Telugu Subhash Chandrabose (jeevitham, Rachanalu, Upanyasalu, Lekalu) - anilvaranasi/indianlanguages GitHub Wiki

% శ! టి ఈ . కే భయట అ క | రం ళం త లాతా క ఈ. బ.. న. / టో... " . . . ల్‌ | న్‌ా | ఎ జకం న రచనలు. ని శేతే ....ఉపన్యాసాలు. 1 న్‌ ను మి... ఫే | న్‌ జులు ఖెళి నం గు భ్‌ గః య "| వ లుగ , ల ష్‌ శే 6032 శీ క్ష ( (కో కా ర లే క్‌. గ౨51 ..... ప్రజాశ శాన" యు... ల ఇల్‌

సుభాస్‌ చంద్ర బోస్‌ 1 జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు ఇంగ్లీషు ; గౌతమ్‌ ఛటోపాధ్యాయ అనువాదం :; ఫాతిమా కాజ వెంకటేశ్వర్రావు ఫ్లో ప్రజాశక్తి బుక్‌హౌన్‌ ఎమ్‌సొబ్‌ భవన్‌, ప్లాట్‌ నెం. 27/7, అజామాబాద్‌, ఆర్‌టిని కళ్యాణ మందపం దర్ధర ప్రాదరాబాటద్‌-206. ఫోన్‌: 27660013

ఢి 12 డాయ గ్‌ ( ము ట్‌ సభా ౮% . ప హైదరా బాద్‌ " ణో 02191 1166 5038450 యయా 90518 49106245 ఇగాగాగాం3ం, 50840485, ఓ2228%25 లాల 1006: 5093234556 ౧64మా్రకి4 303% 2కొ0ారఉళ ఉంగటాతు.0, ౮9400454౬0, ౯౬1400౮ ప్రచురణ సంఖ్య : 1351 ॥ వా. ల ప్రథమ ముద్రణ : జనవరి, 2015 ఖం న ని [ త లై వెల : ₹. 150/- త్స లాగ్‌ ప్రతులకు గక క డ్‌ ఖ్‌ 09811 పజాశక్తి బుక్‌హౌస్‌ 27-1-54, కారల్‌మార్చ్‌ రోడ్‌, గవర్నర్‌పేట, విజయవాడ -9, ఫోన్‌ : 0866 -577538 బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు హైదరాబాద్‌-చిక్కడపల్లి, ఎస్‌విక, ఇసిఐఎల్‌, ఖమ్మం, హన్మకొండ, నల్గొండ, కరీంనగర్‌ ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌ ₹605ీ48 ౩ ఇ బైంపిక. 1 [11 నీ ముగ

విషయ సూచిక జీవిత చరిత్ర ఖః ప్రారంభ సంవత్సరాలు క్ష ఖం కేంట్రిగ్డ్‌లో సుభాస్‌ 19 ణి... దేశబంధు శిష్యుడు 25 యై బర్మాలో జైలు జీవితం తిరి నే సమరశీల జాతీయవాదుల నాయకుడు త్తి స సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రచారం త్తి ఖం 1980-31 నాటి ఉద్విగ్నభరిత ఘటనలు _ 55 స ఐరోపాలో సుభాస్‌ బోస్‌ 68 న ప్రపంచ పరిణామాలపట్ల అవగాహన 77 ం కాంగ్రెస్‌ అధ్యక్షునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ 84 కనే ప్రభుత్వం కన్నుగప్పి సరిహద్దులుదాటి...... 903 జః జర్మనీలో సుభాస్‌ బోస్‌ 100 వః ఐఎన్‌ఏ-తాక్మాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వం 107 ణః సుభాస్‌ బోస్‌ వారసత్వం 118 డన ముఖ్య (గంథనూచి 118 రచనలు, ఉపన్యాసాలు, లేఖలు ణః యువజనోద్యమ పాత్ర 1901 డన విద్యార్థలు-రాజకీయాలు 126

కనే బహదూర్‌ షా సమాధివద్ద చేసిన ప్రసంగం 137 కనే తాత్మాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వ ప్రకటన 140 ఖు ఢిల్లీకి పలు మార్దాలు 145 షా భారతదేశం స్వతంత్రమవుతుంది 147 స తిరుగులేని తరుగులేని తరుణము 149 ఖు నాదేశం 162 షః సంఘసేవ-గృహపరిశ్రమలు 166 ఖః నడవడి- మానసిక అభివృద్ధి 175 వ్ల జైలు - ఖైదీలు 185 ఖః ముఠా తత్వం - బెంగాల్‌ భవితవ్యం న. 2 హిందూ - ముస్లిం ఒడంబడిక 199 వః విడుదల ప్రతిపాదన - దాని జవాబు 201 ఖః జీవిత లక్ష్యము 209 ఖః విజ్ఞపి 212 షం జైలు నుంచి విజ్ఞప్తి 2185 ఖః దేశబంధు 219

మామాట

భౌరత దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు వున్నాా దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్‌ చంద్రబోస్‌ మాత్రమే. గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, ఆ పక్కన భగత్‌ సింగ్‌ - ఈ నాలుగు ఫోటోలు ప్రతి భారతీయ గృహంలో దర్శనమిస్తుండేవి. స్వాతంత్ర పోరాటంలోనూ కాంగ్రెస్‌ నాయకత్వంలోనూ గాంధీజీ నాయకత్వాన్ని ధిక్కరించి నిలదొక్కుకున్న నేత ఆయన ఒకరే. తన తండ్రి వత్తిడిపై పరీక్ష రాసినందుకు బ్రిటిష్‌ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఐసిఎస్‌లో నాల్గవ ర్యాంకర్‌గా వచ్చినా ఆ హోదా స్వీకరించకుండానే వదులుకుని స్వాతంత్ర పోరాటంలో దూకారు. గాంధీజీతో విభేదించి అభ్యుదయ వాదుల మద్దకుతో కాంగ్రెస్‌ అద్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా నేతాజీ భారత స్వాతంత్ర పోరాట నాయక త్రయంలో ఒకరుగా ప్రసిద్ధి కెక్కడమే గాక సమాంతర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాటి విశిష్టత బహుశా మరెవరికీ లేదు. జైలు శిక్షలూ నిర్బంధాలూ అనుభవించారు. నలభయ్యవ దశకం [ప్రారంభంలో హిట్లర్‌ నాయకత్వంలోని నాటి నాజీ జర్మనీ సహాయంతో భారత దేశాన్ని విముక్తి చేయవచ్చునని భావించి దేశం నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. అంతకు ముందే జపొన్‌ సహాయంతో ఏర్పడిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఎ) లేదా అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను పునరుద్ధరించి నూతన శక్తినిచ్చి దేశంపైకి తరలించారు. ఈ సమయంలో విమాన ప్రమాదంలో మరణించడం దేశాన్ని విషాదంలో ముంచింది.

నేతాజీ అనుసరించిన పద్ధతులపై అంచనాలపై కొన్ని భిన్నాభిప్రాయాలున్నా ఆయన త్యాగనిరతి, సాహసం,దేశభక్తి గొప్ప ఉత్తేజమిచ్చాయి. ఇప్పటికీ ప్రజలు ఆయనను ప్రత్యేక తరవి నేతగానే చూస్తున్నారు. అందుకే 1997లో ఆయన శతజయంతి ఉత్సవాలు దేశమంతటా ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలో ప్రసిద్ధ చరిత్ర కారుడు ప్రొఫెసర్‌ గౌతమ్‌ చటోపాధ్యాయ రచించిన (ప్రామాణిక గ్రంధం ఇప్పుడు తెలుగులో మీకందిస్తున్నాం. ఇందులో దశలవారీగా నేతాజీ పరిణామ క్రమం, ఆలోచనా ధార, ఆచరణ తీరు అర్థమవుతాయి.

ప్రొా.గౌతమ్‌ కేవలం విద్యావేత్త, మేధావి మాత్రమే గాక నాడు వంగ దేశంలో స్వాతంత్రం కోసం జరిగిన విద్యార్థి నిరసనోద్యమాలలో పాలు పంచుకున్న వ్యక్తి. బైటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల విద్యార్థి ఉద్యమం కొల్‌కతాలో ఎంత ఉధ్భత రూపం దాల్చిందో ఆయన ప్రత్యక్షంగా చూశారు. నడిపించారు. నేతాజీ స్థాపించిన ఐఎన్‌ఎ సైనికుల విచారణ నిలిపేని విడుదల చేయాలంటూ ఉద్యమించారు. కనుక ఈ పుస్తకాన్ని ఆయన కేవలం చారిత్రిక విశేషాలతోనే నింపేయకుండా సజీవ సాక్షిలా కళ్లకు కట్టేట్టు రచించారు. నేతాజీ కుటుంబ నేపథ్యం, బాల్యం, చదువు, రంగ ప్రవేశం వంటివి కూడా ఆసక్తికరమైన వివరాలతో పొందుపర్చారు. స్వాతంత్ర పోరాట క్రమంలో తలెత్తిన భిన్నాభిప్రాయాల ప్రాతిపదిక ఏమిటో ఎవరు ఏమన్నారో కూడా అందించే ప్రయత్నం చూస్తాం.

నేతాజీ బెన్నక్యాన్ని చెబుతూనే మరోవైపు ఆ విషయాలను విమర్శనాత్మకంగానూ విశ్లేషించడం ఈ పుస్తకం ప్రత్యేకత. అలాగే నేతాజీ ప్రసంగాలూ, రచనలు, లేఖలూ కూడా జతపర్చాము. తెలుగులో ప్రామాణికంగా సమగ్రంగా నేతాజీపై పుస్తకం రావడం ఇదే ప్రథమం కావచ్చు. ఆయన అభిమానులే గాక చరిత్ర విద్యార్థులందరూ ఈ ప్రచురణను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

ప్రచురణ కర్తలు

మేరునగ ధీరుడు

భౌరత స్వాతంత్ర్య అర్ధ శతాబ్ది వేడుకలకు మనం దగ్గరవుతున్నాము. దాదాపు శతాబ్ద కాలంపాటు కొనసాగిన నానావిధ వర్జ రంజితమైన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను రాజకీయవాదులు, రాజనీతి కోవిదులు, చరిత్రకారులు న్మరించు కోవటానికిది సందర్భం కాగలదు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందంటే, అందుకు, మహామహులైన అనేకమంది నాయకులతోపాటు, వెలుగులోకిరాని లక్షలమంది నిర్వహించిన సాహసోపేత పాత్ర కూడా కారణంగా వున్నది. వారి క్రియాశీల భాగస్వామ్యం లేనట్లయితే, కొద్దిమంది నాయకులు, -వారెంత గొప్పవారైనప్పటికీ సాధించగలిగింది అత్యల్పం మాత్రమే. కనుక, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన మేరునగ ధీరుల్లో ఏ ఒక్కరి రాజకీయ చరిత్రనైనా లిఖించే కర్తవ్యానికి పూనుకున్నపుడు మనం (ప్రజాబాహుళ్యానికి సంబంధించి వారి పాత్రను అధ్యయనం చేసి విమర్శనాత్మకంగా విశ్లేషించాలి.

భారత స్వాతంత్ర్య పోరాటాన్నీ మహాశక్తివంతమైన కోట్లాది ప్రజల జాతీయ పోరాటాన్నీ తీర్చిదిద్దిన నిర్మాణ శిల్పిగా మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీని బహుశ వేర్వేరు ధోరణులకు ప్రాతినిధ్యం వహించే చరిత్రకారులందరూ అంగీకరించవచ్చు. అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహంవంటి వినూతన పద్ధతుల ద్వారా ఆయన భారతదేశంలోని వెనుకపడిన, భీరువులైన కోట్లాది రైతు జనాల భావనల్లో ఒకరకమైన నిర్భయత్వాన్నీ యింకా చెప్పాలంటే, ఎనిమిది పదుల వయసు దాటిన సుప్రసిద్ధ చరిత్రకారుడు హీరేంద్రనాథ్‌ ముఖర్జీ పేర్కొన్నట్లుగా అభయాన్నీ నింపాడు. మహతరమెన మన జాతీయ పోరాటంలో జవహర్‌లాల్‌ నె[హూ. అబుల్‌ గపార్‌

ఖాన్‌, సుభాస్‌ చంద్రబోస్‌ వంటి మహామహులు మరికొందరున్నారు. అయితే వీరందరూ తొలుత (కొందరు చివరి వరకు) గాంధీజీ అనుచరులే. మన జాతీయ పోరాటంలోని ప్రధాన ఘట్టాలలో గాంధీజీకి మరి కొంతమంది నాయకులకు మధ్య విభేదాలు పొడచూపాయి. అయితే, సుభాస్‌ చంద్ర బోస్‌ విషయంలో మాత్రం గాంధీజీతో వచ్చిన విభేదాలు అంతిమంగా పూర్తి తెగతెంపులకు దారితీశాయి. స్వాతంత్ర్య సాధనకు సుభాస్‌ భిన్న మార్గాన్ని ఎంచుకుని తనదైన ప్రత్యామ్నాయాన్ని స్వీకరించాడు. అయితే, గాంధీజీ, బోస్‌ లిరువురూ తమను తాము ప్రత్యర్థులుగా ఎన్నడూ భావించలేదు, పరస్పరం (ప్రేమ, గౌరవాలను నిలబెట్టుకున్నారు. అజాద్‌ హింద్‌ ప్రభుత్వ అధినేతగా ఆగ్నేయాసియాలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన పలు రేడియో ప్రసంగాలలో, గాంధీజీని జాతీయోద్యమ మహానాయకునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ కీర్తించారు. గాంధీజీ సైతం, సైద్ధాంతికంగా సుభాస్‌ను, ఆయన ఐఎన్‌ఏను వ్యతిరేకించినప్పటికీ, భారత స్వాతంత్ర్య పోరాటానికి బోస్‌ చేసిన సేవలను వేనోళ్ళ కొనియాడారు. సుభాస్‌ చంద్ర బోస్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా ఈనాటి, రేపటి, తదనంతర యువతరాల కోసం ఆయనకు సంబంధించిన సవివరమైన జీవిత చరిత్ర రచనకు పూనుకునే ముందు దీన్నంతటినీ మనం గుర్తుంచు కోవాలి. అనేక సంక్షిష్టకలతో కూడుకున్న యిటువంటి ప్రజ్ఞాశాలి గురించి యువతరానికి అవగాహన అయ్యే విధంగానూ, పరిశోధకుల విశ్వాసంపొందే విధంగానూ రచన చేయటం కష్టమైన కార్యం. నేను చెప్పగలిగింది ఒకటే, 1897 జనవరి 28న సుభాస్‌ చంద్ర బోస్‌గా జన్మించి, జాతీయ విముక్తి కోసం భారత సాయుధ పోరాట నేతాజీగా 1945 ఆగస్టు 20న మబ్బుల మాటున తొలకరి మెరువులా మాయమైన మనీషికి నగౌరవమైన నివాళిని అర్పించటానికి 'పప్రయత్నించుదాము.

  • గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రారంభ సంవత్సరాలు

897 జనవరి 28 మధ్యాహ్నం కటక్‌లోని ఒరియా బజార్‌లోగల ఇంటిలో సుభాస్‌ చంద్ర బోస్‌ జన్మించాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తి శిఖరస్థాయికి చేరి అజేయమనిపించిన సంవత్సరం యిదే, విక్టోరియా మహారాణి రజతోత్సవం జరుపుకున్న సంవత్సరం కూడా యిదే. గణనీయమైన సంఖ్యలో వున్న విద్యాధిక భారతీయులు, చివరకు భారత జాతీయ కాంగ్రెసులో వున్న వారు సైతం యిలాంటి సమయంలో (బ్రిటిష్‌ పాలకుల 'బెదార్యాన్ని! క్తీర్తిగానం చేశారు. పూనావాసియైన బాలగంగాధర తిలక్‌, బెంగాల్‌కు చెందిన బిపిన్‌ చంద్ర పాల్‌ పంజాబ్‌కు చెందిన లాలా లజపతి రాయ్‌వంటి బహు కొద్దిమంది మాత్రమే స్వరాజ్ఞుం భారతీయుల జన్మహక్కు అంటూ నినదించారు. జాతీయోద్యమంపై వారి ప్రభావాన్ని తుడిచి వేయలేము. అప్పటిలో భారతదేశంలోని సమరశీల యువజనులపై మహత్తర ప్రభావాన్ని చూపిన వ్యక్తి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశాలలో పాల్గొని ఆయన అప్పుడే తిరిగి వచ్చాడు. సహజంగానే వివేకానందుడు, ఆయన రచనల ప్రభావం చిన్నతనంలోనే సుభాస్‌పై పడింది.

సుభాస్‌ తండ్రితైన జానకీనాథ్‌ బోస్‌ కలకత్తాకు కేవలం కొన్ని మైళ్ళ దూరంలోనే వున్న దక్షిణ 24 పరగణాల ప్రాంతంలోని కొడలియా (గ్రామం నుంచి కటక్‌కు తరలి వచ్చాడు. సుభాస్‌ ఎన్నడూ కొడలియా గ్రామంలో నివసించ లేదు. చాలా అరుదుగా మాత్రమే ఆయన తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించాడు. అయినప్పటికీ, కొడలియా, దాని పరిసరాల గురించి కొన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరం వున్నది. ఛాంగ్రిపొట, కొడలియా, హరినవి అన్న మూడు (గ్రామాలు ఒకదానికొకటి కలసి వుంటాయి. ఈ మూడింటి ఉమ్మడి రైల్వే స్టేషన్‌ యిష్పుడు నుఖాన్‌ గ్రామ్‌ అన్న మహోజ్వల నామంతో అలరారుతున్నది. సుభాస్‌ పుట్టటానికి క్ష గౌతమ్‌ ఛటోపాధ్యాయ

నలభై యేళ్ళకు మునుపే మహా సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ మిత్రుడూ, అనుచరుడూ, రాడికల్‌గా పేరుపడిన ద్వారకానాథ్‌ విద్యాభూషణ్‌ బెంగాలీ భాషలో వార పత్రికను ప్రచురించేవారు, భారతదేశంలో బ్రిటిష్‌ దుష్పరిపాలన గురించి దీనిలో తీవ్ర విమర్శలు వుండేవి. ఇది, అంధ విశ్వాసాలను, మౌధ్యాన్ని అజ్ఞానాన్నీ దుయ్యబడుతూ, వితంతు వివాహాలను శాసనబద్ధం చేయటానికి విద్యాసాగర్‌ నడిపేటటువంటి ప్రగతిశీల ఉద్యమాలను బలపరుస్తూ వుండేది. ద్వారకానాథ్‌ అల్లుడు, సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికుడైన శివనాథ్‌ శాస్త్రి ఆయన ఇంట్లోనే జన్మించాడు, అకృదే ఆయన బాల్యం గడచింది. ఈ మూడు గ్రామాల్లోనూ ప్రతిభావంతులనదగ్గ వారు పలువురు వుండేవారు. అలాంటి వారిలో ఒకరు సుభాస్‌కన్నా పదేళ్ళు పెద్దవాడైన నరేంద్రనాథ్‌ భట్టాచార్య ఒకరు. ఈయన మరెవరోకాదు, తదనంతర కాలంలో మానవేంద్రనాథ్‌ రాయగా సుప్రసిద్ధుడైన విప్లవకారుడు. సుభాస్‌ బోస్‌ యీ గ్రామాలలో నివసించనప్పటికీ, పదేపదే యిక్కడకు రానప్పటికీ యీ ప్రాంతంలోని విప్లవ గాథలు సుదూరాన వున్న కటక్‌కు చేరుకుని యువకుడైన సుభాస్‌ భావి జీవితాన్ని తీర్చిదిద్దడంలో (ప్రముఖ పాత్ర వహించాయి.

సుభాస్‌ తండ్రియైన జానకీనాథ్‌ బోస్‌ కటక్‌లో పేరుమోసిన న్యాయవాది. ఆయన మతరీత్యా హిందువైనప్పటికీ బ్రహ్మ సామాజికుల, ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులు సాత్విక బోధలను మెచ్చుకునే వాడు. ఆయన ఉదార స్వభావి. కాని, విలక్షణుడని చిన్నవాడైన సుభాస్‌ భావించేవాడు. ఇదేమీ ఆశ్చర్యం కాదు, ఎందుకంటే, సుభాస్‌ ఆ కుటుంబంలోని తొమ్మిదిమంది బిడ్డల్లో ఆరవ కుమారుడు. ఎల్లప్పుడూ తన తల్లియైన ప్రభావతీ దేవిని అంటిపెట్టుకుని వుండేవాడు. ఆమెకు బడి చదువులు లేనప్పటికీ తన పిల్లల విద్యావిషయంలో మార్గనిర్దేశనం చేయగలిగిన సమర్భరాలు...

సుభాస్‌ చిన్నతనంలో ఒంటరిగా గడిపేవాడని, ఆయనను రాజా అని పిలిచే దాసీపిల్ల శారద మాత్రమే ఆయనతో చనువుగా వుండేదని సుభాస్‌ జీవిత చరిత్రను రాసిన పలువురు ప్రామాణిక చరిత్రకారులు పేర్యొన్నారు. దేశంలోని సామాన్య ప్రజలపట్ల ప్రగాఢ (ప్రేమ కలగటానికి చిన్నతనమందే ఆయనలో బీజాలు పడ్డాయి.

సుభాస్‌ను ఐదవ ఏటనే కటక్‌లోని బాప్తిస్టు మిషన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రొటెస్టెంట్‌ యూరోపియన్‌ స్మూల్‌లో చేర్చారు. ఆంగ్ల మాద్యమంలో బోధన జరిగే యీ పాఠశాలలో ప్రధానంగా ఐరోపావాసుల పిల్లలు వుండేవారు, వారితోపాటే కొద్దిమంది భారతీయుల పిల్లలు కూడా వుండేవారు. ఇక్కడ భారతీయ భాషల్లో బోధన వుండేదికాదు. పైపెచ్చు, ఐరోపావాసుల పిల్లలు జాత్యహంకారులు కానప్పటికీ సుభాస్‌వంటీ 'దేశీయులిపట్ల పొగరుగా ప్రవర్తించే వారు. చదువులో బాగా వున్నప్పటికీ, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 12

గ బడిలో ఆయన గడిపిన ఏడు సంవత్సరాలు

1 ఏమంత సంతోషాన్ని యివ్వలేదు, “ఎలాంటి

3 విచారమూ లేకుండా" పాఠశాలకు ఆయన

ల్‌ ళు [ .. | వీడ్కోలు చెప్పాడు. చాలా సంవత్సరాల తరువాత న... | సుభాస్‌, భారత యాత్రీకుడు అన్నతన అసంపూర్ణ న. జీవిత చరిత్రలో యీ కాలాన్ని ప్రస్తావిస్తూ తాను లి. - | 80డు ప్రపంచాలలో నివసించినట్లు పేర్ళొన్నాడు. నట ల లు (| పాఠశాలలో, సుభాస్‌ పరాయి భాషను మ స ఎఘాణ్టట్లై! అధ్యయనం చేయవలసి వచ్చింది, అ క్కడ స నటే... భారతీయ భాషలపట్ల పూర్తి నిర్లక్ష్యం వుందేది. ను అ కాల “ఆయనే స్వయంగా పేర్కొన్నట్లుగా, పాఠశాల బాల్యంలో సుభాన్‌ చంద్రబోస్‌ బ్యంలో సుభాస్‌ చంద్రబోస్‌ రోజులలో ఆంగ్లాన్ని ద్వేషించినప్పటికీ తదనంతర కాలంలో యీ భాషను చక్కగా అవగాహన

చేసుకోగల శక్తి సమకూరింది. ఇంటివద్ద ప్రధానంగా బెంగాలీ భాషనే మాట్లాడేవారు. ఆయన తల్లికి మరే భాష తెలియదు. సాయం సమయాల్లో ఇంటి దగ్గర ఆమె సుభాస్‌ తదితర పిల్లలను కూర్చాబెట్టుకుని భారతదేశపు మహత్తర (గ్రంథాలైన భారత, రామాయణ ఘట్టాలను, పురాణ గాథలను, జానపద కథలను విన్సించేది. భర్తవలె కాకుండా ఆమె హైందవ సంప్రదాయాలకు కట్టుబడిన గేస్తురాలు. . 1909లో తన పన్నెండేళ్ళ ప్రాయంలో సుభాస్‌ బాప్తిస్తు మిషన్‌ స్కూల్‌లో చదువు పూర్తిచేసుకుని కటక్‌లోని రావెన్‌షా కోలిజేట్‌ స్కూల్‌లో చేరి అక్కడ నాలుగేళ్ళపాటు చదివి మెట్రిక్యులేషన్‌ పరీక్షలో కృతార్ణుడయ్యాడు. కలకత్తా విశ్వవిద్యాలయ పరిధిలో మెట్రిక్యులేషన్‌కు బెంగాలీ భాష నిర్బంధంగా వుండేది. రావెన్‌షా కోలిజేట్‌ స్కూలు దీనికి అనుబంధంగా వుండేది. ఇది దేశీయ పాఠశాల, అదృష్టవశాత్తు అంకిత భావం కలిగిన ప్రధానోపాధ్యాయుడు వేణి మాధవ దాస్‌ కొన్నేండ్లపాటు యీ పాఠశాలలో వున్నాడు. మత, జాతీయతా విషయాలలో ఆయన ప్రభావం సుభాస్‌పై ఎంతగానో వున్నది. స్వామి వివేకానంద గురించి, ఆయన బోధల గురించి తన శిష్యులకు ఆయన వివరించేవాడు. వేణి మాధవ్‌ రెందేళ్ళలోనే బదిలీ అయ్యాడు. దీనితో సుభాస్‌తోపాటు ఆయన శిష్యులు కూడా ఖిన్నులయ్యారు. శిష్యులతో ఆయనకున్న సంబంధం అలాంటిది. సుభాస్‌ రకరకాల పుస్తకాలను చాలా సులభంగా అధ్యయనం చేసేవాడు. వివేకానంద రచనలతోపాటు ఆయన మజ్జిని ద్యూటీస్‌ ఆఫ్‌ మెన్‌ గిబ్బన్‌ విరచిత డ్విక్లయిన్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ రోమన్‌ ఎంపైర్‌ వంటి గ్రంథాలను అధ్యయనం 18 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ళ్ళ చనినటు స్పయంగా పేర్కొన్నాడు. టా | వ స న్నే తన సోదరుడైన శరత్‌ చంద్ర క్‌ |..." బోస్‌కు 1913లో రాసిన లేఖలో ఆయన “ా' గ వ (గ యిలా పేర్కొన్నాడు: *.....భారతదేశం న్‌ | క్‌ న. | ఒకప్పుడు ఎలా వుండేది, యిప్పుడెలా నయ. గ. వున్నది? ......! అంతా గతమైంది...... టా “౫ | కాని, ఆశమిగిలే వున్నది- మత ఆత్మల్లో న... అగ్నిని రగిలించి, సోమరితనాన్ని |. [. |; వదిలించేటందుకై ఆశాదేవత మనమధ్య న. . బుషితుల్యుడైన వివేకానందుడు. , . హైందవంలో యిమిడివున్న వవి(త్ర ననన నత్యాలను యావ(త్పవంచానికి బోధించేందుకై విశాలమూ, తీక్షణమూ అయిన నేత్రాలతోనూ, పవిత్రమైన

వస్త్రధారణతోనూ దేవతా స్వరూపంతో ఆయన అక్కడ నిలచాడు!”

ఇదేకాలంలో సుభాస్‌ తన తల్లికి రాసిన లేఖలో యిలా పేర్కొన్నాడు: “మన దేశ పరిస్థితి అంతకంతకూ దుర్భర దుస్థితిలోకి దిగజారుతున్నప్పుడు- భరతమాత పుత్రుడు ఎవరైనా దుఃఖించకుండా వుంటాడా, అతని స్వీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి తన యావజ్జీవితాన్నీ తల్లికి అంకితం చేయకుండా వుంటాడా?”

ఈ సమయంలోనే వివేకానందను పోలిన గురువు కోసం సుభాస్‌ అన్వేషణ ప్రారంభించాడు. మున్ముందు రానున్న సంవత్సరాలలో ఆప్తమిత్రుడు కాగలిగిన బెంగాలీ యువకుడు హేమంత కుమార్‌ సర్కార్‌తో యీ కాలంలోనే సుభాస్‌కు సన్నిహిత పరిచయం కలిగింది. దీర్హకాలిక సెలవుల్లో వీరిరువురూ గురువును అన్వేషిస్తూ గయ, బెనారస్‌, హరిద్వార్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళారు. ఈ పర్యటను సుభాస్‌కు నిరుత్సాహాన్నే మిగిల్చింది. చాలా ఏళ్ళ తరువాత దీని గురించి రాస్తూ, రెండు మాసాలపాటు సాగిన యీ యాత్రలో అనేక మందిని కలుసుకున్నామని, అయితే వారు కేవలం వేషధారులైన సాధువులేనని పేర్యొన్నాడు. భారత యాత్రీకునిగా యీ పర్యటన ఆయన కళ్ళు తెరిపించింది. హిందూ సమాజంలో పైకి కనిపించని కొన్ని లోటుపాట్లను ఆయన కనుగొన్నాడు, విచార వదనంతో యింటికి తిరిగి వచ్చాడు, సాధు, సన్యాసులపట్ల ఆయన తన విశ్వాసాన్ని కోల్పోయాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు క్షేశ్ష

1918లో సుభాస్‌ మెట్రిక్‌లేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, వప్రతిభావంతుల్లో రెందవ న్‌ స్థానంలో నిలచాడు. 1897లోనే జన్మించిన ఖితిష్‌| ఇ... (ా న స ప్రసాద్‌ ఛటోపాధ్యాయ (ఈ గ్రంథకర్త తండ్రి) నాల కచ్చ స అదే ఏడాది కలకత్తాలోని మవెటోపాలిటిన్‌ జై. ౨౫ ఇన్‌స్టిట్యూట్‌లో మెట్రిక్‌ వరీక్షలో ఉత్తీర్ణుడై ఆ. ప్రతిభావంతుల జాబితాలో ఆరవ స్థానంలో న ట్‌. నిలచాడు. బెంగాల్‌ కవి ద్విజేంద్రలాల్‌ కుమారుడు వ. వ గ దిలీప్‌ కుమార్‌ రాయ్‌ ఆయనకు సహపాఠి. ఈ[ (౫ యిరువురూ, దూరప్రాంతమైన కటక్‌ నుంచి వచ్చిన యువకుని ప్రతిభకు ముగ్గులయ్యారు, అతి | _ సుభాన్‌ చౌద్రదోన్‌ తండ్రే తక్కువ కాలంలోనే యీ ముగ్గురు సన్నిపాత మిత్రులుగా మారారు, జీవితాంతం వీరి మైత్రి నిలచి వున్నది.

1915లో ఇంటర్మీడియట్‌ పరీక్ష నెగ్గిన సుభాస్‌ కలకత్తాలోని (ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ తత్వశాస్త్రం తీసుకుని తన చదువును కొనసాగించాడు. దిలీప్‌, ఖితిష్‌లు కూడా ్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులే. ఇది ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వంలోని వున్నత వుద్యోగుల పిల్లలు ఎక్కువగా యిక్కడే చదువుతారన్న విషయం జగద్విదితమే. భారత యువజనుల హృదయాలను విప్లవ జాతీయవాదం ఆకట్టుకుంటున్న తరుణం కూడా యిదే. 1914 సెప్టెంబరులో బుడ్డ్‌బుడ్డ్‌ (కలకత్తా దగ్గరలో వున్నది) సమీపంలో (బ్రిటిష్‌ సైనికులకు, గదర్‌ విప్లవ వీరులకు మధ్య సంభవించిన వీరోచిత పోరాటం కామాగటామారుగా ప్రసిద్ధికెక్కింది, ఒరిస్సాలోని బాలాసోర్‌ సమీపంలో సంభవించిన అసమ పోరాటంలో ఐఘ జతిన్‌ ఆయన సహచరుల వీర మరణం యువ భారతీయుల్లో విద్యుదావేగాన్ని నింపింది. ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులు సైతం దీని ప్రభావానికి లొంగక పోలేదు. 1916 నవంబరులో భారత ప్రభుత్వ విద్యాశాఖ ఒక రహస్య పత్రంలో యిలా పేర్మొన్నది: "మొత్తంమీద, రాజకీయ స్వభావం కలిగిన కారణాల రీత్యా విద్యార్థులలో ఆగ్రహావేశాలు వున్నాయి...... చట్టబద్దమైన అధికార సంస్థ ప్రకటించిన నిబంధనలకు, ఉత్తర్వులకు తిరుగులేని విధేయతను చూపవలసిన పలు సందర్భాలలో అతిక్రమణ, అనిష్టము కన్పిస్తున్నాయి”.

ప్రెసిడెన్సీ కళాశాలలో చోటుచేసుకున్న ఒక ఘటన సాఫీగా సాగిపోయే సుభాస్‌ విద్యా జీవితాన్ని మార్చివేసింది. ఈ కళాశాలలో ఇఎఫ్‌. ఓటెన్‌ చరిత్ర కేల్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

లా భె మైన్‌ విభాగపు ప్రొఫెసర్‌గా నన్నాడు. ఈడెన్‌ హిందూ వ. 'ఉ హాస్టల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో న రో క్ష |. పొసపెనర్‌ ఓటెన్‌ యిలా చెప్పినట్లుగా నా [4 తెలుస్తున్నది: “తాము కలుసుకున్న అనాగరిక క ” నా జనులను (గీకులు నంనృతీవరులుగా /, న! ,. ___మార్చినట్లుగానే భారతీయులను ఇంగ్రీషువారు . జ గె నాగరీకులుగా మార్చారు”. ఈ వ్యాఖ్యను స" , అవమానంగా కళాశాల విద్యార్థులు భావించారు. న. 1916 జనవరిలో మరలా ఆయన యిలాంటి ము ౪ స్‌" . వ్యాఖ్యలనే చేయటం ద్వారా విద్యార్థులను ననన రెచ్చగొట్టాడు. ఇందుకు నిరసనగా 1916 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు విద్యార్థులు నమ్మా చేశారు. వీబ్రవరి 15వ తేదీన కళాశాలలోని రెండవ అంతస్తు నుండి కిందకు వస్తున్నపుడు మెట్లమీదనే కొందరు విద్యార్థులు ఆయనను అడ్డగించి చేయిచేసుకున్నారు. వెనకవైపునుంచి దాడి జరగటంతో వారెవరైనదీ ఓటెన్‌ గుర్తించలేక పోయాడు. అయితే దాడి చేసిన వారిలో సుభాస్‌ బోస్‌ అనంగ మోహన్‌ దామ్‌లను తాను చూసినట్లు కళాశాల గుమస్తా చెప్పాడు. కలకత్తాలోని పాలక వర్గీయులంతా ఒక్కటిగా నిలచి దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. దీనితో సుభాస్‌ చంద్ర బోస్‌, అనంగ మోహన్‌ దామ్‌లను వెనువెంటనే కళాశాల నుంచి బహిష్మరించటమేకాక, తన పరిధిలోని ఏ కళాశాలలోనూ యీ యిరువురు యువకులకు ప్రవేశాన్ని నిరాకరిస్తూ కలకత్తా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సుభాస్‌ నిజంగానే ఓటెన్‌పై చేయిచేసుకున్నాడా? చాలా కాలం తరువాత భారతీయ యాత్రీకుడు అన్న గ్రంథంలో సుభాస్‌ యీ ఘటన గురించి రాస్తూ, తాను ఓటెన్‌పై చేయి చేసుకోలేదని, అయితే ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నాడు. సుభాస్‌ సన్సిహిత మిక్రుడైన ఖితిష్‌ ఛటోపాధ్యాయ ఆ దుర్దినం నాడు కళాశాలకు వెళ్ళలేదు. కొన్ని సంవత్సరాల తరువాత యీ ఉదంతం గురించి ఆయన కుమారుడు ప్రశ్నించినపుడు, ఎవరిమీదనైనా వెనకనుంచి దాడిచేయలేని అశక్తుడు సుభాస్‌ అని సమాధాన మిచ్చాడు. 1978లో నేతాజీ సుభాస్‌ చంద్ర బోస్‌పైనా, అదేవిధంగా భారతీ జాతీయ స్వాతంత్ర్య పోరాటంపైనా కలకత్తాలోని నేతాజీ భవన్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు జరిగినపుడు ప్రొఫెసర్‌ ఓటెన్‌ స్వయంగా తనకు గుర్తున్న మేరకు సుభాస్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 16

చంద్రబోస్‌ గురించి ఒక పత్రాన్ని పంపించాడు. జ్‌ ఈ పత్రంలో ఆయన తనపై జరిగిన దాడి ఉ మట - దంతాన్ని ప్రస్తావిస్తూ, తనకు కేవలం కొన్ని న! దెబ్బలు మాత్రమే తగిలాయని, విచారణ సంఘం . ళ్‌ చెప్పినట్లుగా, “కిరాతక దాడి” జరగలేదని పేర్కొన్నాడు. దాడి చేసిన వారిలో సుభాస్‌ | వున్నారా? దీనికి ఆయనవద్ధ్ద కచ్చితమైన సమాధానం లేదు, కాని, మొత్తంమీద, సుభాస్‌ చంద్ర బోస్‌ సద్వర్తన కలిగిన విద్యార్థి అని ఆయన తన పత్రంలో పేర్కొన్నాడు. ఈ ఘటన, || ల్‌ ఆనాడు బెంగాలీ మేధావుల్లో వివాదానికి త దారితీసింది: ఒకవేళ ఉపాధ్యాయుడు తప్పు చేశాడనుకున్నప్పటికీ, తన ఉపాధ్యాయునిపై విద్యార్థి చేయెత్తటాన్ని అనుమతించ వచ్చునా? అత్యధికులు యిందుకు ప్రతికూలంగా జవాబు యిచ్చారు. సుభాస్‌పట్ల కలకత్తా విశ్వవిద్యాలయం కఠినంగా ఎందుకు వ్యవహరించింది దీనినిబట్టి తెలుసు కోవచ్చు. మన చరిత్రలోని పలు కీలక సందర్భాలలో భారతీయ ఆత్మగా నిలచిన రవీంద్రనాథ్‌ టాగూర్‌ స్పందన యీ విషయంలో భిన్నంగా వున్నది. ఓటెన్‌ ఉదంతం జరిగిన వెంటనే శాంతినికేతన్‌లో విద్యార్థులను వుద్దేశించి ప్రసంగిస్తూ, ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుని కొట్టటం నిందార్హమనటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్తూనే, అయితే, ఉపాధ్యాయుడు తన మహోన్నతమైన వృత్తి నుండి వైదొలగి విద్యార్థుల మాతృదేశాన్ని తూలనాడుతున్నపుడు విద్యార్థి ఏమి చేయాలి? అని ప్రశ్నించాడు.

ఏడాది తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం కనికరం చూపింది, కాని, పెసిదెన్సీ కళాశాల మాత్రం ఆయనను చేర్చుకోలేదు. స్వతంత్ర భారతంలో సైతం కళాశాల అధికారులు ఓటెన్‌ ఉదంతంలో సుభాస్‌ పేరును తొలగించే విజ్ఞతను ప్రదర్శించ లేదు. 1996లో మాత్రమే, అంటే, సుభాస్‌ శఈతజయంత్యుత్సవాలకు జాతి సమాయుత్తం అవుతున్న తరుణంలో కళాశాల రికార్డుల్లో పదిలపరచిన వివరాలను ప్రాతిపదికగా చేసుకున్న ప్రెసిడెన్సీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటన చేస్తూ, 1916లో సుభాస్‌ చంద్రునికి తీవ్ర అన్యాయం జరిగినట్లుగానే తాను భావిస్తున్నానని, అందుకు పరిహారంగా ప్రస్తుతం కళాశాలకు చెందిన గౌరవనీయుల జాబితాలో ఆయన పేరును వుంచుతున్నామని, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నిర్వహించిన మహోజ్వల పాత్రపై ఉపన్యాసాలు, సదస్సులు వరుసవారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భాను ఛదోవధ్యాయ

ఇక ఆయన జీవిత గాథకు తిరిగి వద్దాము. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయం సుభాస్‌పై బహిష్కరణ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. అదే ఏడాది జూలైలో ఆయన స్కాటిష్‌ చర్చి కళాశాలలో బి.ఏలో చేరాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉర్కుహర్త్‌ ఉదార స్వభావి. ఇది ఎంతైనా సంతోషకరమైన విషయం. 1919లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ పరీక్షలో ప్రథమ థ్రేణిలోనూ, తత్వశాస్త్రంలో ద్వితీయ (్రేణిలోనూ సుభాస్‌ ఉత్తీర్ణుడయ్యాడు. విద్యార్థులకు సైనిక శిక్షణ యిచ్చే కార్యక్రమాన్ని 1917లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్వచ్చంద దళంలో సుభాస్‌ మహోత్సాహంతో చేరాడు. తదనంతర కాలంలో రచించిన భారత యాతభ్రీకుడు అన్న గ్రంథంలో ఆయన యీ విధంగా పేర్శొన్నాడు: “నాకు అవసరమైన దానిని లేదా నాలో కొరతగా వున్న దానిని యీ శిక్షణ నాకు ప్రసాదించింది. మనోఐలము, ఆత్మ విశ్వాసము మరింత పెరిగాయి. భారతీయులుగా మనకు లేని నిర్దిష్టమైన హక్కులు సైనికులుగా మనకు వుంటాయి..... మొట్టమొదటి రోజున మా తుపాకులు తెచ్చుకునేందుకై విలియం కోటలో ్రవేశించాము. యీ సమయంలో మేము విచిత్రమైన అనుభూతికి లోనయ్యాము. దేనినుంచైతే మమ్మలను అన్యాయంగా దూరం చేశారో, ఆ వారసత్వ హక్కుయేదో మాకు లభించినట్లుగా అనిపించింది”. 1919లో సుభాస్‌ ఎం.ఏ పట్టా కోసం ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర విభాగంలో చేరాడు. ఈ సమయంలోనే ఆయన తండ్రియైన జానకీనాథ్‌ బోస్‌ తన రెండవ కుమారుడైన శరత్‌చంద్ర బోస్‌తో సంప్రదించిన అనంతరం సుభాస్‌ను పిలిచి, “ఐ.సి.ఎస్‌ పరీక్ష రాసేందుకై నిన్ను ఇంగ్లాండు పంపాలనుకుంటున్నానని, తెలియ చేశాడు. అప్పటికే సుభాస్‌లో (బ్రిటిష్‌ వ్యతిరేకత బలంగా వుండటంతోపాటు, అంకిత భావం కలిగిన జాతీయవాదిగా తయారైన సంగతి మనకు తెలుసు. అయినప్పటికీ, బ్రిటిష్‌ విశ్వవిద్యాలయ పట్టాను పుచ్చుకోవాలన్న అభిలాష ఆయనలో వున్నది. ఇవన్నీ ఆయన హృదయంలో తుఫానులను రేపాయి. తన సన్నిహిత మిత్రుడైన హేమంత సర్మార్‌కు 1919 ఆగస్టు 26న రాసిన లేఖనుబట్టి యీ విషయం మనకు తెలుస్తుంది. భారత యాత్రీకుడు అన్న గ్రంథంలో యీ లేఖను చూడవచ్చు. సుభాస్‌ చంద్ర బోస్‌ యిలా రాశాడు. “ఇప్పుడుగాని నేను సివిల్‌ సర్వీస్‌ అధ్యయనాన్ని తిరస్మరించినట్లయితే, ఇంగ్లండుకు నన్ను పంపించాలన్న (ప్రతిపాదన మరుగున పడుతుంది...... ఈ అవకాశాన్ని నేను వదలుకోనా? మరోవైపున సివిల్‌ సర్వీసు పరీక్షలో నేను ఉత్తీర్ణుడను అయ్యేటట్లయితే పెద్ద ప్రమాదమే తలయెత్తుతుంది. దాని అర్ధమేమంటే నా జీవిత లక్ష్యానికి తిలోదకాలు యివ్వటం” చిట్టచివరకు ఆయన ఇంగ్లండు వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు. 1919 సెప్టెంబరు 15వ తేదీన ఓడ ఎక్కాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 18

కేంబ్రిడ్డ్‌లో సుభాస్‌

సుభాస్‌ తొలుత తన పెద్దన్న సతీష్‌తో కలసి వున్నాడు. అప్పటిలో ఆయన బారిస్టర్‌ అయ్యే ప్రయత్నాల్లో వున్నాడు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని ఏదో ఒక కళాశాలలో చేరాలన్నది సుభాస్‌ కోరిక. అయితే అప్పటికే ప్రవేశానికి నిర్ణయించిన గడువు ముగిసింది. ఆయన సన్నిహిత మిక్రులైన దిలీప్‌ రాయ్‌, ఖితిళ్‌ ప్రసాద్‌ ఛటోపాధ్యాయలు ఆనాటికే కేంటబ్రిడ్ట్‌లో వుండి ఫిజ్‌ విలియం వాల్‌లో చదువుతున్నారు. వీరిరువురూ సుభాస్‌ కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆనాడు డీన్‌గా పనిచేస్తున్న రెడ్‌ఎవే సహకారం వారికి లభించింది. దీనితో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని ఒక కళాశాలలో సుభాస్‌కు ప్రవేశం లభించింది. 1919 నవంబరు ప్రారంభానికల్లా ఆయన తన చదువుకు శ్రీకారం చుట్టారు. 1920 ఆగస్టులో ఐ.సి.ఎస్‌ పరీక్షలు జరిగాయి. దీనితో మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్సెస్‌ ట్రీిపోస్‌ అధ్యయనాన్ని సుభాస్‌ (ప్రారంభించాడు. తన అసంపూర్ణ ఆత్మకథలో ఆయన యీ విధంగా రాసుకున్నాడు; జ. రాజకీయ విజ్ఞాన శాస్త్రం, అర్ధ శాస్త్రం, ఆంగ్లేయ చరిత్ర, ఆధునిక ఐరోపా చరిత్రల అధ్యయనం ప్రయోజనకరమైనదేనని రుజువైంది. ఈ అంశాలను అధ్యయనం చేయకముందు ఐరోపా ఖండ రాజకీయాల గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు..... నేను ఆధునిక ఐరోపా చరిత్రను, దానితోపాటే బిస్మార్క్‌ ఆత్మకథ, మెటర్నిక్‌ స్మృతులు, కేవర్స్‌ లేఖలు తదితర మౌలికమైన ఆకరాలను అధ్యయనం చేశాను. నా రాజకీయ అవగాహనను పెంచటానిక్తీ, అంతర్జాతీయ రాజకీయాల అంతరార్థాలను గ్రహించటానికీ కేంటబ్రిడ్జ్‌లో నేను అధ్యయనం చేసిన వాటికన్నా మౌలికమైన యీ ఆకరాలే నాకు ఎంతగానో తోడ్పడ్డాయి”.

ఇంగ్లండులో తాను చూసిన పలు విషయాలను సుభాస్‌ ఎంతగానో మెచ్చుకున్నాడు, విశ్వవిద్యాలయంలోనూ, యితరంగానూ నెలకొనివున్న స్వేచ్చకు కం గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కో సజ || అయితే (బీటిష్‌వాళ్ళు . ఇళ్ల స న్‌ తన దేశానికి వలన / , లా ( యజమానులుగా వున్నారన్న | వు విషయాన్ని ఆయన ప్రో స్త | ఎంతమాతం మరచి య రు పోలేదు. భారతదేశంలో 1920లో కంద్రిగ్జీ విశ్వవిద్యాలయంలో సుభాస్‌ చంద్రబోస్‌ | వృన్న తన స్నేపాతుడు (డివైవు వ్రస్టరివునార్టు కష్ట ప్రసాద్‌ ఛటోపాధ్యాయ. | ప్ట్య్వంత సర్కార్‌కు 1919 నవంబరు 12న రానిన లేఖలో యీ విధంగా పేర్యొన్నాడు: “ఎవరికైనా యిష్టమున్నా లేకపోయినా, యీ దేశ వాతావరణం ప్రజలను శక్తివంతులుగా తీర్చిదిద్దుతుంది. ఇక్కడి కార్యకలాపాలు వృాదయంగమంగా వుంటాయి. ప్రతి ఒక్కరూ సమయం విలువను గుర్తెరిగి వుంటారు. ఇక్కడ నడిచే పద్ధతది...... విద్యార్థులకు యిక్కడ ఒక స్థానం అంటూ వుంటుంది- ప్రొఫెసర్లు వారితో వ్యవహరించే తీరే వేరుగా వుంటుంది. ఒక వ్యక్తి తన తోటివారితో ఎలా వ్యవహరించాలో యిక్కడ చూడవచ్చు. వారిలో అనేక లోపాలున్నాయి-- కాని అనేక విషయాలలో వారిలో వున్న సుగుణాలను బట్టి నీవు వారిని గౌరవించవచ్చు”. ఇలా రాసినప్పటికీ ఆయనలో బ్రిటిష్‌వారిపట్ల లోలోపల వ్యతిరేకత బలంగానే వున్నది. ఇదే లేఖలో గమనించ దగిన ఒక వాక్యం వున్నది. “తెల్లవాళ్ళ చేత సేవలు చేయించు కోవటంకన్నాా నా బూట్లను వారు శుభ్రం చేస్తుంటే చూడటంకన్నా మించిన ఆనందం నాకేమీ వుండదు”. సుభాస్‌, దిలీప్‌ రాయ్‌, ఖితిస్‌ ఛటోపాధ్యాయలు కలసివుంటూ, ఒకే రకమైన అభిప్రాయాలను కలిగి వుండేవారు, వారిని త్రయం అని పిలిచేవారు. సెలవు దినాల్లో, యీ ముగ్గురూ లాంక్‌షైర్‌ వెళ్ళి తమకన్నా చాలా సీనియర్‌ అయిన డాక్టర్‌ ధర్మవీర్‌ అనే పంజాబీయుని ఆయన నివాసంలోనే కలుస్తుందేవారు. దాక్టర్‌ ధర్మవీర్‌ భార్య ఐరోపా యువతి. ఈ ముగ్గురు భారతీయ యువకులు ఆమెను దీదీ అని పిలుస్తూ ఎంతో అభిమానంగా మెలిగేవారు. ఆ దంపతుల కుమార్తెలైన సీతను, లీలను ఆప్యాయంగా చూసుకునే వారు. ఈ విషయాన్ని దిలీప్‌ రాయ్‌ యీ విధంగా పేర్మొన్నాడు: “మేము తరచుగా, యౌవనస్తులైన వారికి మాత్రమే సాధ్యపడే ఉజ్వల హృదయంతో చాలా రాత్రి వరకు చర్చించుకునే వాళ్ళం. చిటపటలాడే నిప్పుగూడు సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 20

ముందు కూర్చుని ఇంగ్రండులోని లేబర్‌ పార్టీ, రష్యాలోని కమ్యూనిజంలలో వున్న వాని గురించిన చర్చలో పదేవాళ్ళం”.

భారతదేశం తననుతాను విముక్తి చేసుకోవటానికిగాను బహుశ సరికొత్త విప్లవ కార్మిక వర్గం తోద్చడవచ్చునన్న రాయ్‌ అభిప్రాయంతో బోస్‌ విఖేదించేవాడు. "స్వదేశీ దినాల్లో భారతదేశానికి సహాయపడేందుకు వెలుపలి వారెవరూ రారు, మనంతట మనంగా స్వాతండ్ర్యాన్ని సాధించజాలనిచో మన విముక్తి కోసం ఎవ్వరూ రారన్న, శ్రీ అరబిందో మాటలు అక్షర సత్యాలని సుభాస్‌ నొక్కి చెప్పేవాడన్న విషయాన్ని రాయ్‌ గుర్తుచేసుకున్నాడు.

రోజురోజుకు దగ్గరవుతున్న ఐ.సి. ఎస్‌ పరీక్షను ఏమి చేయాలా అన్న విషయమై సుభాస్‌ చంద్ర బోస్‌ యింకా ఒక నిర్ణయానికి రాలేదు, కాని, బిటిష్‌ వారికి వ్యతిరేకంగా అంతకంతకూ బలపడుతున్న జాతీయ పోరాటం మాత్రం ఆయనపై ప్రభావాన్ని చూపసాగింది. భారతదేశంలో వున్న ఒక మిత్రునికి రాసిన లేఖలో సుభాస్‌ యిలా పేర్మాన్నారు: “స్వామి వివేకానంద యిలా చెప్తూ వుండేవాడు, హాలికులు, బట్టలు వుతికేవాళ్ళు, చెప్పులుకుట్టే వాళ్ళు, వీధులూడ్చే వాళ్ళ ద్వారా మాత్రమే భారతదేశం పురోగతిని సాధించగలదు...... 'ప్రజల శక్తి సాధించ గలిగినదేమిటో పాశ్చాత్య ప్రపంచం తెలియ చెప్పింది. ప్రపంచంలో, అంటే, రష్యాలో మొట్టమొదటి సోషలిస్టు రిపబ్లిక్కు ఏర్పాటే యిందుకు మహోజ్వల వుదాహరణ. భారతదేశం మరోసారి శిరసెత్తుకుని నిలబదేటట్లయితే, అది కేవలం ప్రజల శక్తి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది”.

ఈ తరుణంలో సుభాస్‌ మనసులో చోటుచేసుకున్న సంఘర్షణను ఆయన తన పెద్దన్నయ్య శరత్‌ చంద్ర బోస్‌కు 1921 ఏప్రియల్‌ 23న రాసిన లేఖ ద్వారా తెలుసు కోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగిగా మారటానికి తాను వ్యతిరేకమని, అలా చేయటమంటే బ్రిటిష్‌ వలస పాలకులపట్ల రాజభక్తిని ప్రదర్శించటమే కాగలదంటూ యింకా యిలా పేర్మొన్నాడు: “రాజీ పడటం చెడ్డపని అని నేను నమ్ముతున్నాను -అది మనిషిని దిగజార్చి అతని లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది.... ఒక రాజీ మరో రాజీకి దారి తీస్తుంది..... జాతికి ప్రాణం పోయాలి, కేవలం రాజీలేని హాంప్టైన్‌, క్రామ్‌వెల్‌ల ఆదర్శాల ద్వారా మాత్రమే ఒక జాతి నిర్మాణం కాగలదు”.

కేంట్రిడ్డలోని ఇండియన్‌ మజ్లిస్‌లో సుభాస్‌ చంద్ర చాలా చురుకుగా వుండేవాడని ఆనాటి ఆయన స్నేహితులు పలువురు చెప్పారు. అచిరకాలంలోనే ఆయన కేంట్రిడ్డిలోని భారతీయ విద్యార్థులకు తిరుగులేని నాయకునిగా రూపొందాడు. భారతీయ 21 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విద్యార్థులకు సంబధించి భారత కార్యాలయం నియమించిన కమిటీ ముందు తమ వాదనను విన్పించేటందుకై తమ (ప్రతినిధిగా విద్యార్థులు ఆయనను ఎంపిక చేసుకున్నారు. ఐ.సి.ఎస్‌ పరీక్ష రాయటానికి లేదా బారిస్టర్‌ కావటానికి లేదా చార్జర్‌ అకౌంటెంట్‌ కావటం కోసం ఇంగ్లాండు రావాలంటే భారతీయ విద్యార్థులు అనేక వ్యయ ప్రయానలకు ఓర్వవలసి వస్తున్నట్లు కమిటీ ముందు సుభాస్‌ బలంగా వాదించాడు. భారతదేశంలోనే ఐ.సి.ఎస్‌ పరీక్షలను నిర్వహించి, న్యాయశాస్తాన్ని అకౌంటెన్సీని అధ్యయనం చేసేటందుకు భారతదేశంలోనే సౌకర్యాన్ని కల్పించేటట్లయితే యా కష్టాలన్ని తొలగి పోగలవు. అప్పటిలో బ్రిటన్‌లో వున్న భారతీయ విద్యార్థులందరూ సుభాస్‌ వాదనలను మెచ్చుకున్నారు. ఆయన సన్నిహిత మిత్రడు ఖితిష్‌ తదనంతర సంవత్సరాలలో రాసిన ఒక వ్యాసంలో సుభాస్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. అంతగా పరిచయంలేని విద్యార్థులు సైతం సుభాస్‌ను కీర్తించారు.

సుభాస్‌ ఐ.సి.ఎస్‌ పరీక్ష రాసి తీరవలసిందేనని ఆయన తండ్రి జానకీనాథ్‌ పట్టుదలగా వున్నాడు. 1920లో ఆయన పరీక్షకు హాజరయ్యాడు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా భారత సివిల్‌ సర్వీసులో ఆరు న్థానాలను నింపవలసిన సమయమిది. ఈ పరీక్ష కోసం సుభాస్‌ కేవలం తొమ్మిది మాసాలు మాత్రమే కృషి చేయగలిగాడు, తాను ఉత్తీర్డుడను కాజులనని ఆయన భావించాడు. ఫలితాలు వెలువడినపుడు తెలిసినదేమంటే, కేవలం రెండవ స్థానం మాత్రమే ఆంగ్రేయునికి దక్కింది, ఆరు న్థానాలలో ఐదింటిని భారతీయ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ప్రతిభావంతుల జాబితాలో సుభాస్‌కు నాల్గవ స్థానం దక్కింది. ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. అయితే, ఒకరకంగా ఆయనకు సంతోషం కలిగింది. తాను బ్రిటిష్‌ వారికి సమ ఉ జ్జీనన్న విషయాన్ని వారికి చెప్పాలనుకున్నాడు. అలానే చేశాడు, యీ విషయాన్ని ఒక సందర్భంలో తన మిత్రుడైన దిలీప్‌ రాయ్‌కు చెప్పాడు. తన కుమారుని చూసి జానకీనాథ్‌ మురిసి పోయాడు. ఐ.సి.ఎస్‌లో చేరాలని కోరాడు. అయితే, హేమంత్‌ సర్కార్‌ వంటి స్నేహితులు కలకత్తా నుంచి సుభాస్‌కు జాబుటు రాస్తూ, భారత స్వాతంత్ర్య పోరాట లక్ష్యానికి తనను తాను అంకితం చేసుకున్న వారికి ఐ.సి.ఎస్‌ పదవి పనికి రాదని సూచించారు.

కుటుంబంపట్ల తనకున్న విధేయతకూ, మాతృభూమి విషయంలో తనకుతాను విధించుకున్న కర్తవ్యానికీ మధ్య సుభాస్‌ చంద్రబోస్‌ నలిగి పోయాడు. పరవళ్ళుతొక్కే భావోద్వేగంతో శరత్‌ బోస్‌కు ఆయన ఒక లేఖ రాస్తూ, బ్రిటిష్‌ రాజరికం పట్ల ప్రభుభక్తిని ప్రకటించే ఎలాంటి పత్రంపైనా సంతకం చేయబోనని వుద్దాటించాడు. ప్రభుత్వ పదవికి అంగీకారాన్ని తెలపకుండా నిరాకరించిన సమయంలో ఆయన సుభాస్‌ చంద్ర జోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 22

అంతరంగిక మిత్రులు దిలీప్‌ రాయ్‌, ఖితిష్‌ ఛటోపాధ్యాయలు పక్కనే వున్నారు. స్వీయ ఆదర్భాలకే కట్టుబడి, రాజీనామా విషయంలో దృఢంగా వుండవలసిందిగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో సుభాస్‌ ప్రవేశానికి సహాయపడిన ఫిజ్‌ విలియం హాల్‌కు చెందిన రెడ్‌ఎవే సుభాస్‌ను ప్రోత్సహిస్తూ సలహా యిచ్చాడు.

అంతిమంగా శరత్‌ బోస్‌ సైతం సుభాస్‌ నిర్ణయాన్ని ఆమోదించాడని, బహుశ ఆయన తల్లి కూడా అంగీకరించిందని ప్రముఖ జీవిత చరిత్రకారులు, చరిత్రవేత్తలు పేర్మొన్నారు. ఆనాటికి బెంగాల్‌లో జాతీయ నాయకునిగా నీరాజనాలు అందుకుంటున్న చిత్తరంజన్‌ దాస్‌కు సైతం సుభాస్‌ అప్పటికే ఒక లేఖ రాశాడు. దేశమాత సేవలో గడపటానికిగాను తాను భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నానని, సి.ఆర్‌. దాస్‌ తనకు అప్పచెప్పదలచుకున్న పనిని చేసేందుకు సిద్ధంగా వున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సుభాస్‌ నిర్ణయాన్ని మెచ్చుకున్న సి.ఆర్‌. దాస్‌ వెంటనే కలకత్తా వచ్చేయ వలసిందిగా జాబు రాశాడు.

ఈ సమయంలో సుభాస్‌ చంద్ర బోస్‌ తన నిశ్చయాన్ని స్థిరపరచుకుని 1921 ఏప్రియల్‌ 22న భారత ప్రభుత్వ కార్యదర్శి మాంటెంగ్యుకు ఒక లేఖ రాశాడు. “ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ ప్రొబేషనరీ జాబితా నుంచి నా పేరును తొలగించ వలసిందిగా కోరుతున్నాను", అన్నదే ఆ లేఖ సారాంశం. నిర్ణయం జరిగిపోయింది. ఆ మరుసటి రోజునే, అంటే, 1921 ఏప్రియల్‌ 23న తన పెద్ద అన్న శరత్‌కు సుభాస్‌ ఒక ఉత్తరం రాస్తూ రాజ్యంతో తెగతెంపులు జరిగాయని తెలియచేస్తూ, “అమ్మగారి నుంచి ఉత్తరం అందింది, తండ్రి, యితరులు ఏమి ఆలోచించినప్పటికీ మహాత్మా గాంధీ ఆదర్శానికే తాను కట్టుబడి వున్నట్లు అమ్మ తెలిపింది. ఇలాంటి ఉ త్తరాన్ని అందుకున్నందుకు నేనెంత ఆనందిస్తున్నానో మాటల్లో చెప్పలేను ..... నా మనసులో నుంచి ఏదో భారం దిగిపోయినట్లయింది”,

ఇదియిలా వున్నప్పటికీ ట్రిపోస్‌ పరీక్షకు సుభాస్‌ చంద్ర బోస్‌ సిద్ధమయ్యాడు. కాని, ఆయన ధ్యాస దానిపై నిలవటం లేదు. పరీక్షలో ఉత్తీర్ణుడైనప్పటికీ అంతకు ముందు వాటితో పోలిస్తే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. కలకత్తాకు చేరుకోవాలన్న హడావుడిలో ఆయన మునిగి పోయాడు. 1921 జూన్‌కల్లా ఇంటికి చేరాలని నిర్ణయించుకున్నాడు. సమయాభావం కారణంగా ట్రిపోన్‌ డిప్లామోను కూడా తీసుకోలేదు, దాని బాధ్యతను తన మిత్రుడు ఖితిష్‌కు అప్పచెప్పాడు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ ప్రయాణిస్తున్న ఓడలోనే సుభాస్‌ చంద్ర బోస్‌ కూడా ప్రయాణించినట్లు ఒక చరిత్రకారుడు పేర్కొన్నాడు. అయితే యిది కేవలం యాదృచ్చికం మాత్రమే. భారత జాతీయోద్యమ ఆకాశంలో విశిష్టమైన విప్లవ విధానంతో సరికొత్త నాయకుడు 28 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

అవతరించనున్నట్లు ఆయనతో టాగూర్‌ చెప్పినట్లుగా ఒక కథ వినిపిస్తుంది. ఆ వ్యక్తి గాంధీ, ఆయన విధానం అహింస, సహాయ నిరాకరణ. భారత దేశంలో అడుగు పెట్టిన తరువాత ఏమి చేయాలన్న విషయమై సుభాస్‌కు యింకా స్పష్టత లేదు. ఏదియేమైనప్పటికీ ఆయన జీవితం నిర్ణయాత్మకమైన మార్పుకు గురికానున్నది.

అక సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు బడ

దేశబంధు శిష్యుడు

సుభాస్‌ చంద్ర బోస్‌ 1921 మధ్యలో బొంబాయి రేవులో దిగిన వెనువెంటనే జాతీయోద్యమ మహా నాయకుదైన మహాత్మా గాంధీని చూడటానికి వెళ్ళాడు. గాంధీజీతో దాదాపు పాతికేళ్ళ సంశ్లిష్ట సంబంధాలకు బీజమేసిన యీ సమావేశం గురించి చాలా కాలం తరువాత సుభాస్‌ యీ విధంగా పేర్మాన్నాడు. “నేను బొంబాయి చేరుకుని మహాత్మా గాంధీ ఇంటర్వ్యూ పొందాను. ఆయన కార్యాచరణ గురించి ఆయననుంచే స్పష్టత పొందాలన్నదే నా అభిమతం.... విశదపడవలసిన మూడు అంశాలున్నాయి. -వేర్వేరు కార్యకలాపాలు ఏవిధంగా..... ఆందోళన చరమ దశలో ఉచ్చస్థాయిని అందుకుంటాయి..... కేవలం పన్నుల చెల్లింపు నిరాకరణ లేదా శాసనోల్లంఘన అనేవి అధికారం నుంచి తప్పుకునేలా ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకు వస్తాయి.... ఏడాది లోపల 'స్వరాజ్యాన్ని మహాత్ముడు ఎలా వాగ్దానం చేయగలుగుతున్నారు. మొదటి ప్రశ్నకు ఆయన యిచ్చిన సమాధానం నన్ను సంతృప్తి పరచింది. రెండవ ప్రశ్నకు ఆయన యిచ్చిన సమాధానం నన్ను నిరాశ పరచింది. మూడవ దానికి ఆయన జవాబు ఏమంత గొప్పది కాదు”. దీనినిబట్టి మనకు తెలుస్తున్న విషయం ఏమంటే, సుభాస్‌కు తొలినుంచీ గాంధీజీపట్ల గౌరవం వున్నది, కాని, ఎన్నడూ అవిమర్శనాత్మకంగా మాత్రం లేడు. గాంధీజీ నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉ ద్యమంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నప్పటికీ, స్వతంత్రం కోసం సాగే భారత రాజకీయ పోరాటంలో అహింస కీలకమన్న గాంధీజీ భావనతో ఆయన ఎన్నడూ ఏకీభవించలేదు. గాంధీజీకి మాత్రం యీ యువకునిపట్ల గొప్ప భావమే కలిగింది. బెంగాల్‌కు వెళ్ళి అక్కడ చిత్తరంజన్‌ దాస్‌ మార్గ నిర్దేశకత్వంలో పనిచేయ వలసిందిగా సుభాస్‌కు సూచించాడు.

చిత్తరంజన్‌ దాస్‌ బెంగాల్‌లో పేరుమోసిన బారిస్టర్‌, అపార సంపదకు అధిపతి, పట్టుదల కలిగిన జాతీయవాది. విప్లవాత్మక తీవ్రవాద వ్యూహాలనూ, వ్రాత ఛటొవదాు

మా ఎత్తుగడలనూ ఆయన | ఎనుడూ ఆమౌదించసప్పటికీ టన టా 7 వ. విష్లవకారులతో ఆయనకు పమ యణ . నన్నిపాత నంబంధాలు య ల . తరచుగా వారికి రా | దూసి, నాయపరమైన న గా న న ల జ కట [1 తొలుదొల్త ఆయన ఇతే లా బివిన్‌చంద్ర పాలకు శిమ్యునిగానూ, గాంధీకి వ్యతిరేకిగానూ వుండేవాడు.

1920 డిసెంబరులో బెంగాల్‌ నుంచి పలువురు ప్రతినిధులతో కలసి భారత జాతీయ కాంగైసు నాగపూర్‌ సమావేశాలకు చిత్తరంజన్‌ దాసు హాజరయ్యాడు. స్వరాజ్యం కోసం అహింస, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలన్న గాంధీ ప్రతిపాదనను ఓడించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇదే సమయంలో అఖిల భారత ఖిలాపత్‌ కమిటీతో గాంధీజీ పొత్తుపెట్టుకున్నాడు. న్వరాజ్స్‌ ఖిలాపత్‌లు రెండూ ఉద్యమ లక్ష్యాలుగా వుండాలన్నదే యీ సంయుక్త సంఘటనకు ప్రాతిపదికగా వున్నది. కాంగైసు మహానేత నుండి అయాచితంగా లభించిన యీ మద్దకుకు ఖిలాపత్‌ కమిటీ ఉప్పాంగిపోయి కృతజ్ఞతలు చెప్పింది. అఖిల భారత ఖిలాపత్‌ కమిటీ అధ్యక్షునిగా గాంధీజీని ఎన్నుకున్నది. నాగపూర్‌లో మున్నెన్నడూ ఎరుగని హిందూ-ముస్లిం ఐక్యత పూర్వరంగంలో, “ఏడాదిలో స్వరాజ్యాన్ని" సాధించటానికి ప్రతినిధులందరూ మద్దతు యివ్వాలంటూ గాంధీజీ ఆవేశంతో విజ్ఞప్తి చేశాడు. నత్వా(గ్రపాకి వుందే నిజమైన స్ఫూర్తితో ప్రతినిధులు త్యాగాలకు సిద్ధం కావాలని కూడా ఆయన పిలుపు యిచ్చారు. ఒకప్పుడు గాంధీజీకి వ్యతిరేకులుగా వున్న సి.ఆర్‌. దాస్‌, మోతీలాల్‌ నెహ్రూ,

లాలా లజపతిరాయ్‌వంటి వారితో సహా దాదాపుగా ్రతినిధులందరూ గాంధీ చేసిన విజ్ఞాపనను శిరోధార్యంగా భావించారు. చిత్తరంజన్‌ దాస్‌ అయితే గాంధీ పిలుపుతో తాదాత్యం చెంది గాంధీజీ నేతృత్వంలో స్వరాజ్య సాధన ఉద్యమాన్ని ప్రారంభించాలన్ను ప్రధాన తీర్మానాన్ని ప్రవేశ పెట్టటమే కాకుండా, తన యావదాస్తినీ దేశానికి విరాళంగా యిస్తానని వాగ్దానం చేశాడు. దీనితో పులకించి పోయిన గాంధీజీ ఆయనను వేదికపైనే సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్నాసాలు, లేఖలు 26

కౌగిలించుకుని దేశబంధు అన్న బిరుదును ప్రకటించాడు. ఆనాటి నుంచి యీ పేరుతోనే దేశవ్యాప్తంగా సి.ఆర్‌. దాస్‌ ప్రఖ్యాతి గాంచాడు. ఈ సందర్భంగా గమనించవలసిన విషయం ఒకటున్నది. స్వరాజ్యం కోసం 1921 నుంచి అహింస, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలన్న తీర్మానానికి నాగపూర్‌ సమావేశానికి హాజరైన దాదాపు వేయిమంది ప్రతినిధులు -కాంగ్రైెసు వాదులు, ఖిలాపత్‌ వాదులందరూ- దాదాపుగా మద్దతు యిచ్చారు. కాగా కేవలం యిరువురు మాత్రమే, అంటే, పండిత మదనమోహన మాలవ్య, మవామ్మదాలీ జిన్నాలు మాటత్రవే వ్యతిరేకించారు. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. తదనంతర కాలంలో మాలవీయ అఖిల భారత హిందూ మహాసభకు నాయకుడుకాగా, జిన్నా ముస్లింలీగ్‌ నాయకుడిగా మారి పాకిస్థాన్‌ ప్రచారానికి రూపకర్తగా నిలచాదు.

1921 ద్వితీయార్ధంలో సుభాస్‌ కలకత్తా చేరేనాటికి బెంగాల్‌లో చిత్తరంజన్‌ దాస్‌ మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. ఆయన కేవలం విప్లవకారుడు మాత్రమేకాదు, నిష్కళంక దేశభక్తుడు, ఎత్తుగడలలో ఆరితేరిన దిట్ట. 1917కు మునుపే ఆయన బెంగాల్‌ ప్రాంతీయ కాంగ్రెసు వార్షిక సమావేశాలలో అధ్యక్షోపన్యాసం చేస్తూ బెంగాల్‌ ప్రజలకు విస్పష్టమైన పిలుపు యిచ్చాడు: =భ్రార్రత్రదేశంలోని కోట్లాది ప్రజారాశు లను గుర్తించి, తనలో కలువుకోనట్లయితే .....న్వవరిపాలనను వేము అంగీకరించబోము. భారత దేశానికి నేను స్వపరిపాలనను అడిగినపుడు, ప్రస్తుత నిరంకుశాధికార యంత్రాంగం స్థానంలో మరో నిరంకుశాధికార యంత్రాంగాన్ని మరో నియంతృత్వాన్ని నేను కోరలేదు. నా ఉద్దేశ్యంలో నిరంకుశాధికార యంత్రాంగమంటే, నిరంకుశాధికార యంత్రాంగమే అది ఇంగ్లీషు వారిదైనా కావచ్చు, ఆంగ్లో-ఇండియన్స్‌దైనా కావచ్చు, లేదా భారతీయులదైనా కావచ్చు అంతా ఒకటే. మనం నిరంకుశాధికార యంత్రాంగాన్ని కోరటం లేదు.... ప్రజల ద్వారా, ప్రజల కోసం ఏర్పడే స్పపరిపాలన మనకు కావాలి.... భారత (ప్రజల అఖభీష్టాన్ని పునాదిగా వేసుకున్న స్వపరిపాలనను మనం కోరుతున్నాము”.

స్వరాజ్యాన్ని సాధించు కోవాలంటే హిందూ-ముస్లిం ఐక్యత యొక్క ప్రాధాన్యాన్ని యీ ప్రసంగంలోనే సి.ఆర్‌. దాస్‌ నొక్కి చెప్పాడు. పాశ్చాత్య విద్యను అభ్యసించిన మధ్యతరగతి జాతీయ వాదులు భారతీయతను నింపుకుని పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ వున్న పీడిత జనుల వద్దకు వెళ్ళాలని ఆయన కోరుకున్నారు. అటు పిమ్మట 1928లో అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెసు అధ్యక్షుని హోదాలో చేసిన సుప్రసిద్ధ ప్రసంగంలో, భారతదేశంలో స్వరాజ్యం “98 శాతం మందికి! వాగన్‌ ఛదపద్యాన

తప్పనిసరిగా లభించాలన్న విశిష్టమైన ప్రకటనతో ఆయన భావాలు మరింత పరిపుష్టం అయ్యాయి. ఇలా పరివర్తన చెందిన సి.ఆర్‌. దాస్‌నే 1921లో యువ సుభాస్‌ కలకత్తాలో కలుసుకున్నాడు. దేశబంధుతో జరిగిన ప్రథమ సమావేశం గురించి భారతీయ పోరాటం అన్న రచనలో భావోద్వేగంతో కూడిన చిత్రణను సుభాస్‌ యిచ్చారు. “నన్ను సమీపిస్తున్న ఆ ఆజానుబాహువు రూపం యిప్పటికీ నా మనోనేత్రం ముందు కదలాడుతూనే వున్నది. రాజకీయ కారణాల రీత్యా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థిగా నేను సలహా నిమిత్తం కలకత్తా బార్‌ నాయకులలో ఒకరుగా వున్న ఆయనను కలుసుకున్నప్పటి శ్రీ దాస్‌ వేరు, యీయన వేరు. ఒక్క రోజులో వేల రూపాయలు సంపాదించి ఒక్క గంటలో వేల రూపాయలను ఖర్చు పెట్టినప్పటి శ్రీ దాస్‌ కాదీయన. అయితే, ఎవరైతే యువజనులకు అన్ని వేళలా మిక్రునిగా మెలగుతూ, వారి ఆకాంక్షలను అవగాహన చేసుకుంటూ, వారి బాధలపట్ల సానుభూతిని ప్రదర్శించారో ఆ శ్రీ దాసే యీయన. ఎవరైతే తాను దేని నిమిత్తమో తెలిసిన వాడో, ఎవరైకే తనకున్న దానినంతా త్యాగం చేశాడో, ఎవరైతే, తాము యివ్వగలిగిన దానినంతా యివ్వవలసిందిగా యితరులను కోరుతున్నాదో అలాంటి వ్యక్తి యిక్కడ వున్నాడని యీ సమావేశం సందర్భంగా నేను భావించాను, -యీ వ్యక్తికి యవ్వనం తాత్కాలికం కాదు, స్వాభావిక ధర్మం. మా సమావేశం ముగిసే సమయానికి నేనొక దృఢ నిశ్చయానికి వచ్చాను. నాకొక నేత లభించాడు, నేను ఆయనను అనుసరిస్తాను అన్న భావన నాలో పాదుకున్నది". 1921లో బెంగాల్‌లో ముఖ్యమైన రెండు సంఘటనలు సంభవించాయి. మిద్నపూర్‌ జిల్లాలో పెద్దయెత్తున పన్నుల నిరాకరణ ప్రచారం, తేయాకు తోటల కార్మికులనేకులు చాందపూర్‌లోకి ప్రవేశించటం. వారిపై పోలీసుల పాశవిక చర్య, అందుకు నిరసనగా అస్సాం-బెంగాల్‌ రైల్వే సమ్మె జరిగింది. సహాయ నిరాకరణ ఉ ద్యమానికి తలవంచిన వలస ప్రభుత్వం గ్రామాలలో స్వపరిపాలనను ప్రవేశపెట్టే చర్యలను చేపడతానని వోమీ యిచ్చింది. అంటే, యిక్కడ ప్రతి ఒక్క గ్రామ సముదాయానికి యూనియన్‌ బోర్డును ఏర్పాటు చేస్తారన్న మాట. ఈ మేరకు వచ్చిన శాసనాన్ని బెంగాల్‌ జాతీయవాదులు తీవ్రంగా విమర్శించారు. మొట్టమొదటిదేమంటే, అధికారాలన్నీ జిల్లా అధికారుల చేతిలో వుంటాయేగాని, గ్రామస్తులకు బదిలీ కావు, రెండవదేమంటే, యూనియన్‌ బోర్డుల ఏర్పాటుతోపాటే అదనపు పన్నులు కూడా వస్తాయి, అయితే గ్రామస్తులకు మాత్రం అదనంగా ఎలాంటి సౌకర్యాలూ సమకూరవు. ఈ శాసనాన్ని తమ జిల్లాకు వర్తింప చేయరాదంటూ మిద్నపూర్‌ ప్రజానీకం సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 28

న్యాయవాదియైన వీరేంద్రనాథ్‌ సస్మాల్‌ నేతృత్వంలో పెద్దయెత్తున అందోళన చేపట్టారు, దానితోపాటే, నూతనంగా ఏర్పాటైన యూనియన్‌ బోర్డులు విధించిన పన్నులను చెల్లించటానికి తిరస్కరించారు.

వలసపాలకులు అమానుషమైన అణచివేత చర్యలను చేపట్టారు -మూకుమ్మడి అరెస్టులు, బలవంతంగా ఆస్తుల స్వాధీనం, పోలీసులు, మిలటరీ ద్వారా ప్రజల్లో భయోత్సాతాన్ని సృష్టించడం వంటి చర్యలకు పాలకులు పూనుకున్నారు. దీనిగురించి సుభాస్‌ చంద్ర యీ విధంగా పేర్కొన్నాడు: “ఈ బీభత్సకాండ 1921వ సంవత్సరమంతా కొనసాగింది. అయితే, 1922వ సంవత్సరంలో అంతిమంగా యీ శాసనాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. పన్నుల నిరాకరణ ఆందోళన సాధించిన విజయం మిడ్నపూర్‌ ప్రజలకు గణనీయమైన శక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ (ప్రసాదించింది”.

ఇకపోతే మరో సంఘటన బెంగాల్‌, అస్సాం ప్రాంతాలకు సంబంధించినది. అస్సాంలో తేయాకు తోటల యజమానులైన యూరోపియన్లు దాదాపుగా పది లక్షల మందిగా వున్న కూలీలను దుర్మార్గంగా అణచివేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే, ఒకరకంగా వారిని అర్ధ బానిసలుగా చూసేవారు. స్లాంటర్స్‌ రాజ్‌ టు న్వరాజ్‌ అన్న అమలేందు గుహ (గ్రంథంలో యీ దుర్శార్గాల గురించిన పూర్తి వివరాలు లభిస్తాయి. స్వరాజ్యం అన్న పిలుపు తేయాకు తోటల కార్మికులకు కూడా చేరింది. యజమానుల అణచివేతలకు వ్యతిరేకంగా వారు వినూతన పద్ధతిలో నిరసన తెలపసాగారు. తేయాకు కార్మికులు, వేల సంఖ్యలో తూర్పు బెంగాల్‌లోని పద్మానదీ తీరానగల చాంద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ దిశగా యాత్రను ప్రారంభించారు. గాంధీజీ యిచ్చిన స్వరాజ్యం పిలుపుకు స్పందనగా తామీ యాత్రను ప్రారంభించినట్లు వారు ప్రకటించారు.

చాంద్‌పూర్‌కు చేరేందుకు వారిని వలస పాలకులు అనుమతించారు. ఒక రాత్రివేళ వారంతా నిద్రలో వున్న సమయంలో క్రూరుడైన భారతీయ అధికారి యిచ్చిన ఉత్తర్వుల మేరకు సాయుధ గూర్చా పోలీసులు వారిపై కిరాతకమైన దాడి చేశారు. ఈ దుర్ధటన బెంగాల్‌ అంతటా అసంతృప్తి జ్వాలలను రగిలించింది. సి. ఆర్‌.దాస్‌ వెనువెంటనే చాంద్‌పూర్‌కు పయనమయ్యాడు. ఆయనతోపాటు, ఆయన భార్య బసంతి దేవి, మహిళా కార్మికుల నాయకురాలు సంతోష్‌ కుమారి దేవి కూడా వెళ్ళారు. చాంద్‌పూర్‌లోనే వున్న తేయాకు కార్మికులకు సంఘీభావంగా అస్సాం, బెంగాల్‌ రైల్వే కార్మికులు, అదేవిధంగా స్టీమర్‌ మరమ్మతు కార్మికులు సార్వత్రిక సమ్మె చేశారు. ప్రముఖ న్యాయవాది, చిట్టగాంగ్‌ కాంగ్రెసు నాయకుడు అయిన జె.ఎం, సేన్‌గుష్తా యీ సమ్మెకు కీలక నాయకునిగా వున్నాడు. ఈ సేన్‌గుప్తాయే తదనంతర కాలంలో, అంటే, సి.ఆర్‌. దాస్‌ మరణానంతరం బెంగాల్‌ కాంగైసు నాయకత్వానికి సంబంధించి ౮.

సుభాస్‌కు గట్టి ప్రత్యర్థిగా నిలచాడు. అయినప్పటికి, సమ్మెకు నాయకత్వం వహించినందుకుగాను సేన్‌గుష్తాను తన సుప్రసిద్ధ గ్రంథమైన భారత పోరాటంలో సుభాస్‌ శ్లాఘించాడు.

పైన పేర్శాన్న ఘటనలన్నీ సుభాస్‌ కలకత్తాకు రాకముందే సంభవించాయి. అయితే 1921 జూలై-ఆగస్టు నాటికి అవియింకా బెంగాల్‌ ప్రజల మనస్సుల్లో సజీవంగానే నిలచి వున్నాయి. 1921 నవంబరు 17వ తేదీన వేల్స్‌ రాకుమారుని భారతదేశ పర్యటన యువ సుభాస్‌కు మొట్టమొదటి పరీక్షగా మారింది. రాకుమారుని పర్యటనను బహిష్కరించి, ఆ రోజున హర్తాళ్‌ నిర్వహించాలని ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడల్లా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కాంగ్రెసు వర్మింగ్‌ కమిటీ పిలుపు యిచ్చింది. 17వ తేదీన సంపూర్ణ హర్తాళ్‌ను, నల్ల జెండాల ప్రదర్శనను జయప్రదం చేసేటందుకై కార్యకర్తలను సమీకరించే బాధ్యతను సుభాస్‌కు సి.ఆర్‌. దాస్‌ అప్పగించారు. సుభాస్‌ రాత్రింబవళ్ళు రాక్షసుడిలా పనిచేశాడు. ముఖ్యంగా యువ కార్యకర్తలను వుత్సాహపరిచాడు. తత్భలితంగా హర్తాళ్‌, దానితోపాటే నల్ల జెండాల ప్రదర్శన సంపూర్ణంగా జయప్రదమయ్యాయి. దీనితో రాత్రికి రాత్రే యువ సుభాస్‌ చంద్ర బోస్‌ బెంగాల్‌కు చెందిన జాతీయ నాయకునిగానూ, సి.ఆర్‌. దాస్‌ ముఖ్య అనుచరునిగానూ, యువజనుల నాయకునిగానూ పేరు గడించాడు.

అనాటికింకా కేంట్రిగ్ట్‌లోనే వున్న సుభాస్‌ మిత్రులు, వేల్స్‌ యువరాజు కలకత్తా సందర్శన విశేషాలను తెలుసు కోవాలన్న ఆతురతతో వార్తా పత్రికల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తరువాత ఖితిష్‌ ఛటోపాధ్యాయ ఆనాటి విశేషాలను యిలా పేర్మొన్నారు. కలకత్తాలో బాయ్‌కాట్‌ పూర్తిగా విఫలమైందని, ప్రజలందరూ వరుసల్లో నిలచి రాకుమారుని స్వాగతిస్తూ 'కీ శై (దీర్ధకాలం వర్టిల్లుగాక) అంటూ నినదించారని ఎక్కువ భాగం ఆంగ్ల పత్రికలు పతాక శీర్షికల్లో వార్తలను యిచ్చాయి. ఇవి చదివిన కేంట్రిక్డలోని యువ జాతీయవాదులు నిరాశలో కూరుకు పోయారు. ఇదే సమయంలో వారిలో ఒక అనుమానం తలయెత్తింది. భారత ప్రజలు ఎన్నడూ కీ జూ అని మాత్రమే అనరుగదా, యిదేమిటి యిలా వార్త వచ్చిందని అనుకోసాగారు. వీరిలా మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే వాళ్ళ స్నేహితుడొకరు బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ అధికారిక పత్రికయైన డైలీ హెరాల్ట్‌ను తీసుకుని లండన్‌ నుంచి వచ్చాడు. దాని పతాక శీర్షిక యిలా వున్నది: కలకత్తాలో సంపూర్ణంగా జయ(్రదమైన బాయ్‌కాట్‌. పట్టణ వీధుల్లో వేలసంఖ్యలో (ప్రజలు నిలచి, నల్లజెండాలు వూపుతూ, స్వాధీన్‌ భారత్‌ కీ జై అంటూ నినాదాలు చేశారు, కార్యకర్తల యువ నాయకుడైన సుభాస్‌ గురించి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 30

కూడా వార్త వున్నది. ఇదంతా చదివిన కేంటబ్రిగ్డ్‌లోని ఆయన స్నేహితులు సంతోషంతో ఉప్పొంగి పోయారు. అలానే, వాస్తవాలను వక్రీకరించిన రాయిటర్‌ వార్తా సంస్థను చీదరించుకున్నారు. డిసెంబరు 24న మరోసారి యువరాజు కలకత్తా పర్యటన ఖాయమైంది. దేశబంధు సూచనల మేరకు బ్రహ్మాండమైన ప్రజా ప్రదర్శనకు సుభాస్‌ సన్నాహాలు చేశాడు. ఈసారి ప్రభుత్వం జాగ్రత పడింది. వేల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేసింది. పట్టణంలోని రెండు చెరసాలలు క్రిక్కిరిసి పోయాయి. ఇవికాక, తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేశారు. అవికూడా స్వల్ప వ్యవధిలోనే నిండిపోయాయి. దీనంతటినీ సుభాస్‌ యిలా (గ్రంథస్థం చేశాడు. “అప్పటిలో ప్రభుత్వం తీవ్రమైన చర్యలనే చేపట్టింది. దేశబంధు దాస్‌తోపాటు ఆయన సన్నిహిత సహచరులను అరెస్టు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1921 డిసెంబరు 10వ తేదీ సాయంత్రానికల్లా మేమందరం జైలులో వున్నాము”. బెంగాల్‌లోనూ యితరంగానూ సాగిన అరెన్సులు ఉద్యమాన్ని దెబ్బతీయకపోగా మరింత ఉదృతం కావటానికి తోద్బడ్డాయి. 1921 డిసెంబరు 24న యువరాజు కలకత్తాకు విచ్చేశాడు. ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసేందుకై కొన్ని రోజుల ముందే వైస్రాయ్‌ లార్డ్‌ రీడర్‌ కలకత్తాకు చేరుకున్నాడు. వేల్స్‌ యువరాజును విందుకు ఆహ్వానించేటందుకు తొలుత కలకత్తా బార్‌ సభ్యులు అంగీకరించారు. కాని దేశబంధుతోపాటు సుభాస్‌ చంద్ర తదితర నాయకులను అరెస్టు చేయటంపట్ల ప్రజలలో పెల్లుబికిన అసంతృప్తిని చూసిన పిమ్మట విందు యివ్వటానికి బార్‌ సభ్యులు నిరాకరించారు. దీనితో భారత ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆనాటి పరిస్థితిని తన ఖారత పోరాటం అన్న (గ్రంథంలో సుభాస్‌ విశదంగా పేర్కాన్నాడు. “శాసనోల్లంఘన ఉద్యమం బెంగాల్‌లో తీవ్రరూపాన్ని తీసుకున్నప్పటికీ, ఎగువ భారతంలో కూడా బలంగానే వున్నది, వాస్తవానికి ఏ ఒక్క ప్రాంతమూ యీ న... నూరు అదోల | . నా. నట దక్షిణ భారతం లోని మలబార్‌ ప్రాంతంలో 81 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మోష్లా తిరుగుబాటు వంటివి ప్రభుత్వ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. భారతదేశం వెలుపల బఐర్లండ్‌లో సిన్‌ ఫిన్‌ ఉద్యమం బ్రహ్మాండమైన రీతిలో విజయాన్ని సాధించింది. తత్ఫలితంగా 1921 డిసెంబరు 6వ తేదీన గ్రేట్‌ బ్రిటన్‌తో సంధి పత్రంపై సంతకాలు జరిగాయి. అంతకు కొన్ని మాసొల ముందు ముస్తాఫా కమల్‌ పాషాతో ఆప్టనిస్థాన్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీని తరువాత పర్షియా, సోవియట్‌లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈజిస్టలో జాతీయ వఫ్త్‌ పార్టీ ఆఫ్‌ సయ్యద్‌ జుగ్‌లుల్‌ పాషా అన్నది చాలా బలంగానూ, చురుకుగానూ వున్నది. ఆ విధంగా యావత్‌ ముస్లిం ప్రపంచం గ్రేట్‌ బ్రిటన్‌కు వ్యతిరేకంగా ఐక్యమవుతున్నట్లుగా కన్పించింది, దీని ప్రభావం అనివార్యంగా భారతదేశంలోని ముస్లింలపై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగైసుతో ఒడంబడిక కుదుర్చు కోవటానికి లార్డ్‌ రీడింగ్‌ ప్రభుత్వం ఆదుర్దా పదటంలో ఆశ్చర్యం లేదు”.

ఉదారవాదిలైన పండిట్‌ మదన మోహన మాలవీయ ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వం శాంతి యత్నాలను ప్రారంభించింది. కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైలులో వున్న దేశబంధును ఆయన ఇంటర్వ్యూ చేశారు. అలానే, సుప్రసిద్ధ జాతీయ ముస్లిం నాయకుడైన మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌ను కూడా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ప్రతిపాదన యిలా వున్నది. సహాయ నిరాకరణ ఉ ద్యమాన్ని తక్షణమే ఉపసంహరించు కోవటానికి కాంగ్రెసు అంగీకరించేటట్లయితే, యువరాజు పర్యటనను ప్రజలు బహిష్కరించరు. అప్పుడు ప్రభుత్వం కార్యకర్తలను చట్ట వ్యతిరేకులుగా భావిస్తూ జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుని, సత్యాగ్రహులను విడుదల చేస్తుంది. వైస్రాయ్‌ మరో అడుగు ముందుకు వేశాడు. రెండేళ్ళ కఠిన కారాగారవాస శిక్షపడి కరాచీ జైలులో వున్న సువిఖ్యాత ఆలీ సోదరులను విడచి పెద్దామన్న వోమీ యివ్వటానికి సైతం సిద్ధపడ్డాడు. ఇలాంటి రాజీకి దేశబంధు, మౌలానా అజాద్‌లు సుముఖంగా వున్నారు, కాని, యువ జాతీయవాదులు వ్యతిరేకించారు. సుభాస్‌ చంద్ర బోస్‌ యీ విధంగా పేర్కొన్నారు. *ఈ విషయాన్ని దేశబంధు మావద్ద ప్రస్తావించి మా అభిప్రాయాన్ని కోరినపుడు, నాతోసహా యువకులంతా యిలాంటి షరతులతో కూడిన సంధిని తీవ్రంగా వ్యతిరేకించారు”.

ఒప్పందానికి ప్రతిపాదించిన షరతులను అంగీకరించ వలసిందిగా గాంధీజీని కోరుతూ దేశబంధు, అజాద్‌లు టెలిగ్రామ్‌ పంపించారు. కాని, గాంధీజీ అంగీకరించ లేదు. ఆలీ సోదరులను, ఖిలాపత్‌ ఉద్యమకారులందరినీ, అలానే కాం(గైసు సత్యాగ్రహులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఆయన కోరాడు. జాతీయవాదులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి నిర్దిష్ట తేదీని ప్రకటించాలని కూడా ప్రభుత్వాన్ని కోరాడు. కాని, వైస్రాయ్‌ యిందులో ఏ ఒక్కదానినీ అంగీకరించలేదు, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 82

ఒప్పందం కోసం మాత్రం ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. సవాయ నిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమం నిరాటంకంగా సాగుతూనే వున్నది. సర్‌ వాలంటైన్‌ ఛిరోల్‌ మాటల్లో చెప్పాలంటే,'భారతదేశం సాయుధరహిత తిరుగుబాటు అంచున వున్నది*.

మనమిక్కడ కాస్త ఆగి, వాస్తవ రూపం దాల్చని ప్రతిపాదిత రాజీ గురించిన వివాదాన్ని చూద్దాము. దేశబంధు, మౌలానా అజాద్‌లతోపాటు మరికొంతమంది (బహుశ మోతీలాల్‌ నెహ్రూ కావచ్చు) రాజీని బలంగా సమర్ధించారని, కాని, గాంధీజీ తిరస్కరించారని యిప్పటికే మనం చూశాము. సుభాస్‌ చంద్ర బోస్‌ తొలుత (ఆయన మాటల్లోనే) తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని, చిట్టచివరకు దేశబంధు వైఖరినే సమర్ధించాడు. ఆయనిలా రాశాడు: “మహాత్ముడు తీవ్రమైన తప్పిదం చేశాడన్న భావన రాజకీయ ఖైదీల్లోనూ, అదేవిధంగా కాంగ్రెసు (శ్రేణుల్లోనూ వున్నది”.

డెబ్బయ్‌ ఐదేళ్ళు గడచిన తరువాత యీనాడు ఒక్కసారి వెనుదిరిగి ఆనాటి ఘటనలను పరిశీలించినట్లయితే, దేశబంధు, సుభాస్‌లపట్ల మనకెంత గాధానురక్తి వున్నప్పటికీ ఆ సందర్భంలో మహాత్ముని నిర్ణయమే సరైనదన్న ఆలోచన మనకు వస్తుంది. సుప్రసిద్ధులైన ఆలీ సోదరులతోపాటు, ఖిలాఫత్‌ ఉద్యమ ఖైదీలందరినీ విస్మరించి కేవలం కాంగ్రెసు సత్యాగ్రహుల విడుదలను మాత్రమే ఆశించి ఉద్యమాన్ని విరమించి వున్నట్లయితే, దానిని ముస్తింలపట్ల కాంగ్రెసు విద్రోహ చర్యగానే భావించి వుండేవారు, కాంగ్రెసు, ఖిలాఫత్‌ ఐక్యత దెబ్బతిని వుండేది. రెండవదేమంటే, రౌండ్‌టేబుల్‌ సమావేశానికి నిర్దిష్ట తేదీపై అంగీకారం కుదరనట్లయితే యీ సమావేశాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం తేలికగా వాయిదావేసి వుద్యమం ఐలహీనపడేటట్లు చేసేది.

నిజానికి 1921 డిసెంబరులో భారత జాతీయ కాంగ్రెసు వారిక సమావేశాలు అహమ్మదాబాద్‌లో జరిగినపుడు ్రతినిధుల్లో సమరశీల భావాలు వెల్లివిరిశాయి. ఈ సమావేశాలకు అధ్యక్షునిగా ఎన్నికైన సి.ఆర్‌. దాస్‌ జైలులో వున్నాడు. కనుక ఆయనకు బదులు ప్రముఖ ఖిలాఫత్‌ నాయకుడు హక్షీం అజ్మల్‌ ఖాన్‌ అధ్యక్షత వహించారు. దీనిగురించి సుభాస్‌ బోస్‌ యీవిధంగా రాశాడు. “అహమ్మదాబాద్‌ కాంగ్రెసులో మహోత్సాహం వెల్లివిరిసింది. సామూహిక శాసనోల్లంఘన విధానాన్ని చేపట్టి...... అత్యవసర ఉత్తర్వులను ఉల్లంఘించి జైలుకు వెళ్ళవలసిందిగా యావద్దేశ ప్రజలకు ప్రధాన తీర్మానం పిలుపు యిచ్చింది”.

1922 ఫిబ్రవరి 1వ తేదీన వైస్రాయకి ఒక వారం గడువు యిస్తూ గాంధీజీ తుది హెచ్చరిక చేశాడు. దేశవ్యాప్తంగా పన్నుల నిరాకరణ ఆందోళన చేపడతామని, ముందుగా దీనిని గుజరాత్‌లోని బార్జోలీలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బెంగాల్‌ యుపి, ఆంధ్రా ప్రాంతాలు ఉద్రేకంతో వూగిపోయాయి. సామూహిక పన్నుల తాగాక ఫటోవన్యాయ

నిరాకరణ మొదలైంది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరాలో రైతు సత్యాగ్రహులను పోలీసులు పాశవికంగా అణచి వేశారు. ఆవేశాన్ని పట్టలేని ప్రజలు ప్రతీకార చర్యలకు దిగి పోలీసు స్టేషన్‌ను తగులపెట్టారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు కాలి పోయారు. దీనితో భయకంపితుదైన గాంధీజీ దేశవ్యాప్త సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వకపక్షంగా, నిరవధికంగా నిలిపి వేశాడు. జైలులో వున్న సి.ఆర్‌. దాస్‌, మోతీలాల్‌ నెహ్రూ తదితరులు ఆగ్రహంతో వూగిపోయారు. సుభాస్‌ చంద్ర బోస్‌ కూడా ఆవేదన, ఆగ్రహం పెల్గుబుకుతుండగా యిలా పేర్కొన్నాడు. “ప్రజల ఉత్సాహం మిన్నంటుతున్న తరుణంలో తిరోగమించ వలసిందిగా ఉత్తర్వులను విన్సించటం జాతీయ విపత్తు మినహా మరేమీ కాదు”.

