Telugu Sundhara kandam - anilvaranasi/indianlanguages GitHub Wiki
సుందరకాండము... శ కా. మేం న్. (ఇ ఇ? త్ టంలో, న - న్ ఇ (ఇ తై 7 డీ . = జ్జ / ంం $ ప్న ను య ఖల్ సీ గా +( మ టు..! స నాను ప ర భలం ాఖ, ళ రే న చం
స! సుందరంకాండము (అన్వేషణ కిరణము) రచయిత కొత్త రామకోటయ్య ప్రచురణ కొత్త సూర్యనారాయణ చినకాకాని, గుంటూరు జిల్టా - 255 203
సుందరకాండము దగ! . (అన్వేషణ కిరణము) క. (= ల డు -నులి
కొత్త రామకోటయ్య రో
(ప్రధమ ముద్రణ : 2003
ప్రతులు : 1000
ఠి కొత్త సూర్యనారాయణ
చినకాకాని, గుంటూరు జిల్దా వెల : రూ. 30/- క
(ప్రతులకు క [ఈ
కొత్త సూర్యనారాయణ
చినకాకాని
గుంటూరు జిల్దా - 522 503
పిన్నమనేని రాఘనన్ము
మయూరి హోమ్స్ - 306
చంద్రమౌళినగర్, గుంటూరు
కంపోజింగ్ :
ఫాంట్లైన్ గ్రాఫిక్స్
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 44
ఫోన్ : 27660000
బైటిల్ డిజైన్ :
దేవి ప్క్కీన్స్ ఈ రాలలు అరండల్‌పేట, గుంటూరు రాం క ఖా |
న ళా ళ్బ్రీ న! జ
శ్రీలక్ష్మీ రెన్ న 14/2 ఆరండల్‌పేట, గుంటూరు న | ఫోన్ : 2230643 .
గురుస్తుతి గురుదేవులాప్రభాకరుల లోనుండి దివ్య దీప్పులు వెల్షి తెరలంగ జొచ్చె అందుండి మాతెల్చి యా విర్భవించి ఆది వివేకంబు అందుకో సాగె జ్ఞాన విజ్ఞానాలు గా నయి పోయె తెలివికి తోడుగా తేటదనంబు నిలకడ భక్తియు నిలవంగ జొచ్చి గురువు లౌ శ్రీ ప్రభాకరుల ల్లోనుండి ఉత్సాహ శక్తులే యుగర్రూత లూగి వచ్చి = మమ్మూపరవశులగావించె! అమలంబు స్వశ్చంబు విమలంబునైన దివ్యకాంతుల తోడి దీప్తి నల్లడల పర్వి విశాలమై పరువులు వెట్టె నమృతము భాడ నిండారంగ నింపి నా - యరచేతి కందీయంగ నయ్యె అరచేతిలో స్వర్గ మమరినయట్టు మాస్టరే యర చేతి మాణిక్యమయ్యె అందర బాధల నవలీల గాను పారద్రోలగ జాలు పరమౌషధంబు మాస్టరు సీ.వి.వీ మంత్రరాజంబు కరతలామలకంబు, గా బొచ్చెనిపుడు
“కొత్త రామకోటయ్య ,
ఇ గురుస్తుతి అను పదమ్మును (ప్రాభాకరార్భృనమ్మె ఊపిరిగ నిల్చు యోగి మహోదయుండు భృక్త రహిత తారక యోగ విహితమైన (ప్రవచనము సల్పుచుండు నిరంతరము టై పిలిచిన పలికెడు గురువుల తలపులె, నిజ భావ మందు తారట లాడన్ వెలుగులు చిలిక9డు పలుకుల నొలికించును - భక్తి భావృ మూటలు వారన్ ఏ పటాటోపమును లేక ఇవతళించు రామకోటయ్యగారి హృత్సీమ యెపుడు ఎప్పుడు నిద్రింతురో! యేమొ యెవరి కెజుక? సంవిదన్ని బోలె లోజ్బలన మందు. సంతతము శ్రీ (ప్రభాకర స్మరణ మొకటె ఊపిరిగ నిల్చు, అది యొక్క (ప్రాపు గాగ “ట్రీటుమెంటు”కు నెవ్వరేపాటి వేళ వచ్చినను చేయు టొక్కటే పరమ హితము గురుదేవు చరణములనే శరణమ్మని నమ్మి, యోగ సాధనలోనే నిరతము నిల్చును శ్యాసను పరహితమును కోరు భాగవత గతిలోనన్. = శ్రీ పోచిరాజు శేషగిరిరావు
మ స్ట. చత స. స న న! " .
- సలి రే 2-7 వటట ప సట
” పల “ గ గ స 4 స | త న ల ఎ న క. నమా న న య స వ్ ల్ స ఎం, ప సనో న న. న. సస న చ న ను న. నం కా. న సు
- వన టు. న? టు. స జ. ఖే మం. న స 2 నం న స న న ర! . ॥ ర చ్. ల ల! పంక ం న రే వ న న ల స్త ౩ వ రాన వ. న న... షే న న క న భం (1 న లన ఎ న న.
న. ఎ నస న నుం గ క
ప నైట ల్! 2 అ ను. ముం మొట్టి ఎ చల చం స... వ. (2/2. న ల. ప న.
- మ. న టు ఓ న ళాల. సం న టు టు శ గా అస న లు స్ట న య మం మ! న య
రచయిత శ్రీ కొత్త రామకోటయ్య
శ్రీ కొత్త రాముకోటయ్యగారి గ్రంథావళి 1 ప్రభాకర ప్రవచనములు 1951 2 మా శాస్త్రిగారు 1956 3. _భృక్త రహిత తారక రాజయోగము 1967 4. సావిత్రి (నాటకము) 1976 5. జీవనజ్యోతి - 1వ భాగము 1979 6. భృక్త రహిత తారక రాజయోగము (మంత్రార్హ వివరణము) 1985 7. మా శాస్త్రిగారు - సమదర్భ్శనము 1987 & మా శాస్త్రిగారు - గురుదర్శనము ? 1987 9, భాగవత ప్రభ - కళ్యాణ కిరణము 1986 10. భాగవత (ప్రభ - అవతరణ కిరణము 1087 11 భాగవత ప్రభ - రాసలీలా కిరణము 1989 12. భాగవత ప్రభ - ఆహ్లాద కిరణము 1989 13. భాగవత (ప్రభ - నరసింహ కిరణము 1989 14 భాగవత ప్రభ - మోక్షణ కిరణము 19093 15. భాగవత (ప్రభ - విశ్చజిత్ కిరణము 199 16. సావిత్రి - అరవిందుల రచనకు అనువాదము (రచన 1972) 1990 17. జీవనజ్యోతి - 2న భాగము 1992 18. ఆకాశజ్యోత్తి 1992 19, నా మాట (స్వీయ చరిత్ర) 2003 20. సుందరకాండము వ్యాఖ్యానము 2003
_్ యు .. / .
. య య ప -$ ం గ (| స్ట ఖీ కం ॥ లు న యం
బయ న స ఉస టా ర్ట న మ ్ర; డుం నున టలు కరో సహసా హం న ళీ పం సులల!
క్రీ॥శే॥ పటెం రమ
విషయ సూచిక స్వయం ప్రభావృత్తాంతము క! హనుమంతుని సముద్ర లంఘనము గో (త్రికూటము 29 లంకా ప్రవేశము త్న అద్యార ప్రవేశము 63 రావణాంతఃపురము గడ్డీ రావణ వైభవము 87 శోక వనము 101 అశోక వనము 112 చతుర్దశ స్సర్షః 116 పంచదశ స్సర్గః 123 దర్శనము 130
పూర్వ దర్శనము
శ్రీమద్వాల్మీకి రామాయణము సార్వకాలీనమైన కావ్యము. అందలి ప్రతి యొక్క శ్లోకము మంత్రాత్మకమైనది. అందును ప్రత్యేకముగా సుందరకాండ మహా మంత్ర శక్తితో కూడుకొనినది. ఈ కాండలో ప్రధానమైన పాత్రలు ఆంజనేయుడు, సీతమ్మ. ఆమె వేదమాతయైన జగన్మాత. అమె నుండి ఉద్భవించిన అన్ని యొక్క స్వరూపుడే హనుమన్న. ఆయన లీలా వైభవ వర్షనమే సుందరకాండ యందలి (ప్రధానాంశము. ఇందు కేవలము కవితా వైభవమే కాక అనేక శాస్త్ర రహస్యములు కూడ దాగియున్నవి. (ప్రధానముగా ఈ కాండమున ప్రతి యొక్క శ్టోకమునకు మంత్రశక్తి యున్నది. అందు వలననే అనాదికాలము నుండి జనసామాన్యమున సుందరకాండ పారాయణము రోగ, భయ, (గ్రహపీడాదులను తొలగించుకొను సాధనముగా విఖ్యాతి గాంచినది.
శ్రీమద్రామాయణ కథ నిరక్షరాస్యులైన్న సామాన్య (ప్రజల హృదయాలను కూడ ప్రభావితము చేసినది. ఇక కవులు.పండితుల సంగతి చెప్పనేల? చాలామంది పండితులు రామాయణమునకు వ్యాఖ్యలు చేశారు. అందలి అనేకములైన రహస్యములను ప్రకాశితము చేశారు. కాని వానిలో కొన్ని మాత్రము పామర జనులకు కూడ సులభముగా అవగతమయ్యే విధంగా వున్నవి. ఎక్కువ వ్యాఖ్యానములు పండిత జనరంజకములైనవిగా మనకు కనుపిస్తాయి. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి రామాయణ, భాగవతాది ప్రసంగములు, వ్యాఖ్యానములు పామర జనుల నుద్దేశించి చేయబడినవి కావడం వలన యెల్లరకు సుబోధకములై వుంటాయి. అదే విధంగా పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారి (ప్రసంగములు, వ్యాఖ్యానములు పామరులకు సుబోధకమయ్యే సామాన్య రీతిలో వుంటాయి, వారి రచనలు సామాన్య జనుల కందుబాటుగా వుండే శైలిలో వుంటాయి కాని వారి ప్రతిభ మాత్రము అసామాన్యమైనది. వాల్మీకి, వ్యాసుల హృదయాల్ని తమ గురువులచే పొందిన ఆను([గ్రహపూర్వక దృష్టితో వారు దర్శించారు. అందువలన వీరి రచనలకు విశిష్టత చేకూరినది.
శ్రీమద్రామాయణము సుందరకాండకు వీరు చేసిన వ్యాఖ్యానము ఒక ఆమూల్య రత్నము. వాల్మీకి శ్టైకములలో అంతర్లీనముగా వున్న యోగార్థమును వీరు వెలికి తీసి సుందరకాండ యందు అద్భుతమైన యోగళాస్త్ర రహస్యములు దాగియున్నవని వీరు నిరూపించారు. హనుమంతుని సీతాన్వేషణము యోగ సాధన ప్రక్రియలో సాధకుడు చేయవలసిన అన్వేషణమునకు సంకేతముగా వీరు నిరూపించినారు. ఈ (ప్రక్రియలో
కలిగే ఆవరోధాలే మైనాకుడు, సురస, సింహిక మొదలైన వారి వలన కల్గిన అవరోధాలు గను, వాటిని తన స్వామియందు గల సమర్పణతోను, తన లక్ష్యమునందు కల శ్రద్ద వలనను హనుమంతుడు దాటి లంకలోని అమ్మ సన్నిధికి చేరుకొనిన విధానము ఆదర్శ వంతమైన యోగ సాధనకు సంకేతంగా రామకోటయ్య గారు వివరించారు. సుందరకాండ (ప్రారంభములోని స్వయం ప్రభా వృత్తాంతమందలి అనేక సంకేతములను బహిర్గతము చేసినారు.
ఈ సుందరకాండకు వ్యాఖ్యానమును చేయుటలో రామకోటయ్య గారు మరొక అద్భుతమైన ప్రభను ప్రదర్శించారు. అదేమిటంటే కొన్ని అధ్యాయములకు మాస్టరు గారికి సమర్బణము చెందిన సోదర యోగ మిత్రుల చేత కూడ వ్యాఖ్యానమును (వ్రాయించినారు. ఇందొక విశేషమున్నది. తాను పొందిన దర్శనమును తన యోగశక్తి చేత వారికి కూడ కల్లించి వారి బుద్దిని కూడ ప్రచోదనము చేసి వారిచేత కూడ వ్యాఖ్యాన మును (్రాయించిరి. శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యులు గారు, మల్దాది పున్నయ్య శాస్త్రి గారు, పోచిరాజు శేషగిరిరావు గారు ఈ విధముగా వారిచే ప్రచోదితులైరి.
ఇంతటి విశేషములతో కూడిన ఈ వ్యాఖ్యానము ఇంత కాలమునకు ము(ద్రితమై మనకు. అందుచున్నదన్నచో ఇది అంధ్ర పాఠకుల అదృష్టమని భావించుచున్నాను. = ఎక్కిరాల అనంతకృష్ణ
పరిచయము శోకవనము
నేను జన్మతఃక్హాత్రగుణ ్రదానుడను. గాయత్రి మంత్రమును అస్త్రముగా దర్శించిన దురదృష్టవంతుడను. ఇప్పటికి ప్రవర చెప్పకొనునప్పుడు విశ్యామిత్రగోత్రజుడ ననిలోపల అనిపిస్తుంటుంది. ఈ స్థితిలో గజేంద్రముగా నున్న నాకు, నేను ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నరోజులలో నాన్నగారు నాకు గజేంద్రమోక్షము అను[గ్రహించినారు. అప్పుడు దాదాపు రెండునెలలు సాహిత్యపరముగా, యోగపరముగా విపులముగా వ్యాఖాన్నించినారు. అది అంతయు వారి అనుగ్రహకారణమున హృదయస్తమై నేటికి స్పృతిపదమున నిలచినద్కి ఈ సుదర్శనము వలన భాగవతము, పోతనల యెడల ప్రత్యేక అనురాగము అభిమానము ఏర్పడినది. అందుచేత నాన్హగారు భాగవతము వ్యాఖ్యానించినప్పుడు దానిని జాగ్రత్త చేసెడి వాడను. నాన్నగారు భాగవతవ్యాఖ్యను ఎవరికైన ఇమ్మనినప్పుడు, కాపీ వ్రాసుకొని కాని ఇచ్చెడువాడను కాను - వారు చెప్పినప్పటికి. అందు చేత నేడు భాగవత ప్రభ సప్తకిరణములుగా అపూర్వ యోగసమనయముతో వెలుగొందుచున్నది. వాటి (ప్రచురణ నల్లేరుపైననడకవలె సాగినది.
మానాన్నగారు శిష్యవత్సలురు. అందుచేత వారు వ్యాఖ్యానాలను శిష్యులకిచ్చి చదువమనెడివారు. భారత, రామాయణములు చదివిపారేశాం అనుకొనే పండితులకు తాము వ్యాఖ్యానించిన ప్రతులనిచ్చి “ఇందులో తప్పులుంటే సరిదిద్దండి” అనెడివారు. వారది చదివి అందలి పరమార్హమును (గ్రహించవలెనని నాన్నగారి కోరిక, అది[గ్రహించక కొందరు నిజముగనే దిద్దివ్రాసిరి. వారు పండితులేకాని కవిహృదయము నెరిగినవారు కానందున దిద్ది తప్పులు (వ్రాసెడివారు. ఇక రెండవ రకము వారు :- వీరు హిరణ్యాక్షసంతతివారు అనగా అంతా తమవద్దనే ఉండవలెననెడి దురాశాపరులు. (అక్షులు - దృష్టికలవారు మాత్రమే. హిరణ్యకశ+శివుడు - అనుభవించెడివాడు, ఆనందించెడివాడు) “గడ్డివామికి కుక్కకాపల” వలె వీరుందురు. వీరు అనారోగ్యము చేతనో కష్టముల వలననో నాన్నగారిని ఆశ్రయించి నాన్నగారు ఇచ్చిన చేతికర్ర లేక పుస్తకము వలన ఆబాధలు తొలగినవారు. ఆ పుస్తకము తమ వద్దవుంటే తమకు సుఖము, సుభము కలుగుతుందనుకొను మూర్చులు.
|
ఇందులో ఇంకొక ఉపశాఖ యున్నది. వీరు చోరులేగాక లౌక్యులు కూడ, నాన్నగారి రచనలు, తాత్కాలికముగా వీరి “హిరణ్యాక్ష వక్రదృష్టి” తగిలి వెలుగునకు నోచుకొనలేదు. వీరు అన్నీ తెలిసి స్వార్హముతో, ఇతరప్రయోజనము లాశించి, ఇటువంటి దుర్మార్గములు చేయు పరమనీచులు. వరాహదృంష్టచ్చిన్న హృదయులయినగాని వారివద్ద నుంచి ఈ వేదములు బయటపడవు.
ఇదియంతా ఎందుకు (వ్రాయవలసి వచ్చినదంటే, నాన్నగారి రామాయణ వ్యాఖ్యానము. పై మూడు విధములుగా బాధింపబడినది. భాగవతప్రభ ప్రచురణ పూర్తి అయిన తరువాత, చాలామంది మిత్రులు, రామాయణము కూడా ప్రచురి-పమని కోరినారు. అప్పుడు నాన్నగారి రామాయణ వ్యాఖ్యానాలు చూస్తే అవి పైనుదహ ౨చిన స్థితులలో నున్నవి. అంతా శోకననము.
'ప్రక్షిప్తములు, నాన్నగారి వ్యాఖ్యకు విరుద్రమయిన వాటిని, మార్టిన్ లో ఎర ఎరాతో గుర్తుపెట్టి ఆదస్త్రము మొత్తము పోచిరాజు శేషగిరిరావు గారికి సరిచు”డమని పంపినాను. తరువాత శేషగిరిరావు. గారిని కలసినప్పుడు "నీవు ఎగర్రసిరాతో గుర్తుపెట్టినవి చదువుతుంటే బు(ర్ర తిరిగినట్టయినది. వెంటనే కత్తెరతో కత్తిరించి పారేశాను. అప్పటికిగాని నామనస్సు కుదుట పడలే"దనినారు.
నాన్నగారు రామయణపు వ్యాఖ్య మొదలు "పెట్టినప్పుడు “అన్వేషణకిరణము” అని పేరుపెట్టీన బాగుంటుందని నేను సూచించాను. నాన్నగారు “బాగుంది అలాగే పెట్ట” అన్నారు. కేరుకు తగినటుల, ఈ పని మొదలు పెట్టినప్పటి నుండి అతా అన్వేషణమే. మొదట వ్యాఖ్యానించిన పుస్తకముల కొరకు అన్వేషణ, ప్రక్షిప్తములకొరకు అన్వేషణ. హిరణ్యాక్ష సంతతి పరమైన వాటిని సాధించుటకు అన్వేషణ. అది ఎంతకూ ఫలించలేదు. అంతా శోకవనము,
ఆస్థితిలో ఒకరోజు మా అమ్మాయి సావిత్రి “హూ! చాతగారి అబ్బాయి అయి వుండి నాలుగు సర్గలు కనిపించకపోతే, వాటిని సాంతముగా బ్రాయలేరా” అన్నది. ఆ మాటలు వింటుంటే నాకు, నాన్నగారు మాట్టాడినట్టున్నది. వెంటనే “తాతగారి అబ్బాయి. చేయలేకపోవుటం ఏమిటి”. అని అన్నాను. సావిత్రి మాటలు నాలో గొయత్రిలా (్రవోదనము కలిగించి సరస్వతి వైఖరీ రూపము నందినిఎ. నాన్నగారికి పోతన గారికి నమస్కరించాను. “పలికెడిది రామకథయట - పలికించెడువాడు కోటరామయ్యట అంటు రచన సాగినది. కన్నవారి వలన కన్నంత విన్నంత - తెలియ వచ్చినంత తేటవరచటానికి ప్రయత్నించాను. ఎంతవరకు సఫలీకృతుడనయినాననే దానికి (ప్రమాణము పొరకులే,
111
నాకున్న సాహిత్యాభిలాష (దురదువలన అక్కడక్కడ కొంత స్వతం(త్రించినాను. అందుకు కారణము. వాల్మీకులవారి రచనా శిల్ప సౌందర్యము = లలిత మనోహరమైన వర్లనలు. చం(ద్రునివర్షన, అశోకవనపు _ వర్షనలు రసజ్ఞుల తనివితీర్చునవి. నాన్నగారి వ్యాఖ్య (ప్రధానముగా ఆధ్యాత్మిక, యోగ సాధనా పరముగా నడచును. ఇది దృష్టిలో ఉంచుకొని పైనుదహరించిన ఘట్టములు వ్యాఖ్యానించునపుడు ని[గ్రహముతో లలితముగా స్పృశించుటకు ఎంతో కష్టపడవలసి వచ్చినది.
ఇంతటి ప్రసవవేదన తరువాత కాని ఈ సంపుటము వెలుగుచూడలేదు. రాబోవు సంపుటముల ప్రచురణ సుగమము కొరకు ఈ విషయములను ఇక్కడ ప్రస్తావించుట అప్రస్తుతము కాదనుకొంటాను. ఇదంతా శోకవనము.
అశోకననము
వాల్మీకి మహర్షి వేదకవి. వారివాక్కునందు వేదనాదము అంతర్లీనముగా యుండును. లౌకిక దృశ్యము అయిన '(క్రాంచ మిధునము యొక్క ఎడజాటునకు వాల్మీకి హృదయము. దద్రవించెను. తత్ఫలితముగా శోకముత్సన్నమైనది. అతని శోక్రమే క్లోకముగా వైఖరి రూపమెత్తినది. ఒక దివ్యకావ్యమునకు ఆ శ్లోకమే నాంది పలికినది. క్రౌంచ మిధున వియోగము వాల్మీకి హృదయమును కరుణరస ప్టావిత మొనర్చినది. వాల్మీకి చూచుచున్నది లౌకిక సన్నివేశము. లోపలి చూపునకు అందుచున్నది అవతార పురుషుడైన రామచంద్రుని దివ్య గాధ. అంతేకాక తనకు ఆయాచితముగా లభించినది, జగద్గురుడైన నారదుని దివ్య సాన్నిధ్యము. అనగా అనాహత నాథ జగత్తే తన వద్దకు నడయాడి వచ్చినదని అర్హము. ఆ అనాహత నాధ జగత్తే శబ్బమయమై, వాజబ్బయమై ఆయన నోటి ద్వారా ఉచ్చరింపబడినది. పరిప్రశ్న (పరిషృచ్ళ) అయినది. “కోన్వస్మిన్ సాంప్రతం లోకేగణవాన్ కళ్ళ వీర్యవాన్...” అను వైఖరి రూపమెత్తినది. ఇచట పైనుదహరించిన శ్లోకము నందు నిత్య వర్తమానమును చూచించు సాంప్రతం అను అవ్యయమును పరికించుడని మనవి. రామాయణమును ఎప్పుడు చదివినను ఇప్పుడు ఈ లోకమున సద్గుణవంతుడెవరు? బలపరాక్రమ సంపన్నుడెవరు? ధర్మమూర్తి ఎవరు? చేసిన మేలును మరువని వాడెవరు? అను (ప్రశ్నలు మానవులకు ఎల్లప్పుడు ఎదురగుచునే యుండును. తాను గానము చేసిన ఈ రామాయణము ఎల్లప్పుడు సజీవముగనే యుండునని మహర్షి వాక్కు ధృనించుచున్నది. వాల్మీకి వాక్కులు దివ్య వాక్కులు.
[౪
అవిశాశ్ళత సృష్టి ధర్మములను ప్రతిపాదించునవి. మనము ఆ వాక్కులను శ్రద్దగా ఆలకించవలెను. భక్తి ప్రపత్తులతో దర్శించవలెను.
ఆంజనేయుడు సముద్రమును దాటుట యనగా సంసారసాగరమును దాటుట. ఆత్మ దర్శనము పొందుట ఇదియే సీతాన్వేషూము శతయోజనము లనగా నూరు రకములయిన యోచనలు, లేక ఆలోచనలు. ఆలోచనల యొక్క గుర్తులే ముద్రలు. అట్లీ ముద్రలతో కూడినది సముద్రము.
సీతాదేవి యనగా ఆత్మ, శరీరమునందు బుద్దిచే బంధించబడినట్టి జీవాత్మ రావణుడు; అనగా అహంకారము, అన్నింటికి నేనే అధికారిని అన్నబుద్ది, ఆంజనేయుడు: బుద్ధిచేత ఆవరింపబడిన జీవాత్మను వెదకి తెలిసికొనే జ్ఞాని. కామక్రోదాది శత్రువులను జయించిన వాడు. నేను రాముని దూతను, వారి పనిముట్టును అని ఎరిగినవాడు హనుమంతుడు. కనుక ఆత్మయొక్క యునికిని' తెలుసుకొన గలిగెను. వెదుకనలెననెడి సంకల్పము ఇయేష - రాముని నుండి వచ్చినది. సీతయున్న పదము. అనగా “చోటు” హృదయాంతర్గ్షతమగు ఆత్మస్టానము. అదియే హృదయాకాశము.
సీతాన్వేషణములేక జగన్మాత యొక్క అన్వేషూము అన్న కార్యక్రమమునకు మొదటి మెట్టుగా వాల్మీకి మహర్షి స్వయంప్రభ వృత్తాంతము" అను. పేరుతో ఆసాధారణమగు యోగ సాధన వివరణము సూచించిరి. ఈ విధానము వాల్మీకి మహర్షుల కాలము నుండి ఇప్పటి వరకు ఆత్మజ్యోతిని వెదకు వారలకు మొదటి మెట్టుగానే ఉన్నది. మనకు సాధారణముగా శక్తి పంచభూతముల నుండి లభించును. ఆ పద్ధతికాక, యోగషప్రభ స్వయముగా మనలోపల నుండి ప్రచోధించుటయే స్వయంప్రభ. (ధియో యోనః ప్రచోదయాత్) అనగా దేవతా శక్తులు మనకు సరాసరి దిగివచ్చి మనలో పని చేయవలెనని భావము. ఈ విధముగా ఆంజనేయుడు స్వయంప్రభయొక్క అనుగ్రహమును పొందిన తరువాత మహేంద్ర పర్వతము ఆరోహింప గలిగెను. అచట నుండి చారణులు విహరించు నట్టి యోగమార్గమున ఆంజనేయుడు పయనించగలిగెను. అపుడు మహేంద్రగిరి కృంగి చిన్నది అయినది. అనగా స్టూల శరీరమునకు సంబంధించిన విలువలు అన్నియు చాలా స్వల్చములయిపోయినవి.
తరువాత ప్రయాణములో అతనికి అడ్డు వచ్చినది మైనాకము. అనగా శరీర సౌకర్యముల యొక్క ఆకర్షణము, పూలు, పండ్డు విశ్రాంతి గృహములు, చల్లని
గ
సెలయేరు మొదలగు ఆకర్షణములు. పెద్ద పెద్ద స్యాములు ఇచట ఆగిపోవుదురు. అరటి పండ్ల గెలల (క్రింద మామిడి, కొబ్బరి తోటల|క్రింద వారి అభివృద్ది ఆగిపోవును. ఆంజనేయుడు ఈ ఆకర్షణకు లొంగిపోక మైనాకుని మర్యాద పూర్వకముగా ప్రక్కకు త్రోచి ముందునకు సాగిపోయెను.
తరువాతి ఘట్టము సురస. అనగా దివ్య శక్తులయొక్క అవరోధము. దేవతా శక్తులు మానవుడు దివ్యత్వము పొందుటకు అడ్డువచ్చునా అని మనకు సందేహము కలుగవచ్చును. ఆ శక్తుల వలన గర్వితులై యోగ సాధన కుంటు పడవచ్చును. (సిద్దం పతన హేతుః సురసను తాను జయించగలనని మొదట ఆంజనేయుడు (సాధుకుడు) అహంకరించెను. ఆమె కంటె పెద్దవాడుగ పెరిగిపోయి. ఆమెను జయింపజూచెను. తరువాత తన తప్పును తెలిసికొని, నేను రామ బంటును, రాముని బాణమును అని వినయముతో నమస్కరించి సురసను దాటెను అనునది ఒక అభ్యాసము.
సింహిక అన్నది రాక్షస భావముల ఆకర్షణ. రాక్షస భావములతో రాజీపడుటకు వీలులేదు. వాటిని సమూలముగా నిర్మూలింపవలెను. కనుక సింహికను సంహరించెను. తరువాత అవరోధము లంక. లంక యొక్క అజ్ఞానమును పోగొట్టుటకు ఆమెను తన చేతితో ఆంజనేయుడు తాకెను. అస్పర్భ చేత ఆమె చక్కబడెను. నీవులంకలోనికి (ప్రవేశించి లంకలో నున్న వంకరలను చక్కదిద్ది మంచిని చేకూర్చమని లంక ఆంజనేయుని ప్రార్హించెను. ఇది లంకా ప్రవేశమునకు ముందున్న యోగ సాధన క్రమము.
తరువాత ఆంజనేయుడు అంకలోనికి అద్వార ప్రవేశము ప్రాకార అతిష్టవము అన్న యోగ విశేషము. భాగవతీయ మగు శక్తి మనలోనికి ప్రవేశించుటకు ఏ ద్వారము అక్కరలేదు. మనస్సు, చర్మము, ఎముకలు మొదలగు ప్రాకారములు దానికి అడ్డురావు. అనగా పంచభూతముల కతీతమైనది, మూలమయినది ఆ దివ్యశక్తి
ఆ తరువాత రావణుని అంతఃపురమున ఆంజనేయుడు సీతాదేవిని వెదకుట, అమ్మవారిని కానక దుఃఖపడుట, మండోదరిని చూచి సీతయని భ్రాంతి పడి సంతోషించుట కాదని తెలిసి దుఃఖపడుట అన్నది ఈ దుఃఖ ప్రకణము యొక్క చివరి దశ, తానుగా ప్రయత్నించుట అన్న అహంకారము వలన ఆంజనేయుడు సర్వాంతర్యామిగా ఉన్న అమ్మవారిని చూడలేక పోయెను, అని ఈ ప్రకరణము మనకు బోధించుచున్నది. అజ్ఞానము వలన అమ్మవారు అచట లేరని కూడా భ్రాంతి
ఇ
పడెను. అర్జున విషాద యోగము రీతిలోనే ఆంజనేయు (సాధకుని) విషాదయోగము కూడా ఇచట చక్కగా వర్షింపబడినది. తరువాత “నష్టా మోహ స్మృతిర్హబ్దా” అన్న స్థితిని (నమోస్తు రామాయ సలక్ష్మణాయ) రామనామ స్మరణ వలన పొందగలిగెను. “దేవ్యైచ తస్యై జనకాత్మజాయై” అన్నటు వంటి పరంజ్యోతి, తన ఎదుట ఉండి కూడా మొదట దర్శింపలేక పోయెను. ఇప్పుడు స్కృతిర్లబ్హా మరచినది తిరిగి జ్ఞాపకము వచ్చెను. అపుడు నష్టామోహ అన్నస్ట్రితిని అనగా నప్టోశోక అన్నస్టితిని పొంది, శోకవనమును దాటి అశోకవనములోనికి (ప్రవేశించెను. ఈ సోపానక్రమమును పాఠకులు మనస్సునందు, సుసంగతము చేసుకొనవలెను.
పది హేనవ సర్గ చాలా తేజోవంతమయినది. మానవుని ఆవరించిన ఆజ్ఞానమును తొలగించి అతనిని జ్ఞానవంతుని గాను తేజోమూర్తిగాను చేయునట్టి యోగవిద్యా విధానము ఈ సర్లయందు వర్షింపబడినది. అంతకు పూర్వము ఆంజనేయుడు సీతను వెదకుటకై సోపానక్రమము ననుసరించి తాను ప్రయత్నము చేసెను. లంక నంతయు తానుగా వెదకి అమ్మవారిని దర్శించలేకపోయెను. అందుచేత నిరుత్సాహపడి దుఃఖించెను, తరువాత తన ప్రయత్నము వలన అమ్మవారిని దర్శించుట జరగదని (గ్రహించెను. అప్పుడు రాముల వారు అనుగ్రహించిన అంగుళీయము యొక్క ప్రభావము వలన ఆంజనేయునకు జ్ఞానోదయమయినది. అంతవరకు తాను నడచినది శోకవనము, చీకటి బాట యని తెలుసుకొనెను. రాముల వారి అను(గ్రహము వలన శోకవనమును దాటి అశోకవనము లోనికి ప్రవేశించెను. అనగా అమ్మవారి యొక్క ఆనందనిలయము లోనికి ప్రవేశించుట అను యోగ విద్య ప్రారంభమయినది. కనుకనే ఆంజనేయుడు భక్తి పూర్వకముగా “నమో2స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచతస్యై జనకాత్మజాయై” అని స్తుతించెను.
ఇది ఆనందమార్గమునకు కరదీపిక వంటిది. అశోకవనము ఫలములు పుష్పములతో నిండియున్నది. అచటి కట్టడములు ముత్యములు, పగడములు, ఇంద్రనీల మణులతో కట్టినవి. అనగా ముత్యములు శుద్ద సాత్విక బ్రహ్మము గాను పగడములు రాజబ్రహ్మముగాను, నీలమణులు తామస (బ్రహ్మము గాను కనిపించెను. ఈ (త్రిగుణములకు అధిష్టానదేవత అయిన అమ్మవారిని తాను దర్శించ నున్నటుల ఆంజనేయుడు తెలుసుకొనెను. ఒకకొండనుండి ఒక కొండవాగు క్రిందికి దిగి మరలపైకి, తాను బయలుదేరిని చోటికి తిరిగి వచ్చుటను దర్శించెను. అనగా భగవతియగు అమ్మవారుపైనుండి భూలోకమునకు దిగివచ్చి, మానవులను ఉద్ధరించి మరల దివ్యలోకమునకు వెళ్ళుట అను దృశ్యమును ఆంజనేయుడు దర్శించెను.
౪11 తరువాత అశోకవనమందలి శింశుపావృక్షమూలము నందున్న అమ్మవారిని దర్శించెను. ఆమె. శ్రీరాముని పట్టమహిషి అయిన సీతాదేవిగా గుర్తించెను. శ్రీరాముని అంగములను పోలిన అంగములు, ఆయన తేజస్సును పోలిన తేజస్సు ఆమె యందు మూర్తీభవించుటను చూచెను. అనగా భగవానుని తేజస్సు ఈ సృష్టియందంటనున్నదని (అంతర్ బహిశ్చయత్ సర్వమ్ వ్యాప్య నారాయణ స్థిత) గుర్తించెను. ఏవం సీతాం దతా దృష్ట్యా ప్పాష్టు పవన సంభవః జగాను మనసా రామం ్రశశంస చతం (ప్రభుమ్
జగామ మనసా రామం= అనగా శ్రీరాముని సన్నిధికి వెళ్ళినటుల మనస్సునకు సంతృప్తి కలిగి శ్రీరాముని యొక్క విశిష్ట గుణములను ధ్యానము చేసెను. భగవానుని. (ప్రతిరూపమే. సీతమ్మవారు. కనుక భగవానుని చూచిన సంతృప్తే సీతమ్మవారిని చూచినపుడు కూడా ఆంజన్సేయునకు కలిగినది. చూచినది ఆ భగవానుని దివ్యచైతన్య స్వరూపము, ఆనంద స్వరూపమునే కాని, స్త్రీ పురుష రూపములను కాదని భావము. పదునారవ సర్గలో కూడా ఈ వాక్యమును వాల్మీకి మహర్షి వాడినారు. దీనిని బట్టీ ఈ వాక్యము యొక్క ప్రాధాన్యతను మనము గుర్తింపవచ్చును. సృష్టిని సరిగా దర్శించిన సృష్టికర్త యగు పరమేశ్వరుని దర్శించ వచ్చును. సృష్టిగా దిగివచ్చిన శ్రీదేవిని దర్శించుట ద్వారా శ్రీహరిని దర్శింప వచ్చును.
నేను అమ్మవారిని చూడగలనా అని బయలుదేరిన అంజనేయుడు నేను అమ్మను దర్శింపగలను అని ధైర్య గుణము లోనికి వచ్చుట మొదటి మెట్టు. నేను అమ్మవారిని చూచు చున్నాను అనునది రెండవమెట్టు. ఈమెయే జగన్మాత అని తెలియుట మూడవ మెట్టు ఈమెను సమీపించినపుడు శ్రీరాముని సన్నిధికి వెళుతున్నటుల తెలియుట - ఆమెలో శ్రీరాముని చూచుట అనునది చివరి మెట్టు,
ఆత్మాన్వేషణ చేయునట్టి సాధకులు ఈ సోపాన క్రమము ననుసరించి ఒక మెట్టును అధిరోహించుట, అక్కడ నుండి సై మెట్టునందు కొనుట అన్న సాధన (క్రమమును అనుసరించినపుడే వారి ప్రయత్నము సఫలమగును. మన ప్రయత్నమును వదలి నపుడే వారి అనుగ్రహమునకు పాత్రులమగుదుము, (మార్జాల కిశోరన్యాయము.) వారెప్పుడు అను(గ్రహశీలురు. గానే యుందురు, లాభాలాభములకు కారణము మనమే కాని వారు కారు. దీనిని గురుదేవులు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు, నాన్నగారు తరుచు నొక్కి వక్కాణించెడివారు. “వదిలినచో పట్టమరును”అనగా మన ప్రయత్నము
౪141 లన్నిటిని వదలినపుడు “సర్వధర్భాన్ పరిత్యజ్య" అన్న స్థితిని పొందినపుడు ఆ భగవానుని పట్టు మనకు అమరును
రామాయణపు ప్రసన్న కధా కవితార్దయుక్తులు తెలుగునాట ప్రసిద్ధములు ఈ రచన అందుకోసము వ్రాసినది కాదు. అందుచేత కధా గమనము అక్షర రమ్యత ఇందు అప్రధానములు ఈ రచన సారమతులు, లోనారసి మెచ్చు జిజ్ఞాసువులగు యోగసాధకుల కొరకన్ని గమనింప ప్రార్ధన.
నాన్నాగారు వ్యాఖ్యానించిన సుందరకాండము నుండి “అన్వేషణ కిరణము” ఈ పుస్తక రూపముగా వెలుగొందుచున్నది ఇందులో 5వ, సర్గమ శ్రీ వేదాంతం ఆనందాచార్యులవారు నాన్నగారి సూచనలపై రచించిరి. 18వ సర్గ, తరువాత పుస్తకము “హిరణ్యాక్ష” పరమయినవి. 14వ సర్గమ శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు పూరించిరి. వారు ఈ పుస్తకపు “ముద్రారాక్షస" మర్దనులు కూదా. అందుకు వారికి ధన్యవాదములు.
15వ సర్దమ నేను పూరించితిని. తదుపరి 'ప్రక్షిప్తము లున్నందున ఇంతవరకే ప్రచురించుచున్నాము.
ఈ సుందరకాండ శుద్ధవ్రాత ప్రతి తయారు చేసిన, గోలి కాంతారావునకు చక్కటి టైటిల్ డిజైన్ చేసిన దేవి ఫ్రీన్స్ అరండల్‌పేట, గుంటూరు వారికి మాష్టరుగారి ఆశీస్సులు.
ఈ సుందరకాండము ప్రచురణకు ఆర్థికముగా సహకరించిన శ్రీ పట్టెం పున్నయ్య, _పట్టిం వెంకటేశ్వరుల గారలకు సీతారాములు, ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవలసినదిగా (ప్రార్ధించుచున్నాను.
బుధజన విధేయుడు సూర్యం (కొత్తనూర్యనారాయణ)
స్వయంప్రభా వృత్తాంతము
సీతాదేవి నన్వేషించుటకు మొట్ట మొదటి అర్హత శత్రు కర్షణము. అంత;శత్రువులను, బహిళ్ళత్రువులను జయించినవాడు మాత్రమే సీతాన్వేషణము చేయగల సమర్జుడగును. సిద్దులు, చారణులు మొదలగువారు చరించే మార్గమున అన్వేషణము జరుగవలయును. చారణులు మొదలగు వారు చరించే మార్గమున మనము చరింప జాలము. అందులకు ్రత్యేకమగు అర్హత కలిగి యుండవలయును. ఈ అర్హతను. గూర్చి కిష్కింధకాండ చివరి భాగమున మనకు తెలుపబడినది. అదియే స్వయం ప్రభా వృత్తాంతము.
స్వయం ప్రభ అనగా మనలో స్వయముగా భాసించే (ప్రభ. మనకు స్వతంత్రమగు ప్రభ లేదు. పరతంత్రమగు 'ప్రభయే మనకు లభించును. అనగా గాలి పీల్చుట, వదలుట వలననే, మనకు (ప్రాణశక్తి లేక జీవశక్తి లభించును. నీరు ఉన్నప్పుడే మన (ప్రాణము శరీర మందంతట (ప్రసారము అగుచుండును. అగ్నియొక్క అనుగ్రహము లేనిచో మన మా శరీరములో ఒక్క క్షణామైననూ ఉండజాలము. అగ్ని,గాలి, నీరు వీని సంయోగము వలన శక్తి కలుగుచున్నదే గాని మనలో నుండి స్వయముగా మన సంకల్ప మాత్రమున అవిర్భవించుట లేదు. అట్టి స్తయం '్రభయొక్క అను([గ్రహము మనకు అభింప వలయును. ఖైలము, అగ్ని కలసినప్పుడు మాత్రమే మనకు జ్యోతి లభించుచున్నది గాని, మనంతట మనకుగా మనము జీవన జ్యోతిని కల్పింప జాలకున్నాము. అట్టి స్వయంప్రభ లేక జీవన జ్యోతి మన యందు ప్రకాశించి నప్పుడే అంతరంగ మందలి ఆత్మజ్యోతిని లేక సీతాదేవిని వెదుక గలము. ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలగు వారు స్వయం(ప్రభను కలుసుకున్న వృత్తాంతమును మనము తెలుసు కొందము.
ఆంజనేయుడు, కపివీరులు కలసి అమ్మవారి కొజకై అడవులు, కొండలు, కోనలు, నదులు అన్నిటిని వెదకిరి. వారు కాన జాలక తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడ సాగిరి. అమ్మను చూడలేక పోయితిమన్న మనోవ్యధ వారిని పీడించుచుండెను. ఆస్టితిలో వారు స్వయంప్రభ వున్న గుహాలోనికి ప్రవేశించిరి. మనకు, మన దృష్టికి కనుఫించక మన ఎదుటనే ఉన్న యోగ విశేషమునే గుహ యందురు. పరమాత్మ గుహ యందున్నాడు అని ఉపనిషత్తుల యందు
2 సుందరకాండము చెప్పబడుచున్నది. * యో వేద నిహితంగుహాయాం పరమే వ్యోమన్” మన భౌతిక మైన కంటికి కనుపించడు. మన లోపల, వెలుపల వ్యాపించి యుండునట్టి యోగ తత్త్యమే గుహ యందు ఉన్నది అని యందురు.
ఆ గుహలోనికి (ప్రవేశించినపుడు వీరు ఆకలి తోను, దప్పికతోను, నిరుత్చాహము తోనుండిరి. ఆ గుహలోనికి ప్రవేశింపగనే అచ్చట వారికి మంచి పండ్లతో నిండిన వృక్షములు, చల్లని అమృతమయమైన నీటితో నిండిన సరస్సులు మనస్సుకు ఆహ్హాదము కల్గించు దృశ్యములు కానవచ్చెను. అట్టు వారు చూడగనే అంతయు మారిపోయెను. వారికి ఆకలి పోయి శరీర మంతా వెలుగు నిండారి యుండెను. దప్పిక లేదు. అంతయును పరిపూర్ణము. మనస్సులోని వెలితి, తరుగు కూడా తొలగి పోయి ప్రసన్న మయ్యెను. అప్పుడు వారు స్వయంప్రభ వద్దకు వెళ్ళి నమస్కరింప, ఆమె యిట్లన్నది.
“ఈ గుహ లోనికి ప్రవేశించు వారిక్తి ప్రవేశించు మార్గము తెలియును. మరల తిరిగి వెళ్ళు మార్గము వారికి తెలియదు.”
ఈ యోగమార్గము మన లౌకిక దృష్టికి విరుద్ధముగా కనిపించును. ఎందువల్లననగా మనము వెళ్ళిన దారి వెంట తిరిగి రాగలము. కనుక మనకు విరుద్దముగా కనుపించును. యోగాభ్యాసము నందు ప్రవేశ మున్న వారికి మాత్రమే ఈ యోగాన్వేషణ విశేషము తెలియగలదు.
మనము యోగాభ్యాసము చేయునపుడు. శరీరమును స్టిరము, సుఖమునగు ఆసనము నందు నెలకొల్పుకొని హాయిగా కూర్చుందుము. అప్పుడు శరీరమును గూర్చిన స్పృహ మనకు ఉండదు. ఇంకను ప్రశాంతముగా కూర్చున్నప్పుడు మన ప్రాణశక్తి పరమ ప్రశాంతమగు మార్గమున నడచు చుండును. కనుక శరీరమును గురించిన స్పృహ లేక గుర్తు ప్రాణమునకు సంబంధించిన స్పృహ లేక గుర్తు అన్నవి రెండు కలసి మనోమయ మగును. అనగా మనస్సు లోనికి లీనమై పోవును. అట్టి స్థితి యందు మాత్రమే మనస్సునకు జ్యోతిర్మయమైన నడక లభించును.
అనగా భాగవతీయమైన గతి లభించును దానినే “మనోమయీం భాగవతీం గతిః అన్నారు పెద్దలు.
ఆ విధముగా మనస్సు పరమ శాంతమైన స్ట్రితిని పొందినపుడు ఈ మనస్సే,
పై నున్న ఆత్మ జ్యోతి యందు కలసి పోయి ఆ వెలుగును దర్శింపగలుగును. ఆ వెలుగును. దర్శించి నపుడు మనస్సు, మనస్సుగా ఉండక జ్యోతిగా మారి పోవును.
స్వయం(ప్రభా వృత్తాంతము ౩ నేను ఉన్నాను. నేను చూచుచున్నాను. నేను వస్తువుల భేదములను గమనించు చున్నాను అనుమూడు ప్రజ్ఞలు అప్పుడు అచ్చట పని చేయక, అంతా వెలుగులో కలసిపోవును. ఉచ్చ్వాస, నిశ్వాసముల ప్రక్రియ కూడా ఉండదు. ఆకలి దప్పుల స్ఫురణ యుండదు. అంతయు నిండుగ వెలుగుగా నైపోవును. ఈ విధముగా ఒక మెట్టుపై మరొక మెట్టుగా మనస్సుపైకి, పైకి యెక్కును. అనగా అన్నమయకోశము 'ప్రాణమయకోశములలో కలసి పోవును. అన్న-ప్రాణ మయకోశములు రెండూ మనో మయమగు మెట్టును అందుకొనును. ఈ మూడు 'ప్రజ్ఞలు కలసి కాంతి మయమై స్వయం'్రభా దర్శన మగును. ఇది పైకి వెళ్ళు నట్టి వరుస క్రమము. ఆ వెలుగు నుండి లేక పూర్ణ స్టితి నుండి మన ప్రజ్ఞ దిగి వచ్చునపుడు, సరాసరి మానవ 'ప్రజ్ఞలోనికే దిగి వచ్చును. అనగా అన్నమయకోశము యొక్క స్పృహ లోనికి సరాసరి దిగి వచ్చును. నేను ఫలానా వాడను, ఫలానా స్టలము నాది, ఇప్పుడు శ్రాలము ఇది అన్న స్పృహలోనికి సరాసరి దిగివచ్చునే గాని మెట్టు క్రింద మెట్టు, దాని క్రింది మెట్టుగా దిగివచ్చుట తెలియదు. ఈ యోగవిధానముననే అ గుహలోనికి ప్రవేశించు మార్గము మనకు తెలియును, తిరిగి వచ్చు మార్గము మనకు తెలియదు అని చెప్పబడినది. ఆంజనేయుడు, ఇతర వానరవీరులు కొంతసేపు స్వయం ప్రభలో (వెలుగులో) నుండిపోయి ఆనందము పొందిరి. శరీరమునకు పూర్షమగు పుష్టిలభించెను. ప్రాణశక్తి నిండారెను. మనస్సు ఆనందముతో ఉత్సాహపడెను. అప్పుడు స్వయం (ప్రభ వారిని ఆగుహనుండి మహేంద్రగిరి [క్రింది భాగమున నున్న సముద్ర తీరమునకు గొనివచ్చెను. అప్పుడామె వారితో నిట్లనెను. “ఇది సముద్ర తీరము. దీని కావల లంకా తీర మున్నది” అని చెప్పి, ఆమె వారిని అచ్చట వదలి తిరిగి వెళ్ళిపోయినది. ఆంజనేయుడు సముద్రమును దాటుటకు సమర్జుడని అందరూ నిర్ణయించిరి. రామునకు నమస్కరించి సముద్రమును దాటుటకు ఆంజనేయుడు సంసిద్ద మయ్యెను. ఇది అంతకు పూర్వము జరిగినటువంటి కధా సంవిధానము. రావణుడు అనగా వికారాత్మకమైన బుద్ది. అట్టి బుద్ధిచేత ఆవరింపబడిన, ఆక్రమింపబడిన ఆత్మజ్యోతి సీత. ఈ ఆత్మశక్తిని తన యధీనము నందుంచుకొని తన కార్యక్రమములో తోడుగా ఉపయోగించు కొనవలయునని రావణుని యొక్క కోరిక, మనము సుఖముగా ఆనందముగా నుండుటకు మన యొక్క సామాన్యపు
త్త సుందరకాండము శక్తి చాలదు. ఆత్మక్తి యొక్క సహాయమును, సహకారమును పొందినపుడే మనకు పరిపూర్తమగు ఆనందము, సుఖము లభించగలవు. కనుక ఆ యాత్మను మన అధీనములోనికి తీసికొందాము అని రావణునియొక్క అభిప్రాయము. ఆ విధముగా చంచలాత్మకమైన బుద్ధిచేత ఆవరింపబడిన “ఆత్మజ్యోతి”ని వెదకుటక్షై ఆంజనేయుడు బయలు దేరుట, ఆమెను అన్వేషించుటయే ఈ సుందరకాండ యొక్క (ప్రధాన విషయము.
ఈ వెదకుటకై హనుమంతుడు నూరుయోజనములుగల సముద్రమును దాటి ఆవలనున్న లంకను చేరెను. నూరు యోజనము లనగా నూరు రకములగు యోచనలు లేక ఆలోచనలు. ఆలోచనల యొక్క గుర్తులే ముద్రలు. అట్టి ముద్రలతో కూడినది కనుక సముద్రము అని భావము. ఈ సంకేతము చక్కగా అన్ఫయించుకొనీ నప్పుడు, సుందరకాండము చక్కగా అర్హమగును. ఆ ముద్రలు లేక గుర్తులు అన్నవి మూడు 'ప్రధానమగు విభాగములుగా నుండును.
1 ఈ శరీరమును గురించిన ము[ద్రలు లేక గుర్తులు, నేను పురుషుడను లేక స్రీని. విద్యావంతుడను. రాజకీయనాయకుడను. అన్న యోచన లన్నియు కలసి ఒక భాగము, ఈ యోచనలు లేక వ్యామోహము లన్నిటిని దొటిన వాడే సీతాదేవిని వెదుకగలడు. తనలో నున్న ఆత్మజ్యోతిని వెదకుటకు గాను, సాధకుడు వెలుపల తన చుట్టూ ఉన్న వ్యామోహము లన్నిటిని దాట వలయునని భావము.
2 మన ప్రాణశక్తిని గురించిన ఆలోచనల యందు మన (ప్రాణము, దానిని రక్షించుకాను ఉపాయములు, ప్రాణములు నిలుపుకొనుటకై చేయు ఆహార విహాదాది (ప్రయత్నములు, మొదలగు (ప్రాణమునకు సంబంధించిన ప్రయత్నములు ప్రధానముగా నుండును. తన (ప్రాణమును రక్షించుకొనుటకై. ఉచ్చ్వాస. నిశ్వాసముల ద్వారా (ప్రయత్నములు చేయుట, గాలి, వెలుతురు నీరు మొదలగు వాటిని ప్రాణరక్షణకు ఉపయోగించు. ఆలోచనలన్నియూ. రెండవ భాగము. దీనిని దొటుట వలననే సాధకుడు ఆత్మజ్ఞానము పొందగలడు అని భావము. ఆంజనేయుడు సముద్రమును దొటునపుడు చేసిన మొట్ట మొదటి పని.
“రురోద హృదయే ప్రాణాన్”
ప్రాణములను హృదయాకాశమునందు నిలిపెనని వెప్పబడినది. ఈ సంసొర సముద్రమును తరించి ఆవలి ఒడ్డునకు చేరినపుడు కూడా ఆంజనేయుడు ఉచ్చ్వాస నిశాసములను నూని నట్టునూ, దివ్యమగు (ప్రాణమును ఆధారముగా చేసుకొని ఉండినట్టునూ చెప్పబడినది.
స్వయం'(ప్రభా వృత్తాంతము క్
- మనస్సే అన్ని ఆలోచనలకు కేంద్రము. శరీరమునకు సంబంధించిన ఆందోళన అన్నియూ ఆ మనస్సు నుండియే వచ్చును. ఆ మనస్సు నుండియే మానవుని యొక్క జ్ఞాన ప్రసారము కూడా జరుగు చుండును. కనుక సాధకుడు తన మనస్సును కూడా దాటవలయును. మనస్సులో ఎలాటి ఆలోచనలు లేని స్థితి ఏర్పీడినపుడే ఉచ్చ్వాస నిశ్వాసములతో పనియుండదు. మనః ్రవృత్తులన్నియూ నిలిచి పోయినపుడు మనస్సు నిర్చృత్తి యందుండును. అప్పుడే పరిపూర్ణ్వమగు (ప్రాణశక్తి మనలో పనిచేయును. ఆ కార్యక్రమమునే సముద్రమును దాటుట అని సుందరకాండమున వర్షించిరి.
నూరు యోజనములు దాటుట అనగా ఏమి? అట్టి సముద్రమును దాటుటకు గల అర్హతలు ఏవి? అన్నప్పుడు ఆ అర్హతలను వాల్మీకి మహర్షి సుందరకాండ 'ప్రధము సర్గ 190 వ శ్లోకము లో ఇట్టు చెప్పెను.
యస్యత్వే తాని చత్వారి వానరేంద్ర "యధాతవ
ధృతి దృష్టి ర్మతి ర్జాక్ష్యం స్వకర్మసు న సీదతి!
ఈ సముద్రమును దాటుటకు “ధృతి” అనగా ధైర్యగుణము స్థిరమైన చిత్తము, అమోఘమగు సంకల్పము, నిర్మలమైన అంతఃకరణము కావలెను. అట్లీ వాడే ఈ సముద్రమును దాటగలడు. సముద్రము అనగా మన మనస్సులోని ముద్రలు. అవి ఆకార, జన్మ, విద్య, సంస్కార, వాసనా విశేషములు. దీని వలన వచ్చునట్టివే యీ ము(ద్రలు (190౯631005)
ఆంజనేయస్వామి ప్రాణమయకోశముసై పరిపూర్ణమైన స్వామిత్వము కలవాడు. కారణము అతడు జన్మించినది ప్రాణములో నుండి, వాయువులో నుండి, మనోమయకోశముపై కూడా పూర్ణమైన అధికారము కలవాడు. కనుక అతడు సము(ద్రమును దాటగలడు,. అతని అంతఃకరణము రామమయమైనది. చిత్తము (బ్రహ్మవర్భస్సుతో నిండిపోయినందువలన అతనిపై అవిద్య యొక్క ప్రభావము పనిచేయదు. అతని లోని విశేషము మాత్రము పనిచేయును. అనగా ఈశ్శరకృప లేక రామకృప పని చేయును. కనుక అతడీ సముద్రమును దాటగలడు. నూరు యోజనముల సముద్ర మనగా నూరు ఆమడలని చెప్పుకొనవచ్చును. అలాకాక నూరు రకములగు ఆలోచనలు, యోచనలు లేక యోజనలు అని కూడా అర్ధము కలదు. మనలో (ప్రవర్రిల్లు ఆలోచనలు ్రవాహముగా వచ్చుచుండును. వానికి ఒక నియమము, నిబంధము ఉండదు. కనుక ఆలోచనలను బంధింప వలయునని,
6 సుందరకాండము మనస్సును కట్టీవయ వలయునని యోగసాధకులు ప్రయత్నములు చేసిరి. కాని ఆ విధముగా మనస్సును బంధించుట సులభము కాదు. మనస్సును బంధించుట అన్న కోరిక కూడా మనస్సే. కనుక ఆ ప్రయత్నము సఫలము కాదు. మనస్సును మంచి మార్గమునకు మరలించుట, మంచి ఆలోచనలకు మాత్రమే అవకాశము కల్పించుట, చెడు ఆలోచనలను ఉపేక్షించి సాక్షీభూతులమై ఊరక ఉండి చూచుట వలన మాత్రమే మనము మనస్సు యొక్క సంక్షోభమును దాటగలము. జ్ఞాన మార్గముచేత మన మనస్సుతో మంచి పనులు చేయించవచ్చును. ఇది యొక్కటే స౦ంసారమను సముద్రమును దాటుటకు మార్గము. వందలుగా మన మనస్సులో ప్రవర్తిల్లే ఆలోచనలను దాటుటకు ఇదే మార్గము. ఇట్టి మార్గమే ధృతి యని పేర్కొనబడినది. అనగా మన మీ కార్యక్రమమును చేయగలమా? లేదా? అను సందేహమును దాటుట. మన శక్తి చాలదేమోనను శంక కలుగుట మనకు అపజయము కలుగునని భయము కలుగుట, అందువలన ఏకార్యము (ప్రారంభింపజాలక సోమరిగా నుండుట, ఇది పిరికి వాని లక్షణము. అలా కాకుండ స్టిరమగు ఒక మంచి సంకల్పము ఆధారముగా, మంచి పనులను చేయుటకు ఉప(క్రమించు. వారే ధీరులు, ధైర్యవంతులు. అట్టి వాడే హనుమంతుడు. ఈ కార్యమును చేయగలనా? లేదా? అను భయసందేహములు లేనివాడు, హనుమంతుడు.
