది. కాంగ్రెస్ కార్యకర్తల చేత ప్రజలను సమీకరింపచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. (గాంధీజీ ఈ పరిస్థితిని అంచనా వేసి స్వతంత్రం రాగానే కాంగ్రెస్‌ని రద్దు చేయాలని, పాలక పార్టీకి భిన్నంగా ప్రజల సమస్యలపై పోరాడే ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేయాలని ఇచ్చిన పిలుపు విఫలమయింది). నెహ్రూ ఈ అంతరాన్ని పూడ్చేందుకు గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు అధికార యంత్రాంగాన్ని సృష్టించారు.
ప్రజలను సమీకరించడం, వారిని చైతన్యపరచడం రాజకీయ కర్తవ్యం. ఉద్యోగి స్వామ్యం దీనికి ప్రత్యామ్నాయం కాదు. వాస్తవంగా నెహ్రూ ఈ కర్తవ్యాన్ని వామపక్షం నిర్వహిస్తుందని ఆశించాడు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరిపేందుకు, ఆ విధంగా 662 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
క్రమబద్ధమైన సామాజిక మార్చు తెచ్చేందుకు నెహ్రూ, వామపక్ష మద్దతు కొరకు చాలాసార్లు ప్రయత్నించాడు. కాని వామపక్షం నెహ్రూని సామ్రాజ్యవాదుల చేతుల్లో పనిముట్టుగా పరిగణించింది. అందువలన నెహ్రూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, కూల్చాలని సూత్రీకరించింది. ఆ విధంగా భారత రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం కల్పించిన అవకాశాన్ని (అది బూర్జువా ప్రజాస్వామ్యమని చెప్పి) త్రోసిపుచ్చింది. ఉద్యోగి స్వామ్యం పత్రికలు, న్యాయవ్యవస్థ విద్యా విధానం లాంటి పలు ఉపవ్యవస్థలలోని వర్గ పొందికని మార్చేందుకు గాని లేక ప్రస్తుత రాజ్య చట్రంలో పేద ప్రజలని పెంచడానికి, వారిని సమీకరించడానికి గాని అంతగా కృషి చేయలేదు. భారత బహుళ వర్గ జాతీయ రాజ్యం యొక్క మార్పు చెందే అవకాశాలను గుర్తించకుండా భారత రాజ్యాన్ని విప్లవం ద్వారా కూల్చివేయడానికి వైరుధ్యాలు పరిపక్వమయ్యే దశ కొరకు నిరీక్షించింది. నిరంతరాయంగా నిరీక్షిస్తూ వుంది. వామపక్షం యొక్క ఈ వైఫల్యం, అలాగే తగినంతగా పేదల కనుకూలంగా లేని సంక్షేమ దృక్పథం కొరవడిన రాజ్య యంత్రాంగంపై మొత్తంగా సమాజంపై ప్రాబల్యం సాధించిన వాణిజ్యవేత్తల అవగాహన పెట్టుబడిదారీ అభివృద్ధి దృక్పథానికి దారితీసింది. ఇది పేద ప్రజల ప్రయోజనాలకు హానికరమైన కుల మత శక్తులు ప్రజాస్వామ్య అవకాశాలను అధికాధికంగా వినియోగించుకోవడానికి దారితీసింది. సంఖ్య రీత్యా పేదలు ఎక్కువ. వారి ఓట్లు అన్ని రాజకీయ పార్టీలకు అవసరం
గనుక పేదలు చాలా రాయితీలు పొందినప్పటికీ పేద ప్రజల కనుకూలంగా రాజకీయ
సమీకరణకు గల అవకాశం సక్రమంగా వినియోగించుకోవడం జరగలేదు. చెదురు
మదురుగా అక్కడక్కడ కొన్ని ప్రభుత్వేతర సంస్థలు యువకుల కొరకు వేదికల్ని సమకూర్చాయి. కాని అవి పరిమిత ఫలితాలనే సాధించాయి. రాజ్యాంగానికి పంచాయతీ
రాజ్ సవరణలతో స్థానిక స్వయం పరిపాలనా సంస్థలకు అధికారాలు కల్పించేందుకు
చేసిన ఇటీవలి (ప్రయత్నాలు చాలా ఆశలు కల్పించాయి. అభివృద్ధికర రాజకీయ శక్తులు
ఈ ప్రజాస్వామ్య అవకాశాన్ని వినియోగించుకొనగలిగిన మేరకు ఈ ఆశలు వాస్తవ
రూపం దాల్చుతాయి. ॥
భారతదేశ స్వతంత్రానంతర పరిణామంలో పేదరికం కొనసాగడం అత్యంత
ముఖ్యమైన వైఫల్యం. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనగలగడం అత్యంత గొప్ప విజయం. పేద ప్రజల అవసరాలను తీర్చే దిశలో ఈ ప్రజాస్వామ్య చట్రాన్ని పటిష్టపరచుకొనడం ముఖ్యమైన కర్తవ్యం. కాని 1970 దశాబ్దం చివరి సంవత్సరాల స్వతంత్రం తర్వాత భారతదేశం 668
నుండి అన్ని రాజకీయ పార్టీలు పేదలతో సహా వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు రౌజ్య వనరులను కానుకలుగా పంచేందుకు పోటీపడుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఎరువులు, డీజిల్ ఎగుమతులు, విద్యుత్ రంగాలలో ఇచ్చే రాయితీలు దేశాన్ని ఆర్ధికంగా గందరగోళ స్థితిలోకి నెట్టివేస్తున్నాయి.
సర్వ సత్తాక ప్రజాస్వామ్య భారత రాజ్య మనుగడకు, అభివృద్ధికి బలమైన రాజ్యం అవసరం. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రజలకు సాధికారికత కల్పించేందుకు ప్రత్యామ్నాయంగా వుండే బలమైన రాజ్యం కాదు. పరిమితమైన అతిక్రమలకు అవకాశం కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిమితుల వెలుపల వుండి పనిచేస్తూ ప్రజాస్వామ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే శక్తులను - టెర్రరిస్టులు వేర్పాటువాద తిరుగుబాట్లు, మతమౌధ్య మత ఛాందస హింసాయుత కుల మత శక్తులను అణచివేయగల బలమైన రాజ్యం అవసరం. బలమైన రాజ్యం, ఆరోగ్యకరమైన పోటీతో పనిచేయని పెట్టుబడిని (జపాన్, ఇతర తూర్పు ఆసియా దేశాలు జయప్రదంగా చేసిన విధంగా) క్రమశిక్షణలో పెట్టగలదు. పనిచేయని కార్మిక సెక్షన్గను లేక సామాజికంగా ఆమోదం పొందిన ఉత్పత్తి స్థాయి మేరకు పనిచేయని కార్మిక సెక్షనను క్రమశిక్షణలో పెట్టగలదు. బలమైన రాజ్యం (ప్రజాకర్షక విధానాలను గాక సామాజిక న్యాయాన్ని కీలక లక్ష్యంగా పెట్టుకొని సమకాలీన ప్రపంచం యొక్క అభివృద్ధి చెందిన శాస్త్రీయ విధానాల ద్వారా త్వరిత ఆర్థికాభివృద్ధికి మార్గదర్శకత్వం వహించగలదు. బలమైన రాజ్యం తన సర్వసత్తాక అధికారాన్ని తగ్గించుకొనడం గాక పటిష్టపరచుకొనే విధంగా ప్రపంచీకరణ క్రమంలో భాగస్వామ్యం వహించగలదు. 6064 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
తీ0 ఇల్లి అల్ పాలనా సంస్థలలో క్రమరాహిత్యం
భారతదేశ రాజకీయ పరిణామంలో గమనించదగ్గ అంశాలు : ప్రజాస్వామ్యం పట్ల జాత్రీయైక్యత పట్ల ఆర్ధికాభివృద్ధి పట్ల నాయకుల నిబద్ధత, అందుకవసరమైన రాజకీయ సంస్థల నిర్మాణం; వాటిని భారతీయ సమాజంలో పాదుగొల్పుట. మరొక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య రాజ్య చట్రాన్ని నిర్మించి నిర్వహించడం. త్వరితగతిని జరిగిన సామాజిక మార్పుని, రాజకీయ రంగంలోకి నూతన సామాజిక (గ్రూపులు ప్రవేశించి వారి హక్కుల్ని కాపాడుకొనడానికి చేస్తూ వచ్చిన యత్నాలను తట్టుకొని అవి దృఢంగా నిలదొక్కుకున్నాయి. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ (ప్రజాస్వామ్య చట్రం యొక్క అంతర్గత బలానికి సంకేతం.
గడచిన 25 సంవత్సరాలలో రాజకీయ వ్యవస్థ ఒడిదుడుకుల నెదుర్శొన్నది. రాజకీయ సంస్థలు కొంత పట్టు కోల్పోయాయి. కొంత క్రమరాహిత్యం చోటు చేసుకున్నది. రాజకీయ సంస్థలలో క్షీణత వ్యక్తమయింది. ఆర్థికాభివృద్ధి సామాజిక మార్పు, (ప్రజలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యం -పెరుగుతున్న పెంచబడిన వారి ఆకాంక్షలు, వారి సామాజిక స్థితిని అంగీకరించేందుకు అణగారిన ప్రజల తిరస్కారం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ రాజకీయాధికారం కొరకు ఆర్థికాభివృద్ధి ప్రయోజనాల కొరకు పోటీపడుతున్న సామాజిక [గ్రూపుల మధ్య పెరుగుతున్న వర్గపరమైన, కులపరమైన ఘర్షణ లాంటి సవాళ్ళకు రాజకీయ సంస్థలు తగినంతగా స్పందించలేకపోతున్నాయి.
ఫలితంగా అత్యధిక రాజకీయ సంస్థలు నైతికాధికారాన్ని కోల్పోతున్నాయి. దేశాన్ని పరిపాలించడం - సక్రమంగా పరిపాలించడం కష్టతరమయింది. ఈ పరిపాలనా సంక్షోభం - అస్థిర ప్రభుత్వాలు, తరచుగా ఎన్నికలు, పోటీ పడుతున్న వేర్వేరు సామాజిక .స్వతంత్రం తర్వాత భారతదేశం 665
(గ్రూపుల వర్గాలు డిమాండ్లను అవసరాలను సర్దుబాటు చేయడంలోని అశక్తత, బలహీనపడుతున్న శాంతి భద్రతలు, విద్రోహం, మత హింసల స్థాయికి చేరుతున్న అలజడి వైమనస్యం, రాజ్యాంగేతర పద్ధతులలో హింసామార్దం చేపడుతున్న ప్రజల ఆందోళనలు, పెరుగుతున్న లంచగొండితనం, అన్నిటిని మించి కేంద్రంలో, రాష్ట్రాలలో గల ప్రభుత్వాలు వాటి విధానాలను అమలుపరచడంలో సరియైన పాలన అందించడంలో వైఫల్యం లాంటి పలు రూపాలను తీసుకొంటుంది.
అదే సమయంలో రాజకీయ వ్యవస్థ లేక దాని సంస్థలు కుప్పకూలుతున్నాయని చెప్పడం తప్పవుతుంది. బలహీనతలున్నప్పటికి రాజకీయ వ్యవస్థ, రాజకీయ సంస్థలు పరిస్టితుల కనుగుణంగా సర్దుబాటు చేసుకొనగలవని నిరూపించుకొన్నాయి. సమర్ధవంతంగా కాకపోయినప్పటికి పనిచేయగలుగుతున్నాయి. అవి చాలాకాలంగా పనిచేస్తూ వుండటం, రాజకీయ క్రమంలో - ప్రత్యేకించి ఎన్నికలలో ప్రజలు అధికాధికంగా పాల్గొనడం వలన అవి చట్టబద్ధతను నిలబెట్టుకొన్నాయి.
నిస్సందేహంగా రాజకీయ సంస్థల్ని బలహీనపరచింది రాజకీయ నాయకుల స్వభావం. జాతి నిర్మాణంలో రాజకీయ సంస్థల అభివృద్ధిలో రాజకీయ నాయకత్వం స్వభావం కీలకపాత్ర నిర్వహిస్తుంది. కేంద్రంలోని రాష్ట్రాలలోని నాయకుల స్థాయి క్రమంగా క్షీణిస్తుందడం వలన రాజకీయ వ్యవస్థలో సంక్షోభం కంటే ఇది రాజకీయ నాయకత్వంలోని సంక్షోభంగా స్పష్టమవుతుంది.
చాలా దశాబ్దాల నుండి రాజకీయ వ్యవస్థ నిర్వహణకై రాజకీయ నాయకత్వం వ్యూహాత్మకమైన పథకం, దృక్పథం, సిద్ధాంతం లేక ఆలోచించి రూపొందించుకొన్న ఎత్తుగడలు లేకుండా నిర్వహిస్తూ వచ్చింది. రాజకీయ సమస్యల్ని పరిష్కరించేందుకు అప్పటికప్పుడు తాత్కాలిక తరుణోపాయల్ని వెతుక్కొన్నది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు నల్లడబ్బుని వాడుకున్నది. కుల మతపరమైన పార్టీల గ్రూపుల నేర్పరచి సిద్ధాంత రహిత అవకాశవాద కూటముల నాళశయించింది. ఫలితంగా నాయకులు ఎన్నికలలో గెలిచారు. కాని సక్రమంగా పాలన సాగించలేకపోయారు. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు కూడా పార్టీ, పార్లమెంటు, అధికారవర్గం సంస్థలలోని క్షీణతని అదుపు చేయలేకపోయింది. పార్లమెంట్
ఎన్నికలు, పౌర స్వేచ్చ తరువాత పార్లమెంటరీ (ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ కీలక స్థానం ఆక్రమిస్తుంది. భారతదేశంలో పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలు ప్రభుత్వాల్ని 6686 బిపన్చం(ద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
చట్టబద్ధం చేయడమే గాక అవి విధానాల రూపకల్పన చేస్తాయి. వాటి అమలును పర్యవేక్షిస్తాయి. ప్రభుత్వ పనితీరు పట్ల కాపలాదారులుగా వ్యవహరిస్తాయి. దురదృష్టవశాత్తు గత కొన్ని సంవత్సరాలుగా వాటి పని విధానంలో క్షీణతా లక్షణాలు ప్రవేశించాయి. దిగజారుడుతనం కనిపిస్తుంది.
పార్లమెంట్‌ని గౌరవప్రదంగా పనిచేయించడానికి జవహర్లాల్ నెహ్రూ నిరంతర కృషి సాగించారు. తీరిక లేకపోయినా పార్లమెంట్ సమావేశాలకు క్రమబద్ధంగా హాజరయ్యాడు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాల్ని గౌరవించాడు.
ప్రజాస్వామ్య క్రమంలో అనివార్యభాగంగా వాటిని పరిగణించాడు. వాటి ప్రభావానికి లోనయ్యాడు. ప్రభుత్వ విధానాలను కూడా మార్పుకొన్నాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా పార్లమెంటరీ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా పనిచేశాయి. నెహ్రూ కాలంలోను, నెహ్రూ తరువాత కొన్ని సంవత్సరాల వరకు పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగానే పనిచేసింది. కాని తరువాత సంవత్సరాలలో పార్లమెంట్ తన ప్రతిష్టను కోల్పోయింది. 1960 దశాబ్దం చివర నుండి కార్యకలాపాలలో క్షీణత మొదలయింది. పార్లమెంట్ అసెంబ్లీలో అరుపులు, కేకలు, గందరగోళం - ప్రధాన మంత్రి పట్ల కూడా అల్లరి చిల్లరగా వ్యవహరించడం మొదలయింది. పార్లమెంట్లో, అసెంబ్లీలలో తరచుగా వాకౌట్లు, అదుపు చేయలేని దృశ్యాలు, అవమానకరమైన క్రమశిక్షణారాహిత్యం, హేతుబద్ధమైన వాదనలు ఇచ్చిపుచ్చుకోవడాల స్థానంలో ధర్నాలతో సహా పార్లమెంట్ అసెంబ్లీలో ప్రదర్శనలు, ఇతర విధ్వంసకర “ఎత్తుగడలకు పాల్పడటం జరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ఒక పార్టీ కాకపోతే మరొక పార్టీ పార్లమెంట్లో బైళభాయింపులు జరపడంతో రోజుల తరబడి పార్లమెంట్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నది.
నెహ్రూ కాలంలో వలె గాక ఇటీవలి సంవత్సరాలలో ఒక పార్టీ మెజారిటీ సాధిస్తే అది ప్రభుత్వాన్ని ఏర్పరచి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాల్ని పట్టించుకోకుండా తన విధానాలను రూపొందించుకొని అమలు జరప యత్నించడం సర్వసామాన్యమయింది. ఇక ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ విధానాలలోని గుణదోషాల్ని పట్టించుకోకుండా వ్యతిరేకించడమే తను బాధ్యతన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు కూడా ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను గురించి ఆలోచించడం లేదు. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అర్ధవంతమైన చర్చ జరగడం లేదు. ప్రభుత్వ నిర్ణయంలోని ఉచితానుచితాలు పార్లమెంట్లో గాని, అసెంబ్లీలో గాని గాక వీధుల్లోనూ, పత్రికలలోనూ స్వతంత్రం తర్వాత భారతదేశం 667
చర్చంచబడుతున్నాయి. ఒకప్పుడు పార్లమెంట్ ప్రతిష్థాకరంగా భావించిన “క్వశ్చన్ అవర్ అరుపులు, కేకలతో అరాచక సమయంగా మారింది. తరచుగా క్వశ్చన్ అవర్ రద్దు చేయబడుతున్నది. ఫిరాయింపుదారులు రాజకీయ సైద్ధాంతిక కారణాల, రీత్యా గాక వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా పార్టీలు మార్చారు. ప్రభుత్వాలను పడగొట్టారు. 1967 తరువాత రాష్ట్రాలలో ఇది సర్వసాధారణమయింది. కేంద్రంలో 1977లో జనతా ప్రభుత్వాన్ని కూలదోయడంతో ఈ జబ్బు వ్యక్తమయింది. కొద్దిమంది ఎం.ఎల్.ఎ.లు, ఎం.షి.లు (ప్రభుత్వాలను ఏర్పరచగలగడం, పడగొట్టగలగడం చూస్తే ఒక దశలో పార్లమెంటరీ (ప్రజాస్వామ్యం అపవిస్యంగా మార్చబడినట్లు తోచింది. కాని 1985 నాటి ఫిరాయింపు నిరోధక చట్టంతో(ప్రభుత్వాలకు ఒక మేరకు స్థిరత్వం చేకూరింది. కాని ఇటీవలి కాలంలో ఫిరాయింపు నిరోధక చట్ట పరిమితులకు లోబడి జరిగే ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. మొత్తం మీద 1960 దశాబ్దం చివరి నుండి పార్లమెంట్ అసెంబ్లీలు సమర్ధవంతంగా పనిచేయని ఫలితంగా పార్లమెంటరీ సంస్థల పట్ల ప్రజలకు గౌరవం తగ్గింది. విధాన రూపకల్పనలోను, పరిపాలనలోను వాటి పాత్ర క్షీణిస్తూ ఉంది. అయినప్పటికీ అవి పూర్తిగా పనిచేయని స్థితికి చేరుకోలేదు. వాటికి రాజ్యాంగం నిర్దేశించిన పాత్రని తగినంతగా కాకపోయినా అవి నిర్వహించగలుగుతున్నాయి. అవి ఇప్పటికి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ లేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ప్రభుత్వం భయపడుతుంది. అన్నిటిని మించి పార్లమెంట్ విశ్వాసం పొందగలిగితే ప్రభుత్వం అధికారంలో కొనసాగగలుగుతుంది. 1977 నుండి కేంద్రంలో లోక్‌సభ విశ్వాసం కోల్పోయిన కారణంగా ఏడు ప్రభుత్వాలు కూలిపోయాయి. మంత్రివర్గం ప్రధానమంత్రి నాయకత్వంలో (ప్రధానమంత్రి చేత ఎంపిక చేయబడిన మంత్రివర్గం కార్య నిర్వాహక శాఖగా సమిష్టి బాధ్యతతో పనిచేస్తుంది. ఒక ప్రభుత్వం యొక్క బలం దాని యొక్క మంత్రివర్గ బలాన్ని బట్టి అంచనా వేయబడుతుంది. దురదృష్టవశాత్తు విధాన నిర్ణయాలు చేసే సంస్థగా మంత్రివర్గం పాత్ర యొక్క ప్రాధాన్యత 1969 నుండి అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభం నుండి తగ్గుతూ వచ్చింది. అప్పటి నుండి విధాన నిర్ణయాలు చేయడంలో మంత్రివర్గం విస్మరించబడింది. 668 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రధానమంత్రి అభీష్టం మేరకు మంత్రులుగా నియమించబడతారు. గనుక వారు పదవుల్ని ఆమోదిస్తారు. ఇందిరాగాంధీ తరువాత వచ్చిన ప్రధానమంత్రులు అంత ప్రముఖులు కానప్పటికి మంత్రివర్గంపై (ప్రధానమంత్రి ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరగలేదు.