ఇలాంటి సమయంలో గాందీజీ తన అనుచరులను వుద్దేశించి అస్పృశ్యతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారాందోళనను చేపట్టాలని, (గ్రామాల్లో నిర్మాణాత్మక కార్యకలాపాలను చేపట్టాలని పిలుపు యిచ్చాడు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీచేసి బ్రిటిష్‌ విధేయులను ఓడించాలని సి.ఆర్‌. దాస్‌ తదితరులు భావించారు. శ్రీ దాస్‌ మాటల్లో చెప్పాలంటే, యిది "రాజ్యాంగాన్ని లోపలినుంచి విధ్వంసమొనర్చటం. 1922 నాటి భారత జాతీయ కాంగైసు గయా సమావేశాలకు అధ్యక్షత వహించిన సి.ఆర్‌. దాస్‌ తన సరికొత్త ఎత్తుగడల పంథాను సమావేశాల్లో ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను గాంధీజీ వ్యతిరేకించటంతో అత్యధిక సంఖ్యాకులైన ప్రతినిధులు దీనికి వ్యతిరేకంగా ఓటు చేశారు. కాగా, మోతీలాల్‌ నెహ్రూ, విఠల్‌బాయ్‌ పటేల్‌, హకీం అజ్మల్‌ భాన్‌లు దీనిని సమర్దించారు. ఈ పంథాను ముందుకు తీసుకు వెళ్ళేందుకుగాను భారత జాతీయ కాంగ్రెసు లోపలనే స్వరాజ్య పార్టీని స్థాపించనున్నట్లు దేశబంధు దాస్‌, మోతీలాల్‌ నెహ్రూలు ప్రకటించారు. నిజానికి కాంగైసు రెండు శిబిరాలుగా చీలిపోయింది -వీరిని గాంధీవాదులు, స్వరాజ్యవాదులు లేదా యథాతథవాదులు (నో ఛేంజర్స్‌), మార్చువాదులు (ప్రో భేంజర్స్‌) అన్న పేరుతో పిలిచారు. సుభాస్‌ చంద్ర బోస్‌ మహోత్సాహంగా స్వరాజ్య పంథాను స్వీకరించి, బెంగాల్‌లో దేశబంధుకు కుడిభుజంగా మారాడు.

నవోయ నిరాకరణ-ఖిలావత్‌ ఉద్యమం నీరుగారి పోవటంతో హిందూ-ముస్లిం ఐక్యతకు పెద్ద విభూతమే తగిలింది. స్వామి (శద్ధానంద నాయకత్వంలోని పొందూ మహాసభ శుద్ధి ఉదృమంగా పేర్గాంచిన కరుడుకట్టిన హిందూ ఛాందసవాద ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఎందుకంటే, 1921లో కాంగ్రెసు-ఖిలాఫత్‌ ఉద్యమం ఉచ్చదశలో వున్నపుడు సుప్రసిద్ధమైన జుమా మసీదు ముందు ఢిల్లీ షాహి ఇమామ్‌ సరసన నిలచి హిందూ-ముస్లిం ఐక్యత కోసం స్వామి శ్రద్దానంద మహోద్వేగంతో పిలుపు యిచ్చాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు 84

ఇందుకు ప్రతిగా ముస్లింలు టంజిమ్‌, తభ్లిఘ్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇదికూడా దుందుడుకువాద, మతతత్వ స్వభావం కలిగినదే. మొత్తంమీద యీ సమయంలో మత భావనలు ప్రజ్వరిల్లాయి.

హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా బెంగాల్‌లో స్వరాజ్యవాదులు పెద్దగా పురోగమించ లేరని సి.ఆర్‌. దాస్‌ గ్రహించాడు. కనుకనే ఆయన బెంగాల్‌కు చెందిన ప్రముఖ ముస్లిం రాజకీయ నాయకులతో చర్చలు జరిపాడు. దాని పర్యవసానంగా హిందూ-ముస్లింల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే తదనంతర కాలంలో బెంగాల్‌ ఒడంబడికగా పేరుపొందింది. ఈ సందర్భంగా స్వరాజ్యవాదుల కార్యక్రమాలను బలపరుస్తామని ముస్లిం నాయకులు వాగ్దానం చేయగా, బెంగాల్‌లో ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో నిర్దిష్ట శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామని స్వరాజ్యవాదులు వాగ్దానం చేశారు. ఈ ఒడంబడిక ముస్లింలలో బాగా ప్రాచుర్యం పొందగా, ముస్లింలకు ఉ ద్యోగాలలో రిజర్వేషన్‌ అన్న అంశం బెంగాల్‌లోని ఉన్నత విద్యావంతులకు ఆగ్రహాన్ని కల్గించింది. బెంగాల్‌లోని సిరాజ్‌గంజ్‌ ప్రాంతీయ కాంగ్రెసు సదస్సు యీ ఒడంబడికకు ఆమోదాన్ని తెలిపింది. ఈ ఒడంబడికను ఆమోదించనట్లయితే తాను రాజీనామా చేయగలనని సి.ఆర్‌. దాస్‌ బెదిరించటంతో సదస్సు ఆమోదముద్ర వేసింది. ఈ తరుణంలో సి.ఆర్‌. దాస్‌ను, బెంగాల్‌ ఒడంబడికను యువకుడైన సుభాస్‌ చంద్ర బోస్‌ దృఢంగా సమర్ధించాడు.

బెంగాల్‌లోని స్థానిక స్వీయ ప్రభుత్వంలో మంత్రిగా వున్న సురేంద్రనాథ్‌ బెనర్జీ 1923లో కలకత్తా మున్సిపల్‌ చట్టానికి సవరణ తెచ్చాడు. ఈ చట్టాన్ని అనుసరించి పురపాలక సంఘానికి ఎక్కువ అధికారాలు లభిస్తాయి, ఓటు హక్కు కూడా విస్తరిస్తుంది, ఎన్నికైన వారికి శక్తి సమకూరుతుంది. ఈ కొత్త చట్టాన్ని అనుసరించి 1924లో కలకత్తా కార్పొరేషన్‌కు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో స్వరాజ్యవాదులు, ముస్లింలతో పొత్తుపెట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. నూతన కలకత్తా కార్పొరేషన్‌కు మొట్టమొదటి భారతీయ మేయర్‌గా దేశబంధు ఎన్నికయ్యాడు. షహీద్‌ సుహ్రవర్ది (1946లో యీయనే ముస్లిం లీగ్‌ నాయకునిగా బెంగాల్‌కు ముఖ్యమంత్రి అయ్యాడు, తదనంతర కాలంలో తూర్పు పాకిస్థాన్‌లో అవామీ లీగ్‌ స్థాపకుడయ్యాడు) డిప్యూటీ మేయర్‌గా నియమితమయ్యాదు.

కలకత్తా కార్పొరేషన్‌కు నూతన ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా సుభాస్‌ చంద్ర బోస్‌ను సి.ఆర్‌. దాస్‌ నియమించాడు -బహుశ సుభాస్‌ తన జీవితంలో నిర్వహించిన ఏకైక అధికారిక పదవి యిదేనేమో. కలకత్తాలోని అణగారిన పేదలకు, మధ్యతరగతి వారికి ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలని దేశబంధు తలచాడు. పట్టణ పేదలకు తక్కున ఖర్చుతో ఆరోగ్య సదుపాయాలను కల్పించేటందుకు, ప్రధానంగా త్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మహిళల కోసం (ప్రసూతి కేంద్రాలను నెలకొల్చేటందుకు కలకత్తా కార్పొరేషన్‌ పూనుకోవాలని ఆయన ఆశించాడు. స్వరాజ్యవాదుల అధ్వర్యంలో వున్న కలకత్తా కార్పొరేషన్‌ చేపట్టే సత్మార్యాలను ప్రచారంలోకి తేవాలని కూడా భావించాడు. ఈ ఆలోచనలతోనే కలకత్తా కార్పొరేషన్‌కు చెందిన నూతన విద్యా, వైద్య విభాగాలకు తగిన బాధ్యులను చూడవలసిందిగా సుభాస్‌ను దేశబంధు కోరాడు. అలానే, ప్రచార బాధ్యతలను చేపట్టేందుకుగాను జాతీయవాద భావాలు కలిగిన ప్రతిభావంతుడైన పాత్రికేయుని కోసం అన్వేషణ సాగించ వలసిందిగా ఆదేశించాడు.

వలస ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ స్వల్ప వ్యవధిలోనే పలు సత్మార్యాలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో సుభాస్‌ చంద్ర అవిశ్రాంతంగా పనిచేశాడు. ఆయన సమకాలీనులు, ఉపేంద్రనాథ్‌ బెనర్జీవంటి విప్లవకారులు తమ సృృతులలో ప్రధాన కార్యనిర్వహణాధికారిగా సుభాస్‌ చేసిన కృషిని కొనియాడారు.

సుభాస్‌ స్వయంగా భారతీయ పోరాటం అన్న రచనలో కలకత్తా పురపాలక సంఘం కృషిని యిలా పేర్ళొన్నాడు: “నూతన పాలనలో ప్రజలకు మేలుచేసే నూతన చర్యలు త్వరితగతిని ఆచరణలోకి వచ్చాయి. మేయర్‌తో సవా కౌన్సిలర్‌లుగా ఎన్నికైన స్వరాజ్యవాదులు, యితర పాలక బాధ్యులు స్వదేశీ ఖద్దరు ధరించి వచ్చేవారు. ఉ ద్యోగుల అధికారిక యూనిఫాంగా ఖద్దరు వాడకం ప్రారంభమైంది. పలు వీధులకు, ఉద్యానవనాలకు తిరిగి భారతదేశానికి చెందిన మహామహుల పేరులను పెట్టటం జరిగింది. మొట్టమొదటిసారిగా విద్యావిభాగం ప్రారంభమైంది. కేంట్రిక్టిలో పట్టభద్రుడైన సుప్రసిద్ధ భారతీయుడు కె.పి. ఛటోపాధ్యాయకు దీని బాధ్యతను అప్పచెప్పారు. నగరమంతటా బాలబాలికలకు ఉచితంగా ప్రాథమిక విద్యను బోధించే పాఠశాలలు వెలిశాయి. పురపాలక సంఘ ద్రవ్య సహాయంతో నడిచే ఆరోగ్య సంస్థలు ప్రతి వార్డులోనూ ప్రారంభమయ్యాయి..... పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు వీలుగా వేర్వేరు జిల్లాల్లో వైద్యశాలలను పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. కానుగోళు లి చేసే సందర్భంలో దేశీయ సరకులకే ప్రాధాన్యం లభించింది. నూతన నియామకాల సందర్భంగా ముస్లింలు, యితర మైనారిటీల వాదనలకు మొట్టమొదటి సారిగా గుర్తింపు లభించింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో పిల్లల కోసం ఆసుపత్రులు నెలకొన్నాయి. వాటికి అనుబంధంగా పేద పిల్లలకు ఉచితంగా పాలను సరఫరా చేసే పాల కేంద్రాలు కూడా వెలిశాయి”.

జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ అనంతరం 1919లో పంజాబులో సాహసోపేతమైన వైఖరిని చేపట్టటం ద్వారా ఖ్యాతి గడించిన సుభాస్‌ స్నేహితుడు అమల్‌ హోమ్‌ సంపాదకత్వంలో కలకత్తా కార్పొరేషన్‌ ప్రచురణగా కలకత్తా మున్సివల్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు తి

గెజట్‌ అన్న పేరుతో ఆంగ్ల భాషలో ఒక వార పత్రిక ప్రారంభమైంది. ఈ గెజెట్‌ ఏ వారానికి ఆ వారం కలకత్తాలో జరుగుతున్న సత్యార్యాలను ప్రకటించ సాగింది. ఈ పత్రికే 1981లో కలకత్తా మేయర్‌గా జనవరి 26వ తేదీన కాంగ్రెసు ప్రదర్శనకు నాయకత్వం వహించి, పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న సుభాస్‌ పొటోను ప్రచురించింది. తరువాతి అధ్యాయంలో యీ వుదంతాన్ని వివరంగా చూద్దాము.

కాని, యీ మంచి పని ప్రభుత్వానికి నచ్చలేదు. ప్రభుత్వం తన అక్కసును వెళ్ళగ్రక్కటానికి అవకాశం వచ్చింది. 1923 నుంచి బెంగాల్‌లో విప్లవ కార్యకలాపాలు తిరిగి తలెత్తాయి. ఎలాంటి విచారణా లేకుండా విప్లవకారులుగా అనుమానించిన వారిని అరెస్టు చేసి నిర్బంధించేటందుకు వీలుగా ప్రభుత్వం ఒక అత్యవసర ఉత్తర్వును జారీ చేసింది, దీనినే బెంగాల్‌ ఆర్టినెన్స్‌ అని పిలిచారు. 1924 అక్టోబరు 25వ తేదీ తెల్లవారు జామున కలకత్తాలోనూ, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లోనూ లెక్కకు మిక్కిలిగా క్రియాశీల కాంగ్రెసు వాదులను విష్లవకారులన్న ఆరోపణతో ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇలా అరెస్టయిన వారిలో బెంగాల్‌ శాసన మండలికి చెందిన యిరువురు ప్రముఖ స్వరాజ్యవాదులు -సత్యేంద్ర చంద్ర మిశ్రా, అనిల్‌ బరన్‌ రాయలతోపాటు, కలకత్తా కార్పొరేషన్‌కు చెందిన ప్రధాన కార్యనిర్వహణాధికారి సుభాస్‌ బోస్‌ కూడా వున్నాడు. అప్పటిలో తాను విప్లవ కార్యకలాపాలకు దూరంగా వుండటమేకాక కలకత్తా కార్పొరేషన్‌ విధుల్లో రేయింబవళ్ళు తలమునకలై వున్నట్లు తదనంతర కాలంలో సుభాస్‌ రాసుకున్నాడు. కలకత్తాలోని యూరోపియన్‌ స్వార్ధపర శక్తుల బాకాగా వున్న ది స్టేట్స్‌మన్‌ పత్రిక సుభాస్‌ అరెస్టును సమర్ధిస్తూ, విప్లవకారుల వెనుకవున్న వ్యూహకర్త ఆయనేనని పేర్కొన్నది.

ఈ పరిణామాలు దేశబంధును కుంగదీశాయి. మేయర్‌ హోదాలో ఆయన కలకత్తా కార్పొరేషన్‌లో చేసిన విశిష్ట ప్రసంగంలో సుభాస్‌ను సమర్ధించాడు. ఆయన చేసిన నేరమల్లా తన దేశాన్ని ప్రేమించటమేనని చెప్తూ “దేశాన్ని (ప్రేమించటమే నేరమైతే, నేను కూడా నేరస్తుడినేనని”, భావోద్వేగంతో ప్రకటించాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితము, కార్యకలాపాలకు సంబంధించి సంక్షిప్తమూ, విశిష్టమూ అయిన అధ్యాయం ముగిసింది.

ల తి గౌతమ్‌ ఛటోపాధ్యాయ

బర్మాలో జైలు జీవితం

సుభాన్‌ చంద్ర బోన్‌ దాదాపు నాలుగేళ్ళపాటు కారాగార వాసాన్ని అనుభవించాడు. ఎక్కువ భాగం సుదూరంలో వున్న ఎగువ బర్మాలోని మాండలే జైలులో గడిపాడు. సుభాస్‌కు ముందుతరం వాడైన మహా నాయకుడు బాల గంగాధర తిలక్‌ యికృడే 1908 నుంచి 1914 వరకు దాదాపు ఆరేళ్ళపాటు బంధీగా వున్నాడు. సుభాస్‌ జీవితంలోని యీ జైలు దశలోకి వెళ్ళేముందు, బెంగాల్‌ విప్లవకారుల వెనుకవున్న “వ్యూహకర్తల్లో సుభాస్‌ ఒకరన్న (ప్రభుత్వ ఆరోపణలో ఏమేరకు వాస్తవం వున్నదీ క్లుప్తంగా పరిశీలించటం సమంజసంగా వుంటుంది. బెంగాల్‌లో విప్రవ ఉ (గ్రవాద కార్యకలాపాల్లో సుభాస్‌ పాల్గొన్నాడనటానికి పోలీసుల రహస్య రికార్డుల్లో, లేదా యితరంగా ఎలాంటి ఆధారాలూ లేవు. విప్లవకారులకు క్రియాశీల మద్దతు యిచ్చే విషయంలో సి.ఆర్‌. దాస్‌ మరింత దూరంగా వున్నాడు. అయితే యువ విప్లవకారుల ధైర్య సాహసాలను, బలిదానాలను దేశబంధు, ఆయనకు కుడిభుజంగా వున్న సుభాస్‌లు ఎంతగానో శ్లాఘించే వారు. ఉత్సాహోద్వేగాలు వురకలు వేస్తున్న బెంగాల్‌ యవజనుల విషయానికివస్తే, వారు సాహసులు, నజ్రుల్‌ ఇస్తాం లేఖిని నుంచి వెలువడిన 'దుర్దం గిరి...” అన్న సుప్రసిద్ధ గీతంలో “ఫనిర్‌ మంచే గెయె గలో జర జిబనెర్‌ జయగన” (జీవన గీతాన్ని ఆలాపించే వారు ఉరికొయ్యలపై విజయాన్ని లిఖిస్తారు) అన్న రెండు పంక్తులు హృదయాన్ని కదిలించేవిగా వున్నాయి.

అప్పటిలో యీ గీతం విద్యార్థి యువజన ప్రదర్శనల్లో మార్శొగింది. కలకత్తా పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ అనేక దుర్నార్గాలకు, అణచివేతలకు పాల్పడిన సర్‌ ఛార్లెస్‌ తెగార్ట్‌పై 1924 జనవరి 12వ తేదీన గోపీనాథ్‌ సాహా పేల్చిన తుపాకీ గుండు గురితప్పి దురదృష్టవశాత్తు అమాయకుదైన ఇంగ్లీషు వ్యాపారి ఎర్నెస్ట్‌ దేకి తగలటంతో ఆయన మరణించాడు. సాహాను వెంటనే అరెస్టు చేసి త్వరితగతిని విచారణ జరిపి మరణ శిక్ష విధించారు. న్యాయమూర్తి ఆయనకు మరణ శిక్ష విధించగానే, “నా శరీరంలోని ప్రతి నెత్తుటి బొట్టూ ప్రతి భారతీయుని సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 88

గృహంలో స్వేచ్చా బీజాలు | జాన్‌ ననా న్న ప్రకటించాడు. కలకత్తాలోని |. | [ ా' . పెసిడెన్సీ జైలు ప్రాంగణంలో . . కి ల్‌ ర్‌ క్‌ స్ట దహనం చేశారు. సుభాస్‌ [౪ 7 శ చంద్ర బోస్‌తోపాటు సుప్రసిద్ధ (నాం 2 | విప్లవకారుడు పూర్ణ దాస్‌లు కక నం య సుభాస్‌ చంద్ర బోస్‌ విద్యార్థులను వెంటబెట్టుకుని యీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అయికే వారిని జైలు ప్రాంగణంలోకి అనుమతించ లేదు. గోపీనాథ్‌ సోదరుడు మదన్‌ సాహా బయటకు వస్తూ గోపీనాథ్‌ దుస్తులను తీసుకురాగా, సుభాస్‌ వాటిని అనుకంపనతో స్పర్శించాడు. సుభాస్‌ జీవిత చరిత్రకారుడు హేమేంద్రనాథ్‌ దాస్‌గుష్తా పేర్కొన్నదాని ప్రకారం, “అయితే దీనర్థం సుభాస్‌ ఉ గ్రవాదంపట్ల సానుభూతిని కలిగి వున్నాడని అనుకోరాదు, ఆ బలిదానం ఆయనలో మెచ్చుకోలును నింపింది”.

ఈ విషయం యింతటితో ముగియలేదు. 1924 మే మాసంలో జరిగిన బెంగాల్‌ ప్రాంతీయ కాంగైసు సదస్సు ఒక తీర్మానాన్ని చేసింది. దాని మూలానువాదం యీ విధంగా వున్నది: “అహింసా విధానానికి కట్టుబడ్‌ వుంటూనే, మిస్టర్‌ డే హత్యకు సంబంధించి మరణ శిక్షకు గురైన గోపీనాథ్‌ సావో దేశభక్తికి యీ సదస్సు సగౌరవ నివాళులను అర్పిస్తున్నది*. ఈ తీర్మానం గురించి తెలుసుకున్న గాంధీజీ దిగ్ర్భాంతికి గురయ్యాడు. సి.ఆర్‌. దాస్‌కు ఆయన ఒక జాబు రాస్తూ, సాహా స్కృతి అంజలి ఘటించదగినదే అయినట్లయితే, ఆయన దేశభక్తి చర్య తప్పుదోవ పట్టినదన్న పదం వుండి వుండవలసింది. దీనికి సి.ఆర్‌. దాస్‌ సమాధానమిస్తూ, బెంగాలీ నుంచి చేసిన అనువాదం తప్పు అని మీరన్న పదాన్ని వాడటం జరిగిందని తెలిపారు. కాగా, బెంగాలీ భాషలోని తీర్మానానికి సంబంధించి దాస్‌ వాదాన్ని బెంగాల్‌ కాంగ్రెసు కమిటీలోని విప్రవవాదులు వ్యతిరేకించారు. వారికి సుభాస్‌ మద్దతు లభించింది. ఏదియేమైనప్పటికీ, సి.ఆర్‌. దాస్‌ పరిష్కరించిన అనువాద పాఠాన్ని బెంగాల్‌ ప్రాంత కాంగైసు కమిటీ ఆమోదించింది.

సుభాస్‌ క్రియాశీల విప్లవకారుడు కానప్పటికీ, విప్లవకారులందరికీ ఆయన ప్రాపకం లభించిందన్న అభిప్రాయానికి (ప్రభుత్వం వచ్చింది. కాగా, యిప్పుడు 89 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

పరిశోధకులకు బాగా తెలిసిన విషయం ఏమంటే, 1922-24 కాలంలో యిరువురు కమ్యూనిస్టు విప్లవకారులకు సహాయం చేశాడు. మాస్కో బెర్లిన్‌ల నుంచి వచ్చిన వీరి కోసం ్రిటిష్‌-ఇండియన్‌ ఇంటలిజెన్స్‌ విభాగం గాలిస్తున్నది. వీరిలో ఒకరు నలినీ గుప్తా కాగా మరొకరు అవనీ ముఖర్జీ. బెంగాల్‌కు చెందిన ప్రముఖ మేధావి డాక్టర్‌ సునీతి కుమార్‌ ఛటోపాధ్యాయ యీ విధంగా తెలిపాడు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయన పాత మిత్రుడైన కమ్యూనిస్టు విష్లవకారుడు అవనీ ముఖర్జీ 1922 డిసెంబరులో ఒక సాయంత్రం వేళ అకస్మాత్తుగా వచ్చి తనను పట్టుకున్న వారికి ప్రభుత్వం బహుమతిని ప్రకటించిందని తనకొక సురక్షితమైన ఆశయం కావాలని కోరాడు. సునీత్‌ కుమార్‌ ఆయనను తన స్నేహితుడైన దిలీప్‌ కుమార్‌ రాయ్‌ వద్దకు తీసుకు వెళ్ళాడు. దిలీప్‌ తన మిత్రుడైన సుభాస్‌ వద్దకు తీసుకు వెళ్ళాడు. అవనీ ముఖర్జీకి సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించ వలసిందిగా యువ విప్లవకారుదైన సంతోష్‌ మిత్రాను సుభాస్‌ కోరాడు, దానికి ఆయన అంగీకరించాడు. ఇదేవిధంగా సుభాస్‌ విజ్ఞప్తి మేరకు ఎం.ఎన్‌. రాయ్‌ దూత అయిన నలినీ గుష్తాకు ధాకాలోని అనుశీలన్‌

  • సమితి ఆశ్రయాన్ని కల్పించింది. సుభాస్‌, కమ్యూనిస్టు కాడన్న సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయమే, పైగా వారితో ఆయనకు అనేక భేదాభిప్రాయాలు వున్నాయి. కాని, కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక విష్రవకారులన్న నమ్మకం వుండటంతో వారికి అవసరమైన సమయాలలో సహాయం చేయటానికి ఎన్నడూ సందేహించలేదు. సుభాస్‌ చంద్ర బోస్‌ బెదార్య స్వభావానికి యివన్నీ రుజువులనటంలో ఎలాంటి

సందేహం లేదు, కాని, రాజ్యం దృష్టితో చూసినపుడు సుభాస్‌ ప్రమాదకరమైన వ్యక్తి అనటానికి సరిగ్గా యీ రుజువులే వలస పాలకులకు ఆధారాలుగా వున్నాయి. కనుక, వారి దృష్టిలో 1924 అక్టోబరు 25న బెంగాల్‌ ఆర్డినెన్స్‌ కింద సుభాస్‌ను అరెస్టు చేయటం సమర్ధనీయమే. తొలుత కొన్ని మాసాల పాటు ఆయనను ప్రభుత్వం వేర్వేరు జైళ్ళలో వుంచింది, ఆ తరువాత కొద్ది కాలానికే సుదూరాన వున్న మాండలే జైలుకు తరలించింది. బెంగాల్‌ రాజకీయాలు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న కాలమిది. అన్నిటికన్నా పెద్ద దెబ్బ సి.ఆర్‌. దాస్‌ మరణం, డార్జిలింగ్‌ లో అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లుగా కనిపించిన ఆయన 1925 జూన్‌ 16న కన్ను మూశాడు. భెంగాలీయులతోపాటు, యావద్దేశ ప్రజలకు యీ వార్త ఉరుములేని పిడుగులా సోకింది. జైలులో వున్న సుభాస్‌కు యీ వార్త శరాఘాతమే అయింది. దాదాపు ఒక దశాబ్దం తరువాత సుభాస్‌ యిలా రాశాడు. *1925 జూన్‌ 16న సంభవించిన దేశబంధు మరణం భారతదేశానికి తట్టుకోలేని జాతీయ విపత్తు...... శత్రువు నుండి రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కోవటానికి అనుకూలమైన పరిస్థితులు తరచుగా ఎదురు సుభాన్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు శం

కావని, ఎప్పుడైతే అవి ఎదురవుతాయో అప్పుడవి చిరకాలం నిలచి వుండవన్న సంగతి అందరికన్నా ఆయనకే ఎక్కువ తెలుసు. సంక్షోభం ముగియగానే బేరసారాలు ప్రారంభమవుతాయి. ప్రజల్లో మహోత్సాహం వెల్లువై పొంగుతున్నపుడు ఒప్పందం కుదుర్చు కోవటానికి చాలా ధైర్యం కావాలని, ప్రజల్లో పలుచన అయ్యే అవకాశాలు కొంతమేరకు వుంటాయన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. భయంలేని వాడు కానట్లయితే ఆయన గురించి చెప్పుకునేందుకు ఏమీ వుండదు. తనదైన కచ్చితమైన పాత్ర గురించి ఆయనకు అవగాహన వున్నది. ఆచరణాత్మక రాజకీయవాది అని ఆయనను అనవచ్చు. ప్రజల్లో పలుచన అవుతానన్న భయం ఆయనకు ఎన్నడూ లేదు”.

మాందలే చెరసాలలో వున్న బోస్‌పట్లా, ఆయన తోటి ఖైదీలపట్లా అధికారుల వైఖరి కఠినంగా లేనప్పటికీ ఏమాత్రం సానుభూతితో వుండేది కాదు. జైలు అధికారుల వ్యవహార సరళిని నిరసిస్తూ బర్మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (అప్పటిలో బర్మా కూడా బ్రిటిష్‌ ఇండియాలో ఒక భాగం) సుభాస్‌ పలు లేఖలు రాశాడు, కాని, ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. దీనితో 1926 ఫిబ్రవరి 18వ తేదీన సుభాస్‌ చంద్ర నాయకత్వంలో ఆయన సహచర ఖైదీలు మాండలే జైలులో నిరాహార దీక్షకు దిగారు. ఫిబ్రవరి 22వ తేదీన ఇన్‌సైన్‌ జైలులోని రాజకీయ ఖైదీలు కూడా నిరాహార దీక్షలో కలిశారు. ఎనిమిదవ రోజున నిరాహార దీక్షలో వున్నవారికి బలవంతంగా ఆహారాన్ని యివ్వటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భారత జాతీయవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సుభాస్‌ బోస్‌ బాగా బరువు తగ్గాడు. ఇలాంటి తరుణంలో, తన మిత్రులతో సహా నిరాహార దీక్షను విరమించ వలసిందిగా సుభాస్‌ చంద్రను కోరుతూ శరక్‌ బోస్‌ వ్రాసిన లేఖను తీసుకుని ఆలీ సోదరులుగా ఖ్యాతి పొందిన వారిలో ఒకరైన మౌలానా షౌకత్‌ ఆలీ హుటాహుటిని మాండలే జైలుకు చేరుకున్నాడు. భారతదేశంలో వున్న మిత్రులు, సహచరులు యీ ఆందోళనను కొనసాగించ గలరని సుభాస్‌కు షౌకత్‌ ఆలీ వామీ యిచ్చాడు. మార్చి ఉవ తేదీన, అంటే, సుమారుగా రెండు వారాల నిరాహార దీక్ష అనంతరం ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించటంతో సుభాస్‌, ఆయన మిత్రులు దీక్షను విరమించారు.

ఈ నిరాహార దీక్ష ఫలితాన్ని సుభాస్‌ యీ విధంగా సేర్మాన్నాడు: “మేము చేసిన నిరాహార దీక్ష నిరర్ధకమైనదో లేక నిష్ఫ్టలమైనదో కాదు. మా డిమాంద్స్‌ను (ప్రభుత్వం పరిశీలించక తప్పలేదు..... నిరాహార దీక్ష వలన లభించిన గొప్ప ఫలితమేమంటే ఆత్మతృప్తి, మహదానందం...... ఈ అనుభవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మునుపటికన్నా నన్ను నేను బాగా అర్థం జే... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

చేసుకోగలిగాను, నాలో ఆత్మ విశ్వాసం అనేక రెట్లు పెరిగింది”.

ఇదియిలా వుండగా సుభాస్‌ ఆరోగ్యం నానాటికీ తీసికట్టుగా మారింది.

సివిల్‌ సార్టంట్‌ కల్పల్‌ కేసాల్‌, సుభాస్‌ పెద్దన్న డాక్టర్‌ సునీల్‌ బోస్‌లు యిరువురూ సుభాస్‌ను సంయుక్తంగా పరీక్షించటానికి ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. 1927 ఫిబ్రవరి 12న వారు సుభాస్‌ను పరీక్షించారు. బహుశ ఆయనకు క్షయవ్యాధి సోకి వుండవచ్చునని, యిది పూర్తిగా నయం కావాలంటే విశ్రాంతితోపాటు జైలు వెలుపల వైద్య చికిత్స అవసరమని వారు సూచించారు. స్విట్టర్‌లాండ్‌లోని శానిటోరియంకు సుభాస్‌ను పంపటం వుత్తమంగా వుండగలదని దాక్టర్‌ సునీల్‌ బోస్‌ సిఫార్సు చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కొండల నడుమవున్న అల్నోరా జైలుకు సుభాస్‌ను తరలించాలని తొలుత బెంగాల్‌ ప్రభుత్వం భావించింది. అల్నోరాలో సుభాస్‌ కుటుంబం ఒక ఇల్లు తీసుకునేందుకు, వారితో పొటు సుభాస్‌ మూడు మాసాలపాటు కలసి వుండేందుకు, ఆ తరువాత స్విట్టర్‌లాంద్‌ వెళ్ళేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. షరతులతో కూడిన విడుదలను తొలుత సుభాస్‌ పూర్తిగా వ్యతిరేకిస్తూ 1927 ఏప్రియల్‌ శవ తేదీన శరత్‌ బోస్‌కు గట్టిగా ఒక లేఖ రాశాడు. తుట్టతుదకు, ఆయన పైన చెప్పిన పద్ధతికి అంగీకరించాడు. 1927 మే 7వ తేదీన రంగూన్‌ వెళ్ళే స్టీమర్‌లో సుభాస్‌ బయలుదేరాడు. స్టీమరు, కలకత్తాకు చేరిన వెనువెంటనే బెంగాల్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యులు సుఖాస్‌ను పరీక్షించి ఆయన పరిస్థితి ప్రమాదంగా వున్నట్లు ప్రకటించారు. దీనితో భయపడిన బెంగాల్‌ ప్రభుత్వం 1927 మే 16న సుభాస్‌ను బేషరతుగా విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఎల్జిన్‌ రోడ్‌లోని తన కుటుంబ నివాసానికి ఆయన చేరుకున్నాడు, ఆయన జబ్బు పడివున్నప్పటికీ, మానసికంగా దృఢంగా వున్నాడు. 1927 మే 6వ తేదీన, రంగూన్‌లో స్టీమరు ఎక్కటానికి ఒక రోజుముందు ఆయన తన సోదరుడు శరత్‌కు రాసిన లేఖలో యిలా పేర్మాన్నాడు: “నేను దుకాణదారుడిని కాదు, నేను బేరసారాలాడను. తప్పించుకునే మార్గాలు నా తత్వానికి సరిపడవు కనుక, వాటిని నేను అసప్యాంచుకుంటాను”. 1927 వేసవి అంతా షిల్లాంగ్‌లో గడిపిన సుభాస్‌ కోలుకున్నాడు. ఐదు మాసాలు గడచిన అనంతరం ఆయనను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం చక్కబడినట్లు ప్రకటించారు. 1927 చివరలో ఆయన కలకత్తాకు తిరిగి వచ్చి రాజకీయాలలో చురుకుగా పాల్గొనసాగాడు. బెంగాల్‌ ప్రాంత కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన వెనువెంటనే ఆయన జీవితంలో మరో అధ్యాయం

శ్రీకారం చుట్టుకున్నది.

లక సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు త్తై

సమరశీల జాతీయవాదుల నాయకుడు

సర్‌ జాన్‌ సైమన్‌ నాయకత్వాన ప్రధానంగా మితవాదులు సభ్యులుగా వుండే భారత చట్టబద్ద కమిషన్‌ నియామకానికి సంబంధించిన (ప్రకటనను 1927 నవంబరులో వైస్రాయ్‌ లార్ట్‌ ఇర్విన్‌ చేశాడు. కమిషన్‌లోని ఏడుగురు సభ్యుల్లో వైర్మన్‌తో సహా ఐదుగురు మితవాదులు కాగా యిరువురు మాత్రం లేబర్‌ పార్టీకి చెందిన వారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం వున్నది. లేబర్‌ పార్టీకి చెందిన యిరువురిలో ఒకరైన క్షిమెంట్‌ అట్లీ 1946-47లో బ్రిటన్‌ ప్రధానిగా వున్నపుడే భారతదేశం స్వాతంత్ర్యాన్ని గెలుచుకున్నది. భారతదేశపు భావి రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను పూర్తిగా ఆంగ్లేయులతో కూడిన యీ కమిషన్‌కు ప్రభుత్వం అప్పచెప్పింది. కమిషన్‌లో భారతీయులను మినహాయించిన ప్రభుత్వ చర్య భారతీయులందరికీ ఆగ్రహాన్ని కలిగించింది. బ్రిటిష్‌వారిపట్ల సఖ్యతను ప్రదర్శించే ఇండియన్‌ లిబరల్‌ పార్టీ సైతం కమిషన్‌ నియామకానికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం యిలా చెపుతున్నది: “భారతీయులను మినహాయించటం భారతదేశ (ప్రజలను ఉద్దేశపూర్వకంగా అవమానించటమే. ఇది కచ్చితంగా వారి స్థానాన్ని దిగజార్చటమే అవుతుంది, మరీ దుర్మార్గమైన విషయమేమంటే, తమ మాళ్ళదేశ రాజ్యాంగాన్ని నిర్ణయించే క్రమంలో వారి భాగస్వామ్య హక్కును తోసిపుచ్చటం”. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలని, సర్‌ తేజ్‌ బహుదూర్‌ సహ్రూ నేతృత్వాన 1927 డిసెంబరులో జరిగిన లిబరల్‌ ఫెడరేషన్‌ పదవ సమావేశం నిర్ణయించింది.

1927 డిసెంబరులో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా ముస్లిం లీగ్‌ కూడా హిందూ-ముస్లిం ఐక్యతకు మద్దతు పలుకుతూ, సైమన్‌ కమిషన్‌ను బహిష్మరించ వలసిందిగా పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై సుభాస్‌ చంద్ర బోస్‌ వ్యాఖ్యానిస్తూ 1934లో యీ విధంగా పేర్మొన్నాడు: “జాతీయవాద ముస్లింలకు యిదొక విజయం. ఎం.ఏ. జిన్నా, ఆలీ సోదరులు వంటి ప్రముఖ ముస్లిం నాయకులు 48 | గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఆం కాగ సాల. శక,

శ |. క ఆ

సం శ షళతడ

స లుల ఆంకర్‌ వాలం! యీ సమావేశంలో పాల్గొని జాతీయతా దృక్పథాన్ని ప్రబోధించినందునే యీ తీర్మానం సాధ్యపడింది".

భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశాలు 1927 డిసెంబరులో మద్రాసులో జరిగాయి. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించ వలసిందిగా యావద్దేశ ప్రజలకు మద్రాసు కాంగ్రెసు పిలుపు యిచ్చింది. అంకేకాక, స్వతంత్ర భారతావని కోసం అన్ని పక్షాలకు ఆమోదయోగ్యంగా వుండే రాజ్యాంగాన్ని రూపొందించేటందుకై అఖిల భారతస్థాయి పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చొరవ చూపింది. ఒక విధంగా చూసినట్లయితే, సంపూర్ణ స్వరాజ్యమే భారత జాతీయ కాంగ్రెసు లక్ష్యమని ప్రకటించే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందటం బహుశ, మద్రాసు కాం(గైెసుకు సంబంధించి మరపురాని విషయంగా చెప్పవచ్చు. ఇలా తీర్మానించటం వెనుక కొద్దిమంది కమ్యూనిస్టులతో కలసి జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకు వచ్చిన ఒత్తిడి బలంగా వున్నది. ఈ సమావేశాలకు గాంధీజీ హాజరు కాలేదు. ఆ మరుసటి రోజున హాజరై కాం(గైసు వైఖరిని తీవ్రంగా విమర్శించాడు. ఈ తీర్మానం, “హడావుడిగా రూపొందించినదీ, అనాలోచనతో ఆమోదించినదీ, అని ప్రకటించాడు.

1928 ఫిబ్రవరి 8వ తేదీన సైమన్‌ కమిషన్‌ భారతదేశంలో అడుగు పెట్టింది. దేశవ్యాప్త హర్తాళ్‌కు కాంగ్రెసు యిచ్చిన పిలుపుకు బ్రహ్మాండమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ నిరసన ఉద్యమం మరింత విసృృతమై, దీర్ధకాల లక్ష్యాన్ని కలిగి వుండాలని సుభాస్‌ చంద్ర బోస్‌ ఆశించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “1928 ఫిబ్రవరిలో భారతదేశంలోకి అడుగు పెట్టిన సైమన్‌ సప్తకాన్ని అఖిల భారత “హర్తాళొ స్వాగతించింది..... ఇది కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ ఆదేశాల మేరకు జరిగింది. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు జ్తేడ్తే

దేశమంతటా, ప్రత్యేకించి బెంగాల్‌లో మహోత్సాహం వెల్లివిరిసింది. కాంగ్రెసు నాయకుల నుంచి సానుకూల వైఖరి వెలువడగలదని ప్రజలు వూహించారు..... కాని అలాంటి సూచనలేమీ వెలువడలేదు..... సైమన్‌ కమిషన్‌ బొంబాయిలో అడుగుపెట్టే రోజున (బ్రిటిష్‌ వస్తువులను బహిష్మరించ వలసిందిగా కేవలం బెంగాల్‌లో మాత్రమే ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ తన స్వంత బాధ్యతపై ఉదృత ప్రచారాన్ని చేపట్టింది. కాంగ్రెసు వర్మింగ్‌ కమిటీ సాహసించి వున్నట్లయితే, 1930 నాటి స్థాయిలో ఉద్యమం రెండేళ్ళకు ముందే, అంటే, సైమన్‌ కమిషన్‌ దేశంలో అడుగు పెట్టినపుడే ప్రారంభమై వుండేది”.

1928 ఫిబ్రవరి ౩వ తేదీన కలకత్తాలోనూ, బెంగాల్‌ అంతటా (బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి, బ్రిటిష్‌ తయారీ వస్తువులను ప్రజలు బహిష్కరించారు, పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనంతటి వెనుక సుభాస్‌ చోదక శక్తిగా వున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు. దేశమంతటా దీని ప్రకంపనల ప్రభావం కనిపించింది, యావద్దేశంలోనూ నైమన్‌ గో ఖ్యాక్‌ అన్న రణన్నినాదం మార్మోగింది. ఈ కమిషన్‌ తిరిగి రెండవసారి మరింత సమగ్రమైన పర్యటన నిమిత్తం 1928 అక్టోబరులో వచ్చినపుడు రాజకీయంగా భారతదేశం అల్లకల్లోలంగా వున్నది. అంతకు ముందు సంవత్సరాల నాటి జడత్వమూ, స్తబ్దత అదృ్భశ్యమయ్యాయి.

సైమన్‌ వ్యతిరేక వెల్లువలో కొట్టవచ్చినట్లు కనిపించిన నూతన అంశమేమంటే భారత యువజనుల్లో (బ్రహ్మాండమైన రీతిలో సమరళీలత వ్యక్తం కావటం, కార్మిక వర్గంలో యీ లక్షణం మరింతగా వెల్లివిరియటం. దాదాపుగా ప్రతి పట్టణంలోనూ అసంఖ్యాక కార్మికులు ప్రదర్శనలను నిర్వహించారు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, యితర వామపక్షవాదులు శ్రామికవర్గ ఉద్యమంలో ముందుపీఠిని వున్నారు. యువతీ యువకులు సైతం తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన జరిగిన ప్రతిచోటా వారు అగ్రభాగాన నిలచారు. పలుచోట్ల జరిగిన యువజన ప్రదర్శనల నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాస్‌ చంద్ర బోస్‌లకు ఆహ్వానాలు వెళ్ళాయి. సుభాస్‌ యీ విధంగా పేర్ళొన్నాడు. “పూనాలో జరిగిన మహారాష్ట్ర ప్రాంతీయ కాంగ్రెసు సభకు అధ్యక్షత వహించ వలసిందిగా 1928 మే నెలలో నాకు పిలుపు వచ్చింది. నాకక్కడ కనిపించిన ఉత్సాహం.... నన్ను అబ్బుర పరచింది. థామికులను, యువజనులను, విద్యార్థులను సంఘటిత పరచి వారి స్వీయ ప్రయోజనాలను కాపాదేందుకు, వారి మాతృ దేశానికి సేవలందించేందుకు వారివైన సంస్థలను వారి కోసం స్థాపించే కర్తవ్యాన్ని కాంగ్రెసు నేరుగా చేపట్టాలని నేను కోరాను.

ఇలాంటి సమయంలోనే, 1928 ఆగస్టులో అఖిలపక్ష సదస్సు లక్నోలో శక్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

జరిగింది. ఇక్కడొక నూతన పరిజామం చొటుచెసుకున్నది. జఠిలంగా మారిన హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించి అఖిలపక్ష సదస్సు అరమరికలు లేని సుహృద్భావ వైఖరినే తీసుకున్నది, అయితే, భారతీయులందరికీ అధినివేశ (ప్రతిపత్తిని సాధించటమే లక్ష్యమని పేర్కొన్నది. అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న వామపక్షం ఆగ్రహించి, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాస్‌ల సమక్షంలో లక్నోలోనే స్వంతంగా ఒక సదస్సును నిర్వహించింది. భారత స్వతంత్ర లీగ్‌ అనే నూతన సంస్థను స్థాపించాలని యీ సదస్సు పిలుపు యిచ్చింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాస్‌ చంద్రబోస్‌, శ్రీనివాస్‌ అయ్యంగార్‌ తదితరులు యీ సంస్థకు నాయకులుగా నిలచారు. భారత జాతీయ కాం(గైసు వార్షిక సమావేశాలు 1928 డిసెంబరులో కలకత్తాలోనే జరగవలసి వుంది. దీనికన్నా ముందే, అంటే, 1928 సెస్టెంబరులోనే వామపక్ష భావాలు కలిగిన బెంగాల్‌ విద్యార్థులు సుభాస్‌ అధ్యక్షతన కలకత్తాలోనే (ప్రాంతీయ విద్యార్థి సదస్సును నిర్వహించారు. అఖిల బెంగాల్‌ విద్యార్ధి సమాఖ్య (ఏవిఎస్‌ఏ) స్థాపనకు యీ సదస్సు దారితీసింది. అత్యంత శక్తివంతమైన విసృత పునాది దీనికి వున్నది. చిర యశస్ముడైన యువ విప్లవకారుడు సర్దార్‌ భగత్‌ సింగ్‌ నాయకత్వాన ఉత్తర భారతం అంతటా నౌజవాన్‌ భారత సభ పేరిట సమరశీల యువజనులు సంఘటితమయ్యారు. ఈ సంస్థతో కమ్యూనిస్టులకు, సుభాస్‌కు సన్నిహిత సంబంధాలే వున్నాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరమ లక్ష్యం సోషలిజమేనని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆనాటికే ప్రకటించి వున్నాడు. సుభాస్‌ కూడా యిలాంటి దృక్సథాన్నే కలిగి వున్నాడు. కాగా, స్వేచ్భా భారతం సోషలిస్టు రిపబ్లిక్‌గా మారాలని భారత కమ్యూనిస్టు పార్టీ వాంఛించింది. భారత జాతీయ కాంగ్రెసు లక్ష్యం ఏమిటి, -అధినివేశ (ప్రతిపత్తియా లేక సంపూర్ణ స్వాతంత్ర్యమా అన్న ప్రశ్న చుట్టూ కలకత్తా మహాసభను కుదిపి వేసిన వివాదం ప్రదక్షిణం చేసింది. గాంధీజీతోపాటు పాతకాపులైన మోతీలాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు అధినివేశ (ప్రతిపత్తినే కోరుకున్నారు. కాగా, దిగువ నుంచి ఎగువ వరకుగల యువ ఉద్యమకారులు మాత్రం సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పట్టుపట్టారు. సుభాస్‌ వారి ముఖ్య ప్రతినిధి అయ్యాడు. అధినివేశ ప్రతిపత్తియే భారత జాతీయ కాం(గైసు లక్ష్యంగా వుంటుందని తెలిపే తీర్మానాన్ని కలకత్తా సభల్లో ప్రవేశ పెట్టాడు. జవహర్‌లాల్‌ మద్దతుతో సుభాస్‌ ఒక సవరణను ప్రవేశ పెట్టాడు. అధినివేశ ప్రతిపత్తి అన్న పదానికి బదులుగా సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న పదాన్ని వాడాలని యీ సవరణ చెపుతున్నది. ఈ విషయమై ఉ (ద్రిక్తతలు చెలరేగాయి, యీ సవరణకు అనుకూలంగా 973 ఓట్లు, వ్యతిరేకంగా 1850 ఓట్లు రావడంతో యిది వీగిపోయింది. గాంధీజీకి యిది ఘన విజయమేమీ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు క్త

కాదు. సుభాస్‌తోపాటు యితర వామపక్షవాదులను శాంతింప చేయటానికి గాంధీజీ ప్రయత్నించారు. ఒక్క ఏడాది లోపల తన నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ అధినివేశ ప్రతిపత్తిని సాధించ లేనట్లయితే, నూతన లక్ష్యంగా సంపూర్ణ స్వాతంత్ర్యానికి మద్దతు పలుకుతూ తానే స్వయంగా తీర్మానాన్ని ప్రవేశ పెద్దానని గాంధీజీ బహిరంగంగా ప్రకటించారు. ఏడాది లోపల అధినివేశ ప్రతిపత్తిని కాంగ్రెస్‌ సాధించ లేకపోయింది. గాంధీజీ తన మాటను నిలబెట్టుకున్నాడు. 1929 డిసెంబరులో జరిగిన లాహోర్‌ కాంగ్రెసులో ఆయనే స్వయంగా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని డిమాండు చేసే తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, అది వకగ్రీవంగా ఆమోదాన్ని పొందింది.

కలకత్తా మహాసభ సందర్భంగా చోటుచేసుకున్న మరో విశిష్ట సంఘటన ఏమిటంటే, కమ్యూనిస్టు, సోషలిస్టు, వామపక్ష కాంగైసువాదుల నాయకత్వంలో వేల సంఖ్యలో శ్రామికులు (బ్రహ్మాండమైన ప్రదర్శనను నిర్వహించారు. వారు సభలు జరుగుతున్న పార్క్‌ సర్మస్‌ వద్దకు ప్రదర్శనగా వచ్చి సభలోకి రావటానికి ప్రయత్నించారు. శామీక వర్గ సమస్యలను కాంగైసు నాయకత్వం ముందుంచటమే వారి వుద్దేశ్యం. అప్పటిలో కాంగ్రెసు వలంటీర్లకు నాయకునిగా వున్న సుభాస్‌ చంద్ర బోస్‌, యీ శ్రామికుల ప్రదర్శన కాంగ్రెసు సమావేశాలను భగ్నం చేయగలదని తొలుత భావించాడు. ఆ కారణంగా ప్రదర్శకులు సభాస్థలిలోకి అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సమావేశాలకు అధ్యక్షునిగా వున్న మోతీలాల్‌ నెహ్రూ ఒక గంటసేపు లోపల వుండేందుకు శ్రామికులకు అనుమతి యిచ్చాడు. భారత జాతీయ కాంగ్రెసు అధికారిక చరిత్రకారుడు పట్టాభి సీతారామయ్య యీ ఘటన గురించి యీ విధంగా పేర్కొన్నాడు. శ్రామిక జనులు అత్యంత క్రమశిక్షణతో లోపలికి ప్రవేశించి జాతీయ పతాకానికి వందనమాచరించి, సంపూర్ణ స్వాతంత్ర్య లక్ష్యానికి మద్దతు పలికారు. మోతీలాల్‌ నెహ్రూ తదితర నాయకులు శ్రామికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి డిమాండ్లను కాంగ్రెసు సానుభూతితో పరిశీలించగలదని వామీ యిచ్చారు.

ముమ్మరమైన కార్యకలాపాలలో సుభాస్‌ మునిగి పోయిన కాలమిది. కాంగ్రెసు సమావేశాలు సాఫీగా సొగిపోయేలా చూచేటందుకై కాంగ్రెసు వలంటీర్ల జి.ఓ.సిగా సుభాస్‌ రేయింబవళ్ళు కష్టపడిన విషయం మనం యిప్పటికే చూశాను. ఇదే సమయంలో కాంగ్రెసు మహాసభలు జరుగుతున్న ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న అఖిల భారత యువజన సమావేశాలకు, రాష్ట్ర భాషా సమ్మేళన్‌కు ఆహ్వాన కమిటీ అధ్యక్షునిగా కూడా ఆయన వున్నారు.

అభిల భారత యువజన సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రతినిధులను వుద్దేశించి 1928 క్రిస్మస్‌ రోజున ప్రసంగిస్తూ సుభాస్‌ యిలా పేర్మొన్నాడు. 47 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఆధునిక పారిశ్రామికీకరణ మంచిది కాదన్న భావనను సృష్టించేటందుకు సబర్మతి బృందం (అంటే గాంధీజీ శిష్యగణం) (ప్రయత్నిస్తుండగా, మరోవైపున అరబిందోకు చెందిన పాండిచ్చేరి బృందమేమో ప్రశాంతమైన ధ్యానానికి మించి అత్యుత్త్రమమైనదీ, మహోత్యష్టమైనదీ మరొకటి లేనేలేదన్న అభిప్రాయాన్ని కల్పించటానికి ప్రయత్నిస్తున్నది. ఈ రెండు దృక్పథాలను సుభాస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ యిలా పేర్కొన్నాడు: “భారతదేశంలో మనమీనాడు క్రియాశీల తత్వాన్ని కోరుతున్నాము..... మనం వర్తమానంలో జీవించాలి మనంతటగా మనం ఆధునిక పరిస్థితులను స్వీకరించాలి. ప్రపంచంలో విసిరేసినట్లుందే ఒక మూలన మనమెంతో కాలం జీవించలేము. భరతమాత స్వేచ్ళను పొందినపుడు ఆమె ఆర్థిక, రాజకీయ రంగాల రెండింటా ఆధునిక ప్రయత్నాలతో ఆధునిక శత్రువును ఎదుర్శొన వలసి వుంది”. 'సాధ్యమైన అన్ని విధాలా” కృషిచేసి భారత స్వాతంత్ర్యాన్ని సాధించటమే తన లక్ష్యమని చివరగా యువజన సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. “శాంతియుత, చట్టబద్దమైన మార్గాల ద్వారా” లక్ష్యసాధనే తన అభీష్టమన్న కాంగ్రెసు తీర్మానానికి యిది విభిన్నమైనది.

రాష్ట్ర భాషా సమ్మేళన్‌లో ప్రతినిధులను వుద్దేశించి సుభాస్‌ హిందీలో ప్రసంగించాడు. భారతీయులందరికీ హిందూస్థానీయే జాతీయ భాషగా వుండాలన్న భావనను ఆయన సమర్ధించాడు. ఆయన యింకా యిలా చెప్పాడు: 'మన జాతీయ భాషకు లిపిగా హిందీ లేదా ఉర్దూను దేనిని వాడాలన్న ప్రశ్నను నేను లేవనెత్తబోవటం లేదు. మనం ఉభయ లిపులను నేర్వాలన్న మవిత్ముని అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను”.

స్రీలు సంఘటితం కావటాన్ని సుభాస్‌ చంద్ర ప్రోత్సహించాడని, ఆయన యిచ్చిన ప్రత్యక్ష స్ఫూర్తితో లతికా ఘోష్‌ 1928లో తాను కార్యదర్శిగా మపొళా రాష్ట్రీయ నంఘ్‌ను స్థాపించినట్లు అమెరికన్‌ పరిశోధకుడు గెరాల్‌డైన్‌ ఫోర్స్‌ తెలియ చేశాడు. అదే ఏదాది, పోరాట పటిమ కలిగిన విద్యార్థినులు కల్యాణీ దాస్‌ నేతృత్వాన ఛాత్రి నంఘ్‌ను స్టాపించారు. సంపూర్దాయుష్ములై సమరశీల జాతీయవాద ఆదర్శాలకు అంకితం కావలసిందిగా మహిళలకు సుభాస్‌ వుద్చోధించాడు. ఫోర్స్‌ ప్రకారం, “వారి కార్యక్రమాలను ప్రోత్సహించిన నాయకమ్మన్యుడు ఎవరైనా వున్నారా, అంటే, అది సుభాస్‌ చంద్ర బోస్‌ మాత్రమే. బెంగాల్‌లో మహిళా హక్కుల పోరాట యోధునిగా ఆయనను పలువురు మహిళా విప్లవకారులు భావించారు”.

కాం(గైెసు వేదికవద్ద సంభవించిన భఘుటన కారణంగా కార్మికవర్గ నాయకులకూ, ఆయనకూ మధ్య నెలకొన్న దురవగాహనలను స్వల్ప కాలంలోనే ఆయన తొలగించు కోగలిగాడు. ఈసారి సైమన్‌ కమిషన్‌ 1929 జనవరి 19న కలకత్తాను సందర్శించింది. బెంగాల్‌ కాంగ్రెసు అధ్యక్షుని హోదాలో కమ్యూనిస్టులతో సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు శై

సహా శ్రామికవర్గ ఉద్యమ నాయకులందరితోనూ సంఫ్రదింపులు జరిపిన సుభాస్‌ సైమన్‌ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా నిరసన తెలిపేటందుకు ప్రణాళిక రచించాడు. 1929 జనవరి 19వ తేదీన కలకత్తాలో సంపూర్ణ హర్తాళ్‌, సార్వత్రిక సమ్మె జరిగాయి. "సైమన్‌ గో బ్యాక్‌ అంటూ నినదిస్తూ దాదాపు లక్షమంది ప్రదర్శన నిర్వహించారు, వీరిలో సగం మంది (శ్రామికులే. ఈ తరుణంలోనే బెంగాల్‌లోని సమరశీల జాతీయవాదులకు సుభాస్‌ చంద్ర బోస్‌ తిరుగులేని నాయకుడయ్యాడు. జాతీయస్థాయి నాయకుడయ్యే మార్గంలో ఆయన పయనం సాగింది.

ట్ర్‌ త్తి గౌతమ్‌ ఛటోపాధ్యాయ

జి బ్బ జి ఆలి అలి

సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రచారం భౌరతదేశవు రాజకీయ దిజ్బండలంలో తుఫాను నూచనలను బ్రిటిష్‌వాళ్ళు వసిగట్టారు. ప్రధానంగా రెండు శక్తులు బ్రిటిష్‌ వాళ్ళను బాగా భయపెట్టాయి. ఒకటి కమ్యూనిస్టుల నేతృత్వంలోని కార్మికవర్గ ఉద్యమం కాగా, రెండవది, ప్రత్యేకించి బెంగాల్‌, పంజాబ్‌లలో తలయెత్తిన యువ విష్లవకారుల ఉ ద్యమం. తనదైన పద్ధతిలో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తిని సాధించేటందుకుగాను 1928 నాటి కలకత్తా కాంగ్రెసులో గాంధీజీకి ఏడాది గడువు లభించింది. దీనితో (బ్రిటిష్‌ పాలకులకు తాత్మాలిక విరామం లభించినట్లయింది. వదియెలా వున్నప్పటికీ విప్లవకారుల కదలికలు వేగాన్ని పుంజుకున్నాయి. సర్దార్‌ భగత్‌ సింగ్‌ నాయకత్వంలోని హిందూస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీకి చెందిన విప్లవకారులు 1928 చివరిలో లాహోరునందు ఇంగ్లీషు పోలీసు ఇన్స్‌ పెక్టర్‌ శాండర్స్‌ను కాల్చి చంపారు. లాహోర్‌లో, సైమన్‌ వ్యతిరేక ప్రదర్శన సమయంలో ప్రముఖ జాతీయ నాయకుడు లజపతి రాయ్‌ని కిరాతకంగా లాఠీలతో కొట్టిన ఘటనలో స్కాట్‌తోపాటు శాండర్స్‌ కూడా బాధ్యుడిగా వున్నాడు. శాండర్స్‌ హత్య, విప్లవకారుల ప్రతీకార చర్య మినహా మరొహటి కాదు. 1929 ఏప్రియల్‌లో ఢిల్లీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యువ విష్లవకారులైన సర్టార్‌ భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌ దత్తులు ఢిల్లీలోని కేంద్ర శాసన సభా మందిరంలో పొగ బాంబులు వేసి, కరపత్రాలను విసరి వేశారు. (బైటిష్‌ పాలనకు వ్యతిరేకంగా యిప్పుడు వారి అజెండాలో సాయుధ విప్లవం వున్నట్లు ప్రకటించారు. విప్లవకారులుగా అనుమానించిన వారందరినీ అరెస్టు చేసే ప్రక్రియకు (బ్రిటిష్‌ పాలకులు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. 1929 జూలైలో లాహోర్‌ కుట్ర కేసు విచారణ ప్రారంభమైంది. ఉత్తర భారతంలోని యువ విప్లవకారుల ఉద్యమానికి సర్దార్‌ భగత్‌ సింగ్‌ తిరుగులేని నాయకుడు, ఆయన స్థాపించిన నౌజవాన్‌ భారత్‌ సభకు అపారమైన ప్రజా మద్దతు వున్నది. అరెస్టు అనంతరమూ, విచారణ సమయంలోనూ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 50

ఇఖగత్‌ నింగ్‌, ఆయన స్‌ ్న... గ గ్‌ టు... నిర్భ్వయత్వమూ, తెగింపూ మట ల మాలా క? వ...” ప్రజలపై చెరగని ముద్ర | సామ జత వ 1 వేశాయి. [| [0 ( రా న.

1928లో ప. పడు పెద్దయెత్తున కార్మికులు గా క టనైోన క రో న్‌ ఖో: వ ప్రదర్శనగా కాంగ్రెసు వేదిక జీల | పం ర వెళ్ళటం, కలకతా, జవహర్‌లాల్‌ నెహ్రూ, విజయలక్ష్మి పండెిట్‌లతో

ద్దకు వెళ్ళటం, కలకత్తా, సుభాన్‌ చంద్రబోస్‌

తదితర కార్మిక కేంద్రాలలో అసంఖ్యాక కార్మికులు సైమన్‌ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొనడం చూసిన బ్రిటిష్‌ పాలకులు భీతి చెందారు. భారతదేశానికి కొత్త వైస్రాయిగా వచ్చిన ఇర్విన్‌ 1929 జనవరి చివరలో ఢిల్లీలోని కేంద్ర శాసన సభలో ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో భారతదేశంలో కమ్యూనిజం వ్యాప్తి చెందటాన్ని చూసి తన ప్రభుత్వం తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నట్లు ప్రకటించారు. 1929 మార్చి 20వ తేదీన బైటిష్‌ పాలకులు ఆకస్మిక చర్యలను చేపట్టి దేశంలోని వివిధ ప్రాంతాలలో అ(గ్రస్థాయికి చెందిన 31 మంది కార్మిక సంఘ నాయకులను అరెస్టు చేశారు. వారిలో 20 మంది వరకు కమ్యూనిస్టులు వున్నారు. వారందరినీ మీరట్‌ జైలుకు తరలించి కుట్రకేసు బనాయించారు. ఇదే చరిత్రాత్మకమైన మీరట్‌ కుట్రకేసు. ఇటువంటి కేసులను పెట్టటం ద్వారా జాతీయోద్యమ ప్రధాన స్రవంతి నుండి కమ్యూనిస్టులను వేరు చేయగలమని (బైటిష్‌ పాలకులు తలపోశారు. కాని, జరిగింది మాత్రం తద్విరుద్ధం. మీరట్‌ ఖైదీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అఖిల భారత కమిటీకి జవహర్‌లాల్‌ నెహ్రూ సారథిగా వున్నాడు. బెంగాల్‌లో సుభాస్‌ చంద్ర బోస్‌ కూడా యిదేరకమైన వైఖరిని చేపట్టారు. జాతీయోద్యమానికి చెందిన సుభాస్‌ తదితర వామపక్ష భావాలు కలిగిన నాయకులు లాహోర్‌ జైలులో మగ్గుతున్న విప్లవకారులపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో, సాధారణ నేర ఖైదీలతో సమానంగా తమను చూడవద్దంటూ లాహోర్‌ కుట్రకేసులోని ఖైదీలు భగత్‌ సింగ్‌ నాయకత్వాన ప్రభుత్వం ముందొక డిమాండు వుంచారు. బ్రిటిష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా తాము విప్లవ సమరం సాగిస్తున్నందున తమను యుద్లకైదీలవలె చూడాలని వారు కోరారు. తమ డిమాంద్లును లలా వా నమా న్‌1ే ంది హన ము గౌతమ్‌ ఛటోపాధ్యాయ

రసా ర్చ ర్త 406 ౫0... .€ట ₹ ఓ [న య //

నానా నాగ తాము పరిశీలించటానికి ప్రభుత్వం నం టం! | తిరస్మరించటంతో నిరవధిక | క్ట . ట్రా ఇడ్జ ఉత. ప్రారంభించారు. నిరాహార దీక్ష న న "|| చేపట్టిన వారిలో బెంగాల్‌కు సట్‌ వ. స్‌ 1. లేం 1... || విప్లవకారుడు జతీం(ద్రనాథ్‌ టం శ్‌ స్ట యం. దాన్‌ ఒకరు. చివరకు నా . . [.. ప్రభుత్వం వెనుకడుగు వేయక ొ హు హై తవ్చలేదు. అయితే యా లోపలనే నిరాహార దీక్ష ప్రారంభించిన 63వ రోజునే అంటే, 1929 సెప్టెంబరు 13వ తేదీన జతిన్‌ తనువు చాలించాడు. సుభాస్‌ హుటాహుటిని లాహోర్‌ బయలుదేరి వెళ్ళాడు. జతిన్‌ దాస్‌ భౌతిక కాయాన్ని రైలులో కలకత్తాకు తీసుకు వచ్చాడు. ప్రధానమైన ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ వేలమంది ప్రజలు జతిన్‌ దాస్‌కు నివాళులర్పించారు. సెప్టెంబరు 15వ తేదీన జతిన్‌ మృతదేహం కలకత్తాకు చేరుకున్నది. ఆ రాహత్రి అంతా శవపేటిక వద్దనే కాంగైసు వలంటీర్లతో కలసి సుభాస్‌ గడిపాడు. 16వ తేదీన అంత్యక్రియల సందర్భంగా (బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. సి.ఆర్‌. దాస్‌ మరణానంతరం యింతపెద్ద ఊరేగింపు జరగటం యిదే ప్రథమం. సుభాస్‌, జె.ఎం. సేన్‌గుప్తా తదితర కాంగ్రెసు నాయకులు చెప్పులు లేకుండా ఒట్టికాళ్ళతో అంతిమ యాత్రలో నడచారు. జతిన్‌ దాన్‌ మరణం వంజాబ్‌ా, బెంగాల్‌ మధ్య నంబంధాన్ని పునరుద్ధరించింది. 1929 అక్టోబరులో జరిగిన పంజాబు ప్రాంత విద్యార్థి సదస్సుకు అధ్యక్షత వహించవలసిందిగా సుభాస్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా విద్యార్థులు సుభాస్‌ను తమమధ్య వుంచుకుని లాహోర్‌ వీధుల్లో బ్రహ్మాండమైన ప్రదర్శనను నిర్వహించారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ సాయాజ్వవాదం నళించాలి అన్న నూతన నినాదాలు యీ తరుణంలోనే వినిపించాయి. సదస్సు అధ్యక్షునిగా సుభాస్‌ విద్యార్థులను వుద్దేశించి మహోద్వేగంతో ప్రసంగించారు. “రవీంద్రనాథ్‌ టాగూర్‌తో సహా మన మహా కవులు మీ వీరుల గాథలను గానం చేస్తారు..... మీ రాజకీయ కార్యకలాపాలు కేవలం భారతదేశపు జైళ్ళలో వున్న వారికేకాక, సుదూరానగల బర్మా జైళ్ళలోవున్న వారికి, సముద్రాల ఆవలగల అండమాన్‌ జైళ్ళలో వున్నవారికి కూడా చేరుతున్నాయి”. అమరజీవి జతిన్‌ దాస్‌, నిర్భ్యయత్వానికి మారుపేరైన సాహసి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 5్‌2

భగత్‌ సింగ్‌ వంటి మహోన్నకులను తమ ఆదర్శ పురుషులుగా వుంచుకోవాలని సుభాస్‌ విద్యార్థులకు బోధించారు.

దురదృష్టవశాత్తు యిదే సమయంలో బెంగాల్‌లో కాంగ్రెసు రెండుగా చీలిపోయింది. సుభాస్‌ చంద్ర బోస్‌ మద్దతుదారులు ఒకవైపున, జె.ఎం. సేన్‌గుష్తా మద్దతుదారులు మరొక వైపున నిలచారు. 1929లో సేన్‌గుప్తా కలకత్తా కార్పొరేషన్‌ మేయర్‌గానూ, బెంగాల్‌ శాసన మండలిలో స్వరాజ్‌ పార్టీ నాయకునిగానూ వున్నాడు. కాగా సుభాస్‌ బెంగాల్‌ ప్రాంతీయ కాం(గెసు కమిటీ అధ్యక్షునిగా వున్నాడు. న న క నే

బెంగాల్‌లో అంతర్గత వివాదం!. '*...' సి. . . నడుస్తూనే వున్నది. భారతదేశానికి అధినివేశ. ఆజ్‌ స్య ..' (వ్రతివత్తిని యిచ్చే విషయాన్ని త్‌ శల? ఆలోచించటానికి (బ్రిటిష్‌ (వ్రభుత్వం గ | త్‌ో -. సా బ్‌ సుముఖంగా వున్నట్లు నూతన వైస్రాయ. . .. శ్రీ! స ఇర్విన్‌ ప్రకటించాడు. ప్రముఖ కాంగైసు ,.. ఖో న్‌ కీ భారతదేశానికి అదినివేశ (వతివత్తి (౯ స్త్ర 1 ॥ రాజ్యాంగాన్ని రూపొందించేటందుకై రౌంద్‌ శ టి. ఖ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనటానికి తాము న / శే . సిద్ధంగా వున్నట్లు తెలియ చేశారు. ఈ” గీ గ. 1 మేరకు ఒక ప్రణాళిక జారీ అయింది. దీనిపై టెకీ. _. స 1. గాంధీజీ, మోతీలాల్‌ నెహ్రూ, సర్దార్‌ న్నా . కా స శ వల్లభాయ్‌ పటేల్‌ తదితరులు సంతకాలు క కి సగ చేశారు. దీనిపై సంతకం చేయటానికి న లే మీ క జాట్‌ తొలుత జవహర్‌ తిరస్కరించాడు, సుభాస్‌తో | న క 0 కలసి అధినివేశ ప్రతిపత్తి లక్ష్యానికి భిన్నంగా న్‌ స 1 ఇల నంపూర్ణ స్వాతంత్ర్యం అన్న భావనకు | న శస. ముసాయిదాను రూపొందించటానికే ఆయన నం... యిష్టపడ్డాడు. జ జభ

ఏదియేమైనప్పటికీ అంతిమంగా శు జ్ఞ గాంధీజీ వాదనకు తలయొగ్గిన జవహర్‌లాల్‌ కాయ్‌ భవాయ

నెహ్రూ ప్రణాళికపై సంతకం చేశారు. సుభాస్‌ మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి వున్నాడు. అంతేకాక, పంజాబుకు చెందిన డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్యూ, బీవార్‌కు చెందిన అబ్బుల్‌ బారిలతో కలసి అధినివేశ ప్రతిపత్తికి వ్యతిరేకంగా (ప్రత్యామ్నాయ ప్రణాళికను విడుదల చేశాడు. రౌంద్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించాడు. సమూల మార్పులను కోరే భారత యువజనులు సుభాస్‌ వైఖరిని సమర్ధించారు.

1929 డిసెంబరులో భారత జాతీయ కాంగైసు సమావేశాలు లాహోరలో జరిగాయి. మోతీలాల్‌ నెహ్రూ, అధ్యక్షునిగా పదవీ విరమణ చేస్తూ, బెంగాల్‌ నుంచి ఏబఐసిసికి నూతనంగా ఎన్నికైన సభ్యులు ఏఐసిసి సమావేశంలో పాల్గొనకుండా ఆంక్షను విధించాడు. కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సభ్యునిగా వున్న సుభాస్‌ చంద్ర బోస్‌ మోఢీలాల్‌ నెహ్రూకు ఒక లేఖరాస్తూ వర్మింగ్‌ కమిటీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలియచేస్తూ దానిని ఆమోదించ వలసిందిగా కోరాడు. అయితే, చివరకు సుభాస్‌ తన రాజీనామాను ఉపసంహరించుకున్నాదు.

1929 డిసెంబరునాటి లాహోర్‌ సమావేశాలకు జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఈసారి గాంధీజీయే స్వయంగా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఉద్వేగభరితమైన దృశ్యాల మధ్య అది ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందింది. కాగా సంపూర్ణ స్వాతంత్య్రం అన్న తమ డిమాండును (ప్రభుత్వం పరిశీలించేలా ఒత్తిడి తెచ్చేందుకై, కాంగ్రెసు దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాన్ని చేపట్టి, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న వాక్యాన్ని కూడా గాంధీజీ తీర్మానానికి జోడించాలని సుభాస్‌ కోరాడు.

సుభాస్‌ చంద్ర బోస్‌ నేతృత్వంలో అప్పుడప్పుడే తలయెత్తుతున్న వామపక్ష శక్తులకూ, కాం(గైను అధిష్టానానికీ మధ్య లాహోర్‌ కాంగైసులో విభేదాలు తీవ్రతరమయ్యాయి. లాహోర్‌ కాంగ్రెసు సమావేశాల సందర్భంగా రూపొందించిన

నూతన వర్కింగ్‌ కమిటీలోకి సుభాస్‌ను, ఆయన సన్నిహిత సహచరుదైన శ్రీనివాస అయ్యంగార్‌ను తీసుకోలేదు. ఈ పరిణామం సుభాస్‌లో ఆగ్రహాన్ని కలిగించింది. దీని గురించి తదనంతర సంవత్సరాలలో ఆయన యిలా రాశాడు: “శ్రీ అయ్యంగార్‌ పేరుతోపాటు, యీ లేఖకుని పేరును కూడా యథావిధిగా వుంచాలన్న అభిప్రాయం అభిల భారత కాంగ్రెసు కమిటీలో బలంగా వున్నది. కాని, మహాత్ముడు విన్పించు కోలేదు. ఒకే విధమైన అభిప్రాయాన్ని కలిగిన కమిటీ వుండాలని తాను కోరుతున్నట్లు ఆయన బహిరంగంగానే ప్రకటించాడు. తానిచ్చిన జాబితాను పూర్తిగా ఆమోదించాలని కూడా ఆయన అఖిప్రాయపద్దాడు..... ఇకమీదట మహాత్ముడు, వ్యతిరేకత గురించి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు వ!

ఏమాత్రం భయం లేకుండా తనదైన పథకాలతో, తన సలహాదారులతో కలసి ముందుకు వెళ్తాడు....”

సుభాస్‌ చంద్ర బోస్‌ కలకత్తాకు తిరిగి వచ్చిన తరువాత, 1929 ఆగస్టులో ప్రారంభమైన ఒక కేసుకు సంబంధించి ఆయనకు శిక్షపడింది. కలకత్తా హైకోర్టు ఏడాదిపాటు కఠిన కారాగారవాసాన్ని శిక్షగా విధించింది, తరువాత దానిని తొమ్మిది మాసాలకు తగ్గించింది.

జైలుకు వెళ్ళటానికి కొన్ని రోజుల ముందు బెంగాల్‌ కాంగ్రెసు వాదులను వుద్దేశించి చివరలో ఆయన చేసిన ప్రసంగాలలో ఒకదానిలో యిలా ప్రకటించాడు. “ఐరిష్‌ జాతీయవాదులు కేవలం స్వాతంట్ర్యం కోరుతూ తీర్మానాన్ని చేయటమే కాదు, సంపూర్ణ స్వాతంత్ర్యమే తమ లక్ష్యమని ప్రకటించారు..... ఆ తరువాత మొత్తం ఐర్లండ్‌ జాతీయ దృక్పథమే పూర్తిగా మారిపోయింది”. ఐరిష్‌ జాతీయవాదులు 1916లో న్థాపించుకున్న సుప్రసిద్ధ ఈస్టర్‌ రైజింగ్‌ గురించి సుభాస్‌ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన ప్రసంగంలోని అంతరార్థం సుస్పష్టమే. జగద్విదితమైన ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించటానికి సన్నద్ధుడవుతున్న గాంధీజీకి సుభాస్‌తో తీవ్ర విభేదాలే వున్నాయి. అయినప్పటికీ, ఆయన సుభాస్‌కు ఉద్విగ్నపూరితమైన సందేశాన్ని పంపుతూ, 'బెంగాల్‌ సాహసమూ, ఆత్మ త్యాగమూ ఎన్నడూ వృథాకాబోవని, వుద్దాటించాడు.. సుభాస్‌ చెరలో వున్న తరుణంలోనే సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం భారతదేశం ముమ్మర పోరాటపు ముంగిటలో వున్నది.

లా

లర్‌... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

1930-31 నాటి ఉద్విగ్యభరిత ఘటనలు

స్వాతంత్ర్యం కోసం భారతదేశం సాగించిన పోరాట క్రమంలో 1930వ సంవత్సరాన్ని కల్లోల సంవత్సరంగా చెప్పవచ్చు. ఆసన్న జాతీయ పోరాటానికి గాంధీజీయే తిరుగులేని నాయకుడు. అహింస పరిధిలోనే యీ పోరాటం సాగాలని ఆయన నిశ్చయించాడు. 1930 జనవరి 80వ తేదీని స్వాతంత్ర్య దినంగా దేశమంతటా నిర్వహించాలంటూ, అదే ఏడాది జనవరి ప్రారంభంలోనే గాంధీజీ తన తాలి ఆదేశాన్ని జారీ చేశాడు. ఆ రోజున ప్రతి వేదికపై నుంచి, అంటే -ప్రతి పాఠశాలలోనూ, కళాశాలలోనూ, ప్రభుత్వ కార్యాలయంలోనూ, గ్రామంలోనూ, వాణిజ్య కూడలిలోనూ, పట్టణంలోని ప్రతి బహిరంగ పార్కులోనూ చదవలసిన ప్రతిజ్ఞను గాంధీజీ తయారు చేయగా దానిని వర్కింగ్‌ కమిటీ ఆమోదించింది. సమావేశమైన ప్రజలు ఒక్కొక్క పంక్తిని వరుసగా చదవాలి. ఆ రోజునుంచి భారత ్రజానీకంలోని అత్యధికులు 1980 జనవరి 26వ తేదీని మాతృదేశ విముక్తి దినంగా పాటించ సాగారు.

స్వాతంత్ర్య ప్రతిజ్ఞలోని ఒక భాగం యిలా వుంటుంది: “మరే యితర (ప్రజా సముదాయం వలెనే, స్వాతంత్ర్యాన్ని పొందటం, శ్రమ ఫలితాలను అనుభవించటం, జీవితావసరాలను కలిగి వుండటం భారత ప్రజల అవిభాజ్యమైన హక్కు అని, అప్పుడు మాత్రమే ఎదుగుదలకు పూర్తి అవకాశాలు లభించగలవని మేము నమ్ముతున్నాము. ఏ ప్రభుత్వమైనప్పటికీ, యీ హక్కులను ప్రజలకు లేకుండా చేసినా, వారిని అణచివేసినా అలాంటి ప్రభుత్వాన్ని మార్చివేసే లేదా తొలగించే మరియొక హక్షు కూడా ప్రజలకు వుంటుందని మేము నమ్ముతున్నాము. భారతదేశంలోని బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రజల స్వాతంత్ర్యాన్ని హరించడమేకాక, ప్రజలను దోచుకోవటంపై అది తన్నుతాను నిలుపుకున్నది, అంతేకాక, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా శిధిల పరుస్తున్నది. కనుక, భారతదేశం తప్పనిసరిగా (బ్రిటిష్‌ సంబంధాలను కెంచుకోవాలని, ఫూర్ధ స్వరాజ్యాన్ని లేదా సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించు కోవాలని మేము నమ్ముతున్నాము”. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 56

య 1 ణే న... నస ఛో! స్‌ ట్ట

న. . న్‌ శే ఖా న్‌

మ ఆ మ ౧/04 1 సుం నంతా న సంఘ స . గ . గా నా. మా | (జ

భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలను అనుసరించి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మహాద్భుతంగా జరుపుకున్నట్లు వెల్లడైంది. భారతదేశంలో మూలమూలనా మున్నెన్నడూ ఎరుగని మహోత్సాహం పోటెత్తింది. గాంధీజీ, త్వరలోనే సామూహిక శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించగలరని ప్రజలు విశ్వసించారు. అయితే, యిలాంటి వుద్యమం ఎంపిక చేసిన నత్వాగ్రములతో కూడిన ఒక చిన్న బృందం తన నాయకత్వంలో ్రారంభించగలదని, ఆ బృందమే తన సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్‌లోని కోస్తా ప్రాంతమైన దండికి చేరుకోగలదని గాంధీజీ ప్రకటించారు. ఫిబ్రవరి చివరలో గాంధీజీ యీవిధంగా పేర్శొన్నారు. “ఈసారి నన్ను ఆరెస్టు చేస్తే నిర్వాపారమైన అహింసకు స్థానం వుండదు, అత్యంత క్రియాశీలమైన అహింస ఉనికిలోకి వస్తుంది, అహింసపట్ల నమ్మకమున్న ఏ ఒక్క విశ్వాసియైనా, భారతదేశపు లక్ష్యసాధన నుంచి స్వేచ్చగా లేదా నిరయత్నంగా వుండజాలడు. హింసా శక్తులను నిగ్రహించినపుడే ప్రతి ప్రయత్నమూ సాధ్యమవుతుంది, ఈ విడత ఒక్కసారిగాని శాసనోల్లంఘనం ప్రారంభమైతే చిట్టచివరి శాసనోల్లంఘన ఉ ద్యమకారుడు స్వేచ్చగా లేదా సజీవంగా వున్నంత వరకు ఎంతమాత్రం ఆగదు, ఆపటం సాధ్యం కాదు. ! గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఎప్పుడైతే, గాంధీజీ | జైజై లాం

తాను ఎంవీక చేనుకున్న క్ష్‌ 4; ళ్‌ న కొద్దిమంది నత్యాగ్రహులతో | ్రతో. యం. కసం నతి సముద్ర తీరానికి చేరుకున్నారో, | /ం ల స! ఖు ళ్ళ వురుష భేదం లేకుండా. ధి ౫. పేద-ధనిక తారతమ్యం | స... శ (లో శ లేకుండా వందల వేల సంఖ్యలో |. క్‌? లో ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. బ్రిటిష్‌ పాలకులు, వారి పోలీసులు సత్యాగ్రహులను అత్యంత (క్రూరంగా కొట్టారు. ఉద్యమ వార్తల సేకరణ కోసం వచ్చిన కొద్దిమంది బ్రిటిష్‌ పాత్రికేయులు సైతం యీ కిరాతకత్వాన్ని చూసి నివ్వెర పోయారు. వామపక్ష భావాలు కలిగిన బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నాయకుడు హెచ్‌.ఎన్‌. టబెల్స్‌ఫోర్డ్‌ ఆ సమయంలో భారతదేశంలోనే వున్నాడు. బ్రిటిష్‌ పాలకుల ఆటవిక కిరాతకత్వం గురించీ, శాసనోల్లంఘనకు సిద్ధపడిన క్రమశిక్షణ కలిగిన ప్రజల ధైర్యసాహసాల గురించీ నజ్జెక్ట్‌ ఇండియా అన్న తన (గ్రంథంలో విస్పష్టంగా పేర్కొన్నాడు.

ఆ సమయంలో జైలులో వున్న సుభాస్‌, నాలుగేళ్ళ పిమ్మట గాంధీజీని శ్లాఘిస్తూ యిలా వ్యాఖ్యానించాడు. “ఆయన (గాంధీజీ) చేపట్టే చర్యలు అన్ని వేళలా ఆయన నాయకత్వం యొక్క కొన్ని ఘనమైన విజయాలకు సాక్షీభూతంగా వున్నాయి. సంక్షిష్ట కాలంలో ఆయన రాజనీతి బెన్నత్యాన్ని తెలియ చేస్తున్నాయి”. బెంగాల్‌లో ప్రభుత్వం తీసుకు వచ్చిన వివిధ అణచివేత చట్టాలకు ప్రజా (ప్రతిఘటన పెరుగుతున్నది. తరచుగా యీ ప్రజా పోరాటాలు ప్రధానమైన శాసనోల్లంఘన ఉద్యమంతో జత కలుస్తున్నాయి. ఇలాంటి పోరాటాల్లో ఒకటి బళ్ళుతోలే వాళ్ళ సమ్మె, ఏప్రియల్‌ 1వ తేదీనుండి 7వ తేదీ వరకు యిది సాగింది. ఎద్దుల, దున్నల బండ్ల ఫీజులను ప్రాంతీయ (ప్రభుత్వం దారుణంగా పెంచటమే యీ సమ్మెకు కారణం. స్వామి విశ్వానంద, బంకిం ముఖర్జీ, అబ్బుల్‌ మోమిన్‌వంటి వామపక్ష భావాలు కలిగిన జాతీయవాదులు, కమ్యూనిస్టులు యీ సమ్మెకు నాయకత్వం వహించారు. బంద్లుతోలే దాదాపు పదివేల మంది హిందువులు, ముస్లింలు సమ్మెకుదిగి పట్టణ వీధుల్లో బారికేడ్లు నిర్మించారు.

దౌష్టానీకి మారుపేరైన పోలీసు కమిషనర్‌ సర్‌ ఛార్లెస్‌ యుగార్డ్‌ ఆదేశాలతో పోలీసులు కాల్పులు జరపటంతో ఏడుగురు చనిపోయారు. ఇందుకు నిరసనగా (బ్రహ్మాండమైన ప్రజా ప్రదర్శన జరిగింది. బళ్ళవాళ్ళ డిమాండ్లతోపాటు, 'హిందూ ముస్లిం ఏక్‌ హో, స్వాధీన్‌ భారత్‌కి జై, అన్న నినాదాలు మిన్నుముట్టాయి. 1926 నాటి హేయమైన సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు. 58

మత కలహాల అనంతరం హిందూ, ముస్లింలు సమైక్యంగా నిర్వహించిన అతిపెద్ద (ప్రదర్శనగా దీనిని అబ్బుల్‌ మోమిన్‌ 1973లో అక్షరబద్దం చేసిన తన స్కృతులలో పేర్యొన్నారు. తనిక సర్కార్‌ రచించిన బెంగాల్‌ 1928-84 పోలిటిక్స్‌ ఆఫ్‌ ప్రొటెస్ట్‌ అన్న [గ్రంథంలో బళ్ళవాళ్ళ సమ్మె గురించి పూర్తి వివరాలు వున్నాయి.

1980 ఏప్రియల్‌ 18-22 మధ్య తూర్పు బెంగాల్‌లోని చిట్టగాంగ్‌లో మరిన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాయుధ తిరుగుబాటు ద్వారా చిట్టగాంగ్‌లో (బ్రిటిష్‌ పాలనను కూలదోసేటందుకై బెంగాల్‌ యున విప్లవకారులకు 'మాస్టర్‌దాగా చిరపరిచితుడైన సూర్యసేన్‌ దాదాపు వందమంది సాహసులైన విష్లవకారులను ఎంపిక చేసుకుని శిక్షణ యిచ్చాడు. వీరిలో అత్యధికులు 15 లేదా 16 ఏళ్ళవాళ్ళే (వీరిలో 18 ఏళ్ళ తెగ్రా అనే పిన్న వయస్ముడు కూడా వున్నాడు). వీరి పథకాలు అత్యంత గోప్యంగా వున్నాయి. తమనుతాము ఇండియన్‌ రిపబ్లిక్‌ ఆర్మీగా పిలుచుకున్న చిట్టగాంగ్‌ విప్లవకారులు ఏప్రియల్‌ 18వ తేదీన ఆయుధాగారాన్నీ టెలిఫోన్‌-టెలిగ్రాఫ్‌ కార్యాలయాన్ని, వీటితోపాటు పట్టణంలోని (బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెందిన యితర ముఖ్య కార్యాలయాలను ఆక్రమించుకున్నారు. ఈ ఘటన (బ్రిటిష్‌ వాళ్ళను ఆశ్చర్యచకితులను చేసింది. చిట్టగాంగ్‌లో నివసిస్తున్న ఇంగ్రీషు వాళ్ళు నివ్వెరబోయి ఇళ్ళూవాకిళ్ళూ విడచి, రేవులో లంగరు వేసివున్న యుద్దనౌకలో తలదాచుకున్నారు. విప్లవకారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య భారతానికి అధ్యక్షునిగా సూర్యసేన్‌ను ప్రకటించి చిట్టగాంగ్‌ స్వతంత్రమైనట్లు ప్రకటించారు. యావద్భారత దేశం మహోద్వేగంతో ఊగిపోయింది. అప్పటికప్పుడు చట్టవిరుద్ధమైన వార్తా పత్రిక వెలువడి కలకత్తాలోని యువజనుల మధ్య పంపిణీ అయింది. ధన్య ఛత్తగ్రామ్‌ (చిట్టగాంగ్‌ ఘనత) అంటూ బెంగాలీ భాషలో ఒక శీర్షికను దానిపై వుంచారు. సుభాస్‌ చంద్ర బోస్‌ ఆయన సహచర ఖైదీలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు, చిట్టగాంగ్‌ సాహసులను అభినందిస్తూ వారిచ్చిన నినాదాలు జైలు ప్రాంగణమంతటా ప్రతిధ్వనించాయి. ఏప్రియల్‌ 22వ తేదీన చిట్టగాంగ్‌ విప్రవకారులు తమకన్నా పదిరెట్లు బలమైన బ్రిటిష్‌ సైనిక దళాలతో జలాలాబాద్‌ కొండల్లో తెగించి పోరాటానికి దిగారు. కాగా ఆలీపూర్‌ జైలు అధికారులు అక్కడ నిర్బంధంలో వున్న విప్లవకారులకు గుణపాఠం నేర్పాలని భావించారు.

పోలీసులు, తుపాకీ మడమలతో విప్లవకారులను కొట్టడం ప్రారంభించారు. సమీపంలోని జైలుగదిలో వున్న సుభాస్‌ చంద్ర బోస్‌, జె.ఎం. సేన్‌గుప్తాలు యీ అరాచకాన్ని నిరసిస్తూ, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. బోస్‌, సేన్‌గుప్తాలపై కూడా దాడి చేయవలసిందిగా జైలు సూపరిండెంట్‌గా వున్న ఇంగ్లీషు అధికారి తన ర్‌ి క్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

సాయుధ మూకలకు హుకుం జారీ చేశాడు. 1980 ఏప్రియల్‌ 26 నాటి కలకత్తా మున్సివల్‌ గెజట్‌ యీ ఘటన గురించి విస్పష్టమైన చిత్రణ యిచ్చింది. “వాళ్ళందరూ ఒక్కసారే మీదపడి పిడికిళ్ళు బిగించి గుద్దుతూ, లాఠీలతో, కర్రలతో కొట్టసాగారు. 'సేన్‌గుప్తాను మొరటుగా కొట్టి గదిలోనుంచి బయటకు యీడ్బుకు వచ్చారు. సుభాస్‌ను కూడా దారుణంగా కొట్టారు. ఆయన స్కృతితప్పి మెట్లమీద పడిపోయాడు. ఖైదీలు ఆయనను పై అంతస్తుకు తీసుకు వెళ్ళారు”.

ఈ దుర్మార్దంపై ఎల్లెడెలా నిరసన జ్వాలలు రగులుకున్నాయి. అరెస్టయిన విప్లవకారుల్లో కొందరికి న్యాయ సహాయాన్ని అందించేటందుకై సుభాస్‌ సోదరుడు శరత్‌ బోస్‌ చిట్టగాంగ్‌కు చేరుకున్నాడు. ఐరోపియన్ల స్వార్ధ ప్రయోజనాలపట్ల స్టేట్స్‌ మన్‌ పత్రిక ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గాంధీజీ చిట్టగాంగ్‌ తిరుగుబాటును ఖండించారు, దానితోపాటే, బ్రిటిష్‌వారి ఆటవిక అణచివేతను కూడా ఖండించాడు. మరోవైపున, సుభాస్‌ మాత్రం జలాలాబాద్‌ కొండల్లో సాగిన పోరాటంలో నేలకొరిగిన అమరులను ఎంతగానో కొనియాడారు.

స్వభావరీత్యా పూర్తి భిన్నమైన, బహుశ భారత స్వాతంట్ర్య ఉద్యమ చరిత్రలోనే

విశిష్టమైన ఘటన వాయువ్య భారతంలోని పెషావర్‌లో చోటుచేసుకున్నది. ఇది పఠాన్‌ల జన్మభూమి. సరిహద్దు గాంధీగా ఖ్యాతిగాంచిన చరిత్ర ప్రసిద్దుడు ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ నేతృత్వాన వేలసంఖ్యలో పఠానులు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఏప్రియల్‌ 28వ తేదీన ట్రిటిష్‌ ప్రభుత్వం సాయుధ శకటాలలో సైనికులను తీసుకువచ్చి (ప్రదర్శకులతో ఘర్షణకు దిగింది. గర్వాలీ సైనిక దండును తీసుకువచ్చి నిరాయుధులైన పఠాన్‌లపై కాల్పులు జరప వలసిందిగా ఆదేశించింది. ఆ సమయంలో సైనికుల్లో వున్న ఠాకూర్‌ చంద్ర సింగ్‌ తన తుపాకిని కిందపడవేసి, యీ రోజునుంచి భారత్తీయులైనవారు భారతీయులపై కాల్పులు జరపబోరంటూ పెద్దగా అరచి చెప్పాడు. మిగిలిన గర్వాలీ సైనికులు సైతం ఆయననే అనుసరించారు. ఈ పరిణామంతో ఉ స్పాంగి పోయిన పఠాన్‌ సత్యాగ్రహులు గర్వాలీ సైనికులను ఆలింగనం చేసుకుని హిందూ-ముస్లిం ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. దీనితో భీతిల్లిన బ్రిటిష్‌ అధికారులు తమ సాయుధ శకటాలలో పరారయ్యారు. “చేజారిన పెషావర్‌' అంటూ స్టేట్స్‌మన్‌ పథత్రిక వ్యాఖ్యానించింది.

1980 మే 5వ తేదీన ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసి జైలుకు తరలించింది. భారతదేశమంతటా నిరసన హర్తాళ్ళు, సార్వత్రిక సమ్మెలు జరిగాయి. పారిశ్రామిక పట్టణమైన షోలాపూర్‌ స్వయంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నది. కొన్ని రోజులపాటు కార్మికులే పరిపాలనను సాగించారు. అహింసాయుతమైన యీ ఆందోళనను టిటిష్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 60

ప్రభుత్వం పశుబలంతో అణచి వేసింది. వఏదియేమైనప్పటికీ, యీ అణచివేత ద్వారా భారతీయులలో వెల్లివిరిసిన స్ఫూర్తిని బలహీన పరచటం సాధ్యం కాలేదు. దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమం పెద్దయెత్తున సాగింది.

ఇదే సమయంలో 1980 ఆగస్టు 22వ తేదీన కలకత్తా మేయర్‌గా సుభాస్‌ చంద్ర బోస్‌ ఎన్నికయ్యాడు. 1980 సెప్టెంబరు 28వ తేదీన సుభాస్‌ జైలు నుంచి విడుదల అయ్యాడు, ఆ మరుసటి రోజునే ఆయన కలకత్తా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌ హోదాలో ఆయన మొట్టమొదటిసారిగా ఉపన్యసిస్తూ మున్ముందు జవహర్‌లాల్‌ నెహ్రూతోటీ, అదేవిధంగా కమ్యూనిస్టులతోటీ వివాదపడే అవకాశం ఉన్నదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయనిలా పేర్మొన్నారు: “ఆధునిక ఐరోపాలో వేటినైతే సోషలిజం, ఫాసిజం అని పిలుస్తున్నారో వాటి సమన్వయ సారాంశం యీ విధానంలోనూ, కార్యక్రమంలోనూ వున్నాయని నేను చెప్పదలచుకున్నాను. మనమిక్కడ న్యాయాన్ని సమానత్వాన్ని ఏదైతే సోషలిజానికి పునాదిగా వున్నదో దానిపట్ల (ప్రేమను కలిగివుండి, వీటితో, యీనాడు ఐరోపాలో నిలచివున్న ఫాసిజం యొక్క సమర్ధత, క్రమశిక్షణలను జోడిస్తాము”.

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవిత చరిత్రకారునిగా సుప్రసిద్ధుడైన గోర్డన్‌, సుభాస్‌ సోదరుడు శరత్‌ బోస్‌లు యీ విధంగా పేర్కొన్నారు: “మేయర్‌గా ఆయన చేసిన ప్రసంగంలో..... ఫాసిజంలోని కొన్ని లక్షణాల గురించీ, అదేవిధంగా, సోషలిజం, ఫాసిజంలలోని మౌలిక లక్షణాలను భారతదేశానికి సరికొత్తగా సమన్వయం చేయటం గురించీ సానుకూల ప్రస్తావన మొట్టమొదటిసారిగా కన్పిస్తుంది. ప్రతికూల లక్షణాల ప్రస్తావనను విడచిపుచ్చి, తదనంతర సంవత్సరాలలో బోసు కార్యక్రమంలో యీ సరికొత్త నూతన సమన్వయం సుపరిచిత భాగంగా మారింది”

శరత్‌బోస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌గా వున్న లిబర్రి దినపత్రిక అక్కడ చేరిన వారందరికీ ఆతిథ్యాన్ని యిచ్చింది. ఈ సందర్భంగానే, బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నాయకుల్లో ఒకరిగా వుండటమేకాక, పాత్రికేయునిగా కూడా పనిచేస్తున్న హెచ్‌.ఎన్‌. బైల్స్‌ఫోర్డ్‌కు మేయర్‌ హోదాలో సుభాస్‌ బోస్‌ బహిరంగ ఆహ్వానం పలికాడు.