హనునుంతుని సముద్ర అంఘనము
క్లో తతో రావణ నీతాయా స్ప్సీతాయా శ్థుత్రు కర్ళనః
ఇయేష పద మన్వేష్టుం చారణా చరితే పధి 1-1
సుందరకాండ మొదటి సర్గ మొదటి శ్జోకము నందు చాలా అంతరార్హమున్నది. ప్రతి పదార్హము నిట్టు చెప్పవచ్చును. తతః ఆ పరమాత్మనుందడి రామచంద్రుని నుండి “రావణ నీతాయా"రాజసభావమే - రావణుడు. అట్టి మోహ విభభ్రాంతితో కూడిన మనస్సుచేత లేక బుద్దిచేత తీసుకొనపోబడినది. “సీత” జన్మజరా మృత్యువులు ఏ వికారములు లేనిది ఆత్మ అట్టయ్యును ఆ - అత్మ ఈ శరీరము నందు బంధింపబడుచున్నది. శరీరము నందు బుద్ధిచే ఆ(క్రమింపబడినట్టి ఆత్మను మనస్సు అన్వేషించి తెలుసుకొనజాలదు. మనస్సు కోరికలతో నిండారియుండును. కామ॥్రోధాదులు నడిపినట్లు అది నడచును. “నేనే అంతటికి సమర్జుడను, “స్వామిని” అని బోధించును. నా ప్రయత్నము వలన నన్ను నేను రక్షించుకొన గలను. ఈ కార్యక్రమము నాది. ఈ కార్యముల ఫలము కూడా నాదే అన్న వికారములు గలది మనస్సు. అట్టి మనస్సునకు లోబడినవాడు రావణుడు. అట్టి వాడు ఆత్మను ఎరుగడు,
హనుమంతుడు జ్ఞాని. వివేకము గలవాడు. గనుక మనస్సుకు సంబంధించిన వికారములను జయించినవాడు, పవిత్రమగు బుద్ది వికాసములు గలవాడు, గనుకనే అతడు శత్రుకర్షణుడు. అంత; శత్రువులను జయించిన వాడు. గనుకనే ఆత్మజ్యోతిని వెదుకవలయున్న అభిలాష గలవాడయ్యెను. “అన్వేష్టుం” ఆ ఆత్మయున్న చోటును వెదుకవలయునన్నట్టి ఇయేష - కోరిక గలవాడయ్యెను. ఇంతవరకు సీతాదేవి కొరకు అడవులు, కొండలు, నదులు వెదకినాడు. ఇప్పటికి ఆ ప్రయత్నమంతా వ్యర్థమని తెలుసుకొని ఈ శరీర మనే లంకలో ఆంతరంగములో వెదుకవలయునన్న జ్ఞాన సంకల్పము కలిగెను. అప్పుడంతరంగములోని దహరాకాశము లేక హృదయాకాశము అనబడు ఆకాశమార్గము నందు వెదుక సాగెను. అదియే “చారణా చరితే పథి
- చారణులు మొదలగు దేవతలు చరించే మార్గమునందు వెదుక సంకల్పించెను. అతి సూక్ష్మమగు పరిశీలన ద్వారా అంతరాత్మ నెరుగ గోరెను. పరమాత్మనుండి వేరుపడిన జీవాత్మ కోరికలచేత, సంసార బంధముల చేత ఆకర్షింబడి జన్మజరా
8 సుందరకాండము మృత్యువులను చతక్రబంధమున శరీరము నందు జీవాత్మ బంధింప బడును. ఇట్టు ఆకర్షించి తెచ్చునది మోహితమగు మనస్సు. ఇట్టి కామాది మోహములను జయించిన జ్ఞానియే ఆచార్యుడు. అతడు ఇంద్రియాదులను జయించి భగవదను([గ్రహమును పొందును. భగవదను(గ్రహము వలన సముద్రమును దాటి శరీరమనే లంకలో ్రవేశింపగలడు. ఆ శరీరములో బుద్దిచే ఆ(్రమింపబడిన ఆత్మను గుర్తింపగలడు. అత్మజ్యోతియగు ఆ సీతాదేవితో మాట్టాడగలడు. ఆమె వార్తను అభ్యర్థనను, చూడామణి రూపమున తాను (గ్రహించి తీసుకొని వెళ్ళి ఆ పరమాత్మకు చేర్చగలడు. శ్టో ॥ దుష్కరం నిస్ట్రతి ద్వంద్వం చీకీర్షన్ కర్మ వానరః సముద[గ్ర శిరోగ్రీవో గవాం పతి రివా బభౌ 1-2 శ్లో; అధవైడూర్య వర్లేషు శాద్యలేషు మహాబల: ధీర స్పలిల కల్పేషు విచచార్ యధా సుఖమ్ 13 ఖ్లో ॥ద్విజా న్విత్రాసయన్ ధీమా నురసా పాదపాన్ హరన్ మృగాంళ్ళ సుబహూ న్నిఘ్నన్ ప్రవృద్ద ఇవ కేసరీ [-్త ఆంజనేయుడు ఆ కొండపైకి వచ్చి, పచ్చిక బయలున విహరించు ఆబోతువలె సంచరించినాడు. ఇట సముద్రమనగా సంసొర సాగరము. ఈ సముద్రమును దాటుట చాలాకష్టమైన పని, మహాధీరుడైన వాడు సంసార సాగరమును దాట గలడు. సంసారమును వదలి వైచిన వాడికి సంసారసాగరమును దాటుట అన్న ప్రస్తావనయే యుండదు. సంసారమునందే యుండి అందే తిరుగుచు నున్నవారు ధీమంతులు. ఆంజనేయుడు అట్టి ధీమంతుడు. సుగ్రీవునకు మంత్రి. రాజ్యపాలనతో కొంత (ప్రమేయ మున్నప్పటికీ అందు ఎంతమాత్రమును తగుల్కొనక సంచరించినవాడు. కనుకనే ధీమంతుడైనాడు. అందుచేతనే హనుమంతుని వృషభముతో పోల్చుట జరిగినది. ఆవులు సామాన్యమైన ఎద్దులు. పచ్చిక బయలులో మెడలు వంచి గడ్డిని తినుటకు (ప్రయత్నము చేయును. వృషభము అట్టు చేయదు. అది ఎప్పుడూ నిండుగాను, పుష్కలముగాను. నుండును. కనుక చిన్న చిన్న గడ్డిపరకలచే ఆకర్షింపబడదు. మెడపైకి ఎత్తి వీరత్వముతో సంచరించును, అందుచే ఈ ఉపమానము ఇచ్చట సరిపోవును. వృషభము, ఆబోతు సంసారికై కూడా సంసార బంధములచే కట్టుబడదు. అదే విధముగా ఆంజనేయుడు సుగ్రీవుని రాచకార్యములతో కొంత సంబంధ
హనుమంతుని సముద్ర లంఘనము ం్ర మున్నప్పటికి వాటి నన్నిటిని గడ్డిపోవతో సమానముగా చూసెను. రామభక్తియే ఆయనకు పరమలక్ష్యము. సీతాదేవి దర్శనమే అతనికి జీవిత సాఫల్యము. ధీరుడైన వాడు అనగా బ్రహ్మజ్ఞాని యైనవాడు బ్రాహ్మీయమైన దృష్టిలోనే యుండును. అయినను సంసారములొ కూడా సంచరించు చుండును. గవాంపతి అనగా గోపాలకుడనియు అర్ధము. జీవులనెడి గోవులను పాలించు. శివుడు పశుపతిగా, కృష్ణుడు గోపాలకుడుగా సుప్రసిద్దులు. అంతేగాక గవాంపతి యనగా ఎద్దు. ఇచ్చట నందీశ్చరుడని అర్హము. తరువాత రావణుడు కూడా ఆంజనేయుని నందీశ్చరుని గనే దర్శించెను. ఆనంద స్వరూపమగు వాక్కే నందీశ్చరుడు. ఇక గోవు లనగా కిరణములని అర్హము. శ్లో ॥ నీల లోహిత మాంజిష్ట్ర పత్ర వై స్సితా సితైః స్వభావ విహితైళ్చి (తై ర్చాతుభి స్పమలంకృతమ్ 15 ఆ కొండ యందలి రాళ్ళు త్రిగుణమీల రంగులు కలిగి యుండెను, కొన్ని నలుపు, నీలపు రంగు కలిగినవి. ఇవి తమో గుణమును తెలియజేయును. మరికొన్ని ధాతు వర్షము కలవి. అనగా రాజస లేక రజోగుణమును తెలియజేయునవి. పసుపు పచ్చని బంగారపురంగు గలిగిన భాగములు సాత్విక తేజస్సును తెలియజేయును. ఈ శ్టాకము నందు చెప్పబడిన కాండల రాళ్ళ రంగులు విచిత్రమైనవి. కొండయందలి రంగురాళ్ళు, వెన్నెముక యందలి చక్రముల రంగులు. యోగ వికాసము సాధకుని వెన్నెముక యందు పద్మములుగా విస్పారును. ఈ చక్రములు ఆయా రంగులతో అతని అంతర్నీత్రమునకు దర్శన మిచ్చును. హనుమంతుని యందు ఆయా చక్రములు క్రమవికాసము నందినవి. దీనికి కారణము అతడు సీతారామలక్ష్మణులను హృదయమున ఆరాధించుటయే. ళ్ట్యోః స తస్య గిరివర్యస్య తలే నాగ వరాయుతే తిస్టన్ కపివరస్తత్ర (హ్రదే నాగ ఇవా బభౌ 1-7 శ్దో స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్య శ్చాంజలిం కృత్వా చకార గమనే మతిమ్ 1-8 శ్ఞోః _ అంజలిం ప్రాబ్ము(ఇఏఇం కృత్వా పవనా యాత్మయోనయే తతో హీ వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ 19 శో ప్లవంగ ్రవరై ర్షృష్టు ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు క10
10 సుందరకాండము నిష్ప్రమాణ శరీర స్సన్ లిలంఘయిషు రర్షవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతమ్ 1-11 స చచా లాచలళ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్ప మశాతయత్ 1-12 తేన పాదపముక్తేన పుష్పాఘేణ సుగంధినా సర్వత స్ఫంవృత శ్షైలో బభౌ పుష్పమయో యథా 1-13 తేన చోత్తమ వీర్యేణ పీడ్యమాన స్స పర్వతః సలిలం సం'్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః 14 పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః ర్తీ ర్నిర్వర్తయామాస కాంచ నాంజన రాజతీః క15 ముమోచ చ శిలాళ్సైలో విశాలా స్స్పమనళ్ళిలా: మధ్యమే నార్చిషా జుష్టో ధూమ రాజీ రివానలః 1-16 గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహా విష్టాని భూతాని వినేదు ర్వికృతై స్ప్వరైః 1-17 స మహాసత్ష్య సన్నాద శైల పీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చోసవనాని చ కే18 శిరోభి;ః పృథుభి స్సర్సా వ్యక్త స్వస్తిక లక్షణైః వమంతః పావకం ఘోరం దదంశుర్తశనై శ్ళిలా: కడం తాస్తదా సవిపైర్షస్టాః కుపితై స్తెర్మహాశిలా: జబ్వలుః సావ కొోద్దీప్తాబిభిదు శృ సహ(్రధా 1-20 యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నూ న్యపి నాగానాం న శేకు శృమితుం విషమ్ 1-21 భిద్యతీ౭యం గిరి ర్ఫూతై రితి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరా స్తస్మా దుత్పేతు స్ర్రీగలై స్సహ 1-22 పాన భూమి గతం హిత్వా హైమ మాసవ భాజనం పాత్రాణి చ మహార్ద్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ 1-23 లేహ్యా నుచ్చావచా నృక్ష్యాన్ మాంసాని వివిధాని చ అర్జభాణి చ చర్మాణి ఇడ్డాం శృ కనకత్సరూన్ [224 కృత కంఠ గుణాః క్షీబా రక్రమాల్యానులేపనాః రక్షాన్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే 1-25
హనుమంతుని సముద్ర లంఘనము క్ష హార నూపుర కేయూర పారిహార్య ధరాః (స్త్రియః విస్మితా స్పస్మితా స్తస్టు రాకాశే రమటై స్సహ 1-26 దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితా స్తస్టు రాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ 1-27 శుశ్రువు శ్చ తదా శబ్ద మృషీణాం భావి తాత్మనాం చారణానాం చ సిద్దానాం స్టీతానాం విమలే2౦బరే 1-28 ఏష పర్వత సంకాశో హనూమా న్మారుతాత్మజః తితీర్ణతి మహావేగ సముద్రం మకరాలయమ్ 11-29 రామార్ధం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సము(ద్రస్య పరం పారం దుష్ర్రాపం ప్రాప్త మిచ్చతి 130 ఇతి విద్యాధరా 'శ్శుత్వా వచస్తేషాం్ధ మహాత్మనాం త మష్రమేయం దదృశుః పర్వతే వాన రర్జభమ్ 1-31 దుధువే చ సరోమాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః 1-32 ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం లోమఖిళ్చితం ఉత్పతిష్యన్. విచిక్షేస పక్షిరాజ ఇవోరగమ్ 1-33 తస్య లాంగూల మావిద్ద మాత్త వేగస్య పృష్టతః దదృశే గరుడే నేవ హ్రయమాణో మహోరగః 1-34 బాహూ సంస్తంభయామాస మహా పరిఘ సన్నిభౌా ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ శ్షే-3ర5 సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తధైవ చ శిరోధరాం తేజ స్సత్ష్యం తథా వీర్య మావివేశ స వీర్యవాన్ 1-36 మార్గ మాలోకయన్ దూరా దూర్వ్యం ప్రణిహితేక్షణ: రురోధ హృదయే ప్రాణా నాకాశ మవలోకయన్ 1-37 పద్భ్యాం దృఢ మవస్తానం కృత్వాస కపికుంజర; నికుంచ్య కర్ణౌ హనుమా నుత్చతిష్య న్మహాబలః 1-38 వానరా న్వానరశశ్రేష్ట ఇదం వచన మబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శృర శ్వసన విక్రమః 1-39
12 సుందరకాండము అయన శరీరమును కొండంతగా పెంచెను. హనుమంతుని సంచలనము వలన ఆకొండపై నున్న చెట్టపూలన్నియూ రాలి పడినవి. ఆపూల వాసనలతోను, పువ్వులతోను నిండిన యా కొండ, పూవుల కొండవలె నొప్పెను. అది పుష్పగిరి అనునట్టి అనుభూతి. యోగాభ్యాసము నందు తరచుగా కనబడును. గురుపాదులు వేటూరి 'ప్రభాకరశాస్తుల వారి సన్నిధి యందు యోగసాధన చేయు చున్నపుడిట్టి అనుభూతి కలుగుచుండెడిది. సాధన చేయువా రందరు ఏకా(గ్ర చిత్తు లైనపుడు ఆయోగ కేంద్ర మంతయూ పూలవాసనలతో నిండిపోయెడిది. సంపంగిపూలు, మల్లెపూలు, మొదలగు పూల పరిమళములతో ప్రార్ధన మందిర మంతయూ, నిండి పోయెడిది. హనుమంతుడు మహేం(ద్రగిరిని పాదములతో నాక్కినపుడు అందు నివసించు చున్న మృగములు నలుదిక్కులకు పారిపోవుచు భయంకర నాదము చేసినవి. నేల బొరియలలో నివసించు పాములు బయటకు వచ్చి రాళ్ళను కాటు వేసినవి. నల్లనిరాళ్ళు క్రిందికి జారి పడిపోయినవి. ఈ మూడురకములైన అనుభవములు మహాయోగులైన వారు జ్ఞాన ము(ద్రలోనికి చేరి పరమార్దనిష్టలో (ప్రవేశించినపుడు జరుగునట్టివే. మనలో దాగియున్న _ క్రూరజంతు భావము లన్నియూ అనగా పరులను హింసింపవలెనన్న కోరిక లన్నియూ బయటకు గెంటి వేయబడును. గూఢముగా దాగి యున్న విషసంకల్పములు, చేదు భావములు ఇతరులకు కీడు కలిగింపవలెనన్న దుష్ట భావము లన్నియును పాముల వంటివి. పాములు వాని, వంకర నడకలు మొదలగు వన్నియు తొలగిపోవును. నల్లనిరాళ్ళు అనగా మనలోని అజ్ఞాన అవశేషము. అదికూడా తొలగిపోవును. ఆ కొండపైనున్న విద్యాధరాధి దేవతలకు మహేంద్ర పర్వతము (బ్రద్దలగు చున్న దన్న భావము కలిగెను. అఆభయముతో ఉన్న వారున్నట్టుండి ఆకాళము లోనికి పారిపోయిరి, వాయుపుత్రుని చూచుటకె ఆకాశమున నిలిచి మహర్షులు, హనుమంతుడు రామ కార్యార్షియై ఈ మహాకార్యమును_ బూని సముద్రమును దాటబోవు చున్నాడనిరి. హనుమంతుడు పరమోత్సాహముతో శరీరమును. దులిపి మేఘ గంభీరముగా సింహనాదము చేసెను మహాబలసంపన్నమైన తనతోకను హనుమ అటు నిటు త్రిప్పెను. గరుత్మంతుడు పట్టిన పెద్దపామువలె ఆతోక కనుపించెను. ఇప్పుడు చెప్పనున్న యోగవర్లలు తన (ప్రయత్నము వలన తన శరీరమును నియమింపనున్న క్రమము చెప్పబడినది. ఇచ్చట చెప్పబడు సాధనా (క్రమము
హనుమంతుని సము([ద్ర లంఘనము క్షం జలంధరము(ద్రయని పిలువబడును. ఇనుప గుదియల వంటి బలిష్టమైన తన రెండు చేతులను తన వక్షస్టలముపై నుంచి లోపలకు నొక్కి యుంచెను. పొట్టను లోపలకు గట్టిగా అక్కలించి నడుమును చాలా సన్నముగా బిగించెను. ఉచ్చ్వాస నిశ్వాసములు పనిచేయ కుండుటకు గాను రొమ్మును చేతులతో నొక్కి పట్టుట, పొట్టను పైకి అక్కళించుట జరుగును.
తరువాత పాదములతో భూమిని అదిమి పట్టెను. మెడను, బాహువులను లోనికి ముడుచు. కొనెను. అంతకు పూర్వమే తనలో సహజముగా గుపష్తమైయున్న తేజస్సును, బలమును, పరాక్రమమును, మరింత అధికముగా పొందెను. ఈ సాధన వలన, అనగా ఈ ముద్రలను అభ్యాసము చేయుట వలన లోపల గర్భితమైన శక్తులు విజృంభించి శక్తి సంచారము జరుగునని పెద్దలు చెప్పుదురు. ఇది యంతయూ మన ప్రయత్నముతో జరుగు నట్టిది. అట్టి ప్రయత్నముతో నిమిత్తము లేకుండా జరుగు యోగ విశేషములు తరువాత్ చెప్పబడినవి.
(1-1 పర్వత మనగా పర్వములతో కూడినది. పూర్షిమ, అమావాస్యలను పర్వములతో గూడిన సంవత్సరమందలి జ్యోతిర్విద్యా రహస్యములను ఎరింగి తన యోగ సాధనకు వానిని సమన్వయించు. కొనెనని భావము. ఇందు వలననే ఆంజనేయుడు సూర్యునికి శిష్యుడనియు, సూర్య రథయానము ననుసరించి విద్యలు నేర్చెననియు చెప్పబడెను.
మనస్సు చాలా '్రశాంతమగు స్థితిని పొందవలెను. అన్నమయకోశము, ప్రాణమయకోశము యొక్క కార్యక్రమ మంతయు మనస్సునందు లగ్నము కావలయును. అప్పుడే మనస్సు తనచుట్టూ ఉన్న బాహ్య (ప్రపంచమును దాటి (బ్రహ్మము వైపునకు దృష్టిని నిలుపును,
ఆకాశబ్రహ్మము నందలి ఒక చిన్నభాగమే మనశరీరము లోని హృదయకమలముగా దానిని హృదయాకాశము లేక దహరాకాశము అని పిలుచుట యోగళశాస్త్రము నందు పరిపాటి. తన (ప్రజ్ఞను హనుమంతుడు హృదయమునందు నిలిపెనని చెప్పబడినది. ఈ విధముగా చేయుట వలన మనలో ఆపారమగు దివ్యశక్తి సంచలనము కలుగును. హనుమంతుడు సముద్రమును దాట బోవుచు కాళ్ళు రెండును చక్కగా మోపు చేసి చెవులు రిక్కించిన వాడై ఆకాశగమనమునకు సిద్ధ మయ్యెను. అప్పుడు వానరులతో ఇట్లనెను.
క్ష సుందరకాండము న్లో యధారాఘవ నిర్ముక్తళ్ళరః శృసన విక్రమః గచ్చే త్తద్వ డ్గమిష్యామి లంకాం రావణపాలితాం న హీ (ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజామ్ శ40 హ్లోః అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న [ద్రక్ష్యా మ్యకృత (శ్రమ; శశ కో బద్ద్వా రాక్షస రాజాన మానయిష్యామి రావణం సర్వధా కృతకార్యో2హమేష్యామి సహ సీతయా 1-42 శ్లో ఆనయిష్యామి నా లంకాం సముత్సాట్య సరావణాం ఏవ ముక్త్వా తు హనుమా న్వానరా న్వానరోత్తమః 143 క్లో ఉత్పపా తాధ వేగేన వేగవా నవిచారయన్ సుపర్షమివ చాత్మానం మేనే స కపికుంజర; క్షేంత్తడ శ్లోః సముత్పతతి తస్మిం స్తు వేగా త్తే నగ రోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు స్పమంతత; 1-4ీర్ శ్లో సమత్ర కోయస్టిమకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహ న్నూరు వేగేన జగామ విమలే20బరే 146 ఖః ఊరు వేగోద్దతా వృక్షా ముహూర్తం కపి మన్వయుః: ప్రస్టితం దీర్జమధ్యానం స్వబంధు మివ బాంధవాః కాత? శో త మూరు వేగోన్మధితా స్పాలా శ్చాన్యే నగోత్తమాః అనుజగ్ముర్హనూమంతం 'సైన్యా ఇన మహీపతిమ్ క48 ళ్ళ సుపుప్పి తాగ్రైర్భహుభిః పాదపై రన్వితః కపిః హనుమా న్పర్వతాకారో బభూ వాద్భుత దర్శన: గంత9 క్లో॥ సారవంతో2ధయే వృక్షా న్యమజ్జ్ఞన్ లవణాంభసి భయా దివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే 1-50 నేను రామబాణము వంటి వాడను. అనగా రామబాణమునకు దిక్కు అనునది యుండదు. చేరవలసిన లక్ష్యము కూడా ఉండదు. అంతా రాముని ఆధీనములో నుండును. అనగా భగవానుని ఆధీనములో నుండును. భగవానునికి, భక్తునికి గల సంబంధము ఇటువంటిది. భగవానుని (ప్రబోధము ననుసరించియే భక్తుడు కొర్యోన్ముఖుడు కావలసీయుండును. ఆయన నిర్ణయించిన పద్దతిలో కార్యము నడుప వలయును. ఆకార్యము యొక్క లక్ష్యము, ఫలితము కూడా భగవానునిదే
హనుమంతుని సము(ద్ర లంఘనము కేర్ అని యెరిగి భక్తుడు నడువ వలయును. ఇదియే గురు శిష్యుల యొక్క సంబంధమును తెలియజేయును, పరమ గురువుల యొక్క ఉద్భోధములననుసరించి ఆ చరణమునకు పూనవలయును అనగా పూనిక గురువులదే. ఫల $ప్రాప్రియును గురువుల అనుగ్రహము బట్టియే.
కనుక ఆంజనేయుడు ఇట్లనెను. నేను రాముని బాణమను. నాకు రాముని యొక్క అజ్ఞ యున్నది. రావణుడు ఎంత బలశాలి మైననూ నేను లంకలోనికి జొచ్చుకొని పోగలను. లంకలో ప్రవేశించి నేను లంక నంతయూ సీతకై వెదకెదను. అచ్చట సీతాదేవిని కనుగొన జాలనప్పుడు యిదే వేగముతో స్వర్గలోకమునకు వెళ్ళెదను. అచ్చట సీతాదేవిని వెదకెదను. అచ్చట కూడా సీతాదేవిని కనుగొన జాలక పోయినచో మరల లంకకు తిరిగి వచ్చి ఎలాంటి శ్రమయూ లేకయే రాక్షస రాజగు రావణుని బంధించి తేగలను. ఈ విధముగా వానరులకు ఉత్సాహ వాక్యములు పలికి, ఆంజనేయుడు లంకకు ప్రయాణ మయ్యెను. సముద్రమును దాటుటకుగాను తాను గరుత్మంతుడనని భావించెను. గరుత్మంతుడు మహావిష్ణువునకు వాహనము. ఆ మహా విష్ణువే రాముని అవతారమున కిష్కింధ యందుండి నన్ను ఈ పనికి ఆజ్ఞాపించెను. గనుక ఈ పని గరుత్మంతునిదిగూడా. కనుక అతడు నాలో అవేశించి ఈ పని జయ(ప్రదము చేయింపవలెనని భావించెను. ఆంజనేయుడు బయలు దేరుటకు ముందు సూర్య, అన్ని, వాయువు, బ్రహ్మాదులకు నమస్కరించి వారి తేజస్సు తనకు లభించవలెనని కోరుకొనెను. ఆంజనేయుడు ఆకాశగమనమునకై గరుత్మంతుని సంభావించిను.
ఇచ్చట ఒక ముఖ్య విషయము గుర్తుండవలయును. దేవతలు మానవ, వానర, రూపములు ధరించి ఎవరికి తగిన పాత్రలను వా రభినయించు చున్నారు. కనుక హనుమంతుడు తన తోకను విదిలించినపుడు గరుత్మంతుడు పామును పట్టి విదిలించి నట్టున్నదని యిది వరకు శ్లోకములో చెప్పబడినది. రాముని బంటగు హనుమంతునితో గరుత్మంతుని దివ్యమగు తేజస్సు వచ్చి చేరినదని భావము, అదే విధముగా మొట్టమొదట ఆంజనేయుడు. పచ్చిక బయలులో తిరుగు వృషభము వలె మెడపైకి యెత్తి వ్యవహరించినట్టు వాల్మీకి చెప్పినారు. వృషభ మనగా మన కంరస్వరం యొక్క కేంద్రము. "ైత్తిరియోపనిషత్తు” నందు “యళ్ళంద సామృషభో విశ్వరూప; అని చెప్పబడినది. కంఠస్వరము ద్వారా విశ్వేశ్చరుని సాన్నిధ్యమును గుర్తింపగలము. బుక్కులే. విశ్వేశ్చరునకు వాహనము. కనుకనే ఈశ్వరుడు
16 సుందరకాండము వృషభవాహనుడని చెప్పబడినది. శ్రీహరి గరుడ వాహనుడనియును ప్రసిద్ధము. ఆదివ్యతత్వమును మోసుకొని వచ్చి భూమి మీద (ప్రజలకు అందించే వాహక సాధనములు వృషభము, గరుత్మంతుడు. రాముని వార్తను ఆయనగారి సందేశమును మోసుకొని వెళ్ళు సందేశాహరుడు హనుమ. మరల సీతాదేవి సందేశమును, గుర్తును కొనితెచ్చి రాముని కందించిన వాడు హనుమంతుడు. యుద్దమున రామ లక్ష్మణులకు వాహనమైనాడు. ఇప్పుడు గరుడుని యొక్క ఆకాశగమన సామర్య్యమును తనలో ఆవహింపజేసుకొని సముద్రమును ఆకాశగమనమున దాటి వెళ్ళి సీతను వెదుక నుద్యుక్తుడయినాడు.
ఇట్లు హనుమంతుడు తన శరీరమును పెంచి మహా వేగముతో ఆకాశమార్గమున ఎగిరిపోవు చుండగా ఆ వేగమునకు మహేంద్ర గిరిపై నున్న చెట్టు పూల తిగలు కూడా హనుమంతుని అనుసరించినవి. ఆకొాండ శిఖరమునగల పూల చెట్టు కూడొ ఆయనను అనుసరించెను. ఆస్పుడగు_ మిత్రుడు, తమను విడిచి వెళ్ళునపుడు బంధువులు కొంత దూరము వరకు అమి్రుని వెంట వెళ్ళి వారిని సాగనంపి తిరిగి వత్తురు. ఆదే విధముగా ఆకొండపైన వున్న వృక్షములు, పూలపొదలు హనుమంతుని వెంట కొంత దూరము (ప్రయాణించినవి. పెద్ద పెద్ద చెట్టు ముందుగనే సము(ద్ర తీరము నందు పడిపోయినవి. పూలు, తీగలు మొదలయినవి యింకా కొంత దూరము హనుమంతుని అనుసరించిన తర్వాత క్రిందికి దిగి సముద్రములో పడినవి, ఆ విధముగా నీటిపై పడిన పూవులు, ఆకాశము నందలి నక్షత్రముల వలె నీటిపై తేలియాడుచు మెరసెను.
వాల్మీకి చెట్ట యానమునిట్టు వర్లించెను. చెట్టు జీవపరిణామమున, ఖనిజముల తర్వాత రెండవ దశకు చెందినవి. అవి యింకను జంతుదశు నరదశలను దాటి యోగపరిపూర్ణతను పొందవలసి యున్నవి. కాని యింత సమయము అక్కరలేకయే ఆంజనేయుడు. వానిని తన వెంటగొని వెళ్ళెను. అనగా తాను సంచరించు దివ్యపధముల లోనికి చెట్టను తీసికొని వెళ్ళి వారిని పరిపూర్చులు గావించెను. కొన్ని పూల చెట్టు మరల వెనుకకు వచ్చి సముద్రమున పడినవని కవి వర్షించెను. అనగా ఆంజనేయుని వంటి పరమగురువర్యుని సాన్నిధ్యమున పూర్ణసిద్దినందిన కొందరు ముక్త జీవులు ముందుకు సాగిరి, మరి కొందరు వెనుకకు వచ్చి సంసార సాగరమున కొట్టులాడు జీవులకు తోడ్పడి వారికి తమ వద్దగల దివ్యానందమకరందమును, దివ్యప్రేమ సుగంధమును ప్రసాదించిరని భావము,
హనుమంతుని సము(ద్ర లంఘనము క్ష సముద్రము, అందలి జల జంతువులు కల్గ్లోలము నంది బెదిరినవి. ఆంజనేయుని గమన వేగము యొక్క ధ్వనియున్నూ, ఆయన సింహగర్జనారవమున్నూ సముద్రము యొక్క హోరును మించి పోయెను. ఆయన ముఖకాంతి ఉదయించే సూర్యునివలె ప్రకాశించెను. అతడు రామకార్యార్థియె ప్రయాణము చేయుచున్నవాడు. గాన సూర్యుడు తన వేడిమిని ఆంజనేయునిపై ప్రసరింప జేయలేదు వాయుదేవుడును దేవకార్యమునకు అనుకూలముగా వీవ సాగెను. ఆకాశము నందు మహర్షులు, దేవతలు, కిన్నరులు, మున్నగు వారు హనుమంతుని ప్రయాణమును ప్రశంసించి ఆనందముతో ఆశీర్వదించిరి. మైనాకుడు క్లో! ఇక్ష్యాకు కు మానాక్టీ చింతయామాస సాగర; సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనూమతః 1-88 క్ట కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యోం వివక్షతాం అహ మిక్ష్యాకునా ధీన సగరేణ వివర్దితః 1-89 శ్లో! ఇక్షాకు సచివ శ్చాతుం విశ్రమేత యధాకపిః తథామయా విధాతవ్యం విశ్రమేత నుధాకపిః 1-90 క్ట శేషం చ మయి విశ్రాంత స్పుఖే నాతి పతిష్యతి ఇతి కృత్వా మతిం సాద్వీం సముద్ర శ్చృన్న మంభసి [91 క్లో హిరణ్య నాభం మైనాక మువాచ గిరి సత్తమం త్వ మిహాసుర సంఘానాం పాతాళ తల వాసినామ్ 1-92 శః దేవరాజ్ఞా గిరి్ర్ట పరిఘ సన్ని వేశితః త్వమేషాం జాత వీర్యాణాం పునరేవో తృతిష్యతామ్ 11-93 ఖః పాతాళ స్వప్రమేయస్య ద్వార మా వృత్య తిస్టసి తిర్య గూర్త్వ్య మధశ్చైవ శక్తిస్తే శైల వర్షితమ్ క్షేం9క్వ అందరూ హనుమంతుని ప్రశంసించు చుండుగా సముద్రుడు ఇట్టు తలంచెను. ఇందరు దేవతలు ఆశీర్వదించుచున్న రామదూతను నేను. ఆశీర్వదించి సాయము చేయవలయు నని తలంచి తనలో దాగియున్న మైనాక పర్వతముతో సముద్రుడు ఇట్లనెను. శ్రీరాముడు దైవస్వరూపుడు. రామ కార్యారియై ఆంజనేయుడు సముద్రమును దాటి వెళ్ళి లంకలో సీతాదేవిని అన్వేషింపబోవు చున్నాడు. గాన మన మతనికి తోడ్పడవలయును. అందులకు నీవు సమర్జుడవు, నీవు ఇప్పుడు సముద్రముపైకి
18 సుందరకాండము రమ్ము నీ మీద కొంత సేపు విశ్రమించిన తరువాత ఆంజనేయుడు తన (ప్రయాణమును తిరిగి కొనసాగింపగలడు. ఇట్టి పనికి సాయముగా వచ్చినపుడు నీపై ఇంద్రుడు కోపింపడు. అందులకు మైనాకు డంగీకరించి ఆ సముద్రము మధ్యలో బంగారు కొండగా పైకి లేచెను. హిరణ్మయమైన ఆ కొండ బంగారు కాంతులు వెద జల్టుచున్న సూర్యుని వలె ప్రకాశించెను. ఈ విధముగా సముద్ర మధ్యమున 'సైకి వచ్చిన బంగారు కొండను మహావేగవంతుడగు హనమంతుడు చూసెను.
ఆ పర్వతమునుగాని, దాని బంగారమునుగాని లెక్కచేయక హనుమంతుడు తన రొమ్ముతో ఆ కొండను చెల్లా చెదరు చేసెను. వాయువేగమున కారుమబ్బు చెదరి పోయినట్టు ఆ కొండ చెల్లా చెదరు అయ్యెను. బంగారము వంటి విలువగల ధనరాసులు సామాన్యులను జయించును. వా రా ధనమునకు దాసు లగుదురు. ఇది [క్రింద నున్న సంసారుల స్థితి. ఆంజనేయుడు ఉన్నత స్టితి యందున్నవాడు, గాన ఆయాకర్షణ ఏమి పనిచేయలేదు. సాధారణముగా యోగసాధన చేయునట్టి వారు ఈ అవరోధమును దాట జాలక ఈ ఉన్నత మార్గము నుండి జారి పోవుటయు జరుగుచుండును. ఆ అద్భుతమైన వేగమును, సామర్ష్యమును (ప్రదర్శించిన ఆంజనేయుని జాచి మైనాకుడు మానవరూపము ధరించి ఆంజనేయునితో నిట్లనెను.
ఓ వాయుపుత్రా! నీవు నాకు స్నేహితుడవు. శ్రీరామచంద్రుని కొలుచు వారందరూ సముద్రునకు స్నేహితులు, సముద్రుడు నాకు స్నేహితుడు. దేవ కార్యమునకై వెడలు చున్న నీకు సహాయము చేయుటకై మేము ఉత్సాహపడుచున్నాము. వీవు చేయు కార్య మత్యద్భుతము. ఎవ్వరూ యిట్టిపనిచేయ జాలరు. నా శిరస్సుపై ఫఘుఖముగా విశ్రమించుము. ఓ వాయుపుత్రా! నా యొక్క ఆతిధ్యమును నీవు స్వీకరింపుము. ఇచ్చట పండ్డు కందమూలములు రుచిగల పదార్థములు ఎన్నియో గలవు. ఇవి యెంతో ఆ స్వాద్యముగా నున్నవి, కనుక నీవు యిచ్చట ఆగి విశ్రాంతి తీసుకొనుము.
క్లో యోజనానాం శతం చాపికపిరేష సమాఫ్థుతః
తవ సానుషు విశ్రాంత శ్ళేషం ్రక్తమతామితి 11116 శ్లో, “తదివ గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు త దాస్వాద్య హరిగ్రేష్ట విశ్రాంతో2ను గమిష్యసి 1117
మైనాకుడు తొలి ఆకర్షణ. అదే బంగారము. ఆ కనకాకర్షణను హనుమంతుడు
జొలుత అవలీలగా తిరస్కరించినాడు. ఆతరువాతి ఆకర్షణ ఆయనకు (ప్రత్యక్షమగు
హనుమంతుని సముద్ర లంఘనము క్షం చున్నది. యోగ సాధన చేయువారు కరోరమగు నియమములను ఆచరించి ఆహార పానీయములను మాని ఎండ వానలకు తడిసి యెండి యోగసాధన చేయుదురు, అట్టి వారికి ఈ మైనాకుని ఆకర్షణ చక్కగా పనిచేయును. వారికి ఒక తోట, ఆశ్రమము లభించినపుడు అరటి, మామిడి మొదలగు పండ్ల ఆకర్షణకు లోబడుదురు. శారీరక సుఖములకు లొంగి అచటనే వుండి పోవుదురు. యోగ మార్గము నుండి జారి పోయెదరు. ఈ ప్రమాదమును దాటుట కూడా ఆసాధారణము. ఈ ఆకర్షణ శరీరమును, (ప్రాణమును, మనస్సును కూడా ఆరికట్ట గలదు. ఇది హనుమంతుని లోని ధృతి. అనగా ధైర్యమును లక్ష్యశుద్దిని తెలియజేయును. ఓ ఆంజనేయ! అతిధివై వచ్చిన సత్పురుషులను పూజించుట నాబోటి వారికి ధర్మము. నీవు తేజశ్ళాలివి. నీ వంటి వానిని పూజించుట మాకు ఎంతో ఆనందదాయకము. కనుక మా ఆతిధ్యమును స్వీకరింపుము.
దేవేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను వజ్రాయుధముతో కత్తిరించు చున్నపుడు, వాయుదేవుడు నారెక్కలు కత్తిరించకుండా కాపాడి నాడు. అతడు నాకు అత్యంతాస్తుడు. వాయుప్తుతుడవగు నీవునూ నాకు ఆప్తుడవే. కనుక నా ఆతిధ్యమును స్వీకరింపుము.
క్లోః ఏవముక్తః కపిశ్రేస్టస్తం నగోత్తమ మబ్రవీత్
ప్రీతో2స్మి కృత మాతిథ్యం మన్వురేషో2 పనీయతామ్ 1131 కః త్వరతే కార్య కాలోమే అహశ్చా ప్యతి వర్తతే, ప్రతిజ్ఞా చమయా దత్తా నస్థాతవ్య మిహాంతరే 11-132
మైనాకుడు చెప్పిన మాటలు సామాన్యమగు లోకధర్మములే. అవి మహాభక్తులైన వారి యెడల వర్తింపవు. ఏకా[గ్రమగు చిత్తముతో మనస్సంతయూ భగవన్మయము చేసి అంతరంగమును భగవంతుని తేజస్సుతో నింపుకానువారికి లభించునది పరమానందము. దాని యందే వారి దృష్టి నిమగ్నమై యుండును. అల్పమగు శరీర సుఖములను వారు తిరస్కరింతురు, భగవంతుని చేరవలెనను ఉత్సాహము ఒక్కటియే వారిని ఆవరించి యుండును. ఆయుత్సాహముతో అంజనేయు డిట్లనెను.
- ఓ మైనాకా! నేను రామ దూతను. రాముని బాణమను. ఆయన నిర్షేశించిన ప్రకారము (ప్రయాణింప వలసిన వాడను, గాని ఆగుటకు నాకు స్వతంత్రము లేదు. కాలమూ లేదు. అవకాశమూ లేదు. సాయంకాలము లోపున ఆవలి యొడ్డునకు
20 సుందరకాండము నేను చేరవలసియున్నది. కనుక నన్ను మన్నింపుము. మో ఆదరమునకు నమస్కారములు. మో దర్శన భాగ్యము చేతనే నాకాతిథ్యము చేకూరినది. నేను ఎచ్చటనూ విశ్రాంతిగా ఆగుటకు వీలు లేదు. కనుక నాకు శెలవిమ్ము. పోయి వచ్చెదను” అని ప్రేమతోను, ఆదరముతోను మైనాకుని తాకి ఆంజనేయుడు ఆకాళమార్షమున లంకవైపునకు సాగిపోయెను. శ్ఞోః సపర్వత సముద్రాభ్యాం బహుమానా దవేక్షితః పూజిత శ్చోప పన్నాభి రాశీర్చి రనిలాత్మజః 11-134 ఆంజనేయుని యొక్క ఈ చర్యను జూచి సముద్రుడు, మైనాకుడు ఇద్దరూ కూడా పరమానందము పొందిరి. నీవు కార్యదన్షుడవు. రామకార్యసిద్ది నీవలన తప్పక జరుగు ననిరి. ఇట్టి అద్భుతమైన కార్యమును జూచి దేవతలు, దేవేంద్రుడు, సిద్దులు, మహర్షులు సంతోషించిరి. దేవేంద్రుడు వేయి కన్నులతో ఈ కార్యక్రమమును జూచి సంతసించి ఉత్సాహిమై ఆనందించెను. ,ఆ ఆనందముతో మైనాకుని శిక్షింపక మన్నించి వదలి వైచెను. సురస ప్రకృతికి సంబంధించిన అవరోధములను ఆకర్షణలను తాత్కాలికనుగు సుఖములను హనుమ తిరస్కరించిన తరువాత “సురస” యను దేవతాశక్తి యొక్క అవరోధము ఆంజనేయునకు ఎదురయ్యెను. ఇచ్చట ఒక ప్రశ్న ఉదయించును. హనుమ చేయు కార్యము దేవకార్యమే. ఆ కార్యమును జయ్రదము చేయవలెనని దేవతలు కోరుచున్నారు. అట్టి సందర్భము నందు “సురస” యను నాగదేవత ఆంజనేయుని కార్యక్రమమునకు అడ్డుపడుట యెట్టు? అని సందేహింతుము. దీనికి సమాధానము ముందు ముందు తెలుసుకొందుము. యోగసాధన చేయువారిని లౌకికములైన సుఖములు ఆకర్షించుటయేగాక, దేవతా సంబంధమగు నట్టి ఆకర్షణలు కూడా పనిచేయును. అట్టి వాని నుండి గడిచి గట్టెక్కి జయించుట యోగికి అవసరము. దైవికమగు కార్యములు చేయునపుడు దైవికములగు సుఖములు లభించినపుడు, వానిని అనుభవించుటలో తప్పేమియు లేదని అనిపించును. కాని ఇది సరికాదు. దేవతలు మనకిచ్చు వరములు (బ్రహ్మానందము కంటె చాలా స్వల్పమైనవి. ఈ చిన్న వరములను నమ్మి అక్కడనే యుండి పోయినచో బ్రహ్మానందము దూరమైపోవును. కనుక ఇచ్చట యెంతో జాగ్రత్తగా (ప్రవర్తించవలయును. ఆ దేవతా స్వరూపమే సురస, ఆమె ఆంజనేయుని
హనుమంతుని సము([ద్ర లంఘనము రై తన యధీనములో నుంచుకొనుటకై ప్రయత్నించి మ్రింగ జూచెను. అప్పుడు ఆంజనేయుడు తన శరీరమును పెంచెను. సురస యొక్క నోరు కూడా యింకా పెద్ద దయ్యొనని వాల్మీకి చమత్కరించెను. అనగా మనము మన (ప్రయత్నము ద్వారా సురసను జయించుటకు ప్రయత్నించినపుడు, ఆమె మనకంటె పెద్దదిగా నుండును. ప్రయత్నము మానివైచి మనము అభగవానుని చేతి పనిముట్ల మని తెలుసుకొని భగవానునికి నమస్కరించి నపుడు, మనము చాలా చిన్నవారముగానై పోవుదుము. భగవానుని అనుగ్రహము వలన మనము సురసను దాటిపోగలము. ఇది మన మదికి సంబంధించిన అనుభవము. మన మనస్సుకు సంబంధించిన దురహంకార దోషము. ఈ భావము తొలగిపోయి మనము భగవానుని దాసులమని మనస్సునకు అందినపుడే, మనము జయమార్గమున ముందుకు పోగలము, ఈ కధను వివరముగా పరిశీలింతము.
క్లో, తతోదేవా స్పగంధర్వాస్సి ద్దాళ్చీ పరమర్షయః
అబ్రువన్ సూర్య సంకాశాః సురసాం నాగమాతరమ్. 1145 క్లో అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమన్నాను తస్యత్వం ముహూర్తం విఘ్న మాచర 1146 క్ట బల మిచ్చా మహే జ్ఞాతుం భూయ శ్చాస్య పరాశ్రమమ్ ద్వాం విజేష్య త్యు పాయేన విషాదం వా గమిష్యతి క148 సురసయను నాగమాత సూర్యునివలె దేదీష్యమానముగా వెలుగు చుండెను. అమెతో దేవతలు ఓ నాగమాతా! హనుమ రామదూతయై ఈ సము(ద్రమును దాటి లంకకు చేరుగోరుచున్నాడు. ఆ (ప్రయాణమును నీవొక మహూర్తకాలము ఆపివేయుము. నీవు పెద్దనోరు, కళ్ళతో వికార రూపము దాల్బుము.
ఓ నాగమాతా! ఆంజనేయుడు ఆసమానమగు పరాక్రమము గలవాడు. ఆ లంకలో నున్న రాక్షసులు కూడా చాలా పరాక్రమము గలవారు. అట్టి రావణుని బలము నెదురించగలడో లేడో చూతము. అందులకై నీవు అతని ప్రయాణమునకు క్షణకాలము అవరోధము. కలిగించుము. ఇతడు నీవు తెచ్చిన అవరోధమును జయించునో లేక భయము చెందునో పరీక్షించి చూతముగాక!
ఇట్లు దేవతలు ్రతిపాదింపగా సురసాదేవి అంగీకరించి భయంకరమగు అసాధారణ రాక్షసరూపము దాల్చి యెగురుచున్న హనుమ మార్గమునకు అడ్డుగా నిలిచి యిట్లనెను.
22 సుందరకాండము “ ఓ హనుమా! దేవతలు నిన్ను నాకు ఆహారముగా అను[గ్రహించిరి. కనుక ఈ వెడల్పైన నోటిలోనికి నీవు ్రవేశింపుము. నిన్ను నేను తినివేసెదను. అనగా నీవు దేవ కార్యమును ఆచరించుచున్నవాడవు. నీవు రాముని బంటువని యొరిగియున్నావా? లేక నేనే ఈ కార్యమును చేయుచున్నానని అహంకరించు చున్నావా? ఆ “నేనే” అన్న అహంకారమును తినుమని దేవతలు నన్ను ఆజ్ఞాపించిరి. కనుక నీవు నీ అహంకారమును నా నోటిలోనికి (ప్రవేశపెట్టుము. తినెదను” అనెను. అంత హనుమ, సురసాదేవి పలికిన పలుకులకు సంతోషించిన వాడై ఆమెకు నమస్కారము చేసి యిట్లనెను. దశరథ పుత్రుడగు రాముడు రాక్షస సంహారమునకై శిష్టరక్షణమునకై దండకారణ్యమున ప్రవేశించినాడు. ఆయన వెంట తమ్ముడైన లక్ష్మణుడును భార్యయగు. సీతాదేవియు. వచ్చిరి. ఆ యరణ్యమున రాముడు అనేకులగు రాక్షసులను సంహరించెను. అందువలన రామునిపై వారు వైరమును పూని రాముని భార్యయగు సీతను అపహరించి తీసుకొని వెళ్ళినారు. నేను రామ దూతనై రామాజ్ఞ ననుసరించి సీత కడకేగు చుంటిని. నీవు రామపరిపాలనలో వున్నదానివే. కనుక రామౌజ్ఞను శిరసావహించి సాయము చేయుము. క్లో అధవా మైైధిలీం దృష్ట్యా రామం చాక్షిష్టకారిణమ్ ఆగమిష్యామి తే వక్రం సత్యం ్రతిశ్చణోమితే॥ కే-156 శ్లో ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ అబ్రవీన్నాతి వర్తే న్మాం కళ్చిదేష వరోమమ ॥ 1157 భ్లోః తదృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్దిమాన్ సు సంక్షి ప్యాళ్హునః కాయః బభూ వాంగుష్ట మాత్రకః 11-158 రామకార్యార్దిని కనుక సీతను ముందుగా చూసెదను. రామునకు ఆ వార్త తెలియజేసిన పిమ్మట నీనోటి వద్దకు వచ్చెదను. ఇది సత్యము. నామాట నమ్ముము. అనగా ఈ కార్యము పూర్తియైనపుడు కూడా నేను రామదూతగనే యుందును. కనుక నీ, వద్దకు తిరిగి వచ్చెదను. ఈ మాట సత్యము. నమ్ముము. రాముని దూతడైైన వానిని ఎవ్వరూ ఏమి చేయజాలరు. కనుక నీవు నన్ను ఏమి చేయజాలవని భావము, అంత హనుమ మాటను పరికించినదై సురస యిట్లనెను. ఓయీ! వానరుడా! నన్ను ఎవ్వరూ అతిక్రమించి పోజులరు. నాకట్టి వరమున్నది. అనగా సురస మానవుని
హనుమంతుని సముద్ర లంఘనము 23 అ|క్రమించి బంధించెడి “ఆశకు గుర్తుగా చెప్పవచ్చును. ఆశ చాలా పొడవైనది. దానికి అంతముండదు. అట్టి భావమే సురస.
సురస నోరు యోజనము వెడల్పు చేసి హనుమను (మ్రింగజూచెను. అంత హనుమ తన శరీరమును పెంచి రెండు యోజనములు చేసెను. అయినను సురసయను ఆళ మూడు యోజనము లయ్యెను. ఆంజనేయుడు ప్రయత్నించి అయిదు యోజనములు పెంచెను. అయినను మానవునికి తృప్తి యుండదు. కనుక ఆశ ఆరుయోజనములు విస్తీర్ణ మగును. అటులనే పదియోజనములు పెరిగినను అంతము తెలియదు. అప్పుడు హనుమ తన పొరపాటును తెలిసి కొని తన అహంకారమును, (ప్రయత్నమును విరమించు కొనెను. నేను కేవలము రాముని యొక్క బాణమను అని ఆంజనేయుడు సరియైన జ్ఞానమార్గము లోనికి వచ్చెను. తనకు స్వప్రయోజన మంటూ యేమి లేదు. రామసంకల్పమే తన సంకల్పము. ఆయన లక్ష్యమే తన లక్ష్యము. ఆయన్ అనుగ్రహించిన సామర్ష్యమే తన సామర్హ్యమని హనుమంతుడు తెలుసుకొనెను. అంత హనుమ సూక్ష్మరూపమును ధరించి అంగుస్టమాత్రు డయ్యెను.
ఈ విధముగా సురస మాట్టాడిన అనంతరం ఆంజనేయుడు తన ప్రయత్నమును విరమించుకున్నాడు. “సుబుద్దిమాన్” చాలా గొప్పజ్ఞాని అయ్యెను. అంతా రామ మయము. తనదేమి కాదని గుర్తించెను.
“"సుసంక్షిష్య ఆత్మనః” - ఆత్మ ఎంత సూక్ష్మమైనదో అట్టి సూక్ష్మమగు రూపమును ఆంజనేయుడు ధరించినాడు.
“అంగుస్టమాత్రకళ - అంగుష్టమా[త్రముగా అయ్యెను. అనగా అత్మ స్వరూపము అయ్యెను. అంగుష్టము అనగా చేతిబొటన (వేలు అని అర్ధము కలదు. కాని యిచట అది పొసగదు.
ఉపనిషత్తులోని మంత్రం -
అంగుష్ట్ర మాత్రః పురుషో2౦ం తరాత్మా
సదా జనానాం హృది సన్నివిస్టః
అణువు కన్నా సూక్ష్మమైన రూపము అంగుష్టము, అంతరాత్మయైన పరమపురుషుడు అంగుష్ట మంత రూపముగనే యుండును. జనులందరి యొక్క హృదయకమలము యందు లేక హృదయాకాశము లందు ఎల్లప్పుడూ సత్-నివిష్టు నివసించుచుండును.
పరమపురుషుడు అంగుస్టమాత్రరూపము కలవాడై జీవుల హృదయాంతరాళములలో
24 సుందరకాండము సదా నివసించు చుండును అని అంతరార్థము. ఆంజనేయుడు ఆతి సూక్ష్మమగు అంగుష్టమాత్ర రూపమును ధరించెను. అంత సూక్ష్మమైన రూపమును సురస పట్టుకొన జాలదు. కనుక సురస నోటిలోనికి దూరి ఆవలకి వెళ్లెనని భావము. అనగా హనుమ అంగుష్ట మాత్ర రూపమున తన నోట ్రవేశించుటగాని దూరి ఆవలకు వెళ్లుటగాని సురస (గ్రహింపలేదని అర్హము. అప్పుడు ఆకాశమార్గమునకు ఎగిరి సురసాదేవితో నిట్లనెను.
“ఓ దాక్షాయణి! నేను నీ నోట ప్రవేశించి వెలుపలకు వచ్చి వైచితిని. నీకు నమస్కారములు. నేను సీతాన్వేషణకై వెళ్లెదను. నీ కున్న వరమును నేను పాటించితిని*. అప్పుడు సురస తన రాక్షస రూపమును చాలించెను. సురస ముఖము నుండి బయటకు వచ్చిన హనుమ నుండి రాహువు బయటకు వచ్చిన చం(్రుని వలె ప్రకాశించు చుండెను.
దాక్షాయణి అనగా దక్షుని కుమార్తెయగు సతీదేవి. (ప్రస్తుతము నాగమాత యగు సురసయు జగన్మాతయగు సతీదేవియే. అనగా సాధకులను ఆకర్షించుటకు ఉపయోగపడు మాయాశక్తి కూడా. జగన్మాత యొక్క యంశ యని కవి యుపదేశము. అంతేగాక దాక్షాయణి అనగా నేను దక్షుడను అనుభావమునుండి పుట్టిన వికారమని అర్ధము. హనుమంతుడు -ఈ వికారమును జగన్మాత ధ్యానమున దాటిన వాడయ్యెను. మాయకు లోపల వెలుపల (ప్రవేశించెను. అనగా మాయావరణ బద్దులగు జీవులతో కూడిన జగత్తునందును దీనికి వెలుపల గల ఈళ్వరుని యందును “తాను” అను ఆత్మ (ప్రకాశముగా నుండెనని భావము.
అట్టి ఆంజనేయునితో సురస యిట్లనెను. ఓ హనుమ! నీ యొక్క సొమర్ష్యమును పరీక్షించుటకై ఈ యొక్క యేర్పాటును చేసితిని. ఆ పరీక్షయందు నీవు జయ(్రదముగా వెగ్గితివి. కనుక నీవు అర్హవంతుడవు. అనగా నీవు కోరిన కార్యమును చక్కగా నిర్వర్తింప గలవాడవైతివి. ఓ సౌమ్యుడా! నీవు ఇక లంకకు సుఖముగా (ప్రయాణము చేయుము. సీతను దర్శించి సీతారాముల కలయికను సమ కూర్చుము, ఈ అద్భుత కార్యమును జూచిన సర్వభూతములు బాగుబాగని హనుమను (ప్రశంసించినవి,
సురసను వదలి ఆంజనేయుడు ఆకాశమార్గమున బయలుదేరెను. ఆకాశ, సూర్య, చంద్ర మార్గములన్ని కాంతితో నిండి యుండెను. ఆకాశమున పప్రయాణించు కిన్నరులు కింపురుషులు ఆయన యొక్క అద్భుతకార్యమును పాగడుచుండిరి.
హనుమంతుని సముద్ర లంఘనము 25 శ్ళోః ప్రదృశ్యమాన స్సర్వత్ర హనుమా న్మారు తాత్మజః భేజే2ంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రి రాట్ క-172 అప్పుడు ఆకాశమునందు హనుమకు నిలుచుటకు ఆధారముగా ఏమియూ లేదు. గరుత్మంతుని వలె ఆయనకు రెక్కలు లేవు. పర్వతాకారముతో సమానమైన శరీరము కలిగిన హనుమ ఆకాశమున ప్రయాణము చేయునప్పుడు రెక్క లున్న మైనాకుడు ప్రయాణించినట్టుగా యుండెను. కాని హనుమకు రెక్కలు లేవు. హనుమకు ఆధారభూతమగు నట్టి శక్తి ఆ శ్రీరామ చంద్రుడే అని భావము. సింహిక ఆయన వేగము గరుడవేగ సమానమై ఎవ్వరికి ఆప శక్యము కాని రీతిగా హనుమ ప్రయాణము చేయు చుండెను. అట్టి ప్రయాణమునకు అడ్డుగా “సింహిక” వచ్చి నిలచెను. సింహిక అనగా ఛాయాగ్రాహిణి జ్ఞగు రాక్షసి. తనకు అందిన వారందరిని పట్టీ భక్షించుటయే దాని ప్రవృత్తి. అది నీడవలె నుండెను. కనుక మన సామాన్య దృష్టికి కనపడదు. అనగా యితరులను చంపి తన [ప్రాణములను నిలుపుకొను నట్టి కోరికయే సింహిక. అట్టి సింహిక ఆకాశమున 'ప్రయాణించుచున్న హనుమంతుని చూసి యిట్లను కొనెను. క్ట అద్య దీర్చస్య కాలస్య భవిష్యా మ్యహ మాశితా, ఇదం హి మే మహత్సత్మ్యం చిరస్య వశ మాగతమ్ [174 చిరకాలమునకు నేనిప్పుడు ఆహారమును తినబోవుచున్నాను. నా యెదుట నున్న చాలా మహిమ కలిగిన ఈ సత్వము చిరస్య - వశం -ఆగతమ్. నన్ను వశము చేసుకొనుటకై వచ్చు చున్నదని తెలియకనే ముందు రాబోవు భవిష్యత్తును సూచించు చున్నది. ఈ మహాబలశాలియగు వాడు నావశమగుటకు నావద్దకు వచ్చు చున్నాడు అని అర్ధము కూడా చెప్పవచ్చును. ఈ మహాబలశాలి నా వద్దకు వచ్చుట వలన నేను అతనికి వశమగుదునని కూడా అర్ధము చెప్పవచ్చును. అప్పుడు ఆ సింహిక తన మాయాబలము చేత ఆంజనేయుని నీడను పట్టి తనవైపునకు ఆకర్షించెను. ఈ సింహిక యొక్క ఆకర్షణను చూచి హనుమంతుడు ఇట్టు తలంచెను. “ఇది నా ప్రయాణమునకు అడ్డు తగులు చున్నది. నా వేగము ఆగిపోవుచున్నది. సముద్రములో ఎదురుగాలికి పడవ ఆగిపోయినట్టుగా యిప్పుడు నాస్టితి యున్నది” అని అన్నివైపులకు పరికించి చూచి సముద్రము నుండి పైకి లేచి వచ్చిన పెద్ద జంతువును హనుమ చూసెను.
26 సుందరకాండము
వ్దోః కపిరా జేన కధితం సత్త్యమద్భుత దర్శనమ్
ఛాయా గ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ; 1-179
ఆంజనేయునకు సుగ్రీవుడు ఇది వరకు ఆ సముద్రములో ఒక గొప్ప జంతువున్నది. అది నీడను పట్టి తన వైపునకు ఆకర్షించునని చెప్పిన విషయము గుర్తునకు వచ్చెను. (ప్రస్తుతము తనను ఆకర్షించున దదియే నని నిశ్చయించు కొనెను. అప్పుడు హనుమ తన దేహమును పెద్దగా పెంచెను. పాతాళగుహ వలె పెద్దనోరు తెరచుకొని ఆ సింహిక వచ్చి హనుమను పట్టుకొన ప్రయత్నించెను. హనుమ ఆ సింహిక యొక్క శరీరపరిమాణమును జాగ్రత్తగా పరీక్షించి చూచెను. ఆ రాక్షసి యొక్క ఆయువు పట్టును కూడా గమనించి తెలుసుకొనెను. తరువాత హనుమ సింహిక యొక్క శరీరము లోనికి ప్రవేశించుటకు నిర్ణయించెను. అందులకు ఆమె నోటి ద్వారా ఆమె లోనికి ప్రవేశింప వీలుగా చిన్న రూపమును హనుమ ధరించెను. అమె నోటి గుండా శరీరములోనికి (ప్రవేశించెను.
ఆంజనేయుడు తన గోళ్ళతో సింహిక శరీరములోని ఆయువు పట్టు హృదయము మొదలగు స్థానములను చీల్చివైచెను. ఆ తర్వాత సింహిక నుండి బయటకు వచ్చి వైచెను. సింహిక యొక్క ్రాణపు పట్టును చీల్చుట వలన ఆ సింహిక స్పృహ లేనిదై నీట మునిగెను.
కో తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికామ్
భూతా న్యాకాళ చారీణి తమూచః ప్లవగోత్తమమ్ 12188
ఈ విధముగా లోకమునకు ఆపద కలిగించు సింహికను నీటిలో పడవైచిన హనుమంతుని యొక్క ్రతాపమును ఆకాశము నందున్న దేవతా పురుషు లందరూ మెచ్చుకొనిరి. ఇచ్చట గమనించ వలసిన ముఖ్య విషయము.
ఇంతకు పూర్వము హనుమ ప్రయాణమునకు అవరోధముగా సురసయను దేవతా శక్తి నిలచెను. అమె ఆతని యొక్క ప్రయాణమును ఆపుటకు గట్టిగానే ప్రయత్నించెను. ఆ ప్రయత్నము యొక్క పరమ లక్ష్యము ఆంజనేయుని ఉద్ధరించుటయే. హనుమకు జయమును చేకూర్చుటయే. దేవతలను జయించిన రాక్షసుల ఘోరపరాక్రమముతో ఈ హనుమ సరితూగ గలడా? అని పరీక్షించి తెలుసుకొనుటకు మాత్రమే ఈ అవరోధమేర్చాటు చేయబడినది. ఆ పరీక్షలో ఉత్తీర్లుడైనందువలన సురస యితర దేవతలు ఆయనను ఆశీర్వదించిరి. హనుమకూడా భక్తితో వారికి నమస్కరించి తన ప్రయాణమును ముందునకు సాగించెను.
హనుమంతుని సముద్ర లంఘనము 27
ఇక యిచ్చట సింహిక యొక్క జీవిత విధానము, సురస యొక్క కార్యక్రమమునకు సాక్షాత్తు విరుద్ధమైనది. ఇతరులను భక్షించుటయే సింహిక యొక్క ఏకైక లక్ష్యము. మార్గము కూడా అదియే. కనుక సింహికకు నమస్కరించి పోవుట అతనికి వీలుకాదు. అలా దయ తలచి వెళ్ళుట వలన ఇంకెందరకో అపాయకర మగును. ఆమెను సంహరించుట ఒక్కటియే మంచి మార్గము.
యోగసాధనలో యెంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికి మనలను చెడు వెంటాడుచునే యుండును. మనలను నీడవలె వెంటాడును. ఆకర్షించును. చెడుపనులు చేయవలె నను కోరిక బలముగా మనలను ఆకర్షించి బంధించును. ఈ బంధము నుండి తప్పించు కొనుటకు కావలసిన సామర్హ్యము మనకుండదు. దైవ కృప వలననే మనకు సామర్హ్యము దీక్ష సంభవించును. ఆంజనేయుని, శ్రీరాముని కృపా విశేషము అంగుళీయక రూపమున కాపాడుచున్నది. కనుక ఈ సింహిక యొక్క ఆకర్షణ ఆయన పైన పనిచేయలేదు. చెడు ఆయనను ఏమియు చేయలేక చెడిపోయినది. శ్రీరామ రక్షగల ఆ ఆంజనేయుని (మింగిన ఆసింహిక అంతరించి పోయినది, అనగా మంచికి వచ్చి తాకిన చెడు, మంచిలో కలసి పోవునే గాని తానుగా, చెడుగా ఉండదని భావము.
దేవతా పురుషులకు నమస్కరించి పూజించుటయు లోక కంటకులైన రాక్షసులను సంహరించుటయునూ ధర్మమే అని ఈకథ మనకు బోధించు చున్నది.
ఇతరులను హింసించి పీడించు భావమే అజ్ఞానము. అట్టి భావము కలవా డెప్పుడూ ఆధ్యాత్మిక విద్య యందు ముందునకు సాగలేడు. యోగాభ్యాసమున కెంత మాత్రము పనికి రాడు. ఇట్టి క్రూర స్వభావమును పూర్ణముగా తొలగించిన వాడే ఆత్మజ్యోతి యొక్క అన్వేషణమునకు పనికి వచ్చునని భావము.
ఫ్లో! పునః ప్రకృతి మాపీదీ వీత మోహ ఇవాత్మవాన్
తద్రూప నుతి సంక్షిష్య హనుమాన్పకృతౌ స్థితః 1197
ఆంజనేయుడు తన శరీరమును తగ్గించి తన సహజ మైన రూపమును ధరించెను. శ్ఞోః పునః ప్రకృతి మాపీదే వీత మోహ ఇవాత్మవాన్ - మానవుడు ఈ శరీరమే తాను అని మోహ భ్రాంతి నొంది సంచరించును. పరమ గురువుల సన్నిధిలో చేరి పరిపూర్ణజ్ఞాన వంతుడగును, తాను - అనగా ఈ శరీరము కాదని ఆత్మ యేనని తెలుసుకొనును. అప్పుడు తన నిజ స్వరూపము తనకు అర్జము అగును. అదే విధముగా ఆంజనేయుడు సింహికను చంపుచున్నప్పుడు. నేను
28 సుందరకాండము మహాబలాఢ్యుడను, నేను చంపుచున్నాను అన్న భావముతో కొండ వంటి శరీరమును పొందెను. ఆ తరువాత బుద్ధిమంతుడై ఆలోచించినపుడు తాను రాముని బంటునని, తన సామర్థ్యమంతయూ రాముని అనుగ్రహము వలనే సిద్ధించినదని తెలిసికానెను.
శ్లో॥ త్రీన్మ మానివ విక్రమ్య బలివీర్య హరో హరిః -
మూడు అడుగుల దానమడిగిన వామనుడు బలిచక్రవర్తి ఎదుట ఆకాశమంతయూ నిండిపోయే దేహమును దాల్చి, బలి నుండి మూడడుగుల దానమును గ్రహించిన తర్వాత తన పూర్వపు వామన రూపమునే ధరించెను. అదేవిధముగా హనుమంతుడు సింహికను చంపుటకై కొండంత శరీరమును పెంచిను. ఆ పని పూర్తయిన తర్వాత తన పూర్వరూపమును పొందెను. ఈ విధముగా తన శరీరమును చిన్నదిగా చేసుకొని లంకలోని కొండపై దిగి అమరావతి వలె నున్న లంకా నగరమును చూసెను.
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్సుమిత్రాసుతః
శత్రుఘ్మో భరతశ్చ పార్వదలయోర్వాయ్వాదికోణేషు చ,
సుగ్రీవశ్చ విభిషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలమ్.
సాకేతే శరదిందుకుందధవళే సౌధే మహమండపే
పర్యస్తాగరుధూపదీపలలితే కర్పూరదీపోజ్జ్వులే
సుగ్రీవాంగదజాంబవత్పరివృతం సౌమిత్రిణా సేవితం
లీలామానుషవిగ్రహం రఘువరం రామం భజే శ్యామలమ్.
నమో౭_స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయె
నమో౭_స్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో౭_స్తు చంద్రార్మమరుద్గణేభ్యః.
(త్రికూటము శ్రా స సాగర మనాదృష్ట్య మతి[క్రమ్య మహాబలః త్రికూట శిఖరీ లంకాం స్టితాం స్వస్లో దదర్శ హం. 2-1
ఈ విధముగా ఆంజనేయుడు నూరు యోజనములు గల సముద్రమును దాటి లంకలోని త్రికూట శిఖరము మీదకు దిగెను,. నూరు యోజనములు అనగా నూరు. ఆమడల దూరమని బాహ్య అర్ధము. యోజనము అనగా యోచన లేక ఆలోచన అని అర్ధము. (ప్రస్తుతము భారత (ప్రభుత్వము వారికి “యోజనా భవన్” అను పేరుగల భవనమున్నది. 11200108 0౫91510 భవనమునే యోజనా భవన్ అందురు. నూరు యోజనములు దాటుట అనగా శరీరమును గురించి, ప్రాణమును గురించి మనస్సు, జ్ఞానమును. గురించిన ఆలోచనలను దాటుటయని అర్దము. ఆంజనేయుడు ఈ మూడు విధములగు ఆలోచనలను దాటెను. సముద్రము అనగా ము(ద్రలు కలది. గుర్తులు మూడు రకములు.
-
అన్నమయకోశమునకు సంబంధించిన గుర్తులు వ్యామోహములు దాటుట. మైనాకుడు దీనికి గుర్తు. ఫలములను, కందమూలములను స్వీకరించి సుఖముగా నుండుట అన్న వ్యామోహమును దాటుట.
-
సురస దేవతాళక్తుల యొక్క ఆకర్షణమును, వ్యామోహమును దాటి వచ్చుట.