మంత్రివర్గం పాత్ర తగ్గడానికి కారణం - ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క అధికారాలు ప్రధాన మంత్రుల చేతుల్లో కేంద్రీకరింపబడటం, పాలక పార్టీలు ఎన్నికలలో గెలవడానికి ప్రధాన మంత్రులపై ఆధారపడటం.
మంత్రివర్గం అధికారం తగ్గించడానికి తోద్బడిన మరొక కారణం కార్యనిర్వాహక శాఖకి సమాంతరంగా - మంత్రుల యొక్క మంత్రివర్గం యొక్క విధులలోకి చొచ్చుకొని వచ్చి అధికారాలను లాక్కొన్నటువంటి పి.ఎం.ఒ.గా ప్రసిద్ధి గాంచిన ప్రధానమంత్రి సచివాలయం ఆవిర్భవించడం. పిఎంఓ సమాచారాన్ని సేకరిస్తుంది, సలహాలిస్తుంది. ఆర్థిక విదేశీ విధానాలతో సహా విధానాలను రూపొందిస్తుంది. పాలనా వ్యవహారాల ఉన్నతాధికారుల నియామకాలు పదోన్నతులలో జోక్యం చేసుకుంటుంది. పిఎంఓ యొక్క ఆధిక్యత చెలాయించే పాత్ర శాప్రి ఇందిరాగాంధీలతో ప్రారంభమయింది. జనతా పరిపాలనలోనూ, బిజెపి నాయకత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ కొనసాగింది.
(ప్రధానమంత్రి చేతుల్లో అధికారం కేంద్రీకరించబడటం అనారోగ్యకరమైనది. విధాన నిర్ణయాలలో పరిపాలనలో ప్రజాస్వామ్య విలువల్ని తగ్గించేది. దేశానికి, ప్రభుత్వానికి బలమైన నాయకత్వాన్ని అందించడం అవసరమైనప్పటికి అధికారం ఒక వ్యక్తీ చేతుల్లో కేంద్రీకరింపబడటం సమంజసం కాదు, వాంఛనీయమూ కాదు. బలమైన మంత్రివర్గం, వివిధ ప్రయోజనాలు గలవారు, వివిధ (ప్రాంతాల వారు, వివిధ సాంస్కృతిక విభాగాలకు చెందినవారు అధికారంలో పాలువంచుకొని విధానాలు రూపొందించడంలో సమర్థవంతమైన పాత్ర నిర్వహించగలిగేలా చేస్తుంది. న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయవ్యవస్థ - ప్రత్యేకించి సుప్రీం కోర్టు రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ వ్యాఖ్యానించే హక్షుని, బాధ్యతని పూర్తిగా వినియోగించుకొన్నది. అది ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాసన నిర్మాణ శాఖల నుండి స్వతంత్రంగా వ్యవహరించే ఉన్నత స్వతంత్రం తర్వాత భారతదేశం 669
ప్రమాణాలను నెలకొల్పింది. అది ప్రాథమిక హక్కుల రక్షణకు అగ్రభాగాన నిలుస్తుంది. ఈ కారణాల రీత్యా అది ప్రజల గౌరవాభిమానాల్ని చూరగొన్నది.
భారత న్యాయవ్యవస్థ సామాజికంగా కులీన స్వభావం గలదని యధాతథ స్థితిని కాపాడే స్వభావం గలదని విమర్శ వుంది. ఈ స్వభావంతో అది సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల స్పందించదని, ఫలితంగా వ్యక్తిగత హక్కుల రక్షణ పేరుతో సమూలమైన మార్పులు గోరే సామాజిక ఆర్ధిక చట్టానికి అద్దుగా నిలిచిందని వాదనలు వున్నాయి. ఉదాహరణకు చాలా సంవత్సరాల వరకు భూసంస్మరణలను బ్యాంకుల జాతీయీకరణను అద్దుకొనే విధంగా ఆస్తి హక్కుని వ్యాఖ్యానించింది.
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను విస్మరించే వైఖరి చేపట్టింది. రాజ్యాంగంలో దాని సవరణ కవసరమైన సులభమైన పద్ధతి పొందుపరచడం వలన సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ కులీన ధోరణి గల తీర్పులు చాలావరకు సవరించబడ్డాయి. మనం వెనుకటి అధ్యాయాలలో గమనించిన విధంగా తమ విధానాల అమలు జరిపించేందుకు నెహ్రూ, ఇందిరాగాంధీ చాలా రాజ్యాంగ సవరణలు చేపట్టారు.
అంతేగాక ఇటీవలి సంవత్సరాలలో మహిళల కార్మికుల మైనారిటీల హక్కుల నుండి జీవావరణ మానవ హక్షులు సామాజిక న్యాయం సామాజిక వివక్ష వరకు గల సామాజిక సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తుంది.
సుప్రీం కోర్టు ఇటీవల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ననుసరించి బాధితుడు ప్రధాన న్యాయమూర్తికి వేసిన ఒక పోస్టు కార్డు రిట్ పిటిషన్‌గా స్వేకరించబడుతుంది. అలా అని పేదలకు ఉన్నత న్యాయన్థానాలు అందుబాటులో వున్నాయని కాదు. కాని గతంలో పూర్తిగా మూసివేయబడిన కిటికీ వారి కొరకు తెరవబడింది.
ఈనాటి భారత న్యాయవ్యవస్థకి చెందిన రెండు ప్రతికూల అంశాలు : (న్యాయం అందడానికి జరుగుతున్న మితిమీరిన జాప్యం. కేసు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి నడుస్తూ వుంటుంది. హైకోర్టులలో పేరుకుపోయిన కేసులు లక్షల సంఖ్యలో వున్నాయి. (2) న్యాయం పొందడానికి అయ్యే విపరీతమైన వ్యయం కారణంగా సంపన్నులకు మాత్రమే కోర్టులు అందుబాటులో వున్నాయి. 670 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇటీవలి సంవత్సరాలలో రాజ్యాంగం కార్యనిర్వహణ శాఖకు - చట్ట సభలకు ఇచ్చిన అధికారాలను సుప్రీం కోర్టు అనర్జంగా ఆశిస్తున్నదనే ఆరోపణలు వున్నాయి.
మరి రెండు రాజ్యాంగ సంస్థలు - రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర భారతదేశంలో విధులు సక్రమంగా నిర్వహించాయి. రాష్ట్రపతులు రాజ్యాంగం కల్పించిన అధికారాలను హుందాగా, గౌరవప్రదంగా, వివాదరహితంగా వినియోగించుకొని నిర్వహించారు. అలాగే ఎలక్షన్ కమిషన్లు కూడా కేంద్ర రాష్ట్ర చట్టసభలకు వేలాదిమంది అభ్యర్దులు పోటీ చేసిన కోట్లాది మంది ఓటర్లు పాల్గొన్న ఎన్నికలను రాజ్యాంగ నిబంధనల మేరకు జయప్రదంగా నిర్వహించాయి.
భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన, సంస్థాపరమైన సంక్షోభం పరిపాలన, ఉన్నతాధికార వర్గం యొక్క స్వభావానికి సంబంధించినది. పేదల జీవితంలో పరిపాలన పాత్ర ఎన్నో రెట్లు పెరిగినప్పటికి చాలా రాష్ర్రాలలో పెద్ద నగరాలలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతో సహా పరిపాలన క్షీణించడం పాలనా సంక్షోభానికి
భారతదేశ ఉద్యోగిస్వాన్యుం మౌలికంగా కులీన స్వభావం గలది, యథాతథ న్పీతిని కాపాడేది. సామాజిక మార్చుని - (వ్రత్యేకించి పేదలకు అధికా ౦ సంక్రమింపజేయడాన్ని అడ్డుకునే స్వభావం గలది. అది ప్రత్యేకించి ఆధిపత్య సామాజి (గ్రూపులకు పలుకుబడి గల వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించేది.
పాలనా వ్యవస్థలో పనిచేయని వారిని, అసమర్ధుల్ని శిక్షించి లంచగొందితనాస్ట అదుపు చేసి నిజాయితీగా పనిచేసేవారిని ప్రోత్సహించే కమళిక్షణని అమలు జ యంత్రాంగం లేదు.
పాలనా వ్యవస్థ సామాన్యుల పట్ల తగు విధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు - ప్రత్యేకించి పోలీసులు సాధారణ ప్రజల పట్ల అమర్యాదగా, నిర్దయగా, నిరంకుశంగా, లంచగొండులుగా వ్యవహరించారు. ఇక ప్రజల పట్ల వారి విశ్వసనీయతను 'ప్రస్తావించనవసరం లేదు. సాధారణ (ప్రజలతో (ప్రభుత్వ ఉద్యోగుల సంబంధం ఇటీవలి సంవత్సరాలలో అధికార పక్ష వ్యతిరేక ఓట్ల రూపంలో వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఓటు శక్తిని సాధారణ ప్రజలు ఉపయోగించుకొంటూ స్నేహపూర్వకమైన గౌరవప్రదమైన స్వతంత్రం తర్వాత భారతదేశం 671
కనీస సామర్ధ్యం కలిగి తమకు సహకరించి పనిచేయగల ప్రభుత్వం కొరకు ఎన్నికలతో ప్రభుత్వాలను మార్చుతున్నారు.
ఉద్యోగ స్వామ్యంలోని మధ్య ఉన్నత స్థాయిల్లో కూడా - ప్రత్యేకించి లైసెన్స్ కోటా విధానంలోని సంక్లిష్టమైన నియమ నిబంధనల పద్ధతుల వ్యక్తిగత విచక్షణాధికారాల కారణంగా అసమర్ధత అనవసర జాప్యాలు లంచగొండితనం పెరిగాయి. కాని ఇప్పటికి నిజాయితీ సమర్ధత గల ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.
అదే సమయంలో అవసరాల కంటే ఉద్యోగి స్వామ్యాన్ని మితిమీరి పెంచడం జరిగింది. ఫలితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను (పక్కనపెట్టి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల ఉద్యోగి స్వామ్యానికి ప్రభుత్వ వనరులలో (ప్రభుత్వ వ్యయంలో పెద్ద భాగాన్ని కేటాయించవలసి వచ్చింది.
ఉద్యోగి స్వామ్యానికి చెందిన ఒక సానుకూలమైన అంశమేమిటంటే అది ఇప్పటికీ రాజకీయ తటన్ఫతా నం్యవ్రదాయాన్ని పాటిన్తున్నది. అధికారులు వారి అభిప్రాయాలేమైనప్పటికీ అధికారంలో వున్న (ప్రభుత్వ విధానాలను అమలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్, కేరళలలోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు
- వాటి విధానాలను రాజకీయ సైద్దాంతిక లేక వర్గ ప్రాతిపదికన అధికారులు అమలు జరపడం లేదని ఫిర్యాదు చేయక పోవడం గమనార్హం.
ఉద్యోగి స్వామ్యం యొక్క పక్షపాతం లేక పాక్షికత సైద్ధాంతిక రాజకీయ కారణాల రీత్యా గాక వారు పనిచేసే స్వభావంలో వుంది. అధికారులు వారి నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, సర్వీసు కొనసాగింపు, ఉద్యోగానంతర ఉపాధి, అధికార దుర్వినియోగం లేక లంచాల కారణంగా వారికి వ్యతిరేకంగా చేపట్టబడే క్రమశిక్షణా చర్యల నుండి రక్షణకొరకు ఎం. ఎల్ ఎ.లు, ఎం.పి.లు మంత్రులపై ఆధారపడుతుంటారు. ఉద్యోగులు వారి రాజకీయ యజమానుల యొక్క వ్యక్తిగత లేక రాజకీయ అజెండాని అమలుపరిచే క్రమంలో రాజకీయ కుట్రలో ఇరికించబడతారు. రాజకీయ జోక్యంతో ఉద్యోగుల క్రమశిక్షణ సమర్ధత క్షీణిస్తాయి. లంచగొండితనం పెరుగుతుంది.
(ప్రస్తుతం వున్న ఉద్యోగిస్వామ్య పాలనా విధానాన్ని తొలగించడం సాధ్యపడదు. ఉద్యోగులు లేని పరిపాలన ఊహాజనితం. అయినప్పటికి మంచి ప్రభుత్వం అభివృద్ధి మార్పు కొరకు ఉద్యోగి స్వామ్యాన్ని సరియైన సాధనంగా మలిచేందుకు దానిలో 672 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
నమూలమైన సంస్కరణ పునరుజ్జీవం పునర్నిర్మాణం చేపట్టడం ఇక ఏమాత్రం విస్మరించరాని అత్యవసరం. పాలనా చట్రంలోని లోపాలను, వాటిని తాలగించదానికి చేపట్టవలసిన చర్యలను గురించి ఎన్నో పరిపాలనా సంస్మరణ కమిషన్లు, పరిపాలనా నిపుణులు అనుభవజ్ఞులు విజ్ఞానవంతులైన అధికారులు అధ్యయనం చేశారు. కాని తగు చర్యలు చేపట్టే రాజకీయ చిత్తశుద్ది లోపించింది. ఉద్యోగి స్వామ్యం పొత్ర, దాని ప్రభావానికి చెందిన మరి రెండు ఇతర అంశాలు ్రస్తావించవలసి వుంది. ఉద్యోగి స్వామ్య విలువలు, ఆలోచనా విధానం, నిర్మాణాలు అన్ని రంగాలకు విస్తరించాయి. అవి భారతదేశ విద్యా శాస్త్రీయ రంగాలకు వ్యాప్తి చెంది మన విద్యావేత్తల శాస్త్రవేత్తల అంతర్గత శక్తులు పూర్తిగా వినియోగంలోకి రాకపోవడానికి కారణమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలపై అధికారుల అదుపు, దానికి రాజకీయ జోక్యం తోడవడంతో ఆ సంస్థలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందలేక పోతున్నాయి. పోలీసు
భారతదేశ పోలీసుల్ని ఉద్యోగిస్వామ్యం బలహీనతలతో పాటు మరికొన్ని జబ్బులు పట్టి పీడిస్తున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినప్పటికి పోలీసు వ్యవస్థ అస్తవ్యస్థంగా వుంది. దాని క్షీణత శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడానికి కారణమవుతుంది. గడచిన 50 సంవత్సరాలలో పోలీసు పారా మిలటరీపై వ్యయాన్ని 100 రెట్లకు పైగా పెంచడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు నేరాన్ని నిరోధించే పాత్ర సరిగా నిర్వహించడం లేదు. నేరస్తులు తాము నిర్బంధింపబడతామని గాని, నిర్బంధింపబడినప్పటికి సక్రమంగా విచారణలు జరిపి శిక్షింపబడతామని గాని భయపడటం లేదు. చాలా సందర్భాలలో వారికి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు నమోదు చేయబడటం లేదు. పోలీసుల అసమర్ధత, వారికి సరియైన శిక్షణ ఇవ్వకపోవడం, నేరస్థులతో గల రహస్య సంబంధాలు, కోర్టులలోకి త్వరగా విచారణలు జరగకపోవడం, నేరస్తులు ప్రతీకారం తీర్చుకొంటారనే భయంతో పౌరులు సాక్ష్యానికి రాకపోవడం లాంటి కారణాలతో ఇలా జరుగుతుంది.