ఈ కాలంలోనే ప్రస్తావనార్దమైన ఒక చిన్న సంఘటన జరిగింది. 1980 డిసెంబరు 12వ తేదీన కలకత్తాలోని స్కాటిష్‌ చర్చి కళాశాల శత వసంతాల ఉ త్సవాలు జరిగాయి. సుభాస్‌ బోస్‌ యీ కళాశాలలో చదివిన ఒకప్పటి విద్యార్థియేకాక, కలకత్తా మేయర్‌గా కూడా వున్నందున ఉదారవాదిలైన కళాశాల టప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉర్‌కర్ట్‌ ఆయనను ఆహ్వానించాడు. డాక్టర్‌ ఉర్‌కర్ట్‌ తన ప్రసంగంలో సుభాస్‌ గురించి విద్యార్థులకు తెలియచెప్తూ, “యీ కళాశాలకు చెందిన అత్యంత సుఫ్రసిద్ధ విద్యార్థులలో ఒకరని”, పేర్మొన్నారు. 61. గౌతమ్‌ ఛటోపాధ్యాయ

1930 డిసెంబరు 8వ తేదీన అవక్ర విక్రములైన వినయ్‌ బోస్‌, బాదల్‌

గుప్తా, దినేష్‌ గుప్తాలు రైటర్స్‌ బిల్దింగ్‌లోకి ప్రవేశించి జైళ్ళ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సింప్సన్‌ను కాల్చి చంపారు. వినయ్‌ బోస్‌, బాదల్‌ గుపష్తాలు ప్రతి చర్యలో మరణించగా, దినేష్‌ గుష్తాను పోలీసులు అరెస్టు చేసి విచారణ తంతునడిపి ఉరితీశారు. అప్పటిలో యీ దుర్దటన గురించి కలకత్తా నుంచి వెలువడే ఒక పత్రిక యీ విధమైన శీర్షికను యిచ్చింది: “ప్రాతన్సంధ్య వేళ అమరుడైన అకలంక దినేష్‌” ఆనాటి భావోద్రేకాలను యీ శీర్షిక చక్కగా ప్రతిబింబించింది. డిసెంబరు 10వ తేదీన సమావేశమైన కలకత్తా కార్పొరేషన్‌ సింప్సన్‌ హత్యను ఖండించటమేకాక, యీ చర్యను 'అశక్త దుర్దనతగా పేర్శొన్నది. మేయర్‌ హోదాలో సుభాస్‌ బోస్‌ యీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం విలక్షణమైన రీతిలో యిలా సాగింది: *ఈ ఘటనలకు బాధ్యులైన యువకులను దారితప్పిన వారంటూ తేలిగ్గా అనవద్దు. సత్వరమే స్వాతంత్ర్యం కావాలని యీనాడు భారతదేశం కోరుతున్నదన్న వాస్తవం మనలను నివ్వెరపరుస్తున్నది. సంఖ్యాపరమైన వివరాలు ఎలావున్నప్పటికీ, కేవలం కాంగ్రెసు కార్యక్రమాన్ని అనుసరించటం ద్వారా మాత్రమేకాక, అవసరమైతే ఎంతటి మూల్యాన్ని చెల్లించైనా, ఏ పద్ధతుల ద్వారానైనా స్వాతంత్ర్యాన్ని సంపాదించు కోవాలని కోరుకునే వారు కూడా దేశంలో వున్నారన్న

వాస్తవం మన కళ్ళముందున్నది”.

1981 స్వాతంత్ర్యదినం నాడు జాతీయ పతాకాన్ని ఎగుర వేసేటందుకై

కలకత్తా మైదాన్‌ దిశగా కదలిన బ్రహ్మాండమైన కాంగ్రెసు వలంటీర్ల ప్రదర్శనకు మేయర్‌గా వున్న సుభాస్‌ నాయకత్వం వహించారు. అయితే దీనిని నిరోధించాలని నిశ్చయించుకున్న బ్రిటిష్‌ అధికారులు సుభాస్‌తో సహా వలంటీర్లందరిపై ఆటవిక దాడి చేశారు. అప్పటిలో కలకత్తా కార్పొరేషన్‌లో విద్యాధికారిగా వున్న సుభాస్‌ పాత మిత్రుడు ఖితిష్‌ ప్రసాద్‌ కూడా యీ ప్రదర్శనలో పాల్గొన్నాడు. కలకత్తా మునిసివల్‌ గెజెట్‌కు యిచ్చిన ప్రకటనలో యీ ఘటనను సవివరంగా పేర్కొన్నాడు. “నేను దెబ్బలుతిని కింద పడిపోయేంత వరకు మేయర్‌కు ఎడమ వైపునే వున్నాను. మేము చౌరంగీ దాటగానే అనేకమంది పోలీసులు మా వెనుకవున్న జనాలను చెల్లాచెదురు చేస్తూ లాఠీఛార్జి చేశారు. ప్రదర్శకుల నుంచి మేయర్‌ను, మమ్మల్ని వేరుచేశారు. గుర్రాలపై వున్న పోలీసులు మావైపుకు, ప్రత్యేకించి మేయర్‌ వైపుకు దూసుకు వచ్చి తమ చేతుల్లో వున్న చిన్న లాఠీలతో మమ్మలను కొట్టారు. మేయర్‌పై రెండువైపుల నుంచి దాడి జరిగింది. అప్పుడు తలకు దెబ్బ తగలకుందా కాపాడు కోవటానికై ఆయన తన కుడిచేతిని తలపై పెట్టుకున్నాడు. ఆయనను కొడ్డున్న వారివైపు తిరిగి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు 42

అరిచాను. “సుభాస్‌ కా న న మీకు లేదు. | జ య గ్‌ సీ ఆయనను మీరు మ్‌! [. | గ్ర క మక ? ఆయనను కొట్టే (ఖీ | ఎ జ మ 1 హక్కు మీకు లేదు”. | [క్త కాండాలు అవ్వుడు నేను బ్యానర్‌ కోసం పాతిన గుంజను ఆయన మీదుగా నా చేతితో పట్టుకోవటం ద్వారా ఆయన తలకు దెబ్బతగలకుందడా చూడటానికి ప్రయత్నించాను...... ఈ సమయంలో గుర్రాలపై వున్న పోలీసులు నా మీదకు దూసుకు వచ్చి నన్ను రెండుసార్లు కొట్టారు..... అప్పుడు నా ముఖం మీదకు దారలు కట్టిన నెత్తురు కారణంగా నా కళ్ళు తెరిపిడి పడలేదు...... గుర్రం తాకిడికి నేను కిందపడ్డాను.... మేయర్‌నుగానీ, నన్నుగానీ కొట్టిన వాళ్ళలో భారతీయులెవరూ లేరు".

ఇలాకొట్టిన తరువాత సుభాన్‌ బోస్‌ను అరెస్టుచేసి లాల్‌ ఐజార్‌కు తరలించారు. అక్కడ ఆయనను 24 గంటలపాటు పోలీసు లాకప్‌లో వుంచారు, భోజనంగానీ, వైద్య చికిత్సగానీ లభించలేదు. ఆయన ఒళ్ళంతా పచ్చిపుండుగా మారిపోయింది. నుదురుకు కుడివైపున, తల వెనుక వైపున తగిలిన దెబ్బలతో ఎంతో బాధ పడ్డాడు. తలనుంచి కారిన నెత్తుటితో ఆయన దుస్తులు ఎర్రబారాయి. ఆ మరుసటి రోజున ఆయనను కలకత్తా ప్రధాన న్యాయమూర్తి రోక్క్‌బుర్గ్‌ ముందు నిలబెట్టారు. నెత్తుటి మరకలతో నిండి, చీలికలు పేలికలైన దుస్తులు ధరించి, కుడిచేతిని పైకిలేపి కట్టుకున్నాడు. నత్యాగ్రపాగా ఆయన తననుతాను నమర్ధించుకునేందుకు తిరస్కరించాడు. ఆరుమాసాల కఠిన కారాగార శిక్షపడింది.

బెంగాల్‌లోనూ, మిగిలిన దేశమంతటా శాసనోల్లంవున ఉద్యమం అప్రతిహతంగా సాగిపోతున్నది. బ్రిటిష్‌ ప్రభుత్వం యిప్పుడు నిజంగానే భయపడింది. భారతదేశానికి చెందిన బడా వాణిజ్యవేత్తల్లో సైతం యిదేవిధమైన భయం నెలకొన్నది. చర్చల ద్వారా బ్రిటిష్‌ వారితో ఒప్పందానికి రావలసిందిగా వారు గాంధీజీపై ఒత్తిడి తెచ్చారు. తాలుత 1981 ఫిబ్రవరిలో గాంధీజీని, యితర కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సభ్యులను భారత్‌లోని (బిటిష్‌ ప్రభుత్వం బేషరతుగా విడుదల చేసింది. తత్మారణంగా 63. గౌతమ్‌ ఛటోపాధ్యాయ

వారు వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌తో సమావేశమై బ్రిటిష్‌ ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కావటానికి సుముఖత వ్యక్తం చేశారు. లార్డ్‌ ఇర్విన్‌తో గాంధీజీ సమావేశాలు ఫిబ్రవరి 17న ప్రారంభం అయ్యాయి. అనారోగ్యం పాలైన మోతీలాల్‌ నెహ్రూ మినహా దాదాపుగా వర్కింగ్‌ కమిటీ సభ్యులందరూ గాంధీజీ వెనువెంట వున్నారు. వైస్రాయ్‌కి, కాంగ్రెసు నాయకులకు మధ్య పలు దినాలపాటు చర్చలు సాగాయి. మార్చి 4వ తేదీన గాంధీజీ ఒక ఒప్పందపు ముసాయిదాను వర్కింగ్‌ కమిటీ ఆమోదం కోసం దాని ముందుంచాడు. ఇదే తరువాత కాలంలో గాంధీ-ఇర్వీన్‌ ఒడంఐడికగా పేర్గాంచింది. చర్చల అనంతరం, జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా వర్కింగ్‌ కమిటీ మొత్తం యీ ముసాయిదాను ఆమోదించింది. మార్చి రవ తేదీన దీనిపై గాంధీ, ఇర్విన్‌లు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలోని అంశాలేమిటి? సుభాస్‌ అభిప్రాయం ప్రకారం కాం(ైెసు వీటిని అమోదించింది: (అ) శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించటం, (ఆ) భారతదేశ ప్రయోజనాలకు అవసరమయ్యే (1) సమాఖ్య విధానం (2) బాధ్యత (8) సర్దుబాట్లు, రక్షణల ప్రాతిపదికపై భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేటందుకై రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కావటం (ఇ) భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో సంభవించిన పోలీసుల అత్యాచారాలకు సంబంధించిన ఆరోపణలపై విచారణకు డిమాండు చేయటం.

ప్రభుత్వం తరపున వైస్రాయి యీ విషయాలకు ఆమోదాన్ని తెలిపాడు: (అ) అహింసా ఉద్యమంతో సంబంధాన్ని కలిగివుండి కారాగారంలో పడిన రాజకీయ ఖైదీలందరినీ ఒకే విడతగా విడుదల చేయటం (ఆ) ప్రభుత్వం యిప్పటికీ అమ్మకం చేయని, వేలం వేయని స్వాధీన ఆస్తులను, భూమిని సంబంధిత యజమానులకు అప్పగించటం (ఇ) అత్యవసర ఆర్టినెన్స్‌ల ఉపసంహరణ (ఈ) సముద్ర తీరానికి నిర్దిష్ట దూరంలో నివాసం వుంటున్న ప్రజలు పన్ను లేకుండా ఉప్పును సేకరించటానికి లేదా తయారు చేసుకోవటానికి అనుమతి యివ్వటం (ఉ) మద్యం, నల్లమందు, విదేశీ వస్త దుకాణాల ముందు శాంతియుత పికెటింగ్‌కు అనుమతి, అయితే, చిట్టచివరిది స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించేటందుకేగాని, బ్రిటిష్‌ వస్తువులపట్ల

వివక్షతగా భావించరాదు.

వామపక్ష వాదులతోసవా కాంగ్రెసు పార్టీలో కిందనుంచి పైదాక అనేకమంది

యీ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. 1981 ఫిబ్రవరి 6వ తేదీన మోతీలాల్‌ నెహ్రూ మరణించారు. మార్చి 4వ తేదీ వరకు జవహర్‌ దుఃఖంలో మునిగి వున్నాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 64

తొలుత వర్కింగ్‌ కమిటీ సమావేశంలో యీ ఒప్పందాన్ని ఆమోదించినప్పటికీ, ఒప్పందం ప్రచురణ అయిన తరువాత దానిని తీవ్రంగా విమర్శించాడు. ఆయన యీ విధంగా అన్నట్లుగా వార్తలు వచ్చాయి: “దీని కోసమా, మన ప్రజలు ఏడాది పాటు మహా సాహసంతో పోరాడింది? సాహసంతో కూడిన మన మాటలు, చేతలు అన్నీ దీనిలో లయించి పోవాలా..... కాంగ్రెసు తీర్మానమూ, జనవరి 26 నాటి ప్రతిజ్ఞ తరచుగా పునరావృతం కావాలా?”

ఒప్పందం గురించి జైలులో వున్న సుభాస్‌ చంద్ర బోస్‌ వినటం చదవటం జరిగింది, దీనిని ఆయన తీవ్రంగా విమర్శించాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ నిర్వహించిన పాత్ర ఆయనను నిరాశలో ముంచింది. తరువాత కాలంలో ఆయన యిలా రాశాడు: “ఇటువంటి కీలక తరుణంలో జవహర్‌లాల్‌ నెహ్రూకు మహత్తరమైన బాధ్యత వున్నది. కాంగ్రెసు అధ్యక్షునిగా వుండటమేకాక, వర్కింగ్‌ కమిటీ సభ్యుల్లో ఆయన మాత్రమే వామపక్షవాదుల దృక్పథాన్ని అవగాహన చేసుకుని, తెలియ చెప్పగల వ్యక్తిగా వున్నాడు. మహాక్ళుడు, వర్కింగ్‌ కమిటీ ఒప్పందాన్ని ఖరారు చేయకుండా ఆయన తిరస్మరణ నిరోధించి వుండేది...... ఒప్పందంలోని కొన్ని అంశాలను తాను ఆమోదించలేక పోతున్నానన్న ప్రకటనను ఆయన చేశాడు, కాని, విధేయుడైన సైనికునిగా ఆయన నాయకునికి లొంగిపోయాడు. అయితే సైనికునికి విధేయతను మించి దేశం మరింత ఎక్కువగా ఆయన నుంచి ఆశిస్తున్నది”.

సుభాస్‌ బోస్‌ జైలునుంచి విడుదల అయ్యాడు. గాంధీజీని కలుసుకునేందుకై హుటాహుటిని బొంబాయి బయలుదేరి వెళ్ళాడు. గత ఏడాది కాలంగా కాంగ్రెసు కార్యకర్తలు అనుభవించిన వేదనలకు ప్రతిపలంగా గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం ద్వారా కాంగైసుకు లభించినది స్వల్చ్బమేనన్న జవహర్‌లాల్‌ అభిప్రాయంతో తాను ఏక్తీభవిస్తున్నట్లు గాంధీజీకి సుభాస్‌ చెప్పాడు. మార్చి 15 నుంచి 17వరకు ఆయన గాంధీజీతో విసృతంగా చర్చలు జరిపాడు. కాని ఆయనను ఒప్పించలేక పోయాడు. రాజకీయ ఖైదీలందరి విడుదల సమస్య గాంధీకి, బోస్‌కు మధ్య పెద్ద అంతరంగా మారింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం బెంగాల్‌లో విడుదల కాని రాజకీయ ఖైదీలు 800 మంది వున్నట్లు సుభాస్‌ అభిప్రాయ పడ్డాడు. వీరిలో అత్యధికులు విచారణ లేకుండానే కారాగారంలో మగ్గుతున్నారు. కాగా, గాంధీజీ అభిప్రాయం ప్రకారం యీ ఖైదీలు కాంగ్రెసు సత్యాగ్రహులవలె అహింసకుకట్టుబడిన వాళ్ళుకారు.

1931 మార్చి చివరలో భారత జాతీయ కాంగ్రెసు ప్రత్యేక సమావేశాలు కరాచీలో జరిగాయి. కరాచీ కాంగ్రెసు ప్రారంభం కావటానికి కొన్ని రోజులముందు వ.

సాహసులైన ముగ్గురు యువ విప్లవకారులు భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవలను లాహోర్‌ జైలులో ప్రభుత్వం ఉరితీసింది. దీనితో భగత్‌ సింగ్‌ను అసలుసిసలైన నాయకునిగా భావించే భారత యువజనులు గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికను నిరసించసాగారు. ఈ ముగ్గురు సాహసుల ప్రాణాలను కాపాడేటందుకై వైసప్రాయ ముందు గాంధీజీ మరింత బలంగా వాదించి వుండవలసిందని వారు అభిప్రాయపడ్డారు. వారి ఆగ్రహం మింటికెగసింది. కాంగైసు మవోసభల కోసం గాంధీజీ కరాచీ స్టేషన్‌లో దిగినపుడు వేలమంది రాడికల్‌ యువకులు ఆయనకు నల్ల గులాబిపూల గుత్తిని సమర్పించారు. దానితోపాటే, ఒడంబడిక ద్వారా, “యువజనులు పొందిందేమిటి? కేవలం భగత్‌ సింగ్‌ ఉరితీత మాత్రమే!”, అన్న నూతన నినాదాన్ని విన్సించారు. కరాచీలో కాంగైసు మహాసభలు జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోనే భగత్‌ సింగ్‌ స్థాపించిన నవజవాన్‌ భారత సభ వార్షిక సమావేశాలు 1981 మార్చి 27న జరిగాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన సుభాస్‌ చంద్ర బోస్‌ యిలా పేర్కొన్నాడు: “తిరుగుబాటు స్ఫూర్తికి భగత్‌ సింగ్‌ ప్రతీక, దేశవ్యాప్తంగా ఆ చివర నుంచి యీ చివరకు యీ ప్రతీక ఆవహించింది. ఈ స్ఫూర్తి అజేయమైనది...... ఇటీవలి ఉరిశిక్షలు ప్రభుత్వ ఆలోచనల్లో ఎలాంటి మార్పూ లేదనేందుకూ, గౌరవప్రదమైన ఒప్పందానికి యింకా తరుణం రాలేదనటానికీ కచ్చితమైన సూచనలనే నేను నమ్ముతున్నాను”. ఈ వేదికపై నుంచే గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికను సుభాస్‌ తీవ్రంగా విమర్శించాడు. భారతదేశ భక్తులందరూ పోరాటంలో మునిగి వున్నారు, వారు యీ ఒడంబడికను తిరస్మరించలేదు, అలాచేస్తే తమ నేతను, అంటే, -గాంధీజీని త్రోసిపుచ్చినట్లే అవుతుంది. కరాచీ మహాసభలో సైతం సుభాస్‌ ప్రసంగిస్తూ ఒడంబడికను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, అంతిమంగా ఆయన తన మద్దతుదారుల్లో ఎక్కువమందితో కలసి గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికకు అనుకూలంగా ఓటుచేశారు. మహాసభకు ప్రతినిధులుగా హాజరైన కొద్దిమంది కమ్యూనిస్టులు, విష్రవకారులు ఒడంబడికకు వ్యతిరేకంగా ఓటు చేశారు. సుభాస్‌ చంద్ర బోస్‌ వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. వామపక్షాన్ని త్యజించారని ఆయనతోనే చెప్పారు. దీనితో అసంతృప్తి చెందిన సుభాస్‌ తరువాత కాలంలో దీని గురించి రాస్తూ కరాచీ కాంభైసులో తన వైఖరిని సమర్ధించుకుంటూ యిలా రాశాడు.*....కాంగ్రైెసులోని వామపక్షవాదులు గాంధీ-ఇర్విన్‌ ఒదంబడికను ఆమోదించటం లేదని తెలిపే ప్రకటనను తయారు చేయాలని నిర్ణయించారు. కాని, అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సభను విభజించకుండా సుభాన్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 66

వారు నిగ్రహం వహించారు. ఈ మేరకు నేను చేసిన ప్రకటన ఒడంబడిక మద్దతుదారుల్లో మహోత్సాహాన్ని నింపగా, మమ్మల్ని ఎంతో సంతోషంతో బలపరిచే మద్దతుదారుల్లో నిరాశను నింపింది”. ఒక్కసారి మనం వెనుతిరిగి పరిశీలించి చూసినట్లయితే, కాంగ్రెసు ఐక్యతకున్న అత్యధిక ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని కరాచీ కాంగ్రెసు మహాసభలో తన వైఖరి సమర్ధనీయమేనని సుభాస్‌ భావించేట్లయితే, కాస్త అటూయిటుగా యిలాంటి వైఖరినే తీసుకున్న జవహర్‌లాల్‌ను ఏవిధంగా మర్శించగలము?

తన వైఖరిని బలంగా సమర్ధించు కోవటానికి అవకాశం లేదని సుభాస్‌ స్వయంగా (గ్రహించాడు. కనుకనే ఆయన మరోసారి తన చర్యను సమర్థించుకున్నారు. 1981 మార్చి 15న బొంబాయిలో ఆయన గాంధీజీని కలుసుకుని మూదు రోజులపొటు చర్చలు జరిపాడు. ఈ సందర్భంగా మహాత్ముడు ఆయనకు నోటిమాటగా మూడు హామీలు యిచ్చాడు:

(1) రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళీ కాంగ్రెసు ప్రతినిధులకు పరిమితిని విధిస్తూ ఆదేశించ వలసిందిగా కరాచీ మహాసభను ఆయన కోరతాడు.

(2) లాహోర్‌ కాం(గ్రెసు దేనినైతే ప్రకటించిందో ఆ స్వాతంత్ర్య హోదాతో ఏకీభవించనిదేదీ ఆ ఆదేశాలలో వుండదు.

(39) ఒడంబడికలో ఎవరినైతే వదిలి వేయటం జరిగిందో వారికి క్షమాభిక్ష కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

సుభాస్‌ యింకా యీ విధంగా రాశాడు. బొంబాయిలో యీ రచయితకు యిచ్చిన హామీ మేరకు మవాత్ముడు కాంగ్రెసు ప్రతినిధి బృందానికి కరాచీ కాంగ్రెసు మహాసభలో ఆదేశం యిచ్చాడు. తరువాత కాలంలో కరాచీ కాంగ్రెసులో తాను తీసుకున్న వైఖరిని సుభాస్‌ పరోక్షంగా విమర్శించుకున్నాడు. “మున్ముందు మనం చూడనున్నట్లుగా ఢిల్లీ ఒడంబడిక వరంగాకాక, శాపంగా తయారైంది. ప్రయత్నాల తీరును అవగాహన చేసుకోవటానికీ సమయం తగినది కాదు. మరికొంత కాలంపాటు పోరాటం కొనసాగుతుంది”.

రౌండ్‌ టేబుల్‌ సమావేశం విఫలమైన విషయం అందరికీ తెలిసినదే. 1981 డిసెంబరు 28వ తేదీన ఇంగ్లండు నుంచి బొంబాయికి గాంధీజీ ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఇదే సమయంలో, అంటే, 1981 జూన్‌-అక్టోబరు నెలల మధ్య బెంగాల్‌లో ఆటవికమైన అణచివేత ఘటనలు మూడు సంభవించాయి. ప్రజలపట్ల క్రూరంగా వ్యవహరించే భారతీయ పోలీసు అధికారిని చిట్టగాంగ్‌లో ఒక యువ విప్లవకారుడు 1981 జూన్‌లో హతమార్చాడు. ఆ మరుసటి రోజు ఉదయాన స్థానిక 097... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రభుత్వ అధికారులు అసాంఘిక శక్తులను ఉసిగొల్ప్బటంతో చిట్టగాంగ్‌లో పట్టపగలే వరుస దోపిడీలు జరిగాయి. చిట్టగాంగ్‌ ప్రజలకు గుణపాఠం నేర్పాలని చెప్తూ పోలీసులు నిర్వాపారంగా వుండిపోయారు.

1931 సెప్టెంబరు మధ్యలో బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ సమీపాన వున్న హిజ్ణి నిర్బంధ శిబిరానికి చెందిన అధికారులు వున్నపాటున అన్నం తింటున్న రాజకీయ ఖైదీలపై కాల్పులు జరిపారు. విష్లవకారులైన సంతోష్‌ మిత్రా, తారకేశ్వర్‌ సేన్‌లు అక్కడికక్కడే (ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుభాస్‌ ముటాహుటిని హిజ్లికి చేరుకుని అమరవీరుల భౌతిక కాయాన్ని కలకత్తాకు తీసుకు వచ్చాడు. డెబ్బయ్‌ ఏళ్ళ వృద్ధుడైన మహాకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ, సుభాస్‌, జె.ఎం. సేన్‌గుప్తాల విజ్ఞప్తి మేరకు కలకత్తా మాన్యుమెంటల్‌ మైదాన్‌కు వచ్చి అక్కడ చేరిన బ్రహ్మాండమైన ప్రజానీకాన్ని వుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ అరాచకాలను నిరసించాడు.

ఒడంబడిక పేర్కొన్న సంధికాలం ముగిసి పోయినట్లు 1982 జనవరి 4వ తేదీన వైస్రాయ్‌ ప్రకటించాడు. యావద్భారతంలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. దాదాపు 20,000 మంది కాంగ్రెసు కార్యకర్తలను, నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లబాయ్‌ పటేల్‌, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కూడా అరెస్టయిన వారిలో వున్నారు. ఆ సమయంలో సుభాస్‌ బొంబాయిలో

వుండి గాంధీజీతో చర్చలు జరిపి, 1932 జనవరి 2వ తేదీన కలకత్తాకు రైలులో బయలు దేరాడు. అయితే, బొంబాయికి కేవలం 80 మైళ్ళ దూరంలోని కల్యాణ్‌లో ఆయనను 1818 నాటి రెగ్యులేషన్‌-3 కింద పోలీసులు అరెస్టు చేశారు. అదే రైలులో ఆయనను అజ్ఞాత ప్రదేశానికి తీసుకు వెళ్ళారు. గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక భారతీయుల కోలాహలం మధ్య ఆశావహంగా మొదలై, ఆర్తారవాలతో అంతమైంది. ఇక యిప్పుడు రెండవ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది.

టా సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 68

ఐరోపాలో సుభాస్‌ బోస్‌

క్షేం32 జనవరిలో అరెస్టు చేసిన సుభాస్‌ను సివాని జైలుకు తరలించారు. ఆయనను అరెస్టు చేసిన కల్యాణ్‌కు అతి సమీపాన వున్న జైలు యిదే. ఇది సబ్‌ జైలు, దీనిలో విద్యుత్‌ తదితర సౌకర్యాలు లేవు. అచిరకాలంలోనే సుభాస్‌ అనారోగ్యం పాలయ్యాడు. 1932 ఏప్రియల్‌ మధ్యనాటికి సుభాస్‌ ఆరోగ్యం బాగా దిగజారి పోయింది. దీనితో సివానీ జైలు సూపరింటెండెంట్‌ బొంబాయి (ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ తగిన వైద్య సౌకర్యం లభించే జైలుకు సుభాస్‌ను తరలించ వలసిందిగా తెలియ చేశాడు. కలకత్తా ఆయనకు తగిన ప్రదేశం, కాని, బెంగాల్‌ జైళ్ళలో సుభాస్‌ను వుంచటానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. ఆయన పెద్ద సోదరుడు శరత్‌ బోస్‌ కూడా అదే జైలుకు వచ్చాడు. సుభాస్‌ ఆరోగ్యంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. సుభాస్‌ను అజీర్ణ వ్యాధి పీడించటమేకాక, ఛాతీలో నొప్పి తిరగబెట్టింది. పిత్తాశయం సమస్యతోటీ, క్షయ వ్యాధితోటి ఆయన బాధపడుతున్నట్లు స్థానిక వైద్యులు అనుమానించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మే నెల చివరలో సుభాస్‌, శరత్‌లను జబల్‌పూర్‌ సైనిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు సుభాస్‌ను పరీక్షించి ఆయనకు మరింత మెరుగైన ప్రత్యేక చికిత్స అవసరమని సూచించారు. దానితో ఆయనను మద్రాసుకు మార్చారు, అక్కడ ఆయన కోరుకున్న యిరువురు వైద్యులు దాక్టర్‌ బి.సి. రాయ్‌, సర్‌ నీల్‌రతన్‌ సర్మార్‌లు పరీక్షలు జరిపారు. క్షయవ్యాధి లక్షణాలు వున్నాయనటాన్ని వారు ధ్రువీకరించారు. వైద్యుల సిఫార్సు మేరకు సుభాస్‌ను కుమావూ పర్వతాలలోని నైనిటాల్‌, రాణిఖేట్‌లకు సమీపంలోని భోవలి శానిటోరియానికి తరలించారు. అక్కడైతే ఆయన ఆరోగ్యం మెరుగు కాగలదన్న ఆశ వున్నది.

భోవలిలో సుభాస్‌ ఆరోగ్యం స్వల్పంగా బాగుపడింది. కారాగారంలో ఆయన ప్రాణాలు పోగూడదని అదే జరిగితే దేశంలో నిరసన జ్వాలలు చెలరేగుతాయని ప్రభుత్వం భావించింది. కాని, ఆయనను విడుదల చేయటానికి పాలకులు సిద్ధపడలేదు. 69 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విప్లవ జుగాంతర్‌ పార్టీతో సంబంధాలున్న విప్లవకారునిగా ఆయనను భావించటమే అందుకు కారణం. ప్రభుత్వం సుభాస్‌ ముందు ఒక ప్రతిపాదనను వుంచింది. అదేమంటే, జబ్బుపడ్డ తలిదండ్రుల వద్ద సెలవు తీసుకునేందుకైనప్పటికీ ఒక్క రోజుకూడా కలకత్తా వెళ్ళకుండా బొంబాయి నుంచి సరాసరి ఐరోపా వెళ్ళేటట్లయితే అనుమతి యిస్తామన్నదే ఆ ప్రతిపాదన. బొంబాయిలో నౌక ఎక్కిన తరువాత యీ యాత్రకయ్యే మొత్తం ఖర్చునూ, అదేవిధంగా అక్కడ వున్నందుకు అయ్యే ఖర్చును సుభాస్‌ స్వయంగా భరించు కోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1927లో మాండలే జైలులో అనారోగ్యం పాలయినపుడు యిలాంటి ప్రతిపాదననే ప్రభుత్వం చేయగా అప్పటిలో సుభాస్‌ దానిని తిరస్కరించిన విషయాన్ని యిప్పటికే మనం చూచాము. అయితే, స్వేచ్చాజీవిగా ఐరోపాకు వెళ్ళగలిగినపుడు మాత్రమే తన శారీరక రుగ్మతలు తొలగి పోగలవని 1932లో ఆయన భావించాడు. శరత్‌ బోస్‌ భార్య శ్రీమతి బీనా బోస్‌ సుభాస్‌ను జైలులో కలుసుకున్నది, ఆ తరువాత భవిష్యత్‌ కార్యక్రమాన్ని రూపొందించేటందుకై ఢిల్లీలో ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా కలుసుకున్నది. 1938 ఫిబ్రవరి 28వ తేదీన బొంబాయి నుంచి ఎస్‌.ఎస్‌. గాంజస్‌ ద్వారా ఐరోపాకు 'ప్రయాణించాలన్న నిర్ణయం జరిగింది. ఆయనకు వీడ్కోలు చెప్పేటందుకై కొద్దిమంది స్నేహితులు, బంధువులు వచ్చారు. కాని, ఆయన ఓడలోకి వెళ్ళేవరకు పోలీసులు చుట్టుముట్టే వున్నారు, ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఖైదీయే. రేవులో నుంచి నౌక బయటకు వెళ్ళిన తరువాత మాత్రమే సుభాస్‌ చంద్ర బోస్‌కు విడుదల ఉత్తర్వులను చేతికి యిచ్చారు. అదృష్టవశాత్తు యీ నౌక ఇటలీకి చెందినది, దానికి చెందిన వారు సుభాస్‌ను ఎంతో గౌరవంగానూ, ఆదరంతోనూ చూసుకున్నారు. వెనిస్‌ లో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకై పలువురు పాత్రికేయులు వచ్చారు. ఇది ఆయనకెంతో సంతృప్తిని యిచ్చింది. అక్కడ నుంచి ఆయన నేరుగా వియన్నాకు చేరుకుని డాక్టర్‌ ఫ్యూయర్త్‌ శానిటోరియంలో చేరాడు. స్వల్ప కాలంలోనే ఆయన వుంటున్న గది భారతీయ విద్యార్థులకు దర్శనీయ స్థలంగా మారింది. భారతదేశ పర్యాటకులు కూడా వచ్చిపోతుందేవారు. కాగా దాక్టర్‌ ఫ్యూయర్త్‌ వైద్యంతో సుభాస్‌ సంతృప్తి చెందలేదు. మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం జర్మనీ, ఇంగ్రండులకు వెళ్ళాలని ఆయన భావించాడు. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం ముందే వూహించింది. 1933 మే 8వ తేదీన జర్మనీ వెళ్ళేందుకు పాస్‌పోర్ట్‌ను మంజూరు చేసింది, కాని ఇంగ్లండు పర్యటనను సమ్మతించలేదు. స్వరాజ్య పార్టీ సీనియర్‌ నాయకుడు, సి.ఆర్‌. దాసు మిత్రుడూ, సుభాస్‌పట్ల సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 470

వల్లమాలిన అభిమానమూ నో” . న ఎ య యల్‌ (వల్లబ్‌బాయ్‌ పటేల్‌ పెద్దగ తం | పాం సోదరుడు) అప్పటిలో వైద్య స! _ శతా = శద టు. చికిత్స నిమిత్తం ఐరోపాలోనే | ౪% జే టే 0 షా వున్నాడు. తరుచుగా ఆయన | జ్ష్ము 7 షత కవీ సను వియ్యూరిసూ న్వీట్టర్‌లాండజ్‌లోనూ కలుస్తుందేవాడు. 1988 మే నెలలో సుభాస్‌ బోస్‌, విఠల్‌బాయ్‌ పటేల్‌ కలసి వియన్నా నుంచి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బోస్‌-పటేల్‌ ప్రణాళికగా యిది ప్రసిద్ధమైంది. ఈ ప్రణాళిక ఒక చోట యిలా ప్రకటించింది: రాజకీయ నాయకునిగా మహాత్మా గాంధీ విఫలమయ్యాడన్న సుస్పష్టమైన అభిప్రాయం మాకున్నది. కనుక, నూతన సూత్రీకరణలతో, నూతన పద్ధతుల్లో కాంగైసును సమూలంగా పునర్నిర్మించ వలసిన సమయం ఆసన్నమైంది. మొత్తంగా కాంగైసు యీ రకంగా పరివర్తన చెందినట్లయితే ఉత్తమంగా వుంటుంది. సహాయ నిరాకరణను విడచి పెట్టనవసరం లేదు, అయితే సహాయ నిరాకరణ రూపాన్ని మరింత క్రియాశీలంగా వుండేలా మార్పు చేయాలి. అన్ని రంగాలలోనూ స్వాతంత్ర్య పోరాటం కొనసాగాలి".

సుభాస్‌ చంద్ర బోస్‌పట్ల పటేల్‌కు వల్లమాలిన అభిమానం ఏర్పడింది, ఆయనను ఎంతగానో కొనియాడాడు. 1988 ద్వితీయార్ధంలో పటేల్‌ తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఆయనను స్విట్టర్‌లాండ్‌ తరలించారు. సుభాస్‌కూడా తన ఆరోగ్యం మెరుగు పడగలదన్న కొద్దిపాటి ఆశతోనూ, పటేల్‌కు సేవచేయాలన్న తలంపుతోనూ అక్కడకు చేరుకున్నాడు. 1988 అక్టోబరు చివరలో పటేల్‌ మరణించినపుడు సుభాస్‌ ఆయన ్రక్శనే వున్నాడు.

పటేల్‌ జబ్బుపడక ముందు సుభాస్‌ రెండు నెలలపాటు చెకొస్లవేకియా, పోలండ్‌, జర్మనీలలో పర్యటించాడు. ఇంతకన్నా ముందే, అంటే, 1983 జూన్‌ 10వ తేదీన జరిగే తృతీయ భారత రాజకీయ సదస్సులో ప్రసంగించేటందుకు లండన్‌ రావలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. సుభాస్‌ లండన్‌ వెళ్ళకుండా లిఖిత ప్రసంగాన్ని పంపించాడు. అక్కడకు వెళ్తే తనను తప్పనిసరిగా అరెస్టు చేస్తారని ఆయన భావించాడు. భారతదేశంలో ఒక నూతన పార్టీని స్టాపించనున్నట్లు యీ ప్రసంగంలో ఆయన పేర్కొన్నాడు. “ఈ పార్టీని సామ్యవాది-సంఘ్‌ అని పిలవనివ్వండి. ఇది 71 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కేంద్రీకృత వ్యవస్థ కలిగి (క్రమశిక్షణతో కూడిన అఖిల భారత పార్టీగా వుంటుంది, సమాజంలోని అన్ని తరగతుల వారిలోనూ యిది కార్యక్రమాలను చేపడుతుంది..... భారత ప్రజల బహుముఖ స్వేచ్చ కోసం, అంటే, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్చ కోసం సామ్యవాది-సంఘ్‌ నిలుస్తుంది”. అంతకంతకూ (నవంచం ఫానిన్స, కమ్యూనిన్న శిబిరాలుగా విభజితమవుతున్నదని 1985 ప్రారంభంలో జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నాడు. అయితే, పిడివాద ఒంటెత్తు వాదులంటూ ఆయన కమ్యూనిస్టులను విమర్శించారు. ఒకవేళ యీ రెండు శిబిరాల మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సివస్తే తాను కమ్యూనిజానికే అనుకూలంగా వుంటానని ఆయన చెప్పారు. సుభాస్‌ దీనితో పూర్తిగా విభేదించారు. 1985 ఫిబ్రవరిలో జెనీవా నుంచి ఆయన ఒక ప్రకటన చేస్తూ యిలా పేర్కొన్నారు: “కమ్యూనిజం, ఫాసిజంల మధ్య ఒకదానిని భారతదేశం ఎంచుకోవాలను కోవటం తీవ్ర తప్పిదమే కాగలదు..... నా అభిప్రాయం ప్రకారం యీనాడు మనం చూస్తున్న విభిన్న వుద్యమాలలో ప్రయోజనకరమైన, శుభప్రదమైన వాటిని సమన్వయం చేసుకోవాలి...... ముందుగా ఏర్పరుచుకున్న దురభిమానాల కారణంగా ఏ వుద్యమాన్నైనా లేదా ప్రయోగాన్నైనా అలక్ష్యం చేసినట్లయితే, బుద్ధిహీనత అనే దోషాన్ని మనం భరించవలసి వస్తుంది. 1980 చివరలో కలకత్తా మేయర్‌గా చేసిన తొలి ఉ పన్యాసంలో సుభాస్‌ యిదేరకమైన భావాలను వ్యక్తం చేశాడన్న విషయాన్ని మనం గుర్తుంచు కోవాలి. వదియేమైనప్పటికీ, సుభాస్‌ చంద్ర విషయంలో అరమరికలు లేకుండా చెప్పుకోవాలంటే, 1988 ప్రారంభంలో ఆయన కొంతమేరకు తన దృక్పథాన్ని మార్చుకున్నాడని చెప్పాలి. సుభాస్‌ చంద్ర బోస్‌తో జరిపిన ఒక ఇంటర్వ్యూను గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రజనీ పామీదత్‌ లండన్‌ నుంచి వెలువడే డైలీ వర్భర్‌ పత్రికలో ప్రచురించారు. మీరు రచించిన ఇండియన్‌ జ్రగుల్‌ అన్న పుస్తకం చివరలో ఫాసిజం గురించి నిర్దిష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఫాసిజంపై మీ అభిప్రాయం గురించి ఏమైనా చెప్పదలచుకున్నారా? దీనికి సుభాస్‌ సవివరమైన సమాధానమిచ్చాడు; మూడేళ్ళ క్రితం ఆ పుస్తకాన్ని రచించాను. తరువాత కాలంలో నా రాజకీయ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. వాస్తవానికి నేను వుద్దేశించినదేమంటే, భారతదేశంలోని మనం జాతీయ స్వాతంత్ర్యాన్ని కోరుతున్నాము, దానిని గెలుచుకున్న తరువాత సోషలిజం దిశగా ప్రయాణించాలని మనం కోరుతున్నాము. “కమ్యూనిజం, ఫాసిజంల మధ్య సమన్వయం అని చెప్పటంలో నేను ఉద్దేశించినది యిదే. బహుశ, నేను వ్యక్తం చేసిన భావన సంతృప్తికరమైనది సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు ణ్దై

కాకపోవచ్చు. అయితే, నేనాక విషయాన్ని చెప్పదలచుకున్నాను. నేనా పుస్తకాన్ని రచించినపుడు ఫాసిజం సామ్రాజ్యవాద దండయాత్రను ప్రారంభించలేదు.....”

వియన్నా నుంచి (ప్రేగ్‌ వెళ్ళే సమయంలో చెకొస్తవేకియా విదేశాంగ మంత్రి డాక్టర్‌ బెనిస్‌ను సుభాస్‌ కలుసుకున్నాడు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ శాంతినికేతన్‌లో వుంటూ భారత ఉపఖండ చరిత్రను అధ్యయనం చేసిన ప్రముఖుడు ప్రొఫెసర్‌ లెస్ని2984లో స్థాపించిన ఇండో-చెక్‌ సమాఖ్యకు దాక్టర్‌ బెనిస్‌ కూడా తోడ్పాటును అందించాడు.

19834 ప్రారంభంలో సుభాస్‌ ఇటలీని సందర్శించాడు. అక్కడ ఇటలీకి ఫాసిస్టు నియంతగా వున్న బెనిటో ముసోలినీని కలుసు కోగలిగాడు. ముసోలిని సాధించిన విజయాలు ఆయనను ఎంతగానో అకట్టుకున్నాయి. ముసోలినీతో తాను జరిపిన ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తిగా సాగినట్లు తన స్నేహితుడైన లోథర్‌ ఫ్రాంక్‌తో (నాజీ పార్టీలో వామపక్షవాదిగా వున్న వ్యక్తి అని చెపుతారు) సుభాస్‌ అన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. శిశిర్‌ కె. బోస్‌, అలెగ్జాండర్‌ వర్త్‌లు తాము రచించిన ఎ బీకాన్‌ ఎశ్రాన్‌ ఆసీయా అన్న (గ్రంథంలో యీ ఇంటర్వ్యూను పొందుపరిచారు. “భారతదేశం సమీప భవిష్యత్తులో విముక్తి చెందగలదని మీరు నిజంగానే, దృఢంగా విశ్వసిస్తున్నారా?” అని యీ ఇంటర్వ్యూ సందర్భంగా సుభాస్‌ను ముసోలిని ప్రశ్నించాడు. అవునని, బోస్‌ సమాధానం యివ్వటంతో, మరలా ముసోలిని యిలా ప్రశ్నించాడు. (భారతదేశ స్వాతంత్ర్య సొధన కోసం మీరు సంస్కరణ మార్గం లేదా విప్లవ మార్గం, దేనిని ఎంచుకుంటున్నారు? సంస్మరణవాద పద్ధతులకన్నా విప్లవ మార్షానికే ప్రాధాన్యం యిస్తున్నట్లు బోస్‌ చెప్పటంతో, అయితే, “మీకు నిజంగానే అవకాశం వున్నదని” ముసోలిని వుద్దాటించాడు. ఆ తరువాత సుభాస్‌ చాలాసార్లు ఇటలీని సందర్శించాడు. ముసోలినీ నుంచి ఆయనకు బలమైన మద్దతు లభించింది.

నీతిబాహ్య సమాజాన్ని క్రియాశీలంగా మార్చటంలో ఫాసిస్టు రాజ్య దక్షత గురించి ఐరోపాలో వున్నపుడు సుభాస్‌ చంద్ర బోస్‌ తరచుగా ప్రస్తావించే వారు. కాని, ఫాసిజంలోని ప్రతికూల లక్షణాల గురించి ఆయన ఎక్కడా విమర్శించినట్లు కనిపించదు. నిజానికి 1935 ప్రారంభంలో తను రచించిన ఇండియన్‌ గుల్‌ 2920-34 అన్న పుస్తకం (్రచురితమైనపుడు దానిని ముసోలినీకి స్వయంగా యిచ్చేందుకై ఆయన హుటాహుటిని రోమ్‌కు బయలుదేరి వెళ్ళాడు. 1988లో రజనీ పామీదత్‌కు ఇంటర్వ్యూ యిచ్చినప్పటికీ, 1944 చివరలో టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ, “జాతీయ సోషలిజానికీ, కమ్యూనిజానికీ సమన్వయం కుదర్చటమే మా రాజకీయ తత్వంగా వుండగలదు. సిద్ధాంతము, ప్రతి సిద్ధాంతాల మధ్య వుండే ఘర్షణ జా చ ాగొతమ్‌ భబోపాధ్యా

అత్యున్నత స్థాయి సమన్వయం ద్వారా పరిష్కారం అవుతుంది...... కనుక మేము నియంతృత్వ లక్షణం వున్న రాజ్యాన్ని కలిగి వుండాలి”.

గాంధీజీ సలహా మేరకు 1934 (ప్రారంభంలో కాంగెసు వర్మింగ్‌ కమిటీ

శాసనోల్లంఘన ఉద్యమాన్ని బేషరతుగా నిలిపి వేసింది. ఆ సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ మరికొందరు కాంగ్రెసు నాయకులు జైళ్ళలో వున్నారు. బహిరంగ ప్రకటనల్లోనూ, అదేవిధంగా ఆత్మకథలోనూ యీ నిర్ణయంపట్ల జవహర్‌లాల్‌ తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చాడు. గాంధీజీ నుంచి నెహ్రూ విడగొట్టు కోగలదని అప్పుడప్పుడే భారతదేశంలో తలయెత్తుతున్న వామపక్ష శక్తులు అంచనా వేశాయి. కాని, అలా జరగలేదు. నెహ్రూ వైఖరిపట్ల సుభాస్‌ చంద్ర బోస్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. విమర్శనాత్మక వ్యాఖ్యలే చేశాడు. “ప్రజాదరణలో మహాత్ముని తరువాత రెండవ స్థానంలో వుండి, తన దేశీయులలో అపరిమిత ప్రతిష్టతో పాటు, మేల్తరమైన భావాలను స్వచ్చమైన మేధస్సును కలిగి వుండి, ఆధునిక ప్రపంచ ఉద్యమాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని కలిగివుండికూడా --నాయకత్వానికి అత్యవసరమైన లక్షణాన్ని అంటే, నిర్ణయాలను తీసుకోగల సామర్ధ్యం, అవసరమైతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్మాన గలగటంవంటివి కొరవడటం తీవ్ర అసంతృప్తిని కల్లిస్తున్నది”.

ఈ దశలో సుభాస్‌ చంద్ర బోస్‌ అంతర్జాతీయ దృక్పథం సంశ్లిష్టమైనది. ముసోలిని నేతృత్వంలో ఫాసిస్టు ఇటలీ సాధించిన విజయాలను ఆయన ఘనంగా మెచ్చుకోవటాన్ని మనం చూశాము. కాగా, 1935లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల ఉదాసీన వైఖరితో కూడిన విధానమే వెన్నుదన్నుగా అబిసీనియాపై ఇటలీ దాడిచేసి, నిస్సహాయంగా నిలచిన ఆ ఆఫ్రికన్‌ దేశాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించింది. కలకత్తా నుంచి వెలువదే ప్రముఖ మాస పత్రిక మోదరన్‌ రివ్వ్యూ 1985 నవంబరులో 'ది సీక్రెట్‌ ఆఫ్‌ అబిసీనియా అండ్‌ ఇట్స్‌ లెస్సన్‌' అన్న వ్యాసంలో సుభాస్‌ చంద్ర బోస్‌ ఇటలీ చర్యలను ఖండించాడు. వ్యాసం ముగింపులో ఆయన యీ విధంగా పేర్మాన్నాడు; “అబిసీనియా పోరాటంలో కూరుకు పోతుంది, అయితే ప్రపంచ దేశాల అభిప్రాయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది..... ప్రపంచవ్యాప్తంగా రంగు జాతుల వారిలో నూతన చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఈ చైతన్యం అణగారిన జాతుల్లో నూతన జీవితానికి వెలుగు బాటలు పరుస్తుంది. దీనిపై సామ్రాజ్యవాదులందరూ అసహనంతో వున్నారు”,

ఐరోపా అంతటా ప్రయాణించటానికి సుభాస్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం కొంతమేర స్వేచ్చను యిచ్చింది. సోవియట్‌ యూనియన్‌ వెళ్ళేందుకు ఆయన వీసాకోసం దరఖాస్తు చేసుకున్నపుడు అభ్యంతరాలు తెలపలేదు. అయితే, సోవియట్‌ ప్రభుత్వం అవసరమైన సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు ౯!

ల ల జ్‌ [ క ఖే నిరాకరించింది.

స య్‌. ; ల ర. 1936 ప్రారంభంలో టు టన కీ... స. (1 సుభాస్‌ బెర్లిన్‌లో పర్యటించాడు. శ్రీ, 1. ఈ సమయంలోనే పొట్లర్‌ చేసిన =... ప్రసంగంలో భారత్‌కు వ్యతిరేకంగా ్ట వన న సుభాస్‌కివి ఆగ్రహాన్ని కల్లించాయి. న.

స్ట సమాఖ్య వేదికపై నుండి తగిన సమాధానం చెప్పాలని ఆయన భావించాడు. ఐరోపాలోని భారతీయ విద్యార్థి నాయకులలో కొందరు యిందుకు అంగీకారం తెలిపినప్పటికీ, హిట్లర్‌తో వైరం పెట్టుకోవడానికి యిష్టపడని కొంతమంది మాత్రం పరుషంగా మాట్లాడరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుభాస్‌ వీరితో పూర్తిగా విభేదించాడు. 1986 మార్చి 11వ తేదీన అమీయ చక్రవర్తికి రాసిన ఒక లేఖలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా యిలా పేర్కొన్నాడు: “భారతదేశాన్ని దృష్టిలో వుంచుకున్నపుడు మన ఆరోపణలు చాలా వున్నాయి”. అదే ఏడాది చివరలో డి వలేరా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐర్లండ్‌ వెళ్ళాలని సుభాస్‌ నిశ్చయించుకున్నాడు. ఆయన (ఫ్రాన్స్‌ నుంచి ఐర్లండ్‌లోని కోర్క్‌ రేవుకు ఓడలో ప్రయాణించాడు. ఐర్లండ్‌లో అడుగు పెట్టిన వెంటనే టెరెన్స్‌ మెక్‌స్వీనీ సమాధిని దర్శించి నివాళులు అర్చించాడు. బ్రిటిష్‌ చెరలో ఆమరణ నిరాహార దీక్షచేసి అసువులు బాసిన ఐరిష్‌ దేశభక్తుడాయన. 1929 సెప్టెంబరులో జతిన్‌ దాస్‌కూడా లాహోర్‌ జైలులో యిదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని సుభాస్‌ గుర్తు చేసుకున్నాడు. కాగా, జతిన్‌ కుటుంబీకులకు సంఘీభావాన్ని తెలుపుతూ మెక్‌స్వీనీ భార్య టెలిగ్రామ్‌ పంపించారు. సుభాస్‌కు డబ్లిన్‌లో హృదయపూర్వక స్వాగతం లభించింది. ఐరిష్‌ జాతీయవాది ఒకరు ప్రసంగిస్తూ, సుభాస్‌ను పొగద్రల్లో ముంచెత్తారు. ఎంతో సాహసంతో (బిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలచిన సుభాస్‌ చంద్ర బోస్‌ వంటి మేయర్‌ మున్ముందు దల్లిన్‌కు సైతం లభించగలడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ఫాసిజం, సోషలిజంలు రెండూ మార్చుకు గురవుతున్నట్లు సుభాస్‌ అభిప్రాయపడ్డాడు. సామ్రాజ్యవాద వ్యతిరేక (ఫెంచ్‌లీగ్‌ను వుద్దేశించి ఆయన 75 న్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మాట్లాడుతూ, “మన ఉద్యమ లక్ష్యం కేవలం జాతీయ విముక్తి మాత్రమేకాదు, సామాజిక స్వాతంత్ర్యం కూడా..... తాను ప్రజల పక్షానే వున్నట్లుగా భారత జాతీయ కాం(గైసు స్వయంగా స్పష్టం చేయగలదన్న భావన అంతకంతకూ పెరుగుతున్నది. మనం సోషలిజం దశలో పయనిస్తున్నాము”.

ఐరోపాలో సుభాస్‌ వున్న కాలం గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నదాని

ప్రకారం, ఆయన ఎంతో (క్రియాశీలంగా వుంటూ, ఐరోపాలోని వివిధ ప్రాంతాల నుంచి భారతదేశ స్వాతంత్ర్యం గురించి నిరంతరం చెప్పండటాన్ని మనం గమనించాము. ఐరోపాలో కొంతమేరకు ఆంక్షలు వున్నప్పటికీ భారత్‌కు తిరిగి రావాలని ఆయన కోరుకున్నాడు. పరిణామాలు ఎలా వున్నప్పటికీ భారతదేశానికి తిరిగి రావాలని 1986 ప్రథమంలో ఆయన నిశ్చయించుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చినట్లయితే స్వేచ్చగా వుండవచ్చునని ఎంతమాత్రం భావించవలదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు, 1986 మార్చి 18న జవహర్‌లాల్‌కు రాసిన లేఖలో సుభాస్‌ పేర్కొన్నాడు. దీనికి జవహర్‌లాల్‌ సమాధానమిస్తూ, యిప్పటికిప్పుడే సుభాస్‌ భారత్‌కు తిరిగి రావటానికి తాను కూడా వ్యతిరేకమని తెలుపుతూ, “నిరంతర ప్రవాస జీవితం అభిలషణీయం కాదనటాన్ని' ఆయన కూడా అంగీకరించారు.

వదియేమైనప్పటికీ తిరుగు ప్రయాణానికే సుభాస్‌ సిద్ధపడ్డాడు. ఐరోపాలో వున్నపుడు రెండుసార్లు తాను కలుసుకున్న రొమైన్‌ రోలంద్‌కు లేఖ వ్రాస్తూ, “అధికారుల ఆగ్రహాన్ని పట్టించు కోకుండా భారతదేశానికి తిరిగి వెళ్ళటం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నానని”, తెలిపాడు.

1936 మార్చి 22న సుభాస్‌ ఇటలీ నుండి భారతదేశానికి ఓడపై బయలుదేరాడు. ఆయన ఐరోపాలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే వున్నాడు. ఈ సమయంలో సంపాదించిన అనుభవాన్ని భారతదేశపు గడ్డపై ఖారతదేశ స్వాతంత్ర్యం కోసం మరింత క్రియాశీల పోరాటం సాగించడానికి ఉపయోగించు కోవాలని తలపోశాడు. సుభాస్‌ ఎక్కిన ఓడ 1986 ఏప్రియల్‌ 8వ తేదీన బొంబాయికి చేరుకున్నది. వెనువెంటనే ఆయనను టబిటిష్‌ అధికారులు అరెస్టు చేశారు. మొదట ఆయనను బొంబాయిలో నిర్బంధించారు, తరువాత పూనా సమీపంలోని ఎరవాడ జైలుకు మార్చారు. సుభాస్‌ చంద్ర బోస్‌ను తిరిగి అరెస్టు చేయటంపట్ల ఒక్క బెంగాల్‌లోనేకాక యితరంగా కూడా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనితో ఆయనను బెంగాల్‌లోని కొండప్రాంతమైన కుర్సియాంగ్‌కు మార్చారు. అక్కడ శరత్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 76

బోస్‌కు ఒక ఇల్లు వున్నది. ఆయనకు ఆరోగ్యం బాగా కుదుటపడలేదు, ఆసుపత్రిలో వుండవలసిన అవసరం యింకా వున్నది. కనుకనే ఆయనను 1986 డిసెంబరు 17వ తేదీన కలకత్తా వైద్య కళాశాల ఆసుపత్రికి మార్చారు. సుభాస్‌ విడుదల కోసం డిమాండు అంతకంతకు బాగా పెరిగి పోయింది. 1987 మార్చి 17వ తేదీన కలకత్తాలో ఆయనను బేషరతుగా విడుదల చేశారు. 1985 నూతన చట్టాన్ని అనుసరించి 1987 జనవరిలో బెంగాల్‌ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రజా మంత్రివర్గం ఏర్పాటు కావలసి వుంది. ఈ ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెసు పాల్గొన్నది. కాని, ప్రభుత్వాన్ని వర్పాటు చేయాలన్న కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగైసు ఆమోదించటాన్ని కమ్యూనిస్టులు, కాంగ్రెసు సోషలిస్టులు, ఎం.ఎన్‌. రాయ్‌ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా యిలాంటి అభిప్రాయాన్నే కలిగి వున్నారు. ఇతరేతర కారణాల రీత్యా మహాసభలకు హాజరు కాలేని సుభాస్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెసు ఆమోదం తెల్పటాన్ని తీవ్రంగా విమర్శించారు. బొంబాయి, మద్రాసు, యుపి, బీవార్‌లతో సహా అనేక రాష్ట్రాలలో కాంగైసు ఘన విజయాలను సాధించింది. ఆయా చోట్ల మంత్రివర్ధాలను ఏర్పాటు చేయటంపై కాంగ్రెసు నాయకత్వం దృష్టిని సారించింది. బెంగాల్‌లో ఏ.కె. ఫజ్లుల్‌ హక్‌ నేతృత్వంలోని కృిషిక్‌ ప్రజా పార్టీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా మాత్రమే కాంగైసు అధికారంలోకి రాగలిగింది. బెంగాల్‌లోనూ, మొత్తంగా భారతదేశంలోనూ యిదొక సంక్లిష్ట పరిస్థితి. 1987 మార్చిలో సుభాస్‌ చంద్ర బోస్‌ నిర్బంధం నుంచి విడుదలయ్యే నాటికి యిదీ దేశంలో వున్న పరిస్థితి. న] 77 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రపంచ పరిణామాలపట్ల అవగాహన

1987లోనే విడుదలైనప్పటికీ తన బాధ్యతల నిర్వహణకు చాలినంత ఆరోగ్యం సుభాస్‌కింకా సమకూరలేదు. ప్రస్తుతానికి, హిమాచల్‌ ప్రదేశ్‌లో వున్న కొందప్రాంత పట్టణమైన డల్హాసీలో నివసిస్తున్న ఒకప్పటి తన మిత్రుడు ధర్మవీర్‌ కుటుంబంతో కలసి కొన్నినాళ్ళు గడపాలన్న సరియైన నిర్ణయాన్నే ఆయన తీసుకున్నాడు. అక్కడ ఆయన దాదాపుగా ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకున్నారు. వార్తా పత్రికలు, యితర జర్నల్స్‌ద్వారా ఎప్పటికప్పుడు రాజకీయాలను తెలుసుకుంటూ, పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకున్నాడు. ఉత్తరాల ద్వారా అనేకమంది స్నేహితులతో సంబంధాలను పెట్టుకున్నాడు. అట్లా రాసిన ఒక ఉత్తరంలో యిలా పేర్కొన్నాడు. “అస్థిరత్వమూ, సాహసోపేతమూ అయిన జీవితాన్ని గడపటంలోనూ, ఆదర్శానికి అంకితమై జీవించటంలోనూ నేను మహదానందాన్ని అనుభవిన్తున్నాను. నీవనుభవించిన వేదనలకు, విషాదాలకు అది పరిహారాన్ని చెల్లిస్తుంది, జీవితాన్ని రసమయం చేస్తుంది”.

తాను అనుసరించ వలసిన మార్గంపట్ల సుభాస్‌కు యింకా స్పష్టత లేదు. అశాంతి భావన ఆయనను చుట్టుముట్టింది. 1987లో దళ్డాసీ నుంచి తన పాత మి్రునికి రాసిన లేఖలో యిలా పేర్కొన్నారు: “నేను తప్పనిసరిగా ముందుకే వెళ్ళాలి. మార్గమేమో సుదీర్హమైనదీ, నిరుత్సాహ పూరితమూను. కొన్ని సమయాలలో అలసట అనిపిస్తున్నది. నన్ను చీకటి కమ్మివేస్తున్నది -అప్పుడప్పుడు తళుక్కుమనే వెలుగు రేఖలతో కాస్త ఉపశాంతి పొందుతుంటాను. అయితే, అదంతా ఏమిటి? సాగిపోవటంలో ఆనందం వున్నది..... కాంతులీనే భవితవ్య మొక్కటేకాక, మసకలు కమ్మిన అస్థిరత్వం కూడా రా రమ్మంటున్నది. కాంతి లోకాన్ని చేరటానికి ముందే నేను పతనమైతే -దాన్నేమంటారు?

జపాన్‌ ఫాసిజం, అసహ్యకరమైన తన సామ్రాజ్యవాద స్వభావాన్ని ప్రదర్శిస్తూ, బరితెగించి చైనాను కబళిస్తున్న సమయమది. జవహర్‌లాల్‌ నేతృత్వంలోని మొత్తం భారత జాతీయ ఉద్యమం జపాన్‌కు ప్వతిరేకంగా చైనా పక్షాన బలంగా నిలచింది. భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా భాసిల్లుతున్న మహాకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఎలాంటి అరమరికలు లేకుండా జపాన్‌ను యీసడించుకున్నాడు: “వారు అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో చైనా హృదయాన్ని ముక్కలు చేస్తున్నారు, ఉత్తుత్తి వందనాలతో బుద్దుని హృదయాన్ని తూట్లు పొడుస్తున్నారు”. ఏదియేమైనప్పటికీ సుభాస్‌ యింత నిష్కర్షగా జపాన్‌ను నిరసించలేదు. 'సుదూర ్రాచ్యంలో జపాన్‌ పాత్ర అన్న శీర్షికన ప్రముఖ మాస పత్రిక మోదరన్‌ రివ్వూకు రాసిన ఒక వ్యాసాన్ని యీ విధంగా ముగించాడు: “ఇపాన్‌, తన నిమిత్తమూ, ఆసియా నిమిత్తమూ మహత్తర కార్యాలను ఒనర్చింది.... పాశ్చాత్య శక్తులను తరిమి కొట్టాలని అది నిశ్చయించుకున్నది.... అయితే సామ్రాజ్యవాద పోకడలతో నిమిత్తం లేకుండా, చైనా రిపబ్లిక్‌ను విచ్చిన్నం చేయకుండా, ఆత్మాభిమానాన్నీ సంస్కృతినీ కలిగిన మరో ప్రాచీన జాతిని అవమాన పరచకుండా వీటిని సాధించడం సాధ్యంకాదా? జపాన్‌ను మనం ప్రశంసిస్తూనే, యీ పరీక్షా సమయంలో మనం హృదయపూర్తిగా చైనా పక్షాన నిలుస్తాము”.

1937 అక్టోబరు మొదట్లో సుభాస్‌ కలకత్తాకు తిరిగి వచ్చాడు. అప్పటిలో భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా వున్న జవహర్‌లాల్‌ నెహ్రూ బెంగాల్‌ కాంగ్రైెసులోని ముఠాతత్వం చూసి విసిగి పోయాడు. దీన్నంతటినీ చక్కదిద్దగల సమర్థత సుభాస్‌కు వుంటుందని ఆయన ఆశపడ్డాడు. ఇదే సమయంలో వందే మాతరం గీతానికి ముస్లింలు పదేపదే అభ్యంతరం తెలపడం కూడా జవహర్‌ను కలచి వేసింది. ఈ గీతంలోని ధ్వని హిందూత్వాన్ని తలపుకు తెస్తున్నదని యిది ముస్తింలకు ఆమోదయోగ్యం కాదని వారు చెప్పసాగారు. ఇప్పుడు ఏం చేయాలన్న విషయమై ఆయన సుభాస్‌ సలహా కోరాడు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ సలహా తీసుకుందామని సుభాస్‌ చెప్పాడు. బంకించంద్రుని వందే మాతరం గీతానికి రవీంద్రుడే స్వయంగా బాణి కట్టాడు. అయినప్పటికీ, యీ గీతానికి ముస్లింలు అభ్యంతరం తెలుపుతాడని ఆయన అన్నాడు. కాగా, దీనిని జాతీయ గీతంగా వుంచాలని బెంగాల్‌ జాతీయవాదులు గట్టిగా పట్టుపట్టారు. సుభాస్‌ యీ విషయంలో మొండి పట్టుదలకు పోలేదు. ముస్లింల మనోభావాలను దెబ్బతీయకుండా వుండటం 'ప్రధానమన్న విషయాన్ని ఆయన (గ్రహించాడు. చిట్టచివరకు ఒక రాజీ పరిష్కారం కుదిరింది. అదేమంటే, టాగూర్‌ కూర్చిన జనగణమన అధినాయక అన్న గేయం జాతీయ గీతంగా వుంటుంది, వందే 79 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మాతరం గీతంలోని మొదటి చరణున్ని అన్ని సందర్భాలలోనూ కాంగ్రెసు వేదికపై పాడుకోవచ్చు.

1986లో స్థాపించిన అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడైన ప్రొఫెసర్‌ ఎన్‌.జి. రంగా నాయకత్వంలో అక్టోబరు 27వ తేదీన కలకత్తాలో పదివేలమంది రైతులతో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. ఈ (ప్రదర్శనలో 'ప్రసంగించ వలసిందిగా సుభాస్‌ను కోరారు. అన్ని వర్గాల భారతీయులు అభివృద్ధిచెందే స్వతంత్ర భారతదేశం కోసం కాంగ్రెసు పార్టీ పోరాడుతున్నదని ఆయన అన్నారు. మొత్తం దోపిడీకి స్వస్థి చెప్పాలని కూడా కాం(గెసు కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. కాని, జమిందారుల, అదేవిధంగా [గ్రామీణ ప్రాంతాల్లోని యితర స్వార్ధపర శక్తుల ప్రయోజనాలను దెబ్బ తీయకుండా రైతుల దోపిడీని ఎలా అరికట్టేదీ ఆయన వివరించ లేదు.

ఈ కాలంలోనే బెంగాల్‌ ప్రాంతీయ విద్యార్ధి సమాఖ్య ప్రారంభించిన రాజకీయ ఖైదీల విడుదల ఉద్యమానికి సుభాస్‌ పూర్తి మద్దతు యిచ్చాడు. కాం(గైసు అఖిల భారత కమిటీ కలకత్తాలో సమావేశమైంది. ఇందులో సుభాస్‌ చురుకైన పాత్రను నిర్వహించారు. కలకత్తా కార్పొరేషన్‌ అధ్యక్షునిగా కూడా ఆయన ఎన్నికయ్యాడు. కార్పొరేట్‌ ఎంప్లాయిస్‌ సంఘం ఆయనకు ఘనస్వాగతం యిచ్చింది. దానికాయన కృతజ్ఞతలు చెప్తూ హిందూ-ముస్లిం ఐక్యతను అర్ధించాడు.

ముమ్మర కార్యకలాపాలు ఆయన ఆరోగ్యానికి మంచివి కావని త్వరలోనే వెల్లడైంది. తక్షణ వైద్య చికిత్స నిమిత్తం 1987 నవంబరు 18వ తేదీన విమానంలో ఐరోపాకు తరలి వెళ్ళాడు. ఈసారి ఐరోపాలో ఆయన మూడు మాసాలకన్నా తక్షువే వున్నాడు. కాని యీ మూడు నెలల కాలం ఆయనకు రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ అత్యంత ప్రధానమైనది. ఆస్టియాలోని ఐద్దాస్టీన్‌గా పిలిచే కొందప్రాంత విశ్రాంతి గృహంలో ఐస చేశాడు. ఇక్కడ ఆయన ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే మెరుగు పడింది. ఇక్కడే ఆయన ఎన్‌ ఇండియన్‌ విలిగిమ్‌ పేరుతో తన ఆత్మకథను రాయటం ప్రారంభించాడు. అయితే యిది అసంపూర్ణంగానే మిగిలి పోయింది. సుభాస్‌ అభ్యర్థన మేరకు ఆస్ట్రియన్‌ వనిత ఎమిలి షింక్‌ కొండప్రాంత విశ్రాంతి గృహానికి చేరుకున్నది. 1984 నుంచి వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడి సన్నిహిత మిత్రులుగా మారారు. 1937లో ఐద్దాస్టీన్‌లో తాను, సుభాస్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు 1978

అక్టోబరు 14వ తేదీన సుభాస్‌ జీవిత చరిత్రకారుడైన గోర్టన్‌కు ఎమిలి తెలియ చేశారు. అయితే వివాహం జరిగిన సంవత్సరం గురించి కొంత వివాదం వున్నది. సుభాస్‌, ఎమిలీలు 1941లో వివాహం చేసుకున్నట్లు సుభాస్‌ మేనకోడలు కృష్ణ బోస్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 80

చెప్పారు. 1942 చివరలో వారు వివాహం చేసుకున్నట్లు మరో జీవిత చరిత్రకారుడు పేర్మాన్నాడు. కాగా, వారి పాప అనిత 1942 నవంబరు 29వ తేదీన వియన్నాలో జన్మించినట్లు కచ్చితమైన ఆధారాలు వున్నాయి. సుభాస్‌, ఎమిలీలు 1941 నుంచి 1943 వరకు బెర్లిన్‌లో సహజీవనం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు వున్నాయి. ఎమిలీ తన భార్య అని, అనిత తన కుమార్తెయని తెలుపుతూ తన పెద్ద సోదరుడైన శరత్‌కు సుభాస్‌ ఒక లేఖ రాశాడు (ఈ లేఖ చాలా సంవత్సరాల తరువాత బయటపడింది). ఏ కేదీన పెళ్ళి జరిగిందనేది ముఖ్యం కాదు, అసలు సంగకేమంటే ఎమిలీని సుభాస్‌ ప్రేమించాడు, వారిరువురూ వివాహం చేసుకున్నారు. సుభాస్‌ జీవితం గురించీ, కార్యకలాపాల గురించీ చారిత్రక పరిశోధనకు అవసరమైన అపార సరంజామాను మరెవ్వరికన్నా ఎక్కువగా సేకరించిన సుభాస్‌ మేనకోడలు డాక్టర్‌ శిశిర బోస్‌, ఒక సందర్భంలో గోర్టన్‌తో మాట్లాడుతూ ఎమిలీతో సంబంధం 'సుభాస్‌ను సంపూర్ణ మానవునిగా మార్చిందని” చెప్పారు.

ఐరోపాలో సుదీర్హ కాలం వున్నపుడు సుభాస్‌ ఎన్నడూ (బటన్‌ పర్యటనకు వెళ్ళలేదు. కాని, యీసారి మాత్రం అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. 1921 తరువాత యిదే మొదటి పర్యటన అవుతుంది. 1938 జనవరిలో ఆయన లండన్‌కు చేరుకున్నాడు. దీని గురించి కలకత్తా మునిసిపల్‌ గెజెట్‌ స్పష్టమైన సమాచారాన్ని యిచ్చింది. “విక్టోరియా స్టేషన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. (ఫెండ్స్‌ ఆఫ్‌ ఇండియా, స్వరాజ్‌ లీగ్‌, ఇండియన్‌ పొలిటికల్‌ గ్రూప్‌, గాంధీ సొసైటీ, ఇండియన్‌ (ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ కలోనియల్‌ సీమెన్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అభ్రాడ్‌, ఆక్స్‌ఫర్డ్‌-కేంట్రిడ్ట్‌-లండన్‌ మజ్లిస్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ సొసైటీస్‌ తదితరమైన వాటికి చెందిన ప్రతినిధులు సుభాస్‌కు స్వాగతం పలికారు...... దాదాపు వందమంది పాత్రికేయులు ఆయనను కలుసుకునేందుకు తరలి వచ్చారు. వాళ్ళు వేసిన అనేక ప్రశ్నలకు (ప్రశాంతంగానూ, చమత్మారంగానూ, సరసంగానూ ఆయన సమాధానాలిచ్చాడు”.

ఈ పర్యటనలో సుభాస్‌ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించాడు: భారతదేశానికి, బ్రిటన్‌ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని మంజూరు చేసి, తనదైన రాజ్యాంగాన్ని రూపొందించు కొనేందుకు అనుమతి యిచ్చేటట్లయితే, భవిష్యత్తులో బ్రిటన్‌, భారతదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు కచ్చితంగా నెలకొనగలవు. తరువాత ఎనిమిది రోజులపాటు తీరిక లేకుండా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన అనేక సమావేశాల్లో ప్రసంగించాడు, పలు అభినందన సభలకు, విందులకు హాజరయ్యాడు, నో గౌతమ్‌ ఛటోపాధ్యాయ

జాతీయ ప్రభుత్వ నాయకులతోటీ, లేబర్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులతోనూ, మరికొందరితోనూ ఆయన చర్చలు జరిపారు. జనవరి 11వ జేదీన సుభాస్‌ గౌరవార్ధం ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రజనీ పామీదత్‌ ఒక అభినందన సభను ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో సుభాస్‌ యిలా పేర్కొన్నాడు: “భారతదేశపు భవితవ్యం మిగిలిన మానవ సమాజంతో ముడిపడి వున్నది..... స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజంల కోసం భారతదేశం సాగించే పోరాటం, చైనా, స్పెయిన్‌, అబిసీనియాల ద్వారా తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటంలో అంతర్భాగమన్న విషయాన్ని కాంగ్రెసు పార్టీ యిష్పుడిప్పుదే గమనిస్తున్నది. భారతదేశం యింకెంత మాత్రం తననుతాను వకాకిగా భావించలేదు”. 1984లో ప్రచురితమైన ది ఇండియన్‌ ద్రగుల్‌అన్న పేరున మీరు రచించిన (గ్రంథంలో ఫాసిజం, కమ్యూనిజంల సమన్వయమని తెలిపారుగదా, అలా చెప్పటంలో మీరు ఆశించిన అర్థమేమిటని సుభాస్‌ను ఒక (ప్రైవేటు ఇంటర్వ్యూలో ఆర్‌.పి. దత్‌ ప్రశ్నించారు. ఇప్పటికే ప్రస్తావించినట్లుగా, అరుదైన ఆత్మవిమర్శనా పూర్వక రీతిలో సుభాస్‌ సమాధానమిస్తూ, “బహుశ, నేను వ్యక్తం చేసిన భావన సంతృప్తికరమైనది కాకపోవచ్చు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలని అభిలషిస్తున్నాను. నేను ఆ వుస్తకాన్ని రాసే నాటికి ఫాసిజం యింకా సామ్రాజ్యవాద దండయాత్ర ప్రారంభించలేదు.....” అని అన్నారు. అయితే, 1980-34 మధ్య కాలంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించారన్న విషయాన్ని ఆయన గమనంలో వుంచుకున్నారు. కమ్యూనిస్టులను ఆయన విమర్శించటానికి యిది హేతువైంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పవచ్చునేమో, అదేమంటే, భారత కమ్యూనిస్టులపై సుభాస్‌ చేసిన యీ విమర్శ పూర్తిగా న్యాయమైనదే. (కాంగ్రెసు చేపట్టే కార్యక్రమాలు మధ్యయుగాల వఫ్యూధల్‌ దృక్పథంతో రూపొందుతున్నందున కమ్యూనిస్టులు కొంతకాలంపాటు కొంత దూరాన్ని పాటించారు. దీనికి ఏవేవో కారణాలను వూహించ వలసిన అవసరం లేదు-అను) 'కమ్యూనిజం.... జాతీయ స్వాతంత్ర్య పోరాటానికి పూర్తి మద్దతు యిస్తూ, తన అంతర్జాతీయ దృక్పథంలో దానిని అంతర్భాగంగా గుర్తించినందుకు”, ఎంతో సంతోషంగా వున్నదని ఆర్‌.పి. దత్‌కు యిచ్చిన ఇంటర్వ్యూ చివరలో ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజులపాటు మాత్రమే సాగిన ఇంగ్లండ్‌ పర్యటనలో వేర్వేరు రంగాలకు చెందిన వారిని సుభాస్‌ కలుసుకున్నారు. వీరిలో క్లిమెంట్‌ అట్లీ, అర్దర్‌ గ్రీన్‌వూడ్‌, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు | 82

సర్‌ స్ట్రాఫర్డ్‌ క్రిఫ్స్‌వంటి లేబర్‌ పార్టీ నాయకులు అదేవిధంగా హెరాల్డ్‌ లస్కీ జె. బి.ఎస్‌. హల్దానే వంటి మేధావులు వున్నారు. ఒకప్పుడు తాను నివసించిన కేంట్రిడ్డిని కూడా ఆయన సందర్శించాడు. అక్కడ ఆయనను అనేకమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కలుసుకున్నారు. జనవరి 16వ తేదీన ఆయన ఐరిష్‌ అధ్యక్షుడు డి వలేరాను కలుసుకున్నారు. దురదృష్టవశాత్తు వారి మధ్య జరిగిన సంభాషణ నమోదు కాలేదు. ఆంగ్ల భాషలో వెలువడే ప్రముఖ వార్తాపత్రిక న్యూన్‌ క్రానికల్‌ యీ సందర్భంలో ఒక వార్త యిస్తూ సుభాస్‌ను 'భారతదేశ డి వలేరా' అని వర్ణించింది.

1988 జనవరి 18వ తేదీన భారత జాతీయ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి జె.బి. కృపలానీ ఒక ప్రకటన చేస్తూ గుజరాత్‌లోని హరిపురాలో జరిగిన భారత జాతీయ కాంగైసు 51వ సమావేశాలలో సుభాస్‌ చంద్ర బోస్‌ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు తెలిసారు. సుభాస్‌కు గాంధీజీ పంపిన టెలిగ్రామ్‌లో ఒక వాక్యం యిలా వున్నది. “జవహర్‌లాల్‌ నిర్వహించిన బాధ్యతల బరువును మోయగల శక్తిని నీకు భగవంతుడు ప్రసాదించుగాక బహుశ యీ ఎంపిక గాంధీజీకి ఆనంద కారకం కాకపోవచ్చు, కాని మరో మార్గం లేదు. కొన్ని మాసాల ముందు, అంటే, 1987 నవంబరు 1వ తేదీన సర్టార్‌ పటేల్‌కు గాంధీ ఒక అంతరంగిక లేఖ రాస్తూ, “నా ఎరుకలో సుభాస్‌ ఎంతమాత్రం ఆధార పదదగిన వాడుకాదు. కాని, ఆయన మినహా అధ్యక్షుడు కాగలిగిన వ్యక్తి మరొకరు లేరు”.

సుభాస్‌ వెనువెంటనే తన పర్యటనను ముగించుకుని జనవరి 19వ తేదీన లండన్‌ నుంచి బయలు దేరాడు. ప్రేగ్‌, నేపుల్స్‌, కరాచీలలో ఒకటి రెండు రోజులు ఆగి జనవరి 24వ తేదీన కలకత్తాకు చేరుకున్నాడు. సుభాస్‌ అధ్యక్షత వహించ వలసిన కాంగ్రెసు సమావేశాలు కొద్ది వారాల్లోనే జరగనున్నాయి. నూతన బాధ్యతల నిర్వహణకు ఆయన దీక్షగా సన్నద్ధం కాసాగాడు. 1938 ఫిబ్రవరి 11వ తేదీన కలకత్తా నుంచి ప్రత్యేక రైలులో బయలు దేరాడు, బార్జోలీలో సర్టార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వాన అనేకమంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితంలో వినూత్నమైన, (ప్రధానమైన అధ్యాయం మొదలైంది. మహోద్రేకియైన తిరుగుబాటుదారుగా వున్న సుభాస్‌ దేశనాయక్‌గా మారిన కాలమిదని గోర్టన్‌ వ్యాఖ్యానించాడు.

ల 88... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కాంగ్రెస్‌ అధ్యక్షునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ కౌంగైస్‌ అధ్యక్షునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ హరిపురాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈయనను ఆధారపడదగిన వ్యక్తిగా గాంధీజీ భావించ లేదన్న విషయాన్ని మనం యిప్పటికే ప్రస్తావించుకున్నాము. కొన్ని సమయాలలో కాంగ్రెస్‌ మితవాద పక్షంగా చెప్పుకునే కాంగైసులోని ఒక భాగం కూడా ఆయనపట్ల అనుమానంతోనే వున్నది. అయితే, కారుచీకటిలో కాంతిరేఖలా సుభాస్‌, జవహర్‌లాల్‌ మధ్య కొంతకాలంపాటు సామరస్య సంబంధాలు నిలచివున్నాయి. అధ్యక్షోపన్యాసంలో సుభాస్‌ యీవిధంగా (ప్రకటించాడు: “ఒకేఒక సాహసోపేతమైన చర్యతో (బ్రిటిష్‌ సామ్రాజ్యం తనంతట తానుగా స్వతంత్ర దేశాల సమాఖ్యగా మారగలదా? ఈ ప్రశ్చక్షు బ్రిటిష్‌ ప్రజలే సమాధానం చెప్పాలి..... గ్రేట్‌ (బిటన్‌ సోషలిస్టు రాజ్యంగా మారినప్పుడు మాత్రమే.....యీ మార్పు సాధ్యం కాగలదు..... అయితే, వలసవాదాన్ని నిర్మూలించకుండా, భారతదేశంతోపాటు, బ్రిటిష్‌ సామ్రాజ్యంలోని బానిస దేశాల రాజకీయ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న మనం, అదే సమయంలో బ్రిటిష్‌ ప్రజల అర్ధిక స్వాతంత్ర్యం కోసం పోరాడకుండా దీన్ని సాధించటం అసాధ్యం”. సుదీర్ధంగా సొగిన ప్రసంగంలో భారత జాతీయ కాం[ైెసు మౌలిక ధ్యేయాలను, లక్ష్యాలను కొంతమేరకు సుభాస్‌ పునరుద్దాటించాడు. కార్మిక సంఘాలకు, కిసాన్‌ సభలకు సంబంధించి కాంగ్రెసు నిర్వహించ వలసిన పాత్ర గురించి ఆయన ప్రస్తావించాడు. కార్మిక సంఘాలను, కిసాన్‌ సభలను సమష్టిగా కాంగ్రెసుకు అనుబంధం చేయాలని 1988లో జాతీయోద్యమంలో పాల్గొన్న వామపక్ష శక్తులు డిమాండు చేశాయి. కాంగ్రెసులోని మితవాద పక్షం దీనిని పూర్తిగా వ్యతిరేకించింది. కాగా, “మొత్తం ప్రగతిశీల, సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘాలన్నిటినీ కాంగ్రెసు ప్రభావం కిందకూ, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 84

కాం(గెను పరిధిలోకీ తీసుకు | క్ల నా | వచ్చేటందుకై ఏదో ఒకనాడు | ము యీ అనుబంధాన్ని మంజూరు ||. - న్‌ శ్‌ చేయవలని వస్తుందని నేను." జై వ్యక్తిగతంగా భావిస్తున్నానని", | య న సుభాస్‌ ప్రకటించాడు. న . _.. నానే! కాంటైశ్‌లోని స్‌ న్‌ 7. . మితవాద, అతివాదపక్షాలమధ్య | ౫ వ్వ . విభేదాలు తీవ్రతరమయ్యాయి. + స ఈ సమస్యపై సుభాస్‌ సూటిగా... ” స్పందించాడు. "కాంగ్రెసు లోపల ళు. మితవాద, అతివాద - , తారతమ్యాలున్నాయి, యివి , " . నిరర్ధకమైనవి, విస్మరించదగినవి. | 222 సామ్రాజ్యవాద సవాలు వున్నది, దీనిని మనం ఎదుర్మొన వలసివుంది. ఇలాంటి సంక్షుఖిత స్థితిలో మనమేమి చేయాలి? మన మార్గంలో ఎదురయ్యే సంక్షోభాలన్నిటినీ దృఢంగానూ, సాహసంతోనూ ఎదుర్శొనాలని, పాలకులు పన్న కుట్రలకు చెక్కుచెదరకుండా దుర్భేద్యంగా నిలవాలని నేను చెప్పాల్సిన అవసరం వున్నదా? కాంగ్రెస్‌ యీనాడు ్రజాపోరాటాల సమున్నత వేదికగా వున్నది. దానిలో మితవాద శిబిరం, వామపక్ష శిబిరం వుండవచ్చుగాక, -కాని, భారతదేశ విమోచన కోసం పాటుపడే సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులన్నిటికీ అది సమష్టి వేదికగా వున్నది. కనుక భారత జాతీయ కాంగ్రెసు పతాకం కింద యావద్దేశాన్ని సంఘటితం చేద్దాం. కాంగ్రెసును ప్రజాస్వామ్యీకరించేటందుకూ, విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పునాదిపై పునర్నిర్మాణం చేసేందుకూ తమ యావచ్చక్తినీ, వనరులనూ వినియోగించ వలసిందిగా ప్రత్యేకించి దేశంలోని వామపక్ష బృందాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా విజ్ఞప్తి చేయటంలో నాకు బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుల వైఖరి మహత్తరమైన స్ఫూర్తిగా నిలచింది. నా దృష్టిలో భారతదేశానికి సంబంధించి వారి సాధారణ విధానం భారత జాతీయ కాంగ్రెసును దృష్టిలో వుంచుకుని రూపొందించుకున్నదే”. 85... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

స్థూలంగా చెప్పవలసి వస్తే హరిపుర (ప్రసంగాన్ని భారతదేశంలోని వామపక్షాలు స్వాగతించాయి. అయితే, ఒక ప్రశ్నపై వివాదాస్పదమైన వివరణ వున్నది. విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేసరికి సుభాస్‌ ప్రసంగంలో జర్మనీ, ఇటలీ, జపాన్‌లలోని ఫాసిజాన్ని ఆయన స్పష్టంగా ఖండించలేదు. ఇది జవహర్‌లాల్‌కు, కమ్యూనిస్టులకు అసంతృప్తి కలిగించింది. బ్రిటిష్‌ పాలకులను ఓడించేటందుకు ఏ దేశమైన సహాయ పదేటట్లయితే, ఆ దేశ అంతర్గత విధానాలు ఏవైనప్పటికీ, ఆ దేశ సహాయాన్ని తీసుకునేందుకు తాను సిద్ధంగా వున్నట్లు అధ్యక్షోపన్యాసంలో ఆయన ఇహిరంగంగానే ప్రకటించాడు. అయితే, జపాన్‌ ఫాసిజానికి వ్యతిరేకంగా చైనా ప్రజలు సాగిస్తున్న సాహసోపేతమైన పోరాటానికి ఆయన మద్దతు తెలియ చేశాడు. చైనాకు ఒక వైద్య బృందాన్ని పంపాలని కాంగ్రెసు నిశ్చయించింది. 1938 జూన్‌ 30వ తేదీన విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో సుభాస్‌ దీనిని హృదయపూర్వకంగా బలపరిచాదు. కాంగ్రెసు సూచన మేరకు,జవహర్‌లాల్‌ పూర్తి మద్దతు, రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఆశీస్సులతో అఖిల భారత జాతీయ ప్రణాళికా కమిటీ ఏర్పాటైంది. 1938 డిసెంబరు 17వ తేదీన దీని ప్రారంభోత్సవ సమావేశం సుభాస్‌ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. ఈ కాలంలో తన కార్యకలాపాల గురించి సుభాస్‌ చక్కగా మదింపు వేశాడు. “పారిశ్రామికీకరణ, జాతీయ అభివృద్ధి నిమిత్తం ఒక సమగ్ర ప్రణాళికను రచించేటందుకై జాతీయ ప్రణాళికా కమిటీని 1988 చివరలో (నేను) ప్రారంభించడం జరిగింది. పారి(శ్రామికీకరణను వ్యతిరేకిస్తున్న మహాత్మా గాంధీకి యిది మరింత కోపాన్ని తెప్పించింది”. సోవియట్‌ యూనియన్‌, తదితర ఐరోపా దేశాలను నమూనాగా తీసుకున్న యీ ప్రణాళికా సంఘ అవిర్భావం నిజానికి ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త దాక్టర్‌ మేఘనాథ్‌ సాహా మేధో శిశువు. దాక్టర్‌ సాహా తొలుత యీ అంశాన్ని మహాకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌వద్ద ప్రస్తావించగా ఆయన మనఃపూర్వక మద్దతును తెలిపాడు. వాస్తవానికి టాగూర్‌ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ చంద్ర, జవహర్‌లాల్‌కు ఒక అంతరంగిక లేఖ రాస్తూ, జాతీయ ప్రణాళికా కమిటీకి సంబంధించిన డాక్టర్‌ సాహా ఆలోచనలకు మహాకవి పూర్తి మద్దతు వున్న విషయాన్ని తెలియ చేశారు, అంతేకాక, గాంధీజీతోపాటు కాం(గైనుకు చెందిన యితర ననాతన నాయకులు పారిశామికీకరణను వ్యతిరేకిస్తున్నందున జవహర్‌లాల్‌ లేదా సుభాస్‌ చంద్ర బోస్‌లలో ఒకరు కాం(గెసు అధ్యక్ష పదవిని చేపట్టినపుడు మాత్రమే జాతీయ ప్రణాళికా కమిటీ ఏర్పాటును కాంగ్రెసు ఆమోదించగలదని మహాకవి భావిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ మొత్తం ఉ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 86

" - న . దంతాన్ని నుభాన్‌ . శ . శ గు. | జి ఈ (చాలా క్సువ్వంగా ఇ తనం న శ... ఒకేఒక్క వాక్యంలో | జ, ష్య. , మదింపు వేయటాన్ని ఇ సీ; (జ్ర శమనం యివృటికే |. ( ఎ ం ళ్‌ శ కాంటైను గ , ఎజ్టైా (5 మ | ఖ్‌ ల్లా? అధ్యక్షునిగా సుభాస్‌ 1? [ 1 లో హా? శే వ్యక్తం చేసిన మరో న, మస్‌ క క్‌ తి భావన ఏమంటే, ఏప్రిల్‌ 1938లో కాంగ్రెస్‌ వర్మింగ్‌ కమిటి సభ్యులతో సుభాస్‌ చంద్ర | క్రోన్సన్‌ లిపిలో వ్రాసే పొాందీ, ఉరర్జ్చాల మిశ్రమంతో కూడిన ఒకేఒక్క ఉమ్మడి భాష దేశమంతటికీ వుండాలని సూచించడం. జాతి వ్యతిరేకమన్న ఆలోచనతో విదేశీ లివి వినియోగాన్ని తొలుత సుభాన్‌ వ్యతిరేకించాడు. తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “నాలో మార్పు రావటానికి 1984 నాటి నా టర్కీ పర్యటనే కారణం. మిగిలిన ప్రపంచంలో వలెనే ఒకేఒక్క లిపిని కలిగి వుండటంలోగల గొప్ప సౌకర్యాన్ని నేను మొదటిసారి గ్రహించాను”. ఐఎన్‌ఏను ఏర్పాటు చేసిన తరువాత 1948 చివరలో యీ ఆలోచనకు ఆయన కార్యరూపాన్ని యిచ్చిన విషయం మనకు తెలుసు. కాం(గైసు లోపలా, వెలుపలా భారతదేశంలో వామపక్ష శక్తుల ఆవిర్భావం గురించి సుభాస్‌ అభిప్రాయాలను ఆయన వేసిన స్థూల అంచనా చ్వారానే బహుశ మనం చక్కగా అవగాహన చేసుకోగలం. ఆయన యీ విధంగా వ్రాశాడు: “1984లో కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఆవిర్భావం దేశంలో రాడికల్‌ లేదా వామపక్ష శక్తుల పునరావిర్భావానికి కచ్చితమైన సూచన. దీనితోపాటే రైతుల్లోనూ, విద్యార్థుల్లోనూ, కొంతమేరకు శ్రామికుల్లోనూ జాగృతి కలిగింది. మొట్టమొదటి సారిగా అఖీల భారత కిసాన్‌ సభ పేరుతో కేంద్రీకృత అఖిల భారత రైతు సంఘం ఏర్పడింది. స్వామి సహజానంద దీని నాయకుడు. గతంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్శొన్న విద్యార్థి వుద్యమం సైతం యిప్పుడు అఖీల భారత విద్యార్థి సమాఖ్య నాయకత్వాన కేంద్రీకృతమైంది. వరుసగా రెండుసార్లు చీలికలను ఎదుర్శొన్న అఖిల భారత 87 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మ యాలు. ట్రేదియూనియన్‌ కాంగ్రెసు ఆం “తః మితవాద, వామవక్ష యి. ాీ స వాదాలలోని అన్ని న రా లై | రోరణులకు ప్రాతినిధ్యం సను. టీ! భభ, 'వపాంచే. బలమైన స గ ్ష యకత్వం కింద మరోసారి న త పము గరకు జు స “శిరము... లం ఐక్యమైంది. ల. లా 1937లో మహాత్మ గాంధీ తో సుభాస్‌ చంద్రబోస్‌ | సైతం అభ్యుదయ రచయితలను సంఘటితం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి”. అయితే, భారత కమ్యూనిస్టుల గురించి ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నది. ఆనాటికి వారు భారతీయ వామపక్ష వాదుల్లో అత్యంత బలంగానూ, అత్యంత సంఘటితంగానూ వున్నారు.

భారత జాతీయ కాంగైసు హరిపుర సమావేశాలలో అధికార కాంగైెసు నాయకత్వానికీ, సుభాస్‌కూ మధ్య ఎలాంటి ఘర్షణా తలయొత్తలేదు. యుపి, బీహార్‌లలో మంత్రివర్గ సంక్షోభం గురించి సర్దార్‌ పటేల్‌ ప్రవేశ పెట్టిన తీర్మానానికి శరత్‌ బోస్‌ ప్రధాన మద్దతుదారుగా వున్నారు. 1988 సంవత్సరానికిగాను వర్కింగ్‌ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించినపుడు, 1936, 1987 నాటి నెహ్రూ నేతృత్వంలోని వర్కింగ్‌ కమిటీలో బలమైన ప్రాతినిధ్యం కలిగిన వామపక్ష వాదులు యిప్పుడు గణనీయంగా తగ్గిపోయినట్లు వామపక్ష వాదులు గుర్తించారు. ప్రస్తుతం కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీలో జవహర్‌లాల్స్‌ సుభాస్‌లు మాత్రమే వామపక్ష శక్తులకు ప్రతినిధులుగా వున్నారు. ఈ వర్మింగ్‌ కమిటీలో కాంగ్రెసు సోషలిస్టులుగానీ, రాయిస్టులుగాన్‌, కమ్యూనిస్టులుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఈ తరహా పొందికతో కూడిన వర్కింగ్‌ కమిటీని సుభాస్‌ చంద్ర బోస్‌ ఆమోదించటం ఆశ్చర్యంగా వుంది.

ఈ దశలో సుభాస్‌ పనితీరుతో గాంధీజీ పూర్తిగా సంతృప్తి చెందారు. సర్దార్‌ పటేల్‌కు చివాట్లు పెడుతూ ఒక లేఖ రాశాడు: “నీ ప్రసంగం దూకుడుగా వున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ విధమైన పద్ధతిలో సోషలిస్టులు గెలవలేరు. పొరపాటు చేసినట్లుగా నీవు భావించినట్లయితే దయచేసి సుభాస్‌ దగ్గర (ప్రత్యేక అనుమతిని పొంది, వేదికపైకి వెళ్ళి వారి కన్నీటిని తుడిచి, వారిని నవ్వించు”.

ఇప్పటికే మనం చూసినట్లుగా సుభాస్‌ చంద్ర బోస్‌ అన్ని రకాల మత సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 88

తత్వాలను గట్టిగా వ్యతిరేకించాడు. ప్రాయికంగా లౌకిక వాదానికి మద్దతుదారుగా నిలచాడు. హిందూ-ముస్లిం సంబంధాల విషయంలో విసృత ప్రాతిపదికపై కాంగ్రెసు నాయకత్వంతో ఆయన ఏకీభవించారు. ఈ విషయంలో ఆయనది అంతర్జాతీయ దృక్పథం, ఇది కాంగ్రెసు నాయకత్వంతోనే కాక, భారతీయ వామపక్ష వాదుల్లోని పెద్దభాగంతో కూడా విభేదిస్తుంది. (బ్రిటిష్‌ వారికి, సోవియట్‌ యూనియన్‌కు దీర్ధక్రాల శత్రువులుగా తాను భావిస్తున్న జర్మనీ, జపాన్‌, ఇటలీ నాయకులతో సంబంధాలు పెట్టుకోవటానికి 1939 ప్రారంభంలో సుభాస్‌ ప్రయత్నించాడు. నిజానికి 1938 డిసెంబరు 22వ తేదీన నాజీ అధికారియెైన డాక్టర్‌ ఉర్క్‌ను బొంబాయిలో ఆయన కలుసుకున్నాడు. అతనితో మాట్లాడుతూ, భారతదేశ నాయకులలో కేవలం జవహర్‌లాల్‌ నెహ్రూ, కమ్యూనిస్టులు మాత్రమే జర్మన్‌కు చెప్పదగిన శత్రువులుగా వున్నారని ఆయన తెలిపొదు.

జపాన్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో మునిగివున్న చైనాకు భారతదేశం సంఘీభావ చిహ్నంగా కాంగ్రెసు వైద్య బృందాన్ని చైనాకు పంపటం జరిగింది. ఆ సమయంలో సుభాస్‌ చంద్ర బోస్‌ కాంగైసు అధ్యక్షునిగా వున్నాడు. కాని, నెహ్రూ లేదా మహాకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌వలె ఆయన జపాన్‌కు గట్టి విమర్శకునిగా లేడు.

సుభాస్‌, అధ్యక్ష పదవీ కాలం ముగింపుకు రావటంతో ఆయన తిరిగి ఎన్నికవుతాడా లేదా అన్న ప్రశ్న తలయెత్తింది. భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ను రెండవసారి కూడా ఎన్నుకోవాలంటూ మొట్టమొదటి సారిగా భారత కమ్యూనిస్టులు వారి నాయకుడు పి.సి. జోషి ముందుకువచ్చి పిలుపు యిచ్చారు. ఆ తరువాత ఎం.ఎన్‌. రాయ్‌ మద్దతుదారులు యిదే దారిపట్టారు, చివరకు కాంగ్రెసు సోషలిస్టులు కూడా తమ మద్దతు ప్రకటించారు. మరో ఆసక్తికరమైన విషయమేమంటే, భారత జాతీయ కాంగైసు అధ్యక్షునిగా సుభాస్‌ చంద్ర బోస్‌ను తిరిగి ఎన్నుకోవలసిందిగా సూచిస్తూ రవీంద్రనాథ్‌ టాగూర్‌ సైతం గాంధీజీకి ఒక అంతరంగిక లేఖ రాశాడు. అయితే, యీసారి ఎన్నికల్లో సుభాస్‌ పోటీ చేయక పోవటం ఉత్తమంగా వుంటుందని గాంధీజీ సగౌరవంగా సమాధానం యిచ్చాడు.