త. సింహిక అను రక్కసి యొక్క ఆకర్షణను జయించి వచ్చుట ఇతరులను చంపి తినుటయే తనకు సుఖము అన్న పరహింస భావమే రాక్షసి యగు సింహిక. అది యొక యోజన.
హనుమంతుడు త్రికూట శిఖరమును చేరెను మనలో మూడు కూటములు న్నవని యోగశాస్త్రము చెప్పుచున్నది. అది 1. వాగ్భవ కూటము 2. జ్ఞానకూటము 3. శక్తి కూటము, (లలితా సహస్రనామము) మొదటిది ముఖసంబంధి, రెండవది కంఠము నుండి నడుము వరకు సంబంధించినది. మూడవది నడుమునుండి క్రింది వరకు సంబంధించినది. (త్రికూటమృ పైన లంక వున్నది. అనగా ప్రజ్ఞాన మయమగు (త్రికూట వ్యూహముతో కూడిన వెన్నెముక అను కొండ ఆధారముగా లంకయను శరీర మున్నదని అర్హము.
30 సుందరకాండము
సత్వరజస్తమస్సులతో కూడినదియే త్రిగుణాత్మకమగు సృష్టి. ఈ (త్రిగుణములను ఆధారము చేసుకొనియే శరీర మను లంక యున్నది. దానికి త్రికూట మనిపేరు. ఈ లంకను అనగా ఈ శరీరమును త్రిగుణాత్మకమని ఆంజనేయుడు చూడ గల్గుట అన్న యోగార్రము వర్షింపబడినది.
శ్లో! తతః పాదప ముక్తేన పుష్ప వర్ణేణ వీర్యవాన్
అభివృష్టు సిత స్తత్ర బభౌ పుష్పమయో యధా 2.2.
లంకలోని ఆకొండపై నున్న పూలచెట్లు ఆయనపై పూలవర్షములు కురిపించెను.
ఆ పూలతో శరీర మంతయూ కప్పబడిన వాడై ఆంజనేయుడు పుష్పములచే
కప్పబడిన మహాయోగి వలె ప్రకాశించెను. ఆయన యొక్క యోగ సమాధిస్టితికి మెచ్చి ప్రకృతి ఆయనను పూవులతో సత్కరించెను.
ఇటువంటి యోగాను భూతి పురాణము లందు పలుచోట్ల వర్షింపబడినది. ఇట్టు అపూర్వ్చమగు మహాకార్యము జరిగినపుడు దేవతలు హర్షించి పుష్పవర్షము కురిపించిరి అని చెప్పుట కలదు. యోగాభ్యాసము నందు ఇట్టి అనుభూతి కలుగుట మాకు తెలియును. మా గురుపొదులు బ్రహ్మశ్రీ, వేటూరి ప్రభాకర శాస్త్రుల వారి ప్రార్ధనా సమావేశము లందిట్టి పుష్ప వృష్టి యొక్క అనుభవము మాకు కలిగెడిది. శ్రీశాస్రిగారు ప్రార్ధనలో ప్రశాంతముగా సమాధిస్టితిలో నున్నప్పుడు ఆ ప్రార్ధనా సమావేశ మంతయూ మంచి పరిమళములతో నిండి యుండెడిది. (ప్రార్ధా సమయము వరకు నిట్టి అనుభవము లభించెడిది. ఇతర సమయము లందు అట్టి అనుభూతి లభించుట లేదు. ఇట్టి అనుభవము ఈ సము(ద్రమును దాటబోవు ముందు కూడ హనుమకు కలిగినది, ఆంజనేయుడు సీతమ్మ వారిని దర్శించుటకు ఆమె సమీపమునకు వెళ్ళినపుడు కూడా యిట్టి అనుభవము కలిగినదని రాబోవు సర్గలందు 'ప్రస్తావింపబడినది.
శ్లో! యోజానానాం శతం శ్రీమాం స్త్రీర్యా2 ప్యుత్తమ వి[క్రమః
అనిళ్చుసన్ కపిస్తత్రన గ్లాని మది గచ్చతి 2-3 సహజ (ప్రాణాయామము ఇందు సూచింపబడినది.
(ప్రాణామాయ మనగా ఉచ్చ్యాస, నిశ్వాసములను [క్రమ బద్దము చేయుట అని భావించు చున్నాము. మన ప్రయత్నముతో శ్వాసను బిగబట్టుట, పూరక, కుంభక, రేచకములుగా ప్రాణాయామ క్రియను వర్షించుట కలదు. అలాకాక, మన ప్రయత్నము లేకయే సహజ [ప్రాణాయామ మనబడు యోగక్రియ జరుగును. అందు
త్రికూటము 31 మన ప్రయత్న మనెడి దేమి వుండదు. కుడిముక్కుతో గాలి పీల్చుట, లోపల కుంభింప జేయుట, మరల ఎడమ ముక్కుద్వారా గాలిని బయటకు వదలుట అన్న ప్రాణాయామము అన్నమయ కోశమునకు సంబంధించినది. ఫిజికల్ లెవెల్లో జరుగునట్టిది. ఇది గురు సన్నిధిలోనే చేయవలయును. బంధత్రయ (ప్రాణాయామము వంటి యోగ సాధనలు సరియగు గురువుల శిక్షణలో మాత్రమే సాధన చేయవలయును. సహజ (ప్రాణాయామము వేరు.
“నీ వేమి ప్రయత్నము చేయనక్కరలేదు. విశ్రాంతిగా, సుఖముగా కూర్చుండుము. లేక పరుండుము. నీకు ఇష్టముయినది, సుఖమయినది అయిన విధముగా వుండుము. శరీరములో యేలాటి పట్టులేకుండా అంతటిని ఫ్రీగా వదలి వేయవలెన”ని మాస్టర్ సి.వి.వి.గారు చెప్పిరి.
అప్పుడు శరీర మంతయూ శాంతి నందుకొనును. దీనిని “ఫిజికల్ సైలెన్సు” అనిరి. శరీర అవయవము లన్నింటిని ఫ్రీగా వదతి వేయవలయును.
ఆ తరువాత "వైటల్ సైలెన్సు” ప్రాణామయకోశ మంతటనీ విశ్రాంతి లోనికి తీసుకొని వెళ్ళుము. గాలి పీల్చుట, వదలుట అంతా ఆ మాస్టరు గారికే వదలుము. నీవేమియు. చేయవలదు. ఏమి జరుగునో ఊరక చూచుచుండుటయే మనము చేయవలసినది. అప్పుడు మనకు శరీర స్పృహ యుండదు. ప్రాణమును గురించిన స్పృహ యున్నూ వుండదు. అంతా చల్లగా, తియ్యగా, లయబద్ధముగా నడచి పోవును. ఇక తరువాత “మెంటల్ సైలెన్స్” మనస్సును శాంతి స్థితిలో నుంచుట. మనస్సు ప్రవాహరూపము గలది. కాబట్టి మనస్సును శాంతముగా నుంచుట చాలా కష్టము. మనస్సు “దుర్ని[గ్రహం మహాబాహో” అని భగవర్గితలో కూడా వర్షింపబడినది.
మనస్సును కట్టివేయరాదని మాస్టర్ సి.వి.వి.గారు చెప్పిరి. మనస్సును కట్టివేయుటకు ప్రయత్నించినపుడు మనస్సు నిర్భంధంలో వుంటుందే గాని శాంతించదు. ఆ నిర్బంధంలో మనస్సు అల్లకల్గోలమై గంతులు వేయును. మనస్సును కట్టి వేయుటకై అరణ్యమునకు వెళ్ళిన వారు కొండలపై నుండి ఆహారాదులను వర్టించి తపస్సు చేసిన వారుకూడా విఫలులైరి. సామాన్య లోకములోనికి వారు దిగిరాగానే, వారి మనస్సు మరల కల్టోల మగుతుంది. కనుక ఆ పద్ధతి సరియైన పద్దతి కాదు.
మనస్సును మంచి మార్గమునకు మరలించి, మంచి ఆలోచనలు చేయుట అలవాటు చేయవలెను. ఎలాటి ఆలోచనలు లేకుండా పరమ శాంతముగా మనస్సు నుంచుటకు అభ్యాసము చేయువలయును. మనస్సును భగవంతుని యందు
ప్రై సుందరకాండము సమర్పణ చేసినపుడు మనస్సునకు భాగవతీయమగు గతియేర్సడును. శరీరము, ప్రాణము లోపల ఏకమైన తర్వాత ఆ రెండింటిని కలిపి మనస్సులో యేకము చేయుట ఈయోగాభ్యాసములో సాధ్యమగును. ఆవిధముగా శరీరము, (ప్రాణము, మనస్సు ఏకమైనపుడు ఒక్క మనస్సు మాత్రమే యుండును. శరీరము వేరుగా నుండదు. ప్రాణము వేరుగా నుండదు. అంతయూ మనోమయమైపోవును, దీనినే భాగవతము నందు “మనోమయీం భాగవతీం గతిః” అని వర్షించిరి.
అనగా మనః (ప్రాణాన్నమయములు మూడూ ఒక్కటిగా దివ్య పరిణామము పొందినపుడు, అంతయూ మనో మయమే యగును. అపుడు మనస్సునకు ఈ లోకమునకు సంబంధించిన గతి యుండదు. భాగవతీయమగు గతి యేర్చడును. అనగా శరీరము శాంతిని పొంది 'ప్రాణములో కలియును. ఆ ప్రాణము మనస్సులో కలియును. అప్పుడు ప్రాణమంటూ ప్రత్యేకముగా వుండదు. అంతా మనస్సులో కలసి పోవును, అప్పుడు ఆ మనస్సు, మనలో వుండదు. ఉన్నతమగు భూమిక లోని మనస్సుతో కలసి పోవును. “సూపర్ మైండ్” గా పనిచేయును. అట్టి స్టితినుండి మన ఆలోచనలు క్రిందికి దిగి వచ్చినప్పుడు, క్రింది మనస్సుగా మారి పోవును. అనగా (ప్రాణము వేరుగా పనిచేయనారంభించును. మన ఉచ్చ్వాస నిశ్వాసములు ఆడుటలేదని మనకు తెలియవచ్చును. ఆ తెలియ వచ్చుటయే “సూపర్ మైండ్
నుండి మామూలు మనస్సులోనికి వచ్చుట. అప్పుడు ఊపిరి పీల్చుకొనక పోయినప్పటికిని యోలాంటి శ్రమమూ వుండదు. ఉక్కిరి బిక్కిరి కాదు. ఎంతో శాంతముగా తృస్తిగానే యుండును. అలా వుండి మెల్లగా గాలి పీల్చుట (ప్రారంభమగును. చాలా కొలది పరిమాణములోనే ఆగాలి పీల్చుకొనుట జరుగును. ఎంతో శాంతమైన భావముతోనే ఆగాలిని బయటకు వదలుట జరుగును. ఇది యోగాభ్యాసములో మనకు తెలియవచ్చు. విశేషము. ఇందు మన ప్రయత్నమేమి ఉండదు, మన మనస్సులో (ప్రవర్తించే నూరు రకములగు అనగా పలువిధములగు యోచనలు లేక నూరు యోజనములు దాటి మనస్సు శాంతమైనటువంటి భాగవతీయ గతిని అందుకొనును, అపుడు ఉచ్చ్వాస, నిశ్వాసము లుండవు, అయినా ఆయాస ముండదు. గాలిని పీల్చుకొనవలెనన్న తొందరగాని, అవసరము గాని యుండుదు.
శరీరము, ప్రాణము మనస్సునకు సంబంధించిన సంకల్పము లన్నిటిని దాటి వచ్చినపుడు మనస్సు ఏకా(గ్రవృత్తి యందుండును. అనగా మనస్సునకు పైనున్న
(త్రికూటము 33 ఆ వెలుగును అందుకొనవలెనన్న వృత్తి యొక్కటే యుండును. ఆ ఏకా(గ్రవృత్తిని కూడా దాటి సాధకుని ప్రజ్ఞ పై నున్న వెలుగు లోనికి చేరును. అప్పుడు మనస్సునకు సంకల్పమే యుండదు. నివృత్తియందు మనస్సుండి పోవును. అపుడు మనస్సు అనునది పనిచేయుట యుండదు. కనుక ఉచ్చ్వాస, నిశ్వాసములు ఆగిపోవు సాధనా (క్రమమునే “ఉత్తమ వి[క్రమమ్” అని చెప్పుదురు. లోకోత్తరమైన ఒకానొక దివ్యస్టితిని పొందుట. ఆస్ట్రితి యందు “అనిశ్వసన్” - ఉచ్చ్వాస నిశ్వాసములు లేనపుడు, మనలోని (ప్రాణశక్తికి అవరోధము. కలుగును. ప్రాణము లుగ్గపట్టి ఆయాసము కలుగును. కాని ఆంజనేయునకు ఉచ్చ్వాస, నిశ్వాసములు లేనప్పటికి ఎట్టి కష్టము కలుగలేదు.
నగ్గాని మధి గచ్చతి - అనగా ఎలాంటి బాధయు లేక ఆంజనేయుడు సుఖముగా యుండెను. ఉచ్చ్వాస, నిశ్వాసములు, మనస్సంచారము ఆగిపోయినది. కనుక ఆయనకు కష్టము కలుగలేదు. పూర్ణమగు (ప్రాణశక్తి ఆయన యందు పనిచేయుచునే యుండును. ఇది యోగాభ్యాసము వలన "మాత్రమే తెలుసుకొనబడునది.
ఈ ఉత్తమ విక్రమము అన్న యోగ విధానము మన (ప్రయత్న మంతయూ రహితమైన తరువాత మాత్రమె జరుగునట్టిది. ఇందు మన ప్రయత్న మేమియు వుండదు. ప్రయత్నము చేయవలెననెడి మనస్సుండదు. ఆ మనస్సు కూడా ఆ వెలుగులోనే కరగిపోవును. ఇది నూరు యోజనములు, అనగా నూరు రకములైన ఆలోచనలను దాటి యేక్షాగ్రవృత్తికి వచ్చి, ఆపై నున్న నివృత్తి లోనికి వెళ్ళినపుడు ఈ యోగక్రియ జరుగును. ఇట్టి సముద్రమును దాటుటకు ప్రయత్నము చేయునపుడు మన యత్నముండును. మన మనస్సు దాని మీద పనిచేయును. ఈ విధానమునే, సముద్రము దాటు ప్రయత్నమునందు ఆంజనేయుని యొక్క ప్రయత్నము. దాని యొక్క స్థితి ఒకటవ సర్గలో చక్కగా వర్ణింపబడినది. ఆంజనేయుని యొక్క ప్రయత్నములో భుజములను వక్షస్థ్టలముసై బెగించుట, పొట్టను పైకి అక్కళించుట, దృష్టిని దూరముగా ్రసరింపజేయుట, (ప్రాణమును హృదయ కలమమునందు నిలువరించుట వంటి కార్యములను చేసెనని ఆళ్టోకమున వర్షింపబడెను. ఇప్పుడు సముద్రమును దాటి వచ్చిన తరువాత ఆయన ఉచ్చ్వాస, నిశ్వాసములు ఆపలేదు. ఉచ్చ్వాస, నిశాసములతో పనిలేక అఆగిపోయినవి. ఆయన (ప్రయత్న మేమియును లేదు.
తీరా - అనగా శారీరక, ప్రాణసంబంధమైన, మానసిక మైన ఆలోచన లన్నిటిని దాటుట, ఈవిధముగా దాటుట సామాన్య మానవులకు సాధ్యము కాదు. మన
రె సుందరకాండము మనస్సునకు మనము దాసులుగా నుందుము. మనస్సు శాంతిగా ఉండదు. ఈ మనస్సు నందలి కల్గోలములను దాటి నపుడే శాంతి, మనోబలము లభించును. అట్టి మనళ్ళాంతి కలవాడే శ్రీమాన్. భాగ్యవంతుడని అర్రము. అతడు వి(క్రమశాలి కూడాను, అనగా మనస్సును ఆక్రమించుకొని తన అధీనము చేసుకొని, మనస్సు చేత పనులు చేయించుకున్నవాడే విక్రమ శాలి. అట్టి సామర్హ్యము కలవాడు వాయుప్తుత్రుడని భావము,
ఈ అభ్యాసము మనకు కూడా అనుభూతికి వచ్చుచున్నది. కాని ఆంజనేయునకు నడచినట్టుగా స్థిరముగా నడుపుట లేదు. మన శరీరము గురించిన స్పృహ 5116266 లోనికి వెళ్ళిపోవును. ప్రాణమును గురించిన స్పృహ యున్నూ, 5116066 (పసైలెన్సు)లోనికి వెళ్ళిపోవును. ఈ రెండును కలసి మనస్సు నందు లయమై పోవును. అప్పుడు మనస్సు కూడా “సైలెన్సు”లోనికి వెళ్ళి పోయి "సూపర్‌మైండ్”తో కలియును. అట్టి స్థితిలో ఉచ్చాస, నిశ్వాసముల యొక్క అవసరము మనకుండదు. (216020 01 £:202) పూర్ణ ప్రాణశక్తి అన్నది మనకు పైనుండి సరాసరి లభించును. ఇట్టి స్థితి మనకు చాలా కొలది కాలము మాత్రమే వుంటుంది. కాని పరమ గురువులైన వారి కిట్టి యోగస్ట్రితి స్థిరముగా నుండును. అప్పుడు వారిలో "సూపర్ మైండ్” పనిచేయును కనుక అట్టివారు తమ మనస్సును, ప్రాణమును, శరీరమును కూడా చక్కగా కంట్రోల్ చేయగలరు. అంతేగాక తమ చుట్టూ వున్న వారియొక్క మనః ప్రాణాన్నమయకోశములను కూడా (001101) నియంత్రణ చేయగలరు. ఈ నియంత్రణ (60%౯00 చేయుపద్ధతి చాలా సూక్ష్మమగు, సున్హితమగు (5406 34106 21ఇాల అతిమానస కక్ష్యలో నుండి జరుగును కనుక మామూలు మనస్సునకు అర్దము కాదు. చాలా సూక్ష్మమగు మనస్సు కలవారు మాత్రమే, ఈ పద్దతిని అర్ధము చేసుకొనగలరు. ఉదాహరణకు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు గురుపూజలను నిర్వహించుదురు. గురుపూజలలోని కార్యక్రమము. లన్ని చాలా నిళ్ళబ్దముగా, (ప్రశాంతముగా (4610024110) ఆటోమేటిక్‌గా జరిగిపోతూ వుంటాయి. ఇె గారు చాలా ప్రశాంతముగా వుంటారు. ఎవరికి, ఎలాంటి పని చెప్పినట్టుగా వుండదు. ఆందోళన పడినట్టుగా అసలే యుండదు. అయినా కంట్రోల్ అంతా వారిది గానే వుంటుంది. పూజలకు పాలు తెచ్చేవారు తామె సంకల్పించి తెచ్చుచున్నామని అనుకొందురు. కూరగాయలు వగైరాలు తెచ్చేవారందరూ అలాగే అనుకొందురు.
వంట చేసేవారు, వడ్డన చేసేవారు, వసతులు కల్పించే వారు తమంతట తామే ఆ పనులు చేయు చున్నట్టుగా భావించి పరుగులు పెట్టుటను మనము గమనింప
త్రికూటము 35 వచ్చును. ఇట్టి సూపర్ మైండ్ యొక్క కంట్రోల్ గాంధీ మహాత్ముడు వంటి మహనీయుల యందు చక్కగా పని చేయును. గాంధీ మహాత్ముడు మద్రాసులో ఒకరోజు సాయంకాలము కోడంబాకం మైదానములో ప్రార్ధన చేస్తారని ప్రకటించారు. సాయంకాలం ఐదు గంటలకు ఆమైదానమంతా లక్షల జనముతో నిండి పోయినది ఆ వచ్చిన జనసందోహాన్ని 'క్రమ పద్ధతిలో కూర్చోబెట్టడానికి రాజాజి వంటి వారు చాలా ప్రయత్నములు చేశారు. ఎవరెవరి వృత్తులకు సంబంధించిన వ్యవహారాలను వారు మాట్టాడు కుంటున్నారే గొని రాజుజి మాట ఎవ్వరూ వినలేదు. అట్టి సమయములో ఆరుగంటలకు గాంధీజీ వచ్చారు అన్నారు. తక్షణం ఈ సంభాషణలన్నీ ఆగిపోయినవి. అంతా నిళ్ళబ్దము. అందరూ నిలిచి గాంధీజీని చూస్తున్నారు. ఆయన ఒక్కరే ష్లాట్ ఫాం. (211 0౧౫) పైకి వచ్చి అందరకు నమస్కరించి రెండు చేతులు యొత్తి కూర్చొండని సంజ్ఞచేసెను. మూడు లక్షల మంది కూర్చున్నారు. (ప్రార్ధన శాంతముగా, నిళ్ళబ్ధముగా యింకొక అరగంట జరిగినది. (ప్రార్థనానంతరము అందరకు నమస్కరించి గాంధీజీ క్రిందకు దిగి వెళ్ళిపోయినారు. ఒక్క మాట కూడా మాటాడలేదు. ఆమూడు లక్షల మందిలో ఒక్కరు కూడా మాట్టాడలేదు. ఇది సూపర్‌మైండ్ యొక్క వికాసము. అలా సూపర్ మైండ్‌లో నుండి పనిచేయునట్టి మహానుభావులు క్రింద లోక వ్యవహారములను కూడా కలసి పనిచేయుచుందురు. మన మధ్యలోనే తిరుగుతూ, మన కష్టసుఖములలో పాలుపంచుకొనుచు, కలసి మెలసి వుంటూనే చాలా విశిష్టముగా వుండ గలరు. మన తప్పులు దిద్దే గురువులుగా వుందురు. మనకు మంచి మార్గమును చూపించు. స్వాములుగా నుందురు. మనలో సత్యమైన యెరుకను స్టిరముగా నిలిపే జ్ఞానేశ్చరులుగానే యుందురు. ఇన్ని పనులు చేయుచూ కూడా మనలో ఒకరుగా వుందురు. వా రేపని చేసిన ఆయాసపడరు. కష్టపడరు. వా రానందముగా వుండి మనలను ఆనంద మార్గమున నడిపింతురని భావము. ్దోః శతాన్యహం యోజనానాం 'కమేయం సుబహూన్యపి కింపున స్పాగర స్యాంతం సంఖ్యాతం శతయోజనమ్ 2ంక్తీ ఏదైన క్షిష్టుగు మం(త్రము సాధన చేయు వారికి మొదట ఆ ప్రయత్నము చాలా కష్టసాధ్యముగా నుండును. ధైర్యముతో (ప్రారంభించిన తరువాత కొంత పరిచయము. లభించును. ఆచరణ సాధ్యమైన తరువాత, కొంత అనుభవము గడించినపుడు అవిద్య అంతయూ సులభముగా వుండును. అటులనే నూరు ఆలోచనలతో కూడి యున్న మన మనస్సునకు, అన్నమయ కోశాన్ని జయించుట,
36 సుందరకాండము (ప్రాణమయ కోశాన్ని జయించుట చాలా అసాధ్యము. కాని క్రమంగా సుసాధ్యమగును. ఆ తరువాత మనస్సునందున్న కల్గోలములు దాటి వెళ్ళుట జరుగును. అపుడీ యోగ సాధన చాలా సులభంగా అనుభవమునకు వచ్చును. ఆనూరు యోజనములనెడి సముద్రమును. దాటి గడచి గట్టైక్కుట జరుగును. అలాగట్టెక్కిన వారు ఈ సాధనను ఎన్ని సార్హైనానూ చేయగలరు. ఒక క్లోకము చక్కగా అర్ధవంతముగా చదువనేర్చిన వారా శ్లోకాన్ని అవలీలగా యెన్ని సార్హైెననూ చదువగలరు కదా! అదే విధముగా హనుమ మనః ్రాణాన్స్నమయమగు నీ శరీరతంత్రము నంతటినీ మనోమయము. చేసి గట్టెక్కినాడు. గనుక యిలా యెన్ని సార్హైననూ ఈ సముద్రమును దాట వచ్చును అన్నాడు.
అచ్చట ఆంజనేయుడు పచ్చిక బయళ్ళు, అందున్న చెట్టు వనములు చెట్లతో కూడిన కొండలను దాటి ముందునకు సాగెను. అచ్చట ఖర్జూరపు చెట్టు మొదలగు ఫలవృక్షములతో నిండిన వనములను చూసెను. బలశాలురైన రాక్షసులు లంకను కాపలా కాయుచుండిరి. అచ్చట వున్న మేడలు శరత్కాలపు మేఘమువలె తెల్లగా, యెొత్తుగా వుండెను, ద్వ్యారములందు. వివిధములగు అలంకారములతో కూడిన పతాకములతో ఆ నగరము అలంకరింపబడి యుండెను. ఈ లంకను కొండపై విశ్శకర్మ నిర్మించెను. ఆకాశముపై తేలియాడు చున్నట్టున్న లంక మన; కృతమని వరిం బడినది, అనగా తల్లిదండ్రుల యొక్క మనః సంకల్పముల వనల జగత్కర్త చేత నిర్మింపబడిన ఈ శరీరమని భావము,
ఆ నగరము చుట్టూ కోటగోడలు, బురుజులు, అగడ్తలు వుండెను. శతఘ్నులు మొదలగు ఆయుధములు సమృద్ధిగా సమకూర్చబడి యుండెను. ఈ లంక యొక్క అందము అపూర్వముగా నున్నది, ఎవరో మహానుభావుడు సంకల్పించినందున ఈ పట్టణమింత అందముగా నున్నది. అంతియేగాని శిల్పులు నిర్మించినది కాదు అనిపించెను. లంక యొక్క ఉత్తర ద్వారమును చేరిన హనును తాను సీతను వెదకుటకే మార్గము అనుసరింపవలెనని ఆలోచింపసాగెను.
శ్లో తస్యాళ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్యస:
రావణంచ రిపుం ఘోరం చింతయామాస వానర; 2-26 శ్లో అగత్యా పీహ హరీయో భవిష్యంతి నిరర్థకాం;
నహి యుద్దేన వైలంకా శక్యా చేతు సురైరసి 2-27 శ్లో! ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం
(ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః 2-28
తికూటము 37
శో అవకాశో న పాంత్వస్య రాక్షసీష్యభిగమ్యతే
న దానస్య న భేదస్యవై నయుద్దస్య దృశ్యతే 2-29 క్లో చతుర్థామేన హిగతి ర్వానరాణాం మహాత్మనాం వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః 2-30 శతయోజనములు దాటిన హనుమ మరల యోచన చేయుట ప్రారంభించెను అనేక విధములైన రక్షణలతో కూడి రాక్షసులతో కాపాడబడుచున్న లంకను చూసెను. రావణుని యొక్క గొప్ప తనమును గూర్చి ఆలోచింప సాగెను. తానుచేయబోవు పనిని గూడా పరిశీలించి యిట్లు ఆలోచించెను.
ఇంత రక్షణ పాటవముతో గట్టిగా వున్న లంకను వానరులు జయింపగలరా? ఇంత వున్నతమైన నిర్మాణములతో కూడియున్న ఈ లంకను మహాబలశాలి యైన రాముడు జయింపగలడా? అని తన. ప్రభుశ్తిని కూడా శంకించెను.
ఈ లంకను పరిపాలించు రాక్షసులు మహాక్రూరస్వభావము కలవారు. వారికి మెల్లని, చల్లని బోధలు నచ్చవు. కనుక వారిని సామోపాయముతో మంచివారుగా మార్చుట సాధ్యము కాదు. రెండవది దొనోపాయము. ధనసంపదకు ఆశ చూపించి వీరిని లోబరచుకొన వీలు కాదు. వీరు ధనవంతులు. రావణుడు. కుబేరుని జయించెను.
హనుమకు ఇంతటి రక్షణ పాటవము గల లంకారాజ్యమును జయింపగలమా యని సందేహము కలిగెను. మహాత్ములగు నలుగురు వానర వీరులు మాత్రమే యిందు 'ప్రవేశింపగలరను కొనెను. అనగా ఈ దేహములోనికి ప్రవేశించి ఆత్మాన్వేషణ చేయు సామర్ష్యము నలుగురికి మాత్రమే యుండునని భావము.
1 అంగదుడు : అం- భగవంతుని, గదజ=క్తీర్తిచువాడు అనగా భగవన్నామ సంకీర్తన చేయువాడు.
-
నీలుడు : నీలుడు అగ్నిపుత్రుడు (హోమము) అగ్నిహోత్రుని అనుగ్రహముతో యజ్ఞము చేయువాడు.
-
సుగ్రీవుడు : మంచి కంరము కలవాడు. (వేదవేత్త) వేదధ్యానముచేత కంఠము శోభించినవాడు.
శ హనుమంతుడు : వాయుపుత్రుడు (మం(త్రవేత్తు మంత్ర సిద్ధిేచేత ఆత్మదర్భనము కలిగినవాడు. అనగా శరీరములో మరుగున పడిన అత్మతత్త్యమును సపైనాలుగు సాధనములద్వారా అన్వేషింపవచ్చునని భావము.
తె సుందరకాండము
క్యోః ఉ(గ్రౌజసో మహావీర్యా బలవంతశ్చ రాక్షసాః
వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా 2-34
ఇచ్చట రాక్షసులను వంచన చేసి సీతను వెదుక వలయునని హనుమంతుడు ఆలోచించెను. ఇంద్రియార్థముల వైపు ఇం(ద్రియములను, మనస్సును లాగివేయు శక్తులే రాక్షసులు? వారితో పోరాడుట, వలన ఆపోరాటముతోనే జీవితం సాగి అలసట కలుగును. పోరాటమెవరితో సాగించు చున్నాడో వారినే ధ్యానింపక తప్పదు. ఇక ఆత్మ ధ్యానమేమి లేదు. దర్శనమెట్టు లభించును, కావున భగవంతుని ధ్యానించి, వాని కార్యక్రమమున నిర్విరామముగా పాల్గొనుట వలన మనస్సు భగవంతుని యందు నిమగ్న మగును. రాక్షస శక్తులమియు చేయజాలక వంచనకు గురి యగును. అప్పుడు ఆత్మదర్శన మగును. ఆ తరువాత సహజముగనే రాక్షస శక్తులు అంతరించును. ఇదియే రాజయోగము.
వంచన అనుమాట యిచ్చట చాలా "పరమార్ధవంతముగా (ప్రయోగింప బడినది. రు[ద్రసూక్తము నందు పరమేశ్వరుని యిట్టు వర్లించిరి.
నమోవళృతే పరివళ్బతే
ఈ సృష్టి అంతా ఆభగవానుడే నిండి యున్నా తాను వేరు. ఈ సృష్టి వేరు అను భ్రాంతిని నరునకు కలిగించి వంచించువాడు. అనగా మానవులు తమ అజ్ఞానము వలన భగవంతుడు వేరు. తాను వేరు అని వంచించుకొను చున్నారు. ఈ వంచనను వంచించువాడు కూడా భగవంతుడే. భగవంతుడు లేడు అన్న (భ్రాంతిని తొలగించి, అంతా భగవత్స్వరూపమే అన్నపూర్ల జ్ఞానమును ప్రసాదించువాడు కూడా ఆ భగవంతుడే, దీనిని మాస్టర్ సి.వి.విగారు ఇట్లు చెప్పిరి. 7గ౦॥ (ట్రిక్స్ మాయను మాయలో నుంచుము. అనగా సత్యమును ప్రదీపింప జేయుము. ఈ సృష్టి యంతయును మాయ. ఈ మాయను మోసగించి లోనున్న సత్యమును అనగా (బ్రహ్మమును తెలిసుకొనుము అని మాస్టరు గారి భావము. అనగా (బ్రహ్మమును తెలుసికొనుటకు మిరు ప్రయత్నము చేయండి. అందులకు మీరు వేషభాషల నేమియు మార్చవద్దు. సామాన్య మానవుని వలె వుంటూనే (బ్రహ్మతత్వమును సాధించండి, మో సాధనలో విడ్డూరముగా యెప్పుడూ యెవ్వరూ యెవరికి కనపడరాదు. ఈయోగమును (ప్రచారము చేయనక్కరలేదని మాస్టరు సి.వి.విగారు చెప్పిరి.
ఆంజనేయుడు రాక్షసులు గుర్తించునట్టి విడ్డూరమగు ఆకారముతో వర్తింపరాదని వారికి వ్యతిరేకముగా విడ్డూరముగా నుండరాదనియు నిర్హయించుకానెను. అప్పుడు
('త్రికూటము 39 తన సీతాన్వేషణ కార్యక్రమము ప్రశాంతముగా, జయప్రదముగా జరుగ గలదని భావము. దీని తర్వాత 35వ కాకము చాలా ్రధానమగు యోగాభ్యాసమును వర్షించుచున్నది.
శ్లో లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకా పరీమయా
ప్రవేష్పు ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ 2-35
ఈ శ్లోకమునకు సామాన్యర్థమిట్టున్నది. ఈసత్యాన్వేషణ మన్నది చాలా మహత్తరమైన కార్యము. ఈ కార్యమును సాధించుటకు తగిన కాలము రాత్రికాలము. ఈ కార్యము సాధించుటకు ధరించవలసిన రూపము లక్ష్యాలక్షము. అనగా కనుపించి కనుపించని రూపము, కనుపించి కనుపించ నట్టి రూపమును ధరించినపుడే ఈ సత్యాన్వేషణము జరుగును. ఆడంబరములతో కూడిన యట్టి సత్యాన్వేషణ విధానము నిప్పుడు ఎక్కువ మంది అనుసరించు చుందురు. ఏనుగులు, గుజ్జములు పరివారము మొదలైన ఆడంబరములతో గూడిన సాధకులే అధికులుగా వుందురు. వారిని అధిక్షేపించువారు నుందురు. ఇది ఒక పద్దతి.
రెండవ పద్దతి అలక్ష్యము. కనుపించకుండా వుండి సత్యాన్వేషణ చేయువారు. అనగా హిమాలయ శిఖరములపైన గుహలలో నుండి ఏ కాంతముగా ధ్యానమును, తపస్సును ఆశ్రయించి సాధన చేయువారు. వారు లోకమునకు అందుబాటులో నుండరు. వారికి లభించే దివ్యానుభవములు ఎవ్వరికీ మంచిని చేకూర్చవు. వా రున్నట్లే యెవ్వరికీ తెలియదు. ఈ పద్ధతిలోనే యింకొక తీరువా రున్నారు. వారు మన మధ్యలోనే వుందురు. అతి రహస్యముగా వారు సాధన చేయు చుందురు. ఎవ్వరికి యేమి. చెప్పరు. వారి సాధనాక్రమము తెలుసుకొనుటకు అర్హతగల వారెవ్వరూ. లేరని భావింతురు. కనుక వారి వలన నెవ్వరికీ మంచి జ్ఞానము లభించదు. కనుక ఈ రెండు పద్దతులను హనుమంతుడు తిరస్కరించెను. సీతను అన్వేషించు చున్నానని ఆడంబరముగా చేసే ప్రయత్నము కొన సాగదు. రహస్యముగా రహస్యమును వెదకుట సాధ్యపడదు. కనుక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనుసరించు పంధానే ఆంజనేయుడు అవలంబించెను.. శ్రీరాముడు శ్రీకృష్ణుడు తాము మహావిష్ణువుయొక్క అవతారమని చెప్పుకొనలేదు. వారు మన వంటి సొమాన్యు లనే భావించి అందరూ వచింపబడిరి. ఆయిననూ వారు సామాన్య మానవుల మధ్యనే వుండి అసామాన్యములగు పనులను లోక కళ్యాణమునకై చేసి చూపించిరి. అట్టి పంథానే యిప్పుడు ఆంజనేయుడు అనుసరించుచున్నాడు. అనగా రాక్షసుల మధ్య
శ్ష0 సుందరకాండము తిరుగుచునే సీతాన్వేషణమను మహత్కార్యమును చక్కగా నిర్వర్తించుటకు పూనుకొనెనని భావము. అన్వేషణ విధానము పైన చెప్పబడినది. అన్వేషణ రూపము చెప్పబడినది. తరువాత అన్వేషణ కాలము గూర్చి తెలుసుకొందము. రాత్రా లంకా పురీ మయా ్రవేష్టుం రాత్రియందు లంకను నేను (ప్రవేశించెదను అన్న వాక్యమునకు అర్ధము తెలుసుకొందము. “ మనకు పగలు అనగా సంసారము యొక్క ఆకర్షణ. రాత్రి యనగా ఆధ్యాత్మిక విద్యయందు ఆకర్షణ. ఈ రాత్రియే్ యోగులకు పగలు. మనకు పగలుగా నున్న భావము, వారికి రాత్రి. యనగా ఈ సంసార ఆకర్షణల యందు వారు ని(ద్రింతురు. మనకు రాత్రియగు ఆధ్యాత్మిక విద్యయే వారికి పగలు. అదియే ఆత్మాన్వేషణకు సరియగు సమయము, యానిశా సర్వభూతానాం - తస్యోం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని = సా నిశా పళ్ళతో మునేః భగ. 2అ -69 రాత్రి కాలము అనగా రాక్షసులకు రాత్రియగు కాలము అని అర్ధము. ఎట్లనగా మహర్షులు జ్ఞానులు ఆయిన వారికి యజ్ఞములు, యాగములు, యోగసాధన మొదలగునవి. పగలు, దుష్టకార్యములు, 'క్రూరకర్మలు, హింసాకాండ మొదలగునవి వారికి రాత్రి. రాత్రి కాలమందు వారు ని(ద్రపోవుదురు. అనగా అది వారికి రాత్రి కాలము. రాక్షసుల అనుభవము వారికి సాక్షాత్తు విరుద్ధముగా వుండును. రాక్షసులకు యజ్ఞములు యాగములు, పూజలు యోగసాధన వ్యతిరేకములు. అనగా అవి వారికి రాత్రి. అ పనులయందు వారు నిద్రపోవుదురు. హింస, యుద్ధము, (క్రూరత్వము మొదలగు వాని యందు రాక్షసులు మేలుకొని యుందురు. కనుక రాక్షసులు నిద్రపోవు సమయము, మార్గమునందు అన్వేషించవలయునని ఆంజనేయుడు తలంచెను. క్ట, తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్జాం సురాసురైః హనుమాన్ చింతయామాస వినిశ్చత్య ముహూర్ముహు: 2-36 ఖ్ కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేందద్రేణ రావణేన దురాత్మనా 2-37 శ్లో! నవినశ్ళే తృధం కార్యం రామస్య విదితాత్మనః వీకా మేకళ్ళ పశ్యేయం రహితే జనకాత్మజాం 2-38
'త్రికూటము త్తే క్లోః భూతాళ్చార్దా విపద్యంతే దేశకాల విరోధితాః విక్షబం దూతమా సాద్య తమ స్పూర్యోదయే యధా 2-39 న్లో అర్జా నర్జాంతరే బుద్దిర్ని శ్చితా2పి న శోభతే యూత యంతి హే కార్యాణి దూతాః పండితమానినః 2-40 అందువలన రావణునకు తెలియకుండగనే లంకలో ప్రవేశించి అంతటను వెదకి సీతమ్మ వున్న చోట కనుగొనెదను, అదియే మంచి మార్గము. మహాదుర్మార్లుడైన రావణునకు కనుపించకయే వెదకుట మంచిది. నేను సీతాదేవిని ఒంటరిగా వున్నచోటుకు వెళ్ళి ఆమెను కలుసుకొని ఏకాంతముగా మూట్లాడవలెను. ఈ పని చక్కగా నెరవేరునట్ట్లు చూసుకొనవలెను. అవివేకముగా నేను పప్రవర్తించినచో ఈ పని చెడిపోవును. స్వామి కార్యమును నేను చక్కగా నిర్వర్తించెదను. అందువలన నేను వచ్చిన పని సఫలమై జయ(ప్రదముగా ముగియు మార్గమును అన్వేషింతును. నేను రావణునకు చిక్కక సీతాదేవిని అన్వేషించెదను. నేను కూడా ఆరాక్షసుల యొక్క రూపమును ధరించి వారిలో కలసిపోయి సీతను వెదక వచ్చునా? అది సాధ్యము కాదు. రాక్షస రూపము ధరించినను వారు నన్ను గుర్తింప గలరు. నేను ఇప్పటికి నాపెద్ద రూపముతో ఎచ్చట దాగి యున్ననూ లాభములేదు. రాక్షసులు వెంటనే గుర్రింపగలరు. నా కార్యమునకు భంగము వాటిల్టును. కనుక ఈ పెద్ద భయంకరమగు రూపమం దుండుట మంచిది కాదు. కావున సూక్ష్మరూపమును ధరించి రాత్రివేళ లంకలో ్రవేశించెదను. ఇట్టు రహస్యరూపమున, రహస్య మార్గమున రావణుని గృహమందు సీతను వెదకుటకై ప్రయత్నించెదను. అప్పుడు నా పని చక్కగా సాగును. క్లో॥ ఇతి సంచిత్య హనుమాన్ సూర్య స్పాస్తమయం కపిః ఆచ కాంక్షే తదా వీరో వైదేహ్యా దర్భ్శనోత్సుకః 2-48 హ్లోః సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిస్యమారుతిః పృషదంశక మాత్రస్సన్ బభూ వాద్భుత దర్శనః 2-49 వ్లోః ప్రదోషకాలే హనుమాం స్తూర్లము త్పుత్వ వీర్యవాన్ (ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపధామ్ 2-50 ఈ విధముగా రాత్రివేళ యందు సీతను వెదకుటకు సూర్యాస్తమయ (సందాల కాలమునకై వేచి యుండెదను. రాత్రి చీకటి పడిన తరువాత ఆంజనేయుడు తన రూపమును చాలించి, పిల్లి యంత సూక్ష్మరూపమును ధరించెను. అనగా ఆంజనేయుడు వానరుడు గనుక
సుందరకాండము త్త్తై చిన్నకోతి రూపమును పొందక చిన్న పిల్లియంత రూపమును పొందెను అని చెప్పుట యెందులకు? కోతులకు రాత్రిపూట చూపుతక్కువ. నిద్రయెక్కువ. పిల్లులకు రాత్రిపూట చీకటిలో చూచునట్టి సామర్యము అధికము. నిద్రహోవు అలవాటుకూడా చాలా తక్కువ. కనుక పిల్లి యంత రూపమును ధరించెను. చీకటి పడిన తరువాత లంకానగరము లోనికి ప్రవేశించెను. అంత ఆ లంకానగరములో ఐదు, ఆరు అంతస్థుల భవనములను చూసెను. ఆమేడల కాంతులు అభవనములలో పొదిగిన మణులు, ముత్యములు వలన ఎక్కువయ్యెను. ఆ కాంత్రి చుట్టూ ప్రసరించు చుండెను. క్ట అ చింత్యా మద్భుతాకారం దృష్ట్యా లంకాం మహాక్తపి;ః అసీ ద్విషణ్లో హృష్టళ్ళ వైదేహ్యా దర్శనోత్సుక; 2-55 ఈ శరీరములో అంతర్న్షహితముగా నున్న అంతరాత్మను వెదకుట యెొట్టు? (ప్రవేశద్వార మేది? అని పరిశీలించి. చూడగనే ఆంజనేయునకు లంకానగరము అత్యంత అద్భుతముగా కనిపించెను, ఈ ఇతరము చాలా ఆకర్షణీయముగొ నున్నది. అన్నీ అలంకారములే! ఆకర్షణలే వీటినన్నిటిని దాటి లోపలకు వెళ్ళేదెలా? ఆ అమ్మగారిని పోల్చుకొనే దెలాగ? అన్నదిగులు మరలా ఆంజనేయుని ఆవరించినది. ఆసీత్ విషక్ఞో. దిగులు. చెందిన వాడయ్యెను. నేను ఇంత పనిచేసి సముద్రమును గడిచి వచ్చాను. కాని ఆ తరువాత కార్యము నావల్ల కాద నుకొనెను. మన మందరము చేయు పారపా టిదిర్సు. జయ(్రదముగా అయిన పనులన్నీ మనవల్లనే అయినవి. ఇలాటి పనులు చేయగలమన్న దురహంకారం మనలను అవరించును. గొన ఆ తరువాత చేయవలసిన (క్రొత్త పనులు చాలా పెద్దవిగొ కనుపించును. ఇంత గొప్పనులను చేయజాలనన్న వీషాదమ్సు ఆవరించును. అయినొ హనుమంతుడు కాబట్టి ఒక్కక్షణం మాత్రమే విల్లు డయ్యెను. వెంటనే తన అజ్ఞానమును తెలిసిక్రాన్స. అనగా సీతమ్మ వారిని దర్శించ వలెనన్న ఉత్సాహము హనుమలో ప్రవేశించినది. వెంటనే “హృష్టస్య” సంతోషము క్రల్రిగద్రని భావము* ఈ శరీరము ఒకకోట్స, ఇన్సప్త కవచము వంటిది, ఇట్ట దాని లోనిక్రి వెళ్ళీ బలము మనకు చాలద్రన్సి మొదట అరైర్యము కలుగున్సు, గురువుల యొక్క దర్శనము వలను మనకు జ్ఞానము లభించును. రైర్యోత్సాహములు వచ్చి. చేరును. ఇది గురువుల సన్నిదిని జరుగునట్టి యోగ (వేయ. అదియే యిందు. వర్షింపబడినది. అప్పుడు చంద్రోదయ మైనది. అనగా నొతన మైన తేజస్సు లభ్రించెనని భావము.
లంకా ప్రవేశము
ఖా స లంబకిఖరే లంబే లంబతో యదసన్నిభే
సత్త్య మాస్థాయ మేధావీ హనుమా న్మారుతాత్మజః 3-1 శః నిశి లంకాం మహాసత్త్యో వివేశ కపికుంజర:
రమ్యకానన తోయార్యాం పురీం రావణపాలితామ్ _ 3-2 శః శారదాంబుధర ప్రఖ్యైర్భవనై రుపశోభితాం
సాగరోపమనిర్హోషాం సాగరానిలసేవితామ్ 3-3 ఖు సుపుష్టబలసంఘుష్టాం యథైవ విటపావతీం
చొరుతోరణ నిర్వ్యూహాం పాండుర ద్వారతోరణామ్ మ! క్ట భుజగాచరితాం. గుప్తాం. శుభాం భోగవతీ మివ
తాం స విద్యుద్దనాకీర్ణాం జ్యోతిర్మార్లనిషేవితామ్ 85 కః మందమారుతసంచారాం యథేంద్రస్యామరావతిం
శాతకుంభేన మహతా ్రాకారే ణాభిసంవృతామ్ 3-6 ల్లో! కింకిణీజాలఘోషాభిః పతాకాభి రలంకృతాం
ఆసాద్య సహసా హృష్టః (ప్రాకార మభిపేదివాన్ 37 శ్లో విస్మయావిష్టహ్పాదయ: పురీ మాలోక్య సర్వతః
జాంబూనదమయైర్వారై ర్వైడూర్యకృతవేదికై; 3-8 శ్లో వజ్రసృటికముక్తాభిర్మణికుట్టిమభూషిలైః
తప్త హాటకనిర్వ్యూహై రాజతామలపాండురై; ప్రం ్యీ వైడూర్యకృతసోపానై స్సాటికాంతరపాంసుభి;
చారుసంజవనోపేతై: ఖమివోత్పతితై. శ్ళుభైః 3-10 ఖః క్రౌంచబర్జిణసంఘుప్టై రాజహంసనిషేవితై: _
తూర్యాభరణనిర్జోషై స్సర్వత:ః 'ప్రతినాదితామ్ 3-11 శ్లో వస్వౌకసారాప్రతిమాం తాం వీక్ష్య నగరీం తతః
ఇమివోత్సతితుం కామాం. జహర్ష హనుమాన్ కషిః 312 ళా తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతే శ్ళుభాం
అనుత్తమా మృద్దియుతాం చింతయామాస వీర్యవాన్ 3-13
గ సుందరకాండము ళ్గా నేయ మన్యేన నగరీ శక్యా ధర్హయితుం బలాత్ రక్షితా రావణబలై రుద్యతాయుధధారిభిః 3-14 ఖ్ళ కుముదాంగదయో ర్వాపి సుషేణస్య మహాకసేః (ప్రసిద్దేయం భవే ద్భూమి ర్మైందద్వివిదయో రపి 3-15 ఖ్లోః వివస్వత స్తనూజస్య హరేళ్ళ కుశపర్వణః బుక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ 3-16 శః సమీక్ష్య తు మహాబాహూ రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ వికాంత్ర మభవ త్రీతిమా న్కపిః త్ర17 శ్లో, తాం రత్నవసనోపేతాం కోష్టాగారావతంసకాం యంత్రాగారస్తనీమృద్దాం. (ప్రమదామిన భూషితామ్ 318 శ్లో! తాం నష్టతిమిరాం దీప్రెర్భాస్వరైశ్చ మహాగృహైః “* నగరీం రాక్షసేంద్రస్య సీ దదర్శ మహాకపిః 3-19 సయేషోన్తర్ హృదయ ఆకాశ! తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః!! అన్తేోణ తాలుకే! య ఏపస్తన ఇవా వలమృతే! సేన్ద యోనిః! యత్రా సౌ కేశాన్తో వివర్తతే! వ్యపోహ్యా శీర్షకపాలే! భూరి త్య గ్నౌ ప్రతి తిష్టతి!” (తైత్తిరయోపనిషత్ శిక్షావల్లి షష్టోనువాక:) హనుమంతుడు లంకాతీరమందున్న త్రికూటము అను పర్వత శిఖరమును చేరెను. త్రికూటమనగా ఇందద్రగ్రంథిపై భాగమున నుండును. అనగా (భ్రూమధ్య కేంద్రము. రెండు కనుబొమ్మలు,ముక్కులు కలియుచోటు (భ్రూమధ్యము, త్రికూటము అని కూడా వ్యవహరించుట కలదు. ఆ్రదేశము జ్ఞానకేంద్రము. అందుండియే అంతరంగము లోనికి ప్రవేశింప వీలగును. భాగవతము గజేంద్ర మోక్షములో ఈ విషయము స్పష్టముగా చెప్పబడినది. సీ॥ రాజేంద్ర! నిను సుధారాశిలో నొక పర్వతంబు టత్రికూటంబునా దనరు చుండు యోజనయుతమగు నున్న తత్వంబును నంతియె వెడలుపు నతిశయిల్లు గౌొంచనా యస్సార కలధౌత మయములై! మూడు శృంగంబులు మొనసి యుండు దట శృంగ బహురత్న ధాతు చిత్రితములై! దిశలు భూవభములు దేజరిల్లు తే భూరి భూజ లతా కుంజ పుంజములును 'మైసి పజతెంచు సెలయేటి మొత్తములును
లంకా (ప్రవేశము కర్ మరగి తిరొిగెడు దివ్య విమానములును రుజుల గగ్రీడించు కిన్నర చయము గలిగి 8-23
అమృత రాశిగా నున్న పాలసము(ద్రము నుండి పర్వత మొకటి వచ్చినది. దాని పేరు త్రికూటము. మూడు నెత్తములు కలది. ఒకటి కాంచన మయము. అనగా బంగారు. నెత్తము కలది. రెండవది ఆయస్వారమయము. అనగా ఇనుపనెత్తము కలది. ఇక మూడవది. కలధౌాతమయము. అనగా వెండి శిఖరము కలిగినది. అనగా మూడు గుణములు కలిగినటు వంటిది. బంగారము రాజసగుణమునకు గుర్తు, ఇనుము తామసగుణమునకు గుర్తు మూడవది యగు వెండి శుద్ద సాత్విక తేజస్సునకు గుర్తు ఈ మూడు గుణములు ఆ త్రికూటమునకు మూడు శిఖరములు. దీనికి మూడు లక్షణములు ,తరువాత వచ్చుచున్నవి. దెసలు = దిక్కులు అనగా మనము ప్రవర్తించవలసిన మార్గములు తెలియజేయునది. రెండవది భూ _- అనగా భూమి. భూమి యందలి నీరు, నిప్పు మొదలగు వస్తువులను తెలియజేయునది. తామస గుణము మూడవది నభము. అనగా ఆకాశము. తెల్లని సాత్విక తేజమును తెలియజేయునది ఈ మూడు గుణములతో కూడిన త్రికూట పర్వతము మన శిరస్సునకు పై భాగమున నుండునని భావము, ఈ లంక అనే శరీరమును. సమీపించి నప్పుడు అంజనేయునకు మొట్టమొదట దర్శనమైనది (త్రికూట పర్వతము. అది పై నుండి ర్రేలాడుచున్నట్టుగా కనుపించును.
“యఏషపస్తన ఇవావలమృతే! సే(న్హ యోనిః”
ఇన్ట యోని అని పిలువ బడునట్టిది.
స్తవఇవన : స్తనమువలె, అవలమృతే = (వ్రైలాడుచున్నది.
ఇట్టు పై నుండి గ్రేలాడుచున్న ఇంద్రయోని మన శిరస్సుయొక్క పై భాగమున నున్నది.
లంబ శిఖరే : పై నుండి వ్రేలాడుచున్న లంబ శిఖరమును గుర్తించుట అందరకు సాధ్యమయ్యే విషయము కాదు. అచ్చటకు వెళ్లి చక్కగా కూర్చుండుట. స్థిరముగా అచ్చట వుండ గలుగుట అన్న రెండునూ అందరకూ సాధ్యమయ్యే పనులు కావు, ఆంజనేయుడు మహానుభావుడు. కనుకనే అట్టు సుఖముగా, స్థిరముగా లంబ శిఖరము నందు నిలువ గలిగెను.
లంబే - అనగా ఆకాశము నందు స్టిరముగా నున్నవాడు. అంతియేగొక ఆకాశము నందు చరించుచూ అదే సమయమునందు, ఈ భూమి యందలి లౌకిక
కీర సుందరకాండము వ్యాపారములందు కూడా వుండువాడు కనుక అతడు వాయునందనుడు. అనగా వాయువు, భూమి యందు ్రవర్రించుచునే అదే సమయమునందు ఆకాశము నందు కూడా (ప్రవర్తింప గలడు.
51164114౧60౪5 6౫15169౧06 1౧ 2|| ౧12౧69 అని మాస్టర్ సి.వి.వి. గారు సెలవిచ్చిన యోగానుభవ మిట్టిదే. దానినే “సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే” అని వర్షించుట జరిగినది.
ఈ విధముగా ఆకాశమునందు వుండియూ, భూమియందు చరించునట్టి మహాయోగుల యొక్క యోగచర్యలు మనకు చాలా కన్పించును. వానిని చూచే నేర్పు ఉన్నప్పుడు మాత్రమే అది ఒక చర్వావిశేషమని గుర్తించగలము.
రామాయణము యుద్దకాండయందిట్టి దివ్యయోగ సంపన్నతను వాల్మీకి మహర్షి ప్రవర్తింప చేసెను. అందు ఇంద్రజిత్తు నాగాస్త (ప్రయోగము అన్న యోగాభ్యాసము చాలా మెచ్చదగినది. ఇంద్రజిత్తు నాగమహామంత్రమును 'ప్రయోగించెను. దాని యొక్క ప్రభావము వలన నాగుపాములు రామలక్ష్మణులను బంధించినవి. రామలక్ష్మణులు నాగపాళబద్దులై పడియుండుట చూసి సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలగు సేనా నాయకులు దుఃఖించిరి. భయపడిరి. ఇంద్రజిత్తు చేతిలో రామచంద్రుడే చిక్కి బందీ అయినప్పుడు, యింక మన మేమీ చేయజాలము. యుద్ధమున జయింప జాలము. కనుక తిరిగి కిష్కింధకు వెళ్లుట మంచిది అని దిగజారిపోయిరి. యోగాభ్యాసమునందు జయము కలిగినప్పుడు ఉబ్బిపాంగిపోవుట, అపజయము కలిగినప్పుడు కుంగిపోయి దిగజారుట అన్నది ఎప్పుడూ చేయకూడదని ఈ కధ మనకు బోధించుచున్నది. అట్టి ఓటమి సమయములందు కూడా పూర్ణమగు విశ్వాసము, ధైర్యము కలిగి ముందుకు సాగి పోవలెననియే శ్రీరాముడు, సుగ్రీవాదులకు చెప్పకయే చేప్పుచుండెను. ఆయన యేమియు చికాకు పడలేదు. తనకు చుట్టు ముట్టిన త్రాచు పాములసపైన హాయిగా పరుండెను. శేషళయనుడు గనుక ఆయనకు అది యెంతో సుఖముగనే యున్నది. అజ్ఞానము వలన సు(్రీవాదులు, రాముడే మూర్చ పోయెనని కష్టపడు చుండెనని (భ్రాంతి పడిరి. రామచంద్రుడు తమకు పెట్టిన పరీక్ష యందు సుగ్రీవాదు లందరూ తప్పిరని అర్హము. రాముడు ఈ భూమికి సంబంధించిన రూపములో నున్నప్పుడు ఆదివ్యమగు తేజోమండలము నందు కూడా నుండును. ఆ దివ్యధామము నందు పరంధాముడుగా నుండి, అదే సమయమున భూమి యందు రామచండద్రుడుగా నుండును అన్న విషయము సుగ్రీవాదులకు
లంకా ప్రవేశము శి తెలియదు. దానిని తెలియజేయుటకై రాముడు సంకల్పించెను. నాగుపాముల వికారమును తొలగించుటకు తన వాహనమైన గరుడునకు అనుమతి నిచ్చెను. ఆ గరుత్మంతుడు దెగివచ్చెను. ఆ గరుత్మంతుని రెక్కలయొక్క గాలి "తగలగనె నాగుపాములు అన్నియు పారిపోవ నారంభించెను. గరుత్మంతుడు శ్రీరామచంద్రుని దర్శనము చేసికొని భక్తి ప్రపత్తులతో రామునకు ప్రదక్షిణము. చేసి సాష్టాంగ నమస్కారము చేసెను. “రక్ష మాం” అని రాముని నుండి సెలవు తీసుకొని వెళ్లి పోయెను. అప్పుడు సుగ్రీవాదులతో రాముడు ఏమియును మాట్లాడలేదు. గరుత్మంతుడునూ మాట్లాడలేదు. నీతి బోధలు ఏమియూ చేయలేదు. అయినప్పటికీ సుగ్రీవాదులకు ఒక చక్కని నీతిబోధ అందినది. వారు మాట్టాడకయే సుగ్రీవాదులకు చాలా మంచి మాటలు చెప్పిరని యోగాన్వయము,
సుగ్రీవాదులు నాగాస్త్రమునకు రాముడు లొంగిపోయిరని పొరపడిరి. నాగాస్త్రము చాలా చిన్న విషయము. దానిని నివారించుటకు రాముల వారు ఏమి ప్రయత్నము చేయనక్కరలేదు. వారి పరివారము లోని వారెవరైనా ఆ పనిని చేయగలరు. నా వాహనమైన గరుత్మంతుడు ఈ పనిని చేయగలడని రాముడు చెప్పకయే చెప్తుచుండెను.
గరుత్మంతుడు కూడా చెప్పకయే ఇట్లు చెప్పు చుండెను. “మిరందరూ పిచ్చివాళ్ళు. ఇంద్రజిత్తు నుండి తనను తాను రక్షించుకొన లేడని రామ(ప్రభువును గురించి ఆలోచించు చున్నారు. అది అజ్ఞానము. నాగాస్త్రమును నివారించుటకు నావంటి అల్పుడైన వాడే చాలును. కనుక శ్రీవారు నాకు ఆపని చేయుటకు అనుమతి నిచ్చిరని తెలిసికొనుడు. నాయీ శక్తి యంతయూ శ్రీవారి అనుగ్రహమే అని బోధించెను. ఇది యొక విశిష్ట యోగానుభవము.
ఇట్టి యోగ వికాసము మనలో ఇప్పుడునూ జరుగుచున్నది. గురుదేవులు శ్రీ వేటూరి (ప్రభాకరశాస్తుల వారికి నమస్కరించి వారి యొక్క యోగ ప్రభను తెలియజేయు నట్టి సంఘటన గూర్చి ఇట వర్షింతును.
శ్రీశాస్రిగారి అల్టుడు డాక్టర్ వి. రామచంద్రరావుగారు. తిరుపతి మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్. వారి కుమారునకు (ప్రభాకర్ అని గురువుగారి పేరునే పెట్టిరి, ' ప్రభాకర్ ఉబ్బసపు వ్యాధితో బాధపదెడి వాడు. అవ్యాధి వచ్చినపుడు మెడికల్ కాలేజీలో నున్న వైద్య విజ్ఞానమును అంతా ఉపయోగించి ఆయన బాధను తొలగింప జేయుటకు ప్రయత్నించే వారు. కాని ఏమియును శాంతించెడిది కాదు. అప్పుడు
జరి సుందరకాండము సీసాగారు (ఉదయగిరి శ్రీనివాసాచార్యులు తిరుపతి) అనగా శ్రీ శాస్త్రిగార్కి అత్యంత ప్రియమైన శిష్యులు, భక్తులు, యోగ సాధనము నందు సిద్ది పొందినవారు. వారు రాగానే ఆ ఉబ్బసవ్యాధి యొక్క బాధలు తొలగి పోయి రోగికి స్వస్థత చిక్కెడిది. అయినప్పటికి మరల ఉబ్బసపు బాధ ఆరోగికి తప్పలేదు. ఆ ఉబ్బస వ్యాధి నివారణకై పనిచేయునట్టి ఆ మెడికల్ కాలేజీలోని డాక్టర్లను ఆరోగి ఇట్టా ప్రల్టించెను. నేను ఇలా ఎన్నిరోజులు బాధపడవలెను? దీనికి సరియగు నివారణోపాయము ఆలోచించి చెప్పండి.” అన్న ప్రశ్నకు వారిట్టు సమాధానము చెప్పిరి. “ఈ వ్యాధిని నివారించుట మా వలన కాదు. కొంత ఉపశాంతిని కలిగించు వైద్య విధానములే మాకు తెలియును. అంతియేకాని వ్యాధిని సంపూర్ణముగా తొలగించుట యెొట్లో మాకు తెలియదు. అది మా వల్లకాని పని”
ఈ సంభాషణ జరిగిన మరుచటి ఉదయము ఉబ్బసపు తెర యెక్కువగా వచ్చెను. బాధపడుచున్న కుమారుని జాచి తల్లి ఇట్టు అనెను. నీవలా యెందుకు బాధపడతావు? భక్తి విశ్శాసములతో కూర్చో. మో తాతయ్యగారికి నమస్కారము పెట్టుకో.” అందులకు ఆ రోగి యిట్టు బదులు చెప్పెను.
“ఈ వ్యాధి కుదుర్చుట నా బాబు వల్లకాదు. అదే విధముగా మి బాబు వల్ల కాదు. ఆ తరువాత బాధ భరింపరానంతగా రాగా, రోగిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళిరి. డాక్టర్లందరూ చేరి బిళ్ళలు ఇంజక్షన్‌ను వగైరా యిచ్చి చూచిరి. కాని ఏమి గుణము కానరాలేదు. రోగి (ప్రమాద స్థితితో వున్నందున ఆక్సిజన్ కూడా పెట్టిరి. అప్పుడు సీ.సా గారు వారికి గుర్తుకు వచ్చిరి. వారి కొరకై కారు పంపిరి. సీనా, గారు రాగానే వ్యాధి తగ్గిపోయి మరల ఊపిరి సరిగా ఆడుట ప్రారంభమైనది. రోగిని సమీపించి సీసా. గారు తాకి పలకరించినప్పుడు రోగలక్షణము లన్నీ తొలగిపోయినవి. లేచి కూర్చొనమని అనగా చక్కగా లేచి కూర్చొనుట, లేచినడువ మనగా నడచ్చుట, కాఫీ త్రాగమనగా (త్రాగుట జరిగినది. ఆ గదిలో నున్హు డాక్టర్లందరూ ఈ విచిత్ర (ట్రీటుమెంటు విధానమును చూసిరి. అప్పుడు సీ.సాగారితో రోగి తల్లి యిట్టనిరి. “ఉదయము వీడికి ఉబ్బసపు తెరలు వచ్చినవి. బాధపడుతుండగా చూచి తాతగార్కి నమస్కారము పెట్టుకోరా అని చెప్పినాను. అందుకు వాడు ఇట్టా అన్నాడు. *ఈ జబ్బును కుదుర్చుటకు మా బాబు వల్లకాదు. మీ బాబు వల్లకాదు” ఆ మాటలు
విని సీసా గారు ఇట్టనిరి. ఇక్కడ హాస్పటల్లో మనము కూర్చున్నాము. కనుక అ వ్యాధి నివారణ చేయడం వారి బాబువల్ల కాదని స్పష్టముగా తెలియుచున్నది.