పోలీసులు సాధారణంగా ప్రజల పట్ల ప్రతికూల వైఖరితో వ్యవహరిస్తుంటారు. ఇది వారికి వలస పాలన నుండి వారసత్వంగా సంక్రమించింది. 'పేదలు వారి కవసరమైన చిన్నపాటి సహాయాన్ని కూడా పోలీసుల నుండి పొందలేరు. కాని తరచుగా పోలీసుల హింసా దౌర్జన్యాలకు గురవుతుంటారు. సామాజిక న్యాయం కొరకు, చట్టాల్ని అమలు స్వతంత్రం తర్వాత భారతదేశం 678
జరిపించుకొనేందుకు జరిపే పోరాటాలలో తరచుగా లాఠీ ఛార్జీలకు, భాప్పవాయు ప్రయోగానికి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేని కాల్పులకు గురవుతుంటారు. విచారణలో వున్న ఖైదీలపై పోలీసులు పాశవికంగా వ్యవహరిస్తుంటారు. వారి పాశవికత మరణాలకు దారితీస్తుంది. 1997లో పోలీసుల అధీనంలో వున్న ఖైదీల చావులు 800గా నమోదు చేయబడింది. ఫలితంగా (ప్రజలు పోలీసులంటే భయపడతారు. అసహ్యంగా చూస్తారు. శత్రువులుగా పరిగణిస్తారు. రాజకీయ జోక్యం రాజకీయ నాయకులు పోలీసుల్ని తమ కనుకూలంగా ఉపయోగించుకొనడం పరిస్థితుల్ని మరింతగా క్షీణింపచేసింది. పోలీసు శ్రేణులలో క్రమశిక్షణా రాహిత్యం వ్యాప్తి లంచగొండితనానికి, నైతిక పతనానికి దారితీసింది. ఇక సాధారణ పోలీసులు, మహిళా పోలీసులు వారి జీతభత్యాలు, పని పరిస్థితులు, పదోన్నతి అవకాశాలు, సామాజిక స్థాయి - అన్నీ చాలా దిగువ స్థాయిలో వున్నాయి గనుక చాలా అసంతృప్తితో వున్నారు. రాజ్యం యొక్క కీలకమైన వ్యవస్థగా వున్న పోలీసు వ్యవస్థని అదుపు చేసి సంస్కరించి పునర్నిర్మించాల్సిన అవసరాన్ని సాధారణ (ప్రజల పట్ల పోలీసుల దృక్పథాన్ని మార్చవలసిన అవసరంతో దశాబ్దాల తరబడి, వివిధ ప్రభుత్వాలు పాలనాపరమైన కర్తవ్యంగా భావించాయి. కాని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ దిశలో ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నేషనల్ పోలీసు కమిషన్ 1979 రిపోర్టుని అమలు పరచడంలో లేక దానిలోని సిఫార్సుల్ని పరిగణనలోకి తీసుకొనడంలో అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ప్రభుత్వపరమైన అశ్రద్ధ లేక ఉదాసీన వైఖరికి ఉదాహరణ. సాయుధ బలగాలు భారతదేశ మిలిటరీ అత్యంత క్రమశిక్షణాయుతమైనదిగా, వృత్తి పట్ల నిబద్ధత గలదిగా కొనసాగుతున్నది. పౌర ప్రభుత్వ నియంత్రణలో వుంటూ ప్రజాస్వామ్య సంస్థల్ని, వాటి పని విధానాన్ని గౌరవించే సంప్రదాయం పాటిస్తూ వుంది. రక్షణ విధానానికి సంబంధించిన సలహాలు ఇస్తుంది. యుద్ధకాలంలో కార్యకలాపాలు నిర్వహించే అధికారం కలిగి వుంటుంది. అయినప్పటికి రక్షణ విధానం యొక్క మౌలిక రూపు రేఖల్ని నిర్ణయించేది పౌర ప్రభుత్వమే. మిలటరీకి, పౌర ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు పెంపాందటం యాదృచ్చికం కాదు. చాలా ఇతర మూడవ ప్రపంచ దేశాలలాగా భారతదేశం కూడా 674 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
మిలిటరీ ఆధిపత్యం క్రిందికి వస్తుందని ఆందోళన చెందిన స్వతంత్ర భారతదేశం యొక్క జాతీయ నాయకత్వం ఈ విషయంలో జాగ్రత్త పడింది. అత్యవసరమైన ఆర్థికాభివృద్ధి నుండి వనరుల్ని మరల్చకూడదనే ఆకాంక్షతో నెహ్రూ ఇతర నాయకులు మిలిటరీని పరిమితం చేశారు. ఇండియా - చైనా యుద్ధం తరువాత మిలిటరీ పెంచబడింది. కానీ జనాభా రీత్యా చూస్తే ఇప్పటికి చైనా పాకిస్తాన్ లేక దక్షిణ కొరియా, ఇండోనేషియా, అమెరికా, అత్యధిక యూరప్ దేశాల కంటే తక్కువగానే వుంది. జాతీయాదాయంలో రక్షణ బడ్జెట్ కేటాయింపుల నిష్పత్తి తక్కువగానే వుంది. రక్షణ వ్యయం ఆర్థికాభివృద్ధికి భరింపరాని భారంగా వుండకూడదని, రక్షణావసరాలకు సరిపడేటంత మాత్రమే వుండాలనేది లక్ష్యం.
భారతదేశ రాజకీయ పార్టీలు కూడా రక్షణ వ్యవహారాలకు మిలిటరీని పాక్షిక రాజకీయ చర్చలో అంశాలు చేయకూడదనే అంశాన్ని పాటించాయి. భారతదేశ 'ప్రజాన్వామ్య సంస్థల స్థిరత్వం కూడా మిలిటరీని రాజకీయాలకు దూరంగా వుంచింది.
అంతేగాక స్వతంత్రం వచ్చిన వెంటనే అధికారుల శ్రేణుల నియామకంలో గతంలో వలస పాలన కాలంలో పొటించిన వర్గ ప్రాంతీయ వివక్ష ఆపివేయడం జరిగింది. విభిన్న సామాజిక స్థాయిలకు చెందిన కులాల నుండి, మతాల నుండి, ప్రాంతాల నుండి నియామకాలు జరిగాయి. ఇది మిలిటరీకి అఖిల భారత స్వభావాన్ని సంతరించి పెట్టింది. మిలిటరీ శిక్షణ కూడా అఖిల భారత, జాతీయ దృక్పథాన్ని అందించి మిలిటరీని జాతీయైక్యత సమ(గ్రతల శక్తిగా చేసింది. ఇది మిలిటరీలోని ఒక సెక్షన్‌ని గాని, ఆఫీసర్ల పటాలాన్ని గాని, సాయుధ బలగాలను గాని రాజ్యాంగేతర రాజకీయ కేంద్రం వెనుక సమీకరించి పటిష్టపరచడాన్ని దాదాపు అసాధ్యం చేసింది.
రాజకీయ వ్యవహారాలలో మిలిటరీ జోక్యం చేసుకొనే ప్రమాదం లేనప్పటికి యిటీవలి కాలంలో కొన్ని రాజకీయ శక్తులు, మీడియా మిలిటరీని మిలిటరీ సంస్కృతిని ఆకాశానికి ఎత్తే ధోరణిని ప్రవేశపెట్టాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు
భారతదేశ ఫెడరల్ విధానం రాజ్యాంగంలో పొందుపరచబడిన విధంగా బలమైన కేంద్రంపై ఆధారపడి వుంది. అమలు జరిపిన ఆర్థికాభివృద్ధి నమూనా కారణంగా ప్రణాళిక, పబ్లిక్ సెక్టార్, పేదరిక నిర్మూలనలకు కేంద్రం నిధులు సమకూర్చడం, పన్నుల ద్వారా స్వతంత్రం తర్వాత భారతదేశం 675
కేంద్రానికి లభించే ఎక్కువ వనరుల నుండి రాలకు కేటాయించటం లాంటి పని విధానం ద్వారా క్రమంగా కేంద్ర (ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రాబల్యం వహించింది. అంతేగాక స్వతంత్రానంతర తాలి దశాబ్దాలలో ఒకే పార్టీ కేంద్రంలో రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఇది ప్రధానమంత్రికి కేంద్ర కాం(గగెస్ నాయకత్వానికి రామ్షైలపై పట్టు పెంచింది. కాని ఈ పట్టుని చారవని భూసంస్కరణలు అమలు జరపడానికి తగినంతగా వినియోగించుకోలేదు. ఆ తరువాత రాష్ట్రాలు క్రమక్రమంగా కాంగ్రెసేతర పార్టీల పరిపాలన క్రిందకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ప్రభావం తగ్గింది. లైసెన్సు - కోటా విధానం రద్దు, కేంద్ర ప్రణాళికల పాత్ర తగ్గుదల కూడా రాష్ర్రాలపై కేంద్రం ప్రాబల్యం తగ్గడానికి కారణాలు. కొన్ని కీలక రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేయగల ఎక్కువ అధికారాలు గల బలమైన కేంద్ర ప్రభుత్వం అవసరం గుర్తించబడింది. పలు మతాలు, పలు భాషలు గల భారతదేశం లాంటి దేశంలో మైనారిటీలకు షెడ్యూల్డు కులాలకు షెడ్యూల్డు తెగలకు రక్షణ కల్పించే కీలకమైన పాత్ర కేంద్రం పోషించాల్సి వుంటుంది. ప్రాంతీయ వ్యత్యాసాల పెరుగుదలను నిరోధించడానికి, శాంతింపచేయడానికి కూడా బలమైన కేంద్ర ప్రభుత్వం అవసరం. అంతేగాక విచ్చిన్నకరమైన కుల మత ప్రాంతీయ శక్తులతో వ్యవహరించేందుకు, వాటి ఘర్షణలను అదుపులో పెట్టేందుకు కూడా బలమైన కేంద్రం అవసరం. అదే సమయంలో భారత రాజకీయ వ్యవస్థ యొక్క ఫెడరల్ స్వభావం కాలక్రమంలో క్షీణిస్తుందనడం తప్పవుతుంది. రాజ్యాంగం సమకూర్చిన స్వయం ప్రతిపత్తిని రామాలు వినియోగించుకోగలుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ గాక ఇతర పార్టీలు రాష్ట్రాలను స్వేచ్చగా పాటించగలుగుతున్నాయి. సంస్కృతి, విద్య భూసంస్కరణలు, వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల, ఆరోగ్య పరిరక్షణ, నీటి సరఫరా, ప్రజా సంక్షేమం రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేగాక దాదాపు అన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సామాజికాభివృద్ధి సంక్షేమ ప్రణాళికలు పథకాలు - రాష్ట్రాల పరిపాలనా యంత్రాంగం చేతనే అమలు పరచబడతాయి. దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాలలో పరిపాలన అంత సక్రమంగా లేదు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో వెనుకబడ్డాయి. అందుకు కారణం పరిపాలన సక్రమంగా నిర్వహించకపోవడం గాని కేంద్రం జోక్యం 676 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాదు. ఉదాహరణకు కేంద్రం ఒత్తిడి చేసినప్పటికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగాలు, భూసంస్కరణలు సరిగా అమలు జరపకపోవడం వలన భూమిలేని పేదలు ప్రయోజనం పొందలేదు. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు కేంద్రంలో అంతగా ప్రాతినిధ్యం లేకపోయినప్పటికి రైతులకు అనుకూలంగా భూసంస్క్మరణలను (ప్రవేశపెట్టదడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్మోలేదు.
రాష్ట్రాల స్వయం ్రతిపత్తిలో కేంద్రం జోక్యం చేసుకొన్న ఒకే ఒక ఆంశం : 356 ఆర్టికల్‌ని ప్రయోగించి రాష్ట్రపతి పాలన రూపంలో కేంద్ర పరిపాలనను రాష్ట్రాలపై రుద్దడం. ఈ అధికారం రాష్ట్రంలోని రాజ్యాంగబద్ధమైన (ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి వీలుపడని అసాధారణ వరిన్టితులేర్చడినవ్వుడు మాత్రమే ప్రయోగించడానికి ఉద్దేశించబడింది. కాని ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి లేక పాలక పార్టీ రాష్ట్ర శాఖలను తన అదుపులో వుంచుకొనడానికి ఈ అధికారం 1970లలో తరచుగా ఉపయోగించబడింది. తరువాత కాలంలో ఈ అధికార దుర్వినియోగం చాలావరకు అదువు చేయబడింది. ఏమైనప్పటికీ ఆర్టికల్ 356 దుర్వినియోగం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అపహాస్యంగా మార్చిందనడం తప్పవుతుంది.
సమాఖ్య అనేది యూనియన్ యొక్క బలహీనమైన రూవం కాదు. వైవిధ్యభరితమైన సమాజానికి అనువైన బలమైన యూనియన్ యొక్క రూపం సమాఖ్య, అదేవిధంగా సమాఖ్యలో బలమైన కేంద్రం బలమైన రాష్ట్రాలు పరస్పర విరుద్ధాలు కావు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించేందుకు 1980లో నియమించబడిన సర్కారియా కమిషన్ కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వాటి కార్యక్రమాలను, వాగ్భానాలను అమలు పరచడానికి కేంద్రం రాష్ట్రాలు బలంగా వుండటమే సమాఖ్య సూత్రం. బలమైన జాతీయ రాజ్యం అధికార వికేంద్రీకరణల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన సమాజంలో ప్రజాస్వామ్యానికి జాతీయైక్యత అభివృద్ధికి కావలసింది అధికార వికేంద్రీకరణ గాని అధికార కేంద్రీకరణ కాదు. నిర్ణయాలు చేయడంలోను, అమలు పరచడంలోను వికేంద్రీకరణ అవసరం.
ప్రభుత్వం యొక్క మూడవ శ్రేణికి అంటే స్థానిక స్వయం పరిపాలనకు అధికారాన్ని వికేంద్రీకరించి సంక్రమింపచేయడం - జాతీయోద్యమం యొక్క రాజకీయ పరిపాలన అజెండాలోని మౌలికమైన అంశం. ఫలితంగా 1950 దశాబ్దం చివరిలో స్వతంత్రం తర్వాత భారతదేశం 677
దిగువ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పి ప్రణాళికలలో వివిధ అభివృద్ధి పథకాల అమలులో ప్రజల జోక్యాన్ని రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు స్టానిక పరిపాలన అధికారంలోని ఎక్కువ భాగాన్ని జిల్లా పరిషత్‌లకు, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసేందుకు ఒక (ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం యొక్క ఫలితాలు చాలా నిరాశాజనకంగా వున్నాయి. కారణం ఈ మూడవశ(శ్రేణి సంస్థలు అధికారులచే అణచివేయబడ్డాయి. రాష్ట్ర పరిపాలనతోను స్టానిక అధికారులతోను సన్నిహిత సంబంధాలు గల భూస్వాములు వారి అధికారాన్ని మరికొంత 'పెంచుకొనదానికి ఈ పరిస్థితుల్ని ఉపయోగించుకొన్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలు వదులుకొని స్థానిక సంస్థలకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా వున్నాయి. 1980లలో పంచాయతీరాజ్ ప్రయోగం రెండు రాఘ్ట్రాలలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే ఫలప్రదమైంది. ఎన్నికైనప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా పంచాయతీలు సరియైన పునాదులపై పునర్చిర్మించబడ్డాయి. మెరుగైన ఫలితాలు ఇవ్వటం ప్రారంభమయింది. పంచాయితీలలోని 380 లక్షల మంది సభ్యులలో 10 లక్షల మంది మహిళలు. మరొకవైపు అత్యధిక నగరాలలోని, పట్టణాలలోని మున్సిపల్ ప్రభుత్వాలు లంచగొండితనంతో, అసమర్థ పాలనతో కునారిల్లుతున్నాయి. రోడ్లు, పార్కులు, వీధిదీపాలు, నీరు, విద్యుత్ సరఫరా, మురుగు, ఆరోగ్య రక్షణ, పారిశుధ్యం పాఠశాల విద్య నేరాల అదుపు - అన్నీ క్షీణిస్తున్నాయి. రాజకీయ పార్టీలు భారతదేశంలో రాజకీయ పార్టీలు, పార్టీ విధానం చాలా జబ్బులతో క్షీణిస్తున్నాయి. ఇవి : అంతర్గత అస్థిరత, పార్టీల లోపల అంతర్గత కుమ్ములాటలు ముఠాతత్వం, చాలా పార్టీలలో బలహీనమైన అసమర్ధ నిర్మాణం ఫలితంగా ముక్కలు చెక్కలవుతున్న పార్టీలు, స్థిరత్వం కొరవడిన సంకీర్టాలు, ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి విధేయతలు మార్చుతున్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అత్యధిక పార్టీలలో కొరవడిన (ప్రజాస్వామ్య చర్చ, అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం విధానాలకు మద్దతు సమీకరించడంలోని వైఫల్యం. అత్యధిక రాజకీయ పార్టీలు ఎలాంటి దీర్హక్షాలిక రాజకీయ కార్యక్రమం లేక అభివృద్ధి పథకం నమూనా లేకుండా పనిచేయడం, కార్యక్రమాలు విధానాల నుండి రాజకీయ చర్చని పైపై వ్యక్తిగతమైన అంశాల వైపు మరల్చటం, పార్టీలు కుల మత ప్రాంతీయ దురభిమానులపై ఆధారపడటం. ఉదాహరణకు 1989 నుండి ఎన్నికలు బోఫోర్స్ హవాలా అపవాదులు, లేని ఆలయాన్ని పునర్నిర్మించుట, ప్రభుత్వ సర్వీసులలో కొన్ని వేల ఉద్యోగాల 678 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, అదిత్య ముఖర్జీ
రిజర్వేషన్లు, విదేశంలో పుట్టిన సోనియా గాంధీ కంటే వాజ్‌పేయి యోగ్యతలు, కొన్ని వందల కార్గిల్ చొరబాటుదారులపై సాధించిన విజయం లాంటి ప్రజా జీవితంతో అంతగా సంబంధం లేని అంశాలపై ఎన్నికలు జరిగాయి.
ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి లేక అధికారం దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు గ్రాంట్లు, సబ్సిడీలు, ఉచిత విద్యుత్, చౌకబియ్యం వాగ్దానాల లాంటి చౌకబారు జనాకర్షక విధానాలకు పాల్పడుతున్నాయి. చాలా పార్టీలు రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత పాత్రని, పాలనని అతిశయించి చెప్పుకుంటూ రాజకీయ సంస్థల్ని బలహీనపరుస్తున్నాయి. రాజకీయ జబ్బు యొక్క ఒక లక్షణం రాజకీయ నాయకులు ఎంత ముసలివాళ్ళయినా, ప్రజల ఛీత్కారాలు ఎంత పొందినా రాజకీయాల నుండి విరమించుకొనేందుకు విముఖంగా వుండటం. వాళ్ళు పాతకాలపు సంస్కృత సూక్తి, 'తృష్ణ నజీర్ణ వయమేష్ జీనవ్' (వృద్ధలమవుతాం, కాని కోర్కెలు కాదు), దృఢంగా. విశ్వసిస్తారు.
ఫలితంగా రాజకీయ నాయకత్వం ప్రజలపై పట్టు కోల్పోతున్నది. ఎన్నికలలో కావలసిన మెజారిటీ సాధించినప్పటికీ సమాజానికవసరమైన అభివృద్ధికరమైన మార్పులు చేపట్టలేకపోతున్నది. మరీ ప్రమాదకరమైన ఫలితమేమంటే మొత్తం రాజకీయ రంగమే విలువలు కోల్పోయి అపహాస్యం పాలవుతుంది. ప్రజలలో రాజకీయ పార్టీల పట్ల రాజకీయ నాయకుల పట్ల అపనమ్మకం నిరాశావాదం (ప్రబలుతున్నాయి. రాజకీయాలు రాజకీయ జీవితం అంటే (ప్రజలు నయవంచక లంచగొండితనంగా ఈనడించే వైఖరి నవలంబిస్తున్నారు. రాజకీయ జీవితం అంతగా (భ్రష్టు పట్టడం వలన ఆదర్శాలు గల యువకులు రాజకీయాలలోకి ప్రవేశించడం లేదు. రాజకీయాల్లోకి వచ్చేవారు రాజకీయ రంగాన్ని సామాజికంగా ఆర్థికంగా పైపైకి ఎదగడానికి సాధనంగా ఉపయోగించుకొంటున్నారు.