కాం(గైను రెండుగా విడిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో సుభాన్‌ పోటీ చేయరాదంటూ సర్దార్‌ పటేల్‌ ఆచార్య జె.బి. కృపలానీ తదితరులతో సహా వర్కింగ్‌ కమిటీలో మితవాదులుగా భావిస్తున్న అత్యధిక సభ్యులు పిలుపు యిచ్చారు. త్రిపురిలో జరగనున్న సమావేశాలలో కాంగ్రెసు అధ్యక్ష పదవికి ఆంధ్రాకు చెందిన కాంగ్రెసు తాతకు ఛటోపధ్యాు

నాయకుడైన పట్టాభి సీతారామయ్య పేరును వారు ముందుకు తీసుకు వచ్చారు. తన సోదరుని తరపున శరత్‌ బోస్‌ సమాధానమిస్తూ, సుభాస్‌ మాత్రమే కాంగ్రెసును ఐక్యంగా వుంచగలడని, పట్టాఖిని సమర్ధించడమంటే కాంగైసును విభజించదడమే అవుతుందని పేర్కొంటూ సర్దార్‌ పటేల్‌కు టెలిగ్రామ్‌ పంపించాడు. ఎన్నికల్లో పోటీకే సుభాస్‌ నిశ్చయించుకున్నాడు. దీనితో యుద్ధ భేరీలు మైగినట్లయింది. వామపక్షవాదుల సమైక్య మద్దతుతో 1989 జనవరి 29వ తేదీన సుభాస్‌ కాంగైసు అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాడు. పట్టాభి సీతకారామయ్యను 1580-1875 ఓట్ల తేదాతో ఓడించాడు. సుభాస్‌ చంద్ర బోస్‌ను వ్యతిరేకించిన కాంగైసు నాయకులు అడుగడుగునా ఆయనను ఆటంకపరచాలని నిశ్చయించుకున్నారు. గాంధీజీ సంగతేమిటి? కాం(గైసు అధ్యక్షునిగా సుభాస్‌ తిరిగి ఎన్సికైన తరువాత ఆయనపట్ల వ్యతిరేకత రావటం వెనుక గాంధీజీ అండదండలున్నాయన్న అభిప్రాయం వ్యకమైంది. అయితే, వాస్తవం చాలా సంక్లిష్టమైనది. 1989 ఫిబ్రవరి ప్రారంభంలో రాసిన ఒక వ్యాసంలో గాంధీజీ యిలా పేర్యొన్నాడు: “శ్రీ సుభాస్‌ బోస్‌ నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించాడు...... ఆయన 'ప్రకటనల్లోని వాదనలను...... నేను ఆమోదించలేను...... ఏదియేమైనప్పటికీ, ఆయన గెలుపుపట్ల నేను సంతోషిస్తున్నాను......నేను వేటికోసమైతే నిలచానో ఆ ఆదర్శాలను, విధానాలను ప్రతినిధులు సమ్మతించ లేదన్న విషయం నాకు స్పష్టమైంది. ఈ ఓటమిలో ఆనందాన్ని పొందుతున్నాను..... సుభాస్‌ బాబు తన దేశానికి ఎంతమాత్రం శత్రువుకాడు. దేశం కోసం ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన అభిప్రాయంలో ఆయనది అత్యంత చారవ గలిగిన, సాహసోపేతమైన విధానము, కార్యక్రమము...... మైనారిటీగా వున్నవారు ఏవిధంగానూ ఆటంకపరచరు. సహకరించ లేనపుడు వారు తప్పనిసరిగా తప్పుకోవాలి, సుభాస్‌ కూడా తన బహిరంగ ప్రకటనల్లో సఖ్యతనే ప్రదర్శించాడు. “నా గురించి మహాత్మాజీకి వున్న అభిప్రాయమేమిటో నాకు తెలియదు. ఆయన అభిప్రాయం ఏమైనప్పటికీ, ఆయన విశ్వాసాన్ని పొందటానికి ప్రయత్నించడమే సర్వేసర్వత్రా నా ధ్యేయంగానూ, లక్ష్యంగానూ వుంటుంది. సుభాస్‌, 1989 పిబ్రవరి 15వ తేదీన గాందీజీని కలుసుకుని ఆయన మద్దతును కోరాడు. కాని, 1939 ఫిబ్రవరి 22వ తేదీన బోసు సోదరులు మినవా మిగిలిన వర్మింగ్‌ కమిటీ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారి జాబితాలో జవహర్‌లాల్‌ పేరు కూడా వున్నది, వామపక్షవాదుల వైఖరి ఏమిటి? వారు సుభాస్‌కే గుండుగుత్తగా ఓటు వేశారు. కాం(గైసు వర్కింగ్‌ కమిటీలో బలమైన వామపక్ష వాదుల బృందం వుండాలని కమ్యూనిస్టులు ఆలోచించగా, అదేసమయంలో, వర్కింగ్‌ కమిటీలో వామపక్షవాదుల సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 90

వెజారిటీ వుండాలని శ, ఛి ఇక శాల ఇ భన (సిఎస్‌పి) కోరుకున్నది. (తై * “జ్య లా

ఎం.ఎన్‌. రాయ్‌ |, కుండబద్దలు కొట్టినట్లుగా | జీన్‌ ఇడ లీ తన అభి([పాయాన్ని ష్య న . కై ల్‌ వు (వ్రకటించాడు. 1939 || ం. ల “ఛో | వీబ్రవరి 1వ తేదీన ట్టు త్త తగా ] సుషస్‌కు ఆయన ఒక లేఖ మ్ను. కలో జ్‌ వే రాస్తూ, వామపక్ష వాదులతో తప వ. క్షు ఇకో వర్పరచాలని, దానికి ఎం.ఎన్‌. రాయ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరాడు. రాయ్‌ యింకా యీ విధంగా రాశాడు. “గాంధేయ సూత్రాలు గౌరవప్రదమైన సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాలతో సమాధాన పడలేవు..... ఉద్యమం యొక్క వస్తుగత విప్లవ ఆశయాలకు గాంధీజీ ఆకాంక్షలు వ్యతిరిక్తంగా వున్నపుడు కాం(గైసు నూతన నాయకత్వం స్వతంత్రంగా వ్యవహరించే సాహసాన్ని పట్టుదలను కలిగి వుండాలి”.

1989 మార్చి 10వ తేదీన మధ్య భారతంలో కాంగ్రెసు త్రిపురి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో గాంధీజీ నాయకత్వంపట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించటంతోపాటు, గాంధీజీ ఆకాంక్షలకు అనుగుణంగా వర్కింగ్‌ కమిటీని నియమించ వలసిందిగా సుభాస్‌ చంద్ర బోస్‌కు విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని యుపీకి చెందిన కాంగైసు నాయకుడు గోవింద వల్లబ్‌ పంత్‌ ప్రవేశ పెట్టారు.

కాగా, పంత్‌ తీర్మానాన్ని వ్యతిరేకించాలని సిపిఐ, రాయిస్టులు నిర్ణయించారు. సిఎస్‌పి మాత్రం గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నది. వామపక్ష వాదులందరూ కలని పంత్‌ తీర్మానానికి ప్రవేశ పెట్టిన సవరణలు 185-218 ఓట్ల తేడాతో వీగిపోయాయి. దీనితో సుభాస్‌ సంశయంలో పడ్డాడు. వర్కింగ్‌ కమిటీ నియామకంలో గాంధీజీ మద్దతు పొందటంలో ఆయన విఫలమయ్యాడు. వామపక్ష వాదులు అధికంగా వుండే వర్మింగ్‌ కమిటీని ఆయన ఎందువలన నియమించలేక పోతున్నాడు? 1989 ఏప్రియల్‌ 11వ తేదీన తన కోడళ్ళలో ఒకరికి ఆయన రాసిన లేఖలో యిలా పేర్కొన్నాడు: “సిఎస్‌పి నాయకత్వం చేసిన విద్రోహమూ, మా వైపునుంచి ఎత్తుగడలు మొరటుగా వుండటమూ త్రిపురిలో మా అపజయానికి కారణాలు...... కమ్యూనిస్టు భే గౌతమ్‌ ఛటోపాధ్యాయ

పార్టీ కూడా సిఎస్‌పితో జోడీ కట్టింది, అయితే, చివరి నిముషంలో పార్టీలో కిందిస్థాయి నుంచి పైవరకు తిరుగుబాటు రావటంతో తన విధానాన్ని మార్చుకున్నది..... సమీప భవిష్యత్తు అగమ్య గోచరం. చివరగా నేను రాజీనామా చేసే అవకాశం కూడా లేకపోలేదు”. 1939 కన్ని న క్ష ఏప్రియల్‌ 29వ తేదీన గ్‌ అఖిల భారత కాంగైసు [ స కీ . ' నవమూవేశమైంది. యాల. “న మ కంగన అధ్యక్ష ీ మ. . ( 1 ''పదవికి సుభాస్‌ తన | ॥ వే జె | '_|,, సమర్పించాడు. తన 1 షు. / (| రాజీనామా లేఖలో 1937లో అబ్బుల్‌ గఫూర్‌ ఖాన్‌తో సుభాస్‌ చంద్రబోస్‌ ఆయన యిలా కుంఠర్కాన్నాడోం;: భారతదేశంలోనూ, బయటి ప్రపంచంలోనూ మనకు ఎదురు కానున్న సంక్షిష్ట కాలం దృష్టా కాంగ్రెసులోని అత్యధికుల విశ్వాసాన్ని పొందగల మిశ్రమ అంతరంగిక కమిటీ మనకు వుండాలన్నదే నా స్వీయ అభిప్రాయం..... ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షునిగా నా వునికి ఒక రకంగా ఆటంకమనే నేను భావిస్తున్నాను..... కనుకనే, పరిపక్వమైన యోచనతో, నహాయపడాలన్న ఆకాంక్షతో నా రాజీనామాను మీ చేతుల్లో వుంచుకున్నాను”. అంతిమంగా సుభాస్‌ రాజీనామా ఆమోదాన్ని పొందింది, మిగిలివన్న కాలానికి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. వామపక్ష (్రేణుల్సో, ప్రత్యేకించి బెంగాల్‌లో ఆగ్రహోద్రేకాలు పెల్లుబికాయి. కాంగ్రెసు లోపలనే ఫార్వర్డ్‌ బ్లాక్‌ పేరిట నూతన బృందాన్ని వర్పాటు చేస్తున్నట్లు మే 3వ తేదీన సుభాస్‌ ప్రకటించారు. “అన్నిరకాలైన రాడికల్స్‌ మధ్య మహత్తరమైన ఏకాభిప్రాయ సాధనకు ప్రాతినిధ్యం వహించే కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై దేశంలోని మొత్తం రాడికల్స్‌ను, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రగతిశీల శక్తులను సమీకరించటమే”, ఫార్వర్డ్‌ బ్లాక్‌ కర్తవ్యమని ఆయన (ప్రకటించాడు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, రాయిస్టులు, సహజానంద మద్దతుదారులంతా ఫార్వర్డ్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 9బై

బ్లాక్‌లో చేరతారని ఆయన వూహించాడు, కాని అలా జరగలేదు. 1989 జూన్‌ మధ్యలో మొట్టమొదటి అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ సమావేశాలు బొంబాయిలో జరిగాయి. బలమైన వామపక్ష కమిటీని (ఎల్‌సెసి) వర్పాటు చేయాలని యీ సమావేశాలు పిలుపు యిచ్చాయి. సిఎస్‌పి, రాయిస్టులు, కెపిఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌లకు చెందిన ప్రతినిధులు సమాన సంఖ్యలో ఎల్‌సిసిలో వుంటారు. సుభాస్‌ రాజకీయ జీవితంలో నూతన దశ ప్రారంభమైంది.

ట్‌ 93 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రభుత్వం కన్నుగప్పి సరిహద్దులు దాటి... ఐరోపాలో యుద్ధ మేఘాలు వడివడిగా కమ్ముకోసాగాయి. భారతదేశంలో సామ్రాజ్యవాదుల అణచివేత తారాస్థాయికి చేరింది. 1989 జూలై 9వ తేదీని వామపక్ష దినం'గా పాటించాలని సుభాస్‌ చంద్ర బోస్‌ ఎల్‌సెసిలు నిర్ణయించాయి. దీని ప్రదర్శనలో పాల్గొన వలదని కాం(గ్రెసు అధిష్టానం కాం(గగెసు (శ్రేణులకు పిలుపు యిచ్చింది. భారతదేశం అంతటా వామపక్ష దినాన్ని ప్రజలు పెద్దయెత్తున జరిపారు. కాగా, సుభాస్‌ చంద్ర బోస్‌పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ నిర్ణయించింది. బెంగాల్‌ ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా ఆయనను అనర్హునిగా ప్రకటించటమే కాకుండా, ఎన్నికైన ఏ కాంగైసు కమిటీలోనూ సభ్యత్వం తీసుకోవటానికి వీలులేకుండా 1989 ఆగస్టు నుంచి మూడేళ్ళపాటు బహిష్మరించారు. కాగా, ఆగస్టు 19వ తేదీన సుభాస్‌ చంద్ర ఒక ప్రకటన విడుదల చేశాడు. “వట్టబద్ద వాదంలోనూ, సంస్కరణ వాదంలవైపు నిరంతరం కొట్టుకు పోతుండటంపట్ల దేశాన్ని హెచ్చరించటం ద్వారా, కాంగ్రెసు విప్లవ స్ఫూర్తిని నాశనం చేయాలని చూసే తీర్మానాలకు వ్యతిరేకంగా నిరసన తెల్పటం ద్వారా, వామపక్ష వాదులను సంఘటిత పరచటానికి ప్రయత్నించటం ద్వారా..... రానున్న పోరాటాలకు సన్నద్దం కావలసిందిగా దేశ ప్రజలకు నిరంతరం విజ్ఞప్తులు చేయటం ద్వారా నేను నేరమే చేశాను, అందుకు తగిన మూల్యాన్ని చెలించుకున్నాను. యీ శిక్ష నాకుకాదు, అత్యధిక దేశీయులకు దిగ్భ్రాంతిని గొలపవచ్చు”. సాధారణంగా జాతీయోద్యమంలోని ముఠా తగవులకు దూరంగా వుండే రవీంద్రనాథ్‌ టాగూర్‌ యిప్పుడు మాత్రం సుభాస్‌ చంద్ర బోస్‌ను గట్టిగా సమర్ధించాడు. “దేశనాయక్‌ శీర్షికన బెంగాలీ భాషలో వెలువడిన ఒక వ్యాసంలో ఆయన యిలా పేర్కొన్నాడు. “బెంగాలీ కవిగా నేను, బెంగాలీ ప్రజల పూజనీయుడైన నాయకునిగా యీనాడు నిన్ను గుర్తిస్తున్నాను...... ఆమె సంతతి అయిన నవ యువతరం సుదీర్ధక్షాల దండనతో మొద్దుబారి, అంతర్గత చీలికలతో చిన్నాభిన్నం కావటంతో వేదన సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 4

చెందుతున్నది. బెంగాల్‌ నిరాశా తిమిరంలో సాగుతున్నది..... దేశవ్యాప్త సంక్షోభం నెలకొన్న యిలాంటి పరిస్థితిలో మన ప్రగతికి బెడదగా తయారైన దురదృష్టాన్ని తోసిపుచ్చగల శక్తివంతమైన వ్యక్తిత్వమూ, అజేయమైన ఆత్మవిశ్వాసమూ వున్న సహజ నాయకుని సేవలు మనకిప్పుడు కావాలి..... రక్షకుని ఆసనం సిద్ధమైందని, అది నీకోసం పరచి వున్నదని బెంగాల్‌ ముక్తకంఠంతో పలుకుతున్నది. చాలా సంవత్సరాల క్రితమే నేను బెంగాల్‌ నాయకుని కోసం పిలుపు యిచ్చాను, కాని, యిప్పటి వరకు రాలేదు. అనేక సంవత్సరాలు గడచిన తరువాత పూర్తి వెలుగులోకి వచ్చిన వారిని వుద్దేశించి నేను మాట్లాడుతున్నాను. నా రోజులు ముగింపుకు వచ్చాయి. రానున్న పోరాటంలో నేను ఆయనతో కలవలేను. కేవలం ఆశీర్వాదాన్ని మాత్రమే యివ్వగలను. తన దేశ భారాన్ని తన స్వీయ వేదనగా భరించగలడని తెలుసు. దేశ స్వాతంత్ర్యమే ఆయనకు లభించే అంతిమ బహుమతి.

జాతి ఐక్యత ప్రయోజనం రీత్యా సుభాస్‌పై క్రమశిక్షణా చర్యను ఎత్తివేయ వలసిందిగా కోరుతూ గాంధీజీకి రవీంద్రనాథ్‌ టాగూర్‌ టెలిగ్రామ్‌ యిచ్చాడు. గాంధీజీ ఆయనకు తిరుగు సమాధానమిస్తూ, కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ ఆ పని చేయలేని అశక్తతలో వున్నట్లు తెలియ చేశాడు. 1940 జనవరి 15వ తేదీన సి.ఎఫ్‌. అంగ్రూస్‌కు రాసిన లేఖలో గాంధీజీ యిలా పేర్కొన్నారు: “ఆయన (సుభాస్‌) రాజకీయాలు పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాయి. ఇవి పూడ్చలేనట్లుగా కన్పిస్తున్నాయి. గురుదేవులకిది చాలా చిక్షైన సమస్య అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. కమిటీలో ఏ ఒక్కరూ సుభాస్‌కు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఆయన విశ్వసించుగాక. నా విషయానికి వస్తే అతడు నా బిడ్డ వంటివాడు”.

అంటే, గాంధీజీ, వర్కింగ్‌ కమిటీ - సుభాస్‌ చంద్ర బోస్‌లు పరస్పరం అభిముఖంగా నిలచి వున్నారన్న మాట. నిజానికి విడిపోయే మార్దాలు సమీపించాయి. జవహర్‌లాల్‌ యా సమయంలో సుభాస్‌పట్ల నిర్దయగా వున్నాడు. 1920 మార్చి 20వ తేదీన వి.కె. కృష్ణమీనన్‌కు ఆయనొక లేఖరాస్తూ సుభాస్‌ చంద్ర, “యిప్పుడు పోటీ కాంగ్రెసు గురించి అత్యంత నిరర్ధకమైన దుష్టు వ్యాఖ్యలు చేస్తున్నాడు...... (ఆయన) అస్పష్టంగా వామపక్షవాదులు, మితవాదులు అని చెప్పటం మినహా ఆయన మనసులో ఏమీ వున్నట్లు కన్చడదు”.

1939 సెప్టెంబరు ప్రారంభంలో ప్రపంచ యుద్ధం మొదలైంది. సెప్టెంబరు 9వ తేదీన కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ వార్జాలో సమావేశమైంది. దీనికి హాజరు కావలసిందిగా సుభాస్‌ చంద్రను ప్రత్యేకంగా ఆహ్వానించారు. యుద్ధానంతరం భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని యిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం కచ్చితమైన హామీయివ్వని 9ిర్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

త్త

పక్షంలో యుద్ధ ప్రయత్నాలకు కాంగ్రెసు మద్దతు వుండదని వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా

తీర్మానించింది. దీనికి అక్టోబరు 17వ తేదీన భారత వైస్రాయ్‌ స్పందన అసంతృప్తినే

మిగిల్చింది. ప్రాంతీయ కాంగ్రెసు మంట్రివర్గాలు రాజీనామా చేయవలసిందిగా కాం(గైసు

నాయకత్వం పిలుపు యిచ్చింది. నెహ్రూ, కమ్యూనిస్టు వామపక్షవాదులు సామ్రాజ్యవాద

వ్యతిరేక, ఫాసిస్టు వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సుభాస్‌ చంద్ర దృక్పథం మరో

విధంగా వున్నది. యుద్ధ పరిస్థితిని భారత్‌కు అనుకూలంగా మార్చు కోవాలని ఆయన కోరాడు. బ్రిటన్‌ శత్రువులు తన మిత్రులని ఆయన భావించారు. 1940 జనవరిలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య వార్షిక సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ యిలా పేర్కొన్నారు: “మనమందరమూ విక్రమించ వలసిన, కార్యోన్ముఖులం కావలసిన తరుణం ఆసన్నమైంది. సుప్రసిద్ధ ఇటాలియన్‌ జనరల్‌ ఉద్దాటించిన స్ఫూర్తిదాయకమైన మాటలను నేను గుర్తు చేసుకుంటున్నాను. “మీరు నన్ను అనుసరించినట్లయితే, మీకు నేను ఆకలిని, దప్పికను, లేమిని, బలవంతపు ప్రయాణాలను, మరణాన్ని యిస్తాను”. ఈ మాటలు యిప్పుడు మన చెవులకు సోకాలి, మనం ముందడుగు వేసేలా, విక్రమించేలా, కార్యోన్ముఖులమయ్యేలా స్ఫూర్తినివ్వాలి. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని స్వరాజ్యాన్ని అందుకోగలం”.

1940 మార్చిలో కాంగ్రాను పార్టీ తన వార్షిక నమావేశాలను ఛోటానాగపూర్‌లోని రామ్‌గర్‌లో జరుపుకున్నది. ఇదే సమయంలో సుభాస్‌ చంద్ర బోస్‌, సమీపంలోని బిహిత వద్ద రాజీ వ్యతిరేక సదస్సును నిర్వహించాడు. ఈ సదస్సుకు బీహార్‌కు చెందిన సమరశీల రైతు నాయకుడు స్వామి సహజానంద సరస్వతి వేల సంఖ్యలో రైతులను సమీకరించాడు. ఈ సదస్సులో సుభాస్‌ మాట్లాడుతూ, “జర్మనీ ఫాసిస్టు లేదా సామ్రాజ్యవాద శక్తి కావచ్చు, మొరటైనదీ లేదా క్రూరమైనది కావచ్చు, కాని, దాని గుణాలను శ్లాఘించటంలో ఎవరూ తోడ్పడరు”. రామ్‌గర్‌లో నాజీలను సరిగ్గా యిదే విధంగా శ్లాఘించనప్పటికీ, శత్రువుని శత్రువు మిత్రుడన్న భావన ఆయన ఆలోచనగా వున్నది.

1940 జూన్‌లో గాంధీజీని కలుసుకునేందుకై సుభాస్‌ వార్డాకు వెళ్ళాడు. కాని, వారిరువురి దృక్పథాలకు మధ్య పొంతన కుదురలేదు. సుభాస్‌ కలకత్తాకు తిరిగి వచ్చి హాల్వెల్‌ స్మారక చిహ్నాన్ని తొలగించాలని డిమాండు చేస్తూ ఉద్యమాన్ని చేపట్టాడు. బ్లాక్‌హోల్‌ విషాదోదంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్ధం దీనిని కలకత్తా నడిబొడ్డున నిర్మించారు. దీనిని ' మనం అనుభవిస్తున్న బానిసత్వానికి, అవమానాలకు ప్రతీకగా భావించటం జరిగింది. 1940 జూలై 3వ తేదీన ఉద్యమం ప్రారంభమైంది. కాగా భారత రక్షణ చట్టం కింద జూలై 2వ తేదీనే సుభాస్‌ను సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 96

ప్రభుత్వం ఆరెస్టు చేసింది. సుభాస్‌ను (ప్రభుత్వం నిరవధికంగా జైలులోనే వుంచింది, మరోవైపున యుద్ధం సాగుతూనే వున్నది. తాను మూడు విషయాలను నమ్ముతున్నట్లు ఇండియన్‌ ధ్రగుల్‌ అన్న గ్రంధం రెండవ భాగంలో సుభాస్‌ యిలా పేర్కొన్నాడు. “మొదటిది, (బ్రిటన్‌ యుద్ధంలో పరాజయం పొందుతుంది, (బ్రిటిష్‌ సామ్రాజ్యం విచ్చిన్నమవుతుంది రెండవది, అస్టిర పరిస్థితిలో చిక్కుకున్నప్పటికీ బ్రిటిష్‌ వారు భారత ప్రజలకు అధికారాన్ని అప్పచెప్పరు, ప్రజలే పోరాడి తమ స్వాతంత్ర్యాన్ని సంపాదించు కోవాలి. మూడవది, యుద్ధంలో బ్రిటన్‌కు వ్యతిరేకంగా భారతదేశం తనవంతు పాత్రను నిర్వహించి, బ్రిటన్‌తో పోరాడుతున్న వారితో చేతులు కలిపినట్లయితే భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించు కోగలదు. ఆ విధంగా అక్ష రాజ్యాల సహకారంతో భారతదేశంలో బ్రిటన్‌ పాలనను కూలద్రోయాలని సుభాస్‌ అప్పటికే ఆలోచన చేయటం ప్రారంభించాడు.

ఏ విధంగానైనా జైలు నుంచి బయటపడి భారతదేశం దాటి బయటకు వెళ్ళిపోవాలని యూ సమయంలోనే సుభాస్‌ నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వానికి మాత్రం ఆయనను విడుదల చేయాలన్న ఆలోచన లేనేలేదు. దీనితో ఆయన తనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండు చేస్తూ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించాడు. వారం రోజులకే ఆయన పరిస్టితి దిగజారింది. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొంచిన ప్రభుత్వం ఆయనను 1940 డిసెంబరు 5వ తేదీన విడుదల చేసింది.

ఫార్వర్డ్‌ బ్లాక్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యునిగా వున్న మియాన్‌ అక్బర్‌ షాతో సుభాస్‌ సంప్రదింపులు జరిపొడు. పరాన్‌ తెగకు చెందిన యీయన రెండు దశాబ్దాల క్రితం పెషావర్‌-బోల్నినిక్‌ కుట్రకేసులో ప్రధాన ముద్దాయిగా వున్నాడు. అక్సర్‌ కలకత్తాకు చేరుకుని సుభాస్‌ చంద్ర బోస్‌తో సంప్రదింపులు జరిపాడు. సుభాస్‌, భారత్‌ను విడచి అప్టనిస్థాన్‌ను చేరుకునేందుకు పధకాన్ని రచించాడు. పెషావర్‌ నుంచి కాబూల్‌ వెళ్ళేందుకు పంజాబు కీర్తి కిసాన్‌ పార్టీకి చెందిన కమ్యూనిస్టు నాయకుడైన అచ్చర్‌ సింగ్‌ భీమా ఏర్పాట్లు చేశాడు. నాటకీయంగా జరిగిన యీ ఉదంతం గురించి సుభాస్‌ మేనల్లుడు డాక్టర్‌ శిశిర్‌ కె. బోస్‌ తన ది గ్రేట్‌ ఎస్సేవ్‌ అన్న గ్రంథంలో విపులంగా వర్దించాడు.

1941 జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సుభాస్‌ చంద్ర బోస్‌ మహమ్మదీయునిలా మారువేషం వేసుకున్నాడు. మేనల్లుడు శిశిర్‌ ఆయనను కారులో తీసుకు వెళ్ళి గోమొహ్‌లోని తన పెద్దన్న అశోక్‌ ఇంటి వద్దకు చేర్చాడు. మరుసటి రోజు రాత్రి యిరువురు సోదరులు కలసి గోమొవ్‌ రైల్వే స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. అక్కడ కల్మా మొయిల్‌లో మహమ్మద్‌ జియావుద్దీన్‌ పేరుతో రిజర్వయిన బెర్తులోకి ఆయనను చేర్చారు. 97 రూ నా గాతమ్‌ ఛటోపాధ్యాయ

ఆ తరువాత సుభాస్‌ ఢిల్లీవద్ద రైళ్ళుమారి పెషావర్‌ వెళ్ళీ ఫప్రాంటియర్‌ మెయిల్‌ ఎక్కాడు. మియాన్‌ అక్బర్‌ షా కూడా అదే రైలులో వున్నాడు. పెషావర్‌ కంటోన్మెంట్‌ స్టేషన్‌లో సుభాస్‌ దిగటం, అక్కడ అక్టర్‌ అనే కార్యకర్త తోడుతో అప్పటికే ఏర్పాటు చేసుకున్న స్థావరానికి వెళ్ళటం అంతా ఆయన గమనిస్తూనే వున్నాడు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, జనవరి 21వ తేదీన సుభాస్‌ అంటే ప్రగాఢ అభిమానం వున్న భగత్‌ రామ్‌ తల్వార్‌ అనే కమ్యూనిస్టు ఆయనను కలుసుకుని, కాబూల్‌ వెళ్ళేందుకు పధక రచన చేశాడు. తల్వార్స్‌ ఆఫ్‌ వఠాన్‌ లాండ్‌ అండ్‌ నుభాన్‌ చంద్రాస్‌ (గేట్‌ ఎస్మేవ్‌, అన్న తన గ్రంథంలో భగత్‌ రామ్‌ తల్వార్‌ యీ యాత్ర గురించి విపులంగా వర్ణించాడు. 1941 జనవరి 27వ తేదీన సుభాస్‌ చంద్ర, భగత్‌ రామ్‌లు కాబూల్‌కు చేరుకున్నారు. సుభాస్‌ తప్పించుకునే విషయం బ్రిటిష్‌ గూఢచారి విభాగానికి తెలుసునని, కాబూల్‌లో ఆయనను వారు ఒంటరిగా వదలి వేశారని, ఎందుకంటే సుభాస్‌ బోస్‌ భారతదేశం వెలుపల వుండటం వారికి సంతోషం కలిగించిందని యిటీవల కొంతమంది చరిత్రకారులు, పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. ఆసియాటిక్‌ సాసైటీ ఆఫ్‌ కలకత్తాకు చెందిన ఒక పరిశోధక బృందం 1995లో రష్యాలో పర్యటించి మాస్మ్కోలోని పురాపత్ర భాండాగారంలో వున్న (ధ్రువీకరించని పత్రాలను ఆధారం చేసుకుని వారీ నిర్ణయానికి వచ్చారు. ఈ రచయిత ఆ పత్రాలను విశ్వాస యోగ్యమైనవిగా భావించటం లేదు. ఏదియేమైనప్పటికీ 1941లో బెంగాల్‌ ప్రభుత్వానికి చెందిన హోం విభాగం చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత బెంగాల్‌ గవర్నర్‌ నివేదికలోని భాగాలు మనకు గట్టి సాక్ష్యాలుగా వున్నాయి. కలకత్తా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ జన్వరిన్‌ ఒక రహస్య నివేదికలో యిలా పేర్కొన్నాడు. “సుభాస్‌ బోస్‌ అదృశ్యం కావటానికి తోద్చడిన పరిస్థితులపై విచారణ జరపటం కోసం యీ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ ఈ రోజు ఉదయం (1941 జనవరి 27) వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఆయనకు చెప్పిందేమంటే...... (జనవరి 25వ తేదీ ఉదయం తాము) ఆయన అదృశ్యమైనట్లు కనుగొన్నామని చెప్పారు. ఒంటికి వెచ్చదనాన్ని కలిగించే దుస్తులుగానీ..... చెప్పులుగానీ తనతో తీసుకు వెళ్ళలేదు. ఆయన ప్రాపంచిక సుఖాలను త్యజించి సన్యాసిగా మారాడన్న నమ్మకంతో వారున్నారు....... సుభాస్‌ బోస్‌ అదృశ్యం గురించి పైన యిచ్చిన వివరణ యుక్తంగానే వున్నది. అయితే యిది వాస్తవమైన వివరణా, కాదా అని సందేహించటానికి గట్టి కారణాలే వున్నాయి”. కలకత్తా స్పెషల్‌ బ్రాంచ్‌ పనితీరుపట్ల ఢిల్లీలోని అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేంద్ర గూఢచారి విభాగం అధికారి ఒకరు 1941 ఫిబ్రవరి 198వ తేదీన యిలా పేర్కొన్నాడు. “ఆయన ఎలా తప్పించుకున్నాడు, యిప్పుడు ఆయన సుభాన్‌ చంద్ర బోన్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 98

ఎక్కడ వున్నాడన్నది యిప్పటికీ అగమ్యంగానే వున్నది. భారతదేశంలో లేదా విదేశాలలో వుండి ఎలాంటి హానీ చేయకుండా బోస్‌ను నిరోధించాలని (ప్రభుత్వం భావిస్తున్నది. బోసు, పోలీసుల కళ్ళుగప్పాడు, తన పనితీరు గురించి గర్వించటానికి గవర్నర్‌కు కారణమే లేదు.

మన కథనానికి మరలా తిరిగి వద్దాము. కాబూల్‌లోని సోవియట్‌ ప్రభుత్వ అధికారులకో సంబంధం పెట్టుకోవటానికిగాను 1941 జనవరి 28 నుంచి సుభాస్‌ చంద్ర, భగత్‌ రామ్‌లు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు సోవియట్‌ యూనియన్‌లోకి సుభాస్‌ ప్రవేశానికి సంబంధించి కూలంకష చర్చకు సోవియట్‌ అంతగా వుత్సాహం చూపలేదు. దీనితో యితర అవకాశాల గురించి సుభాస్‌ పరిశీలించ సాగాదు. 1941 ఫిబ్రవరి 2వ తేదీన జర్యన్‌ దౌత్వ్యాధికారిని ఒకరిని కలుసుకుని, ఆయనద్వారా అత్యున్నత స్థాయి అధికారితో మాట్లాడాడు వేచి వుండవలసిందిగా జర్మన్స్‌ ఆయనకు చెప్పారు. తన భూభాగం ద్వారా ఐరోపాకు వెళ్ళేందుకుగాను సుభాస్‌ చంద్రకు ప్రయాణపు వీసాను మంజూరు చేయవలసిందిగా జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సంయుక్తంగా సోవియట్‌ యూనియన్‌ను కోరినట్లు ఫిబ్రవరి మధ్య భాగంలో భగత్‌ రామ్‌కు జర్మన్‌ దౌత్య కార్యాలయానికి చెందిన ధామస్‌ తెలియ చేశాడు.

జర్మన్‌ల సహకారంతో సుభాస్‌ బోస్‌, ఇటలీతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి చివరలో సుభాస్‌ బోస్‌ కోసం ఒక నకిలీ పాస్‌పోర్ట్‌ను తయారు చేశారు. దీనితో మహమ్మద్‌ జియావుద్దీన్‌ కాస్తా ఓర్లాండొ మజోట్టగా మారిపోయాడు. 1941 మార్చి 15వ లేదీన పచ్చజెండా వూగింది. మార్చి 19వ తేదీన సుభాస్‌ను ఆయన నివాసం నుంచి కారులో సోవియట్‌ యూనియన్‌లోకి తీసుకువెళ్ళి అక్కడ మాస్మోకు రైలు ఎక్కించారు. 1941 ఏప్రియల్‌ మొదటి వారంలో అక్కడ నుంచి విమానంలో ఆయన బెర్లిన్‌ చేరుకున్నాడు. భారత స్వాతంత్ర్య పోరాటానికి జర్మన్ల క్రియాశీల మద్దతు కోసం సుబాస్‌ చండ్ర ప్రయత్నాలు ప్రారంభించాడు. యుద్ధంలో పట్టుబడిన భారతీయ కైదీలతో భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసేందుకు కృషి చేయసాగాడు కాబూల్‌లో వున్నపుడే ఆయన “ఫార్వర్డ్‌ బ్లాక్‌-దాని న్యాయ చింతన” అన్న గుదీర్హ వ్యాసాన్ని రచించాడు భగత్‌ రామ్‌ దానిని భద్రంగా కలకత్తాకు చేర్చి శరత్‌ బోస్‌కు అందచేశాడు భారతదేశాన్ని విముక్తి చేయటంలో సుభాస్‌ చంద్ర ప్రణాళికలో జర్మన్‌ అధ్యాయం ప్రారంభమైంది.

౮

89 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

జర్మనీలో సుభాస్‌ బోస్‌

క941 ఏప్రియల్‌లో సుభాస్‌ చంద్ర బోస్‌ బెర్లిన్‌లో అడుగు పెట్టేనాటికే సోవియట్‌ యూనియన్‌పై పెద్దయెత్తున దాడి చేయాలన్న తన పధకాలను హిట్లర్‌ సిద్ధం చేసుకుని వున్నాడు. ఈ పధకానికి ఆపరేషన్‌ బార్చరోస్సా అని పేరు పెట్టినట్లు తరువాత తెలిసింది. ఈ దాడిని ప్రారంభించటానికి ముందే హిట్లర్‌ తన డిప్యూటీ అయిన రుడాల్స్‌ హెస్‌ను బ్రిటన్‌కు రహస్యంగా పంపించి బ్రిటన్‌తో (అప్పటికే (ఫ్రాన్స్‌ అతని ఉక్కుపాదం కింద నలుగుతున్నది) మరోసారి శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశాడు. కాని, యీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. (బ్రిటన్‌లో అడుగు పెట్టగానే (బ్రిటిష్‌ రక్షక దళం హెస్‌ను పట్టీవేసింది. నాజీ అనుకూల శక్తులు పూర్తిగా వేరుపడి పోయాయి, బ్రిటిష్‌ సామ్రాజ్యంపై హిట్లర్‌ బూటకపు పొగడ్తలు కురిపించాడు. తనను ప్రాణాధికంగా (ప్రేమించే వాళ్ళను వుద్దేశించి 1941లో ఆయన ప్రసంగిస్తూ “ఇంగ్లండుకు భారతదేశం ఎలానో, మనకు రష్యా భూభాగం అలాంటిది, అని ఆయన చెప్పాడు. హిట్లర్‌ దృష్టిలో భారతదేశ స్వాతంత్ర్యానికి ఏమాత్రం విలువ లేదు. నిజానికి భారతీయులు ఎవరో ఒకరి చేత పాలింప బడాలన్నదే ఆయన నమ్మకం.

సుభాస్‌ చంద్ర బోస్‌కు యిదంతా ఏమి తెలియదు. (బిటన్‌కు శత్రువుగా వున్న జర్మనీ, భారత స్వాతంత్ర్య పోరాటం ముందుకు వెళ్ళటానికి తోడ్పాటును అందచేయ గలదన్న భ్రమల్లోనే యిప్పటికీ ఆయన వున్నాడు. భారత జాతీయోద్యమానిక! అక్ష రాజ్యాలు ఎందుకు మద్దతు యివ్వాల్సి వుందో వివరిస్తూ జర్మన్‌ ప్రభుత్వానిః అందచేయటం కోసం సుదీర్థమైన విజ్ఞాపన పత్రాన్ని తయారు చేశాడు. 1964ల పునర్ముద్రించిన బోస్‌ రచన ఇండియన్‌ ప్రగుల్‌ అన్న గ్రంథంలో యీ పత్రాన్ని జతచేశారు. “బ్రిటిష్‌ సామ్రాజ్యం కేవలం భారతదేశ స్వాతంత్ర్య మార్గ్దంలోనేకాక మానవ జాతి పురోగతి మార్గంలో కూడా పెద్ద అడ్డంకిగా తయారైంది. ప్రస్తు! సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 101

యుద్ధంలో భారత ప్రజల వైఖరి బ్రిటిష్‌ వారిపట్ల తీవ్రమైన వ్యతిరేకతతో కూడి వున్నందున, గ్రేట్‌ బ్రిటన్‌ను కుప్పకూల్చటంలో వారు భౌతిక సహాయాన్ని అందించే అవకాశం వున్నది అక్ష రాజ్యాల గెలుపుకు అర్ధం భారతదేశ స్వాతంత్ర్యమేనని భారత ప్రజలకు హామీ యివ్వగలిగితే భారతదేశ సహకారం లభించగలదు. సుభాస్‌ మరో అడుగు ముందుకు వేసి యింకొక సలహా కూడా యిచ్చాడు జర్మన్ల అధీనంలో వున్న భారతీయులైన యుద్ధ ఖైదీల నుండి 50,000 మంది భారతీయ సైనికులను తయారు చేయగలిగితే, ఆ “జాతీయ సైన్యం జర్మన్ల సహాయంతో బలహీనంగా వున్న బ్రిటిష్‌ దళాలను భారతదేశం నుంచి తరిమి కొట్టి దేశాన్ని విముక్తం చేస్తాయి. అయితే, “స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని జర్మనీ తప్పనిసరిగా గుర్తించి తీరాలని, అక్ష రాజ్యాలు విజయాన్ని సాధించినట్లయికే భారత స్వాతంత్ర్యాన్ని గౌరవించగలమన్న వాగ్దానం చేయాలని ఆయన గట్టిగా నొక్కి చెప్పాడు. వాం నా నాజీ జర్మనీ విదేశాంగ మంత్రి న్‌ కటు స. స రబ్బన్‌ట్రాప్‌, సహాయానికి సంబంధించి వ లేల స సుభాస్‌ చంద్ర బోస్‌కు వాగ్దానం చేశాడు. కాని, వ టీ. . ప్రభుత్వ గుర్తింపుకు సంబంధించి, భారతదేశ ఇ ౫... స్వాతంత్ర్యం గురించి ఆయన ఎలాంటి హామీ

  1. ప (యివ్వలేదు సుభాస్‌ నిరాశకు గురయ్యాడు. ఈ సమయంలోనే ఎమిలి షింక్‌ వియన్నా స మి శ. నుంచి బెర్లిన్‌కు చేరుకుని యుద్ధ కాలమంతటా . సతో సుభాస్‌ చంద్ర బోస్‌తోనే ఐరోపాలో గడిపింది న | సుభాస్‌, ఎమిలీలు సుమారుగా 19841 న. కై మధ్యలో వివాహం చేసుకున్నారు, 1942 సుభాస్‌ చంద్ర బోస్‌ భార్య ఎమిలీ | నవంబరు 29వ తేదీన వారి కుమార్తె అనితా బోస్‌ జన్మించిన సంగతి మనకు బాగా తెలుసు. 1941 మే నెలలో ఎమిలి తోడురాగా సుభాస్‌ చంద్ర రోమ్‌కు చేరుకున్నాడు. భారత స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించి నాజీ జర్మనీ నుంచి ఆశించి భంగపడిన సహాయాన్ని ముసోలినీ చేయగలడని ఆయన భావించాడు జూన్‌ 6వ తేదీన ముసోలిని విదేశాంగ మంత్రి కౌంట్‌ సియానోను కలుసుకున్నాడు. ఆయన ప్రయత్నం సఫలం కాలేదు వాస్తవానికి సుభాస్‌ గురించి సియానోకు మొరటైన అంచనాయే వున్నది. 1941 జూన్‌ 6వ తేదీన సియానో తన ,(పైవేటు డైరీలో యిలా రాసుకున్నాడు. “భారతదేశ ప్రవాస ప్రభుత్వ అధినేతయైన బోసును నేను కలుసుకున్నాను భారత 101... గౌరమ్‌ ఛటోపాధ్యాయ

స్వాతంత్ర్య విషయమై అక్ష రాజ్యాలు ఒక ప్రకటన చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. బెర్లిన్‌లో ఆయన ప్రతిపాదనలపై ఎలాంటి స్పందన లేదు. మేము కూడా రాజీపడలేదు, ప్రత్యేకించి దీనికి కారణమేమంటే యీ నడమంత్రపు అధికారపు విలువ యింకా స్పష్టం కాలేదు.

భారత స్వాతంత్ర్య పోరాటానికి అటు అక్ష రాజ్యాలు, యిటు సోవియట్‌ యూనియన్‌ శక్తివంతమైన మిక్రులని సుభాస్‌ చంద్ర భావించిన విషయం మనకు తెలుసు. నిజానికి 1941 ఏప్రీయల్‌లో బెర్లిన్‌ చేరినపుడు, సోవియట్‌ యూనియన్‌తో నిర్యుద్ధ సంధి పత్రంపై సంతకం చేసినందుకుగాను జర్మన్‌ ప్రభుత్వాన్ని ఆయన అభినందించాడు. అయితే, 1941 జూన్‌ 22వ తేదీన సోవియట్‌ యూనియన్‌పై జర్మనీ దాడి చేయటంతో సుభాస్‌ ఆశ్చర్యానికి, తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. జర్మనీతో తనకు సంబంధాన్ని కల్పించిన వారిలో ఒకరికి 1941 జూలై 5వ తేదీన రాసిన లేఖలో యీ విధంగా పేర్కొన్నాడు. “ప్రాచ్యాన నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపట్ల నా దేశంలో ప్రజల స్పందన మీ ప్రభుత్వం పట్ల ప్రతికూలంగా వున్నది”, అని పేర్కొన్నాడు.

జర్మన్‌ విదేశాంగ అధికారులతో బోసు సంభాషణలు నిష్కర్షగా సాగాయి. రహస్య పత్రాలలోని సమాచారం ్రకారం మనకీ విషయాలు తెలుస్తున్నాయి. “జర్మన్‌-రష్యాల మధ్య యుద్ధం భారతీయుల భావనల్లో కలిగించే ప్రతికూల ధోరణుల గురించి ముందుగా సుభాస్‌ సవివరంగా చర్చించాడు...... భారతదేశ (ప్రజల మనోభావాలు రష్యావైపునే కచ్చితంగా వున్నాయి. ఎందుకంటే జర్మనీ దురాక్రమణదారు అని, ఆరకంగా అది సామ్రాజ్యవాద శక్తిగా కూడా వున్నదని, భారతదేశానికిది ప్రమాదమని భారతీయులు దృఢంగా విశ్వసిస్తున్నారు..... ఘర్షణ మూలానికి సంబంధించిన సమస్యతో సహా సోవియట్‌ సిద్ధాంతంపట్ల బోసు ఆకర్షితుడైనట్లు...... ఆయన ప్రకటనలు తెలియ చేస్తున్నాయి..... సాధ్యమైనంత త్వరలో యీ ప్రకటనను (స్వతంత్ర భారతదేశానికి అనుకూలంగా) విదేశాంగ మంత్రి విడుదల చేయాలని ఆయన కోరాడు”.

ఏదియేమైనప్పటికీ, 1941 నవంబరు 2వ తేదీన బెర్లిన్‌లో స్వతంత్ర భారత కేంద్రం ఏర్పాటైంది. 1942 ప్రారంభం నుంచి సుభాస్‌ బోస్‌ ప్రధాన సంపాదకునిగా, ప్రమోద్‌ రంజన్‌ గుప్తా సహాయకునిగా జర్మన్‌, అంగ్ల భొషల రెండింటా అజాద్‌ పొంద్‌ మాస పత్రిక (ప్రారంభమైంది. బెర్లిన్‌ నుంచి అజాద్‌ హింద్‌ రేడియో ప్రసారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంగ్లీషు, హిందూసానీ, బెంగాలీ, చివరకు పస్తు సుభాస్‌ చంద్ర బోన్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 102

భాషతోసహా పలు భారతీయ భాషల్లో యీ ప్రసారాలు వెలువడ సొగాయి. ఈ విషయాలన్నింటినీ, యీ కాలంలో సుభాస్‌కు అత్యంత సన్నిహితులుగా వున్నవారిలో ఒకరైన ఎం.ఆర్‌. వ్యాస్‌ తాను రచించిన పానేజ్‌ త్రూ ఎ టర్భులెంట్‌ ఎరా అన్న (గ్రంథంలో సవివరంగా పేర్మొన్నాడు.

దాదాపుగా యిదే సమయంలో, సుభాస్‌ చంద్ర బోస్‌ శత్రువుతో చేతులు కలిపాదడంటూ భారత ప్రభుత్వం 1941 నవంబరు 10వ తేదీన కేంద్ర శాసన సభలో ఒక ప్రకటన చేసింది. భారతదేశంలో బ్రిటిష్‌ బాకా అయిన ది స్టేట్స్‌ మన్‌ ఒక వ్యాసంలో యిలా పేర్కొన్నది “బోస్‌ అభిప్రాయాలు నాజీలకు వున్నటువంటివే, యీ విషయాన్ని ఆయన ఎన్నడూ దాచలేదు.... కనుకనే సుభాస్‌ బోస్‌ నాజీలతో వున్నాడు --జనవరికి ముందే సుభాస్‌ ఎక్కడ వున్నదీ తనకు తెలుసునని జర్మన్‌ రేడియో చెప్పగలిగింది-- ఆయన దేనికి చెందుతాడో అక్కడనే వున్నాడు.

జర్మనీలో బోస్‌ తయారు చేసిన భారత సైన్యం గురించి చాలా చెప్పటం జరిగింది. భారత జాతీయ సైన్యం కోసం సైనికులను చేర్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. సుభాస్‌ చంద్ర బోస్‌కు విధేయుడైన మద్దతుదారుడు అబిద్‌ హసన్‌ చెప్పినదాని ప్రకారం భారత జాతీయ సైన్యంలో 17,000 మంది భారతీయ ఖైదీలు చేరగా, కేవలం 2,500 మంది మాత్రమే స్వచ్చందంగా చేరిన వారున్నారు. హసన్‌ తన స్మృతులలో యిలా పేర్కొన్నారు. భారతీయ ఖైదీలలో అత్యధికులు “బ్రిటిష్‌ వారికే విధేయంగా వున్నారు, వారు యీ సైన్యంలో చేరరు..... భగవద్గీత, కురాన్‌, గురుగ్రంథ్‌లపై తాము చేసిన ప్రమాణాన్ని భగ్నం చేయటానికి కొందరు యిష్టపడటం లేదు.... ఇలాంటి వారిలో అత్యధికులు తమ కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు..... మరి కొంతమందేమో తాము జర్మన్‌లకు వ్యతిరేకమని వారిపై పోరాడుతామని చెప్తున్నారు. -శత్రువుతో చేతులు కలపటం సైనిక వృత్తికే విరుద్ధమని యింకొందరు భావిస్తున్నారు. కారణాలేవైనప్పటికీ భారతీయ ఖైదీలలో అత్యధికులు భారత సైనిక దళంలో చేరటానికి తిరస్మరించారు. హసన్‌ తదితరులను జర్మన్‌ కీలుబొమ్మలని నిందించారు

సుభాస్‌ బోస్‌ నిర్మించ తలపెట్టిన భారత సైన్యంలో భారతీయ ఖైదీలు చేరక పోవటానికి మరో కారణాన్ని యీ రచయిత ఊహిస్తున్నాడు. నాజీలు వారిపై పెట్టిన నియమ నిబంధనలే ఆ కారణం. భారతీయ ఖైదీలు జర్మన్‌ ప్రమాణాల మేరకు శిక్షణ పొందేటట్లయితే వారు జర్మన్‌ సైన్యంలో భాగం అవుతారు. అప్పుడు వారు జర్మన్‌ యూనిఫారమ్‌ను, స్వస్థిక్‌, (గద్ద గుర్తులను ధరించవలసి వుంటుంది. ఆ తరువాత 103 ాాాాోాోా గాతమ్‌ ఛటోపాధ్యాయ

కాలక్రమంలో అజాద్‌ హింద్‌ ఫొజ్‌లో భాగం అవుతారు. ప్రచురణకు నోచుకోక రాతప్రతిగానే మిగిలి పోయిన హుగ్‌ టోయ్‌ రచన నుభాన్‌ పాషాలో సైనికులు తీసుకోవలసిన ప్రతిజ్ఞను పొందు పరచాడు. దీనినే లియోనార్డ్‌ గోర్టన్‌ పునరుద్ధరించాడు. అది యిలా సాగుతుంది “దేవునిపై ప్రమాణం చేసి పవిత్రమైన యీ (ఫటిజ్జ తీసుకుంటున్నాను, జర్మన్‌ రాజ్యానికి, ప్రజలకు నాయకునిగానూ, జర్మన్‌ సాయుధ దళాల కమాండర్‌గానూ వున్న అడాల్ఫ్‌ హిట్లర్‌కు, భారత స్వాతంత్ర్యం కోసం సాగే పోరాటానికి, యీ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సుభాస్‌ చంద్ర బోస్‌కు విధేయంగా వుంటాను, సాహసియైన సైనికునిగా యీ ప్రతిజ్ఞ కోసం నా ప్రాణాలనే ఫణంగా పెద్దాను”.

ఈ తరుణంలోనే సుభాస్‌ చంద్రునికి నేతాజీ అన్న బిరుదు లభించింది. తమ నాయకుని ఏమని పిలవాలన్న సమస్యను తాము ఎదుర్మొన్నట్లుగా వ్యాస్‌ రాశాడు. భారత సైనిక దళంలో చేరిన భారతీయ సైనికుడొకరు యీ సమస్యను పరిష్కరించారు. వామారే నేత అంటూ అతను ముందుకు వచ్చాడు. దీనినే మేము నేతాజీ అని మెరుగు పరచానుని వ్యాస్‌ రాశాడు. అయితే, 'సుభాస్‌ బోస్‌ దీనిని దృఢంగా వ్యతిరేకించాదని, కాని, సైనిక బృందాలు ఆయనను నేతాజీ అని పట్టుదలగా పిలుస్తుండటంతో చివరకు అంగీకరించినట్లు, వ్యాస్‌ రాతల ద్వారా తెలుస్తున్నది

1942 ఫిబ్రవరి 15వ తేదీన సింగపూర్‌ను జపాన్‌ స్వాధీనం చేసుకున్నది. ఆ రోజున సుభాస్‌ అజ్ఞ్జాతాన్ని విడచి పెట్టాడు. తన పేరుతో రేడియోలో (ప్రసంగించాడు. “సింగపూర్‌ పతనం అంటే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం కుప్పకూలటమనే అర్ధం...... భారతదేశ చరిత్రలో నూతన శకం ్రారంభమైనట్లు...... యీనాడు (బ్రిటిష్‌ సొమ్రాజ్యవాద శత్రువులు మన సహజ మిత్రులు...... సంపూర్ణ స్వాతంత్రం కోసం మనం సాగించే పోరాట క్రమంలో, ఎవరైతే ఉమ్మడి శత్రువును కూలదోయటానికి సహాయ పడతారో వారందరికీ మనం హృదయపూర్వకమైన తోడ్పాటునందించాలి...... భారతదేశానికి విమోచన ముంగిటిలోకి వచ్చింది”.

సింగపూర్‌ పతనం తరువాత దాదాపు లక్షమంది భారతీయ సైనికులన జపాన్‌ ఖైదీలుగా పట్టుకున్నది ఈ సమయంలో జపాన్‌ ఉన్నతాధికారులతో సుభా! చంద్ర బోస్‌ సంప్రదింపులు జరిపి వారిద్వారా యుద్ధంలో ఖైదీలుగా చిక్కిన కొంతమం! భారతీయులను వలంటీర్లుగా చేర్చుకున్నాడు. ఈ సమయంలోనే భారతీయులక సహాయపడేందుకై మేజర్‌ ఇవైచి ఫుజివర అనే యువ అధికారిని జపాన్‌ ఎంపి!

చేసింది. 1941 డిసెంబరుకు ముందే యుద్ధ ఖైదీగా వున్న తన సన్నిహి, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 10

సహచరుడొకరు ఫుజివరాకు లభించాదు. భారత జాతీయ సైన్యాన్ని తయారు చేయటానికి కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ సంసిద్దతను వ్యక్తం చేశాడు. 1942 ఫిబ్రవరి 17వ తేదీన దాదాపు 45,000 మంది భారతీయ క్లదీలను సింగపూర్‌ రేస్‌కోర్సు మైదానంలోకి తీసుకు వచ్చారు. వారిని ఉద్దేశించి ఫపుజివర, మోహన్‌ సింగ్‌లు ఉ పన్యసించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయ పడాలని జపాన్‌ చిత్తశుద్ధితో భావిస్తున్నట్లు యీ యిరువురూ హామీ యిచ్చారు. చాలా సంవత్సరాల తరువాత మోహన్‌ సింగ్‌ యిలా రాశారు. “మీలో ఎవరైనా యీ సైనిక దళంలో వలంటీర్లుగా చేరి మీ దేశం కోసం పోరాదేవాళ్ళు ఉన్నట్లయితే చేతులెత్త వలసిందిగా సైనికులను నేను కోరాను...... వేల సంఖ్యలో సైనికులు చేతులను పైకెత్తడమేకాక, తలపాగాలను, టోపీలను గాలిలో ఊపసాగారు..... “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ....... సైనికులు ఎగిరెగిరి దూకారు”. ఫుజివర కూడా సుభాస్‌ చంద్ర బోస్‌, మోహన్‌ సింగ్‌లను మెచ్చుకుంటూ, బోస్‌లాంటి విప్లవకారులు ఆసియాకు వచ్చి ఉ ద్యమానికి నాయకత్వం వహించేటట్లయితే, ఆసియాలో నివసించే అనేకమంది భారతీయులు విప్లవంలో చేరగలరని అభిప్రాయపడ్డాడు.

ఈ కాలంలోనే తూర్పు, ఆగ్నేయాసియాలలో నివసించే భారతీయులకు సంబంధించి అనేక సంఘాలు వున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌కు తప్పించుకు వచ్చిన భారతీయ విప్లవకారుడు రాస్‌బిహారి బోస్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ను స్థాపించాడు. 1942 జూన్‌లో బాంకాక్‌లో భారతీయుల కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు తూర్పు, ఆన్నేయాసియాలకు చెందిన వివిధ భారతీయ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సమయంలో యివన్నీ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌లో విలీనమయ్యాయి. రాస్‌ బిహారీ బోస్‌ లాంఛనంగా నాయకుడయ్యాడు. కాని, ఎక్కువమంది భారతీయులకు ఆయనపట్ల అంతగా విశ్వాసం లేదు. ఆయనను జపాన్‌ కీలుబొమ్మగానే అనుమానించారు. ఈ సదస్సులో అనేక తీర్మానాలు ఆమోదాన్ని పొందాయి వీటిల్లో ఒకటి భారత జాతీయ సైన్యానికి మిత్రరాజ్య సైనిక హోదాను యివ్వాలని కోరింది. అలానే, తూర్పు ఆసియాకు వచ్చి ఉద్యమ నాయకత్వాన్ని స్వీకరించ వలసిందిగా సుభాస్‌ చంద్ర బోస్‌ను మరో తీర్మానంలో కోరటం జరిగింది. సదస్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెల్బటం ద్వారా సుభాస్‌ వెనువెంటనే స్పందించాడు.

1942 సెప్టెంబరు 1వ తేదీన భారత జాతీయ సైన్యంకు చెందిన మొట్టమొదటి డివిజన్‌ 16,300 మందితో ఉనికిలోకి వచ్చింది. దీని గురించి జాయిసి 105 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

లెబ్రాతోపాటు, భారతీయ పరిశోధకుడైన కె.కె. ఘోష్‌ సవివరంగా పేర్కొన్నారు. ఇకయిప్పుడు ఆగ్నేయాసియా చేరటానికి సుభాస్‌కు తేలికైంది. ఆయన జపాన్‌ వచ్చేటందుకు జర్మనీ, జపాన్‌ రెండూ ఆమోదించాయి. అబిద్‌ హసన్‌ ఒక్కడే తోడుగా జర్మన్‌ జలాంతర్జామిలో సుభాస్‌ ప్రయాణించాలని, దక్షిణాఫ్రికాలోని గుడ్‌ హోప్‌ అగ్రంవద్ద జపాన్‌ జలాంతర్జామిలోకి మారాలని నిర్ణయం జరిగింది. 1943 ఫిబ్రవరి 8వ తేదీన సుభాస్‌ చంద్ర, హసన్‌లు కీల్‌వద్ద యు-180 జలాంతర్జామిలోకి ప్రవేశించారు. ఏప్రియల్‌ 24వ తేదీన హిందూ మహా సముద్రంలో జపాన్‌ జలాంతర్జామి 1-29కి చెందిన కమాండర్‌, సిబ్బందీ జర్మన్‌ జలాంతర్జామిని గుర్తించారు. ఒక రబ్బరు దోనె ద్వారా సుభాస్‌, హసన్‌లు జర్మన్‌ జలాంతర్జామిని విడచిపెట్టి జపాన్‌ జలాంతర్జామిని చేరుకున్నారు. సముద్రమంతా అల్లకల్లోలంగా వుంది. వారు జపాన్‌ జలాంతర్జామిలోకి వెళ్ళేసరికి పూర్తిగా తడిసి పోయారు. జపాన్‌ సామ్రాజ్యవాద నౌకాదళం అతిథులుగా వారు తూర్పు ఆసియావైపు (ప్రయాణాన్ని ప్రారంభించారు. లక సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 106

ఐఎన్‌ఏ-తాత్కాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వం

19439 జూన్‌ 10వ తేదీన జపాన్‌ ప్రధాన మంత్రి టోజోతో సుభాస్‌ చంద్ర బోస్‌ మొదటిసారిగా సమావేశమయ్యాడు. వీరిద్దరి మధ్య సుదీర్హ చర్చలే జరిగాయి. హిట్లర్‌, ముసోలినీలకన్నా టోజో విభిన్నుడని తొలి సమావేశంలోనే సుభాస్‌ ఒక నిర్ధారణకు వచ్చాడు. జూన్‌ 16వ తేదీన జపాన్‌ డైట్‌ (పార్లమెంటు) సమావేశాలు జరిగాయి. వీటికి గౌరవ అతిధిగా సుభాస్‌ హాజరయ్యాడు. ఆ రోజున టోజ్లో పార్లమెంటులో యిలా ప్రకటించాడు: “భారత స్వాతంత్రానికి మనం సాధ్యమైన ప్రతిఒక్క సహాయాన్ని చేయాలని మనం నిశ్చయించుకున్నాము”.

ఇది జరిగిన తరువాత సుభాస్‌ పత్రికా గోష్టిలో పాల్గొని ఒక ప్రకటన చేశాడు. “అక్ష రాజ్యాలు విజయం సాధించినట్లయితే భారతదేశం తాను కోల్పోయిన స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందుతుంది. మా రక్తాన్ని ఛారపోయటం ద్వారా మాశ్రమే మేము స్వాతంత్ర్యాన్ని పొందగలము. శత్రువు కత్తిపట్టి పోరాడుతున్నందున మనం కూడా కత్తిపట్టి పోరాడవలసిందే. అసంఖ్యాక భారతీయులు యీ కత్తుల బాటలో నడచినపుడే పోటీలో విజయులై స్వాతంత్ర్యాన్ని కానుకగా పొందగలరు”.

జపాన్‌ నుంచి సుభాస్‌ చంద్ర సింగపూర్‌ వెళ్ళాడు. అక్కడొక సత్కార సభ జరిగింది. ఆ సభలో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న యువజనాన్ని వుద్దేశించి భారత విష్లవకారుడు రాస్‌ బిహారి బోస్‌ మాట్లాడుతూ, సుభాస్‌ చంద్ర బోస్‌ను కానుకగా యిస్తున్నాని చెప్పాడు. “మీకు యీ బహుమానాన్ని యిస్తున్నాను. భారత యువజనుల్లోని ఉత్తమత్వానికి, బెదార్యానికి, అమిత సాహసానికి, మహోన్నత క్రియాశీలత్వానికి సుభాస్‌ చంద్ర బోస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్షణం నుంచి సుభాస్‌ చంద్ర బోస్‌ మీ అధ్యక్షుడు, స్వాతంత్ర్య కోసం భారతదేశం సాగించే పోరాటంలో మీ నాయకుడు, 107 రారా డా గొతమ్‌ ఛటోపాధ్యాయ

య గ ఉస ఇ మ... ళ్శ సవన & . వ్‌ ఇకార) |

యి టాం సాల లాం ఆ? అని రాస్‌ బిహారీ బోస్‌ ప్రకటించాడు. ఇదే సభలో సుభాస్‌ కూడా ప్రసంగిస్తూ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వర్పాటు చేయాలన్న తన ఉ దేశాన్ని ప్రకటించాడు. “భారత విప్లవాన్ని సమర్ధవంతంగా నడపటానికై మన శక్తులన్నిటినీ సమీకరించటానికీ, సాయుధ పోరాటానికి భారతదేశం లోపలా, వెలుపలా వున్న భారతీయులను సన్నద్ధం చేయటానికీ”, తాత్కాలిక ప్రభుత్వం అవసరమవుతుంది. ఆయన యింకాయిలా చెప్పాడు. భారత స్వాతంత్ర్య సముపార్టనకు ఐఎన్‌ఏకు చెందిన సైనికులకు బహుశ ఆకలి, దప్పిక, లేమి, శ్రమ భరితమైన ప్రయాణాలు, మరణం ఎదురు కావచ్చు. ఈ సభలోనే ఛలో ఢిల్లీ అన్న ప్రసిద్ధ నినాదాన్ని సుభాస్‌ చంద్ర

భారత జాతీయ సైన్యంలో స్త్రీలను చేర్చుకునేందుకు తొలినుంచీ సుభాస్‌ చంద్ర బోస్‌ అధిక ప్రాధాన్యత యిచ్చాడు. అదృష్టవశాత్తు ఆయన దళంలో డాక్టరైన ముప్పైయేళ్ళ తమిళ యువతి లక్ష్మీ స్వామినాథన్‌ (ఇప్పుడు లక్ష్మీ సెహెగల్స్‌ చేరారు. కెప్టెన్‌ లక్ష్మిగా సుప్రసిద్ధమైన ఆమె చాలా కాలం తరువాత సుభాస్‌ చంద్ర గురించి యిలా గుర్తు చేసుకున్నది. “పరిపూర్ణమైన చిత్తశుద్ధి నన్ను ఆకట్టుకున్నది. ఎవరైనా ఆయనను సంపూర్ణంగా విశ్వసించ వచ్చునని, ఆయనపట్ల ప్రగాఢమైన నమ్మకం వుంచవచ్చుననే నేను భావించాను”. సింగపూర్‌ ప్రధాన కార్యాలయంగా తాత్కాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వం

ఏర్పడినట్లు 1943 అక్టోబరు 21వ తేదీన లాంఛనంగా ప్రకటన వెలువడింది. ఈ ప్రభుత్వానికి సుభాస్‌ చంద్ర బోస్‌ ప్రధాన మంత్రి, యుద్ధ, విదేశాంగ శాఖల బాధ్యతలు కూడా ఆయనవే. మరో నలుగురు, కెప్టెన్‌ లక్ష్మీ స్వామినాథన్‌, ఎస్‌.ఏ. అయ్యర్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 108

(ప్రసార (ప్రచార బాధ్యతలు) లెప్టినెంట్‌ కల్నల్‌ ఏ.సి. ఛటర్జీ (ఆర్థికం), ఏ.ఎం. సహాయలు సహ మంత్రులుగా వున్నారు. అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అక్టోబరు 28వ తేదీన జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ మరికొన్ని దేశాలు యిదే బాటలో నడిచాయి. ఐరిష్‌ నాయకుడు డి వలెరా సుభాస్‌ బోస్‌కు శు భాకాంక్షలు తెలియ చేశాడు. అక్టోబరు 24వ తేదీన సింగపూర్‌లో దాదాపు 50,000 మంది భారతీయులు పాల్గొన్న సభలో సుభాస్‌ ప్రసంగిస్తూ భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించే వరకు యీ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నేతాజీకీ జై. ఛలో ఢిల్లీ అంటూ మిన్ను ముట్టేలా నినదించటం ద్వారా సభలో పాల్గొన్న వారంతా తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

19438 డిసెంబరులో బర్మా నుంచి భారతదేశంపై జపొన్‌ తన దాడిని ప్రారంభించింది. ఈ సందర్భంగా జపాన్‌, ఐఎన్‌ఏల సంబంధాల గురించి కొన్ని మాటలు చెప్పవలసిన అవసరం వున్నది. జపాన్‌ అధికారులలో అత్యధికులకు భారత స్వాతంత్ర్యం అనేది అసంగతమైన విషయం, గోర్డన్‌ చెప్పినట్లు, వారి అభిప్రాయంలో భారతదేశాన్ని జయించటమనేది సామ్రాజ్యవాద జపాన్‌ కీర్తిని మరింతగా యినుమడింప చేస్తుంది. ఐఎన్‌ఏ అధికారుల్లో అత్యధికులకు జపాన్‌పట్ల నమ్మకం లేదు. మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ తన జ్ఞాపకాలలో యీ విధంగా పేర్కొన్నాడు. “జపనీయులు ఐఎన్‌ఏను విశ్వసించ లేదు. తమ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఎన్‌ఏ అంగీకరించబోదని, ఒకవేళ బ్రిటిష్‌ వారి స్థానంలోకి తాము రావాలని ప్రయత్నిస్తే వారు జపాన్‌తో పోరాటానికి దిగుతారని మధ్యవర్తులైన తమ అధికారుల ద్వారా జపాన్‌ గ్రహించింది”. నిజానికి ఐఎన్‌ఏ ఏనాడూ బ్రిటిష్‌ సైన్యంతో పోరాడలేదంటూ లండన్‌కు చెందిన సుప్రసిద్ధ రచయిత నిరోద్‌ ఛౌదరి యిటీవల తాను రచించిన 70 ౭24 ౮౪౭4 4౫౭27౧౮4 అన్న గ్రంథంలో పేర్మానడం విడ్డూరంగా వున్నది. ఇలా చెప్పటాన్ని అనేకమంది రచయితలు తోసిపుచ్చారు. ఐఎన్‌ఏ గురించి భారత ప్రభుత్వ గూఢచారి విభాగం తయారు చేసిన సుదీర్హమూ, సవివరమూ అయిన నివేదిక నుండి కొంత భాగాన్ని వుటంకిస్తాను. “1945లో బర్మాలో ముందు వరుసలో వున్న ఐఎన్‌ఏ దళాల నాయకులు బ్రిటిష్‌వారి ట్యాంకులను, తుపాకులను, యుద్ధ విమానాలను కేవలం తుపాకులతోనూ, ఎడ్ల బళ్ళతోనూ, ఖాళీ కడుపులతోనూ ఎదుర్శొన్న సాహసాన్ని తక్కువగా అంచనా వేయరాదు”.

జపాన్‌ సైన్యమూ, ఐఎన్‌ఏలు మణిపూర్‌లో ్రవేశించి కోహిమా, ఇంపాల్‌ నగరాలను ముట్టడించిన సంగతి తెలిసిందే. సుభాస్‌ చంద్ర, ఐఎన్‌ఏలు కోహిమా 109 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

యం సమీపంలో భారత జాతీయ పతాకాన్ని ఎగుర | క్‌? + న. . వేశారు, కాని, దానిని పట్టుకోలేక పోయారు. " వ స. ష్‌ న్‌ య . । చిట్టచివరకు, జపాన్‌ సైన్యంతో కలసి ఐఎన్‌ఏ వ వ. స్‌ తిరోగమన బాట పట్టింది. తొలుత యిందుకు ణ్‌ న్‌. య... న. సుభాస్‌ వ్యతిరేకించినా చివరకు అంగీకరించ య య. పొందాలసి ఐఎన్‌ఏకు సుభాస్‌ బోధించాడు. క. నం మ్‌ శ ను అక్ష రాజ్యాలు దెబ్బతింటాయి, అయినప్పటికీ, క... | ఐఎన్‌ఏ మాత్రం తన వెనుక సాహసాన్ని పున న పక్‌ మొనగాడితనాన్ని తస గుర్తుగా విడచిపెట్టాలి, ను. తత్ప్సలితంగా భారతీయులకు అది గర్వకారణంగా వుంటుంది, భారతదేశాన్ని విముక్తి చేయగల తదుపరి చర్యకు వారిని పురికొల్పుతుంది. ఐఎన్‌ఏ అధికారుల, సైనికుల వీర గాథలను సవివరంగా పేర్క్మానటానికి యీ పుస్తకానికున్న పరిమితులు అనుమతించవు. అయితే, యీ తరానికి చెందిన యువజనులకు వారి సాహస చరిత్ర రేఖామాత్రంగానైనా తెలియటం కోసం కాన్ని సంఘటనలను ఉదహరిస్తాను. జపాన్‌, ఐఎన్‌ఏల ఓటమి ఖాయమని 1945 మే నెలలోనే అర్ధమైంది. తుదిశ్వాస వరకు పోరాడవలసిందిగా సుభాస్‌ పిలుపు యిచ్చాడు. పలు ఐఎన్‌ఏ దళాలు ధైర్యంతో పోరాడాయి. 1945 మే 7వ తేదీన మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ తన డైరీలో యిలా పేర్మొన్నాడు. మేజర్‌ బగ్రి దాదాపు వందమంది ఐఎన్‌ఏ సైనికులను వెంటబెట్టుకుని చేతి బాంబులు, పెట్రోలు సీసాలే ఆయుధాలుగా బ్రిటిష్‌ యుద్ధ ట్యాంకులపై దాడిచేసి వాటిని నాశనం చేశాడు. కెప్టెన్‌ జ్ఞాన్‌ సింగ్‌ నాయకత్వంలో 98 మందితో కూడిన ఐఎన్‌ఏ బృందం కేవలం తుపాకులు, రెండు మందు పాతరలను మాత్రమే తీసుకుని 18 ట్యాంకులు, 11 సాయుధ శకటాలు కలిగిన బ్రిటిష్‌ పదాతి దళాన్ని ఎదుర్కొన్నారు. ఈ చర్యలో ఐఎన్‌ఏ సైనికులందరూ విగత జీవులయ్యారు. ఈ తరుణంలోనే జనరల్‌ అంగ్‌ సాన్‌ నేతృత్వం వహిస్తున్న బర్మీస్‌ జాతీయ సైన్యంలో జపాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. సుభాస్‌ చంద్ర బోస్‌కు సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 1౩10

మిత్రుడైన అంగ్‌ సాన్‌ ఆయనకొక విజ్ఞప్తి చేస్తూ, ఐఎన్‌ఏ కూడా జపాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, బ్రిటిష్‌ సైన్య కమాండర్‌గా వున్న జనరల్‌ స్లిమ్‌తో ఒప్పందం కుదుర్చు కోవలసిందిగా కోరాడు. సుభాస్‌ దీనికి తిరస్కరించాడు. అయితే, అంగ్‌ సాన్‌కు ఆయన దళాలకు వ్యతిరేకంగా ఐఎన్‌ఏను ఉపయోగించు కోవటానికి జపాన్‌ను అనుమతించబోమని చెప్పారు.

1945 మే నెలలో నాజీ జర్మనీ బేషరతుగా మిత్ర కూటమికి లొంగిపోయింది. జపాన్‌కు ఓటమి తప్పదని తేలి పోయింది. సరిగ్గా యా సమయంలోనే, అంటే, 1945 మే 25వ తేదీన సింగపూర్‌ నుంచి, సుభాస్‌ రేడియోలో ప్రసంగిస్తూ యిలా ప్రకటించాడు. “జర్మనీ పరాజయం సోవియట్‌కూ, ఆంగ్లో-అమెరికన్‌లకూ మధ్య తీక్షణమైన ఘర్షణకు సంకేతం కాగలదు. సోవియట్‌ రష్యా యుద్ధ లక్ష్యాలు ఆంగో-అమెరికన్ల్నకు విభిన్నమైనవన్న విషయం యావత్ష్రపంచానికీ తెలుసు...... జర్మనీ ఓడిపోయిందంటే అందుకు ప్రధాన కారణం సోవియట్‌ యూనియన్‌ ప్రజల, సాయుధ దళాల సడలని పట్టుదల, పోరాట పటిమ, త్యాగాలేనని చెప్పాలి..... కనుక, రానున్న రోజుల్లో సోవియట్‌ చర్యలను ప్రపంచమంతా నిశ్చల దృష్టితోనూ, ఉ త్సుకతతోనూ గమనిస్తుంది”.

జపాన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినట్లు 1945 ఆగస్టు 10వ తేదీన సుభాస్‌ చం(ద్రకు తెలినింది. జపాన్‌ లొంగి పోవటానికి సిద్ధంగా వున్నట్లు కూదా . ఆయనకు అర్ధమైంది. ఆగస్టు 16వ తేదీన | త్త ఆయన బాంకాక్‌కు, అక్కడ నుంచి ఈ ల క న్‌ ॥ కైవాన్‌లోని త్రెపేకు చేరుకున్నాడు. ఆగస్టు న్‌ మ మట 17వ తేదీన, ముందుకు చొచ్చుకు వస్తున్న మూ న్‌ు లీ ర... న. సోవియట్‌ సైన్యంతో నంబందం |! మై ఎ పెట్టుకునేందుకుగాను హబిబుర్‌ రహ్మాన్‌ |. సం. తోడురాగా సుభాస్‌ జపొన్‌ విమానంలో న! (త మంచూరియాలోని డైరెనకు బయలు లాం న సం... దేరాడు. సోవియట్‌ యూనియన్‌కు |క్షైహ్షైక (జ ర. వెళ్ళాలని సుభాస్‌ కోరుకున్నట్లు మనం మ గ కచ్చితంగా ఎలా చెవృగలం? ఈ | టా 45 అగ్యు??. న్‌ క్షేషే1ే గౌతమ్‌ ఛటోపాధ్యాయ

పరిశీలనలోకి తీసుకోవలసిన కొన్ని ఆధారాలు వున్నాయి. 1945 ఆగస్టు 16వ తేదీన జపాన్‌ అధిష్టానానికి సుభాస్‌ చంద్ర ఒక సందేశాన్ని పంపినట్లు తెలుస్తున్నది. “నా మంత్రి వర్గంలోని కొంతమంది విశ్వసనీయులతో కలసి సోవియట్‌ యూనియన్‌ వెళ్ళాలని అనుకుంటున్నాను. అవసరమనుకున్న పక్షంలో నేను ఒక్కడినే సోవియట్‌ యూనియన్‌లోకి ప్రవేశిస్తాను”, అన్నదే ఆ సందేశ సారాంశం. మంచూరియాకు చేరుకుని, ముందుకు వస్తున్న సోవియట్‌ సైన్యంతో సంబంధం పెట్టుకునేందుకు జపాన్‌ అంగీకరించినట్లు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బయట పడిన రహస్య పత్రాల ద్వారా తెలియ వస్తున్నది.

సుభాస్‌ చంద్ర బోస్‌ మంచూరియాకు చేరివుంటే ఏం జరిగేదనే వూహాగానాలు అసంగతం, ఎందుకంటే అలాంటిదేమీ జరగనేలేదు. సుభాస్‌ చంద్ర, హబిబుర్‌ రహ్మాన్‌, జపాన్‌కు చెందిన జనరల్‌ ఒకరు, వీరితోపాటు మేజర్‌ కోనోలు ఎక్కిన విమానం దాదాపుగా గాలిలోకి లేచిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మొత్తం నివేదికలను, యితర సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత యీ రచయితకు కలిగిన అభిప్రాయం ఏమంటే, సుభాస్‌ చంద్ర బోస్‌కు తీవ్రమైన గాయాలే తగిలాయి. 1945 ఆగస్టు 19వ తేదీన యీ గాయాలే ఆయన ప్రాణాలను హరించాయి. ఆగస్టు 20వ తేదీన తైపేలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆ విధంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో వివాదాస్పద వ్యక్తిగా పేరుపడిన సుభాస్‌ చంద్ర బోస్‌ అత్యంత విషాదకర పరిస్థితుల్లో పరమ పదించాడు. కొద్దిపాటి గాయాలతో మరణం నుంచి తప్పించుకున్న హబిబుర్‌ రహ్మాన్‌ చెప్పిన దాని ప్రకారం సుభాస్‌ ఆయనతో యీ విధంగా చెప్పినట్లు తెలుస్తున్నది. “నీవు వెనక్కు వెళ్ళినప్పుడు నా దేశ ప్రజలతో యిలా చెప్పు, 'నా దేశ స్వాతంత్ర్యం కోసం నేను తుదివరకు పోరాడాను. మరే శక్తీ మన దేశాన్ని యింకెంత మాత్రం దాస్యంలో వుంచలేదు. భారతదేశం త్వరలోనే స్వతంత్రమవుతుంది'.

య్‌

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 112

సుభాస్‌ బోస్‌ వారసత్వం

సుభాస్‌ చంద్ర బోస్‌ యింకెంత మాత్రం భౌతికంగా లేరు, ఆయన సజీవుడైనా, నిర్జీవుడైనా భారతదేశంలోని బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని 'భూతంిలా వెంటాడుతూనే వున్నాడు. రెండవ ప్రపంచ యుధ్దానంతరం, అంటే, 1945-46లో భారతదేశంలో బ్రిటిష్‌ రాజ్య పునాదులనే కదలించి వేసిన మునుపెన్నడూ ఎరుగని తిరుగుబాటుకు స్ఫూర్తిప్రదాతగా నిలచాడు,

1945 ఆగస్టు, సెప్టెంబరు నాటికి కూడా (బ్రిటిషిందియా ప్రభుత్వం సుభాస్‌ నిర్జీవుడా, సజీవుడా అన్న విషయాన్ని తేల్చుకోలేక పోయింది. విమాన ప్రమాదంలో సుభాస్‌ నిజంగా మరణించాడా లేక ప్రస్తుతానికి కొంతకాలం అజ్ఞాతంగా గడపి, తగిన తరుణంలో భారతదేశంలో ప్రత్యక్షమవుతాడా అన్న అనుమానాలు ప్రభుత్వానికి వున్నాయి. 1945 ఆగస్టు 20వ తేదీన భారత ప్రభుత్వ కార్యదర్శియైన పెథిక్‌ లారెన్స్‌కు రాసిన అంతరంగిక లేఖలో వైస్రాయ్‌ లార్డ్‌ వావెల్‌ యీ విధంగా పేర్కొన్నాడు. “బైిటిష్‌ వ్యతిరేక రాజకీయవాది (సుభాస్‌ చంద్ర బోస్‌) భారతీయ సైన్యంలో గణనీయమైన సంఖ్యాకులను తనవైపుకు తిప్పుకోవడం యిదే ప్రథమం. దీని ఫలితాలను అంచనా వేయలేము. ఐఎన్‌ఏలో అత్యధికులు బోస్‌కు అపారమైన గౌరవాన్ని యిస్తారు. ఇప్పుడాయన జాతీయస్థాయి నేత. ఆయన విషయంలో ఏం చేయాలన్నది మంత్రివర్గం చాలా జాగరూకతతో ఆలోచించి చర్యలు చేపట్టాలి. ఆయన ఖారతదేశానికి రాకుందా వున్నట్లయితే, అది చాలా మంచిదని నేను కచ్చితంగా చెప్పగలను? (వక్కాణింపు మాది).

వావెల్‌ అంతరంగిక లేఖలోని అంతరార్థం స్పష్టమే -సుభాస్‌ చంద్రను అరెస్టు చేయడం చాలా ప్రమాదం, ఆయనను భారత దేశానికి తీసుకువచ్చి యిక్కడే వుంచేటందుకు ప్రయత్నించాలి అన్నిటికన్నా “ఉత్తమంి ఏమంటే ఎక్కడైనా ఆయనను “తప్పించడం, అంటే, రహస్యంగా చంపివేయడమన్న మాట. ఇలాంటి వూహాగానాలే, 118. గౌతమ్‌ ఛటోపాధ్యాయ

తైపే విమాన ప్రమాదం వెనుక కొంతమంది జపాన్‌ ఉన్నతాధికారులతో కుమ్మక్షైన బ్రిటిష్‌ గూఢచారి విభాగం కుతంత్రాలు వున్నాయోమోనన్న అనుమానాలు భారతీయుల్లో కలగటానికి దారితీశాయి.

పెథిక్‌ లారెన్స్‌కు వావెల్‌ అంతరంగిక లేఖ రాసిన అనంతరం మూడు రోజుల తరువాత భారత ప్రభుత్వ హోం విభాగం సభ్యుడు ముదై అత్యంత రహస్యం అన్న గమనికతో మరో లేఖ రాశాడు. “సమీప భనిష్యత్తులో హోం విభాగానికి ఎదురయ్యే అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి సుభాస్‌ చంద్ర బోస్‌పట్ల వ్యవహరించే తీరు....... భారతదేశంలో ఆయనపై విచారణ జరిపేటట్లయితే ఆయనకు ఉరిశిక్ష విధించే అవకాశం వున్నదని నేను అనుకోను. ఆయన విడుదల కోసం విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఆయనపై జరిపే విచారణ ఆయన చర్యలకు విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తుంది......”

ఐఎన్‌ఏ ఖైదీలను ఏంచేయాలన్న సమస్య కూడా బ్రిటిష్‌ వాళ్ళను తీవ్రంగా వేధించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఐఎన్‌ఏ ఖైదీలను నలుపు, బూడిద రంగు, తెలుపు అంటూ మూడు తరగతులుగా విభజించింది. సుభాస్‌ చంద్ర బోస్‌ను గట్టిగా సమర్ధిస్తూ, (బ్రిటిష్‌వారిని తీవ్రంగా వ్యతిరేకించే వారు నలుపు రంగు తరగతి కిందకు వస్తారు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 7,000ల వరకు వుంటుంది. 1945 ఆగస్టు 21వ తేదీన లండన్‌లో వున్న భారత ప్రభుత్వ కార్యదర్శికి యిచ్చిన అర్జంట్‌ టెలిగ్రామ్‌లో వావెల్‌ యిలా పేర్కొన్నాడు. “(అత్యధిక) ఐఎన్‌ఏ ఖైదీలు వాస్తవ విరుద్ధమైన తప్పుడు అనుమానాలతో, విపరీతమైన ఒత్తిళ్ళ మధ్య పనిచేస్తున్నారు. బోసు చర్యలను దారి తప్పినవిగా భావించినప్పటికీ, మొత్తంమీద ఆయనను దేశ భక్తునిగానే భారతీయులు భావిస్తున్నారు. ఐఎన్‌ఏకు వ్యతిరేకంగా కఠిన చర్యలను చేపట్టినట్లయితే అత్యధిక భారతీయుల హృదయాలు గాయపడతాయి, యిందులో ఎలాంటి సందేహమూ లేదు. మన ప్రతిపాదనలు ఏవైనా పైన తెల్పిన రెండు అంశాల నడుమ మధ్యస్తంగా వుండాలి, కేవలం నాయకులను మాత్రమే శిక్షించాలి”.

ఐఎన్‌ఏ నాయకులను కఠినంగా శిక్షించాలని, అలా చేసినట్లయితే భారతీయులందరికీ అదొక గుణపాఠం కాగలదని 1945 అక్టోబరు చివరలో ిటిష్‌ మంత్రివర్గం ఆలోచనలు చేయసాగింది. 1945 అక్టోబరు 20వ తేదీన మంత్రివర్గం కోసం భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి ఒక రహస్య మెమోను తయారు చేశాడు. ఇఎన్‌ఏ అధికారులను, సైనికులను నలుపు రంగు తరగతిలో చేర్చాలని, “వారికి ఉ రిశిక్షగానీ లేదా జీవిత ఖైదు విధించి నిర్బంధ శిబిరాలకు పంపడంగానీ చేయాలని,..... మరోవైపున పండిట్‌ నెహ్రూ తదితరులు వీరందరినీ అసలుసిసలైన దూరదృష్టి కలిగిన దేశభక్తులని పొగుడుతున్న సంగతిని కూడా గుర్తుంచు కోవాలని”, యీ మెమో చెస్తన్నది. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 1114

ఐఎన్‌ఏకు చెందిన ముఖ్యమైన ముగ్గురు అధికారులపై -షా నవాజ్‌, ధిల్లాన్‌, సెహగల్‌- ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణ ప్రారంభమైంది. వీరికి చట్టబద్దమైన రక్షణ కోసం నెహ్రూ సారథ్యంలో జాతీయ నాయకులు అండగా నిలచారు. కాని, వేచి చూసేటందుకు భారతీయులు తిరస్కరించారు. యావద్భారతమూ ్రిటిష్‌ ప్రభుత్వంపట్ల ఆగ్రహంతో ఏ క్షణాన్నైనా పేలటానికి సిద్ధంగా వున్న మందుపాతరలా మారిపోయింది. 1945 నవంబరు 21వ తేదీన కలకత్తా విద్యార్థులు నిప్పును రాజేశారు. బ్రిటిష్‌ తుపాకీ గుళ్ళకు ఏ మాత్రం భయవడకుండా ఐఎన్‌ఏ ఖైదీలను విడుదల చేయవలసిందిగా డిమాండు చేశారు. గ్రేటర్‌ కలకత్తాకు చెందిన మొత్తం కార్మిక వర్గం నవంబరు 22వ తేదీన సమ్మె చేసింది. యుద్ధ సమయంలోని విభేదాలు విస్మరించిన కాం(గ్రెసు, ముస్లింలీగ్‌, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారంతా భుజం భుజం కలిపి ఏకతాటిపై నిలచారు. కాంగ్రెసు, లీగ్‌ జెండాలతోపాటు ఎర్రజెండాలను కలిపికట్టి ప్రధాన వీధులన్నిటా నిలబెట్టారు. కలకత్తా నుంచి ఆంగ్ల భాషలో వెలువడే జాతీయవాద దినపత్రిక ఆవృత బజార్‌ వశత్రిక దీన్నంతటినీ కన్నులకు కట్టినట్లు వర్ణించింది. భారతదేశంలో బ్రిటిష్‌ పాలనకు మంగళం పాడేందుకై జరిగిన అసలు సిసలైన తిరుగుబాటు యిది, సుభాస్‌ చంద్రుని ఐఎన్‌ఏ యీ తిరుగుబాటుకు ప్రధానమైన చోదక శక్తిగా వున్నదని యీ పత్రిక వ్యాఖ్యానించింది.

1946 ఫీబ్రవరి 18వ తేదీన రాయల్‌ నౌకాదళానికి చెందిన భారతీయ సైనికులు బొంబాయిలో లంగరు వేసివున్న భారత నౌకాదళానికి చెందిన శిక్షణా నౌక హెచ్‌ఎంఎస్‌ తల్వార్‌లో తిరుగుబాటు లేవదీశారు. తొలుత భారత సైనికులను, భారత వైమానికులను ప్రయోగించి యీ తిరుగుబాటును అణచి వేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. కాని, వారు తమ సోదరులైన నావికులపై కాల్పులు జరపటానికి తిరస్మరించారు. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి రాయల్‌ నౌకా దళం మొత్తం తిరుగుబాటు జెందా ఎగురవేసింది. బొంబాయి, కరాచీ, మద్రాసు, కలకత్తా, విశాఖ, కొచ్చిన్‌లలో 78 నౌకలకు చెందిన సైనికులు బ్రిటిష్‌ వారి జెండాయైన యూనియన్‌ జాక్‌ను చింపివేసి దాని స్థానంలో మొత్తం సామ్రాజ్యవాద శక్తుల ఐక్యతకు ప్రతీకగా మూడు జెండాలను -అంటే, కాంగ్రెసు, ముస్లిం లీగ్‌, కమ్యూనిస్టు జెండాలను- ఎగురవేశారు.

భారత పదాతి దళం యింకా బహిరంగంగా తిరుగుబాటు చేయలేదు. కాని, వారి హృదయాలలో మంటలు రగులుతున్నాయన్న విషయాన్ని దూరదృష్టి వున్న బ్రిటిష్‌ సైనికాధికారులు గ్రహించారు. 1945 డిసెంబరు 1వ తేదీన ప్రధాన మంత్రి అట్లీని, బ్రిటిష్‌ మంత్రి వర్గాన్ని వుద్దేశించి ఫీల్డ్‌ మార్షల్‌ సర్‌ క్లౌడి అచిన్‌లెక్‌ తీవ్రమైన హెచ్చరికను పంపాడు. భారతదేశంలో (బిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా (బ్రహ్మాండమైన తిరుగుబాటు సంభవించనున్నదని, ఐఎన్‌ఏ నిర్వహించిన పాత్రను 115 వా ాాా గతమ్‌ ఛటోపాధ్యాయ

స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ సాయుధ దళాలు కూడా యీ తిరుగుబాటులో పొల్గొనగలవన్నదే యీ హెచ్చరిక సారాంశం.

బ్రిటన్‌ మరెంతో కాలం భారతదేశాన్ని పట్టి వుంచలేదన్నది స్పష్టమైంది. 1946 ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటన్‌ ప్రధాన మంత్రి అట్లీ ఒక ప్రకటన చేస్తూ, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని మంజూరు చేస్తామని, అధికార బదలాయింపు విధివిధానాలను చర్చించేందుకై భారతదేశానికి కేబినెట్‌ మిషన్‌ను పంపనున్నట్లు తెలియ చేశాడు.

సైనికంగా చూస్తే, బహుశా సుభాస్‌ చంద్ర, ఐఎన్‌ఏలు సాధించింది విశేషంగా ఏమీ లేకపోవచ్చు. వాళ్ళు కేవలం కోహిమా సమీపంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ చర్య దేశ (ప్రజలందరిలో, అంటే, అటు పౌరుల్లోనూ యిటు సైనికుల్లోనూ ఒకేవిధమైన భావోద్వేగాలను నింపింది. 1946 ఫిబ్రవరిలో యావద్భారత ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి (బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఉ ప్పెనలా విరుచుకు పడ్డారు. చరితార్భుడు సుభాస్‌ చంద్ర బోస్‌, ఐఎన్‌ఏలే వీరికి స్ఫూర్తిగా నిలచాయి. భారతీయ సైనిక దళాలు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా వున్నాయి. బ్రిటిష్‌వారు వెనుకంజ వేసి, అంతిమంగా భారతీయులకు అధికారాన్ని అప్పచెప్పేలా యీ పరిణామాలే ఒత్తిడి తెచ్చాయి. ఇవి తిరుగులేని చారిత్రక సత్యాలు. అయితే, దురదృష్టవశాత్తు వీటికి సాధారణ లేదా పరిశోధకుల రచనల్లో పూర్తి గుర్తింపుగానీ, ప్రాతినిధ్యంగానీ వుండటం లేదు.

ఫాసిజంపట్ల సుభాస్‌ చంద్రకు బలమైన సైద్ధాంతిక మొగ్గు వున్నదా, లేదా, అలానే అక్ష రాజ్యాలతో ఆయన పెట్టుకున్న పొత్తు సరియైన వ్యూహమేనా అన్న చర్చకు సంబంధించి ఒకటి రెండు మాటలు చెప్పాలి. జవహర్‌లాల్‌ నెహ్రూ, రాడికల్‌ కాంగ్రెసువాదుల్లో అతిపెద్ద భాగమూ, అలానే కమ్యూనిస్టు పార్టీలు, ఫాసిస్టు అక్ష రాజ్యాలు మానవ జాతికి అత్యంత ప్రమాదకర శత్రువులని నిష్కర్షగా చెప్తూ, ఫాసిస్టు వ్యతిరేక మిత్రరాజ్య కూటమిని తమ పొత్తుదారులుగా భావించాయి. సుభాస్‌ చంద్ర బోస్‌కూ, భారత కమ్యూనిస్టు పార్టీకి మధ్యవున్న విభేదాలు సర్దుబాటు చేయటానికి వీలులేనంత ప్రగాడమైనవీ, మౌలికమైనవీ, వీరిరువురూ రెండు ప్రత్యర్థి శిబిరాలుగా విడిపోయారు.

ఈనాడు ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు, అక్షరాజ్యాలతో చేతులు కలపటం ద్వారా దేశ శత్రువుగా మారాడంటూ సుభాస్‌ చంద్రబోస్‌ గురించి వేసిన యుద్ధ కాలపు అంచనా పూర్తిగా పొరపాటని, తదనంతర కాలంలో యిందుకు తగిన చారిత్రక ఆధారాలు లేవని కమ్యూనిస్టులు, ఫాసిస్టు వ్యతిరేక చరిత్రకారులు స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. అత్యంత సంక్షిష్టమూ, ప్రతికూలమూ అయిన పరిస్థితులలో సుభాస్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 116

చంద్ర బోస్‌ తనదైన స్వతంత్ర వైఖరిని చేపట్టాడని, అలానే, హిట్లర్‌ లేదా టోజో చేతుల్లో కీలుబొమ్మగా మారలేదని మనకిప్పుడు లభిస్తున్న సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. జర్మనీలో వున్న భారత సైనిక దళాలను సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా వినియోగించటానికి, లేదా, 1945 మార్చి 27వ తేదీన బర్మాలో జపాన్‌ వ్యతిరేక ప్రతిఘటనా పోరాటాన్ని ప్రారంభించిన అంగ్‌ సాన్‌, ఆయన నేతృత్వంలోని ఏఫ్‌పిఎఫ్‌ఎల్‌కు వ్యతిరేకంగా ఐఎన్‌ఏను ఉపయోగించటానికి నిరాకరించటమే యిందుకు స్పష్టమైన ఆధారం.

ఏదియేమైనప్పటికీ, సుభాస్‌ చంద్రుని మహాఘనమైన దేశభక్తియుత లక్ష్యాలు మహోన్నతమైనవే అయినప్పటికీ, నేతాజీని కీర్తించే చరిత్రకారులు, అభిమానులు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. అదేమంటే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన చారిత్రక దృక్పథం మౌలికంగానే తప్పు, మానవ చరిత్రలోనే అత్యంత వికృతమైన సొమ్రాజ్యవాద నిరంకుశ శక్తియైన అక్షరాజ్యాలు యావత్ర్రపంచంపైనా పెత్తనం కోసం ఆరాట పడుతున్న విషయాన్ని అంచనా వేయటంలో ఆయన విఫలమయ్యాడు.

సుభాస్‌ చంద్ర నేతృత్వంలోని భారతీయ దళాలపట్ల హిట్లర్‌కున్న తృణీకార భావాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. లిఖిత రూపంలో వున్న హిట్లర్‌ ప్రస్తావనను చూద్దాము: “భారత సైనిక దళం ఒక జోక్‌. తల్లో పేనును కూడా చంపలేని భారతీయులున్నారు, అలాంటి వారు ఇంగ్లీషు వాడిని చంపలేరు. ఇంగ్లీషువాళ్ళకు వ్యతిరేకంగా వారిని నిలబెట్టటం అర్ధంలేని పనిగానే నేను భావిస్తాను..... భారతీయులను గుడిలో గంటలు కొట్టటానికి వుపయోగించితే వాళ్ళంత పనివాళ్ళు ప్రపంచంలోనే వుండరు”.