లంకా ప్రవేశము శం ఇక రెండవది. మీ బాబు వల్లకాదు. అన్న రెండవ మాట కూడా సత్యమే. ఈ చిన్న దగ్గు నివారించుట మీ బాబు గారి పనికాదు. మీ బాబుగారు పంపించిన ఏ పూచిక పుల్లైన ఆ పని చేయగలదు. వారి అను(గ్రహము వలన మనకు అన్ని పనులు చేయగల సామర్ర్యము గలదు. ఇట్టి బాధలను తాలగించుకొనుటకు గురువుగారు నా వంటి పూచిక పుల్లను పంపిస్తే చాలు. వారు రానక్కర లేదు అన్నారు. ఈ కథ మనకు బోధించేది ఏమంటే పరమ గురువులు అయిన వారు సంకల్పించినంత మాత్రమున పనులు అన్నీ చక్కగా నడుస్తాయి. వారు స్వయముగా ఆ పనులను నడపరు. వారి పనిముట్టు ద్వారా ఆ పనిని నిర్వహింపగలరు. శ్రీరామ చంద్రుడు ఏమో చేయలేదు. గరుత్మంతుడు వచ్చి ఆ కార్యమును చక్కబెట్టెను. అన్నప్పుడు అర్హమట్టు (గ్రహింపవలసియున్నది.
లంకయందలి భవనములు శరత్కాలపు మేఘములవలె తెల్లగా నుండెను. సముద్ర తీరములందు ఆ భవనములుండుట వలన సము(ద్రపు గాలి ఘోషించుచూ వాటిని సేవించుచుండెను. ధనాధిపతి కుబేరుని పట్టణము అలకాపురి వలె ధనసంపన్నమై ఒప్పెను. దానిని మహావీరులు రక్షించుచుండగా అకాశమునందు మేఘమువలె ఇంద్రుని అమరావతి వలె నుండెను. గుప్తచరులగు దేవతాశక్తులు చరించునట్టిదియూ, వారిచే కాపాడబడునట్టిదియున్నూ అయిన (బ్రహ్మగ్రంధి (ఇంద్రయోని) న్దాన మున్నది. అది ఆకాశము వలె కాంతివంతమైనది. ఆపైన వున్న విద్యుత్కాంతులను అందుకొనునట్టిది. కనుక ఆ ఇంద్రయోని అమరావతి వలె భాసించునట్టిది. అట్టి చోటు నుండి లంకయొక్క ప్రాకారమును చేరుకొనెను. అనగా ఈ శరీరము యొక్క నెత్తమునకు చేరుకొనెను. అది యే శరీరములోనికి ప్రవేశించుటకు గల అవకాశము లేక ద్వారము అనబడును.
బంగారపు ద్వారములతో వజ్ర, వైడూర్యసోపానములతో క్రాంచపక్షులు, నెమళ్ళు మొదలగు పక్షుల కూతలతో కూడిన ఆ నగర శోభను చూచి హనుమ సంతోషించుచూ (ప్రొకారమును చేరుకానెను.
ఆ లంక అన్ని వస్తువులతో సమృద్దిగా వుండెను. అట్టి లంకను గాంచి ఆంజనేయు డిట్టు భావించెను. మహావీరులైన రాక్షసుల చేత రక్షితమైన లంకాపురిని కిష్కింధ వాసు లెవరూ యెరుగరు. అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు, బుక్షువు, కేతుమాలి మొదలగు కొద్దిమందికి, నాకు మాత్రమే ఈ నగర ప్రవేశ సామర్ధ్యము గలదు. (వినయముగా తనను చివరగా పేర్కొనీనాడు)
50 సుందరకాండము లంకిణి శ్లో, అధ సా హరి శార్దూలం ప్రవిశంతం మహాబలః । నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజమ్॥ 3-20 శ్లో; సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలితా | స్వయమే వోత్సితా తత్ర వికృతాననదర్భనా॥ 3-2] వ్గో। పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్టత ముంచమానా మహానాద మబ్రవీత్ సవనాత్మజమ్॥ 3-22 శ్లో కస్ట్యృంకేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహ యత్తత్ష్యం యావత్ (ప్రాణా ధరంతి తే॥ 3-23 క్లో న శక్యం ఖల్వియం లంకా ్రవేష్పుం వానర త్వయా! రక్షితా రావణబలై రభిగుప్తా సమంతతః॥ 3౩-24 శ్లోః అథ తా మ వీ ద్వీరో హనుమా నగ్రతస్తితామ్ కథయిష్యామి తే తత్తం యన్మాం త్వం పరిషృచ్చసి॥ 3-25 శ్లో! కా త్వం విరూపసనయనా పురద్వారే2వతిష్టన కిమర్హం చాపి మాం రుద్దా నిర్భర్సయసి దారుణా॥ 3-20 ఆ లంకాపురియే స్త్రీ రూపమును ధరించి ఆంజనేయుని ఎదుటకు వచ్చి నిలచెను. ఆమె యొక్క ముఖము వికృతముగా నుండెను, ఆమె కన్నులు, చూపులు కూడా వికృతముగా నుండెను. కంఠస్వరము కూడా భీషణముగా నుండెను. అట్టి భీషణ కంఠస్వరముతో అంజనేయునితో లంకాపురాధిదేవత ఇట్టు పలికెను. (అందమైన లంకను పాలించువారు వికారముగా నున్నారని చమత్కారము) “ఓ వనాలయా! నీవెవరవు? ఏమి పనిమీద యిచ్చటకు వచ్చితివి? నీవు (ప్రాణములతో నుండగా తత్వమును చెప్పుము. వనాలయం అనగా అడవులలో తిరుగు కోతి అని సామాన్య అర్ధము. తేజస్సులు ఆలయముగా కలవాడవు అని విశేషార్థము. (వనమాలి) వనము = (బ్రహ్మము, 'బ్రహ్మవనం బ్రహ్మ స వృక్ష ఆ సీత్, అనగా (బ్రహ్మ స్వరూపుడవు. ఈ దేహములోనికి ఏమి పనిమీద వచ్చితివి అనుటలో దేహబడద్దుడ వగుటకా? లేక దేహములతో కూడిన లోకమునందు కూడా (బ్రహ్మమును దర్భించుటకా? అని ఆమె మాటల తాత్పర్యము. నీవు కేవలము దేహ మాత్రుడవా? లేక (బ్రహ్మమని గుర్తున్నదా? (ప్రాణమును ధరించుట, ఆ 'బ్రహ్మతత్వమును గుర్తించు కొనుటకే.
656391౬. లంకా ప్రవేశము ర్1 రావణుని బలము చేత కాపాడ బడుచూ గుప్తముగా నున్న ఈ లంకలోనికి (ప్రవేశించుట వానరుడవైన నీకు అశక్యము. రజోగుణ, తమోగుణములతో కూడినది మానవ దేహము. నీవు వానరునిగా ఇందు (ప్రవేశింప లేవు, దేవుని అనుగ్రహము, అనుమతితో మాత్రమే ప్రవేశింపగలవు. తన ముందు నిలచిన లంకతో హనుమంతుడు ఇట్టనెను.” నీవు నన్నడిగిన తత్వమును చెప్పెదను. లంక అడిగినది లోకసంబంధమైన ప్రశ్న గాదు. ఆత్మ తత్వమునకు సంబంధించిన పరిప్రశ్న. కావున ఆ తత్త మందే చెప్పెదనని హనుమంతుడు అనెను. నీవు నన్నడిగితివి. ఆ తత్వమును చెప్పెదను. అనగా నీవు = నేను - అను భేదముల కతీతమై ఆ రెండుగా దిగివచ్చిన ఒకే ఆత్మతత్త్యమును చెప్పెదను. శరీరమే ఆత్మ అనుబుద్దిని కలిగించుటయే విరూసము. మాయలేక (ప్రకృతి. ఇదియే దేహాత్మ భ్రాంతి. విరూసము. మారురూపము. శరీరమను పురము యొక్క ద్వారమునకు అడ్డుగా నీవు వికారమైన రూపముతో యేల వున్నావు? నన్ను ఎందువలన కరినముగా అడ్డుకొనుచున్నావు? రూపమున కతీతమైనది ఆత్మస్టితి, రూపముతో కూడిన దేహములోనికి నేను వచ్చుచుండగా అడ్డగించుట యేల? “నేను” దేహము తోడి ఈ సృష్టిలోనికి దిగిరాక తప్పదు. “నీవు” అను ప్రజ్ఞ రూపాతీతమైన ఆత్మ తత్వములోనికి ప్రవేశింపక తప్పదు. నేను అను తత్వమును నీవు అను ప్రజ్ఞ అడ్డగింపజాలదు. విరూోపనయన = వ[్రదృష్టి, సుదర్శనము లేని చూపు. శ్లో॥ హనుమ ద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ ఉవాచ వచనం [క్రుద్దాం పరుషం పవనాత్మజమ్ 3-27 శ్లో అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతిక్షా దుర్రర్షా రక్షామి నగరీ మిమామ్ 8-28 శ్లో! న శక్యా మా మవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా అద్య ్రాజైః పరిత్యక్తః స్వప్పుసే నిహతో మయా 3-29 వ్ధో అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లనంగమ సర్వతః పరిరక్షామి హ్యే తత్తే కథితం మయా 3-30 క్లో లంకాయా వచనం శ్రుత్వా హనుమా న్మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్టు స్థిత శ్లైల ఇవాపరః ౩-31
52 సుందరకాండము
హనుమంతుని మాటలు విని కామురూపిణియగు లంక వాయు పుత్రునితో పరుషముగా ఇట్లనెను. “మహాత్ముడగు రావణుని అజ్ఞప్రకారము నేను ఈ నగరము రక్షించుచున్నాను. నన్ను ఎదిరింప ఎవ్వరికిని సాధ్యము కాదు. నాకు తెలియకుండా నీవు లోనికి ప్రవేశింప జాలవు. ఇప్పుడే నా చేత చంపబడి శాశ్వత నిద్రపోయెదవు. ప్రవంగమా! నేనే లంకానగరిని అన్నివైపుల నుండి కాపాడుచున్నాను” అనినది. ప్లవంగ మనగా కోతి అని సామాన్య అర్ధము. అట్టుగాక తేలియాడుచూ [ప్రయాణించగలవాడని మరియొక అర్హ మున్నది, అనగా అతను సంసారమం దుండును. కాని అతనికి సంసార ముండదు. తామరాకుసై నీటిబొట్టవలె బంధముల కంటక ముక్తుడై చరించు వాడని విశేషార్ధము.
లంకానగరదేవత మాటలు విన్న వాయుపుత్రుడగు హనుమంతుడు అపర పర్వతము వలె నుండెను. తన శ్వాసను, వాక్కును సర్యాంతర్యామి యగు (బ్రహ్మము నందు నిలిపెను. (హరి :; హ= నిశ్వాసము, రి = వాక్కులనుచ్చరించుటకు కంఠనాళముల మధ్య జరుగు ప్రయత్నమును సూచించును). దేహములోనికి (ప్రవేశింప బోవుచూ తన మనస్సును, శ్వాసను (ప్రణవముగా హనుమంతుడు నిలిపెను. అప్పుడు అంతర్యామి యందు తా నుండుటచే తనకన్నా యితరము లే దయ్యెను. దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు వాటితో కూడిన యిహలోక మంతయూ తా నను వెలుగు యొక్క కిరణములుగనే భాసించెను. కావున శరీరము కల్పించు మాయాబంధముల కితడు భయపడక కొండవలె నిల్చెను. (శరీరము బంధములు కల్పించునని భయపడువాడు శరీరములో నున్న అంతర్యామిని దర్శింపజాలడు.) హనుమంతు డట్టుగాక తన శ్వాసను, మనస్సును, వాక్కును, శరీరమును అంతర్యామియగు ఈశ్చర ప్రజ్ఞతో నిండినవిగా దర్శించెను. '3ైల” మనగా మానవుని వెన్నెముక అని యోగశాస్త్ర సంప్రదాయము. కావున హనుమంతుడు తన వెన్నెముకలో దాగిన “సుషుమ్న”యందు ప్రజ్ఞను నిలిపిన వాడై శరీరస్థితికి అతీతుడై నిలచెను.
శ్లో స తాం స్త్రీరూప వికృతాం దృష్ట్యా వానరపుంగవః
ఆబభాషే2థ మేధావీ సత్త్యవాన్ ప్లవగ ర్షభః 3-32
వానరులలో (శ్రేష్టుడను. తేలియాడుచూ పోవువారిలో వృషభము వంటి వాడను అగు హనుమంతుడు మేధతోను, బలముతోనూ కూడిన వాడై వికారమైన స్రీ రూపముగల అంకను చూసి ఇట్లు పలికెను, “ఇచ్చట వృషభ పదమును (శ్రేస్ర్రాచకముగా కొందరు భావింతురు. కాని దీని సూటి అర్హమునే మనము
లంకా (ప్రవేశము ర్3 (గ్రహింపవలెను. కంరనాళముల ఒరపిడిచే వెలువడు “రేఫము” వాక్కుల ఉత్పత్తికి మూలము. కావున దీనిని “నంది” నాందీ వాచకము అందురు. వాక్కు నుచ్చరించు వానిలోని ఈశ్చరుడు అనుభూతిమయమగు వాక్కను ఎద్దును యెక్కి వినువారి హృదయములలోనికి ప్రవేశించి వారిని తన 'ప్రజ్ఞలోనికి కరగించును అని బుగ్వేదము చెప్పుచున్నది.
“రేఫ” రామ నామమునకు మొదటి అక్షరము. హనుమంతుడు తన శ్వాసను, మనస్సును రాముని యందు నిలిపి వాక్కు రామమయము చేసి శరీర సంబంధమగు ఇహలోకమును దాటిన వాడై నిలచెను. ఇప్పు డితనికి స్వయమగు మేధ లేదు. స్వయమగు బలమును లేదు. పై మంత్రములో చెప్పబడినట్లు ఇతని మేధను అమృతమయమగు రాముని ప్రజ్ఞ తాకెను. రాముడే బలము, ఈ మేధ, బలము దివ్యములు. వీటితో కూడిన వాక్కుతో అధోమయ ప్రకృతి యగు లంకతో హనుమంతుడు ఇట్టి మధురసుధామయములగు వాక్కులతో ప్రసంగించెను. నంది అను పదమునకు ఇదియే అర్ధము. తరువాత రావణుడు తన సభలోనికి 'ప్రవేశించుచున్న హనుమంతుని కైలాసము నుండి తన వద్దకు వచ్చుచున్న నందీశ్వరునిగా దర్శించెను.
క్లో (ద్రక్ష్యామి నగరీం లంకాం సొట్ట (ప్రాకార తోరణామ్
ఇత్యర్హ మిహ సంప్రాప్త పరం కౌతూహలం హి మే 3-33
(ప్రాకారములు, తోరణములతో కూడిన లంకానగరమును చూడగోరుచున్నాను. ఈ పనికై ఇచ్చటికి నేను వచ్చినాను. నాకు పరము నందు కుతూహలము కలదు. (లంక యొక్క వంకరలను సరిదిద్దవలయునని కుతూహలము కలిగి నేను వచ్చితిని).
'ప్రాకా రమనగా చక్కని ఆకారములేక మంచి పని లేక సుందరమైన నిర్మాణము. తోరణము లనగా నవద్యారములు. వీటితో కూడిన శరీరములోనికి జీవుడు తాను సంకల్పించి రాలేదు. ఇచ్చటికి అనగా ఇది అని చూడదగిన భౌతిక స్థితి లోనికి దేవుని సంకల్పము వలన, జీవుడు వచ్చును. ఈ కధలో ఈశ్చరుడగు రాముని సంకల్పము వలన జీవుడగు హనుమంతుడు లంకకు వచ్చెను. ఇతడు వచ్చుట సామాన్యమైన ప్రాప్తి కాదు. ఇది సమ్యక్ ప్రాప్తి అనగా లంకలోని అధోమయ కక్ష్యయందు జీవించువారు, ఉన్నత దివ్య కక్ష్యృకు ఉద్ధరింపబడుటకు గాను రాముడు చక్కని సంకల్పము చేయుట వలన, హనుమంతుడు లంకకు వచ్చుట జరిగినది.
క్డ సుందరకాండము దేవుడు జీవుని శరీరములోనికి పంపుటలోని ఉద్దేశ్యము. శరీర బంధములో ఇతడు చిక్కు కొనుటకు గాదు. శరీరమును కూడా తన ఆలయముగా తన తేజస్సు యొక్క విస్తారముగా జీవుడు దర్శించి దేహాభిమానమును త్యజించి తన యందు కరగుటయే దేవుని సంకల్పము. కావున హనుమంతుడు లంకను చూచుటకు మాత్రమే వచ్చె ననెను. కాని వాస్తవముగా సీతను చూచుటకు వచ్చెను. పైకి చూచినచో హనుమంతుడు లంకాదేవతకు భయపడి అబద్ధ మాడుచున్నా డనిపించును. కాని యిందు అసత్యమేమియునూ లేదు. పరాశక్తి యగు సీతను దర్శించుట దేవాలయమగు శరీరమునందే జరుగును. శరీరము యొక్కపై ఆకారము శిరస్సు. అందు ద్వారములు, ఇంద్రియములు ఆపైన (ప్రాణ సంచాలనము. మనస్సు, బుద్రి అను (క్రమసోపానములపై పరిణమించి ఆత్మయొక్క అనుభూతిలోనికి పర్యవసించును. ఆత్మఅనగా ఇదేమియూ కాక వేరుగా వుట్టి కట్టుకొని (వ్రేలాడుట కాదు. ఇవన్నియూ తానై వీనియందు అంతర్యామిగా యున్నదే ఆత్మ. కనుక హనుమంతుని దృష్టిలో సీతకును, లంకకును భేదము లేదు, అబద్ధ మాడకుండుటయే గాక పరమైన సత్యమనితడు దృఢముగా చెప్పెను. హనుమ సాధారణ జీవుడు కాడు. పరిణామమున అత్యున్నత వికాసము నందిన అందువలన ఐహిక జగత్తునకును, పరమైన వెలుగునకునూ అభేద దర్శనము సం్రాప్తమైనది. దేహమునందు వళశించుచూ ఐహిక జీవితమును గడుపుచునే యుండును, నా కుతూహలము పరమమైనది అనగా అనన్యమైనది. సర్యోతృృష్టమైనది. అనగా పరమ పురుషుని యం దున్నదని హనుమంతుడు లంకకు చెప్పెను. రామాయణ రచనకు పూర్వము వాల్మీకి, నారదుని పరిప్రశ్న చేయుచూ తనకు పరునియందు కుతూహలముగా నున్నదని చెప్పెను, ఇట్టు ఇహమునందు. పరమును దర్శించు వాడు, ఇహమునందు చిక్కుకొనడు. ఇహపరములను వేరుగా చూసి వానిలో ఒక దానిని పట్టుకొని (వ్రేలాడువాడు తప్పక ఇహమునందే చిక్కుకొనును. హనుమంతుడు ఇహపరములకు, తనకు పరమాత్మకు ఉన్నతమైన దివ్యవారధి కలిగి దానిపై తేజోమయమైన పయనము చేయువాడు. ఇట్టివాడు కావుననే శరీరకక్ష్యలో చిక్కుకున్న జీవులకు దివ్య వికాసము కల్పించి వారిని పరమాత్ముడగు రాముని సాన్నిధ్యమునకు చేర్చగలవాడు. హనుమంతుని మాటలు, వాచ్యార్హ, సూచ్యార్థములతో కూడినవే గాక వేదార్హ సమన్వితములై ్రకాశించుచున్నవి. న్లోః వనాన్యుపవనా నీహ లంకాయాః కాననాని చ, సర్వతో గృహముఖ్యాని ద్రష్టు మాగమనం హి మే 3-34
లంకా ప్రవేశము ర్ర్
లంకలోని వనములు, ఉపవనములు, అడవులు ముఖ్యమైన గృహములు చూచుటకు నేను వచ్చితిని. వనము లనగా తేజస్సులు. పరమాత్మయను వెలుగునుండి కిరణములుగా వెలువడిన సూర్య, చంద్రాది దేవతలు, జీవుల శరీరములలోని (ప్రాణ మనో బుధ్యాదులు. ఉపవనము లనగా అంతర్యామికి సమీపముగా ఆరోహణము చేయుచున్న వెలుగులు. అనగా దేవుని నుండి అవరోహణ (క్రమమున దిగివచ్చిన వారు. తిరిగి దేవుని సాన్నిధ్యమునకు ఆరోహణ (క్రమమున '్రయాణించెదరు. ఈ మొత్తము. కలిసిన చ(క్రభ్రమణమే దేవుని వైభవము. ఇదే హనుమంతునకు దర్శనీయము. ముఖ్యములైన గృహము లనగా ముఖము నందలి స్టానములని అర్హము. అనగా వాక్కు. అది ఉత్పత్సియగు కంఠమునందలి నాళములు, శ్వాస అది వెలువడుటకు కారణమైన సృదయము నందలి చోటు. వాక్కు ప్రసారమగుటకు అధిపతులగు దేవతలు లయ, తాళ రాగములకు అధిపతులగు దేవతలు మున్నగువారు. అంతేగాక గృహము అనగా తీసుకొనబడినవి. తా నాత్మగా ఉండగా తా నుండుటకై సాలెపురుగు చుట్టూ గూడువలె, తన చుట్టూ అల్టుకున్న ఆవరణములైన విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ కోశములు. సాలెపురుగు నోటి నుండి వచ్చిన దారముచేతనే దానిచుట్టూ గూడు అల్లబడును. అట్టే ఆత్మయనెడి. వెలుగు రేఖలే మిగిలిన కోళశములుగా హనుమంతుడు దర్శించుచున్నాడు.
క్లోః తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ,
భూయ ఏవ పున ర్వాక్యం బభాషే పరుషాక్షర్ 3-35 శ్లో, మా మనిర్దిత్య దుర్భుద్దే రాక్షసేశ్చర పాలితమ్ న శక్య మద్య తే ద్రష్టుం పురీయం వానరాధమ 3-36 ఆతని యొక్క మాటలు విని కోరికలలో చిక్కుకొనిన (కామరూపిణి అయిన) లంక మరల ఇట్టు పరుషముగా పలుకుచున్నది, ఒక్క హనుమంతుని యెడల మాత్రమే. కాక ్రతిజీవునితోను రజో, తమో, గుణాత్మకమగు ప్రకృతి ఇట్టే మాట్లాడును. కావున ఈ సలుకులు “అ-క్షరములు” - అనగా నళింపనివి.
“* ఓ దుర్భుద్దీ! వానరులలో ఆధముడైన వాడా! నన్ను జయింపకుండా రాక్షస 'ప్రభువుచే పాలింపబడుచున్న ఈ పురమును చూచుట శక్యము కాదు. హనుమంతుడు శరీరములోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నాడు. శరీరము తమోగుణముచేతను, అందలి ప్రాణము రజోగుణము చేతను ఏర్పడుట వలన శరీరములో చేరిన జీవుని
రక్ సుందరకాండము ఈ రెండు గుణములు బాధించును. కావున ముందే ఆగుణములను జయింపవలెను. అట్టు జయింపక పోయినచో బుద్ది అను దీసమునకు తమస్సను పాగయు, రజస్సను దుమ్ము [క్రమ్మి నరజాతికంటె కూడా వెనుకబడి యున్న వానరులలో అధము డగును. లంకయొక్క మాటలు హెచ్చరికలే గాక అభ్యర్థ్హనమును కూడా సూచించుచున్నవి. రాక్షసుల దుష్ట ప్రకృతిని జయించి, వారిని కాపాడుమని ఆమె హనుమంతుని వేడుచున్నది. కాని ఆమె మార్గము హఠయోగ విధానమునకు చెందినది. కామ॥క్రోధాది దుర్షణములను తరింపవలెననుట యుక్తమే గాని, అందులకై వానితో పోరాడుట సరిల్రైన పద్దతికాదు. ఇది ఎన్ని జన్మలకైననూ తెములునది కాదు. దుర్గణములతో పోరాటము చేయుటలో, పోరాడుచున్నవాని అహంకారము, స్వంతప్రయత్నము, దుర్గుణముల ధ్యానయు పెరుగును. పోరాటము తెమలక నిరాశ, విషాదము కలుగును. అంతియేకాక పోరాటము, ఘర్షణ భగవంతుని సృష్టిలో సహజములైనవి కావు. దుర్గుణముల కక్ష్య నుండి దివ్యములగు సద్గుణముల కక్ష్యలోనికి ప్రయాణము, వికాసము మాత్రమే జరుగుట సృష్టిలోని సహజ ధర్మము. ఈ విధమైన క్రమ వికాస మార్గము పరంపరగా వచ్చుచున్నది. ఈ మార్గము సద్గుణములను, దివ్య ఆకర్షణములను ప్రసాదించు, పరమైన వెలుగు వైపునకు మరలించి, వానిని ఉదాత్తము చేయుట జరుగును. ఇదియే రాజయోగ విధానము. హనుమంతుడు ఈ మార్గమును ఆమె యందు భాసింపచేయగోరుచున్నాడు. శ్లో, తతస్స కపి శార్దూల స్తా మువాచ నిశాచరీమ్ దృష్ట్వా పురీ మిమాం భద్రే పునర్యాస్యే యథాగతమ్ 3-37 అంతట కపులలో (శ్రేష్టుడగు హనుమంతుడు లంకతో “ నేను ఈ పురమును చూచి మరల వచ్చెద” ననెను. కపి అనగా నీటిని (త్రాగువాడు అని అర్హము. నీటిని, అవిరి రూపమున (త్రాగువాడు సూర్యుడు. కావున హనుమంతుడు ఆదిత్యుని వలె గొప్పు తేజస్సు గలవాడు అని అర్హము. భగవంతుని వెలుగునకు ఇతడు వాహకుడు. లంక నిశాచరి, అనగా తమోగుణముతో కూడినది. ఇప్పుడు హనుమంతుడు తన జ్ఞాన తేజస్సుతో లంక యొక్క తమస్సును (చీకటిని) తాలగింప జేయుచున్నాడు. లంక తన తమోగుణము వలని హనుమంతుని దుర్చుద్దిగను, వానరాధముడుగను భావించెను. కాని హనుమంతుడు రామ సంబంధమగు శుద్ద సాత్విక తేజస్సుగల వాడగుటచే ఆమెను “భద్రే” అని సంబోధించెను. భద్ర అనగా శుభము లేక శ్రేయస్సు. జీవులకు భద్రమగు స్టితి భగవంతుని సాన్నిధ్యము. అదియే మోక్షము.
లంకా ప్రవేశము 5్7 తమస్సును తుచ్చముగను, నీచముగను చూడరాదు. తమస్సుకూడా శుద్దసత్వము యొక్క ఒక రూపముగా జగన్మాత యొక్క (ప్రభావముగా దర్శించువాడు, తమస్సునకు అతీతు డగును. ఇతరులలో చెడును చూచెడి వారి దృష్టికిది విరుగుడు. (ప్రేమతో వారిలోని మంచిని దర్శించుటయే. ఇట్టి దృష్టిని కలిగిన వానికి మంచి, చెడులు, వెలుగు, చీకటులు, చైతన్య, జడములు మున్నగు భేదములు కానరావు. భగవంతుని వైభవము అఖండ సుందరముగా దర్శన మిచ్చును. ఇట్టి సుదర్శనము గల హనుమంతుడు లంకను కూడా భద్రస్వరూపిణిగా దర్శించి, వినోదించి, పోయిన మార్గముననే తిరిగి వచ్చెదను అనుచున్నాడు. అనగా దేహములోనికి పోవునపుడునూ దేహమునుండి వెడలునప్పుడునూ కూడా అదే స్థితిలో నుండ గలవాడు. అనగా జనన మరణములు అతనికి లేవు. అత నెపుడునూ ఆ రెంటి కతీతమైన అమృత స్టితిలోనే యుండును. దీనినే (బ్రాహ్మాయస్టితి యని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్నాడు. ఈ స్టితిని పొందినవాడు తమస్సుతో పోరాడ వలసిన పనిలేదు. తమస్సు అని అతనికి వేరుగా వుండదు. ఇట్టి వాని చూపు, పలుకు, స్పర్శాదులచే తామసిక ప్రకృతి కూడా దివ్యమై ఉదాత్తమై శుద్ద సత్వమయ మగును, పరిసరములకు లొంగక వానినే తనవైపున కాకర్షించి తన తత్త్యములోనికి కరిగింప జేయు సామర్యమునే పతంజలి మహర్షి ఈశత్వమని పేర్కొనెను. క్లో తతః కృత్వా మహానాదం సావై లంకా భయావహమ్ తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగితా 3-38 అంతట లంకాది దేవత భయంకర నాదము చేసి తన అరచేతితో కొట్టెను. హనుమంతుని వంటి పరమగురువు సందర్శనము, సాంగత్యము, మధుర సల్ఫాసములు కూడా లంకను మార్చలేక పోయినవి. హనుమంతుని నుండి యోగ ప్రసారము తేజోమయమై ఒప్పారుచున్నను, ఆ ్రవాహములో మునుగుటకు లంక సిద్ధముగా లేదు. రజస్తమోగుణములను పోరాడి జయింపవలెనని ఆమె ఉద్దేశము. హనుమంతుడు అందులకు విరుద్దము. అందువలన ఆమె అతనిని తన మార్గమున టప్రేరేపించుటకై తన అరచేతితో కొట్టెను. అనగా సత్యముతో తమస్సు ఘర్షణకు దిగెను. అతనికి భయము గొల్పుటకై పెద్దగా ధ్వని చేసినది. అనగా జీవునిలో దాగిన కామ క్రోధాది దుర్గుణములు అతనిని ఆవేశముతో నింప ప్రయత్నించుటకై గగ్గోలు పెట్టుచుండెను. సత్య్యగుణ సంబంధములైన ఆలోచనలు వచ్చినప్పుడు, మనస్సు ్రసన్నముగా నుండును. ప్రాణశక్తి శరీర మంతటా సమతుల్యముగా ్రసరించును. మనస్సు
ల్8 సుందరకాండము రాజసిక, తామసికములైన ఆలోచనలు చేయు నప్పుడు ఆవేశము యొక్క పేడనమునకు లోనై యుండును. ప్రాణశక్తి వక్రమార్గమున (ప్రసరించుచుండును. రజోగుణములోను, తమోగుణములోను ప్రవర్తించు జీవులు పెద్ద పెద్ద కేకలు వేయుచుందురు. సమత్వము తప్పి ఉద్రేక (ప్రేరితులై అరచుచుందురు.
శ్లో తత స్ప కపిశార్హూలో లంకయా తాడితో భృశమ్
ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ: 3-39
అంతట హనుమంతుడు లంక చేత కొట్టబడిన వాడై శ్వాసను, హృదయ మందలి ఆత్మతో అనుసంధించి చక్కని మహానాదమును చేసెను. హనుమంతుడు తామసిక (ప్రకృతి చేత కొట్టబడినను లొంగలేదు. అనగా కామ॥క్రోధాది దుర్గ్షణములను (ప్రేరేపించునట్టి పరిస్థితు లేర్చడి ఆతనిని బలముగా ఆకర్షించిననూ అతడు వానికి లొంగలేదు అని అర్థము. దీనికి నిదర్శనమే తరువాత రావణుని అంత;ఃపురము నందు. విలాసవతులగు స్త్రీలు, సునర్హ రత్నాభరణములు, భోగ భాగ్యములు కనబడిననూ, వాటికి అతీతుడై నిలచెను. అంతమాత్రమున అతడు దుర్గణములతో కూడిన ప్రకృతి యెడల అలసత్వము వహించెనని కాదు. కావున అతడు పవనాత్మజుడు అయ్యెను. అనగా తనలో శ్వాసగా చలించుచున్న గాలిని ఆత్మయగు రాముని యందు సంధించి ఆ అనుభూతితో నిండెను. అంతట హనుమంతుడు సుమహానాదము చేసెను. లంక చేసినది మహానాదము. హనుమంతుడు చేసినది సుమహానాదము, అనగా అంతకంటే పెద్దగా అరచెనని అర్హము కాదు. “సు” అనగా మంచి అని అర్ధము. మంచి నాదమేది? నాదములకెల్ల మూలమైన నాదము. నాదములు మన (ప్రయత్నముతో ఉచ్చరింపబడునవి. మహానాదము ఆవేశముతో ఉచ్చరింప బడునది. మన ప్రయత్నముతో సంబంధము లేక మనలోపల తనంత తానుగా 'ప్రసారమగుచున్న నాదము ఒకటి కలదు. అదియే “ప్రణవము”.
ళ్ళ స్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వ్వయంకృతః
సా తు తేన ప్రహరేణ విహ్వలాంగీ నిశాచరీ
లంకకు హనుమంతుని స్పర్శవలన కలిగినది ప్రహారము. హారమనగా కూర్చు. (ప్రహార మనగా చక్కని కూర్పు. రజస్తమస్సులతో కూడిన అసుర స్వభావమును, శుద్ధ సత్సమయమగు పరాస్రకృతి అయిన సీతతోను, ఆమెకు అధిష్టాన మగు శ్రీరామబ్రహ్మముతోను సంధానమును హనుమంతుడు కూర్చేను. అనగా చీకటిని వెలుగుగా తీర్చెను. ఆసురత్వమును దివ్యముగా చేసెను. అతని దర్శనమునకు మంగళమగు పిలుపునకు పూర్తిగా వశము గాని లంక, అతని దివ్య స్పర్శకు లొంగి పోయినది.
లంకా ప్రవేశము 59
మహాత్ములగు పరమ గురువులకు, తమోగుణ పీడితులగు వ్యక్తులకు నడుమ సన్నివేశములు ఎప్పుడునూ ఇట్లే జరుగుచుండును. కావున ఈ ఘట్టము ఎప్పుడో జరిగినది కాక, ఎప్పుడునూ జరుగునది. మహాత్ముల దృష్టి వలన కొందరు, వారి పలుకు వలన వారి స్పర్శవలన మరికొందరు మానవత్వము లోనికిని, అటునుండి దివ్యత్వములోనికి (ప్రవేశింతురు. మహాత్ముల దేహాణువులలో కూడా దివ్యత్వము వర్తించుచూ, నర్తించు చుండుటయే దీనికి కారణము. అజ్ఞాన మను చీకటిలో చరించుచున్న లంక హనుమంతుని దివ్య స్పర్శకు మధురానుభూతిలో మునిగెను. మనస్సులోని ఆవేశములు, ఆలోచనలు శాంతించి శరీరము కూడా తేలిక యయ్యెను. ఇం(ద్రియార్హములగు బాహ్య విషయముల నుండి ఇంద్రియములు వెనుకకు మరలినవి. ఇంద్రియములకు దాసుడై వర్తించు మనస్సు కూడా, ఇపుడు బుద్ధియందు సంగమించెను. బుద్ది ఆత్మయగు భగవంతుని యందు లీనమయ్యెను. అవయవముల చేష్ట లుడిగి పోయెను. సమాధి స్టితి కలిగెనని భావము.
కో పపాత సహసా భూమౌ వికృతాననదర్శనా
తతస్తు హనుమాన్ ప్రాజ్జస్తాం దృష్ట్వా వినిపాతితామ్ 3-42 జ కృపాం చకార తేజస్వీ మూన్యమానఃస్రియం తు తామ్ తతో వైభృశ సంవిగానలంకా సా గద్గదాక్షరమ్ 3-43
లంక యొక్క వికృత రూపము భూమిపై పడెనని సామాన్యార్హము. ఇచట పడినది లంక కాదు. లంక శరీరము తేలికై (ప్రజ్ఞ అంతర్యామి యందు అయింపగా, ఆమె ముఖిమునందు దర్శన మిచ్చు వికృతి, వెంటనే భూమిపై పడెను. జీవుల (ప్రకృతి సహజముగా ఈళ్చరుని (ప్రకృతియే. ఇది పరిశుద్ధము, పవిత్రము, శుద్ద సత్సమయము. దీపపు కాంతి వలె స్వచ్చము, కాని దేహబద్దులైన తరువాత జీవుల ప్రకృతి, దీపమున కంటు మసి వంటిది. దానిని తుడుచుకొనుట వలన తిరిగి, దీపపు కాంతి ఉబ్వలముగా ప్రకాశించును. అపుడు ఆమెలోని వికృత లక్షణములు జారి పోయినవి. తొలగి పోయినవి.
ఆమెకు ఇట్టి అనుభూతి క్రొత్తది. అలవాటు లేనిది. పరిమిత ్రజ్ఞాశాలియగు జీవుని, అవతార మూర్తుల యొక్కగాని, దివ్యపురుషుల యొక్కగాని అనుగ్రహమున ఒక్కసారిగా అపరిమితమైన (బ్రహ్మానంద సాగరము ముంచెత్తినప్పుడు, జీవుడు తట్టుకొనలేక వణకి పోవును, ఎద అనుభూతితో నిండగా, వాక్కు వెలువడుట కష్టమగును. వెలువడుటకు యత్నము చేసినచో గొంతు డగ్నత్తిక వడును. జీవుని
60 సుందరకాండము ప్రజ్ఞ అంతర్యామి ప్రజ్ఞలో కొంత నిలిచి, కొంత ఈవలకు వచ్చుటయే దీనికి కారణము. (ధ్రువుడు మహావిష్ణువు నందు నిలిచి, తనయందలి యాతనిని తర్వాత వెలుపలను చూచునపుడు ఇట్టి స్పితియే కలిగెను. విష్ణురూపుడగు త్రీకృష్ణునుని దర్శించిన అర్జునునకు తాను వేరుగా భావించుకున్న వెంటనే భీతియు, డగ్గుత్తికయు కలిగెను.
“సగడ్గదః భీత భీతః ప్రణమ్య” - భగవద్గీత,
లంక హనుమంతుని ప్రసన్నుడవు గమ్మని వేడెను. వేడునప్పుడు ఆమె కాతడు సుమహాబాహుడై దర్శన మిచ్చెను. నారదుడు శ్రీరాముని కూడా యిట్టే వర్షించెను. ఇచ్చట లంకకు దర్శన మిచ్చినది, శ్రీరామచంద్రుడే. అంతేగాక తన్ను కాపాడుమని వేడినది. అనగా మరల రజస్తమోగుణముల లోనికి జారకుండ రక్షింపుమని ప్రార్టించినది. ఈ ప్రార్ధన చేయు నప్పుడు ఆమెకు హరిసత్తముడు దర్శన మిచ్చెను. సల్+తముడు = సర్యోన్నత సత్యస్వరూపుడగు శ్రీహరి (రాముడు),
ఫీ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ
సమయే సౌమ్య తిస్టింతి సత్త్యృవంతో మహాబలాః 3-45 క్ట అహంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ, నిర్ణితాహం త్వయా వీర విక్రమేణ మహాబల 3-46
ఇంతకు పూర్వము నన్ను కొట్టితివి. దెబ్బతినియున్నాను. ఇక చాలు. ఇపుడిక నీ విక్రమము చూపు సమయము కాదు. ఊరకుండుమని వేడుచున్నాను అని, లంక అన్నట్టు ఫైకి కన్పించును. పైన తెలుపబడిన యోగతేజోవికాసము పరిశీలించిన వానికి, ఈ వ్లోక మందలి భావము దాని కొనసాగింపేయని తెలియనగును.
ఇప్పు డిచట లంక విచిత్రముగా హనుమంతుని సంబోధించినది. “సౌమ్య” అని. సామాన్యమైన అర్ధముతో పరిశీలించినచో ఇది విరుద్రముగా కన్పడును. హనుమంతుడు ఆమెను కొట్టక పూర్వము “దుర్భుద్ది” యనియు, కొట్టిన తర్వాత “సౌమ్య” అనియు సంబోధించుట అసంభావ్యము. కావున హనుమంతుడు ఇచ్చినది దివ్యమాధుర్య స్పర్శ యనుట స్పష్టము. దానికి మురిసిన లంక, అతనిని “సౌమ్య” యని కీర్తించినది. సౌమ్యు డనగా ్రశాంతుడు, ప్రసన్నుడని యర్హము. అంతేకాక “సోముని కుమారుడని అర్ధము. సశఉమ=సోమ. ఉమా సహితుడైన శివుడే సోముడు.
“నమస్పోమాయచ రుద్రాయచ” (రుద్రసూక్తము)
అనగా చోటులో అంతర్జ్నిహితమగు నాదమునకు జీవుల శ్వాసయనెడు గానమునకు,
లంకా ప్రవేశము రే సామగానమునకు అధిపతి అయినవాడు. హనుమంతుని తేజస్సు, శ్వాస, వాక్కులు శివములైై లంకపై కురిసెను. అందుకు తనిసి, మురిసిన లంక హనుమంతుని సోముని కళగా దర్శించెను. సత్య్యవంతు అనగా బలవంతులని సామాన్యార్ధము. సత్+త్వమ్= సత్యమ్. సద్వస్తువు యొక్క భావమే. సత్త్యము. ఇచ్చట సత్యమగు శ్రీరాముని తేజస్సుకు వాహికయగుట వలన హనుమంతుడు సత్యవంతు డయ్యెను. హనుమంతుని బలము రాముడే. లోకములో ఎందరో బలవంతు లుండవచ్చును. కాని మహాబలవంతు లరుదు, విస్తారమయిన బలముగలవారే మహాబలవంతులు. లంకకు హనుమంతుడు (ప్రసాదించినది దివ్యస్పర్శ. కావున మహాబలవంతు డనగా తన స్పర్శతో ఎదుటి వారి మనోబుద్ద్యాదులను జయింపగల వాడని అర్థము. ఇంతేగాక వాయుదేవునకు మహాబలుడని వేదములో పేరు కలదు. వాయుపుత్రుడగు ఆంజనేయుడు తండ్రిగారి బలము కలవాడు. కావున మహాబలుడే. . విక్రమ - అనగా విశేషమైన (క్రమము. అ(క్రమముగా ఉన్న లంకయొక్క భౌతిక, మానసిక ఆధ్యాత్మిక, కక్ష్యలను హనుమంతుడు త్రివిక్రముడై సక్రమముగా నమర్చెనని భావము. “నేను లంకా నగరిని. నీ చేతిలో ఓడిపోయితిని” అనుటలో హనుమ లంకలోని వారందరిని జయించెనను భావము గర్భితమైయున్నది. శ్లో స్వయంభువా పురా దత్తం వరదానం యధా మమ యదా త్వాం వానరః కళ్ళి ద్విక్రమా ద్వశ మానయేత్ 3డీ? వో తదా త్వయా హి విజ్లేయం రక్షసాం భయ మాగతం సహి మే సమయ స్పౌమ్య ప్రొప్త2ద్య తవ దర్భనాల్ 3-డీ8ి శ్లో! స్వయం భువిహిత స్పత్యో న తస్యాస్తి వ్యతిక్రమః సీతా నిమిత్తం రాజ్జ్ఞస్తు రావణస్య దురాత్మనః 3-49 వ్ధో రక్షసాం చైవ సర్వేషాం వినాశ స్పముపాగతః త(త్ర్రవిళ్య హరి'శ్రేస్ట పురీం రావణపాలితామ్ 3-50 హనుమ పిడికిలితో లంకిణిని స్పృశించెను. నిశాచరి ఆచేతనయై నేలపై పడెను. ఆమె. నిగర్వియై గద్గదస్వరముతో హనుమంతునితో నిట్లనెను. “మహాబలా! రక్షింపుము. నీవంటి మహావీరులు మర్యాదను పాటింతురు. నేను లంకానగరిని, నీ మహాబల విక్రమముల చేత ఓడింపబడితిని. పూర్వము (బ్రహ్మ నా కిచ్చిన వరము
62 సుందరకాండము నాకు గుర్తుకు వచ్చుచున్నది. “ఎప్పుడు వానరుడు పరాక్రమముచే నిన్ను జయించునో అప్పుడు రాక్షసకులమునకు కీడు కలుగు" ననెను. నీ సందర్శనము చేత ఆ సమయము ఆసన్నమయినదని ఎరిగితిని. సీతామాత నిమిత్తముగా దురాళ్ముడైన రావణునికి (ఇంతకు పూర్వము రావణుని మహాత్మఅని పొడిగినది) వినాశ కాలము సమీపించినది. “నీవు నగరిలో ప్రవేశించి సుఖముగా అంతటనూ దర్శించుము” అనెను ఆత్మకానట్టి దేహమును ఆత్మ అని భావించుటయే విరూపము నందుట. అదియే మాయ. మహాపురుషులు అట్టి మాయచే కలుగు దేహాత్మ భ్రాంతిని జయించి, లోనికేగి ఆత్మను అన్వేషింతురు. ఇదియే హనుమంతుడు లంకిణిని జయించుటలో సూచింప బడుచున్నది.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖారీ వందే వాల్మీకి కోకిలం
వాల్మీకేర్మునిసింహస్య కవితా వనచారిణ;
శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాం గతిమ్.
గోష్పధీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలారత్నం వందే౭ నిలాత్మజమ్
అంజనానందనం వీరం జానకీ శోకనాశనం
కపీశమక్ష్తహంతారం వంచే లంకా భయంకరమ్.
మనోజవం మారుత తుల్యవె.
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి.
జీ అద్వార ప్రచేశము
శ్టో స నిర్జిత్య పురీం (్రేష్టాం లంకాం తాం కామరూపిణీం
విక్రమేణ మహాతేజా హనూమాన్కపిసత్తమః తంగ శ్లో అద్వారేణ మహాబాహుః ప్రాకార మభిపుప్లువే
ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః శం శ్ఫోః చక్రే2ంథ పాదం సవ్యం చ శత్రూణాం స తు మూర్ధని
(ప్రవిష్ట స్పత్షసంపన్నో నిశాయాం మారుతాత్మజః; శ్రి శ్లో స మహాపథ మాస్టాయ ముక్తాపుష్పవిరాజితం
తతస్తు తాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః న! శ్ఞః హసితోత్కష్టనినదై స్తూర్యఘోషపురస్సరైః
వజ్రాంకుశనికాశైళ్ళు వజ్రజాలవిభూష్తైః ఉర్ శ్లో॥ గృహమేఘై: పురీ రమ్యా బభాసే ద్యౌ రివాంబుదైః
ప్రజజ్యాల తదా లంకా రక్షోగణగృహై శ్ళుభైః కర కః సితాభ్రసదృశైళ్ళితైం పద్మస్వస్తికసంస్థిచైః
వర్హమానగృహై శ్చాపి సర్వత స్సువిభూషితా ఉ-7 క్లో, తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః
రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ శ-రి శ్టోః భవనాద్భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః
వివిధాకృతిరూపాణి భవనాని తతస్తతః డ-9 క్లో; శుశ్రావ కాంచీనినదం నూపురాణాం చ నిస్స్వనం
సోపాననినదాంచ్హైవ భవనేషు మహాత్మనామ్ శ్త11 క్లో ఆస్పోటితనినాదాంశ్ళ స్ష్వేళితాంశ్చ తతస్తతః
శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షోగృహేషు వై శ-12 శ్లోః స్వాధ్యాయనిరతాయ్హైవ యాతుధానాన్ దదర్శ సః
రావణ స్తవసంయుక్తాన్ గర్జతో రాక్షసానపి త్త్నఏ శ్లోః రాజమార్గం సమానృత్య స్థితం రక్షో బలం మహత్
దదర్శ మధ్యమే. గుల్మే రావణస్య చరా నృహూన్ తీంక్షేత్త
౮4 సుందరకాండము శ్లో, దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాససః దర్భముష్టిప్రహరణా నస్నకుండాయుధాం స్తథా డ-15 శ్లోః కూటముద్గరపాణీంశ్ళ దండాయుధ ధరానపి ఏకాక్షా నేకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్ ఉీ-16 ఖ్లోః కరాళాన్ భుగ్షవ[్రాంచ వికటాన్ వామనాం స్తథా ధన్వినః ఖడ్గిన్చైోవ శతఘ్నీ ముసలాయుధాన్ శ శ్ఞోః పరిఘోత్రమహస్తాంశ్చ విచిత్ర కవచోజ్జలాన్ నాతిస్త్టూలా న్నాతికృశాన్ నాతిదీర్జాతిహ్రస్వకాన్ శీ-18 హనుమంతుడు లంకలో ప్రవేశించు విధానము, ఆత్మ నన్వేషించు యోగి శరీరములోనికి (ప్రవేశించు విధానము ఇక్కడ వివరింపబడినది. ఆత్మాన్వేషణకు మహాయోగి శరీరములోనికి ప్రవేశించునపుడు, ఆత్మ తేజస్సులో శరీరము కలసి పోవును. కన్ను, ముక్కు, చెవి మొదలగు ద్వారముల ద్యారా జ్ఞాని శరీరములోనికి ్రవేశింపడు. లోనికి ప్రవేశించుటకు చర్మము, ఎముకలు, మొదలగు ప్రాకారము లేవీ జ్ఞానిని అడ్డుకొనవు. ఈ (ప్రాకారములను దాటి అంతరంగములోనికి ప్రవేళించి ఆత్మజ్యోతిని తెలుసు కొనగలడు. మాష్టర్ సి.వి.వి. గారి దర్శనానికి ప్రభాకర శాస్త్రుల వారు వెళ్ళినప్పుడు వారి శరీరము వ్యాధులతో చిక్కి శల్యావళిష్టమై శూన్యముగా నుండెను. అట్టి జీర్ణారణ్యములోనికి మాస్టరుగారి నామము నుచ్చరించినంత మాత్రముననే, ఒక నూతన మగుశ్రక్తి ఉత్సాహము నిండుకొన నారంభించెను. అది ఎక్కడ నుండి వస్తున్నదో తెలియదు. లోపల నిండుతున్నట్లు మాత్రము తెలియ నారంభించినది. ఆశక్తి ప్రసారానికి ఈ చర్మము ప్రాకారము లేనీ అడ్డుకాలేదు. గురువుల నుండి మనకు (ప్రసారమయ్యే జ్ఞానము, తేజస్సు అద్వారమున [ప్రాకారములను దాటి మనలోనికి ప్రవేశించునని ఈ అనుభవము తెలియజేయుచున్నది. శ్రీశా(్త్రిగారి సన్నిధిలో నాకిట్టి అనుభవమే కలిగినది. ఇట్టి భావమును తెలియజేయు కధ భారతమునందును కలదు. ఖ్దో అద్బారేణ రిపోర్లేహం ద్వారేణ సుహృదోగృహాన్। ప్రవిశంతి నరాధీరా ద్వారా ణ్యేతాని ధర్మతః “జరాసంధుని వధించుటకు (అనగా ముసలి తనమును) నిత్యయౌవనత్వమును (ప్రతిష్టించుటకై భీముడు, శ్రీకృష్ణుడు అద్వారమున (ప్రాకారమును అయఘించి
ఆద్యార ప్రవేశము రక్ జరాసంధుడున్న చోటుకు వెళ్లిరి” అని భారతము చెప్పుచున్నది. జరను అనగా ముసలి తనమును తొలగించుటకు, కేవలము భీముని యొక్క శరీరబలమొక్కటే పనిచేయ జాలదు. శ్రీకృష్ణుని దేవభావము. తోడు కావలెను. కనుక శ్రీకృష్ణుడు భీమునితో కలసి వెళ్లి జరాసంధుని తొలగించి "సహ-దేవుని” ప్రతిష్టించెనని, కథకు సమన్వయము.
అద్వారేణ రిపోర్లేహం : గేహము అనగా శరీరము, ఇల్లు అని కూడా అర్హము. రిపుగేహము అనగా కామ, క్రోధాది శత్రువులతో కూడి అల్లకల్టోలముగా, చీకటి మయముగా. నున్న శరీరములోనికి ద్వారముతో. నిమిత్తము లేకుండా జ్ఞాని ప్రవేశించి, విరోధులను పొరద్రోలునని భావము.
సీతమ్మ వారు కూడా అద్వార (ప్రవేశము, (ప్రాకారాది గమనము ద్వారా మనకు దర్శన మిచ్చినది. అనగా ఆమె అయోనిజ. అనగా తల్లి గర్భము నుండి వచ్చినది కాదు. ఆమె తాను మానవాకారము ధరింపవలెనని సంకల్పించి వచ్చినట్టిదే కాని కర్మ ఫలానుభూతి కొజకై జన్మయెత్తిన యామె కాదని అర్దము. ఆమె సాక్షాత్తు భగవతి. కనుకనే ఆమె ఈ స్పష్టికి సాక్షీభూతురాలే గాని ఆమె చేయవలసిన పను లేమియు నుండవు. దేనికి ఆమె కర్త కాదు. కర్రవ్యము లేనట్టిది. అనగా ఫలాని పని చేసి తీరవలయును అన్న నిబంధనకు అతీతమైనది. అయినప్పటికి ఆమె లోకమున చెడు కార్యములు పెచ్చు "పెరిగి పోయినందున వానిని నిరోధించుటకు, మంచి. కార్యములను ప్రోత్సహించి రక్షించుటకు దిగివచ్చినది. అందులక్రై ఆ కార్యక్రమము ననుసరించుటకై: లంకలో (ప్రవేశించి లంకలోని వంకరలను తొలగించుటకు, సత్కర్మాదులను ప్రోత్సహించుటకు వచ్చినది. ఆ విధముగా వచ్చుటకు ఆమెకు ఏ ద్వారము అక్కరలేదు. ఏ ప్రాకారము అడ్డురాదు. ఆ ఆత్మను దర్శించుటకు. వెళ్లుచున్న ఆంజనేయుడు" కూడా అట్టివాడే. కనుక ఆయన లంకలోనికి ద్వారముగుండా ప్రవేశించలేదు. ప్రాకారము కూడా దాటి వెళ్లెను. అనగా (ప్రాకారపు గోడలను ఎక్కి అవతలకు దూకి వెళ్లను అని చెప్పవలసిన అవసరము లేదు. (ప్రాకారము నుండియే ఆయన లోనికి (ప్రవేశింపగలడు. పరమగురువుల యొక్క ఆశీర్చచనము మనలోనికి (ప్రవేశించి, మన హృదయములను విప్పార జేయును. వారి యొక్క సిద్ధ సంకల్పములు మనలోనికి (ప్రవేశించుటకు ద్వారములు, (ప్రాకారములు అడ్డురావు,
ఈ విధముగా హనుమంతుడు లంకలోనికి అద్వార ప్రవేశము, (్రాకారాది గమనము గావించెను. రాజమార్గమున పోవుచుండెను. తెల్ల ముత్యములు, తెల్ల
6ఠ6 సుందరకాండము పూలుగల శుద్ధ సాత్విక తేజోమార్గములలో వెదకెను. వజ్రములచే అలంకరింపబడిన గృహములపై అతడు పోవుచుండగా, అవి నల్లని మేఘములవలె నుండెను. తమోమయము లయిన రాక్షసుల ప్రాణమయ, మనోమయాది కోశములే ఆ గృహములు. మలినములయిన భావముల చేతను, ఆచరణ చేతను అవి మబ్బులవలె నల్లనైనవి. అట్టి వారి హృదయముల యందు కూడా దహరాకాశ ముండును. హనుమంతుడు అందు చరించుచుండెనని భావము.
ఇక హనుమంతుడు స్త్రీలు సంచారము చేయు నప్పుడు కలుగు నగల శబ్దములను, రాక్షసులు చేయు వేదపఠనమును వినెను. రాక్షసులు కూడా వేదాధ్యయనము చేయుచుండెడి వారు. మంత్రములను జపించెడివారు. నిత్యమును హోమము చేసెడివారు. కాని ఈ పనులను బట్టి వారి మంచితనము నిర్ణయించుటకు వీలు కాదు. ఇతరులలోని అంతర్యామి యెడల, వారి (ప్రవర్తనను బట్టి మాత్రమే దేవతలా. మానవుల్హా అసురులా అని నిర్ణయింపబడును. సత్ర్రవర్రన, శరణాగతి లేనప్పుడు సై చెప్పిన జప, హోమాదు లన్నియూ నిరర్హకములే. వీరు మంత్ర తండత్రములను స్వార్ధము కొరకునూ, లోకాపకారము కొరకునూ ఉపయోగించు క్షుద్రోపాసకులు, ఇవే మంత్రతంత్రాదులను లోకహితము కొరకునూ, ఆత్మ వికాసము కొరకునూ ఉపయోగించు వారు దేవతాగుణసంపన్నులు అనబడుదురు. అందరు రాక్షసులు మేధస్సు లేనివారు, మొద్దువారు కాదు. వారు నేర్చుకున్న వేద పరిజ్ఞానమునకు తమజీవితమునకు పొత్తులేదు. పరిజ్ఞానము మేధకు సంబంధించినది. జీవితా చరణము హృదయ సంబంధి. హృదయముపై మేధ ఆధిపత్యము చహించుటనే రాక్షసత్వము అందురు. మేధపై హృదయము అధిపత్యము వహించుటనే, దేవత్వము అందురు. రాక్షసత్వము స్థానములో దేవత్వమును స్టాపించుటకే వీరి వద్దకు హనుమంతుడు వచ్చెను.
భోగ, భాగ్యములు, చీనిచీనాంబరములు, రత్నాభరణములు హనుమంతుని ఆకర్షింప లేక పోయినవి. అట్టని వాని యందు విముఖత లేదు. వాటిని చూచుట మాన లేదు. ఇవిగాక వివిధ ఆయుధములు ధరించిన రాక్షసులను కూడా చూచెను. ఇదంతయూ విరాట్ పురుషుని వైభవముగా దర్శించెను.