అయినప్పటికి ప్రజాస్వామ్యం మనుగడకి మంచి పాలన సాగదానికి రాజకీయ కార్యకర్తలు, నాయకులు పార్టీలు అవసరం. వాటిని అవహాన్యం చేయడం, ఏవగించుకోవడం రాజకీయ వినాశనానికి దారితీస్తుంది. అధికారవాదాన్ని, ఫాసిజాన్ని మిలిటరీ పాలనను స్వాగతించడమవుతుంది.
ప్రజాస్వామ్య రాజకీయాలు కాంగ్రెస్ అనే విశాలమైన గొడుగు క్రింద లేక దాని ప్రాబల్యంలో అభివృద్ధి చెందాయి గనుక కాంగ్రెస్ సంస్థ క్షీణించడం తీవ్రమైన స్వతంత్రం తర్వాత భారతదేశం 679
అంశం. చాలా సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఒక సంస్థగా దిగువ స్థాయిలో క్రమబద్ధమైన రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. అది ఎన్నికల యంత్రమయింది. ఎన్నికల యంత్రంగా కూడా పనిచేయలేకపోతున్నది. ఇంతకుముందు గమనించిన విధంగా ఇందిరాగాంధీ పార్టీ యొక్క రాజకీయ పునాదిని సరిచేయగలిగినప్పటికీ, పని విధానాన్ని కేంద్రీకరించడం వలన ఒకే నాయకునిపై అధికారికంగా ఆధారపదేలా చేయడంవలన సంస్థ చట్రాన్ని బలహీనపరచింది. దురదృష్టవశాత్తు కాం(గ్రెస్ నిర్వహించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆవిర్భవించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత కలిగి దేశంలోని అన్ని ప్రాంతాలలో ఒక మేరకైనా ఉనికి గలిగిన జాతీయ పార్టీ. కాంగ్రెసేతర పార్టీలు ప్రతిపక్షంలో వున్నప్పుడు బాధ్యతాయుతమైన హేతుబద్ధమైన, సమర్ధవంతమైన విమర్శ చేయడంలో విఫలమయ్యాయి. 1977, 1989 లేక 1998లో అధికారంలో వున్నప్పుడు అవి ప్రత్యామ్నాయ జాతీయాభివృద్ధి కార్యక్రమాన్ని లేక అజెండాని ప్రతిపాదించడంలో విఫలమయ్యాయి. అంతేగాక 1967నుండి ఇప్పటి వరకు కేరళ పశ్చిమ బెంగాల్‌లాంటి ఒకటీ అరా మినహాయింపులతో అవి సైద్ధాంతిక కార్యక్రమాలను లేక విధానపరమైన విభేదాలను ప్రక్మనపెట్టి సూత్రరహితమైన అవకాశవాద కూటముల నేర్పాటు చేశాయి. రాజకీయ పార్టీలు క్షీణించడం, విచ్చిన్నమవడం, అదృశ్యమవడం లాంటి క్రమానికి ప్రతిపక్ష పార్టీలతో సిపిఎం, బిజెపిలు పాక్షికంగా మినహాయింపులుగా పేర్మానవచ్చు. సిపిఎం కూడా కొంతకాలం నుండి స్తబ్ధతగా వుంది. అది పార్టీ నిర్మాణంలోను రాజకీయ విధానాలు కార్యక్రమంలోను నిశ్చితాభిప్రాయాలు గలవి. అది పార్లమెంటరీ ప్రజాస్వామ్య తర్మాన్ని అంగీకరించినప్పటికి దాని కార్యక్రమం ఈ గుర్తింపుని పూర్తిగా ప్రతిఫలించదు. దాని రాజకీయ ఆచరణ యూరో కమ్యూనిజాన్ని లేక సోషల్ డెమోక్రటిక్ విధానాన్ని అనుసరిస్తుంది. కాని పెట్టుబడిదారీ విధానాన్ని హింసా ప్రయోజనంతో కూలదోసే ప్రాతిపదిక గల స్టాలినిస్టు విధానం దానికి మార్గదర్శకంగా వుంటుంది. అంతేగాక దానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య చట్రంలో గల జాతీయాభివృద్ధి దృక్పథం లేదు. ప్రత్యామ్నాయంగా సోషలిస్టు విధానాన్ని ప్రతిపాదిస్తుంది. 680 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఇటీవలి కాలంలో బిజెపి నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. బిజెపి పెరుగుదల మతపరమైన కారణాల రీత్యానే గాక దానిపై ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం రీత్యా కూడా వాంఛనీయం కాదు. మైనారిటీలను బహిష్కరించి హిందూ రాష్ర్టాన్ని స్థాపించే లక్ష్యం గల ఆర్ఎస్ఎస్ బిజెపికి దిగువ (శ్రేణుల్ని నాయకత్వాన్ని సైద్ధాంతిక చట్రాన్ని సమకూర్చుతుంది. సంస్థాపరంగా, సైద్ధాంతికంగా ప్రజాస్వామ్య విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఫాసిజం యొక్క భారతీయ రూపానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిజెపికి మతపరమైన దృక్పథం వున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ లేకపోతే అది ఇటలీ జర్శ్మనీలలోని క్రిష్టియన్ డెమోక్రటిక్ పార్టీలలాగా లేక అమెరికాలోని రిపబ్లికన్ పార్టీలాగా మతపరమైన విజ్ఞప్తలతో హిందువులలోని కొన్ని సెక్షన్లను ఆకట్టుకొనే మితవాద పార్టీ అయి వుండేది.
భారతదేశంలో ఇతర మితవాద పార్టీలు క్రమంగా అంతర్భానమవడం వలన, కాంగ్రెస్ క్షీణించడం వలన, సమానత్వం సామాజిక న్యాయం పట్ల నిఐద్ధతలేని త్వరగా పెరుగుతున్న మధ్యతరగతుల మద్దతు మన బిజెపి ఇటీవలి సంవత్సరాలలో అభివృద్ధి చెందింది. కాని అఖిల భారత స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా బిజెపి పెరుగుతున్న కొలదీ దానిని కూడా కాంగ్రెస్‌ని పట్టి పీడిస్తున్న జబ్బులే పీడిస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో ప్రత్యేకమైన స్థానిక పరిస్థితుల రీత్యాను, కాంగ్రెస్ క్షీణత కారణంగాను, రాజకీయాల ద్వారా అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాల కారణంగాను చాలా ప్రాంతీయ పార్టీలు లేక ఒక నాయకుని పార్టీలు పుట్టుకొచ్చాయి. లంచగొండితనం
పెద్ద ఎత్తున ప్రబలుతున్న లంచగొండితనం, పెరుగుతున్న నేరాలు, నేరపూరిత రాజకీయాలు - భారతదేశ అభివృద్ధికి ప్రజాస్వామిక నైతిక ఆరోగ్యానికి ప్రమాదకారులుగా పరిణమించాయి.
వలస పాలకుల పాలన మొదటి నుండి సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు. జీతాలు ఎక్కువగా వున్న పై న్థాయి ఉద్యోగులలో తప్ప మిగిలిన క్రింది స్థాయి ఉద్యోగులలో లంచగొండితనం ప్రబలింది. కాని వెనుకబడిన ఆర్థిక విధాన స్వభావం కారణంగాను, వలస రాజ్య పనివిధానం యొక్క పరిమిత స్వభావం కారణంగాను లంచగొండితనం ప్రభావం కొద్దిమంది (ప్రజలపైనే పడింది. కాని పర్మిట్ లైసెన్స్ కోటా స్వతంత్రం తర్వాత భారతదేశం 681
విధానాన్ని ప్రవేశపెట్టడం, వినిమయ వస్తువుల కొలతలు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విపరీతమైన పన్నుల విధింపులతో నల్ల బజారు వ్యాపారం పన్నుల ఎగవేత విసృతమయింది. కాని అప్పటికి పరిపాలనలో, రాజకీయ వ్యవస్థలో లంచగొండితనం వ్యాపించలేదు.
ఆర్ధికాభివృద్ధి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల ఆర్థిక పాలనా రంగాలలో లంచగొండితనానికి అవకాశాలు కల్పించాయి. ప్రభుత్వ ఆర్థిక వనరుల అందుబాటుకి, పర్మిట్లు లైసెన్సుల కోటాలు పొందడానికి రాజకీయ ప్రాపకం ఉపయోగించుకోబడింది.
నెహ్రూ కాలంలో పన్నుల ఎగవేతతో సహా రాజకీయ, పాలనాపరమైన లంచగొండితనం పెరుగుదల సూచనలు స్పష్టంగా కనిపించాయి. కాని కఠినమైన సమయోచిత చర్యలు పరిస్టితి దిగజారకుండా అద్దుకున్నాయి. 1950లలో లంచగొండితనం మూలాలు బలంగా వేళ్ళూనుకొనలేదు. స్వతంత్ర పోరాటం, గాంధేయ నైతికతతో ప్రభావితమైన రాజకీయ నాయకత్వం కార్యకర్తలు, మధ్య పై స్థాయిల్లో నిజాయితీ గల అధికార వర్గం, చిత్తశుద్ధి గల న్యాయమూర్తులు లంచగొండితనం విస్తరణని అద్దుకొన్నారు. కాని త్వరితగతిని సమస్య మూలాల్లోకి పోయి నిర్మూలించడానికి వ్యూహం రూపొందించలేదు.
ఫలితంగా ప్రజల జీవితంలో ప్రభుత్వం నిర్వహించే పాత్ర పెరుగుతున్న కొద్దీ లంచగొండితనం తీవ్రత పెరుగుతూ వచ్చింది. కాలక్రమంలో రాజకీయ వ్యవస్థ లంచగొండితనంలో చిక్కుకొన్నది. దిగువ స్థాయిల్లో అదుపు చేయబడకపోవడంతో లంచగొండితనం క్రమంగా రాజకీయ పాలనా వ్యవస్థలలోని పై స్థాయిలకు ఎగబాకింది. రాజకీయ ప్రాపకం అందిచ్చిన ప్రోత్సాహంతో సర్వ వ్యాప్తమైన లంచగొండితనం పరిపాలనని చుట్టుముట్టి ధ్వంసం చేస్తున్నది. ఇప్పుడు లంచగొండితనం అధికారులకు రాజకీయ నాయకులకు పరిమితమై లేదు. సమాజంలోని ఏ సెక్షన్ కూడా దానికి అతీతంగా లేదు. మీడియా, విద్యారంగం, వివిధ వృత్తులు, న్యాయ వ్యవస్థ కూడా కళంకితమయ్యాయి. పాలనాపరమైన అసమర్ధత జాప్యాలతో పాటు లంచగొండితనం సాధారణ (ప్రజల పాలిట శాపమయింది.
కాని ఇప్పటికి నిజాయితీపరులైన అధికారులు, ఉద్యోగులు, రాజకీయ కార్యకర్తలు, నాయకులు వున్నారు. పరిపాలనలో (ప్రజా జీవితంలో గల లంచగొండితనాన్ని అతిశయించి చెబుతూ నిజాయితీకి కనీస గుర్తింపు కరువయింది. 682 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారత రాజకీయ వ్యవస్థలో 1960వ దశాబ్దం చివరి నుండి ఎన్నికలకు సమకూర్చడం అవినీతికి పెద్ద వనరు అయింది. డబ్బు సంచులు నల్లధనం వున్నవాళ్ళకు సానుకూలత పెరుగుతుండటం వలన ఎన్నికలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమయింది. చాలా సంవత్సరాల నుండి కుల మత ఘర్షణలు రౌడీలను, గుండాలను రాజకీయాలలోకి రప్పిస్తున్నాయి. కుల మతతత్వాలు, శాంతి భద్రతల పరిరక్షణలో మెతకదనం, ఎన్నికలలో ధనబలం, కండబలం ప్రయోగం - ఫలితంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాజకీయాలు నేరపూరితం చేయబడుతున్నాయి. రాజకీయ నాయకుల, వ్యాపారస్తుల, అధికారుల, పోలీసుల, నేరస్థుల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. డబ్బుతో నేరగాళ్ళ ముఠాల్ని, ఉద్యోగుల్ని లొంగదీసుకుని ఎన్నికల్ని తొత్తదానికి పోలింగు బూతుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాని ఇటీవలి ఒక సానుకూలమైన పరిణామం. రాజకీయాలలోని లంచగొండితనంతో నేరగాళ్ళతో డబ్బు సంచుల పొత్రతో సైద్ధాంతికంగా, రాజకీయంగా, వ్యవస్థాపరంగా వ్యవహరించవలసిన తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారతదేశ రాజకీయ సంస్థలలో కొంత బలహీనత, క్షీణత చోటు చేసుకొన్నప్పటికీ అవి పనిచేయడం కొనసాగుతుంది. గత వైభవం పొందగల ఆ సంస్థల సామర్ధ్యం రాజకీయ పండితులను, నిరాశావాదులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్రంలో అస్థిర నిరర్ధక ప్రభుత్వాలు, సమాజంలో పెరుగుతున్న హింసా ప్రవృత్తి పరిపాలనలో రాజకీయ జీవితంలో లంచగొండితనం, రాజకీయాలు, రాజకీయ సంస్థలపై ప్రబలిన నిర్లిప్తకా భావం ్రబలినప్పటికీ భారతదేశ ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. సుప్రతిష్టితమవుతుంది. ప్రజాస్వామ్య సంస్థలు బలంగా వేళ్ళూనుకొన్నాయి. ఎన్నికల వ్యవస్థ యొక్క అధికారం నిరాఘాటంగా సాగుతుంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలు నాయకులకు పార్టీలకు న్యాయబద్ధత కల్పిస్తున్నాయి. ప్రజలు - ప్రత్యేకించి పేదలు, మేధావులు వారి ఆకాంక్షల్ని వ్యక్తీకరించేందుకు, విధానాల పట్ల వారి ప్రాధాన్యతను వ్యక్తీకరించేందుకు, వాగ్దానాలు చేసి నెరవేర్చని వారిని శిక్షించేందుకు ఓటు ఆయుధాన్ని స్వేచ్చగా వినియోగించుకొంటున్నారు. దురదృష్టకర అంశమేమంటే, ఇతర (ప్రజాస్వామ్యూలలో లాగానే భారత రాజకీయ వ్యవస్థకు ప్రజలు ఎంపికచేసే విభానాలను అమలు జరిపే యంత్రాంగం లేదు. కాబట్టి స్వతంత్రం తర్వాత భారతదేశం 688
కాలానుగుణంగా ప్రజల మారుతున్న అవసరాలను తీర్చేందుకు - ప్రత్యేకించి అభివృద్ధి ఫలితాలలో ఎక్కువ వాటా కావాలని కోరుతున్న డిమాండ్లను తీర్చే విధంగా రాజకీయ పరిపాలనా సంస్థలను సంస్క్మరించవలసిన అవసరం వుంది. ఇప్పటి వరకు పనిచేసిన సంస్థలు సామాజికంగా యధాతథ స్థితిని, స్థిరత్వాన్ని సంరక్షించే విధంగా సన్నద్ధం చేయబడి వున్నాయి. కాని జాతీయోద్యమం, ప్రజాస్వామ్య పని విధానంచే రాజకీయీకరణ చెందించబడిన ప్రజల ఆదేశాల మేరకు ఆర్ధికాభివృద్ధి సామాజిక మార్పు కర్తవ్యాలను నెరవేర్చే విధంగా వాటిని తిరిగి రూపొందించవలసి వుంది. అదేవిధంగా ఈ కర్తవ్యాలను నెరవేర్చడానికి ప్రజల శక్తియుక్తుల్ని వినియోగంలోకి తెచ్చే నూతన సంస్థల్ని సృష్టించవలసిన అవసరం వుంది. దీనిలో రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల పాత్ర కీలకమైనది. స్వతంత్ర పోరాటం అందించిన తరహా, స్థాయి గల రాజకీయ నాయకుల్ని ఈనాడు ఆశించలేకపోయినప్పటికి స్వతంత్ర పోరాటంలోను రాజ్యాంగంలోను రూపొందించబడిన ఆదర్శాల పట్ల సామాజిక రాజకీయ నిబద్ధత గల రాజకీయ నాయకులను తయారు చేసుకొనగల ప్రజల శక్తిపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి వుంది.
6841 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
త్‌ే నూతన సహస్రాబ్ది ప్రారంభంలో వ
మనం నూతన సహస్రాబ్టిలోని మొదటి దశాబ్దంలో ప్రవేశించగానే కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. భారతదేశం ఇప్పటి వరకు ఏమి సాధించింది? దేశం ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది? భవిష్యత్ కర్తవ్యాలేమిటి? అవకాశాలేమిటి?
ఈనాడు పలువురు మేధావులు, వార్తాపత్రికలు, వారపత్రికలు సమకాలీన సమస్యలపై వెలువడుతున్న పుస్తకాలు స్వతంశ్ర్యానంతర భారతదేశాన్ని చీకటి ప్రాంతంగా చూసే వైఖరి చేపడుతున్నాయి. 1998లో రచయిత సి. థామస్ దేశం యొక్క దయనీయమైన పరిస్థితిని ఇలా సమీక్షించాడు.
కుల ఘర్షణలు, భాషాపరమైన ఘర్షణలు, మతతత్వ రక్తపాతం, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల హత్య, పాకిస్తాన్ చైనాలతో యుద్దాలు పంజాబు వేర్చాటువాదం, కాశ్మీరులో తిరుగుబాటు, అస్సాంలో రక్తపాతం, దక్షిణాదిన హిందీ వ్యతిరేక ఉద్యమాలు, ఆకలి, లంచగొండితనం, పరిసరాల కాలుష్యం, సంపన్నులపేదల మధ్య పెరుగుతున్న అంతరాలు, కులదురహంకారం,వరకట్న హత్యలు, బాల కార్మికులు, నేరమయం చేయబడుతున్న రాజకీయాలు, మహిళల పట్ల వివక్ష మానవ హక్కుల ఉల్లంఘనలు.
నెహ్రూ వున్నంత వరకు పలువురు మేధావులు వ్యక్తం చేసిన ఆశావాదానికి ఇది పూర్తిగా భిన్నమైన వైఖరి. గొప్ప చరిత్రకారులలో ఒకరైన ఎస్, గోపాల్ 1984లో ఇలా రాశాడు ;
కాలగమనంతో నెహ్రూ యుగం “అంతకంతకు మసకబారిన స్వర్ణయుగంలా కనిపిస్తున్నది. ఆయన చనిపోయినప్పుడు కాలాన్ని తన వెంట తీసుకుపోయినట్లయింది. స్వతంత్రం తర్వాత భారతదేశం ఓక
ఉన్నతమైన ఆశలు ఆకాంక్షలతో పాటు గణనీయమైన విజయాలు సాధించిన నెహ్రూ యుగం ఈనాడు అదృశ్యమైన ప్రపంచం. గతించిన ఆలోచనలు, కోల్పోయిన అవకాశాలు క్రుంగదీస్తున్న అనుభూతి. ప్రజాసేవ ఇక ఏమాత్రం స్వార్ధరహితమైన ఆదర్శం కాదు. ఆనాడు ఆయన (ప్రజలకు నిర్దేశించిన లక్ష్యాలు ఈనాడు అలజడి, అలసట కలిగించేవిగా వున్నాయి. భారతదేశం యొక్క సమిష్టి ఆత్మవిశ్వాసం తీవ్రమైన ఎదురు దెబ్బలకు గురయింది. ప్రజల ఆశావాదం దెబ్బతిన్నది.