బర్మాలోని అంగ్‌ శాన్‌, ఇండోనేషియాలో సుకర్నో మరికొందరు తొలుత సుభాస్‌ చంద్ర బోస్‌ వేసిన ఎత్తుగడల వంటివాటినే స్వీకరించారు. అయితే, రెండేళ్ళ పాలనను చూసిన తరువాత వారు జపాన్‌ ఫాసిజం యొక్కనిజ స్వభావాన్ని గ్రహించారు. వియత్నాం నేత హోచిమన్‌ సూచన మేరకు వారు విశాల ఫాసిస్టు వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి, తమ దేశాల విముక్తి కోసం జాతీయ పోరాటాలను నిర్వహించారు. మంచూరియాలో సోవియట్‌ సైన్యంతో సంబంధం పెట్టుకోవాలన్న సుభాస్‌ కోరికను చూస్తే బహుశ, ఆయన కూడా యిదే తరహాలో అలోచించి వుండవచ్చునన్న అనుమానం కలుగుతున్నది. ఈ సమయంలోనే అంతుబట్టని విమాన ప్రమాదంతో నేతాజీ సుభాస్‌ చంద్ర బోస్‌ ఉజ్వల భవిష్యత్‌ ఘట్టం ముగిసింది.

సుభాస్‌ వదలి వెళ్ళిన వారసత్వ సంపద అపారమైనది. మాతృభూమికి సంపూర్ణంగా అంకితం కావటానికీ, నిరంతర త్యాగ జీవనానికి నమూనాగా తన కార్యకలాపాల ద్వారా ఒక ఆదర్శాన్ని వర్తమాన, భవిష్యత్‌ యువతరాలకు ఆయన క్షే1ేళ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విడిచి వెళ్ళాడు. 1943 అక్టొబరు 21న తేదిన తాత్కాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం చేసిన తొలి ప్రసంగంలో ఆయన కుల మతాలతో సంబంధంలేని సమస్త భారతీయుల ఐక్యత అన్న ఆదర్శాన్ని భావోద్వేగంతో నొక్కి వక్కాణించాడు. శేష ప్రపంచంతో అనుసంధానానికి వీలుగా భారతీయుల వ్యవహారిక భాషగా హిందీ, ఉర్జూల మిశ్రమమైన హిందూస్టానీని ఆయన ఎంపిక చేశాడు. సంపూర్ణ స్వాతంత్ర్యానికీ, లౌకిక సూత్రాలపై ఆధారపడిన భారత సోషలిస్టు రిపబ్లిక్‌కూ తాను కట్టుబడి వున్నట్లు 1988 నుండి 1945 వరకు ఆయన చెప్తూనే వున్నాడు. ఇదీ నేతాజీ సుభాస్‌ చంద్ర బోస్‌ విడిచి వెళ్ళిన వారసత్వం. ఈ శత జయంతి సంవత్సరాన భారతీయులందరూ ప్రత్యేకించి యువతీ యువకులు యీ విలువలను ([గ్రపొంచి, కాపాడవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఆ విధంగా మాత్రమే మనం నేతాజీ సుభాస్‌ చంద్ర బోస్‌కు యథార్థమైన నివాళిని అర్చించగలము. ముఖ్పు (గంథనూచి

  1. కెం6, 500010 ౧౦బురగ 06 06120 50828216 1920-1942 అ॥!03[12, 19656 261601 రై పలవాలచవాలాలవాలాలు తీరి 106180 1120100-40 ౧ఈ0015066 త&ట[00102220%0. ౮2౦౪412, 1965 6616010 వ అలావలావాలవవాలవం ౯౦౩౩ గండ63, ౧110612, 1966. తీ పలవావాాలవవవంం ఏ61600664 వంం6ం1లఏ, "ల 061 గాలగగం 1974
  2. తం36 513 కంగు (064) లట! ఖర 1064120 166600), అజీింంగ2, 195 ళం _వబైలాలైవాలావవలవా &ీ కెండ00% 100053 4512, 6౪ అంట!
  3. 6౦0౯4౦8, 1.600864 కెగంరులగు 4౩2050 06 మట్ట, 11, 86, లా? 01 190
  4. ళజ0ంలంగ రలిశం0॥ (00) 205168 00 90౪/6 1942-47, ౬01601, ₹01-6.
  5. 6 4ఉథతంగర 064) అంంట0టలఏ 0 ౧6 ౧౦౧౧౪౮౧1౩౬ జాం 0% య ౪01-2 (1923-25) 6 06101 1975,
  6. ౮౩6౦024002 0201201 5300285 జురు జర 6 04120 ౦020140191 సెళం+6అ060౬ సా 0061101. 10/3,
  7. కం 110 కముం2 కం ప్‌30011ు | కము6౪/ 900102 1946.
  8. 52/220020, సశ “16 016 10 06111. 060/0, 1967.
  9. 824060 141121 106414 102 ఉం వర946923 తగ2ైబం 1981. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు 118

రచనలు ఉపన్వానాలు లేఖలు

శ కక న టే వో . | " జా త్‌ టు రో తోక ఉత

స్త వు (1. || భశ టరు. ఎత న్నే న టై స్‌ టా ల (న్‌ క్ష రె క్‌ /| మ 4! £ లో టియు రా గంగకి న్‌ య కు! కత ట్‌. | [౮ వ్నే' 1 ప రం టి కం: శిర కం త కర. నం త్య (|. శనం నే ఎవని రం. టు ల న ర్న క గా

యువజనోద్యమన పాత్ర అఖిల భారత యువజన కాంగ్రెసు తృతీయ సమావేశాల ఆవ్వాన కమిటీ తరపున మన యీ నగరానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాను. నిజానికి యీ ఏడాది నిర్వహిస్తున్న యీ తృతీయ సమావేశాలు నానాటికీ పెరుగుతున్న యువజనోద్యమానికి నికార్సయిన ఉదాహరణ.

ఈ ఏడాది భారత జాతీయ కాంగైసు చర్చలు, అఖిల పార్టీల సదస్సు నిర్వహణ మాటున అఖిల భారత యువజన కాంగ్రైసు కార్యక్రమాలు కనుమరుగు కాగలవన్న అనుమానాలు బహుశ కొంతమేరకు వుండి వుండవచ్చు. కాని, యువజన కాంగ్రెసు వంటి అత్యంత ముఖ్యమైన సమ్మేళనాన్ని నా మనసులో నుంచి ఏదీ తొలగించ లేదు. మన జీవితంలోని రాజకీయ సమస్యల ప్రాధాన్యాన్ని ఏమాత్రం కుదించకుండానే, యువజనుల సమస్యలు సజీవమైన సమస్యలని, వాటి ప్రాధాన్యం వాటికున్నదని నేను చెప్పదలచుకున్నాను. యువజన రిపబ్లిక్‌ సభ్యులమైన మనం వాటికి అపారమైన విలువను, ప్రాధాన్యాన్నీ యిస్తాము. ఈ మహాసభలో జరిగిన చర్చలను మన భుజస్కంధాలపై నిలచిన బాధ్యతతో ముందుకు తీసుకు వెళ్తామనటంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. నేటి మన జీవితంలో ఎదురయ్యే కీలక సమస్యలకు యీ మవాసభ కచ్చితమైన పరిష్కారాలను చూపగలదనటంలో నాకెలాంటి సందేహమూ లేదు. కనుకనే, యిలాంటి ప్రధానమైన సందర్భంలో మిమ్మలను స్వాగతించేలా ఆహ్వాన కమిటీ అవకాశాన్ని కల్పించటం నాకు లభించిన అధిక్యతగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను.

మనం మన దృష్టిని సరిహద్దుల ఆవలకు ప్రసరింప చేసినట్లయితే, ప్రపంచంలో సంభవిస్తున్న ఘటనలను విహంగ వీక్షణంగానైనా పరిశీలించినట్లయితే ప్రతిచోటా మనకు కొట్టవచ్చినట్లు కనిపించే దృశ్యం ఒకటున్నది, అది యవతరంలో పునరుజ్జీవన చైతన్యం. అటు ఉత్తరం నుంచి దక్షిణం వరకూ, యిటు తూర్పు నుంచి 928 దిసెంబరు 25వ తేదీన కలకత్తాలో జరిగిన అఖిల భారత యువజన కాంగ్రెసు...

తృతీయ సమావేశాలలో చేసిన ప్రసంగం) వా గాతమ్‌ ఛటోపాధ్యాయ

పడమర వరకూ మన దృష్టిని ఎక్కడ నిలిపినా అక్కడ యువజనోద్యమం వాస్తవ రూపుదాల్చి వుంటుంది. యువజన ఉద్యమ లక్షణాలేమిటి, దాని ప్రధాన తత్వమూ, దాని అంతిమ లక్ష్యం ఏమిటి అన్న విషయాలపట్ల మన హృదయాలలో స్పష్టమైన అవగాహన వుండటం ఎంతైనా అవసరం. యువకులు లేదా యువతులతో కూడిన ఏ సమాఖ్య అయినా యువజన సమాఖ్య అనిపించుకోదు. సామాజిక సేవా సంఘం లేదా కరువు సహాయక సమాఖ్య అనేవి తప్పనిసరిగా యువజన సమాఖ్యలు కావలసిన అవసరం లేధు. వర్తమాన వ్యవస్థపట్ల అసంతృప్తి, అత్యున్నత వ్యవస్థపట్లా, తదనుగుణమైన దృక్పథంతో కూడిన భావనయే యువజన సమాఖ్య లక్షణంగా వుంటుంది. యువజన ఉద్యమాలు సంస్కరణాత్మకమైనవి కావు, అవి, విప్లవాత్మకమైనవి. ప్రస్తుత వ్యవస్థపట్ల అనిష్టత, అసహనం అనేవి యవజనోద్యమాల ప్రారంభానికి ముందే వుంటాయి. నావరకు నేను యిలాంటి వుద్యమాన్ని ఇరవయ్యవ శతాబ్ది పరిణామంగానో, లేదా, యాదృచ్చిక ఘటనగానో భావించను. సోక్రటీస్‌, బుద్ధుడు కాలం నుంచీ మానవులు అత్యున్నతమైన (ప్రాపంచిక దృక్పథంతో స్ఫూర్తి పొందుతూనే వున్నారు. ఆ స్ఫూర్తితోనే సమాజ పునర్మిర్మాణానికి పాటుపడ్డారు. ఆధునిక యుగపు యువజనోద్యమాలు కూడా యీ తరహా దృకథాన్ని, యిలాంటి కృషినీ కలిగి వున్నాయి. రష్యాలో బోల్నివిజం కానివ్వండి, లేదా, ఇటలీలో ఫాసిజం కానివ్వండి, లేదా, టర్మీలో యంగ్‌టర్క్‌ వుద్యమం కానివ్వండి, లేదా, చైనా, పర్షియా, జర్మనీలలో ఉద్యమాలను తీసుకోండి, ప్రతిచోటా మీకు ఒకే విధమైన (ప్రేరణా, దృక్సథం, లక్ష్యం కనిపిస్తాయి. పాత తరానికి చెందిన నాయకులు విఫలమైన సందర్భంలో యువతరం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, సమాజ పునర్నిర్మాణ బాధ్యతనూ, అదేవిధంగా, అత్యున్నతమూ, మహత్వమూ కలిగిన సమాజ దిశగా మార్గదర్శకత్వాన్నీ స్వీకరిస్తారు. మిత్రులారా, మన దేశం విషయానికి వద్దాము. జర్మనీ, రష్యా, ఇటలీ, చైనా దేశాలలోని యువజనులు మాత్రమే శిరసెత్తుకుని నిలవటం లేదు. ఇక్కడి యీ సుఖభోగుల భూమిలో సైతం చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఇలాంటి చైతన్యం లోపల నుంచేగాని, పైనుంచి జారిపడదని నేను గట్టిగా నమ్ముతున్నాను. భారతదేశంలోని యువతరం, యింకెంతో కాలం బాధ్యతలన్నిటినీ పాత నాయకత్వానికి అప్పచెప్పి చేతులు కట్టుకుని కూర్చోదు, లేదా, గొర్రైదాటుగా వ్యవహరించదు. స్వతంత్రమైన, మహోత్యష్టమైన, శక్తివంతమైన నవ్య భారతాన్ని సృష్టించే బాధ్యత తమదేనని వారు గుర్తించారు. వారు బాధ్యతలను స్వీకరిస్తున్నారు, ఆగామి పరిణామాలను సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 22

ఎదుర్కొనటానికి వారు సన్నద్ధమవుతున్నారు, తమ కోసం ఎదురు చూస్తున్న మహత్తర కర్తవ్యానికి వారు సంసిద్ధలవుతున్నారు. ఇటువంటి సంక్షిష్ట పరిస్థితుల్లో వర్తమాన వుద్యమం లేదా వుద్యమాల గురించి తామేమి అనుకుంటున్నదీ నిర్భయంగా ప్రకటించడం భారతదేశ (శ్రేయోభిలాషుల విధి. ఉద్యమంలోని అరకొరలను విమర్శనాత్మకంగా విశ్లేషించాలి, అలానే, యావత్తు ఉద్యమాన్ని ఆరోగ్యకరమైన, ఫలప్రదమైన మార్గంలోకి మరలించ వలసివుంది.

ఈనాడు నా చుట్టూవున్న పరిసరాలను అవలోకించినప్పుడు రెండు రకాలైన ఆలోచనా విధానాలు దృగ్గోచరమవుతున్నాయి. వీటి గురించి బహిరంగంగా, నిర్భయంగా ప్రకటించడం నా విధిగా భావిస్తాను. సబర్శతి, పాండిచేరీలను కేంద్రాలుగా కలిగిన రెండు ఆలోచనా విధానాల గురించి నేను చెప్పదలచుకున్నాను. రెండు తరహాలైన యీ ఆలోచనా విధానాల మౌలిక తత్వాల గురించి నేను ఆలోచించటం లేదు. శుష్క వేదాంత వూవాగానాలకిది సమయం కాదు. శుష్క వేదాంత దృష్టితో కాక, నిజమైన ప్రభావాలను, పరిణామాలను ఆచరణాత్మక అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని వాస్తవ విలువలను అంచనా వేయగల అఆశావాదిగా యీనాడు మీతో నేను మాట్లాడుతాను.

సబర్మతి ఆలోచనా విధానం ప్రచలితం కావటం వల్ల కలిగే వాస్తవ ప్రభావం ఏమంటే, ఆధునికత్వం చెడ్డది, పెద్దయెత్తున జరిగే ఉత్పత్తి దుష్టమైనది, వాంఛలను పెరగనివ్వరాదు, జీవన ప్రమాణాలను హెచ్చించరాదు, వెనక్కు తిరిగి ఎద్దుల బళ్ళ రోజులకు తిరిగివెళ్ళే మన శక్తిని పెంచుకోవటానికి పాటుపడాలి, ఆత్మయే అత్యంత ప్రధానం, పాదార్థిక సంస్కృతి, సైనిక శిక్షణలు నిర్లక్ష్యం చేయదగినవన్న భావాలు పాతుకు పోవటం.

పాండిచేరి ఆలోచనా విధానం ప్రచలితం కావటంవల్ల కలిగే వాస్తవ ప్రభావం ఏమంటే, ప్రశాంతమైన చింతనకన్నా మహోన్నతమైనదీ, లేదా, మహోతృష్టమైనదీ మరేదీలేదు, యోగా అంటే, ప్రాణాయామం, ధ్యానం కార్యాచరణను మంచిదిగా భావించినప్పటికీ, ప్రత్యేకమైన యీ తరహా యోగ ఉన్నతమైనదీ, ఉత్తమమైనదీను. ఈ తరహా (ప్రచారం (ప్రస్తుత పరిస్థితుల్లో నిరాటంకమూ, నిస్వార్థమూ అయిన ఆచరణ ద్వారా మాత్రమే లభించేందుకు అవకాశమున్న ఆత్మికాభివృద్ధిని పలువురు విస్మరించేలా చేస్తుంది. ప్రకృతిపై విజయానికి ఉత్తమ మార్గం దానితో పోరాడటం, మనం అన్నివైపుల నుంచి ప్రమాదాలతోనూ, యిబ్బందులతోనూ చుట్టుముట్టి వున్నప్పుడు ధ్యానాన్ని ఆ(భ్రయించటం బలహీనతే కాగలదు. 128“ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఈ రెండు రకాలైన ఆలోచనా విధానాలను నేను నిరసిస్తున్నాను, యిది వాస్తవం, వేదాంతం కాదు, ఆశావాదం. పవిత్రమైన మన భూమిలో ఆ(శమాలు కొత్త కాదు, సాధువులు, యోగులు మనకు తెలియని వారుకాదు. సమాజంలో వారిది గతంలోనూ, యికముందూ గౌరవప్రదమైన స్థానమేననటంలో సందేహం లేదు. స్వేచ్భ్చాయుతమైన, సంతోషకరమైన, మహోన్నతమైన నవ్య భారతాన్ని నిర్మించాలని మనం అభిలషించినట్లయితే మనం అనుసరించ వలసిన నాయకత్వం యిది కానేకాదు.

మిత్రులారా, కల్లాకపటం లేకుండా మాట్లాడే ధోరణిలో మీ మనోభావాలను దెబ్బతీసి వున్నట్లయితే నన్ను మీరు క్షమించగలరు. ఇంతకుముందే చెప్పినట్లుగా, 'పైన తెల్పిన రెండు రకాలైన ఆలోచనా విధానాలకు చెందిన మౌలిక తత్వాలలో ఏదో ఒకదానికి చెందిన వాడనుకాను, ఆచరణాత్మక దృక్పథంతో వాటి ఫలితాల గురించి ఆలోచిస్తున్నాను. భారతదేశంలో యీనాడు మనం (క్రియాశీల తత్వాన్ని కోరుకుంటున్నాము. దృఢమైన ఆశావాదం మనకు (ప్రేరణ కావాలి. మనం వర్తమానంలో జీవిస్తూ, ఆధునిక పరిస్థితులను జీర్ణించుకోవాలి.

ప్రపంచంలో ఒక మూలన ఏకాకులుగా ఎంతోకాలం జీవించలేము. భారతదేశం స్వతంత్రమైనపుడు, అది ఆర్థిక, రాజకీయ రంగాలలో తన అధునిక శత్రువులతో ఆధునిక పద్ధతుల్లో పోరాడవలసి వుంటుంది. ఎడ్లబళ్ళ రోజులు వెళ్ళిపోయాయి, శాశ్వతంగా వెళ్ళిపోయాయి. నిరాయుధీకరణ విధానాన్ని యావత్ష్రపంచమూ హృదయపూర్వకంగా ఆమోదించనంత కాలం ఎలాంటి సంఘటనైనా ఎదుర్శొనటానికి స్వేచ్చా ప్రపంచం సంసిద్ధంగా వుండాలి.

ఎవరైతే ఆధునికత్వపు మోజులో పడిపోయి గతకాలపు వైభవాన్ని విస్మరిస్తారో అలాంటి వారిలో ఒకనిగా నేనులేను. మన వైఖరి తప్పనిసరిగా మన గతంపై ఆధారపడినదై వుండాలి. భరతమాత తనదైన స్వీయ సంస్కృతిని కలిగి వున్నది, తనకున్న విశిష్ట మార్గాల ద్వారా ఆమె దానిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటుంది. తత్వశాస్త్రం, సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞాన రంగాలలో ప్రపంచానికి యివ్వగల క్రొత్తదనాన్ని మనం కలిగి వున్నాము, దీని కోసం ప్రపంచం ఆదుర్ధాగా ఎదురు చూస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే, మనం సమన్వయ సిద్ధాంతం దగ్గరకు రావాలి. మనకు చెందిన కొంతమంది అత్యుత్తమ ఆలోచనాశీలురు, కార్యకర్తలు యిప్పటీకే ప్రధానమైన యీ కార్యంలో మునిగి వున్నారు. ఒకవైపున, 'వేదాల వద్దకు తిరిగి వెళ్ళాము" అన్న పొలికేకలను, మరోవైపున, ఫ్యాషన్‌ కోసం, మార్చు కోసం ఆధునిక ఐరోపా మోజులో చిక్కుపడటాన్ని మనం తప్పనిసరిగా ప్రతిఘటించాలి. సజీవ ఉ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 124

ద్యమాన్ని హద్దుల లోపల బిగించి వుంచటం కష్టం. అయితే, ఉద్యమ మార్గదర్శకులు, నాయకులు సరైన మార్గంలో వున్నట్లయితే వ్యవహారాలన్నీ తగు సమయంలోనే సరైన రూపాన్ని తీసుకుంటాయి.

మిద్రులారా, మరోమాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ఏడాదికి, మన రాజకీయ ఉద్యమ చరిత్రలోనేకాక, భారత యువజన చరిత్రలో కూడా ఎంతో విశిష్టత వున్నది. ఈ దేశ యువతకు యీ సమావేశాలు సాహసాన్ని కచ్చితమైన మార్గదర్శకత్వాన్ని యివ్వగలవని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ దేశ యువజనులకు ప్రత్యేకించి పరిచయం చేయవలసిన అవసరంలేని బొంబాయికి చెందిన శ్రీ నారిమన్‌కు మన అధ్యక్షునిగా స్వాగతం తెలిపే భాగ్యం యీనాడు మనకు పట్టింది.

క!

1125 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విద్యార్థులు-రాజకీయాలు

పంచ నదులు (ప్రవహించే యీ పవిత్ర భూమిలో తొలిసారిగా అడుగు పెట్టిన నాకు నులివెచ్చని ఆదరపూర్వక స్వాగతాన్ని యిచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చూపిన గౌరవానికీ, ఆదరపూర్వక స్వాగతానికి నేను అంతగా అర్జుడిని కానన్న సంగతి నాకు తెలుసు, నన్ను అభినందిస్తూ మీరు చూపిన దయకు, ఆతిథ్యానికి నేను ఒకింత పాత్రుడిని కావాలన్నదే యీనాటి నా

ఒకేఒక ఆకాంక్ష, మీ చెంతకు వచ్చి మీతో మాట్లాడేందుకై సుదూరాన వున్న కలకత్తా నుంచి మీరు నన్ను పిలిపించారు. అందరిలోనూ నన్నే మీరు ఎందుకు పిలిపించారు. తమ ఉమ్మడి సమస్యలు పరిష్మారానికి ప్రాక్‌ పశ్చిమాలు కలవాలను కోవటమే కారణమా? విదేశీ దాస్యం కిందకు మొట్టమొదటిగా వచ్చినది బెంగాల్‌, చిట్టవివరగా బానిసత్వపు బంధీ అయినది పంజాబు, యివి రెండూ పరస్పరం సహకరించు కోవలసిన అవసరం వుండటమే కారణమా? లేక, నీవు, నేను ఉమ్మడిగా, అంటే, ఒకేరకమైన ఆలోచనలను, ఒకే రకమైన ఆకాంక్షలను కలిగి వుండటమే కారణమా? ఏమి చిత్రం లాహోర్‌లో విద్యార్థులను వుద్దేశించి ప్రసంగించ వలసిందిగా మీరు నన్ను -ఒకప్పుడు సోదర విశ్వవిద్యాలయం నుంచి బహిష్టుతుదైన వ్యక్తిని- కోరారు. కాలం మారిపోయింది, కొత్త మనుషులు, కొత్త ఆలోచనలు ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయని మన పెద్దలు ఆక్షేపిస్తుంటే మీరు అభ్యంతర పెట్టగలరా? నా గతం గురించి పూర్తిగా తెలిసివుండే మీరు నన్ను ఆహ్వానించారా, నేనేమి చెప్పబోతున్నానో మీరు నిజంగానే వూహించారా? పంజాబు జైళ్ళలో మగ్గుతున్న జతీంద్రనాథ్‌ దాస్‌కూ, అలానే బెంగాల్‌కు చెందిన ఆయన యిరువురు సహచరులకు పంజాబు -ప్రత్యేకించి పంజాబు యువతీ యువకులు- చేసిన సాయం గురించి తలచుకున్నపుడు నాలో పొంగే కృతజ్ఞతా

(2929 అక్సోఐరు 22న తేదీన లావోర్‌లో నిర్వనాంచిన విద్యార్థి సదస్సులో చేనిన అధ్యక్షోపన్వానం,)

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 126

భావాలను బలహీనంగా అయినప్పటీకీ ప్రారంభంలోనే చెప్తన్నందుకుగానూ మిత్రులారా నన్ను క్షమించండి. వారి రక్షణ కోసం చేసిన ఏర్పాట్లు, వారు ఆమరణ నిరాహార దీక్షలో వున్నపుడు వారి కోసం మీలో పెల్లుబికిన ఆందోళనాఖిమానాలు, జతిన్‌ సజీవునిగా వున్నపుడూ ఆ తరువాతా మీరు చూపిన ఆప్యాయతానురాగాలు బెంగాల్‌ ప్పాదయాన్ని గాఢంగా తాకాయి. లాహోర్‌లో తొము చేసిన దానితో తృప్తిపడని రక్షణ కమిటీకి చెందిన ప్రముఖ సభ్యులు ఆ మహాత్యాగి అవశేషాలకు కాపలాగా కలకత్తా వరకు ప్రయాణించి వాటిని మాకు అప్పచెప్పారు. మేము ఉద్వేగపూరితులైన ప్రజలము. మీ హృదయ విశాలత్వం మమ్మలను ఆకట్టుకున్నది. తానెదుర్కాన్న చీకటి రోజుల్లో పంజాబు ఏమి చేసిందీ బెంగాల్‌ ఎంతో శ్రద్ధతో గుర్తుంచు కుంటుంది.

సుప్రసిద్ధులైన మీ నాయకులలో ఒకరు ఒకసారి కలకత్తాలో మా గురించి చెప్పే సందర్భంలో అమరజీవి గురించి ప్రస్తావిస్తూ, సూర్యుడు తూర్పున ఉదయించి పళ్చిమాన అస్తమిస్తాడు, అలానే సూర్యాస్తమయం తరువాత చంద్రుడు పశ్చిమాన ఉ దయించి తిరిగి తూర్పుకు ప్రయాణిస్తాడని ప్రతీకాత్మకంగా చెప్పాడు.

ఇదేవిధంగా జతిన్‌ కూడా జీవించాడు, మరణించాడు. ఆయన తన జీవితంలో కలకత్తా-లాహోర్‌ల మధ్య (ప్రయాణించాడు. మరణానంతరం ఆయన శరీర అవశేషాలు తిరిగి కలకత్తాకు చేరుకున్నాయి. అయితే అవి నిస్సారమైన బురదవలె చేరుకోలేదు, స్వచ్చత, బెదార్యము, దైవత్వానికి ప్రతీకగా ఆవి ప్రయాజించాయి. ఈనాడు జతిన్‌ మరణించలేదు. సుసంపన్నతకు దారిచూపే వెలుగు చుక్కలా వినీలాకాశంలో 'స్వచ్చమైన కాంతి పుంజంలా' ఆయన నిలచి వున్నాడు. ఆయన తన అమర త్యాగంలో జీవించి వున్నాడు. మానవ జాతిలో ఏదైతే నిర్మలమో, ఏదైతే మహత్వాన్ని కలిగి వున్నదో అలాంటి దృక్పథంవలె, ఆదర్భంవలె, ప్రతీకవలె ఆయన జీవించి వున్నాడు.

ఆయన తన బలిదానంతో భారతీయ ఆత్మను మేల్మ్కొల్పటమేకాక, రెండు ప్రాంతాల మధ్య, అంటే, ఆయన జన్మించిన స్థలానికీ, మరణించిన స్టలానికీ మధ్య విడిపోని బంధం వేశాడని నేను నమ్ముతున్నాను. ఆధునిక దధీచి యొక్క తపస్యక్షేత్రం- తపోవనం- వంటి మీ నగరాన్ని చూస్తే నాకు ఈర్యగా వున్నది.

స్వాతంత్రోదయానికి మనం క్రమక్రమంగా చేరువవుతున్న కొలది మన బాధలు, వ్యధలు చరమస్థాయికి చేరుకున్నాయి. తమ చేతుల్లోంచి అధికారం క్రమక్రమంగా జారిపోతుండటంతో సహజంగానే మన పాలకులు యితర నియంతల వలెనే అసహనానికి లోనవుతున్నారు. డా గయ్‌ ఫోం

కొద్ది రోజుల్లోనే వారు తమ నాగరిక ముసుగులను తీసిపారేసి ఎలాంటి సంకోచం లేకుండా స్వేచ్చగా తమ కబంధ హస్తాలను వుపయోగించేటట్లయితే ఎవరూ అశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈనాడు పంజాబు, బెంగాల్‌ ప్రాంతాలు తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నాయి. ఒకరకంగా యిది మనకు అభినందనీయమైనదే, స్వరాజ్య పరీక్షను మనం అధిగమిస్తున్నాము. భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌ దత్తు వంటి వీరుల ఆత్మలు అణచివేతకు లొంగలేదు. తద్విరుద్ధంగా, అణచివేతలు, వేదనలు, అవమానాలు, విషాదాల నుంచి అలాంటి వీరులు పుట్టుకు వస్తారు. మనం అణచివేతను మనఃపూర్వకంగా ఆహ్వానించుదాము, అది ఎదురైనపుడు దానిని పూర్తిగా వినియోగించుకుందాము.

తననుతాను నునంవన్నం చేనుకోవటానికీ, తన పాఠకులను చైతన్యపరచటానికీ తొలినాళ్ళ పంజాబు చరిత్ర నుంచి బెంగాల్‌ సాహిత్యం ఏమేరకు స్వీకరించిందీ మీకు అంతగా తెలియక పోవచ్చు. రవీంద్రనాథ్‌ టాగూర్‌తో సహా అనేకమంది కవులు మీ వీరుల గాథలను గానం చేశారు. ఇలాంటి వారిలో పలువురు బెంగాలీ గృహస్తులకు సుపరిచితులే. మీ సాధువుల నీతులు బెంగాలీలోకి తర్జుమా అయ్యాయి. లక్షలాదిమంది బెంగాలీలు వీటిద్వారా ఎంతో స్ఫూర్తిని పొందారు. ఈ సాంస్కృతిక సంబంధాలు రాజకీయ రంగంలో కూడా కొనసాగాయి. మీ రాజకీయ యోధులు భారతదేశపు చెరసాలల్లోనేకొక, సుదూరాన వున్న బర్మా జైళ్ళలోనూ, అలానే సముద్రాలకు ఆవలవున్న అండమాన్‌లోనూ మావాళ్ళను కలుసుకుంటున్నారు.

మిత్రులారా, యీ ప్రసంగంలో రాజకీయ సమస్యలను సుదీర్హంగా ప్రస్తావించి వాటికి సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించి వున్నట్లయితే అందుకు ఎలాంటి క్షమాపణా చెప్పదలచు కోలేదు. పాలిత జాతులకు రాజకీయాలు వుండగూడదని, ప్రత్యేకించి విద్యార్ధులకు రాజకీయాలతో ఎలాంటి ప్రమేయం వుండరాదనే వారు (వీరిలో కొందరు (ప్రముఖులు కూడా వున్నారు) యీ దేశంలో వున్నారన్న సంగతి నాకు తెలుసు. అయితే, నా వుద్దేశ్యం ఏమంటే, పాలిత జాతులకు రాజకీయాలు మినహా ఏమీ వుండరాదు. పరాధీన దేశంలో నీవు ఆలోచించే ప్రతి సమస్యనూ సతక్రమమైన రీతిలో విశ్లేషించినపుడు, దాని అట్టడుగున రాజకీయ సమస్య కనపడుతుంది. దివంగత దేశబంధు సి.ఆర్‌. దాసు చెప్పినట్లుగా, జీవితం అవిభాజ్యమైనది, కనుక విద్య నుంచి రాజకీయాలను వేరుచేయలేము. మానవ జీవితాన్ని వేర్వేరు భాగాలుగా విడదీయచేము. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 128

రాజకీయాలలో పాల్గొనడంపై ప్రత్యేకమైన నిషేధం ఎందుకో నేను అర్ధం చేసుకోలేక పోతున్నాను. సాధారణంగా దేశానికి సంబంధించిన పనిపై అలాంటి నిషేధమేమీ లేనపుడు యిది మాత్రం ఎందుకు? మొత్తంగా దేశానికి సంబంధించిన పనిపై నిషేధాన్ని విధించి వున్నట్లయితే దానిని నేను అర్థం చేసుకోగలిగే వాడిని, కేవలం రాజకీయ కార్యక్రమాలపై మాత్రమే నిషేధం విధించటం అర్ధంలేని పని. పరాధీన దేశంలో సమస్యలన్నీ రాజకీయమైనవే అయినట్లయితే, అలాంటపుడు, దేశ సంబంధమైన కార్యకలాపాలన్నీ రాజకీయ స్వభావాన్ని కలిగినవే అయ్యుంటాయి. రాజకీయాలలో పాల్గొనటంపై ఏ స్వేచ్చా దేశంలోనూ నిషేధం లేదు. తద్విరుద్ధంగా రాజకీయాలలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. విద్యార్ధుల నుంచే రాజకీయ చింతనాపరులు, రాజకీయవేత్తలు ఉద్భవిస్తారు కనుక వారికి వుద్దేశ్యపూర్వకంగానే ప్రోత్సాహాన్ని అందచేస్తారు. భారతదేశంలో, విద్యార్ధులైన వారు రాజకీయాలలో క్రియాశీల పాత్రను నిర్వహించనట్లయితే రాజకీయ కార్యకర్తలను మనం ఎక్కడ నుంచి తీసుకుంటాము, వారికి ఎక్కడ శిక్షణ యిస్తాము? అంతేకాక, స్వాభావికంగా, మానవీయంగా అభివృద్ధి చెందాలంటే రాజకీయాలలో పాల్గొనటం అవసరమన్న విషయాన్ని పలువురు ఆమోదించారు.

ఆచరణతో ముడిపడని ఆలోచన వ్యక్తిత్వ వికాసానికి దోవదపడదు. కనుకనే, ఆరోగ్యకరమైన అంటే, రాజకీయ, సామాజిక లేదా కళాత్మక కార్యకలాపాలలో పాల్గొనటం అవసరం. పుస్తకాల పురుగులను, స్వర్హపతక విజేతలను, ఆఫీసు క్లర్కులను తయారు చేయటానికికాదు విశ్వవిద్యాలయాలు కృషి చేసేది. విభిన్న జీవిత రంగాలలో తమ దేశం కోసం మహత్మార్యాలను సాధించి మహానుభావులుగా మారేవారి కోసం అవి పాటుపడాలి.

భారతదేశమంతటా అసలుసిసలైన విద్యార్థి వుద్యమాల పెరుగుదల యీ కాలపు ప్రోత్సాహకర లక్షణాలలో ఒకటిగా వున్నది. విస్సతమైన యువజనోద్యమంలో యీ వుద్యమం ఒక దశగానే నేను భావిస్తాను. గత దశాబ్దం నిర్వహించిన వాటికీ యీనాడు జరుగుతున్న విద్యార్థి సదస్సుకూ మధ్య చాలా పెద్ద తేడాయే వున్నది. తదనంతర కాలానికి చెందినవి అధికారిక ఆశీస్సులను కలిగివుండి, “రాజకీయాల గురించి మాట్లాడకండి" అన్న ప్రకటన తలవాకిటనే దర్శనమిస్తుంది. చక్రవర్తికి విధేయతను ప్రకటిస్తూ తీర్మానాలు చేసిన భారత జాతీయ కాంగైసు ప్రారంభ మహాసభలను యీ సదస్సులు గుర్తుకు తెస్తున్నాయి. అదృష్టవశాత్తు మనం ఆ దశను 129... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

దాటివచ్చాము. భారత జాతీయ కాంగ్రెసు మాత్రమేకాక విద్యార్థి వుద్యమం కూడా యీ దుర్దశను దాటింది. ప్రస్తుతం జరుగుతున్న విద్యార్ధి మహాసభలు స్వేచ్చా వాతావరణంలో జరుగుతున్నాయి. భారత శిక్షాస్మృతికి లోబడి ఏ అంశంపైనా అయినా ప్రసంగించవచ్చు.

ఈనాటి వ్యవస్థ పట్ల వర్తమాన యువజనోద్యమం అశాంతితోనూ, అసహనంతోనూ వున్నది, నూతనమూ, మహోన్నతమూ అయిన శకంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నది. బాధ్యతా, ఆత్మత్యాగ స్ఫూర్తీ యీ వుద్యమాన్ని ఆవహించి వున్నాయి. అన్ని బాధ్యతలనూ పెద్దవాళ్ళకు వదిలివయటంలో యింకెంతో కాలం యీనాటి యువతరానికి సంతృప్తి వుండదు. ఈ దేశమూ, దేశ భవితవ్యమూ పెద్దలకన్నా తమకే ఎక్కువగా చెందుతుందని వారు భావిస్తున్నారు. కనుకనే పూర్తి బాధ్యతలను స్వీకరించటాన్ని తమ విద్యుక్త ధర్మంగా వారు భావిస్తూ, యీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటందుకుగాను తమను తాము సన్నద్ధం చేసుకుంటున్నారు. విసృత యువజనోద్యమంలో ఒక దశగా వున్న విద్యార్థి వుద్యమం కూడా యిదేరకమైన దృక్సథంతో, మనస్తత్వంతో, వుద్దేశాలతో వున్నది.

ఈనాటి విద్యార్థి వుద్యమం బాధ్యతా రహితులైన బాలబాలికల వుద్యమం కాదు. తమ గుణ శీలాదులను, వ్యక్తిత్వాన్నీ మెరుగుపరిచే ఆదర్భ్శంతో స్ఫూర్తిపొంది, దేశం కోసం అత్యంత ప్రతిభావంతమూ, ప్రయోజనకరమూ అయిన సేవ చేయాలన్న యువతీయువకులు నడుపుతున్న బాధ్యతాయుతమైన వుద్యమమిది. ఈ ఉద్యమం రెండు విధాలైన ఆచరణను కలిగి వున్నది, లేదా, కలిగి వుండాలి. మున్ముందుగా, ప్రత్యేకించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చేపట్టి, జీవిత సమరానికి వారిని తర్భీదు చేయాలి. ఇందుకుగాను జీవిత ప్రాంగణంలో అడుగిడినపుడు ఎదురయ్యే సమస్యల గురించి, కార్యకలాపాల గురించి వారికి తెలియ చెప్పాలి.

ఉద్యమం యొక్కరెండవ అంశం నిరుత్సాహ పరచదగినదీ, ఖండించదగినది, చివరకు అడ్డుకోవలసిందీ అయినప్పటికీ, పైన నేను ప్రస్తావించిన విద్యార్ధి వుద్యమం యొక్కమొదటి అంశాన్ని అధికారుల పట్లవున్న అననుకూల దృష్టి కారణంగా సాధారణ దృక్పథంతో చూడగూడదు. మొదటి అంశం కింద మీరు చేయవలసిన కార్యక్రమాలను సవివరంగా తెలియ చెప్పటం నాకు అంత అవసరం కాదు. అది కొంతవరకు మీకున్న (ప్రత్యేక అవసరాలపైనా, కొంతవరకు విద్యాధికారులు చేసే ఏర్పాట్లపైనా ఆధారపడి వుంటుంది. ప్రతి విద్యార్థీ దృఢమైన, ఆరోగ్యకరమైన దేహాన్నీ నిశ్చల స్వభావాన్నీ సధాన్‌ చండ్ర బోన్‌ జపత రచనలు, ఉవన్యానద తద 150

అదేవిధంగా (ప్రయోజనకరమైన సమాచారంతోనూ, స్వస్థత, క్రియాశీల భావాలతోనూ నిండిన మేథస్సును తప్పనిసరిగా కలిగి వుండాలి. అధికారులు చేసిన ఏర్పాట్లు శారీరక, మానసిక, మేథోపరమైన పురోగతికి అనుకూలంగా లేనట్లయితే, అలాంటి పురోగతికి అవసరమైన సౌకర్యాలను మీరు అందచేయాల్సి వుంటుంది. ఈ విషయంలో మీ ప్రయత్నాలను అధికారులు హర్షించినట్లయితే మీకు మంచిది, ఒకవేళ వారలా చేయని పక్షంలో మీ దారిలో మీరు ముందుకు పదండి. మీ జీవితం మీ స్వంతం, దానిని అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత యితరులకన్నా మీకే ఎక్కువ వుంటుంది.

ఈ సందర్భంగా నేను మీకొక సలహా యిస్తాను. విద్యార్థి సంఘాలు తమతమ పరిధిలో, ప్రత్యేకించి విద్యార్థుల సౌకర్యం కోసం సహకార స్వదేశీ దుకాణాలను ప్రారంభించాలని నేను కోరుతున్నాను. ఈ దుకాణాలను విద్యార్థులు సమర్ధవంతంగా నడిపినట్లయితే రెందు రకాలైన ఉపయోగాలు నెరవేరుతాయి. ఒకవైపున చౌక ధరలకు స్వదేశీ సరకులు విద్యార్ధులకు అందుతాయి, దానివలన దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. మరోవైపున సహకార దుకాణాలను నడపటంలో విద్యార్థులకు అనుభవం లభిస్తుంది, వాటి నిర్వహణ ద్వారా వచ్చే లాభాలను విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగ పెట్టవచ్చు.

విద్యార్థుల సంక్షేమాన్ని ముందుకు కొనిపోయేందుకై మీ కార్యక్రమంలో మరికొన్నిటిని కలపాలి. అవి; దేహ దారుధ్య సంఘాలు, వ్యాయామ శాలలు, అధ్యయన తరగతులు, చర్చా వేదికలు, పత్రికలు, సంగీత కేంద్రాలు, గ్రంథాలయాలు, పళనాలయాలు, సామాజిక సేవా కేంద్రాలు వగైరాలను అందుబాటులోకి తీసుకు రావాలి.

విద్యార్థి వుద్యమానికి చెందిన బహుశ అత్యంత ప్రథానమైన మరొక అంశమేమంటే, భావి పౌరులకు శిక్షణ యివ్వటం. ఈ శిక్షణ రెండు రకాలుగా, అంటే, మేధోపరంగా, ఆచరణాత్మకంగా వుండాలి. మనం, విద్యార్థుల ముందు ఆదర్శ సమాజ చిత్రాన్ని వుంచాలి, అలా చేసినట్లయితే వారు తమ జీవిత కాలంలోనే దానిని నిజం చేయటానికి కృషి చేస్తారు. వారు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని, తమ శక్తిమేర దానిని అనుసరించటానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో విశ్వవిద్యాలయ అనంతర జీవితానికి తమను తాము సన్నద్ధం చేసుకుంటారు. ఈ క్రమంలో అధికారులతో ఘర్షణ పడవలసి రావచ్చు. అయితే యీ ఘర్షణ తలెత్తుతుందా, లేదా అన్నది ప్రధానంగా విద్యా విభాగానికి, ప్రభుత్వానికి చెందిన అధికారుల వైఖరిపై జానా భర్య

ఆధారపడి వుంటుంది. దురదృష్టవశాత్తు ఘర్షణ తలెత్తినట్లయితే, అప్పుడిక విద్యార్థులు నిర్భయంగా, స్వశక్తితో విశ్వవిద్యాలయ అనంతర జీవితాన్ని తీర్చిదిద్దు కోవటానికి

తమను తాము సన్నద్ధం చేసుకోక తప్పదు.

మనమందరమూ అనుసరించ వలసిన ఆదర్శం గురించి నా అభిప్రాయాన్ని ప్రకటించటానికి ముందు మీ అనుమతితోనే అసంగతం కాని మరో విషయాన్ని ప్రస్తావిస్తాను. ఈనాడు, ఐరోపా పాదాల ముందు ఆసియా సాగిలబడటాన్ని గమనించిన ఆసియావాసి వేదనతోనూ, అవమానంతోనూ కుంగిపోకుండా వుందడలేడు. ఆసియా సర్వేసర్వత్రా యిదే స్థితిలో వున్నదన్న భావనను విడిచి పెట్టవలసిందిగా నేను మిమ్మలను కోరుతున్నాను. ఈనాడు ఐరోపా మొనగాడుగా వుండవచ్చుగాక, కాని, ఆసియా కూడా మొనగాడుగా నిలచిన కాలమంటూ ఒకటి వున్నది. ప్రాచీన కాలంలో ఐరోపాలోని అత్యధిక భాగాన్ని ఆసియా జయించిందని, అప్పటిలో శక్తివంతమైన ఆసియాను చూసి ఐరోపా భయపడేదని చరిత్ర చెపుతున్నది. అయితే, యిప్పుడు పరిస్థితి తారుమారయ్యింది, కాని, ఆదృష్ట చక్రం ఆగకుండా తిరుగుతూనే వున్నందున నిరాశపడ వలసిన అవసరం లేదు. ప్రస్తుతం, ఆసియా బానిస శృంఖలాలను ఛేదించే పనిలో పూర్తిగా నిమగ్నమై వుంది, చైతన్యవంతమైన ఆసియా గతకాలపు అంధకారం నుంచి బయటపడి అధికారాన్ని చేపట్టి, వైభవంతో దేదీప్యమానంగా వెలిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. స్వతంత్ర దేశాల సరసన తానుకూడా గర్వంగా నిలవగలదు.

ఒకప్పుడు టర్మీని 'ఐరోపా వ్యాధిగ్రస్తుడని” పిలిచినట్లుగానే, అజరామరమైన (ప్రాచ్యాన్ని 'జడత్వంతో కూడుకున్నదని' అంటూ పొశ్చాత్యం నుంచి వచ్చిన బేహారులు అపనింద వేశారు. కాని, యీ అపనింద మొత్తంమీద ఆసియాకు, ప్రత్యేకించి టర్కీకి ఎంతోకాలం వర్తించ లేదు. జపాన్‌ నుంచి టర్కీ వరకు, సైబీరియా నుంచి సిలోన్‌ వరకు యావత్తు ప్రాచ్య ప్రపంచం చైతన్యంతో కళకళలాడ సాగింది. ప్రతిచోటా మార్చు, పురోగతి, సంప్రదాయాలతో ఘర్షణ కనిపిస్తున్నది. తాను అనుకున్నంత కాలం మార్చులేకుండా వున్న ప్రాచ్యం, ముందడుగు వేయాలని తీర్మానించుకోగానే వళ్చిమ దేశాలకన్నా వేగిరంగా పురోగతి బాటపట్టింది. ఈనాడు ఆసియాలో జరుగుతున్నదిదే.

ఆసియాలోనూ, ప్రత్యేకించి భారతదేశంలోనూ కనిపించే కార్వశీలతా, ఆందోళనలు నిజ జీవిత చిహ్నాలా లేక బాహ్య (ప్రేరణలా అని మనలను అడుగుతుంటారు. చచ్చుబడిన అవయవాలు సైతం (ప్రేరణను పొందగలవు, అయితే, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 132

యీనాడు జరుగుతున్న ఆందోళనలు చచ్చుపడిన కండరాల వంటివి కాదని కచ్చితంగా చెప్పవచ్చు. జీవిత పరీక్ష సృజనాత్మక కార్యకలాపం, ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాలు మౌలికతకూ, మేథో సృజనాత్మకతకూ సాక్ష్యంగా నిలబాయనే నేను విశ్వసిస్తున్నాను. ఒక జాతిగా మనం సజీవంగా వున్నాము, జాతి జీవనానికి సంబంధించిన వివిధ రంగాలలో చోటుచేసుకున్న పునర్వికాసానికి మనం సాక్షీభూతులుగా వున్నాము, యిదంతా లోలోపలనే సంభవిస్తున్న జాగృతి. చీకటి యుగాల నుండి ఆవిర్భవించిన భారతీయ నాగరికత యిప్పుడు పునరుజ్జీవన దశలో ప్రవేశించింది. ఒకనొక సమయంలో మన నాగరికత కూడా ఫానీషియా, బాబిలోనియాల నాగరికతల వలెనే అంతరించిపోయే ప్రమాదాన్ని నిజంగానే ఎదుర్కొన్నది. కాని. కాలం విసరిన కత్తివేటును తప్పుకుని సజీవంగా నిలచింది. ప్రారంభమైన పునరుజ్జీవన క్రమం కొనసాగాలని మనం కోరుకున్నట్లయితే ఆలోచనా వ్రవంచంలో భావ విప్లవాన్ని తీసుకు రావాలి. చరిత్ర తీర్పును తిరస్మరించకుండా, అదేవిధంగా, సర్‌ వ్లిండర్స్‌ పెటివంటి చింతనాపరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే పురాతన, మృత నాగరికతలు యీ పద్ధతిలోనే పునరుజ్జీవనం చెందాయని మనం (గ్రపించగలము. ఒకవేళ నా అభిప్రాయాన్ని మీరు అంగీకరించని పక్షంలో నాగరికతల ఉత్థాన పతనాలకు సంబంధించిన నియమాన్ని మీరు మీ స్వంత పరిశోధనలతో కనిపెట్టవలసి వుంటుంది. ఈ నియమాన్ని కనుగొనటంలో మనం ఒక్కసారిగాని సఫలీకృతులం కాగలిగితే మన యీ పురాతన భూమిలో ఆరోగ్యకరమైన, పురోగమనశీలమైన నూతన జాతి నిర్మాణానికి ఏమి చేయాలో దేశ ప్రజలకు సలహా యివ్వటానికి వీలుగా వుంటుంది. భావ విప్లవాన్ని తీసుకు రావాలని మనం ఆశించినట్లయితే ముందుగా

మన యావజ్జీవితాన్ని ఉత్తేజపరిచే ఆదర్శాన్ని మన ముందుంచు కోవాలి. ఆ ఆదర్శం స్వతంత్రమైనది. స్వతంత్రం అన్న పదానికి రకరకాల అర్భాలున్నాయి. మన దేశంలో స్వతంత్రం అంటే అదొక క్రమపరిణామంగా భావిస్తున్నారు. నా ఉద్దేశంలో స్వతంత్రం అంటే బహుముఖీనమైనది, వ్యక్తికి, అదేవిధంగా, సమాజానికి స్వతంత్రం; ధనికులకు అదేవిధంగా పేదలకు స్వతంత్రం; వ్యక్తులందరికీ, అన్ని వర్గాలకూ స్వతంత్రం. స్వతంత్రం అంటే కేవలం రాజకీయ బానిసత్వం నుంచి జరిగే విమోచనకు మాత్రమే వర్తించదు, సంపద సమానంగా పంపిణీ కావాలి, కులం గోడలు, సొమాజిక అసమానతలు తొలగి పోవాలి, మతోన్మాదమూ, మత అసహనమూ నిర్మూలనం కావాలి. సనాతనులైన స్త్రీ పురుషుల దృష్టిలో యీ ఆదర్భం కేవలం ఊహాజనితమైనదే కావచ్చు, కొని, యీ ఆదర్శం మాత్రమే ఆత్మ క్షోభకు ఉపశాంతిని చేకూర్చ గలదు. 183 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

స్వాతంత్ర్య సాధనకు మనకున్న ఒకేఒక మార్గం స్వతంత్ర మానవునిగా ఆలోచించటం, అనుభూతి చెందటం. మన లోలోపల సంపూర్ణ విష్లవం చోటుచేసుకోవాలి, స్వాతంత్ర్య మధుపానంతో మత్తెక్కిపోవాలి. స్వాతంత్ర్య మధుపానంతో మత్తుగిలిన స్రీ పురుషులు మాత్రమే మానవ జాతిని విముక్తి చేయగల శక్తిశాలురవుతారు. ఎప్పుడైతే మనం "స్వేచ్భా వర్తనులిమవుతామో అప్పుడు మాత్రమే కార్యాచరణ అనే సముద్రంలోకి దూకగలము. హెచ్చరిక గళాలు నునను యింకెంతో కాలం నిరోధించలేవు, సత్యాకర్షణ, (ప్రతాపాదులు మాత్రమే మనలను నిర్దేశిత లక్ష్యానికి చేర్చగలవు.

మి(త్రులారా, నా జీవిత లక్ష్యం గురించి నేనేమని భావిస్తున్నానో, ఆలోచిస్తున్నానో, స్వష్నిస్తున్నానో, అలానే, నేను చేపట్టే కార్యక్రమాలన్నిటి వెనుక వున్న చోదక శక్తి యేమిటో మీకు కొంతమేరకైనా చెప్పేటందుకు (ప్రయత్నించాను. ఇది మిమ్మలను ఆకట్టుకున్నదీ లేనిదీ నేనెరుగను. అయితే, ఒక విషయం మాత్రంనా ముందు చాలా స్పష్టంగా నిలచింది: జీవితానికి ఒకే అర్ధం, ఒకే ప్రయోజనం వున్నది, అదేమంటే, (ప్రతి ఒక్క తరహా దాస్యం నుంచి విముక్తి కావటం. ఆత్మ గానమే స్వాతంత్ర్యం- నవజాత శిశువు వేసే తొలి కేక, తాను చిక్కుపడిన బంధనాలను వ్యతిరేకంగా వేసే తిరుగుబాటు కేక. మీలోనూ, మీ దేశీయులలోనూ వున్న స్వాతంత్ర్య వాంఛను రగిలించండి, స్వల్ప కాలంలోనే భారతదేశం స్వాతంత్ర్యాన్ని సముపార్దించ గలదని నేను పూర్తిగా నమ్ముతున్నాను.

భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధిస్తుంది, యిందులో రవ్వంత కూడా సందేహం లేదు. నా దృష్టిలో యిది రాత్రివెంట పగలు రావటమంత కచ్చితమైనది. భారతదేశాన్ని యింకెంతో కాలం దాస్యంలో బంధించి వుంచే శక్తియేదీ యీ భూతలంపై లేనేలేదు. మనం భారతదేశాన్ని గురించి స్వప్పిద్దాం, మనకు కలిగినదంతా యివ్వదగినదంతా, -చివరకు ప్రాణాలను సైతం- యివ్వదగినంత విలువైనదీ దేశం, దీనికోసం అయిన వాళ్ళందరినీ త్యాగం చేస్తాము. స్వాతంత్ర్యం గురించి నాకున్న భావనలన్నిటినీ మీముందుంచాను, నేను కోరుతున్న భారతదేశాన్ని మీ కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించాను. భారతదేశాన్ని సంపూర్ణంగా విముక్తి కానివ్వండి, స్వాతంత్ర్యం గురించి నూతన సువార్తను ప్రపంచానికది వినిపిస్తుంది.

దురహంకారినని పిలిస్తే పిలవనివ్వండి, నా దేశీయులకు నేను ఒక సంగతి చెప్పదలచుకున్నాను, భారతదేశం నెరవేర్చవలసిన కార్యం ఒకటి వున్నది, ఆ కారణంగా భారతదేశం యిప్పటికీ సజీవంగానే వున్నది. 'కార్యం' అన్న పదంలో ఎలాంటి మర్మమూ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 194

లేదు. మానవ జీవితానికి చెందిన దాదాపు ప్రతి విభాగంలోనూ ప్రపంచ సంస్కృతీ,

నాగరికతలకు దోహదపడగల ఒకానొక మౌలికత భారతదేశానికి వున్నది. ఈనాడు

మన దేశం దైన్యస్థితిలోనూ, బానిసత్వంలోనూ మగ్గుతున్నప్పటికీ అది చేస్తున్న దోహదం

తక్కువేమీ కాదు. ఒక్క క్షణం నిలబడి ఆలోచించండి, దేశం స్వతంత్రమై, తనదైన

మార్గంలో, తన అవసరాల మేరకు అభివృద్ధి చెందినపుడు అది చేయగల మహత్తర

'సేవల గురించి తెలుసుకోండి.

స్వాతంత్ర్య సూత్రాన్ని బహువిధాలుగా వర్తింప చేయటానికి యిష్టపడని

జనులు -వీరిలో కొందరు ప్రముఖులు, గౌరవనీయులు - యీ దేశంలో వున్నారు.

వారిని సంతృప్తి పరచలేకపోతే అందుకు క్షమాపణలు చెపుదాము, కాని, సత్యము,

న్యాయము, సమానత పునాదులపై నిలచిన మన ఆదర్శాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ

విడనాడబోము. ఇతరులు మనతో కలవనీ, కలవకపోనీ మనం మాత్రం మన

మార్గంలోనే పయనిస్తాము, ఎవరైనా కొంతమంది మనలను విడిచిపెట్టినప్పటికీ

అంతిమంగా వేల సంఖ్యలో, యింకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో మన స్వాతంత్ర్య సైన్యంలో కలుస్తారు. కాగా, దాస్యంతోటీ, అన్యాయాలతోటీ, అసమాత్వంతోటీ మనం ఎంతమాత్రం రాజీపదడబోము.

మిత్రులారా, స్వాతం(్య దచ్రియులందరూ కలసి ఆనందకరమైన సౌభ్రాత్భత్వంతో, స్వతంత్ర సైనిక దళాలను ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఈ దళాలను కేవలం స్వాతంత్ర్య సమరంలో పోరాడటానికి పంపించటమేకాక, స్వాంతంత్ర్యానికి చెందిన నూతన సంప్రదాయాలను ప్రచారం చేసే దూతలుగా కూడా పంపించాలి. మీలో నుంచే యీ దూతలు, సైనికులు తయారు కావాలి. మన కార్యాచరణ ప్రణాళికలో ఒకవైపున ముమ్మరమైన, విస్ఫృతమైన ప్రచారం, మరొక వైపున, దేశవ్యాప్త స్వచ్చంద సేవకుల నిర్మాణం వుండాలి. మన దూతలు రైతుల్లోకీ, ఫ్యాక్టరీ శ్రామికుల్లోకి వెళ్ళి నూతన సందేశాన్ని అందించాలి. వారు యువజనులకు స్ఫూర్తినిస్తూ, దేశవ్యాప్తంగా యువజన సంఘాలను నిర్మించాలి. చివరగా చెప్తన్నప్పటికీ చిన్నదికాని విషయమేమంటే, వారు యావత్తు మహిళా లోకాన్ని కదిలించాలి, స్రీలు కూడా ముందుకువచ్చి రాజకీయ రంగంలో పురుషులతో సమానంగా పాల్గొనాలి. భారత జాతీయ కాం(గైసులో పాల్గొనేందుకుగాను ప్రస్తుతం మిమ్మలను

మీరు తర్భీదు చేసుకోవాలి. ఈ దేశంలో భారత జాతీయ కాంగైసు అత్యున్నతమైన జాతీయ సంస్థ అనటంలో సందేహం లేదు. దానిలో మన ఆశలన్నీ కేంద్రీకృతం క్షేతిక్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కావాలి. అయితే, భారత జాతీయ కాంగ్రెసు తాను బలోపేతం కావటానికీ, ప్రజలను ప్రభావితం చేయటానికీ, శక్తిమంతంగా తయారు కావటానికీ కార్మిక ఉద్యమం, యువజన ఉద్యమం, రైతు ఉద్యమం, మహిళా ఉద్యమం, విద్యార్ధి ఉద్యమం వంటివాటిపై ఆధారపడాలి, ఆధారపడి తీరాలి. మనంగానీ, కార్మికులను, కర్షకులను, అణగారిన వర్గాలను, యువజనులను, విద్యార్థులను, మహిళా లోకాన్నీ కూడగట్టటంలో మనం సఫలీకృతం కాగలిగితే, రాజకీయ విముక్తిని సాధించగల శక్తివంతమైన ఉ ద్యమాన్ని నడపగల బలాన్ని భారత జాతీయ కాంగ్రెసుకు యిచ్చిన వారమవుతాము. మీరుగాని భారత జాతీయ కాంగ్రెసు సమర్ధంగా పనిచేయాలని కోరుకున్నట్లయితే, అదే సమయంలో మీరు నేను ప్రస్తావించిన సోదర ఉద్యమాలను బలోపేతం చేయాల్సి వుంటుంది. -

మన పొరగునే చైనా దేశం వున్నది. ఇటీవలి చైనా చరిత్రలోని ఒక పుటను చూద్దాము. తను మాతృభూమి కోసం చైనా విద్యార్థులు ఏం చేశారో తెలుసుకోండి. భారత దేశం కోసం మనం అలాంటి పని చేయలేమా? ఆధునిక చైనాలో పునర్వికాసం చోటుచేసుకున్నదంటే అందుకు దాదాపుగా చైనా విద్యార్థులు, అంటే, యువతీ యువకులిరువురూ కారణమని చెప్పాలి. వారు ఒకవైపున స్వాతం(త్ర సందేశాన్ని వినిపించేందుకై గ్రామాలకు, పట్టణాలకు, ఫ్యాక్టరీలకు తరలి వెళ్ళారు, మరోవైపున యావద్దేశాన్నీ ఆ చివర నుంచి యీ చివరవరకు సంఘటిత పరిచారు. ఈ పద్ధతినే మనం భారతదేశంలో పాటించవలసి వుంది. స్వాతంత్ర్యానికి రాజమార్గం ఏదీ లేదు. స్వాతందత్ర్య పథం ముళ్ళబాట అనటంలో సందేహం లేదు, అయితే అది మహోజ్వల వైభవానికీ, అజరామరత్వానికి కూడా దారితీస్తుంది. రండి, గతాన్నుంచి బయటపదడదాం, యుగయుగాలుగా మనలను బంధించి వుంచిన శృంఖలాలన్నింటినీ ఛేదిద్దాము, అసలుసిసలైన లక్ష్య సాధకులవలె భుజం భుజం కలిపి స్వాతంత్ర్య గమ్యం వైపుకు సాగుదాము. స్వాతంత్ర్యం అంటే అర్థం జీవితం, స్వాతంత్రోద్యమంలో మరణానికి అర్థం అనశళ్వరమైన కీర్తి వ్రతిష్టలు. కనుక మనం స్వేచ్చగా వుండాలని నిశ్చయించుకుందాము, కనీసం స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలను అర్చించుదాము. మన ్రవర్తనతో, మన గుణగణాలతో అమరజీవి జతీం[ద్రనాథ్‌ దేశీయులమని అనిపించుకుందాము.

ల

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 136

బహదూర్‌ షా సమాధివద్ద చేసిన ప్రసంగం

మహా ఘనతవహించిన దాక్టర్‌ బ మా, మిత్రులారా! ఈనాడు మనం స్వతంత్ర భారతదేశపు చివరి చక్రవర్తియైన బహదూర్‌ షా సమాధి సమీపంలో సమావేశమయ్యాము. భారతదేశపు చిట్టచివరి చక్రవర్తి అవశేషాలకు బర్మా భూభాగం నెలవుకాగా, బర్మా దేశపు ఆఖరు చక్రవర్తి అవశేషాలకు భరత భూమి స్థావరంగా మారింది. ఈ యాదృచ్చికత ఒక చారిత్రక వైచిత్రి. భారతదేశంలోనూ, బర్మాలోనూ వున్న మనమందరం చారిత్రకంగా సుదృఢ సంబంధాలను కలిగి వున్నాము. మవి ఘనత వహించిన మీ దేశానికీ, మా దేశానికి మధ్యవున్న సంబంధాలకు పైన తెల్పిన చారిత్రక యాదృచ్చికత రుజువుగా వున్నది.

మనమూ, మన రెండు దేశాలూ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా వుమ్మడి పోరాటాన్ని చేస్తున్నాము, కనుకనే, మనం మన ఆఖరు చక్రవర్తి అవశేషాల ముందు మనమీ చిన్న కార్యక్రమాన్ని జరుపుకోవటానికి తగిన వారమయ్యాము. ఒక రకంగా మనలో మండుతున్న అగ్ని జ్వాలలను మరింతగా మండిస్తూ, అదే సమయంలో బర్మాను, భారతదేశాన్నీ అన్ని వేళలా కలిపి వుంచుతున్న బంధాలను దృధతరం చేద్దాము. ఈ చిన్న కార్యక్రమానికి దయతో విచ్చేసి మాకెంతో గౌరవాన్ని కల్పించిన మహాఘనత వహించిన మీకు, గౌరవనీయులైన ప్రభుత్వ సభ్యులకు మేము ఎంతో రుణపడి వున్నాము. రానున్న రోజుల్లో సంభవించనున్న అత్యంత ప్రధానమూ, చారిత్రకమూ కానున్న ఘటనలను తనలో నిక్షిప్తం చేసుకున్న కార్యక్రమమిది.

బర్మా మిత్రులతో భుజం భుజం కలిపి పోరాడాలన్న మా దృఢదీక్షను చ... “౩13 నెప్టెంరు 2డవతేదీన

రంగాన్‌లోని ఐవుదూల్‌ షా గోరీ వద్ద చేసిన ప్రనంగం)

షత గౌతమ్‌ ఛటోపాధ్యాయ

మరోసారి ప్రకటించాలనుకుంటున్నాను. నిష్పన్‌ ఉదార సహాయము, మద్దతుతో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని కూలదోసి ఒకవైపున భారతదేశం కోల్పోయిన స్వేచ్చను సంపాదించటం, అలానే, మరోవైపున బర్మా రక్షణకూ, స్వాతంత్ర్యానికీ ఆటంకాలను తొలగించటం జరగుతుంది. ఎవరైతే మనుషుల్లో చక్రవర్తిగానూ, చక్రవర్తుల్లో మనీషిగానూ వుంటూ, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆఖరి యోధునిగా వున్నాడో, ఆయన పవిత్ర అవశేషాల ముందు తిరుగులేని మా దృఢ నిశ్చయాన్ని మరోసారి వ్యక్తం చేయాలనుకుంటున్నాము. బహదూర్‌ షా స్మృతిని మేము కాపాడు కుంటాము. భారతీయులమైన మేము, మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ఆయన స్మృతిని కాపాడుకుంటామని చెప్త్పున్నామంటే, అందుకు కారణం శత్రువుకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా తన దేశీయులను ఉద్దేశించి సమర శంఖాన్ని పూరించటమేకాక, సమస్త ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆయన ఎత్తిన పతాకం కింద చేరి పోరాడారు, యిదే అసలైన కారణం. విభిన్న మత విశ్వాసాలు కలిగిన భారతీయులు ఆయన ఎత్తిన పవిత్ర పతాకం కింద ముస్లిములు, హిందువులు, సిక్కులు కనీసం స్వాతంత్ర్య ప్రియులైన హిందువులు, ముస్లింలు, సిక్కులు చేయిచేయి కలిపి యుద్ధంలో పాల్గొన్నారు. దీనిని ఇంగ్లీషు చరిత్రకారులు సిపాయి తిరుగుభాటు అని పిలవగా భారతీయులమైన మనం మాత్రం దానిని ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలుచుకున్నాము. కాగా మనమిప్పుడు భారత స్వాతంత్ర్యం కోసం తుది సమరంలో మునిగి వున్నాము. బాధలను, త్యాగాలను లక్ష్యపెట్టకుండా, మన మార్గంలో ఎదురయ్యే యిబ్బందులను పట్టించుకోకుండా, యుద్ధం ఎంతకాలం సాగినా వెనుకడుగు వేయకుండా తుది సమరాన్ని పూర్తిచేస్తామన్న మన తిరుగులేని నిశ్చయాన్ని పునరుద్దాటించుదాము. ఆ విధంగా బర్మా, భారతదేశముల ఉమ్మడి శత్రువును పారద్రోలి, కేవలం మన దేశాలకు మాత్రమే స్వతంత్రాన్ని సంపాదించడంకాక, మానవ జాతి సమష్టి లక్ష్య సాధన కోసం సహచరులవలె భుజం భుజం కలిపి ప్రయాణించుదాము. గౌరవనీయులారా, యిటువంటి పవిత్ర స్థలాల్లో కానుకలు పెట్టటం, సేవలు చేయటం మన ఆచారం. మా మనోభావాలకు, విశ్వాసాలకు (ప్రతీకగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి చెందిన చివరి నాయకుడైన బహదూర్‌ షా చక్రవర్తి పేరున యివ్వటంకన్నా గొప్పదైన కానుక లేదా నజర్‌ మరొకటి వుండబోదని నేను భావిస్తాను. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 138

మవావునత వహించిన మీకు యీ చిన్న మొత్తమైన రూ.2,50,000లను

యిచ్చుకుంటున్నాను. బర్మాపట్ల మాకున్న (ప్రేమను, ఆదరణను యీ చిన్న మొత్తం

తెలియ చేస్తుంది. మహాఘనత వహించిన మీరు దేనినైతే ఉత్తమమనుకుంటారో దానికి

యీ చిన్న మొత్తాన్ని వ్యయం చేయగలరు.

బహుదూర్‌ షా కూర్చిన ఒక ద్విపద అర్ధాన్ని చెప్పి నాయీ ప్రసంగాన్ని

ముగిస్తాను. “భారత స్వాతంత్ర యోధుల ఆత్భల్లో చిట్టచివరి విశ్వాన శకలం వున్నంత వరకు లందన్‌ వృాదయంలో భారతీయ ఖడం (గుచ్చుకుంటూనే వుంటుంది*

౮6

189 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

తాత్కాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వ స్థాపన

1757లో బెంగాల్‌నందు మొట్టమొదటి సారిగా బ్రిటిష్‌వారి చేతుల్లో పరాజయం పాలయిన తరువాత దాదాపు వంద సంవత్సరాలపాటు భారతీయులు అవిరామంగా భీకర పోరాటాలు సాగించారు. ఈ కాలంలో 'ప్రదర్శితమైన సాటిలేని సాహసానికి, ఆత్మ త్యాగాలకు సంబంధించిన పలు ఉదాహరణలను చరిత్ర నమోదు చేసింది. చరిత్ర పుటల్లో స్థానాన్ని సంపాదించిన బెంగాల్‌కు చెందిన సిరాజ్‌ ఉద్‌ దౌలా, మోహన్‌ లాల్‌, దక్షిణ భారతానికి చెందిన హైదర్‌ ఆలీ, టిప్పుసుల్తాన్‌, వేలు థంపి, మహారాష్ట్రకు చెందిన అప్పా సాహిబ్‌ భోంస్తే, పీష్వా బాజీరావులు, బెద్‌ బేగం, పంజాబ్‌కు చెందిన సర్దార్‌ శ్యామ్‌ సింగ్‌ అటరివాల, చివరగా చెప్తున్నప్పటికీ ఎవరికీ తీసిపోని రూన్సీ రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, దుమ్‌రావ్‌కు చెందిన మహారాజ కున్వర్‌ సింగ్‌, నానా సాహెబ్‌ వంటి మహా యోధుల పేరులు సువర్ధాక్షూలతో లిఖించబడ్డాయి. దురదృష్టవశాత్తు మన పూర్వీకులు, బ్రిటిష్‌వారి కారణంగా యావద్భారత దేశానికి ఎదురయ్యే ముప్పును గ్రహించలేక పోయారు. కనుకనే, శత్రువుకు వ్యతిరేకంగా ఐక్య సంఘటనను ఏర్పాటు చేయలేక పోయారు. అంతిమంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భారత (ప్రజలు నడుం బిగించి, ఐక్యంగా చర్యలు చేపట్టారు-- 1857లో బహదూర్‌ షా పతాకం కింద స్వేచ్భాయుతులుగా వారు తమ ఆఖరి యుద్దాన్ని చేశారు. యుద్ధం ప్రారంభ దశలో (బ్రహ్మాండమైన విజయాలను సాధించినప్పటికీ రానురాను దురదృష్టమూ, నాయకత్వ

(1943 అక్టోబరు 21వ తేదీన సింగపూర్‌లో తాత్కాలిక అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ

విడుదల చేసిన (ప్రకటన పూర్తి పాఠం)

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 140

లోపాలు వెన్నాడగా చివరకు కుప్పకూలి, దాస్య శృంఖలాల్లో బంధీలయ్యారు. ఇలా జరిగినప్పటికీ రూన్సీ రాణి, తాంతియా తోపే, కున్వర్‌ సింగ్‌, నానా సాహెబ్‌ వంటివారు జాతి జనుల సృతుల్లో చిరస్థాయిగా నిలచిపోయి మహత్తర త్యాగాలు, ధైర్యసాహసాలు చూపేలా యిప్పటికీ స్ఫూర్తినిస్తూనే వున్నారు.

1857 తరువాత బ్రిటిష్‌ వారి ద్వారా జరిగిన నిర్భంధ నిరాయుధీకరణ అనంతరం బీభత్సానికీ, క్రూరత్వానికీ గురైన భారతీయులు కొంతకాలంపాటు లొంగివున్నప్పటికీ 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఆవిర్భావంతో ప్రజల్లో నూతన జాగృతి మొదలైంది. చేజారిన స్వాతంత్ర్యాన్ని తిరిగి సాధించుకునేందుకై భారత ప్రజలు 1885 నుంచి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా _-అంటే, అందోళన, ప్రచారం, బ్రిటిష్‌ వస్తువుల బహిష్కరణ, ఉగ్రవాదం, విధ్వంసం-- ప్రయత్నించి చివరకు సాయుధ విప్లవాన్ని సాగించారు. అయితే కొంతకాలంపాటు యీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైఫల్యాల భారంతో క్రుంగిపోతున్న ప్రజలు చివరకు 1920లో నూతన పద్ధతిని చేపట్టేందుకు వీలుగా జతకట్టారు. మహాత్మా గాంధీ రంగంలోకి ప్రవేశించి సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన అనే నూతన ఆయుధాలతో జనావళిని ముందుకు నడిపించారు.

దాదాపు రెండు దశాబ్దాలపాటు దేశ ప్రజలు ముమ్మరమైన దేశభక్తి కార్యకలాపాలలో మునిగి పోయారు. స్వాతంత్ర్య సందేశం ప్రతి ఇంటి తలుపును తట్టింది. స్వాతంత్ర్యం కోసం బాధలను అనుభవించి, త్యాగాలు చేసి, మరణానికి సైతం వెరవకుండా వుండేలా వైయక్తిక ఉదాహరణల ద్వారా ప్రజలకు శిక్షణ యివ్వటం జరిగింది. కేంద్రం నుంచి సుదూర గ్రామాల వరకు ప్రజలంతా కలసికట్టుగా ఒకేఒక రాజకీయ నిర్మాణంగా ఏర్పడ్డారు. ఆ విధంగా భారత ప్రజలు తమ రాజకీయ చైతన్యాన్ని తిరిగి సంపాదించు కోవడమేకాక, ఒక రాజకీయ శక్తిగా తయారయ్యారు. వారిప్పుడు ఒకే గొంతుతో మాట్లాడుతున్నారు, ఒకే హృదయంతో కృషి చేస్తున్నారు, ఒకే లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. 1987 నుంచి 1989 వరకు ఎనిమిది ప్రాంతాలలో నెలకొన్న కాంటైను మంత్రివర్గాలు వరిపాలనా రంగంలో తమ నత్తాను నిరూపించుకున్నాయి.

ఆ విధంగా ప్రస్తుత ప్రపంచ యుద్ధం సందర్భంగా భారత స్వాతంత్ర్యం కోసం అంతిమ పోరాటానికి రంగం సిద్ధమైంది. యుద్ధ సమయంలో జర్మనీ తన మిత్రులతో కలసి ఐరోపాలో మన శత్రువును తీవ్రంగా దెబ్బతీసింది. ఇదే సమయంలో శత నా గౌతమ్‌ ఛటోపాధ్యాయ

తూర్పు ఆసియాలో తన మిత్రులతో కలసి నిప్పన్‌ మన శత్రువును ముప్పుతిప్పలు పెట్టింది. అనుకూలమైన పరిస్థితులు కలసి రావటంవల్ల తమ జాతీయ విముక్తిని సాధించేటందుకు భారత ప్రజలకు మహాద్భుతమైన అవకాశం లభించింది. ఇటీవలి చరిత్రలో మొట్టమొదటిసారిగా విదేశాలలోని భారతీయులు రాజకీయంగా చైతన్యం పొంది ఒక సంఘంగా ఐక్యమయ్యారు. తమ దేశంలోని తోటి ప్రజలను దృష్టిలో వుంచుకుని మాత్రమే వారు ఆలోచనలు చేయటం లేదు, వారితో కలసి స్వాతంత్ర్య మార్గంలో నడుస్తున్నారు. ప్రత్యేకించి తూర్పు ఆసియాలో దాదాపు 20 లక్షల మంది “సంపూర్ణ సమీకరణ” నినాదంతో స్ఫూర్తిపొంది ఐక్యమయ్యారు. “ఢిల్లీ దిశగా” అన్న నినాదం తమ పెదవులపై లాస్యమాడుతుండగా వారిముందు భారత స్వాతంత్ర్య సైన్యం వున్నది. బ్రిటిష్‌ పాలకులు తమ కపట నాటకాలతో భారతీయులను బెదిరించి నిరాశలో ముంచి, నిలువు దోపిడీ చేసి వారిని ఆకలికి, మృత్యువుకు విడచిపెట్టటం ద్వారా భారతీయులలో తమ మంచితనాన్ని పోగొట్టుకుని యిప్పుడు అస్థిరస్థితిలో చిక్కుకున్నారు. ఈ అసంతృప్తి పాలన చివరి గుర్తును తుడిపి వేయటానికి ఒక జ్వాల కావాలి. ఆ జ్వాలను వెలిగించే కర్తవ్యం భారత స్వాతంత్ర్య సైనిక దళానిదే. మాతృదేశంలోని పౌరులు మహోత్సాహంతో యిచ్చే మద్దతు, (బ్రిటిష్‌ భారతీయ సైనికులలో అత్యధిక భాగం, విదేశాలలో వున్న అజ్ఞాత మిత్రులు, అన్నిటికన్నా ముఖ్యంగా తన స్వశక్తిపై ఆధారపడిన భారత స్వాతంత్ర్య సైనిక దళం తనదైన చారిత్రక పాత్రను నిర్వహించగలనన్న విశ్వాసంతో వున్నది. స్వతంత్ర భానుడు ఉదయించే వేళ సమీపించింది. ఇలాంటి సమయంలో

తనదైన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత భారతీయులపై వున్నది. ఆ ప్రభుత్వ పతాకం కింద ఆఖరు పోరాటాన్ని సాగించాలి. అయితే, భారత ప్రజా నాయకులందరూ జైళ్ళలో వుండటం, దేశంలో వున్న ప్రజలు నిరాయుధంగా వున్నందున భారతదేశం లోపల తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, లేదా, ఆ ప్రభుత్వ ఆశీస్సులతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించడం ఎంతమాత్రం సాధ్యం కాదు. కనుక, దేశవిదేశాల్లో వున్న దేశభక్తులైన భారతీయులందరి మద్దతుతో తూర్పు ఆసియాలోని భారతీయ స్వతంత్ర లీగ్‌ యీ కర్తవ్యాన్ని స్వీకరించాలి --అంటే, అజాద్‌ హింద్‌ (స్వతంత్ర భారత్‌) ప్రభుత్వాన్ని స్థాపించి, లీగ్‌ ఏర్పాటుచేసే స్వతంత్ర సైన్యం (అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ లేదా భారత జాతీయ సైన్యం) తోడ్పాటుతో స్వాతంత్ర్యం కోసం తుది సమరాన్ని సాగించాలి,

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు క్షే42

తూర్పు ఆసియాలోని భారత స్వాతంత్ర్య లీగ్‌ స్థాపించిన అజాద్‌ హింద్‌ తాత్మాలిక ప్రభుత్వ స్థాపనతో మాపై వుంచిన బాధ్యతల గురించిన పూర్తి అవగాహనతో మేము వాటిని స్వీకరించాము. మన మాతృభూమి కోసం విముక్తి కోసం సాగే మా కృషిని, పోరాటాన్ని ఆశీర్వదించాలని పరమేశ్వరుని వేడుకుంటున్నాను. భరతమాత స్వేచ్చ కోసం, సంక్షేమం కోసం, ప్రపంచ దేశాలలో బెన్నత్యం కోసం మా ప్రాణాలను, మా సహచర యోధుల ప్రాణాలను ఫణంగా పెద్దామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత గడ్డపై నుంచి బ్రిటిష్‌ వాళ్ళను, వారి పొత్తుదారులను తరిమిగొట్టే పోరాటాన్ని ప్రారంభించి కొనసాగించ వలసిన బాధ్యత తాత్కాలిక (ప్రభుత్వంపై వుంటుంది. ఆ తరువాత భారత ప్రజల అభీష్టం మేరకు, వారి విశ్వాసాన్ని పొంది శాశ్వత అజాద్‌ హింద్‌ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా దానిపైనే వున్నది. (బైటిష్‌ వాళ్ళను, వారి పొత్తుదారులను పారదోలిన తరువాత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి పట్టే వ్యవధిలో భారత ప్రజల విశ్వాసం మేరకు పరిపాలనా వ్యవహారాలను తాత్కాలిక ప్రభుత్వమే చూడాలి. ప్రతి భారతీయుని నుంచి రాజభక్తిని ఆశించే యోగ్యత, అర్హత తాత్కాలిక ప్రభుత్వానికి వున్నది. ఇది తన పౌరులందరి మత స్వేచ్చకు, సమాన హక్కులకు, సమాన అవకాశాలకు వామీ యిస్తుంది. యావజ్ఞాతి సుఖ సంతోషాల కోసం, పురోగతి కోసం కృషి చేస్తానని, దేశంలోని బాలబాలికలందరి సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని, గతంలో పర ప్రభుత్వం కపటంతో రేపెట్టిన విభేదాలన్నిటినీ పోగొడతానని యీ ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకున్నది. భగవంతుని పేరుతోనూ; భారత ప్రజానీకాన్ని ఏకజాతిగా నిలిపిన గడచిన తరాల పేరుతోనూ; థైర్యాన్నీ ఆత్మ త్యాగాలను వారసత్వంగా యిచ్చిపోయిన అమరజీవులైన సాహసుల పేరుతోనూ-- మేమెత్తిన పతాకం కింద చేరి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడవలనిందిగా సమస్త భారత ప్రజలకు పిలుపును యిస్తున్నాము. భారతదేశం నుంచి బ్రిటిష్‌ వారిని, వారి పొత్తుదారులను తరిమిగొట్టే ఆఖరి పోరాటాన్ని ప్రారంభించాలని, శత్రువు భారత భూభాగాన్ని విడచి వెళ్ళిపోయే వరకు, భారత ప్రజలు మరోసారి స్వతంత్ర జాతిగా మారేవరకు అంతిమ విజయంలో పూర్తి నమ్మకముంచి యీ పోరాటాన్ని ధైర్యంతోనూ పట్టుదలతోనూ సాగించ వలసిందిగా మేము పిలుపు యిస్తున్నాము. తా గాళ్‌ భటోప్య్యాయ

అజాద్‌ పొంద్‌ తాత్మాలిక వ్రభుత్చం తరపున నంతకం చేసిన వారు:

నుఖాన్‌ చంద్ర బోన్‌, ప్రభుత్వ అధివతి, ప్రధాన మంత్రి, యుద్ధ, విదేశాంగ శాఖల మంత్రి, భారత జూతీయ వైన్వానికి అత్యున్నత అధికారి. కెప్టెన్‌ కుమారి లక్షీ (యపొకా విఖాగం) ఎన్‌ ఏ అయ్యర్‌ (ప్రచార విభాగం్కి లెప్టినెంట్‌ కల్నల్‌ వని. ఛటక్టీ (ఆర్థికం) లెప్టినెంట్‌ కల్నల్‌ అబీజ్‌ అవ్మ్హాద్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ ఎన్‌ ఎన్‌, భగత్‌, కల్నల్‌ జెకె భోంస్తే, లెప్టినెంట్‌ కల్నల్‌ గుల్దార నింగ్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ కియాని, లెప్టీనెంట్‌ కల్నల్‌ ఏడి. లోకనాథన్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ యవాసాన్‌ ఖదీర్స్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ షా నవాజ్‌ (నైనిక దళాల వ్రతినిధుల్తు ఏఎం. సవోయ్య్‌, కార్వ్యదర్భి (యంత్రి వోదాలో) రాన్‌ భివోరీ బోన్‌ (అత్యున్నత నలవోదార్సు కరీం గని, దేవనాథ్‌ దాన్‌, డిఎం. ఖాన్‌ షయరల్లవ్చ, జె థివి, సర్దార్‌ ఐవర్‌ సీంగ్‌ ధలవోదారులు,, షఎన్‌ నర్భార్‌ (న్యాయ నలవోదారు,

ల సుఖాన్‌ చంద్ర బోన్‌ జీవతం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 144

ఢిల్లీకి పలు మార్గాలు

కామ్రేడ్స్‌, మన మాత్ళభూమి స్వాతంత్ర్యం కోసం మనం సాగిస్తున్న పోరాటాన్ని కలలో కూడా ఊహించని సంక్షోభం చుట్టుముట్టింది. భారతదేశాన్ని విముక్తి చేయాలన్న మీ ప్రయత్నంలో విఫలమైనట్లుగా బహుశ మీరు భావిస్తుండవచ్చు. అయితే, యీ వైఫల్యం కేవలం తాత్మాలిక స్వభావం కలిగినదేనన్న విషయాన్ని నన్ను చెప్పనివ్వండి. గతంలో మీరు సాధించిన విజయాలను ఏ ఒడుదుడుకులూ, ఏ పరాజయమూ నిర్వీర్యమొనర్చ లేదు భారత-బర్మా సరిహద్దులోనూ, అదేవిధంగా భారతదేశం లోపలా మీలో అనేకమంది పలు కష్టాలకు, వేదనలకు ఓర్చి పోరాటాలలో పాల్గొన్నారు మీ సహచరులనేకులు యుద్ధ రంగంలో ప్రాణాలర్పించి అజాద్‌ హింద్‌ శాశ్వత వీరయోధులుగా నిలచి పోయారు. మహోజ్వల త్యాగాలు ఎన్నడూ వృధాకావు

కా(మేద్స్‌, యీ చీకటి గడియలో, నిజమైన విప్లవ సైన్యానికి తగినట్లుగా మీరు క్రమశళిక్షణతోనూ, హుందాతనంతోనూ, స్టెర్యంతోనూ మెలగ వలసిందిగా మీకందరికీ నేను పిలుపు యిస్తున్నాను. యుద్ధరంగంలో మీ సాహసం, ఆత్మ త్యాగం యిప్పటికే రుజువయ్యాయి. తాత్కాలిక పరాజయం ఎదురైన యీ తరుణంలో అనశ్వరమైన ఆశావాదాన్నీ తొణకని సంకల్ప శక్తినీ ప్రదర్శించ వలసిన బాధ్యత మీపైన వున్నది. ఈ ఘోర దుర్దశలో సైతం మీరు శిరసెత్తుకుని నిలవగలరని, యింకిపోని “ఎ అపాన్‌ లొంగిపోయిన అనంతరం అజాద్‌ పొంద్‌ ఫౌజ్‌ అధికారులకు, యితడులకు

25945 ఆగస్టు 26న తేదీన జూరీ చేనిన ప్రతేక ఆదేతం)

తాల్‌ భవోవ్యాు

ఆశా విశ్వాసాలతో భవిష్యత్తును ఎదుర్కొనగలరన్న విషయంలో నాకు లేశమాత్రమైనా సందేహం లేదు. కామ్రేడ్స్‌, యీ సంక్షిష్ట సమయంలో, మన మాతృభూమిలో 38 కోట్లుగా వున్న దేశీయులు భారతదేశ స్వాతంత్ర్య సైనికదళ సభ్యులమైన మనవైపు చూస్తున్నారు. కనుక, నిజమైన భారతీయులుగా నిలవండి, భారత భవితవ్యంపట్ల మీకున్న విశ్వాసంలో అణు మాత్రమైన చెదరనీయకండి. ఢిల్లీ చేరేందుకు పలు మార్గాలు వున్నాయి, యిప్పటికీ ఢిల్లీయే మన లక్ష్యంగా వున్నది. మీరు, మీ సహచరులు చేసిన అపూర్వ త్యాగాలు తప్పని సరిగా ఫలిస్తాయి. భారతదేశాన్ని బానిసత్వంలో బంధించి వుంచగల శక్తియేదీ యీ భూతలంపై లేనేలేదు. అనతి కాలంలోనే భారతదేశం స్వతం(త్రమవుతుంది. లో సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 146

భారతదేశం స్వతంత్రమవుతుంది సోదరీ సోదరులారా, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వైభవోజ్వలమైన ఒక అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇందులో తూర్పు ఆసియాలోని భరతమాత పుత్రులకు, పుత్రికలకు శాశ్వత స్థానం వుంటుంది. భారత స్వాతంత్ర్య పోరాటానికి అవసరమైన కార్యకర్రలనూ, ధనాన్న్సీ వస్తుగత సామాగ్రినీ పంపటం ద్వారా మీరు ఉజ్వలమైన వుదాహరణను స్థాపించారు. సంపూర్ణ సమీకరణ అన్న నా పిలుపుకు వెనువెంటనే, మహోత్సాహంతో మీరు స్పందించిన తీరు ఎన్నటికీ మరచి పోలేను. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనిక శిక్షణా కేంద్రాలకు, రాజి ర్లూన్సీ విభాగానికీ అసంఖ్యాకంగా మీ బిడ్డలను పంపించారు. అంతేకాక, అజాద్‌ హింద్‌ తాత్కాలిక ప్రభుత్వ యుద్ధ కోశాన్ని ధనంతోనూ, వస్తుసామాగ్రితోనూ ముంచెత్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే భరతమాత నిజమైన పుత్రులు, పుత్రికలుగా మీరు మీ విధిని నిర్వహించారు. మీ స్థాయికి మించి మీరు కష్టపడ్డారు, మీ వ్యధలు, త్యాగాలు తక్షణ ఫలితాన్ని యివ్వలేదన్న విచారం నాకున్నది. అయితే యివి వృథాకావు, ఎందుకంటే, మన మాతృభూమి విమోచనను అవి ఖాయపరచాయి, ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులందరికీ నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయి. మీ వంశీకులు మీ పేరును స్మరించుకుంటూ, భారత స్వాతంత్ర్య పోరాట వేదికపై మీ బలిదానాల గురించి గర్వంగా చెప్పుకుంటారు. ....... ూర్చుజసియాలోని భారతీయులకు. 1945 ఆగస్టు 16వ తేదీన పంపిన సందేశం) 2 ాాాాా గాన్‌ ఛటోపాధ్యాయ

మన చరిత్రలో మున్నెన్నడూ ఎరుగని యీ సంక్షోభ సమయంలో ఒక్క మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మన యీ తాత్మాలిక వైఫల్యంతో కుంగిపోవద్దు. ఉల్లాసంగా వుంటూ మీ చైతన్యాన్ని నిలబెట్టండి. అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశ భవితవ్యంపట్ల మీకున్న విశ్వాసంలో ఏమాత్రం తోట్రుపాటు రానివ్వవద్దు. భారతదేశాన్ని బానిసత్వంలో పట్టివుంచగల శక్తి యీ భూతలంపై యేదీ లేదు. అచిర కాలంలోనే భారతదేశం స్వతంత్రమవుళుంది. జై పొంద్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 148

తిరుగులేని తరుగులేని తరుణము మానవజన్మ ఎంతో సార్ధకమైనది. అందు యవ్వన దశ మహోత్కష్ట మైనది. మహోపకారి. మరుపురానిది, జీవిత బాటలో మెరుపు లాంటిది. మానవతా గమ్యము చేరుకొనుటకు పయనించు మార్గమున మనం పురోగమించుటకు తిరుగులేని సాధనము. ఎందునను, ఎచ్చటను, దేనికికూడ తరుగులేని అవకాశమును మానవునకు కలిగించు తరుణము. ఈ తరుణముననే సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థులం కాగలం. ప్రియమైన యువకులారా, ఒక మహత్తర లక్ష్యాన్ని చేరుకొనుటకు, అమూల్యమగు సందేశాన్ని ప్రచారం చేయుటకే మనం జన్మించాము. ఈ లోకానికి వెలుగును ప్రసాదించుటకే సూర్యుడు ఉదయిస్తున్నాడు. తమ సువాసనలు వెదజల్లి మహదానందాన్ని కలిగించుటకే ఉద్యానవనమున పూవులు వికసిస్తున్నాయి. మధుర జలాలను సమాజానికి అందించుటకే ఈ నదులున్నీ పరుగులు తీస్తున్నాయి. ఇదేరీతిగా యౌవనోత్తేజం, ఉల్లాసం, ఆనందం కలిగివున్న మనం సత్యస్థాపన నిమిత్తమే వచ్చినాము. మన జీవితం వ్యర్థం గాకుండా సార్థకమగునట్లు చూసుకోవాలి. మనమంతా ఆలోచన చేయాలి, త్యాగం చేయాలి. కార్యశూరులమై జీవిత రహస్యాలను కనుగొనాలి. ఆనందంలో మునకలు వేసే మనమే యీ (ప్రపంచానికి ఆనందం కలిగించాలి. మనమే ఆనందమై యీ లోకంలో విహరించాలి. మనం అడుగు పెట్టిన చోట నిరుత్సాహం, నిరానందం, నిరాశ, నిస్పృహ అజ్ఞానం ఆలసట అన్నీ నామరూపాలు లేకుండా పోవాలి. ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఉత్తేజం, ఉత్సాహం, సంతృప్తి, సద్భావాలు పరుగులెత్తాలి. మన సర్వ శక్తులతో అనుపమానమైన ఆత్మానందాన్ని యీ దేశంలో కలిగించాలి. కాని యింతటితోనే మన పని పూర్తయినట్లుగా భావించరాదు. 149 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

అనంతమైన ఆశలు, అంతులేని ఉత్సాహం,ఊహింపరాని ఉత్తేజం, తిరుగులేని ధైర్యం తదితరములైన వాటితో పెనవేసుకొని పరుగులిడే మన జీవిత ప్రవావానికి ఎవ్వరూ అద్దుకట్ట వేయజాలరు. అవిశ్వాసం, అజ్ఞానం నిరాశ నిస్పృహలనే పర్వతాలు కూడ మనముందు నిలవలేవు. యావత్‌ మానవ జాతి శక్తి ఎదురైనను, ఆనందంతో తన్మయులమై సాగిపోవుచున్న మనలను ఆటంక పరచ లేదు. మన యీ వ్రవాహ గమనం సజీవమైనది. అజేయమైనది, అప్రతిహతమైనది.

మనకొక ప్రత్యేక ధర్మముంది. దానినే మనం ఆనుసరిస్తున్నాము. నేటి వరకు ప్రపంచం ఎరుగని, చూడని సరసమైన, వినూత్నమైన శక్తి నొకదానిని మనం ఆరాధిస్తున్నాము. పాతదానిలో కొత్తదనం కలిగిస్తున్నాము. జడత్వంలో చైతన్యాన్ని నింపుతున్నాము. ్రౌధావస్థలో యవ్వనోత్తేజం తెస్తున్నాము. శృంఖలాబద్ధులకు స్వేద్భామార్థాన్ని చూపుతున్నాము. అన్ని వేళల చరిత్ర చెప్పినది వినేవాళ్ళము కాదు. అనంతమగు జీవిత యాత్రలో పయనించు మనకు క్రొత్త దారులంటేనే యిష్టం, కన్పించని భవిష్యత్‌ పైనే మనకు అభిమానం, పొరపాట్లు చేయటానికి మనం వెనుకాడం. అందుకే ఎక్కువ మందికి మనమంటే ఇష్టం వుండదు. చాలామంది దృష్టిలో “మనం యీ ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళం, దురదృష్టవంతులం”. అవును యీ మాటలు మన విషయంలో నిజమేనని నా భావం, నిజం గనుకనే మనం ఆనందంగా వున్నాం గర్వపడుతున్నాము. యవ్వనం ఈ ప్రపంచానికి, ధనానికి వేరుగానే వుంటుంది. మనం తీరని కోరికలతో ఉన్న్మాదులమై పరుగులు తీస్తున్నాము. తెలివిగల వారి ఉపదేశాలు వినలేక పోతున్నాము.

పొరపాట్లు చేసినా, భ్రమించినా, ఎదురు దెబ్బలు తగిలినా, ఉత్సాహం కోల్పోయి తిరోగమించటం మాత్రం జరుగదు. మన ప్రయాణం నిర్విరామమైనది. అడ్డుఆపూ లేనిది. నిరంతరం సముద్రంలో పొంగిపొరలే అలల వంటిది. ప్రతి దేశానికి స్వాతంత్ర్య చరిత్రను సృష్టించేది మనమే. శాంతి మంత్రములు వల్లించటానికి మనం యిక్కడకు రాలేదు. సంఘర్షణలను ఎదుర్శొనుటకే యిచటకు వచ్చాము. యుద్ధసన్నద్ధులమై ప్రళయమును ఎదుర్శొన వలసినదని చెప్పుటయే మన ధ్యేయం

ఎక్కడ బంధనాలున్నవో, అహంభావమున్నదో, దుష్ట సంస్కారాలున్నవో, సంకుచిత స్వభావాలున్నవో అక్కడకు మనం ఖడ్గ హస్తులమై శరవేగమున వెళ్ళాలి. ముక్తి పధమందున్న చిక్కులను తొలగించడమే మన (్రధాన కర్తవ్యం. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 160

మానవ జీవితం విస్మరించరాని సత్యం. ప్రస్తుతం మనం కావాలను కొంటున్న స్వేచ్చా స్వాతంత్ర్యాలు లేకుండా జీవించటం అనేది పరివాసం మాత్రమే. ఈ పరివాస ప్రాయం కాని జీవితం కొరకే మనం యుగయుగాలుగా నవ్వుతూ రక్తం ధారపోస్తూ వస్తున్నాం. జీవితంలోని ప్రతి క్షేతంలోనూ ముక్తి మార్గాన్వేషణే మన ధర్మం. వాస్తవాన్ని ఆధారం చేసుకుని మనం ఆనందాన్ని పొందాలి. జెదార్యమునకు నూతన మార్గాలు కనుగొనాలి.