శ్లో నాతిగౌరా న్నాతికృష్ణా న్నాతికుబ్బా న్న వామనాన్
విరూపాన్ బహురూపాంళ్ళ సురూపాంశ్ళ సువర్భసః త్తీ-కేఫ క్లో ధ్వజీన్ పతాకిన్చైన దదర్శ వివిధాయుధాన్ శక్తివృక్షాయుధాంశ్చైవ పట్టసాశనిధారిణ: 4-20
అద్వార (ప్రవేశము 67 శ్లో; క్షేపణీపాశహస్తాంశ్చ దదర్శ స మహాకపిః స్రస్విణ స్వ్వనులిస్తాంఛ్చ వరాభరణభూషితాన్ త్షీం21ే శో! నానావేషసమాయుక్షాన్ యధా స్టైరగతాన్ బహూన్ తీక్షణశూలధరాంక్షైవ వట్రిణశ్చ మహాబలాన్ శృీ-22 శ్లో, శతసాహస్ర మవ్య[గ్ర మారక్షం మధ్యమం కపిః రక్షోధిపతినిర్దిష్టం దదర్శాంతఃపురా(గ్రతః శ్ష-23 శో, స తదా తదహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాత మద్రి మూర్లి ప్రతిష్టితమ్ డ్షీ-2డీ శ్లో, పుండరీకావతంసాభిః పరిఘాభి రలంకృతం (ప్రాకారావృత మత్యంతం దదర్శ స మహాకపిః శ్తీ-25 క్లో॥ థత్రివిష్టనిభం దివ్యం దివ్యనాదని నాదితం వాజొహేషితసంఘుష్టం నాదితం, భూషజై స్తథా శ-26 క్లో రథై ర్యాన్నై ర్విమానై శృ తధా హయగబైళ్ళులైః వారణ్జైశ్చ చతుర్హంతై శ్టేతాభ్రనిచయోపమై: క్ష-27 శ్లో భూషితం రుచిరద్యారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీర్యై ర్యాతుధానై స్పహ్రశః శీ-2ర5 శ్లోః రాక్షసాధిపతే ర్లుప్త్ప మావివేశ మహాకపిః స హేమజాంబూనదచ(క్రవాళం మహార్హముక్తామణిభూషితాంతం పరార్ష్య కాలాగరుచందనాక్తం స రావణాంతఃపుర మావివేశ శ29 శరీరము. భౌతిక ద్రవ్యమే అయిననూ, అది దేవుని వెలుగుతో తయారు చేయబడినది. ఇందుండి వచ్చు వాక్కులు దైవస్వరూప మగు శ్వాసచేత (ప్రసరింపబడుట వలన, అవియు దివ్యనామములే. గుజ్జములు, ఇంద్రియములు. రథము లనగా అన్నమయ కోశములు, విమానము లనగా మూలాధారమున కధిపతులైన ప్రజ్ఞలు, మృగము లనగా జీవునిచే వెదుకబడుచున్న దివ్యప్రజ్ఞలు. పక్షు లనగా ఉచ్చ్వాస, నిశ్వాసములను రెండురెక్కలు. వీటన్నిటి యొక్క విచిత్ర సమాహారమే శరీరమను దేవాలయము. (దేహో దేవాలయ (ప్రోక్తం) శరీరములోని సర్యాంగములను క్షాళనము చేయువారే దేవతలు. వీరితో సహకరించుచూ మనస్సునూ, వాక్కునూ, (ప్రాణమునూ
6కి సుందరకాండము సద్వినియోగ పరచుట లేదా దుర్వినియోగపరచుట జీవుని సంకల్పమునకు వదలివేయబడినది. అందు మొదటి మార్గము వారు భూమిపైగల దేవతలు అనబడుదురు. రెండవ మార్గము వారు భూమిపై గల రాక్షసులు అనబడుదురు. బంగారు కట్టడములు కలవు. అనగా నారాయణుని నిలయమగు సూర్యబింబమునుండి వెలుగుచున్న కిరణముల ద్వ్యారముననే జీవులు దిగి వచ్చుచున్నారు. రావణుని నివాసము మహానాగరికముగను, భౌతిక వైభవముతోను అలరారు చున్నదని కవి వర్షించుచున్నాడు. విజ్ఞాన శా(స్తము, లలిత కళలు కూడా రావణుని రాజ్యమున ఉచ్చస్థితిలో నున్నవి. కాని హృదయ ధర్మముతో ఇచ్చటి వారికి (ప్రమేయము లేదు. ఒక కన్ను గలవారు, ఒక చెవి గలారు, దద్రేలాడు కడుపు గలవారు మున్నగు వికృతాకారులు గలరు. అని వాల్మీకి వర్షించినాడు. తాము వినదల్చ్ఫుకున్నవి తప్ప ఇతరమైన మంచిని వినుటకు ఇష్టపడని వాడే ఒక చెవిగలవారు. భౌతికమైన ఖండ దృష్టి తప్ప అఖండమైన తత్త్యదృష్టి లేనివారే ఒక కన్ను గలవారు. జీవపరిణామమున వెనుకబడి, నిరంతరమూ పశుకక్ష్యలో జీవించువారే అట్టివారు. యజ్ఞ కుండము వంటి పొట్టను సాత్వికాహారములతో తృప్తి పరచక, ఆకలి కొరకు గాక రుచి కొరకై నిరుపయోగములు, హానికరమునగు వానిని తినుటకే జీవించువారు (వ్రేలాడు పొట్టల వారు. వీరు ఆహార దోషముల వలన ఉత్తమ కక్ష్యములోనికి వికాసము చెందక కామ (క్రోధమయమగు అధోకక్ష్యలోనికి వ్రేలాడుచుందురు. ఇట్టి వారితో కూడిన లంకను హనుమంతుడు హేయము, తుచ్చముగా గాక ఇదంతయూ భగవంతుని లీలావైభవముగా దర్శించెను. చంద్రాష్టకనము రచన : శ్రీ వేదాంతం ఆనందాచార్యులు వారు, గుంటూరు ళీ తతస్స మధ్యంగత మంశుమంతం జ్యోత్సావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్టే వృషం మత్తమివ (భ్రమంతమ్ ర్-1 వః లో కస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరజయంతం దదర్శ శీతాంశు మథాభియాంతమ్ 5-2
అద్యార ప్రవేశము రం ఖ్ళీ! యా భాతి లక్ష్మీ ర్భువి మందరస్టా తథా (ప్రదోషేషు చ సాగరప్టా తథైవ తోయేషు చ పుష్కరస్టా రరాజ సా చారునిశాకరస్టా ర5్-3 కో! హంసో యధా రాజతపంజరస్ట స్పింహో్ యధా మందరకన్హరస్టః వీరో యధా గర్వితకుంజరస్ట శృంద్రో2పి బ(భ్రాజ తథాంబరస్థః ద్-త్తి క్లో॥ స్థితః కకుద్మానివ తీక్ష్ణశ్చంగో మహాచల స్వేత ఇవోచ్చశ్ళంగః హస్తేీవ జాంబూనదబద్దశ్చంగో రరాజ చంద్రః పరిపూర్ణశ్చంగః ర్-క్ న్లో వినష్టశీతాంబుతుషారపంకో మహా([గ్రహగ్రాహవినష్టపంకః (ప్రకాశలక్ష్మ్యాశ్రయనిర్మలాంకో రరాజ చంద్రో భగవాన్ శశాంకః ర్-6 వః శిలాతలం [ప్రష్యా యథా మృగేంద్రో మహారణం ప్రాష్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యధా నరేంద్ర స్తదా (ప్రకాశో విరరాజ చంద్రః 5-7 క్టోః 'ప్రకాశచంద్రోదయనష్టదోషు ప్రవృత్తరక్షపెశితాశదోషు రామాభిరామేరితచిత్తదోషు స్వర్షప్రకాశో భగవాన్ ప్రదోషు క్కి ఆ సమయమున ఆకాశములోనున్న చంద్రుని హనుమంతుడు చూచెను. ఇతడు అవుల మంద యందు తిరుగుచున్న వృషభము వలె అనగా వృషభరాశియందు ఉచ్చస్థితిలో నున్నాడని అర్హము. లోకముల దుఃఖములు, పాపములు పోగొట్టువాడై సర్వ జీవులకు కాంతిని ప్రసాదించు. వాడై చల్లని కిరణములతో చంద్రుడు తిరుగుచున్నాడు. మనోహరమయిన వెన్నెలను కురిపించుచున్నాడు.. వెండి పంజరమునందున్న హంసవలె, మందరగుహలోని సింహమువలె, మదగజముపై నున్న వీరునివలె చంద్రుడు ్రకాశించుచున్నాడు. ఎనిమిది శ్లోకములు చంద్రుని
70 సుందరకాండము గూర్చి కలవు. దీనినే చంద్రాష్టకము అందురు. ఇది మంత్ర పరిపూరితమై యున్నది. అష్టకమును తమ జాతకములందు చంద్రవేధకలవారు, చంద్రుడు దుర్చలముగా నున్నవారు అనుదినము పారాయణము చేసినచో వారి మానసిక దౌర్చల్యములు తొలగి వికాసము కలుగును. ఈ శ్లోకము లందు వర్షింపబడిన చంద్రుడు పూర్ణిమ చంద్రుడు. ఇతడు వృషభరాశి సూర్యునకు సమసప్తకము నందున్నాడు. కావున హనుమంతుడు లంకలో (ప్రవేశించిన రోజు వృశ్చికరాశి పూర్ణిమ. అనగా కార్తీక పూర్షిమ. ఆ దినమున జగన్మాత షోడశ కళలతో, దివ్యశోభతో (ప్రకాశించుచుండును. ఆత్మానుభూతిని మనస్సుకు పూర్ణముగా ప్రసాదించును. చంద్రుని కాంతి మందరగిరి యందలి లక్ష్మివలె నీటిలోని కమలముల కాంతివలె కనుపించును. మందర మనగా దక్షిణ ధృవము లేక మూలాధారము, మూలాధార మందలి అమ్మవారి శోభయే ఈ చంద్రకళ. కమలము లనగా షట్బ(క్రములు. అనగా మనస్సు పరిపూర్ణముగా వికసించుట. పరిజరమనగా శరీరము. (ఊర = పంజరము) ఉచ్చ్వాస నిశ్వాసములే హంసలు (హం-సో) ఓంకారము. చంద్రుడు హంసవలె కనబడెను. చంద్రుడు అనగా మనస్సు. (చంద్రమా మనసో జాత. క్టో తంత్రీస్వనాః కర్షసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభి స్సువృత్తాః నక్తంచరా శ్చాపి తథా ్రవృత్తా విహర్హు మత్యద్భుతరౌ(ద్రవృత్తాః ర్-9 శ్లో! మత్తప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసనసంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కపిః కులాని 5-10 శ్లో! పరస్పరం చాధిక మాక్షిపంతి భుజాంళ్చ పీనా నధినిక్షిపంతి మత్తప్రలాపా నధివిక్షిపంతి మళత్తాని- చాన్యోన్య మధిక్షిపంతి 5-11 ళో రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి 5-12
అద్వార ప్రవేశము 71
క్ళోః, దదర్శ కాంతాళ్చ సమాలభంత్య
స్తా పరా స్తత్ర పున స్ప్వపంత్యః
సురూపవక్రాళ్ళ తధా హసంత్యః
(క్రుద్దాః పరాశ్చాపి వినిశ్చ్యృసంత్యః 5-13 క్లో, మహాగదై శ్చాపి తధా నదద్శి
స్సుపూజితైశ్చాపి తథా సుసద్భిః
రరాజ వీరైశ్ళ వినిశ్వసద్భి
(ర్రబో భుజంగై రివ నిశ్చసద్భిః ర్-1త్త క్లో బుద్దిప్రధానాన్ రుచిరాభిధానాన్
సంశ్రద్దధానాన్ జగతః (ప్రధానాన్
నానావిధానాన్ రుచిరాభిధానాన్
దదర్శ తస్యాం పురి యాతుధానాన్ ర్-1ేర్ క్లో, ననంద దృష్ట్వాస చ తాన్ సురూపాన్
నానాగుణా నాత్మగుణానురూపాన్
విద్యోతమానా న్స తదానురూపాన్
దదర్శ కాంశ్చిచ్చ పునర్విరూపాన్ 516 శ్ఞోః తతో వరార్హా స్ఫువిశుద్ధభావా
స్తేషాం (్రియ స్తత్ర మహానుభావాః
ప్రియేషు పొనేషు చ స్తక్తభావా
దదర్శ తారా ఇవ సుషప్రభావాః 5-17 శ్లో శ్రియా జ్వలంతీ స్రపయోపగూఢా
నిశీధకాలే రమణోపగూఢాః
దదర్శ కాశ్చి త్రమదోపగూఢాః
యథా విహంగాః కుసుమోపగూఢాః 5్-1ేరి శ్లో॥ అన్యాః పునర్హర్మ్య్యతలోపవిష్ట్రా
స్తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః
భర్తుః (ప్రియా ధర్మపరా నివిష్టా
దదర్శ ధీమా న్మదనాభివిష్టా ర్19 క్లో అపావృతాః కాంచనరాజివర్థాః
కాళ్చిత్సరార్థ్యా స్తపనీయవర్ధాః
72 సుందరకాండము
పునశ్చ కాళ్ళి చృశలక్ష్మవర్థాః
కాంతప్రహీణా రుచిరాంగవర్థాః 5-20 క్లో! తతః ప్రియా నాస్య మనోభిరామాః
సుప్రీతియుక్తాః ప్రసమిక్ష్య రామాః
గృహేషు హృష్టాః పరమాభిరామాః
హరిప్రవీర స్ప దదర్శ రామాః ర్-21 వో చంద్ర (ప్రకాశాళ్ళ హి వక్తమాలాః
వ॥క్రాక్షిపక్ష్మాశ్చు సునేత్రమాలా:ః
విభూషణానాం చ దదర్శ మాలా
శ్థత(హ్రదానామివ చారుమాలా: 5-22 కోన త్వేవ సీతాం పరమాభిజాతాం
పథి స్థితే రాజకులే ప్రజాత్తాం
అతాం (ప్రఫల్జ్లా మివ సాధుజాతాం
దదర్శ తన్వీం మనసాభిజాతామ్ 5-23 శ్లో సనాతనే వర్మని సన్నివిష్టాం
రామేక్షణాం తాం మదనాఖివిష్టాం
భర్తుర్మన శ్రీమదనుప్రవిష్టాం -
స్త్రభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టామ్ 5-24 శ్లో, ఉష్టార్దితాం సానుసృతా(స్రకంఠీం
పురా వరార్దోత్తమనిష్కకంఠీం "
సుజాతపక్ష్మామభిరక్తకంఠీర
వనే ప్రన్నత్తామివ నీలకంఠీమ్ 5-25 ళో ॥ అవ్వక్త రేఖా మివ చం(ద్రరేఖాం
పొంసుప్రదిగ్దా మివ హేమరేఖాం
క్షతప్రరూఢా మివ బాణరేఖాం
వాయుప్రభిన్నా మివ మేఘరేఖామ్ 5-26 కా సీతా మపశళ్య న్మనుజేశ్యరస్య
రామస్య పత్నీం వదతాం వరస్య
బభూవ దుఃఖాభిహత శ్చిరస్య
ప్లవంగమో మంద ఇవాచిరస్య 5-27
అద్వార (ప్రవేశము 73
పతుల యెడ గౌరవము, (ప్రేమ, పొతివ్రత్యము, తేజస్సంపన్నులయిన స్త్రీలను హనుమంతుడు చూచెను.
కొందరు రాక్షస వనితలు స(త్ర్రవర్తన కలవారు. చక్కగా కుటుంబ నియమములు పాటించువారు. బంగారు వర్షము కలిగిన వారు కూడా వుండిరి. ఈ రాక్షస రాజ్యములోనే పరమ పతిప్రతలు సుందరమైన రూపము కల స్త్రీలును తమ పతులతో ఆనంద పరవశులుగా జీవించు వనితలనూ హనుమ చూచెను.
అచ్చట నున్న స్త్రీలు కాంతి వంతమగు ఆభరణములు కలవారు. చంద్రబింబమువంటి అందమైన ఆకర్షణీయమైన ముఖములు కలవారిని చూచెను. అనగా సీతమ్మ ఆ స్త్రీలలో నున్నదా యని స్త్రీలను పరిశీలించి చూస్తేనే గాని, స్రీలయందు వ్యామోహముతో కాదని భావము.
ఇందరి స్త్రీలను హనుమ పరిశీలించినప్పటికిని, సీతను కానలేక పోయెను. ఆమె ఈ లోకమునకు సంబంధించిన సౌందర్యవతొ కాదు. పరలోకమునకు సంబంధించిన సౌందర్యరాశి. ఉత్తమ రాజకుల సంజాత. ఆమె పూచిన తీగవలె ప్రకాశించునది. ఒక తల్లి గర్భమున ఆమె జన్మించలేదు. ఆమె జగన్మాత. తన సంకల్పము చేతనే జన్మించినట్టి పరమపవిత్రురాలు. అట్టి సీత కొరకై రాక్షస స్త్రీలలో వెదకియు హనుమ సీతను కనుగొనలేదని భావము.
సీత సర్యోత్కృష్టమగు పుట్టుక లేనిది అనుటలో చమత్కార మున్నది. అనగా పుట్టుకగల జీవు లెల్లరిలో దాగియున్న పరమ తత్త్యము. సర్వ్రేస్ట తత్వము తానై యున్నది. అనగా పుట్టుక లేని దయ్యును, రాజవంశమున (చంద్రవంశమున) ప్రసూతత్రైనది. అనగా చంద్రుని వెన్నెల తానే. జీవులకు రంజనము, అనగా అఆహ్ద్హాదము కట్లించు కులము. అనగా వెన్నెముక యొక్క సన్నని 'బ్రహ్మరంధ్ర మార్గమున సుషుమ్నగా వెలసియున్నదని భావము. వికసించిన తీగ వలె సాధుమూర్తి జన్మించినది. అనగా అందరి యందునూ సన్నని తీగవలె వెలుగుల మయమై వెన్నెముక అడుగున కుండలిని చుట్టుకొని యుండును. అయినను సాధువులగు సజ్జనుల యందు మాత్రము వెన్నెముకలో తీగవలె జ్యోతిర్మయ మూర్తిగా వికసించి యుండునని భావము, ఆమె తనువు భౌతిక మయినది మాత్రము కాదు. ధ్యానము నందు, అమెపై చెప్పిన విధానమున దర్శనమగును.
అగ్లీ రానణాంతః పురము క్ట స నికామం విమానేషు విష్ఞుః కామరూపధృత్ విచచార పున ర్లంకాం లాఘవేన సమన్వితః రా! ఫ్ఫోః అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసీంద్రనివేశనం (ప్రాకారేణార్కవర్లేన భాస్వరే ణాభిసంవృతమ్ 6-2 క్లో రక్షితం రాక్షసై ర్గోరైస్సింహై రివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాశే కపికుంజరః 6-8 శ్ఞః రూప్యకోపహితై శ్చితై స్తోరణై ర్హేమభూషితైః విచిత్రాభిళ్చ కక్ట్యాభిర్వారైళ్చ రుచిరై ర్పృతమ్ రాక క్లోః గజాస్థితై ర్మహామాత్రై శ్ళూవైశ్చ విగతశ్రమైః ఉపస్థిత మసంహార్యైర్హర్షై స్ప్యందనయాయిఖభిః 6-ర్ ళో సింహవ్యాఘ్రతనుత్రాణ్తై ర్హాంతకాంచనరాజతైః ఘోషవద్భిర్విచితైళ్చు సదా విచరితం రథైః 6-6 శ్చోః బహురత్నసమాక్షీర్ణం పరార్ట్యాసనభాజనం మహారథసమావాసం మహారథమహాస్వనమ్ 6-7 శ్లో దృళ్యెశ్చ పరమోదారై స్రెస్తై శృ మృగపక్షిభిః వివిధై రృహుసాహ(ైః పరిపూర్ణం సమంతతః ర-8 పరతత్త్యము ఇదీకాదు, అదీకాదు. మనకు కనుపించు నదేదీ కాదు అనుట ఒక పద్ధతి. దానినే నేతి-నేతి అని ఇది కాదు, ఇది కాదు అనిబ్రహ్మము కాని వస్తువుల వలన బ్రహ్మమును తెలిసికొనుట. అదే విధముగా “న=ఖం; న-వాయుః నవ=జలం; నజఅగ్నిః అనునది, అనగా మనకు కనబడునట్టి ఆకాశము (బ్రహ్మము కాదు. ఆకాశము వికారవంత మగుచున్నది. వాయువు (బ్రహ్మము కాదు. అదియును మార్పు చెందు తున్నది. జలము కూడా బ్రహ్మము కాదు. అదీ మార్పు చెందునది. అభ్బియును బ్రహ్మము కాదు. అది స్థిరమైనరూపమున వుండదు అని ఆలోచించు పద్ధతి ఒకటి ఉన్నది, ఇప్పటి వరకు ఆంజనేయుడు ఈ పద్ధతినే అనుసరించెను. ఈలంకలోని బంగారు మేడలు సీతకాదు. అచ్చట నున్న అందమైన స్రీలు కూడా సీతమ్మకాదు అని, సీతమ్మవారు. కొని వస్తువులను వెదకి సీతను కానలేక
రావణాంతః పురము ౯5 దిగులుపడెనని భావము. అదియే శోకభవనము. భవము అనగా పుట్టుక. దుఃఖముతో కూడిన శరీరమున (ప్రజ్ఞగల రాక్షసుల భవనము లవి. చుట్టూ ఉదయసూర్యునివలె (ప్రకాశించు ఎర్రని (ప్రాకారము గల రావణుని భవనములోనికి వెళ్ళి సీతను వెదకుట కారంభించెను. ఎర్రని ప్రాకారము అనగా నేనే ఈ రాజ్యమునకు అధికారిని అన్న రాజసగుణము. అధికార గుణమునకు గుర్తు. అట్టి రావణుని ఇంటిలో సీతాదేవి ఉండదు. ఇంతకు పూర్వము రాక్షసుల యొక్క నివాసము లందు హనుమ సీతను వెదకెను. రాక్షస నివాసము లనగా అజ్ఞానాంధకారముతో తామసగుణ _ (నల్లని రంగు) (ప్రవృత్తి కలిగిన చోటునందు వెదకెను. సీత అచట కానరాలేదు. అది మొదట మొట్టు. ఇప్పుడు వెదుకబోవు మార్గము రెండవమెట్టు, ఇది రాజసగుణమునకు సంబంధించిన మెట్టు, రావణుడు రాజ్యాధికారగర్వముతో కూడు కున్నట్టి వాడు. ఆపైన (బ్రహ్మ యొక్క వర (ప్రభావము వలన కూడా అహంకారము పెరిగినది. అట్టివాని సన్నిధిలో పరమ సాత్తిక మూర్తియైన అమ్మవా రుండుట ఎప్పుడునూ పొసగదు.
ఆ రాక్షస భవనము మహాభయంకర రూపులు, మహాబలశాలురు నైన రాక్షసులచే కాపొడబడుచున్నది. ఎవ్వరికీ ప్రవేశింప వీలుకానిదిగా భయము గొల్పుచుండెను. మహారణ్యమే చొరరానిది. ఆ అరణ్యములో భయంకరములగు సింహములు తిరుగుచున్నవి. కాన ఎవ్వరూ అందు ప్రవేశింప జాల రనదగియున్న రావణుని భవనమును ఆంజనేయుడు చూచెను.
ఆ భవన మంతయూ బంగారముతో నలంకరింపబడిన ద్వారములు కలది. మహాశూరులగు రాక్షస వీరులచే రక్షింపబడునది. రథములు, ఏనుగులు, గుజ్ణముల బలములతో పరివేష్టింప బడినది. సింహ శార్జూలాది జంతువుల చర్మములతోను, దంతములు, మణులు మొదలగు అపూర్వ వస్తువులతో నిపుణుల చేత అలంకరింపబడినది. అగరు, చందనాది గంధములచే గుబాళించునది. భేరీ, మృదంగ శబ్దఘోషతో కూడినది. అగ్ని, అర్భన గలది యున్నూ అయిన రావణుని భవనమును హనుమంతుడు చూచెను.
ప్రహస్తుని భవనమును (భుజబలమును నమ్ముకొనివాడు) మహాపార్చుని భవనమును. (ఒక పార్ట్యము మాత్రమే కలవాడు) విరూపాక్షుడు = తిన్నని చూపులేనివాడు ఇటులనే తక్కిన రాక్షస సేనాపతులపేర్హు వారి అవలక్షణములను తెలియజేయు. చున్నవి. మేఘముల నంటు ఎత్తైన కుంభకర్ణుని భవనమును
గర సుందరకాండము చూచెను. ఆ తరువాత విభిషణుని భవనమును తిలకించెను. ఆ రెండు భవనములు రాజుగారి సోదరులు నివసించెడివి. చాలా ఆకర్షణము గలవి కూడా. అయిననూ అవి ర్ధువి హనుమ నాకర్షింపలేదు. ఆయన దృష్టి సీతాదేవి యందు లగ్నమైనది. ఈ సంపదలను, భవనములను తిరస్కరించెను. మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, వి ద్యున్మాలి అను వారల గృహములను చూచెను. ఇంద్రజిత్తు భవనమును, ఇతర రాక్షసుల భవనములను దర్శించెను. అవి యేవీ హనుమ నాకర్షింపలేదు. ళ్ళ సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాదాథ లక్ష్మీవా గగ్రాక్షసేంద్రనివేశనమ్ 6-28 క్లో రావణ స్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమః విచర న్హరిశార్జూలో రాక్షసీ ర్వికృతేక్షణా: 6-29 శ్లో శూలముద్గరహస్తాశ్చ్ళ శక్తితోమరధారిణీ: దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్ష్యపతేర్షహే 6-30 శ్లో రాక్షసాంశ్చ మహాకాయా న్నానాప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ స్టితాంశ్సైవ హరీంళ్చాపి మహాజవాన్ 6-31 క్టోః కులీనాన్ రూపసంపన్నాన్ గజా నృరగజారుజాన్ నిష్టితాన్ గజళిక్షాయా మైరావతసమాన్యుధి 6-32 శ్లో నిహంత్తా న్పరపైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సః క్షరతళ్చ్ళ యథా మేఘాన్ (్రవతశ్చ యథా గిరీన్ 6-33 వో మేఘస్తనితనిర్జోషాన్ దుర్ధర్దాన్ సమరే పరైః సహ(్రం వాహినీ స్తత్ర జాంబూనదపరిష్కృతాః 6-34 వ్ధోః హేమజాలపరిచ్చన్నా స్తరుణాదిత్యసన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే 6-85 వ్లోః శిబికా వివిధాకారా స్స కపి ర్మారుతాత్మజ; అతాగృహాణి చి(త్రాణి చిత్రశాలాగృహాణి చ 6-36 ట్ల క్రీడాగృహాణి చాన్యాని దారుపర్వతకానపి కామస్య గృహకం౦ం రమ్యం దివాగ్యహక మేవ చ 6-37 వ్గోః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే సమందరగిరిప్రఖ్యం మయూరస్థానసంకులమ్ 6-38
రావణాంతః పురము ౯7
అన్ని భవనములలోను (్రేస్ముగు రావణుని భవనమును చూచెను. ఆ భవనమున రాత్రి వేళల యందు కావలి యుండు రాక్షస స్రీలను చూచెను. వారు చాలా వికృతములగు రూపములు కలవారు. కత్తులు, శూలములు, మొదలగు ఆయుధములు ధరించిన వారు. మహాబలురగు రాక్షస వీరులు సకల ఆయుధపాణులై దానికి కావలి యుండిరి. తెల్లని, ఎజ్జని రంగుల గుజ్జములు, మదించిన ఏనుగులు శత్రుసేనలను సంహరించు సొమక్ష్యముగల వానిని హనుమ చూచెను. ఆ రావణుని భవనము అప్పుడే ఉదయించుచున్న సూర్యుని వలె బంగారు కాంతులతో మెరయు చుండెను. పూపొదలు, శిభికలు మొదలగు చిత్రశాలలు కలిగియుండెను. తేనెతో కలసిన మద్యము వలన అఆభవనము యొక్క నేల తడసి యుండెను. అనేకములగు ('ప్రాసాదముల సమూహమైనదియును, అనేక కక్ష్యాంతరములు గలదియు నగు రావణభవనమును హనుమ చూచెను.
మన శరీరము లోపల హృదయాంతరాళమందు వెలిగే అంతరాత్మను అన్వేషించే దెలా? (2) దగ్గరకు చేరే దెలా? (3) ఆ జ్యోతిని పోల్చుకొనే దెలా? (4 ఆజ్యోతియొక్క సాన్నిధ్యమును పొందే దెలా? అన్న నాలుగు విధములైన సాధనా(క్రమములు లేక మెట్టు ఇందు సూచింపబడినవి,
రాజముఖ్యులు, రాజ బంధువుల గృహములలోని ఆకర్షణములు హనుమను లోబర్చ్బుకొనలేక పోయినవి. ఆ తరువాత చూచిన రావణ భవనము మహాతేజోవంతముగా జాజ్బల్యమానముగా వెలుగుచున్నది. వాల్మీకి మహర్షి ఆ భవనమును చాలా విస్తారముగా వర్లించెను. సృష్టిలోనున్న అందములు, ఆకర్షణలు అన్నీ అక్కడ కూర్చి, పేర్చినట్టుగా వర్ణించెను. వాల్మీకి మహర్షి కదొ! ఇట్టి రాజభోగములు గురించి యింత విపులముగా వర్షించుట ఎందుల కనిపించును. కొంత విడ్డూరముగా కూడా కనుపించును. అనగా ప్రపంచమునకు సంబంధించిన లౌకికమగు సుఖములు, అందములు, ఆకర్షణలు మనల నెంతగానో ఆకర్షిస్తాయి. మనకు కావలసినవి అవే యని మోసపుచ్చును. వానిని చూచినపుడు అక్కడే ఉండిపోవాలని లోభము, భ్రాంతి మనలను పట్టుకుంటుంది. ఆ పట్టు విడిపించుకొని పోలేనివాడు రావణునివలె అందులోనే చిక్కుకొని పడిపోగలడు. దానిని దాటి బయటకు రాలేడు, హనుమ అలా కాదు. పూర్ణమైన జ్ఞానస్వరూపుడు. కనుక ఈ ఆకర్షణ లేవీ ఆయనపై పని చేయలేదు. యోగసాధన చేయునపుడు మనకు అపూర్వమగు, అశ్ళర్యకరములైన సిద్దులు లభిస్తూంటాయి. ఆ సిద్దులే అసలు
78 సుందరకాండము సత్యమని భ్రాంతి కలిగిస్తాయి. ఆ భ్రాంతిలో పడిన వాడు అధోగతికి వెళ్ళిపోతాడు. జ్ఞానియైన వాడు అట్టి సిద్దులను లక్ష్యపెట్టడు. దానిని దాటి అంతరాత్మను వెదకుటకై ముందుకు సాగిపోవును. ఈ యోగానుభవమునే వాల్మీకి మహర్షి యిచ్చట మన కందించెను. మండోదరిని చూడగనే ఆమె యొక్క తేజస్సును, అందమును ఆకర్షణ శక్తిని చూచి తాను వెదికే ఆత్మజ్యోతి లేక సీతాదేవి ఈమెయే యని భ్రాంతి పడినాడు. నేను సీతను చూచితినని గంతులు వేసెను. ఆ తరువాత మరల ఆలోచించినాడు. తన తప్పును తెలుసుకున్నాడు. చూస్తున్నది కాగితపు పువ్వుగా గుర్తించెను. ఆకారము, రంగు, నిర్మాణము అన్నీ పువ్వును పోలియున్నప్పటికీ పువ్వు యొక్క సువాసన, జీవకళ కాగితపు పువ్వున కుండవని హనుమ తెలుసుకొనెను. ఇంతవరకు ఆంజనేయుడు చూచిన దంతయూ శోకవనము. అనగా దుఃఖము కలిగించు అనుభవము. అనగా కొద్దికాల ముండి చేజారిపోవు సుఖములు, అవి దుఃణమును కలిగిస్తాయి. కొంతకాలము మాత్రము కొద్దిపాటి సుఖమును కలిగించి, తరువాత అధికమగు. దుఃఖమును కలిగించు. సన్జివేశములను వాల్మీకి మహర్షి యింతవరకు వర్షించెను, దీనిని దాటిన తరువాత ఆంజనేయుడు అశోకవనమున (ప్రవేశించెను. అనగా తాత్కాలికములగు సుఖములు, లాభములు కలసి శోక మగును. దానిని దాటి నపుడు నిత్యమైన సుఖము, నిత్యమైన జ్ఞానము, నిత్యమైన శక్తికి కారణమైన అశోకవనము లోనికి ఆంజనేయుడు ప్రవేశించెను. అనగా తాను వెదకెడి సీతాదేవి యొక్క సాన్నిధ్యము లోనికి ఆంజనేయుడు ప్రవేశించెనని భావము. పుష్పక వినూనము క్ట స వేశ్ళజాలం బలవాన్ దదర్శ వ్యాసక్తవైడూర్యసువర్త జాలం యథా మహత్రావృషి మేఘజాలం విద్యుత్పినద్దం సవిహంగజాలమ్ 7-1 శో నివేశనానాం వివిధాశ్చ శాలాః ('ప్రధానశంఖాయుధచాపశాలాః మనోహరాళ్వాపి పునర్విశాలాః దదర్శ వేశ్మాద్రిషు చంద్రశాలాః 7-2 న గృహాణి నానావసురాబితాని దేవాసుకైశ్చాపి సుపూజితాని
రావణాంత;ః పురము ౯79
సర్వైశ్చ దోషై పరివర్జితాని
కపి ర్రదర్శ స్వబలార్జితాని 7-3 ఖ్లోః తాని ప్రయత్నాభిసమాహితాని
మయేన సాక్షాదివ నిర్మితాని
మహీతలే సర్వగుణోత్తరాణి
దదర్శ లంకాధిపతే రృహాణి 7-క ళో 1 తతో దద ర్నో(ల్చితమేఘరూపం
మనోహరం కాంచనచారురూపమ్
రక్షో2ధిప స్యాత్మబలానురూపం
గృహోత్తమం హ్యప్రతిరూపరూపమ్ 7-5 న్లో, మహీతలే స్వర్గమివ 'ప్రకీర్షం
శ్రియా జృలంతం బహురత్నకీర్షమ్
నానాతరూణాం కుసుమావకీర్ణం
గిరే రివాగ్రం రజసావకీర్షమ్ 7-6 ఫ్లై నారీప్రవేకైరివ దీస్యమానం
తటిద్భి రంభోదవ దర్భ్యమానం
హంస(ప్రవేకైరివ వాహ్యమానం
శ్రియా యుతం ఖే సుకృతాం విమానమ్ 7-7 క్ళో యధా నగా[గ్రం బహుధాతుచిత్రం
యథా నభళ్ళ (గ్రహచం(ద్రచిత్రం
దదర్శ యుక్తీకృతమేఘచి[త్రం
విమానరత్నం బహురత్న చిత్రమ్ 7-8 ళ్ట మహీ కృతా పర్వతరాజిపూర్ణా
తైలాః కృతా వృక్షవితానపూర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితానపూర్జాః
పుష్పం కృతం కేసరపత్రపూర్ణమ్ 7-9 వో కృతాని వేళ్మాని చ. పాండురాణి
తధా సుపుష్పాణ్యపి పుష్కరాణి
పునళ్చ్ళ పద్మాని స కేసరాణి
ధన్యాని చిత్రాణి తథా వనాని 7-10
80 సుందరకాండము
ఖః పుష్పాహ్యయం నామ విరాజమానం
రత్న(ప్రభాభిశ్చ వివర్హమానం
వేశ్శోత్తమానా మపి చోచ్చమానం
మహాకపి స్తత్ర మహావిమానమ్ 7-11 శ్లో కృతాశ్చ వైడూర్యమయా విహంగాః
రూపష్యప్రవావైళ్ళు తథా విహంగాః
చిత్రాళ్ళ నానావసుభి ర్భుజంగా:
జాత్యానురూపొస్తురగా శ్ళుభాంగాః 7-12 శ్లో, ప్రవాళజాంబూనదపుష్పపక్షా
“స్పలీల మావర్జితజిహ్మపక్షాః
కామస్య సానక్షాదివ భాంతి పక్షాః
కృతా విహంగా స్సుముఖా స్సుపక్షాః 7-13 క్లో నియుజ్యమానాస్తు గజా స్సుహస్తా
న్స కేసరా శ్చ్పోత్సలపదత్రహస్తాః
బభూవ దేవీ చకృతా సుహస్తా
లక్ష్మీ స్తథా పద్మిని పద్మహస్తా 7-14 శ్లో ఇతీవ తద్భహమభిగమ్య శోభనం
సవిస్మయో నగమివ చారు శోభనం
పునళ్ళ తత్పరమసుగంధి సుందరం
హిమాత్యయే నగమివ చారుకందరమ్ 7-15 ఖో తతస్స తాం కపి రభిపత్య పూజితాం
చరన్ పురిం దశముఖబాహుపాలితాం
అదృశ్యతాం జనకసుతాం సుపూబితాం
సుదుఃఖిత: పతిగుణవేగనిర్దితామ్ 7-16 వ్ధోః తతస్తదాబహువిధభావితాత్మనః
కృతాత్మనో జనకసుతాం సువర్మ్మన!
అపళ్యతో2భవ దతిదుః;ఖితం మన
స్సుచక్షుషు ప్రవిచరతో మహాత్మనః 7-17
రావణాంత;ః పురము 81
లంకలో నున్న పెద్ద పెద్ద భవనములు, ఉద్యానవనములు సంపదలు ఈ ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది సర్గల యందు చాలా విపులముగా వర్షింపబడినవి. ఆ లంక అన్ని విధములైన భోగములు కలిగియున్నది. ధనసంపద పరిపూర్ణముగానున్నది. రాక్షసనాయకుల యిండ్లు ఎంతో ఆకర్షణీయముగా నున్నట్లు వర్షిపంబడినది. సిరిసంపదలు కోకొల్లలుగా నున్నప్పటికీ అవియేవీ ఆంజనేయుని ఆకర్షించలేదు. శ్రీరామచంద్రునితో అడవులయందు నివసించుట కంటె ఈరాక్షస వీరుల పక్షమునకు చేరినవో తనకు కూడా రాజభవనములు, ఉద్యానవనములతో కూడిన మంచి నివాసము ఏర్పడును అన్న భావము ఆంజనేయ్గనకు కలుగ లేదు. రాముని యందు భక్తి విశ్వాసములు ఆంజనేయునకు అధికమైనవే గాని తగ్గలేదు. ఇంత కంటెను ఎక్కువ ఆకర్షణ కలిగించు. నట్టిది, చూచువారిని మోహింపజేయునట్టిది యైన పుష్పకమును దర్శించెను.
పుష్పక విమానము తక్కిన రాజభవనమఘులకంటె అధికమైన ఆకర్షణ కలది. చాలా ఎత్తైనది, బంగారముతో నిర్మితమైనది. వజ్రములు, రత్నములు మొదలగు వాటి చేత అలంకరింపటడినది. ఈ భూమి మీద నున్న శిల్పులు నిర్మించిన దాని వలె కన్పించలేదు. మయుడు స్వయముగా నిర్మించి నట్టిది. మనోహరముగానున్న పుష్పక విమానమును చూసి నప్పటికీ ఆంజనేయుడు వ్యామెహపడలేదు. ఒక సామాన్యవస్తువును చూసినట్టు దాటి పోయెను. అనగా ఆ విమానము యొక్క ఆకర్షణ ఆంజనేయుల వారి మీద ఎంత మాత్రము పనిచేయలేదు.
ఈ ఆకర్షణ కన్నులకు భ్రమగొల్పునట్టిది. ఆంజనేయుని కన్నులు లోచూపు కలిగినట్టివి. తన సీతాన్వేషణ, యోగాన్వేషణ వంటిది. జగన్మాత మైన అమ్మవారి అఖిండసొందర్యాకర్ష్ణణయే తన యోగయానములోని ఏకైక లక్ష్యము. ఈ పుష్పక విమానము అమ్మవారి శోభలోని ఒక భాగము మాత్రమే. దేవశిల్పి మయుడు. తన నైపుణ్యమును ప్రదర్శించి పరిమిత ్రజ్ఞగల రాక్షసులకు, మానవులకు దర్భ్శనీయమగునట్లు ఆ పుష్పక విమానమును రచించెను. ఈ రూపజగ త్తంతయు అమ్మవారి కనుకొలకుల వెలుగునుండి ఉద్భవించు. నట్టిది. కనుక మాయా శోభితమైన ఈ దృశ్యమాన జగత్తు సమస్తము ఆ తల్లియొక్క అఖండ సౌందర్యమను సముద్రము లోని ఒక చిన్న అల మాత్రమే. ఈ పుష్పక విమానము అట్టి జగత్తులోని ఒక అణువు మాత్రమేనని చివరి శ్లోకములు ధ్వని గర్భితముగా వర్షించు చున్నవి,
విమాన మనగా విశేషమైన కొలతలతో కూడినది. పుష్పసంబంధము కలిగిన విమాన మిది. మానవ శరీరము (ప్రకృతి మాతచే కల్పింపబడినది. అందలి భాగముల
82 సుందరకాండము కొలతలు శరీర నిర్మాణమునకు పూర్వమే మానవమేధతో సంబంధము లేకయీ నిర్షీతమైనవి. కావుననే ఇవి విశేషములు. మానవ శరీరమును నడుపు (ప్రజ్ఞామయ కేంద్రములు పుష్పములై వికసింపవలసి యున్నది. రావణునిచే అనుభవింపబడుచున్న పుష్పక విమానము అతని స్వార్దీతము కాదు. అతని యన్నయు. భక్తుడునగు కుబేరునకు శివుడు ్రసాదించినట్టిది. భక్తితో తనను సేవించుటకు గాను దేవుడు ప్రసాదించిన విమానమును, రావణుడు భోగములకు వినియోగించెను. అనగా మానవ శరీరమును భౌతిక భోగములకై రావణుడు వినియోగించెను. సూర్య చంద్రాది (గ్రహములు, మేఘములు, వృక్షములు మున్నగు విశేషములు విశ్చము నందున్నట్లే మానవ శరీరమునందును ప్రకృతిచే కల్పింపబడినవి. తన శరీరమునందును, విశ్వము నందును గల సారూప్యములగు ఇట్టి విశేషములు నడుపు సామర్హ్యము సాధించుటయే యోగసాధన. ప్రకృతితో సహజీవనము చేయుటకై ఆ తల్లి మనకు శరీరము. నిచ్చును. కాని రావణుడు * ప్రకృతి విరుద్రములగు కార్యక్రమములు నిర్వహించుటకే తన శరీరమును, తోటి రాక్షసుల శరీరములను వినియోగించెను. త్యాగాయతనము, యోగాయతనము కావలసిన రాక్షసుల శరీరములు అమితభోగాయ తనములును, రోగాయతనములును నైనవి. లంకావాసుల భోగములు, శారీరకసౌందర్యమును పెంచుకొనుటకై ఉపయోగించిన నాగరికతా విశేషములు (ప్రకృతియొక్క స్వచ్చతకు విరుద్ధముగా మానవుడు కల్పించుకొన్నవే. అయినను ప్రకృతి యొక్క కాలవైభవములో, నవియు, భాగములే. కావున వీనినిగూడ ప్రకృతి మాత యొక్క అఖండ సౌందర్యమందలి భాగముగ ఆంజనేయుడు దర్శించెను. కావున వీనియందు జుగుప్పగాని, ఆసక్తిగాని పొందక సముడై నిలచెను. శరీరములోనికి జొచ్చినను, శరీరము యొక్క ప్రభావమునకు లోనుగాక ఎట్టుచొచ్చితినో అట్లే వెడలెదను అని హనుమంతుడు పూర్వము లంకలో అనెను. శ్లో యధా నభళశ్ళగ్రహ చంద్ర చిత్రం దదర్శ యుక్తీకృత మేఘ చిత్రం మహీకృతా పర్వత రాజి పూర్ణాః శ్రైలాః కృతా వృక్ష వితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పం కృతం కేసర పత్ర పూర్షమ్ - 'పై శ్చోకములోని పద ప్రయోగమును (శ్రద్దగా గమనింప ప్రార్ధన.
రావణాంత; పురము 83
చంద్ర చిత్రం ; కేవలము తాల్కిక ప్రజ్ఞగల మనస్సునకు మాత్రమే కనుపించు చంద్రుడు అని పై పదబంధమునకు అర్హము. అట్టే (గ్రహగోళములతోను, చం(ద్రగోళములతోను చిత్రింపబడిన ఆకాశము బొమ్మగా మాత్రమే ఆంజనేయునకు కన్పించు చున్నది. ఈ బొమ్మ అమ్మ వారి సౌందర్యము ముందు దిగదుడుపునకు కూడా పనికిరాదని భావము. _
అట్టే యుక్తీకృత మేఘ చిత్రమ్ : నైపుణ్యముగా చెక్కబడిన మేఘ చిత్రమే. ఆ పుష్పక విమానమున నున్నది. ఆహా! ఎంతటి నైపుణ్యము ఎంతటి శిల్ప చాతుర్యము! అని అబ్బుర పోవుటకు మాత్రమే పనికి వచ్చునుగాని, దివ్యయోగాను భూతికి అందు నట్టి అఖండసౌందర్యము మాత్రము కాదని ధ్వన్యర్హము. తర్వాత భూమి, పర్వతములు, చెట్టు పూలు మొదలగునవి చిత్రీకరింపబడినవి, అవి కృత్రిమమైనవి అని “కృతాః” అను పదమునందు ధృవీకరించబడుచున్నవి. ఈ పదములే, ఆంజనేయుడు వ్యామోహపడలేదని సూచించు చున్నవి. ఆయన గారిది పూర్ణయోగ దృష్టి ఆ దృష్టితో అవలోకించు నపుడు ఈ కృత్రిమ సౌందర్యము అల్పమైనదిగా గోచరించును. 9వ శ్లోకములో అత్యుత్తమ కళాసౌందర్యమును వాల్మీకి మహర్షి మన కనుల ముందు అవిష్కరించుచున్నాడు. ఆ పుష్పక విమానములో చిత్రీకరించబడిన కళాఖండములను చూడుడు! భూగోళము, దానిపై మహోన్నతమైన పర్వతరాజములు, ఆ పర్వతములపై గుబురుగా వ్యాపించిన చెట్ల గుంపులు, ఆ చెట్లపై విచ్చుకున్న పూవులు. ఆ పూవులులోని రేకులు, ఆ పూరేకుల మధ్య సన్ననైన కేసరములు - ఇది యొక కళాఖండము. స్టూలము నుండి సూక్ష్మము వరకు సర్వము చిత్రీకరింపబడిన ఉత్తమ కళాఖండము, పుష్పక విమానమునందు మనకు దర్శన మొసగును. మయుడు దివ్య శిల్పకళావేత్త. కనుక దానిని దివ్య కళామయముగా తిర్చిదిద్దకలిగెను. కాని అమ్మవారి అఖండ సౌందర్యము ఈ అల్పమైన అనుభూతికి అందదు. అందువలన ఆంజనేయునికి ఆ తల్లి దర్శనీయము కాలేదు. అప్పుడు హనుమంతుడు దుఃఖించెను.
(16వ శ్లో! అదృశ్యతాం జనక సుతాం)
అపశ్యతో2భవదతి దుఃఖితం మన
స్సు చక్షుషు ప్రవిచలతో మహాత్మనః
'పై శ్టైోకములో సాధకున కందుబాటులో నుండు అర్థము లిట్టుండును. దుఃఖము యోగసాధనకు విఘ్నము. దుఃఖము పెనగొనిన మనస్సు విశిష్టముగా చరించినను,
కిక సుందరకాండము (ప్రవిచలితఖి అనగా ఆలోచించినను దానికి అమ్మవారు దర్శన మీయదు. ఆ సాధకుని మామూలు కన్నులు (సుచక్షుషు) ఎంత వెదకినను అమ్మవారు కనపడదని అర్ధము. కాని ఆంజనేయుడు మహాత్ముడు. ఉన్నతమైన ఆత్మానుభూతియందు చరించు వాడని ధ్వన్యర్హము. ఇది యంతయు అన్నమకోశయమునకు సంబంధించినది మాత్రమే. ఖః స తస్యమధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం '్రతప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజ: కపిః త్ర్1 కః తదప్రమేయాప్రతికారకృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్సకర్మణా దివం గతం వాయుపథప్రతిష్టితం వ్యరాజతా22దిత్యపథస్య లక్ష్మవత్ 8-2 క్లో, న తత్ర కించి న్న కృతం ప్రయత్నతో న తత్ర కించి న్న మహార్హరత్నవత్ న తే విశేషా నియతా స్సురేష్వపి న తత్ర కించి న్న మహావిశేషవత్ 8-3 క్లో, తపస్సమాధానపరా(క్రమార్షితం మనస్సమాధానవిచారచారిణం అనేకసంస్టానవిశేషనిర్మితం తతస్తత స్తుల్య విశేషదర్శనమ్ 8-4 శ్లో మన స్పమాధాయ తు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహర్దినాం యశస్వినా మ[గ్ర్యముదా మివాలయమ్ 8ర5్ ళ్గోః విశేషమాలంబ్య విశేషసంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందునిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా 86
రావణాంత;ః పురము 8ిర్ న్లో; వహంతి యం కుండలశోభితాననా:ః మహాశనా వ్యోమచరా నిశాచరాః వివృత్త విధ్వస్త విశాలలోచనాః మహాజవా భూతగణా స్పహ(్రశః 8-7 శ్చోః వసంతపుష్పోతృ్మరచారుదర్భనం వసంతమాసా దపి కొంతదర్భ్శనం స పుష్పకం తత్ర విమాన ముత్తమం దదర్శ తద్వానరవీరసత్తమః 8-8 హనుమంతుడు చూచిన విమానము బంగారముతో నిర్మింపబడి వజ్రములు, మణులతో చిత్రింపబడి యుండెను. అయినప్పటికి వ్యామోహపడక సీతాదేవిని వెదకుటకు బయలుదేరెనని భావము.
ఈ విమానమునకు అసాధారణమైన దివ్య లక్షణములు కొన్ని యున్నవి. భూమి మీద మానవులు రాళ్ళు, సున్నముతో నిర్మించు వానికంటె శక్తియుక్తులు కలదిగా ఈ విమానము వర్లించబడెను. మనము నిర్మించునట్టి భవనములు స్వీయ చైతన్యమునుగాని, ఒక చోట నుండి మరొక చోటికి తరలు శక్తిని గాని కలిగి యుండవు. ఆ విమానము నడుపు వారి యొక్క కోరిక ననుసరించి కోరిన మార్గమున, కోరిన వేగముతో పయనించును. రావణుని వంటి సామర్హ్యము కలవానికి తప్పు లభించనట్టివి. ఇది సర్వసుఖములను అందించు నటువంటిది. అయినప్పటికి ఆంజనేయుడు. దానియందు. వ్యామోహము. పడలేదు. మనము పరమాత్మదర్భ్శనమునకై ముందుకు సాగి వెళ్ళినప్పుడు ఆ మార్గములో ఇటువంటి అత్యంత ఆకర్షణీయమైనవి, సుఖమును, ఆనందమును ఇచ్చునవి మన ఎదుట కనిపించును. అల్ప్బమగు జ్ఞాన దీప్తికలవారు ఇట్టి విమానాదులయొక్క ఆకర్షణకు లోబడుదురు. ఆ విమానాదులను అ|శ్రయించుట వలన తాత్కాలిక మగు సుఖమునకు, ఆనందమునకు బానిస లగుదురు. కాని ఆంజనేయుడు పూర్ణజ్ఞాని కనుక అమ్మవారిని దర్శించవలెనను పవిత్రమగు జ్ఞానమార్గమున నడచి దృఢమగు సంకల్పముతో ముందుకు సాగిపోగలిగెనని భావము. జ్ఞాన దీప్రిగల ధీమంతుడు కనుక ఆంజనేయుడు ఆ విమానమును చూచినంతనే అది “కృత్రిమము” అని భావించెను. 1ప్రతప్త జాంబూనదజాల కృత్రిమమ్' అని వాల్మీకి పద ప్రయోగములోని జొచిత్యమును గమనింపుడు. మణులు, వజ్రములతో పొదగబడి వెలుగొందుచున్న
86 సుందరకాండము ఆ విమానము బంగారముతో తాపడము చేయబడినది. ఇవి అన్నియు వెలిచూపు కల కన్నులను మాత్రమే ఆకర్షింప గలవు. లోచూపుగల ఆంజనేయునకు అవి కృత్రిమముగా కనిపించినవి. సహజశోభ అందు అందులేదు. హనుమంతుని దివ్యానుభూతికి దర్శన మిచ్చుచున్న జగన్మాత యొక్క అఖండ సౌందర్యము అచ్చట లేదు. కనుక చక్డు రింద్రియపు టలవాటు చొప్పున చూచి ముందుకు సాగిపోవుచున్నాడు. “మనస్సమాధాయతు. శీఘ్రగామినం” అనునపుడు మనస్సు యొక్క ప్రస్తాపన వచ్చినది. ఈ మనస్సు ఇంద్రియ చోదితమైనట్టిది. మన పంచేంద్రియములు వెలుపల వర్తించునవే కాని లోపల వర్తించునవి కావు. అవి మున కోరికల వరకే పరిమితమైనవి. ఇవి జీవుల బాహ్యోపకరణములు. మరియొకటి అంతఃకరణము. బాహ్యముగా నున్న జగత్తునకు, ఆంతర జగత్తునకు మనస్సు ముఖద్వారము వంటిది. ఈ ద్వారము దాటిన గొని లోపల పరమేశ్వరుడు దర్శనమీయడు. ఈ విమానము పరిమితమైన జీవప్రజ్ఞకు ఆకర్షణీయముగా ఉండును. లోలోపల దివ్యాను భూతికి అత్యల్పమైనదిగా గోచరించును. దీనిని దర్శించినపుడు పై మెరుగుల అందమే గోచరించును. ఇట్టివి మనస్సుయొక్క అల్పమైన కోరికలను తీర్చునదే కాని అనంత దివ్యానుభూతిని అను(గ్రహించదు. అనగా అంతర జగత్తునకు వలసిన ఆనందానుభూతిని అను(గపొాంవ జాలదు. ఈ అల్పానుబూతులు 'ప్రాణమయకోశమునందు లభించెడివి.
రావణ వైభనము శ్ఞః తస్యాలయ వరిష్టస్య మధ్యే విపుల మాయతం దదర్శ భవన శ్రేష్టం హనూమా న్మారుతాత్మజః క! కః అర్హయోజన విస్తీర్ణ మాయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాదసంకులమ్ 9-2 శః మార్గ మాణస్తు వైదేహీం సీతా మాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనూమా నరిసూదనః రంప శ్లో ఉత్తమం రాక్షసావాసం హనుమా నవలోకయన్ ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్ 9-క్ష న్టోః చతుర్విషాజై ర్విరదై ్రివిషాణై స్తథైవ చ పరిక్షిప్త్ మసంబాధం రక్ష్యమాణ ముదాయుధైః 9-5 అంజనేయుడు రావణనివాస భవనమును సమీపించెను. ఆ భవనము అర్హయోజన విస్తీర్షము అనగా సగము, సగము ఆలోచనలలోనే విస్తరించి యున్నది. “ఆయతం యోజనం హితత్ొ” ఆలోచనలు సగము సగముగానే విస్తరించి యుండగా, వాని పొడవు నిండు అగు ఆలోచనగా నున్నది, ఇది రావణుని ఆలోచనాసరళిని తెలియ జేయు విశేషము. సాధారణముగా ఒక అర్హయోజనం వెడల్పు గలిగినది అనగా ఒక ఆమడ వెడల్పు గలిగినది. ఒక ఆమడ పొడవు కలిగినటువంటి భవనమునందు రావణు డున్నాడని ఒక అర్థము చెప్పుచున్నది. అతని యోచన అర్థయోజనముగానే యుండును. కాని చేయవలసిన పనిని గురించి ఆ యోజనయొక్క సంపూర్ణ స్వరూపమును చక్కగా పరిశీలించు అలవాటు లేనివాడని భావము. సగము ఆలోచన మాత్రమే చేయగలవాడు. అంతవరకే అతని (ప్రజ్ఞ విస్తరించు చుండును. ఆసగము ఆలోచననే పరిపూర్ణనుగు యోజనముగా, పొడవుగా [గ్రహించువాడు. ఆ ఆలోచనా సరళికి మూడవ కొలతయైన ఎత్తును గూర్చి ఎరుగని వాడు. అనగా రావణుని భావములకు పొడవు, వెడల్పు ఉండునే గాని ఎత్తు ఉండదు. అనగా ఒక పని చేయుటకు సగము అలోచన మాత్రమే చేసి ప్రారంభించును. ఆ సగము ఆలోచన నుండి అదియే సరియగు విధానమన్న భావము అవిర్భవించును. ఆ భావము ఆచరణలో పెట్టినప్పుడు
8కి సుందరకాండము ముందుకాలమున రాబోవు ఫలితములను గురించి ఆలోచించు ప్రజ్ఞయే మూడవ కొలతయగు ఎత్తు. ఆ ఎత్తును గూర్చిన ఆలోచన రావణునికి పనిచేయుట లేదు. ఆచరణలో పెట్టినప్పుడు తాను ఎదుర్కొనవలసిన సమస్యలు ఎంత ఎత్తయినవన్న ఆలోచన చేయనివాడు. తాను ఎదుర్కొనబోవు శ్రీరామచంద్రుడు ఎంత ఎత్తువాడని ఆలోచించలేదు. శూర్నణఖ చెప్పిన మాటలను సగము వరకే ఆలోచించెను, సీతను తీసుకొని రావలయునన్న భావము వెంటనే ఏర్పడెను. అది సాధ్యమా? అసాధ్యమా? దాని వలన తరువాత జరుగబోవునట్టి పరిణామముల యొక్క కొలత అతని బు(ర్రలో పనిచేయలేదు.. అందువలన అతని ఆలోచనా సరళి అర్హయోజన విస్తీర్ణమును, యోజనము ఆయతనమును కలిగినది మాత్రమే. అతని జీవిత విధానమట్టిది. అని ఈ శ్లోకము సూచించుచున్నది.
సీతాన్వేషణము నందు అంజనేయుడు రాజభవనము లన్నీ తిరిగి వెదకి చూచెను. కాని అచట సత్యస్వరూపిణి' అయిన అమ్మవారు లేరని తెలుసుకొనెను. అచ్చట నున్నదంతయూ అసత్యము. అజ్ఞానము, రాజసమగు అహంకారము మాత్రమేనని తెలుసుకొనెను.
ఈ తెలివిడి కలిగిన ఆంజనేయుడు సామాన్యుడు కాడు. హనుమాన్ + అరిసూదవః అని వాల్మీకి మహర్షి చెప్పుచున్నారు. రావణుని అంతఃపురము అరిషడ్వర్గములతో (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) అలరారుచున్నదనియు, మనస్సును తినివేయ గుణములుగల ఆశత్రువులను తన అంతఃకరణమున కరగించుకొనిన ధీమంతుడు ఆంజనేయు డనియు అర్హము. ఈ శత్రువులతో పోరాడుట అనునది ఉండదు. మనస్సు యొక్క పై పొరలలో స్టిరనివాస మేర్చరచు కొనిన శత్రువులతో యుద్ధము చేయుట అవివేకము. ఈ అరిషడ్వర్గములను మోసుకొనుచూ తిరుగాడుచున్న మనస్సునూ పరమేశ్వరునకు సమర్పణ చేయుటయే అరిసూదనత్వము, అప్పుడే సాధకుడు మధుసూదనుని అనుభూతికి పాత్రుడగును.
ఈ భావమునే అతి సూక్ష్మమగు భాషలో ఐదవ శ్లోకము వ్యక్త పరచుచున్నది. రావణుని చుట్టూ ఆవరించియున్న అజ్ఞానమును ఏనుగులుగా వర్లించినాడు. అనగా శరీరసొష్టవము. నిండుగా పుష్కలముగా ఉండికూడా, జ్ఞానభాగము అల్పముగా నున్నవారిని ఏనుగు అనుపేరుతో పేర్కొనుట కలదు. రావణుని చుట్టూ ఆవరించి యున్న వారందరూ ఏనుగుల వంటి వారు. అనగా ఒకరు చెప్పిన పనిని చేయుటయే అలవాటుగా గలవారు. తాము స్వయముగా ఆలోచించునట్టి (ప్రజ్ఞ లోపించిన వారు.
రావణ వైభవము 89 “చతుర్విషాటైః” నాలుగు దంతములు కలిగినట్టివి. త్రివిషాణైై - మూడు దంతములు కలిగినవి. అనగా వివిధములైన ఏనుగులు వర్షింపబడినవి. ఏనుగు అనగా స్వయముగా ఆలోచించి కర్తవ్యము నిర్ణయించునట్టి సామర్ష్యముగాని, స్వంత పజ్లగానొ లేనిది. ఏనుగుల ఆయుధములు దంతములు. అవి సహజముగా రెండు ఉండును. ఇచ్చుట మూడు, నాలుగు దంతము లున్నటులు కవి వర్షించెను. అనగా బుద్ధిబలము తక్కువ. శరీరబలము ఎక్కువగా నుండి ఇతరులను బాధించెడి వారని అర్ధము. అట్టివారే రావణుని చుట్టూ ఉన్నారని భావము. రావణుడు చేయునవి ధర్మకార్యములా లేక అధర గకార్యములా అని విమర్శించునట్టి వారు అచ్చట ఎవ్వరూ లేరు. రావణుడు చేసినదే ధర్మమని భావించువారే అచట నున్నారు. ఆయన యొక్క హితమును కోరువారు కాదు. అతనికి అనుకూలముగా, ప్రియముగా మాట్టాడువారు మాత్రమే. ఆయన యిచ్చు ఆజ్ఞలను పాటించువారు మాత్రమే ఆయన చుట్టూ పరివేష్టించి యున్నారు. ఆ తరువాత ఎత్తబడిన ఆయుధములు రావణుని భవనము చుట్టును. పరినేష్టింపబడినవి అని వర్షింపబడినది. ఆయన మాటకు ఎదురు తిరుగువారిని ఖండించుటకై ఆయుధములు సిద్దముగా నున్నవి. ఆయుధములకు ధర్మాధర్మవిచక్షణ జ్ఞాన ముండదు. సాధు అసాధుభావము ఆయుధముల కుండదు. అట్టీ మౌనసిక స్థితి కలవారే ఆచట నున్న రాక్షసవీరులని భావము.
ఇంత వరకూ రావణుని సంపదయొక్క వైభవము. అనగా బంగారము, వెండి, రత్నములు, భవనములు, కోటలు, ఉద్యానవనములు, పుష్పకవిమానము మొదలగు వానిని వర్షించుట జరిగెను. ఆ తరువాత శ్టోకముల యందు అనగా 9వ సర్గములోని 28వ. ళ్లోకము. నుండి 38వ. శ్టోకము వరకూ రావణబ్రహ్మ యొక్క తేజస్సు వర్షింపబడినది.
రావణుడు పులస్య్యబ్రహ్మ వంశమువాడు. (బ్రహ్మ అంశతో దిగి వచ్చినవాడు. రాజస అహంకారములయొక్క బ్రహ్మ తేజస్సును తనయందు నిల్పుకొన్నవాడు. తాను శ్రీమహావిష్ణువుయొక్క ద్వారపాలకుడు అనియు, ముని శాపవశమున ఇటువంటి. రాక్షస భావమును కలిగియున్న వాడననియు ఎరిగినవాడు. ముని శాపవశమున తనకు లభించిన ఈ రాక్షసజన్మను త్వరలో ముగించుకొని విష్ణువు యొక్క ద్వారపాలకునిగా తిరిగి వెళ్లవలెనను ఆతృత కలవాడు. కనుక రావణుని, మాటలు కూడా రాక్షస భావముతోను, దురహంకారముతోను మాట్లాడినట్లు పైకి కనుపించుచునేగాని లోపల నిశ్చలమగు వైష్ణవ భక్తిని ప్రతిపాదించుచుండును.
ంం సుందరకాండము కనుకనే అతని భవనము వెలుపల నుండి చూచునప్త్పుడు ఏనుగుల చేత, రాక్షసులచేత ఆవరించబడినట్టు కనిపించును. లోపల ప్రవేశించి చూచినప్పుడు 'బ్రహ్మతేజస్సుతో నిండారినట్టు కనుపించును అని వాల్మీకి మహర్షి మనకు బోధించుచున్నాడు. రావణుని భవనము తెల్లగా రాజహంస వలె ప్రకాశించుచుండెను. రావణునిలోని బ్రహ్మ తేజస్సు తెల్లగా రాజహంసవలె ప్రకాశించుచున్నదని భావము. ఆ భవన మందంతట మంచివాసన నెలకొల్పుటకై అగరు మొదలగు వాసన ద్రవ్యముల పొగ భవనమంతయూ ఆవరించి యుండెను. ఆ పాగ ఆ భవనము చుట్టూ ఆవరించి యుండుట వలన, దాని యొక్క తెల్లదనము ఈ పొగతో ఆవరించి యున్నది. తెల్లని రంగు పొగయొక్క నల్లని రంగు కలసి బూడిద రంగుగా ఆభవనము. కనుపించుచుండును. అతడు తన లోపల బ్రహ్మజ్ఞానసంపన్నుడే అయినప్పటికీ ముని శాపము అన్న అగరు వాసన ఆవరించి తెలుపు, నలుపు కలసిన బూడిద రంగుతో నున్న జీవితమే రావణుని జీవితము అని తెలియును. కాని రావణుడు సంపూర్ణ జ్ఞాని కాడు. సంపూర్ణముగా అజ్ఞాని కూడా కాడు. దైవభావ, రాక్షసభావముల కలయిక అని మనము (గ్రహింప వలయును. క్ట, ధూఘ్రా మగరుధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పోపహారేణ. కల్మాషీ మివ సుప్రభామ్ 9-28 క్లో! మనస్సంహ్హాద జననీం వర్లస్యాపి (ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియ స్సంజననీ మివ 9-29 శ్లో ఇంద్రియా ణీంద్రియార్డెస్తు పంచ పంచభి రుత్తమైః తర్పయామాస మాతేవ తదా రావణపాలితా 9-30 ఖ్లోః స్వర్గ౭యం దేవలోకో౭య మింద్ర స్యేయం పురీభవేత్ సిద్దిర్వేయం పరాహి స్యా దిత్య మన్యత మారుతిః 9-31 క్లోః దీపానాంచ ్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భి ర్భూపణానాం చ పప్రదీప్తే త్యభ్యమన్యత 9-33 రావణుని సన్నిధిలో ఉన్న వారందరిపైనను ఆ బ్రహ్మతేజస్సు పడుతూన్నది. పరమగురువులైన వారు తమను ఆశ్రయించిన వారిని, తమతో పొటు పరమాత్మ సన్నిధికి చేర్చగలరు. ఆ విధముగానే రావణబ్రహ్మ వైకుంఠ ద్వారపాలకునిగా తాను తిరిగి వెళ్ళుటే గాక, తన నాశ్రయించిన వా రందరినీ ఆ విష్ణుసన్నిధి చేర్చగలిగినవాడు. అట్టి వాని సన్నిధియం దున్న వారికి వర్చస్సు పెరిగెనని, శోకము తొలగెనని భావమ.
రావణ వైభవము హ్!
(బ్రహ్మము యొక్క తేజస్సును మనము (గ్రహించుట అన్నది మనయొక్క కన్ను, ముక్కు, చెవి, నాలుక మొదలగు పంచేంద్రియముల ద్వారా జరుగును. ఈ భవనము యొక్క (బ్రహ్మవర్చస్సు ఆ భవనములో నున్న వారందరికీ కావలసిన విషయసుఖముల నందించి, వారియొక్క కన్ను ముక్కు, చెవి, నాలుక మొదలగు ఇంద్రియముల ద్వారా మంచి సంతృప్తిని కలిగించుచున్నది. ఆ అనుభూతి, తల్లి తన బిడ్డలను ప్రేమతో సాకి వారికి కావలసీన సుఖముల నందించుచున్నట్టు నిండుగా నున్నది.
ఆ భవనము యొక్క వైభవమును చూచి హనుమంతుడు చాలా ఆశ్ళర్యపడెను. ఇది స్వర్గమా? ఇంద్రుని అమరావతియా? దేవలోకమా? లేక బ్రహ్మస్టానమా? అని హనుమంతుడు ఆశ్చర్యపడెను. అచ్చట నిశ్చలముగా వెలుగుచున్న దీపములను చూచెను,
దీపముల యొక్క జ్వాల, రావణుని తేజస్సునుండి వచ్చు జ్వాలలు, ఆ భవనమునందలి రత్నములు మొదలగు అఆభరణముల నుండి వచ్చిన జ్వాలలతో నిండిన ఆ భవనము, అన్నిజ్యాలలచే ఆవరింపబడిన దానివలె నుండెను. అనగా ముందు. రాబోవు కధలో లంకానగరము అగ్నిజ్వాలలచే ఆవరింపబడుట సూచింపబడుచున్నది. 34 నుండి రఠవరకు రావణుని సతులను మహర్షి వర్ణించెను.