విస్తృతంగా పరచుకొని వున్న పేదరికం, అసమానతలు నిరక్షరాస్యత సామాజిక అన్యాయం లింగ వివక్ష సామాజిక అణచివేత లంచగొండితనం, కులతత్వం, మతతత్వం
- ఇదీ భారతదేశ ముఖచిత్రం. కాబట్టి భారతదేశం గతం వర్తమానం పలువురిని నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నది. కాని ఇవీ ఇలాంటి బలహీనతలు మన దృష్టిని కప్పివేయకూడదు. స్వతంత్ర పోరాట కాలంలోను, స్వతంత్రం సాధించిన తొలి కాలంలోను సాధించాలని ఆశించినవన్నీ సాధించడం జరగలేదు. నిస్సందేహంగా తీవ్రమైన లోపాలు వున్నాయి. కొత్త బలహీనతలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రమాదాలు ఉత్పన్నమయ్యాయి.
అయినప్పటికీ భారతదేశం అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు గుర్తించక పోవడం తప్పవుతుంది. గడచిన 52 సంవత్సరాలలో భారతదేశం సాధించిన ఫలితాలు ఏ చారిత్రక ప్రమాణాల రీత్యా కూడా - ప్రత్యేకించి మన ప్రయాణం ఎక్కడ నుండి మొదలయిందో, మనం నడిచి వచ్చిన దారి ఎగుడు దిగుళ్ళతో ఎంత అస్తవ్యస్థంగా వుందో గమనంలో పెట్టుకొంటే గణనీయమైన విజయాలు సాధించిందని అంగీకరించక తప్పదు. ఈ కాలంలో ఎన్నీ రాజకీయ ఆర్థిక సామాజిక మార్పులు జరిగాయి. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి పోగుపడిన కశ్శలం గుట్టలుగా ఘనీభవించింది. అభివృద్ధి ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాధించడం జరిగింది గనుక భారతదేశం పలు రంగాలలో సాధించిన గుణాత్మక పురోగతి విస్మరించబడింది. రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో సాధించిన పురోగతి మిగిలిన సమస్యల్ని పరిష్మరించుకొనగల ప్రజల శక్తిపై విశ్వాసాన్ని పెంచింది. జాతీయైక్యత
రాజకీయంగా, ఆర్థికంగా భావోద్వేగపరంగా భారతదేశ ఐక్యతని పటిష్టపరచి, సంక్షిష్టమైన జాతి నిర్మాణ క్రమాన్ని ముందుకు నడపడంలో ఘనమైన విజయం 686 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
సాధించబడింది. విస్తారమైన భారతదేశ వైవిధ్యం ఈ (క్రమాన్ని అడ్డుకోలేదు. సామాజిక మధనంలో ఉత్పన్నమైన ఉద్రిక్తతలు భారతీయులు ఒకే జాతి అనే జాతీయతా భావాన్ని ఇంకా పెంచేందుకు అద్దురాలేదు. భారతదేశ ఐక్యతకు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి. వాటిని చాలావరకు అధిగమించడం జరిగింది. అధికార భాషా సమస్య, భాషా రాష్ల్రాల పునర్చిర్మాణం, భారత గుర్తింపుకి సమతూకంగా ప్రాంతీయ సాంస్కృతిక గుర్తింపుల నిరాకరణ, తెగల సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించి జాతీయ ప్రధాన ్రవంతిలో వాటి విలీనం, వేర్పాటువాద ఉద్యమాల వెనుక వున్న భావాలను అవగతం చేసుకొంటూనే వాటితో దృథధంగా వ్యవహరించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసి భారతదేశ రాజకీయ ఐక్యతకు హామీ కల్పించబడింది. రాష్ట్రాల మధ్య అసమానతలు వున్నాయి. కాని ఈ అసమానతలు అంతర్జత వలసవాదం వలన గాని లేక అభివృద్ధి చెందిన ఒక ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని దోపిడీ చేయడం వలన గాని లేక ఆర్థికంగా లొంగదీసుకొనడం వలన గాని ఏర్పడలేదు. అందువలన రామ్ర్రాల మధ్య అసమానతలు భారతదేశ ఐక్యతకు ప్రమాదకారులుగా పరిణమించలేదు. ఇటీవలి సంవత్సరాలలో చాలా ప్రాంతీయ పార్టీలు, ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు పుట్టాయి. అవి రాష్ట్రాలలో స్వేచ్చగా అధికారం చేపట్టాయి. అవి ఏదో ఒక జాతీయ పార్టీకి మిత్రపక్షంగా వుండి గాని లేక అఖిల భారతస్థాయిలో ఏర్పడిన కూటమిలో చేరిగాని కేంద్ర ప్రభుత్వ అధికారంలో కూడా భాగస్వాములయ్యాయి. అవి రాష్ర్రాల వనరులపై పూర్తి అజమాయిషీ కావాలని గాక (అవి ఎలాగూ రాష్ట్ర వనరులపై అజమాయిషీ కలిగి వున్నాయి గనుక) కేంద్ర వనరులలో ఎక్కువ వాటా కొరకు పోరాడుతున్నాయి. అంతేగాక ఎన్నికలకు సంబంధించిన, సంబంధించని భారతదేశ రాజకీయాలు అంతకంతకు జాతీయ స్వభావాన్ని సంతరించుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా క్రమబద్ధంగా నిర్వహింపబడుతున్న సార్వత్రిక ఎన్నికలు, అఖిల భారత రాజకీయ పార్టీల ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రాబల్యం, ఆర్థిక రాజకీయ అంశాలపై దేశవ్యాప్త (ప్రచారాలు,రేడియా, టి.వి. వార్తాపత్రికలు చలన చిత్రాలతో సహా అఖీల భారత రవాణా సమాచార అల్లికల పని విధానం ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో ఒకే ఒక రాజకీయ సంస్కృతి వ్యాపిస్తుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 687
కాబట్టి నెహ్రూ శకం తరువాత కూడా 1971, 1977, 1980, 1984 సార్వత్రిక ఎన్నికల అలాగే 1999లో బిజెపి నాయకత్వంలో నేషనల్ దెమోగ్రటిక్ అలయెన్స్ విజయాన్ని ప్రభావితం చేసిన ఎన్నికల సుడిగాలులు జాతీయ స్వభావం గలవి కావడం యాదృచ్చికం కాదు.
అయినప్పటికి కుల మత విభజనతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిపరమైన ప్రాంతీయ వ్యత్యాసాలు తీవ్రమైన సమస్యల్ని ముందుకు తెస్తున్నాయి. ప్రత్యేకించి మతత్వం వ్యాపిస్తూనే వుంది. గత రెండు దశాబ్దాల నుండి సెక్యులర్ శక్తులలో మతతత్వ వ్యతిరేక స్ఫూర్తి తగ్గుతున్నది. 1989లోను, ఇటీవల 1998, 1999లలో లాగా సెక్యులర్‌వాదులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మతతత్వ శక్తులతో మైత్రి నెరపుతున్నాయి. ఆ విధంగా మతతత్వ శక్తులకు గౌరవం విశ్వసనీయత తెచ్చి పెడుతున్నారు. భారతదేశం సెక్యులరిజం 'ప్రాతిపదికగానే బలమైన ఐక్యత గల జాతిగా మనగలుగుతుంది గనుక భారతదేశానికి మతతత్వం అత్యంత ప్రమాదికారి అయింది. మతం రాజకీయాల నుండి పూర్తిగా విడగొట్టబడకపోతే, మతతత్వ శక్తులతో రాజీపడటానికి ప్రయత్నిస్తే మతతత్వం పట్ల సరియైన సమయంలో దృఢంగా వ్యవహరించకపోతే ఏం జరుగుతుందో పంజాబ్‌పై అధ్యాయం 24లో గమనించాం. ఈ సందర్భంగా సంస్కృతీ సంప్రదాయాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం స్పష్టమవుతుంది. మతాలు, దేశీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజల జీవితంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. భారతదేశ సంస్కృతీ వారసత్వాన్ని మతతత్వ అభివృద్ధి నిరోధక శక్తులు దుర్వినియోగపరచకుండా అద్దుకోవాలంటే ఆధునిక సెక్యులర్ శక్తులు దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలతో సృజనాత్మక సంబంధాలు ఏర్పరచుకోవలసి వుంటుంది. దురదృష్టవశాత్తు (ప్రజా జీవితానికి సంబంధించిన ఈ అంశంపై సమగ్రమైన అధ్యయనం జరగలేదు. సెక్యులర్ ప్రజాస్వామ్య శక్తులు మఠాన్ని ఒక తాత్వికత, ఆధ్యాత్మిక అనుభవం, నైతికతకు మార్గదర్శి, మానసిక ఏకాంతంగా వరిగణించదానికి మతాన్ని పిడివాదంగా, మౌధ్యంగా, మతతత్వ వాహకంగా పరిగణించడానికి మధ్య గల వ్యత్యాసాన్ని అర్ధంచేసుకోవాలి.
ఏమైనప్పటికీ జాతి నిర్మాణ క్రమాన్ని జాగ్రత్తగా పెంచి పోషించేందుకు అది ఏకైక మార్గం కాదు గనుక అది కొత్త సవాళ్ళను ఎదుర్శానే సందర్భాలలో ఎదురుదెబ్బలు, అంతరాయాలు తప్పవు, 688 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ఆర్థికాభివృద్ధి వలన పెద్ద ప్రయోజనాలు పొందిన పెట్టుబడిదారులు, హరిత విప్లవంతో ప్రయోజనం పొందిన భూస్వాములు, 1947 తరువాత వచ్చిన అపారమైన అవకాశాలను అందిపుచ్చుకొన్న మేధావులు, వృత్తిదారులు, మధ్యతరగతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ ఉద్యోగులు, సంఘటిత కార్మిక వర్గం, షెద్యూల్లు కులాలు, షెడ్యూల్డు తెగలలో పై పొరలకు చెందినవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని తమకనుకూలంగా మరల్బుకోగలిగారు. పేదలు అలా చేయలేకపోయారు. నిర్ణయాలు చేసే క్రమంలో వారు వదలివేయబడ్డారు. వారి జీవితాలను ప్రభావితం చేసే దైనందనిక నిర్ణయాలలో కూడా వారి ప్రమేయం లేదు. వారికి ఆర్ధిక విధానంలో వనరులు పరిమితంగా కల్పించబడింది. వారి అధికారాన్ని (ప్రభావితం చేసేంతగా ప్రజల్ని సమీకరించలేక పోయారు. మార్పులు కోరే పార్టీలు గ్రూపులు సంఘాలు కూడా వారిని సమీకరించడం పట్ల అథ్రద్ధ చేశాయి. పేదలు నిరసనలు తెలియజేశారు. కొన్ని సందర్భాలలో తిరుగుబాట్లు చేశారు. ఎన్నికైన వ్యక్తులు వారి సామాజిక అర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తారనే ఆశతో ఎన్నికలలో చురుకుగా పాల్గొన్నారు.
అట్టడుగు ప్రజల చురుకైన జోక్యం లేనిదే అభివృద్ధి గాని సామాజిక మార్పు గాని జాతీయ సమైక్యత గాని పూర్తిగా సాధ్యపడదు గనుక వారిని సమీకరించడం అవసరం. స్వతంత్ర పోరాటంలో సాధారణ ప్రజల చురుకైన జోక్యం ప్రత్యేకంగా పేర్కొనదగినది కాగా ఆ పోరాట వారసులు వారిని విస్మరించడం విపరీతం. గాంధీజీ గొప్పతనం సాధారణ ప్రజలను అహింసాయుతంగా సమీకరించడం లోను భారత స్వతంత్ర పోరాటాన్ని ఐహముశా ప్రపంచంలోనే అత్యున్నత ప్రజా ఉద్యమంగా నడపడంలోనూ లేదా? జవహర్లాల్ నెహ్రూ యొక్క అభివృద్ధి ప్రణాళిక సామాజిక మార్పు కూడా క్రింది నుండి తీసుకొని వచ్చే ఒత్తిడిపైనే ఆధారపడింది. ఆయన తన స్వంత ప్రణాళికని అమలు పరచడంలో విఫలమవడం వేరే అంశం, రాజకీయ నిరసన రూపాలు
ఓటు హక్కుతో పాటు రాజకీయ నిరసన ప్రజాస్వామ్య రాజకీయాలలో సాధారణ భాగం. పీడితులు తమ బాధలను డిమాండ్లను వ్యక్తం చేసుకొనే సాధనం నిరసన. సమాజంలోని వివిధ సెక్షన్లు రాజకీయ చైతన్యంతో వారి సామాజిక పరిస్థితులలో త్వరిత మార్పుల కారకు కృషి చేస్తున్నారు గనుక భారతదేశంలో నిరసనలు నిరసనోద్యమాలు పెరుగుతున్నాయి. అధికారంలో వున్నవారిని స్పందించేలా చేయడానికి నిరసనోద్యమాలు స్వతంత్రం తర్వాత భారతదేశం 698
ముఖ్యమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా తలెత్తే ముఖ్యమైన ప్రశ్న : పౌర స్వేచ్చ గల ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సమాజంలో నిరసన రూపాలు ఎలా వుండాలి? ఇప్పటి వరకు భారతీయులు సరిైన నిరసన రూపాలు రూపొందించుకొనడంలో లేక నిరసన సందర్భంగా ఏమి చేయవచ్చు? ఏమి చేయకూడదు? అనే అంశంపై ఏకాభిప్రాయం రూపొందించుకొనడంలో విఫలమయ్యారు.
రాజకీయ పార్టీల విద్యార్థుల కార్మికుల రైతుల ప్రభుత్వోద్యోగుల సాధారణ పౌరుల నిరసనోద్యమాలు పెద్ద ఎత్తున అరెస్టులకు ఘర్షణలకు దారితీసే విధంగా ప్రదర్శనలు, నిరాహారదీక్షలు, హర్తాళ్ళు, పనిచేసే ప్రాంతాలలో విద్యా సంస్థలలో సమ్మెలు, ధర్నాలు, బంద్‌లు, ఘెరావ్‌లు, రాస్తారోకోలు, సత్యాగ్రహం, శాసనోల్లంఘనం రూపాలు తీసుకొంటున్నాయి. వీటిలో కొన్ని రూపాలు ఒత్తిడి తెచ్చేవి. మరికొన్ని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ హింసకు దారితీసేవి. చాలా సందర్భాలలో నిరసనకారులు ఏ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నారో ఆ ప్రజలనే తాము చేపట్టే నిరసనలలో పాల్గొనమని ఒత్తిడి తెస్తుంటారు. నిరసనలు - ప్రత్యేకించి ప్రదర్శనల రూపంలో సాగే నిరసనలు తరచుగా కార్లపై, బస్సులపై, రైళ్ళపై ప్రభుత్వ (పైవేట్ ఆస్తులపై దాడులతో ముగుస్తుంటాయి. తరచుగా ఆందోళనకారులు అతిగా వ్యవహరించడం, దానికి ధీటుగా లేక అంతకంటే ఎక్కువగా అధికారులు, పోలీసులు హింసాయుతంగా స్పందించడంతో పరిస్థితి విషపలయంగా మారి మరీ క్షీణిస్తుంది.
అలాంటి నిరసనోద్యమాల ఉద్దేశ్యం వారి డిమాండ్లలోని న్యాయబద్ధతని సంబంధిత అధికారులకు నచ్చచెప్పడం కాదు. గాంధేయ పదజాలంలో చెప్పాలంటే అధికారుల మనస్సు మార్చడం ద్వారా డిమాండ్లు సాధించుకొనడం కాదు, కేవలం వారి డిమాండ్లను సాధించుకొనేందుకు అధికారాన్ని బలహీనపరచి బలవంత పెట్టేందుకు.
కాబట్టి నింద ఒక పక్షంపై అంటే నిరసనకారులపై మోపడం సరియైనది కాదు. అధికారంలో వున్నవారు శాంతియుతమైన నిరసనకు స్పందించరు, హింసాయుతమైన నిరసనకు మాత్రమే స్పందిస్తారు గనుక నిరసనకారులు హింసాయుతమైన నిరసననే చేపడుతుంటారు. ఈ సందర్భంగా మ్రైరన్ వీనర్ 1962లో రాసిన ఈ దిగువ వాక్యాలు ఇప్పటికీ వర్తిస్తాయి. 694 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
“ప్రజా ఉద్యమం వలన శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు, డిమాండ్ల న్యాయబద్ధతని పరిగణించి గాక డిమాండ్ చేసే గ్రూపు యొక్క విధ్వంసక శక్తిని గుర్తించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం శాంతియుతంగా పెద్ద గ్రూపులు చేసే డిమాండ్ల పట్ల స్పందించకపోవడం, హింసాయుతంగా చేసే డిమాండ్లను పూర్తిగా ఆమోదించడం చేస్తుంటుంది.' మరొక విధంగా చెప్పాలంటే ప్రజాందోళనల నిర్వాహకులుగా వారు అధికారులపై ఒత్తిడి తీసుకొని రావడం గాక వారి మనసులను మార్చడానికి ప్రయత్నించడం అలాగే అధికారులు కూడా నిరసనకారుల ఆందోళనలు న్యాయబద్ధమైనవైనప్పుడు మనస్సు మార్చుకొనడానికి సిద్ధపడటం జరగాలి.
శాంతియుతమైన నిరసనని ఆటంకపరచడానికి లేక అణచడానికి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్య విరుద్ధమైనదైనటల్లే హింసాయుత నిరసన కూడా ప్రజాస్వామ్య పని విధానానికి ప్రమాదకారిగా పరిణమిస్తుంది.