అనాది కాలం నుంచి మనము ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నాము. బాల్యం నుంచి ముక్తి కావాలన్న కోరికే మన నరనరాన వ్యాపించి వుంది. ఈ లోక బంధనాల నుండి విముక్తి కోసమే మనం జన్మించిన మరుక్షణమే రోదిస్తాము. బాలానాం రోదనం బలం, యవ్వనంలో భుజబలం, బుద్ధిబలం లభిస్తుంది. ఈ బలంతో మనమెన్నో పనులు సాధించాము. ప్రపంచంలోని ఏ దేశ చరిత్ర పుటలు తిరగేసినా యువకుల గురించి వారి కీర్తిని గురించి ప్రత్యేకంగా పేర్కొని వుంటుంది. మన సహాయంతోనే ఎంతోమంది చక్రవర్తులు సింహాసనం అధిష్టించారు. ఎంతోమంది సింహాసనం వదిలి పారిపోయారు. నున దేశంలో (్రేుమాశ్రువులతో తాజమహల్‌ నిర్మించుకున్నట్లే గుండె నెత్తురులతో ఈ భూదేవిని అలంకరించాము. మన కేంద్రీకృత శక్తిని వినియోగించుకుని సంఘం, సాహిత్యం, కళ, విజ్ఞానాలు ప్రతి యుగంలోను ప్రతి దేశంలోను అభివృద్ధి చెందాయి. మనం కోపగించి తాండవ నృత్యం చేసినపుడు ఎన్నో సామ్రాజ్యాలు మట్టి కలిశాయి. ఇంతకాలం తరువాత మరల మన శక్తిని గుర్తించాము. ధర్మాన్ని అర్థం చేసుకున్నాము. అందువల్ల, మనలను ఎవరూ పరిపాలించటంగానీ, పీదించటంగానీ చేయలేరు. నవీన యుగంలో యువకులందరు తమ అత్మ బలాన్నభివృద్ధి పరచుకొని ప్రయోజనం పొందటానికి ప్రయత్నించాలి. జీవితంలోని ప్రతి కోణంలోనూ యవ్వన ప్రభావాన్ని మనం కలుగజేయాలి. యువకుల ఆందోళనా ప్రభావం సర్వతోముఖ మైనట్లుగానే, విశ్వవ్యాప్తం కూడాను. నేడు ప్రపంచ దేశాలన్నింటిలో ప్రత్యేకించి వృద్ధ నాయకత్వం పనిచేస్తున్న దేశాలలో యువ తరం నిర్భీతిగా, సగర్వంగా, నిలచి వున్నది. ఏ దివ్య సందేశంతో ఆయా దేశాలను వీరు అభివృద్ధి పరచగలరో ఎవరు చెప్పగలరు? ఓ యువలోక సారథులారా, మన కోసం అరుణారుణ కిరణాలు మేల్కొలుపు

గీతాలు పాడుతున్నాయి లేవండి. 151 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

దేశమాత పిలించింది 150 సంవత్సరాలకు పూర్వం భరత భూమిలో విదేశీయుల ప్రవేశానికి బెంగాలీయులే దారి చూపారు. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని 20వ శతాబ్ది బెంగాలీలు చేసుకోవాలి. భారత గౌరవ పునరుద్ధరణకు బెంగాలీ ప్రీ పురుషులందరూ ప్రయత్నించాలి. అందుకు తగిన మార్గాన్ని కనుగొనాలి. జాతీయ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మహాత్మాగాంధీ బెంగాలీవాసి కానప్పటికీ ఆయన ప్రభావం మన పైననే బాగా పడింది. ఈ ఉద్యమం, మన రాష్ట్రంలో సాగుతున్నంత ఉధ్భతంగా, మరే రాష్ట్రంలోనూ జరగటం లేదు. అన్ని రాష్ర్రాలు పర్యటించిన కరువాతనే ఈ అభిప్రాయము నాకు కలిగింది. జాతీయ జీవనంలోని యితర రంగాలలో నునం ముందు లేనప్పటికీ, స్వాతంత్ర్య సంగ్రామంలో మాత్రం అగ స్థానంలో వుందగలమన్న విశ్వాసం నాకున్నది. భారత దేశానికి స్వరాజ్యం వస్తుందని దాన్‌ నిర్వాహణలో బెంగాల్‌ ప్రధాన బాధ్యత వహించగలదని ఘంటాపథంగా చెప్పగలను. బెంగాలీలు మార్చాడి జాతివారో లేదా మరొక జాతివారో అయితే బాగుండునని మన వారే కొందరు విచారపడుతూ ఉంటారు. కాని అది నాకేమాత్రము నచ్చదు. బెంగాలీలు ఎల్లప్పుడూ బెంగాలీలుగానే ఉండిపోవాలనే నా అభిప్రాయం. స్వధ్యో నిధనం శ్రేయః సరధర్శో భయావః అని శ్రీ కృష్ణుడు.గీతలో పేర్యొన్నాడు. ఈ సూక్తిలో నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. స్వధర్మాన్ని విస్మరించటం ఆత్మహత్యా సద్భశమని ప్రతి బెంగాలీ భావించాలి. భగవంతుడు. మనకు ఆర్ధిక సంపత్తి యివ్వలేదు. కాని తెలివితేటలు ప్రసాదించాడు. త్యాగాలకు సిద్ధంగావున్న ప్రాణాలు మనవి. ధనం కౌరకు ప్రాణాలు పోగొట్టు కొనవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ధనాన్ని పరిత్యజించాలి. భారత దేశంలోనే కాక యావత్ర్రపంచంలోనే బెంగాలీలకు ప్రత్యేక స్థానం ఉ న్నదని, ఆ ప్రత్యేకతకు తగినట్లే ప్రవర్తించవలసిన బాధ్యత వారికున్నదన్న విషయం ఎన్నడూ మరవరాదు. తాము స్వాతంత్ర్యం పొంది నూతన భారతావనిని నిర్మించవలసిన బాధ్యత క్షూదా వ్రార్రిపైనే వున్నది. వారు నిర్మించిన నూతన భారత దేశంలో సాపొత్యం, విజ్ఞానం, సంగీత్రం, శిల్చం, శౌర్య స్టైెర్యములు, క్రీడా వైపుణ్యం, దయాదాక్షిణ్యాలు మొదలైనవన్నీ వర్ధిల్లాలి. జాతి జీవితాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించు శక్తి, జాతీయ విద్య సమన్వయ ప్రవృత్తి కేవలం బెంగాలీ వారిలోనే కలవని మనం రుజువు చేసుకోవాలి. బెంగాలీయులకు ప్రత్యేక విశిష్టత కలదనటంలో నాకు సందేహం లేదు. విద్య, దీక్ష స్వభానం, నడవడిలన్నిటిలోనూ వారి సామర్హ్వం విద్యుత్‌ తేజంలా ్రకాళిస్తూనే

వుంటుంది. బెంగాల్‌ (ప్రాంత ప్రకృతిలో కూడా ఈ లక్షణం మనకు గోచరిస్తుంది. ఆకాశం, నీరు, సస్యశ్యామలంగా ఉన్న భూమి, తాళ వృక్షాలను కాపుగా పెట్టుకున్న చెరువులు మొదలగువానితో కనుల పండువగా కనిపించు ప్రకృతి సౌందర్యం బెంగాలీల చరిత్రకు ప్రత్యేకతను ప్రసాదిస్తుందనటంలో చిత్రమేమి లేదు. మెత్తని మట్టిలో పుట్టిన వారగుటచేతనే బెంగాలీల హృదయాలు కోమలంగా వుంటాయి.

(ప్రాకృతిక సౌందర్యం మధ్యలో మెలగిన వారగుటచేతనే బెంగాలీలు సౌందర్యోపాసకులయ్యారు. సుజలాం, సుఫలాం, సస్యశ్యామలం అయిన భూమిని సేవించిన వారగుటచేత కావ్య సాహిత్యంలోనూ ఒక నిపుణతను చూపించ గలిగేరు. గత రెండు మూడు సంవత్సరాలలో పెల్లుబికిన చైతన్య ప్రవాహం ఈ సమయంలో తగ్గుముఖం పట్టినట్లుగా కన్చడుతున్నది. కాని త్వరలోనే మరల పెరగగలదని నా అంచనా. బెంగాల్‌నందు పొంగుతున్న జాతీయకా వెల్లువ త్వరలో మరింత ఉధృత రూపం పొందగలదు. ఆ ప్రవాహ తాకిడికి బెంగాలంతా మరల మేల్కొనగలదు. స్వాతంత్ర్యం, స్వేచ్చ కొరకు బెంగాలీలందరూ తమ సర్వస్వం అర్చించి పట్టుదలతో పనిచేస్తారు. ఆ నూతన జాగృతి పరిణామమెలా ఉంటుందో, నూతన యజ్ఞానికి పౌరోహిత్యమవరు వహించెదరో కూదా మనం చెప్పజాలము. మహత్మాజీయే మరల నాయకత్వం వహిస్తారో వారికి బదులు మరొక మహనీయుడే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారో అన్న విషయం కూడా చెప్పజాలం. కాని ఈ ప్రశ్చలన్నిటికి మనం జవాబులను ఆలోచిస్తూ కూర్చొనరాదు. ఈ నూతన జాగ్భృతికి ఇప్పటి నుంచే మనమందరం సంసిద్ధులం కావాలి. జీవితానికి అవసరమైన విషయాలస్సిటిని చూచుకుంటూనే ఈ జాగరణోద్యమానికి కావలసిన సాధనాలు సమకూర్చుకొనాలి- యువకులై యుండి సన్యసించు త్యాగధనులనే వంగభూమి కోరుతున్నది. సోదరులారా! అత్మార్పణకు సిద్ధంగా ఉన్న వారందరూ రండి. ఇప్పుడు దేశమాతవల్ల మ్‌కు లభించునదేమి ఉండదు. అనేక కష్టాలు వస్తాయి, అన్నపానాదులు కూడా లభించవు. జైలు జీవితం గడపవలసి ఉంటుంది. ఈ కష్టములన్నిటినీ సీలకంకఠుని వలే దిగమింగ గలిగితే మీరంతా ముందుకు సాగిరండి. దేశమాతకు మీరంతా కావాలి. మాతృభూమి నిమిత్తం మీరంతా ప్రాణాలర్పించవలసి వస్తే స్వర్గ ద్వారాలు మీకొరకు తెరచే ఉ టాయి. మీరంతా నిజంగా వీర పుత్రులైతే ముందుకు సాగిరంది.

ఓ నా ప్రియమైన యువ నాయకులారా! యువకులే దేశ దేశాలలో విముక్తి ఉ ద్యమాల చరిత్రలు సృష్టించారు. జాతి మేల్మొని స్వాతంత్ర్య మహోద్యమం విశ్వవాప్తి డాయ కే58 గాతమ్‌ ఛటోపాధ్యాయ

చెందిన యీ తరుణంలో మీరు మిన్నకుండుట సమంజసమా? యువకులు దేశ దేశాలలో చిరకాలం నుంచి అద్భుత కార్యాలు సాధించారు. ఆత్మార్పణం చేసి జాతీయతా సౌధాలు నిర్మించారు. ఎన్నోకష్టాలనుభవించారు. అత్యాచారాలు సహించారు. వీటికి బదులుగా దేశ సేవను, దేశ భక్తిని అర్పించారు. మీరు లాభం ఆశించేవారు కాదు. స్వాతంత్ర్య మంత్రాన్ని జపిస్తూ వీర సైనికులవలె నవ్వుతూ మృత్యు దేవతను కౌగిలించుకుంటారు. మీలోని శౌర్యం, ధైర్యం, మీనడవడిక, బలం గమనించిన ఈ భూ దేవి స్వచ్ళమగు మీ లలాటంలో విజయతిలకం తీర్చిదిద్దింది.

వంగ భూమియందు వుద్భవించిన ఓ! యువ యోధులారా ! మాతృభూమి సేవ నిమిత్తం కొనసాగు ఈ యజ్ఞంలో మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. మీరంతా ఎక్కడున్నా ఎలావున్నా వెంటనే కదలిరండి. ఎటుచూసినా నేడు దేశమాత విజయ శంఖమే ధ్వనించుచున్నది. ప్రాచ్యదిశనున్న ఆకాశాన్ని పరికించండి. భారతదేశ భాగ్య దేవతలు తరుణుల తపస్సు రూపంలో ఉదయించుచున్నారు. స్వాతంత్ర్యమనే వెలుగు బాటను పయనిస్తున్న ప్రపంచ దేశాలన్ని అభివృద్ధి వైపుకి ఎంతో పురోగమిస్తున్నాయి. మరి మీరంతా యింకా పనికిమాలిన భ్రమలోనే కూరుకు పోయివుంటారా?

ఓ! నా యవ మిత్రులారా! మీరేమాత్రం జాగు చేసినా లాభం లేదు. 18వ శతాబ్దంలో మన పూర్వీకులు విదేశీ వ్యాపారులకు మన రాష్టంలోనికి ప్రవేశమిచ్చి చేయరాని పాపం చేశారు. ఈ 20వ శతాబ్దంలో ఆ పాపానికి మన యువతరం (ప్రాయళ్ళ్చిత్తం చేసుకొని తీరాలి, జాగృతి చెందిన భారతీయ హృదయాలు ముక్తి కొరకు పరితపిస్తున్నవి. కావున మీరంతా శరవేగంతో కదిలిరండి. శుభాకాంక్షాపరులైన సోదరీమణుల వీరకంకణాలు కరమునందు ధరించి, మాతృదేవతల ఆశీర్వాదము పొంది దేశమాతకు కలిగిన కళంకం తొలగించి మరల స్వాతంత్ర్య సింహాసనమధిష్టింప చేయుదుమనియు సర్వం కోల్పోయిన భారత లక్ష్మి గౌరవాన్ని పునరుద్ధరించెదమనియు దీక్షపూనండి.

మనుగడకు మూలం మానవుని జీవితంలో బాల్య యవ్వన ప్రౌఢ వృద్ధాప్యములనెడి క్రమమున్నట్లే దేశ జీవితంలో కూడా ఒక క్రమం ఉన్నట్లు మనకు కన్పిస్తున్నది. మానవుడు మరణానంతర మీ శరీరము త్యజించి మరొక నూతన రూపం పొందును. కాని, జాతులన్నియూ అథోగతిపాలైన తరువాత మరల అభివృద్ధినీ, నూతన రూపాన్నీ పొంద గలవని చెప్పజాలము. తన అస్తిత్వాన్ని ఆరాధించి, సార్ధ్థకపరుచుకున్న జాతులు, సుభాన్‌ చంద్ర బోన్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 1654

విశిష్టకత్వమును జీర్ణించుకున్న జాతులు మాత్రం నూతన రూపాలు పొందుతాయి. మిగతావన్నీ నామరూపాలు లేకుండా నశిస్తాయి. లేదా బ్రతికి వున్నా క్రిమికీటకాదులవలే నిస్సార జీవితాన్ని గడుపుతుంటాయి. భారతదేశం ఎన్నోసార్లు నిస్తేజమై నిర్వీర్యమై మృతప్రాయంగా మారింది. కానీ

అజేయమైన ఆస్తిత్వంవల్ల నూతన రూపాన్ని పొందుతూనే వున్నది. ప్రాణం పోసుకుంటున్నది. ఆ ఆస్తిత్వమే నేటికీ దానికున్నది. విశ్వమంతటకి వినిపించదగిన

అర్ధవంతమైన సత్సందేశం ఈ దేశ సంపద. (ప్రపంచ పౌరులెవరైనా సరే పరిగ్రహించి

పొందగలిగిన ప్రత్యేకత ఏదో మనదేశ సంస్ఫృతిలో ఉన్నది. ఈ ప్రత్యేకతను కాదన్న మానవునికి పురోభివృద్ధి లేదు. ఈ ప్రత్యేకత గురించి మనం చెప్పుకోనవసరం లేదు.

శాస్త్రం, కళలు, విజ్ఞానము, సాహిత్యము, వ్యాపారము, వాణిజ్యము మొదలగువాటిలో

కూడా ఎంతోకొంత ఇతరులకు నేర్పగల స్థితిలోనే మన దేశమున్నది. ఈ కారణం

వల్లనే అనాగరిక యుగంలో కూడా మన దేశ మహర్షులు స్థిరంగాను, శాంతంగాను,

జ్ఞానజ్యోతిని వెలిగించ గలిగారు. మనమంతా పుణ్యమూర్తులగు ఆ మహర్షుల సంతానమే.

అంత మహత్తరమైన సంపదకు వారసులమైన మనం జుతీయ కర్తవ్యాన్నీ దేశమాత అవసరాలనూ తీర్చకుండా చనిపోవలసిందేనా?

మానవుని తనువు పంచభూతాలలో మిళితమైనా, ఆత్మమాత్రం నశించదు.

ఆదేరీతి దేశం, జాతి నశించినప్పటికీ, కళా సంస్కృతులు, సభ్యత అను ఆత్మమాత్రం నశించదు. సృజనాత్మక శక్తి లోపించినపుదే దేశం అధోగతి పాలవుతుంది. అప్పుడు ప్రజానీకం ఆహార నిద్రా మైధునాదుల వంటి సాధారణ కార్యకలాపాలకే పరిమితమై వుంటారు. ఉపయోగాదుల గురించీ, కష్ట నష్టాల గురించీ ఆలోచింపక, ఏవేవో వెనుకటి అలవాట్లనే పట్టుకుని వ్రేలాడుతాడు. సృజనాత్మ శక్తి నశించి యిలాంటి దుర్భర దుస్థితిలో చిక్కిన కొన్ని దేశాలు తమ అప్రతిహతమగు ఆస్తిత్వంవల్ల మరలా జీవం పోసుకుని రాణిస్తాయి. ఇటువంటి దేశాలు పలు అవాంతరాలకు గురైనప్పటికీ తమ సంస్యృతీ సంప్రదాయాలను నిలబెట్టు కుంటాయి. అంతేగాని ఇతర దేశాలతో కలిసిపోయి తన ఆస్తిత్వాన్ని పోగొట్టుకోవు. అలా అస్తిత్వాన్ని నిలబెట్టు కోగలిగిన తరువాత అదృష్ట వశాత్తుగాని, భగవత్‌ (ప్రేరణ రూపంలోగాని నవ జాగృతి ప్రారంభమౌతుంది. అంధకారం అంతరిస్తుంది. నిద్ర మేల్కొన్న జాతి కళ్లు నలుపుకుని లేచి నిలబడుతుంది. సృజనాత్మక శక్తి కూడా మరల పనిచేయ ప్రారంభిస్తుంది. సహస్ర దళకమలం వలే విష్పారి రమ్యంగా, చూడసొంపుగా హుషారుని, హాయిని గూర్చు జీవన రేఖలు మానవుల ముఖారవిందాలపై కకత గౌతమ్‌ ఛటోపాధ్యాయ

తాండవిస్తాయి. అప్పుడు జీవితంలో నూతనత్వం వస్తుంది. క్రొంగొత్త భావాలు, మార్గాలు ఉనికిలోకి వస్తాయి. ఆశాదీపాలు వెలుగుతాయి. ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఈ విధమైన చావు పుట్టుకల మధ్యనుంచి భారతజాతి గమనం సాగుతూ వస్తున్నది. ఈ దేశ గమనం ఇలా ఎందుకున్నదంటే భారతజాతికొక గురుతర బాధ్యత వున్నది, భారతీయ సభ్యతకొక లక్ష్యమున్నది. ఇవి నేటికి ఫలించలేదు.

భారత దేశం యొక్క యీ బాధ్యత, సభ్యతా లక్షణాలలో విశ్వాసమున్న

భారతీయులే బ్రతికున్నారు. భారతదేశంలో ముప్పైఐదు కోట్లమంది వున్నారనడమేగాని నిజంగా వారంతా సజీవులు కారని నా భావం. ఈ పరిస్థితులన్నిట్రినీ అర్ధం చేసుకొని అనుభవించే యువకులు మాత్రమే సజీవులని భావం.

ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? ఏ (ప్రరణవల్ల చేస్తున్నాం? కారాగార

వాసం కూడా గడిపి శక్తివంతులు కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? దీనివల్ల కలిగే ఫలితమేమిటి? అని అనేక పర్యాయాలు జైల్లో ఉండగా నాకు అనిపిస్తూ వుండేది. “భారతదేశానికొక గురుతర బాధ్యత వున్నది. గౌరవాన్వితమగు భవిష్యత్‌ రానున్నది, అలాంటి దివ్య భారతావనికి వారసులం మనమే. నూతన భారతాన్ని మనమే సృష్టించాము. ఇంకా సృష్టిస్తామన్న విశ్వాస బలంతోనే వినరాని, పడరాని బాధలు పడుతున్నాం. వాస్తవికతను ఆదర్శమనే దెబ్బతో ముక్కలు ముక్కలు చేస్తున్నాం. ఈ విధమైన అచంచల విశ్వాసంతోనే భారత యువకుల శక్తి అమరమైనదని”, ఆత్మ సమాధానం చెబుతుండేది.

ఈ విధమగు శ్రద్ధ ఆత్మ విశ్వాసంగల మానవుడే సృజనాత్మక శక్తి కలిగి ఉ టాడు. అతనే దేశాన్ని ఆరాధించడానికి అర్హుడై ఉంటాడు. ఈ ప్రపంచంలోని మహత్మ్యార్యాలన్నీ మానవ హృదయంలోని ఆత్మ విశ్వాసం, సృజనాత్మక శక్తి మీదనే ఆధారపడ్డాయి. తన దేశంమందుగాని, ఆత్మ బలంమందుగాని, విశ్వాసంలేని వ్యక్తి ఏ విధమగు నూతనత్వాన్నీ సృష్టించ జాలడు. భారతీయులలో ఎన్నో దోషాలున్నాయి. కాని వాటన్నింటిని మరిపించి వారిని ఉత్తమ మానవులుగా ఈ ప్రపంచంలో పరిగణింప జేయు గుణములుకొన్ని ఉన్నవి. వారిలో ఆత్మ విశ్వాసమున్నది. భావ నైపుణ్యమున్నది. కల్చనాశక్తి ఉన్నది. అందువల్లనే వారు నిత్యజీవితంలో కలుగు ఒడుదుడుకులను, అయోగ్యతలను, అపజయాలను లెక్కచేయక మహదాదర్శాలను ఊహించగలరు. దాని ఆరాధనలో తన్మయులు కాగలరు. అసాధ్యమనుకొన్న దానిని సాధించటానికి శతవిధాల ప్రయత్నిస్తారు. ఈ విధమగు కల్పనా శక్తి, ఆత్మ విశ్వాసాల వల్లనే భారతదేశం ఎంతో సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 156

మంది తపశ్శాలురకు నిష్టాగరిష్టులకు, సాధకులనకు జన్మనిచ్చింది. మున్ముందు కూడా యింకా ఉద్భవిస్తారు. అందువల్ల ఎన్ని కష్టాలు కలిగినా, అత్యాచారాలు, అపచారాలు జరిగినా యీ దేశం మాత్రం నిటారుగా, ఠీవిగా నిలబడగలదు. ఆదర్శం ఆభ్యుదయాలను తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకొన్న జాతి తన ఆదర్శం కొరకు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో సహించగలదు. కష్టాలను ఎదుర్కొనుటలో కేవలం బాధలేకాదు ఆనందంకూడా కలుగుతుంది. ఈ ఆనందాన్ని అర్ధం చేసుకోలేని వారికి మాత్రమే కష్టం. కష్టాలను కేవలం బాధలు గానే భావించిన వ్యక్తి దిగులు పడిపోతాడు, దిగజారి పోతాడు, అణగారి పోతాడు. కాని కష్టాన్ని ఆనందంగా భావించిన వ్యక్తికి అది గౌరవం కాగలదు. ఈ కష్టాలవల్ల బాధలవల్ల అతను మృతప్రాయుదు కాక, మరింత శక్తివంతుదై మహోన్నతుడవుతాడు. ఈ ఆనందానికి మూలం ఎక్కడున్నదో మనం యోచించాలి. ఆదర్భమందు కలుగు అనురాగంలోనే యీ ఆనందం ఉన్నదని నా భావం. ఉత్తమాదర్భ్శం కొరకు అనుభవించే వారి కష్టాలు నిర్దేతుకాలు, నిరుపయోగాలు కావు అలాంటి వ్యక్తి జీవితంలో దుఖమే అనందంగా రూపొందుతుంది. ఆ ఆనందమే అమృతంవలే అతని నరనరాన ప్రసరిస్తుంది. ఆ వ్యక్తియే జీవితంలోని వాస్తవికతను అర్ధం చేసుకొనగలడు. ఆదర్శం కొరకై సర్వస్వం సమర్ప్చించగలడు. అతనే జీవిత మకరందాన్ని ఆస్వాదించగలడు. ఇన్‌సిన్‌టైలులో ఉండగా ఒక రష్యన్‌ నవల చదువుతుంటే ఈ విధమగు భావమే నాకందు కనిపించింది. ఆ నవలా రచయిత రష్యన్‌ జాతిని ఉద్దేశించి తమ నాయకుని ద్వారా ఈ విధంగా చెప్పించాడు. నేనింకా ఎన్నికష్టాలు పడాలని వ్రాసిపెట్టి ఉందో, అయినా నేను జంకను అత్యాచారపరుల ఘోరాలకు నా రక్తం కూడా ప్రవహింప జేస్తాను. ఎన్ని బాధలు అనుభవించినా సత్యం మాత్రం నా దృష్టి నుంచి దూరం కాదు. అది నా నరనరాన వ్యాపించి ఉన్నది. సత్యసాధనకు నా సర్వస్వం సమర్పించవలసి వచ్చినా వెనుకాడను. అప్పట్షికైన సత్యాన్ని చేరగలనేని చాలా తక్కువ మూల్యానికే సత్యాన్ని సాధించినట్లుగా భావిస్తాను. ఎంతో సిరిసంపదలు పొందినట్లు సంతోషపడతాను. శ్వేతవర్ణ కిరణాలతో ప్రకాశించు అలభ్యమగు నక్షత్ర సంపద లభించినట్లుగా భావిస్తాను. ఇందుకోసం ఏ బాధనైనా, కష్టాన్నైనా సహించడానికి సిద్ధంగా వున్నాను. ఇందువల్ల నేను పొందే ఆనందాన్ని యీ భూమిపై వున్న ఏ శక్తీ దాచలేదు. ఆ ఆనందం అనంతమగు సముద్రం వంటిది. కళ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

గరళం సేవించిన శివుడివలే ఏ మానవుడైతే తన మనస్సులోని అనందంవల్ల సమస్త కష్టాలను దిగమింగునో, ఎవరైతే అపరిమిత యాతనను సైతం సహించి సత్యాన్ని దర్శించటానికి సిద్ధపడతాడో అతడే తన సాధనలో సఫలుడు కాగలడు.

ఈ విధమైన సాధననే నేడు మనం చెయ్యాలి. నూతన భారతాన్ని నిర్మించగోరు ప్రతివారూ ప్రతిఫలాపేక్ష లేకుండా నిరంతర త్యాగాన్నే తమ ధ్యేయంగా పెట్టుకోవాలి. తమ భోగాలన్నిటినీ విడచి బికారులు కావడానికి సైతం సిద్ధం కావాలి. చివరకు జీవితాన్ని కూడా దానం చేసి జీవిత ప్రతిష్టను నిలబెట్టాలి. ఇలాంటి సాధకులకు వారి ఆక్క విశ్వాసం ఆదర్భానురాగ, ఆత్మానందాలే సిరిసంపదలౌతాయి.

ఒక పర్యాయము నా సహాధ్యాయుడొకడు కనిపించాడు.

“మన దేశము ఏమీ లాభం లేదు కౌన్సిల్‌లో పాల్గొన్నా, ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగిలినా కలిసి వచ్చేదేమి కనబడదు. మంత్రులను ఇబ్బంది పెట్టినందువల్ల కూడా లాభం లేదు" అంటూ నిరాశ, అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్పారు.

“మనం ఇంతకన్నా చేసేదేముంటుందని” నేను ప్రశ్నించాను.

అతను మాత్రం అవిశ్వాసము, అశ్రద్ధతో కూడిన భావాలనే వ్యక్తం చేశాడు. అప్పుడు నేను మరలా ఇలా అన్నాను.

“ఇదిగో చూడు నీవు నాకంటే చిన్నవాడవు. ఏదో ఒక ఆదర్శం ప్రేరేపించటంతో మీరంతా సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రవేశించారు. నా ఆదర్భవాదం రోజురోజుకీ పెద్దవాడితో పాటు సాగిపోవుచున్నది. కానీ, మీ ఆదర్శం మాత్రం క్రమక్రమంగా క్షీణిస్తున్నది.”

“గత్ర కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన వలసిన యిబ్బంది కారణంగా నాలో యీ భావ మార్చిడి జరిగిందని” అప్పుడతను అంగీకరించాడు.

నా సహాధ్యాయుడు చెప్పిన రీతిగా కొన్ని సంవత్సరాల నుంచి అవిశ్వాసం, అశ్రద్ధా భావాలు వ్యాపించిన మాట వాస్తవం. దీనిని కాదనలేము. ఈ కారణంగానే మనలోని కార్యోత్సాహం కుంటుబడి పోయింది. ఈ చిక్కునుంచి బయట పడవలసిన తరుణం వచ్చింది. మన ఆంతరంగిక శ(త్రువులకన్నా మించిన శత్రువులు మరెవరుంటారు? అందువల్ల ముందుగా మన లోపలి శత్రువును తొలగించు కోవాలి. అప్పుడే బావ్య శత్రువును జయించ గలుగుతాం. మనలో అజేయమైన ఆత్మ విశ్వాసం

పెరగాలి. శక్తి, ఆదర్శము, భరత భూమి భవితవ్యము నందు విశ్వాసం స్థిరపడాలి. ఈ విశ్వాస (ప్రేరణతోనే ఉత్తేజితులమై మనము విశ్వవిజేతలం కావాలి.

బెంగాల్‌ ప్రస్తుత పరిస్థితిని గమనించినపుడు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. తాలింఖానాలు తెరవాలని, దేశ పర్యటన చేయాలనేది ఒకటి, యువలోకంలో కలిగిన జాగృతి రెండవది. ఒకప్పుడు బెంగాలీ వాళ్ళు పిరికివాళ్ళుగా భావింపబడే వారు. కాని ఆ ఆపవాదు ఇప్పుడు లేదు. బెంగాలీలకు పరమ శత్రువులైన వారు కూడా ఇపుడు వెంగాలీలను అవమాన పరచలేరు. మనకీ విధంగా చెడ్డపేరు తెచ్చింది ఎవరో, అది ఎలా తొలగిపోయిందో అందరికీ తెలుసు. కానీ శారీరక దౌర్బల్యం మాత్రం ఇంకా మనలో ఉన్నది. ఈ లోటును తొలగించు కోవాలి. అందుకు నడుం కట్టినందుకు సంతోషం. రాష్ట్రమంతటా వ్యాయామ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఏదో లాంఛనంగా ఉ న్నాయి. దుర్చలతను తొలగించుకుని జాతీయ దృష్టితో మనమంతా మంచి బలవంతులం కావాలి. విశ్వవిజేతలగు వస్తాదులను కొందరిని తయారు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందువల్ల రాష్ట్ర గౌరవం పెరిగితే పెరగవచ్చును. కానీ సామాన్య బెంగాలీ పౌరుడెలా ఉన్నాడో మనం చూడాలి. అతని శక్తి పెంచాలి. అంటే నలుగురు ముగ్గురు వస్తాదులను తయారుచేసి తృప్తిపడితే లాభం లేదు. సామాన్య ప్రజల సంగతి చూడాలి. వారి శక్తి పెంచాలి. అప్పుడే బెంగాల్‌ జాతి అంతా బలపడుతుంది. ఇప్పుడిప్పుడే పర్యటన చేయాలనే ఉత్సుకత పెరుగుతున్నది. ఇది సంతోషించదగిన విషయం. ఈత, అదేవిధంగా సైకిల్‌ మీద ప్రపంచ యాత్రపట్ల ఉత్సాహాన్ని చూపుతున్నారు. చూడని దేశాలను చూడాలని, అపరిచిత ప్రజలను కలిసి మాట్లాడాలన్న ఉత్కంఠతే జాతి నిర్మాణానికి, సామాజ్యాల న్థాపనకు నాంది కాగలదు. తన సరిహద్దులు దాటీ బయటకు వెళ్ళటానికి ఇష్టపడని జాతి తప్పక పతనమై తీరుతుంది. ఇందుకు భిన్నంగా ఎన్నో విఘ్నాలను అధిగమించి ప్రాణాలపై మోహాన్ని సహితం పరిత్యజించి దేశదేశాల పర్యటన చేయు జాతి రోజురోజుకు తన శారీరక, మానసిక అభివృద్ధితోపాటు రాజ్యాభివృద్ధి కూడా పొందగలుగుతుంది. నడవడి, విజ్ఞానం, పరిశ్రమలు అన్నీ అభివృద్ధి చెందుతాయి. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించి ప్రపంచంలో ఒక మహోన్నత స్థానాన్ని బ్రిటీష్‌వారు పొందగలిగారంటే, అందుకు, పర్యటనలపట్ల వారిలో వున్న ప్రభల వాంఛయే (ప్రధాన కారణమని నేననుకుంటాను. సామ్రాజ్య విస్తరణ కాంక్ష మనకు లేనప్పటికీ విదేశీ పర్యటనలతో మన హృదయం విశాలమవుతుంది, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, బుద్ది వికసిస్తుంది. ప్రపంచ పర్యటనలవల్ల కలిగే పూర్తి ఆనందాన్ని పొందాలంటే అమెరికన్‌ ధనికులవలే సుఖ మార్గంలోకాక, కష్టాలు వున్నప్పటికీ పాదచారులుగానో, లేదా గుర్రాలపైనో, సైకిల్‌పైనో పర్యటించాలి. ళా ాాడాడాడాడాాడాడాగొతమ్‌ ఛటోపాధ్యాయ

రాష్ట్ర యువకులలో ఒక కదలిక వచ్చింది. ఇది సంతోష పడదగిన విషయమే. ఈ కదలికే నూతన జీవితానికి నాంది కాగలదు. యువకులందరిలోనూ ఉత్సాహం పెరిగింది. వారు తమ కర్తవ్యాన్ని అర్ధం చేసుకొన ప్రారంభించారు. అందుచేతనే ప్రతి జిల్లాలోనూ యువజన సంఘాలు ఏర్పడుతున్నాయి. వారంతా పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాని సరైన మార్గము కనిపించుట లేదు. నాయకుడు లేకపోయినా, మార్గం తోచక పోయినా, యువకులు మేల్మొని తమ బాధ్యత వమిటో యోచించ ప్రారంభించారు. ఇది సామాన్య విషయం కాదు. నేనాక విషయము చెప్పదలచాను. మీ యువకులంతా అన్వేషించినా నాయకుడు లభించకపోతే మీరు విచారించ వలసిన అవసరం లేదు. మీరే ఒక నాయకుని నిర్ణయించుకుని పనిలో నిమగ్నులవండి. నాయకులనే వారెవరూ ఆకాశంలోంచి వూడిపడరు. పని చేయగా చేయగా ప్రతి ఒక్కరూ నాయకుడు కావచ్చును. అంతేగాని ఇప్పుడు మీరంతా “మార్గమేమిటి?” అని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. పని జరగదు. తెలివితేటలను ఉపయోగించుకొని మీ మార్గాన్ని మీరే నిర్ణయించు కోవాలి. సమస్య మీరనుకొన్నంత కష్టమైనది కాదు. జ్ఞాన, కర్మ సంస్కృతీ రంగాలలోనూ, జాతి విషయంలోను అభివృద్ధి చెంది సర్వోన్నతాలగు స్వేచ్భా స్వాతంత్రాలనుభవించు జాతి జనులతో సమానంగా నిలవగల సర్వాంగ సుందరమగు జాతిని నిర్మించుటయే మన ప్రధాన కర్తవ్యం. అందువల్ల జాతీయ జీవనంలోని ప్రతి క్షేత్రంలోనూ చైతన్యం తీసుకు రావాలి. ఎక్కడా, ఏ విధమగు అసలట, నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరి శక్తినిబట్టి వారు, ఎవరి అఖిరుచినిబట్టి వారు తమ తమ కార్యక్షేత్రాలను నిర్ణయించు కొనాలి. జన్మతః గాని, పరిసరాల వల్లగాని ఎవరికి ఏవిధమైన శక్తి లభించినా దానిని అభివృద్ధి చేసుకొని దేశమాత పాదారవిందాలకు పూజాపుష్పంగా అర్చించాలి. గత ఇరువది సంవత్సరాలలో బెంగాల్‌లో అనేకమంది సాధకులు, కవులు, సాహితీవేత్తలు, విజ్ఞానవేత్తలు జన్మించారు. వారందరూ మనలను విచార సాగరంలో ముంచి స్వర్గస్తులైనారు. దివంగతులైన వారి స్థానాలను మనమింకా భర్తీ చేయనేలేదు. ఇది సిగ్గు పడవలసిన విషయం. మన వంగభూమి ప్రత్యేకతలను నిలబెట్టాలనుకుంటే, ఈ ఖాళీని భర్తీ చేయగలవారిని సృష్టించ గలగాలి. జీవమున్న ఏ జాతిలోను యిలాంటి లోటు వుండదు. మహా పురుషులు తనువు చాలించినదే తడవుగా యితర మహాత్ములు ఆ స్థానాలను భర్తీ చేస్తారు. ఏ జాతి అయితే ఒక్కటిగ నిలచి తదేక దీక్షతో వివిధ జీవన రంగాలలో తగు కృషిచేయునో, అలాంటి జాతిలో ఏ రంగంలోనూ కొరత ఉండదు. బెంగాలు సర్వతోముఖాభివృద్ధి చెందలేదు. ఇందుచేతనే గతించిన మహాపురుషుని స్థానం భర్తీ అగుటలేదు. సర్వతోముఖంగా అభివృద్ధి చెందిన జాతిని ఆదర్శంగా తీసుకుని సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 160

జాతీయాభివృద్ధి కార్యాలలో ప్రవేశించక పోయిన పక్షంలో మనమెన్నడ్లూ జీవితరంగంలో విజయులం కాజాలము. జాతీయ జీవితంలో అనేక రంగాలున్నవి. అన్నిటినీ ముందుకు తీసుకు పోవాలి. చైతన్య వాహినులు అన్ని జీవిత రంగాలలోకి ప్రవహిస్తాయి. నూతన బెంగాల్‌ రాష్ట్రం బయట వారిమీద ఆధారపడక స్వశక్తిపై నిలవగలిగి ఉండాలి. నూతన జాతిని సృష్టించ వలసిన బాధ్యత నేటీ యువకులపై వున్నది. ఈ గురుతర బాధ్యత కోసం (ప్రాణార్ప్చణకు సైతం సిద్ధపడి కార్యరంగంలోకి దిగాలి. నేదు రాష్హ్రాఖివృద్ధికి జరగ వలసిన కృషి గురించి చర్చలు జరగటం సంతోషించదగిన విషయం. దేశాభివృద్ధి కౌరకు జరిగే యా మహా యజ్ఞంపట్ల నిర్లక్ష్యంగా వుండలేము. అందువల్ల ఓ యువకులారా! “వ్రూ సమస్తం దేశమాత కొరకేనని” నినాదం చేద్దాం రండి. క బాన్‌ ఫది

నాదేశం మాందలే జైలు డిసెంబర్‌- 1926 వినయపూర్వక నమస్కారములు, తాము నవంబర్‌ తొమ్మిదవ తేదీన రాసిన ఉత్తరం అందినది. జవాబిచ్చుటలో ఆలస్యమైనందుకు అన్యధా భావించకండి. నా అభిప్రాయం ప్రకారమైతే ఉత్తరము 'వ్రాయవద్దనే అనుకున్నాను. ఎందుకనగా రాజకీయ ఖైదీతో సంబంధం పెట్టుకొనుట ఎవరికీ మంచిది కాదు. కానీ మీరు ఎదురుచూస్తూ ఉంటారని జవాబు రాస్తే మీకు సంతృప్తిగా కూడా ఉంటుందని వ్రాస్తున్నాను.

సంఘదృష్టితో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆరోగ్యాభివృద్ధిని కాంక్షించారు. విడుదల కోరినారు. మనఃపూర్వక (ప్రేమను ప్రదర్శించారు. వీటన్నింటికీ పృదయ పూర్వకమగు కృతజ్ఞతను తెలియ జేయుచున్నాను. దేశ సేవకుడు యింతకంటే మంచి పారితోషికాన్ని ఏమి కోరగలడు? మీ ఉత్తరం ద్వారాను, పత్రికలద్వారాను మీ సమితి కార్యకలాపములను తెలుసుకుని సంతోషించినట్లు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ విధంగా ఆనంద పడటం మంచిది కాదనుకోండి. స్వదేశ సేవకుడననే భావన ఉన్నప్పటికీ మానవుడనే కదా? “మనదే యిదంతా, మనమే చేస్తున్నాము", అని భావించుకుని ఏదో మమత, (ప్రేమ కలిగి ఆనందం కలుగుతోంది. ఈ (ప్రేమ, మమత అనే వాటిని జయించి ముందుకు సాగిపోవుట మంచిదే. మంచి దేశ భక్తులందరూ అన్ని రకాలైన ప్రతిఫల కాంక్షలను వదలుకొనుట ఉత్తమం. కానీ

నేను కోరుచున్న యీ దశ నాలో ఇంకా ఆదర్శంగానే ఉండిపోయింది.

(మాండలే జైలు నుంచి “ దక్షిణ కలకత్తా సేవక్‌ సమితి ” కార్యదర్శి శ్రీ అనాథ బంధు దత్‌కి వ్రాసిన ఉత్తరం)

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 162

ఇప్పటికీ పదునాలుగు సంవత్సరాలు జైలులో గతించాయి. ఇందులో పదకొండు సంవత్సరాలు బర్మాలో గడిచాయి, చూస్తూ చూస్తూ పదునాలుగు మాసాలు గతించినవే అని ఒకసారి, యుగాలే గడిచి పోయినట్లు మరొకసారి అనిపించేది. జైలే ఇల్లన్నట్లుగా ఉండేది. బయటి విషయాలు మాకు స్వష్పాలతో సమానం. ఇనుప సంకెళ్ళు, రాళ్ళు, గోడలు ఇవే ఇక్కడ కనిపించేవి. నిజంగా ఈ జైలు ఒక విచిత్ర ప్రపంచం. జైలు చూడదనివాడు యీ దేశంలో ఏమీ చూడలేదని, వాడికి యీ ప్రపంచంలోని వాస్తవం ఎక్కువ భాగం తెలియదని అనిపించేది. ఎంతో మనః పరిశీలన చేసిన తరువాత కూడా ఈ విధమగు ఆలోచనలు కలగటం ఈర్యవల్ల కాదనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను జైలుకివచ్చి చాలా నేర్చుకున్నాను. లోగడ అస్పష్టంగా ఉన్న సత్యం ఇప్పుడు చాలా వరకు స్పష్టంగా గోచరిస్తున్నట్లుగా ఉన్నది. ఇదే గాక అనేక మగు నూతనమైన, గంభీరమైన అనుభూతులు నా జీవితానికి శక్తినిచ్చి ప్రగాఢం చేసినవి. ఒక వేళ భగవంతుడు నాకు సదవకాశాన్ని సద్వాణిని ప్రసాదించిన పక్షంలో విషయాలన్ని దేశవాసులకు వినిపిస్తాను. జైలులో ఉన్నానన్న విచారం లేదు. దేశం కోసం కష్టాలను అనుభవించడం గౌరవమే. దేశం కోసం పడే బాధలలో ఆనందమున్నదని నమ్మండి. అలాకాని పక్షంలో మానవుడు పిచ్చివాదై పోతాడు. బాధలలో మందపహాసవదనుదై నిలబదడజాలడు. బాహ్యంగా యాతన అనుభవించునది, అంతరంగికంగా అనందమయమై ఉందును. సంవత్సరానికి 365 రోజులు, రోజుకు ఇరవై నాలుగు గంటలన్న వాస్తవం కూడా నాద్భష్టిలో లేకుండా పోయింది. ఎందుకనగా ఇప్పటికీ చేతుల మీద సంకెళ్ళ చిహ్నాలున్నాయి. పైన చెప్పిన అనుభవం తక్కువగాగాని, ఎక్కువగాగానీ పొందని మనిషి బాధాపూరిత జీవితాన్ని ఆనందంగా అనుభవించ లేదనేది యథార్థం. పద్నాలుగు మాసాల కాలం వృధాగా పోయిందనే విచారం. స్వరాష్ట్రంలోని జైలులో ఉండివుంటే సాధన రంగంలో ఎంతో ముందుకుపోయి ఉండేవాడినే. కానీ అది జరిగే పనికాదు. పతాకాన్ని పట్టుకోమని చెప్పినవారే, దానిని పట్టుకోగల శక్తిని కూడా సమకూర్చాలన్నదే నా విన్నపం. ఇక్కడ నుంచి విడుదల అవుతాననే అభిప్రాయం కలిగినపుడు కలిగే ఆనందం కంటే భయమే ఎక్కువగా ఉంటున్నది. వెళ్ళే ఏర్పాట్లు చేసుకొనేటప్పుడే కర్తవ్యం పిలుస్తుందనే అభిప్రాయం కలుగుతున్నది. అందువల్ల కర్తవ్య నిర్వహణకు పూర్తిగా తయారయ్యే వరకూ విడుదల సమస్య ఉత్పన్నం కారాదన్నదే నా కోరిక. నేనిపుడు శారీరకంగానూ, మానసికంగానూ సిద్ధంగా లేను, అందుచేతనే కర్తవ్యం 165... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

అహ్వానించుట లేదు. నేను సిద్ధమైన రోజున ఒక్క క్షణం కూడా ఈ జైలు నన్ను అటకాయించి ఉంచలేదు. ఈ విధమగు భావనా క్రమమే నాలో పనిచేస్తోంది. ఇందులో జరిగేదేదో, జరగనిదేదో నాకు తెలియకున్నది.......... “దేశ కాలమాన పరిస్థితులు మిమ్మల్ని బెంగాలుకు ప్రియతమునిగా చేసినవని” మీరు వ్రాశారు. కానీ ఈ పరిస్థితులు బెంగాలుని నాకేరూపంలో చూపెడుతున్నవో అర్ధమవుటలేదు. బెంగాల్‌ నీటిలోను, మట్టిలోనూ, ఒక చిరంతన సత్యం దాగి ఉన్నదని దేశ బంధు చిత్తరంజన్‌ దాస్‌ అన్నాడు. ఒక సంవత్సరం జైలులో ఉండకపోతే ఆయన చెప్పిన ఈ సత్యం యొక్క అర్ధం నాకు తెలిసేదికాదు.

వంగభూమి యందు సస్యశ్యామలమై మనోహరమై చూడ సొంపైన పంట పొలాలు, నిలువెల్లా పుష్పించి మధుర సువాసనలతో గుబాళిస్తున్న మామిడి తోటలు, ధూపదీప నైవేద్యాలతో నిండిన దేవాలయాలు, పరిశుభ్రమైన గ్రామీణ కుటీరములు నా కన్నుల ముందు నాట్యం చేస్తున్నాయి.

పగటిపూట మేభఘమాలికలు నాకండ్ల ముందు తిరుగుతున్నపుడు, వియోగావస్థలో నున్న దేవకన్యలు పంపిన రీతిగా నా మనసులోని మాటలన్ని ఒక సందేశ రూపంలో బెంగాలి మాతల పాద పద్మములకు నివేదించాలని అనిపిస్తుంది.

సాయం వేళ చీకటి చిక్కబడిన కొలది సూర్యుడు మాండలే కోటగోడల వెనుకకు వెళ్లిపోతాడు. అస్తమిస్తున్న భానుని సువర్ణరాగ రంజితమైన కిరణాలు అరుణ వర్ధాన్ని దాల్చి పశ్చిమ దిశా కాంతకు ఎరుపు రంగును అద్దుతాయి. అప్పటి వరకు ధవళ కాంతితో మెరిసిపోతున్న మేఘమండలం ఎర్ర పడుతుంది. ఆ సమయాన వంగ భూమియందు అస్తమించు సూర్యారుణకాంతులు నా న్యృతి పథంలో పరుగులు తీస్తాయి. ఈ విధమగు ఊహాజనిత దృశ్యములందు ఇంత సౌందర్యమున్నదని లోగడ నాకు తెలియదు.

ప్రాతఃకాలాన ఒక విచిత్రమగు కాంతి తూర్పుదిశను అలరించినపుడు నిద్రమత్తులో ఉన్న నేత్రాలను ఎవరోకాకి “ఆంధులారా” లేవండి అని చెప్పినట్లుగా ఉ టుంది. ఈ సూర్యుడు మరొక రూపంలో కూడా మనకు కనపడతాడు. ఈ సూర్యోదయ దర్భనంలోనే కవులు, సాధకులు మాతృదేవతను దర్శించారు.

ఇదంతా ఎందుకులే పోనియండి. చూడగా నేనేదో కవినై పోతున్నట్లున్నది. కాని, ఇది కవిత్వం కాదులే అధిక ప్రసంగం అనుకోండి. మాట్లాదేవారు లేక చాలా కాలంపాటు మౌనంగా వుండి, అనుకోకుండా ఎవరైనా కలసి మాట్లాడే సదవకాశం సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 164

లభించినపుడు యిలానే వుంటుంది. ఇంజన్‌ను గమనించండి, అప్పుడప్పుడు పనికిరాని పిప్పిని, మడ్డిని బయటకు పారేసి తననుతాను శుద్ధి చేసుకుంటుంది. ఇప్పటి నా స్థితి కూడా యిలానే వున్నది.

సేవక్‌ సమితి కార్యాలన్నీ సక్రమంగా జరుగుతున్నట్లు తెలిసి సంతోషించాను. ల్యాండ్స్‌ డౌన్‌ బ్రాంచి వారితో ఏ విధమగు భేదాభిప్రాయాలు రాకుండా చూడవలసినది. వాళ్ళు పనిపొటలు బాగానే చేస్తున్నారనుకుంటాను. దక్షిణ కలకత్తాలోని 'సేవాశ్రమంలోని ఉద్యోగుల కొరకు ఏమైన చేస్తే చాలా బాగుండును. ఇది బాగా అభివృద్ధి చెందుట లేదు. కాని ఆ పనిచేయుట చాలా అవసరం.

మిమ్మల్నందరిని గుర్తించడానికి ఏవిధమగు కష్టంగాని, అసౌకర్యంగాని లేదు. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రీతిపూర్వకమగు నా పలుకులతో పాటు అలింగనం కూడా స్వీకరించండి.

ఇక ఉంటాను. 165 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

సంఘసేవ-గృహపరిశ్రమలు

  • మాందలే జైలు వినయపూర్వక నమస్మారములు, తమ ఉత్తరం అందినది. విషయాలు తెలిశాయి. ఆనందం కలిగింది. కార్యవర్దంలోని ఎక్కువమంది సభ్యులు సేవాశ్రమం పనులలో 'శద్ద చూపటం లేదని మీరేమీ నిరాశ చెందవలదు, విచారపడవద్దు. అనేక కార్య వర్షాలవారి పరిస్థితి కూడా యిలాగే ఉన్నది. తన సేవాసక్తుల వల్లనే ఇతరులలో కూడా సేవాసక్తి కలిగించాలి. (గ్రామంలోని, యితరుల కష్టాలపట్ల సానుభూతి, పట్టుదల లేకుండా 'సేవాకార్యాలు సాధ్యం కావు. ఒక వేళ సాధ్యమైనా సార్ధకం కావు. మీలోని అంతరంగిక సేవాభావం, సంఘ (ప్రేమల వల్లనే ఇతరుల హృదయాలలో కూడా అదే విధమైన భావాలు కలిగించ వచ్చన్నది నా ఆశ, విశ్వాసమున్నూ సేవాశ్రమం భవనం పక్కన పొర్కు వేయటానికి తగిన స్థలమున్నదా? నెలకు నలఖై రూపాయలవరకు చందా వస్తున్నదని సంతోషించాను. భవనానికి అద్దె ఎంత? ఎన్ని అంతస్తులు గలది? ఎన్ని గదులున్నాయి? కార్బోరేషన్‌ ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు? ఏ తెగకు చెందిన వారి పిల్లలు వస్తున్నారు. సేవాత్రమంలోని పిల్లలకు ఏ విధమమైన విద్య నేర్పుతున్నదీ రాయండి. ఆశ్రమంలో నౌకర్లు ఎంతమంది ఉన్నారు? వంట ఎవరు చేస్తారు? ఎంతమంది బాలురు మగ్గములు, మిషను కుట్టుట మొదలకు పనులు నేర్చుకొంటున్నారు. మా మూలు కోటులు, చొక్కాలు మొదలైన వాటీకి సరిపడే గుడ్డనేయటం లేదా కుట్టటం ఎన్ని రోజులలో నేర్వవచ్చును? సగటున విద్యార్థుల తెలివితేటలు ఎలా ఉన్నాయి? అవకాశం లభించినపుడు సేవాశ్రమమును గూర్చి విషయాలన్నీ వివరంగా రాసి పంపండి. అవి చదివిన తరువాత ఏమైన సలహాలు యివ్వటానికి ప్రయత్నిస్తాను. పిల్లల భోజనాలకు ఏర్పాట్లు ఎలా చేశారు. జబ్బుపడితే చికిత్సకు ఏమి ఏర్పాటు చేశారు ? చికిత్సకు గాని మందులకు గాని డబ్బు. చెల్లించవలసి వస్తున్నదా లేదా? సరే ఉంటాను. (శ్రీ అనీల్‌ ఐంధుకు వ్రాసిన ఉత్తరములు) సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 166

2

మాందలే జైలు మా నిరశన వ్రతం పూర్తిగా నిరర్ధకం, నిప్పలం కాలేదన్న సంగతి బహుశా మీరు వినే వుంటారు. మత సంబంధమైన కొన్ని అధికారాలను ప్రభుత్వం అంగీకరించి అమలులో పెట్టటానికి ఒప్పుకున్నది. ఇకనుంచి దుర్గాదేవి పూజ ఖర్చుల నిమిత్తం ముప్పది రూపాయల అలవెన్సు లభిస్తుంది. ముప్పది రూపాయలు చాలా తక్కువ. ఈ మొత్తం మన ఖర్చుకు చాలదు. కానీ, ఇంతవరకు వ్యతిరేకిస్తూ వచ్చిన ఒక నియమాన్ని ప్రభుత్వం యిప్పుడు అంగీకరించింది. ఇదే ఇపుడు మన కన్నిటికంటే లాభసాటి అయిన

విషయం. డబ్బు విషయం అన్నిచోట్లా, అన్ని వేళలా మామూలు విషయమే గదా? పూజ చేసుకోనివ్వాలనే కోర్మెనే కాకుండా మరొక కోర్మెను కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిరశన వ్రతం గురించి వైష్ణవ భాషలో చెప్పవలెనంటే ఆత్మ వికాసం, ఆత్మానందమే దానివల్ల కలిగే గొప్పలాభం. కోర్కెల సాధనను విజయంగా చెప్పడం లౌకిక భావన మాత్రమే. బాధలు పొందకుండగా ఎవ్వరూ తన అంతరంగిక ఆదర్శంతో తాదాత్మ్యం పొందజాలడు తనను తాను ఒరవడి పెట్టుకుని ఆచరణ భాగంగా పరిక్షించి చూస్తేనేగాని తన లోపలున్న అనంత శక్తిని గురించి ఒక నిశ్చితాభిప్రాయానికి రాజాలడు. ఈ విధమైన పరిచయ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నన్నునేను బాగా అర్ధం

చేసుకోగలిగాను. నా మీద నాకు విశ్వాసం రెట్టింపైంది.

సాంఘిక సేవాద్వారా మనం గృహపరిశ్రమలు ఏర్పాటు చేసుకొన వచ్చును. “కమర్షియల్‌ మ్యూజియం”, “ బెంగాల్‌ హోమ్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ మొదలగునవి లేదా దుకాణములు గాని చూస్తే మన మనసుల్లో నూతన ఆలోచనలు కలుగుతాయి. గృహ పరిశ్రమల గురించి బెంగాలు ప్రభుత్వం ప్రచురించిన నివేదికను కూడా మనం పరిశీలించవచ్చు. దానివల్ల కూడా లాభం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమంటే గృహ పరిశ్రమలున్న ప్రాంతానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడటంవల్ల ఎక్కువ ఉపయోగం వుంటుంది. ఈ పరిశ్రమలకు ఎక్కువ డబ్బు కావలసి వస్తుందని శత గౌతమ్‌ ఛటోపాధ్యాయ

నేను అనుకోవడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే, పూర్తి ఛద్ధ చూపి మనస్ఫూర్తిగా పని చేయటానికి సిద్ధపడిన కార్యకర్త ఒకరు ఈ సభ తరపున ఉ డాలి. అతను దీనికి చెందిన విషయాలన్ని తెలుసుకోవాలి, సంబంధిత పుస్తకాలు చదవాలి. ఎక్కడెక్కడ యిలాంటి పరిశ్రమలు పని చేస్తున్నాయో తెలుసుకొని ఆయా చోట్లకు వెళ్ళి వాటి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలి. పని చేయాలని నిశ్చయించు కున్నప్రుడు ఆ పనిని ఎవరితో చేయించాలని అనుకుంటున్నామో అతనిని తగిన ప్రదేశానికి పంపి తగు శిక్షణ యిప్పించాలి. ఇందుకు ఏవో పెద్దపెద్ద పరిశమాగారాలకు పంపనవసరం లేదు. కుట్టుపని మనవద్దనే నేర్చుకొన వచ్చును. పాలిటెక్నికల్‌ పనులన్నిటిలోనూ పొటో (ఫ్రేంలు, లేదా, మట్టి బొమ్మలు వగైరాలన్నీ ఇంటివద్దనే తయారు చేస్తుంటారు. పీలతో (ఫ్రేం వర్కు చేయించ వచ్చునా లేదా అనే దానిలో నాకు సందేహం ఉన్నది. ఇక మట్టి బొమ్మలు వగైరాలు తయారు చేయాలని భావించినట్లయితే ఎవరో ఒకరు సంబంధిత ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులలోనే నేర్చుకొని రావచ్చు. దీనికి ఖర్చు కూడా పెద్దగా కాదు. పని ప్రారంభించిన తరువాత రంగులకు మాత్రం కొంత ఖర్చు అవుతుంది. మిగతా ఖర్చులు చాలా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి దీనికోసం పూర్తిగా పనిచేస్తూ తయారు చేసుకోవాలి. మరొక విషయం నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటుంది. లోగడ కూడా నీకు వ్రాసి ఉండవచ్చును. గుండీల విషయం ఒకటి చూడండి. ఢాకా జిల్లాలోని అనేక గ్రామాలలో ఈ పని జరుగుతున్నది. బీద కుటుంబీకులందరూ ఖాళీ సమయంలో ఇదే పని చేస్తుంటారు. ఎవరికైనా దీనిని త్వరలోనే నేర్చవచ్చు. పని నేర్చగల వానిని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. పత్రికలో ప్రకటన యిస్తే అలాంటి వ్యక్తి ఎవరైనా లభిస్తాడు. నాకు తెలిసినంత వరకు రాతిమీద అరగదీసి గుండీలు చేయవచ్చు. రంధ్రాలు వేయటానికి, గుండ్రంగా చేయటానికి చిన్నపాటి మెషిన్‌ కావాలి. దీనితోపాటు, ఒక కుర్రవాడు సముద్రం వద్ద లభించే ముత్యపు చిప్పలు, శంఖాలు వుంటే పని ప్రారంభించవచ్చు. సహాయం అవసరమైతే వారితోనే ఈ పని చేయించ వచ్చును. కాని పని చేతనైన తరువాత బీద కుటుంబీకులు అందరూ తమ ఆదాయం పెంచుకొనుటకు ఈ పని తమంతటతామే చేసుకుంటారు. సమితి వారు తక్కువ ధరకు ముడి సరకులు అందించి తయారైన సరకు అమ్మదానికి ఏర్పాటు చేయాలి. ఈ పని ప్రారంభించిన మొదట్లో చాలా సమయం వినియోగించాల్సి ఉంటుంది. ఇక సెలవు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 168

3 మాండలే జైలు మీరు మొదట పంపిన కాగితాలన్నీ అందినవి. నిన్న గ్రంథాలయం కేటలాగు వగైరా అందినవి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న సమితి కార్యకలాపాలు నాకెంత ఆనందాన్ని కలగజేస్తున్నదీ వ్రాయనలవి కాదు. ఖర్చుకు కావలసిన డబ్బు సమకూర్చినందుకు చాలా సంతోషం. రాట్నం, నూలు వగైరాలను గురించి మీరు వ్రాసిన దానితో ఏకీభవిస్తున్నాను. అయినా ఇప్పటి నుంచి ప్రయత్నం మానకూడదు. ప్రత్తి పండిచటానికి ముప్పై ఎకరాల భూమి ఎవరో ఒక మహానుభావుడు ఇస్తానన్నట్లు లోగడ వ్రాశారు. వారు ఇప్పటికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నచో మంచిదే. ప్రత్తి పండిచటానికి మొదట్లో ఎక్కువ ఖర్చు కాదు. ఒకరిద్దరు పనివాళ్ళ జీతానికి, విత్తనాలకు సరిపడ డబ్బు సమకూర్చుకుంటే సంవత్సరంలో మనకు దాని ఫలితం వస్తుంది. ఏ జాతి పత్తి విత్తనాలు నాటాలో వ్యవ్యసాయ శాఖావార్ని అడిగి తెలుసుకోవాలి. ప్రారంభించిన పరిశ్రమలు కష్టం లేకుండా ఏ మాత్రం లాభం ఉ న్నప్పటికిని కొనసాగించండి. అధిక లాభం యిచ్చే పనులు 'ప్రారంభమైనపుడు వీటిని వదిలి వేయవచ్చు. ఇప్పుడున్న శరణార్థులతో మాత్రం ఏదో ఒక పని చేయించాలి. బిక్షమెత్తటం మాని వారు ఏదేని పని చేయటం నేర్వగానే వారందరినీ అధిక లాభాలు వచ్చే పనిలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం గృహ పరిశ్రమలో లాభం అధికంగా రాకపోయినా పనిపాటలందు అభిలాష్క పని విలువను గ్రహించటం వంటి భావాలను వారిలో పాదుకొల్పినచో సంఘానికెంతో లాభం కలుగుతుంది. కుటీర పరిభ్రమల విషయంలో మీరుకూడా శ్రీ మదన్‌ మోహన్‌ బర్మన్‌తో కలిస్తే చాలా బాగుంటుంది. సున్ని మామిడి తదితర ఊరగాయ పచ్చళ్ళు వగైరాలు చేస్తే అవికూడా చెల్లుబడి అవుతాయి. స్త్రీలు ప్రత్యేకించి వితంతువులు ఈ పనులు సులభంగా చేయగలరు. కానీ, ఈ పనిని నేర్చటానికి ఎవరైనా దొరుకుతారా? బజారులో అమ్మాలంటే ఈ 169 ఎ. గౌతమ్‌ ఛటోపాధ్యాయ

సరకులు చాలా బాగుండాలి. బాగా తయారు చేయగలం అనుకుంటే ప్రయోగాత్మకంగా చేసి చూడవచ్చు. ముడి సరకు యిచ్చి తయారైన సరకును మీరు తీసుకొనవచ్చు. అమ్ముకోవలసిన బాధ్యత మీపైనే వుంటుంది. అలాకాకుంటే, ముడి సరకులు వారే తెచ్చుకుని తయారైన వాటిని మీకు అమ్మవచ్చును. పని ప్రారంభానికి ముందే దుకాణాల వారితో మాట్లాడాలి. మన సరకు తీసుకుంటారో లేదో వారిని అడగాలి. ముడి సరకులు బాగుంటేనే తయారైన సరకు బాగుంటుంది. కాని, దీనిలో దొంగతనం జరగడానికి కూడా అవకాశం వుంది. ఈ పనులు చేసేవారు బీదలై ఉంటారు. మామిడికాయలు, నిమ్మకాయలు, నూనె, మిరపకాయలు మొదలైనవి వారి వద్దకు వచ్చినపుడు స్వంతానికి ఉపయోగించు కోవాలనే ఆశ వారికి కలగదని ఎలా చెప్పగలం? వారే ముడిసరకులు తెస్తే నూనె వగైరాలు చౌకబారువి తీసుకు వస్తారు. అప్పుడు సరకు బాగుండదు. అందువల్ల ఈ విషయంలో మీరు అటూ ఇటూ కూడా ఆలోచించుకునే ఏదైనా నిర్ణయానికి రండి ఇవేగాక బజారులో ఈ సరుకులు కొనేవారు ఎలాంటివారో తెలుసుకోవటం కూడా అవసరం. అంతరాత్మను కష్టపెట్టని వారు, పాపభీతి కలవారు లభించనిచో ఈ పనిలో మనకు జయం వుండదని నా భావం. బీదవారైనా, మంచి కుటుంబీకులైనా వారిద్వారా ఈ పని జరగ వచ్చును. సరకు తయారై రాగానే దాని ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. అమ్ముడుబోయే వరకు నిలవ చేయాల్సి ఉంటుంది. సమితి మరొక పనికూడా చేయాలి. కలకత్తాలో (పెసిదెన్సీ జైల్‌, ఆలీపూర్‌ జైల్‌ అని రెండున్నవి. ఈ జైళ్ళ ఆస్పత్రులలో ఎవరైనా హిందువులు చనిపోయినపుడు వారికి చెందిన బంధువులెవరూ కలకత్తాలో లేనియెడల దహన క్రియలు తగు రీతిని జరుగుట లేదు. వెట్టివారికి లేదా పాకీ పనివారికి డబ్బుయిచ్చి యీ పని చేయించాల్సి వస్తున్నది. మహమ్మదీయులకు ఈ విషయంలో మంచి యేర్చాటున్నది. “బరియల్‌ అసోసియేషన్‌” అనే దొకటీ వున్నది. ఎవరైనా మహ్మదీయ ఖైదీ చనిపోయాడనే వార్త తెలియగానే యీ సంఘం వారు తగురీతిగా ఖననం జరుపుతున్నారు. చనిపోయిన హిందూ ఖైదీలకు కూడా ఈ విధంగా ఉపయోగపడు సంస్థ ఒకటి ఉండాలి. సేవక్‌ సమితి ఈ బాధ్యత తీసుకోగలదా? మీకు గనుక యీ విషయం నచ్చితే వసంతబాబు ద్వారా జైలు సూపర్నెండెంటు వారికి ఒక దరఖాస్తు పంపవచ్చును. దానిలో మీరు యీ కార్యభారం వహించడానికి సేవక్‌ సమితి సిద్ధంగా ఉన్నదని వ్రాయండి. తాము యీ విషయంలో వమీ యేర్పాటు చేయలేని పక్షంలో జైలునుంచి విడుదలైన తరువాత నేను ప్రత్యేక కృషి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 170

చేయగోరుచున్నాను. పూర్వం నేను స్వయంగా యీ పని అనేకసార్లు చేశాను. ఈ విధమైన పనిలో వలంటీరుగా ఉండటానికి నేను సర్వ్సదా సంసిద్ధుడనే. కుటీర పరిశ్రమలు నడపవలెనన్నవో ముందుగా ఒక పని చేయటం చాలా అవుసరం. ఒక యువకుని, కాసిమ్‌ బజారులో నున్న పాలిటెక్సిక్‌కిగాని లేదా అదేవిధమైన మరొక సంస్థలోగానీ పని నేర్చుకొనుటకు పంపవలయును. కాసిం బజారులోని స్కూలులో మట్టితో ఆట బొమ్మలను, దేవీ దేవతల విగ్రహాలను బాగా తయారు చేస్తారు. సహాయము కావలసిన వారినందరిని యీ విధమమైన పనులలో ప్రవేశపెట్టిన పక్షంలో వారిద్వారా తయారగు సరకు బెంగాలు అంతటా అమ్మవచ్చును. ఇక్కడ మరొక చేతి పరిశ్రమకూడా వున్నది. రంగు కాగితాలతో పువ్వులు, చెట్ల అకులు, పూలగుత్తులు చైనా లాంతరులు మొదలగునవి తయారు చేయునదే ఆ పరిశ్రమ. ఈ వస్తువులు చూడగానే “ఇవి అసలైనవి కావు కాగితంతో తయారైనవని” చెప్పటానికి వీలులేనంత అందంగా వుంటాయి. పెద్ద కుటుంబాలకు చెందిన పిల్లలు యీ పని చేయవచ్చును. చాలా సులభం. ధాకా జిల్లాలో కుటీర పరిశ్రమల స్థాయిలో గుండీలు తయారవుతున్నాయి. ప్రతి ఇంటా యీ పని జరుగుతోంది. ఈ పని చూచిరావటానికి ఎవరినైనా ఒకర్ని అక్కడకు పంపండి. అరోగ్య విషయంగా జరుపు ఉపన్యాసాలు, మ్యాజిక్‌లాంతర్‌ ప్రదర్శనల ఏర్పాటు భవానీపూర్‌ వైపున చేస్తే మంచిది. బీదలు నివసించు చోటున ఉపన్యాసాలు, చాలా అవుసరం. సాధ్యమైతే మ్యాజిక్‌ లాంతర్‌ వగైరాలు కొనండి. ప్రదర్శించుటకు కావలసిన చిత్రాలు ఎవరితోనైనా తయారు చేయించుకుంటే మంచిది. సెలవు. 171 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

క! మాందలే జైలు 3-7-1926 మీరు వ్రాసిన మూడు ఉత్తరాలూ సక్రమంగానే చేరాయి. జవాబివ్వటానికి అవకాశం లభించలేదు. ఇదేగాక ఆరోగ్యం కూడా సరిగాలేదు. చదవటానికి, వ్రాయటానికి మనస్మరించడం లేదు. మొదట వారానికి రెండు ఉత్తరాలు వ్రాయగలిగే వాడిని, కానీ ఇప్పుడు ఒకటే వ్రాయగలుగుతున్నాను. ఇందువల్ల జవాబివ్వలేక పోతున్నాను. రెండు మూడు మాసాల నుంచి ఉత్తరాలు పేరుకొని పోయాయి. బీదలకు సహాయం చేసి వారి ద్వారా పని చేయించు కోవటం అనేది సాంఘిక సేవ విభాగంవారి ప్రధాన ధ్యేయంగా ఉండాలి. కేవలం దానం చేయుట, నియమబద్ధంగా దానం చేయు ఉద్దేశం కాజులదు. దానం ఇవ్వకుండా, కేవలం దానం తీసుకొనటానికి అలవాటు పడటం మంచిది కాదు, ఆత్మగౌరవానికి భంగం కల్షిస్తుంది. ఈ భావాన్నే సహాయం అర్థించు బీదలలో మనం కలుగ చేయాలి. అయినప్పటికి ఎవరైనా సహాయం పొంది దానికి బదులుగా పని చేయడానికి ఇష్టపడనిచో వారికి చేయు సహాయం ఉ పసంహరించు కోవటమే ఉత్తమం. కాని దీనికి ముందుగా ఒకటి రెండు విషయాల గురించి ఆలోచించుట అవసరం, 1 సహాయం పొందిన వారికి పనిచేయటానికి అవకాశాలుండాలి. ఉదాహరణకు : ఒక వితంతువు సహాయం పొందినదనుకోండి ఆమెకు ఇంటి పనుల నుంచి తీరిక లభించనిచో పనిచేయమని పట్టుపట్టుట అనవసరం. సహాయం పొందుతూ సోమరిగా ఎవరైనా తిరుగుతున్నారేమో మనం గమనిస్తూ ఉండాలి. అవకాశమూ, పనిచేసే శక్తీ ఉండికూడా పనిచేయని వారికి సహాయం ఆపుచేయాలి. 2. శారీరక బలం లేక పనిచేసి పెట్టేవారు కూడా లేక బాధపడువారిని మనము పని చేయమని బలవంత పెట్టరాదు. (దక్షిణ కలకత్తాలోని సేవక్‌ సమితికి చెందిన మరొక కార్యకర్త థీమాన్‌ హరిచరణ్‌ బాగ్‌చీకి రాసిన ఉత్తరము) సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు క్షం

  1. పనులు చేయించటంలో విభిన్నమైన పనులను, అవకాశాలను కలిగించాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. ప్రథమంలో చాలా సులభమైన పనులు చేయించాలి. తరువాత కష్టంగా ఉన్న పనులు నేర్పాలి.

4 ఎవరితో మనము పనిచేయించాలను కొంటున్నామో వారికి పనులు నేర్పాలి. మానవుడు తాను స్వయంగా కష్టపడి బాగా నేర్చుకోనిదే మరల చేయటానికి సందేహపడు పనులు అనేకములు గలవు. ఈ విధములైన పనులు పూర్తిగా నేర్చుకున్న తరువాతనే మానవుడు మనస్ఫూర్తిగా చేయటానికి సిద్ధపడతాడు.

మనము బిక్షకులవలే తయారైనాము. అందువల్ల బిక్షుక వృత్తికి చెందిన

భావాలు ఒకరోజులో మారవు. ఈ మనః ప్రవృత్తి ఒక్క రోజులో మారిపోగలదని మీరు భావించితే పూర్తిగా నిరాశ చెందగలరు. సాంఘిక సేవారంగంలో అపారమగు ధైర్యం

కావాలి.

చిత్తుకాగితాలు, సముద్ర శంఖాలు, ముత్యపు చిప్పలు మొదలైన ముడిసరకుల సేకరణనే మీరు మీ పనిగా పెట్టుకోవాలి. సహాయం పొందినవారు ఈ ముడిసరకులతో వస్తువులు తయారుచేసి యిస్తారు. తయారైన సరకును అమ్మే బాధ్యత మీది. దీనికిగాను మీరు అన్నిరకాలైన దుకాణాల వారితో మాట్లాడి యీ సరుకును అమ్మించే యేర్పాటు చేసుకోవాలి. సరకు అంతా అమ్మగా వచ్చిన ఆదాయంలో ఖర్చుపోను మిగిలిన పైకంతో కొదిగా అయినా సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చు. పబ్లిక్‌ ఫండ్‌మీద ఎల్లప్పుడు ఆధారడి ఉండక శాశ్వతమగు ఆదాయానికి యేర్పాటు చేసుకోవాలి. ఇందుకెంతో సహాయం కావాలి. ఖర్చుపెట్టాలి. గ్రంథాలయం కొరకు పుస్తకాలు కొనవద్దు రచయితల నుంచి, పెద్దలవద్ద నుంచి సేకరించటానికి ప్రయత్నించాలి. ఏ పుస్తకాలు దొరికితే ఆ పుస్తకాలు కాకుండా ఒక పద్దతిలో అర్ధవంతంగా ఉన్న పుస్తకాలను సంపాదించమని అనిల్‌ బాబుతో చెప్పండి. ఉచితంగా ఇచ్చిన పుస్తకాలు మాత్రమే ఏవైనాసరే తీసుకోమని చెప్పండి. అయినా ఒక ప్రణాళిక వుండితీరాలి. మొదట బెంగాలీ భాషకు చెందినవి. తరువాత యింగ్లీషు, యూరోపియన్‌ భాషలకు చెందిన ప్రసిద్ధ రచయితలని సమకూర్చు కోవాలి. తరువాత భారతదేశ చరిత్రకు చెందినవి, ఆ తరువాత ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్రలు సంపాదించండి. వాటి తరువాత విజ్ఞాన గ్రంథాలు మహాపురుషుల జీవితాలు, వ్యవసాయ, వాణిజ్య, రాజకీయ పుస్తకాలన్నీ సంపాదించాలి. ఒకే పర్యాయం అన్నిరకాల పుస్తకాలు సంపాదించగలిగితే ఎంతో మంచిది. అడిగిన వారి అభిలాష మేరకు వారు అడిగిన పుస్తకాన్ని ఇవ్వటానికి వీలుగా అన్ని రకాలైన పుస్తకాలను 178 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

సమకూర్చు కోవటం మంచిది. ఉత్తమ (శ్రేణికి చెందిన నవలలు కూడా ఉంచండి. తక్కువ ఖర్చులో ఆదర్శ (గ్రంథాలయాన్ని యేర్పాటు చేయండి

దూర దేశాల నుంచి నూలు తెప్పించి దీర్టకాలం పాటు నేతపని సాగించటం కష్టం. సహాయం పొందేవారి ఇంటివద్ద, సమితి సభ్యుల ఇంటివద్ద ప్రత్తి పండించాలి. భవానిపూర్‌ నుంచి లేదా పరిసర (ప్రాంతాల నుంచి కొంత నూలు లభించకపోతే మీ పరిశ్రమ వ్యర్థం. స్థానిక ప్రజలు నూలు తయారు చేసి మీ సంస్థకు ఇస్తే వారికి కూడా సంస్థ యందు నిజమైన సానుభూతి యేర్పడుతుందనే విషయం మీరు గమనించాలి. స్థానిక ప్రజల సొనుభూతి సహకారాలు లేకుండా ఏ పనికూడా ఎక్కువ రోజులు నడవదు. నూలు వనడకటం వడుకుతారు. కాని అమ్మటానికి ఇష్టపడనివారు కూడా ఉ చటారు. అలాంటి వారికి వారి నూలు తీసుకొని దోవతులు, చీరెలు నేసి ఇవ్వగలిగితే నూలు వడికి యిస్తుంటారు. లోగడ అనేకమంది నూలు యిచ్చి దోవతులు, చీరెలు నేయించుకునేవారు. ఇప్పుడెలా ఉన్నదో నాకు తెలియదు. ఏది ఎలాగున్నను నూలు తీసుకొని దోవతులు చీరెలు నేయించి ఇచ్చే యేర్పాటు ఉండాలని భావిస్తున్నాను. ప్రతి సభ్యుని ఇంటిలోను నూలు వడికి తీరాలి. దీనిని మీరు గమనించాలి.

ఇక ఉంటాను

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 174

నడవడి- మానసిక అభివృద్ధి మాందలే జైలు నీవు రాసినది వాస్తవం. నిజాయతీగల కార్యకర్తలు చాలా కొరతగా ఉన్నారు. అయినా దొరికిన వారినే ఆధారం చేసుకొని పని నడుపుకోవాల్సి వస్తుంది. జీవితం యిస్తేగాని మరొక జీవితం లభించుటలేదు. (టేమించితేగాని ప్రతిఫల (ప్రేమ లభించుట లేదు. అదేవిధంగా ముందు స్వయంగా మానవత్వాన్ని సంతరించు కోకుండా మనిషిని అసలైన మానవునిగా చేయజాలము. దిగజారిపోయిన రాజకీయ రంగాన్ని పరిశీలించినపుడు కౌంతకాలం వరకు రాజకీయాలవల్ల దేశానికి అధిక ప్రయోజనం ఏదీ కలుగదేమో అనిపిస్తున్నది. సత్యం, త్యాగం అను రెండు ఆదర్శాలు రాజనీతికి ఎంత దూరమగుచున్నదో అంతగా రాజకీయ కార్యరంగం క్షీణిస్తున్నది. నదిలోని నీరు ఒకప్పుడు స్వచ్చంగాను మరొకప్పుడు నురుగుతోను నిండివున్నటులే రాజకీయ ఉద్యమాలు కూడా అన్ని దేశాల్లోను అలానే ఉంటున్నాయి. బెంగాలు రాజకీయ పరిస్థితి ఎలావున్నప్పటికీ దానికి ప్రాధాన్యం ఇవ్వక మీరు మీసేవా రంగంలో ముందుకు వెళ్లండి. నీ మనసు అసంతృప్తిగా ఉండదానికిగల ప్రస్తుత కారణం నీవు గమనించావో లేదోగాని నేను గమనించాను. కేవలం పనుల వల్లనే మానవునికి ఆత్మ విశ్వాసం కలగదు. బాహ్వంగా కొనసాగు పనులతోపాటు చదువు సంధ్యలు కావాలి. ఆత్మ చింతన కావాలి. పనులవల్ల బాహ్యంగా కనిపించు విశ్చంఖలత్వం తొలగిపోయి మానవుడు నిగ్రహపరుడు అయినటులే చదువు సంధ్యలు, ఆత్మ చింతనవల్ల అంతరంగిక నిగ్రహం యేర్చడుతుంది. ఆత్మ నిగ్రహం లేకుంటే బాహ్యా నిగ్రహం నిలువ జాలదు. వ్యాయామం వల్ల శారీరక అభివృద్ధి జరిగినటులే సాధనవల్ల సత్‌ ప్రవృత్తులు మేల్మొని అంతరంగిక శత్రువులను నాశనం చేస్తాయి. సాధనవల్ల మనకు రెండు ప్రయోజనాలు కలుగుతాయి. (దక్ష కలకత్తా సేవక్‌ సమిలిలోని శ్రీహరి చరణ్‌బాగ్‌ చీకి వ్రాసిన ఉత్తములు) గ ాారాారాాాాానొతకు ఛటోపాధ్యాయ

  1. భయం, కామం, స్వార్థం మొదలగు అంతరంగిక శత్రువులను జయించుతాంల-
  2. (ప్రేమ, క్తి బుద్ధి, త్యాగం మొదలగు ఉత్తమ గుణములు వికాసం పొందుతాయూ.

ఆచరణ విజయానికి ప్రధాన సాధనం, ప్రతి స్రీలోను మనము మాతృమూర్తిని దర్శించాలి. దుర్గ, కాళీ మొదలైన స్త్రీ విగ్రహాలలో మనము భగవంతుని దర్శించ గలిగినపుడు ప్రతి స్త్రీలోను భగవంతుని దర్శించటానికి మానవుడు అలవాటు పడతాడు. ఇందువల్లనే ఒక శక్తిని సాక్షాత్కరింప చేసుకోవాలని భావించినపుడు మన పూర్వ పురుషులు స్రీ రూపాన్నే కల్పించుకున్నారు. ఇహలోక జీవితంలో ప్రతి స్ర్తీని మాతృభావంతో చూడడం అలవర్చు కొన్నందువల్ల క్రమంగా మానవుడు పవిత్రుడు, నిష్కల్మష వృదయుడు కాగలుగుతాడు.

భక్తి ప్రేమలవల్ల మానవుడు నిస్వార్థపరుడు అవుతాడు మానవుని హృదయంలో (పేమ భక్తిభావాలు ఏమేరకు పెరుగుతాయో ఆమేరకు స్వార్ధం తగ్గిపోతుంది. (ప్రేమమయుడై సాగిపోతున్న భక్తుడు క్రమంగా సంకుచిత స్వభావాన్ని సంపూర్తిగా త్యజించి విశ్వంలోనే విలీనమై పోతాడు. మానవుడు అధికంగా దేనిని ఆరాధించునో దానిలోనే తొదాత్యం పొందును. తనను తాను పాపి అని దుర్చలుడని భావించుకొను వ్యక్తి దుర్చలుడై తీరును. తనను తాను పవిత్రుడని, శక్తివంతుడని భావించుకొను వ్యక్తి పవిత్రుడు, శక్తివంతుడు అయితీరుతాడు “యాద్భశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాద్భళశ్‌ొ” అను సామెత వుందనే వున్నది కదా.

భయమును జయించు ఉపాయమే శక్తి సాధన, కాళికా దేవి మొదలగు విగ్రహాలు శక్తియొక్క రూప విశేషాలే. శక్తియొక్క వరూపాన్సైనా మనసులో ఊహించుకుని దానివల్ల శక్తిని పొందటానికి ప్రార్థించాలి. మనసులోని మాలిన్యాన్ని దౌర్బల్యాన్ని ఆ శక్తి పాదాలచెంత బలి యిచ్చినపుడు మానవునికి శక్తి కలుగుతుంది. మనసులో అనంతమగు శక్తి నిక్షిప్తమై వున్నది దానిని మేల్కొలపాలి. మనసులోని శక్తిని మేల్ళొల్పడమే పూజాదుల ధ్యేయం ప్రతి ఒక్కరు శక్తిని ఆరాధించి కామం వంటి శత్రువులను ఆ శక్తికి సమర్పించాలి. “పంచప్రదీహ్‌ అంటే పంచేద్రియాలని అర్ధం. పంచేద్రియాల సహాయంతోనే కాళీమాతను పూజించుచున్నారు. మనకు నేత్రాలున్నవి కనుకనే ఒక ఊహాకల్పన చేసుకొనుచున్నాము. నానీక వున్నది. కావుననే ధూవదీపాదులు సుగంధ (ద్రవ్యాలు వూజలో వినియోగిస్తున్నాము. బలి అనగా, కామం మొదలగు శత్రువులను బలి ఇవ్వటమే. మేకపోతు, కామానికి రూప విశేషమే. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 176

సాధనవలన ఒక విధంగా శత్రునాశనం మరొక విధంగా సత్‌ ప్రవృత్తుల వికాసం జరుగుతుంది. శత్రునాశనంతో పాటుగా మానవ హృదయంలో దివ్యమగు భావం ఏర్పడుతుంది. దివ్యమగు భావము మనసులో ప్రవేశించగానే దౌర్బల్యాలన్నీ తిరోగమిస్తాయి. అవకాశముంటే రోజూ యీ విధంగా శక్తిని ఆరాధించటం నేర్చుకో. కొంత కాలం తరువాత నీ వృాదయానికి శక్తి లభిస్తుంది. శాంతికూడా అనుభవించ గలుగుతావు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవవచ్చును. కావాలంటే ఆయన ఉత్తరాలు, ఉ పన్వాసాలు అన్నీ లభిస్తాయి . ఉత్తరాలు, ఉపన్యాసాలు చదవకుండా యితర పుస్తకాలు చదవటం మంచిదికాదు. 'ఫిలాసఫి ఆఫ్‌ రిలిజియన్‌ జ్ఞానయోగా' వంటివి ముందుగా చదువవద్దు. వీటి తరువాత 'శీరామకృష్ణ కధామృతం' చదవ వచ్చును. రవి బాబు రచించిన అనేక కవితలందు కూడా కావలసినంత విషయం లభిస్తుంది. ద్విజేంద్రలాల్‌ రాయ్‌ వ్రాసిన మేవాడ పతనం, దుర్దాదాస్‌ మొదలైన పుస్తకాలు చదవటం వలన శక్తి లభించగలదు. బంకింబాబు, రమేష్‌ దత్తుని చారిత్రక నవలలు కూడా మనకు అనేక విషయాలు నేర్పుతాయి. నవీన్‌సేన్‌ రాసిన * ఫలాసి యుద్ధరి కూడా చదవవవచ్చును. (భీమతి కుముదిని బోస్‌ రచించిన '* శిఖేర బలిదాన్‌ చాలా మంచి పుస్తకం. విక్టర్‌ హ్యూగో విరచిత బీదల పాట్లు అన్న పుస్తకం బహుశ గ్రంధాలయంలో ఉండే ఉ ంటుంది. దానిని చదువు, మంచినీతి లభిస్తుంది. ఈ తొందరలో ఇంతకంటే ఎక్కువ పుస్తకాల జాబితా ప్రాయలేక పోయాను, అవకాశం లభించినపుడు ఆలోచించి మరో జాబితా తయారుచేసి పంపుతాను. ఇక ఉంటాను 177 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

2 మాందలే జైలు ఆరోగ్యాభి వృద్ధికారకు రోజూ వ్యాయామం చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ముల్లర్‌, రాసిన మై సిస్టమ్‌ - అన్న పుస్తకం చదివి దాని ప్రకారం వ్యాయామం చేస్తే బాగుంటుంది. నేను ముల్లర్‌ చెప్పిన వ్యాయామమే తరచుగా చేస్తూ ఉంటాను. దానివల్ల లాభం కూడా కలిగింది. ముల్లర్‌ చెప్పిన వ్యాయామంలోని విశేషాలివి 1 ఖర్చువమీ ఉండదు. కొద్దిపాటి చోటులోనే వ్యాయామం చేసుకోవచ్చు. 2. వ్యాయామం వల్ల కావలసిన దానికంటే ఎక్కువ శ్రమకలదు గనుక ఏ విధమైన నష్టమూ శరీరానికి కలుగదు. 8. అవసరమైన మాంసకృత్తులన్నింటికి వ్యాయామం కలుగుతుంది. ఉ సంపూర్ణమగు శక్తి పెరుగుతుంది. మన దేశంలో ముఖ్యంగా విద్యార్థులలో ముల్లర్‌ వ్యాయామ పద్ధతుల గురించి ఎక్కువ ప్రచారం జరిగితే బాగా ఉపయోగకారిగా ఉంటుందని నా అభిప్రాయం. రోజువారి పనులు చేసి సంతృప్తి పడితే లాభంలేదు. ఈ పనులన్నింటివల్ల సాధించ వలసీన ఆత్మ వికాస సొధనమును మరవరాదు. కేవలం పని చేసుకుంటూ పోవటమే జీవిత పరమార్థం కాదు. ఈ పనులలో నుంచే మన నడవడిక అభివృద్ధి పొందాలి, జీవితం అన్ని విధాల వికాసం చెందటం అవసరం. మనలో పనిచేయు ప్రవృత్తులు వ్యక్తిత్వాన్నిబట్టి, వ్యక్తి ఒక వైపునుంచి విశేషత్వాన్ని పొందాలి. మరొకవైపు నుంచి ఆ ప్రత్యేకతను పటిష్టం చేసుకుంటూ ఉ ండాలి. సంపూర్ణ వికాసం పొందాలి. సర్వతోముఖంగా అభివృద్ధి చెందని మానవునికి శాంతి ఉండదు. అంతరంగికంగా సుఖం ఉండదు. అతని మనసులో లేనితనం, లోటు చివరివరకు పనిచేస్తూనే వుంటాయి. అందువల్ల సర్వాంగీణ వికాసం కొరకు ఈ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 178

దిగువ విషయాలు అవసరం. 1.వ్యాయామ గోష్టులు, 2 నియమ పూర్వకమగు అధ్యయనం, 8 రోజువారి ధ్యాన చింతన. పనుల ఒత్తిడి చేత ఇవి మరచిపోతూ ఉ ంటాము, మరచి పోకపోయినా సమయం వుండక పోవచ్చును. అందువల్ల పని భారం తగ్గగానే మరల వీటి వైపు మనము దృష్టిని మరలించాలి. రోజూవారి పనులు మాత్రం చేసుకాని ఊరుకుంటే లాభం లేదు. వాటితోపాటుగానే వ్యాయామం, చదువు ధ్యానం చింతన కూడా కొనసాగాలి. సమయం కల్పించుకుని తీరాలి. ఈ మూడు పనుల కొరకు మానవుడు రోజుకి గంటన్నర రెండు గంటలు ఉపయోగించితే ఎక్కువ లాభం కలుగుతుంది. తను చెప్పిన ప్రకారం రోజుకు పదిహేను నిముషాలు వ్యాయామం చేస్తే సరిపోతుందని ముల్లర్‌ చెప్తాడు. పదిహేను నిముషాలు మనం ఆలోచనా ముద్రకు ఇసే అరగంట అవుతుందది. ఒక గంట చదవటానికి ఇస్తే గంటన్నర అవుతుంది. దిన పత్రికలు చదివే సమయాన్ని దీనిలో చేర్చలేదు. అవకాశాన్ని బట్టి వీటికి యింకా సమయం ఇవ్వగలిగితే మంచిదే. అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరూ గంటన్నర టైం తీసుకొనటం మంచిది. ఆలోచనా ముద్రను గురించి లోగడ ఉత్తరంలో వ్రాశాను. అందువల్ల మరల వ్రాయటంలేదు. పుస్తకాల జాబితా రాస్తున్నాను. ఈ పుస్తకాలు సంవత్సరం వరకు చదవటానికి సరిపోతాయి. ప్రాథమిక విద్వకు, ఉన్నత విద్యకు మధ్య కొంత వ్యత్యాసం వున్నది. ప్రాథమిక విద్యలో వాస్తవాల గురించిన పరిచయం వుంటుంది. ఉన్నత విద్యలో ఆయా వాస్తవాలకు వ్యాపక రూపాన్ని కల్పించి వ్యాఖ్యను కూడా జత చేస్తారు. ప్రాథమిక విద్యలో కేవలం ఇంద్రియ జ్ఞానం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉండవలసి వస్తుంది. ఉన్నత విద్యలో విద్యార్థులు చూడక పోయినా అర్ధం చేసుకోగల విషయాలు నేర్చబడతాయి. అలా నేర్పే సమయంలో జ్ఞానేంద్రియాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత సులభంగా నేర్చుకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు మురళిగాని లేదా మరొక వాయిద్యాన్నిగాని నేర్పాలని అనుకున్నప్పుడు, విద్యార్థి పిల్లనగ్రోవిని ప్రత్యక్షంగా చూసి దానిని చేతబట్టి రంద్రాలు వగైరా పరిశీలించి దానిని ఊది తద్వారా ధ్వనిని వినటానికి తగిన అవకాశం కలగజేస్తే అప్పుడు వారు సులభంగా నేర్చుకోగలరు. దృష్టి శక్తిని స్పర్ఫజ్ఞాన శ్రవణ శక్తిని ఒకేసారి విద్యార్థి వినియోగించటమే దీనికి కారణం. ఒడిలో కూర్చున్న బాలుడు ఏదేని వస్తువు చూడగానే దానిని పట్టుకోవాలనుకుంటాడు, తినాలనుకుంటాడు. బాలుడు సర్వేంద్రియాలను ఉపయోగించి బాహ్య జ్ఞానాన్ని పొందగోరుటయే దీనికి కారణం. ఇందువల్ల ప్రకృతి నియమాలను అనుసరించి సర్వేంద్రియాలతోను జ్ఞానం పొందటానికి 19 నూ ౌగాతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రయత్నించిన పక్షంలో త్వరలో ఫలితం లభించును. లెక్కలు మన నోటితోటే చెప్పించక రాతి ముక్కలు, కొయ్యముక్కలు వగైరాల సహాయంతో చెప్పడానికి ప్రయత్నించితే విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోగలరు.