న యుద్ధకామేన తా స్పర్వా రావణేన హృతా: (స్త్రియః
సమదా మదనే నైవ మోహితాః కాళ్చి దాగతాః
రావణుడు యుద్ధమును (ప్రేమించు వాడు. తాను కన్యలను కొనివచ్చినచో, వారికి సంబంధించిన వారు యుద్దమునకు వత్తురని యువతులను తెచ్చెను. అంతియే కొని వారిని కామించి కాదు. కొందరు తామే వలచి యతని వద్దకు వచ్చిరి. వారంతా ఆయనను కోరువారే. ఒక్క అమ్మవారు మాత్రమే బలవంతముగా కానిరాబడినది.
మానవ (ప్రయత్నము వలన భౌతికమైన వా టన్నిటినీ రావణుడు జయించెను. కాని అత్మ స్వరూపిణి అయిన అమ్మవారిని మాత్రము జయింపలేక పోయెను. అతని భౌతికమైన శక్తియుక్తులు ఏమీ అచట పని చేయలేదు. యోగ సాధకులకు ఈ విషయము తేలికగా అర్థమగును.
శ్లో, నతదత్ర కాచిత్ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్బా,
నచాన్య కామాపి నచాన్య పూర్వా వినావరా ర్హాం జనకాత్మజాం తామ్ 9-70
౦2 సుందరకాండము. ఇందు మహర్షి సీతాదేవిని వరార్హా అని చెప్పిరి. వరుడు అనగా సృష్టి అంతటికినీ (ఢ్రష్టమైనవాడు. అనగా ఆపరమేశ్చరుడే అట్టి వరునకు అర్హమైనది నరార్హాసీతమ్మవారు. నః బభూవ బుద్దిస్తు హరీశ్చరస్య య దీ దృశీ రాఘవ ధర్మపత్నీ ఇమా యథా రాక్షస రాజభార్యా స్సుజాత మస్యేతి హి సాధుబుద్దేః 972 ఖ్జః పున శ్చసో2 చింతయ దార్తరూపో (ధ్రువం విశిష్టా గుణతో హీ సీతా అథాయ మస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్చరః కష్ట మనార్యకర్మ 9-73 సీతాపహరణము అన్నది చెడ్డ కార్యము. రావణుడు మూర్చుడు. (తైలోకాధిపత్య మదముతో కూడినవాడు. కనుక సీతను అపహరించునట్టి సాహసకార్యమునకు పూనుకొనినాడు. కనుక రావణుడు శిక్షార్హు. డు. అతనిని హింసించి, ధ్వంసము చేయవలెను అన్న భావముతో హనుమ లంకకు వచ్చెను. లంకలో రావణుని యొక్క వైభవమును చూచెను. రావణుని హింసించవలెనన్న భావము హనుమంతునిలో (క్రమముగా వెనుకబడసొగినది. ఇంత ఐశ్వర్యము, రాజ్యాధికారము కలిగిన ఈ రావణుడు నళించకుండ శుభమగు మార్గమును పట్టిన బాగుండును అని ఆంజనేయునకు కరుణామయమగు దృష్టి యేర్చడెను. సర్వలక్షణ సంపన్నమైన ఈ రాజ్యమును, ఈ సైన్యములను, ఈ పట్టణములను యథాస్త్రితిగా రావణుడు ఉంచుకొనుటకు ఉపాయమేమిటని ఆలోచించెను. సీతను అపహరించుట వలన కదా రావణునకు ఇటువంటి ఆపద రాబోవుచున్నది. ఈ ఆపద నుండి తప్పించిన బాగుండును. దానికి ఒకటే ఉపాయము. రామునితో రావణుడు మైత్రి చేసుకొనుటయే. అలా రామరావణులకు మైత్రి కుదిరినప్పుడు తన (ప్రభువగు సుగ్రీవునకు కూడా అనాయాసమైన, సుఖమగు కార్యక్రమము లభించును. కనుక వీ రిద్దరికి మైత్రి కలిగిన బాగుండును. సీతమ్మ వారిని రామునకు సమర్పించి శరణాగతిని పొందినప్పుడు రాముడు, రావణుని తప్పక క్షమించును. సుగ్రీవునకు యుద్ధసన్నాహము తప్పును. ఈ ఆలోచన అంతయు చాలా సులువుగా, సరళముగా నున్నట్లే కనిపించును. కాని ఇది సరియగు ఆలోచన కాదు. ఇట్టి సౌమ్యము, సఖ్యత భూమిపై నున్నచో, ప్రేమభావము భూమిమీద పరిపాలనము చేయుచున్నచో, సీతారాములు
రావణ వైభవము 93 అవతరించవలసిన అవసర ముండదు. రావణునితో ఘోర యుద్ధము చేయవలసిన అవసర ముండదు. రాముని అరణ్యవాసము కూడా అవసరము లేదు. దండకారణ్యములో విరాధుడు, కబంధుడు మొదలగు వారు మహామూర్డులు. వారికీ తోచిన మార్గములను తప్ప ఇతర మార్గములను అంగీకరింపని వారు. సౌమ్యముగా చెప్పిన వినని వారు. కనుకనే వారిని వధింపవలసి వచ్చినది.
రావణ, కుంభకర్ణులు జయవిజయులు, వైకుంఠ ద్వారపాలకులు. మునులయొక్క శాపమువలన రాక్షస జన్మ పొంది రావణ, కుంభకర్ణులుగా జన్మించినారు. రాముడు వారిని తిరిగి వైకుంఠమునకు గొనిపోవుటకు అవతరించెను. అది ఈ- కథ యొక్క పరమార్ధము. కనుకనే రాముడు మారీచుని మాయకు లోబడినట్టు నటించి సీతను వదలి. వెళ్ళుట, సీతాపహరణమునకు రావణుని (ప్రోత్సహించుటకే అని తెలుసుకొనవలెను. అందువలన రావణుడు ఇప్పుడు సౌమ్యమార్గమునకు మరలి మంచి మాటలను అంగీకరించి సీతను రామునకు అప్పగించుట యన్నది జరుగదు, రామునితో మైత్రి చేసినచో రావణునకు లంకకు శుభము కలుగును కదా యని, రావణుడు సుఖముగా లంకలో నుండవచ్చునుకదా యని ఆంజనేయుడు అనుకొనెను. కొని రావణుడు ఈరాక్షసరూపములో నుండుటకు ఇష్టపడుట లేదు. ఈ జన్మను త్వరగా వదలి వేయవలెనన్న తొందరలో నున్నాడని మనము (గ్రహింపవలెను.
ఇదియంతయు మనోమయకోశమునకు సంబంధించినది. ఇప్పటి వరకు ఆంజనేయుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయకోశములందు చరించను. అందు ఆత్మస్వరూపిణి అయిన అమ్మ వారిని అన్వేషించెను. కాని అచ్చట దర్శించలేకపోయెను. అనగా ఈ మూడు మెట్టు ఎక్కిన తరువాత గాని సాధకుడు అమ్మవారిని దర్శింపలేడని భావము,
హ్దోః తత్ర దివ్యోసమం ముఖ్యం స్పాటికం రళ్నభూషితం
అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనమ్ 10-1 రాజభవనములో ప్రవేశించి రావణుని యొక్క శయనాగారము, శయనించు ఏర్పాట్లను, కూర్చుండు ఏర్పాట్లను చూచెను.
ఈ సర్గ అధికభాగము రావణుని యొక్క పడకటింటి వర్ణనలతో కూడియున్నది. అచ్చట నున్న అందమైన వస్తువులను, అచట ని(ద్రించుచున్న అందమైన స్త్రీలను చాలా విపులముగా వర్లించెను. వాల్మీకి మహర్షి రాజభోగలాలసత్వమును వర్షించుట వింతగా కనుపించును. అందునను ఆంజనేయుడు (బ్రహ్మచారి, ప్రీలతో ఎలాంటి సంబంధము లేనివాడు. రావణుని పడక గదిలోని వస్తువుల నన్నింటిని హనుమంతుడు
రడ సుందరకాండము పరిశీలించుట వింతగా నుండును. అనగా ఇంతటి ఆకర్షణీయమైన రాజభోగములు ఏవీ కూడా ఆంజనేయుని ఆకర్షింప లేదని చెప్పుటకే. ఆ గదిలో ఆయన వెదకినది అక్కడి సంపదను కాదు. అచ్చట ని(ద్రించుచున్న స్త్రీల సౌందర్యమును కాదు. సీతమ్మ వారి సచ్చీలము, ఆత్మ తేజస్సు జగన్మాతమైన ఆమె వాత్సల్యము. ఆ రావణునియింటిలో ఉన్నదేమో నని అచట నున్న వారిలో వెదకెను. అచట లేదని తెలుసుకొనెను. అచట నున్నది అందమే కాని జగన్మాత యొక్క స్వచ్చ సౌందర్యము కానే కాదు అని హనుమ స్పష్టముగా తెలిసికొనెను. శ్లో నిళ్చసంతం యథా నాగం రావణం వానరర్జభః ఆసాద్య పరమో ద్విగ్న స్పోపాసర్పత్సు భీతవత్ 10-12 రావణుని దర్శనము వలన ఆంజనేయునకు ఒడలు జలదరించిన ట్లయ్యెను. తనకు తెలియకయే ఒక అడుగు వెనుకకు వేసెను. హరాత్తుగా మనకు పులి ఎదురైనప్పుడు ఒడలు జలదరించును. మనకు తెలియకయే వెనుకకు అడుగులు వేయుదుము. '్రమాదకములు, దుష్టములు అగువానికి దూరముగా నుండగోరుట సహజము. రాముల వారిని దర్శించినప్పుడు, రామునియొక్క సాత్త్విక తేజస్సు ఆంజనేయుని తనవైపునకు ఆకర్షించినది. కనుక హనుమ రాముని దరికి చేరెను. భక్తు డయ్యెను. బంటు అయ్యెను. రాముని వదలలేని వానిగా నయ్యెను. క్లో ఐరావత విషాణాగై రాపీడనకృతవ్రణౌ వట్రో ల్లసిత పీనాంసౌ విష్ణుచక్రపరిక్షతౌ 10-16 హనుమ రావణుని చక్కగా పరిశీలించి చూచుటకై ఎత్తైన వేదికపైకి ఎక్కెను తెల్లని పాన్పుపై పరుండి నిద్రించుచున్న రావణుడు (ప్రస్రవణ గిరిపై నిద్రించుచున్న మదపుటేనుగువలె కన్పించెను. అనగా శరీరబలము అధికముగా కలిగి, జ్ఞాన తేజము అల్పముగా గలవాడుగా హనుమకు కన్పించెను. ఐరావతముతో పోరి నప్పుడు తన భుజములకు కలిగిన గాయపు గుర్తులు ఆభుజబలముపై కనుపించుచుండెను. భుజములు చాచి పరుండినపుడు చేతిగ్రేళ్ళు, చేతిగోళ్ళు మెరయు చుండగా ఆ చేతులు ఐదుతలల పాము వలె కన్పించెను. " శో చూత పున్నాగ సురభి ర్వకుళోత్తమ సంయుతః మృష్ణాన్నరస సంయుక్త పానగంధ పురస్సరః 10-23 అతని నిట్టూరులు (త్రివిధములుగా యున్నవి. ఒకటి. యితడు వైకుంఠ ద్యారపాలకుడు, కనుక పరమ పవిత్రమైన వాసనా విశేషములు కలవాడు. కనుక
రావణ వైభవము 9ి్ అతని. శ్వాస పున్నాగ మొదలగు పూలవాసనలు గలది. రెండవది మునిశాపము వలన భూమికి దిగి వచ్చినందువలన, భూమికి సంబంధించిన మృష్టాన్నరసము ఆ పుష్టిగల రుచిగల అన్నపు వాసన వచ్చుచున్నది. మూడవది రాక్షస భావమునకు కేంద్రము అయినవాడు గనుక మద్యపు వాసన అన్నింటిని మించుచున్నది.
రాక్షస ప్రకృతికి సహజమగు బలదర్భములు గల రావణుని చూడగనే హనుమకు వెగటు కలిగెను. శ్రీరామచంద్రుడు సర్వజన సమ్మోహనమగు రూపము కలవాడు. ఆనందమయ మందహాసముతో అందరినీ తన వద్దకు ఆకర్షించుకొనువాడు. ధర్మపరాయణత్వమునకు (బ్రహ్మవర్చస్సునకు హనుమ ఆకర్షింపబడి శ్రీరాముని చేరెను. రాముని విడిచి ఉండజాలని మంచి స్థితిని పొందిన హనుమకు, రావణుడు చాలా అల్పునివలె కన్పించెను. అతని చుట్టూ సుందరాంగులయిన వారెందరో నిద్రపోవుచుండిరి. ఇందరితో వర్తించు రావణుని శీలసంపదను చూచి (బ్రహ్మచారి రామభక్తుడునయిన హనుమకు మరీ వెగటు కలిగెను. ఈ విధముగా అర్హనగ్నముగా పడి ని(ద్రించుచున్న యువతులను చూచుటయే యధర్మ మనుకొన్న హనుమకు ఆ దృశ్యము నచ్చలేదు. కాని తాను వెదకునది జగన్మాతయగు సీతను. కాని సీతాదేవి యొక్క శుచిత్వమును పవిత్రతను ఆనిద్రించువారి యందు ఎంత వెదకినను హనుమకు కనుపించలేదు. వారు ఎంతో అందముగా ఉన్నా ఎంతో ధనసంపదలలో మునిగియున్న వారిలో ఆకర్షణ లేదు. పవిత్రత అసలే లేదని హనుమ నిశ్చయించెను.
శ్లో! మాషరాశి ప్రతీకాశం నిశ్చసంతం భుజంగవత్
గాంగే మహలు తోయాంతే 'ప్రసుప్త మివ కుంజరమ్ 10-28 శ్లోః చతుర్భిః కాంచనైర్రీపై ర్రీష్య మానం చతుర్దిశం ప్రకాశికృత సర్వాంగం మేఘం విద్యుద్గణై రివ 10-29
మినుములు రాశిగా పోసినప్పుడు వానికి స్వయముగా ప్రకాశం గాని, ఆకర్షణ గాని యుండదు. అలా రావణు డున్నాడు. నల్లని త్రాచుపాము బుసకొట్టుచున్నట్టు ఊపిరి తీసి వదులుచున్నాడు. తామసగుణము ప్రధానముగా కలిగి వికారవంతముగా ఉన్నాడు. తెల్లని పానుపు మీద శయనించిన రావణుడు గంగానదీ జలములో నున్న నల్లని ఏనుగువలె హనుమకు కనిపించెను. రావణునకు నాలుగు వైపులా బంగారు పాత్రలలోని దీపములు వెలుగుచున్నవి. అవి రావణుని నాలుగు దిశలకు కనిపించులాగున చేయుచున్నవి. అనగా రావణునకు స్వయం (ప్రభ లేదని భావము.
కర్ర సుందరకాండము
ఆ తరువాత మండోదరని చూచుట
ళ్డా తాసా మేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే
దదర్శ రూపసంపన్నా మపరాం స కపి(స్రియమ్ 10-50 ్జోః స తాం దృష్టా వ్ మహాబాహు ర్ఫూషితాం మారుతాత్మజః తర్మయామాస సీజేతి రూప యౌవన సంపదా 10-53
“ఏకాంతం విన్యస్తే” ఒంటరిగా ఉంచబడినది. అమె శయనించిన మంచము ఒంటరిగా నున్నది. అనగా ఆమె మనస్సు అల్లకల్లోలముగా నుండక, ఏకాంతముగా ప్రశాంతముగా ఉన్నది. ఆమె యొక్క (ప్రశాంతమైన స్థితి వలన ఆమె చుట్టూ శుభకరమయిన వాతావరణ మున్నది. రావణుని చూచినప్పుడు భయము కలిగెను. మండోదరి శుభభావములు విస్తరింపజేయుచూ కోభాయమానముగా నుండెను. రావణుని అంతఃప్పురమునకు ఒక నూతనమగు శోభను చేకూర్చుచుండెను. ఆమె చాలా అందముగా ఆకర్షణీయముగా ఉండెను. ఇచట ముఖ్యముగా గమనించవలసినది మండోదరిని చూచి సీత అని హనుమంతుడు (భ్రమపడెను.
ఆంజనేయుడు సీతమ్మ వారిని వెదకుటక్షై ముందుగా తామస గుణమునకు గుర్తుగా నున్న నల్లని రావణుని చూచెను. ఆ తరువాత బంగారు కాంతి కల్షిన రాజనగుణమునకు గుర్దుగా నున్న మండోదరిని చూచెను, ఈమె సర్వాలంకారభూషితతైై యున్నది. ఆమెను చూచి సీతాదేవి ఈమెయే కావచ్చును అన్న ఆలోచన ఆంజనేయునకు కలిగెను.
యోగాభ్యాసము చేయు నప్పుడు భగవంతుని దర్శనము కావలెనని ప్రతివారు ఉవ్విళ్ళూరు చుందురు. గురువులు కూడా అట్టే చెప్పుచుందురు. నీవు సాధన చేయి. అప్పుడు నీకు ఎర్రని దీపము కనిపించును. తామరపువ్వు కన్పించును, హంస కన్చించును అని చెప్పెడి పరిపాటికూడా కలదు. ఆ ఆశకు వళశులై సాధకులు తమకు భగవద్దర్శనము కాబోవుచున్నదని ఉబలాటపడుచుందురు. అతనికి ఒక వెలుగుగాని, హంసగాని కన్సించవచ్చును. ఆ కన్పించినదే భగవద్దర్భనము అని వీరు పొంగి పోవుదురు. ఎగిరి గంతులు వేయుదురు. నాకు భగవద్దర్శనమైనది. పండిపోయితిని నాకు పూర్ణపిద్ది లంభించినది అని భావింతురు. మనకు లభించే యిలాంటి అనుభవమునే వాల్మీకి మహర్షి ఆంజనేయునకు లభించినట్లుగా వర్షించుచున్నారు. ఇది (బ్రాంతి వలన ఏర్పడిన భావమే, కాని అసలు దర్శనము కాదు అని ఈ శ్చోకము మనకు బోధించుచున్నది.
రావణ వైభవము రా ళో. హర్షేణ మహతా యుక్తో ననంద హరి యూధపః ఆస్పోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిశ్రీడ జగౌ జగామ స్తంభా నరోహ న్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ 10-54 ఆహా! నేను అమ్మ వారిని చూచితిని అని జబ్బ చరిచెను. తోకను ముద్దిడెను, ఆనందముతో గంతులు వైచెను. యోగాభ్యాసము చేయువారికి కొత్త అనుభవము లభించినంతనే, ఆనందము. కలుగుచుండును. ఉబ్బితబ్బిబ్బయిపోయి అటునిటు తిరుగాడుదురు. ఒక చోట స్థిరంగా నుండజాలరు. మనస్సు ఉద్వేగము పొందును. కొండ నెక్కినట్టుగొ సంతృప్తి హాయి గొల్పును. స్తంభము ఎక్కినట్టుగా తాను ఎంతో ఉన్నతనుయిన స్టితిని పొందితిని అనిపించును. తాను అందరికన్న అధికుడను, యోగవిద్యలో అందరికన్నా ప్రథమ్రేణికి చేరగలిగితి నన్న అతిశయ భావము కలుగును. స్తంభ మెక్కుట, చిగుట యన్నది ఉచ్చ్వాస, నిశ్వా్షములయొక్క పోకడకు గుర్తు. గొలి పీల్చినప్పుడు. నిండుగా ఉత్సాహము. నుండును. అది అట్టే కాల ముండదు. మరల గాలిని వదలి వేయవలసివచ్చును. అలాం టప్పుడు ఉత్సాహం దిగివచ్చును. హనుమంతునకు ఉత్సాహము. కొండ యొక్కించినది. తుదకు జయము లభించిన దనుకొన్నాడు. కాని ఆ భావం నిలువ లేదు. సీతాదేవి ఈమె కొదేమో నన్న భావం తనకున్న ఉత్సాహాన్ని తగ్గించింది. అపవిత్రమగు రావణశయన గృహమున అమ్మవా రుండునా యన్న వివేకము క్రమముగా పని చేసినది. గులాబీపువ్వు చూచుటకు ఎంతో. బాగున్నది. రేకుల పొందిక, రంగు బాగా శోభాయమానముగా నున్నది. ఆకారము చక్కగా, గుండ్రంగా, అకర్షణీయముగా ఉన్నప్పుడు ఆహా! గులాబి పువ్వే అను కొందుము. దగ్గరకు చేరి వాసన చూసినప్పుడు, కాగితపు పువ్వు అని తెలియును. వాసన యుండదు. కళ యుండదు. జీవభావం లోసించును. హనుమకు అట్టి వివేకోదయము కలిగినది. ఈమె శోభ, ఆకర్షణము అంతయూ ఆ అమ్మవారి యొక్క దివ్య చైతన్యము యొక్క ఒకొనొక చిన్న భాగమేనని హనుమ (గ్రహించెను. తాను వెదకు జగన్మాత జగత్తుయొక్క చైతన్యకేంద్రము, ఈ నిద్రించు. నామె కాదని నిర్ణయించెను. “నిద్రాము!ద్రాం సకల జగతీ - రక్షణో జాగరూకా - అమ్మ వారి నిత్య జాగృతి యొక్క రూపము. నిద్రాముద్రలో నున్న జాగృతి. మరి ఈమె చక్కగా నిద్రపోవుచున్నదని హనుమ (గ్రహించెను.
98 సుందరకాండము
శ్లో, అవధూయ చ తాం బుద్ధిం బభూవావ స్టిత స్తదా
జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః శ్ష-1 శ్లో, న రామేణ వియుక్తా సా స్వప్తు మర్హతి భామినీ న భోక్తుం నాప్యలంకర్తుం న పాన ముపసేవితుమ్ 11-2
మొదట ఆంజనేయుడు మండోదరిని చూచి సీతాదేవి యని భ్రాంతి పడినప్పటికీ వివేకవంతుడు కనుక యిట్లు ఆలోచించెను. “సీత భూజాత. అయోనిజ. జగన్మాత ఆమె రావణుని అంతఃపురములో నున్నది అని నేను భావించుట పెద్ద పొరపాటు” అని తెలుసుకొనను.
'నరామేణ వియుక్తా సా స్వప్ము మర్హతి భామినీ"
ఆమె ఎప్పుడూ, నిత్యమూ జాగృతిలో ఉండునటువంటి అనగా మెలకువలో నుండునటువంటి ఆమె కాని, నిద్రపోవు సామాన్య లక్షణములు కలిగినట్టిది కానే కొదు. సర్వేశ్చరుడగు రామునితో కలసి యున్నప్పుడు మాత్రమే ని(ద్రాముద్ర వుండును. నిద్రించుచున్న ట్లుండును. అయినప్పటికీ జగత్తు నంతటినీ రక్షించునట్టి జాగృతి యందే యుండునని భావము.
“నభోక్తుం నాష్యలంకర్తుం న పాన ముపసేవితుమ్”
సీతాదేవి జగన్మాత కనుక ఆమె అందరకు ఆహారమును పెట్టునే కాని ఆమె ఎప్పుడూ ఆహారమును తీసుకొన వలసిన స్టీితి యం దుండదు. సామాన్యమగు జంతువులు, మానవులు ఆహారము తీసుకొన వలసి యుండును. ఆమె భూజాత కనుక ఆమె భూమి నుండి వచ్చు ధాన్యములు, పండ్డు అన్నీ ఆమె రూపములే. మనకు అహార్వము స్వీకరింపజేయునట్టి సామర్ధ్యము ఆమెయే. ఆహారము. కూడ ఆమెయొక్క స్వరూపమే, ఆమె మనచేత ఆహారాదులను తినిపించును కాని ఆమె తీసుకొనవలసిన అవసర ముండదు.
ఆమెయే సృష్టికి అలంకారము. షోడశ కళాపరిపూర్హ స్వరూపిణి. కనుక ఆమె ఎప్పుడు ఆలంకరించుకొనదు, ఇనవంశోత్తముడైన ఆరాముడు ఆమేకు అలంకారము. అమ్మవారికి అన్నపానములు, విహారము అంతా రామచంద్రుని మయము, కాన ప్రత్యేకముగా ఆమెకు అన్న ఫానాదులు అక్కరలేదని భావము.
అన్నపానాదులకు, నిద్రకు దాసురాలైన ఈ మండోదరి సీతకాదు అని ఆంజనేయుడు స్పష్టముగా తెలుసుకొనెను. సంపదల యొక్క ఆకర్షణ, రాక్షస
రావణ వైభవము 9ం స్వభావములలో ఇమిడియున్న ఆకర్షణ, రాజుంతః పురము లందున్న సౌందర్య వచులగు. స్త్రీల యొక్క ఆకర్షణను హనుమ సులువుగా జయించెను, కంటి ఆకర్షణను తిరస్కరించి, దాటి వెళ్ళునప్పుడు ఇంకొక ఆకర్షణ అతనికి ఎదు రయ్యెను. అదే ముక్కునకు, నాలుకకు సంబంధించిన ఆకర్షణ. మద్యమాంసాదుల యొక్క ఆకర్షణ. శ్ఞోః వరాహ వార్రాణసకాన్ దథిసౌవర్చ లాయుతాన్ శల్యాన్నృగ మయూరాంశ్చ్ళ హనుమా నన్యవైక్షత వివిధములగు జంతువుల మాంసము వండి భుజించుటకు సిద్దముగా ఉండెను, పలు విధములగు మద్యములు కూడ అచ్చట నుండెను. అవి ఏవియును హనుమను ఆకర్షించలేదు. వానిని తిరస్కరించి ఆపానశాలను దాటి వెలుపలకు వచ్చెను. క్ట, ఏవం సర్వ మశేషేణ రావణాంతః పురం కపిః దదర్శ సుమహాతేజా న దదర్శ చ జానకీం 11-35 నిరిక్ష మాణళ్చ్ళ తదా తాస్త్రియ స్స మహాకపిః శ్లో; పరదారావరోధస్య (ప్రసుప్త స్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్ధం ధర్మలోపం కరిష్యతి 11-37 వ్గోః నహి మే పరదారాణాం దృష్టి ర్విషయవర్తినీ అయం చాత్ర మయా దృష్టః పరదారపరి[గ్రహః కే1-38 వాల్మీకి మహర్షి పరమ శాంతమైన ఆశ్రమ జీవనమునకు అలవాటు పడిన వాడు. శుచికరమైన అన్నివలె తేజోవంతమైన భావములు కలవాడు. ఆశ్రమవాసు లందరు అట్టివారే. అట్టి వాల్మీకి మహర్షి రావణుని అంతఃపురమునందలి రాజభోగములను వర్ణించుట, అదియును అర్ధరాత్రి యందు అర్హనగ్నముగా నున్న స్త్రీలను (త్రాగిన మైకములో మైమరచినట్టి వారిని వర్లించుట విడ్డూరము. (బ్రహ్మవిదుడైన ఆంజనేయుడు ఆ దృశ్యములను చూచుటయును ఆశ్చర్యకరమే అని మనకు అన్పించును. కాని, రావణాంతఃపురమునందున్న స్త్రీలను చూచుటకు ఆంజనేయుడు వెళ్ళలేదు. చూడవలయునన్న కోరికయు లేదు. సీతాదేవిని చూచుటకే ఆ అంతఃపురమునందు ప్రవేశించెను. ఆ దేవి దర్శనము కాలేదు. “సీతమ్మ వారిని వెదకుటకై నేను రావణుని అంతభురములోనికి వచ్చి పర్త్రీలను పరకాయించి చూచుటవలన ధర్మలోపము కలిగినది. అయినప్పటికీ నా
100 సుందరకాండము దృష్టి సీతాదేవిని దర్శించుటకే యత్నించుచున్నది. కాని యితర స్త్రీలను చూచునట్టి ప్రయత్నము నాలో ఎంత మాత్రమును లేదు. మంచి భావములు కలుగుటకు, చెడు భావములు కలుగుటకు మనస్సే ప్రధానము. నా మనస్సునందు చెడు భావము లేదు. నేను సీతమ్మ తల్లిని వెదుకవలెనన్న భావముతోనే ఈ అంతఃపురము తిరిగితిని. ఈ భావమే చెక్కుచెదరక నాలో నిల్చినది కాని సీతమ్మను చూడలేకపోయితిని” అని బాధపడుచు మిగిలిన ప్రదేశములలో వెదుకసాగెను.
కొత్త రామకోటయ్యా - పాత కోటరామయ్యా
కృష్ణ రాము లిరువురూ - నీలో ఉన్నారయ్యా
అరవిందుల కావ్యమ్మగు అపురూపపు '“సావిత్రి' ని,
ప్రభాకరుల దీవెనతో అనువదించి నావయ్యా !
నారికేళ పాకమ్మును నవనీతము గానొనర్చి -
నలుగురు చవిచూచి మెచ్చ అందించినావయ్యా |!
విద్వేషము నెరుగనట్టి విజ్ఞానము నీదయ్యా !
విశ్వ శ్రేయమే యెంచిన విశ్వాత్మకుడీవయ్యా !
విశ్వశాంతి సమకూర్చే విణ్ఞాణము నీదయ్యా ! ॥ కొత్త ॥
ఏవి నీకు పడలేదో అవే బాగ తినుమటన్న,
సీవీవీ రాజయోగ సిద్ధి పొందినానయ్యా !
వేడిచేయు మామిడులు వేసవినే ఏల వచ్చు
నన్న నీదు వాదనమ్ము అన్నిటను ఉన్నతమ్ము
సామాన్యులకును అందిన సద్గురుండ వీవయ్యా !
సామ్రాట్టులకే అందని శాంతిపధము నీదయ్యా ! ॥ కొత్త ॥
దయ్యాలను - భూతాలను దయతోడ ఆదరించి,
ఉన్నతగతి రూర్చినావు - ఉత్తములను చేసినావు,
కామితార్థ మొనగూరిచి కైవల్యము జూప్ినావు,
ప్రేమతోడ పరమాత్ముని పొందు భాగ్య మొసగినావు
ప్రాణిహింస సహియింపని ప్రేమమూర్తి వీవయ్యా 1
పతితుల పావనుల జేయు పరమహంస వీవయ్యా ! ॥ కొత్త ॥
చల్లనైన నీ చూపు - చక్కనైన నీ పిలుపు
తీయనైన నీ పలుకు - తిన్ననైన నీ బోధ
కలకాలం మా మదిలో - నిలచేనయ్యా !
కర్తవ్యము నెరుగజేసి నడిపేనయ్యా ! ॥ కొత్త ॥
-శ్రీ మజ్జీవూడి వీరయ్య
శోకవనము శ్లో! “సా రాక్ష సొనాం '్రవరేణ జానకీ - స్వశీల సంరక్షణ తత్పరా సతీ అనేన నూనం ప్రతి దుష్టకర్మణా - హతా భవే దార్యపథే పరే స్థితా” 12-3
ఇంతవరకు ఆంజనేయుడు ఎంతో గట్టి పట్టుదలతో సీతమ్మ వారిని వెదకెను. ఆమె లేని చోటులయందు అమె కొరకై వెదకి విఫలు డయ్యెను. తన ప్రయత్నము వ్యర్థమైనందులకు చింతించెను.
ఇటువంటి అనుభవము భగవంతుని వెదకునట్టి యోగసాధకులైన వారిక్తి ఆధ్యాత్మ విద్యయందు ప్రవేశము కలవారికి తరచు కలుగు చుండును. భగదారాధన పరులగు వారు కూడ ఇట్టే తలంతురు. మేము ఎన్నో తీర్ణములకు వెళ్ళితిమి. పుణ్యక్షేత్రములు దర్శించితిమి. ప్రతములు, ఆరాధనములు, యజ్ఞములు మొదలగునవి ఎన్నో చేసితిమి. అయినను ఆ భగవానుని కృప మాకు ఇంకను లభింపలేదు. అని దుఃఖపడుట సహజము. అది శోకవనము అనబడును. అనగా ్రతిఫలమును కోరి భగవంతుని పూజలు, ఆరాధనములు చేయుట వలన ఇట్టి ఆశాభంగము కల్లును. ఏ ఫలమును కోరక నిశ్చలమగు భక్తిలో భగవంతుని ఆరాధన చేయు వారికి, శోకవనముయొక్క _సంస్పర్శ యుండదు. అట్టి వారే అశోకవనస్పర్భలోనికి (ప్రవేశించగలరు. అని ఈ శ్లోకము మనకు బోధించు చున్నది.
అమ్మవారు త్రిలోక జనని యని యెరిగియు, అచటి భయంకర రూపుల యొక్క దుష్టచేష్టలకు భయపడి తన శీలరక్షణమునకు చనిపోయినదేమో అని భావించుచున్నాడు. “స్వశీల సంరక్షణ తత్పరాసతీ" - ఈ సృష్టిలోని వా రందరి యొక్క శీలమే స్వశీలము _ మానవుల నందరను మంచి శీల సంపత్తి గల వారలనుగా పరివర్తనము చేయుటకే వా రిరువురు దిగి వచ్చిరి గొన వా రాపని యందే తత్పరులై, యున్నారని భావము.
“పరిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతాం” - భగేవద్గీత
అన్న భావమే యిందు 'ప్రతిపాదించ బడినది.
“అనేన నూనం ప్రతి దుష్టకర్మణా” -
పైన చెప్పిన సాధుభావములకు “ప్రతి దుష్టకర్మణా” అడ్డు వచ్చిన చెడు కర్మ లన్నిటినీ “హతం భవేత్” చెడును హతమార్చి వేయుటకై దేవిగా రవతరించిరి. ఇది ఆర్యపథే - ఆర్యుల సన్మార్గము. ఆ మార్గము నందే అమ్మవా రున్నారు.
102 సుందరకాండము కో “సీతా మదృష్ట్వా హ్యనవాప్య పౌరుషంవిహృత్య కాలం సహ వానరై శ్చిరం నమే2స్తి సుగ్రీవ సమిపగా గతి స్సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానరః. 125 శ్లోః ద్రష్ట మంతఃపురం సర్వం దృష్టా రావణయోషితః న సీతా దృశ్యతే సాద్వీ వృధాజాతో మమ (శ్రమః 12-6 నేను సీతాదేవిని వెదుక వలసిన చోటున వెదుకలేదు. వెదుక నక్కరలేని చోటు లన్నీ వెదికితిని. రావణుని అంతఃపురము నందు వెదకుట వ్యర్హము. రావణుని భార్యలందు వెదకుటయూ వ్యర్థము, కాలమూ వ్యర్థమైనది. నాశ్రమయు వ్యర్ధ మయినది. లేని చోటుల వెదకిన తరువాత ఉన్నచోటును చేరగలమని భావము. “సీత్రా మదృష్ట్వా హి అనవాప్య - పౌరుషం” - సీత ఎక్కడ ఉండదో ఆ చోటుల యందు నేను వెదకిగిని. ఇది యంతయూ పురుష ప్రయత్నము. నేను వెదకగలను. నేను చూడగలను అనే అహంకారము, పౌరుషము. ఇచ్చట పనిచేయుట” లేదు. అపౌరుషమయిన దానిని చేరుటకు అపౌరుషేయమార్గమే తగి యుండును. కాని పురుష ప్రయత్నము వ్యర్థము. కాలము వ్యర్థము చేసినందులకు, చండశాసనుడగు సుగ్రీవుడు నన్ను క్షమింపడు, అని తలచి మరల మరల ఆ ప్రాంత మంతయు గట్టిగా గాలించి వెదకి వేసారెను. ఇంక నే వెట్టు అంగదుని, జాంబవంతుని మొగములను చూడగలను అని విచారించు హనుమంతునికి మరల దివ్యప్రచోదనము పనిచేయ నారంభించినది. శ్లోః “అనిర్వేద శ్రియోమూల మనిర్వేద: పరం సుఖం' అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు (ప్రవర్తకః 12-10 క్లోః “కరోతి సఫలం జంతోః కర్మయత్తత్కరోతి సః తస్మా దనిర్వేద కృతం యత్నం చేస్టే! హ ముత్తమమ్” 12-11 అనిర్వేదః పరం సుఖం - ఆంజనేయుని కంతయూ శోకమే - వేదనయే. - అంగదుని మొగ మెలా చూస్తాను? జాంబవంతున కేమి సమాధానం చెప్పవలె? సుగ్రీవుని చూసే దెలా? అన్న వేదన అశాంతి, దుఃఖము. ఈ దుఃఖము రాముల వారిని స్మరించి నంతనే తాలగగలదని ఎరుగవలయును. రాముని స్మరించినచో శోకవనము తొలగిపోయి అశోకవనమును చేరగలము. అట్టి దివ్య ప్రచోదనము' కొలదిగా హనుమంతునకు లభించినది. అది సరిగా, ససిగా పూర్ణముగా అందలేదు. తన నాక్రమించిన పౌరుషపుటహంకారము నలన పట్టుకొన్న దుఃఖము ఆంజనేయుని వేధింపసాగినదని భావము.
ఎజిాఇ-64 ౩ ది వారమే 6వ ౨౮ -ప్తేనా ₹గడ్య స్పృన్యు[నం ర్భశ్త యం క వ్వరండ ద్య బప పానం శ గల క్రన్త రా మపి (వముక్వుశేతం వ వ కమెచనదపదది కరానాట లే డు న టా న్. గావయో షి, అంతం చ్చురవంచంయడ దమటచ్యర్న వస్త స్రధిద్దటైలు తాల గరంమే సలా మరృన్లా(గొ-లదవా వయ [ల[ం గత ద్వ క్యర తృండ జళక వరుల ౦.4+చు భం చి త్రయు విద౩డ్యా -.- తమిఘయ్యుం. అక లోంయు పక భర్రుళలాల త్న వంఖ్ వదత యలు య లా కస్య యూ అంకం మ దు అ వైక్యతే 'రులతు పవ జూ టకం సంయక్ అం షళళ్లమ్ ఆంయిలుడత శక్యా. యాతమ యంత్యంవయకా మార్గము -కాలంద్దభొ వ్య దంట ల కంచ జట శారద ప డొుడ గట్లైండ్ష పాప దు ఉంతోంండ దుక ఛం చట అషాఓిం ఈఘు3 ఆలం *చ గారా నల దు కము పాడా 2 క2 3 పో ల(కదూని ఇూలటఖ వంం౮ పెం గఘుల చరాసిలాభ 46 ల్ు దివిటీ షర 6కు నం ఘుమాైం శాన యా రట షన్ష్యయుయాకర వండు వ 3
శాత 2. చను! త సట యమోాం మూ లడు నీ నక్షషళంయఖ ం
జ సన్స్ తో + టి | ౩
అన కేష్రజాతా నతఆం) న క్యా కుత్రు దర త
“అ శ్యోధదడకాడళం ను ఇం ఈం ఇ షెరింరు వ తజతలుటు న 1. చఠరేఎ అంగగర వియ్ యెలా ఎయాలైత్తూత ఖూన జవ ల్ తు డశ్రవి 4 గాడా ౮0వ నత ఉల్రిఖీవ ంటాయామెలా - అళ్నశమందనోత హాం ఆదు ప్పుంా ఈం నం్క్కచ్వం కా చు-ల షారాలి మది 0 “న కలాళతేిలాాలగశల ద ఇ-బ పగదలజసే శ గ7ామీన న స్త్మత లము డ బాశ నాల క్రవకయుంట్యాంభి శ పొలి 6 శాణకభడం శం మ్టగలయు- రసో దాళ్షప్ర పూకాట గం కాలాలి గ వలనంవంతంల్యు సీర కాణాంక న గా ప్ర్రర్మోల గో ఆంచత్సం లన నాళడ్రు జు* జ మో డువష్పు టవొంకాళ4వ క. వ్ రై కాంవ్హుదు 9 ఇంతా లతావాల పొడు -తాల 4 పాచిక. ఆజ రం (ట్రై7ంఘాల్టో ఐ ౭7 చం టమ .. (“మిల్లుల విపి వసానగ ద మాల చవోంం డో - ,
00 ) కట్టయ లన్ “వల
తశౌగల న ఫలం షోంఆాడ) టి. లీ (ర్ల్చ 'ఉన్మక్మడపస్వేకక్రళటుయయత్చు వస్త వమ్వత్తాలో
శోకవనము 103 దుఃఖ మార్గమును వదలి ఉత్సాహ వంతమగు మార్గమున నడచినపుడే మనకు జయము. లభించును. చేయు ప్రయత్నములు ఫలించును. కాబట్టి యీ పని రామకార్య మన్న ఉత్సాహముతో నేను నా కార్యమును ఆరంభించెదను అని హనుమ తలచెను. వెదకిన చోటులనే మరల వెదకెను. అనగా ఒక జన్మలో. తీరయాత్రలు నేసి చూస్తాము. యజ్ఞయాగాది. (వ్రతకల్పము. లెన్నో చేస్తాము. (ప్రార్ధనలు, భజనలు చేస్తాము. కాని దైవదర్శ్భనము కాదు. ఆజన్మ చాలించి మరల జన్మకు వస్తాము. మళ్ళీ చేసిన ప్రయత్నము, తిరిగిన యాత్రలు తిరిగి తిరిగి, వేసారిపోయి వెదకుచునే యున్నాం అన్న భావం ఈ క్రింది శ్లోకము వివరించుచున్నది. శ్లో; “ఉత్పతన్నిపష్పతం శ్చాపి తిష్టన్ గచ్చ న్ఫునః పునః అపావృక్వాంళ్ళ ద్వారాణి కవాటా న్యవఘాటయన్ 12-15 జన్మ, జరా మృత్యువులు ఒక చక్రం. అనగా తల్లి గర్భములోనికి ప్రవేశించుట, ఒక శరీరమును ధరించి జన్మను పొందుట, ఆ శరీరములో కొంత కాల ముండుట, ఆ ఉన్న చోటునుండి మరల లేచిపైకి వెళ్ళి, తల్లి గర్భములో మరల ప్రవేశించుట అను చక్రము ఎప్పుడూ దాటరానిదిగానే యుండును. ఈ చక్రములో పడి తిరుగుతున్నంత కాలము అమ్మ దర్శనమునకై వెదకుచునే యుందుము,. (వ్రతములు, యజ్ఞములు, యాగములు చేయుచునే యుందుము గాని ఈ చక్రమును ఛేదించుకొని పైకి పోజాలము. ఈ జీవిత పరిభ్రమణమే యిందు (ప్రస్తావించబడినది. (పునరపిజననమ్ పునరపి మరణమ్ ......గోవిందమ్ భజమూఢమతే) యింతకు పూర్వము రహస్య గృహమును వెదకుట, భూతగృహములను వెదకుట, పాతాళ గృహములను వెదకుట మొదలగు నట్టి క్షుద్ర అభ్యాసములు సూచింప బడినవి. అట్టి సాధకులు చేయు కార్యక్రమములు ఇతరులను చూడనీయరు. భూమిలోపల పాతాళగృహములు కట్టి హోమాదులు చేయుచుందురు. ఇటువంటి సాధనములు మనలను అధోగతికి మరలించునే గాని, ఊర్జ్యగతికి కారణములు కాజాలవు. ఉత్పతన్ నిష్పతన్ : మనము ఈ శరీరము నుండి పైకి వెళ్ళుట, శరీరము లోనికి దిగి వచ్చుట అనగా శరీరమును వదలి తల్లి గర్భములో (ప్రవేశించుట మరల శరీరమును (గ్రహించుట. తిష్టన్ గచ్చన్ : ఈ శరీరము నందు కొంతకాలము తిష్ట్వేయుట అమ్మవారిని వెదకుచూ ఉండిపోవుట, అమ్మవారి దర్శనము కాలేదని విసుగుచెంది ఆశరీరము నుండి వెళ్ళిపోవుట అన్నట్టునంటి జన్మ జరామృత్యువుల
104 సుందరకాండము యొక్క చక్రము. మానవుడు పునః పునః - యీ చక్రము నాశ్రయించి తిరుగుట, ఎన్నో జన్మలుగా చేయుచునే యున్నాడు.
కాని వైదేహి (సీతమ్మ వారు) అచట లేదు అన్న పొరపాటు భావమునకు ఇక్కడ తావులేదు. సాధకుని దృష్టికి గోచరింప లేదనేది సరి అయిన భావము.
“అపా వృణ్వంశ్చ ద్వారాణి కవాటా న్యవఘాటయన్”
“అపా వృణ్వంళ్ళ ద్వారాణి” - తనకు అమ్మవారు కనిపించుటకు, తాను తెరచి యుంచుకొనవలసిన ద్వారమును సాధకుడయిన మానవుడు తెరవడు. అమ్మవారిని చూడటానికి వీలులేని ద్వారములే తెరచి, ఆ చీకటి గుహల లోనికి వెళ్ళిపోవును. అమ్మవారు అక్కడ లేరని వాదించును. మరల తిరిగి వచ్చి ఆ ద్వారములను, కవాటములను మూసి వేయుచుండును. అనగా జన్మకు వచ్చుట, మృత్యువు లోనికి వెళ్ళుట మానవుడు చేయుచున్నాడు. కాని అమ్మను దర్శించు ద్వారము తెరచి, అమ్మను దర్శించు ప్రయత్నము చేయడు. అమ్మను దర్శించు ద్వారమును ఉపనిషత్తులు ఇట్టు వర్షించుచున్నవి.
“అపాంశు ద్యారాం స్వర్ణమయం” =
మనము తెరచు ద్వారము లన్నియును అయోమయములు. అనగా అజ్ఞాన మార్గములు. ఇనుముతో చేయబడిన ద్వారములు. తామస ప్రవృత్తి క్రోపించినపుడు చేయునటువంటి పనులు. అట్టి పనుల వలన మనకు అమ్మదర్శనము లేక ఆత్మదర్భనము కానేకాదు. మనయొక్క లౌకిక మగు దృష్టి తాలగిపోయి దివ్యమగు దృష్టి లభించినపుడే, యీ స్వర్ణమయ ద్వారము తెరువబడును. దివ్యమగుదృష్టి లభించును. అమ్మను దర్శించుటకు వలసిన దివ్యదృష్టి మనకు లభించుటకు గొను ముందు మూడు రకములగు యోగసాధన సోపొనములు మానవుడు ఎక్కవలసియున్నది. ఆ సోపానక్రమము :
“ఫిద్యతే హృదయశగ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః
క్షీయంతే సర్వ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే” అని ఉపనిషద్వాక్యము
మనకు ఆ స్వర్ణమయ ద్వారము తెరచుకొనుటకు ప్రధాన మయిన అడ్డు మన హృదయమును ఆవరించియున్న అయోమయస్టితి. అజ్ఞానపు ముడి. ఆ ముడి తొలగినపుడే మనకు జ్ఞాననేత్రము తెరచుకొనును.
మన హృదయమును చుట్టు ముట్టియున్న ఆ ముడి భిద్యంతి - తెగి పోయినపుడు మనకు సరి అయిన జ్ఞానోదయము అగును. హృదయకమలము.
శోకవనము 105 మన అజ్ఞానము వలన తామరమొగ్గ వలె ముడుచుకొని యుండును. తామరపువ్వుగా వికసించుటకు తామరమొగ్గకు పైనున్న రేకులే అడ్డమగును. ఆ అడ్డము తొలగినపుడు తామరపువ్వు వికసించును. సూర్యోదయకాంతి తామరమొగ్గపై పడినపుడే, తామరపువ్వు వికసించును. అదే విధముగా ఆ భగవానుని కృప మన హృదయకమలముపై పడినప్పుడే, మనలో నున్న జీవకమలము వికసించును. పైనున్న ముడి తొలగిపోవును. ఆంజనేయునిలో నిట్టి స్తితి యిప్పుడు లభించినది, నేను గొప్ప వాడను, సముద్రమును దాటగలను, లంకను పరిశోధించగలను, అమ్మను దర్శింపగలను, అన్న అహంకారపు ముడి తొలగిపోయినది. ఆమ్మను దర్శించుట నా వల్లకాని పని. రాముని కృప వలన మాత్రమే ఆమెను దర్శించగలను. అన్న వెలుగు ఆయనలో వికసింపసాొగినది.
“ఛిద్యంతే సర్భసంశయాః” = నేను సుగ్రీవుని ముఖము ఎట్టు చూతును. జాంబవంతుని ఎట్టు కలసికొందును? నా పొరుష మంతయూ ఏమయినది? నా జ్ఞానమంతా వ్యర్థమయినది అన్న సందేహములతో కూడిన హనుమకు శోకముతో తపించుచున్న వానికి, సందేహములు తొలగిపోవునట్టి మంచికాలము చేరువయినది. శోకము తొలగిపోయి అశోక వనము చేరు సమర్ధత యిప్పుడే హనుమకు లభించు చున్నది. నేను సీతను తప్పక చూడగలను అన్న స్టిరభావము హనుమలో నెలకొన బోవుచున్నది.
మూడవస్థితి -
క్షీయంతే సర్వకర్మాణి” -
హనుమంతుడు ఇప్పటి వరకూ నేను చాలా గొప్పగొప్ప కర్మలు చేసిన్మవాడను. సము(ద్రమును దాటిన వాడను, లంకను జయించినవాడను, లంకను పరిశోధించుచున్నవాడను అన్న అహంకారముకలదు. ఇప్పుడు ఆ కర్మల ఆధిక్యము అంతయు క్షీణించి పోయినది. నేను రాముని బంటును, రాముని దూతను, రాముని బాణమును అని తెలిసికొనగలిగిన వాడిగా అయ్యెను,
“తస్మిన్ దృష్టే పరావరే”
ఈ మూడు మెట్టు ఎక్కిన తర్వాత మాత్రమే దివ్యదృష్టి లభించును. ఈ లోకంలోని మానవ దృష్టికంటే- చాలా గొప్పది. విశిష్టమైనది, అయిన సరాదృష్టి లేక దివ్యదృష్టి లభించును. వరే అంటే సర్వశ్రేష్టమైనది. వరేణ్యము అయిన దృష్టి ఇప్పుడు లభించబోవుచున్నది అని భావము.
106 సుందరకాండము
భక్తుడయిన వాడు భగవద్దర్శనము. కోరి తపించుచుండును. భగవంతుడు ఫలానా చోట ఉండవచ్చును అని తనకు తానుగా భావించును. అటువంటి తీర్జక్షేత్ర ప్రదేశము. లన్నియు. తిరుగును. దేవాలయములు, నదులు, సముద్రములు, కొండలను వెదకును. భగవంతుడు కన్పించలేదని దుఃఖపడును. భగవంతుడు లేడేమోనన్న నిరాశకు గురి అగును. కాని అజ్ఞానము అట్టే కాలము నిలువదు. భగవంతుడు లేడను కొన్నపుడు ఈ కన్సించు సూర్యచంద్రాదులు కన్పించకుండా పోవలెను కదా అను జ్ఞానము మేల్కొనును. ఈ సృష్టి అంతయు సలక్షణముగొ జరుగుచున్నది. కాబట్టి భగవానుడు తప్పక ఉన్నాడు అను అభిప్రాయము అతనిలో స్టిరముగా నిలబడును. ఈ అనుభవమునే పదమూడవ సర్గ చక్కగా వర్షించి చెప్పుచున్నది. మనకు అత్యంత ప్రియమైన వారిని గురించి కీడును శంకించుట మానవుల యొక్క స్వభావము. ఎవరియందు మమకారము అధికముగా నుండునో అట్టివారు క్షేమముగా నున్నారో లేక ఆపదలో చిక్కుకొని ఉన్నారో అన్న శంక తప్పక కలుగుచుండును. ఇందులకు మనకు ప్రియమైన వారియందు గల వ్యామోహమే కారణము.
శ్రీరాముని ధర్మపత్ని జగన్మాత అయిన సీతను వెదకుచూ లంకలో నున్న వస్తువులను, ప్రాణులను, సర్వ ప్రదేశములను వెదకెను. ఈ వస్తువులు, (ప్రదేశములు, ప్రాణులు అనగా అంతయు ఆ అమ్మవారి యొక్క స్వరూపమే అని హనుమంతు డెరుగడు. గనుక తాను ఆమెను చ్తూడజాలక పోయితినని దుఃఖపడెను. అటువంటి అతి స్నేహము వలన మనకు లభించునట్టి పాపచింతన యొక్క ప్రభావము ఆంజనేయుని మిద గూడ ప్రసరించినట్ట్లు ఈ సర్గము బోధించుచున్నది. నేను సీశను వెదకుచున్నాను అన్న పురుషప్రయత్నం కూడ ఎప్పుడూ ఫలించదు. నీవు ఎంత జ్ఞానివి ఆయినను, వేద పండితుడవు ఆయినను యజ్ఞయాగాది (క్రతువులు చేసిన వాడవైనను, నేను భగవంతుని వెదకి చూడగలను అన్న అహంకారంతో నీవు చేయు ప్రయత్నము లేవియు పనిచేయవు అని ఈ సర్గ చక్కగా బోధించుచున్నది. నేను చేయుచున్నాను అను ప్రయత్నం వలన మనకు భగవద్దర్భనం కాకపోగా, నేను ఓడిపోయితి నన్న దుఃఖము కలుగును, నా ప్రయత్న మంతయు వ్యర్థమైనది అను బాధ కలుగును. ఈ ప్రయత్నమును మాని “నమోస్తు రామాయి' అని శరణాగతి భావముతో సాష్టాంగ నమస్కారము చేసినపుడు మాత్రమే సీతమ్మవారి దర్శనము కాగలదు, అని ఈ సర్గమునకు సుస్పష్టముగా బోధించు. చున్నది. సీతాన్వేషూ
శోకవనము 107 అనగా ఒకే స్త్రీని వెదకుట అన్న భ్రాంతి పోయి సర్వాంతర్యామి యగు ఆజగన్మాతను వెదకుట అన్న జ్ఞానము మనకు లభించినవుడే సీతాదేవి దర్శనము మనకు లభించగలదు. క్ధోః అఖ్యాతా గృధ్ర రాజేన నచ పశ్యామి తా మహం కిం ను సీతా2 థ వైదేహీ మైథిలీ జనకాత్మజా 13-6 ఖీ (| ఉపతిస్టేత వివశా రావణం దుష్టవారిణం క్షిప్ర ముత్పతతో మన్యే సీతా మాదాయ రక్షసః 13-7 శ్లో, రామస్య ధ్యాయతీ వక్రం పంచత్యం కృపణా గతా హా రామ లక్ష్మణే త్యేవం హా2 యోధ్యే చేతి మైథిలీ 13-14 సీత, వైదేహి, మైథిలి, జనకాత్మజ అని చెప్పినపుడు ఆమె తల్లి గర్భము నుండి దిగివచ్చిన రూపము కాదని, ఈ దేహమును ఆశ్రయించిన ప్రజ్ఞ కాదనియు, రాజర్షి ఆధ్యాత్మిక (ప్రధానమైన జీవిత విధానము గల జనకుని వద్ద పెరిగినటువంటిదని భావము. కనుక ఆమెను వెదకుటకు ఈ లక్షణములలో ఏదో ఒక లక్షణమైనను సాధకునకు ఉండవలయును. అట్టి సీతాదేవిని తాను దర్శింప జాలనందుకు దుఃఖించిన వాడై ఆంజనేయుడు పలువిధములుగా భావించెను. భావా భావముల మధ్య ఉన్నటువంటి ఎరుక ఎప్పుడూ ఇట్లే ఊగిసలాడుచుండును. ఉయ్యాల వలె అటునిటు కదలుచుండునని భావము. మహావేగముతో వచ్చుచున్న రావణుని నుండి అమె జారిపడియుండెనా? అని కలిగిన సందేహమునకు సమాధానము కూడా హనుమకు వెంటనే తోచెను. ఆమె తనకే కొవాలని కోరిక కలవాడై మారీచుని సహాయము కోరి, సీతను తీసుకొని వచ్చిన రావణుడు, ఆమెను భక్షించుట ఎప్పుడు జరగదు అని సమాధానపడెను. రావణుని భార్యలు ఈర్ష్యతో సీతను భక్షించిరి అన్న భావము కూడా సరియైన భావము కాదని హనుమ (గ్రహింపగలిగెను, రావణుని ప్రీతి పాత్రమైన సీతాదేవిని అచటి వారెవరూ బాధింపజాలరు. రావణుని వలెనే పీ రామెను గారవించియే యుందురని సమాధానపడెను. రాముని ఎడబాసి ఈ రాక్షసుల మధ్య ఉండలేక భయభభ్రాంతులతో కూడినదై చనిపోయియుండవచ్చును. హా! రామా! వో! లక్ష్మణా! యని రామనామ ధ్యానము తోనే యుండి సీతాదేవి ప్రాణములు విడచి యుండవచ్చును. రాముడు నారాయణుని దివ్యావతారమూర్తి అని సీతమ్మ వారికి తెలియును. ఆయన యొక్క తేజస్సు
108 సుందరకాండము తనను సదా రక్షించుచుండునని కూడా తెలియును, అజ్ఞానము వలన ఇచ్చట నున్న రాక్షసులు తనకు బాధలు కలిగించి నప్పటికిని అవి తాత్కాలికములే యని కూడా ఆమె ఎటుగును. అట్టి ఎలుకగల సీతాదేవి మరణించె ననుట పొసగని మాట. క్లో! మమేదం లంఘనం వ్యర్ధం సాగరస్య భవిష్యతి కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః 13-22 ఖో కిష్కింధాం సమనుప్రాప్తం తేవా దశరథాత్మజౌ న దృష్టేతి మయా సీతా తత స్తక్ష్యతి జీవితం 13-23 శ్లోః సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి తంతు కృద్చగతం దృష్ట్వా పంచత్వ గతమానసమ్ 13-25 క్ట భృశాను రక్తో మేధావీ నభవిష్యతి లక్ష్మణ: వినష్టా (భ్రాతరౌత్రుత్వా భరతో2 పి మరిష్యతి 13-26 శ్ళోః భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నోన భవిష్యతి పుత్రాన్ మృతాన్ సమోాక్ష్యాధ న భవిష్యంతి మాతరః 13-27 క్లో, కృతజ్ఞ స్పత్యసంధశ్చ్ళ సు(్రీవప్టవగాధిపః రామం తధాగతం దృష్ట్యా తతస్త్యక్షతి జీవితం 13-28 ఖీ ఇక్షాకుకుల నాళళ్ళ నా శ్చైవ వనౌకసాం సో౭ హం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీ మితః 13-38 ఈ విధముగా హనుమంతుడు సీతమ్మ వా రున్నదని, లేదని తర్కించిన తరువాత, ఒక నిశ్చయభావమునకు వచ్చెను. సీతమ్మ వారు లంకలోనే ఉన్నది నేను ఎంతో ప్రయత్నముతో వెదకితిని. అయిననూ ఆమెను చూడజాలకున్నాను. అందువలన దుఃఖపడుచున్నాను. ఈ వార్త రామునకు చెప్పుట మహాదోష మగును. అని హనుమంతుడు భావించెను. అట్లని చెప్పకుండుట కూడ దోష మని తలచెను. ఏమి చేయవలెనో నిర్ణయింపజాలని హనుమంతుడు ఇట్టు చింతించెను, “నేను సీతను చూడజాలక పోయితినని రామునకు చెప్పుట ఎట్టు? వానరులకు చెప్పుట ఎట్టు?" సుగ్రీవునితో మాట్టాడుట ఎట్టు? నేను సీతను చూచి వచ్చెద ననుమాట వ్యర్హమగును గదా. సముద్రమును దాటుట కూడ వ్యర్థమయినది. లంకను పరిశీలించుటయును నిప్పుల మయినది, ఇటువంటి దుర్వార్తను రామునకు నేను చెప్పినపుడు ప్రియమయిన భార్యా వియోగము. వలన రాముడు మరణించును. ఆయన అనుచరు లయిన వా రందరు కూడా మరణింతురు.
శోకవనము 109
రాముడు. దుష్టులను సంహరించుటకు అవతరించిన వాడు,.ఈ రాక్షసు లందరిని సంహరించి కాని ఆయన తన అవతారమును చాలించడు. (సంహారము = సంయక్+హారము=చక్కగా కూర్చుట= చక్కబరుచుట) ఈ దుష్ట సంహారము నిమిత్తము ఆయనకు అనుచరులుగా సేవ జేయుటకు వచ్చిన వారే ఈలక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలగువారు. రాముడు అవతారమును చాలించిన తరువాత వీరందరు రాముని అనుసరింతురు అన్న భావము ఆంజనేయునిలో మెదలు చున్నది. అట్టి (ప్రమాదము, తాను సీతను చూడనంత మాత్రమునకే జరుగునని హనుమంతుడు (భ్రమపడుచున్నాడు. అది అంతయు అతని భ్రమయే కాని సత్యము కాదు. తాను సీతను చూడలేదు అన్నది ఇక్కడ సత్యములో చిన్న భాగమే, అనగా సీతాదేవిని ఇంతవరకు చూడలే దన్నది సత్యము. తరువాత తానే చూడబోవుచున్నానను పూర్షజ్ఞానము ఆంజనేయునకు అందలేదు. సగము ఎరుకలో ఉన్నప్పుడు, మనకు కలుగునట్టి భావములే ఆంజనేయునకును కలిగినవి. నేను సీతను చూడకుండ తిరిగి కిష్కంధకు వెళ్ళను. ఈలంకలోనే ఒక చెట్టుక్రింద తపస్సు చేయుచు గడిపెదను అన్నప్పుడు హనుమ సత్యమునకు కొంత దగ్గరగా వచ్చుచున్నాడు. నేను సీతను దర్శించిన తరువాతనే, తిరిగి కిష్కింధకు వెళ్ళిదను అను ఆశారేఖ కొలదిగా గోచరింపసాగినది అని అర్థము.
శ్లో వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్రాణాన్ ధరిష్యామి (ధ్రువో జీవిత సంగమః 13-47
అజ్ఞానము వలన ఆంజనేయునకు కలిగిన దుఃణపు తెర క్రమముగా విచ్చుకొన్నది. సీతాన్వేషణ 'ప్రయత్నమున అపజయము పొందిన నేను బ్రతికి యుండుట వ్యర్థము అనుభావము మొదట కలిగినప్పటికి, ఆ అజ్ఞాన భావము తొలగి మంచి జ్ఞానోదయము కలిగినందున ఆంజనేయుడు తిరిగి యిట్లు భావించెను.
మరణించుట వలన అంతయు శూన్యమైై పోవును. సాధించ వలసినది యిక ఏమియు నుండదు. కనుక మరణము పరిష్కార మార్గము కాదు. కనుక నేను జీవించియే యుందును. నేను చేరవలసిన లక్ష్యమును చేరుటకు కావలసిన (ప్రయత్నమును చేయుదును అను భావము ఆంజనేయుని అవేశించెను. అనగా శ్రీరాముడు అంజనేయున కిచ్చిన. ముద్రిక యొక్క ప్రభావము ఆంజనేయుని అవరించిన ఆజ్ఞానమును పారద్రోలెను అని భావము.