ఈ సందర్భంగా మరొక ప్రశ్న ఎదురవుతుంది. ప్రజాస్వామ్య విధానంలో సత్యాగ్రహం చేపట్టడం లేక చట్టాలను అహింసాయుతంగా అతిక్రమించడం న్యాయబద్ధమా? అయితే ఎలాంటి షరతులతో లేక ఎలాంటి పరిస్థితులలో? దీనిపై మరికొంత అవగాహనకు మార్గదర్శకత్వం కొరకు సత్యాగ్రహానికి మూలపురుషుడైన గాంధీజీని ఆశ్రయించవచ్చు. గాంధీజీ స్వతంత్ర భారతదేశంలో ప్రజలు తమంతట తాము ఎన్నుకొన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం లేక శాసనోల్లంఘనం చేయడం సరియైన చర్య కాదన్నాడు. బిటిషువారికి వ్యతిరేకంగా కూడా సత్యాగ్రహం లేక శాసనోల్లంఘనం (త్రికరణశుద్ధిగా జరగాలన్నాడు. ఏమైనప్పటికి ప్రభుత్వం అన్యాయమూ, అనైతికతకు పాల్పడితే అప్పుడు కూడా సరిదిద్దడానికి చేపట్టిన అన్ని ప్రయత్నాలు విఫలమైతే చిట్టచివరి ఆయుధంగా సత్యాగ్రహాన్ని లేక శాసనోల్లంఘనని ఆశ్రయించాలి. గాంధేయ పద్దతుల్ని అనుకరిస్తూ స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన పోరాట రూపాలు దురాగ్రహాన్ని పోలివున్నాయి. గాంధేయ అవగాహన మేరకు సత్యాగ్రహానికి దురాగ్రహానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకొనేందుకు గాంధేయ పండితుడైన జోన్ వి. బాండురంట్ యొక్క కాంక్వెస్ ఆఫ్ వయలెన్స్' నుండి ఈ క్రింది వాక్యాలను ఉటంకించవచ్చు.
“నిర్లక్ష్యం లేక వథకం ప్రకారం (ప్రజాస్వామ్య పడ్డతులకు నష్టం వాటిల్లజేయబడినప్పుడు న్యాయాన్ని అవహేళన చేసే దిశగా న్యాయ యంత్రాంగం స్వతంత్రం తర్వాత భారతదేశం 695
మరల్చ్బబడినప్పుడు శాసనోల్లంఘనం చేపట్టవచ్చు. కాని శాసనోల్లంఘన సత్యాగ్రహ చట్ర పరిమితులలో గాక దురాగ్రహం రీతిలో చేపట్టబడితే అది చట్టబద్ధత పట్ల విస్తృతమైన ఉదాసీనతకు లేక నిర్లక్ష్యానికి దారితీయవచ్చు. ప్రజాస్వామ్య పద్దతులలోని విశ్వాసాన్ని బలహీనపరచేందుకు చట్టవిరుద్ధమైన ఎత్తుగడలను ప్రయోగించే వారికి దోహదపడవచ్చు.”
నిరసన పౌరునికి శ్వాసలాంటిది. కాబట్టి నిరసన వ్యక్తం చేయవద్దని గాందీజ్ ఎప్పుడూ సలహా ఇచ్చి వుండడు. కాని ఇటీవలి కొందరు గాంధేయవాదులు, గాంధేయవాదులు కానివారు పట్టిన మార్గాన్ని మాత్రం అనుసరించి వుండేవాడు కాదు. కాని, ఆయన వాగ్గ్దానం చేసిన విధంగా స్వయంపాలిత ప్రజాస్వామ్య సమాజానికి సరిపడే నిరసన రూపాలకు రూపొందించి వుందేవాడు. ఆర్థిక విధానం నిర్వహణ
స్వతంత్ర భారతదేశం యొక్క ఆర్ధిక విధానం నిర్వహణ 25 నుండి 31 వరకు గల అధ్యాయాలలో వివరించినట్లు మొత్తంమీద సంతృప్తికరంగా వుంది. కాని అవసరాల మేరకు గాని, అవకాశాల మేరకు గాని విజయాలు సాధించలేకపోయింది.
భారతదేశం ఆర్థిక స్తబ్ధతని అధిగమించింది. పేదరికం - వెనుకబాటుతనం - పేదరికం విషవలయం నుండి బయటపడింది. వలసవాద అర్థిక చట్రం నుండి కూడా విడివడింది. స్వావలంబన, స్వతంత్ర ఆర్థిక విధానానికి పునాదులు వేసుకొన్నది. ఆ విధంగా రాజకీయ స్వతంత్రాన్ని ఆర్థిక స్వతంత్రంగా మార్చుకోవాలన్న రిపబ్లిక్ నిర్మాతల పథకాన్ని నెరవేర్చింది.
భారతదేశం నిరంకుశ దేశంకాదు. స్వయం సమృద్ధి సాధించిన దేశం కాదు. ఇతర దేశాలతో సంబంధాలు లేకుందా ఒంటరిగా వుండాలనుకాన్న దేశమూ కాదు. అలా వుండటం సాధ్యమూ కాదు. భారతదేశం ప్రపంచ ఆర్ధిక విధానంలో భాగంగా మాత్రమే అభివృద్ధి చెందగలదు. కాని ప్రపంచ ఆర్థిక విధానంతో స్వతంత్ర భారతదేశం యొక్కవిలీనం వలస పాలన కాలం నాటికంటే భిన్నమైనది. అది స్వయంపాలిత భారతదేశ అభివృద్ధి అవసరాల ప్రాతిపదికన, పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలలోని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక విధానాలకు లోబడి గాక స్వతంత్రంగా వుండే ప్రాతిపదికన అభివృద్ధి చెందుతూ వుంది. విదేశీ పెట్టుబడికి భారతదేశ ఆర్థిక విధానంపై 696 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
బలమైన పట్టలేదు. స్వతంత్ర భారతదేశం విదేశీ పెట్టుబడిపై విదేశీ సహాయంపై ఆధారపడటం చాలా తక్కువ. ఈనాడు ఆర్థికంగా కీలకమైన పరిశ్రమ ఏదీ కూడా విదేశీ పెట్టుబడి నియంత్రణలో లేదు.
భారతదేశ ఆర్థిక విధానంలో బహుళ జాతి సంస్థలు కూడా తక్కువ పాత్ర నిర్వహిస్తున్నాయి. అయినప్పటికి అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కొరకు భారతదేశం కొన్ని పారిశ్రామిక దేశాలపై ఆధారపడటం కొనసాగుతూ వుంది,
స్వతంత్రం సాధించిన వెంటనే భారతదేశం తనదైన తరహా ఆర్ధిక విధానాన్ని - ప్రభుత్వానికి మార్కెట్‌కి సమాన ప్రాధాన్యత గల మిశ్రమ ఆర్ధిక విధానాల్ని జయప్రదంగా అభివృద్ధి చేసుకొన్నది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య పరస్పరం దోహదపడే సంబంధాన్ని అభివృద్ధి చేసింది. సహస్రాబ్టిలోని చివరి దశాబ్దంలో లైసెన్సు - కోటా రాజ్‌పై ఉద్యోగి స్వామ్యం నియంత్రణలను రద్దు చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలకు నష్టం వాటిల్లకుండా భారత ఆర్ధిక విధానాన్ని ప్రపంచ ఆర్థిక విధానంలో విలీనం చేస్తూ ఆర్థిక సంస్కరణలు (ప్రవేశపెట్టింది.
భారతదేశం వ్యవసాయంలో పరిశ్రమలలో జాతీయాదాయంలో నిలకడగల అభివృద్ధి సాధించింది. భారత ఆర్థిక విధానంపై ప్రపంచ ఆర్థిక విధానంలోని ఒడిదుడుకుల ప్రభావం పడలేదు. ప్రపంచంలోని మూడు పెద్ద ప్రతికూలతలు. 1970ల చమురు సంక్షోభం, భారతదేశానికి గణనీయమైన ఆర్థిక సంబంధాల గల యూరప్‌కి చెందిన సోషలిస్టు దేశాల పతనం, 1997నాటి తూర్పు ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక సంక్షోభం . నుండి నష్టం వాటిల్లకుండా నిలదొక్కుకొనగలిగింది. 1991 నాటి విచేశీ మారక (ద్రవ్య సంక్షోభం నుండి పెద్ద నష్టం వాటిల్లకుండా నివారించుకోగలిగింది. -
వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకతలో వలన పాలన కాలం నాటి స్తబ్ధిత అంతరించింది. 1950 నుండి వ్యవసాయాభివృద్ధి 8 1/2 రెట్లు పెరిగింది. వార్షికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 8 శాతం పెంచుకుంటూ భారతదేశం ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది. అప్పుడప్పుడు అనావృష్టి కారణంగా దుర్శిక్షాలు సంభవించినప్పటికి కరువు కాటకాలు గతకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కాలం గడచిన కొలదీ వ్యవసాయ ఉత్పత్తి రుతుపవనాల ప్రభావం తగ్గుతూ వుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 697
19850 నుండి పరిశ్రమలు 17రెట్లకు పైగా పెరిగాయి. అంతేగాక పరిశ్రమలు నిర్మాణపరమైన మార్పులకు గురయ్యాయి. ఉత్పాదక వస్తువుల రంగంలోని లోపం ఆశించిన మేరకు కాకపోయినా గణనీయంగా అధిగమించబడింది. భారతదేశం ఉత్పాదక యంత్రాలు, యంత్ర పరికరాల కొరకు అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడటం చాలావరకు తగ్గింది. విద్యుత్ రవాణా బ్యాంకింగ్ రంగాలు బాగా విస్తరించాయి. దూర ప్రాంత లక్ష్యాలను చేధించగల క్షిపణులతో, అణ్వాయుధాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో భారతదేశం రక్షణ రంగంలో ఇంచుమించు స్వయం సమృద్ధి సాధించింది. అయినప్పటికి ఇంకా అత్యంత ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం గల రక్షణ పరికరాలను విదేశాల నుండి కొనవలసి వస్తుంది. పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలను సాంకేతిక నిపుణులను సమకూర్చుకొన్నది. జనాభా వృద్ధి రేటు ఎక్కువగా వున్నప్పటికి 1950 నుండి జాతీయాదాయం 7రెట్లకు పైగా పెరిగింది. తలసరి ఆదాయం 2 1/2 రెట్లు పెరిగింది.
భారత ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రముఖ ఆర్థికవేత్త ఫ్రాన్సిస్ ఆర్. ఫ్రాంకెల్ 1978 ఇలా ఏకరువు పెట్టారు : “1960 దశాబ్దం చివరలో 1970లలో ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, దేశీయ ముడివనరుల లభ్యతలో కొరత, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ పెట్టుబడి రేట్లలో స్తంభన క్షీణత, కొరతగా వున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆహార ధాన్యాల ముడివనరుల దిగుమతులకు మరల్చుట.” ఈనాడు అలాంటి పరిస్థితి ఊహించడం అంత సులభం కాదు. భారతదేశం యొక్క 'పెరుగుదల రేట్లు జనాభా పెరుగుదల రేటుని అధిగమించవు' - అనే అమె అంచనా 80లలోనే తప్పని నిరూపించబడింది.
గడచిన కొద్ది సంవత్సరాలలో భారతదేశం ఎక్కువ ఆర్థిక పెరుగుదల సాధించే దశలో ప్రవేశించింది. ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక శక్తిగా ఎదిగే దారిలో వుంది. 20వ శతా; అదీ ఆష =.
బ్బపు ప్రపంచ ఆర్థిక విధానంలో అది పెద్ద పాత్ర నిర్వహించనున్నది.
ఆర్థిక సమస్యలు
భారతదేశం ఇంకా పరిష్మరించుకొనవలసిన ఆర్థిక సమస్యలు చాలా వున్నాయి. నూతన సహస్రాబ్దిలోని తొలి సంవత్సరాలలో యింకా పెద్ద సమస్యలెదుర్కొనవచ్చు. ప్రపంచ 698 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రమాణాలతో చూస్తే భారతదేశం యింకా వెనుకబడిన దేశం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు ఆర్థిక వ్యత్యాసాన్ని తగ్గించకపోగా పెంచాయి. భారత ఆర్థిక విధానం పెద్ద ముందడుగులు వేసినప్పటికి ఆర్థిక పంపిణీలోని లోపాల కారణంగా ప్రజల ఆకాంక్షల మాట అలా వుంచి ఇప్పటికి మౌలిక అవసరాలు తీర్చలేకపోతున్నది. భారత ఆర్థిక స్వతంత్రం వెనక్కి తిప్పడానికి వీలుపడనిది కాదు. మనం ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో నివసిస్తున్నారు. ఇది అసమానమైనది. ఇది ఆర్థిక సౌష్టవం గల, కొన్ని పరిమితులకు లోబడిన ఆర్థిక వ్యవస్థలు గల దేశాలుగా విభజితమై వుంది. ప్రపంచ వ్యవస్థ ఇప్పటికీ పోటీపడే సర్వసత్తాక రాజ్యాలు జాతీయ ఆర్థిక వ్యవస్థలు కలిగి వుంది. అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ ఆర్థిక విధానంలో వాటి అధికృతా స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు కొన్ని పరిమితులకు లోబడిన దేశాల సాపేక్షిక స్థితిగతులను ఆర్థిక విధానాలకు బలహీనపరచడంతో సహా చేయగలిగినదంతా చేస్తాయి. భారతదేశ ఆర్థికాభివృద్ధి ఇప్పటి వరకు స్వతంత్రమైనదైనప్పటికి ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో చేర్చబడి విలీనం చేయబడటం వలన తిరిగి పరిమితులు విధింపబడని దశకి చేరుకోలేదు. అంటే అభివృద్ధి చెందిన ఆర్ధిక విధానాలకు లోబడి వుండే ప్రమాదాన్ని అధిగమించిన దశకు చేరుకోలేదు. “నెహ్రూ ఇందిరాగాంధీల హయాంలో భారీ పరిశ్రమలు విద్యుదుత్సాదనపై కేంద్రీకరించి భారతదేశానికి అభివృద్ది చెందిన దేశాలకు మధ్య గల అంతరాన్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. యూరప్ 150 సంవత్సరాల కాలంలో సాధించింది భారతదేశం కొద్ది సంవత్సరాలలో సాధించే కర్తవ్యం చేపట్టింది. మనం గతం నుండి వర్తమానంలోకి పరుగులు తీస్తుండగా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో వర్తమానం భవిష్యత్ దిశగా ముందుకు పోతున్నది. నెహ్రూ శకం నాటి అంచనాలు లక్ష్యాలు - స్వావలంబనతో ఆర్థిక స్వతంధ్రాన్ని నిలబెట్టుకుంటూ న్యాయమైన సమాజాన్ని నిర్మించునే లక్ష్యాలు సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం సాధనాలు మార్చు చెందాలి.” ప్రపంచ ఆర్థిక విధానం ఒక క్రొత్త ప్రాముఖ్యత గల దశలోకి ప్రవేశించింది. పరిశ్రమ, వ్యవసాయం, వాణీజ్యం, రవాణా సమాచారాలకు సైన్స్‌ని అనువర్తింపచేసి మరొక పెద్ద ముందడుగు వేసింది. ఈనాడు ఆర్థికాభివృద్ధి లేక నాల్గవ పారిశ్రామిక విష్లవం మైక్రోచిప్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఇంధన వనరులు అభివృద్ధి చెందిన యాజమాన్య యితర మేధాపరమైన నిపుణతలపై ఆధారపడి వుంది. ఇవన్నీ కూడా (ప్రజల స్వతంత్రం తర్వాత భారతదేశం 6998
యొక్క అభివృద్ది చెందిన శాస్త్ర సాంకేతిక యాజమాన్య ఇతర మేధాపరమైన సామర్ద్వంపై ఆధారపడి వుంటాయి. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన ఇతర మేధో కార్యకలాపాలు యిప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో కేంద్రీకరిస్తూ భారతదేశాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను సంప్రదాయ వినిమయ వస్తువుల ఉత్పత్తికి, శారీరక (థమకి చెందిన కార్యకలాపాలకు పరిమితం చేసే విధంగా నూతన అంతర్జాతీయ శ్రమ విభజన జరిగే ప్రమాదం వుంది. కాని భారతదేశ ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ వర్గం, భారత రాజ్యం కొంత పరిమాణం విదేశీ పెట్టుబడిని - ప్రత్యేకించి సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య నిర్వహణ నిపుణతలను ఇముడ్చుకొనడానికి, దేశీయ ప్రభుత్వ (ప్రైవేట్ పెట్టుబడుల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించేందుకు స్వీకరించగల దశకి చేరుకొన్నాయి. భారతదేశం లాటిన్ అమెరికా తరహా అభివృద్ధికి, బహుళజాతి సంస్థలు ఆర్ధికరంగంలోని కీలకమైన స్థానాలను నియంత్రించి, అంతర్గత ఉత్పత్తి అంతర్జాతీయ మారకం విధానాలను నిర్ణయించేందుకు అవకాశం ఇవ్వకూడదు. విదేశీ పెట్టబడి వలన పారిశ్రామికాభివృద్ది జరిగినప్పటికి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలతో పోల్చి చూస్తే సాపేక్షికంగా దాని సాంకేతిక వెనుకబాటుతనం కొనసాగేలా చేసే ప్రమాదం వుంది. పారిశ్రామిక విప్లవం యొక్క గడచిన దశలకు ఇటీవలి దశకి చెందిన పరిశ్రమలు భారతదేశానికి బదిలీ చేయబడినప్పటికి అభివృద్ధి చెందిన మేధో కార్యకలాపాలు దానికి దూరంగా వుంచబడతాయి. అంటే అవి అభివృద్ధి చెందిన దేశాల గుత్తాధిపత్యానికి పరిమితం చేయబడతాయి. విదేశీ పెట్టుబడి పట్ల మనకు గల ప్రతికూలతను తగ్గించుకొనవలసిన అవసరమున్నప్పటికీ దాని దిశని, పాత్రని నియంత్రించే విధానం కొనసాగించవలసి వుంటుంది. పారిశ్రామిక విష్లవం యొక్క చివరి దశ మేధా కార్యకలాపాలపై ఆధారపడుతుంది గనుక విద్య - ప్రత్యేకించి పై స్థాయి విద్య ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకొంటుంది. కాబట్టి విద్య యొక్క వ్యాప్తి కంటే గుణాత్మకత ముఖ్యమవుతుంది. దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని అత్యధిక విద్యార్థులకు స్థాయి గల విద్య నందించలేకపోవడం వలన దేశం విస్తారమైన మేధాశక్తిని ఉపయోగించలేకపోతున్నది. ఈ లోపాన్ని లేక బలహీనతని అంతర్గత మేధా వలసగా వర్ణించవచ్చు. కాబట్టి అసమగ్రంగా లోపభూయిష్టంగా వున్నా విద్యా విధానాన్ని నవీకరించడం అత్యవసరం. ఈ రంగంలో అడ్రద్ధ ఫలితం గడచిన 700 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ప్రజాస్వామ్య రాజకీయ విధానాలు స్వతంత్ర భారతదేశం సెక్యులర్, ఫెడరల్ బహుళ పార్టీల రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్నది. పేదరికంతో (మ్రగ్గుతున్న ప్రజలు గల వెనుకబడిన ఆర్థిక విధానంతో, హింసాయుత సామాజిక ఘర్షణలతో, మూడు పెద్ద యుద్ధాల కారణంగా 1947 నుండి రక్షణకు పెద్ద మొత్తాలను కేటాయించి, నిరంతరం అంతర్జాతీయ ఒత్తిడికి లోనవుతూ దేశం ఎంతో వైవిధ్యంగా; ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ రాజకీయ వ్యవస్థ పరీక్షలను తట్టుకొని 1967-69, 1974-77 సంక్షోభాలను అధిగమించింది. “భారతదేశం 1947 నుండి సాధించిన విజయాలేమిటి? - అని ఇందిరాగాంధీని 1972 ఆగస్టులో (ప్రశ్నించగా ఆమె 'మన దేశాన్ని స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టుకొనడమే అన్నిటికంటే గొప్ప విజయం' అని' చెప్పింది. రాజకీయ స్థిరత్వం స్వతంత్ర భారతదేశం యొక్క ముఖ్యమైన లక్షణం. 