మానసిక విద్యతోపాటు చేతిపనులు కూడా నేర్పాలి. మట్టితో దేశపటములు చేయటం, బొమ్మలు తయారు చేసి రంగులు వేయటం, అలానే ఆట పాటలు వంటివి నేర్పాలి. వీటితోనే అన్ని రకాల విద్యలు అలవడుతాయని చెప్పడం నా వుద్దేశంకాదు. చదువులో ఎక్కువ అభివృద్ధి పొందుటకు దోహదకారిగా ఉంటుందనే చెబుతున్నాను. ఇదు విధాలుగా నేర్చటంవల్ల బాలుర విద్యాభివృద్ధి జరుగుతుంది. వారి బుద్ధి వికసిస్తుంది. చదువుపై వారి మనసు లగ్నమవుతుంది. చదువంటే భయపదకుండా వుంటారు. ఈ ఐదు విధాలుగాగాక కేవలం బట్టీపట్టి చదివినపుడు పిల్లల్లో చదువుపట్ల అయిష్టత ఏర్పడుతుంది. వారి బుద్ధి వికానం చెందదు. జ్ఞానేంద్రియాలన్నిటిని ఉ పయోగించుకుంటూ వాటి సహాయంతో అర్ధం చేసుకోవలసిన విషయాన్ని పరిశీలిస్తూ ముందుకుపోవు విద్యార్థులకు బుద్ధి వికాసం, మనోవికాసం కలుగుతుంది. చేతి పనులు లేకపోతే మూలములోనే విద్యలో లోపముండి పోవును. తన చేతితో తయారు చేసిన వస్తువులవల్ల కలిగే ఆనందం ఈ ప్రపంచంలో మరి దేనివలనా మనకు కలుగదు. సృజనాత్మక శక్తిలోనే అమితానందం ఉన్నది. తమ చేతులతో తాము వస్తువులు తయారు చేయగలిగినప్పుడు ఈ మహదానందాన్నే పిల్లలు పొందగలుగుతారు. తోటలో మొక్కలు పెట్టి నీరు పోసిగాని, మట్టితో బొమ్మలు చేసిగాని యిలాంటిదే మరేపని చేసినా వారు ఎంతో ఆనందం అనుభవిస్తారు. చిన్నతనంలోనే పిల్లలు ఈ విధమగు ఆనందం పొందటానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. అప్పుడే వారిలోని సహజ ప్రతిభా, వ్యక్తిత్వమూ వికాసం పొందడానికి అవకాశం యేర్ప్చడుతుంది. చదువంటే భయపడక దానిలో ఆనదం పొందటానికి ప్రయత్నం చేస్తారు. విదేశాలలో హెచ్చు భాగం పాఠశాలలోని పిల్లలు తోటపని, వ్యాయామం, ఆటలు పాటలు, వాయిద్యం మొదలైనవన్నీ నేర్చుకుంటారు. (గ్రూపులు, గ్రూపులుగా రోర్లవెంట తిరుగుతూ ఉంటారు. కథలు వాటిద్వారా ఇతర దేశాల గురించి తెలుసుకుంటారు. వాళ్లు చదువుతున్నామని మాత్రం అనుకోరు. ఏవో కథలు వింటున్నామనో లేక ఏవో ఆటలు అడుకుంటున్నామనో భావిస్తుంటారు. అనుకోకుండానే వారు చదువుకి అలవాటు పడతారు. తొలి దశలో వాళ్లకు పాఠ్యపుస్తకాలు అవసరంలేదు. చెట్లు, మొక్కలు, పూలు మొదలైనవి చూపిస్తూ వారికి వాటి గురించి చెప్పాలి. ఆకాశం నక్షత్రాలు తదితరాల గురించి చెప్పాలనుకున్నపుడు ఆరుబయటకు సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు 180

తీసుకువెళ్లి స్వచ్చమగు ఆకాశం చూపాలి. దేనిగురించి మనము చెప్పాలనుకున్నామో అది వాళ్లకు కనిపిస్తూ ఉండాలి. భూగోళాన్ని గురించి చెప్పునప్పుడు గ్లోబు మ్యాపులు ఉండాలి. చరిత్రను గురించి చెప్పునపుడు అవకాశాన్ని బట్టి మ్యూజియం మొదలగువానికి తీసుకు వెళ్ళాలి. మామూలు పద్ధతులలో స్కూలు ఉన్నప్పటికీ పాడటం, రంగులు వేయటం, బొమ్మలు గీయటం, తోటపని మొదలైనవన్నీ నేర్పాలి. అసలు సంగతేమంటే చదివినవి వాళ్ళకు అర్ధం కావాలి, ఒంట బట్టాలి. అంతేగాని బట్టీ పట్టటంవల్ల ప్రయోజనం శూన్యం. ప్రాధమిక విద్య గురించి కొన్ని ప్రాధమిక సూత్రాలు చెప్పాను. పార్య పుస్తకం గురించి ఊరకనే చెప్పలేదు, విద్యయందు దాని వుపయోగం చాలా తక్కువ. మంచి ఉ పాధ్యాయుడు లేనిదే ప్రారంభ విద్య విజయవంతం కాబోడు. (ప్రారంభ దశలోనే విద్యకు కావలసిన మూల సూత్రాలు, నియమ నిబంధనలు ఏర్పడ వలయును. విద్యార్థులపట్ల (ప్రేమ, సహానుభూతి చూపాలి. ఉపాధ్యాయుడు కూడా తనను తాను విద్యార్థిగా భావించుకున్నపుడే విద్యార్థుల లోటుపాట్లను, పొరపాట్లను చక్కగా అర్థం చేసుకొనగలడు. ఉపాధ్యాయుని శరీరాకృ్ళతి కూడా ప్రభావాన్ని చూపుతుంది. విద్యకు మూడు ప్రధాన ఉ పకరణాలున్నవి (1) ఉపాధ్యాయుని వ్యక్తిత్వం (2) విద్యాప్రణాళిక (3) విద్యా విషయం మరియు పార్యపుస్తకాలు. ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ విహీనుదైనపుడు విద్య ఏమాత్రం సఫలం కానేరదు. ఉత్తమ చరిత్ర సంపన్నుడు, వ్యక్తిత్వ విలసితుడైన ఉపాధ్యాయుడు లభించినపుడే మనము విద్యా ప్రణాళిక రూపొందించుకున్నవో ఏ విషయానికి చెందిన పుస్తకమైనను చెప్పించ వచ్చును. మీరంతా కులాసాగనే వున్నారని ఆశించుచున్నాను. ఇక ఉంటాను 181 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

3 నీ ఉత్తరము అందినది. జవాబు వ్రాయుటలో ఆలస్యమైనందుకు అన్యధా భావించవలదు. 'నీవు మానసిక అశాంతిని తొలగించుకొని సంతోషపూర్వకంగా పనులు చేస్తున్నావని ఆశించుచున్నామని'. ఒకచోట మిల్టన్‌ అంటాడు. నిజంగా ఈ సూక్తిని ఎప్పుడు పడితే అప్పుడు ఆచరణలో పెట్టుట సాధ్యం కాదు. కాని ఆదర్శమనేదొకటి మనముందు లేనిదే జీవితంలో ముందుకు పోలేము, వాస్తవానికి జీవితమంతా ఏదో అశాంతి ఉంటుందనే విషయాన్ని మనం మరవరాదు. నా విడుదల గురించి నేనిప్పుడేమీ ఆలోచించటం లేదు. మీరుకూడా ఆలోచించ వద్దు. భగవంతుని దయవల్ల నాకిచట మానసిక శాంతి లభించినది. అవసరమయితే జీవితమంతా ఇక్కడే గడపగలనన్న ధైర్యం విశ్వాసం కూడా కలిగినది. నాశు భాకాంక్షలవల్ల నీకేమియూ లాభం లేదు. విశ్వజనని శుభాకాంక్షలు నిరంతరం లభించుగాక. నేను వ్రాయవలసింది యింకేమున్నది? విశ్వజననిపైనే నమ్మకముంచి ఆమెపైనే పూర్తి భరోసా ఉంచుము. ఆమె దయవలన నీవు ఏ ఆపదా లేకుండా క్షేమంగా నీపని కొనసాగించగలవు. మానసికంగా సుఖము శాంతి లేనపుడు బాహ్యంగా కనిపించు లోటులు ఎన్ని తొలగిపోయినా మానవుడు వాస్తవ సుభాన్ని పొందజాలడు. అందువల్ల ఎన్ని పనులున్నప్పటికీ లోకమాతకు మన హృదయాన్ని అర్చించి తీరాలి. ఇక ఉంటాను సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 182

క! ఇన్‌సిన్‌ జైలు 5 ఏప్రియల్‌ 1987 ప్రియబాంధవా! తాము ఐదవ తేదీన వ్రాసిన ఉత్తరము చదివి ఆనందించాను. మీరేవో చాలా ప్రశ్నలు వేవారు. వాటికి ఏమని జవాబు ఇవ్వాలో తెలియుట లేదు. ఎన్నో విషయాలను వ్రాయాలనిపిస్తున్నది, కాని వ్రాయగలనా? యథాపూర్వకంగా నా ఆరోగ్యం బాగానే ఉన్నది. పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను శరీరాన్ని గురించి ఆలోచించటం లేదు. కొన్ని మాసాలుగా ఏవేవో భావాలు నా మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. జీవితాన్ని సంపూర్తిగా అర్పించనిచో రొమ్మువిరచి నిలబడుట కష్టమనే భావం బలపడుచున్నది, “నా జీవితాన్ని నీకు అంకితం చేసే శక్తిని ప్రసాదించు తల్లీ అన్న ప్రార్ధన బాల్యం నుంచి నేను చేస్తూ వస్తున్నాను. ఆ విధమగు శక్తినే భగవంతుడు నాకు నేటివరకు ప్రసొదించుచున్నాడు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పజాలను. భగవంతుడు ఆవిధమగు శక్తిని ప్రసాదించటంతో నేను చాలా సుఖంగా ఉన్నాను. “నా వలే సుఖముగా ఈ ప్రపంచంలో ఎందరున్నారు?” అనే ప్రశ్న అప్పుడప్పుడు నాలో కలుగుతూ ఉంటుంది. ఈ జైలు గోడల నుంచి విడుదలయ్యే గడువు పెరిగిన కొలది మనసులోని శాంతి పెరుగుతున్నది. మనసు ఉద్వేగ శూన్యమగు చున్నది. ఆలోచనలను అత్మగతం చేసుకొని మన ఆత్మ వికాసమనే ప్రవాహంలో జీవిత నౌకను నడుపుటలోనే ఎంతో శాంతి వున్నది. ఎక్కువ కాలం జైలు జీవితం గడపవలెనన్నచో ఈ విధమగు శాంతియే ఏకైక ఆధారం. ఎక్కువ కాలం జైలు జీవితం గదుపటంవల్ల నేను అపూర్వమగు శాంతిని పొందాను. 'అంతరాత్మకు అణగుణంగా నడుచుకొనుట అత్యుత్తమం, అని ఎమర్సన్‌ అన్నాడు. ఇది పదహారణాల నిజం. ఈ సత్యమందు నా విశ్వాసం రోజు రోజుకి బలబడుతున్నది. ... (అర్మశక్తిసంపాదకుడు శ్రీ గోపాల్‌ లాల్‌కి వ్రాసిన ఉత్తం. త ర డా రా రారా నానక్‌ భటోపా్యాడు

నా వలెనే జీవితం కొనసాగించే వారు బయట జరిగే విషయాలపై ఆధారపడి జీవిత సార్ధకత, నిరర్ధకతలను నిర్ణయించే పక్షంలో 'మృత్యురేవరణ సంశయః అను సూక్తి జ్ఞప్తికి రాగలదు. మా ఖైదీలను తూచే కాటా భౌతికమైనదికాక, మనసును తూచేది కావాలి. భౌతిక దృష్టితో చూస్తే మాత్రం మా జీవితం నిష్ప్రయోజనం గాను, శూన్యంగాను కనిపిస్తుంది. ఈ జైలులోనే తనువు చాలిస్తే మా జీవిత శాశ్వత (ప్రభావమేదియు ప్రపంచంమీద పడక పోవచ్చును. జీవితంలో మరే పనులు చేయలేక పోయినా, ఆదర్శాన్ని వాస్తవరూపంలో చూపెట్టలేక పోయినా, జీవితం వ్యర్థమైనదని మాత్రం చెప్పను. ఒక గొప్ప ఆదర్శమును నిరంతరం ఆరాధిస్తూ జీవితాన్ని దానికి అనుగుణంగా మలచుకుంటే చాలు. నేనెంతగానో సంతోషపడతాను, సంతృప్తి పడతాను. నా జీవితం యీ ప్రపంచ దృష్టిలో వ్యర్థంగా కనిపించవచ్చును. నాదృష్టిలో మాత్రం (భగవంతుని దృష్టిలో కూడా) వ్యర్థం కాదని చెప్పగలను. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ క్షణభంగురాలు, కాని, కేవలం భావం లేక ఆవేశం మాత్రం నశించవు. అవి శాశ్వత మైనవి. మా ఆదర్శం, ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనా ధోరణి అన్నీ నశించేవి కావు, శాశ్వతమైనవి. వీటిని గోడల మధ్య బంధించి ఎవరైనా ఉంచగలరా?

పూర్తిగా త్యాగం చేయాలంటే తిరుగులేని ఆదర్శాన్ని కూడా అలవర్చుకోవాలి. ఆదర్శాన్ని చేరుకోవలెనన్నచో పూర్తిగా త్యాగం చేసి తీరాలి. ఈ రెంటికి ఉన్న ప్రగాఢ సంబంధమిది. ఆదర్భం కోసం సంపూర్ణంగా ఆహుతి అవ్వాలనే యిపుడు నేను ఆతురత చెందుచున్నాను. ఈ దౌర్బల్యం మధ్యలో వున్న నాకు ఎంతో శక్తిని ప్రసాదించిన వారు నా మీద అంతమాత్రపు దయ చూపకుందురా? “యమే వైషవన్తే పేనలభ్యం[” అను ఉ పనిషత్‌ వాక్యమున్నది గదా ఏమి జరుగుతుందో చూద్దాం.

తప్పనిసరిలై చాలా రోజుల నుంచి నియమబద్ధంగా చదువుట మానేశాను. జాతీయత యొక్క పుట్టుపూర్వోత్తరాలు దానికి చెందిన ప్రధాన సమస్యలు అన్నిటినీ పూర్తిగా అవగతం చేసుకొనుటకై అనేక పుస్తకాలు చదవటం, పరిశీలన మొదలగు పనులు ప్రారంభించాను. ప్రస్తుతం ఆ పని అంతా ఆగిపోయింది. మరల ఎపుడు ప్రారంభించగలనో తెలియదు. బయటికి వస్తే ఈ పని అసలే సాగదు. అందువల్ల ఆ పని పూర్తి చేయగోరు చున్నాను. బహుశ జైలులో నేను చేయాల్సిన పని పూర్తి కాలేదు. అందువల్లనే విడుదలకు ఆలస్యమగు చున్నది. భగవంతుడు మిమ్మలనందరిని సంతోషంగా ఉంచవలసిందని, ఆయన ఆశీర్వాదము ఎప్పుడూ మీకు లభించాలని ప్రార్థించుచున్నాను.

ఇక సెలవు

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 184

జైలు - ఖైదీలు మాండలే జైలు ప్రియమైన దిలీప్‌, నీవు 24వ తేదీన వ్రాసిన ఉత్తరము చదివి చాలా ఆనందం పొందాను. అపుడపుడూ జరుగుచున్నటులే రెండు మూడు పర్యాయములు సెన్సారు చేస్తేగాని ఉ త్తరాలు చేరటం లేదని నీవు సందేహించి వుంటావు. కాని యీసారలా జరగలేదు, అందుకు సంతోషిస్తున్నాను. నీ ఉత్తరం నా హృదయవీణను సుతిమెత్తగా మీటింది. ఆలోచనా అనుభూతులు నన్ను ముంచెత్తినాయి. నీకు సమాధానం వ్రాయుటం నాకెంతో కష్టంగా ఉంది. నేను వ్రాసే ఉత్తరం సెన్సార్‌వారి చేతులలో నుంచి పోవలసి ఉండటం కూడా ఒక అసౌకర్యం తన పృాదయంలోని గంభీర భావాలు బహిర్గతం కాకుండా వుండవలెనని ఎవరూ కోరుకొనరు. అందువల్ల రాతి గోడలు, ఇనుప గేటుల మధ్య బందీనైవున్న నేను ఆలోచించినవి, అనుభవించినవి ఎన్నో విషయాలు తగు సమయం వచ్చే వరకు బహిర్గతం చేయకుండా ఉండాల్సి ఉంటుంది. మాలో అనేకమంది కారణం లేకుండానే అర్ధరహితంగా బందీలుగా ఉన్నామని నీవు ఎంతగానో బాధపడుట సహజం. కాని ఒక విషయం ఉన్నది, లోలోపలనే మదన పడవలసి వున్న యీ పరిస్థితిని ఆధ్యాత్మిక దృష్టితో కూడా మనం చూడవచ్చు. జైలులో ఉండటమే నాకు ఇష్టమనికాదు నేను చెప్పేది. అలా అంటే అది మరల మోసమవుతుంది. జైలులో ఉండటానికి ఏ విద్యావంతుడూ, నాగరికుడూ ఇష్టపడడనే నేను అంటాను. జైలు వాతావరణం మానవుని వికృతంగాను, అమానుషంగాను మార్చటానికి ఉపయోగ పడుతుంది. ప్రతి జైలుకు ఇది వర్తిస్తుందని నా భావం. (తీ దిలీప్‌కుమార్‌ రాయ్‌కి వ్రాసిన రెందు ఉత్తరములు) ఇక ాాాాాాాాాాాా గావ్‌ ఛదోపా్య్యాదు

జైలులో ఉండే నేరస్తులలో ఎక్కువ భాగం నైతిక ఉన్నతి పొందకపోగా మరింత పతనమై పోతారని నా అభిప్రాయం. జైళ్ళ విధానంలో పూర్తి మార్పు రావాలన్న విషయాన్ని ఇంతకాలంగా జైలులో ఉన్న తరువాత నేను అంగీకరించవలసి వున్నది. భవిష్యత్తులో జైళ్ళ సంస్మరణ కూడా నా కార్యక్రమంలో ఒక భాగం కానున్నదని అనిపిస్తున్నది. భారతీయ జైళ్ళ పద్ధతులు కూడా బ్రిటీషు వారి పద్ధతులకు అనుకరణములే. కలకత్తాలోని విశ్వవిద్యాలయం కూడా అంకేకదా! పూర్తిగా లండన్‌ విశ్చ్వవిద్యాలయమునకు అనుకరణ మాత్రమే. జైలు సంస్కరణల విషయంలో మాత్రం మనం అమెరికా వారి జైళ్ళ పద్ధతులను అనుకరించుట మంచిది.

మార్పులు చేయునపుడు మనము కొన్ని విషయాలను గమనంలో వుంచుకోవాలి.

ఒక విధమగు నూతన భావం ఖైదీలలో కలిగించాలి. ఖైదీలతో సానుభూతిగా వ్యవహరించాలి. వారిలోని నేర ప్రవృత్తిని మానసిక వ్యాధిగా భావించి దానిని పోగొట్టటానికి ప్రయత్నం చేయాలి. చేసిన నేరానికి ప్రతిగా ఏదో విధంగా దండించి తీరాలనే పద్ధతిని వదిలేసి సంస్మరణ పూరితమగు దండనా విధానం అవలంబించాలి. నేనే స్వయంగా ఖైదీని కాకపోతే మరొక ఖైదీని సానుభూతిగా చూడగలిగే వాడినో లేదో చెప్పజులను. మన చిత్రకారులకు సాహితీ పరులకు జైలు జీవితం బాగుగా తెలిసినచో మన శిల్చం, సాహిత్యం కూడా అభివృద్ధి పొందేవని చెప్పటానికి నేను సందేహించను. ఖాజా నజరుల్‌ ఇస్లాం వ్రాసిన కవిత్వం ఆయన జైలు జీవితం యొక్క అనుభవాన్ని ఎంతగా గుర్తు చేస్తుందో ఎవరో గమనించి ఉండరు. మన భావాలు కష్టాలలో అంతర్షిహితమై ఏదో గొప్ప ఉద్దేశ్యం తన పని తాను చేయుచున్నదని శాంతంగా ఆలోచించినపుడు నా మనసుకి అనిపిస్తూ ఉంటుంది. ఈ భావమే. మన జీవితంలో ప్రతిక్షణం తన ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటే మన విచారం, కష్టాలు అన్నీ అంతర్థానమై పోతాయి. ఇందుకే ఆత్మకు, శరీరానికీ నిరంతరం సంఘర్షణ నడుస్తున్నది. ఖైదీగా ఉ డగా మానవుని హృదయంలో సాధరణంగా ఆధ్యాత్మిక భావమొకటియే యేర్చడుతుంది. అదే అతనికి కొంత బలం కలుగ చేస్తుంది. ఈ విధమైన భావం కలిగిన చోటనే నిలద్రాక్కు కొనుటకు ప్రయత్నించాను. ఆధ్యాత్మిక చింతన గురించి నేను విన్నది నాకు తెలిసింది. అలానే, జీవితం గురించి నాలో యేర్చడిన భావాలు యిపుడు నాకు ఉ పయోగ పడుతున్నవి. మానవుడు ఆత్మావలోకనం చేసుకొన్నచో ఆలోచించదగిన విషయాలెన్నో అతని దృష్టికి వస్తాయి. ఈ విధమైన ఆలోచన కలిగిన ఖైదీ ఆరోగ్యం మంచిదైనచో అతనికే కష్టం ఉండదు. కాని మాకిపుడు కలిగే నష్టం ఆధ్యాత్మికమైనది. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 186

కాదు. శారీరకమైనది. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పటికీ శరీరం అపుడపుడూ దుర్చల స్థితికి దిగజారి పోతున్నది. లోకమాన్యుడు తిలక్‌మవాశయుడు జైలులోనే గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. ఆయన అక్కడ ఉన్నంత కాలం ఆత్మానందంతోనే ఉన్నారని నిశ్చయంగా చెప్పగలను. మాండలే జైలులో ఆరు సంవత్సరాలు ఉన్నందునే ఆయనకు అకాల మృత్యువు దాపురించిందని కూడా నిశ్చయంగా చెప్పుకోవచ్చును. జైలు జీవితంలోని ఏకాంతవాసమే మానవుని బాహ్యా ప్రపంచానికి దూరం చేసి అంతర్ముఖుని చేసి నిగూఢధమగు సమస్యల గురించి ఆలోచించగల సదవకాశాన్ని ప్రసాదిస్తున్నదన్న విషయాన్ని నేను ఒప్పుకొనక తప్పటం లేదు. ఇప్పుడు స్వయంగా నా విషయంలో కూడా అదే జరిగింది. ఏడాదిపాటు జెలులో ఉండటంవల్ల అనేకమైన వ్యక్తిగత సమస్యలకు, సమష్టి సమస్యలకు సమాధానం కనుగొనగలిగాను. కొంతకాలం క్రితం చాలా తేలికగా ప్రకటించిన, లేదా, ఆలోచించిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు స్పష్టంగా తమ నిజరూపంలో సంపూర్ణంగా నా కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నాయి. జైలు గడువు పూర్తయ్యే లోపుగా ఆధ్యాత్మిక దృష్టితో నేను ఎంతో లాభం పొందగలనని అనుకుంటున్నాను. నేను జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధపడటం, నమ్మిన దానికై ప్రాణం కూడా ఇచ్చే మొండి పట్టుదలగా నీవు భావించావు. ఈ విధంగా చెప్పటం నిజంగా నీ గొప్ప అనుభవాన్నీ ప్రాణాల ప్రాముఖ్యతను తెలియ చేస్తున్నది. వాస్యాన్ని ఏ దామాషాలో (గగ్రహించాలో కొద్దిగానైనా తెలిసిన వాడనుగనుక నన్ను నేను నమ్మిన ఆదర్భానికై ఆత్మాహుతి చేయగల వానిగా భావించుట లేదు. అందుకు పోటీకూడా పదడదలచలేదు. పోటీభావానికి, ఆత్మదర్చానికి దూరంగా ఉండదలంచాను. కాని ఈ విషయంలో నేనెంతగా నెగ్గగలిగానో నీబోటి మిత్రులే చెప్పగలగాలి. అనుకొన్నదానికై ఆత్మార్పణ చేయటమనేది నాకొక ఆదర్భంగా ఉంటే మంచిదేననిపిస్తున్నది. జైలులో ఎక్కువకాలం ఉండటానికి అన్నిటికంటే చిక్కుగా పరిణమించేది మనకు తెలియకుండగా వృద్ధాప్యం రావటమేనని నా నమ్మిక అందువల్ల ఖైదీలు దీనిని కనిపెట్టి వుండాలి. ఎక్కువ కాలం జైలులో ఉండటం చేత మానవుడు శారీరకంగాను, మానసికంగాను వృుద్ధుడెలాగవుతాడో నీవు ఊహించలేవు. దీనికి అనేక కారణాలున్నాయి. మంచితనం లేకపోవటం, వ్యాయామం, చురుకుదనం లోపించటం, సంఘానికి దూరంగా ఒకరి ఆధీనంలో ఉండిపోయామే అన్న ఆలోచన, స్నేహితులు, సంగీతం లేకపోవటం, సంగీతం విషయము అన్నిటికంటే చివర చెప్పాను కాని అసలు అది పెద్దలోటే వీటిలో అనేక లోటులను మానవుడు తన అంతరంగం ద్వారా పూర్తి చేసుకోగలడు కాని కొన్నిమాత్రం బయటి సహాయంతో పూర్తి కావలసినవే. ఈ విధంగా బయటనుంచి ఇ గా గూ లా నారా ఛటోపాధ్యాయ

లభించ వలసినవి లభించక పోవడం వల్లనే అనతి కాలంలోనే వృద్దాప్యం ప్రాస్తిస్తుందని చెప్పవచ్చు. అలీపురం జైలులో యూరోపియన్‌ ఖైదీలకు వారానికొకసారి సంగీతం యేర్చాటు చేసేవారు. కాని, మాకు ఉండేది కాదు. విహార యాత్రలు, సంగీత సభలు, కులాసా గోష్టులు, షికారు వెళ్లడం, సాహిత్య సమావేశాలు మొదలైనవి మన జీవితాన్ని ఎంత మధురంగా, రసవతంగా చేస్తాయో మన మామూలు జీవితంలో గ్రహించలేము. కాని బలవంతాన ఖైదీగా ఉంచబడినపుడు వాటి ప్రాధాన్యం సులభంగా తెలిసి వస్తుంది. ఆరోగ్య దృష్టితోగాని సాంఘిక దృష్టితోగాని నిర్వర్తించ వలసిన విధులకు తగు ఏర్పాట్లు జైలులో లేనంతకాలం ఖైదీల సంస్కరణలను గురించి యోజించుట నిష్ప్రయోజనం అప్పటివరకు, జైళ్ళు నైతిక అభివృద్ధికి సాధనాలు కాజాలవు. ప్రస్తుతమున్న అధ్వాన్న స్థితిలోనే వుంటాయి.

తన వారనుకునే మిత్రులు, ప్రియ బంధువులు తదితరుల సహానుభూతివల్ల జైలులో కూడా మానవుడు సంతోషం సొందుతారన్న విషయాన్ని నేను నీకు వేరుగా (వ్రాయనవసరం లేదనుకుంటాను. ఈ విధమగు సానుభూతివల్ల ఖైదీ ఆనంద పడతాదనే సత్యం నేను మనః పరిశీలన ద్వారానే గ్రహించ గలిగాను. ఈ సానుభూతి పొందు విధానం మాత్రం సాధారణ ఖైదీలకు, రాజకీయ ఖైదీలకు ఉన్న అదృష్టం యొక్క తారతమ్యాలను మనకు తెలియజేస్తుంది. తాను విడుదల అయితే సంఘంలో ఎంతోమంది ఆనందంతో స్వాగత సత్మారాలు చేస్తారని రాజకీయ ఖైది ఊహిస్తాడు. కాని మాములు నేరస్తుడు యీ విధమైన యోచన చేయలేడు. తన ఇంటివద్ద వార్ని మినహాయించితే మరొకరినుంచి సానుభూతి లభించగలదనే ఆశ అతనికి ఉండదు. అందువల్ల ప్రజలకు ముఖం చూపటానికి సిగ్గుపడతాదు. 'మేము జైలులో వున్న సంగతి మా యింటివద్ద తెలియదంటూ,, నా వార్డులో పనిచేసే ఖైదీలు చెస్త్పందే వారు. సిగ్గుచేత వారు తమ ఇంటికి ఉత్తరం కూడా వ్రాసేవారు కాదు. ఈ స్థితి నాకు చాలా అసంతృప్తిని కలిగించేది. సభ్య సమాజం నేరస్తులపట్ల మరింత సానుభూతిని చూపితే బాగుండునని నా భావన.

జైలు జీవితానుభవం, దానివల్ల కలిగే ఆలోచనలను గురించి పేజీలకు పేజీలు వ్రాయగలను. కాని ఉత్తరానికి ఆంతం అంటూ ఉండాలి కదా? ఎక్కువగా థమ పడే శక్తి ఉన్నచో ఈ విషయాన్ని గురించి ఒక పుస్తకం వ్రాయటానికి ప్రయత్నించే వాడను, కాని యిపుడా శక్తిలేదు.

జైలు కష్టాలు శారీరకమైనవని అనటంకంటే మానసికమైనవని అనటానికే ఇష్టపడతాను. అత్యాచారాలు, అవమానకరమగు దెబ్బలు తగ్గి పోయినపుడు ఖైదీ జీవితం ఏమంతా కష్టంగా ఉండదు. ఏదో సూక్ష్మంగా కష్టమనేది కలుగుతూనే ఉంటుందనుకోండి. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 188

అది పైవాళ్ల నుంచి కలుగుతూ ఉంటుంది. కాని జైలు అధికారులకు మాత్రం ఏమీ సంబంధం ఉండదు. ఈ దెబ్బలు, పీడించడం మొదలుగునపన్నీ మనసుకు కష్టం కలిగించే వారి ఎడల మరింత వికృతంగా తయారవుతాయి. అందువల్ల ఈ దెబ్బలు వ్యర్ధమనిపిస్తుంది. వాటివల్ల మనం ఇహలోక సంబంధాన్ని మరచి పోతాము. హృదయంలో ఆనంద నిలయమునకు పునాదులు వేస్తాము. ఇందుచేతనే ఈ కష్టములన్నీ స్వస్నగతమగు ఆత్మను మేల్కొలిపి మనకు బలాన్ని కలిగిస్తాయి. మన పరిసర స్థితిగతుల మమతా రాహిత్యాన్నీ కళోరతనూ తెలియ చేస్తాయి. రోజురోజుకి మానవుని కన్నీరు యీ భూమి పొరలను తడుపుకుంటూ లోతుకి పోతున్నాయని, ఆ దృశ్యం తిలకించినపుడల్లా నీకెంతో గంభీర ఆలోచనలు, విచారం కలుగుతున్నట్లు వ్రాశావు. కాని, ఇందులో నీవు గమనించవలసిన విషయమొకటి వున్నది. అదంతా కష్టాల కన్నీరు కాదు. దానిలో కరుణాథశ్రువులు, (పేమాథ్రువులు కూడా ఉ టాయి. ఎంతో సమృద్ధీ, ప్రశస్తమూ అయిన ఆనంద ప్రవాహాన్ని చేరగలమని భావించినపుడు, ఆపదలనే యీ చిన్నచిన్న గోతులను అధిగమించడానికి నీవు నిరాకరించ గలవా? నాకు మాత్రం దుఃఖానికి నిరాశవాదానికి కారణమేది కనిపించకపోగా , ఈ దుఃఖంలో కష్టాల వల్లనే మరింత ఉన్నత కార్యాలు చేయటానికి ఎక్కువగా విజయం పొందటానికి ప్రోత్సాహం కూడా లభిస్తుందని అనిపిస్తుంది. కష్టాలు పడకుండా లభించిన దానికేమైనా విలువ వుంటుందని నీవు అనుకొంటున్నావా? కొన్ని రోజులకు పూర్వం నీవు పంపిన పుస్తకాలన్నీ అందినవి కాని అవి నీకు మరల ఇప్పుడే పంపటానికి వీలుకాదు. ఇక్కడ అవి చదివేవారి సంఖ్య పెరిగింది. నీ అభిరుచి, దృక్పథం చాలా మంచివి. అందువల్ల నీవు పంపే పుస్తకాలను అందరూ ఎంతో ఆసక్తితోను, ఆదరంతోనూ చదువుతారని వేరే రాయనవసరం లేదనుకుంటాను. ఇక సెలవు 189 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

2 మాందడలే జైలు 25-6-1925

ప్రియ దిలీప్‌

ఆఖరి ఉత్తరం తరువాత మొత్తం నీవి మూడు ఉత్తరాలు అందినవి. ఆ ఉ త్తరాల తేదీలు ఒకటి మేనెల ఆరవ తేది, రెండవది మే నెల 15వ తేది, మూడవది 15వ తేది జూన్‌ నెల,

నీవు పంపిన పుస్తకాల పార్సిల్‌ చేరింది. తుగర్నేవుది “స్మోక్‌” అను పుస్తకం లేదు. పార్సిల్‌ ఆఫీస్‌లో ఊడదీశారు. అందువల్ల సూపరింటెండెంట్‌తో ఈ విషయం చెప్పి ఉంచాను, అవసరమైతే కలకత్తాలోని జాజని ఆయన అడుగుతాడు. నీవు కూడా ణ౫+ ఇను లకు వ్రాసి వారి దృష్టికి తెస్తే మంచిదే.

బెట్రాండ్‌ రసెల్‌ వ్రాసిన “పరిశ్రమలు, నాగరికత వాటి పుట్టుపూర్వోత్తరాలు” అను పుస్తకం బరహంపురం లోని జైలులో చాలామంది ఖైదీలవద్ద ఉన్నది. నాకు స్థాన మార్చిడి జరిగినపుడు అనేకమంది యీ పుస్తకాన్ని మాకు కావాలంటే మాకు కావాలని అడిగారు. ఆ పుస్తకం నీకు అవసరం ఉండదను అభిప్రాయంతో అక్కడే వదిలేసి వచ్చాను. రసెల్‌ పుస్తకాలు దొరికితే చాలు మరల ఇవ్వటానికి ఎవరి మనసూ ఒప్పదు. అంత ఆదరమున్నది వాటికి. పుస్తకం నీకు పంపవలసిందిగా బరహంపురం సూపర్చిటెండెంట్‌ గారికి వ్రాశాను. నీవు కూడా వారికి ఒక ఉత్తరం వ్రాయి. ఇది మరల గుర్తుచేసినట్లు అవుతుంది. నీ పని ఆగిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉన్నది. ఈ పుస్తకం నీకింత అత్యవసరం అవుతుందనే విషయం నాకు అప్పుడు తెలియదనే విషయం నీకు తెలిసే ఉంటుంది.

“ఫ్రీ థాట్‌ అండ్‌ అఫీషియల్‌ ప్రోపగాండా” అను పుస్తకం నా వద్దలేదు. ఈ పుస్తకం నీవు నాకు పంపలేదు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 190

పుస్తకాలు ఎన్నికచేసి పంపినందుకు ధన్యవాదాలు. నీవు ప్రారంభించిన పని భగవంతుని దయవలస బాగుగా కొనసాగుతుందని మేమందరం అశించుచున్నాము. మీ వ్యాసాలు నేను గౌరవపూర్వకంగా చదువుతాననే సంగతి చెప్పనవసరం లేదుగదా? పుస్తకం ప్రచురించే సమయంలో టైటిల్‌ విషయంలో జూగ్రత్త తీసుకొనుము “వంగవాణి” లో రవీం(ద్రనాథుని గురించి వ్రాసిన వ్యాసమొకటి చూచాను. ఇంకా దానిని చదవలేదు. కాని విషయం ఆకర్షణీయంగానే వున్నట్లు కనబడుచున్నది. ప్రస్తుతం నా మనసెలా పనిచేస్తున్నదో నీకు తెలుసు. మనమందరం ఒకే విషయాన్ని ఆలోచిస్తున్నామన్న సంగతి నాకు తెలుసును. దేశ బంధు అస్తమయమే ఆ విషయం. పట్రికలో ఈ వార్త చదువుతున్నపుడు విస్తుపోయాను, నమ్మలేక పోయాను. కాని వార్త యథార్థం మన జాతి అదృష్టాన్నే కొల్లగొట్టినట్లు అనిపిస్తున్నది. నా మనసులో ఆందోళన కలిగించే ఆలోచనలన్నింటినీ బహిర్ణతపరచి మనసుని తేలిక పరుచు కోవాలని కోరిక కలుగుతున్నను, కష్టంగానైనా నేను నిగ్రహించు కోవాల్సి ఉన్నది. ఇప్పుడు నా మనసులో చెలరేగే విషయాల్ని అపరిచితుల ముందు ప్రకటించ వీలులేనంత పవిత్రమైనవి, విలువైనవి. సెన్సర్‌ని అపరిచితునిగా భావించకుండా వుండలేం కదా? 'దేశ బంధు తనువు చాలించుటవల్ల దేశానికి ఎలాగో తీరని నష్టం వాటిల్లినది. దానితోపాటే బెంగాలు యువకుల సర్వస్వం పోయిందని కూడా నేను చెప్పదలిచాను. నిజంగా ఈ ఘట్టం నన్ను స్తంభింప చేసింది. ఇప్పుడు నేనెంతగానో శోకవిహ్వలుడనై ఉన్నాను. శరీరం చలించి పోయింది. మరొక వైవున మనోవీధులలో వడివడిగా పయనించి దేశ బంధు వద్దకు చేరుకొంటున్నాను. ఆయన గుణగణాలను వివరించుట మనకు సాధ్యమా? నేను ఆయన దగ్గర వుండి సహజ స్థితిలోనే ఆయన కొనసాగించిన కార్యకలాపాలు గమనించాను. అవకాశం కలిగినపుడు ఆయన సుగుణాల ప్రభావాన్ని స్థూలంగా ప్రజల ముందుంచ గలనని ఆశించుచున్నాను. నా వలెనే, వారిని గురించి అనేక విషయాలు తెలిసినవారు మరికొందరు ఏమైనా చెప్పగలిగినా యిప్పుడేమీ చెప్పలేని స్థితిలో వున్నారు. మౌనం వహించారు. ఆయన గొప్పతనాన్ని పూర్తిగా చెప్పలేని అశక్తులుగా వుండుటచేత దానిని తగ్గించి చెప్పాల్సి వస్తుందేమోనన్న భయం కలుగుతోంది. నాకు కష్టమేమీ లేదని నీవంటే మాత్రం నీతో నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు మనస్సును కలవర పరుస్తున్న విషాదం లాంటిది స్వీయ జీవితంలో వస్తే నేను ఆనంద పూర్వకంగా స్వీకరించజాలను. అన్ని కష్టాలను ఆనందంగా స్వీకరించగలనని చెప్పగల 19 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

తత్వజ్ఞానినో లేదా మోసగానినో కాదు. దురదృష్టవంతులనుకో, అదృష్టవంతులనుకో, అనేకమంది అన్ని రకాల కష్టాలు బాధలు అనుభవించుటకే జన్మించారా అన్న భావం కలిగించేవారు, ఈ సంఘంలో ఉన్నారు. తక్కువగాని ఎక్కువగాగాని కష్టాలు అనుభవించాల్సి వస్తే చేసేదేముంది. చేదుమందు కండ్లుమూసుకొని త్రాగేసినట్లుగా అనుభవించటమే మంచిది. మనలను మనం కాసేపు మరచిపోతే సరి. ఏదోవిధంగా ఆ కష్టాలు అనుభవించ గలుగుతాం ఆత్మ సమర్చణ ఆత్మ నివేదన అనేభావం చైనావారి గోడవలే అన్ని రకాల ప్రమాదాల నుంచీ, కష్టాల నుంచీ రక్షించలేక పోవచ్చు. కాని, ఒకటి ఆత్మ సమర్ప్బణ మన సహన శక్తిని చాలా భాగం పెంచుతుందనటంలో మాత్రం సందేహం లేదు. జీవితంలో ఎన్నడూ రాకుండా వుందాలని మానవుడు కోరుకునే విషాదాలు కూడా వున్నవని 'బర్జార్న్‌డో అన్నాడు. ఈ మాటలలో ఆయన కేవలం సోంసారిక వ్యక్తుల మనోభావాలనే ప్రకటించాడు. కాని నా విశ్వాసమేమనగా, నిష్మకంక మైన సాధువైనవాడు లేదా ఆ విధంగా చెలామణి అయ్యేవాడు వట్టి మోసగాడు అంటాను. వాడే ఈ విషయాన్ని కాదనగలడు.

భావుకులకు తత్వజ్ఞానులకు ఎల్లప్పుడూ బాధలు ఉంటూనే ఉంటాయనడం పొరపాటు. తత్వజ్ఞాన రహితులను, నేను తత్వజ్ఞాన హీనులంటున్నానంటే అదికూడా ఒక అభిప్రాయంతోనే అంటున్నాను. ఈ స్థూల ప్రపంచానికి చెందని ఒక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొనే అలా అంటున్నాను. వాళ్లు ఆ ఆదర్శాన్ని శ్రద్ధా భక్తులతో పూజిస్తారు. నానా విధాలగు బాధలు అనుభవించే సమయంలో వారా (ప్రేమ సముద్రంలో నుంచే సాహసం నమ్మకం పొందుతూ ఉంటారు. ఇచ్చట నాతోపాటు కారాగారవాస కష్టాలను అనుభవిస్తున్న వారిలో భావుకులు, దార్శనికులుకాని వారనేకమంది ఉన్నారు. అయినప్పటికి శాంతులై, వీరులవలే వారా కష్టాలను సపహిస్తున్నారు. సాంకేతిక అర్ధంలో వారు దార్భనికులు కాకపోవచ్చును. కానీ నేను వారిని పూర్తిగా భావరహితులని కూడా అనలేను. బహుశా, ఈ ప్రపంచంలో ఉన్న కార్యవాదులందరికి నాయీ భావమే వర్తిస్తుంది. ఉరి తీయటానికి ఖైదీని బల్లమీదకు తీసుకు వెళ్లగానే అతనికి నరాల దౌర్బల్యం వచ్చేస్తుందని, ఏదో ఒక గొప్ప లక్ష్యసాధన కోసం తన ప్రాణాలను సైతం అర్చించుటకు సిద్ధమైనవారే వీరులవలె చావగలుగుతారని సామాన్య ప్రజల అభిప్రాయం, కాని ఇది యధార్థంకాదు. ఈ విషయంలోనే అనేక వాస్తవాలను తిలకించిన మీదట, ఎక్కువ భాగం నేరస్తులు ధైర్యంతోనే చస్తున్నారని, ఉరిత్రాడు మెడలో పడక పూర్వం తమను తాము భగవంతునికి అర్పించు కుంటున్నారన్న నిర్ణయానికి వచ్చాను. పూర్తిగా ఏమి చేయాలో తెలియని మూర్చులు నా కెవరు కనిపించ లేదు. ఒక రోజున ఒక ఖైదీ సుభాన్‌ చంద్ర బోన్‌ జీఏతం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు. ఇళ

ఉరి బల్ల వైపుకి వెళుతూ, తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడట. ఈ పని చేసినందుకు నీవేమైన బాధపదుతున్నావా? అని ఆ ఖైదీని అడిగారట. తనుచేసిన పనికి తానేమీ బాధ పడటం లేదని, చేయవలసిన హత్య చేసినందుకు సంకళృషప్తిగా ఉందని ఆ ఖైదీ చెప్పాడట. వీరునివలె వురితీయు బల్లమీదకు ఉరికి వీరునివలె మరణించాడట. అంకేగాని శరీరంలో ఒక నరంకూదా కుంచించుకు పోయినట్లు కనిపించలేదట. ఇదంతా జైలు అధికారి ఒకరు నాతో చెప్పాడు. నేరస్తుల మనస్తత్వాన్ని సమీక్షించిన మీదట నాకేదో సత్యం గోచరించినట్లుగా వున్నది. సాధారణంగా వాళ్ళకు అన్యాయం చేస్తున్నామేమో అనిపిస్తుంది. 1922లో నేను జైలులో వున్నపుడు నా వార్డులో ఒక ఖైదీ పనిచేస్తుండే వాడు. అప్పుడు నేను, మవావ్యక్తి దేశ బంధు ఒకేచోట ఉండేవారం. దేశ బంధు చాలా దయా హృదయుడు అందువల్ల సహజంగానే ఆ ఖైది ఆయన దృష్టిని ఆకర్షించాడు. వాడొక పాత కేడి ఎన్నోపొపాలు చేసి ఎనిమిది పర్యాయాలు జైలుకువెళ్లి శిక్ష అనుభవించాడు. కాని అదేమి చిత్రమో వాడిలో కూడా దేశ బందుపట్ల అనురక్తి కలిగింది. ఆశ్చర్యం కలిగించు శక్తిని చూపెట్టాడు. తాను విడుదలై వెళ్ళునపుడు మన దేశబంధు “నీవు జైలునుంచి విడుదలైన తరువాత నన్ను తరచుగా కలుస్తూ వుండు నీ పాత స్నేహితులతో ఎన్నడూ కలవవద్దు+ అని ఆ ఖైదీతో చెప్పాడు. అందుకు అతను అంగీకరించాడు. తరువాత చెప్పినట్లు చేశాడు కూడాను. ఒకప్పుడు పాత కేడి అయిన వాడు జైలునుంచి వచ్చినప్పటి నుండి దేశబంధు ఇంటివద్దనే ఉండేవాడు. మధ్యమధ్యలో ఏదో కొంత అసభ్యతగా ప్రవర్తించినా మామూలు భావాలతోనే జీవితం గడిపాడు. ఇప్పుడు దేశబంధు లేనందువలన తీరని నష్టం పొందిన వారిలో ఒకడు కాగలిగినాడన్న సంగకి వింటే నీకు ఆశ్చర్యం కలుగకపోదు. అతి సామాన్యమైన విషయాన్ని ఆధారంగా చేసుకొని మానవుని మహత్యాన్ని ఆలోచించవచ్చునని అనేకమంది అంటూ ఉంటారు. ఇది యథార్థమైన పక్షంలో దేశానికి మన దేశ బంధు చేసిన ఉపకారాల సంగతి వదిలి వేసినా ఆయనొక మహాపురుషుడని చెప్పవచ్చును. నేను అసలు విషయాన్నుంచి చాలా దూరం వెళ్ళి పోయాననుకుంటాను. ఇక కాస్త కలానికి కళ్లెం వేయాలి. నీ వుత్తరానికి పూర్తిగా జవాబు వ్రాయలేక పోయాను. ఇంకా ఆలస్యం చేద్దామంటే యీ రోజు టపా వెళ్లిపోతుంది. నా ఉత్తరం కొరకు నీవు ఎంతో ఆతురత పడుతూ ఉంటావన్న సంగతి నాకు తెలుసు. అందువల్ల ఈ ఉత్తరం ఈ రోజు టపాలోనే వేయాలి. ఈ సారి రాసే ఉత్తరంలో మరిన్ని విషయాలు వ్రాస్తాను. లాలా తిక సెలవ 1938 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ముఠా తత్వం - బెంగాల్‌ భవితవ్యం మాండలే జైలు బంధువర్యా! మీరు 2వ తేదీన రాసిన ఉత్తరం ఇండియాకు వెళ్లినది. ఆనందం కలిగింది. జవాబు రాయుటలో ఆలస్యమైనందుకు క్షమించండి. ఇప్పుడు అనేక విషయాలలో నాకు నేనే యజమానిని, కాని పరిస్థితుల సంగతి మీకు తెలియును. మీ ఉత్తరం వల్ల భవానిపురం వార్తలు తెలిసి నాకు ఆనందం, దుఃఖం రెండూ కలిగినవి. బెంగాలులో ఇప్పుడెక్కడ చూచినా మురా రాజకీయాలు, తగాదాలే అధికంగా కనిపిస్తున్నాయి. పనులు తక్కువగా వున్నచోటనే తగాదాలు హెచ్చుగా ఉంటున్నవి. భవానిపురంలో కొంత పని జరుగుతున్నది. అందుచేతనే తగాదాలు కొంత తక్కువగా ఉన్నవి. ఏదీ ఎలా ఉన్నను. నిష్పక్షపాతంగా వుండు వ్యక్తి అసంతృప్తి చెందక తప్పదు. పొట్లాడు కోవడానికి ఇంతమంది దొరుకుతూ ఉంటారు. కాని తగాదా పరిష్కారం చేయగలవాడు బెంగాలులో ఒక్కరు కూడా లేరా అని నేను ఆలోచిస్తున్నాను. ఈ ముళా తగాదాలవబ్ల ఇప్పుడు బెంగాలు అనిల్‌ వరణ్‌ లాంటి దేశ సేవకుని పోగొట్టుకున్నది. ఇంకా ఎంతమంది సేవకులను పోగొట్టు కుంటుందో ఎవరు చెప్పగలరు? బెంగాలీ వారంతా అంధులై పోతున్నారు. అందరూ కలహాలలోనూ, వివాదాలలోనూ మునిగి తేలుతున్నారు. అందువల్లనే తెలిసిన విషయాలు కూడా తెలుసు కోలేని స్థితిలో ఉన్నారు. స్వార్ధరహిత ఆత్మ దానమన్న పేరే ఇపుడు వినబడుట లేదు. ఒక మహాప్రాణి శూన్యంలో కలసి పోయింది. అగ్ని జ్వాలలు వెదజల్లిన వెలుతురుతో కూడిన త్యాగమూర్తి రూపం దాల్చి అది మనముందుకు వచ్చింది. ఆ దివ్యాలోకన ప్రభావం వల్లనే బెంగాలీలు ఒక క్షణంపాటు స్వర్గవాసులయ్యారు. కాని, ఆ ప్రకాశం మరల కనిపించకుండా పోయింది. అందువల్ల మరల బెంగాలీలు స్వార్థమనే రొంపిలో దిగబడి పోయారు. నేడు బెంగాలు అంతటా అధికారం కొరకు ......... భ్రీభూపేంద్రనాథ్‌ వంద్యోపాధ్యాయకు (వ్రాసిన ఉత్తరం సుభాన్‌ చంద్ర బోన్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు: 194

కుమ్ములాట జరుగుతున్నది. తమకున్న అధికారాన్ని రక్షించు కొనుటకు అధికారంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. మావల్లనే దేశోద్ధరణ జరగాలి, లేకుంటే లేనేలేదని యిరుపక్షాల వారు అంటున్నారు. అధికార లాలసులైన యి రాజనీతిజ్ఞుల తగాదాలకు దూరంగా, ఆర్భాట రహితంగా ఉండి ఆత్మత్యాగం చేయగలిగి దేశసేవ చేసే వారెవరూ నేడు బెంగాలులో లేరా? తమ మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని కాదని, దేశ సేవకే ఆత్మార్పణ గావించిన మవోనుభావులు అనేకమంది వున్నారు. నీచాతి నీచమగు విషయాలకై అందరూ తగాదా పడుట గమనించి నిరాశపడి, విరక్తి కలిగి రాజకీయ రంగాల నుంచే తప్పుకున్న పక్షంలో ఆశ్చర్య పడవలసిన పనేమున్నది.? తమ మానసిక పారమార్థిక క్షేమాన్నే తృణంగా అలక్ష్యం చేసి దేశహితాన్నే పరమోన్నత లక్ష్యంగా భావించిన నిస్వార్ధ ప్రజాసేవకులు యీ పనికిమాలిన తగాదాలలో తల దూర్చటానికి ఎన్నడూ అంగీకరించరు. ఈ ్రజాసేవా రంగంలో నిరాశపడి విరక్తికి గురై మరలా పారమార్ధిక క్షేమంలోనే నిమగ్నులు కావటానికి నిర్ణయించుకున్న పక్షంలో వారిని మనం దూషించటానికి అవకాశం లేదు. సమాజం యీ స్థితిలోనే ఉంటే ఎంతమంది సంఘ సేవకులు అనిల్‌వరణ్‌ మార్గం అవలంబించుతారో బాగా అర్ధమవుతుంది. నేడు బెంగాలులోని అనేకమంది కార్యక్తర్తలలో వ్యాపారం, కరణిక పద్ధతులు ప్రవేశించాయి. మాకేదో శక్తిని ఇవ్వు. పదవిఇవ్వ లేదా ఏదైనా కార్యవర్గాలలో మమ్మల్ని సభ్యులుగా వేసుకోండి లేకపోతే మేము పనిచేయబోమని అనటం ప్రారంభించారు. నరనారాయణుని సేవ వ్యాపార బుద్ధితోను కంట్రాక్టు పద్ధతిలోను ఎప్పుడైనా సంభవమా? అని నా ప్రశ్న ఇవ్వటమే నీ ధర్మం, కోరుట సరికాదు. ఇచ్చేదేదో హృదయపూర్తిగా ఇవ్వమన్న సేవా ధర్మమే నాకు తెలుసు. దేశ బంధు త్యాగాన్ని యింత త్వరగా మరిచిన బెంగాలువాసి ఇంతకు ముందెపుడో బెంగాలులో మార్నొగిన వివేకానందుని వీరవాణిని సైతం మరిచి పోతాదనటంలో విచిత్రమేముంది?

ఈ విచార పూరిత వార్తలు, కళంకాన్ని కలిగించే కథలు వినగా వినగా, ఆలోచించగా ఆలోచించగా గుండె చెక్కలై పోతుంది. ప్రతీకారానికి మార్గం లేదు. ఏదైనా చేసే శక్తి కనిపించుట లేదు. అందువల్ల ఉత్తరాలు పత్రాలు రాయుట మానేసి బాహ్య (ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెంచేసుకుంటే మంచిదని తరచుగా నాకనిపిస్తున్నది. అలా చేయగలిగితే మాత్రం ప్రజలకు కనిపించకుండా వుండి కృశించి, కృళించి జీవితాన్నాహుతి చేసి జరుగుతున్న ఘోరానికి ప్రాయశ్చిత్తం చేసుకు పోతాను

195 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

పైన భగవంతుడు ఉండి సత్యానికి తావున్నచో తరువాత ఎప్పుడో ఒకప్పుడైనా నా మనసులోని మాటను దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. దేశం పేరుమీద ఈ విధమగు ప్రహసనాన్ని చూడాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. రోము నగరం తగలబడుతుంటే నీరో ఫిడేల్‌ వాయించిన రీతిగా వున్న యిలాంటి నూతన ఉదాహరణ చూడాల్సి వస్తుందని నేనెన్న్షడూ ఆలోచించనైనా ఆలోచించలేదు.

ఏమో చాలా భ్రాశాను, హృదయావేగాన్ని దాచలేక పోయాను. మిమ్మలనందరిని పూర్తిగా నా వాళ్లుగానే భావిస్తున్నాను. కనుక యిన్ని విషయాలు (వ్రాయటానికి సాహసించాను. మీరు నిర్మాణాత్మకమైన పనులు చేస్తున్నారు. యీ ముఠా తత్వపు రొంపికి మీరు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను.

విద్యాలయం వార్తలు చదివి చాలా సంతోషించాను. కాని భవనం సంగతి చదివిన తరువాత విచారపడకుండా ఉండలేక పోయాను. కాని ఈ విషయం నాకు మొదటి నుంచి తెలుసును, చండీబాబు తదితరులతో దీని పరిణామాన్ని గురించి చెప్పాను .స్మూలు అధికారులు అలౌకిక పద్ధతులలో భూమి కౌలుకు తీసుకొని భవనం కట్టుట ప్రారంభించారు. దానివల్ల జమిందారులకే లాభం కలిగిందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. “గతస్య శోచనా నాస్త కనుక ఇక దానిని వదిలేయండి. మీరు నిరాశ చెందకుండా, “భవన నిర్మాణం” నిమిత్తం ధనం ప్రోగుచేయుట చాలా ఆశావహంగా వున్నది. “నహి కల్యాణ కృత్‌ కచ్చితో దుర్గతితాత్‌ గచ్చతి” అన్నారు. కనుక మీ ప్రయత్నం ఫలిస్తుందనటంలో నాకు సందేహం లేదు.

సమితి విషయాలన్నీ తెలుసుకొని సంతోషించాను. మీరు పారిశుధ్యం, వెట్టి పనులు చేసే తదితర నిమ్న జాతుల పిల్లలకు ఒక స్కూలు నడుప గలిగితే బాగుంటుంది, ఈవిషయంలో అమృత్‌ని సలహా అడగండి చాలా రోజుల క్రితం అమృత్‌ ఒక ఉత్తరం వ్రాశాడు. దానికి సమాధానం వ్రాయలేక పోయినందుకు విచార పడుతున్నాను. ఈ రోజు కుల్‌దాకి ఉత్తరం వ్రాశాను. వచ్చేవారం అమృత్‌కి కూడా ఉత్తరం వ్రాయగలనని ఆనుకుంటున్నాను.

నేను ఉన్నట్లయితే మిమ్మల్ని వేరుకానిచ్చే వాడిని కాదన్నసంగతి చెప్పనవసరం లేదు గదా? కాని, మరొక శాఖ యేర్పాటు చేయవలెనన్న తీర్మానం మాత్రం తప్పక తీసుకువచ్చే వాడను. సరే, అయినదేదో అయినది మీరు నియమావళి యేర్పాటు చేయడం మంచిపనే, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 196

బియ్యం పోగుచేయటం, చందావసూలు చేయుటంలో బాల సమితులకు మీకు వైరుధ్యం రాదనుకుంటాను. ఒకేచోట అనేక సంఘాలవారు బియ్యం చందాలు పోగు చేయటం ప్రారంభిస్తే ధర్మం చేసేవారికి విసుగు కలుగుతుందనే విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఒకరిద్దరు వర్కర్లను ఖాసిం బజారులోని పాలిటెకిక్‌కు పంపి ట్రైనింగు యిప్పించితే సాంకేతిక విద్య ఏర్పాట్లకు ఎక్కువ సౌకర్యాలు కలుగజేయ వచ్చునని నా అభిప్రాయం. నేనొక పర్యాయం ఖాసిం బజారులోని పాఠశాలకు వెళ్లాను, నాకు బాగా నచ్చింది. ఇతరచోట్ల నేర్చని అనేక కొత్త వస్తువులను అచట చేయడం నేర్చుతారు. (ఫేంవర్ము బంకమట్టితో నమూనాలు చేయుట, కుట్టుపని, వైద్యుతరంజనము మొదలగునవి అన్నీ అచట నేర్పుతారు. నేను వెళ్లినపుడు వైద్యుతరంజమునకు కావలసిన యంత్ర సామాగ్రి కొంటున్నారు. మీరు పంపిన విద్యాలయ నియమావళి, సమితి నియమావళి అందినవి. ఆరోగ్యానికి చెందిన శాఖలో పని సరిగ్గా జరుగుట లేదను విషయం చాలా విచారకరమైనది. సామాన్య ప్రజానీకాన్ని ఈ విషయమై సరిగ్గా ఆకర్షించ లేకపోవుటయే దీనికి కారణం. మనం చేయవలసిన పద్ధతులలో చేస్తే ఈ విషయంలో ప్రజల నుంచి తగు స్పందన రాకపోదు. ఆరోగ్యశాఖ వారి ఉద్దేశ్యాలకు, ధర్మాసుషత్రుల ఉద్దేశ్యాలు పూర్తిగా భిన్నమైనవి. ప్రజలను కార్యోన్ముఖులుగా చేయాలంటే (ప్రేమద్వారానే మనము వారినొక మార్గంలో పెట్టగలము. దక్షిణ కలకత్తాలోని సేవాశమానికి చెందిన లోటుపాట్లకు బాధ్యుడను నేనేనన్న సంగతి బహుశా మీకు తెలియక పోవచ్చును. బయట ఉండి పోవుటచేత నేను దానిని సరిగా నడపలేక పోయాను. వెంటనే జైలుకు వచ్చేశాను. సేవాశ్రమం కాళీఘాటులో ఉన్నపుడు బిల్లింగ్‌ అద్దె, కార్యదర్శి జీతం నేనే ఇచ్చేవాడను . కేవలం పిల్లల భోజనాదుల ఖర్చులకు మాత్రం ప్రజల మీద ఆధారపదే వారు. సేవాశ్రమం విషయంలో నా ఆత్మ ఇప్పటికి నిష్కల్మషంగానే వున్నది. ఎందుకనగా దానికొరకని ప్రజల నుంచి వసూలు చేసిన దానిలో ఒక్క పైసా కూడా అనవుసరంగా ఖర్చు చేయలేదు. నేను అరెస్టు అయిన తరువాత కూడా లోగడ నేను చెల్లించే సొమ్ము మా అన్నగారు చెల్లిస్తూనే వున్నారు. ఇపుడు ఆదాయం పెరిగింది. ఖర్చు తగ్గింది. అందువల్ల మొదట ఇచ్చినంత డబ్బు యిప్పుడు యివ్వనవసరం లేకుండా పోతున్నది. నేను రెండువందల రూపాయలు ఖర్చుచేసే రోజులలో అయిదారుగురు పిల్లలకు నీవు అనవసరంగా ఖర్చుపెదుతున్నావని కొందరు మిత్రులు అంటూ ఉండేవారు. కాని ఏదో నా మనసులో తాత్మాలికంగా 19... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కలిగిన భావం వల్లగాక పదునాలుగు సంత్సరాలనుంచి రగులుచున్న ఆవేదనాగ్నిని ఉ పశమింప జేయటానికే ఈ పనిలో సహకరించటానికి దిగానన్న సంగతి వారికి తెలియదు. కావాలంటే నేను కాంగ్రేసును వదలగలను కాని సేవాశ్రమం పనులను వదలుట మాత్రం అసంభవం. దరిద్రనారాయణుని సేవించటానికి లభించిన యీ సదవకాశాన్ని ఎలా వదులుకోగలను? సేవాశ్రమం వెనుక ఎంత చరిత్ర ఉన్నదో దాని రూపకల్పన నామనసులో ఎలా కలిగిందో, ఎందుకు కలిగిందో, ఎప్పుడు కలిగిందో, నేను ఎలా ఆలోచనా జగత్తునుండి, ఆచరణ యుక్తమగు ప్రపంచంలోనికి వచ్చానో ఇలాంటి విషయాలన్ని మరోసారి రాస్తాను. ఉత్తరంలో వ్రాయటానికి ప్రయత్నం చేస్తే ఉత్తరం కాస్తా పుస్తకమైపోతుంది. చాలా విషయాలు వ్రాశాను. ఇక చాలిస్తాను. నా విషయమేదో అడిగావు. ఏమి చెప్పమంటావు? రవి బాబు కవిత్వమొకటి ఉన్నది. ఆ కవి భాషలోనే నేను వ్రాయుట మంచిది కాదనుకో జైలు జీవితాన్నీ మనలక్ష్యాన్నీ ఆ కవిత్వంలో ఆయన చక్కగా వివరించారు. అందువల్ల ఆ కవిత్వంమంటే నాకు చాలా ఇష్టం. కవులు మన వృాదయగత విషయాలను మనం భావించిన దానికంటే కూడా ఎంతో స్పష్టంగానూ, విసృతంగానూ చెప్పగలుగుతారు. అందుకనే వారికంత అధిక గౌరవం లభించుతోంది. నీవు రవిబాబు కవిత్వం చదువు , నా ప్రస్తుత విషయం అర్ధమవుతుంది. ఇపుడు శరీరారోగ్యమేమంత బాగాలేదు, కాని దాని గురించి నాకేమి విచారం లేదు. అమృత్‌ ప్రభృత్‌ ఎలా ఉన్నారు.? మీ క్షేమ సమాచారములు చదివినపుడు ఎంతో సంతోషం కలుగుతుంటుంది. అలాగని మీరే పనిమానుకొని సమయం వృథాచేసి ఉత్తరాలు వ్రాయనవుసరం లేదు. నా డ్రేమాభివందనాలు అందుకొనండది. ఇక సెలవు సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 198

హిందూ - ముఫ్లిం ఒడంబడిక మాండలే జైలు నేను నీ ప్రకటనతో పాటే దానిపై (శ్రీ సేన్‌ గుప్తా రాసిన విమర్శ కూడా చదివాను. ఇంతవరకూ సేన్‌గుస్తా విమర్శకు జవాబు ఏదీ వచ్చినట్లు కనిపించలేదు. మరల ఇపుడు ఒడంబడికను అంగీకరించటమన్న ప్రశ్నే లేదు. సిరాజుగంజ్‌లో ఈ ఒడంబడికను అంగీకరించినపుడు దీనికి వ్యతిరేకులు కొందరున్నారు. వారు మాట్లాడలేదు. దేశ బంధుకి యీ విషయం తెలుసు. దేశంలో రెండు భిన్న మతాలవారు కలిసి వుండటానికై స్పష్టమైన పునాదులు యేర్పాటు చేయటమే తన ఉద్దేశ్యమంటూ పదే పదే ఆయన చెప్తూ వచ్చారు. అందుచేత యీ ఒడంబడికలోని కొన్ని అంశాలుగాని, కొన్ని నిబంధనలుగాని లక్ష్యసాధనకు భిన్నమని, గ్రహింపదగినవి కావని భావించినచో వాటిని మార్చటానికి దేశబంధుకి అభ్యతరం లేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బహుశ కాకినాడ కాంగ్రెసులో అనుకుంటాను, బెంగాలు ఒడంబడికను యిష్పటికిప్పుదే కాంగ్రెస్‌ అంగీకరించాలని తాను కోరుట లేదని దేశబంధు చెప్పాడు. ఈ ఒడంబడికను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పరిశీలించాలని ఆయన కోరిక. కాని ఆ సమయాన దానినే కాంగ్రెస్‌ బాగా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌ సభ్యులు ఒదంబడికను విమర్శించటానికి సిద్ధంగా లేరు. కాకినాడ కాంగ్రెస్‌ తరువాత సిరాజ్‌గంజ్‌లో యీ ఒడంబడిక ఆమోదాన్ని పొందినది. నేను అక్కడ లేను. కాని ఒడంబడిక అంగీకరించక పూర్వం కూడా నేను ఏవిధమగు తర్మాన్ని సర్జ్దుబొట్లను అంగీకరించ బోనని చెప్పలేదు. ఒడంబడిక లోని ఏదేని అంశం లేక నియమం మార్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడినపుడు అందుకు సిద్ధంగా ఉన్నట్లు దేశ బంధు హామీ యిచ్చాడు. అందువల్ల మనం దేశబంధు భక్తులమై ఉన్నప్పటికినీ ఒడంబడికలోని ఏదేని అంశం మార్చమని కోరవచ్చును. బెంగాలు సమస్య పరిష్కారానికి కేవలం దేశబంధుపైనా, 199 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

అదేవిధంగా ఆయన లేనపుడు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీలపైనా ఆధారపడి ఉ ండుటంవల్ల పని జరగదని కూదా అనిపిస్తుంది

హిందూ, ముస్లింల సమస్యను యావత్‌ భారత దేశ దృష్టితో పరిష్కరించినప్పటికీ, బెంగాలులోని హిందూ, మహ్మదీయుల సమస్యా పరిష్కారానికి మార్గం బెంగాలీలే కనుగొన వలసి వున్నది

పత్రికలలో వచ్చే వార్తలలో చదీవిన తరువాత ఆయా సంఘటనలు జరిగిన తీరునుబట్టి నాకు తోచిన వరకు కొన్ని నిశ్చితాభిప్రాయాలకు వచ్చాను ప్రస్తుత విషమ పరిస్థితిలో అన్ని విషయాలలోను మనకు నిర్దిష్టుగు దూరదృష్టి ఉండాలి అది మనకు లేదనేది ఆ అఖభి[ప్రాయాలలో ఒకటి.

సరే ఇక ఉంటాను

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 200

విడుదల ప్రతిపాదన - దాని జవాబు ఇన్‌సిన్‌ సెంట్రల్‌జైలు శ.ఏప్రియల్‌ 1927 అన్నగార్శి మిష్టర్‌ మోవాలి ప్రతిపాదన విషయంలో నా అభిప్రాయం తెలుసుకొనుటకు మీరు ఆదుర్దాగా ఉండి ఉంటారు. ఈ విషయంలో నా అభిప్రాయం తెలపవలసిన సమయం కూడా వచ్చినది. మీ అభిప్రాయంతో, నా అభిప్రాయం కలుస్తుందో లేదో చెప్పజాలను. అయినప్పటికీ నా అభిప్రాయం యొక్క విలువతో నిమిత్తం లేకుండా ప్రకటించడానికే నిర్ణయించాను. నేను చాలా నిగ్రహంతోనే మిష్టర్‌ మోవాలి ప్రతిపాదన చదివాను. దానిలోని అంశాల గురించి మాటిమాటికి ఆలోచించాను. ఆయన తన ప్రతిపాదన కొరకు మాటలు చాలా జాగ్రత్తగా ఏరుకొన్నారు. వెనుకా ముందు ఆలోచించే ప్రకటించాడన్న నిర్ణయానికి వచ్చాను. ఆయన తీర్మానంలోని విషయాలన్నిటిని క్షుజ్జంగా పరిశీలించిన మీదటనే నేడు నా అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు వ్రాసే నిర్ణయాన్ని గురించి ఎన్నోసార్లు ఆలోచించే తీసుకున్నాను. అయినప్పటికీ నావల్ల ఏదైనా పొరపాటు జరిగినచో దానిని గురించి మరల ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాను.

ఈ విషయాన్ని మిస్టర్‌ మోనాలి ఎంతో స్పష్టంగా చెప్పినందుకు ప్రశంసిస్తున్నానని మొదటే చెప్తున్నాను. అయితే ఒక విషయముంది. ఆయన వల్లనే నేను కూడా అన్ని విషయాలు విస్పష్టంగా చెప్పకపోతే పొరపాటు చేసినట్లేకాక, నా కర్తవ్యము అసంపూర్తిగా ఉండి పోతుందని అనిపిస్తున్నది. ఏ విషయమైనా డొంకతిరుగుడుగా కాక స్పష్టంగా చెప్పటం ఉత్తమ పద్ధతని నమ్మేవారిలో నేనాకడను. విస్పష్టంగా, వమాత్రం దాపరికం లేకుండా చెప్పుకొన్నందువల్ల ఇరుపక్షాల వారికి లాభమే కలుగునని నా భావం.

ఆయన చెప్పిన అనేక విషయాలకు మిష్టర్‌ మోవాలీని అభినందించకుండా ఉ ండలేక పోతున్నాను. ప్రత్యేకించి నా గతకాలపు కార్యకలాపాలకు, భవిష్యత్తులో జరగబోవు 20 డా డా గౌతమ్‌ ఛటోపాధ్యాయ

వాటికి నా హామీ అవుసరం లేదని ఆయన చెప్పినందుకు తప్పక అభినందించి తీరాలి. నేను మాట యిస్తే వదిలేస్తానంటున్నారాయన. మొదటనే యీ విషయం నాతో చెప్పదలచి నట్లూ, కాని, ఈ తీర్మానం నా ముందుంచిన పక్షంలో దానిని అంగీకరించ వలసిందిగా ఆయన నన్ను ఒత్తిడి చేస్తున్నట్లుగా నేను ఎక్కడ అనుకొంటానో అని ఆలోచించి ఈ విషయం నా దృష్టికి తీసుకు రాలేదని చివరకు ఆయన రాశారు. తీర్మానంలోని ఈ భాగాలు చదివిన తరువాత ఆయన నన్ను ఆత్మ గౌరవం, విశిష్ట్రగల సత్పురుషునిగా భావించినట్లు అర్ధం చేసుకొన్నాను. తీర్మానంలో ఆయన నాయందు చూపిన గౌరవం ప్రశంసనీయం. చివరకు బెంగాలు శాసన సభా సభ్యుని హోదాలో గౌరవనీయుడైన సభ్యుని ఈ విధమగు ప్రవర్తనను శ్లాఘించకుండా వుండలేను. కౌన్సిల్‌ సభ్యులయందు విశ్వాసం బాగుగా నెలకొల్పి ఏదైనా తీర్మానం ప్రథమంగా వారి ముందుంచటానికి చేయు ప్రయత్నానికి యిది తొలి నిదర్శనమని నా అభిప్రాయం. తీర్మానాన్ని గురించి మిష్టర్‌ మోవాలి చెప్పవలసిందేమి లేదని నా అభిప్రాయం. అన్నిటికంటే ముందు ఒకానొక విషయం గురించి మీ మనసులో ఏర్పడిన అభిప్రాయాన్ని తొలగించాలనుకుంటున్నాను. అన్నా, డాక్టర్‌ సునీల్‌ చంద్రబోస్‌ రిపోర్ట్‌కి నా అభిప్రాయాలకు ఏమీ సంబంధం లేదు. ఆయన రిపోర్టు రాయక పూర్వం గాని, తరువాతగాని నన్ను గురించి గవ్రాసేదేమిటో, చేసే సిఫార్సు ఏమిటో అసలు నాతో సంప్రదించలేదు. ఆయన ముందుగా నాతో చెప్పినట్లయితే తప్పక స్విట్టర్‌లాండ్‌ పంపు ప్రతిపాదనను వ్యతిరేకించే వాడను. ఈ విధమగు ప్రతిపాదన పంపిన తరువాత దీనివల్ల మంచి ఫలితం రాదని నేను సందేహించాను. చివరకు నా సందేహమే నిజమైంది. అన్నయ్య దాక్టర్‌ హోదాలోనే నన్ను పరీక్షించటానికి వచ్చారు. డాక్టరుగానే ఆయన తన అభిప్రాయం చెప్పారు. ఈ విధంగా చెప్పటం చూస్తే అన్నగారు సమదృష్టి కలిగిన వైద్యుడని, తెలిసిన శాస్త్రజ్ఞుడని తెలుస్తున్నది. అంతేకాని ఆయనకున్న యీ అభిప్రాయము రాజకీయ వాఖ్య ఎలా అవుతుంది? ప్రభుత్వం మాత్రం దీనిని రాజకీయ ఎత్తుగడ అని ఎలా అనగలుగుతుంది? ఈ విధంగా ఆలోచించ వలసిన అవుసరం కూడా (ప్రభుత్వానికి లేదు. అందువల్ల ప్రభుత్వం వారి ఈ చర్యను నేను నిందించలేను. రోగులనేకమంది స్విట్టర్‌లాండ్‌ ఆరోగ్య ఆశమానికి వెళ్ళి రోగ నివారణ పొందారు. ఇదిచూసి, యితర ఉబ్బసం రోగులకు చెప్పినట్లే నన్ను కూడా స్విస్‌కు పంపవలసిందిగా సిఫార్సు చేశారు. స్విట్టర్‌లాండ్‌ వెళ్లి మందుల వరైరాలకు సధాన్‌ జంభ్ర బోన్‌ జేవతం, రచనలు, ఇవన్యానాల. లేఖల: 202

బాగుగా డబ్బు ఖర్చుపెట్టగల ధనికులకు ఈ సలవాో చాలా మంచిదే, కాని, ఈ ప్రతిపాదనకు నన్ను నేను బాధ్యునిగా భావించలేను. అన్నగారు చెప్పిన రోగ వివరాలను ప్రభుత్వం వారు అంగీకరించలేదు. కాని ఆరోగ్యం పొందటానికి మాత్రం వారి సూచన అంగీకరించారు. “సుభాస్‌ చంద్ర బోస్‌ ఎక్కువగా బాధ పడటం లేదు. పని చేయలేనంత బలహీనంగా కూడా లేడన్న సంగతి అందరికి తెలిసినదే”, అని మిస్టర్‌ మోవాలి అన్నాడు. నేను అధిక రోగ పీడితుడనని, వమాథత్రం పని చేయలేనంత బలహీనంగా ఉన్నానని ప్రభుత్వం ఎప్పుడు భావిస్తుందో నేను తెలుసుకోగోరు చున్నాను. నాకు జబ్బు నయం కాదని యిక కొద్ది నెలల్లో చనిపోతానని డాక్టర్లందరూ చెప్పినప్పుడు ఒప్పుకుంటారా? అన్నగారి రోగ వివరణ నివేదిక అంగీకరించక యీ డాక్టర్ల నివేదిక అంగీకరించితే పరోక్షంగా అన్నగారి నివేదిక కూడా ఒప్పుకొన్నట్లే గదా? కాని మరి దానిని అంగీకరించటానికి ప్రయత్నించ రెందుకని? ఇంటికి వెళ్లనివ్వొద్దనికాని, విదేశానికి ప్రయాణమైనపుడు ఆత్మీయులను బంధువులను చూడవద్దనిగాని ఆయన గారు చెప్పలేదు. నేను వెళ్లే ఏ భారతీయ రేవులోను లంగరు వేయరాదనిగాని, ఆరోగ్యం బాగు పడనప్పటికిని, ఆర్డినెన్స్‌ ఉన్నన్ని రోజులు నేను ఇంటికి తిరిగిరాననిగాని చెప్పలేదు. ఈ విషయాలన్ని పరిశీలించిన మీదట క్షీణించిన నా ఆరోగ్యం మెరుగు చేయుటకు తగిన యేర్పాటు చేసే అభిప్రాయం ప్రభుత్వానికి లేదని అనుకోవాల్సి వస్తున్నది.

మిస్టర్‌ మోవాలి ప్రధానంగా రెండు విషయాలు చెప్పారు. 1) ఉంటే నేను జైలులోనే ఉండాలి. 2) రోగ నివారణ నిమిత్తం ఏ దేశమైన వెళ్ళితే నిశ్చిత గడువు లేకుండా అక్కడే ఉండి పోవాలి.

ఈ రెంటికి మధ్య మార్గమేది లేదా అని ఆలోచించికే లేదనే నాకు అనిపిస్తోంది. ఆర్డినెన్స్‌ అమలులో ఉన్నంత కాలం అనగా 1930 వరకు నేను బందీగానే ఉండాలని ప్రభుత్వం వారి కోర్కె కాని 1980లో ఈ గడువు పూర్తి అయిన తరువాత కూడా మరల దీనిని గురించి ఆలోచించరని మనము చెప్పగలనా? గత అక్టోబరులో సి.ఐ.డి శాఖాధిపతి మిస్టర్‌ లోమైన్‌తో నేను జరిపిన సంభాషణ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 1929లో యీ ఆర్టినెన్స్‌ చట్ట సమ్మతం చేయాలనే ఆందోళన బయలుదేరితే నాకేమి ఆశ్చర్యం కలుగదు. అలా జరిగితే నేను శాశ్వతంగా విదేశాలలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆవిధంగా దేశాంతరం పోవటానికి నాకు నేనే బాధ్యుడనవుతాను. ఈ విషయంలో నిజంగా ప్రభుత్వం వారికి ఏదైనా ఉద్దేశ్యం వున్న యెడల తప్పనిసరిగా

నేను విదేశాలనుంచి తిరిగి వచ్చే గడువు కూడా ప్రతివాదనలో పేర్మొని ఉండేది. ఇంత నూ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విదేశంలో నాకు స్వేచ్చ ఎంతవరకు ఉంటుందో పేర్కొనలేదు స్విట్టర్‌లాంద్‌లో మూలమూల తిరుగుతున్న సి.ఐ.డి వారి నుంచి భారత ప్రభుత్వం నన్ను రక్షించగలదా? రాజకీయ నేరస్తునిగా పరిగణించ బడిన నేను నాఅభిప్రాయం మార్చుకొని ప్రభుత్వానికి అనుకూలంగా మారనంతవరకు (ప్రభుత్వంవారు నన్ను అనుమానిస్తూనే ఉంటారనేది కాదనలేము. ఈ సి.ఐ.డి అదుగదుగునా నన్ను వెంటాడుతూ బాధించుతారనేది కూడా యథార్థం. స్విట్టర్‌లాండ్‌లో కేవలం బబ్రిటీష్‌వారి గూడచారులే కాక ట్రిటీషువారి ద్వారా నియమించబడిన స్విస్‌ దేశస్తులు ఇటాలియనులు, (ఫెంచివారు, జర్మనులు, భారతీయ గూడచారులు ఉన్నారు. వీరిలో ఎవడో ఒక ఉత్సాహవంతుడగు గూఢచారి నన్ను ప్రభుత్వ దృష్టిలో దోషాల పుట్టగా చూపెట్టటానికి ఏవో లేనిపోని విషయాలన్నీ కల్పించకుండా ఉంటాడనటానికి ఆధారమేమున్నది. నేను గత సంవత్సరం మిస్టర్‌ మైన్స్‌ను కలసి నపుడు, 'మీ గూఢచారి శాఖవారు కావాలనుకుంటే ఎవరికి వ్యతిరేకంగా నైనా సాక్ష్యాలు సేకరించి ఆతనిని ఏదో ఒక ఆర్డినెన్స్‌ ప్రకారం అరెస్టు చేయగలరని”, చెప్పాను. యూరప్‌లో ఇలా చేయుట మరింత సులభం యూరప్‌లో అనుమానించ బడినవారు స్వదేశం తిరిగి రావాలంటే ఎన్నో చిక్కులు పడతారు. ఈ విషయం అందరికి తెలుసు. విదేశాలలోని పార్లమెంటు, మంత్రుల సభలోని సభ్యులు కొందరు కృషి చేయనిచో లాలా లజపతిరాయ్‌ వంటి నాయకుడు కూడా భారత దేశం తిరిగి రాలేక పోయ్‌వారు, ప్రభుత్వం నన్ను ఒకమారు అనుమానించిన తరువాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది సహజంగానే ఊహించు కోవచ్చును.

గూఢచారి పోలీసులు యీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనేది నేనెరుగుదును. నేను యూరోప్‌లో ఎంతో శాంత భావంతోను, జాగ్రత్తగాను ఉన్నప్పటికీ వాళ్లు నాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం వారికి ఏవో కల్పిత రిపోర్టులు పంపితీరుతారు. నేను మెదలకుండా ఉన్నప్పటికిని ఏదో ప్రమాదకరమగు కుట్రకు నన్ను కర్తగా చిత్రిస్తారు. వారు పంపే రిపోర్టు ఏమిటో కూడా నాకు తెలియటానికి అవకాశముండదు. దాని ఫలితంగా జరిగే దేమంటే ఆ రిపోర్టుని గురించి నిజము చెప్పటానికిగాని లేక నేనే ఏదైనా చెప్పుకోవటానికిగానీ అవకాశం లేకుండా పోతుంది. ఈ విధంగానే చేసి బహుశా 1929కి పూర్వమే వారు నన్ను పెద్ద బోల్నిలిక్‌ నేతగా ప్రకటించుతారు. తత్ఫలితంగా నేను భారత దేశానికి తిరిగి రావటమనే ప్రశ్నే వుండదు. యూరోపియన్లు కేవలం బోల్నివిక్కులకే భయపడతారు. అందువల్లనే నేను నా కోర్మెమీద మాతృభూమి వదిలి వెళ్ళటానికి ఇష్టపడుట లేదు. ప్రభుత్వం కూడానా దృష్టితో యీ విషయాన్ని యోచించినచో నా స్థితిని అర్ధం చేసుకోగలదు. సుభాన్‌ చంద్ర బోన్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు. లేఖలు: 204

బోల్నివిక్కుల ఏజెంటును కావాలనే అభిప్రాయమే నాకుంటే ప్రభుత్వం వారు అనగానే అన్నిటికంటే ముందుగా దొరికే ఓడలోనే యూరోపునకు బయలుదేరే వాడను. ఆరోగ్యము మెరుగు పడిన తరువాత బోల్షివిక్కుల దళంలో కలిసి సమస్త ప్రపంచంలో పెద్ద తిరుగుబాటు సృష్టించటానికి ప్యారిస్‌ నుంచి లెనిన్‌ గ్రాడ్‌ వరకు తిరుగుతూ ఉ ందేవాడిని, కాని నాకు ఆ అభిప్రాయం లేదు. భారతదేశానికిగాని, సింహళానికి లేదా బర్మాకు నన్ను తిరిగి రానివ్వరని విన్నపుడు నిజంగా నేను భారత దేశంలో ్రిటీష్‌వారి భద్రతకు అంత అవరోధం కలిగించే వాడిగా ఉన్నానా అని ఆలోచించాను. బెంగాలు నుంచి వెళ్లగొట్టినా ప్రభుత్వం తృప్తి పడలేదు. ఒకవేళ యిదంతా మోసమా? మొదటి మాట వాస్తవమై నిరంకుశ అధికార యంత్రాగాన్ని ఎదుర్శొనే క్రమంలో నేనే భయానికి కారకుడను అర్వుకంటే శ్లాఘనీయమైన విషయమేముంటుంది? నా జీవిత కార్యకలాపాల గురించి ఆలోచించినపుడు హింసావాదులు నన్ను గురించి ఊహించిన రూపంలో మాత్రం నేను లేనన్నది స్పష్టం. నేను బెంగాలు బయట ఏ విధమైన రాజకీయ కార్యాలు చేయలేదు. భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా ఇంతవరకు లేదు. బెంగాలే నా కార్యక్షేత్రం. నా ఆదర్శానికి నాకా రాష్ట్రం చాలును. బెంగాలు ప్రభుత్వాన్ని మినవాయిస్తే మరే ప్రభుత్వంవద్ద కూడా నాకు వ్యతిరేకంగా నేరారోపణలు ఉన్నవని నేను అనుకోవటం లేదు. అలాంటపుడు, సమస్త భారతదేశంలోనూ, సింహళంలోనూ, బర్మాలోనూ నా ప్రవేశాన్ని ఎందుకు నిపషేధిస్తున్నారు? సింహళం పూర్తిగా (బిటీష్‌వారి బెపనివేసిక రాజ్యమేకదా? భారత ప్రభుత్వ చట్టం అక్కడ కూదా చెల్లుబడి అవుతుంది. అందువల్ల యిది కూడా సందేహాస్పదంగా ఉన్నది. బెంగాలు ప్రభుత్వం నా కార్యకలాపాలన్నింటిని కనిపెట్టి ఉండాలని, తన అదుపులో ఉంచుకోవాలని భావిస్తున్నది. అయితే, నేను స్వేచ్చగా ఉన్నపుడు మాత్రం చేసిన పనులేమి? 1928 అక్టోబర్‌ నుంచి 1924 అక్టోబర్‌ వరకు రెండే పర్యాయాలు కలకత్తా వదలి బయటకు వెళ్లాను. ఒక పర్యాయం ఖుల్నా జిల్లా కాంగ్రెస్‌ సమావేశానికి, రెండవసారి నాడియా జిల్లా కౌన్సిల్‌ ఎన్నికలలో నిలబడిన ఒక అభ్యర్థిని బలపరచటానికి వెళ్లాను. 1924 ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకు ఒక్కసారి కూడా బయటకు వెళ్లలేదు. సిరాజుగంజ్‌ కాంగ్రెస్‌లో నన్ను యిరికించటానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ సమయాన నేను కార్పోరేషన్‌ చీఫ్‌ ఎగ్జుక్యూటివ్‌ హోదాలో కార్పోరేషన్‌ పనులలోనే ఎక్కువగా మునిగి వున్నాను. సరిగ్గా కాంగ్రెస్‌ జరిగే సమయంలో సిబ్బంది ఎవరో సమ్మె చేస్తారనే హడావుడిలో వున్నందున ఒక్క నిముషం కూడా బయటకు వెళ్లటానికి వీలు పడలేదు. 1924 మే నుంచి అక్టోబర్‌ వరకు నేను చేసిందేమిటో అందరికి తెలుసు. అపుడు 205 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

రాకపోకల పనులన్నీ ప్రభుత్వానికి తెలుసు. నా రాకపోకల పైనా, పనుల పైనా నిఘా వుంచడమే ప్రభుత్వం వారి లక్ష్యమైతే అందుకు నన్ను అరెస్టు చేయవలసిన అవసరం లేదన్నదే నా అభిప్రాయం. మిస్టర్‌ మోవాలి ఒక విషయంలో తన హృదయ రాహిత్యాన్ని చూపించాడు. నేను రెండున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రం వెలుపల బందీగా ఉన్నాను. ఈ తరుణంలో నేను అత్మీయులనే గాదు, చివరకు తల్లితండ్రులను కూడా కలుసుకోలేక పోయాను. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు, తెలిసి కూదా ఇపుడు నేను రెండున్నర సంవత్సరాలు విదేశాలలో ఉండాలని తీర్మానించింది. ఇపుడు కూడా నేను నా వారిని కలవటానికి అవకాశం యివ్వలేదు. ఇది నాకు బాధ కలిగించేదనటంలో సందేహం లేదు. నన్ను అభిమానించే వారందరికీ ఇది మరింత బాధాకరమైనది. ప్రాచ్య దేశస్తులంతా తమ ఆల్మీయులపట్ల ఎలాంటి అవిచ్చిన్నమైన స్నేహ బాంధవ్యాలు కలిగి వుంటారో పాశ్చాత్యులు ఊహించనైన ఊహించలేరు. ఈ అజ్ఞానం వల్లనే ప్రభుత్వం తన హృదయ విహీనతను చాటుకొన్నదని నా ఉద్దేశ్యం. నాకు వివాహం కానందున, పరివారం లేనందున నాకు ఎవరిపట్లా (ప్రేమాభిమానాలు ఉండవని వారు అభిప్రాయ పడుతున్నారు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్నికష్టాలు పడవలసి వస్తుందోనన్న సంగతి బహుశ ప్రభుత్వం మరచి పోయింది. నిష్కారణంగా నన్ను యిన్ని రోజుల నుంచి బంధించి ఉంచారు. ఆయుధాలు, పేలుడు పదార్ధాలు తెప్పించుట, ప్రభుత్వోద్యోగులను హత్యచేయుట మొదలగు కుట్రపూరిత నేరారోపణలున్న అపరాధినని యిపుడు నాతో అంటున్నారు. నా అభిప్రాయమేమిటో చెప్పమంటున్నారు. నేను నిర్దోషిని అంటున్నాను. పరలోక గతులైన ఎద్వర్ట్‌ మార్షల్‌ సర్‌జాన్‌ సైమన్‌ యింతకంటే ఎక్కువ ఏమి చెప్పగలిగే వారు కాదని నా విశ్వాసం. రెండవ పర్యాయం ఈ నేరారోపణలను నా ముందుంచినపుడు ఇంతమంది మనుషులుందడగా పోలీసులు నన్నే ఎందుకు అరెస్టు చేశారు? అని అడిగాను. ఈ జవాబే మంచిదనిపించింది నాకు. నన్ను అరెస్టు చేసిన తరువాత నామీద ఆధారపడి ఉన్నవారికికాని, లేదా ఇంటిని కాపాడటానికిగాని బెంగాలు ప్రభుత్వం వారేవిధమైన అలవెన్సు ఇవ్వలేదు. ఇందుకు నేను గవర్నర్‌ జనరల్‌కి దరఖాస్తు పెట్టాను. కాని దానిని బెంగాలు ప్రభుత్వం త్రొక్కిపట్టి వుంచింది. ఇన్ని జరిగినా తరువాత ఇపుడు మరల నన్ను మూడు సంవత్సరాలు విదేశాలలో ఉండమని చెప్తున్నారు. యూరోప్‌లో ఉన్నపుడు నా ఖర్చులు నేనే భరించుకోవాలి. కాని యీ ప్రతిపాదన ఎలా న్యాయ సమ్మతమైనది అంగీకారమైనది అవుతుందో అర్ధం కావటం లేదు. 1924 లో

ఉన్నంతగానైనా నా ఆరోగ్యాన్ని మెరుగుపరచి ప్రభుత్వం నన్ను విడుదల చేయాలి. జైలులో ఉండగా క్షీణించిన నా ఆరోగ్య శక్తిని మరలా పూరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయదా? యూరప్‌కు వెళ్ళి మరలా ఆరోగ్యం పొందేవరకూ అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలి. యూరప్‌ వెళ్ళడానికి పూర్వం నేను ఇంటికి వెళ్లి రావటానికి అనుమతించి యూరప్‌లో ఉన్నకాలంలో నాక్రైన ఖర్చులు భరించి, ఆరోగ్యం చిక్కిన తరువాత భారతదేశం తిరిగి రావటానికి అంగీకారం తెలిపినట్లయితే ప్రభుత్వం వారి వ్యవహారం సద్భావ పూదితమూ, సహృదయంతో కూడినదీ అని భావించి వండే వాడను. ఆర్డినెన్స్‌ గడువు పూర్తయ్యే వరకు జైలులో ఉండటానికి బోసు అంగీకరిస్తున్నాడు, (ప్రభుత్వం కూడా ఉంచాలనే అనుకుంటోందని మిస్టర్‌ మోవాలీ అన్నారు. ఈ విషయంలో నేను మిస్టర్‌ మోవాలీతో ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం కావాలనుకున్నంత కాలం నన్ను జైలులో ఉంచగలదు. ఆర్డినెన్స్‌ పూర్తయిన తరువాత మూడవ రెగ్యులేషన్‌ లేదా ఏదో ఒకచట్టం పేరుతో నన్ను బందీగా ఉంచగలరనే విషయం నేనెరుగుదును. ప్రతినిధులు సభా సభ్యులు గొడవ చేసినా శాసన సభ్యులు ప్రయాణ ఖర్చులు తిరస్మరించినప్పటికీ కూదా ప్రభుత్వం తను కావాలనుకున్నంత కాలం లేదా జీవితాంతం వరకూ బందీగానే ఉంచగలదన్న సంగతి నాకు తెలుసు. నిరవధికంగా ఇలాగే చిరకాలం జైలులోనే నన్ను బందీగా ఉంచాలని భావిన్తున్నదా? లేదా? అను విషయమే నేను తెలుసు కోగోరుచున్నాను. దేశ బంధు నన్ను యువ వృద్ధుడని పిలిచేవాడు. నిరాశావాది అనే వాడు. సామాన్యంగా నాకు ప్రతి విషయంలోనూ అశుభమే గోచరిస్తుంది. అందువల్ల నిరాశావాదిని కావచ్చునేమో. వర్తమాన ఘట్టంవల్ల హెచ్చుగా కలిగే చెడు ఫలితమేదో నేను ఆలోచించాను. ఒక నిశ్చయానికి వచ్చాను. బ్రతికినంత కాలం మాత్ళ భూమికి దూరంగా ఉందేకంటే జైలులో ప్రాణాలు వదలటమే ఉత్తమమని అనుకున్నాను. అదే నా నిశ్చయం. “గౌరవం ప్రసాదించు మార్గమెప్పుడూ మృత్యువు వైపుకి తీసుకువెళ్ళుతుంది” అన్న కవిసూక్తి పట్ల నాకు విశ్వాసం వుంది. ప్రభుత్వం వారి ప్రతిపాదనకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ నేను చెప్పవలసినదంతా చెప్పాను. కనుచూపు మేరలో నా విడుదలకు అవకాశం కనిపించటం లేదని భావించి మీరెవరు కూడా ఏవిధంగానూ బాధ పడవద్దు. తలిదండ్రులెంతగానో బాధపడతారు. వారికి ధైర్యం చెప్పండి. స్వాతంత్ర్యం వచ్చేవరకు వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ మనం ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. నేను ఏ మాత్రం 207 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కలత చెందకుండా ఎలాంటి అగ్ని పరీక్షకైనా సిద్ధం కాగల శక్తిని ప్రసాదించినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపు కొనుచున్నాను. నా జాతి చేసిన సమస్త పొపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొంటున్నందుకు నాకు తృప్తిగా ఉంది. మన ఆలోచనలు, ఆదర్శాలు శాశ్వతంగా ఉంటాయి. దేశం సదా స్మరించుకుంటుంది. భవిష్యత్‌ సంతతి మనలను (ప్రేమపూర్వకంగా స్మరించుకొను వారసురాలవుతుంది. ఈ భావంతోనే, విశ్వాసంతోనే సమస్త విధాలైన ఆపదలను, కష్టాలను మందహాసవదనంతో సహిస్తూ జీవితం గడుపుతాను. ఇక సెలవ. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 208

జీవిత లక్ష్యము ఇన్‌సిన్‌ జైలు 9మే 1927 అన్నా!

పెద్ద ఉత్తరం వ్రాసే శక్తిలేదు. పూర్తి శక్తివచ్చే వరకు దానికొరకు నిరీక్షించాలి.

ప్రభుత్వం వారి ప్రతిపాదనను గురించి అన్నగారితో చాలా చర్చ జరిగింది. ఈ విధంగా చర్చించటానికి అవకాశం లభించినందుకు చాలా అనందపడుతున్నాను. గౌరవనీయులైన మన రాష్ట్ర మంత్రిగారు చూపిన సౌజన్యమునకు ప్రతిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇప్పటివరకు నాయందు వ్యవహరించిన తీరుకంటే ఇది భిన్నమైనది. వప్రియల్‌ 27వ తేదీన అన్నగారు నాకు ప్రభుత్వంవారి జవాబు చూపారు. ఈ జవాబు వల్ల అసలు విషయం యిరుపక్షాల వారికి స్పష్టంగా అర్ధమయింది, ఏప్రియల్‌ 11వ తేదీన ప్రభుత్వంవారి షరతులకు నేను రాసిన జవాబే ఇపుడు పునరాలోచన చేసిన

తరువాత కూడా సరైనదని తోస్తున్నది.

వదో సహజంగానే ఆలోచించితే నాకొక సిద్ధాంతం ఏర్పడింది. బాగుగా ఆలోచించిన మీదట అది బఐబలీయమగు సిద్ధాంతం కాగలదు. సహజమగు భావంతోనే జీవితం గురించి యోచించి నేనీ సిద్దాంత నిర్ణయానికి వచ్చాను. ఆలోచించగా యీ సిద్ధాంతం మరింత బలపడింది. జైలులో ఎక్కున రోజులు ఉన్నకొలది జీవిత సంగ్రామం యొక్క మూలమును గురించి భావఘర్షణ, సత్యా సత్యాలకు ఘర్షణ జరుగుచున్నదన్న అభిప్రాయం బాగా బలపడింది. కొంతమంది దీనినే సత్యంయొక్క విభిన్న రూపాల సంఘర్షణ అనికూడా అంటున్నారు. మానవుని ఆలోచనలే అతనిని నడుపుతున్నాయి. మానవుని అభిప్రాయాలన్నీ నిరుపయోగమైనవి కావు. ఉపయోగకరమైనవి, ఘర్షణలతో కూడినవి ఈ విషయమై ఇంగ్రీషులో గ్రంథాలు రాసి ప్రసిద్ధి పొందిన హెగెల్‌, హేవరి మొదలగు రచయితల అభిప్రాయం ప్రకారం కూడా సమస్త ఉద్దేశ్యాలు ఉపయోగకరమైనవే ఎ... (శీశశ్చంద్రబోసుకి వ్రాసిన ఉత్తరం. 209 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఈ అభిప్రాయాలన్నీ తమంతట తాముగా ఒక మార్గాన్ని ఏర్పరుచు కుంటాయి. మనమంతా మట్టి బొమ్మలం. భగవంతుని తేజోరాసి నుంచి ఏవో కొన్ని అణువులు మాత్రం మనలో ్రవేశించినాయని భావించుకుని మనము ఆత్మార్పణ చేయాలి.

సాంసారిక, శారీరక కష్టసుఖాలను సరకుగొసక ఈ భావాలతో ఆత్మసమర్పణ చేయగలిగిన మానవుని జీవితంలో తప్పక జయం సమకూరుతుంది. ఒక రోజున నా ఆదర్శానికి విజయం కలిగి తీరుతుందని నాకు గట్టి నమ్మకముంది. అందువల్లనే నా ఆరోగ్యాన్ని గురించిగాని,భవిష్యత్‌ గురించిగానీ ఎన్నడూ దిగులు చెందటం లేదు.

ప్రభుత్వంవారి షరతులకు జవాబుగా నేను చెప్పిన దానిలో నా అభిప్రాయం ప్రకటించాను. ఇకనుంచి షరతులు పొందటానికి నేనీవిధంగా పన్నుగడ పన్నానని కొంతమంది విమర్శకులు అంటున్నారు. విమర్శకులు యీ విధమైన దయారహిత విమర్శ చేసినందుకు విచారంగా ఉన్నది. నేను వ్యాపారంగాని, కమీషన్‌ బేరంగాని చేయలేదు. కుటిల నీతి అంటే నాకు అసహ్యం, నేనొక ఆదర్శం కొరకు నిలచాను. దానిలోనే అన్నీ వున్నాయి. పన్నుగడలు పన్ని కాపాడుకోవలసినంత ప్రియమైనది కాదు నా జీవితం. విలువల విషయం వచ్చేసరికి నా అభిప్రాయం వేరు. బజారు అభిప్రాయం వేరు. శారీరక లేక వ్యక్తిగత సౌఖ్యాల ఒరవడి మీదనే జీవితంలో జయాపజయాలు నిర్ణయం అవుతాయనటంతో నేను ఏకీభవించను. మన సంగ్రామం శారీరక బలానికి సంబంధించినది కాదు. తాత్కాలిక భోగాలను, లాభాలను ఆశించి మన పోరాటం సాగటం లేదు.

“రక మాంసాలకు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదు. ఈ లోకంలో అంధకారానికి నాయకుడైన వారికి, ఉన్నత పదవులు పొందిన వారి అన్యాయాలకు వ్యతిరేకంగానే మన పోరాటం నడుస్తున్నదని”, సెయింట్‌ పాల్‌ అంటారు. స్వేచ్చా స్వాతంత్ర్యాలు, సత్యమే మన ఆదర్శం. రాత్రి గతించిన తరువాత పగలు రావటమనేది ఎంత సత్యమో, మన ప్రయత్నం ఫలించటం కూడా అంతే సత్యం. తప్పక ఫలించి తీరుతుంది. మన శరీరం నశించితే నశించవచ్చును. కాని అచంచల విశ్వాసం, అజేయమైన వజ సంకల్పం వల్ల మనకు జయం తప్పక కలుగుతుంది. మన ఆదర్శానికి కలుగు విజయాన్ని కళ్ళారా చూసే అదృష్టం ఎవరికి కలుగుతుందనేది భగవంతునికే తెలుసు. కాని నా విషయం చెప్పమంటే మాత్రం, “తరువాత ఏమీ జరిగినా, నా పని నేను చేసుకుపోతానని మాత్రమే చెప్పగలను.

మరొక విషయం చెప్పి నేను చెప్పదలిచింది పూర్తి చేస్తాను. నేను స్విట్టర్‌లాంద్‌ వెళ్లేదీ, లేనిదీ ఇపుడు నిర్ణయించలేను. ప్రస్తుతమున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 210

చూస్తే స్విట్టర్‌లాండ్‌ వెళ్లే శక్తి లేదు. ప్రస్తుతం భారతదేశంలోనే వదైనా ఆరోగ్యప్రదమగు ప్రదేశంలో ఉండి ముందు ఆరోగ్యం పొందాలి. ఎన్నిరోజులకు స్విట్టర్‌లాండ్‌ వెళ్ళగల శక్తిని పొందగలుగుతానో తెలియదు. నా ఆరోగ్యం కొంతైనా మెరుగు అయ్యేంతవరకు స్విట్టర్‌లాండ్‌ వెళ్ళే ప్రశ్నే లేదని డాక్టర్లు చెప్పారు. భారత దేశంలోనే వదేని ప్రాంతంలో ఉండి ఆరోగ్యం పొందగలిగినా, దేశం వదిలి వెళ్లటానికి నా ఇష్టత తెలుపకపోయినా స్విటర్ట్‌లాండ్‌ వెళ్ళవలసిన అవుసరం లేదు.