110 సుందరకాండము రామము!ద్రిక యొక్క (ప్రభావము ఆంజనేయునిపై ప్రసరించుట వలన అపజయ దుఃఖము పోయి అతడు పరమోత్స్చాహముతో నిట్లు భావించెను. శ్లో అధవైనం సముత్క్షిష్య హ్యుపర్యుపరి సాగరమ్ రామా యోపహరిష్యామి పశుం పశు పతేరివ 13-50 శ్రీరామ చంద్రమూర్తి భూమి మోద అవతరించిన పరమ ప్రయజనము సాధురక్షణ, రాక్షస సంహారము. సంహారము అనగా చంపుటనియే సామాన్యముగా మనము (గ్రహించుదుము. సంహారము అనగా చక్కగా హారమువలె దిద్దుబాటు చేయుట అని భావము. కామకక్రోధాధుల విజృంభణ వలన అల్లకల్టోలముగా నున్న రాక్షసులను, మంచి వారిగ సంస్కరించి చక్కని హారములుగా జత పరచుటయే సంహారము అనబడును. వారిలోని చెడును తొలగించి వారిని మోక్షమునకు అర్హులుగా చేయుటయే. సంహారము. అనగా రావణాదులను వైకుంరమునకు చేర్చుటయే యీ సంహారక్రియ. ఆంజనేయుడు వధించుటను మాత్రమే ఎరిగిన వాడు. సము(ద్రములో ముంచుట మాత్రమే. తెలిసిన వాడు. తన స్వస్టానమైన కిష్కింధకు. మాత్రమే. వెళ్ళుట తెలిసినవాడు. ఆపైన ఉన్నటువంటి తేజోమార్లమును ఇంకను తెలిసికొనవలచిన వాడు. “రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలమ్” - పది రకములైనటువంటి సామర్హ్యములను కలిగినటువంటి వా రయినప్పటికిని, లంకలోని రాక్షసులందరిలో మహాబల సంపన్ను డయినప్పటికినీ ఈ రావణుని చంపివేసెదను, ఇతడిని బంధించి సముద్రములో మంచి వేసెదను. కిష్కింధకు తీసీకుని వెళ్ళి రామునకు యజ్ఞపశువుగొ సమర్పించెదను. సాధకుడు భగవంతుని చూచుటకు గొను యజ్ఞయాగాది క్రతువులు చేయుచున్నాను, పుణ్యతీర్థములను సీవించుచున్నానని ఉత్సాహ పడును. అ ప్రయత్నములో ఒక వెలుగో, ఒక హంసో కన్పించినపుడు. అదే తాను వెదకు నట్టి ఆత్మజ్యోతి అని భ్రమ పడును. ఉబ్బితబ్బిబ్బు అగును. ఆ తరువాత తాను పొరబడితినని తెలుసుకుని నిరుత్సాహపడును. మండోదరిని చూచి ఆమెయే తాను వెదకునట్టి సీతాదేవి అని (భ్రాంతి పడి హనుమంతుడు ఉత్సాహముతో గంతులు వైచెను. మనము కూడ ఇట్టి పారబాటులే చేయుచుందుము. ఆ ఆత్మజ్యోతి యొక్క స్వరూపమును మనము ఇంతకు పూర్వము చూచి యుండలేదు” దాని స్వరూపము
శోకవనము 111 ఇట్టీది అను చక్కని అవగాహనము ఉండదు. ఇక్కడి వస్తువులలో దేనితోను పోల్చడానికి వీలుండదు. కనుక ఏదో ఒక వెలుగు కనిపించగనే అదే ఆత్మజ్యోతి అని భ్రాంతి పడుటకు, ఉత్పాహపడుటకు అవకాశమ్ను ఉన్నది. తాను చూచినది తాను వెదకునట్టి పరంజ్యోతి కాదని తెలిసినప్పుడు. తాను ప్రయత్నములో తాను వెదకు నట్టి పరంజ్యోతి కాదని తెలిసినప్పుడు తన ప్రయత్నములో తాను ఓడిపోయితినన్న నిరుత్సాహము, నిస్పృహ కలుగును. నేను జయమును పొందజాలను. నాకు ఆ అర్హత లేదు. కనుక ఈ ప్రయత్నము విరమించుట మంచిది అని క్రిందకు జారిపోవును. దీని కంతటికి ముఖ్యమైన కారణము నేను గొప్పవాడను, నేను భగవంతుని వెదకగలను అన్న ఆధ్యాత్మికాతిశయమే
రబ్బరు బంతిని మనము నేలపైకి కొట్టినపుడు, అది అధోమార్గమున భూమి వైపునకు వెళ్ళి భూమికి తగిలిన తరువాత, ఇంకను (క్రిందకు వెళ్ళుటకు ప్రయత్నించి సొట్టపోవును. అలా ఇంకా అధోగతికి పోవుటకు వీలుగానట్టి స్థితియే 0111101 ₹010[ అనబడును. అక్కడ నుండియే రబ్బరు బంతికి, పైకి వెళ్ళుటకు తగిన ఉత్సాహము. లభించును, పైకి ఎగరగలుగును. అదేవిధముగ సాధకుడైన వాడు అఆధ్యాత్మికాతశయమువలన భగవద్దర్శనము కాక (క్రిందకు దిగజారిపోవును. అట్టి అట్టడుగు స్థానమునకు జారినను, తిరిగి పైమెట్టును అందుకొను నట్టి ఉత్సాహమును పొందును. అట్టీ గట్టి ప్రయత్నమును చేయని వాడు (క్రిందకు పోనూలేడు, పైకి ఎక్కనూ లేడని భావము. భూమిని తొలుచు నట్టివాడు, అందులకు ఉపయోగించు పలుగు మొదలగు పనిముట్లను భూమిలోనికి ఒత్తినపుడు ఆ కార్యము జరుగదు. ఆ గునపమును భూమి పైకి ఎడముగా ఎత్తి వేగముగా భూమి మీదకు వదిలినప్పుడే భూమిని (త్రవ్వుట జరుగును. గొడ్డలితో నరకు కొయ్యకు, దూరముగా గొడ్డలిని తీసికుని వెళ్ళి మరల వేగముగా ఆ కొమ్మపైకి ఆ గొడ్డలిని ప్రయోగించినపుడే ఆ కొమ్మ తెగిపోవును. అనగా తాను కోరినది సిద్ధించును. హనుమకు ఇట్టి యోగాను భవనము సిద్ధించినది.
హనుమ సీతను దర్శించుట తన వలన కాదని తెలిసికొని నిరుత్సాహపడి తన శరీరమును త్యాగము చేయవలెనన్న స్థితికి దిగజారిన తరువాతనే, అతనికి జయమార్ల్గము గోచరించినది. వెలుగుబాట యొక్క సంస్పర్శ అందినది.
అశోకననము క్ట నమో2స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయైై నమో2స్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమో2స్తు చంద్రార్క మరుద్గణే భ్య 13-59
ఈ క్టోకము నిత్యపారాయణ యోగ్యమైనది. సుందరకాండ మొదటి. సర్గలో మహేం(ద్ర పర్వతము నుండి ఆంజనేయుడు బయలు దేరునపుడు, సూర్యునకు, మహేం[ద్రునకు వాయువునకు, స్వయంభవునకు అంజలి ఘటించెను. ఇపుడు ముందు రామలక్ష్మణులకు పీతకు 'నమస్కరించెను. తరువాత ఇతర దేవతలకు కూడా నమస్కరించెను.
ఆత్మదర్శనమునకు భగవదను[గ్రహము ముఖ్యము. భగవద్దర్శనమునకు ఆత్మదర్శనము ఆవశ్యకము. మధ్య స్థానీయ దేవతల యను[గ్రహము అల్ప సిద్దుల నాసంగును. ఇవి పూర్ణ సత్య దర్శనమును కలిగించజాలవు.
హనుమంతుడు పూర్వము అంజలి ఘటించెను. ఆ శ్లోకము నందు మూడు సార్లు “నమ” స్కరించెను. త్రివిధా అనగా మనో వాక్కాయ కర్మలచే నమస్కరించెను. తా నన్వేషించు చున్నా నన్న భావము పోయెను. ఈ అన్వేషణలో 'నేను కర్తను కాను - నేను వారి పనిముట్టును - రామబాణము వంటి వాడనని పూర్ణశరణాగతి నొందెను. (బాణమునకు స్వయముగా దిశ లక్ష్యము ఉండవు).
“నమో౭2స్తు దేవ్యై జనకాత్మజా యై” అని తరువాత అమ్మవారికి నమస్కరించెను. “దేవి” - అనగా ప్రకాశించునది, క్రీడించునది అని అర్ధము. కనిపించుట, కనిపించక పోవుట ఆమె యొక్క క్రీడ ఆమె స్వయం(ప్రకాళిని. తాను ప్రకాశించుచు తన చుట్టూ ఉన్న వాటిని కూడా ప్రకాశింపజేయును. అందు చేత ఆమెను అన్వేషింప నవసరములేదు. తనంత తానుగా దర్శన మిచ్చును. అనగా ఆమె అనుగ్రహ మున్ననే ఆమె దర్శనము కలుగునని ఆంజనేయుడు (గ్రహించెను. అందుచేతనే జనకసుత అనలేదు - జనకాత్మజ అనివాడు.
వ్గోః “తదున్న సం పొండురదంత మవ్రణం
శుచిస్మితం పద్మపలాశ లోచనం
అశోకవనము 13 (ద్రక్ష్వే తదార్యా వదనం కదాన్సహం ప్రసన్న తారాధిప తుల్యదర్శనమ్ 68 కః క్షుద్రేణ పాపేన నృశంస కర్మణా సుదారుణాలంకృత వేష ధారిణా బలాభిభూతా వ్యాబలా తపస్వినీ కధం ను మే దృష్టి పధే2 ద్య సా భవేత్ 13-69. ఆంజనేయుడు అమ్మవారిని అంతకు ముందు చూచి యుండలేదు. ఆమెను గురించిన భావము మాత్రమే యున్నది, అందు మొదటిది ఈ సృష్టికి అమ్మవారు 'ప్రాణప్రదాయిని అన్న నమ్మిక అట్టి 'ప్రాణశ్త్తి సృష్టికి అందించునట్టి కేంద్రము 'నాస ప్రాణశక్తిని తన లోనికి ఆకర్షించుట, వికర్షించుట అన్నటువంటి రెండు కార్యములు, 6౪౧౮౧821 286 0600౯621 [0866 ద్వారా సృష్టిని నడిపించు నటువంటి కార్యము 'నాసి. ఆ శక్తి కేంద్రము సృష్టి కంటెను ఉన్నత మయినది. రెండవభాగము: ఈ సృష్టిలో ఉన్నటువంటి అజ్ఞానమును, చీకటిని పోగొట్టు తేజమును, ఆమె సూర్యాది[గ్రహముల ద్వారా స్వచ్చమైన వెలుగును అందించునట్టిది. శుచిస్మితం - శుచి అనగా అన్ని అనగా బ్రహ్మము. ఆ (బ్రహ్మము యొక్క వర్భస్సును ఈ సృష్టికి తన ముఖ మండలము ద్వారా, చిరునవ్వు ద్యారా ప్రసారము చేయునట్టిది. తెల్లటి తామర పువ్వువలె సాత్విక తేజస్సును సృష్టి కంతటికి అందించి సృష్టిని ఎల్లప్పుడు వికసింపచేయునట్టి దృష్టి (కన్నులు) కలిగినది. తారాధి పతుల్య దర్శనమ్ -భగవానుని పరిపూర్షమైన తేజస్సును తాను (గ్రహించి ఆ తేజస్సును సృష్టిగ్రహింపగల మోతాదులో సృష్టికి అందించగల కేంద్రమునే సోముడు - చంద్రుడు - తారాధిపతి అందురు. అట్టి సోమునితో సమానమైన ప్రసన్నతతో కూడిన వర్చస్సు కలిగిన అమ్మవారి దర్శనము. నాకు ఎప్పుడు కలుగును? అమ్మవారు ఈ సృష్టిలోనికి దిగివచ్చిన పరమప్రయోజనము ఈ తరువాత శ్లోకమున చెప్పబడినది. ఆమె అబల, తపస్విని అని వర్షింపబడినది. ఈ సృష్టిలో ని బలము కంటె అధికమైన బలమును కలిగి నట్టీది, కనుక ఈ సృష్టిలో ఉన్న చెడు నంతటిని సంస్కరించి చక్కగ తిన్నగ నడుపు నట్టి పరిపూర్ణమగు బలము కలిగినది. తపస్విని : ఈ సృష్టిలో నున్న చెడు నంతటిని పాొగొట్టి మంచిని స్థాపించు జగత్కళ్యాణ కార్యమునకు కారణమైనట్టి తపస్విని. అటువంటి తపస్సిద్ధి కొరకై ఈ
114 సుందరకాండము లంకకు వచ్చి ఉన్నది. ఇచ్చట ఉన్న చెడును అంతటిని తొలగించుటయే ఆమె తపస్సు యొక్క పరమార్ధము. అమె తొలగింప గోరిన లంకలోని చెడు లక్షణములు ఈ (క్రింద వర్లింపబడినవి.
క్షుద్రేణ - పాపేన - నృశంస కర్మణా -
అనగా అల్ప (ప్రయోజనమును కోరి చేయునటువంటి పనులు, తనకు, తన ప్రక్కవారికి పాపమును కలిగించునట్టి పనులు. నృళంసకర్మణా - ఇతరులను నాశనము చేయుట వలన తాము వృద్ది నందగలనన్న భావముతో చేయుపనులు. ఇట్టి "దోషములను చేయునటువంటి రాక్షసులు, వారి కార్యములను సాగకుండ చేయుట కొరకై సీతమ్మ అవతరించి వచ్చియున్నది. అట్టి పుణ్యమూర్తిని నేను ఎప్పుడు చూతునో అని హనుమ ఆరాటపడెను.
శ్రీరామ చంద్రుని (ప్రచోదనము వలన, అపజయదుఃఖము నుండి హనుమ మేల్కొనెను. తాను చేసిన దంతయు శోకవనమునకు సంబంధించిన ప్రయత్నమని తెలుసుకొనెను. ఆప్రయత్నమును విరమించి అశోకవనములో (ప్రవేశించుటకు హనుమ సీద్ద మాయెను. అనగా హనుమకు ఇపుడు ఆ అర్హత లభించినది అని అర్ధము.
అశోకవనము అనగా ఈ సంసార శోకము లన్నిటిని దాటి ఉన్న అమ్మవారి యొక్క ఆనందనిలయము అని భావము,
ఈ భావముతో పదమూడవసర్గ ముగింపబడినది. ఆనందనిలయమగు అశోకవనము నందు అడుగిడు నపుడు మానవునకు కలుగు అనుభవములు పదునాల్గవ సర్గయందు తెలియజేయబడు చున్నవి. అమ్మవారి దివ్యదర్శనమునకు కావలసిన దివ్యవికాసమే 60614108 అనబడును.
అనగా పాత మూసలతో తయారయి వచ్చిన కన్ను చెవి, మనసు, బుద్ది, చిత్తము మొదలగునవి పాతది అగు అల్ప సామర్థ్యమునే కలిగియుండును. వానిని ఎంత సంస్కరించిననూ, ఎంత మెరుగుపెట్టినను దివ్యత్వము నందుకొనుటకు అర్హములుగా నుండజాలవు. కనుక అఆ మూసలనే మార్చవలెను. అనగా కన్ను కొంత దూరమే చూడగలుగును. కొద్ది వెలుగునే చూడ కల్గును. వెలుగు లేనప్పుడు చూడలేదు. అదే విధముగ చెవి-మరీ చిన్న శబ్దము గాని, మరీ పెద్ద శబ్దమును గాని వినలేదు, దూరమున నున్న శబ్దమును అసలే వినలేదు. అదే విధముగ మనసు, నాలుక, బుద్ది అనునవి చాలా పరిమితమగు కక్ష్యలలోనే పనిచేయును.
ఆశోకవనము 115 కనుక వీటి నిర్మాణ పద్ధతియే మారవలయును. కొత్త మూసలతో వీటి నిర్మాణము జరిగి దివ్యమగు పరిణామము వాటికి లభించి నప్పుడే ఇవి యోగ్యములై ఉండగలవు. . ఈ భావమే వేద మందత్రకారుడు ఇట్టు వర్షించినాడు. శ్ఞోకము. ఉపనిషత్ :- “పరాం చిఖాని విసృజత్ స్వయం భువ తస్మాన్ పరాన్ పశ్యతి నాంతరాత్మ కళ్ళిద్దీర (ప్రత్యగాత్మ నాం సమిక్ష దా వృత్రచక్షుః అమృతత్వ మిచ్చన్” ఖాని అనగా మన ఇంద్రియములను పరాంచి - వెలుపలకు త్రిప్పియే స్వయంభువు - బ్రహ్మ సృజించెను. తస్మాత్ = అందువలన పరాన్ పశ్యతి - మన ఇంద్రియములు వెలుపలకే చూడగలవు, నా అంతరాత్మ - అంతరంగ జ్యోతిని చూడలేవు. కళ్ళి ద్ధీరః - ఒకానొక ధీరుడైన వాడు, మహాజ్ఞాని యైనవాడు. కళ్చిదాత్మానం ఈక్షత్ - మనలో వెలుగు నట్టి పరమాత్మను చూడగోరి ఆవృత్తచక్షుః - ఇంద్రియములను అన్ని వైపులకు త్రిప్పగలడు. వృత్తాకారముగల పదమునందు ఇంద్రియములను నడిపింపగలడు. అనగా ముందునకు మాత్రమే చూచుట, వినుట అను ఇంద్రియములను (ప్రక్కకు, వెనుకకు, అన్ని వైపులకు త్రిప్పగలడు. అతడే అమృతత్వ మిచ్చన్ - మృత్యువు లేనటువంటి దివ్యమగు స్థితిని కోరినవాడు అనగా పొందినవాడు. ఇపుడు ఆంజనేయుడు అట్టి దివ్యమగు స్థితిని చేరుకొనినాడు,
చతుర్దశ స్పర్లః ది నీ రచన : డా॥ పోచిరాజు శేషగిరిరావు, హైదరాబాదు శో స ముహూర్త మిన ధ్యాత్వా మనసా చాధిగమ్యు తాం అవప్లుతో మహాతేజాః (ప్రాకారం తస్య వేశ్మనః న! హనుమంతుడు క్షణకాలము సీతామాత గురించి మనస్సులో యోచించి, ఒక్క దాటున రావణుని గృహమును వదలి అశోకవనమునకున్న (ప్రాకారమును చేరినాడు. “ఈ శావాస్య మిదగ్ం సర్వం" అని ఉపనిషత్తు పలికినట్లు సమస్త సృష్టి ఈశ నిర్మితమైనది. (ప్రకృతి, పురుషుల సమిష్టిరూపమే ఈశ్వరుడు. ప్రకృతి రూపమే అమ్మవారు. ఆమె సందర్శనము ప్రకృతి ముఖము గానే జరగాలి. శాంతమధురమైన యీ ప్రకృతి నధిగమించిన పిమ్మటనే ఈశ్వర దర్శనము. హనుమ గొప్ప యోగసాధకుడు. ముందు (సంసార) సముద్రమును దాటినాడు. అందులో ఎన్నో ఆటంకములు, ఆకర్షణలు వచ్చినాయి. వాని నన్నింటిని అధిగమించి లంకను చేరినాడు. లంక మన శరీరమునకు ప్రతీక. అదొక విచిత్ర ప్రపంచము. త్రిగుణముల సంపుటి. రజస్తమనస్సుల ప్రతాప మెక్కువ. అక్కడి రాక్షస సంతతి దానికి గుర్తు. అదే. అధిగమించాలి తొలుత సాధకుడు. హనుము జగన్మోహనమైన కాంతా కనకములను చూచి నిర్వికారుడుగానే ఉన్నాడు కాని మనస్సు సంచలింపలేదు. పాచి తొలగిన తర్వాత తేటనీరు లభ్యమైనట్టు, మారుతికి సీతమ్మను గూర్చిన ఆలోచన వచ్చింది. అదియు ఆషామాషీగా కాదు. తత్త్యచింతనా దృష్టితో అన్వేషూకై ఆరంభించినాడు హనుమ, ప్రకృతి ముఖంగా జగన్మాత దర్శనమునకై సన్నద్దుడైనాడు. అపు డాతనికి ప్రకృతి సమస్తమూ ఆనందమయంగాను - రసమయంగాను - శోభాయమానంగాను, మంగళదీపిక గాను కానవచ్చినది. ప్రతి కొమ్మ, రెమ్మ ఆకులు, పూవ్వులు - భిన్న జాతుల వృక్షాలు - (ప్రకృతి సమస్తము దివ్యదర్శనమునకు దేవీ దర్శనమునకు ఉన్ముఖంగా ఉత్తేజకరంగా ఉల్లాసకరంగా కనపడసాగింది. ఎన్ని చికాకులతో ఉన్నా, మాస్టర్ సి.వి.విగారిని గూర్చిగాని, శాస్త్రిగారిని గూర్చిన ఆలోచనగాని మనస్సులో మసలగానే, వాతావరణ మంతా చక్కనయి నూతనోత్సాహము యోగ సాధకులతో ఉరకలు వేయుట మాకు అనుభవానికి వచ్చేది. అనగా మనస్సున మహత్ సంకల్ప సూర్యోదయము కాగానే, జగన్మాత
చతుర్తశ స్పర్లః క్ష దర్శనానికి తలుపులు తెరచి నట్టగుట, ఈ సర్గ ఈ మహత్తర విషయాన్నే కవితా సుందరంగా కమనీయంగా చెప్పింది. క్ట సతు సంహృష్ట సర్వాంగ; (ప్రాకారస్ట్రో మహాకపిః పుష్పితాగ్రా న్వసంతా దౌ దదర్శ వివిధాన్ (ద్రుమాన్ అశోకవన ప్రాకారముపైనున్న మారుతి మేను కురుచగా చేసికొని, వసంత ర్తువు ప్రారంభమున పూచిన వృక్షములను చూచెను. [4-2 శో సాలా నశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకా న్నాగవృక్షాం శ్చూతాన్ కపిముఖా నపి 1క3 శ్లో అథామ్రవణసంఛన్నాం లతాళశతసమావృతాం జ్యాముక్త ఇవ నారాచః పుఫ్లువే వృక్షవాటికామ్ మద్ది, మామిడి, అశోకాదివృక్షములను, సంపెంగచెట్టను, కసిముఖ వృక్షములను హనుమ చూచెను, ఆ పిమ్మట లతలచే ఆవరింపబడిన వనవాటికను, వింటినారి నుండి విడువబడిన బాణమువలె దాటెను. వ్లోః సప్రవిశ్ళ విచిత్రాం తాం విహగై రభినాదితాం రాజతైః కాంచన్చ్పోవ పాదపై సర్వతో వృజామ్ కేశం5 శ్లోః విహగై రృగసంఘైైశ్చ్ళ విచిత్రాం చిత్ర కాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః ఊర పక్షుల కలకలములతో నిండిన వెండి, బంగారు రంగులు గల చెట్లతో విచిత్రమై యున్నది, పక్షిమృగ సంతతులతో కూడినది యును యగు వనవాటికను చూచెను. ళ్దోః వృతాం నానావిధైర్చక్షిః పుష్ఫిపగఫలోపన్టైః కోకిలై ర్బృంగరాజైళ్ళ మత్తెర్నిత్య నిషేవితామ్ కత ఫ్లో ప్రహృష్టమనుజే కాలే మృగపక్షి సమాకువే మత్త బర్హీిణ సంఘుష్టాం నానాద్విజగయుతామ్ కడ-8 ఆ వనము పుస్పఫల భరితముగా నుండెను. కోయిలల, గండుతుమ్మెదలతో కూడియుండెను. అమితానందముతోనున్న మనుజులతోను మత్తెక్కిన నెమళ్ళతోను గూడిన ఆ వనమును హనుమ తిలకించను. శః మార్గమాణ్య వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖప్రసుష్తాన్ విహగాన్ బోధయామాస వానర; [49 రాజపుత్రి, ఉత్తమురాలు, యువతీరత్నమునగు సీతాదేవిని అచ్చట వెదకుచు హనుమ సుఖముగా నిద్రించుచున్న పక్షులను మేలు కొలిపెను.
118 సుందరకాండము ల క్లోః ఉత్పతర్శిర్చిజ గటైః పక్షై స్ఫాలా సృమాహతాః అనేక వర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః 1410 శ్లో! పుష్పావకీరళ్ళుశుభే హనుమాన్ మారు తాత్మజః అశోకవనికా మధ్యే యధాపుష్పమయో గిరిః 1411 మేల్కొన్న పక్షుల తాకిడికి చెట్లు కదలినవి. అందువల్ల పెక్కురంగుల పూలు రాలినవి. ఆ పుష్పములచే కప్పబడిన హనుమ అశోకవనంలో పుష్పగిరి వలె శోభించెను. ఫ్లోః దిశాస్సర్వాః ప్రధావంతం వృక్షషండగతం కపిం
- దృష్టాసర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. వెట్ట కొమ్మలనుండి అన్ని వైపులకు దుముకుచు పరుగిడుచున్న హనుమంతుని జూచి, ఆతడు వసంతుడని సర్వప్రాణులు తలచెను. శ్లో, వక్షే్యః పతితైః పుష్పై రవకీర్ణా ప్పృధగ్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషితా కడ-13 క్లో; తరస్వినా తే తరవస్తరసాభి ప్రకంపేతాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా 1414 క్ల నిర్జూత పత్ర శిఖరా శ్ళర్ణ పుష్పఫలాద్రుమాః నిక్షిప్తవ(స్త్రాభరణా ధూర్తాఇవ పరాజితాః శేత15 పూలతో నిండిన అచటినేల అలంకరించుకొన్న యువతి వలె కాననయ్యెను. ఆతని వేగానికి చెట్లనుండి రంగురంగుల పూలు నేలపై రాలినవి. అప్పుడా చెట్టు కదల్పబడిన ఆకులు, కొమ్మలు కలిగి పూలను పండ్లనురాల్చి, పందెమున ఓడిపోయి కట్టుబట్టలను, నగలను ఊడ్చియిచ్చిన జూదరులవలె కానవచ్చినవి, శ్లో; హనూమతా వేగవతా కంపితాస్తే నగోత్తమాః పుష్పపర్లఫలాన్యాశు ముముచుః పుప్పశాలినః 1416 శ్లో విహంగసంఘైర్హీనాస్తే స్కంధ మాత్రాశయా (ద్రుమాః బభూవు రగమాస్సర్వే మారుతేనేవ నిర్హుతాః కత్స]7 హనుమంతునిచే కదల్పబడిన చెట్టు తొందరగా ఆకులను, కొమ్మలను, పండ్లను రాల్చినవి. మొదళ్ళు మాత్రమే మిగినవి. కావున వానిపై పక్షుల గుంపులు లేవు, సాధకుడు క్రమముగా నిస్సంగు డగుటతో ఆతనిలో ఏ కోరికలు చేరవు. అచల
చతుర్దశ స్పర్లః 119 స్ధితి యేర్చడును. అప్పుడే జగన్మాత దర్శనమునకు అర్హతయేర్పడును. అట్టు కానిచో మనము మనముగానే పుల్లయ్య పుల్లయ్యగానే ఉండిపోవును. క్లోః నిర్జూత కేశీ యువతిర్యథా మృదిత వర్ణకా నిప్పీత శుంభదంతోష్టీ నఖైర్దంతెశ్చ విక్షతా 14-18 క్లో తధా లాంగూల హస్టైళ్చ చరణాభ్యాం చ మర్షితా బభూ వాశోకవనికా ప్రభగ్న వరపాదపా 14-19 హనుమంతుడు తోకచేత, కాళ్ళచేత ధ్వంసమైన వృక్షములు గల అశోకవనము వీడిన కొప్పు, రాలిన గందపు పూత కలిగి, చుంబితాధరములు, నఖక్షత దంతక్షతములు గల యువతివలె కాననయ్యెను. శ్లో మహాలతానాం దామాని వ్యథమత్ర్తరసా కపిః యధా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః 14-20 వ్య! స తత్ర మణిభూమిశ్చ్ళ రాజతీళ్ళ మనో రమాః తథా కాంచన భూమిశ్చ దదర్శ విచారన్ కపిః శ4-21 ఖః వాపీళ్చ్ళ వివిధాకారాః పూర్ణా పరమవారి ణా మహార్డెర్మణి సోపొనై రుపపన్నా స్తతస్తతః 14-22 గాలి మేఘములను తూలగొట్టినట్టుగా హనుమంతుడా వనములోని తీగల గుంపును నలువైపుల చిమ్మెను. ఆ వనమున బంగారము, మణులు పొదిగిన నేలనను చూచెను. మణిసోపానములు గల నడబావులను కూడ చూచెను. క్లో! ముక్తా (ప్రవాళ సికతాః స్పాటికాంతర కుట్టిమాః | కాంచనై స్తరుభి శ్చితై స్తీరజైరుపశోభితాః 1423 ళో పుల్ల పద్మోత్పలవనా శక్ర వాకోపకూజితాః నత్యూ హ రుతసంఘుష్టా హంససారస నాదితాః కేడ-24 శ్లోః దీర్దాభి (ర్రుమయుక్తాభిస్సరిద్భి శృ సమంతతః అమృతోపమ తోయాభి శ్ళివాభి రుపసంస్కృతాః 14-25 క్ట, లతా శతై రవతతా స్పంతానకుసుమావృతాః నానా గుల్మావృత ఘనాః కరవీరకృతాంతరాః 1426 వ్ధో। తతో20 బుధర సంకాశం ్రవృద్ద శిఖరం గిరిం విచిత్ర కూటం కూటైశ్ళ సర్వతః పరివారితమ్ 14-27
120 సుందరకాండము ముత్యాలు, పగడాలతో నిండిన యిసుక దిబ్బలు, స్పటిక శిలా వేదికలు, ఒడ్డున సువర్ల వృక్షములు కలిగియుండెను. వికసించిన పద్మకైరవములతో బెగ్గురు పక్షుల, హంసల వానకోయిలల రొదలతో నది యింపుగా నుండెను. నడబావుల గట్లపై ఎత్సైన చెట్టు, చుట్టు వాగులు, వంకలు గలిగి యుండెను. కల్ప వృక్షములు, గన్నేరులతో నెల్లెడ శోభించు చాండెను. ఎత్తైన శిఖరము లున్న కొండను చూచెను. దాని శిఖరములు విచిత్రములుగా కాననయ్యెను. రమణీయ చిత్రదర్శనము వలె కవి వర్షించినాడు. ఇన్ని ఆకర్షణలు బాహిరముగా కన్పడినా, అంతర్ముఖముగా హనుమ సమారాధన చేయుచునే యుండుట సాధకుని పురోగతిని సూచించుచున్నది. క్ల శిలాగ్భహై రవతతం నానా వృక్షై స్పమావృతం దదర్శ హరి శార్జూలో రమ్యం జగతి పర్వతమ్ 14-28 ళ్ళ దదర్శ చ నగాత్తస్మా న్నదీం నిపతితాం కసిః అంకా దివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియామ్ 1త-29 శ్లో జలే నిపతి తాగైశ్ళ పాదపై రుపశోభితాం వార్యమాణా మివక్రుద్దాం (ప్రమాదాం ప్రియబంధుఖిః 14-30 శ్లో పున రావృత్త తోయాం చ దదర్శ స మహా కపిః ప్రసన్నా మివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం 14-31 శిలాగ్రహములతో రమ్యముగా నున్న పర్వతమును చూచెను. అటనుండి పడుచున్న నదీ పప్రవాహమును గాంచెను. ఆ నది, ప్రియుని తొడ నుండి జారిపడిన యువతి వలె కాననయ్యెను. చెట్ల కొనలు నీటిలో వ్రాలుట, భర్తను విడిచి పోవలదని చుట్టములు చెప్పినను, వెళ్ళిపోయే కుపితభార్యవలె తోచెను. కొండపైనుండి వచ్చు నీరు ప్రవహించు చుండుటచే, కోపము మాని తిరిగి భర్తను చేరనున్న భార్యవలె అదృశ్వము కాన వచ్చెను. ళ్ళ కాంచనీం శింశుపా మేకాం దదర్శ హరియూధపః వృత్తాం హేమమయీ భిస్తు వేదికాభి సమంతతః 14-37 శ్లో; తేషాం (ద్రుమాణాం ప్రభయా మేరోరిన దివాకరః అమన్యత తదా వీరః కాంచనో2 స్మీతి వానరః 14-38 శ సో2 పశ్య ద్భూమిభాగాంశ్చ గర్త (ప్రస్రవణాని చ సువర్హ వృక్షా నపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్ 14-39
చతుక్రశ స్సర్గః 121 శ్చోః తాం కాంచనై స్తరుగణ్జై ర్మారుతేన చ వీజితాం కింకిణీ శత నిర్జోషాం దృష్ట్యా విస్మయ మాగమత్ 1440 క్టో॥ స పుప్పితాగ్రాం రుచిరాం తరుణాకుంర పల్లవాం తా మారుహ్య మహాబాహు శ్చింశుపాం పర్షసంవృతామ్ న! హనుమ బంగారు వన్నెగల యిరుగుడు చెట్టును చూచెను. ఆ చెట్ల సువర్ల కాంతిచే హనుమంతుడు మేరువుచెంత నున్న ్రభాకరుని వలె ప్రకాశించెను, సువర్షమయదేహము కలిగియున్నట్టు భావించెను. అగ్నివలె ప్రకాశించు. కాంచన వృక్షములను కనియెను. పిమ్మట చిజుగంటల సవ్వడితోనున్న శింశుపా వృక్షమును గాంచెను. మహాబాహుడైన మారుతి కొమ్మలతో లేలేత చిగుళ్ళతో అందముగా నున్న శింశుపావృక్షముపై కెక్కెను. శ్హోః ఇతో (ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇత శ్చేతళ్చ దుఃఖార్తాం సంపతంతీం యదృచ్చయా 1-42 శ్లో! అశోక వనికా చేయం దృఢం రమ్యాదురాత్మన; చంపక్షై శృందనై శ్చాపి వకుళైశ్ళ విభూషితా కశ43 క్లో ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘ నిషేవితా ఇమాం సా రామమహిషీ నూన మేష్యతి జానకీ 1శ-44 క్లో సా రామా రామమహిషీ రాఘవస్య ట్రియా సతీ వన సంచార కుశలా నూన మేష్యతి జానకీ 1శీ-డర్ క్లోః అధవా మృగ శాబాక్షీ వన స్యాస్య విచక్షణా వన మేష్యతి సా22 ర్యేహ రామ చింతాను కర్శితా క్షేశీ-46 శ్రీరామ దర్శనముకై అతుర పడుచున్నది, దుఃఖపీడితయు ఒకచోట నిలువలేక అటునిటు తిరుగుచున్నదియు నగు జానకీ దేవి నిట నుండియే చూచెదను గాక! దురాత్ముడైన రావణుని అశోకవనము చందన, సంపెంగ, పొగడ చెట్లతో ఎంతో అందముగా నున్నది.
ఈ పద్మలత ఎంత రమ్యముగా నున్నది! ఇటకు జానకీదేవి తప్పక వచ్చును. విచక్షణురాలు, మృగాక్ష్మి ఆర్యురాలు నగు సీతాదేవి శ్రీరాముని గూర్చిన విచారముచే కృశించినద్దై ఈ తోటలో నుండి యుండవచ్చును.
క్దో। రామ శోకాభి సంతప్తాసా దేవీ వామలోచనా
వనవాసే రతా నిత్యమేష్యతే వనచారిణీ 1ఉంత7
122 సుందరకాండము క్ట। వనేచరణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ 14-48 ఖే సంధ్యా కాలమనా శ్యామా (ధ్రువ మేష్యతి జానకీ నదీం చేమాం శివజలాం సంధ్యార్హే వరవర్షినీ క్షేశంశ9 అందమైన కన్నులు కలదీ, రాముని గూర్చిన దుఃఖముచేత పరితపించు నదీ, వనసంచారమున కలవాటు పడిన దియు వగు సీతాదేవి, వనవాసమున నిష్టము కలదై యిటకు రావచ్చును. ఉత్తమురాలు జానకి రామచంద్ర (ప్రభువున కత్యంతము ప్రీతి గూర్చు నిల్లాలు. ఆమె యిదివరకే వానరుల మేలు కోరుచుండును. సంధ్యాకాలము. నెదురు చూచుచు ఈ పవిత్ర నదీజలమున పరిశుద్దతనంది సంధ్యాకాల దైవపూజకై ఇటకు వచ్చును. క్లో, తస్యాశ్చా స్య నురూపేయ మశోక వనికా శుభా శుభా యా పార్ధివేంద్రస్య పశ్నీ రామస్య సమ్మతా 14-50 క్లో యది జీవతి సా దేవీ తారాధిపనిభాననా అగమిష్యతి సా౭వశ్యమిమాం శివజలాం నదీం కేడర్] శుభంకరమైన ఈ అశోకవన మామెకు తగియున్నది. శ్రీరామపత్ని, శుభప్రదురాలు నగు సీతయు నీ వనమునకు తగియున్నది. చంద్రుని బోలు అందమైన ముఖము గల సీతాదేవి జీవించి యున్నచో పవిత్ర జలములు గల ఈ నది వద్దకు తప్పక రాగలదని నా నమ్మకం. క్లో, ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా (ప్రతీక్షముణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణ శ్చ దదర్శ సర్వం సుపుప్పితీ పర్షఘనే నిలీనః 14-52 మహాత్ముడగు హనుమంతుడు ఈ రీతిని పరిపరి విధముల నాలోచించి శ్రీరామ పత్నియగు సీతాదేవి రాక కెదురు చూచుచు, గుబురుగా పెరగిన ఆకులు కలిగి, లెస్సగా కుసుమించిన యా శింశుపా వృక్షముసై దొగియుండి ఎల్లయెడల గమ నించు చుండెను.
పంచదశ స్పర్ల్షః లి రచన : కొత్త సూర్యనారాయణ చినకాకాని పలికెడిది రామకథ యట పలికించెడు వాడు కోటరామయ్యట నే పలికిన భవహర మగునట పలికెద వీరండ గాగ పలుకులు సుధ అౌ శ్లో, సవీక్షమాణ స్తత్రస్త్రో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణళ్చ్ళ మహీం సర్వాం తామన్వవైక్షత 5-1 క్లో సంతానక లతా భిళ్ళ పాదపైరుపశోభితాం దివ్యగంధ రసోపీతాం సర్వత స్సమలంకృతామ్ 15-2 శః తాం స నందన సంకాశాం మృగపక్షిభి రాన్ఫతాం హర్మ్య (ప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనామ్ 15-38 న్లో, కాంచనోత్పల పద్మాఖభి ర్వాపీభి రుపశోభితాం బహ్వాసనకుథోపేతాం బహుభూమి గృహాయుతామ్ క5-క్ష ళ్ద. సర్వర్తు కుసుమై రమ్యాం ఫలవద్భి శృ పాదపైః పుష్పితానా మశోకొనాం శ్రియా సూర్యోదయ(ప్రభామ్ శేకర్ ఫ్ఞోః ప్రదీప్త మివ తత్రస్థ్రో మారుతి స్పముదైక్షత నిష్ప్రత్ర శాఖాం విహగైః (క్రియమాణా మివాసకృత్ 5-6 ఖ్లోః వినిష్ప తద్భి శృతశ శ్చితైః పుష్పావతంసకై ఆమూల పుష్ప నిచిత్తై రశోకై కోక నాశనైః 15-7 కః పుష్పభారాతి భారై శృ స్పృళద్భి రివ మేదినీం కర్షికారైః కుసుమిలైః కింశుకై శృ సుపుప్పితైః 15-8 ళా స దేశు ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నాగా స్పప్తపర్థాశ్ళ్చు చంపకోద్దాల కా స్తథా. క్షేర్-9 ఆంజనేయుడు. స్టిమితపడి శింశుపా వృక్షముసై స్థిరముగా కూర్చుండెను. జగన్మాతయగు సీతాదేవి యందు దృష్టి నిలిపిన వాడై సీతాదేవి కొరకు (శ్రద్దాళువై పరిశీలించు చుండెను.
124 సుందరకాండము సుందర కాండ మొదటి సర్గ మొదటి శ్లోకము నందు ఆంజనేయుని స్థితిని ఈ కక్రిందివిధముగా వర్షించెను. క్లో! తతో రావణ నీతాయా సీతాయా శ్రత్తు కర్ళనః ఇయేషు పదమన్వేష్టుం చారణా చరితే పథి శ్ర సీతావేవి యున్న పదమును అన్వేషించెదనని ఆంజనేయుడు బయలుదేరెను. తాను అన్వేషించు మార్గము చారణులు మున్నగు దేవపురుషులు చరించునట్టి ఆకాశమార్షము. అట్టి చారణ చరితమైన మార్గమున బయలుదేరిన ఆంజనేయుడు సీతమ్మ వారున్న ప్రదేశమునకు చేరకలిగెను. ఇప్పుడు ఆంజనేయుని దృష్టి ఆకాళమార్గమున అన్వేషించుట మానివైచి, భూజాత అయిన సీతమ్మను భూమి మోద వెదకుట (ప్రారంభించెను. అనగా ఆమెను దర్శించుటకు కావలసిన అర్హతను ఆంజనేయుడు ఇపుడు సంపాదించెను. అమ్మవారు ఎచటనో ఉన్నారని (ప్రారంభమయిన అన్వేషణ, మిక్కిలి దగ్గర అయి తానున్న వృక్షమూలము నందే యున్నదని గుర్తించునట్టి సామర్థ్యము కలిగెను. వృక్షమూల మనగా శరీరము నకు మూలాధారమయిన కుండలిని, అచట అమ్మవా రున్నారని ఆంజనేయుడు (గ్రహించెను. జగన్మాతయగు సీతాదేవి సర్వకళ్యాణ గుణములకు నిలయము. ఆ గుణము అన్నియును ఆమె నుండియే సృష్టికి లభించు. చున్నవి. ఆమె లంకలోని అశోకవనములో నున్నట్టుగా అశోకవనముయొక్క శోభయే చెప్పక చెప్పుచున్నది. ఈ భూమిమిద మనకు లభ్యపడని రంగురంగుల చెట్లను, మనము ఎప్పుడు చవిచూడని మధురమైన ఫలములను, అపూర్వ సౌందర్యముగల భవనములను అచట ఆంజనేయుడు దర్శించెను. ఇవి అన్నియును అమ్మవారు సమిపముననే ఉన్నారు” అని వైతాళికులు స్తుతిస్తున్నట్టుగా నున్నవి. ఇందు ప్రత్యేక విషయ మేమన - అశోకవృక్షము కాంతి వాని పూల మహాతేజము, 'సుందరముగా నుండి తమంత తాము. వెలుగుటయే గాక తమ చుట్టూ ఉన్న వృక్షములను గూడ కాంతి వంతములుగా చేయుచున్నవి. అనగా అమ్మవారి జ్యోతిస్తరూపము ఆ వృక్షముల ద్వారా అంతటా వ్యాపించు చుండెను, ళ్ధః వివృద్ధ మూలా బహువ శృోభంతే స్మ సుపుప్పితాః శాత కుంభ నిభాః కేచి త్కేచి దగ్ని శిఖోపమా: 15-10 ోః నీలాంజననిభాః కేచిత్తత్రా2 శోకా స్సహ'స్రశః నందనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా, 15-11
పంచదళ స్సర్లః 125 శ్లోః అతెవృత్త మివాచింత్యం దివ్యం రమ్యం (శ్రియా వృతం ద్వితీయ మివ చాకాశం పుష్పజ్యోతిర్ణణాయుతమ్ 15-12 ఉద్యానవనము అన్ని శోభలతో కూడి యున్నది. ఉద్యానవనము అనగా (ఉత్+యాన+వనము) పైనున్న పూర్ణమగు వెలుగు లోనికి ప్రయాణము. ఈ అశోక ఉద్యానవనము ఇక్కడ నున్న అది శోకము, బాధల నుండి ఉద్ధరించి దివ్యతకు మానవులను తీసుకొని వెళ్ళునటువంటి (ప్రయత్నము. ఈ శ్లోకమునకు 1- పూల తోట పరముగా 2-మానవులను దేవతారూపులుగ చేయుటకు పనికి వచ్చు సాధనాపరముగ కూడా అర్ధము చెప్పవచ్చును. పున్నాగా స్పప్తపర్దాళ్ళు- అనగా పున్నాగ చెట్టు ఏడాకుల అరటి మొదలగు చెట్టు ఉన్నవని బాహ్యార్హము. పున్నాగ ఆదిశేషుడు సప్తపర్షిః ఏడు వర్షములు కలిగిన జ్ఞాన విభాగము లేక ఇంద్రధనుస్సు. ఈ విధముగా దివ్యమగు పదములకు మానవులను తీసుకొని వెళ్ళు సాధన లన్నియూ ఇందు వర్షింపబడినవి. ఆ ఉద్యానవనము నుండి తేజస్సు చుట్టూ ప్రసరించుచున్నది. (ప్రకృతి మాత అయిన సీత అచటకు దిగివచ్చి నందున, అచట పూలమొక్కలకు కూడ దివ్యత్వము సం'క్రమించినదని భావము.
ఆ ఉద్యానవనములో ఉన్న చెట్టు ఈ జగత్తు నిర్మాణమునకు కారణమైన త్రిగుణముల కాంతులను వెదజల్టుచున్నవి, కొన్ని చెట్టు “శాత కుంభ' అనగా బంగారు రంగు గలవి. అనగా శుద్దసాత్విక తేజస్సును అంతటా ప్రసరించుచున్నవి. ఇంకా. కొన్ని అగ్ని శిఖోపమా =ఎర్రని మంటలతో పోల్చదగినట్టున్నవి. అవి రాజసబ్రహ్మము యొక్క తేజస్సును తెలియ చేయుచున్నవి. నీలాంజన నిభమ్ =నల్లని కాటుక వలె కొన్ని చెట్టున్నవి. అవి తామస బ్రహ్మమునకు గుర్తుగానున్నవి. ఈ (త్రిగుణములకు ఆధారభూతమయిన అమ్మవారు, అక్కడ ఉండుట వలన ఆమె తేజస్సు అక్కడి చెట్టకు కూడా సంక్రమించినది. అశోకాసహ(్రశః =వేయి అశోక వృక్షములు అని సామాన్యార్థము, సహస్రారము నందు అశోక మున్నదని విశేషార్హము. అనగా సహ[స్రారకమలమైన జ్యోతిః కేంద్రము శిరస్సు పై భాగమున నుండును. అందు జగన్మాతలక్షణమైన అశోకము, ఆనందము వెల్లివిరిసి యుండును. ధ్యానమార్గమున సహస్రారమును చేరిన వారికి ఈ సిద్ది లభించును.
1 నందనం: పరబ్రహ్మము నకు గల శుభలక్షణము లన్నియు పరబ్రహ్మణి అయిన సీతమ్మ వారి సన్నిధి వలన ఆశోకవనమునకు సం'క్రమించెను. స్వర్గమునకు కేంద్రమయిన అమరావతి యందున్న ఉద్యానవనము నందనము. అశోకవనము నందనోద్యానము వలె నున్నది.
126 సుందరకాండము
- వివిధోద్యానం : అనగా నానా విధములైన ఉద్యాన వనములను
పోలియున్నదని సామాన్యార్థము. వివిధము అనగా ప్రత్యేక మయినది.
విశేష మయినది అని కూడా చెప్పవచ్చును. సీతమ్మవారు వేంచేసి యున్నందున అది విశేష మయినది.
3 చిత్రం : ఈ భూమి మొద ఉన్న రంగులు వాసనలూ కానటువంటి నూతనమగు విశేషమయిన రంగు వాసనలు కలిగి యున్నందున చిత్ర మయినది.
&. _ చైత్రరధము అను దేవతోద్యాన వనమును పోలియున్నది
- _అతివృత్తం : వృత్తం అనగా పరిధిలేక హద్దు. ఈ ఉద్యాన వనమునకు ఉన్న అందమునకు, శోభకు పరిమితి లేదు. అపరిమితమయిన ప్రజ్ఞ యీ వనమున కున్నది.
ఈ _ అచింత్యం : దీని శోభ యింత గొప్పగా నున్నదని చెప్పుటకు అందనిది. ఊహాతీత మయినది.
గ దివ్యం : ఈ భూమికి సంబంధించినది. దేవతాశక్తులతో కూడి నది కనుక దివ్యమయినది.
& _ రమ్యం శ్రియా వృతం : రమాదేవి యొక్క కళ లన్నింటిని తన యందు నింపుకొని నటువంటిది. అమ్మవారి స్పర్శతో అంతా రమ్యముగా నున్నదని అర్థము. లక్ష్మీదేవి కళ లన్నియు ఆమెతో పాటు వచ్చి చెట్లను పరిసరాలను ఆవరించినవని భావము,
ల్సి ద్వితీయ మివ చాకాశం : ఆకాశము నందు పూచిన పూలచెట్ట వలెనే కోటానుకోట్ల తారకలు మెరయు. చుండును. అవి స్వయం ప్రకాశ మయినట్లివి, అటులనే ఈ వనము నందలి పుష్పములు కూడా స్వయం'(్రకాశము విశిష్ట గంధము కలవి.
ళ్తీ పుష్పరత్న శజైళ్చిత్రం - పంచమం సాగరం యథా సర్వర్హు పుష్పై ర్నిచితం - పాదపై ర్మధు గంధిభిః 15-18
ఇందు నందనో ద్యాన వనమందలి విశేష లక్షణములు వర్షింప బడినవి. ఇచట
నున్న పుష్పము అన్నియును స్వయం ్రకాశములై రత్నముల వలె ప్రకాశించుటచేత (రత్నాకరము) ఆ వనము సముద్రమువలె వెలుగొందుచున్నది. భూమిపై నున్న వృక్షములు కొన్ని బుతువుల యందు మాత్రమే పుప్పించును. ఈ అశోకవనమందలి
పంచదశ స్పర్ష 127 వృక్షములు అన్నియును అన్ని బుతువుల యందును అన్ని జాతుల పుష్పములను పుష్పించు చున్నవి. ఇంకొక విశేష లక్షణ మేమన - అచటి వృక్షము లన్నియును అమృతము యొక్క సుగంధమును అంతట విరజిమ్ము చున్నవి.
మధుగంధిభిః *- మధు అనగా తేనె అనియును చెప్పవచ్చును. మధువు అనగా అమృతము. దేవలోకమునకు సంబంధించినది. అటువంటి వాసన ఇచట నున్న చెట్టనుండి వచ్చు చున్నది. భూ లోకమునందు అన్ని పూవులు అన్ని బుతువుల యందు పూయుట జరుగదు. కాన ఈ వనము నందు పూవు లన్నిరకములు ఏకకాలము ననే పూయుచున్నవి. సీతాదేవి మహిమ వలన కాలమును దాటి యిచటి చెట్టు పూయుచున్నవి. తేనె వాసనలను గాకు అమృతపు వాసనలను వెదజల్లుచున్నవి. ఇచ్చటి పూలు కొంతసేపుండి తరువాత వాడిపోవుట లేదు. అవి రత్నముల వలె ఎపుడును ప్రకాశించుచున్నవని భావము.
క్లో నానా నినాదై రుద్యానం రమ్యం మృగగణైద్దిడై:
అనేక గంధ (్రవహం పుణ్యగంధం మనోరమమ్ 15-14 శైలేంద్ర మివ గంధాడ్యం ద్వితీయం గంధమాదనమ్
మొదటి చరణము నందు చెవికి లభించునట్టి నాదమును గురించి చెప్పుచున్నాడు.
నానా నినాదై రుద్యానం ; అనగా అచట నున్న పక్షుల, ఇతర జంతువుల కంరస్వరముల నుండి వచ్చు నాదము అచట ్రతిధ్వనించుచున్నది. ఇచట ఉద్యానము అనగా పైకి వెళ్ళునట్టి యోగపద్ధతి చెప్పటం జరిగింది, పశుపక్ష్యాదుల శబ్ద ధ్వనులు అన్నివైపులకు వెళ్ళును గాని పైకి వెళ్ళవు. ఇచట ప్రస్తావించినది *బ్ద తరంగముల గురించి కాదు. శబ్దము సూక్ష్మమై అతిసూక్ష్మమైన స్థితియందు నాదము అగును. అది సృష్టి యంతట ప్రకంపించునట్టిది. 'ప్రకంపనము గానే యుండును గాని శబ్దముగా నుండదు. అతి సూక్ష్మమగు నాదము యొక్క ప్రసారము ఈ వనము నందు ఊర్చ్వముఖముగా ప్రసరించుచున్నది.
రమ్యం మృగగణైర్వి జైః ఏ; ఈ నాదము మూడు రకములుగా నుండును.
1 రమ్యము : అనగా రమాదేవికి సంబంధించినది. లక్ష్మీస్తుతికి సంబంధించిన శ్రీసూక్త నాదములు.
- మృగగటైః : భగవానుని సదా అన్వేషించునట్టి తపః సంపన్నులగు బుషులు మృగములు = అనగా భగవానుని వెదకువారు. వారు మహా మంత్రమును నాదరూపమున అనుసంధానము చేయుచుందురు. అది నాదాను సంధాన మనబడును. లేక (బ్రహ్మవేత్తల యొక్క బ్రహ్మనాద మనబడును.
శరర సుందరకాండము
త ద్విజైై - అనగా మానవజన్మము నెత్తియు ఎంతో పరిపూర్ణముగు జ్ఞానసిద్ది ఆజన్మమున పొందినవారు. అనగా వారు రెండవ జన్మము నెత్తినవారు. వారి నుండి వెలువడు నాదములు జ్ఞానముతో కూడి పైకి (ప్రసారమగుచుండును. తరువాత విషయము గంధమాదనము.
గంధమాదనమ్ :దివ్యమగు గంధము అనుభూతికి అందుట వలన ఈ గంధము నందే యుండి పోవునట్లు చేయు 'ప్రజ్ఞనే మాదనము అందురు. దివ్యగంధిము లోనికి, అంతటినీ ఆకర్షించు. (ఫ్రజ్ఞయే మాదనము.
ఈ ఉద్యానవనము నందున్న గంధ విశేషము లన్నియు మాదకద్రవ్యముల వంటివి. అనగా మన ప్రజ్ఞలన్నిటినీ తమలోనికి ఆకర్షించునట్టివి. అట్టిదానిని గంధమాదనము అందురు. ఆదివ్యవాసనలు లోనికి ప్రవేశించినపుడు ఈ లోకపు వాసనలు (విషయవాసనలు) మన మిద పని చేయవని భావము.
క్లో అశోకవనికాయాం. తు తస్యాం వానరపుంగవః
స దదర్శా విదూరస్త్రం చైత్య ప్రాసాద ముభ్భితమ్ కే5-15 క్ట మధ్యేస్తంభ సహస్రేణ స్టీతం కైలాస పాండురమ్ (ప్రవాళ కృత సోపానం తప్త కాంచన వేదికమ్ 15-16 క్ట ముష్ణంత మివ చక్టూంషి ద్యోత మాన మివ (శ్రియా విమలం. ప్రాంశు భావత్వా దుల్లి ఇంత మివాంబరమ్ 15-17 ఆశోకవన మనగా శోకరహితమైన, ఆనందమయిన వనము, ఆ వనము నకు సమిపమందు ఒక భవనమును ఆంజనేయుడు చూచెను. అది మశీ దూరముగానూ లేదు. అలా అని దగ్గరగానూ లేదు. ఆ భవనము (బ్రహ్మ తేజస్సు. అతేజస్సు అనందమునకు దూరముగా నుండదు. కలసి మెలసి యుండదు. దానినే ఈశా వాస్యోపనిషత్తు ఇట్టు చెప్పుచున్నది.
తదేజతి, తనైజతి, యద్దూదే తద్వదంతికే”
అది కదలును, కదలదు, కదలనే కదలదు. దాని యంత దూరమున ఇంక చేదియును నుండదు. దాని యంత దగ్గరలో మళి ఏదియును నుండదు. అనగా మన హృదయాంతరాళమునందే పరబ్రహ్మ మున్నది. కాని (బ్రహ్మలోకమున ఎక్కడో చాలా దూరమున నుండునని భావింతుము. అ భావము సరికాదు. ఆ బ్రహ్మము చాలా దూరమున లేదు అని ఈ ఉపనిషద్వ్యాక్యము ప్రతిపాదించుచున్నది. అలాగే మనకు అతి దగ్గరగా నున్నదనీ చెప్పలేదు. మన అంతరంగము నందే యున్నది.
పంచదశ స్సర్లః 129 లో-లోపలే యున్నది. అనగా జ్ఞానులకు మాత్రమే దగ్గరగా ఉండునది. దాని స్టానము శిరస్సుపై భాగమున నున్న సహ(్రారకమలము. అదే సహస్రారము అని పిలువ బడుచుండును. యోగాభ్యాసము చేయువారల కందరకు సహ(స్రారకమలము, మూలాధారము, కుండలిని అనబడు శక్తి కేంద్రములు పరిచితములు. అట్టి సహస్రార కేంద్రము చేత తేజము నలువైపులకు (ప్రసార మగుచుండును.
ఈ సహస్రారము = కైలాస పాండురము అనగా కైలాస పర్వతము వలె వెల్లనైనటు నంటి శుద్ద సాత్విక తేజస్సును విరజిమ్ముచుండును. (స్తంభ సహస్రేణ
- సహస్ర దళకమలము = సహస్రారము) అట్టి సహస్రారకమలము చుట్టూ ప్రవాళకృత సోపానములు కలది. అనగా ఎజ్జని పగడపు కాంతితో కూడిన మెట్టుగలది. రాజసబ్రహ్మతేజము ఎగ్రనిదే. ప్రవాళములు ఎగర్రనివే. విమలం - ఇవాంబరమ్ : స్వచ్చమైన ఉన్నతమయిన ఆకాశమువలె నీలపు కాంతి ఆ భవనము చుట్టు వ్యాపించినది. అనగా తామస (బ్రహ్మము. గృహము అనగా శరీరము. ఇది సత్వ,రజః తమస్సుల నెడి త్రిగుణాత్మకము. ఈ దర్శనము ఆంజనేయునకు కలిగెననిభావము.
దర్శనము క్లో తతో మలిన సంవీతాం రాక్షసీభి స్పమావృతమ్ 15-18 ఉపవాస కృళశాం దీనాం నిళ్చుసంతీం పునఃపునః; దదర్శ శుక్ష పక్షాదౌ చం[ద్రరేఖా మి వామలామ్ 15-19 ఆంజనేయుడు దూరము నుండి సీతాదేవిని దర్శించిన విధానములు వరుసక్రమంలో ఇచట వర్ణింపబడినవి. ఈ సోపానక్రమములో మొదటి మెట్టుగ ఆంజనేయుడు దర్శించినది, ఆమె నిజమగు రూపము కాదు. ఆమెకు కొంత దూరముగా చెట్ల సందులలోనుంచి స్పష్టా స్పష్టముగా ఆమెను దర్శించుట ఇందు వర్లింపబడినది. ఆమె వంతో తేజోమూర్తి అయినప్పటికీ, ఆంజనేయుడు సరాసరిగ ఆమెను దర్శింపలేదు, ఆమె అచట నున్నట్టు మాత్రమే గుర్తింపగల్నెను. కుండలినీ విద్యతో పరిచయమున్న వారికే యీ శ్లోకము అర్ధమగును.
1 తతోమలిన సంవీతామ్ : మాలిన్యమయిన వాని చేత ఆవరింపబడి నది. అనగా కుండలినీ శక్తి కేంద్రము మన శరీరము నందు వెన్నుపూసకు చిట్టచివరన అడుగు భాగమున నుండును. అనగా మలమూత్రకోశములకు మధ్యన ఈ కుండలినీ కేంద్ర ముండును.
అమ్మవారు శింశుపా వృక్షమూలమున యుండిరి అని చెప్పుట కలదు.
వృక్షము" ఆనగా శరీరమని యోగశాస్త్రము నందు చెప్పుట కలదు. మూలము అనగా వేరు - అని సామాన్యార్థము. మూలాధారమని వేదార్థము. మూలాధారము వెన్నుపూసకు చిట్టచివరన ఉండునట్టి శక్తి కేంద్రము.
-
రాక్షసీభి స్సమావృతామ్ : ఆ కుండలినీ కేంద్రము చుట్టూ నుండు ఆవరణము. రాక్షసమయముగ నుండును. అనగా కామక్రోధాదుల యొక్క విజ్బంభణము, హింసా ద్వేషాదుల యొక్క దుర్వర్తనమునకు కేంద్రముగ నధోభాగముండును. మన శరీరములోని మాలిన్యము లన్నియు అచటికి దిగివచ్చి వెడలిపోవుచోటు అని భావము.
-
ఉపవాస కృశామ్ ; అనగా ఆహారము, నీరు విసర్జించుట వలన (ఉపవాస దీక్షవలన) చిక్కి పోయినదని వ్యాఖ్యాన కారులు చెప్పుట కలదు. ఉపనసించుట
దర్శనము 131 అనగా సామాష్యముగ నుండుట అని అర్ధము కలదు. అనగా కుండలినీ కేంద్రము భాగవతీయమగు శక్తితో కలసియుండునట్టిది.
-
కృశామ్ : అతి సూక్ష్మమగు రూపమును కలిగి నట్టిది. అనగా మూడు కొాలతలకు సంబంధించి నట్టిది కాదు. ఇంత పొడవు, ఇంత లావు ఇంత ఎత్తు అని వర్షింపనలవి కానిది. సూక్ష్మమయినది.
-
దీనామ్ : అనగా ఆడంబరముగ బయటకు కనిపించక ఒదిగి యుండునటువంటిది.
-
నిశ్చసంతీం పునఃపునః ; మరల మరల నిశ్చసించునధి కుండలినీ కేంద్రము, ఎప్పుడును దివి నుండి దివ్యశక్తులను ఆక్రర్షించును, సాధకునకు కావలసినంత మేరకు శరీరము లోనికి పంచుచుండును. ఇట్టు పై నుండి శక్తులను ఆకర్షించుట, శచరము. లోనికి దానిని ప్రసరింప చేయుట కుండలిని యొక్క _ఉచ్చాస నిశ్శాసములు.
-
దదర్శ శుక్త పక్షాదౌ : వెలుగుకు ముందున్నట్టి స్తితి, అనగా అమ్మవారి నుండి తేజస్సు దిగి వచ్చుచున్నదని భావము,
-
చంద్రరేఖా మివామలామ్. : శుక్షపక్ష మందలి తాలిచంద్రరేఖవలెనున్న సవిత్రమగు తేజము కలదైన సీతాదేవి ఆ వృక్షమూలము నుండెను. శుక్షపక్షము నందలి చంద్రబింబము సన్ననిరేఖ వలె ప్రకాశించును. దినములు గడచిన కొలది యా వెలుగు వృద్ధిగాంచును. అదే విధముగా ఆంజనేయుడు సీతమ్మవారిని, తొలిసారి విలోకించినపుడు ఆమె సన్నని రేఖ వలె కన్పించెను. పిమ్మట జాగ్రత్తగా పరిశీలించి ఆమె పూర్ణతేజస్సును దర్శించెను. పాడ్యమి నుండి వరుసగా పూర్షిమవరకు చంద్రుడు తా నందుకున్న సూర్యతేజస్సును భూమిపైకి ప్రసరించును. పూర్ణిమనాడు పూర్ణముగా అందించును. చంద్రుడు మనఃకారకుడు. సూర్యుడు ఆత్మకారకుడు. మనస్సు ఆత్మయందు లయమైన స్థితికి అమావాస్య సంకేతము. అపుడు అందిన దివ్యానుభూతిని భౌతిక జీవితము నందుకూడ సాధకులకు అనుగ్రహించుచున్న జగన్మాతయే శుక్షపక్షపాడ్యమి నాటి చంద్రరేఖ,
శ్లో, మందం ్రఖ్యాయ మానేన రూపేణ రుచిర ప్రభాం
పినద్దాం ధూమ జాలేన శిఖామివ విభావసోః 15-20 రెండవ సోపాన క్రమము ఇందు వర్షింపబడినది. ఎక్కడో ఆకసమున కనిపించిన చంద్రరేఖ వలె గాక్క సీతాదేవి ఆంజనేయునకు మిక్కిలి సమోసమున నున్నట్లు
132 సుందరకాండము గుర్తింపగలిగెను. అనగా సృష్టిగా దిగివచ్చిన అమ్మవారి వెలుగు అంతటా భాసించును. అయినా మనము దానిని గుర్తింపజూాలము. ఆమెయొక్క అనుగ్రహము వలన మాత్రమే ఆ సామిష్యత మన అనుభవమున కందును.