1967 నుండి రాష్ట్రాలలో 1989 నుండి కేంద్రంలో త్వర త్వరగా (ప్రభుత్వాలు మారాయి. కాని రాజకీయ స్థిరత్వం కొనసాగుతూ వచ్చింది. రాజ్యాంగ పరిమితులలో వివిధ రాజకీయ శక్తులు కలయికలు, రాజకీయ పోరాటాలు చేశాయి. రాజ్యాంగబద్ధమైన (ప్రజాస్వామ్య నిబంధనల ననుసరించి ప్రభుత్వాలు మారాయి. పరాజితులైనవారు ఓటమిని హుందాగా అంగీకరించారు. స్వేచ్భాయుతంగా క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించబడతాయని విశ్వసిస్తున్న ప్రజలు దేశాన్ని రాష్ట్రాన్ని పంచాయితీని ఎవరు పరిపాలించాలో నిర్ణయిసా ఆందోళనలతో సహా ప్రజలు రాజకీయాలలో ఎక్కువగా భాగస్వామ్యం వహించడం రాజకీయ అస్థిరతకు దారితీయలేదు. రాజకీయ విధానం ఇంచుమించు ప్రశ్నించడానికి వీలుపడనంత న్యాయబద్ధత సాధించింది. ప్రారంభంలో మౌలిక నిబంధనలను ప్రశ్నించిన కొద్దిమంది కూడా తరువాత ఆమోదించారు. కమ్యూనిస్టులు చాలా దశాబ్దాల వరకు సైద్ధాంతికంగా రాజ్యాంగ మౌలిక చట్రం పాలక దోపిడీ వర్గాలకు అనుకూలంగా రూపొందించబడిందని వాదించారు. కాని ఈనాడు వారూ రాజ్యాంగ పరిరక్షణకు దృఢంగా నిలబడుతున్నారు. మతతత్వవాదులు మొదటినుండి భారత రాజకీయాల యొక్క సెక్యులర్ స్వభావాన్ని బలహీనపరచ యత్నిస్తున్నారు. మాట వరుసకు సెక్యులరిజాన్ని ఆమోదించినప్పటికి వాళ్ళు సెక్యులరిజం పదాన్ని మరొక విధంగా నిర్వచించి దాని స్వభావాన్ని మార్చ యత్నిస్తున్నారు. అదేవిధంగా స్వతంత్రం తర్వాత భారతదేశం 689
జయప్రకాష్ నారాయణ 1960లలో 1970 దశాబ్దం ప్రారంభంలో బహుళ పార్టి పార్లమెంటరీ విధానాన్ని విమర్శించినప్పటికి 1977లో అత్యవసర పరిస్టితి ఎత్తివేసిన తరువాత ఆమోదించాడు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన, వస్తున్న గ్రూపులు కూడా వారి ప్రయోజనాలు సాధించుకొనేందుకు ఈ విధానం పరిమితులలో పనిచేస్తున్నారు. 5 దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ మూలాలు బలంగా వేళ్ళూనుకొన్నాయి. మోరిస్ జోన్స్ 1966లో రాసింది ఈనాటికీ వర్తిస్తుంది. "స్వేచ్భాయుత రాజకీయ విధానంతో రాజకీయ స్థిరత్వాన్ని మిళితం చేయడం భారత రాజకీయ అద్భుతం అని పిలవవచ్చు.” ప్రజాస్వామ్యం సురక్షిత స్థానం 1947 నుండి భారతదేశం సాధించిన అత్యంత గణనీయమైన విజయం - భారతీయ జీవితానికి అత్యంత మౌలిక లక్షణాలైన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను దృఢంగా పాదుగొల్పడం, భారతీయులు ఈనాడు పత్రికా స్వేచ్చ, అభిప్రాయలు వ్యక్తం చేసే స్వేచ్చ, సంఘాలు ఏర్పరచుకొనే స్వేచ్చ, ప్రభుత్వాన్ని స్వేచ్చగా విమర్శించే హక్కు అనుభవిస్తున్నాయి. వారికి స్వేచ్చగా పాల్గొనేందుకు ఎన్నికలు, రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వున్నాయి. బాలెట్ బాక్స్ ద్వారా ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజకీయ జీవితంలో భాగస్వామ్యం వహించే హక్కు వుంది. గతంలో వలస పాలన క్రింద వున్న ప్రభుత్వాలలో ఒక భారతదేశం మాత్రమే ప్రజాస్వామ్య పౌర హక్కులు గల రాజకీయాలను కొనసాగించగలుగుతున్నది. అత్యధిక భారతీయులలో ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత వేళ్ళూనుకొన్నది. అత్యవసర పరిస్థితి కూడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచలేకపోయింది. ప్రజాస్వామ్య రాజకీయ చట్రం ద్వారా సామాజిక మార్పు సాధ్యమనే విశ్వాసం కూడా బలంగా నాటుకొన్నది. బ్యాంకుల కొన్ని పరిశ్రమల జాతీయీకరణ, భూసంస్కరణల అమలు, మహిళలకు 30 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ రాజ్ సమర్థవంతంగా పనిచేయడం, చాలా రాష్ర్రాలలో షెడ్యూల్డు కులాల తెగలకు రిజర్వేషన్లు వ్యతిరేకత లేకుండా జయప్రదంగా అమలుపరచడం - నిషాక్షికత సమానత్వం దిశలో సామాజిక మార్పుకి సామాజిక ఆర్ధిక సంస్కరణలకు రాజకీయ (ప్రజాస్వామ్యం ఆటంకం కాదని స్పష్టం చేశాయి. 690 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
స్వతంత్రానంతరం భారత రాజకీయ పరిణామంలో సానుకూలమైన అంశం : (ప్రజలలో క్రమంగా పెరుగుతున్న రాజకీయ చైతన్యం, రాజకీయ క్రమంలో వారి ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం.
స్వతంత్ర పోరాటం ప్రజలలో విస్తృతమైన సెక్షన్లను రాజకీయాకరణ చెందించింది. ప్రజాందోళనలు ఎన్నికల రాజకీయాలు ఈ [క్రమాన్ని ముందుకు తీసుకుపోయాయి. కాలక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు సామాజిక [గ్రూవులు రాజకీయంగా సమీకరింపబడుతూ రాజకీయ సంస్థలలో ఇముడ్చుకొనబడ్దారు.
అననుకూలతకు గురిచేయబడిన మహిళలు వ్యవసాయ కార్మికులు పట్టణ పేదలు వారి సామాజిక స్థితిగతులు అధ్వాన్నంగా వున్నాయని, వాటిని మార్చడం సాధ్యపడుతుందని, తాము ఆకాంక్షించే మార్పులు రాజకీయాల ద్వారా, రాజకీయ హక్కుల ద్వారా సాధ్యపదడతాయని విశ్వసించారు.
(ప్రజలు రాజకీయాధికారంలోను, వారు ఉత్పత్తి చేస్తున్న సంపదలోను ఎక్కువ వాటా కోరుతున్నారు. అణచివేత వివక్ష వంచన తృణీకారంలాంటి అణచివేత రూపాలను భరించేందుకు సిద్ధంగా లేరు.
పంచాయతీల నుండి పార్లమెంట్ వరకు వివిధ స్థాయిల ఓటు హక్కు విలువ, అధికారం - వాటిని వినియోగించుకొనడం వలన పొందే ప్రయోజనాల పట్ల ప్రజల వైతన్యం పెరిగింది. పోలింగు బూతుల ఆక్రమణ ఓట్లు అమ్మకం కొనుగోలు ఓటు బ్యాంకులు ప్రాపకం రాజకీయాలు క్రమంగా వెనుక పట్టుపడుతున్నాయి. ఓటరు తన నిర్ణయం మేరకే ఓటు వేస్తున్నాడు. కుటుంబంలోని పురుషుల ఆదేశాల మేరకు స్త్రీలు ఓటు వేయ నిరాకరిస్తున్నారు. అంతేగాక పేదలు బాధితులు పార్టీలు అభ్యర్థుల విషయంలో ఇతరుల ఆదేశాలు పాటించడం లేదు. కాని వారు ఇప్పటికి కులం మతం లాంటి ఆకర్షణలకు ఒకమేరకు లోనవుతున్నప్పటికి అమ్ముడుపోవడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల నుండి ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా సమస్యలు విధానాలు సిద్ధాంతాలు గ్రూపు ప్రయోజనాలను బట్టి ఓటు చేసే వైఖరి నవలంబిస్తున్నారు.
ఇటీవలి "సంవత్సరాలలో ఎన్నికల రాజకీయాలలో కులం పాత్ర పెరిగిన మాట వాస్తవమే. కాని ఎన్నికల రంగంలో ఇతర సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య లేనప్పుడు
స్వతం(త్రం తర్వాత భారతదేశం 691
లేక అలాంటి సమస్యలు విద్య ఉపాధి అవకాశాలలో లాగా కులంతో కలగలపబడినప్పుడు కులం ఒక రాజకీయ అంశంగా ముందుకు వస్తుంది. ఏమైనప్పటికి 1971లో గరీవీ హటావో, 1974-75 జె.పి. ఉద్యమం, 1977 నాటి ఎమర్దెన్సీ వ్యతిరేక ఎన్నికలు, ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 ఎన్నికలలో లాగా విస్తృత జాతీయ సమస్యలు ప్రధాన సమస్యలుగా ముందుకు వచ్చినప్పుడు రాజకీయాలలో కులం ఒక అంశంగా వెనుకపట్టు పట్టింది.
ఓటర్లు విస్తృతమైన సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలకు స్పందించడమే గాక వారు ఎవరికి ఓటు వేస్తున్నారో ఆ నాయకులు తమ అవసరాలకు స్పందించాలని కోరుతున్నారు. ప్రజలు అధికారంలో వున్నవారిని చూసి భయపడటం లేదని, వారికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి సంశయించడం లేదని అన్ని స్థాయిల్లోని ఎన్నికలు చాలాసార్లు స్పష్టం చేశాయి.
గతంలో రాజకీయీకరణ చెందని ప్రజలు రాజకీయీకరణ చెంది సమీకృతులవడం అనే నిరంతరంగా సాగుతున్న క్రమం కొన్నిసార్లు పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని కొన్ని సెక్షన్లను కలుపుకొని ప్రజాందోళనల రూపం తీసుకుంటున్నది. ఇది దేశం యొక్క చాలా ప్రాంతాలలోని గ్రామీణ ప్రజల వరకు వెళ్ళలేదు. అభివృద్ధి ప్రయోజనాలలో వాటా కొరకు, నిర్ణయాలు చేయడంలో భాగస్వామ్యం కొరకు నిరసన రాజకీయాలు చేపట్టబడుతున్నాయి. అణచివేయబడిన వర్గాలు గ్రూపులు రాజకీయ రంగం పైకి రావడంతో నిరసన రాజకీయాలు వృద్ధిచెందాయి. కాని వర్ణ పోరాటం కొరకు కులపరమైన అణచివేత వివక్షలకు వ్యతిరేకంగా ప్రజల సమీకరణ జరగని సందర్భాలలో (గ్రామీణ ప్రాంతాలలో అధికార పోరాటం ప్రజా సమీకరణ తరచుగా కులపరమైన రూపం తీసుకుంటాయి. రాజకీయ క్రమంలో ప్రజల భాగస్వామ్యం
రాజకీయ క్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ప్రజాసామ్యాన్ని బలోపేతం చేయడం ఈనాటి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. నిర్జీత కాలవ్యవధులలో జరిగే ఎన్నికలలో ఓటు చేయడం అలాంటి భాగస్వామ్యంగా పరిగణించలేము.
ఇప్పటి వరకు పేదలను, బాధితులను రాజకీయంగా సమీకరించడంలోను, సామాజిక రాజకీయ అధికారం వారికి అనుకూలంగా మరల్చ్బడంలోను వైఫల్యం జరిగింది. 692 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
కాలంలో యంత్రాల ఉత్పత్తిని అడశ్రద్ధ చేయడం వలన కలిగిన ఫలితం లాంటిది గనుక గుణాత్మక విద్యని అశ్రద్ధ చేస్తూ ప్రస్తుత విద్యా విధానానికి ముసుగులు తొడిగి ప్రజాకర్షకంగా చేసే ప్రయత్నాల్ని అద్దుకోవాలి.
పలు కారణాల రీత్యా భారతదేశం నుండి అమెరికాకు యూరపుకి మేధో వలస కొనసాగుతుంది. దీనిని నివారించడానికి తగిన పద్ధతులు రూపొందించబడాలి. విదేశాలలో వున్న భారతీయుల పెట్టుబడుల కంటే వారిని రప్పించడం అవసరం.
ఉత్పత్తి రంగంలో పబ్లిక్ సెక్టార్ నిర్వహించే పాత్రతో సహా ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వం నిర్వహించే చురుకైన పాత్రకి చాలా ప్రాధాన్యత వుంది. అవి లేకుండా మనం అధునాతన సాంకేతిక రంగంలో పోటీపడలేము. వనరులను నమర్ధవంతంగా వినియోగించుకొంటూ, ్రైవేట్ రంగంతో పోటీ పడే విధంగా ప్రభుత్వరంగ సంస్థల్ని పనిచేయించాలి. రాజకీయ ప్రాపకం యొక్క అసమర్ధ ఉద్యోగి స్వామ్యం యొక్క ధృతరాష్ట్ర కౌగిలి నుండి ప్రభుత్వ రంగానికి విముక్తి కల్పించాలి.
పేదరికం అసమానత, సామాజిక అన్యాయం, దిగువ స్థాయిలో వున్న అత్యధిక ప్రజల జీవన సరళి భారతదేశ ఆర్థిక ' అభివృద్ధిపై ఆవరించిన నీలినీడలు భారతదేశం ఆర్థికాభివృద్ధి రాజకీయ ప్రజాస్వామ్యం రీత్యా గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ దేశ ప్రజలు చాలా తక్కువ తలసరి ఆదాయంతో, నిరక్షరాస్యతతో, ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి సూచికలు దిగువ స్థానంతో 21వ శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. కాని ఈ మార్పు చాలా నెమ్మదిగా జరిగింది.
1954లో నెహ్రూ పార్లమెంట్లో ప్రణాళిక సామాజిక లక్ష్యాలను ప్రతిపాదిస్తూ ఇలా చెప్పారు వ
“మనం భారతదేశంలోని 360 మిలియన్ల వ్రజల కొరకు ప్రణాళిక ప్రారంభిస్తున్నాం. ఈ 860 మిలియన్ల ప్రజలు ఏమి కోరుతున్నారు? వారు కూడు గుద్దా నీడా కోరుతున్నారు. ఆరోగ్యం కూడా కోరుతున్నారు. కాబట్టి మన మనసులో వుండవలసిన ఒకే ఒక విధానం మనం 860 మిలియన్ల ప్రజల కొరకు పనిచేయాలి. కొద్దిమంది కొరకు కాదు. ఒక (గ్రూపు కొరకు కాదు.” " . స్వతంత్రం తర్వాత భారతదేశం 701
పార్లమెంట్లో రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెడుతూ నెహ్రూ సోషలిస్టు సమాజాన్ని “సమానావకాశాలు గల ప్రతి వ్యక్తీ మంచి జీవితం గడపడానికి అవకాశం గల సమాజం అని నిర్వచించాడు. ఈ లక్ష్యాలు పాక్షికంగా నెరవేర్చబడ్డాయి. సామాజిక అన్యాయాన్ని దానిని అధిగమించే ప్రయత్నాలను గురించి మనం ౩4, 35 అధ్యాయాలలో అధ్యయనం చేశాం. మనం ఈ అధ్యాయంలో పేదరికం సమస్యలు జీవన స్థాయిని గురించి చర్చిద్దాం. పేదరికం
నిరంతరంగా ఆర్థిక పెరుగుదల వున్నప్పటికి 50 సంవత్సరాలకు పైగా గడచిన కాలంలో స్వతంత్ర భారతదేశం పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమయింది. పేదరికం యింకా వుంది గాని బాగా తగ్గించబడింది.
1960 దశాబ్దం ప్రారంభంలో ప్లానింగ్ కమిషన్ దారిద్ర్య రేఖ' అనే భావనని రూపొందించింది. ఈ రేఖకు దిగువన వున్న ప్రజల వినియోగం - ప్రత్యేకించి ఆహార ధాన్యాల వినియోగం కేలరీల రీత్యా కనీస స్థాయికి తక్కువగా వుంటుంది. వలస పాలనా కాలం నాటి లేక స్వతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలకు చెందిన గణాంక వివరాలు లేనప్పటికి 1970-71 నాటి సమాచారాన్ని బట్టి 59 శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. అప్పటి నుండి ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అది 1977-78లో 51.3కి 1983లో 44.58 1993-94లో 36కి తగ్గింది. నాణేనికి మరోవైపు చూస్తే 300 మిలియన్ల ప్రజలు - స్వతంత్రం వచ్చినప్పటి మన దేశ జనాభా ఎంత వుందో అంతమంది ప్రజలు యిప్పటికీ దారిద్ర్య రేఖకీ దిగువన వున్నారు. పేదరికం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. 1998-94లో బీహారులో అత్యంత అధికంగా 68 శాతం వుండగా పంజాబు, హర్యానాలలో 20 శాతం వుంది.