ఈ విషయాలన్నీ అలా ఉండగా స్విట్టర్‌లాండ్‌ వెళ్ళటానికి నిశ్చయించుకొనక ముందే నా ఆర్థిక స్థితిని గురించి కూడా ఆలోచించుకోవాలి. కుటుంబంలోని వారితో, ప్రత్యేకించి అమ్మా నాన్నలతో యీ విషయమై మాట్లాడవలసి వున్నది. కాద్ది మాసాలలోనే బెంగాలు రాజకీయాలలో మార్పు రావచ్చును. ఆ కారణంగా బెంగాలు ప్రభుత్వ ధోరణిలో కూడా మార్పు కలగవచ్చును. ఈ విషయాలన్ని ఆలోచించుకున్న తర్వాతనే ఏ విధమైన నిర్ణయాన్నయినా తీసుకోవలసి ఉంటుంది. ఏదియెలా ఉన్నా నేను ఎలాంటి నిర్బంధాన్నీ కోరుట లేదు. ప్రభుత్వం ఏవైనా అభ్యంతరాలు పెడితే మీరు చర్చలను విరమించండి. ఈశ్వరుడు గొప్పవాడు కనీసం తన యీ సృష్టివల్లనైన ఆయన గొప్పవాడే కదా? ఆయనపట్ల మనకు విశ్వాసమున్నపుడు ఏవిధంగాను విచారపడరాదు.

నాయందు ఆదరాభిమానాలు కలిగి, నాపట్ల బెదార్యాన్ని చూపే వారందరికీ

బాధ కలిగించిన వాడినయ్యాను. అందుకు నాకు చాలా విచారంగా ఉన్నది. కాని,

మాతృభూమి యందు సమాన రూపంలో (ప్రేమ విశ్వాసాలు కలిగిన వారు, కష్టసుఖాలను

కూడా సమాన రూపంలో అనుభవించటానికి అర్హులని ఆలోచించి, ఓదార్పు పొందుతున్నాను. మీరంతా కూడా సంతోషంగా ఉన్నారని ఆశించుచున్నాను.

ఇక ఉంటాను

బైకైక్ష గౌతమ్‌ ఛటోపాధ్యాయ

విజ్జప్తి ఇ ష్‌లాంగ్‌ 10-8-1927 వినయపూర్వక విజ్ఞప్తి

ఉత్తర కలకత్తా నియోజక వర్గం నుంచి బెంగాలు ప్రతినిధుల సభకు అభ్యర్థిగా నిలచినపుడు నేను మాందలే జైలు నుండి సెప్టెంబరు 24వ తేదీ నాటికి మీ అందరి వద్దకు నా విజ్ఞప్తి పత్రం పంపవలసి ఉన్నది. కాని ఆ పత్రం మీకు చేరనేలేదు. కారణం ఏదైనప్పటికీ ఆ వినతి పత్రాన్ని అధికారులు మీదాకా రానివ్వలేదు. ఈ మామూలు దరఖాస్తును కూడా ఎందుకు ఆపి ఉంచారని అడిగినప్పటికీ దానికి జవాబు రాలేదు. ఇదేకాదు నా ఎన్నిక విషయమై కొందరు ప్రత్యేక వ్యక్తుల పేరున నేను వ్రాసిన ఉత్తరాలు కూడా వారికి చేరలేదు. జైలులో ఉండి ఎన్నికల పని చేసుకోలేనని అధికారులందరూ భావించినట్లు జైలు ఉన్నతాధికారి ఒకరు జైలులో ఉండగా చెప్పారు.

వ్రాత పూర్వకమగు నా విజ్ఞప్తి మీకు చేరక పోయినా నా వికల హృదయంలోని మూగ అభ్యర్థన మీ మనసుకు చేరగలిగినదన్న నమ్మకం నాకుంది. అందువల్లనే నా విజ్ఞప్తి చదవక పోయినా, రెండవవైపున బలీయమగు ప్రత్యర్థి ఉన్నప్పటికీ, నాబోటి అయోగ్యునికి ఓటిచ్చి మీరు నన్ను ఎన్నుకున్నారు. మాండలే జైలులో రాత్రి పదిగంటలకు అనేకమంది రాజకీయ ఖైదీలతో కలిసి ఎన్నికల విజయవార్త విన్నపుడు కలిగిన ఆనందం మీకు మాటల్లో చెప్పలేక పోతున్నాను. కాని, నదీనదాలను, అడవులను అధిగమించి నా హృదయ వీణా ధ్వనులు మీ శ్రవణ ద్వారాల వరకు చేరి ఉంటాయని నా విశ్వాసం.

మిత్రులైన వారే తమ మిత్రులను గుర్తించలేని పరిస్థితులు ఒక్కొకసారి ఎదురవుతుంటాయి. అధికారుల ఆజ్ఞలను వుల్లంఘించి బయటకు అడుగు పెట్టలేని స్థితిలో నేను వున్నప్పటికీ మీరంతా అధికారులను సైతం అలక్ష్యం చేసి, గౌరవ పూర్వకంగా ఎ. ఫేల్‌సల్‌లాజ్‌ సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 212

నన్ను ఉన్నతాసనంపై అధిష్టింప చేశారు. నాయందు యీ విధమైన స్పేహ విశ్వాసాలను ప్రకటించి, కేవలం నన్ను ధన్యుడను చేయటమేకాక, రాజకీయ ఖైదీలందరికీ గౌరవం తెచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. జైలులో ఉన్నపుడు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేయుటకు లేదా ప్రస్తుత సమస్యల గురించి మీ అభిప్రాయాలను తెలుసుకొనుటకు అవకాశం లభించ లేదు. విడుదలైనపుడు ఈ రెండు పనులు చేయగలుగుతానని అనుకున్నాను. నిజానికి, అసలు విడుదల అవుతానని అనుకోలేదు. కాని, ఊహించని రీతిలో నేను విడుదలైన రోజున జబ్బుపడి మంచం మీద పడివున్నాను. జైలునుంచి వచ్చిన తరువాత కూదా, మీ ప్రతినిధిగా నేను నిర్వర్తించ వలసిన కర్తవ్యాన్ని ఇంతవరకు పూర్తి చేయలేక పోయాను...... కార్యక్షేతంలోకి రావటానికి ఇంకా గడువుంది. వచ్చినప్పటికంటే ఇపుడు ఆరోగ్యం కొంత బాగుంది. అందువల్ల కనీసం ఉత్తరం ద్వారానైన నా విన్నపం మీకు పంపాలని నిశ్చయించుకున్నాను. నా విడుదల తరువాత నన్ను అభినందించటానికి మీరు చేసిన ఏర్పాట్లు, నా ఆరోగ్యం బాగుపడాలని మీరు చేసిన ప్రార్ధనలు, చూపిన భక్తి (శ్రద్ధలు మరువరానివి. అలాంటి మీకు సేవచేయటానికి అవకాశం కల్పించి నన్ను ధన్యుడను చేశారు. నేనీ అధికారాన్ని తగురీతిగా ఉపయోగించగల శక్తి కావాలని ప్రత్యేకంగా కోరుకొనుచున్నాను. మీరంతా నాపట్ల స్నేహం, విశ్వాసం, ప్రకటించి నన్ను ఆదరించారు. పూర్తిగా కోలుకొనుటకు కొంత సమయం తీసుకొన్నాను. మీ ఆశీర్వాదాలు శు భాకాంక్షల ప్రభావం వల్ల మెల్లమెల్లగా ఆరోగ్యం మెరుగు పడుతోంది. శారీరక ఆరోగ్యం పొందినప్పటికి మానసిక శాంతి పొందుట మాత్రం దుర్లభం. వంగభూమికి చెందిన సమర్థులగు వ్యక్తులెందరో నిర్దేతుకంగా, విచారణ లేకుండా జైళ్ళలో మగ్గుతున్నంత కాలం, అసంఖ్యాక బెంగాలి ప్రీపురుషులు తమ ఆత్మీయుల కష్టాలను, నిర్భంధాలను తలచుకొని సహింపనొల్లని హృదయవిదారక ఆవేదనతో రాత్రింబవళ్ళు కొట్టు మిట్టాడుతూ గిలగిలలాదుతున్నంత వరకూ, తండ్రులు, మిత్రులు, భర్తలు, సోదరీ సోదరులు లేక ఎన్నో బెంగాలీ కుటుంబాలు శృశానతుల్యాలుగా ఉన్నంత వరకు బెంగాలీ పౌరులెవరూ కడువునిండా తిని, కంటినిండా నిదుర పోలేరు. ఈసారి కౌన్సిల్‌కి హాజరు కాకపోయినట్లయితే మీ పేరు సభ్యుల జాబితా నుండి తొలగించ బడుతుందని బెంగాలు గవర్నర్‌గారు నాకు తెలియజేశారు. ఈసారి కౌన్సిల్‌కి హాజరై రాజకీయ ఖైదీల సమస్య వచ్చినపుడు నేను నా కర్తవ్యాన్ని పాటించ గలనని మనస్సుకు అనిపిస్తుంది. వైద్యులు అనుమతిస్తారో లేదో తెలియుట లేదు. అనుమతి లభించిన పక్షంలో కలకత్తావచ్చి నా 218. గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కర్తవ్యం పాటిస్తాను. కౌన్సిల్‌ సమావేశానికి హాజరు కాగలనన్న ఆశతోనే కొన్ని తీర్మానాలు,

ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాను. కాని అనుమతి లభించని పక్షంలో చేయునది లేదు.

సాధ్యమైనంత త్వరలో ఆరోగ్యం పొంది ప్రజాసేవకొరకు కార్య క్షేత్రంలోకి రావటానికి

గట్టీ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దేశంలో ఎటుచూసిన నవ జాగృతి లక్షణాలే

కనిపిస్తున్నవి. జాతీయ జీవిత రంగంలో రానున్న పెద్ద మార్చుయొక్క లక్షణాలు నాకు

చూచాయగా కన్పిస్తున్నవి. సరైన సమయానికి అందుకు కావలసిన శారీరక మానసిక శక్తులతో సిద్ధంగా ఉండాలనే నేనిప్పుడు కోరుకొనుచున్నాను.

ఏమౌతుందో చూద్దాం. నాభక్తి పూర్వక వందనాలు అందుకొనండి. "సెలవు సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు వై్షైశ

జైలు నుంచి విజ్ఞప్తి మీ అందరికి నా హృదయ పూర్వక విజ్ఞప్తి. బెంగాలు ప్రతినిధుల సభా సభ్యత్వానికి నేను ఉత్తర కలకత్తా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. (ప్రజాభిప్రాయం నాకు అనుకూలంగా ఉ న్నట్లు గ్రహించిన తరువాత స్వదేశ సేవా కాంక్షాపరులు, హితైఖిలాషులు అయిన మిత్రుల ప్రోద్బలంతో దేశానికి అధికంగా సేవ చేయడానికి సదవకాశం పొందాలన్న కోర్మెతోనే యీ స్థానంలో నిలబడ్డాను. ముందుగా మీ వద్దకు ఒకసారి రావలసింది. కాని, ఆ అవకాశం నాకు లభించలేదు. నా ప్రస్తుత స్థితి గమనించిన మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికలలో పోటీ చేయాలా, వద్దా, పోటీచేస్తే దానివల్ల ప్రయోజనం వుంటుందా, వుండదా అని జైలులో వున్నపుడు నేను బాగుగా ఆలోచించాను. జాతీయ మహాసభ కూదా దీని గురించి ఆలోచన చేసింది. మన దేశ బంధు చిత్తరంజన్‌ దాసు వుండివుంటే ఆయన కూడా నన్ను నిలబడమని చెప్పేవాడన్న విశ్వాసం నాకున్నది. మిత్రులు శ్రీ అనిల్‌ వరణ్‌ రాయ్‌, సత్యేంద్ర చంద్రులు ఉప ఎన్నికలో చెప్పిన దాని ప్రకారం నేననుకున్న దానితో వకీభవించినట్లు తెలుస్తున్నది. ఈ విషయాలన్ని బాగుగా ఆలోచించి యీ ఎన్నికలలో అభ్యర్థిగా ఉన్నందువల్ల ప్రయోజనం కలుగునని అర్థం చేసుకొని యీ విజ్ఞప్తి పత్రం ద్వారా మీ ముందుకి రావటానికి సాహసించాను. ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉండటం అనేది యీ నిశ్చయం జరగటానికొక పెద్దకారణం. అవకాశం లభించి సాధ్యమైతే స్వయంగా మీ సమక్షంలోకి వచ్చి రాజకీయాల గురించి నాకున్న అనుకూల ప్రతికూల భావాలు ప్రకటించి మీ సలహా సంప్రదింపులు పొంది వుండేవాడను. కాని ప్రభుత్వం నాకా అవకాశం లేకుండా చేసింది. సుమారు రెండు సంవత్సరాల ...... (ఈ విజ్ఞప్తి పత్రం మాండలే జైలునుంచి పంపినది. అధికారులు దీనిని నిలిపివేశారు) బ్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

నుంచి ఏవిధమైన న్యాయ విచారణా లేకుండా జైలులో ఉన్నాను. ఈ రెండు సంవత్సరాల నుంచి ఎన్నిస్రార్లు ఎన్ని విన్నపాలు చేసినా ప్రభుత్వం నన్ను ఏ న్యాయస్థానంలోనూ హాజరుపెట్టలేదు. ఇదే కాదు, అధికారుల వద్ద నాకు వ్యతిరేకంగా ఏమేమి నేరాలున్నవి వాటికి సాక్ష్వాధారాలేమిటీ అనేది ఏనాడూ, ఏవిధంగానూ నాకు చెప్పలేదు. నా అపూధాల గురించి నేనుగా ఏమైనా చెప్పవలసివస్తే మాత్రం, ఒక బానిస జాతి చిరకాలంగా ఆచరిస్తూ వచ్చిన పద్ధతులను పరిత్యజించి కాంగ్రెస్‌లో ఒక సామాన్య కార్యకర్తగా దేశం కొరకు సమస్తం తృణప్రాయంగా సమర్చించి ప్రయత్నించినందుకు గాను జైలులో నిర్భంధించటమేకాక స్వదేశానికి సైతం దూరం చేయబడితినని చెప్పగలను. నా మాతృభూమిలో వుండి అచటి నీరు గాలి సేవించే అవకాశం లేకుందా చేశారు. అయినప్పటికి నేను జైలుకువెళ్ళుట నిరుపయోగం కానందుకు సంతోషంగా ఉన్నది. నాలోని వ్యధ పరిపక్వమొంది ప్రాఢధతను సంతరించుకున్నది. ఇచటకు రాకముందు నేను బెంగాలును భారతదేశమును (ప్రేమించేవాడను. ఈ దూర దేశానికి వచ్చిన తరువాత ఆ ప్రేమ అనేక రెట్లు పెరిగింది. బెంగాలునందు తేలియాడు మబ్బులు, అచటి గాలులు నాకు తలపుకురాని క్షణం లేదు. నా స్మృతిలో పూర్తిగా నిండివున్న బెంగాలు మోహనరూపం నా మనసుకు ఎంతో అహ్హాదం కలిగిస్తోంది, నేడు నాకు బెంగాలు ఎంత పవిత్రమైనదో ఎంత సత్యమో చెప్పజాలను. ఏ అంతరిక ఆత్మత్యాగం యొక్క ఆదర్శంతో ఈ కర్మభూమి మీద ఉద్భవించానో దాని కొరకే తగిన యోగ్యునిగా మారటానికి యీ దేశ బహిష్మరణ అనెడి సూదంటు రాయి ఉపకరించుచున్నది. బెంగాలులోని గంగా వాహినిలో, దాని సస్యశ్యామలమగు క్షేత్రాలలో చిరంతన సత్యం చిందులు ద్రొక్కుచున్నది. బంకింబాబు నుంచి దేశ బంధువరకు అనేకులు తమ సాధన ద్వారా పవిత్ర బెంగాలు ధర్మాలను స్వంతం చేసుకున్నారు. వంగభూమి భువన మోహన రూపానికి మురిసిన ఎందరో కవులు, కళాకారులు, శిల్పులు, సాహితీపరుల తమ కుంచెలకు, కలములకు పని కల్పించారు. ఇన్ని మహత్తర పూరిత సత్యాలతో వర్ధిల్లు పుణ్యభూమి వంగ దేశాన్ని దర్శన మాత్రంగా నేను ధన్యుడనయ్యాను. ఈ దివ్యానుభూతులను స్మరించి గర్వించుటలోనే జైలు జీవితంలోని రెండు సంవత్సరాలు సార్ధకమైనవి. మాతృమూర్తి కొరకు ఈ విధమగు కష్టాలను వరించుట ఎంత గౌరవమో, ఎంత సౌభాగ్యప్రదమో అర్ధం చేసుకోగలిగాను. ఈ విధమగు ఆవేదనాపూరిత ఆలోచనలను అన్నిటినీ మీతో చెప్పుకోవాలని ఎన్ని రోజుల నుంచో అనుకొంటున్నాను. నా గురించి చెప్పుకోవటం ద్వారా మీ సహాయం సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 216

పొందగలనని ధీమాగా చెప్పగల ప్రత్యేకత నాలో ఏమీలేదు. అనంత జలధిలో ఉ వ్వెత్తున ఎగసిపడిన మహోన్నత తరంగాల వలె, ఐదేళ్ళ క్రితం భరతమాత బిడ్డలు తమ ప్రాణాలను సైతం ఆమె చరణారవిందాల ముందు ఆహుతి చేయుటకు ఉ ద్యుక్తులై పరుగులు తీసినవుడు నేను విశ్వవిద్యాలయం వదలి కార్యరంగంలో కాలుపెట్టాను. జీవితంలో సంపూర్ణ వికాసం పొంది మాతృదేశానికి అంజలి ఘటించి ఆత్మారణ చేయుట ద్వారానే జీవిత సాఫల్యత పొందగలననన్న నమ్మకంతో యీ జీవితాన్ని వరించాను. సంఘసేవ, రాజకీయ కార్యకలాపాలను నేనేదో తాత్కాలికంగానో, కాకతాళలీయంగానో చేపట్టినవి కావు. అందుచేత బానిస దేశంలోని జీవితంలో రాగలవనుకున్న ఆపదలు, అగ్ని పరీక్షలు, కష్టాలు, వేదనలు అన్నిటికీ శారీరకంగానూ, మానసికంగాను సంసిద్ధంగా ఉండటానికే ఎల్లప్పుడూ ప్రయత్నించే వాడిని. ఈ ప్రయత్నంలో నేను సఫలమయ్యానో, లేదో, ఒకవేళ అయితే ఎంతవరకు కాగలిగానో నిర్ణయించ వలసింది నా దేశీయులే. కొద్దిపాటి జీవితమే అయినా దానిలో నేను ఎదుర్కొనవలసి వచ్చిన ఘట్టాలను, తుఫానులను ఆధారంగా చేసుకొని నన్నునేను అర్ధం చేసుకొని గుర్తించటానికి ప్రయత్నం చేశాను. యవ్వనోదయంలో నేనవలంబించిన కంటకావృత మార్దాన్నే చివరివరకు అవలంబిస్తాను. కనుపించని భవిష్యతుని ముందుంచుకొని నేనొక వ్రతం పట్టాను. అది పూర్తికానిదే విశ్రమించను. నేను శరీరాన్ని కృశింపజేసి, జ్ఞానాన్ని పిండి ఎంతగానో మదనపడి ఒక సత్యాన్ని పొందగలిగాను. బానిస జాతి చదవూ సంధ్యలు పనిపాటలు సమస్తం కూడా ఆ జాతి స్వేచ్భా స్వాతంత్ర్యాలు పొందటానికి సహాయకారిగాను, అనుకూలంగాను లేనిచో వ్యర్థమని చెప్పేదే అసత్యం. అందువల్లనే “స్వాధీనతా హీనతాయకే బాంచితే చాయరే, కేబాంచి తే చాయ” అను వాణి నేటికీ నా వృాదయాంతరాళం నుంచి వెలువడి నిత్యం చెవులలో ప్రతిధ్వనించుచున్నది. స్వరాజ్య ప్రాప్తి కొరకై చేయు పావన ప్రయత్నమే నాకు జపతపాలు కావాలని, పరిశీలన, సాధన, ముక్తికి సోపానం కావాలని యీ తనువులో ప్రాణం వున్నంత వరకు భారత విముక్తి పోరాటంలో మునిగి తేలాలని మీరందరూ నన్ను ఆశీర్వదించ వలసిందిగా చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. పవిత్రమగు అత్నార్చణకు ప్రతీకయగు ప్రాతః స్మరణీయుడు దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌ చరణారవిందాల ముందు నేను దేశసేవ దీక్షను పూనితిని. ఆయన వుండగా ఆపదలన్నిటినీ నల్లేరుపై బండి నడకగా భావించి ఆయన పతాకం చేతబూని నడిచితిని. ఆయన లేని ఈ సమయంలో కూడా ఆయన లోకోత్తర చరిత్ర నుంచి పాఠం నేర్చుకొని 217 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

దాని ఆధారంగా వారి మహోన్నత జీవితాదర్శాన్ని స్మరిస్తూ తదేక నిష్టతో జీవిత మార్గాన పురోగమించాలన్న దృఢసంకల్పంతో వున్న నన్ను సర్వేశ్వరుడు రక్షించుగొక. ఇపుడు జరగనున్న ఎన్నిక సమస్యకు పరిష్కార మార్గం మీ చేతిలో వున్నది. ఎందుకనగా ప్రవాస జీవితం గడుపుతున్న ఒక రాజకీయ ఖైదీ పర్వతాలు,నదులు, సముద్రాల అవతల ఎక్కడో యింత దూరాన వుండి ఎన్నికల పోరాటంలో విమి చేయగలుగుతాడు? ఈ దేశంలో నేనొక అతి సామాన్య సేవకుడనే అయినా మీకందరికి అసలు తెలియని వాడను కాదు. ప్రతి ఒక్కరితోను ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మీ అందరిని అడిగే హక్కు నాకు కలదనే నేను భావిస్తున్నాను. నా విజయం - జాతీయ మహాసభ విజయం. ప్రజాభిప్రాయమే మనకు పట్టాభిషేకం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అందరి విజయం. ఎంతో వ్యయం చేస్తేగాని విజయం సాధించలేని యీ ఎన్నికల పోరాటంలో మీరే నా ఆశారేఖ, నమ్మక మార్గం, సహాయ సహకారాలు సర్వస్వం అని మనవి చేయుచున్నాను. మీ సేవకు పాత్రుడను కావాలనేదే నా కోర్కె దేశసేవ చేసే సదావకాశాన్నిి అధికారాన్ని నాకు కల్పించి నన్ను ధన్యుడను చేయవలసిందిగా మిమ్మలను కోరడం మినహా నేను చెప్పేదేముంది? మీరంతా ఈ దేశానికి ప్రతి మూర్తులని నా విశ్వాసం. మాతృ్ళభూమికి దూరంగా సముద్రాల అవతల యీ ఖైది పంపు భక్తిపూరిత అభినందనలు అందుకొనంది. ఇక సెలవు. సుభాన్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 218

దేశబంధు మాండలే జైలు 12-8-1925 గౌరవనీయా,

(వసుమతి మాస పత్రికలో తాము వ్రాసిన 'స్నృతికథను మూడుసార్లు చదివాను, చాలా బాగుంది. మానవ వ్రవృత్తులను అంతర్‌ దృష్టితో పరిశీలించగల శక్తి మీకున్నది. దేశ బంధుతో సన్నిహిత సంబంధం వుండి ఆత్మీయుతతో మెలగిన కారణం చేత ఆయనలోని అతి సామాన్య విషయాలను సహితం విడమర్చి చెప్పి వాటిని రసమయ రూపంలో వున్న సత్యంగా చిత్రించు నేర్పు మీలో వున్నది. సాధారణమగు ఉపకరణ ద్వారానే మీరింత సుందర చిత్రాన్ని చిత్రించగలిగారు.

“వారికి అంతరంగికులైన వారందరి వృాదయాలలోను ఏవో నిగూఢ గాధలు మిగిలి వున్నవి. ఈ రహస్య గాధలను కొన్నిటిని పేర్మాని మీరొక సత్యాన్ని ప్రతిపాదించుటే కాక మా మనసులోని బరువును కూడా తేలిక పరిచారు. ప్రతి బానిస దేశానికి అదొక పెద్ద శాపసమేమో తెలియదుగాని విదేశీయులతోకన్నా స్వదేశీయులతోనే హెచ్చుగా పోరాదవలసి వస్తున్నదని వ్రాశాను. నిజానికి జరుగుతున్నదిదే. ఈ కఠోర సత్యం ప్రతి దేశ సేవకునికి అనుభవైకవేద్యమే. ఇపుడు జరుగుతున్నది కూడా యిదేనని చెప్పాలి.

అత్యంత ప్రియమైన ఆత్మీయుల కొరకు హృదయంలో రగిలే ఆవేదనాగ్నియే నేడు వారి సన్నిపితులనుకునే మా అందరి పృాదయాలలోను రగులుతున్నది.

ఆ నిగూఢ గాథా వ్యధాగ్నిని బహిర్గతం చేయగల భాషకూడ మాకు లేకుందా పోయింది. ఈ ఆత్మగత గాథ యితరుల ముందు చెప్పుకోవాలన్నా మనసు చివుక్కు మంటున్నదొ అన్న మాటలు మీ వ్యాసంలో నాకు బాగా నచ్చాయి. వాస్తవానికి మనసులోని నిగూఢ రహస్యం యితరులతో అంత సులభంగా చెప్పగలమా? చెప్పి

(శ్రీ శరశ్చంద్ర చటోపాధ్యాయకు వ్రాసిన ఉత్తరము) చత రారా నానా గాతమ్‌ ఛటోపాధ్యాయ

నపుడు పరిహసించినా సహించగలం, కాని ఆ బాధలోని రహస్యమే వారు గ్రహించ లేనపుడు చెప్పలేనంత బాధ కలుగుతుంది. అపుడు * ఆరసికేప్తరస నివేదనమ్‌ శిరసి మాలిఖొ అని మనసులో అనిపిస్తుంది. మన హృదయంలోని విషయం ఆంతరంగిక మిత్రుడు మినహా మరొకరు అర్థం చేసుకోజాలరు.

“వ్వేము దేశబంధు పనులు చేసేవారమని అందరూ అంటారు. దేశబంధు అభిప్రాయాలతో ఏకీభవించని వారనేక మందిని నేనెరుగుదును. కాని ఆయన హృదయం లోని ఆకర్షణ శక్తికి సమ్మోహితులై వారికి పనిచేసి పెట్టకుండా ఉండలేక పోయేవారు. దేశబంధు కూడా అనుకూల ప్రతికూలములనెడి భావనలకు అతీతులై అందరిని (ప్రేమించే వారు. వారెన్నడూ ప్రస్తుత సంఘంలోని విధి నిషేధాలనుగాని, ఆచారములనుగాని అనుసరించి మానవుని ఉనికిని నిర్ణయించేవారు కాదు. మానవుల మంచి చెడ్డలు రెండూ తెలుసుకొని ప్రేమించ వలెనని ఆయన విశ్వాసం” అని వ్రాశారు. ఇది కూడ నాకు చాలా బాగుంది.

మనమేదో (గ్రుడ్డిగా వారిని అనుసరిస్తున్నామని అనేకమంది అనుకుంటూ వుంటారు. కాని, ముఖ్య శిష్యలమనుకునే వారినే ఆయన ఎక్కువగా పోట్లాడే వారు. ఈ విషయమై స్పీయానుభవాన్ని నేను చెప్పగలను. అనేక విషయాలపై నేను ఆయనతో మాట్లాడాను. కాని ఎంత పోట్లాడినా నా భక్తి నిష్ట తరుగులేనివి గానే వుంటాయన్న సంగతి నే నెరుగుదును. అలాగే ఆయన (ప్రేమకూడ నాకు అపారంగానే లఖించేది. చర్చల క్రమంలో తుఫానువంటి తీవ్రత చోటుచేసుకున్నా నేను ఆయన్ని వదలనన్న సంగతి ఆయనకూ తెలుసు. తల్లి వాసంతీ దేవి మా పొట్లాటలు నివారించేది. కాని యిష్పుడేముంది, అంతా ముగిసి పోయింది. ఆ విధంగా మారాం చేయుటకు, కోపగించు కొనుటకు, అలగటానికి ఆధారం లేకుండా పోయింది. చాలా చిన్న వాళ్లనుకునే వాళ్ళు కూడా తిట్లు తినకుండా మాట వినేవారు కాదు. ఏమి, ఆయనలోని విశేషము! ఓహో! ఒక నాటి ఘటనను ఉదహరిస్తాను. అది ఇప్పటికి నా స్కృతి ఫలకంపై మెరుపువలె మెరుస్తున్నది. మేమిరువురం గయా కాంగ్రెసు తరువాత కలకత్తా వచ్చాం. అ సమయాన పూర్తిగా ఊహాజనిత వార్తలతోను అబద్ధాలతోను, అర్ధ సత్యాలతోను, బెంగాలు వార్తా పత్రికలన్నీ నిండివున్నాయి. ఇంజేగాదు. పేపర్ల వాళ్ళు మేము చెప్పింది వేయటానికి కూడా యిష్టపడటం లేదు. అపుడు డబ్బు అవసరం చాలా వుంది. కాని, సమకూర్చు మార్గం కనుపించలేదు. ఎక్కువమంది యిరుక్కుని ఉండే యింటిలో చోటు ఉండేది కాదు. ఈ కారణాన శత్రువుగానీ మిత్రుదుగాని ఆ యింటివైపు తొంగైనా సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 220

చూచేవారు కాదు. కేవలం మేమే కొందరం కూర్చొని మాట్లాడుతూ ఉండేవారం, మరల ఆ యింటికి పూర్తి గౌరవం వచ్చేసరికి పరిస్థితే మారి పోయింది. బయటివాళు ఖా మరింకా కావాలని వచ్చిన వాళ్లు అంతా మా సభాస్థలిని ఆక్రమించారు. మాకు మాట్లాడుకొనే అవకాశం కూడా లభించలేదు. ఎంతో శ్రమించి, ఎముకలు విరుచుకుని కష్టపడి నిధికి డబ్బు పోగు చేశాము. తరువాత పత్రికను ఎలా నడిపామో, ప్రజాభిప్రాయాన్ని మా వైపుకి ఎలా తిప్పుకోగలిగామో బయటి వారి కెవరికీ తెలియదు. బహుశా ఎప్పటికీ తెలియక పోవచ్చును కూడా. ఈ యాగాన్ని ప్రారంభించినవారూ, మంత్రోచ్భాటన చేసిన ప్రధాన పురోహితులు పూర్ణాహుతికి పూర్వమే ఎక్కడకు వెళ్లారో తెలియటం లేదు. అవునవును తెలిసింది. అంతరింగిక అగ్నికి, బహిరంగ బగబార్ని జ్వాలలు తోడై వారి యిహలోక తనువును దహించి వేశాయి. దేశ సేవా నిరతిలో ప్రాజార్పించటమే ఆయన జీవిత ఉద్దేశ్యమని అనేకులు భావిస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశ్యం మరెంతో మహోన్నత మైనదని దానిలో చాలా వరకు కృతకృత్యులు కూడా కాగలిగారని నేను ఎరుగుదును. 1927 ఉద్యమ సందర్భంలో తన కుటుంబంలోని వారందరూ ఒకొరొకరిగా అరెస్టు కావలసిందిగా సలహా యిచ్చి చివరకు తొను జైలుకి వెళదామని నిశ్చయించుకున్నాడు. తన కుమారుని జైలుకు పంపకుండా యితరుల కుమారులను జైలుకి పంపమని సలహా ఎలా చెప్పగలరు? త్వరలోనే ఆయన జైలుకు వెళ్తారని మాకు తెలసు. ఆయన అరెస్టుగాక పూర్వమే ఆయన కుమార్తెలు జైలుకు వెళ్లవలసిన అవసరం లేదు. పురుషులు వుండగా స్రీ లెవరూ జైలుకి వెళ్లరాదని మేం చెప్పాం. దీనిమీద చాలాసేపటి వరకు చర్చ జరిగింది. కాని నిర్ణయమేది జరుగలేదు. ఆయన మాట వినటానికి మేమే మాత్రం సిద్ధంగాలేం “ఇది నా అజ్ఞ పాటించ వలసిందే, అని ఆయన గట్టిగా చెప్పారు. సరే, మా వాదం మేం వినిపించి చివరకు ఆయన ఆదేశాన్ని శిరసావహించాం. ఆయన పెద్దకుమార్తె వివాహమైనది. కనుక ఆమెను ఆదేశించి పంపటానికి ఆయనకు అవకాశం లేదు. రెండవ కుమార్తె వాగ్దత్త . ఈ అమ్మాయిని జైలుకు పంపాలా లేదా అన్న విషయం చర్చకు వచ్చింది. పంపి తీరాలనేదే దేశబంధు అభిప్రాయం. ఆమె కూడా వెళ్లాలనే కుతుహలంతోనే వున్నది. కాని మిగతా వారందరికి వాగ్దత్త జైలుకి వెళ్ళటం యిష్టం లేదు. ఎందుకనగా ఆమె ఆరోగ్యం సరిగాలేదు. పైగా త్వరలో వివాహం జరగనున్నది. ఈ కారజాలన్నిటివల్ల వాగ్దత్త వెళ్లకుండా ఉండటానికి దేశబంధు అంగీకరించ వలసి వచ్చింది. మిగిలిన వారందరూ జైలుకు వెళ్ళటానికే నిర్ణయమైనది. 2౨1 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఉద్యమ సందర్భంలో బయట జరిగిన విషయాలు అందరికి తెలుసు. కాని ఉ ద్యమ మూలంలో వుండికూడా యీ ప్రపంచ దృష్టికి అందని భావం, ఆదర్శం, (ప్రేరణ, ఎవరికీ తెలియవు.

మహా పురుషుల గొప్పతనం పెద్దపెద్ద వాటిల్లో కంటె చిన్నచిన్న విషయాలలోనే ఎక్కువగా కనుపిస్తుందని నా నమ్మకం. ఆషాడ, శ్రావణ మాసాలలో వెలువడిన “వసుమతి పత్రికలో దేశబంధుతో కలిసి పనిచేసినవారి వ్యాసాలు శ్రద్ధగా చదివాను. అనేక వ్యాసాలు మామూలు మాటలతోను, పునరుక్తి పూరితంగానూ ఉన్నవి. కేవలం మీరే చిన్న చిన్న విషయాలను తీసుకొని రసవంతంగా విశదీకరించి దేశబంధు చరిత్రను చిత్రించటానికి ప్రయత్నించారు. అందువల్ల మీ వ్యాసం చదివి ఎంతగా ఆనందించానో చెప్పలేను. దేశబంధు శిష్యులనుంచీ, ఆయనతో కలిసి పనిచేసిన వారినుంచీ యింతకంటే అధికంగా ఆళశించాను. కాని, వారు అసలు వ్రాయకుండా వుంటేనే బాగుండేది. దేశబంధు అకాల మృత్యువుకి గురికావటానికి, మన దేశీయులు సహచరులు కూడ బాధ్యులేనన్న విషయం అపుడపుడు ఆలోచించకుందా ఉండలేక పోతున్నాను. ఆయన బాధ్యతలను వీరు కొంత తేలికపరిస్తే యింతగా శ్రమించి ఆరోగ్యం చెడగొట్టు కోకుండా వుండేవారు. "కాని, మన దౌర్భాగ్యమేమంటే మానవ మాత్రులెవరూ మోయజాలని బరువునూ, పూరించజాలని ఆశల పరిపూర్తి బాధ్యతను మనము నాయకునిగా అంగీకరించిన వ్యక్తికి వదిలి వేయటానికి అలవాటు పడిపోయాం. రాజకీయ సంబంధమైన బాధ్యతలను నాయకులకే వదిలిపెట్టి మనం నిశ్చింతగా కూర్చానవలెనని కోరుకుంటాం”. ఏదో చెప్పాలని ప్రారంభించి ఎక్కడికో వెళ్ళాను. కనుక దీనిని వదిలేయండి. 'స్పృతి కథి వలనే దేశబంధు గురించి మీరు మరికొంత వ్రాయాలని నేనేగాక యిక్కడ ఉన్నవారంతా

కోరుచున్నారు. మీ విషయ భాండారంగాని, శబ్ధ భాండారంగాని త్వరగా తరిగేది కాదుగదా. అందుచేత వ్రాయాలనుకుంటే రచనా సామగ్రి లభించకపోదు. మీరు వ్రాస్తే బర్మాలో ఖాళీగా కూర్చున్న రాజకీయ ఖైదీలందరు ఎంతో పట్టుదలతో చదువుతారు.

బహుశ ఎక్కువ కాలం నేను ఇక్కడ ఉండక పోవచ్చు. కాని, విడుదల కావాలనే కోర్కె నాకంతగాలేదు. బయటకువస్తే అచటవున్న నిరాశ, నిస్పృహ, స్తబ్ధత, శూన్యత నన్ను చుట్టివేస్తాయి. వాటిని గురించి యోచించగానే నా హృదయం పరిమితాలోచనలకు దిగిపోతుంది. ఇక్కడ ఉంటే కష్టాలు, సుఖాలు, స్మృతులు, స్వష్పాలతో ఏదోవిధంగా రోజులు గడచి పోతున్నాయి. జైలులో, నా మనసులో ఒక విధమగు జ్వాల రగులుకున్నా దానిలో ఏమాత్రం సుఖం లేదని నేను అనను. కోరిన దేదైనా హృదయ పూర్వకంగా

కోరుట చేతనే నేను యిపుడు నాలో రగులుతున్న జ్వాలలో కూడా శాంతినే దర్శించ గలుగుతున్నాను. జైలు గోడలను రాసుకొని గాయపడిన హృదయానికి కలిగిన శాంతిని ఒదిలి బయట వ్యాపించివున్న నిరాశ, శూన్యత, బాధ్యతలు స్వీకరించటానికి మనసుకి యిష్టం లేనట్లుగా వున్నది. నేను యిక్కడకు రాకపోయినచో బెంగాలును నేనెంతగా ప్రేమిస్తున్నానో నాకే తెలిసేది కాదేమో అన్నట్లుగా వున్నది. “న్తోనార్‌ బంగాల ఆమితోమార్‌ భాలోవాసి చిరదిన్‌తో మార్‌ ఆకాళ్‌ తోమార్‌ ఆకాశ్‌ “ఆమార్‌ ప్రాణె బజూయ్‌ బాంసీ” అన్న గీతాన్ని రవిబాబు బహుశ జైలులోనే ఊహించి వ్రాసి వుంటాడు. ఈ విధమైన బెంగాలీ ప్రకృతి దృశ్యం నా మనో నేత్రాలముందు క్షణకాలం నాట్యం చేసినపుడు, యీ మధురానుభూతి కొరకే యిన్ని యిక్కట్లు అనుభవించి మాండలే జైలుకి వచ్చానేమోనని నా మనసుకి అనిపిన్తుంటుంది. బెంగాలు భూమి, ఆకాశం, వాయువులందు ఇంత మాధుర్యం మిళితమై వున్నదనీ ఇంతకు పూర్వం తెలియదు. ఈ ఉత్తరం ఎందుకు వ్రాశానో తెలియదు. మీకు ఉత్తరం వ్రాస్తానని యింతకు ముందు నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ వ్యాసం చదివినాక నా మనసులో కలిగిన ఆలోచనలకు అక్షర రూపం యిచ్చాను. వ్రాసిన తరువాత పంపుటయే మంచిది కదా! మీ అందరికీ నమస్కారాలు, స్వీకరించండి. వగ్రాయాలనుకుంటే జవాబు వ్రాయండి, జవాబు వ్రాయండని మిమ్ము బలవంతం చేసే అధికారం నాకులేదు. బహుశ మీరు జవాబు వ్రాస్తోోమోనన్న ఆశతో చిరునామా యిస్తున్నాను. 6/౦ 0.161.9.0.1.0 13. 20(500)4 [0% జంగ వావ భు

బి

మాండలే జైలు 20-1-1926 మామూలు ప్రజల చదువుకు తగిన విధంగా దేశబంధు చిత్తరంజన్‌ దాసు గురించి యిపుడేమైనా వ్రాయదగిన శక్తి నాలో కూడా లేదు. ముందెప్పుడైనా కలుగుతుందో లేదో తెలియదు. అంతర్యంలో ఆలోచించటం, ఆయన గురించిన జ్ఞాపకాలను తలచు కోవటం మినహా అయన గురించి చెప్పవలసి వచ్చేటప్పటికి నోరు పెగలనంతటి ప్రగాఢ సంబంధం వ్యక్తిగతంగా ఆయనతో నాకు పెనవేసుకొని వున్నది. ఆయనెంతో గొప్పవాడు. నేను అతి సామాన్యుడను. ఆయన సర్వతోముఖ ప్రతిభా సంపన్నుడు, ఉ దార హృదయుడు, మహోన్నత చరిత్ర కలిగిన వాడు ఆ గొప్పతనాన్ని నేటికీ నేను పహృదయగతం చేసుకోలేక పోయానని అనిపిస్తున్నది. నా మనసు చిన్నది, ఆలోచనలు చిన్నవి, శక్తి పరిమతమైనది, భాష బహుసామాన్య మైనది. ఈ విధమైన పరిమితులున్న సామాన్యుడను నేను. ఆ పుణ్యమూర్తిని గురించి వ్రాయబూనడం దుస్సాహసమే అవుతుంది. కోర్కె లేకపోయినా తగిన సామాగ్రి లేకపోయినా మిత్రుల బలవంతంవల్ల అనేక పనులు చేయాల్సి వస్తూ వుంటుంది. ప్రియమిత్రులు మీరు చెప్పిన తరువాత కాదనలేక యీ ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యక్షంగా ఆయన గురించి తెలిసినది లోతుగా ఆలోచించిన మీదట ఆయన జీవితంలోనూ, కార్య రంగంలోనూ యిమిడివున్న నిగూఢ భావాలను నేను అర్ధం చేసుకొన్నంత వరకు వ్రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. అన్ని విషయాలు వ్రాయగల శక్తి, అనుకూల మనసు కూడా యిపుడు నాకులేదు. నీవు

కోరావు గనుక కాదనలేక కొన్ని విషయాలే వ్రాస్తాను.

(దేశబంధు జీవిత చరిత్ర వ్రాసిన శ్రీ హేమేంద్ర నాథ్‌ దాన్‌ గుస్తాకు వ్రాసిన ఉత్తరము)

సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 224

దేశబంధు జీవితంలోని విషయాలన్నింటితోనూ నాకు సంబంధం లేదు. ఆయన జీవితం గురించి యిప్పటివరకు వెలుగులోకి వచ్చిన విషయాలన్నీ కూడా నాకు తెలియవు. నేను మూడు మాసములే ఆయనవద్ద వున్నాను. ప్రయత్నించి వున్నట్లయితే ఈ సమయంలోనే చాలావరకు గగ్రహించగలిగే వాడిని. కాని అనేక విషయాలు ఆలోచనలో వుండగా యిది సంభవం కాదు. ఆ విలువను 'గుర్తించలేం.. దేశబంధు తన వ్రతం పూర్తి అయ్యేవరకు దాని ఫలితం గూడా పొందేంత వరకు కార్య క్షేతంలో ప్రత్యక్షంగా వున్నట్లయితే ఎంతో బాగుండేదని నా యోచన, “రెండేళ్ళపాటు సముద్రాలకు అవతల జైలులోవుండి సగౌరవంగా తిరిగివచ్చిన తరువాత అధికారులతో ఒడంబడిక జరుగుతుందని, రాజాదరణ పొందిన తరువాత చనిపోతానని తన జాతకంలో వ్రాసి వున్నట్లు ఆయన చాలాసార్లు నాతో చెప్పినట్లు గుర్తు మీతోపాటు సముద్రాలు దాటి రావటానికి నేను సిద్ధమేనని నేను ఆయనతో అన్నాను. కొంపదీసి ఆయన మాట నిజమవుతుందేమో, యిదే జైలుకి ఆయన్ని పంపుతారేమోనని యిక్కడకు వచ్చినప్పటి నుంచి నాకు సందేహంగా వుంది. కాని దురదృష్టం, జరగరాని ఘోరం జరిగి పోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇది భారత దేశం యొక్క దౌర్భాగ్యం. ఆఖరిసారిగా నేను దేశబంధుని ఆలీపూర్‌ జైలులో కలుసుకున్నాను. ఆరోగ్యం సరిలేక విశ్రాంతి కొరకని ఆయన సిమ్లా వెళ్ళారు. నా అరెస్టు వార్త విన్నవెంటనే సిమ్లా నుంచి కలకత్తా వచ్చారు. నన్ను చూడటానికి రెండుసార్లు ఆయన ఆలీపూర్‌ వచ్చారు. బరంపురం మార్చక పూర్వం ఆయన్ని చివరి సారిగా దర్శించాను. మాట్లాడుకోవలసిన మాటలన్నీ ఆయిన తరువాత మరలా చాలా రోజుల వరకు మిమ్మల్ని కలుసుకోలేక పోవచ్చునంటూ ఆయన పాదాలు స్పృశించాను.* లేదు! లేదు! నేను నిన్ను తొందరలోనే విడిపించుతానంటూ” ఆయన తన సహజమగు ఆనందోత్సాహాలతో చెప్తూ వెళ్ళి పోయారు. అయ్యో! ఎంత పని జరిగి పోయింది. యీ జీవితంలో యిక ఆయన్ని చూడలేమని ఎవరికి తెలుసు? ఆ అంతిమ కలయిక, నా మనఃఖలకంపై ప్రగాఢంగా చిత్రితమైంది. ఈ చిత్రం జీవితాంతం అలాగే వుంటుందని ఆశిస్తున్నాను. నాలో మిగిలిన, ఆయన మిగిల్చిన యీ స్కృతియే నా జీవితానికి వెలుగుబాట. ప్రజలపై దేశబంధు ప్రభావం యింతగా పడటానికిగల కారణాన్ని వివరించటానికి చాలామంది (ప్రయత్నించారు. ఆయన సహచరునిగా ఆ కారణాలేవో నేను చెప్పగోరుచున్నాను. గుణ దోషాలతో నిమిత్తం లేకుండా సాటివారిని (ప్రేమించటాన్ని నేను గమనించాను. సహజంగానే తన ఉదారహృదయంతో మానవ మాత్రుని ఆయన స్నేహ పాత్రునిగా చేసుకోగలిగే వారు. ఎదుటి వ్యక్తి గుణ దోషాలను అసలు పట్టించుకునే వారేకాదు. మనం అసహ్యించుకొని దరిజేరనివ్వని వారినికూాడ వృదయ పూర్వకంగా కొగలించు 226 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కానగలిగెవారు. ఎన్నిరకాల ప్రజలు ఆయన వద్దకు వచ్చెవారొో, ఎన్ని రంగాలలో ఆయన (ప్రభావమొక ్రవాహంగాపని చేసిందో మనం చెప్పజాలం. నలువైపుల నుంచి ఆకర్షించి,వారి పక్షాన నిలచి విజయం చేకూర్చేవారు. ఆయనలోని తరగని పాండిత్యాన్ని గౌరవించని వారు, అనుపమాన వాక్‌ శక్తికి వశీభూతులు కానివారు, ఆశ్చర్యం కలిగించు అదృష్టానికి చకితులు కానివారు సైతం ఆయన మహోదాత్త హృదయానికి మాత్రం యిట్టే వశమై పోయేవారు, ఆయన స్నేహితుల సంగతి సరేసరి, స్వకుటుంబీకులుగా మెలిగేవారు, దేశబంధు మేలు కోసం, ఆయన విజయం కోసం ఏమీ చేయమన్నా చేసేవారు. జీవితం అర్బించనిదే జీవితం లభించదనేది పదహారణాల నిజం. ఆయన సహచరులందరూ ఆయన అవసరాల కోసం తమ సర్వస్వాన్నీ సమర్పించటానికి సిద్ధంగా వుందేవారు. అనుచరులందరూ కష్టాలకు, త్యాగాలకు వెనుతీయని వారే. ఏ పరిస్థితిలోనైనా సరే నిశ్చితంగా విశ్వసించగల అనుచరులనేకులు అహింసా సంగ్రామంలో తన వెనుక వున్నారన్న సంగతి దేశబంధుకి తెలుసు. చివరి క్షణం వరకు ఆయన అనుచరులు యీ దృఢ సంకల్పంతోనే వున్నారవి నేను సగర్వంగా చెప్పగలను. దేశబంధు అనుచరులలోని నియమ నిగ్రహాలు, కర్తవ్యపరాయణత, నిర్భీకత గమనించిన నాయకులనేకులు యిలాంటి కార్యకర్తలు మనకు కూడా లభఖించితే బాగుండునని లోలోన ఎంతో ఈర్చ్య పడేవారని చెప్పటానికి నాకు విచారంగా నున్నది. ఒకవేళ అలాంటి కార్యకర్తలు లభించినా వారికి చెల్లించ వలసిన మూల్యాన్ని చెల్లించటానికి మాత్రం వారు సిద్ధంగా వుండేవారు కాదు. కార్యకర్తలు కాన్విండి, అనుచరులు కానివ్వండి హృదయపూర్వక స్నేహం చూపనిదే వారి హృదయాన్ని మనం చూరగొనలేం. ఇతరులవలె ఆయనలో తనపర భేదభావం వుండేది కాదు. ఆయన యిల్లు అందరికి ఉపయోగ పడేది. ఆయన పడక గదిలోకి కూడా ప్రతివారు వెళ్ళగలిగేవారు. తన అనుచరులను ప్రేమించుటేగాక వారికొరకు తాను నింద పొందటానికి గాని, చీవాట్లు తినడానికిగాని వెనుకాడే వారేకాదు. ఒక రోజున ఆయన కుటుంబీకులెవరో ఒకరు వచ్చి , ఒక కార్యకర్త పనిని నిందిస్తూ అతనంటేనే నాకసహ్యం అని అన్నారు. ఆయన చాల బాధపడి, ఇక్కడే చిక్కువున్నది. నేనా విధంగా అసహ్యించు కోలేనని అన్నారు. ఇదేకాదు బయటి వారికోసం ఆయన తన వారితో పోట్లాడుతూ ఉందేవారు. ఆయన తన అనుచరులను బాగా సమర్ధించటాన్ని, వారిపై వచ్చిన నిందను ఎదుర్కొనటాన్ని నేననేక పర్యాయాలు చూచాను. దేశబంధు ఆంతరంగిక విషయాలు తెలియనివారు ఆయన కార్యనిర్వహణ శక్తిని జూచి ఆశ్చర్య పడేవారు భారత రాజకీయ రంగంలో దేశబంధు చేసిన కృపి సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్వాసాలు, లేఖలు 2926

అపూర్వం. పర్వత సమానుడై ఆయన తన నిర్వహణా శక్తిని నిరూపించుకున్నాడని నేను నిస్సందేహంగా చెప్పగలను. దీనికి కారణం అనుచరుల భావాలు, నాయకుని ప్రభావం ఒకటిగా కలవడమే, గుణ దోషాలను అలక్ష్యంచేసి మానవ మాక్రుని స్నేహపాత్రునిగా చేసుకొను స్వభావం, అసాధారణ బుద్ధికుశలతతో విభఖిన్నరుచులు, వేర్వేరు దృక్సథాలు కలవారినందరినీ కలిపి ఒక మార్గాన, నడిపించగలగడం కూడా యిందుకొక ప్రధాన కారణం. ఆయన పక్షంలో లేనివారు ఆయన అభిప్రాయాన్ని సమర్థించని వారు కూడా అప్రయత్నంగా ఆయనకే సహాయ పడేవారు. తాము చెప్పినదానిని బుజువు చేసుకోలేని నాయకులు కొందరు, దేశబంధు అనుచరులను, కార్యకర్తలను అవమానపరుస్తా, ఆయన చెప్పిన దానిని మారుమాటాడక అనుసరించే దాసత్వ పరాయణులని చెప్పుకొచ్చారు. దేశబంధుతో పరియమున్న వ్యక్తులెవరూ యీ విషయం అంగీకరించరు. విమర్శ ప్రతివిమర్శ జరుగు సమయంలో తాను చెప్పదలచిన దానిని స్పష్టంగా చెప్పగల వారిని నేను దాసత్వపరాయణులుగా ఎలా భావించగలను? ఆపుడపుడు జరుగు విమర్శలో నాయకునికి అనుచర వర్గానికి మధ్య తీవ్రమగు వివాదం చెలరేగేది. కాని ఆయన ఎన్నడూ యిలాంటి వివాదం గురించి మనసులోనైనా కోపగించుకునే వాడుకాదు. ఎక్కువ తర్శవితర్మాలు చేసేవారి మాటలే ఆయన ఎక్కువ శ్రద్ధగా వినేవారిని అనేకమంది అంటూవుంటారు. భేదాభిప్రాయం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా సంచరించుటగాని, నిగ్రహం కోల్పోవుటగాని అయన అనుచరులు చేసేవారు కాదనుట యథార్థం.నాయకునిపై కోపంతో ఆయనను తూలనాడి ప్రతిపక్షంలో కలవటానికి కూడా అంగీకరించేవారు కాదు. నిగ్రహంతోను, నియమబద్ధంగాను నడుచు కొనుటయే దేశబంధు సంఘం యొక్క ప్రధాన సూత్రం . పరస్పర భేదాభిప్రాయాలున్నప్పటికి అధిక సంఖ్యాకుల నిర్ణయాన్ని అందరు బెదల దాల్చేవారు. సంఘనియమాలను పాటించి నదచుకొను నీతి భారత దేశానికి కొత్తదేమీ కాదు. ఇరవై అయిదువందల సంవత్సరాలకు పూర్వం బుద్ధభగవానుడుకూడ భారతదేశానికి యిదే నీతిని నేర్చినాడు, నేటికీ ప్రపంచమంతటా ప్రార్ధన చేయు సమయాన బౌద్దులు- బుద్ధం శరణమ్‌ గచ్చామి ధర్మం శరణమ్‌ గచ్చామి సంఘం శరణమ్‌ గచ్చామి 227 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

అని అంటారు. ఇది నిజమే మరి. ధర్మ ప్రచారం లేకుండా దేశీయ సేవా సంఘంగానీ, సంఘాను వర్తనంలేకుండా యీ ప్రపంచంలో ఏ గొప్ప కార్యంగానీ సాధ్యంకాదు.

రాజకీయ రంగంలో ప్రవేశించిన తరువాత విద్యా సంస్కృతులు లేని వెనుకబడ్డ జాతుల వారితో దేశబంధు కలిసిమెలిసి తిరుగుతున్నారంటూ ఆక్షేపించడాన్ని నేను విన్నాను. 1921 నుంచి జీవితాంతం వరకు ఆయనతో కలసి పనిచేసిన మొత్తం కార్యకర్తలను వెనుకబడిన వారిగా భావించారో లేదో నాకు తెలియదు. ఆయన సంభాషణలో యీ విధమైన ప్రస్తావన ఎన్నడూ రాలేదు. ఆయన తన మనోభావాలు బహిరంగ పరచి వుండక పోవచ్చును. ఒకవిషయం మాత్రం నాకు జ్ఞాపకమున్నది, ఆయన జైలు నుంచి విడుదలయినపుడు విద్యార్థులు ఒక స్వాగతసభను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సమర్పించిన స్వాగత పత్రంలో ఆయన చేసిన త్యాగాల గురించి, దేశసేవ గురించి పేర్కొన్నారు. తనపట్ల యువకులు చూపిన భక్తి, (ప్రేమలకు దేశబంధు హృదయం ఉప్పాంగి పోయింది. ఆయన నిత్య నవీనుడు నిత్య యవ్వనుడు, అందువల్ల యువవాణి వెంటనే ఆయన మనసులో పని చేసేది. స్వాగతానికి జవాబు చెప్పటానికి లేచినపుడు ఎన్నీ భావాలు తుఫానులా చెలరేగినై. తన త్యాగాలను, కష్టాలను మరచిపోయి యువజనుల కష్టాలను, త్యాగాలను చెప్పసాగారు. కాని ఎంతోసేపు మాట్లాడలేక పోయారు. నోటి మాట రాలేదు. మౌనంగా నిలబడి పోయారు. బొటబొట కన్నీళ్ళు కారాయి. యువరాజు రోదించ సాగాడు. యువకులు కూడ రోదించారు. ఎవరియందు ఆయన లో ఇంతగా సానుభూతి (ప్రేమలున్నవో వారినే వెనుకబడ్డవారుగా ఎలా భావించ గలుగుతారో నేను ఊహించ లేకున్నాను. దేశబంధు చెప్పిన పనులు చేసిన వారిలోగాని, చేస్తున్న వారిలోగాని విద్యా సంస్కృతుల ఆధిక్యతగానీ, ఉన్నత వంశమనెడి అభిజాత్యంగానీ లేదనుట నిశ్చయం. వినయమనే పవిత్ర సంపదను వారెన్నడూ వదులు కోరని కూడా భావిస్తున్నాను.

దేశబంధు చివరి ఉత్తరం నాకు పాట్నానుంచి వచ్చింది. ఆ ఉత్తరం ఎక్కడో

దూరాన బర్మాలో రాజకీయ ఖైదీగావున్న నాకు అమూల్యమగు సృృతులతో కూడిన నిధిగా పరిణమించింది. తన సహచరులు, కార్యకర్తలు వేరై పోయినపుడు ఆయన హృదయమెంతగా దహించుకు పోయేదో యీ ఉత్తరంవల్ల స్పష్టంగా తెలుస్తుంది. దేశబంధు సున్నిత హృదయం ఎరిగి వున్నవారే వారి హృదయవేదన తీవ్రతను అర్ధం చేసుకోగలరు, సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 228

1921లోను మరల 1922లో ఎనిమిది మాసాలపాటు దేశ బంధుతో కలసి జైలులో ఉండే అదృష్టం నాకు లభించింది. యీ ఎనిమిది మాసాల్లో మేము రెండు మాసాల వరకు ఒకదాని తరువాత మరొకటి కలిసియున్న గదులలో ఉండేవారం తరువాత రెండు మాసాలు మరి కొంతమంది స్నేహితులతో కలిసి సెంట్రల్‌ జైలులో ఒకే హాలులో ఉన్నాము. ఈ సమయంలో ఆయనకు కొంత పరిచర్య చేయు సదవకాశం నాకు కలిగింది. ప్రభుత్వం వారి దయవల్ల ఎనిమిది మాసొలు నేను ఆయనకు సేవ చేయగలిగాను. ఇది నాకు చాలా గర్వకారణం. 1921లో నేను అరెస్టుకాక పూర్వం మూడు,నాలుగు మాసాలు మాత్రమే ఆయన వద్ద పనిచేశాను. ఆ కొద్ది కాలంలో ఆయన్ని సరిగా అర్ధం చేసుకొనుటకు నాకు సాధ్యం కాలేదు. కాని యీ ఎనిమిది మాసాల గుడువులో మాత్రం అర్థం చేసుకోగలిగాను. చేరిక ఎక్కువైనపుడు అశ్రద్ధ యేర్చడుతుందని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. కాని దేశబంధు విషయంలో నాకది కనిపించలేదు. చేరిక పెరిగిన కొలది ఆయనయందు నాలో (శ్రద్ధ ఎన్నోరెట్లు పెరిగిందని చెప్పగలను. యీ విషయంలో అందరూ నాతో ఏకీభవించుదురని ఆశిస్తున్నాను. దేశబంధులో తరగని సరసత్వం రసికత్వం ఉన్నాయని జైలులో నాకు బాగా అర్థమైంది. ఎన్నిరకాలైన మనో వినోదాలతో ఆయన మమ్ముల్నందరిని ఆనందపరిచే వారో చెప్పలేదు. ప్రెసిడెన్సీ జైలులో ఉండగా సాయుధ గూర్థాలు మమ్మల్ని కాపలా కాస్తూ ఉండేవారు. ఒక రోజు ఉదయం లేవగానే గూర్చావానికి బదులుగా లాఠీ చేపట్టి నిలబడిన ఉత్తర భారతీయుని ఆయన చూశారు. వాడిని చూడగానే “ఏమి సుభాస్‌ మర తుపాకీకి బదులు యీ వెదురు వాసం ఎక్కడి నుండి వచ్చింది. మనమంఠా అమాయకులమా?” అని అన్నారు. హాస్యం కోసం, ఆయన వెతుక్కునే అవుసరం ఉ ందేది కాదు. సహజంగానే ఆయన రసికుడు. రసాస్వాదన శక్తి సంపన్నుడు తనకు ప్రతికూలమగు విషయాలకు కూడా కలత చెందక వాటిలోని వినోదాన్ని అనుభవించగలడు. జైలులోని శాంతిపూరిత వాతావరణంలో ఉన్నపుడే ఈ సత్యం పూర్తిగా బోధపడగలదు. ఇంగ్రీషు, బెంగాలి భాషల్లో ఆయన ఉద్ధండ పండితుడు. ఇంగ్లీషు కవుల్లో బౌనింగ్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. బ్రౌనింగ్‌ కవిత లనేకాలు ఆయనకు కంఠస్తం. జైలులో తరుచుగా ఆయన బ్రౌనింగ్‌ కవితలను చదువుతూ ఉండేవారు. రోజువారి ఏదైనా చదువుకునే సమయంలో ఆయన ఎన్నో వినోద విషయాలను ప్రస్తావించేవారు. 229 గొతమ్‌ ఛటోపాధ్యాయ

కాని వాటిని మాకు అర్ధమయ్యే విధంగా వ్యాఖ్యానించితే గాని వాటిలో వున్న పూర్తి మజాను మేము అనుభవించగలిగే వాళ్లం కాదు.

దేశబంధు, తన అఆత్మీయుని కొకనికి అవసరమై..... వడ్డీ చొప్పున పదివేలు అప్పుతెచ్చారు. కాని అతను సమయానికి బాకీ తీర్చలేక పోయాడు. అపుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ప్లీడరు తగు బోగట్టాకోసం దేశబంధు వద్దకు వెళ్లాడు. కుటుంబంలో ఈ విషయం ఎవరికి తెలియదని ఆయన పుత్రుడు చిత్రరంజన్‌ వల్ల తెలిసింది. ఎవరికొరకు దేశబంధు అప్పు తీసుకు వచ్చారో అతనిప్పుడొక లక్షాధికారి. కాని అతనితో ఏమీ చెప్పకుండానే తానే స్వయంగా నోటులమీద సంతకాలు చేశారు. తన సంతానానికిగాని, భార్యకుగాని చెప్పకుండానే ఆయన ఇతరుల కారకు చాలా డబ్బుఉపయోగించారు.

అన్నపానాదులను కూడా విస్మరించి దేశబంధుని దూషించుటే తన పనిగా పెట్టకున్నవారు కూడా ఆపద సమయంలో ఆయన్ని ఆశ్రయించుట నేనెరుగుదును. ఈ విధమగు పెద్దమనిషే ఒక పర్యాయం రెండు వందలు కావలసి ఆయన వద్దకు వచ్చాడు. దేశబంధు అతనికి మారు మాటాడకయే రెండు వందలు ఇచ్చి పంపెను.

ఎనిమిది మాసాల పాటు ఆయనతో సన్నిపాత సంబంధం కలిగియుండి, అన్ని విధాలగు అనుభూతుల ద్వారా అర్ధం చేసుకునే అవకాశం నాకు కలిగింది. కాని ఎన్నడూ మాటల సందర్భంలోగాని, యితర విషయాలలోగాని, హెచ్చుతగ్గులనేవి నామమాత్రంగా కూడా ఆయనలో నేను చూడలేక పోయాను. రాజకీయ రంగంలో తనకు అనేకమంది శత్రువులున్నారన్న సంగతి ఆయనకు తెలుసు. కాని ఎవరియందూ ఆయనకు ద్వేషం ఉండేది కాదు. అవసరమయితే ఆ శత్రువుకి సహాయం చేయటానికి వెనుకాడే వారు కాదు.

జైలులో దేశబంధు ఎక్కువగా చదవటంలోనే లీనమై వుండేవారు. భారతదేశ జాతీయత గురించి పుస్తకం వ్రాయాలన్న అభిప్రాయంతో ఆయన రాజకీయ ఆర్థిక విధానాలకు చెందిన పుస్తకాలనేకం తెప్పించారు. సామాగ్రి అంతా సమకూరిన తరువాత పుస్తకం వ్రాయడం కూడా ప్రారంభించారు. కాని తగినంత సమయం లభించక పోవటంతో జైలులో పుస్తకము పూర్తి చేయలేక పోయారు. జైలు బయటకు వచ్చిన తరువాత అసలు తీరికే దొరకలేదు. దానితో అది పూర్తి కాలేదు. జైలులో ఉండగా రాజకీయాల గురించి సాహిత్యం గురించి ఆయనతో నేను చాలా చర్చించాను. మన జాతీయత విద్యా సంస్కతులతోపాటు సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక విషయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కనుక వాటికి వేర్వేరు యేర్చాట్లు, కార్యక్షేత్రాలు అవసరం సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 280

లేదని ఆయన నమ్మిక. ఈ కారణం చేతనే ఆయన యీ విషయాలలో కార్ల్‌ మార్చ్‌తో విభేదించేవాదు. భారతదేశంలోని అన్ని మతములవారు, తరగతుల వారు తమలోతాము సర్దుబాటు చేసుకుని ఏకాభిప్రాయంతో స్వాతంత్రోద్యమంలో సహకరించు కోగలరన్న విశ్వాసం చివరి క్షణంవరకు ఆయనకున్నది. ఒడంబడికల ద్వారా అవసరమైన పటుత్వం, ఐక్యత ఏర్పడదు. ఐక్యత సానుభూతి మీదనే ఆధారపడి వుంటుందేగాని మధ్య వర్తిత్వంవల్ల కాదని దేశబంధుని ఎగతాళి చేసేవారు. ఒడంబడిక అనేది చేసుకొనకుండగా మానవుడు ఈ ప్రపంచంలో ఒక్కరోజు కూడా జీవించ జాలడు, సంఘం కూడా మనలేదు. కుటుంబంలోనేమి సంఘంలో నేమి, రాజకీయ జీవితంలో నేమి, సమస్త రంగాలలో భిన్నరుచులు, వేరువేరు ఆలోచనలుగల వ్యక్తుల మధ్య ఒడంబడిక అనేది లేనిదే మానవులు కలిసి జీవించటం అసంభవం. ప్రపంచంలోని ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితో చేసుకొను ఒడంబడికల మీద ఆధారపడి ఏ పరిశ్రమలు, వ్యాపారాలు జరుగుచున్నవి? అలా ఒడంబడికలు చేసుకొను వారి మధ్యలో (ప్రేమ మచ్చుకైనా కానరాదని చెప్పుటలో అతిశయోక్తి ఏమీ లేదని దేశబంధు అంటూ ఉండేవారు. మన దేశంలో ఉన్న హిందూ నాయకులలో ఇస్లాం మతాన్ని దేశబంధువలే అభిమానించేవారు మరెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. ఆవిధమైన మన దేశబంధువే తారకేశ్వర్‌ సత్యాగ్రహానికి ప్రధాన నాయకుడు. ఆయన హిందూ మతాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. అవసరమయితే ప్రాణార్చణకు గూడా వెనకాడేవాడు కాదు. కాని, నా మతమే అన్నిటిని మించినది, గొప్పది అన్న అహంభావం మాత్రం ఉండేది కాదు. అందువల్ల ఇస్లాం మతాన్ని గూడా ప్రేమించ గలిగాడు. ఎంతమంది హిందూ నాయకులు మాకు మహ్మదీయుల యెడల ఈర్య్యా భావం లేదని గుండెమీద చేయి వేసుకొని చెప్పగలరో, అలానే, ఎంతమంది మహ్మదీయ నాయకులు గూడా మాకు హిందువుల యెడల ద్వేష భావంలేదని చెప్పగలరో నాకు తెలుసు కోవాలనిపిస్తున్నది. కాని అన్ని మతముల వారికి ఆయన హృదయంలో తావున్నది. ఒడంబడికల ద్వారా వివాదం సమసి పోయినప్పటికి అంతమాత్రముననే హిందూ మహ్మదీయులలో (ప్రేమ ఏర్పడి పోవునని ఆయనకు నమ్మకం ఉండేది కాదు. అందుచేతనే సంస్కృతి ద్వారా హిందూ మహ్మదీయులలో సంఘీభావం నెలకొల్ప్బవలెనని కోరేవారు. హిందూ మహ్మదీయ సంస్కృతులు రెండూ ఒకటి మరొక దానితో కలిసి ఒకటిగా ఎక్కడ విషయాలలో మనగలుగుతాయన్న విషయాన్ని జైలులో నుండగా ఆయన తరచుగా అకర్‌ మఖాన్‌తో చర్చిస్తూ ఉండేవారు. నాకు జ్ఞాపకమున్నంత వరకు అప్పటిలో మౌలాన అకర్‌ మకాన్‌గారు 231 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

హిందూ మహ్మదీయ సాంస్కృతిక సమైక్యత గురించి ఒక గ్రంథం వ్రాయుటకు అంగీకరించారు. భారతదేశం, స్వరాజ్యాన్ని కోరుకుంటున్నదంటే, ఏదో కొంతమంది ఉన్నత . తరగతుల వారి కోసం మాత్రమేకాక, సామాన్య ప్రజల సంక్షేమం కొరకేనన్న సంగతిని దేశబంధు ఎనస్తీసార్లు ఎలుగెత్తి చాటారు. ఇతర పెద్దలు యీ విధంగా చెప్పారో లేదో నాకు తెలియదు. ప్రజాసామాన్యం కొరకే స్వరాజ్యమన్న సంగతి నూతనంగా వచ్చిందేమీ కాదు. వాస్తవానికి ముప్పది సంవత్సరాలకు పూర్వమే స్వామి వివేకానంద తన “వర్తమాన భారతదేశం” అన్న పుస్తకంలోనే ఈ విషయాన్ని పేర్కొన్నారు. కాని స్వామి చెప్పిన యీ భవిష్యవాణి ఆ సమయంలో రాజకీయ వేదికలమీద ప్రతిధ్వనించ లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత దేశబంధు ప్రచారం చేసిన విషయాలన్నీ ఆయన జైలులో బాగా యోచించి నిర్ణయించుకున్నవే. అవకాశం వచ్చినపుడల్లా మేమందరం కూడా యీవిషయాల మీద చర్చించాం. కౌన్సిల్‌కు వెళ్లాలన్న విషయాన్ని ఆయన జైలులోనే నిశ్చయించుకున్నారు. చాలావరకు వాదవివాదములు జరిగిన తరువాతనే మేము దానిని ఆమోదించాము. వాదాలలో తీవ్రత ఎక్కువగానే వున్నది. ఇంగ్లీషులో దిన పత్రిక ఒకదానిని నడపాలనే నిర్ణయం కూడా జైలులోనే చేశాము. ఆయన ఈవిధంగా చేసిన అనేక గొప్ప సంకల్పాలు కార్యరూపం ధరించనందుకు నాకు చాలా విచారంగా వుంది. జైలులో జరిగిన విషయమొకటి తప్పక చెప్పవలసి వున్నది. అది ఖైదీలపట్ల ఆయనకున్న ప్రేమ భావన. ప్రెసిడెన్సీ జైలునుండి అలీపూర్‌ జైలుకి వచ్చినపుడు మేమున్న వార్డులో. మాధుర్‌ అనే. ఖైదీ ఒకడు పనిచేస్తూ ఉండేవాడు. అందరూ వాడిని పాత ముద్దాయి అనేవారు: ఎన్నోసార్లు .దొంగతనాలు చేసాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. దొంగ అనిపించు కోవటమే వాడికి అలవాటైంది. అనేకమంది దొంగలవలె వాడి హృదయం కూడా సరళమైనదే. కొన్ని రోజులు పని చేశాక దేశబంధును అభిమానించ సాగాడు. ఆయనంటే భక్తి ఏర్పడింది. బాబా అని పిలిచేవాడు. మాధుర్‌అంటే దేశబంధు మనసులో కూడా సానుభూతి ఏర్పడింది. క్రమంగా వాడు మా అందరిని ఆకర్షించాడు. రాత్రిగాని పగలుగాని దేశబంధు ఒళ్ళు పట్టు సమయంలో తనకు జరిగిన విషయాలన్ని చెప్తూ ఉండేవాడు. విడుదలై వెళ్లే సమయంలో “నిన్ను వదిలిన తరువాత మా యింటికి రా నిన్ను అక్కడే ఉంచుకుంటానని”, మాధుర్‌తో దేశబంధు అన్నారు. వాడికెంతో సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 232

ఆనందం కలిగింది. చెడ్డ స్నేహాలు వదలటానికి, చెడు పనులు చేయకుండా ఉండటానికి అతను సంకల్పించుకున్నాడు.

“మాధుర్‌ విడుదలైన రోజున మనిషిని పంపి దేశబంధు తన యింటికి రప్పించుకున్నాడు. తరువాత చాలా కాలంపాటు అతను ఆయన ఇంటివద్దనే ఉన్నాడు. ఆయనకు సేవ చేస్తూ ఆయనతోపాటు దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగాడు. పాత కేడీ అవటంవల్ల కొంతకాలంపాటు పోలీసులు వాడిని వెంబడిస్తూనే ఉన్నారు. కాని వాడు ఎల్లపుడు దేశ బంధువునే ఆశ్రయించి ఉంటున్నాడన్న విషయం (గ్రహించి వెంటాడటం మానివేశాడు. వాడిని చూచినపుడల్లా “ఒరే మాధుర్‌ మొత్తానికి నీవు మనిషివి అయ్యావురా” అనేవారు. వాడిక చెడ్డవాడు కాదను కున్నాను. కాని దేశబంధు చనిపోయిన తరువాత విచారించగా, దేశబంధు డార్జిలింగ్‌లో ఉన్నప్రడు రసారోడ్డు లోని వారి ఇంటినుంచి కొన్ని వెండి వస్తువులు తీసుకొని పారిపోయాడని తెలిసింది. ఈ చిత్రమైన వార్తవిన్న నాకు “బీదలపాట్లు” పుస్తకంలోని కథ గుర్తుకు వచ్చింది. దేశ బంధు గనుక దగ్గరనే ఉంటే ఆయన వ్యక్తిత్వ ప్రభావంవల్ల లోభానికి వశుడై వుండేవాడు కాదు. క్షణిక దౌర్బ్భల్యానికి లోనై దొంగతనం చేశాడు. అయినప్పటికి నేడు దేశబంధు బతికే ఉన్నట్లయితే కాళ్లమీద పడి ఏద్చేవాడు, క్షమాపణ కోరేవాడని ఇప్పటికి నాకు విశ్వాసమున్నది. కాని ఇపుడు వాడి గతి వమౌతుందో మరి. అనుపమానమగు వాదనా పటుత్వం, సేవా బెదార్యాలు కలిగిన ఉత్తమ వైష్ణవుడు చతుర రాజనీతీజ్ఞుడు, దిగ్విజయాలు సాధించే వీరుడుగా మనగల విశిష్టత ఒకే వ్యక్తిలో ఎలా వచ్చినవని అందరూ సహజంగా అనుకుంటూ ఉంటారు. కాని మానవ శాస్త్రం ద్వారా యీ ్రశ్చకు సమాధానం పొందాను. అది ఎంతవరకు వాస్తవమో చెప్పజాలను. ఆర్యులు, ద్రవిడులు, మంగోలు జాతి యీ మూడు జాతుల మిశ్రమం వల్లనే నేటి బెంగాలి జాతి ఏర్పడినదని అంటారు. ఒక్కొక్కటిగా గుణం వికాసం పొందుతూ ఉంటుంది. రక్తమిశ్రమం వల్ల ప్రత్యేక గుణాలు వికాసం పొందుతాయి. కనుక మిశ్రమ జాతి బెంగాలీలలో కూడా సర్వతోముఖ ప్రతిభ ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. ఆర్యుల ధర్మ ప్రభుత్వం ఆదర్శ వాదం, ద్రవిడుల కళా నైపుణ్యం భక్తి భావం, అలానే మంగోలీల బుద్ధికుశలత, యథార్థవాదం అన్నీ కలసి యీ బెంగాలీ స్రవంతిలో విలీనమైనాయి. అందుకనే బెంగాలీలు తెలివి తేటల్లో చురుకైనవారు. భావుకులు, మాయావాదానికి వ్యతిరేకులు. అనుకరణ అన్నా నూతన సృష్టి అన్నా అనుకూలంగా ఉంటారు. ఒక జాతి రక్తము మరొక వ్యక్తి రక్తనాడులలో ప్రసరించునపుడు ఆ జాతి సంస్కారాలు కూడా ఆ వ్యక్తి వృదయసీమలో స్థానమేర్చరుచు 238... గౌతమ్‌ ఛటోపాధ్యాయ

కుంటాయి. బెంగాలీలు అందరూ ఒక జాతిగా రూపొందినటులే వారి సంస్కుతికూడా ఒక విధమగు విశిష్టతతో కూడిన ప్రయోజనాన్ని పొందినది. బెంగాలు సభ్యత ఆర్య సభ్యతే అయినా దానికొక ప్రత్యేక విశిష్టత ఉన్నదని బెంగాలు సాహిత్యంతోను, చరిత్రతోను పరిచయమున్న వారందరూ అంగీకరిస్తారు. స్వామి దయానందుడు ఆర్య సమాజమును ఏర్పాటు చేసి ఉత్తర భారతంలో విజయం పొందారు. కాని బెంగాలునందు విజయం పొందలేక పోయారు. పరమహంస కాళికాదేవి భక్తుడు. దేవుని, బెంగాలీలు ఇంత శ్రద్ధా భక్తులతో ఎందుకు కొలుస్తారు? బెంగాలులో వరకట్నం వాడుకలో ఎందుకున్నది? బౌద్ధమతం అన్ని చోల్లా అపజయం పొంది చివరకు బెంగాలును ఎందుకు ఆథశయించింది? బెంగాలు నుంచి అధునిక న్యాయపరద్ధతి ఎందుకు ప్రారంభమైంది? శంకరుని మాయా వాదాన్ని బెంగాలు ఎందుకు పరిగ్రహించలేదు. బౌద్ధ మతం బెంగాలులో అపజయం పొందిన తరువాత శంకరుని మాయావాదానికి ప్రతిగా విశిష్టాద్వైత్సం యొక్క భేదాభేదాల పరిస్థితి ఎందుకు ఏర్చడింది.? ఈ ప్రశ్చలన్నింటి గురించి ఆలోచించితే గాని బెంగాలీ సంస్కృతిలో మూడు భాగాలున్న సంగతి మనకు బోధపడదు. (1) తంత్రం, (2) వైష్ణ మతం (3) నూతన న్యాయం, రఘునందనుని స్మరణ, న్యాయస్టృతులలో బెంగాలు ఆర్యావర్తం తోనే కలిసి ఉన్నది. వైష్ణవ మతంలో ద్రావిడులతో ఉన్నది. తంత్రాలలో టిబెట్‌ మరియు పర్వత జాతులతో కలిని యున్నది. న్యాయశాస్త్ర వరిశీలన బెంగాలీ వారిని తార్మికులుగాను, న్యాయవేత్తలుగాను చేసింది. ఈ స్వభావమే బాగుగా అభివృద్ధి చెంది దేశబంధుని ఒక గొప్ప బారిష్టరుగా మార్చింది. ప్రాచీన న్యాయ శాప్రం సంగతి నేను చెప్పలేనుగాని పాశ్చాత్య తర్మ శాస్త్రాన్ని మాత్రం ఆయన అధ్యయనం చేశాడు. ఒక పెద్ద న్యాయవేత్తవలే ఆయన ప్రతిచిన్న విషయాన్నీ కూలంకషంగా తర్మించేవాడు. ఊపిరి సలుపనీయని ప్రవాహ సదృశమైన వాగ్దాటితో ఎదుటి పక్షం నోరు కట్టించేవాడు. రెండు మూడు వందల సంవత్సరాలకు పూర్వం ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఎక్కడైనా జన్మించి ఉ న్నప్పటికీ తప్పనిసరిగా ఒక న్యాయవేత్త అయ్యేవాడు. బెంగాలులోని వైష్ణవ మతం, ద్వైతాద్వైత వాదాలు కలసి నాస్తిక వాదం వైపుకు దేశబంధుని పోనివ్వలేదు. అలానే, నిర్లిప్త వేదాంతంలో నుంచి (పేమ మార్గం వైపుకు తీసుకు వెళ్ళాయి. ఆధ్యాత్మిక తత్వరూపంలో ఆయన విశిష్టాద్వైత భేదాభేద వాదాన్ని అన్నిటికంటే ఉత్తమమైనదని భావించేవాడు. ఆయన దాదాపుగా సన్యాసిగానే కనిపించే వారు. కాని సన్యాసము స్వీకరించుట మాత్రం ఆయనకు గిట్టదు. భగవంతుడు

సత్యమైనటులే ఆయన లీలలు కూడా సత్యాలే. బ్రహ్మ సత్యమైనపుడు జగత్‌ మిధ్య కావటం ఎలా? కాన భగవంతుని దర్శనం కోసం చేయు ప్రయత్నాలు, రూపం, గుణక్తీర్తన, ఆరాధన మొదలగునవి ఏ రూపంలో వున్నా వదలవలసిన అవసరం లేదు. భగవంతుని లీలలు అనంతాలు. వాటిలో ఈ బాహ్య జగత్తేకాక అంతరంగిక జగత్తు కూడా వున్నది. వాస్తవానికి దేశబంధు ఈ పూర్తి జగత్తును, పూర్తి మానవ జీవితాన్ని పరిగ్రహించాడు. ద్వైతాద్వైత వాదం సహాయంతో ఆయన జీవితంలోని విరోధులందరిని కూడా తొలగించు కోగలిగాడు. మత సామరస్యతను కూడా నెలకొల్పాడు. దీనికొరకే ఆయన వైష్ణవ మతాన్ని ఆరాధించారు. ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సాహిత్య, మతాలకు చెందిన విషయాలన్నింటిని మనం వేరుచేసి చూడకూడదు. అవన్నీ అవినాభావ సంబంధం గలవి. ఒక దానికైనాసరే. ప్రత్యేక సిద్ధాంత కల్పన చేసినందువల్ల జీవితం పూర్ణత్వం పొందజాలదు.

ఆయనలో వున్న మత వ్యతిరేకతలను తొలగించిన దార్భినికతత్వమే ఆయన పృాదయంలో అందరికి స్నేహ భావం వర్చడ జేసినది.

ఆయన ఉదారంగా చేసే దానధర్మాలను గురించి జైలులో మిత్రులు గొడవచేస్తూ ఉండేవారు. ఆ గొడవ విని, “నాకేమీ తెలియదనీ, ప్రజలు నన్ను మోసగించి డబ్బు తీసుకు పోతున్నారనీ మీ అభిప్రాయమైతే అది పొరపాటు. నాకంతా తెలుసును. ఇస్తూ పోవటమే నా పని గనుక యిచ్చుకుంటూ పోతున్నాను. ఆలోచించవలసిన బాధ్యత ఉ న్నవారు ఆలోచించుకుంటారంటూ?” ఆయన మా వద్దకు వచ్చి అనేవారు.

ఏ మంత్రోపదేశం వలన బెంగాలీలు శక్తిపూజను అలవర్చుకున్నారో దాన్నే ఆధారం చేసుకొని దేశబంధు ఎంతో తేజోవంతుదైనాడు. వాస్తవానికి దేశబంధు మంత్రోచ్చారణ పద్దతులు అవలంబించ లేదు. రోజూ పూజలు కూడా చేయలేదు. కాని కులాచారాలు మొదలుగునవి పాటించనిదే మానవుడు శక్తివంతుడు కాజాలడన్న వాదనపై నాకు విశ్వాసం లేదు. మంత్ర తంత్రాల సారమే శక్తిపూజ. ఈ జగత్తుకి మూలం ఆదిశక్తి. దానివలనే సృష్టి స్థితి లయలు ప్రళయం, బ్రహ్మ , విష్ణు మహేశ్వరులు అందరూ యేర్చ్పడ్డారు. ఆ ఆదిశక్తిని ఆరాధించువారే ఈ శక్తిని కూడా మాతృ మూర్తిగా భావించి ఆరాధిస్తున్నారు. బెంగాలీల మీద ఈ శక్తిపూజా ప్రభావం బాగా ఉన్నది. ఈ కారణం చేతనే భగవంతుని కూడా వారు మాతృరూపంలోనే చూస్తారు. యూదులు, అరబ్బులు, క్రైస్తవులు మొదలగు జాతుల వారు భగవంతుని తండ్రిగా భావిస్తారు. సోదరి నివేదిత చెప్పిన దాని ప్రకారం ఆ సమాజంలో స్రీకంటే పురుషులకే అధిక 2తిర్‌ గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ప్రాధాన్యం ఇస్తారట. అందుచేత అచటివారు. భగవంతుని పురుషునిగా కొలుస్తారట. పురుషనికంటే స్రీకి ప్రాధన్యమిచ్చు జాతుల వారు భగవంతుని కూడా మాతృమూర్తిగానే కొలుస్తారు. సరే, ఇక మిగతా విషయాలన్నీ అలా వుంచండి. బెంగాలీలు, భగవంతుడినేకాక, బెంగాలునూ, భారతదేశాన్ని కూడా మాతృమూర్తిగానే భావించి ప్రేమిస్తారు. పూజిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనమందరం కూడా దేశాన్ని మాతృభూమి అనే అంటున్నాము.

“సుజలాం.సుఫలాం మలయజ శీతలాం” అను గీతాన్ని బంకిం చంద్రుడు రాశాడంటే అందుకు కారణం యిదే. జితేంద్రలాల్‌ రాయకూడ అదే భావంలో వ్రాశాడు చూడండి.

“జెదిన్‌ సునీల్‌ జలధీ హయితే శ్రీఠిల్‌ జననీ భారత వర్షో

కవి రవీంద్రుడు అలాగే పాడినాడు.

“ఓ ఆమార్‌ జన్నభూమితో మార్‌ పాయేకే కాయి మాథా” దేశబంధుకు కూడా మాతృరూపంలో ఆరాధించుటయే ఇష్టం. జైలులో ఆయన బంకిం బాబు పుస్తకం చదివి వినిపించే వాడు. మాతృదేవత గురించి బంకిం బాబు చేసిన మూడు వర్ణనలు ఆయనకు చాలా ఇష్టం. ఆయన “నారాయణ్‌” ఆను పత్రికలో వైష్ణవ, శక్తి మతాల

గురించి ఒకే విధంగా సమీక్ష జరుగుతూ ఉండేది. దుర్దా దేవి పూజ గురించి “నారాయణ్‌” పత్రికలో ప్రచురితమైన వ్యాసాలన్నీ ఉన్నత భావ ప్రపూరితాలు.

దేశబంధు జీవితంలోని ఆచరణ భాగంలో కూడా మనం ఈ పవిత్ర పూజా ప్రభావాన్ని చూడవచ్చును.

... స్రీవిద్య, స్రీ స్వాతంత్ర్యంలోను విశ్వాసమున్న సంగతి అందరికి తెలిసింది.

“నారి నరకశ్య ద్వారమ్‌” అని శంకరాచార్యుల వారి అనుచరులు అంటుంటారు. దేశబంధుకి మాత్రం యీ సూక్తిలో నమ్మకం లేదు.

ఆయనలోని గుణ దోషాలు బెంగాలి వారి లోనివే. వంగ ప్రాంతీయుడగుటయే ఆయనకు అన్నిటికి మించిన గౌరవం. బెంగాలీ వారిని ఎవరైనా “మీరు భావంలో మునిగితేలేవారు కదా?” అని పరిహాస మాడిన సమయంలో దేశబంధు కల్పించుకొని “భావోద్రేకముగల వారము కనుకనే మాకు గౌరవం ఉన్నదని”, అనేవారు. అంతేగాని తనకు కలిగిన కష్టాన్ని బయటకు కనబరిచే వారు కాదు. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు 286

మానవజాతి సంస్కృతి ఒకటేనా లేక అనేకమా అన్న ప్రశ్నను అనేకమంది లేవదీస్తూనే ఉన్నారు. సంస్కృతి అంతా ఒకటే దానిలో భేదమనేది లేదంటారు అద్వైత వాదులు. సంస్కృతిలో జాతీయత కూడా వున్నది. దానికికూదా అనేక రూపాలున్నవంటారు ద్వైతవాదులు. దేశబంధు ద్వైతా ద్వైతవాది. సంస్కృతి ఒకటి అదే సమయంలో అనేకం కూడాను. మూలంలో మానవజాతి సంస్కృతి ఒకటే. కాని దాని వికాసం మాత్రం అనేక రూపాలలో జరుగుతూ వచ్చింది. తోటలో అనేక రకాల చెట్లువుండి రకరకాల పూవులు పూసినటులే మానవ సమాజంలో విభిన్న రూపాలలో సంస్కృతి వికాసం పొందింది. ప్రతి సంస్కృతి వికసించినపుడే ప్రపంచమంతటిలోనూ సంస్కృతి వికసించ గలదు. ఒక దేశం యొక్క సంస్కృతీ వికాసాన్ని కుంటుపరచి విశ్వ సంస్కృతిని మనం అభివృద్ధి పరచలేము. దేశబంధులోని స్వదేశానురాగమే విశ్వప్రేమకు సోపానమైనది. అంతేగాని స్వదేశ (ప్రేమను వదిలి ప్రపంచాన్ని ప్రేమించుటకు ప్రాకులాడలేదు.

స్వదేశీ ప్రేమలోపడి బెంగాలును మరవటమో లేక బెంగాలుపై అభిమానంతో దేశాన్ని మరవటమో దేశబంధు స్వభావం కాదు. ఆయన పేరు వంగభూమి సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. మహారాష్ట్రలో తిలక్‌ మహాశయునివలె (ప్రేమాదరాలు పొందేవారు.

స్వాతంత్ర్య సం(గ్రామంలో బెంగాల్‌ ముందంజ వేయాలని దేశబంధు అన్నాడు

1920లో బెంగాలులో స్వరాజ్యాందోళన నాయకత్వాన్ని కోల్పోయింది. కాని 1928లో మరలా నాయకత్వాన్ని పొందగలిగింది.

భారత దేశానికి చెందిన ఏదేని ఉద్యమంగాని, సత్యాగ్రహంగాని బెంగాలులో జరుప దలచినపుడు దానిని బెంగాలు పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలని దేశబంధు అంటూ వుండేవాడు.

జన సామాన్యంలోనేకాక పెద్దలలోకూడా దేశబంధు ప్రభావాన్ని గమనించిన వారు ఆశ్చర్యపడి ముగ్గులైపోతూ వుండేవారు. కొంతమంది ఆయనవల్ల కలిగే ప్రభావానికి కారణాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేశారు. ఆయన ఎపుడేది చేయాలనుకుంటే అది చేసేవారు.

“మంత్రం వాసాధ్యేయం శరీరం వాపాత్యేయయ్‌” అనునది ఎప్పుడూ ఆయన మనసులో పనిచేసేది. ఏదేని కార్యనిర్వహణ నిమిత్తం ఆయన ధైర్యంగా పురోగమించ దలంచిన మార్గం నుంచి వెనుకకు మరలించగల శక్తి ఎవ్వరికి వుండేదికాదు. ప్రియజనుల 237 గౌతమ్‌ ఛటోపాధ్యాయ

ఆర్త నాదములుగాని, అనుచరుల కరుణాపూరిత పలుకులుగాని ఆయన్ని చలింప చేయగలిగేవికావు. ఈ దివ్యమగు శక్తి దేశబంధుకి ఎలా లభించింది? ఏదైనా సాధన ద్వారా లభించిందా? ఆయన శక్తి సాధకుడైనప్పటికి మంత్ర పఠనంవల్ల శక్తిని పొందలేదని మొదటే నేను వ్రాశాను. ఆయన గొప్పవాడు. ఆశయాలు కూడా మహోన్నకాలే, కోరేదేదో మనస్ఫూర్తిగానే కోరేవాడు. దాని కొరకు కృషికూడా మనస్ఫూర్తిగానే చేసేవాడు. దానిని పొందితీరే వాడు.*నా మార్గాన్ని యీ ఆల్ఫన్‌ పర్వతాలు అద్దుకోలేవని”, నెపోలియన్‌ బోనపార్ట్‌ ఒకప్పుడు అన్నాడట. అలాగునే దేశబంధు కూడా కష్టాలన్నింటిని తృణప్రాయంగా చూసేవాడు. ఆయనలా చేయగలిగాడు గనుకనే మేము “ఫార్వర్డ్‌” పేపరును ప్రచురించగలిగాము. కౌన్సిల్‌ ఎన్నికలందు విజయం పొందగలిగాము. పొరపాటున ఎపుడైనా మేము “అసౌకర్యం కలుగుతుందని గాని,చిక్కులు వస్తాయని గాని” అంటే “మీ కెప్పుడూ అవాంతరాలను గురించి ఆలోచన, చెడును గురించి తలంపు ఎందుకు వస్తుందని” కోప్పడేవారు. మీరు వయసు రాకుండానే ముసలి వాళ్ళయిన యువకులు. యువకులై వుండి ముసలి వారివలె వ్యవహరిస్తున్నారని తరచుగా ఆయన మమ్మల్ని అంటూ వుండేవారు. ఆయన మాత్రం నిత్యనూతన యౌవనోత్సాహాలతో తొణకిసలాడే వాదు. ఆయన యువకుల ఆశలను. ఆకాంక్షలను అర్ధం చేసుకునేవాడు. అందుకనే నేను ఆయన్ని “యువరాజు అన్నాను. ఆయనలోని త్యాగం, పాండిత్యం, బుద్ధికుశలత అందరూ ఎరిగినవే ఆయనలోని అత్యద్భుత ప్రభావానికి మరొక కారణాన్ని చెప్పి నేను ముగిస్తాను. వైష్ణవ మత సహాయంతో ఆయన వాస్తవ జీవితానికీ, ఆదర్శానికీ మధ్య సామరస్యాన్ని స్థాపించ గలిగారని నేను ముందే వ్రాసివున్నాను. ఆయన అనుభూతి ద్వారా తనను భగవల్లీలకు పరికరంగా భావించుకొనేవారు. ఆయనలోని అహంకారం తొలగిపోయింది. అహంకారం లోపించిన మీదట మానవునిలో దివ్యశక్తి వచ్చేస్తుంది. జీవితం చరమదశలో 'యత్రదాన్‌ మహాశయ్‌ తత్రజయా అను స్థితి యేర్చడింది. ఎన్ని రకాలైన్మ వారితో ఎన్ని రకాలైన పనులు చేయించటానికి ఆయన ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలియదు. ఆయన నాటిన వృక్షం ఫలాలిచ్చునపుడు యీ విషయం దేశప్రజలందరికీ తెలుస్తుంది. జీవితాంతం వరకు జాగ్రదావస్థలోను, నిద్రావస్థలోను ఆయనకు ఒకే ఒక ఆలోచన. అదే స్వదేశ సేవ. స్వదేశ సేవయే ఆయన త్వాతిక జీవితానికి సోపానం. సుభాస్‌ చంద్ర బోస్‌ జీవితం, రచనలు, ఉపన్యాసొలు, లేఖలు 238

దేశబంధుని గురించి యింత వ్రాసిన తరువాత ఒక వ్యక్తిని గురించి పేర్ళొనక పోయినచో ఏమీ వ్రాయనట్లే కాగలదు. ఆకుమాటున వూవువలె ప్రజాసామాన్నానికి "ఆమె కనిపించక పోవచ్చును. మూర్తీభవించిన సేవ, శాంతి వలెను, నీడ మాదిరిగా దేశబంధుని ఆమె కాపాడుతూ వుండేది. ఆమెను మరచిపోతే దేశబంధు జీవితంలో మిగిలేది ఏముంటుంది? భోగభాగ్యాలకు లోటులేని జీవిత రంగంలో ప్రవేశించి నప్పటికిని హిందూ స్త్రీకి ఆదర్శమైన లజ్జ, వినయం, సేవా భావాలను ఏనాడు ఆమె విస్మరించలేదు. కొండంత కష్టాలొచ్చి జీవిత మార్గమంతా అంధకారమయమై శాంతికి దారి దొరకని స్థితిలోకూడ పతివ్రతా ధర్మాన్ని, చిత్తస్థర్యాన్ని, భగవద్విశ్వాసాన్ని వదలని అ దేవిని గురించి వ్రాయటానికి నాకు మాటలు దొరకటం లేదు. దేశబంధు యువకులందరికి రాజైతే, పతివ్రత, సాధ్వియగు ఆయనభార్య యువకులందరికి మాతృదేవత. దేశబంధు తనువు చాలించిన తరువాత నేదా మాతృదేవత ఏ ఒకృరికోకాక, యావత్‌ బెంగాల్‌ వాసులకు మాతృదేవత అయినది. యావత్‌ బెంగాలు జాతి నేడు ఆమె పాదాలకడ హృదయ పూర్వక అంజలి ఘటించుచున్నుది. అలీపురం విషయంలో అరవింద బాబుని సమర్థిస్తూ దేశబంధు యిలా అన్నాడు. “అరవిందుడు దేశభక్తి పూరిత కవీంద్రుడు. జాతీయతాభిమాని. మానవతారాధకుడు. ఆయన మాటలు చిరకాలం శాశ్వతాలు. అరవిందుడు అమరుడు. ఇవేమాటలను మనం నేడు దేశబంధుని గురించి చెప్పుకుంటే సరిపోతుంది గదా? -అళయమోః అకకడ ైుల- ాయ్యయ్యు రంధాల ౮న / * (106 ౫011 ఓ | | స టీల లీ సక సాక్షి టైబూచాడ 1 2 నా గౌతమ్‌ ఛటోపాధ్యాద

త యు ప. క 11 వ స. ల స్‌ న? గ్గ, స ॥ ( స. న్‌; క స న్యట 1/1 పటల న 1 హ్రో. స షన గ ( గ గ్సే ర్ట. ళ్‌ శ్‌ ప ణా శీ (గ ర వైన | స న. టు. 1 లై /. చ నం క రం. , 1 |. లేం తిన లై! గ (5 షో న. ల షం ని టో “స! మ న్‌ న మ [ ఏం. స , 4 ర న న లీ న. డై. ఇ * “శ స. , న్‌ [ని (ల | నన రం త టం. స టి. లోల! స్త, టు. న త సం నం . అత్యంత కిష్టమైస్త ద శ్వస్టరిం క సన న య. సానంద యువకులు; పదర హీ షా. . చక్కగా అవగాహన్నచెసుక ఎలానీక్తిటో పుకం: ; ౨... / /. ॥ " సై .. , . _ గల , ర్‌. న... య మః ౧౦911 ల