మం(ద్రం (ప్రఖ్యాయ మానేన : ఆమె జగత్ర్రఖ్యాతి గాంచిన దేవి మైననూ ఈ చిన్న మానవ ్ర్రీరూపములో ఉన్నది. అందుచేత జాగ్రత్తగా పోల్చుకొను జ్ఞానులకు మాత్రమే ఆమె ఖ్యాతి గోచరించును. ఆమెరూపము చిన్నదయినను ఆమె నుండి వచ్చు తేజస్సు అధికముగానే ఉన్నది. అగ్ని పొగచేత కప్పబడినప్పుడు స్పష్టముగా వ్యక్తము కాదు. అటులనే సీతాదేవి (ప్రఖ్యాతి, తేజస్సు, మంద్రముగా ్రకాశించుచున్నవి.
వ్గోః ప్త్రే నై కేన సంవీతాం కసే నోత్తమ వాససాొ
సపంకా మనలంకారాం విపద్మామివ పద్మినీమ్ 15-21
చిరిగిపోయి మాసిపోయిన పచ్చని ఒకే ఒక వస్త్రము కలది అని బాహ్యార్థము. ఆమె ధరించిన వస్త్రము ఒక్కటే. అనగా ఈ ఆకాశమందలి కాంతి యంతయు ఆమె యొక్క వస్త్రమే. ఆ కాంతి పీతా - పసుపు పచ్చరంగని ఒక అర్ధము. ఇతర రంగు లన్నిటిని తనలోనికి ఆకర్షించు. (త్రాగు) నట్టి దివ్యమయిన (ప్రభ కలిగిన ఒకే. ఒక వస్త్రము (పీతాంబరం). సృష్టికంటె శ్రేస్టమై, సృష్టికి వెలుగయినట్టి వస్త్రమును, ఆమె ధరించినది. అనగా ఆమె చుట్టూ ఉన్న అవరణ యంతయు మహాతేజస్సుతో నిండియున్నదని భావము.
ఆమె బురదతో కూడియున్నది. అలంకారములు లేనిది. తామరపువ్వులు లేని తామరకొలను వలె నున్నదని బాహ్యార్థము. భూజాత కనుక అమ్మవారు భూమియందు, బురదయందు కలసి యుండునని భావము.
అనలంకారాం : ఆమె ఈ సృష్టి కంతకు అలంకారము. ఈ శోభ యంతయు ఆమెయే. కనుక అమెకు వేరుగా అలంకారములు లేవు. భగవానుడు "అనికేతనుడు” అనగా ఇల్టు లేనివాడనుట సాంప్రదాయము. ఈ ప్రపంచ మంతయు తన యందు ఉన్నవాడు. సృష్టికే ఇల్లు అయినవాడు. అందువలన వేరే యిల్టు లేనివాడు.
దీనినే త్యాగరాజు స్వామి వారు ఇట్టనిరి: “అనాధుడనుగాను రామ అనాధుడవు నీవని నిగమజ్ఞుల సనాతనుల మాట విన్నాను “ఓ రామా! నీవు అనాథుడవు! నేను అట్టుకాదు, సనాథుడను నాకు నీవు నాధుడవు (ఆధారము)-ఈ జగత్తునకు కూడా నీవే ఆధారము. కనుక నీవు అనాధుడవు” ఈ సంప్రదాయము ననుసరించియే ఇక్కడ ఇలా వ్యాఖ్యానించు కొనవలయును.
దర్శనము 133
విపద్మ మివ పద్మినీమ్ : పద్మాలు లేనటువంటి పద్మిని, పద్మిని అనగా లక్ష్మీదేవి, అనగా శింశుపా వృక్షమూలమందున్న ఈమె, సాక్షాత్తు శ్రీదేవి యే అని సూచన,
శ్లోః వ్రీళితాం దుఃఖసంతప్తాం - పరిమ్ఞానాం తపస్వినీం
(గ్రహే ణాంగారకే ణేవ పీడితా మివ రోహిణీమ్ 15-22
అమ్మవారు సిగ్గుతో తాను ,_లంకలో బంధింపబడితి నన్న శోకముతో శోభ తరగిపోయి అంగారకునిచే పీడింపబడిన రోహిణీ నక్షత్రమువలె నున్నదని బాహ్యార్థము.
సీతమ్మవారు రోహిణీ నక్షత్రము వంటిది. మహాతేజోవంత మైనది. అట్టి స్వయంప్రకాశమానమగు రోహిణీ నక్షత్రమును, అంగారక (గ్రహము పీడించి నట్టుగా అల్పుడయిన రావణునిచే సీతమ్మవారు పీడింపబడుచున్నది. అంగారకుడు సూర్యుని ఆశ్రయించి, ఆయనయొక్క తేజస్సును (గ్రహించి వక్టిల్లువాడు. సూర్యుని తేజస్సు (సప్తవర్షములు) లోకూడా ఎరుపురంగుకు మాత్రమే అధిపతి. అదే విధముగా రావణుడు కూడా బ్రహ్మ అనుగ్రహమున రాజసభావమయిన ఎరుపురంగును కలిగిన వాడు. రావణునికి ఉన్నది వరబలమే కాని, స్వయముగా తనకే బలము లేనివాడు. _ అట్టి అల్పుడు ఆత్మజ్యోతి స్వరూపమయిన అమ్మవారిని పీడించినటుల, లోగొనినటుల, అనిపించి, కనుపించును. కొని అది తాత్కాలిక సత్యము మాత్రమే.
వ్రీళితాం -దుఃఖ - మ్లానాం : ఈ విశేషములు ఆమ్మవారి చుట్టూ ఉన్న రాక్షసస్తీలయొక్క అహంకారమును పరస్పరద్వేషమువలన రాక్షసులు ఆర్జించే దుఃఖమును, పరాభవము వలన వారికి కలుగు సిగ్గును కూడా దయామయురాలైన జగన్మాత తన వైపునకే ఆకర్షించుకొన్నదని భావము.
శో అశ్రు పూర్ణ ముఖీం దీనాం - కృశా మనశనేనచ
శోకధ్యాన పరాం దీనాం - నిత్య దుఃఖపరాయిణామ్ 15-23
ఈ శ్లోకము బ్రహ్మతేజస్వియొక్క మహిమను వర్షించుచున్నది.
అశ్రు పూర్ణముఖి = సీతమ్మ వారి ముఖము (ఆనందాశ్రువులు) ఆనందముతో (ప్రకాశించుచున్నది. కృశ=కృశించినది. అనగా ఆమె సృష్టిగా దిగివచ్చినపుడు పూర్ణ (ప్రజ్ఞ వ్యక్తము కాదు - పాదోస్యవిశ్చృభూతాని - త్రిపాదస్యామృతం దివి” అని నట్టుగా ఉండును. అందుచేత కృశించి నటుల కనిపించును.
అనశనేనచ = ఆహారము తీసుకొననటు వంటిది. ఓషధులు వనస్పతులుగా దిగివచ్చినది, ఆమెయే కనుక, ప్రత్యేకముగా వాటిని ఆహారముగా తీసికొనవలసిన
13% సుందరకాండము పనిలేనిది. అనగా నిత్యమూ పూర్ణముగా ఉండునది. “ద్యాసుపర్ణా సయుజా సఖాయా
- అని ఉపనిషత్ సూక్తి
ఈ శరీర మనే చెట్టు మిద రెండు పిట్ట లున్నవి. అందు ఒకటి జీవిత ఫలభోక్తగా ఉండును. (జీవాత్మ) రెండవది పరమాత్మ. అది అనశనం = అనగా ఏమియు భుజించదు. సాక్షీభూతముగా నుండును. సీతమ్మ లంకలో నున్ననూ అచటి శోకమునకు భోక్త కాదని చమత్కారము.
శోక ధ్యానపరాం = మానవులు తమకు కలిగిన బాధలకు శోకింతురు. అపుడు ఈ శోకము నుండి రక్షించమని వేడుకొందురు. అది (క్రమముగా భక్తి జ్ఞానములనే మెట్టు ఎక్కి, ధ్యానయోగము నందు (ప్రవేశింతురు. అయిననూ అమ్మవారు “పరా” అందనిది గానే ఉండును. అట్టని పూర్తిగా అందనిదిగాను ఉండరు. నిత్యం దుఃఖపరాయణామ్ = దుఃఖమునకు పరము అయినది, ఆనందము. అనగా నిత్యానందమయి.
శ్లోప్రియం జన మపశ్యంతీం - పశ్యంతీం రాక్షసీగణం
స్వగణేన మృగీం హీనాం - శృగణాభి వృతా మివ. 15-24
తన కిష్టమైన వారు కనపడక, చుట్టూ రాక్షసులు మాత్రమే కనిపించగా, స్వజాతి మృగములు. దగ్గర లేక వేటకుక్కలచే చుట్టబడిన ఆడు లేడివలె నున్నదని సామాన్యార్థము.
అమ్మవారి యొక్క దివ్యలక్షణములు ఇందు చెప్పబడినవి. ప్రియజన మ పశ్యంతీం = ఆమె జగన్మాత కనుక అమెకు అందరు ప్రియులే. ప్రేమ పాత్రులే. సజ్జనులు, దుర్దనులు, దేవతలు, రాక్షసులు అనెడి భేదదృష్టి లేక అందరను వాత్సల్యముతో చూచును. కనుక ఆమె (ప్రత్యేకముగా ప్రియమైన వారిగా కొందరిని చూచుట లేదు.
పశళ్యంతీం రాక్షసగణం = అమ్మవారి దృష్టి ప్రత్యేకముగా అజ్ఞానులు, ఆర్హులు అయినటువంటి రాక్షసులను (రక్షింపబడువారు) ఉద్దరించుట యందు ఉండునని భావము.
స్వగణేవ మ్బగీం హీనాం = స్వగణము అనగా అమ్మవారి యందు భక్తి ఆత్మీయత గలవారు. అన్మువారిని “స్వ”గా దర్శించెడివారు. అంతియే కాని అమ్మవారికి “స్వ” యని అర్థము కాదు.
శృగణ = దివ్యజ్ఞానులయిన మహామునులు ఆమె చుట్టూ పరివేష్టించి
దర్శనము 135 సామగానము చేయుచుందురు. అట్టి వారిని (శృగణము) “ఉద్గీతలు” శ్యానకులు అని అందురు,
ఆమె మృగముగా పోల్చబడినది. మృగము అనగా వెదుక బడునది. అమ్మవారు ఎపుడూ వెదుకబడుచునే యుండును. ఫలాని రూపము, ఫలాని చోట, ఫలాని కాలమున ఉండునని ఎవరూ ఎరుగరు. ఆమె దరికి చేరవలెనని అందరూ అన్వేషించుచునే యుందురు.
శ్లో నీల నాగాభయా వేణ్యా జఘనం గతయైక యా
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీ మివ 15-25 ఆంజనేయుడు సీతమ్మవారిని దర్శించిన విధము ఇందు వర్లింప బడినది. సీతాదేవి అనగా లక్ష్మీదేవి. శ్రీరాముడు. శ్రీహరి. వారిరువురు ధర్మరక్షణకు మానవరూపమున దిగివచ్చినవారు. అట్టి సీతాదేవిని, శింశుపావృక్షమూలము నందు ఉన్నప్పుడు, ఆంజనేయుడు మూడు విధములుగా దర్శించెను.
1 భూదేవి - ఘనరూపమును పొందిన సృష్టి విభాగము 2. సిరిః అనగా ఈ సృష్టి యందలి సిరిసంపదలు శక్తి మంతములయిన సూర్యాది[గ్రహ కుటుంబములు, అందలి (ప్రాణులు. ఇవి అన్నియు కలసి సిరి. 3 నీల : స్వచ్చమగు నీల వర్ణము హరియొక్క స్వరూపము, (మేఘశ్యామ్ = పీతాంబరుడు) నీల వర్షము కలిగిన ఆకాశమే. నీలాదేవి. కనుక ఈ మూడు విధములయిన దేహములు కలిగిన అమ్మవారిని హనుమ దర్శించు చున్నాడని ఈ శ్ఞోకము బోధించుచున్నది. ఆమె నల్లని జడ, తమోగుణ ప్రధానమైన భూదేవిని సూచించుచున్నది. ఆమె (ప్రీ రూపము ధరించి వచ్చి అక్కడ ఉన్నది కనుక ఈ సృష్టి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి వలె కనుపించు చున్నది. మబ్బులు తొలగిపోయిన శరత్కాల మందలి నీలాకాశపు కాంతి కలిగిన నీలాదేవి వలెనే ఆంజనేయునికి ఆమె కనిపించెను. అనగా హరియొక్క నిజస్వరూపము సీతమ్మ వారుగా చూడగలిగెను.
శ్లో! సుఖార్జాం దుఃఖసంతప్తాం వ్యసనానా మకోవిదాం
తాం సమీక్ష్య విశాలాక్షీ మధికం మలినాం కృశామ్ 15-26 ఫీత్రాదేవి సుఖమునకు అర్హురాలు. నిత్యము శాశ్ళ్వతము అయిన ఆనంద స్వరూపిణి. అమె మానవ రూపము ధరించినందున, ఈ లోకమునకు సంబంధించిన దుఃఖస్పర్శను కూడా పొందుచున్నది. విశాలాక్షి ; విశ్శ్వమంతటిని సమిోక్షించి, పోషించి రక్షించగల విశాల దృక్పథము గలది. ఆమె విశ్వ మంతటిని తన విశాల నేత్రములతో
136 సుందరకాండము చూచుచున్నది. ఆమె భూమిని ఆశ్రయించుకొని నందు వలన మురికిగా నున్ననూ, దేవభావములతో (ప్రకాశించు. చున్నది. ఈ విశ్చ మంతయూ ఆమె యొక్క స్వరూపమే అయినప్పటికి లంకయందు కృశించి చిన్న మానవరూసమును వహించియున్నది.
క్లో తర్కయామాస సీతేతి కారణై రుపపాదిభిః
'హైయమాణా తదా తేన రక్షసా కామరూపిణా 27 శః యధారూపా హి దృష్టావై తథా రూపేయ మంగనా పూర్ణచంద్రాననాం సుభ్రూం చారువృత్తపయోధరామ్ 15-28
ఆంజనేయుడు సీతాదేవిని ప్రత్యక్షముగా చూడ నప్పటికి, రావణుడు ఆమెను ఆకాళమార్గమున తీసుకొని వెళ్లునపుడు కొంతమాత్రము చూడగలిగెను. ఆ చూచిన రూపము ఇక్కడ అశోకవృక్షమూలమున ఉన్నది. తాను వెదకుచున్న సీతాదేవియే ఈమె కావచ్చునను కొనెను.
అనగా సీతాదేవిని ఆకాశమందు దూరముగా చూచెను. ఆరూపమును తరువాత ఆయన మరచిపోయెను. అలా కొంత కాలము గడచిన తరువాత అమ్మవారి రూసము పూర్తిగా మరుగున పడిపోయినది. తరువాత కొన్నాళ్ళకు శ్రీరామదర్శనము జరిగెను. రాముల వారితో ప్రసంగముల వలన తాను చూచిన సీతారూపమును గురించి మరల ఆంజనేయుడు ధ్యానము చేయ (అన్వేషింప) నారంభించెను. అయిననూ స్మృతికి అందలేదు. అన్వేషణ చేసి ఎంతో ప్రయత్నము చేసిన తరువాత, సాక్షాత్తు తాను ఆరాధన చేసిన దేవతామూర్తి తన ఎదుట కనపడినప్పుడు మాత్రమే, తాను ఆంతకు ముందు చూచిన రూపము, మరల చక్కగా గుర్తుకు వచ్చినది. ఆ రూపమే ఈ రూపమని పోల్చుకొనదగిన స్పష్టమగు భావము ఏర్పడినది.
ఇట్టి అనుభవము సాధనలో శ్రద్దాళువులైన కొందరికి లభించును. గురుకృప వలన యోగసాధకుడు సమాధిస్థితి యం దున్నప్పుడు, వానికి ఏదో ఒక రూపము దర్శన మిచ్చును. ఆ రూపము తాను కోరినది కాదు. తాను ఎరిగినది కాదు. కనుక అది త్వరలో మరుగున పడిపోవును. తరువాత కొంతకాలమునకు ఆ గురువే స్వయముగా వచ్చి దర్శనము ఇచ్చును. ఆ సద్గురువు మార్గ దర్శకత్వములో ధ్యానము చేయగా, మరల ఆ రూపము దర్శనమగును. అదే విధముగా సీతాదేవిని అస్పష్టముగా ఆంజనేయుడు చూచినప్పటికి, శ్రీరామ. చంద్రుని దర్శ్భనమయిన తరువాత మాత్రమే ఆ దేవతారూపమును గురించి (శ్రద్దగా ఆలోచించుట, ధ్యానము
దర్శనము 137 చేయుట జరిగెను. రాముల వారియొక్క ఆశీర్చచనము వలన సీతాన్వేషణకు ఆంజనేయుడు అర్హత పొందెను. శోకవనమును దాటి, అశోకవనప్రవేశము చేసి అమ్మవారిని స్వయముగా చూడగలిగెను,
అంతకు పూర్వము ఎరిగి ఉన్నది, కొంతకాలము మరచి పోయినది, అజ్ఞానముతో వ్యామోహము వలన గుర్తురానిది, తరువాత పరమ గురువుల యొక్క కృపా విశేషము వలన, తిరిగి లభించునట్టిది, అయిన యొక విశేషముయినది యోగవిద్య ఈ విద్య అర్జునునకు అంతకు పూర్వము తెలిసినదే. కాని యుద్దమునకు సిద్దమై వచ్చిన తరువాత, ఈ విద్య మరుగున పడిపోయినది. తాతలు, తండ్రులు, అన్నలు అన్న వ్యామోహము చుట్టుకొన్నది. యోగీశ్చరుడైన శ్రీకృష్ణుని సొన్నిధ్యములో ఆ మోహము నష్టమైపోయినది, అందువలన “నష్టోమోహఃస్కృతి ర్లబ్దా” అని అర్జునుడు అనెను. అట్టి అనుభూతినే ఆంజనేయుడు కూడా పొందినట్టు ఈ శ్లోకము బోధించు చున్నది.
ఆంజనేయులవారు సీతమ్మ వారిని దర్శించిన విధమిది. నా యెదుట దర్శన మిచ్చుచున్న ఈమెయే. భగవతియగు సీతాదేవి. ఈమె భగవానుని తేజస్సును భూలోకమునకు పంచిపెట్టుచున్నది. పున్నమి నాటి చంద్రుని వల్మెఆమె ముఖము లోక మంతటికి ఆనంద మయమగు. వెలుగును ప్రసారము చేయుచున్నది. అమ్మవారి 'భ్రూమధ్యము భగవానుని శక్తిని అందరకు అందించు చున్నది. ప్రాణశక్తిని, ఆమె వక్షస్టలము, ఈ సృష్టియందలి ప్రాణులకు పంచుచున్నది. అనగా ఆయన దర్శించినది సామాన్య స్త్రీరూపమని, చెప్పుట కుదరదు. ఆ జగన్మాతనే దర్శించెనని చెప్పుటయే సరియగు పద్ధతి.
శ్లోః కుర్వంతీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా దిశ
తాం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం' సుప్రతిష్టితామ్ 15-29 ళ్దో సీతాం పద్మపలాశాక్షీం మన్మధస్యరతిం యథా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభా మివ 15-30
ఆంజనేయుడు ఇప్పటికి పూర్ణమగు దృష్టిని అమ్మవారి అనుగ్రహము వలన పొందెను. అందువలన ఆమె యొక్క పరిపూర్ణమైన స్వరూపమును ఇచట ఈ మానవ రూపమునందే గుర్తింప కలిగెను. ప్రళయావసానమందు జగత్తంతయు తమో మయమగును. అట్టి చీకటి నంతటీని తానే త్రావి మరల జగత్తు నంతటిని శ్రీదేవిగా, శ్రీహరి సృష్టించును. అలా జగత్తుగా చీకటి నుండి వెలుగునకు
138 సుందరకాండము (అవ్యక్తము నుండి వ్యక్తమునకు) వచ్చిన చైతన్య ప్రభయే లక్ష్మీదేవి. అట్టి లక్ష్మీదేవిగా, ఇపుడు ఆంజనేయుడు సీతమ్మవారిని గుర్తించుచున్నాడు. హిరణ్యకశిపుడు అనుచీకటిని తొలగించి మరల సృష్టికి వెలుగును ్రతిపాదించు నరసింహమూర్తిని వర్షించు ప్రహ్హాదచరిత్రము నందలి ఈ పద్యమును శ్రద్దగా గమనింపుడు.
“ప్రకటంబైై ప్రళయావసానమున మున్ (బ్రహ్మాండ భాండావరో
ధకమైయున్న తమి(్రముం జగము నుత్సాదించుచోన్ ద్రావి సా
త్విక తేజో నిధియైన విష్ణు నెడ నుద్దీసించు నేన ష్టమై
వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యమ్ము రాజోత్తమా
కుర్వంతీం ్రభయాదేవీం సర్వా వితిమిరా దిశా!
ఈ విధముగా జగత్తునకు అవరోధముగా ఉన్న చీకటిని త్రాగి, జగత్తును మరల వెలుగులోనికి తెచ్చుట లక్ష్మీనారాయణుల యొక్క లీల. అదియే ఇందు వర్షింపబడినది.. ఈ సృష్టి మొదటి నుంచి, తమస్సుయొక్క విజృంభణము ఉంటూనే యున్నది. దానిని లక్ష్మీనారాయణు లిరువురు తొలగించి సాత్వికమైన తేజస్సును నిలుపుచునే యున్నారు. అజ్ఞానాంధకారమును తొలగించి, మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించుచున్నారు.
తాం నీలకేశీం బింబోస్టీం సుమధ్యామ్ సుప్రతిస్టితామ్
అమ్మవారు చీకటిని పోగొట్టుచున్న దనగా ఆమె తమస్సు కంటే వేరు అని అర్ధము కాదు. ఈ మూడు గుణములు ఆమె యందే భాసిల్లు చున్నవి. సాత్విక తేజస్సు, రాజసిక అహంకారము, నీలమగు, తామస (బ్రహ్మ తేజస్సు కూడా అమె యందే వర్తించును. కనుక త్రిగుణములకు ఆధారభూతమైన జగన్మాతయే ఈ సీతాదేవి. దీనికి సంకేతముగా. పై విశేషణములు వాడబడినవి.
పద్మపలాళాక్షీం : ఆమె ఎల్లప్పుడు విస్తరించి వికసించే సృష్టికి నిదర్శనము. కనుక వికసించుచున్న తామర రేకుల వంటి కన్నులు కలది. మన్మధస్య రతిం యథా ఏ భగవానునికి ఆనందరసము వంటిది. భగవానుడు సత్-చిత్- ఆనందమయుడు. అమ్మవారు జగత్తునకు ఆనందము కూర్చునట్టిది. రతి అనగా (బ్రహ్మానందము - (బ్రహ్మైక్యము (శరతల్పగతుడయిన భీష్ముడు శ్రీకృష్ణునితో “నేను నీయందు రతి కోరుచున్నాననెను) మన్మధుడగు భగవానుడ్డు ఇష్టాం : అనగా ఈ సృష్టియే తాను అయినది. పరమేష్టి అనగా సృష్టిని చేయువాడు. సర్వస్యజగతః ఈ జగత్తు నంతటికి తల్లి అయినది కనుక ఇష్టమైనది అని కూడా చెప్పవచ్చును. బాహ్యార్థముగా, పూర్షిమ
దర్శనము [139 రోజున భూమిపై (ప్రసరించే వెన్నెల, (ప్రాణు లన్నింటికి ఇష్టమై ఆనందమును కూర్చుచున్నది.
క్టోః భూమౌ సుతనుమాసీనాం నియతా మివ తాపసీం
నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూ మివ 15-31
దూరము. నుండి భాగవతీయమైన దివ్యప్రజ్ఞయొక్క రూపమును. గుర్తించు విధానము ఇందు సూచింపబడినది. పైకి కనుపించు రూప మొకటియును, మన స్ఫురణకు లేక విశేష ప్రజ్ఞకు మాత్రమే అందగల రూపము మరియొకటియును సూచింపబడినది. ఇటువంటి విశేషమగు వర్షనము అమ్మవారి గురించి పలుతావులందు మనకు. దర్శన మిచ్చుచుండును. అట్టి దివ్యదర్శనములలో ఇది యొకటి, మహాయోగులు, అవతార పురుషులు 'అయిన వారు కూడా సామాన్యముగనే పైకి కనిపించుదురు. భూమిని ఆశ్రయించియే యుందురు. లక్ష్మీనారాయణులు భూమిపై అవతరించినప్పుడు భూమిపై నడతురు. మానవుల మధ్యనే యుండి మానవుల యొక్క సుఖదుఃఖముల యందు పాల్గ్లొనుచున్నట్టు నటించుచుందురు. సామాన్యమానవులు గానే నిశ్వాసము లెక్కునగా విడుచుచుందురు. అందరి నలె భయపడినట్టుగా కూడా ఉందురు. అందరూ చేయలేని ఒక విశేషమయిన పనిని గూడా చేయుచుందురు. అదియే “భుజగేంద్రవధూ మివి, ఆదిశేషుని భార్యవలె ఉండుట అందరు చేయలేరు. మహాపురుషులు మాత్రమే చేయగలరు. అనగా ఇచట నడచునట్టి లోకవ్యవహారము యొక్క భారము నంతటిని ఆ మహాపురుషులు మాత్రమే భరింపగలరని భావము.
యోగాభాస్యము చేయు వారికి ఈ విషయము సులువుగా స్ఫురణకు రాగలదు. కుండలినీ శక్తికేంద్రము వెన్నుపూసకు చిట్టచివర భాగమున ఉన్నది. అది మూడు చుట్టలు చుట్టుకొని, పడగ విప్పి, బుసలు కొట్టుచు, ఆడుచుండునని చెప్పుట కలదు. అనగా మూడు కాలములకు సంబంధించిన జ్ఞానమునకు ఆ కుండలినియే కేంద్రము. ఆకుండలినీకేంద్రము పైనుండి దివ్యశక్తిని ఆకర్షించి శరీరమునకు ఆశ్రక్తిని పంచి పెట్టుచుండును. అది ఎప్పుడు, గాలిని పీళ్చినట్లు దివ్యశ్తిని పీల్చుట, గాలిని వదలినట్టుగా మానవ శరీరములోనికి మానవశక్తిని ప్రసారము చేయు “ట్రాన్సు ఫార్మరో' వలె పనిచేయుచుండును. కనుక బుసకొట్టుచున్న (త్రాచుపాము వలె నున్నదని అర్థము.
కనుక మన మో శ్లోకార్థము నిట్లు చెప్పుకొనవచ్చును. మనము కూర్చున్నప్పుడు
140 సుందరకాండము కుండలిని భూమిని ఆశ్రయించి సుఖముగా కూర్చున్నటుల ఉండును. శించుపావృక్ష మూలమునందు అమ్మవారు కూర్చుని యున్నారని చెప్పినది కూడా యోగార్హమే. మూల మనగా మూలాధారము, అక్కడ కుండలినీ శక్తికేంద్రము పని చేయుచుండును. నియతాం : క్రమబద్ధమైన, నియమబద్ధమైన పద్దతిలో దివ్యశక్తిని ఆకర్షించి శరీరమునకు పంచి పెట్టునది. తాపసీం : దేవతా విషయి కమయిన కార్యక్రమములందు దృష్టి కలిగియుండునే కాని, లౌకికమగు విషయ దృష్టి యుండదు. నిశ్వాస బహుళాం ఏ ఈ అకర్షణ, వికర్ణములు రెండూ ఎపుడూ చేయుచుండునది. అట్టి కార్యక్రమముల వలన, భీరుం : ఎప్పుడు చలించునట్లు ఉండునేకాని స్వయముగా కదలదు అని సమన్వయమును చెప్పుకొనవచ్చును. ఆంజనేయుడు మహాయోగి, తపస్వి, రాముని బంటు. అందువలన అమెలో విశిష్టమైన దివ్యదర్శనమును పొందెనని భావము.
శ్లో శోకజాలేన మహతా వితతేన న రాజతీం
సంసక్షాం ధూమజాలేన శిఖా మివ విభావసోః 15-32
అమ్మవారు తన చుట్టు ఉన్న శోకవనము అనగా దుఃఖముతో కూడిన రాక్షస సమూహముచే అవరింపబడినప్పటికి, ఆమె అశోకవనము వలె అనగా ఆనందనిలయము వలెనే ప్రకాశించు చుండెను. పొగచే ఆవరింపబడిన అగ్నివలె వెలుగుచున్నది. అనగా పొగకూడా అగ్నిలో ఒక అవస్టావిశేషమే కాని అగ్ని కంటె వేరు కాదు. ఆ పొగ తొలగించి జ్ఞానాగ్లిని విస్తరించుటకై అమ్మవారు అచటికి వచ్చిరని భావము.
శా తాం స్మృతీ మివ సందిగ్దా మృద్దిం నిపతితా మిన
విహతా మివచ శ్రద్దా మాశాం ్రతిహతా మివ 15-33
స్మృతి అనగా మనుస్మృతి మొదలగునవి. ఇవి సందిగ్దార్హమునే తెలియజేయును. (శ్రుతి అనగా వేదము. స్పష్టమగు పరమార్థ భావమును తెలియజేయును. అమ్మవారు (శ్రుతివలె స్పష్టమగు అర్ధమునే ప్రతిపాదించుచున్నది. ఇప్పటివరకు ఆంజనేయుడు సందిగ్బావస్థయందే ఉన్నాడు, అమ్మవారిని దర్శించిన తరువాత, సందిగ్జావస్థ నుండి అసందిగ్ధమగు వేదవాక్కు వలె అమ్మవారిని (గ్రహింపగలిగినాడు.
వృద్ధిం నిసతి తామివ : మనయొక్క అభివృద్ది పడిపోయినదని సామాన్యార్థము చెప్పుట పొరపాటు, మానవుని వృద్ది పెరిగి పెరిగి ఇక పెరుగుటకు వీలులేని స్థానమే నిపతితం. అనగా వృద్ధికి గమ్యస్టానము. పరిపూర్తమగు వృద్ధియే సీతాదేవి.
దర్శనము న! వః స్వపాదమూలే పతితం త మర్భకం విలోక్య దేవః కృపయా పరిఫ్లుతః వ్లన చరిత్ర 95
(ప్రహ్లాదుడు నరసింహస్వామి పాదములవద్ద పడిపోయెను. అనగా ఓడిపోయినాడని అర్ధము చెప్పుటకు వీలులేదు. తాను చేరవలసిన పరమలక్ష్యము చేరినాడనియే అర్ధము. అదే విధముగా వృద్దిపతితం అనగా మానవుని వృద్ది పెరిగి పెరిగి చేరవలసిన గమ్యము అమ్మవారు. అటువంటి న్థానమును ఆంజనేయుడు చూచుచున్నాడు. అనగా ఆంజనేయుని అభివృద్దికూడా గమ్యస్థానము చేరినదని భావము, విహతా మివ చ (శ్రద్దా : అనగా భగవంతుని యందు భక్తి శ్రద్దలు. పెరిగి పెరిగి ఆగిపోయినచోటు. ఆశాం (ప్రతిహతా మివ : రాముడు వచ్చి తనను రక్షించునను ఆశ లేక నిరాశతో ఉన్నదని బాహ్యార్ధము. అమ్మవారికి ఆశలు (దిక్కులు) ఉండవు, అనగా క్రింద, మీద, ప్రక్కన అనెడి ఆశలు లేవు. ఈ దిక్కు లన్నియూ అమ్మవారి లోపలనే ఉండును.
క్లో! సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా మివ
ఆభూతే నాపవాదేన క్షీర్తిం నిపతితా మివ క5-34
ఈ శ్లోకమును చదువగనే బాహ్యార్థ మిట్టు తోచవచ్చును. తేజస్సు తరిగిపోయినటువంటి సిద్ధివలె నున్నది. దుష్టభావములతో కూడి చెడిపోయిన బుద్ధివలె నున్నది. న్యాయము కానటువంటి అపకీర్తి వలన భగ్నమయిన కీర్తివలె సీతమ్మ వారు ఉన్నారు.
ఈ విధముగా సీతమ్మవారు అపకీర్తి పాలయినది అని అర్హము చెప్పుట సాహసము. అటులయిన ఆంజనేయుడు కూడా అపకీర్తి పాలగును. మహాయోగి అయినటువంటివాడు అల్బమయిన శోభలను, చిన్నచిన్న మహిమలను కోరడు. ఈ మహిమలను దాటిని తరువాతనే, క్రైవల్యసిద్ది లభించును. అదే విధముగా ఈ మహిమ లన్నింటిని దాటిన కైవల్య సిద్దివలె సీతమ్మ వారు ఉన్నారు. ఆంజనేయుడు కూడా అల్ప్బ్పమయిన సిద్ధులను దాటి కైవల్యసిద్దిని అనగా అమ్మవారి సాక్షాద్దర్భనము పొందగలిగిన స్థితిని అందుకొనుచున్నాడు.
బుద్ధిం సకలుషా మివ: ఈ ('ప్రాపంచికమైన కలుషములు దాటినటువంటి పరిపూర్ణబుద్ధిని పొందినటువంటి వారివలె అమ్మవారు ఉన్నారు. సత్యము కానటువంటి చెడువాదన లన్నింటిని దొటి, దివ్యమయిన సత్యమయిన కీర్తి నిలచినట్టుగా అమ్మవా రున్నారు.
క్షశ2 సుందరకాండము వ్లోః రామోపరోధ వ్యధితాం రక్షోహరణకర్శితాం అబలాం మృగశాబాక్షీం వీక్షమాణాం తత స్తతః 15-35 రాముని ఎడబాటువలన, రాముని సన్నిధి కోరి వ్యధ పడుచున్నది. రావణుని చేత అపహరింపబడి బంధింపబడినది. అందుచేత ఎటువంటి బలము లేనిది. లేడికన్నుల వంటి కన్నులు గలది. భయముతో చూచుచున్నదని సామాన్యార్దము. సీతమ్మవారు రావణునకు మోక్షము నిచ్చుటకు లంకకు వచ్చినది. అబల అనగా జగత్తు కంతటికిని బలము నిచ్చునది, రక్షించునది. కాని ఆమెకు బలము అంటూ లేనిది. మనకు తెలిసిన ఈ బలమునకు అతీత మయినది. భగవానుడు లేక భగవతి, అనాథుడు, అనికేతనుడు అని కూడా వర్షింపబడినది. అనగా దిక్కులేని వాడు, ఇల్లు లేనివాడు అని అర్ధము ఎంత మాత్రమును కాదు. ఆయనయే జగత్తునకు నాధుడు అని భావము. అనగా రావణుడు సీతమ్మ నిచటకు తీసుకొని వచ్చుటకు కావలసిన బలము కూడా ఆమె యొక్క వరప్రసాదమే. శాపమునలన రాక్షసజన్మనెత్తిన జయ విజయులను తిరిగి వైకుంఠమునకు పంపుటకై ఆమె ఇచటకు వచ్చినదని భావము, ఖ్లో బాష్పాంబు పరిపూర్షేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణా వదనే నాషప్రసన్నేన నిశ్చసంతీం పునః పునః 15-36 శ్లో మలపంకధరాం దీనాం మండనార్హా మమండితాం 'ప్రభాం సక్షత్రరాజస్య కాలమేఘై రివావృతామ్ ౩7 శో తస్య సందిది హే బుద్దిర్ముహుస్సీతాం నిరీక్ష్య తు అమ్నాయానా మయోగేన విద్యాం (ప్రశిథిలా మివ 15-38 శ్లో దుణేన బుబుధే సీతాం హనుమా ననలంకృతాం సంస్కారేణ యధా పీనాం వాచ మర్చాంతరం గతామ్ 39 క్లో, తాం సమీక్ష్య విశాలాక్షీ రాజపుత్రీ మనిందితాం తర్కయామాస సీతేతి కారణై రుపపాదిభిః శ0 ఈ క్టోకమునందు. చెప్పబడిన మూడు కారణముల వలన, శింశుపా వృక్షమూలమున ఉన్న ఆమెయే తాను వెదకుచున్న సీతమ్మ వారని భావించెను, విశాలాక్షీం : ఈ విశ్చమంత విస్తరించునట్టి విశాలమగు దృష్టిలేక విశ్చదృష్టి ఈమె నుండి ప్రసార మగుచున్నది. రాజపుత్రీం: ఈ సృష్టి యొక్క నడకకు, రక్షణకు కావలసి రాజసభావము ఈమెయందు మూత్తిభవించియున్నది. అనిందితాం :
దర్శనము 143 తామసబ్రహ్మ స్వరూపమయిన మానవ రూపమును పొందినప్పటికి పరమ పవిత్రమగు (బ్రహ్మతేజస్విని. కనుక ఈమె, తాను. వెదకు చున్న జగన్మాతయగు సీత కావచ్చునని ఆంజనేయుడు అనుకొనెను. శ్లో వైదేహ్యా యాని చాంగేషు తదా రామో2న్వక్షీర్తయత్ తా న్యాభరణబజాలాని శాఖాశోభీ న్యలక్షయత్ 15-41 ఇంతవరకు ఆంజనేయుడు సీతమ్మవారిని దూరము నుంచి చూచి, ఆమె బ్రహ్మ" వర్చస్సును, అభ్ని వలె నున్న శుచిత్వమును, పవిత్రతను చూచి ఆకర్షింపబడెను. ఇట్టిదిఆట్టిది యను చెప్పుటకు వీలుకాని ఏదో ఒక తేజోవలయమును బట్టి, అచట ఉన్న ఆమెయే తాను అన్వేషించుఛున్నట్టి సీతాదేవి అని గుర్తించి ఇంకను దగ్గరగా పరిశీలించిన తరువాత, ఆంజనేయునకు కలిగిన అనుభవమును ఈ శ్లోకము చెప్పుచున్నది. రాముల వారు, ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరు నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకు వచ్చుచున్నవి. సీతాదేవి ఈ విధముగా నుండును. ఈ అభరణములు ధరించుయున్నదని గుర్తు చెప్పెను. ఆ గుర్తులను పోలిన ఆభరణములే ఇప్పుడు సీతాదేవి యున్న వృక్షశాఖలకు అలంకరింపబడియున్నవి. రాములవారు. చెప్పిన గుర్తులను బట్టి ఆంజనేయుడు ఈమె సీతయేయను స్పష్టమగు జ్ఞానమును పొందెను. భూషణములు శ్లో సుకృతౌా కర్షవేష్టాచ శ్వదంథ్ర్రైచద సుసంస్థితౌ ముణి విద్రుమ చిత్రాణి హస్తే ష్వాభరణాని చ 5-42 సుకృతౌ : ఈ సృష్టిగా దిగివచ్చిన అమ్మవారి శుభలక్షణము లన్నియు అమెకు ఆభరణములే. అవియే సృష్టికి ఆభరణములు కూడా. ఆమెకు ప్రధానమైన ఆభరణము - సుకృతము - మంచిని (ప్రతిపాదించునట్టి కర్షవేష్టనము. అనగా సవిత్రమగు వాక్యము. అదియే చెవికి, సృష్టియొక్క చెవికి అనగా విను సామర్ష్యమునకు అలంకారము, కః శ్యామాని చిరయుక్తత్వా త్తథా సంస్టానవంతి చ తాన్యే వైతాని మన్యే2౭హం యాని రామో2న్వకీర్తయత్ 15-43 శ్యామాని ఫ చిరకాలము వాడనందున ఆభరణములు రంగు మాసిపోయినవి. చిరకాలము ఆమె అభరణములు ధరించినందున, ఆ శరీరాంగములు ఇప్పుడు ధరించనప్పటికి ఆ గుర్తులే కలిగియున్నవి.
[త4 సుందరకాండము అనగా మహావిష్ణువు ద్వారపాలకులైన జయవిజయులను సనక్క సనందులు (క్రోధవశుల్లై రాక్షస రూపమును. ధరించి సాధుహింస చేయుడని శపించిరి. ఆ మునుల శాపము ననుసరించి జయవిజయులు రావణ కుంభకర్ణులై సృష్టికి అలంకారమైన ధర్మములను వాడుకలో లేకుండా తొలగించి వైచిరి. దానికి గుర్తుగా అమ్మవారు, తన ఆభరణములను కొన్ని కిష్కింధ యందు వదలినది. రాములవారు యుద్దానంతరము మరల ఈ సృష్టికి అలంకారము లయిన ధర్మములను వానివాని స్థానములందు. పునః ప్రతిష్ట చేయనున్నాడని తరువాత. శ్టోకము. మనకు తెలియజేయుచున్నది. రావణుని వలన ధర్మము ఉండవలసిన నచోటు నుండి గెంటబడినది. అయినప్పటికి ఆ ధర్మములు అచట ఉన్నట్టు గుర్తులు తెలియజేయు చున్నవి. విభీషణుడు, త్రిజట మొదలగు వారి వాక్కుల ద్వారా, ధర్మము ఉన్నటుల తెలియుచునే ఉన్నది. అయిననూ ఉండవలసినంతగా స్టిరముగా లేదని కూడా తెలియుచున్నది. ఇచట ప్రస్తావించబడిన భూషణము లనగా కేవలము శరీర అవయవములకు సంబంధించినవి కాక్క అవయవములు చేయుపనులకు అలంకారము తెచ్చునట్టి భూషణములని కూడా చెప్పవచ్చును. క॥ భూషణములు చెవులకు, బుధ తోషణము, లనేక జన్మదురితాఘ విని శ్ళోషణములు, మంగళకర ఘోషణములు, గరుడగనును గుణభాషణముల్ . రుక్కిణీ కళ్యాణము చెవులకు భూషణము అనగా భగవానుని వాక్కులు, మతియు మనము భగవానుని గురించి చెప్పు వేద వాక్కులు అని అర్ధము. ళీ తత్ర యాన్యవహీనాని తా న్యహం నోపలక్ష్యయే యా న్యస్యా నావహీనాని తా నీమాని న సంశయ: 15-44 సుందరకాండ యందలి రళత్నదీపికలలో ఈ శ్లోకము. ఒకటి. రత్నము ఆకారమునందు చిన్నదయిననూ అపారమగు కాంతిని వెలిగ్రక్కునట్టు, ఆధ్యాత్మిక తేజస్సును వెలిగ్రక్కునట్టి దీ శ్లోకము. ఈ శ్లోకమునకు కథాక్రమము ననుసరించి బాహ్యార్థము. చెప్పవచ్చును. యోగానుష్టాన పరులయిన వారికి, యోగార్హమునూ చెప్పవచ్చును. ఆత్మ విద్య కలవారికి ఆ అర్ధమునూ చెప్పవచ్చును. సీతమ్మవారు రావణునితో లంకకు వచ్చుచు బుష్యమూకపర్వతముపై నున్న
దర్శనము 145 హనుమంతునకు, సుగ్రీవునకు అందునట్టు చెవిపోగు, చేతికడియము, కాలి అందె మొదలగుకొన్లి భూషణములను అను([గ్రహించెను. (సుగ్రీవుడు = మంచి కంఠము కలవాడు. హనుమ = దవడ ఎముకలేక అంగిలి. అనగా ఇద్దరూ కంఠ స్థానమున నున్న, విళుద్ది చక్రమును స్వాధీనము చేసుకొనినవారు) చెవిపోగు : చెవికి ఇంపు గొలుపునట్టి భగవద్వాక్యములని మనము భగవంతుని గూర్చి చేయు సంక్షీర్తనము లని భావము. ఇవి మనకు మంచి వెలుగు మార్గమును బోధించును. చేతి కడియము వ మనయొక్క చేతలను దిద్దుట. మనలను మంచి కార్యములు మాత్రమే చేయునట్టు ప్రోత్సహించునది. చెడు కార్యములను తిరస్కరింపజేయునది. కాలి అందె : మన నడకను చక్క దిద్దునట్టిది. సత్యమార్గమునందు నడపించునది. ఇందు చెప్పబడిన అలంకారములు రామాయణము మొదటి క్లోకములండదే ప్రస్తావించబడినవి. భగవానుని లక్షణములు వర్షించు ప్రశ్నతోనే రామాయణము ప్రారంభించబడినది. “యస్మిన్ సాంప్రతే లోకే గుణవాన్ కళ్ళ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ" షోడళ కళలు అనగా పదహారు అలంకారము లయిన గుణములు ప్రస్తావించబడినవి. ఈ గుణములు పదహారును భూమిపై ప్రవర్తించు మానవుల యందు సాధారణముగా ఉండవు. అందులో కొన్ని మాత్రమే మానవుల యందు ప్రవర్తిల్లు చుండును. తక్కినవి భగవానుని యొక్క దివ్య అలంకారముగానే ఉండును. భగవానుని దివ్య లక్షణములలో ఒక పాదము అనగా నాలుగవ భాగము మాత్రమే భూమిపై ప్రవర్తిల్లుదుండును. ఇవి కాలమునకు లొంగి వృద్ధిక్షయములకు అధీనములై యుండును. ఆపై నున్న మూడు పాదములు, నిత్యములై సత్యములై అమృత స్వరూపముగా ఉండునని పెద్దలు చెప్పుదురు. (పాదోస్య విశ్వాభూతాని త్రిపాద స్యామృతం దివి) సీతాదేవి ఆంజనేయునకు బుష్యమూక పర్వతము మీద అనుగ్రహించి ఇచ్చినవి ఆ ఒక పాదమునకు సంబంధించినవి. తక్కిన మూడు పాదములకు సంబంధించిన భూసణములు ఆమె వద్ద ఉన్నవి. భగవానుడు (భగవతి) భూమికి అవతరించినప్పుడు అమృతమయమగు కళ్యాణ గుణము లిచటకు దిగివచ్చును. వారితో కలసి మానవ లోకమునకు. వెలుగు మార్గమును చూపించును. వీరు అవతారము చాలించి వైకుంఠమునకు వెళ్ళునప్పుడు, ఈ దివ్య లక్షణములు కూడా వారి ననుసరించును, ఈ విషయమే ఇచట 'ప్రస్తావించబడినది. లక్ష్మీ నారాయణులు, సీతా రాములుగా దిగివచ్చునప్పుడు, వారితో ఈ పదహారుకళలూ భూమికి దిగి వచ్చినవి,
146 సుందరకాండము మానవ రూపము ధరించి యున్నందున వారు ఆ పదహారుకళలను పూర్తిగా ప్రదర్శించ లేదు. గరుడుని భూమికి రప్పించుట, రావణునితో యుద్దము చేయునప్పుడు, ఇంద్రుని రధము తెప్పించుట అనునవి అసాధారణ, మానవాతీతమగు విశేష లక్షణములు. అట్టి అసాధారణ ప్రజ్ఞవలెననే, విరాధ, ఖరదూషణ, కబంధులకు మోక్షము నిచ్చినది, అదే విధముగా లంకలోని దోషము లన్నిటిని ప్రక్షాళనము చేసి, తిన్నని మార్గమున పెట్టి విభీషణుని రాజును చేయుట ఆ దివ్య సామర్ధ్యము యొక్క విశేష లక్షణము గనే మనము గుర్తింప వచ్చును. రాముని కాలములో గాని, అ తరువాత కాని, ఎవరూ ఇట్టి అసాధారణ కార్యములు చేయలేదు. కనుక ఆ ఆభరణములు ఇచట లేవు అని భావము. ఆంజనేయుని వాక్యములీ విషయమును స్పష్టపరచుచున్నవి, ఆంజనేయునికి కిష్కింధలో కనబడిన ఆభరణములు ఇచ్చట కనిపించుట లేదు. ఇచ్చట కనిపించు ఆభరణములు అచ్చట కిష్కింధలో కనిపించలేదు. పారకులు పై వివరణను (గ్రహింతురుగాకు శ్లో పీతం కనక పట్టాభం '్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైై: 15-45 “పీతాభాస్వత్యనూపమా : అమ్మ వారి చుట్టు ఉన్నట్టి ఆవరణమునే వస్త్రము లేక అంబరము అని అందురు. ఆయావరణ అనూపమాన్ = ఇచట ఉన్న ఏ వ(స్తముతోను ఉపమించి చెప్పుటకు వీలుకానిది. ఈ భూమి మీద ఉన్న ఫలాని వస్తువు వలె ఉండునని చెప్పుటకు వీలుకానిది. ఇచట నున్న రంగులు, కాంతి ఆమె చుట్టూ ఉన్న తేజస్సు వలన వెలవెల బోవును. అమ్మవారి అంబరము, కళ్యాణ 'ప్రదముగా ఉండును, శో భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీ తలే అనడు నాసవిద్దాని స్వనవంతి మహాంతి చ 15-46 ఆ అభరణములు ముఖ్యమయినవి, ఖరీదయినవి, శబ్దము చేయునవి. అమ శారి ఆభరణములు అమ్మవారినలె అపూర్వ మయినవి. అవి విలువ కట్టలేనివి. స్వనము అనగా వేదవాక్కు. అ వాక్కులు (బ్రాహ్మీయమైన చైతన్యము కలవి. వేదవాక్కుగా దిగివచ్చినటువంటిదని విశేషార్ధము చెప్పుకొనవచ్చును. మహాంతి ఆ ఆభరణములు ఎంతో మహత్తు గలిగినవి. శః ఇదం చిరగృహితత్వా ద్వసనం క్షిష్టవత్తరం తథా2పినూనం తద్వర్ణం తథా శ్రీమధ్యథేతరత్ 15-శీ7
దర్శనము క్షైడ్తగ క్ట, ఇయం కనకవర్థ్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీ యా2స్య మనసో న ప్రణశ్వతి 15-48 అమ్మవారు ఆకాశమునందు రావణునితో పోవునప్పుడు, ఆమె చుట్టూ ఉన్న జ్యోతిర్చలయము ఎంతో ప్రకాశమానముగా ఉన్నది. ఆకాశము యొక్క కాంతి ఆమె యొక్క స్వయం ప్రభయందు కలిసి పోయి ఎంతో తేజోవంతముగా కనిపించినది. లంకకు వచ్చిన తరువాత ఇక్కడి వాతావరణము ధూళితోను, మలినములతోను కూడియున్నందున, ఆమె యొక్క కాంతి మందగించినటుల కనిపించుచున్నదే కాని, ఆమె యొక్క స్వయంప్రభ తరుగలేదు. ఆమె ధరించిన చీర మాంద్యముగా ఉన్నది తప్ప, ఆమె తేజస్సులో మార్చు లేదు. కనుక ఈమె శ్రీరాముని ప్రియ భార్య అయిన సీతాదేవియేనని ఆంజనేయుడు నిశ్చయించుకొనెను. రాముడు కంటి ఎదుట లేకున్నను, ఎప్పుడూ ఆ రాముని మనస్సులో ధ్యానించుచున్నందున ఈమెయే తాను అన్వేషించు సీతాదేవి అని ఆంజనేయుడు గుర్తించెను. ళో ఇయం సా యత్కృతే రామ శృతుర్శిః పరితప్యతే కారుణ్యే నానృళంస్యేన శోకేన మదనేన చ 15-49 ఫ్యా స్రీ ప్రణష్టేతి కారుణ్యా దాశ్రితే త్యానృశంస్యతః పత్నీ నష్టేతి శోకేన ్రియేతి మదనేన చ 15-56 ఆపదలో నున్న స్త్రీని కాపాడవలెను కారుణ్యము వలనను, తన రక్షణలో నున్న స్త్రీని రక్షించలేక పోయితి ననెడి అనుతాపము వలనను, తన భార్యను ఎవరో ఎత్తుకొని పోయినారనే దుఃఖము వలనను, తన ప్రియురాలు దగ్గర లేనందున మదనతాపము వలనను, రాముడు ఎవరి కోసము బాధపడుతున్నాడో ఆమె ఈమె అని సామాన్యార్థము. భగవానుని దివ్య లక్షణములు ఇందు వర్లింప బడినవి. అతడు కరుణాసము(ద్రుడు. ఈ సృష్టిలోని జీవజాలము నంతటిని కారుణ్యముతో సదా రక్షించునట్టి 'ప్రేమమయుడు. నృళంస భావ మనగా ఇతరులకు హాని వలన తనకు వృద్ది కలుగునను దురాశ. సృష్టియందలి 'ప్రాణు లన్నిటియందు. సమమగు 'ప్రేమాదరములు కలవాడు. తనకంటె వేరైనవారు, వైరులు లేనివాడు. సృష్టి యందలి కామళక్రోధాదుల విజ్బంభణము. వలన కలుగు శోకమును ఉపశమింప జేసి దాని స్థానమునందు ఆనందమును ప్రతిస్థించువాడు. సూర్య చం'ద్రాది (గ్రహములతో కూడిన ఈ సృష్టియం దంతటను సమానమగు కాంక్ష కోరిక గలవాడని విశేషార్థము,.
1486 సుందరకాండము శ్లో, అస్యా దేవ్యా యథారూప మంగప్రత్యంగ సౌష్టవం రామస్య చ యధారూపం తస్యేయ మసితేక్షణా 15-51 క్లో అస్యా దేవ్యా మనస్తస్మిం స్తస్య చాస్యాం ్రతిస్టితం తేనేయం స చ ధర్మాత్మా ముహూర్త మపి జీవతి 15-52 సీతాదేవి యొక్క అంగములు, వాటి యొక్క సౌష్టవము, శ్రీరాముని యొక్క అంగప్రత్యంగ సౌష్టవము ఒకే విధముగ ఉన్నవి. అనగా సీతాదేవి రూపము మొగరాయుడుగా ఉన్నదని అర్హము కాదు. ఇద్దరూ ఒకరి కొకరుగా ఉన్నారు. సీతాదేవి మనస్సులో శ్రీరాముడు వెలుగుచున్నాడు. శ్రీరాముని మనస్సులో సీతాదేవి మసలు చున్నది. ఈ విధముగా ఒకరి మనస్సులో ఒకరు మెదలుచున్నందున ఇక్కడ సీతాదేవి, అక్కడ శ్రీరాముడు జీవించియున్నారు. అమ్మవారి యొక్క రూపము, అయ్యవారి యొక్క రూపమే. అయ్యవారు రూప, నామ, (క్రియా రహితుడు. అమ్మవారు రూప, నామ, (క్రియా సహిత అయినప్పటికి అమ్మవారు శ్రీహరి యొక్క స్వాభిమతము, స్వరూపము, అనురూపము, రూపము. స్వాభిమతము అనగా ఆయన సంకల్పమే ఆమె యొక్క రూపము. ఆమె స్వయముగా భగవానుని యొక్క స్వరూప ప్రతిరూపమే. కనుక భగవానుని అవయవముల యొక్క (ప్రతిరూపములే అమ్మవారి యొక్క అవయవములని ఈ శ్చోకము ప్రతిపాదించుచున్నది. శారీరకమగు ఏకత్త్వమే కాక మనస్సులును ఏకత్వము పొందియున్నవి. శ్రీరాముని యొక్క మనస్సే సీతమ్మ వారి మనస్సు. సీతమ్మ వారి మనస్సే శ్రీరాముని యొక్క మనుస్సు. వారిద్దరు వేరుగా లేరు. అనగా అంతటా వ్యాపించి యున్నవారు కనుక వారు రెండుగా ఉంటున్నప్పటికి ఒకటిగానే ఉంటున్నవారు. శ్లో; దుష్కరం కృతవాన్రామో హీనో య దనయా ప్రభు; ధారయ త్యాత్మనో దేహం న శోకే నావసీదతి 15-53 శ్లోః దుష్కరం కురుతే రామో య ఇమాం మత్త కాళినీం సీతాం వినా మహాబాహు ర్ముహూర్త మపి జీవతి 15-54 శ్రీరాముడు పై చెప్పినటువంటి సీతాదేవిని ఎడబాసికూడా, దుఃఖముతో దేహాన్ని చాలించకుండా ఉండుట దుష్కరమయిన విషయము అని శ్రీరాముని, మనస్సులో 'ప్రశంసించినాడు ఆంజనేయుడు. శ్రీరాముడు శ్రీహరి యొక్క అవతారము. ్రకృతి కంటే ఈశ్వరుడు. పరుడు వరుడు, వరేణ్యుడుగానే యుండును. అయినప్పటికి
దర్శనము 1తం ఈ (ప్రకృతి యంతటనూ భగవానుడే నిండియుండును. ఆ శ్రీహరియందే ఈ ప్రకృతి యంతయు నిండియుండును. శ్రీహరి/శ్రీదేవి యిద్దరూ కలసి యుండియూ వేరుగా ఉండుటయే దుష్కరమైన కార్యము. అటు లుండియు. వారు అనందమయులుగానే యుందురు. సృష్టిని ఆనందమయముగా ఉంచుటకు వారు ఎల్లప్పుడు ప్రయత్నింతురు. క్ట 'ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పున శ్చింతా పరో౭భవల్ 16=1 శ్చ స మూహూర్త మివ ధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ: సీతా మాశ్రిత్య తేజస్వీ హనుమా న్విలలాపహ + 16-2 ఆంజనేయుడు సీతమ్మ వారి యొక్క ప్రశస్తములగు లక్షణములను క్రీర్తింపసాగెను. రాముని యొక్క సద్గుణములు లోక మంతటికి ఆనందము కూర్చునట్టివి. అట్టి ప్రశస్త గుణములను గురించి కూడ, హనుమంతు డాలోచింప సాగెను. అనగా సీతారాముల యొక్క దివ్య లక్షణములను ఆరాధింపసాగెను. సీతమ్మ వారి యొక్క స్థితిని చూచిన సామాన్య లోకజ్ఞుడగు మానవునకు తోచు భావములిందు ప్రతిపాదించబడినవి. ఆ జగదీశ్వరి అయిన అమ్మవారు ఈ రాక్షస స్త్రీల మధ్య బందిగా ఉండి, అనేక విధములగు బాధలు పడుట చూచి, హనుమ దు;ఖించెను. కాని అమ్మవారు దుఃఖించుట లేదని కలత చెందని గంగానది వలె నున్నదని తర్వాత శ్లోకము స్పష్టీకరించినది. మహాదేవి శ్లో! మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతా2పి దుఃఖార్తా కాలో హి దురతి క్రమః 163 మనకందరకు వచ్చు సందేహమును, వాల్మీకి ఇక్కడ ్రశ్న రూపమున ప్రతిపాదించి సమాధానము చెప్పుచున్నాడు. సీతాదేవి, లక్ష్మణుని ఆంతటి మహానుభావునిచే పూజింపబడినది. నారాయణ స్వరూపమైన రామునికి ప్రియమైన అట్టి మహాదేవి ఈ లంకలో ఈ విధముగా బాధలు ఎందుకు పడుచున్నదని హనుమంతుడు ఆలోచించెను. ఈ ఆలోచనయే ప్రశ్నకు సమాధానం కూడ. అమె మహాదేవి కనుకనే భూమికి దిగివచ్చి మానవుల నుద్దరించుటకు అనేక కష్టముల పాలగుచున్నది. కష్టముల నామె ఆహ్వానించుచున్నది. “ఎన్ని కష్టములు వచ్చినప్పటికి మీరు ధర్మమార్గమును విడువవలదు. ధైర్యముతో
150 సుందరకాండము ముందుకు నడుపుడు” అని ఆమె ఆచరించి చూపి చెప్పుచున్నది ఆమె కావలెననియే అరణ్యమునకు, లంకకు వచ్చినది. బాధలను అంటించుకొన్నది. ఈ ప్రశ్న మహా బుషులైన వారికి కూడ వర్తించును ఆ బుషులు ఎంతో మంచివారు చక్కగా మడలలో పట్టుపరుపులపై పరుండి, హాయిగా భగవధ్యానము చేయవచ్చును గదా అను ప్రశ్చ వచ్చును. ఆ ప్రశ్నకు సమాధానం వారు బుషులు కనుకనే అరణ్యములలో రాళ్ళపై పరుండి, అకుఅలములనే తిని కందమూలములను భక్తించుచునే, భగవ ధ్యానము చేయుదురు. ఆ పని వారే చేయగలరు గాని, ఇతరులు ఎవరూ చేయజాల రని సమాధానము. తొమ్మిది మాసముల్లు గర్భభారమును మోసి బిడ్డను గని, కొన్ని మాసములు మలమూత్రములు కడుగునట్టి తల్లికి ఎంతో కష్టము అనుకొవెడి వారి అజ్ఞానము వంటిదీ పై సందేహము. వారు కాలమును లెక్కచేయక, దేశమును లెక్క చేయక, లోకకళ్యాణమునకై పని చేయుచుందురు.
సీతాదేవి అనే చంద్రుని సమీపించినప్పుడు ఆంజనేయుని మనస్సనబడియెడి కమలము వికసించుట కారంభించెను. అనగా మనస్సులోని సంకోచములు, చీకటు అన్నియూ తొలగిపోయెను. సీతాదేవి నుండి ప్రసారమగు వెన్నెల, ఆంజనేయుని మనస్సును చక్కగా వికసింపజేసెనని భావము.
సీతాదేవి క్షమ అనగా భూదేవి యొక్క స్వరూపము అని, ఈ సృష్టి అంతటి = చక్కగా నడుపునటువంటి పరాశక్తి అని, ఆ పరమాత్ముని యొక్క ఆనందమే సీతవ * వారుగా దిగివచ్చి ఈ శింశుపావృక్త మూలమున ఉన్నది అని, ఆంజనేయుడు చు ౨ గలిగెను. ఇది యొక దివ్య దర్శనము ఈ ఉన్నతమగు స్థితిని అందుకు ఆంజనేయుడు, సీతమ్మ వారిలో శ్రీరామచంద్రుని, లక్ష్మణస్వామిని చూడగలిగె కనుక ఆంజనేయుడు భక్తితో ప్రణమిల్లి నమస్కరించెను. ఈ విధముగా రా లక్ష్మణులకు నమస్కరించుటకు కారణము ఆంజనేయునకు కలిగిన సీతాదం సంతుష్టి,
సీతా దర్శన సంహృష్టో - హనుమాన్ సంవృతో౭_ భవత్ ఈ అనుభూతి పారకులకు అందుగాక. నాన్న!
ల. / రగ లొ స
య ॥ ఎగ స లాలా అక - |. ( న్ ల ల గోప్పదీకృతవారాశీం మసకీకృత రాక్షసామ్ త (| టల థి | | | ॥ యాట న్టవ్న్ళం ః“ “2వ గ య ” (7 వన్ లా. , తం ॥ వ “ద నటం ళ్డ | ఉ ( _ న. లి న్ శని న , జ | | కత ॥ య. క. + / సాం మ... -ల్లొ క్ యీ! (| . | సం. ను. క. లం టో | ఖో ట్ . 11 స అ ఫాం స న / 4 / ళీ | నా”. క కం రో ॥ _ భరస భీ య ( | న క్ క | గ/ " గ్ య! ం ల వంగో, ణ్ " నీ న్ా సల ఎనో ఖా ర టీ టై. ణన 2" ఈకల నే పప న న స ఇ నలం కతు... “ట్ల , ళా వరా అ ఖం. ఇ ౧ ళజ్త్వు స లో న సే! , లీ క క ం న స. నే రే షట _ | | ఉం ఊ వాకా టన ఫా | ః విను ఎ మన తాము ఇకక ణి క్ ః నం రా వాన. వ వాన జా జా బావా / ఖ్ ( ల వనన వము” తనో తోలు దయాం ల అఆలాడ్. ఇ ఆ వజూ “ప మ న. లి న్ా వక ఇక క క. ॥ స్ట ళ్ న్ లో సా నా! ఈ శశ | ౯ గా / చా జ న్న జగ్ , న 3 తళ, జాతం . కా. న. ంళీ 4" ర్ు ల్ల వన్య. న్ న న్యా భి అహో నీ నా నన ము ర న. సస. త 1) వార్తా నమన నా లన చనా ఎ రన కన. = హైవే రహడనేనముం న ఏం కీ ల వాటా “మసం క న లన స యయ. పటు షన స స