సామాజిక నిబద్ధత గల ఆర్థిక శాస్త్రవేత్తలలో ఒకరైన సుఖమోయ్ చక్రనర్తి మార్గదర్శకత్వంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970 దశాబ్దం మధ్యకాలంలో చేపట్టిన పలు పేదరిక నిర్మూలన ఉపాధి కల్పనా కార్యక్రమాల ఫలితంగా పేదరికం స్థాయిల్లో తగ్గుదల నమోదయింది. 1984-85 నుండి ఈ కార్యక్రమాలు కొనసాగించబదుతున్నాయి. లంచగొండితనం లక్షిత గ్రూపులకు చేర్చడంలో లోపం వున్నప్పటికి అవి పేదరిక నిర్మూలనకు గణనీయంగా తోద్బడ్డాయి. మహారాష్ట్రలో ఉపాధి హామీ పథకం సమర్ధవంతంగా అమలు జరుపబడింది. 1950లలో 1960లలో నెహ్రూ ప్రణాళికా వ్యూహాన్ని అనుసరించి చేపట్టిన 702 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
భారతదేశ ఆర్థిక పునర్నిర్మాణం తరువాత కాలంలో పేదరిక నిర్మూలన పథకాలను అమలు పరచడాన్ని సాధ్యం చేసిందని ఈ సందర్భంగా (ప్రస్తావించడం సముచితంగా వుంటుంది. కాని స్వతంత్రానంతరం భారత ప్రజలు వలస పాలనా కాలంలో వున్నంత దుర్భర దారిద్ర్యంలో లేరు. 1948 నాటి బెంగాల్ కరువులాంటి కరువుని ఎదుర్మోలేదు. 1987-88 నాటి వర్షాభావ పరిస్థితుల కారణంగా కొద్దిమంది ఆకలితో జబ్బులతో మరణించారు. 1965-67, 1972-78 కాలం నాటి వర్నాభ్రావ పరిస్థితులలో కూడా దాదాపు అలాంటి నష్టమే సంభవించింది. అలాగే వలస పాలన కాలంలోను, స్వతంత్రానంతర తొలి సంవత్సరాలలోను చాలా మందికి రోజుకి రెండు పూటల భోజనం లేదు. సంవత్సరంలో కొన్ని నెలలు రోజుకొకపూట భోజనం కూడా లేకుండా గడిపారు. కాని ఇటీవలి అధ్యయనం రోజుకి రెండు పూటల భోజనం లేని కుటుంబాలు 1988 నాటికి 19 శాతానికి 1994 నాటికి ర శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది. ఎక్కువ ఆహార ధాన్యాలు ఇతర ఆహార పదార్థాల లభ్యత కూడా పేదరికం తగ్గుదలను సూచిస్తుంది. ఉదాహరణకు 190], 1941ల మధ్యకాలంలో తలసరి ఆహార ధాన్యాల వినిమయం 24 శాతం పైగా పడిపోగా, 195 1లో రోజుకి 849.9 గ్రామాలుగా వున్న తలసరి ఆహార ధాన్యాల వినిమయం 1971లో 468.8 గ్రామాలకు 1095లో 507.7 గ్రామాలకు అంటే 28 శాతం పెరిగింది. ఆహార ధాన్యాల లభ్యతలోని పెర్తుగుద ॥ పాటు ఇతర వినిమయ వస్తువుల లభ్యత పెరిగింది. 1950లో వార్షికంగా తలసరి మీటర్ల వస్త్రం లభ్యం కాగా 1960లో 16 మీటర్లు 1995లో 29.5 మీటర్ల వస్టం లభ్యమయింది. వార్షికంగా ఇతర ముఖ్యమైన వినిమయ వస్తువుల లభ్యత ఈ ది గణాంకాలు తెలియజేస్తాయి. సంవ ఖాద్యతైలాలు వనస్పతి చక్కెర టీ కాఫీ త్సరం (కేజ్రీ. (కేజీ) (కేజీ) (గ్రాములు) (గ్రాములు 1955 25 0.7 680 ఈ20 67.0 1975 385 0.8 61 ఉ60 62.0 1995 70 10 141 60 55.0 స్వతంత్రం తర్వాత భారతదేశం 708
అదేవిధంగా 1950-1996 కాల వ్యవధిలో పాల ఉత్పత్తి 17 మిలియన్ల టన్నులు నుండి 68.8 మిలియన్ల టన్నులకు అనగా 4 రెట్లు. గ్రుడ్ల ఉత్పత్తి 1,832 మిలియన్ల నుండి 28.400 మిలియన్లకు అనగా 15 రెట్లకు పైగా, చేపల ఉత్పత్తి 752 వేల టన్నుల నుండి 65388 టన్నులకు అనగా 7 రెట్లకు పైగా పెరిగింది.
జీవన స్థాయిని తెలియజేసే ముఖ్యమైన సూచిక అయిన తలసరి ఆదాయం 1950-1995 కాల వ్యవధిలో 250 శాతం పెరిగింది. 1975 నుండి 1995 వరకు తలసరి ఆదాయం యొక్క వార్షిక పెరుగుదల రేటు 2.8 శాతం ఇది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆయా అభివృద్ధి చెందుతున్న దశలతో పోల్చదగిందిగా వుంది. బ్రిటన్ (1855 నుండి 1967 వరకు 1.84 శాతం), ఫ్రాన్స్ (1861 నుండి 1966 వరకు 1.7 శాతం), జర్మనీ (1850 నుండి 1967 వరక 1.83 శాతం), అమెరికా (1834 నుండి 1967 వరకు 1.75 శాతం),
పేదరిక సమస్యకి సాంఘిక, ఆర్థిక అసమానత తోడయింది. దేశం యొక్క ఆర్థిక పెరుగుదల నుండి పేదలు కొంత ప్రయోజనం పొందినప్పటికి వారికి సంపన్నులకు మధ్య అంతరం మనం చూస్తుండగానే పెరిగింది. ఆర్థిక పెరుగుదల ఫలితాలను సమాజంలోని పై స్థాయికి చెందినవారు ఒక మేరకు మధ్యతరగతికి చెందినవారు పోగు చేసుకొన్నారు. అంతేగాక ఆదాయం, అధికారం అవకాశాల అనుచితమైన పంపిణీ దేశం యొక్క సాంఘిక వర్ష చట్రంలోకి చొచ్చుకుపోతుంది. పెట్టుబడిదారుల పశు ప్రవృత్తి ప్రాతిపదికపై ఆర్థిక సరళీకరణ విధానాలు ప్రారంభించబడుతున్నాయి. గనుక వారిని (పెట్టుబడిదారుల్ని) అదుపు చేసే చర్యలు చేపట్టకపోతే అసమానతలు ఇంకా పెరిగే అవకాశం వుంది. జీవన స్థాయి
ప్రజల భౌతిక సాంఘిక అవసరాలు కనీస స్థాయి మేరకు తీర్చబడనందున ప్రజల జీవన స్థాయి నిరాకరింపబడుతున్నది. మానవుని స్థితిగతుల్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరచడంలో భారతదేశం వెనుకబడి వుంది. ఈ అంశంలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చి చూసినప్పటికి నిరాశాజనకంగా వుంది. 1999లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక (యుఎన్‌డిపి) 174 దేశాల సమాచారాన్ని సేకరించి రూపొందించిన మానవాభివృద్ధి సూచికలో భారతదేశం 182వ స్థానంలో వుంది. 704 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
జీవన స్థాయి అనేది ప్రేమ; మానవ సంబంధాలు కళలు సంగీతం సాహిత్యాల ఆస్వాదన లాంటి కొన్ని కొలతలకు వీలుపడని అంశాలకు విస్తరించి వుంటుంది. కాని దాని అభివృద్ధిని లేక వెనుకబాటుతనాన్ని కొలవడానికి వీలైన మరికొన్ని అంశాలచే నిర్ధారించవచ్చు. మనం ముందుగా ఆరోగ్యం, విద్యకి సంబంధించిన మూడు అంశాలకు
- ఆయుష్కాలం, శిశుమరణాల రేటు, అక్షర్రాస్యతలను తీసుకుందాం.
ఈ రంగాలలో స్వతంత్రానంతర రికార్డుని వలస పాలన కాలం నాటి రికార్డుతో పోల్చి చూస్తే భారతదేశం గడచిన మూడు దశాబ్దాలలో గణనీయమైన విజయాలు సాధించిందని చెప్పవచ్చు. కాని భారతదేశంలో ఆరోగ్యం, విద్య వరుసగా అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి చాలా తక్కువ ప్రాధాన్యం పొందిన రంగాలు. ఈ రంగాలలో మనం సాధించిన అభివృద్ధిని చైనా, శ్రీలంక లాంటి ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం ఎంత వెనుకబడింది, ఏమి సాధించాల్సిందీ స్పష్టమవుతుంది.
భారతదేశంలో 1950లో ౩2గా వున్న సగటు ఆయుష్మాలం 1970 నాటికి శీర్ 6 సంవత్సరాలకు 1998కి 63 సంవత్సరాలకు పెరిగింది. కాని 1997 నాటికి చైనా ప్రజల సగటు ఆయుష్కాలం 69.8 సం॥లు. శ్రీలంకలో 78.12 సం॥లు భారతదేశంలో 1940లో ప్రతి వెయ్యి మందికి 27.4గా వున్న మరణాల రేటు 1970 నాటికి 1498కి 1997 నాటికి 8. 9కి తగ్గడం వలన సగటు ఆయుష్మాలం పెరిగింది.
శిశు మరణాల రేటు 1941లో ప్రతి వెయ్యికి 227 వుండగా 1970 నాటికి 130 కి 1997 నాటికి 71కి తగ్గింది. 1997 నాటికి చైనా (38), శ్రీలంక (17). ఇప్పటికి భారతదేశంలో (ప్రసూతి మరణాలు చాలా ఎక్కువ. ప్రతి లక్ష ప్రసవాలకు 507 మంది చనిపోతున్నారు. చైనా, శ్రీలంకలలో సంబంధిత సంఖ్యలు వరుసగా 95,140. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని 60 శాతం కాన్పులు ఎలాంటి శిక్షణ పొందని వారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
విస్తృత స్థాయిలో నిరక్షరాస్యత కొనసాగుతూ వుండటం భారతదేశం యొక్క మరొక వైఫల్యం. 1950లో దాదాపు 82 శాతం భారతీయులు నిరక్షరాస్యులు. 1997 నాటికి కూడా 38 శాతం నిరక్షరాస్యులుగా మారారు. సంబంధిత సంఖ్యలు చైనాలో 17.1 శాతం శ్రీలంకలో 9.8 శాతం. అంతేగాక భారతదేశంలోని అక్షరాస్యతలో కూడా (స్తీ పురుషుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ. స్త్రీ పురుషుల అక్షరాస్యత 1:2 నిష్పత్తిలో వుంది. స్వతంత్రం తర్వాత భారతదేశం 705
గడచిన అధ్యాయాలలో వివరించిన విధంగా భారతదేశంలో పై స్థాయి విద్య సాంకేతిక విద్య ఒక మేరకు బాగానే వుంది. గత దశాబ్దంలో పాఠశాల విద్య వేగంగా విస్తరించింది. బడికి పోయే బడి ఈడు గల బిడ్డల శాతం పెరిగింది. 88 శాతానికి పైగా (గ్రామాలకు ప్రాథమిక పాఠశాలల వసతి కల్పించబడింది. కాని ఇటీవలి సంవత్సరాలలో పాఠశాలల్లో పై న్థాయి విద్యాసంస్థలలో విద్య యొక్క గుణాత్మకత క్షీణించింది. కొన్ని మినహాయింపులతో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అందుకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ బాధ్యులే. గ్రామీణ పాఠశాలల్లో విద్య మరీ అధ్వానంగా వుంది. చాలా సందర్భాలలో ర్ సంవత్సరాలు పాఠశాలకు హాజరైన విద్యార్థికి చదవడం రాయడం రాదు.
గడచిన 50 సంవత్సరాలలో ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా అశ్రద్ధకు గురయింది. ఉదాహరణకు గత దశాబ్దంలో 19 శాతం ప్రజలకు మంచినీటి వసతి లేదు. 25 శాతం ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. 71 శాతం ప్రజలకు పారిశుధ్య వసతులు లేవు. 5 సం॥ల లోపు వయస్సు గల బిడ్డలలో 53 శాతం మంది వయస్సుకి తగిన బరువు లేరు. ఇటీవలి సంవత్సరాలలో ఈ సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. పోలియో, మశూచికం, క్షయ, డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు - లాంటి జబ్బులు రాకుండా వ్యాధి నిరోధక చర్యలు జయప్రదంగా నిర్వహించ బడుతున్నాయి.
విద్యలో లాగానే ప్రచారోగ్యరంగంలో కూడా ప్రజలకు అందజేసే సేవలు గుణాత్మకత చాలా రాష్ట్రాలలో - ప్రత్యేకించి హిందీ భాషా రాష్ట్రాలలో అధ్వానంగా వున్నది.
గ్రామీణ ప్రాంతాలలో గృహవసతి మెరుగుపడింది. కాని పట్టణ ప్రాంతాలలో లక్షలాది మంది ఇళ్ళు లేక పేవ్మెంట్ల మీద లేక గుడిసెలలో ఎండ వాన గాలుల నుండి రక్షణ లేకుందా ఐబతుకులీడుస్తున్నారు.
జీవితాన్ని సులభతరం సుఖవంతంజేసే స్కూటర్లు మోటారు సైకిళ్ళు, రేడియోలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, కూలర్లు, టెలిఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు లాంటి వస్తువుల వినియోగం ప్రత్యేకించి గ్రామాలలో చాలా తక్కువ.
మరొకవైపు 1950 నుండి విద్యుద్దీకరణ చేయబడిన పట్టణాలు, (గ్రామాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1990లలో గుడిసెలు మినహాయించి గ్రామీణ ప్రాంతాలలోని 706 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
43 శాతం కుటుంబాలకు పట్టణాలలోని దాదాపు అన్ని కుటుంబాలకు విద్యుత్ వసతి కల్పించబడింది. 1950లో 5.1 బిలియన్ కిలోవాట్ అవర్స్ (కె.డబ్యు. హెచ్.)గా వున్న విద్యుదుత్పత్తి 1996 నాటికి 434 బిలియన్ కిలోవాట్ అవర్స్‌కి పెరిగింది. పట్టణ గ్రామీణ ప్రజలకు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, సినిమాలు, సంగీతం, టెలివిజన్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి.
దేశంలో ప్రబలిన నిరుద్యోగం (ప్రజల జీవనస్థాయిపై చాలా ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థికాభివృద్ధి విద్యావంతులైన గ్రామీణ, పట్టణ ప్రజల నిరుద్యోగంపై తీవ్రమైన ప్రభావం చూపేంతగా పరిశమ సేవలలో తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయింది. వారి జీవితాలకు తీవ్రమైన మానసిక, సామాజిక, ఆర్థిక అసమతుల్యతని తెచ్చిపెట్టింది.
అభివృద్ధి, పేదరికం జీవన స్థాయి రీత్యా వివిధ రాష్ర్రాల మధ్య, వాటిలోని ప్రాంతాల మధ్య సరిదిద్దవలసిన చాలా వ్యత్యాసం వుంది. జీవన స్థాయిలో మానవాభివృద్ధి సూచికలలో మెరుగుదల కొరకు రాజ్యం, సామాజిక రంగంలో గతంలో కంటే చాలా చురుకైన పాత్ర నిర్వహించవలసి వుంటుంది.
ఉపాధి దొరకని వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు భారతీయ సమాజంలో జీవన స్టాయి రీత్యా అత్యంత అణగారిన వర్గం. వారు పేదరికంతో రోగాలు, రొస్టులతో సతమతమవుతుంటారు. వారికి సరియైన విద్య, ఇంటి వసతి, ఆరోగ్య సేవలు, రక్షిత మంచినీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్, సాంస్కృతిక వినోద వసతులు అందుబాటులో వుండవు. కులవివక్ష కులపరమైన అణచివేత బాధితులు కూడా వారే. వారు వర్ష సంఘాలలో సంఘటిత పరచబడిన వారు కాదు. రాజకీయ క్రమంలో కూడా అంతగా జోక్యం లేనివారు. నెరవేర్రవలసిన వాగ్ధానాలు
మనకు నిస్సందేహంగా నెరవేర్చవలసిన వాగ్గాన్గాలు చాలా వున్నాయి. ఎన్నో మైళ్ళు ముందుకు పోవలసి వుంది. మనం యింకా పేదరికం, ' రోగాలు, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం, కులపరమైన వివక్ష ప్రీ పరుష వివక్ష అణచివేతలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. కాని నిరాశా నిస్బృహలకు గురికాకూడదు. మన సమస్యలలో చాలావరకు మనం లోనయిన అద్భుతమైన మార్చుల వలన ఉత్చన్నమైనవి గాని స్తబ్ధత స్వతంత్రం తర్వాత భారతదేశం 707
లేక తిరోగమనం వలన కాదు. లోపాలు చాలా వున్నప్పటికి భారతదేశం ఆర్థిక రాజకీయ రంగంలో గణనీయమైన విజయాలు సాధించింది. సామాజిక న్యాయం దిశగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఒక పేద దేశం సామాజిక న్యాయాన్ని చేపట్టగలదా? - అనే అంశంపై గతంలో నడచిన చర్చ ఇప్పుడు సందర్భ శుద్ది కోల్పోయింది. ఈనాడు మనం అభివృద్ధి న్యాయం సాధించాం గనుక అభివృద్ధిని న్యాయంతో ఎలా అనుసంధానం చేయాలన్న నెహ్రూ సందిగ్ధత కూడా అదృశ్యమయింది. కాబట్టి రానున్న దశాబ్దంలో భారతదేశం అపారమైన అభివృద్ధి సాధిస్తుందని, (ప్రజల జీవితాలను మార్చడంలోను వారికి మంచి జీవన ప్రమాణాన్ని కల్పించడంలోను పెద్ద ముందడుగు వేస్తుందని ఆశించవచ్చు. మన ఆశావాదం ఈ సమస్యలకు ప్రజాస్వామ్యం కనుగొనగలదనే విశ్వాసంలో వుంది. మహిళలు గ్రామీణ పేదలు అణచివేయబడిన కులాలు, వర్థాలు ఇంతకంటే మంచి మానవతావాదంతో కూడిన జీవితం సాధ్యపడుతుందని విశ్వసిస్తున్నారు. వారు వారసత్వంగా సంక్రమించిన రాజకీయ చైతన్యంతో మేల్కొంటారు. చాలా బలహీనతలు వున్నప్పటికి భారతదేశ (ప్రజాస్వామ్య రాజకీయ విధానం ఆ అధికారాన్ని చెలాయించే చట్రాన్ని సమకూర్చుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం తరతరాలుగా పేరుకుపోయి గుట్టలుగా పోగుపడ్డ దుమ్ము ధూళిని తుడిచి పెట్టగల జలప్రళయం. -అళయమ? అకడప్రైల- న్యం ల, హైదరా ల. “న్వల హైదరాల న 708 బిపన్‌చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ
ల్ శ. 1
- సమకాలీన చరిత్ర రచయితలకు గౌరవాస్పదుడైన బిపన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీలు రచించిన భారత "
స్వాతంత్ర పోరాటం [గ్రంథం అమితాదరణ పొంది నిరంతరం
పునర్ముద్రణలు వెలువడుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన
చరిత్ర (గ్రంథాల సిరీస్‌ను, డిఎన్రూ (ప్రాబీన భారతం, సతీష్ .
చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్ సర్మార్ ఆధునిక "
భారతదేశం తదితర గ్రంథాలను కూడా ప్రజాశక్తి ప్రచురించింది.
...... స్పతంత్రం తర్వాత భారతదేశం” అన్న బిపన్ చంద్ర
బృందం రచన ఇప్పుడు తొలిసారి తెలుగులో వెలువడుతున్నది.
ప్రత్యేకించి విద్యార్థుల, ఉద్యోగ పరీక్షార్థుల కోణం నుండి
ప్రాథమిక సమాచార వనరు ఈ పుస్తకం. టె . (ప్రజాశక్తి బుక్‌హౌస్